దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
మరణాంతర జీవితం – పార్ట్ 26 A నుండి తీసుకోబడింది వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
తహజ్జుద్ పుణ్యానికి సరిసమానమైన సత్కారాలు – తరావీహ్ నమాజు ఇమాంతో సంపూర్ణంగా చేయుట వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
[7 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
తరావీహ్ నమాజు ఇమాంతో సంపూర్ణంగా చేయుట
అబూ జర్ర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం, మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో రమజానులో ఉపవాసమున్నాము. ఆయన ﷺ ఈ మాసంలో సామూహికంగా తరావీహ్ చేయించలేదు. అయితే (ఈ నెల సమాప్తానికి) ఏడు రోజులు మిగిలి ఉండగా, రాత్రి మూడవ వంతు వరకు మాకు తరావీహ్ చేయించారు, మళ్ళీ (నెల చివరి నుండి) ఆరవ రోజు తరావీహ్ చేయించలేదు, ఐదవ రోజు చేయించారు, అందులో అర్థ రాత్రి గడసిపోయింది. అప్పుడు సహచరులు ‘ప్రవక్తా! మిగిలిన రాత్రంతా మాకు ఈ నఫిల్ చేయిస్తే బావుండును’ అని విన్నవించుకున్నారు. అందుకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సమాధానమిచ్చారుః
మస్జిదులలో చాలా మంది ఇమాములు రమజాను మాసములో ఈ విషయం బోధిస్తూ ఉంటారు, ఇమాంతో తరావీహ్ నమాజు సంపూర్ణంగా చేయాలని ప్రోత్సహిస్తున్నది నీవు చూడగలవు. కాని కొందరు బద్ధకం వహించేవారు, అలక్ష్యపరులు, ఇతర మాసాలకు మరియు రమజానుకు మధ్య వ్యత్యాసం చూపే ఈ గొప్ప చిహ్నాన్ని వదులుకుంటున్నారు. దాని గురించే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా శుభవార్త ఇచ్చారుః
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
మొక్కుబడి నియమాలు – Rulings of An-Nadhr (Vows) https://youtu.be/d3XZ5Pz3iOw [24 నిముషాలు] వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ వీడియో లో వివరించబడిన ముఖ్యమైన విషయాలు
మొక్కుబడి అంటే ఏమిటి? దాని నిర్వచనం
మొక్కుబడి ఆరాధన క్రిందికి వస్తుందా?
ఖురాన్ & సున్నత్ లో మొక్కుబడి కి సంబంధించిన కొన్ని ఉదాహరణలు
మొక్కుబడి చేసుకుంటే అది తప్పనిసరిగా నెరవేర్చాలా?
ధర్మ సమ్మతమైన వాటినే మొక్కుబడి చేసుకోవాలి
అధర్మ మైన విషయాలకు మొక్కుబడి చేసుకోకూడదు, ఒకవేళ చేసుకొంటే అది నెరవేర్చకూడదు, పరిహారం చెల్లించుకోవచ్చు
తన అధీనంలో లేని వాటి మీద మొక్కుబడి చేసుకోరాదు.
అర్థరహితమైన మొక్కుబడులు చేసుకోరాదు
చనిపోయిన వారి మొక్కుబడులు వారి తరపున బ్రతికున్నవారు, వారసులు పూర్తిచేయాలా?
అల్లాహ్ కు తప్ప వేరెవరికీ మొక్కుబడులు చేసుకోకూడదు
మొక్కుబడి అల్లాహ్ రాసిన రాతను, ఖదర్ ను మార్చదు
మొక్కుబడిని ఒక వ్యాపారం లాగా చేయకూడదు. అల్లాహ్ తో షరతు పెట్టి మొక్కుబడి చేయకూడదు. “ఓ అల్లాహ్ ఈ పని జరిగితే ఉపవాసం ఉంటాను.” ఇలాగ మొక్కుబడులు చేసుకోకూడదు.
[ఆడియో టెక్స్ట్]
ప్రశంసలన్నీ, పొగడ్తలన్నీ సర్వ లోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక, ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్య మూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక, ఆమీన్.
గౌరవనీయులైన ధార్మిక పండితులు, పెద్దలు మరియు అభిమాన సోదరులారా, ఈనాటి జుమా ప్రసంగంలో మొక్కుబడి నియమాల గురించి ఇన్షా అల్లాహ్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మొక్కుబడి అంటే ఏమిటి?
మొక్కుబడి అంటే ఏమిటి? అభిమాన సోదరులారా, అరబీ భాషలో మొక్కుబడిని నజర్ అంటారు. ధార్మిక పండితులు మొక్కుబడి యొక్క నిర్వచనాన్ని ఈ విధంగా తెలిపి ఉన్నారు.
أَنْ تُوْجِبَ عَلَى نَفْسِكَ مَا لَيْسَ بِوَاجِبٍ لِحُدُوْثِ أَمْرٍ (అన్ తూజిబ అలా నఫ్సిక మా లైస బివాజిబిన్ లిహుదూసి అమ్ రిన్)
అంటే, నీపై తప్పనిసరి కాని ఒక కార్యాన్ని, ఆ పని నేను చేస్తాను అని సంకల్పం చేసుకున్న కారణంగా, నీపై ఆ పని చేయడం తప్పనిసరి అయిపోతుంది కదా? అలా అనుకోవటాన్ని మొక్కుబడి అంటారు, అని ధార్మిక పండితులు మొక్కుబడి యొక్క నిర్వచనాన్ని ఈ విధంగా తెలియజేశారు.
అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇస్లాం ధర్మంలో చాలా రకాల ఆరాధనలను ఉంచి ఉన్నాడు. ఆ ఆరాధనలలో ఒక ఆరాధన మొక్కుబడి చేసుకోవటం. మొక్కుబడి కూడా ఒక ఆరాధన అని ఖురాను మరియు హదీస్ గ్రంథాలలో మనకు తెలుపబడి ఉంది. ఉదాహరణకు మనము చూచినట్లయితే, సూర బఖరాలోని 270వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ విధంగా తెలియజేశాడు,
وَمَآ أَنفَقْتُم مِّن نَّفَقَةٍ أَوْ نَذَرْتُم مِّن نَّذْرٍ فَإِنَّ ٱللَّهَ يَعْلَمُهُۥ (వమా అన్ఫఖ్ తుం మిన్ నఫఖతిన్ అవ్ నజర్తుం మిన్ నజ్రిన్ ఫఇన్నల్లాహ యఅలముహు) మీరు దైవ మార్గంలో ఎంత ఖర్చు చేసినా, ఏ మొక్కుబడి చేసుకున్నా అల్లాహ్‌కు దాని గురించి పూర్తిగా తెలుసు.
అంటే, భక్తులు చేసుకుంటున్న మొక్కుబడిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పూర్తిగా గమనిస్తున్నాడు అని మొక్కుబడి గురించి ఈ వాక్యంలో ప్రస్తావించబడింది.
పూర్వ ప్రవక్తల శాసనాలలో మొక్కుబడి
అభిమాన సోదరులారా, మనం ఖురాన్ మరియు హదీస్ గ్రంథాలను చదివినట్లయితే ఒక విషయం మనకు తెలుస్తుంది, అదేమిటంటే, మొక్కుబడి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికంటే పూర్వం గతించిన ప్రవక్తల శాసనాలలో కూడా మొక్కుబడి ఉండేది.
ఉదాహరణకు, మన ప్రియ ప్రవక్త ఈసా అలైహిస్సలాం, ఏసుక్రీస్తు వారి అమ్మమ్మ, ఆవిడ పేరు హన్నా అని గ్రంథాలలో వ్రాయబడి ఉంది. ఆవిడ భర్త పేరు ఇమ్రాన్ అని కూడా వ్రాయబడి ఉంది. ఆవిడ గర్భం ధరించినప్పుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో మొక్కుబడి చేసుకుందట. ఏమని మొక్కుబడి చేసుకుందట?
ఓ అల్లాహ్, నా గర్భంలో ఉన్న శిశువుని నీ పుణ్యక్షేత్ర సేవ కొరకు నేను అంకితం చేసేస్తానని మొక్కుబడి చేసుకుంటున్నాను ఓ అల్లాహ్, నీవు నా ఈ మొక్కుబడిని స్వీకరించు, అని ఆ రోజుల్లోనే ఏసుక్రీస్తు(ఈసా) అలైహిస్సలాం వారి అమ్మమ్మ మొక్కుబడి చేసుకుందని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనకు ఖురాన్‌లో తెలియజేశాడు.
అలాగే, ఆవిడ తర్వాత, ఈసా అలైహిస్సలాం, ఏసుక్రీస్తు వారి తల్లి, మర్యం అలైహస్సలాం గురించి మనం చూసినట్లయితే, ఆవిడ కూడా మొక్కుబడి చేసుకునిందని, ఆవిడకు ఆ మొక్కుబడి చేసుకోమని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆదేశించినట్టు మనకు తెలుస్తుంది. ఉదాహరణకు మనం చూసినట్లయితే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరా మర్యంలో మర్యం అలైహస్సలాం వారి చరిత్రను తెలుపుతూ, ఎప్పుడైతే మర్యం అలైహస్సలాం ఎలాంటి పురుష ప్రమేయం లేకుండా, ఎలాంటి తప్పు పని చేయకుండా, అల్లాహ్ ఆజ్ఞతో ఎప్పుడైతే ఆవిడ గర్భం ధరించిందో, గర్భం ధరించిన తర్వాత ఆవిడ ఏకాంతంలో ఒక ప్రదేశంలోకి వెళ్ళిపోయింది. ఏకాంతంలో ఆవిడ ఉంటున్నప్పుడు, పురిటి నొప్పులు వచ్చినప్పుడు ఆవిడ మనుసులో చాలా కంగారు పడ్డారు. అయ్యో, ఇక త్వరలోనే నాకు బిడ్డ పుడతాడు, ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డను తీసుకుని నేను సమాజంలోకి వెళితే, ప్రజలు నాలుగు రకాలుగా నన్ను నిలదీస్తారు. అప్పుడు లేనిపోని నిందలు కూడా నా మీద వేస్తారు. ఆ మాటలు వినలేను. ఆ రోజు రాకముందే నేను ఈ ప్రపంచంలో నుంచి లేకుండా వెళ్ళిపోతే బాగుండు కదా అని బాధపడుతూ ఉంటే అప్పుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దూతను పంపించి మర్యం అలైహస్సలాం వారికి ఏమని చెప్పాడంటే,
فَإِمَّا تَرَيِنَّ مِنَ الْبَشَرِ أَحَدًا فَقُولِي إِنِّي نَذَرْتُ لِلرَّحْمَٰنِ صَوْمًا فَلَنْ أُكَلِّمَ الْيَوْمَ إِنسِيًّا (ఫఇమ్మా తరయిన్న మినల్ బషరి అహదన్ ఫఖూలీ ఇన్నీ నజర్తు లిర్రహ్మాని సౌమన్ ఫలన్ ఉకల్లిమల్ యౌమ ఇన్సియా) ఏమనిషైనా నీకు తారసపడితే, ‘నేను కరుణామయుని కోసం ఉపవాస వ్రతం పాటిస్తున్నాను. ఈ రోజు నేను ఎవరితోనూ మాట్లాడను’ అని చెప్పు.”
దైవదూత వచ్చి మర్యం అలైహస్సలాం వారితో అంటున్నాడు, చూడండి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ ఉండండి. మీకు ఆకలి వేస్తే ఇదిగో ఈ ఖర్జూరపు చెట్టు ఉంది కదా, ఆ ఖర్జూరపు చెట్టుని ముట్టుకోండి, ఖర్జూరపు పండ్లు రాలుతాయి. ఆ ఖర్జూరపు పండ్లు భుజించండి. ఇదిగో ఇక్కడ నీళ్లు ప్రవహిస్తున్నాయి కదా, ఆ నీటిని త్రాగండి, మీ దాహాన్ని తీర్చుకోండి. ఒకవేళ ఎవరైనా పురుషులు ఇటువైపు మీతో తారసపడితే, అప్పుడు వారు మీతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తే అప్పుడు మీరు వాళ్లకి ఏమని సమాధానం ఇవ్వాలంటే “నేను కరుణామయుడైన అల్లాహ్ నామం మీద ఉపవాసం ఉంటానని మొక్కుబడి చేసుకున్నాను, ఆ మొక్కుబడిని నేను అమలుపరుస్తూ ఈ రోజు ఉపవాస వ్రతంలో ఉన్నాను కాబట్టి ఎవరితో నేను ఈ రోజు మాట్లాడలేను” అని సైగ చేసేయండి, అని దైవదూత మర్యం అలైహస్సలాం వారికి తెలియజేశాడు.
అంటే ఇక్కడ ఈసా అలైహిస్సలాం వారి అమ్మమ్మ మొక్కుబడి చేసుకున్నట్టు, అలాగే ఈసా అలైహిస్సలాం వారి తల్లి మర్యం, ఆవిడ కూడా మొక్కుబడి చేసుకున్నట్టు, ఇద్దరు కూడా మొక్కుబడి చేసుకున్నట్టు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్‌లో మనకు తెలియజేశాడు. దీని ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికంటే పూర్వం గతించిన ప్రవక్తల శాసనాలలో కూడా మొక్కుబడి ఉండేది. ఆ రోజుల్లోని భక్తులు కూడా మొక్కుబడి చేసుకునేవారు అని మనకు తెలుస్తుంది.
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి షరియాలో మొక్కుబడి
ఇక మీరు ప్రశ్నించవచ్చు, ఏమండీ, మేము ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శాసనంలో ఉన్న వాళ్ళము కదా, మాకు వేరే ప్రవక్తల శాసనాలతో పని ఏమిటి? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శాసనంలో మొక్కుబడి ఉందా లేదా? అది చెప్పండి అని మీరు అడగవచ్చు. అభిమాన సోదరులారా, అటువైపే నేను వస్తున్నాను. రండి, ఇప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శాసనంలో మొక్కుబడి గురించి అల్లాహ్ మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమని చెప్పారో తెలుసుకుందాం.
అభిమాన సోదరులారా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శాసనంలో కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మొక్కుబడిని ఉంచాడు. ఎవరైనా మొక్కుబడి చేసుకుంటే ఆ మొక్కుబడి తప్పనిసరిగా చెల్లించుకోవాలని కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్‌లో ఆదేశించి ఉన్నాడు. చూడండి, ఖురాన్‌లోని సూరా హజ్ 29వ వాక్యంలో అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తున్నాడు.
హజ్ చేయడానికి వెళ్తారు కదండీ? కాబా పుణ్యక్షేత్రానికి వెళ్లి అక్కడ హజ్ ఆచరించాలని హాజీలు వెళ్తారు కదండీ? ఆ హాజీల గురించి ప్రస్తావిస్తూ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏమంటున్నాడంటే, ఆ తరువాత వారు, అనగా హజ్ చేసేవారు, తమ మురికిని దూరం చేసుకోవాలి, తమ మొక్కుబడులను చెల్లించుకోవాలి. మొక్కుబడులను చెల్లించుకోవాలని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ వాక్యంలో ఆదేశిస్తున్నాడు.
అలాగే అభిమాన సోదరులారా, స్వర్గానికి వెళ్ళే వాళ్ళు భక్తులు, వాళ్ళు ఉత్తములు. అలాంటి సజ్జనుల లక్షణాలలో ఒక లక్షణం ఏమిటంటే, స్వర్గవాసులు స్వర్గానికి వెళ్ళిన వాళ్ళు ప్రపంచంలో ఏదైనా మొక్కుబడి చేసుకుని ఉంటే ఆ మొక్కుబడి తప్పనిసరిగా చెల్లించేవారని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారి యొక్క లక్షణాలను కూడా మనకు తెలియజేశాడు. చూడండి, సూరా దహర్‌లోని ఏడవ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సజ్జనుల లక్షణాలను ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడంటే,
సజ్జనులు ఏమి చేస్తారంట? వారు తమ మొక్కుబడులను చెల్లిస్తూ ఉంటారు, కీడు నలువైపులా విస్తరించే రోజు గురించి భయపడుతూ ఉంటారు. అంటే, పరలోక దినం గురించి వాళ్ళు భయపడుతూ ఉంటారు. మొక్కుబడులు చేసుకుంటే ఆ మొక్కుబడులను తప్పనిసరిగా వాళ్ళు చెల్లించుకుంటూ ఉంటారు. ఇది సజ్జనుల లక్షణము అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇక్కడ తెలియజేశాడు.
మొక్కుబడి యొక్క నియమాలు
అభిమాన సోదరులారా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శాసనంలో కూడా మొక్కుబడి ఉంది. మొక్కుబడి చెల్లించుకోవటం సజ్జనుల లక్షణమని మనకు ఈ వాక్యాల ద్వారా తెలిసింది కాబట్టి, ఇక మొక్కుబడికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన నియమాలను తెలియజేస్తున్నాను, అవి కొంచెం జాగ్రత్తగా వినండి, గుర్తుపెట్టుకుని ఆచరించే ప్రయత్నం చేయండి.
మొదటి నియమం ఏమిటంటే, మొక్కుబడి చేసుకునే వాళ్ళు ధర్మ సమ్మతమైన విషయాల మీదే మొక్కుబడి చేసుకోవాలి. ఉదాహరణకు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పేరు మీద నేను ఒక జంతువు జబా చేసి అన్నం తినిపిస్తాను లేదా నలుగురికి దాహం తీర్చడానికి నీటి సౌకర్యం కల్పిస్తాను, ఈ విధంగా ఏదైనా ఒక సత్కార్యాన్ని, ధర్మ సమ్మతమైన కార్యాన్ని నేను చేస్తాను అని మొక్కుబడి చేసుకోవచ్చు. ధర్మ సమ్మితమైన విషయాల మీద మాత్రమే మొక్కుబడి చేసుకోవాలని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా తెలియజేశారు.
مَنْ نَذَرَ أَنْ يُطِيعَ اللَّهَ فَلْيُطِعْهُ (మన్ నజర అన్ యుతీఇల్లాహ ఫల్ యుతిఅ) అల్లాహ్ ఆదేశాలను పాటించడానికి ఎవరైనా మొక్కుబడి చేసుకుంటే వాళ్ళు తప్పనిసరిగా ఆ మొక్కుబడిని చెల్లించాలి.
అలాగే మొక్కుబడికి సంబంధించిన మరొక నియమం ఏమిటంటే, అధర్మమైన విషయాల మీద మొక్కుబడి చేసుకోరాదు. ఉదాహరణకు, ఎవరైనా ఒక వ్యక్తి నేను నలుగురికి సారాయి తాపిస్తాను అని మొక్కుబడి చేసుకోవడం. అభిమాన సోదరులారా, ఇస్లాంలో సారాయి సేవించటం స్వయంగా త్రాగటము కూడా నిషేధమే, ఇతరులకు త్రాపించటము కూడా నిషేధమే, లేదా సారాయిని ఒకచోట నుండి మరొక చోటికి తరలించడానికి సహాయపడటము కూడా నేరమే, అది కూడా నిషేధమే. కాబట్టి అల్లాహ్ నిషేధించిన కార్యాన్ని నేను చేస్తాను అని మొక్కుబడి చేసుకోవటం ధర్మ సమ్మతం కాదు. అధర్మమైన విషయాల మీద మొక్కుబడి చేసుకోరాదని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు.
وَمَنْ نَذَرَ أَنْ يَعْصِيَهُ فَلا يَعْصِهِ (మన్ నజర అన్ యఅసియహు ఫలా యఅసిహి) అల్లాహ్ ఆదేశాలను ధిక్కరించడానికి ఎవరైనా మొక్కుబడి చేసుకుంటే అతను అల్లాహ్ ఆదేశాలను ధిక్కరించరాదు, అలాంటి మొక్కుబడి చేసుకోరాదు అని తెలియపబడింది.
అభిమాన సోదరులారా, మీరు ఒక్క విషయం ఇక్కడ ప్రశ్నించవచ్చు. ఏమండీ, ఒక వ్యక్తి అధర్మమైన విషయాల మీద మొక్కుబడి చేసుకున్నాడు. కాకపోతే ఆ అధర్మమైన విషయాల మీద మొక్కుబడి చేసుకోరాదని తరువాత అతనికి తెలిసింది. ఇప్పుడు అతను ఏమి చేయాలి? అతనికి ఏదైనా పరిష్కార మార్గం ఉందా అంటే, అభిమాన సోదరులారా, అధర్మమైన విషయాల మీద మొక్కుబడి చేసుకున్న వాళ్ళు మొక్కుబడి చెల్లించాల్సిన అవసరం లేదు కానీ పరిహారం చెల్లించుకోవచ్చును. పరిహారం ఏమిటంటే, 10 మందికి అన్నం తినిపించాలి లేదా 10 మందికి బట్టలు తొడిగించాలి లేదా ఒక బానిసను విముక్తుడిని చేయాలి లేదా మూడు రోజుల ఉపవాసం ఉండాలి. ప్రమాణం చేసిన తర్వాత ప్రమాణాన్ని భంగపరిస్తే కూడా ఇదే పరిహారం ఇవ్వాలి, అదే పరిహారము అధర్మమైన విషయాల మీద మొక్కుబడి చేసుకున్న వాళ్ళు కూడా పరిహారం చెల్లించుకోవాలి.
ఇక రండి అభిమాన సోదరులారా, మొక్కుబడికి సంబంధించిన మరొక ముఖ్యమైన నియమం ఏమిటంటే, తన ఆధీనంలో లేని విషయాల మీద మొక్కుబడి చేసుకోకూడదు. అలాగే మనం చూస్తున్నట్లయితే చాలా మంది, నాకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ కార్యం పూర్తి చేస్తే, నేను ఇన్ని కిలోల బంగారాన్ని దానం చేస్తాను అని మొక్కుబడి చేసుకుంటారు. వాస్తవానికి అన్ని కిలోల బంగారం వాళ్ళ వద్ద లేదు. వారి ఆధీనంలో, వారి శక్తి సామర్థ్యానికి మించిపోయిన విషయాల గురించి మొక్కుబడి చేసుకోరాదు.
అలాగే, అర్థరహితమైన మొక్కుబడులు కూడా చేసుకోకూడదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో కూడా ఇలాగే ఒక సంఘటన జరిగింది. ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మెంబర్ మీద నిలుచుని ప్రసంగిస్తూ ఉంటే, ఒక సహాబీ ఎండలో నిలబడి ప్రసంగాన్ని వింటూ ఉన్నాడు. అందరూ లోపల వచ్చి కూర్చుని ఉన్నారు, ఆయన ఒక్కడు మాత్రం ఎండలోన నిలబడి ఉన్నాడు. అది గమనించిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఎవరండి అతను? ఎందుకు అక్కడ ఎండలో నిలబడిపోయాడు? లోపలికి ఎందుకు రావట్లేదు? పిలవండి అతనికి అని అడిగితే, అప్పుడు కూర్చుని ఉన్న సహాబాలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేసే విషయం ఏమిటంటే, ఓ అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయన పేరు అబూ ఇస్రాయీల్, ఆయన ఈ రోజు మొక్కుబడి చేసుకున్నాడు. ఏమని మొక్కుబడి చేసుకున్నాడు అంటే, ఈ రోజు నేను నీడలోకి రాను ఎండలోనే ఉంటాను, అలాగే ఈ రోజు నేను ఎవరితో మాట్లాడను, అలాగే ఈ రోజు నేను రోజు మొత్తం నిలబడే ఉంటాను కానీ కూర్చోను, అలాగే ఈ రోజు నేను ఆహారం భుజించను, ఉపవాసంలో ఉంటాను. ఆ విధంగా అతను మొక్కుబడి చేసుకున్నాడు కాబట్టి ఓ దైవ ప్రవక్త, అతను కూర్చోవట్లేదు, అతను అలాగే నిలబడి ఉన్నాడు, నీడలోకి రావట్లేదు, ఎండలోనే నిలబడి ఉన్నాడు అని చెబితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వెంటనే అన్నారు.
ఇదేంటండి? మీరు వెంటనే అతనికి ఆదేశించండి. అతను మాట్లాడనని మొక్కుబడి చేసుకున్నాడు కదా, ఇది అర్థరహితమైన మొక్కుబడి. అతనికి మాట్లాడమని చెప్పండి. అలాగే ఈ రోజు మొత్తం నేను నీడలోకి రాను అని మొక్కుబడి చేసుకున్నాడు కదా, ఇది కూడా అర్థరహితమైన మొక్కుబడి. అతనికి వెంటనే నీడలోకి రమ్మని ఆదేశించండి. ఈ రోజు మొత్తం నేను కూర్చోను, నిలబడే ఉంటాను అని మొక్కుబడి చేసుకున్నాడు కదా, ఇది కూడా అర్థరహితమైన మొక్కుబడి. అతనికి ఆదేశించండి, వచ్చి వెంటనే కూర్చోమని చెప్పండి. అయితే ఈ రోజు నేను ఉపవాసం ఉంటాను అని అన్నాడు కదా, ఇది మాత్రం ధర్మ సమ్మితమైన విషయమే కాబట్టి ఉపవాసాన్ని పూర్తి చేయమని చెప్పండి. ఉపవాసం పూర్తి చేయమని చెప్పండి కానీ నిలబడతాను అన్నాడు కదా, అది మాత్రం తగదు, కూర్చోమని చెప్పండి. ఈ రోజు నేను నీడలోకి రాను అన్నాడు కదా, అది మాత్రం తగదు, నీడలోకి రమ్మని చెప్పండి. ఈ రోజు నేను మాట్లాడను అని చెప్పాడు కదా, అది కూడా తగదు, మాట్లాడమని చెప్పండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు.
కాబట్టి దీని ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే, తన ఆధీనంలో లేని విషయాల మీద, అర్థరహితమైన విషయాల మీద మొక్కుబడి చేసుకోకూడదు.
అలాగే, మొక్కుబడి గురించి మనం తెలుసుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మన పూర్వీకులు లేదా మన తల్లిదండ్రులు, మన బంధువులలో ఎవరైనా మొక్కుబడి చేసుకున్నారు కానీ మొక్కుబడి చెల్లించక మునుపే మరణించారు. మొక్కుబడి చేసుకున్నారు కానీ మొక్కుబడి చెల్లించక మునుపే మరణించారంటే, మరణించిన వారి యొక్క వారసులు వారి మొక్కుబడులను చెల్లించాలి.
ఉదాహరణకు, జుహైనా తెగకు సంబంధించిన ఒక మహిళ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, ఓ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నా తల్లి హజ్ చేస్తానని మొక్కుబడి చేసుకుంది కానీ హజ్ చేయకుండానే మరణించింది. నేను నా తల్లి తరఫు నుంచి ఆ మొక్కుబడి చెల్లించవచ్చునా? అని ఆ మహిళ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ప్రశ్నిస్తే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఏమమ్మా, నీ తల్లి ఇతరుల వద్ద ఎవరి దగ్గరైనా బాకీ తీసుకుని ఉంటే, ఆవిడ మరణించిన తర్వాత ఆవిడ బాకీ నీవు తీరుస్తావా, తీర్చవా? ఆ తప్పనిసరిగా తీర్చుతాను ఓ దైవ ప్రవక్త అన్నప్పుడు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నీ తల్లి అల్లాహ్ పేరు మీద హజ్ చేస్తానని మొక్కుబడి చేసుకుని, అల్లాహ్‌కు బాకీ అయిపోయింది కాబట్టి, మీ తల్లి తరఫు నుంచి ఆ అల్లాహ్ మీద చేసుకున్న బాకీని నీవు తీర్చవమ్మా అన్నారు.
కాబట్టి దీని ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే, మన పెద్దలు ఎవరైనా మొక్కుబడి చేసుకున్నారు, వాళ్ళు మొక్కుబడి చేసుకున్న విషయాన్ని మనకు తెలియజేశారు. ఆ తర్వాత మొక్కుబడి చెల్లించకుండానే వాళ్ళు మరణించారంటే, వాళ్ళ వారసులమైన మనము వాళ్ళ తరఫు నుంచి మొక్కుబడులను తప్పనిసరిగా చెల్లించాలి.
మొక్కుబడి కేవలం అల్లాహ్కే
అలాగే అభిమాన సోదరులారా, చివరి యొక్క ముఖ్యమైన నియమం ఏమిటంటే, మొక్కుబడి ఒక ఆరాధన అని నేను ముందుగానే ప్రారంభంలోనే తెలియజేశాను కాబట్టి, ఈ మొక్కుబడి కేవలం అల్లాహ్ దగ్గర మాత్రమే చేసుకోవాలి. అల్లాహ్ తప్ప ఇతరుల ఎవరి వద్ద కూడా మొక్కుబడి చేసుకోకూడదు. ఎందుకంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్‌లో స్పష్టంగా కొన్ని విషయాలు తెలియజేశాడు, అదేమిటంటే
وَقَضَىٰ رَبُّكَ أَلَّا تَعْبُدُوٓا۟ إِلَّآ إِيَّاهُ (వఖజా రబ్బుక అల్లా తఅబుదూ ఇల్లా ఇయ్యాహు) నీ ప్రభువు స్పష్టంగా ఆజ్ఞాపించాడు, మీరు ఆయనను తప్ప మరెవరికీని ఆరాధించకూడదు.
అల్లాహ్‌కు తప్ప ఎవరినీ ఆరాధించకూడదు అని అల్లాహ్ ఆదేశించి ఉన్నాడు. అలాగే మరోచోట
وَٱعْبُدُوا۟ ٱللَّهَ وَلَا تُشْرِكُوا۟ بِهِۦ شَيْـًٔا (వఅబుదుల్లాహ వలా తుష్రికూ బిహీ షైఅన్) అల్లాహ్‌ను ఆరాధించండి, ఆయనకు సహవర్తులుగా ఎవరినీ కల్పించకండి అని ఆదేశించి ఉన్నాడు.
ఇక మొక్కుబడి ఒక ఆరాధన కదండీ? ఇది అల్లాహ్ దగ్గర కాకుండా ఒక దర్గా దగ్గరనో లేదా ఒక చెట్టు దగ్గరనో లేదా ఒక పుట్ట దగ్గరనో ఎవరైనా మొక్కుబడి చేసుకుంటున్నాడు అంటే అతను అల్లాహ్‌తో ఇతరులను సాటి కల్పిస్తున్నాడు. కాబట్టి మొక్కుబడులు చెట్ల దగ్గర, పుట్టల దగ్గర, సమాధుల దగ్గర చేసుకోకూడదు, కేవలం అల్లాహ్ వద్ద మాత్రమే చేసుకోవాలి.
మొక్కుబడి విధిరాతను మార్చలేదు
ఇక చివరిగా ఒక విషయాన్ని తెలిపి ఇన్షా అల్లాహ్ నా మాటను ముగిస్తున్నాను, అదేమిటంటే మొక్కుబడి చేసుకుంటే అభిమాన సోదరులారా, మొక్కుబడి అల్లాహ్ రాసిన రాతను ఎట్టి పరిస్థితుల్లో మార్చలేదు. ఇది మనం గమనించాలి. చాలా మంది ఏమనుకుంటుంటారంటే మొక్కుబడి చేసుకుంటే ప్రాణాపాయం తప్పిపోతుంది, లేదా ఇంకేదో జరిగిపోతుంది, లేదా ఇంకేదో జరిగిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. మొక్కుబడి ఒక ఆరాధన, ధర్మ సమ్మితమైన విషయాల పైన ఆ మొక్కుబడి చేసుకోవచ్చు. చేసుకున్న వాళ్ళు తప్పనిసరిగా మొక్కుబడి చెల్లించాలి, ఇవన్నీ ఆదేశాలు ఉన్నాయి, కానీ ఒక భక్తుడు గమనించాల్సిన, తెలుసుకోవలసిన, విశ్వసించవలసిన విషయం ఏమిటంటే మొక్కుబడి అల్లాహ్ రాసిన వ్రాతను ఎట్టి పరిస్థితుల్లో మార్చలేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు.
فَإِنَّ النَّذْرَ لَا يَرُدُّ مِنْ قَدَرِ اللَّهِ شَيْئًا (ఫఇన్నన్నజర లా యరుద్దు మిన్ ఖదిరిల్లాహి షైఆ) అల్లాహ్ రాసేసిన విధి వ్రాతను మొక్కుబడి ఎట్టి పరిస్థితుల్లో మార్చలేదు.
అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక రకమైన అయిష్టాన్ని కూడా ఒక సందర్భంలో తెలియజేశారు. ఏమన్నారంటే
పిసినారులు ఉంటారు కదండీ, దైవ మార్గంలో ఖర్చు చేయాలంటే వాళ్ళు వాళ్ళ చేతులు లేయవు. పిసినారులు ఉంటారు కదండీ, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు “పిసినారుల జోబులో నుంచి డబ్బు బయటికి తీయించడానికి ఒక మార్గము ఈ మొక్కుబడి” అన్నారు. అల్లాహు అక్బర్.
కాబట్టి అభిమాన సోదరులారా, ఒక భక్తుడు విశ్వసించవలసిన విషయం ఏమిటంటే, మొక్కుబడి విధివ్రాతను మార్చలేదు. పిసినారుల జబ్బు నుంచి కొంత డబ్బు దైవ మార్గంలో ఖర్చు పెట్టడానికి ఒక మార్గము మాత్రమే.
అల్లాహ్ తో షరతు పెట్టి మొక్కుబడి చేయకూడదు
అభిమాన సోదరులారా, మరొక దురభిప్రాయం మన సమాజంలో ఎలా ఉందంటే, మొక్కుబడిని సరైన రీతిలో చేసుకోరు, ఒక వ్యాపారం లాగా చేస్తారు. ఎలాగంటే, ఫలానా నా పని జరిగితే నేను ఫలానా కార్యాన్ని చేస్తాను. ఫలానా నా కోరిక తీరితే నేను ఇన్ని రకాతుల నమాజు చదువుతాను, లేదంటే ఇన్ని ఉపవాసాలు ఉంటాను, లేదంటే ఒక జంతువుని జబా చేసి సదఖా చేస్తాను, ఈ విధంగా షరతు పెట్టేస్తారంట మాట. ఆ షరతు పూర్తి అయితేనే ఆ పని చేస్తారు లేదంటే ఆ పని చేయరు. ఇది సరైన విధానం కాదు. ఇది అల్లాహ్‌తో ఒక రకమైన వ్యాపారం ఆడుతున్నట్టు. అంటే ఆ పని చేయకపోతే నీవు నమాజులు చదవవా? ఆ పని పూర్తి కాకపోతే నీవు ఉపవాసాలు ఉండవా? ఆ పని పూర్తి కాకపోతే నువ్వు ఖుర్బానీలు చేయవా? అంటే అల్లాహ్‌తో నువ్వు షరతు పెడుతున్నావు, అంటే ముందు అల్లాహ్ నీ పని చేయాలి, తర్వాత నీవు అల్లాహ్ పని చేస్తావు. ఇది సరైన విషయం కాదు అభిమాన సోదరులారా.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మన కార్యాలను పూర్తి చేస్తున్నప్పుడు మనం సంతోషంగా అల్లాహ్ నువ్వు నా ఈ కార్యాన్ని పూర్తి చేస్తున్నావు కాబట్టి నేను సంతోషంగా నీకు కృతజ్ఞత తెలుపుతూ మొక్కుబడి చేసుకుంటున్నాను, నేను ఈ విధంగా ఈ పని చేస్తానని చెప్పి మొక్కుబడి చేసుకుని వెంటనే ఆ పని అమలు పరచాలి. అది సరైన విధానము.
కాబట్టి చివరిలో నేను అల్లాహ్‌తో దుఆ చేస్తున్నాను, ఇప్పటివరకు మొక్కుబడి గురించి మనం ఖురాన్ మరియు హదీస్ గ్రంథాల ద్వారా తెలుసుకున్న నియమాలను సరిగా అర్థం చేసుకుని, దైవ మార్గంలో అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆదేశాల ప్రకారము నడుచుకునే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
6వ కార్యం: తహజ్జుద్ కు గల పుణ్యానికి సరిసమానమైన ఇతర సత్కార్యాలు
తహజ్జుద్ నమాజు యొక్క విలువ అల్లాహ్ వద్ద చాలా గొప్పగా ఉంది. ఫర్జ్ నమాజుల తర్వాత ఎక్కువ శ్రేష్ఠతగల నమాజు తహజ్జుదే. దాని ప్రత్యేకతల్లో: అది కేవలం పాపాలను హరించి వేయడమే గాకుండా; దానిని పాటించేవారిని పాపంలో పడకుండా కాపాడుతుంది. ప్రవక్త ﷺ ఇలా తెలిపారని అబూ ఉమామా బాహిలీ t ఉల్లేఖించారుః
“మీరు తహజ్జుద్ నమాజు చేయండి, అది మీకంటే ముందు పుణ్యాత్ముల సద్గుణం, మీ ప్రభువు సాన్నిధ్యానికి చేర్చునది, పాపాలకు పరిహారం మరియు అపరాధాల నుండి వారిస్తుంది”.
పూర్వ పుణ్యపురుషులు రహిమహుముల్లాహ్ యే కాదు, గత సమీప కాలాల్లో మన తాతముత్తాతలు తహజ్జుద్ నమాజులో ఏ కొరతా చూపేవారుకాదు. కాని ఈ కాలంలో అనేక మంది రాత్రులు పగల్లో, నిద్రలు జాగారాల్లో మారిపోయి, రాత్రి వేళల్లో అల్లాహ్ ను వేడుకునే మాధుర్యాన్ని కోల్పోయారు. మరికొందరు ఎంతటి అలసత్వానికి గురి అయ్యారంటే ఫజ్ర్ నమాజు సైతం వదిలేస్తున్నారు.
తన దాసులపై ఉన్న అల్లాహ్ యొక్క గొప్ప కరుణ ఏమిటంటే; ఆయన వారికి చిన్నపాటి కొన్ని కార్యాలు ప్రసాదించాడు, వాటి పుణ్యఫలితం తహజ్జుద్ కు సమానంగా ఉంది. ఎవరికైనా తహజ్జుద్ తప్పిపోతే లేదా ఎవరైనా తహజ్జుద్ చేయలేక పోతే కనీసం ఇలాంటి సత్కార్యాలు తప్పిపోకూడదు, వాటి ద్వారా తన త్రాసు బరువును పెంచుకోవచ్చును. ఇది తహజ్జుద్ చేయలేకపోయినా పరవా లేదు అన్న మాట కాదు, మన పూర్వ పుణ్యపురుషులు ఎన్నడూ అలా భావించలేదు, వారైతే ప్రతి పుణ్య కార్యంలో ముందంజవేసి, చురుకుగా పాల్గొనేవారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ సహచరులకు కొన్ని సులువైన ఆచరణల గురించి తెలిపారు, ప్రత్యేకంగా ఎవరైతే తమకు తాము కొంత శ్రమ పడి తహజ్జుద్ చేయలేకపోతారో అలాంటి వారి గురించి, ఇలా మనల్ని కూడా సత్కార్యాలు చేసుకొని మన పుణ్యాలను పెంచుకోవాలని ప్రోత్సహించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారని అబూ ఉమామా బాహిలీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః
“ఎవరు రాత్రి వేళ మేల్కొని (తహజ్జుద్ కై) శ్రమ పడుటకు భయపడ్డాడో, ధనాన్ని (అల్లాహ్ మార్గంలో) ఖర్చు చేయుట నుండి పిసినారితనం వహించాడో మరియు శతృవుతో పోరాడడానికి పిరికితనం వహించాడో అతను అధికంగా సుబ్ హానల్లాహి వబిహందిహీ అనాలి. ఈ పదాలు అల్లాహ్ కు ఆయన మార్గంలో ఖర్చుపెట్టబడ్డ వెండి, బంగారాల కంటే ఎక్కువగా ఇష్టమైనవి, ప్రియమైనవి”. (తబ్రానీ కబీర్ 7795, అల్బానీ సహీహుత్తర్గీబ్ 1541లో సహీ లిగైరిహీ అని అన్నారు).
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
“ఎవరు ఒక రాత్రిలో పది ఆయతులు పఠిస్తాడో అతని (కర్మల పత్రంలో) ‘ఖింతార్’ వ్రాయబడుతుంది, ‘ఖింతార్’ అన్నది ఈ ప్రపంచం మరియు అందులో ఉన్న సమస్తానికంటే మేలైనది”. (తబ్రానీ కబీర్ 1253, సహీహుత్తర్గీబ్ లో అల్బానీ హసన్ అని అన్నారు).
పైన పేర్కొనబడిన పది ఆయతుల ప్రస్తావన, ఆ ఆయతులు తహజ్జుద్ నమాజులో పఠించాలి. –వాస్తవ జ్ఞానం అల్లాహ్ కే ఉంది- కాని అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారుః
“పది ఆయతులతో తహజ్జుద్ చేయువారు అలక్ష్యపరుల్లో వ్రాయబడరు. మరెవరయితే వంద ఆయతులతో తహజ్జుద్ చేస్తాడో వినయ విధేయుల్లో వ్రాయబడుతారు. ఇంకా ఎవరయితే వెయ్యి ఆయతులతో తహజ్జుద్ చేస్తారో ‘ముఖంతిరీన్’లో వ్రాయబడుతాడు”. (ముఖంతిరీన్ అన్న పదం ఖింతార్ తో వచ్చింది. ఖింతార్ భావం పై హదీసులో చూడండి). (అబూదావూద్ 1398, ఇబ్ను హిబ్బాన్ 2572, ఇబ్ను ఖుజైమా 1144, దార్మి 3444, హాకిం 2041, అల్బానీ సహీహుత్తర్గీబ్ 639లో హసన్, సహీ అని అన్నారు).
ఇషా తర్వాత చేయబడే ప్రతి నఫిల్ నమాజ్ తహజ్జుద్ లో లెక్కించబడుతుంది. ఈ నమాజు నీవు రాత్రి వేళ ఎంత ఆలస్యం చేస్తే అంతే ఎక్కువ పుణ్యం. ఈ గొప్ప ఘనత, చిన్నపాటి సత్కార్యాన్ని నీవు కోల్పోకు. కనీసం ఇషా తర్వాత రెండు రకాతుల సున్నత్ మరియు విత్ర్ నమాజు అయినా సరే.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అల్లాహ్ స్మరణ యొక్క ఘనత – The Excellence of the Remembrance of Allah https://youtu.be/M-AgVCyt-Qg[36 నిముషాలు] వక్త: షరీఫ్ (హఫిజహుల్లాహ్) వైజాగ్
ప్రపంచంలో మానవుడు డబ్బు, ఐశ్వర్యం వంటి సకల భోగభాగ్యాలు పొందుతున్నప్పటికీ, నిజమైన మనశ్శాంతికి దూరమవుతున్నాడు. వాస్తవమైన మనశ్శాంతి సంగీతం, సినిమాలు లేదా ప్రాపంచిక సుఖాలలో లేదు, కానీ సృష్టికర్త అయిన అల్లాహ్ స్మరణ (ధిక్ర్)లో మాత్రమే ఉంది. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా అత్యంత అవసరం, మరియు ఈ మానసిక బలాన్ని, ప్రశాంతతను అల్లాహ్ ధిక్ర్ అందిస్తుంది. ధిక్ర్ యొక్క ఘనత, దాని వల్ల కలిగే ప్రయోజనాలు, మరియు ప్రవక్త (స) నేర్పించిన నిర్దిష్టమైన ధిక్ర్ పదాలు, వాటి ప్రతిఫలాల గురించి ఖురాన్ మరియు హదీసుల వెలుగులో వివరించబడింది.
ఖురాన్ మరియు హదీసుల వెలుగులో చూసినట్లయితే, అల్లాహ్ యొక్క స్మరణకు విశిష్టమైన ఘనత ఉంది ప్రియులారా. వాస్తవానికి, నేటి ప్రపంచములో మానవులకు కావలసినది ఏమిటి? మనం ప్రపంచంలో మనుషుల్ని చూస్తూ ఉన్నాం. మనిషికి డబ్బు ఉంది, మనిషికి అన్ని రకాల వనరులు ఉన్నాయి, కానీ అనేక మంది మానవులకు ఈ రోజు మనశ్శాంతి కరువైపోయింది. మనశ్శాంతి లేదంటున్నారు. డబ్బు ఉందండి, ఆస్తి ఉందండి, అంతస్తు ఉందండి, ఐశ్వర్యం ఉంది, అన్ని రకాల భోగ భాగ్యాలు ప్రపంచంలో మానవుడు పొందుతున్నాడు, కానీ వాస్తవానికి అనేక మంది మానవులు పొందలేక పోతున్న విషయం మనశ్శాంతి ప్రియులారా.
మనసుకు ప్రశాంతత లభించటం. వాస్తవానికి మనస్సుకు ప్రశాంతత దేని ద్వారా లభిస్తుంది? ఈ రోజు మనిషి అనుకుంటాడు, మనసుకు ప్రశాంతత లభించాలంటే సంగీత వాయిద్యాల ద్వారా మనిషికి ప్రశాంతత లభిస్తుంది అనుకుంటున్నాడు. చలన చిత్రాలను వీక్షించటం ద్వారా మనసుకు ప్రశాంతత లభిస్తుంది అనుకుంటున్నాడు. వాస్తవమైన మనశ్శాంతి ప్రియులారా, ఈ ప్రపంచంలో డబ్బులో లేదు, ఈ ప్రపంచపు సుఖాలలో లేదు, ఈ ప్రపంచములో ఈ సంగీత వాయిద్యాలలో లేదు, చలన చిత్రాలలో లేదు ప్రియులారా.
వాస్తవమైన మనశ్శాంతి, అల్లాహ్ సుబ్ హాన వ తఆలా, ఏ జాతి అయితే మనిషిని సృష్టించిందో, ఎవరైతే మనిషిని సృష్టించి, మనిషిని పోషించి, మనిషి కోసం ఈ ప్రపంచంలో సకల ఏర్పాట్లను చేశాడో, ఎవడైతే మనిషిని తల్లి గర్భములో వీర్యపు చుక్క వలే ప్రవేశింపజేశాడో, ఎవరైతే తల్లి గర్భములో 40 రోజుల పాటు రక్తపు ముద్ద వలే ఉంచాడో, ఎవరైతే ఆ 40 రోజుల తరువాత ఆ మనిషి గర్భములో ఉన్న మనల్ని రక్తపు ముద్ద నుండి మాంసపు ముద్దగా మార్చి, ఎముకను జత చేసి, మనకు అందమైన రూపాన్ని ఇచ్చి, వినే చెవులు ప్రసాదించి, చూసే కనులు ప్రసాదించి, ఆలోచించే హృదయాన్ని ప్రసాదించాడో, ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క స్మరణలో మనిషికి ప్రశాంతత ఉంది.
అదే విషయాన్ని పవిత్ర ఖురాన్ గ్రంథం తెలియజేస్తుంది ప్రియులారా.
أَلَا بِذِكْرِ اللَّهِ تَطْمَئِنُّ الْقُلُوبُ అలా బి జిక్రిల్లాహి తత్మఇన్నుల్ ఖులూబ్ వినండి, అల్లాహ్ యొక్క స్మరణలో మాత్రమే మనిషికి ప్రశాంతత లభిస్తుంది.
ప్రియమైన ధార్మిక సోదరులారా, ప్రియమైన ధార్మిక సోదరీమణులారా, ఈ ప్రస్తుత ప్రపంచములో, నేటి సమాజములో, ప్రత్యేకించి నేటి కాలములో మనిషి శారీరకంగా, దానితో పాటు ఎక్కువగా మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి ప్రియులారా. ఎందుకంటే ఈ కరోనా కాలం, ఇలాంటి కాలాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేహ దారుఢ్యం కలిగినవారు, యవ్వనములో ఉన్నవారు, ఆరోగ్యంగా ఉన్నవారు, శారీరక ఆరోగ్యం ఉన్నవారు, అనేక మంది ప్రాణాలు ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోతున్నాయి. వాస్తవానికి ఈ కష్ట కాలములో ప్రియులారా, మానవుడు శారీరక ఆరోగ్యంతో పాటు, మానసిక ఆరోగ్యాన్ని కలిగి ఉండటం మనిషికి అత్యంత అవసరదాయకమైనది. ఎందుకంటే సోదరులారా, మనిషికి శారీరక ఆరోగ్యం కంటే మానసిక ఆరోగ్యమే ఎక్కువ బలాన్ని చేకూరుస్తుంది. అలాంటి మానసిక ఆరోగ్యం మనిషికి అల్లాహ్ యొక్క స్మరణలో మాత్రమే లభిస్తుంది ప్రియులారా.
అనేక మంది ప్రపంచంలో అనుకోవచ్చు, నాకు సంగీత వాయిద్యాలలో నాకు ప్రశాంతత లభిస్తుంది. షేఖుల్ ఇస్లాం ఇబ్నె తైమియా రహిమహుల్లా తెలుపుతున్నారు ప్రియులారా, మనిషి హృదయానికి ఏదైతే సంగీతం ఉందో, అది మనిషి హృదయానికి సంబంధించిన మద్యపానం లాంటిది. మనిషి యొక్క హృదయానికి మద్యపానం లాంటిది సంగీతం ప్రియులారా. మనిషి గనక దానికి అడిక్ట్ అయిపోతే, అది మద్యం వలే మనిషి హృదయాన్ని పట్టుకుంటుంది. అంటే, ఆ విధంగా మనిషిని సర్వనాశనం చేస్తుంది. ఏదేమైనప్పటికీ, మనకున్న ముఖ్తసరి సమయంలో నేను మీకు మీ ముందు ఉంచే విషయాలు ఏమిటి అంటే, అల్లాహ్ స్మరణ యొక్క ఘనత. మనిషి అల్లాహ్ ను స్మరించటం ద్వారా మనిషికి ఒనగూరే ప్రయోజనాలు ఏమిటి?
మొట్టమొదటి ప్రయోజనం, ఏదైతే నేను మీ ముందు వాక్యాన్ని పఠించానో,
أَلَا بِذِكْرِ اللَّهِ تَطْمَئِنُّ الْقُلُوبُ అలా బి జికిరిల్లాహి తత్మఇన్నుల్ ఖులూబ్ అల్లాహ్ యొక్క స్మరణ ద్వారా మనిషి హృదయానికి ప్రశాంతత లభిస్తుంది.
రెండవ ఘనత ఏమిటి ప్రియులారా? మనల్ని అల్లాహ్ జ్ఞాపకం చేసుకుంటాడు.
فَاذْكُرُونِي أَذْكُرْكُمْ وَاشْكُرُوا لِي وَلَا تَكْفُرُونِ ఫజ్కురూనీ అజ్కుర్కుం వష్కురూలీ వలా తక్ఫురూన్ అల్లాహ్ ఏమంటున్నాడు? మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి, నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను.
అల్లాహ్ సుబ్ హాన వత’ఆలా ఒక హదీసె ఖుద్సీలో తయారు చేస్తుంటున్నాడు. అల్లాహ్ సుబ్ హాన వత’ఆలా మనిషి యొక్క ఆలోచనకు దగ్గరలో ఉంటాడు ప్రియులారా. మనిషి అల్లాహ్ ను స్మరిస్తే, అల్లాహ్ కూడా ఆ మనిషిని గుర్తు చేసుకుంటాడు. ఒకవేళ మనిషి గనక లోలోపల అల్లాహ్ ను గుర్తు చేసుకుంటే, అల్లాహ్ కూడా తన లోపల మనల్ని గుర్తుకు చేసుకుంటాడు. మనిషి అల్లాహ్ ను గురించిన గొప్పతనం, అల్లాహ్ యొక్క జిక్ర్ ఒక సమావేశంలో చేస్తే, దానికంటే గొప్ప సమావేశములో అల్లాహ్ ఆ మనిషి యొక్క ప్రస్తావన చేస్తాడు ప్రియులారా.
ఆ పిదప, మనం జిక్ర్ యొక్క ఘనతను చూస్తే, అల్లాహ్ యొక్క నామ స్మరణ యొక్క ఘనతను చూస్తే, ఎలాంటి ఘనత ఉందండి? అల్లాహ్ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నారు:
وَالذَّاكِرِينَ اللَّهَ كَثِيرًا وَالذَّاكِرَاتِ أَعَدَّ اللَّهُ لَهُمْ مَغْفِرَةً وَأَجْرًا عَظِيمًا వజ్జాకిరీనల్లాహ కసీరన్ వజ్జాకిరాత్, అఅద్దల్లాహు లహుం మగ్ఫిరతన్ వ అజ్రన్ అజీమా ఎవరైతే అల్లాహ్ ను అత్యధికంగా స్మరించే స్త్రీలు, అల్లాహ్ ను అత్యధికంగా స్మరించే పురుషులు, వారికి కోసం అల్లాహ్ వద్ద క్షమాభిక్ష ఉంది.
మనం ఇంకాస్త ముందుకు వెళ్తే సోదరులారా, అల్లాహ్ తఆలా జిక్ర్ యొక్క ఘనత ఖురాన్ గ్రంథంలో ఏమి తెలియజేస్తున్నారు? అల్లాహ్ అంటూ ఉన్నారు, అల్లాహ్ ఏమంటున్నారు?
وَاذْكُرُوا اللَّهَ كَثِيرًا لَعَلَّكُمْ تُفْلِحُونَ వజ్కురుల్లాహ కసీరల్ లఅల్లకుం తుఫ్లిహూన్ మీరు అల్లాహ్ ను ఎక్కువగా స్మరించండి, బహుశా మీరు సాఫల్యం పొందవచ్చు.
కాబట్టి ప్రియులారా, సాఫల్యం అల్లాహ్ యొక్క జిక్ర్ లో ఉంది, క్షమాభిక్ష అల్లాహ్ యొక్క జిక్ర్ లో ఉంది, మనుషుల హృదయాలకు ప్రశాంతత అల్లాహ్ యొక్క జిక్ర్ లో ఉంది, అల్లాహ్ మనల్ని జ్ఞాపకం చేసుకోవటం అల్లాహ్ యొక్క జిక్ర్ లో ఉంది. సుబ్ హా నల్లాహ్.
అలాంటి జిక్ర్ ఈ రోజు మనిషి చేస్తున్నాడా? మనిషి అల్లాహ్ యొక్క జిక్ర్ లో ప్రశాంతత పొందుతున్నాడా? ఈ రోజు మనిషి అనుకుంటాడు, నాకు ప్రశాంతత సినిమాలలో ఉంది, నాకు ప్రశాంతత మొబైల్ ఫోన్లలో ఆటలు ఆడటంలో ఉంది, నాకు ప్రశాంతత పాటలు వినటంలో ఉంది, నాకు ప్రశాంతత సంగీత వాయిద్యాలలో ఉంది. نَعُوْذُ بِاللهِ (నవూజుబిల్లాహ్) మేము అల్లాహ్ శరణు వేడుతున్నాము. ఏ హృదయానికైతే అల్లాహ్ యొక్క స్మరణలో ప్రశాంతత లేదో, అది రోగగ్రస్తమైన హృదయం ప్రియులారా. జ్ఞాపకం పెట్టుకోండి.
ఈ రోజు మనం, మనం అనుకుంటాం ప్రియులారా, మనలో అనేక మంది ఏమనుకుంటారు, జిక్ర్ అంటే తసవ్వుఫ్ అండి, అది మనది కాదు. ఈ రోజు ఎలాగైపోయిందంటే, దరూద్ చదివే వాళ్ళు అదొక పార్టీ అండి, దరూద్ చదివే వాళ్ళకు మాకు సంబంధం లేదు. نَعُوْذُ بِاللهِ (నవూజుబిల్లాహ్). ఎక్కువగా జిక్ర్ గురించి మాట్లాడితే, ఏమి సూఫీలు జిక్ర్ చేసుకుంటారండి, మాకేం అవసరం జిక్ర్ ఇది, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. జిక్ర్ ఎలాంటి ఆరాధన ప్రియులారా?
ఒక హదీస్ గనక మనం పరిశీలించినట్లయితే, తిర్మిజీ గ్రంథంలో అబూ దర్దా (రదియల్లాహు అన్హు) వారి ఒక ఉల్లేఖనం వస్తుంది ప్రియులారా. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలియజేస్తున్నారు, నేను మీ ఆచరణల అన్నింటిలోకెల్లా ఒక గొప్ప ఆచరణ గురించి, ఒక మేలైన ఆచరణ గురించి మీకు తెలియజేయనా? అది ఎలాంటి ఆచరణ అంటే, మీ యొక్క ప్రభువు దృష్టిలో, అల్లాహ్ దృష్టిలో అత్యంత పవిత్రమైన ఆచరణ. మీరు అల్లాహ్ మార్గములో బంగారం, వెండి ఖర్చు పెట్టటము కంటే గొప్ప ఆచరణ. మీరు శత్రువుతో పోరాటము చేసి, శత్రువు తలలు తీయటము కంటే గొప్ప ఆచరణ. దైవ ప్రవక్త యొక్క సహాబాలు అడుగుతున్నారు, చెప్పండి ప్రవక్త, అది ఏ ఆచరణ? అల్లాహు అక్బర్. అల్లాహ్ మార్గంలో బంగారం, వెండి ఖర్చు చేయటము కంటే గొప్ప ఆచరణ. అల్లాహ్ వద్ద అత్యంత పవిత్రమైన ఆచరణ. శత్రువుతో పోరాటము చేయటము కంటే గొప్ప ఆచరణ. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలియజేస్తున్నారు ప్రియులారా,
ذِكْرُ اللَّهِ تَعَالَى జిక్రుల్లాహి తఆలా
అల్లాహ్ యొక్క స్మరణ చేయటం అల్లాహ్ మార్గంలో బంగారం దానము చేయటము కంటే గొప్పది. అల్లాహ్ యొక్క జిక్ర్ చేయటం, అల్లాహ్ మార్గములో వెండి దానము చేయటము కంటే గొప్పది. అల్లాహ్ యొక్క జిక్ర్ చేయటం శత్రువుతో పోరాటము చేయటము కంటే గొప్పది, సుబ్ హా నల్లాహ్.
అలాంటి జిక్ర్ ఈ రోజు మన వద్ద ఉందా ప్రియులారా? అల్లాహు అక్బర్. అబూ మూసా అష్అరీ (రదియల్లాహు అన్హు) హదీస్ ఉల్లేఖిస్తున్నారు. సహీహ్ ముస్లిం గ్రంథంలో హదీస్ నఖలు చేయబడుతుంది. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలియజేస్తున్నారు:
ప్రవక్త అంటున్నారు, అల్లాహ్ యొక్క స్మరణ చేసేవాడు, అల్లాహ్ యొక్క స్మరణ చేయనివాడు, వీరిద్దరి ఉపమానం ఎలాంటిదంటే, అల్లాహ్ యొక్క స్మరణ చేసేవాడు సజీవమైన వాడితో సమానము, అల్లాహ్ యొక్క స్మరణ చేయనివాడు నిర్జీవమైన వాడితో సమానం. సుబ్ హా నల్లాహ్. అల్లాహ్ యొక్క స్మరణ చేసేవాడు సజీవమైన వాడితో సమానం, అల్లాహ్ యొక్క స్మరణ చేయనివాడు నిర్జీవునితో సమానం ప్రియులారా. ఆలోచించండి.
ఈ రోజు ఎంత మంది అల్లాహ్ యొక్క జిక్ర్ చేస్తున్నారు? అల్లాహ్ తఆలాను జ్ఞాపకం చేసుకుంటున్నారు? మనం బ్రతికి ఉన్నాం ప్రియులారా, మన హృదయాలు బ్రతికి ఉన్నాయి సోదరులారా. మన హృదయాలను బ్రతికి ఉండగా మనం సజీవమైన వారిగా జీవితం గడుపుదామా? లేక బ్రతికి ఉండగానే మన హృదయాలు చనిపోయిన వారి వలే జీవితాన్ని గడుపుదామా? అల్లాహ్ యొక్క జిక్ర్ చేసేవాడు సజీవమైన వాడితో సమానం, అల్లాహ్ యొక్క జిక్ర్ చేయనివాడు నిర్జీవునితో సమానం ప్రియులారా.
ఒక చిన్న ఉదాహరణ మీ ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తాను ప్రియులారా. ఒక వ్యక్తి అట తన ఇంటి బాల్కనీ నుండి బయట ప్రపంచాన్ని చూస్తున్నాడు. తన ఇంటి బాల్కనీ నుండి రోడ్డు వైపునకు, రోడ్డు పై చూస్తున్నాడు. ఎవరో వచ్చి రోడ్డు మీద ఉన్న ఒక చెత్త కుండీలో ఆహారాన్ని, పాడైపోయిన ఆహారం బహుశా, పడేసి వెళ్ళిపోయారు. ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి, ఏదైతే పాడైపోయిన ఆహారం చెత్త కుండీ వద్ద పడవేయబడిందో, ఆ ఆహారాన్ని ఎత్తుకొని త్వర త్వరగా తినేస్తున్నాడు. బాల్కనీ నుండి చూస్తున్న వ్యక్తి అంటున్నాడు, الْحَمْدُ لِلَّهِ అల్హమ్దులిల్లాహ్సర్వ స్తోత్రములు అల్లాహ్ కే. అల్లాహ్ అతగాడి కంటే మంచి జీవితాన్ని నాకు ప్రసాదించాడు, దీనికి అల్లాహ్ కు స్తోత్రం. ఇక ఎవరైతే చెత్తకుండీ వద్ద పాడైపోయిన ఆహారాన్ని ఏరుకొని తింటున్నాడో, అతగాడు చూస్తున్నాడు రోడ్డు మీద ఒక వ్యక్తి సరిగ్గా బట్టలు కూడా లేవు, అంతగా మతస్థిమితం లేని వాడి వలే రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. అతగాడిని చూసి పాడైపోయిన ఆహారం తింటున్న వాడు అంటున్నాడు, الْحَمْدُ لِلَّهِ అల్హమ్దులిల్లాహ్ సర్వ స్తోత్రములు అల్లాహ్ కే. అల్లాహ్ అతగాడి కంటే మంచి స్థితిలో నన్ను ఉంచాడు, అల్లాహ్ కు స్తోత్రము. ఇక ఎవడైతే పిచ్చివాడి వలే రోడ్డు పై పరిగెత్తుతున్నాడో, అతగాడు చూస్తున్నాడు అంబులెన్స్ లో ఒక పేషెంటును హాస్పిటల్ కు తరలించటం జరుగుతుంది. ఆ పిచ్చివాడి వలే రోడ్డు పై గెంతులు వేస్తున్న వాడు ఆ అంబులెన్స్ లో ఉన్న రోగిని చూసి అంటున్నాడు, الْحَمْدُ لِلَّهِ అల్హమ్దులిల్లాహ్ సర్వ స్తోత్రములు అల్లాహ్ కే. అతడు అనారోగ్యం పాలైపోయాడు, అల్లాహ్ నాకైతే ఆరోగ్యాన్ని ప్రసాదించాడు, దీని కోసం అల్లాహ్ కు సర్వ స్తోత్రములు. ఇక ఎవడైతే అంబులెన్స్ లో నుండి హాస్పిటల్ వద్దకు చేరుకొని స్ట్రెచర్ మీద హాస్పిటల్ లోకి అడ్మిట్ అవుతున్న ఆ రోగి, అవతల పక్క స్ట్రెచర్ మీద ఒక డెడ్ బాడీని బయటకు తీసుకురావటాన్ని చూస్తున్నాడు. ఆ పేషెంటు ఆ డెడ్ బాడీ బయటకు వస్తుండగా చూసి అంటున్నాడు, الْحَمْدُ لِلَّهِ అల్హమ్దులిల్లాహ్ సర్వ స్తోత్రములు అల్లాహ్ కే. అల్లాహ్ నా దేహంలోనైతే ప్రాణం ఉంచాడు, అతడి దేహములో ప్రాణము కూడా లేదే, అల్లాహు అక్బర్. అల్లాహు అక్బర్. ఇప్పుడు మీరు చెప్పండి, ఏ అనారోగి అయితే తన ఆరోగ్యం, ఆ వ్యక్తి అల్లాహ్ కు కృతజ్ఞత తెలుపుతున్నాడే. ఇక పలకగలుగుతున్నాడే. ఇక స్ట్రెచర్ మీద బయటకు తీసుకు రాబడుతున్న వ్యక్తి అల్హందులిల్లాహ్ చెప్పగలడా ప్రియులారా? ఏ వ్యక్తి అయితే మరణించి బయటకు వస్తున్నాడో, అతగాడు అల్హందులిల్లాహ్ పలకలేడు ప్రియులారా. ఎందుకంటే వాడు చనిపోయి ఉన్నాడు కాబట్టి, సుబ్ హా నల్లాహ్.
ప్రియులారా, కాబట్టి బ్రతికి ఉండగా అల్లాహ్ తఆలాకు కృతజ్ఞత తెలిపే వారిగా, అల్లాహ్ యొక్క జిక్ర్ చేసే వారిగా మన జీవితాలను మనం మార్చుకుంటే, ఇది మన కోసం మేలైనది ప్రియులారా. అల్లాహ్ వద్ద అంతస్తులను తీసుకు వచ్చి పెట్టే మహోన్నత సాధనం. కాబట్టి ప్రియులారా, అల్లాహ్ యొక్క జిక్ర్ చేద్దాం, అల్లాహ్ ను స్మరిద్దాం. అల్లాహ్ అంటూ ఉన్నారు కదా ఏదైతే తిలావత్ లో చదివారు,
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اذْكُرُوا اللَّهَ ذِكْرًا كَثِيرًا యా అయ్యుహల్లజీన ఆమనూజ్కురుల్లాహ జిక్రన్ కసీరా ఓ విశ్వసించిన ప్రజలారా, అల్లాహ్ ను అత్యధికంగా స్మరించండి, సుబ్ హా నల్లాహ్.
కాబట్టి పదండి ఈ రోజున అంశంలో ముఖ్తసరిగా గురువుగారు మీరంటున్నారు అల్లాహ్ ను స్మరించమని. మీరు అంటున్నారు అల్లాహ్ ను స్మరించేవాడు మానసికంగా చాలా ఆరోగ్యంగా ఉంటాడని, హృదయపరంగా ఆరోగ్యంగా ఉంటాడని. సుబ్ హా నల్లాహ్. వాస్తవం ప్రియులారా. మనిషి యొక్క హృదయానికి ఆహారం అల్లాహ్ యొక్క జిక్ర్. మన శరీరానికి ఆహారం ప్రియులారా ప్రపంచంలో అన్నపానీయాలు, కానీ మన హృదయానికి ఆహారం అల్లాహ్ యొక్క జిక్ర్ ప్రియులారా, సుబ్ హా నల్లాహ్.
కాబట్టి, అల్లాహ్ యొక్క జిక్ర్ మన హృదయానికి ఎలాంటిదండి? షేఖుల్ ఇస్లాం ఇబ్నె తైమియా రహమహుల్లా తెలియజేస్తున్నారు, మనిషి హృదయానికి అల్లాహ్ యొక్క జిక్ర్ ఎలాంటిదంటే, చేపకు నీరు లాంటిది. ఏ విధంగానైతే నీరు లేకపోతే చేప మరణిస్తుందో, అల్లాహ్ యొక్క జిక్ర్ లేకపోతే మనిషి హృదయం మరణిస్తుంది. సుబ్ హా నల్లాహ్. ఏ విధంగానైతే నీరు లేకపోతే చేప మరణిస్తుందో, అల్లాహ్ యొక్క జిక్ర్ లేకపోతే, అల్లాహు అక్బర్, మనిషి హృదయం మరణిస్తుంది ప్రియులారా.
అల్లాహ్ యొక్క జిక్ర్ చేయకపోవటం, అల్లాహ్ ను స్మరించకపోవటం, ఇది ఎవరి లక్షణం ప్రియులారా? ఇది కపట విశ్వాసుల లక్షణం. సుబ్ హా నల్లాహ్. అల్లాహ్ ఏమన్నారు? కపట విశ్వాసుల యొక్క లక్షణాల గురించి ఖురాన్ గ్రంథములో అల్లాహ్ ప్రస్తావించిన మాట ఏమిటి?
అల్లాహ్ దానికంటే ముందు అన్నాడు, يُرَاءُونَ النَّاسَ وَلَا يَذْكُرُونَ اللَّهَ إِلَّا قَلِيلًا యురాఊనన్నాస, వలా యజ్కురూనల్లాహ ఇల్లా ఖలీలా
అల్లాహ్ ఏమన్నాడు? వారు, ఎవరంటే కపట విశ్వాసులు, నమాజు కోసం నిలబడినప్పుడు అతి బద్ధకంతో నిలబడతారు. ఒకవేళ నిలబడినా, ప్రజలకు చూపించటానికి నిల్చుంటారు. వారు అల్లాహ్ ను స్మరించరు, కానీ బహు తక్కువగా స్మరిస్తారు. సుబ్ హా నల్లాహ్. అల్లాహ్ తఆలా బహు తక్కువగా అల్లాహ్ ను స్మరించటాన్ని ఏ లక్షణం అంటున్నాడు? ఈ రోజు మనం అల్లాహ్ ను ఎంత వరకు స్మరిస్తున్నాం? ఈ రోజు అల్లాహ్ ఈ ఉమ్మత్ లో చాలా మందికి హిదాయత్ ప్రసాదించు గాక. కనీసం తుమ్ము వచ్చినప్పుడు అల్హందులిల్లాహ్ చెప్పే భాగ్యము కూడా ఈ ఉమ్మత్ లో చాలా మంది కోల్పోతున్నారు. లేదు ప్రియులారా. అల్లాహ్ కు కృతజ్ఞత, అల్లాహ్ యొక్క జిక్ర్ చేద్దాం, దాని ద్వారా మన జీవితంలో అనేక రకాలైన సమస్యలకు అల్లాహ్ పరిష్కారం చూపుతాడు, సుబ్ హా నల్లాహ్.
ఒక వ్యక్తి వచ్చాడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తో అడిగాడు, ప్రవక్త, నాకు ఇస్లాం యొక్క ఆచరణలు చాలా ఎక్కువగా అనిపిస్తున్నాయి, నాకు ఒక ఆచరణ చెప్పండి దానిపై నేను స్థిరంగా ఉంటాను. ప్రవక్త ఏమన్నారు?
لَا يَزَالُ لِسَانُكَ رَطْبًا مِنْ ذِكْرِ اللَّهِ లా యజాలు లిసాను కరత్బమ్ మిన్ జికిరిల్లాహ్ నీ యొక్క నాలుకను ఎల్లప్పుడూ అల్లాహ్ యొక్క స్మరణలో నిలిపి ఉంచు.
అల్లాహు అక్బర్. అల్లాహ్ యొక్క స్మరణలో నిలిపి ఉంచు. దాని వల్ల చాలా లాభాలు ఉన్నాయి ప్రియులారా.
ఇప్పుడు పదండి, మన ముఖ్తసరిగా జిక్ర్ ఏంటి? ఎలాంటి జిక్ర్ చేయాలి? మీరు అంటున్నారు గురువుగారు ఇందాకటి బట్టి అల్లాహ్ యొక్క స్మరణ, అల్లాహ్ యొక్క స్మరణ, అల్లాహ్ యొక్క స్మరణ. అల్లాహ్ యొక్క స్మరణ ఏం చేయాలి? మనం గనక హదీసులు పరిశీలించినట్లయితే, హదీసులు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. నిర్దిష్టమైన వాక్యాలు ఉన్నాయి హదీసులలో అల్లాహ్ యొక్క స్మరణ గురించి.
మొట్టమొదటిగా మనం చూసినట్లయితే, బుఖారీ, ముస్లిం గ్రంథాలలో హదీస్ నకలు చేయబడుతుంది. హజ్రతే అబూ హురైరా (రదియల్లాహు అన్హు) హదీస్ ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త వారు ఏమన్నారు? కలిమతాన్. రెండు వచనాలు ఉన్నాయి. ఖఫీఫతాని అలల్ లిసాన్ – పెదవులతో పలకటానికి చాలా తేలికైనవి. సఖీలతాని ఫిల్ మీజాన్ – త్రాసులో చాలా బరువైనవి. హబీబతాని ఇలర్రహ్మాన్ – కరుణామయుడైన అల్లాహ్ కు చాలా ప్రీతి పాత్రమైనవి. రెండే వచనాలు.
سُبْحَانَ اللَّهِ وَبِحَمْدِهِ، سُبْحَانَ اللَّهِ الْعَظِيمِ సుబ్ హా నల్లాహి వబిహమ్దిహీ, సుబ్ హా నల్లాహిల్ అజీమ్ అల్లాహ్ పవిత్రుడు మరియు ఆయనకే సర్వ స్తోత్రములు, మహోన్నతుడైన అల్లాహ్ పవిత్రుడు.
అల్లాహు అక్బర్. మనం రోజులో ఎంత సమయాన్ని తీస్తున్నామండి ఈ పదాలు పలకటానికి? అల్లాహ్ మనకు హిదాయత్ ప్రసాదించు గాక, ఆమీన్. ప్రియులారా, అల్లాహు అక్బర్. అల్లాహ్ యొక్క స్మరణ. విశ్వాసి ఎవరు?
అల్లాహ్ యొక్క దాసుడు పరుండినా, కూర్చుండినా, నిల్చున్నా, అల్లాహ్ యొక్క జిక్ర్ చేస్తూ ఉంటాడు. అల్లాహు అక్బర్.
ప్రియులారా, ఆ తరువాత పదండి. సహీహ్ ముస్లిం గ్రంథంలో అబూ హురైరా (రదియల్లాహు అన్హు) హదీస్ ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలియజేస్తున్నారు. ఏమన్నారు ప్రవక్త వారు? సూర్యుడు ఉదయించే ఈ భూమిపై నాకు అన్నింటికంటే, నాకు అన్నింటికంటే ఇష్టమైనది,
سُبْحَانَ اللَّهِ، وَالْحَمْدُ لِلَّهِ، وَلَا إِلَهَ إِلَّا اللَّهُ، وَاللَّهُ أَكْبَرُ సుబ్ హా నల్లాహ్, వల్ హమ్దులిల్లాహ్, వ లా ఇలాహ ఇల్లల్లాహ్, వల్లహు అక్బర్ పలకటం.
దీని ఘనత ఎలాంటిది? ఒక రివాయత్ వస్తుంది ప్రియులారా, ఎవరైతే సుబ్ హా నల్లాహి వల్ హమ్దులిల్లాహి వ లా ఇలాహ ఇల్లల్లాహి వల్లహు అక్బర్ అని పలుకుతారో, వారి కోసం స్వర్గములో ఒక చెట్టు నాటబడటం జరుగుతుంది. అల్లాహు అక్బర్.
ఈ రోజు మన ఇంట్లో పిల్లలు పాటలు పాడితే తల్లి తండ్రి సంతోషపడిపోతారు. మా వాడు పాట పాడుతున్నాడండి, ఇక సంవత్సరం రాలేదు, ఇంకా రెండేళ్ళండి, వీడు పాట పాడుతున్నాడు. ఎంత మంది తల్లి తండ్రి పిల్లలకు లా ఇలాహ ఇల్లల్లాహ్ జిక్ర్ నేర్పిస్తున్నారు? అఫ్జలుజ్ జిక్ర్. శ్రేష్టమైన జిక్ర్ ఏమిటి?
لَا إِلَهَ إِلَّا اللَّهُ లా ఇలాహ ఇల్లల్లాహ్ అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు.
పిల్లలు మాట్లాడటం ప్రారంభించగానే, పిల్లలు చాలా చిన్నప్పుడు అందంగా మాట్లాడుతారు, తొత్తి తొత్తి మాటలు అంటారు మన వాళ్ళు. ఎప్పుడైతే పిల్లవారు మాట్లాడటం ప్రారంభమిస్తున్నారో, వారికి నేర్పించాల్సింది లా ఇలాహ ఇల్లల్లాహ్ పలకటం ప్రియులారా. అల్లాహు అక్బర్.
హజ్రతే అబూ హురైరా (రదియల్లాహు అన్హు) హదీస్ ఉల్లేఖిస్తున్నారు, బుఖారీ ముస్లిం గ్రంథాలలో హదీస్ ఉల్లేఖించబడుతుంది. ప్రవక్త వారు ఏమన్నారు?
لَا إِلَهَ إِلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، لَهُ الْمُلْكُ، وَلَهُ الْحَمْدُ، وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ లా ఇలాహ ఇల్లల్లాహు వహదహూ లా షరీక లహూ, లహుల్ ముల్కు వ లహుల్ హమ్దు, వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్ అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు, ఆయన ఏకైకుడు, ఆయనకు భాగస్వామి లేడు. సార్వభౌమత్వం ఆయనదే, సర్వ స్తోత్రములు ఆయనకే. ఆయన ప్రతి దానిపై శక్తిమంతుడు.
ఎవరైతే రోజుకు 100 సార్లు అంటారో, వారితో ఏమవుతుందండి? వారికి ఎంత పుణ్యం లభిస్తుంది? పది మంది బానిసలను విడుదల చేసినంత పుణ్యం. హదీస్ లో ఉన్నాయి బానిసలను విడుదల చేయించండి, మనం విడుదల చేయించలేకపోతున్నాం. మరి ఈ యొక్క జిక్ర్ చేస్తే పది మంది బానిసలను విడుదల చేసినంత పుణ్యం. అతడి యొక్క కర్మల జాబితాలో వంద పుణ్యాలు లిఖించబడతాయి, అతడి కర్మల జాబితాలో వంద పాపాలు తుడిచిపెట్టబడతాయి, ఆ రోజు సాయంత్రం వరకు అతడు షైతాను బారి నుండి రక్షింపబడతాడు, ప్రళయ దినాన అల్లాహ్ వద్ద విశిష్ట స్థానములో, సుబ్ హా నల్లాహ్, అల్లాహ్ వద్ద చాలా గొప్ప ప్రాధాన్యత వస్తాడు. కానీ అతడి కంటే ఎవరైతే ఎక్కువగా జిక్ర్ చేస్తారో, వారు అతడి కంటే గొప్ప ప్రాధాన్యత. దేనితో? రోజుకు 100 సార్లు లా ఇలాహ ఇల్లల్లాహ్ వహదహూ లా షరీక లహూ, లహుల్ ముల్కు వ లహుల్ హమ్దు, వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. వంద సార్లు లెక్కపెట్టండి. 10 మంది బానిసలను విడుదల చేసినంత పుణ్యం, 100 పుణ్యాలు లిఖించబడతాయి, 100 పాపాలు క్షమించబడతాయి, ఆ రోజు సాయంత్రం వరకు షైతాను యొక్క కీడు నుండి రక్షింపబడతాడు. సుబ్ హా నల్లాహ్.
గురువుగారు 100 సార్లు లెక్కపెట్టే సమయం లేదండి. 10 సార్లు లెక్కపెట్టండి. అబూ అయ్యూబ్ అన్సారీ (రదియల్లాహు అన్హు) రివాయత్ ఉంది. ఎవరైతే రోజుకు పది సార్లు లా ఇలాహ ఇల్లల్లాహు వహదహూ లా షరీక లహూ, లహుల్ ముల్కు వ లహుల్ హమ్దు, వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్ పది సార్లు లెక్కపెడతారో, వారు ఇస్మాయిల్ (అలైహిస్సలాం) వంశములో నలుగురు బానిసలను విడుదల చేసినంత పుణ్యాన్ని పొందుతారు ప్రియులారా. అల్లాహు అక్బర్.
ప్రవక్త వారు అంటున్నారు, ఎవరైతే రోజుకు 100 సార్లు
سُبْحَانَ اللَّهِ وَبِحَمْدِهِ సుబ్ హా నల్లాహి వబిహమ్దిహీ అల్లాహ్ పవిత్రుడు మరియు ఆయనకే సర్వ స్తోత్రములు.
అంటారో, ఎవరైతే రోజుకు 100 సార్లు సుబ్ హా నల్లాహి వబిహమ్దిహీ అంటారో, వారి పాపాలు క్షమించబడతాయి. ఆ పాపాలు సముద్రపు నురుగు అంత ఉన్నా సరే. సుబ్ హా నల్లాహ్. అల్లాహు అక్బర్. వంద సార్లు సుబ్ హా నల్లాహి వబిహమ్దిహీ పలికితే సముద్రపు నురుగు అంత పాపాలు ఉన్నా అవి క్షమించబడతాయి. వేరే హదీస్ లో ప్రవక్త అంటున్నారు, పరిశుద్ధత సగ విశ్వాసం. الْحَمْدُ لِلَّهِ అల్హమ్దులిల్లాహ్అ నే పదం త్రాసును నింపేస్తుంది. దాని యొక్క పుణ్యాన్ని గనక మనం weight చేయాలనుకుంటే, అల్హమ్దులిల్లాహ్ అన్న పదం త్రాసును నింపేస్తుంది. الْحَمْدُ لِلَّهِ، سُبْحَانَ اللَّهِ అల్హమ్దులిల్లాహ్, సుబ్ హా నల్లాహ్అ నే పదాలు భూమి ఆకాశాల మధ్య పూర్తి స్థానాలు నింపేస్తాయి. అల్లాహు అక్బర్. ఎంత గొప్ప విశిష్టత ప్రియులారా, అల్లాహ్ యొక్క నామ స్మరణది.
ఈ రోజు మన సమాజం ఎటు వెళ్ళిపోతుంది ప్రియులారా? మన మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది, نَعُوْذُ بِاللهِ నవూజుబిల్లాహ్. ఈ రోజు మనం సామాజిక మాధ్యమాలలో, అల్లాహ్ తఆలా మనకు హిదాయత్ ను ప్రసాదించు గాక. అల్లాహ్ తఆలా నీ యొక్క జిక్ర్ చేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించు, సుబ్ హా నల్లాహ్. ఈ రోజు మన యొక్క ఉనికి ఏంటంటే, నమాజ్ తర్వాత మన ఉనికి ఏంటంటే, అరే ఏంటి మన ఉనికి? ఏమంటారు గురువుగారు? ఇమాం గారు అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్ అని తిప్పిన వెంటనే లెగిచిపోవటం. ఏమండీ? ఖురాన్ హదీస్ తో ఏ ఆచరణ చేసేవాళ్ళం? మా యొక్క సంకేతం, మేము ఖురాన్ హదీస్ ను ఆచరించేవాళ్ళం, ఇమాం సలాం తిప్పిన వెంటనే మేము లేచి వెళ్ళిపోతాం. అల్లాహు అక్బర్.
ఒక రివాయత్ వస్తుందండి, అబూ హురైరా (రదియల్లాహు అన్హు) హదీస్ ఉల్లేఖిస్తున్నారు. పేద ముహాజిర్లు ప్రవక్త వద్దకు వచ్చి అంటున్నారు, ప్రవక్తా! శాశ్వత వనాలు, ఉన్నత స్థానాలు డబ్బు ఉన్నవారికే లభిస్తాయా ప్రవక్త? చూస్తే వారు కూడా మాలాగే నమాజ్ చేస్తారు, మాలాగే ఉపవాసాలు ఉంటారు, కానీ వారి వద్ద డబ్బు ఉన్న మూలంగా వారు ఏం చేస్తారంటే జిహాద్ చేస్తారు, దానధర్మాలు చేస్తారు, హజ్ చేస్తారు, ఉమ్రా చేస్తారు. మా వద్ద డబ్బు లేదు, మేము చేయలేకపోతున్నాం. హదీస్ సారాంశం చూసినట్లయితే, ఏమంటున్నారు? గొప్పవాళ్ళకే ఉన్నత స్థానాలు, శాశ్వత వరాలు లభిస్తాయా? వారు కూడా మాలాగే నమాజ్ చేస్తారు, మాలాగే ఉపవాసం పెడతారు, కానీ డబ్బు మూలంగా వారేం చేస్తారు? ఉమ్రా చేస్తారు, హజ్ చేస్తారు, దానధర్మాలు చేస్తారు, జిహాద్ చేస్తారు. ప్రవక్త వారు అన్నారు, మీకు ఇలాంటి ఆచరణ తెలపనా? దేని ద్వారానైతే ఎవరి గురించి అయితే మీరు అంటున్నారో, వారు చేసిన పుణ్యాలను మీరు కూడా అందుకుంటారు. సుబ్ హా నల్లాహ్. ప్రవక్త ఏమన్నారు? ప్రతి నమాజు తరువాత 33 సార్లు సుబ్ హా నల్లాహ్ పలకండి, 33 సార్లు అల్హమ్దులిల్లాహ్ పలకండి, 33 సార్లు అల్లాహు అక్బర్ పలకండి. వారి యొక్క పుణ్యాలు మీకు కూడా లభిస్తాయి అని ప్రవక్త వారు చెప్పారు ప్రియులారా.
రెండో మాట వినండి ప్రియులారా, జిక్ర్ ద్వారా, జిక్ర్ ద్వారా మనిషికి కేవలం మానసిక ప్రశాంతత మాత్రమే లభించదు, శారీరక ప్రశాంతత కూడా లభిస్తుంది. ఆధారం? హజ్రతే ఫాతిమా (రదియల్లాహు అన్హు) ప్రవక్త వద్దకు కబురు పంపించారు కదా, ఇంట్లో పనులు చేసుకోలేక చేతివేళ్ళు పాడైపోయాయి. తెలిసింది ఫాతిమా (రదియల్లాహు అన్హు) వారికి ప్రవక్త వద్ద కొంతమంది బానిసలు వచ్చి ఉన్నారని కబురు పంపించారు. ప్రవక్త ఏమన్నారు? ఫాతిమా, ప్రతి రోజూ రాత్రి పడుకోవటానికి ముందు 33 సార్లు సుబ్ హా నల్లాహ్, 33 సార్లు అల్హమ్దులిల్లాహ్, 33 సార్లు అల్లాహు అక్బర్ పఠించమన్నారు, దేని కోసం? శారీరక బలం కోసం ప్రియులారా. అల్లాహు అక్బర్. ఈ రోజు ఈ జిక్ర్ తో మనం ఎంత వరకు లాభం పడుతున్నాం?
వేరే రివాయత్ లో వస్తుంది ప్రియులారా, ప్రవక్త వారు సహాబాలతో ప్రశ్నించారు, మీలో ఎవరైనా రోజుకు వెయ్యి పుణ్యాలు పొందగలరా? సహాబాలు ప్రశ్నించారు, ప్రవక్త, రోజుకు వెయ్యి పుణ్యాలు ఎలా పొందగలం? ప్రవక్త వారు అన్నారు, అయితే రోజుకు 100 సార్లు سُبْحَانَ اللَّهِ సుబ్ హా నల్లాహ్అ ని పలకండి, మీకు వెయ్యి పుణ్యాలు లిఖించటం జరుగుతుంది, లేక వెయ్యి పాపాలు క్షమించటం జరుగుతుంది. అల్లాహు అక్బర్. కాబట్టి ప్రియ సోదర సమాజమా, మనం జిక్ర్ అలవాటు చేసుకోవాలి. ప్రవక్త మాట:
لَا يَزَالُ لِسَانُكَ رَطْبًا مِنْ ذِكْرِ اللَّهِ లా యజాలు లిసాను కరత్బమ్ మిన్ జికిరిల్లాహ్ నీ యొక్క నాలుక ఎల్లప్పుడూ అల్లాహ్ యొక్క స్మరణలో ఉండాలి, ప్రవక్త చెప్పిన మాట. మన జీవితాలలో మనం నిత్య కృత్యంగా చేసుకోవాలి.
రోజు వారి దువాలు. ఈ కరోనా మహమ్మారి ప్రపంచం భయపడుతున్నాం. అరే, ప్రవక్త చెప్పలేదా?
ఎవరైతే ఉదయం మూడు సార్లు, సాయంత్రం మూడు సార్లు ఈ దువా పఠించాడో, వారికి ఎలాంటి కీడు కలగదు. ఎంత మంది నేర్చుకున్నారు? అల్లాహు అక్బర్. ఈ దువా నేర్చుకున్నాం, ఉదయం మూడు సార్లు, సాయంత్రం మూడు సార్లు చదువుతున్నాం, అయినా కరోనా వచ్చింది, చనిపోయాను. ఉలమాలు అంటున్నారు, ఇన్షాఅల్లాహ్ నువ్వు అల్లాహ్ పై విశ్వాసముతో ఉండి అల్లాహ్ యొక్క పరీక్ష వచ్చినప్పుడు విశ్వాసముతో ఉండి నువ్వు చనిపోతే, ఈ కరోనా మూలంగా చనిపోతే ఇన్షాఅల్లాహ్, ఇన్షాఅల్లాహ్ అల్లాహ్ నీకు షహీద్ యొక్క స్థానాన్ని ప్రసాదిస్తాడు. మనం అల్లాహ్ పై నమ్మకం కలిగి ఉండాలి కదా.
ఒక వ్యక్తి వచ్చాడు, ప్రవక్తా నాకు తేలు కుట్టింది అన్నాడు. ప్రవక్త వారు ఏమన్నారు? నువ్వు రోజుకు సాయంత్రం మూడు సార్లు
అన్న దువా చేయమన్నారు. రోజుకు మూడు సార్లు జిక్ర్ చేయమన్నారు. ఎంత మంది ఈ దువా నేర్చుకున్నాం? అల్లాహు అక్బర్.
ప్రతి ఫరజ్ నమాజ్ తర్వాత ఆయతుల్ కుర్సీ. ప్రవక్త ఏమన్నారు? ఎవరైతే ప్రతి ఫరజ్ నమాజ్ తర్వాత ఆయతుల్ కుర్సీ చదువుతాడో, అతడికి స్వర్గానికి మధ్య మరణం మాత్రమే అడ్డు ఉంటుంది.
సయ్యదుల్ ఇస్తిగ్ఫార్. అల్లాహుమ్మ అన్త రబ్బీ లా ఇలాహ ఇల్లా అన్త, ఖలఖ్తనీ వ అన అబ్దుక, అల్లాహు అక్బర్. ఎవరైతే సయ్యదుల్ ఇస్తిగ్ఫార్ ఉదయం విశ్వాసంతో చదివి సాయంత్రం మరణిస్తే అతగాడు స్వర్గానికి వెళ్తాడు అన్నారు ప్రవక్త. ఎవరైనా సయ్యదుల్ ఇస్తిగ్ఫార్ సాయంత్రం విశ్వాసముతో పఠించి ఉదయం మరణిస్తే స్వర్గానికి వెళ్తారు అన్నారు ప్రవక్త.
ఎవరైతే ఉదయం, సాయంత్రం ఏడు సార్లు:
حَسْبِيَ اللَّهُ لَا إِلَهَ إِلَّا هُوَ ۖ عَلَيْهِ تَوَكَّلْتُ ۖ وَهُوَ رَبُّ الْعَرْشِ الْعَظِيمِ హస్బియల్లాహు లా ఇలాహ ఇల్లా హువ, అలైహి తవక్కల్తు వహువ రబ్బుల్ అర్షిల్ అజీమ్ ఎవరైతే ఏడు సార్లు పఠిస్తారో, ఎలాంటి కీడు జరగదు అన్నారు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం).
కాబట్టి సోదర సమాజమా, జిక్ర్ తో మహోన్నతమైన లాభాలు ఉన్నాయి, విపరీతమైన లాభాలు ఉన్నాయి. మనకు తెలియకుండా అల్లాహ్ తఆలా మనల్ని రక్షిస్తూ ఉంటాడు ప్రియులారా. ఇలాంటి జిక్ర్ చేయటంలో మీరు నేను ఈ రోజు ఎంత ముందున్నాం? నేను ప్రతిసారీ ప్రశ్నించే ప్రశ్న ప్రియులారా. నేను 30 ఏళ్ల నమాజీని, కానీ నాకు జిక్ర్ రాదు. మస్జిద్ లోపలికి వచ్చే దువా రాదు, మస్జిద్ నుండి బయటకు వెళ్ళే దువా రాదు. లాక్డౌన్ సమయం నడుస్తుంది ప్రియులారా, నెలన్నర నుండి మధ్యాహ్నం 12 వరకు, మొన్నటి వరకు ఇప్పుడు రెండు గంటల వరకు. ఈ లాక్డౌన్ సమయాన్ని ఎంత చక్కగా సద్వినియోగ పరుచుకుంటున్నాం? కాబట్టి జిక్ర్ చేయటం నేర్చుకుందాం. అల్లాహ్ తఆలా యొక్క జిక్ర్ చేద్దాం ప్రియులారా. దీనితో చాలా లాభాలు ఉన్నాయి.
చివరిగా ఒక్క మాట చెప్పి నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తున్నాను ప్రియులారా. జిక్ర్ ద్వారా మనకు లభించే లాభాలు ఏమిటి? అల్లాహు అక్బర్. అల్లాహ్ యొక్క నామ స్మరణ చేయటం మూలాన మనకు లభించే లాభాలు, ఒకే ఒక సంఘటన చెప్పి నా యొక్క మాటను ముగిస్తున్నాను ప్రియులారా.
పూర్వ కాలములో ఒక పెద్ద ఇమాం ఉండేవారండి. ఇమాం అహ్లుస్ సున్నా వల్ జమాఅ, ఇమాం అహ్మద్ బిన్ హంబల్ రహమహుల్లాహ్ చాలా పెద్ద విద్వాంసుడు గడిచారండి. రహమహుల్లాహ్. ఆయన బగ్దాద్ లో ఉండేవారు. ఒకసారి బగ్దాద్ పట్టణం నుండి ఇమాం అహ్మద్ బిన్ హంబల్ రహమహుల్లాహ్ సిరియా పట్టణానికి వెళ్లారు. సిరియా పట్టణపు రాజధాని డమస్కస్ నగరానికి వెళ్లారు. ఒకచోట రాత్రి అయిపోయింది, ఆయన నమాజ్ వగైరా చేసుకున్నారు, ఇక మస్జిద్ లో ఆయన విశ్రాంతి తీసుకుందాం అనుకున్నారు. ఇంతలో ఆ డమస్కస్ నగరములో, ఆ మస్జిద్ యొక్క ముఅజ్జిన్ ఇమాం గారి వద్దకు వచ్చి అన్నాడు, ఇమాం గారు ఎవరో ఆ ముఅజ్జిన్ కి తెలియదు. ఆ ముఅజ్జిన్ ఏమన్నాడు? అయ్యా, మా మస్జిద్ లో పడుకోవటానికి వీలు లేదు, మా గవర్నర్ గారి ఆజ్ఞ, మీరు ఈ రాత్రికి మా మసీదులో విశ్రాంతి తీసుకోలేరు. అల్లాహు అక్బర్. గురువుగారు ఏం చేశారండి? చెప్పుకోలేదు, నేను పెద్ద ఇమాం ని అని, నేను ఇమాం అహ్మద్ బిన్ హంబల్ ని అని. గురువుగారు తన యొక్క స్వీయ పొగడ్త చేసుకోలేదు, గురువుగారు తన యొక్క పరిచయం కూడా చేసుకోలేదు, సుబ్ హా నల్లాహ్. ఇబ్నె జౌజీ రహమహుల్లా ప్రస్తావిస్తున్నారు ఇమాం అహ్మద్ బిన్ హంబల్ రహమహుల్లా యొక్క ఈ సంఘటన. ఇమాం అహ్మద్ బిన్ హంబల్ మస్జిద్ యొక్క బయట కూర్చుండి పోయారు తన పుస్తకాలు, సంచి పెట్టుకున్నారు. ఆ రక్షక భటుడు లేదా ముఅజ్జిన్ ఇమాం గారి యొక్క పుస్తకాలు, అతగాడిని మస్జిద్ బయట కూడా కూర్చోవటానికి అనుమతి ఇవ్వలేదు. ఇమాం గారి సంచి పుస్తకాలు రోడ్డు మీదకి విసిరేశాడు, అల్లాహు అక్బర్. దూరం నుండి మూడో వ్యక్తి మొత్తం తతంగాన్ని చూస్తున్నాడు.
ఆ వ్యక్తి వచ్చాడు ఇమాం గారి వద్దకు, అయ్యా ఏంటి సంగతి? ఇమాం గారు తెలియజేశారు, అయ్యా ఈ ప్రాంతానికి కొత్తవాడిని, అపరిచితుడిని, రాత్రి మస్జిద్ లో పడుకోవటానికి నాకు పర్మిషన్ లేదంటున్నారు, ఏం చేయాలో అర్థము కావటం లేదు. ఇంతలో ఆ వ్యక్తి అన్నాడు, అయ్యా మీరు ఏమి అనుకోనంటే నాకు దగ్గరలో ఒక బేకరీ ఉంది, ఆ బేకరీలో నేను రొట్టెలు తయారు చేస్తుంటాను, నా బేకరీలో వచ్చి ఈ రోజు రాత్రి మీరు విశ్రాంతి తీసుకోవచ్చు. గురువుగారు వెళ్లారు ప్రియులారా, అతగాడి యొక్క బేకరీ వద్దకు. గురువుగారు వెళ్లి విశ్రాంతి తీసుకుంటున్నారు, ఆ బేకరీలో రొట్టెలు తయారు చేసే వ్యక్తి ఏం చేస్తున్నాడు, రొట్టెల కోసం పిండి వగైరా తయారు చేసి రొట్టె తయారు చేయటం ప్రారంభిస్తున్నాడు, అతగాడు తన నోటి నుండి أَسْتَغْفِرُ اللّٰهَ అస్తగ్ఫిరుల్లాహ్ అని అల్లాహ్ యొక్క స్మరణ చేస్తున్నాడు. ఆ వ్యక్తి రొట్టె తయారు చేస్తున్నాడు, أَسْتَغْفِرُ اللّٰهَ అస్తగ్ఫిరుల్లాహ్ అంటున్నాడు. అల్లాహు అక్బర్. రాత్రంతా గడిచిపోయింది, రొట్టె తయారు చేసే వాడి నోటి నుండి ‘అస్తగ్ఫిరుల్లాహ్’ అన్న పలుకు మాత్రం ఆగలేదు.
ఇమాం అహ్మద్ బిన్ హంబల్ రహమహుల్లా ఆ వ్యక్తితో ప్రశ్నించారు, నాయనా నేను విన్నాను, నువ్వు రాత్రంతా అల్లాహ్ యొక్క జిక్ర్ చేస్తూనే ఉన్నావు, అల్లాహ్ సుబ్ హాన వత’ఆలా నీకు దీనితో ఏమి ఇచ్చాడు? ఆ రొట్టె తయారు చేసే వ్యక్తి అంటాడు ప్రియులారా, అయ్యా నేను ప్రతి రోజూ రాత్రి ఈ విధంగా అల్లాహ్ యొక్క జిక్ర్ చేస్తూనే ఉంటాను. అల్లాహ్ నా జీవితంలో ప్రతి మొర, ప్రతి ప్రార్థన ఆలకించాడు, కానీ ఒక్క మొర ఉందయ్యా, ఒక్క కోరిక ఉంది, ఆ కోరిక, ఆ మొర అల్లాహ్ సుబ్ హాన వత’ఆలా ఎప్పుడు తీరుస్తాడా అని నేను రాత్రి పూట అల్లాహ్ యొక్క జిక్ర్ చేస్తుంటాను. గురువుగారు ప్రశ్నించారు, నాయనా ఆ యొక్క మొర ఏమిటి, దేనికోసమైతే నువ్వు రాత్రంతా ‘అస్తగ్ఫిరుల్లాహ్’ అని అల్లాహ్ యొక్క స్మరణ చేస్తున్నావో? ఆ రొట్టె తయారు చేసేవాడు సమాధానం ఇస్తాడు ప్రియులారా, అయ్యా ప్రపంచంలో పండితులలో ఇమాం అహ్మద్ బిన్ హంబల్ అని ఒక మహా పండితుడు ఉన్నారట, అతగాడిని ఒకసారి నిన్ను కళ్లారా చూడాలి, అతన్ని కలవాలి అన్నదే నా యొక్క ఆకాంక్ష, నా యొక్క మొర అని చెప్పాడు. ఇమాం అహ్మద్ బిన్ హంబల్ అంటున్నారు, అల్లాహు అక్బర్, అల్లాహ్ తఆలా ఆ నీ ప్రార్థన కూడా విన్నాడు, ఆ నీ మొర కూడా ఆలకించాడు, ఇమాం అహ్మద్ ను లాక్కుంటూ అల్లాహ్ తఆలా నీ కళ్ళ ముందు తీసుకు వచ్చి కూర్చోబెట్టేశాడు.
జిక్ర్ యొక్క ఘనత ప్రియులారా. మనసులో నమ్మకం ఉండి, విశ్వాసం ఉండి, మనం అల్లాహ్ యొక్క జిక్ర్ చేస్తూ దువా చేస్తే అల్లాహ్ మన ప్రతి ప్రార్థన ఆలకిస్తాడు. కాబట్టి సోదరులారా, నేను చివరిగా చెప్పే మాట, జిక్ర్ యొక్క పదాలు నేర్చుకుందాం. మన వద్ద పుస్తకాలు ఉన్నాయి, ఉదయం సాయంత్రం దువాలు నేర్చుకుందాం ప్రియులారా. జిక్ర్ చేస్తూ ఉందాం. దీని ద్వారా మన జీవితాలలో అనేక లాభాలు ఉన్నాయి. మన హృదయానికి ప్రశాంతత సోషల్ మీడియాలో, Facebook లో, YouTube లో, సంగీత వాయిద్యాలలో, అనవసరపు విషయాలలో లేదు ప్రియులారా. అల్లాహ్ యొక్క స్మరణలో, ఖురాన్ గ్రంథం యొక్క పఠనలో, నమాజ్ ఆచరించటంలో, అల్లాహ్ తఆలా యొక్క నామ స్మరణలో మన హృదయాలకు ప్రశాంతత ఉంది. అది ఇహలోకంలోనూ, పరలోకంలోనూ సాఫల్యాన్ని చేకూరుస్తుంది. అందుకే అల్లాహ్ అన్నాడు,
وَاذْكُرُوا اللَّهَ كَثِيرًا لَعَلَّكُمْ تُفْلِحُونَ వజ్కురుల్లాహ కసీరల్ లఅల్లకుం తుఫ్లిహూన్ అల్లాహ్ యొక్క స్మరణ అత్యధికంగా చేయండి, తద్వారా మీరు సాఫల్యం పొందుతారు.
అల్లాహ్ సుబ్ హాన వత’ఆలా మనందరికీ అల్లాహ్ యొక్క నామ స్మరణ ఎక్కువగా చేసే సద్భాగ్యాన్ని ప్రసాదించు గాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దైవ భీతితో కన్నీరు పెట్టడం (The Excellence Of Weeping Out Of The Fear Of Allah) వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) https://youtu.be/NNoAU3lUlAs [26 నిముషాలు]
ఈ ప్రసంగంలో, దైవ భీతితో కన్నీరు కార్చడం అనే అంశంపై లోతైన వివరణ ఇవ్వబడింది. మానవునికి అల్లాహ్ నవ్వు మరియు ఏడుపు రెండింటినీ ప్రసాదించాడని ఖురాన్ ఆయతుతో ప్రసంగం ప్రారంభమవుతుంది. మానసిక నిపుణుల ప్రకారం, శారీరక గాయం, ప్రియమైనవారిని కోల్పోవడం, ఆనందం, మోసం మరియు డబ్బు కోసం వంటి వివిధ కారణాల వల్ల మానవులు ఏడుస్తారని వివరించబడింది. అయితే, అసలు ప్రాముఖ్యత దైవ భీతితో కార్చే కన్నీరుకే ఉందని స్పష్టం చేయబడింది. అల్లాహ్ భయంతో ఏడ్చే వ్యక్తి నరకంలోకి ప్రవేశించడం అసాధ్యమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసులను ఉటంకించారు. తీర్పు దినాన అల్లాహ్ సింహాసనం నీడలో చోటు పొందే ఏడు రకాల వ్యక్తులలో, ఏకాంతంలో అల్లాహ్ ను స్మరించుకుని కన్నీరు కార్చే వ్యక్తి కూడా ఒకరని చెప్పబడింది. అల్లాహ్ భయంతో కన్నీరు కార్చిన కళ్ళను నరకాగ్ని తాకదని, ఆ కన్నీటి చుక్క అల్లాహ్ కు అత్యంత ప్రియమైనదని వివరించబడింది. దైవదూతలు (మీకాయీల్ అలైహిస్సలాం), ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మరియు సహాబాల (ఉస్మాన్, ముఆద్, హసన్, అబూ హురైరా రదియల్లాహు అన్హుమ్) జీవితాల నుండి దైవ భీతితో వారు ఏ విధంగా కన్నీరు కార్చేవారో ఉదాహరణలతో వివరించబడింది. మన హృదయాలు కఠినంగా మారిపోయాయని, మరణాన్ని, సమాధిని స్మరించుకుంటూ, అనారోగ్యులను మరియు స్మశానాలను సందర్శిస్తూ, మన హృదయాలను మృదువుగా చేసుకుని అల్లాహ్ భయంతో కన్నీరు కార్చాలని ప్రసంగం ముగుస్తుంది.
ప్రశంసలన్నీ, పొగడ్తలన్నీ సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పరలోక దినానికి యజమాని అయిన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై ఎల్లవేళలా వర్షించు గాక. ఆమీన్.
గౌరవనీయులైన ధార్మిక పండితులు, పెద్దలు మరియు అభిమాన సోదరులారా! ఈనాటి జుమా ప్రసంగంలో దైవ భీతితో కన్నీరు పెట్టడం అనే అంశంపై ఇన్షా అల్లాహ్ కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అభిమాన సోదరులారా, మానవున్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సృష్టించాడు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇచ్చిన ఈ శరీరం ఒక హార్డ్వేర్ (hardware) అయితే, ఈ శరీరం లోపల అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనిషికి కొన్ని సాఫ్ట్వేర్ (software) లాంటి విషయాలను కూడా అమర్చాడు. మనం చూచినట్లయితే ఈ శరీరం కలిగిన మనిషికి బాధ కలుగుతుంది. ఈ శరీరం కలిగి ఉన్న మనిషికి సంతోషం కూడా కలుగుతుంది. మనిషికి ఆకలి వేస్తుంది, మనిషికి దాహం వేస్తుంది, మనిషి నవ్వుతాడు, మనిషి ఏడుస్తాడు. ఈ విధంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ శరీరంలో ఎన్నో విషయాలను పొందుపరిచి ఉన్నాడు. ఈరోజు మనం దైవ భీతితో మనిషి కన్నీరు కారుస్తాడు కదా, దాని గురించి ఇన్షా అల్లాహ్ తెలుసుకుందాం.
నవ్వు మరియు ఏడుపు అల్లాహ్ నుండి వచ్చినవే
వాస్తవానికి మనం చూచినట్లయితే మనిషికి నవ్వించడం నేర్పించింది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా. అలాగే మనిషికి బాధపడి కన్నీరు పెట్టడం నేర్పించింది కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాయే. ఖురాన్ లో మనం చూచినట్లయితే, సూర నజ్మ్ 43వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ విధంగా తెలియజేశాడు:
وَأَنَّهُ هُوَ أَضْحَكَ وَأَبْكَىٰ (వ అన్నహూ హువ అద్’హక వ అబ్కా) మరి ఆయనే నవ్విస్తున్నాడు, ఆయనే ఏడిపిస్తున్నాడు. (53:43)
అభిమాన సోదరులారా, మానసిక వైద్య నిపుణులు కొన్ని విషయాలు తెలియజేశారు. అవేమిటంటే, మనిషి ఎన్నో కారణాల వల్ల బాధపడి కన్నీరు కారుస్తాడంట. మనిషి కన్నీరు కార్చడానికి చాలా కారణాలు ఉన్నాయి అని మానసిక వైద్య నిపుణులు తెలియజేశారు. ఒక కారణం ఏమిటంటే, మనిషికి ఏదైనా గాయమైతే, ఆ బాధను ఓర్వలేక అతను కన్నీరు కారుస్తాడంట. అలాగే మనిషి ఎవరైనా దూరమైపోతుంటే, ఎవరినైతే అతను అభిమానించాడో, ప్రేమించాడో, వారు దూరమైపోతుంటే ఆ బాధ వల్ల కూడా మనిషి కన్నీరు కారుస్తాడట.
అలాగే, మనిషికి అనుకోకుండా ఒక పెద్ద సంతోషం కలిగితే, అప్పుడు కూడా పట్టరాని సంతోషంలో మనిషి కళ్ళ నుంచి కన్నీళ్లు కారుతాయంట. దానినే మనము ఆనంద భాష్పాలని కూడా అంటూ ఉంటాం. అలాగే అభిమాన సోదరులారా, కొంతమంది ఇతరులను మోసం చేయడానికి కూడా కన్నీరు కారుస్తారు. ముసలి కన్నీరు అని మనము అప్పుడప్పుడు సామెత పలుకుతూ ఉంటాం.
అలాగే, కొంతమంది అయితే డబ్బు తీసుకుని మరీ ఏడుస్తారట, కన్నీరు కారుస్తారట. దానిని ఇస్లామీయ పరిభాషలో నౌహా (శోకం) చేయడం అంటారు, మాతం చేయడం అంటారు. ఎవరైనా ఒక వ్యక్తి మరణించినచో, ఆ వ్యక్తి శవం వద్ద ఏడవడానికి కూలీ మీద కొంతమంది వచ్చి ఏడుస్తారు. ఇది ఇస్లాంలో నిషేధం. మనిషి మరణించిన తర్వాత అతని బంధువులైనా సరే, ఇతర వ్యక్తులైనా సరే అతని వద్ద వచ్చి నౌహా చేయడం, బిగ్గరగా కేకలు పెడుతూ ఏడ్చడం ఇస్లాంలో నిషేధం చేయబడింది.
దైవ భీతితో కార్చే కన్నీరు
అలాగే, దైవ భీతితో కూడా మనిషి కన్నీరు కారుస్తాడట. రండి ఇన్షా అల్లాహ్, ఈనాటి జుమా ప్రసంగంలో ఈ అంశం మీదే ఇన్షా అల్లాహ్ ఖురాన్ మరియు హదీసుల వెలుగులో మరియు సహాబాల జీవితాలకి సంబంధించిన విషయాలతో తెలిసిన కొన్ని విషయాలు తెలుసుకుందాం.
అభిమాన సోదరులారా! ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా తెలియజేశారు.
لَا يَلِجُ النَّارَ رَجُلٌ بَكَى مِنْ خَشْيَةِ اللَّهِ حَتَّى يَعُودَ اللَّبَنُ فِي الضَّرْعِ “లా యలిజున్నార రజులున్ బకా మిన్ ఖశియతిల్లాహి హత్తా యఊదల్లబను ఫిద్దర్రా” దీని అర్థం ఏమిటంటే “జంతువు పొదుగు నుండి పాలు పిండేసిన తర్వాత ఆ పాలు మళ్లీ ఆ జంతువు పొదుగులోకి తిరిగి వెళ్లిపోవడం ఎలాగైతే అసంభవమో దైవభీతితో కన్నీరు కార్చిన వ్యక్తి కూడా నరకంలో వెళ్లటం అసంభవం” అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు.
అల్లాహు అక్బర్ (ٱللَّٰهُ أَكْبَرُ)! దైవ భీతితో మానవుడు, భక్తుడు ఒక్కసారి ప్రపంచంలో కన్నీరు పెడితే ఆ వ్యక్తి నరకంలో వెళ్లడం, ఆ వ్యక్తి నరక ప్రవేశం చేయడం అసంభవం అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు అభిమాన సోదరులారా!
మరొక ఉల్లేఖనంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏడు మంది అదృష్టవంతుల గురించి తెలియజేశారు. రేపు పరలోకంలో లెక్కింపు రోజున సూర్యుడు చాలా సమీపంలో ఉంటాడు. ఆ రోజు ఎలాంటి నీడ ఉండదు. కేవలం అల్లాహ్ యొక్క సింహాసనం, అర్ష్ యొక్క నీడ మాత్రమే ఉంటుంది. ఆ రోజు ప్రజలు వేడికి తపిస్తూ అల్లాడుతూ ఉంటారు. ఆ రోజు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన సింహాసనం యొక్క నీడలోకి ఏడు రకాల మనుషులను తీసుకుంటాడు. ఆ ఏడు రకాల మనుషులలో ఒక రకమైన మనిషి ఎవడంటే
ఏకాంతంలో ఉన్నప్పుడు భక్తుడు, మానవుడు అల్లాహ్ ను తలుచుకొని అల్లాహ్ ను గుర్తు చేసుకొని కన్నీరు కార్చితే అలాంటి భక్తునికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రేపు పరలోకంలో లెక్కింపు రోజున ఆ మహ్షర్ మైదానంలో తన సింహాసనం నీడలోకి తీసుకుంటాడట.
మరో ఉల్లేఖనంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. “రెండు రకాల కళ్లు ఉన్నాయి. ఆ రెండు రకాల కళ్లు ఎప్పటికీ నరకాగ్నిని చూడవు. నరకాగ్ని ఆ కళ్లకు కాల్చదు అన్నారు“. ఎవరు ఆ రెండు రకాల కళ్లు? నరకాగ్నిని చూడవట. నరకాగ్ని ఆ కళ్లను కాల్చదట. ఎవరు ఆ రెండు రకాల కళ్లు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు,
ఒక రకమైన కళ్లు ఎవరివి అంటే ఏ వ్యక్తి అయితే అల్లాహ్ ను తలుచుకొని కన్నీరు పెట్టాడో ఆ వ్యక్తి కళ్లకి నరకము తాకదు. నరకాగ్ని ఆ కళ్లకు ముట్టుకోదు. అలాగే పూర్వం యుద్ధాలు జరిగేవి. ఆ యుద్ధాలు జరిగే సమయంలో రాత్రి పూట యుద్ధం ముగిసిన తరువాత సైనికులందరూ పడుకుని ఉంటే ఆ సైనికులకి కొంతమంది వ్యక్తులు కాపలా కాసేవారు. వాళ్ల ప్రాణానికి రక్షణగా వాళ్లు రాత్రి మొత్తం జాగారము చేసి కాపలా కాసేవారు. అలా దైవ మార్గంలో రాత్రి మొత్తం జాగారం చేసి కాపలా కాసిన ఆ కళ్లకు కూడా రేపు నరకపు అగ్ని ముట్టుకోదు, నరకము ఆ కళ్లకు కాల్చదు అన్నారు.
రండి అభిమాన సోదరులారా, మరొక ఉల్లేఖనంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎంత మంచి మాట చెప్పి ఉన్నారో చూడండి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకి రెండు రకాల చుక్కలు చాలా ప్రియమైనవి అట. అలాగే రెండు గుర్తులు కూడా అల్లాహ్ కు చాలా ఇష్టమైనవి అట. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు,
“రెండు చుక్కలు అల్లాహ్ కు చాలా ప్రియమైనవి.” ఒక చుక్క ఏమిటంటే, “అల్లాహ్ ను తలచుకుని భక్తుడు ఎప్పుడైతే కళ్ళ నుంచి కన్నీరు కారుస్తాడో, ఆ కన్నీటి చుక్క అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు చాలా ప్రియమైనది.” అలాగే, “దైవ ధర్మ రక్షణ కొరకు ఎప్పుడైతే మానవుడు వెళ్లి శత్రువుని ఎదుర్కొంటాడో, ఆ ఎదుర్కొనే సమయంలో అతని శరీరానికి గాయమై, అతని శరీరం నుండి రక్తపు చుక్క కారుతుంది కదండీ, ఆ చుక్క కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు చాలా ప్రియమైనది.”
ఇక రెండు గుర్తుల గురించి కూడా తెలియజేశారు. “రెండు రకాల గుర్తులు అల్లాహ్ కు చాలా ప్రియమైనవి. అవేమిటంటే, ఒక గుర్తు, “అల్లాహ్ ధర్మ రక్షణ కొరకు పోరాటం చేస్తున్నప్పుడు అతని శరీరానికి ఎక్కడైనా గాయం అవుతుంది. ఆ గాయం మానిన తర్వాత అక్కడ అలాగే గుర్తు పడిపోతుంది. ఆ గుర్తు అల్లాహ్ కు చాలా ఇష్టమైనది.” రెండవ గుర్తు ఏమిటంటే, “అల్లాహ్ విధించిన ఒక విధిని పాటిస్తూ ఉన్నప్పుడు అతని శరీరం మీద గుర్తు పడిపోతుంది. ఆ గుర్తు కూడా అల్లాహ్ కు చాలా ప్రియమైనది.”
దీనికి ఉదాహరణగా మనం చూచినట్లయితే, ఒక వ్యక్తి నమాజ్ ఆచరిస్తూ ఉంటాడు. నమాజ్ చేయడం విధి, తప్పనిసరి. అల్లాహ్ తరపు నుంచి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రతీ ముస్లిం మీద నమాజ్ చేయడం తప్పనిసరి చేశాడు, విధి చేశాడు. మరి ఒక ముస్లిం, ఒక దైవ భక్తుడు నమాజ్ ఆచరిస్తూ ఉంటే, అతని నుదుట మీద గుర్తు పడిపోతుంది, అతని మోకాళ్ళ మీద గుర్తు పడిపోతాది. ఇలా దైవం విధించిన ఒక విధిని ఆచరిస్తున్నప్పుడు అతని శరీరం మీద ఏదైనా గుర్తు పడిపోయిందంటే, ఆ గుర్తు అల్లాహ్ కు చాలా ఇష్టమైనది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు.
అలాగే రండి అభిమాన సోదరులారా! అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హు వారు ఏమనేవారంటే “ల అన్ అద్మఅ మిన్ ఖష్యతిల్లాహ్ అహబ్బు ఇలయ్య మిన్ అన్ అతసద్దక బి అల్ఫి దీనార్” (لَأَنْ أَدْمَعَ مِنْ خَشْيَةِ اللَّهِ أَحَبُّ إِلَيَّ مِنْ أَنْ أَتَصَدَّقَ بِأَلْفِ دِينَارٍ). అల్ఫి దీనార్ అంటే మనందరికీ తెలుసు. వెయ్యి దీనార్లు. అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హు వారు తెలియజేస్తున్నారు. “నేను అల్లాహ్ మార్గంలో వెయ్యి దీనార్లు దానం చేయడము కంటే కూడా అల్లాహ్ ను తలుచుకొని ఒక్కసారి కన్నీరు పెట్టడం నాకు చాలా ప్రియమైనది, ఇష్టమైనది” అన్నారు. అంటే నేను అల్లాహ్ ను తలుచుకొని ఏడవటం, అల్లాహ్ ను తలుచుకొని కన్నీరు కార్చడం దైవమార్గంలో వెయ్యి దీనార్లు ఖర్చు చేయటం కంటే నాకు ఇష్టం అన్నారు.
ప్రవక్తలు మరియు సహాబాల దైవ భీతి
ఇక రండి అభిమాన సోదరులారా, అల్లాహ్ ను తలచుకుని, అల్లాహ్ భీతితో ప్రవక్తలు ఏ విధంగా కన్నీరు కార్చేవారో, దూతలు ఏ విధంగా వణికిపోయేవారో, దైవ భక్తులు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యులు ఏ విధంగా కన్నీరు పెట్టేవారో, అవి కూడా ఇన్షా అల్లాహ్ కొన్ని ఉదాహరణల ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ముందుగా దైవ దూతల గురించి తెలుసుకుందాం. ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జిబ్రయీల్ అలైహిస్సలాం వారితో మీకాయీల్ అలైహిస్సలాం వారి గురించి ప్రశ్నించారు. మీకాయీల్ అలైహిస్సలాం నలుగురు పెద్ద దైవ దూతలలో ఒక దైవదూత. ఆ దైవదూత గురించి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జిబ్రయీల్ అలైహిస్సలాం వారిని ప్రశ్నించారు. ఏమని ప్రశ్నించారంటే “మాలి లా అరా మీకాయీల దాహికన్ ఖత్తూ?” (مَا لِي لَا أَرَى مِيكَائِيلَ ضَاحِكًا قَطُّ؟). ఓ జిబ్రయీల్ అలైహిస్సలాం! ఏమిటండి నేను ఎప్పుడూ కూడా మీకాయీల్ని చిరునవ్వు నవ్వుతూ కూడా నేను చూడలేదు. ఆయన ఒక్కసారి కూడా నాకు చిరునవ్వు నవ్వుతూ కనిపించట్లేదు. ఎందుకలా అని అడిగాను. అప్పుడు జిబ్రయీల్ అలైహిస్సలాం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేశారు “మా దహిక మీకాయీలు ముంజు ఖులికతిన్నార్” (مَا ضَحِكَ مِيكَائِيلُ مُنْذُ خُلِقَتِ النَّارُ). ఓ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం! అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నరకాన్ని సృష్టించిన తర్వాత నుంచి మీకాయీల్ అలైహిస్సలాం ఒక్కసారి కూడా నవ్వలేదు అన్నారు.అభిమాన సోదరులారా, దైవదూతలు ఒక్క తప్పు కూడా వారితో దొర్లదు. అయినా గానీ నరకం సృష్టించబడిన తర్వాత వాళ్ళు నవ్వడమే మానేశారు.
అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మెరాజ్ యాత్రలో ఎప్పుడైతే అల్లాహ్ ను కలిసి మాట్లాడటానికి వెళ్లారో ఆ రోజు జిబ్రయీల్ అలైహిస్సలాం వారిని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూశారు. ఆయన గురించి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, “వ జిబ్రయీలు కల్ హిల్సిల్ బాలి మిన్ ఖశియతిల్లాహ్” (وَجِبْرِيلُ كَالْحِلْسِ الْبَالِي مِنْ خَشْيَةِ اللَّهِ). మెరాజ్ యాత్రలో నేను చూశాను. దూతలకు రారాజు, దూతల నాయకుడు జిబ్రయీల్ అలైహిస్సలాం మలయే ఆలాలో పరుపులాగా అల్లాహ్ కు భయపడి నేలకు ఆనిపోయారు. అభిమాన సోదరులారా! దూతల నాయకుడు అల్లాహ్ ను తలుచుకొని, అల్లాహ్ భక్తితో, అల్లాహ్ భీతితో నేల మీద పరుపు లాగా పడిపోయి ఉన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కళ్లారా వారిని చూశారు.
ఇక రండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి కూడా తెలుసుకుందాం. అభిమాన సోదరులారా! ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకరోజు నమాజు చేయడానికి నిలబడ్డారు. నమాజు చదువుతున్నారు. నమాజులోనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కన్నీరు కార్చడం మొదలెట్టేశారు. ఎంతగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవభీతితో కన్నీరు కారుస్తున్నారంటే చూసిన వాళ్లు ఆయన గురించి చెప్పారు, “వలి జౌఫిహీ అజీజున్ క అజీజిల్ మిర్జలి మినల్ బుకా'” (وَلِجَوْفِهِ أَزِيزٌ كَأَزِيزِ الْمِرْجَلِ مِنَ الْبُكَاءِ). ఎలాగైతే పొయ్యి మీద పెట్టిన ఒక కుండలో నీళ్లు బాగా వేడెక్కిన తర్వాత ఖత్ ఖత్ ఖత్ అని ఎలా శబ్దం వస్తుందో ఆ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజుకు నిలబడి అల్లాహ్ ను తలుచుకొని లోలోపలే కన్నీరు కారుస్తున్నారు, బాధపడి ఏడుస్తున్నారు అభిమాన సోదరులారా!
అలాగే ఆయిషా రదియల్లాహు తాలా అన్హా వారు తెలియజేశారు. ఒక రోజు రాత్రి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు కోసం నిలబడ్డారు. నమాజులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏడవటం మొదలెట్టారు. ఎంతగా ఏడ్చారంటే వారి గడ్డం తడిసిపోయింది. అయినా ఏడుపు ఆపట్లేదు. మళ్లీ ఏడుస్తున్నారు. ఆయన తొడిగిన బట్టలు కూడా నానిపోయాయి. అయినా ఏడుపు ఆపట్లేదు. ఏడుస్తూనే ఉన్నారు. ఎక్కడైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు చేస్తున్నారో ఆ భూమి కూడా తడిసిపోయింది. ఫజర్ అజాన్ ఇచ్చే సమయం వచ్చేసింది. బిలాల్ రదియల్లాహు అన్హు మస్జిద్లో అజాన్ ఇవ్వటానికి వచ్చి చూస్తే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏడుస్తున్నారు. అది చూసిన బిలాల్ రదియల్లాహు అన్హు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో అన్నారు, “ఓ దైవ ప్రవక్తా, అల్లాహ్ మీ పాపాలన్నింటినీ మన్నించేశాడు కదా? అయినా కూడా మీరు ఈ విధంగా ఏడవడం ఏంటి?” అని అడిగితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, “అఫలా అకూను అబ్దన్ శకూరా?” (أَفَلَا أَكُونُ عَبْدًا شَكُورًا؟). నేను దైవానికి కృతజ్ఞుడు చేసి తెలుసుకునే భక్తుని కావద్దా? అందుకోసమే దైవానికి కృతజ్ఞత, కృతజ్ఞతలు తెలుపుకునే భక్తుడు అవ్వటానికి ఏడుస్తున్నాను అన్నారు.
అభిమాన సోదరులారా! మన పరిస్థితి ఏమిటి? దైవదూతలు ఏడుస్తున్నారు. దూతల నాయకుడు జిబ్రయీల్ అలైహిస్సలాం వారు ఏడుస్తున్నారు. దైవప్రవక్తలు ఏడుస్తున్నారు. దైవ ప్రవక్తల నాయకుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కన్నీరు కారుస్తున్నారు. మన పరిస్థితి ఏమిటి అభిమాన సోదరులారా?
ఇక రండి. మరొక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రెండు చేతులు ఎత్తి ఏడవడం ప్రారంభిస్తే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వెంటనే జిబ్రయీల్ అలైహిస్సలాం వారిని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు పంపించేశారు. జిబ్రయీల్ అలైహిస్సలాం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ఓ దైవప్రవక్త మీరు కన్నీరు కారుస్తున్నారు, ఏడుస్తున్నారు. కారణం ఏమిటి? అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నన్ను మీ వద్దకు పంపించాడు చెప్పండి అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన విషయం ఏమిటో తెలుసా అభిమాన సోదరులారా? ఎంత అదృష్టవంతులమో మనము ఒకసారి ఆలోచించండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి జిబ్రయీల్ అలైహిస్సలాం వారు వచ్చి మీరు ఎందుకు ఏడుస్తున్నారు అంటే ఆయన ఇచ్చిన సమాధానం ఏమిటంటే “అల్లాహుమ్మ ఉమ్మతీ, ఉమ్మతీ!” (اللَّهُمَّ أُمَّتِي أُمَّتِي!). ఓ అల్లాహ్! నా అనుచర సమాజాన్ని తలుచుకొని ఏడుస్తున్నాను. నా అనుచర సమాజం ఏమైపోతుందో అని తలుచుకొని ఏడుస్తున్నాను అన్నారు. అప్పుడు జిబ్రయీల్ అలైహిస్సలాం మళ్లీ అల్లాహ్ సన్నిధికి వెళ్లి తెలియజేయగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి శుభవార్త అందజేశాడు. అదేమిటంటే “ఇన్నా సనుర్దీక ఫీ ఉమ్మతిక వలా నసూఉక” (إِنَّا سَنُرْضِيكَ فِي أُمَّتِكَ وَلَا نَسُوءُكَ). ఓ ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం! మీ అనుచరుల విషయంలో మేము మీకు సంతృప్తి చెందేలా చేస్తాము. మీకు అసంతృప్తి అయ్యేలాగా చేయము అని చెప్పేశారు. అల్లాహు అక్బర్! అలాంటి ప్రవక్తకి మనము అనుచరులమైనందుకు మనము ఎంతో అదృష్టవంతులమని భావించాలి అభిమాన సోదరులారా!
ఇక రండి ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శిష్యుల గురించి కూడా తెలుసుకుందాం. ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఇలాగే శిష్యులందరూ కూర్చుని ఉంటే శిష్యుల ముందర ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలాగే ఉపన్యాసం ఇవ్వడం ప్రారంభించారు. ఆ ఉపన్యాసంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమని తెలియజేశారంటే, “ఏమండీ నాకు స్వర్గం చూపబడింది. నాకు నరకము కూడా చూపబడింది. నేను చూసిన విషయాలు గనక మీరు చూసినట్లయితే మీరు నవ్వడం మానేసి ఏడవడం ప్రారంభించేస్తారు” అన్నారు. అది విన్న వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యులందరూ తల మీద బట్ట వేసుకొని ముక్కు పట్టుకొని ఏడవడం ప్రారంభించేశారు అభిమాన సోదరులారా!
అలాగే హానీ, ఉస్మాన్ రదియల్లాహు తాలా అన్హు వారి యొక్క బానిస ,ఉస్మాన్ రదియల్లాహు అన్హు వారి గురించి ఆయన తెలియజేశారు. అదేమిటంటే ఉస్మాన్ రదియల్లాహు తాలా అన్హు వెళుతూ వెళుతూ స్మశానం దగ్గర ఆగిపోయి ఏడవడం ప్రారంభించేవారు. ఎంతగా కన్నీరు కార్చేవారంటే ఆయన గడ్డం మొత్తం తడిచిపోయేది. అది చూసిన ఆయన బానిస ఆయన వద్దకు వచ్చి ఏమని అడిగేవాడంటే, “ఏమండీ మీ దగ్గర స్వర్గం గురించి చర్చించబడినప్పుడు మీరు కన్నీరు కార్చరు. అలాగే మీ దగ్గర నరకం గురించి తెలియజేయబడినప్పుడు కూడా మీరు ఈ విధంగా కన్నీరు కార్చరు. కానీ స్మశానాన్ని, సమాధులను చూసి మీరు ఈ విధంగా కన్నీరు కారుస్తారు. కారణం ఏమిటి?” అని ఆయన అడిగినప్పుడు ఉస్మాన్ రదియల్లాహు తాలా అన్హు వారు తెలియజేసిన విషయం ఏమిటంటే, “ఇన్నల్ ఖబర అవ్వలు మంజిలిన్ మిన్ మనాజిలిల్ ఆఖిరహ్. ఫఇన్ నజా మిన్హు ఫమా బాఅదహు ఐసర్, వఇల్లం యంజ్ మిన్హు ఫమా బాఅదహు అషద్దు మిన్హు” (إِنَّ الْقَبْرَ أَوَّلُ مَنَازِلِ الْآخِرَةِ، فَإِنْ نَجَا مِنْهُ فَمَا بَعْدَهُ أَيْسَرُ، وَإِنْ لَمْ يَنْجُ مِنْهُ فَمَا بَعْدَهُ أَشَدُّ مِنْهُ). నేను సమాధిని చూసి ఎందుకు ఏడుస్తున్నాను అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. పరలోక ప్రయాణంలో సమాధి మొదటి స్టేజీ లాంటిది. ఇక్కడ ఏ వ్యక్తి అయితే పాస్ అయిపోతాడో అతను తర్వాత స్టేజీలలో కూడా పాస్ అయిపోతాడు. ఈ ఫస్ట్ స్టేజీలోనే ఏ వ్యక్తి అయితే ఇరుక్కుపోతాడో, నష్టపోతాడో ఆ తర్వాత వచ్చే స్టేజీలన్నీ కూడా అతనికి చాలా భయంకరమైనవిగా మారిపోతాయి. కాబట్టి నా మొదటి స్టేజీలో నా పరిస్థితి ఎలా ఉంటుందో అది తలుచుకొని నేను కన్నీరు కారుస్తున్నాను అని చెప్పేవారు.
అలాగే ముఆజ్ రదియల్లాహు తాలా అన్హు ఏడుస్తూ ఉంటే కొంతమంది వ్యక్తులు వెళ్లి ఏమండీ మీరు కన్నీరు కారుస్తున్నారు, కారణం ఏమిటి అని అడిగితే ఆయన చెప్పిన విషయం ఏమిటంటే “స్వర్గానికి వెళ్ళే వాళ్ల సమూహం ఏదో అల్లాహ్ కు బాగా తెలుసు. నరకానికి వెళ్లే సమూహం ఏదో అది కూడా అల్లాహ్ కు బాగా తెలుసు. నేను స్వర్గానికి వెళ్లే సమూహంలో ఉన్నానా లేదా నరకానికి వెళ్లే సమూహంలో ఉన్నానా? అది తలుచుకొని నేను కన్నీరు కారుస్తున్నాను” అన్నారు.
అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మనవడు హసన్ రదియల్లాహు తాలా అన్హు ఏడుస్తూ ఉంటే కన్నీరు కారుస్తూ ఉంటే ప్రజలు వెళ్లి ఆయనను అడిగారు, “ఎందుకయ్యా మీరు ఏడుస్తున్నారు, కన్నీరు కారుస్తున్నారు?” అంటే ఆయన చెప్పిన విషయం ఏమిటంటే “నేను ప్రళయదినాన్ని తలుచుకొని కన్నీరు కారుస్తున్నాను. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తలుచుకుంటే నన్ను కూడా నరకంలో వేసేస్తాడు. అతనికి ఎలాంటి పర్వా లేకుండా పోతుంది. నేను ఎవరు, ఏంటి అనేది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు ఏమి అవసరం ఉండదు. ఆయన తలుచుకుంటే నన్ను కూడా నరకంలో పడవేయగలడు కాబట్టి అది తలుచుకొని నేను ఏడుస్తున్నాను” అన్నారు.
అలాగే అభిమాన సోదరులారా! అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యుల్లో గొప్ప శిష్యుడు. అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు వ్యాధిగ్రస్తునిగా ఉన్నప్పుడు ఏడుస్తూ ఉంటే ప్రజలు వెళ్లి ఏమయ్యా ఏడుస్తున్నారు మీరు అంటే ఆయన అన్నారు. “నేను మరణిస్తానేమో, ఈ ప్రపంచాన్ని నేను వదిలేసి వెళ్లిపోతున్నాను కదా అని నేను బాధపడట్లేదు. నేను బాధపడుతున్న విషయం ఏమిటంటే ఇక నా ప్రయాణం చాలా పెద్దదిగా ఉంది. కానీ అంత పెద్ద ప్రయాణంలో నేను సంపాదించుకుంది చాలా తక్కువ. ఇంత తక్కువ మొత్తంతో నేను అంత పెద్ద ప్రయాణాన్ని ఎలా చేయగలను అని తలుచుకొని నేను ఏడుస్తున్నాను” అన్నారు.
అలాగే అభిమాన సోదరులారా! అబ్దుల్లాహ్ ఇబ్నె రవాహా సతీమణి ఒడిలో పడుకొని ఉన్నారు. అక్కడే కన్నీరు కార్చడం మొదలెట్టేశారు. ఆయనను చూసి ఆయన భార్య కూడా కన్నీరు కార్చడం మొదలెట్టేసింది. ఆ తర్వాత ఏమయ్యా ఎందుకు మీరు కన్నీరు కారుస్తున్నారు అని ఆయనతో అడిగినప్పుడు ఆయన చెప్పిన విషయం ఏమిటంటే “రేపు ప్రతి వ్యక్తి స్వర్గానికి వెళ్లాలనుకునే ప్రతి వ్యక్తి నరకం మీద ఉంచిన పుల్సిరాత్ ని దాటుకుని స్వర్గానికి వెళ్లాల్సి ఉంటుంది. ఆ రోజు నేను పుల్సిరాత్ దాటుకుని స్వర్గానికి వెళ్తానా లేదా అని తలుచుకొని బాధపడుతున్నాను అన్నారు. ప్రతి వ్యక్తి ఆ మార్గం ద్వారానే దాటుకోవాల్సి ఉంటుంది. నరకాన్ని దాటుకోవాలంటే ఆ మార్గం మీద నుంచి నడిచి వెళ్ళాలి. ఆ తర్వాత మళ్లీ స్వర్గ ప్రవేశం ఉంటుంది. ఆ మార్గాన్ని నేను దాటుకోగలనా లేదా అని తలుచుకొని నేను కన్నీరు కారుస్తున్నాను” అన్నారు అభిమాన సోదరులారా.
ఈ విధంగా చూస్తే చాలామంది గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఆఖరిలో ఒక్క విషయం చెప్పేసి నా మాట ముగిస్తున్నాను. అదేమిటంటే అభిమాన సోదరులారా! అల్లాహ్ ను తలుచుకొని ప్రతి భక్తుడు ఎప్పుడైనా సరే ఏదో ఒక సందర్భంలో తప్పనిసరిగా కన్నీరు కార్చాలి. ఎందుకంటే ఈ జీవితం శాశ్వతము కాదు. ఈ జీవితాన్ని స్వస్తి పలికి అల్లాహ్ పిలుపు రాగానే ప్రపంచాన్ని వదిలేసి మనం వెళ్లిపోవాలి. మన బంధువులు, మన మిత్రులు, మన స్నేహితులు, కుటుంబ సభ్యులు మూడు రోజులు కన్నీరు కార్చుకుంటారు. మళ్లీ వాళ్ల పనుల్లో వాళ్లు నిమగ్నమైపోతారు. ప్రయాణం చేయాల్సింది ఒంటరిగా మనమే. అక్కడ మనకు కాపాడాల్సింది ఒక అల్లాహ్ మాత్రమే. కాబట్టి అల్లాహ్ ను తలుచుకొని ప్రతి భక్తుడు కన్నీరు కార్చాలి. అల్లాహ్ తో క్షమాపణ వేడుకోవాలి.
కానీ మన పరిస్థితి ఎలా ఉందంటే మన హృదయాలు నల్ల రాయి లాగా గట్టిగా మారిపోయాయి. కారణం ఏమిటంటే మనలో దైవభీతి లేదు. ప్రపంచ వ్యామోహంలో పడిపోయి ఉన్నాం. డబ్బు డబ్బు, ఆస్తి ఆస్తి, బంగారు నగలూ అని చెప్పేసి దాని వెనకాల పరిగెడుతున్నాం అభిమాన సోదరులారా. ఇది శాశ్వతము కాదు. చావును తలుచుకోండి. సమాధిని తలుచుకోండి. నరకాన్ని తలుచుకోండి. పుల్సిరాత్ని తలుచుకోండి. లెక్కింపు రోజుని తలుచుకోండి. ఇది ఎంత ఎక్కువగా తలుచుకుంటే అంతగా హృదయం మెత్తబడుతుంది. అప్పుడు భక్తుడు దైవ భక్తితో, దైవ భీతితో కన్నీరు కారుస్తాడు. వీలైతే వ్యాధిగ్రస్తుల వద్దకు వెళుతూ వస్తూ ఉండండి. అప్పుడు కూడా మనసులు, హృదయాలు మెత్తబడతాయి. వీలైతే స్మశానానికి వెళుతూ వస్తూ ఉండండి. సమాధుల్ని చూసినప్పుడు కూడా హృదయాలు మెత్తబడతాయి.
కాబట్టి అభిమాన సోదరులారా! ప్రతి భక్తునికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా హృదయం, మెత్తని హృదయాన్ని ప్రసాదించి, దైవభీతితో కన్నీరు కార్చేలాగా, అల్లాహ్ తో చేసిన పాపాలకి క్షమాపణ కోరుతూ ఉండేలాగా సద్బుద్ధిని అల్లాహ్ ప్రసాదించుగాక.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.