త్రాసు(మీజాన్)ను బరువు చేసే సత్కార్యాలు [పుస్తకం & వీడియోలు]

బిస్మిల్లాహ్

ఇక్కడ పుస్తకం చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి
త్రాసు (మీజాన్) ను బరువు చేసే సత్కార్యాలు – 139 పేజీలు [PDF]

త్రాసు(మీజాన్)ను బరువు చేసే సత్కార్యాలు – యూట్యూబ్ ప్లే లిస్ట్:
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1YzZIOtmpGXkoPP02bnls6

పుస్తక పరిచయ తొలి పలుకులు:

ముస్లిం తన పుణ్యాల అకౌంట్‌ పెరుగుతూ ఉండాలని చాలా కాంక్షిస్తాడు. అందుకు మరియు ప్రళయదినాన తన పుణ్యాల త్రాసు బరువుగా ఉండుటకు తన ఇహలోక జీవితంలో సాధ్యమైనంత వరకు అధికంగా పుణ్యాలు సమకూరుస్తూ ఉంటాడు. సాధ్యమైనంత వరకు తక్కువ పాపాలు చేస్తూ ఉంటాడు. ఎవరి పుణ్యాల త్రాసు బరువుగా ఉంటుందో వారే గొప్ప అదృష్టం పొందుతారు, ఆ తర్వాత ఎప్పుడూ అతనికి దురదృష్టం అనేది ఉండదు, తద్వారా మనసు మెచ్చిన విలాసవంతమైన జీవితం గడుపుతూ ఉన్నతమైన స్వర్గవనంలో ఉంటాడు. అల్లాహ్‌ ఇలా తెలిపాడు:

ఎవరి త్రాసు పళ్ళాలు బరువుగా ఉంటాయో అతను మనసు మెచ్చిన భోగభాగ్యాలతో కూడిన జీవితంలో ఉంటాడు. మరెవరి త్రాసు పళ్ళాలు తేలికగా ఉంటాయో అతని నివాస స్థానం ‘హావియా’ అవుతుంది, అదేమిటో (హావియా అంటేమిటో) నీకేం తెలుసు? అది దహించివేసే అగ్ని. (ఖారిఅహ్‌ 101:6-11).

అనేక మంది ఇహలోకంలో ధనవంతులు కావాలనుకుంటారు.అందుకోసం తమ సిరిసంపదల పెంపుదల మరియు త్వరగా ఐశ్వర్యవంతులు అయ్యే సూచనలు సూచించే పుస్తకాలు ఎన్నుకొని శ్రద్ధగా చదువుతూ ఉండడం చూస్తుంటాము.

అలాంటప్పుడు మనం కూడా ఎన్నటికీ అంతం కాని, దోచుకోబడని ధనం గురించి తెలుసుకోవడం చాలా మంచిది. ధనం సమకూర్చడానికి కాంక్షించే విధంగా సత్కార్యాలు సమకూర్చడానికి కాంక్షించాలి. ఇహలోక సంపద అంతం అవుతుంది. సదా ఉండదు. పరలోక సంపద శాశ్వాతమైనది, అంతం కానిది. ఇహలోకంతో పాటు పరలోకంలో కూడా మనం ధనికులవడం ఏ మాత్రం పాపం కాదు. అల్లాహ్‌ గొప్ప నిరపేక్షాపరుడు, ధనవంతుడు, ఉదారుడు.

నీవు త్వరగా పరలోక ధనవంతుడివి కాదలచుకుంటే త్రాసును బరువుగా చేసే సత్యార్యాల వెంట పడాలి. అల్లాహ్‌ దయతో ఈ పుస్తకం నీ త్రాసును బరువుగా చేసే సత్యార్యాల వైపునకు నీకు దారి చూపుతుంది.

అందుకు ప్రతి ముస్లిం, విద్యనభ్యసించడం మరియు అభ్యసించిన విద్యను ఆచరణలోకి తీసుకురావడంలో అలసటకు, అశ్రద్ధకు గురికాకూడదు. ఎంతో మంది నీ ముందు ఉన్న ఈ పుస్తకంలోని ఘనతల పట్ల అజ్ఞానంలో ఉన్నారు. వాటిని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు, వాటి గురించి ప్రశ్నించే, వెతికే ప్రయత్నమూ చేయరు. అందుకు అల్లాహ్‌ యొక్క గొప్ప వరం; అల్లాహ్‌ మనకు ధర్మం, సత్యం నేర్పాడు. దాని వైపునకు మార్గం చూపాడు, ఇక ఆ ధర్మం, సత్యం పట్ల మనకు సంపూర్ణ ప్రేమ కలగాలని, అది మన హృదయాలకు శోభాయమానంగా అవ్వాలని వాటిని ఎల్లవేళల్లో ఆచరణలో ఉంచుటకు అల్లాహ్‌ తో దుఆ చేయాలి, ఇది మనకు ఆ రోజు తప్పకుండా లాభాన్నిస్తుంది ఏ రోజయితే దుర్మార్గుడు, విద్య నేర్చుకోనివాడు. మరియు ఆచరించనివాడు తన చేతులను కొరుకుతూ ఇలా అంటాడు:అయ్యో! నేనీ పరలోక జీవితం కోసం ముందుగానే సత్కార్యాలు చేసుకొని ఉంటే ఎంత బావుండేది? ఇది గంభీరమైన (సీరియస్) విషయం, పరిహాసం (జోక్)కాదు. శాశ్వతంగా స్వర్గంలో లేదా శాశ్వతంగా నరకంలో ఉండవలసి ఉంటుంది. అల్లాహ్‌ ఆ నరకం నుండి మనందరినీ రక్షించుగాక!

విషయ సూచిక:

త్రాసును తేలికగా చేసే కార్యాలు

  • త్రాసును తేలికగా చేసే కార్యాలు– [డౌన్లోడ్ PDF]
  • పాపాల రకాలు– [డౌన్లోడ్ PDF]
    • ప్రథమం: చిన్న పాపాలు
    • ద్వితీయం: ఘోర పాపాలు
    • తృతీయం; సత్కార్యాలను నశింప(వృధా) చేసే దుష్కార్యాలు
  • అతిముఖ్యమైన ముహ్‌ బితాతుల్‌ ఆమాల్‌ – [డౌన్లోడ్ PDF]
    • (1) షిర్క్‌, కుఫ్ర్, రిద్దత్‌
      • (A) షిర్క్‌, కుఫ్ర్‌, రిద్దత్‌ కు సంబంధించిన కొన్ని రకాలు
      • (B) ధర్మం మరియు ధర్మ అవలంబికులతో పరిహాసమాడుట
      • (C) ధర్మం, దర్మ విషయాలను అసహ్యించుకొనుట
      • (D) అల్లాహ్‌ కు ఇష్టంలేని పాపాల వెంట పడి, అల్లాహ్‌ కుఇష్టమైన పుణ్యాలను అసహ్యించుకొనుట
    • (2) చూపుగోలుతనం, ప్రదర్శనాబుద్ది = చిన్న షిర్క్‌
    • (3) అల్లాహ్మరియు ప్రవక్తను మించిపోకండి
    • (4) అల్లాహ్‌ ఫలాన వ్యక్తిని క్షమించడని ప్రమాణం చేయుట
    • (5) అస్ర్‌ నమాజ్‌ విడనాడుట
    • (6) ఏకాంతంలో నిషిద్ధ కార్యాలుచేయుట
    • (7) కుక్కను పెంచడం
    • (8) జ్యోతిష్యుడ్ని ప్రశ్నించడం
    • (9) జ్యోతిష్కుడు మరియు మాంత్రికులను నమ్మట
    • (10) మత్తు సేవించుట
    • (11) ప్రజల హక్కు కాజేసుకొనుట వారిపై దౌర్జన్యం చేయుట
    • (12) దుష్ప్రవర్తన
    • (13) ఒక ముస్లింను అవమానపరచడం
    • (14) ముజాహిద్ఇంటివారి పట్ల ద్రోహానికి పాల్పడడం
    • (15) ఆత్మహత్య
    • (16) అనవసరంగా భార్య భర్తకు అవిధేయత చూపుట మరియు ప్రజలు ఇష్టపడని ఇమాం (నాయకుడు, నమాజు చేయించే వ్యక్తి).
    • (17) ఉపకారం, దానం చేసి ఎత్తిపొడుచుట
    • (18) చీలమండల కంటే క్రింద వస్త్రాలు ధరించుట, ఉపకారం చేసి ఎత్తిపొడుచుట, అబద్దపు ప్రమాణంతో సరుకు అమ్ముట

[క్రింద పూర్తి పుస్తకం చదవండి]

బిస్మిల్లాహిర్ రహ్మా నిర్రహీం

తొలిపలుకులు

అల్ హందు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాఇ వల్ ముర్ సలీన్, నబియ్యినా ముహమ్మద్ వఅలా ఆలిహీ వసహ్ బిహీ అజ్మఈన్ అమ్మా బఅద్.

ముస్లిం తన పుణ్యాల అకౌంట్ పెరుగుతూ ఉండాలని చాలా కాంక్షిస్తాడు, అందుకు మరియు ప్రళయదినాన తన పుణ్యాల త్రాసు బరువుగా ఉండుటకు తన ఇహలోక జీవితంలో సాధ్యమైనంత వరకు అధికంగా పుణ్యాలు సమకూరుస్తూ ఉంటాడు. సాధ్యమైనంత వరకు తక్కువ పాపాలు చేస్తూ ఉంటాడు. ఎవరి పుణ్యాల త్రాసు బరువుగా ఉంటుందో వారే గొప్ప అదృష్టం పొందుతారు, ఆ తర్వాత ఎప్పుడూ అతనికి దురదృష్టం అనేది ఉండదు, తద్వారా మనసు మెచ్చిన విలాసవంతమైన జీవితం గడుపుతూ ఉన్నతమైన స్వర్గవనంలో ఉంటాడు. అల్లాహ్ ఇలా తెలిపాడుః

فَأَمَّا مَنْ ثَقُلَتْ مَوَازِينُهُ * فَهُوَ فِي عِيشَةٍ رَاضِيَةٍ * وَأَمَّا مَنْ خَفَّتْ مَوَازِينُهُ * فَأُمُّهُ هَاوِيَةٌ * وَمَا أَدْرَاكَ مَا هِيَهْ * نَارٌ حَامِيَةٌ

ఎవరి త్రాసు పళ్ళాలు బరువుగా ఉంటాయో అతను మనసు మెచ్చిన భోగభాగ్యాలతో కూడిన జీవితంలో ఉంటాడు. మరెవరి త్రాసు పళ్ళాలు తేలికగా ఉంటాయో అతని నివాస స్థానం ‘హావియా’ అవుతుంది, అదేమిటో (హావియా అంటేమిటో) నీకేం తెలుసు? అది దహించివేసే అగ్ని. (ఖారిఅహ్ 101:6-11).

అనేక మంది ఇహలోకంలో ధనవంతులు కావాలనుకుంటారు, అందుకోసం తమ సిరిసంపదల పెంపుదల మరియు త్వరగా ఐశ్వర్యవంతులు అయ్యే సూచనలు సూచించే పుస్తకాలు ఎన్నుకొని శ్రద్ధగా చదువుతూ ఉండడం చూస్తుంటాము. అలాంటప్పుడు మనం కూడా ఎన్నటికీ అంతం కాని, దోచుకోబడని ధనం గురించి తెలుసుకోవడం చాలా మంచిది, ధనం సమకూర్చ- డానికి కాంక్షించే విధంగా సత్కార్యాలు సమకూర్చడానికి కాంక్షించాలి. ఇహలోక సంపద అంతం అవుతుంది, సదా ఉండదు, పరలోక సంపద శాశ్వాతమైనది, అంతం కానిది. ఇహలోకంతో పాటు పరలోకంలో కూడా మనం ధనికులవడం ఏ మాత్రం పాపం కాదు. అల్లాహ్ గొప్ప నిరపేక్షాపరుడు, ధనవంతుడు, ఉదారుడు.

నీవు త్వరగా పరలోక దనవంతుడివి కాదలచుకుంటే త్రాసును బరువుగా చేసే సత్కార్యాల వెంట పడాలి. అల్లాహ్ దయతో ఈ పుస్తకం నీ త్రాసును బరువుగా చేసే సత్కార్యాల వైపునకు నీకు దారి చూపుతుంది.

అందుకు ప్రతి ముస్లిం, విద్యనభ్యసించడం మరియు అభ్యసించిన విద్యను ఆచరణలోకి తీసుకురావడంలో అలసటకు, అశ్రద్ధకు గురికాకూడదు. ఎంతో మంది నీ ముందు ఉన్న ఈ పుస్తకంలోని ఘనతల పట్ల అజ్ఞానంలో ఉన్నారు, వాటిని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు, వాటి గురించి ప్రశ్నించే, వెతికే ప్రయత్నమూ చేయరు. అందుకు అల్లాహ్ యొక్క గొప్ప వరం; అల్లాహ్ మనకు ధర్మం, సత్యం నేర్పాడు, దాని వైపునకు మార్గం చూపాడు, ఇక ఆ ధర్మం, సత్యం పట్ల మనకు సంపూర్ణ ప్రేమ కలగాలని, అది మన హృదయాలకు శోభాయమానంగా అవ్వాలని వాటిని ఎల్లవేళల్లో ఆచరణలో ఉంచుటకు అల్లాహ్ తో దుఆ చేయాలి, ఇది మనకు ఆ రోజు తప్పకుండా లాభాన్నిస్తుంది ఏ రోజయితే దుర్మార్గుడు, విద్య నేర్చుకోనివాడు, మరియు ఆచరించనివాడు తన చేతులను కొరుకుతూ ఇలా అంటాడు: అయ్యో! నేనీ పరలోక జీవితం కోసం ముందుగానే సత్కార్యాలు చేసుకొని ఉంటే ఎంత బావుండేది? ఇది గంభీరమైన (Serious) విషయం, పరిహాసం (Joke) కాదు, శాశ్వతంగా స్వర్గంలో లేదా శాశ్వతంగా నరకంలో ఉండవలసి ఉంటుంది. అల్లాహ్ ఆ నరకం నుండి మనందరినీ రక్షించుగాక!

1వ కార్యం: మాటల్లో, చేతల్లో సంకల్పశుద్ధి

ప్రతి కార్యానికి పునాది సంకల్పశుద్ధి. ఏ కార్యం ఎంత సంకల్ఫశుద్ధితో కూడుకొని ఉంటుందో త్రాసులో అంతే బరువుగా ఉంటుంది, అది కొంచమైనా సరే. ఒకవేళ చూపుగోలు, పేరు, ప్రఖ్యాతులతో సమ్మిళితమై ఉంటే త్రాసు తేలికగా ఉంటుంది, అది ఎంత ఎక్కువగా అయినప్పటికీ సూక్ష్మకణాలుగా, దుమ్ము, ధూళివలే అయిపోతుంది (అంటే రవ్వంత పుణ్యం లభించదు). అల్లాహ్ సుబ్ హానహు వతఆలా వద్ద కర్మల ఘనత, వాటిని చేసేవారి మనస్సులో ఉండే సంకల్పశుద్ధిని మరియు వారిలో ఉండే అల్లాహ్ పట్ల ప్రేమను బట్టి పెరుగుతూ, తరుగుతూ ఉంటుంది.

عَنْ أَبِي أُمَامَةَ الْبَاهِلِيِّ t، قَالَ: جَاءَ رَجُلٌ إِلَى النَّبِيِّ ﷺ، فَقَالَ: أَرَأَيْتَ رَجُلًا غَزَا يَلْتَمِسُ الْأَجْرَ وَالذِّكْرَ، مَالَهُ؟ فَقَالَ رَسُولُ اللَّهِ ﷺ: لَا شَيْءَ لَهُ فَأَعَادَهَا ثَلَاثَ مَرَّاتٍ، يَقُولُ لَهُ رَسُولُ اللَّهِ ﷺ: لَا شَيْءَ لَهُ ثُمَّ قَالَ: إِنَّ اللهَ لَا يَقْبَلُ مِنَ الْعَمَلِ إِلَّا مَا كَانَ لَهُ خَالِصًا، وَابْتُغِيَ بِهِ وَجْهُهُ

అబూ ఉమామహ్ బాహిలీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ఓ మనిషి వచ్చి, ‘ఒక వ్యక్తి పుణ్యఫలం మరియు పేరుప్రఖ్యాతులనుద్దేశించి పోరాడుతుంటే అతనికి ప్రాప్తమయ్యేదేమిటి?’ అని అడిగాడు. “అతనికి ఏ పుణ్యమూ దక్కదు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానమిచ్చారు. ఆ మనిషి తిరిగి మూడు సార్లు అదే ప్రశ్న అడిగాడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అతనికి ఏ పుణ్యమూ దక్కదు” అని మూడు సార్లు జవాబిచ్చారు, మళ్ళీ ఆ తర్వాత ఇలా చెప్పారుః “అల్లాహ్ సంకల్పశుద్ధితో, ఆయన అభీష్టాన్ని కోరుతూ చేసిన సత్కార్యాన్ని మాత్రమే స్వీకరిస్తాడు”. (నిసాయి 3140, తబ్రానీ కబీర్ 7628, సహీహుల్ జామి 1856).

అబ్దుల్లాహ్ బిన్ ముబారక్ రహిమహుల్లాహ్ చెప్పారుః ‘ఒక చిన్న కార్యాన్ని సంకల్పం గొప్పదిగా, పెద్దదిగా చేయవచ్చు, ఒక పెద్ద కార్యాన్ని సంకల్పం చిన్నదిగా చేయవచ్చు’. (జామిఉల్ ఉలూమి వల్ హికం, రచయితః ఇబ్ను రజబ్ అల్ హంబలీ 1/71).

మైమూన్ బిన్ మహ్రాన్ రహిమహుల్లాహ్ చెప్పారుః ‘మీ ఆచరణలు ఉన్నవే చాలా తక్కువ, ఆ తక్కువవాటిని సంకల్పశుద్ధితో ఆచరించండి’. (హిల్ యతుల్ ఔలియా వ తబ్ ఖతుల్ అస్ఫియా, రచయితః అబూ నుఐమ్ 4/92).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారని అబూ సఈద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః

الصَّلَاةُ فِي جَمَاعَةٍ تَعْدِلُ خَمْسًا وَعِشْرِينَ صَلَاةً فَإِذَا صَلَّاهَا فِي فَلَاةٍ فَأَتَمَّ رُكُوعَهَا وَسُجُودَهَا بَلَغَتْ خَمْسِينَ صَلَاةً

“సామూహికంగా చేసే నమాజు (ఒంటరిగా చేసే) పాతిక నమాజులకు సమానంగా ఉంటుంది. ఒకవేళ అతను అదే నమాజు ఏదైనా ఎడారి ప్రాంతంలో చేస్తూ, రుకూ, సజ్దాలు సంపూర్ణంగా చేస్తే యాబై నమాజులకు సమానంగా చేరుతుంది”. (అబూదావూద్ 560, ఇబ్ను హిబ్బాన్ 1749, హాకిం 753, సహీహుల్ జామిః అల్బానీ 3871).

అతను (ఎడారిలో) ఒంటరిగా ఎందుకు నమాజు చేశాడు? నమాజు గురించి అతనికి గుర్తు చేయడానికి ఏ ముఅజ్జిన్ యొక్క అజాన్ మరియు తోటి స్నేహితుడు అంటూ లేడు? రుకూ, సజ్దాలు సంపూర్ణంగా, ఎంతో హుందాతనంతో, తృప్తిగా నమాజు చేశాడు? ఎందుకనగా అతడు సంకల్ఫశుద్ధితో, అల్లాహ్ కొరకు మాత్రమే చేశాడు, అల్లాహ్ అతడ్ని కనిపెట్టి ఉన్నాడన్న భావన కలిగి ఉన్నాడు అందుకే అతనికి అధిక రెట్లు ప్రతిఫలం లభించింది.

అందుకే సలమా బిన్ దీనార్ రహిమహుల్లాహ్ చెప్పారుః నీవు నీ పాపాలను ఎంత గుప్తంగా చేస్తావో అంతకంటే ఎక్కువ గుప్తంగా పుణ్యకార్యాలు చేయు. (హిల్యతుల్ ఔలియా వ తబ్ ఖతుల్ అస్ఫియాః అబూ నుఐమ్ 3/240).

అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారుః

بَيْنَمَا كَلْبٌ يُطِيفُ بِرَكِيَّةٍ، كَادَ يَقْتُلُهُ العَطَشُ، إِذْ رَأَتْهُ بَغِيٌّ مِنْ بَغَايَا بَنِي إِسْرَائِيلَ، فَنَزَعَتْ مُوقَهَا فَسَقَتْهُ فَغُفِرَ لَهَا بِهِ

“మరణావస్థకు చేరబోతున్న ఓ కుక్క ఒక బావి చుట్టూ తిరగసాగింది, ఇస్రాఈల్ సంతతికి చెందిన వ్యభిచారిణిల్లో ఒకామె ఆ కుక్కను చూసింది, వెంటనే తన కాలిజోడులో నీళ్ళు నింపి ఆ కుక్కకు త్రాగించింది. అందుకై ఆమెను మన్నించడం జరిగింది”. (బుఖారి పదాలు 3467, ముస్లిం 2245).

ఇబ్ను తైమియ రహిమహుల్లాహ్ ఇలా చెప్పారుః స్వచ్ఛమైన విశ్వాసంతో ఆమె కుక్కకు త్రాగించింది. అందుకని క్షమించబడింది. అలా అని కుక్కకు నీళ్ళు త్రాగించే ప్రతి వ్యక్తి మన్నింపు జరగదు. (మిన్ హాజ్…3/ 183, మదారిజ్…1/ 332).

2వ కార్యం: సద్వర్తన

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సద్వర్తనను ప్రశంసించారు, త్రాసులో దాని గొప్ప పుణ్యాన్ని, ఘనతను స్పష్టంగా తెలిపారు. అందుకే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సద్వర్తన గురించి అల్లాహ్ ను అర్థించేవారు, దుష్ప్రవర్తన నుండి అల్లాహ్ శరణు కోరేవారు.

ప్రవక్త ﷺ ఇలా తెలియజేశారని, అబూ దర్దా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః

مَا شَيْءٌ أَثْقَلُ فِي مِيزَانِ المُؤْمِنِ يَوْمَ القِيَامَةِ مِنْ خُلُقٍ حَسَنٍ، وَإِنَّ اللهَ لَيُبْغِضُ الفَاحِشَ البَذِيءَ

“ప్రళయదినాన విశ్వాసి త్రాసులో సద్వర్తన కంటే బరువైన వస్తువు మరొకటి ఉండదు. నిశ్చయంగా అల్లాహ్ దుర్భాషలాడేవాడిని, బూతు పలికేవాడిని అసహ్యించుకుంటాడు”. (తిర్మిజి 2002, అబూదావూద్ 4799, ఇబ్నుహిబ్బాన్ 5693, బైహఖీ 20587, సహీహుల్ జామిః అల్బానీ 5632).

ఆయనే ఉల్లేఖించిన మరో ఉల్లేఖనం ఇలా ఉందిః

أَثْقَلُ شَيئٍ فِي الْـمِيزَانِ الخُلُقُ الحَسَن

“త్రాసులో అన్నిటికంటే బరువైన వస్తువు ఉత్తమ నడవడికయే”. (ఇబ్ను హిబ్బాన్ 481, అహ్మద్ 6/ 452, సహీహుల్ జామిః అల్బానీ 134).

మరో ఉల్లేఖనంలో ఉంది, ప్రవక్త ﷺ తెలిపారు:

مَنْ أُعْطِيَ حَظَّهُ مِنَ الرِّفْقِ فَقَدْ أُعْطِيَ حَظَّهُ مِنَ الْخَيْرِ، وَمَنْ حُرِمَ حَظَّهُ مِنَ الرِّفْقِ، فَقَدْ حُرِمَ حَظَّهُ مِنَ الْخَيْرِ، أَثْقَلُ شَيْءٍ فِي مِيزَانِ الْمُؤْمِنِ يَوْمَ الْقِيَامَةِ حُسْنُ الْخُلُقِ، وَإِنَّ اللَّهَ لَيُبْغِضُ الْفَاحِشَ الْبَذِيَّ

“ఎవరికి మెతకవైఖరిలోని కొంత భాగం ప్రాప్తమయిందో అతనికి మంచితనం, మేలు కొంత వరకు ప్రాప్తమయినట్లే. మరెవరైతే మెతకవైఖరిలోని కొంత భాగాన్ని కూడా నోచకోలేదో అతనికి అంత మేలు కూడా ప్రాప్తం కాలేదన్న మాట. ప్రళయదినాన విశ్వాసి త్రాసులో బరువుగల వస్తువు ఉత్తమ నడవడిక. నిశ్చయంగా అల్లాహ్ దుర్భాషలాడేవాడిని, బూతు పలికేవాడిని అసహ్యించుకుంటాడు”. (అదబుల్ ముఫ్రద్: బుఖారి 464, సహీ అదబుల్ ముఫ్రద్: అల్బానీ 361, బైహఖీ 20587, ఇబ్ను హిబ్బాన్ 5695).

ముల్లా అలీ ఖారీ రహిమహుల్లాహ్ చెప్పారుః అల్లాహ్ కు అసహ్యకరమైన ప్రతీది బరువు రహితంగా, విలువ లేనిది, అలాగే అల్లాహ్ కు ఇష్టమైన, ప్రీతికరమైన ప్రతీది అతని వద్ద చాలా గొప్పది. అల్లాహ్ అవిశ్వాసుల, సత్యతిరస్కారుల విషయంలో ఇలా చెప్పాడుః “మేము ప్రళయదినాన వారి త్రాసును బరువుగా చేయము”. (కహఫ్ 18:105). ప్రఖ్యాతిగాంచిన ఓ హదీసులో ఇలా ఉందిః “రెండు పదాలున్నాయి, అవిః నాలుకపై చాలా సులభంగా, త్రాసులో బరువుగా ఉన్నాయి మరియు కరుణామయునికి చాలా ప్రియమైనవి కూడా. అవేః సుబ్ హానల్లాహి వబిహందిహీ సుబ్ హానల్లాహిల్ అజీం”. (మిర్ఖాతుల్ మఫాతీహ్ షర్హు మిష్కాతుల్ మసాబీహ్: ముల్లా అలీ ఖారీ 8/ 809).

ఉత్తమ నడవడిక అలవర్చుకొనుటకు అధికంగా దోహదపడే విషయాలు ఇవిః ఖుర్ఆన్ పారాయణం ఎక్కువగా చేయడం, వాటి భావార్థాలను గ్రహించడం, పుణ్యపురుషుల సన్నిధిలో ఉండడం, వారికి సన్నిహుతులుగా ఉండడం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీసులను పఠించడం, ఇంకా సద్వర్తన ప్రసాదించాలని అల్లాహ్ ను వేడుకోవడం. ఇబ్ను మస్ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అద్దంలో చూసినప్పుడు ఇలా అనేవారుః اللَّهُمَّ كَمَا حَسَّنْتَ خَلْقِي فَحَسِّنْ خُلُقِي అల్లాహుమ్మ కమా హస్సంత ఖల్ఖీ ఫహస్సిన్ ఖులుఖీ “ఓ అల్లాహ్! నీవు నా సృష్టిని (ఆకారాన్ని) సరిదిద్దినట్లు నా నడవడికను కూడా సరిదిద్దు”. (ఇబ్ను హిబ్బాన్ 959, అహ్మద్ 1/ 403, అబూ యఅలా 5075, సహీహుల్ జామిః అల్బానీ 1307. షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ ఇర్వాఉల్ ఘలీల్74లో వ్రాసారు: అద్ధం చూస్తూ దుఆ చదవాలని వచ్చిన హదీసులన్నీ జఈఫ్, అయితే సామాన్య స్థితుల్లో చదవవచ్చును).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా దుఆ చేసేవారని ఖుత్బా బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః

اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ مُنْكَرَاتِ الأَخْلَاقِ، وَالأَعْمَالِ وَالأَهْوَاءِ

అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మిన్ మున్ కరాతిల్ అఖ్లాఖి వల్ అఅమాలి వల్ అహ్వా. “ఓ అల్లాహ్! దుష్ ప్రవర్తన నుండి, దుష్కార్యాల నుండి మరియు చెడు కోరికల నుండి నీ శరణులోకి వస్తున్నాను”. (తిర్మిజి 3591, ఇబ్ను హిబ్బాన్ 960, హాకిం 1949, సహీహుల్ జామిః అల్బానీ 1298).

తెలుసుకోండి! విశ్వాసుల్లో సంపూర్ణ విశ్వాసం గలవారు; తమ సద్వర్తనలో అతిఉత్తమంగా ఉన్నవారే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారని అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః

أَكْمَلُ الْـمُؤْمِنِينَ إِيمَانًا أَحْسَنُهُمْ خُلُقًا، وَإِنَّ حُسْنَ الْـخُلُقِ لَيَبْلُغُ دَرَجَةَ الصَّوْمِ وَالصَّلَاةِ

“విశ్వాసుల్లో సంపూర్ణ విశ్వాసం గలవారు అతిఉత్తమ సద్వర్తన గలవారే, నిశ్చయంగా ఉత్తమ నడవడిక నమాజ్, ఉపవాసాల స్థానానికి చేరుకుంటుంది”. (సహీహుల్ జామిః అల్బానీ 1578, బజ్జార్ 7445, అబూయాలా 4166).

3వ కార్యం: అల్లాహ్ కొరకు కోపాన్ని దిగమింగుట

ప్రవక్త ﷺ ఉపదేశించారని అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః

مَا مِنْ جُرْعَةٍ أَعْظَمُ أَجْرًا عِنْدَ اللهِ، مِنْ جُرْعَةِ غَيْظٍ كَظَمَهَا عَبْدٌ ابْتِغَاءَ وَجْهِ اللهِ

“అల్లాహ్ వద్ద పుణ్యపరంగా అతి గొప్ప గుటక, అల్లాహ్ అభీష్ఠానికై దాసుడు మింగే కోపాగ్ని గుటక”. (ఇబ్ను మాజ 4189, అహ్మద్ 2/ 128, అదబుల్ ముఫ్రద్ 1318, సహీహుత్తర్గీబ్: అల్బానీ 2752).

ఇలాంటి ఎన్ని సందర్భాలు మనకు ఎదురవుతాయి, అప్పుడు మనం ఈ హదీసును, ఈ గొప్ప పుణ్యఫలితాన్ని గుర్తుకు తెచ్చుకుంటామా? అల్లాహ్ కొరకు మన కొపాన్ని మింగి పుణ్యాన్ని పొందుతామా?

అల్లాహ్ సుబ్ హానహు వతఆలా కోపం వచ్చినప్పుడు కోపం ప్రకారం ఆచరించడానికి శక్తి ఉండికూడా కోపాన్ని దిగమ్రింగేవారిని ప్రశంసించి, వారికి మన్నింపు, క్షమాపణ, స్వర్గప్రవేశ శుభవార్త ఇచ్చాడు.

الَّذِينَ يُنْفِقُونَ فِي السَّرَّاءِ وَالضَّرَّاءِ وَالكَاظِمِينَ الغَيْظَ وَالعَافِينَ عَنِ النَّاسِ وَاللهُ يُحِبُّ المُحْسِنِينَ * وَالَّذِينَ إِذَا فَعَلُوا فَاحِشَةً أَوْ ظَلَمُوا أَنْفُسَهُمْ ذَكَرُوا اللهَ فَاسْتَغْفَرُوا لِذُنُوبِهِمْ وَمَنْ يَغْفِرُ الذُّنُوبَ إِلَّا اللهُ وَلَمْ يُصِرُّوا عَلَى مَا فَعَلُوا وَهُمْ يَعْلَمُونَ * أُولَئِكَ جَزَاؤُهُمْ مَغْفِرَةٌ مِنْ رَبِّهِمْ وَجَنَّاتٌ تَجْرِي مِنْ تَحْتِهَا الأَنْهَارُ خَالِدِينَ فِيهَا وَنِعْمَ أَجْرُ العَامِلِينَ {آل عمران: 134-136}

“ఎవరు కలిమిలోనూ, లేమిలోనూ (అల్లాహ్ మార్గంలో) ఖర్చు చేస్తారో మరియు కోపాన్ని దిగమ్రింగుతారో ఇంకా ప్రజలను మన్నిస్తారో, (ఇలాంటి) సజ్జనులను అల్లాహ్ ప్రేమిస్తాడు. మరెవరైతే (వారి ద్వారా) ఏదైనా అశ్లీల పని జరిగితే లేదా వారు తమపై అన్యాయం చేసుకుంటే, వెంటనే అల్లాహ్ ను స్మరించి తమ పాపాల క్షమాపణకై వేడుకుంటారు. –నిజానికి అల్లాహ్ తప్ప పాపాలను క్షమించేవాడెవడున్నాడు?- వారి ద్వారా జరిగింది తప్పు అని తెలిసినప్పుడు దానిపై హటం చెయ్యరు (మంకుపట్టు పట్టరు). ఇలాంటి వారి ప్రతిఫలం, వారి ప్రభువు నుండి క్షమాభిక్ష మరియు క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలు. వారక్కడ శాశ్వతంగా ఉంటారు. సత్కార్యాలు చేసే వారికి ఎంతో శ్రేష్ఠమైన ప్రతిఫలం ఉంది”. (ఆలె ఇమ్రాన్ 3:134-136).

ఈ ఘనమైన ఫలం పైన మరో ప్రతిఫలం ఏమిటంటే; అతనికిష్టమైన హూరె ఐన్ (అందమైన పెద్ద కళ్ళుగల స్వర్గపు సుందర కన్య)ను ఎన్నుకునే స్వేచ్ఛ ఇవ్వబడుతుంది. సహల్ బిన్ ముఆజ్ తన తండ్రితో ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారుః

مَنْ كَظَمَ غَيْظًا وَهُوَ قَادِرٌ عَلَى أَنْ يُنْفِذَهُ، دَعَاهُ اللهُ عَزَّ وَجَلَّ عَلَى رُءُوسِ الْخَلَائِقِ يَوْمَ الْقِيَامَةِ حَتَّى يُخَيِّرَهُ اللهُ مِنَ الْحُورِ الْعِينِ مَا شَاءَ

“ఎవరు తన కోపాన్ని దిగమింగుతాడో, అతను దానిని అమలు పరచడానికి శక్తి ఉండి కూడా (దిగమింగుతాడో), అల్లాహ్ ప్రళయదినాన అతనిని ప్రజల ఎదుట పిలుస్తాడు, అతనికిష్టమైన హూరె ఐన్ ను ఎన్నుకునే అధికారం ఇస్తాడు”. (అబూదావూద్ 4777, తిర్మిజి 2493, ఇబ్నుమాజ 4186, అల్బానీ సహీహుత్తర్గీబ్ 2753లో హసన్ అని చెప్పారు).

ఏదైనా ప్రాపంచిక వృధాకార్యం కోసం నీవు ఇంతటి గొప్ప పుణ్యాన్ని వదులుకుంటావా? ప్రజల్ని ఓటమికి గురి చేసేవాడు శక్తిశాలి కాదు, తన కోపాన్ని దిగమ్రింగేవాడు అసలైన శక్తిశాలి. అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారుః

لَيْسَ الشَّدِيدُ بِالصُّرَعَةِ، إِنَّمَا الشَّدِيدُ الَّذِي يَمْلِكُ نَفْسَهُ عِنْدَ الغَضَب

“ఎదుటి వానిని చిత్తుచేసినవాడు శూరుడు కాదు, తాను ఆగ్రహానికి గురై నప్పుడు తన్ను తాను అదుపులో ఉంచుకున్నవాడే అసలైన శూరుడు”. (బుఖారి 6114, ముస్లిం 2609, అహ్మద్ 2/ 236.).

4వ కార్యం: జనాజ వెంట వెళ్ళడం, జనాజ నమాజు చేయడం

గొప్ప పుణ్య కార్యాల్లో ఒకటి; జనాజ వెంట వెళ్ళడం, జనాజ నమాజు చేయడం, దానిపై లభించే పుణ్యం బరువు మానవుని త్రాసులో ఉహద్ పర్వతం కంటే అధికిమించి ఉంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని ఉబై బిన్ కఅబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః

مَنْ تَبِعَ جَنَازَةً حَتَّى يُصَلَّى عَلَيْهَا، وَيُفْرَغَ مِنْهَا، فَلَهُ قِيرَاطَانِ، وَمَنْ تَبِعَهَا حَتَّى يُصَلَّى عَلَيْهَا، فَلَهُ قِيرَاطٌ، وَالَّذِي نَفْسُ مُحَمَّدٍ بِيَدِهِ لَهُوَ أَثْقَلُ فِي مِيزَانِهِ مِنْ أُحُدٍ

“ఎవరు నమాజు మరియు (ఖననం) అయ్యే వరకు జానాజ వెంట ఉంటాడో అతనికి రెండు ఖీరాతులు, మరెవరయితే కేవలం నమాజు అయ్యే వరకు దాని వెంట ఉంటాడో అతనికి ఒక ఖీరాతు లభిస్తుంది. నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన (అంటే అల్లాహ్) సాక్షి! ఒక్క ఖీరాత్ బరువు అల్లాహ్ వద్ద ఉన్న త్రాసులో ఉహద్ పర్వతంకంటే ఎక్కువ ఉండును”. (అహ్మద్ 5/ 131 ఇది సహీ హదీస్).

ప్రవక్త ﷺ తెలిపారని, అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః

مَنْ شَهِدَ الجَنَازَةَ حَتَّى يُصَلِّيَ، فَلَهُ قِيرَاطٌ، وَمَنْ شَهِدَ حَتَّى تُدْفَنَ كَانَ لَهُ قِيرَاطَانِ، قِيلَ: وَمَا القِيرَاطَانِ؟ قَالَ: مِثْلُ الجَبَلَيْنِ العَظِيمَيْنِ

“ఎవరు జనాజలో పాల్గొని నమాజు చేస్తాడో అతనికి ఒక ఖీరాత్, మరెవరయితే (నమాజు మరియు) ఖననం అయ్యే వరకు పాల్గొంటాడో అతనికి రెండు ఖీరాతులు లభించును”. రెండు ఖీరాతులంటే ఏమిటి? అని ప్రశ్న వచ్చినప్పుడు, ప్రవక్త చెప్పారుః “రెండు పెద్ద కొండల వంటివి”. (బుఖారి 1325, ముస్లిం 945, తిర్మిజి 1040, నిసాయి 1940, ఇబ్ను మాజ 1539, అహ్మద్ 2/ 401, ఇబ్ను హిబ్బాన్ 3080)

ముస్లింలో ఉందిః ఇబ్ను ఉమర్ రజియల్లాహు అన్హు జనాజ నమాజు చేసుకొని వెళ్ళేవారు, ఎప్పుడయితే వారికి అబూహురైరా రజియల్లాహు అన్హు గారి ఈ హదీసు చేరిందో ‘వాస్తవానికి మనం అనేక ఖీరాతులు పోగుట్టుకున్నాము’ అని బాధ పడ్డారు.

5వ కార్యం: కనీసం పది ఆయతులైన సరే పఠిస్తూ తహజ్జుద్ నమాజు చేయటం

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారని, ఫుజాలా బిన్ ఉబైద్ మరియు తమీమ్ అద్దారీ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖించారుః

مَنْ قَرَأَ عَشْرَ آيَاتٍ فِي لَيْلَةٍ، كُتِبَ لَهُ قِنْطَارٌ، وَالْقِنْطَارُ خَيْرٌ مِنَ الدُّنْيَا وَمَا فِيهَا

“ఎవరు ఒక రాత్రిలో పది ఆయతులు పఠిస్తాడో అతని (కర్మల పత్రంలో) ‘ఖింతార్’ వ్రాయబడుతుంది, ‘ఖింతార్’ అన్నది ఈ ప్రపంచం మరియు అందులో ఉన్న సమస్తానికంటే మేలైనది”. (తబ్రానీ కబీర్ 1253, సహీహుత్తర్గీబ్ లో అల్బానీ హసన్ అని అన్నారు).

పైన పేర్కొనబడిన పది ఆయతుల ప్రస్తావన, ఆ ఆయతులు తహజ్జుద్ నమాజులో పఠించాలి. –వాస్తవ జ్ఞానం అల్లాహ్ కే ఉంది- కాని అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారుః

مَنْ قَامَ بِعَشْرِ آيَاتٍ لَمْ يُكْتَبْ مِنَ الغَافِلِينَ، وَمَنْ قَامَ بِمِائَةِ آيَةٍ كُتِبَ مِنَ القَانِتِينَ، وَمَنْ قَامَ بِأَلْفِ آيَةٍ كُتِبَ مِنَ المُقَنْطِرِينَ

“పది ఆయతులతో తహజ్జుద్ చేయువారు అలక్ష్యపరుల్లో వ్రాయబడరు. మరెవరయితే వంద ఆయతులతో తహజ్జుద్ చేస్తాడో వినయ విధేయుల్లో వ్రాయబడుతారు. ఇంకా ఎవరయితే వెయ్యి ఆయతులతో తహజ్జుద్ చేస్తారో ‘ముఖంతిరీన్’లో వ్రాయబడుతాడు”. (ముఖంతిరీన్ అన్న పదం ఖింతార్ తో వచ్చింది. ఖింతార్ భావం పై హదీసులో చూడండి). (అబూదావూద్ 1398, ఇబ్ను హిబ్బాన్ 2572, ఇబ్ను ఖుజైమా 1144, దార్మి 3444, హాకిం 2041, అల్బానీ సహీహుత్తర్గీబ్ 639లో హసన్, సహీ అని అన్నారు).

ఇషా తర్వాత చేయబడే ప్రతి నఫిల్ నమాజ్ తహజ్జుద్ లో లెక్కించబడుతుంది. ఈ నమాజు నీవు రాత్రి వేళ ఎంత ఆలస్యం చేస్తే అంతే ఎక్కువ పుణ్యం. ఈ గొప్ప ఘనత, చిన్నపాటి సత్కార్యాన్ని నీవు కోల్పోకు. కనీసం ఇషా తర్వాత రెండు రకాతుల సున్నత్ మరియు విత్ర్ నమాజు అయినా సరే.

6వ కార్యం: తహజ్జుద్ కు గల పుణ్యానికి సరిసమాన- మైన ఇతర సత్కార్యాలు

తహజ్జుద్ నమాజు యొక్క విలువ అల్లాహ్ వద్ద చాలా గొప్పగా ఉంది. ఫర్జ్ నమాజుల తర్వాత ఎక్కువ శ్రేష్ఠతగల నమాజు తహజ్జుదే. దాని ప్రత్యేకతల్లో: అది కేవలం పాపాలను హరించి వేయడమే గాకుండా; దానిని పాటించేవారిని పాపంలో పడకుండా కాపాడుతుంది. ప్రవక్త ﷺ ఇలా తెలిపారని అబూ ఉమామా బాహిలీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః

عَلَيْكُمْ بِقِيَامِ اللَّيْلِ فَإِنَّهُ دَأَبُ الصَّالِحِينَ قَبْلَكُمْ، وَهُوَ قُرْبَةٌ إِلَى رَبِّكُمْ، وَمَكْفَرَةٌ لِلسَّيِّئَاتِ، وَمَنْهَاةٌ لِلإِثْمِ

“మీరు తహజ్జుద్ నమాజు చేయండి, అది మీకంటే ముందు పుణ్యాత్ముల

సద్గుణం, మీ ప్రభువు సాన్నిధ్యానికి చేర్చునది, పాపాలకు పరిహారం మరియు అపరాధాల నుండి వారిస్తుంది”. (తిర్మిజి 3549, ఇబ్ను ఖుజైమా 1135, సహీహుత్తర్గీబ్ 624లో హసన్ లిగైరిహి అని ఉంది).

పూర్వ పుణ్యపురుషులు రహిమహుముల్లాహ్ యే కాదు, గత సమీప కాలాల్లో మన తాతముత్తాతలు తహజ్జుద్ నమాజులో ఏ కొరతా చూపేవారుకాదు. కాని ఈ కాలంలో అనేక మంది రాత్రులు పగల్లో, నిద్రలు జాగారాల్లో మారిపోయి, రాత్రి వేళల్లో అల్లాహ్ ను వేడుకునే మాధుర్యాన్ని కోల్పోయారు. మరికొందరు ఎంతటి అలసత్వానికి గురి అయ్యారంటే ఫజ్ర్ నమాజు సైతం వదిలేస్తున్నారు.

తన దాసులపై ఉన్న అల్లాహ్ యొక్క గొప్ప కరుణ ఏమిటంటే; ఆయన వారికి చిన్నపాటి కొన్ని కార్యాలు ప్రసాదించాడు, వాటి పుణ్యఫలితం తహజ్జుద్ కు సమానంగా ఉంది. ఎవరికైనా తహజ్జుద్ తప్పిపోతే లేదా ఎవరైనా తహజ్జుద్ చేయలేక పోతే కనీసం ఇలాంటి సత్కార్యాలు తప్పిపోకూడదు, వాటి ద్వారా తన త్రాసు బరువును పెంచుకోవచ్చును. ఇది తహజ్జుద్ చేయలేకపోయినా పరవా లేదు అన్న మాట కాదు, మన పూర్వ పుణ్యపురుషులు ఎన్నడూ అలా భావించలేదు, వారైతే ప్రతి పుణ్య కార్యంలో ముందంజవేసి, చురుకుగా పాల్గొనేవారు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ సహచరులకు కొన్ని సులువైన ఆచరణల గురించి తెలిపారు, ప్రత్యేకంగా ఎవరైతే తమకు తాము కొంత శ్రమ పడి తహజ్జుద్ చేయలేకపోతారో అలాంటి వారి గురించి, ఇలా మనల్ని కూడా సత్కార్యాలు చేసుకొని మన పుణ్యాలను పెంచుకోవాలని ప్రోత్సహించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారని అబూ ఉమామా బాహిలీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః

مَنْ هَالَهُ اللَّيْلُ أَنْ يُكَابِدَهُ، وَبَخِلَ بِالْمَالِ أَنْ يُنْفِقَهُ، وَجَبُنَ عَنِ الْعَدُوِّ أَنْ يُقَاتِلَهُ، فَلْيُكْثِرْ أَنْ يَقُولَ: سُبْحَانَ اللهِ وَبِحَمْدِهِ، فَإِنَّهَا أَحَبُّ إِلَى اللهِ مِنْ جَبَلِ ذَهَبٍ وَفِضَّةٍ يُنْفَقَانِ فِي سَبِيلِ اللهِ عَزَّ وَجَلَّ

“ఎవరు రాత్రి వేళ మేల్కొని (తహజ్జుద్ కై) శ్రమ పడుటకు భయపడ్డాడో,

ధనాన్ని (అల్లాహ్ మార్గంలో) ఖర్చు చేయుట నుండి పిసినారితనం వహించాడో మరియు శతృవుతో పోరాడడానికి పిరికితనం వహించాడో అతను అధికంగా సుబ్ హానల్లాహి వబిహందిహీ అనాలి. ఈ పదాలు అల్లాహ్ కు ఆయన మార్గంలో ఖర్చుపెట్టబడ్డ వెండి, బంగారాల కంటే ఎక్కువగా ఇష్టమైనవి, ప్రియమైనవి”. (తబ్రానీ కబీర్ 7795, అల్బానీ సహీహుత్తర్గీబ్ 1541లో సహీ లిగైరిహీ అని అన్నారు).

నేను తెలుపబోయే హదీసుల్లో సత్కార్యాల ఘనతలున్నాయి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వాటిని మనకు బహుకరించారు, మన పుణ్యాలు పెరగడానికి మరియు పుణ్యత్రాసు బరువుగా ఉండడానికి. ఇక మనం వాటిని ఆచరించాలి. వాటిలో కొన్ని ఇవిః

(1) ఇషా మరియు ఫజ్ర్ నమాజ్ సామూహికంగా (జమాఅత్ తో) చేయుట

ప్రవక్త ﷺ ఇలా సంబోధించారని, ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః

مَنْ صَلَّى الْعِشَاءَ فِي جَمَاعَةٍ كَانَ كَقِيَامِ نِصْفِ لَيْلَةٍ، وَمَنْ صَلَّى الْعِشَاءَ وَالْفَجْرَ فِي جَمَاعَةٍ كَانَ كَقِيَامِ لَيْلَةٍ

“ఎవరు ఇషా నమాజు సామూహికంగా పాటిస్తారో వారికి అర్థ రాత్రి వరకు తహజ్జుద్ చేసినంత (పుణ్యం), మరెవరయితే ఇషా మరియు ఫజ్ర్ నమాజులు సామూహికంగా పాటిస్తారో వారిక రాత్రంతా తహజ్జుద్ చేసినంత (పుణ్యం) లభిస్తుంది”. (అబూ దావూద్ 555, ముస్లిం 656, అహ్మద్ 1/ 58, మాలిక్ 371, తిర్మిజి 221, దార్మి 1224).

అందుకే ఫర్జ్ నమాజులు సామూహికంగా మస్జిదులో చేసే కాంక్ష అధికంగా ఉండాలి. వాటి ఘనత చాలా ఎక్కువ గనుక ఎట్టిపరిస్థితిలోనూ తప్పకూడదు. ప్రత్యేకంగా ఇషా మరియు ఫజ్ర్ నమాజులు. ఇవి రెండు మునాఫిఖుల(కపట విశ్వాసుల)కు చాలా కష్టంగా ఉంటాయి. వాటిలోని ఘనత గనక వారికి తెలిసి ఉంటే వారు తమ కాళ్ళు ఈడ్చుకొని అయినా వచ్చేవారు. వాటిలో ప్రతి ఒక్క నమాజు పుణ్యం అర్థ రాత్రి తహజ్జుద్ నమాజు చేసిన పుణ్యంతో సమానం.

(2) జొహ్ర్ నమాజుకు ముందు నాలుగు రకాతుల సున్నత్ చేయుట

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని, అబూ సాలిహ్ రహిమహుల్లాహ్ ‘మర్ ఫూఅ’, ‘ముర్ సల్’ ఉల్లేఖించారుః

أَرْبَعُ رَكَعَاتٍ قَبْلَ الظُّهْرِ، يَعْدِلْنَ بِصَلَاةِ السَّحَرِ

“జొêహ్ కు ముందు నాలుగు రకాతుల నమాజు సహర్ లో చేసే (తహజ్జుద్) నమాజుకు సమానమైనది”. (ముసన్నఫ్ ఇబ్ను అబీ షైబ 5940, అల్బానీ సహీహ 1431లో హసన్ అని చెప్పారు.

ఈ నాలుగు రకాతుల మరో ప్రత్యేకత ఏమిటంటే వాటి కొరకై ఆకాశపు ద్వారాలు తెరువబడతాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారని అబూ అయ్యూబ్ అన్సారీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః

أَرْبَعٌ قَبْلَ الظُّهْرِ تُفْتَحُ لَهُنَّ أَبْوَابُ السَّمَاءِ

“జొêహ్ కు ముందు నాలుగు రకాతులున్నాయి, వాటి కొరకు ఆకాశపు

ద్వారాలు తెరువబడతాయి”. (అబూ దావూద్ 3128, షమాఇల్ తిర్మిజి, అల్బానీ సహీహుత్తర్గీబ్ 585లో హసన్ లిగైరిహీ అని చెప్పారు).

అందుకనే ప్రవక్త ﷺ ఈ రకాతులు చేయుటకు అతిగా కాంక్షించే- వారు. అకాస్మాత్తుగా ఏదైనా కారణం వల్ల తప్పిపోయినా ఫర్జ్ నమాజు తర్వాత వాటిని చేసేవారు. ఈ విషయం ఆయిషా రజియల్లాహు అన్హా తెలిపారుః ఆయన ﷺ ఎప్పుడైనా జొêహ్ కు ముందు నాలుగు రకాతులు చేయలేక పోతే జొêహ్ తర్వాత చేసేవారు. ఇంకా బైహఖీ ఉల్లేఖనంలో ఆమె రజియల్లాహు అన్హా ఇలా తెలిపినట్లు ఉందిః జొêహ్ కు ముందు నాలుగు రకాతులు తప్పిపోతే జొêహ్ తర్వాత చేసేవారు. (తిర్మిజి 426, బైహఖీ, అల్బానీ సహీ తిర్మిజి 350లో హసన్ అని అన్నారు).

అందుకు, ఈ నాలుగు రకాతులు ఎవరికైనా తప్పిపోతే, లేదా ఏదైనా పని వల్ల చేయుటకు వీలు పడకపోతే -ఉదాహరణకుః కొందరు టీచర్లు- ఆ పని అయిన తర్వాత తమ ఇంటికి వచ్చి చేసుకోవచ్చును.

(3) తరావీహ్ నమాజు ఇమాంతో సంపూర్ణంగా చేయుట

అబూ జర్ర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం, మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో రమజానులో ఉపవాసమున్నాము. ఆయన ﷺ ఈ మాసంలో సామూహికంగా తరావీహ్ చేయించలేదు. అయితే (ఈ నెల సమాప్తానికి) ఏడు రోజులు మిగిలి ఉండగా, రాత్రి మూడవ వంతు వరకు మాకు తరావీహ్ చేయించారు, మళ్ళీ (నెల చివరి నుండి) ఆరవ రోజు తరావీహ్ చేయించలేదు, ఐదవ రోజు చేయించారు, అందులో అర్థ రాత్రి గడసిపోయింది. అప్పుడు సహచరులు ‘ప్రవక్తా! మిగిలిన రాత్రంతా మాకు ఈ నఫిల్ చేయిస్తే బావుండును’ అని విన్నవించుకున్నారు. అందుకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సమాధానమిచ్చారుః

إِنَّ الرَّجُلَ إِذَا صَلَّى مَعَ الْإِمَامِ حَتَّى يَنْصَرِفَ حُسِبَ لَهُ قِيَامُ لَيْلَةٍ

“ఎవరైనా ఇమాం నమాజు సమాప్తం చేసే వరకు అతనితో నమాజు చేస్తాడో అతనికి పూర్తి ఒక రాత్రి తహజ్జుద్ చేసినంత పుణ్యం లిఖించబడుతుంది”. (అబూ దావూద్ 1375, తిర్మిజి 806, నిసాయి 1364, ఇబ్ను మాజ 1327, అల్బానీ సహీహుల్ జామి1615లో సహీ అన్నారు).

మస్జిదులలో చాలా మంది ఇమాములు రమజాను మాసములో ఈ విషయం బోధిస్తూ ఉంటారు, ఇమాంతో తరావీహ్ నమాజు సంపూర్ణంగా చేయాలని ప్రోత్సహిస్తున్నది నీవు చూడగలవు. కాని కొందరు బద్ధకం వహించేవారు, అలక్ష్యపరులు, ఇతర మాసాలకు మరియు రమజానుకు మధ్య వ్యత్యాసం చూపే ఈ గొప్ప చిహ్నాన్ని వదులుకుంటున్నారు. దాని గురించే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా శుభవార్త ఇచ్చారుః

مَنْ قَامَ رَمَضَانَ إِيمَانًا وَاحْتِسَابًا، غُفِرَ لَهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِهِ

“ఎవరు సంపూర్ణ విశ్వాసం మరియు పుణ్యఫలాపేక్షతో రమజానులో నిలబడతారో (తరావీహ్ చేస్తారో), అతని పూర్వ పాపాలు మన్నించబడతాయి”. (బుఖారీ 37, ముస్లిం 759).

అలాగే లైలతుల్ ఖద్ర్ (ఘనమైన రాత్రి), అందులో సరియైన విధంగా అల్లాహ్ ఆరాధన చేయడం వెయ్యి నెలల ఆరాధన కంటే ఉత్తమం.

అల్లాహ్ ఇలా తెలిపాడు لَيْلَةُ الْقَدْرِ خَيْرٌ مِنْ أَلْفِ شَهْرٍ

“ఘనమైన రేయి వెయ్యి నెలల కంటే శ్రేష్ఠమైనది”. (ఖద్ర్ 97: 3).

ఇంతటి ఘనమైన రాత్రిని గుర్తించక అశ్రద్ధగా గడిపేవారి విషయం చాలా విచారకరమైనది.

(4) రాత్రి వేళ వంద ఆయతులు పారాయణం

ప్రవక్త ﷺ ప్రవచించారని తమీమ్ అద్దారీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః

مَنْ قَرَأَ بِمِائَةِ آيَةٍ فِي لَيْلَةٍ، كُتِبَ لَهُ قُنُوتُ لَيْلَةٍ

“ఎవరు ఒక రాత్రిలో వంద ఆయతుల పారాయణం చేస్తారో అతనికి రాత్రంతా తహజ్జుద్ చేసినంత పుణ్యం లిఖించబడుతుంది”. (అహ్మద్ –అల్ ఫత్ హుర్రబ్బానీ- 8/11, దార్మీ 3450, అల్బానీ సహీహుల్ జామి6468లో సహీ అన్నారు).

వంద ఆయతుల పారాయణం చాలా సులువు, నీ సమయంలో నుండి కేవలం పది నిమిషాల పాటు మాత్రమే గడుస్తుంది. నీ వద్ద సమయం మరీ తక్కువగా ఉంటే, ఈ ఘనతను పొందాలనుకుంటే సూర సాఫ్ఫాత్ (సూర నం. 37), లేదా సూర ఖలమ్ (68) మరియు సూర హాఖ్ఖా (69) పారాయణం చేయవచ్చు.

ఒకవేళ ఈ వంద ఆయతుల పారాయణం రాత్రి వేళ తప్పిపోతే ఫజ్ర్ మరియు జొహ్ర్ నమాజుల మధ్య పారాయణం చేయు, ఇందులో బద్ధకం వహించకు, ఇన్ షా అల్లాహ్ నీవు దాని పుణ్యం పొందగలవు. ఎలా అనగా ప్రవక్త ﷺ ఇలా శుభవార్త ఇచ్చారని హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః

مَنْ نَامَ عَنْ حِزْبِهِ، أَوْ عَنْ شَيْءٍ مِنْهُ، فَقَرَأَهُ فِيمَا بَيْنَ صَلَاةِ الْفَجْرِ، وَصَلَاةِ الظُّهْرِ، كُتِبَ لَهُ كَأَنَّمَا قَرَأَهُ مِنَ اللَّيْلِ

“ఎవరైనా తాను రోజువారీగా పారాయణం చేసే ఖుర్ఆనులోని కొంత ప్రత్యేక భాగం, లేదా ఏదైనా వేరే ఆరాధన చేయలేక నిద్రపోతే, మళ్ళీ దానిని ఫజ్ర్మరియు జొహ్ర్ నమాజుల మధ్య పూర్తి చేసుకుంటే అతనికి రాత్రివేళ చేసినంత పుణ్యం లిఖించబడుతుంది”. (ముస్లిం 747).

ఉమర్ బిన్ ఖత్తాబ్ గారీ ఈ ఉల్లేఖనం యొక్క వ్యాఖ్యానంలో ముబారక్ పూరి రహిమహుల్లాహ్ ఇలా చెప్పారుః ఈ హదీసు ద్వారా తెలిసిందేమిటంటే రాత్రిపూట (నమాజ్, ఖుర్ఆన్ పారాయణం లాంటి) ఏదైనా సత్కార్యం చేయుట, మరియు నిద్ర వల్ల లేదా మరే కారణంగా తప్పిపోతే ‘ఖజా’ చేయుట ధర్మసమ్మతమైనది. ఫజ్ర్ మరియు జొహ్ర్ నమాజుల మధ్య దానిని చేసినవాడు రాత్రి చేసినవానితో సమానం. ముస్లిం (746), తిర్మిజి (445) మొదలైనవాటిలో హజ్రత్ ఆయిషా రజియల్లాహు అన్హా ద్వారా రుజువైన విషయం ఏమిటంటేః నిద్ర లేదా ఏదైనా అవస్త కారణంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తహజ్జుద్ నమాజ్ చేయలేకపోతే పగటి పూట పన్నెండు రకాతులు చేసేవారు. (తొహ్ఫతుల్ అహ్వజీ షర్హ్ జామి తిర్మిజిః ముబారక్ పూరీ 3/ 185, హ.న. 851).

బహుశా ఈ హదీసు ప్రతి రోజు ఖుర్ఆనులో ఓ ప్రత్యేక భాగ పారాయణం ఉండాలని, ప్రత్యేకంగా రాత్రి వేళ అని నిన్ను ప్రోత్సహిస్తుంది.

ఏమీ! మనము అశ్రద్ధవహుల్లో లిఖించబడకుండా ఉండుటకు రాత్రి కనీసం పది ఆయతులైనా పారాయణం చేయాలని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రోత్సహించిన విషయం మీకు తెలియదా?

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖించారుః

مَنْ قَامَ بِعَشْرِ آيَاتٍ لَمْ يُكْتَبْ مِنَ الغَافِلِينَ، وَمَنْ قَامَ بِمِائَةِ آيَةٍ كُتِبَ مِنَ القَانِتِينَ، وَمَنْ قَامَ بِأَلْفِ آيَةٍ كُتِبَ مِنَ المُقَنْطِرِينَ

“పది ఆయతులతో తహజ్జుద్ చేయువారు అలక్ష్యపరుల్లో వ్రాయబడరు. మరెవరయితే వంద ఆయతులతో తహజ్జుద్ చేస్తాడో వినయ విధేయుల్లో వ్రాయబడుతాడు. ఇంకా ఎవరయితే వెయ్యి ఆయతులతో తహజ్జుద్ చేస్తారో ‘ముఖంతిరీన్’లో వ్రాయబడుతాడు”. (ముఖంతిరీన్ అన్న పదం ఖింతార్ నుండి వచ్చింది. ఖింతార్ భావం పై హదీసులో చూడండి). (అబూదావూద్ 1398, ఇబ్ను హిబ్బాన్ 2572, ఇబ్ను ఖుజైమా 1144, అల్బానీ సహీహుత్తర్గీబ్ 639లో హసన్, సహీ అని అన్నారు).

ఇకనైనా మనం ఖుర్ఆన్ పారాయణం చేయడానికి అడుగు ముందుకు వేద్దామా? మన ఖుర్ఆన్ సంపూర్ణం చేయడమనేది కేవలం రమజాను వరకే పరిమితమయి ఉండకూడదు, సంవత్సరమెల్లా ఉండాలి.

తహజ్జుద్ పుణ్యం పొందుటకు ప్రతి రోజు వంద ఆయతుల పారాయణ కాంక్ష అనేది అల్లాహ్ గ్రంథాన్ని బలంగా పట్టుకొని ఉండడానికి శుభప్రదమైన అవకాశం కావచ్చు.

(5) రాత్రి సూర బఖరలోని చివరి రెండు ఆయతుల పఠనం

ప్రవక్త ﷺ ఇలా తెలిపారని అబూ మస్ఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః

مَنْ قَرَأَ بِالْآيَتَيْنِ مِنْ آخِرِ سُورَةِ البَقَرَةِ فِي لَيْلَةٍ كَفَتَاهُ

“ఎవరు రాత్రి వేళ సూర బఖరలోని చివరి రెండు ఆయతులు పఠిస్తారో అతనికి అవే చాలు”. (బుఖారి 5010 పదాలు, ముస్లిం 807).

ఇమాం నవవీ రహిమహుల్లాహ్ చెప్పారుః అవి సరిపోతాయి అంటే తహజ్జుద్ కు బదులుగా సరిపోతాయి అని భావం. షైతాన్ నుండి, ఆపదల నుండి రక్షణకై అని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా కావచ్చు. (సహీ ముస్లిం షర్హ్ నవవీ 6/ 340, హ.న. 807)

ఇబ్ను హజర్ రహిమహుల్లాహ్ పై అభిప్రాయాలకు/ భావాలకు మద్దతు ఇస్తూ ఇలా చెప్పారుః దీనిపై నేను ఇలా అంటానుః పైన పేర్కొనబడిన భావాలన్నియు సరియైనవి కావచ్చు. –అల్లాహ్ యే అందరికంటే ఎక్కువ తెలిసినవాడు- కాని మొదటి భావం గురించి మరో స్పష్టమైన ఉల్లేఖనం ఉంది, అది ఆసిం ద్వారా, అల్ ఖమాతో, ఆయన అబూ మస్ఊద్ తో, ఆయన ప్రవక్త చెప్పినట్లు తెలిపారుః

مَن قَرَأخَاتِمة الْبَقَرَةِ أَجْزَأَتْ عَنْهُ قِيَامَ لَيْلَةٍ

“ఎవరు సూర బఖరలోని చివరి ఆయతులు పఠిస్తారో అవి అతని వైపు నుండి తహజ్జుద్ కు బదులుగా సరిపోతాయి”. (ఫత్హుల్ బారీ బిషర్హి సహీహిల్ బుఖారిః ఇబ్ను హజ్ర్ అస్ఖలానీ 8/ 673, హ.న. 5010).

ఈ రెండు ఆయతుల పారాయణం చాలా సులువైన విషయం, అనేక మంది వాటిని కంఠస్తం చేసి ఉంటారు అల్ హందులిల్లాహ్. ముస్లిం వ్యక్తి ప్రతి రాత్రి వాటిని క్రమం తప్పకుండా చదివే ప్రయత్నం చేయాలి. ఇవి సులువుగా ఉన్నాయని కేవలం వీటినే పట్టుకొని, తహజ్జుద్ కు ఉన్నటువంటి పుణ్యం గల ఇతర సత్కార్యాలను వదలకూడదు. ఎందుకనగా విశ్వాసి సాధ్యమైనంత వరకు ఎక్కువ పుణ్యాలు సమకూర్చుకునే ప్రయత్నం చేస్తాడు. ఏ సత్కార్యం అంగీకరించబడుతుందనేది కూడా అతనికి తెలియదు.

అబ్దుల్లాహ్ బిన్ ఉమైర్ రహిమహుల్లాహ్ చెప్పారుః అల్లాహ్ విధేయతకు సంబంధించిన విషయాల్లో, ఏదో అతి నీచమైన పని చేస్తున్నట్లుగా అతి సులువైన విషయాలతోనే సరిపుచ్చుకోకు. అలా కాకుండా ఎంతో ఆనందంతో, సంపూర్ణ కాంక్షతో కఠోరంగా శ్రమించే ప్రయత్నం చేయి. (హిల్యతుల్ ఔలియా…: అబూ నుఐమ్ 3/ 354).

(6) సద్వర్తన, ఉత్తమ నడవడిక

ప్రవక్త ﷺ చెప్పగా విన్నానంటూ ఆయిషా (రదియల్లాహు అన్హా) ఉల్లేఖించారుః

إِنَّ الْـمُؤْمِنَ لَيُدْرِكُ بِحُسْنِ خُلُقِهِ دَرَجَاتِ قَائِمِ اللَّيْلِ، صَائِمِ النَّهَارِ

“నిశ్చయంగా విశ్వాసుడు తన ఉత్తమ నడవడిక ద్వారా రాత్రంతా ఆరాధన చేసే, పగలంతా ఉపవాసముండే వారి స్థానాలకు చేరుకుంటాడు”. (ముస్నద్ అహ్మద్ పదాలు 24355, అబూదావూద్ 4798, అల్బానీ సహీహుల్ జామి 1620లో సహీ అన్నారు).

దీని వ్యాఖ్యానంలో అబుత్తయ్యిబ్ షమ్సుల్ హఖ్ అజీమాబాదీ రహిమహుల్లాహ్ ఔనుల్ మఅబూద్ లో ఇలా చెప్పారుః ఉత్తమ నడవడిక గల వ్యక్తికి ఇంతటి గొప్ప ఘనత ఎందుకు ఇవ్వబడిదంటే; ‘సాయిమ్’ (ఉపవాసం ఉండేవాడు), ‘ఖాయిమ్’ (రాత్రి నమాజు చేసేవాడు), తమ మనోవాంఛలకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటారు, కాని ఉత్తమ నడవడిక అవలంబించే వ్యక్తి విభిన్న తత్వాలు, గుణాలు గల ప్రజలతో పోరాడుతూ ఉంటాడు అందుకే అతను సాయిమ్, ఖాయిమ్ ల స్థానాలను అందుకుంటాడు. ఇలా వారు స్థానంలో సమానులవుతారు, ఒకప్పుడు వీరే ఎక్కువ స్థానం పొందుతారు. (ఔనుల్ మఅబూద్ షర్హు సునన్ అబీ దావూద్ 13/ 154, హదీసు నంబర్ 4798).

ప్రజలతో మంచి విధంగా వ్యవహరించడం, వారికి ఏ కష్టం కలిగించకుండా ఉండడమే ఉత్తమ నడవడిక, సద్వర్తన.

నిశ్చయంగా మనిషికి విశ్వాసం తర్వాత సద్వర్తన కంటే ఉత్తమమైన మరే విషయం ఇవ్వబడలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ ప్రభువుతో ఉత్తమ నడవడిక ప్రసాదించమని అర్థించేవారు. జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహు అక్బర్ అని నమాజు ప్రారంభించాక ఇలా చదివేవారుః

إِنَّ صَلَاتِي وَنُسُكِي وَمَحْيَايَ وَمَمَاتِي لله رَبِّ الْعَالَمِينَ لَا شَرِيكَ لَهُ، وَبِذَلِكَ أُمِرْتُ وَأَنَا مِنَ الْـمُسْلِمِينَ. اللَّهُمَّ اهْدِنِي لِأَحْسَنِ الْأَعْمَالِ وَأَحْسَنِ الْأَخْلَاقِ لَا يَهْدِي لِأَحْسَنِهَا إِلَّا أَنْتَ، وَقِنِي سَيِّئَ الْأَعْمَالِ وَسَيِّئَ الْأَخْلَاقِ لَا يَقِي سَيِّئَهَا إِلَّا أَنْتَ

ఇన్న సలాతీ వ నుసుకీ వ మహ్ యాయ వ మమాతీ లిల్లాహి రబ్బిల్ ఆలమీన్, లాషరీక లహూ వ బిజాలిక ఉమిర్తు వ అన మినల్ ముస్లిమీన్, అల్లాహుమ్మహ్ దినీ లిఅహ్సనిల్ అఅమాలి వ అహ్సనిల్ అఖ్లాక్, లా యహ్ దీ లి అహ్సనిహా ఇల్లా అంత, వ ఖినీ సయ్యిఅల్ అఅమాలి వ సయ్యిఅల్ అఖ్లాక్, లా యఖీ సయ్యిఅహా ఇల్లా అంత.

(భావం: నిశ్చయంగా నా నమాజ్, నా ఖుర్బానీ (బలిదానం), నా జీవన్మరణాలు సర్వ లోకాల ప్రభువైన అల్లాహ్ కొరకే, ఆయనకు ఎవడూ భాగస్వామి లేడు. ఈ ఆదేశమే నాకు ఇవ్వబడినది, నేను ముస్లిములోని వాడిని. ఓ అల్లాహ్! నాకు సత్పవర్తన మరియు సదాచరణ వైపునకు మార్గదర్శకత్వం చేయు, వాటి వైపునకు మార్గదర్శకత్వం చూపేవాడు నీ తప్ప ఎవ్వడూ లేడు. నన్ను దుష్పవర్త మరియు దుష్కార్యాల నుండి కాపాడు. నన్ను వాటి నుండి కాపాడేవాడు నీ తప్ప ఎవ్వడూ లేడు). (ముస్లిం 771, తిర్మిజి 3421, నిసాయి 897 హదీసు పదాలు).

అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అద్దంలో చూసినప్పుడల్లా ఇలాగే దుఆ చేసేవారు. ఇబ్ను మస్ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః ప్రవక్త ﷺ అద్దంలో చూసినప్పుడల్లా ఇలా అనేవారుః

اللَّهُمَّ كَمَا حَسَّنْتَ خَلْقِي فَحَسِّنْ خُلُقِي

“ఓ అల్లాహ్! నీవు నా సృష్టిని (ఆకారాన్ని) సరిదిద్దినట్లు నా నడవడికను కూడా సరిదిద్దు”. (ఇబ్ను హిబ్బాన్ 959, అహ్మద్ 1/ 403, అబూ యాలా 5075, తయాలిసి 374, తబ్రానీ ఫిద్దుఆ 368, అఖ్లాఖున్నబీః అబుష్షేఖ్ అల్ అస్బహానీ 493, సహీహుల్ జామిః అల్బానీ 1307).

సద్వర్తన గల వ్యక్తి ప్రజల్లో ప్రవక్తకు అతిప్రియుడైనవాడు మరియు ప్రళయదినాన ఆయనకు సమీపాన కూర్చుండేవాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారని జాబిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః

إِنَّ مِنْ أَحَبِّكُمْ إِلَيَّ وَأَقْرَبِكُمْ مِنِّي مَجْلِسًا يَوْمَ القِيَامَةِ أَحَاسِنَكُمْ أَخْلَاقًا

“నిశ్చయంగా మీలో నాకు అతి ప్రియమైనవాడు మరియు ప్రళయదినాన మీలో నాకు అతి సమీపంగా కూర్చుండేవాడు మీలో అందరికన్నా ఉత్తమ నడవడిక గలవాడు”. (తిర్మిజి 2018, తబ్రానీ కబీర్ 10424, అదబుల్ ముఫ్రద్: బుఖారీ 272, అల్బానీ సహీహుత్తర్గబ్ 2649లో సహీ అన్నారు).

అల్లాహ్ ఉత్తమ నడవడిక గల వ్యక్తికి, సత్ఫలితార్థం మరియు గౌరవార్థం ఉన్నతస్వర్గంలో ఒక కోట (మంచి ఇల్లు) ప్రసాదిస్తాడు. ప్రవక్త ﷺ సెలవిచ్చారని అబూ ఉమామ బాహిలీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః

أَنَا زَعِيمٌ بِبَيْتٍ فِي رَبَضِ الْجَنَّةِ لِمَنْ تَرَكَ الْمِرَاءَ وَإِنْ كَانَ مُحِقًّا، وَبِبَيْتٍ فِي وَسَطِ الْجَنَّةِ لِمَنْ تَرَكَ الْكَذِبَ وَإِنْ كَانَ مَازِحًا وَبِبَيْتٍ فِي أَعْلَى الْجَنَّةِ لِمَنْ حَسَّنَ خُلُقَهُ

“నేను బాధ్యత వహిస్తున్నాను స్వర్గం పరిసరాల్లో ఒక గృహం ఇప్పించాడానికి ఎవరైతే ధర్మం తన వైపు ఉన్నప్పటికి వివాదాన్ని విడనాడుతాడో. మరియు స్వర్గం మధ్యలో ఒక గృహం ఇప్పంచడానికి ఎవరైతే పరిహాసానికైనా అబద్ధం పలకనివానికి. ఇంకా స్వర్గంలో ఎత్తైన ప్రదేశంలో ఒక గృహం ఇప్పించడానికి ఎవరైతే తమ నడవడికను సరిదిద్దుకుంటారో”. (అబూదావూద్ పదాలు 4800, బైహఖీ 20965, షేఖ్ అల్బానీ సహీహుల్ జామి 1464లో హసన్ అన్నారు).

నీ ఉత్తమ నడవడిక అనేది నీకు దూర సంబంధికులైన వారి వరకే పరిమితమయి, నీ దగ్గరి సంబంధికులను మరచిపోవడం సమంజసం కాదు. అది నీ తల్లిదండ్రులు, నీ కుటుంబికులకు వ్యాపించి ఉండాలి. కొందరు ప్రజల పట్ల ఉల్లాసంగా, విశాల హృదయం మరియు సద్వర్తనతో ఉంటారు, అదే వారి భార్య పిల్లలతో వాటికి భిన్నంగా ఉంటారు.

(7) వితంతువు, నిరుపేదల బాగోగులు చూడటం

అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త ﷺ ఇలా సెలవిచ్చారుః

السَّاعِي عَلَى الأَرْمَلَةِ وَالمِسْكِينِ، كَالْمُجَاهِدِ فِي سَبِيلِ الله، أَوِ القَائِمِ اللَّيْلَ الصَّائِمِ النَّهَارَ

“వితంతువుల మరియు నిరుపేదల మేలు కోసం కృషి చేసేవాడు అల్లాహ్ మార్గంలో పోరాడేవాడు లేదా రాత్రంతా తహజ్జుద్ లో పగలంతా ఉపవాసంలో గడిపేవారితో సమానం”. (బుఖారీ పదాలు 5353, ముస్లిం 2982, తిర్మిజి 1969, నిసాయి 2577, ఇబ్ను మాజ 2140).

నీవు ఈ బ్రహ్మాండమైన పుణ్యం సంపాదించవచ్చు, ఎవరైనా బీదవాని సహాయానికి కృషి చేస్తూ, అతని పేపర్లు ఏదైనా స్వచ్ఛంద సేవ సంస్థలో చేర్పించి, ఆ సంస్థవారు అతని స్థితిగతులను పరిశోధించి అతనికి అవసరమైన సహాయం అందిస్తారు.

అలాగే ఈ గొప్ప పుణ్యం నీవు సంపాదించవచ్చు, ఎవరైనా వితంతువు –భర్త చనిపోయిన స్త్రీ- సహాయానికి కృషి చేస్తూ, ఆమె అవసరాన్ని తీరుస్తూ. ఇది ఏదో కష్టతరమైన పని కాదు, ఎలా అనగా నీవు నీ బంధవుల్లో వెదికితే భర్త చనిపోయిన స్త్రీలు కనబడతారు, వారు నీ మేనత్త, పెద్ధమ, చిన్నమ్మలు లేదా నానమ్మ, అమ్మమ్మలే కావచ్చు. వారికి అవసరమైన ఏదైనా సామాను కొనుగోలు చేసి వారికి సహాయపడి అల్లాహ్ మార్గంలో పోరాడే, రాత్రంతా తహజ్జుద్ చేసే పుణ్యాన్ని సంపాదించవచ్చు.

(8) కొన్ని జుమా పద్ధతులను తప్పకుండా పాటించుట

ప్రవక్త ﷺ చెప్పగా విన్నట్లు ఔస్ బిన్ ఔస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః

مَنْ غَسَّلَ يَوْمَ الْجُمُعَةِ وَاغْتَسَلَ، ثُمَّ بَكَّرَ وَابْتَكَرَ، وَمَشَى وَلَمْ يَرْكَبْ، وَدَنَا مِنَ الْإِمَامِ فَاسْتَمَعَ وَلَمْ يَلْغُ كَانَ لَهُ بِكُلِّ خُطْوَةٍ عَمَلُ سَنَةٍ أَجْرُ صِيَامِهَا وَقِيَامِهَا

“ఎవరు జుమా రోజు స్నానం (చేయించి, తలంటు స్నానం) మంచి విధంగా చేశాడో, త్వరగా బయలుదేరి, తొలి సమయంలో చేరాడో, వాహనముపై కాకుండా కాలినడకతో వచ్చాడో, ఇమాంకు సమీపంగా కూర్చోని, శ్రద్ధగా (జుమా ఖుత్బ/ప్రసంగం) విన్నాడో, ఏలాంటి వృధా కార్యాలకు పాల్పడలేదో, అతను నడిచే ప్రతి అడుగుకు బదులుగా ఒక సంవత్సరపు ఉపవాసాల మరియు ఒక సంవత్సరపు తహజ్జుద్ నమాజ్ చేసినంత పుణ్యం లభిస్తుంది”. (తిర్మిజి 496, అబూదావూద్ 345 హదీసు పదాలు వీరివే, నిసాయి 1381, ఇబ్ను మాజ 1087, షేఖ్ అల్బానీ సహీహుల్ జామి 6405లో సహీ అన్నారు).

జుమా గురించి ఒక్క అడుగు, -పైన పేర్కొనబడిన పద్ధతులను నెరవేర్చినవానికి- దాని పుణ్యం ఒక రాత్రి తహజ్జుదా? కాదు, వారమా? కాదు, నెలా? కాదు, పూర్తి ఒక సంవత్సరపు తహజ్జుద్ నమాజులు మరియు ఉపవాసాల పుణ్యానికి సరిసమానమైనది. ఈ గొప్ప పుణ్యం గురించి ఆలోచించు, యోచించు.

ఆ పద్ధతులు ఇవిః జుమా రోజు స్నానం చేయటం, త్వరగా, తొందరగా బయలుదేరటం, కాలినడకతో వెళ్ళటం, చివరి పంక్తుల్లో కాకుండా ఇమాంకు సమీపంగా కూర్చోవటం, శ్రద్ధగా ఖుత్బ వినటం, ఏలాంటి వృధా కార్యకలాపాలు చేయకుండా ఉండటం .

ఖుత్బ సందర్భంగా ఏలాంటి వృధా మాటలైనా, పనులైనా ‘లగ్వ్’ క్రింద లెక్కించబడుతాయి. ఎవరు లగ్వ్ చేస్తారో వారి ఆ జుమా కాదు (అంటే పుణ్యఫలితం ఉండదు), చిన్న రాళ్ళతో, (పూసలతో, దారాలతో), తస్బీహ్ గొలుసుతో, సెల్ ఫోన్లతో మరే దానితోనైనా ఆటలాడుట లగ్వ్ అనబడుతుంది. ప్రక్కన ఉన్న మనిషిని, తన కొడుకును ‘నిశబ్దంగా ఉండు, మౌనం వహించు’ లాంటి మాట అన్నా సరే లగ్వ్ గానే పరిగణించబడుతుంది.

ఎట్టి పరిస్థితిలోనైనా జుమా పద్ధతుల పట్ల అశ్రధ్ధగా, అగౌరవంగా వ్యవహరించ కూడదు. ఈ గొప్ప పుణ్యాన్ని వృధా చేసుకోకూడదు. అది నీ త్రాసును బరువుగా చేస్తుంది. అనేక సంవత్సరాల తహజ్జుద్, ఉపవాసాల పుణ్యాన్ని నీకు లభింపజేస్తుంది.

(9) అల్లాహ్ మార్గంలో ఒక రాత్రి, పగలు పహరా ఇవ్వటం

ప్రవక్త ﷺ చెప్పగా విన్నట్లు సల్మాన్ ఫార్సీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః

رِبَاطُ يَوْمٍ وَلَيْلَةٍ خَيْرٌ مِنْ صِيَامِ شَهْرٍ وَقِيَامِهِ، وَإِنْ مَاتَ جَرَى عَلَيْهِ عَمَلُهُ الَّذِي كَانَ يَعْمَلُهُ، وَأُجْرِيَ عَلَيْهِ رِزْقُهُ، وَأَمِنَ الْفَتَّانَ

“ఒక రాత్రి, ఒక పగలు సరిహద్దు మీద పహరా ఇవ్వటం, ఒక నెల పాటు ఉపవాసం పాటించడం, తహజ్జుద్ చేయడం కంటే ఉత్తమం. అతను అదే స్థితిలో గనక చనిపోతే, అతను చేస్తూ ఉండిన ఆ సత్కార్యం ఆ తర్వాత కూడా కొనసాగుతునే (అంటే అతనికి దాని పుణ్యం చేరుతునే) ఉంటుంది. అతనికి (స్వర్గ) ఉపాధి లభించటం మొదలవుతుంది. ఇంకా అతను పరీక్షకు గురి చేసేవారి నుండి కూడా సురక్షితంగా ఉంటాడు”. (బుఖారి 2892, ముస్లిం 1913 హదీసు పదాలు వీరివే, తిర్మిజి 1665, నిసాయి 3168).

పరీక్షకు గురిచేసేవారు అంటే సమాధి పరీక్ష.

(10) పడుకునే ముందు తహజ్జుద్ సంకల్పం చేసుకొనుట

అబూ దర్దా (రదియల్లాహు అన్హు) ప్రవక్త ﷺ చెప్పినట్లు ఉల్లేఖించారుః

مَنْ أَتَى فِرَاشَهُ وَهُوَ يَنْوِي أَنْ يَقُومَ يُصَلِّي مِنَ اللَّيْلِ فَغَلَبَتْهُ عَيْنَاهُ حَتَّى أَصْبَحَ كُتِبَ لَهُ مَا نَوَى وَكَانَ نَوْمُهُ صَدَقَةً عَلَيْهِ مِنْ رَبِّهِ عَزَّ وَجَلَّ

“ఎవరైనా తన పడక మీదికి (పడుకోవడానికి) వచ్చి, రాత్రి మేల్కొని తహజ్జుద్ చేస్తానని సంకల్పిస్తాడో, అతను (గాఢ నిద్రలో ఉండి) మేల్కోలేక పోయినప్పటికీ, అతని సంకల్పం ప్రకారం అతనికి పుణ్యం లిఖించబడుతుంది, అతని నిద్ర అతని కొరకు అతని ప్రభువు వైపు నుండి దానంగా పరిగణించబడుతుంది”. (నిసాయి 1789, ఇబ్ను మాజ 1344, అల్బానీ సహీహుల్ జామి 5941లో హసన్ అన్నారు).

చూశావా? సంకల్పం యొక్క ప్రాముఖ్యత, విలువ, అది ఓ కార్యంతో సమానం. అందుకే ఎవరైతే ఫజ్ర్ నమాజు దాని సమయంలో చేయని సంకల్పంతో పడుకుంటారో వారు ఎంతటి భయంకరంలో, అపాయంలో పడి ఉన్నారో తెలుస్తుంది. అలాంటి వారు తమ గడియార అలారం డ్యూటి టైంపై లేదా తమ స్కూల్ టైంపై సెట్ చేసి పెట్టడాన్ని నీవు చూస్తావు, ఇలాంటి మనిషి ఘోరమైన పాపానికి ఒడిగట్టాడు, అదే స్థితిలో గనక చనిపోతే అతనిది చెడు చావు అవుతుంది. –అల్లాహ్ కాపాడుగాక!- ఎవరైతే ఫజ్ర్ సమయానికి మేల్కోవాలని నిశ్చయించాడో, తగిన సాధనాల ఏర్పాటు కూడా చేసుకున్నాడు కాని మేల్కోలేకపోయాడు, అతనిపై ఏలాంటి నింద లేదు. ఎందుకనగా అతను పడుకునేటప్పుడు ఏ కొరత చేయలేదు, జరిగిన లోపం లేవడంలో మాత్రమే.

(11) ఏ సత్కార్యాల పుణ్యం తహజ్జుద్ కు సమానంగా ఉందో అవి ఇతరులకు నేర్పు

ఏ సత్కార్యాల పుణ్యం తహజ్జుద్ నమాజ్ పుణ్యానికి సమానంగా ఉందో అవి ఇతరులకు నేర్పుట నీవు తహజ్జుద్ పుణ్యం పొందుటకు ఒక కారణం. ఎలా అనగా ఒక మంచి గురించి బోధించే వ్యక్తి, ఆ మంచిని పాటించే వ్యక్తి లాంటి (పుణ్యం పొందుతాడు). మేలు వైపునకు ఆహ్వానించేవాడివి అయిపో, తెలిసిన ఈ విషయాలను ప్రచారం చేయి, నీతో ఎంత మంది నేర్చుకొని, వాటిని పాటిస్తారో అంత మంది పుణ్యాలు నీవు పొందుతావు (వారి పుణ్యాల్లో ఏలాంటి కొరత జరగదు).

7వ కార్యం: ఖుర్ఆన్ కంఠస్తం చేయడం మరియు అధికంగా దాని పారాయణం చేయడం

విశ్వాసుని త్రాసును బరువుగా చేయు సత్కార్యాల్లో మరొకటి అల్లాహ్ గ్రంథమైన ఖుర్ఆన్ ను కంఠస్తం చేయడం. కంఠస్తం చేయడం వల్ల మాటిమాటికి, ఎల్లవేలల్లో చదువుతూ ఉండే అవకాశం ఉంటుంది. ప్రవక్త సహచరుల్లో చాలా ప్రఖ్యాతి గాంచిన, ఖుర్ఆన్ పారాయణుల్లో అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు ఒకరు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతడ్ని ప్రశంసిస్తూ ఇలా అన్నారుః

مَنْ أَحَبَّ أَنْ يَقْرَأَ الْقُرْآنَ غَضًّا كَمَا أُنْزِلَ، فَلْيَقْرَأْهُ عَلَى قِرَاءَةِ ابْنِ أُمِّ عَبْدٍ

“ఖుర్ఆన్ అవతరించిన విధంగా తాజాదనంగా చదవాలని ఎవరికి ఇష్టమో అతను ఇబ్ను ఉమ్మె అబ్ద్ (అంటే అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్) పారాయణ విధానాన్ని అవలంబించాలి”. (ఇబ్ను మాజ 138, ఇబ్ను హిబ్బాన్ 7076, షేఖ్ అల్బానీ సహీహుల్ జామి 5961లో సహీ అన్నారు. ఉల్లేఖించిన వారు అబూబక్ర్ మరియు హజ్రత్ ఉమర్ రజియల్లాహు అన్హుమా).

ఈ గొప్ప సహచరుని గురించే ప్రవక్త తెలిపారుః అతని పిక్క ప్రళయదినా తూయబడినప్పుడు ఉహద్ పర్వతం కంటే ఎక్కువ బరువు ఉంటుంది అని. ఇక వేరే అవయవాల గురించి నీ ఆలోచన ఏముంటుంది? ఇలా ఎందుకో తెలుసా? –నిజమైన జ్ఞానం అల్లాహ్ కు మాత్రమే ఉంది- అల్లాహ్ గ్రంథాన్ని కంఠస్తం చేసి, దానిని అధికంగా పారాయణం చేసినందుకు. ఇది విశ్వాసాన్ని పెంచుతుంది, త్రాసులో బరువును పెంచుతుంది. ఎవరు అల్లాహ్ సద్వచనాలను (అంటే ఖుర్ఆన్) కంఠస్తం చేస్తారో ఖుర్ఆన్ వాసుల్లో కలిసిపోతాడు, ఖుర్ఆన్ వాసులు అల్లాహ్ వారు, అతని ప్రత్యేక సన్నిహితులు.

జుర్ర్ బిన్ హుబైష్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం: అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గురించి అరాక్ చెట్టు యొక్క మిస్వాక్ కోస్తుండేవారు. అతని పిక్కలు చాలా సన్నగా ఉండేవి. అది చూసిన సహచరులు ఒకసారి నవ్వారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మందలిస్తూ, మీరెందుకు నవ్వుతున్నారు? అతని పిక్కలు సన్నగా ఉన్నాయనా? నా ప్రాణం ఎవ్వని చేతిలో ఉందో ఆయన సాక్షి! ఆ రెండు కాళ్ళు త్రాసులో ఉహద్ కంటే బరువుగా ఉంటాయి. (ఇబ్ను హిబ్బాన్ హదీసు 7069, హాకిం 5385, అదబుల్ ముఫ్రద్ 237లో, తబ్రానీ కబీర్ 8452లో, అబూయాలా 5310, అల్బానీ సహీహా 2750లో).

ఇబ్ను మస్ఊద్ కు ఖుర్ఆన్ పట్ల, దాని పారాయణం పట్ల చాలా ప్రేమ ఉండేది, అంటే అందువల్ల ఆయన నఫిల్ ఉపవాసాలు ఉండలేక పోతున్నారని వాపోయేవారు. అయితే మనం మన సమయాన్ని ఎందులో వెచ్చిస్తున్నామో ఆలోచించండి???

హాఫిజ్ ఇబ్ను రజబ్ రహిమహుల్లాహ్ చెప్పారుః ఇబ్ను మస్ఊద్ నఫిల్ ఉపవాసాలు చాలా తక్కువ ఉండేవారు, ఇంకా ఇలా అనేవారుః ఉపవాసం నన్ను ఖుర్ఆన్ పారాయణం నుండి అడ్డుకుంటుంది, ఖుర్ఆన్ పారాయణం నాకు చాలా ప్రియమైనది. ఖుర్ఆన్ పారాయణం నఫిల్ ఉపవాసాలకంటే ఉత్తమం. సుఫ్యాన్ సౌరీ మరియు ఇతర ఇమాముల ద్వారా రుజువైన విషయమే ఇది. (లతాయిఫుల్ మఆరిఫ్ ఫీమా లిమవాసిమిల్ ఆమి మినల్ వజాయిఫ్: హాఫిజ్ ఇబ్ను రజబ్ 147).

ప్రళయదినాన సిఫారసు చేయువారిలో ఖుర్ఆన్ అతి గొప్పది అన్న విషయం నీకు తెలియదా? అది నీ పక్షాన ఆధారంగా, తోడుగా నిలబడుతుంది లేదా నీకు వ్యతిరేకంగా నిలబడుతుంది. నీ గురించి సిఫారసు చేస్తుంది లేదా నీకు వ్యతిరేకంగా సిఫారసు చేస్తుంది. ఈ రోజు నుండే దాని సాంగత్యం వహించు, ప్రళయదినాన దాని కంటే మంచి మిత్రుడు మరొకడు ఉండడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారని హజ్రత్ బురైదా అస్లమీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః

(يَجِيءُ الْقُرْآنُ يَوْمَ الْقِيَامَةِ كَالرَّجُلِ الشَّاحِبِ، يَقُولُ لِصَاحِبِهِ: هَلْ تَعْرِفُنِي؟ أَنَا الَّذِي كُنْتُ أُسْهِرُ لَيْلَكَ، وَأُظْمِئُ هَوَاجِرَكَ، وَإِنَّ كُلَّ تَاجِرٍ مِنْ وَرَاءِ تِجَارَتِهِ، وَأَنَا لَكَ الْيَوْمَ مِنْ وَرَاءِ كُلِّ تَاجِرٍ، فَيُعْطَى الْمُلْكَ بِيَمِينِهِ، وَالْخُلْدَ بِشِمَالِهِ، وَيُوضَعُ عَلَى رَأْسِهِ تَاجُ الْوَقَارِ، وَيُكْسَى وَالِدَاهُ حُلَّتَانِ، لَا يَقُومُ لَهُمَا الدُّنْيَا وَمَا فِيهَا، فَيَقُولَانِ: يَا رَبّ، أَنّٰى لَنَا هَذَا؟ فَيُقَالُ لَهُمَا: بِتَعْلِيمِ وَلَدِكُمَا الْقُرْآنَ، وَإِنَّ صَاحِبَ الْقُرْآنِ يُقَالُ لَهُ يَوْمَ الْقِيَامَةِ: اقْرَأْ، وَارْقَ فِي الدَّرَجَاتِ، وَرَتِّلْ كَمَا كُنْتَ تُرَتِّلُ فِي الدُّنْيَا، فَإِنَّ مَنْزِلَكَ عِنْدَ آخِرِ آيَةٍ مَعَكَ)

“ప్రళయదినాన ఖుర్ఆన్ రంగు పేలిపోయిన మనిషి రూపంలో వస్తుంది, తనను పారాయణం చేసినవానితో అంటుందిః నీవు నన్ను ఏర్పాటు చేస్తున్నావా? నేనే నిన్ను రాత్రంతా మేల్కొలిపి, పగలంతా దాహంగా ఉంచేదాన్ని, ప్రతి వ్యాపారి తన వ్యాపారం వెంట పడి ఉంటాడు, ఈ రోజు నేను నీ కొరకు ప్రతి వ్యాపారికన్నా ఎక్కువగా ముందు ముందుగా ఉంటాను, అప్పుడు అతని కుడి చేతిలో ‘ముల్క్’, ఎడమ చేతిలో ‘ఖుల్ద్’ ఇవ్వబడుతుంది, అతని తలపై గౌరవ కిరీటం పెట్టబడుతుంది ఇంకా అతని తల్లిదండ్రులకు రెండు దుస్తులు ధరించబడతాయి, ప్రపంచం మరియు అందులో ఉన్న సర్వమూ కూడా దాని విలువకు తూగవు, వారిద్దరంటారుః ప్రభూ! ఈ దుస్తులు మాకు ఎలా లభించాయి? మీరు మీ సంతానానికి ఖుర్ఆన్ విద్య నేర్పారు గనక అని సమాధానం వస్తుంది. ఖుర్ఆన్ పారాయణం చేసేవానితో ప్రళయదినాన ఇలా అనబడుతుందిః చదువుతూ పో, స్థానాలు అధిగమిస్తూ పో, ప్రపంచంలో నీవు ఆగి, ఆగి, నెమ్మదిగా పఠించినట్లు పఠిస్తూ పో, నీ వద్ద ఉన్న చివరి ఆయతు వరకు నీకు స్థానం ప్రాప్తమవుతుంది”. (ఇబ్ను మాజ 3781, దార్మీ 3391, తబ్రానీ ఔసత్ 5764, బైహఖీ, ఇబ్ను హజర్ అల్ మతాలిబుల్ ఆలియ 4/ 66లో హసన్ అన్నారు, సుయూతీ అల్ బుదూరుస్సాఫిరహ్ ఫీ ఉమూరిల్ ఆఖిరహ్ 231లో సహీ అన్నారు, షేక్ అల్బానీ సహీహా 2829లో దానిని అంగీకరించారు).

8వ కార్యం: సదఖ (దానం)

సదఖ అల్లాహ్ సాన్నిధ్యానికి చేర్పించే సత్కార్యాల్లో అతి ఉత్తమమైనది. దానిని మనిషి అల్లాహ్ వద్ద పెట్టుబడిగా పెట్టగలడు. అల్లాహ్ ఏ సత్కార్యాలనయితే వాటిని చేసిన వారి కొరకు పెంచుతాడో, వాటిని అదే స్థితిలో వదలడో వాటిలో ఒకటి సదఖా కూడా. ఇది త్రాసు బరువును అధికం చేస్తుంది. అల్లాహ్ ఆదేశం చదవండి సూర బఖర (2:276)లో:

يَمْحَقُ اللهُ الرِّبَا وَيُرْبِي الصَّدَقَاتِ وَاللهُ لَا يُحِبُّ كُلَّ كَفَّارٍ أَثِيمٍ

“అల్లాహ్ వడ్డీని హరింపజేస్తాడు, దానధర్మాలను పెంచుతాడు. మేలును మరిచేవారిని, పాపిష్టులను అల్లాహ్ ఎంతమాత్రం ప్రేమించడు”.

ప్రవక్త ﷺ ఇలా సెలవిచ్చారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః

مَنْ تَصَدَّقَ بِعَدْلِ تَمْرَةٍ مِنْ كَسْبٍ طَيِّبٍ، وَلاَ يَقْبَلُ اللَّهُ إِلَّا الطَّيِّبَ، وَإِنَّ اللَّهَ يَتَقَبَّلُهَا بِيَمِينِهِ، ثُمَّ يُرَبِّيهَا لِصَاحِبِهِ، كَمَا يُرَبِّي أَحَدُكُمْ فَلُوَّهُ، حَتَّى تَكُونَ مِثْلَ الجَبَلِ

“ఎవరైనా పరిశుద్ధ సంపాదనతో ఖర్జూరానికి సమానంగా దానం చేస్తాడో -అల్లాహ్ పరిశుద్ధమైన వాటినే అంగీకరిస్తాడు- అల్లాహ్ దానిని తన కుడి చేతితో స్వీకరిస్తాడు, మళ్ళీ దానం చేసినవాని కొరకు దానిని పెంచుతాడు, ఎలాగైతే మీలో ఎవరైనా తన గుర్రపు పిల్లను పెంచుతాడో. చివరికి అది పెరుగుతూ కొండంత పెద్దదిగా అయిపోతుంది”. (బుఖారి హదీస్ 1410, ముస్లిం 1014).

అందుకే ఒక్క రూపాయి అయినా, దానిని నీవు చిన్నదిగా, విలువలేనిదిగా భావించకు, అది నీవు నీ కొరకే సదఖా చేస్తున్నావు, ఎలా అనగా, అల్లాహ్ దానిని పెంచుతాడు, ప్రళయదినాన నీవు అంతే ప్రమాణం ముమ్మాటికి చూడవు. సదఖా చేయండని కొందరికి చెప్పబడినప్పుడు, అతని వద్ద కొంచమే ఉందని, ఆ కొంతపాటిని (తన కొరకే) ముందుకు పంపుకోవడంలో సిగ్గుపడి, సదఖా చేయకుండా ఆగిపోతాడు, పాపం అతనికి (ఈ హదీసు) తెలియదా? అతను తన కొరకే ముందుకు పంపుకున్న దానిని అతని పరమ ప్రభువు అనేకానేక రేట్లు దానిని పెంచుతాడు, చివరికి ఒక్క ఖర్జూరం ఉన్నదల్లా పర్వతమంత అయిపోతుంది.

అందుకే సదఖా చేయడంలో వెనుక ఉన్న వ్యక్తి చనిపోయే సమయంలో, ఇప్పుడే చావు రాకుండా, సదఖా చేసుకోడానికై కొంత గడువు కావాలని కోరుతాడు, బహుశా అప్పుడు అతనికి సదఖా యొక్క గొప్ప పుణ్యం గురించి నమ్మకం కలుగుతుందేమో, లేదా అందులో ఆలస్యం చేసినందుకు గల ఘోరశిక్ష గురించి తెలుస్తుందేమో. అల్లాహ్ ఇలా తెలిపాడుః

وَأَنْفِقُوا مِنْ مَا رَزَقْنَاكُمْ مِنْ قَبْلِ أَنْ يَأْتِيَ أَحَدَكُمُ المَوْتُ فَيَقُولَ رَبِّ لَوْلَا أَخَّرْتَنِي إِلَى أَجَلٍ قَرِيبٍ فَأَصَّدَّقَ وَأَكُنْ مِنَ الصَّالِحِينَ {المنافقون:10}

మీలో ఎవరికయినా చావు వచ్చి, “నా ప్రభూ! నాకు మరికొంత గడువు ఎందుకు ఇవ్వలేదుॽ (ఇస్తే) నేను కూడా దానధర్మాలు చేసి సజ్జనులలో చేరేవాణ్ణి కదా!” అని పలికే దుస్థితి దాపురించకముందే మేము మీకు ప్రసాదించిన దాని నుండి (మా మార్గంలో) ఖర్చు చేయండి. (మునాఫిఖూన్ 63:10).

అందుకే అధికంగా దానధర్మాలు చేస్తూ ఉండూ, నిశ్చయంగా అసలైన నీ సొమ్ము నీవు దానధర్మాలు చేసుకొని ముందుకు పంపుకున్నదే, మరి ఏదైతే నీవు వెనుక వదిలి వెళ్తావో అది నీది కాదు, ఇతరులది. హసన్ బస్రీ రహిమహుల్లాహ్ చెప్పారుః ప్రళయదినం అనేది బాధ మరియు కడుశోచనీయమైన దినం, అయితే అతి పెద్ద బాధ ఏమిటంటే మీలో ఎవరైనా తన సొమ్మును ఇతర త్రాసులో చూడడం. అది ఎలా జరుగుతుందో మీకు తెలుసాॽ అల్లాహ్ ఒక వ్యక్తికి ధనం ప్రసాదించాడు, అల్లాహ్ యొక్క వివిధ హక్కుల్లో దానిని ఖర్చు పెట్టాలని ఆదేశించాడు, అయితే అతను పిసినారితనం వహించి (ఖర్చు పెట్టలేదు) తర్వాత ఆ సొమ్ము అతని వారసునికి లభించింది, అప్పుడు అతను ఆ సొమ్మును అతని వారసుని త్రాసులో చూస్తాడు, అయ్యో! ఇది ఎలాంటి పోటురాయి, చికిత్స కానిది, పశ్చాత్తాప పడి తౌబా చేసుకుందామన్నా కాని పని. (హిల్ యతుల్ ఔలియా…: అబూ నుఐమ్ 2/145).

చేసే దానధర్మాలు చిత్తశుద్ధితో చేయి, దానిపై కృతజ్ఞత పలుకులు రావాలని వేచి ఉండకు, నీ చిత్తశుద్ధి ప్రకారమే నీ పుణ్యం పెరుగుతుంది. ఔన్ బిన్ అబ్దుల్లాహ్ రహిమహుల్లాహ్ తెలిపారుః పేదవానికి నీవు ఏమైనా ఇచ్చినప్పుడు అతను బారకల్లాహు ఫీక (అల్లాహ్ మీలో శుభం కలుగజేయుగాక) అని అంటే నీవు కూడా బారకల్లాహు ఫీక అని బదులు పలుకు, ఇలా నీ సదఖ చిత్తశుద్ధితో కూడినదవుతుంది. (హిల్ యతుల్ ఔలియా… 4/253).

ఘనత గల సదఖాలు

మనిషి రోగం గాని చావు గాని దాపురించక ముందు ఆరోగ్య స్థితిలో లేదా కనీసం మొత్తానికే బిక్షాటన గురికాక ముందు లేదా తక్కువ సంపాదన గలవాడు తన శక్తి మేరకు సదఖా చేయడం అతిఉత్తమ సదఖాగా పరిగణిచబడుతుంది.

(1) అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం, ఒక వ్యక్తి ప్రవక్త ﷺ వద్దకు వచ్చి ఓ ప్రవక్తా! ప్రతిఫలం రీత్యా ఏ దానం గొప్పది? అని అడిగాడు. అందుకు ప్రవక్త ﷺ ఇలా సమాధానం చెప్పారుః

أَنْ تَصَدَّقَ وَأَنْتَ صَحِيحٌ شَحِيحٌ تَخْشَى الفَقْرَ، وَتَأْمُلُ الغِنَى، وَلاَ تُمْهِلُ حَتَّى إِذَا بَلَغَتِ الحُلْقُومَ، قُلْتَ لِفُلاَنٍ كَذَا، وَلِفُلاَنٍ كَذَا وَقَدْ كَانَ لِفُلاَنٍ

నీవు ఆరోగ్యంగా ఉండి, నీకు సంపదపై వ్యామోహం కూడా ఉండి, (దానం చేస్తే) బీదవాడినైపోతానన్న భయంతో పాటు, ధనవంతుడినై- పోవాలన్న ఆశ కూడా ఉన్న స్థితిలో చేసే దానం (ఎక్కువ ఘనత గలది). కాబట్టి నీవు దానధర్మాలు చేయడంలో ఆలస్యం చేయకు, చివరకు ప్రాణం గొంతుదాక వచ్చేసినప్పుడు, వానికి ఇంత, వీనికి ఇంత అని నీవు అన్నా (ఏమీ ప్రయోజనం ఉండదు). ఎందుకంటే అప్పటికే అది ఫలాన, ఫలాన (వారసుల సొత్తు) అయి ఉంటుంది. (బుఖారి పదాలు 1419, ముస్లిం 1032).

అందుకే మైమూన్ బిన్ మహ్రాన్ రహిమహుల్లాహ్ తెలిపారుః నేను నా జీవిత కాలంలో ఒక దిర్హమ్ దానం చేసుకోవడం, నేను చనిపోయిన తర్వాత నా తరపున వంద దిర్హములు దానం చేయబడే దానికంటే ఎక్కువ నాకు ఇష్టం. (హిల్ యతుల్ ఔలియా… 4/87).

(2) అబూ హురైరా (రదియల్లాహు అన్హు) అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త ﷺ తెలిపారు:

خَيرُ الصَّدقةِ مَا كَانَ عَن ظَهرِ غِنىً، وَابْدَأ بِمَن تَعول

అత్యుత్తమ దానం అవసరాలన్నీ తీరిన తర్వాత చేసే దానమే. అయితే నీపై ఆధారపడి ఉన్నవారితో ఖర్చు పెట్టడం మొదలు పెట్టు. (బుఖారి 1426, ముస్లిం 1034,).

పై హదీసు భావమేమిటంటేః మనిషి తనపై, తన మీద ఆధారపడి ఉన్నవారిపై తగిన రీతిలో ఖర్చు చేసిన తర్వాత మిగిలినది దానం చేయటం అత్యుత్తం. అంటే అతను దానం చేసిన తర్వాత మరొకరి ముందు చెయ్యి చాపే పరిస్థితి రాకూడదు.

అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః ప్రవక్త ﷺ చెప్పారుః

سَبَقَ دِرْهَمٌ مِائَةَ أَلْفِ دِرْهَمٍ ، قَالُوا: وَكَيْفَ؟ قَالَ: كَانَ لِرَجُلٍ دِرْهَمَانِ تَصَدَّقَ بِأَحَدِهِمَا وَانْطَلَقَ رَجُلٌ إِلَى عُرْضِ مَالِهِ فَأَخَذَ مِنْهُ مِائَةَ أَلْفِ دِرْهَمٍ فَتَصَدَّقَ بِهَا

“ఒక దిర్హమ్ ఒక లక్ష దిర్హములపై గెలుపొందింది”. అదెలా ప్రవక్తా! అని సహచరులు అడగ్గా, ఇలా సమాధానమిచ్చారుః “ఒక వ్యక్తి వద్ద రెండే రెండు దిర్హములు ఉండగా అతను అందులో నుండి ఒక దిర్హమ్ దానం చేశాడు, మరో వ్యక్తి తన ధన బంఢారం వైపనకు వెళ్ళి అందులో నుండి ఒక లక్ష దానం చేశాడు”. (నిసాయి 2527, అహ్మద్ 2/379, హాకిం 1519, ఇబ్ను హిబ్బాన్ 3347, సహీహుల్ జామి 3606).

ఇక దానం, దాని ప్రయోజనం రీత్యా ఒకప్పుడు ఒక విధంగా ఎక్కువ శ్రేష్ఠత గలదైతే, మరొకప్పుడు మరో విధంగా ఘనతగలది కావచ్చు, ఏ అవసరం ప్రజలకు ఎక్కువగా ఉంటుందో దాని పుణ్యం చాలా గొప్పదిగా ఉంటుంది.

ప్రజలకు నీళ్ళ అవసరం ఎక్కువ ఉన్న సందర్భంలో ఒక వ్యక్తి అత్యుత్తమ దానం ఏదీॽ అని అడిగినందుకు నీళ్ళు త్రాపించటం అని ప్రవక్త ఉపదేశించారు. యుద్ధవీరులకు ధన రూపంలో సహాయం అవసరం ఉన్న సందర్భంలో ఒక వ్యక్తి ఘనతగల దానమేదిॽ అని అడిగినందుకు అల్లాహ్ మార్గంలో ఖర్ఛు పెట్టడం అని ప్రవక్త చెప్పారు.

బుద్ధిమంతుడైన ముస్లిం పేదలకు ప్రతి సీజన్ లో ఏ అవసరం ఎక్కువగా ఉంటుందో తెలుసుకొని అది తీర్చటానికి ముందడుగు వేయాలి. ఇలా అతని పుణ్యం పెరుగుతుంది, త్రాసు బరువు అధికమవుతుంది.

9వ కార్యం: సదఖాకు సమానమైన సత్కార్యాలు

కొన్ని సత్కార్యాలున్నాయి, వాటిని పాటించేవారికి పేదలకు దానం చేసినంత పుణ్యం లభిస్తుంది. వాటిలో అతి ముఖ్యమైనవి ఇవిః

(1) ఎవరికైనా ఉత్తమరీతిలో అప్పు ఇవ్వడం

అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త ﷺ చెప్పారుః

مَا مِنْ مُسْلِمٍ يُقْرِضُ مُسْلِمًا قَرْضًا مَرَّتَيْنِ إِلَّا كَانَ كَصَدَقَتِهَا مَرَّةً

“ఎవరైనా ముస్లిం మరో ముస్లింకు రెండు సార్లు అప్పు ఇస్తే అది అతని కొరకు ఒకసారి దానం చేసినదానితో సమానం”. (ఇబ్ను మాజ పదాలు 2430, షొఅబుల్ ఈమాన్: బైహఖీ 3561, షేఖ్ అల్బానీ సహీహుల్ జామి 5769లో సహీ అన్నారు).

అబ్దుల్లాహ్ యే ఉల్లేఖించారు, ప్రవక్త ﷺ తెలిపారుః

إِنَّ السَّلَفَ يَجْرِي مَجْرَى شَطْرِ الصَّدَقَةِ

“నిశ్చయంగా అప్పు, దానంలో సగభాగంగా పరిగణించబడుతుంది”. (అహ్మద్ –అల్ ఫత్ హుర్రబ్బానీ- 15/83, షేఖ్ అల్బానీ సహీహుల్ జామి 1640లో సహీ అన్నారు).

హజ్రత్ ఇబ్నె మస్ఊద్ (రదియల్లాహు అన్హు) ఇలా చెప్పేవారుః రెండు సార్లు అప్పివ్వడం, ఒక్కసారి దానం చేయడం కంటే నాకు ఎక్కవ ఇష్టం. (బైహైఖీ షొఅబుల్ ఈమాన్ 3560).

(2) అప్పు చెల్లించడం కష్టంగా ఉన్నవారికి వ్యవధినివ్వడం

ప్రవక్త ﷺ తెలిపారని, బురైదా అస్లమీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః

مَن أَنْظَر مُعسرًا فَلَهُ بِكُلِّ يَومٍ مِثلِهِ صَدَقَةٌ قَبْلَ أَن يَحِلَّ الدَّينُ، فَإِذَا حَلَّ الدَّينُ فَأَنظَرَهُ فَلَهُ بِكُلِّ يَومٍ مِثلَيهِ صَدَقَة

“ఎవరు ఇబ్బందిలో ఉన్నవారికి, అప్పు చెల్లించే సమయం వచ్చే వరకు వ్యవధినిస్తాడో, అతనికి ప్రతి రోజు అప్పుకు సమానంగా దానం చేసిన పుణ్యం లభిస్తుంది. చెల్లించే సమయం వచ్చాక (అతను ఇవ్వలేని స్థితిలో ఇంకా) వ్యవధినిస్తే ప్రతి రోజు అప్పుకు రెండింతలు దానం చేసినంత పుణ్యం లభిస్తుంది”. (ఇబ్ను మాజ 2418, షేఖ్ అల్బానీ సహీహుల్ జామి 6108లో సహీ అన్నారు).

10వ కార్యం: ఆలుబిడ్డలపై ఖర్చు చేయటం, పిసినారితనం చూపకపోవటం

తెలుసుకో! ఆలు బిడ్డలపై ఖర్చు చేయడం అల్లాహ్ దృష్టిలో నిరుపేదలపై ఖర్చు చేయడం కన్నా గొప్ప పుణ్యం. ఎందుకనగా మొదటిది (ఆలుబిడ్డలపై ఖర్చు) వాజిబ్ (విధి) అయితే రెండవది (నిరుపేదలపై ఖర్చు) ముస్తహబ్.

ప్రవక్త ﷺ తెలిపారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః

دِينَارٌ أَنْفَقْتَهُ فِي سَبِيلِ اللهِ وَدِينَارٌ أَنْفَقْتَهُ فِي رَقَبَةٍ، وَدِينَارٌ تَصَدَّقْتَ بِهِ عَلَى مِسْكِينٍ، وَدِينَارٌ أَنْفَقْتَهُ عَلَى أَهْلِكَ، أَعْظَمُهَا أَجْرًا الَّذِي أَنْفَقْتَهُ عَلَى أَهْلِكَ

“నీవు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టింది ఒక దీనార్, బానిసను విముక్తి కలిగించుటకు ఖర్చు పెట్టింది ఒక దీనార్, నిరుపేదపై దానం చేసింది ఒక దీనార్, నీ ఆలుబిడ్డలపై ఖర్చు పెట్టింది ఒక దీనార్. వీటన్నింటిలో నీవు నీ ఆలుబిడ్డలపై ఖర్చు పెట్టిన దీనార్ అన్నిటికంటే ఎక్కువ పుణ్యం గలది”. (అహ్మద్ –అల్ ఫత్ హుర్రబ్బానీ- 17/57, ముస్లిం పదాలు 995, నిసాయీ కుబ్రా 9183, బైహఖీ 15475).

చాలా మంది తమ భార్య పిల్లలపై ఖర్చు చేయడంలో పిసినారితనం వహిస్తారు. (స్తోమత కలిగి ఉండి కూడా) ఖర్చు పెట్టకుండా చేతిని ఆపి ఉంచుకుంటారు. అదే వ్యక్తి మరో వైపు నిరుపేదలు, బీదవాళ్ళకు మేలు చేస్తూ, వారి కష్టాల్లో వారిని ఆదుకుంటాడు, అయితే ఇది అల్లాహ్ దృష్టిలో ఆలుబిడ్డిల మీద ఖర్చు పెట్టడం కన్నా గొప్ప పుణ్యం గలదని అతని ఆలోచన. కాని ఈ వైఖరి అనేది అతని కుటుంభంలో అనేక ఆటంకాలను, వైవాహిక జీవితంలో ఇబ్బందులను జనిస్తుంది. అందువల్ల భార్య బిడ్డల మనసుల్లో కపటం, కల్మషాలు నాటుకుపోతాయి. వారు అతని చావును కోరడం మొదలెడతారు. అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త ﷺ చెప్పారుః

كَفَى بِالْـمَرْءِ إِثْمًا أَنْ يَحْبِسَ، عَمَّنْ يَمْلِكُ قُوتَهُ

మనిషి పాపాత్ముడు కావటానికి; తన బాధ్యతలో ఉన్నవారికి (తగినరీతిలో తిండి పెట్టకుండా) వారి హక్కులను వృధా చేయడమే సరిపోయేది. (ముస్లిం 996, అబూదావూద్ పదాలు 1692, ఇబ్ను హిబ్బాన్ 4240).

నిస్సందేహంగా ఏ ముస్లిం వ్యక్తి తన కుటుంభికులపై ఖర్చు చేసే పుణ్యాన్ని గ్రహిస్తాడో, అల్లాహ్ వద్ద లభించే దాని పుణ్యాన్ని ఆశిస్తాడో, అతను తన కుటుంభికులతో సుఖానందాల అనుభూతిని పొందుతూ, ప్రేమ, పరస్పర సహకారాలతో గడుపుకుంటాడు. ఎందుకనగా అతను వారి గురించి ఏదీ తీసుకొచ్చి ఇచ్చినా అది అతని పుణ్యాల త్రాసులో సదఖాగా వ్రాయబడుతుందని గ్రహిస్తాడు. అంతే కాదు సదఖాల్లో ఇది అతిఉత్తమమైనదని కూడా గ్రహిస్తాడు. అబూ మస్ఊద్ ఉఖబా బిన్ ఆమిర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త ﷺ తెలిపారుః

إِذَا أَنْفَقَ الرَّجُلُ عَلَى أَهْلِهِ يَحْتَسِبُهَا فَهُوَ لَهُ صَدَقَةٌ

“ఎవరైనా తన ఇంటివారిపై ఖర్చు చేస్తూ పుణ్యాన్ని ఆశిస్తాడో అది అతనికి సదకా అవుతుంది”. (బుఖారి పదాలు 55, ముస్లిం 1002).

ఏమీॽ మీరు హజ్రత్ ఇర్బాజ్ బిన్ సారియా (రదియల్లాహు అన్హు) చేసినట్లు చేయరాॽ ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఈ హదీసు విన్నారుః

إِنَّ الرَّجُلَ إِذَا سَقَى امْرَأَتَهُ مِنَ الْـمَاءِ أُجِرَ

“మనిషి తన భార్యకు నీళ్ళు త్రాపించినా దానిపై అతనికి పుణ్యం లభిస్తుంది”. ఆ తర్వాత నేను ఇంటికి వచ్చాను, నా భార్యకు నీళ్ళు త్రాగించాను, మళ్ళీ ప్రవక్తతో విన్న ఈ హదీసు ఆమెకు వినిపించాను. (అహ్మద్ –అల్ ఫత్ హుర్రబ్బానీ- 16/223, తబ్రానీ కబీర్ 646, షేఖ్ అల్బానీ సహీహుత్తర్గీబ్ 1963లో హసన్ అన్నారు).

11వ కార్యం: లైలతుల్ ఖద్ర్ ఖియాం

లైలతుల్ ఖద్ర్ ఖియాం యొక్క పుణ్యం వెయ్యి నెలలు ఖియాం చేసే వ్యక్తి పుణ్యం కంటే అధికంగా ఉంటుంది. అల్లాహ్ ఆదేశం (ఖద్ర్ 97: 3)లో

[لَيْلَةُ القَدْرِ خَيْرٌ مِنْ أَلْفِ شَهْرٍ] {القدر:3}

లైలతుల్ ఖద్ర్ (ఘనమైన రేయి) వెయ్యి నెలల కంటే చాలా శ్రేష్ఠమైనది.

అల్లాహ్ దాని పుణ్యాన్ని తన పవిత్ర గ్రంథంలో ప్రస్తావించే బాధ్యత ఎలా తీసుకున్నాడో గమనించండి, అంతే కాదు, దానిని చిన్న సూరాలలో ప్రస్తావించాడు, చిన్నవారు, పెద్దవారు దాని కంఠస్తం చేసుకోవాలని, దానిపై శిక్షణ పొందాలని.

12వ కార్యం: బజారులో వెళ్ళినప్పుడు చదువే దుఆ

ప్రవక్త ﷺ తెలిపారని, ఉమర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః బజారులో ప్రవేశిస్తూ

لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، لَهُ المُلْكُ وَلَهُ الحَمْدُ، يُحْيِي وَيُمِيتُ وَهُوَ حَيٌّ لَا يَمُوتُ، بِيَدِهِ الخَيْرُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ

లాఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లాషరీకలహూ లహుల్ ముల్కు వలహుల్ హందు యుహ్ యీ వ యుమీతు వహువ హయ్యున్ లా యమూతు బియదిహిల్ ఖైరు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్ ఎవరు చదువుతారో, అల్లాహ్ వారికి పది లక్షల పుణ్యాలు వ్రాస్తాడు, అతని పది లక్షల పాపాలు మన్నిస్తాడు, అతని కొరకు స్వర్గంలో ఇల్లు నిర్మిస్తాడు. (తిర్మిజి 3429, ఇబ్ను మాజ పదాలు 2235, దార్మీ 2692, హాకిం 1976, షేఖ్ అల్బానీ సహీహుల్ జామి 6231లో హసన్ అన్నారు).

ఒక మిలియన్ (పదిలక్షల) పుణ్యాలు నీ పుణ్యాల త్రాసులో పెట్టబడే విషయాన్ని ఒక సారి ఊహించు, అంతకు మించి పాపాల త్రాసులో నుంచి ఒక మిలియన్ పాపాలు తగ్గించడం, చెరిపివేయడం జరుగుతుంది. నిస్సందేహంగా ఇది నీ త్రాసును చాలా బరువుగలదిగా చేస్తుంది.

పూర్వం పుణ్య పురుషుల్లో ఒకరికి ఈ పుణ్యం సంపాదించే కాంక్ష ఉండేదా అని ఆశ్చర్య పోవలసిన అవసరం లేదు! అతను ఏ పని లేకున్నా బాజారుకు వెళ్ళి, ఈ దుఆ చదివి తిరిగి వచ్చేవారు, ఈ విషయం అతని త్రాసును బరువుగలదిగా చేయాలని అతని కాంక్ష. ముహమ్మద్ బిన్ వాసిఅ రహిమహుల్లాహ్ తెలిపారుః నేను మక్కా నగరానికి వచ్చాను, అక్కడ సోదరులు సాలిం బిన్ అబ్దుల్లాహ్ ను కలిశాను, అతను తన తండ్రితో, అతను తన తండ్రితో ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని ‘ఎవరు బాజారులో ప్రవేశిస్తూ…’ అన్న ఈ హదీసు వినిపించారు. నేను ఖురాసాన్ వచ్చి, ఖుతైబా బిన్ ముస్లింను కలసి, నేను మీ కొరకు ఒక బహుమానం తీసుకొచ్చాను అని చెప్పి, ఈ హదీసు వినిపించాను. ఆ తర్వాత నుండి అతను తన వాహనముపై ఎక్కి బాజారుకు వచ్చి, నిలబడి, ఈ దుఆ చదివి వెళ్ళిపోయేవారు. (సునన్ దార్మీ 1692).

13వ కార్యం: అల్లాహ్ స్మరణ (జిక్ర్)

వివిధ రకాల అల్లాహ్ స్మరణ (జిక్ర్) త్రాసును బరువుగా చేస్తుంది. త్రాసులో బరువుగా ఉండే కొన్ని అజ్కార్ మరియు తస్బీహాత్ ఉన్నాయి, ప్రవక్త మన పట్ల చాలా కరుణామయులు గనక ఈ సులభమైన అజ్కార్ మనకు తెలియజేశారు, మనం వాటిని తప్పకుండా పాటించాలని, వాటితో మన నాలుకలను ఎల్లప్పుడూ తడిగా ఉంచాలని, మన పుణ్యాలు పెరగాలని, మన కష్టాలు తగ్గాలని. వాటిలో కొన్ని ఇవిః

[1] అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త ﷺ తెలిపారుః

كَلِمَتَانِ خَفِيفَتَانِ عَلَى اللِّسَانِ، ثَقِيلَتَانِ فِي المِيزَانِ، حَبِيبَتَانِ إِلَى الرَّحْمٰنِ: سُبْحَانَ الله وَبِحَمْدِهِ ، سُبْحَانَ الله العَظِيمِ

“రెండు పదాలున్నాయి, అవిః నాలుకపై చాలా సులభంగా, త్రాసులో బరువుగా మరియు కరుణామయునికి చాలా ప్రియమైనవి. అవేః సుబ్ హానల్లాహి వబిహందిహీ సుబ్ హానల్లాహిల్ అజీం”. (బుఖారి 6406, ముస్లిం 2694).

అనేక మందికి ఈ రెండు పదాల ఘనత తెలుసు, కాని త్రాసు బరువు కావటానికి చదివేవారు చాలా అరుదు. (మరికొందరికైతే) ఏదైనా కల్చరల్ ప్రోగ్రాముల్లో పోటాపోటీలు, కాంపిటేషన్లు జరుగుతున్నప్పుడు అందులో ఇలాంటి ప్రశ్న ఏదైనా వచ్చినప్పుడు అవి గుర్తుకు వస్తాయి. (ఇది ఎంత ధారుణంॽॽॽ).

[2] అబూ మాలిక్ అష్అరీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త ﷺ తెలిపారుః

الطُّهُورُ شَطْرُ الْإِيمَانِ وَالْحَمْدُ لله تَمْلَأُ الْمِيزَانَ وَسُبْحَانَ اللهِ وَالْحَمْدُ للهِ تَمْلَآَنِ أَوْ تَمْلَأُ مَا بَيْنَ السَّمَاوَاتِ وَالْأَرْضِ …

“పరిశుభ్రత సగం విశ్వాసం, అల్ హందులిల్లాహ్ త్రాసును నింపుతుంది, సుబ్ హానల్లాహ్, వల్ హందులిల్లాహ్ భూమ్యాకాశాల మధ్య భాగాన్ని నింపేస్తుంది…”. (ముస్లిం 223, అహ్మద్ 5/342, తిర్మిజి 3517, ఇబ్ను మాజ 280, దార్మి 653, ఇబ్ను హిబ్బాన్ 844).

[3] హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త ﷺ తెలిపారుః

مَنْ قَالَ: حِينَ يُصْبِحُ وَحِينَ يُمْسِي: سُبْحَانَ اللهِ وَبِحَمْدِهِ، مِائَةَ مَرَّةٍ، لَمْ يَأْتِ أَحَدٌ يَوْمَ الْقِيَامَةِ، بِأَفْضَلَ مِمَّا جَاءَ بِهِ، إِلَّا أَحَدٌ قَالَ مِثْلَ مَا قَالَ أَوْ زَادَ عَلَيْهِ

“ఎవరు ఉదయం, సాయంకాలం సుబ్ హానల్లాహి వబిహందిహీ 100 సార్లు చదువుతారో, ప్రళయదినాన అతనికంటే ఉత్తమ సత్కార్యం చేసిన మరొకరెవరూ ఉండరు. అయితే అతని మాదిరిగా చదివినా లేదా అతనికంటే ఎక్కువ చదివిన వ్యక్తి తప్ప”. (ముస్లిం 2692).

[4] ప్రవక్త ﷺ తెలిపారని, ఉబూ ఉమామా బాహిలీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః

مَنْ قَالَ فِي دُبُرِ صَلَاةِ الْغَدَاةِ: لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ، يُحْيِي وَيُمِيتُ، بِيَدِهِ الْخَيْرُ، وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ، مِائَةَ مَرَّةٍ، قَبْلَ أَنْ يَثْنِيَ رِجْلَيْهِ، كَانَ يَوْمَئِذٍ أَفْضَلَ أَهْلِ الْأَرْضِ عَمَلًا، إِلَّا مَنْ قَالَ مِثْلَ مَقَالَتِهِ، أَوْ زَادَ عَلَى مَا قَالَ

“ఎవరు ఫజ్ర్ నమాజ్ తర్వాత తన కాలు ముడుచుకునే ముందు లాఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లాషరీక లహూ, లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్ 100 సార్లు చదువుతారో, అతను ఆ రోజు భూవాసుల్లోకెల్లా అతి ఉత్తమ ఆచరణగలవాడు. కేవలం అతని మాదరిగా లేదా అతనికంటే ఎక్కువ పలికినవాడు తప్ప”. (తబ్రానీ ఔసత్, సహీ తర్గీబ్ 476లో షేఖ్ అల్బానీ హసన్ అన్నారు).

[5] ప్రవక్త ﷺ తెలిపారని, అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః

مَنْ قَالَ فِي يَوْمٍ مِائَتَيْ مَرَّةٍ [مائة إذا أصبح ، ومائة إذا أمسى] لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ لَمْ يَسْبِقْهُ أَحَدٌ كَانَ قَبْلَهُ، وَلَمْ يُدْرِكْهُ أَحَدٌ كَانَ بَعْدَهُ إِلَّا مَنْ عَمِلَ أَفْضَلَ مِنْ عَمَلِهِ

“ఎవరు లాఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లాషరీక లహూ, లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్ ఒక్క రోజులో 200 సార్లు (ఉదయం 100 సార్లు, సాయంకాలం 100 సార్లు) చదువుతాడో, అతని కంటే పూర్వికుడు అతనికి ముందు పోలేడు, అతని తర్వాతవాడు అతనిని చేరలేడు. కేవలం అతనికంటే ఉత్తమమైన ఆచరణ చేసినవాడు తప్ప”. (అహ్మద్ –అల్ ఫత్ హుర్రబ్బానీ- 14/215, షేఖ్ అల్బానీ సహీహా 2762లో సహీ అన్నారు).

[6] ప్రవక్త ﷺ తెలిపారని అబూ సలమ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః

بَخٍ بَخٍ، مَا أَثْقَلَهُنَّ فِي الْمِيزَانِ: لَا إِلَهَ إِلَّا اللهُ، وَسُبْحَانَ اللهِ، وَالْحَمْدُ لِلَّهِ، وَاللهُ أَكْبَرُ، وَالْعَبْدُ الصَّالِحُ يُتَوَفَّى لِلْمُسْلِمِ فَيَحْتَسِبُهُ

“ఐదు విషయాలు చాలా మంచివి, త్రాసులో చాలా బరువుగలవి, లాఇలాహ ఇల్లల్లాహ్ సుబ్ హానల్లాహ్ అల్ హందులిల్లాహ్ అల్లాహు అక్బర్ ఎవరైనా ముస్లిం వ్యక్తి యొక్క సదాచరణగల సంతానం చనిపోతే అతడు పుణ్యాన్ని ఆశించి సహనం వహించడం”. (అహ్మద్ –అల్ ఫత్ హుర్రబ్బానీ- 19/195, నిసాయి కుబ్రా 9995 పదాలు, షేఖ్ అల్బానీ సహీ తర్గీబ్ 2009లో సహీ అన్నారు).

[7] ప్రవక్త ﷺ తెలిపారని అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః

إِنَّ نَبِيَّ اللهِ نُوحًا عَلَيْهِ الصلاة والسلام لَـمَّا حَضَرَتْهُ الْوَفَاةُ قَالَ لِابْنِهِ إِنِّي قَاصٌّ عَلَيْكَ الْوَصِيَّةَ آمُرُكَ بِاثْنَتَيْنِ وَأَنْهَاكَ عَنْ اثْنَتَيْنِ آمُرُكَ بِلَا إِلَهَ إِلَّا اللهُ فَإِنَّ السَّمَوَاتِ السَّبْعَ وَالْأَرْضِينَ السَّبْعَ لَوْ وُضِعَتْ فِي كِفَّةٍ وَوُضِعَتْ لَا إِلَهَ إِلَّا اللهُ فِي كِفَّةٍ رَجَحَتْ بِهِنَّ لَا إِلَهَ إِلَّا اللهُ

“అల్లాహ్ యొక్క ప్రవక్త హజ్రత్ నూహ్ అలైహిస్సలాం చనిపోయే ముందు తన కుమారునికి ఇలా చెప్పారుః నేను రెండు విషయాల గురించి ఆదేశిస్తాను, రెండు విషయాల నుండి వారిస్తాను. ముందుగా నీకు ‘లాఇలాహ ఇల్లల్లాహ్’ గురించి ఆదేశిస్తాను. ఏడు ఆకాశాలు, ఏడు భూములు ఒక పళ్ళంలో, లాఇలాహ ఇల్లల్లాహ్ మరొక పళ్ళంలో పెట్టబడితే లాఇలాహ ఇల్లల్లాహ్ ఉన్న పళ్ళం వంగిపోతుంది”. (అహ్మద్ 2/170, నిసాయీ కుబ్రా 10668, హాకిం 154, బజ్జార్, సహీహా 134).

[8] జువైరియా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం ప్రకారం, ఆమె ఫజ్ర్ నమాజు చేసి తన మస్జిదు (అంటే ఆమె నమాజు చేసే స్థలం)లోనే కూర్చొని ఉండగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమె గుండా ఉదయం వేళ దాటి వెళ్ళారు. మళ్ళీ చాష్త్ సమయంలో (అంటే ఇంచుమించు 4, లేదా 5 గంటల తర్వాత) అటు తిరిగి వచ్చారు, అప్పటికి ఆమె అక్కడే కూర్చొని ఉన్నది చూసి, “నేను నిన్ను వదలి వెళ్ళినప్పటి నుండి ఇలాగే ఉన్నావా అని అడిగారు, అందుకు ఆమె అవును అంది. అప్పడు ప్రవక్త చెప్పారుః “నేను నీ వద్ద నుండి వెళ్ళాక, నాలుగు పదాలు మూడు సార్లు పలికాను, వాటిని గనక తూకం వేస్తే నీవు ఉదయం నుండి పలుకుతున్న పదాలకంటే ఎక్కువ బరువుగా ఉంటాయి. అవిః సుబ్ హానల్లాహి వబిహందిహీ అదద ఖల్కిహీ వరిజా నఫ్సిహీ వజినత అర్షిహీ వమిదాద కలిమాతిహ్”. (ముస్లిం పదాలు 2726).

ఇబ్ను మాజలో (3808)ని ఉల్లేఖనంలో ఉంది; ప్రవక్త ﷺ ఆమెతో చెప్పారుః “నేను నీ వద్ద నుండి వెళ్ళి నాలుగు పదాలు మూడు సార్లు పలికాను అవి నీవు పలికిన పదాలకంటే అధికంగా ఉన్నాయి, (త్రాసులో) వంగి ఉన్నాయి లేదా బరువుగా ఉన్నాయిః సుబ్ హానల్లాహి అదద ఖల్కిహీ, సుబ్ హానల్లాహి రిజా నఫ్సిహీ, సుబ్ హానల్లాహి జినత అర్షిహీ, సుబ్ హానల్లాహి మిదాద కలిమాతిహ్”.

سُبْحَانَ اللَّهِ عَدَدَ خَلْقِهِ، سُبْحَانَ اللَّهِ رِضَا نَفْسِهِ، سُبْحَانَ اللَّهِ زِنَةَ عَرْشِهِ، سُبْحَانَ اللَّهِ مِدَادَ كَلِمَاتِهِ

[9] అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త ﷺ మక్కాలోని ఓ దారిలో నడుస్తూ ఉండగా జుమ్ దాన్ అను పేరు గల ఒక పర్వతం ప్రక్క నుండి దాటుతూ ఇలా అన్నారుః “ఇది జుమ్ దాన్, నడుస్తూ ఉండండి, ముఫర్రిదూన్ గెలుపొందారు”. ముఫర్రిదూన్ అంటే ఎవరు ప్రవక్తా అని సహచరులు అడిగారు. “అల్లాహ్ ను అధికంగా స్మరించే స్త్రీ పురుషులు” అని సమాధానమిచ్చారు. (ముస్లిం 223).

[10] ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక రోజు నా దగ్గరి నుండి దాటి వెళ్తుండగా నేను ఇలా ప్రశ్నించానని ఉమ్మెహాని బిన్తె అబీ తాలిబ్ రజియల్లాహు అన్హా తెలిపారుః ప్రవక్తా నేను వృద్ధురాలయ్యాను, బలహీనత ఎక్కువయింది, నేను కూర్చొని ఉండి చేసుకోగల ఏదైనా సత్కార్యం గురించి ఆదేశించండి. ప్రవక్త చెప్పారుః “100 సార్లు సుబ్ హానల్లాహ్ అనండి, అది ఇస్మాఈల్ అలైహిస్సలాం సంతానంలోని వంద బానిసలకు విముక్తి కలిగించిన దానితో సమానం. 100 సార్లు అల్ హందులిల్లాహ్ అనండి. అది కళ్ళెం మరియు జీను వేసి ఉన్న వంద గుర్రాలు అల్లాహ్ మార్గంలో దానం చేసిన దానితో సమానం. 100 సార్లు అల్లాహు అక్బర్ అనండి. అది మెడలో పట్టాలు కట్టబడి, స్వీకరించబడిన వంద ఒంటెలతో సమానం. 100 సార్లు లాఇలాహ ఇల్లల్లాహ్ అనండి. అది భూమ్యాకాశాల మధ్య స్థలాన్ని నింపేస్తుంది. ఆ రోజు నీ ఆచరణకంటే ఉత్తమమైన ఆచరణ మరెవరిది పైకి లేపబడదు. కేవలం నీ లాంటి ఆచరణ చేసినవానిది తప్ప”. (ఇబ్ను మాజ 3810, నిసాయి 10680, సహీ తర్గీబ్ 1553లో షేఖ్ అల్బానీ హసన్ అన్నారు).

అందుకే హసన్ బస్రీ రహిమహుల్లాహ్ ప్రజలకు హదీస్ వినిపించేది లేదా మరేదైనా ముఖ్యమైన పని లేనప్పుడు “సుబ్ హనల్లాహిల్ అజీం” అని అంటుండేవారు. (జామిఉల్ ఉలూమి వల్ హికమ్ 2/517).

14వ కార్యం: అల్లాహ్ గ్రంథంలో గొప్ప ప్రతిఫలం లేదా పెద్ద పుణ్యాల వాగ్దానం చేయబడిన సత్కార్యాలు

నిశ్చయంగా అల్లాహ్ తబారక వ తఆలా తన దివ్యగ్రంథంలో సత్కా- ర్యాలు చేసే తన విశ్వాసులైన దాసులకు సామాన్యంగా ప్రళయదినాన గొప్ప ప్రతిఫలం లేదా పెద్ద పుణ్యం గురించి వాగ్దానం చేశాడు. అల్లాహ్ ఆదేశం ఇలా ఉందిః

[وَعَدَ اللهُ الَّذِينَ آَمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ لَهُمْ مَغْفِرَةٌ وَأَجْرٌ عَظِيمٌ] {المائدة:9}

“విశ్వసించి, మంచిపనులు చేసినవారికి గొప్ప మన్నింపుతో పాటు, గొప్ప ప్రతిఫలం కూడా ఉందని అల్లాహ్ వాగ్దానం చేశాడు”. (మాఇద 5:9).

ఇంకా ఇలా తెలిపాడుః

[إِنَّ هَذَا القُرْآَنَ يَهْدِي لِلَّتِي هِيَ أَقْوَمُ وَيُبَشِّرُ المُؤْمِنِينَ الَّذِينَ يَعْمَلُونَ الصَّالِحَاتِ أَنَّ لَهُمْ أَجْرًا كَبِيرًا] {الإسراء:9}

“నిశ్చయంగా ఈ ఖుర్ఆన్ అన్నిటికంటే సవ్యమైన మార్గాన్ని చూపిస్తుంది. మంచి పనులు చేసే విశ్వాసులకు గొప్ప పుణ్యఫలముందన్న శుభవార్తను అది వినిపిస్తుంది”. (బనీ ఇస్రాయిల్ 17:9).

అబూ హురైరా రజియల్లాహు అన్హు తెలిపారుః నిశ్చయంగా అల్లాహు తఆలా ఒక సత్కార్య ఫలితం 20 లక్షల వరకు అధికం చేస్తాడు. మళ్ళీ అబూ హురైరా రజియల్లాహు అన్హు ఈ ఆయత్ పఠించారుః

[إِنَّ اللهَ لَا يَظْلِمُ مِثْقَالَ ذَرَّةٍ وَإِنْ تَكُ حَسَنَةً يُضَاعِفْهَا وَيُؤْتِ مِنْ لَدُنْهُ أَجْرًا عَظِيمًا] {النساء:40}

“నిశ్చయంగా అల్లాహ్ ఎవరికీ రవ్వంత అన్యాయం చేయడు. సత్కార్యం ఉంటే ఆయన దానిని రెట్టింపు చేస్తాడు. అంతే కాదు, తన వద్ద నుండి గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు”. (నిసా 4:40).

మళ్ళీ చెప్పారుః అల్లాహ్ “గొప్ప ప్రతిఫలం” అని తెలిపినప్పుడు ఎవరు దాని అంచన వేయగలుగుతాడు?.

సయ్యద్ ఖుతుబ్ రహిమహుల్లాహ్ ఈ క్రింది ఆయతుః

[وَمَنْ أَوْفَى بِمَا عَاهَدَ عَلَيْهُ اللهَ فَسَيُؤْتِيهِ أَجْرًا عَظِيمًا] {الفتح:10}

“ఎవరు అల్లాహ్ తో చేసిన వాగ్దానాన్ని నెరవేశాడో అల్లాహ్ అతనికి త్వరలోనే గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు”. (ఫత్ హ్ 48:10).

ఈ ఆయతును వ్యాఖ్యానిస్తూ ఇలా చెప్పారుః “గొప్ప ప్రతిఫలం” అని జనరల్ గా చెప్పబడింది, ఏ వివరణ, ఏ హద్దు తెలుపబడలేదు. ఈ ప్రతిఫలం గురించి స్వయంగా అల్లాహ్ అది గొప్పదీ అని అంటున్నాడు. ఆ గొప్ప అన్నది అల్లాహ్ లెక్క ప్రకారంగా, అల్లాహ్ త్రాసులో ఉంటుంది. భూవాసులు ఈ వర్ణానికి సరియైన భావం తెలుపలేరు. ఎందుకనగా స్వయంగా వారే అల్పులు (పరిపూర్ణులు కారు), పరిమితి హద్దులో ఉండేవారు, నాశనమయ్యేవారు. (ఫీ జిలాలిల్ ఖుర్ఆన్ 6/3320).

నిశ్చయంగా అల్లాహ్ ఇలాంటి కొన్ని సత్కార్యాల ప్రస్తావన తన గ్రంథంలో చేశాడు. వాటి పట్ల మనకు కోరిక కలగాలని మరియు వాటిని మనం ఆచరించుటకు పోటీపడాలని. నిశ్చయంగా గొప్పగా, పెద్దగా అని వర్ణించబడిన సత్కార్యాలను ఆచరించే హక్కు చాలా ఉంది, అంతేకాదు; వాటిని ఎక్కువగా ఆచరించే హక్కు ఉంది, కలిమహ్ (లాఇలాహ ఇల్లల్లాహ్) మాదిరిగా త్రాసులో అవి చాలా బరువుగా ఉంటాయి. వాటిలో కొన్ని ఈ క్రింది విధంగా ఉన్నాయిః

[1] అల్లాహ్, ఆయన గ్రంథాలను, ప్రళయదినాన్ని విశ్వసించుట, నమాజు స్థాపించుట, జకాత్ చెల్లించుట

అల్లాహ్ ఇలా ఆదేశించాడుః

[لَكِنِ الرَّاسِخُونَ فِي العِلْمِ مِنْهُمْ وَالمُؤْمِنُونَ يُؤْمِنُونَ بِمَا أُنْزِلَ إِلَيْكَ وَمَا

أُنْزِلَ مِنْ قَبْلِكَ وَالمُقِيمِينَ الصَّلَاةَ وَالمُؤْتُونَ الزَّكَاةَ وَالمُؤْمِنُونَ بِاللهِ وَاليَوْمِ الآَخِرِ أُولَئِكَ سَنُؤْتِيهِمْ أَجْرًا عَظِيمًا] {النساء:162}

“అయితే వారిలో పరిపూర్ణమైన, పరిపక్వతనొందిన జ్ఞానం గలవారూ, విశ్వసించిన వారూ, నీపై అవతరింపజెయ్యబడిన దానినీ, నీకు పూర్వం అవతరింపజెయ్యబడిన దానినీ విశ్వసించేవారూ, నమాజులను నెలకొల్పేవారూ, జకాతును చెల్లించేవారూ, అల్లాహ్ మరియు అంతిమ దినాన్ని విశ్వసించేవారూ –వీరందరికీ మేము గొప్ప పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాము”. (నిసా 4:162).

మనిషి త్రాసులో అంతే బరువుగా ఉంటాడు ఎంత అతని హృదయం అల్లాహ్, పరలోక విశ్వాసంతో మరియు ప్రవక్త ﷺ తీసుకొచ్చిన వాటి దృవీకరణతో నిండి ఉంటుందో. మనిషి శరీరంలో ఎంత మాంసం మరియు కొవ్వు ఉంటుందో దాని ప్రకారం అతని బరువు ఉండదు.

అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త ﷺ చెప్పారుః

إِنَّهُ لَيَأْتِي الرَّجُلُ الْعَظِيمُ السَّمِينُ يَوْمَ الْقِيَامَةِ لَا يَزِنُ عِنْدَ الله جَنَاحَ بَعُوضَةٍ وَقَالَ اقْرَءُوا فَلَا نُقِيمُ لَهُمْ يَوْمَ الْقِيَامَةِ وَزْنًا

“ప్రళయదినాన స్థూలకాయుడైన లావు మనిషి వస్తాడు, అల్లాహ్ వద్ద అతని బరువు దోమ రెక్కంత కూడా ఉండదు”. మళ్ళీ చెప్పారుః దీని ఆధారం కావాలంటే చదవండి దివ్య ఖుర్ఆనులోని సూర కహఫ్ (18:105):“ప్రళయదినాన మేము వారి బరువును తూయము”. (బుఖారి 4729, ముస్లిం పదాలు 2785).

వెనక చదివి వచ్చిన అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు మరియు అతని సన్నని పిక్కల సంఘటన రెండవ ఆధారం అవుతుంది విశ్వాసం త్రాసులో బరువుగా ఉంటుందీ అనడానికి.

ప్రవక్త తర్వాత హజ్రత్ అబూ బక్ర్ సిద్దీఖ్ రజియల్లాహు అన్హు మొత్తం అనుచర సంఘంలో కెల్లా ఎక్కువ ఘనతగలవారు కావడానికి రహస్యం అతని దృఢమైన విశ్వాసం మరియు ప్రవక్త తీసుకొచ్చిన వాటిని ఏ సంకోచం, అనుమానం లేకుండా ధృవీకరించడమే. ప్రవక్త అతనికి “సిద్దీఖ్” (సత్యవంతుడు) అని పేరు పెట్టింది, ప్రవక్త గగన ప్రయాణ వివరాలను ప్రవక్త నోట వినక ముందే ధృవీకరించినందుకే.

నమాజు ఘనత గురించి చెప్పాలంటే చాలా విషయాలున్నాయి కాని ఈ హదీసు శ్రధ్ధగా చదవండి:

అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెనుక నమాజు చేస్తున్నప్పుడు (తషహ్హుద్ లో) జిబ్రీల్, మీకాఈల్ పై ఇంకా ఫలానా, ఫలానా పై సలాం (శాంతి కురుయుగాక) అని పలికేవారిమి. ఒక రోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మా వైపునకు మరలి ఇలా అన్నారుః

إِنَّ اللهَ هُوَ السَّلاَمُ، فَإِذَا صَلَّى أَحَدُكُمْ، فَلْيَقُلْ: التَّحِيَّاتُ لله وَالصَّلَوَاتُ وَالطَّيِّبَاتُ، السَّلاَمُ عَلَيْكَ أَيُّهَا النَّبِيُّ وَرَحْمَةُ الله وَبَرَكَاتُهُ، السَّلاَمُ عَلَيْنَا وَعَلَى عِبَادِ الله الصَّالِحِينَ، فَإِنَّكُمْ إِذَا قُلْتُمُوهَا أَصَابَتْ كُلَّ عَبْدٍ لله صَالِحٍ فِي السَّمَاءِ وَالأَرْضِ، أَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلَّا اللهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ

“నిశ్చయంగా అల్లాహ్ యే సలాం (శాంతిప్రదాత). మీలోనెవరైనా నమాజ్ చేయునప్పుడు ఇలా అనండిః అత్తహియ్యాతు లిల్లాహి వస్సలవాతు వత్తయ్యిబాతు వస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు వరహ్మతుల్లాహి వబరకాతుహూ, అస్సలాము అలైనా వఅలా ఇబాదిల్లాహిస్సాలిహీన్ -మీరు ఇలా అన్నప్పుడు భామ్యాకాశాల్లో ఉన్న ప్రతి పుణ్యాత్మునికి మీ ఈ దుఆ చేరుతుంది- వఅష్ హదు అల్లాఇలాహ ఇల్లల్లాహు వఅష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వరసూలుహు”. (ముస్నద్ అహ్మద్ 3439, బుఖారి పదాలు 1202, ముస్లిం 402).

ఊహించండి, మానవుల్లో, జిన్నాతుల్లో మరియు దైవదూతల్లో ఎంత మంది పుణ్యాత్ములుంటారో? కోట్లాదికోట్లల్లో ఉంటారు. వారి సంఖ్య కంటే ఇంకా పది రెట్లు ఎక్కువ పుణ్యాలు ఇన్షాఅల్లాహ్ నీకు లభిస్తాయి. ఎలా అనగా; అస్సలాము అలైకుం అని ఒక్కసారి అంటే పది పుణ్యాలు లభిస్తాయి. అందుకే నమాజీల సంఖ్య పెరిగినాకొద్దీ నీ పుణ్యం పెరుగుతుంది. పుణ్యాత్ముల సంఖ్య పెరిగినాకొద్దీ నీ పుణ్యం పెరుగుతుంది.

ఖఫ్ఫాల్ తన ఫతావాలో పేర్కొన్నారని ఇబ్ను హజర్ రహిమహుల్లాహ్ చెప్పారుః నమాజును వదలడం వల్ల సర్వ ముస్లిములకు నష్టం చేకురుతుంది, ఎందుకనగా నమాజీ అంటాడుః ఓ అల్లాహ్! నన్ను మరియు విశ్వాస స్త్రీ పురుషులందరినీ క్షమించు, అయితే తషహ్హుద్ లో తప్పనిసరిగా ఈ పదాలు కూడా అనవలసి ఉంటుందిః అస్సలాము అలైనా వఅలా ఇబాదిల్లాహిస్సాలిహీన్. ఇక నమాజ్ చదవని వ్యక్తి పుణ్యాత్ముల పక్షంలో ఈ దుఆ చేయలేదు గనక అల్లాహ్ పట్ల, ఆయన ప్రవక్త పట్ల, స్వయంగా తన పట్ల మరియు సర్వ ముస్లిముల పట్ల ఎంతో కొరత చేసినవాడవుతాడు. అందుకే నమాజు వదలడం మహాఘోర పాపంగా నిలిచింది. ఇమాం సుబుకీ రహిమహుల్లాహ్ చెప్పారుః నమాజు అల్లాహ్ హక్కుతో పాటు దాసుల హక్కు కూడాను. ఎవరు ఈ నమాజును విడనాడుతారో అతను గత మరియు ప్రళయం వరకు వచ్చే ముస్లింలందరి హక్కులో అన్యాయం చేసినవాడవుతాడు. ఎందుకనగా నమాజులో అస్సలాము అలైనా వఅలా ఇబాదిల్లాహిస్సాలిహీన్ అనడం విధిగా ఉంది. (ఫత్హుల్ బారి: ఇబ్ను హజర్ అస్ ఖలానీ 2/317, హ.నం:831).

[2] దానధర్మాలు చేయడం, మంచిని ఆదేశించడం మరియు ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరచడం

[لَا خَيْرَ فِي كَثِيرٍ مِنْ نَجْوَاهُمْ إِلَّا مَنْ أَمَرَ بِصَدَقَةٍ أَوْ مَعْرُوفٍ أَوْ إِصْلَاحٍ بَيْنَ النَّاسِ وَمَنْ يَفْعَلْ ذَلِكَ ابْتِغَاءَ مَرْضَاةِ اللهِ فَسَوْفَ نُؤْتِيهِ أَجْرًا عَظِيمًا]

{النساء:114}

“వారు జరిపే అత్యధిక రహస్య మంతనాలలో ఏ మేలూ ఉండదు. అయితే దానధర్మాల గురించి లేక మంచి పనుల గురించి లేక ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరచటం గురించి ఆజ్ఞాపించేవాని రహస్య మంతనాల్లో మేలుంటుంది. ఎవరయినా కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసం ఈ పనులు చేస్తే నిశ్చయంగా మేమతనికి గొప్ప ప్రతిఫలం ప్రసాదిస్తాము”. (నిసా 4:114).

8వ కార్యం (పేజి35)లో దానధర్మాల ఘనత ప్రస్తావించాము.

ఇక మంచి పనుల గురించి ఆదేశించడంలో సర్వ సత్కార్యాలు ఇమిడి ఉన్నాయి. డాక్టర్ అబ్దుల్ అజీజ్ అల్ మస్ఊద్ చెప్పారు: ఇస్లాం ధర్మం ఆదేశించిన ప్రతి విషయం అది విశ్వాసానికి, లేదా వాక్కుకు, లేదా ఆచరణకు సంబంధమైనదైనా, లేదా ఏదైనా విషయాన్ని దృవపరచాటి- నికైనా ఇంకా అది విధిగా లేదా అభిలషణీయముగా లేదా కేవలం అనుమతి రూపంలో ఎలా ఉన్నా సరే మంచిపనిగా పరిగణించబడుతుంది)[1]).

ఇమాం జుహ్రీ రహిమహుల్లాహ్ ‘నరకాగ్ని పట్టకోలేని పని అధికంగా చేయండి’ అని చెప్పారు. అదేమిటి అని అడిగినందుకు, మంచిపని అని జవాబిచ్చారు. (హిల్యతుల్ ఔలియా 3/371).

ఇక ప్రజల మధ్య సంధి కుదుర్చడం: దాని ప్రతిఫలం నఫిల్ ఉపవాసాలు, నమాజులు మరియు దానధర్మాల కంటే ఉత్తమంగా, గొప్పగా ఉందని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు.

أَلَا أُخْبِرُكُمْ بِأَفْضَلَ مِنْ دَرَجَةِ الصِّيَامِ وَالصَّلَاةِ وَالصَّدَقَةِ؟ قَالُوا: بَلَى، يَا رَسُولَ اللَّهِ قَالَ: إِصْلَاحُ ذَاتِ الْبَيْنِ، وَفَسَادُ ذَاتِ الْبَيْنِ الْحَالِقَةُ

“ఉపవాసం, నమాజు, దానధర్మాల కంటే ఉత్తమ స్థానం గల విషయం మీకు తెలుపనా? అని ప్రవక్త అడిగినందుకు, ఎందుకులేదు? తప్పక తెలుపండి ప్రవక్తా! అని సహచరులన్నారు. అప్పుడు ప్రవక్త చెప్పారుః పరస్పరం సంధి కుదుర్చడం, మరి పరస్పరం కలతలే కొరగవేయునవి”. (అంటే మంగళికత్తి తల గీకినట్లు కలతలు మనిషి ధర్మాన్ని గీకేస్తాయి). (అబూ దావూద్ 4919, షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ సహీహుల్ జామి 2595లో సహీ అన్నారు).

అబూ అయ్యూబ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త ﷺ తెలిపారుః

يَا أَبَا أَيُّوبَ أَلَا أَدُلُّكَ عَلَى صَدَقَةٍ يُحِبُّهَا اللهُ وَرَسُولُهُ؟ تُصْلِحُ بَيْنَ النَّاسِ إِذَا تَبَاغَضُوا، وتَفَاسَدُوا

“ఓ అయ్యూబ్! అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ప్రేమించే దానం గురించి తెలుపనా? ప్రజలు పరస్పరం అసహ్యించుకొని, వారి మధ్య కలతలు రేకిత్తించినప్పుడు నీవు వారి మధ్య సయోధ్యకు ప్రయత్నించు”. (తబ్రానీ కబీర్ 3922, తయాలిసీ 598, షేఖ్ అల్బానీ సహీహుత్తర్గీబ్ 2820లో హసన్ లిగైరిహీ అన్నారు).

హజ్రత్ అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త ﷺ హజ్రత్ అబూ అయ్యూబ్ tతో చెప్పారుః నేను నీకు ఒక వ్యాపారం గురించి తెలుపాలా? తప్పక తెలుపండి అని అతడన్నాడు. ప్రవక్త చెప్పారుః

صِلْ بَينَ النَّاسِ إِذَا تَفَاسَدُوا وَقَرِّبْ بَينَهُم إِذَا تَبَاعَدُوا

“ప్రజలు పరస్పరం సంబంధాలను తెంచుకున్నప్పుడు వారిని కలుపు, పరస్పరం దూరమయినప్పుడు వారిని కలుపు”. (బజ్జార్, షేఖ్ అల్బానీ సహీహుత్తర్గీబ్ 2818లో హసన్ లిగైరిహీ అన్నారు).

అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త ﷺ తెలిపారుః

أَفْضَلُ الصَّدَقَةِ إِصْلَاحُ ذَاتِ الْبَيْنِ

“పరస్పర సంబంధాలను సరిదిద్దడమే ఉత్తమమైన దానధర్మం”. (తబ్రానీ, బజ్జార్, షేఖ్ అల్బానీ సహీహుత్తర్గీబ్ 2817లో సహీ లిగైరిహీ అన్నారు).

[3] అల్లాహ్ తో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చండి

అల్లాహ్ ఇలా ఆదేశించాడుః

[إِنَّ الَّذِينَ يُبَايِعُونَكَ إِنَّمَا يُبَايِعُونَ اللهَ يَدُ اللهِ فَوْقَ أَيْدِيهِمْ فَمَنْ نَكَثَ فَإِنَّمَا يَنْكُثُ عَلَى نَفْسِهِ وَمَنْ أَوْفَى بِمَا عَاهَدَ عَلَيْهُ اللهَ فَسَيُؤْتِيهِ أَجْرًا عَظِيمًا] {الفتح:10}

ఎవరయితే (నీ చేతిలో చెయ్యేసి) విధేయతా ప్రమాణం చేస్తున్నారో వారు యదార్థానికి అల్లాహ్ తో ప్రమాణం చేస్తున్నారు. వారి చేతులపై అల్లాహ్ చెయ్యి ఉంది. ఎవరయినా ప్రమాణ భంగానికి పాల్పడినట్లయితే, ఆ ప్రమాణ భంగపు నష్టం తన ఆత్మకే చేకూర్చుకుంటాడు. మరెవరయినా అల్లాహ్ తో చేసిన వాగ్దానాన్ని నెరవేరిస్తే అల్లాహ్ అతనికి త్వరలోనే గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. (ఫత్ హ్ 48:10).

ఈ ఆయతు సహాబాలను ప్రశంసిస్తూ, మరియు అల్లాహ్ వారికి -వారు ‘బైతె రిజ్వాన్’ లో అల్లాహ్ తో చేసిన ప్రమాణాన్ని నిలుపుకున్నందుకు- ప్రసాదించే గొప్ప ప్రతిఫలం గురించి తెలియజేస్తూ అవతరించింది. ఈ ఆయతు అల్లాహ్ తో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చే వారికి శుభవార్తనిస్తుంది, ఆ వ్యక్తికి ఈ ఆయతులో తెలుపబడిన గొప్ప ప్రతిఫలం ఇన్ షా అల్లాహ్ లభిస్తుంది.

అందుకే ఒక ముస్లింపై అల్లాహ్ తో మరియు ప్రజలతో చేసే వాగ్దానాలను నిలుపుకోవటం విధిగా ఉంది. ప్రజలతో చేసే వాగ్దానాలు గౌరవప్రదమైనవే, అల్లాహ్ ను సాక్షిగా పెట్టి ఆ వాగ్దానాలు మనం చేస్తాము. వాటి గురించి ప్రళయదినాన మనల్ని ప్రశ్నించడం జరుగుతుంది. అల్లాహ్ ఇలా ఆదేశించాడుః

}وَأَوْفُوا بِالْعَهْدِ إِنَّ الْعَهْدَ كَانَ مَسْئُولاً{ {الإسراء:34}.

వాగ్దానాన్ని (చేసుకున్న ప్రతి ఒప్పందాన్ని) నెరవేర్చండి. ఎందుకంటే వాగ్దానం (ఒప్పందం) గురించి ప్రశ్నించబడుతుంది. (బనీ ఇస్రాఈల్ 17: 34).

[4] చూడకుండానే అల్లాహ్ కు భయపడడం

అల్లాహ్ ఇలా ఆదేశించాడుః

}إِنَّ الَّذِينَ يَخْشَوْنَ رَبَّهُمْ بِالْغَيْبِ لَهُمْ مَغْفِرَةٌ وَأَجْرٌ كَبِيرٌ{ {الملك:12}.

నిశ్చయంగా తమ ప్రభువును చూడకుండానే ఆయనకు భయపడుతూ ఉండేవారి కోసం క్షమాపణ, గొప్ప పుణ్యఫలం ఉన్నాయి. (ముల్క్ 67: 12).

ప్రవక్త ﷺ అగోచరంగా అల్లాహ్ కు భయపడే భాగ్యం కలగాలని అధికంగా ప్రార్థించేవారు/దుఆ చేసేవారు. (అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక ఖష్ యతక ఫిల్ ఘైబి వష్షహాద). (సహీహుల్ జామి 1301).

మనిషి అల్లాహ్ ను చూడకుండానే భయపడతాడా లేదా? అని పరిక్షించడానికి అల్లాహ్ ఒక్కోసారి పాపాల సాధనాలను సులభతరంగా చేస్తాడు. అందుకు నీవు ఏకాంతంలో ఉన్నాను, ప్రజలు చూడటం లేదు అన్న మోసంలో పడకుండా, అల్లాహ్ కు భయపడుతూ, ఆయన పర్యవేక్షణలోనే ఉన్నావన్న నమ్మకం కలిగి ఉండు. వాస్తవానికి ఇదే పరోక్షంగా భయపడటం. హుదైబియా సందర్భంగా సహాబాలు ఇహ్రాం స్థితిలో ఉండగా ప్రయాణ మార్గంలో అడవి పశువులు, పక్షులు ముందుకు వస్తూ ఉండేవి, అయినా సహాబాలు కేవలం అల్లాహ్ భయం, గొప్ప పుణ్యాన్ని ఆశిస్తూ వారి చేతులకు, బాణాలకు దగ్గర వచ్చిన వాటిని కూడా వేటాడేవారుకారు. (ఇహ్రాం స్థితిలో షికార్ నిషిద్ధం గనుక ఈ ఆదేశ ఉల్లంఘనకు పాల్పడేవారుకారు). ఇదే విషయం ఖుర్ఆన్ లో చదవండిః

[يَا أَيُّهَا الَّذِينَ آَمَنُوا لَيَبْلُوَنَّكُمُ اللهُ بِشَيْءٍ مِنَ الصَّيْدِ تَنَالُهُ أَيْدِيكُمْ وَرِمَاحُكُمْ لِيَعْلَمَ اللهُ مَنْ يَخَافُهُ بِالغَيْبِ فَمَنِ اعْتَدَى بَعْدَ ذَلِكَ فَلَهُ عَذَابٌ أَلِيمٌ] {المائدة:94}

ఓ విశ్వాసులారా! మీ చేతులకూ, మీ ఈటెలకూ అందుబాటులో ఉన్న కొన్ని వేట జంతువుల ద్వారా అల్లాహ్ మిమ్మల్ని పరీక్షిస్తాడు. తనను చూడకుండానే తనకు భయపడేవాడరెవరో తెలుసుకోవాలని. దీని తరువాత కూడా హద్దు మీరి ప్రవర్తించేవారికి వ్యధాభరితమైన శిక్ష ఉంటుంది. (మాఇద 5:94).

ప్రియసోదరా! నీవు ప్రజల నుండి, నీ ఇల్లాలి పిల్లల నుండి దూరముండి పాపం చేయుటకు ఏకాంతంలో ఉంటావో, నీవు ఏమి చేస్తావో ఆలోచించు? నీవు ఆ పాపానికి పాల్పడతావా? లేదా ఏదీ ఆయన ముందు గోప్యంగా లేనివాని వైపు నుండి లభించే గొప్ప పుణ్యం గుర్తు చేసుకొని దానికి దూరంగా ఉంటావా!! దూరముంటే ఇదే అల్లాహ్ చూడకుండా భయపడటం అన్న మాట.

[5] అల్లాహ్ విధేయత, సత్యత, సహనం, అణకువ, ఉపవాసం, నిశిద్ధాల నుండి మర్మాంగాన్ని కాపాడటం, అధికంగా అల్లాహ్ స్మరణ చేయటం…

[إِنَّ المُسْلِمِينَ وَالمُسْلِمَاتِ وَالمُؤْمِنِينَ وَالمُؤْمِنَاتِ وَالقَانِتِينَ وَالقَانِتَاتِ وَالصَّادِقِينَ وَالصَّادِقَاتِ وَالصَّابِرِينَ وَالصَّابِرَاتِ وَالخَاشِعِينَ وَالخَاشِعَاتِ وَالمُتَصَدِّقِينَ وَالمُتَصَدِّقَاتِ وَالصَّائِمِينَ وَالصَّائِمَاتِ وَالحَافِظِينَ فُرُوجَهُمْ وَالحَافِظَاتِ وَالذَّاكِرِينَ اللهَ كَثِيرًا وَالذَّاكِرَاتِ أَعَدَّ اللهُ لَهُمْ مَغْفِرَةً وَأَجْرًا عَظِيمًا] {الأحزاب:35}

నిశ్చయంగా ముస్లిం పురుషులు – ముస్లిం స్త్రీలు, విశ్వాసులైన పురుషులు – విశ్వాసులైన స్త్రీలు, విధేయులైన పురుషులు – విధేయులైన స్త్రీలు, సత్యసంధులైన పురుషులు – సత్యసంధులైన స్త్రీలు, సహనశీలురైన పురుషుల – సహనవతులైన స్త్రీలు, అణకువ గల పురుషులు – అణకువ గల స్త్రీలు, దానధర్మాలు చేసే పురుషులు – దానధర్మాలు చేసే స్త్రీలు, ఉపవాసం ఉండే పురుషులు – ఉపవాసం ఉండే స్త్రీలు, తమ మర్మాంగాలను కాపాడుకునే పురుషులు – కాపాడునే స్త్రీలు, అల్లాహ్ ను అత్యధికంగా స్మరించే పురుషులు – స్మరించే స్త్రీలు, వీరందరి కోసం అల్లాహ్ (విస్తృతమైన) మన్నింపును, గొప్ప పుణ్యఫలాన్ని సిద్ధం చేసి ఉంచాడు. (అహ్ జాబ్ 33:35)

ఇబ్ను కసీర్ రహిమహుల్లాహ్ పై ఆయతులో ‘ఖానితీన్’ అంటే ప్రశాంతతో విధేయత పాటించేవారు మరియు ‘ఖాషిఈన్’ అంటే నిబ్బరం, నెమ్మది, నిమ్మళం, తృప్తి మరియు అణకువ అని తెలిపారు. (తఫ్సీర్ ఇబ్నె కసీర్ 4/520).

[6] తహజ్జుద్ నమాజ్

అబూ సఈద్ ఖుద్రీ మరియు అబూ హురైరా రజియల్లాహు అన్హుమాల ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త ﷺ ఇలా తెలిపారుః

مَنِ اسْتَيْقَظَ مِنَ اللَّيْلِ وَأَيْقَظَ امْرَأَتَهُ، فَصَلَّيَا رَكْعَتَيْنِ جَمِيعًا، كُتِبَا مِنَ الذَّاكِرِينَ اللهَ كَثِيرًا، وَالذَّاكِرَاتِ

“ఎవరు రాత్రి వేళ మేల్కొని తన భార్యను లేపుతాడో, ఇద్దరూ రెండు రకాతుల నమాజు చేస్తారో, వారిద్దరు అల్లాహ్ ను అధికంగా స్మరించే స్త్రీపురుషుల్లో వ్రాయబడతారు”. (అబూదావూద్ పదాలు 1451, ఇబ్ను మాజ 1335, షేఖ్ అల్బానీ సహీహుత్తర్గీబ్ 333లో సహీ అన్నారు).

అధికంగా అల్లాహ్ ను స్మరించేవారికి గొప్ప పుణ్యం వ్రాయబడుతుంది అన్న విషయం పై ఆయతు ద్వారా తెలిసిందే.

[7] ప్రవక్త సమక్షంలో చిన్నస్వరంతో మాట్లాడుట

[إِنَّ الَّذِينَ يَغُضُّونَ أَصْوَاتَهُمْ عِنْدَ رَسُولِ اللهِ أُولَئِكَ الَّذِينَ امْتَحَنَ اللهُ قُلُوبَهُمْ لِلتَّقْوَى لَهُمْ مَغْفِرَةٌ وَأَجْرٌ عَظِيمٌ] {الحجرات:3}

ఎవరయితే ప్రవక్త సమక్షంలో తగ్గుస్వరంతో మాట్లాడతారో వారి హృదయాలను అల్లాహ్ ధర్మనిష్ఠ (తఖ్వా) కోసం పరికించాడు. వారికి మన్నింపుతో పాటు గొప్ప ప్రతిఫలం ఉంది. (హుజురాత్ 49:3).

ఖుర్తుబీ రహిమహుల్లాహ్ ఇబ్నుల్ అరబీ రహిమహుల్లాహ్ మాటను తన తఫ్సీర్ లో ఇలా ప్రస్తావించారుః ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సజీవంగా ఉన్నప్పుడు గౌరవమర్యాదలకు ఎంతగా అర్హులో మరణించిన తర్వాత కూడా అంతే అర్హులు, ఆయన సమక్షంలో ఉండి ఆయన శుభనోట వెలువడే మాటలకు ఇవ్వాల్సిన ప్రధాన్యాత ఆయన మరణం తర్వాత రుజువైన ఆయన మాటకు ఇవ్వాలి. ఆయన మాట చదువబడుతున్నప్పుడు ఆ మాటపై తన స్వరం పెంచకుండా, పెడముఖం పెట్టకుండా శ్రద్ధగా వినడం విధిగా ఉంది. ఎల్లవేళల్లో, ప్రతి కాలం, యుగంలో గౌరవమర్యాద విషయం అల్లాహ్ ఇలా ప్రస్తావించాడుః

[وَإِذَا قُرِئَ القُرْآَنُ فَاسْتَمِعُوا لَهُ وَأَنْصِتُوا لَعَلَّكُمْ تُرْحَمُونَ] {الأعراف:204}

దివ్యఖుర్ఆన్ పారాయణం జరుగుతున్నప్పుడు దానిని శ్రద్ధగా వినండి, నిశ్శబ్దంగా ఉండండి. తద్వారా మీరు కరుణించబడవచ్చు. (ఆరాఫ్ 7:204).

ప్రవక్తగారి మాట కుడా వహ్ యి, ఖుర్ఆన్ లాంటి వివేకపూరిత విషయాలు హదీసులో. (తఫ్సీర్ ఖుర్తుబీ 16/293).

[8] జిహాద్ ఫీ సబీలిల్లాహ్

జిహాద్ మూడు రకాలుగా ఉంటుందిః

 జిహాద్ బిన్నఫ్స్ (దైవమార్గంలో ప్రాణాలర్పించడం).

 జిహాద్ బిల్ మాల్ (దైవమార్గంలో ధనం ఖర్చు చేయడం).

 జిహాద్ బిల్ లిసాన్ (దైవమార్గంలో నోటిమాటలతో కృషిచేయడం).

 జిహాద్ బిన్నఫ్స్ అల్లాహ్ ఆదేశం:

[فَلْيُقَاتِلْ فِي سَبِيلِ اللهِ الَّذِينَ يَشْرُونَ الحَيَاةَ الدُّنْيَا بِالآَخِرَةِ وَمَنْ يُقَاتِلْ فِي سَبِيلِ اللهِ فَيُقْتَلْ أَوْ يَغْلِبْ فَسَوْفَ نُؤْتِيهِ أَجْرًا عَظِيمًا] {النساء:74}

ఇహలోక జీవితాన్ని పరలోకానికి బదులుగా అమ్మివేసినవారు దైవమార్గంలో పోరాడాలి. దైవమార్గంలో పోరాడుతూ చంపబడినవానికి లేదా విజయం పొందినవానికి మేము గొప్ప పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాము. (నిసా 4:74).

అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ప్రవక్తా! జిహాద్ కు సమానమైన ఏదైనా సత్కార్యం నాకు తెలుపండి అని అడిగాడు. ప్రవక్త “ఆలాంటి ఏ సత్కార్యం నేను పొందడం లేదు” అని చెప్పి మళ్ళీ ఇలా ప్రశ్నించారుః

هَلْ تَسْتَطِيعُ إِذَا خَرَجَ المُجَاهِدُ أَنْ تَدْخُلَ مَسْجِدَكَ فَتَقُومَ وَلاَ تَفْتُرَ، وَتَصُومَ وَلاَ تُفْطِرَ؟ قَالَ: وَمَنْ يَسْتَطِيعُ ذَلِكَ؟

ముజాహిద్ బయలుదేరినప్పటి నుండి (తిరిగి వచ్చే వరకు) నీవు నీ మస్జిద్ లోకి వెళ్ళి అలసట చెందకుండా నఫిల్ నమాజులు చేస్తూ ఉండే, ఇఫ్తార్ చేయకుండా ఉపవాసాలు పాటిస్తూ ఉండే శక్తి నీలో ఉందా? ఎవరికి ఈ శక్తి గలదు? అని అతడన్నాడు. (అహ్మద్ –అల్ ఫత్ హుర్రబ్బానీ- 14/6, బుఖారి పదాలు 2785, ముస్లిం 1878).

సముద్ర మార్గాన జిహాద్ చేసే వ్యక్తి పుణ్యం భూమార్గాన జిహాద్ చేసే వ్యక్తి కంటే పది రెట్లు ఎక్కువ ఉంటుంది.

అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారుః

غَزْوَةٌ فِي الْبَحْرِ أَفْضَلُ مِنْ عَشْرِ غَزَوَاتٍ فِي الْبَرِ، وَمَنْ جَازَ الْبَحْرَ، فَكَأَنَّمَا جَازَ الْأَوْدِيَةَ وَالْمَائِدُ فِي السَّفِينَةِ كَالْـمُتَشَحِّطِ فِي دَمِهِ

“సముద్రంపై యుద్ధం భూమిపై యుద్ధం కంటే పది రెట్లు ఎక్కువ ఘనత గలది. సముద్రం దాటినవాడు లోయలన్నిటినీ దాటేసినవాడితో సమానం. సముద్రంలో ఎవరి తల తిరిగుతుందో అతను భూమి మీద జిహాద్ చేస్తూ రక్తసిక్తమయినటువంటి వాడు”. (ఇబ్ను మాజ 2777, హాకిం 2634, షేఖ్ అల్బానీ సహీహుల్ జామి 4154లో సహీ అన్నారు).

అల్లాహ్ మార్గంలో కాపలాకాస్తూ చనిపోవడం ఎంత గొప్ప సత్కార్యం అంటే అల్లాహ్ అతని ఆ పుణ్యాన్ని ప్రళయదినం వరకు పెంచుతునేపోతాడు. సల్మాన్ రజియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా విని ఉల్లేఖించారుః

رِبَاطُ يَوْمٍ وَلَيْلَةٍ خَيْرٌ مِنْ صِيَامِ شَهْرٍ وَقِيَامِهِ، وَإِنْ مَاتَ جَرَى عَلَيْهِ عَمَلُهُ الَّذِي كَانَ يَعْمَلُهُ، وَأُجْرِيَ عَلَيْهِ رِزْقُهُ، وَأَمِنَ الْفَتَّانَ

“ఒక రాత్రిపగలు కాపలాకాయటం ఒక నెల ఉపవాసం మరియు తహజ్జుద్ ల కంటే ఉత్తమం. అదే స్థితిలో గనక చనిపోతే అతని ఆ సత్కార్యం కొనసాగుతూ ఉంటుంది (అంటే ఆ సత్కార్యం చేస్తూ ఉన్న పుణ్యం లభిస్తునే ఉంటుంది). అతనికి స్వర్గం ఉపాధి కూడా ప్రాప్తమవుతూనే ఉంటుంది. అతనికి ఫిత్న (సమాధీ పరీక్ష) నుండి కూడా రక్షణ లభిస్తుంది”. (ముస్లిం పదాలు 1913, బుఖారి 2892).

ప్రవక్త ﷺ తెలిపారని ఫుజాలా బిన్ ఉబైద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః

كُلُّ مَيِّتٍ يُخْتَمُ عَلَى عَمَلِهِ إِلَّا الَّذِي مَاتَ مُرَابِطًا فِي سَبِيلِ اللَّهِ فَإِنَّهُ يُنْمَى لَهُ عَمَلُهُ إِلَى يَوْمِ القِيَامَةِ، وَيَأْمَنُ مِنْ فِتْنَةِ القَبْرِ ، وَسَمِعْتُ رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ: المُجَاهِدُ مَنْ جَاهَدَ نَفْسَهُ

“ప్రతి వ్యక్తి ఆచరణ అతని చావుతో అంతం అవుతుంది కాని అల్లాహ్ మార్గంలో కాపలాకాచే వ్యక్తి; నిశ్చయంగా అతని ఆ ఆచరణను ప్రళయదినం వరకు రెట్టింపు చేయబడుతూ ఉంటుంది, అతను సమాధి పరీక్షల నుండి కూడా రక్షణ పొందుతాడు. ప్రవక్త చెప్పగా నేను విన్నానుః తన ఆత్మతో, ప్రాణంతో జిహాద్ చేసే వ్యక్తి అసలైన ముజాహిద్”. (అహ్మద్ –అల్ ఫత్ హుర్రబ్బానీ- 14/11, తిర్మిజి 1621, అబూదావూద్ 2500, షేఖ్ అల్బానీ 1322).

 జిహాద్ బిల్ మాల్

అల్లాహ్ ఆదేశం సూర హదీద్ 57:7లో ఇలా ఉంది:

[آَمِنُوا بِاللهِ وَرَسُولِهِ وَأَنْفِقُوا مِمَّا جَعَلَكُمْ مُسْتَخْلَفِينَ فِيهِ فَالَّذِينَ آَمَنُوا مِنْكُمْ وَأَنْفَقُوا لَهُمْ أَجْرٌ كَبِيرٌ] {الحديد:7}

మీరు అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను విశ్వసించండి. అల్లాహ్ మిమ్మల్ని ఏ సంపదకైతే వారసులుగా చేశాడో అందులో నుంచి ఖర్చు చేయండి. మరి మీలో విశ్వసించి, దానధర్మాలు చేసేవారికి గొప్ప పుణ్యఫలం ఉంది.

అల్లాహ్ మార్గంలో ఖర్చు చేసే వారికి ఏడు వందల రెట్లు ఎక్కువ పుణ్యం లభిస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని, ఖురైమ్ బిన్ ఫాతిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః

مَنْ أَنْفَقَ نَفَقَةً فِي سَبِيلِ الله كُتِبَتْ لَهُ بِسَبْعِ مِائَةِ ضِعْفٍ

“ఎవరైనా అల్లాహ్ మార్గంలో ఖర్చు పెడితే అతనికి ఏడు వందల రెట్లు ఎక్కువ పుణ్యం లిఖించబడుతుంది”. (తిర్మిజి 1625, నిసాయి 3186, షేఖ్ అల్బానీ సహీహుత్తర్గీబ్ 1236లో సహీ అన్నారు).

ప్రవక్త ﷺ ఉపదేశించారని జైద్ బిన్ ఖాలిద్ ﷺ ఉల్లేఖించారుః

مَنْ جَهَّزَ غَازِيًا فِي سَبِيلِ الله فَقَدْ غَزَا، وَمَنْ خَلَفَ غَازِيًا فِي سَبِيلِ الله بِخَيْرٍ فَقَدْ غَزَا

“జిహాద్ చేసే వ్యక్తికి జిహాద్ లో అవసరపడే సామాగ్రి తయారు చేసి ఇచ్చే వ్యక్తి జిహాద్ చేసేవానితో సమానం. జిహాద్ చేయుటకు వెళ్ళిన వ్యక్తి ఇల్లాలిపిల్లల అవసరాలు తీర్చే వ్యక్తి కూడా జిహాద్ చేయువానితో సమానం”. (బుఖారి 2843, ముస్లిం 1895).

 జిహాద్ బిల్ లిసాన్[2]

కఅబ్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్తా! అల్లాహ్ కవిత్వం గురించి అవతరించిన విషయం తెలిసిందే అని నేను చెప్పబోయాను అప్పుడు ప్రవక్త చెప్పారుః

إِنَّ الْمُؤْمِنَ يُجَاهِدُ بِسَيْفِهِ وَلِسَانِهِ، وَالَّذِي نَفْسِي بِيَدِهِ، لَكَأَنَّ مَا تَرْمُونَهُمْ بِهِ نَضْحُ النَّبْلِ

“నిశ్చయంగా విశ్వాసి తన కరవాలం (ఆయుధం) మరియు నాలుక ద్వారా జిహాద్ చేస్తాడు. నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన సాక్షి! (నాలుకతో జిహాద్ చేసే వ్యక్తి కూడా శత్రువులపై) బాణాలు విసురుతున్న వ్యక్తి లాంటివాడు”. (ఇబ్ను హిబ్బాన్ 4707, బైహఖీ 20897, షేఖ్ అల్బానీ సహీ మవారిదుజ్జమ్ఆన్ 1694లో సహీ అన్నారు).

ప్రవక్త ﷺ చెప్పారని అనస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః

جَاهِدُوا الْمُشْرِكِينَ بِأَمْوَالِكُمْ وَأَنْفُسِكُمْ وَأَلْسِنَتِكُمْ

“మీ ధన, ప్రాణాలతో ఇంకా మీ మాటల (నాలుక) సాయంతో బహుదైవారాధకులతో జిహాద్ చేయండి”. (అబూదావూద్ 2504, నిసాయి 3096, షేఖ్ అల్బానీ సహీహుల్ జామి 3090లో సహీ అన్నారు).

15వ కార్యం: సహనం

అల్లాహ్ వివేచన ప్రకారం ఈ ప్రపంచం ఎల్లకాలం ఉండదు, అందుకే ఈ ప్రపంచంలో ఎవరు అల్లాహ్ కొరకు పరీక్షలను, కష్టాలను భరిస్తారో అల్లాహ్ వారి గురించి హద్దు లేకుండా గొప్ప పుణ్యం ప్రసాదిస్తాడని వాగ్దానం చేశాడు. అల్లాహ్ ఆదేశం ఇలా ఉందిః

[قُلْ يَا عِبَادِ الَّذِينَ آَمَنُوا اتَّقُوا رَبَّكُمْ لِلَّذِينَ أَحْسَنُوا فِي هَذِهِ الدُّنْيَا حَسَنَةٌ وَأَرْضُ اللهِ وَاسِعَةٌ إِنَّمَا يُوَفَّى الصَّابِرُونَ أَجْرَهُمْ بِغَيْرِ حِسَابٍ] {الزُّمر:10}

(ప్రవక్తా!) ఇలా చెప్పుః విశ్వసించిన ఓ నా దాసులారా! మీ ప్రభువుకు భయపడుతూ ఉండండి. ఈ లోకంలో సత్కర్మలు చేసినవారికి మేలు జరుగుతుంది. అల్లాహ్ భూమి ఎంతో విశాలమైనది. సహనం వహించేవారికి లెక్కలేనంత పుణ్యఫలం ప్రసాదించబడుతుంది. (జుమర్ 39:10).

 అల్లాహ్ విధేయత పాటిస్తూ సహనం వహించుట,  అల్లాహ్ అవిధేయతకు దూరంగా ఉంటూ సహనం వహించుట మరియు  అల్లాహ్ వైపు నుండి విధవ్రాత ప్రకారం జరిగే బాధకరమైన సంఘటనలపై సహనం వహించుట. ఇలా మూడు రకాల సహనం ఉంటుంది.

 అల్లాహ్ విధేయతలో సహనం

అల్లాహ్ విధేయతలో సహనం మానవుని త్రాసును బరువుగా చేస్తుంది. ఉదాహరణకు ఉపవాస స్థితిలో ఆకలి బాధపై సహనం. ఉపవాసం సహన రకాల్లో అతిఉత్తమమైనది. అందులో రెండు రకాల సహనం ఉంది. ఒకటిః అల్లాహ్ విధేయతలో సహనం. రెండుః అల్లాహ్ అవిధేయతకు పాల్పడకుండా సహనం. అందుకే ప్రవక్త ﷺ రమజాన్ మాసాన్ని సహన మాసంగా నామకరణం చేశారు. ప్రవక్త ﷺ చెప్పగా నేను విన్నాను అని అబూహురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః

شَهْرُ الصَّبْرِ، وَثَلَاثَةُ أَيَّامٍ مِنْ كُلِّ شَهْرٍ صَوْمُ الدَّهْرِ

“సహన మాసం మరియు ప్రతి మాసంలో మూడు రోజుల ఉపవాసాలు జీవితాంతం ఉపవాసం పాటించినదానికి సమానం”. (అహ్మద్ –అల్ ఫత్ హుర్రబ్బానీ- 10/208, అబూదావూద్ 2428, నిసాయి పదాలు 2408, ఇబ్ను మాజ 1741, షేఖ్ అల్బానీ సహీహుల్ జామి 3803).

మనిషి స్థితిగతుల్లో హెచ్చుతగ్గులు ఎలా ఉంటాయో అలాగే అల్లాహ్ విధేయతలో సహనం యొక్క పుణ్యం కూడా ఎక్కువ తక్కువ వివిధ రూపాల్లో ఉంటుంది. (అంటే సహనపరులందరికీ ఒకే రకమైన పుణ్యం ఉండదు). ఉపద్రవాలు జనించి, ధర్మం అంటే ఏదో వింతగా అయిపోయి, ధర్మపాలనలో సహాయసహకారాలు అందించేవారు లేని సందర్భంలో గల సహనం యొక్క పుణ్యం 50 మంది అమరవీరులకు లభించే పుణ్యంతో సమానంగా ఉంటుంది. అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారుః

إِنَّ مِنْ وَرَائِكُمْ زَمَانَ صَبْرٍ، للمُتَمَسِّكِ فِيهِ أَجْرُ خَمْسِينَ شَهِيدًا

“మీ తర్వాత ఓర్పూసహనాల ఓ కాలం రానుంది, ఆ కాలంలో ధర్మంపై స్థిరంగా ఉన్న వ్యక్తికి 50 మంది అమరవీరుల పుణ్యం ఉంటుంది”. (తబ్రానీ కబీర్ 10394, షేఖ్ అల్బానీ సహీహుల్ జామి 2234లో సహీ అన్నారు).

 అల్లాహ్ అవిధేయతకు దూరంగా ఉంటూ సహనం

త్రాసు బరువయ్యే సత్కార్యాలలో ఒకటి నిశిద్ధ వాంఛలను విడనాడడం కూడా. ఉదాహరణకు వ్యభిచారంలో పడకుండా తననుతాను కాపాడుకోవడం. ఎవరు దానికి దూరంగా ఉంటారో వారికి అల్లాహ్ తరపు నుండి గొప్ప పుణ్యముందిః

[وَالحَافِظِينَ فُرُوجَهُمْ وَالحَافِظَاتِ وَالذَّاكِرِينَ اللهَ كَثِيرًا وَالذَّاكِرَاتِ أَعَدَّ اللهُ لَهُمْ مَغْفِرَةً وَأَجْرًا عَظِيمًا] {الأحزاب:35}

తమ మర్మాంగలను కాపాడుకునే పురుషులు – కాపాడునే స్త్రీలు, అల్లాహ్ ను అత్యధికంగా స్మరించే పురుషులు – స్మరించే స్త్రీలు, వీరందరి కోసం అల్లాహ్ (విస్తృతమైన) మన్నింపును, గొప్ప పుణ్యఫలాన్ని సిద్ధం చేసి ఉంచాడు. (అహ్ జాబ్ 33:35)

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శుభవార్త ఇచ్చారని సహల్ బిన్ సఅద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః

مَنْ تَوَكَّلَ لِي مَا بَيْنَ رِجْلَيْهِ وَمَا بَيْنَ لَحْيَيْهِ، تَوَكَّلْتُ لَهُ بِالْجَنَّةِ

“ఎవరు తన రెండు కాళ్ళ మధ్య మరియు రెండు దవడల మధ్య ఉన్న దానిని గురించి నాకు పూచి ఇస్తారో నేను అతనికి స్వర్గం పూచి ఇస్తాను”. (బుఖారి 6807).

అల్లాహ్ విధివ్రాతలోని కష్టాలపై సహనం

విధివ్రాత ప్రకారం వచ్చే బాధాకరమైన కష్టాలపై సహనం వల్ల మనిషి త్రాసు చాలా బరువవుతుంది. ఉదాహరణకు విశ్వాసి తన కొడుకు చనిపోతే సహనం వహించటం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారని హజ్రత్ సౌబాన్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః

بَخٍ بَخٍ لِخَمْسٍ مَا أَثْقَلَهُنَّ فِي الْمِيزَانِ لَا إِلَهَ إِلَّا اللهُ وَسُبْحَانَ الله وَالْحَمْدُ لله وَاللهُ أَكْبَرُ وَالْوَلَدُ الصَّالِحِ يُتَوَفَّى لِلْمَرْءِ الْـمُسْلِمِ فَيَحْتَسِبُهُ

“ఐదు విషయాలు చాలా మంచివి, త్రాసులో చాలా బరువుగలవి, లాఇలాహ ఇల్లల్లాహ్ సుబ్ హానల్లాహ్ అల్ హందులిల్లాహ్ అల్లాహు అక్బర్ ఎవరైనా ముస్లిం వ్యక్తి యొక్క సదాచరణగల సంతానం చనిపోతే అతడు పుణ్యాన్ని ఆశించి సహనం వహించడం”. (అహ్మద్ –అల్ ఫత్ హుర్రబ్బానీ- 19/195, నిసాయి కుబ్రా 9995, షేఖ్ అల్బానీ సహీ తర్గీబ్ 2009లో సహీ అన్నారు).

అలాగే ఆపదల్లో ఉన్నవారు తమ ఆపదలో సహనం వహించటం.

يَوَدُّ أَهْلُ العَافِيَةِ يَوْمَ القِيَامَةِ حِينَ يُعْطَى أَهْلُ البَلَاءِ الثَّوَابَ لَوْ أَنَّ جُلُودَهُمْ كَانَتْ قُرِضَتْ فِي الدُّنْيَا بِالمَقَارِيضِ

“(ఇహలోకంలో) సుఖంగా, క్షేమంగా ఉన్నవారు ప్రళయదినాన ఆపదల్లో ఉన్నవారికి ఇవ్వబడుతున్న పుణ్యాన్ని చూసి వారి చర్మాలు కూడా ఇహలోకంలో కత్తెర్లతో ఒలచివేయబడి ఉంటే ఎంతో బాగుండు అని కోరుకుంటారు”. మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వస్లలం చెప్పారుః

لَيَوَدَّنَّ أَهْلُ الْعَافِيَةِ يَوْمَ الْقِيَامَةِ أَنَّ جُلُودَهُمْ قُرِضَتْ بِالمَقَارِيضِ مِمَّا يَرَوْنَ مِنْ ثَوابِ أَهْلِ البلاء

“ఇహలోకంలో సుఖసంతోషాల్లో ఉండేవారు ఆపదల్లో ఉండేవారికి ప్రళయదినాన లభించే ప్రతిఫలాన్ని ఎప్పుడైతే చూస్తారో, అప్పుడు వారి చర్మాలు కత్తెర్లతో కోయబడినా బాగుండు అని తప్పకుండా కాంక్షిస్తారు”. (తిర్మిజి 2402, తబ్రానీ కబీర్ 8778, బైహఖీ 6345, షేఖ్ అల్బానీ సహీహుల్ జామి5484లో హసన్ అన్నారు).

విశ్వాసి సహనం మరియు అవిశ్వాసి సహనంలో ఉన్న తేడా కూడా ఇదే. విశ్వాసి తన సహన ఫలాన్ని తన ప్రభువు నుండి పొందుతాడని ఆశిస్తాడు. అందుకే ప్రవక్త ﷺ తన కుమార్తె జైనబ్ రజియల్లాహు అన్హాకు ఆమె ఓ కుమారుడు మరణావస్తలో ఉన్నాడని కబురు పంపినప్పుడు సహనం మరియు పుణ్యాన్ని ఆశించాలని ఆదేశించారు. ఆ సంఘటనను ఉసామా బిన్ జైద్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖించారుః మేము ప్రవక్త ﷺ వెంట ఉండగా, ఆయన ఒక కుమార్తె వార్త పంపింది, ఆమె ఓ కుమారుడు మరణావస్తలో ఉన్నాడని, అప్పుడు ప్రవక్త చెప్పారుః

ارْجِعْ إِلَيْهَا فَأَخْبِرْهَا أَنَّ لِلَّهِ مَا أَخَذَ وَلَهُ مَا أَعْطَى، وَكُلُّ شَيْءٍ عِنْدَهُ بِأَجَلٍ مُسَمًّى، فَمُرْهَا فَلْتَصْبِرْ وَلْتَحْتَسِبْ

“ఆమె వద్దకు వెళ్ళి ఇలా చెప్పుః నిశ్చయంగా ఇచ్చింది అల్లాహ్ దే తీసుకునేదీ అల్లాహ్ దే, ప్రతి వస్తువుకు ఆయన వద్ద ఓ సమయం నిర్ణయించబడి ఉంది. అయితే ఆమె సహనం వహించి, పుణ్యం ఆశించాలని చెప్పు”. (బుఖారి 7377, ముస్లిం 923).

ఎవరయితే పుణ్యాన్ని ఆశించరో వారిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించారుః

لَا أَجْرَ لِمَنْ لَا حِسْبَةَ لَهُ

పుణ్యాన్ని ఆశించని వారికి పుణ్యఫలితం లేదు. (ఇబ్నుల్ ముబారక్ జుహ్ద్ 152లో ఖాసిం బిన్ ముహమ్మద్ తో ‘ముర్సల్’ ఉల్లేఖించారు. షేఖ్ అల్బానీ సహీహుల్ జామి 7164లో హసన్ అన్నారు).

దీని భావమేమిటంటే ఎవరు తాను చేస్తున్న సత్కార్యం ద్వారా అల్లాహ్ ఆజ్ఞాపాలన చేస్తున్నట్లు మరియు ఆయన సాన్నిహిత్యం పొందే ఉద్దేశం ఉండదో అతనికి పుణ్యఫలితం ప్రాప్తం కాదు. (ఫైజుల్ ఖదీర్ షర్హుల్ జామిఇస్సగీర్ 6/380).

అయితే సహనంతో పుణ్యాన్ని ఆశించడం వేరు, అశక్తి, ఏమీ చేయలేక మౌనం వహించడం వేరు. రెండిటిలో వ్యత్యాసం గుర్తించడం తప్పనిసరి.

16వ కార్యం: జిహాద్ కు సమానమైన సత్కార్యాలు

మనం ఇంతకు ముందే చదివి ఉన్నాము; త్రాసును చాలా బరువుగా చేసే సత్కార్యాల్లో ఒకటి జిహాద్ ఫీ సబీలిల్లాహ్ అని. అయితే అల్లాహ్ కు కృతజ్ఞతలు; జిహాద్ పుణ్యానికి సమానమైన కొన్ని సత్కార్యాలు కూడా ఉన్నాయి, వాటిలో ప్రత్యేకంగా పద్నాలుగు సత్కార్యాలను ప్రస్తావిస్తాను. ఇబ్ను హజర్ రహిమహుల్లాహ్ చెప్పారుః ముజాహిద్ స్థానం ముజాహిదేతరులు కూడా సాధించవచ్చును. అయితే స్వచ్ఛమైన సంకల్పం ద్వారా లేదా దానికి సమానమైన సత్కార్యాల ద్వారా. ఎందుకనగా ప్రవక్త ﷺ ముజాహిద్ ల కొరకు సిద్ధిం చేయబడిన (100 స్థానాల గురించి) తెలిపిన తర్వాత ఫిర్దౌస్ గురించి దుఆ చేయండని అందరిని ఆదేశించారు. (ఫత్ హుల్ బారి లిబ్ని హజర్ 6/13. హదీస్ 2790).

(జిహాద్ కు సమానమైన సత్కార్యాలు క్రింద పేర్కొనడం జరిగింది)

[1] వితంతువు మరియు నిరుపేదల బాగోగులు చూడటం

అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త ﷺ ఇలా సెలవిచ్చారుః

السَّاعِي عَلَى الأَرْمَلَةِ وَالمِسْكِينِ، كَالْمُجَاهِدِ فِي سَبِيلِ الله، أَوِ القَائِمِ اللَّيْلَ الصَّائِمِ النَّهَارَ

“వితంతువుల మరియు నిరుపేదల మేలు కోసం కృషి చేసేవాడు అల్లాహ్ మార్గంలో పోరాడేవాడు లేదా రాత్రంతా తహజ్జుద్ లో పగలంతా ఉపవా- సంలో గడిపేవారితో సమానం”. (బుఖారి 5353 పదాలు, ముస్లిం 2982).

వితంతువు సహాయానికి చేరడం సులువు. ఆమె నీ అత్తమ్మ కావచ్చు, పెద్దమ్మ లేదా చిన్నమ్మ కావచ్చు, లేదా నీ నానమ్మ, అమ్మమ్మ కావచ్చు. పెద్ద పుణ్యం గల చిన్న సత్కార్యం నుండి నిన్ను నీకు దూరం చేసుకోకు.

[2] జిల్ హిజ్జ మొదటి దశలో సత్కార్యాలు

ఇబ్ను అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త ﷺ చెప్పారు:

مَا مِنْ أَيَّامٍ الْعَمَلُ الصَّالِحُ فِيهَا أَحَبُّ إِلَى اللهِ مِنْ هَذِهِ الْأَيَّامِ (يَعْنِي أَيَّامَ الْعَشْرِ)، قَالُوا: يَا رَسُولَ اللهِ، وَلَا الْجِهَادُ فِي سَبِيلِ اللهِ؟ قَالَ: وَلَا الْجِهَادُ فِي سَبِيلِ اللهِ، إِلَّا رَجُلٌ خَرَجَ بِنَفْسِهِ وَمَالِهِ، فَلَمْ يَرْجِعْ مِنْ ذَلِكَ بِشَيْءٍ

“అల్లాహ్ వద్ద ఈ రోజుల్లో (జిల్ హిజ్జ మొదటి దశకంలో)ని సత్కార్యాలకంటే ఎక్కువ ప్రీతిగల సత్కార్యాలు మరే ఇతర రోజుల్లో లేవు”. సహచరులన్నారుః ప్రవక్తా! జిహాద్ ఫీ సబీలిల్లాహ్ కూడా (వాటంతటి ప్రీతికరమైనది) కాదా? ప్రవక్త చెప్పారుః “అల్లాహ్ మార్గంలో జిహాద్ కూడా వాటంతటి ప్రీతికరమైనది కాదు, కాని, ఎవరైనా తన ధనప్రాణాలతో జిహాద్ కు వెళ్ళి వాటిలో ఏ ఒక్కదానినైనా తిరిగి తీసుకొని రాని వ్యక్తి తప్ప”.

مَا مِنْ عَمَلٍ أَزْكَى عِنْدَ اللهِ عَزَّ وَجَلَّ وَلَا أَعْظَمَ أَجْرًا مِنْ خَيْرٍ يَعْمَلُهُ فِي عَشْرِ الْأَضْحَى قِيلَ: وَلَا الْجِهَادُ فِي سَبِيلِ اللهِ قَالَ: وَلَا الْجِهَادُ فِي سَبِيلِ اللهِ عَزَّ وَجَلَّ إِلَّا رَجُلٌ خَرَجَ بِنَفْسِهِ وَمَالِهِ فَلَمْ يَرْجِعْ مِنْ ذَلِكَ بِشَيْءٍ

“అల్లాహ్ వద్ద జిల్ హిజ్జ తొలిదశలో చేసే మేలుకంటే అత్యంత పవిత్రమైన, గొప్ప పుణ్యంగల మరే సత్కార్యం లేదు. జిహాద్ ఫీ సబీలిల్లాహ్ కూడా లేదా అని వచ్చిన ప్రశ్నకు, జిహాద్ ఫీసబీలిల్లాహ్ కూడా లేదు, కాని ఎవరైనా తన ధనప్రాణాలతో వెళ్ళి ఆ రెండింటిలో ఏ ఒక్కదానితో కూడా తిరిగి రాని వ్యక్తి విషయం వేరు”. (అబూ దావూద్ 2438, సునన్ దార్మీ 1815, షేఖ్ అల్బానీ సహీహుత్తర్గీబ్ 1248లో సహీ అన్నారు. ఈ భావం బుఖారి 2843, ముస్లిం 1895లో ఉంది).

[3] నమాజ్ దాని సమయం లేదా ప్రారంభ సమయం నుండి ఆలస్యం చేయకపోవుట

అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు:

سَأَلْتُ النَّبِيَّ ﷺ: أَيُّ العَمَلِ أَحَبُّ إِلَى اللَّهِ؟ قَالَ: الصَّلاَةُ عَلَى وَقْتِهَا، قَالَ: ثُمَّ أَيٌّ؟ قَالَ: ثُمَّ بِرُّ الوَالِدَيْنِ قَالَ: ثُمَّ أَيٌّ؟ قَالَ: الجِهَادُ فِي سَبِيلِ اللَّه

నేను ప్రవక్త ﷺ ను అడిగానుః అల్లాహ్ కు చాలా ప్రీతికరమైన ఆచరణ ఏదీ అని? “నమాజ్ దాని సమయంలో చేయుట” అని ప్రవక్త చెప్పారు. ఆ తర్వాత ఏదీ అని అడిగాను, “తల్లిదండ్రుల పట్ల ఉత్తమరీతిలో ప్రవర్తించడం” అని ఆయన చెప్పారు. ఆ తర్వాత ఏదీ అని మళ్ళీ అడిగాను, “జిహాద్ ఫీ సబీలిల్లాహ్” అని చెప్పారు. (బుఖారి 527, ముస్లిం 85).

* ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు మరియు తల్లిదండ్రుల సేవను జిహాద్ పై ప్రధాన్యతనిస్తూ ప్రస్తావించారు. వాటి గౌరవోన్నతులను, ప్రాధాన్యతలను గమనించి పాటించు.

* ఈ నమాజు గనక మస్జిద్ లో సామూహికంగా పాటిస్తే, దాని పుణ్యం త్రాసులో అధికమవుతుంది. అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః

صَلَاةٌ مَعَ الْإِمَامِ أَفْضَلُ مِنْ خَمْسٍ وَعِشْرِينَ صَلَاةً يُصَلِّيهَا وَحْدَهُ

“ఇమాంతో చేసే నమాజు ఒంటరిగా చేసే నమాజు కంటే పాతిక రెట్లు ఎక్కువ శ్రేష్ఠత గలది”. (ముస్లిం 649).

ఇమాం జుహ్రీ రహిమహుల్లాహ్ నమాజులో ‘లహన్’ (ఖుర్ఆన్ పారాయణంలో జరిగే ఓ రకమైన తప్పు) చేసే వ్యక్తి వెనక నమాజు చేసేవారు, అయితే ఆయన అనేవారుః సామూహిక నమాజు ఒంటరి నమాజు కంటే ఘనతగలది లేకుంటే నేను ఇతని వెనక నమాజు చేసే వాడిని కాదు. (హిల్ యతుల్ ఔలియా 3/364).

* నమాజీల సంఖ్య ఎంత పెరుగుతుందో అంతే సామూహిక నమాజు పుణ్యం పెరుగుతూ పోతుంది. హదీసులో ఉంది:

وَإِنَّ صَلَاةَ الرَّجُلِ مَعَ الرَّجُلِ أَزْكَى مِنْ صَلَاتِهِ وَحْدَهُ، وَصَلَاتُهُ مَعَ الرَّجُلَيْنِ أَزْكَى مِنْ صَلَاتِهِ مَعَ الرَّجُلِ، وَمَا كَثُرَ فَهُوَ أَحَبُّ إِلَى اللهِ تَعَالَى

“మనిషి ఒంటరిగా చేసే నమాజు కంటే మరో వ్యక్తితో కలసి చేయడం ఎక్కువ ఉత్తమం, ఒక వ్యక్తితో కలసి చేసే నమాజు కంటే ఇద్దరితో కలసి చేయడం మరీ ఉత్తమం, ఇంకా ఎంత మంది ఎక్కువ ఉంటే అంతే ఎక్కువ అల్లాహ్ కు ప్రీతికరమైనది”. (అబూదావూద్ 554).

* హరమైన్ షరీఫైన్ (మస్జిదె హరాం మక్కా మరియు మస్జిదె నబవీ మదీనా)లో చేసే నమాజు ఘనత ఇంకా ఎక్కువగా ఉంటుంది. మస్జిదె హరాంలో చేసే నమాజు పుణ్యం ఇతర మస్జిదుల్లో చేసే ఒక లక్ష నమాజుల కంటే ఎక్కువ ఘనత, అదే మస్జిదె నబవీలోనయితే ఇతర మస్జిదుల్లోని వెయ్యి నమాజుల కంటే ఎక్కువ ఉత్తమం. జాబిర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః

صَلَاةٌ فِي مَسْجِدِي أَفْضَلُ مِنْ أَلْفِ صَلَاةٍ فِيمَا سِوَاهُ إِلَّا الْمَسْجِدَ الْحَرَامَ وَصَلَاةٌ فِي الْمَسْجِدِ الْحَرَامِ أَفْضَلُ مِنْ مِائَةِ أَلْفِ صَلَاةٍ فِيمَا سِوَاهُ

“నా మస్జిదులో ఒక నమాజు ఇతర మస్జిదుల్లోని వెయ్యి నమాజుల కంటే ఉత్తమం కేవలం మస్జిదె హరాం తప్ప. మస్జిదె హరాంలో ఇతర మస్జిదుల్లోని లక్ష నమాజులకంటే ఉత్తమం”. (బుఖారి 1190, ముస్లిం 1394, ఇబ్నుమాజ పదాలు 1406).

[4] ఒక నమాజ్ తర్వాత మరో నమాజ్ కొరకు వేచి ఉండుట

ప్రవక్త ﷺ ప్రవచించారని అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః

أَلَا أَدُلُّكُمْ عَلَى مَا يَمْحُو اللهُ بِهِ الْخَطَايَا، وَيَرْفَعُ بِهِ الدَّرَجَاتِ؟ قَالُوا بَلَى يَا رَسُولَ اللهِ قَالَ: إِسْبَاغُ الْوُضُوءِ عَلَى الْمَكَارِهِ، وَكَثْرَةُ الْخُطَا إِلَى الْمَسَاجِدِ، وَانْتِظَارُ الصَّلَاةِ بَعْدَ الصَّلَاةِ، فَذَلِكُمُ الرِّبَاطُ

“పరమ ప్రభువైన అల్లాహ్ ఏ విషయాల ఆధారంగా అపరాధాలను మన్నిస్తాడో, స్థాయిని ఉన్నతం చేస్తాడో నేను మీకు తెలుపనా?” దానికి సహచరులు ‘దైవప్రవక్తా తప్పక సెలవీయండి’ అని బదులిచ్చారు. అప్పుడాయన ఇలా బోధించారుః “(1) వాతావరణం, పరిస్థితులూ అనుకూలంగా లేనప్పటికీ వుజూ పూర్తిగా చెయ్యటం. (2) మస్జిద్ వైపునకు అధికంగా అడుగులు వెయ్యడం. (3) ఒక నమాజ్ తరువాత మరో నమాజ్ కొరకు నిరీక్షించడం. ఇది రిబాత్ తో సమానం, ఇది రిబాత్ తో సమానం”. (ముస్లిం 251).

నిశ్చయంగా ఒక నమాజు తర్వాత మరో నమాజు గురించి వేచి ఉండే ఏలాంటి కష్టం లేని, అత్యంత సులభమైన సమయం మగ్రిబ్ మరియు ఇషా మధ్యలోనిది.

[5] తల్లిదండ్రుల పట్ల సద్వర్తన

అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం ప్రకారం, ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి జిహాద్ లో పాల్గొనడానికి అనుమతి కోరాడు, “నీ తల్లిదండ్రులు ఉన్నారా?” అని ప్రవక్త అడిగారు, అవును అని అతడన్నాడు, అప్పుడు ప్రవక్త చెప్పారుః “(فَفِيهِمَا فَجَاهِد) వారిద్దరి సేవలో అత్యధికంగ కృషి చేస్తూ ఉండు”. (బుఖారి 3004, ముస్లిం 2549).

ఇబ్ను అబ్బాస్ (రదియల్లాహు అన్హు) వద్దకు ఒక వ్యక్తి వచ్చి; నేను ఒక స్త్రీకి పెళ్ళి సంబంధం కొరకు వార్త పంపాను, ఆమె నాతో పెళ్ళి చేసుకోడానికి నిరాకరించి, మరో వ్యక్తి పంపిన సందేశాన్ని స్వీకరించి అతనితో పెళ్ళికి ఇష్టపడింది, అందువల్ల నాకు రోషం పెరిగి నేను ఆమెను హత్య చేశాను, ఇక నాకు తౌబా అవకాశం ఉందా? అని అడిగాడు, నీ తల్లి ఉందా? అని ఇబ్ను అబ్బాస్ అడిగారు. లేదు అని అతడన్నాడు, అప్పుడాయన చెప్పారుః అల్లాహ్ సన్నిధిలో స్వచ్ఛమైన తౌబా చేయి, సాధ్యమైనంత వరకు ఆయన సాన్నిధ్యం పొందుటకు సత్కార్యాలు చేస్తూ ఉండు. అతా బిన్ యసార్ అంటున్నారు: నేను ఇబ్ను అబ్బాస్ వద్దకు వెళ్ళి ‘నీ తల్లి ఉందా?’ అని అతడిని ఎందుకు అడిగారు అని ప్రశ్నించాను, అందుకాయన చెప్పారుః తల్లి పట్ల సద్వర్తన కంటే ఎక్కువ అల్లాహ్ సాన్నిధ్యానికి చేర్చే ఆచరణ గురించి నాకు తెలియదు. (అదబుల్ ముఫ్రద్ 4, షేఖ్ అల్బానీ సహీ అన్నారు).

తల్లిదండ్రుల పట్ల సద్వర్తన హక్కుల్లో ఒకటేమంటేః వారి మరణానంతరం వారి బంధుమిత్రులతో సత్సంబంధాలుంచుకోవాలి. అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హుమా చెప్పారు: నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా విన్నానుః

إنَّ أَبَرَّ الْبِرِّ صِلَةُ الْوَلَدِ أَهْلَ وُدِّ أَبِيهِ.

“తనయుడు తండ్రి స్నేహితులతో సత్సంబంధాలుంచుకొనుట కూడా ఒక ఉత్తమమైన సత్కార్యం”. (ముస్లిం 2552).

అబూ బుర్ద రజియల్లాహు అన్హు కథనం: నేను మదీన వచ్చాను, అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ నాతో కలవడానికి వచ్చి, నేను ఎందుకు వచ్చానో తెలుసా? అని అడిగారు, తెలియదు అని నేను అన్నాను.

అప్పుడతడన్నాడుః నేను ప్రవక్త ﷺ చెప్పగా విన్నానుః

مَنْ أَحَبَّ أَنْ يَصِلَ أَبَاهُ فِي قَبْرِهِ فَلْيَصِلْ إِخْوَانَ أَبِيهِ بَعْدَهُ

ఎవరు తన తండ్రితో అతని సమాధిలో సత్కార్యం చేయ గోరుతాడో అతను తన తండ్రి మరణం తర్వాత అతని సోదరులతో సత్సంబంధాలుంచుకోవాలి”. (ఇబ్ను హిబ్బాన్ 432, అబూ యాలా 5669, షేఖ్ అల్బానీ సహీహుత్ తర్గీబ్ 2506లో హసన్ అన్నారు).

ప్రియ సంతానమా! మనం మన తల్లిదండ్రుల బంధువులతో సత్సంబంధాలుంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే వారి స్నేహితులతో. ఇలాంటి సత్కార్యాన్ని అల్లాహ్ చాలా ఇష్టపడతాడు.

[6] దానదర్మాలు సమకూర్చడం

రాఫి బిన్ ఖదీజ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారుః

الْعَامِلُ عَلَى الصَّدَقَةِ بِالْحَقِّ كَالْغَازِي فِي سَبِيلِ اللهِ، حَتَّى يَرْجِعَ إِلَى بَيْتِهِ

“ధర్మపరంగా దానదర్మాలు సమకూర్చేవాడు తిరిగి తన ఇంటికి వచ్చే వరకు ముజాహిద్ ఫీ సబీలిల్లాహ్ వంటి వాడు”. (అబూ దావూద్ 2936, తిర్మిజి 645 షేఖ్ అల్బానీ సహీహుల్ జామి 4117లో సహీ అన్నారు).

[7] భిక్షాటన చేయకుండా ఉండటానికి, ఆలుబిడ్డపై ఖర్చు చేయటానికి మరియు తల్లిదండ్రులపై పట్ల ఉపకారం చేయటానికి సంపాదించుట

కఅబ్ బిన్ ఉజ్రా (రదియల్లాహు అన్హు) కథనం: ఒక వ్యక్తి ప్రవక్త ప్రక్క నుండి వెళ్ళాడు, అతని శరీర ధృడత్వాన్ని, చురుకుతనాన్ని చూసిన సహాబాలు ఆశ్చర్యపోయి ఇలా అన్నారుః ప్రవక్తా! ఈ వ్యక్తి ఫీ సబీలిల్లాహ్ (అల్లాహ్ మార్గంలో పోరాడుటకు వెళ్తే ఎంత బావుండేది కదూ?) అప్పుడు ప్రవక్త అన్నారుః

إِنْ كَانَ خَرَجَ يَسْعَى عَلَى وَلَدِهِ صِغَارًا فَهُوَ فِي سَبِيلِ اللهِ، وَإِنْ كَانَ خَرَجَ يَسْعَى عَلَى أَبَوَيْنِ شَيْخَيْنِ كَبِيرَيْنِ فَهُوَ فِي سَبِيلِ اللهِ، وَإِنْ كَانَ يَسْعَى عَلَى نَفْسِهِ يُعِفُّهَا فَهُوَ فِي سَبِيلِ اللهِ، وَإِنْ كَانَ خَرَجَ رِيَاءً وَمُفَاخَرَةً فَهُوَ فِي سَبِيلِ الشَّيْطَانِ

“ఒకవేళ అతను తన చిన్నారులైన సంతానం కొరకు కష్టపడటానికి వెళ్తే అతను అల్లాహ్ మార్గంలో ఉన్నట్లే, ఒకవేళ అతను వృద్ధులైన తల్లిదండ్రుల మేలు కొరకు కష్టపడటానికి వెళ్తే అతను అల్లాహ్ మార్గంలో ఉన్నట్లే, ఒకవేళ అతను తనకు తాను చేయి చాపకుండా ఉండటం కొరకు కష్టపడటానికి వెళ్తే అతను అల్లాహ్ మార్గంలో ఉన్నట్లే, ఒకవేళ అతను పేరుప్రతిష్ఠలు సంపాదించడానికి చూపుగోళుతనం మరియు ఇతరులపై తన పెద్దరికం చూపడం కొరకు వెళ్తే అతను షైతాన్ మార్గంలో ఉన్నట్లు”. (తబ్రానీ కబీర్ 282, షేఖ్ అల్బానీ సహీహుల్ జామి 1428లో సహీ అన్నారు).

మనం మన డ్యూటీకి, ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు సత్సంకల్పం ఉంచుకొనుట ఎంత అవసరం ఉందో గమనించండి, ఇలా దానిని మనం అల్లాహ్ మార్గంలోని విధేయతలో మార్చవచ్చు తద్వారా పుణ్యాన్ని ఆశించవచ్చు.

[8] విద్యాభ్యాసం

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారని అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః

مَنْ خَرَجَ فِي طَلَبِ العِلْمِ فَهُوَ فِي سَبِيلِ اللهِ حَتَّى يَرْجِعَ

“విద్యాభ్యాసం కొరకు బయలుదేరిన వ్యక్తి తిరిగి తన ఇంటికి వచ్చే వరకు అల్లాహ్ మార్గంలో ఉన్నట్లు”. (తిర్మిజి 2647, తబ్రానీ ఔసత్ 380, షేఖ్ అల్బానీ సహీహుత్ తర్గీబ్ 88లో హసన్ లిగైరిహీ అన్నారు).

హుజైఫా బిన్ యమాన్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు ప్రవక్త ﷺ చెప్పారుః

فَضْلُ الْعِلْمِ أَحَبُّ إِلَيَّ مِنْ فَضْلِ الْعِبَادَةِ، وَخَيْرُ دِينِكُمُ الْوَرَعُ

“నా వద్ద ఆరాధన ఘనత కంటే విద్యాభ్యాసం ఘనత ఎంతో అధికంగా, ప్రియమైనది. మీ ధర్మంలోని ఉత్తమ విషయం భయభీతియే”. (హాకిం 314, తబ్రానీ ఔసత్ 3960, షేఖ్ అల్బానీ సహీహుల్ జామి 6184లో సహీ అన్నారు).

[9] హజ్ వ ఉమ్రా

ప్రవక్త ﷺ ప్రవచించారని, ఉమ్మె మఅఖల్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః

إنَّ الْحَجَّ وَالْعُمْرَةَ مِنْ سَبِيلِ اللهِ، وَإِنَّ عُمْرَةً فِي رَمَضَانَ تَعْدِلُ حَجَّةً

“నిస్సందేహంగా హజ్ వ ఉమ్రాలు అల్లాహ్ మార్గంలో పరిగణించ- బడతాయి, రమజానులో ఉమ్రా చేయటం హజ్ చేయటంతో సమానం”. (ఇబ్ను ఖుజైమా 3075, హాకిం 1774, షేఖ్ అల్బానీ సహీహుల్ జామి 1599లో సహీ అన్నారు).

షఫా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ఒక వ్యక్తి వచ్చి, నేను జిహాద్ లో పాల్గొన గోరుతున్నాను అని అన్నాడు, “కష్టం లేని ఒక జిహాద్ గురించి నీకు తెలుపాలా? అది హజ్” అని ప్రవక్త చెప్పారు. (తబ్రానీ కబీర్ 792, షేఖ్ అల్బానీ సహీహుల్ జామి 7044లో సహీ అన్నారు).

హుసైన్ బిన్ అలీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి, నేను పిరికివాడిని, బలహీనుడిని అని అన్నాడు, అందుకు ప్రవక్త కష్టం లేని జిహాద్ వైపునకు రా, అదే హజ్ అని సమాధానమిచ్చారు. (తబ్రానీ కబీర్ 2910, షేఖ్ అల్బానీ సహీహుల్ జామి 7044లో సహీ అన్నారు).

మన నుండి తప్పిపోయిన కష్టతరమైన జిహాద్ కు బదులుగా ఈ జిహాద్ లభించినందుకు దాని కాంక్ష ఎక్కువగా ఉంచి, అది హజ్జె మబ్రూర్ (అల్లాహ్ స్వీకరించే హజ్) కావడానికి దానిని ఉత్తమ విధంగా చేసే ప్రయత్నం చేయాలి.

[10] సంక్షోభ (ప్రజలు ధర్మానికి దూరమవుతున్న) కాలంలో ప్రవక్త సున్నతులను అనుసరించుట

إِنَّ مِنْ وَرَائِكُمْ زَمَانَ صَبْرٍ، للمُتَمَسِّكِ فِيهِ أَجْرُ خَمْسِينَ شَهِيدًا

“మీ తర్వాత ఓర్పుసహనాల ఓ కాలం రానుంది, ఆ కాలంలో ధర్మంపై స్థిరంగా ఉన్న వ్యక్తికి 50 మంది అమరవీరుల పుణ్యం ఉంటుంది”. (తబ్రానీ కబీర్ 10394, షేఖ్ అల్బానీ సహీహుల్ జామి 2234లో సహీ అన్నారు).

[11] ప్రతి నమాజు తర్వాత సుబ్ హానల్లాహ్, అల్ హందులిల్లాహ్, అల్లాహు అక్బర్ పలుకుట

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొందరు పేదవాళ్ళకు కొన్ని స్మరణలు (అజ్కార్) నేర్పారు, ప్రతి నమాజు తర్వాత వాటిని చదవాలి, ఇలా సిరిసంపదలు గల దానధర్మాలు చేసే, యుద్ధాలు చేసే వారికంటే (పుణ్యాల్లో) మించిపోవచ్చు. అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, పేదవాళ్ళు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇలా అన్నారుః ధనికులు తమ ధనం వల్ల ఉన్నత స్థానాలు, శాశ్వత వరాల్లో మాకంటే ముందుకు వెళ్ళిపోయారు, మేము నమాజు చేసినట్లే వారూ చేస్తారు, మేము ఉపవాసమున్నట్లు వారూ ఉంటారు, వారి వద్ద వారి అవసరాలకు మించిన ధనం ఉంది; కనుక వారు హజ్జ్, ఉమ్రా, జిహాద్ మరియు దానధర్మాలు చేస్తూ ఉంటారు. అప్పుడు ప్రవక్త చెప్పారుః

أَلاَ أُحَدِّثُكُمْ إِنْ أَخَذْتُمْ أَدْرَكْتُمْ مَنْ سَبَقَكُمْ وَلَمْ يُدْرِكْكُمْ أَحَدٌ بَعْدَكُمْ، وَكُنْتُمْ خَيْرَ مَنْ أَنْتُمْ بَيْنَ ظَهْرَانَيْهِ إِلَّا مَنْ عَمِلَ مِثْلَهُ تُسَبِّحُونَ وَتَحْمَدُونَ وَتُكَبِّرُونَ خَلْفَ كُلِّ صَلاَةٍ ثَلاَثًا وَثَلاَثِينَ

“నేను మీకో మాట చెప్పాలా? మీరు గనక దాని ప్రకారం ఆచరించారంటే మీకంటే ముందు వెళ్ళిన వారిని మీరు అందుకుంటారు, మీ వెనకున్నవారు మిమ్మల్ని చేరలేరు, మీరు అందరికంటే ఉత్తములవుతారు, కేవలం మీలాంటి ఈ ఆచరణ పాటించేవారు తప్ప, మీరు ప్రతి నమాజు తర్వాత 33 సార్లు సుబ్ హానల్లాహ్, అల్ హందులిల్లాహ్, అల్లాహ్ అక్బర్ అనండి.

అబూ హురైరా అంటున్నారుః మా మధ్య భేదాభిప్రాయం ఏర్పడింది, కొందరన్నారుః 33 సార్లు సుబ్ హానల్లాహ్, 33 సార్లు అల్ హందులిల్లాహ్, 34 సార్లు అల్లాహు అక్బర్ అందాము అని. అయితే నేను ప్రవక్త వద్దకు వెళ్ళి స్పష్టణ కోరగా, సుబ్ హానల్లాహ్, అల్ హందులిల్లాహ్, అల్లాహు అక్బర్ ప్రతి ఒక్కటి 33 సార్లు అయినట్లు అనండి. (బుఖారి 843, ముస్లిం 595).

మన తీరిక సమయాన్ని సులభతరమైన ఇలాంటి జిక్ర్(అల్లాహ్ స్మరణ)లో గడపడానికి అత్యధికంగా శ్రద్ధాశక్తులు చూపాలి, మనం వేచిస్తూ గడిపే ఘడియలను ప్రభువుకు సన్నిహితులవటానికి వినియోగించుకోవాలి.

[12] వంద సార్లు అల్ హందులిల్లాహ్ పలకడం

మూసా బిన్ ఖలఫ్ అన్నారు: ఆసిం బిన్ బహ్ దల మాకు హదీసు తెలిపారు, అబూ సాలిహ్ తో, అతను ఉమ్మె హాని బిన్తె అబీ తాలిబ్ తో, ఆమె ఇలా అన్నారు: ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నా దగ్గరి నుండి దాటారు, అప్పుడు నేనన్నాను: ప్రవక్తా! నేను వృద్ధురాలినయ్యాను, బలహీనురాలినయ్యాను (రెండిటిలో ఏదో ఒకటి అన్నారు), నేను కూర్చోని చేసుకోగల సత్కార్యం ఏదైనా నాకు తెలుపండి, అప్పుడు ప్రవక్త చెప్పారుః

سَبِّحِي اللهَ مِائَةَ تَسْبِيحَةٍ، فَإِنَّهَا تَعْدِلُ لَكِ مِائَةَ رَقَبَةٍ تُعْتِقِينَهَا مِنْ وَلَدِ إِسْمَاعِيلَ، وَاحْمَدِي اللهَ مِائَةَ تَحْمِيدَةٍ، فإنها تَعْدِلُ لَكِ مِائَةَ فَرَسٍ مُسْرَجَةٍ مُلْجَمَةٍ، تَحْمِلِينَ عَلَيْهَا فِي سَبِيلِ اللهِ، وَكَبِّرِي اللهَ مِائَةَ تَكْبِيرَةٍ، فَإِنَّهَا تَعْدِلُ لَكِ مِائَةَ بَدَنَةٍ مُقَلَّدَةٍ مُتَقَبَّلَةٍ، وَهَلِّلِي اللهَ مِائَةَ تَهْلِيلَةٍ، قَالَ ابْنُ خَلَفٍ: أَحْسِبُهُ قَالَ، تَمْلَأُ مَا بَيْنَ السَّمَاءِ وَالْأَرْضِ، وَلَا يُرْفَعُ يَوْمَئِذٍ لِأَحَدٍ مِثْلُ عَمَلِكَ إِلَّا أَنْ يَأْتِيَ بِمِثْلِ مَا أَتَيْتِ بِهِ “

“100 సార్లు సుబ్ హానల్లాహ్ అని పలుకు, అది నీ కొరకు ఇస్మాఈల్ అలైహిస్సలాం సంతానం నుండి వంద బానిసలను విడుదల చేసినంత సమానం, 100 సార్లు అల్ హందులిల్లాహ్ అని పలుకు, అది నీ కొరకు కళ్ళెం మరియు జీనుతో సహా వంద గుర్రాలు అల్లాహ్ మార్గంలో దానం చేసినంత పుణ్యానికి సమానం. 100 సార్లు అల్లాహు అక్బర్ పలుకు, అది నీ కొరకు మెడలో పట్టాలు కట్టి ఉన్న, స్వీకరించబడిన వంద ఉంటెలు దానం చేసినంత పుణ్యానికి సమానం. 100 సార్లు లాఇలాహ ఇల్లల్లాహ్ పలుకు –ఇబ్ను ఖలఫ్ అన్నాడు నా అంచన ప్రకారం (దీని ఘనత) ఇలా చెప్పారు- అది భూమ్యాకాశాల మధ్య భాగాన్ని నింపేస్తుంది, ఆ రోజు నీ లాంటి ఆచరణ ఎవరిదీ స్వీకరించబడదు. కేవలం నీ లాంటి ఈ ఆచరణ పాటించినవారు తప్ప”. (ఇబ్ను మాజ 3810, షేఖ్ అల్బానీ సహీహుత్తర్గీబ్ 1553లో హసన్ అన్నారు).

[13] అల్లాహ్ ను షహాదత్ (వీరమరణం) కోరుట

సహల్ బిన్ హనీఫ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

مَنْ سَأَلَ اللهَ الشَّهَادَةَ بِصِدْقٍ، بَلَّغَهُ اللهُ مَنَازِلَ الشُّهَدَاءِ، وَإِنْ مَاتَ عَلَى فِرَاشِهِ

“ఎవరు సత్యంగా (నిర్మలమైన మనస్సుతో) అల్లాహ్ ను షహాదత్ కోరుతారో అల్లాహ్ అతనిని షహీదు(అమరవీరు)ల స్థానానికి చేర్పిస్తాడు, అతను తన పడకపై చనిపోయిన సరే”. (ముస్లిం 1909, అబూ దావూద్ 1520, తిర్మిజి 1653).

ఈ విషయం చాలా సులభమైనది, నీలో దానిని చేసే శక్తి లేకున్నా సరే, అయితే సంకల్పంలో సత్యత మరియు సత్కార్యం చేయుటకు ముందంజ ఎంతైనా అవసరం చాలా ఉంది. అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తబూక్ యుద్ధం నుండి తిరిగి వస్తున్నప్పుడు మదీనాకు సమీపంలో ఇలా అన్నారుః

إِنَّ بِالْمَدِينَةِ أَقْوَامًا، مَا سِرْتُمْ مَسِيرًا، وَلاَ قَطَعْتُمْ وَادِيًا إِلَّا كَانُوا مَعَكُمْ ، قَالُوا: يَا رَسُولَ اللَّهِ، وَهُمْ بِالْمَدِينَةِ؟ قَالَ: وَهُمْ بِالْمَدِينَةِ، حَبَسَهُمُ العُذْرُ

“మదీనలో కొందరున్నారు, మీరు ఎక్కడ నడచినా, ఏ లోయ నుండి దాటినా వారు మీ వెంటనే ఉండిరి. ప్రవక్తా! వారు మదీనాలో ఉన్నారు కదా? అని సహచరులు అడగ్గా, అవును వారిని ఓ కారణం ఆపుకున్నందుకు మదీనలోనే ఉన్నారు (లేకుంటే మనతో వచ్చేవారు, అందుకు వారికి వారి సంకల్పం ప్రకారం పుణ్యం లభించింది)”. (బుఖారి పదాలు 4423, ముస్లిం 4731).

ఈ కష్టాలు ఎదుర్కునేవారు షహీద్ (అమరవీరుని) పుణ్యం పొందుతారు

అల్లాహ్ తన విశ్వాసులైన దాసులపై చేసిన కరుణల్లో ఒకటి వారు అనారోగ్యానికి, కష్టాలకు గురి అయితే, వారు వాటిపై సహనం వహించినప్పుడు అల్లాహ్ వారి పాపాలను మన్నిస్తాడు, స్థానాలను పెంచుతాడు. వాటిలోనే కొన్నిటికి బదులుగా షహీద్ యొక్క పుణ్యం వారికివ్వబడుతుంది. ఇలా అని విశ్వాసి వాటిని కాంక్షించ కూడదు, అల్లాహ్ ను వాటి నుండి క్షేమమే కోరాలి. కొన్ని కష్టాల్లో మరియు వాటికి గురయినవారికి లభించే షహీద్ పుణ్యం గురించి సహీ హదీసుల ద్వారా రుజువైన కొన్ని ముఖ్య విషయాలు క్రింద తెలుపుబడుతున్నాయి.

1- ప్లేగ్ (మహామారి వ్యాధి)లో చనిపోవుట

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారని జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్గుమా ఉల్లేఖించారుః

الفَارُّ مِنَ الطَّاعُونِ كَالفَارِّ مِنَ الزَّحفِ، وَمَنْ صَبَر فِيهِ كَانَ لَهُ أَجْرُ شَهِيد

“ప్రేగ్ రోగం వ్యాపించిన స్థలం నుండి పారిపోయేవాడు యుద్ధ మైదానం నుండి పారిపోయే లాంటి వాడు, మరెవరయితే అందులో సహనం వహిస్తాడో అతనికి షహీద్ పుణ్యం లభిస్తుంది”. (అహ్మద్ –అల్ ఫత్ హుర్రబ్బానీ- 17/207, ఇబ్ను హుమైద్ 1118, షేఖ్ అల్బానీ సహీహుల్ జామి 4277లో సహీ అన్నారు).

2- తన ధనసంపదలను కాపాడుతూ చనిపోవుట

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా విన్నాను అని అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః

مَنْ قُتِلَ دُونَ مَالِهِ فَهُوَ شَهِيد

తన సొమ్మును కాపాడుతూ హత్య చేయబడినవాడు షహీద్ (అమరమవీరుడు). (బుఖారి 2480, ముస్లిం 141).

అతను ఉల్లేఖించిన మరో హదీసులో ప్రవక్త ఇలా చెప్పారుః

مَنْ أُرِيدَ مَالُهُ بِغَيْرِ حَقٍّ فَقَاتَلَ فَقُتِلَ فَهُوَ شَهِيدٌ

“ఎవరి సొమ్ము అక్రమంగా తీసుకొనబడుతుందో అందుకు అతను పోరాడాడో అందులో అతను హత్యచేయబడితే అతను షహీద్”. (తిర్మిజి 1430, అబూదావూద్ 4771, షేఖ్ అల్బానీ సహీహుల్ జామి 6011లో సహీ అన్నారు).

3- తన ప్రాణాన్ని, ధర్మాన్ని, భార్యబిడ్డల్ని కాపాడుతూ చనిపోవుట

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా విన్నాను అని సఈద్ బిన్ జైద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు:

مَنْ قُتِلَ دُونَ مَالِهِ فَهُوَ شَهِيدٌ، وَمَنْ قُتِلَ دُونَ دِينِهِ فَهُوَ شَهِيدٌ، وَمَنْ قُتِلَ دُونَ دَمِهِ فَهُوَ شَهِيدٌ، وَمَنْ قُتِلَ دُونَ أَهْلِهِ فَهُوَ شَهِيدٌ

“తన సొమ్మును కాపాడుతూ హత్యచేయబడినవాడు షహీద్, తన ధర్మాన్ని కాపాడుతూ హత్యచేయబడినవాడు షహీద్, తన్ను తాను కాపాడుతూ హత్యచేయబడినవాడు షహీద్, తన భార్యబిడ్డల్ని కాపాడుతూ హత్యచేయబడినవాడు షహీద్”. (అహ్మద్ –అల్ ఫత్ హుర్రబ్బానీ- 14/34, తిర్మిజి 1421, అబూదావూద్ 4772, షేఖ్ అల్బానీ సహీహుల్ జామి 6445లో సహీ అన్నారు).

4- Pleurisy రోగంతో చనిపోవడం

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారని ఉఖ్బా బిన్ ఆమిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు:

الْـمَيِّتُ مِنْ ذَاتِ الْـجَنبِ شَهِيد

“ప్లేరిసీ రోగంలో చనిపోయిన వ్యక్తి షహీద్”. (అహ్మద్ –అల్ ఫత్ హుర్రబ్బానీ- 14/36, తబ్రానీ కబీర్ 881, షేఖ్ అల్బానీ సహీహుల్ జామి 6738లో సహీ అన్నారు).

Pleurisy ని అరబీలో జాతుల్ జంబ్, ఉర్దూలో ఫేఫ్ డే కీ ఝిల్లీ కా వర్మ్ అంటారు. కడుపులో ఒక కురుపు లేదా కంతి మాదిరిగా తయారై ఒక్కోసారి లోపల ఒక్కోసారి బయట పగిలిపోతుంది. (జామిఉల్ ఉసూల్ 2/742).

5- సముద్రంలో తలతిరుగుట మరియు అందులో మునిగి చనిపోవుట

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారని ఉమ్మె హరాం రజియల్లాహు అన్హా ఉల్లేఖించారుః

الْـمَائِدُ فِي الْبَحْرِ الَّذِي يُصِيبُهُ الْقَيْءُ لَهُ أَجْرُ شَهِيدٍ، وَالْغَرِقُ لَهُ أَجْرُ شَهِيدَيْنِ

“సముద్రంలో తలతిరిగి వాంతి అయినవారికి ఒక షహీద్ పుణ్యమైతే అందులో మునిగిపోయిన వారికి ఇద్దరి షహీదుల పుణ్యం లభిస్తుంది”. (అబూదావూద్ 4772, అర్నావూత్ జామిఉల్ ఉసూల్ 2/742లో హసన్ మరియు అల్బానీ సహీహుల్ జామి6642లో సహీ అన్నారు).

ఎవరైనా జిహాద్, హజ్, విద్యభ్యాసం మరియు వ్యాపారం లాంటి పుణ్య కార్యాల కొరకు సముద్ర మార్గాన వెళ్ళాడు, అది తప్ప అతనికి వేరే దారి కూడా లేదు అందులో అతనికి తలతిరిగితే ఒక షహీద్ పుణ్యం పొందుతాడు. (మిర్ఖాతుల్ మఫాతీహ్ షర్హు మిష్కాతిల్ మసాబీహ్ 7/401).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారని రాషిద్ బిన్ హుబైష్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః

القَتْلُ فِي سَبِيلِ الله شَهَادَة، وَالطَّاعُونُ شَهَادَة، وَالغَرقُ شَهادة، وَالبَطنُ شَهَادَة، وَالحَرقُ شَهَادَة، والسَّيلُ، وَالنُّفَسَاءُ يَـجُرُّهَا وَلَدُهَا بِسَرَرِهَا إِلَى الْـجَنَّة

“అల్లాహ్ మార్గంలో హతమవడం షహాదత్, ప్లేగ్ వ్యాధి తో చనిపోవడం షహాదత్, మునిగిపోవడం షహాదత్, కడుపు నొప్పితో చనిపోవడం షహాదత్, కాలి పోవడం షహాదత్, ‘సైల్’ నీటి ప్రవాహంలో చనిపోవడం షహాదత్, బాలింత స్త్రీలు (ఆ స్థితిలో చనిపోతే) అతని ఆ సంతానం తల్లి నాభిని పట్టుకొని స్వర్గంలో తీసుకెళ్తాడు”. (అహ్మద్ –అల్ ఫత్ హుర్రబ్బానీ- 14/37, తయాలిసీ 582 స్యూతీ జామిఉస్సగీర్ 6177లో అల్బానీ సహీహుల్ జామి4439లో హసన్ అన్నారు).

6- కడుపు నొప్పితో లేదా ఏదైనా కట్టడం కూలి చనిపోవుట

ప్రవక్త ﷺ చెప్పారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః

الشُّهَدَاءُ خَمسَةٌ: المَطْعُونُ، وَالمَبْطُونُ، وَالغَرَقُ، وَصَاحِبُ الهَدْمِ، والشَّهيدُ في سبيل الله

“ఐదు రకాల వారు షహీద్: ప్లేగ్ రోగంతో, కడుపు నొప్పితో, మునిగిపోయి, కట్టడం కూలి చనిపోయినవారు మరియు అల్లాహ్ మార్గంలో చంపబడినవారు”. (బుఖారి 2829, ముస్లిం 1914).

7- కాలిపోయి, గర్భ, బాలంత స్థితిలో స్త్రీ చనిపోవడం

ప్రవక్త ﷺ చెప్పారని, జాబిర్ బిన్ ఉతైక్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః

الشَّهَادَةُ سَبْعٌ سِوَى الْقَتْلِ فِي سَبِيلِ الله: المَقْتُولُ فِي سَبِيلِ الله شَهِيدٌ، وَالمَطْعُونُ شَهيدٌ، وَالغَرِيقُ شَهيدٌ، وَصَاحِبُ ذَاتِ الجَنبِ شَهيدٌ، وَالمَبْطُونُ شَهيدٌ، وَصَاحِبُ الْحَرِيقِ شَهِيدٌ، وَالَّذِي يَمُوتُ تَحْتَ الْـهَدْمِ شَهيدٌ، وَالْـمَرْأَةُ تَـمٌوتٌ بِجَمْعٍ شَهيد

“అల్లాహ్ మార్గంలో షహీద్ అవడం కాకుండా ఏడు రకాల షహాదత్ ఉందిః అల్లాహ్ మార్గంలో హతమైన వ్యక్తి షహీద్, ప్లేగ్ (plague) వ్యాధి తో చనిపోయిన వ్యక్తి షహీద్, మునిగిపోయిన వ్యక్తి షహీద్, ప్లేరిసీ (pleurisy) రోగంతో మరణించిన వ్యక్తి షహీద్, కడుపు నొప్పితో గతించిన వ్యక్తి షహీద్, కాలిపోయిన వ్యక్తి షహీద్, కట్టడాలు కూలి చనిపోయిన వ్యక్తి షహీద్, ‘జమ్అ’లో మరణించిన స్త్రీ షహీద్”. (మవత్తఅ మాలిక్ 2829, అబూదావూద్ 3111, షేఖ్ అల్బీ సహీహుల్ జామి 3739లో సహీ అన్నారు).

8- సిల్ రోగంలో చనిపోవడం

ఉబాద బిన్ సామిత్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః “సిల్ రోగంతో చినిపోవడం కూడా షహాతద్”. (షేఖ్ అల్బానీ సహీహుల్ జామి 3691లో సహీ అన్నారు).

(ఊపిరితిత్తుల్లో పుండు అయి రక్తం స్రవిస్తుంది, దానిని సిల్ అంటారు, క్షయరోగం అని బహుశా దానినే అనబడుతుంది).

17వ కార్యం: అల్లాహ్ కు అతి ప్రియమైన కార్యం

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఘనతగల కార్యాల్లో కొన్ని మహా ఘనత గల కార్యాలను ప్రస్తావించారు, అవి అల్లాహ్ వద్ద అతి ప్రియమైనవని మరియు అతిఉత్తమమైనవని తెలిపారు, ఇలాంటి కార్యాల పట్ల మన శ్రద్ధాశక్తులు అధికంగా ఉండాలి.

[1] ప్రజల్లో సంతోషాన్ని ప్రవేశింపజేయుట, కష్టాలు తొలగించుట

అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త ﷺ తెలిపారు:

أَحَبُّ النَّاسِ إِلَى اللهِ تَعَالَى أَنْفَعُهُمْ لِلنَّاسِ، وَأَحَبُّ الْأَعْمَالِ إِلَى اللهِ تَعَالَى سُرُورٌ تُدْخِلُهُ عَلَى مُسْلِمٍ، أَوْ تَكَشِفُ عَنْهُ كُرْبَةً، أَوْ تَقْضِي عَنْهُ دَيْنًا، أَوْ تَطْرُدُ عَنْهُ جُوعًا، وَلَأَنْ أَمْشِيَ مَعَ أَخِي فِي حَاجَةٍ أَحَبُّ إِلَيَّ مِنْ أَنْ أَعْتَكِفَ فِي هَذَا الْمَسْجِدِ – يَعْنِي مَسْجِدَ الْمَدِينَةِ- شَهْرًا وَمَنَ كَفَّ غَضَبَهُ سَتَرَ اللهُ عَوْرَتَهُ، وَمَنْ كَظَمَ غَيْظَهُ، وَلَوْ شَاءَ أَنْ يُمْضِيَهُ أَمْضَاهُ مَلَأَ اللهُ قَلْبَهُ رَجَاءً يَوْمَ الْقِيَامَةِ، وَمَنْ مَشَى مَعَ أَخِيهِ فِي حَاجَةٍ حَتَّى يَتَهَيَّأَ لَهُ أَثْبَتَ اللهُ قَدَمَهُ يَوْمَ تَزُولُ الْأَقْدَامِ وَإِنَّ الْخُلُقَ السَّيِّئَ لَيُفْسِدُ الْعَمَلَ كَمَا يُفْسِدُ الْخَلُّ الْعَسَلَ

“ప్రజల్లో వారి కొరకు అధిక ప్రయోజనపరుడే అల్లాహ్ కు ఎక్కువ ప్రియుడైనవాడు. అల్లాహ్ కు ఎక్కువగా ప్రియమైన సత్కార్యాల్లో ముస్లింకు సంతోషం కలిగించుట, అతని కష్టాని దూరం చేయుట, అప్పును చెల్లించుట, ఆకల్ని తీర్చుట. నేను నా ఈ మస్జిద్ (మదీనా తయిబాలోని మస్జిదె నబవి)లో ఒక మాసం ఏతికాఫ్ లో ఉండడం కంటే నా ముస్లిం సోదరుని వెంట నడచి అతని ఏదైనా అవసరాన్ని తీర్చడం నాకు ఎక్కువ ఇష్టమైనది. ఎవరు తన కోపాన్ని మింగేస్తాడో అల్లాహ్ అతని రహస్యాలను కాపాడతాడు, ఎవరు తన కోపాన్ని-తలచుకుంటే కోపం ప్రకారం ఆచరించవచ్చు కాని అలా ఆచరించకుండా- దిగమింగుతాడో అల్లాహ్ ప్రళయదినాన అతని హృదయాన్ని ఆశలతో నింపేస్తాడు. ఎవరు తన సోదరుని వెంట నడచి అతని ఏదైనా అవసరాన్ని పూర్తి చేస్తాడో, అల్లాహ్ పాదాలు కదలిపోయే రోజు అతని పాదాలను స్థిరంగా ఉంచుతాడు. వెనిగర్ తేనెను పాడు చేసినట్లు దుష్వర్తన సత్కర్మల్ని పాడు చేస్తుంది. (తబ్రానీ కబీర్ 3187, సహీహుల్ జామి అల్బానీ 176).

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

مِنْ أَفْضَلِ الْعَمَلِ إِدْخَالُ السُّرُورِ عَلَى الْمُؤْمِنِ: يَقْضِي عَنْهُ دَيْنًا، يَقْضِي لَهُ حَاجَةً، يُنَفِّسُ عَنْهُ كُرْبَةً

“విశ్వాసునికి సంతోషం కలుగజేయుట అతి ఉత్తమమైన ఆచరణలో లెక్కించబడుతుంది: అంటే అతని అప్పు తీర్చుట, అతని అవసరాన్ని పూర్తి చేయుట, అతనిపై ఉన్న కష్టాన్ని తొలగించుట”. (బైహఖీ ఫీ షొఅబిల్ ఈమాన్ 7274, సహీహుల్ జామి 5897).

[2] ప్రజలకు అవస్త కలిగించకుండా ఉండుట

سَأَلْتُ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فَقُلْتُ: يَا رَسُولَ اللهِ، أَيُّ الْأَعْمَالِ أَفْضَلُ؟ قَالَ: «الصَّلَاةُ عَلَى مِيقَاتِهَا» قُلْتُ: ثُمَّ مَاذَا يَا رَسُولَ اللهِ؟ قَالَ: «بِرُّ الْوَالِدَيْنِ» ، قُلْتُ: ثُمَّ مَاذَا يَا رَسُولَ اللهِ؟ قَالَ: «أَنْ يَسْلَمَ النَّاسُ مِنْ لِسَانِكَ»

అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో అడిగాను, ప్రవక్తా! ఆచరణల్లో అతిఉత్తమమైనది ఏ ఆచరణ అని? ప్రవక్త చెప్పారు: “నమాజు దాని సమయంలో చేయుట”. ఆ తర్వాత ఏదీ అని అడిగాను, “తల్లిదండ్రుల పట్ల సేవ సద్వర్తన” అని చెప్పారు, ఆ తర్వాత ఏదీ అని మళ్ళీ అడిగాను, అప్పుడన్నారు: “ప్రజలు నీ నాలుక (మాటలతో అవస్త కలగకుండా) నుండి సురక్షితంగా ఉండాలి”. (తబ్రానీ కబీర్ 9802, షేఖ్ అల్బానీ సహీహుత్తర్గీబ్ 2852లో సహీ అన్నారు).

అబూ మూసా అష్అరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, ఏ ఇస్లాం ఉత్తమమైనది అని నేను అడిగినప్పుడు

مَنْ سَلِمَ الـمُسْلِمُونَ مِنْ لِسَانِهِ، وَيَدِهِ

“ఎవని నోటి మరియు చేతలతో ఇతర ముస్లిములు సురక్షితంగా ఉంటారో అలాంటి వ్యక్తి ముస్లిం”. (బుఖారి 11, ముస్లిం 42).

[3] మనిషి తన హృదయాన్ని అన్యాయం, అత్యాచారం మరియు కపటము, ఈర్ష్యలు లేకుండా శుభ్రంగా ఉంచుట

అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజయిల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, ఉత్తమ పురుషుడెవడు అని అడిగినప్పుడు, ప్రవక్త చెప్పారు:

كُلُّ مَخْمُومِ الْقَلْبِ، صَدُوقِ اللِّسَانِ ، قَالُوا: صَدُوقُ اللِّسَانِ، نَعْرِفُهُ، فَمَا مَخْمُومُ الْقَلْبِ؟ قَالَ: هُوَ التَّقِيُّ النَّقِيُّ، لَا إِثْمَ فِيهِ، وَلَا بَغْيَ، وَلَا غِلَّ، وَلَا حَسَدَ

“మఖ్మూముల్ ఖల్బ్ మరియు సత్యవంతుడు. వారన్నారు: ప్రవక్తా! సత్యవంతుడు తెలుసు, కాని మఖ్మూల్ ఖల్బ్ అంటే ఎవరు? అప్పుడు ప్రవక్త చెప్పారు: భయభీతగలవాడు, పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అంటే మనస్సులో ఏ పాప కోరిక, అత్యాచార ఆలోచన, కపటం మరియు ఈర్ష్యలు లేనివాడు”. (ఇబ్ను మాజ పదాలు 4216, బైహఖీ, షేఖ్ అల్బానీ సహీహుత్తర్గీబ్ 2889లో సహీ అన్నారు).

[4] బంధుత్వం తెంచేవారితో పెంచుకొనుట, ఇవ్వనివారికి ఇచ్చుట మరియు ప్రతీకారం తీర్చుకోక పోవుట

ఉక్బా బిన్ ఆమిర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కలసి, ఆయన చేయి పట్టుకొని, ప్రవక్తా! ఘనతగల సత్కార్యాల గురించి చెప్పండి అని విన్నవించుకున్నాను. అప్పుడు ప్రవక్త చెప్పారు:

يَا عُقْبَةُ، صِلْ مَنْ قَطَعَكَ، وَأَعْطِ مَنْ حَرَمَكَ، وَأَعْرِضْ عَمَّنْ ظَلَمَكَ

ఉక్బా! బంధుత్వాన్ని తెంచుకున్నవానితో నీవు బంధుత్వం పెంచుతూపో, నీకు ఇవ్వని వారికి నీవు ఇస్తూ ఉండు, నీపై దౌర్జన్యం చేసిన వ్యక్తి పట్ల శ్రద్ధ ఇవ్వకు”. (అహ్మద్ –అల్ ఫత్ హుర్రబ్బానీ- 19/82, హాకిం 7285, షేఖ్ అల్బానీ సహీహుత్తర్గబ్ 2536లో సహీ లిగైరిహీ అన్నారు).

[5] అల్లాహ్ స్మరణ మరియు ప్రశంసలతో నాలుకను తడిగా ఉంచాలి

మాలిక్ బిన్ యుఖామిర్ రహిమహుల్లాహ్ ఉల్లేఖించారు, ముఆజ్ బిన్ జబల్ రజియల్లాహు అన్హు వారితో చెప్పారు: ప్రవక్త నుండి వీడ్కోలు తీసుకుంటున్నప్పుడు నేను చివరిగా అడిగిన మాట ఏమిటంటే: అల్లాహ్ కు ప్రీతికరమైన ఆచరణ ఏది? దానికి ప్రవక్త ఇలా సమాధానమిచ్చారు:

أَنْ تَمُوتَ وَلِسَانُكَ رَطْبٌ مِنْ ذِكْرِ اللهِ

“నీవు చనిపోతున్నప్పుడు నీ నాలుక అల్లాహ్ స్మరణతో తడిగా ఉండాలి”. (ఇబ్ను హిబ్బాన్ 818, తబ్రానీ కబీర్ 18, షేఖ్ అల్బానీ సహీహుత్ తర్గీబ్ 1492లో సహీ అన్నారు).

సముర బిన్ జుందుబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

أَحَبُّ الْكَلَامِ إِلَى اللهِ أَرْبَعٌ: سُبْحَانَ اللهِ، وَالْحَمْدُ لِلهِ، وَلَا إِلَهَ إِلَّا اللهُ، وَاللهُ أَكْبَرُ. لَا يَضُرُّكَ بِأَيِّهِنَّ بَدَأْتَ

“అల్లాహ్ కు అతి ప్రియమైన పలుకులు నాలుగు: సుబ్ హానల్లాహ్, అల్ హందులిల్లాహ్, లాఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్. ఈ నాల్గిట్లో దేని నుండి నీవు మొదలు పెట్టినా ఏ నష్టమూ లేదు”. (ముస్లిం 2137).

عَنْ أَبِي ذَرٍّ، قَالَ: قُلْتُ: يَا رَسُولَ اللهِ، أَوْصِنِي. قَالَ: إِذَا عَمِلْتَ سَيِّئَةً فَأَتْبِعْهَا حَسَنَةً تَمْحُهَا . قَالَ: قُلْتُ: يَا رَسُولَ اللهِ، أَمِنَ الْحَسَنَاتِ لَا إِلَهَ إِلَّا اللهُ؟ قَالَ: هِيَ أَفْضَلُ الْحَسَنَاتِ.

అబూ జర్ర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్తా! నాకు ఏదైనా ఉపదేశించండి అని ప్రవక్తతో విన్నవించుకోగా, ఆయన చెప్పారుః నీతో ఏదైనా పాపం జరిగితే వెంటనే పుణ్యం చేయి, అది దానిని తుడిచివేస్తుంది. నేనడిగాను, ప్రవక్తా! లాఇలాహ ఇల్లల్లాహ్ కూడా పుణ్యకార్యాల్లో ఒకటా? ప్రవక్త చెప్పారు: అది పుణ్యాల్లో అతిశ్రేష్ఠమైనది. (అహ్మద్ –అల్ ఫత్ హుర్రబ్బానీ- 14/209, షేఖ్ అల్బానీ సహీహుత్ తర్గీబ్ 3162లో సహీ అన్నారు).

అందుకే లాఇలాహ ఇల్లల్లాహ్ విశ్వాస భాగాల్లో చాలా ఉన్నత స్థానానికి చెందినది.

అబూ ఉమామ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త ﷺ చెప్పారు:

مَنْ هَالَهُ اللَّيْلُ أَنْ يُكَابِدَهُ، وَبَخِلَ بِالْمَالِ أَنْ يُنْفِقَهُ، وَجَبُنَ عَنِ الْعَدُوِّ أَنْ يُقَاتِلَهُ، فَلْيُكْثِرْ أَنْ يَقُولَ: سُبْحَانَ اللهِ وَبِحَمْدِهِ، فَإِنَّهَا أَحَبُّ إِلَى اللهِ مِنْ جَبَلِ ذَهَبٍ وَفِضَّةٍ يُنْفَقَانِ فِي سَبِيلِ اللهِ عَزَّ وَجَلَّ

ఎవరు రాత్రి వేళ మేల్కొని (తహజ్జుద్ కై) శ్రమ పడుటకు భయపడ్డాడో, ధనాన్ని (అల్లాహ్ మార్గంలో) ఖర్చు చేయుట నుండి పిసినారితనం వహించాడో మరియు శతృవుతో పోరాడడానికి పిరికితనం వహించాడో అతను అధికంగా సుబ్ హానల్లాహి వబిహందిహీ అనాలి. ఈ పదాలు అల్లాహ్ దృష్టిలో అల్లాహ్ మార్గంలో ఖర్చుపెట్టబడ్డ వెండి, బంగారాల కంటే ఎక్కువ ఇష్టమైనవి, ప్రియమైనవి”. (తబ్రానీ కబీర్ 7795, అల్బానీ సహీహుత్తర్గీబ్ 1541లో సహీ లిగైరిహీ అని అన్నారు).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారని అబూ జర్ గిఫారీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు:

أَلَا أُخْبِرُكَ بِأَحَبِّ الْكَلَامِ إِلَى اللهِ؟ قُلْتُ: يَا رَسُولَ اللهِ أَخْبِرْنِي بِأَحَبِّ الْكَلَامِ إِلَى اللهِ، فَقَالَ: إِنَّ أَحَبَّ الْكَلَامِ إِلَى اللهِ: سُبْحَانَ اللهِ وَبِحَمْدِهِ

“అల్లాహ్ కు అతిగా ప్రియమైన పలుకులేమిటో తెలుపనా? అని అడిగారు ప్రవక్త. నేను అన్నాను: ప్రవక్తా! అల్లాహ్ కు అతిగా ప్రియమైన పలుకులేమిటో తెలుపండి, ప్రవక్త చెప్పారు: అల్లాహ్ కు అతిగా ప్రియమైన పలుకులు: సుబ్ హానల్లాహి వబిహందిహి”.

ప్రవక్త ﷺ చెప్పారని అబూ జర్ర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు:

أَحَبُّ الْكَلَامِ إِلَى اللهِ: سُبْحَانَ اللهِ لَا شَرِيكَ لَهُ، لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ، وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ، لَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِاللهِ، سُبْحَانَ اللهِ وَبِحَمْدِهِ

“అల్లాహ్ కు చాలా ప్రియమైన పలుకులు: సుబ్ హానల్లాహి లా షరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్ లాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహి సుబ్ హానల్లాహి వబిహందిహి”. (అదబుల్ ముఫ్రద్ 638, షేఖ్ అల్బానీ సహీ అన్నారు).

ప్రవక్త ﷺ తెలిపారని అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు­:

التَّأَنِّي مِنَ اللهِ، وَالْعَجَلَةُ مِنَ الشَّيْطَانِ، وَمَا شَيْءٌ أَكْثَرَ مَعَاذِيرَ مِنَ اللهِ، وَمَا مِنْ شَيْءٍ أَحَبَّ إِلَى اللهِ مِنَ الْحَمْدِ

“నిదానం అల్లాహ్ వైపు నుండి, తొందరపాటు షైతాన్ తరఫు నుండి. అల్లాహ్ కంటే ఎక్కువ సాకులను వినేవాడు మరెవడూ లేడు. అల్లాహ్ కు హంద్ (ఆయన్ని స్తుతించడం) కంటే ఎక్కువ మరేదీ ఇష్టం లేదు”. (అబూ యఅలా 4256, షేఖ్ అల్బానీ సహీహుత్ తర్గీబ్ 1572లో సహీ అన్నారు).

ఇమ్రాన్ బిన్ హుసయ్యిన్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త ﷺ తెలిపారు:

إِنَّ أَفْضَلَ عِبَادِ اللهِ يَوْمَ الْقِيَامَةِ الْحَمَّادُونَ

“నిశ్చయంగా ప్రళయదినాన అల్లాహ్ దాసుల్లో అతిశ్రేష్ఠులు హమ్మాదూన్ (అల్లాహ్ ను అధికంగా స్తుతించేవారు)”. (తబ్రానీ కబీర్ 254, షేఖ్ అల్బానీ సహీహుల్ జామి 1571లో సహీ అన్నారు).

ఇంతకు ముందు 14వ కార్యంలో త్రాసులో బరువుగా ఉండే కొన్ని జిక్ర్, స్మరణల గురించి తెలుపబడింది. నీవు తప్పక ఆ పేజీలను తిరిగి వెయ్యి, దినమంతా వాటి ద్వారా నీ నాలుకను తడిగా ఉంచు.

ముహమ్మద్ అల్ ఖురజీ రహిమహుల్లాహ్ చెప్పారు: ఒకవేళ జిక్ర్ చేయకుండా ఉండే అనుమతి ఇవ్వబడితే జకరియ్యా అలైహిస్సలాంకు ఇవ్వబడేది, కాని చదవండి:

[آيَتُكَ أَلَّا تُكَلِّمَ النَّاسَ ثَلَاثَةَ أَيَّامٍ إِلَّا رَمْزًا وَاذْكُرْ رَبَّكَ كَثِيرًا]

నీ కొరకు నిదర్శనం ఏమిటంటే, మూడు రోజుల వరకు నువ్వు సైగలు చేయటం తప్ప జనులతో మాట్లాడ లేవు. నీవు నీ ప్రభువును అధికంగా స్మరిస్తూ ఉండు. (ఆలె ఇమ్రాన్ 3:41).

ఒకవేళ జిక్ర్ ను మానుకునే అనుమతి ఉంటే అల్లాహ్ మార్గంలో యుద్ధం చేసేవారికి ఉండేది, కాని చదవండి:

[يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا لَقِيتُمْ فِئَةً فَاثْبُتُوا وَاذْكُرُوا اللهَ كَثِيرًا] {الأنفال:45}

ఓ విశ్వాసులారా! మీరు ఏ ప్రత్యర్థి సైన్యాన్ని అయినా ఎదుర్కొవలసి వచ్చినప్పుడు నిలకడ చూపండి. అత్యధికంగా అల్లాహ్ ను స్మరించండి. (అన్ఫాల్ 8:45).

[6] అల్లాహ్ భయంతో కంటితడ పెట్టుకోవటం

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని అబూ ఉమామ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః

لَيْسَ شَيْءٌ أَحَبَّ إِلَى اللهِ مِنْ قَطْرَتَيْنِ وَأَثَرَيْنِ، قَطْرَةٌ مِنْ دُمُوعٍ فِي خَشْيَةِ اللهِ، وَقَطْرَةُ دَمٍ تُهَرَاقُ فِي سَبِيلِ اللهِ، وَأَمَّا الأَثَرَانِ: فَأَثَرٌ فِي سَبِيلِ اللهِ، وَأَثَرٌ فِي فَرِيضَةٍ مِنْ فَرَائِضِ اللهِ

“అల్లాహ్ కు రెండు చుక్కలు (డ్రాప్స్) మరియు రెండు గుర్తులు (మచ్చలు) కంటే ఎక్కువ ప్రియమైనవి, ఇష్టమైనవి మరేమీ లేవు. ఒకటి: అల్లాహ్ భయంతో రాలిపడే కన్నీటి చుక్క. రెండు: అల్లాహ్ మార్గంలో (పోరాడినప్పుడు) చిందే రక్తపు బొట్టు. ఇక రెండు గుర్తుల్లో ఒకటి: అల్లాహ్ మార్గంలోని గుర్తులు. రెండు: అల్లాహ్ విధుల్లోని ఏదైనా విధిని నెరవేర్చినందుకు పడిన గుర్తు”. (తిర్మిజి 1669, తబ్రానీ కబీర్ 7918, షేఖ్ అల్బానీ సహీహుత్ తర్గీబ్ 1326లో హసన్ అన్నారు).

ముల్లా అలీ ఖారీ రహిమహుల్లాహ్ చెప్పారు: అల్లాహ్ మార్గంలోని గుర్తు అంటే వచ్చి పడిన దుమ్ము వల్ల, కలిగిన పుండు లేదా విద్యభ్యాసంలో పడిన సిరా. అల్లాహ్ విధుల్లోని ఓ విధి నెరవేర్చినందుకు పడిన గుర్తు అంటే చలి కాలంలో వుజూ చేస్తున్నందుకు చేతుల్లో కాల్లళ్ళో చీలికలు పడుట, వుజు తడి మిగిలి ఉండుట, సజ్దా చేయడం వల్ల నొసటిపై మచ్చ పడుట, ఉపవాసంలో నోటి ద్వార వాసన వచ్చుట, హజ్ లో కాళ్ళకు దుమ్ము పట్టుట లాంటివి.

[7] నమాజ్ ఆరంభంలో చదివే దుఆ

నమాజు ఆరంభంలో చదివే దుఆలు ఎన్నో ఉన్నాయి, సుమారు పన్నెండు వరకు ఉన్నాయి, వాటిలో ప్రఖ్యాతి గాంచినది ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖించినది, ప్రవక్త ﷺ నమాజు ఆరంభంలో ఈ దుఆ చదివేవారు: సుబ్ హానకల్లాహుమ్మ వబిహందిక వతబారకస్ముక వతఆలా జద్దుక వలాఇలాహ గైరుక. ఈ దుఆ అల్లాహ్ కు ప్రియమైన పలుకుల్లో ఒకటి. అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు ప్రవక్త ﷺ చెప్పారు:

إِنَّ أَحَبَّ الْكَلَامِ إِلَى اللهِ أَنْ يَقُولَ الْعَبْدُ: سُبْحَانَكَ اللهُمَّ وَبِحَمْدِكَ، وَتَبَارَكَ اسْمُكَ، وَتَعَالَى جَدُّكَ، وَلَا إِلَهَ غَيْرَكَ، وَإِنَّ أَبْغَضَ الْكَلَامِ إِلَى اللهِ أَنْ يَقُولَ الرَّجُلُ لِلرَّجُلِ: اتَّقِ اللهَ فَيَقُولُ: عَلَيْكَ نَفْسَكَ

“నిశ్చయంగా అల్లాహ్ కు ప్రియమైన పలుకులు, మనిషి ఇలా పలకడం సుబ్ హానకల్లాహుమ్మ వబిహందిక వతబారకస్ముక వతఆలా జద్దుక వలాఇలాహ గైరుక (భావం: ఓ అల్లాహ్! నీ స్తోత్రముతో పాటు నీ పవిత్రతను కొనియాడుతున్నాము, నీ నామము చాలా శుభము గలది, నీ కీర్తి ఉన్నతమైనది, నీ తప్ప ఆరాధ్యదైవం లేదు). అల్లాహ్ కు ఇష్టం లేని పలుకులు: ఒక వ్యక్తి మరో వ్యక్తితో నీవు అల్లాహ్ కు భయపడు అని చెబితే, నీది నీవు చూసుకో అని సమాధానమివ్వడం”. (నిసాయి కుబ్రా పదాలు 10685, తబ్రానీ కబీర్ 8587, సహీహా అల్బానీ 2939).

[8] ఎడతెగకుండా చేసే కొంచమైన సత్కార్యం ఎక్కువగా చేసి వదిలేసే సత్కార్యానికంటే ఎంతో ఉత్తమం

ఘనతగల సత్కార్యాలలో ఏదైనా చిన్నపాటి సత్కార్యమైనా చూస్తూపోవడం, దీర్ఘకాలికంగా, మాటిమాటికి చేయడం ఒకసారి చేసి వదిలేయడం కంటే చాలా మేలు. ఉందాహరణకు: స్వఛ్చంద సేవ సంస్థకు ఆర్థిక సహాయం చేస్తూ ఉండడం, ప్రతి రోజు ఖుర్ఆన్ లోని కొంత భాగ పారాయణం. ఖాసిం బిన్ ముహమ్మద్ రహిమహుల్లాహ్ ఆయిషా రజియల్లాహు అన్హా ద్వారా ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

أَحَبُّ الْأَعْمَالِ إِلَى اللهِ تَعَالَى أَدْوَمُهَا، وَإِنْ قَلَّ

“అల్లాహ్ కు చాలా ప్రీతికరమైన సత్కార్యాలలో దానిని ఎడతెగకుండా చేయబడే సత్కార్యం, అది కొంచెం లేదా చిన్నదైనా సరే”. (ముస్లిం 783, బుఖారి 6464).

ఖాసిం చెప్పారు: ఆయిషా రజియల్లాహు అన్హా ఏదైనా సత్కార్యం చేయనారంభించిందంటే చేస్తూ ఉండేవారు.

18వ కార్యం: అల్లాహ్ వైపునకు ఆహ్వానించుట

‘మేలు వైపుకు పిలిచే వ్యక్తి ఆ మేలును ఆచరించే వ్యక్తి లాంటివాడు’ ఇలాగే ప్రవక్త మనకు తెలిపారు, అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: ఒక వ్యక్తి ప్రవక్త వద్దకు వచ్చి సవారీ అడిగాడు, అప్పుడు ప్రవక్త వద్ద అతనికి ఇవ్వడానికి ఏ సవారీ లేనందున, మరో వ్యక్తి వద్దకు అతడ్ని పంపారు, అతడు వానికి సవారీ ఇచ్చాడు, అడిగిన వ్యక్తి ప్రవక్త వద్దకు వచ్చి (ఆ వ్యక్తి సవారీ ఇచ్చాడని) చెప్పాడు, అప్పుడు ప్రవక్త ఇలా ప్రవచించారు:

إِنَّ الدَّالَّ عَلَى الخَيْرِ كَفَاعِلِهِ

“నిశ్చయంగా మేలు వైపుకు పిలిచే వ్యక్తి దానిని చేసే వ్యక్తి లాంటి వాడు”. (అహ్మద్ –అల్ ఫత్ హుర్రబ్బానీ- 18/66, తిర్మిజి 2670, తబ్రానీ కబీర్ 632, షేఖ్ అల్బానీ సహీహుత్తర్గీబ్ 116లో సహీ అన్నారు).

విని సంతోషపడవలసిన హదీసుల్లో అతిగొప్ప హదీసు ఇది ఒకటి, ఇందులో చూపబడిన పద్థతిలో అనేకానేక పుణ్యాలు సంపాదించవచ్చు, నీవు ఎవరికి మేలు చేసినా, సత్కార్యం వైపుకు పిలిచినా వారందరు ఆ మేలును ఆచరించే పుణ్యం నీ పుణ్య త్రాసులో ఉంటుంది, వారి పుణ్యాల్లో ఏ మాత్రం తక్కువ కాదు. ఈ విధంగా నీ పుణ్యాల త్రాసు బరువు అధికంగా పెరుగుతూ ఉంటుంది.

ఎవరిదైనా జనాజ ఉందని నీకు తెలిస్తే, నీవు నీ ఓ పది మంది స్నేహితులకి తెలిపితే, వారందరూ హాజరయితే నీకు 20 ఖీరాతుల పుణ్యం లభిస్తుంది. ఇక నీ స్నేహితుల్లో ఎవరైనా వారి స్నేహితులకు పంపితే ఎలా ఉంటుందో గమనించు? నిశ్చయంగా ఖీరాతుల పుణ్యం సంఖ్య పెరిగిపోతుంది ఇన్ షా అల్లాహ్.

నీవు ఏదైనా ఘనతగల ఆచరణ ఒకసారి చేస్తావు, కాని దాని పుణ్యం నీ త్రాసులో వెయ్యి రెట్లు ఎక్కువగా ఉండవచ్చు, ఎలా అంటే? నీవు ఆ ఆచరణ గురించి ఇతరులకు తెలిపి ఉంటావు, వారిలో ఎవరైనా నీకంటే ఎక్కువ ధైర్యం గలవారుంటారు, ఆ సత్కార్యం అనేక సార్లు చేస్తారు, ఇతరులకు నేర్పుతారు ఈ విధంగా వారి పుణ్యాల్లో ఏ కొరతా జరగకుండా నీకు వారందరికి సమానమైన పుణ్యం లభిస్తుంది.

అల్లాహ్ నిన్ను కరుణించుగాక! ఇలాంటి సత్కార్యాల్లో ఇతరులను మించిపోయే ప్రయత్నం చేయి, ఇది నీ కొరకు ధన సమీకరణ కంటే ఎంతో మేలయినది మరియు శాశ్వతమైనది.

19వ కార్యం: త్రాసు బరువుగా ఉండాలన్న తపన

తన త్రాసు బరువుగా ఉండాలన్న తపన ఎవరికి ఉంటుందో అతను గంటలేమిటి క్షణం కూడా వృధా కాకుండా వ్యవహరిస్తాడని నా ఆలోచన, ఎందుకనగా అతను తన త్రాసును బరువుగలదిగా చేయడంలో నిమగ్నుడై బిసీగా ఉన్నాడు, అందుకే అతను వృధా కార్యాలకు, పాపానికి దూరంగా ఉంటాడు, ఏదైనా పొరపాటు జరిగినా దాని నష్టం అతని పుణ్యాలకు కలగకుండా క్షమాపణ కోరడానికి తొందరపాటు పడతాడు.

కనీసం ఒకరోజు గురించైనా ఇలాంటి ఆరట కలిగి ఉండు అప్పుడు నీ ఆ రోజు ఎలా గడుస్తుందో చూడు, నీవు ఒక వేరే మనిషివి అవుతావు అంటే అతిశయోక్తి కాదు.

సత్కార్యాల మధ్య ఘనత భేదం

తన త్రాసు బరువుగా ఉండాలన్న ఆరాటం కలిగి ఉన్న వ్యక్తి ముందు సత్కార్యాలు ఎక్కువగా ఏర్పడినప్పుడు లేదా వాటి ఘనతలో హెచ్చుతగ్గుల భేదం ఏర్పడినప్పుడు ఏ సత్కార్య పుణ్యం ఎక్కువగా ఉందో దానిని ఎంచుకోవాలి, ఆచరించాలి.

ఒక గొప్ప తాబిఈ జాబిర్ బిన్ జైద్ రహిమహుల్లాహ్ చెప్పారు: నాకు అనాధ లేదా నిరుపేదకు ఒక దిర్హమ్ దానం చేయడం నఫిల్ హజ్ (ఫర్జ్ హజ్ కాదు) చేయడం కంటే ఎక్కువ ఇష్టం. (హిల్ యతుల్ ఔలియా 3/90).

ముహమ్మద్ బిన్ మున్కదిర్ రహిమహుల్లాహ్ చెప్పారు: తల్లి సేవ చేసుకుంటూ ఉండడం రాత్రి తహజ్జుద్ చేయడం కంటే ఎక్కువ ఇష్టం. ఆయన అన్నారు: నేను రాత్రంతా నా తల్లి కాళ్ళు ఒత్తుతూ ఉంటిని, నా సోదరుడు తహజ్జుద్ చేసుకుంటూ ఉన్నాడు, నాకు అతని రాత్రి కంటే నా రాత్రి ఎక్కువ సంతోషాన్ని కలగజేసింది. (హిల్ యతుల్ ఔలియా 3/150).

ఇబ్ను హజర్ రహిమహుల్లాహ్ చెప్పారు: దానం కంటే నమాజు ఘనత గొప్పదని ఆధారాలున్నాయి, అయినా అగత్యపరుడు ఎదురయినప్పుడు అతని సహాయ నిమిత్తం దానం నమాజు కంటే గొప్పది. (ఫత్ హుల్ బారీ 2/13. హ.నం: 527).

ఇబ్ను ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ ఏ సందర్భంలో ఏ ఆచరణ (ఆరాధన) అఫ్జల్ [అంటే ఎక్కువ ఘనత గలది] అన్న విషయంలో ఉలమాల భేదాభిప్రాయాలను నాలుగు రకాలుగా ప్రస్తావించారు: వాటిలో నాల్గవ దానిని బలపరచి ఇలా చెప్పారు:

నాల్గవ రకం: ఏ సమయం, ఏ సందర్భంలో ఏ ఆచరణ అల్లాహ్ కు ఎక్కువ ప్రీతికరమో అది చేయడమే అఫ్జల్.

కొన్ని ఉదాహరణలు: జిహాద్ సమయంలో జిహాద్ చేయడమే అఫ్జల్, దీని వల్ల రేయింబవళ్ళలో చేసే తహజ్జుద్, ఉపవాసాలు లాంటి నఫిల్ సత్కార్యాలు వదలివేయ వలసినా సరే, శాంతి సమయంలో చేసే సంపూర్ణ నమాజు వదలి (ఖుర్ఆన్ లో తెలిపినట్లు) సంక్షిప్త నమాజు చేసినా సరే.

అతిథి వచ్చినప్పుడు అతనికి హక్కు నెరవేర్చుటయే అఫ్జల్ సత్కార్యం, ఇందువల్ల ఏదైనా ముస్తహబ్ సత్కార్యం విడనాడినా సరే. ఇలాగే భార్య పిల్లల విధులను నేరవేర్చ వలసిన సందర్భంలో ఈ విధులను నేరవేర్చడమే అఫ్జల్ సత్కార్యం.

సహర్ (ఫజర్ కంటే కొంచెం ముందు) సమయంలో తహజ్జుద్, ఖుర్ఆన్ పారాయణం, దుఆ, జిక్ర్, ఇస్తిగ్ఫార్ లాంటివి చేయడమే అఫ్జల్.

స్టూడెంట్ కు బోధిస్తున్నప్పుడు, అజ్ఞానికి విద్య నేర్పుతున్నప్పుడు ఆ విద్య నేర్పడంలో నిమగ్నులవడమే అఫ్జల్.

అజాన్ అవుతున్నప్పుడు వేరే జిక్ర్, తిలావత్ లాంటివి వదిలేసి ముఅజ్జిన్ జవాబివ్వడమే అఫ్జల్.

ఐదు ఫర్జ్ నమాజు సమయాల్లో ఆ నమాజులు సంపూర్ణ రీతిలో చేయుటకు మరియు తొలి సమయంలో నేరవేర్చుటకు, జామె మస్జిద్ దూరమున్నా వెళ్ళుటకు త్వరపడుటయే అఫ్జల్.

అగత్యపరునికి సహాయం చేయవలసి వచ్చినప్పుడు తన హోదా అంతస్తులు, ధన, ప్రాణాలు ఏ విధంగానైనా అతని సహాయం చేయడంలో నిమగ్నులవడం మరియు అతని అవసరాన్ని తీర్చడం, దీనిని వ్యక్తిగత మరియు పర్సనల్ కార్యాలపై ప్రాధాన్యతనివ్వడమే అఫ్జల్ సత్కార్యం.

ఖుర్ఆన్ పారాయణ సందర్భంలో మనసు ఏకాగ్రత, అల్లాహ్ నీతోనే సంభాషిస్తున్నాడు అన్నటువంటి భావన గలిగే విధంగా అల్లాహ్ వాక్యాల్లో యోచించుట, వాటిని అవగాహన చేసుకొనుటకు ధైర్య సాహసాలను కూడగట్టుకొనుటయే అఫ్జల్ ఇబాదత్, సత్కార్యం. ఖుర్ఆన్ ను అర్థం చేసుకొనుటకు, అర్థభావాలలో యోచన చేయుటకు సంపూర్ణ శ్రద్ధ వహించు, అందులో ఉన్న ఆదేశాలను ఆచరించుటకు నిశ్చయించుకో. వాస్తవానికి ఇలా చేయడమే, ‘ఏ రాజు నుండైనా వచ్చిన పత్రంపై కలిగే మనసు ఏకాగ్రత కంటే’ ఎంతో మేలైనది.

హాజీ హజ్ సందర్భంలో అరఫా లో ఉన్నప్పుడు దీనంగా, వినయంతో దుఆ, జిక్ర్ లో ఉండడం ఆ రోజు ఉపవాసం ఉండడం కన్నా అఫ్జల్.

జిల్ హిజ్జ తొలి దశలో అధిక ఆరాధన చేయడం ప్రత్యేకంగా తక్బీర్, తహ్ లీల్, తహ్ మీద్ లాంటివి పరిమితము చేయబడని జిహాద్ కన్నా అఫ్జల్.

రమజాన్ చివరి దశలో ఏతికాఫ్ గురించి మస్జిదులోనే ఏకాంతంలో ఉండిపోవడం, ప్రజలతో కలవకుండా, మాట్లాడకుండా ఉండడం అఫ్జల్. చివరికి ఆ రోజుల్లో ఇతరులకు విద్య నేర్పడం, ఖుర్ఆన్ నేర్పడం కన్నా అఫ్జల్ అని అనేక ఉలమాల అభిప్రాయం.

ముస్లిం సోదరుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు అతడ్ని పరామర్శించడం, అతను చనిపోతే అతని జనాజ వెంట వెళ్ళడం అఫ్జల్.

ప్రజల నుండి ఏదైనా బాధ నీకు కలుగుతున్నప్పుడు వారి వదలిపోయేకంటే వారి మధ్య వారితోనే ఉండి సహనం వహించడం అఫ్జల్. ఎందుకనగా (ప్రవక్త చెప్పారుః) ఏ విశ్వాసి ప్రజలలో కలసిమెలసి ఉంటూ వారి కష్టాలను భరిస్తాడో, వారి మధ్య ఉండని, వారు ఏ అవస్త కలిగించని వ్యక్తి కంటే అఫ్జల్. మంచి విషయంలో వారికి తోడుగా ఉండడం వారితో వేరుగా ఉండడం కంటే అఫ్జల్. చెడు విషయంలో వారికి దూరంగా ఉండడం వారితో కలసి ఉండడం కంటే అఫ్జల్. వారు చెడులో ఉన్నప్పుడు వారితో కలసి ఉండడం వల్ల వారి చెడును అంతమొందించవచ్చు లేదా నీవు వారిలో ఉండడం వల్ల ఆ చెడు తగ్గవచ్చు అలాంటప్పుడు నీవు వారితో దూరంగా ఉండడం కన్నా కలసి ఉండడమే అఫ్జల్. ఏ సమయం, ఏ సందర్భంలో ఆ అల్లాహ్ కు ఏ కార్యం, పని ఎక్కువ ఇష్టమో ఆ సమయసందర్భంలో అది చేయడం అఫ్జల్. (మదారిజుస్సాలికీన్: ఇబ్ను ఖయ్యిమ్ అల్ జౌజియ్య 1/88).

త్రాసును తేలికగా చేసే కార్యాలు

తన త్రాసును బరువుగా చేసే కాంక్ష గల ప్రతి ముస్లిం పాపాలకు దూరంగా ఉండాలి, మరణానికి ముందే వాటి నుండి క్షమాపణ కోరుతూ ఉండాలి, ఎందుకనగా ఏ మనిషి చావుతో అతని పాపాలు కూడా చనిపోయాయో (అంటే అతని లెక్కలో లేవో) ఆ మనిషియే అదృష్టవంతుడు, మరి ఎవడైతే చనిపోతాడో కాని అతని పాపాలు మిగిలి ఉంటాయో అతడే దుష్టుడు.

ఆయిషా రజియల్లాహు అన్హా చెప్పారు: నీవు అల్లాహ్ ను కలిసేటప్పుడు అతి తక్కువ పాపాలతో కలుసుకోవడం కంటే మేలైన విషయం మరేదీ లేదు. అలసి పోకుండా పుణ్యాలు చేసే వారికంటే ముందుకు దూసుకెళ్ళి పోవాలనుకునే వ్యక్తి పాపాలకు అతి దూరంగా ఉండాలి. (సిఫతుస్ సఫ్వా: ఇబ్నుల్ జౌజీ 1/350).

అధిక పాపాలు త్రాసును తేలికగా చేస్తాయి, బరువుగా చేయవు, ఎలా అనగా పుణ్యాలు త్రాసు ఒక పళ్ళంలో మరియు పాపాలు మరో పళ్ళంలో పెట్టబడతాయి, ఎప్పుడైతే పుణ్యాల పళ్ళం బరువుగా ఉంటుందో ఆ వ్యక్తి త్రాసు బరువుగా ఉందని అర్థం, ఎప్పుడైతే పాపాల పళ్ళం బరువుగా ఉంటుందో ఆ వ్యక్తి త్రాసు తేలికగా ఉందని అర్థం, అంటే పాపాలే త్రాసును తేలికగా చేస్తాయి, బరువుగా చేయవు. ఇదే విషయం అల్లాహ్ సూర ఖారియా 101:6-9 లో ఇలా తెలిపాడు:

فَأَمَّا مَنْ ثَقُلَتْ مَوَازِينُهُ * فَهُوَ فِي عِيشَةٍ رَاضِيَةٍ * وَأَمَّا مَنْ خَفَّتْ مَوَازِينُهُ * فَأُمُّهُ هَاوِيَةٌ {القارعة:6-9}

ఎవరి త్రాసు పళ్ళాలు బరువుగా ఉంటాయో, అతను మనసు మెచ్చిన భోగభాగ్యాలతో కూడిన జీవితంలో ఉంటాడు. మరెవరి త్రాసు పళ్ళాలు తేలికగా ఉంటాయో, అతని నివాస స్థానం ‘హావియ’ అవుతుంది.

పాపాల రకాలు:

కొన్ని పాపాలు, వాటికి పాల్పడిన వారి జాబితాలో చిన్న పాపం చేసినట్లుగా లిఖించబడుతుంది. వీటిని చిన్న పాపాలు అని అంటారు. మరికొన్ని, వాటికి పాల్పడిన వారి జాబితాలో పెద్ద పాపం చేసినట్లుగా లిఖించబడుతుంది. వీటిని ఘోర పాపాలు అని అంటారు. ఈ ఘోరపాపాల్లో కొన్ని అనేక పుణ్యాలను నాశనం చేస్తాయి, మరికొన్ని సర్వ పుణ్యాల్ని నాశసం చేస్తాయి. వీటన్నిటి వలన త్రాసు బరువు తగ్గి చాలా తేలికగా అయిపోతుంది. అందుకే మనం మన పుణ్యాల్ని అంతమొందించి, వాటి సత్ఫలితం దక్కకుండా చేసే పాపాల గురించి తెలుసుకోవడం మరియు వాటికి అతి దూరంగా ఉండడం చాలా అవసరం.

ప్రథమం: చిన్న పాపాలు

చిన్న పాపాల్ని అల్లాహ్ క్షమిస్తానని వాగ్దానం చేశాడు, కాని రెండు షరతులున్నాయి, ఒకటి: ఘోర పాపాల నుండి దూరముండాలి. రెండు: చిన్న పాపాల్ని చిన్నవే కదా అని భావించకూడదు. చదవండి అల్లాహ్ ఆదేశం:

الَّذِينَ يَجْتَنِبُونَ كَبَائِرَ الإِثْمِ وَالفَوَاحِشَ إِلَّا اللَّمَمَ إِنَّ رَبَّكَ وَاسِعُ المَغْفِرَةِ هُوَ أَعْلَمُ بِكُمْ إِذْ أَنْشَأَكُمْ مِنَ الأَرْضِ وَإِذْ أَنْتُمْ أَجِنَّةٌ فِي بُطُونِ أُمَّهَاتِكُمْ فَلَا تُزَكُّوا أَنْفُسَكُمْ هُوَ أَعْلَمُ بِمَنِ اتَّقَى {النَّجم:32}

ఎవరయితే చిన్న చిన్న తప్పులు తప్ప, పెద్ద పాపాల నుండి మరియు నీతిబాహ్యమైన పనుల నుండి దూరంగా ఉంటారో, (వారి పాలిట) నిశ్చయంగా నీ ప్రభువు ఎంతో ఉదారంగా క్షమించేవాడు. ఆయన మిమ్మల్ని భూమి (మట్టి) నుండి సృజించినప్పుడూ, మీరు మీ మాతృగర్భాలలో శిశువులుగా ఉన్నప్పుడు కూడా మీ గురించి ఆయనకు బాగా తెలుసే, కాబట్టి మీ పరిశుధ్ధతను గురించి మీరు (గొప్పలు) చెప్పుకోకండి. దైవానికి భయపడే వాడెవడో ఆయనకు బాగా తెలుసు. (నజ్మ్ 53:32).

إِنْ تَجْتَنِبُوا كَبَائِرَ مَا تُنْهَوْنَ عَنْهُ نُكَفِّرْ عَنْكُمْ سَيِّئَاتِكُمْ وَنُدْخِلْكُمْ مُدْخَلًا كَرِيمًا {النساء:31}

మీకు వారించబడే మహా (పెద్ద) పాపాలకు గనక మీరు దూరంగా ఉన్నట్లయితే, మేము మీ చిన్న చిన్న పాపాలను మన్నించి, గౌరవప్రద స్థానాల్లో ప్రవేశింపజేస్తాము. (నిసా 4:31).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ ఇలా తెలిపారని సహల్ బిన్ సఅద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు:

إِيَّاكُمْ وَمُحَقَّرَاتِ الذُّنُوبِ، فَإِنَّمَا مَثَلُ مُحَقَّرَاتِ الذُّنُوبِ كَمَثَلِ قَوْمٍ نَزَلُوا بَطْنَ وَادٍ، فَجَاءَ ذَا بِعُودٍ، وَجَاءَ ذَا بِعُودٍ، حَتَّى حَمَلُوا مَا أَنْضَجُوا بِهِ خُبْزَهُمْ، وَإِنَّ مُحَقَّرَاتِ الذُّنُوبِ مَتَى يَأْخُذْ بِهَا صَاحِبُهَا تُهْلِكْهُ

మీరు చిన్న పాపాలను అల్పమైనవిగా భావించడం మానుకోండి. అల్పమైనవియే కదా అనుకోవడం యొక్క దృష్టాంతం : కొందరు ఒక కనుమలో మజిలి చేశారు, ఒక్కొ వ్యక్తి ఒక్కో కట్టె పుల్ల సమాకూర్చడం మొదలుపెట్టాడు, అందరూ కలసి జమ చేసిన కట్టెలతో వారు తమ రొట్టెలు వండుకున్నారు, ఈ విధంగా చిన్న పాపాల వల్ల మనిషిని పట్టుకోవడం జరిగిందంటే అవి అతనిని నాశనం జేస్తాయి. (అల్ ముఅజముల్ కబీర్: తబ్రానీ 10500. సహీహుల్ జామి 2687).

అందుకే చిన్న పాపాల విషయంలో కూడా భయపడుతూ ఉండడం, అల్పమైనవిగా భావించకపోవడం తప్పనిసరి. మనం ప్రవక్త సహచరుల మాదిరిగా కావడానికి ప్రయత్నించాలి, వారు అల్లాహ్ ను గౌరవించే విధంగా గౌరవించాలి, ఈ చిన్న పాపాలను కూడా గంభీరంగా భావించేవారు. అనస్ రజియల్లాహు అన్హు చెప్పారు: మీరు కొన్ని కార్యాలు చేస్తున్నారు, అవి మీ దృష్టిలో వెంట్రుక కన్నా సన్నగా ఉన్నాయి, కాని మేము ప్రవక్త కాలంలో వాటిని వినాశనానికి గురి చేసేవిగా భావించేవాళ్ళం. (బుఖారి పదాలు 6492, దార్మీ 2768, హాకిం 7674).

ఇబ్ను బత్తాల్ చెప్పారని ఇబ్ను హజ్ర్ పేర్కొన్నారు: చిన్న పాపాలు మాటిమాటికి చేస్తూ ఎక్కువై పోతే అవి పెద్ద పాపాలుగా మారిపోతాయి. అసద్ బిన్ మూసా ‘జుహ్ద్’ రచనలో పేర్కొన్నారు: అబూ అయ్యూబ్ అన్సారీ రజియల్లాహు అన్హు చెప్పారు: ఒక మనిషి ఏదైనా సత్కార్యం చేస్తాడు, దానిపై నమ్మకం ఉంచి, ఇతర చిన్న పాపాలను మరచిపోతాడు, ఇక ఎప్పుడైతే అల్లాహ్ ను కలుసుకుంటాడో ఆ చిన్న పాపాలే అతడ్ని శిక్షకు గురి చేస్తాయి. మరొక వ్యక్తి పాపం చేస్తాడు, భయపడుతూ ఉంటాడు, అల్లాహ్ ను కలుసుకున్నప్పుడు అతనికి మోక్షం లభిస్తుంది. (ఫత్ హుల్ బారీ 11/337. హదీసు నం. 6492).

ద్వితీయం: ఘోర పాపాలు

ముస్లిమ్ చిన్న పాపాల కంటే ముందు ఘోర పాపాల నుండి దూరంగా ఉండాలి, ఎందుకనగా అవి పాపాల త్రాసు పళ్ళంలో బరువుగా ఉంటాయి, అవి చాలా ఉన్నాయి. పండితులు వాటి గురించి ఇలా నిర్వచించారు: ఏ పాపం చేసినవారిని శపించడం, ఆగ్రహించడం జరిగిందో, లేదా వైల్ (వినాశనం) లేదా నరకం లేదా అప్రసన్నత హెచ్చరిక ఇవ్వబడిందో లేదా ఏదైనా ‘హద్ద్’ (శిక్ష ఇహలోకంలో) నిర్ణయించడం జరిగిందో దానిని ఘోర పాపంగా పరిగణించడం జరిగింది.

ఇబ్ను హజర్ రహిమహుల్లాహ్ ఇలా చెప్పారు: ఘోర పాపం నిర్వచనల్లో

అందరికంటే మంచి మాట ఇమామ్ ఖుర్తుబీ రహిమహుల్లాహ్ మాట, ఆయన దానిని ‘అల్ ముఫ్ హిమ్’ అను తన రచణలో ప్రస్తావించారు: అదేమిటంటే: ఖుర్ఆన్, హదీస్ లేదా ఇజ్మాఅ ఏ పాపాన్ని ఘోర పాపం, పెద్ద పాపం అన్నదో, లేదా దానిపై కఠిన శిక్ష, లేదా ‘హద్ద్’ నిర్ణయించడం జరిగిందో, లేదా దాన్నిగురించి కఠినంగా హెచ్చరించడం జరిగిందో అది ఘోర పాపం. దీని ఆధారంగా ఏ పాపం చేసిన వారిని శపించడం, హెచ్చరించడం, అవిధేయులు అనడం జరిగిందో ఖుర్ఆన్ మరియు సహీ హదీసులో వెతకాలి, అలాగే ఖుర్ఆన్ మరియు సహీ హదీసులో ఏ పాపాల్ని ఘోర పాపం అనడం జరిగిందో వాటిని కూడా పైవాటిలో చేర్చాలి. (ఫత్ హుల్ బారీ 2/191. హ.నం 6857).

దీని యొక్క ఉదాహరణ ఈ హదీస్: ప్రవక్త ﷺ ఇలా తెలిపారని అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖించారు:

إِنَّ أَعْظَمَ الذُّنُوبِ عِنْدَ اللَّهِ رَجُلٌ تَزَوَّجَ امْرَأَةً، فَلَمَّا قَضَى حَاجَتَهُ مِنْهَا، طَلَّقَهَا، وَذَهَبَ بِمَهْرِهَا، وَرَجُلٌ اسْتَعْمَلَ رَجُلًا، فَذَهَبَ بِأُجْرَتِهِ، وَآخَرُ يَقْتُلُ دَابَّةً عَبَثًا

అల్లాహ్ వద్ద పాపాల్లో అతి ఘోరమైనవి:  ఒక వ్యక్తి ఓ స్త్రీని పెళ్ళాడి, ఆమెతో తన కామవాంఛ తీర్చుకున్నాక, ఆమెకు విడాకులిచ్చి ఆమె మహర్ కూడా కాజేసుకోవడం.  ఎవరైనా ఒక పని మనిషిని పెట్టుకొని, అతనితో కావలసిన పని తీసుకొని అతనికి కూలి ఇవ్వకపోవడం.  అకారణంగా ఏదైనా జంతువును చంపడం. (హాకిం, 2743, బైహఖీ 14173. షేఖ్ అల్బానీ సహీహుల్ జామి 1567లో హసన్ అన్నారు).

తృతీయం: సత్కార్యాలను నశింప(వృధా)జేసే దుష్కార్యాలు

కొన్ని ఘోరపాపాల నుండి హెచ్చరించడం జరిగింది, వాటికి పాల్పడేవారి సత్కార్యాలు వృధా అవుతాయని కూడా హెచ్చరించడం జరిగింది, వాటిని ‘ముహ్ బితాతుల్ అఅమాల్’ అంటారు. అయితే షిర్క్ మరియు రిద్దత్ (అంటే బహుదైవారాధన మరియు ఇస్లాం నుండి వైదొలగిపోవడం/ధర్మభ్రష్టత) తప్ప మరే పాపం సర్వ సత్కార్యాలను నశింపజేయవు అని ధర్మపండితుల ఏకాభిప్రాయం ఉంది.

అందుకే ఘోర పాపాలు ఎలాంటి సత్కార్యాల్ని నశింపజేస్తాయి అన్న విషయంలో పండితుల వివిధ అభిప్రాయాల్లో నిజమైన మాట ఏమిటంటే అవి సత్కార్యాల్ని నశింపజేస్తాయి అనే మాట బెదిరింపు, హెచ్చరిక కొరకు చెప్పడం జరిగింది, వీటికి పాల్పడే వ్యక్తి పర్యవసానం అల్లాహ్ ఇష్టప్రకారం జరుగుతుంది, ఆయన తలచి క్షమించవచ్చు, లేదా శిక్షించనూవచ్చు.

అందుకే ఘోరపాపాలు సామాన్యమైనవైతే, ముహ్ బితాతుల్ ఆమాల్ ప్రత్యేకమైనవి. ఏ వ్యక్తి తన త్రాసును బరువుగా ఉండాలని, ప్రళయం నాటి కష్టనష్టాలు తగ్గాలన్న కాంక్ష కలిగి ఉన్నాడు అతను తప్పకుండా ఘోర పాపాల నుండి కూడా దూరంగానే ఉండాలి.

అతి ముఖ్యమైన ముహ్ బితాతుల్ అ’మాల్

[1] షిర్క్, కుఫ్ర్, రిద్దత్

షిర్క్ పాపాల్లోనే అతి ఘోరమైనది, అల్లాహ్ వద్ద మహా అసహ్యకరమైనది. మనిషి తౌబా చేయకుండా చనిపోయాడంటే అల్లాహ్ ఏ మాత్రం క్షమించని పాపం ఏదైనా ఉంటే అది కేవలం షిర్క్ మాత్రమే. అల్లాహ్ ఆదేశం చదవండి:

}إِنَّ اللهَ لَا يَغْفِرُ أَنْ يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَلِكَ لِمَنْ يَشَاءُ وَمَنْ يُشْرِكْ بِاللهِ فَقَدِ افْتَرَى إِثْمًا عَظِيمًا{ {النساء:48}.

తనకు భాగస్వామిగా మరొకరిని కల్పించటాన్ని (షిర్కును) అల్లాహ్ ఏ మాత్రం క్షమించడు. ఇది తప్ప ఏ పాపాన్నైనా ఆయన కోరిన వారిని క్షమిస్తాడు. మరియు అల్లాహ్ కు భాగస్వామి కల్పించినవాడే వాస్తవానికి మహా పాపం చేసినవాడు. (నిసా 4:48).

}إِنَّ اللهَ لَا يَغْفِرُ أَنْ يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَلِكَ لِمَنْ يَشَاءُ وَمَنْ يُشْرِكْ بِاللهِ فَقَدْ ضَلَّ ضَلَالاً بَعِيدًا{{النساء:116}.

తనకు భాగస్వామ్యం (షిర్క్) కల్పించటాన్ని అల్లాహ్ ఎట్టి పరిస్థితిలోనూ క్షమించడు. షిర్క్ మినహా తాను కోరినవారి మిగిలిన పాపాలను క్షమిస్తాడు. అల్లాహ్ కు సహవర్తులుగా ఇతరులను నిలబెట్టినవాడు మార్గభ్రష్టతలో చాలా దూరం వెళ్ళి పాయాడు. (నిసా 4:116).

ఎవరు ఎత్త గొప్పవాడైనా, ఏ హోదా అంతస్తు గలవాడైనా షిర్క్ చేశాడంటే వారి సర్వ సత్కార్యాలను భసం చేస్తాడని అల్లాహ్ హెచ్చరించాడు, చివరికి ప్రవక్తలతో ఇలా జరిగినా వదలడని ఖుర్ఆన్ లో తెలియజేశాడు. (అల్లాహ్ మనల్ని క్షమించుగా! ప్రవక్తలతో షిర్క్ జరగలేదు, కాని ఈ హెచ్చరిక మన కొరకు).

} وَلَقَدْ أُوحِيَ إِلَيْكَ وَإِلَى الَّذِينَ مِنْ قَبْلِكَ لَئِنْ أَشْرَكْتَ لَيَحْبَطَنَّ عَمَلُكَ وَلَتَكُونَنَّ مِنَ الْخَاسِرِينَ{ {الزمر:65}.

నిశ్చయంగా నీ వద్దకు నీ పూర్వీకులైన ప్రవక్తల వద్దకు పంపబడిన సందేశం (వహీ) ఇది: ఒకవేళ నువ్వు గనక బహుదైవారాధనకు పాల్పడితే నువ్వు చేసుకున్నదంతా వృధా అయిపోతుంది. మరి నిశ్చయంగా నువ్వు నష్టపోయినవారిలో చేరిపోతావు. (జుమర్ 39:65).

అందుకే ప్రతి విశ్వాసి అన్ని రకాల షిర్క్ (బహుదైవారాధన)కు, దాని దరిదాపులకు దూరంగా ఉండాలి. చివరికి షిర్క్ వైపునకు తీసుకెళ్ళే లేదా తీసుకువెళ్తుందన్న సందేహమున్న ఏ కార్యమూ చేయకూడదు.

షిర్క్, కుఫ్ర్, రిద్దత్ కు సంబంధించిన కొన్ని రకాలు

ధర్మం మరియు ధర్మ అవలంబికులతో పరిహాసమాడుట

}وَلَئِنْ سَأَلْتَهُمْ لَيَقُولُنَّ إِنَّمَا كُنَّا نَخُوضُ وَنَلْعَبُ قُلْ أَبِاللَّهِ وَآَيَاتِهِ وَرَسُولِهِ كُنْتُمْ تَسْتَهْزِئُونَ * لَا تَعْتَذِرُوا قَدْ كَفَرْتُمْ بَعْدَ إِيمَانِكُمْ إِنْ نَعْفُ عَنْ طَائِفَةٍ مِنْكُمْ نُعَذِّبْ طَائِفَةً بِأَنَّهُمْ كَانُوا مُجْرِمِينَ{ {التوبة:65-66}

అల్లాహ్ ఆదేశం: (మీరు చెప్పుకుంటూ ఉన్న విషయం ఏమిటి? అని) నువ్వు వారిని అడిగితే, అబ్బే ఏమీలేదు, ఏదో సరదాగా, నవ్వులాటకు ఇలా చెప్పుకుంటున్నాము అని వారంటారు. ఏమిటీ, మీరు అల్లాహ్ తో, ఆయన ఆయతులతో, ఆయన ప్రవక్తలతో పరిహాసమాడుతున్నారా? అని అడుగు. మీరింక సాకులు చెప్పకండి, మీరు విశ్వసించిన తరువాత అవిశ్వాసానికి ఒడిగట్టారు. ఒకవేళ మేము మీలో కొందరిని మన్నించినా, మరికొందరిని వారి నేరాలకుగాను కఠినంగా శిక్షిస్తాము అని వారికి చెప్పు. (తౌబా 9:65-66).

ధర్మం, దర్మ విషయాలను అసహ్యించుకొనుట

}ذَلِكَ بِأَنَّهُمْ كَرِهُوا مَا أَنْزَلَ اللَّهُ فَأَحْبَطَ أَعْمَالَهُمْ{ {محمد:9}

అల్లాహ్ ఆదేశం: అల్లాహ్ అవతరింపజేసిన వస్తువును వారు ఇష్టపడకపోవటం చేత ఈ విధంగా జరిగింది. అందుకే అల్లాహ్ కూడా వారి కర్మలను నిష్ఫలం చేశాడు. (ముహమ్మద్ 47:9).

అల్లాహ్ ధర్మం లేదా ప్రవక్త సాంప్రదాయంలోని ఏదైనా విషయం తమ మనోవాంఛలకు వ్యతిరేకంగా ఉంటే దానిని ఇష్టపడనివారు మరియు అసహ్యించుకునేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి, వారి కర్మలన్ని వృథా కావచ్చు!

అల్లాహ్ కు ఇష్టంలేని పాపాల వెంట పడి, అల్లాహ్ కు ఇష్టమైన పుణ్యాలను అసహ్యించుకొనుట

అల్లాహ్ ఇలా ఆదేశించాడు:

ذَلِكَ بِأَنَّهُمُ اتَّبَعُوا مَا أَسْخَطَ الله وَكَرِهُوا رِضْوَانَهُ فَأَحْبَطَ أَعْمَالَـهُمْ {محمد:28}

వారి ఈ దుర్గతికి కారణం వారు అల్లాహ్ కు ఆగ్రహం కలిగించే విధానాన్ని అనుసరించినందుకు మరియు ఆయన సమ్మతించే మార్గాన్ని అసహ్యించుకున్నందుకు! కావున ఆయన వారి కర్మలను వృథా చేశాడు. (ముహమ్మద్ 47:28).

[2] చూపుగోలుతనం, ప్రదర్శనాబుద్ధి = చిన్న షిర్క్

అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

قَالَ اللهُ تَبَارَكَ وَتَعَالَى: أَنَا أَغْنَى الشُّرَكَاءِ عَنِ الشِّرْكِ، مَنْ عَمِلَ عَمَلًا أَشْرَكَ فِيهِ مَعِي غَيْرِي، تَرَكْتُهُ وَشِرْكَهُ

అల్లాహ్ ఇలా తెలిపాడు: నేను ఇతర సహవర్తులకంటే ఎక్కువగా షిర్క్ (భాగస్వామ్యాని)కి అతీతంగా ఉన్నాను. ఎవరైనా ఏదైనా సత్కార్యం చేసి అందులో నాతో పాటు ఇతరులను భాగస్వాములుగా చేస్తే నేను అతడ్నీ మరియు అతని ఆ షిర్క్ ను వదిలివేస్తాను. (ముస్లిం 2985, తిర్మిజి 3154, ఇబ్ను మాజ 4202).

షుఫయ్యా అస్ బహీ రహిమహుల్లాహ్ ఉల్లేఖనం ప్రకారం, నేను మదీనహ్ వచ్చాను, ఒక వ్యక్తి చుట్టూ గుమిగూడి ఉన్న ప్రజల్ని చూశాను, ఆ వ్యక్తి ఎవరు అని అడిగితే, ప్రజలన్నారు: అతను ప్రవక్త సహచరులైన అబూ హురైరహ్ అని. అప్పుడు నేను అతనికి దగ్గరగా వెళ్ళాను, అతని ముందు కూర్చున్నాను, అతను ప్రజలకు ప్రవక్త హదీసులు వినిపిస్తున్నారు, అతని మాట పూర్తి అయిన తర్వాత, ప్రజలందరూ వెళ్ళిపోయాక అతను ఒక్కడే మిగిలి ఉన్నప్పుడు: ‘నేను అల్లాహ్ ప్రమాణం చేసి మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ తో స్వయంగా విని అర్థం చేసుకొని తెలుసుకున్న హదీసు నాకు వినిపించండి’ అని కోరాను. అబూ హురైరహ్ సరే మంచిది, నేను ప్రవక్తతో విని, అర్థం చేసుకున్న హదీసు వినిపిస్తాను అని ఒక కేక వేశారు, సొమ్మసిల్లిపోయారు. కొంత సమయం తర్వాత స్పృహ వచ్చాక, నేను ఒక హదీసు వినిపిస్తాను, దానిని నేను ఇదే ఇంట్లో ప్రవక్తతో విన్నాను, అప్పుడు మా ఇద్దరి తప్ప మరెవరూ లేరు, మళ్ళీ అబూ హురైరహ్ రెండవసారి సొమ్మసిల్లి పోయారు. స్పృహ వచ్చాక, నీళ్ళతో ముఖం తుడ్చుకొని, నేను తప్పకుండా ప్రవక్తతో విన్న ఒక హదీసు వినిపిస్తాను, అప్పుడు ఈ ఇంట్లో నేను మరియు ప్రవక్త మాత్రమే ఉన్నాము, మరెవ్వరూ లేరు అని మళ్ళీ స్పృహ తప్పిపోయారు. స్పృహ వచ్చాక, నీళ్ళతో ముఖం తుడ్చుకొని, ఇక మాట పూర్తి చేస్తాను. నేను తప్పకుండా ప్రవక్తతో విన్న ఒక హదీసు వినిపిస్తాను, అప్పుడు ఈ ఇంట్లో నేను మరియు ప్రవక్త మాత్రమే ఉన్నాము, వేరెవరూ లేరు అని మళ్ళీ తొలిసారి కంటే భయంకరంగా స్పృహ తప్పి, ముఖము ఆధారంగా బోర్లాపడిపోబోయారు కాని నేను కొంత సేపటి వరకు ఆనుకొని ఉన్నాను, స్పృహ వచ్చాక, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ ఈ హదీసు తెలిపారు:

أَنَّ الله تَبَارَكَ وَتَعَالَى إِذَا كَانَ يَوْمُ القِيَامَةِ يَنْزِلُ إِلَى العِبَادِ لِيَقْضِيَ بَيْنَهُمْ وَكُلُّ أُمَّةٍ جَاثِيَةٌ، فَأَوَّلُ مَنْ يَدْعُو بِهِ رَجُلٌ جَمَعَ القُرْآنَ، وَرَجُلٌ قُتِلَ فِي سَبِيلِ الله، وَرَجُلٌ كَثِيرُ المَالِ، فَيَقُولُ الله لِلْقَارِئِ: أَلَمْ أُعَلِّمْكَ مَا أَنْزَلْتُ عَلَى رَسُولِي؟ قَالَ: بَلَى يَا رَبِّ. قَالَ: فَمَاذَا عَمِلْتَ فِيمَا عُلِّمْتَ؟ قَالَ: كُنْتُ أَقُومُ بِهِ آنَاءَ اللَّيْلِ وَآنَاءَ النَّهَارِ، فَيَقُولُ الله لَهُ: كَذَبْتَ، وَتَقُولُ لَهُ المَلَائِكَةُ: كَذَبْتَ، وَيَقُولُ الله: بَلْ أَرَدْتَ أَنْ يُقَالَ: إِنَّ فُلَانًا قَارِئٌ فَقَدْ قِيلَ ذَاكَ، وَيُؤْتَى بِصَاحِبِ المَالِ فَيَقُولُ الله لَهُ: أَلَمْ أُوَسِّعْ عَلَيْكَ حَتَّى لَمْ أَدَعْكَ تَحْتَاجُ إِلَى أَحَدٍ؟ قَالَ: بَلَى يَا رَبِّ، قَالَ: فَمَاذَا عَمِلْتَ فِيمَا آتَيْتُكَ؟ قَالَ: كُنْتُ أَصِلُ الرَّحِمَ وَأَتَصَدَّقُ، فَيَقُولُ الله لَهُ: كَذَبْتَ، وَتَقُولُ لَهُ المَلَائِكَةُ: كَذَبْتَ، وَيَقُولُ الله تَعَالَى: بَلْ أَرَدْتَ أَنْ يُقَالَ: فُلَانٌ جَوَادٌ فَقَدْ قِيلَ ذَاكَ، وَيُؤْتَى بِالَّذِي قُتِلَ فِي سَبِيلِ الله ، فَيَقُولُ الله لَهُ: فِي مَاذَا قُتِلْتَ؟ فَيَقُولُ: أُمِرْتُ بِالجِهَادِ فِي سَبِيلِكَ فَقَاتَلْتُ حَتَّى قُتِلْتُ، فَيَقُولُ الله تَعَالَى لَهُ: كَذَبْتَ، وَتَقُولُ لَهُ المَلَائِكَةُ: كَذَبْتَ، وَيَقُولُ الله: بَلْ أَرَدْتَ أَنْ يُقَالَ: فُلَانٌ جَرِيءٌ , فَقَدْ قِيلَ ذَاكَ ، ثُمَّ ضَرَبَ رَسُولُ الله ﷺ عَلَى رُكْبَتِي فَقَالَ: يَا أَبَا هُرَيْرَةَ، أُولَئِكَ الثَّلَاثَةُ أَوَّلُ خَلْقِ الله تُسَعَّرُ بِهِمُ النَّارُ يَوْمَ القِيَامَةِ

ప్రళయదినాన అల్లాహు తఆలా ప్రజల వైపునకు వస్తాడు వారి మధ్య తీర్పు చేయడానికి, ప్రతి జాతి మోకాళ్ళపై పడి ఉంటుంది. అల్లాహ్ తొలిసారిగా ఖుర్ఆన్ జ్ఞానం పొందినవాడిని, అల్లాహ్ మార్గంలో షహీద్ (అమరవీరుడు) అయిన వాడిని మరియు అధిక ధనం ఉన్నవాడిని పిలుస్తాడు. ‘నేను నా ప్రవక్తపై అవతరింపజేసిన దానిని నీకు నేర్పలేదా? అని ఖుర్ఆన్ జ్ఞానితో ప్రశ్నిస్తాడు. అతడంటాడు: ఎందుకు లేదు ప్రభువా, నీవే నాకు నేర్పినది. నీకు నేర్పబడిన దాని ప్రకారం ఎంత వరకు ఆచరించావు. అతడు సమాధానమిస్తాడు: నేను రేయింబవళ్ళు దాని పారాయణం చేస్తూ ఉన్నాను. అప్పుడు అల్లాహ్ అంటాడు: నీవు అబద్ధం పలుకుతున్నావు, దైవదూతలంటారు: నీవు అబద్ధం పలుకుతున్నావు. మళ్ళీ అల్లాహ్ అంటాడు: నిన్ను ప్రజలు ఖారీ అన్న బిరుదు ఇవ్వాలి అన్న ఉద్దేశ్యం నీకు ఉండింది, ఆ బిరుదు నీకు లభించినది.

ఆ తర్వాత సిరిసంపదలు గలవాడిని తీసుకురావడం జరుగుతుంది. నీవు ఒకరికి రుణపడి ఉండే అవసరం లేనంత పరిమాణంలో నీకు ధనం ప్రసాదించలేదా? అని అల్లాహ్ ప్రశ్నిస్తాడు. అతడంటాడు: అవును ఓ ప్రభువా అని. నీకు ప్రసాదించిన దానిలో నీవు ఏమి చేశావు అని అల్లాహ్ ప్రశ్నిస్తాడు. అతడు నేను బంధుత్వాన్ని పెంచేవాడిని, దానదర్మాలు చేస్తూ ఉండేవాడిని అని బదులు పలుకుతాడు. నీవు అబద్ధం పలుకుతున్నావు అని అల్లాహ్ అంటాడు, నీవు అబద్ధం పలుకుతున్నావు అని దైవదూతలంటారు. మళ్ళీ అల్లాహ్ అంటాడు: ప్రజలు నిన్ను ఉదారగుణం గలవాడని మెచ్చుకోవాలన్న ఉద్దేశ్యం నీరు ఉండేది, ప్రజలు నిన్ను మెచ్చుకున్నారు కూడా.

ఆ తర్వాత అల్లాహ్ మార్గంలో ప్రాణాలు కోల్పోయిన (అమరవీరుడైన) వ్యక్తిని తీసుకురావడం జరుగుతుంది. నీవు ఎందుకని హత్యచేయబడ్డావు అని అల్లాహ్ ప్రశ్నిస్తాడు. అతడు ఇలా జవాబిస్తాడు: నీ మార్గంలో జిహాద్ చేయాలని నాకు ఆదేశించబడినది, కనుక నేను నీ మార్గంలో హతమయ్యే వరకు పోరాడుతునే ఉన్నాను. నీవు అబద్ధం పలుకుతున్నావు అని అల్లాహ్ అంటాడు, నీవు అబద్ధం పలుకుతున్నావు అని దైవదూతలంటారు. మళ్ళీ అల్లాహ్ అంటాడు: ప్రజలు నిన్ను శూరుడు అని, గొప్ప బలశాలి అని పొగడాలన్న ఉద్దేశ్యం నీకు ఉండేది, ప్రజలు అలా నిన్ను పొగిడారు. మళ్ళీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నా మొకాలును తట్టి ‘అబూ హురైరా! అల్లాహ్ సృష్టిలోని తొలి ముగ్గురు వీరే, వీరి ద్వారానే ప్రళయదినాన నరకాగ్నిని దహించడం జరుగుతుంది.

ఉల్లేఖకులైన హజ్రత్ షుఫయ్యా ముఆవియా రజియల్లాహు అన్హుకు ఈ హదీసు వినిపించారు, అప్పుడు ముఆవియా రజియల్లాహు అన్హు చెప్పారు: ఇలాంటి వారిది ఈ గతి అయితే ఇతరుల సంగతే ఏమిటి? ఆ తర్వాత ఎంతగా ఏడ్చారంటే, స్పృహ తప్పిపోయారు, ఈ ఏడ్పుతోనే ఆయన ప్రాణం పోతుందా అనిపించింది. స్పృహ వచ్చాక, ముఖం తూడ్చుకొని చెప్పారు: వాస్తవంగా అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సత్యం పలికారు, అని ఖుర్ఆనులోని ఈ ఆయతు పఠించారు:

مَن كَانَ يُرِيدُ الْحَيَاةَ الدُّنْيَا وَزِينَتَهَا نُوَفِّ إِلَيْهِمْ أَعْمَالَهُمْ فِيهَا وَهُمْ فِيهَا لَا يُبْخَسُونَ * أُولَٰئِكَ الَّذِينَ لَيْسَ لَهُمْ فِي الْآخِرَةِ إِلَّا النَّارُ وَحَبِطَ مَا صَنَعُوا فِيهَا وَبَاطِلٌ مَّا كَانُوا يَعْمَلُونَ

ఎవరయితే ప్రాపంచిక జీవితం పట్ల, దాని అందచందాల పట్ల వ్యామోహితులవుతున్నారో అలాంటి వారికి వారి కర్మలను (వాటి ఫలితాన్ని) మేము ఇక్కడే పూర్తిగా ఇచ్చేస్తాము. ఇక్కడ (ప్రపంచంలో) వారికి ఏ లోటూ జరగదు. అయితే అలాంటి వారికి పరలోకంలో అగ్ని తప్ప మరేమీ లభించదు. ప్రపంచంలో వారు చేసుకున్నదంతా వృథా అయిపోతుంది. వారు చేసే పనులన్నీ మిథ్యగా మారిపోతాయి. (హూద్ 11: 15,16). (తిర్మిజి 2382, ముస్లిం 1905).

[3] అల్లాహ్ మరియు ప్రవక్తను మించిపోకండి

}يَا أَيُّهَا الَّذِينَ آَمَنُوا لَا تُقَدِّمُوا بَيْنَ يَدَيِ اللَّهِ وَرَسُولِهِ وَاتَّقُوا اللَّهَ إِنَّ اللَّهَ سَمِيعٌ عَلِيمٌ{

విశ్వసించిన ఓ ప్రజలారా!అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను మించిపోకండి. అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు. (హుజురాత్ 49:1).

ఇబ్ను ఖయ్యిం రహిమహుల్లాహ్ చెప్పారు: అనేక మందికి సత్కార్యాలను వ్యర్థం చేసే పాపాల గురించి తెలియదు. అల్లాహ్ ఇలా తెలియజేశాడు:

يَا أَيُّهَا الَّذِينَ آَمَنُوا لَا تَرْفَعُوا أَصْوَاتَكُمْ فَوْقَ صَوْتِ النَّبِيِّ وَلَا تَجْهَرُوا لَهُ بِالقَوْلِ كَجَهْرِ بَعْضِكُمْ لِبَعْضٍ أَنْ تَحْبَطَ أَعْمَالُكُمْ وَأَنْتُمْ لَا تَشْعُرُونَ

ఓ విశ్వాసులారా! మీ కంఠస్వరాలను ప్రవక్త కంఠస్వరం కంటే పైన (హెచ్చుగా) ఉంచకండి. మీరు పరస్పరం బిగ్గరగా మాట్లాడుకునే విధంగా ఆయనతో బిగ్గరగా మాట్లాడకండి. దీనివల్ల మీ కర్మలన్నీ వ్యర్థమైపోవచ్చు. ఆ సంగతి మీకు తెలియను కూడా తెలియకపోవచ్చు. (హుజురాత్ 49:2).

పరస్పరం మాట్లుడుకున్నట్లు ప్రవక్తతో గొంతెత్తి మాట్లాడితే వారి కర్మలన్నీ వ్యర్థమైపోతాయని అల్లాహ్ విశ్వాసులను హెచ్చరిస్తున్నాడు. అయితే ఇది ధర్మభ్రష్టతకు కారణం కాదు, ఇది ఒక పాపం, దీని వల్ల సత్కర్మలు వ్యర్థమవుతాయి, ఈ విషయం ఆ పాపం చేసినవానికి కూడా తెలియకుండా ఉండవచ్చు. ఇది ఇలా ఉండగా ఇక ఎవరయితే తెలిసి, కావాలని ప్రవక్త మాట, బాట పై ఇతరుల మాట, బాటకు ప్రాధాన్యతనిస్తారో వారికి తెలియకుండానే వారి కర్మలు కూడా వ్యర్థము కావా? ఇకనైనా ఇలాంటి వారు అప్రమత్తమవుతారా?

[4] అల్లాహ్ ఫలాన వ్యక్తిని క్షమించడని ప్రమాణం చేయుట

జుందుబ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త ﷺ ఇలా తెలిపారు:

أَنَّ رَجُلًا قَالَ: وَاللهِ لَا يَغْفِرُ اللهُ لِفُلَانٍ، وَإِنَّ اللهَ تَعَالَى قَالَ: مَنْ ذَا الَّذِي يَتَأَلَّى عَلَيَّ أَنْ لَا أَغْفِرَ لِفُلَانٍ، فَإِنِّي قَدْ غَفَرْتُ لِفُلَانٍ، وَأَحْبَطْتُ عَمَلَكَ

“ఒక వ్యక్తి ‘అల్లాహ్ సాక్షిగా! అల్లాహ్ ఫలాన మనిషిని క్షమించడు’ అని ప్రమాణం చేసాడు. అందుకు అల్లాహ్ చెప్పాడు: “నేను ఫలాన మనిషిని క్షమించను అని నాపై ప్రమాణం చేసి చెప్పే అధికారం ఎవనికి ఉంది, నేను ఫలాన మనిషిని క్షమించాను మరియు నీ కర్మల్ని వ్యర్థపరిచాను”. (ముస్లిం 2621).

[5] అస్ర్ నమాజ్ విడనాడుట

అల్లాహు తఆలా ఐదు పూటల నమాజులను సామాన్యంగా, అస్ర్ నమాజ్ ప్రత్యేకంగా పాటిస్తూ ఉండాలని ఆదేశించాడు ఎందుకనగా దాని ప్రాముఖ్యత ఇలా ఉంది. అల్లాహ్ ఆదేశం బఖర 2:238లో చదవండి:

}حَافِظُوا عَلَى الصَّلَوَاتِ وَالصَّلَاةِ الْوُسْطَى وَقُومُوا لِلَّهِ قَانِتِينَ{

నమాజులను కాపాడుకోండి, ముఖ్యంగా మధ్యలో ఉన్న నమాజును.

అబూ ములైహ్ రహిమహుల్లాహ్ కథనం: మేము బురైదా రజియల్లాహు అన్హుతో ఒక యుద్ధంలో పాల్గొన్నాము, ఆ రోజు మేఘాలు కప్పుకొని ఉన్నాయి, అప్పుడు ఆయన చెప్పారు: అస్ర్ నమాజ్ దాని తొలి సమయంలో అదా చేయండి, నిశ్చయంగా ప్రవక్త ﷺ తెలిపారు:

مَنْ تَرَكَ صَلاَةَ العَصْرِ فَقَدْ حَبِطَ عَمَلُهُ

“ఎవరు అస్ర్ నమాజు విడినాడారో అతని కర్మలన్నీ వ్యర్థమయ్యాయి”. (బుఖారి 553).

అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త ﷺ తెలిపారు:

الَّذِي تَفُوتُهُ صَلاَةُ العَصْرِ، كَأَنَّمَا وُتِرَ أَهْلُهُ وَمَالُهُ

“ఎవరి అస్ర్ నమాజు తప్పిపోతుందో అతని సంతానము, సంపద అన్నీ నాశనమయినట్లే”. (బుఖారి పదాలు 552, ముస్లిం 626).

[6] ఏకాంతంలో నిషిద్ధ కార్యాలుచేయుట

హజ్రత్ సౌబాన్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీసు పుణ్యాత్ములను వారి పడకల నుండి దూరం చేసేసింది, మేము కపట విశ్వాసులమయ్యామా అని వారికి అనిపించింది, కర్మలన్నీ వృథా అవుతాయా దేవా అని భయకంపితులయ్యారు. ఎందుకనగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

لَأَعْلَمَنَّ أَقْوَامًا مِنْ أُمَّتِي يَأْتُونَ يَوْمَ الْقِيَامَةِ بِحَسَنَاتٍ أَمْثَالِ جِبَالِ تِهَامَةَ بِيضًا، فَيَجْعَلُهَا اللهُ عَزَّ وَجَلَّ هَبَاءً مَنْثُورًا ، قَالَ ثَوْبَانُ: يَا رَسُولَ اللهِ صِفْهُمْ لَنَا، جَلِّهِمْ لَنَا أَنْ لَا نَكُونَ مِنْهُمْ، وَنَحْنُ لَا نَعْلَمُ، قَالَ: أَمَا إِنَّهُمْ إِخْوَانُكُمْ، وَمِنْ جِلْدَتِكُمْ، وَيَأْخُذُونَ مِنَ اللَّيْلِ كَمَا تَأْخُذُونَ، وَلَكِنَّهُمْ أَقْوَامٌ إِذَا خَلَوْا بِمَحَارِمِ اللهِ انْتَهَكُوهَا

“నాకు నా అనుచర సంఘంలోని కొందరు తెలుసు, వారు ప్రళయదినాన తిహామా తెల్ల కొండల్లాంటి పుణ్యాలు తీసుకొని వస్తారు కాని అల్లాహ్ వాటిని ఎగిరిపోయిన దుమ్ము ధూళివలే చేసేశాడు”. అప్పుడు సౌబాన్ అన్నాడు: ప్రవక్తా! మాకు వారి గుణాలు తెలుపండి, మేము తెలియకుండానే వారిలో కలువకుండా ఉండుటకు వారి గురించి స్పష్టపరచండి. ప్రవక్త ﷺ ఇలా తెలిపారు: “వారు మీ సోదరులే, మీలోని వారే, రాత్రి వేళల్లో మీలాగ తహజ్జుద్ చేసేవారే, కాని ఏకాంతంలో ఉండి అల్లాహ్ నిషేధించిన వాటికి పాల్పడే అవకాశం వస్తే పాల్పడేవారు”. (ఇబ్ను మాజ 4245, సహీహుత్ తర్గీబ్ 2346. సహీ).

మన ఆంతర్యం బాహ్యం కంటే ఉత్తమంగా ఉండే విధంగా ప్రయత్నం చేయాలి. ఏకంతాంలో నిషిద్ధ కార్యాలు చేస్తూ ఉండడాన్ని అల్లాహ్ చూడడు అని, ఆయనకు తెలియదు అని అనుకోకూడదు. అల్లాహ్ ను చూడ కుండానే భయపడేవారికి ఎంత గొప్ప ఘనత, సత్ఫలితం ఉందో గుర్తు తెచ్చుకోవాలి. ఇది ఇంతకు ముందే మనం చదివి ఉన్నాము. (పేజి 59, 14వ కార్యంలో [4] చూడకుండానే అల్లాహ్ కు భయపడడం).

[7] కుక్కను పెంచడం

అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు:

مَنِ اتَّخَذَ كَلْبًا، إِلَّا كَلْبَ زَرْعٍ، أَوْ غَنَمٍ، أَوْ صَيْدٍ، يَنْقُصُ مِنْ أَجْرِهِ كُلَّ يَوْمٍ قِيرَاطٌ

“ఎవరు తోట మరియు మేకల రక్షణ మరియు వేటాడే ఉద్దేశ్యంతో తప్ప కుక్కను పెంచుతారో వారి పుణ్యాల నుండి ప్రతి రోజు ఒక ఖీరాత్ పుణ్యాలు తగ్గుతూ ఉంటాయి”. (బుఖారి 2322, ముస్లిం పదాలు 1575). [ఖీరాత్ అంటే ఉహుద్ కొండకు సమానం]

ప్రతి రోజు ఒక ఖీరాత్ పుణ్యాలు మనలో ఎవరు సమకూర్చ గలుగుతున్నారు? ఇక ప్రతి రోజు ఒక ఖీరాత్ పుణ్యాలు తగ్గుతున్నాయంటే పరిస్థితి ఏమి కావాలి? లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్.

[8] జ్యోతిష్యుడ్ని ప్రశ్నించడం

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారని సఫియ్య రజియల్లాహు అన్హా ప్రవక్తగారి ఒక భార్య ద్వారా ఉల్లేఖించారు:

مَنْ أَتَى عَرَّافًا فَسَأَلَهُ عَنْ شَيْءٍ، لَمْ تُقْبَلْ لَهُ صَلَاةٌ أَرْبَعِينَ لَيْلَةً

“ఎవరైనా జ్యోతిష్యుని వద్దకు వచ్చి దేని గురించైనా అతన్ని ప్రశ్నిస్తే అతని నలబై రోజుల నమాజు స్వీకరించబడదు”. (ముస్లిం పదాలు 2230).

[9] జ్యోతిష్యుడు మరియు మాంత్రికులను నమ్ముట

అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త ﷺ ఇలా తెలిపారు:

مَنْ أَتَى كَاهِنًا، أَوْ عَرَّافًا، فَصَدَّقَهُ بِمَا يَقُولُ، فَقَدْ كَفَرَ بِمَا أُنْزِلَ عَلَى مُحَمَّدٍ

“ఎవరు జ్యోతిష్యుడు మరియు అగోచర జ్ఞానం గలదని ఆరోపించేవారి వద్దకు వస్తారో వారు చెప్పిన మాటను సత్యముగా నమ్ముతారో వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించిన దానిని తిరస్కరించినవారవుతారు”. (అహ్మద్ 16/133, బైహకీ 16273, తబ్రానీ కబీర్ 10005, సహీహుత్ తర్గీబ్ 5939. సహీహ్).

అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త ﷺ తెలిపారు:

مَنْ أَتَى عَرَّافًا أَوْ سَاحِرًا أَوْ كَاهِنًا فَسَأَلَهُ فَصَدَّقَهُ بِمَا يَقُولُ، فَقَدْ كَفَرَ بِمَا أُنْزِلَ عَلَى مُحَمَّدٍ

“ఎవరు అగోచర జ్ఞాన ఆరోపి లేదా మాంత్రికుని వద్దకు వస్తారో వారు చెప్పిన మాటల్ని సత్యపరుస్తాడో వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించిన దానిని తిరస్కరించినవాడవుతాడు”. (అబూ యఅలా పదాలు 5408, బైహఖీ 16274. షేఖ్ అల్బానీ సహీహుత్ తర్గీబ్ 3048లో సహీహ్ మౌఖూఫ్ అని చెప్పారు).

అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త ﷺ తెలిపారు:

مَنْ أَتَى حَائِضًا، أَوِ امْرَأَةً فِي دُبُرِهَا، أَوْ كَاهِنًا، فَصَدَّقَهُ بِمَا يَقُولُ، فَقَدْ كَفَرَ بِمَا أُنْزِلَ عَلَى مُحَمَّدٍ

“ఎవరు బహిష్టులో ఉన్న భార్యతో, లేదా ఆమె మల ద్వారంలో సంభోగిస్తాడో లేదా జ్యోతిష్యుని వద్దకు వచ్చి, అతని మాటను సత్య పరుస్తాడో అతడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించిన దానిని తిరస్కరించినవారవుతారు”. (అబూ దావూద్ 3904, తిర్మిజి 135, ఇబ్ను మాజ పదాలు 639. సహీహుత్ తర్గీబ్ 2433).

‘అతడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించిన దానిని తిరస్కరించినవాడవుతాడు’ అంటే: అతను వాటిని హలాల్ (ధర్మసమ్మతం)గా పరిగణిస్తే, సత్యం అని నమ్మితే తిరస్కారం యొక్క బాహ్య భావమే తీసుకొనబడును, ఒకవేళ అలా పరిగణించకుండా, సత్యంగా నమ్మకుండా వాటికి గురి అయితే ‘కుఫ్రానె నిఅమత్’ (కృతఘ్నత) భావంలో తీసుకొనబడును అని తిర్మిజి హదీస్ గ్రంథం యొక్క వ్యాఖ్యాన కర్త అల్లామా ముహమ్మద్ అబ్దుర్ రహ్మాన్ ముబారక్ పూరీ రహిమహుల్లాహ్ చెప్పారు. (తుహ్ఫతుల్ అహ్వజీ 1/419. హ.నం135).

[10] మత్తు సేవించుట

అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

مَنْ شَرِبَ الخَمْرَ لَمْ تُقْبَلْ لَهُ صَلَاةٌ أَرْبَعِينَ صَبَاحًا، فَإِنْ تَابَ تَابَ اللهُ عَلَيْهِ، فَإِنْ عَادَ لَمْ يَقْبَلِ اللهُ لَهُ صَلَاةً أَرْبَعِينَ صَبَاحًا، فَإِنْ تَابَ تَابَ اللهُ عَلَيْهِ، فَإِنْ عَادَ لَمْ يَقْبَلِ اللهُ لَهُ صَلَاةً أَرْبَعِينَ صَبَاحًا، فَإِنْ تَابَ تَابَ اللهُ عَلَيْهِ، فَإِنْ عَادَ الرَّابِعَةَ لَمْ يَقْبَلِ اللهُ لَهُ صَلَاةً أَرْبَعِينَ صَبَاحًا، فَإِنْ تَابَ لَمْ يَتُبِ اللهُ عَلَيْهِ، وَسَقَاهُ مِنْ نَهْرِ الخَبَالِ. قِيلَ: يَا أَبَا عَبْدِ الرَّحْمَنِ: وَمَا نَهْرُ الخَبَالِ؟ قَالَ: نَهْرٌ مِنْ صَدِيدِ أَهْلِ النَّارِ

“ఎవరు మత్తు సేవిస్తారో అల్లాహ్ వారి నలబై రోజుల నమాజు స్వీకరించడు, ఒకవేళ అతను పశ్చాత్తాప పడి క్షమాపణ కోరితే అల్లాహ్ అతడ్ని క్షమిస్తాడు. మళ్ళీ అతను మత్తు సేవిస్తే అల్లాహ్ నలబై రోజుల నమాజ్ స్వీకరించడు, ఒకవేళ అతను పశ్చాత్తాప పడి క్షమాపణ కోరితే అల్లాహ్ అతడ్ని క్షమిస్తాడు. ఆ తర్వాత మళ్ళీ అతను మత్తు సేవిస్తే అల్లాహ్ నలబై రోజుల నమాజ్ స్వీకరించడు, ఒకవేళ అతను పశ్చాత్తాప పడి క్షమాపణ కోరితే అల్లాహ్ అతడ్ని క్షమిస్తాడు. అతను నాల్గవ సారి మళ్ళీ మత్తు సేవించాడంటే అల్లాహ్ నలబై రోజుల నమాజ్ స్వీకరించడు, ఈ సారి అతను పశ్చాత్తాప పడి క్షమాపణ కోరినా అల్లాహ్ అతడ్ని క్షమించడు, ఇంకా ‘ఖబాల్’ నదీ ద్రవపదార్థం త్రాగిస్తాడు”. ‘ఖబాల్’ నదీ ఏమిటి అని అడిగినప్పుడు అబూ అబ్దుర్ రహ్మాన్ (అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ కునియత్) చెప్పారు: ఆ నదీలో నరకవాసుల చీము పారుతూ ఉంటుంది అని.(తిర్మిజి పదాలు 1862, అబూదావూద్ 3680, నిసాయి 5670, ఇబ్ను మాజ 3377, సహీహుల్ జామి 6312. సహీహ్).

[11] ప్రజల హక్కు కాజేసుకొనుట వారిపై దౌర్జన్యం చేయుట

అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త ﷺ అడిగారు:

أَتَدْرُونَ مَنِ الْمُفْلِسُ؟ قَالُوا: المُفْلِسُ فِينَا يَا رَسُولَ اللَّهِ مَنْ لَا دِرْهَمَ لَهُ وَلَا مَتَاعَ، قَالَ رَسُولُ اللَّهِ ﷺ: المُفْلِسُ مِنْ أُمَّتِي مَنْ يَأْتِي يَوْمَ القِيَامَةِ بِصَلَاتِهِ وَصِيَامِهِ وَزَكَاتِهِ، وَيَأْتِي قَدْ شَتَمَ هَذَا وَقَذَفَ هَذَا، وَأَكَلَ مَالَ هَذَا، وَسَفَكَ دَمَ هَذَا، وَضَرَبَ هَذَا فَيَقْعُدُ فَيَقْتَصُّ هَذَا مِنْ حَسَنَاتِهِ، وَهَذَا مِنْ حَسَنَاتِهِ، فَإِنْ فَنِيَتْ حَسَنَاتُهُ قَبْلَ أَنْ يُقْتَصّ مَا عَلَيْهِ مِنَ الخَطَايَا أُخِذَ مِنْ خَطَايَاهُمْ فَطُرِحَ عَلَيْهِ ثُمَّ طُرِحَ فِي النَّارِ

“దరిద్రుడు ఎవరో మీకు తెలుసా?” వారన్నారు: ప్రవక్తా! డబ్బు ధనం లేనివాడు, కావలసిన సామాగ్రి లేనివాడు మాలో దరిద్రుడు. ప్రవక్త చెప్పారు: నా అనుచర సంఘంలోని దరిద్రుడు ప్రళయదినాన నమాజ్, ఉపవాసం, జకాతులతో వస్తాడు, కాని అతడు ఇహలోకంలో ఒకరిని దూషించి ఉంటాడు, మరొకనిపై అపనింద వేసి ఉంటాడు, అతని సొమ్ము తిని ఉంటాడు, ఒకర్ని హత్య చేసి ఉంటాడు, ఇంకొకడ్ని కొట్టి ఉంటాడు. బాధితుల్లో ప్రతి ఒక్కడు అతని పుణ్యాలు తీసుకుంటూ ఉంటాడు, అతని పుణ్యాలు అన్నీ అయిపోయి బాధితుల హక్కు ఇంకా మిగిలి ఉంటే వారి పాపాలు అతనిపై వేయబడతాయి. అనంతరం అతడ్ని నరకంలో విసిరి వేయడం జరుగుతుంది”. (ముస్లిం పదాలు 2581).

ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం ప్రకారం, ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధిలో కూర్చొని ఉన్న ఒక వ్యక్తి ‘ప్రవక్తా! నా వద్ద బానిసలున్నారు, వారు నన్ను తిరస్కరిస్తారు, అపహరణకు పాల్పడతారు, నాకు అవిధేయత చూపుతారు, అందుకు నేను వారిని తిడతాను, కొడతాను. అయితే వారి పట్ల నా ఈ ప్రవర్తన గురించి మీరేమంటారు?’ అని అడిగాడు. అప్పుడు ప్రవక్త చెప్పారుః “వారు నీ పట్ల ఎంత అపహరణకు పాల్పడ్డారు, అవిధేయత చూపారు, తిరస్కరించారో లెక్క తీసుకోవడం జరుగుతుంది, అలాగే నీవు వారికిచ్చిన శిక్ష యొక్క లెక్క తీసుకోవడం జరుగుతుంది.

ఒకవేళ నీవు వారికిచ్చిన శిక్ష వారి పాపాలకు తగినంత ఉంటే అది అక్కడికక్కడే సమానం అయినట్లు, నీకు పుణ్యం లేదు, పాపం లేదు.

ఒకవేళ నీవు వారికిచ్చిన శిక్ష వారి పాపాలకంటే తక్కువ ఉంటే నీకే మేలు కలుగుతుంది. (అంటే వారికంటే నీవు మంచివాడివి).

ఒకవేళ నీ శిక్ష వారి పాపాలకు మించి ఉంటే ఆ మించి ఉన్నంత పరిమాణంలో నీ నుండి పుణ్యాలు తీసుకోబడతాయి”.

తర్వాత ఆ వ్యక్తి ఓ ప్రక్కకు వెళ్ళి బోరుమని ఏడ్చాడు, అప్పుడు ప్రవక్త చెప్పారుః “ఏమిటి? నీవు అల్లాహ్ గ్రంథంలో ఈ ఆయతు చదవటం లేదా?

وَنَضَعُ المَوَازِينَ القِسْطَ لِيَوْمِ القِيَامَةِ فَلَا تُظْلَمُ نَفْسٌ شَيْئًا وَإِنْ كَانَ مِثْقَالَ حَبَّةٍ مِنْ خَرْدَلٍ أَتَيْنَا بِهَا وَكَفَى بِنَا حَاسِبِينَ {الأنبياء:47}

“మేము ప్రళయదినాన న్యాయంగా తూచే త్రాసులను నెలకోల్పుతాము, ఏ ప్రాణికీ ఏ మాత్రం అన్యాయం జరగదు. ఒకవేళ ఆవగింజంత కర్మ ఉన్నా మేము దానిని హాజరుపరుస్తాము. లెక్క తీసుకోవటానికి మేము చాలు”. (అంబియా 21:47).”.

అప్పుడు ఆ మనిషి అన్నాడుః ‘ప్రవక్తా! నేను నా కొరకైనా, వారి గురించైనా ఏదైనా మేలు చేయాలనుకుంటే వారిని వదిలివేయడం కంటే మరే మంచి మార్గం లేదు. అయితే నేను మిమ్మల్ని సాక్షిగా పెట్టి చెబుతున్నాను వారు బానిసత్వం నుండి విముక్తి పొందారు’. (తిర్మిజి 3165, అహ్మద్ 6/281, సహీహుత్తర్గీబ్ 3606).

అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త ﷺ తెలిపారు:

رَحِمَ اللهُ عَبْدًا كَانَتْ لِأَخِيهِ عِنْدَهُ مَظْلِمَةٌ فِي عِرْضٍ أَوْ مَالٍ، فَجَاءَهُ فَاسْتَحَلَّهُ قَبْلَ أَنْ يُؤْخَذَ وَلَيْسَ ثَمَّ دِينَارٌ وَلَا دِرْهَمٌ، فَإِنْ كَانَتْ لَهُ حَسَنَاتٌ أُخِذَ مِنْ حَسَنَاتِهِ، وَإِنْ لَمْ تَكُنْ لَهُ حَسَنَاتٌ حَمَّلُوهُ عَلَيْهِ مِنْ سَيِّئَاتِهِمْ

“తనపై తన సోదరుడ్ని అవమానపరచిన లేదా సొమ్మును కాజేసిన ఏదైనా అన్యాయం ఉంటే, అతని పుణ్యాల నుండి తీసుకోబడే రోజు రాక ముందే అతని వద్దకు వెళ్ళి అది ఇచ్చేసి లేదా క్షమాపణ కోరే వ్యక్తిపై అల్లాహ్ కరుణించుగాక! అక్కడ దీనార్, దిర్హము (డబ్బుధనా)లు ఏమీ ఉండవు. అతని వద్ద సత్కార్యాలుంటే అవి తీసుకోబడతాయి, అతని వద్ద సత్కార్యాలు లేకుంటే అతని వారి (బాధితుల) దుష్కార్యాలు తీసుకొని ఇతనిపై వేయబడతాయి”. (తిర్మిజి 2419, ఇబ్ను హిబ్బాన్ 7362, షేఖ్ అల్బానీ సహీ అని చెప్పారు).

సుఫ్యాన్ రహిమహుల్లాహ్ చెప్పారు: నీవు అల్లాహ్ తో కలుసుకునేటప్పుడు ఏలాంటి నీ మధ్య మరియు అల్లాహ్ మధ్య 70 పాపాలుండడం, నీ మధ్య మరియు ఇతర దాసుల మధ్య ఒక పాపం ఉండడం కంటే ఎంతో సులువైనది. (తజ్కిర: ఖుర్తుబీ 2/13).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలకు ఏ మాత్రం హానీ కల్గించకుండా ఉండాలని ముజాహిదీన్లకు చాలా హెచ్చరికలు చేస్తూ, వారు గనక జిహాద్ సందర్భంలో ప్రజలకు అవస్థ కలుగజేశారంటే వారి పుణ్యం తగ్గవచ్చు, లేదా మొత్తానికే నశించవచ్చు అని హెచ్చరించారు. ముఆజ్ బిన్ అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, నేను ఫలాన యుద్దంలో ప్రవక్త వెంట ఉండగా, కొందరు (తమ గుడారాలు వేసుకోవడంలో అవసరానికంటే ఎక్కువ స్థలం తీసుకొని) ఇతరులను ఇరకాటంలో పడవేసి, ప్రజలు నడవడానికి దారిలేకుండా చేశారు, అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక వ్యక్తిని పంపి ఇలా విజ్ఞప్తి చేయాలని ఆదేశించారు:

أَنَّ مَنْ ضَيَّقَ مَنْزِلًا أَوْ قَطَعَ طَرِيقًا فَلَا جِهَادَ لَهُ

“ఎవరైతే అనవసరంగా లేదా తన అవసరానికి మించి స్థలం తీసుకొని, ఇతరులకు ఇరకాటం కలిగించారో లేదా ప్రయాణికులకు దారి లేకుండా చేశారో అతనిది ఆ జిహాద్ కానట్లే”. (అబూ దావూద్ పదాలు 2629, బైహఖీ 18239, సహీహుల్ జామి6378లో సహీ అన్నారు).

[12] దుష్ప్రవర్తన

సద్వర్తన త్రాసును బరువుగా చేస్తుందని ఇది వరకే చదివియున్నాము, అయితే దానికి భిన్నంగా దుష్వర్తన సత్కార్యాలను వ్యర్థం చేస్తూ, త్రాసును తేలికగా చేస్తుంది.

అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త ﷺ తెలిపారు:

أَحَبُّ النَّاسِ إِلَى اللهِ تَعَالَى أَنْفَعُهُمْ لِلنَّاسِ، وَأَحَبُّ الْأَعْمَالِ إِلَى اللهِ تَعَالَى سُرُورٌ تُدْخِلُهُ عَلَى مُسْلِمٍ، أَوْ تَكَشِفُ عَنْهُ كُرْبَةً، أَوْ تَقْضِي عَنْهُ دَيْنًا، أَوْ تَطْرُدُ عَنْهُ جُوعًا، وَلَأَنْ أَمْشِيَ مَعَ أَخِي فِي حَاجَةٍ أَحَبُّ إِلَيَّ مِنْ أَنْ أَعْتَكِفَ فِي هَذَا الْمَسْجِدِ – يَعْنِي مَسْجِدَ الْمَدِينَةِ- شَهْرًا وَمَنَ كَفَّ غَضَبَهُ سَتَرَ اللهُ عَوْرَتَهُ، وَمَنْ كَظَمَ غَيْظَهُ، وَلَوْ شَاءَ أَنْ يُمْضِيَهُ أَمْضَاهُ مَلَأَ اللهُ قَلْبَهُ رَجَاءً يَوْمَ الْقِيَامَةِ، وَمَنْ مَشَى مَعَ أَخِيهِ فِي حَاجَةٍ حَتَّى يَتَهَيَّأَ لَهُ أَثْبَتَ اللهُ قَدَمَهُ يَوْمَ تَزُولُ الْأَقْدَامِ وَإِنَّ الْخُلُقَ السَّيِّئَ لَيُفْسِدُ الْعَمَلَ كَمَا يُفْسِدُ الْخَلُّ الْعَسَلَ

“ప్రజల్లో వారి కొరకు అధిక ప్రయోజనపరుడే అల్లాహ్ కు ఎక్కువ ప్రియుడైనవాడు. అల్లాహ్ కు ఎక్కువగా ప్రియమైన సత్కార్యాల్లో ముస్లింకు సంతోషం కలిగించుట, అతని కష్టాన్ని దూరం చేయుట, అప్పును చెల్లించుట, ఆకలి తీర్చుట. నేను నా ఈ మస్జిద్ (మదీనా తయిబాలోని మస్జిదె నబవి)లో ఒక మాసం ఏతికాఫ్ లో ఉండడం కంటే నా ముస్లిం సోదరుని వెంట నడచి అతని అవసరాన్ని తీర్చడం నాకు ఎక్కువ ఇష్టమైనది. ఎవరు తన కోపాన్ని దిగమ్రింగుతాడో అల్లాహ్ అతని రహస్యాలను కాపాడుతాడు, ఎవరు తన కోపాన్ని-తలచుకుంటే కోపం ప్రకారం ఆచరించవచ్చు కాని అలా ఆచరించకుండా- దిగమింగుతాడో అల్లాహ్ ప్రళయదినాన అతని హృదయాన్ని ఆశలతో నింపేస్తాడు. ఎవరు తన సోదరుని వెంట నడచి అతని ఏదైనా అవసరాన్ని పూర్తి చేస్తాడో, అల్లాహ్ పాదాలు కదలిపోయే రోజు అతని పాదాలను స్థిరంగా ఉంచుతాడు. వెనిగర్ తేనెను పాడు చేసినట్లు దుష్వర్తన సత్కర్మల్ని పాడు చేస్తుంది”. (తబ్రానీ కబీర్ 3187, సహీహుల్ జామి అల్బానీ 176).

[13] ఒక ముస్లింను అవమానపరచడం

సఈద్ బిన్ జైద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త ﷺ తెలిపారు:

إِنَّ مِنْ أَرْبَى الرِّبَا الِاسْتِطَالَةَ فِي عِرْضِ الْمُسْلِمِ بِغَيْرِ حَقٍّ

“అనవసరంగా ఒక ముస్లిం గౌరవమర్యాదల్లో జోక్యం చేసుకోవడం, వడ్డీ తీసుకోవడం కంటే ఎక్కువ పాపం”. (అబూ దావూద్ 4876, బైహఖీ 20916. సహీహుల్ జామి 2203లో సహీహ్).

[14] ముజాహిద్ ఇంటివారి పట్ల ద్రోహానికి పాల్పడడం

బురైద (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

حُرْمَةُ نِسَاءِ الْمُجَاهِدِينَ عَلَى الْقَاعِدِينَ كَحُرْمَةِ أُمَّهَاتِهِمْ، وَمَا مِنْ رَجُلٍ مِنَ الْقَاعِدِينَ يَخْلُفُ رَجُلًا مِنَ الْمُجَاهِدِينَ فِي أَهْلِهِ فَيَخُونُهُ فِيهِمْ، إِلَّا وُقِفَ لَهُ يَوْمَ الْقِيَامَةِ، فَيَأْخُذُ مِنْ عَمَلِهِ مَا شَاءَ، فَمَا ظَنُّكُمْ؟ وفي رواية: فَقَالَ:فَخُذْ مِنْ حَسَنَاتِهِ مَا شِئْتَ،فَالْتَفَتَ إِلَيْنَا رَسُولُ اللهِ ﷺ، فَقَالَ: فَمَا ظَنُّكُمْ؟

“యుద్ధానికి వెళ్ళినవారి స్త్రీల మానమర్యాదలు యుధ్దానికి వెళ్ళనివారి కొరకు తమ తల్లుల మానమర్యాదల మాదిరిగా పవిత్రమైనవి. ఎవడైనా యుద్ధానికి వెళ్ళినవాడి ఇంటికి పర్యవేక్షకునిగా ఉండి ద్రోహానికి పాల్పడితే ప్రళయదినాన అతడ్ని ఆ యోధుని ముందు నిలబెట్టడం జరుగుతుంది. అతను ఆ ద్రోహి చేసిన సత్కర్మల్లో తాను కోరుకున్నన్ని సత్కర్మలు తీసుకుంటాడు. అప్పుడు ప్రవక్త మీరేమంటారు? అని అడిగారు. మరో ఉల్లేఖనంలో ఉంది: నీవు అతని సత్కర్మల్లో నుండి తీసుకో అని చెప్పబడుతుంది. ఈ మాట చెప్పాక ప్రవక్త మా వైపు తిరిగి మీరేమంటారు? అని అడిగారు. (అంటే అతను గనక ఆశపరుడై ఉంటే ఈ ద్రోహి సత్కర్మల్లో ఏమైనా వదులుతాడా?). (ముస్లిం పదాలు 1897, అబూదావూద్ 2496, నిసాయి 3189).

[15] ఆత్మహత్య

అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం: మేము ఖైబర్ యుద్ధంలో ప్రవక్త

వెంట ఉన్నాము, తనకు తాను ముస్లింగా భావిస్తూ (ధైర్యంగా పోరాడుతూ) ఉన్న ఒక వ్యక్తి గురించి అతను నరకవాసి అని చెప్పారు. యుద్ధం మొదలయ్యాక అతను ధీరునిగా పోరాడుతూ గాయపడ్డాడు, కొందరు ప్రవక్త మాట పట్ల అనుమానంలో పడతారా అనిపించింది, కాని అతని గాయం భరించలేనిదిగా అయి, అతను ఓర్చుకోలేక తన అమ్ములపొది నుండి ఒక బాణము తీసుకొని ఛాతిలో గుచ్చుకున్నాడు (చనిపోయాడు). ఈ సంఘటన చూసిన ముస్లిములు పరిగెత్తుకుంటూ ప్రవక్త వద్దకు వచ్చి, ప్రవక్తా! అల్లాహ్ మీ మాటను సత్యపరిచాడు. అతడు తన ఛాతిలో బాణం గుచ్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. (బుఖారి పదాలు 4204, ముస్లిం 111).

అందుకే సహాబాల -రజియల్లాహు అన్హుమ్- ఆత్మహత్య చేసుకున్నవాని సత్కర్మలు వృధా అవుతాయని నమ్మేవారు.

[16] అనవసరంగా భార్య భర్తకు అవిధేయత చూపుట మరియు ప్రజలు ఇష్టపడని ఇమాం (నాయకుడు, నమాజు చేయించే వ్యక్తి).

అబూ ఉమామ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త ﷺ తెలిపారు:

ثَلَاثَةٌ لَا تُجَاوِزُ صَلَاتُهُمْ آذَانَهُمْ: العَبْدُ الآبِقُ حَتَّى يَرْجِعَ، وَامْرَأَةٌ بَاتَتْ وَزَوْجُهَا عَلَيْهَا سَاخِطٌ، وَإِمَامُ قَوْمٍ وَهُمْ لَهُ كَارِهُونَ

ముగ్గురు వ్యక్తుల నమాజు వారి చెవుల పైకి వెళ్ళదు (అంటే స్వీకరించబడదు); పారిపోయిన బానిస తిరిగి వచ్చే వరకు, రాత్రంతా భర్త ఆమెపై ఆగ్రహించుకొని ఉన్న భార్య మరియు ముఖ్తదీలు ఇష్టపడని ఇమాం. (తిర్మిజి పదాలు 360, బైహఖీ 5125, సహీహుల్ జామి 3057లో హసన్ అన్నారు).

ఇలాంటి వారి నమాజు స్వీకరించబడదు, అయినా వారు మరో సారి నమాజు చేయాలని చెప్పరాదు. ఇదే విషయం ఇమాం నవవీ రహిమహుల్లాహ్ తెలిపారు. భావం ఏమిటంటే వారు ఆ నమాజు పుణ్యాన్ని పొందలేరు.

[17] ఉపకారం, దానం చేసి ఎత్తిపొడుచుట

ఎవరు దానం చేసి లేదా ఉపకారం చేసి వారిని బాధిస్తారో, ఎత్తిపొడుస్తారో వారి ఆ సత్కార్యం యొక్క పుణ్యం వృధా అయిపోతుంది. అల్లాహ్ ఇలా ఆదేశించాడు:

يَا أَيُّهَا الَّذِينَ آَمَنُوا لَا تُبْطِلُوا صَدَقَاتِكُمْ بِالْمَنِّ وَالْأَذَى كَالَّذِي يُنْفِقُ مَالَهُ رِئَاءَ النَّاسِ وَلَا يُؤْمِنُ بِاللهِ وَالْيَوْمِ الْآَخِرِ فَمَثَلُهُ كَمَثَلِ صَفْوَانٍ عَلَيْهِ تُرَابٌ فَأَصَابَهُ وَابِلٌ فَتَرَكَهُ صَلْدًا لَا يَقْدِرُونَ عَلَى شَيْءٍ مِمَّا كَسَبُوا وَاللهُ لَا يَهْدِي الْقَوْمَ الْكَافِرِينَ

ఓ విశ్వాసులారా! మీరు తమ ధనాన్ని పరుల మెప్పు కోసం ఖర్చు చేస్తూ, అల్లాహ్ ను గానీ, అంతిమ దినాన్ని గానీ విశ్వసించని వ్యక్తి మాదిరిగా మీరు మీ ఉపకారాన్ని చాటుకొని, (గ్రహీతల) మనస్సులను నొప్పించి మీ దానధర్మాలను వృధా చేసుకోకండి. అతని ఉపమానం కొద్దిగా మట్టి పేరుకుని ఉన్న నున్నని రాతి బండ వంటింది. దానిపై భారీ వర్షం కురిసి, ఆ మట్టి కాస్తా కొట్టుకుపోయి, కటిక రాయి మాత్రమే మిగులుతుంది. ఇలాంటి వారికి తాము చేసుకున్న దానిలో నుంచి ఏమీ ప్రాప్తించదు. అల్లాహ్ సత్యతిరస్కారులకు సన్మార్గం చూపడు. (బఖర 2:264).

ఎవరయితే ప్రజల పట్ల ఉత్తమంగా వ్యవహరించి లేదా వారికి ఉపకారం చేసి వారిని ఎత్తిపోడుచుట, వారికి బాధ కలిగించుట లాంటి చేష్టలకు పాల్ప డతాడో అతని ఆ సత్కార్య పుణ్యం వృధా అవుతుందన్న భయం ఉంది.

[18] చీలమండల కంటే క్రింద వస్త్రాలు ధరించుట, ఉపకారం చేసి ఎత్తిపొడుచుట, అబద్ధపు ప్రమాణంతో సరుకు విక్రయించుట

అబూ జర్ర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

ثَلَاثَةٌ لَا يُكَلِّمُهُمُ اللهُ يَوْمَ الْقِيَامَةِ، وَلَا يَنْظُرُ إِلَيْهِمْ وَلَا يُزَكِّيهِمْ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ قَالَ: فَقَرَأَهَا رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ ثَلَاثَ مِرَارًا، قَالَ أَبُو ذَرٍّ: خَابُوا وَخَسِرُوا، مَنْ هُمْ يَا رَسُولَ اللهِ؟ قَالَ: الْمُسْبِلُ، وَالْمَنَّانُ، وَالْمُنَفِّقُ سِلْعَتَهُ بِالْحَلِفِ الْكَاذِبِ

“ముగ్గురు వ్యక్తులతో అల్లాహ్ ప్రళయదినాన మాట్లాడడు, వారి వైపున చూడడు, వారిని పరిశుద్ధపరచడు, వారికి కఠినశిక్ష విధిస్తాడు. – ప్రవక్త ఈ మాట మూడు సార్లు పలికారు-. అబూజర్ర్రజియల్లాహు అన్హు వారు నాశనమయ్యారు, నష్టపోయారు, వారెవరు ప్రవక్తా! అని అడిగారు. అప్పుడు ప్రవక్త చెప్పారు: చీలమండలకంటే క్రిందిగా దుస్తులు ధరించే వ్యక్తి, ఉపకారం చేసి ఎత్తిపొడిచే వ్యక్తి, అబద్ధపు ప్రమాణాలతో సరుకు విక్రయించే వ్యక్తి”. (ముస్లిం పదాలు 106).

గమనించండి, ఉపకారం చేసి ఎత్తిపొడిసినందుకు ఎలా ఆ ఉపకార సత్కార్యం వృధా అవుతుందో అలాగే చీలమండలానికి క్రింద దుస్తులు ధరించినందుకు కొన్ని సత్కార్యాలు వృధా అవుతాయన్న భయం ప్రతి ఒక్కరికీ ఉండాలి.

సమాప్తం

ఏ ముస్లిం కూడా ధర్మవిద్య అభ్యసించడం మరియు ఆ విద్య ప్రకారం ఆచరించడంలో అలసిపోకూడదు. చాలా మందికి ఈ పుస్తకంలోని అనేక ఘనతలు తెలియవు, ఎంతో మంది వాటిని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు, కనీసం తెలిసిన వారిని ప్రశ్నించాలన్న కోరిక కూడా కానరాదు. కాని అల్లాహ్ దయ వల్ల ఈ పుస్తకం మీ చేతుల్లోకి వచ్చేసింది, ఆయన మనకు నిజజ్ఞానం ప్రసాదించాడు, ఇక మనం దుఆ చేయాలి, ఆయన తన కరుణతో మన మనస్సులో ధర్మం ప్రేమ కలిగించి, మన హృదయాలకు అలంకరణగా చేయాలి, దాని ప్రకారం ఆచరించాలి, సదా దానిపై ఉండే భాగ్యం ప్రసాదించాలి. ఇంకా దాని లాభం మనకు ఆ రోజు కలగాలి ఏ రోజయితే దుర్మార్గులు, పాపాత్ములు తమ పళ్ళతో స్వయం తమ చేతులు కొరుక్కుంటూ: అయ్యో! నేను ఇహలోక జీవితంలోనే పరలోకానికి ఏదైనా ముందు పంపించుకొని ఉంటే ఎంత బాగుండేది. ఇదేదో జోక్, పరిహాసం కాదు. నిదానంగా ఆలోచించాలి, ఎందుకంటే ఆ తర్వాత ఎల్లకాలం స్వర్గంలో లేదా నరకంలో ఉండవలసి ఉంటుంది. అల్లాహ్ మనకు అన్ని రకాల క్షేమం, సురక్షితాలు ప్రసాదించుగాక.

వసల్లల్లాహు అలా ఖైరిల్ బరియ్యహ్, వహాదియిల్ బషరియ్యహ్, నబియ్యినా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం), వఅలా ఆలిహీ వసహబిహీ అజ్మఈన్, వల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.

ﷺ సల్లల్లాహు అలైహి వసల్లం


[1] అల్ అమ్రు బిల్ మారూఫ్ వన్నహ్ యు అనిల్ మున్కర్ వ అసరుహుమా ఫీ హిఫ్జిల్ ఉమ్మః డాక్ట్రేట్ రచణః డాక్టర్ అబ్దుల్ అజీజ్ అల్ మస్ఊద్ 1/47.

[2] నోటి ద్వారా, నాలుక ద్వారా జిహాద్ రకాలను తెలుసుకొనుటకు నా వేరే రచన చదవండిః కైఫ తర్ ఫఉ దర్జతక ఫిల్ జన్న? (స్వర్గంలో నీ స్థానం ఎలా పెరుగుతుంది) పేజి 70.

%d bloggers like this: