నబీ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై దరూద్ పఠించు ఘనత – హిస్న్ అల్ ముస్లిం

బిస్మిల్లాహ్

107. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ పఠించు ఘనత

219. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రకటించారు.

“ఎవరైతే నాకై ఒకసారి “దరూద్ దుఆ” చదువుతారో అతనికి అల్లాహ్ తన కారుణ్యం పది సార్లు పంపుతాడు.” 

[ముస్లిం 1/288.]


220. మరియు ప్రవక్త (ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రకటించారు :

“నా సమాధిని మీరు ఉత్సవ క్షేత్రంగా చేసుకోకండి, మీరు ఎక్కడ నుండియైనా నాకై “దరూద్ దుఆ” పంపండి అది నాకు తప్పక చేరుతుంది.”

[బుఖారీ ముస్లిం] [అబుదావూద్ 2/218, అహ్మద్ 2/367 మరియు అల్బానీ గారు సహీహ్ అబిదావూద్ 2/283లో దీనిని సహీహ్ అన్నారు]


221. ఇంకా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా తెలిపారు :

“ఎవరి ముందైనా నా పేరు ప్రస్తావించబడినపుడు వారు నాకై “దరూద్ దుఆ” చేయక పోతే అతను పిసినారి.”

[అత్తిర్మిదీ 5/551, ఇతరులు ఉల్లేఖించారు. చూడుము సహీహ్ అల్ జామిఅ 3/ 25, సహీహ్ అత్తిర్మిదీ 3/177.]


222. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇలా తెలిపారు.

“నిశ్చయంగా అల్లాహ్ యొక్క దూతలు కొందరు భూమిపై సంచరిస్తూ ఉంటారు. వారు నా అనుచర సమాజము పంపించు సలాం నాకు అందజేస్తారు.”

[అన్నిసాఈ 3/43, అల్ హాకిం 2/421 మరియు సహీహ్ అన్నిసాఈ 1/274లో అల్బానీ గారు దీనిని సహీహ్ అన్నారు.]


223. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇలా తెలిపారు.

“ఎవరైనా నాకు సలాం పంపినచో, అల్లాహ్ నా ఆత్మను నా వైపుకు పంపిస్తాడు, నేను తిరిగి అతనికి సలాం పంపిస్తాను.”

[అబుదావూద్, సంఖ్య 2041 అల్బానీ గారు సహీహ్ అబిదావూద్ 1/383లో దీనిని హసన్ అన్నారు.]


ఇది హిస్న్ అల్ ముస్లిం (తెలుగు)  అనే పుస్తకం నుండి తీసుకోబడిందిఅరబ్బీ మూలం: సయీద్ బిన్ అలీ బిన్ వహఫ్ అల్ ఖహ్తాని. అనువాదం: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ.
https://teluguislam.net/2010/11/23/hisn-al-muslim-vedukolu-telugu-islam/

పూర్తి దరూద్ షరీఫ్:

“అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదున్ మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్ త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదున్ మజీద్”

చిన్న దరూద్ షరీఫ్ : 

అల్లాహుమ్మ సల్లి వ సల్లిమ్ వ బారిక్ అలా ముహమ్మద్

ఇతర లింకులు:

%d bloggers like this: