ఇస్లాం పరిధి నుంచి బహిష్కరింప జేసే కార్యములు – Nullifiers of Islam

the-nullifiers-telugu-islamక్రింద తెలుప బడిన అతి ఘోరమైన ఈ పది కార్యములు మానవుణ్ణి ఇస్లాం పరిధి నుంచి బహిష్కరింపచేయును.

1. అల్లాహ్‌కు భాగస్వాములు కల్పించువారు ముస్లింలు కాజాలరు.

(إِنَّ اللّهَ لاَ يَغْفِرُ أَن يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَلِكَ لِـمَن يَشَاء وَمَن يُشْرِكْ بِاللّهِ فَقَدْ ضَلَّ ضَلاَلاً بَعِيدًا (النساء:116

అన్నిసా 4:116 :- “అల్లాహ్‌కు సాటి (భాగస్వామ్యం) కల్పించు వారిని అల్లాహ్ అస్సలు క్షమించడు. షిర్క్ తప్ప వేరే పాపములను అల్లాహ్ తన ఇష్టానుసారం క్షమిస్తాడు”

قال الله تعالى:)إِنَّهُ مَن يُشْرِكْ بِاللّهِ فَقَدْ حَرَّمَ اللّهُ عَلَيهِ الْـجَنَّةَ وَمَأْوَاهُ النَّارُ وَمَا لِلظَّالِـمِينَ مِنْ أَنصَارٍ( الـمـائدة:72

అల్ మాయిద 5:72:- “నిశ్చయంగా అల్లాహ్‌కు భాగస్వాముల్ని కల్పించువారికి అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించెను మరియు అతని నివాసము నరకమే, పాపాత్ములకు సహాయం చేయువారు ఎవ్వరూ లేరు”. అంటే అల్లాహ్‌కు భాగస్వాములు కల్పించువారు అవిశ్వాసులు. చనిపోయిన వారిని వేడుకొనుట, సమాధులకు మొక్కుట, అల్లాహ్ పేరుమీద కాకుండా వేరేవాని పేరుమీద బలి ఇచ్చుట..మొదలైనవన్నీ షిర్క్‌లోని విధానములు.

2. తమకి మరియు అల్లాహ్‌కి మధ్య ఎవరినైనా మధ్యవర్తి (సిఫార్సు చేసేవాడు)గా చేసి వేడుకొనుట, మరియు వారిని నమ్ముట వారి సిఫారసుపై నమ్మకం ఉంచుట అవిశ్వాసమే అవుతుందని ఇస్లామీయ పండితులందరి అభిప్రాయం.

3. ఎవరైనా, అవిశ్వాసిని, లేదా బహుదైవారాధకుడిని, అవిశ్వాసి అని నమ్మనివారు మరియు వారి యొక్క అవిశ్వాసములో అనుమానం ఉన్నా లేదా వారి యొక్క ధర్మం కూడా నిజమే అని నమ్మినా సరే, వారు కూడా అవిశ్వాసులుగా భావించబడతారు.

4. ఎవరైనా వేరే విధానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహుఅలైహి వసల్లమ్ తెచ్చిన నిబంధనల (షరిఅహ్) కంటే ఉత్తమమైన విధానమని అనుకుంటే వారు అవిశ్వాసులు. వేరే వారి మాటకు ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లమ్ మాటపై ప్రాముఖ్యత ఇచ్చువారు అవిశ్వాసులు.

5. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లమ్ యొక్క షరిఅహ్ (నియమనిబంధనల) ను  హృదయపూర్వకంగా స్వీకరించకపోవుట అవిశ్వాసము. అతను దానిపై అమలు చేస్తున్నా మనస్సు దానికి వ్యతిరేకంగా నిర్ణయించిన ఎడల అతను అవిశ్వాసి అగును.

قال الله تعالى:)ذَلِكَ بِأَ نَّـهُمْ كَرِهُوا مَا أَنزَلَ اللَّهُ فَأَحْبَطَ أَعْمَـالَـهُمْ( [محمد:9].

ముహమ్మద్ 47:9:- “ఎందుకంటే వారు అల్లాహ్ అవతరించిన షరియత్‌ను అంగీకరించలేదు. అందుచే అల్లాహ్ వారి కార్యములను వ్యర్ధము చేసేను.”

6. అల్లాహ్ గురించి గాని ప్రవక్త గురించి గాని లేదా షరిఅహ్ ను ఎగతాళి చేసినవారు అవిశ్వాసులు.

قال الله تعالى: )وَلَئِن سَأَلْتَهُمْ لَيَقُولُنَّ إِنَّمَـا كُنَّا نَخُوضُ وَنَلْعَبُ قُلْ أَبِاللّهِ وَآيَاتِهِ وَرَسُولِهِ كُنتُمْ تَسْتَهْزِؤُونَ *      لاَ تَعْتَذِرُواْ قَدْ كَفَرْتُم بَعْدَ إِيمَـانِكُمْ إِن نَّعْفُ عَن طَآئِفَةٍ مِّنكُمْ نُعَذِّبْ طَآئِـفَةً بِأَ نَّهُمْ كَانُواْ مُـجْرِمِينَ( التوبة:65-66

అత్తౌబా 9:65–66:-  “ప్రకటించండి! ఏమిటీ, అల్లాహ్ మరియు ఆయన నిదర్శనాలను ఎగతాళి చేయటానికా? మరియు ఆ ప్రవక్తతో ఎగతాళియా? ఇక సాకులు చెప్పకండి. మీరు విశ్వసించిన తర్వాత అవిశ్వాసానికి పాల్పడ్డారు”

7. జాదు (చేతబడి) చేయుట మరియు చేయించుట కూడా అవిశ్వాసుల పని.

قال الله تعالى:)وَمَا كَفَرَ سُلَيْمَـانُ وَلَكِنَّ الشَّيْاطِينَ كَفَرُواْ يُعَلِّمُونَ النَّاسَ السِّحْرَ وَمَا أُنزِلَ عَلَى الْـمَلَكَيْنِ بِبَابِلَ هَارُوتَ وَمَارُوتَ وَمَا يُعَلِّمَـانِ مِنْ أَحَدٍ حَتَّى يَقُولاَ إِنَّمَـا نَحْنُ فِتْنَةٌ فَلاَ تَكْفُرْ( [البقرة:102]

అల్ బఖర 2:102 :- “వారిద్దరూ అప్పుడు వరకూ ఎవ్వరికీ జాదు నేర్పించేవారు కాదు. ఇలా అనే వరకూ మేము ఒక పరీక్ష నీవు అవిశ్వాసానికి పాల్పడకు”

8. విశ్వాసులకు వ్యతిరేకంగా అవిశ్వాసులకు సహాయం చేసేవారు.

قال الله تعالى:)يَا أَ يُّـهَا الَّذِينَ آمَنُواْ لاَ تَتَّخِذُواْ الْيَهُودَ وَالنَّصَارَى أَوْلِيَاء بَعْضُهُمْ أَوْلِيَاء بَعْضٍ وَمَن يَتَوَلَّـهُم مِّنكُمْ فَإِنَّهُ مِنْهُمْ إِنَّ اللّهَ لاَ يَـهْدِي الْقَوْمَ الظَّالِـمِينَ( [الـمـائدة:51]

అల్ మాయిద 5:51:- “మీలో ఎవరైనా వారితో (అవిశ్వాసులతో) స్నేహం చేసిన యెడల నిశ్చయంగా వారు వారిలో వారే. నిశ్చయంగా అల్లాహ్ దుర్మార్గులకు ఎప్పటికీ ఋజుమార్గం చూపడు.”

9. ఇస్లామీయ షరిఅహ్‌లో కొన్నింటిని విడిచిపెట్టే సదుపాయం కొందరికుందని భావించువారు అవిశ్వాసులు.

قال الله تعالى:)وَمَن يَـبْتَغِ غَيْرَ الإِسْلاَمِ دِينًا فَلَن يُقْبَـلَ مِنْـهُ وَهُوَ فِي الآخِرَةِ مِنَ الْـخَاسِرِينَ( [آل عمران:85]

ఆలె ఈమ్రాన్  3:85 :- “ఎవరైనా విధేయతా ధర్మం (ఇస్లాం) కాకుండా వేరే విధానాన్ని అనుసరించిన ఎడల, వారి విధానం స్వీకరించబడదు. ప్రళయదినం రోజున అతడు నష్టపోయేవారిలోని వాడగును.”

10. అల్లాహ్ యొక్క దీన్ (ధర్మం)తో సంబంధం లేకుండా జీవించువారు, ఇస్లాం గురించి నేర్చుకోనివారు, ఆచరించనివారు అవిశ్వాసులు.

قال الله تعالى:)وَمَنْ أَظْلَمُ مِـمَّن ذُكِّرَ بِآيَاتِ رَبِّهِ ثُمَّ أَعْرَضَ عَنْهَا إِنَّا مِنَ الْـمُجْرِمِينَ مُنـتَقِمُونَ( [السجدة:22]

అస్సజ్దా 32:22:- “తన ప్రభువు వాక్యాల ద్వారా బోధించబడినపుడు, వాటి పట్ల విముఖుడయ్యే వానికంటే దుర్మార్గుడెవరు? అటువంటి అపరాధులతో మేము తప్పక ప్రతీకారం తీర్చుకుంటాము.”
పైన తెలుపబడిన అవిశ్వాసకార్యముల నుండి మేము చాలా జాగ్రత్త వహించాలి. అల్లాహ్ యొక్క భయంకర శిక్షల నుండి భయపడుతూ, అల్లాహ్‌ను క్షమాపణ వేడుకుంటుండాలి మరియు అల్లాహ్ ఈ పాపాల నుండి మమ్మల్ని రక్షించమని, కాపాడమని వేడుకుంటుండాలి. యా అల్లాహ్! మమ్మల్ని అవిశ్వాసం నుంచి కాపాడు. ఆమీన్.

ఆరాధన యొక్క అర్ధం – Meaning of Ibadah or Worship

విధేయత లేదా సంతోషంగా విధేయత చూపుట. ఇస్లాంలో ఆరాధన అంటే అల్లాహ్‌కు విధేయుడు అగుట. ఏ ఆజ్ఞలనైతే అల్లాహ్ ప్రవక్త ద్వారా మనకు తెలియజేసెనో, వాటిని తు.చ. తప్పకుండా పాటించుటయే విధేయత చూపుట అగును. అల్లాహ్‌కు ఇష్టమైన ప్రతి పని, అది ఏదైనా సరే, కనపడేది కానీవండి, కనపడనది కానీవండి, మనసులో ఆలోచన కానీవండి, నోటితో పలికే పలుకులు కానీవండి,  చేతులతో చేసే పనులు కానీవండి ఆరాధన (ఇబాదత్) అనబడును. అంటే ప్రతి ముస్లిం యొక్క బాధ్యత ఏమిటంటే, అల్లాహ్ యొక్క ఆరాధనలో కాస్త చిన్నపాటి భాగస్వామ్యం యొక్క వాసన కూడా లేకుండా చేయాలి మరియు ప్రతి కార్యమును మన ప్రవక్త సల్లల్లాహు వ అలైహి వసల్లం తెలిపిన విధంగానే అమలు చేయాలి మరియు స్వకల్పిత కార్యములు చేయరాదు.

స్వీకరించబడే  ఆరాధనలు (ఇబాదహ్): నమాజు, కాబా యొక్క తవాఫు, హజ్, ఉపవాసములు, దుఆ, సజ్దా(~సాష్టాంగం), రుకూ, అల్లాహ్ యొక్క భయం, అల్లాహ్ పైనే నమ్మకం ఉంచుట, అల్లాహ్ నే సహాయం కోరుట, యాచించుట, ఆశించుట, అల్లాహ్ స్వీకరణ కోసం ఎతేకాఫ్ పాటించుట, ప్రార్ధన, ఆరాధన, విధేయత, శరణు వేడుట, దైవభీతి, ప్రేమ, అభిమానం, మనసులోని ఏకాగ్రత, అల్లాహ్ వైపు మనస్సు లగ్నమై ఉండుట, బలి, దానం, వేడుకొనే సకల విధానములు – కేవలం అల్లాహ్ కొరకే ప్రత్యేకించుట…. ఇంకా ఏవైతే ఖుర్‌ఆన్ మరియు హదీసులలో చేయమని ఆదేశింపబడినాయో వాటిని చేయుట మరియు నిషేధింపబడినాయో వాటి నుండి దూరంగా ఉండుట. మరి ఎవరైనా వీటిని అల్లాహ్ కొరకు కాకుండా వేరే వారి కొరకు చేసిన ఎడల అతడు ముష్రిక్ (బహుదైవారాధకుడు) అగును.

)وَمَن يَدْعُ مَعَ اللَّهِ إِلَـهًا آخَرَ لا بُرْهَانَ لَهُ بِهِ فَإِنَّمـَا حِسَابُهُ عِندَ رَبِّهِ إِنَّهُ لا يُفْلِحُ الْكَافِرُونَ( [المؤمنون:117]

మూమినూన్ 23:117:- “ఎవరైతే అల్లాహ్‌తో పాటు వేరే ఆధారం లేని వారిని వేడుకొనే వారి లెక్క వారి ప్రభువు వద్ద ఉన్నది. నిశ్చయంగా అవిశ్వాసులు ఎప్పటికీ సాఫల్యం(ముక్తి) పొందలేరు.”

قال الله تعالى:)وَ أَنَّ الْـمَسَاجِدَ لِلَّهِ فَلا تَدْعُوا مَعَ اللَّهِ أَحَدًا( [الـجن:18]

జిన్ 72:18:-“మస్జిద్ లు ఒక్క అల్లాహ్‌కే పరిమితం, మరి అల్లాహ్‌తో పాటు మరెవరినీ యాచించకండి (ప్రార్ధించకండి), వేడుకోకండి” అంటే ఆరాధనలన్నీ ఒక్క అల్లాహ్ కొరకే ప్రత్యేకించి అంకితం చేయుట.

ఇస్తిఖారః దుఆ – Dua Istikhaara

اللّهُـمَّ إِنِّـي أَسْتَخيـرُكَ بِعِاْـمِك، وَأسْتَقْـدِرُكَ بِقُـدْرَتِـك، وَأَسْـألُـكَ مِنْ فَضْـلِكَ العَظـيم، فَإِنَّـكَ تَقْـدِرُ وَلا أَقْـدِر، وَتَـعْلَـمُ وَلا أَعْلَـم، وَأَنْـتَ عَلاّمُ الغُـيوب، اللّهُـمَّ إِنْ كُنْـتَ تَعْـلَمُ أَنَّ هـذا الأمْـرَ- وَيُسَـمِّي حاجَتَـه – خَـيْرٌ لي في دينـي وَمَعـاشي وَعاقِـبَةِ أَمْـري، فَاقْـدُرْهُ لي وَيَسِّـرْهُ لي ثـمَّ بارِكْ لي فيـه، وَإِنْ كُنْـتَ تَعْـلَمُ أَنَّ هـذا الأمْـرَ شَـرٌ لي في دينـي وَمَعـاشي وَعاقِـبَةِ أَمْـري، فَاصْرِفْـهُ وَاصْرِفْني عَنْـهُ وَاقْـدُرْ لي الخَـيْرَ حَيْـثُ كانَ ثُـمَّ أَرْضِـني بِـه .

అలాహుమ్మ ఇన్నీ అస్తఖీరుక బి ఇల్మిక వస్తఖ్ దిరుక బి ఖుధ్రతిక వ అస్ అలుక మిన్ ఫజలికల్ అజీమి ఫ ఇన్నక తఖ్ దిరు వలా అఖ్ దిరు వ తాలము వలా ఆలము వ అంత అల్లాముల్ గుయూబ్ .అల్లాహుమ్మ ఇన్ కున్ త తాలము అన్న హాజల్ అమ్ ర ఖైరున్ ల్లీ ఫీ దీనీ వ మ ఆషీ వ ఆఖిబతి అమ్ రీ ఫఖ్ దుర్ హులీ వయస్సిర్ హులీ సుమ్మ బారిక్ లీ ఫీహి వ ఇన్ కున్ త – లము అన్న హాజల్ అమ్ ర షర్రున్ ల్లీ ఫీ దీనీ వ మ ఆషీవ . ఆఖిబతి అమ్ రీ ఫస్ రిఫ్ హు అన్నీ వస్ రిఫ్ నీ అన్హు వఖ్ దుర్ లి యల్ ఖైర హయసు కాన సుమ్మ అర్ జినీ బిహీ . ( బుఖారి )

ఓ అల్లా: ! నేను నీ జ్ఞానంతో పాటు మేలును కోరుతున్నాను . నీ మహిమ తో పాటు నీ శక్తిని కోరుతున్నాను . నీ దయతో ఆర్దిస్తున్నాను . నీవే శక్తి కలవాడవు . నేను శక్తి కల వాడను కాను . నీవే ఎరిగిన వాడవు . నేను ఎరిగిన వాడిని కాను . నీవు అగోచరాలను ఎరిగిన వాడివి . ఓ నా ప్రభూ ! నా కోసం , నా ధర్మం కోసం , నా ఇహం కోసం , నా పని లోని పర్యవసానంలో ఈ పని మంచిదని నీవు ఎరిగినట్లైతే దీన్ని నా పరం చెయ్యి . దీనిని నా కోసం సులభతరం చెయ్యి . ఇంకా ఇందులో నాకు శుభాన్ని ఇవ్వు . ఒకవేళ ఈ పని నా కోసం నా ధర్మం , నా ప్రాపంచికం , నా పని లోని పర్యవసానం నా కోసం మంచిది కాదని నీవు భావిస్తే దీనిని నా నుండి తప్పించు . నా కోసం మేలును నిర్ణయించు . నేను ఎక్కడ వున్నా నాకు దానితో సంతృప్తి కలిగించు .


అయతుల్ కుర్సీ Ayat-al-Kursi


اللّهُ لاَ إِلَـهَ إِلاَّ هُوَ الْحَيُّ الْقَيُّومُ لاَ تَأْخُذُهُ سِنَةٌ وَلاَ نَوْمٌ لَّهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الأَرْضِ مَن ذَا الَّذِي يَشْفَعُ عِنْدَهُ إِلاَّ بِإِذْنِهِ يَعْلَمُ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ وَلاَ يُحِيطُونَ بِشَيْءٍ مِّنْ عِلْمِهِ إِلاَّ بِمَا شَاء وَسِعَ كُرْسِيُّهُ السَّمَاوَاتِ وَالأَرْضَ وَلاَ يَؤُودُهُ حِفْظُهُمَا وَهُوَ الْعَلِيُّ الْعَظِيمُ

అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూము లా త ఖుజుహూ సినతువ్ వ్వలా నౌమున్ ల్లహూ మా ఫిస్సమావాతి వమా ఫిల్ అర్ జి , మన్ జల్లజీ  యష్ ఫవూ ఇన్ దహూ ఇల్లా బి ఇజ్నిహీ య – లము  మా బైన అయదీహిం వమా ఖల్ ఫహుం వలా యుహీతూన బిషయ్యిమ్మిన్ ఇల్మిహీ ఇల్లా బి మాషా అ వసి అకుర్ సియ్యుహు స్సమావతి వల్అర్జ వలా  య ఊదుహూ హిఫ్ జుహుమా వహువల్ అలియ్యుల్ అజీం (ఖుర్ ఆన్ 2:255).

ఆయన  అల్లాః . ఆయన తప్ప దాస్యానికి అర్హుడు ఎవరూ లేరు . ఆయన హమేషా సజీవుడుగా వుంటాడు . అందరినీ  ఆదుకునే వాడు . ఆయనకు నిద్ర , కునుకూ రావు . భూమ్యాకాశాలలో ఉన్నదంతా ఆయనదే . ఆయన ఆజ్ఞ లేనిదే సిఫారసు  చేసేవారు ఎవరున్నారు ?  ప్రాణులకు ముందూ వెనుకలలో ఏమున్నదో ఆయన ఎరుగు. ఆయన కోరిన మేరకు తప్ప ఆయన జ్ఞానం నుండి వారు ఏమి గ్రహించలేరు . ఆయన పీటం భూమి ఆకాశాలను ఆవరించి వుంది . ఆ రెండింటి సంరక్షణ ఆయనకు అలుపు తెప్పించదు . ఆయన అందరికన్నా ఉన్నతుడు మరియు గొప్పవాడు .

దుఆ యే ఖునూత్ Dua-e-Qunoot

اللَّهُمَّ اهْدِنِي فِيْمَنْ هَدَيْتَ، وَعَافِنِي فِيْمَنْ عَافَيْتَ، وَتَوَلَّنِي فِيْمَنْ تَوَلَّيْتَ، وَبَارِكْ لِي فِيْمَا أَعْطَيْتَ، وَقِنِي شَرَّ مَا قَضَيْتَ، فَإِنَّكَ تَقْضِي وَلا يُقْضَى عَلَيْكَ، إِنَّهُ لا يَذِلُّ مَنْ وَالَيْتَ،   [ وَلا يَعِزُّ مَنْ عَادَيْتَ ]، تَبَارَكْتَ رَبَّنَا وَتَعَالَيْتَ.

అల్లహుమ్మహ్దినీ ఫీమన్ హద య్ త, వ ఆఫినీ ఫీమన్ ఆఫయ్ త, వ తవల్లనీ ఫీమన్ తవల్లయ్ త, వ బారిక్ లీ ఫీమా ఆతై త, వఖినీ షర్ర మా ఖదై త, ఫ ఇన్నక తఖ్ ధీ వలా యుఖ్ ధా అలైక, ఇన్నహు లా యుజిల్లు మన్ వాలైత, [వలా య ఇజ్జు మన్ ఆద య్ త] తబారక్ త రబ్బనా వత ఆలయ్ . (  తిర్మిజీ ,  అబూదావూద్ )

ఓ  అల్లః !  నీవు హిత బోధనిచ్చిన వారిలోనే నాకు హిత బోధనివ్వు . నీవు స్వస్థత నిచ్చిన వారిలోనే నాకు స్వస్థత ఇవ్వు . నీవు సంరక్షకత్వం వహించిన వారిలోనే నాకు సంరక్షణ కలిపించు . నాకు నీవు ప్రసాదించిన దానిలో నాకు శుభాన్ని ఇవ్వు . నీవు నా కోసం నిర్ణయించిన దానిలో కీడు నుండి నన్ను కాపాడు . నిర్ణయించే వాడవు నీవే . నీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరూ నిర్ణయించలేరు . నీవు మిత్రునిగా చేసుకున్న వారిని ఎవరూ అవమాన పరచలేరు . నీవు విరోధం వహించినవాడు ఎన్నటికీ గౌరవనీయుడు కాలేడు . మా ప్రభూ !  నీవు అమిత శుభములు కలవాడవు .  ఉన్నతమైన ఘనత కలవాడవు .

ఈ mp3 దుఆ  వినండి [Listen]

Shirk – అష్షిర్క్ – దైవత్వంలో భాగస్వాములను చేర్చటం

1. అష్షిర్క్ – దైవత్వంలో భాగస్వాములను చేర్చటం – الشرك

నిర్వచనం:

అల్లాహ్ యొక్క దైవత్వం (తౌహీద్ రుబూబియత్) లో మరియు అల్లాహ్ యొక్క ఏకత్వపు ఆరాధనల (తౌహీద్ ఉలూహియత్) లో ఇంకెవరినైనా చేర్చటం, అంటే ఇతరులను అల్లాహ్ యొక్క భాగస్వాములుగా చేయటం. తౌహీద్ ఉలూహియత్ (అంటే దైవారాధనలలో అల్లాహ్ యొక్క ఏకత్వానికి వ్యతిరేకంగా, ఇతరులను భాగస్వాములుగా చేర్చటం – ఇంకో మాటలో బహుదైవారాధన చేయటం)లో బహుదైవారాధన ఎక్కువగా జరుగుతుంది. అల్లాహ్ తో పాటు ఇతరులను కూడా వేడుకోవటం, ప్రార్థించటం అనేది దీనిలోని ఒక విధానం. కేవలం అల్లాహ్ కే చెందిన ఏకదైవారాధనా పద్ధతులలో కొన్నింటిని ఇతరులకు ప్రత్యేకం చేయటం దీనిలోని మరొక విధానం. ఉదాహరణకు – బలి ఇవ్వటం, ప్రమాణం చేయటం, దిష్టి తీయటం, భయపడటం, ఆశించటం, భక్తి చూపటం (ప్రేమించటం) మొదలైనవి. క్రింద తెలుపబడిన కొన్ని ప్రత్యేక ఆధారాల మరియు మూలకారణాల వలన అష్షిర్క్ (అల్లాహ్ యొక్క ఏకదైవత్వంలో భాగస్వామ్యం కల్పించటం) అనేది,  పాపాలన్నింటిలోను అత్యంత ఘోరమైన పాపంగా గుర్తింప బడినది.

1-   పోలిక: షిర్క్ అనేది దివ్యగుణాలలో సృష్టికర్తను తన సృష్టితాలతో పోలిక కల్పిస్తున్నది. ఎవరైనా అల్లాహ్ తో పాటు ఇతరులను కూడా ఆరాధిస్తున్నట్లయితే, వారు అల్లాహ్ కు భాగస్వాములను చేర్చినట్లు అగును. ఇది అత్యంత ఘోరమైన దౌర్జన్యం (పాపిష్టి పని). దివ్యఖుర్ఆన్ లోని లుఖ్మాన్ అధ్యాయం 13వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు –

(لقمان 13) “إِنَّ الشِّرْكَ لَظُلْمٌ عَظِيمٌ” – భావం యొక్క అనువాదం – {ఖచ్ఛితంగా, అష్షిర్క్ (బహుదైవారాధన) అనేది అత్యంత ఘోరమైన పాపిష్టి పని}. దౌర్జన్యం (పాపిష్టి పని) అంటే ఒకదానికి చెందిన స్థానంలో వేరేది ఉంచటం. అంటే దేనికైనా చెందిన స్థానంలో దానిని కాకుండా వేరే దానిని ఉంచటం. కాబట్టి ఎవరైనా కేవలం అల్లాహ్ కు మాత్రమే చెందిన ఆరాధనలలో ఇతరులను కూడా చేర్చటమనేది, వారు తమ ఆరాధనలను తప్పుడు స్థానం లో ఉంచటమన్న మాట. ఇంకో మాటలో – అనర్హులైన వాటికి తమ ఈ ఉన్నతమైన బాధ్యతను (ఆరాధనను) సమర్పించటం. కాబట్టి, కేవలం అల్లాహ్ కు మాత్రమే చెందిన ‘ఆరాధన’ అనే దివ్యమైన హక్కును, దాని స్థానం నుండి తప్పించి, వేరే స్థానంలో ఉంచటం అంటే అనర్హులైన, అయోగ్యులైన వేరే వాటికి సమర్పించటం అనేది అత్యంత ఘోరమైన మహాపాపంగా సృష్టకర్త ప్రకటించినాడు.

2-    క్షమింపబడని ఘోరాతి ఘోరమైన మహాపాపం: ఎవరైతే ఈ ఘోరమైన మహాపాపం నుండి పశ్చాత్తాపం చెందకుండా, క్షమాభిక్ష వేడుకోకుండా చనిపోతారో, అటువంటి వారిని అల్లాహ్ (ఎట్టి పరిస్థితులలోను క్షమించనని) ప్రకటించెను. ఖుర్ఆన్ లోని అన్నీసా (స్త్రీలు) అనే అధ్యాయంలోని 48వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు

(النساء 48) – “إِنَّ اللَّهَ لا يَغْفِرُ أَنْ يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَلِكَ لِمَنْ يَشَاءُ”

భావం యొక్క అనువాదం – {తనకు భాగస్వాములను కల్పించటాన్ని (షిర్క్) అల్లాహ్ క్షమించడు; కాని ఇది (షిర్క్) కాక  ఇతర పాపలన్నింటినీ ఆయన క్షమించవచ్చును}

3-    స్వర్గం నిషేధించబడినది:  ఎవరైతే తన ఆరాధనలలో ఇతరులకు భాగస్వామ్యం కల్పిస్తారో (బహుదైవారాధన) చేస్తారో అటువంటి వారికి అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించెను. మరియు వారిని అల్లాహ్ శాశ్వతంగా నరకంలోనే ఉంచును. దివ్యఖుర్ఆన్ లోని అల్ మాయిదహ్ (వడ్డించిన విస్తరి) అనే అధ్యాయంలోని 72వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు –

”إِنَّهُ مَنْ يُشْرِكْ بِاللَّهِ فَقَدْ حَرَّمَ اللَّهُ عَلَيْهِ الْجَنَّةَ وَمَأْوَاهُ النَّارُ وَمَا لِلظَّالِمِينَ مِنْ أَنصَارٍ “ (المائدة 72)

భావం యొక్క అనువాదం– {తనతో పాటు ఇతరులను ఆరాధిస్తున్న వారి పై అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించెను మరియు నరకంలోనే వారు శాశ్వతంగా ఉండబోతున్నారు. అటువంటి పాపిష్టులకు సహాయపడే వారెవ్వరూ ఉండరు}.

4-   పుణ్యకార్యాలన్నీ వ్యర్థమవుతాయి: షిర్క్ (బహుదైవారాధన) కారణంగా చేసిన పుణ్యకార్యాలన్నీ నిష్ప్రయోజనమవుతాయి, వ్యర్థమవుతాయి, ఉపయోగపడకుండా పోతాయి. దివ్యఖుర్ఆన్ లోని అల్ అన్ ఆమ్ అధ్యాయంలోని 88వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు

” ذَلِكَ هُدَى اللَّهِ يَهْدِي بِهِ مَنْ يَشَاءُ مِنْ عِبَادِهِ وَلَوْ أَشْرَكُوا لَحَبِطَ عَنْهُمْ مَا كَانُوا يَعْمَلُونَ- “ (الأنعام 88)

భావం యొక్క అనువాదం – {ఇది అల్లాహ్ యొక్క మార్గదర్శకత్వం: ఎవరి ఆరాధనలైతే తనను మెప్పిస్తాయో, వారికి అల్లాహ్ దీనిని ప్రసాదిస్తాడు. ఒకవేళ వారు గనుక ఇతరులను అల్లాహ్ ఏకదైవత్వంలో భాగస్వాములుగా చేర్చితే, వారి చేసిన (కూడగట్టిన) పుణ్యకార్యాలన్నీ వ్యర్థమైపోతాయి}.

ఇంకా దివ్యఖుర్ఆన్ లోని అజ్జుమర్ అధ్యాయంలోని 70వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు

(الزمر70) –  “وَلَقَدْ أُوحِيَ إِلَيْكَ وَإِلَى الَّذِينَ مِنْ قَبْلِكَ لَئِنْ أَشْرَكْتَ لَيَحْبَطَنَّ عَمَلُكَ وَلَتَكُونَنَّ مِنْ الْخَاسِرِينَ”

భావం యొక్క అర్థం – {కాని, ఏవిధంగా నైతే పూర్వికుల ముందు అవతరించినదో, అదే విధంగా మీ దగ్గర కూడా ఇది అవతరింపబడి ఉన్నది. ఒకవేళ మీరు ఎవరినైనా (అల్లాహ్ యొక్క ఏకదైవత్వంలో) చేర్చితే, నిశ్చయంగా మీ యొక్క (జీవితపు) ఆచరణలు నిష్ప్రయోజనమైపోతాయి మరియు మీరు తప్పక (అధ్యాత్మికంగా) నష్టపోయిన వారి పంక్తులలో చేర్చబడతారు}

5-  ప్రాణ సంపదలకు రక్షణ ఉండదు: ఎవరైతే అల్లాహ్ యొక్క ఆరాధనలలో ఇతరులను భాగస్వాములుగా చేర్చుతారో, వారి యొక్క రక్తం (జీవితం) మరియు సంపద నిషిద్ధం కాదు. దివ్యఖుర్ఆన్ లోని అత్తౌబా అధ్యాయం లోని 5వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు.

(التوبة 5)-  “فَاقْتُلُوا الْمُشْرِكِينَ حَيْثُ وَجَدْتُمُوهُمْ وَخُذُوهُمْ وَاحْصُرُوهُمْ وَاقْعُدُوا لَهُمْ كُلَّ مَرْصَدٍ”

భావం యొక్క అనువాదం – {యుద్ధరంగంలో మీకు ఎదురైన ప్రతి బహుదైవారాధకుడితో (ఏకైక ఆరాధ్యుడైన సర్వలోక సృష్టికర్త యొక్క దైవత్వంలో ఇతరులను భాగస్వాములుగా చేర్చుతున్న వారితో) యుద్ధం చేయండి మరియు వారిని హతమార్చండి మరియు వారిని బంధించండి మరియు చుట్టుముట్టండి మరియు వారి ప్రతి యుద్ధతంత్రంలో, యుక్తిలో ఘోరవైఫల్యం నిరీక్షిస్తున్నది.}

ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా ఉపదేశించారు

“أمرت أن أقاتل الناس حتى يقولوا لا إله إلا الله و يُقيموا الصلاة و يُؤتوا الزكاة” –

అనువాదం – “లా ఇలాహ్ ఇల్లల్లాహ్ (కేవలం ఒక్క అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యుడు ఎవ్వరూ లేరు) మరియు ముహమ్మదుర్రసూలుల్లాహ్ (ముహమ్మద్ ^ అల్లాహ్ యొక్క సందేశహరుడు) అని సాక్ష్యమిచ్చి, నమాజు స్థాపించి, విధిదానం (జకాత్) ఇచ్చే వరకు ప్రజలతో పోరు జరపమని (అల్లాహ్ నుండి) నాకు ఆజ్ఞ ఇవ్వబడినది. కాబట్టి వారు పైవిధంగా ఆచరిస్తే, వారి రక్తం మరియు సంపదకు ఇస్లామీయ ధర్మశాస్త్ర ఆదేశాల సందర్భంలో తప్ప,  నా తరపున గ్యారంటీగా రక్షణ లభిస్తుంది.

6-      ఘోరాతి ఘోరమైన మహాపాపం: షిర్క్ (బహుదైవారాధన, అల్లాహ్ యొక్క ఏకైక దైవత్వంలో ఇతరులను చేర్చటం) అనేది మహా పాపములలో ఘోరాతి ఘోరమైనది.

ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా సంబోధించారు –  “ألا أنبئكم بأكبر الكبائر” – అనువాదం – “ఘోరాతి ఘోరమైన మహాపాపం గురించి మీకు తెలియజేయ మంటారా?” మేము (సహచరులం) ఇలా సమాధానమిచ్చాం, “అవును,  ఓ అల్లాహ్ యొక్క సందేశహరుడా r”, వారు ఇలా పలికారు, “الإشراك بالله وعقوق الوالدين” – అనువాదం – “అల్లాహ్ తో ఇతరులెవరినైనా జతపర్చటం, తల్లిదండ్రులకు అవిధేయత చూపటం

కాబట్టి షిర్క్ (బహుదైవారాధన) అనేది అత్యంత ఘోరాతి ఘోరమైన దౌర్జన్యం (పాపిష్టి పని) మరియు తౌహీద్ (ఏకదైవత్వం) అత్యంత స్వచ్ఛమైనది, న్యాయమైనది. మరియు ఏదైనా సరే అల్లాహ్ యొక్క ఏకదైవత్వాన్ని ఖండిస్తున్నట్లయితే, తిరస్కరిస్తున్నట్లయితే, నిరాకరిస్తున్నట్లయితే, వ్యతిరేకిస్తున్నట్లయితే అది అత్యంత ఘోరమైన దౌర్జన్యం (అన్యాయం) అవుతుంది. ఇంకా తన ఆరాధనలలో ఇతరులను భాగస్వాములుగా చేర్చే వారిపై అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించెను. వారి జీవితం, సంపద, భార్య మొదలైనవి కేవలం తననే ఆరాధిస్తున్న ఏకదైవారాధకుల రక్షణ పరిధి లోనికి రావని అల్లాహ్ ప్రకటిస్తున్నాడు. ఇంకా తర్వాతి వారు మొదటి వారిని వారి బహుదైవారాధన కారణంగా ఖైదీ (దాసులుగా) చేయటానికి అనుమతి ఇవ్వబడుతున్నది. ఇంకా బహుదైవారాధకుల ఏ చిన్న మంచి పనినైనా సరే ఆమోదించటాన్ని లేదా ఎవరిదైనా సిఫారసు స్వీకరించటాన్ని లేదా పునరుత్థాన దినమున వారి పిలుపును అందుకోవటాన్ని అల్లాహ్ తిరస్కరించెను. ఎందుకంటే కేవలం అజ్ఞానం వలన, అల్లాహ్ కు భాగస్వామ్యం జతపర్చిన బహుదైవారాధకుడు అందరి కంటే ఎక్కువగా అవివేకుడు, మూఢుడు. అ విధంగా అతడు అల్లాహ్ పై దౌర్జన్యం (అన్యాయం) చెయ్యటమే కాకుండా స్వయంగా తనకు వ్యతిరేకంగా తానే దౌర్జన్యం (అన్యాయం) చేసుకుంటున్నాడు.

7-   ఒక లోపం మరియు తప్పిదం: షిర్క్ (బహుదైవారాధన)  అనేది ఒక లోటు, ఒక లోపం, ఒక దోషం, ఒక కళంకం, ఒక లొలుగు మరియు ఒక తప్పిదం – అల్లాహ్ యొక్క అత్యుత్తమమైన స్వభావం దీని (షిర్క్ భావనల) కంటే ఎంతో మహాన్నతమైనది. కాబట్టి, ఎవరైతే అల్లాహ్ యొక్క ఆరాధనలలో ఇతరులను భాగస్వాములుగా చేర్చుతున్నారో, అలాంటి వారు కేవలం అల్లాహ్ కే చెందిన ప్రత్యేక ‘మహోన్నత స్థానాన్ని’ తాము ఖండిస్తున్నామని మరియు వ్యతిరేకిస్తున్నామని స్వయంగా అంగీకరిస్తున్నట్లవు తున్నది.

షిర్క్ (బహుదైవారాధన) లోని భాగాలు:

షిర్క్ (బహు దైవారాధన లేదా విగ్రహారాధన) ఎలా ప్రారంభమైనది ? (How shirk or idalatory started?)

షిర్క్ (అల్లాహ్ కు సాటి కల్పించుట) గురించి తెలుసుకున్న తర్వాత, అది ఈ లోకంలో ఎలా ప్రారంభమైనదో తెలుసుకోవటం మంచిది. షిర్క్ మొట్టమొదట నూహ్ అలైహిస్సలాం కు పూర్వపుకాలంలో ప్రారంభం అయినది. అల్లాహ్ నూహ్ అలైహిస్సలాం ను వారి సంతతి వద్దకు ప్రవక్తగా చేసి పంపినప్పుడు ఆయన వారిని విగ్రహారాధనను విడనాడవలసినదిగా ఉద్బోదించారు, సకలరాశి సృష్టికర్త అయిన ఒకే ఒక అల్లాహ్ యొక్క ఆరాధన వైపునకు పిలిచారు. దానితో వారు ఆయనను వ్యతిరేకించారు, విగ్రహారాధనకు కట్టుబడి ఉంటానికి పూనుకున్నారు, ఆయనను ఉపదేశాలను తిరస్కరించారు, ఆయనను కష్టపెట్టడం ప్రారంభించారు. ఇంకా వారు ఇలా ప్రకటించారు.

నూహ్ 71:23:- “ మరియు వాళ్ళు అన్నారు – ఎట్టి పరిస్థితిలోను మన దేవుళ్ళను (విగ్రహారాధన ను) వదలవద్దు. మరియు వద్ మరియు సువాఅ మరియు యగూస్ మరియు యఊఖ్ మరియు నసరా ని వదలవద్దు అన్నారు.”

పై వాక్యం యొక్క వివరణ (సహీ బుఖారీ) లో అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా యొక్క ఉల్లేఖన లో ఇలా వివరించబడినది – ఈ పేర్లన్నీ నూహ్ అలైహిస్సలాం కాలంనాటి ప్రజలలోని పుణ్యపురుషుల పేర్లు. వీరు చనిపోయిన తర్వాత షైతాన్ ఇట్లా ఉసి కొల్పెను.” మీరు మీ సభలలో ఆ పుణ్యపురుషుల ఫొటోలు, విగ్రహములు చేసి ఉంచి వారి గురించి తెలియజేస్తుండండి” వారు అదే విధముగా చేయటం ప్రారంభించారు.  కాని ఆ ప్రజలు వారిని ఆరాధించలేదు. తర్వాత ఈ విధంగా విగ్రహాలు తయారు చేసి వారు చనిపోయారు. వారి తర్వాత వచ్చిన ప్రజలు ఆ విగ్రహాలను ఆరాధించటం (పూజించడం) ప్రారంభించారు.

హాఫిజ్ ఇబ్నె అల్ ఖయ్యిం (రహిమహుల్లాహ్) ఇలా విశదీకరించారు – “చాలామంది మతగురువులు ఇలా తెలిపారు. ఆ పుణ్యపురుషులు చనిపోయినప్పుడు ప్రజలు వారి సమాధుల వద్ద గుమిగూడి తపస్సులు(ధ్యానం) చేసెడివారు. ఆ తర్వాత వారి ఫొటోలు(చిత్రపటాలు), విగ్రహాలు తయారు చేశారు. ఇంకా కాలం మారే కొద్దీ, వారి తరువాత ప్రజలు వాటిని పూజించటం ప్రారంభించారు.” కాబట్టి దీని వలన అర్థం మవుతున్నది ఏమిటంటే షిర్క్ (బహు దైవారాధన లేదా అల్లాహ్ కు సాటి కల్పించుట) ప్రారంభమగుటకు అసలు కారణం పుణ్యపురుషుల విషయంలో గులూ (హద్దు మీరటం) చేయటమే. పుణ్యపురుషుల విషయంలో హద్దు మీరి విధేయత చూపటం వలన ప్రజలలో షిర్క్ చోటు చేసుకుంటుంది.

Source: Tawheed Course – Level 01