ఇస్లామీయ షరీఅత్, ఖుర్ఆన్ హదీసుల్లో నిర్ణయించిన పద్ధతుల ద్వారానే మరణించిన వారికి పుణ్యప్రాప్తి జరుగుతుంది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం వసల్లం) ఈ విధంగా ప్రవచించారు:
“మనిషి చనిపోగానే అతని ఆచరణల పరంపర కూడా ఆగిపోతుంది.అయితే మూడు మార్గాల ద్వారా అతనికి పుణ్యం చేరుతూ ఉంటుంది.”
ఆ మూడు మార్గాలు ఇవి :
1) సదఖయె జారియా 2) ప్రయోజనకరమైన విద్య 3) సదాచార సంపన్నులైన సంతానం చేసే దుఆలు
ఈ క్రింది హదీసుకు అనుగుణంగా కూడా తమ మృతులకు పుణ్య సమర్పణ చేయవచ్చు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం వసల్లం) ఈ విధంగా ప్రవచించారు:
విశ్వాసికి తను మరణించిన తర్వాత కూడా తన ఆచరణల, సత్కార్యాల పుణ్యం లభించే మార్గాలు ఇవి:
1) తాను ఇతరులకు బోధించి ప్రచారం చేసిన విద్య
2) తన సంతానాన్ని సదాచార సంపన్నులుగా, ఖుర్ఆన్కు వారసులుగా తీర్చిదిద్దటం
3) మస్జిద్ లు, సత్రాలు నిర్మించటం
4) ఆరోగ్యంగా ఉన్న కాలంలో తన ధనంలో కొంత భాగం దాన ధర్మాల కోసం ఖర్చుపెట్టడం. (ఇబ్నెమాజా)
3) చనిపోయిన వారి తరఫు నుండి ఏదయినా వస్తువు దానం చేస్తే దాని పుణ్యం కూడా మృతులకు లభిస్తుంది. బుఖారీలోని ఒక హదీసులో ఇలా ఉంది: ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం వసల్లం) దగ్గరికి వెళ్ళి, “దైవప్రవక్తా! నా తల్లి చనిపోయింది. నేనామె తరఫున దానధర్మాలు చేస్తే దాని వల్ల ఆమెకు పుణ్యం లభిస్తుందా?” అనడిగాడు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం వసల్లం) ‘లభిస్తుంద‘ని చెప్పారు.
జలదానం అన్నింటి కంటే గొప్ప దానం!
4) ముస్నదె అహ్మద్ మరియు సునన్ గ్రంథాల్లో ఇలా ఉంది: హజ్రత్ సాద్ బిన్ ఉబాదా (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం వసల్లం) దగ్గరకు వెళ్ళి, “దైవప్రవక్తా! నా తల్లి చనిపోయింది. నేను ఆమె తరఫున ఏ వస్తువు దానం చేస్తే ఆమెకు ఎక్కువ పుణ్యం లభిస్తుంది?” అని అడిగారు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం వసల్లం) “నీళ్ళు” అని సమాధానమిచ్చారు. అప్పుడు సాద్ (రదియల్లాహు అన్హు) ఒక బావిని త్రవ్వించి, సాద్ తల్లికి పుణ్య సమర్పణ కోసం ఈ బావి త్రవ్వించ బడిందని ప్రజల మధ్య ప్రకటించారు.
పై హదీసు ద్వారా బోధపడే విషయమేమిటంటే మృతులకు వారి సంతానం తరఫున పుణ్యం చేకూరే మార్గాలలో జల దానం కూడా ఒకటి. ఈ ఆదేశం బావులు, గొట్టపు బావులు, కాలువలు, చెరువులు త్రవ్వించటానికి కూడా వర్తిస్తుంది.
5) సహీహ్ ముస్లింలోని ఒక హదీసులో ఇలా ఉంది: ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం వసల్లం) దగ్గరకు వెళ్ళి, “నా తల్లిదండ్రులు ఆస్తి వదలి వెళ్ళారు. వారు అందులో (దానధర్మాల) గురించి ఎలాంటి వీలునామా రాసి వెళ్ళలేదు. ఇప్పుడు వారి తరఫున నేను దానం చేస్తే దాని పుణ్యం వారికి లభించగలదా?” అని అడిగాడు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం వసల్లం) ‘లభిస్తుంద’నిచెప్పారు.
6) మృతుని కొరకు ముస్లిం ప్రజానీకం దుఆ చేసినా, అతని మన్నింపు కొరకు ప్రార్థించినా దానివల్ల అతనికి పుణ్యం లభిస్తుంది. దాని గురించి అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
“వారి తరువాత వచ్చిన వారు ఇలా ప్రార్థిస్తారు: ప్రభూ! మమ్మల్నీ, మాకు పూర్వం విశ్వసించిన మా సోదరులందరినీ క్షమించు.”(ఖుర్ఆన్ 59 : 10)
సునన్ గ్రంథాల్లో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం వసల్లం) “మీరు మరణించిన వారి జనాజా నమాజ్ చేస్తే, వారి కొరకు చిత్తశుద్ధితో ప్రార్థించండి” అని ఆదేశించారని ఉంది.
బ్రతికున్న వారి తరఫు నుండి మరణించిన వారికి పుణ్యం చేకూరే మార్గాలు ఇవే. ఇవిగాక ఇతర పద్ధతులకు ఖుర్ఆన్ హదీసుల్లో ఎక్కడా రుజువు లభించదు.
Tags: Conveying Rewards to the Deceased (Dead), Isal e Sawab
—
క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది. పూర్తి పుస్తకం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇస్లామీయ ఆరాధనలు– ప్రతి ముస్లిం ఇంట్లో ఉండవలసిన పుస్తకం –శాంతిమార్గం పబ్లికేషన్ ట్రస్ట్
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఇస్లామీయ ఆరాధనలు – ప్రతి ముస్లిం ఇంట్లో ఉండవలసిన పుస్తకం – మూలం: ఫఖీ అబ్బాస్ ఫఖీ అబ్దుల్లాహ్ (Faqi Abbas Faqi Abdullah) సంకలనం, అనువాదం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ ప్రకాశకులు: శాంతిమార్గం పబ్లికేషన్ ట్రస్ట్, హైదరాబాద్
1వ అధ్యాయం:మూల విశ్వాసాలు[PDF][45 పేజీలు] ముస్లిముల ప్రాథమిక విశ్వాసాలు, ఏకదైవారాధన(తౌహీద్), అనేక దేవుళ్ళను పూజించటం (షిర్క్), షిర్క్-వివిధ రూపాలు, చిన్న షిర్క్, ఖుర్ఆన్, హదీసుల అనుసరణ…
7వ అధ్యాయం: ఆస్తి వారసత్వం[PDF] [5 పేజీలు] ఆస్తి పంపకానికి ప్రాథమిక సూత్రాలు,ఆస్తి వాటాలు, వీలునామా, మూడోవంతు కంటే ఎక్కువ ఆస్తి మీద వీలునామా చెల్లదు
8వ అధ్యాయం: హజ్ – ఉమ్రా[PDF] [7 పేజీలు] హజ్ విశిష్టత, హజ్ విధింపుకు షరతులు, హజ్ రకాలు, హజ్ విధులు, ఉమ్రా వివరణ, చిన్న పిల్లలు చేసే హజ్
9వ అధ్యాయం: పండుగలు – ఖుర్బానీలు[PDF] [6 పేజీలు] పండుగ రోజు నియమాలు, పండుగ రోజు పఠించ వలసిన తక్బీర్, పండుగ నమాజులకు స్త్రీలు కూడా వెళ్ళాలి, ఈదుల్ అజ, ఖుర్బానీ నియమాలు
12వ అధ్యాయం: ఇస్లాం జీవన విధానం[PDF] [32 పేజీలు] సలామ్ ఆదేశాలు, తల్లిదండ్రుల హక్కులు, పిల్లల శిక్షణ, రోగుల పరామర్శ, అతిధి మర్యాద, భోజన నియమాలు
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) ఉల్లేఖనం ప్రకారం: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) రమజాన్ మాసంలో తప్ప, ఇతర మాసాలలో మొత్తం నెల ఉపవాసాలు పాటించినట్లు నేను ఎప్పుడు చూడలేదు. మరియు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) షాబాన్ నెలకంటే ఎక్కువగా ఉపవాసాలు ఇతర నెలల్లో పాటించినట్లు ఆయన్ని నేను చూడలేదు. (బుఖారీ:1833, ముస్లిం:1956)
హజ్రత్ ఉసామా బిన్ జైద్(రజియల్లాహు అన్హు) కధనం ప్రకారం: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారిని నేను ఇలా అడిగాను: “ఓ అల్లాహ్ ప్రవక్తా (సల్లల్లాహు అలైహి వసల్లం) మీరు షాబాన్ మాసంలో (అధికంగా) ఉపవాసాలు పాటించినట్లు, ఏ ఇతర మాసాలలో అన్ని ఉపవాసాలను పాటించినట్లు నేను మిమ్మల్ని చూడలేదు. దానికి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా బదులిచ్చారు:
“రజబ్ మరియు రమజాన్ నెలకి మధ్య ఉన్న షాబాన్ నెల యొక్క వాస్తవం ప్రజలకు తెలియదు. ఈ నెలలో ప్రజలు చేసిన కార్యాలు అల్లాహ్ ముందు సమర్పించబడతాయి. కనుక నా పుణ్యకార్యాలు అల్లాహ్ యందు నేను ఉపవాస స్థితిలో ఉండగా సమర్పించబడాలని ఇష్టపడుతున్నాను.”
(నసాయి:2317, అబూ దావూద్, సహీహ్ ఇబ్ను ఖుజైమ)
సలఫ్ పద్ధతి: సహాబా, తాబిఈన్ తదితరులు అధికంగా ఉపవాసంతో పాటు ఖుర్ఆన్ కూడా ఎక్కువగా పారాయణం చేసేవారు. దీని తర్వాత రమజాను మాసం గనక, అందులో ఈ మంచి అలవాటు స్థిరపడిపోతుంది. (లతాఇఫుల్ మఆరిఫ్.)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
విశ్వాసంలో మాధుర్యాన్ని, తీపిని ఆస్వాదించాలన్న కోరిక మీకు ఉందా ? అయితే తప్పనిసరిగా ఈ మంచి వీడియో చూడండి మరియు మీ బంధుమిత్రులకు షేర్ చెయ్యండి., ఇన్ షా అల్లాహ్
తప్పకుండ వినాల్సిన వీడియో, డోంట్ మిస్ఏ. కాంతంలో డిస్టర్బన్స్ లేకుండా ఏకాగ్రతగా వింటే, సంపూర్ణ లాభం పొందవచ్చు
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
1) ఒక రాత్రిని ఆరాధన కోసం ప్రత్యేకం చేసుకోవడం సరికాదు.
2) షాబాన్ నెల ఉపవాసాల మహత్యం.
3) షాబాన్ నెల 15వ రాత్రి మహత్యం.
4) షబే బరాత్ గురించిన తప్పుడు మరియు కాల్పనిక హదీసులు.
5) షబే బరాత్ లో ఏం చెయ్యాలి?
6) షాబాన్ 15వ రాత్రి నిర్ణయాలు తీసుకోబడే రాత్రినా?
మొదటి ఖుత్బా
ఇస్లామీయ సోదరులారా!
అల్లాహ్ జిన్నాతులను, మానవులను తన ఆరాధన కోసం సృష్టించాడు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
وَمَا خَلَقْتُ الْجِنَّ وَالْإِنْسَ إِلَّا لِيَعْبُدُونِ “నేను జిన్నాతులను, మానవులను సృష్టించింది వారు నన్ను ఆరాధించటానికి మాత్రమే“. (జారియాత్ : 56)
కానీ, ఆరాధన కోసం జీవితంలోని ఒక ప్రత్యేక కాలాన్ని లేదా ప్రత్యేక సంవత్సరాన్ని, లేదా ప్రత్యేక మాసాన్ని లేదా ప్రత్యేక వారాన్ని లేదా ప్రత్యేక దినాన్ని లేదా ప్రత్యేక రాత్రిని నిర్ణయించుకొని మిగతా జీవితమంతా (అల్లాహ్) ఆరాధన పట్ల అశ్రద్ధ చూపడం సరికాదు.
మానవ పుట్టుక అసలు ఉద్దేశ్యమే అల్లాహ్ ను ఆరాధించడం కాబట్టి (ఆరాధనకు) యోగ్యమైన వయస్సు నుండి జీవితపు ఆఖరి క్షణాల వరకు గూడా అల్లాహ్ ను ఆరాధిస్తూ గడపాలి. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :
అందుకే, ఎవరైతే తన జీవిత అసలు లక్ష్యం (అల్లాహ్ ను) ఆరాధించటం అని భావిస్తాడో అతనే సఫలీకృతుడు. అలాకాక, ఎవరైతే తన జీవిత లక్ష్యాన్ని కేవలం తన కోసం, తన ఇంటి వారికోసం ఇహలోకపు తళుకుబెళుకులు సమకూర్చుకోవడంగా భావిస్తాడో అతను ఎట్టి పరిస్థితుల్లోనూ సాఫల్యం పొంద లేడు.
నేడు పరిస్థితి ఎలా వుందంటే – ఒకటేమో, ముస్లిం సమాజంలోని అధికులు అల్లాహ్ ఆరాధన పట్ల అశ్రద్ద చూపివున్నారు. దీనికితోడు, వారికి కొంత మంది – ఒక సం॥లో రెండు సార్లు రాత్రి జాగారం చేసి, మూడు నాలుగు రోజులు ఉపవాసముంటే, ఈ ఆరాధన వారి మోక్షానికి, ఇహపరలోకాల సాఫల్యానికి సరిపోతుంది అని మాయమాటలు చెప్పి వారినింకా భ్రష్టు పట్టించారు.
కాని, వాస్తవానికి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), ఆరాధన కోసం ఒక రాత్రిని ప్రత్యేకించు కోవడాన్ని (గట్టిగా) వారించారు.
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“రాత్రిళ్లు నిలబడడం (నమాజు చేయడం)లో కేవలం శుక్రవారం రాత్రిని మరియు ఉపవాసం వుండడానికి శుక్రవారాన్ని ప్రత్యేకించుకోకండి. ఒకవేళ ఎవరైనా ఉపవాసముంటూ, మధ్యలో శుక్రవారం వస్తే అది వేరే విషయం“. (ముస్లిం : 1144)
అందుకే, ఏదైనా రాత్రిని ఆరాధన కొరకు ప్రత్యేకించు కోవడం సరైనదైతే ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) శుక్రవారం రాత్రి ఆరాధన కోసం ప్రత్యేకించుకోవడానికి అనుమతి ఇచ్చి వుండేవారు. ఎందుకంటే మొత్తం వారంలోని రాత్రిళ్ళలో శుక్రవారం రాత్రి ఉత్తమమైనది. అయినప్పటికీ ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) దీనిని వారించారు. దీని ద్వారా తెలిసేదేమిటంటే సంవత్సరంలో కేవలం ఒకటి రెండు రాత్రులు ఆరాధనలో గడిపి మిగతా సంవత్సరమంతా దీని పట్ల అశ్రద్ద చూపడం ఎంతమాత్రం సరికాదు.
స్వయానా దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అలవాటు కూడా ఇదే. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) సంవత్సరంలోని ప్రతి రాత్రీ ఆరాధించేవారు. పైగా ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవితపు ప్రతి క్షణం ఆరాధనలోనే గడిచేది. కనుక మనం కూడా మన జీవితాన్ని ప్రతి క్షణం అల్లాహ్ ఆరాధనలో గడిపేందుకు ప్రయత్నించాలి. ఇది ఎలా సాధ్యపడుతుందంటే మనం వేసే ప్రతి అడుగు అల్లాహ్ సంకల్పాని కనుగుణంగా వుండాలి. చేసే ప్రతి కార్యం ఆయన మెప్పు కోసం వుండాలి.
ఆయెషా (రజియల్లాహు అన్హు) కథనం:
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) రాత్రిళ్ళు నమాజులో ఎంత (సుదీర్ఘంగా) నిలబడేవారంటే ఆయన కాళ్ళలో పగుళ్ళు ఏర్పడేవి. నేను – ఓ దైవ ప్రవక్తా! మీరు ఇలా ఎందుకు చేస్తారు (ఎందుకింతగా కష్టపడతారు)? అల్లాహ్ మీ మునుపటి మరియు రాబోయో తప్పిదాలను మన్నించేశాడుగా అని అనేదాన్ని, ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) నాతో – (అల్లాహ్ నాకు ప్రసాదించిన దానికిగాను) నేను కృతజ్ఞుడైన దాసుడు కాకూడదా! అని అనేవారు. (బుఖారీ : 4837, ముస్లిం : 2820)
ముగైరా (రజియల్లాహు అన్హు) కథనం:
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) రాత్రిళ్ళు (నమాజులో) ఎంత సుదీర్ఘంగా నిలబడేవారంటే ఆయన కాళ్ళు వాచిపోయేవి. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం)తో ఇలా అనబడింది: అల్లాహ్ మీ మునుపటి మరియు రాబోయే తప్పిదాలను మన్నించేశాడు. అయినప్పటికీ మీరు ఇంత సుదీర్ఘంగా ఎందుకు నిలబడతారు? ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) జవాబిస్తూ “నేను కృతజ్ఞుడైన దాసుణ్ణి కాకూడదు మరి!” అని అన్నారు. నేను (బుఖారీ: 4836, ముస్లిం : 2819)
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎల్లప్పటి అలవాటేమిటంటే – ఆయన రాత్రిళ్ళు సుదీర్ఘంగా ఖియాం చేసేవారు. దీనితో ఆయన కాళ్ళలో పగుళ్ళు ఏర్పడేవి లేదా వాపు వచ్చేది. అంతేగానీ సంవత్సరంలో కేవలం రెండు మూడు రోజులు ఇలా చేసేవారు కాదు. మరి జీవితం గడపడానికి ఉత్తమ పద్దతి కేవలం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పద్ధతే.
జాబిర్ బిన్ అబ్దుల్లా (రజియల్లాహు అన్హు) కథనం:
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) శుక్రవారం ఖుత్బా యందు ఇలా సెలవిచ్చేవారు – స్తోత్రం తర్వాత, (బాగా గుర్తుంచుకోండి!) అన్నిటికన్నా ఉత్తమమైన వాక్కు అల్లాహ్ గ్రంథము, అన్నిటి కన్నా ఉత్తమ పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పద్ధతి, అన్నింటి కన్నా చెడు కార్యం (ధర్మంలో) క్రొత్తగా ఆవిష్కరించబడేది మరియు ప్రతి బిద్ అత్ మార్గభ్రష్టతే. (ముస్లిం : 867)
దీని ద్వారా తెలిసిందేమిటంటే – అల్లాహ్ గ్రంథం మరియు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సున్నత్ లే అసలు ధర్మం. ఇక వీటికి విరుద్ధంగా ధర్మంలో క్రొత్తగా సృష్టించబడే ప్రతి కార్యం అత్యంత చెడు కార్యమే, అది ప్రజల దృష్టిలో ఎంత గొప్పదైనా సరే. దీని ద్వారా తెలిసిన మరో విషయమేమిటంటే – అల్లాహ్ గ్రంథం మరియు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సున్నత్ ద్వారా ఆధారం దొరకని కార్యం బిద్అత్ మరియు ప్రతి బిద్అత్ మార్గభ్రష్టతకు ఆనవాలు. ధర్మంలో ‘బిద్ధతే హసన‘ అన్న బిద్అత్ ఏదీ లేదు. బిద్అత్ లన్నీ మార్గభ్రష్టతే మరియు వీటిని ఆచరించే వారిని అవి మార్గభ్రష్టులుగా చేసేస్తాయి.
షాబాన్ నెల మరియు ఉపవాసాల మహత్యం
షాబాన్ నెలలో దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) రమజాన్ తప్ప, ఇతర మాసాల కన్నా ఎక్కువగా ఉపవాసాలుండేవారు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిస్తూ వుండేవారు:
“ఈ నెలలో సత్కార్యాలు పైకి లేపబడతాయి. మరి నా ఆచరణలు (నా) ఉపవాస స్థితిలో పైకి లేపబడటాన్ని నేను ఇష్టపడతాను.”
అయినప్పటికీ, ఈ నెలను నాలుగు నిషిద్ధ మాసాలలో చేర్చడం సరైనది కాదు. ఆ మాసాల్లో యుద్ధాలు, హత్యలు రక్తం చిందించడం నిషేధం కాబడ్డాయి, అందరు విశ్లేషకులు, హదీసు వేత్తలు మరియు విద్వాంసుల ఏకాభిప్రాయం ఏమిటంటే ఆ నాలుగు నిషిద్ధ మాసాలు – జిల్ ఖాదా, జిల్ హిజ్జ, ముహర్రమ్ మరియు రజబ్. ఏ విశ్లేషకుడు కూడా షాబాన్ నెలను నిషిద్ధ మాసాల్లో చేర్చలేదు.
ఈ యావత్ నెలలో దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రత్యేకంగా పాటించిన ఆరాధన ఉపవాసమే. అది కూడా పూర్తి నెల పాటించారు అంతేగాని ఏదో ఒక రోజు ప్రత్యేకంగా కాదు. ఏదో ఒక రోజు ఉపవాసపు శ్రేష్ఠత కూడా వివరించలేదు.
ఆయెషా (రజియల్లాహు అన్హు) కథనం:
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నిరంతరంగా (ఏమాత్రం విడిచిపెట్టకుండా) ఉపవాసాలు వుండేవారు. ఆయన ఉపవాసాన్ని ఇక వదలరేమో అని మేము అనుకునేవాళ్ళం. అలాగే ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒకవేళ ఉపవాసం వదిలేస్తే చాలా రోజుల దాకా మానేసేవారు. చివరికి మాకు – ఆయన ఉపవాసం వుండరేమో అని అనిపించేది. నేను ఆయన్ని రమజాన్ తప్ప మరే నెలలోనూ పూర్తిగా ఉపవాసముండడం చూడలేదు. నేను ఆయన్ని – షాబాన్ నెల కన్నా ఎక్కువగా మరే నెలలోనూ ఉపవాసాలుండడం చూడలేదు. (బుఖారీ, ముస్లిం)
ఆయేషా (రజియల్లాహు అన్హ) ఇలా కూడా సెలవిచ్చారు:
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు ఉపవాసాల కోసం అన్నిటి కన్నా ప్రియమైన నెల షాబాన్ నెల, తదుపరి ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) రమజాన్ ఉపవాసాలు వుండేవారు. (అబూ దావూద్: 2431, సహీహ్ -అల్బానీ)
అలాగే, ఆమె ఇలా కూడా సెలవిచ్చారు:
నేను దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను షాబాన్ నెలలో కన్నా ఎక్కువగా ఏ నెలలోనూ ఉపవాసాలుండగా చూడలేదు. ఆయన దానిలో (షాబాన్ నెలలో) కొద్ది రోజులు తప్ప అన్ని రోజులు ఉపవాసముండేవారు, పైగా ఆయన దానిలో పూర్తిగానే ఉపవాసముండేవారు. (తిర్మిజీ: 736, సహీహ్- అల్బానీ)
అంతేగాక, ఉమ్మె సలమా (రజియల్లాహు అన్హ) కథనం:
నేను దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను రెండు నెలలు నిరంతరంగా ఉపవాసముండడం చూడలేదు. కేవలం షాబాన్ మరియు రమజాన్ నెలల్లో తప్ప. (తిర్మిజీ: 736, సహీహ్- అల్బానీ)
షాబాన్ నెలలో ఎక్కువగా ఉపవాసముండడంలో దాగి వున్న మర్మం
ఉసామా బిన్ జైద్ (రజియల్లాహు అన్హు) దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను నేను మిమ్మల్ని షాబాన్ నెలలో ఉపవాసమున్నంతగా మరే నెలలోనూ చూడలేదు (కారణం ఏమిటి?) అని అడిగారు.
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జవాబిస్తూ – “రజబ్ మరియు రమజాన్ నెలల మధ్య ప్రజలు ఉపవాసాల గురించి అశ్రద్ధ చూపే నెల ఇది. మరి చూడబోతే, ఈ నెలలోనే ఆచరణలు అల్లాహ్ వైపునకు లేపబడతాయి. మరి నా ఆచరణలు (నేను) ఉపవాసం వున్న స్థితిలో పైకి లేపబడటాన్ని నేను ఇష్ట పడతాను” అని అన్నారు.
ఈ హదీసులన్నింటి ద్వారా తెలిసిన విషయమేమిటంటే – ఈ నెలలో అధికంగా ఉపవాసాలు ఉండాలి.
షబే బరాత్ గురించి ఏది సత్యం? ఏది అసత్యం?
షాబాన్ నెలలో ఉపవాసాల మహత్యం గురించి తెలుసుకున్నాక ఉదయించే ఒక ప్రశ్న ఏమిటంటే ఈ నెల 15వ తారీఖు ప్రాముఖ్యత ఏమిటి మరి?
వాస్తవం ఏమిటంటే – సత్యాసత్యాల గురించి ఏమాత్రం పట్టించుకో కుండా ఏ 3,4 విశిష్ఠ రాత్రుల గురించి వివరించడం జరుగుతూ వుంటుందో, వాటిలో షాబాన్ నెల 15వ తారీఖు రాత్రి కూడా ఒకటి. సాధారణంగా దీనిని ‘షబే బరాత్’ అని అంటూ వుంటారు.
ఈ రాత్రి గురించి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి ఈ ప్రవచనం ప్రామాణిక పరంపరతో ఉల్లేఖించబడింది:
“అల్లాహ్ – షాబాన్ నెల 15వ తేదీ రాత్రి తన సృష్టితాల వైపునకు (దయతో) చూస్తాడు. తదుపరి బహుదైవారాధకుడు (ముష్రిక్) మరియు అసూయా పరుడు తప్ప మిగతా సృష్టితాలను అందరినీ క్షమిస్తాడు.” (తిర్మిజి, ఇబ్నె హిబ్బాన్, బైహఖీ)
ఈ కాలపు హదీసువేత్త అయిన షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ ఈ హదీసుకు సంబంధించిన వేర్వేరు పరంపరలు పేర్కొన్న తర్వాత ఇలా వివరించారు: “దీని సారాంశం ఏమిటంటే ఈ హదీసు దీని వేర్వేరు పరంపరలతో కలిసి నిస్సందేహంగా ప్రామాణికమైనది (సహీహ్).” (అస్సహీహ : 1144)
మరో ఉల్లేఖనంలో పదాలు ఇలా వున్నాయి:
“నిశ్చయంగా అల్లాహ్, షాబాన్ నెల 15వ తేదీ రాత్రి దాసులపై కరుణతో (దయతో) చూస్తాడు. నిజమైన విశ్వాసులు (మోమిన్)ను క్షమిస్తాడు, అవిశ్వాసులకు గడువు ఇస్తాడు మరియు అసూయాపరులను వారి మనసులను అసూయ నుండి శుద్ధి చేసుకొనే వరకు వదిలేస్తాడు”. (సహీహుల్ జామె లిల్ అల్బానీ : 1898)
ప్రియతమ సోదరులారా!
షాబాన్ 15వ తేదీ రాత్రి మహత్యాన్ని వివరించే ఒకే ఒక్క ప్రామాణిక హదీసు ఇది. ఇది తప్ప సాధారణంగా ఈ రాత్రి మహత్యాన్ని గురించి ధార్మిక సమ్మేళనాల్లో, పత్రికల్లో వివరించబడే హదీసులన్నీ అత్యంత బలహీనమైనవేకాక, కాల్పనికమైనవి కూడా. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) షరీయతు ఇలాంటి పనికిమాలిన మాటల నుండి ఎంతో పరిశుద్ధంగా వుంది.
షబే బరాత్ ను పురస్కరించుకొని సాధారణంగా పేర్కొనబడే బలహీన, కాల్పనిక హదీసులలో కొన్ని ఇవి:
(1) “షాబాన్ నా మాసం మరియు రమజాన్ అల్లాహ్ మాసం” (జయీఫుల్ జామె – అల్బానీ : 3402, మౌజూ) దీనిని అల్బానీ రహిమహుల్లాహ్ కాల్పనికమైనది (మౌజూ) గా ఖరారు చేశారు.
(2) పేర్కొనబడే మరో ఉల్లేఖనం ఏమిటంటే – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక రాత్రి ఆయెషా (రజియల్లాహు అన్హ) ఇంట్లో వున్నారు. అకస్మాత్తుగా ఆయన అక్కణ్ణుంచి బయలుదేరారు. ఆయెషా (రజియల్లాహు అన్హ) కూడా ఆయన వెనుకనే వెళ్ళిచూస్తే, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) బఖీ (మదీనా స్మశాన వాటిక)లో వున్నారు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆమెను చూసి – (ఓ ఆయెషా!) అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నీపై దౌర్జన్యం చేస్తారని శంకించావా? అని అడిగారు. ఆమె – ఓ దైవ ప్రవక్తా! బహుశా మీరు మీ సతీమణులలో, ఎవరో ఒకరి ఇంటికి వెళ్ళారన్న అనుమానం కలిగింది అని అన్నారు. దీనిపై ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) – “నిశ్చయంగా అల్లాహ్, షాబాన్ 15వ రాత్రి ఇహలోకపు ఆకాశానికి విచ్చేస్తాడు – తదుపరి ‘బనూ కల్బ్’ తెగ మేకల వెంట్రుకలకు సరిసమానంగా మానవులను క్షమిస్తాడు“. (తిర్మిజీ: 739, ఇబ్నె మాజ : 1389, జయీఫ్- అల్బానీ)
ఇతర ఇమాములతోపాటు స్వయానా ఇమామ్ తిర్మిజి కూడా ఈ హదీసును ఉల్లేఖించిన తర్వాత దీని బలహీనత ను సూచించారు. పైగా ఆయన ఇమామ్ బుఖారీ ద్వారా ఆయన దీనిని బలహీనమైనదని అనేవారని ఉల్లేఖించారు.
ఇక్కడ తెలుసుకోవాల్సిన ఒక విషయమేమిటంటే – ఆయెషా (రజియల్లాహు అన్హ) వివరించిన వృత్తాంతము – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) బఖీ వెళ్ళి అక్కడి వారి కోసం ప్రార్ధించడం- మాత్రం ప్రామాణికమైనది. సహీహ్ ముస్లిం వగైరా గ్రంథాల్లో దీని గురించి వివరంగా వుంది, కానీ, దానిలో షాబాన్ నెల 15వ తేదీ రాత్రి గురించి ఏ మాత్రం లేదు. ఆ ప్రామాణికమైన పూర్తి వృత్తాంతం ఇలా వుంది:-
ఆయెషా (రజియల్లాహు అన్హ) కథనం: దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఓ రాత్రి నా ఇంట్లో వున్నారు. తను కప్పుకొని వున్న దుప్పటిని, బూట్లను ఆయన తీసి ఆయన తలకు దగ్గరగా పెట్టారు. ఆయన ధరించివున్న దుప్పటి లోని కొంత భాగాన్ని పరుపుపై వేసి నడుంవాల్చారు. ఇలా కొంత సమయం దాటాక నేను నిద్రపోయానని ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) భావించి మెల్లగా తన దుప్పటిని తీసుకొని, బూట్లు ధరించి, తలుపు తెరిచి బయటికి వెళ్ళి తలుపును మెల్లగా మూసేశారు. తదుపరి నేను లేచాను. నా శిరస్త్రాణం తలపై ధరించి, ఓణీ కప్పుకొని, దుప్పటి మడుచుకొని నేను కూడా ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) వెనుక వెళ్ళాను. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) బఖీ లోకి వెళ్ళారు. అక్కడ చాలా సేపు నిలబడివున్నారు. ఈ తరుణంలో మూడు సార్లు తన చేతుల్ని (దుఆ కోసం) పైకెత్తారు. తదుపరి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) వెను తిరగగా, నేను కూడా తిరిగాను. ఆయన త్వరత్వరగా నడుస్తే, నేను కూడా త్వరత్వరగా నడుస్తూ, ఆయన మెల్లగా పరుగెత్తితే నేను కూడా మెల్లగా పరుగెత్తుతూ, ఆయన వేగంగా పరుగెత్తితే నేను కూడా వేగంగా పరుగెత్తుతూ ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) కన్నా ముందుగా ఇంటికి వచ్చేశాను. కాసేపటికి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా విచ్చేశారు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం)- ఓ ఆయెషా! ఏమయ్యింది నీకు, నీ శ్వాస ఎందుకు పెరిగి వుంది? అని అడిగారు. నేను – (అబ్బే) అలాంటి దేమీ లేదు అని అన్నాను. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) స్వయంగా నీవైనా చెప్పు, లేదా అన్నీ తెలిసినవాడు, అత్యంత సూక్ష్మగ్రాహి అయిన అల్లాహ్ నాకంతా చెప్పేస్తాడు అని అన్నారు. నేను – నా తల్లిదండ్రులు మీకు అర్పితం! అని తదుపరి ఆయనకంతా వివరించాను. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) – “నాకు ముందుగా ఒక ఛాయ కదలడం నేను చూశాను. ఆ ఛాయ నీదా?” అని అన్నారు. నేను – అవును అని అన్నాను. తదుపరి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన అర చేత్తో ఛాతీ మీద కొట్టారు. దీనికి నాకు కాస్త నొప్పి కలిగింది తదుపరి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) – అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నీపై దౌర్జన్యం చేస్తారని నీ అభిప్రాయమా? అని అన్నారు. నేను (నా మనస్సులో) అనుకున్నాను – జనాలు ఎంతగా దాచిపెట్టినా అల్లాహ్ మాత్రం అన్నీ తెలిసినవాడు, వాస్తవానికి అల్లాహ్ సమస్తం ఎరిగినవాడు.
ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా వివరించారు: నువ్వు నన్ను చూసిన సమయంలో జిబ్రయీల్ (అలైహిస్సలాం) నా దగ్గరి కొచ్చారు, ఆయన నీకు కనపడకుండా మెల్లగా నన్ను పిలిచారు. నేను కూడా నీకు కనపడకుండా మెల్లగా జవాబిచ్చాను. నువ్వు లోదుస్తులు తీసి వుండడంతో ఆయన లోపలికి రాలేక పోయారు. నేనేమో నీవు నిద్రపోయావని భావించాను. అందుకే నిన్ను లేపడం మంచిది కాదని భావించాను. అదిగాక నేను లేకపోవడం మూలంగా నువ్వు భయపడతావేమో అని అనుకున్నాను. (ఈ లోగా) జిబ్రయీల్ (అలైహిస్సలాం) నాతో – ‘మీరు బఖీ దగ్గరికి వచ్చి బఖీ వాసుల మన్నింపు కోసం ప్రార్దించమని మీ ప్రభువు ఆజ్ఞాపించాడు’ అని అన్నారు. నేను (ఆయెషా రజియల్లాహు అన్హ) – నేను వారి కోసం ఏమని ప్రార్థించనూ అని అడిగాను, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) జవాబిస్తూ నువ్వు ఈ విధంగా పలుకు అని అన్నారు : “అస్సలాము అలా అహ్లిద్దియారి మినల్ మోమినీన వల్ ముస్లిమీన్, వ యర్ హముల్లాహుల్ ముస్తఖ్ దిమీన మిన్నా వల్ ముస్త ఆఖిరీన్, వ ఇన్నా ఇన్షా అల్లాహు బికుమ్ లలాహికూన్”.(ముస్లిం : 974)
కనుక రుజువైనదేమిటంటే – బఖీ వృత్తాంతానికీ, షాబాన్ నెల 15వ తేదీ రాత్రికి ఏ విధమైన సంబంధం లేదు. దీని గురించి ఒక్క సహీహ్ హదీసులో కూడా వివరించబడలేదు. అందుకే బలహీన (జయీఫ్) హదీసులను ఆధారంగా చేసుకొని ఈ రాత్రిగానీ, దాని తర్వాత రోజు గానీ స్మశానానికి వెళ్ళడం సున్నత్ అని విశ్వాసముంచడం సరైనది కాదు.
(3) షాబాన్ నెల 15వ తేదీ రాత్రి మీరు (ఆరాధనలో) నిలబడండి (జాగారణ చేయండి) మరియు మరుసటి రోజు ఉపవాసం ఉండండి. ఎందుకంటే – ఆ రోజు షాబాన్ 15వ తేదీ) సాయంత్రం కాగానే అల్లాహ్ ఇహలోక ఆకాశంపైకి వచ్చి ఇలా ప్రకటిస్తాడు- ఎవరైనా మన్నింపు కోరుకొనే వారున్నారా? వారిని నేను మన్నిస్తాను. ఎవరైనా ఉపాధి కోరుకొనే వారున్నారా? నేను వారికి ఉపాధి ప్రసాదిస్తాను. ఎవరైనా వ్యాధిగ్రస్తులై వున్నారా? వారికి నేను ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాను. ఎవరైనా (ఏదైనా) అడిగే వారున్నారా? వారికది నేను ప్రసాదిస్తాను. ఎవరైనా ఎవరైనా ఇలా ఫజర్ సమయం వరకూ (ప్రకటిస్తూనే వుంటాడు) (జయీఫ్ అల్ జామె – అల్బానీ : 602, మౌజూ)
ఈ హదీసు కూడా కాల్పనిక, తప్పుడు హదీసు, దీనికి విరుద్ధంగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ద్వారా ప్రామాణికంగా ఉల్లేఖించబడిన ఈ హదీసును వివరిస్తూ వుండాలి.
“ఎంతో శుభవంతుడైన మన ప్రభువు ప్రతి రాత్రి మూడింట ఒక వంతు మిగిలి వున్నప్పుడు ఇహలోకపు ఆకాశంపైకి అవతరిస్తాడు. తదుపరి ఇలా ప్రకటిస్తాడు – నన్ను ప్రార్థించేవారు ఎవరున్నారు? నేను వారి ప్రార్థనలను స్వీకరిస్తాను. నన్ను ఏదైనా (కావాలని) అడిగేవారు ఎవరున్నారు? నేను వారికది ప్రసాదిస్తాను. నా మన్నింపు కోరుకొనేవారు ఎవరున్నారు? నేను వారిని మన్నిస్తాను”.
ముస్లిం లోని మరొక ఉల్లేఖనంలో అదనంగా ఇలా వుంది – “ఇలా (ఈ ప్రకటన) ఫజర్ వేళ వరకు కొనసాగుతూనే వుంటుంది.” (బుఖారీ: 1145, 6321, 7494 ముస్లిం: 758)
ఈ హదీసు ద్వారా – ప్రతి రాత్రికీ ఈ మహత్యం ఉందని తెలుస్తుంది. మరలాంటప్పుడు దీనిని కేవలం షాబాన్ నెల 15వ రాత్రికి ప్రత్యేకించడం తప్పు మరియు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై అభాండం మోపడమే అవుతుంది.
(4) అలీ (రజియల్లాహు అన్హు) హదీసు: దీనిలో ఆయన వివరించిన దేమిటంటే – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) షాబాన్ నెల 15వ రాత్రి 14 రకాతులు చదివారు. తదుపరి ఆయన కొన్ని సూరాలను పఠించారు. ఆ తర్వాత ఇలా సెలవిచ్చారు – నేను చేసినట్లే ఎవరైనా చేస్తే (ఇలాగే ఆచరిస్తే) స్వీకరించబడిన 20 హజ్జ్ లు మరియు 20 సం॥ల ఉపవాసాలకు లభించే అంత పుణ్యం లభిస్తుంది.
ఇబ్నుల్ జౌజి ఈ హదీసును అల్ మౌజుఅత్’లో సంగ్రహించి దీనిపై ఇలా వ్యాఖ్యానించారు: ఈ హదీసు కూడా కాల్పనికమైనది. దీని పరంపర కూడా అత్యంత చెడ్డగా వుంది. (అల్ మౌజుఆత్: 2వ సంపుటం, 445వ పేజి)
ఇమామ్ సుయూతీ ఇలా వివరించారు: ఈ హదీసును బైహఖీ ‘షోబుల్ ఈమాన్’ లో ఉల్లేఖించారు. దాదాపుగా ఇది కాల్పనికమైన తప్పుడు హదీసు. (తన్జిఉష్షరియ లి ఇబ్నె ఇరాక్: 2వ సంపుటం, 94వ పేజీ)
(5) సలాతుల్ అల్ ఫియా – దీని గురించి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అలీ (రజియల్లాహు అన్హు)కు ఇలా వివరించారు:
ఏ వ్యక్తి అయినా ఈ రాత్రి 100 రకాతుల నమాజులు చదివి ప్రతి రకాతులో ఫాతిహా సూరా తర్వాత ఇఖ్ లాస్ సూరా 10 సార్లు చదివితే – అల్లాహ్ అతని కోరికలన్నింటినీ నెరవేరుస్తాడు. ఒకవేళ ‘లౌహే మహ్పూజ్’ లో అతను దురదృష్టవంతుడని వ్రాయబడివున్నప్పటికీ, అల్లాహ్ దానిని చెరిపేసి అదృష్టవంతుడని వ్రాస్తాడు. మరియు రాబోయే 1 సం॥ పాటు అతని పాపాలను లిఖించడం జరగదు.
“అల్ మౌజుఆత్”లో ఇబ్నుల్ జౌజి ఈ హదీసును గూర్చి ఎన్నో పరంపరలను పేర్కొన్న తర్వాత ఇలా వివరించారు :
ఈ హదీసు ఒక కాల్పనిక, తప్పుడు హదీసు అవడంలో ఏమాత్రం సందేహం లేదు. దీనిలోని చాలా మంది ఉల్లేఖకులు అపరిచితులు మరియు కొందరైతే అతి బలహీన ఉల్లేఖకులు. ఈ స్థితిలో ఈ హదీసును దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ద్వారా ఉల్లేఖించడం అసంభవం. మేము ఎంతో మందిని ఈ నమాజును చదువుతుండగా చూశాం. తక్కువ వ్యవధి కలిగిన రాత్రుళ్ళలో వీరు ఈ నమాజు చదివి నిద్రపోతారు. దీనితో వీరి ఫజర్ నమాజు నెరవేరదు. పైగా, మసీదులకు చెందిన అజ్ఞాన ఇమాములు ఈ నమాజును మరియు ఇలాగే ‘సలాతుర్రగాయిబ్’ ను కేవలం ప్రజలను సమీకరించడానికి మరియు దీని ద్వారా (ఏదైనా) ప్రత్యేక హెూదా పొందడానికి సాధనంగా చేసుకున్నారు. కథలు చెప్పేవారు సైతం తమ సమూహాల్లో ఈ నమాజును గూర్చే వివరిస్తూ వుంటారు. వాస్తవానికి ఇవన్నీ సత్యానికి చాలా దూరంగా వున్నాయి. (అల్ మౌజుఆత్ : 2వ సంపుటం, 440-443 పేజీలు)
ఇమామ్ నవవీ ఇలా సెలవిచ్చారు:
‘సలాతుర్రగాయిబ్’ గా పేరుగాంచి, రజబ్ నెల మొదటి రాత్రి మగ్రిబ్ – ఇషాల మధ్య 12 రకాతులుగా చదవబడే నమాజ్ మరియు షాబాన్ నెల 15వ రాత్రి 100 రకాతులుగా చదవబడే నమాజ్ – ఈ రెండు నమాజులు ఎంతో నీచమైన బిద్అత్ లు. కనుక ‘ఖువ్వతుల్ ఖులూబ్’ మరియు ‘ఇహ్యా ఉలూమిద్దీన్’ లాంటి గ్రంథాల్లో వీటి వివరణ చూసి మోసానికి గురికావద్దు. అంతేగాక, వీటికి సంబంధించి ఉల్లేఖించబడ్డ హదీసులను చూసి మోసపోవద్దు. ఎందుకంటే – అవన్నీ పూర్తిగా అసత్యం గనుక. (అల్ మజ్మూఅ లిన్నవవీ: 3వ సంపుటం, 379వ పేజీ)
ఇమామ్ షౌకానీ ఇలా వివరించారు:
ఇదొక కాల్పనిక తప్పుడు హదీసు. దీనిలో వచ్చిన పుణ్యానికి సంబంధించిన పదజాలం ద్వారా (ఇదొక కాల్పనిక హదీసని) స్పష్టంగా తెలుస్తుంది. (అంతేగాక) బుద్ధి జ్ఞానాలున్న ఏ ఒక్కరు కూడా దీని కాల్పనికతను గూర్చి సందేహించరు. పైగా దీని ఉల్లేఖకులు గూడా అపరిచితులు. (ఫవాయెద్ అల్ మజ్మూఅ: 53వ పేజీ)
ఆయన ఇంకా ఇలా వివరించారు:
ధార్మిక పరిజ్ఞానులు, విశ్లేషకుల ఒక సమూహం – ఉదా. ‘ఇహ్యా’ గ్రంథకర్త – ఈ హదీసు విషయంలో పొరపాటుకు లోనయ్యింది. వాస్తవానికి – షాబాన్ నెల 15వ రాత్రి గురించి వివిధ పరంపరలతో ఉల్లేఖించబడ్డ హదీసులన్నీ కాల్పనిక, తప్పుడు హదీసులే. (అల్ ఫవాయిదుల్ మజ్మూఅ : 53వ పేజీ)
ముల్లా అలీ ఖారీ ఈ హదీసు గురించి వ్యాఖ్యానిస్తూ ఇలా పేర్కొన్నారు: ఈ నమాజు గురించి బలహీన, కాల్పనిక హదీసులు తప్ప మరేమీ ఉల్లేఖించబడలేదు. అందుకే ‘ఖువ్వతుల్ ఖులూబ్’, ‘ఇహ్యా ఉలూమిద్దీన్’ గ్రంథకర్తలు దీనిని సంగ్రహించడం గురించి మీరు మోసానికి గురి కావద్దు.
ఇంకా ఆయన ఇలా కూడా వివరించారు :
“ఈ బిద్దత్ నమాజ్ మొట్టమొదటగా 448 హి.శ.లో బైతుల్ మఖ్దిస్ నందు సృష్టించబడింది. అగ్ని పూజారులు కొందరు ఇస్లాం స్వీకరించారప్పుడు, వాళ్ళు ముస్లిములతో కలసి నమాజు చేసేటప్పుడు తమ ముందు అగ్నిని మండించేవారు. ఇలా వాళ్ళు ముస్లిములను కూడా సంతృప్తి పరచేవారు మరియు తమ భ్రష్ట విశ్వాసాలపై కూడా ఆచరించేవారు. వీళ్ళు సలాతుల్ అల్ ఫియా నమాజును కూడా ఆవిష్కరించారు. షాబాన్ నెల 15వ రాత్రి వాళ్ళు నమాజు చదువుతూ తమ ముందు అగ్ని మండించేవారు. దీని ద్వారా వారి ఉద్దేశ్యం – అగ్ని ముందు ఎక్కువ సేపు గౌరవంగా నిలవడడం. ఇంకా ఈ అగ్నిని ఆసరాగా చేసుకొని దీని ముసుగులో ఎన్నో చెడు పనులు చేసేవారు. దీనితో ఆ సమయంలోని సజ్జనులు – వీళ్ళు భూమిలోకి దిగద్రొక్కబడతారేమో అని భయపడ్డారు. అందుకే వారు – ఈ బిద్ అత్ ఆచరించబడుతున్న ప్రదేశం వదిలి దూరంగా వెళ్ళిపోయారు. అంతేగాక, దీని ముసుగులో వారు ఎన్నో నిషేధ కార్యాలను కూడా చేసేవారు“. (తొహ్ ఫతుల్ అహ్వజి- 3వ సంపుటం, 165వ పేజీ)
ఎంతో బాధాకరమైన విషయమేమిటంటే అగ్నిపూజారుల ద్వారా హిజ్ర 5వ శతాబ్దంలో ఆవిష్కరించబడి, దాని మహత్యం గురించి కాల్పనిక హదీసులు సృష్టించబడ్డ నమాజును ఈ రోజు ముస్లిములు షాబాన్ నెల 15వ రాత్రి ప్రత్యేకంగా నెలకొల్పుతారు మరియు ఎంతో జోరుగా ఈ తప్పుడు హదీసులను వివరిస్తారు.
ఈ హదీసు మరియు దీని లాంటి మరెన్నో హదీసులు నిస్సందేహంగా అతి బలహీన మరియు కాల్పనిక హదీసులు. ఇమాములలో ఉదా॥కు షౌకానీ, ఇబ్నుల్ జౌజి, ఇబ్నె హిబ్బాన్, ఖుర్తుబీ, సుయూతి మొ॥ వారు ఈ ఉల్లేఖనా లన్నింటినీ నమ్మదగ్గవి కావని ఖరారు చేశారు. మరిన్ని వివరాల కోసం- అల్ ఫవాయద్ అల్ మజ్మూఅ, అల్ మౌజుఅత్ అల్ కుబ్ర, తఫ్సీర్ అల్ ఖుర్తుబీ, అల్ అల్లాలి అల్ మస్నుఅ లను చూడవచ్చు.
కనుక, (ధర్మ) ప్రచార క్షేత్రంలో వున్నవారు- పరంపరల రీత్యా ప్రామాణి కంగా లేని ఈ (కాల్పనిక) ఉల్లేఖనాలను (ఇతరులకు) వివరించడం నుండి మరియు ముద్రించి పంచి పెట్టడం నుండి దూరంగా వుండాలి. ఏదైనా హదీసును (ఇతరులకు) వివరించడానికి ముందు, దాని పరంపరను గూర్చి అన్వేషించడం ఖచ్చితంగా దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హదీసుకు సేవ చేయడమే అవుతుంది. అలా కాని పక్షంలో, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి ఈ హెచ్చరిక ఎల్లప్పుడూ గుర్తుపెట్టు కోవాలి:
“ఎవరైనా, నేను చెప్పని మాటను నాకు ఆపాదిస్తే, అతను తన నివాసాన్ని నరకంలో ఏర్పరచుకోవాలి”. (బుఖారీ: 109)
షబే బరాత్ లో ఏం చేయాలి?
ఇప్పుడు ఉదయించే ప్రశ్న ఏమిటంటే- షాబాన్ 15వ తేదీ రాత్రి మహ త్యాన్ని గురించి ఉల్లేఖించబడ్డ ప్రామాణిక హదీసు – “అల్లాహ్ షాబాన్ 15వ రాత్రి తన సృష్టితాల వైపు (దయతో) చూస్తాడు. తదుపరి బహుదైవారాధకుడు, ఆసూయపరులను తప్ప మిగతా అందరినీ క్షమిస్తాడు” లో సమావేశాలు ఏర్పాటు చేయడం గురించి వుందా? లేక ఏదైనా ప్రత్యేక ఆరాధన గురించి వుందా? లేదా ఈ హదీసులో దీపాలు వెలిగించి, బాణసంచా కాల్చమని వచ్చిందా?
ఈ ప్రశ్నలకు జవాబు – పనికిమాలిన, కాల్పనిక ఉల్లేఖనాలను విడిచి, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి స్వచ్ఛమైన షరీయతుపై విశ్వాసం వుంచే ప్రతి ఒక్కడూ ఇవ్వగలడు. ఈ హదీసును న్యాయంగా గనక పరిశీలిస్తే విశదమయ్యే విషయమేమిటంటే- ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) దీనిలో ఎలాంటి సమావేశం గురించి గానీ, ప్రత్యేక ఆరాధన గురించి గానీ, దీపాలంకరణ చేసి బాణసంచా కాల్చడం గురించి గానీ ప్రస్తావించలేదు. పైగా ప్రస్తావించింది కేవలం ఏమిటంటే – అల్లాహ్ యొక్క సువిశాల మన్నింపు గురించి. తమ విశ్వాసంలో షిర్క్ ను చేర్చనివారు, స్వీయ శతృత్వ కారణంతో తోటి ముస్లిం పట్ల ఈర్ష్య, అసూయ కలిగి వుండని వాళ్లు దీనికి అర్హులు.
అందుకే, ఈ రాత్రిలోని సువిశాల మన్నింపు యొక్క అర్హత పొందాలంటే- మనిషి ముందుగా తన విశ్వాసాన్ని సరిచేసుకోవాలి. లాభ నష్టాల యజమాని కేవలం అల్లాహ్ అని గట్టిగా విశ్వసించాలి. కష్టాలను తీర్చేవాడు కూడా కేవలం ఆయనే అని విశ్వసించి కేవలం ఆయనపైనే నమ్మకం వుంచాలి. తమ ఆశలు నెరవేర్చే కేంద్రంగా దర్బారులను, మజార్లను కాక కేవలం అల్లాహ్ ను చేసుకోవాలి. పీర్లకు, సన్యాసులకు భయపడకుండా కేవలం అల్లాహ్ కు భయ పడాలి. మ్రొక్కుబడులు కూడా కేవలం అల్లాహ్ తోనే చేసుకోవాలి. ఆయనను తప్ప మరెవరినీ వేడుకోకూడదు. దీనితోపాటు, తోటి ముస్లిముల పట్ల ఈర్ష్య, అసూయలను వదిలి హృదయాన్ని శుభ్రం చేసుకోవాలి. మనిషి సాఫల్యానికి ఇవి ఎంతో అవసరమైన విషయాలు. ఇక దీపాలంకరణ చేసి బాణసంచా కాల్చడమైతే వృధా ఖర్చే. కనుక మన ధర్మం వారించిన ఈ విషయం నుండి గూడా దూరంగా వుండడం తప్పనిసరి.
ఎంతో దురదృష్టకరమైన విషయం ఏమిటంటే – షాబాన్ 15వ తేదీ రాత్రి మహత్యం గురించి ప్రస్తావిస్తూ ప్రత్యేకంగా వివరించినదేమిటంటే ముష్రిక్ మరియు అసూయపరులను అల్లాహ్ క్షమించడు. వారు తప్ప మిగతా అందరిని ఆయన క్షమిస్తాడు. మరి ఈ రోజును ఎంతో మంది ప్రత్యేకంగా జరుపుకొంటారు. షబే బరాత్ ను పురస్కరించుకొని సమావేశాలు నిర్వహించ బడతాయి, వాటిలో ఈ రాత్రి మహత్యం గురించి కాల్పనిక, తప్పుడు హదీసులు వివరించడంతోపాటు, ‘నాత్’ పఠించేవారు మరియు వక్తలు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను వేడుకుంటారు. సహాయం కోసం ఆయనను అర్థిస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే – బాహాటంగా షిర్క్ చేస్తూ ‘అల్లాహ్ క్షమాపణ’పై ఆశపెట్టుకుంటారు!
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హదీసుకు ఆచరణ రీత్యా పరిహాసమాడబడుతుంది. మరి చూస్తే ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) చాలా స్పష్టంగా – ముష్రిక్ ను క్షమించడం జరుగదు అని సెలవిచ్చివున్నారు. అయినప్పటికీ (షిర్క్ చేస్తూ) ఈ రాత్రి – నరకాగ్ని నుండి స్వేచ్ఛ పొందడానికి అనుమతి లభించిందని అనుకుంటారు.
ఎంత విచిత్ర పరిస్థితి ఇది! షిర్క్ నుండి పూర్తిగా పశ్చాత్తాప పడాల్సింది పోయి దీనిని క్రియాత్మకంగా ఆచరణలో పెట్టి దీని వైపునకు ప్రజలను ఆహ్వానించడం జరుగుతుంది!
షబే బరాత్ ‘మన్నింపు రాత్రి’ అయితే మరి దానిలో ఎందుకు ఆరాధించ కూడదు?
ఎవరైనా ఇలా ప్రశ్నించవచ్చు- ఈ రాత్రి మన్నింపుల రాత్రి అని స్వయంగా రుజువు చేశారు. మరి ఈ రాత్రి ప్రత్యేకంగా ఆరాధిస్తే వచ్చిన నష్టమేంటి?
దీనికి మా జవాబు ఏమిటంటే- దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను అల్లాహ్ మనకోసం ఆదర్శవంతునిగా ఖరారు చేశాడు. దీని అర్థం ఏమిటంటే- మనం ప్రతి రంగంలోనూ దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అడుగుజాడల్లో నడుస్తూ ఆయనను అనుసరించాలి. అందుకే ఏ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఏ ఆరాధన చేశారు అన్న విషయం చూడాలి. ఇలా, మనం హదీసు గ్రంథాలు మరియు ఆయన జీవిత చరిత్రను వివరించే గ్రంథాలను తిరగేస్తే మనకు తెలిసే విషయం ఏమిటంటే – ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ రాత్రి ప్రత్యేకంగా ఏమీ ఆరాధించలేదు, ప్రత్యేకంగా దీనిని జరుపుకోలేదు, సహాబాలను గూడా దీని గూర్చి ప్రోత్సహించలేదు.
అందుకే, మన ప్రియతమ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దీనిని చేయలేదు కాబట్టి మనం కూడా చేయకూడదు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) దీనిని (ఈ రాత్రిని) ఉత్సవంగా జరుపుకోలేదు కాబట్టి మనం కూడా జరుపుకోకూడదు.
హాఫిజ్ ఇబ్నె రజబ్ ఇలా పేర్కొన్నారు: షాబాన్ 15వ రాత్రి ఖియాం మహత్యం గురించి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మరియు సహాబాల ద్వారా ఏదియూ (ప్రామాణికంగా) నిర్ధారించబడలేదు. (లతాయిఫుల్ మారిఫ్)
ఇమామ్ అబూ బక్ర్ తర్ తూషి, జైద్ బిన్ అస్లం (తాబయీ) ద్వారా ఇలా ఉల్లేఖించారు: మేము మా గురువులనూ, ధార్మిక పరిజ్ఞానులనూ షాబాన్ 15వ రాత్రి వైపునకు గానీ, మక్ హూల్ వివరించిన హదీసు వైపునకు గానీ మ్రొగ్గు చూపడం చూడలేదు. అంతేగాక వారు ఈ రాత్రి ఔన్నత్యం వేరే రాత్రుల కన్నా ఎక్కువైనదని కూడా విశ్వసించేవారు కాదు.
ఇబ్నె అబీ మలైకాకు ఓసారి జియాద్ అనే కథలు చెప్పేవాడొకడు ప్రజలతో ఈ రాత్రి ప్రతిఫలం లైలతుల్ ఖద్ర్ ప్రతిఫలానికి సమానం అని చెబుతూ వుంటాడు – అని చెప్పబడింది. దీనికి ఆయన- నేను గనక వాడి ద్వారా ఈ మాట వింటే, నా చేతిలో కర్ర గనక వుంటే వాణ్ణి తప్పకుండా శిక్షిస్తాను అని అన్నారు. (అల్ హవాదిస్ వల్ దిద్ అ)
చర్చ సారాంశమేమిటంటే – షాబాన్ నెల 15వ రాత్రి ఆరాధన మహత్యం గురించి ఏదియూ (ప్రామాణికంగా) నిర్ధారించబడలేదు. దీని గురించి వివరించ బడే విషయాలన్నీ అసత్యాలు మరియు కల్పితమైనవి.
ఆలోచించదగ్గ మరో విషయమేమిటంటే – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) షాబాన్ 15వ రాత్రి మహత్యం గురించి – “అల్లాహ్ తన దాసులపై ప్రత్యేకంగా దృష్టి సారించి ముష్రిక్ మరియు అసూయపరులను తప్ప అందరినీ క్షమిస్తాడు”- అని ఏదైతే సెలవీయబడిందో, అదే మహత్యం సోమవారం మరియు గురు వారాలకు గూడా ఇవ్వబడింది. దీని గురించి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“ప్రతి సోమ మరియు గురువారాల్లో స్వర్గపు ద్వారాలు తెరవబడతాయి. తదుపరి షిర్క్ చేయని, తన సోదరుని పట్ల ఈర్ష్య, అసూయ కలిగి వుండని ప్రతి వ్యక్తిని క్షమించడం జరుగుతుంది. తమ మధ్య ఈర్ష్య, అసూయ కలిగివున్న ఇద్దరు వ్యక్తులు సంధి చేసుకొనే వరకు వారికి వ్యవధి నివ్వడం జరుగుతుంది“. (ముస్లిం : 2565)
కనుక షాబాన్ నెల 15వ తేదీ రాత్రి మన్నింపు హదీసును – ప్రత్యేకంగా ఈ రాత్రిని (ఉత్సవంగా) జరుపుకోవడానికి, సమావేశాలు ఏర్పాటు చేయడానికి, ప్రత్యేక ప్రార్థనలు చేయడానికి ఆధారంగా చేయలేం. ఒకవేళ ఈ కార్యాలన్నింటికీ దానిని (ఆ హదీసును) ఆధారంగా తీసుకుంటే మరి అలాంటి మహత్యమే సోమ, గురువారాలకు కూడా ఇవ్వబడింది. కనుక, షబే బరాత్ ను జరుపుకొనే వారు సోమ, గురువారాలను కూడా ప్రత్యేకంగా జరుపుకుంటారా మరి? ఆ రోజుల్లో కూడా ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేస్తారా?
అల్లాహ్ మనందరినీ క్షమించుగాక! మనందరినీ సత్యాన్ని అర్థం చేసుకొని దానికనుగుణంగా ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించుగాక! మరియు అసత్యం నుండి దూరంగా వుండే సద్బుద్ధిని ప్రసాదించుగాక! ఆమీన్!!
రెండవ ఖుత్బా
షాబాన్ 15వ తేదీ రాత్రి నిర్ణయాలు తీసుకొనబడే రాత్రినా?
షబే బరాత్ జరుపుకొనే వారు ఈ రాత్రిని నిర్ణయాలు గైకొనబడే రాత్రిగా భావిస్తారు. దానికి ఆధారంగా ఈ ఆయతను తీసుకుంటారు:
إلا الزلتُهُ في لَيْلَةٍ مُبَرَكَةِ إِلا لَنَا مُنْذِرِينَ فِيهَا يُفْرَقُ كُلُّ أَمْرٍ حَكِيون
“నిశ్చయంగా మేము దీనిని (ఖురాన్ను) శుభప్రదమైన రాత్రి యందు అవతరింపజేశాము. నిస్సందేహంగా మేము హెచ్చరిక చేసేవాళ్ళము. ఆ రాత్రి యందే కీలకమైన ప్రతి ఉత్తర్వూ జారీ చేయబడుతుంది”. (దుఖాన్ : 3-4)
అల్లాహ్ యొక్క ఈ ఆదేశంలో ‘శుభప్రదమైన రాత్రి’ గురించి వివరించ బడింది. దీనిలో దివ్య ఖురాన్ అవతరింపజేయబడడంతో పాటు సం॥ అంతా జరగబోయే సంఘటనల గురించి నిర్ణయాలు తీసుకోబడతాయి. ఇక చూడాల్సిన విషయం ఏమిటంటే – ఆ శుభప్రదమైన రాత్రి అంటే ఏ రాత్రి? అని.
ఒకవేళ మనం, మన సంకల్పానికనుగుణంగా ఖురాన్ ను విశ్లేషించడం వదిలిపెట్టి, స్వయంగా ఖురాన్లోనే దాని విశ్లేషణను అన్వేషిస్తే ఈ ప్రశ్నకు సమాధానం మనకు దొరుకుతుంది. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
إِنَّا أَنْزَلْنَهُ فِي لَيْلَةِ الْقَدْرِ “నిశ్చయంగా మేము దీనిని (ఖురాన్ ను) ‘లైలతుల్ ఖద్ర్’ (ఘనమైన రాత్రి) యందు అవతరింపజేశాము“. (ఖద్ర్ : 1)
దీని ద్వారా – శుభప్రదమైన రాత్రి అంటే ‘లైలతుల్ ఖద్ర్’ అని తెలుస్తుంది. ఇది రమజాన్ నెలలోని ఆఖరి పది రోజుల్లోని బేసి సంఖ్యల రాత్రుల్లో వస్తుంది. అదేరాత్రి మనిషి జీవితం, మరణం, జీవనోపాధి తదితర అంశాలను గురించి నిర్ణయాలు తీసుకోబడతాయి.
‘శుభప్రదమైన రాత్రి’ గురించి అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రజియల్లాహు అన్హు), ఖతాదా, ముజాహిద్, హసన్ మొ॥ వారు కూడా ఇలాగే విశ్లేషించారు. ఈ విశ్లేషణనే విద్వాంసులందరూ సరైన విశ్లేషణగా ఖరారు చేశారు. (తఫ్సీర్ ఖుర్తుబీ : 8వ సంపుటం,, 432-433 పేజీలు)
ఇమామ్ అబూ బక్ర్ ఇబ్నుల్ అరబీ ఇలా పేర్కొన్నారు: ధార్మిక పండితుల దృష్టిలో ‘శుభప్రదమైన రాత్రి’ అంటే ‘లైలతుల్ ఖద్ర్’ అని అర్థం. కానీ కొందరి దృష్టిలో మాత్రం ఇది షాబాన్ నెల15వ రాత్రి. కానీ ఇది అసత్యం. ఎందుకంటే అల్లాహ్ తన సత్య గ్రంధంలో – ‘రమజాను నెల ఖురాన్ అవతరింప జేయబడిన నెల’ అని వివరించి తదుపరి, ఈ నెలలోని ‘లైలతుల్ ఖద్ర్’ను ఖురాన్ అవతరించిన రాత్రిగా ఖరారు చేశాడు. ఇక దీనిని (ఈ సత్యాన్ని) వదిలిపెట్టి ఎవరైనా, శుభప్రదమైన రాత్రి అంటే లైలతుల్ ఖద్ర్ కాక మరో రాత్రి అని అంటే అతను అల్లాహ్ పై పెద్ద అభాండం మోపినట్లే. షాబాన్ 15వ రాత్రి మహత్యం గురించి లేదా ఆ రాత్రి నిర్ణయాలు తీసుకోబడతాయి- అన్న దాని గురించి వచ్చిన హదీసులన్నీ అత్యంత బలహీనమైనవి. కనుక వీటి జోలికి పోకండి. (అహముల్ ఖురాన్, ఇబుల్ అరబీ:4వ సంపుటం, 106వ పేజీ)
ఇమామ్ ఇబ్నె కసీర్ ఇలా పేర్కొన్నారు : ‘శుభప్రదమైన రాత్రి’ మరియు ‘నిర్ణయాలు తీసుకోబడే రాత్రి’ అంటే లైలతుల్ ఖద్ర్ అని అర్థం. ఇక ఎవరైనా, ఇక్రమా చెప్పినట్లు-దీని అర్థం షాబాన్ 15వ రాత్రి – అని అంటే అది సరైనది కాదు, ఎందుకంటే స్వయంగా ఖురాన్ ద్వారానే ‘ఈ రాత్రి రమజాన్ నెలలో వస్తుంది’ అని రూఢీ అవుతుంది. (తఫ్సీర్ ఇబ్నె కసీర్ : 4వ సంపుటం, 163వ పేజీ)
కనుక షాబాన్ 15వ రాత్రిని నిర్ణయాలు తీసుకోబడే రాత్రిగా ఖరారు చేయడం ఎంతమాత్రం సరికాదు, దానికేమాత్రం విలువ లేదు.
ఆఖరుగా అల్లాహ్ ను వేడుకొనేదేమిటంటే – ఆయన మనందరినీ ఆయన విధేయతకు కట్టుబడి, ఆయన అవిధేయతకు దూరంగా వుండే సద్బుద్ధిని ప్రసాదించుగాక! మరియు మన అంతం ‘తౌహీద్ మరియు సత్యార్యాలపై’ కలుగజేయుగాక! ఆమీన్!
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
గత రమజాన్ లో ధర్మ కారణం లేకుండా తప్పిపోయిన ఉపవాసాలు వచ్చే రమజాన్ లోపల పూర్తి చేసుకోలేకపోతే? [ఆడియో] https://youtu.be/oQRASeuVJ3A [2 నిముషాలు] – ఇబ్న్ బాజ్ రహిమహుల్లాహ్ ఫత్వా వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
గత రమజాన్ 1443 హిజ్రిలో ఏమైనా ఉపవాసాలు తప్పిపోయిన వారు త్వరగా ఉపాసాలుండండి. అకారణంగా వదిలి, రమజాన్ (1444హిజ్రి) నెల ప్రారంభమయిన తర్వాత బాధ పడకండి ఏ ధర్మ కారణం లేకుండా, వచ్చే రమజాన్ వరకు కూడా ఎవరైనా గత రమజాన్ లో తప్పిన ఉపవాసాలు ఉండకపోతే, అతను రమజాన్ దాటి పోయిన తర్వాత ఆ ఉపవాసాలతో పాటు పేదవానికి అన్న పెట్టాలి. ఒక్కో ఉపవాసానికి బదులు ఒక్క పూట భోజనం.
السؤال: السؤال الأول ورد من الأخ شيخي محمد بلدية عين الخضرة ولاية المسيلة الجزائر- العاصمة، يسأل في أول سؤال عن حكم من أفطر في رمضان يومين حتى أتاه شهر رمضان القادم، فما حكم ذلك وأفيدوه؟
الجواب: بسم الله الرحمن الرحيم، الحمد لله، وصلى الله وسلم على رسول الله وعلى آله وأصحابه ومن اهتدى بهداه. أما بعد: فإن من أفطر في رمضان يجب عليه أن يقضي قبل رمضان الآخر، وما بين الرمضانين فهو محل سعة من ربنا ، إذا قضى في شوال أو في ذي القعدة أو في ذي الحجة أو في المحرم أو ما بعد ذلك.. إلى شعبان، فعليه أن يقضي ما أفطره لمرض أو سفر أو نحو ذلك قبل رمضان، فإن أخره إلى رمضان آخر لم يسقط القضاء بل يجب عليه القضاء ولكن يلزمه مع القضاء إطعام مسكين عن كل يوم زيادة مع القضاء، أفتى به جماعة من أصحاب النبي ﷺ، فيقضي ويطعم عن كل يوم مسكينًا نصف صاع من قوت البلد كيلو ونصف من قوت البلد من تمر أو أرز أو غير ذلك، أما إن صام ذلك قبل رمضان القادم فإنه يقضي ولا إطعام عليه. نعم.
అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లా, అల్హందులిల్లాహ్.
షేక్ ఇబ్నె బాజ్ రహిమహుల్లాహ్ తో ప్రశ్నించడం జరిగింది, ఒక వ్యక్తి ఒక రంజాన్ లో రెండు రోజుల ఉపవాసాలు వదిలేసాడు ఏదో కారణంగా. కానీ వచ్చే రంజాన్ వరకు కూడా అతను ఆ ఉపవాసాల ఖజా చేయలేకపోయాడు. అంటే వచ్చే రంజాన్ వరకు కూడా ఆ రెండు ఉపవాసాలు తప్పిపోయినవి ఉండలేకపోయాడు. అతని గురించి ఏంటి ఆదేశం?
షేక్ ఇబ్నె బాజ్ రహిమహుల్లా చెప్పారు:
ఆ వ్యక్తి ఆ ఖజా ఉపవాసాలు ఉండడానికి అల్లాహ్ తాలా ఇంత దీర్ఘ కాలం ప్రసాదించాడు, అంటే సుమారు పదకొండు నెలలు. ఈ పదకొండు నెలల్లో అతను ఉండలేదు అంటే, ఇప్పుడు వచ్చిన ఈ రంజాన్ కూడా దాటిపోయిన తర్వాత, గత రంజాన్ లో తప్పిన ఈ రెండు రోజులు అతను తప్పకుండా ఉపవాసం ఉండాలి మరియు ప్రతి ఒక్క ఉపవాసంతో పాటు ఒక్క పేదవానికి అన్నం కూడా పెట్టాలి.
“అఫ్తా బిహి జమాఅతున్ మిన్ అస్హాబి నబియ్యి సల్లల్లాహు అలైహి వ సల్లం”, ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం వారి సహాబాలలోని ఒక జమాఅత్, ఒక సమూహం ఇలాంటి ఫత్వా ఇచ్చి ఉన్నది. అంటే విషయం ఏంటి, మనిషి ధర్మ కారణం లేకుండా ఉపవాసాలు ఖజా చేయడం వదిలేసాడు, ఇంత దీర్ఘ సమయంలో కూడా అతను ఉండలేకపోయాడు. వాస్తవానికి ఇది చాలా బాధాకరమైన విషయం. ఈ రోజుల్లో ఎంతోమంది స్త్రీలు, ఎంతోమంది పురుషులు ఇలాంటి పాపానికి గురి అవుతున్నారు. అందుకొరకు అల్లాహ్ ఇచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. గత రంజాన్ లో ఏమైనా ఉపవాసాలు తప్పిపోయి ఉంటే ఈ ఉపవాసాలు పూర్తి చేసుకోండి. అకారణంగా, ఏ ధర్మ కారణం లేకుండా ఉపవాసాలు మానుకోకండి. అల్లాహ్ తాలా మనందరికీ హిదాయత్ ప్రసాదించుగాక.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
మనం ఖుర్ఆన్ ఎందుకు కంఠస్థం చేయాలి? [ఆడియో] https://youtu.be/xe-0DyNUTCQ [18 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) జామిఅ్ హుసైన్ బిన్ అలీ రజియల్లాహు అన్హుమా జుల్ఫీ(KSA)లో షేఖ్ సాలిహ్ బిన్ ఫురైహ్ అల్ బహ్‌లాల్ ఇచ్చిన జుమా ఖుత్బా అనువాదం
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
పృధ్విపై అత్యుత్తమ (పరిశుభ్రమైన, శుభకరమైన) నీరు జమ్ జమ్ నీరు; అది ఆకలిగొన్నవారికి తిండి/భోజనంగా, రోగికి స్వస్థతగా పనిచేస్తుంది. (సహీ తర్గీబ్ 1161. ఉల్లేఖనం: ఇబ్నె అబ్బాస్).
జమ్ జమ్ నీరు ఏ సదుద్దేశ్యంతో తాగడం జరుగుతుందో అది పూర్తవుతుంది. (సహీ తర్గీబ్ 1164, 1165. ఇబ్నె అబ్బాస్, జాబిర్).
స్వస్థత పొందే ఉద్దేశంతో జమ్ జమ్ నీళ్ళు త్రాగటం
الشرب والاستشفاء من ماء زمزم: عَنْ أَبِي ذَرٍّ t قَالَ: قَالَ رَسُولُ الله عَنْ مَاءِ زَمْزَمَ: (إِنَّهَا مُبَارَكَةٌ ، إِنَّهَا طَعَامُ طُعْمٍ). رواه مسلم و زاد الطيالسي: (وَشِفَاءُ سُقْمٍ).
అబూ జర్ర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జమ్ జమ్ నీళ్ళ విషయంలో ఇలా బోధించారు:
“అది శుభమైన నీరు. అది ఆకలిగొన్నవారికి ఆహారపు పని జేస్తుంది. (ఇది ముస్లిం 2473 ఉల్లేఖనం, తయాలిసిలో అదనంగా ఈ పదాలున్నాయిః) మరియు అది రోగ నివారిణి కూడాను“.
ఈ ప్రసంగంలో జమ్ జమ్ నీటి యొక్క చరిత్ర, దాని శుభాలు మరియు గొప్పతనం గురించి వివరించబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీసును ఆధారం చేసుకుని, జమ్ జమ్ నీరు శుభప్రదమైనదని, ఆకలిగొన్నవారికి ఆహారంగా మరియు రోగులకు స్వస్థతగా పనిచేస్తుందని చెప్పబడింది. ఇబ్రాహీం (అలైహిస్సలాం), హాజర్ (అలైహస్సలామ్), మరియు ఇస్మాయిల్ (అలైహిస్సలాం) లతో ముడిపడి ఉన్న జమ్ జమ్ బావి యొక్క చారిత్రక నేపథ్యం, సఫా మరియు మర్వా కొండల మధ్య హాజర్ (అలైహస్సలామ్) పరుగెత్తడం వంటి సంఘటనలు వివరించబడ్డాయి. ఇబ్ను అబ్బాస్, అబ్దుల్లాహ్ ఇబ్నుల్ ముబారక్, ఇమామ్ ఇబ్ను ఖుజైమా, ఇమామ్ హాకిమ్ మరియు హాఫిజ్ ఇబ్ను హజర్ వంటి ఎందరో గొప్ప ఉలమాల జీవితాల నుండి జమ్ జమ్ నీటిని త్రాగుతూ వారు చేసుకున్న దువాలు మరియు వాటి స్వీకరణకు సంబంధించిన సంఘటనలు కూడా పేర్కొనబడ్డాయి. ఈ నీటిని కేవలం రుచి కోసం కాకుండా, ఇబాదత్ గా, పూర్తి నమ్మకంతో, ఇహపరలోకాల మేలు కోరుతూ త్రాగాలని ఉపదేశించబడింది.
السلام عليكم ورحمة الله وبركاته (అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు).
الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعده أما بعد (అల్ హందులిల్లాహి వహదహు వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బఅదహు అమ్మా బఅద్).
ప్రియ వీక్షకులారా, విద్యార్థులారా, అల్ హందులిల్లాహి హందన్ కసీరా. ఈరోజు మనం బహుశా కేవలం ఒకే ఒక హదీస్ మన ఈ క్రమంలో అంటే, హదీస్ క్లాస్ ఏదైతే ప్రారంభించామో అందులో జుల్ఫీ దావా సెంటర్ నుండి ప్రింట్ అయినటువంటి ఈ పుస్తకం శత సాంప్రదాయాలు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నతుల జ్ఞానం పొందడానికి, మన జీవితంలో ఆచరిస్తూ ఉండడానికి ఈ పుస్తకం చదువుతున్నాము. ఇందులోని హదీస్ నెంబర్ 56 ఇన్ షా అల్లాహ్ ఇప్పుడు మనం చదువుతున్నాము.
కానీ ఈ హదీస్ 56 వ నెంబర్ జమ్ జమ్ నీటి గురించి ఉంది గనక, ఎన్నో రోజుల నుండి జమ్ జమ్ గురించి ఒక ప్రసంగం చేయాలి అన్నటువంటి ఆలోచన కూడా ఉండింది. అల్లాహ్ యొక్క దయ ఈరోజు ఆ అవకాశం ఏర్పడినది. الحمد لله حمداً كثيراً (అల్ హందులిల్లాహి హందన్ కసీరా). అల్లాహు త’ఆలా ఈ భాగ్యం కలుగజేశాడు. దాని గురించి అవసరం ఉన్నటువంటి కొంత ప్రిపరేషన్ కూడా జరిగింది. అయితే, జమ్ జమ్ నీటి గురించి సంక్షిప్తంగా దాని చరిత్ర మరియు దాని యొక్క శుభాలు మరియు దాని యొక్క మహిమలు, మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. ఇన్ షా అల్లాహ్ మీరందరూ కూడా చాలా శ్రద్ధగా ఈ విషయాలను వింటారని ఆశిస్తున్నాను.
“నిశ్చయంగా ఇది (జమ్ జమ్ నీరు) శుభప్రదమైనది, ఇది ఆకలిగొన్న వారికి ఆహారంగా పనిచేస్తుంది.” (ముస్లిం) మరియు తయాసిలో “ఇది రోగ నివారిణి” అని అధికంగా ఉంది.
స్వస్థత పొందే ఉద్దేశంతో జమ్ జమ్ నీళ్లు త్రాగటం.
అబూజర్ రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జమ్ జమ్ నీళ్ల విషయంలో ఇలా ప్రవచించారు. అది శుభమైన నీరు. శుభప్రదమైన నీరు. మరియు అది ఆకలిగొన్న వారికి ఆహారంగా పనిచేస్తుంది. ఇక్కడి వరకు సహీ ముస్లింలోని పదాలు. హదీస్ నెంబర్ 2473.
ముస్నద్ తయాలిసి అని ఒక హదీస్ పుస్తకం ఉంది. అందులో ఈ రెండు సెంటెన్స్ إِنَّهَا مُبَارَكَةٌ إِنَّهَا طَعَامُ طُعْمٍ (ఇన్నహా ముబారకతున్, ఇన్నహా త’ఆము తుఅమిన్) తో పాటు మరొకటి అదనంగా ఉంది. అదేమిటి?
وَشِفَاءُ سُقْمٍ (వ షిఫాఉ సుఖ్మ్) “అది రోగుల కొరకు స్వస్థత, రోగ నివారిణి కూడాను.”
జమ్ జమ్ నీరు, ఇది వాస్తవానికి ప్రపంచంలో ఎక్కడా కూడా లేనటువంటి అద్భుతమైన అల్లాహ్ యొక్క గొప్ప మహిమ. నేను స్టార్టింగ్ లోనే చెప్పినట్లు ఈ హదీస్ ఆధారంగా మూడు విషయాలు తెలియజేస్తాను. సంక్షిప్తంగా దాని చరిత్ర, మరియు దాని యొక్క శుభాలు, మరియు దాని యొక్క మహిమ.
ఒక క్రమంగా కాకుండా మధ్యలో ఈ మూడు విషయాలు కూడా కలిసి రావచ్చు. ఎందుకంటే చరిత్ర చెప్పేటప్పుడు కొన్ని మహిమలు, కొన్ని శుభాలు కూడా మనకు కనబడవచ్చు. అందుకొరకే ఒకటైనకి ఒకటి వస్తుంది అన్నట్టుగా కాకుండా మాటను పూర్తి శ్రద్ధతో వినే ప్రయత్నం చేయండి.
జమ్ జమ్ నీటి చారిత్రక నేపథ్యం
విషయం ఏమిటంటే అల్లాహు త’ఆలా ఇబ్రాహీం అలైహిస్సలాం వారి మొదటి భార్య సారా అలైహిస్సలాం ద్వారా ఎంతో కాలం వివాహ బంధంలో గడిచినప్పటికీ సంతానం కలగలేదు. అయితే అల్లాహు త’ఆలా ఒక ప్రయాణంలో ఒక పరీక్ష తర్వాత కానుకగా హాజర్ అలైహిస్సలాం ఏదైతే లభించినదో, ఆమెతో మీరు వివాహం చేసుకోండి అని సారా అలైహిస్సలాం యొక్క సలహాతో ఇబ్రాహీం అలైహిస్సలాం వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఇస్మాయిల్ అలైహిస్సలాం పుట్టారు. ఇంకా ఇస్మాయిల్ అలైహిస్సలాం పాలు త్రాగే వయసులోనే ఉన్నారు. అల్లాహ్ యొక్క ఆదేశం మేరకు అక్కడి నుండి ఇప్పుడు ఎక్కడైతే కాబతుల్లా ఉన్నదో అక్కడికి హిజ్రత్ చేయాలని, అక్కడికి తీసుకువచ్చి తన భార్య హాజర్ ను మరియు ఏకైక పుత్రుడైనటువంటి ఇస్మాయిల్ ను వదలాలని ఆదేశం ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశం మేరకు ఇబ్రాహీం అలైహిస్సలాం బయలుదేరారు.
సహీ బుఖారి 3364 లో మనకు ఈ హదీస్ కనబడుతుంది. అక్కడ చాలా వివరంగా దీని యొక్క విషయం ఉంది కానీ నేను పూర్తి హదీస్, దాని యొక్క పూర్తి వివరణ ఇప్పుడు చెప్పలేను. అందులో ఏదైతే జమ్ జమ్ కు సంబంధించిన విషయం ఉన్నదో దానిని మాత్రమే ఇప్పుడు ఇక్కడ నేను ప్రస్తావిస్తాను.
ఇబ్రాహీం అలైహిస్సలాం తన ఏకైక పుత్రుడైన ఇస్మాయిల్ ని మరియు భార్య ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి యొక్క తల్లి హాజర్ ను మక్కాలో ఇప్పుడు కాబా ఉన్న ప్రదేశంలో వదిలేసి వెళ్ళిపోయారు. కేవలం ఒంటరి స్త్రీ, అక్కడ ఎవరూ లేరు. మీరు ఖురాన్ సూరే ఇబ్రాహీంలో చూసినా గాని,
رَّبَّنَا إِنِّي أَسْكَنتُ مِن ذُرِّيَّتِي بِوَادٍ غَيْرِ ذِي زَرْعٍ عِندَ بَيْتِكَ الْمُحَرَّمِ (రబ్బనా ఇన్నీ అస్కన్తు మిన్ జుర్రియ్యతీ బివాదిన్ గైరి జీ జర్ఇన్ ఇంద బైతికల్ ముహర్రమ్) ఓ మా ప్రభూ! నీ పవిత్ర గృహం వద్ద, ఏ విధమైన పంటా పండని ఒక లోయలో నేను నా సంతానంలో కొందరిని నివసింపజేశాను. (14:37)
“అక్కడ ఒక పచ్చిక లేదు. అక్కడ ఏ చిన్న చెట్టు లేదు. నీటి సౌకర్యం లేదు. నీ ఆదేశం మేరకు నేను నా సంతానాన్ని అక్కడ వదిలి వెళ్తున్నాను” అని చెప్పారు. దుఆ చేశారు. ఆ దుఆ ప్రస్తావన ఖురాన్ లో కూడా ఉంది. అయితే ఎప్పుడైతే వాళ్ల వద్ద ఉన్నటువంటి ఆ సామాగ్రి చిన్నగా ఏదైతే ఉండినదో, పూర్తిగా అయిపోయినదో అప్పుడు చాలా ఇబ్బంది కలిగింది.
ఏం చేశారు? తినడానికి ఏమీ లేదు, త్రాగడానికి ఏమీ లేదు. చివరికి హాజర్ తల్లి అయినటువంటి ఆమె స్తనాల్లో కూడా పాలు లేకపోయాయి ఆ పాలు త్రాగే బాబు కొరకు. అప్పుడు ఆమె హజరే అస్వద్ నుండి దగ్గరగా ఎత్తైన ప్రదేశం, కొండ సఫా ఉండినది. ఆమె అటువైపునకు వెళ్లారు. సహీ బుఖారిలో హదీస్ నెంబర్ ఇక్కడ మరియు నేను చెప్పినటువంటి ఆయత్ సూరత్ ఇబ్రాహీం ఆయత్ నెంబర్ 37 ఇక్కడ ఉంది.
فَوَجَدَتِ الصَّفَا أَقْرَبَ جَبَلٍ فِي الأَرْضِ يَلِيهَا (ఫ వజదతిస్సఫా అఖ్రబ జబలిన్ ఫిల్ అర్ది యలీహా) ఆమెకు దగ్గరగా సఫా కొండ ఉంటే అక్కడికి వెళ్ళింది. నలువైపులా చూసింది, ఎవరూ కనబడటం లేదు. అక్కడి నుండి కిందికి దిగి వచ్చింది. ఎప్పుడైతే కిందికి దిగి వచ్చిందో, లోయ ప్రాంతం, వాది అని అంటారు కదా. అయితే అక్కడ తిరిగి ఎడమవైపునకు చూసేసరికి బాబు కనబడటం లేదు. బాబు ఇస్మాయిల్ అలైహిస్సలాం కనబడటం లేదు. ఆమె అక్కడ పరుగెత్తింది.
ثُمَّ سَعَتْ سَعْيَ الإِنْسَانِ الْمَجْهُودِ حَتَّى جَاوَزَتِ الْوَادِي (సుమ్మ సఅత్ సఅయల్ ఇన్సానిల్ మజ్హూద్ హత్తా జా వజతిల్ వాది) అక్కడి నుండి మళ్ళీ మర్వా వైపునకు వచ్చింది.
ఇక్కడ గమనించండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని ఇబ్ను అబ్బాస్ అంటున్నారు.
فَذَلِكَ سَعْيُ النَّاسِ بَيْنَهُمَا (ఫ జాలిక సఅయున్నాసి బైనహుమా) ఈ రోజుల్లో హజ్ ఉమ్రాలో ఏదైతే సయీ చేస్తారో దాని యొక్క చారిత్రక ఘట్టం ఇది.
అంటే ఇక్కడ ఒక్క విషయం మీరు గమనించండి శ్రద్ధగా. మధ్య మధ్యలోనే నేను కొన్ని హింట్స్ మనకు బోధ పడుతున్నటువంటి లాభాలు కూడా చెబుతూ వెళ్తాను. ఇబ్రాహీం అలైహిస్సలాం, అతని యొక్క భార్య హాజర్ మరియు కొడుకు ఇస్మాయిల్. ఈ చిన్న కుటుంబాన్ని చూడండి. అల్లాహ్ కొరకు ఎంత త్యాగం చేశారో అల్లాహు త’ఆలా వారు చేసిన ఆ పుణ్యాలను సూరతుస్సాఫాత్ లో కూడా చెప్పినట్లుగా వెనక తరాల వారికి కొరకు కూడా మిగిలి ఉంచి వారి కొరకు ఇది ఒక చారిత్రక ఘట్టమే కాదు, తర్వాత వారు చేస్తూ ఉన్నంత ఈ పుణ్యాల యొక్క పుణ్యం వారికి కూడా లభిస్తూ ఉంటుంది కదా?
ఆ తర్వాత ఈ విధంగా మర్వా పైకి ఎక్కింది. అక్కడి నుండి కూడా నలువైపులా చూసింది ఎవరూ కనబడలేదు. మళ్లీ సఫా వైపునకు వచ్చింది. ఏడవసారి మర్వా పై ఉన్న సందర్భంలో అక్కడ ఆమె ఒక శబ్దం విన్నది. అప్పుడు ఆమె మౌనం వహించి మరోసారి వినే ప్రయత్నం చేసింది. అప్పుడు ఒక దూత యొక్క సప్పుడు వచ్చింది. చూసేసరికి కొడుకు వద్ద అక్కడ నీళ్ల ఊట మొదలైపోయింది. ఇక్కడ ఈ హదీస్ లో వచనం ప్రకారం జిబ్రీల్ అలైహిస్సలాం తమ యొక్క కాలు మడిమతో లేదా తమ యొక్క రెక్క (జనాహ్) తో అక్కడ కొట్టారు. నీళ్ల ఊట మొదలైంది.
حَتَّى ظَهَرَ الْمَاءُ (హత్తా జహరల్ మా) అప్పుడు హాజర్ అలైహిస్సలాం తమ చేతులతో నీళ్లు అటు ఇటు దూరంగా పోకుండా మనం మనకు మిగిలి ఉండాలి అని మట్టితో కడతారు కదా, ఆ విధంగా కట్టి నీళ్ళను కాపాడుకునే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత కొన్ని నీళ్లు అక్కడ జమా అయినప్పుడు తీసుకుని రెండు చేతులతో తీసుకుని తమ వద్ద ఉన్నటువంటి నీళ్ళ తిత్తిలో వేసుకోవడం మొదలు పెట్టింది.
ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు అంటున్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు,
అంటే ఆమె నీళ్లతో ఏదైతే ఆ నీళ్లను కాపాడుకోవడానికి ఒకచోట బంధించే మాదిరిగా చేసినదో, అప్పుడు ఆమెకు తెలియదు కదా ఈ నీళ్ల ఊట ప్రళయం వరకు ఉంటుంది, అల్లాహ్ వైపు నుండి ఒక గొప్ప మహిమగా మాదిరిగా. అక్కడ అల్లాహు త’ఆలా ఇప్పుడు నీళ్లు ఇచ్చాడు, ఆ నీళ్లు దూరంగా పారిపోయి మళ్ళీ రేపటి రోజు మిగిలకుండా ఉండకూడదు అని ఆమె తన ఆలోచనతో చేసింది. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం దుఆ ఇచ్చారు? కరుణించుగాక. ఆమె గనుక ఈ విధంగా నీళ్లను బంధించకుంటే అది ఒక పెద్ద దూరంగా పారే అటువంటి చెలమ మాదిరిగా అయిపోయేది.
సోదర మహాశయులారా, సోదరీమణులారా, ప్రియ వీక్షకులారా ఇక్కడి వరకు సంక్షిప్తంగా మనం జమ్ జమ్ నీటి యొక్క చారిత్రక చరిత్ర తెలుసుకున్నాము. అయితే ఇదే ఈ నీటి గురించి ఆ రోజు ఏ అన్నము లేదు, ఏ పప్పు కూరలు లేవు, ఏ రొట్టెలు బిర్యానీలు లేవు. కేవలం ఈ జమ్ జమ్ నీరు త్రాగి తల్లి కొడుకులు ఎన్నో రోజుల వరకు బ్రతికారు.
మళ్లీ ఆ తర్వాత అక్కడికి జనం రావడం మొదలైంది, అదొక వేరే చరిత్ర, నేను దాని వివరాల్లోకి వెళ్ళను.
అయితే ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన విషయం ఏంటి? ఇటు మనం ఇప్పుడు హదీస్ వైపునకు వచ్చి ఈ హదీస్ లో మనం శ్రద్ధగా ఒకసారి గమనిస్తే:
إِنَّهَا مُبَارَكَةٌ (ఇన్నహా ముబారక) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటున్నారు? శుభప్రదమైన నీరు అది.
ఇక ఈ బరకత్ అన్న పదం, ఈ శుభం అన్న పదం ప్రియులారా, మనం ఏదైనా ఒక్కే ఒక్క అనువాదంలో, ఏదైనా ఒక్క వ్యాఖ్యానంలో బంధించలేము.
ఇది మన విశ్వాసపరంగా కూడా స్వయం మనం త్రాగినందుకు మన ఆరోగ్యంలో గాని, ఏ సదుద్దేశాలతో త్రాగుతామో దాని ప్రకారంగా గాని, అందుకొరకే మరొక హదీస్ ఉంది. షేక్ అల్బాని రహమహుల్లాహ్ సహీ అని చెప్పారు.
مَاءُ زَمْزَمَ لِمَا شُرِبَ لَهُ (మాఉ జమ్ జమ లిమా షురిబ లహు) “జమ్ జమ్ నీరు ఏ ఉద్దేశంతో త్రాగడం జరుగుతుందో అల్లాహ్ ఆ సదుద్దేశాన్ని పూర్తి చేస్తాడు.”
మన సలఫె సాలిహీన్లో ఎవరు ఏ ఉద్దేశంతో తాగారు? ఇప్పుడే నేను కొన్ని క్షణాల్లో మీకు తెలియజేస్తాను, కొన్ని సంఘటనలు.ఇన్ షా అల్లాహ్
ఈ ముబారక్ అన్న పదాన్ని విశాలంగా, విస్తృతంగా, పెద్దగా, లోతుగా, డీప్ గా, దూరంగా, ఇహపర ఇహలోకంలోని శుభాలు, పరలోకంలోని శుభాలు అన్ని రకాలుగా ఆలోచించండి.
మరొక గొప్ప విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు?
إِنَّهَا طَعَامُ طُعْمٍ (ఇన్నహా త’ఆము తుఅమ్) ఆకలిగా ఉన్న వారి కొరకు ఇది వాస్తవంగా ఒక అన్నముగా, ఆహారంగా, కడుపు నింపే అటువంటి భోజనంగా పనిచేస్తుంది.
మరియు
وَشِفَاءُ سُقْمٍ (వ షిఫాఉ సుఖ్మ్) ఎవరైతే అనారోగ్యంగా ఉంటారో, అనారోగ్యంగా ఉంటారో అలాంటి వారి కొరకు కూడా ఇది నివారణగా, రోగ నివారిణి, స్వస్థత కలిగించేది, షిఫాగా పనిచేస్తుంది.
జమ్ జమ్ నీటి గురించి ఉలమాల అనుభవాలు
సోదర మహాశయులారా, సోదరీమణులారా, మన ఇండియాలో ఉన్నటువంటి ఒక యువకుడైన మంచి పరిశోధనతో, ఎంతో డీప్ రీసెర్చ్ తో ప్రసంగాలు ఇచ్చేటువంటి షేక్ ముహమ్మద్ షేక్ ముఆజ్ అబూ కుహాఫా ఉమ్రీ హఫిదహుల్లాహ్, జమ్ జమ్ నీటి గురించి కూడా అసలైన పుస్తకాల నుండి అంటే అసలు రూట్, అసల్ మస్దర్ ఏదైతే ఉంటుందో మర్జా, మూల పుస్తకాల నుండి ఎన్నో ఇలాంటి సంఘటనలు వెతికి ఒక చిన్న ఆర్టికల్ గా రాశారు. అది కూడా ఇన్ షా అల్లాహ్ నేను మీ ముందు తెలియజేస్తాను. కానీ అంతకు ముందు ఒక చిన్న ముఖ్యమైన మాట. అదేమిటి?
ఒక సందర్భంలో హాఫిజ్ ఇబ్ను హజర్ రహమహుల్లాహ్ తెలుసు కదా, ఒక చాలా మహా గొప్ప హదీసు వేత్త. సహీ బుఖారీ యొక్క ఎన్నో వ్యాఖ్యానాలు రాయబడ్డాయి. కానీ ఈయన రాసిన వ్యాఖ్యానం లాంటిది ఎవరూ రాయలేకపోయారు. హాఫిజ్ ఇబ్ను హజర్ రహమహుల్లాహ్ ఈజిప్ట్, మిసిర్ లో ఉన్నప్పుడు షేక్ ఇబ్ను అరఫా రహమహుల్లాహ్ తో కలిశారు. ఆయనతో అడిగారు, “జమ్ జమ్ నీరు తియ్యగా ఎందుకు లేవు? తీపిగా ఎందుకు లేవు? కొంచెం అందులో తీపితనం తక్కువ ఏర్పడుతుంది.”
ఇబ్ను అరఫా ఏం చక్కగా సమాధానం ఇచ్చారో ఒకసారి గుర్తుంచు ఒకసారి శ్రద్ధగా వినండి. ఇబ్ను అరఫా అన్నారు, “జమ్ జమ్ నీరును త్రాగడం ఇబాదత్ కొరకు, టేస్ట్ కొరకు కాదు.” ఈ సమాధానం విని ఇబ్ను హజర్ రహమహుల్లాహ్ ఆశ్చర్యపోయారు. ఆయన యొక్క జ్ఞానం, హదీసుల విషయంలో ఆయన యొక్క ఇంతటి లోతు అర్థాన్ని విని ఆశ్చర్యపోయారు. ఈ మాట ముఫీదుల్ అనామ్ వ నూరుల్ జలామ్ లిబ్ని జాసిర్ పుస్తకంలో ఉంది.
సోదర మహాశయులారా, సహీహాలో వచ్చినటువంటి హదీస్ లో ఈ జమ్ జమ్ నీటి గురించి మరొక గొప్ప మాట ఉంది. హదీస్ నెంబర్ 1056. ఏంటి?
خَيْرُ مَاءٍ عَلَى وَجْهِ الأَرْضِ (ఖైరు మాఇన్ అలా వజ్హిల్ అర్ద్) “ఈ భూమి మీదనే ఈ భూలోకంలో అత్యంత ఉత్తమమైన, చాలా మంచి నీరు, శుభప్రదమైనది ఏదైనా ఉంది అంటే అది కేవలం ఈ జమ్ జమ్ నీరు మాత్రమే.”
అలాగే సోదర మహాశయులారా, దీని గురించి ఇంకా మీరు వివరంగా చదవాలనుకుంటే, కొన్ని జయీఫ్ హదీసులు కూడా మనకు కనబడుతున్నాయి. కానీ మనం ఆ జయీఫ్ హదీసుల యొక్క వివరాల్లోకి వెళ్లకుండా, హా ఇది జయీఫ్ అన్నట్లుగా కేవలం తెలవడానికి ఎప్పుడైనా మనం ఆ హదీసులను కూడా తెలుసుకుంటే నష్టం లేదు కానీ కేవలం అది జయీఫ్ అని తెలియడానికి.
ఇక
مَاءُ زَمْزَمَ لِمَا شُرِبَ لَهُ (మాఉ జమ్ జమ లిమా షురిబ లహు) జమ్ జమ్ నీరు ఎవరు ఏ ఉద్దేశంతో తాగుతారో ఆ ఉద్దేశం వారిది పూర్తి అవుతుంది. ఈ హదీస్ ను కొందరు జయీఫ్ అని చెప్పారు కానీ ఇది రుజువైనది. ఇమామ్ ఇబ్ను హజర్ అస్కలానీ రహమహుల్లాహ్ ఎవరి ప్రస్తావన ఇంతకు ముందు జరిగిందో ఆయన ఈ హదీస్ యొక్క పరిశోధనలో ఎన్నో పేజీల ఒక పుస్తకమే రాసేసారు.
జమ్ జమ్ నీరు, మనం జమ్ జమ్ అన్నటువంటి పేరు చాలా ప్రఖ్యాతి గాంచినది. వేరే పేర్లు కూడా ఉన్నాయని ఎవరికీ తెలియదు కావచ్చు బహుశా. కానీ ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు అన్హు, ఇంకా వేరే కొన్ని సందర్భాల్లో కొన్ని వేరే పేర్లు కూడా వచ్చి ఉన్నాయి. దాని మరొక పేరు దానిది ‘షబ్బాఆ‘. ఇది జూర్ ఆకలికి అపోజిట్. షబ్బాఆ అంటే కడుపు నింపేదిగా. మరొక పేరు ‘ముర్వియా‘. ముర్వియా అంటే దాహానికి వ్యతిరేకం. మరొక పేరు ‘నాఫిఆ‘ అంటే లాభం చేకూర్చేది. జుర్, నష్టానికి అపోజిట్. మరొక పేరు ‘ఆఫియా‘. స్వస్థత కలిగించేది, సంక్షేమం కలిగించేది. ఇది బలా, ముసీబత్, రోగాలు దానికి వ్యతిరేకం. దీని యొక్క మరో పేరు ‘మైమూన్‘. బరకత్, శుభం అన్నటువంటి భావాలు ఇందులో ఉన్నాయి.
అయితే, షేక్ ముఆజ్ అబూ కుహాఫా హఫిదహుల్లాహ్ రాసినటువంటి చిన్న ఆర్టికల్ సంక్షిప్తంగా నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. ఆయన రాస్తున్నారు, “జమ్ జమ్ నీరు, దాని యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క ఘనత మరియు దాని యొక్క చెప్పలేనటువంటి ప్రభావం, అమూల్యమైన దాని యొక్క బెనిఫిట్ మరియు దాని యొక్క ఎఫెక్టివ్ మరియు అందులో ఉన్నటువంటి అనేక లాభాలు ఎంత గొప్ప విషయాలంటే ఇవన్నీ కూడా అందుకొరకే ఒక స్వచ్ఛమైన ముస్లిం కనీసం ఒక రెండు గుటకలు మాకు దొరికినా గానీ ఎంత బాగుండు అన్నటువంటి భావన ఒక ముస్లింకు ఉంటుంది.
వాస్తవానికి జమ్ జమ్ నీరు చాలా గొప్ప ఘనత గల విషయం కూడా. ఎందుకంటే ఎవరు ఏ ఉద్దేశంతో తాగుతారో, ఏ దుఆ చేసుకొని తాగుతారో వారి ఆ దుఆలు కూడా స్వీకరించబడతాయి.
ఇమామ్ ఇబ్ను మాజా రహమహుల్లాహ్ కితాబుల్ మనాసిక్ హజ్ యొక్క వివ సంబంధించిన హదీసులు చాప్టర్ లో:
بَابُ الشُّرْبِ مِنْ زَمْزَمَ (బాబుష్షుర్బి మిన్ జమ్ జమ్) “జమ్ జమ్ యొక్క నీళ్లు త్రాగడం” అన్నటువంటి ఒక బాబ్, చిన్న హెడ్డింగ్ కూడా ఆయన పేర్కొన్నారు. అందులో జాబిర్ రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించినటువంటి ఈ హదీస్ ను తీసుకొచ్చారు.
ఇది మన మన విశ్వాసాల ప్రకారంగా, మన యొక్క నమ్మకాల ప్రకారంగా, అల్లాహు త’ఆలా తన యొక్క దయానుగ్రహాలతో ప్రసాదిస్తాడు.
షేక్ అబూ కుహాఫా అంటున్నారు, నా యొక్క జ్ఞానం అనుభవంలో అనేకమంది జమ్ జమ్ నీళ్లు వ్యాపారం, వివాహం, సంతానం, ఇలాంటి విషయాల గురించి ఇందులో వారికి శుభం కలగాలన్నటువంటి ఉద్దేశంతో తాగుతూ ఉంటారు. కానీ వాస్తవానికి పరలోక లాభం కూడా మన ముందు ఉండాలి. మన ఉలమాలను మనం చూస్తే వారు ఎంత మంచి దుఆలు చేశారంటే, ఆ దుఆల స్వీకరణ, వారు చేసిన ఆ దుఆలు అంగీకరించబడ్డాయి అని వారి జీవితంలో కూడా వారికి తెలిసింది. అంతే కాదు, వారి ఆ దుఆల బరకత్ ఈ రోజు వరకు కూడా మనము పొందుతున్నాము.
మరోసారి చెబుతున్నాను శ్రద్ధగా వినండి. మన సలఫె సాలిహీన్లో కొందరు జమ్ జమ్ నీరు త్రాగుతూ చేసినటువంటి దుఆలు, అల్లాహు త’ఆలా తన దయ కరుణతో ఏదైతే అంగీకరించాడో, స్వీకరించాడో, ఆ స్వీకరణ యొక్క లాభం, శుభం, దాని యొక్క ఎఫెక్టివ్, తాసీర్, ప్రభావం స్వయం వారు తమ జీవితంలో చూసుకున్నారు, చూసుకున్నారు. అంతే కాదు, ఆ లాభం ఇప్పటి వరకు మన వరకు కూడా చేరుతూ ఉన్నది. ఎంతటి గొప్ప దుఆలు కావచ్చు అండి?
అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రదియల్లాహు అన్హుమా చేసినటువంటి దుఆ, ముస్తద్రక్ హాకింలో వచ్చి ఉంది.
اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ عِلْمًا نَافِعًا وَرِزْقًا وَاسِعًا وَشِفَاءً مِنْ كُلِّ دَاءٍ (అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక ఇల్మన్ నాఫిఆ, వ రిజ్ఖన్ వాసిఆ, వ షిఫాఅమ్ మిన్ కుల్లి దా) “ఓ అల్లాహ్! నేను ప్రయోజనకరమైన విద్య, విస్తృతమైన ఉపాధి మరియు ప్రతీ రోగం నుండి స్వస్థత, ఆరోగ్యం ఈ నీరు త్రాగుతూ నీతో కోరుతున్నాను, నీతో అర్ధిస్తున్నాను.”
అబ్దుల్లాహ్ ఇబ్నుల్ ముబారక్ చాలా గొప్ప పెద్ద ముహద్దిస్. సియర్ అ’లామిన్ నుబలా అని ఇమామ్ జహబీ రహమహుల్లాహ్ రాసినటువంటి చరిత్ర పుస్తకంలో ఈ సంఘటన వచ్చి ఉంది. ఆయన జమ్ జమ్ నీరు త్రాగడానికి వచ్చినప్పుడు జాబిర్ రదియల్లాహు త’ఆలా అన్హు వారి ఆ హదీస్ مَاءُ زَمْزَمَ لِمَا شُرِبَ لَهُ (మాఉ జమ్ జమ లిమా షురిబ లహు) ప్రస్తావించి,
وَهَذَا أَشْرَبُهُ لِعَطَشِ يَوْمِ الْقِيَامَةِ (వ హాజా అష్రబుహు లి అత్షి యౌమిల్ ఖియామా) “ఓ అల్లాహ్! నేను ఈ జమ్ జమ్ నీరు త్రాగుతున్నాను, ప్రళయ దినాన నన్ను ఎప్పుడూ కూడా దాహంగా ఉంచకు.”
గమనించండి. పరలోకానికి సంబంధించిన వివరంగా పాఠాలు మీరు విని ఉండేది ఉంటే, అక్కడ ఎన్నో సందర్భాల్లో చాలా దాహం కలుగుతూ ఉంటుంది. అదృష్టవంతులకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హౌజె కౌసర్ నుండి నీరు లభిస్తుంది. అల్లాహ్ అలాంటి వారిలో మనల్ని కూడా చేర్చుగాక. బిదతుల నుండి దూరం ఉంచుగాక. షిర్క్ నుండి దూరం ఉంచుగాక అల్లాహ్ మనందరినీ కూడా.
అలాగే మూడో సంఘటన చూడండి. ఇమామ్ అబూబకర్ ఇబ్ను ఖుజైమా, గొప్ప ముహద్దిస్, సహీ ఇబ్ని ఖుజైమా తెలుసు కదా మీ అందరికీ, ఆయనతో ఒకరు ప్రశ్నించారు, مِنْ أَيْنَ أُوتِيتَ هَذَا الْعِلْمَ؟ (మిన్ ఐన ఊతీత హాజల్ ఇల్మ్?) “ఈ మహా సముద్రం లాంటి, విశాలమైన, ఇంత లోతు జ్ఞానం మీరు ఎలా సంపాదించారు?” అప్పుడు ఆయన చెప్పారు, “నేను ఎప్పుడైతే జాబిర్ రదియల్లాహు అన్హు వారి ఈ హదీస్ విన్నానో, مَاءُ زَمْزَمَ لِمَا شُرِبَ لَهُ (మాఉ జమ్ జమ లిమా షురిబలహ్), అప్పుడు నేను وَإِنِّي لَمَّا شَرِبْتُ مَاءَ زَمْزَمَ سَأَلْتُ اللَّهَ عِلْمًا نَافِعًا (వ ఇన్నీ లమ్మా షరిబ్తు మాఅ జమ్ జమ సఅల్తుల్లాహ ఇల్మన్ నాఫిఆ), నేను అల్లాహ్ తో జమ్ జమ్ నీళ్లు త్రాగుతూ దుఆ చేశాను, ఓ అల్లాహ్ నాకు ప్రయోజనకరమైన విద్యా జ్ఞానాన్ని ప్రసాదించు అని.” ఈ విషయం తజ్కిరతుల్ హుఫ్ఫాజ్ లో ఉంది.
అలాగే, అబూ అబ్దుల్లాహ్ ఇమామ్ హాకిం రహమహుల్లాహ్ ఎన్నో పుస్తకాలు ఆయన రాశారు. వందల్లో లెక్కించారు ఉలమాలు ఆయన రాసిన పుస్తకాలను. ఆయన అంటున్నారు, “గమనించండి.” ఇక్కడ షేక్ అబూ ముఆజ్ అబూ కుహాఫా రాశారు, “సుమారు 500 జుజ్, చిన్న చిన్న పుస్తకాలను అంటారు జుజ్ అని, ఆయన రాశారంట.” వాటిలో ఒకటి ప్రఖ్యాతి గాంచినది ముస్తద్రక్ హాకిం. అయితే ఆయన అంటున్నారు, شَرِبْتُ مَاءَ زَمْزَمَ وَسَأَلْتُ اللَّهَ أَنْ يَرْزُقَنِي حُسْنَ التَّصْنِيفِ (షరిబ్తు మాఅ జమ్ జమ వ సఅల్తుల్లాహ అన్ యర్జుఖనీ హుస్నత్తస్నీఫ్) “నేను జమ్ జమ్ నీరు త్రాగుతూ అల్లాహ్ తో దుఆ చేశాను, ఓ అల్లాహ్, నన్ను ఒక మంచి ఉత్తమ రచయితగా…” ఏదో బుకార్ అవార్డు, నోబెల్ అవార్డు, ఇంకా వేరే ఇలాంటి అవార్డుల కొరకు కాదు. అల్లాహ్ వద్ద. అల్లాహ్ యొక్క ధర్మాన్ని ప్రజల వరకు చేరవేయడానికి, ఒక మంచి ఉత్తమమైన రచయితగా నేను ఎదగాలి అని దుఆ చేశారు. అల్లాహు త’ఆలా అతని యొక్క కోరికను ఎలా తీర్చాడో, వాటి ద్వారా మనం ఈ రోజు కూడా లాభం పొందుతున్నాము కదా ఆ పుస్తకాల ద్వారా?
సోదర మహాశయులారా, టైం సమాప్తం కావస్తుంది కానీ కొన్ని చిన్న చిన్న సంక్షిప్తంగా సంఘటనలు వినిపిస్తాను. శ్రద్ధ వహించండి.
అబుల్ ఫజ్ల్ అబ్దుర్రహ్మాన్ అల్ బుల్కీనీ, చాలా గొప్ప పండితులు,
ఆయన సంఘటన ఇక్కడ ప్రస్తావించారు. ఆయన అరబీ భాషలో ఎదగడం లేదు, ఇంకా చాలా వీక్ గా ఉన్నారు. అయితే 787వ హిజ్రీ శకంలో తన తండ్రి, ఆ తండ్రి కూడా చాలా గొప్ప పెద్ద ఆలిం పండితులు, తండ్రితో హజ్ కు వెళ్లారు. జమ్ జమ్ నీళ్లు త్రాగుతూ అల్లాహ్ తో ఎంతగా దుఆ చేశారంటే, “ఓ అల్లాహ్! నన్ను అరబీ భాషలో…” ఎందుకంటే ఇస్లాం జ్ఞానం యొక్క మొత్తం సంపద అరబీ భాషలో ఉంది కదా, దాన్ని మంచిగా అర్థం చేసుకోవడానికి అరబీ భాష మంచిగా రావడం తప్పనిసరి. అయితే, “ఓ అల్లాహ్ నాకు ఈ భాష మంచిగా అర్థం కావాలి, ఇందులో నేను ఒక నైపుణ్యుని కావాలి. మాహిరే జుబాన్, భాషా ప్రావీణ్యుణ్ణి కావాలి.” فَلَمَّا رَجَعَ أَدْمَنَ النَّظَرَ فِيهَا فَمَهَرَ فِيهَا فِي مُدَّةٍ يَسِيرَةٍ (ఫ లమ్మా రజఅ అద్మనన్నజర ఫీహా ఫ మహర ఫీహా ఫీ ముద్దతిన్ యసీరా) హజ్ నుండి తిరిగి వచ్చిన తర్వాత చాలా శ్రద్ధగా ఆయన చదవడంలో, స్టడీలో నిమగ్నులయ్యారంటే చాలా కొంత చిన్న కాలంలోనే మాషా అల్లాహ్ గొప్ప ప్రావీణ్యులయ్యారు.
ఇక సోదర మహాశయులారా, హాఫిజ్ ఇబ్ను హజర్ అస్కలానీ రహమతుల్లాహి అలైహి యొక్క మాటేమిటి?
ఇల్ముర్ రిజాల్ అన్నటువంటి ఒక ప్రత్యేక సబ్జెక్ట్ ఏదైతే ఉందో, అందులో ఆయన ఎంత ప్రావీణ్యులో, గొప్ప పండితులో చెప్పనవసరం లేదు. అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆయన యొక్క ఇబ్ను హజర్ రహమహుల్లాహ్ యొక్క శిష్యుడు ఆయన గురించి రాశారు ఈ విషయం. “నేను ఎప్పుడైతే ధర్మ విద్య నేర్చుకోవడం మొదలుపెట్టానో, జమ్ జమ్ నీళ్లు తాగుతూ అల్లాహ్ తో చాలా చాలా దుఆ చేశాను. ఏమని దుఆ చేశాను? ఓ అల్లాహ్! హిఫ్జ్ ఇత్ఖాన్, మెమొరైజేషన్ మరియు విద్యను ఉత్తమ రీతిలో, మంచి రీతిలో అర్థం చేసుకునే వారిగా నేను కావాలి. ఎలా? హాఫిజ్ అబూ అబ్దుల్లాహ్ అజ్ జహబీ, ఇమామ్ జహబీ రహమతుల్లాహి అలైహి అంటాము కదా, అలాంటి గొప్ప పండితు మాదిరిగా నేను కావాలి. وَأَنَا شَرِبْتُهُ فِي بِدَايَةِ طَلَبِ الْحَدِيثِ (వ అన షరిబ్తుహు ఫీ బిదాయతి తలబిల్ హదీస్) నేను హదీస్ విద్య నేర్చుకునే ప్రారంభ దశలో ఈ జమ్ జమ్ నీరు తాగుతూ దుఆ చేశాను. أَنْ يَرْزُقَنِيَ اللَّهُ حَالَةَ الذَّهَبِيِّ فِي حِفْظِ الْحَدِيثِ (అన్ యర్జుఖనీ అల్లాహు హాలతజ్ జహబీ ఫీ హిఫ్జిల్ హదీస్) హదీస్ లో అల్లాహు త’ఆలా ఇమామ్ జహబీ లాంటి మనిషిగా నన్ను తీర్చిదిద్దాలి అని. మళ్లీ 20 సంవత్సరాల తర్వాత నేను మళ్లీ హజ్ కు వెళ్లాను. అప్పుడు దుఆ చేశాను, ఓ అల్లాహ్, ఇమామ్ జహబీ కంటే గొప్ప పండితుణ్ణి కావాలి నేను.
గమనించండి. మొదటిసారి దుఆ చేసినప్పుడు ఏం చేశారు? ఇమామ్ జహబీ లాంటి గొప్ప హదీస్ వేత్తగా నేను ఎదగాలి. 20 సంవత్సరాల తర్వాత మళ్లీ హజ్ చేసే అవకాశం దొరికినప్పుడు, ఇమామ్ జహబీ కంటే గొప్ప పండితుణ్ణి కావాలి నేను అన్నటువంటి దుఆ చేశారు. فَسَأَلْتُ رُتْبَةً أَعْلَى مِنْهَا وَأَرْجُو اللَّهَ أَنْ أَنَالَ ذَلِكَ مِنْهُ (ఫ సఅల్తు రుత్బతన్ అ’లా మిన్హా, వ అర్జుల్లాహ అన్ అనాల జాలిక మిన్) అయితే అల్లాహ్ నాకు ఇది కూడా ప్రసాదిస్తాడు అని నాకు నమ్మకం ఉంది అని అంటున్నారు. మరి ఈ రోజు హదీస్ పుస్తకాలు, వాటి యొక్క వ్యాఖ్యానాలు చదివే వారికి తెలుసు ఈ విద్యలో ఎవరు ఎక్కువ గొప్పవారు అని.
అలాగే ఇమామ్ ఇబ్నుల్ హుమామ్ రహమహుల్లాహ్ తన యొక్క గురువు గారి యొక్క సంఘటన తెలియజేస్తున్నారు. ఏమన్నారు? وَالْعَبْدُ الضَّعِيفُ يَرْجُو اللَّهَ سُبْحَانَهُ شُرْبَهُ لِلإسْتِقَامَةِ وَالْوَفَاةِ عَلَى حَقِيقَةِ الإِسْلامِ مَعَها (వల్ అబ్దుద్ జయీఫ్ యర్జుల్లాహ సుబ్ హానహు షుర్బహు లిల్ ఇస్తిఖామతి వల్ వఫాతి అలా హఖీఖతిల్ ఇస్లామి మఅహా) “నేను ఈ నీళ్లు త్రాగుతూ, బ్రతికి ఉన్నంత కాలం ధర్మంపై స్థిరంగా ఉండాలని మరియు నా చావు అల్లాహ్ కు ఇష్టమైనటువంటి సత్యమైన ఇస్లాంపై రావాలని, ఇలాంటి సదుద్దేశంతో తాగాను.”
అలాగే సోదర మహాశయులారా, ఇమామ్ అబూబకర్ ఇబ్నుల్ అరబీ అల్ మాలికీ. నేను ఇంత వివరంగా స్పష్టంగా ఎందుకు చెబుతున్నాను? ఇబ్నె అరబీ అలిఫ్ లామ్ లేకుండా అరబీ, ఇబ్నె అరబీ ఒక దుర్మార్గుడు ఉన్నాడు, దుష్టుడు చనిపోయాడు. బిదతుల యొక్క మూల పురుషుడు, కారకుడు. అతడు కాదు. ఈయన అబూబకర్ ఇబ్నుల్ అరబీ అల్ మాలికీ రహమహుల్లాహ్. ఈయన ఉందులుస్ లో చాలా గొప్ప పండితులు. ఎన్నో రకాల విద్యలో ఆయన చాలా ఆరితేరి ఉన్నారు. ఆయన కూడా జమ్ జమ్ నీళ్లు త్రాగుతున్నప్పుడు ఇల్మ్, ఈమాన్, ధర్మ విద్య మరియు విశ్వాసం కొరకు అల్లాహ్ తన యొక్క హృదయాన్ని తెరవాలి అని దుఆ చేశారు. ఆయన అంటున్నారు, وَكُنْتُ أَشْرَبُ مَاءَ زَمْزَمَ كَثِيرًا (వ కుంతు అష్రబు మాఅ జమ్ జమ కసీరన్) “నేను అధికంగా ఎక్కువగా జమ్ జమ్ నీళ్లు త్రాగేవాన్ని. وَكُلَّمَا شَرِبْتُهُ نَوَيْتُ بِهِ الْعِلْمَ وَالإِيمَانَ (వ కుల్లమా షరిబ్తుహు నవైతు బిహిల్ ఇల్మ వల్ ఈమాన్) నేను ఎప్పుడెప్పుడు తాగినా గానీ, ఇల్మ్ మరియు ఈమాన్ నాకు లభించాలని నేను నియ్యత్ చేసేవాణ్ణి. حَتَّى فَتَحَ اللَّهُ عَلَيَّ لِي بَرَكَتَهُ (హత్తా ఫతహల్లాహు అలైయ్య లీ బరకతహు) అల్లాహు త’ఆలా నా కొరకు తన శుభాల ద్వారాలను తెరిచాడు. فِي الْمِقْدَارِ الَّذِي يَسَّرَهُ لِي مِنَ الْعِلْمِ (ఫిల్ మిఖ్దారిల్లజీ యస్సరహు లీ మినల్ ఇల్మ్).”
సోదర మహాశయులారా, ఇక్కడ ఒక చిన్న జోక్ అంటారా? వాస్తవానికి దీనిని ఒక ఇల్మీ జోక్ అని అంటే మీరు ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఏంటి అది? ఇబ్నుల్ జౌజీ అని ఇమామ్ ఇబ్నుల్ జౌజీ ఆయన కూడా ఒక చాలా గొప్ప పండితుడు. 597 లో చనిపోయారు. అయితే ఆయన యొక్క రచనలు పుస్తకాలు కూడా చాలా ఉన్నాయి. ఒక పుస్తకం أخبار الظراف والمتماجنين (అఖ్బారుజ్ జిరాఫి వల్ ముతమాజినీన్) లో రాస్తున్నారు, ఇమామ్ అబూబకర్ అల్ హుమైదీ, 219లో చనిపోయారు మక్కాలో, ఆయన సుఫ్యాన్ ఇబ్ను ఉయైనా వద్ద కూర్చుండి ఉన్నారు. సుఫ్యాన్ ఇబ్ను ఉయైనా పెద్ద ముహద్దిస్. ఇమామ్ బుఖారీ యొక్క ఉస్తాదుల ఉస్తాదుల వస్తారు. సుఫ్యాన్ ఇబ్ను ఉయైనా శ్రద్ధగా వినండి ఇక్కడి నుండి. సుఫ్యాన్ ఇబ్ను ఉయైనా మక్కాలో ఉన్నారు. హదీసులు ప్రజలకు చెబుతున్నారు. హదీస్ దర్స్ ఇస్తున్నారు. ఇస్తూ ఇస్తూ ఈ జాబిర్ రదియల్లాహు త’ఆలా అన్హు వారి యొక్క హదీస్ ప్రజలకు వినిపించారు. అయితే ఒక వ్యక్తి వెంటనే పక్కకు వెళ్ళాడు, మళ్లీ వచ్చాడు. ఆ తర్వాత వచ్చి, “ఇమామ్ సుఫ్యాన్ ఇబ్ను ఉయైనా గారు, మీరు ఈ హదీస్ మాకు ఇప్పుడే చెప్పారు కదా, అయితే నేను జమ్ జమ్ నీళ్లు త్రాగి, త్రాగుతూ దుఆ చేశాను, సుఫ్యాన్ ఇబ్ను ఉయైనా నాకు వంద హదీసులు వినిపించాలని.”
ఆనాటి కాలంలోని ఇమాములు, ఉస్తాదులు, గురువులు ఎంత ఓపిక సహనాలు గలవారో. ఆయన అన్నారు, “సరే బిడ్డ, కూర్చో. అల్లాహ్ నీ దుఆను స్వీకరించుగాక.” فَأَقْعَدَهُ فَحَدَّثَهُ بِمِائَةِ حَدِيثٍ (అఖఅద ఫ హద్దసహు బి మిఅతి హదీస్) కూర్చోబెట్టి వంద హదీసులు వినిపించారు.
ఇక చివరిలో షేక్ అబూ కుహాఫా అంటున్నారు, శ్రద్ధగా వినండి. ఇవన్నీ సంఘటనలు నేను ఏదైతే పేర్కొన్నానో, వాస్తవానికి ఇవన్నింటినీ ఒకచోట జమా చేయడంలో నేను చాలా కష్టపడ్డాను. ఎందుకంటే నేను కేవలం ఎక్కడ నుండో విని, చూసి కాదు. ప్రతి ఒక్క సంఘటన ఏ మూల పుస్తకంలో ఉందో అక్కడి నుండి నేను చూసి స్వయంగా నేను రాశాను. అయితే కేవలం ఏదో ఒక కోరిక తీరాలని కాదు, ఈ సంఘటనలు మన యొక్క జీవితంలో, మన యొక్క భవిష్యత్తులో ఒక మంచి మార్పు తీసుకురావాలి. వీటిని మన పూర్వీకుల కథలు అన్నట్లుగా మనం చదివి ఊరుకోకూడదు, మౌనం వహించకూడదు. మన ఫ్యూచర్ లో కూడా ఉపయోగపడే విధంగా మన కొరకు ఉండాలి.
సోదర మహాశయులారా, ఇవన్నీ పాత కాలపు నాటి సంఘటనలు అని అనుకోకండి. అల్లాహ్ యొక్క దయతో ఇప్పటికీ కూడా, ఇప్పటికీ కూడా అల్ హందులిల్లాహ్ జమ్ జమ్ నీటి ద్వారా ఇలాంటి లాభాలు ఎంతో మంది పొందుతున్నారు. సమీప కాలంలోనే షహీద్ అయిపోయినటువంటి అల్లామా ఎహ్సాన్ ఇలాహి జహీర్ రహమహుల్లాహ్ తన రాసినటువంటి ఒక పుస్తకంలో స్వయంగా చెప్పారు, “నేను జామియా ఇస్లామియాలో చదువుతున్న కాలంలో నాకు కిడ్నీలో రాళ్లు వచ్చాయి. హాస్పిటల్లో తీసుకువచ్చి అడ్మిట్ చేశారు. ఇంకా కొన్ని గంటల తర్వాత ఆపరేషన్ జరుగుతుంది అని డిక్లేర్ చేశారు. కానీ నేను భయపడిపోయాను. ఆపరేషన్ నాకు ఇష్టం లేదు. అయితే ఎవరూ డాక్టర్లు, నర్సులు దగ్గర లేని సందర్భంలో… ఈ పనులన్నీ కూడా చేయండి అని చెప్పడం లేదు,
జమ్ జమ్ నీటి యొక్క శుభం వస్తుంది కొంచెం ఓపికతో వినండి. నేను అక్కడి నుండి పారిపోయాను, మదీనా. వెంటనే ఒక టాక్సీ ఎక్కి మక్కాలో వచ్చేసాను. అక్కడే కొద్ది రోజులు ఉండిపోయి అల్లాహ్ తో నేను మాటిమాటికి దుఆ చేసుకుంటూ, నఫిల్ నమాజులు చేసుకుంటూ అధికంగా, అధికంగా, అధికంగా నేను జమ్ జమ్ నీరు తాగుతూ ఉండేవాన్ని. ఒకసారి చిన్న వ్యవధిలోనే నాకు ఎంత స్పీడ్ గా మూత్రం వచ్చినట్లు ఏర్పడింది అంటే వెంటనే నేను టాయిలెట్ కి వెళ్ళాను, వాష్ రూమ్ కి వెళ్ళాను. చాలా స్పీడ్ గా వచ్చింది. ఆ అందులోనే అల్ హందులిల్లాహ్ ఆ కిడ్నీలోని స్టోన్స్ పడిపోయాయి. అల్లాహ్ నాకు ఈ విధంగా షఫా ఇచ్చారు.”
ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ యొక్క మాట పేరు మాటిమాటికి వింటూ ఉంటారు కదా, ఆయన కూడా తన యొక్క రచనల్లో ఒకచోట రాశారు, “నేను మక్కాలో వచ్చి ఉన్న సందర్భంలో ఇక్కడి స్టార్టింగ్ లో వాతావరణం నాకు పడక చాలా కడుపు నొప్పులు వస్తూ ఉండేవి. అయితే నేను జమ్ జమ్ నీళ్లు త్రాగుతూ, సూరే ఫాతిహా చదువుతూ మాటిమాటికి దుఆ చేస్తూ ఉండేవాడిని. అల్లాహు త’ఆలా నాకు షఫా ప్రసాదించాడు.” ఇంకా ఇలాంటి ఎన్నో సంఘటనలు ఉన్నాయి.
ముగింపు
సోదర మహాశయులారా, వాస్తవానికి ఈ జమ్ జమ్ నీరు అల్లాహ్ వైపు నుండి ఒక గొప్ప మహిమ గనుక దీని గురించి సైంటిఫిక్ పరంగా, మెడికల్ పరంగా, ఇప్పుడు డెవలప్మెంట్ ఈ అభివృద్ధి చెందిన కాలంలోని ఏ ఏ రీసెర్చ్ లు అయితే జరిగాయో అవన్నీ చెప్పడానికి ఇక్కడ మనకు సమయం కూడా లేదు, అవకాశం కూడా లేదు. కానీ హదీసుల ద్వారా, ధర్మవేత్తల, ముహద్దిసీన్ల, ఎంతో మంది ఉలమాల ఇమాముల యొక్క సంఘటనల ద్వారా మనకు ఏ విషయం అయితే తెలిసినదో, ఎప్పుడైతే మనకు జమ్ జమ్ నీరు త్రాగే అటువంటి అవకాశం లభిస్తుందో, అల్లాహ్ మనలో ప్రతి ఒక్కరికీ అలాంటి భాగ్యం ప్రసాదించుగాక. ఇలాంటి ఈ హదీస్ ను గుర్తుంచుకోవాలి. అది శుభప్రదమైన నీరు, భూలోకంలోనే అత్యంత శుభ్రమైన, పరిశుద్ధమైన నీరు మరియు ఆకలిగొన్న వారికి ఆహారంగా, రోగంతో ఉన్న వారికి షిఫా, స్వస్థతగా పనిచేస్తుంది మరియు ఇదే ముస్లిం షరీఫ్ లో సహాబియే రసూల్ అబూజర్ రదియల్లాహు త’ఆలా అన్హు వారి యొక్క సంఘటన కూడా ఉంది. ఆయన పూర్తి ఒక్క నెల మక్కాలో ఉన్నారు. ప్రవక్త వారి గురించి కనుక్కోవడానికి, ఇది ఇస్లాం యొక్క స్టార్టింగ్ లో, ఎవరైనా కలమా చదివినట్లుగా ప్రవక్త వారిని అనుసరిస్తున్నట్లుగా తెలిస్తే మక్కా యొక్క అవిశ్వాసులు చాలా చిత్రహింసలకు గురి చేసేవారు. ఆ సందర్భంలో అబూజర్ రదియల్లాహు త’ఆలా అన్హు ఒక నెల మక్కాలో ఉండి కేవలం జమ్ జమ్ నీరు పైనే, నీటి పైనే బ్రతికారు. వేరే ఏదీ కూడా తినడానికి ఆ రోజుల్లో లేకుండే.
చెప్పుకుంటే ఇంకా ఎన్నో సంఘటనలు, ఎన్నో విషయాలు ఉంటాయి. కానీ ఇంతటితో ముగించేస్తున్నాము. ఏదైతే చిన్నపాటి రీసెర్చ్ తో మనం చెప్పే ప్రయత్నం చేశామో, అందులోని మంచి విషయాలు అల్లాహ్ యొక్క దయ, కరుణ, అనుగ్రహంతో అల్లాహ్ వాటిని స్వీకరించుగాక, మనందరి కొరకు, మన తర్వాత వచ్చే తరాల కొరకు లాభదాయకంగా చేయుగాక. ఎక్కడైనా ఏదైనా చెప్పే విషయంలో పొరపాటు జరిగితే అల్లాహ్ నన్ను, అందరినీ కూడా క్షమించుగాక. وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ. السلام عليكم ورحمة الله وبركاته (వా ఆఖిరు దఅవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు).
ప్రశ్నోత్తరాలు
సంక్షిప్తంగా అంశానికి సంబంధించి ఏదైనా ముఖ్య ప్రశ్న ఉండేది ఉంటే అడగవచ్చును. మైక్ మీ వద్ద నుండి ఆన్ చేసుకొని.
السلام عليكم ورحمة الله وبركاته (అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు) గురువు గారు. జమ్ జమ్ వాటర్, జమ్ జమ్ నీళ్లు త్రాగేటప్పుడు بِسم الله (బిస్మిల్లాహ్) అని చెప్పి త్రాగాలి, ఓకే. ఈ దుఆ కూడా మీరు పైన చెప్పారు اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ عِلْمًا نَافِعًا وَرِزْقًا وَاسِعًا وَشِفَاءً مِنْ كُلِّ دَاءٍ (అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక ఇల్మన్ నాఫిఆ వ రిజ్ఖన్ వాసిఆ వ షిఫాఅమ్ మిన్ కుల్లి దా). ఈ దుఆ కూడా చదవాలి. ఈ దుఆ రానివారు بِسم الله (బిస్మిల్లాహ్) చదివి త్రాగవచ్చా? ఏమైనా ప్రాబ్లం ఉందా? بِسم الله (బిస్మిల్లాహ్) అని తమ భాషలో, తమకు వస్తున్నటువంటి భాషలో ఎవరైనా మాట్లాడని వారు కూడా వారి వారు తమ యొక్క ఆలోచనల ప్రకారంగా ఇలాంటి మంచి విషయాలను మనసులో పెట్టుకొని, నియ్యత్ చేసుకొని, సంకల్పించి త్రాగవచ్చు, అభ్యంతరం లేదు.
بارك الله (బారకల్లాహ్). మరొక ప్రశ్న, ఈ ఏదైతే మీరు ఇప్పుడు ప్రోగ్రాం చేశారో, జమ్ జమ్ వాటర్ కి సంబంధించి, ఇది YouTube లో అప్లోడ్ చేశారా? YouTube లైవ్ అయ్యిందా? అవుతుంది. లైవ్ జరుగుతుంది ఇప్పుడు YouTube లో, Twitter లో లైవ్ జరుగుతుంది.
بارك الله فيك (బారకల్లాఫిక్).
السلام عليكم ورحمة الله وبركاته (అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు). وعليكم السلام ورحمة الله وبركاته (వ అలైకుం అస్సలాం వ రహమతుల్లాహి వ బరకాతుహు). దయచేసి అంశానికి సంబంధించిన ప్రశ్నలు అడగండి లేదా అంటే సమయం ఎక్కువైపోతుంది. చెప్పండి.
గురూజీ, త్రాగే విధానము, మనం కూర్చొని కిబ్లా వైపు ముఖం పెట్టి దుఆ చేసి తల మీద కప్పుకొని త్రాగాలి కదా గురూజీ? చూడండి, ఈ విషయాలు ఏదైతే మీరు చెప్పారో, కిబ్లా వైపున ముఖము చేసి, నిలబడి, ఈ విషయాలు కొందరు ధర్మవేత్తలు ప్రస్తావించారు. కానీ సర్వసామాన్యంగా ప్రతీ త్రాగే విషయం, తినే విషయం కూర్చుండి తాగాలని ప్రవక్త వారి ఆదేశం ఉంది. నిలబడి త్రాగకండి అని వారించారు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అందుకొరకు ఉత్తమ విషయం కూర్చుండి త్రాగడమే. ఇక కిబ్లా విషయం ప్రస్తావించారు కొందరు. (జకరల్ ఫుఖహా) కొందరు ఫుఖహాలు వీటిని ప్రస్తావించారు. కానీ మనకు డైరెక్ట్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల్లో, సహాబాల యొక్క ఆచరణలో ఇది స్పష్టంగా మనకు కనబడడం లేదు. కాకపోతే ఇంతకు ముందు నేను నిన్న కూడా చెప్పాను, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పరిస్థితి అలా ఎదురైంది. జమ్ జమ్ నీరు అక్కడ నిలబడి తాగారు, బుఖారీలో వచ్చిన ప్రస్తావన ఇది. ఎవరైనా అదే అనుకొని తాగితే అది వేరే విషయం. కానీ ఇదే అసలైన సున్నత్ కాదు. والله أعلم بالصواب (వల్లాహు అ’లం బిస్సవాబ్).
గురూజీ, తాగిన తర్వాత మరి దుఆ ఏమైనా ఉందా గురూజీ? ప్రత్యేకంగా వేరే… నేను చెప్పాను కదా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జమ్ జమ్ నీరు త్రాగి ఇలాంటి ఇలాంటి దుఆలు చేసుకోండి అని చెప్పలేదు. ప్రత్యేకంగా దుఆ నేర్పలేదు. ప్రవక్త వారు ఏమన్నారు? مَاءُ زَمْزَمَ لِمَا شُرِبَ لَهُ (మాఉ జమ్ జమ లిమా షురిబ లహు) “జమ్ జమ్ నీరు ఎవరు ఏ ఉద్దేశంతో త్రాగుతారో అల్లాహ్ వారి ఉద్దేశాన్ని పూర్తి చేస్తాడు.” అయితే ఎవరికి ఎలాంటి సమస్య ఉందో, ఎవరు అల్లాహ్ తో ఇహపరలోకాల ఏ మేలు కోరుతున్నారో, అవి వారు అడుక్కుంటే తమ భాషలో కూడా సరిపోతుంది. ప్రత్యేకమైన దుఆ ఏమీ లేదు.
గురూజీ, ఒకే దుఆ చేసుకోవాలా, ఎన్నైనా చేసుకోవచ్చా గురూజీ? ఎన్నైనా చేసుకోండి. అభ్యంతరం లేదు.
السلام عليكم ورحمة الله وبركاته (అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు). وعليكم السلام ورحمة الله وبركاته (వ అలైకుం అస్సలాం వ రహమతుల్లాహి వ బరకాతుహు).
సార్, ఇప్పుడు జమ్ జమ్ పానీకి మాత్రమే ఆ దుఆ చేసుకొని ప్రేయర్ అంతా అయ్యా చెప్పారు అది లేకపోతే రుఖియా వాటర్ కూడా చేసుకోవచ్చా? అంటే రుఖియా చేసుకునే వాటర్ తాగే ముందు కూడా ఆ దుఆ చేసుకోవచ్చా? ఇక్కడ చూడండి, రుఖియా యొక్క వాటర్ ఏదైతే ఉందో, మీరు ఏ ఉద్దేశంతో రుఖియా చేయించుకుంటున్నారో అది దాని వరకే పరిమితం. కానీ ఇక్కడ జమ్ జమ్ నీరు దాని యొక్క శుభం ఏదైతే అల్లాహు త’ఆలా అందులో పెట్టాడో దాని కారణంగా ఈ మాట జరుగుతుంది. మీరు ఏ కారణంగా రుఖియా చేసుకుంటున్నారో ఆ ఉద్దేశం అక్కడ సరిపోతుంది దానికి.
جزاك الله (జజాకల్లాహ్) సార్. السلام عليكم (అస్సలాము అలైకుం). وعليكم السلام ورحمة الله وبركاته (వ అలైకుం సలాం వ రహమతుల్లాహి వ బరకాతుహు). ఇక్కడ ఒక మరో విషయం గమనించండి. రుఖియా వాటర్ అని, రుఖియా వాటర్ అని ఎక్కడైనా ఏదైనా మనకు వాటర్ దొరకడం లేదు. మీ ఇంట్లో ఉన్నటువంటి నీరు ఒక గ్లాసులో, చెంబులో తీసుకొని సూరే ఫాతిహా, సూరత్ ఇఖ్లాస్, సూరత్ ఫలక్, నాస్ మరియు దరూద్ చదివి అందులో ఊదారంటే అది కూడా రుఖియా వాటర్ అయిపోయింది.
సరే సార్.
ఓకే. جزاك الله خيرا (జజాకల్లాహు ఖైర్).
ఎవరైతే చెయ్యి ఎత్తి ఉన్నారో, తమ మైక్ ఆన్ చేసుకొని ప్రశ్న అడగండి. బారకల్లాహు ఫీక్.
السلام عليكم ورحمة الله وبركاته (అస్సలాము అలైకుం రహమతుల్లాహి వ బరకాతుహు). وعليكم السلام ورحمة الله وبركاته (వ అలైకుం అస్సలాం వ రహమతుల్లాహి వ బరకాతుహు).
షేక్ బాగున్నారా? మాషా అల్లాహ్, మాషా అల్లాహ్. హయ్యాకుముల్లాహ్, అహ్లా వ సహ్లా.
షేక్, మన దగ్గర జమ్ జమ్ నీరు తక్కువగా ఉన్నప్పుడు ఇంట్లో నీరు కూడా కలుపుకొని తాగుతాం కదా, అట్లా చేస్తే? నన్ను పరీక్షలో వేశారు మీరు. క్షమించాలి. నా దృష్టిలో ఇప్పుడు ఏ పెద్ద ఆలింల ఫత్వా నా ముందు లేదు. చదివి, విని ఉన్నట్లు కూడా నాకు గుర్తు రావట్లేదు. అందుకొరకు క్షమించండి, నేను మీ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు ఇవ్వలేను.
సరే. جزاك الله خيرا (జజాకల్లాహు ఖైర్). بارك الله فيكم، بارك الله فيكم (బారకల్లాహు ఫీకుం, బారకల్లాహు ఫీకుం).
ఇంకా? ఎవరైతే చెయ్యి ఎత్తి ఉన్నారో, ప్రశ్న అడగండి. ఆ, ఎవరు, మన సోదరులు ఎవరు ఎత్తారు కదా ఇక్కడ?
السلام عليكم (అస్సలాము అలైకుం) షేక్, క్లియర్ అయింది. وعليكم السلام ورحمة الله (వ అలైకుం అస్సలాం వ రహమతుల్లాహ్).
ఆ, అది నేను అడుగుదాం అనుకున్నది అడిగారండి. క్లియర్ అయిందా, డౌట్?
ఓకే, రైట్.
ఇంకా ఎవరి వద్ద ఏదైనా ప్రశ్న ఉందా?
వాటర్ తాగేటప్పుడు ప్రత్యేకంగా ఏ దుఆ లేదండి. ఇక్కడ రాశారు, “వాటర్ తాగేటప్పుడు దుఆ.” بِسم الله (బిస్మిల్లాహ్) అని తాగాలి, తాగిన తర్వాత الحمد لله (అల్ హందులిల్లాహ్) అనాలి. అంతే.
السلام عليكم (అస్సలాము అలైకుం). وعليكم السلام ورحمة الله (వ అలైకుం అస్సలాం వ రహమతుల్లాహ్).
అడగండి.
ఓకే, సరే మంచిది. جزاكم الله خيرا، بارك الله فيكم، تقبل الله حضوركم (జజాకుముల్లాహు ఖైర్. బారకల్లాహు ఫీకుం. తఖబ్బలల్లాహు హుజూరకుం). మీరు వచ్చి ఏదైతే విన్నారో, అల్లాహు త’ఆలా స్వీకరించుగాక. మీ అందరికీ ఇహపరాల మేలు ప్రసాదించుగాక. ఇంతటితో ప్రోగ్రాం సమాప్తం చేస్తున్నాము. سُبْحَانَكَ اللَّهُمَّ وَبِحَمْدِكَ، أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا أَنْتَ، أَسْتَغْفِرُكَ وَأَتُوبُ إِلَيْكَ (సుభానకల్లాహుమ్మ వ బిహందిక్, అష్హదు అల్లా ఇలాహ ఇల్లా అంత, అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్).
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.