
[3:41 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
తెలుగుఇస్లాం.నెట్ * తెలుగులో ఇస్లాం జ్ఞాన సంపద *
[3:41 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
35 వ అధ్యాయం
విధివ్రాత పై సహనం వహించుట కూడా అల్లాహ్ పై విశ్వాసంలో ఒక భాగం
అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్ – ఇమామ్ అస్-సాదీ
The famous commentary of Shaykh as-Sa’di of the book Kitab at-Tawhid of Muhammad ibn Abdul Wahhab.
అల్లాహ్ ఆదేశం: “ఎవడు అల్లాహ్ ను విశ్వసిస్తాడో, అల్లాహ్ అతని హృదయానికి మార్గదర్శకత్వం ప్రసాదిస్తాడు” (తగాబున్ 64:11).
పై ఆయతులో ప్రస్తావించబడిన వ్యక్తి ఎవరు అనేది “అల్ ఖమ” ఇలా ప్రస్తావించారు: “అతనిపై ఏదైనా ఆపద వస్తే, అది అల్లాహ్ తరఫు నుండి అని అతను తెలుసుకొని, సంతోషిస్తాడు, మనఃపూర్వకంగా ఒప్పుకుంటాడు”.
అబు హురైరా (రది అల్లాహు అన్హు) కథనం, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారు: “కుఫ్ర్ కు (సత్యతిరస్కారానికి) సంబంధించిన రెండు గుణాలు ప్రజల్లో ఉన్నాయి. ఒకటి: ఒకరి వంశపరంపరను నిందించుట. రెండవది: చనిపోయినవారిపై శోకము చేయుట”.
అబ్దుల్లా బిన్ మస్ ఊద్ (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించారు: “చెంపలను బాదుకుంటూ, దుస్తులు చించుకుంటూ అజ్ఞాన కాలపు అరుపులు పలుకులు పలికేవాడు మన (సంప్రదాయము అనుసరించే) వాడుకాడు”. (బుఖారి,ముస్లిం).
అనసు (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారు: “అల్లాహ్ ఏ మానవునికి మేలు చేయగోరుతాడో, అతని పాపాలకు బదులు శిక్ష ఇహలోకంలోనే తొందరగా ఇచ్చేస్తాడు. ఏ మానవునికి మేలు చేయగోరడో, అతని పాపాలకు బదులు శిక్షను ప్రళయం వరకు వేచి ఉంచి అక్కడ ఇస్తాడు”. (తిర్మిజి).
మరో సారి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు: “పరీక్ష ఎంత కఠినంగా ఉంటుందో ప్రతిఫలం కూడా అంతే గొప్పగా ఉంటుంది. అల్లాహ్ ఏ సమాజం, సంఘాన్ని ప్రేమస్తాడో, దానిని పరీక్షకు గురి చేస్తాడు. ఎవరు దానిని సహనంతో (సహిస్తారో), వారిని అల్లాహ్ ఇష్టపడుతాడు.ఎవరు అసహనము చూపుతారో, అల్లాహ్ వారిపై ఆగ్రహస్తాడు”. (తిర్మిజి).
ముఖ్యాంశాలు:
1. తగాబున్ ఆయతు యొక్క భావం.
2. సహనం అల్లాహ్ పై విశ్వాసంలో ఒక భాగం.
3. వంశపరంపర లోని లోపాలను ఎంచుట మంచిది కాదు.
4.చెంపలు బాదుకుంటూ, దుస్తులు చించుకుంటూ, అజ్ఞానకాలపు పలుకులు పలికేవాని గురించి కఠినంగా హెచ్చరించబడింది.
5. అల్లాహ్ మేలు కోరిన వ్యక్తి లక్షణం తెలిసింది.
6. అల్లాహ్ మేలు కోరని వ్యక్తి లక్షణం తెలిసింది.
7. అల్లాహ్ ప్రేమించిన వ్యక్తి చిహ్నం.
8. పరీక్ష ఆపదపై అసంతృప్తి వ్యక్తం చేయుట నిషిద్ధం.
9. వాటిపై సహనం వహించుట వలన పుణ్యం లభిస్తుంది.
తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ)
ఓపికతో అల్లాహ్ కు విధేయులగుట, పాపం నుండి దూరంగా ఉండి సహనం వహించుట – ఇవి రెండూ విశ్వాసంలో లెక్కించబడుతాయి. అంతే కాదు అవి దాని పునాది. దాని భాగాలే. అల్లాహ్ ప్రేమించేవాటిని, ఆయనకు ఇష్టమున్న, ఆయన సన్నిధిలో చేర్పించేవాటిని ఓపికతో (ఆచరించుట), ఆయన నిషేధించిన వాటి నుండి దూరంగా ఉండి సహనం వహించుటయే విశ్వాసం.
ఇస్లాం పునాది మూడు సూత్రాల పై ఉంది.
అల్లాహ్ వ్రాసిన విధివ్రాత బాధాకరమైనప్పటికి దానిపై ఓపిక వహించుట ఇందులోనే వస్తుంది. కాని దాన్ని తెలుసుకొనుట, ఆచరించుట చాలా అవసరం కాబట్టి దానిని ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది.
ఆపద, కష్టం అల్లాహ్ తరఫు నుండియే వస్తుంది అని, అల్లాహ్ దాన్ని నిర్ణయించడంలో సంపూర్ణ వివేచణాపరుడని, దానిని మానవునిపై నిర్ణయించడం కూడా ఆయన సంపూర్ణ వరమేనని తెలుసుకున్న వ్యక్తి అల్లాహ్ వ్రాసిన విధివ్రాతతో సంతోషించి, దాన్ని మనఃపూర్వకంగా ఒప్పుకొని, అసంతృప్తికరమైన వాటిపై అల్లాహ్ సన్నిధానం కోరుతూ, పుణ్యాన్ని ఆశిస్తూ, ఆయన శిక్షతో భయపడుతూ మరియు సత్ప్రవర్తన అవలంబించే సమయం వచ్చిందని భావిస్తూ సహనం వహించాలి. అప్పుడు అతని హృదయానికి తృప్తి శాంతి కలుగుతుంది. అతని విశ్వాసం, ఏకత్వంలో బలం వస్తుంది.
నుండి: ఏకత్వపు బాటకు సత్యమైన మాట (అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్) – ఇమామ్ అస్-సాదీ [పుస్తకం]
ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [36 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
“మేము విశ్వసించాము” అని చెప్పినంత మాత్రాన తాము ఇట్టే వదలి వేయబడతామనీ, తాము పరీక్షింపబడమని ప్రజలు అనుకుంటున్నారా? [1]
వారి పూర్వీకులను కూడా మేము బాగా పరీక్షించాము. వీరిలో సత్యవంతులెవరో, అసత్యవాదులెవరో నిశ్చయంగా అల్లాహ్ తెలుసుకుంటాడు. [2]
[సూరహ్అంకబూత్ 29:2-3]
[1] “మేము విశ్వసించాము” అని నోటితో చెప్పినంతమాత్రాన, తమను పరిక్షించకుండానే వదలివేయబడటం జరుగుతుందని భావించటం సరైనది కాదు. వారు ధన ప్రాణాల ద్వారా పరీక్షించబడతారు. కష్టాల ద్వారా పరీక్షించబడతారు. ఆకలిబాధ ద్వారా పరీక్షించబడతారు. ఈ పరీక్షల ద్వారా కల్తీ సరుకు ఏదో – మేలిమి సరుకు ఏదో, నిజాయితీపరులెవరో – నయవంచకులెవరో నిగ్గుదేల్చటం జరుగుతుంది.
[2] ఇది తరతరాలుగా కొనసాగుతూ వస్తున్న దైవ సంప్రదాయం. అందుకే ఆయన గతించిన సమాజాల వారిని పరీక్షించినట్లుగానే ఈ సమాజాన్ని (ముహమ్మద్ అనుచర సమాజాన్ని) కూడా పరీక్షిస్తాడు. మక్కాలోని అవిశ్వాసుల వేధింపులు నానాటికీ పెరిగిపోతుండటంతో ముస్లిములు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు ఫిర్యాదు చేసుకున్నారు. దైవసహాయం కోసం ప్రార్ధించమని ఆయన్ని (సల్లల్లాహు అలైహి వ సల్లం) విన్నవించుకున్నారు. అప్పుడు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన బాధిత సహచరులనుద్దేశించి ఇలా అన్నారు : “ఈ దౌర్జన్యకాండ విశ్వాసుల చరిత్రలో ఆనవాయితీగా వస్తున్నదే. మీకు పూర్వం గతించిన విశ్వాసులు ఇంతకన్నా దారుణంగా వేధించబడ్డారు. గొయ్యి తవ్వి, వారిని ఆ గోతిలో నిలబెట్టి, తలపై రంపపు కోతకోస్తే, వారి శరీరాలు రెండు భాగాలుగా చీలిపోయేవి. అలాగే ఇనుప దువ్వెనలతో వారి శరీరాలను దువ్వగా, మాంసం ఊడివచ్చేది. అయినాసరే ఈ అమానుష కృత్యాలు వారిని వారి సత్యధర్మం నుంచి మరల్చటంలో సఫలీకృతం కాలేకపోయాయి.” (సహీహ్ బుఖారీ – కితాబ్ అహాదీసుల్ అంబియా). హజ్రత్ అమ్మార్, ఆయన తల్లిగారైన హజ్రత్ సుమయ్య, తండ్రి హజ్రత్ యాసిర్, హజ్రత్ సుహైబ్, హజ్రత్ బిలాల్ మిఖ్దాద్ తదితర సహచరులపై తొలి కాలంలో జరిగిన వేధింపులకు చరిత్ర పుటలే సాక్షి. ఈ సంఘటనల నేపథ్యంలోనే ఈ ఆయతులు అవతరించాయి. అయితే ప్రళయదినం వరకూ సాధారణ ముస్లింలందరికీ ఇవి వర్తిస్తాయి.
[అహ్సనుల్ బయాన్, సూరహ్అంకబూత్ నుండి]
ప్రజలలో మరికొంతమంది (కూడా ఉన్నారు. వారు) ఎలాంటివారంటే, వారు ఒక అంచున (నిలబడి) అల్లాహ్‌ను ఆరాధి స్తుంటారు. తమకేదన్నా లాభం కలిగితే ఆరాధన పట్ల సంతృప్తి చెందుతారు. ఏదన్నా ఆపద వచ్చిపడితే మాత్రం అప్పటి కప్పుడే ముఖం తిప్పుకునిపోతారు.[1] అలాంటి వారు ప్రాపంచికంగానూ, పార లౌకికం గానూ నష్టపోయారు. స్పష్టంగా నష్ట పోవటం అంటే ఇదే.
[సూరహ్ అల్-హజ్ 22:11]
[1] “హర్ ఫున్ ” (حَرْفٍ) అంటే అంచు, ఒడ్డు అని అర్థం. ఈ అంచులపై నిలబడి ఉండేవాడు నిలకడలేని వాడై ఉంటాడు. మతధర్మం విషయంలో సంశయానికి, సందిగ్దానికి లోనై ఉన్న వ్యక్తి కూడా ఇంతే. ధర్మావలంబనలో అతనికి నిలకడ ప్రాప్తించదు. ఎందుకంటే పొద్దస్తమానం ప్రాపంచిక ప్రయోజనాలు పొందటం అతని ముఖ్యోద్దేశం అయి వుంటుంది. ప్రయోజనాలు చేకూరినంతసేపూ ధర్మాన్ని అంటి పెట్టుకుని ఉంటాడు. లేని యెడల తన పూర్వీకుల మతం వైపుకు మరలిపోతాడు. తద్భిన్నంగా నిజమైన, నికార్సయిన ముస్లింలు దృఢవిశ్వాసం కలిగి ఉంటారు. వారు కలిమి లేములను, ఎత్తుపల్లాలను చూడకుండానే ధర్మంలోకి వస్తారు. సర్వకాల, సర్వావస్థల్లో ధర్మంపై స్థయిర్యాన్ని కనబరుస్తారు. దైవానుగ్రహాలు ప్రాప్తించినప్పుడు దైవానికి కృతజ్ఞతలు తెలుపుకుంటారు. కష్టాలెదురైనపుడు ఓర్పు వహిస్తారు. ఈ ఆయతు అవతరణా నేపథ్యంలో ఒక వ్యక్తి వృత్తాంతం ఉంది. అతను మదీనా నగరానికి వస్తాడు. తనకు సంతానం కలిగితే, పశువులలో సమృద్ధి జరిగితే ఈ ధర్మం (ఇస్లాం) చాలా మంచి ధర్మం అని అంటాడు. తాననుకున్నట్లుగా జరగకపోతే ఈ ధర్మం ముదనష్టపు ధర్మం అంటాడు. కొన్ని ఉల్లేఖనాల ప్రకారం ఆనాడు కొత్తగా ఇస్లాం స్వీకరించిన అరబ్బు పల్లెవాసుల్లో ఈ అవలక్షణం ఉండేది. (ఫత్‌హుల్ బారీ)
[అహ్సనుల్ బయాన్, సూరహ్ అల్-హజ్ నుండి]
155. మరియు నిశ్చయంగా మేము, మిమ్మల్ని భయ ప్రమాదాలకు, ఆకలి బాధలకు, ధన, ప్రాణ, ఫల (ఆదాయాల) నష్టానికీ గురిచేసి పరీక్షి స్తాము. మరియు (ఇలాంటి పరిస్థితులలో) మనఃస్థైర్యం ఉండేవారికి శుభవార్త నివ్వు.
156. ఎవరైతే విపత్కరమైన పరిస్థితి ఏర్పడినప్పుడు: “నిశ్చయంగా మేము అల్లాహ్‌కే చెందినవారము! మరియు మేము ఆయన వైపునకే మరలిపోతాము!” అని అంటారో;
157. అలాంటి వారికి వారి ప్రభువునుండి అనుగ్రహాలు మరియు కరుణ ఉంటాయి. మరియు వారే సన్మార్గం పొందినవారు.
(సూరహ్ బఖర 2:155-157)
ఇతరములు:
You must be logged in to post a comment.