https://youtu.be/lg3lujt6PN8 [ 30:43 ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
షాబాన్ నెల యెుక్క వాస్తవికత – ఖుర్ఆన్ హదీసు–వెలుగులో!
సంకలనం,కూర్పు : ముహమ్మద్ నసీరుద్దీన్ జామీఈ (హఫిజహుల్లాహ్)
నా ధార్మిక సహోదర సహోదరిమణులారా! అస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వబరకాతహు
ఖుర్ఆన్ లో వచ్చిన ‘శుభప్రదమైన రాత్రి’ అంటే షాబాన్ నెలలో వచ్చే 15వ రాత్రినా? లేక రమజాన్ నెలలో వచ్చే లైలతుల్ ఖద్ర్ నా? ఖుర్ఆన్ వెలుగులో తెలుసుకుందాము ఇన్ షా అల్లాహ్.
సూరహ్ అద్ దుఖాన్ ఆయాతును చూపించి షాబాన్ నెల 15 తేది రాత్రి షబెే బరాత్ శుభప్రదమైన రాత్రని చాలా మంది అపోహను కలిగివున్నారు. ఆ ఆయతు మరియు తఫ్సీర్ లను చదివి సత్యాన్ని తెలుసుకుందాము
حمٓ وَٱلْكِتَٰبِ ٱلْمُبِينِ
హా మీమ్. స్పష్టమైన ఈ గ్రంథం తోడు!
إِنَّآ أَنزَلْنَٰهُ فِى لَيْلَةٍۢ مُّبَٰرَكَةٍ ۚ إِنَّا كُنَّا مُنذِرِينَ
నిశ్చయంగా మేము దీనిని శుభప్రద మైన రాత్రియందు అవత రింపజేశాము. నిస్సందేహంగా మేము హెచ్చరిక చేసేవాళ్ళము.
فِيهَا يُفْرَقُ كُلُّ أَمْرٍ حَكِيم
ఆ రాత్రియందే కీలకమైన ప్రతి ఉత్తర్వూ జారీ చేయబడు తుంది.
أَمْرًۭا مِّنْ عِندِنَآ ۚ إِنَّا كُنَّا مُرْسِلِينَ
మా వద్ద నుండి ఆజ్ఞ రూపంలో! (ప్రవక్తలను) పంపేది కూడా మేమే.
رَحْمَةًۭ مِّن رَّبِّكَ ۚ إِنَّهُۥ هُوَ ٱلسَّمِيعُ ٱلْعَلِيمُ
నీ ప్రభువు దయానుగ్రహం వల్ల. ఆయన సర్వం వినేవాడు, సర్వం తెలిసినవాడు.
رَبِّ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضِ وَمَا بَيْنَهُمَآ ۖ إِن كُنتُم مُّوقِنِينَ
మీరు గనక నమ్మగలిగితే ఆయనే భూమ్యాకాశాలకు, వాటి మధ్యనున్న సమస్తానికీ ప్రభువు.
لَآ إِلَٰهَ إِلَّا هُوَ يُحْىِۦ وَيُمِيتُ ۖ رَبُّكُمْ وَرَبُّ ءَابَآئِكُمُ ٱلْأَوَّلِينَ
ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. ఆయనే బ్రతికిస్తు న్నాడు, ఆయనే చంపుతున్నాడు. ఆయనే మీ ప్రభువు, పూర్వీకు లైన మీ తాతముత్తాతలకు కూడా (ఆయనే) ప్రభువు. (Quran – 44 :1 – 8)
పై ఆయతులో వచ్చిన శుభప్రదమైన రాత్రి అంటే లైలతుల్ ఖద్ర్ (ఘనమైన రాత్రి) అని భావం. ఈ లైలతుల్ ఖద్ర్ రమజాన్ నెల చివరి దశకంలోని బేసిరాత్రుల్లో ఏదో ఒకటి అయి ఉంటుంది.
“దివ్య ఖుర్ఆన్ అవతరించిన నెల రమజాన్ నెల” – అల్ బఖర – 185.అని చెప్పబడటం గమనార్హం.
అలాగే “మేము ఈ ఖుర్ఆన్ ను ఘనమైన రాత్రి యందు అవతరింపజేశాము” అని అల్ ఖద్ర్ సూరాలో సెలవీయబడటం కూడా గమనార్హమే.
ఆ ఘనమైన రేయినే ఈ సూరాలో శుభప్రదమైన రేయిగా పేర్కోనటం జరిగింది. అది శుభప్రదమైన రేయి అనటంలో సందేహానికి తావేలేదు. ఎందుకంటే
ِ إِنَّآ أَنزَلْنَٰهُ فِى لَيْلَةِ ٱلْقَدْرِ
నిశ్చయంగా మేము దీనిని (ఈ ఖుర్ఆనును రమజాను నెలలో) ఘనమైన రాత్రి యందు అవతరింపజేశాము.
وَمَآ أَدْرَىٰكَ مَا لَيْلَةُ ٱلْقَدْرِ
ఘనమైన రాత్రి గురించి నువ్వేమనుకున్నావు?
لَيْلَةُ ٱلْقَدْرِ خَيْرٌ مِّنْ أَلْفِ شَهْرٍ
ఘనమైన రాత్రి వెయ్యి నెలల కంటే కూడా మేలైనది.
تَنَزَّلُ ٱلْمَلَٰٓئِكَةُ وَٱلرُّوحُ فِيهَا بِإِذْنِ رَبِّهِم مِّن كُلِّ أَمْرٍ
ఆ రాత్రి యందు దైవదూతలు, ఆత్మ (జిబ్రయీల్) తమ ప్రభువు ఉత్తర్వుపై సమస్త విషయాల (నిర్వహణ) నిమిత్తం (దివి నుంచి భూమికి) దిగివస్తారు.
سَلَٰمٌ هِىَ حَتَّىٰ مَطْلَعِ ٱلْفَجْرِ
ఆ రాత్రి అసాంతం శాంతియుతమైనది – తెల్లవారే వరకూ (అది ఉంటుంది).Quran 97 :(1 – 5)
దివ్యఖుర్ఆన్ ఘనమైన రాత్రిన లేక శుభకరమైన రాత్రిన అవతరించిందంటే దాని భావం ఇదే. ఆ రాత్రి నుంచి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై దాని అవతరణా క్రమం ఆరంభమయింది. అంటే తొట్టతొలిసారి ఈ రాత్రియందే ఈ గ్రంధం అంతిమ దైవప్రవక్త (స) పై అవతరించింది. లేక దీని భావం ఇది:
ఈ రాత్రియందే దివ్యఖుర్ఆన్ “లౌహె మహ్ పూజ్” నుంచి క్రింది ఆకాశంలో ఉన్న ‘బైతుల్ ఇజ్జత్’ లోకి దించబడింది. మరి అక్కణ్ణుంచి అవసరాల కనుగుణంగా కొద్దికొద్దిగా 23 ఏండ్ల వ్యవధిలో మహానీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) పై అవతరించింది.
కొంత మంది ‘శుభప్రదమైన రాత్రి’ ని షాబాన్ నెలలో వచ్చే 15వ రాత్రిగా తలపోశారు. కాని ఇది సరైనది కాదు.
ఈ గ్రంధం రమజాన్ మాసంలోని ‘లైలతుల్ ఖద్ర్’ లో అవతరించినట్లు ఖుర్ఆన్ ద్వారా స్పష్టంగా రూఢీ అవుతున్నప్పుడు ఇతరత్రా రాత్రుల గురించి ఆలోచించటం ఎంతమాత్రం సరైంది కాదు.
నా ధార్మిక సహోదర సహోదరిమణులారా! అస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వబరకాతహు –
మెదటి బాగంలో ఖుర్ఆన్ లో వచ్చిన ‘శుభప్రదమైన రాత్రి’ అంటే రంజాన్ నెలలో చివరిదశలో వచ్చే లైలతుల్ ఖద్ర్ (ఘనమైన రాత్రి) అని తెలుసుకున్నాము. హదీసుల వెలుగులో షబే బరాత్ కు సంభందించిన హదీసులు ప్రామాణికమైనవేనా? తెలుసుకుందాం ఇన్ షా అల్లాహ్
షాబాన్ 15వ రాత్రి (షబే బరాత్) కి సంబందించిన హదీసుల్లో ఒకటి మాత్రమే సహీహ్ (హసన్) గా మరియు మిగితా హదీసులు ప్రామాణికమైనవి కావు.!
ఆ హదీసుల్లో కొన్నిటిని గురించి శ్రద్ధగా చదవి సత్యాన్ని తెలుసుకుందాము ఇన్ షా అల్లాహ్!
1) మెుదటి హదీసు
హజ్రత్ ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖించారు, ఒకసారి షాబాన్ 15 వ రాత్రి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నా పడకపై లేకపోవడం వలన వెదుకుతూ ఉండగా బఖీ స్మశానంలో అగుపించగా నేను అక్కడికెళ్లి కారణం అడుగగా – “ఈ రాత్రి అల్లాహ్ ప్రపంచం వైపు దృష్టిసారిస్తాడు, బని కల్బ్ వారి గొర్రెల వెంట్రుకల కంటే అధిక రెట్లో మానవుల పాపాలను క్షమిస్తాడు” అని చెప్పారు. (ఈ హదీసు ముస్నద్ అహ్మద్, తిర్మిది, ఇబ్నెమాజాలో ఉంది.)
పై మూడు గ్రంథాల్లో కూడా ఈ హదీసు ఆయిషా రజియల్లాహు అన్హా ద్వార ఉర్వా, ఉర్వా ద్వారా యహ్ యా, యహ్ యా ద్వారా హజ్జాజ్ విన్నట్లు ఉంది. అయితే ఇమాం తిర్మిజి ఈ హదీసు చివరిలో ఎంతో స్పష్టంగా చెప్పారు: నేను ముహమ్మద్ బిన్ ఇస్మాయీల్ ద్వారా విన్నాను ఆయన దీనిని బలహీనమైనదని, ప్రామాణికమైనది కాదని చెప్పారు, ఎందుకంటే ఉర్వా ద్వారా యహ్’యా మరియు యహ్’యా ద్వారా హజ్జాజ్ వినలేదు. (తిర్మిజి, అబ్వాబుస్ సియాం, బాబు మా జాఅ ఫీ లైలతిన్ నిస్ఫి మిన్ షాబాన్. 739)
2) రెండవ హదీసు
హజ్రత్ అలీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“షాబాన్ 15 వ రాత్రి అల్లాహ్ యెుక్క ఆరాధనలో నిలబడు. మరునాడు నీవు ఉపవాసం పాటించు. అల్లాహ్ షాబాన్ 14 నాటి సూర్యాస్తమయం వెంటనే ప్రపంచపు ఆకాశంపై వచ్చి, ఫజ్ర్ వరకు తన పాపాల మన్నింపు కోరేవాడున్నాడా నేను అతడ్ని మన్నిస్తాను, ఉపాధి కోరేవాడున్నాడా నేను అతనికి ఉపాధిని ప్రసాదిస్తాను, ఆపదలో ఉన్నవాడెవడూ అతనికి స్వస్థత ప్రసాదిస్తాను అంటూ ఇలాంటి నినాదాలు ప్రకటిస్తాడు.”
(ఇబ్నుమాజా, కితాబు ఇఖామతిస్ సలాతి వస్సున్నతు ఫీహా, బాబు మా జాఅ ఫీ లైలతిన్ నిస్ఫి మిన్ షాబాన్ 1388)
ఈ హదీసు గురించి షేఖ్ అల్బాని (రహిమహుల్లాహ్) తెలిపారు ఇది దయీఫ్ మరియు మౌదూ అని (అంటే ప్రామాణికమైనది కాదు, కల్పించబడినది).
ఈ హదీసులో ఇబ్ను అబి సబ్రా అనే వ్యక్తి గురించి ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ మరియు ఇమామ్ ఇబ్నె ముయీన్ ఇలా చెప్పారు: అబూ సబ్రా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పని హదీసులు తానె చెప్పి ప్రవక్త వైపు ఆపాదించాడు. అందువలన అతనిని కల్పిత హదీసుల బోధకుడిగా పేర్కోన్నారు.
3) మూడవ హదీసు హసన్ మరియు సహీగా కొందరు ఉలమాలు పేర్కొన్నారు.
దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉల్లేఖించారు:
“షాబాన్ 15వరాత్రి అల్లాహ్ తఆలా తన దాసుల పట్ల దృష్టి సారిస్తాడు. అల్లాహ్ వారి పాపాలను క్షమిస్తాడు. కాని ఇద్దరి వ్యక్తుల పాపాలను క్షమించడు. వారిలో ఒకడు : అల్లాహ్ కు బాగాస్వామిని నిలబెట్టేవాడు (షిర్క్ చేసేవాడు) రెండో వాడు: మనసులో కపటం, కీడు గలవాడు.“
(ఈ హదీసు ఇబ్నెమాజా, ఇబ్ను హిబ్బాన్ లలో ఉంది.)
ఈ హదీసు కొందరి దగ్గర దయీఫ్ గా వుంటే ఎక్కువ ఉలమాలు దీనిని ఇతర హదీసుల ఆదారంగా సహీగా ప్రకటించారు.
పై హదీసులు మరికొన్ని వేరే బలహీన, లేదా కల్పిత హదీసుల ద్వారా ఈ క్రింది విషయాలను సత్కార్యాలుగా భావించి, వాటిని ప్రత్యేకంగా 15వ షాబాన్ సందర్భంగా చేయటం పుణ్యకార్యం అని అంటారు:
1- 15వ షాబాన్ రాత్రి జాగారం
2- ప్రత్యేక నమాజులు
3- పగలు ఉపవాసం పాటించడం.
4- సమాధులను దర్శించడం
5- గత సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు చనిపోయిన వారి ఆత్మలు తిరిగి వస్తాయని, అంతే కాదు ప్రత్యేక వంటకాలు చేసి, వాటిని ఆ ఆత్మలు తినిపోతాయని భ్రమపడడం జరుగుతుంది.
అయితే సోదర సోదరిమణులారా! పై ఐదు విషయాలు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గానీ, సహాబాలు, తాబియిన్లు గానీ పాటించలేదు. అలాంటి మూఢనమ్మకాలు అసలు వారికి లేనే లేవు.
కొందరి అభిప్రాయమేమిటంటే ఆ రాత్రి ఇద్దరిని తప్ప అందరిని అల్లాహ్ క్షమిస్తాడు అని వచ్చిన హదీసు సహీ అయినప్పుడు నమాజు, రోజాలు పాటించడంలో తప్పు ఏమిటి అని అంటారు?
కాని వాస్తవంగా ఆలోచిస్తే, ఆ హదీసులో అలాంటి భావమేమీ లేదు. అలా అనుకుంటే సహీ బుఖారీ హదీసు నంబర్ 758లో ఉంది:
“అల్లాహ్ ప్రతి రాత్రి మూడవ భాగం మిగిలి ఉండగా ప్రపంచపు ఆకాశం వైపునకు వచ్చి ఎవరైనా అడుగుతారా వారికి ఇస్తాను, ఎవరైనా దుఆ చేస్తారా అంగీకరిస్తాను, ఎవరైనా పాప మన్నింపు కోరుతారా మన్నిస్తాను” అని ఫజ్ర్ వరకు ప్రకటిస్తూ ఉంటాడు.
గమనించండి ఇది బుఖారీలోని హదీసు, ఏ ఒక్కరు దీనిని బలహీనమైనది అని అనలేదు, అనలేరు కూడా.
ఇక పై హదీసు కొందరు పండితులు బలహీనమైనదంటే మరి కొందరు సహీ అన్నారు.అయితే బుఖారీ హదీసు ప్రకారం ప్రతి రోజు మేల్కొని అల్లాహ్ ను వేడుకుంటూ మన్నింపు కూరుతూ అన్ని మేల్లు అడుగుతూ ఉంటే ఎంత బావుంటుంది. అలా కాకుండా నిరాధరమైన హదీసుల ఆధారంగా కేవలం ఒక రాత్రి, పగలు పాటించడం అసలు ఇది ప్రవక్త పద్ధతే కాదు. ప్రవక్త పద్ధతి కానప్పుడు పుణ్యానికి బదులుగా పాపం మూట గట్టుకున్నట్లవుతుంది. జాగ్రత్తా!
బిద్అత్ (నూతనాచారం) – Bid’ah
- [నూతనాచారం]
- బిద్అత్ (నూతనచారము) – “దైవ ప్రవక్త ధర్మము” పుస్తకము నుండి (ఖలీలుల్ రహ్మాన్)
- కొత్త పోకడలు , నూతన ఆచారాలను సృష్టించరాదు– హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)
- ఇస్లాం ధర్మం సంపూర్ణమయింది. కొత్త పోకడలు , నూతన ఆచారాలను సృష్టించరాదు [Video]
You must be logged in to post a comment.