తెలుగు ఇస్లామిక్ క్విజ్ : పార్ట్ 18 [ఆడియో]

బిస్మిల్లాహ్

Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 18
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ప్రశ్నల పత్రం – 18

1 ) అల్లాహ్ ఏ ప్రవక్తను ఖలీల్ (అత్యంత ప్రియుడు) అని అన్నాడు?

A) మూసా (అలైహిస్సలాం)
B) ఇబ్రాహీం (అలైహిస్సలాం)
C) ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)
D) ఇబ్రాహీం (అలైహిస్సలాం) మరియు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)

2 ) ఏ జిక్ర్ గురించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) స్వర్గ నిధులలో ఒక నిధి అని చెప్పారు ?

A) లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్
B) సుబ్ హానల్లాహ్
C) లా ఇలాహ ఇల్లల్లాహ్

3 ) నేనూ ప్రవక్తను అని ఆరోపన చేసిన అబద్దీకులలో వీడు ఒకడు ?

A) మిర్జా గులామ్ అహ్మద్
B) అబూ లహాబ్
C) హామాన్

సమాధానాలు & వివరణ ఇక్కడ వినండి /డౌన్లోడ్ చేసుకోండి [26 నిమిషాలు]


1) అల్లాహ్ ఏ ప్రవక్తను ఖలీల్ (అత్యంత ప్రియుడు) అని అన్నాడు?

JAWAB: D) ఇబ్రాహీం (అలైహిస్సలాం) మరియు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)

ఖుర్ఆనులో ఇబ్రాహీం అలైహిస్సలాంను ఖలీల్ గా చేసిన ప్రస్తావన ఉంది

4:125 وَاتَّخَذَ اللَّهُ إِبْرَاهِيمَ خَلِيلًا
ఇబ్రాహీమ్‌ (అలైహిస్సలాం)ను అల్లాహ్‌ తన మిత్రునిగా చేసుకున్నాడు.
صحيح البخاري 6565 … ائْتُوا إِبْرَاهِيمَ الَّذِي اتَّخَذَهُ اللَّهُ خَلِيلًا،

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: ప్రళయదినాన ప్రజలందరూ హషర్ మైదానంలో ఓపిక వహించలేక, అల్లాహ్ వద్ద సిఫారసు చేయాలని ముందు ఆదం అలైహిస్సలాం వద్దకు, ఆ తర్వాత నూహ్ అలైహిస్సలాం వద్దకు వస్తారు, అయితే నూహ్ సిఫారసు చేయరు. ఇబ్రాహీం అలైహిస్సలాం వద్దకు వెళ్లండి అల్లాహ్ ఆయన్ని ఖలీల్ గా చేసుకున్నాడు అని అంటారు.

అయితే హదీసులో ఇబ్రాహీం అలైహిస్సలాంతో పాటు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను కూడా ఖలీల్ గా చేసుకున్నాడు అని ఉంది అయితే ఇద్దరూ కూడా ఖలీల్ అవడంలో రవ్వంత సందేహం లేదు. కాకపోతే ప్రజలలో ఫేమస్ మాట ఇబ్రాహీం ఖలీల్, మూసా కలీం అని.
సహీ ముస్లిం 532లో ఉంది: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ మరణానికి కేవలం 5 రోజుల ముందు ఇలా చెప్పగా నేను విన్నానని, జుందుబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు:

مسلم 532 … «إِنِّي أَبْرَأُ إِلَى اللهِ أَنْ يَكُونَ لِي مِنْكُمْ خَلِيلٌ، فَإِنَّ اللهِ تَعَالَى قَدِ اتَّخَذَنِي خَلِيلًا، كَمَا اتَّخَذَ إِبْرَاهِيمَ خَلِيلًا، وَلَوْ كُنْتُ مُتَّخِذًا مِنْ أُمَّتِي خَلِيلًا لَاتَّخَذْتُ أَبَا بَكْرٍ خَلِيلًا، أَلَا وَإِنَّ مَنْ كَانَ قَبْلَكُمْ كَانُوا يَتَّخِذُونَ قُبُورَ أَنْبِيَائِهِمْ وَصَالِحِيهِمْ مَسَاجِدَ، أَلَا فَلَا تَتَّخِذُوا الْقُبُورَ مَسَاجِدَ، إِنِّي أَنْهَاكُمْ عَنْ ذَلِكَ

మీలో ఎవరు నాకు ఖలీల్ కారని స్పష్టంగా తెలియజేస్తున్నాను, ఎందుకనగా అల్లాహ్ ఇబ్రాహీం అలైహిస్సలాంని ఖలీల్ గా చేసుకున్నట్లు నన్ను కూడా ఖలీల్ గా చేసుకున్నాడు. ఒకవేళ నేను ఎవరినైనా ఖలీల్ గా చేసుకునేవాడినేనైతే అబూ బక్ర్ ని ఖలీల్ గా చేసుకునేవాడిని. వినండీ! మీకంటే ముందు గడిసినవారు తమ ప్రవక్తల, పుణ్యపురుషుల సమాధులను మస్జిదులుగా (ఆరాధనాలాయంగా) చేసుకునేవారు! జాగ్రత్తగా వినండి! మీరు సమాధులను మస్జిదులుగా చేసుకోకండి. ఇలా చేయడం నుండి నేను మిమ్మల్ని వారిస్తున్నాను.

ఇబ్రాహీం అలైహిస్సలాంను ఖలీల్ గా ఎన్నుకున్నది ఆయనలో ఉన్న ఎన్నో అత్యుత్తమ గుణాల కారణంగా:

1- ఇమాం, ఒంటరిగానైనప్పటికీ నాయకత్వం గుణాలు ఆయనలో ఇమిడి ఉండినవి. సూర నహల్ 16:120,121
2- వఫాదార్, అల్లాహ్ యొక్క ఆదేశాలన్నిటినీ నెరవేర్చారు. సూర నజ్మ్ 53: 37
3- హలీం (సహనశీలి)
4- అవ్వాహ్ (అధికంగా అల్లాహ్ ముందు వినమ్రులై, జిక్ర్, ఇస్తిగ్ఫార్, దుఆలో ఉండేవారు
5- అల్లాహ్ ను గుర్తెరిగి సంపూర్ణ ప్రేమతో ఆయన వైపుకు మరలేవారు, ఇతరుల పట్ల ఏ ఆశ లేకుండా ఉండేవారు. సూర హూద్ 11:75
6- చాలా ఉపకారం చేసేవారు, అతిథికి మర్యాదనిచ్చేవారు. సూర జారియాత్ 51:24-27
7- ఓపిక సహనాల్లో ఉన్నత శిఖరానికి చేరినవారు. సూర అహ్ ఖాఫ్ 46:35, సూర షూరా 42:13
 ఆయన ఉత్తమ గుణాల్లోని రెండు గుణాలు అతిముఖ్యమైనవి, మనం వాటిని మరవకూడదు :  ఎవరూ తోడులేనప్పుడు, ఒంటరిగా ఉండి కూడా తౌహీద్ పై ఉన్నారు, షిర్క్ కు వ్యెతిరేకంగా పోరాడుతూ ఉన్నారు. ముమ్ తహన 60:4
 వయస్సు పై బడిన తర్వాత కలిగిన ఏకైక సంతానం యొక్క ప్రేమ ఎంతగా ఉంటుందో చెప్పనవసరం లేదు, అలాంటి ఏకైక పుత్రుడిని అల్లాహ్ ప్రేమలో బలిచేయుటకు సిద్ధమయ్యారు. సాఫ్ఫాత్ 37:100-111


2) ఏ జిక్ర్ గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వర్గ నిధులలో ఒక నిధి అని చెప్పారు

JAWAB: A ] లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్

وَعَنْ أَبِيْ مُوْسَى الْأَشْعَرِيِّ قَالَ: قَالَ النبي: “يَا عَبْدَ اللهِ بْنِ قَيْسٍ :أَلَا أَدُلُّكَ عَلَى كَنْزِ مِّنْ كُنُوْزِ الْجَنَّةِ ؟” فَقُلْتُ: بَلَى يَا رَسُوْلَ اللهِ قَالَ : “لَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِاللهِ”.

అబూ మూసా అష్’అరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ”ఓ ‘అబ్దుల్లా బిన్ ఖైస్! నేను నీకు స్వర్గనిధుల్లో ఒక నిధిని చూపనా?” అని అన్నారు. దానికి నేను, ‘చూపండి ఓ అల్లాహ్ ప్రవక్తా!’ అని అన్నాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ”లా ‘హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్” స్వర్గ నిధుల్లోని ఒక నిధి అని ప్రవచించారు. (బు’ఖారీ 4205, ముస్లిమ్ 2704)
సుబ్ హానల్లాహ్, వల్ హందులిల్లాహ్, వలాఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్ వలాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్ చదివిన పాపాలు మన్నించబడతాయి, అవి సముద్రపు నురుగంత ఉన్నా సరే. (తిర్మిజి 3460, హసన్)

ఇవి మరియు వీటితో పాటు అల్లాహుమ్మగ్ ఫిర్లీ వర్ హమ్నీ వఆఫినీ వర్ జుక్నీ వహ్దినీ దుఆ ఒక గ్రామినుడికి నేర్పి ఇతను సర్వ మేళ్ళను తీసుకుళ్తున్నాడు అని ప్రవక్త చెప్పారు. (అబూదావూద్ 832). ప్రవక్త దీనిని గిరాసుల్ జన్నహ్ అన్నారు. (ఇబ్ను హిబ్బాన్ 821)


2) నేనూ ప్రవక్తను అని ఆరోపణ చేసిన అబద్దీకులలో వీడు ఒకడు ?

A ] మిర్జా గులామ్

అబూ దావూద్ 4333 లో ఉంది, ప్రవక్త సల్లల్లాహు చెప్పారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు:

«لَا تَقُومُ السَّاعَةُ حَتَّى يَخْرُجَ ثَلَاثُونَ دَجَّالُونَ، كُلُّهُمْ يَزْعُمُ أَنَّهُ رَسُولُ اللَّهِ»

30 అబద్ధాల కోరులు అసత్యవాదులు రానంత వరకు ప్రళయం సంభవించదు, ప్రతి ఒక్కడు తన భ్రమలో పడి తాను దైవప్రవక్త అన్న ఆరోపణ చేసుకుంటాడు.

వారిలో ఒకడు అబుల్ అస్వద్ అల్ అనసీ యమన్ లో రెండోవాడు ముసైలమా కజ్జాబ్ యమామలో ప్రవక్త కాలంలోనే దావా చేశారు. అబుల్ అస్వద్ అనతికాలంలోనే హతమార్చబడ్డాడు. మసైలమా ప్రవక్త వద్దకు వచ్చిన సంగతి సహీ బుఖారీ 3620లో ఉంది

عَنِ ابْنِ عَبَّاسٍ رَضِيَ اللَّهُ عَنْهُمَا، قَالَ: قَدِمَ مُسَيْلِمَةُ الكَذَّابُ عَلَى عَهْدِ رَسُولِ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، فَجَعَلَ يَقُولُ: إِنْ جَعَلَ لِي مُحَمَّدٌ الأَمْرَ مِنْ بَعْدِهِ تَبِعْتُهُ، وَقَدِمَهَا فِي بَشَرٍ كَثِيرٍ مِنْ قَوْمِهِ، فَأَقْبَلَ إِلَيْهِ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ وَمَعَهُ ثَابِتُ بْنُ قَيْسِ بْنِ شَمَّاسٍ وَفِي يَدِ رَسُولِ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قِطْعَةُ جَرِيدٍ، حَتَّى وَقَفَ عَلَى مُسَيْلِمَةَ فِي أَصْحَابِهِ، فَقَالَ: «لَوْ سَأَلْتَنِي هَذِهِ القِطْعَةَ مَا أَعْطَيْتُكَهَا، وَلَنْ تَعْدُوَ أَمْرَ اللَّهِ فِيكَ، وَلَئِنْ أَدْبَرْتَ ليَعْقِرَنَّكَ اللَّهُ، وَإِنِّي لَأَرَاكَ الَّذِي أُرِيتُ فِيكَ مَا رَأَيْتُ»

ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖించారు, ముసైలమా కజ్జాబ్ ప్రవక్త కాలంలో వచ్చి, ముహమ్మద్ గనక తన తర్వాత నాకు ఖిలాఫత్ మాట ఇచ్చాడంటే నేను ఆయన్ని అనుసరిస్తాను, అతని వెంట అతని జాతి వారు కూడా ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాబిత్ బిన్ ఖైస్ తో సహా అతని వద్దకు వచ్చారు, అప్పుడు ప్రవక్త చేతిలో ఒక ఖర్జూరపు కర్ర ముక్క ఉంది, ముసైలమా మరియు అతని అనుచరుల దగ్గరికి వచ్చి ఇలా చెప్పారు: నీవు ఈ కర్ర ముక్క అడిగినా, నేను అది నీకివ్వను. అల్లాహ్ నీ కోసం నిర్ణయించిన దాన్నుండి నీవు ఏ మాత్రం తప్పించుకోలేవు. నీవు నా నుండి ముఖం తిప్పుకున్నావు. అందుచేత అల్లాహ్ నిన్ను (త్వరలోనే) అంతమొందిస్తాడు. నీవు నా కలలో ఎలా కన్పించావో ఇప్పుడు నేను నిన్ను అదేవిధంగా చూస్తున్నాను. అతని హత్య విషయం కూడా సహీ బుఖారీ 4072లో ఉంది

హజ్రత్ హంజా రజియల్లాహు అహు గానికి హతమార్చిన వహ్ షీ తర్వాత ఇస్లాం స్వీకరించారు, అయితే అబూ బక్ర్ రజియల్లాహు అన్హు పరిపాలన కాలంలో యమామా యుద్ధంలో పాల్గొన్నారు. ముసైలమాను హతమార్చారు.

చెప్పుకుంటూ పోతే ఎంతో మంది అసత్యవాదులు వచ్చారు, వారిలో ఒకడు మిర్జా గులాం అహ్మద్ ఖాదియానీ.ఇతడు 13 ఫిబ్రవరీ 1835లో ప్రస్తుత పంజాబ్ రాష్టం, గోర్దాస్ పూర్ జిల్లాహ్ ఖాదీయన్ గ్రామంలో పుట్టాడు. 26 మే 1908లో ప్రస్తుత పాకిస్తాన్ లో చాలా హీనంగా చనిపోయాడు.ఇతని గురించి ఈ లింక్ లో మరిన్ని వివరాలు తెలుసుకోగలరు

https://teluguislam.net/2015/04/07/the-lies-of-mirza-ghulam-ahmad-qadiayni/

ప్రారంభంలో అతడు ముస్లిమేతరులో ఇస్లాం సపోర్టులో డిబేట్లు చేస్తున్నట్లు ప్రదర్శించాడు, చేశాడు కూడా తర్వాత మెల్లమెల్లగా అతని అసలు నల్లరూపం బయటపడింది. అతని వాక్చాతుర్యాన్ని చూసి బ్రిటిష్ వారు వాడుకున్నారు, కాని వానికి అది తెలియలేదా, లేక ప్రాపంచిక వ్యామోహానికి లోనై అమ్ముడుపోయాడా కాని పరలోకానికి ముందు ఇహలోకంలోనే అల్లాహ్ వాడిని అవమానపరిచాడు

అతడు ప్రవక్త అన్న ఆరోపణ ఒక్కట కాదు చేసింది, ఎన్నో రంగులు మార్చాడు, ఎన్నో రూపుల వేశాడు ఎన్నో ఆరోపణలు చేశాడు, వాని కాలంలో వానికి ధీటుగా నిలబడిన ధర్మపండితులు మాలానా సనాఉల్లా అమ్రత్సరీ రహిమహుల్లాహ్. అతని ప్రతి అసత్యవాదానికి జవాబిస్తూ పోయారు పై లింకులో తప్పక వివరాలు చూడగలరు.

సంక్షిప్తంగా వాడు చేసిన ఆరోపణల్లో కొన్ని:

* అల్లాహ్ అర్ష్ పీఠంపై నన్ను ప్రశంసిస్తున్నాడు (అంజామె ఆథమ్ 55)
* మృతులకు ప్రాణం పోసే, జీవులను మరణింపజేసే శక్తి నాకు ప్రసాదించబడింది. (ఖుత్బయే ఇల్హామియా 23)
* మీరు తెలుసుకోండి! అల్లాహ్ కరుణ కటాక్షాలు నాతోనే ఉన్నాయి. అల్లాహ్ ఆత్మ నాలోన చెబుతుంది. (అంజామె ఆథమ్ 176).
* తానె మసీహె మౌఊద్ అని చెప్పుకున్నాడు. అంటే మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బుఖారీ 2222, ముస్లిం 155లో ఇచ్చిన శుభవార్త

«وَالَّذِي نَفْسِي بِيَدِهِ، لَيُوشِكَنَّ أَنْ يَنْزِلَ فِيكُمْ ابْنُ مَرْيَمَ حَكَمًا مُقْسِطًا، فَيَكْسِرَ الصَّلِيبَ، وَيَقْتُلَ الخِنْزِيرَ، وَيَضَعَ الجِزْيَةَ، وَيَفِيضَ المَالُ حَتَّى لاَ يَقْبَلَهُ أَحَدٌ» وفي رواية: فَيَطْلُبُهُ حَتَّى يُدْرِكَهُ بِبَابِ لُدٍّ، فَيَقْتُلُهُ 2937

ఈ ఈసా నేనే అని అంటాడు. ఒక ఖాదీయాని సోదరుడు నాతో చర్చలో ఉన్నప్పుడు ఈ హదీసు తెలిపి మీరు నమ్మే మిర్జా న్యాయశీలి నాయకుడయ్యాడా? శిలువను విరగ్గొట్టారా? పందిని చంపారా? జిజ్ యా పన్ను లేకుండా చేశారా ? జకాత్ తీసుకునేవాడు లేని విధంగా ధనం వృద్ధి అయిందా? దజ్జాల్ ను హతమార్చాడా? అని అడిగాను. ఇప్పటికీ ఏ సమాధానం రాలేదు.

..ప్రస్తుతానికి కూడా వారి అనుచరులు ఉన్నారు వారిని మనం కూడా ఖండిస్తూనే ఉండాలి వారి ఉచ్చులో పడకుండా ఉండడానికి జాగ్రత్త వహించాలి.


ఇతరములు 

తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz

అల్లాహ్ ఆదేశం: “ప్రవక్తా! నీకు ఇష్టమైన వారికి నీవు మార్గదర్శకత్వాన్ని ప్రసాదించ లేవు” – ఇమామ్ అస్-సాదీ

బిస్మిల్లాహ్

18 వ అధ్యాయం
అల్లాహ్ ఆదేశం: “ప్రవక్తా! నీకు ఇష్టమైన వారికి నీవు మార్గదర్శకత్వాన్ని ప్రసాదించ లేవు”
అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్ – ఇమామ్ అస్-సాదీ
The famous commentary of Shaykh as-Sa’di of the book Kitab at-Tawhid of Muhammad ibn Abdul Wahhab.


إِنَّكَ لَا تَهْدِي مَنْ أَحْبَبْتَ وَلَٰكِنَّ اللَّهَ يَهْدِي مَن يَشَاءُ ۚ وَهُوَ أَعْلَمُ بِالْمُهْتَدِينَ

అల్లాహ్ ఆదేశం: “ఓ ప్రవక్తా! నీకు ఇష్టమైన వారికి నీవు మార్గదర్శకత్వాన్ని ప్రసాదించలేవు“. (ఖసస్ 28:56).

ముసయ్యిబ్ (రదియల్లాహు అన్హు) కథనం: అబూ తాలిబ్ మరణ సమయంలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వచ్చారు. అక్కడ అబుల్లా బిన్ అబీ ఉమయ్య, అబూ జహల్ ఇద్దరు అవిశ్వాసులున్నారు. ప్రవక్త అన్నారు: “చిన్నాన్నా! “లా ఇలాహ ఇల్లల్లాహ్” వచనం పలకండి, అల్లాహ్ వద్ద మీ పట్ల దాన్ని ఒక ఋజువుగా ఉంచి మాట్లాడతాను“.

అప్పుడు వారిద్దరు: “అబ్దుల్ ముత్తలిబ్ ధర్మంను విడనాడుతావా?” అని హెచ్చరించారు. ప్రవక్త మళ్ళీ చెప్పారు. వారిద్దరు అదే మాట అన్నారు. అబూ తాలిబ్ పలికిన చివరి మాట: “నేను అబ్దుల్ ముత్తలిబ్ ధర్మాన్నే విశ్వసిస్తున్నాను”, “లా ఇలాహ ఇల్లల్లాహ్”ను అతడు తిరస్కరించాడు. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అన్నారు: “అల్లాహ్ నన్ను నివారించని వరకు మీ కొరకు క్షమాపణ కోరుతూ ఉంటాను“. అప్పుడు అల్లాహ్ ఈ వాక్యం అవతరింప జేశాడు. “ముష్రికులను క్షమించవలసినదిగా ప్రార్థన చెయ్యటం ప్రవక్తకూ, విశ్వాసులకూ తగనిపని” (తౌబా 9:113). అబూ తాలిబ్ విషయంలో ఈ ఆయతు అవతరించింది. “ప్రవక్తా! నీకు ఇష్టమైన వారికి నీవు మార్గదర్శ కత్వాన్ని ప్రసాదించలేవు. కాని అల్లాహ్ తనకు ఇష్టమైన వారికి మార్గదర్శకత్వాన్ని ప్రసాదించగలడు”. (ఖసస్ 28: 56). (ఈ మొత్తం విషయం బుఖారి మరియు ముస్లిం హదీసులలో ఉల్లేఖించబడింది).

ముఖ్యాంశాలు:

1. మొదటి ఆయతు యొక్క భావం. (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ జీవిత కాలంలోనే స్వయంగా తన పినతండ్రికి ఏ లాభం చేయలేకపోతే, మరణించిన తర్వాత ఎవరికి ఏ సహాయం చేయగలరు?).

2. (ముష్రికులను క్షమించవలసినదిగా ప్రార్థన చెయ్యటం………. ) అన్న ఆయతు యొక్క భావం తెలిసింది.

3. ముఖ్యమైన విషయం ఇందులో “లా ఇలాహ ఇల్లల్లాహ్” యొక్క భావం. అంటే కేవలం నోటితో పలికితే సరిపోదు, నిర్మలమైన మనస్సుతో సాక్ష్యం ఇచ్చుట తప్పనిసరి. నోటి మాటలు సరిపోవును అని చెప్పే కొందరి పండితులకు ఈ హదీసు విరుద్ధంగా ఉన్నది.

4. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వచ్చి “లాఇలాహ ఇల్లల్లాహ్” చదవమని అబూ తాలిబ్ తో అన్న ప్పుడు, ప్రవక్త ఉద్దేశం ఏమిటో అబూ జహల్, అతనితో ఉన్న ఇద్దరికి బాగా తెలుసు. (అందుకే వారు తాతముత్తాతల ధర్మాన్ని విడనాడకూడదని అతనికి చెప్పగలిగారు). అందరికంటే అబూ జహల్ ఎక్కువ ఇస్లాం మౌలిక విషయాన్ని తెలుసుకున్నప్పటికీ (ఇస్లాంలో చేరలేదు). వారిని అల్లాహ్  శపించుగాక!

5. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), తన పినతండ్రి ఇస్లాం స్వీకరించాలని చాలా ప్రయత్నం చేశారు.

6. అబ్దుల్ ముత్తలిబ్ మరియు అతని పూర్వీకులు ఇస్లాం స్వీకరించారు –  అన్నవారి భ్రమ దీనిద్వారా దూరం కావాలి.

7. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతని కొరకు ఇస్తిగ్ఫార్ (క్షమించమని అల్లాహ్ తో ప్రార్థించుట) చేశారు. ఆయన పినతండ్రి క్షమించబడలేదు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అలా ఇస్తిగ్ఫార్ చేయుటను అల్లాహ్ నివారించాడు.

8. దుష్ట స్నేహితుల దుష్ప్రభావం మనిషి పై పడుతుంది.

9. దుర్మార్గంపై ఉన్న పూర్వీకుల బాటను అనుసరించడం, గౌరవించడం కూడా హానికరం.

10. “మా పెద్దల ఆచారాన్ని ఎలా వదులుకోవాలి” అన్న సందేహంలో పడి ఉన్నవారు, వాస్తవానికి అబూజహల్ అన్నటువంటి మాటే అంటున్నారు.

11. మనిషి సఫలుడు అవుతాడు అన్నదానికి ఒక సాక్ష్యం అతని అంతిమ ఘడియల్లో ఉన్న ఆచరణ. అతడు (అబూ తాలిబ్) ఒకవేళ కలిమాహ్  పలికియుంటే అది అతనికి ఉపయోగపడేది.

12. దుర్మార్గుల మనుస్సులో ఉన్న (పెద్దల ఆచరణ విడనాడకూడదు అనే) భ్రమ ఎంత భయంకరమో గమనించాలి. ఎందుకనగా కొన్ని సంఘటనలలో వారికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అనేకసార్లు చెప్పినను తిరస్కరించి వివాదానికి కూడా తయారయి  వారు దాన్ని గౌరవిస్తూ, దాన్ని విడనాడడానికి సిద్ధంగా లేకపోవడమే.

తాత్పర్యం : (అల్లామా అల్ సాదీ) 

ఈ అధ్యాయం కూడా దీనికంటే మునుపటి లాంటిదే. సృష్టిలో శ్రేష్ఠులైన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ వద్ద ఉన్నత స్థానంగల వారు, సిఫారసు చేసేవారిలో ఎక్కువ అర్హత గలవారు, అయినా స్వయంగా తమ పినతండ్రికి ఋజుమార్గం ప్రసాదించలేక పోయారు. ఋజుమార్గం ప్రసాదించేవాడు అల్లాహ్ యే అయినప్పుడు ఇతరులు ఏమి చేయగలుగుతారు? అల్లాహ్ యే సత్యమైన ఆరాధ్యుడు అని తెలుస్తుంది. ఆయన సృష్టించటంలో అద్వితీయుడైతే, ఋజుమార్గం ప్రసాదించడంలో కూడా అద్వితీయుడు. మరెవ్వరి చేతిలో ఈ శక్తి లేదు. – “ప్రవక్త నీవు ఋజుమార్గం చూపుతావు” అని ఖుర్ఆన్ లో వచ్చిన దానికీ భావం: “ప్రవక్త అల్లాహ్ యొక్క వహీ (సందేశం) ప్రజలకు అందజేస్తారు. వారు దాని ద్వారా ఋజుమార్గం పొందుతారు” అని అర్థం.


నుండి: ఏకత్వపు బాటకు సత్యమైన మాట (అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్)  – ఇమామ్ అస్-సాదీ [పుస్తకం]  

మేరాజున్‌ నబీ పండుగ

బిస్మిల్లాహ్

12- మేరాజున్‌ నబి పండుగ

రజబ్‌ నెల 27వ తేది మేరాజున్‌ నబీ పవిత్రమైన సంఘటన జరిగిందని ఆ పండుగను జరుపుకునే వారి అభిప్రాయం. అందువలన వారు ప్రతి ఏటా మేరాజున్‌ నబీ రాత్రి ఒక పండుగ కొరకు ముస్తాబవుతారు. అలాగే తమ ఇండ్లల్లో ప్రత్యేకమైన వంటకాలు చేసుకుంటారు. మరియు ఫాతిహాలు అర్పిస్తారు. మసీదులను పచ్చటి మరియు ఎర్రటి లైట్లతో అలంకరిస్తారు, మసీదులలో ప్రత్యేకమైన నఫిల్‌ నమాజులు చదువుతారు. మరియు ఆ రాత్రంతా మేరాజున్‌ నబీ జరిగిన సంఘటను గురించి మరియు ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) చరిత్ర గురించి ప్రసంగాల సభలు నిర్వహిస్తారు. మరియు ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై ప్రత్యేకమైన “దరూద్‌ దుఆ” లను చదువుతారు. ఆ రోజున ఉపవాసం కూడా పాటిస్తారు.

కొంతమంది ప్రజలు మేరాజున్‌ నబీ గురించి కొన్ని కల్పిత విషయాలు జొప్పించుకొని ప్రసంగాలు చేస్తారు, అంతే కాక ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహివసల్లం) గారి పట్ల ధర్మ హద్దులు మీరి అతిగా పొగుడ్తారు. ఉదాహరణకు:

1- ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) కొరకు అల్లాహ్‌ తన తేజస్సు తెరను తొలిగించాడు. కనుక అల్లాహ్‌ను అసలైన రూపంలో ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) కళ్ళారా దర్శించే భాగ్యాన్ని పొందినట్లు అంటారు.

2- ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) మేరాజ్‌ రాత్రి అల్లాహ్‌ వద్దకు చేరుకునేందుకు తమ కాళ్ళ నుండి చెప్పులను తీయబోతే, అల్లాహ్‌ ఆయన్ని చెప్పులతో సహా ఆహ్వానించారు అని కథలు చెప్పుకుంటారు.

౩- మేరాజ్‌ రాత్రి ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్‌ ను స్వయంగా సందర్శించారు మరియు అల్లాహ్‌ మరియు ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి మధ్య ఆలింగనము చేసుకునే వ్యత్యాసం మాత్రమే మిగిలిందని అంటారు.

4- అల్లాహ్‌ తన తేజస్సు తెరను తొలిగించినప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు అల్లాహ్‌ను చూస్తే అల్లాహ్‌ కూడా ప్రవక్త రూపంలోనే ఉన్నారని అంటారు.

హజ్రత్ ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) సతీమణి ఆయిషా (రజియల్లాహు అన్హ) గారు ఇలా తెలియజేసారు: “ఎవరైతే అల్లాహ్‌ను ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు కళ్ళారా చూసారని అంటారో వారు అల్లాహ్‌ పై  అబద్దాన్ని అంటగట్టినట్టే”…. (బుఖారి: 259)

ఇలా అనేకమైన షిర్క్ కు చెందిన విషయాలను మేరాజ్‌ రాత్రిన అమాయక ప్రజల ముందు ప్రసంగిస్తారు. ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారిని అల్లాహ్‌ స్థాయికి పెంచి అల్లాహ్‌ అంటే ప్రవక్త, ప్రవక్త అంటే అల్లాహ్‌ అని విశ్వసిస్తారు. ఇలా విశ్వసించటం క్రైస్తవుల విశ్వాసంకంటే హీనమైన విశ్వాసంగా తెలుస్తుంది. ఎందుకంటే? క్రైస్తవులు యేసు (అలైహిస్సలాం) వారిని అల్లాహ్‌ కుమారునిగా విశ్వసిస్తారు. కాని మన ముస్లిం ప్రజలలో కొంత మంది ప్రజలు ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ను పూర్తిగా అల్లాహ్‌ స్థాయికి పెంచి అనేక కవితాగానాలు రచించారు. మరియు ఆ రాత్రంతా వాటిని పాడుతుంటారు.

అందుకనే ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా హెచ్చరించారు: “మీరు నన్ను పొగడటంలో హద్దులు మీరకండి, ఎలాగైతే క్రైస్తవులు మర్యమ్‌ కుమారుడగు ఈసా(అలైహిస్సలాం) గారి పట్ల హద్దుమీరి పొగడ్తల్లో ముంచారో! నిశ్చయంగా నేను అల్లాహ్‌ దాసుడను మాత్రమే. కనుక మీరు నన్ను అల్లాహ్‌ దాసుడు మరియు ఆయన ప్రవక్త అని మాత్రమే అనండి.” (బుఖారి: ౩189)

13- పవిత్రమైన మేరాజ్‌ సంఘటన వాస్తవం

మేరాజున్‌ నబీ యాత్ర ఎప్పుడు జరిగిందని అడిగితే? దానికి సూటిగా ఒక జవాబుగా హిజ్రత్ కు ఒక ఏడాది ముందు జరిగిందని చెప్పవచ్చు.

కాని ఏ నెలలో? ఏ తేదిలో అని చెప్పడానికి స్పష్టమైన ఆధారం ఇస్లామీయ చరిత్రలో భధ్రపరచబడలేదు. కనుక ప్రవక్త గారి చరిత్రను రచించినవారిలో కూడా మేరాజ్‌ సంఘటన గురించి అనేక భిన్నాభిప్రాయాలున్నాయి. వాటిలో కొన్నిటిని మీ ముందు ఉంచుతున్నాము:

1- దైవదౌత్యం ప్రసాదించబడిన సంవత్సరమే ఈ మేరాజ్‌ సంభవించిందని ఇమామ్‌ తబ్రీ కథనం.

2- దైవదౌత్యం అయిదు సంవత్సరాల తరువాత జరిగిందని ఇమామ్‌ నూవీ, ఇమామే ఖుర్తిబీ కథనం.

౩- దైవదౌత్యం పదవ సంవత్సరం రజబ్‌ నెల 27వ తేదిన సంభవించిందని, సులైమాన్‌ మన్సూర్‌పూరి కథనం.

4- హిజ్రత్ పదహారు మసాల ముందు రమజాన్‌ నెలలో సంభవించిందని, లేక హిజ్రత్ పదునాలుగు మాసాల ముందు ముహర్రం నెలలో సంభవించిందని, లేక హిజ్రత్ కు ఒక సంవత్సరం ముందు రబీఉల్‌ అవ్వల్‌ మాసంలో సంభవించిందని రచయితలు భిన్నాభిప్రాయాలు వెలిబుచ్చారు. ఏదైనప్పటికి ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) సతీమణి హజ్రత్ ఖదీజా (రజియల్లాహు అన్హ) గారి తదనంతరం మేరాజ్‌ సంఘటన జరిగినట్లు స్పష్టమవుతుంది. మరియు హజ్రత్ ఖదీజా (రజియల్లాహు అన్హ) గారు దైవదౌత్య శకం పదవ సంవత్సరం రమజాన్‌ నెలలో మరణించినట్లు తెలుస్తుంది. కనుక ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) హిజ్రత్‌ కంటే ఒక యేడాది ముందు మేరాజ్‌ సంఘటన సంభవించినదిగా భావించాలి. (వివరాలకు అర్రహిఖుల్‌ మఖ్తూమ్‌ – మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవిత చరిత్ర తెలుగు, 224-225 చూడండి).

మేరాజున్‌ నబీ సంఘటన ఏ నెలలో మరియు ఏ తేదిన జరిగిందో అన్న విషయం మన మహానీయులైన ధర్మ గురువులకే స్పష్టమైన జ్ఞానం లేదంటే మనం రజబ్‌ నెల 27వ తేదిన మేరాజున్‌ నబీ పండుగ జరుపుకోవడం ఎంతవరకు ధర్మం. అలాగే మేరాజ్‌ రాత్రి ఆరాధనలు మరియు పగలు ఉపవాసం గనక ఇస్లామీయ సాంప్రదాయం అనుకుంటే, ప్రవక్త ముహమ్మద్‌(సల్లల్లాహు అల్లిహి వసల్లం) మేరాజ్‌ తరువాత పన్నెండు సంవత్సరాల వరకు సహాబాల మధ్య బతికున్నారు, అయినా ఆయన మేరాజ్‌ జరిగిన పవిత్రమైన రోజు ఇలాంటి ఆరాధనలు ఎందుకు పాటించలేదు? తరువాత సహాబాలు మేరాజ్‌ రోజున పండుగగా ఎందుకు నిర్వహించలేదు. ఒకవేళ వారు ప్రతి సంవత్సరం మేరాజ్‌ రాత్రిని ఆరాధనల కొరకు మరియు పగలు ఉపవాసం కొరకు ప్రత్యేకం చేసుకొని పర్వదినంగా నిర్వహించి ఉంటే, మేరాజ్‌ జరిగిన మాసము మరియు తేది కూడా స్పష్టంగా తెలిసి ఉండేది కదా! మరియు ఆ రోజున చేసే కార్యాలకు, ఆరాధనలకు ప్రవక్త ఆమోదం కూడా లభించి ఉండేది కదా!.

నా ప్రియమైన ముస్లిం సోదరులారా! మనం పుణ్యాలు చేయుట కొరకు ఆశక్తి చూపాలి, కాని ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) మార్గదర్శకం ప్రకారమే మనం ఆరాధనలు చెయ్యాలి. అప్పుడే అవి అల్లాహ్‌ వద్ద ఆమోదయోగ్యానికి నోచుకుంటాయి. మేరాజున్‌ నబీ అన్నది ఇస్లామీయ ధర్మానికి చెందిన ఒక విశ్వాసనీయ సంఘటన, మరియు ఎంతో అద్భుతమైన సంఘటన, ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు చాలా కష్టాలకు, దుఃఖాలకు నష్టాలకు గురికాబడ్డారు. అంతలో హజ్రత్ ఖదీజా(రజియల్లాహు అన్హా) కూడా మృతి చెందారు. చివరికి ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ సంవత్సరానికి ఆముల్‌ హుజ్న్‌ (శోక సంవత్సరం) గా భావించారు. అప్పుడు అల్లాహ్‌ ఆయన శోకాన్ని, మరియు దుఃఖాన్ని దూరం చేయుట కొరకు ఈ మహోన్నతమైన మేరాజ్‌ గగన యాత్రను ఏర్పాటు చేసినట్లు ధర్మగురువులు భావిస్తారు.

అక్కడ ప్రవక్త ముహమ్మద్‌(సల్లల్లాహు అలైహి వసల్లం) గారు అనేక మంది ప్రవక్తలను కలిసి మాట్లాడారు. స్వర్గం, నరకం మరియు అనేక అద్భుత విషయాలను చూసారు. తరువాత ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు వారి ఉమ్మత్‌ కొరకు అల్లాహ్‌ ఒక మహోన్నత బహుమానంగా, ఐదు సమయాల నమాజులను విధిగా ప్రసాదించాడు. మరియు “సూరతుల్‌ బఖరా” చివరి ఆయతులను కూడా ప్రసాదించాడు.

మనం మేరాజున్‌నబి గురించి పవిత్రమైన సంఘటనగా విశ్వసించాలి, ఆ సంఘటన గురించి ఉన్న వాస్తవాలను యదాతధంగా నమ్మాలి. మరియు ప్రతి రోజు ఐదు సమయాల నమాజును విధిగా పాటించాలి. ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) స్వర్గం, నరకం గురించి తెలియజేసిన విషయాలను నిత్యం గుర్తుంచుకొని భయభక్తితో జీవితాన్ని గడపాలి.


ఇది “ఇస్లాంలో అధర్మ కార్యాలు మరియు వాటి ప్రక్షాళణ” అను పుస్తకం నుంచి తీసుకోబడింది. (పేజీలు : 83-87). కూర్పు: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ (హఫిజహుల్లాహ్)

బిద్అత్ (నూతనాచారం) – Bidah

మేరాజ్ (గగణ ప్రయాణ) దృశ్యాలు [వీడియో & టెక్స్ట్]

ప్రవక్త మేరాజ్ (గగణ ప్రయాణాని)కి రజబ్ లోనే వెళ్ళారా?
ఈ సందర్భంగా తర్వాత రోజుల్లో షబె మేరాజ్ జరుపుకున్నారా? 

మేరాజ్ (గగణ ప్రయాణ) దృశ్యాలు
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
https://www.youtube.com/watch?v=Qmq6Oq7tJE0
36:38 నిమిషాలు, తప్పక వినండి

ఈ ప్రసంగంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలోని ఒక కీలకమైన ఘట్టం, ఇస్రా మరియు మేరాజ్ (రాత్రి ప్రయాణం మరియు ఆరోహణ) గురించి వివరించబడింది. ప్రవక్త పదవి పొందిన తర్వాత మక్కాలో పది సంవత్సరాల పాటు ఆయన ఎదుర్కొన్న తీవ్రమైన శారీరక, మానసిక, మరియు సామాజిక కష్టాల గురించి ప్రస్తావించబడింది. ముఖ్యంగా తాయిఫ్‌లో ఆయనపై జరిగిన దాడి, ఆ తర్వాత ఆయన ప్రియమైన భార్య హజ్రత్ ఖదీజా మరియు పినతండ్రి అబూ తాలిబ్ మరణంతో కలిగిన దుఃఖం గురించి చెప్పబడింది. ఈ కష్టాల సమయంలో అల్లాహ్ తన ప్రవక్తకు ఓదార్పుగా ప్రసాదించిన అద్భుత ప్రయాణమే ఇస్రా మరియు మేరాజ్. ఈ ప్రయాణంలో జరిగిన సంఘటనలు, ఏడు ఆకాశాలలో ప్రవక్తలను కలవడం, స్వర్గ నరకాలను దర్శించడం, మరియు ముఖ్యంగా ముస్లిం సమాజానికి బహుమానంగా లభించిన ఐదు పూటల నమాజు, సూరహ్ బఖరా చివరి రెండు ఆయతులు, మరియు షిర్క్ చేయని వారి పాపాలు క్షమించబడతాయన్న శుభవార్త గురించి వివరించబడింది. ఈ ప్రయాణం యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ, దానిని స్మరించుకునే పేరుతో బిద్అత్ (నూతన ఆచారాలు) చేయకుండా, ప్రవక్త తెచ్చిన అసలైన బోధనలను, ముఖ్యంగా నమాజును మరియు తౌహీద్‌ను ఆచరించాలని నొక్కి చెప్పబడింది.

అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ ఆలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బాద్.

మహాశయులారా! ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నలభై సంవత్సరాల వయసు నిండిన తర్వాత ప్రవక్త పదవిని పొందారు. ఆ తర్వాత ఇంచుమించు పది సంవత్సరాల వరకు ప్రజలను అల్లాహ్ వైపునకు పిలుస్తూ కేవలం మనందరి సృష్టికర్త అయిన అల్లాహ్‌ను మాత్రమే మనం ఆరాధించాలి అని బోధిస్తూ ఎన్నో రకాల ఇబ్బందులను, ఎన్నో రకాల కష్టాలను కూడా భరించారు. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై మనం ఊహించలేని, మనం పరస్పరం చెప్పుకోలేనటువంటి శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక అన్ని రకాల కష్టాలు వచ్చాయి. కానీ అల్లాహ్ కొరకు ఎంతో సహనం వహించారు.

పది సంవత్సరాలు గడిచిన తర్వాత మక్కా నగరం, దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వారు చాలా తక్కువ మంది ఇస్లాం స్వీకరించారు. అయితే మక్కా నగరానికి ఇంచుమించు ఒక 80, 90 కిలోమీటర్ల దూరంలో తాయిఫ్ ఒక పెద్ద నగరము. అక్కడ నివసించే వారికి ఇస్లాం బోధన చేద్దామని వెళ్లారు. కానీ అక్కడి నుండి కూడా వారు ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి కేవలం అల్లాహ్‌ను ఆరాధించే వారు అయి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సంతోషం కలిగేకి బదులుగా వారు కేవలం నిరాకరించలేదు, పైగా ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై రాళ్ల వర్షం కురిపించారు. ఎంతగా అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి శరీరం నుండి రక్తం వెళ్లి పాదాల్లో ఏ బూట్లయితే వేసుకున్నారో, చెప్పులయితే వేసుకున్నారో అందులో రక్తం ఆగిపోయింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సొమ్మసిల్లిపోయారు, స్పృహ తప్పిపోయారు.

మక్కా నగరం తిరిగి వచ్చిన తర్వాత కొద్ది రోజులకు, 25 సంవత్సరాల వరకు అన్ని రకాలుగా సహాయం చేస్తూ, అన్ని రకాలుగా తోడ్పాటు అందిస్తూ, ఆమెకు ఒక ఉత్తమమైన భార్యగా నిలిచిన వారు హజ్రత్ ఖదీజా రదియల్లాహు త’ఆలా అన్హా కూడా చనిపోయారు. గమనించండి, కేవలం సామాన్య మనలాంటి మనుషులకే మన భార్య చనిపోయింది అంటే మనకు ఏడుపొస్తుంది. కానీ ఖదీజా రదియల్లాహు త’ఆలా అన్హా ఒక సామాన్య భార్య కాదు, ఒక సామాన్య స్త్రీ కాదు. ఆ చరిత్రలోకి వెళితే చాలా సమయం మనకు ఇది అయిపోతుంది. హజ్రత్ ఖదీజా రదియల్లాహు త’ఆలా అన్హా వారు చనిపోయాక కొద్ది రోజులకు వెన్నెముక లాంటి సహాయం అందించిన పినతండ్రి హజ్రత్ అబూ తాలిబ్ కూడా చనిపోతారు. ఆయన కేవలం చనిపోవడమే కాదు, ఇస్లాం ధర్మం స్వీకరించకుండా తాత ముత్తాతల ఆచారం మీద నేను చనిపోతున్నాను అని అనడం ప్రవక్త గారికి చెప్పలేనంత బాధ కలిగింది.

ఇన్ని బాధలను, ఇన్ని కష్టాలను, ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్న సమయంలో ఒక శుభ ఘడియ వచ్చింది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి. అదేమిటి? రాత్రిలోని కొన్ని క్షణాల్లోనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు హజ్రత్ జిబ్రీల్ అలైహిస్సలాం వచ్చారు, బురాఖ్ అన్న ఒక జంతువు తీసుకొచ్చారు. ఆ జంతువు గురించి సహీహ్ హదీథ్ లో వచ్చిన ప్రస్తావన ఏమిటి? అది హైట్ లో గాడిద కంటే పెద్దగా మరియు కంచర గాడిద కంటే చిన్నగా మరియు దాని వేగం ఎక్కడివరకైతే దాని దృష్టి పడుతుందో అక్కడి వరకు అది ఒక గంతు వేస్తుంది. అంతటి వేగం గల ఒక జంతువును తీసుకుని వచ్చారు.

కానీ ఇక్కడ ఒక విషయం గమనించండి. ఈ రోజుల్లో మనం ఎన్నో క్యాలెండర్లలో, ఎన్నో ఫోటోలలో బురాఖున్ నబీ, ప్రవక్త వారికి గగన ప్రయాణం, మేరాజ్ ఏ వాహనంపై అయితే జరిగిందో దాని పేరు బురాఖ్ అని దానికి ఒక స్త్రీ ముఖం లాంటిది, ఇంకా వెనక ఒక తోక వేరే రకం లాంటిది, దాని కాళ్లు మరో జంతువు రకం లాంటివి, ఇలాంటి ఫోటోలు చూస్తాము. ఇవన్నీ కూడా అబద్ధము, అసత్యము, బూటకం. ఎందుకంటే ఆ జంతువు యొక్క చిన్నపాటి వర్ణన వచ్చింది కానీ అది, దాని ముఖం, దాని యొక్క ఇమేజ్, దాని యొక్క ఫోటో ఆ కాలంలో ఎవరూ తీయలేదు, దాని గురించి ఎలాంటి ప్రస్తావన హదీథుల్లో రాలేదు. ఇది మన యొక్క ధర్మంపై ఒక మహా అపనింద మనం వేసిన వాళ్ళం అవుతాము ఇలాంటి ఫోటోలను మనం ప్రచారం చేసి ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నుండి బైతుల్ మఖ్దిస్, బైతుల్ మఖ్దిస్ నుండి ఏడు ఆకాశాల పైకి వెళ్లినటువంటి బురాఖ్ అని చెప్పడం ఇది చాలా తప్పు విషయం.

అయితే సహీహ్ హదీథుల్లో వచ్చిన విషయం ఏంటి? ఆ జంతువు, దాని యొక్క వేగం మనం చెప్పలేము. దానిపై ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎక్కించుకొని మక్కా నుండి బైతుల్ మఖ్దిస్, ఫలస్తీన్ కి వెళ్లారు. ఆ ప్రస్తావన సూరహ్ బనీ ఇస్రాయీల్ లోని మొదటి ఆయతులోనే ఉంది.

سُبْحَانَ الَّذِي أَسْرَىٰ بِعَبْدِهِ لَيْلًا مِّنَ الْمَسْجِدِ الْحَرَامِ إِلَى الْمَسْجِدِ الْأَقْصَى الَّذِي بَارَكْنَا حَوْلَهُ لِنُرِيَهُ مِنْ آيَاتِنَا

“ఆయన పరమ పవిత్రుడు. తన దాసుణ్ణి ఒక రాత్రి మస్జిద్-ఎ-హరామ్ నుండి మస్జిద్-ఎ-అఖ్సా వరకు తీసుకువెళ్లాడు. దాని పరిసరాలను మేము శుభప్రదంగా చేశాము. ఇది మేము మా సూచనలను అతనికి చూపించటానికి చేశాము.” (17:1)

ఆ ప్రభువు, అల్లాహ్ ఎంతో పరిశుద్ధుడు. అన్ని రకాల లోపాలకు, దోషాలకు అతీతుడు. ఆయనే రాత్రివేళ తన దాసునిని మస్జిద్-ఎ-హరామ్ నుండి బైతుల్ మఖ్దిస్, మస్జిద్-ఎ-అఖ్సా ఫలస్తీన్ వరకు తీసుకువెళ్లాడు. ఆ మస్జిద్-ఎ-అఖ్సా దాని చుట్టుపక్కల ప్రాంతమంతా కూడా మేము దానిని శుభకరమైనదిగా చేశాము. ఎందుకు తీసుకువెళ్ళాము? మా యొక్క సూచనలు, మా యొక్క మహిమలు ఆయనకు చూపించాలని. అయితే దీనిని ఇస్రా అని అంటారు. ఇస్రా అంటే ఏంటి? మక్కా నుండి బైతుల్ మఖ్దిస్ వరకు రాత్రివేళ ఏదైతే ప్రయాణం జరిగిందో దానిని ఇస్రా అని అంటారు. మరియు బైతుల్ మఖ్దిస్ నుండి ఏడు ఆకాశాల వైపునకు ఏ ప్రయాణం అయితే జరిగిందో దానిని మేరాజ్ అని అంటారు. దాని ప్రస్తావన ఖుర్ఆన్ లో సూరహ్ నజ్మ్ లో వచ్చి ఉంది.

అయితే ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏమిటంటే, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇస్రా, మేరాజ్ ఈ ప్రయాణం ఏదైతే చేశారో ఇది వాస్తవం. ఖుర్ఆన్ లో దాని ప్రస్తావన ఉంది, సహీహ్ హదీథుల్లో దాని వివరాలు వచ్చి ఉన్నాయి. కానీ ఆ ప్రయాణంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఏమేమి జరిగినది? ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎక్కడెక్కడ ఏమేమి దర్శించారు? ఏ ఏ అద్భుత విషయాలు మనకు తెలియజేశారు? మన విశ్వాసానికి, ఆచరణకు సంబంధించిన బోధనలు అందులో ఏమున్నాయి? అవి మనం తెలుసుకోవాలి ఖుర్ఆన్ మరియు సహీహ్ హదీథుల ద్వారా మరియు వాటి ప్రకారంగా మనం ఆచరించాలి, వాటి ప్రకారంగా మన విశ్వాసం సరిచేసుకోవాలి.

అలా కాకుండా, ఈ రోజుల్లో ఏం జరుగుతుంది? జషన్, షబ్-ఎ-మేరాజ్, మేరాజున్ నబీ యొక్క ఉత్సవాలు అని జరుపుకుంటున్నారు. ఒక వ్యక్తి వాట్సాప్ లో ఒక సందర్భంలో ఏం రాశాడు? చేసుకునే వాళ్ళు చేసుకుంటారయ్యా, మీకేం నొస్తుంది? మీకేం బాధ కలుగుతుంది? అని బూతులు కూడా వదిలారు కొందరు. కానీ ఇక్కడ వారి మదిలో, వారి ఆలోచనలో ఏముందంటే, మేము ఏం చేసినా గానీ ప్రవక్త ప్రేమలో చేస్తున్నాము కదా, మేం ఏం చేసినా గానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఈ గగన ప్రయాణం, మేరాజ్ అయితే ఒక గొప్ప బహుమానంగా ఇవ్వబడినదో దానిని గుర్తు చేసుకుంటున్నాము కదా, ఇందులో తప్పేమిటి? ఇలాంటి కొన్ని మంచి ఆలోచనలు వారివి ఉంటాయి కావచ్చు. కానీ ఇక్కడ గమనించాలి. ఏంటి గమనించాలి? ఒకవేళ ఇలా చేయడం ధర్మం అయితే ఈ ధర్మాన్ని అల్లాహ్ మనకు నేర్పలేదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలుపలేదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహాబాలు చేయలేదు, ఇమాములు చేయలేదు. అలాంటి కార్యం మనం చేస్తున్నాము అంటే మన ఆలోచన, మన ఉద్దేశం ఎంత ఉత్తమంగా, మంచిగా ఉన్నప్పటికీ అందులో మనకు పుణ్యం లభించదు, దాని వల్ల మనం బిద్అత్ లో పడిపోతాము, అది మహా ఘోరమైన పాపం అయిపోతుంది.

అందు గురించి మహాశయులారా! అలాంటి బిద్అత్ లకు, దురాచారాలకు మనం గురి కాకుండా ఈరోజు మీరు కొన్ని విషయాలు వింటారు ఇన్షా అల్లాహ్. ఏమిటి ఆ విషయాలు? ఈ గగన ప్రయాణంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఏ ఏ బహుమానాలు బహూకరించబడ్డాయి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ దృశ్యాలను చూశారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ ప్రయాణం ఎలా జరిగింది? దానికి సంబంధించిన వివరాలు ఏమిటి?

అయితే పూర్తి వివరంగా చెప్పుకుంటూ పోతే గంటల తరబడి ప్రసంగం జరుగుతుంది. కానీ అలా కాకుండా టూ ద పాయింట్ హదీథుల ఆధారంగా నేను కొన్ని విషయాలు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. దానిని మీరు శ్రద్ధగా ఆలకిస్తారు అని ఆశిస్తున్నాను.

మొదటి విషయం ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల జరిగినటువంటి గొప్ప మహిమ, ఒక అద్భుతం ఏమిటంటే ఈ ప్రయాణానికి బయలుదేరే ముందు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క చెస్ట్ ఆపరేషన్ అని అనండి మీరు, హార్ట్ ఆపరేషన్ అని అనండి, ఓపెన్ హార్ట్ సర్జరీ అని మీరు చెప్పుకోండి, చెప్పుకోవచ్చు. అది జరిగింది. వాస్తవం. హజ్రత్ అనస్ రదియల్లాహు త’ఆలా అన్హు చెప్తున్నారు, నేను స్వయంగా చూశాను ఆ కుట్లను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఛాతి చీల్చబడి, అందులో నుండి గుండెను బయటికి తీసి, జమ్ జమ్ నీళ్లతో దానిని కడిగి, అందులో ఈమాన్, విశ్వాసం, హిక్మత్, వివేకాలతో నింపబడినది. సహీహ్ బుఖారీ, హదీథ్ నంబర్ 3887 లో దీని ప్రస్తావన ఉంది.

ఇక ఏ వాహనం పైన అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రయాణం చేశారో నేను ఇంతకు ముందు తెలిపినట్లు గాడిద కంటే పెద్దది మరియు కంచర గాడిద కంటే చిన్నది, దాని పేరు ఏమిటి? బురాఖ్. దీని ప్రస్తావన సహీహ్ బుఖారీలోని ఈ హదీథ్ లోనే వచ్చి ఉంది. ఇంతకు ముందు నేను చెప్పిన నంబర్ 3887.

మరియు ఈ ప్రయాణం మస్జిద్-ఎ-హరామ్ మక్కా నుండి మొదలుకొని ఫలస్తీన్, ఫలస్తీన్ నుండి ఏడు ఆకాశాలు, ఏడు ఆకాశాల పైన అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ తో సంభాషించడం మరియు స్వర్గాన్ని చూడడం, నరకాన్ని చూడడం మధ్యలో ఇంకా ఎన్నో విషయాలు జరిగాయి. ఇవన్నీ కూడా ఎన్నో రోజులు, ఎన్నో గంటలు పట్టలేదు. لَيْلًا (లైలన్) రాత్రిలోని కొంత భాగం మాత్రమే. అది ఎలా? అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ సర్వశక్తిమంతుడు. అవునా లేదా? విశ్వాసం ఉందా లేదా? ఈ రోజు ఆ అల్లాహ్ ఇచ్చినటువంటి మేధ, బుద్ధి, జ్ఞానం, సైన్స్, విద్యతో రాకెట్లు తయారు చేస్తున్నారు. సామాన్యంగా ఇంతకు ముందు ఎవరైనా ఇక్కడి నుండి మక్కా నేను ఒక రోజులో పోయి వస్తాను అంటే ఎవరైనా నమ్ముతారా? ఇంచుమించు 1000 కిలోమీటర్లు. కానీ ఈ రోజుల్లో సాధ్యమా లేదా? నాలుగు సార్లు పోయి రావచ్చు కదా మక్కా. అదే రాకెట్ యొక్క వేగం ఎంత ఉన్నది? అయితే నేను ఈ విషయాలు మళ్ళీ విడమరిచి చెప్పడానికి వెళ్తే సమయం ఇంకా చాలా ఎక్కువ అవుతుంది. మన విశ్వాసులం, ఖుర్ఆన్ లో వచ్చిన విషయం, సహీహ్ హదీథ్ లో వచ్చిన విషయాన్ని మనం తూచా తప్పకుండా నమ్మాలి, ఎలాంటి అనుమానాలకు, సందేహాలకు గురి కాకూడదు.

అయితే మస్జిద్-ఎ-అఖ్సా లో చేరిన తర్వాత అక్కడ అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఆదమ్ అలైహిస్సలాం నుండి మొదలుకొని చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు ఎంత మంది ప్రవక్తలు వచ్చారో వారందరినీ జమా చేశాడు. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారందరికీ రెండు రకాతుల నమాజ్ చేయించారు. ఇమామత్, నమాజ్ చేయించే అటువంటి నాయకత్వం ఈ గొప్పతనం ఎవరికి లభించింది? ఎవరికీ? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి. అంటే ఇమాముల్ అంబియా అని అంటాము కదా మనం సామాన్యంగా ఉర్దూలో. ఇది వాస్తవ రూపంలో అక్కడ జరిగింది.

ఇంకా ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ప్రయాణంలో మొదటి ఆకాశం, రెండవ ఆకాశం, మూడవ ఆకాశం, ఏడు ఆకాశాలలో పైకి వెళ్లారైతే, మొదటి ఆకాశంలో హజ్రత్ ఆదమ్ అలైహిస్సలాం తో కలిశారు. రెండవ ఆకాశంలో ఈసా మరియు యహ్యా అలైహిముస్సలాం తో కలిశారు. మూడవ ఆకాశంలో యూసుఫ్ అలైహిస్సలాం తో కలిశారు. నాలుగవ ఆకాశంలో హజ్రత్ ఇద్రీస్ అలైహిస్సలాం తో కలిశారు. ఐదవ ఆకాశంలో హారూన్ అలైహిస్సలాం తో కలిశారు. మరియు ఆరవ ఆకాశంలో హజ్రత్ మూసా అలైహిస్సలాం తో కలిశారు. ఏడవ ఆకాశంలో హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం తో కలిశారు.

ఈ విధంగా ఏడు ఆకాశాలకు పైన ఒక రేగు చెట్టు ఉంది. దానిని సిద్రతుల్ ముంతహా అని అంటారు. ఆ చెట్టు, రేగు పండు ఒక్కొక్క పండు పెద్ద పెద్ద కడవలు చూసి ఉంటారు. పల్లెటూర్లలో పాతకాలంలో గోధుమాలో లేదా వడ్లు వేయడానికి పెద్ద పెద్ద గుమ్మీలు వాడేవారు. ఒక్కొక్క దాంట్లో 300 కిలో, 500 కిలోలు కూడా అంత స్థలం ఉంటుంది. ఆ విధంగా పెద్ద పెద్ద ఒక్కొక్క పండు అంత పెద్దగా ఉంటుంది. మరియు దాని యొక్క ఆకులు ఏనుగుల చెవుల మాదిరిగా అంత పెద్దగా ఉంటాయి. అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి. హదీథ్ లో వచ్చిన విషయం ఏంటంటే, హిజ్ర్ అని ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంత వాసులు ఎలాంటి మట్టి నీళ్లు వేయడానికి బిందెలు లాంటివి, నీళ్లు పోసుకోవడానికి కడవల లాంటివి ఏదైతే ఉపయోగిస్తారో దానికి సమానమైన పండ్లు ఆ రేగు పండు ఒక్కొక్కటి మరియు దాని యొక్క ఆకు ఏనుగు చెవుల మాదిరిగా ఉంటాయి.

ఇంకా ఆ రేగు చెట్టు యొక్క వ్రేళ్లు ఆరవ ఆకాశంలో ఉన్నాయి మరియు దాని యొక్క కొమ్మలు ఏడు ఆకాశాలకు పైగా ఉన్నాయి. అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఎన్నో విషయాలు చూపించడం జరిగింది, ఎన్నో విషయాలు అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో జరిగాయి. ఉదాహరణకు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడే అల్లాహ్ యొక్క చాలా దగ్గరగా ఉండే అల్లాహ్ ఆదేశాలను రాస్తూ ఉండే దైవదూతల కలముల శబ్దం విన్నారు, సిద్రతుల్ ముంతహాలో.

జన్నతుల్ మఅవా అన్నది దానికి సమీపంలోనే ఉన్నది. అక్కడే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మూడు విషయాలు బహుమానంగా ఇవ్వబడ్డాయి. ఎలా? మీకు ఏదైనా బహుమానం దొరికింది, ఏదైనా పెద్ద గిఫ్ట్ దొరికింది, ఒక షీల్డ్, క్రికెట్ లో మీరు కప్ గెలిచారు. దానిని తీసుకొచ్చి పారేస్తారా? ఏం చేస్తారు? కాపాడుతారు. గమనించండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అక్కడ లభించిన విషయాలు ఏమిటి? ఐదు పూటల నమాజులు, ఇక దాని వివరణలో వెళ్తాలేను, ముందు 50 ఉండే ఆ తర్వాత ఇలా తగ్గింది అనేది. రెండవ బహుమానం, సూరహ్ బఖరా లోని చివరి రెండు ఆయతులు, ఆమన రసూల్ బిమా ఉన్జిలా అక్కడ నుండి మొదలుకొని. మరియు మూడవ బహుమానం ఏమిటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమాజంలో, వారిని అనుసరించే వారిలో ఎవరైతే షిర్క్ నుండి దూరం ఉంటారో అల్లాహ్ త’ఆలా వారి యొక్క ఘోరమైన పాపాలను కూడా మన్నిస్తాడు. అల్లాహు అక్బర్. ఈ మూడు పెద్ద బహుమానాలు.

సహీహ్ ముస్లిం షరీఫ్, హదీథ్ నంబర్ 173 లో వీటి ప్రస్తావన వచ్చి ఉంది. సిద్రతుల్ ముంతహా మరియు అక్కడ ఆ తర్వాత నుండి ఏదైతే విషయాలు చెప్పానో వాటి ప్రస్తావన. ఇక్కడ గమనించండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మేరాజ్ ప్రయాణంలో ప్రవక్తకు లభించినటువంటి గొప్ప బహుమానం ఏమిటి? ఏమిటి? చెప్పండి! ఐదు పూటల నమాజు. ఇంకా? సూరహ్ బఖరా లోని చివరి రెండు ఆయతులు. మరియు మూడో విషయం? షిర్క్ చేయని వారి యొక్క ఘోర పాపాలను కూడా అల్లాహ్ త’ఆలా క్షమిస్తాడు అని శుభవార్త.

ఈ రోజుల్లో మేరాజున్ నబీ అన్నటువంటి బిద్అత్ చేసి, ఇంకా అందులో ఎన్నో రకాల షిర్క్ పనులు చేసి, రజబ్ మాసంలో రజబ్ కే కూండే అన్న పేరు మీద ఎన్నో షిర్క్ పనులు చేసుకుంటూ మనం ప్రవక్త విధానానికి ఎంత వ్యతిరేకం చేస్తున్నాము. ఎంతో మంది ఎవరైతే జషన్-ఎ-మేరాజ్-ఉన్-నబీ అని ఈ మేరాజ్-ఉన్-నబీ పేరు మీద రాత్రి జాగారం చేస్తారో, సంవత్సరంలో ఎన్ని నమాజులు వారు చేస్తున్నారు? ఆ రోజు వచ్చి ఎన్నో నఫిల్‌లు చేస్తారు కావచ్చు కానీ, మహాశయులారా! గమనించండి. మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గొప్ప బహుమానంగా ఏ విషయాలు అయితే ఈ ప్రయాణంలో పొందారో వాటిని మనం గౌరవించాలి, వాటిని మనం పాటించాలి, వాటిని ఎప్పుడూ కూడా తూచా తప్పకుండా, అందులో ఎలాంటి అశ్రద్ధ చేయకుండా వాటిని మనం పాటించాలి.

ఇంకా మహాశయులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడ హజ్రత్ జిబ్రీల్ అలైహిస్సలాం వారిని రెండవ సారిగా అతని యొక్క అసలైన రూపంలో చూశారు.

అక్కడే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మత్తుపానీయం మరియు పాలు మరియు తేనె మూడు విషయాలు ఇవ్వబడ్డాయి. ప్రవక్తా ఇదిగో తీసుకోండి, మీరు సేవించండి అన్నట్లుగా ఏ విషయాలు ఇవ్వబడ్డాయి? అల్లాహు అక్బర్! మత్తుపానీయం, మరియు పాలు, మరియు తేనె. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం తీసుకున్నారు? పాలు తీసుకున్నారు. సహీహ్ బుఖారీ, హదీథ్ నంబర్ 3887 లో ఈ ప్రస్తావన ఉంది.

మరియు ఏడవ ఆకాశంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బైతుల్ మఅమూర్ అని చూశారు. బైతుల్ మఅమూర్ ఏంటి? ఇహలోకంలో మన కొరకు బైతుల్లాహ్ ఎలానైతే ఉందో, కాబతుల్లాహ్, అలాగే దానికి స్ట్రెయిట్ గా ఏడు ఆకాశాల పైన బైతుల్ మఅమూర్ ఉంది. దైవదూతలు అక్కడ నమాజ్ చేస్తారు, దాని యొక్క తవాఫ్ చేస్తారు. ఒక్కసారి 70,000 మంది దైవదూతలు అక్కడ తవాఫ్ చేస్తారు, నమాజ్ చేస్తారు. మరియు ఒక్కసారి ఎవరికైతే ఈ అవకాశం దొరికిందో ప్రళయం వరకు మళ్ళీ వారికి ఈ అవకాశం దొరకదు. గమనించండి దైవదూతల సంఖ్య ఎంత గొప్పగా ఉందో. దీని ప్రస్తావన సహీహ్ బుఖారీలో ఉంది, హదీథ్ నంబర్ 3207.

ఇంకా మహాశయులారా, ఈ ప్రయాణంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజ్రత్ మూసా అలైహిస్సలాం వారిని కూడా చూశారు. అలాగే నరకం యొక్క కాపరి, మాలిక్ అతని పేరు, అతనిని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూశారు. ఈ ప్రయాణంలో ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వర్గాన్ని కూడా చూశారు, అలాగే నరకాన్ని కూడా దర్శించారు. ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వర్గం దర్శించారో అక్కడ చూశారు, వజ్రాలతో తయారు చేయబడినటువంటి అక్కడ గోపురాలు ఉన్నాయి. ఖైమా, ఇక్కడ ఏదైనా వాతావరణం చాలా సునాయాసంగా ఉండి, వేడి కూడా ఎక్కువ లేకుండా, చలి కూడా లేకుండా, మోసమ్-ఎ-రబీ అని ఏదైతే అంటారో మనం చూస్తాము కదా, ఎడారిలో డైరాలు వేసుకొని, ఖైమాలు వేసుకొని అక్కడ కొంత సమయం గానీ లేదా కొద్ది రోజులు గానీ గడుపుతారు. చూశారా కదా? అయితే అలాంటి ఖైమాలో వారికి ఎంత ఆనందం ఏర్పడుతుంది, అన్ని రకాల సౌకర్యాలు బహుశా అందులో ఉంటాయి కావచ్చు కానీ అస్తగ్ ఫిరుల్లాహ్, ఇది పోలిక కాదు స్వర్గంలో లభించే అటువంటి ఖైమాకు. కానీ అక్కడ ఒకే ఒక వజ్రం ఇంత పెద్దగా ఉంటుంది, ఆ ఒకే వజ్రంతో చాలా పెద్ద ఖైమాగా తయారు చేయబడుతుంది. మరియు అక్కడి యొక్క మట్టి కస్తూరి అని చెప్పడం జరిగింది. దీని యొక్క ప్రస్తావన బుఖారీ 349, అలాగే సహీహ్ ముస్లిం 163 లో వచ్చి ఉంది.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి స్వర్గంలో కౌథర్ అనేటువంటి ఒక పెద్ద వాగు ఏదైతే ప్రసాదించడం జరుగుతుందో దానిని కూడా చూసి వచ్చారు. అలాగే ఫిరౌన్ కూతురికి జడలు వేసే అటువంటి ఒక సేవకురాలు, ఆమె ఇస్లాం స్వీకరించింది, మూసా అలైహిస్సలాం ను విశ్వసించింది. దానికి బదులుగా ఫిరౌన్ ఆ దౌర్జన్యపరుడు, దుర్మార్గుడు ఏం చేశాడు? ఆమెను, ఆమె యొక్క నలుగురి సంతానాన్ని సలసల మసులుతున్న నూనెలో, వేడి నూనెలో వేసేశాడు. అయితే ఆమెకు స్వర్గంలో ఏ గొప్ప అక్కడ గృహం అయితే ప్రసాదించబడిందో, దానిని అక్కడి నుండి వస్తున్నటువంటి సువాసనను కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విషయం సహీహ్ ముస్నద్ అహ్మద్ లో వచ్చి ఉంది, జిల్ద్ 5, పేజ్ 30.

అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజ్రత్ జిబ్రీల్ అలైహిస్సలాం వారిని మరొక రూపంలో చూశారు. అల్లాహ్ తో భయపడుతూ ఎంత కంపించిపోయారంటే అతని యొక్క పరిస్థితి ఒక చాలా మాసిపోయిన లేదా పాడైపోయిన తట్టు గుంత ఎలా ఉంటుందో అతనిని చూస్తే అలా ఏర్పడింది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపారు. షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ ఈ హదీథ్ ను సహీహాలో ప్రస్తావించారు, 2289.

ఇంకా మహాశయులారా, హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని కూడా ఈ ప్రయాణంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కలిశారు. ఇబ్రాహీం అలైహిస్సలాం ప్రవక్తతో కలిసి ఏం చెప్పారు? ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీవు నా వైపు నుండి నీ అనుచర సంఘానికి సలాం తెలుపు. అల్లాహు అక్బర్. సల్లల్లాహు అలైహి వ ఆలా ఆలిహి వసల్లం. అల్లాహ్ త’ఆలా ఇబ్రాహీం అలైహిస్సలాం పై కూడా తన కరుణ, శాంతులు కురియజేయుగాక. గమనించండి. ఒకవేళ నేను, మీరు, మనందరము, ముస్లింలం అని అనుకునే వాళ్ళము, మేరాజ్-ఉన్-నబీ లాంటి బిదత్ పనులు, జషన్-ఎ-మేరాజ్ అని బిదత్ పనులు చేయకుండా నిజమైన ధర్మంపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొచ్చిన ధర్మంపై ఉండి ఉంటే ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క సలాం కూడా మనకు కలుగుతుంది. ఆయన ప్రత్యేకంగా సలాం పంపారు. ఇంకా ఏం చెప్పారు? ఓ ముహమ్మద్, నీ అనుచర సంఘానికి తెలుపు, ఈ స్వర్గం దీని యొక్క మట్టి ఇది చాలా మంచిది. ఇక్కడ విత్తనం వేసిన వెంటనే మంచి చెట్లు మరియు దానికి ఫలాలు వెంటనే అవుతూ ఉంటాయి. అట్లాంటి మట్టి ఇది. మరియు ఇక్కడి యొక్క నీరు కూడా చాలా మంచి నీరు. కానీ ఇప్పటివరకు అది ఎలాంటి చెట్టు లేకుండా ఉంది. అక్కడ చెట్టు మనకు కావాలంటే ఏం చేయాలి? నీ అనుచర సంఘానికి తెలుపు, సుబ్ హా నల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్ అధికంగా చదువుతూ ఉంటే అల్లాహ్ వారి కొరకు స్వర్గంలో మంచి చెట్లు నాటుతాడు, పరలోకంలో స్వర్గంలో చేరిన తర్వాత వారికి ఆ చెట్లు ప్రసాదించబడతాయి. అల్లాహు అక్బర్. ఏమైనా కష్టమా ఆలోచించండి? సుబ్ హా నల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్ చదవడం.

అలాగే మహాశయులారా, మరొక హదీథ్ లో ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇబ్రాహీం అలైహిస్సలాం వారు చెప్పారు, లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్ అధికంగా చదువుతూ ఉండమని చెప్పండి. ఈ హదీథ్ లు తిర్మిజీ మరియు ముస్నద్ అహ్మద్ లో వచ్చి ఉన్నాయి. షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ సహీహ్ అని చెప్పారు.

అలాగే నరకంని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దర్శించారు. నరకంలో ఏం చూశారు? నరకంలో ఒక చాలా భయంకరమైన దృశ్యం చూశారు. కొందరి యొక్క గోర్లు వారి యొక్క ఆ గోర్లు ఎలాంటివి? ఇత్తడివి. చాలా పొడుగ్గా ఉన్నాయి. వాటితో వారు తమ ముఖాలను, తమ శరీరాన్ని గీకుతున్నారు. తోలు బయటికి వచ్చేస్తుంది. వారి గురించి జిబ్రీల్ ను అడిగారు, ఈ పరిస్థితి వీరికి ఎందుకు జరుగుతుంది? అప్పుడు జిబ్రీల్ వీరికి తెలిపారు, వీరు ఎవరు తెలుసా? ప్రజల మానంలో, వారి యొక్క పరువులో చేయి వేసుకొని వారిని అవమానపరిచేవారు. అంటే పరోక్ష నిందలు, చాడీలు, గీబత్, చుగ్లీ, ఇంకా వాడు అలాంటి వాడు, వీడు ఇలాంటి వాడు అని వారిని నిందించడం, వారి యొక్క మానం, పరువులో జోక్యం చేసుకోవడం, ఇలా చేసుకునే వారికి ఈ శిక్ష జరుగుతుంది అని చెప్పడం జరిగింది. సునన్ అబూ దావూద్ లో హదీథ్ వచ్చి ఉంది, 4878 హదీథ్ నంబర్.

ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ ప్రయాణంలో ఇంకా ఎన్నో రకాల దృశ్యాలు చూశారు కానీ మనకు సమయం అనేది సరిపోదు గనుక ఒక ముఖ్యమైన విషయం ఇక్కడ మీకు తెలియజేస్తున్నాను. అదేమిటి? షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ సహీహాలో ప్రస్తావించారు, హదీథ్ నంబర్ 306.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గగన ప్రయాణం, ఈ మేరాజ్ ప్రయాణం నుండి తిరిగి వచ్చిన తర్వాత అక్కడి విషయాలు ప్రజలకు తెలుపుతున్నారు. ఎవరైతే సత్య విశ్వాసులో వారు తూచా తప్పకుండా నమ్మారు. కానీ అవిశ్వాసులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని హేళన చేశారు. ఏమని? మేము మక్కా నుండి ఫలస్తీన్ కు ఒక నెల రోజులు పడుతుంది మాకు పోవాలంటే. నీవు కేవలం ఫలస్తీన్ వరకే కాదు, ఏడు ఆకాశాల పైకి రాత్రిలోని కొన్ని క్షణాల్లో, కొంత సమయంలోనే వెళ్లి వచ్చావు అంటున్నావు అని హేళన చేశారు. అంతే కాదు, కొందరు అవిశ్వాసులు అయితే ఒకవేళ నీవు వాస్తవంగా ఫలస్తీన్ వెళ్లి, మస్జిద్-ఎ-అఖ్సా చూసి వచ్చావంటే దాని యొక్క వివరణ మాకు తెలుపు అని ఎన్నో ప్రశ్నలు అడిగారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఆ సందర్భంలో ఎప్పుడైతే వారు అడిగారో నాకు దాని వివరణ ఏమీ తెలియదు. కానీ ఆ మస్జిద్-ఎ-అఖ్సా యొక్క దృశ్యం అల్లాహ్ నా ముందుకు తీసుకొచ్చాడు. వారు అడిగిన ప్రతి దానికి, ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్పుకొచ్చాను. అల్లాహు అక్బర్.

అక్కడ ఆ సమయంలో అబూ బకర్ రదియల్లాహు త’ఆలా అన్హు లేరు. ఎక్కడో దూరంగా ఏదో పని మీద ఉన్నారు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి విషయాలు విన్న ఒక వ్యక్తి, “ఈరోజు అబూ బకర్, “ఎల్లవేళల్లో అబూ బకర్ ను చూశాము, ముహమ్మద్ చెప్పింది నిజమే, ముహమ్మద్ చెప్పింది నిజమే అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ముహమ్మద్ కు తోడుగా ఉన్నాడు కదా, ఈరోజు అబూ బకర్ కు వెళ్లి నేను తొందరగా ఈ విషయం తెలియజేస్తాను, అబూ బకర్ ఈ విషయాన్ని తిరస్కరిస్తాడు, అబద్ధం అని అంటాడు అన్నటువంటి నమ్మకంతో వెళ్లి, “అబూ బకర్! ఎవరైనా ఒక రాత్రిలో మక్కా నుండి ఫలస్తీన్ వెళ్లి వచ్చాడు అంటే నువ్వు నమ్ముతావా?” అంటే, “లేదు.” సంతోషం కలిగింది అతనికి. వెంటనే అన్నాడు, “మరి మీ స్నేహితుడు, మీ యొక్క గురువు ముహమ్మద్ అంటున్నాడు కదా?” సల్లల్లాహు అలైహి వసల్లం. అబూ బకర్ వెంటనే చెప్పారు, “నిజమా? ముహమ్మద్ ఈ మాట చెప్పారా?” సల్లల్లాహు అలైహి వసల్లం. అతను అన్నాడు, “అవును, ముహమ్మద్ ఈ మాట చెప్పాడు. అంతే కాదు, రాత్రిలోని కొంత భాగంలో ఫలస్తీన్ వరకే కాదు, మస్జిద్-ఎ-అఖ్సా కాదు, అక్కడి నుండి ఏడు ఆకాశాల పైకి కూడా వెళ్లారట.” వెంటనే అబూ బకర్ చెప్పారు, “ఒకవేళ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మాట చెప్పి ఉంటే నూటికి నూరు పాళ్లు నిజం, ఇది సత్యం, ఇందులో ఏ మాత్రం అనుమానం లేదు.” అతడే, ప్రశ్న అడిగినవాడు, అబూ బకర్ గురించి ఏదో తప్పుగా ఆలోచించి వచ్చినవాడు చాలా ఆశ్చర్యపోతాడు. “ఎలా నీవు ఇది నిజం నమ్ముతున్నావు?” అని అంటే, “నీకు ఇందులో ఏం అనుమానం? ప్రవక్త చెప్తారు నాకు పొద్దున వహీ వస్తుంది, సాయంకాలం వహీ వస్తుంది, అల్లాహ్ నుండి దైవదూత వస్తున్నాడు, నాకు ఈ సందేశం ఇచ్చారు, మేము అన్ని విషయాలను నమ్ముతున్నాము. ఒకవేళ అల్లాహ్ త’ఆలా తలుచుకొని ప్రవక్తని అక్కడి వరకు తీసుకువెళ్లాడంటే ఇందులో మాకు నమ్మని విషయం ఏమిటి?” అప్పుడే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సిద్దీఖ్, సత్యవంతుడు అన్నటువంటి బిరుదు లభించినది. సత్యవంతుడు అని బిరుదు లభించినది.

అందుకు మహాశయులారా, గమనించండి. సిద్దీఖ్ అన్నటువంటి బిరుదు హజ్రత్ అబూ బకర్ కు ప్రవక్తను అనుసరిస్తే లభించిందా? ప్రవక్తను నమ్మితే లభించిందా? లేదా అనుసరణ, ఆచరణ అన్నిటినీ వదులుకొని కేవలం ప్రేమ, ప్రేమ, ప్రేమ అని కేవలం నోటికి చెప్పుకుంటే లభించిందా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల అబూ బకర్ కు ఉన్నంత ప్రేమ ఇంకా ఎవరికీ లేకుండే. కానీ ఆయన అంతే అనుసరించేవారు. ప్రవక్త మాటను ఆచరించేవారు. ఈ గుణపాఠం మనం కూడా నేర్చుకోవాలి. ఆచరణ అనేది ఉండాలి ప్రవక్త సున్నత్ ప్రకారంగా, దురాచారాన్ని వదులుకోవాలి, బిదత్ లను వదులుకోవాలి, షిర్క్ లను వదులుకోవాలి. మరియు ఏదైతే నమాజులను వదులుతున్నామో అది వదలకూడదు. ఎందుకు? ఇదే సామాన్య విషయమా నమాజ్? ఎక్కడ దొరికింది నమాజ్ ప్రవక్తకు? ఆకాశాల పైకి పిలువబడి ఇవ్వబడినది. ఇంతటి గౌరవమైన విషయాన్ని మనం ఎంత సునాయాసంగా, ఎంత ఈజీగా వదులుతున్నాము. అల్లాహ్ త’ఆలా మనందరికీ మేరాజ్ ప్రయాణంలో ప్రవక్త గారు ఏ ఏ విషయాలు చూశారో, ఏ ఏ బహుమానాలు పొందారో, దాని గురించి కొన్ని విషయాలు ఏదైతే విన్నామో వాటిని అర్థం చేసుకొని, వాటిని పాటించే భాగ్యం ప్రసాదించుగాక. స్వర్గంలో తీసుకెళ్ళేటువంటి సత్కార్యాలు చేసే భాగ్యం ప్రసాదించుగాక. మరియు నరకంలో తీసుకెళ్ళే విషయాల నుండి దూరం ఉండే అల్లాహ్ త’ఆలా భాగ్యం కూడా మనకు ప్రసాదించుగాక.

జజాకుముల్లాహు ఖైర్. అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=5801



మహా ప్రవక్త జీవిత చరిత్ర: అర్రహీఖుల్‌ మఖ్ తూమ్ (పూర్తి పుస్తకం)

బిస్మిల్లాహ్
ప్రవక్త జీవిత చరిత్ర: అర్రహీఖుల్‌ మఖ్ తూమ్ (పూర్తి పుస్తకం)

[ఇక్కడ పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి] [PDF]
[ఫైల్ సైజు 135.5 MB]

మొబైల్ ఫ్రెండ్లీ వెర్షన్ బుక్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి [PDF]

[విషయ సూచిక డౌన్లోడ్ చేసుకోండి] [PDF] [14 పేజీలు]

యూట్యూబ్ ప్లే లిస్ట్ (అర్రహీఖుల్‌ మఖ్ తూమ్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV08AMT_PWrGUnIDGIMw8dtc

విషయసూచిక

(1) ఇస్లాం శుభోదయ సమయాన అరేబియా పరిస్థితి [PDF] [58p]

  1. అరేబియా నైసర్గిక స్వరూపం – జాతులు [PDF] [13p]
  2. అరబ్బు రాజ్యాలు – నాయకత్వాలు [PDF] [19p]
  3. అరేబియా మతాలు – ధర్మాలు [PDF] [15p]
  4. అజ్ఞాన కాలంనాటి అరబ్బుల సామాజిక తీరుతెన్నులు [PDF] [8p]

(2) ప్రవక్త ﷺ వంశావళి, జననం, నలబై ఏండ్ల పవిత్ర జీవని [PDF] [30p]

  1. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వంశావళి [PDF] [11p]
  2. శుభ జననం & నలబై ఏళ్ళ పవిత్ర జీవితం (ప్రవక్త పదవి ముందు) [PDF] [17p]

(3) మక్కా దైవదౌత్య జీవితం [PDF] [196p]

  1. దైవ దౌత్యపు ఛత్ర ఛాయల్లో ముహమ్మద్ ﷺ [PDF] [11p]
  2. సందేశ ప్రచారాదేశం – దాని అంతరార్థం [PDF] [5p]
  3. ప్రథమ దశ – దైవసందేశ ప్రచార యత్నం [PDF] [5p]
  4. రెండవ దశ – బహిరంగ దైవసందేశ ప్రచారం [PDF] [59p]
  5. సంపూర్ణ సంఘ బహిష్కరణ [PDF] [7p]
  6. అబూ తాలిబ్‌ను కలసిన ఖురైష్‌ చిట్టచివరి ప్రతినిధి బృందం [PDF] [4p]
  7. శోక సంవత్సరం [PDF] [5p]
  8. ప్రప్రథమంగా ఇస్లాం స్వీకరించిన వారి సహన సంయమనాలను పురికొల్పిన కారణాలు [PDF] [15p]
  9. తృతీయ దశ – మక్కాకు వెలుపల ఇస్లామ్‌ సందేశ ప్రచారం [PDF] [9p]
  10. ప్రముఖ వ్యక్తులు, వివిధ తెగల్లో ఇస్లామ్‌ ధర్మ ప్రచారం [PDF] [13p]
  11. ఇస్రా మరియు మేరాజ్‌ [PDF] [10p]
  12. ప్రథమ బైతె అఖబా [PDF] [7p]
  13. ద్వితీయ బైతె అఖబా [PDF] [11p]
  14. హిజ్రత్‌కు ఉపక్రమించిన ప్రథమ బృందాలు [PDF] [5p]
  15. దారున్నద్వాలో ఖురైషుల సమావేశం [PDF] [5p]
  16. హిజ్రత్‌ చేసి మక్కాను వీడిన దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) [PDF] [24p]

మదీనాలో గడిపిన పవిత్ర జీవితం

(4) మదీనా – మొదటి దశ [PDF] [306p]

  1. హిజ్రత్‌ నాటి మదీనా పరిస్థితులు [PDF] [11p]
  2. నవ సమాజ నిర్మాణం [PDF] [12p]
  3. యూదులతో జరిగిన ఒప్పందం [PDF] [2p]
  4. సాయుధ పోరాటాలు [PDF] [17p]
  5. బద్ర్ సంగ్రామం [PDF] [52p]
  6. బద్ర్ తరువాయి యుద్ద సన్నాహాలు [PDF] [25p]
  7. ఉహద్‌ పోరాటం (గజ్వయె ఉహద్‌) [PDF] [76p]
  8. ఉహద్‌ పోరాటం తరువాతి సైనిక చర్యలు [PDF] [20p]
  9. గజ్వయె అహఁఖాబ్  (అగడ్త యుద్ధం) [PDF] [33p]
  10. అహఁఖాబ్ మరియు ఖురైజా పోరాటాల తదుపరి సైనిక చర్యలు [PDF] [11p]
  11. గజ్వయె బనీయిల్‌ ముస్తలిక్‌ [PDF] [18p]
  12. గజ్వయెబనీ ముస్తలిక్‌ తరువాత చేపట్టిన సైనిక చర్యలు [PDF] [4p]
  13. హుదైబియా ఒప్పందం [PDF] [15p]
  14. హిజ్రత్‌ చేసి వచ్చిన మహిళల అప్పగింతను నిరాకరించడం [PDF] [9p]

(5) మదీనా – రెండవ దశ [PDF] [120p]

  1. క్రొత్త మార్పు [PDF] [26p]
  2. హుదైబియా ఒప్పందం తరువాతి సైనిక చర్యలు [PDF] [3p]
  3. గజ్వయె ఖైబర్‌; గజ్వయె వాదియిల్‌ ఖురా [PDF] [27p]
  4. గజ్వయె జాతుర్రిఖాఖ్‌ (జాతుర్రిఖాఖ్‌ యుద్ధం- హి.శ. 7) [PDF] [8p]
  5. ఉమ్రయె ఖజా [PDF] [6p]
  6. ‘మూతా’ పోరాటం [PDF] [12p]
  7. మక్కా విజయం [PDF] [38p]

(6) మదీనా – మూడవ దశ – ప్రవక్త జీవితంలోని చివరి దశ [PDF] [144p]

  1. గజ్వయె హునైన్‌ (హునైన్‌ యుద్ధం) [PDF] [20p]
  2. మక్కావిజయం తరువాతి సైనిక చర్యలు -ప్రభుత్వాధికారుల నియామకం [PDF] [9p]
  3. గజ్వయె తబూక్‌ (తబూక్‌ పోరాటం) [PDF] [20p]
  4. హిజ్రీ శకం 9 లో జరిగిన హజ్‌ [PDF] [2p]
  5. గజ్వాల (యుద్ధాల)పై ఓ సమీక్ష [PDF] [5p]
  6. దైవధర్మంలో తండోపతండాలుగా ప్రజల ప్రవేశం [PDF] [23p]
  7. ఇస్లామ్‌ ధర్మప్రచార సాఫల్యం – దాని ప్రభావాలు [PDF] [4p]
  8. హజ్జతుల్‌ విదా (చివరి హజ్‌) [PDF] [12p]
  9. చిట్టచివరి సైనిక యాత్ర [PDF] [2p]
  10. పరమాప్తుని వైపునకు ప్రస్థానం [PDF] [16p]
  11. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కుటుంబం [PDF] [14p]
  12. పరిపూర్ణ మూర్తిమత్వం [PDF] [16p]

మహా ప్రవక్త ﷺ జీవిత చరిత్ర – సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) సిగ్గు, బిడియం [ఆడియో & టెక్స్ట్]

హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) సిగ్గు, బిడియం
https://youtu.be/dZZa0Z0Oh8Y (3 నిముషాలు)
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, ఉస్మాన్ (రజియల్లాహు అన్హు) వారి యొక్క అత్యుత్తమ గుణమైన సిగ్గు, బిడియం (హయా) గురించి వివరించబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వయంగా ఉస్మాన్ (రజియల్లాహు అన్హు) వద్ద దేవదూతలు కూడా సిగ్గుపడతారని తెలిపిన ఒక సంఘటనను పేర్కొన్నారు. అబూబక్ర్ (రజియల్లాహు అన్హు), ఉమర్ (రజియల్లాహు అన్హు) వచ్చినప్పుడు సాధారణ స్థితిలో ఉన్న ప్రవక్త, ఉస్మాన్ (రజియల్లాహు అన్హు) రాకతో తమ వస్త్రాలను సరిచేసుకుని కూర్చోవడం ఆయన పట్ల గల గౌరవాన్ని, ఆయన సిగ్గు యొక్క స్థాయిని తెలియజేస్తుంది. అంతేకాకుండా, ఇస్లాం స్వీకరించిన నాటి నుండి తన కుడి చేతిని మర్మాంగాలకు తాకించలేదని ఉస్మాన్ (రజియల్లాహు అన్హు) స్వయంగా చెప్పిన విషయం ఆయన పవిత్రతకు నిదర్శనం. ఆయన అధికంగా ఖుర్ఆన్ పారాయణం చేసేవారని, చివరికి హంతకుల చేతిలో హత్యకు గురయ్యే సమయంలో కూడా ఖుర్ఆన్ పారాయణంలోనే నిమగ్నమై ఉన్నారని వివరించబడింది.

సోదర సోదరీమణులారా! ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి యొక్క ఉత్తమ గుణం, బిడియం, సిగ్గు, లజ్జ దీని గురించి మనం తెలుసుకుంటున్నాము. అందరికంటే ఎక్కువ హయా ఉస్మాన్ రజియల్లాహు అన్హు గలవారని స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాక్ష్యం పలికారు.

ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ ఇంట్లో కూర్చుని ఉన్నారు. ఒక మెత్తకు ఇలా ఆనుకొని, తన ఈ మోకాళ్ళను ఇలా నిలబెట్టి ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ లుంగీ లేదా వస్త్రం అయితే ధరించి ఉన్నారో అది ఇంచుమించు మోకాళ్ళకు దగ్గరగా వచ్చి పిక్క కనబడుతూ ఉన్నది. ఈ స్థితిలో కూర్చుండి ఉన్నారు. కొంతసేపట్లో హజరత్ అబూబకర్ సిద్దీఖ్ రజియల్లాహు అన్హు వచ్చారు. లోపలికి రావడానికి అనుమతి కోరారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అదే స్థితిలో కూర్చుండి ఉన్నారు, అబూబకర్ రావడానికి అనుమతి ఇచ్చారు. అబూబకర్ వచ్చి ఒక పక్కన కూర్చున్నారు.

మరికొంత సేపటికి హజరత్ ఉమర్ వచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అదే స్థితిలో కూర్చుని ఉన్నారు, హజరత్ ఉమర్ అనుమతి కోరారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుమతి ఇచ్చారు. హజరత్ ఉమర్ లోపలికి వచ్చి ఓ పక్కన కూర్చున్నారు, ప్రవక్త అలాగే ఉన్నారు. మరికొంత సమయం గడిచిన తర్వాత హజరత్ ఉస్మాన్ వచ్చారు. లోపలికి రావడానికి అనుమతి కోరారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ వస్త్రాన్ని మరింత కిందికి దించుతూ, ఒక సరియైన రీతిలో కూర్చుండి, ఉస్మాన్ కు రావడానికి అనుమతి ఇచ్చారు.వచ్చారు, మాట్లాడారు, వెళ్ళిపోయారు.

ఆ తర్వాత ఇంట్లో ఈ విషయాన్ని గమనించిన భార్య, అబూబకర్ వచ్చినప్పుడు మీరు అలాగే కూర్చుండి ఉన్నారు, ఉమర్ వచ్చినప్పుడు మీరు అలాగే కూర్చుండి ఉన్నారు, కానీ ఉస్మాన్ ఎప్పుడైతే వచ్చి అనుమతి కోరాడో మీరు మీ వస్త్రాన్ని సరిచేసుకుంటూ, మరి కిందికి దించుకుంటూ, మీ కూర్చుండే స్థితిని మార్చి, మరి మీరు అనుమతించారు, ఎందుకు ఇలా అని అడిగినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, “ఏ ఉస్మాన్ తోనైతే దేవదూతలు సిగ్గు పడుతున్నారో ఆ ఉస్మాన్ తో నేను సిగ్గుపడనా?“

అయితే ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే ఉస్మాన్ రజియల్లాహు అన్హు సహాబాలలో అందరికంటే ఎక్కువగా సిగ్గు, బిడియం గలవారు. మరియు స్వయంగా ఆయన ఒక సందర్భంలో తెలిపారు, “ఎప్పటి నుండి అయితే నేను నా ఈ కుడి చేతితో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేతిలో చెయ్యి వేసి శపథం చేశానో, ఇస్లాం స్వీకరించానో, బయఅత్ చేశానో, అప్పటినుండి నేను ఈ కుడి చెయ్యిని నా మర్మాంగానికి తాకనివ్వలేదు”

హజరత్ ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారిలో ఎన్నో రకాల ఉత్తమ గుణాలు ఉండినవి. ఆయన ఖుర్ఆన్ యొక్క పారాయణం చాలా అధికంగా చేసేవారు. చాలా అధికంగా చేసేవారు. మరియు చివరి సమయంలో, ఏ సమయంలోనైతే దుండగులు ఆయన్ని హతమార్చడానికి ప్రయత్నం చేశారో, ఆ సమయంలో కూడా ఆయన ఖుర్ఆన్ పారాయణం చేస్తూ ఉన్నారు, అదే స్థితిలో ఆ దుష్టులు, దుర్మార్గులు వచ్చి ఆయన్ని హతమార్చారు.


ఇతరములు:

మహా ప్రవక్త జీవిత చరిత్ర పాఠాలు [వీడియోలు]

బిస్మిల్లాహ్

పైన వీడియో ప్లే లిస్ట్ క్లిక్ చేస్తే మొత్తం వీడియోలు ప్లే అవుతాయి. విడి విడిగా టాపిక్ ప్రకారం కావాలనుకుంటే క్రింద ఇచ్చిన లింకుల మీద క్లిక్ చెయ్యండి.

మొత్తం వీడియోల వ్యవధి: దాదాపు 80 నిముషాలు 

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

పై వీడియోలు తో పాటు  క్రింది పుస్తకం చదవండి 

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) అంతిమ ప్రవక్త [పుస్తకం]
అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్

ఉమర్‌ బిన్‌ ఖత్తాబ్‌ ఇస్లాం స్వీకరణ వృత్తాంతం

బిస్మిల్లాహ్

ఉమర్‌ (రజియల్లాహు అన్హు) గారి ఇస్లాం స్వీకరణ వల్ల కూడా ముస్లిములకు గట్టి బలం, పటిష్టము లభించింది. హంజా (రజియల్లాహు అన్హు) ఇస్లాం స్వీకరణకు మూడు రోజుల తర్వాత ఇతను ఇస్లాం స్వీకరించారు. అది ఎలా అనగా: ఉమర్‌ (రజియల్దాహు అన్హు) ఓ రోజు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారిని హతమార్చే ఉద్దేశ్యంతో వెళ్ళాడు. దారిలో ఒక వ్యక్తి కలసి ‘ఎటు వెళ్ళుచున్నావు ఉమర్‌!’ అని అడిగాడు. దానికి అతడు ‘ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వస్లలం)ను హతమార్చుటకు వెళ్ళుచున్నాను’ అని సమాధానమిచ్చాడు. దానిపై అతడన్నాడు: ‘నీవు ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం)ను హతమారుస్తే బనూ హాషిం మరియు బనూ జుహా నిన్ను క్షేమంగా వదులుతారా?’ ఉమర్‌ అన్నాడు: ‘నీవు నీ తాతముత్తాతల మతాన్ని వదలి కొత్త మతాన్ని స్వీకరించినట్లున్నావు’? అతడన్నాడు: ‘దీనికంటే మరీ విచిత్రమైన విషయం చెప్పాలా ఉమర్‌! నీ చెల్లి మరియు బావ ఇద్దరూ ఇస్లాం స్వీకరించారు. తాతముత్తాతల మతాన్ని వదిలేశారు’.

ఉమర్‌ అక్కడి నుండి చాలా కోపంగా వెళ్ళి చెల్లిలి ఇంటికి వచ్చాడు. అప్పుడు ఖబ్బాబ్‌ బిన్‌ అరత్త్‌ (రజియల్లాహు అన్హు) వారింట్లో ఉన్నాడు. ఖుర్‌ఆన్‌ లోని సూర తాహా వ్రాసిఉన్న పత్రం అతని వద్ద ఉంది. అతను వారికి ఆ సురా నేర్పుతున్నాడు. ఉమర్‌ వస్తున్నది గమనించిన ఖబ్బాబ్‌ (రజియల్లాహు అన్హు) ఇంట్లో ఓ మూలకు దాగిపోయాడు. ఉమర్‌ చెల్లి ఫాతిమా ఆ పత్రాన్ని దాచిపెట్టింది. ఉమర్‌ ఇంటికి సమీపంలో చేరినప్పుడే ఖబ్బాబ్‌ (రజియల్లాహు అన్హు) ఖుర్‌ఆన్‌ పారాయణాన్ని విన్నాడు. లోనికి ప్రవేశించిన వెంటనే ‘నేను మీ ఇంట్లో విన్నదేమిటి? అని అడిగాడు. ‘ఏమి లేదు, అట్లే మాట్లాడుకుంటూ ఉంటిమి’ అని వారిద్దరు అన్నారు. ఉమర్‌ అన్నాడు: బహుశా మీరిద్దరు పాత మతాన్ని విడనాడి కొత్త ధర్మం స్వీకరించారు కదూ? బావ చెప్పాడు: ‘ఉమర్‌! ఒకవేళ సత్వం అన్నది నీ మతంలో కాకుండా వేరే ధర్మంలో ఉంటే ఏమిటి మీ ఆలోచనా?’ దానిపై ఉమర్‌ అతడ్ని చాలా చితకబాదాడు. అంతలోనే చెల్లి వచ్చి ఉమర్‌ ను భర్త మీది నుండి పక్కకు జరపబోయింది. ఉమర్‌ ఆమెను సయితం కొట్టి రక్తసిక్తం చేసేశాడు. ఆమె ముఖం ద్వారా రక్తం కారడం మొదలయింది. అదే కోపంలో ఆమె ఇలా అంది: “అష్‌హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్‌, వ అష్‌ హదు అన్న ముహమ్మదర్‌ రసూలుల్లాహ్‌“. అంటే సత్య ఆరాధ్యుడు అల్లాహ్‌ తప్ప ఎవడు కాడని మరియు ముహమ్మద్‌ అల్లాహ్‌ యొక్క సత్య ప్రవక్త అని సాక్ష్యమిచ్చుచున్నాను.

ఉమర్‌ రక్తసిక్తమైన చెల్లిని చూసి చాలా సిగ్గు పడ్డాడు. ‘మీ వద్ద ఉన్న పుస్తకం ఏది? ఇవ్వండి’ అని అడిగాడు. చెల్లి చెప్పింది: నీవు అపరిశుద్దునివి, దీని పరిశుద్ధులు ముట్టుకుంటారు’ లేచి స్నానం చేసుకో’. ఉమర్‌ లేచి, స్నానం చేసి, పుస్తకం తీసుకొని బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం చదివి ‘చాలా మంచి పేర్లున్నాయి’ అని చెప్పాడు. మళ్ళి సూర తాహా మొదటి నుండి 14వ ఆయతు (నిశ్చయంగా, నేనే అల్లాహ్‌ను! నేను తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు, కావున నన్నే ఆరాధించు మరియు నన్ను స్మరించడానికి నమాజును స్థాపించు) వరకు చదివి, ఈ మాట ఎంత బావుంది మరెంత గౌరవప్రదంగా ఉంది, ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎక్కుడున్నాడో దారి చూపండి’ అని అన్నాడు.

ఉమర్‌ యొక్క ఈ మాటను విన్న ఖబ్బాబ్‌ (రజియల్లాహు అన్హు) లోపలి నుండి బైటికి వచ్చి “సంతోషించు ఉమర్‌! “అల్లాహ్‌! ఉమర్‌ బిన్‌ ఖత్తాబ్‌ లేదా అబూ జహల్‌ బిన్‌ హిషామ్‌ ద్వారా ఇస్లాంను బలపరుచు” అని ప్రవక్త చేసిన దుఆ అంగీకరించబడిందని ఆశిస్తున్నాను’ అని అన్నాడు.

ఆ తర్వాత ఉమర్‌ (రజియల్లాహు అన్హు) తన కరవాలాన్ని తీసుకొని ప్రవక్త వైపునకు బయలుదేరాడు. తలుపును తట్టాడు. ఒక వ్యక్తి తలుపు సందుల్లో నుండి చూశాడు. ఉమర్‌ కరవాలం ధరించి ఉండడాన్ని గమనించి, లోపలున్న ప్రజలకు తెలిపాడు. వారు దిగ్భ్రాంతి చెందారు. అప్పుడు ప్రవక్త లోపలి గదిలో ఉన్నారు. అక్కడే దగ్గర ఉన్న హంజా (రజియల్లాహు అన్హు) ప్రజలను గమనించి ఏమిటి సంగతి? అని అడిగాడు. ఉమర్‌ అని వారన్నారు. అప్పుడు హంజా (రజియల్లాహు అన్హు) అన్నారు: ‘అతని కొరకు ద్వారం తెరవండి. అతను సదుద్దేశ్యంతో వచ్చాడా అది అతనికి లభించుటకు సహాయపడదాము. ఒకవేళ ఏదైనా దురుద్దేశ్యంతో వచ్చాడా అతని కరవాలంతో అతడ్ని హతమార్చుదాము’. ఉమర్‌ లోనికి ప్రవేశించి ఇస్లాం స్వీకరించానని చాటి చెప్పాడు. వెంటనే అక్కడ ఉన్నవారందరూ ఏకంగా మరియు పెద్ద శబ్దముతో అల్లాహు అక్బర్‌ అని అన్నారు. ఆ శబ్దాన్ని మస్జిదె హరాంలో ఉన్నవారు విన్నారు.

సుహైబ్‌ రూమి (రజియల్లాహు అన్హు) ఇలా తెలిపారు: ‘ఉమర్‌ (రజియల్లాహు అన్హు) ఇస్లాంలో ప్రవేశించినప్పటి నుండి ఇస్లాం బలంగా, గౌరవంగా ఉంది. దాని వైవు బహిరంగంగా పిలవడం జరిగింది. మేము కాబా వద్ద కూర్చోగలిగాము మరియు దాని ప్రదక్షిణం (తవాఫ్‌) చేయగలిగాము’.

అబ్దుల్లాహ్ బిన్‌ మస్‌ఊద్‌ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు? ‘ఉమర్‌ (రజియల్లాహు అన్హు) ఇస్లాం స్వీకరించినప్పటి నుండి మేము గౌరవంగా జీవించగలిగాము’.


ఇది క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది:

ముహమ్మద్ – అంతిమ ప్రవక్త (Muhammad, the final Prophet)
అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia)
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)

సూరహ్ అల్ కౌసర్: అనువాదం, వ్యాఖ్యానం [ఆడియో]

బిస్మిల్లాహ్

సూరహ్ పరిచయం

ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో ౩ ఆయతులు ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్‌ (సల్లలాహు అలైహి వ సల్లం)కు అల్లాహ్‌ ప్రసాదించిన అనుగ్రహాలను ఈ సూరాలో ముఖ్యంగా ప్రస్తావించడం జరిగింది. మొదటి ఆయతులో వచ్చిన ‘కౌసర్‌‘ (సమృద్ధి) అన్న పదాన్నే ఈ సూరాకు పేరుగా పెట్టడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్‌ (సల్లలాహు అలైహి వ సల్లం)కు ప్రసాదించబడిన అసంఖ్యాక అనుగ్రహాలను ప్రస్తావిస్తూ, అల్లాహ్‌ను కొనియాడాలని, ఆయనకు కృతజ్ఞత చూపాలని బోధించడం జరిగింది. అవిశ్వాసుల వైరం, వారి గర్వం ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)ను ఏమాత్రం నష్టపరచలేవని హామీ ఇవ్వడం జరిగింది.

[అహ్సనుల్ బయాన్ నుండి]


ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (38 నిముషాలు)

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా


సూరతుల్ కౌసర్ – 108 

ఇది మక్కాలో అవతరించినది. దీనిలో మూడు ఆయతులున్నాయి. [1]

అనంత  కరుణామయుడూ, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో … బిస్మిల్లా హిర్రహ్మానిర్రహీమ్ بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ
1. (ప్రవక్తా) మేము నీకు కౌసర్ (సరస్సు) [2] ను ప్రసాదించాము. ఇన్నా  అఅతైనా కల్ కౌసర్ إِنَّا أَعْطَيْنَاكَ الكَوْثَرَ
2. కనుక నీవు నీ ప్రభువు కొరకు నమాజు చెయ్యి మరియు ఖుర్బానీ చెయ్యి.[3] ఫశల్లి లి రబ్బిక వన్ హర్ فَصَلِّ لِرَبِّكَ وَانْحَرْ
3. నిస్సందేహంగా నీ శత్రువే నామరూపాలు లేకుండా నశించిపోతాడు.[4] ఇన్న షానిఅక హువల్ అబ్తర్ إِنَّ شَانِئَكَ هُوَ الأَبْتَرُ

క్రింద నోట్స్ అహ్సనుల్ బయాన్ నుండి :

[1] ఈ సూరాను సూరత్ అన్ నహ్ర్ గా కూడా వ్యవహరిస్తారు.

[2] కౌసర్ అనే పదం బహుళార్ధకాలకు సంకేతం. దీని అర్ధాలు కూడా అనేకం. ఇబ్నె కసీర్‌ గారు “అత్యధిక శుభాలు” అన్న అర్దానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకంటే ఇతరత్రా అర్దాలు కూడా ఈ పదంలో ఇమిడి ఉన్నాయి. ఉదాహరణకు ప్రామాణిక హదీసులలో వచ్చిన వివరాల ప్రకారం కౌసర్‌ అనేది స్వర్గంలో మహాప్రవక్త ముహమ్మద్‌ (సల్లలాహు అలైహి వ సల్లం)కు వొసగబడే ఒక కాలువ. మరికొన్ని హదీసులలో కౌసర్‌ అనేది ఒక సరస్సు అని, విశ్వాసులు స్వర్గంలో ప్రవేశించేముందు మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చేతుల మీదుగా ఆ సరస్సు నీరును త్రాగుతారని, ఆ సరస్సులోకి వచ్చే నీరు కూడా స్వర్గంలోని ఆ కాలువకే చెందింది అయి ఉంటుందని తెలుపబడింది. అలాగే ఇహలోకంలో మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) వారికి లభించిన విజయాలు, కీర్తి ప్రతిష్టలు, పరలోకంలోని పుణ్యఫలాలు – ఇవన్నీ ఈ “అత్యధిక శుభాలు” లోకి వచ్చేస్తాయి. (ఇబ్నె కసీర్‌).

[3] అంటే నమాజు కూడా కేవలం ఒక్కడైన అల్లాహ్‌ కొరకే చేయాలి. ఖుర్బానీ కూడా ఒక్కడైన ఆ అల్లాహ్‌ పేరిటే ఇవ్వాలి. బహుదైవారాధకుల మాదిరిగా ఈ ఖుర్బానీలో ఇతరులను భాగస్వాములుగా చేర్చరాదు. ‘నహ్ర్‘ అంటే ఒంటె గొంతుపై ఈటెతోగానీ, కత్తితోగానీ కొట్టి, ఆ తరువాత దానిని ‘జిబహ్‌‘ చేయటం అని అసలు అర్థం. అయితే ఇతర పశువులను మాత్రం నేలపై పరుండబెట్టి గొంతు కోయటాన్ని ‘జిబహ్‌’గా వ్యవహరిస్తారు. కాని ఈ ఆయతులో ‘నహ్ర్’ అంటే అసలు సిసలు అర్థం ఖుర్బానీ. ఇక ఇతరత్రా దానధర్మాలుగా పశువును ఖుర్బానీ చేయటం, హజ్‌ సందర్భంగా “మినా” పర్వత లోయలో పశువును ఖుర్బానీ చేయటం, బక్రీద్‌ పండుగ సందర్భంగా ఖుర్బానీ ఇవ్వటం – ఇవన్నీ ఇందులో అంతర్భాగాలే.

[4] “అబ్‌తర్‌‘ అంటే తోక తెగటం అని అసలు అర్ధం. ఒకరి వంశపరంపర ముందుకు సాగకుండా ఆగిపోయిన వారిని, పేరు కూడా ప్రస్తావించకుండా వదిలివేసిన అనామకులను ‘అబ్‌తర్‌’గా వ్యవహరిస్తారు. మహాప్రవక్త ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) వారి మగపిల్లలు చనిపోవటం గమనించిన కొంతమంది అవిశ్వాసులు ఆయన్ని ‘అబ్‌తర్‌’గా అవహేళన చేయసాగారు. అప్పుడు అల్లాహ్ ఆయన్ని (సల్లలాహు అలైహి వ సల్లం) ఓదారుస్తూ ఈ వాక్యాలను అవతరింపజేశాడు –

“ఓ ముహమ్మద్‌ (సల్లలాహు అలైహి వ సల్లం) నీవు అనామకుడవు కావు. నీ విరోధులే అనామకులవుతారు” అని ధైర్యం చెప్పాడు. మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఆడపిల్లల ద్వారానే అల్లాహ్ ఆయన సంతతికి ప్రపంచంలో గొప్ప కీర్తి ప్రతిష్టల్ని ప్రసాదించాడు. ఒకవిధంగా చెప్పాలంటే ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) అనుచర సమాజమంతా ఆయన బిడ్డల్లాంటివారే. వారి సంఖ్యాబలంపై ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) ప్రళయదినాన గర్వపడతారు. అదీగాక ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) గౌరవమర్యాదలను అల్లాహ్ ఎంతగానో పెంచాడు. లోకమంతా నేడు ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) పేరును ఎంతో భక్తితో, వినయంతో ప్రస్తావిస్తుంది. ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం)పై శాంతీశుభాలు కురవాలని లోకవాసులంతా ప్రార్థిస్తారు. అదే సమయంలో మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) శత్రువులు చరిత్రపుటలకే పరిమితం అయిపోయారు. ఒకవేళ ఎవరయినా వారి ఊసు ఎత్తినా వారిని దుష్టులుగానే చూస్తారుగాని మంచివారుగా చూడరు.

దరూద్ చదవండి ప్రవక్త సిఫారసు పొందండి [వీడియో]

బిస్మిల్లాహ్

[1 నిమిషం వీడియో]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Video Courtesy: Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.

ఉదయం పదిసార్లు, సాయంత్రం పదిసార్లు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై దరూద్ పఠిస్తే, (ప్రళయ దినాన) ఆయన సిఫారసు భాగ్యం లభిస్తుంది.

عَنْ أَبِي الدَّرْدَاءِ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ ﷺ: «مَنْ صَلَّى عَلَيَّ حِيْنَ يُصْبِحُ عَشْرًا وَحِيْنَ يُمْسِي عَشْرًا أَدْرَكَتْهُ شَفَاعَتِي يَوْمَ الْقِيَامَةِ». رَوَاهُ الطَّبَرَانِي

హజ్రత్ అబూదర్దా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “ఎవరయితే ఉదయం పదిసార్లు, సాయంత్రం పదిసార్లు నాపై దరూద్ పఠిస్తారో, ప్రళయ దినాన వారికి నా సిఫారసు లభిస్తుంది“.(తబ్రానీ-హసన్) [అల్ బానీగారి ఫజ్లుస్సలాతి అలన్నబియ్యి గ్రంథం. 11వ హదీసు]

ఇతరములు: