ప్రియమైన అమ్మకు .. [పుస్తకం]

సంకలనం: నసీమ్ గాజీ

[ఇక్కడ పుస్తకం చదవండి / డౌన్లోడ్ చేసుకోండి]
https://teluguislam.net/wp-content/uploads/2022/03/priyamaina-ammaku-teluguislam.net-mobile-friendly.pdf
[20 పేజీలు] [PDF] 

అపార కృపాశీలుడు అనంత కరుణామయుడయిన అల్లాహ్‌ పేరుతో

ఈ ఉత్తరం ఇప్పటికి దాదావు ఇరవై సంవత్సరాల క్రితం వ్రాశాను. అప్పుడు నేను ఒక ధార్మిక పాఠశాల, జామియతుల్‌ ఫలాహ్‌, బిలేరియా గంజ్‌ (ఆజమ్‌గడ్ జిల్లా)లో విద్యనభ్య సిస్తున్నాను. ఆ కాలంలో అప్పుడప్పుడు ఇంటికి కూడా వెళ్ళేవాడిని. ఇస్లాం స్వీకారానికి పూర్వం నేను హిందూ సమాజంలోని అగర్వాల్‌ కుటుంబానికి చెందినవాడిని. మా నాన్నగారు మరణించినప్పుడు నా వయస్సు తొమ్మిది సంవత్సరాలు. ఒక రోజు ఇస్లాం స్వీకరించే భాగ్యం నాకు లభిస్తుందన్నది నా ఊహకు కూడా అందని విషయం. మా పెద్దన్నయ్య మా కుటుంబ పెద్ద. ఇస్లాం విషయంలో ఆయన నాతో ఏకీభవించేవారు గనక, ఆయన ద్వారా నాకు ప్రోత్సాహమే లభించింది కాని ప్రతికూలం ఎదురవ్వలేదు. అయితే అమ్మ విషయం మాత్రం అందుకు భిన్నంగా ఉండేది. నేను ఇస్లాం స్వీకరించడం ఆమె సుతరామూ ఇష్టపడలేదు. ఆమెను అన్నింటి కంటే ఎక్కువగా బాధించిన విషయం ఏమంటే నేనామెకు దూరంగా ఒక ధార్మిక పాఠశాలలో చేరాను. అప్పటికీ నేను తరచూ ఇంటికి వెళ్ళివచ్చేవాడిని. అమ్మ కూడా ఈ మహా వరప్రసాదాన్ని గ్రహించాలని సహజంగానే నేను మనసారా కోరుకునేవాణ్ణి. ఆమె మటుకు వీలయినంత త్వరగా నేను ఇస్లాంను వదిలేసి పాత ధర్మం వైవుకు తిరిగిరావాలని కోరుకునేది. వాస్తవానికి ఆమెకు నాపైగల అమితమైన మమతానురాగాల కారణంగా నా ఈ చేష్ట ఆమెకు నచ్చలేదు. ఆమె మానసికంగానూ, ఆధ్యాత్మికంగానూ ఆవేదనకు గురయింది. ఇది స్వాభావికమే. ఇస్లాం బోధనలు ఆమెకు విశదంగా తెలియవు. ముస్లిముల జీవితాలు ఇస్లామ్‌కు పూర్తిగా భిన్నంగానే కాక ఇస్లామ్‌ పట్ల ఏవగింపు కలుగజేసేవిగా కనిపిస్తున్నాయి. అందువల్ల అమె హృదయంలో ఇస్లామ్‌ కొరకు ఏ మాతం చోటు లేదు. నా గురించి ఆమెలో రకరకాల ఆలోచనలు తలెత్తేవి, ఇతరులూ బహు విధాలుగా రేకెత్తించేవారు. ఈ లేఖలో కొన్నింటిని పేర్కొన్నాను. నేను వీలైనంతవరకు ఆమె సందేహాలను, సంశయాలను దూరం చేయడానికి, ఇస్లాం బోధనల్ని, విశదపరచడానికి ప్రయత్నించేవాడిని. ఈ ప్రయత్నం ఒక్కో సారి సంభాషణ ద్వారాను, మరోసారి ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారాను కొనసాగేది.

నేను జన్మించిన తరువాత హైందవ ఆచారం ప్రకారంగా మా వంశ గురువులవారు, నా హస్తరేఖలు, నా జాతకం చూసి నా భవిష్యత్తు గురించి అనేక విషయాలు మా అమ్మకు చెప్పారు. ఆందులో ఒకటి, “నీ కొడుకు నీకు కాకుండా పోతాడ”న్నది. నేను ఇస్లాం స్వీకరించిన తరువాత ఆచార్యులవారు జోస్యం నిజమయినట్లుగా ఆమెకు అగుపడసాగింది. ఆ విషయాన్ని ప్రస్తావించి ఆవిడ నాకు నచ్చజెప్పడానికి ప్రయత్నించేది.

ఇస్లాంలో మంచి అన్నదేదీ లేకపోయినా, నా కొడుకు మౌలానాగారి వలలో చిక్కుకున్నాడు అనే విషయం ఆమె హృదయంలో బాగా నాటుకుపోయింది. ఈ లేఖలో ఆమెకున్న ఈ అపోహను దూరం చేయడానికీ ప్రయత్నించాను. దాంతో పాటు ఇస్లాం వైవుకు కూడా అమెను ఆహ్వానించాను. నా ఉద్ధేశ్యం, ఇస్లాం పట్లను , నా పట్లను కేవలం ఆమెకున్న అపోహల్ని, అపార్ధాలను దూరం చెయ్యడమే కాదు. ఈ సత్యాన్ని ఆమె కూడా స్వీకరించి, దైవ ప్రసన్నత పొంది, స్వర్గానికి అర్హురాలు కావాలని, నరకాగ్ని నుండి ఆమె రక్షింపబడాలి అన్నది నా ప్రగాఢ వాంఛ, కృషి కూడా.

ఈ లేఖ చదివిన తరువాత ఆమెలో భావ తీవ్రత కాస్త్ర తగ్గినా, తన పూర్వీకుల మతం వదలడానికి మాతం ఆమె సిద్ధం లేదు. నేను ఆమెకు నచ్చజెప్పడానికి సతతం ప్రయత్నం చేస్తుండేవాడిని. ఆమె హృదయ కవాటాలు సత్యం కొరకు తెరచుకోవాలని అల్లాహ్ ను వేడుకునే వాణ్ణి కూడా. దాదాపు మూడు సంవత్సరాల ఎడతెగని కృషి తరువాత అల్లాహ్ అనుగ్రహం కలిగింది. ఆమెకు సత్యధర్మానికి స్వాగతం పలికే బుద్ధి కలిగింది. తన పురాతన ప్రవర్తనకు పశ్చాత్తాప్పడింది. నా మాతృమూర్తి నేడు ఇస్లామ్‌ పై సుస్థిరంగా, సంతృప్తిగా ఉంది. ఆమెకు ఇస్లాం పట్ల కలిగిన అవ్యాజాభిమానానికి తార్కాణంగా అనేకసార్లు ఖురాన్ లాంటి ఉద్గ్రంధం, హిందీ అనువాదాన్ని అనేకసార్లు అధ్యయనం చేసింది. నేడు, ప్రజలు ఇస్లాం ను అర్ధం చేసుకునే ప్రయత్నం చెయ్యాలని, ముస్లిమ్‌లు తమ జీవితంలో ఇస్లాం ను పూర్తిగా అనుసరించాలని, ఇస్లామ్‌ పట్ట ప్రబలిపోయిన అపోహలను దూరం చేసి, ఇస్లామ్‌ బోధించే మహత్తర శిక్షణల్ని సామాన్య ప్రజలకు చేరవేయాలని ఆమె ఆవేదన చెందుతూ. ఉంటులది.

ఇదో వ్యక్తిగత లేఖ. దీన్ని ప్రచురించడం మూలాన సత్యప్రేమికుల ఆత్మలకు సన్మార్గ దర్శనం జరగాలని, మనం సత్యధర్మంపై స్ధిరంగా నిలబడగలగాలని, మృత్యువు సంభవించే వరకు ఇస్లామ్‌నే అనుసరించగలగాలని ఆకాంక్షిస్తూ అల్లాహ్‌ను వేడుకుంటున్నాను.

నసీమ్‌ గాజి
జూన్‌: 1980

కితాబ్ అత్-తౌహీద్ (ఏక దైవారాధన) – ముహమ్మద్ ఇక్బాల్ కైలానీ [పుస్తకం]

రచయిత: ముహమ్మద్ ఇక్బాల్ కైలానీ
అనువాదం: అబ్దుల్ బాసిత్ ఉమరీ
హదీసు పబ్లికేషన్స్, హైదరాబాద్ ఎ. పి., ఇండియా

[ఇక్కడ పుస్తకం చదవండి / డౌన్లోడ్ చేసుకోండి]
https://teluguislam.net/wp-content/uploads/2022/03/kitab-at-tawheed-iqbal-kailani-mobile-friendly.pdf
[194 పేజీలు] [PDF] [మొబైల్ ఫ్రెండ్లీ]

విషయ సూచిక

  1. తొలిపలుకులు [PDF] [84p]
  2. సంకల్ప ఆదేశాలు [PDF] [2p]
  3. అల్లాహ్ యొక్క ఏక దైవత్వం పట్ల విశ్వాసం కలిగి ఉండటం [PDF] [7p]
  4. అల్లాహ్ యొక్క ఏక దైవత్వం పట్ల విశ్వాసం- దాని ప్రాముఖ్యత [PDF] [4p]
  5. దివ్య ఖుర్ఆన్ – అల్లాహ్ యొక్క అద్వితీయత [PDF] [9p]
  6. అల్లాహ్ యొక్క ఏక దైవత్వం పట్ల విశ్వాసం – దాని వివరణ దాని రకాలు [PDF] [2p]
  7. అల్లాహ్ ఒక్కడే సత్య దేవుడు [PDF] [5p]
  8. అల్లాహ్ ఒక్కడే సర్వ విధాల ఆరాధనలకు, అన్ని రకాల పూజలకు అర్హుడని విశ్వసించటం [PDF] [13p]
  9. అల్లాహ్ తన సద్గుణ విశేషణాల యందు అద్వితీయుడని విశ్వసించటం [PDF] [21p]
  10. దైవత్వంలో అల్లాహ్ కు సాటి కల్పించటం – దాని రకాలు [PDF] [3p]
  11. దివ్య ఖుర్ఆన్ ద్వారా షిర్క్ ఖండన [PDF] [11p]
  12. ప్రవక్తగారి ప్రవచనాల ద్వారా షిర్క్ ఖండన [PDF] [7p]
  13. చిన్న షిర్క్ వివరాలు [PDF] [6p]
  14. నిరాధార, కల్పిత వచనాలు [PDF] [4p]

డౌన్లోడ్ ఇస్లాం తెలుగు పుస్తకాలు (Telugu Islamic Books):
https://telugusialm.net/?p=4259

ఉసూలె సలాస (త్రి సూత్రాలు) [పుస్తకం, వీడియో పాఠాలు] [మర్కజ్ దారుల్ బిర్ర్]

బిస్మిల్లాహ్


Usool-Thalatha & Qawaid-al-Arba
Shaykh Muhamamd bin AbdulWahhab (rahimahullah)
మూల రచయిత షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హాబ్
అనువాదం: అబ్దుల్ గఫ్ఫార్ ఉమ్రి (హఫిజహుల్లాహ్)

[Download the Book]
[ఇక్కడ పుస్తకం చదవండి / డౌన్లోడ్ చేసుకోండి]

[47 పేజీలు] [PDF] [మొబైల్ ఫ్రెండ్లీ]

వీడియో పాఠాలు:

[క్రింద పూర్తి పుస్తకం చదవండి]

మనవి 

పరలోక సాఫల్యం పొందాలంటే ఇహలోకంలో విశ్వాసాల పునాదులు పటిష్టంగా ఉండాలి. మన కర్మలు ఆ పునాదులపై ఆధారపడి వుంటాయి. అందువలన విశ్వాసాల పటిష్టతకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణంగా దీని పై శ్రద్ధ వహించని వారి శాతమే ఎక్కువ. అనువదించబడిన ఈపుస్తకం విశ్వాసాల పటిష్టతకు ఒక మైలురాయి. 

పాఠకులారా.. 

12వ శతాబ్ధము నాటికి ముస్లింల ధార్మిక జీవనశైలి చెదిరిపోయింది. ఏధర్మం మూలంగా వారికి సన్మార్గము లభించిందో ఆదే ధర్మంలో షైతాన్ తన సమూహంతో విశ్వాసాల రూపురేఖలను మార్చి ముస్లింల హృదయాలను అనాచారాల (ఇస్లాం అనుసరణాచారాలకు వ్యతిరేకంగా) కు లోబరుచుకున్నాడు. పుణ్యాత్ములను ఆరాధించటం, సమాధులను దర్శించటం (ప్రార్ధించడం), వేడు కోవటం, బలిదానాలు చేయటం, మొక్కుతీర్చటం, లేని పక్షంలో వారి ప్రతాపానికి గురి అయ్యే భయం, తాయత్తుల మహిమలు, దైవ సందేశహరుల విలువలను అగౌరవ పర్చటం, ఇష్టానుసారంగా దిద్దుకున్న ఆచారాలను ఇస్లాం ధర్మంలో కల్పితంచేసి ప్రజలను వక్రమార్గానికి మళ్ళించటం జరిగింది. 

ఈ తరుణంలో ఇస్లాం ధార్మిక వాస్తవ రూపురేఖలను వెలికి తీసి ప్రజలకు సన్మార్గం చూపించటానికి అహోరాత్రులు శ్రమించిన వ్యక్తే… “ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హాబ్”. 

‘ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హబ్’ హిజ్రి శకం 1115 సంవత్సరంలో “ నజ్ద్” దేశంలోని “ఉయ్యైనా” పట్టణంలో జన్మించారు. నాడు విద్యా, జ్ఞానాలకు నెలవుగా గుర్తింపు పొందిన ‘బసర’ నగరానికి పయనించి విద్యా విజ్ఞాలలో ప్రావీణ్యం పొందారు. ధర్మప్రచారానికి నడుం బిగించిన సందర్భములో “ముహమ్మద్ బిన్ సఊద్” వెన్నుతట్టి తన వంతు సహాయాన్ని అందించారు. అనతి కాలంలోనే ఈ ప్రచారం విస్తృతమై ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. 

మీ ముందు వున్న ఈ చిరు పుస్తకం “అల్ ఉసూలు స్సలాసతి వ అదిల్లతిహా” అనే పేరుతో అరేబియా (అరబ్బి) భాషలో లిఖించబడింది. ఈ మహోన్నత పుస్తకాన్ని ప్రపంచంలోని అన్నీ భాషల్లో అనువాదం చేసి ప్రచురించడం జరిగింది. దీని వలన ఎంతో మంది ప్రజలు ‘షిర్క్’ (బహుదైవారాధన), ‘బిద్అత్’లను విడనాడి అల్లాహ్ సమక్షంలో పశ్చాత్తాపపడి సన్మార్గము వైపుకు మళ్ళారు. ఇదే సంకల్పముతో దీనిని తెలుగుభాషలో అనువదించటం జరిగింది. దీని లోని ముఖ్యాంశం ఏమిటంటే మరణాంతరం సమాధిలో ప్రతి మానవునికి (విశ్వాసి, అవిశ్వాసి తేడా లేకుండా) ఈ 3 ప్రశ్నలు ప్రశ్నించబడతాయి. 

  • 1. నీ ఆరాధ్య దేవుడు ఎవరు? 
  • 2. నీ ధర్మం ఏది? 
  • 3. నీ ప్రవక్త ఎవరు? 

పై ప్రశ్నలకు ఏ అల్ప విశ్వాసము కలిగియున్న వ్యక్తి కూడా జవాబు ఇవ్వగలడు. ఇందుకు సంబంధించి మనలో చోటుచేసుకున్న కలుషితమైన విశ్వాసాలను దైవగ్రంధము పవిత్ర ఖుర్ఆన్, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హదీసుల ఆధారంగా అసత్య, అవాస్తవ విశ్వాసాలను బహిర్గతం చేయడం జరిగింది. అంతే కాకుండా ధర్మానికి సంబంధించి ఏ అంశమైనా సాక్ష్యాధారాలతోనే అంగీకరించాలనే గీటురాయి కల్పించబడింది. 

ఈ మహోన్నత పుస్తకాన్ని తెలుగుభాషలో అనువదించే భాగ్యాన్ని కల్పించిన అల్లాహ్ కు సర్వత్రా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అందరికి దీని ప్రయోజనం చేకూరాలని కోరుకుంటున్నాను. తద్వారా  ఖుర్ఆన్, హదీసు ప్రకారంగా మన జీవితం మెరుగు పడాలని, మరణాంతరం సమాధిలో సరైన జవాబులు ఇచ్చే భాగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. 

ఈ పుస్తక అనువాదానికి, ప్రచురణకు పాలుపంచుకున్న అనేకులకు అల్లాహ్ వారి పుణ్యకర్మలను అంగీకరించి ఇహపరలోకాల్లో మంచి ఫలితం ప్రసాదించాలని ప్రార్ధించుచున్నాను… ఆమీన్. 

ధార్మిక సేవలో……… 
హాఫిజ్ అబ్దుల్ గఫ్ఫార్ ఉమ్రి,M.A. 
తెలుగు అనువాదకులు , మర్కజుల్ హిదాయ, బహ్రేన్. 3-4-2007. 

అనంతకరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో… 

ధర్మ అవగాహనకు అవశ్యకమైన త్రిసూత్రాలు 

పాఠకులారా.. 

అల్లాహ్ మీ పై కరుణించుగాక..! ఇది బాగా గుర్తుపెట్టుకో వలసిన విషయం. నాల్గు విషయాల గురించి జ్ఞానము పొందుట, అవగాహన చేసుకొనుట మనపై విధించబడి ఉన్న విధి. 

మొదటి విషయం :విద్యాభ్యాసన 

అల్లాహ్, ఆయన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు ఇస్లాం ధర్మం గురించి ఆధారాలతో అవగాహన చేసుకొనుట. 

రెండవ విషయం : ఆచరణ 

విద్యాభ్యాసనతో అవగాహన చేసుకొన్న దానిని ఆచరించుట. 

మూడవ విషయం : ఆహ్వానం, ప్రచారం 

ఇస్లాం ధర్మం వైపునకు ఇతరులను ఆహ్వానించుట. 

నాలుగో విషయం : ఓర్పు, సహనం 

ధర్మ ప్రచారంలో ఎదురయ్యే ఇబ్బందులు, కష్టాలపై ఓర్పు, సహనంతో స్థిరంగా ఉండుట. 

పై నాలుగు అంశాలకు ఆధారం పవిత్ర ఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా పేర్కొంటున్నాడు: 

وَالْعَصْرِ إِنَّ الْإِنْسَانَ لَفِي خُسْرٍ . إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَتَوَاصَوْا بِالْحَقِّ وَتَوَاصَوْا بِالصَّبْرِ 

అర్ధం: “కాలం సాక్షిగా..! నిస్సందేహంగా మానవుడు నష్టములోపడివున్నాడు. కాని ఎవరైతే విశ్వసించి, సత్కార్యములు చేస్తూ వుంటారో, మరియు పరస్పరం సత్యోపదేశం, సహనబోధన చేసుకుంటారో వారు తప్ప”. (అల్ అస్103:1-3) 

ఇమాం ‘షాఫయి’ (రహ్మతుల్లాహి అలైహి) ఈ పవిత్ర సూర గురించి ఇలా పేర్కొన్నారు: 

لَو مَا أَنْزَلَ اللهُ حُجَّةً عَلى خَلْقِهِ الْاهْذِهِ السُّورَةِ لَكَفَتُهُم 

అర్ధం : అల్లాహ్ మానవ సృష్టి పై తన వాగ్దాన ప్రకారం, ఈ ఒక్క సూరానే అవతరింపజేసి ఉంటే, అది వారి సన్మార్గమునకు సరిపోయేది

ఇమాం ‘బుఖారి’ (రహ్మతుల్లాహి అలైహి) తన ‘సహిహ్ బుఖారి’ గ్రంధములో ఒక అధ్యాయాన్ని ఈ విధంగా ఆరంభం చేశారు. 

మాట, బాటకు ముందు జ్ఞానం‘ (సంబంధిత జ్ఞానాన్ని సేకరించుట, పొందుట) 

దీనికి ఆధారం అల్లాహ్ పేర్కొన్న ఈ వచనమే : 

فَاعْلَمْ أَنَّهُ لَا إِلَٰهَ إِلَّا اللَّهُ وَاسْتَغْفِرْ لِذَنبِكَ وَلِلْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ ۗ وَاللَّهُ يَعْلَمُ مُتَقَلَّبَكُمْ وَمَثْوَاكُمْ

అర్ధం: “తెలుసుకోండి..! అల్లాహ్ తప్ప మరెవరూ ఆరాధ్యదేవుడు లేడు. మరియు మీరు మీ పాపాలకు క్షమాపణ కోరుతూవుండండి”. (ముహమ్మద్ 47:19) 

فَبُدَأَ بِالْعِلْمِ. 

కనుక ఇందులో అల్లాహ్ మాట, బాటకు ముందు జ్ఞాన ప్రస్తావన చేశాడు. 

పాఠకులారా.. 

అల్లాహ్ మీ పై కరుణించుగాక.. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోవలసిన విషయమే. క్రింద పేర్కొనబడే మూడు సమస్యల జ్ఞానం పొందుట, దానిని ఆచరించుట, ప్రతి ముస్లిం (స్త్రీ, పురుషుని) పై విధించబడిన విధి. 

మొదటి సమస్య: 

అల్లాహ్ యే మనల్ని సృష్టించి, ఉపాధి కల్పించాడు. మరి మాకు అనవసరంగా ఇలాగే వదిలి పెట్టలేదు. తన ప్రవక్తను (సల్లల్లాహు అలైహి వసల్లం)ను మా మార్గదర్శనం కోసం మావైపు పంపిచాడు. ఆయనకు విధేయత చూపిన వారు స్వర్గవాసులవుతారు. ఆయన ఆజ్ఞను తిరస్కరించిన వారు నరక వాసులవుతారు. 

అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: 

إِنَّا أَرْسَلْنَا إِلَيْكُمْ رَسُولًا شَاهِدًا عَلَيْكُمْ كَمَا أَرْسَلْنَا إِلَىٰ فِرْعَوْنَ رَسُولًا فَعَصَىٰ فِرْعَوْنُ الرَّسُولَ فَأَخَذْنَاهُ أَخْذًا وَبِيلًا

అర్ధం : “మీ వద్దకు అలాగే ఒక ప్రవక్తను సాక్ష్యంగా చేసి పంపాము, ఎలాగైతే మేము ‘ఫిరౌన్’ వద్దకు ప్రవక్తను పంపాము, కాని ఫిరౌన్ ఆ ప్రవక్తను తిరస్కరించాడు. అప్పుడు మేము అతనిని కఠినంగా శిక్షించాము”. (అల్ ముజ్జమ్మిల్ 73:15-16) 

రెండవ సమస్య: 

అల్లాహ్ కు తన ఆరాధనలో మరెవరినీ సాటి కల్పించడాన్ని ముమ్మాటికి సహించడు. (ప్రఖ్యాత దైవ దూతలు, ప్రవక్తలైనా సరే) 

అల్లాహ్ ఇలా ప్రవచిస్తున్నాడు: 

وَأَنَّ الْمَسَاجِدَ لِلَّهِ فَلَا تَدْعُوا مَعَ اللَّهِ أَحَدًا

అర్ధం : “నిస్సందేహంగా మసీదులు అల్లాహ్ కొరకే (ప్రత్యేకించబడ్డాయి). కనుక అందులో అల్లాహ్ తో పాటు మరెవరినీ పిలవకండి”. (అల్ జిన్న్ 72:18) 

మూడవ సమస్య: 

ఎవరైతే దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను అనుసరించి విధేయత చూపుతూ, అల్లాహ్ ఏకత్వాన్ని కూడ అంగీకరిస్తారో వారికి అల్లాహ్ మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పట్ల శతృత్వం వహించే వాళ్ళతో సత్సంబంధాలు పెట్టుకొనుట ఏ మాత్రం తగని విషయం. ఒకవేళ వారు ఇహలోకపరంగా అతి సమీపబంధువులైన సరె. 

ఇందుకు ఆధారం అల్లాహ్ పేర్కొన్న ఈ వచనం: 

لَّا تَجِدُ قَوْمًا يُؤْمِنُونَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ يُوَادُّونَ مَنْ حَادَّ اللَّهَ وَرَسُولَهُ وَلَوْ كَانُوا آبَاءَهُمْ أَوْ أَبْنَاءَهُمْ أَوْ إِخْوَانَهُمْ أَوْ عَشِيرَتَهُمْ ۚ أُولَٰئِكَ كَتَبَ فِي قُلُوبِهِمُ الْإِيمَانَ وَأَيَّدَهُم بِرُوحٍ مِّنْهُ ۖ وَيُدْخِلُهُمْ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا ۚ رَضِيَ اللَّهُ عَنْهُمْ وَرَضُوا عَنْهُ ۚ أُولَٰئِكَ حِزْبُ اللَّهِ ۚ أَلَا إِنَّ حِزْبَ اللَّهِ هُمُ الْمُفْلِحُونَ

అర్ధం : “అల్లాహ్ ను పరలోకాన్ని విశ్వసించే వారు, అల్లాహ్ ను  ఆయన ప్రవక్తను వ్యతిరేకించే వారిని ప్రేమించటాన్ని నీవు ఎన్నడూ చూడలేవు. ఆ వ్యతిరేకించే వారు, వారి తల్లితండ్రులైనా, వారి కుమారులైనా, వారి సోదరులైనా సరె. లేదా వారి కుటుంబీకులైన సరే. వారి హృదయాలలో అల్లాహ్ విశ్వాసాన్ని స్థిరంగా నాటాడు.తన తరపు నుండి ఒక ఆత్మను ప్రసాదించి, వారికి బలాన్నిచ్చాడు.ఆయన వారిని క్రింద సెలయేరులు ప్రవహించే స్వర్గ వనాలలో ప్రవేశింపజేస్తాడు.ఆవనాలలో వారు శాశ్వతంగా ఉంటారు. అల్లాహ్ వారి పట్ల ప్రసన్నుడయ్యాడు, వారు అల్లాహ్ పట్ల సంతుష్టి చెందారు. వారు అల్లాహ్ పక్షానికి చెందినవారు. జాగ్రత్తా! అల్లాహ్ పక్షం వారే సఫలీకృతులయ్యే వారు”. (అల్ ముజాదలహ్ 58:22) 

పాఠకులారా.. 

అల్లాహ్ మీకు సన్మార్గాన్ని అనుసరింపచేయు గాక. ఈ విషయాన్ని కూడ బాగా అర్ధం చేసుకోండి. అదేమిటంటే ” హనఫీయ్యత్, మిల్లతె ఇబ్రాహీమి” అంటే, మీరు చిత్తశుద్ధితో సంపూర్ణముగా కేవలం ఏకైక అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలి. ఈ కార్యాన్ని గురించే అల్లాహ్ అందరిని ఆజ్ఞాపించాడు. దీని కోసమే మానవుడిని సృష్టించాడు. అల్లాహ్ తన గ్రంధంలో పేర్కొన్నాడు: 

وَمَا خَلَقْتُ الْجِنَّ وَالْإِنسَ إِلَّا لِيَعْبُدُونِ

నేను జిన్నాతులను, మానవులను సృష్టించినది వారు నన్ను ఆరాధించటానికి మాత్రమే”.(అజ్జారియాత్ 51:56) 

يَعْبُدُونِ : అనేపదానికి అర్ధం: నా ఏకత్వాన్ని మనసార అంగీకరించండి. 

అల్లాహ్ ప్రస్తావించిన ఆజ్ఞల్లో అన్నిటికంటే ప్రధానమైన, ఉన్నతమైన ఆజ్ఞ “తౌహీద్” అన్ని విధాల ఆరాధనలు ఏకైక అల్లాహ్ కొరకే అర్పించుటకు మారు పేరు. మరి అల్లాహ్ నిర్మూలించిన ఆజ్ఞల్లో అన్నిటికంటే ప్రధాన మైనది “షిర్క్”. అల్లాహ్ యేతరులను మన ఆశలను, కోరికలను నెరవేర్చటానికి పిల్చేందుకు అతని భాగస్వామిగా కల్పేందుకు మారు పేరు. 

అల్లాహ్ పవిత్ర ఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: 

وَاعْبُدُوا اللَّهَ وَلَا تُشْرِكُوا بِهِ شَيْئًا

అల్లాహ్‌ను ఆరాధించండి. ఆయనకు సహవర్తులుగా ఎవరినీ కల్పించకండి”.(అన్నిసా 04:36)  

బిస్మిల్లా హిర్రహ్మాన్ నిర్రహీం 

ధర్మ అవగాహనకు అవశ్యకమైన త్రిసూత్రాలు 

ప్రతి మానవుడికి ఏ మూడు సూత్రాల అవగాహన అవసరం అని ప్రశ్నించినప్పుడు మీరు ఇలా చెప్పండి: 

  • 1. ప్రతి వ్యక్తి తనప్రభువు గురించి అవగాహన పొందడం. 
  • 2. తన ధర్మం (దీన్) గురించి అవగాహన పొందడం. 
  • 3. తన ప్రవక్త అయిన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహివసల్లం) గురించి అవగాహన పొందడం. 

ప్రధమ సూత్రం : విశ్వప్రభువైన అల్లాహ్ గురించి అవగాహన 

మీ ప్రభువు ఎవరని వివరంగా అడిగినప్పుడు చెప్పండి “నా ప్రభువు అల్లాహ్! ఆయనే తన దయ, కృషితో నన్నూ మరియు ఈ సర్వలోకాన్ని పోషిస్తున్నాడు. ఆయనే నా ఆరాధ్య దేవుడు. ఆయన తప్పమరోక ఆరాధ్య దేవుడు లేడు. ఆయనే విశ్వపోషకుడు. ఆయనే ఆరాధ్య దైవం. 

ఇలా చెప్పటానికి దైవ గ్రంధంలో ఆధారం చూడండి : 

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ

అర్ధం : “సర్వపొగడ్తలు సర్వలోకాలకు పోషకుడైన అల్లాహ్ కొరకే”. (అల్ ఫాతిహ 01:02) 

అల్లాహ్ తప్ప లోకంలోని సర్వమూ (ప్రతి వస్తువు) సృష్టియే. నేను ఆ సృష్టిలో ఒకణ్ణి. మీరు మీ ప్రభువును ఎలా కనుగొన్నారు? దేనిద్వారా కనుగొన్నారు? అని అడిగినప్పుడు “ఆయన నిదర్శపూరితమైన చిహ్నాలతో, అనేక రకమైన సృష్టితాలతో కనుగొన్నాము” అని చెప్పండి. 

ఆయన నిదర్శనాల్లో: రాత్రి, పగలు, సూర్యుడు, చంద్రుడు మొదలైనవి. 
ఆయన సృష్టితాల్లో : సప్తభూములు, సప్త ఆకాశాలు, ఆ రెండింటి మధ్యలో ఉన్న సర్వమూ (ప్రతీది) కూడ. 

అల్లాహ్ చిహ్నాల గురించి ఆధారాలు: 

అల్లాహ్ తన పవిత్ర ఖుర్ఆన్ గ్రంధంలో ఇలా తెలుపుతున్నాడు: 

وَمِنْ آيَاتِهِ اللَّيْلُ وَالنَّهَارُ وَالشَّمْسُ وَالْقَمَرُ ۚ لَا تَسْجُدُوا لِلشَّمْسِ وَلَا لِلْقَمَرِ وَاسْجُدُوا لِلَّهِ الَّذِي خَلَقَهُنَّ إِن كُنتُمْ إِيَّاهُ تَعْبُدُونَ

రేయింబవళ్లూ, సూర్యచంద్రులు కూడా ఆయన (శక్తి) సూచనలలోనివే. మీరు సూర్యునికిగానీ, చంద్రునికిగానీ సాష్టాంగప్రణామం (సజ్దా) చేయకండి. నిజంగా మీరు అల్లాహ్‌ దాస్యం చేసేవారే అయితే వీటన్నింటినీ సృష్టించిన అల్లాహ్‌ ముందు సాష్టాంగపడండి (ఫుస్సిలత్ 41:37) 

అల్లాహ్ తన సృష్టి గురించి పవిత్ర ఖుర్ఆన్లో ఇలా సెలవిస్తున్నాడు: 

إِنَّ رَبَّكُمُ اللَّهُ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ فِي سِتَّةِ أَيَّامٍ ثُمَّ اسْتَوَىٰ عَلَى الْعَرْشِ يُغْشِي اللَّيْلَ النَّهَارَ يَطْلُبُهُ حَثِيثًا وَالشَّمْسَ وَالْقَمَرَ وَالنُّجُومَ مُسَخَّرَاتٍ بِأَمْرِهِ ۗ أَلَا لَهُ الْخَلْقُ وَالْأَمْرُ ۗ تَبَارَكَ اللَّهُ رَبُّ الْعَالَمِينَ

నిస్సందేహంగా అల్లాహ్‌యే మీ ప్రభువు. ఆయన ఆకాశాలను, భూమిని ఆరు రోజులలో సృష్టించాడు. ఆ తరువాత సింహాసనంపై (అర్ష్‌పై) ఆసీనుడయ్యాడు. ఆయన రాత్రిని పగటిపై కప్పివేస్తాడు. అది దాన్ని వేగంగా వెంబడిస్తూ వస్తుంది. ఇంకా ఆయన సూర్యచంద్రులను, నక్షత్రాలను తన ఆజ్ఞకు కట్టుబడి ఉండే విధంగా సృష్టించాడు. వినండి! సృష్టి ప్రక్రియ ఆయన స్వంతం. ఆజ్ఞాపన ఆయన సొత్తు. సకల లోకాల ప్రభువైన అల్లాహ్‌ అపారమైన శుభాలు కలవాడు”. (అల్ ఆరాఫ్ 7: 54) 

సర్వలోకానికి పోషకుడైన ఆయనే (అల్లాహ్) ఆరాధనకు అర్హుడని దైవ గ్రంధం ఖుర్ఆన్లో ఇలా చెప్పబడింది: 

يَا أَيُّهَا النَّاسُ اعْبُدُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُمْ وَالَّذِينَ مِن قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُونَالَّذِي جَعَلَ لَكُمُ الْأَرْضَ فِرَاشًا وَالسَّمَاءَ بِنَاءً وَأَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَأَخْرَجَ بِهِ مِنَ الثَّمَرَاتِ رِزْقًا لَّكُمْ ۖ فَلَا تَجْعَلُوا لِلَّهِ أَندَادًا وَأَنتُمْ تَعْلَمُونَ

అర్ధం : ఓమానవులారా..! మీరు ఆ (సత్య) ప్రభువునే ఆరాధించండి ఎవరైతే మిమ్మల్నీ, మీకంటే ముందు మీ పూర్వికుల్ని సృష్టించాడో, దాని ఫలితంగా బహుశ మీరు నరకాగ్ని నుండి విముక్తి పొందగలరు. ఆయనే మీ కొరకు భూమిని పాన్పుగా, ఆకాశాన్ని కప్పుగా చేశాడు. మరియు పైనుండి వర్షాన్ని కురిపించాడు.దాని ద్వారా రకరకాల పండ్లను సృష్టించాడు. వాటిని మీ కొరకు ఆహారంగా ప్రసాదించాడు. ఈ విషయాన్ని గ్రహిస్తూకూడ మీరు (ఇతరులను) అల్లాహ్ కు సహవర్తిత్వం కల్పించకండి”. (అల్ బఖర 2:21-22) 

ఇమామ్ ఇబ్నె కసీర్ (రహిమహుల్లాహ్) ఈ వచనానికి తాత్పర్యం ఇలా తెలిపారు: 

الْخَالِقُ لِهذِهِ الأشْيَاءَ هُوَ الْمُسْتَحِقُ لِلْعِبَادَةِ (تفسير ابن كثير : ۱ : ۵۷ طبع مصر) 

అర్ధం : పైన పేర్కొన్న వాటిని సృష్టించినవాడే అన్ని రకాల పూజలకు అసలైన అర్హుడు (తఫ్సీర్ ఇబ్నెకసీర్) 

గమనిక : అల్లాహ్ ఆజ్ఞ ప్రకారం చేయవలసిన ఆరాధనల పేర్లను ముందుగా అరబివ్యాఖ్యాలతోనే పేర్కొని తరువాత క్లుప్తంగా దాని వివరణ ఇవ్వటం జరిగంది. క్రింది వాటిని గమనిచండి. 

ఆరాధనల అరబి నామాలు:

ఇస్లాం, ఈమాన్ ,ఇహ్సాన్ ,దుఆ ,ఖవ్ ఫ్ ,ఉమ్మీద్ వ రజా ,తవక్కుల్ ,రఘ్బత్ ,ఖుషూ ,ఖషియత్,  రుజూ ,ఇస్తి ఆనత్ ,ఇస్తి ఆజహ్ ,ఇస్తిఘాసహ్, జబహ్ ,ఖుర్బాని ,నజర్ వ మిన్నత్ మొదలైనవి. 

పై ఆరాధనలన్నీ కేవలం అల్లాహ్ కు పరిమితం. వీటి గురించి దైవ గ్రంధం ఖుర్ఆన్ లోని ఈ ఆయత్లో ప్రస్తావన జరిగింది:

وَأَنَّ الْمَسَاجِدَ لِلَّهِ فَلَا تَدْعُوا مَعَ اللَّهِ أَحَدًا

మస్జిదులు కేవలం అల్లాహ్ కొరకే ప్రత్యేకించబడ్డాయి. కాబట్టి (వాటిలో) అల్లాహ్ తో పాటు ఇతరులెవరినీ పిలవకండి. (అల్ జిన్న్ 72:18) 

పైన పేర్కొన్న ఆరాధనలను ఎవరైనా అల్లాహ్ కొరకు కాకుండా మరెవరి కొరకైన చేస్తే అతను ముష్రిక్, మరియు అవిశ్వాసి అవుతాడు. దీనికై పవిత్ర గ్రంధం ఖుర్ఆన్లో ఈ ఆయత్ ను గమనించండి : 

وَمَن يَدْعُ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ لَا بُرْهَانَ لَهُ بِهِ فَإِنَّمَا حِسَابُهُ عِندَ رَبِّهِ ۚ إِنَّهُ لَا يُفْلِحُ الْكَافِرُونَ

ఎవడైనా, తన దగ్గర ఏ ప్రమాణమూ లేకపోయినప్పటికీ – అల్లాహ్‌ తో పాటు వేరొక దేవుణ్ణి మొరపెట్టుకుంటే, అటువంటి వ్యక్తి లెక్క అతని ప్రభువు వద్ద ఉన్నది. నిశ్చయంగా అవిశ్వాసులు సఫలురు కాలేరు”.  (అల్ మొమినూన్ 23:117) 

గమనిక : 

పైన పేర్కొనబడిన అరబి నామాలను వివరిస్తూ, అవన్నీ ఆరాధనలకు చెందుతాయని చెప్పటానికి తగు ఆధారములు ఖుర్ఆన్ గ్రంధము, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సున్నత్ నుండి పేర్కొనడం జరిగింది గమనించండి. 

దుఆ (ప్రార్ధన) : అన్ని రకాల వేడుకోలు, మొరలు

మన అవసరాలను తీర్చుటకు సృష్టికర్తయిన అల్లాహ్ నే వేడుకుంటాము. కాబట్టి అది (మొరపెట్టుకునే) ఆరాధన. ‘దుఆ’యే ఆరాధన అని చెప్పటానికి దైవ ప్రవక్త (సల్లలాహు అలైహి వసల్లం) హదీసులో దీని గురించి ఇలా ప్రస్తావించడం జరిగింది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉపదేశించారు: 

الدُّعَاءُ مُخُ الْعِبَادَةِ . (ترمذی) 

అర్ధం : “ దుఆయే ఆరాధనలోని అసలైన పౌష్టికం”. (తిర్మిజి) 

దీనికై దైవ గ్రంధము పవిత్ర ఖుర్ఆన్ లో ఈ విధముగా ప్రస్తావించడం జరిగింది: 

وَقَالَ رَبُّكُمُ ادْعُونِي أَسْتَجِبْ لَكُمْ ۚ إِنَّ الَّذِينَ يَسْتَكْبِرُونَ عَنْ عِبَادَتِي سَيَدْخُلُونَ جَهَنَّمَ دَاخِرِينَ

అర్ధం: “మీ ప్రభువు ఆజ్ఞాపిస్తున్నాడు- నన్ను పిలవండి. నేను మీ ప్రార్ధనలను అంగీకరిస్తాను. ఎవరైన అహంకారంతో నా ఆరాధనను తిరస్కరిస్తే వారు తప్పకుండా హీనులై నరకములో ప్రవేశిస్తారు”. (అల్ మొమిన్ 40:60) 

‘ఖవ్ ఫ్ : భయ భీతి 

కేవలం అల్లాహ్ పట్ల భయభీతి కలిగివుండాలి తప్ప ఇతరుల భయభీతి మనసులో వుంచకూడదు. కేవలం అల్లాహ్ కు మాత్రమే భయపడాలి. అల్లాహ్ భయభీతి (అల్లాహ్ కు భయపడటం) కూడ ఆరాధనే. పవిత్ర గ్రంధం ఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: 

فَلَا تَخَافُوهُمْ وَخَافُونِ إِن كُنتُم مُّؤْمِنِينَ

మీరు అవిశ్వాసులకు భయపడకండి, మీరు విశ్వాసులే అయితే నాకు భయపడండి.” (ఆలి ఇమ్రాన్ 03:175) 

ఉమ్మీద్ వ రజా: ఆశా & భీతి 

దాసుడు అల్లాహ్ పట్ల విశ్వాసుడై ఆయనపై ఆశలు పెట్టుకుంటాడు. 

పవిత్ర ఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: 

فَمَن كَانَ يَرْجُو لِقَاءَ رَبِّهِ فَلْيَعْمَلْ عَمَلًا صَالِحًا وَلَا يُشْرِكْ بِعِبَادَةِ رَبِّهِ أَحَدًا

అర్ధం : “ఎవరైన తన ప్రభువుతో కలవాలని ఆశిస్తున్నప్పుడు అతను సత్కార్యాలు చెయ్యాలి, 

మరియు ఆరాధనల్లో తన ప్రభువుకు సాటి కల్పించకూడదు. (అల్ కహఫ్18:110) 

తవక్కుల్: అల్లాహ్ పై నమ్మకం 

నమ్మకం అంటే ఏదైన కార్యం జరగాలని ఆయన (అల్లాహ్) పైనే నమ్మకం, భారం మోపుతారు. 

పవిత్ర ఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: 

وَعَلَى اللَّهِ فَتَوَكَّلُوا إِن كُنتُم مُّؤْمِنِينَ

మీరు విశ్వాసులే అయితే అల్లాహ్‌నే నమ్మండి“. (అల్ మాయిదా 5:23) 

దైవ గ్రంధములో మరో చోట ఇలా తెల్పబడింది: 

وَمَن يَتَوَكَّلْ عَلَى اللَّهِ فَهُوَ حَسْبُهُ

అల్లాహ్ పై భారం మోపిన వానికి అల్లాహ్ యే చాలు”. (అత్తలాఖ్ 65:3) 

రగ్బత్, రహ్బత్, ఖుషూ: ఆయన వైపే మరలుతూ భయపడాలి 

అంటే ఆశ, భయభీతి తోను, వినమ్రత తోనూ ఆయన వైపే మరలుతారు. ఇదీ ఆరాధనే. పవిత్ర ఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా ప్రస్తావిస్తున్నాడు: 

إِنَّهُمْ كَانُوا يُسَارِعُونَ فِي الْخَيْرَاتِ وَيَدْعُونَنَا رَغَبًا وَرَهَبًا ۖ وَكَانُوا لَنَا خَاشِعِينَ

ఈ సద్వర్తనులు సత్కార్యాల కోసం త్వరపడేవారు. ఆశతోనూ, భయంతోనూ మమ్మల్ని వేడుకునేవారు. మా ముందు అశక్తతను, అణకువను కనబరచేవారు”. (అల్ అంబియా 21:90) 

ఖష్యత్ : భయ భక్తులు కలిగి వుండటం 

ఎవరైన దౌర్జన్యం చేసినప్పుడు భయపడతాం. కాని అటువంటి సందర్భాల్లో కూడ అల్లాహ్ కు మాత్రమే భయపడాలి. ఇదీ ఒక ఆరాధనే. 

అల్లాహ్ పవిత్ర ఖుర్ఆన్ లో ఇలా ప్రస్తావించాడు: 

 فَلَا تَخْشَوْهُمْ وَاخْشَوْنِي

మీరు వారితో భయపడకండి, నా తోనే భయపడండి”. (అల్ బఖర 2:150) 

ఇనాబత్, రుజు : మరలటం 

తప్పు జరిగిన ప్రతిసారి అల్లాహ్ వైపు మరలాలి. ఇదీ ఒక ఆరాధనే. 

దీనికై పవిత్ర ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ఆదేశిస్తున్నాడు: 

وَأَنِيبُوا إِلَىٰ رَبِّكُمْ وَأَسْلِمُوا لَهُ

మీరు మీ ప్రభువు వైపునకు మరలండి. ఆయనకు విధేయత చూపండి”. (అజ్జుమర్ 39:54) 

ఇస్తిఆనత్ : సహాయం కొరకు అర్ధించుట 

సర్వశక్తులు కలవాడైన అల్లాహ్ నుండి సహాయం కోరాలి. ఇదికూడ ఒక ఆరాధన. 

పవిత్ర గ్రంధం ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: 

إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ

మేము నిన్నే ఆరాధిస్తున్నాము, మరియు నీతోనే సహాయాన్ని కోరుతున్నాము”. (అల్ ఫాతిహ 01:05) 

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హదీసులో కూడ ప్రత్యేకించి దీని గురించి చెప్పబడింది. 

إِذَا سُتَعَدُتَ فَاسْتَعِنُ بِاللَّهِ 

అర్ధం : “మీరు సహాయం కోరాలనుకున్నప్పుడు అల్లాహ్ సహాయాన్నే అర్ధించండి”. (తిర్మిజి, హసన్ సహీహ్) 

ఇస్తిఆజాహ్: శరణం, ఆశ్రయం కోరుట 

పరిపూర్ణంగా ఆశ్రయమిచ్చే అల్లాహ్ ఆశ్రయాన్నే కోరాలి. ఇదీ ఒక ఆరాధనే. 

పవిత్ర గ్రంధం ఖుర్ఆన్ అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: 

قُلْ اَعُوذُ بِرَبِّ النَّاسِ مَلِكِ النَّاسِ 

నేను మానవుల ప్రభువుతో, శరణు కోరుతున్నాను. మానవుల చక్రవర్తి (అల్లాహ్) తో (శరణు కోరుతున్నాను)”. (అన్నాస్ 114:1-2) 

ఇస్తిగాస: నిర్బంధత్వంలో అల్లాహ్ సహాయాన్ని అర్జించుట

 ఇదీ ఒక ఆరాధనే అల్లాహ్ పవిత్ర ఖుర్ఆన్ లో ఇలా సెలవిస్తున్నాడు: 

إِذْ تَسْتَغِيثُونَ رَبَّكُمْ فَاسْتَجَابَ لَكُمْ

అర్ధం : “ఆ సందర్భాన్ని తలచుకొండి అప్పుడు మీరు మీ ప్రభువును మొరపెడుతూ వేడుకున్నారు అప్పుడు ఆయన మీ బాధను విన్నాడు (మీమొరను ఆలాకించాడు)”. (అల్  అన్ ఫాల్  08:09) 

జిబాహ్, ఖుర్బాని : సమర్పణ, బలిదానం 

ఇదికూడ అల్లాహ్ కొరకే చేయాలి. 

అల్లాహ్ పవిత్ర గ్రంధం ఖుర్ఆన్లో ఇలా సెలవిస్తున్నాడు: 

قُلْ إِنَّ صَلَاتِي وَنُسُكِي وَمَحْيَايَ وَمَمَاتِي لِلَّهِ رَبِّ الْعَالَمِينَ لَا شَرِيكَ لَهُ ۖ وَبِذَٰلِكَ أُمِرْتُ وَأَنَا أَوَّلُ الْمُسْلِمِينَ

ఇంకా ఈ విధంగా ప్రకటించు : “నిస్సందేహంగా నా నమాజు, నా సకల ఆరాధనలు, నా జీవనం, నా మరణం – ఇవన్నీ సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌ కొరకే. ఆయనకు భాగస్వాములెవరూ లేరు. దీని గురించే నాకు ఆజ్ఞాపించబడింది. ఆజ్ఞాపాలన చేసే వారిలో నేను మొదటివాణ్ణి.” (అల్ అన్ఆమ్ 06:162,163) 

దీనిగురించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హదీస్ ఇలా ప్రస్తావించారు: 

لَعَنَ اللَّهُ مَنْ ذَبَحَ لِغَيْرِ اللَّهِ 

ఎవరైన అల్లాహ్ ను తప్ప మరే ఇతర ఆరాధ్య దేవుళ్ళ (ప్రవక్త, వలి, పీర్, ముర్షద్, బాబా, సమాధిలోని వాడు) సన్నిధి కోరాలని దేనినైనా బలిస్తే, అతని పై అల్లాహ్ శాపం కలుగుతుంది”. (ముస్లిం) 

నజర్ : మొక్కుబడి 

ఇది కూడ అల్లాహ్ కోసమే చేయాలి. ఇది కూడా ఒక ఆరాధనే. దీని గురించి ఖుర్ఆన్ గ్రంధములో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: 

يُوفُونَ بِالنَّذْرِ وَيَخَافُونَ يَوْمًا كَانَ شَرُّهُ مُسْتَطِيرًا

వారు తమ మొక్కుబడులను చెల్లిస్తుంటారు. ఏ రోజు కీడు నలువైపులా విస్తరిస్తుందో ఆ రోజు గురించి భయపడుతుంటారు. (అద్దహర్ 76:7) 

رَبِّ زِدْنِي عِلْمًا 

ద్వితీయ సూత్రం: 

ఇస్లాం ధర్మాన్ని ఆధారాలతో తెలుసుకోవడం తప్పని సరి 

అల్లాహ్ ఏకత్వాన్ని సహృదయముతో అంగీకరిస్తూ తమకు తాము అల్లాహ్ కు విధేయులుగా సమర్పించుకోవాలి. ఆయన ఆదేశాలకు అణుగుణంగా విధేయతపాటిస్తూ అనుసరించాలి. ఆయనతో పాటు మరెవ్వరిని ఎట్టి పరిస్థితుల్లోనూ సాటి కల్పించకూడదు. ఇదే సత్య ధర్మం (దీన్). 

ధర్మంలో 3 స్థానాలున్నాయి: 

  • 1. మొదటి స్థానం : ఇస్లాం 
  • 2. రెండవ స్థానం : ఈమాన్ 
  • 3. మూడవ స్థానం : ఇహ్సాన్ 

ఈ మూడింటిలోనూ ప్రతి దానికి కొన్ని మూలాలున్నాయి.

ఇస్లాం – దీనికి 5 మూలాలున్నాయి. 

  • 1. అల్లాహ్ తప్ప మరెవరూ ఆరాధ్యదేవుడు లేడని, (తౌహీద్) ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన సత్య ప్రవక్త అని సాక్షమివ్వటం. 
  • 2. నమాజు స్థాపించటం. 
  • 3. జకాత్ (ధర్మ దానం) ఇవ్వటం. 
  • 4. రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉండటం. 
  • 5. హజ్ (కాబా గృహ దర్శనం) చేయటం. 

పై పేర్కొనబడిన “ఇస్లాంకు గల 5 మూలాల” గురించి పవిత్ర ఖుర్ఆన్లో ఇలా ప్రస్తావించబడింది: 

1. తౌహీద్: అల్లాహ్ ఏకత్వానికి సాక్షమివ్వటం 

అల్లాహ్ యే ఏకైక ఆరాధ్యదేవుడు. ఆయనకు సాటి ఎవరూలేరు అని నమ్మి, ఉచ్చరించడం. 

పవిత్ర గ్రంధం ఖుర్ఆన్ అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: 

شَهِدَ اللَّهُ أَنَّهُ لَا إِلَٰهَ إِلَّا هُوَ وَالْمَلَائِكَةُ وَأُولُو الْعِلْمِ قَائِمًا بِالْقِسْطِ ۚ لَا إِلَٰهَ إِلَّا هُوَ الْعَزِيزُ الْحَكِيمُ

అల్లాహ్‌ తప్ప మరో ఆరాధ్యదైవం లేడని స్వయంగా అల్లాహ్‌, ఆయన దూతలు, జ్ఞాన సంపన్నులూ సాక్ష్యమిస్తున్నారు. ఆయన సమత్వం, సమతూకంతో ఈ విశ్వాన్ని నిలిపి ఉంచాడు. సర్వాధిక్యుడు, వివేచనాశీలి అయిన ఆయన తప్ప మరొకరెవరూ ఆరాధనకు అర్హులు కారు”. (ఆలి ఇమ్రాన్ 03:18) 

తౌహీద్ గురించి సాక్ష్యం అంటే అల్లాహ్ తప్ప మరెవరూ నిజమైన ఆరాధ్యదేవుడు లేడు. ‘లాఇలాహ ఇల్లల్లాహ్‘ వాక్యపరంగా కలిగివున్న అర్ధం ఏమిటంటే, ‘లాఇలాహ‘ ఏ దేవుడు లేడని, “అల్లాహ్ తప్ప మరిదేనిని ఆరాధించిన, పూజించిన నిరాకరించ బడుతుందనే అర్ధం కలిగివుంది”. మరి ‘ ఇల్లల్లాహ్ ‘ కేవలం ఏకైక అల్లాహ్ కొరకే సమస్త ఆరాధనలు ఉన్నాయనే అర్ధం కల్గియుంది. ఆయన సామ్రాజ్యంలో, ఎలాగైతే ఎవరూ భాగస్వాములు లేరో, అలాగే ఆయన ఆరాధనల్లో ఆయనకు ఎవరూ సాటిలేరు. 

దీని గురించి పవిత్ర ఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా ప్రస్తావిస్తున్నాడు: 

وَإِذْ قَالَ إِبْرَاهِيمُ لِأَبِيهِ وَقَوْمِهِ إِنَّنِي بَرَاءٌ مِّمَّا تَعْبُدُونَ إِلَّا الَّذِي فَطَرَنِي فَإِنَّهُ سَيَهْدِينِ وَجَعَلَهَا كَلِمَةً بَاقِيَةً فِي عَقِبِهِ لَعَلَّهُمْ يَرْجِعُونَ

ఇబ్రాహీము తన తండ్రితోనూ, తన జాతి వారితోనూ పలికినప్పటి విషయం (స్మరించదగినది. ఆయన ఇలా అన్నాడు): “మీరు పూజించే వాటి నుంచి నేను వేరైపోయాను.“నన్ను పుట్టించిన వానిని మాత్రమే (నేను ఆరాధిస్తాను). ఆయనే నాకు సన్మార్గం చూపుతాడు.”మరి ఇబ్రాహీము ఈ మాటే – తన తదనంతరం – తన సంతానంలో మిగిలి ఉండేట్లుగా చేసి వెళ్ళాడు – ప్రజలు (షిర్క్‌ నుంచి) మరలిరావటానికి. (అజ్ జుఖ్ రుఫ్ 43:26-28) 

మరొక చోట ఖుర్ఆన్ గ్రంధములోఇలా ప్రస్తావించబడింది. 

قُلْ يَا أَهْلَ الْكِتَابِ تَعَالَوْا إِلَىٰ كَلِمَةٍ سَوَاءٍ بَيْنَنَا وَبَيْنَكُمْ أَلَّا نَعْبُدَ إِلَّا اللَّهَ وَلَا نُشْرِكَ بِهِ شَيْئًا وَلَا يَتَّخِذَ بَعْضُنَا بَعْضًا أَرْبَابًا مِّن دُونِ اللَّهِ ۚ فَإِن تَوَلَّوْا فَقُولُوا اشْهَدُوا بِأَنَّا مُسْلِمُونَ

(ఓ ప్రవక్తా!) వారికి స్పష్టంగా చెప్పు: ”ఓ గ్రంథవహులారా! మాలోనూ, మీ లోనూ సమానంగా ఉన్న ఒక విషయం వైపుకు రండి. అదేమంటే మనం అల్లాహ్‌ను తప్ప వేరెవరినీ ఆరాధించకూడదు, ఆయనకు భాగస్వాములుగా ఎవరినీ కల్పించరాదు. అల్లాహ్‌ను వదలి మనలో ఎవరూ ఇంకొకరిని ప్రభువులుగా చేసుకోరాదు.” ఈ ప్రతిపాదన పట్ల గనక వారు విముఖత చూపితే, ”మేము మాత్రం ముస్లిం (విధేయు)లము అన్న విషయానికి మీరు సాక్షులుగా ఉండండి” అని వారికి చెప్పేయండి. (ఆలి ఇమ్రాన్ 03:64) 

దైవ సందేశరునికి సాక్ష్యం : 

ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) దైవ ప్రవక్త అని సాక్షమివ్వాలి. అందుకు పవిత్ర ఖుర్ఆన్ అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: 

لَقَدْ جَاءَكُمْ رَسُولٌ مِّنْ أَنفُسِكُمْ عَزِيزٌ عَلَيْهِ مَا عَنِتُّمْ حَرِيصٌ عَلَيْكُم بِالْمُؤْمِنِينَ رَءُوفٌ رَّحِيمٌ

మీ దగ్గరకు స్వయంగా మీలోనుంచే ఒక ప్రవక్త వచ్చాడు. మీకు కష్టం కలిగించే ప్రతిదీ అతనికి బాధ కలిగిస్తుంది. అతను మీ మేలును ఎంతగానో కోరుకుంటున్నాడు. విశ్వాసుల యెడల అతను వాత్సల్యం కలవాడు, దయామయుడు”. (అత్ తౌబా 9:128) 

ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవక్త అని సాక్ష్యం ఇవ్వటం అంటే ఆయన ఇచ్చిన ఆదేశాలను సంపూర్ణంగా పాటించటం. ఆయన దేనినైతే తెలియచేశారో దానిని సత్యం అని అంగీకరించాలి. దేని గురించైతే నిరాకరించారో దానికి పూర్తిగా కట్టుబడి వుండాలి. అల్లాహ్ ఆరాధన కేవలం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అడుగు జాడల్లోనే ఆచరించాలి. 

నమాజ్, జకాత్, తౌహీద్ మూడింటికి సంబంధించి అల్లాహ్ పవిత్ర ఖుర్ఆన్లో ఇలా సెలవిస్తున్నాడు:

وَمَا أُمِرُوا إِلَّا لِيَعْبُدُوا اللَّهَ مُخْلِصِينَ لَهُ الدِّينَ حُنَفَاءَ وَيُقِيمُوا الصَّلَاةَ وَيُؤْتُوا الزَّكَاةَ ۚ وَذَٰلِكَ دِينُ الْقَيِّمَةِ

వారు అల్లాహ్ నే ఆరాధించాలని ధర్మాన్ని ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలనీ, ఏకాగ్రచిత్తులై – నమాజును నెలకొల్పాలనీ, జకాత్ ను ఇస్తూ ఉండాలని మాత్రమే వారికి ఆదేశించబడింది. ఇదే స్థిరమైన సవ్యమైన ధర్మం”. (అల్ బయ్యిన 98:05) 

పవిత్ర రమజాన్ మాసములో ఉపవాసాలు పాఠించమని అల్లాహ్ పవిత్ర ఖుర్ఆన్లో ఇలా సెలవిస్తున్నాడు: 

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُتِبَ عَلَيْكُمُ الصِّيَامُ كَمَا كُتِبَ عَلَى الَّذِينَ مِن قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُونَ

ఓ విశ్వసించినవారలారా! ఉపవాసాలుండటం మీపై విధిగా నిర్ణయించబడింది – మీ పూర్వీకులపై కూడా ఇదే విధంగా ఉపవాసం విధించబడింది. దీనివల్ల మీలో భయభక్తులు పెంపొందే అవకాశం ఉంది”. (అల్ బఖర 2:183) 

కాబా గృహాన్ని సందర్శించమని అల్లాహ్ పవిత్ర ఖుర్ఆన్ గ్రంధంలో ఇలా సెలవిస్తున్నాడు: 

فِيهِ آيَاتٌ بَيِّنَاتٌ مَّقَامُ إِبْرَاهِيمَ ۖ وَمَن دَخَلَهُ كَانَ آمِنًا ۗ وَلِلَّهِ عَلَى النَّاسِ حِجُّ الْبَيْتِ مَنِ اسْتَطَاعَ إِلَيْهِ سَبِيلًا ۚ وَمَن كَفَرَ فَإِنَّ اللَّهَ غَنِيٌّ عَنِ الْعَالَمِينَ

అందులో స్పష్టమయిన సూచనలున్నాయి. మఖామె ఇబ్రాహీం (ఇబ్రాహీం నిలబడిన స్థలం) ఉన్నది. అందులోకి ప్రవేశించినవాడు రక్షణ పొందుతాడు. అక్కడికి వెళ్ళే స్థోమత గలవారికి, ఆ గృహ (యాత్ర) హజ్‌ చేయటాన్ని అల్లాహ్‌ విధిగా చేశాడు. మరెవరయినా (ఈ ఆజ్ఞను శిరసావహించటానికి) నిరాకరిస్తే అల్లాహ్‌కు సమస్త లోకవాసుల అవసరం ఎంతమాత్రం లేదు. (ఆలి ఇమ్రాన్ 03:97) 

రెండవ స్థానం: ఈమాన్ 

దైవ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉపదేశించారు: 

“ఈమాన్ (విశ్వాసం) కు సంబంధించి డెబ్భైకు పైగా స్థానాలున్నాయి. అందులో ఉన్నత స్థానం “లాఇలాహ ఇల్లల్లాహ్” (అల్లాహ్ తప్ప మరెవ్వరూ నిజమైన ఆరాధ్యదేవుడు లేడు) అని సాక్ష్యం పలకటం. అన్నిటి కంటే అల్ప స్థానం దారి నుండి హాని కల్గించే వస్తువు (ముళ్ళు వంటివి)ను దూరం చేయడం.సిగ్గు, వ్రీడ, శీలం కూడ విశ్వాసానికి సంబంధించిన విషయాలే”. (సహీహ్ ముస్లిం). 

ఈమాన్ కు 6 కోణాలున్నాయి 

  • 1. అల్లాహ్ ను విశ్వసించుట.
  • 2. అల్లాహ్ దూతలను విశ్వసించుట.
  • 3. అల్లాహ్ గ్రంధాలను విశ్వసించుట.
  • 4. అల్లాహ్ ప్రవక్తలను విశ్వసించుట.
  • 5. ప్రళయ దినాన్ని విశ్వసించుట. 
  • 6. విధి వ్రాత చెడైన, మంచిదైన దానిని విశ్వసించుట. 

ఈమాన్ (విశ్వాసం)కు గల 6 కోణాలకు ఆధారాలు : 

పైన పేర్కొనబడిన ఆరింటిలో ఐదు గురించి దైవగ్రంధం పవిత్ర పవిత్ర ఖుర్ఆన్లో ఇలా ప్రస్తావించబడింది: 

لَّيْسَ الْبِرَّ أَن تُوَلُّوا وُجُوهَكُمْ قِبَلَ الْمَشْرِقِ وَالْمَغْرِبِ وَلَٰكِنَّ الْبِرَّ مَنْ آمَنَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ وَالْمَلَائِكَةِ وَالْكِتَابِ وَالنَّبِيِّينَ

మీరు మీ ముఖాలను తూర్పు దిక్కుకో, పడమర దిక్కుకో తిప్పటమే సదాచరణ కాదు. సదాచరణ అంటే వాస్తవానికి అల్లాహ్‌ను, అంతిమ దినాన్నీ, దైవదూతలనూ, దైవగ్రంథాన్నీ, దైవ ప్రవక్తలనూ విశ్వసించటం” (అల్ బఖర 2:177) 

6వ కోణం విధి వ్రాత (మంచి, చెడు) గురించి పవిత్ర గ్రంధం ఖుర్ఆన్లో ఇలా పేర్కొనబడింది: 

إِنَّا كُلَّ شَيْءٍ خَلَقْنَاهُ بِقَدَرٍ

నిశ్చయంగా, మేము ప్రతి వస్తువును ఒక (నిర్ణీత) ‘విధి’ ప్రకారం సృష్టించాము”. (అల్ ఖమర్ 54:49) 

మూడవ స్థానం: ఇహ్సాన్: ఉత్తమం 

‘ఇహ్సాన్’కు సంబంధించి ఒకే ఒక మూలం ఉంది. అది మీరు అల్లాహ్ ను  అభిమానంతో, భయభక్తితో, ఆయన వైపు ఏకాగ్రతతో,మరలుతూ ప్రార్ధించాలి. మనస్పూర్తిగా అల్లాహ్ ను చూస్తున్నట్టు ఆరాధించాలి. మనము చూడలేక పోయినా ఆయన మమ్మల్ని చూస్తునే ఉన్నాడని గ్రహించాలి. 

‘ఇహ్సాన్ ‘కు సంబంధించిన ఆధారాలు : 

‘ఇహ్సాన్’ గురించి పవిత్ర గ్రంధం ఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా పేర్కొంటున్నాడు: 

إِنَّ اللَّهَ مَعَ الَّذِينَ اتَّقَوا وَّالَّذِينَ هُم مُّحْسِنُونَ

నిశ్చయంగా అల్లాహ్‌ తనకు భయపడుతూ జీవితం గడిపే వారికి, సద్వర్తనులకు తోడుగా ఉంటాడు” (అన్ నహ్ల్ 16:128) 

وَتَوَكَّلْ عَلَى الْعَزِيزِ الرَّحِيمِ الَّذِي يَرَاكَ حِينَ تَقُومُ وَتَقَلُّبَكَ فِي السَّاجِدِينَ إِنَّهُ هُوَ السَّمِيعُ الْعَلِيمُ

సర్వాధిక్యుడు, కరుణామయుడు అయిన అల్లాహ్‌నే నమ్ముకో.నువ్వు (ఒంటరిగా ఆరాధనలో) నిలబడి ఉన్నప్పుడు ఆయన నిన్ను చూస్తూ ఉంటాడు. సాష్టాంగ పడేవారి మధ్య (కూడా) నీ కదలికలను (కనిపెట్టుకుని ఉంటాడు).నిశ్చయంగా ఆయన అన్నీ వినేవాడు, అంతా తెలిసినవాడు”.  (ఆష్ షుఅరా 26: 217-220). 

మరో చోట ఇలా పేర్కొన్నాడు: 

وَمَا تَكُونُ فِي شَأْنٍ وَمَا تَتْلُو مِنْهُ مِن قُرْآنٍ وَلَا تَعْمَلُونَ مِنْ عَمَلٍ إِلَّا كُنَّا عَلَيْكُمْ شُهُودًا إِذْ تُفِيضُونَ فِيهِ

(ఓ ప్రవక్తా!) నువ్వు ఏ స్థితిలో వున్నా – ఖుర్‌ఆనులోని ఏ భాగాలను పారాయణం చేసినా, (ప్రజలారా!) మీరు ఏ పనిచేసినా, మీరు మీ కార్యక్రమాలలో తలమునకలై ఉన్నప్పుడు మేము మిమ్మల్ని గమనిస్తూనే ఉంటాము” (యూనుస్ 10:61)

పై మూడింటికి సున్నత్ ఆధారాలు: 

ధర్మంలో పై మూడు స్థానాలు ఉన్నాయని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి ప్రముఖ, ప్రఖ్యాత హదీసు ‘హదీసె జిబ్రయీల్ ‘ను గమనించండి: 

” عن عمر بن الخطاب رضی الله عنه قال: بينما نحن جلوس عند النبى الله اطلع علينا رجلٌ 

شديد بياض الثياب، شديد سواد الشعر، لأيرى عليه أثر السفر، ولا يعرفه منا احد. فجلس 

الى فـأسـنــدركبتيه إلى ركبتيه ووضع كـفيـه عـلـى فـخـذيــه وقال: يا محمد، أخبرني عن الإسلام، فقال: أن تشهد أن لا إله إلا الله وأن محمدا رسول الله ، وتقيم الصلوة، وتؤتي الزكاة،وتصوم 

رمضان، وتحج البيت إن استطعت اليه سبيلاً. قال : صدقت. فعجبناله يسأله ويصدقه. قال: أخبرني عن الإيمان، قال أن تؤمن بالله وملائكته وكتبه ورسله واليوم الآخر وبالقدر خيره وشره.قال: أخبرني عن الاحسان، قال: أن تعبد الله كأنك تراه فان لم تراه فانه يراك. قال أخبرني عن الساعة،قال: ما المسؤل عنها بأعلم من السائل. قال أخبرني عن أمارتها، قال: ان تلد الامة ربتها وأن ترى الحفاة العراة العالة رعاء 

الشاء، يتطاولون في البنيان قال : فمضى فلبثنامليا . قال : يا عمر أتدرون من السائل؟ قلنا: الله ورسوله 

أعلم، قال: هذا جبريل أتاكم يعلمكم أمر دينكم .” (صحیح بخاری و صحیح مسلم 

అర్ధం : హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రజిఅల్లాహు అన్హు) కధనం: 

“ఒక సారి మేము దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమక్షంలో కూర్చుని ఉన్నాము. ఇంతలో ఒక వ్యక్తి మా సమావేశంలో వచ్చాడు. అతని వస్త్రాలు తెల్లవిగాను, తలవెంట్రుకలు దట్టంగా ఉండి మిక్కిలి నల్లవిగాను ఉన్నాయి. అతనిపై ప్రయాణపు అలసట, ఆనవాళ్ళు కనబడట్లేదు. పైగా మాలో ఎవరు అతన్ని ఎరుగరూ కూడ. అతనికి తెలిసిన వారు లేరు కూడ. అతను నేరుగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వచ్చి ఆయన మోకాళ్ళకు తన మోకాళ్ళు ఆనించి, చేతులు తొడలపై పెట్టుకుని సవినయంగా (మర్యాదస్థితిలో కూర్చున్నాడు. తరువాత ఇలా ప్రశ్నించసాగాడు: 

ఓ ముహమ్మద్..! (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇస్లాం గురించి వివరించండి. దానికి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: “ఇస్లాం అంటే అల్లాహ్ తప్ప మరేఆరాధ్య దేవుడు లేడని, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ ప్రవక్త అని సాక్ష్యం ఇస్తూ, ‘నమాజు’ స్థాపించాలి. ధర్మదానం చేయాలి(జకాత్ చెల్లించాలి). పవిత్ర రమజాన్ మాసంలో ఉపవాసాలను పాటించాలి. సిరి, సంపదలు కల్గివుంన్నప్పుడు పవిత్ర ‘ కాబా’ (అల్లాహ్ గృహాన్ని) దర్శించాలి”. ఇది విన్న ఆ వ్యక్తి అవును మీరు చెప్పింది నిజమే.. అన్నాడు. అతని జవాబుకు మేము ఆశ్చర్యపోయాము. తనే ప్రశ్నిస్తునాడు, తనే నిజమంటున్నాడు. ఆ వ్యక్తి మళ్ళీ ప్రశ్నించాడు: ‘ఈమాన్’ గురించి తెల్పండి. దానికి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు. “అల్లాహ్ ను , ఆయన దూతలను, ఆయన గ్రంధాలను, ఆయన ప్రవక్తలను, ప్రళయ దినాన్ని మరియు విధిరాత (మంచి, చెడు)ను విశ్వసించాలి. 

ఇది విన్న ఆ వ్యక్తి మళ్ళి ఇలా ప్రశ్నించాడు: ‘ఇహ్సాన్’ గురించి తెల్పండి. దానికి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: “నీవు మనస్ఫూర్తిగా అల్లాహ్ ను చూస్తున్నటు ఆరాధించు.. నీవు చూడక పోయిన ఆయన నిన్ను గమనిస్తున్నాడని గ్రహించు”. అనంతరం మళ్ళీ ప్రశ్నించాడా వ్యక్తి: మరి ప్రళయం ఎప్పుడోస్తుందో తెల్పండి. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “ప్రళయం ఎప్పుడోస్తుందో ప్రశ్నించదగిన వానికంటే ప్రశ్నించే వాడికే బాగా తెలుసు” అని అన్నారు. ఆ వ్యక్తి మరల ప్రశ్నించాడు: అయితే దాని చిహ్నాలను చెప్పండి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు. “బానిసరాలు తమ యజమానిని కంటారు. చెప్పులు, వస్త్రాలు లేని మెకల కాపర్లు పెద్ద పెద్ద భవనాలు నిర్మించడంలో గర్వపడతారు”. 

హజ్రత్ ఉమర్(రజి అల్లాహు అను) ఇలా తెలిపారు: ఈ సంభాషణ తరువాత ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. మేము కొద్దిసేపు మౌనంగా వున్నాము. అంతలోనే దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు:- ఓ ఉమర్..! (రజి అల్లాహు అన్హు) ఆ ప్రశ్నికుడేవరో తెలుసా..? అన్నారు. అల్లాహ్, ఆయన ప్రవక్తకే బాగా తెలుసు అన్నాం. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “ ఆయన ‘జిబ్రయీల్’ (దైవదూత). ఆయన మీ వద్దకు ధార్మిక విద్యను నేర్పటానికి వచ్చారు” అని వివరించారు. (బుఖారి, ముస్లిం). 

మూడవ సూత్రం: దైవప్రవక్త ﷺ గురించి అవగాహన 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పేరు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన తండ్రి పేరు అబ్దుల్లాహ్

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కుటుంబానికి సంబంధించి తాత ముత్తాతల మహా వృక్షము ఇలా ఉంది:  ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ బిన్ హాషిం

‘హాషిం’ వంశం పరువు, ప్రతిష్ఠ పేరు ప్రఖ్యాతలకు నిలయం. ఇది ఖురైష్ వంశానికి చెందింది. ఖురైష్ అరేబియా వాసుల్లోని ఒక తెగ. అరేబియులు (అరబ్బులు) ప్రవక్త ఇస్మాయిల్ బిన్ ఇబ్రాహీం (అలైహిస్సలాం) సంతానం. 

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహివసల్లం) పూర్తి జీవిత కాలం 63సంవత్సరాలు. అందులో 40సంవత్సరాలు దైవ వాణి అవతరించక ముందువి. దైవ వాణి అవతరించి దైవ సందేశహరులుగా సంవత్సరాలు జీవించారు. ఆయన పవిత్ర మక్కా నగరంలో జన్మించారు. ఆయన పై తొలి దైవ వాణిలో ఈ వాక్యాలు అవతరింపబడ్డాయి. 

اقْرَأْ بِاسْمِ رَبِّكَ الَّذِي خَلَقَ

(ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం!) చదువు, సృష్టించిన నీ ప్రభువు పేరుతో. (అల్ అలఖ్ 96:1) 

(వాటి ద్వార దైవప్రవక్తగా నియమితులయ్యారు.)

రెండో సారి దైవ వాణిలో అవతరించిన వాక్యాలు (ఆయతులు): 

يَا أَيُّهَا الْمُدَّثِّرُ

قُمْ فَأَنذِرْ


ఓ కంబళి కప్పుకున్నవాడా! లే. (లేచి జనులను) హెచ్చరించు”. (అల్ ముద్దస్సిర్ 74:1-2) 

ఈ వాక్యాల ద్వార దైవసందేశహరులుగా నియమితులయ్యారు. ప్రజలకు షిర్క్(బహుదైవారాధన) గురించి వారించి, హెచ్చరించి, తౌహీద్ (ఏకదైవారాధన) వైపునకు పిలవటానికి, అల్లాహ్ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ప్రవక్తగా ఎన్నుకున్నాడు. 

దీని గురించి అల్లాహ్ పవిత్ర ఖుర్ఆన్లో ఇలా సెలవిస్తున్నాడు: 

يَا أَيُّهَا الْمُدَّثَرُ قُمْ فَانْذِرُ. وَرَبَّكَ فَكَبْرِ ، وَثِيَابَكَ فَطَهِّرُ وَالرُّجُزَ فَاهْجُر. 

وَلَا تَمْنُنْ تَسْتَكْسِرُ. وَلِرَبِّكَ فَاصْبِر) (سورة المدثر: ۱-۷۲) 

అర్ధం : “ ఓ దుప్పటి కప్పుకొని నిద్రించేవాడా..! మేలుకో (నిలబడు), (ప్రజలను)హెచ్చరించు. నీ ప్రభువు గొప్పతనాన్ని చాటిచెప్పు. నీ వస్త్రాలను పరిశుభ్రముగా ఉంచుకో. చెడు నుండి దూరంగా ఉండు. ఎక్కువ పొందాలనే అత్యాశతో ఉపకారము చేయకు. నీ ప్రభువుకై సహనం వహించు”. 

(అల్ ముద్దస్సిర్74:1-7) 

దైవ వాణిలోని పదాల వివరణ:- 

2 قُمْ فَأَنذِرْ. మీరు ప్రజలను ‘షిర్క్ (బహుదైవారాధన) గురించి హెచ్చరించి భయపెట్టండి. అల్లాహ్ ఏకత్వం వైపునకు పిలవండి. 

3. وَرَبَّكَ فَكَبْرِ అల్లాహ్ ఏకత్వం తోపాటు అతని గొప్పతనాన్ని చాటి చెప్పండి. 

4. وَثِيَابَكَ فَطَهِّرُ  తమ కర్మలను షిర్క్ (బహుదైవారాధన) తో కల్పితం చేయకుండా శుభ్రముగా ఉంచండి. 

5. وَالرُّجُزَ అంటే విగ్రహాలు. 

6 فَاهْجُر అంటే దానిని విడనాడుట. 

వివరణ: 

విషయం ఏమనగా ఇంత కాలం మీరు ఎలాగైతే దానికి దూరంగా ఉన్నారో, అలాగే దాన్ని తయారు చేసి పూజించే వారితో కూడా దూరంగా ఉండండి. వారితో తమకు ఎటువంటి సంబంధములేదని చాటి (విజ్ఞప్తి చేయండి) చెప్పండి. 

ఈ ఒక్క అంశాన్నే మాటనే కేంద్రీకరించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) 10సంవత్సరాలు అంకితం చేశారు. ప్రజలను ‘తౌహీద్’ (ఏకత్వం) వైపునకు పిలుస్తూవున్నారు. 10సంవత్సరాల తర్వాత ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) కు గగనయాత్ర (మేరాజ్) చేయించబడింది. ఆ శుభ సందర్భములో ఆయనపై అయిదు పూటల నమాజ్ విధిగా నిర్ణయించబడింది. 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) 3 సంవత్సరాల వరకు పవిత్ర మక్కా నగరంలో నమాజు చేస్తూవున్నారు. ఆ తర్వాత పవిత్ర మదీనా వైపు వలస చేయమని ఆజ్ఞా పించటం జరిగింది. 

హిజ్రత్:(వలసత్వం) 

వలసచేయుట. అంటే షిర్క్ (బహుదైవారాధన) జరిగే ప్రదేశము నుండి ఇస్లాం ప్రకారం ఆచరణ చేయగలిగే ప్రదేశమునకు వలసపోవుట అని అర్ధం. (బహుదైవారాధకుల ప్రదేశంలో ఏకదైవరాధన (అల్లాహ్ ఆరాధన) పట్ల కష్టాలు ఎదురై, సమస్యలు ముదిరినప్పుడు ఆ ప్రదేశం నుండి కేవలం ధార్మికత కోసమే వలస చేయాలి) ఈవిధముగా వలసచేయుట, ప్రదేశాలు మారుట ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి ఉమ్మత్ (జాతి) పై విధిగా పరిగణించబడింది. ఇది ప్రళయం వరకు సాగే విధి. దీని గురించి పవిత్ర గ్రంధం ఖుర్ఆన్ ఇలా ప్రస్తావించబడింది: 

إِنَّ الَّذِينَ تَوَفَّاهُمُ الْمَلَائِكَةُ ظَالِمِي أَنفُسِهِمْ قَالُوا فِيمَ كُنتُمْ ۖ قَالُوا كُنَّا مُسْتَضْعَفِينَ فِي الْأَرْضِ ۚ قَالُوا أَلَمْ تَكُنْ أَرْضُ اللَّهِ وَاسِعَةً فَتُهَاجِرُوا فِيهَا ۚ فَأُولَٰئِكَ مَأْوَاهُمْ جَهَنَّمُ ۖ وَسَاءَتْ مَصِيرًا

إِلَّا الْمُسْتَضْعَفِينَ مِنَ الرِّجَالِ وَالنِّسَاءِ وَالْوِلْدَانِ لَا يَسْتَطِيعُونَ حِيلَةً وَلَا يَهْتَدُونَ سَبِيلًا

فَأُولَٰئِكَ عَسَى اللَّهُ أَن يَعْفُوَ عَنْهُمْ ۚ وَكَانَ اللَّهُ عَفُوًّا غَفُورًا

“(ఎవరైతే) తమ ఆత్మలపై అన్యాయం చేసుకుంటు ఉండేవారో, వారి ఆత్మలను దైవదూతలు (తమ) ఆధీనంలో తీసుకున్నప్పుడు (వారిని ప్రశ్నిస్తారు) మీరు ఈ స్థితిలో వున్నారేమిటని? (దానికి వారు బదులు పలుకులో) మేము భూమి పై బలహీనులుగా వున్నాము. దైవ దూతలు అంటారు. అల్లాహ్ యొక్క భూమి విశాలముగా లేదా? మీరు అందులో వలసచేయటానికి? వీరే ఆవ్యక్తులు! వీరి నివాసమే నరకము. అది మహా చెడ్డనివాసం. కాని నిజంగా అవస్థలో పడివున్న ఆ పురుషులు, స్త్రీలు, చిన్నారులు వలస పోవుటకు ఎటువంటి దారి పొందనప్పుడు, అల్లాహ్ వారిని క్షమించే అవకాశం ఉంది.అల్లాహ్ ఎక్కువగా క్షమించేవాడు. మన్నించేవాడు”. (అన్నిసా 04:97-99) 

అల్లాహ్ మరొచోట అల్లాహ్ పేర్కుంటున్నాడు: 

يَا عِبَادِيَ الَّذِينَ آمَنُوا إِنَّ أَرْضِي وَاسِعَةٌ فَإِيَّايَ فَاعْبُدُونِ

విశ్వసించిన ఓ నా దాసులారా! నా భూమి ఎంతో విశాలమైనది. కనుక మీరు నన్నే ఆరాధించండి”. (అన్కబూత్ 29:56) 

ఇమాం బగ్విఁ (రహ్మతుల్లాహి అలైహి) ఈ ఆయత్ అవతరణ సందర్భము గురించి ఇలా పేర్కొన్నారు: 

ఈ ఆయతు ఎవరైతే వలసచేయకుండా మక్కా ప్రదేశములో ఉన్నారో, ఆముస్లింల గురించి అవతరింపబడింది. అల్లాహ్ వారిని ఈమాన్ (విశ్వాస లక్షణం) తో పిలిచాడు. 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక హదీసులో ఇలా ప్రస్తావించారు: 

لاتنقطع الهجرة حتى تنقطع التوبة ولا تنقطع التوبة حتى تطلع الشمس من مغربها 

“ తౌబా’ తలుపులు మూయబడే వరకు ‘హిజ్రత్’ వలసత్వం ఆగదు. మరి ‘తౌబా’ తలుపులు మూయబడాలంటే సూర్యుడు పడమర నుండి ఉదయిం చాలి. (ప్రళయ దినమే సూర్యుడు పడమర నుండి ఉదయిస్తాడు). 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మదీనాలో స్థిరపడిన తర్వాత మిగితా ఇస్లాం ధర్మోపదేశాలు ఇవ్వబడ్డాయి. 

ఉదా : జకాత్ (ధర్మదానం), రోజా(ఉపవాసం), హజ్ (పవిత్ర మక్కా యాత్ర), అజాన్ (నమాజు కొరకు పిలుపు), జిహాద్ (ధార్మిక అంతులే కృషి) ‘అమర్ బిల్ మారూఫ్, నహి అనిల్ మున్కర్’ (మంచిని పెంచుట, చెడును త్రుంచుట) మొదలైనవి. 

పై ఆదేశాలపై ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) 10 సంవత్సరాలు జీవించి, తర్వాత మరణించారు. కాని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ధర్మం ప్రళయం వరకూ ఉంటుంది. దీనిని అల్లాహ్ యే ప్రళయం వరకు రక్షిస్తాడు. 

ఇస్లాం ధర్మం 

ప్రవక్త ﷺ శాసన సారాంశం 

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై అవతరింపబడిన ఈ ధర్మం ఎంతో సంక్షిప్తమైనది, ఉత్తమమైనది. ప్రజలకు ఆ మంచి కార్యము అందలేదు అని చెప్పటానికి మంచిలోని ఏభాగము మిగలలేదు. మంచికార్యాలలో అమితముగా మార్గదర్శకత్వం వహించిన కార్యం ‘తౌహీద్’ (అల్లాహ్ ఏకత్వం) మరియు అల్లాహ్ మెచ్చుకునే ప్రతి మంచి కార్యంకూడ. ఈ పుణ్యకార్యాలు అల్లాహ్ ఇష్టాన్ని పొందుటకు మూలమైనవి. చెడు లో అతి ఎక్కువగా హెచ్చరించిన కార్యం ‘షిర్క్’ (అల్లాహ్ తోసాటి కల్పించడం, బహుదైవారాధన). మరి అల్లాహ్ ఇష్టపడని కార్యాలతో కూడ హెచ్చరించారు. 

ప్రవక్త (సల్లల్లాహు అలైహివసల్లం)ను అల్లాహ్ సర్వమానవాళి కొరకు దైవ సందేశహరులుగా పంపాడు. మానవులు జిన్నాతులు ఆయనకు విధేయత చూపాలని విధిగా నిర్ణయించాడు. 

పవిత్ర గ్రంధం ఖుర్ఆన్ అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

قُلْ يَا أَيُّهَا النَّاسُ إِنِّي رَسُولُ اللَّهِ إِلَيْكُمْ جَمِيعًا

(ఓ ముహమ్మద్‌!) వారికి చెప్పు : “ఓ ప్రజలారా! నేను భూమ్యాకాశాల సామ్రాజ్యానికి అధిపతి అయిన అల్లాహ్‌ తరఫున మీ అందరి వద్దకు పంపబడిన ప్రవక్తను. (అల్ ఆరాఫ్ 7:158) 

అల్లాహ్ తన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై ఇస్లాం ధర్మాన్ని పరిపూర్ణం చేశాడు. ఇహ, పరలోకాలకు సంబంధించిన అన్ని విషయాల పరిష్కారాల్ని పెట్టాడు. ఎటువంటి లోపం మిగలలేదు. ఇందుకు దైవగ్రంధము పవిత్ర ఖుర్ఆన్ లో ఇలా తెలుపబడింది: 

الْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِينَكُمْ وَأَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي وَرَضِيتُ لَكُمُ الْإِسْلَامَ دِينًا

అర్ధం : “ఈ రోజు నేను (అల్లాహ్) మీ ధర్మాన్ని మీకోసం పరి పూర్ణం చేశాను,మరి నా అనుగ్రహాన్ని మీపై పూర్తిచేశాను, ఇస్లాం మీ ధర్మంగా అంగీకరించాను”. (అల్ మాయిదా 05:3) 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈలోకం నుండి పయనించారు (మరణించారు) అని చెప్పటానికి దైవగ్రంధము పవిత్ర ఖుర్ఆన్ లోని ఈ ఆధారం: 

إِنَّكَ مَيِّتٌ وَإِنَّهُم مَّيِّتُونَ

ثُمَّ إِنَّكُمْ يَوْمَ الْقِيَامَةِ عِندَ رَبِّكُمْ تَخْتَصِمُونَ

అర్ధం : “ప్రవక్తా..! మీరూ మరణించే వారే, మరియు వారు కూడ మరణించే వారే. చివరికి మీరందరు ప్రళయంలో మీ ప్రభువు ముందు తమ తమ ‘పేషీ’ (హాజరు ఇవ్వవలసి ఉన్నది) చేయవలసి యుంటుంది. (అజ్జుమర్ 39:30 – 31) 

ప్రజలందరూ మరణించిన తర్వాత తమకార్యకలాపాల ఫలితాలను పొందటానికి లేపబడతారు, దీని గురించి పవిత్ర గ్రంధం ఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా ప్రస్తావిస్తున్నాడు: 

مِنْهَا خَلَقْنَاكُمْ وَفِيهَا نُعِيدُكُمْ وَمِنْهَا نُخْرِجُكُمْ تَارَةً أُخْرَىٰ

“ఇదే భూమి నుండి మేముమిమ్మల్ని సృష్టించాము, మరియు ఇందులోకే తీసుకు వెళ్తాము, దీని నుండే మిమ్మల్ని మరల వెలికితీస్తాము. (మరోసారి సృష్టిస్తాము)”. (తాహా 20:55) 

మరణాంతర జీవితం గురించి మరోచోట ఇలా పేర్కొన్నాడు: 

وَاللَّهُ أَنبَتَكُم مِّنَ الْأَرْضِ نَبَاتًا

ثُمَّ يُعِيدُكُمْ فِيهَا وَيُخْرِجُكُمْ إِخْرَاجًا

అల్లాహ్ మిమ్మల్ని ప్రత్యేకించి భూమి నుండి సృష్టించాడు, మరల ఆయన అదే భూమిలోకి తీసుకువెళ్తాడు. (ప్రళయంనాడు అదే భూమి నుండి) మిమ్మల్ని ఒక్కసారిగా లేవతీస్తాడు”. (సూరె నూహ్ 71:17-18) 

మలి విడత సృష్టించిన తర్వాత అందరితో లెక్క తీసుకుంటాడు. వారి పాప పుణ్యకర్మల ప్రకారం ప్రతిఫలాన్ని అందజేస్తాడు. అల్లాహ్ పవిత్ర ఖుర్ఆన్లో ఇలా సెలవిస్తున్నాడు: 

وَلِلَّهِ مَا فِي السَّمَوَاتِ وَمَا فِي الْأَرْضِ لِيَجْزِيَ الَّذِينَ أَسَاؤُوا بِمَا عَمِلُوا وَيَجْزِيَ 

الَّذِينَ أَحْسَنُوا بالحسنى (سورة النجم : ٣١) 

భూమ్యాకాశాల్లో ఉన్న ప్రతిదానికి అల్లాహ్ యే అధిపతి. (ఎందుకంటే) పాపకార్యాలు చేసిన వారికి వారి కర్మఫలాన్ని ఇచ్చేందుకునూ, మరి పుణ్యవంతులకు మంచి ఫలితాన్ని ప్రసాదించేందుకునూ”. (అన్నజ్మ్  54:31) 

ఎవరైన మరణాంతర జీవితాన్ని నిరాకరిస్తే అతను అవిశ్వాసి, అతని గురించి దైవగ్రంధము ఇలా ప్రస్తావిస్తుంది: 

زَعَمَ الَّذِينَ كَفَرُوا أَن لَّن يُبْعَثُوا ۚ قُلْ بَلَىٰ وَرَبِّي لَتُبْعَثُنَّ ثُمَّ لَتُنَبَّؤُنَّ بِمَا عَمِلْتُمْ ۚ وَذَٰلِكَ عَلَى اللَّهِ يَسِيرٌ

తాము మరణించిన పిదప తిరిగి బ్రతికించబడటం అనేది ఎట్టి పరిస్థితిలోనూ జరగని పని అని అవిశ్వాసులు తలపోస్తున్నారు. (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “ఎందుకు జరగదు? నా ప్రభువు తోడు! మీరు తప్పకుండా మళ్ళి లేపబడతారు. మీరు చేసినదంతా మీకు తెలియపరచబడుతుంది. ఇలా చేయటం అల్లాహ్ కు చాలా తేలిక.”. (అత్తఘాబున్ 64:7) 

అల్లాహ్ ప్రవక్తలందరికి ‘స్వర్గపు’ శుభవార్త ఇచ్చేవారుగా, ‘నరకము’ నుండి హెచ్చరించేవారుగా చేసి పంపాడు: 

رُّسُلًا مُّبَشِّرِينَ وَمُنذِرِينَ لِئَلَّا يَكُونَ لِلنَّاسِ عَلَى اللَّهِ حُجَّةٌ بَعْدَ الرُّسُلِ

మేము వారిని శుభవార్తలు వినిపించే, హెచ్చరించే ప్రవక్తలుగా చేసి పంపాము – ప్రవక్తలు వచ్చిన తరువాత అల్లాహ్‌కు వ్యతిరేకంగా వాదించటానికి ప్రజల వద్ద ఏ ఆధారమూ మిగలకూడదని (మేమిలా చేశాము). అల్లాహ్‌యే సర్వాధిక్యుడు, మహావివేకి”. (అనిస్సా 4:165) 

ప్రవక్తల్లో తొలి ప్రవక్త హజ్రత్ ‘నూహ్’ (అలైహిస్సలాం) చివరి ప్రవక్త హజ్రత్ ‘ముహమ్మద్’ (సల్లల్లాహు అలైహి వసల్లం). ఆయనే అంతిమ ప్రవక్త. ప్రవక్త ‘నూహ్’ (అలైహిస్సలాం) కంటే ముందు ఏ ప్రవక్త లేరు. అల్లాహ్ దీని గురించి ఇలా ప్రస్తావిస్తున్నాడు: 

إِنَّا أَوْحَيْنَا إِلَيْكَ كَمَا أَوْحَيْنَا إِلَىٰ نُوحٍ وَالنَّبِيِّينَ مِن بَعْدِهِ

ఓ ప్రవక్తా! మేము మీవైపు అలాగే దైవవాణి పంపాము, ఎలాగైతే నూహ్ వైపు మరియు వారి తర్వాత ప్రవక్తలవైపు పంపామో”. (అన్నిస్సా 4:163) 

‘నూహ్’ (అలైహిస్సలాం) మొదలుకొని ప్రవక్త ‘ముహమ్మద్’ (సల్లల్లాహు అలైహి వసల్లం) వరకు ప్రతి జాతిలోను మేము సందేశహరులను పంపాము. (వారు) తమ జాతి వారికి అల్లాహ్ ఆరాధించమని, ‘తాఘత్ ‘ను పూజించవద్దని చెప్తూవచ్చేవారు.

అందుకు దైవగ్రంధము పవిత్ర ఖుర్ఆన్ లో ఆధారం: 

وَلَقَدْ بَعَثْنَا فِي كُلِّ أُمَّةٍ رَّسُولًا أَنِ اعْبُدُوا اللَّهَ وَاجْتَنِبُوا الطَّاغُوتَ

మేము ప్రతి సముదాయంలోనూ ప్రవక్తను ప్రభవింపజేశాము. అతని ద్వారా (ప్రజలారా!) “అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించండి. ఆయన తప్ప ఇతరత్రా మిథ్యా దైవాలకు దూరంగా ఉండండి” అని బోధపరచాము”. (అన్ నహ్ల్ 16:36) 

అల్లాహ్ తన దాసులందరి (జిన్నాతులు, మానవులు) పై విధిగా నిర్ణయించింది ఏమనగా వారు ‘తాఘాత్ ‘ను నిరాకరించి, తనను (అల్లాహ్) విశ్వసించి తీరాలి. 

ఇమాం ఇబ్నె ఖయ్యిం (రహిమహుల్లాహ్ ) ‘తాఘాత్’ గురించి వివరిస్తూ ఇలా పెర్కొన్నారు: 

“అల్లాహ్ తప్ప మరి దేనిని ఆరాధించినా, లేక అనుసరించినా (అనుసరించే విధానంలో అల్లాహ్ అవిధేయతను కల్గివుంటే), మరి ‘హలాల్-హరామ్’ విషయాలలో మరొకరికి విధేయత చూపినా, అతడు దైవదాసుల పరిధిని దాటిన వాడవుతాడు. అదే (సమయం) లో వాడు ‘తాఘత్’ను అనుసరించిన వాడవుతాడు. 

లెక్కకు మించిన ‘తాఘాత్’లు ఉన్నాయి. అందులో ప్రధమ స్థానంలో అయిదుగురున్నారు. 

1. ఇబ్లీస్ లయీన్. 

2. ఎవరైన వ్యక్తి తన పూజ జరుగుతున్నప్పుడు దానిని మెచ్చుకునేవాడు.
3. ప్రజలకు తనను పూజించమని ఆహ్వానించే వ్యక్తి. 

4. నేను అగోచర విషయాల(జ్ఞానము కలవాడిని)ను ఎరుగుదును అనే వ్యక్తి. 

5. అల్లాహ్ అవతరింపజేసిన ధర్మానికి వ్యతిరేకంగా తీర్పు చెప్పేవాడు. 

అల్లాహ్ పవిత్ర ఖుర్ఆన్ గ్రంధములో ఇలా సెలవిస్తున్నాడు: 

 لَا إِكْرَاهَ فِي الدِّينِ ۖ قَد تَّبَيَّنَ الرُّشْدُ مِنَ الْغَيِّ ۚ فَمَن يَكْفُرْ بِالطَّاغُوتِ وَيُؤْمِن بِاللَّهِ فَقَدِ اسْتَمْسَكَ بِالْعُرْوَةِ الْوُثْقَىٰ لَا انفِصَامَ لَهَا ۗ وَاللَّهُ سَمِيعٌ عَلِيمٌ

ధర్మం విషయంలో బలవంతం ఏమీ లేదు. సన్మార్గం అపమార్గం నుంచి ప్రస్ఫుట మయ్యింది. కనుక ఎవరయితే అల్లాహ్‌ తప్ప వేరితర ఆరాధ్యులను (తాగూత్‌ను) తిరస్కరించి అల్లాహ్‌ను మాత్రమే విశ్వసిస్తారో వారు దృఢమైన కడియాన్ని పట్టుకున్నారు. అది ఎన్నటికీ తెగదు. అల్లాహ్‌ సర్వం వినేవాడు, సర్వం తెలిసినవాడు”. (అల్ బఖర 2:256) 

ఇదే ‘లాఇలాహ ఇల్లల్లాహ్’ (అల్లాహ్ తప్ప మరెవ్వరూ ఆరాధ్య దేవుడు లేడు) కు అసలైన అర్ధము, వివరణ. 

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉపదేశించారు. 

رَاسُ الأمر الاسلامُ وَعَمُودُهُ الصَّلاةُ وَذِرْوَةُ سَنَامِهِ الجِهَادُ فِي سَبِيلِ اللَّهِ” اعلم 

(طبرانی کبیر ، صححه السيوطى فى جامع صغير وحسنه المناوي في شرحه والله 

అర్ధం : “ఈ ధర్మానికి అసలు మూలం “ఇస్లాం” మరి దీనిని (పటిష్టంగా నిలబెట్టె బలమైన) స్థంభం నమాజ్. ఇందులో ఉన్నతమైన, ఉత్తమమైన స్థానం దైవ మార్గములో చేసే ధర్మ పోరాటం”. (తబ్రాని కబీర్) 

జకాత్ ఆదేశాలు [పుస్తకం & వీడియో పాఠాలు]

బిస్మిల్లాహ్

జకాత్ (విధి దానం) ఆదేశాలు
[ఇక్కడ చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [12 పేజీలు]

రచయిత : ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.

జకాత్ ఆదేశాలు (Fiqh of Zakat) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1ojW-FuiGAt8MtqQ5Cssyt

విషయ సూచిక

  • జకాత్ అంటే ఏమిటి?
  • జకాత్ వల్ల కలిగే లాభాలు,మేళ్లు 
  • జకాత్ ఏ  వస్తువుల పై  విధిగా ఉంది?
  • బంగారం, వెండి జకాత్ 
  • వ్యాపార సామాగ్రి యొక్క జకాత్ 
  • షేర్ల యొక్క జకాత్ 
  • భూ సంబంధ ఉత్పత్తులపై జకాత్ 
  • పశువుల జకాత్ 
  • ఒంటెల జకాత్ 
  • ఆవుల జకాత్ 
  • మేకల జకాత్ 
  • జకాత్ హక్కుదారులు 

[పూర్తి పుస్తకం క్రింద చదవండి]

(ఇస్లామీయ పరిభాషలో జకాత్ అంటే: అల్లాహ్ యొక్క ఆరాధన ఉద్దేశ్యంతో, నిసాబ్ స్థాయికి చేరిన వ్యక్తి తన నిర్ణీత ధన, ధాన్యాలలో అర్హులైన ప్రజలకు చెల్లించవలసిన బాధ్యత).

జకాత్ ఇస్లాం మూల స్తంభాల్లో మూడవది. ఏ ముస్లిం అయితే జకాత్ యొక్క “నిసాబ్” (చెల్లించేవారి పరిధి)లోకి వస్తాడో అతనిపై జకాత్ విధిగా అవుతుంది. అల్లాహ్ ఆదేశం చదవండిః

నమాజు స్థాపించండి. జకాత్ ఇవ్వండి. (బఖర 2: 43).

జకాత్ ను ధర్మపరంగా విధిగావించడంలో అనేక లాభాలు, మేల్లున్నాయి. వాటిలో కొన్ని ఇవి:

  • 1- ఆత్మశుద్ధి కలుగుతుంది. మనస్సులో నుండి దురాశ, పిసినారి తత్వాలు దూరమవుతాయి.
  • 2- ముస్లిం భక్తుడు దాతృత్వం లాంటి సద్గుణ సంపన్నుడవుతాడు.
  • 3- ధనవంతుని మరియు పేదవాని మధ్య ప్రేమ సంబంధాలు బలపడతాయి. ఎలా అనగా ఉపకారుని పట్ల ఆత్మ ఆకర్షితమవుతుంది మరియు ప్రేమిస్తుంది.
  • 4- బీద ముస్లిముల అవసరాలు తీరుతాయి. వారు ఒకరి ముందు తమ చెయ్యి చాపకుండా ఉంటారు.
  • 5-  జకాత్ చెల్లించే మానవుడు పాపాల నుండి పరిశుద్ధుడు అవుతాడు. అంటే జకాత్ వల్ల అతని స్థానం ఉన్నతమై, అతని పాపాలు మన్నించ- బడతాయి.

ఏ వస్తువుల్లో జకాత్ విధిగా ఉంది

బంగారం, వెండి, వ్యాపార సామాగ్రి, పశుసంపద, పండిన పంటలు, ఫలాలు మరియు నిధినిక్షేపాలు.

బంగారం, వెండి జకాత్

బంగారం, వెండి ఏ రూపంలో ఉన్నా వాటిపై జకాత్ విధిగా ఉంది. నిసాబ్ స్థాయికి చేరిన వ్యక్తి పై మాత్రమే.

బంగారం “నిసాబ్”: 20 దీనారులు. ఈ నాటి లెక్క ప్రకారం 85 గ్రాములు.

వెండి “నిసాబ్”: 200 దిర్హములు. ఈ నాటి లెక్క ప్రకారం 595 గ్రాములు.

పై లెక్క ప్రకారం ఏ వ్యక్తి “నిసాబ్” స్థాయికి చేరుకున్నాడో, అది అతని వద్ద ఉండి సంవత్సరం పూర్తి అయిందో, అతను అందులో నుండి (2.5%) రెండున్నర శాతం జకాతుగా చెల్లించాలి.

వాటి జకాత్, డబ్బు రూపంలో ఇవ్వదలుచు- కున్న వ్యక్తి, అవి అతని ఆధినంలో వచ్చినప్పటి నుండి ఒక సంవత్సరం పూర్తయినప్పుడు మార్కెట్లో ఒక గ్రాము బంగారం లేదా వెండి యొక్క ధర ఎంత ఉందో తెలుసుకొని, తన వద్ద ఉన్న మొత్తం బంగారం లేదా వెండి మూల్యం ఎంతవుతుందో లెక్కగట్టి, అందులో నుండి రెండున్నర శాతం డబ్బు జకాతుగా ఇవ్వాలి. (మేము డబ్బు అని వ్రాసాము అయితే ఎవరు ఏ దేశంలో ఉన్నారో అక్కడ వారి కరెన్సీ పేరేముందో దాన్ని బట్టి వారు లెక్కించుకోవాలి).

దీని ఉదాహరణ: ఒక వ్యక్తి వద్ద 100 గ్రాముల బంగారం ఉంది అనుకుందాం. అతని వద్ద ఉండి సంవత్సరం పూర్తి అయింది కూడాను. అందుకు అతనిపై జకాత్ విధి అయింది. ఇక అతను రెండున్నర గ్రాముల బంగారం జకాతుగా ఇవ్వాలి. ఒకవేళ అతను దాని జకాత్ డబ్బు రూపంలో ఇవ్వదలుచుకుంటే, 100 గ్రాముల బంగారం ధర తెలుసుకోవాలి. (దాని ధర ప్రస్తుత భారత కరెన్సీ ప్రకారం ఒక లక్ష అని తెలిసిందనుకుందాం) అతను అందులో రెండున్నర శాతం జకాత్ ఇవ్వాలి. (అంటే (2,500) రెండు వేల అయిదు వందల రూపాలు). ఇదే విధంగా వెండి జకాతు ఇవ్వాలి.

ఇలాగే కరెన్సీలో కూడా “నిసాబ్” స్థాయికి చేరిన వ్యక్తిపై, అవి అతని వద్ద ఉండి సంవత్సరం గడిస్తే అతనిపై జకాతు విధి అవుతుంది. ఎవరి వద్ద 595 గ్రాముల వెండి ధరకు సమానమైన లేదా అంతకంటే ఎక్కువ కరెన్సీ ఉందో అతనిపై జకాత్ విధిగా ఉంది. అతను తన వద్ద ఉన్న మొత్తం డబ్బులో నుండి రెండున్నర శాతం జకాత్ గా ఇవ్వాలి.

ఏ ముస్లిం వద్ద డబ్బు ఉండి, సంవత్సరం దాటిందో అతను 595 గ్రాముల వెండి ధర తెలుసుకోవాలి, అతని వద్ద ఉన్న డబ్బు 595 గ్రాముల వెండి ధరకు చేరుకుంటే జకాత్ ఇవ్వాలి. ఒకవేళ అతని వద్ద ఉన్న డబ్బు దాని ధరకు తక్కువ ఉంటే అతనిపై జకాత్ విధిగా లేదు.

ఉదాహరణః ఒక వ్యక్తి వద్ద భారత కరెన్సీ ప్రకారం రూ. 80 వేలున్నాయనుకుందాం. అతని వద్ద ఉండి సంవత్సరం పూర్తి అయ్యింది కూడా. ప్రస్తుతం మార్కెట్లో 595 గ్రాముల వెండికి ఎంత ధర ఉందో తెలుసుకోవాలి. దాని ధర ఎనభై ఐదు వేలు అని తెలిస్తే అతనిపై జకాత్ విధిగా లేదు. ఎందుకనగా అతను “నిసాబ్” స్థాయికి చేరుకోలేదు. “నిసాబ్” స్థాయికి  చేరుకోడానికి అతని వద్ద ఎనభై ఐదు వేల రూపాయిలుండాలి.

వ్యాపార సామాగ్రి యొక్క జకాత్

సంపద కలిగి, దానిని వ్యాపారంలో ఉపయో గించే ముస్లిం వర్తకునిపై ప్రతి సంవత్సరం జకాత్ విధిగా ఉంది. ఇది అల్లాహ్ ప్రసాదించిన అనుగ్రహానికి కృతజ్ఞత మరియు అతనిపై ఉన్న తన పేదసోదరుల హక్కు అని తను భావించాలి. లాభోద్దేశంతో క్రయవిక్రయించే ప్రతీ వస్తువు వ్యాపార సామాగ్రి అనబడుతుంది; భూములు, ఇండ్లు, స్థిరాస్థులు (real estate), పశువులు, తినుత్రాగు పదార్థాలు మరియు వాహనాలు వగైరా. అవి “నిసాబ్” స్థాయికి చేరి ఉండాలి. అంటే పైన తెలిపిన 595 గ్రాముల వెండి ధరకు సమానంగా లేదా అంతకుమించి ఉండాలి. ఆ మొత్తంలో నుండి 2.5% (రెండున్నర శాతం) జకాతుగా ఇవ్వాలి.

ఉదాహరణ: ఒక వ్యక్తి వద్ద ఒక లక్ష రూపాయల విలువ గల వ్యాపార సామాగ్రి ఉంటే, అందులో నుండి రూ. 2500/- జకాత్ చెల్లించాలి. వ్యాపారస్తులు ప్రతి సంవత్సరపు ఆరంభంలో తమ వద్ద ఉన్న మొత్తం సరుకును లెక్కించుకొని జకాత్ చెల్లించాలి. ఎవరైనా వ్యాపారి సంవత్సరం పూర్తి అగుటకు పది రోజుల ముందు ఏదైనా సరుకు కొనుగోళు జేస్తే దాని జకాత్ కూడా ముందు నుండే ఉన్న సరుకుతో కలపివ్వాలి. వ్యాపారం ప్రారంభించిన మొదటి రోజు సంవత్సరం యొక్క ఆరంభమగును. ఇలా ప్రతి సంవత్సరం జకాత్ చెల్లించాలి.

పశుశాలలో లేదా ఇంటి వద్ద ఉంచి మేత ఇవ్వబడే పశువులు వ్యాపారం కోసం పెంచితే వాటి మీద జకాత్ విధి అవుతుంది. అవి పశువుల “నిసాబ్” స్థాయికి చేరుకున్నా, చేరుకోకపోయినా వాణిజ్య సరుకులాగా దాని వెల “నిసాబ్” స్థాయికి చేరుకుంటే అందులో నుండి జకాత్ చెల్లించాలి.

షేర్స్ యొక్క జకాత్

రియల్ ఎస్టేట్ (Real estate) తదితర రంగాల్లో షేర్స్ ఈ రోజుల్లో సర్వసాధనం అయ్యింది. (ధర్మసమ్మతమైన షేర్స్ కొనుట, అమ్ముట ఆమోదయోగ్యమే. కాని ధర్మసమ్మతం కాని వాటిలో ముస్లిం పాల్గొనుట ఎంత మాత్రం యోగ్యం కాదు). అందులో డిపాజిట్ చేసి ఉన్న డబ్బు కొద్ది సంవత్సరాల్లో పెరగవచ్చు లేదా తరగనూవచ్చు. షేర్స్ లో ఉన్న డబ్బుపై జకాత్ ఉంది. ఎందుకనగా అది కూడా వాణిజ్య సరుకు లాంటిదే. షేర్స్ లో పాల్గొన్న ప్రతి ముస్లిం ప్రతి సంవత్సరం తన షేర్స్ ధర చూస్తూ ఉండాలి. ‘నిసాబ్” స్థాయికి చేరి ఉంటే జకాత్ చెల్లిస్తూ ఉండాలి.

భూ సంబంధ ఉత్పత్తులపై జకాత్

నిల్వ మరియు తూకము చేయుగల ఖర్జూరం, ఎండిన ద్రాక్ష, గోధుమ, జొన్న, బియ్యం లాంటి ఆహారధాన్యాల, ఫలాలపై జకాత్ విధిగా ఉంది. కాని నిల్వ చేయలేని తాజా పండ్లు, కూరగాయలపై జకాత్ విధిగా లేదు. పై వాటిలో జకాత్ విధి కావడానికి అవి “నిసాబ్” స్థాయికి చేరి ఉండాలి. వాటి నిసాబ్ 612 కిలోలు. వాటిపై ఒక సంవత్సరం గడవాలన్న నిబంధన లేదు. కోతకు వచ్చినప్పుడు వాటిలో నుండి ఈ క్రింది పద్ధతిలో జకాత్ చెల్లించాలిః

 ప్రకృతి పరమైన వర్షాలు, నదుల మూలంగా పండిన పంటల్లో పదవ వంతు జకాత్ చెల్లించాలి. కృత్రిమ కాలువలు, బావుల మూలంగా పండిన పంటల్లో ఇరవయ్యో వంతు జకాత్ చెల్లించాలి.

ఉదా: ఒక వ్యక్తి తన భూమిలో గోధుమ విత్తనం వేశాడు. అతనికి 800 కిలోల పంట పండింది. ఇప్పుడు అతనిపై జకాత్ విధిగా ఉంది. ఎందుకనగా దీని నిసాబ్ 612 కిలోలు, అయితే దీనికంటే ఎక్కువగా పండింది. ఇక ఆ పంట వర్షంతో పండితే అందులో పదో వంతు అంటే 80 కిలోల జకాత్ చెల్లించాలి. ఒకవేళ కృత్రిమ కాలువల, బావుల ఆధారంగా పండితే అందులో ఇరవయ్యో వంతు అంటే 40 కిలోలు జకాత్ చెల్లించాలి.

పశువుల జకాత్

ఇక్కడ పశువులు అంటే: ఆవు, మేక, గొర్రె మరియు ఒంటె లని భావం. వీటి జకాతు కొరకు ఈ క్రింది నిబంధనలు వర్తిస్తాయిః

  • 1- “నిసాబ్” స్థాయికి చేరి ఉండాలి. ఒంటెల నిసాబ్ 5. మేకలు, గొర్రెల నిసాబ్ 40. ఆవుల నిసాబ్ 30. వీటికన్నా తక్కువ ఉంటే జకాత్ లేదు.
  • 2- వాటి యజమాని వద్ద అవి సంవత్సరమెల్లా ఉండాలి.
  • 3- అవి ‘సాయిమా’ అయి ఉండాలి. అనగా సంవత్సరంలో అధిక శాతం పచ్చిక మైదానాల్లో మేసేవి అయి ఉండాలి. శాలలో ఒక చోట ఉండి తమ ఆహారం తినునవి, లేదా వాటి యజమాని వాటి కొరకు మేత ఖరీదు చేసి, లేదా నిల్వ చేసి ఉంచేవాడైతే వాటిలో జకాత్ లేదు.
  • 4- రవాణ సాధనంగా లేదా వ్యవసాయ పరంగా పని చేయునవై ఉండకూడదు.

ఒంటెల జకాత్

ఒంటెల జకాత్ యొక్క నిసాబ్ 5 ఒంటెలు. ఏ ముస్లిం వ్యక్తి “నిసాబ్“ స్థాయికి చేరాడో, అవి అతని వద్ద ఉండి సంవత్సరం పూర్తయిందో అతను ఈ విధంగా జకాత్ చెల్లించాలి.

  •  5 నుండి 9 వరకూ ఉంటే 1 మేక.
  • 10 నుండి 14 వరకూ ఉంటే రెండు మేకలు.
  • 15 నుండి 19 వరకూ ఉంటే మూడు మేకలు.
  • 20 నుండి 24 వరకూ ఉంటే నాలుగు మేకలు.
  • 25 నుండి 35 వరకూ ఉంటే ఏడాది వయసున్న ఒక ఆడ ఒంటె. అది గనక లేకుంటే రెండేళ్ళ ఒక మగ ఒంటె.
  • 36 నుండి 45 వరకూ ఉంటే రెండేళ్ళ ఒక ఆడ ఒంటె.
  • 46 నుండి 60 వరకూ ఉంటే మూడేళ్ళ ఒక ఆడ ఒంటె.
  • 61 నుండి 75 వరకూ ఉంటే నాలుగేళ్ళ ఒక ఆడ ఒంటె.
  • 76 నుండి 90 వరకుంటే రెండేళ్ళ రెండు ఆడ ఒంటెలు.
  • 91 నుండి 120 వరకుంటే మూడెళ్ళ రెండు ఆడ ఒంటెలు.
  • 120 ఒంటెలకు మించిపోతే ప్రతి నలభై ఒంటెలపై రెండేళ్ళ ఒక ఆడ ఒంటె. ప్రతి 50 ఒంటెలపై మూడేళ్ళ ఒక ఆడ ఒంటె.

ఇదే లెక్క క్రింది టేబల్ ద్వారా వివరించబడిందిః

సంఖ్య  జకాత్
నుండివరకు
591 మేక
10142 మేకలు
15193 మేకలు
20244 మేకలు
2535ఏడాది ఆడ ఒంటె. అది లేకుంటే 2 ఏళ్ళ మగ ఒంటె
36452 ఏళ్ళ 1 ఆడ ఒంటె
46603 ఏళ్ళ 1 ఆడ ఒంటె
61754 ఏళ్ళ 1 ఆడ ఒంటె
76902 ఏళ్ళ 2 ఆడ ఒంటెలు
911203 ఏళ్ళ 2 ఆడ ఒంటెలు

ఆవుల జకాత్

(ఆవులు, ఎద్దులు ఈ రెండింటి లెక్క ఒకటే. 1 నుండి 29 వరకుంటే జకాత్ లేదు). ఏ వ్యక్తి ఆధీనంలో 30 నుండి 39 వరకూ ఉన్నాయో (వాటిపై సంవత్సరం గడిచిందో) అందులో ఏడాది వయస్సుగల ఒక ఆడ లేదా మగ దూడను జకాత్ గా ఇవ్వాలి.

  • 40 నుండి 59 వరకూ ఉంటే రెండేళ్ళ దూడ.
  • 60 నుండి 69 వరకూ ఉంటే ఏడాది వయస్సు గల రెండు దూడలు.
  • 70 నుండి 79 వరకూ ఉంటే ఏడాది వయసుగల 1 దూడ, రెండేళ్ళ వయస్సుగల మరొక దూడ.
  • ఆ తరువాత వాటి సంఖ్య ఎంత పెరిగినా ప్రతి 30లో ఏడాది వయస్సుగల ఒక దూడ, ప్రతి 40లో రెండేళ్ళ వయస్సుగల ఒక దూడ జకాత్ గా ఇవ్వాలి.

దీనినే క్రింది టేబల్ ద్వారా తెలుసుకొండి:

సంఖ్య  జకాత్
నుండివరకు
3039ఒక ఆడ లేదా మగ దూడ
4059రెండేళ్ళ దూడ
6069ఏడాది వయస్సు గల రెండు దూడలు
7079ఏడాది దూడ ఒకటి, రెండేళ్ళ దూడ మరొకటి

మేకల జకాత్

(మేకలు, గొర్రెలు, పొట్టేలు అన్నిటి నిసాబ్ ఒకటే. అవి 1 నుండి 39  వరకుంటే జకాత్ విధిగా లేదు). ఏ వ్యక్తి  ఆధీనంలో 40 నుండి 120 వరకు మేకలున్నాయో అతను అందులో నుండి ఒక మేకను జకాత్ గా ఇవ్వాలి.

  • 121 – 200 వరకూ ఉంటే రెండు ఆడ మేకలు.
  • 201 – 399 వరకూ ఉంటే మూడు ఆడ మేకలు.
  • 400 – 499 వరకూ ఉంటే నాలుగు ఆడ మేకలు.
  • 500 – 599 వరకూ ఉంటే ఐదు ఆడ మేకలు.
  • ఆ తర్వాత వాటి సంఖ్య ఎంత పెరిగినా ప్రతి 100లో ఒక ఆడ మేకను జకాత్ గా ఇవ్వాలి.
సంఖ్య  జకాత్
నుండివరకు
401201 ఆడ మేక
1212002 ఆడ మేకలు
2013993 ఆడ మేకలు
4004994 ఆడ మేకలు
5005995 ఆడ మేకలు

జకాత్ హక్కుదారులు

జకాత్ హక్కుదారులెవరనేది స్వయంగా అల్లాహ్ ఇలా తెలిపాడు:

ఈ జకాత్ నిధులు అసలు కేవలం నిరుపేదలకు, అక్కరలుతీరనివారికి, జకాత్ వ్యవహారాలకై నియుక్తులైన వారికీ, ఇంకా ఎవరి హృదయాలను గెలుచుకోవటం అవసరమో వారికీ, ఇంకా బానిసల విముక్తికీ, ఋణగ్రస్తుల సహాయానికీ, అల్లాహ్ మార్గంలోనూ, బాటసారులకూ వినియోగించటం కొరకు, ఇది అల్లాహ్ తరఫు నుండి నిర్ణయించబడిన ఒక విధి. అల్లాహ్ అన్నీ ఎరిగినవాడూ వివేకవంతుడూ. (తౌబా 9: 60).

పై ఆయతులో అల్లాహ్ ఎనిమిది రకాలు తెలిపాడు. వారిలో ప్రతి ఒక్కడు జకాత్ తీసుకునే అర్హతగలవాడు. ఇస్లాం ధర్మంలో జకాత్ సమాజములోని అర్హులకే ఇవ్వబడుతుంది. ఇతర ధర్మంలో ఉన్నట్లు కేవలం పండితులకివ్వబడదు. జకాత్ హక్కుదారులు వీరు:

1- నిరుపేద (ఫఖీర్) అంటే తనకు అవసరమయ్యే ఖర్చులో సగముకన్నా తక్కువ సంపాదించేవాడు.

2- అక్కరతీరనివాడు (మిస్కీన్) అంటే తనకు అవసరమయ్యే ఖర్చులో సగముకన్నా ఎక్కువ సంపాదించేవాడు, కానీ అది అతనికి సరిపడదు. అందుకు అతనికి సరిపడునంత కొన్ని నెలలు లేదా ఒక సంవత్సరం వరకు జకాత్ సొమ్ము ఇవ్వవచ్చును.

3- జకాత్ వసూలు చేసే ఉద్యోగి అంటే జకాత్ వసూలు చేయడానికి ముస్లిం అధికారి తరఫున నియమింపబడిన ఉద్యోగులు. వారు ధనికులై- నప్పటికీ, వారి పనికి తగ్గట్టు జీతంగా వారికి జకాత్ నుండి ఇవ్వవచ్చును.

4- హృదయాలు గెలుచుకొనుటకు అంటే అవిశ్వాసుల్లో తమ వంశం, గోత్రంలో నాయకులుగా ఉన్నవారు ఇస్లాంలో ప్రవేశించే ఆశ ఉన్నచో వారికి, లేదా వారి కీడు ముస్లింలకు కలగకుండా జకాత్ సొమ్ము ఖర్చు చేయవచ్చును. అలాగే కొత్తగా ఇస్లాం స్వీకరించినవారిలో వారి అవసరార్థం, వారు స్థిరంగా ఇస్లాంపై ఉండుటకు జకాత్ ధనం ఖర్చు చేయవచ్చును.

5- బానిసలను స్వతంత్రులుగా చెయ్యటానికి మరియు శత్రవుల నుంచి ముస్లిం ఖైదీలను విడిపించుటకు జకాత్ సొమ్ము ఖర్చు పెట్టవచ్చును.

6- ఋణగ్రస్తులు అంటే అప్పులపాలైనవారు. ఇలాంటి వారికి జకాత్ నుండి ఖర్చు చేయవచ్చును. కాని క్రింది షరతులు వారిలో ఉండాలి:

  • A: ముస్లిం అయి యుండాలి.
  • B: స్వయంగా చెల్లించగల ధనికుడు కాకూడదు.
  • C: ఆ అప్పు ఏ పాప కార్యానికో చేసి ఉండ కూడదు.
  • D: అది ఆ సమయంలోనే చెల్లించుట తప్పనిసరి అయి యుండాలి.

7- అల్లాహ్ మార్గంలో అంటే జీతం తీసుకోకుండా పుణ్యాపేక్షతో ధర్మయుద్ధం చేయు వీరులు, వారి స్వంత ఖర్చుల కొరకు, లేదా ఆయుధాలకు జకాత్ డబ్బు ఇవ్వచ్చును. జిహాదులో ధర్మవిద్య అభ్యసించడం కూడా వస్తుంది. ఎవరైనా విద్యభ్యాసనలో నిమగ్నులైనట్లయితే, అతని విద్యకు సరిపడు ఖర్చులు జకాత్ నుండి ఇవ్వవచ్చును.

8- బాటసారి అంటే ప్రయాణికుడు. స్వస్థలంలో ఎంత ధనికుడైనా సరే ప్రయాణంలో ఏదైనా ఆర్థిక ఇబ్బందులకు గురయితే అతను తన గ్రామం చేరుకొనుటకు సరిపడు ఖర్చులు జకాత్ నుండి ఇవ్వవచ్చును.

మస్జిదుల నిర్మణాలకు, దారులు సరి చేయడానికి జకాత్ సొమ్ము ఉపయోగించరాదు.

నోట్స్:

1-  సముద్రం నుండి లభించే ముత్యాలు, పగడాలు మరియు చేపల్లో జకాత్ లేదు. వాణిజ్యసరుకుగా ఉన్నప్పుడు పైన తెలిపిన ప్రకారంగా జకాత్ చెల్లించాల్సి ఉంటుంది.

2- అద్దెకివ్వబడిన బిల్డింగులు, ఫ్యాక్టరీల పై జకాత్ లేదు. కాని వాటి నుండి పొందుతున్న పైకం “నిసాబ్“ స్థాయికి చేరుకొని, సంవత్సరం గడిస్తే అందులో జకాత్ విధిగా ఉంది.

ఇతర లింకులు:

ఇస్లాంలో అధర్మ కార్యాలు మరియు వాటి ప్రక్షాళణ [పుస్తకం]

బిస్మిల్లాహ్

[ఇక్కడ పుస్తకం చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [138 పేజీలు] [మొబైల్ ఫ్రెండ్లీ బుక్]

రచయిత : జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ (హఫిజహుల్లాహ్)

ఇస్లామీయ విధేయతా విధానం మరియు మీలాదున్నబీ, దర్గాల వద్ద జరిగే ఆరాధనలు మరియు మ్రొక్కుబడులు, ముహర్రం నెలలో జరిగే బిదఆతులు, నెల్లూరు రొట్టెల పండుగ, సఫర్ నెలలో జరిగే బిదఆతులు, ఆఖరి చహర్షుబా, శకునాలు, రజబ్ నెల బిదఆతులు, రజబ్ కె కుండే, మేరాజ్ నబీ పండుగ, షాబాన్ నెల బిదఆతులు, వసీలాలోని బిదఆతులు, ఉరుసుల ఆచారాలు, తావీజులు, చేతబడులు, జాదూ, ఇంద్రజాలం, జ్యోతిష్యం, వాలెంటైన్స్ డే పండుగ మొదలైన ఇస్లాం ధర్మంలో లేని బిదఆతులు అంటే నూతన కల్పితాల గురించి ఈ పుస్తకంలో రచయిత సవివరంగా ప్రామాణిక ఆధారాలతో చర్చించారు.

విషయ సూచిక [డౌన్లోడ్]

అన్ని చాఫ్టర్లు PDF లింకులు గా క్రింద ఇవ్వబడ్డాయి. లింక్ క్లిక్ చేసి PDF డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా చదవవచ్చు.

పై పుస్తకం నుండి పబ్లిష్ చేసిన పోస్టులు

ఇతరములు 

స్వర్గ సందర్శనం [పుస్తకం]

బిస్మిల్లాహ్

స్వర్గ సందర్శనం (Swarga Sandarsanam)
కూర్పు : మౌలానా ముహమ్మద్‌ ఇఖ్‌బాల్‌ కైలానీ (Muhammad Iqbal Kailani)
అనువాదం : ముహమ్మద్‌ జీలాని (Muhammad Jeelani)
ప్రకాశకులు : హదీస్‌ పబ్లికేషన్స్‌. హైద్రాబాద్‌, ఏ.పి. ఇండియా

[ఇక్కడ చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి]
https://bit.ly/swarga-sandarsanam-mobile
PDF (పిడిఎఫ్) – 176 పేజీలు మొబైల్ ఫ్రెండ్లీ బుక్

విషయ సూచిక 

నరక విశేషాలు – ముహమ్మద్‌ ఇక్బాల్ కైలానీ [పుస్తకం]

బిస్మిల్లాహ్

Naraka Visheshalu – (Jahannam ka Bayan)
సంకలనం: ముహమ్మద్‌ ఇక్బాల్ కైలానీ (Muhammad Iqbal Kailani)
అనువాదం: ముహమ్మద్ జాకిర్‌ ఉమ్రీ (Mohd. Zakir Umari)
హదీస్‌ పబ్లికేషన్స్‌.హైదరాబాద్‌

[ఇక్కడ చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి]
[మొబైల్ ఫ్రెండ్లీ పుస్తకం] [PDF] [127 పేజీలు] [1.5 MB]

విషయ సూచిక

  • 1.1 నరక యాతనలు
  • 1.2 నరకాగ్ని
  • 1.3 నరకంలోని కొన్ని ఇతర శిక్షలు
    • 1.3.1 విషపూరితమైన, దుర్వాసన గల ఆహార పదార్థాల ద్వారా, మరుగుతున్న పానీయాల ద్వారా శిక్షించటం
    • 1.3.2 తలపై కాగే నీటిని పోసే శిక్ష
    • 1.3.4 ఇరుకైన అగ్ని గదులలో బంధించే శిక్ష
    • 1.3.5 ముఖాలపై అగ్ని జ్వాలలు కురిపించే శిక్ష
    • 1.3.6 గదలు, సుత్తుల ద్వారా కొట్టే శిక్ష
    • 1.3.7 విష సర్పాలు, తేళ్ళకాటు ద్వారా శిక్ష
    • 1.3.8 శరీరాలను పెంచే శిక్ష
    • 1.3.9 విపరీతమైన చలి ద్వారా శిక్షించుట
    • 1.3.10 ఇంకా అనేక రకాల శిక్షలు
  • 1.4 శిక్షించటంలో హద్దంటూ ఉండాలి!
  • 1.5 మీ భార్యాబిడ్డలను నరకాగ్ని నుండి రక్షించుకోండి
  • 1.6 స్వల్పకాలానికిగాను నరకంలోనికి వెళ్ళేవారు
  • 1.7 కేవలం ఖుర్ఆన్, హదీసులే మనకు చాలు

హదీసుల పరంగా చాఫ్టర్లు

  • 2. నరకం ఉనికి పట్ల సాక్ష్యం
  • 3. నరక ద్వారాలు
  • 4. నరకంలోని తరగతులు
  • 5. నరక వైశాల్యం
  • 6. నరక శిక్ష తీవ్రత
  • 7. నరకాగ్ని కాఠిన్యత
  • 8. అతిస్వల్పమైన నరక శిక్ష
  • 9. నరకవాసుల పరిస్థితి
  • 10. నరకవాసుల అన్నపానీయాలు మరియు ఆహారం
  • 11. దాహం ద్వారా శిక్ష
  • 12. మరిగే నీటిని తలపై పోసే శిక్ష
  • 13. నరకవాసుల వస్త్రాలు
  • 14. నరకవాసుల పడకలు
  • 15. నరకవాసుల గొడుగులు, షామియానాలు
  • 16. అగ్ని సంకెళ్ళులు, హారాల ద్వారా శిక్ష
  • 17. ఇరుకైన చీకటిగల అగ్నిగదుల్లోనికి నెట్టివేయబడే శిక్ష బంధించే శిక్ష
  • 18.ముఖాలను అగ్నిపై కాల్చే శిక్ష
  • 19. విషపూరితమైన వడగాలి మరియు నల్లపొగ ద్వారా శిక్షించుట
  • 20. విపరీతమైన చలి శిక్ష
  • 21. నరకంలోని అవమానకరమైన శిక్ష
  • 22. నరకంలో దట్టమైన చీకట్ల ద్వారా శిక్ష
  • 23. బోర్లా పడవేసి నడిపించటం, ఈడ్చుకుపోయే శిక్ష
  • 24. అగ్ని కొండలపై ఎక్కించే శిక్ష
  • 25. అగ్ని స్తంభాలకు బంధించే శిక్ష
  • 26. నరకంలో ఇనుప గదలు, సుత్తులతో కొట్టే శిక్ష
  • 27. నరకంలో పాములు, తేళ్ళ ద్వారా శిక్ష
  • 28. శరీరాలను పెంచే శిక్ష
  • 29. ఇతర శిక్షలు
  • 30. నరకంలో కొన్ని నేరాలకు ప్రత్యేక శిక్షలు
  • 31. నరకవాసుల గురించి ఖుర్‌ఆన్‌ వ్యాఖ్యలు
  • 32. నరకంలో మార్గభ్రష్టులైన పండితులు, స్వాములు…..పరస్పర కలహాలు
  • 33. గుణపాఠాలు నేర్చే సంభాషణలు
  • 34. ఫలించని కోరికలు
  • 35. ఒక్క వెలుగు కిరణం పొందే విఫల యత్నం
  • 36. నరకవాసులు మరో అవకాశం దొరకాలని విలపించుట
  • 37. నరకంలో ఇబ్లీసు
  • 38. పాత జ్ఞాపకాలు
  • 39. నరకంలోనికి కొనిపోయే పాపకార్యాలు ఆకర్షణీయమైనవి
  • 40. స్వర్గవాసుల, నరకవాసుల నిష్పత్తి
  • 41. నరకంలో స్త్రీల ఆధిక్యం
  • 42. నరక శుభవార్త పొందినవారు
  • 43. నరకంలో శాశ్వతంగా ఉండేవారు
  • 44. స్వల్ప కాలానికిగాను నరకంలోనికి వెళ్ళేవారు
  • 45. నరక సంభాషణ
  • 46. మిమ్మల్నీ మీ కుటుంబాన్ని నరకాగ్ని నుండి కాపాడుకోండి
  • 47. నరకం, దైవదూతలు
  • 48. నరకం, దైవప్రవక్తలు
  • 49. నరకం, ప్రవక్త (సహాబాలు) అనుచరులు
  • 50. నరకం, పూర్వీకులు
  • 51. ఆలోచనా సందేశం
  • 52. నరకాగ్ని నుండి శరణుకోరే దుఆలు
  • 53. వివిధ రకాల అంశాలు

అనంతకరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో

హాజిహిన్నారుల్లతీ కున్ తుమ్ బిహా తుకజ్జిబూన్
మీరు తిరస్కరిస్తూ వస్తున్న ఆ అగ్ని ఇదే.

ఓ ప్రపంచ ప్రజలారా!
నా మాటల్ని శ్రద్ధగా వినండి.


ఈ విషయం పద్నాలుగు వందల సంవత్సరాలకు క్రితంది.
అగోచర విషయాలను తెలిపేవాడు, తన ఊరి ప్రజల్లో సత్యసంధుడుగా, అమానతుదారుగా (భద్రపరిచేవాడు) పేరుగాంచిన వాడు. ఈ వార్తను తెచ్చాడు!
“నేను అగ్నిని చూశాను.”
నరకాగ్ని భగభగమండుతోంది,
జ్వాలల్ని వెదజల్లుతోంది. శరీరాన్ని చుట్టుముట్టే ఈ అగ్ని! ఇహలోకపు అగ్నికన్నా 69 రెట్లు ఎక్కువ వేడిగలది.

ఇంకా ఇందులో ప్రవేశించేవారికి అగ్ని దుస్తులు ఉన్నాయి. అగ్ని పడకలు ఉన్నాయి. అగ్ని నీడలు ఉన్నాయి. అగ్ని గొడుగులు ఉన్నాయి. భయంకరమైన అగ్ని బేడీలు ఉన్నాయి. అగ్ని సంకెళ్ళు ఉన్నాయి. అగ్నితో కాల్చిన ఇనుప సుత్తులు, గొడ్డళ్ళు ఉంటాయి. అగ్నిలో కాల్చిన ఇనుప పలకలు ఉంటాయి.

అగ్నిలో ఒంటెల్లాంటి విషసర్పాలు ఉంటాయి. అగ్నిలో కంచరగాడిదల్లాంటి విష పూరితమైన తేళ్ళు ఉంటాయి. అగ్నిలో పెరిగే విషపూరిత ముళ్ళుగల ఫలాలు తినటానికి, త్రాగటానికి కాగే నీరు, దుర్వాసన గల చీము, నెత్తురు ఉంటాయి.

ప్రజలారా! అగోచర విషయాలను తీసుకువచ్చేవాడు తన కళ్ళతో నరకాగ్నిని చూసిన వాడు నిరంతరం మిమ్మల్ని పిలుస్తున్నాడు శ్రద్ధగా వినండి!

ప్రజలారా! నేను మిమ్మల్ని అగ్ని విషయమై హెచ్చరించాను. నేను మిమ్మల్ని అగ్ని విషయమై హెచ్చరించాను. (దార్మీ)
ప్రజలారా! ఈ అగ్ని నుండి రక్షించుకోండి. ఖర్జూరపు ముక్క ఒకటి ఇచ్చయినాసరే.
వివేకవంతులారా! విద్యావంతులారా!ఒంటరిగా అయినా, కలసి అయినా దీర్ఘంగా ఆలోచించండి! తెచ్చిన వాని వార్త సత్యమా? అసత్యమా?

అసత్యమైతే ఆ పాపం అతని మీదే పడుతుంది. మీకెలాంటి నష్టమూ వాటిల్లదు.
కానీ…
ఒకవేళ ఈ వార్త నిజమైతే?

ఓ అగ్ని తిరస్కారులారా!
ఓ అగ్నిని పరిహసించేవారలారా!
ఓ అగ్నిని సందేహించేవారలారా!
ఓ అగ్నిని విశ్వసిస్తూ ఏమరుపాటుకు గురయినవారలారా!

ఆ అగ్నిజ్వాలలు ముందు పైకెగసినప్పుడు సందేశకారుడు ఇలా అంటాడు:
చూడండి! మీరు తిరస్కరిస్తూ వచ్చింది ఈ అగ్నినే“. (52:14)

మరీ…….!
దానికి మీ సమాధానం ఏమిటి?
ఎక్కడికి పారిపోగలరు?
ఎక్కడ రక్షణ పొందగలరు?
ఏ ఆపద్బాంధవుడితో మొరపెట్టుకుంటారు?
ఏ రక్షకుణ్ణి తెచ్చుకుంటారు? లేదా రగులుతున్న ఆ అగ్ని జ్వాలల్లో కాలటానికి సిద్ధపడతారా?

ధిక్కరించేవారి కొరకు ఆనాడు వినాశనం ఉంది”. (77:15)

నరకమనేది పాపులకు, వారి కర్మానుసారం శిక్షల్ని అమలుచేసే భయంకర లోకం.. దీన్ని అల్లాహ్ (త’ఆలా) అవిశ్వాసుల కొరకు, విగ్రహారాధకుల కొరకు, పాపాత్ముల కొరకు, అత్యాచారుల కొరకు సిద్ధపరచి ఉంచాడు. అల్లాహ్ (త’ఆలా) ఖుర్ఆన్లో అనేక చోట్ల స్వర్గనరకాలను గురించి వివరంగా పేర్కొన్నాడు. వీటిలో నరకాగ్ని గురించి, నరకం గురించి కాస్త అధికంగా పేర్కొన్నాడు. ఎందుకంటే చాలా మంది మానవులు శుభవార్తలకన్నా హెచ్చరికలకు అధిక ప్రాధాన్యత ఇస్తారని.

ఖుర్ఆన్లో నరకం గురించి ఇవ్వబడిన వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

  • 1. నరకాన్ని చూడగానే అవిశ్వాసుల ముఖాలు నల్లబడిపోతాయి. (10:27)
  • 2. నరకవాసులు శిక్షను భరించలేక చావును కోరుతారు. కాని వారికి చావురాదు. (25:13)
  • 3. నరకాగ్ని నరకవాసుల ముఖాల మాంసాన్ని కాల్చివేస్తుంది. వారి దవడలు బయట పడతాయి.(23:104)
  • 4. నరకాగ్ని చావనివ్వదు. బ్రతకనివ్వదు. (87:13)
  • 5. నరకాగ్ని ప్రజలను సర్వనాశనం చేసి వేస్తుంది. (104:4)
  • 6. అవిశ్వాసులను నరకంలో బంధించి పైనుండి ద్వారాలు మూసి వేయడం జరుగుతుంది. (104:8,9)
  • 7. నరకంలో అవిశ్వాసులు బుసలుకొడుతుంటారు. పరిస్థితి ఎలా ఉంటుందంటే అందులో వారికి ఏ శబ్దమూ వినబడదు. (21:100)
  • 8.పాపాత్ములకు విషపూరితమైన ముళ్ళుగల దుర్వాసన గల జఖ్కూమ్ వృక్షం ఆహారంగాఇవ్వబడుతుంది. (44:43)
  • 9. నరకవాసుల గాయాల నుండి ప్రవహించే చీము, నెత్తురు, మరిగే నీరు నరక వాసులకు త్రాగటానికి ఇవ్వబడతాయి. (14:16, 17)
  • 10. నరకవాసులు అగ్ని దుస్తులు ధరించటం జరుగుతుంది. (22:20)
  • 11. నరకవాసులు కాళ్ళూ, చేతులూ సంకెళ్ళ ద్వారా కట్టివేయబడతాయి. ఇంకా అగ్ని జ్వాలలు వారి ముఖాలపై కురిపించబడతాయి. (14:49,50)
  • 12. నరకవాసులు పరచుకోవటానికి, కప్పుకోవటానికి అగ్ని మాత్రమే ఉంటుంది. (7:41)
  • 13. నరకవాసుల కొరకు అగ్ని గొడుగులు, అగ్ని చాపలు ఉంటాయి. (39:16)
  • 14. నరకవాసుల కొరకు అగ్నిజ్వాలలు ఉంటాయి. (18:29)
  • 15. నరకవాసుల మెడలో భారీ అగ్ని హారాలు వేయబడతాయి. (69:30)
  • 16. నరకవాసుల కాళ్ళకు బరువైన సంకెళ్ళు వేయబడతాయి. (73:12)
  • 17. నరకవాసులను విషపూరితమైన వేడిగాలి ద్వారా, విషపూరితమైన దట్టమైన పొగ ద్వారా శిక్షించడం జరుగుతుంది. (56:41-44)
  • 18. నరకంలో నరకవాసులను నొసలు పట్టి ఈడ్చటం జరుగుతుంది. (54:48)
  • 19. నరకవాసులను నిప్పుకొండలపైకి ఎక్కించి శిక్షించటం జరుగుతుంది. (74:17)
  • 20. నరకవాసులను ఇనుప గదలతో శిక్షించటం జరుగుతుంది. (22:19)
  • 1. నరకంలో పై నుంచి విసిరివేయబడిన ఒక రాయి డెబ్బయి సంవత్సరాల తర్వాత అడుగుకు చేరుతుంది. (ముస్లిమ్)
  • 2. నరకంలో ఒక ప్రక్క యొక్క రెండు గోడల మధ్య నలభై సంవత్సరాల ప్రయాణ దూరం ఉంటుంది. (అబూయాలా)
  • 3. నరకాన్ని హషర్ మైదానంలోనికి తీసుకు రావటానికి నాలుగు వందల తొంభై కోట్ల దైవదూతలు నియమితులై ఉన్నారు. (ముస్లిమ్)
  • 4. నరకంలో అన్నిటికంటే తేలికైన శిక్షగా నిప్పు చెప్పులు ధరించబడతాయి. వాటివల్ల నరకవాసుని మెదడు ఉడుకుతుంది. (ముస్లిమ్)
  • 5. నరకవాసుని ఒక దవడ ఉహద్ కొండకన్నా పెద్దదిగా ఉంటుంది. (ముస్లిమ్)
  • 6. నరకవాసుని భుజాల మధ్య వేగగామి మూడు రోజుల ప్రయాణమంత దూరం ఉంటుంది. (ముస్లిమ్)
  • 7. నరకవాసుని చర్మం 63 అడుగుల వెడల్పుగా ఉంటుంది. (తిర్మిజి)
  • 8. ప్రపంచంలో అహంకారంతో ప్రవర్తించే వారికి చీమల్లాంటి శరీరాలు ఇవ్వబడతాయి. (తిర్మిజి)
  • 9. నరకవాసులు ఎంత ఘోరంగా కన్నీళ్ళు కారుస్తారంటే వాటిలో పడవలు నడవగలవు. (ముస్తద్రక్ హాకిమ్)
  • 10. నరకవాసులకు ఇవ్వబడే ఆహారపు ఒక ముక్క అయినా భూలోకంలో పడవేస్తే ప్రాణులన్నిటి ఆహార సంపదంతా సర్వనాశనం అయిపోతుంది. (అహ్మద్, నసాయి, తిర్మిజి, ఇబ్నెమాజ)
  • 11. నరకవాసులు త్రాగే పానీయం ఒక బానంత (డోలు) భూలోకంలో పడవేస్తే భూలోక సృష్టితాలన్నీ దుర్వాసనకు గురవుతాయి. (అబూయాలా)
  • 12. నరకవాసుల తలపై ఎలాంటి కాగే నీరు వేయబడుతుందంటే, అది తలకు రంధ్రం చేస్తూ కడుపులోనికి చేరుతుంది. కడుపులో ఉన్న వాటిని కోసివేస్తుంది. అవన్నీ కడుపులో నుండి జారి కాళ్ళపై పడతాయి. (అహ్మద్)
  • 13. అవిశ్వాసున్ని నరకంలో బాణాన్ని తూణములో కుక్కినట్లు కుక్కటం జరుగుతుంది. (షర్ హు సున్నహ్)
  • 14. నరకాగ్ని దట్టమైన నలుపురంగులో ఉంటుంది. (మాలిక్)
  • 15. నరకవాసులకు నిప్పుకొండలపై ఎక్కటానికి 70 సంవత్సరాలు పడుతుంది. దిగిన వెంటనే అతన్ని మళ్ళీ ఎక్కమని ఆదేశించబడుతుంది. (అబూయాలా)
  • 16. నరకవాసులను శిక్షించే ఇనుప గదులు ఎంత బరువుగా ఉంటాయంటే మానవులు జిన్నులు కలసి ఎత్తాలనుకున్నా ఎత్తలేరు. (అబూయాలా)
  • 17. నరకంలోని పాములు ఒంటెల్లా ఉంటాయి. అవి ఒకసారి కాటువేస్తే అవిశ్వాసి నలభై సంవత్సరాల వరకు విషపూరితమైన బాధ భరిస్తూ ఉంటాడు. (అహ్మద్)
  • 18. నరకంలోని తేళ్ళు కంచరగాడిదల్లా ఉంటాయి. అవిశ్వాసి వాటి కాటు ప్రభావాన్ని నలభై సంవత్సరాల వరకు పొందుతూ ఉంటాడు. (అహ్మద్)
  • 19. నరకవాసులను నరకంలో తలక్రిందులుగా నడిపించటం జరుగుతుంది.(ముస్లిమ్)
  • 20. నరక ద్వారాల వద్ద శిక్షించే నాలుగు లక్షల దైవదూతలు ఉంటారు. వారి ముఖాలు మహాభయంకరంగా నల్లగా ఉంటాయి. దంతాలు బయటికి వచ్చి, కఠినంగా నిర్దయులై ఉంటారు. ఇంకా ఎంత దృఢంగా ఉంటారంటే వారి రెండు భుజాల మధ్య పక్షి రెండు నెలలు ఎగిరేంత దూరం ఉంటుంది. (ఇబ్నె కసీర్)

ఇవే ఆ భయంకరమైన, ఒళ్ళు జలదరించే విచిత్రమైన సంఘటనలు. తీర్పు దినం నాడు సంభవించే ఈ సంఘటనలను ఖుర్ఆన్ మరియు హదీసులలో అనేక చోట్ల నరక శిక్షలుగా పేర్కొనడం జరిగింది. అల్లాహ్ (త’ఆలా) మనందరినీ తన దయ మరియు కరుణాను గ్రహాల ద్వారా వీటి నుండి రక్షించుగాక. నిస్సందేహంగా ఆయన పరమ కృపాశీలుడు మరియు కరుణామయుడు. తాను ఏమి కోరితే అది చేయగల సమర్ధుడు.

నరకంలో అన్నిటికంటే అగ్నిశిక్ష ఘోరంగా ఉంటుంది. దీన్ని గురించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “ఇది భూలోక అగ్ని కన్నా 69 రెట్లు అధికంగా ఉంటుంది.” (ముస్లిమ్).

ఖుర్ఆన్లోని సూరె ఆలా 12వ వాక్యంలో గొప్ప అగ్నియని, మరోచోట, రాజేయబడిన అగ్నియని, సూరె హుమజహ్ 5వ వాక్యంలో, మరోచోట అగ్నిజ్వాలలు అని, సూరె లైల్ 14వ వాక్యంలో, మరోచోట పైకెగసిన అగ్నియని, సూరె గాషియ 4వ వాక్యంలో పేర్కొన బడింది.

కేవలం మానవుల్ని కాల్చటమే ఉద్దేశమైతే దానికి భూలోక అగ్ని చాలు. అందులో మానవుడు కొన్ని నిమిషాల్లో మాడిమసైపోతాడు. కాని నరకాగ్ని అవిశ్వాసులకు, విగ్రహారాధకులకు నిరంతరం శిక్షించే నిమిత్తం రాజేయబడింది. అందువల్ల భూలోక అగ్నికి ఎన్నో రెట్లు వేడిదై ఉన్నా, నరకవాసులను విడిచిపెట్టదు. పైగా నిరంతరం శాశ్వతంగా వారిని శిక్షిస్తూనే ఉంటుంది. అల్లాహ్ (త’ఆలా) ఇలా ఆదేశిస్తున్నాడు- “చావనివ్వదు, బ్రతకనివ్వదు” (74:28). ఇంకోచోట ఇలా ఆదేశించబడింది: “ఆ అగ్నిలో అవిశ్వాసి చావడు, బ్రతకడు.” (20:74)

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కలలో ఒక అందవికారమైన వ్యక్తిని చూశారు. నిరంతరం నిప్పు రాజేస్తూ ఉన్నాడు. దాని చుట్టూ తిరుగుతూ మంటల్ని వ్యాపింపజేస్తూ ఉన్నాడు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జిబ్రయీల్ను ఇలా ప్రశ్నించారు: “ఇతనెవరు?”; జిబ్రయీల్ ఇలా సమాధాన మిచ్చారు: “ఇతని పేరు మాలిక్. ఇతను నరకానికి అధికారి.” (బుఖారి) అంటే నరకాధికారి. ఈనాడు కూడా నిప్పును రాజేస్తున్నాడు. తీర్పుదినం వరకు నిరంతరం రాజేస్తూనే ఉంటాడు. పాపాత్ములు నరకంలోనికి ప్రవేశించిన తరువాత కూడా ఈ పరంపర కొనసాగుతుంది.

అల్లాహ్ ఆదేశం: “దాని మంట మందగించినప్పుడల్లా మేము దానిని మరింత మండింప జేస్తాము.” (17:97)

నరకాగ్ని ఎంత వేడిగా ఉంటుందనేది లెక్కకట్టడం అసాధ్యమైన విషయం. కాని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనం ప్రకారం 69 రెట్లు అధికంగా ఉంటుంది. అంటే ఒకవేళ ప్రపంచ ఉష్ణోగ్రత 2000 డిగ్రీల సెంటీగ్రేడ్ అయితే నరకాగ్ని వేడి 138 వేల డిగ్రీల సెంటీగ్రేడ్గా ఉంటుంది.*

* అగ్ని యొక్క ఉష్ణోగ్రత ఉపయోగించే ఇంధనంపై ఆధారపడి ఉంటుంది. కొన్ని పరిస్థితుల్లో దాని ఉష్ణోగ్రత 2000 సెంటీగ్రేడ్ కన్నా అధికంగా ఉంటుంది. అందువల్లే అల్లాహ్ (త’ఆలా) నరకంలో వాడబడే ఇంధనం గురించి ప్రస్తావించాడు. “ఆ ఇంధనం రాళ్ళు మరియు మానవులు”. (2:24). మానవులను ఇంధనం అని పేర్కొనబడిందంటే మానవులు అగ్నిలో కాలి నశించరు. రాళ్ళల్లో ముళ్ళ ఉనికి కూడా ఉంటుంది. (అంతా అల్లాహ్ కే తెలుసు.)

ఈ అత్యధిక వేడైన అగ్నితో నరకవాసుల దుస్తులు తయారుచేయబడతాయి. ఈ అగ్నితోనే వారి పడకలు కూడా తయారు చేయబడతాయి. ఈ అగ్నితోనే వారి గొడుగులు, స్తంభాలు కూడా తయారు చేయబడతాయి. ఈ అగ్నితోనే వారి కొరకు గచ్చు పరచబడుతుంది. ఇటువంటి మహా కఠినమైన శిక్షాస్థలంలో మానవ జీవితం ఎలా కొనసాగుతుంది. తన చేతిలో ఒక చిన్న నిప్పురవ్వను భరించలేని ఈ మానవుడు ఎలా భరిస్తాడో ఆలోచించండి.

మానవుని శక్తి సామర్థ్యాలు జూన్, జులైలో ఎండవేడికి భరించలేక ఓడిపోతాయి. బలహీనులు, రోగులు, వృద్ధులు భరించలేక ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనాల ప్రకారం ఈ అధిక ఉష్ణోగ్రత నరక ఆవిరి వల్ల ఉత్పన్నమవు తుంది. నరక ఆవిరిని భరించలేని ఈ మానవుడు నరకాగ్నిని ఎలా భరించగలడు?

తీర్పు దినం నాడు ఈ నరకాగ్నిని చూసి ప్రవక్తలందరూ భయంతో వణుకుతూ అల్లాహ్ ను “రబ్బి సల్లిమ్ రబ్బి సల్లిమ్” అని ప్రార్థిస్తూ ప్రాణభిక్ష పెట్టమని వేడుకుంటారు.

ఉమ్ముల్ మూమినీన్ హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) ఈ అగ్నిని గుర్తు చేసుకుంటూ ఈ లోకంలో ఏడ్చేది. శుభవార్త పొందిన 10 మందిలోని ఒకరు ఉమర్ (రదియల్లాహు అన్హు) ఖుర్ఆన్ పఠన సమయంలో నరక ప్రస్తావన ఉన్న వాక్యం పఠించి స్పృహ కోల్పోయారు. హజ్రత్ మఆజ్ బిన్ జబల్ (రదియల్లాహు అన్హు) , హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ రవాహ (రదియల్లాహు అన్హు) , హజ్రత్ ఉబాదహ్ బిన్ సామిత్ (రదియల్లాహు అన్హు) లాంటి గొప్ప అనుచరులు కూడా నరకాగ్నిని గుర్తు చేసుకొని వెక్కివెక్కి ఏడ్చేవారు.

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్ ఊద్ వడ్రంగి దుకాణం గుండా వెళ్ళటం జరిగింది. అగ్నిజ్వాలలతో వెలుగుతున్న బట్టీని చూసి నరకాగ్ని గుర్తొచ్చి ఏడ్వసాగారు. హజ్రత్ అతా సులైమీ (రహిమహుల్లాహ్) స్నేహితుడొకడు రొట్టెలు కాల్చటానికి పొయ్యి వెలిగించాడు. అతా దాన్ని చూసి మూర్చపోయాడు.

హజ్రత్ సుఫియాన్ సౌరీ (రహిమహుల్లాహ్) ముందు నరకాగ్ని ప్రస్తావన ఎప్పుడు వచ్చినా అతనికి రక్తమూత్రం వచ్చేది.

హజ్రత్ రబీ (రదియల్లాహు అన్హు) రాత్రంతా పడకపై అటుఇటూ మెదిలే వారు. ఆమె కూతురు ఇలా ప్రశ్నించింది: “తండ్రిగారూ! రాత్రిపూట ప్రపంచమంతా హాయిగా నిద్రపోతుంది. మరి మీరెందుకు మేల్కొనే ఉంటారు?” ఆయన ఇలా అన్నారు: “పాపా! నరకాగ్ని నీ తండ్రిని పడుకోనివ్వటం లేదు.”

అల్లాహ్ ఆదేశించింది స్పష్టంగా ఉంది:

నిజానికి నీ ప్రభువు శిక్ష ఎంతో భయపడ దగినటువంటిది.”(17:57)

అల్లాహ్ (త’ఆలా) ముస్లిములందరినీ నరకాగ్ని నుండి రక్షించుగాక. ఆమీన్.

జైలు అంటే నాలుగు గోడల మధ్య నిర్భందించడమే అవుతుంది. అయితే నేరస్తుల నేరాలను బట్టి వారి శిక్షలు కూడా వేరుగా ఉంటాయి. అదే విధంగా నరకం అంటే అగ్ని అనే మనం గుర్తిస్తాము. కాని అవిశ్వాసులు, విగ్రహారాధకుల పాపాలకు అనుగుణంగా వారిని ఇతర పద్ధతుల ద్వారా కూడా శిక్షించడం జరుగు తుంది. ఈ శిక్షల గురించి క్లుప్తమైన సమాచారం మీరు రాబోయే అధ్యాయాల్లో లభిస్తుంది. వాటిలో కొన్నింటిని గురించి ఇక్కడ కూడా ప్రస్తావించటం జరుగుతుంది.

మానవుడు తినే త్రాగే విషయాలలో ఎంతో అప్రమత్తంగా వ్యవహరిస్తాడు. ఆహార పదార్థాలు కుళ్ళినా, మురిగిపోయినా వాటిని ఏ మానవుడు తినడానికి ఇష్టపడడు. కొందరైతే ఆహారంలో ఉప్పు, కారం ఒక్కరవ్వంత ఎక్కువైనా, తక్కువైనా భరించలేరు. ఆహార పానీయాలకు మానవ ఆరోగ్యానికి దగ్గరి సంబంధం ఉంది. అందువల్లే అభివృద్ధి చెందిన దేశాల్లో ఆహారపానీయాల పట్ల ఎంతో అప్రమత్తంగా ఉంటారు. మావుడు రుచి కరమైన, సువాసనకరమైన ఎన్నో ఆహార పానీయాలను తయారు చేసుకున్నాడు. నిస్సం కోచంగా వాటిని లెక్కపెట్టాలన్నా లెక్క పెట్టలేము. ఇహలోకంలో ఇటువంటి రుచికరమైన, అద్భుతమైన భోగభాగ్యాలను పొందిన మానవుడు తీర్పుదినం నాడు విచారణ కొరకు లేపబడినప్పుడు అన్నిటికంటే ముందు అతనికి తీవ్రమైన దాహం వేస్తుంది. ప్రవక్తల నాయకులు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తన హౌజ్ కౌసర్ వద్ద నిలబడి ఉంటారు. ఆయన తన చేతులతో విశ్వాసులకు నీళ్ళు త్రాపిస్తూ ఉంటారు. అవిశ్వాసులు, విగ్రహారాధకులు కూడా తమ దాహం తీర్చుకోవడానికి హౌజ్ కౌసర్ వద్దకు వస్తారు. కాని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని తరిమివేస్తారు. (ఇబ్నెమాజ)

బిద్అతీలు కూడా నీరు త్రాగేందుకు హౌజ్ కౌసర్ వద్దకు వస్తారు. కాని వారిని కూడా తరిమివేయడం జరుగుతుంది“. (బుఖారి)

అవిశ్వాసులు, విగ్రహారాధకులు, బిద్అతీలు తీర్పు మైదానంలోని కాలమంతా తీవ్రమైన దాహంతోనే గడుపుతారు. ఇంకా అదే స్థితిలో నరకంలో పడవేయబడతారు. (మర్యమ్-86), నరకంలో పడవేయబడిన తరువాత వీళ్ళు ఆహారం కోరితే వారికి నరకంలో పెరిగిన ముళ్ళ చెట్టు, ముళ్ళ గడ్డి ఇవ్వబడుతుంది. అంటే ఈ రెండూ నరకాగ్నిలా వేడిగా ఉంటాయి. ఇంకో విధంగా ఈ ఆహారం నిప్పుగోళాలుగా ఉంటాయి. పాపాత్ములు తమ ఆకలిని తొలగించటానికి వాటిని మ్రింగడం జరుగుతుంది. నరక ఆహారం ఇంకో విధంగా నరక శిక్షల్లో ఒక భాగంగానే ఉంటుంది. అల్లాహ్ మనల్ని రక్షించుగాక!

ఆహారం తిన్న తరువాత నరకవాసులు నీళ్ళను కోరుతారు. నరక దూతలు వారిని అక్కడి నుండి నరక సెలయేర్ల వద్దకు తీసుకొని వస్తారు. అక్కడ మరుగుతున్న వేడినీటి ద్వారా వారిని సత్కరించడం జరుగుతుంది. ఆ నీరు ఎలా ఉంటుందో ఆలోచించండి. మండే అగ్నిలో ఆ నీరు ఆవిరిగా మారే బదులు అలాగే నిలిచి ఉంటుంది. ఏదైనా లోహం, ధాతువు లేదా రాళ్ళు నరకాగ్నికి కరిగి ద్రవంగా మారి ఉండవచ్చు. ఇదే నరకవాసులు పానీయంగా ఉంటుంది. నరకవాసులు దాన్ని త్రాగే ప్రయత్నం చేస్తారు. మొదటి గుటకలోనే వారి ముఖం యొక్క మాంసమంతా కుళ్ళి కృశించి క్రిందపడిపోతుంది. (ముస్తదక్ హాకిమ్) కడుపులోనికి వెళ్ళిన తర్వాత కడుపులోని ప్రేగులన్నీ తెగి వెనుక భాగం ద్వారా వారి కాళ్ళపై పడిపోతాయి. (తిర్మిజి) అంటే మరి త్రాగడం కూడా ఒక రకమైన శిక్షే అవుతుంది. ఇదంతా జరిగిన తరువాత నరక దూతలు వారిని మళ్ళీ జైలులో పడవేస్తారు.

నరకంలోని అన్నపానీయాలను భరించలేక నరకవాసులు స్వర్గవాసులతో కొంత ఆహారాన్ని, నీటిని తమకు ఇమ్మని ప్రాధేయపడతారు. అప్పుడు స్వర్గవాసులు స్వర్గంలోని ఆహార పదార్థాలను అవిశ్వాసుల కొరకు నిషేధించబడ్డాయని సమాధాన మిస్తారు. (ఆరాఫ్:7:50)

ఎలాంటి నీచులను మండే నరకాగ్ని జ్వాలల ద్వారా, విషపూరితమైన దుర్వాసనగల ముళ్ళ ఆహారం, కాగే నీరు, అపరిశుభ్రమైన రక్తం, చీముల పానీయాల రూపంలో శిక్షించడం జరుగుతుందో, అంతా అల్లాహ్ కే తెలుసు. అయితే ఖుర్ఆన్, హదీసుల ద్వారా తెలిసినదేమి టంటే: అవిశ్వాసుల జీవిత కేంద్రాలు రెండే రెండు. అవి- ఆకలి, కామకోరికలు.

ఈ రెండూ ఎలాంటి ఆహార పదార్దాలు కోరుతాయంటే వాటివల్ల నరకాగ్ని జ్వాలలు పైకిలేస్తాయి. అవి ధర్మసమ్మతమైనా, అధర్మసమ్మతమైనా సరే. పరిశుభ్రమైనవైనా, అపరి శుభ్రమైనవైనా సరే. అత్యాచారాల ద్వారా లభించినా, ద్రోహం వల్ల లభించినా, దోపిడీలవల్ల లభించినా లేదా దొంగతనంవల్ల లభించినాసరే. అందువల్లే ఖుర్ఆన్ అవిశ్వాసుల గురించి “నరకాగ్నితో పాటు బాగా తినండి, త్రాగండి, బాగా సుఖాలను అనుభవించండి” అని ఎత్తి పొడవడం జరిగింది. సూరె హిజ్ర్ లో ఇలా ఆదేశించబడింది:

వారిని వదలిపెట్టు. తినడానికి త్రాగడానికి సుఖాలు అనుభవించటానికీ, లేనిపోని ఆశలు వారిని భ్రమలో పడవేసి ఉంచటానికీ. అతి త్వరలోనే వారుదానిని గ్రహిస్తారు“. (సూరె హిజ్ర్: 3)

సూరె ముర్సలాత్ లో ఇలా ఆదేశించబడింది:

మీరు ఈ స్వల్ప జీవితంలో కొన్ని దినాలు తినండి, సుఖాలు అనుభవించండి. నిస్సందేహంగా మీరు నేరస్తులే“. (సూరె ముర్సలాత్: 46)

ఇంకోచోట ఇలా ఆదేశించబడింది:

అవిశ్వాసులు కేవలం కొన్నాళ్ళ ప్రాపంచిక జీవితంలోని సౌఖ్యాలను జుర్రు కుంటున్నారు. పశువుల మాదిరిగా తింటున్నారు, త్రాగుతున్నారు. వారి అంతిమ నివాసం నరకం అవుతుంది“. (ముహమ్మద్ : 12)

సకల భోగభాగ్యాలను అనుభవించి మరణానంతరం సృష్టికర్త ముందు హాజరయితే, అవిశ్వాసానికి బదులు నరకాగ్ని, రుచికరమైన ఆహార పదార్థాలకు బదులు ముళ్ళచెట్టు, ముళ్ళగడ్డి, కాగే నీరు, నీచమైన, అపరిశుభ్రమైన రక్తం, చీముల ద్వారా సత్కరించటం జరుగుతుంది.

అవిశ్వాసుల కొరకు నరకంలోని శిక్షలన్నీ శాశ్వతంగా ఉంటాయి. ధర్మాధర్మాల పట్ల విచక్షణారహితంగా ప్రవర్తించిన ముస్లిములకు కూడా ఇలాంటి శిక్షలు ఉంటా యని ఖుర్ఆన్, హదీసుల ద్వారా తెలుస్తుంది. అనాధల సొమ్మును అపహరించే వారికి ఖుర్ఆన్లో ఈ వాక్యం కఠినంగా హెచ్చరించింది.

అనాధల ఆస్తిని అన్యాయంగా తినేవారు వాస్తవానికి తమ పొట్టలను అగ్నితో నింపుకుంటారు. వారు తప్పకుండా మండే నరకాగ్నిలో త్రోయబడతారు”. (అన్నిసా: 10)

మద్యపానం సేవించే వారి గురించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “నరకంలో వారికి నరకవాసుల చెమట త్రాపించబడుతుంది.” (ముస్లిమ్)

వ్యభిచార స్త్రీ, పురుషుల మర్మాంగాల నుండి కారే నీచమైన, దుర్వాసనగల ద్రవాన్ని తాగుబోతులకు త్రాపించడం జరుగుతుంది.” (ముస్నద్ అహ్మద్)

అనాధల, భార్యల ధనాన్ని దోచుకునే ప్రజలారా! ఇతరుల స్థలాలను ఆక్ర మించుకునే ప్రజలారా! జాతికి చెందిన ధనాగారాన్ని దోచుకునే ప్రజలారా! వడ్డీ, లంచం ద్వారా భోగభాగ్యాలు అనుభవిస్తూ భవంతులు నిర్మించే ప్రజలారా! మద్య పానాన్ని సేవిస్తూ రంగుల జీవితాన్ని అనుభవిస్తున్న ప్రజలారా! ఒకసారి కాదు వెయ్యి సార్లు ఆలోచించండి! నిర్ణయించు కోండి! నరకంలో పెరిగే ముళ్ళచెట్టు, ముళ్ళ గడ్డిని తినే శక్తి ఉందా? అగ్నిలో కాలిన మానవుని శరీరం నుండి ద్రవించే రక్తం, చీముల ఆహారాన్ని తినగలరా? దుర్వాసనగల, అపరిశుభ్రమైన అత్యంత వేడి స్థితిలో ఉన్న నల్లటి నీటిని త్రాగగలరా?

“హితబోధను గ్రహించే వారెవరైనా ఉన్నారా?”

అవిశ్వాసులకు ఇదొక వ్యధాభరితమైన శిక్ష. దైవదూతలను ఈ విధంగా ఆదేశించడం జరుగుతుంది:

వాడిని పట్టుకోండి. ఈడ్చుకుంటూ నరక మధ్యభాగంలో తీసుకుని పోండి. వాడి తలపై మరుగుతున్న నీరు పోయండి.” (దుఖాన్: 47,48)

ఈ వాక్యాన్ని గురించి వివరిస్తూ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “మరుగుతున్న నీటిని అవిశ్వాసునిపై వేస్తే, ఆ నీరు అతని తలను రంధ్రం చేస్తూ శరీరంలోని భాగాలన్నింటినీ కాల్చివేస్తుంది. ఆ భాగాలన్నీ మలద్వారం ద్వారా బయల్పడి అతడి కాళ్ళపై పడతాయి.” (ముస్నద్ అహ్మద్)

తలను రంధ్రం చేస్తూ ఆ నీరు అవిశ్వాసుని మెదడులోనికి ప్రవేశిస్తుంది. అతని మెదడు అధర్మ కోరికలు, వ్యర్ధ అభిప్రాయాలు, మూఢనమ్మకాలకు కేంద్రంగా ఉండేది. ఏ మెదడుతో వాడు ఇస్లాంకు, ముస్లిములకు వ్యతిరేకంగా కుట్రలు పన్నేవాడో, ముస్లిములపై అత్యాచారాలు చేసేవాడో, ఏ మెదడుతో ఇస్లాం మార్గంలో ఆటంకాలు కలిగించేవాడో, భయంకరమైన పథకాలు వేసేవాడో ఆ మెదడు ద్వారానే అతన్ని కఠినంగా శిక్షించటం జరుగుతుంది.

ప్రస్తావించబడిన సూరె దుఖాన్ వాక్యం చివరలో – “శిక్షను అనుభవించు. ఇహలోకంలో మాత్రం నువ్వు మహాగొప్ప వాడిగా ఉండేవాడవు” అని ఉంది. 49వ వాక్యం ద్వారా కఠిన శిక్షకు గురయ్యేవారు అవిశ్వాస నాయకులని, ఇహలోకంలో శక్తి, పరపతిని, అధికారాన్ని, ఆధిక్యతను కలిగి ఉండేవారని, ఇహలోకంలో వారికి గౌరవమర్యాదలు లభించేవని ఈ శక్తి, ఆధిక్యత, అధికారం మత్తులో వారు ఇస్లాంను చిన్నచూపు చూసేవారని, ముస్లిములను నాశనం చేసే ప్రయత్నాలన్నీ చేసేవారని స్పష్టమవు తుంది. ఖుర్ఆన్ ఇలాంటి అవిశ్వాస నాయకుల కుట్రలను, పన్నాగాలను గురించి అనేకచోట్ల ప్రస్తావించబడింది.

అల్లాహ్ ఆదేశం:

వారు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) కు వ్యతిరేకంగా కుట్రలు పన్నారు. అల్లాహ్ కూడా పన్నాగం పన్నాడు. అల్లాహ్ (త’ఆలా) చాలా మంచి పన్నాగాలు పన్నేవాడు.”

మరో వాక్యంలో ఇలా ఉంది:

వీరికి పూర్వంవారు కూడా చాలా కుట్రలు పన్నారు. అయితే అసలు పన్నాగం అల్లాహ్ చేతుల్లో ఉంది”. (రఅద్:42)

సూరె ఇబ్రాహీమ్ లో అల్లాహ్ (త’ఆలా) ఇలా ఆదేశించారు:

అవిశ్వాసులు ఇస్లాంకు వ్యతిరేకంగా ఎంత భయంకరమైన కుట్రలు పన్నారంటే వాటి ధాటికి పర్వతాలు కూడా కదిలిపోతాయి”. (ఇబ్రాహీమ్:46)

నూహ్ (అలైహిస్సలాం) 950 సంవత్సరాలు తన జాతిలో ప్రచారం చేసిన తర్వాత అల్లాహ్ సన్నిధిలో విన్నవించుకోడానికి ముఖ్యకారణం ఒకటుంది:

ఓ అల్లాహ్! ఈ జాతి నాయకులు భయంకరమైన కుట్రలు పన్ని ఉన్నారు”. (నూహ్:22) అయితే ఇస్లాం శత్రువులు ఇస్లాంకు హాని తలపెట్టేవారు, ముస్లిములను నాశనం చేయాలనుకునేవారు తీర్పుదినం నాడు వీరిని విచారించినప్పుడు అతి భయం కరమైన శిక్షలతో వీరిని సత్కరించబడును.

వ్యధాభరితమైన శిక్ష ఉంటే అది అవిశ్వాసుల కొరకే. కాని విశ్వసించిన తరువాత ఇస్లామీయ దేశాల్లో ఇస్లామీయ వ్యవస్థను ఆటంక పరిచేవారు, ఇస్లామీయ చిహ్నాలను అగౌరవపర్చేవారు, వడ్డీ వ్యాపారాన్ని అభివృద్ధి పరచినవారు అల్లాహ్, ఆయన ప్రవక్తను మోసం చేయదలచుకున్నవారు ఈ వ్యధాభరితమైన శిక్ష నుండి తప్పించుకోగలరా?

అధ్యక్ష పదవులు, మంత్రిపదవులపై ఉన్న నాయకులారా! కోర్టుల్లో, న్యాయస్థానాల్లో పదవులలంకరించిన న్యాయమూర్తులారా! జాతీయ అసెంబ్లీలలో భోగభాగ్యాలను పొందుతున్న సభ్యులారా! అల్లాహ్ శిక్షకు భయపడండి. ఇస్లాంకు వ్యతిరేకంగా కుట్రలు పన్నటం మానుకోండి. ఇస్లామీయ ఆదేశాలను, ఇస్లామీయ చిహ్నాలను ఎగతాళి చేయకండి. అల్లాహ్ నూ, ఆయన ప్రవక్తను మోసగించడం మానుకోండి. లేదంటే ఆయన శిక్ష నుండి మీరు తప్పించుకోలేరు.

అవిశ్వాసుల కొరకు సిద్దపర్చబడిన అగ్నికి భయపడండి. (ఆలి ఇమ్రాన్: 131)

నరకంలోని కఠిన శిక్షల్లో ఒకటేమిటంటే అవిశ్వాసుల కాళ్ళు, చేతులు బలమైన సంకెళ్ళతో కట్టి బిగుతైన అంధకారమైన అగ్ని గదులలో కుక్కడం జరుగుతుంది. పైనుండి ద్వారాలు మూయబడుతాయి. అందులోకి గాలి ప్రవేశించదు, వెలుతురు రాదు. దారీ ఉండదు. హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ ఇలా అంటున్నారు: “అవిశ్వాసి కొరకు సరకం ఎంత ఇరుకుగా అయిపోతుందంటే బల్లెం మొన కర్రలో బిగుతుగా దూర్చినట్లు ఉంటుందో ఆ విధంగా ఇరుకుగా అయిపోతుంది.”

ఈ శిక్షను గురించి తెలుసుకోవాలంటే ప్రెషర్ కుక్కర్ని తలచుకోండి. 1000 మంది మాత్రమే పట్టే ప్రెషర్ కుక్కర్లో 2000 మందిని నింపితే ఏమవుతుందో ఊహించుకోండి. అందులో వారు ఊపిరి పీల్చుకోవటం కూడా కష్టమవుతుంది. అటూఇటూ కదలడానికి కాళ్ళు చేతులు బంధించి ఉంటాయి. పైనుండి దృఢమైన మూత కూడా బిగించి ఉంటుంది. అది నరకాగ్నిలో ఉంటుంది. ఈ పరిస్థితుల్లో అవిశ్వాసులు చావును ఎలుగెత్తి పిలుస్తుంటారు. కాని చావురాదు. అల్లాహ్ ఆదేశం: “దానిలోని ఒక ఇరుకైన స్థలంలో వారు కాళ్ళు, చేతులు బంధించబడిన స్థితిలో క్రుక్కబడినప్పుడు, చావును పిలవటం ప్రారంభిస్తారు. అప్పుడు వారితో, “ఈనాడు ఒకచావునే కాదు అనేక చావులను పిలవండి” అని అనబడుతుంది. (ఫుర్ఖాన్-13,14)

కాని చావు జాడలే ఉండవు. అప్పటికీ చావు జబహ్ చేయబడి ఉంటుంది. అందువల్ల అవిశ్వాసులు ఆ వ్యధాభరితమైన శిక్షలో శాశ్వతంగా పడి ఉంటారు.

ఇరుకైన, అంధకారమైన నిప్పు గదుల్లో క్రుక్కబడే శిక్ష ఎవరికిపడుతుంది? సూరె ఫుర్ఖాన్లోని ఈ వాక్యాల్లోనే అల్లాహ్ (త’ఆలా) దీనికి సమాధానం ఇచ్చాడు. ఇలా ఆదేశించాడు: ‘ఆ ఘడియను తిరస్కరించే వాడి కోసం మేము జ్వలించే అగ్నిని సిద్ధపరచి ఉంచాము.” (అల్ ఫుర్ఖాన్:11)

తీర్పు దినాన్ని తిరస్కరించే భయంకర పరిణామం ఇహలోకంలో విచ్చలవిడిగా జీవించడమే.

ధర్మాన్ని ఎగతాళి చేయడం, ఇస్లాం చిహ్నాలను అపవిత్ర పరచడం, అశ్లీలాన్ని, నగ్నత్వాన్ని వ్యాపింపజేయడం, అందచందాలను ప్రదర్శించడం, నగ్నచిత్రాలు తీసి వాటిని వ్యాపింపజేయడం, పర స్త్రీ పురుషుల కలయికలు, సంగీతం, డ్యాన్సులు, మద్యపానీయాలు, వ్యభిచారం, అబార్షన్లు చేయించుకోవటం, స్వలింగ సంపర్కం, నగ్నంగా ఉండటం[*1], స్త్రీ పురుషులు పరస్పరం సుఖాలను అనుభవించే అనేక మార్గాలు [*2] – ఇలాంటి స్వేచ్ఛల ఫలితమే ఆ నరకాగ్నిలో ఇరుకైన గదుల్లో క్రుక్కబడటం అన్నమాట. ఈ స్వేచ్ఛకు ఆనాడు ఎంత వ్యధాభరితమైన శిక్షపడుతుందో ఊహించుకోండి. అవిశ్వాసులు ఈ విషయం తెలుసుకుంటే ఎంత బాగుండు!

[*1] స్వలింగ సంపర్కంలో చిక్కుకుపోయిన పాశ్చాత్యదేశాలు లూతాజాతి కంటే మించి పోయాయి. బ్రిటన్ న్యాయస్థానాల్లో స్వలింగసంపర్కం కోరే వారిని దంపతులుగా స్థానం ఇవ్వబడుతుంది. చర్చీల ఫాదరీలు స్వలింగసంపర్కాన్ని గర్వకారణంగా భావిస్తున్నారు. బ్రిటన్ క్యాబినెట్లో స్వలింగసంపర్కానికి గురైన వారు అధిక సంఖ్యలో ఉన్నారు. దీన్ని పరస్పరం వ్యక్తం చేసుకుంటూ ఉంటారు. (తక్బీర్-ఫిబ్రవరి 16, 2000)

[*2] పాశ్చాత్య దేశాలలో గుప్తజ్ఞానం ఇప్పుడు రహస్యంగా లేదు. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ ఇస్తున్నాము. సేటల్ 37 సంవత్సరాల స్త్రీ హైవేపై ఉన్న స్తంభాన్ని పట్టుకొని డ్యాన్సు చేస్తూ స్తంభంపైకి ఎక్కింది. ఊగుతూ పాడసాగింది. ఆమె చేతిలో మద్యపాన సీసా కూడా ఉంది. పోలీసులు వెంటనే పవర్ కంపెనీకి ఫోన్ చేసి కరెంటు నిలిపివేశారు. ఎందు కంటే ఆమె మత్తులో ఉంది. తీగలను లైటర్ ద్వారా వెలిగించే ప్రయత్నం చేస్తుంది. ఆమెను చూడటానికి ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది. ప్రజలు గంటకు పైగా ఈ డ్రామాను చూస్తూ ఉన్నారు. చివరికి పోలీసులు అతికష్టంగా ట్రాఫిక్ను తొలగించి ఆమెను స్తంభం నుండి క్రిందికి దించి అరెస్టు చేశారు. ఆమెపై అభియోగం ఏమిటంటే ఆమె సెఫ్టీ యాక్ట్ Safety Act కు వ్యతిరేకంగా ప్రవర్తించింది. ఈ కారణంగా ట్రాఫిక్ అంతరాయం కలిగింది. (ఉర్దూ న్యూస్-సెప్టెంబర్-1999). పోలీసులు మద్యపానం పట్ల, నగ్నత్వం పట్ల ఏ మాత్రం అభ్యంతరం వ్యక్తం చేయ లేదు. అయితే ఇప్పుడు పాశ్చాత్య సంస్కృతిని పూజించే పాకిస్తాన్ రవాణా శాఖ కూడా తన జాతిని విచ్చలవిడిగా డ్యాన్స్ చేయమని ప్రోత్సహిస్తుంది. వివేకవంతులారా! ఆలోచించండి!

ప్రజలారా! అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను, తీర్పు దినాన్ని, స్వర్గనరకాలను విశ్వసించే మీరు ఆలోచించండి. సమాధానం ఇవ్వండి. ఈ ఇహలోక స్వేచ్ఛకు బదులుగా ఆ నరకయాతన స్వీకరిస్తారా? అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త నిషేధించిన వాటిని ధర్మసమ్మతం చేసి శాశ్వతంగా ఇరుకైన అగ్ని గదుల్లో జీవితం గడుపుతారా?

వారిని అడగండి. ఈ పర్యవసానం మంచిదా లేక దైవభీతి పరులకు వాగ్దానం చేయబడిన శాశ్వతంగా ఉండే స్వర్గం మంచిదా?” (అల్ ఫుర్ఖాన్: 15)

నరకం అంతా అగ్నే. నేరస్తులు తల నుండి కాళ్ళ వరకు శరీరమంతా అగ్నిలోనే కాలుతూ ఉంటారు. అయినా అల్లాహ్ (త’ఆలా) ఖుర్ఆన్లో కొంతమంది నేరస్తుల ముఖాలపై అగ్నిజ్వాలలు కురిపించే, ముఖాలను అగ్ని ద్వారా కాల్చే శిక్ష గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. అల్లాహ్ ఆదేశం:

వారి చేతులు, కాళ్ళు బేడీలతో బంధించబడి ఉంటాయి. వారు తారు వస్త్రాలను ధరించి ఉంటారు. అగ్నిజ్వాలలు వారి ముఖాలను క్రమ్ముకుంటాయి”. (ఇబ్రాహీమ్:49, 50)

అల్లాహ్ (త’ఆలా) మానవ శరీరాన్ని గురించి ప్రత్యేకంగా ప్రశంసించాడు.

మేము మానవుడ్ని అద్భుతమైన ఆకృతిలో సృష్టించాము.” (అత్తీన్:4)

అల్లాహ్ (త’ఆలా) మానవ శరీరంలోని అవయవాలన్నింటి కంటే ముఖాన్ని చాలా అందంగా తీర్చిదిద్దాడు. ముఖానికి అందం, గౌరవం, ఠీవి ప్రసాదించాడు. మనోహరమైన కళ్ళు, పొడవైన ముక్కు, సరైన చెవులు, సున్నితమైన పెదవులు, నిర్మలమైన బుగ్గలు, యవ్వనంలో నల్లటి వెంట్రుకలు అందాన్ని అధికం చేస్తాయి. వృద్ధాప్యంలో ఆ వెంట్రుకలే తెల్లగా మారి మానవుని గౌరవ, మర్యాదలకు కారకులౌతాయి. ముఖం యొక్క ఈ ఆదరణ, అభిమానాల వల్లే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉపదేశించారు:

భార్యా, పిల్లలు, సేవకులను శిక్షణా నిమిత్తం కొట్టవలసి వస్తే ముఖంపై మాత్రం కొట్టకండి.” (ఇబ్నెమాజ)

వైద్యపరంగా కూడా ముఖ భాగాలు శరీరంలోని ఇతర భాగాల కంటే చాలా సున్నితంగా, అత్యంత గ్రహణశక్తి కలిగి ఉంటాయి. కళ్ళు, చెవులు, ముక్కు, దంతాలు, పెదాలు, బుగ్గలు మొదలైన వాటి నరాలు నేరుగా మెదడుతో సంబంధం కలిగి ఉంటాయి. మెదడుతో దగ్గరి సంబంధం కలిగి ఉండడం వల్ల ఇతర భాగాల కన్నా ముఖంలో రక్తప్రసరణ అధికంగా ఉంటుంది. ఈ కారణంగానే ఏ మాత్రం కోపం వచ్చినా ముఖం రంగు ఎర్రగా మారిపోతుంది. ముఖంలోని ఏ భాగంలో నొప్పి ఉన్నా ఇతర భాగాలకు కూడా నొప్పి వ్యాపి స్తుంది. కేవలం పంటి నొప్పివల్ల కళ్ళు, చెవులు మెదడు కూడా నొప్పికి గురవుతాయి. ఈ నొప్పి ఎంత తీవ్రంగా ఉంటుందంటే మానవుడు సమయం లెక్కపెడుతూ గడుపుతాడు. త్వరగా నయం కావాలని కోరుకుంటాడు. ఇటువంటి సున్నితమైన, గ్రహణశక్తిగల ముఖంపై నరకాగ్ని జ్వాలలు కురిపిస్తే అవిశ్వాసులకు ఎంత తీవ్ర బాధ కలుగుతుందో తెలుసుకోవా లనుకుంటే వారి కోరికల వల్ల అర్థం అవుతుంది.

నేను మట్టినై ఉంటే ఎంత బాగుండేది.” (అన్ నబా:40)

నరకవాసులను శిక్షిస్తున్నప్పుడు తమ ముఖాలను దెబ్బల నుండి రక్షించు కోటానికి చేతులతో కప్పుకుంటారు. ఒకవైపు వారి కాళ్ళూ చేతులు భారీ బేడీలతో బంధించబడి ఉంటాయి. రెండో వైపు నరక దూతలు నిరంతరం వారి ముఖాలపై అగ్ని వర్షం కురిపిస్తూ ఉంటారు. అంటే శారీరక శిక్షతోపాటు అవమాన కరమైన శిక్ష కూడా ఇవ్వటం జరుగుతుంది. అయితే ఇది గంటకో, రోజుకో, వారానికో, నెలకో, సంవత్సరానికో కాదు. నిరంతరం శిక్షించటం జరుగుతూనే సింది.

అల్లాహ్ ఆదేశం:

అయ్యో! ఈ అవిశ్వాసులకు ఆసమయం గురించి కొద్దిగైనా తెలిసి ఉంటే ఎంతో బాగుండును! అప్పుడు వారు అగ్ని నుండి తమ ముఖాలనుగానీ, తమ వీపులనుగానీ కాపాడుకోలేరు. వారికి ఎక్కడి నుండి కూడా సహాయం అందదు.’ (అంబియా:39)

ఇటువంటి విపరీతమైన శిక్షకు ఎలాంటి దౌర్భాగ్యులు గురవుతారు? దీని గురించి అల్లాహ్ (త’ఆలా) చాలా వివరంగా పేర్కొన్నాడు.

అల్లాహ్ ఆదేశం:

“వారి ముఖాలను నిప్పులపై అటూ ఇటూ త్రిప్పటం జరిగిన నాడు వారు ఇలా అంటారు: “అయ్యో! మేము అల్లాహూ, దైవప్రవక్తకూ విధేయత చూపి ఉంటే ఎంత బాగుండేది!” ఇంకా ఇలా అంటారు: “ఓ మా ప్రభూ! మేము మా నాయకులకూ, మా పెద్దలకూ విధేయత చూపాము. వారు మమ్మల్ని ఋజుమార్గం నుండి తప్పించారు. ఓ మాప్రభూ! వారికి రెట్టింపు యాతన విధించు. వారిని తీవ్రంగా శపించు.” (అల్ అహ్ జాబ్ :66-68)

నరక వాసుల నేరం ఏమిటంటే వారు అల్లాహ్ కు, ఆయన ప్రవక్తకూ, వ్యతి రేకంగా తమ నాయకులకూ, తమ పెద్దలకూ, విధేయత చూపారు. అవిశ్వాసుల అవిశ్వాసం, విగ్రహారాధకుల సాటి కల్పించటానికి ఫలితం అల్లాహ్, ప్రవక్తల అవిధేయత మాత్రమే. వీరు తమ పండితుల, విద్వాంసులు, నాయకుల, పాలకులకు విధేయత చూపుతున్నారు. దీనికి తగిన శిక్ష తీర్పు దినం నాడు అనుభవించవలసి వస్తుంది.

మన సమాజంలో అవిశ్వాసులు, విగ్రహారాధకుల కన్నా ముస్లిముల పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. వీరు అల్లాహ్, ఆయన ప్రవక్తల వచనాల్ని మాత్రం పఠించారు. తీర్పు దినాన్ని విశ్వసిస్తారు, స్వర్గనరకాలను విశ్వసిస్తారు. కాని ఏదో ఒక పొరపాటుకు గురయి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పట్ల విధేయతను తిరస్కరిస్తున్నారు.

ఏ విధంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దైవదౌత్యం తీర్పు దినం వరకు కొనసాగుతుందో, అదే విధంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పట్ల విధేయత కూడా తీర్పు దినం వరకు కొనసాగుతుంది.

అల్లాహ్ ఆదేశం : “మేము నిన్ను మానవులందరికీ శుభవార్తను ఇచ్చేవాడుగా, హెచ్చరించేవాడుగా నియమించాము”. (సబా :28)

మరోచోట ఇలా ఆదేశించబడింది. “ఇలా ప్రకటించు, ప్రజలారా! నేను మీ అందరి వైపునకు పంపబడిన అల్లాహ్ ప్రవక్తను”. (అల్ ఆరాఫ్: 158)

అదే విధంగా మరో ఆదేశం:

అంతులేని శుభాలు కలవాడు ఈ గీటురాయిని తన దాసునిపై అవతరింప జేశాడు. సకల విశ్వజనులను హెచ్చరించాలని”. (అల్ ఫుర్ఖాన్:1)

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దైవదౌత్యాన్ని జీవిత చరిత్రవరకే పరిమితం చేసే వారు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పట్ల విధేయతను తిరస్కరిస్తున్నారు. ఇంకా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను కేవలం సందేశహరులుగా పరిగణించే వారు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆదేశాలను తిరస్కరించేవారు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పట్ల విధేయతను తిరస్కరిస్తున్నారు. ఇంకా ఖుర్ఆన్ మాత్రమే ఋజుమార్గానికి చాలు దీనికి తోడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆదేశాల అవసరం ఏ మాత్రం లేదని భావించేవారు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పట్ల విధేయతను తిరస్కరిస్తున్నారు. చూడండి ఈ ఆదేశం (అన్ నహ్ల్ : 44), ఇంకా ఖుర్ఆన్ నమ్మదగిన స్థితిలో ఉందని, కాని హదీసు నమ్మే స్థితిలో లేదని దీని అనుసరణ తప్పని, సరికాదని భావించేవారు కూడా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పట్ల విధేయతను తిరస్కరిస్తున్నారు. చూడండి (అల్ హిజ్ర్ :9). ఇంకా తమ సమస్యలపట్ల పక్షపాతం కారణంగా తమ ఇమాముల అభిప్రాయాలకు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హదీసులపై ప్రాధాన్యత ఇచ్చేవారు కూడా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) విధేయతను తిరస్కరిస్తున్నారు. అదే విధంగా తమ పెద్దల, పూర్వీకుల అభిప్రాయాలను, హితోపదేశాలను ప్రవక్త సాంప్రదాయాలకంటే అధిక ప్రాధాన్యత నిచ్చేవారు కూడా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పట్ల విధేయతను తిరస్కరిస్తున్నారు. (చూడండి: అల్ హుజురాత్: 1)

మేము సంపూర్ణ వినయవిధేయతలతో వివిధ ఆలోచనా సరళిగల ముస్లిం సోదరు లందరికీ విన్నవించుకుంటున్న విషయం ఏమనగా- ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పట్ల విధేయత అనేది చాలా సున్నితమైన విషయం. ఇమాముల నమ్మకాలు, పూర్వీకుల ప్రేమ స్వయం కల్పిత ఆలోచనల పక్షపాతం మనల్ని తీర్పుదినం నాడు కఠినాతి కఠినమైన శిక్షకు గురిచేయకుండా అప్రమత్తంగా ఉండాలి. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను విశ్వసించిన తర్వాత ఇటువంటి భయంకర పర్యవసానం నష్టానికి గురిచేసిన వ్యాపారంగా పరిణమిస్తుంది.

“గుర్తుంచుకోండి! అదే అన్నిటికంటే గొప్ప నష్టం.” (అజుమర్:15)

నరకంలో అవిశ్వాసులను, విగ్రహారాధకులను గొడ్డళ్ళు, గునపాల ద్వారా కొట్టే శిక్ష కూడా ఉంటుంది. దీని గురించి ఖుర్ఆన్, హదీసులలో కూడా ప్రస్తా వించటం జరిగింది.

“వారిని దండించటానికి ఇనుప గదలు ఉంటాయి”. (అల్ హజ్:21)

హదీసులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనం ఇలా ఉంది: “అవిశ్వాసులను దండించే గదలు ఎంత బరువుగా ఉంటాయంటే ఒక గద భూమిపై పెట్టి, భూమిపై నివసించే మానవులు, జిన్నులు అందరూ కలసి దాన్ని ఎత్తాలనుకున్నా ఎత్తలేరు.” (ముస్నద్ అబూయాలా)

నరకానికి ముందు సమాధిలో కూడా అవిశ్వాసులను గదల ద్వారా, గునపాల ద్వారా శిక్షించటం జరుగుతుంది. సమాధి శిక్షను గురించి ప్రస్తావిస్తూ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “మున్ కర్ నకీర్ల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేకపోయిన అవిశ్వాసిని అంధుడు, చెవిటివాడైన దైవదూతకు అప్పగించబడుతుంది. అతని వద్ద ఇనుప గద ఉంటుంది. అది ఎంత బరువుగా ఉంటుందంటే దానితో కొండను కొడితే తునా తనకలు అయిపోతుంది. దానితో ఆ అంధుడైన చెవిటివాడైన దైవదూత వాడిని కొడతాడు. దానికి అవిశ్వాసి కేకలు, పెడబొబ్బలు పెడతాడు.’

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:

అవిశ్వాసి కేకల శబ్దాన్ని తూర్పు పడమరల మధ్య ఉన్న జిన్నులు, మానవులు తప్ప అందరూ వింటారు. దైవదూత యొక్క దెబ్బకు అవిశ్వాసి తునాతునకలు అయిపోతాడు. మళ్ళీ వాడికి ప్రాణం పోయబడుతుంది. ఇదే విధంగా తీర్పుదినం వరకు జరుగుతూ ఉంటుంది.” (ముస్నద్ అబూయాలా)

నరక శిక్ష సమాధి శిక్షకంటే ఎంతో కఠినంగా ఉంటుంది. సమాధిలో శిక్షించే దైవదూతలు అంధులు, చెవిటివారు, నరకంలో శిక్షించే దైవదూతల గురించి అల్లాహ్ ఇలా ఆదేశించాడు:

అంటే నరకంలో కఠినమైన, దయలేని దైవదూతలు నియమించబడి ఉన్నారు.’

హజ్రత్ ఇక్రమ(రదియల్లాహు అన్హు) ఇలా అంటున్నారు: “నరకంలో మొదటి సమూహము ప్రవేశించి నప్పుడు నరకద్వారాలపై నాలుగు లక్షల దైవదూతలు శిక్షించటానికి సిద్దంగాఉంటారు. వారి ముఖాలు భయంకరంగా దట్టమైన నలుపురంగులో ఉంటాయి. వారి దంతాలు బయటికి వచ్చి ఉంటాయి. కఠినాతి కఠినులై, నిర్దయులై ఉంటారు. అల్లాహ్ (త’ఆలా) వారి మనసులలో రవ్వంత దయకూడా ఉంచలేదు. ఆ దైవదూతల రెండవ ప్రత్యేకత ఏమిటంటే- వారు ఏ మాత్రం అల్లాహ్ ఆజ్ఞను ఉల్లంఘించరు. వారు తమకు ఇవ్వ బడిన ఆదేశాన్ని వెంటనే పాటిస్తారు. (అత్తహ్రీమ్:6)

అంటే అల్లాహ్ (త’ఆలా) దైవదూతలను ఎలా శిక్షించమంటే అదే విధంగా శిక్షిస్తారు. ఎంతమాత్రం ఆలస్యం గాని, అభ్యంతరంగాని చేయరు. ఈ దైవదూతలు ఎలాంటి పైశాచిక విధంగా శిక్షిస్తారంటే పెద్దపెద్ద నేరగాళ్ళు కూడా నీరుగారిపోతారు. (ఇబ్నె కసీర్)

ఇది అవిశ్వాసుల పర్యవసానం. అవిశ్వాసానికి శిక్ష. వాస్తవమేమిటంటే, అల్లాహ్ దృష్టిలో అందరికంటే అధికంగా అసహ్యించుకోదగినవాడు, హీనమైనవాడు అవిశ్వాసి. విశ్వాసం కంటే గొప్ప ధనం ఈ ప్రపంచంలోనే లేదు. ముస్లిములు విశ్వాసానికి ఉన్న స్థానం తెలుసుకుంటే ఎంతో బాగుంటుంది. అవిశ్వాసులు తీర్పు దినం నాడు నరక శిక్షను చూసి ఇలా విలపిస్తారు:

“అయ్యో! వారు సన్మార్గాన్ని అవలంబించి ఉంటే ఎంత బాగుండేది?” (అల్ ఖసస్:64)

నరకంలో విషసర్పాల, తేళ్ళ కాటుల ద్వారా కూడా శిక్షించటం జరుగుతుంది. పాములు, తేళ్ళు ఈ రెండూ మానవ శత్రువులుగా భావించబడతాయి. ఈ రెంటి పేరు వింటేనే భయమేస్తుంది. ఈ రెండు ఉన్న చోట ఎవరూ కూర్చోవటం కాదు కదా, అక్కడికి వెళ్ళడానికి కూడా సిద్ధపడరు. పాములు, తేళ్ళు ఎలా ఉంటాయంటే వాటిని చూడగానే మానవుని ఒళ్ళు జలదరిస్తుంది. భయంతో వణికిపోవడం జరుగుతుంది.

పాములు, తేళ్ళు ఎంత వరకు విషం కలిగి ఉంటాయి? దీని గురించి కేవలం అల్లాహ్ కే తెలుసు. కాని పరిశోధనల ద్వారా, ప్రయోగాల ద్వారా కొన్ని పుస్తకాల్లో ఉన్న వివరాలను బట్టి పాము అత్యంత విషపూరితమైనదని, మానవుని శత్రువని తేలింది.

ఫ్రాన్సులో ఉన్న పాముల ప్రదర్శనశాలలో ఉన్న ఒక విషసర్పాన్ని గురించి కొన్ని వివరాలు ప్రచురించబడ్డాయి. వీటి ప్రకారం 1 1/2 మీటర్ల పొడవైన ఈ పాము తన విషంతో ఒకేసారి అయిదుగురిని చంపగలదు. [ఉర్దూ న్యూస్ జిద్దహ్-ఆగస్టు 17, 1999 ]

1999 ఫిబ్రవరిలో కింగ్ సఊద్ యూనివర్శిటీలో విద్యార్థుల కొరకు ఒక విద్యా ప్రదర్శన ఏర్పాటయింది. ఇందులో ప్రపంచంలో ఉన్న వివిధ రకాలకు చెందిన విషసర్పా లను ప్రదర్శించటం జరిగింది. వీటిని గాజు పెట్టెలలో ఉంచడం జరిగింది. వీటిలో కొన్నిటిని గురించి ఈ క్రింది వివరాలు సేకరించబడ్డాయి.

అరబీ కోబ్రా ఇది అరబ్ దేశాలలో ఉంది. ఇది ఎంత విషపూరితమైనదంటే దీని 20 మిల్లీ గ్రాముల విషం 70 కిలోల మానవుడ్ని వెంటనే చంపగలదు. అయితే ఈ కోబ్రా ఒకేసారి 200 మిల్లీగ్రాముల నుండి 300 మిల్లీగ్రాముల వరకు విషాన్ని శత్రువుపై విసరగలదు. (ఉమ్మగలదు), భారతదేశం, పాకిస్తాన్లలోగల కింగ్ కోబ్రా ద్వారా కాటు వేయబడిన వ్యక్తి వెంటనే మరణిస్తాడు. పాశ్చాత్య దేశాలలో ఉండే వెస్ట్ డైమండ్ బేక్ర్ సర్పాలు కూడా అత్యంత విషపూరితమైనవి.

ఇండోనేషియాలోని ఉమ్మి విసిరే విషసర్పం రెండు మీటర్లు పొడవు ఉంటుంది. ఇది మూడు మీటర్ల దూరం నుండి మానవుని కళ్ళలోనికి విషాన్ని విసురుతుంది. దీనివల్ల మానవుడు వెంటనే మరణిస్తాడు.

నరకం కంటే ముందు అవిశ్వాసులను సమాధిలో కూడా పాము కాటుల ద్వారా శిక్షించటం జరుగుతుంది. సమాధి శిక్షను గురించి ప్రస్తావిస్తూ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “అవిశ్వాసి మున్కర్ నకీర్ల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వ నప్పుడు, వాడిపై 99 పాములు వదలివేయటం జరుగుతుంది. తీర్పుదినం వరకు అవి అతన్ని కాటు వేస్తూ మాంసాన్ని పీక్కుతింటూ ఉంటాయి”. సమాధిలోని పాముల గురించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ఉపదేశిం చారు: “ఒకవేళ ఆ పాము ఒకసారి భూమిని కాటు వేస్తే భూమిపై ఏ ఆకు కూరలు పండవు”. (ముస్నద్ అహ్మద్)

సమాధిలోని పాముల గురించి ఇబ్నె హిబ్బాన్ ఉల్లేఖనంలో ఈ విధంగా కూడా పేర్కొనబడింది: “ఒక్కొక్క పాముకు, 70 ముఖాలు ఉంటాయి. వాటితో అవి అవిశ్వాసిని తీర్పు దినం వరకు కాటు వేస్తూ ఉంటాయి.”

నరకంలోని పాముల గురించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పేర్కొన్నారు: “అవి ఒంటెలా ఎత్తుగా ఉంటాయి. అవి ఒకసారి కాటు వేస్తే అవిశ్వాసికి 40 సంవత్సరాల వరకు బాధ కలుగుతూ ఉంటుంది”. (ముస్నద్ అహ్మద్)

సమాధిలో, నరకంలో కాటు వేసే పాములు నిస్సందేహంగా ఇహలోకంలోని పాముల కంటే ఎన్నో రెట్లు విషం గలవి. ప్రమాదకరమైనవి. భయంకరమైనవి. ఇహ లోకంలో ఒక సామాన్య విషసర్పం కాటు వేస్తేనే మానవుడు గిలగిల విలపిస్తాడు. వెంటనే మానవుడు స్పృహ కోల్పోతాడు. విషం ప్రవేశించిన భాగం పనికిరాకుండా పోతుంది. ముక్కు ద్వారా, నోటి ద్వారా, చెవి ద్వారా, కళ్ళద్వారా రక్తం స్రవిస్తుంది. ఈ పరిస్థితి అంతా పాము ఒక్కసారి కాటు వేసినందుకే జరుగుతుంది. ఆ మానవుడ్నే వేల రెట్లు అధిక విషం గల పాములు కాటు వేస్తూ ఉంటే ఎంతటి వ్యధకు గురవుతాడో ఆలోచించండి!

తేలు కాటు ప్రభావం, పాము కాటు ప్రభావానికి వేరుగా ఉంటుంది. తేలుకాటు వేస్తే మానవుడు రెండు విధాల బాధలకు గురవుతాడు. మొదట శరీరం ఉబ్బిపోతుంది. తరువాత ఊపిరిపీల్చుకోవటం కష్టం అవుతుంది. ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది.

నరక తేళ్ళ గురించి ప్రస్తావిస్తూ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు:

అవి అడవి గాడిదల్లా ఉంటాయి. ఒకసారి కాటు వేస్తే అవిశ్వాసి నలభై సంవత్సరాల వరకు దాని మంటను భరిస్తూ ఉంటాడు.” (ముస్నద్ అహ్మద్)

అంటే దీని అర్థం తేలు నిరంతరం కాటు వేస్తూ ఉంటే నరకవాసుని శరీరం కూడా ఉబ్బుతూ ఉంటుంది. ఊపిరిపీల్చుకోవటంలోనూ బాధ పెరుగుతూ ఉంటుంది. ఇది నరకంలోని అవిశ్వానికి ఇవ్వబడే శిక్షల్లో ఒకటి. అవిశ్వాసులు నరకంలోని పాములను తేళ్ళను చంపగలరా? ఎక్కడికైనా పారిపోగలరా? లేదా ఎక్కడైనా దాక్కోని రక్షణ పొందగలరా?

అలాహ్ ఆదేశం:

తిరస్కారులే అప్పుడు పశ్చాత్తాపపడుతూ, “అయ్యో! మేము ముస్లిములమయి ఉంటే ఎంత బాగుండేది” అని అంటారు”. (అల్ హిజ్ర్:2)

అయితే ఓ విశ్వాసులారా! నరక శిక్షలను విశ్వసించే ప్రజలారా! అల్లాహ్ శిక్షలకు భయపడండి. అల్లాహ్ ఆయన ప్రవక్త యొక్క అవిధేయతకు దూరంకండి. అల్లాహ్ శిక్షల గురించి తెలిసి కూడా ఆయనకు అవిధేయత చూపటం అల్లాహ్ కు ఆగ్రహం కలిగించినట్టే అవుతుంది.

మరి మీరు అల్లాహ్ అవిధేయతను విసర్జిస్తారా?” (అల్ మాయిద:91)

ప్రస్తుత శరీర దారుఢ్యంలో నరక శిక్ష భరించడం అసాధ్యం. అందువల్ల నరకవాసులు శరీరాన్ని పెంచడం జరుగుతుంది. అదీ ఒక శిక్ష అవుతుంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికారు:

నరకంలో అవిశ్వాసి యొక్క ఒక పన్ను ఉహుద్ కొండంత ఉంటుంది”. (ముస్లిమ్).

కొందరు అవిశ్వాసుల చర్మం మూడు రోజుల ప్రయాణం అంత వెడల్పు ఉంటుంది”. (ముస్లిమ్).

కొందరి చర్మం 63 అడుగుల వెడల్పుగా ఉంటుంది”. (తిర్మిజి). ఈవ్యత్యాసం వారి కర్మల వల్ల ఉంటుంది.

కొందరు అవిశ్వాసులు రెండు భుజాల మధ్య దూరం వేగంగా స్వారీ చేసే వాని మూడురోజుల ప్రయాణం అంత ఉంటుంది”. (ముస్లిమ్).

కొందరు అవిశ్వాసులు భుజానికి చెవికి 70 సంవత్సరాల ప్రయాణం అంత దూరం ఉంటుంది”.

కొందరు అవిశ్వాసులు కూర్చునే చోటు మక్కా మదీనాల మధ్య ప్రయాణం అంత దూరం ఉంటుంది. అంటే 410 కిలోమీటర్లు”. (తిర్మిజి).

కొందరు అవిశ్వాసులు విశాలమైన మైదానంలో ఒక మూల ఉంచబడతారు. (ఇబ్నెమాజ). కొందరు అవిశ్వాసుల భుజాలు, తొడలు కొండల్లా ఉంటాయి. (అహ్మద్).

అల్లాహ్ (త’ఆలా) ఇహలోకంలో ఎలాంటి పక్షపాతం లేకుండా మానవులందరికీ అందమైన, సరైన శరీరాన్ని ప్రసాదించాడు. ఆ శరీరంలోనే ఒక భాగం సరిగా లేకపోతే మానవుడు చూడ్డానికి అందవికారంగా కనిపిస్తాడు. 5 లేక 6 అడుగుల శరీరానికి పది అడుగుల భుజాలు జత చేస్తే, నొసలు క్రింద ఒక అడుగు పొడవుగల ముక్కు జత చేస్తే మానవుడు ఎంత అందవికారంగా, ఎంత భయంకరంగా ఉంటాడో ఊహించండి. నరకంలో అవిశ్వాసిని ఈ విధంగా పెంచి అత్యంత అందవికారంగా, భయంకరంగా చేయడం జరుగుతుంది.

మానవ శరీర భాగాల్లో చర్మం అన్నిటి కంటే తీవ్రమయిన గ్రహణశక్తి కలిగి ఉంటుంది. అందువల్లే అవిశ్వాసులను కఠినంగా శిక్షించటానికి కాలిన చర్మాన్ని మళ్ళీ మార్చటం జరుగుతుంది. దీని గురించి ఖుర్ఆన్లో ప్రత్యేకంగా పేర్కొనబడింది. చూడండి (నిసా: 4). చర్మం లాగితే ఎంత బాధకలుగుతుందో తెలుసా? భుజం, తొడల ఎముకలు విరిగితే అతికించటానికి చర్మాన్ని లాగవలసివస్తుంది. దాని ధాటికి మనిషి విలవిలలాడుతాడు. ఆ చర్మాన్నే లాగి పెంచడం జరుగుతుంది. దీని గురించి హదీసుల్లో ప్రస్తావన వచ్చింది. దానివల్ల అవిశ్వాసికి ఎంత వ్యధ కలుగుతుందో ఇహలోకంలో దాన్ని ఊహించడం అసాధ్యం.

ఇంత పెద్ద శరీరంగల అవిశ్వాసిని మహా సర్పాలు, తేళ్ళు కాటు వేస్తూ ఉంటే, మాంసం పీక్కు తింటూ ఉంటే వాటి విషప్రభావం వల్ల స్పృహకోల్పోవటం, అంగవైకల్యం, రక్తసిక్తంగా, అవస్థలు పడుతున్న అవిశ్వాసి పరిస్థితిని ఊహించుకోండి!

మానవునికి తన శరీరాన్ని మోసే శక్తి కూడా కొంత వరకే ఉంటుంది. ఒకవేళ శరీరం విపరీతంగా పెరిగిపోతే మానవుడు లేవటం, కూర్చోవటం, నడవటం చాలా కష్టమయి పోతుంది. జీవితం దుర్భరమయిపోతుంది. శరీరం విపరీతంగా పెరగడం వల్ల ఎన్నో వ్యాధులు ఆవరిస్తాయి. ఉదాహరణకు గుండెజబ్బులు, ఆస్తమా, కంటి వ్యాధి, డయాబిటీస్ మొదలైనవి. నరకంలో అవిశ్వాసికి ఇటువంటి వ్యాధులు సోకుతాయో లేదో అల్లాహ్ కే తెలుసు. కానీ దైవదూతలు గదలు, సుత్తులతో కొడతారన్నది లేదా, పాములు, తేళ్ళు కాటు వేస్తాయన్నది మాత్రం వాస్తవం. అవిశ్వాసి ఏ మాత్రం చలించడు. దైవదూతలు అతడ్ని ఒక చోటు నుండి మరోచోటుకి నడిపిస్తే అది అవిశ్వానికి ఎంత దుర్భరంగా ఉంటుందంటే అదొక శిక్షలా అనిపిస్తుంది.

అవిశ్వాసులు నరకంలో కేకలు వేస్తూ ఇలా అంటారు: “ఓ అల్లాహ్ ! ఒక్కసారి ఇక్కడి నుండి తీసి వెయ్యి. ఇక నుండి మేము పుణ్యాత్ములుగా మారి పోతాము. ” సమాధానంగా ఇలా ఆదేశించ బడుతుంది: “ఇక రుచి చూడండి. దుర్మార్గులకు ఇక్కడ సహాయం చేసే వాడెవ్వడూ లేడు.” (ఫాతిర్:37)

అల్లాహ్ (త’ఆలా) మనల్ని తన కారుణ్యం ద్వారా, దయ ద్వారా నరక శిక్షల నుండి కాపాడుగాక. నిస్సందేహంగా ఆయన ఎంతో ఆదరణీయుడు, చక్రవర్తి, సహాయకుడు, ప్రేమించేవాడు. కరుణించేవాడు.

నిప్పు ఏ విధంగా మానవ శరీరాన్ని కాల్చివేస్తుందో అదే విధంగా విపరీతమైన చలి కూడా మానవ శరీరాన్ని కాల్చి వేస్తుంది. అందువల్లే నరకంలో విపరీతమైన చలి కూడా ఉంటుంది. నరకంలోని ఈ భాగం పేరు ‘జమ్ హరీర్‘. జమ్ హరీర్లో ఎంత చలిగా ఉంటుంది అనే విషయాలన్నీ కేవలం అల్లాహ్ కే తెలుసు. అయితే అక్కడి చలి శిక్షించటానికి ఉంటుంది. అందువల్ల ఇహలోకం కంటే అధికంగానే ఉంటుంది. ఇక్కడి చలి నుండి కాపాడుకోవటానికి దుస్తులు, కంబళి, హీటర్లు, మేజోళ్ళు, మఫ్ లర్లు , నిప్పు, మంటలు, వేడివేడి ఆహార పదార్థాలు ఇంకా ఎన్నో మార్గాలను అనుసరిస్తారు. అయినా ఏ మాత్రం పొరపాటు జరిగినా వెంటనే ఏదో ఒక రోగానికి గురిచేస్తుంది. ఈ మార్గాలను వదలి నగ్నంగా ఉన్న వ్యక్తి ఇక్కడి చలిని రుచి చూడమంటే అది కూడా శిక్షగానే పరిగణించబడుతుంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనం ప్రకారం, ‘చలి కేవలం నరకం లోపలి శ్వాస ద్వారా పుడుతుంది.’ (బుఖారి). నరకం లోపలి శ్వాస ద్వారా పుట్టే చలి భరించరానిదిగా ఉంటే మరి నరకం లోపలి చలి ప్రాంతమయిన ‘జమ్ హరీర్’ లో మానవుని గతి ఏమవుతుంది?

అల్లాహ్ (త’ఆలా) మానవునికి సున్నితమైన, కోమలమైన, గ్రహణశక్తి గల శరీరాన్ని ప్రసాదించాడు. మానవ శరీరం 35-37 సెంటిగ్రేడ్ల మధ్యే ఆరోగ్యంగా ఉంటుంది. దీనికన్నా ఎక్కువైనా, తక్కువైనా అనారోగ్య లక్షణాలు కనబడతాయి. ఒకవేళ శరీర ఉష్ణోగ్రత 35 నుండి తగ్గి 26 సెంటిగ్రేడ్ వరకు తగ్గితే మరణం సంభవిస్తుంది. ఇంకా ఒకవేళ ఈ ఉష్ణోగ్రత విపరీతమైన చలి వల్ల శరీరంలోని ఏ భాగంలోనైనా -6.75 సెంటిగ్రేడ్ వరకు పోతే ఆ భాగం చలి వల్ల కాలి లేదా కుళ్ళి కృశించి, వెంటనే వేరైపోతుంది. దీన్ని వైద్యశాస్త్రంలో ‘Frost Bite అంటారు.

కొద్ది క్షణాలకు “జమ్ హరీర్”లో ఈవిధమైన చలే ఉందనుకోండి. దానివల్ల శరీరంలోని ఉష్ణోగ్రత 6.75 సెంటిగ్రేడ్ వరకు చేరితే ఆ శిక్ష ఎలా ఉంటుందంటే బ్రతికున్న మానవుని శరీరం చలి యొక్క తీవ్రత వల్ల ఇసుకలా చెల్లాచెదురై రేణువుల్లా మారిపోతుంది. దానికి మళ్ళీ నూతన శరీరం ఇవ్వబడుతుంది. మళ్ళీ అలా మారుతుంది. మళ్ళీ దానికి శరీరం ఇవ్వబడుతుంది. ‘జమ్ హరీర్ లో ఉన్నంత వరకు ఆ విధమైన శిక్షకే గురవుతూ ఉంటారు.

ఈ లెక్కలన్నీ కేవలం సైన్సు వాస్తవాల, ప్రయోగాల వెలుగులో వేయబడ్డాయి. అయితే నరకాగ్నిలో జమ్ హరీర్ లోని చలి ఇహలోకంలోని చలికి ఎన్నో రెట్లు అధికంగా ఉంటుందనేది వాస్తవం. జమ్ హరీర్ లో శిక్షించే విధానం సరిగ్గా ఎలా ఉంటుందో మనం ఊహించలేకపోవచ్చు. కాని నరకాగ్ని అయినా ‘జమ్ హరీర్ లో’ లోని చలి అయినా అవిశ్వాసులు మాత్రం జీవితం కంటే చావుకే ప్రాధాన్యత ఇస్తారని, చావును కోరుతూ ఉంటారనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. వారు, “ఓ మాలిక్! నీ ప్రభువు మమ్మల్ని అంతం చేస్తే బాగుంటుంది?” అని వేడుకుంటారు. దానికి అతడు, “మీరు ఇదే విధంగా పడి ఉంటారు, అని అంటాడు.” (అజుఖ్రుఫ్:77)

అల్లాహ్ (త’అలా) ముస్లిములందరినీ తన దయాదాక్షిణ్యాలతో జమ్ హరీర్ యొక్క నరకయాతన నుండి కాపాడుగాక. నిస్సందేహంగా ఆయన క్షమించేవాడు. కరుణించేవాడు. తన దాసులపై కారుణ్యాన్ని కురిపించేవాడు, సున్నిత మనసుగలవాడు.

ఖుర్ఆన్ మరియు హదీసుల్లో నరకంలోని అగ్ని శిక్షలే కాక ఇంకా ఎన్నో రకాల శిక్షలను గురించి ప్రస్తావించడం జరిగింది. అంతేకాక కొన్ని నేరాలకు ప్రత్యేక శిక్షలుంటాయని కూడా పేర్కొనబడింది. అయితే దీనికితోడు అల్లాహ్ (త’ఆలా) ఈ విషయాన్ని కూడా తెలియజేసి ఉన్నాడు.

ఈ విధమైన ఇతర శిక్షలు కూడా ఉన్నాయి:

ఒక చోట (సాద్:58) (చాలా పెద్ద శిక్ష), (వ్యధాభరితమైన శిక్ష).

మరో చోట (చాలా పెద్ద శిక్ష), ఇంకో చోట (చాలా కఠినమైన శిక్ష)గా పేర్కొన బడింది. వీటి గురించి కేవలం అల్లాహ్ కే తెలుసు.

జైల్లో నేరస్తుల శిక్షలు నిర్ణయించబడి ఉంటాయి. కాని కొందరు నేరస్తుల విషయంలో అధికారులు కేవలం ‘వీడికి మంచి గుణపాఠం చెప్పు’ అని మాత్రమే అంటారు. శిక్షించే వాడు అధికారులు ఏం కోరుతున్నారనేది తెలుసుకుంటాడు. అదే విధంగా అల్లాహ్ అవిశ్వాస నాయకులను గుణపాఠం నేర్పడానికి ఫలానా వ్యక్తులను కఠినంగా శిక్షించు అని అంటే చాలు. నరక దూతలకు ఇలాంటి మహా అవిశ్వాస నాయకులను ఏ విధంగా కఠినంగా శిక్షించాలి? ఎవరు ఎలాంటి శిక్షకు అర్హులు, ఇంకా వారిని ఎలా శిక్షించాలి? అన్నది కూడా తెలిసే ఉంటుంది.

ఇదే ఆ నరకం. దీని శిక్షల పట్ల హెచ్చరించేందుకు అల్లాహ్ (త’ఆలా) ప్రవక్తలను ప్రభవింపజేశాడు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రజలను నరకాగ్ని గురించి హెచ్చరించడంలో ఎటువంటి కొరత ఉంచలేదు. ప్రజలను అనేకసార్లు హెచ్చరించారు.

నరకాగ్ని నుండి రక్షించుకోండి. ఖర్జూరం ముక్క ఇచ్చి అయినా సరే. దీని స్తోమత లేనివారు మంచి మాట పలికి రక్షించుకోవాలి.” (ముస్లిమ్)

అగ్ని నుండి రక్షణ ఎంత తప్పనిసరి అంటే ఎవరి వద్ద దానం చేయడానికి ఏమీ లేకపోతే కనీసం ఖర్జూరం ముక్క దానం చేసి అయినాసరే రక్షించుకోవాలి. ఇంకా కొందరి వద్ద అది కూడా లేకపోతే మంచి మాటపలికి రక్షించుకునే ప్రయత్నం చేయాలి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క చివరి వచనాలు: “ఎవరి వద్ద ఖర్జూరం ముక్క అయినా లేకపోతే” ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన అనుచర సంఘాన్ని నరకాగ్ని నుండి రక్షించటానికి ఎంత తపించేవారో, కృషిచేసేవారో ఈ వాక్యం వల్ల అర్ధమవుతుంది. హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఇలా అంటున్నారు:

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మాకు నరకాగ్ని నుండి తప్పించుకునే దుఆను ఖుర్ఆన్ సూరాలు బోధించినట్టు బోధించేవారు.” (నసాయి)

హజ్రత్ మాలిక్ బిన్ దీనార్ (రహిమహుల్లాహ్) ఇలా అంటున్నారు: “నా వద్ద సహాయకులు ఉంటే నేను వారిని ప్రపంచం నలువైపుల ఈ విధంగా ప్రకటించటానికి పంపి స్తాను. ‘ప్రజలారా! నరకాగ్ని నుండి కాపాడుకోండి. ప్రజలారా! నరకాగ్ని నుండి కాపాడుకోండి.” ప్రపంచ మంతా కాకపోయినా మనలో ప్రతి వ్యక్తి తన భార్యాబిడ్డలను, తన బంధుమిత్రులను నరకాగ్ని పట్ల హెచ్చరించగలడు. తన బంధుమిత్రులను తన పరిసరాల్లో ఉన్న వారిని, తన సహవర్తులను ఈ విధంగా హెచ్చరించగలడు. “ప్రజలారా! నరకాగ్ని నుండి కాపాడు కోండి. ఖర్జూరం ముక్క ఇచ్చి అయినా సరే, ఇంకా ఎవరి వద్ద ఇది కూడా లేకుంటే మంచి వచనాలు వల్లించి తప్పించుకోవాలి.” (ముస్లిమ్)

నరకాగ్ని మరియు అందులో ఉన్న అనేక రకాల శిక్షలను గురించి చదివే టప్పుడు మనిషి భయంతో వణికిపోతాడు. అనుకోకుండా మనిషి నరకం నుండి శరణుకోరుతాడు. కాని దానికితోడు ఒక విధమైన ఆలోచన కూడా వస్తుంది. జీవితాంతం చేసిన పాపాలు, అవి ఎన్నయినాసరే వాటి శిక్షకు ఒక పరిమితి ఉండాలి. మరి ఆ అల్లాహ్ తన దాసులను అమితంగా కరుణించేవాడు, దయ చూపేవాడు తన దాసులను శాశ్వతంగా నరకాగ్నిలో ఎలా శిక్షించగలడు?

ఈ ప్రశ్నకు సమాధానం వెదకడానికి ముందు అల్లాహ్ (త’ఆలా) యొక్క శిక్ష, ప్రతిఫలాల వ్యవస్థలోని ఒక ముఖ్య విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:

ఒక వ్యక్తి ప్రజలను సన్మార్గం వైపు ఆహ్వానిస్తే, అతనికి అతని సందేశాన్ని అనుసరించిన వారికి సమానంగా పుణ్యం లభిస్తుంది. ఇంకా వారి పుణ్యంలో ఎటువంటి కొరత ఉండదు. అదే విధంగా ఒక వ్యక్తి ప్రజలను వక్రమార్గాల వైపు పిలిస్తే అతనికి అతని పిలుపును అనుసరించిన వారికి సమానంగా పాపం చుట్టుకుంటుంది. వారి పాపంలో ఎటువంటి కొరత ఉండదు”. (ముస్లిమ్).

దీనిని హాబీల్, ఖాబీల్ సంఘటన ద్వారా ఇంకా వివరంగా తెలుసుకోవచ్చు. దీని గురించి ప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:

ప్రపంచంలో అన్యాయంగా ఎవరు చంపబడినా, ఆ పాపంలో హజ్రత్ ఆదమ్ (అలైహిస్సలాం) మొదటి కుమారుడు ఖాబీల్ కూడా భాగం పంచుకుంటాడు. ఎందుకంటే వాడే అందరికంటే ముందు హత్యా పద్ధతిని కనుగొన్నాడు”. (బుఖారీ, ముస్లిమ్).

ఈ చట్టాన్ని అనుసరించి అవిశ్వానికి కేవలం తన పాపాల శిక్ష మాత్రమే పడదు. వాడి సంతతి, వారి సంతతి ఈ విధంగా తీర్పుదినం వరకు వాడి సంతతిలో పుట్టిన వారందరి అవిశ్వాస పరిణామం వాడికి పడుతుంది. వాడు అల్లాహ్, ఆయన ప్రవక్త యొక్క విధేయతను తిరస్కరించాడు. వాడి తరువాత గల అవిశ్వాసులకూ అదే గతిపడుతుంది. తన సంతానానికి అవిశ్వాస శిక్షణ ఇచ్చిన అవిశ్వాసులందరి పట్ల ఇదే విధంగా ప్రవర్తించటం జరుగుతుంది. ఈ సూత్రాలననుసరించి ప్రతి అవిశ్వాసి యొక్క పాపాల చిట్టా ఎంత పెద్దదిగా ఉంటుందంటే వాడిని నరకంలో శాశ్వతంగా ఉంచడమే న్యాయంగా, ధర్మంగా పరిగణించబడుతుంది. ఇలా అవిశ్వాసి పట్ల ప్రవర్తించటం జరుగుతుంది. ఒకవేళ అవిశ్వాసీ అవిశ్వాసాన్ని సామూహిక ఉద్యమ రూపం ఇచ్చి సమాజంలో, దేశంలో, ప్రపంచంలో దాన్ని స్థాపించాలని ప్రయత్నిస్తే, ఈ కృషి, క్రమశిక్షణతో కూడిన ప్రయత్నాలు అతని పాపాన్ని లేక అవిశ్వాసాన్ని మరీ అభివృద్ధి పరుస్తాయి. ఈ అభివృద్ధి అతని కృషి, ప్రయత్నాలకు ఫలితమే. ఈ ఉద్యమం ద్వారా ఎంతమంది మార్గభ్రష్టులయ్యారు, ఇంకా ఈ ఉద్యమాన్ని స్థాపించేందుకు ఎన్ని పాపాలు చేయబడ్డాయి? ఉదా: లెనిన్ కమ్యూనిజమ్ స్థాపనకు లక్షల కొలది మానవులను అన్యాయంగా సంహరించాడు. వ్యతిరేకించినవారిపై పైశాచికంగా అత్యాచారాలు చేశాడు. పల్లెలను, పట్టణాలను ధ్వంసం చేయించాడు. ముస్లిం ప్రాంతాల్లో ఇస్లాం మార్గంలో ఆటంకాలు కలిగించేందుకు విశ్వప్రయత్నాలు, కుట్రలు వినియోగించాడు. అల్లాహ్, ఆయన ప్రవక్తలను ఉచ్చరించటాన్ని, అజాన్ ఇవ్వటాన్ని, నమాజు ఆచరించటాన్ని, ఖుర్ఆన్ పఠించటాన్ని, మస్జిదులు, మదరసాలపై ఆంక్షలు, పండితుల, ధార్మికవేత్తల సంహరణ, ఈ ఈ నేరాలన్నీ లెనిన్ పాపాల జాబితా పెరుగుదలకు కారణమయ్యాయి. ఇంకా క్రైస్తవ సంతతి అవిశ్వాసుల తిరస్కారానికే కాదు, కోట్లాది మానవుల మార్గభ్రష్టత్వానికి బాధ్యుడై ఈ భారాన్ని, తమ భుజాలపై మోసుకుంటూ తీర్పుదినం నాడు వస్తాడు. హత్యలు, కల్లోలాలు, నేరాల జాబితా వేరుగా ఉంటుంది. ఇలాంటి ఇస్లాం శత్రువు నీచ అవిశ్వాసి కొరకు నరకం కన్నా మంచిచోటు ఏది కాగలదు?

మార్చి 1846లో మహారాజు గులాబ్ సింగ్ కశ్మీరును కొని తన బల ఆధిక్యతను స్థాపించటానికి ప్రయత్నించాడు. అప్పుడు ఇద్దరు ముస్లిం సర్దారులు మిలీఖాన్, సబ్ అలీ ఖాన్ వ్యతిరేకించారు. గులాబ్ సింగ్ ఇద్దరినీ తలక్రిందులుగా వ్రేలాడగట్టి వారి చర్మాలు తీయమని ఆదేశించాడు. ఈ దృశ్యం ఎంత భయంకరంగా ఉండేదంటే గులాబ్ సింగ్ కుమారుడు రణ్బీర్ సింగ్ తాళలేక సభ నుండి లేచి వెళ్ళిపోయాడు. గులాబ్ సింగ్ అతన్ని పిలిపించి ఇలా అన్నాడు: “ఒకవేళ నీలో ఈ దృశ్యం చూసే శక్తి లేకపోతే నిన్ను నా వారసత్వం నుండి తొలగించి వేస్తాను.” ఇస్లాం మరియు ముస్లిముల పట్ల శత్రుత్వ శిక్షణకు తగిన గుణపాఠం నరకాగ్ని తప్ప మరెవరు ఇవ్వగలరు?

భారత విభజన సమయంలో, ‘లార్డ్ మౌంట్ బాటన్, పటేల్, నెహ్రూ, గాంధీ మొదలైనవారు ఇస్లాం శత్రుత్వంలో భయంకర పథకాలు వేసి ముస్లిముల హత్యలు చేయించారు. ముస్లిం స్త్రీల మానభంగాలు చేశారు. అభం శుభం తెలియని పిల్లలను హత్య చేయించారు. దీనికి తగిన ప్రతీకారం నరకాగ్ని, నరకంలో ఉన్న పాములు తేళ్ళు ప్రతీకారం తీర్చుకోనంత వరకు హత్యచేయబడిన నిరుపేద ముస్లిముల, మానాలను పోగొట్టుకున్న ముస్లిం స్త్రీల, అమాయక బాలల ఆత్మలు ఎలా శాంతిస్తాయి?

గోచర అగోచర విషయాలు తెలిసిన ఆ అల్లాహ్, మానవుల మనసులలో దాగి ఉన్న కోరికలను, కాంక్షలను కూడా తెలుసుకోగలడు. అవిశ్వాసుల కొరకు వివిధ రకాల శిక్షలను నిర్ణయించాడు. నిస్సందేహంగా వారు వాటికే అర్హులు. ఇవన్ని న్యాయంగా, ధర్మంగా నిర్ణయించ బడ్డాయి. ఎందుకంటే అల్లాహ్ (త’ఆలా) మానవుల పట్ల ఎంతో కరుణించేవాడు, దయచూపేవాడు. ఆయన ఎవరికీ రవ్వంత అన్యాయం కూడా చేయడు.

ఇంకా నీ ప్రభువు ఎవరినీ రవ్వంత అన్యాయం కూడా చేయడు. (అల్ కహఫ్:49)

ఖుర్ఆన్లో అల్లాహ్ (త’ఆలా) ఇలా ఆదేశించాడు:

విశ్వాసులారా! మీరు మిమ్మల్ని, మీ కుటుంబాలను మానవులు, రాళ్ళు, ఇంధనం కాగల అగ్ని నుండి కాపాడుకోండి. దానిలో ఎంతో బలిష్టులు, అత్యంత కఠినులు అయిన దైవదూతలు నియమించబడి ఉంటారు. వారు ఎంత మాత్రం అల్లాహ్ ఆజ్ఞను ఉల్లంఘించరు. వారు తమకు ఆదేశించిన దాన్నే పాటిస్తారు.”(అత్తహ్రీమ్:6)

ఈ వాక్యంలో అల్లాహ్ (త’ఆలా) రెండు విషయాలను గురించి ఆదేశించాడు: 1. మిమ్మల్ని మీరు నరకాగ్ని నుండి రక్షించుకోండి. 2. మీ కుటుంబాన్నీ నరకాగ్ని నుండి రక్షించుకోండి.

కుటుంబం అంటే భార్యాబిడ్డలు అని అర్థం. అంటే ప్రతి వ్యక్తి తనతోపాటు తన భార్యాబిడ్డలను కూడా నరకాగ్ని నుండి రక్షించటం తప్పనిసరి అన్నమాట. భార్యా బిడ్డల పట్ల ఇదే నిజమైన శ్రేయోభిలాష మరియు అల్లాహ్ విధేయత కూడా. అల్లాహ్ (త’ఆలా) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను దీనిని గురించి ఆదేశించినప్పుడు: (అంటే నీ బంధుమిత్రులను నరకాగ్ని పట్ల హెచ్చరించు) అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన కుటుంబం వారిని, తన తెగవారిని పిలిచారు. వారిని నరకాగ్ని పట్ల హెచ్చరించారు. చివరగా తన కుమార్తె హజ్రత్ ఫాతిమా(రజిఅన్) ను పిలిచి ఇలా ఉపదేశించారు.

ఓ ఫాతిమా (రదియల్లాహు అన్హా) ! నిన్ను నువ్వు నరకాగ్ని నుండి కాపాడుకో, అల్లాహ్ కు వ్యతిరేకంగా (తీర్పు దినం నాడు) నేను నీకు దేనికీ పనికిరాను.” (ముస్లిమ్)

తన బంధుమిత్రులను, తన తెగవారిని నరకాగ్ని పట్ల హెచ్చరించిన తరువాత, తన కూతుర్ని నరకాగ్ని పట్ల హెచ్చరించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముస్లిములందరికీ తమ సంతానాన్ని నరకాగ్ని నుండి రక్షించటం కూడా తల్లిదండ్రుల బాధ్యతల్లో ఒక ముఖ్యమైన బాధ్యత అని చాటి చెప్పారు.

ఒక హదీసులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:

ప్రతి శిశువు ప్రకృతి (ఇస్లాం) నియమానుసారం జన్మిస్తాడు. వాడి తల్లిదండ్రులు వాడిని యూదునిగానో, క్రైస్తవునిగానో, నాస్తికునిగానో మార్చివేస్తారు.” (బుఖారి)

అంటే సాధారణంగా తల్లిదండ్రులే తమ సంతానాన్ని స్వర్గమార్గం లేదా నరక మార్గాన పెడతారు.

అల్లాహ్ (త’ఆలా) ఖుర్ఆన్ లో మానవుని యొక్క అనేక బలహీనతలను గురించి పేర్కొ న్నాడు. ఉదా: మానవుడు మహా అత్యాచారి మరియు కృతఘ్నుడు. (ఇబ్రాహీమ్:34). మానవుడు చాలా తొందరపాటుగలవాడు. (బనీ ఇస్రాయీల్:11) మొదలైనవి. ఇతర బలహీనతల్లో ఒక బలహీనత ఏమిటంటే మానవుడు త్వరగా లభించే లాభాలకు ప్రాముఖ్యత ఇస్తాడు. అవి తాత్కాలికమైనవైనా, లేదా తక్కువ సంఖ్యలో ఉన్నా సరే. అయితే ఆలస్యంగా లభించే లాభాలను హీనంగా చూస్తాడు. అవి శాశ్వతమైనవైనా, అధిక సంఖ్యలో ఉన్నాసరే.

అల్లాహ్ ఆదేశం:

వారు త్వరగా లభించే దాన్ని (ఇహలోకాన్ని) ప్రేమిస్తున్నారు. భవిష్యత్తులో రాబోయే కఠినమైన దినాన్ని విస్మరిస్తున్నారు.” (అద్దహ్ర్:27)

మానవుల్లోని ఈ స్వాభావిక బలహీనతల వల్లే చాలా మంది తల్లిదండ్రులు తమ సంతానాన్ని ఇహలోకపు తాత్కాలిక జీవితంలో భోగభాగ్యాలు, గౌరవోన్నతులు పెద్దపెద్ద స్థానాలు ఇప్పించటానికి చదివించే ప్రయత్నం చేస్తారు. దానికి ఎంతకాలం పట్టినా, ఎంత ధనం ఖర్చు అయినా, ఎన్ని కష్టాలు వచ్చినా సరే. అయితే చాలా తక్కువ మంది తల్లిదండ్రులు తమ సంతానాన్ని పరలోక జీవితంలోని గొప్పగొప్ప స్థానాలు, గౌరవాలు ఇప్పించడానికి ధార్మిక విద్యను ఇప్పించే ఏర్పాటు చేస్తారు. పరలోక విద్య ప్రాపంచిక విద్యకన్నా ఎంతో సులువైనది. సులభమైనదీను. ఇది ఉభయ లోకాల దృష్ట్యా తల్లిదండ్రులకు లాభం చేకూర్చేదే.

ప్రాపంచిక విద్యను అభ్యసించే చాలా మంది యువకులు ఆచరణలో తల్లి దండ్రుల పట్ల ద్రోహులుగా, స్వతంత్రులుగా మారుతున్నారు. ధార్మిక విద్యను అభ్యసించే చాలా మంది యువకులు తమ తల్లిదండ్రుల పట్ల విధేయత చూపుతూ, వారి సేవ చేస్తున్నారు.

ఇంకా పరలోకం దృష్ట్యా నిస్సందేహంగా సద్బుద్ధి, దైవభీతి, ధార్మికతగల ఇలాంటి సంతానమే లాభదాయకం కాగలదు. ఈ వాస్తవాలన్నింటినీ తెలిసి ఉండి, స్వీకరిస్తూ కూడా 99% మంది తల్లిదండ్రులు తమ సంతానం కొరకు ధార్మిక విద్యకంటే ప్రాపంచిక విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు.

రండి! మానవుని యొక్క ఈ బలహీనతను మరో వైపు నుండి పరిశీలిద్దాం. ఊహించండి! ఒక ఇంటికి నిప్పు అంటుకుంది. ఇంట్లో ఉన్న వారందరూ ఇంటి నుండి బయటికి వచ్చేస్తారు. పొరపాటున ఒక అబ్బాయి ఇంట్లో ఉండిపోతాడు. ఆ సమయంలో తల్లిదండ్రుల పరిస్థితి, ఆందోళన ఎలా ఉంటుంది? ప్రాపంచిక సమస్యలు, వ్యాపారం, ఉద్యోగం, అనారోగ్యం మొదలైనవి ఏవైనా ఆ అబ్బాయి నుండి మరల్చగలవా? ఎంతమాత్రం కాదు. తమ కుమారుడు ఆ నిప్పు నుండి రక్షించబడనంత వరకు తల్లిదండ్రులు రెప్పపాటుకైనా సుఖంగా ఉండలేరు. తమ సంతానాన్ని మంటల నుండి రక్షించటానికి తల్లిదండ్రుల ప్రాణాలు పణంగా పెట్టాలన్నా దానికి కూడా వారు సిద్ధపడతారు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం. తాత్కాలికమైన ఈ ఇహలోక జీవితంలో ప్రతి వ్యక్తీ తన సంతానాన్ని మంటల నుండి రక్షించాలని కోరుకుంటాడు. కానీ పరలోకంలో నరకాగ్ని నుండి తన సంతానాన్ని రక్షించాలని మాత్రం చాలా కొద్దిమందికే అర్థమవుతుంది.

అల్లాహ్ ఆదేశం : “నా దాసుల్లో చాలా కొద్ది మందే కృతజ్ఞత చూపేవారు.” (సబా:13)

నిస్సందేహంగా మానవుని ఈ బలహీనత పరీక్షలోని భాగమే. పరీక్ష కోసమే మానవుడ్ని ఇహలోక జీవితంలోనికి పంపబడింది. ఈ పరీక్ష గురించి తెలివిగా ప్రవర్తించేవాడే బుద్ధిమంతుడు. తన సృష్టికర్త, ప్రభువుకు విధేయత చూపడమే మానవుని తెలివి తేటలకు నిదర్శనం. అల్లాహ్ (త’ఆలా) విశ్వాసులకు నరకాగ్ని నుండి తమ్ము తాము రక్షించుకోవాలని, తమ కుటుంబాన్ని నరకాగ్ని నుండి రక్షించుకోవాలని ఆదేశించాడు. ప్రతి ముస్లిం తనను, తన కుటుంబాన్ని నరకాగ్ని నుండి రక్షించు కోవడానికి ఇక్కడి తపన, ఆందోళన కంటే 69 రెట్లు అధికంగా ఆందోళన, తపనతో ఉండాలి. ఈ బాధ్యతను నిర్వర్తించటానికి ప్రతి ముస్లిం రెండు విషయాలను విధిగా పాటించాలి.

మొదటిది ఖుర్ఆన్, హదీసుల విద్యను అభ్యసించడం

ఖుర్ఆన్, హదీసుల విద్యను అభ్యసించడం, అజ్ఞానం అనేది ప్రాపంచిక విషయాల దైనా, ధార్మిక విషయాలదైనా మానవున్ని నష్టాలకు, కష్టాలకు గురిచేస్తుంది. అల్లాహ్ దీన్ని గురించి ఇలా ఆదేశించాడు:

జ్ఞానమున్నవారూ, జ్ఞానం లేనివారూ ఇద్దరూ సమానులు కాగలరా?” (అజ్జుమర్:9)

మనం చూస్తూ ఉంటాం తీర్పు దినాన్ని విశ్వసించే వ్యక్తి, ప్రళయ మైదానం గురించి తెలిసిన వ్యక్తి, స్వర్గనరకాల శిక్షా ప్రతిఫలాలను గురించి తెలిసే వ్యక్తి యొక్క జీవితం వేరుగా ఉంటుంది. మరో వ్యక్తి కేవలం సాంప్రదాయంగా తీర్పు దినాన్ని విశ్వసిస్తాడు. కానీ తీర్పు మైదానంలోని పరిస్థితులను గురించి స్వర్గనరకాల శిక్షా ప్రతిఫలాల గురించి ఏ మాత్రం అవగాహన ఉండదు. ఇటువంటి వ్యక్తి జీవితం వేరుగా ఉంటుంది. ఖుర్ఆన్ హదీసుల జ్ఞానం గలవారు ఇతరుల కన్నా ఎంతో మంచి నడవడిక కలిగి, సత్యవంతులై, భీతిపరులై, ఎల్లప్పుడూ అల్లాహ్ కు భయపడుతూ ఉంటారు.

అల్లాహ్ ఆదేశం: “వాస్తవం ఏమిటంటే అల్లాహ్ దాసుల్లో కేవలం (ఖుర్ఆన్ హదీసుల) విద్యగలవారే అల్లాహ్ కు భయపడతారు.’ (ఫాతిర్:28)

తమ సంతానాన్ని ప్రాపంచిక విద్య కోసం ధార్మిక విద్యకు దూరం చేసే తల్లి దండ్రులు వాస్తవంగా తమ సంతానం యొక్క పరలోక జీవితాన్ని నాశనం చేసి చాలా పెద్ద అపరాధాన్ని చేస్తున్నారు. ఇంకా తమ సంతానాన్ని ప్రాపంచిక విద్యతోపాటు ధార్మిక విద్యా శిక్షణ ఇప్పిస్తున్న తల్లిదండ్రులు కేవలం తమ సంతానం యొక్క పరలోక జీవితాన్నే అలంకరించటం లేదు. తమ పరలోక జీవితాన్ని కూడా అలంకరించు కుంటున్నారు.

రెండవది – ఇంట్లో ఇస్లామీయ వాతావరణ స్థాపన:

పిల్లల వ్యక్తిత్వాన్ని ఖుర్ఆన్ హదీసుల బోధనల రూపంలో తీర్చిదిద్దడానికి ఇంట్లో ఇస్లామీయ వాతావరణం తప్పనిసరి. అయిదు పూటలూ నమాజు తప్పనిసరిగా పాటించటం, ఇంట్లో వచ్చినప్పుడు, వెళ్ళినప్పుడు సలాం చేయటం, సత్యం పలికే అలవాటు చేయటం, ఆహార సమయాల్లో ఇస్లామీయ నియమాలను దృష్టిలో ఉంచటం, దానధర్మాల అలవాటు చేయటం, పడుకునేటప్పుడు, మేల్కొనేటప్పుడు దుఆలను పఠించటం నేర్పించాలి. సంగీతం, పాటలు డప్పులు వాయించటం, చిత్రాలు, సినీ పత్రికలు, నగ్న చిత్రాలు గల వార్తాపత్రికలు మొదలైన వాటి నుండి ఇంటిని దూరంగా ఉంచాలి. అసత్యం, పరోక్ష నింద, దుర్భాషలాడటం, పొట్లాటలు, వివాదాలకు దూరంగా ఉంచాలి. ప్రవక్తల జీవిత చరిత్రలు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవిత చరిత్ర ఖుర్ఆన్ గాధలు, యుద్ధాలు, ప్రవక్త అనుచరుల (స్త్రీ, పురుషుల) జీవిత చరిత్రలు గల పుస్తకాలు పిల్లలకు అందివ్వడం, పరస్పరం మంచిగా ప్రవర్తించటం ఈ విషయాలన్ని పిల్లల వ్యక్తిత్వ వికాసానికి ప్రధాన పాత్ర వహిస్తాయి. అందువల్ల తమ సంతానాన్ని నరకాగ్ని నుండి రక్షించే బాధ్యతను నిర్వర్తించాలనుకునే తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ సంతానాన్ని ధార్మిక విద్యా శిక్షణ ఇవ్వటంతోపాటు ఇంట్లో పరిపూర్ణ ఇస్లామీయ వాతావరణాన్ని కూడా స్థాపించాలి.

ఒక అపార్థానికి పరిష్కారం:

అల్లాహ్ ఆదేశాన్ని ధిక్కరించిన షైతాన్ సభ నుండి బహిష్కరించబడి ఇలా ప్రతిజ్ఞ చేశాడు. “ఓ నా ప్రభూ! నీవు నన్ను వక్రమార్గం పట్టించినట్లే, నేను వారి కొరకు హృదయాలను ఆకర్షించే విషయాలను భూమిలో సృష్టించి వారందరినీ మార్గ భ్రష్టత్వానికి గురిచేస్తాను.” (అల్ హిజ్ర్ :39)

ఇంకోచోట షైతాన్ ఇలా అన్నాడు:

“వెనుకా, ముందూ, కుడి, ఎడమా అన్ని వైపుల నుండీ వారిని చుట్టుముట్టుతాను”. (అల్ ఆరాఫ్:17)

వాస్తవమేమిటంటే షైతాన్ నిరంతరం (రాత్రీపగలూ) మానవుని వెంట పడుతుం టాడు. చావుకు ముందు ఏ విధంగానైనా దుష్కార్యాలకు గురిచేసి స్వర్గానికి వెళ్ళే బదులు, నరకానికి అర్హునిగా చేద్దామని షైతాన్ ఉద్దేశం. మానవులను దుష్కార్యాలకు గురిచేయడానికి వారిలో ఆచరణను నశింపజేయటానికి షైతాన్ అన్నిటికంటే ఆకర్షణీయమైన, మనోహరమైన ఆయుధాలను ప్రయోగిస్తాడు. అల్లాహ్ గొప్ప కరుణామయుడనీ, దయామయుడనీ, ఆయన పాపాలన్నీ క్షమిస్తాడనీ కల్లబొల్లి కబుర్లు చెప్పి మోసం చేస్తాడు.

నిస్సందేహంగా అల్లాహ్ కారుణ్యం చాలా విశాలమైనది. ఇది అల్లాహ్ ఆగ్రహంపై ఆధిక్యత కలిగి ఉంది. కాని ఆయన కారుణ్యాన్ని పొందడానికి కూడా కొన్ని నియమ నిబంధనలను అల్లాహ్ (త’ఆలా) ఖుర్ఆన్లో వివరంగా పేర్కొన్నాడు.

అల్లాహ్ ఆదేశం:

“అయితే ఎవరు పశ్చాత్తాపపడతారో మరియు విశ్వసించి మంచి పనులు చేస్తారో, ఆ తరువాత తన్ను తాను సరిదిద్దుకుంటారో, వారిని నేను అమితంగా మన్నిస్తాను.” (తాహా:82)

ఈ వాక్యంలో అల్లాహ్ (త’ఆలా) క్షమించడానికి నాలుగు షరతులను నిర్ణయించాడు.

1. పశ్చాత్తాపం: ఒక వ్యక్తి అవిశ్వాసంలో విగ్రహారాధనలో ఉంటే వాటిని విసర్జించాలి. కాని ఇంకో వ్యక్తి అవిశ్వాసానికి, విగ్రహారాధనకూ గురికాలేదు. మహా అపరాధాలకు గురియై ఉన్నాడు. అతడు వాటిని విసర్జించాలి. వాటికి దూరం కావాలి.

2. విశ్వాసం: నిర్మలమైన మనస్సుతో అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను, ఆయన గ్రంథాలను, ఆయన దూతలను, తీర్పు దినాన్ని విశ్వసించటం తప్పనిసరి.

3. సత్కార్యాలు: అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను విశ్వసించిన తర్వాత అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆదేశాలకనుగుణంగా జీవితం గడపాలి. జీవితం లోని ప్రతి వ్యవహారంలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సాంప్రదాయానికి విధేయత చూపాలి.

4. నిలకడ: అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) విధేయతలో కష్టాలు, నష్టాలు వస్తే నిలకడగా ఉండాలి.

ఎవరైతే ఈ నాలుగు షరతులను పూర్తి చేస్తారో అలాంటి వారికి క్షమాపణ, కరుణ ప్రసాదిస్తానని అల్లాహ్ వాగ్దానం చేశాడు. ప్రజలను క్షమించే, ప్రజల పాపాలను దూరం చేసే అల్లాహ్ చట్టం ఇదే. మరోచోట అల్లాహ్ (త’ఆలా) పశ్చాత్తాపానికి కావలసిన సూత్రాన్ని వివరిస్తూ ఇలా పేర్కొన్నాడు:

అజ్ఞానం వల్ల, మరుపువల్ల, పొరపాటువల్ల పాపానికి పాల్పడినవారి పశ్చాత్తాపం స్వీకరించ బడుతుంది. కాని కోరి పాపాలకు పాల్పడుతూ పోయిన వారికి క్షమాపణ లేదు గదా, వారి కొరకు కఠినాతి కఠినమైన శిక్ష పొంచి ఉంది.

అజ్ఞానం వల్ల పాపం చేసిన వెంటనే పశ్చాత్తాపపడే వారి పశ్చాత్తాపాన్ని మాత్రమే అల్లాహ్ స్వీకరిస్తాడని తెలుసుకోండి. ఇలాంటి వారి పట్ల అల్లాహ్ కారుణ్యంతో వ్యవహరిస్తాడు. అల్లాహ్ అన్ని తెలిసినవాడూ, వివేక సంపన్నుడూను. మరణం సమీపించే వరకు నిరంతరం దుష్కార్యాలు చేస్తూ ఉండి, ‘ఇప్పుడు నేను పశ్చాత్తాప పడుతున్నాను’ అని అనే వారి పశ్చాత్తాపం ఎంతమాత్రం స్వీకరించ బడదు. అదే విధంగా మరణించే వరకు అవిశ్వాసులుగానే ఉండేవారి పశ్చాత్తాపం కూడా స్వీకరించబడదు. ఇటువంటి వారి కొరకు మేము అత్యంత బాధాకరమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాము.” (అన్ నిసా: 17,18)

ఈ వాక్యంలో మూడు విషయాలు చాలా విశదంగా ఉన్నాయి.

1. అజ్ఞానం వల్ల, మతిమరుపువల్ల, పొరపాటు వల్ల పాపానికి పాల్పడినవారి పశ్చాత్తాపం స్వీకరించ బడుతుంది.
2. తెలిసి పాపాలకు పాల్పడుతూ ఉన్న వారికి వ్యధాభరితమైన శిక్ష ఉంది.
3. అవిశ్వాస స్థితిలో మరణించిన వారికి కఠినాతి కఠినమైన శిక్ష ఉంది.

ప్రవక్తకాలంలో తబూక్ యుద్ద సమయంలో హజ్రత్ కఅబ్ బిన్ మాలిక్, హజ్రత్ హిలాల్ బిన్ ఉమయ్యహ్, హజ్రత్ మురారహ్ బిన్ రబీ(రదియల్లాహు అన్హు) ల వల్ల పొరపాటు జరిగి పోయింది. ముగ్గురూ పశ్చాత్తాపం చెంది, క్షమాపణ కోరారు. అల్లాహ్ (త’ఆలా) వారి పొరపాటును మన్నించాడు. ఆ యుద్ధంలోనే కపటులు (మునాఫిఖీన్) తెలిసి అల్లాహ్ ప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) కు అవిధేయత చూపారు. వారు కూడా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వచ్చి సాకులు వెదికారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను తమ పట్ల సంతృప్తి పరచడానికి ప్రయత్నించారు.

అల్లాహ్ ఇలా ఖచ్చితంగా తేల్చి చెప్పాడు:

“నిస్సందేహంగా వారు మలినంవంటివారు. వారి అసలు స్థానం నరకం, వారి సంపాదనకు ప్రతిఫలంగా. ” (అత్తాబహ్:95)

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన అనుచరుల్లోని చాలా మందికి ఇహలోకంలోనే స్వర్గ శుభవార్త ఇచ్చి ఉన్నారు. ఉదా: అష్ర ముబషరహ్, బద్ర్ వారు, చెట్టు క్రిందివారు అయినాసరే వారు అల్లాహ్ కు భయపడుతూ జీవించేవారు. తీర్పుదిన ప్రస్తావన రాగానే ఏడ్చేవారు. అనేకసార్లు స్వర్గశుభవార్త ఇవ్వబడిన హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) లాంటివ్యక్తి సమాధి ప్రస్తావన వస్తే గడ్డం తడిచిపోయేట్టు ఏడ్చేవారు. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) జుమా ప్రసంగంలో తక్వీర్ సూరా పఠిస్తూ ఉన్నారు (“తీర్పు దినం నాడు ప్రతి వ్యక్తికీ తాను ఏమి తెచ్చాడో తెలిసిపోతుంది”) ఈ వాక్యానికి చేరినప్పుడు ఎంత భయానికి గురయ్యారంటే నోటి నుండి శబ్దం రావటం నిలిచిపోయింది. హజ్రత్ షద్దాద్ బిన్ ఔస్(రదియల్లాహు అన్హు) పడకపై పరుండి ప్రక్కలు మారుతూ ఉండేవారు. నిద్రవచ్చేదికాదు. ఇంకా ఇలా అంటూ ఉండేవారు- “ఓ అల్లాహ్! నరకభీతి నా నిద్రను పొగొట్టింది.” ఆ తరువాత లేచి తెల్లవారే వరకు నమాజులో గడిపేవారు.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) ఇలా అంటున్నారు: సూరె నజ్మ్ అవతరించినప్పుడు ప్రవక్త అనుచరులు ఈ వాక్యాన్ని విన్నారు:

మీరు ఈ విషయాలపట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారా? నవ్వుతున్నారా? ఏడ్వరెందుకు?” (అన్నజ్ :59,60)

ప్రవక్త సహచరులు విని వెక్కివెక్కి ఏడ్వసాగారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి ఏడ్చే శబ్దాన్ని విని వచ్చారు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా ఏడ్వసాగారు. హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) సూరె ముతప్పిఫీన్ పఠిస్తున్నారు. ఈ వాక్యం వద్దకు రాగానే, (‘తీర్పు దినం నాడు మానవులందరూ తమ ప్రభువు ముందు నిలుచుంటారు. (ముతప్పిఫీన్:6) ఎంత ఏడ్చారంటే స్పృహ కోల్పోయి క్రిందపడ్డారు. హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) సూరె ఖాఫ్ ను పఠిస్తూ ఈ వాక్యం వద్దకు రాగానే…(‘మరణ యాతన యదార్థంగా వచ్చేసింది; నీవు తప్పించుకోవటానికి ప్రయత్నించిన విషయం ఇదే.” ఖాఫ్:19) వెక్కివెక్కి ఏడ్వసాగారు.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) తన మరణ సమయంలో ఏడ్వసాగారు. దానికి కారణం ఏమిటని ప్రజలు అడిగారు. అప్పుడిలా అన్నారు: “నేను ప్రాపంచిక విషయాలపట్ల ఏడ్వటం లేదు. నాది చాలా దూర ప్రయాణం. ప్రయాణ సామాను మాత్రం చాలా తక్కువగా ఉంది. నేను ఎలాంటి గుట్టపై ఉన్నానంటే అది స్వర్గనరకాల వైపు ఎగురుతుంది. నా స్థానం ఏదో నాకే తెలియదు?

హజ్రత్ అబూదర్దా (రదియల్లాహు అన్హు) తీర్పు దినానికి భయపడి ఇలా అనేవారు: “నేను ఒక మొక్కనై ఉండి ఉంటే ఎంత బాగుండేది, పీకబడుతుంది, పశువులు ఆహారంగా తిని వేస్తాయి.”

హజ్రత్ ఇమ్రాన్ బిన్ హుసైన్ (రదియల్లాహు అన్హు) ఇలా అనేవారు: “నేను గుట్టలపై ఉండే బూడిదనై ఉండి ఉంటే ఎంత బాగుండేది? గాలులు దాన్ని ఎగురవేసుకుపోతాయి.”

అల్లాహ్ సమక్షంలో విచారణ, నరక శిక్ష పట్ల భయాందోళనలు ఏ కొంత మందిలోనో కాక ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సహచరులందరిలోనూ ఉండేవి. మరికొన్ని సంఘటనలను ఈ పుస్తకంలోని ‘సహచరులు మరియు నరకం’ అనే అధ్యాయంలో పేర్కొనడం జరిగింది.

ఒక ముఖ్య ప్రశ్న ఏమిటంటే, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సహచరులకు అల్లాహ్ (త’ఆలా) కరుణా మయుడనీ, అపార కృపాశీలుడనీ తెలిసి ఉండేది కాదా? అల్లాహ్ (త’ఆలా) పాపాలన్నీ క్షమించగలడని వారికి తెలిసి ఉండేది కాదా? అల్లాహ్ కరుణ ఆయన ఆగ్రహంపై ఆధిక్యత కలదని ప్రవక్త సహచరులకు తెలిసి ఉండేది కాదా? అవన్ని మనకంటే బాగానే తెలిసి ఉండేవి. కాని అల్లాహ్ యొక్క గొప్పతనం, శక్తిసామర్థ్యాల భయం ఎల్లప్పుడూ హృదయాల్లో ఉండటం కూడా ప్రార్ధనే అనబడుతుంది.

అల్లాహ్ ఆదేశం: “మీరు విశ్వాసులే అయితే ప్రజలకు భయపడకండి, కేవలం నాకే భయపడండి.’ (ఆలి ఇమ్రాన్:175)

ఈ కారణంగానే అల్లాహ్ దూతలు కూడా అల్లాహ్ విచారణ పట్ల, శిక్ష పట్ల, ఎల్లప్పుడూ భయపడుతూ ఉంటారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా అల్లాహ్ విచారణ పట్ల, శిక్షపట్ల ఎల్లప్పుడూ భయపడుతూ ఉండేవారు. ప్రవక్త ప్రవచనం: “అల్లాహ్ సాక్షి! నేను మీ అందరికంటే అధికంగా అల్లాహ్ కు భయపడతాను.” (బుఖారి)

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన ప్రార్థనల్లో అల్లాహ్ భీతిని కోరేవారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రార్థనల్లో ఒక ముఖ్యమైన ప్రార్థన: “ఓ అల్లాహ్ ! మాకూ మా పాపాలకూ మధ్య ఆటంకంగా నిలిచే భయాన్ని ప్రసాదించు.”(తిర్మిజి)

ఇంకో ప్రార్థనలో దైవభీతిలేని హృదయం నుండి శరణు కోరారు.

ఓ అల్లాహ్ ! నీకు భయపడని హృదయం నుండి శరణు కోరుతున్నాను.”

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తరువాతి తరాల వారు, వారి తరువాతి తరాల వారు అందరూ అల్లాహ్ విచారణ పట్ల భయపడేవారు. అల్లాహ్ భీతి లేకపోవటం కూడా ఒక విధంగా మహాపాపమే. దాని ఫలితం తన్ను తాను నాశనం చేసుకోవటమే.

అల్లాహ్ ఆదేశం:

అల్లాహ్ ఎత్తుపట్ల నాశనం అయ్యేవారే నిర్భయంగా ఉంటారు.” (ఆరాఫ్:99)

అల్లాహ్ కు భయపడుతూ జీవించేవారే, ఆయన కరుణ, క్షమాభిక్షల పట్ల ఆశతో ఉండాలి. పొరపాటువల్ల జరిగే దుష్కార్యాల పట్ల ఎల్లప్పుడూ అల్లాహ్ ను క్షమాపణ కోరుతూ ఉండాలి. అయితే పాపాలు చేస్తూ పోయినవారు, ఇంకా అల్లాహ్ కరుణామయుడనీ, కృపాశీలుడని నిర్భయంగా ఉన్నవారు తాము పైతాన్ పన్నాగానికి గురిఅయ్యామని గుర్తించాలి. దీని పర్యవసానం వినాశనం, నరక యాతన తప్ప మరేమీ కాదు.

ఈ పేరుతో ఈ పుస్తకంలో ఒక అధ్యాయం పొందుపరచటం జరిగింది. ఇందులో ముస్లిముల నరక ప్రవేశం గురించి పేర్కొనబడింది. మహాపాపాలు చేయటం వల్ల ముందు నరకంలోనికి ప్రవేశిస్తారు. తాము చేసిన పాపాలకు తగిన శిక్ష అనుభవించిన తర్వాత స్వర్గంలోనికి ప్రవేశిస్తారు.. ఈ అధ్యాయంలో కేవలం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వివరంగా ప్రవచించిన హదీసులనే చేర్చటం జరిగింది. ఈ మహాపాపకార్యాలే కాక ఇంకా ఎన్నో పాపకార్యాలు నరక ప్రవేశానికి కారణం కావచ్చు.

ప్రజలు విచారణ పట్ల, నరక శిక్ష పట్ల అప్రమత్తంగా ఉండాలని, సాధ్యమై నంత వరకు వాటి నుండి రక్షించుకునే ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతోనే ఈ ‘’ అనే పుస్తకాన్ని పొందుపరిచాము. ఎందుకంటే మహాపాపాలను గురించి కూడా హెచ్చరించడం చాలా అవసరం. వీటి కారణంగానే మనిషి స్వర్గానికి పోయే బదులు నరక యాతనకు గురవుతాడు. ఈ చర్చను ఇంకా పొడిగించకుండా హజ్రత్ ఇమామ్ జహబీ (రహిమహుల్లాహ్) యొక్క పుస్తకం ‘కితాబుల్ కబాయిర్’ నుండి మహాపాప కార్యాల జాబితాను క్రింద పేర్కొంటున్నాము. అల్లాహ్ శిక్షలకు భయపడే పుణ్యాత్ములు, దైవభీతిపరులు ఈ పుస్తకం ద్వారా లాభం పొందగలరని ఆశిస్తున్నాము.

1. అల్లాహ్ కు సాటి (విగ్రహారాధన, సమాధి పూజ) కల్పించుట
2. అన్యాయంగా హత్య చేయుట
3. చేతబడి చేయుట, చేయించుట
4. నమాజును ఆచరించకపోవుట
5. జకాత్ చెల్లించకపోవుట
6. అకారణంగా రమజాన్ ఉపవాసాలు మానివేయుట
7. శక్తి ఉండి కూడా హజ్ చేయకపోవుట
8. తల్లిదండ్రుల అవిధేయత
9. అన్యాయంగా హత్య చేయించుట
10. వ్యభిచారం
11. లూత్ జాతిని అనుసరించుట. (స్వలింగ సంపర్కం)
12. వడ్డీ ఇచ్చిపుచ్చుకొనుట, వ్రాత పని, సాక్ష్యం, ఇవన్నీ మహాపాపకార్యాలే.
13. అనాధల సొమ్ము అన్యాయంగా తినుట
14. అల్లాహ్ ఆయన ప్రవక్తకు అసత్యాలను అంటగట్టుట.
15. యుద్ధమైదానం నుండి వెనుదిరుగుట
16. పాలకులు ప్రజలను హింసించుట, మోసం చేయుట.
17. గర్వంగా అహంకారంగా ప్రవర్తించుట
18. అసత్యపు సాక్ష్యం ఇచ్చుట
19. అసత్యప్రమాణం చేయుట
20. జూదమాడుట
21. అమాయక స్త్రీలపై అభాండాలు వేయుట
22. యుద్ధధనంలో ద్రోహం తలపెట్టుట
23. దొంగతనం చేయుట
24. దోచుకొనుట
25. మద్యపానం సేవించుట
26. హింసించుట
27. పన్ను వసూలు చేయుట
28. అధర్మ సంపాదన తినుట
29. ఆత్మహత్యకు పాల్పడుట
30. అసత్యం పలుకుట
31. ఖుర్ఆన్, హదీసులకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చుట
32. లంచం తీసుకొనుట
33. స్త్రీ పురుషులు పరస్పరం అనుకరించుట
34. వ్యభిచారం చేయించుట
35. హలాల చేయుట, చేయించుట
36. మూత్రం పట్ల జాగ్రత్తగా ఉండకపోవుట
37. చూపుగోలు, ప్రదర్శనాబుద్ధి కలిగి ఉండుట
38. ప్రాపంచిక లాభాల కోసం ధార్మిక విద్య అభ్యసించడం, దాచడం
39. ద్రోహం తలపెట్టుట
40. ఎత్తి చూపుట
41. విధివ్రాతను తిరస్కరించుట
42. ఇతరుల రహస్యాలను వెతకటం
43. చాడీలు చెప్పడం, పరోక్ష నింద
44. శపించుట
45. వాగ్దాన భంగం చేయుట
46. జోతిష్యున్ని ధృవీకరించుట
47. భర్త పట్ల భార్య అసభ్యంగా ప్రవర్తించుట
48. చిత్రాలు వేయుట
49. ఏడ్పులు, పెడబొబ్బలు పెట్టుట
50. హద్దుమీరి ప్రవర్తించుట
51. భార్య, సేవకుల పట్ల అసభ్యంగా ప్రవర్తించుట
52. పొరుగువారిని హింసించుట
53. ముస్లిములను హింసించుట
54. ముస్లింను కొట్టుట
55. ఇజారును చీలమండల కన్నా క్రింద వ్రేలాడదీయుట
56. పురుషులు పట్టు వస్త్రములు, బంగారాన్ని ఉపయోగించుట
57. సేవకుడు పారిపోవుట
58. అల్లాహ్ తప్ప ఇతరుల పేర జంతువును జిబహ్ చేయుట
59. తండ్రికి బదులుగా ఇతరుల్ని తండ్రిగా గుర్తించుట
60. అన్యాయంగా పొట్లాటకు, కొట్లాటకు దిగుట
61. అవసరానికి మించిన నీటిని తీసుకోనివ్వకపోవుట
62. కొలతల్లో, తూనికల్లో మోసం చేయుట
63. అల్లాహ్ హెచ్చరికల పట్ల నిర్భయంగా ఉండుట
64. చిన్నచిన్న పాపాలు చేస్తూ పోవుట
65. అకారణంగా వ్యక్తిగత నమాజుకు ప్రాధాన్యత ఇచ్చుట
66. దగా, మోసం చేయుట
67. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సహచరులను గురించి దుర్భాషలాడుట *
68. ఇస్లామీయ ప్రభుత్వం పట్ల గూఢచారిగా వ్యవహరించుట
69. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి అనుచరులను తిట్టడం

* పైన పేర్కొన్న పాపాలను హజ్రత్ ఇమామ్ జహబీ (రహిమహుల్లాహ్) ఖుర్ఆన్, హదీసుల ఆధారంగా ఇవన్ని మహాపాపకార్యాలని తేల్చారు. కుతూహలం గలవారు ఆయన పుస్తకం ‘కితాబుల్ కబాయిర్’ ని చదివి తీరాలి.

ఇవన్నీ మహాపాపకార్యాలు. వీటిలో ఏ ఒక్కదానికి పాల్పడినా నరకంలోనికి ప్రవేశించవలసి వస్తుంది. నరకం నుండి రక్షణ పొందాలంటే

  • మొదటిది, పైన పేర్కొన్న మహాపరాధాలన్నిటికీ దూరంగా ఉండాలి.
  • రెండవది, పొరపాటున వీటిలో దేనికైనా పాల్పడితే తెలిసిన వెంటనే అల్లాహ్ సమక్షంలో పశ్చాత్తాపం చెంది క్షమాపణ కోరాలి. ఇంకా దాని జోలికి పోనని దృఢంగా నిశ్చయించుకోవాలి.
  • మూడవది, ఒకవేళ ఇలాంటి పాపంలో ఎవరికైనా అన్యాయం జరిగితే, అతనికి న్యాయం చేకూర్చాలి లేదా అతన్ని క్షమాపణ కోరాలి. ఇలా సాధ్యంకాకపోతే (అతను మరణిస్తే) అతని గురించి అధికంగా క్షమాపణ కోరాలి.
  • నాలుగవది, చిన్న పాపాలను క్షమించే సత్కార్యాలు అదనపు నమాజులు, అదనపు రోజాలు, అదనపు దానధర్మాలు మొదలైనవాటిని అధికంగా చేయాలి. అయితే ఏ చిన్న పాపాన్నీ అయినా అలవాటుగా చేస్తూ పోతే అది మహాపాపంగా మారిపోతుందనే సంగతి గుర్తుంచుకోవాలి. దానికి తప్పకుండా పశ్చాత్తాపం చెందాలి. మతిమరుపు వల్ల, పొరపాటున జరిగే పాపాలే సత్కార్యాల ద్వారా క్షమించబడతాయి. ఈ నియమాలన్నింటిని పాటించిన తరువాత అల్లాహ్ (త’ఆలా) తన దయాకారుణ్యాల ద్వారా నరకం నుండి తప్పకుండా రక్షిస్తాడని, భోగభాగ్యాలు, అనుగ్రహాలు, వరప్రసాదాలు గల స్వర్గంలో ప్రవేశింపజేస్తాడనీ గట్టి నమ్మకం కలిగి ఉండాలి.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణానికి ముందే అల్లాహ్ (త’ఆలా) తన దయ, అనుగ్రహాల వల్ల ఇస్లాంను అన్ని విధాలా పరిపూర్ణంగావించాడు. అల్లాహ్ ఆదేశం: “ఈనాడు నేను మీ ధర్మాన్ని మీ కొరకు పరిపూర్ణం చేశాను.” (అల్మాయిదహ్:3)

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా ఇలా ప్రవచించారు:

నేను ఒక స్పష్టమైన రుజుమార్గాన్ని మీ వద్దకు తీసుకొని వచ్చాను.” (ముస్నద్ అహ్మద్)

ఇంకో హదీసులో ఇలా ప్రవచించారు:

నా ఆచరణా పథం యొక్క రాత్రి కూడా పగటిలా వెలుగుతుంది.” (ఇబ్నె అబీఆసిమ్) అంటే ఇక ఈ ధర్మంలో హెచ్చుతగ్గులు చేయటానికి ఎంత మాత్రం వీలులేదు. అంతా సంపూర్ణంగా, క్లుప్తంగా ఉంది.

నమ్మకాలైనా, ఆరాధనలైనా, హక్కులైనా, సమాజ విషయాలైనా ప్రోత్సాహమైనా, హెచ్చరికైనా, విషయాలన్నింటి గురించి బోధించవలసినదంతా అల్లాహ్, ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) బోధించారు. స్వర్గం పట్ల ప్రోత్సహించటానికి నరకం పట్ల హెచ్చరించడానికి ఏ ఏ విషయాల అవసరం ఉన్నదో వాటన్నిటినీ అల్లాహ్ (త’ఆలా) ఖుర్ఆన్లో ఆజ్ఞాపించడం జరిగింది. ఖుర్ఆన్లోని ప్రతి పేజీలో ఏదో ఒక రూపంలో స్వర్గనరకాల ప్రస్తావన తప్పకుండా ఉంది. ఖుర్ఆన్లోని 114 సూరాల్లోని అనేక సూరాలు కేవలం మళ్ళీ లేపబడటం, విచారణ, స్వర్గనరకాలు మొదలైన అంశాలతో కూడివున్నాయి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హదీసుల్లో వాటి గురించి మరికొన్ని వివరాలు బోధించారు. ఇంత జరిగినా స్వర్గనరకాలను గురించి రచించబడే పుస్తకాల్లో శుభవార్తను తెలుపటానికి, హెచ్చరించటానికి కల్పిత కథలను*, వృత్తాంతాలను, పూర్వీకుల కలలు, అన్అయాల వ్రాతల గురించి చివరికి బలహీనమయిన, కల్పించుకున్న ఉల్లేఖనాలను ప్రాముఖ్యత నిస్తూ వివరించటం జరుగుతుంది. అయితే ఇలాంటివన్నీ ఇస్లామీయ షరీఅత్లో కల్పించుటయే అవుతుంది. ఇవన్నీ వ్యర్ధమయినవి, మార్గభ్రష్టత్వానికి గురిచేసేవి. ఈ విధమైన ఆచరణ వల్ల ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పట్ల అవిధేయత, వ్యతిరేకత అవుతుంది.

1420 హిజ్రి సఫర్లో మదీనా స్మశాన వాటిక ‘బఖివుల్ గరఖద్’లో ఒక సంఘటన జరిగిందని పత్రికల్లో వచ్చింది. తరువాత పాకిస్తాన్ పత్రికల్లో కూడా ప్రచురించటం జరిగింది. సంఘటనా వివరాలు ఇలా ఉన్నాయి: నమాజ్ చదవని ఒక వ్యక్తి జనాజా ఖననం చేయటానికి తీసుకురావటం జరిగింది. ఒక పెద్ద సర్పం వచ్చి అతన్ని చుట్టుకుంది. ప్రకటనల్లో నమాజు ప్రోత్సహించే హదీసు కూడా ఇవ్వబడింది. కొందరు పండితులు ఈ సంఘటన గురించి పరిశీలించగా ఇలాంటి సంఘటన ఏదీ జరగలేదని తేలింది. ఇది కేవలం నమాజ్ చదవని వారిని భయపెట్టటానికే ఇలా చేయడం జరిగింది. ఈ సంఘటనను ఖండిస్తూ ఉర్దూ దినపత్రిక ‘ఉర్దూ న్యూస్’ జిద్దహ్ లో సెప్టెంబర్ 10, 1999న ప్రకటన ఇవ్వబడింది.

అల్లాహ్ ఆదేశం:

“విశ్వాసులారా! అల్లాహూ, ఆయన ప్రవక్తకూ, అధిగమించకండి. అల్లాహు భయపడండి. అల్లాహ్ అన్నీ వినేవాడు, సర్వమూ ఎరిగినవాడూను.” (అల్ హుజురాత్: 1)

ఇస్లాం ధర్మం రెండు అతి వివరణాత్మకమైన విషయాలపై ఆధారపడి ఉంది. అల్లాహ్ గ్రంథం, ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సాంప్రదాయం మన నమ్మకమూ, విశ్వాసమూ ఈ రెంటిని అధిగమించటానికి ఎంత మాత్రం మనకు అనుమతి ఇవ్వవు. అలాంటి శక్తి కూడా మనలో లేదు. పూర్వీకుల స్వప్నాలు, తపస్సులు, అర్జియాల దివ్య నిదర్శనాలు, ఫకీర్ణ కల్పిత కథలు, గాధలను దైవధర్మంగా భావించి ప్రజల ముందు పెట్టే ధైర్యం కూడా మనం చేయరాదు. అలా చేస్తే తీర్పు దినం నాడు అల్లాహ్ న్యాయస్థానంలో నేరస్తులుగా తలదించు కోవటం జరుగుతుంది.

నేను అజ్ఞానుల్లో చేరిపోవటాన్నుండీ అల్లాహ్ శరణుకోరుతున్నాను. అల్లాహ్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన అనుచర సంఘాన్ని ఈ విధంగా నొక్కి చెప్పారు: “మార్గభ్రష్టత్వం నుండి రక్షణ పొందాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. అల్లాహ్ గ్రంథాన్ని మరియు నా సాంప్రదాయాన్ని దృఢంగా పట్టాలి. ఇదే సన్మార్గం.”

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:

‘అంటే మీ మధ్య నేను ‘రెండు విషయాలను వదలి వెళ్తున్నాను. వాటిని దృఢంగా పట్టుకొని ఉంటే మీరు ఎన్నటికీ మార్గభ్రష్టత్వానికి గురికారు. అవి అల్లాహ్ గ్రంథం (ఖుర్ఆన్) నా సాంప్రదాయం (హదీస్). ” (ముస్తద్రక్ హాకిమ్)

మనము ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆదేశాన్నీ విన్నాము, విధేయత చూపాము.మార్గదర్శకత్వానికి, సాఫల్యానికి అల్లాహ్ గ్రంథం, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సాంప్రదాయం మనకు చాలు. ఇవి తప్ప ఇతర విషయాల వైపు మనం చూసే అవసరం ఎంతమాత్రం లేదు.

ప్రియ పాఠకులారా! ” అసలు ‘స్వర్గ గ్రంథం యొక్క రెండవ భాగమే. దీని పేజీలు అధికం కావటం చేత తగ్గించటం జరిగింది. ఈ రెండు పుస్తకాలు లాభం చేకూర్చగలవని ఆశిస్తున్నాము. ఇన్షా అల్లాహ్, ఈ రెండు పుస్తకాలు శుభవార్త లిచ్చేవిగా, హెచ్చరించేవిగా చేసి ప్రజలు లాభం పొందే భాగ్యాన్ని ప్రసాదించమని పుస్తక రచనల్లోని ప్రయత్నాలను స్వీకరించమని, ఇందులో దొర్లిన పొరపాట్లను, అచ్చు తప్పులను క్షమించాలని అల్లాహ్ ను అతివినయంగా వేడుకుంటున్నాము. ఆమీన్.

ఇంతకు ముందులా, ఈ పుస్తకంలో కూడా షేఖ్ నాసిరుద్దీన్ అల్బానీ (రహిమహుల్లాహ్) పరిశీలించిన హదీసులనే పేర్కొనడం జరిగింది. 315వ అంశంలో పేర్కొనబడిన హదీసు మాత్రమే బలహీనమైనది (జయీఫ్). చివరి పేజీల్లో పుస్తకాలు, రచయితల పేర్లు, హదీసు నంబర్లు కూడా ఇవ్వబడ్డాయి.

చివరిగా గౌరవనీయులైన పండితులకు కృతజ్ఞతలు తెలుపుకోవటం తప్పని సరిగా భావిస్తున్నాను. వీరందరూ ‘తఫీముస్సన్నహ్” రచనా కార్యక్రమాలలో నాకు మార్గదర్శక సూత్రాలు, సలహాలు, అభిప్రాయాలు, సహాయ సహకారాలు అందించారు. అదే విధంగా నా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వీరు 15 సంవత్సరాలుగా హదీసు ప్రచురణా కార్యంలో నాకు అండగా నిలుస్తూ సహాయ సహకారాలు అందిస్తున్నారు.

ప్రియ పాఠకులారా!

రండి! మనమందరం కలసి మన ప్రభువైన అల్లాహ్ ను నరకాగ్ని నుండి శరణుగోరుతూ ప్రార్థిద్దాం. నిస్సందేహంగా ఆయన ప్రార్థనలను వినేవాడు, స్వీకరించేవాడూను.

ఓ మా ప్రభూ! మీరు మా ప్రభువులు, మేము మీ దాసులము. మీరు మా పాలకులు, మేము మీ పాలితులము. మీరు సర్వశక్తిమంతులూ, మేము బలహీను లము. మీరు అక్కరలేనివారు, మేము అక్కరగలవారము. మీరు ధనవంతులు, మేము నిరుపేదలము. మేము మీ చేతిలో ఉన్నాము. మా తీర్పులు మీ అధీనంలో ఉన్నాయి.

గౌరవనీయులైన, గొప్పవారైన మా ప్రభూ! శరణు కోరడానికి నీవు తప్ప మాకు మరెవ్వరూ లేరు. నీ ఆధారం తప్ప మాకు మరే ఆధారం లేదు. నీ సన్నిధి తప్ప మాకు మరెవరి సన్నిధి లేదు. నీ నుండి తప్ప మేము మరెవరి నుండీ ఆశించలేము. నీ కారుణ్యం మా ప్రయాణ ఆహారం. నీ క్షమాపణ మా ధనం.

ఓ మా ప్రభూ! సర్వశక్తులు గలవాడా! శుభాలు గలవాడా! ప్రత్యేకతలు గలవాడా! గొప్పదనాలు గలవాడా! ఉన్నత స్థానాలు గలవాడా! అధికారాలు గలవాడా! నీ అంతట నీవే ‘నరకం చాలా చెడ్డ నివాసం’ అని మాకు తెలియజేశావు. అందులోని శిక్ష ప్రాణాలకు చుట్టుకుంటుంది. అందులో ప్రవేశించిన వాడు చావడూ, బ్రతకడూ. నీవు నరకంలో పడవేసిన వాడు మహా నీచమయిన అవమానానికి గురయ్యాడు.

మమల్మి క్షమించేవాడా! కప్పిపుచ్చే వాడా! కరుణామయుడవైన అల్లాహ్ ! మేము నీ పట్ల అత్యాచారానికి పాల్పడ్డాము. మేము మా చిన్నాపెద్దా, బహిరంగమైనవీ, గుప్తమైనవీ, కోరి చేసినవి, పొరపాటున జరిగినవి, తెలిసినవి తెలియనివి పాపాలన్నిటినీ అంగీకరిస్తు న్నాము. నీ శిక్షల పట్ల భయపడుతున్నాము. నీ నరకాన్నుండి శరణు గోరుతున్నాము. ఇంకా నరకంలోనికి తీసుకుపోయే ప్రతి విషయాన్నుండి శరణు గోరుతున్నాము.

ఓ శాంతిగల భద్రత కల్పించే, పాపాలు క్షమించే, లోపాలను కప్పిపుచ్చే, మా ప్రభూ! ఇహలోకంలో ఏ విధంగా మా పాపాలను కప్పిపుచ్చారో, అదే విధంగా పర లోకంలో కూడా నీ కారుణ్యం ద్వారా కప్పి ఉంచాలి. ఇంకా మమ్మల్ని తీర్పు దినం నాడు ఘోర అవమానానికి, నీచ పరాభవానికి గురికాకుండా రక్షించాలి.

ఓ మహా సింహాసనాధిపతీ! భూమ్యాకాశాలకూ ప్రభువు, తీర్పు దినానికి స్వామి, చక్రవర్తులకు చక్రవర్తి, పాలకులకు పాలకుడు అయిన నీవు మమ్మల్ని కరుణించకపోతే మరి మీరే చెప్పండి, మమ్మల్ని ఎవరు కరుణిస్తారు? మా పాపాలను మీరు క్షమించక పోతే, మరెవరు క్షమిస్తారు? మీరు మాకు ఆశ్రయం ఇవ్వకపోతే మరెవరు ఇస్తారు? మీరు మమ్మల్ని నరకం నుండి రక్షించకపోతే మరెవరు రక్షిస్తారు?

ఓ హజ్రత్ జిబ్రాయీల్ (అలైహిస్సలాం) , హజ్రత్ మీకాయీల్ (అలైహిస్సలాం) , హజ్రత్ ఇస్రాఫీల్ (అలైహిస్సలాం) , హజ్రత్ ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం)ల పరిశుద్ధ అల్లాహ్ ! మేము నరకం నుండి నిన్ను శరణు గోరుతున్నాము. నీ కారుణ్యాన్ని ఆశిస్తూ…. తీర్పు దినం నాడు నీవు మమ్మల్ని నిరాశకు గురిచేయవని భావిస్తున్నాము.

“తీర్పు దినం నాడు నా పాపాలను క్షమిస్తాడని నేను ఆశిస్తున్నాను.” (అష్షుఅరా:82)

– ముహమ్మద్ ఇఖ్బాల్ కైలానీ,
రమజాన్-9, 1420 హిజీ, డిసెంబర్ 17, 1999
రియాద్, సఊదీ అరేబియా

بسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ

హజ్రత్ జుబైర్ (రదియల్లాహు అన్హు) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ద్వారా ఇలా ఉల్లేఖిస్తున్నారు:

“ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: ‘నేను అబూసుమామ అమర్ బిన్ మాలిక్ ని నరకంలో తన ప్రేగులను ఈడ్చుకుంటూ పోవటాన్ని చూశాను.” (ముస్లిమ్ – కితాబుల్ కుసుఫ్)’

“హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖించారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: ‘మీలో ఎవరైనా మరణించినప్పుడు, ఉదయం, సాయంత్రం అతనికి అతని నివాసం చూపెట్టడం జరుగుతుంది. ఒకవేళ స్వర్గవాసి అయితే స్వర్గంలోని నివాసాన్ని, నరకవాసి అయితే నరకంలోని నివాసాన్ని చూపెట్టడం జరుగుతుంది.” (బుఖారి – బాబుసిఫతిల్ జన్నహ్)

షైతాన్ ను అనుసరించే మానవులందరికీ నరక వాగ్దానం ఉంది. దానికి ఏడు ద్వారాలున్నాయి. ప్రతి ద్వారానికి నరకవాసుల్లోని ఒక వర్గం ప్రత్యేకించబడి ఉంది”. (అల్ హిజ్ర్ : 43, 44)

వివరణ : వాక్యం 192వ అంశంలో ఉంది.

వివరణ: వాక్యం 133వ అంశంలో ఉంది.

హజ్రత్ అబ్బాస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు: ఆయన ఇలా ప్రశ్నించారు: “ఓ అల్లాహ్ ప్రవక్తా! అబూతాలిబ్ మిమ్మల్ని సంరక్షించేవారు. మీ కోసం ఇతరుల పట్ల అసంతృప్తి వ్యక్తం చేసేవారు. ఇది వారికి ఏమైనా పనికి వస్తుందా? ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సమాధానమిచ్చారు: ‘అవును, అతను ఇప్పుడు నరకంలోని పై తరగతిలో ఉన్నారు. ఒకవేళ నేను వారి గురించి సిఫారసు చేసి ఉండకపోతే అతను నరకంలోని అన్నిటికంటే క్రింది తరగతిలో ఉండేవారు.” (ముస్లిమ్, కితాబుల్ ఈమాన్)

కపటులు నరకంలోని అట్టడుగు తరగతికి పోతారు. వారికి సహాయం చేసే వారెవరినీ నీవు పొందలేవు”. (అన్నిసా: 145)

హజ్రత్ సమ్ రహ్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు: ‘ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అంటూ ఉండగా విన్నారు: ‘కొందరిని అగ్ని కాళ్ళచీలమండల వరకూ కాల్చి వేస్తుంది. కొందరిని నడుము వరకు కాల్చివేస్తుంది. మరికొందరిని మెడ వరకు కాల్చివేస్తుంది. (ముస్లిమ్ కితాబుల్ జన్నా)

హజ్రత్ అబూహురైరహ్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచిం చారు: ‘అగ్ని మానవ శరీరాన్నంతా దహిస్తుంది. కాని సజ్జా చేసేచోట ఏమీ చేయదు. అల్లాహ్ (త’ఆలా) అగ్నికి సజ్జా చేసే చోటును నిషేధించాడు’. (ఇబ్నెమా కితాబుజ్జుహ్ద్ 2/3492)

హద్దుమీరి ప్రవర్తించి ఇహలోక జీవితానికి ప్రాధాన్యతనిచ్చినవారికి నరకమే నివాసం అవుతుంది”. (నాజిఆత్:37-39)

అలా ఎంతమాత్రం కాదు. అతడు నుజ్జునుజ్జు చేసి వేసే స్థలంలోనికి విసిరి వేయబడతాడు. ఆ నుజ్జు నుజ్జు చేసే స్థలం ఏమిటో నీకు తెలుసా? అది తీవ్రంగా దహించబడే దైవాగ్ని”. (అల్ హుమజహ్: 4-6)

ఎవరి త్రాసుపళ్ళాలైతే తేలికగా ఉంటాయో, వారి నివాస స్థలం లోతైన గొయ్యి అవుతుంది. అదేమిటో నీకేమైనా తెలుసా? అది భగభగమండే అగ్ని గుండం. (అల్ ఖారిఅహ్ : 8-11)

త్వరలోనే నేను అతన్ని నరకంలోనికి త్రోసివేస్తాను. ఆ నరకం ఏమిటో నీకేం తెలుసు? అది మిగల్చదు, వదలి పెట్టదు. అది చర్మాన్ని మాడ్చివేస్తుంది. (అల్ ముద్దస్సిర్: 26-29)

అది భగభగమండే అగ్ని జ్వాల. మాంసాన్ని, చర్మాన్ని సైతం అది తినేస్తుంది. సత్యం పట్ల విముఖుడై, వెన్నుచూపి, ధనాన్ని కూడబెట్టి దానిని పేర్చిపెట్టిన ప్రతి ఒక్కరిని అది బిగ్గరగా అరుస్తూ తన వైపునకు పిలుస్తుంది. (అల్ మఆరిజ్: 15-18)

వారు ఇలా అంటారు, ‘అయ్యో, మేమే గనుక ఆనాడు విని ఉంటే, లేదా గ్రహించి ఉంటే, ఈనాడు నరకాగ్నికి శిక్షార్హులుగా ఉండేవారం కాదు కదా! ఈ విధంగా వారే స్వయంగా తమ తప్పును ఒప్పుకుంటారు. నరకవాసులు నాశనమవుగాక! (అల్ ముల్క్:10,11)

ఈ హదీసు 125వ అంశం చూడండి.

పదండి, మూడు శాఖలుగా చీలిపోయే నీడ వైపునకు, అది చల్లదనాన్ని ఇచ్చేది కాదు, అగ్నిబారి నుండి రక్షించేదీ కాదు, ఆ అగ్ని, భవనాల వంటి పెద్ద పెద్ద రవ్వలను విసురుతుంది. ఆ రవ్వలు పసుపు పచ్చని ఒంటెల వలె కనిపిస్తాయి. ఆ రోజున సత్య తిరస్కారులకు వినాశనం తప్పదు.” (అల్ ము ర్సలాత్: 30-34)

హజ్రత్ అబూహురైరహ్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు: “ఒకసారి మేము ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెంట ఉన్నాము. అకస్మాత్తుగా ప్రేలుడు శబ్దం విన్నాము. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రశ్నించారు: ‘ఇది ఎలాంటి శబ్దమో మీకు తెలుసా?’ ఉల్లేఖన కర్త అంటున్నారు, ‘మేమిలా విన్నవించుకున్నాము. ‘అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకే బాగా తెలుసు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు: ‘ఇదొక రాయి, 70 సంవత్సరాలకు పూర్వం నరకంలో విసిరి వేయబడింది. అది అగ్నిలో పడుతూ పోయింది. ఇప్పుడది నరకం అడుగుభాగానికి చేరింది. (ముస్లిమ్)(కితాబు సిఫాతుల్ మునాఫిఖీన్)

హజ్రత్ అబూహురైరహ్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు: ‘ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను ఇలా అంటూ ఉండగా విన్నారు: “ఒక్కోసారి దాసుడు ఒక మాటను తన నోటి ద్వారా పలకుతాడు. దానివల్ల అతను నరకంలో భూమ్యాకాశాల మధ్య దూరం కన్నా అధికంగా క్రిందికిపోతాడు. (ముస్లిమ్ కితాబుజ్జుహ్ద్)

హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు. ‘ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: నరకం నాలుగు గోడల మధ్య ఆవరించి ఉంది. ప్రతి గోడ యొక్క మధ్య నలభై సంవత్సరాల ప్రయాణ దూరం ఉంది. (అసరీగారి, అబూయాలా 2/1358, సహీహ్)

హజ్రత్ ముజాహిద్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు. హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) నన్ను ఇలా ప్రశ్నించారు: “నీకు నరక వైశాల్యం తెలుసా? నేను లేదని సమాధాన మిచ్చాను. అప్పుడు హజ్రత్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు: ‘అవును అల్లాహ్ సాక్షి నీకు తెలియదు. విను! నరకవాసుని చెవి నుండి భుజం వరకు 70 సంవత్సరాల ప్రయాణ దూరం ఉంటుంది. వాటి మధ్య చీము నెత్తుర్ల కాలువలు ప్రవహిస్తాయి. నేనిలా విన్నవించు కున్నాను: ‘నదులు పారుతాయా?, హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ ఇలా అన్నారు: ‘కాదు, లోయలు (నదులకన్నా వెడల్పుగా) పారుతాయి. (అబూనయీమ్ హుల్యాలో ఉల్లేఖించారు) (షర్హుహుసున్నహ్: 15-251)

వివరణ: హదీసు 242వ అంశంలో ఉంది.

ఆనాడు మేము నరకాన్ని, ‘నీవు నిండిపోయావా? అని అడిగినప్పుడు, అది, ‘ఇంకేమైనా మిగిలి ఉందా?’ అని అంటుంది. (ఖాఫ్:30)

హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “ఇంకేమైనా ఉందా? ఇంకేమైనా ఉందా?” అని నరకం విరామం లేకుండా అంటూ ఉంటుంది. చివరికి అల్లాహ్ (త’ఆలా) తన పాదాన్ని నరకంలో పెడతారు. అప్పుడు నరకం ఇలా అంటుంది. ‘నీ గౌరవం సాక్షి! చాలు చాలు. ఆ తరువాత నరకంముడుచుకుంటుంది.’ (ముస్లిమ్) (కితాబుల్ జన్నతి వన్నార్)

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్ ఊ ద్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: ‘తీర్పు దినం నాడు నరకం రప్పించబడుతుంది. అది డెబ్భై వేల భాగాలుగా ఉంటుంది. ప్రతి భాగాన్ని డెబ్భై వేలమంది దైవదూతలు ఈడ్చుకొస్తూ ఉంటారు.(ముస్లిమ్) (కితాబుల్ జన్నతి వన్నార్)

“అది వారిని దూరం నుండి చూసినప్పుడు వారు దాని క్రోధ ధ్వనులను, విజృంభణ ధ్వనులను వింటారు. (అల్ ఫుర్ఖాన్:12)

వివరణ: హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ఇలా ఉంది: నరకవాసు లను నరకం వైపు ఈడ్చుకు పోవటం జరుగుతుంది. అప్పుడు నరకం కేకలు వేస్తుంది. దాని శరీరం జలదరిస్తుంది. ఆ ధాటికి హషర్ మైదానంలో ఉన్న వారందరూ భయానికి గురవుతారు. హజ్రత్ ఉబేద్ బిన్ ఉమేర్ (రదియల్లాహు అన్హు) ఇలా అంటున్నారు: నరకం కోపంగా వణికి నప్పుడు కేకలు, అరుపులు, ఆవేశాన్ని మొదలెడుతుంది. అప్పుడు సన్నిహిత దైవదూతలు, ప్రవక్తలు వణికిపోతారు. చివరికి హజ్రత్ ఖలీలుల్లాహ్ ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) కూడా మోకాళ్ళపై పడతారు. ఇంకా ఇలా విన్నవించుకుంటారు: “ఓ అల్లాహ్! ఈనాడు నేను కేవలం నా ఒక్క ప్రాణం రక్షించమని కోరుతున్నాను. ఇంకేమీ కోరను”.

ఒకసారి హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ హజ్రత్ (రదియల్లాహు అన్హు) ను వెంట తీసుకొని వెళ్తున్నారు. దారిలో ఒక బట్టీ చూశారు. దానిలో అగ్నిజ్వాలలు లేస్తున్నాయి. అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ నోట అకస్మాత్తుగా, పై వాక్యం వెలువడింది. దాన్నీ వింటూనే హజ్రత్ రబీ (రదియల్లాహు అన్హు) స్పృహ కోల్పోయారు. వారిని మంచంపై పరుండబెట్టి ఇంటికి చేర్చడం జరిగింది. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ వద్ద కూర్చున్నారు. కాని అతనికి స్పృహ రాలేదు. (ఇబ్నె కసీర్)

“వారిని అందులోనికి విసిరినప్పుడు, వారికి భయంకరమైన దాని గర్జన ధ్వని వినిపిస్తుంది. అది అప్పుడు ఉద్రేకంతో ఉడికిపోతూ ఉంటుంది. తీవ్రమైన ఆగ్రహంతో బ్రద్దలవుతూ ఉంటుంది.” (అల్ ముల్క్ : 7, 8)

“నిశ్చయంగా నరకం ఒక మాటు. ధిక్కారులకు అది నివాస స్థలం. యుగాల తరబడి వారు అక్కడే పడి ఉంటారు.” (అన్ నబా: 21-23)

“విశ్వాసులారా! మీరు మిమ్మల్నీ, మీ కుటుంబాన్నీ మానవులు, రాళ్ళు ఇంధనం కాబోయే అగ్ని నుండి కాపాడుకోండి. దానిపై ఎంతో బలిష్టులు, అత్యంత కఠినులు అయిన దైవదూతలు నియమించబడి ఉంటారు. వారు ఎంత మాత్రం అల్లాహ్ ఆజ్ఞను ఉల్లంఘించరు. వారు ఆజ్ఞాపించబడిన దాన్నే పాటిస్తారు.” (అత్తహ్రీమ్:6)

దానిపై 19 మంది నియమితులై ఉన్నారు. (అల్ ముద్దస్సిర్:30)

“పాపకార్యాలు సంపాదించుకున్న వారు తమ చెడులాంటి ప్రతిఫలాన్నే పొందు తారు. అవమానం వారిని కప్పివేస్తుంది. అల్లాహ్ నుండి వారిని రక్షించే వాడెవడూ ఉండడు. వారి ముఖాలను చీకటి అలుముకుంటుంది. రాత్రి యొక్క నల్లని తెరలు వారిపై పడి ఉన్నట్లు వారు నరకానికి అర్హులు. వారు శాశ్వతంగా అక్కడే ఉంటారు.” (యూనుస్ :27)

మా వాక్యాలను నిరాకరించిన వారిని మేము నిశ్చయంగా అగ్నిలో పడ వేస్తాము. ఇంకా వారి చర్మం కాలిపోయినప్పుడల్లా, దాని స్థానంలో మరో చర్మాన్ని సృష్టిస్తాము. వారు శిక్షను బాగా రుచి చూడాలని. అల్లాహ్ సర్వశక్తి వంతుడూ, విజ్ఞతగలవాడూను. (అన్నిసా:56)

నరకంలోని ఒక ఇరుకైన స్థలంలో వారు కాళ్ళు, చేతులూ బంధించబడి క్రుక్కబడి నప్పుడు చావును కోరటం ప్రారంభిస్తారు. అప్పుడు ఇలా అనబడుతుంది. ‘ఈనాడు ఒక చావునే కాదు, అనేక చావులను పిలవండి.’ (అల్ ఫుర్ఖాన్:13,14)

“అల్లాహ్ మార్గం చూపిన వాడే సన్మార్గాన్ని పొందుతాడు. ఆయన మార్గం తప్పించిన వారికి ఆయన తప్ప, అండగలవాడ్ని, సహాయపడేవాడ్ని, ఎవరినీ నీవు పొందలేవు. వారిని మేము ప్రళయం నాడు గుడ్డివారుగా, మూగవారుగా, చెవిటి వారుగా చేసి బోర్లాపడవేసి లాక్కువస్తాము. వారి నివాసం నరకం. దాని మంట మందగించినప్పుడల్లా మేము దానిని మరింత మండింప జేస్తాము.” (బనీ ఇస్రాయీల్ :97)

“అవిశ్వాసానికి పాల్పడిన వారికి నరకాగ్ని గలదు. చనిపోవటానికి వారికి అనుమతి ఇవ్వబడదు. వారి నరక యాతనను ఏ మాత్రం తగ్గించటమూ జరగదు.”(ఫాతిర్:36)

వివరణ: ఈ హదీసు 313వ అంశంలో ఉంది.

“మా ప్రభూ! నరక యాతన నుండి మమ్మల్ని రక్షించు, దాని శిక్ష ప్రాణాంతకమై నది. అది ఎంతో చెడు ప్రదేశం. ఎంతో చెడ్డ నివాసం.” (అల్ ఫుర్ఖాన్:65,66)

హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “తీర్పు దినం నాడు భూలోకంలో సర్వసుఖాలను అనుభవించిన, నరకం ఖాయం చేయబడిన ఒక వ్యక్తిని రప్పించి నరకం చుట్టిరమ్మని చెప్పి అతన్ని ‘ఓ ఆదమ్ (అలైహిస్సలాం) కుమారుడా! ఇహలోకంలో నీవు భోగభాగ్యాలను ఎప్పుడైనా అనుభవించావా?’ అని ప్రశ్నించటం జరుగుతుంది. అప్పుడు ఆ వ్యక్తి ఇలా అంటాడు: “ఓ నా ప్రభూ! నీ సాక్షి ఎన్నడూ చూడలేదు.” ఆ తరువాత భూలోకంలో దుర్భర జీవితాన్ని గడిపిన, స్వర్గం ఖాయం చేయబడిన ఒక వ్యక్తిని రప్పించి, స్వర్గం చుట్టిరమ్మని చెప్పి అతన్ని, ఓ ఆదమ్ పుత్రుడా! భూలోకంలో నీవు కష్టాలను, నష్టాలను ఎప్పుడైనా అనుభవించావా? అని ప్రశ్నించటం జరుగుతుంది. అప్పుడు ఆ వ్యక్తి, “ఓ నా ప్రభూ! నీ సాక్షి, ఎన్నడూ కష్టాలను, నష్టాలను చవిచూడలేదు” అని సమాధానమిస్తాడు. (ముస్లిమ్) (కితాబుల్ మునాఫిఖీన్)

హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ(రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “తీర్పు దినంనాడు చావును ఒక గొర్రె రూపంలో స్వర్గనరకాల మధ్య నిలబెట్టి జబహ్ చేయడం జరుగుతుంది. స్వర్గవాసులూ, నరకవాసులూ ఇదంతా చూస్తూ ఉంటారు. ఒకవేళ సంతోషం పట్టలేక మరణం సాధ్యం అయితే స్వర్గవాసులు సంతోషంగా చనిపోతారు. ఇంకా దుఃఖం భరించలేక మరణం సాధ్యం అయితే నరకవాసులు దుఃఖంతో చనిపోతారు.’ (తిర్మిజి)(అబ్వాబు సిఫతిల్ జన్నహ్:2-2073)

“అగ్ని వారి ముఖాల చర్మాన్ని దహించి వేస్తుంది. వారి దవడలు బయటపడతాయి.’ (అల్ మూమినూన్ : 104)

“అది భగభగమండే నరకాగ్ని జ్వాల. మాంసాన్ని, చర్మాన్ని సైతం అది తినేస్తుంది.” (అల్ మఆరిజ్: 15, 16)

“నరకం అంటే ఏమిటో నీకేమి తెలుసు? అది మిగల్చదు. వదలిపెట్టదు. అది చర్మాన్ని మాడ్చివేస్తుంది.” (అల్ ముద్దస్సిర్: 27-29)

“హితబోధను పెడచెవిన పెట్టేవాడే పరమ దౌర్భాగ్యుడు. అతడు ఘోరమైన అగ్నిలో పడతాడు. ఇక అందులో చావడూ, బ్రతకడూ.” (అల్ ఆలా:11-13)

“ఇక నడవండి, మూడు శాఖలుగా చీలిపోయే నీడ వైపునకు. అది చల్లదనాన్ని ఇవ్వదు, అగ్నిబారి నుండీ రక్షించదు. అది భవనాల వంటి పెద్ద పెద్ద నిప్పు రవ్వలను విసురుతుంది. ఆ నిప్పురవ్వలు పసుపు పచ్చని ఒంటెల వలే కనిపిస్తాయి.” (అల్ ముర్సలాత్:30-33)

“నేను మిమ్మల్ని ప్రజ్వలించే అగ్ని పట్ల హెచ్చరించాను.” (అల్ లైల్:14)

“అవిశ్వాసులు తీవ్రమైన నరకాగ్నిలో ప్రవేశిస్తారు.” (అల్ గాషియహ్ : 4)

“ఎవరి త్రాసు పళ్ళాలైతే తేలికగా ఉంటాయో, వారి నివాస స్థలం లోతైన గొయ్యి అవుతుంది. అదేమిటో మీకేమైనా తెలుసా? అది భగభగమండే అగ్ని గుండం.” (అల్ ఖారిఅహ్:8-11)

42వ అంశం : నరకాగ్ని మందగించగానే, వెంటనే నరక దూతలు మండింప జేస్తారు.

“దాని మంట మందగించినప్పుడల్లా మేము దానిని మరింత మండింప జేస్తాము.” (బనీ ఇస్రాయీల్:97)

43వ అంశం : నరకాగ్ని తన లోపలికి వచ్చిన ప్రతి వాడినీ నుజ్జునుజ్జు చేసి వేస్తుంది.

“ఎంతమాత్రం కాదు, అధర్మ సంపాదనను కూడబెట్టే ప్రతి వ్యక్తి నుజ్జునుజ్జు చేసే ప్రదేశంలో విసరివేయబడతాడు. అలా నుజ్జునుజ్జు చేసే స్థలం ఏమిటో నీకుతెలుసా? అది తీవ్రంగా ప్రజ్వరిల్లజేయబడిన దైవాగ్ని. అది గుండెల దాకా చొచ్చుకొనిపోతుంది. అందులో వారు పడిన తర్వాత అది మూసివేయ బడుతుంది. ఈ విధంగా వారు పొడుగాటి అగ్నికీలల మధ్య చిక్కుకొని ఉంటారు.” (అల్ హుమజహ్: 4-9)

44వ అంశం: నరకాగ్ని ఇంధనం మానవులు, రాళ్ళు.

మానవులు, రాళ్ళు ఇంధనం కాగల ఆ అగ్నికి భయపడండి. అది సత్య తిరస్కారుల కొరకు తయారు చేయబడింది. (అల్ బఖర:24)

45వ అంశం: నరకాగ్ని భూలోక అగ్నికన్నా 69 రెట్లు అధికంగా వేడి గలది. ఇంకా దాని ప్రతి భాగంలో వేడి తీవ్రత భూలోక అగ్ని తీవ్రతలాగే ఉంటుంది.

హజ్రత్ అబూహురైరహ్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “మానవుడు వెలిగించే ఈ భూలోక అగ్ని నరకాగ్నిలో 70వ వంతు”

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అనుచరులు ఇలా విన్నవించుకున్నారు.

“అల్లాహ్ సాక్షి ఓ ప్రవక్తా! మానవుల్ని దహించడానికి ఈ అగ్నే చాలు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: ‘కాని అది భూలోక అగ్ని కన్నా 69 రెట్లు వేడిగా ఉంటుంది. దాని ప్రతిభాగం ఈ లోకపు అగ్నిలా వేడిగా ఉంటుంది.” (ముస్లిమ్) (కితాబుల్ జన్నహ్)

46వ అంశం: నరకాధికారి నరకాగ్నిని నిరంతరం దహింపజేస్తునే ఉన్నాడు.

హజ్రత్ సమూరహ్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “రాత్రి నేనొక స్వప్నం చూశాను. అందులో ఇద్దరు వ్యక్తులు నా వద్దకు వచ్చి ‘ఈ అగ్నిని దహింపజేస్తున్నవాడు నరకాధికారి మాలిక్, నేను జిబ్రయీలను, ఇతను మీకాయీల్” అని అన్నారు. (బుఖారీ) (కితాబు బద్ యిల్ ఖల్కి )

47వ అంశం: ఒకవేళ ప్రజలు నరకాగ్నిని చూస్తే నవ్వడం మానివేస్తారు. భార్యల దగ్గరకూ పోరు, నగరాలు సుఖజీవితాన్ని వదలి అడవుల్లోకి వెళ్ళి జీవిస్తారు. ఇంకా ఎల్లప్పుడూ అగ్ని నుండి అల్లాహు శరణు కోరుతూ ఉంటారు.

హజ్రత్ అబూజర్(రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉపదేశించారు: “నేను చూస్తున్నది మీరు చూడట్లేదు. ఇంకా నేను వింటున్నది మీరు వినట్లేదు. వాస్తవంగా ఆకాశం పూర్తిగా నిండివున్నది. అది అలాగే నిండివుండాలి కూడా. ఎందు కంటే అందులో దైవదూతలు సజ్జా చెయ్యని నాలుగు అంగుళాల చోటంటూ లేదు.అల్లాహ్ సాక్షి! నాకు తెలిసిన విషయాలు మీరు తెలుసుకుంటే అల్పంగా నవ్వుతారు, అధికంగా ఏడుస్తారు. పడకలపై స్త్రీలతో సుఖాలు అనుభవించడం మానివేస్తారు. ఇంకా అల్లాహ్ శరణు కోరుతూ అడవుల్లోకి, ఎడారుల్లోకి వెళ్ళిపోతారు. (ఇబ్నెమాజ 4190, హసన్ ) (కితాబుజ్జుహ్ద్)

వివరణ: ముస్నద్ అహ్మద్లో ఇలా ఉంది: “ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అనుచరులు ఇలా విన్న వించుకున్నారు: ప్రవక్తా! మీరు ఏం చూశారు? అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు: ‘నేను స్వర్గనరకాలను చూశాను.”

48వ అంశం: నరకాగ్ని యొక్క వేడిమిని భరించడం కూడా మానవుని తరం కాదు.

హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు: “నరకం నా ముందుకు రప్పించబడింది. మీరు నన్ను నమాజులో వెనక్కి జరుగుతూ ఉండగా చూసినప్పుడు నేను దానికి భయపడి వెనక్కితగ్గాను. దాని వేడి నాకు తగలకూడదని.” (ముస్లిమ్) (కితాబుల్ కుసూఫ్)

49వ అంశం: ఎండాకాలంలో తీవ్రమైన వేడి కేవలం నరకాగ్ని యొక్క ఆవిరి వల్ల జనిస్తుంది.

హజ్రత్ అబూహురైరహ్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు: “తీవ్రమైన ఎండలు ఉన్నప్పుడు జోహర్ నమాజు ఆలస్యం చేసి పాటించండి. ఎందుకంటే ఎండ తీవ్రత నరకాగ్ని ఆవిరి వల్ల జనిస్తుంది. నరకం తన ప్రభువును ఇలా ఫిర్యాదు చేసింది. ‘వేడి తీవ్రత వల్ల నా ఒక భాగం మరో భాగాన్ని తినివేస్తుంది. “

అల్లాహ్ (త’ఆలా) దాన్ని సంవత్సరానికి రెండుసార్లు ఊపిరి పీల్చుకునే అనుమతి ఇచ్చాడు. ఒకసారి చలికాలంలో (లోపలివైపు), మరోసారి ఎండాకాలంలో (బయటి వైపు). ఈ ఊపిరివల్లే మీరు ఎండాకాలంలో అధిక వేడిని, చలికాలంలో అధిక చల్లదనాన్ని పొందుతున్నారు. (బుఖారి) (మవాఖితుస్సలాహ్ పుస్తకం)

50వ అంశం : జ్వరం నరక ఆవిరి ప్రభావం వల్ల వస్తుంది.

ఆయిషహ్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు: ‘జ్వరం నరక ఆవిరి వల్ల వస్తుంది. అందువల్ల దాన్ని నీటి ద్వారా చల్లార్చండి.’ (బుఖారి) (సిఫతున్నారి అధ్యాయం)

51వ అంశం : నరకాగ్నిని తలచుకున్న వ్యక్తి సుఖంగా నిద్రపోలేడు.

హజ్రత్ అబూహురైరహ్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు: “నరకం నుండి పారిపోయే వ్యక్తి సుఖంగా నిద్రపోవటంగానీ, స్వర్గాన్ని కోరే వ్యక్తి సుఖంగా నిద్రపోవటంగానీ నేను చూడలేదు.’ (తిర్మిజి, హసన్) (సిఫతు జహన్నమ్: 2-2097)

52వ అంశం : నరకాగ్ని నిరంతరం మండించటం వల్ల ఎరుపుగా మారటానికి బదులు చాలా నల్లగా మారిపోయింది.

హజ్రత్ అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఇలా అంటున్నారు. ‘మీరు నరకాగ్నిని భూలోక అగ్నిలా ఎర్రగా ఉంటుందని అనుకుంటున్నారా? అది తారు కన్నా నల్లగా ఉంటుంది. (మాలిక్) (షరహ్ అస్ సున్నహ్: 15-240 )

53వ అంశం: నరకంలో అతిస్వల్పమైన శిక్ష ఏమిటంటే, నరకవాసులు అగ్ని చెప్పులు ధరిస్తారు. దానివల్ల వారి మెదడు ఉడుకుతుంది.

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు: నరకంలోని అన్నిటికంటే అతి స్వల్పమైన శిక్ష అబూ తాలిబ్కు పడుతుంది. అతనికి అగ్ని చెప్పులు తొడిగిస్తారు. దానివల్ల అతని మెదడు ఉడుకుతుంది. (ముస్లిమ్) (కితాబుల్ ఈమాన్)

హజ్రత్ అబూసయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు: “నరకంలో అందరికంటే అతి స్వల్పమైన శిక్షకు గురయిన వ్యక్తికి ధరించ డానికి అగ్ని చెప్పులు ఇవ్వబడతాయి. దానివల్ల అతని మెదడు ఉడుకుతూ ఉంటుంది.” (ముస్లిమ్) (షఫా అతున్నబీ లి అబితాలిబ్)

54వ అంశం: స్వల్పంగా శిక్షించటానికి కొందరు నరకవాసుల కాళ్ళ క్రింద నిప్పు గోళాలు ఉంచబడతాయి.

హజ్రత్ నోమాన్ బిన్ బషీర్ ప్రసంగిస్తూ ఇలా అన్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను ఇలా అంటూ ఉండగా నేను విన్నాను. ‘తీర్పుదినం నాడు అతి స్వల్పంగా శిక్షించబడే వ్యక్తి పాదాల క్రింద రెండు అగ్నిగోళాలు ఉంచబడతాయి. వాటివల్ల అతని మెదడు ఉడుకుతూ ఉంటుంది. (ముస్లిమ్) (షఫా అతున్నబీ లి అబితాలిబ్)

55వ అంశం : నరక శిక్ష వల్ల నరకవాసులు పెద్ద పెద్ద భయంకరమైన కేకలు వేస్తారు. ఎంత బిగ్గరగా పెడబొబ్బలు, కేకలు వేస్తారంటే చెవిలో పడిన శబ్దం కూడా వినబడదు.

అక్కడ వారు రొప్పుతూ, పాకుతూ బుసలు కొడతారు. ఇంకా అక్కడ పరిస్థితి ఏలా ఉంటుందంటే, అందులో వారికి ఏ శబ్దమూ వినిపించదు. (అల్ అంబియా: 100)

56వ అంశం : నరకంలో నరకవాసులకు చావూ రాదు, వారి శిక్షా తగ్గదు. అవిశ్వాసానికి పాల్పడిన వారికి నరకాగ్ని ఉంది. వారు చనిపోవాలనే తీర్పూ ఇవ్వబడదు. వారి నరకయాతన ఏ మాత్రం తగ్గించటమూ జరుగదు. ఈ విధంగా మేము అవిశ్వాసానికి పాల్పడే ప్రతి వ్యక్తికీ ప్రతిఫలం ఇస్తాము. (ఫాతిర్:36)

57వ అంశం : నరకవాసులు చర్మం కుళ్ళి కృశించగానే దాని స్థానంలో మరో చర్మం సృష్టించడం జరుగుతుంది వారిని నిరంతరంగా శిక్షించటానికి. మా వాక్యాలను నిరాకరించిన వారిని మేము నిశ్చయంగా అగ్నిలో పడవేస్తాము. ఇంకా వారి శరీర చర్మం కాలి కరిగిపోయినప్పుడల్లా దాని స్థానంలో మరొక చర్మాన్ని సృష్టిస్తాము. వారు శిక్షను బాగా రుచిచూడాలని. అల్లాహ్ సర్వశక్తిమంతుడు. విజ్ఞతగలవాడూను. (అన్నిసా:56)

58వ అంశం : నరకవాసుల ముఖాలు చాలా నల్లగా ఉంటాయి.
వివరణ: వాక్యం 29వ అంశం చూడండి.

59వ అంశం : నరకవాసులు ముఖాల చర్మం కాల్చబడి ఉంటుంది. వారి దవడలు బయట పడి ఉంటాయి.

అగ్ని వారి ముఖాల చర్మాన్ని తినివేస్తుంది. వారి దవడలు బయటపడతాయి. (అల్ మూమినూన్: 104)

60వ అంశం: నరకంలో అవిశ్వాసి యొక్క ఒక పన్ను ఉహుద్ కొండంత ఉంటుంది.

61వ అంశం: నరకంలో అవిశ్వాసి చర్మం మూడు రోజుల ప్రయాణ దూరమంత వెడల్పుగా ఉంటుంది.

హజ్రత్ అబూహురైరహ్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు: “అవిశ్వాసి యొక్క పన్ను లేదా దవడ ఉహద్ కొండంత ఉంటుంది. ఇంకా అతని చర్మం మూడు రోజుల ప్రయాణ దూరమంత వెడల్పుగా ఉంటుంది.” (ముస్లిమ్ కితాబుల్ జన్నహ్)

62వ అంశం: కొందరు అవిశ్వాసుల దవడ ఉహుద్ కొండకన్నా పెద్దదిగా ఉంటుంది. వారి మిగతా శరీరం కూడా అదే నిష్పత్తిలో పెరిగి ఉంటుంది.

వివరణ: హదీసు 156వ అంశం చూడండి.

63వ అంశం : నరకంలో అవిశ్వాసులు రెండు భుజాల మధ్య వేగగామి యొక్క మూడు రోజుల ప్రయాణమంత దూరం ఉంటుంది.
వివరణ: హదీసు 157వ అంశం చూడండి.

64వ అంశం: కొందరు అవిశ్వాసుల చెవులు, భుజాల మధ్య దూరం 70 సంవత్సరాల ప్రయాణ దూరం ఉంటుంది. ఇంకా వారి శరీరంలో చీము, రక్తాల లోయలు పారుతూ ఉంటాయి.

వివరణ: హదీసు 21వ అంశం చూడండి.

65వ అంశం: నరకంలో అవిశ్వాసి చర్మం వెడల్పు 42 మూరలు (63 అడుగులు) ఉంటుంది. ఒక పన్ను ఉహుద్ కొండంత ఉంటుంది. ఇంకా వాడు కూర్చునే స్థలం మక్కా మదీనాల మధ్య దూరం అంత ఉంటుంది.

వివరణ: హదీసు 159వ అంశం చూడండి.

66వ అంశం: నరకవాసులు ఒక చేయి ‘బైజా’ కొండంత, తొడ ‘వర్ ఖాన్’ కొండంత ఉంటుంది.
వివరణ: హదీసు 160వ అంశం చూడండి.

67వ అంశం : కొందరు అవిశ్వాసుల శరీరం ఎంత అధికంగా పెంచబడు తుందంటే, నరకంలోని విశాలమైన ఒక మూలలో కదలలేక పడి ఉంటారు.

వివరణ: హదీసు 161వ అంశం చూడండి.

68వ అంశం: అహంకారులకు నరకంలో చీమల్లాంటి అతి చిన్న శరీరం ఇవ్వబడుతుంది.

హజ్రత్ అమర్ బిన్ షుఐబ్ (రదియల్లాహు అన్హు) తన తండ్రిగారి ద్వారా, ఆయన తన తాతగారి ద్వారా ఇలా ఉల్లేఖిస్తున్నారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు: “తీర్పు దినం నాడు అహంకారులను చీమల్లాంటి శరీరాలతో మానవ రూపాల్లోనే లేపటం జరుగుతుంది. అన్ని వైపుల నుండి వారిని పరాభవం ఆవరించి ఉంటుంది. నరకంలో వారిని ఒక జైలు వైపు తోలడం జరుగు తుంది. దాని పేరు ‘బోలస్’. వ్యధాభరితమైన అగ్ని వారిని ఆవరిస్తుంది. వారికి నరకవాసుల శరీరాలనుండి కారే ద్రవం (చీము, నెత్తురు) త్రాగటానికి ఇవ్వబడుతుంది. దీన్నే ‘తీనతుల్ ఖబాల్ అంటారు. (తిర్మిజి, హసన్) (అబ్వాబు సిఫతిల్ ఖియామ:2-2025)

69వ అంశం : నరక శిక్ష వల్ల నరకవాసులు కాలి బొగ్గులా నల్లబడతారు.

హజ్రత్ అబూసయీద్ (రదియల్లాహు అన్హు) ఖుద్రీ ఇలా ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా బోధిం చారు: ‘విచారణ తర్వాత స్వర్గవాసులు స్వర్గంలోనికి వెళ్ళిపోతారు. నరకవాసులు నరకంలోనికి వెళ్ళిపోతారు. ఆ తరువాత అల్లాహ్ (త’ఆలా) హృదయంలో ఆవగింజంత విశ్వాసం ఉన్న వారిని నరకం నుండి తీసివేయండి’ అని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు అలాంటి వారు తీయబడతారు. అయితే వారు కాలి బొగ్గులా మారి ఉంటారు. ఆ తరువాత వారు ‘అమృత సరస్సు’లో వేయబడతారు. దానివల్ల వారు యధాతథంగా తయారై నది వొడ్డున గింజ మొలకెత్తినట్లు పైకి వస్తారు. మీరు చూడలేదా నది వొడ్డున గింజ ఎంత అందంగా పసుపు రంగులో చుట్టబడి మొలుస్తుందో.” (బుఖారి) (సిఫతుల్ జన్నతి వన్నార్: 284)

70వ అంశం :నరకంలో నరకవాసులు ఎంత అధికంగా కన్నీళ్ళు కారుస్తారంటే వాటిలో పడవలు నడపవచ్చు.

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఖైస్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా బోధించారు: ‘నరకవాసులు ఎన్ని కన్నీళ్ళు కారుస్తారంటే, ఒకవేళ వాటిలో పడవలు నడిపితే నడుస్తాయి. వారి కన్నీళ్ళు అయిపోతాయి. మళ్ళీ నరకవాసులు ఏడుస్తూ ఉంటారు. అప్పుడు రక్తకన్నీళ్ళు పారుతూ ఉంటాయి. (హాకిమ్, హసన్ అల్బానిగారి సిల్సిలతు అహాదీసుస్సహీహహ్:4-1679)

71వ అంశం : నరకవాసులకు నరకంలో ఈ క్రింది నాలుగు రకాల ఆహారం ఇవ్వబడుతుంది.

(1). రాకాసి జముడు (2). ముళ్ళ గడ్డి (3). గాయాల కడుగు (4). గొంతులో గుచ్చుకుంటూ దిగిపోయే ఆహారం

72వ అంశం: దుర్వాసన, చేదు, ముళ్ళుగల రాకాసి జముడు (జఖ్ఖూమ్)

నరకవాసుల ఆహారం అవుతుంది. ఇది నరక అడుగు భాగంలో పండుతుంది. దాని కొమ్మలు విషపూరితమైన సర్పాల్లా ఉంటాయి.

73వ అంశం: రాకాసి జముడును తిన్న తరువాత కాగే నీరు నరకవాసులకు త్రాగటానికి ఇవ్వబడుతుంది.

74వ అంశం : నరక అతిథి గృహంలో ఆతిథ్యం తరువాత నరకవాసులను వారి స్థానాలకు చేర్చటం జరుగుతుంది.

ఈ ఆతిథ్యం మంచిదా లేక రాకాసి జముడు (జఖూమ్) చెట్టు ఆతిథ్యం మంచిదా?

మేము ఆ చెట్టును దుర్మార్గుల పాలిటి పరీక్షగా చేశాము. అది నరకం అడుగు భాగంలో పండేచెట్టు. దాని మొగ్గలు పైతానుల తలలు మాదిరిగా ఉంటాయి. నరకవాసులు వాటిని తింటారు. వాటితోనే కడుపులు నింపుకుంటారు. అంతేకాక, త్రాగటానికి వారికి సలసల కాగే నీరు లభిస్తుంది. ఆతరువాత మళ్ళీవారు నరకాగ్ని వైపునకే మరలివస్తారు”. (అస్సాఫ్ఫాత్:62-67)

75వ అంశం: రాకాసి జముడు యొక్క విషం కడుపులో ఎలాంటి వ్యధకు గురిచేస్తుందంటే, కాగే నీరు మసలుతూ ఉన్నట్లు ఉంటుంది. రాకాసి జముడు వృక్షం పాపాత్ములకు ఆహారం అవుతుంది. అది నూనె మడ్డిలా ఉంటుంది. సలసలకాగే నీరులా అది కడుపులో మసలుతూ ఉంటుంది. (అద్దుఖాన్:43-46)

76వ అంశం : నరకవాసుల ఆహారం (రాకాసి జముడు) ఎంత విషపూరితంగా ఉంటుం దంటే, ఒకవేళ దాని ఒక చుక్క ప్రపంచంలో పడవేస్తే అది ప్రపంచ ఆహార సంపదను సర్వనాశనం చేసివేస్తుంది.

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా బోధిం చారు: “ఒకవేళ రాకాసి జముడు యొక్క ఒక్కచుక్క భూలోకంలో పడవేస్తే ప్రాణులన్నిటి ఆహార సంపదనంతా సర్వనాశనం చేసివేస్తుంది. మరి అలాంటప్పుడు రాకాసి జముడు ఆహారంగా తిన్న వ్యక్తి పరిస్థితి ఏమవుతుంది? (అహ్మద్, తిర్మిజి, నసాయి, ఇబ్నెమాజ సహిహ్)* 1. . అల్లామా అల్బానీగారి సహీహుల్ జామియిస్సగీర్: 5-5126

77వ అంశం : రాకాసి జముడే కాక, ముళ్ళగడ్డి కూడా వారికి ఆహారంగా ఉంటుంది. ఇది మహా విషంగానూ, దుర్వాసన కలిగి ఉంటుంది.

78వ అంశం : ‘జరీ’ ఆహారం నరకవాసుల ఆకలిని ఏమాత్రం తగ్గించదు. పైగా వాళ్ళ బాధను అధికం చేస్తుంది.

తాగేందుకు వారికి సలసల కాగే చలమనీరు ఇవ్వబడుతుంది. వారి కొరకు ఎండిన ముళ్ళ గడ్డి తప్ప మరొక ఆహారం ఉండదు. అది బలాన్ని ఇవ్వదు. ఆకలినీ తీర్చదు. (అల్ గాషియహ్ : 5-7)

79వ అంశం : రాకాసి జముడు, ముళ్ళగడ్డితోపాటు, గాయాల కడుగు, మలినాలు కూడా నరకవాసులకు ఆహారంగా ఇవ్వబడతాయి.

ఈనాడు ఇక్కడ ఇతని దుఃఖంలో పాలుపంచుకునే స్నేహితుడెవడూ ఉండడు. గాయాల కడుగు తప్ప అతనికి తినటానికి ఆహారం కూడా ఏదీ ఉండదు. దానిని అపరాధులు తప్ప మరెవ్వరూ తినరు”. (అల్ హాఖ్రాహ్ : 35-37)

వివరణ: కొందరు వ్యాఖ్యానకర్తలు “గిస్లీన్ అనేది నరకంలోని ఒక చెట్టు పేరు” అని వ్యాఖ్యానించారు.

80వ అంశం : రాకాసి జముడు, ముళ్ళగడ్డి, గాయాలు కడుగుతోపాటు, నరకవాసు లకు విషపూరితమైన, దుర్వాసనగల ఆహారం ఇవ్వబడుతుంది. అది వారి గొంతులో గుచ్చుకుంటూ క్రిందికి దిగుతుంది.

మా వద్ద బరువైన సంకెళ్ళు ఉన్నాయి. భగభగమండే అగ్ని గొంతులో ఇరుక్కు పోయే ఆహారం, వ్యధాభరితమైన శిక్షలు ఉన్నాయి” (అల్ ముజ్జమ్మిల్:12-13}

81వ అంశం : నరకవాసులు త్రాగటానికి ఈ క్రింది అయిదు రకాల పానీయాలు ఇవ్వబడుతాయి.

(1) సలసలకాగుతున్న నీరు
(2) గాయాల నుండి కారే చీము, నెత్తురు
(3) నూనె మడ్డిలాంటి కాగే పానీయం
(4) విషపూరితమైన, దుర్వాసనగల నల్లని పానీయం
(5) నరకవాసుల చెమట.

82వ అంశం:రాకాసి జముడు తిన్న తరువాత నరకవాసులకు సలసల కాగుతున్న నీరు త్రాగటానికి ఇవ్వబడుతుంది.

నరకవాసులు వాటిని తింటారు, వాటితోనే కడుపునింపుకుంటారు. అదీగాక, త్రాగటానికి వారికి సలసలకాగుతున్న నీరు లభిస్తుంది. ఆ తరువాత వారు మళ్ళీ నరకాగ్ని వైపునకే తిరిగి వస్తారు”. (అస్సాఫ్ఫాత్:66,67)

వివరణ: రాకాసి జముడు చెట్టు, సలసలకాగే నీటి చలమలు నరకంలో ఒక ప్రత్యేక ప్రదేశంలో ఉంటాయని అనిపిస్తుంది. నరకవాసులకు ఆకలి, దాహాలు కలిగినప్పుడు ఆ ప్రదేశం వైపునకు వారిని తోలుకు వెళ్ళటం జరుగుతుంది. ఆతిథ్యం తరువాత మళ్ళీ వారిని నరకంలో వారి స్థానానికి రప్పించటం జరుగుతుంది. (అష్రఫుల్ హవాపీ)

83వ అంశం: రాకాసి జముడు తిన్న తరువాత నరకవాసులు దాహంతో ఉన్న ఒంటెల్లా సలసలకాగే నీటిని త్రాగుతారు.

ఓ మార్గభ్రష్టులారా! తిరస్కారులారా! మీరు జఖూమ్ చెట్టును ఆహారంగా తింటారు. దానితోనే మీరు మీ కడుపులను నింపుకుంటారు. ఆపై సలసల కాగే నీటిని దాహంతో ఉన్న ఒంటెల్లా త్రాగుతారు. తీర్పు దినం నాడు లభించే ఆతిథ్యం ఇదే. (అల్వాఖి అహ్ : 51-56)

84వ అంశం : కాగే నీటిని త్రాగగానే నరకవాసులు ప్రేగులు తెగిపోతాయి.

భయభక్తులు గలవారికి వాగ్దానం చేయబడిన స్వర్గం యొక్క వైభవం ఇలా ఉంది. అందులో నిర్మలమైన నీటి కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. ఏ మాత్రమూ మారని రుచిగల పాల కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. సేవించే వారికి మధురంగా ఉండే మద్యపు కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. స్వచ్ఛమైన తేనె కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. అందులో వారి కొరకు అన్ని రకాల పండ్లు ఉంటాయి. ఇంకా వారి ప్రభువు తరఫు నుండి క్షమాభిక్ష కూడా. ఇలాంటి వ్యక్తి నరకంలో శాశ్వతంగా ఉండేవారి మాదిరిగా ప్రేగులను సైతం కోసివేసేటటువంటి, సలసల కాగే నీరు ఇవ్వబడే వ్యక్తి మాదిరిగా కాగలడా? (ముహమ్మద్:15)

85వ అంశం: గాయాల చీము, నెత్తుర్ల మిశ్రమ ద్రవం నరకవాసులకు త్రాగటానికి ఇవ్వబడుతుంది. దాన్ని వారు బలవంతంగా, అతి కష్టంగా గొంతులోకి దించగలుగుతారు.

అతని వెనుక నరకం ఉంది. అక్కడ అతడికి త్రాగటానికి చీము, నెత్తురు లాంటి మురికి నీరు ఇవ్వబడుతుంది. దానిని అతడు బలవంతంగా గొంతులోకి దించటానికి ప్రయత్నిస్తాడు. అతికష్టంతో దించగలుగుతాడు. మరణం అతణ్ణి అన్ని వైపుల నుండీ చుట్టుముట్టి ఉంటుంది. కాని అతడు మరణించలేడు. దాని తరువాత కూడా ఒక కఠినమైన శిక్ష అతడి ప్రాణానికి సంకటంగా వేచి ఉంటుంది”. (ఇబ్రాహీమ్:16,17)

86వ అంశం : నూనెమడ్డివంటి, దుర్వాసనగల కాగే మురికి పానీయాన్ని కూడా నరకవాసులకు త్రాగటానికి ఇవ్వటం జరుగుతుంది.

అక్కడ వారు మంచినీళ్ళు అడిగితే, నూనెమడ్డిలాంటి నీటితో వారిని సత్క రించటం జరుగుతుంది. అది వారి ముఖాలను మాడుస్తుంది. అది ఎంత చెడ్డ మురికి పానీయం! అది ఎంత నికృష్టమైన విశ్రాంతి స్థలం!” (అల్ కహఫ్:29)

వివరణ: హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మసాద్ (రదియల్లాహు అన్హు) ఒకసారి బంగారాన్ని కరిగిం చారు. అది ద్రవరూపంగా మారి మరుగుతూ ఉంది. అప్పుడు ఇలా అన్నారు: ‘ఇప్పుడిది ‘మహల్’ లా ఉంది. (ఇబ్నెకసీర్)

87వ అంశం : ఆ మడ్డిలాంటి పానీయాన్ని నోటికి తగిలించగానే నరకవాసుల ముఖాలను అది కాల్చివేస్తుంది.

హజ్రత్ అబూ సయీద్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉపదేశిం చారు: “నరకవాసుల పానీయం కరిగించిన రాగిలా, నూనెమడ్డిలా ఉంటుంది. దాన్ని త్రాగటానికి నోటి వరకు తీసుకు వస్తే, వారి నోటి మాంసం మాడి క్రిందపడిపోతుంది. (హాకిమ్, సహీహ్) (4-646, 647)

4. విషపూరితమైన, దుర్వాసనగల నల్లటి పానీయం

88వ అంశం: పైన పేర్కొన్న మూడు పానీయాలే కాక గస్సాఖ్ అనబడే నల్లని, విషపూరితమైన మలిన ద్రవపదార్థం కూడా నరక వాసులకు త్రాగటానికి ఇవ్వబడుతుంది.

అది నరకం, అందులో వారు కాల్చబడుతూ ఉంటారు. అది బహుచెడ్డ నివాస స్థలం. ఇదీ వారికి లభించేది, వారు సలసల మరిగే నీటిని, చీము, నెత్తురులనూ, ఇంకా ఇటువంటి చేదు పదార్థాలను రుచి చూడాలని. (సాద్:56-58)

89వ అంశం: గస్సాఖ్ పానీయం ఎంత విషం కలిగి, ఎంత దుర్వాసన కలిగి ఉంటుందంటే, దాని ఒక్క చేద (ఒక్కడోలు) అంటే, 12 లీటరు మొత్తం ప్రపంచాన్ని పూర్తిగా దుర్వాసనకు గురిచేయగలదు.

హజ్రత్ అబూ సయీద్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:

‘గస్సాఖ్ (నరక వాసుల శరీరాల నుండి కారే మురికి ద్రవపదార్థం) యొక్క ఒక చేద ప్రపంచంలో పడవేస్తే ప్రపంచాన్నంతటినీ దుర్వాసనకు గురిచేసి వేస్తుంది. (ముస్నద్ అబుయాలా 2-1372)

5. నరకవాసుల చెమట

90వ అంశం: ప్రపంచంలో మత్తుపానీయాలు సేవించే వారికి అల్లాహ్ (త’ఆలా) నరకవాసుల శరీరాల నుండి కారే మురికైన, దుర్వాసనగల, విషం గల చెమటను త్రాపిస్తారు.

హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉపదేశించారు: “మత్తు పదార్థాలన్నీ నిషేధించబడ్డాయి. అల్లాహ్ (త’ఆలా) మత్తుపానీయాలు త్రాగేవారికి (నరకంలో) ‘తీనతుల్ ఖబాల్‘ త్రాపిస్తానని’ శపధం చేశాడు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అనుచరులు ఇలా విన్నవించు కున్నారు. ‘ప్రవక్తా! తీనతుల్ ఖబాల్ అంటే ఏమిటి?, ప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ‘నరకవాసుల చెమట’ అని తెలిపారు. (ముస్లిమ్) (కితాబుల్ అష్రిబా )

91వ అంశం: నరకవాసులకు తృప్తినిచ్చే, త్రాగ గలిగే ఎటువంటి పానీయమూ ఇవ్వబడదు.

అందులో ఎలాంటి చల్లదనాన్ని, పానీయాన్ని వారు చవిచూడరు. ఒకవేళ ఏదైనా దొరికితే, అది సలసలకాగే నీరు, గాయాల కడుగు మాత్రమే. అది వారి పరిపూర్ణ ఫలం. (అన్ నబా :24-26)

92వ అంశం: నరకంలో నరకవాసుల కొరకు ఒక మంచి నీటి చుక్క అయినా, ఒక్క ముద్ద మంచి ఆహారం అయినా నిషేధించబడి ఉంటుంది.

నరకవాసులు స్వర్గవాసులతో, “కాస్త దయతలచి మాపై కొద్దిగా నీళ్ళు పోయండి, లేదా అల్లాహ్ ప్రసాదించిన ఆహారాన్ని అయినా కొంత ఇటు విసరండి’ అని మొరపెట్టు కుంటారు. అప్పుడు వారు, ‘ఈ రెంటినీ అల్లాహ్ అవిశ్వాసుల కొరకు నిషేధించాడు’ అని సమాధానం ఇస్తారు. (అల్ ఆరాఫ్-50)

దాహం ద్వారా శిక్ష

93వ అంశం : అపరాధులను నరకాగ్నిలో వేయకముందే తీవ్రమైన దాహాన్ని కల్పించి శిక్షించటం జరుగుతుంది.

అపరాధులను దాహానికి గురయిన జంతువుల్లా నరకం వైపునకు తోలుకొని పోయే రోజు రానున్నది. (మర్యమ్:86)

94వ అంశం: తీవ్రమైన దాహం వల్ల నరకవాసులు నరకానికి, కాగే నీటి చలమలకు మధ్య తిరుగుతూ ఉంటారు.

నేరగాళ్ళు కొట్టిపారేస్తూ వచ్చిన ఆ నరకం ఇదే. వారు నరకంలో కాగుతున్న నీళ్ళ మధ్య అటూఇటూ తిరుగుతూ ఉంటారు”. (అర్రహ్మాన్: 43-45)

95వ అంశం: నరకవాసులు రాకాసి జముడు తిన్న తరువాత దాహం గల ఒంటెల్లా ప్రవర్తిస్తారు.
వివరణ: వాక్యం 83వ అంశంలో ఉంది.

మరిగే నీటిని తలపై పోసే శిక్ష

96వ అంశం: నరకం మధ్యభాగంలోకి తీసుకొని వెళ్ళి అవిశ్వాసుని తలపై మరిగే నీటిని పోయటం జరుగుతుంది.

అతన్ని పట్టుకోండి, నరకం మధ్య ఈడ్చుకుంటూ తీసుకువెళ్ళండి. వాడి తల మీద సలసలకాగే నీటిని వేసి శిక్షించండి. రుచి చూడు! నీవు గొప్ప బలవంతుడవూ, గౌరవ నీయుడవూ అయిన వ్యక్తివి. మీరు ఏ విషయాన్ని గురించి సందేహించేవారో, ఆ విషయం ఇదే. (అద్దుఖాన్:47-50)

97వ అంశం : అవిశ్వాసులు, విగ్రహారాధకుల చర్మం, క్రొవ్వు, కడుపులోని భాగాలు, గుండె మొదలైనవి కాలిపోయేటట్లు వారిపై సలసలకాగే నీరు వేయబడుతుంది.

ఈ రెండు వర్గాలు తమ ప్రభువును గురించి వివాదానికి గురయ్యాయి. వారిలో అవిశ్వాసులైన వారి కొరకు అగ్ని వస్త్రాలు కత్తిరించబడి ఉన్నాయి. వారి శిరస్సులపై మరిగే నీరుపోయబడుతుంది. దానివల్ల వారి చర్మాలే కాదు కడుపులోని భాగాలు సైతం కరిగిపోతాయి. (అల్ హజ్:19-20)

98వ అంశం: మరిగే నీరు అవిశ్వాసులపై వేయబడుతుంది. దానివల్ల వారి కడుపులోని భాగాలు కాలిపోయి క్రింద పాదాలపై పడతాయి. అల్లాహ్ మహిమ వల్ల నిరంతరం ఇలాగే శిక్షించటం జరుగుతూ ఉంటుంది.

హజ్రత్ అబూహురైరహ్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు: ‘మరిగే నీరు అవిశ్వాసుల తలలపై వేయబడుతుంది. అది తలకు రంధ్రం చేస్తూ కడుపు లోపలికి చేరుతుంది. కడుపులో ఉన్న వాటిని కాల్చివేస్తుంది. అవన్నీ మలద్వారం ద్వారాపాదా లపై పడతాయి. అంటే నిరంతరం ఈ విధంగా జరుగుతూనే ఉంటుంది. (అహ్మద్, హసన్) (షర్హుస్సున్నహ్ కితాబుల్ ఫితన్, ముస్నద్ అహ్మద్ : 2/8851)

వివరణ: ‘సహర్’ అనే పదం సూరెహజ్ 20వ వాక్యంలో ఉంది. ఇంకా 97వ అంశమును చూడండి.

నరకవాసుల వస్త్రాలు

99వ అంశం : నరకవాసులు అగ్ని వస్త్రాలు ధరిస్తారు.

అవి రెండు వర్గాలు, వాటి మధ్య తమ ప్రభువును గురించి వివాదం తలెత్తింది. వారిలో అవిశ్వాసులైన వారి కొరకు అగ్ని వస్త్రాలు కత్తిరించబడి ఉన్నాయి. వారి శిరస్సులపై మరిగే నీరు పోయబడుతుంది. దానివల్ల వారి చర్మాలే కాదు కడుపులోని భాగాలు సైతం కరిగిపోతాయి (అల్ హజ్: 19,20)

100వ అంశం: కొంతమంది అపరాధులకు బేడీలు వేసి తారు వస్త్రాలు తొడిగిస్తారు.

ఆ రోజు నీవు దోషులను చూస్తావు. వారి చేతులూ, కాళ్ళూ బేడీలతో బంధించ బడి ఉంటాయి. వారు తారు వస్త్రాలను ధరించి ఉంటారు. అగ్నిజ్వాలలు వారి ముఖాలను క్రమ్ముకుంటాయి. (ఇబ్రాహీమ్ : 4,50)

101వ అంశం : కొందరు అపరాధులు గంధకం పైజామా, గజ్జి కుర్తా ధరిస్తారు.
వివరణ: హదీసు 175వ అంశం చూడండి.

102వ అంశం: ఖుర్ఆన్ హదీసుల విద్యను దాచే వారికి అగ్ని కళ్ళెం వేయబడుతుంది.
వివరణ: హదీసు 170వ అంశం చూడండి.

103వ అంశం : కొందరు నరకవాసులు అగ్ని చెప్పులు ధరిస్తారు.
వివరణ: హదీసు 53వ అంశం చూండండి.

నరకవాసుల పడకలు

104వ అంశం : నరకవాసులు విశ్రాంతి కోసం నిప్పు పడకలు పరచబడతాయి.

వారికి నరకమే పాన్పు, నరకమే దుప్పటి. మేము దుర్మార్గులకు ఇచ్చే ప్రతిఫలం ఇదే. (అల్ ఆరాఫ్:41)

105వ అంశం: నరకవాసులకు నిప్పు తివాచీలు, నిప్పు తలగడలు ఇవ్వ బడతాయి.

వారి మీద నిప్పు గొడుగులు పైనుండి కూడా క్రమ్ముకొని ఉంటాయి. క్రింది నుండి కూడా. ఈ పర్యవసానం గురించే అల్లాహ్ తన దాసులను హెచ్చరిస్తున్నాడు. ‘కనుక నా దాసులారా! నా ఆగ్రహం నుండి తప్పించుకోండి.’ (అజ్జుమర్:16)

106వ అంశం: నరకవాసులు పరచుకునేదీ, కప్పుకునేదీ అంతా నిప్పే.

ఆ రోజు శిక్ష వారిని పైనుండి, క్రింది నుండి కూడా కప్పివేస్తుంది. ఇంకా, “ఇక రుచి చూడండి, మీరు చేసిన కార్యాలకు’ అని పలకబడుతుంది. (అల్ అన్కబూత్:55)

అక్కడ వారు ఒకవేళ మంచినీళ్ళు అడిగితే, నూనెమడ్డిలాంటి నీటితో వారిని సత్కరిం చటం జరుగుతుంది. అది వారి ముఖాలను మాడుస్తుంది. అది ఎంత మురికి పానీయం! అది ఎంత నికృష్టమైన విశ్రాంతి స్థలం! (అల్ కహఫ్:29)

నరకవాసులు గొడుగులు, షామియానాలు

107వ అంశం: నరకవాసులపై నిప్పుగొడుగులు ఉంటాయి.

వారి మీద నిప్పు గొడుగులు పైనుండి కూడా క్రమ్ముకొని ఉంటాయి. క్రింది నుండి కూడా ఈ పర్యవసానం గురించే అల్లాహ్ తన దాసులను భయపెడుతున్నాడు. కనుక నా దాసులారా! నా ఆగ్రహాన్నుండి తప్పించుకోండి. (అజ్జుమర్:16)

108వ అంశం: నరక షామియానాల్లో నరకవాసులు నివసిస్తారు.

మేము దుర్మార్గుల కొరకు ఒక అగ్నిని సిద్ధపరచి ఉంచాము. దాని జ్వాలలు వారిని చుట్టు ముట్టుతాయి. (అల్ కహఫ్:29)

109వ అంశం: నరకంలోని షామియానాల రెండు గోడల మధ్య నలభై సంవత్సరాల ప్రయాణ దూరం ఉంటుంది.

వివరణ: హదీసు 20వ అంశం చూడండి.

అగ్ని సంకెళ్ళు, హారాల ద్వారా శిక్ష

110వ అంశం: నరకంలోనికి తీసుకొనిపోవుటకు, నరక వాసుల మెడలో బరువైన గొలుసులు వేయబడతాయి.

111వ అంశం : నరకంలోనికి తీసుకువెళ్ళిన తర్వాత నరకవాసులు 70 మూరల (105 అడుగులు) పొడవుగల గొలుసులతో బంధించబడతారు.

అతన్ని పట్టుకోండి. అతని మెడకు కంఠపాశం తగిలించండి. ఆపై అతన్ని నరకంలోకి విసిరివేయండి. తరువాత అతన్ని డబ్భై గజాల పొడవు గొలుసుతో బంధించండి. మహ నీయుడు, మహోన్నతుడు అయిన అల్లాహ్ ను వీడు విశ్వసించే వాడుకాదు. నిరుపేదలకు అన్నం పెట్టండి అని ప్రోత్సహించేవాడూ కాదు. (అల్ హాఖ్కహ్:30-34)

సత్యతిరస్కారుల కొరకు మేము సంకెళ్ళను, కంఠపాశాలను, మండే అగ్నిని సిద్ధపరచి ఉంచాము. (సూరా అద్దహ్ర్:4)

112వ అంశం : నరకవాసులలో కొందరి కాళ్ళకు నిప్పు బేడీలు వేయబడతాయి. మా వద్ద బరువైన సంకెళ్ళు, భగభగమండే అగ్ని ఉన్నాయి. (అల్ ముజ్జమ్మిల్:12)

113వ అంశం: దైవదూతలు అవిశ్వాసులను గొలుసులతో బంధించి నరకంలో ఈడ్చుకుంటూ పోతారు.

అప్పుడు వారి మెడలలో కంఠపాశాలు ఉంటాయి. సంకెళ్ళు కూడా ఉంటాయి. వాటితో వారు మరిగే నీటివైపునకు ఈడ్చబడతారు. తరువాత అగ్నిలోకి నెట్టబడతారు. (అల్ మూమిన్:71,72)

114వ అంశం : కొందరికి సంకెళ్ళు వేసి తారు వస్త్రాలు తొడిగిస్తారు.

ఆ రోజు నీవు దోషులను చూస్తావు. వారి చేతులూ, కాళ్ళూ బేడీలతో బంధించబడి ఉంటాయి. వారు తారు వస్త్రాలు ధరించి ఉంటారు. అగ్నిజ్వాలలు వారి ముఖాలను క్రమ్ముకొని ఉంటాయి. (ఇబ్రాహీమ్ : 49,50)

115వ అంశం : కొందరి మెడలలో విషసర్పాలు హారాలుగా వేయబడి ఉంటాయి.
వివరణ: హదీసు 166వ అంశం చూడండి.

ఇరుకైన, చీకటిగల అగ్ని గదులలోనికి నెట్టివేయబడే శిక్ష

116వ అంశం : నరకవాసులు చాలా ఇరుకైన చీకటి గదులలో బంధించబడి నెట్టబడతారు. అప్పుడు వారు చావు వస్తే బాగుండేది అని కోరుకుంటారు.

దానిలోని ఒక ఇరుకైన స్థలంలో వారు కాళ్ళూ, చేతులూ బంధించబడి క్రుక్కబడి నప్పుడు, చావును పిలవటం మొదలెడతారు. అప్పుడు వారితో, ‘ఈనాడు ఒక చావునేకాదు, అనేక చావులను పిలవండి’ అని పలకబడుతుంది. (అల్ ఫుర్ఖాన్:13,14)

వివరణ: ఈ వాక్యం గురించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను ప్రశ్నించినప్పుడు ప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు: ‘గోడలోనికి మేకు అతికష్టంగా వెళ్ళినట్లు నరకవాసులు బలవంతంగా ఇరుకైన చీకటి గదులలో క్రుక్కబడతారు. (ఇబ్నెకసీర్)

117వ అంశం: శూలం మొన కర్రలోనికి దింపినట్లు పాపాత్ముల్ని నరకంలో కుక్కబడుతుంది.

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు: “శూలాన్ని కర్రలోనికి అతికష్టంగా దించినట్లు అవిశ్వాసునికి నరకం చాలా ఇరుకుగా తయారవుతుంది. (షరుస్సున్నహ్)

ముఖాలను అగ్నిపై కాల్చే శిక్ష

118వ అంశం: నరకవాసులు ముఖాలు నరకంలో నిప్పుపై అటు ఇటు త్రిప్పి కాల్చబడతాయి.

వారి ముఖాలను నిప్పులపై అటూఇటూ త్రిప్పటం జరిగేనాడు వారు ఇలా అంటారు, “అయ్యో! మేము అల్లాహూ, దైవప్రవక్తకూ, విధేయత చూపి ఉంటే ఎంత బాగుండేది!” ఇంకా ఇలా అంటారు: ‘ఓ మా ప్రభూ! మేము మా నాయకులకూ, మా పెద్దలకూ విధేయత చూపాము. వారు మమ్మల్ని సన్మార్గం నుండి తప్పించారు. ఓ ప్రభూ! వారికి రెట్టింపు శిక్ష విధించు, ఇంకా వారిని తీవ్రంగా శపించు.” (అల్ అహ్ జాబ్:66-68)

119వ అంశం: దైవదూతలు అవిశ్వాసులను నిప్పుపై కాలుస్తారు. ఇంకా ఇలా అంటూ ఉంటారు. “దేన్నయితే ప్రపంచంలో కోరేవారో దాని రుచి చూడండి.”

అనుమానాల ఆధారంగా నిర్ణయం చేసేవారు నాశనమగుదురు గాక! వారు అజ్ఞానంలో కూరుకుపోయారు. మరియు ఏమరుపాటు మైకంలో పడివున్నారు.

‘అసలు ఆ తీర్పు దినం ఎప్పుడు వస్తుంది’ అని అడుగుతున్నారు. అది వారు అగ్నిలో దహించబడే రోజున వస్తుంది. ‘ఇక చవిచూడండి మీ అకృత్యాల రుచిని, మీరు తొందరపెడుతూ వచ్చిన విషయం ఇదే’ అని తెలుపబడుతుంది. (అజ్జారియాత్: 10-14)

120వ అంశం : అవిశ్వాసుల ముఖాలపై అగ్నిజ్వాలలు కురిపించ బడతాయి. ఆ రోజు నీవు దోషులను చూస్తావు. వారి చేతులూ, కాళ్ళు బేడీలతో బంధించ బడి ఉంటాయి. వారు తారు వస్త్రాలను ధరించి ఉంటారు. అగ్నిజ్వాలలు వారి ముఖాలను క్రమ్ముకుంటాయి. (ఇబ్రాహీమ్:49,50)

121వ అంశం: అవిశ్వాసులు తమ ముఖాలను అగ్ని నుండి రక్షించటానికి ప్రయత్నిస్తారు. కాని రక్షించలేరు.

ఈ అవిశ్వాసులకు ఆ సమయం గురించి కొద్దిగైనా తెలిసి ఉంటే ఎంత బాగుండేది! అప్పుడు వారు అగ్ని నుండి తమ ముఖాలను గానీ తమ వీపులను గాని కాపాడుకోలేరు. ఇంకా వారికి ఎక్కడ నుండీ సహాయమూ అందదు. (అల్ అంబియా: 39)

122వ అంశం:నరకంలో అవిశ్వాసులు అన్నిటికంటే ఘోరంగా ముఖాల ద్వారా శిక్షించబడతారు.

ఇక ప్రళయం నాడు శిక్ష యొక్క తీవ్రమైన దెబ్బను తన ముఖం మీద తినేవాడి దుస్థితిని గురించి నీవేమి అంచనా వేయగలవు? ఇటువంటి దుర్మార్గులతో, ‘ఇక మీరు సంపాదించిన దానిని రుచి చూడండి’ అని అనబడుతుంది. (అజ్జుమర్:24)

వివరణ: పాపాత్ములు శిక్షపడేటప్పుడు తమచేతులతో తమముఖాలను తప్పించే ప్రయత్నం చేస్తారు. కాని వారి చేతులు మెడకు కట్టి ఉంటాయి. అందువల్ల వారు చేతులను ఉపయోగించలేరు. ఈ కారణంగా వారి ముఖాలే కఠిన శిక్షకు గురవుతాయి.

విషపూరితమైన వడగాలి ద్వారా నల్లని పొగ ద్వారా శిక్షించుట

123వ అంశం: కొందరిని వేడి విష వాయువు ద్వారా నల్లని విషపొగ ద్వారా శిక్షించబడును.

వామపక్షంవారు, వామపక్షంవారి (దౌర్భాగ్యాన్ని) గురించి ఏమని చెప్పాలి. వారు వడగాలుల మధ్య, సలసలకాగే నీటిలో, నల్లని పొగల నీడలో ఉంటారు. అది చల్లగానూ ఉండదు, సుఖంగానూ ఉండదు. (అల్ వాఖిఅహ్:41-44)

వివరణ: నరకవాసులు నరక శిక్షను భరించలేక ఒక నీడ వెంట పరిగెడతారు. అక్కడికి చేరిన తర్వాత అది నీడ కాదని, అది నరకాగ్నియొక్క దట్టమైన పొగ అని తెలుస్తుంది. (తఫ్సీర్ అహ్సనుల్ బయాన్)

124వ అంశం: అవిశ్వాసులను నరకంలో కాల్చివేసే తీవ్రమైన వేడి గాలి ద్వారా శిక్షించబడును.

వారు “మేము మాకుటుంబం వారి మధ్య భయపడుతూ జీవితం గడిపేవారం. చివరకు అల్లాహ్ మాపై కరుణ చూపాడు. మమ్మల్ని తీవ్రమైన వడగాలి శిక్ష నుండి రక్షించాడు. (అత్తూర్:26, 27)

విపరీతమైన చలి శిక్ష

125వ అంశం: జమ్ హరీర్ నరకంలోని ఒక భాగం. అందులో నరకవాసులకు విపరీతమైన చలి ద్వారా శిక్షించబడును.

కనుక అల్లాహ్ వారిని ఆనాటి కీడు నుండి రక్షిస్తాడు. వారికి తాజాదనాన్ని, ఆనందాన్ని ప్రసాదిస్తాడు. వారిసహనానికి ప్రతిఫలంగా వారికి స్వర్గాన్ని, పట్టువస్త్రాలనూ ప్రసాదిస్తాడు. అక్కడవారు ఎత్తయిన పీఠాలపై దిండ్లకు ఆనుకొని కూర్చోని ఉంటారు. వారిని ఎండవేడి హింసించదు. చలి తీవ్రతా వేధించదు. (సూరా అద్దహ్ర్:11-13)

హజ్రత్ అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు: “ఎండ తీవ్రంగా ఉండే రోజు అల్లాహ్ (త’ఆలా) తన దృష్టిని, తన వినికిడినీ భూమ్యాకాశాల వైపు కేంద్రీకరించి ఉంచుతాడు. అప్పుడు ఎవరైనా దాసుడు, ‘లా ఇలాహ ఇల్లల్లాహ్ ఈనాడు ఎంత ఎండగా ఉంది. ఓ అల్లాహ్ నన్ను నరకాగ్ని నుండి కాపాడు’ అని ప్రార్థిస్తే అల్లాహ్ (త’ఆలా) నరకంతో ఇలా అంటాడు. ‘నా దాసుల్లోని ఒకదాసుడు నీ నుండి నా శరణు కోరాడు. నేను నిన్ను సాక్షిగా పెడుతున్నాను. నేను అతనికి శరణం ప్రసాదించాను.” అదే విధంగా తీవ్ర చలి రోజు వచ్చినప్పుడు అల్లాహ్ (త’ఆలా) తన దృష్టిని, తన వినికిడినీ భూమ్యాకాశాల వైపు కేంద్రీకరించి ఉంచుతాడు. అప్పుడు ఎవరైనా దాసుడు, ‘లా ఇలాహ ఇల్లల్లాహ్ ‘ ఈ వేళ చలి ఎంత తీవ్రంగా ఉంది. ఓ అల్లాహ్ ! నన్ను నరకంలోని జమ్హరీర్ యొక్క చలి నుండి రక్షించు’ అని ప్రార్థిస్తే అల్లాహ్(త’ఆలా) నరకంతో ఇలా అంటాడు. ‘నా దాసుడు నన్ను నీ జమ్ హరీర్ నుండి శరణు కోరుతున్నాడు. నేను నిన్ను సాక్షిగా పెడుతున్నాను. నేను అతనికి శరణమిస్తున్నాను. ‘అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సహచరులు ఇలా విన్నవించుకున్నారు: ఓ ప్రవక్తా! నరకంలోని జమ్హరీర్ అంటే ఏమిటి?’ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సమాధానమిచ్చారు: ‘అల్లాహ్ (త’ఆలా) అవిశ్వాసిని అందులో విసిరినప్పుడు దాని తీవ్ర చలికి అవిశ్వాసి దాన్ని గుర్తుపడ తాడు. చలి, వేడి రెండూ నరక శిక్షలే.” (బైహఖీ) (అన్నిహాయహ్: 2-307)

నరకంలో అవమానకరమైన శిక్ష

126వ అంశం : అవిశ్వాసులు నరకంలో అవమానపరచబడుదురు.

తరువాత ఈ అవిశ్వాసులను అగ్ని ముందుకు తీసుకు వచ్చి నిలబెట్టినప్పుడు, వారితో ఇలా అనటం జరుగుతుంది. ‘మీరు మీ వంతు వరాలను మీ ప్రాపంచిక జీవితంలో పొందారు. వాటి ద్వారా ఆనందాన్ని అక్కడే అనుభవించారు. ఇక ఏ హక్కు, అర్హతా లేకుండా మీరు భూమిపై ప్రదర్శిస్తూ ఉండిన దురహంకారానికి, మీ అవిధేయతా చేష్టలకు పర్యవసానంగా, ఈ రోజు మీకు అవమానకరమైన శిక్ష విధించబడుతుంది. (అల్ అహ్ ఖాఫ్: 20)

127వ అంశం: నరకవాసులు నరకంలో గాడిదల్లా అరుస్తూ ఉంటారు.

అక్కడ వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, అందులో వారికి ఏ శబ్దమూ వినిపించదు. (అల్ అంబియా: 100)

128వ అంశం: కొందరు అవిశ్వాసులను అవమానపరచటానికి వారి ముక్కు కాల్చబడుతుంది.

అతి త్వరలోనే మేము అతడి ముక్కు మీద వాతలు పెడతాము. (అల్ ఖలమ్ :16)

129వ అంశం: నరకవాసుల ముఖాలు నల్లగా ఉంటాయి.

ఈనాడు అల్లాహ్ కు అసత్యాన్ని అంటగట్టిన వారి ముఖాలు తీర్పుదినం నాడు నల్లగా మారిపోవటాన్ని నీవు చూస్తావు. నరకంలో అహంకారులకు సరిపోయే స్థలం లేదా? (అజ్జుమర్:60)

130వ అంశం: కొందరు అవిశ్వాసుల ముఖాలు దుమ్ముధూళితో నిండి వుంటాయి.

కొందరి ముఖాలు ఆ రోజున దుమ్మూధూళి పట్టి ఉంటాయి. వాటిపై నల్లని మసి ఆవరించి మాడిపోయి ఉంటాయి. వీరే సత్యతిరస్కారులు, దుర్మార్గులు. (అబస:40-42)

131వ అంశం: కొందరిని నుదుటి జుట్టు పట్టుకొని ఈడ్చుకుపోవటం జరుగుతుంది. ఎంతమాత్రం కాదు, అతడు గనుక మానుకోకపోతే మేము అతన్ని, అతని నుదుటి వెంట్రుకలు పట్టుకొని ఈడుస్తాము. అబద్ధానికి ఘోర పాపానికి పాల్పడిన నుదురు అది. (అల్ అలఖ్:15, 16)

132వ అంశం: నరకంలో కొందరిని తలక్రిందులుగా చేసి ఈడ్చడం జరుగుతుంది.
వివరణ: వాక్యం 135వ అంశం చూడండి.

నరకంలో దట్టమైన చీకట్ల ద్వారా శిక్ష

133వ అంశం : అవిశ్వాసులను నరకంలో వేయగానే దాని తలుపులు గట్టిగా మూయబడ తాయి. నరకవాసులు తరాలతరబడి దట్టమైన చీకట్లలో అగ్నిశిక్ష రుచి చూస్తూ ఉంటారు. ఒక్క వెలుగు కిరణమైనా కానరాదు.

మా వాక్యాలను తిరస్కరించినవారు వామపక్షానికి చెందినవారు వారిని అగ్ని చుట్టుముట్టి ఉంటుంది. (అల్ బలద్: 19,20)

ఆ నుజ్జునుజ్జు చేసే స్థలం ఏమిటో నీకుతెలుసా? అది తీవ్రంగా ప్రజ్వరిల్లజేయ బడిన దైవాగ్ని. అది గుండెల దాకా చొచ్చుకుపోతుంది. అందులో వారు పడిన తరువాత అది మూసివేయబడుతుంది. ఆ విధంగా వారు పొడుగాటి అగ్ని స్థంభాల మధ్య ఉంటారు. (అల్ హుమజహ్:5-9)

134వ అంశం: నరకాగ్ని తారు కన్నా దట్టమైన నలుపురంగులో ఉంటుంది. తన చేతిని కూడా పోల్చుకోలేని స్థితిలో ఉంటుంది.

హజ్రత్ అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు. ఆయన ఇలా అంటున్నారు: “మీరు నరకాగ్నిని ఇక్కడి అగ్నితో పోల్చుతున్నారా? (ఎంతమాత్రం కాదు) నరకాగ్ని అయితే తారుకన్నా నల్లగా ఉంటుంది. (మాలిక్) (కితాబుల్ జామి-బాబ్సఫతిజహన్నమ్)

వివరణ: గట్టిరోడ్లు వేయటానికి నల్లటి చిక్కని ద్రవపదార్ధాన్ని ఉపయోగిస్తారు. దీన్ని ఉర్దూలో ‘తార్కోల్, పంజాబీలో ‘లుక్’, ఇంగ్లీషులో ‘బిచుమెన్’, అరబీలో ‘ఖార్’, తెలుగులో ‘తారు’ అంటారు.

బోర్లాపడవేసి నడిపించటం, ఈడ్చుకుపోవటం జరుగుతుంది

135వ అంశం : దైవదూతలు అవిశ్వాసులను బోర్లాపడవేసి ఈడుస్తారు.

వారుబోర్లా పడవేయబడి, అగ్నిలోకి ఈడ్చబడే రోజున వారితో, “ఇప్పుడు చవి చూడండి నరకం తాకిడిని’ అని చెప్పబడుతుంది. (అల్ ఖమర్ :48)

136వ అంశం: కొందరు పాపాత్ములు సమాధి నుండే బోర్లా వేయబడి నరకంలో విసిరివేయబడతారు.

137వ అంశం: బోర్లా ఎత్తబడిన అవిశ్వాసులు, అంధులుగా, మూగవారుగా, చెవిటివారుగా ఉంటారు.

వారిని మేము తీర్పు దినంనాడు, గ్రుడ్డివారుగా, మూగవారుగా, చెవిటివారుగా చేసి బోర్లాపడవేసి ఈడ్చుకొస్తాము. వారి నివాసం నరకం. దాని మంట మందగించినప్పుడల్లా మేము దానిని మరింత మండింపజేస్తాము. (బనీ ఇస్రాయీల్:97)

138వ అంశం: కొందరు అవిశ్వాసులను దైవదూతలు గొలుసులతో బంధించి ఈడుస్తారు.

అప్పుడు వారి మెడలలో కంఠహారాలు ఉంటాయి. సంకెళ్ళు కూడాఉంటాయి. వాటితో వారు కాగే నీటి వైపునకు ఈడ్చబడతారు. తరువాత అగ్నిలోకి నెట్టబడతారు. (అల్ మూమిన్ :71,72)

139వ అంశం: అవిశ్వాసుని తలపై మరిగే నీటిని పోయటానికి దైవదూతలు వాడ్ని ఈడ్చుకుంటూ నరకం మధ్య భాగానికి పోతారు.

మీద మరిగే నీటిని పోయండి. అతన్ని పట్టుకోండి, నరకం మధ్యకు ఈడ్చుకుంటూ తీసుకు వెళ్ళండి. వాడి తల (అద్దుఖాన్:47,48)

140వ అంశం: కొందరిని నుదుటి వెంట్రుకలు పట్టుకొని, మరికొందరిని కాళ్ళు పట్టుకొని ఈడ్చడం జరుగుతుంది.

అక్కడ నేరస్తులు తమచిహ్నాలను బట్టి గుర్తించబడతారు. వారిని నుదుటి జుత్తు, కాళ్ళు పట్టుకొని ఈడ్చుకుపోవటం జరుగుతుంది. మీరు మీ ప్రభువు యొక్క ఏ ఏ శక్తి సామర్థ్యాలను తిరస్కరించగలరు? (అర్రహ్మాన్:41,42)

141వ అంశం: అబూజహల్ని దైవదూతలు నుదుటి జుట్టు పట్టుకొని నరకం లోనికి ఈడ్చుకుంటూపోతారు.

ఎంతమాత్రం కాదు, అతడు మానుకోకపోతే, మేము అతన్ని అతని నుదుటి వెంట్రుకలు పట్టుకొని ఈడుస్తాము. అబద్ధానికి, ఘోర పాపానికి పాల్పడిన నుదురు అది. (అల్ అలఖ్:15,16)

142వ అంశం: చూపుగోలు, ప్రతిష్టల కోసం ఆరాధించేవారిని బోర్లాపడవేసి నరకంలోనికి ఈడ్చబడుతుంది.
వివరణ: హదీసు 266వ అంశంలో ఉంది.

143వ అంశం : అవిశ్వాసులను అల్లాహ్ (త’ఆలా) ఇహలోకంలో కాళ్ళపైన నడిపించినట్లు, పరలోకంలో తలక్రిందులుగా నడిపించే శక్తి గలవాడు.

హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు: ఒక వ్యక్తి ఇలా విన్నవించు కున్నాడు: ‘ఓ ప్రవక్తా! తీర్పుదినం నాడు అవిశ్వాసిని తలక్రిందులుగా ఎలా లేపడం జరుగు తుంది? ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సమాధానమిచ్చారు: ‘ప్రపంచంలో కాళ్ళపై నడిపించేవాడు తీర్పు దినంనాడు వాడిని తలక్రిందులుగా నడిపించలేడా?’ హజ్రత్ ఖతాదా(రదియల్లాహు అన్హు) ఈ హదీసు ను విని ‘మా ప్రభువు గౌరవం సాక్షి! ఆయన సర్వశక్తులూ కలిగి ఉన్నాడు’ అని అన్నారు. (ముస్లిమ్) (కితాబు సిఫతిల్ మునాఫిఖీన్)

అగ్ని కొండపై ఎక్కించే శిక్ష

144వ అంశం: నరకంలో అవిశ్వాసులను అగ్ని కొండపై ఎక్కించి శిక్షించబడును.

నేను త్వరలోనే అతనిని దుర్గమమయిన స్థానంపైకి ఎక్కిస్తాను. (అల్ ముద్దస్సిర్:17)

145వ అంశం: ‘సఊద్’ నరకంలోని ఒక కొండ పేరు. దానిపైకి అవిశ్వాసి 70 సంవత్సరాల కాలంలో ఎక్కుతాడు. క్రిందపడతాడు. మళ్ళీ 70 సంవత్సరాల కాలంలో ఎక్కుతాడు. ఈ విధంగా నిరంతరం నరక శిక్షకు గురి అవుతాడు.

హజ్రత్ అబూసయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా బోధించారు: “నరకంలోని ఒక లోయ పేరు ‘లైల్’. అందులో విసిరివేయబడిన అవిశ్వాసి 40 సంవత్సరాల తరువాత దాని అడుగుకు చేరుతాడు. ఇంకా నరకంలో ‘సఊద్’ అనే పేరుగల ఒక కొండ ఉంది. దానిపైకి అవిశ్వాసి 70 సంవత్సరాల కాలంలో ఎక్కుతాడు. మళ్ళీ దిగుతాడు. అవిశ్వాసి నిర్విరామంగా ఎక్కి దిగటంలోనే నిమగ్నమయి ఉంటాడు.” (అబూయాలా) (అసరీగారి ముస్నద్ అబుయాలా:2-1378)

అగ్ని స్తంభాలకు బంధించే శిక్ష

146వ అంశం: కొందరు పాపాత్ములు నరకంలో అగ్నిస్తంభాలకు బంధించ బడతారు.

ఆ నుజ్జునుజ్జు చేసే స్థలం ఏమిటో నీకు తెలుసా? అది తీవ్రంగా ప్రజ్వరిల్ల జేయబడిన దైవాగ్ని. అది గుండెలదాకా చొచ్చుకుపోతుంది. అందులో వారు పడిన తరువాత అది మూసి వేయబడుతుంది. ఆ విధంగా వారు పొడుగాటి అగ్ని స్తంభాల మధ్య చిక్కుకొని ఉంటారు. (అల్ హుమజహ్:4-9)

147వ అంశం: కొందరు చాలా గట్టిగా బంధించబడతారు.

ఇక ఆ రోజున అల్లాహ్ శిక్షించినట్లు మరెవ్వరూ శిక్షించలేరు. ఇంకా అల్లాహ్ ఎలా బిగించి కట్టివేస్తాడో, అలా బిగించి మరెవ్వరూ కట్టలేరు. (అల్ ఫజ్ర్ :25,26)

నరకంలో ఇనుప గదలతో కొట్టే శిక్ష

148వ అంశం: నరకవాసులు ఇనుప గదలతో శిక్షించబడతారు.

వారిని దండించటానికి ఇనుప గదలు ఉంటాయి. వారు కంగారుపడి అక్కడి నుండి పారిపోయే ప్రయత్నం చేస్తే వారు మళ్ళీ అందులోనే నెట్టబడతారు. ‘ఇప్పుడు చవిచూడండి. దహన శిక్షను’ అని వారిని ఉద్దేశించబడుతుంది. (అల్ హజ్:21,22)

149వ అంశం: నరకంలో అవిశ్వాసులను శిక్షించే ఇనుప గదలు ఎంత బరువుగా ఉంటాయంటే, మానవులూ, జిన్నులూ కలసి ఒక్క గదను కూడా ఎత్తలేరు.

హజ్రత్ అబూసయీద్ ఖుద్రి (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉపదేశించారు: “ఒకవేళ నరకంలో అవిశ్వాసుల్ని శిక్షించే ఇనుప గదను భూమిపై పెట్టి మానవులూ, జిన్నులూ కలసి దాన్ని ఎత్తాలనుకున్నా ఎత్తలేరు. (అబూయాలా, సహీహ్) (ముస్నద్ అబుయాలా: 2-1384)

నరకంలో పాములు, తేళ్ళ ద్వారా శిక్ష

150వ అంశం: నరకంలోని పాములు ఒంటెల్లా ఉంటాయి. ఒకసారి కాటు వేస్తే దాని ప్రభావం 40 సంవత్సరాల వరకు ఉంటుంది.

151వ అంశం: నరకంలోని తేళ్ళు అడవి గాడిదల్లా ఉంటాయి. ఒకసారి కాటు వేస్తే 40 సంవత్సరాల వరకు దాని ప్రభావం ఉంటుంది.

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ హారిస్ బిన్ జజ్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా బోధించారు: “నరకంలోని పాములు ఒంటెల్లా ఉంటాయి. ఒకసారి కాటువేస్తే 40 సంవత్సరాల వరకు దాని ప్రభావం ఉంటుంది. నరకంలోని తేళ్ళు అడవి గాడిదల్లా ఉంటాయి. ఒకసారి కాటువేస్తే 40 సంవత్సరాల వరకు దాని ప్రభావం ఉంటుంది. (ముస్నద్ అహ్మద్) (ముస్నద్ అహ్మద్-సంపుటం-3, కితాబుల్ ఫితన్ హదీసు నం. 17864)

152వ అంశం: నరకంలో మహా విషపూరితమైన పాములు ఉంటాయి. ఇవి జకాత్ చెల్లించని వారి మెడలలో హారాలుగా వేయబడతాయి.

వివరణ: హదీసు 166వ అంశంలో ఉంది.

153వ అంశం: నరకవాసులు శిక్షను పెంచటానికి, నరక తేళ్ళ తోకలు ఖర్జూరం పళ్ళలా పెంచబడతాయి.

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మసాద్ (రదియల్లాహు అన్హు) ఇలా అంటున్నారు. అల్లాహ్ ఆదేశం: (మేము వారి శిక్షను ఇంకా అధికంగా పెంచుతాము.) (అన్ నహ్ల్:88)

దీని వివరణ ఇస్తూ, ‘నరకవాసులు శిక్షను పెంచటానికి తేళ్ళ తోకలను పొడవైన ఖర్జూరంలా పెంచటం జరుగుతుంది’ అని అన్నారు. (తిబ్రానీ) (మజ్మఉజ్జవాయిద్ 10వ సంపుటం)

శరీరాలను పెంచే శిక్ష

154వ అంశం : నరకంలో అవిశ్వాసి పన్ను ఉహుద్ కొండంత ఉంటుంది.

155వ అంశం: నరకంలో అవిశ్వాసి చర్మం మూడు రోజుల ప్రయాణ దూరమంత వెడల్పుగా ఉంటుంది.

హజ్రత్ అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా బోధించారు: ‘అవిశ్వాసి పన్ను లేదా దవడ ఉహుద్ కొండంత ఉంటుంది. వాడి చర్మం మూడు రోజుల ప్రయాణపు దూరమంత వెడల్పుగా ఉంటుంది. (ముస్లిమ్ కితాబుల్ జన్నహ్)

156వ అంశం : మరికొందరి దవడ ఉహుద్ కొండ కన్నా పెద్దదిగా ఉంటుంది. మిగతా శరీరమంతా దాని నిష్పత్తిలోనే పెరుగుతుంది.

హజ్రత్ అబూసయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉపదే శించారు. ‘నరకంలో అవిశ్వాసి శరీరాన్ని పెంచడం జరుగుతుంది. చివరికి వాడి దవడ ఉహద్ కొండకన్నా పెద్దదైపోతుంది.’ (ఇబ్నెమాజ, సహీహ్) ( కితాబుజ్జుహ్ద్ :2-3489)

157వ అంశం: నరకంలో అవిశ్వాసుని రెండు భుజాల మధ్య వేగగామి యొక్క మూడు రోజుల ప్రయాణమంత దూరం ఉంటుంది. దూరం ఉంటుంది.

హజ్రత్ అబూహురైరహ్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: ‘అవిశ్వాసుని రెండు భుజాల మధ్య వేగగామి యొక్క మూడు రోజుల ప్రయాణమంత (ముస్లిమ్) (కితాబుల్ జన్నహ్)

158వ అంశం: కొంతమంది అవిశ్వాసులు చెవులకు, భుజాలకు మధ్య 70 సంవత్సరాల ప్రయాణ దూరం ఉంటుంది. ఇంకా వారి శరీరంలో చీము, నెత్తుర్ల నదులు పారుతూ ఉంటాయి.

వివరణ: హదీసు 21వ అంశంలో ఉంది.

159వ అంశం: నరకంలో అవిశ్వాసి చర్మం 42 మూరల (63 అడుగుల) వెడల్పు ఉంటుంది. ఒక పన్ను ఉహుద్ కొండలా ఉంటుంది. మరియు కూర్చునే చోటు మక్కా మదీనాల మధ్య దూరమంత ఉంటుంది. (అంటే 410 కిలోమీటర్లు).

హజ్రత్ అబూ హురైరహ్(రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: ‘అవిశ్వాసి చర్మం 42 గజాల వెడల్పుగా ఉంటుంది. ఒక పన్ను ఉహద్ కొండంత ఉంటుంది. మరియు కూర్చునే చోటు మక్కా మదీనాల మధ్యదూరం అంత ఉంటుంది. (తిర్మిజి, సహీహ్) (అబ్వాబు సిఫతిల్ జహన్నమ్-2577)

160వ అంశం: నరకవాసులు ఒక చేయి ‘బైజాఅ’ కొండంత ఉంటుంది. ఇంకా వారి ఒక తొడ ‘వరన్’ కొండంత ఉంటుంది.

హజ్రత్ అబూహురైరహ్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా బోధించారు: ‘తీర్పు దినం నాడు అవిశ్వాసి దవడ ఉహద్ కొండంత ఉంటుంది. అతని చర్మం 70 మూరల (100 అడుగుల) వెడల్పుగా, అతని ఒక చేయి బైజాఅ కొండంత, అతని ఒక దవడ వర్లాఖాన్ కొండంత ఉంటుంది. అతని కూర్చునే చోటు నాకు రబహ్ ఊరికి ఎంత దూరమైతే ఉందో అంత పెద్దదిగా ఉంటుంది. (అహ్మద్, హాకిమ్, సహీహ్) (అల్బానీగారి సిల్సిలతుల్ అహదీసీస్సహీహహ్ – 1105)

వివరణ: వివిధ హదీసుల్లో వివిధ రకాలుగా వివరించటం జరిగింది. చర్మం వెడల్పు 42 మూరలు (60 అడుగులు), 70 మూరలు (100 అడుగులు) వివరించడం జరిగింది. ఈ బేధం వారి పాపాలకు తగినట్టుగా ఉంటుంది.

161వ అంశం : కొందరు అవిశ్వాసుల శరీరాలు ఎంత పెద్దగా ఉంటాయంటే సువిశాలమైన ప్రదేశంలో ఒక మూల ఉంచబడతాయి.

హజ్రత్ హారిస్ బిన్ అఖ్యష్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు: ‘నా అనుచర సంఘంలోని కొందరి శరీరాలు ఎంత అధికంగా పెంచబడ తాయంటే వారు నరకంలో ఒక మూల ఉన్న చోటే పడివుంటారు. (ఇబ్నెమాజ, సహీహ్} (కితాబుజ్జుహ్: 2-3490)

ఇతర శిక్షలు

162వ అంశం: అవిశ్వాసులు పాపాలకు, నేరాలకు అనుగుణంగా ఇంకా అనేక విధాలుగా శిక్షించబడుతుంది. వాటి గురించి ఖుర్ఆన్ లోనూ, హదీసులోనూ ప్రస్తావించబడలేదు.

ఇంకా ఇటువంటి చేదు శిక్షలనూ రుచిచూడాలి. (సాద్:58)

163వ అంశం : కొందరిని కఠినాతి కఠినంగా శిక్షించటం జరుగును.

తమ ప్రభువు వాక్యాలను తిరస్కరించిన వారికి వ్యధాభరితమైన కఠిన శిక్ష పడుతుంది. (అల్ జాసియహ్ : 11)

తిరస్కార వైఖరి అవలంభించిన వారి ఆధీనంలో సమస్త భూసంపద, ఇంకా అలాంటి సంపదే దానితోపాటు ఉండి, వారు గనుక ప్రళయ దినాన శిక్ష నుండి తప్పించుకోవటానికి ఆ మొత్తం సంపదను పరిహారంగా ఇవ్వదలచినా అది స్వీకరించబడదు. వారికి వ్యధాభరిత మైన శిక్ష పడుతుంది. (అల్ మాయిదహ్:36)

164వ అంశం కొందరికి చాలా పెద్ద శిక్షపడుతుంది.

ప్రవక్తా! నేడు అవిశ్వాస మార్గంలో చురుకుగా పాల్గొంటున్న వారి కార్యకలాపాలు నిన్ను దుఃఖానికి గురిచేయరాదు. వారు అల్లాహ్కు ఏ మాత్రం హాని కలిగించలేరు. పర లోకంలో వారికి ఏ భాగమూ ఇవ్వరాదనేదే అల్లాహ్ అభిమతం. చివరకు వారికి కఠిన శిక్షపడుతుంది (ఆలి ఇమ్రాన్: 176)

165వ అంశం : కొందరిని కఠినంగా శిక్షించటం జరుగుతుంది.

అల్లాహ్ ఆజ్ఞలను ధిక్కరించేవారికి కఠిన శిక్ష పడటం ఖాయం. (ఆలి ఇమ్రాన్ : 4)

నీచ కుట్రలు పన్నేవారికి కఠిన శిక్షపడుతుంది. (ఫాతిర్:10)

నరకంలోని కొన్ని నేరాలకు ప్రత్యేక శిక్షలు

166వ అంశం: జకాత్ చెల్లించని వారిని విషసర్పాల కాటుల ద్వారా శిక్షించబడు తుంది.

హజ్రత్ అబూహురైరహ్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు: “అల్లాహ్ ధనం ప్రసాదించిన వ్యక్తి తన ధనంలో నుండి జకాత్ చెల్లించకపోతే, ఆ ధనం తీర్పు దినాన విషసర్పం రూపు ధరిస్తుంది. దాని పడగపై రెండు నల్లటి చుక్కలుంటాయి. ఆ సర్పం అతని కంఠాన్ని భారమైన హారంలా చుట్టుకుంటుంది. నేను నీ ధనాన్ని, నీవు కూడబెట్టిన నిధిని అంటూ ఆ సర్పం అతని దవడల్ని గట్టిగా కరచుకుంటుంది.

ఆ తరువాత ఇలా పఠించారు: “ఎవరికైతే అల్లాహ్ తన అనుగ్రహాలను ప్రసాదించాడో వారు పిసినారులుగా ప్రవర్తిస్తే, తమ ఈ పిసినారితనం తమకు లాభం చేకూరుస్తుందనే అపోహలో పడి ఉన్నారేమో, కాదు అది వారికి ఎంతో హానికరంగా పరిణమిస్తుంది. వీరు కూడబెట్టినదంతా ప్రళయదినాన బరువైన కంఠహారంగా రూపొందుతుంది.” (ఆలి ఇమ్రాన్: 180)-(బుఖారీ, జకాత్ అధ్యాయం)

167వ అంశం : జకాత్ చెల్లించని వారి ధనాన్ని పలకలుగా మార్చి వాటిని నిప్పులో వేడిచేసి, వారి నుదుటిపై, వీపులపై, ప్రక్కలపై వాతలు పెట్టి శిక్షించడం జరుగుతుంది.

168వ అంశం : పశు సంపదలో జకాత్ చెల్లించని వారికి పశువుల ద్వారా కుమ్మించే శిక్ష పడుతుంది.

హజ్రత్ అబూహురైరహ్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉపదేశించారు: “ఒక వ్యక్తి వెండి, బంగారం కలిగి ఉండి వాటి జకాత్ చెల్లించకపోతే, తీర్పు దినం నాడు వాటిని పలకలుగా చేసి వాటిని నరకాగ్నిలో వేడి చేసి వాటితో అతని ప్రక్కలకూ, నుదుటిపై, వీపులకు వాతలు పెట్టబడును. రోజంతా ఇదే విధంగా జరుగుతూనే ఉంటుంది. ఆ దినం 50 వేల సంవత్సరాలకు సమానంగా ఉంటుంది. చివరికి మానవుల తీర్పులు సమాప్తమవు తాయి. వారు స్వర్గం లేదా నరకం దారిపడతారు. ప్రవక్త అనుచరులు ఇలా విన్నవించు కున్నారు. “ఓ ప్రవక్తా! మరి ఒంటెల సంగతి? అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: ‘ఒంటెలు ఉండి జకాత్ చెల్లించనివాడు, పేదలకు పెట్టనివాడు తీర్పుదినం నాడు విశాలమైన మైదానంలో బోర్లాపడి ఉంటాడు. ఆ ఒంటెలు చాలా ఆరోగ్యంగా ఉంటాయి. వాటిలో ఒక పిల్ల ఒంటే కూడా తక్కువగా ఉండదు. అవి అతన్ని తమ కాళ్ళతో కుమ్ముతూ ఉంటాయి. తమ నోటితో కరుస్తూ ఉంటాయి. మొదటి ఒంటె తన యజమానిని కుమ్మి వెళ్తుంది. రెండవది వస్తుంది- దినమంతా ఇదే విధంగా జరుగుతూ ఉంటుంది. అది 50 వేల సంవత్సరాల ఒక దినం అవుతుంది. చివరికి ప్రజల విచారణ ముగుస్తుంది. వారు స్వర్గనరకాల్లో తమ తమ స్థానాలలో వెళ్ళిపోతారు. ఇలా ప్రశ్నించబడింది: “ఓ ప్రవక్తా! ఆవులు మరియు మేకల విషయం ఏమిటి?’ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “వాటిని కలిగి ఉండి కూడా జకాత్ చెల్లించకపోతే తీర్పు దినం నాడు విశాలమైన మైదానంలో బోర్లాపడ వేయటం జరుగుతుంది. అవి ఏ మాత్రం తక్కువగా ఉండవు. (అన్నీ వస్తాయి) వాటిలో దేనికీ కొమ్ములు విరిగి ఉండవు. కొమ్ములు లేకుండా కూడా ఉండవు. విరిగినట్లు కూడా ఉండవు. అవి తమ కొమ్ములతో అతన్ని పొడుస్తూ ఉంటాయి. తమ కాళ్ళతో త్రొక్కుతూ ఉంటాయి. మొదటిది వెళ్తే రెండవది వస్తుంది. – అంటే నిరంతరం వస్తూనే ఉంటాయి. దినమంతా ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఆ దినము 50 వేల సంవత్సరాలకు సమానంగా ఉంటుంది. చివరికి దాసుల విచారణ ముగుస్తుంది. వారు స్వర్గంలోనో, నరకంలోనో తమ స్థానాల్లోకి వెళ్ళిపోతారు. (ముస్లిమ్ కితాబుజ్జకాత్)

169వ అంశం : అకారణంగా ఉపవాసం ఉండని వారి నోటిని సాగ దీసే శిక్ష.

హజ్రత్ అబూ ఉమామహ్(రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు: నేను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అంటూ ఉండగా విన్నాను. ‘నేను పడుకొని ఉన్నాను. నా వద్దకు ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వారు నా భుజాలను పట్టుకున్నారు. ఒక ఎత్తయిన కొండ వద్దకు తీసుకొని వచ్చారు. ఇద్దరూ ఇలా అన్నారు. “ఈ కొండపైకి ఎక్కుదామా? నేను ఎక్కలేను అని నేనన్నాను. వారిలా అన్నారు: ‘మేము మీ కొరకు సౌకర్యం ఏర్పాటు చేస్తాం. వెంటనే నేను ఎక్కాను. చివరికి నేను దాని శిఖరాన్ని చేరుకున్నాను. అక్కడ నేను మహా కేకలు అరుపులు విన్నాను. నేనిలా ప్రశ్నించాను. ‘ఈ శబ్దాలు ఎక్కడి నుండి వస్తున్నాయి?” ఇవి నరక వాసుల కేకలు, అరుపులు అని వారన్నారు. ఆ తరువాత వారు నా వెంట ముందుకు సాగారు. అక్కడ కొందరిని తల క్రిందులుగా వ్రేలాడబడి ఉండటాన్ని చూశాను. వాళ్ళ నోర్లు సాగదీయబడి వాటి నుండి రక్తం కారుతూ ఉంది. నేనిలా ప్రశ్నించాను; ‘వీరెవరు?’ వారిలా సమాధానమిచ్చారు: ‘వీరు ఉపవాసంలో సమయానికి ముందే తినేవారు.” (ఇబ్నె ఖుజైమహ్, ఇబ్నె హిబ్బాన్, సహీహ్) (అల్పానీగారి సహీ తగ్గీబ్ వత్తర్హిబ్ -995)

170వ అంశం: ధార్మిక విద్యను దాచిపెట్టే వారికి నరకంలో నిప్పు కళ్ళెం వేయబడుతుంది.

హజ్రత్ అబూహురైరహ్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉపదేశిం చారు: “ధార్మిక విషయాల్ని గురించి ప్రశ్నించబడి, తెలిసి ఉండి సమాధానం ఇవ్వక పోయిన వ్యక్తికి తీర్పు దినం నాడు అగ్ని కళ్ళెం వేయబడుతుంది.” (తిర్మిజి, సహీహ్) (అబ్వాబుల్ ఇల్మీ: 2-2135)

171వ అంశం : ద్వంద్వ స్వభావం కలిగివున్న వ్యక్తి నోట్లో తీర్పుదినం నాడు రెండు నిప్పు నాలుకలు వెలుస్తాయి.

హజ్రత్ అమ్మార్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సావధానపరిచారు: “ఏ వ్యక్తి ప్రపంచంలో ద్వంద్వ స్వభావం కలిగి ఉంటాడో ప్రళయదినాన అతని నోటిలో రెండు నిప్పు నాలుకలు వెలుస్తాయి.” (అబూదావూద్) (కితాబుల్ అదబ్: 3-4078)

172వ అంశం: వదంతుల్ని వ్యాపింపజేసే వారికి దవడలు, ముక్కులు, కళ్ళు తల వెనుకభాగం వరకు చీల్చే శిక్ష పడుతుంది.

173వ అంశం: వ్యభిచార స్త్రీ, పురుషులకు నగ్నంగా ఒకే అగ్ని గుండంలో కాలే శిక్ష పడుతుంది.

174వ అంశం: వడ్డీ తినే వారికి రక్తపు నదుల్లో ఈదే, రాళ్ళను మ్రింగే శిక్ష పడుతుంది.

హజ్రత్ సమురహ్ బిన్ జున్ దుబ్ (రదియల్లాహు అన్హు) ఒక హదీసులో ఇలా ఉల్లేఖిస్తున్నారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా హెచ్చరించారు: “కలలో నేను ప్రశ్నించగా హజ్రత్ జిబ్రాయీల్ (అలైహిస్సలాం) , హజ్రత్ మీకాయీల్ (అలైహిస్సలాం) నాకు ఇలా తెలియజేశారు. (మీకు చూపెట్టిన సంఘటనల్లో) అందరికంటే ముందు మీరు చూసిన దవడలు, ముక్కు రంధ్రాలు, కళ్ళు, తల వెనుక భాగం వరకు చీల్చబడుతున్న ఆ వ్యక్తి ఉదయం తన ఇంటి నుండి బయలుదేరి వదంతుల్ని వ్యాపింపజేసే వాడు. ఇంకా ఆ అగ్ని గుండంలో కాలుతున్న నగ్న స్త్రీ పురుషులు వారు వ్యభిచారానికి పాల్పడేవారు, ఇంకా ఆ రక్తపు నదిలో ఈదుతున్న, ఇంకా నిరంతరం నోట్లో రాళ్ళు వేయబడు తున్న ఆ వ్యక్తి ఇహలోకంలో వడ్డీ తినేవాడు.” (బుఖారి) (కితాబుత్తాబీర్)

175వ అంశం: శవంపై అరుపులు పెడబొబ్బలు పెట్టే స్త్రీ లేదా పురుషులు తీర్పుదినం నాడు గంధకం పైజామా, గజ్జి కుర్తా ధరిస్తారు.

హజ్రత్ అబూమాలిక్ అష్ అరీ(రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా హెచ్చరిం చారు: “నా అనుచర సంఘం అజ్ఞాన కాలం నాటి నాలుగు ఆచారాలను అనుసరిస్తుంది. 1. తన వంశం పట్ల గర్వం చూపుట. 2. ఇతరుల వంశం పట్ల హీనదృష్టి కలిగి ఉండటం. 3. గ్రహాల ద్వారా వర్షాన్ని కోరుట. 4. శవాలపై బయ్యిన్ చేయుట.

ఇంకా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా హెచ్చరించారు: ‘బయ్యిన్ చేసే స్త్రీ మరణానికి ముందు పశ్చాత్తాపం చెందకపోతే, తీర్పుదినం నాడు ఆమె నిలబడి, గంధకం పైజామా గజ్జి కుర్తా ధరిస్తుంది. (ముస్లిమ్) (కితాబుల్ జనాయిజ్)

176వ అంశం: ఖుర్ఆన్ని కంఠస్తం చేసి మరచిపోయేవాడికి, ఇషా నమాజు చదవకుండా పడుకునేవాడికి, నరకంలో నిరంతరం రాళ్ళ ద్వారా తల పగలగొట్టే శిక్ష పడుతుంది.

హజ్రత్ సమురహ్ బిన్ జున్ దుబ్ (రదియల్లాహు అన్హు) కలల హదీసులో ఇలా ఉల్లేఖిస్తున్నారు. కలలో నేనడిగిన దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు: “హజ్రత్ జిబ్రయీల్ (అలైహిస్సలాం) , హజ్రత్ మీకాయీల్(అలైహిస్సలాం) నాతో ఇలా అన్నారు: “తమకు చూపెట్టిన దృశ్యాలలో మొట్టమొదట తమరు చూసిన బండరాయి ద్వారా తలపగలగొట్టబడుతున్న వ్యక్తి ఇహలోకంలో ఖుర్ఆన్ కంఠస్తం చేసి మళ్ళీ మరచిపోయాడు. ఇంకా ఇషా నమాజు చదవకుండా పడుకునేవాడు. (బుఖారి) (కితాబుత్తావీర్)

వివరణ: హదీసులో ఇలా కూడా వివరించబడింది. దైవదూత మనిషి తలపై రాతితో కొడితే, తల పగిలిన తరువాత రాయి దూరం పోయి పడుతుంది. దైవదూత ఆ రాయిని తీసుకొని వచ్చేసరికి ఆ తల తన మొదటి స్థితిలో ఉంటుంది. ఈ విధంగా నిరంతరం శిక్షించటం జరుగుతుంది.

177వ అంశం: ఇతరులకు మంచిని బోధిస్తూ, చెడు నుండి వారిస్తూ, తాము మాత్రం ఆచరించకుండా ఉన్న వారికి నరకంలో శిక్ష పడుతుంది.

హజ్రత్ ఉసామా(రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అంటూ ఉండగా నేను విన్నాను. తీర్పుదినం నాడు ఒక వ్యక్తి అగ్నిలో వేయబడుతాడు. అతని ప్రేగులు బయటపడి అగ్నిలో ఉంటాయి. అతను తన ప్రేగులను తీసుకొని గానుగలో గాడిద తిరిగినట్లు తిరుగు తుంటాడు. ఇతర నరకవాసులు అతని చుట్టూ గుమిగూడి, “నీకు ఈ గతి పట్టిందేమిటి? నీవు ప్రపంచంలో మాకు సత్కార్యాలను ఉపదేశించి దుష్కార్యాల నుండి వారించేవాడివి కదా! అని ప్రశ్నిస్తారు. అతడు యధార్థాన్ని తెలుపుతూ, నేను మీకు మంచిని బోధించేవాడ్ని, కాని నేను మాత్రం వాటిని ఆచరించే వాడిని కాను. మిమ్మల్ని చెడు నుండి వారించేవాడ్ని కానీ స్వయంగా నేనే చెడుకు పాల్పడేవాడిని” అని అంటాడు. (బుఖారి) (కితాబు బద్ అల్ ఖల్క్)

178వ అంశం:ఆత్మహత్య చేసుకున్నవాడు, ఏ విధంగా ఆత్మహత్య చేసుకున్నాడో, నరకంలో కూడా నిరంతరం అదే స్థితిలో ఉంటాడు.

హజ్రత్ అబూహురైరహ్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉపదేశించారు. “ఎవరు తన్ను తాను పీక పిసికి ఆత్మహత్య చేసుకుంటే, వాడు నరకంలో కూడా తన పీక పీసు క్కుంటూ ఉంటాడు. ఇంకా ఎవరు తన్ను తాను ఆయుధాల ద్వారా చంపుకుంటే, నరకంలో కూడా అదే విధంగా తన్ను తాను చంపుకుంటూ ఉంటాడు. (బుఖారి) (కితాబుల్ జనాయిజ్)

179వ అంశం: మద్యం సేవించేవారు నరకంలో నరకవాసుల దుర్వాసన గల చెమట త్రాగుతారు.
వివరణ: హదీసు 90వ అంశం చూడండి.

180వ అంశం: చూపుగోలు కోసం ఆరాధించే వారిని బోర్లాపడవేసి నరకంలోనికి ఈడ్చుకు పోవడం జరుగుతుంది.
వివరణ: హదీసు 266వ అంశం చూడండి.

181వ అంశం : పరోక్ష నిందకు పాల్పడినవారు నరకంలో తమ గోళ్ళద్వారా, తమ ముఖాల గుండెల మాంసాన్ని పీకుతూ ఉంటారు.

హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా హెచ్చరించారు: ‘మేరాజ్లో నేను కొందరిని చూశాను. వాళ్ళు ఎర్రని రాగి గోళ్ళు కలిగి ఉన్నారు. వాటితో తమ ముఖాన్ని, ఛాతిని పీకుతూ ఉన్నారు. నేనిలా ప్రశ్నించాను: ‘ఓ జిబ్రయీల్ వీరెవరు?’ జిబ్రయీల్ ఇలా అన్నారు. ‘వీరు ఇతరుల మాంసాన్ని తినేవారు. (అంటే పరోక్ష నిందకు పాల్పడేవారు) ఇంకా వారి గౌరవాన్ని మంట కలిపేవారు. (అబూదావూద్)(కితాబుల్ అదబ్: 3-4082)

నరకవాసుల గురించి ఖుర్ఆన్ వ్యాఖ్యలు

182వ అంశం: తీర్పుదినాన్ని విశ్వసించని వారిని ఖుర్ఆన్ ఇహలోకంలో గౌరవనీయులుగా పేర్కొంది.

అతనిని పట్టుకోండి, నరకం మధ్యకు ఈడ్చుకుంటూ తీసుకు వెళ్ళండి. వాడి తల మీద సలసల కాగే నీటిని పొర్లించండి. నీవు గొప్ప బలవంతుడవూ, గౌరవనీయుడవూ అయిన మనిషివి. మీరు ఏ విషయం గురించి సందేహించేవారో, ఆ విషయం ఇదే. (అద్దుఖాన్: 47-50)

183వ అంశం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను మాంత్రికుడని ఇస్లాం సందేశాన్ని తిరస్కరించిన వారిని నరకంలోనికి ఈడ్చుకుంటూపోతూ ఎత్తి పొడవటం జరుగుతుంది.

ఆ రోజున వారిని కొట్టుతూ, నెట్టుతూ నరకం వైపునకు ఈడ్చుకుపోవటం జరుగు తుంది. అప్పుడు వారితో ఇలా అనబడుతుంది. ‘మీరు తిరస్కరిస్తూ ఉండిన నరకాగ్ని ఇదే, ఇప్పుడు చెప్పండి. ఇది మంత్రజాలమా? లేక మీకేమీ కనిపించటం లేదా? ఇక వెళ్ళండి. అందులో కాలుతూ ఉండండి. మీరు సహించినా, సహించకపోయినా ఒక్కటే. మీ కర్మల ప్రకారమే మీకు ప్రతిఫలం ఇవ్వబడుతుంది.” (అత్తూర్:13-16)

184వ అంశం: అవిశ్వాసులను అగ్నిపై శిక్షిస్తూ నరకదూతలు హేళనగా ప్రవర్తిస్తూ ఉంటారు.

ఊహ, అనుమానాల ఆధారంగా నిర్ణయం చేసేవారు నాశనమగుదురు గాక! వారు అజ్ఞానంలో కూరుకుపోయారు. మరియు ఏమరుపాటు మైకంలో పడివున్నారు. అసలు తీర్పు దినం ఎప్పుడు వస్తుంది? అని అడుగుతున్నారు. అది వారు అగ్నిలో దహింపజేయబడే రోజున వస్తుంది. ఇక చవిచూడండి. మీ ఆగడాల రుచిని, మీరు తొందరపెడుతూ ఉన్న విషయం ఇదే. (అజ్జారియాత్:10-14)

185వ అంశం: నరకం వైపు తీసుకొని పోతూ నరకదూతలు వారిని కించపరుస్తూ ఉంటారు.

దుర్మార్గులనూ, వారి సహచరులనూ, అల్లాహు కాదని వారు ఆరాధిస్తూ ఉండిన దైవాలనూ చుట్టుముట్టి తీసుకురండి. తరువాత వారందరికీ నరకానికి దారి చూపండి. కాస్త వారిని ఆపండి, ఒక విషయం అడగాలి. “ఏమయింది మీరు ఇప్పుడెందుకని ఒకరికొకరు సహాయం చేసుకోరు? అరే, ఈ రోజు వారు తమను తాము అప్పగిస్తున్నారేమిటి? ఆ తరువాత వారు ఒకరి వైపునకు మరొకరు తిరిగి పరస్పరం వాదించుకుంటారు. (అస్సాప్పాత్ 22-26)

నరకంలో మార్గభ్రష్టులైన పండితులు, స్వాములు, అనుచరుల పరస్పర కలహాలు

186వ అంశం : మార్గభ్రష్టతకు గురిచేసిన పండితులను, స్వాములను, ఫకీర్లను వారి అనుచరులు నరకంలో ఇలా అంటారు: ‘ఇప్పుడు మా శిక్షను కొంచమైనా తగ్గించండి.’ అప్పుడు వారు ఇలా సమాధాన మిస్తారు: ‘ఇక్కడ మనమంతా సమానమే. మీకు దేనికీ పనికిరాము.’

ఇంకా, వారు నరకంలో పరస్పరం కలహించుకునే సందర్భం గురించి ఆలోచించు. ప్రపంచంలో బలహీనులుగా ఉన్నవారు, పెద్దమనుషులుగా చెలామణి అయినవారితో ఇలా అంటారు: ‘మేము మిమ్మల్ని అనుసరిస్తూ ఉండేవారము. ఇప్పుడు మీరు ఇక్కడ నరకాగ్ని నుండి కొంతైనా మమ్మల్ని కాపాడుతారా?’ ఆపెద్ద మనుషులు ఇలా జవాబు ఇస్తారు. ‘ఇక్కడ మనమంతా ఒకే స్థితిలో ఉన్నాము. అల్లాహ్ దాసుల మధ్య తీర్పుచేసి వేశాడు. ‘ (అల్ మూమిన్ : 47, 48)

187వ అంశం : స్వాములు నరకంలోనికి వెళ్తూ తమ అనుచరులను చూసి, ‘దౌర్భాగ్య అనుచరులు కూడా నరకంలోనికే వెళ్తారు’ అని అంటారు. అను చరులు స్వాముల మాటలు విని అసహ్యించుకుంటూ ఇలా సమాధానమిస్తారు: ‘దౌర్భాగ్యులారా! మీరు కూడా నరకంలోనికే వెళ్తున్నారు.’ ‘ఓ అల్లాహ్! మమ్మల్ని నరకంలోనికి పంపినవారిని కఠినంగా శిక్షించు.’

“ఇది ఒక సైన్యం, మీ వైపునకు తోసుకుంటూ వస్తోంది. వారికి స్వాగతం పలకటం అనేది లేదు. వారు అగ్నిలో కాలేవాళ్ళు. వారు వీరితో ఇలా అంటారు: ‘లేదు, స్వయంగా మీరే కాల్చబడుతున్నారు. మీకు ఏ స్వాగతమూ లేదు. ఈ పర్యవసానాన్ని మాముందుకు తెచ్చింది మీరే కదా! ఎంత పాపిష్టి నివాస స్థలం ఇది. వారు ఇంకా ఇలా అంటారు: ‘మా ప్రభూ! మమ్మల్ని ఈ నరకానికి చేరవేసిన వారికి రెట్టింపు శిక్షను విధించు.” (సాద్ : 59-61)

188వ అంశం : అనుచరులు తమ నాయకులను, స్వాములను శపించమని, రెట్టింపు శిక్ష విధించమని అల్లాహు విన్నవించుకుంటారు.

వారి ముఖాలను నిప్పులపై అటూఇటూ త్రిప్పటం జరిగేనాడు వారు ఇలా అంటారు: ‘అయ్యో! మేము అల్లాహూ, దైవప్రవక్తకూ, విధేయత చూపి ఉంటే ఎంత బాగుండేది!’ ఇంకా ఇలా అంటారు: ఓ మా ప్రభూ! మేము మా నాయకులకూ, మా పెద్దలకూ విధేయత చూపాము. వారు మమ్మల్ని రుజుమార్గం నుండి తప్పించారు. ఓ మా ప్రభూ! వారికి రెట్టింపు శిక్షను విధించు, వారిని తీవ్రంగా శపించు.” (అల్ అహ్ జాబ్: 66-68)

189వ అంశం: నరకంలోనికి చేరిన తరువాత మార్గభ్రష్టతకు గురయిన పండితులు వారి అనుచరులు పరస్పరం వాదించుకుంటారు.

ఆ తరువాత వారు ఒకరి వైపునకు మరొకరు తిరిగి పరస్పరం వాదించుకోవటం ప్రారంభిస్తారు. ‘మీరు మా వద్దకు కుడి వైపు నుండి వచ్చేవారు.” వారు సమాధానం ఇస్తారు: ‘అది కాదు, అసలు మీరే విశ్వసించే వారుకారు, మీ మీద మాకు అధికారం లేదు, మీరు సహజంగానే తల బిరుసుతనం గలవాళ్ళు. చివరకు మీరు తప్పకుండా యాతన చవిచూస్తారు.’ అనే మా ప్రభువు మాటకు మేము అర్హులమైపోయాము. కనుక మేము మిమ్మల్ని మార్గ భ్రష్టులుగా చేశాము. స్వయంగా మేము కూడా మార్గభ్రష్టులమయ్యే ఉన్నాము. ఈ విధంగా వారందరూ ఆ రోజు ఉమ్మడిగా శిక్ష అనుభవిస్తారు. (అస్సాప్పాత్ : 27-33)

190వ అంశం : నరకంలో విగ్రహారాధకులు తమ నాయకులను, ‘మమ్మల్ని మోసం చేశారు’ అని ఆరోపిస్తారు. అయితే నాయకులు మాకేమీ సంబంధం లేదని దులుపుకుంటారు.

ఈ దుర్మార్గులు తమ ప్రభువు సమక్షంలో నిలబడినప్పటి స్థితిని నీవు చూస్తే ఎంత బాగుండును! అప్పుడు వారు పరస్పరం నిందించుకుంటూ ఉంటారు. ప్రపంచంలో అణగ ద్రొక్కబడినవారు తమ పెద్దలతో, ‘మీరు లేకపోయినట్లయితే మేము విశ్వాసులమై ఉండే వారము’ అని అంటారు. ఆ పెద్దలు వీరికి ఇలా సమాధానమిస్తారు: ‘మీ వద్దకు వచ్చిన సన్మార్గాన్ని అవలంబించకుండా మేము మిమ్మల్ని నిరోధించామా? లేదు. మీరు స్వయంగా అపరాధులు. అప్పుడు వారు తమ పెద్దలతో ఇలా అంటారు. ‘కాదు, ఇది మీరు రాత్రింపగలు పన్నిన కుట్ర. అల్లాహ్ ను తిరస్కరించండి అని ఇతరులను ఆయనకు సహవర్తులుగా చెయ్యండి అని మీరు మాకు బోధించారు.’ చివరకు వారు శిక్షను చూసినప్పుడు, తమ మనస్సు లలో పశ్చాత్తాపపడతారు. మేము ఈ అవిశ్వాసులు మెడలకు గుదిబండలు వేస్తాము. ప్రజలకు వారి కర్మలు ఎలాంటివో అలాంటి ప్రతిఫలమే దొరుకుతుంది. దానికి భిన్నమైన ప్రతిఫలాన్ని వారికి ఇవ్వటం సాధ్యమా?” (సబా : 31-33)

191వ అంశం : నరకంలో అనుచరులు తమ స్వాములతో, రుషులతో ‘మమ్మల్ని అల్లాహ్ శిక్ష నుండి రక్షించండి’ అని విన్నవించుకుంటారు. సమాధానంగా వారు, ‘ఇక్కడ అల్లాహ్ శిక్ష నుండి రక్షించేవాడెవడూ లేడు’ అని అంటారు.

ప్రజలందరినీ కలిపి అల్లాహ్ ముందు హాజరుపరచినప్పుడు, వారిలో ప్రపంచంలోని బలహీనులు, పెద్ద మనుషులతో ఇలా అంటారు: ‘ప్రపంచంలో మేము మిమ్మల్ని అనుసరిం చాము. ఇప్పుడు అల్లాహ్ శిక్ష నుండి మమ్మల్ని కాపాడటానికి మీరేమైనా చెయ్యగలరా?’ వారు ఇలా సమాధానం ఇస్తారు: ‘అల్లాహ్ మాకు సన్మార్గాన్ని చూపి ఉండినట్లయితే మేము తప్పకుండా మీకు చూపి ఉండేవారము. ఇప్పుడు మనము ఏడ్చి మొత్తుకున్నా, ఓర్పు వహించినా రెండు ఒకటే. ఏది ఏమైనా, మనం తప్పించుకునే మార్గం ఏదీలేదు.” (ఇబ్రాహీమ్ : 21)

గుణపాఠం నేర్పే సంభాషణలు

192వ అంశం : నరకపాలకులు: ‘మీ వద్దకు అల్లాహ్ ప్రవక్త రాలేదా?’

అవిశ్వాసులు: ‘వచ్చారు కానీ, మేమే నరకమార్గాన్ని అనుసరించాము.’
నరకపాలకులు: ‘అయితే ఈ ద్వారాలగుండా ప్రవేశించి నరకంలోనికి విచ్చేయండి.

ఈ తీర్పు తరువాత సత్యాన్ని తిరస్కరించినవారు, నరకం వైపునకు గుంపులు, గుంపులుగా తోలబడతారు. చివరకు వారు అక్కడికి చేరినప్పుడు దాని ద్వారాలు తెరువబడ తాయి. దాని పాలకులు వారితో ఇలా అంటారు: ‘స్వయంగా మీలో నుండే, మీకు, మీ ప్రభువు వాక్యాలను వినిపించి, మీరు ఈ దినాన్ని చూడవలసి వస్తుందని, మిమ్మల్ని హెచ్చరిం చిన ప్రవక్తలు మీవద్దకు రాలేదా?’ వారు, ‘అవును, వచ్చారు, కాని శిక్షా నిర్ణయం అవిశ్వాసులు విషయంలో తేలిపొయింది’ అని సమాధానం ఇస్తారు. అప్పుడు ఇలా ఆదేశించబడుతుంది: ‘నరక ద్వారాలలో ప్రవేశించండి. ఇక్కడ మీరు శాశ్వతంగా ఉండవలసి ఉంది. ఇది అహంకారుల మహా చెడ్డనివాసం.’ (అజ్జుమర్:71)

193వ అంశం : నరకపాలకులు: “మీ వద్దకు హెచ్చరించే వారెవరూ రాలేదా?”

అవిశ్వాసులు: “వచ్చారు కాని, మేము అతన్ని తిరస్కరించాము, మేము అతని మాట శ్రద్ధగా విని ఉంటే నరకం నుండి రక్షణ పొందేవారం.”

నరకపాలకులు: “నాశనమవ్వండి. ఇప్పుడు తప్పు ఒప్పుకున్నా ఏం లాభం?”

ఏదైనా ఒక గుంపు అందులో వేసిన ప్రతిసారీ, దాని పాలకులు, ‘మీ వద్దకు హెచ్చరించే వారు రాలేదా?’ అని వారిని అడుగుతారు. దానికి వారు ఇలా సమాధానం ఇస్తారు: “హెచ్చ రించేవారు మా వద్దకు వచ్చారు. కానీ మేము అతన్ని తిరస్కరించాము. అల్లాహ్ దేన్నీ అవతరించలేదు, నీవు వక్రమార్గానికి గురయ్యావని మేము అతనితో అనేవారము. ‘ ఇంకా వారు ఇలా అంటారు: “అయ్యో! మేమే గనుక విని ఉంటే, లేదా గ్రహించి ఉంటే, ఈనాడు ఇలా మండే నరకాగ్ని శిక్షకు గురియై ఉండేవారము కాదు కదా! ” ఈ విధంగా వారు స్వయంగా తమ తప్పును ఒప్పుకుంటారు. ఈ నరక వాసులు నాశనమవుదురుగాక! (అల్ ముల్క్:8-11)

194వ అంశం: నరకపాలకులు: “మీ కష్టాలను, నష్టాలను దూరం చేసేవారేరి?”

అవిశ్వాసులు: “విచారకరం! వాళ్ళు కష్టాలను, నష్టాలను దూరం చేస్తారనేది భ్రమని తేలిపోయింది.”

అప్పుడు వారి మెడలలో హారాలు ఉంటాయి. సంకెళ్ళు కూడా ఉంటాయి. వాటితో వారు కాగే నీటి వైపునకు ఈడ్చబడతారు. తరువాత నరకాగ్నిలోకి నెట్టబడతారు. అప్పుడు వారిని ఇలా అడగటం జరుగుతుంది: “అల్లాహ్ ను కాదని మీరు అల్లాహ్ కు భాగస్వాములుగా నిలబెట్టిన దేవుళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు?” వారు ఇలా సమాధానం చెబుతారు: “వారు మా నుండి విడిపోయారు. దీనికి పూర్వం మేము అసలు దేనిని ప్రార్థించే వారము కాదు అన్నట్లు. ఈ విధంగా అల్లాహ్ అవిశ్వాసులు ఎలా మార్గభ్రష్టులయిందీ చూపిస్తాడు. (అల్ మూమిన్:71-74)

195వ అంశం : అవిశ్వాసులు తమ చెవులు, కళ్ళు, చర్మం పట్ల ‘మీరెందుకు సాక్ష్యం ఇచ్చారు’ అని ఆగ్రహం వ్యక్తం చేస్తారు.

అవి, “మమ్మల్ని సృష్టించిన వాడే మాకు మాట్లాడే శక్తి నిచ్చాడని అందుకే మేము సాక్ష్యం ఇచ్చామని చెబుతాయి.’

అల్లాహ్ యొక్క ఈ శత్రువులు నరకం వైపునకు పంపబడటానికి సమీక రించబడే సమయాన్ని గురించి కొంచెం ఆలోచించు, వారి పూర్వీకులను, వారి తరాల వారు వచ్చే వరకు ఆపటం జరుగుతుంది. తరువాత అందరూ అక్కడకు చేరినప్పుడు, వారి చెవులూ, వారి కళ్ళు, వారి శరీర చర్మాలూ వారు ప్రపంచంలో చేస్తూ ఉన్న దానిని గురించి సాక్ష్య మిస్తాయి. అప్పుడు వారుతమ శరీర చర్మాలను, ‘మీరు మాకు వ్యతిరేకంగా ఎందుకు సాక్ష్యం చెప్పారు?’ అని అడుగుతారు. అవి ఇలా సమాధానం చెబుతాయి: “ప్రతి వస్తువుకూ మాట్లాడే శక్తిని ఇచ్చిన అల్లాహ్ యే మాకు మాట్లాడే శక్తినిచ్చాడు. ఆయనే మిమ్మల్ని మొదట సృష్టించాడు, ఇప్పుడు ఆయన వైపునకే మీరు మరల్చబడుతున్నారు. (హామీమ్ అస్సజ్హ్ :19-21)

196వ అంశం : స్వర్గవాసులు (నరకవాసులతో): “అల్లాహ్ (త’ఆలా) మాతో చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చాడు. మీతో చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చ బడ్డాయా?”

నరకవాసులు: ‘అవును, మాతో చేసిన వాగ్దానాలన్నీ పూర్తయ్యాయి. ‘

నరకపాలకులు: “తీర్పు దినాన్ని ధిక్కరించే వారు, ఇస్లాం మార్గం నుండి నిరోధించే వారు నాశనమవుగాక!”

తరువాత స్వర్గవాసులు నరకవాసులను పిలిచి ఇలా అంటారు: “మా ప్రభువు మాకు చేసిన వాగ్దానాలను అన్నింటినీ మేము సత్యమైనవిగా కనుగొన్నాము. మరి మీరు కూడా మీ ప్రభువు చేసిన వాగ్దానాలను సత్యమైనవిగా కనుగొన్నారా?” వారు సమాధానంగా, ‘అవును’ అనిపలుకుతారు. అప్పుడు ప్రకటించేవాడొకడు వారి మధ్య ఇలా ప్రకటిస్తాడు: ‘ప్రజలను అల్లాహ్ మార్గం నుండి నిరోధించే, దానిని వక్రీకరించే, పరలోకాన్ని తిరస్కరించే వారిపై అల్లాహ్ శాపం అవతరించుగాక.” (అల్ ఆరాఫ్: 44,45)

197వ అంశం : ప్రపంచంలో ఒకే చోట నివసించే కపటులు (మునాఫిఖ్ లు), విశ్వాసుల మధ్య గుణపాఠం నేర్పే సంభాషణ.

కపటులు: “మీ కాంతి నుండి ఈ చీకటిలో మమ్మల్ని కూడా కొంచెం వెలుగు పొందనివ్వండి.”

విశ్వాసులు: “ఈ కాంతిని పొందడానికి మళ్ళీ ప్రపంచంలోకి వెళ్ళండి (వెళ్ళగలిగితే.)” దానిపై కపటులు మళ్ళీ విన్నవించుకుంటారు.

కపటులు: “ప్రపంచంలో మేము మీతోనే ఉండేవారం కదా?”

విశ్వాసులు: “మీరు మాతోనే ఉండేవారు. కాని, అల్లాహ్, ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పట్ల అనుమానానికి గురయ్యేవారు. ముస్లింలను మోసగించేవారు. అందువల్ల మీ నివాసం నరకం.”

ఆనాడు కపట స్త్రీ పురుషుల పరిస్థితి ఎలా ఉంటుందంటే, వారు విశ్వాసులతో, “కొంచెం మా వైపు చూడండి, మేము మీ వెలుగు ద్వారా కొంత ప్రయోజనం పొందు తాము” అని అంటారు. కాని వారితో, ‘వెనక్కి వెళ్ళండి. మీ వెలుగును మరొకచోట ఎక్కడైనా వెతుక్కోండి’ అని అనబడుతుంది. తరువాత వారి మధ్య ఒక గోడను అడ్డుగా నిలబెట్టటం జరుగుతుంది. దానికి ఒక ద్వారం కూడా ఉంటుంది. ఆ ద్వారానికి లోపల సౌఖ్యం, బయట మాత్రం యాతన. వారు విశ్వాసులతో, “మేము మీతో కలసి ఉండలేదా?” అని ఎలుగెత్తి మాటిమాటికీ అరుస్తూ ఉంటారు.

విశ్వాసులు ఇలా సమాధానం ఇస్తారు: “నిజమే, కాని మిమ్మల్ని మీరే స్వయంగా పరీక్షకు గురిచేసుకున్నారు. అవకాశవాదానికి పాల్పడ్డారు. సందేహంలో పడిపోయారు. లేనిపోని ఆశలు మిమ్మల్ని మోసం చేశాయి. చివరకు అల్లాహ్ నిర్ణయం వచ్చేసింది. అంతిమ క్షణం వరకూ ఆ గజ మోసగాడు మిమ్మల్ని అల్లాహ్ విషయంలో మోసం చేస్తూ వచ్చాడు. కనుక ఈ రోజు మీ నుండి ఎలాంటి పరిహారమూ తీసుకో బడదు. బహిరంగంగా అవిశ్వాసానికి ఒడిగట్టిన వారి నుండి కూడా ఎలాంటి పరిహారమూ తీసుకోవటం జరుగదు. మీ నివాస స్థలం నరకం. అదే మీ మంచిచెడ్డలను చూస్తుంది. ఇది చాలా చెడ్డ పర్యవసానం.” (అల్ హదీద్:13-15)

198వ అంశం : స్వయంగా అల్లాహ్ (త’ఆలా) అవిశ్వాసులతో ఇలా మాట్లాడుతాడు.

అల్లాహ్ (త’ఆలా) : “నా ఆదేశాలు మీవద్దకు వచ్చి ఉండలేదా?”

అవిశ్వాసులు: “ఓ అల్లాహ్ ! నిజంగా మేము వక్రమార్గానికి గురిఅయ్యాము. కేవలం ఒక్కసారి ఇక్కడి నుండి రక్షించు. మళ్ళీ అవిశ్వాసానికి పాల్పడితే మేము నిజంగా అపరాధులమే.’

అల్లాహ్: “పొండి- ఇక్కడి నుండి వెళ్ళే విషయం గురించి నాతో మాట్లాడకండి. ప్రపంచంలో మీరెంతకాలం జీవించారో కొంచెం చెప్పండి?”

అవిశ్వాసులు: “ఒక్క దినం లేదా అందులో కొంత భాగం అంతే!”

అల్లాహ్ “ఇంతకొద్ది కాలం గురించి కూడా మీరు బుద్దిని ఉపయోగించ లేకపోయారు. మా వద్దకు ఎన్నడూ తిరిగి రారని భావిస్తూ ఉండిపోయారు?”

“నా వాక్యాలు మీకు వినిపించబడేటప్పుడు వాటిని నిరాకరించినవారు మీరే కదా?” వారు ఇలా అంటారు: “ఓ మా ప్రభూ! మా దౌర్భాగ్యం మమ్మల్ని కప్పేసింది. నిజంగానే మేము మార్గం తప్పిన వారము. ఓ మా ప్రభూ! ఇక మమ్మల్ని ఇక్కడ్నుండి బయటకు తీయి. తరువాత మేము అటువంటి పాపాలు చేస్తే దుర్మార్గులమవు తాము. అల్లాహ్ దానికి ఇలా సమాధానం పలుకుతాడు: “పోండి ఇక్కడ్నుండి, ఇందులోనే పడి ఉండండి. నాతో మాట్లాడకండి. నా దాసులు కొందరు, ‘మా ప్రభూ! మేము విశ్వసించాము. మమ్మల్ని క్షమించు. మాపై దయచూపు. నీవు కరుణా మయులలోకెల్లా ఉత్తమ కరుణామయుడవు’ అని అన్నప్పుడు, వారిని పరిహసించింది మీరే కదా! చివరకు వారి పట్ల మీ మంకువైఖరి మిమ్మల్ని, “నేనూ ఒకడ్ని ఉన్నాను’ అనే విషయాన్ని కూడా మరచిపోయేలా చేసింది. మీరు వారిని పరిహసిస్తూనే పోయారు. ఈనాడు నేను వారి సహనానికి ఈ ప్రతిఫలం ఇచ్చాను. వారే సాఫల్యం పొందినవారు. తరువాత అల్లాహ్ వారిని ఇలా అడుగుతాడు: ‘చెప్పండి, భూలోకంలో మీరు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు. వారు, ‘మేము ఒక దినమో లేక దినంలో కొంత భాగమో అక్కడ ఉన్నాము. లెక్క పెట్టేవారిని అడగండి’ అని అంటారు. ఇలా సెలవీయబడు తుంది: ‘కొంతకాలమే ఉన్నారు కదా! అయ్యో, మీరు ఈ విషయాన్ని అప్పుడు తెలుసుకొని ఉంటే ఎంత బాగుండేది. మేము మిమ్మల్ని వృధాగానే పుట్టించామని, మావైపునకు మీరు ఎన్నడూ మరలరని భావించారా?” (అల్ మూమినూన్: 105-115)

199వ అంశం : అల్లాహ్ (త’ఆలా) అవిశ్వాసులతో ప్రత్యక్షంగా మాట్లాడుతాడు.

అల్లాహ్ (త’ఆలా) : ‘చనిపోయిన తరువాత మరల సజీవులవడం నిజమా, అబద్ధమా?’ అవిశ్వాసులు: ‘ఎందుకు కాదు, నిజమే.’

అల్లాహ్ (త’ఆలా) : ‘మరి మీ తిరస్కారానికి రుచి చూడండి.’

అవిశ్వాసులు: ‘అయ్యో! తీర్పుదినం గురించి మేము చాలా పెద్దపొరపాటు చేశాము.

వారు తమ ప్రభువు ముందు నిలబెట్టబడే దృశ్యాన్ని నీవు చూడగలిగితే ఎంత బాగుండును! అప్పుడు వారి ప్రభువు వారిని, ‘ఇదంతా యదార్థం కాదా?’ అని అడుగుతాడు. వారు ఇలా అంటారు: ‘అవును మా ప్రభూ! ఇదంతా యదార్థమే.’ అప్పుడు ఆయన ఇలా సెలవిస్తాడు: ‘సరే, అయితే మీరు యదార్థాన్ని తిరస్కరించిన దానికి ఫలితంగా ఇప్పుడు శిక్షను చవిచూడండి. అల్లాహ్ తమ సమావేశపు వర్తమానాన్ని అబద్ధంగా పరిగణించినవారు నష్టానికి గురి అయ్యారు. అకస్మాత్తుగా ఆ గడియ వచ్చిపడినప్పుడు వారే వాపోతారు. ‘అయ్యో! ఈ విషయంలో మేము ఎంత పొరపాటు చేశాము?’ అని. వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, తమ పాపాల బరువును తమ వీపులపై మోస్తూ ఉంటారు. చూడండి! వారు మోస్తున్న ఈ బరువు ఎంత చెడ్డదో.” (అల్ అన్అమ్: 30,31)

200వ అంశం: స్వర్గవాసులు, నరకవాసుల మధ్య సంభాషణ.

స్వర్గవాసులు: ‘మిమ్మల్ని ఏ విషయం నరకంలోనికి తీసుకొని పోయింది?’

నరకవాసులు: ‘మేము నమాజ్ చేసేవారము కాదు, పేదలకు అన్నం పెట్టేవారం కాదు. ఇతరులతో కలసి మేము కూడా అల్లాహ్, ఆయన ప్రవక్తల పట్ల హాస్యంగా ప్రవర్తించే వారం. ఇంకా తీర్పు దినాన్ని తిరస్కరించేవారము.”

వారు అపరాధులను, “మిమ్మల్ని ఏ విషయం నరకంలోకి తీసుకు వెళ్ళింది?” అని అడుగుతారు. దానికి వారు ఇలా అంటారు: ‘మేము నమాజు చేసేవారం కాదు, నిరుపేదలకు అన్నం పెట్టేవారం కాదు. ఇతరులతో కలసి మేము కూడా సత్యానికి వ్యతిరేకంగా మాటలను కల్పించేవారము. ఇంకా తీర్పు దినాన్ని తిరస్క రించేవారం. చివరకు ఆ యదార్థమే మాకు ఎదురైంది.” (అల్ ముద్దస్సిర్:40-47)

201వ అంశం: అల్లాహ్, ఆయన పరమ భక్తుల మధ్య ఉపదేశ పూరితమైన సంభాషణ.

అల్లాహ్ : ‘మీరు నా దాసుల్ని వక్రమార్గానికి గురి చేశారా? లేక స్వయంగా వీరే మార్గం తప్పారా?’

అల్లాహ్ పరమభక్తులు: “సుబహానల్లాహ్! మేము నిన్ను తప్ప ఇతరుల్ని అక్కరలు తీర్చేవారుగా, కష్టాలను గట్టెక్కించేవారుగా ఎలా పరిగణించగలం? నీవు వారికి భూలోక సంపదను ప్రసాదించావు. దాన్ని పొంది వారు స్వయంగా మార్గం తప్పారు.”

ఆ రోజున నీ ప్రభువు ఈ ప్రజలను, అల్లాహ్ ను వదలి పూజిస్తున్న దేవుళ్ళను పిలుస్తాడు, తరువాత ఆయన ఆ దేవుళ్ళను, “నా ఈ దాసులను మీరే మార్గం తప్పించారా లేక స్వయంగా వారే రుజుమార్గం తప్పిపోయారా?’ అని అడుగుతాడు. అప్పుడు వారు ఇలా విన్నవించుకుంటారు. “నీవు అత్యంత పరిశుద్ధుడవు. నిన్ను తప్ప మరొకరిని మా రక్షకుడుగా చేసుకునే ధైర్యం కూడా మాకు లేదు. కాని నీవు వారికి, వారి పూర్వీకులకు జీవితావసర వస్తువులను పుష్కలంగా ప్రసాదించావు. చివరకు వారు బోధనను మరచిపోయి దురదృష్ట స్థితికి చేరుకున్నారు.” (అల్ ఫుర్ఖాన్:17, 18)

202వ అంశం : నరకపాలకులకు, నరకవాసులకు మధ్య సంభాషణ

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ (రదియల్లాహు అన్హు) ఇలా అంటున్నారు: ‘అల్లాహ్ ఆదేశం: “ఓ మాలిక్! నీ అల్లాహ్ మమ్మల్ని అంతం చేస్తే బాగుండేది?’ అని వేడుకుంటారు. (జుఖ్రుఫ్:77) వారి ఈ విన్నపంపై నరకపాలకుడు మాలిక్ 40 సంవత్సరాల వరకు వారి పట్ల అయిష్టం వ్యక్తం చేస్తూ వారి ప్రశ్నలకు ఎటువంటి సమాధానం ఇవ్వడు. 40 సంవత్సరాల తర్వాత ఇలా సమాధానమిస్తాడు: ‘మీరు ఈ నరకంలోనే ఉంటారు” (జుఖ్రుఫ్:77) మళ్ళీ నరకవాసులు విన్నవించుకుంటారు.

ఓ మా అల్లాహ్ ! ఇక మమ్మల్ని ఇక్కడ్నుండి బయటకు తీయి. తరువాత మేము అటువంటి పాపాలు చేస్తే దుర్మార్గులమవుతాము. (మూమినూన్: 107) అల్లాహ్ (త’ఆలా) వారి నుండి ముఖాన్ని త్రిప్పుకుంటాడు. ఏ విధంగా వారు భూలోకంలో ముఖం త్రిప్పుకున్నారో. ఆ తరువాత వారికి ఇలా సమాధానం ఇవ్వబడు తుంది: ‘ఇక్కడి నుండి పొండి! ఇందులోనే పడి ఉండండి. నాతో మాట్లాడకండి.” (మూమినూన్-108)

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమ్రి(రదియల్లాహు అన్హు) ఇలా అంటున్నారు: ‘అల్లాహ్ సాక్షి ఆతర్వాతవారి నోర్లు మూసుకుంటాయి. కేవలం వారికేకలు, అరుపులు మాత్రమే మిగిలివుంటాయి. (హాకిమ్) (అబ్దుల్ ఖాదర్ అతా -4: 640)

ఫలించని కోరికలు

203వ అంశం : కొన్ని చుక్కలు నీరు త్రాగే కోరిక కూడా ఫలించదు.

నరకవాసులు స్వర్గవాసులతో ఇలా మొరపెట్టుకుంటారు: ‘కాస్త దయచేసి మాపై కొద్దిగా నీళ్ళుపొయ్యండి. లేదా అల్లాహ్ మీకు ప్రసాదించిన ఆహారంలో నుంచైనా కొంత ఇటు విసరండి.’ సమాధానంగా వారు: ‘ఈ రెంటినీ అల్లాహ్ సత్య తిరస్కారులకు నిషేధించాడు. వారు తమ ధర్మాన్ని ఒక క్రీడగా, ఒక కాలక్షేపంగా చేసుకున్నారు. ఇంకా వారిని ఇహలోక జీవితం మోసానికి గురిచేసింది.” అల్లాహ్ ఇలా సెలవిస్తాడు: “వారు ఈనాటి సమావేశాన్ని మరచినట్లుగానే, మా వాక్యాలను తిరస్కరిస్తూ ఉండిన విధంగానే మేమూ వారిని ఈనాడు మరచిపోతాము.” (అల్ ఆరాఫ్: 50,51)

ఒక్క వెలుగు కిరణం పొందే విఫల యత్నం

204వ అంశం
వివరణ: వాక్యం అంశం 197 చూడండి.

205వ అంశం: నరక శిక్షలో కేవలం ఒక్క రోజు తగ్గించమని దరఖాస్తు. చీవాట్లు పెట్టిన నరకపాలకులు.

అగ్నిలో పడివున్న వారు నరకభటులతో, “మా శిక్షను కనీసం ఒక్క రోజైనా తగ్గించమని మీరు మీ ప్రభువును ప్రార్థించండి’ అని అర్థిస్తారు. భటులు ఇలా అడుగుతారు: ‘మీ వద్దకు దైవప్రవక్తలు స్పష్టమైన సూచనలు తీసుకొని రాలేదా?’ అప్పుడు వారు, ‘అవును వచ్చారు’ అని అంటారు. నరకభటులు, ‘అలా అయితే, మీరే ప్రార్థించండి; సత్యతిరస్కారుల ప్రార్థన నిరర్ధకమే అవుతుంది’ అని అంటారు. (అల్ మూమిన్: 49,50)

206వ అంశం : చావు కోరిక, అందులోనూ అసఫలత.

‘ఓ మాలిక్! నీ ప్రభువు మమ్మల్ని అంతం చేస్తే బాగుంటుంది’ అని వేడుకుంటారు. దానికి అతడు, ‘మీరు ఇలాగే పడివుంటారు. మేము మీ దగ్గరకు సత్యాన్ని తీసుకొని వచ్చాము. కాని మీలో చాలా మందికి సత్యం అంటేనే గిట్టేది కాదు’ అని అంటారు. (అజ్ జుక్రుఫ్ :77,78)

207వ అంశం: నరక శిక్షను చూసి అవిశ్వాసి తన చేతులు నలుపుకుంటూ ఇలా అంటాడు: ‘నేను ఈ జీవితానికి ముందు ఏమైనా (పుణ్యం) పంపి ఉంటే ఎంత బాగుండేది!’

ఆ రోజున నరకం ముందుకు తీసుకురాబడుతుంది. ఆనాడు మానవునికి తెలిసివస్తుంది. అప్పుడు అతనికి తెలిసివచ్చినందువల్ల ప్రయోజనం ఏమిటి? అతను, ‘అయ్యో! నా ఈ జీవితం కొరకు నేను ముందుగానే కొంత సామగ్రిని ఏర్పాటు చేసుకొని ఉంటే ఎంత బాగుండేది!’ అని అంటాడు. ఇక ఆ రోజున అల్లాహ్ ఎలాంటి శిక్ష విధిస్తాడో, అలాంటి శిక్షను మరెవ్వరూ విధించలేరు. ఇంకా అల్లాహ్ ఎలా బిగించి కట్టివేస్తాడో, అలా బిగించి మరెవ్వరూ కట్టలేరు. (అల్ ఫజ్ర్:23-26)

208వ అంశం :సన్మార్గం నుండి తప్పించిన పండితులు, స్వాములూ, పీర్లను, కాళ్ళతో నలిపే కోరిక ఫలించదు!

అది అల్లాహ్ శత్రువులకు ప్రతిఫలమైన నరకం. అందులోనే వారు శాశ్వతంగా నివసిస్తారు. మా వాక్యాలను తిరస్కరిస్తూ వచ్చిన దానికి ఈ శిక్ష. అక్కడ ఈ అవిశ్వాసులు ఇలా అంటారు: ‘మా ప్రభూ! మమ్మల్ని మార్గభ్రష్టులుగా చేసిన జిన్నాతులనూ, మానవులనూ, కొంచెం మాకు చూపించు. మేము వారిని మా పాదాల క్రింద పడవేసి తొక్కుతాము. వారు మరింత పరాభవం పాలుకావటానికి. (హామీమ్ అస్సజ్ఙహ్:28-29)

209వ అంశం: నరకాగ్నిని చూసి ప్రపంచంలో బుద్ధిని ఉపయోగించి ఉంటే ఎంత బాగుండేది అనే నిరాశ!

‘అయ్యో! మేము గనక విని వుంటే, లేదా గ్రహించి ఉంటే, ఈనాడు ఇలా మండే నరకాగ్ని శిక్షకు గురియై ఉండేవారము కాదు కదా! ‘ఈ విధంగా వారే స్వయంగా తమ తప్పును ఒప్పుకుంటారు. ఈ నరకవాసులు నాశనమైపోను! (అల్ ముల్క్:10,11)

210వ అంశం : అవిశ్వాసి అగ్నిని చూసి, నేను మట్టినై ఉంటే ఎంత బాగుండేది’ అని కాంక్షిస్తాడు.

సమీపంలోనే ఉన్న శిక్షను గురించి మేము మిమ్మల్ని హెచ్చరించాము. ఆ రోజున మనిషి తన చేజేతులా చేసుకొని ముందు పంపుకున్నదంతా ప్రత్యక్షంగా చూస్తాడు. (అప్పుడు) సత్యతిరస్కారి ‘అయ్యో! నేను మట్టినై ఉంటే ఎంత బాగుండేది’ అని గగ్గోలు పెడతాడు. (అన్నబా:40)

211వ అంశం : మరో ఫలించని కోరిక. ‘అయ్యో! నేను ప్రవక్త మాట విని ఉండి, ఫలానా వ్యక్తులతో స్నేహం చెయ్యకుండా ఉంటే ఎంత బాగుండేది!

ఆ రోజు దుర్మార్గులు తమ చేతులను కొరుక్కుంటూ ఇలా అంటారు: ‘అయ్యో! నేను దైవప్రవక్తకు తోడుగా ఉంటే ఎంత బాగుండేది! అయ్యో, నా దౌర్భాగ్యం! నేను ఫలానా వ్యక్తితో స్నేహం చేయకుండా ఉంటే ఎంత బాగుండేది! అతడి మాయలోపడి నేను నా వద్దకు వచ్చిన హితబోధను స్వీకరించలేదు. సైతాను మానవుని విషయంలో నమ్మకద్రోహి అని తేలిపోయింది. (అల్ఫుర్ఖాన్:27-29)

212వ అంశం : అగ్నిలో కాలిన తరువాత అవిశ్వాసులు, ‘అయ్యో! మేము అల్లాహ్, ఆయన ప్రవక్తకు విధేయత చూపి ఉంటే ఎంత బాగుండు’ అని కాంక్షిస్తారు.

వారి ముఖాలను నిప్పులపై అటూ ఇటూ త్రిప్పటం జరిగే నాడు వారు ఇలా అంటారు: ‘అయ్యో! మేము అల్లాహూ, ఆయన ప్రవక్తకూ విధేయత చూపి ఉంటే ఎంత బాగుండేది? అని అంటారు. (అల్ అహ్ జాబ్ :66)

213వ అంశం : తమ తప్పులను ఒప్పుకున్న తర్వాత నరకం నుండి బయటపడే విఫలయత్నం!

వారు ఇలా అంటారు: “ప్రభూ! నీవు మాకు రెండుసార్లు మరణాన్ని, రెండుసార్లు జీవితాన్ని ఇచ్చావు. ఇప్పుడు మేము మా తప్పులను ఒప్పుకుంటున్నాము. కనుక ఇక్కడి నుండి బయటపడే మార్గం కూడా ఎదైనా ఉందా?’ ‘మీరు గురైన ఈ దుస్థితికి కారణం ఏమిటంటే- అల్లాహ్ వైపునకు మాత్రమే పిలిచినప్పుడు మీరు విశ్వసించకుండా తిరస్కరించేవారు. ఇప్పుడు తీర్పు మహనీయుడూ, మహోన్నతుడైన అల్లాహ్ చేతుల్లో ఉంది. (అల్ మూమిన్:11,12)

214వ అంశం: నేరస్తుడు తన సంతానాన్ని, తన భార్యను తన సోదరుల్ని, చివరికి ప్రపంచంలో ఉన్న వారందరినీ నరకంలోవేసి దానికి బదులుగా తన్ను తాను నరకం నుండి రక్షించుకునే విఫలయత్నం చేస్తాడు.

దోషి ఆనాటి శిక్ష నుండి తప్పించుకోవటానికి తన సంతానాన్ని, తన భార్యను, తనసోదరులనూ, తనకు ఆశ్రయ మిచ్చిన దగ్గరి బంధువులనూ, భూమండలంలోని వారందరినీ పరిహారంగా ఇచ్చి, విముక్తి పొందాలని కోరుకుంటాడు. ఎంతమాత్రం కాదు, అది భగభగ మండే నరకాగ్ని జ్వాల. మాంసాన్ని, చర్మాన్ని సైతం అది తినేస్తుంది. (అల్ మఆరిజ్: 11-16)

215వ అంశం : అవిశ్వాసి భూమి బరువంత బంగారాన్ని పరిహారంగా ఇచ్చి విముక్తి పొందుదామనే విఫలయత్నం చేస్తాడు.

ఎవరు అవిశ్వాసం అవలంభించి అవిశ్వాస స్థితిలోనే అసువులు బాశారో, వారిలో ఎవరైనా తమను తాము శిక్ష నుండి కాపాడుకోవటానికి భూమంత బంగారం పరిహారంగా ఇచ్చినా స్వీకరించబడదు. ఇలాంటి వారి కొరకు బాధాకరమైన శిక్ష సిద్ధంగా ఉంది. ఇంకా వారికి సహాయం చేసేవారెవరూ ఉండరు. (ఆలి ఇమ్రాన్:91)

హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు: “తీర్పు దినం నాడు అవిశ్వాసిని ఇలా ప్రశ్నించబడుతుంది: ‘నీ దగ్గర భూమంత బంగారం ఉంటే పరిహారంగా ఇచ్చి నరకం నుండి విముక్తి పొందే ప్రయత్నం చేస్తావా?’ దానికి అవిశ్వాసి, ‘అవును’ అని అంటాడు. అప్పుడు అతనితో ఇలా అనబడుతుంది: ‘దీని కన్నా ఎంతో సులువైన దాన్ని మేము ప్రపంచంలో కోరాము. అంటే ఏకత్వం, కాని దాన్ని నువ్వు నిర్వర్తించలేదు.” (ముస్లిమ్ కితాబుల్ సిఫతిల్ మునాఫిఖీన్)

216వ అంశం : అవిశ్వాసులు శిక్షను చూసి తాము కొలచిన భాగస్వాముల పట్ల విచారిస్తారు. అయ్యో! మమ్మల్ని ఒక్కసారి ప్రపంచంలోనికి పంపితే బాగుండు. ఈ స్వాములు ఈనాడు ఏ విధంగా సంబంధం లేదని అంటున్నారో, మేమూ సంబంధం లేదని అనడానికి.”

అల్లాహ్ వారిని శిక్షించే సమయాన వారు ప్రపంచంలో ఏ నాయకుల, ఏ మార్గ దర్శకుల అడుగుజాడలలో నడిచేవారో, ఆ నాయకులు, ఆ మార్గదర్శకులు తమ అను చరులతో, ఏ మాత్రం సంబంధం లేని విధంగా ప్రవర్తిస్తారు. కాని వారికి శిక్ష మాత్రం తప్పదు. ఇంకా వారి సకల సాధనా సంపత్తుల పరంపర తెగిపోతుంది. అప్పుడు అనుచరులు ఇలా అంటారు: ‘మాకు మరొక అవకాశం లభిస్తే, వారు ఈ రోజు మమ్మల్ని త్యజించినట్లు మేము వారిని అప్పుడు త్యజిస్తాము’. ఈ విధంగా ప్రపంచంలో వారు చేసిన కర్మలను అల్లాహ్ వారి ముందు ఉంచుతాడు. వారు అప్పుడు నిరాశతో, తీవ్ర అవమానభారంతో కృంగిపోతారు. అయినప్పటికీ నరకాగ్ని నుండి బయటపడటం వారికి సాధ్యం కాదు. (అల్బఖర : 166-167)

217వ అంశం: అగ్ని శిక్షను చూసి అవిశ్వాసుల మనసుల్లో ఉద్భవించే కోరికలు- ‘అయ్యో! నేను అల్లాహ్ను ధిక్కరించకుండా ఉంటే ఎంత బాగుండేది.’

అయ్యో! నేను అల్లాహ్, ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పట్ల ఎగతాళిగా ప్రవర్తించకుండా ఉంటే ఎంత బాగుండేది.

అయ్యో! నేను కూడా సన్మార్గం పొందే ప్రయత్నం చేసి ఉంటే ఎంత బాగుండేది. అయ్యో! నేను కూడా దైవభీతి గలవాడై ఉంటే ఎంత బాగుండేది.

అయ్యో! నేను మంచివాడినై చూపించడానికి మరొక్క అవకాశం దొరికితే ఎంత బాగుండేది, మీరు మీ ప్రభువు వైపునకు మరలి, ఆయనకు విధేయత చూపండి. మీకు తెలియకుండానే మీమీదకు అకస్మాత్తుగా శిక్ష రాకముందే, మీ ప్రభువు పంపిన గ్రంథంలోని ఉత్తమమైన విషయాలను అనుసరించండి. తరువాత ఏ వ్యక్తి అయినా ఇలా అనే పరిస్థితి రాకూడదు సుమా! అల్లాహ్ విషయంలో నేను చూపిన నిర్లక్ష్యతకు నేను ఎంతో చింతిస్తున్నాను పైగా నేను ఎగతాళి చేసేవారిలో చేరిపోయాను’ లేదా అయ్యో! అల్లాహ్ నాకు సన్మార్గం చూపి ఉంటే, నేను కూడా భయభక్తులు కలవారిలో చేరిపోయేవాణ్ణి. ‘లేదా శిక్షను చూసి, ‘అయ్యో! నాకు మరొక అవకాశం దొరికితే ఎంత బాగుండును. నేను కూడా సత్కార్యాలుచేసే వారిలో కలిసిపోతాను. అప్పుడు ఇలా అనబడుతుంది: లేదు. నా వాక్యాలు నీ వద్దకు వచ్చాయి. కాని నీవు వాటిని తిరస్కరించావు; విర్రవీగావు. నీవు అవిశ్వాసులలోనివాడవు.’ (అజ్జుమర్ : 55-59)

218వ అంశం: పర్యవసానం కనపడగానే అవిశ్వాసి ఇలా విలపిస్తాడు: “అయ్యో! నా కర్మ పత్రం నాకు ఇవ్వబడకుంటే ఎంత బాగుండేది!’ ‘అయ్యో! ప్రపంచంలోని చావు స్థిరంగా ఉంటే ఎంత బాగుండేది.”

తన కర్మల పత్రం తన ఎడమచేతికి ఇవ్వబడిన వ్యక్తి ఇలా వాపోతాడు. ‘అయ్యో! నా కర్మల పత్రం నాకు అసలు ఇవ్వకుండా ఉంటే, నా లెక్కఏమిటో నాకు అసలు తెలియకుండా ఉంటే ఎంత బాగుండేది! అయ్యో! నాకు ఆ మరణమే అంతిమ మరణమై ఉంటే ఎంత బాగుండేది.” (అల్ హాఖ్కహ్ : 25-27)

219వ అంశం : అయ్యో! నేను అల్లాహ్ పట్ల సాటి కల్పించకుండా ఉంటే ఎంత బాగుండు.

హజ్రత్ అబూహురైరహ్(రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “ప్రతి నరకవాసి స్వర్గంలో తన స్థానాన్ని చూసి ఇలా అంటాడు: ‘అయ్యో! అల్లాహ్ నాకు సన్మార్గం ప్రసాదించి ఉంటే ఎంత బాగుండేది’ అని విలపిస్తూ ఉంటాడు. ప్రతి స్వర్గవాసి నరకంలోని తన స్థానాన్ని చూసి, ‘ఒకవేళ అల్లాహ్ నాకు సన్మార్గం ప్రసాదించి ఉండకపోతే నేను ఇక్కడే ఉండేవాణ్ణి అని అల్లాహ్కు కృతజ్ఞతలు తెలుపుకుంటాడు. ఆ తరువాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ వాక్యాలను పఠించారు: ‘ ఏ వ్యక్తి అయినా ఇలా అనే పరిస్థితి రాకూడదు సుమా! ‘అల్లాహ్ విషయంలో నేను చూపిన నిర్లక్ష్యతకు నేను ఎంతో చింతిస్తున్నాను. (అజ్జుమర్ : 56) (హాకిమ్, సహీహ్) (అల్బానీగారి సిల్సిలతు అహదీసు సహీహహ్ : 5-2034)

నరకవాసులు మరో అవకాశం దొరకాలని విలపించుట

220వ అంశం : అవిశ్వాసులు అగ్నిని చూసి సత్యాన్ని స్వీకరిస్తారు. సత్కార్యాలు చేయటానికి మళ్ళీ భూలోకానికి వెళ్తామని విలపిస్తారు.

ఆ ముగింపు వచ్చే రోజున దానిని నిర్లక్ష్యం చేస్తూ వచ్చినవారే ఇలా అంటారు: ‘యదార్థంగానే మా ప్రభువు పంపిన ప్రవక్తలు సత్యం తీసుకొని వచ్చారు. అయితే, మా కొరకు సిఫారసు చెయ్యటానికి, సిఫారసు దారులెవరైనా మాకు లభిస్తారా? లేదా మేము మళ్ళీ తిరిగి పంపబడగలమా? పూర్వం మేము చేస్తూ ఉండిన దానికి బదులుగా ఇప్పుడు మరొక పద్ధతి ప్రకారం పనిచేసి చూపించటానికి?’ వారు తమను తాము నష్టంలో పడవేసు కున్నారు. వారు కల్పించిన అసత్యాలు సమస్తమూ ఈ రోజు వారి నుండే తప్పుకున్నాయి.’ (అల్ ఆరాఫ్: 53)

221వ అంశం : వారి ఈ విలపించటాన్ని చూసి నరకభటులు సూటిగా ఇలా అంటారు: ‘దుర్మార్గులకు సహాయం చేసేవారెవరూ ఇక్కడ లేరు.” వారు అక్కడ పెడబొబ్బలు పెడుతూ ఇలా అంటారు: ‘మా ప్రభూ! మమ్మల్ని ఇక్కడి నుండి బయటకు తియ్యి, మేము పూర్వం చేసిన పనులకు భిన్నంగా మంచి పనులు చేయటానికి.” ఇలా సమాధానం ఇవ్వబడుతుంది: గుణపాఠం నేర్చుకోదలచిన వాడు గుణపాఠం నేర్చుకోవటానికి సరిపడిన ఆయుష్షును మేము మీకు ఇవ్వలేదా? మీ వద్దకు హెచ్చరించేవాడు కూడా వచ్చి ఉన్నాడు కదా! ఇక రుచి చూడండి. దుర్మార్గులకు ఇక్కడ సహాయం చేసేవాడెవడూ లేడు.” (ఫాతిర్:37)

222వ అంశం: నరకంలో అవిశ్వాసులు నేరాన్ని ఒప్పుకొనుట, విశ్వాసిగా ఉంటామనే కోరిక వ్యక్తం చేయుట.

తరువాత ఆ దేవుళ్ళు, మార్గం తప్పిన ఈ మానవులూ, ఇబ్లీసు సైన్యము, అందరూ దానిలోకి ఒకరి మీద ఒకరు పడేటట్లుగా త్రోయబడతారు. అక్కడ వారందరూ పరస్పరం పొట్లాడుకుంటారు. మార్గం తప్పిన ఈ మానవులు ఇలా అంటారు: “దేవుని సాక్షిగా! సకల లోకాల ప్రభువుతో సమానమైన స్థానాన్ని మీకు ఇచ్చినప్పుడు మేము స్పష్టమైన వక్రమార్గానికి గురియై ఉన్నాము. మమ్మల్ని మార్గం తప్పించిన వారు నిజంగానే అపరాధులు. ఇప్పుడు మాకు సిఫారసు చేసేవాడు గానీ, ప్రాణ స్నేహితుడు గానీ, ఎవడూ లేడు. అయ్యో! ఒక సారి మళ్ళీ మరలి వెళ్ళే అవకాశం మాకు దొరికితే, మేము తప్పకుండా విశ్వాసులమవు తాము.” (అషుఅరా:94-102)

223వ అంశం : అవిశ్వాసులు విశ్వసిస్తామనే వాగ్దానంతో తిరిగి భూలోకంలోకి పంపమని వేడుకుంటారు. సమాధానంగా ‘మీరు చేస్తూ ఉండిన దానికి శాశ్వత శిక్షను రుచిచూడండి.”

ఈ దోషులు తలలు వంచి తమ ప్రభువు సమక్షంలో నిలబడి ఉండే ఆ సమయాన్ని నీవు చూస్తే ఎంత బాగుండును! అప్పుడు వారు ఇలా అంటారు: “మా ప్రభూ! మేము బాగా చూశాము. బాగా విన్నాము. ఇక మమ్మల్ని వెనక్కి పంపించు, మేము మంచి పనులు చేస్తాము. మాకు ఇప్పుడు నమ్మకం కలిగింది. ‘సమాధానంగా, ‘మేము కోరితే, మొదట్లోనే ప్రతి ఆత్మకూ దాని యొక్క మార్గదర్శకత్వాన్ని ఇచ్చిఉండేవారము. కాని నేను చేసిన వాగ్దానం నెరవేరింది. మీరు ఈనాటి సమావేశాన్ని విస్మరించారు. కనుక ఇప్పుడు మీ ఈ చేష్ట యొక్క రుచిని చూడండి. మేము కూడా ఇప్పుడు మిమ్మల్ని విస్మరించాము, చవి చూడండి శాశ్వతంగా ఉండిపోయే యాతనను మీ చేష్టలకు పర్యవసానంగా.” (అస్సజహ్ : 12-14)

224వ అంశం: నరకాగ్నిని చూసి మరో అవకాశం కావాలని, మంచిగా జీవితం గడుపుతామని విలపించే విఫలయత్నం చేస్తారు.

లేదా శిక్షను చూసి, “అయ్యో! నాకు మరొక అవకాశం దొరికితే ఎంత బాగుండును. నేను కూడా సత్కార్యాలు చేసేవారిలో కలసిపోతాను. (అప్పుడు అతనికి ఈ జవాబు దొరకకూడదు) ‘లేదు, నా వాక్యాలు నీ వద్దకు వచ్చాయి. కాని నీవు వాటిని తిరస్కరించావు; విర్రవీగావు, నీవు అవిశ్వాసులలోనివాడవు. ” (అజ్ఞుమర్:58,59)

225వ అంశం : నరకవాసులు విశ్వసిస్తామని వాగ్దానం చేస్తూ నరకం నుండి బయటకు తీయమని విన్నవించుకుంటారు. సమాధానంగా అల్లాహ్ (త’ఆలా) వారికి చీవాట్లు పెట్టడం జరుగుతుంది.

వారు ఇలా అంటారు: “ఓ మా ప్రభూ! మా దౌర్భాగ్యం మమ్మల్ని కప్పేసింది. నిజం గానే మేము మార్గం తప్పినవారము. ‘ఓ స్వామి! ఇక మమ్మల్ని ఇక్కడ్నుండి బయటకు తీయి. తరువాత మేము అటువంటి పాపాలు చేస్తే, దుర్మార్గులమవుతాము.’ అల్లాహ్ దానికి ఇలా సమాధానం పలుకుతాడు: ‘నా ముందు నుంచి వెళ్ళిపోండి. ఇందులోనే పడి ఉండండి. నాతో మాట్లాడకండి’ నా దాసులు కొందరు, ‘మా ప్రభూ! మేము విశ్వసించాము. మమ్మల్ని క్షమించు, మాపై దయచూపు. నీవు కరుణామయులలోకెల్లా ఉత్తమ కరుణా మయుడవు’ అని అన్నప్పుడు, వారిని పరిహసించింది మీరే కదా! చివరకు వారిపట్ల మీ మంకు వైఖరి మిమ్మల్ని, ‘నేనూ ఒకడ్ని ఉన్నాను’ అనే విషయాన్ని కూడా మరచిపోయేలా చేసింది. మీరు వారిని పరిహసిస్తూనే పోయారు.” (అల్ మూమినూన్: 106-110)

226వ అంశం : నరకాగ్నిని చూసి అవిశ్వాసులు విశ్వసిస్తామని కొంత గడువు కోరుతారు. కాని వారి విన్నపం తిరస్కరించబడుతుంది.

‘ప్రవక్తా! శిక్ష వచ్చి వారిని పట్టుకునే రోజును గురించి నీవు వారిని భయపెట్టు, అప్పుడు ఈ దుర్మార్గులు ఇలా అంటారు. ప్రభూ! మాకు మరి కొంత వ్యవధిని ప్రసాదించు. మేము నీ సందేశాన్ని స్వీకరిస్తాము. వారికి ఇలా సమాధానం ఇవ్వబడు తుంది: ‘క్షీణ దశ మాకు ఎన్నటికీ రాదు అని పూర్వం ప్రమాణాలు చేసి చెప్పేవారు మీరే కదా!’ (ఇబ్రాహీమ్:44)

227వ అంశం: నరకం వొడ్డున నిలబడిన అవిశ్వాసులు ‘ఒక్కసారి ప్రపంచం లోకి పంపించ బడితే ఎంతబాగుండు’ అని కాంక్షిస్తారు.

నరకం గట్టుపై వారిని నిలబెట్టే దృశ్యాన్ని నీవు గనుక చూడగలిగితే ఎంత బాగుం టుంది. అప్పుడు వారు ఇలా అంటారు: “అయ్యో! మేము మళ్ళీ భూలోకానికి తిరిగి పంపబడే, మా ప్రభువు సూచనలు అసత్యాలని తిరస్కరించ కుండా ఉండే, విశ్వాసులలో మేము కలసిపోయే మార్గం ఏదైనా ఉంటే ఎంత బాగుండు?” (అల్ ఆన్అమ్:27)

228వ అంశం :నరక శిక్షను చూసి మళ్ళీ ప్రపంచంలోకి వెళ్ళే కోరిక!

ఈ దుర్మార్గులు శిక్షను చూసినప్పుడు, వెనక్కి వెళ్ళిపోవటానికి మార్గమేదైనా ఉందా? అని అడగటాన్ని నీవు చూస్తావు. వారిని నరకం ముందుకు తీసుకొని వచ్చినప్పుడు వారు అవమానభారంతో కృంగిపోవటాన్ని, దానిని దొంగచూపులతో చూడటాన్ని నీవు గమనిస్తావు. అప్పుడు విశ్వాసులు ఇలా అంటారు: ‘ప్రళయ దినం నాడు తననూ, తన సంబంధీకులనూ, నష్టానికి గురిచేసేవాడే అసలు నష్టపోయేవాడు. గుర్తుంచుకోండి! దుర్మార్గులు శాశ్వతమైన యాతనకు గురిఅవుతారు. (అష్ షూరా :44,45)

229వ అంశం : శిక్షించబడుతున్న అపరాధుల విన్నపం. అల్లాహ్! ఒక్కసారి శిక్షను తొలగించు, మేము విశ్వసిస్తాము.

“అల్లాహ్! ఈ శిక్షను మాపై నుండి తొలగించు. మేము విశ్వసిస్తున్నాము. “వారి అశ్రద్ధ ఎలా దూరం అవుతుంది? వారి వద్దకు సాక్షాత్తుగా ఒక ప్రవక్త వచ్చినప్పటికీ, వారు అతని పట్ల శ్రద్ధ చూపలేదు, సరికదా పైగా, ‘ఇతను ఒక పిచ్చివాడు, ఇతరుల నుండి నేర్చుకున్నాడు’ అని అన్నారు. ఇలా ఉంది వారి పరిస్థితి. మేము శిక్షను కొంచెం తొలగిస్తే, మీరు పూర్వం చేస్తూ ఉన్న దానినే మళ్లీ చేస్తారు. మేము గట్టి దెబ్బ కొట్టే ఆ రోజు, మేము మీకు ప్రతీకారం చేసే రోజు అవుతుంది.’ (అద్దు ఖాన్: 12-16)

230వ అంశం : ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) తండ్రి నరకాన్ని చూసి ఇలా అంటాడు. “ఓ ఇబ్రాహీమ్! ఈనాడు నేను నీకు విధేయత చూపుతున్నాను. కాని అతనికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా నరకంలో పడవేయబడుతుంది.”

హజ్రత్ అబూహురైరహ్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) తీర్పు దినం నాడు తన తండ్రిని చూస్తారు. అతని ముఖంపై నల్లని రంగు, దుమ్ముధూళి ఉంటుంది. అప్పుడు హజ్రత్ ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) ఇలా అంటారు: ‘నేను ప్రపంచంలో నాకు అవిధేయత చూపకు అని అనలేదా?’ అప్పుడు ఆజర్ ఇలా అంటాడు: ఈనాడు నేను నీకు విధేయత చూపుతాను. హజ్రత్ ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) తన ప్రభువును విన్నవించుకుంటారు. ‘ఓ నా ప్రభూ! నీవు నాతో ఇలా ‘తీర్పు దినం నాడు నీవు నన్ను అవమానపరచవని’ వాగ్దానం చేసి ఉన్నావు. నా తండ్రి నీ కారుణ్యానికి దూరమయ్యాడు. ఇంతకంటే అవమానకరమైన విషయం ఇంకేముంది. అప్పుడు అల్లాహ్ (త’ఆలా) ఇలా ఆదేశిస్తాడు: “నేను స్వర్గాన్ని అవిశ్వాసులకు నిషేధించాను. ఇంకా ఇలా ఆదేశిస్తాడు. “ఓ ఇబ్రాహీమ్ ! నీ రెండు కాళ్ళక్రింద ఏముంది? హజ్రత్ ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) తన కాళ్ళ వైపు చూస్తారు. అపరిశుద్ధంలో కొట్టుమిట్టాడుతున్న ఒక ఉడుము ఉంటుంది. దైవదూతలు దాని కాళ్ళు పట్టుకొని నరకంలో పడవేస్తారు.” (బుఖారీ, కితాబు బద్ ఇల్ ఖల్క్)

నరకంలో ఇబ్లీసు

231వ అంశం : నరకంలో ప్రవేశించిన తరువాత ఇబ్లీసు తన అనుచరులను ఉద్దేశించి ప్రసంగిస్తాడు.

తీర్పు జరిగిపోయినప్పుడు పైతాను ఇలా అంటాడు: “వాస్తవం ఏమిటంటే, అల్లాహ్ మీకు చేసిన వాగ్దానాలన్నీ నిజమైనవే. నేను మీకు చేసిన వాగ్దానాలలో ఒక్క దానిని కూడా నెరవేర్చలేదు. నాకు మీ మీద ఎటువంటి అధికారమూ లేదు. నేను మిమ్మల్ని నా మార్గంవైపునకు ఆహ్వానించటం తప్ప మరేమీ చెయ్యలేదు. మీరు నా ఆహ్వానాన్ని అంగీకరించారు. ఇప్పుడు నన్ను నిందించకండి. మిమ్మల్ని మీరే నిందించుకోండి. ఇక్కడ మీ మొరలను నేనూ ఆలకించలేను. నా మొరలను మీరూ ఆలకించలేరు. ఇంతకు పూర్వం మీరు నన్ను దైవత్వంలో భాగస్వామిగా చేసి ఉంచారు. దానికి నా బాధ్యత ఏమీ లేదు. ఇటువంటి దుర్మార్గులకు వ్యధాభరితమైన శిక్ష తప్పదు.” (ఇబ్రాహీమ్:22)

232వ అంశం: ఇబ్లీసు భయంకరమైన పర్యవసానం.

233వ అంశం: తీర్పుదినం నాడు అందరికంటే ముందు ఇబ్లీసు అగ్ని దుస్తులు ధరిస్తాడు.

హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: తీర్పుదినం నాడు అందరికంటే ముందు ఇబ్లీసు అగ్ని దుస్తుల్ని ధరిస్తాడు. వాడు వాటిని తన నుదుటిపై ఉంచి వెనుక నుండి ఈడ్చుకుంటూ తిరుగుతాడు. అతని సంతానం అంటే అతని అనుచరులు వాడిని అనుసరిస్తారు. ఇబ్లీసు తన చావును, నాశనాన్ని కేకలు వేస్తూ తిరుగుతుంటాడు. వాడి అనుచరులు కూడా తమ చావునూ, నాశనాన్ని కేకలు వేస్తూ ఉంటారు. చివరికి వారు నిప్పు మీదకు రాగానే ఇబ్లీసు ఇలా అంటాడు. ‘చావు.’ వాడి అనుచరులు కూడా ఇలా అంటారు: ఓ చావు, అప్పుడు వారితో ఇలా అనబడుతుంది: ‘ఈనాడు ఒక చావును కాదు అనేక చావులను పిలవండి.” (సూరె ఫుర్ఖాన్ : 14) (అహ్మద్) (ఇబ్నెకసీర్ 3:415, ముస్నద్ అహ్మద్- సంపుటం -3/415, 12588)

పాత జ్ఞాపకాలు

234వ అంశం: నరకంలో ఒక మంచి స్నేహితున్ని గుర్తు చేయుట, అతన్ని వెదుకుట.

“ఏమిటీ విశేషం! మనం ప్రపంచంలో చెడ్డవారుగా భావించిన వారు మనకు ఎక్కడా కనిపించరే? మనం ఊరికే వారిని ఎగతాళి చేశామా లేక వారు మనకు కనుమరుగయ్యారా?” నిస్సందేహంగా ఇది నిజం; నరకవాసుల మధ్య ఇటువంటి తగాదాలే జరుగుతాయి. (సాద్ : 62-64)

235వ అంశం : నరకంలో ఒక నాస్తిక స్నేహితున్ని గుర్తు చేయుట

ఆ రోజు దుర్మార్గుడు తన చేతులను కొరుక్కుంటూ ఇలా అంటాడు: “అయ్యో! నేను దైవప్రవక్తకు తోడుగా ఉంటే ఎంత బాగుండేది! అయ్యో! నా దౌర్భాగ్యం! నేను ఫలానా వ్యక్తితో స్నేహం చేయకుండా ఉంటే ఎంతబాగుండేది! అతడి మాయలోపడి నేను నా వద్దకు వచ్చిన హితబోధను స్వీకరించ లేదు. షైతాను మానవుని విషయంలో నమ్మకద్రోహి అని తేలిపోయింది.” (అల్ ఫుర్ఖాన్:27-29)

నరకంలోనికి తీసుకొని పోయే పాపకార్యాలు ఆకర్షణీయమైనవి

236వ అంశం: నరకం ఆకర్షణీయమైన, మనోహరమైన దుష్కార్యాలతో ఆవరించబడి ఉంది.

హజ్రత్ అబూహురైరహ్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు: అల్లాహ్ (త’ఆలా) స్వర్గనరకాలను సృష్టించి, హజ్రత్ జిబ్రయీల్ (అలైహిస్సలాం) ను స్వర్గం వైపు పంపించి ఇలా అన్నాడు; ‘వెళ్ళు, స్వర్గం, ఇంకా స్వర్గవాసుల కొరకు నేను సృష్టించిన అనుగ్రహాలను వీక్షించు, హజ్రత్ జిబ్రయీల్ (అలైహిస్సలాం) వచ్చారు. స్వర్గాన్ని, స్వర్గవాసుల కొరకు సృష్టించిన అనుగ్రహాలను వీక్షించారు. మళ్ళీ అల్లాహ్ సన్నిధిలో హాజరయ్యారు. ఇంకా ఇలా విన్నవించు కున్నారు: ‘నీ గౌరవం సాక్షి! దీని గురించి విన్న ప్రతివాడు ఇందులోకి ప్రవేశిస్తాడు. ఆ తరువాత అల్లాహ్ (త’ఆలా) దైవదూతలను స్వర్గాన్ని కష్టాల ద్వారా, ఆపదల ద్వారా కప్పివేయమని ఆదేశించాడు. ఆతరువాత అల్లాహ్ (త’ఆలా) హజ్రత్ జిబ్రయీల్ (అలైహిస్సలాం) ని రెండవసారి మళ్ళీ ‘వెళ్ళు, స్వర్గాన్ని, స్వర్గవాసుల కోసం తయారు చేసిన అనుగ్రహాలను వీక్షించు’ అని ఆదేశించాడు. జిబ్రయీల్ వెళ్ళారు. అక్కడ స్వర్గం ఆపదలతో, కష్టాలతో ఆవరించబడి ఉంది. అప్పుడు అల్లాహ్ (త’ఆలా) సమక్షంలోకి వెళ్ళి, ‘నీ గౌరవం సాక్షి! అందులోకి ఎవరూ ప్రవేశించలేరు’ అని విన్నవించుకున్నారు. అప్పుడు అల్లాహ్ ఇప్పుడు నరకం వైపు వెళ్ళు, నరకాన్ని, నరకంలో శిక్షలనూ తిలకించు దాని ఒక భాగం మరో దానిపై ఎలా ఉందో చూడు అన్నారు. ‘నీ గౌరవం సాక్షి! దాని గురించి విని, అందులోకి ప్రవేశించే వాడు ఉండడు అల్లాహ్ ఆదేశించాడు వెంటనే నరకాన్ని మనోకాంక్షలు, సుఖాలతో ఆవరించబడింది. అప్పుడు అల్లాహ్ జిబ్రయీల్ (అలైహిస్సలాం) ను ఇలా ఆదేశించాడు. ‘రెండవసారి వెళ్ళు’ జిబ్రయీల్ వెళ్ళారు. అంతా చూశారు. ఇంకా ఇలా విన్నవించుకున్నారు. ‘నీ గౌరవం సాక్షి! ఇప్పుడయితే దీన్నుండి ఎవరూ రక్షించుకో లేరు. ప్రతి ఒక్కరూ ఇందులోకి ప్రవేశిస్తారు.’ (తిర్మిజీ, హసన్) (అబ్వాబు సిఫతి జహన్నమ్: 2-2075)

హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు ) ఇలా ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు: “స్వర్గాన్ని కష్టనష్టాలు ఆవరించి ఉన్నాయి. నరకాన్ని మధురమైన, ఆకర్షణీయమైన మనో కాంక్షలు ఆవరించి ఉన్నాయి”. (ముస్లిమ్)

237వ అంశం: ప్రాపంచిక ఆకర్షణల పర్యవసానం కేవలం నరకమే.

హజ్రత్ అబూమాలిక్ అష్ అరీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖిస్తున్నారు. నేను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అంటూ ఉండగా విన్నాను. ‘ప్రాపంచిక తీపి పరలోక చేదు, ప్రాపంచిక చేదు పరలోక తీపి.’ (అహ్మద్, హాకిమ్) (ముస్నద్ అహ్మద్-5/23287 హదీసు, అల్బానీగారి సహీ జామెవుస్ సగీర్:3-3150)

238వ అంశం: పాపకార్యాలు ఎంతో మనోహరంగా ఉంటాయి.

హజ్రత్ అబూహురైరహ్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా బోధించారు: “ప్రపంచం విశ్వానికి జైలు వంటిది. అవిశ్వాసికి స్వర్గం లాంటిది.” (ముస్లిమ్)

మానవులలో నరకవాసులు, స్వర్గవాసుల నిష్పత్తి

239వ అంశం : 1000లో 999 మంది నరకానికి పోతారు. కేవలం ఒక్కడే స్వర్గంలోనికి ప్రవేశిస్తాడు.

హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “తీర్పుదినం నాడు అల్లాహ్(త’ఆలా) ఆదమ్ ను ఉద్దేశించి ఇలా ఆదేశిస్తాడు: “ఓ ఆదమ్!” ఆదమ్ (అలైహిస్సలామ్) ఇలా విన్నవించుకుంటారు: “ఓ అల్లాహ్ నీ సేవలో, నీ విధేయతలో ఉన్నాను. ఇంకా మంచి నీ చేతిలోనే ఉంది.” అప్పుడు అల్లాహ్ ఇలా ఆదేశిస్తాడు: “నరక సమూహాన్ని వేరు చేయండి. హజ్రత్ ఆదమ్ (అలైహిస్సలాం) “నరక సమూహం ఎంత మంది?” అని విన్నవించుకుంటారు. అల్లాహ్ ఇలా ఆదేశిస్తాడు: “1000లో 999 మంది.”

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “ఇదే ఆ సమయం ఇందులో పిల్లలు వృద్ధులుగా మారుతారు. గర్భవతులు గర్భం పోగొట్టుకుంటారు. ఇంకా నీవు ప్రజలను మైకంలో చూస్తావు. వాస్తవంగా వారు మైకంలో ఉండరు, కాని అల్లాహ్ శిక్ష చాలా తీవ్రంగా ఉంటుంది”.

హజ్రత్ అబూసయీద్ (రదియల్లాహు అన్హు) ఇలా అంటున్నారు: “ఇది విని సహాబా (అనుచరులు) ఆందోళన చెందారు. ఇంకా ఇలా విన్నవించుకున్నారు: ‘ఓ ప్రవక్తా! మాలో ఎవరు స్వర్గంలోనికి వెళ్ళగలరు?’ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “నిశ్చితంగా ఉండండి. యాజూజ్, మాజూజ్ ఎంత అధికంగా ఉంటారంటే వారిలో వెయ్యిమంది మీలో ఒక్కరు పూర్తవుతారు. (ముస్లిమ్)

240వ అంశం: ముహమ్మద్(సల్లల్లాహు అలైహి వసల్లం) అనుచర సంఘంలోని 73 వర్గాల్లో 72 వర్గాలు నరకంలోనికి, కేవలం ఒక వర్గం స్వర్గంలోనికి పోతాయి.

హజ్రత్ ఔఫ్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా హితబోధ చేశారు: “యూదులు 71 వర్గాలుగా విడిపోయారు. వారిలో ఒక వర్గం మాత్రం స్వర్గంలో ప్రవేశిస్తుంది. మిగిలిన 70 వర్గాలు నరకంలోనికి ప్రవేశిస్తాయి. క్రైస్తవులు 72 వర్గాలుగా విడిపోయారు. వారిలో 71 వర్గాలు నరకంలోనికి ప్రవేశిస్తాయి. కేవలం ఒకవర్గం స్వర్గంలోనికి ప్రవేశించింది. మరియు ఎవరి చేతిలో ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రాణముందో ఆయన సాక్షి! నా అనుచరసంఘం 73 వర్గాలుగా విడిపోతుంది. వారిలో కేవలం ఒకవర్గం మాత్రమే స్వర్గంలోనికి ప్రవేశిస్తుంది. మిగిలిన 72 వర్గాలు నరకంలోనికి ప్రవేశిస్తాయి” ఇలా విన్నవించు కోవటం జరిగింది: “ఓ అల్లాహ్ ప్రవక్తా! స్వర్గంలోనికి వెళ్ళేవారెవరు?” ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉపదేశించారు: “అల్ జమాఅహ్.” (ఇబ్నెమాజ, సహీహ్) (కితాబుల్ ఫితన్-3992వ హదీసు)

నరకంలో స్త్రీల ఆధిక్యత

241వ అంశం : నరకంలో పురుషుల కన్నా స్త్రీలు అధిక సంఖ్యలో ఉంటారు.

హజ్రత్ ఉసామా (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా బోధించారు: “నేను స్వర్గద్వారాల వద్ద నిలబడి ఉన్నప్పుడు అందులోకి పేదవారు, అగత్యపరులు అధిక సంఖ్యలో ప్రవేశించారు. ధనవంతులను స్వర్గద్వారాల వద్దే ఆపివేయటం జరిగింది. నరకంలోనికి వెళ్ళే ధనవంతులను అంతకు ముందే నరకంలోనికి పంపివేయమని ఆదేశం ఇవ్వబడింది. మళ్ళీ నేను నరక ద్వారాల వద్ద నిలబడ్డాను, నరకంలోనికి వెళ్ళే వారిలో స్త్రీలు అధికంగా ఉండటం గమనించాను.” (బుఖారి)

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచిం చారు: “నేను స్వర్గం చూశాను. అందులో పేదలు, అగత్యపరులు అధికంగా ఉన్నారు. ఇంకా నేను నరకం చూశాను. అందులో స్త్రీలు అధిక సంఖ్యలో ఉన్నారు. (తిర్మిజి2/2098 సహీహ్) (అబ్వుబు సిఫతి జహన్నమ్-2:2098)

242వ అంశం : కొందరు స్త్రీలు తమ భర్తల పట్ల కృతఘ్నతగా ప్రవర్తించటం వల్ల నరకంలోనికి పోతారు.

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు. “ఈనాడు నేను నరకాన్ని చూశాను. అయితే అంతకు ముందు ఎన్నడూ అలాంటి దృశ్యాన్ని చూడలేదు. నేను నరకంలో స్త్రీలను అధిక సంఖ్యలో చూశాను.’ అనుచరులు ఇలా విన్నవించుకున్నారు: “ఓ ప్రవక్తా! అలా ఎందుకు?” ప్రవక్త ఇలా తెలిపారు: “అది వారి కృతఘ్నతవల్ల. మళ్ళీ ప్రశ్నించటం జరిగింది: “వారు అల్లాహ్ పట్ల కృతఘ్నత చూపుతారా?” ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “తమ భర్తల పట్ల కృతఘ్నత చూపుతారు. వారి సేవను గుర్తించరు. నువ్వు ఒక స్త్రీకి జీవితాంతం సేవలు చేయి, కాని ఎప్పుడైనా ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఏదైనా జరిగిపోతే వెంటనే ఇలా అంటుంది: ‘నేను నీ నుండి రవ్వంత సుఖాన్నయినా పొందలేదు.” (ముస్లిమ్)

243వ అంశం: కొందరు స్త్రీలు అధికంగా శపించటం వల్ల నరకానికి గురవుతారు. (నరకంలో ప్రవేశిస్తారు)

హజ్రత్ అబూసయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈదుల్ అద్హా లేదా ఈదుల్ ఫిత్ర సందర్భంగా ‘ఈద్ గాహ్’ వెళ్ళే దారిలో స్త్రీలను కలవడం జరిగింది. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) స్త్రీలనుద్దేశించి ఇలా అన్నారు: “స్త్రీలారా! దానధర్మాలు చేయండి. నేను నరకంలో స్త్రీలను అధిక సంఖ్యలో ఉండటం చూశాను.” స్త్రీలు ఇలా విన్నవించు కున్నారు: “ఓ ప్రవక్తా! దీనికికారణం ఏమిటి?” ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “మీరు అధికంగా శపిస్తారు, మీ భర్తల పట్ల కృతఘ్నతగా వ్యవహరిస్తారు.” (బుఖారి)

244వ అంశం: కొందరు స్త్రీలు సన్నని, పలుచని, ఇరుకైన, బిగుతైన అర్ధనగ్న వస్త్రాలు ధరించటం వల్ల నరకంలోనికి ప్రవేశిస్తారు.

245వ అంశం: కొందరు స్త్రీలు పురుషులను తమ వైపు మరలించటం వల్ల, ఆకర్షించటం వల్ల నరకంలోనికి ప్రవేశిస్తారు.

హజ్రత్ అబూ హురైరహ్ (రజిఅల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “నరకంలోనికి వెళ్ళే రెండు రకాల వారిని నేను ఇప్పటి వరకు చూడలేదు. వారిలో ఒకరు, వారి చేతుల్లో ఎద్దు తోకల్లాంటి కొరడాలు ఉంటాయి. వాటితో వారు ప్రజలను హింసిస్తారు. రెండవ రకం వారు బట్టలు ధరించి కూడా నగ్నంగా ఉండే స్త్రీలు, పురుషులను తమ వైపు మరల్చటానికి, తాము పురుషులకు ఆకర్షితులు కావటానికి ప్రయత్నించే స్త్రీలు. వీరి తలలు ఒంటె చీపుల్లా ఉంటాయి. (అలంకారం వల్ల) ఒక వైపు మొగ్గ ఉంటాయి. ఇటువంటి స్త్రీలు స్వర్గంలోనికి వెళ్ళరు, దాని సువాసనా ఆస్వాదించరు. అయితే చాలా దూరం నుండే స్వర్గసువాసన వస్తూ ఉంటుంది.’ (ముస్లిమ్)

నరక శుభవార్త పొందినవారు

246వ అంశం : అమ్ర్ బిన్ లుహై నరకంలో ఉన్నాడు.

హజ్రత్ అబూహురైరహ్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు: “నేను అమ్ర్ బిన్ లుహై బిన్ ఖమ్ బిన్ ఖన్ దుఫ్, బనూ కఅబ్ మూల పురుషుడ్ని నరకంలో తన ప్రేగులను ఈడుస్తూ ఉండగా చూశాను.” (ముస్లిమ్)

247వ అంశం: “సాయిబ” విగ్రహారాధనను ప్రారంభించిన అమ్ర్ బిన్ ఆమిర్ ఖుజాయీ నరకంలో ఉన్నాడు.

హజ్రత్ అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు: “నేను అమ్ర్ బిన్ ఆమిర్ ఖుజాయీని నరకంలో తన ప్రేగులను ఈడుస్తూ ఉండగా చూశాను. ఇతనే అందరికంటే ముందు ‘సాయిబ’ విగ్రహారాధనను ప్రారంభించాడు.”(ముస్లిమ్ )

248వ అంశం : యుద్ధ ధనంలోని దుప్పటిని దొంగలించినందుకు ‘కుర్కురహ్ ‘ అనే వ్యక్తి నరకంలో ఉన్నాడు.
వివరణ: హదీసు 295వ అంశం చూడండి.

249వ అంశం : బద్ర్ యుద్ధంలో చంపబడిన 24 మంది ఖురైష్ నాయకులు నరకంలో ఉన్నారు.

హజ్రత్ అబూ తల్హా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం: బద్ర్ నాడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఖురైష్కు చెందిన 24 మంది నాయకులను బద్ర్ బావి నుండి తీసి, మరో అసహ్యకరమైన, దుర్వాసనగల బావిలో విసిరివెయ్యమని ఆదేశించారు. వారిని అందులోకి విసరడం జరిగింది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) బావి ప్రక్కన నిలబడి నాయకులందరినీ వారి తండ్రుల పేర్లతో సహా పిలిచారు. ఓ ఫలానా వ్యక్తి! ఓ ఫలానా వ్యక్తి! ఇప్పుడు మీకు అల్లాహ్, ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు విధేయత చూపడం అనే విషయం మంచిదని పించదా? మా ప్రభువు మాతో చేసిన వాగ్దానాన్ని మేము సత్యంగా పొందాము. మీరు కూడా మీ ప్రభువు చేసిన వాగ్దానాన్ని సత్యంగా పొందారు. (అంటే నరకాన్ని) అని అన్నారు.” (బుఖారి)

250వ అంశం అబూ సుమామ అమ్ర్ బిన్ మాలిక్ నరకంలో ఉన్నాడు.
వివరణ: హదీసు 1వ అంశం చూడండి.

251వ అంశం: అహ్ జాబ్ యుద్ధంలో పాల్గొన్న అవిశ్వాసులు విగ్రహారాధకులు నరకాగ్నిలో ఉన్నారు.

హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) ఇలా అంటున్నారు. అహజాబ్ యుద్ధం నాడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) విగ్రహారాధకుల కొరకు ఇలా శపించారు: “అల్లాహ్ వారి ఇళ్ళను, వారి సమాధులను అగ్నితో నింపుగాక! వారు మమ్మల్ని అస్ర్ నమాజు చదవనివ్వలేదు. చివరికి సూర్యాస్త మయం అయిపోయింది.” (బుఖారి)

నరకంలో శాశ్వతంగా ఉండేవారు

252వ అంశం : అవిశ్వాసులు నరకంలో శాశ్వతంగా ఉంటారు.

గ్రంథ ప్రజలలో, బహుదైవారాధకులలో సత్యాన్ని తిరస్కరించిన వారు తప్పని సరిగా నరకాగ్నిలోకే పోతారు. అందులోనే శాశ్వతంగా ఉంటారు. వీరే సృష్టిలోకెల్లా పరమనీచులు. (అల్ బయ్యినహ్:6)

253వ అంశం: అవిశ్వాసులు నరకంలోనికి పోతారు.

నిస్సందేహంగా విశ్వసించనివారూ, మావాక్యాలను ధిక్కరించిన వారూ, నరకాగ్నిలోకి పోతారు. అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు. (అల్ బఖర:39)

254వ అంశం: ఇస్లాం పరిధి నుండి తొలగిపోయినవాడు (ముర్తద్) నరకం లోనికి ప్రవేశిస్తాడు.

మీలో ఎవరైనా తన ధర్మాన్ని పరిత్యజించి, అవిశ్వాస స్థితిలో మరణిస్తే, అతడు చేసిన మంచి పనులన్ని ఇహపరలోకాల్లోనూ వృధా అవుతాయి. ఇటువంటి వారంతా నరకవాసులు. నరకంలోనే వారు శాశ్వతంగా ఉంటారు. (అల్ బఖర:217)

255వ అంశం : కపటులు (మునాఫిఖీన్) నరకంలోనికి పోతారు.

కపటులైన ఈ పురుషులకూ, స్త్రీలకూ, అవిశ్వాసులకూ అల్లాహ్ నరకాగ్ని వాగ్దానం చేశాడు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు. ఇదే వారికి సరియైనది. వారిపై అల్లాహ్ శాపం పడింది. వారి కొరకు శాశ్వతమైన శిక్ష ఉంది. (అత్ తౌబహ్:68)

256వ అంశం: గ్రంథ ప్రజలు, ముస్లిమేతరులలో ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)ను విశ్వసించని వారు కూడా నరకంలోనికిపోతారు.

హజ్రత్ అబూహురైరహ్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖించారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవ చించారు: “ఎవరి చేతిలో ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రాణం ఉందో ఆయన సాక్షి! నా అనుచర సంఘంలోని యూదులైనా, క్రైస్తవులైనా ఇతరులెవరైనా నా గురించి విని, నాకు ఇచ్చి పంపించబడిన దాన్ని (ఖుర్ఆన్) విశ్వసించకుండా మరణిస్తే అతడు నరకానికి పోతాడు.” (ముస్లిమ్)

స్వల్పకాలానికిగాను నరకంలోనికి వెళ్ళేవారు

257వ అంశం : జకాత్ చెల్లించనివారు నరకంలోనికి వెళ్తారు.

వెండి, బంగారాలను పోగుచేసి వాటిని దైవమార్గంలో ఖర్చుపెట్టని వారికి వ్యధాభరిత మైన శిక్ష యొక్క శుభవార్తను అందచేయండి. ఈ వెండి, బంగారాలు నరకాగ్నిలో కాల్చబడే ఒక రోజు వస్తుంది. వాటితోనే వారి నొసటిపై, వారి ప్రక్కలపై, వీపులపై వాతలు పెట్టబడ తాయి. ఇది మీరు మీ కొరకు కూడబెట్టుకున్నది, ఇదిగో, ఇక మీరు కూడబెట్టిన సంపదను రుచి చూడండి.” (అత్ తౌబహ్:34,35)

258వ అంశం: తన ఇష్టప్రకారమే విశ్వాసిని చంపినవాడు శాశ్వతంగా నరకంలోనికి ప్రవేశిస్తాడు.

ఇక బుద్ధి పూర్వకంగా ఒక విశ్వాసిని చంపేవానికి ప్రతిఫలం నరకం. అందులో అతడు సదా ఉంటాడు. అతనిపై అల్లాహ్ ఆగ్రహం, శాపం అవతరిస్తాయి. అల్లాహ్ అతడి కొరకు కఠినమైన శిక్షను సిద్ధపరచి ఉంచాడు. (అన్నిసా: 93)

కొందరు ముస్లిములు మహాపాపాల కారణంగా నరకంలోనికి వెళ్తారు. తమ పాపాల కనుగుణంగా శిక్షలు అనుభవిస్తారు. ఆ తరువాత అల్లాహ్ కరుణ, దయవల్ల నరకం నుండి తీయబడతారు. అంతా అల్లాహ్ కే తెలుసు.

హజ్రత్ అబూసయీద్ (రదియల్లాహు అన్హు) మరియు హజ్రత్ అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ల ఉల్లేఖనం. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉపదేశించారు: “ఒకవేళ భూమ్యాకాశాలలో ఉన్న సృష్టితాలన్నీ (మానవులు, జిన్నులు, దైవదూతలు) ఒక విశ్వాసి హత్యలో పాల్గొంటే, అల్లాహ్ (త’ఆలా) వారందరినీ తలక్రిందులుగా నరకంలో పడవేస్తాడు. ” (తిర్మిజి, సహీహ్) (కితాబుద్దియాత్:2/1128)

259వ అంశం : అవిశ్వాసులతో యుద్ధం చేస్తూ సైన్యం నుండి పారిపోయిన వాడు నరకంలో ప్రవేశిస్తాడు.

ఎవడు అటువంటి సమయంలో వెన్ను చూపుతాడో యుద్దపు ఎత్తుగడగా అలా చేస్తే తప్ప లేదా మరొక (విశ్వాసులు) సైన్యాన్ని కలిసేందుకు అలా చేస్తే తప్ప అతడు అల్లాహ్ ఆగ్రహానికి గురవుతాడు. నరకం అతడి నివాస స్థలం అవుతుంది. అది అతి చెడ్డ పునరాగమన ప్రదేశం.(అల్ అన్ఫాల్: 16)

260వ అంశం : అనాధల ధనాన్ని అన్యాయంగా తిన్నవాడు నరకంలోనికి ప్రవేశిస్తాడు.

అనాధల ధనాన్ని అన్యాయంగా తినేవారు వాస్తవానికి తమ పొట్టలను అగ్నితో నింపుకుంటున్నారు. వారు తప్పకుండా మండే నరకాగ్నిలో విసరివేయబడతారు.(అన్నిసా: 10)

261వ అంశం: శీలవతులైన ముస్లిం స్త్రీలపై అభాండాలు వేసేవాడు నరకం లోనికి ప్రవేశిస్తాడు.

శీలవంతులు, అమాయకులు అయిన విశ్వాసంగల స్త్రీలపై అభాండం వేసేవారు- ప్రపంచంలోనూ, పరలోకంలోనూ శపించబడ్డారు. వారికి ఘోరమైన శిక్షపడుతుంది. (అన్నూర్:23)

262వ అంశం : దుర్మార్గులు నరకంలోనికి ప్రవేశిస్తారు.

నిస్సందేహంగా దుర్జనులు నరకానికిపోతారు. తీర్పుదినం నాడు వారు అందులో ప్రవేశిస్తారు. ఇక అందులోనుంచి ఎంత మాత్రం బయటపడలేరు. (అల్ ఇన్ఫితార్:14-16)

263వ అంశం : నమాజ్ చదవనివాడు నరకంలో ప్రవేశిస్తాడు.

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ అల్ ఆస్ ఉల్లేఖనం. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒకసారి నమాజు గురించి ప్రస్తావిస్తూ ఇలా ఉపదేశించారు: “ఎవరు నమాజును భద్రంగా కాపాడు కుంటారో వారి కొరకు నమాజ్ తీర్పుదినంనాడు కాంతిగా, సాక్ష్యంగా, విముక్తిగా నిలుస్తుంది. మరి నమాజ్ను కాపాడుకోని వారి కొరకు కాంతి ఉండదు, సాక్ష్యమూ ఉండదు. విముక్తి కలుగదు. ఇలాంటివాడు తీర్పుదినం నాడు ఖారూన్; ఫిరౌన్, హామాన్ మరియు ఉబయ్ బిన్ ఖలలతో ఉంటారు.” (ఇబ్నె హిబ్బాన్, హసన్) (సహీహ్ ఇబ్నెహిబ్బాన్ (అర్నావూత్గారి) : 4/1467)

264వ అంశం : ఉపవాసం పాటించని వారు నరకంలో ప్రవేశిస్తారు.
వివరణ: హదీసు 169వ అంశం చూడండి.

265వ అంశం : శక్తి ఉండి కూడా హజ్ చేయనివారు నరకంలోనికి ప్రవేశిస్తారు.

హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) ఇలా అంటున్నారు. “నేను కొందరిని నగరాల్లో పంపుదామని నిర్ణయించుకున్నాను. వారు శక్తి ఉండి కూడా హజ్ చేయని వారిని గుర్తిస్తారు. నేను వారిపై పన్ను విధిస్తాను. ఇలాంటి వారు ముస్లిములు కారు.” (సుననె సయీద్) (ముస్తఖల్ అక్బార్, కితాబుల్ మనాసిక్)

266వ అంశం : చూపుగోలు, ప్రదర్శ నాబుద్ధిగలవారు నరకంలోనికి ప్రవేశిస్తారు.

హజ్రత్ అబూహురైరహ్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు:

“తీర్పు దినం నాడు ఒక అమర వీరుడ్ని రప్పించటం జరుగుతుంది. అల్లాహ్ (త’ఆలా) తన అనుగ్రహాలన్నింటినీ పేర్కొంటాడు. ఆ అమరవీరుడు వాటన్నిటినీ అంగీకరిస్తాడు. అల్లాహ్ (త’ఆలా) అతన్ని ఇలా ప్రశ్నిస్తాడు: “నీవు ఈ అనుగ్రహాలకు బదులుగా ఏం ఘనకార్యం చేశావు?” అతడు ఇలా అంటాడు: “నేను నీ మార్గంలో యుద్ధం చేశాను. చివరికి అమరుడనయ్యాను.” అల్లాహ్ (త’ఆలా) ఇలా ఆదేశిస్తాడు: ‘నీవు అసత్యం పలుకుతున్నావు. నీవు వీరుడు అనిపించు కోటానికే యుద్ధం చేశావు. ప్రపంచంలో నీవు వీరుడిగా పేరుగాంచావు. ఆ తరువాత దైవదూత లను ఆదేశించబడుతుంది: ‘అతన్ని తలక్రిందులుగా ఈడ్చుకుంటూ నరకంలోనికి విసిరి వేయటం జరుగుతుంది.’

ఆ తరువాత ఒక వ్యక్తిని రప్పించడం జరుగుతుంది. అతడు విద్యను అభ్యసించి ఇతరులకు విద్య నేర్పి ఉంటాడు. ఖుర్ఆన్ చదివి ఉంటాడు. అల్లాహ్ (త’ఆలా) తన అనుగ్రహా లను లెక్కిస్తాడు. అతడు వాటిని అంగీకరిస్తాడు. అప్పుడు అల్లాహ్(త’ఆలా) ఇలా ప్రశ్నిస్తాడు: ‘వీటి కృతజ్ఞతగా నీవు ఏంచేశావు?” అతను ఇలా విన్నవించుకుంటాడు: ‘ఓ అల్లాహ్ ! నేను విద్యను అభ్యసించాను. ఇతరులకూ నేర్పాను. నీకోసం ఖుర్ఆన్ పఠించి ప్రజలకు వినిపిం చాను.” అల్లాహ్ (త’ఆలా) ఇలా ఆదేశిస్తాడు: “నీవు అబద్ధం పలికావు. నిన్ను ప్రజలు పండితుడు అనాలనే నువ్వు విద్యనభ్యసించావు. నిన్ను ఖారీ అనాలనే నువ్వు ఖుర్ఆన్ పఠించి వినిపిం చావు. ప్రపంచం నిన్ను పండితునిగా, ఖారీగా గుర్తించింది’ అనిపలికిన పిమ్మట దైవదూతలను ఆదేశించగా అతన్ని తలక్రిందులుగా ఈడ్చుకుంటూ నరకంలో పడవేయడం జరుగుతుంది.

ఆ తరువాత మూడో వ్యక్తి రప్పించబడతాడు. అతనికి ప్రపంచంలో సంపదలు ప్రాప్తించి ఉంటాయి. అల్లాహ్ అతనికి తన అనుగ్రహాలన్నిటినీ లెక్కిస్తాడు. అతనితో వాటికి కృతజ్ఞతగా ఏం చేశావు?’ అని ప్రశ్నిస్తాడు. దానికి అతను “ఓ అల్లాహ్ ! నీ మార్గంలో వాటన్నిటినీ వినియోగించాను. నీవు కోరిందే చేశాను.’ అని అంటాడు. దానికి అల్లాహ్ నీవు అబద్దం పలుకుతున్నావు. ప్రజలు నిన్ను ధర్మాత్ముడు అని అనాలనే నీవు దానధర్మాలు చేశావు. ప్రజలు నిన్ను ధర్మాత్మునిగా గుర్తించారు’ అని ఆగ్రహిస్తాడు. ఆ తరువాత దైవదూతలను ఆదేశించగా అతన్ని కూడా తలక్రిందులుగా పట్టుకొని ఈడ్చుకుంటూ నరకంలో పడవేస్తారు. (ముస్లిమ్)

267వ అంశం : అసత్యాలను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు అంటగట్టినవాడు నరకంలోనికి ప్రవేశిస్తాడు.

హజ్రత్ ఉమ్మె సల్మా (రదియల్లాహు అన్హా) ఇలా అంటున్నారు: “ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అంటూ ఉండగా నేను విన్నాను. ‘నేను అనని దాన్ని నాకు అంటగట్టిన వాడి నివాసం నరకం.” (బుఖారి కితాబుల్ ఇల్మ్)

268వ అంశం : అహంకారి నరకంలోనికి ప్రవేశిస్తాడు.

హజ్రత్ అబూసయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) , హజ్రత్ అబూహురైరహ్ (రదియల్లాహు అన్హు) ఇద్దరి ఉల్లేఖనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా హితబోధచేశారు: “గౌరవం అల్లాహ్ (త’ఆలా) ఇజారు. గొప్పతనం అతని దుప్పటి. ఎవరు వాటిని నా నుండి లాక్కోడానికి ప్రయత్నిస్తారో నేను వారిని శిక్షిస్తాను” అని అల్లాహ్ అన్నాడు. (ముస్లిమ్ కితాబుల్ బిర్)

269వ అంశం : వడ్డీ తినేవాడు నరకంలోనికి ప్రవేశిస్తాడు.

270వ అంశం : వ్యభిచార స్త్రీ, పురుషులిద్దరూ నరకంలోనికి ప్రవేశిస్తారు.
వివరణ: హదీసు 173, 174వ అంశాలు చూడండి.

271వ అంశం : మద్యపానం సేవించేవారు నరకంలోనికి ప్రవేశిస్తారు.
వివరణ: హదీసు 90వ అంశం చూడండి.

272వ అంశం : ఆత్మహత్యకు పాల్పడినవాడు నరకంలోనికి ప్రవేశిస్తాడు.
వివరణ: హదీసు 178వ అంశం చూడండి.

273వ అంశం : ప్రాణుల చిత్రాలు వేసేవారు నరకంలోనికి ప్రవేశిస్తారు.

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అంటూ ఉండగా నేను విన్నాను. “తీర్పు దినం నాడు ప్రాణుల చిత్రాలను వేసేవారు అందరికంటే కఠినంగా శిక్షించబడుదురు.” (బుఖారి కితాబుల్ లిబాస్)

274వ అంశం: ప్రాపంచిక లాభాలను పొందాలని ధార్మిక విద్య అభ్యసించేవారు నరకంలో ప్రవేశిస్తారు.

హజ్రత్ కఅబ్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అంటూ ఉండగా నేను విన్నాను: “ధార్మిక విద్య ద్వారా, 1) పండితుల మధ్య గర్వించటానికి, 2) అజ్ఞానులతో కలహించటానికి, 3) గొప్పవాళ్ళను తన వైపు రప్పించటానికి ప్రయత్నించిన వారిని అల్లాహ్ (త’ఆలా) నరకంలో పడవేస్తాడు. (తిర్మిజి) (అబ్వాబుల్ ఇల్మ్:2/2128 )

275వ అంశం: సంక్షేమ నిధులలో అవకతవకలకు పాల్పడినవారు నరకంలోనికి ప్రవేశిస్తారు.

హజ్రత్ ఖాలహ్ అన్సారియా (రదియల్లాహు అన్హా) ఇలా అంటున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అంటూ ఉండగా విన్నాను: “అల్లాహ్ ధనంలో అవకతవకలకు పాల్పడినవారు తీర్పు దినంనాడు నరకంలోనికి ప్రవేశిస్తారు.’ (బుఖారి కితాబుల్ జిహాద్)

276వ అంశం : ముసలి వ్యభిచారి, అసత్యవాది అయిన పాలకుడు, గర్విష్టి అయిన బిచ్చగాడు నరకంలో ప్రవేశిస్తారు.

హజ్రత్ అబూహురైరహ్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా హెచ్చరించారు: “అల్లాహ్ తీర్పుదినం నాడు ముగ్గురు వ్యక్తులతో మాట్లాడడు, వారిని పరిశుద్ధ పరచడు, వారికి కఠిన శిక్ష పడుతుంది. 1) ముసలి వ్యభిచారి, 2) అసత్యపాలకుడు, 3) గర్విష్టి అయిన బిచ్చగాడు.” (ముస్లిమ్ కితాబుల్ ఈమాన్)

277వ అంశం : ఉపకారం చేసి ఎత్తిపొడిచే వాడు, అసత్య ప్రమాణం చేసి సరుకు అమ్మేవాడు నరకంలో ప్రవేశిస్తారు.

హజ్రత్ అబూజర్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “తీర్పు దినం నాడు అల్లాహ్ (త’ఆలా) ముగ్గురు వ్యక్తులతో మాట్లాడడు. వారివైపు చూడడు, వారిని పరిశుద్ధ పరచడు. పైగా వారి కొరకు కఠినమైన శిక్ష ఉంది. “ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా మూడుసార్లు అన్నారు. దానికి హజ్రత్ అబూజర్ (రదియల్లాహు అన్హు) ఇలా విన్నవించుకున్నారు: “విముక్తి లభించని, నష్టానికి గురైన ఆ ముగ్గురు ఎవరు అల్లాహ్ ప్రవక్తా?” ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు: “1) ఇజారును చీలమండల క్రింది వరకు ధరించినవాడు, 2) ఉపకారంచేసి ఎత్తిపొడిచేవాడు, 3) అసత్యప్రమాణాలు చేసి సరుకు అమ్మేవాడు.” (ముస్లిమ్ కితాబుల్ ఈమాన్)

278వ అంశం : జంతువులను హింసించేవారు నరకంలోనికి ప్రవేశిస్తారు.

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా వివరించారు: “ఒక స్త్రీ బంధించి ఉంచిన పిల్లి చివరికి చనిపోయింది. ఆ స్త్రీ నరకంలో ప్రవేశించింది. ఆ స్త్రీ పిల్లిని బంధించి అన్నపానీయాలు పెట్టలేదు. అది బయటకు వెళ్ళి తన ఆహారం వెతుక్కోడానికి, దాన్ని విడిచిపెట్టనూ లేదు.” (ముస్లిమ్ కితాబుల్ బిర్)

279వ అంశం: ఇతరులను హింసించేవారు, ఇతరుల హక్కులను దోచుకునే వారు నరకానికి పోతారు.

హజ్రత్ అబూహురైరహ్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన అనుచరులతో ఇలా ప్రశ్నించారు: “దరిద్రుడు అని ఎవరినంటారో మీకేమయినా తెలుసా? అప్పుడు అనుచరులు “ఎవరివద్దయితే డబ్బు దస్కం ఉండదో, ఎవరి వద్దనయితే నిత్యం ఉపయో గించుకునే సామాను ఉండదో వారినే దరిద్రులని అంటారు’ అని బదు లిచ్చారు. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: ‘నా అనుచర సంఘంలోని దరిద్రుడు ఎలా ఉంటాడంటే, అతను ప్రళయదినాన తన నమాజ్, రోజా, జకాత్ లతో అల్లాహ్ ఎదుట హాజరవుతాడు. అతను ప్రపంచంలో ఇతరులను దుర్భాషలాడి ఉంటాడు, కొందరి సొమ్మును దొంగిలించి ఉంటాడు. ఇతరుల్ని హత్యచేసి ఉంటాడు. మరికొందర్ని అన్యాయంగా కొట్టి ఉంటాడు. ఈ పీడిత ప్రజలందరికీ అతని సత్కార్యాల పుణ్యం పంచి పెట్టబడుతుంది. ఇంకా అతని సత్కార్యాలు మిగలవుకాని, పీడితుల హక్కులు మిగిలి ఉంటాయి. అప్పుడు వారి పాపాలను వీడి నెత్తిన వెయ్యటం జరుగుతుంది. ఆ వెంటనే అతన్ని నరకంలో విసరివేయటం జరుగుతుంది.” (ముస్లిమ్ కితాబుజ్జుల్మ్)

280వ అంశం : అధర్మసంపాదన తినేవాడూ, ద్రోహం చేసేవాడు, మోసగించే వాడు, పిసినారి, లేదా అసత్యవాది ఇంకా దుర్భాషలాడేవాడు నరకంలోనికి వెళ్తారు.

హజ్రత్ అయాజ్ బిన్ హమార్ మజాషియా (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక రోజు ప్రసంగిస్తూ ఇలా అన్నారు: “అయిదు రకాల వ్యక్తులు నరకంలోకి వెళ్తారు. ధర్మసంపాదనను పరికించని అజ్ఞానులు, అంధులుగా అనుకరించేవారు, సామాన్య వస్తువు విషయంలో కూడా ద్రోహం తలపెట్టేవారు, నీ ఇంటి, ధన విషయాల్లో నిన్ను మోసం చేసేవాడు. ఆ తరువాత ప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) పిసినారి లేదా అసత్యవాది అని ప్రస్తావించారు. ఇంకా అయిదవ వ్యక్తి దుర్భాషలాడేవాడు, అశ్లీల విషయాలు పలికేవాడు.”(ముస్లిమ్ కితాబుల్అదబ్)

281వ అంశం : జగడాలమారి, దుర్గుణాలు గలవాడు నరకంలోకి వెళ్తారు.

హజ్రత్ హారిసా బిన్ వహబ్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా వివరణ ఇచ్చారు: “జగడాలమారి, దుర్గుణాలు గలవాడు స్వర్గంలో ప్రవేశించలేరు.” (అబూదావూద్ 4801, సహీహ్) (కితాబు సిఫతిల్ మునాఫిఖిన్: 4801)

282వ అంశం : అవసరానికిమించి నీళ్ళు ఉండి బాటసారులకు నీళ్ళు ఇవ్వని వాడు, ప్రాపంచిక వ్యామోహం వల్ల పాలకునితో చేతులు కలిపినవాడు నరకంలో ప్రవేశిస్తాడు.

హజ్రత్ అబూహురైరహ్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉపదేశిం చారు: “అల్లాహ్ (త’ఆలా) తీర్పు దినం నాడు ముగ్గురు వ్యక్తులతో మాట్లాడడు. వారి వైపునకు కరుణాదృష్టితో చూడడు. ఇంకా వారిని పరిశుద్ధపరచడు. వారికోసం కఠినమైన శిక్ష కలదు. 1) అవసరానికి మించి నీళ్ళు కలిగి బాటసారులకు నీళ్ళు ఇవ్వని వ్యక్తి. 2) అసర్ తర్వాత సరుకును అమ్మినవాడు, అల్లాహ్ సాక్షి దీన్ని ఇంతకి కొన్నాను అని ప్రమాణం చేస్తాడు. కానీ అతడు ఆ వెలకు కొనలేదు. కొనేవాడు దాన్ని నిజమని కొంటాడు. 3) ప్రాపంచిక వ్యామోహం వల్ల పాలకునికి వంతపాడేవాడు. లాభం ఉంటే నమ్మకంగా ఉంటాడు, లాభం లేకపోతే ద్రోహం తలపెట్టేవాడు. (ముస్లిమ్, కితాబుల్ ఈమాన్)

283వ అంశం: ధర్మం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించనివాడు నరకం లోనికి పోతాడు.

హజ్రత్ అబూహురైరహ్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు. అతను ప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ను ఇలా అంటూ ఉండగా విన్నారు. “ఒక్కోసారి దాసుడు తన నోటి ద్వారా ఎలాంటి మాట పలుకు తాడంటే, తూర్పు పడమరల మధ్య దూరం కన్నా అధికంగా అగ్నిలోకి వెళ్ళిపడతాడు.” (ముస్లిమ్, కితాబుజ్జుహద్)

284వ అంశం: ప్రమాణాలు చేసి ఇతరుల హక్కుల్ని కాజేసేవాడు నరకంలోకి వెళ్తాడు.

హజ్రత్ అబూ ఉమామ హారిసీ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచిం చారు: “ఎవరు ప్రమాణం చేసి ముస్లిముల హక్కుల్ని దోచుకుంటారో, వారి కొరకు అల్లాహ్ నరకాగ్ని తప్పనిసరి చేసివేస్తాడు. ఒక వ్యక్తి ‘ఓ ప్రవక్తా! అది మామూలు వస్తువైనా సరే?’ అని ప్రశ్నించాడు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “అది ఒక జిల్లేడు కొమ్మ అయినాసరే.” (ముస్లిమ్, కితాబుల్ ఈమాన్)

285వ అంశం: పైజామా, షల్వార్ లేదా లుంగీ చీలమండల క్రింద వ్రేలాడ గట్టేవాడు నరకంలో ప్రవేశిస్తాడు.

హజ్రత్ అబూహురైరహ్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా హెచ్చరించారు: “చీలమండల క్రింద ఉండే వస్త్రాలు, నరకంలోనికి వెళ్తాయి.” (బుఖారీ, కితాబుతహార)

286వ అంశం : వుజూ సరిగా చేయనివాడు నరకంలో ప్రవేశిస్తాడు.

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కొందరిని వుజూ చేస్తూ ఉండగా చూశారు. వారి మడమలు తడపనందువల్ల మెరుస్తూ కనిపించాయి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలాఅన్నారు: “మడమలు ఎండుగా ఉంటే వినాశనం తప్పదు. వుజూ సరిగా చేయండి.” (ముస్లిం 241, ఇబ్నెమాజ 450, సహీహ్)

287వ అంశం : అధర్మసంపాదన ద్వారా సంరక్షించబడేవాడు నరకంలోనికి ప్రవేశిస్తాడు.

హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా హెచ్చరించారు: “అధర్మ సంపాదన ద్వారా సంరక్షించబడిన శరీరాన్ని నరకాగ్ని అన్నిటికంటే ముందు కాల్చుతుంది.” (తిబ్రానీ) (అల్బానీగారి సహీహ్ జామిఉస్సగీర్: 4/4395)

288వ అంశం : పేరు ప్రతిష్టల కోసం దుస్తులు ధరించిన వాడు నరకంలోనికి ప్రవేశిస్తాడు.

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారు. “ప్రపంచంలో పేరు ప్రతిష్టల కోసం దుస్తులు ధరించేవారికి తీర్పుదినం నాడు అల్లాహ్ పరమ అవమాన కరమైన దుస్తులను ధరించి వాటికి నిప్పు అంటిస్తాడు.” (ఇబ్నెమాజ హసన్) (కితాబుల్ లిబాస్ 3606)

289వ అంశం: తెలిసి కూడా ధార్మిక సమస్య పరిష్కారాన్ని దాచేవాడు, తెలుపని వాడు నరకంలోనికి ప్రవేశిస్తారు.
వివరణ: హదీసు 170వ అంశం చూడండి.

290వ అంశం: హత్య చేసే ఉద్దేశంతో పరస్పరం దాడికి దిగిన ఇద్దరు ముస్లి ములూ నరకంలోనికి ప్రవేశిస్తారు.

హజ్రత్ అబూ మూసా (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచిం చారు: ఇద్దరు ముస్లిములు పరస్పరం కరవాలాలు ధరించి దాడికి దిగితే, వధించిన వాడు, వధించ బడినవాడూ ఇద్దరూ నరకంలోనికి ప్రవేశిస్తారు. అనుచరులు, “వధించినవాడు నరకవాసి అనేది అర్థమవుతుంది. కాని వధింపబడినవాడు అనేది ఎందుకు?” అని ప్రశ్నించారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) , “వధించబడినవాడు కూడా తన ప్రత్యర్థిని వధించాలనే ఉద్దేశం కలిగి ఉండేవాడు’ అని సమాధాన మిచ్చారు. (ఇబ్నెమాజ, సహీహ్) (కితాబుల్ ఫితన్: 3964)

291వ అంశం: దగా, మోసం చేసేవాడు కూడా నరకంలో ప్రవేశిస్తాడు.

హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ ఉల్లేఖనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా హెచ్చరించారు. “మోసగించే వాడు మనవాడుకాడు. ఇంకా దగా, మోసం నరకాగ్నిలోకి వెళ్తాయి. (తిబ్రానీ) (అల్బానీగారి సిల్సెలతు అహదీసు సహీహహ్:3/1058)

292వ అంశం: బంగారు ఉంగరాన్ని ధరించినవాడు నరకంలో ప్రవేశిస్తాడు.

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒకవ్యక్తి చేతిలో బంగారు ఉంగరాన్ని చూశారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతని చేతి నుండి ఆ బంగారు ఉంగరాన్ని తీసి దూరంగా పారవేశారు. ఇంకా ఇలా అన్నారు: ‘మీలోని ఎవరైనా నిప్పును తన చేతుల్లోకి తీసుకోదలచినవాడే బంగారు ఉంగరాన్ని ధరిస్తాడు.” (ముస్లిమ్ కితాబుల్ లిబాస్)

293వ అంశం: వెండి, బంగారు కంచాలలో తినే, త్రాగేవారు నరకంలో ప్రవేశిస్తారు.

హజ్రత్ ఉమ్మె సల్మా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా హెచ్చరించారు: “వెండి, బంగారు కంచాలలో తినే, త్రాగేవారు తమ పొట్టలో నరకాగ్నిని దింపారు.” (ముస్లిమ్)

294వ అంశం: “నా గౌరవార్థం ప్రజలు నిలబడాలని’ కోరేవారు నరకంలో ప్రవేశిస్తారు.

హజ్రత్ అబూ మిజ్లజ్ ఉల్లేఖనం. హజ్రత్ ముఆవియహ్ (రదియల్లాహు అన్హు) రాక సందర్భంగా హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ జుబైర్ (రదియల్లాహు అన్హు) , హజ్రత్ సఫ్వాన్ (రదియల్లాహు అన్హు) ఇద్దరూ నిల్చున్నారు. అప్పుడు ముఆవియహ్(రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు: “మీరిద్దరూ కూర్చోండి” ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అంటూ ఉండగా నేను విన్నాను: “తన గౌరవార్ధం ప్రజలు నిలబడాలని కోరేవారు తన నివాసం నరకంలో ఏర్పాటు చేసుకోవాలి.” (తిర్మిజి 2/2212, సహీహ్ ) (అబ్వాబుల్ ఇస్తీజాన్: 2/2212)

295వ అంశం: యుద్ధ ధనాన్ని దొంగలించినవాడు నరకంలో ప్రవేశిస్తాడు.

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కాలంలో ఒక వ్యక్తిని యుద్ధ ధనం రక్షకుడిగా నియమించడం జరిగింది. అతని పేరు ‘కిరి కిరహ్’ అతడు మరణించిన తరువాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అన్నారు: ఇతడు నరకంలో ఉన్నాడు.” ప్రవక్త అనుచరులు వెళ్ళి వాడి సామాన్లు తనిఖీ చేయగా యుద్ధ ధనం నుండి దొంగలించిన ఒక దుప్పటి కనిపించింది.(ముస్లిమ్)

296వ అంశం: పరోక్షంగా నిందించేవాడు నరకంలో ప్రవేశిస్తాడు.
వివరణ: హదీసు 181వ అంశం చూడండి.

297వ అంశం: మానవుల్లోని అధిక సంఖ్యాకులు నోరు, మర్మాంగం వల్ల నరకం లోనికి వెళ్తారు.

హజ్రత్ అబూహురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను ఇలా ప్రశ్నించడం జరిగింది. “ఏ సత్కార్యం వల్ల మానవుల్లోని అధికులు స్వర్గంలో ప్రవేశిస్తారు?” ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) , “దైవభీతి, సద్గుణాలు ” అని సమాధానం ఇచ్చారు. మళ్ళీ ఇలా ప్రశ్నించడం జరిగింది: “ఏ దుష్కార్యం వల్ల ప్రజలు అధికంగా నరకంలోనికి ప్రవేశిస్తారు?” దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) , “నోరు, మర్మాంగం” అని సమాధానమిచ్చారు. (తిర్మిజి, హసన్) (కితాబుల్ బిర్రివస్సిలహ్ : 2004)

నరక సంభాషణ

298వ అంశం: అల్లాహ్ (త’ఆలా) ఆజ్ఞాపించగా నరకం మాట్లాడుతుంది.

అల్లాహ్ (త’ఆలా) : “నువ్వు నిండిపోయావా?”

నరకం: “ఇంకేమైనా ఉందా ?” (ఇంకా కావాలి)

ఆనాడు మేము నరకాన్ని, “నీవు నిండిపోయావా?’ అని అడిగినప్పుడు అది “ఇంకేమైనా ఉందా?” అని అంటుంది. (ఖాఫ్:30)

299వ అంశం: నరకానికి కళ్ళు ఉంటాయి. వాటి ద్వారా దూరం నుండే అవిశ్వాసులు రావటం చూసుకుంటుంది.

అది వారిని దూరం నుండే చూసినప్పుడు, వారు దాని క్రోధ ధ్వనులను, విజృంభణ ధ్వనులను వింటారు. (అల్ ఫుర్ఖాన్:12)

300వ అంశం : నరకానికి రెండు కళ్ళు ఉన్నాయి. వాటితో అది చూస్తుంది. రెండు చెవులు ఉన్నాయి. వాటితో అది వింటుంది. ఒక నోరు ఉంది. దానితో అది మాట్లాడుతుంది.

హజ్రత్ అబూహురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు: “తీర్పు దినం నాడు నరకం నుండి ఒక మెడ బయటికి వస్తుంది. దానికి రెండు కళ్ళు ఉంటాయి. వాటితో అది చూస్తుంది. రెండు చెవులు ఉంటాయి. వాటితో అది వింటుంది. ఒక నోరు ఉంటుంది. దానితో అది మాట్లాడుతుంది. నరకం ఇలా అంటుంది: “మూడు రకాల వ్యక్తుల్ని శిక్షించటానికి నన్ను రప్పించటం జరిగింది. 1) అల్లాహ్ పట్ల అహంకారం, శత్రుభావం కలిగి ఉన్నవాడు. 2) అల్లాహ్ తోపాటు ఇతరులను కూడా ప్రార్థించేవాడు. 3) చిత్రాలు (ప్రాణుల) వేసేవాడు.” (తిర్మిజి) (అబ్వాబు సిఫతి జహన్నమ్:2/2083)

మిమ్మల్నీ, మీ కుటుంబాన్నీ నరకాగ్ని నుండి కాపాడుకోండి

301వ అంశం : అల్లాహ్ (త’ఆలా) విశ్వాసులందరికీ తననూ, తన కుటుంబాన్ని నరకాగ్ని నుండి కాపాడుకోమని ఆదేశించాడు.

విశ్వాసులారా! మీరు మిమ్మల్నీ, మీ కుటుంబాన్నీ మానవులు, రాళ్ళు ఇంధనం కాబోయే అగ్ని నుండి కాపాడుకోండి. దానిపై బలిష్టులు, కఠినులు అయిన దైవదూతలు నియమించబడి ఉంటారు. వారు ఎంతమాత్రం అల్లాహ్ ఆజ్ఞను ఉల్లంఘించరు. వారు తమకు ఆదేశించిన దాన్నే పాటిస్తారు. (అత్తహ్రీమ్:6)

302వ అంశం: ప్రవక్తలందరూ తమ సంఘాలను నరకాగ్ని నుండి రక్షించుకోమని హెచ్చరించారు.

1) హజ్రత్ నూహ్ (అలైహిస్సలామ్)

మేము నూహ్ ను అతని జాతి వద్దకు పంపాము. అతడు ఇలా అన్నాడు: “నా జాతి ప్రజలారా! అల్లాహ్ ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరొక దేవుడు లేడు. మీ పట్ల ఒక భయంకర దినం నాటి శిక్షను గురించి నేను భయపడుతున్నాను.” (అల్ ఆరాఫ్:59)

2) హజ్రత్ ఇబ్రాహీమ్ (అలైహిస్సలామ్)

అతడు ఇలా అన్నాడు: ‘మీరు ప్రాపంచిక జీవితంలో అల్లాహ్ను కాదని విగ్రహాలను మీ మధ్య ప్రేమకు సాధనంగా చేసుకున్నారు. కాని ప్రళయం నాడు మీరు పరస్పరం తిరస్కరించుకుంటారు, శపించుకుంటారు. మీ నివాసం నరకం అవుతుంది. మీకు సహాయం చేసేవాడెవ్వడూ ఉండడు.” (అల్ అన్కబూత్ :25)

3) హజ్రత్ హూద్ (అలైహిస్సలామ్)

కొంచెం వారికి ఆద్ సోదరుని (హూద్) గాధను వినిపించు. అప్పుడు అతను ఇసుక గుట్టల మధ్య నివసించే తన జాతివారిని ఇలా హెచ్చరించాడు. ఈ విధంగా హెచ్చరించే వారు అంతకు ముందు కూడా వచ్చారు. అతని తరువాత కూడా వచ్చారు. “అల్లాహ్ ను వదలి మరెవ్వరినీ ఆరాధించకండి. మీ గురించి ఒక భయంకరమైన రోజు విధించబడే శిక్ష పట్ల నేను భయపడుతున్నాను.” (అల్ అహ్ ఖాఫ్:21)

4) హజ్రత్ షుఐబ్ (అలైహిస్సలామ్)

మదయన్ ప్రజల వైపునకు మేము వారి సోదరుడైన షుబిబ్ను పంపాము. అతను ఇలా అన్నాడు: “నా జాతి ప్రజలారా! అల్లాహ్ నే ఆరాధించండి. ఆయన్ను వదలి మీకు మరో దేవుడు లేదు. తూనికల్లో, కొలతల్లో తక్కువ చేయకండి. నేను ఈనాడు మిమ్మల్ని మంచి స్థితిలో చూస్తున్నాను. కాని మీపైకి రానున్న చుట్టుముట్టే దినం గురించి భయపడు తున్నాను.” (హూద్:84)

5) హజ్రత్ మూసా (అలైహిస్సలామ్)

హజ్రత్ మూసా (అలైహిస్సలాం) ఇలా అన్నారు; “మేము నీ వద్దకు నీ ప్రభువు సూచనలు తీసు కుని వచ్చాము. రుజుమార్గం అనుసరించే వారికి శాంతి ఉంది. తిరస్కరించి విముఖత చూపేవారికి శిక్ష ఉంది” అని మాకు దైవవాణి ద్వారా తెలుపబడింది. (తాహా:47,48)

6) హజ్రత్ ఈసా (అలైహిస్సలామ్)

వాస్తవానికి మసీహ్ ఇలా అన్నాడు: “ఓ ఇస్రాయీలు వంశీయులారా! అల్లాహ్ కే దాస్యం చేయండి. ఆయన నాకూ ప్రభువే, మీకూ ప్రభువే. ఇతరులను అల్లాహ్ భాగస్వాము లుగా చేసేవారికి అల్లాహ్ స్వర్గాన్ని నిషిద్ధం చేశాడు. వారి నివాసం నరకం. దుర్మార్గులకు సహాయం చేసేవాడెవడూ లేదు.” (అల్మాయిదహ్:72)

7) ఇతర ప్రవక్తలు, సందేశహరులు

మేము ప్రవక్తలను పంపేది, వారికి శుభవార్తలు ఇవ్వటానికి, హెచ్చరించటానికి మాత్రమే. కనుక విశ్వసించి, తనను తాను సరిదిద్దుకునే వారికి భయం కానీ, విచారం కానీ కలిగే అవకాశం లేదు. అయితే మా వాక్యాలను తిరస్కరించేవారు తమ అవిధేయ తలకు ఫలితంగా తప్పకుండా శిక్ష అనుభవిస్తారు. (అల్ అన్అమ్: 48,49)

8) హజ్రత్ ముహమ్మద్ (సఅసం):

ఓ ప్రవక్తా! వారితో ఇలా అను, “నేను మీకు ఒక విషయాన్ని బోధిస్తున్నాను. అల్లాహ్ కోసం, మీరు ఒక్కొక్కరూ, ఇద్దరిద్దరూ కలసి మీ బుద్ధిని ఉపయోగించి ఆలోచించండి. మీ సహచరుని మాటలలో పిచ్చితనం ఏముందో? అతను కేవలం ఒక తీవ్రమైన శిక్షకు ముందు మీకు హెచ్చరించేవాడు మాత్రమే.” (సబా:46)

303వ అంశం: అందరికంటే ముందు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన బంధుమిత్రులను నరకాగ్ని పట్ల హెచ్చరించారు.

హజ్రత్ అబూహురైరహ్(రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం. ఈ వాక్యం అవతరించబడినప్పుడు; ‘మీ సన్నిహిత బంధుమిత్రులను హెచ్చరించండి.'(షు అరా:214)

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఖురైష్ ప్రజలను పిలిపించారు. వారందరూ వచ్చిచేరారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అందరినీ సంక్షిప్తంగా హెచ్చరించారు. ఆ తరువాత ప్రత్యేకంగా పేర్లు పిలిచి హెచ్చరించారు. “ఓ కఅబ్ బిన్ లూయీ సంతానమా! మిమ్మల్ని మీరు నరకాగ్ని నుండి రక్షించుకోండి. ఓ ముర్ర బిన్ కఅబ్ సంతానమా! మిమ్మల్ని మీరు నరకాగ్ని నుండి రక్షించుకోండి! ఓ హాషిమ్ సంతానమా! మిమ్మల్ని మీరు నరకాగ్ని నుండి రక్షించుకోండి! ఓ అబ్దుల్ ముత్తలిబ్ సంతానమా! మిమ్మల్ని మీరు నరకాగ్ని నుండి రక్షించుకోండి. ఓ ఫాతిమా! నిన్ను నువ్వు నరకాగ్ని నుండి రక్షించుకో. అల్లాహు వ్యతిరేకంగా నేను నీకు దేనికీ పనికిరాను. అయితే ఇహలోకంలో నీతో నాకున్న బంధుత్వాన్ని నెరవేరుస్తూ ఉంటాను.” (ముస్లిమ్)

304వ అంశం: ప్రతి ముస్లిం స్త్రీ పురుషులు తమను తాము నరకాగ్ని నుండి రక్షించుకోవటానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలి.

హజ్రత్ అదీ బిన్ హాతిమ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నరకాగ్ని గురించి ప్రస్తావించారు: “ఆ తరువాత తన ముఖాన్ని మరోవైపు త్రిప్పుకున్నారు. ఆ తరువాత ఇలా అన్నారు: ప్రజలారా! నరకాగ్ని నుండి కాపాడుకోండి. మళ్ళీ రెండవసారి ముఖాన్ని త్రిప్పుకున్నారు. చాలా సేపు అలాగే ఉన్నారు. “ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అగ్నిని చూస్తున్నారని మేము భావించాము.” మళ్ళీ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “ప్రజలారా! నరకాగ్ని నుండి రక్షించుకోండి. ఖర్జూరం ఒక్కముక్క దానం చేసైనా సరే. ఆ ఖర్జూరపు ముక్క అయినా లేదంటే ‘సద్వచనం’ పలికి నరకాగ్ని నుండి రక్షించుకోండి.” (ముస్లిమ్ కితాబుజ్జుకాత్)

305వ అంశం: “ప్రజలారా! నరకాగ్నికి దూరంగా ఉండండి.” ‘ప్రజలారా! నరకాగ్నికి దూరంగా ఉండండి.’

హజ్రత్ అబూహురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు: “నా ఉదాహరణ ఇలా ఉంది: ఒక వ్యక్తి మంట రాజేశాడు. ఆ పరిసరమంతా కాంతిమంతం అయిపోయింది. అప్పుడు తుమ్మెదలు, ఇతర పురుగులు ఆ మంటల్లో పడసాగాయి. ఆ వ్యక్తి వాటిని కాపాడ సాగాడు. కాని అవి అతనిపై ఆధిక్యత పొందాయి. అవి అగ్నిలో పడుతూ పోయాయి. ఇదే మీ, నా ఉపమానం నేను మిమ్మల్ని పట్టుకొని నరకాగ్ని నుండి రక్షిస్తున్నాను. ఇలా హెచ్చరి స్తున్నాను. “ప్రజలారా! అగ్నికి దూరంగా ఉండండి.” “ప్రజలారా! అగ్నికి దూరంగా ఉండండి” కాని మీరు నన్ను అధిగమించారు. నరకంలోకి వెళ్ళిపోయారు.”(ముస్లిమ్ కితాబుల్ ఫజాయీల్)

306వ అంశం: ధనవంతులు, పేదలు, స్త్రీలు, పురుషులు, జ్ఞానులు, అజ్ఞానులు, ప్రతి ఒక్కరూ అన్ని విధాలా నరకాగ్ని నుండి కాపాడుకునే ప్రయత్నం చేయాలి.

హజ్రత్ అదీ బిన్ హాతిమ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు: తీర్పు దినం నాడు మీలో ఒక వ్యక్తి అల్లాహ్ ముందు నిలబడతాడు. అల్లాహ్ కు, అతనికీ మధ్య ఎటువంటి తెర ఉండదు. అనువాదకులు ఉండరు. అప్పుడు అల్లాహ్ (త’ఆలా) ఆ వ్యక్తిని, ‘నేను నీకు ధనం ఇవ్వలేదా?’ అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి, “ఎందుకు కాదు. నువ్వు ఇచ్చావు ” అని అంటాడు. మళ్ళీ అల్లాహ్ (త’ఆలా) “నీ వైపుకు ప్రవక్తను పంపలేదా?” అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి “ఎందుకు కాదు, పంపించావు” అని అంటాడు. ఆ తరువాత ఆ వ్యక్తి తన కుడివైపు చూస్తాడు. కేవలం అగ్ని మంటలే కనబడతాయి. ఎడమవైపు చూస్తాడు- అంతా అగ్నిగానే ఉంటుంది. అందువల్ల మీరు నిప్పు నుండి రక్షించుకోవాలి. ఖర్జూరం ఒక్క ముక్క ఇచ్చి అయినాసరే. అదీ లేకపోతే మంచి మాట పలికి నరకాగ్ని నుండి కాపాడుకోవాలి.” (బుఖారీ, కితాబుజ్జకాత్)

307వ అంశం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన అనుచర సంఘాన్ని నరకాగ్ని నుండి హెచ్చరించే బాధ్యతను పూర్తి చేశారు.

హజ్రత్ నోమాన్ బిన్ బషీర్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అంటూ ఉండగా నేను విన్నాను. “ప్రజలారా!నేను మిమ్మల్ని అగ్ని పట్ల హెచ్చరించి ఉన్నాను. నేను మిమ్మల్ని అగ్ని గురించి హెచ్చరించి ఉన్నాను. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా అంటూ ఉన్నారు. ఒకవేళ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నా స్థానంలో ఉంటే బజారులోని వారంతా విని ఉండేవారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దుప్పటి ఆయన భుజాల నుండి జారిపాదాలపై పడింది. * (దార్మీ) (అల్లామా అల్బానీగారి మిష్కాతుల్ మసాబీహ్: 3/5678)

హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) హజ్జతుల్ విదా హదీసులో ఇలా ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అరఫాత్ మైదానంలో ప్రసంగిస్తూ ఇలా అన్నారు: “తీర్పు దినం నాడు మిమ్మల్ని నా గురించి ప్రశ్నిస్తే మీరేమని సమాధానమిస్తారు?” ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అనుచరులు ఇలా విన్న వించుకున్నారు: ‘తమరు అల్లాహ్ సందేశాన్ని అందజేశారని, హెచ్చరించారని, తన అనుచర సంఘం శ్రేయాన్నే కోరారని, మేము సాక్ష్యం ఇస్తు న్నాము. ఆ తరువాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన చూపుడు వ్రేలు ఆకాశం వైపు ఎత్తి, ప్రజల వైపు వంచుతూ మూడుసార్లు, “ఓ అల్లాహ్ ! నువ్వే సాక్షి, ఓ అల్లాహ్! నువ్వేసాక్షి! ఓ అల్లాహ్ నువ్వే సాక్షి! ” అని అన్నారు. (ముస్లిమ్) (కితాబుల్ హజ్)

నరకం, దైవదూతలు

308వ అంశం: దైవదూతలకు నరక శిక్ష లేదు. అయినా వారు అల్లాహ్ కు భయపడుతూ ఉంటారు.

భూమిలోనూ, ఆకాశాలలోనూ ఉన్న సమస్త జీవరాశులూ, సర్వదైవదూతలూ, అల్లాహ్ ముందు సాష్టాంగ పడుతున్నారు. వారు ఎంతమాత్రం తలబిరుసుతనంతో ప్రవర్తించరు. తమపై ఉన్న ప్రభువుకు భయపడతారు. తమకు ఇవ్వబడిన ఆదేశాన్నే పాలిస్తారు. (అన్ నహ్ల్: 49,50)

309వ అంశం : అల్లాహ్ భయం వల్ల దైవదూతల రంగు మారి ఉంటుంది.

వారు, “కరుణామయుడు సంతానవంతుడు’ అని అంటారు. అల్లాహ్ ఎంతో పరి శుద్ధుడు, వారు గౌరవం ప్రసాదించబడిన దాసులు, వారు ఆయన సాన్నిధ్యంలో మాట్లాడరు, కేవలం ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటారు. ఆయనవారికి ముందున్న దానిని, వారికి గుప్తంగా ఉన్న దానినీ ఎరుగును. వారు ఎవరిని గురించీ సిఫారసు చేయరు. సిఫారసు వినటానికి అల్లాహ్ ఇష్టపడిన వాని విషయంలో తప్ప. ఆయన భయం వల్ల అప్రమత్తులై ఉంటారు.” (అల్ అంబియా: 26-28)

నరకం, దైవప్రవక్తలు (అలైహిస్సలాం)

310వ అంశం: ప్రవక్తల నాయకులు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ శిక్షకు చాలా భయపడేవారు.

ఓ ప్రవక్తా! ఇలా అను, ‘ఒకవేళ నేను నా ప్రభువుకు అవిధేయత చూపితే, ఒక మహా రోజున శిక్షను అనుభవించవలసి వస్తుందని నేను భయపడుతున్నాను. ఆ రోజున శిక్ష నుండి తప్పించుకున్నవాడిని అల్లాహ్ కరుణించినట్లే. అదే గొప్ప సాఫల్యం.” (అల్ అన్అమ్: 15, 16)

311వ అంశం : నరకంపై నుండి దాటుతూ ప్రవక్తలందరూ అల్లాహు; “నా ప్రభూ! నన్ను కాపాడుకో” అని అర్థిస్తూ ఉంటారు.

హజ్రత్ అబూహురైరహ్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “తీర్పు దినం నాడు ‘ఫుల్సరాత్’ నరకంపై ఉంచబడుతుంది. అందరి కంటే ముందు నేనూ, నా అనుచర సంఘం దాటుతుంది. ఆ రోజు ప్రవక్తలకు తప్ప ఇతరులెవ్వరికీ మాట్లాడే అవకాశం ఇవ్వబడదు. ప్రవక్తలు కూడా కేవలం, ఓ అల్లాహ్ ! నన్ను రక్షించు’, ఓ అల్లాహ్ నన్ను రక్షించు’ అనే అంటూ ఉంటారు. నరకంలో సఅదాన్ ముళ్ళులాంటి పెద్దపెద్ద ఇనుప మేకులు ఉంటాయి. సఅదాన్ ముళ్ళు మీరెప్పుడైనా చూశారా? అనుచరులు ‘అవును ఓ ప్రవక్తా!’ అని సమాధానమిచ్చారు. ఈ ఇనుప చట్రాలు సఅదాన్ ముళ్ళులాగే ఉంటాయి. అయితే ఈ చట్రాలు ఎంత పెద్దగా ఉంటాయో అది కేవలం అల్లాహ్ కే తెలుసు. ఈ చట్రాలు ప్రజలను వారి పాపాల కనుగుణంగా నరకంలో పడవేస్తాయి. కొందరు తమ పాపాల కారణంగా పూర్తిగా సర్వనాశనం అయిపోతారు. (అంటే పుల్సరాత్ పై అడుగుపెట్టగానే నరకంలోనికి ఈడ్చివేయడం జరుగుతుంది. కొందరు కొన్ని అడుగులు వేసిన తరువాత నరకంలోనికి ఈడ్చివేయటం జరుగుతుంది. కొందరు అతికష్టంగా దాన్ని దాటగలరు. ఇంకా ఇదే విధంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పలికారు.” (బుఖారి కితాబు తౌతౌహీద్)

312వ అంశం: నరకం యొక్క భయంకరమైన అరుపులు విని సన్నిహిత దైవదూతలు, ప్రవక్తలు చివరికి హజ్రత్ ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) కూడా తన క్షేమం కోరుతూ ప్రార్థిస్తారు.

హజ్రత్ ఉబైద్ బిన్ ఉమైర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం, అల్లాహ్ ఆదేశం: “అవిశ్వాసులు నరక కేకలు, అరుపులు విన్నప్పుడు” (పురఖాన్-12) గురించి వ్యాఖానిస్తూ నరకం కోపంగా ఆవేశాన్ని ప్రదర్శించినప్పుడు సన్నిహిత దైవదూతలు, ప్రవక్తలు, చివరికి ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) కూడా మోకాళ్ళపై పడి అల్లాహ్ ను “ఓ నా ప్రభువా! ఈనాడు నిన్ను నా క్షేమం తప్ప మరేమీ కోరను” అని ప్రార్థిస్తూ ఉంటారు. (ఇబ్నె కసీర్) (3/415)

313వ అంశం: రాత్రి నమాజులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) శిక్షకు సంబంధించిన ఒకే వాక్యాన్ని పఠిస్తూ రాత్రంతా గడిపారు.

హజ్రత్ అబూజర్ (రదియల్లాహు అన్హు) ఇలా తెలిపారు: ఒక రోజు రాత్రి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నమాజ్ చదివారు. తెల్లవారే వరకూ ఒకే వాక్యాన్ని పఠిస్తూ ఉన్నారు. “ఓ అల్లాహ్ ! ఒకవేళ నీవు వారిని శిక్షిస్తే, వారు నీ దాసులు. ఒకవేళ నీవు క్షమిస్తే నీవే ఆధిక్యత గలవాడవు, వివేక వంతుడవూను.” (ఇబ్నెమాజ 1350 హసన్) (కితాబు ఇఖామతిన్ సలా: 1/1110)

314వ అంశం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన అనుచర సంఘానికి చెందిన కొందరు నరకం పాలవుతారనే భయంతో ఏడ్చేవారు.

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) పలుకు ఉన్న ఈ వాక్యాన్ని పఠించారు. “అల్లాహ్! ఈ విగ్రహాలు చాలా మందిని మార్గం తప్పించాయి. కనుక నా విధానంపై నడిచే వాడు నావాడు, నాకు వ్యతి రేకంగా ఉన్న విధానాన్ని ఎవరైనా అవలంభిస్తే నిస్సందేహంగా నీవు క్షమించే వాడవు.” (ఇబ్రాహీమ్:36)

ఆ తరువాత మళ్ళీ హజ్రత్ ఈసా (అలైహిస్సలాం) పలుకువున్న వాక్యాన్ని పఠించారు: ఇప్పుడు ఒకవేళ నీవు వారిని శిక్షించినట్లయితే వారు నీ దాసులు. ఒకవేళ క్షమించి నట్లయితే నీవు శక్తిమంతుడవు. వివేకవంతుడవు.” (అల్ మాయిదహ్: 118)

ఆ తరువాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన చేతులను ఎత్తి ఇలా ప్రార్థించారు: “ఓ అల్లాహ్ ! నా అనుచర సంఘం, ఓ అల్లాహ్ ! నా అనుచర సంఘం.. అంటూ ఏడ్వసాగారు. అల్లాహ్ (త’ఆలా) ఇలా ఆదేశించాడు: “ఓ జిబ్రయీల్ (అలైహిస్సలాం) ముహమ్మద్ వద్దకు వెళ్ళు. ఎందుకు ఏడుస్తున్నారని అడుగు. అయితే ఓ జిబ్రయీల్ (అలైహిస్సలాం) ! నీ ప్రభువుకు తెలుసు ముహమ్మద్ ఎందుకు ఏడుస్తున్నారో. ఆ తరువాత జిబ్రయీల్ వచ్చారు. ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ని అడిగారు. (మీరు ఎందుకు ఏడుస్తున్నారని?) ముహమ్మద్(సల్లల్లాహు అలైహి వసల్లం) ఏడ్వడానికి కారణం తెలిపారు: హజ్రత్ జిబ్రయీల్(అలైహిస్సలాం) వెళ్ళి అల్లాహ్ కు తెలియజేశారు. అయితే అల్లాహ్ కు అంతాతెలుసు. అప్పుడు అల్లాహ్ (త’ఆలా) ఇలా ఆదేశించాడు: “ఓ జిబ్రయీల్ (అలైహిస్సలాం)! ముహమ్మద్(సల్లల్లాహు అలైహి వసల్లం) తో ఇలా అను, నీ అనుచర సంఘం (ఉమ్మత్) విషయంలో నిన్ను సంతోషకరమైన విధంగా ప్రవర్తిస్తాము. నిన్ను నిరాశకు గురిచేయము.” (ముస్లిమ్)

నరకం, ప్రవక్త (సహాబాలు) అనుచరులు

315వ అంశం : హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హు) నరకాగ్ని గుర్తొస్తే ఏడ్చేవారు.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు. ఆమెకు నరకాగ్ని గుర్తొచ్చి ఏడ్వసాగింది. ప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) , “ఆయిషా! ఎందుకు ఏడుస్తున్నావు?’ అని అడిగారు. ఆయిషా(రదియల్లాహు అన్హు) ఇలా విన్నవించు కున్నారు: “ఓ అల్లాహ్ ప్రవక్తా! నరకాగ్ని గుర్తొచ్చి ఏడుస్తున్నాను. తీర్పుదినం నాడు తమరు మీ భార్యాబిడ్డల్ని గుర్తిస్తారా?” ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: ‘మూడు చోట్ల ఎవరూ ఎవరినీ గుర్తించరు. 1. తూనిక వద్ద ఎవరి సత్కార్యాలు బరువుగా ఉన్నాయి. ఎవరివి తెలిగ్గా ఉన్నాయి తేలే వరకు. 2. కర్మల పత్రం ఇవ్వబడినప్పుడు, రండి మీకర్మ, పత్రాలు చదవండి అని పిలువబడినప్పుడు. చివరికి ఎవరి కర్మల పత్రం కుడిచేతిలో ఇవ్వబడుతుంది, మరెవరి కర్మల పత్రం ఎడమ చేతిలో ఇవ్వబడుతుందో తేలే వరకు. 3. పుల్సిరాతిని దాటుతూ ఉన్నప్పుడు నరకంపై ఉంచబడినప్పుడు. (అబూదావూద్ 4755, జయీఫ్) (అల్బానీగారి జయీఫ్ అబూదావూద్:4755, అల్లాము అల్బానీగారు ఈ హదీసును బలహీనమైనది (జయీఫ్)గా పేర్కొన్నారు. కాబట్టి దీన్ని ఆధారంగా తీసుకోకూడదు)

316వ అంశం : హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ రవాహా (రదియల్లాహు అన్హు) , అతని భార్య నరకాగ్నిని గుర్తుచేసుకొని ఏడ్చేవారు.

హజ్రత్ ఖైస్ బిన్ అబీ హాజిమ్ (రదియల్లాహు అన్హు) ఇలా తెలిపారు: హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ రవాహా(రదియల్లాహు అన్హు) తన భార్య ఒడిలో తల పెట్టి ఉన్నారు. అకస్మాత్తుగా ఏడ్వసాగారు. అతనితో పాటు అతని భార్య కూడా ఏడ్వసాగింది. హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ రవాహా (రదియల్లాహు అన్హు) తన భార్యను నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు?’ అని అడిగారు. అతని భార్య, ‘మిమ్మల్ని ఏడుస్తూ చూసి నేనూ ఏడుస్తున్నాను’ అని సమాధానమిచ్చింది. అప్పుడు హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ రవాహా (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు. ‘నాకు అల్లాహ్ ఆదేశం ‘నరకాన్ని దాటని వాళ్ళెవరూ మీలో లేరు.” (మర్యమ్ :71) గుర్తుకొచ్చింది.

నరకంపై ఉన్న ఫుల్సిరాత్ను దాటుతూ తప్పించుకుంటామో లేదేమో నేను చెప్పలేను. (హాకిమ్) (కితాబుల్ అహ్వాల్: 73)

317వ అంశం : హజ్రత్ ఉబాదహ్ బిన్ సామిత్ (రదియల్లాహు అన్హు) నరకాన్ని గుర్తు చేసుకొని ఏడ్చేవారు.

హజ్రత్ జియాద్ బిన్ అబీ అస్వద్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు: హజ్రత్ ఉబాదహ్ బిన్ సామిత్ (రదియల్లాహు అన్హు) , బైతుల్ ముఖద్దస్ యొక్క తూర్పున ఉన్న గోడపై ఉన్నారు. అకస్మాత్తుగా ఏడ్వసాగారు. ప్రజలు ఎందుకు ఏడుస్తున్నారని అడిగారు. హజ్రత్ ఉబాదహ్ (రదియల్లాహు అన్హు) ఇలా సమాధానమిచ్చారు. ‘ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మాతో నేను నరకం చూశాను అని చెప్పినచోటు ఇదే.” (హాకిమ్) (కితాబుల్ అవ్వాల్: 110)

318వ అంశం : అల్లాహ్ శిక్ష గురించి హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) భయం.

హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) ఇలా అనేవారు: ఒకవేళ ఆకాశం నుండి ఒక వ్యక్తి “ప్రజలారా! మీరందరూ స్వర్గంలో ప్రవేశిస్తారు కేవలం ఒక్క వ్యక్తి తప్ప’ అని అంటే ఆ వ్యక్తి నేనేనని భయం వేస్తుంది. ఇంకా ఒకవేళ ఆకాశం నుండి ఒకవ్యక్తి ప్రజలారా! మీరందరూ నరకంలోనికి ప్రవేశిస్తారు. కేవలం ఒకవ్యక్తి తప్ప” అని అంటే అది నేనేనని ఆశిస్తాను.’ (హుల్యతు అబూనయీమ్) (అల్లాఅహుమ్మ సల్లిమ్: పేజీ నం.20)

319వ అంశం : హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హు) నరకంలోని విషపూరితమైన వేడిగాలి యొక్క శిక్షను గుర్తు చేసుకొని ఏడ్చేవారు.

హజ్రత్ ఉరవహ్ (రదియల్లాహు అన్హు) తన తండ్రిగారి ద్వారా ఉల్లేఖిస్తున్నారు. నేను ఉదయం ఇంటి నుండి బయలుదేరే ముందు హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హు) ఇంటికి వెళ్ళి సలామ్ చేస్తాను. ఒకసారి ఇంటి నుండి బయలుదేరాను. అలవాటు ప్రకారం సలామ్ చేయటానికి వెళ్ళాను. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హు) నమాజ్లో ఉన్నారు. ఖుర్ఆన్ వాక్యం పఠిస్తున్నారు.

“చివరకు అల్లాహ్ మాపై కనికరించాడు. మమ్మల్ని తీవ్రమైన వడగాలి శిక్ష నుండి రక్షించాడు.” (అత్తూర్:27)

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హు) ఈ వాక్యాన్నే పఠిస్తూ పోతున్నారు. ఏడుస్తూ ఉన్నారు. నేను వేచి ఉన్నాను. పని పడి నేను బజారుకు వెళ్ళిపోయాను. తిరిగి వచ్చాను. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హు) ఇప్పటి వరకు నమాజ్లోనే ఉన్నారు. ఆ వాక్యాన్నే వల్లిస్తున్నారు. ఏడుస్తున్నారు. (సిఫతుస్ సఫ్ వఫ్ : 2/229)

320వ అంశం : హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) శిక్షకు సంబంధించిన వాక్యం పఠించి ఎంతగా ఏడ్చారంటే చివరికి అనారోగ్యానికి గురయ్యారు.

హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) సూరె తూర్ పరిస్తూ ఉన్నారు. ఈ వాక్యానికి చేరగానే, “నీ ప్రభువు శిక్ష తప్పకుండా సంభవించనున్నది” (తూర్:7) ఏడ్వసాగారు. ఏడుస్తూ చివరికి అనారోగ్యానికి గురయ్యారు. ప్రజలు పరామర్శించడానికి రాసాగారు. (అలవాబుల్ కాఫీ:77)

హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) ఏడ్వటం వల్ల అతని ముఖంపై రెండు నల్లని గీతలు పడిపోయాయి. (అజుహద్ బైహఖీ:678)

321వ అంశం : హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) కమ్మరి దుకాణంలో నిప్పును చూసి ఏడ్వసాగారు.

హజ్రత్ సఅద్ బిన్ అఖమ్ (రహిమహుల్లాహ్) ఇలా అంటున్నారు: “నేను హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మసాద్ (రదియల్లాహు అన్హు) వెంట వెళ్తున్నాను. మేము కమ్మరి దుకాణం దగ్గరికి చేరాము. కమ్మరి వాడు అగ్ని నుండి ఇనుమును బయటికి తీశాడు. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) దాన్ని చూడ్డానికి ఆగారు. అది చూసి ఏడ్వసాగారు. (హిల్యతుల్ అవులియా: 2/133)

322వ అంశం : హజ్రత్ మఆజ్ బిన్ జబల్ (రదియల్లాహు అన్హు) నరకాన్ని గుర్తుచేసుకొని చాలా సేపు ఏడ్చారు.

హజ్రత్ మఆజ్ బిన్ జబల్ (రదియల్లాహు అన్హు) చాలా ఏడ్చారు. “మీరెందుకు ఏడ్చారు?” అని ప్రశ్నించడం జరిగింది. ఆయన ఇలా అన్నారు: “అల్లాహ్ (త’ఆలా) తన రెండు పిడికెళ్ళను బిగించారు. ఒక పిడికిలిని స్వర్గంలో, మరో పిడికిలిని నరకంలో వేశాడు. నా సంబంధం

రెంటిలో దేనితో ఉందో నాకు తెలియదు. (అజహరుల్ ఫాయి:21)

వివరణ: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “అల్లాహ్ (త’ఆలా) స్వర్గనరకాలను సృష్టించాడు. వాటికి చెందిన వాళ్ళను సృష్టించాడు. (ముస్లిమ్)

323వ అంశం: హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) నరకవాసులు నీళ్ళు అర్థించటం గుర్తుకు వస్తే ఏడ్వసాగారు.

హజ్రత్ సమీర్ రయాహీ (రహిమహుల్లాహ్) తన తండ్రి ద్వారా ఇలా ఉల్లేఖిస్తున్నారు. హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) చల్లని నీళ్ళు త్రాగి ఏడ్వసాగారు. చాలా ఏడ్చారు. తమరు ఎందుకు ఏడ్చారు? అని ప్రశ్నించగా, హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు: ‘ఖుర్ఆన్లో ఈ వాక్యం నాకు గుర్తొచ్చింది. ‘అప్పుడు వారు తాము అధికంగా కాంక్షించే దానికిదూరం చేయబడ తారు.” (సబా:54); ఆసమయంలో నరకవాసులు ఏమీ కోరరు. కేవలం నీళ్ళు మాత్రమే. ఎందుకంటే అల్లాహ్ (త’ఆలా) ఇలా ఆదేశించాడు: “నరకవాసులు స్వర్గవాసులతో ఇలా మొరపెట్టుకుంటారు. కాస్త దయచేసి మాపై కొన్ని నీళ్ళు పొయండి. లేదా అల్లాహ్ మీకు ప్రసాదించిన ఆహారంలో నుంచైనా కొంత ఇటు విసరండి.” (అల్ ఆరాఫ్:50) (హులియతుల్ అల్లియా: 2/133)

324వ అంశం: హజ్రత్ సయీద్ బిన్ జుబైర్ (రదియల్లాహు అన్హు) నరకాన్ని తలచుకొని నవ్వేవారు కారు.

హజ్జాజ్ బిన్ యూసుఫ్ సయీద్ బిన్ జుబైర్తో ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఇలా అడిగారు: “నువ్వు నవ్వటం లేదని నాకు తెలిసింది. హజ్రత్ జుబైర్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు: “నరకం రగిలించబడి ఉంది. నేనెలా నవ్వగలను. కంఠపాశాలు పాతబడి ఉన్నాయి. అల్లాహ్ సైన్యం సిద్ధంగా ఉంది.” (సఫ్వతుల్సఫ్వా: 3/333)

325వ అంశం: ఏ విశ్వాసయినా పుల్సిరాత్ దాటకుండా నిశ్చింతగా ఉండలేడు.

మఆజ్ బిన్ జబల్, ‘విశ్వాసి ఫుల్సరాత్ను దాటే వరకు నిశ్చింతగా ఉండలేడు’. (అల్ ఫవాఇద్ :152)

నరకం, పూర్వీకులు

326వ అంశం: హజ్రత్ ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ (రదియల్లాహు అన్హు) నరకంలోని కంఠపాశాలు, బేడీలు గల వాక్యాలను అనేకసార్లు పఠించి రాత్రంతా ఏడ్చేవారు.

హజ్రత్ ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ (రదియల్లాహు అన్హు) ఒక రాత్రి నమాజు చదువుతున్నారు. ఈ వాక్యానికి చేరగానే “అప్పుడు వారి మెడలలో కంఠపాశాలు ఉంటాయి. సంకెళ్ళు కూడా ఉంటాయి. వాటితో వారు కాగే నీటి వైపునకు ఈడ్చబడతారు. తరువాత నరకాగ్నిలోకి నెట్ట బడతారు. (అల్ మూ’మిన్:71,72) ఈ వాక్యాన్నే వల్లిస్తూ, ఏడుస్తూఉన్నారు చివరికి తెల్లవారి పోయింది. (తంబీహుల్ గాఫిలీన్: 2/620)

327వ అంశం : హజ్రత్ రబీ బిన్ ఖసీమ్ (రదియల్లాహు అన్హు) బట్టీలోని నిప్పును చూసి స్పృహ కోల్పోయారు.

హజ్రత్ అబూవాయిల్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం: మేము హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ (రదియల్లాహు అన్హు) వెంట బయటకు వెళ్ళాము. మా వెంట రబీ బిన్ ఖసీమ్ కూడా ఉన్నారు. హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ (రదియల్లాహు అన్హు) ఫురాత్ నది ఒడ్డున ఒక అగ్ని బట్టీగుండా వెళ్ళారు. అందులో రగులుతున్న నిప్పును చూసి ఈ వాక్యాన్ని పఠించారు: “అది వారిని దూరం నుంచి చూసి నప్పుడు, వారు దాని క్రోధ ధ్వనులను, విజృంభణ ధ్వనులను వింటారు.” (అల్ ఫుర్ఖాన్:12). అది విన్న హజ్రత్ రబీబిన్ ఖసీమ్ (రదియల్లాహు అన్హు) స్పృహ కోల్పోయి క్రిందపడ్డారు. ప్రజలు వారిని మంచంపైకి తీసుకొని వెళ్ళారు. హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ (రదియల్లాహు అన్హు) అతని వద్ద జోహర్ వరకు కూర్చోని స్పృహలోకి తెచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాని ఆయనకు స్పృహ రాలేదు. (ఇబ్నె కసీర్: 3/415, 3. 2/369)

328వ అంశం : ప్రపంచమంతటికీ అగ్నిపట్ల హెచ్చరించాలనే కుతూహలం.

హజ్రత్ మాలిక్ బిన్ దీనార్ (రదియల్లాహు అన్హు) ఇలా అంటున్నారు: నాకే గనుక శక్తి ఉంటే నేను ఎన్నడూ పడుకోను. పడుకున్నా నాపై అల్లాహ్ శిక్ష అవతరిస్తుందని భయంతో పడుకుంటాను. ఒకవేళ నా వద్ద సహాయకులు ఉంటే నేను వారిని ప్రపంచ మంతటా ఇలా ప్రకటించటానికి పంపివేస్తాను. “ప్రజలారా! నరకాగ్ని నుండి జాగ్రత్తగా ఉండండి ప్రజలారా! నరకాగ్ని నుండి జాగ్రత్తగా ఉండండి.” (హుల్యతు అబూనయీమ్ ) (అల్ అహ్య: 169)

329వ అంశం : హజ్రత్ సూఫ్యాన్ అస్ సౌరీ (రదియల్లాహు అన్హు) ప్రళయం పట్ల ఎంత భయపడే వారంటే అతనికి మూత్రంలో రక్తం కారేది.

హజ్రత్ మూసా బిన్ మ ద్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు: మేము సుఫియాన్ సౌరీతోపాటు కూర్చున్నప్పుడు అతను భయాందోళనలకు గురికావటం చూసి, మమ్మల్ని అగ్ని ఆవరించి ఉన్నట్టు ఊహించేవారం. ప్రళయ ప్రస్తావన వస్తే సౌరీ గారికి మూత్రంలో రక్తం పడేది.

330వ అంశం: మరణం, సమాధి, ప్రళయం, పుల్సిరాత్ పట్ల భయం.

హజ్రత్ అతా సులైమీ (రహిమహుల్లాహ్) ని విచారంగా ఉండటాన్ని గురించి ప్రశ్నించడం జరిగింది. ఇలా అన్నారు: ‘నీకు తెలీదా? మరణం నా మెడపై ఉంది. సమాధి నా ఇల్లు, ప్రళయ దినం నాడు నేను అల్లాహ్ ముందు నిలబడాలి. నరకంపై ఉన్న ఫుల్సెరాల్ని దాటాలి. నా పట్ల ఎలా ప్రవర్తించబడుతుందో నాకే తెలియదు.” [సిఫతుస్సఫ్వహ్ : 3/327]

331వ అంశం : నరకం గుర్తుకు వస్తే హజ్రత్ అబూ మైసర (రహిమహుల్లాహ్) , “నన్ను నా తల్లి కనకుంటే ఎంతో బాగుండేది” అని విచారించేవారు.

హజ్రత్ అబూ మైసర (రహిమహుల్లాహ్) తన పడకపై వెళ్ళి నా తల్లి నన్ను కనకుంటే ఎంత బాగుండేది? అని పలికి ఏడ్చేవారు. అతన్ని, ‘అబూమైసర ఎందుకు ఏడుస్తు న్నారు?’ అని ప్రశ్నించ బడింది. ఆయన ఇలా అంటారు: ‘నరకంపై నుండి దాటాలనే సంగతి మాత్రం మాకు తెలుసు కానీ, విముక్తి లభిస్తుందా లేదా అనేది మాత్రం మాకు తెలియదు. [ఇబ్నెకసీర్: 3/179]

332వ అంశం : నరక ప్రస్తావన జీవితాంతం నవ్వకుండా చేసింది.

హజ్రత్ హసన్ బస్రి (రహిమహుల్లాహ్) ఇలా అంటున్నారు: ‘ఒక మంచి వ్యక్తి తన సోదరున్ని ఇలా ప్రశ్నించాడు. ‘నువ్వు నరకం పై నుండి దాటాలనే సంగతి నీకు తెలుసా?’ దానికి అతను. ‘అవును’ అని సమాధానమిచ్చాడు. అతను మళ్ళీ అడిగాడు, ‘నీవు అక్కడి నుండి తప్పించుకుంటావని నీకు తెలుసా? సోదరుడు ‘లేదు’ అని సమాధాన మిచ్చాడు. అప్పుడు ఆ పుణ్యాత్ముడు ‘మరి ఈ నవ్వెందుకు?’ అని అన్నాడు. ఆ తరువాత ఆ వ్యక్తి జీవితాంతం ఎప్పుడూ నవ్వలేదు. [ఇబ్నెకసీర్: 3/179]

333వ అంశం : హజ్రత్ బుథైల్ బిన్ మైసర (రదియల్లాహు అన్హు) తీర్పు దినం నాటి దాహానికి భయపడి ఎంత ఏడ్చారంటే కళ్ళద్వారా రక్తపు బిందువులు రాలాయి.

హజ్రత్ బుదైల్ బిన్ మైసర (రహిమహుల్లాహ్) ఎంత ఏడ్చేవారంటే కళ్ళంట చీము, నెత్తురు రాసాగాయి. ప్రళయ భయం వల్ల ఎప్పుడూ విచారంగా ఉండేవారు. ఇంకా, “ప్రళయ దినం నాటి దాహ తీవ్రతను గురించి ఏడుస్తున్నాను” అని అనేవారు.” [సిఫతుస్సఫ్వహ్:3/265]

334వ అంశం: హజ్రత్ ముహమ్మద్ బిన్ మున్ కదిర్ (రహిమహుల్లాహ్) నరక భయం వల్ల ఏడ్చి కంటి అసువులను తన ముఖానికి, గడ్డానికి పులుము కునేవారు.

హజ్రత్ ముహమ్మద్ బిన్ మున కదిర్ (రహిమహుల్లాహ్) నరక భయంవల్ల ఏడ్చి కన్నీళ్ళను తనముఖానికి, గడ్డానికి పులుముకుంటారు. ఇంకా “దైవభీతి వల్ల రాలే కన్నీళ్ళు ఎక్కడెక్కడ తగిలితే అక్కడ నరకాగ్ని కాల్చదు అని నాకు తెలిసింది” అని అంటారు.” [అల్ అహ్య: 4/172]

335వ అంశం : అతా సులైమీ (రహిమహుల్లాహ్) తన పొరుగువాని పొయ్యిలోని నిప్పును చూసి స్పృహ కోల్పోయారు.

హజ్రత్ అలా బిన్ ముహమ్మద్ అతా సులైమీ (రహిమహుల్లాహ్) ఇంటికి వచ్చారు. అతన్ని స్పృహ కోల్పోయిపడి ఉండటం చూశారు. ఆయన భార్యను, “అతా సులైమీకి ఏమయింది?’ అని అడిగారు. ఆమె, “మా పొరుగువారు పొయ్యి వెలిగించారు, దాన్ని చూసిన అతా సులైమీ స్పృహ తప్పిపడిపోయారు” అని అన్నారు. [సిఫతుస్సఫ్వహ్:3/326]

336వ అంశం: హసన్ బస్రీ దైవాగ్ని భయం వల్ల ఏడ్చేవారు.

హజ్రత్ హసన్ బస్రీ (రహిమహుల్లాహ్) ఏడుస్తూ ఉండటం చూసి, “మీరెందుకు ఏడుస్తున్నారు?” అని అడగటం జరిగింది. సమాధానంగా ఆయనిలా అన్నారు: “తీర్పు దినం నాడు అల్లాహ్ (త’ఆలా) నన్ను నరకాగ్నిలో విసిరివేస్తాడనే భయంతో, ఎందుకంటే అల్లాహ్ కు ఎవరైనా ఫర్వాలేదు. [సిఫతుస్సఫ్వహ్:3/233]

337వ అంశం : యజీద్ బిన్ హారూన్ (రహిమహుల్లాహ్) ఏడ్చిఏడ్చి అంధులైపోయారు.

హజ్రత్ హసన్ బిన్ అరాఫా (రహిమహుల్లాహ్) ఇలా అంటున్నారు: నేను యజీద్ బిన్ హారూను చూశాను. అతని కళ్ళు అందరికంటే అందంగా ఉండేవి. కొంతకాలం తర్వాత చూస్తే ఒకే కన్ను ఉంది. మరికొంత కాలం తరువాత చూస్తే రెండు కళ్ళు పోయివున్నాయి. నేను, ఓ అబూ ఖాలిద్! నీ అందమైన కళ్ళకు ఏమయింది?’ అని అడిగాను. దానికి అతను ‘రాత్రిపూట ఏడ్వటం వల్ల పోయాయి” అని బదులిచ్చాడు. [తజి కిరతుల్ హుఫ్ఫాజ్: 3/790]

338వ అంశం: చావుకు ముందు విశ్వాసాన్ని కోల్పోయే భయం.

హజ్రత్ అబ్దుర్రహ్మాన్ బిన్ మహ్దీ (రహిమహుల్లాహ్) ఇలా అంటున్నారు: సుఫియాన్ రాత్రి నా వద్ద ఉన్నారు. ఆందోళనకు గురై ఏడ్వసాగారు. ఒక వ్యక్తి అతన్ని, ‘ఓ అబూ అబ్దుల్లాహ్ ! అధిక పాపాల కారణంగా ఏడుస్తున్నారా?’ అని ప్రశ్నించాడు. సుఫియాన్ (రదియల్లాహు అన్హు) నేలపై నుండి ఒక గడ్డి పరక పట్టుకొని అల్లాహ్! పాపాల విషయం నా దగ్గర ఈ గడ్డిపరక కన్నా తేలిగ్గా ఉంది. అసలు నేను భయపడుతుంది చావుకు ముందు నేను విశ్వాసం కోల్పోతానేమోనని.” [సిఫతుస్సఫ్వహ్:3/150

339వ అంశం : హజ్రత్ ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ (రహిమహుల్లాహ్) ఇషా నమాజు తర్వాత దైవభీతి వల్ల ఏడుస్తూ ఉండేవారు. చివరికి నిద్రముంచు కొచ్చేది.

హజ్రత్ ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ భార్య ఫాతిమా బిన్తె అబ్దుల్ మలిక్ బిన్ మర్వాన్ ఇలా అంటున్నారు: ఉమర్ ప్రజల్లో అందరికంటే అధికంగా నమాజ్, రోజాలను పాటించే వారు కాని, తన ప్రభువుకు భయపడుతూ అతనికంటే అధికంగా ఏడ్చే వారెవరినీ నేను చూడలేదు. ఇషా నమాజ్ చదివిన తరువాత చేతులెత్తి నిరంతరంగా ఏడుస్తూ ఉంటారు. చివరికి నిద్రముంచుకొస్తుంది. లేపితే మళ్ళీ తన చేతులను ఎత్తి ఏడ్వటం ప్రారంభిస్తారు. చివరికి నిద్రముంచుకొస్తుంది. (తజ్కరతుల్ హుఫ్ఫాజ్ : 1/120)

ఆలోచనా సందేశం

340వ అంశం : అగ్నిలో కాలేవాడు మంచివాడా? అగ్ని నుండి రక్షించబడిన వాడు మంచి వాడా?

స్వయంగా మీరే ఆలోచించండి! ఏ వ్యక్తి మెరుగైనవాడు. అగ్నిలో పడవేయ బడేవాడా? లేక తీర్పు దినం నాడు భద్రంగా ఉన్నవాడా? మీరు కోరినదంతా చేస్తూ ఉండండి. మీరు చేస్తున్నదంతా అల్లాహ్ చూస్తూనే ఉన్నాడు. (హామీమ్ సజ్దా: 40)

341వ అంశం : రగులుతున్న నరకాగ్నిని చూసి తన చావును, తన వినాశనాన్ని అరచిపిలుస్తున్న వ్యక్తి బాగున్నాడా? లేక తాను కోరినవన్నీ పొందుతున్న వ్యక్తి బాగున్నాడా?

ఆ సమయాన్ని తిరస్కరించేవారి కోసం మేము రగులుతున్న నిప్పును సిద్ధం చేసి ఉంచాము. అది వారిని దూరం నుండి చూసినప్పుడు, వారు దాని క్రోధధ్వనులను, విజృంభణ ధ్వనులను వింటారు. దానిలోని ఒక ఇరుకైన స్థలంలో వారు కాళ్ళు, చేతులూ బంధించబడి క్రుక్కబడినప్పుడు, చావును పిలవటం ప్రారంభిస్తారు. అప్పుడు వారితో ఇలా అనబడుతుంది. “ఈనాడు ఒక్క చావునే కాదు, అనేక చావులను పిలవండి” వారిని అడగండి, ఈ పర్యవసానం మంచిదా లేక శాశ్వతంగా ఉండే స్వర్గం మంచిదా. అది దైవభీతి పరులకు వాగ్దానం చేయబడింది. అది వారి కర్మలకు ప్రతిఫలం. వారి ప్రయాణానికి చివరి గమ్యస్థానం. అందులో వారి కాంక్షలన్ని తీరుతాయి. అందులో వారు శాశ్వతంగా ఉంటారు. దాన్ని ప్రసాదించటం నీ ప్రభువు నెరవేర్చ వలసిన ఒక వాగ్దానం. (అల్ ఫుర్ఖాన్:11-16)

342వ అంశం : స్వర్గ అనుగ్రహాల ఆతిథ్యం మంచిదా? లేక జముడు చెట్టు, కాగేనీటి ఆతిథ్యం మంచిదా?

నిశ్చయంగా ఇదే మహత్తరమైన విజయం, ఇలాంటి విజయం కోసమే కర్మశీలురు కర్మలు చేయాలి. చెప్పండి, ఈ ఆతిథ్యం మంచిదా లేక రాకాసి జముడు చెట్టు ఆతిథ్యం మంచిదా? మేము ఆ చెట్టును దుర్మార్గుల పాలిటి పరీక్షగా చేశాము. అది నరకం అడుగు భాగంలో మొలిచే చెట్టు. దాని మొగ్గలు పైతానుల తలలు మాదిరిగా ఉంటాయి. నరకవాసులు వాటిని తింటారు. వాటితోనే కడుపు నింపు కుంటారు. దానిపై త్రాగటానికి వారికి సలసల కాగే నీరు లభిస్తుంది. (అస్సాప్పాత్:60-67)

343వ అంశం : ఎగతాళిగా ప్రవర్తించేవారు ఇహలోకంలో బాగున్నారా? లేక పరలోకంలో బాగున్నారా?

ప్రపంచంలో విశ్వసించినవారిని నేరస్తులు హేళన చేసేవారు. వారి ముందు నుండి వెళ్ళేటప్పుడు మాటిమాటికి కళ్ళు గీటుతూ వారి వైపు సైగలు చేసేవారు. తమ కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్ళేటప్పుడు సంబరపడుతూ వెళ్ళేవారు. వారిని చూసినప్పుడు, “వీరు దారి తప్పారు” అని అనేవారు. వాస్తవానికి వారు వారిపై కాపలాదారులుగా నియమించి పంపబడలేదు. ఈనాడు విశ్వసించినవారు అవిశ్వాసు లను చూసి నవ్వుతున్నారు. ఉన్నత పీఠాలపై కూర్చుండి వారి స్థితిని చూస్తున్నారు. అవిశ్వాసులు చేస్తూ ఉండిన చేష్టలకు బదులు దొరికిందా? (అల్ ముతప్పిఫీన్:29-36)

నరకాగ్ని నుండి శరణు కోరే దుఆలు

344వ అంశం : మూడుసార్లు నరకం నుండి అల్లాహ్ను శరణు కోరే వ్యక్తి కొరకు నరకం సిఫారసు చేస్తుంది.

హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు: “ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “మూడుసార్లు అల్లాహ్ ను స్వర్గం కోరే వ్యక్తి కొరకు స్వర్గం ఇలా విన్నవించుకుంటుంది: ‘ఓ అల్లాహ్ ! ఇతన్ని స్వర్గంలోకి ప్రవేశింపజేయి.” ఇంకా మూడుసార్లు నరకం నుండి అల్లాహ్ ను శరణు కోరే వ్యక్తి కొరకు నరకం ఇలా విన్నవించుకుంటుంది: ‘ఓ అల్లాహ్ ! ఇతన్ని నరకాగ్ని నుండి రక్షించు.’ (ఇబ్నెమాజ 2/3502, సహీహ్) (కితాబుజ్జహ్: 2/3502)

345వ అంశం : నరకాగ్ని నుండి శరణుకోరే కొన్ని ఖుర్ఆన్ దుఆలు:

1. “మా అల్లాహ్ ! ఇహలోకంలోనూ, పరలోకంలోనూ మాకు మంచిని ప్రసా దించు. మమ్మల్ని నరక బాధ నుండి కాపాడు.” (అల్ బఖర:201)

2. “మా అల్లాహ్! నరకయాతన నుండి మమ్మల్ని కాపాడు, దాని శిక్ష ప్రాణాంతకమైనది, అది ఎంతో చెడు ప్రదేశం. ఎంతో చెడు నివాసం.” అని ప్రార్థించే వారు. (అల్ ఫుర్ఖాన్ :65,66)

3. “అల్లాహ్! ఇదంతా నీవు వ్యర్థంగా, నిర్లక్ష్యంగా సృష్టించలేదు. నీవు పరిశుద్ధుడవు. కాబట్టి విఫలమైన కార్యాలు చేయవు. కనుక ప్రభూ! మమ్మల్ని నరక బాధ నుండి కాపాడు. నీవు ఎవడిని నరకంలో పడవేస్తావో వాన్ని వాస్తవానికి అధోగతికి, అవమానానికి గురిచేసినట్లే. ఇక ఇటువంటి దుర్మార్గులకు సహాయం చేసేవాడెవడూ ఉండడు. ప్రభూ! మేము విశ్వాసం వైపునకు పిలిచేవాని పిలుపును విన్నాము. ‘మీ ప్రభువును విశ్వసించండి” అని అతను అనేవాడు. మేము అతని సందేశాన్ని స్వీకరించాము. కనుక మా స్వామీ! మేము చేసిన తప్పులను మన్నించు. మాలో ఉన్న చెడులను దూరం చేయి. సజ్జనులతోపాటు మా జీవితానికి ముగింపు ప్రసాదించు. మాదేవా! నీవు నీ ప్రవక్తల ద్వారా చేసినటువంటి వాగ్దానాలను మా మా విషయంలో నెరవేర్చు. ప్రళయం నాడు మమ్మల్ని పరాభవానికి గురిచెయ్యకు. నిస్సందేహంగా నీవు నీ వాగ్దానాలకు భిన్నంగా వ్యవహరించవు.” (ఆలి ఇమ్రాన్ : 191–194)

346వ అంశం : నరకాగ్ని నుండి శరణు గోరే ఈ క్రింది దుఆను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన అనుచరులకు ఖుర్ఆన్లోని సూరహ్లా నేర్పారు.

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన అనుచరులకు ఈ క్రింది దుఆలను ఖుర్ఆన్ లోని సూరహ్ నేర్పేవారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉపదేశించారు: “ఓ మా ప్రభూ! నరకయాతన నుండి మేము నీ శరణువేడుతున్నాము. మరియు మేము సమాధి యాతనల నుండి నీ శరణు కోరుతున్నాము. మరియు దజ్జాల్ ఉపద్రవం నుండి మేము నీ శరణు కోరుతున్నాము. మరియు జీవన్మరణాల పరీక్షల నుండి మేము నీ శరణు కోరుతున్నాము.” (నసాయి 2036, సహీహ్) (అబ్వాబున్నౌమ్: 2063)

347వ అంశం: నరకం యొక్క వేడి నుండి శరణు కోరే దుఆ.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖించారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా దుఆ చేసేవారు: “ఓ అల్లాహ్ ! జిబ్రయీల్, మీకాయీల్, ఇస్రాఫీల్ల ప్రభువా! నరకాగ్ని వేడి నుండి, సమాధి యాతన నుండి నేను శరణు కోరుతున్నాను.” (నసాయి 3/5092, సహీహ్) (కితాబుల్ ఇస్తి ఆజా:3/5092)

348వ అంశం:పడుకోవటానికి ముందు అల్లాహ్ శిక్ష నుండి శరణుకోరే దుఆలు

1) హజ్రత్ హఫ్ సా (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పడుకున్నప్పుడు కుడిచేయి తన తల క్రింద పెట్టి ఈ దుఆ పఠిస్తారు: ‘ఓ అల్లాహ్! నీవు నీ దాసులను తిరిగి లేపే రోజున నన్ను నీ శిక్ష నుండి కాపాడు.” (అబూదావూద్ 3/4218, సహీహ్) (అబ్వాబున్నౌమ్: 3/4218)

2) హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్(రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన పడకపై వెళ్ళి నప్పుడు ఇలా అంటారు: “నన్ను కష్టాల నుండి తప్పించిన, నాకు నివసించడానికి స్థలం ఇచ్చిన, నాకు ఆహారపానీయాలు ప్రసాదించిన అల్లాహ్ కు కృతజ్ఞతలు. ఆయనే నాకు చాలా ఉపకారం చేశాడు. ఆయనే నాకు చాలా ప్రసాదించాడు. ఎల్లప్పుడూ ఆయనకు నేను కృతజ్ఞుడ్ని. ఓ అల్లాహ్ ! సృష్టితాల పోషకుడవు, సృష్టితాల ప్రభువు, సృష్టితాల ఆరాధ్యుడవు. నరకాగ్ని నుండి నేను నిన్ను శరణు కోరుతున్నాను.” (అబూదావూద్ 3/4229, సహీహ్) (అబ్వాబున్నౌమ్ : 3/4229)

349వ అంశం : తహజ్జుద్ నమాజ్లో అల్లాహ్ శిక్ష నుండి శరణు కోరే దుఆ.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హు) ఇలా అంటున్నారు: ఒక రాత్రి నేను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన పడకపై ఉండకపోవటాన్ని గమనించాను. వెతకసాగాను. నా చేయి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పాదాల క్రింద భాగానికి తగిలింది. ఆ సమయంలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మస్జిద్లో ఉన్నారు. సబ్దాస్థితిలో ఈ దుఆ చేస్తున్నారు: ‘ఓ అల్లాహ్ ! నేను నీ ప్రీతి ఆధారంగా నీ ఆగ్రహాన్నుండి శరణు కోరుతున్నాను. నీ క్షమాపణ ఆధారంగా నీ శిక్ష నుండి శరణుకోరుతున్నాను. ప్రతి విషయంలోనూ నేను నీ శరణు కోరుతున్నాను. నిన్ను స్మరించే స్తుతించే శక్తి నాకు లేదు. నీవు పరిచయం చేసినట్లే నీవు ఉన్నావు.”. (ముస్లిమ్ కితాబుస్సలాత్)

350వ అంశం : నరకాగ్ని నుండి రక్షణ పొందడానికి ఈ క్రింది దుఆను అధికంగా పఠిస్తూ ఉండాలి.

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అధికంగా ఈ దుఆను పఠించేవారు: “మా ప్రభూ! ఇహలోకంలోనూ, పరలోకంలోనూ మాకు మంచిని ప్రసాదించు. మమ్మల్ని నరక బాధ నుండి కాపాడు.” (ముత్తఫకున్ అలైహి)

351వ అంశం: ఒకేసారి కనీసం మూడుసార్లు అయినా నరకం నుండి అల్లాహ్ (త’ఆలా) ను శరణుకోరాలి. వివరణ: హదీసు 344వ అంశం చూడండి.

వివిధ రకాల అంశాలు

352వ అంశం : అల్లాహ్ కారుణ్యం, అనుగ్రహం లేకుండా నరక శిక్ష నుండి ఎవరూ తప్పించుకోలేరు.

హజ్రత్ అబూహురైరహ్(రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖించారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉపదేశించారు. “ఎవరూ తమ సత్కార్యాల ద్వారా స్వర్గంలోకి వెళ్ళలేరు” ఇలా ప్రశ్నించడం జరిగింది. “ఓప్రవక్తా! మీరు కూడానా?” ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “అవును, నేను కూడా, నా ప్రభువు నన్ను తన కారుణ్యం ద్వారా కప్పుకుంటే తప్ప” అని అన్నారు. (ముస్లిమ్) (కితాబు సిఫతుల్ మునాఫిఖీన్)

353వ అంశం : ఏక దైవారాధకులు, దైవభీతిపరులు, పుణ్యాత్ముల యొక్క సాక్ష్యం ఒకరు స్వర్గవాసి లేక నరకవాసి అనడానికి చిహ్నం.

హజ్రత్ అబూబకర్ బిన్ జుహైర్ సఖఫీ (రదియల్లాహు అన్హు) తన తండ్రి ద్వారా ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తాయిఫ్కి సమీపంలో ఉన్న ‘నబావహ్’ (లేదా బనానహ్)లో మమ్మల్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఇలా అన్నారు: ‘అతి త్వరలో ఒక యుగం రానున్నది. స్వర్గవాసిని, నరకవాసిని మీరు గుర్తుపట్టగలరు.’ అనుచరులు ఇలా అన్నారు: ‘ఓ ప్రవక్తా! అదెలా?’ అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ‘మంచి లేక చెడు పరిచయం ద్వారా మీరు పరస్పరం అల్లాహ్ సాక్షులుగా వ్యవహ రిస్తారు” అని అన్నారు. (ఇబ్నెమాజ 4221, హసన్) (కితాబు జుహాద్:2/2400)

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఇలా అంటున్నారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచిం చారు: “ప్రజల ద్వారా తన గొప్పతనాన్ని వింటూ చెవులు పండినవాడు స్వర్గవాసి. ఇంకా, “ప్రజల ద్వారా తన చెడును వింటూ చెవులు పండినవాడు నరకవాసి.” (ఇబ్నెమాజ 4224, సహీహ్ అస్సహీహ 1740) (కితాబు జ్జుహ్ద్: 2/ 2403)

354వ అంశం: కఠిన వేడి, కఠిన చలికాలాలు నరక ఉచ్వాస నిఛ్వాసాల వల్ల ఉద్భవిస్తాయి. వేడి ఊపిరి నరకంలోని వేడి ప్రదేశం నుండి, చల్లని ఊపిరి నరకం యొక్క చల్లని ప్రదేశం జమ్హరీర్ నుండి.

వివరణ: హదీసు 49వ అంశం చూడండి.

355వ అంశం: విశ్వాసి కొరకు జ్వరం నరకంలోని భాగం.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “జ్వరం ప్రతి విశ్వాసికి నరకంలోని భాగం.” (బజ్జార్, సహీహ్) [అల్బానీ గారి సహీహుల్ జామిఉస్సగీర్-3/3182వ హదీసు]

356వ అంశం : కొందరు ముస్లిముల శరీరాన్ని నరకాగ్ని కాల్చివేస్తుంది.

హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “ఏకదైవారాధకు ల్లోని కొందరు నరకాగ్ని శిక్షకు గురవుతారు, కాలి చివరికి బొగ్గుగా మారుతారు. ఆ తరువాత కారుణ్యభాగ్యం కలుగుతుంది. నరకం నుండి తీసివేయబడి స్వర్గపు ద్వారాల వద్ద కూర్చుంటారు. స్వర్గవాసులు వారిపై స్వర్గ జలాన్ని పోస్తారు. వెంటనేవారు తమ పాత రూపాన్ని ధరిస్తారు. వరదలో కొట్టుకొచ్చిన గింజ మొలకెత్తినట్లు. ఆ తరువాత వారికి స్వర్గ ప్రవేశం లభిస్తుంది. (తిర్మిజి 2/2094, సహీహ్) (సిఫతు అబ్వాబి జహన్నమ్: 2/2094)

357వ అంశం : సముద్రమే నరకస్థలం.

హజ్రత్ యాలా (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: సముద్రమే నరక స్థలం. (హాకిమ్ కితాబుల్ అహావాల్ 87, సహీహ్) (కితాబుల్ అహ్వల్:87)

వివరణ: ఖుర్ఆన్ అల్లాహ్ ఆదేశం: “సముద్రాలు మండించబడినప్పుడు.” (తక్వీర్ :6)

మరోచోట అల్లాహ్ ఆదేశం: “సముద్రాలు చింపివేయబడినప్పుడు.” (ఇన్ఫితార్:3)

ఈ రెండు వాక్యాల వల్ల అర్థమవుతున్నది ఏమిటంటే, తీర్పుదినం నాడు సముద్రాలను ఒకచోట చేర్చటం జరుగుతుంది. నీటిలోని రెండు భాగాలను వేరుపర్చటం జరుగుతుంది. దానివల్ల అగ్ని రగిలించబడుతుంది. హైడ్రోజన్ అగ్నిగా పని చేస్తోంది. ఆక్సిజన్ దానికి సహకరిస్తుంది. ప్రస్తుతం స్వర్గనరకాలు ఉన్నాయి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ప్రవచనాల భావం ఏమిటంటే- తీర్పు దినం నాడు నరకాన్ని రగులుతున్న సముద్రంపై ఉంచడం జరుగుతుంది. దానివల్ల నరకాగ్ని మరింత రగులుతుంది. అదే నరక స్థలంగా కొనసాగటానికి.

ఓ మా అల్లాహ్! మమ్మల్ని నరక యాతన నుండి కాపాడు. దాని శిక్ష ప్రాణాంతకమైనది. అది ఎంతో చెడ్డ నివాసం, ఎంతో చెడు ప్రదేశం. (అల్ ఫుర్ఖాన్:65,66)

అల్హమ్దు లిల్లాహిల్లజీ బినీమతిహీ తతిమ్ముస్సాలిహాతు వ అల్ ఫు అల్ ఫి సలాతిన్ వ సలామిన్ అలా ముహమ్మదీన్ వ అలా ఆలిహీ వ అసబిహీ అజ్మయీన్

బిరహ్మతిక యా అర్హమర్రాహిమాన్.

ఉమ్రా విధానం [పుస్తకం & ఆడియో]

బిస్మిల్లాహ్

[ఇక్కడ పుస్తకం చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి]
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
[PDF] 16పేజీలు]

క్రింద ఆడియోలు వినండి:

ఉమ్రా విధానం: పార్ట్ 1: ఇహ్రాం వివరాలు [8 నిముషాలు]

ఉమ్రా విధానం: పార్ట్ 2:ఇహ్రాం నిషిద్ధతలు [4 నిముషాలు]

ఉమ్రా విధానం: పార్ట్ 3: తవాఫ్ [6 నిముషాలు]

ఉమ్రా విధానం: పార్ట్ 4:సఈ, హలక్ [8 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ఇస్లామీయ ప్రవర్తన [పుస్తకం & ఆడియో]

బిస్మిల్లాహ్

అఖ్లాఖ్, ఉత్తమ నడవడిక, గుడ్ క్యారెక్టర్, సత్ప్రవర్తన, Character, Manners
[ఇక్కడ పుస్తకం చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [29పేజీలు ]
సంకలనం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
పబ్లిషర్స్: జుల్ఫీ ధర్మప్రచార విభాగం (సౌదీ అరేబియా)

ఇస్లామీయ సత్ప్రవర్తన, నైతిక ప్రవర్తన (గుడ్ క్యారెక్టర్) – వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/heqzqooCHzY [42 నిముషాలు]
ఆడియోలో క్రింది విషయాలు వివరించబడ్డాయి:
[1] ఇస్లాంలో సత్ప్రవర్తన (ఉత్తమ నడవడిక ) కు ఎలాంటి విలువ ఉన్నది?
[2] సత్ప్రవర్తన (అఖ్లాఖ్) వలంబిస్తే మనకు ఇహపర లోకాల్లో ఏమి లాభాలు కలుగుతాయి?
[3] సత్ప్రవర్తన ఎవరి పట్ల ఎలా అవలంబించాలి?
[4] సత్ప్రవర్తన రావాలంటే ఎలాంటి సాధనాలను ఉపయోగించాలి?

విషయ సూచిక:

  • ఇస్లామీయ ప్రవర్తన 
  • సద్వర్తన నిదర్శనాలు 
  • దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవర్తన 
  • కొన్ని సద్గుణాలు : సత్యత, అమానతు,  వినయము, సిగ్గు, బిడియం,లజ్జ
  • కొన్ని దుర్గుణాలు: జుల్మ్ (అత్యాచారం),ఈర్ష్య, మోసం,  దుష్గర్వం
  • నైతిక గుణాలు ఆర్జించు మార్గాలు 
    1. విశ్వాస శుద్ధి 
    2. దుఆ 
    3. ముజాహదా (ప్రయత్నం,కృషి)
    4. ముహాసబ (ఆత్మ విమర్శ)
    5. సద్వర్తన వాళ్ళ వచ్చే  ప్రయాజనాలను ఆలోచించుట 
    6. దుర్గుణాల దుష్ఫలితాల గురుంచి యోచించుట 
    7. సంపూర్ణ ఆత్మ శుద్ధి కోసం ప్రయత్నించుట 
    8. మందహాసం,చిరునవ్వు 
    9. చూసి చూడనట్లు ఉండుట 
    10. సంయమనం,సహనం 
    11. మూర్ఖుల జోలికి పోకుండా ఉండుట 
    12. దూషించకుండా ఉండుట 
    13. బాధని మరిచిపోవాలి 
    14. మన్నింపు వైఖరి 
    15. దాతృత్వం 
    16. అల్లాహ్ వద్ద ప్రతిఫలం పొందే నమ్మకం 
    17. కోపం నుండి దూరముండుట 
    18. నిర్మాణాత్మక మైన విమర్శను స్వీకరించుట 
    19. పనిని సంపూర్ణంగా చేయుట 
    20. తప్పు జరిగితే ఒప్పుకోవుట 
    21. సత్యం ఆవశ్యకమైనది 
    22. సద్గుణులతో స్నేహం చేయుట 
    23. పరస్పర సంభాషణ, సమావేశ పద్ధతులు పాటించుట 
    24. ప్రవక్త మరియు సహచరుల జీవిత చరిత్ర చదువుట 
    25. సద్గుణాలకు సంబంధించిన రచనలు చదువుట 

[పూర్తి పుస్తకం క్రింద చదవండి]

 అల్ హందులిల్లాహ్, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్, అమ్మా బఅద్!

సర్వ స్తోత్రములకు అర్హుడు అల్లాహ్ మాత్రమే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై శాంతి, కరుణ కురియుగాక!

అల్లాహ్ మనకు ఇస్లాం వరాన్ని అనుగ్రహించినందుకు, సద్గుణాలు అవలంభించా లని ప్రోత్సహించినందుకు, సద్గుణ సంపన్నులకు గొప్ప ప్రతిఫలం సిద్ధపరచినందుకు మనం ఆయనకు అనేకానేక స్తోత్రములు పఠించాలి.

సద్గుణ సంపన్నులైయుండుట ప్రవక్తల, పుణ్యాత్ముల గుణం. సద్గుణాల వల్ల ఉన్నత స్థానాలు లభించును. అల్లాహ్ ఒకే ఒక ఆయతులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఎలా ప్రశంసించాడంటే, అందులో ఆయన సర్వ సద్గుణాలు ఇమిడియున్నాయి: చూడండి: ఖలం (68:4)

[وَإِنَّكَ لَعَلَىٰ خُلُقٍ عَظِيمٍ]

“నిస్సందేహంగా నీవు నైతికంగా అత్యున్నత స్థానంలో ఉన్నావు”.

సద్గుణాల ద్వారా ప్రేమ, అప్యాయతలు జనిస్తాయి. దుర్గుణాల వల్ల ద్వేషం, ఈర్ష్యలు పుడతాయి. సద్గుణ సంపన్నులకు సత్ఫలితం, వారి పర్యవసానం ఇహపరాల్లో స్పష్టమయి ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సద్గుణాన్ని దైవభయభీతితో కలిపి తెలిపారు:

عَنْ أَبِي هُرَيْرَةَ قَالَ: سُئِلَ رَسُولُ اللهِ عَنْ أَكْثَرِ مَا يُدْخِلُ النَّاسَ الجَنَّةَ، فَقَالَ: «تَقْوَى اللهِ وَحُسْنُ الخُلُقِ»

అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, అనేక మందిని స్వర్గంలో ప్రవేశింపజేయునది ఏమిటని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అడిగినప్పుడు, ఆయన చెప్పారు: “అల్లాహ్ భయభీతి మరియు సద్వర్తన”. (తిర్మిజి 2004, సహీహా 977, సహీహుత్ తర్గీబ్ 1723).

సద్వర్తన అంటే: నగుమోముతో ఉండుట, మంచి చేయుట, ప్రజలకు అవస్త కలిగించకుండా ఉండుట, ఇంకా మృదువుగా మాట్లాడుట, కోపాన్ని దిగమింగుట, కోపం వ్యక్తపరచకుండా ఉండుట, ఇతరుల బాధ భరించుట. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారు:

«إِنَّمَا بُعِثْتُ لِأُتَمِّمَ مَكَارِمَ الْأَخْلَاقِ»

“సద్గుణాలను సంపూర్ణం చేయుటకు నన్ను పంపడం జరిగింది”. (ముస్నద్ బజ్జార్ 8949, ముస్నద్ అహ్మద్ 8952, సహీహా 45).

ఉఖ్బా రజియల్లాహు అన్హుతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

«أَلَا أُخْبِرُكَ بِأَفْضَلِ أَخْلَاقِ أَهْلِ الدُّنْيَا وَأَهْلِ الْآخِرَةِ؟ تَصِلُ مَنْ قَطَعَكَ، وَتُعْطِي مَنْ حَرَمَكَ، وَتَعْفُو عَمَّنْ ظَلَمَكَ»

“ఇహపరవాసుల అత్యుతమ నడవడిక గురించి నీకు తెలుపనా? నీతో సంబంధం తెంచుకున్న వానితో నీవు సంబంధం పెంచుకో, నీకు ఇవ్వనివానికి నీవు ఇవ్వు, నీ పట్ల దౌర్జన్యం చేసినవానిని నీవు మన్నించు”. (మకారిముల్ అఖ్లాక్: ఇబ్ను అబిద్ దున్యా 19, ముస్నద్ అహ్మద్ 17334, సహీహా 891).

సోదరా! ఈ ప్రశంసనీయమైన సద్గుణం యొక్క లెక్కలేనన్ని పుణ్యాలను, గొప్ప సత్ఫలితాలను గమనించు; ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు. అబూ దావూద్ 4798, సహీహా 794లో ఉంది:

«إِنَّ الْمُؤْمِنَ لَيُدْرِكُ بِحُسْنِ خُلُقِهِ دَرَجَةَ الصَّائِمِ الْقَائِمِ»

“విశ్వాసి తన నైతిక గుణాల వల్ల ఉపవాసమున్న వారి మరియు తహజ్జుద్ నమాజ్ చేయువారంత స్థానం పొందుతాడు”.

అంతేకాదు, సద్గుణాలు సంపూర్ణ విశ్వాసానికి గొప్ప సబబు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శుభవార్త ఇచ్చారు:

«أَكْمَلُ الْمُؤْمِنِينَ إِيمَانًا أَحْسَنُهُمْ خُلُقًا»

“విశ్వాసులలో సంపూర్ణ విశ్వాసం గలవాడు వారిలో అందరికన్నా ఎక్కువగా సద్వర్తన గలవాడు”. (అబూ దావూద్ 4682, సహీహా 284).

సోదరా! ప్రవక్తగారి ఈ ప్రవచనంపై శ్రద్ధ వహించు:

«أَحَبُّ النَّاسِ إِلَى اللَّهِ أَنْفَعُهُمْ لِلنَّاسِ، وَأَحَبُّ الْأَعْمَالِ إِلَى اللَّهِ سُرُورٌ تُدْخِلُهُ عَلَى مُسْلِمٍ، أَوْ تَكْشِفُ عَنْهُ كُرْبَةً ، أَوْ تَقْضِي عَنْهُ دَيْنًا ، أَوْ تَطْرُدُ عَنْهُ جُوعًا، وَلَئِنْ أَمْشِي مَعَ أَخٍ لِي فِي حَاجَةٍ أَحَبُّ إِلَيَّ مِنْ أَنْ أَعْتَكِفَ فِي هَذَا الْمَسْجِدِ شَهْرًا»

“అల్లాహ్ కు అత్యంత ప్రియుడు ప్రజలకు అత్యంత ప్రయోజనకరుడు. అల్లాహ్ కు సత్కార్యాల్లో అత్యంత ప్రియమైనవి; ముస్లింకు సంతోషం కలిగించడం, అతని ఓ కష్టాన్ని తొలగించడం, అతని అప్పు చెల్లించటం, అతని ఆకలి భాధను తీర్చటం. నేను నా ముస్లిం సోదరుని వెంట అతని ఓ అవసరాన్ని తీర్చుటకు నడవడం నా మస్జిదు (మస్జిదె నబవీ)లో ఒక నెల ఏతికాఫ్ చేయడం కంటే ఎంతో ప్రియమైనది”. (తబ్రానీ సగీర్ 861, సహీహుత్ తర్గీబ్ 2623).

ముస్లిం సోదరా! మృదువుగా, ప్రేమగా ఓ మాట నీవు మాట్లాడినా అందులో నీకు పుణ్యం ఉంది, అది నీ కొరకు ఒక దానం లాంటిది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

«وَالكَلِمَةُ الطَّيِّبَةُ صَدَقَةٌ»

“మంచి మాట ఒక దానం వంటిది”. (బుఖారీ 2989, ముస్లిం 1009).

మంచిమాటకు ఈ ఘనత ఎందుకు లభించినది? ఎందుకనగా; అందులో ప్రశంసనీయమైన ప్రభావం ఉంది. అది హృదయాలను చేరువుగా చేస్తుంది, మనస్సును ప్రేమతో నింపుతుంది, ద్వేషాలను దూరం చేస్తుంది.

ఇతరుల నుండి బాధ భరించి అయినా సద్వర్తన కలిగి ఉండడం గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రోత్సహించిన సందర్భాలు అనేకం, వాటిలో ఒకటి:

«اتَّقِ اللهِ حَيْثُمَا كُنْتَ، وَأَتْبِعِ السَّيِّئَةَ الحَسَنَةَ تَمْحُهَا، وَخَالِقِ النَّاسَ بِخُلُقٍ حَسَنٍ»

“ఎక్కడ ఉన్నా అల్లాహ్ తో భయపడు, పాపం జరిగిన వెంటనే పుణ్యం చెయ్యి, దాని వల్ల పాపం తుడుచుకుపోవును, ప్రజల ఎడల సద్వర్తనతో మెలుగు”. (తిర్మిజి 1987, సహీహుత్ తర్గీబ్ 2655).

ప్రతీ సమయ, సందర్భంలో ముస్లిం ఈ సద్గుణాలను అలవర్చుకొని ఉంటాడు, అందుకు అతను ప్రజలకు ప్రియుడయి ఉంటాడు. ఏ దారి గుండా నడిచినా, ఏ చోటకి వెళ్ళినా వారికి సన్నిహితుడవుతాడు, చివరికి తన భార్యకు ఓ అన్నం ముద్ద తినిపించినా, అతనికి ఇస్లాంలో సత్ఫలితం లభిస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

«وَإِنَّكَ مَهْمَا أَنْفَقْتَ مِنْ نَفَقَةٍ، فَإِنَّهَا صَدَقَةٌ، حَتَّى اللُّقْمَةُ الَّتِي تَرْفَعُهَا إِلَى فِي امْرَأَتِكَ»

నీవు ఖర్చు చేసే ఒక్కో దానికి బదులుగా నీకు సదఖ చేసినంత పుణ్యం, చివరికి నీవు నీ భార్య నోట్లో పెట్టే ఓ అన్నం ముద్దకు బదులుగా కూడా పుణ్యం లభిస్తుంది. (బుఖారీ 2742).

ప్రియ సోదరా! విశ్వాసులు పరస్పరం సహోదరులు, విశ్వాసి తన కొరకు ఇష్టపడినదే తన సోదరుని కొరకు ఇష్టపడాలి. కనుక నీకిష్టమైనదేదో చూసుకొని అదే, అలాంటిదే నీ సోదరునికీ ఇవ్వు. నీకు ఇష్టం లేనిది అతని నుండి దూరంగానే ఉంచు. జాగ్రాత్త! అల్లాహ్ ను తన ప్రభువుగా, ఇస్లాంను తన ధర్మంగా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తన ప్రవక్తగా విశ్వసించినవారిని చిన్నచూపుతో చూడకు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా హెచ్చరించారు:

«بِحَسْبِ امْرِئٍ مِنَ الشَّرِّ أَنْ يَحْقِرَ أَخَاهُ الْمُسْلِمَ»

“తన ముస్లిం సోదరుడ్ని కించపరచడం, చిన్న- చూపుతో చూడడం స్వయం తాను చెడ్డవాడు అనడానికి గొప్ప చిహ్నం”. (ముస్లిం 2564).

ముస్లిం సోదరా! అన్ని వేళల్లో సుగమమైన మార్గం, సులభమైన ఆరాధన సద్వర్తన అవలం- బించండం. అవును, దీని సత్ఫలితం ఇంతా అంతా కాదు, రాత్రంతా తహజ్జుద్ చేసే, పగలంతా ఉపవాసం పాటించే వారితో సమానం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇదే శుభవార్త ఇచ్చారు:

«إِنَّ الْمُؤْمِنَ لَيُدْرِكُ بِحُسْنِ خُلُقِهِ دَرَجَةَ الصَّائِمِ الْقَائِمِ»

“విశ్వాసి తన సద్వర్తన ద్వారా (నఫిల్) ఉపవాసాలు, తహజ్జుద్ నమాజులు పాటించేవారి స్థానాన్ని చేరుకుంటాడు”. (అబూ దావూద్ 4798, సహీ తర్గీబ్ 2643).

సద్వర్తన చిహ్నాలు

సద్గుణాలంటే కొన్ని మంచి గుణాల కలయిక (సమూహం). వాటిలో కొన్ని దిగువ తెలుసు- కుందాము, పాటించే ప్రయత్నం చేద్దాము:

మనిషి ఎక్కువగా బిడియం గలవాడై ఉండాలి. ఇతరులకు బాధ కలిగించకుండా ఉండాలి. అధికంగా సంస్కరణకర్త అయి, సత్యవంతుడై ఉండాలి. తక్కువ మాట్లాడాలి. ఎక్కువ పని చేయాలి. వృధా వాటికి దూరంగా ఉండాలి. ప్రతి మంచిలో ముందంజ వేయాలి. బంధుత్వాన్ని పెంచుకుంటూ ఉండాలి. సహనశీలుడై, కృతజ్ఞుడై, సంతృప్తి పడేవాడై, ఓర్పుగలవాడై, మృదువైఖరి అవలంబించేవాడై ఉండాలి. సౌశీల్యుడై కనికరుడై ఉండాలి. శపించువాడు, దూషించువాడు, చాడీలు చెప్పేవాడు, పరోక్షంగా నిందించేవాడు, తొందరుపాటు పడేవాడు, కపటం గలవాడు, పిసినారి, ఈర్షాపరుడై ఉండకూడదు. సంతోషంగా, ఉల్లాసంగా ఉండాలి. అల్లాహ్ కొరకే ప్రేమించాలి. అల్లాహ్ కొరకే ఇష్టపడాలి. అల్లాహ్ కొరకే కోపంగా ఉండాలి.

సద్వర్తన గల మనిషి ప్రజల బాధను సహిస్తాడు, ఎల్లప్పుడు వారి నుండి జరిగే పొరపాట్లకు ఏదైనా సాకు వెతుకుతాడు, వారి తప్పులెన్నడం, వారి లోటుపాట్లను వెతకడం నుండి ఆమడ దూరమే ఉంటాడు. విశ్వాసి ఏ స్థితిలో, సందర్భంలో దుర్గుణుడు, దుష్ప్రవర్తన గలవాడు కాడు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనేక సందర్భాలలో సద్వర్తన ప్రాముఖ్యతను, సద్గుణ సంపన్నడు పొందే గొప్ప సత్ఫలితాన్ని ఎంతో నొక్కి చెప్పారు. ఉసామా బిన్ షరీక్ ఉల్లేఖించారు, మేము ప్రవక్త వద్ద కూర్చొని ఉండగా, కొంత మంది వచ్చి ఇలా అడిగారు:

فَمَنْ أَحَبُّ عِبَادِ اللَّهِ إِلَى اللَّهِ؟ قَالَ: «أَحْسَنُهُمْ خُلُقًا»

అల్లాహ్ కు తన దాసుల్లో అత్యంత ప్రియులెవరూ?

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం  చెప్పారు: “వారిలో అత్యంత సద్గుణ సంపన్నుడు”. (తబ్రానీ ఔసత్ 6380, సహీహా 432).

అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖించారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా విన్నారు:

«أَلَا أُخْبِرُكُمْ بِأَحَبِّكُمْ إِلَيَّ وَأَقْرَبِكُمْ مِنِّي مَجْلِسًا يَوْمَ الْقِيَامَةِ؟» قَالُوا: نَعَمْ يَا رَسُولَ اللَّهِ، قَالَ: «أَحْسَنُكُمْ خُلُقًا»

“మీలో నాకు అత్యంత ప్రియుడు మరియు ప్రళయదినాన నా సమావేశంలో నాకు అత్యంత సమీపంలో కూర్చునేవాడు ఎవరో మీకు తెలుపనా?”, అవును తెలుపండి ప్రవక్తా! అని సహచరులు విన్నవించుకున్నారు: “మీలో అందరికన్నా ఎక్కువ సద్గుణాలు గలవాడు”. (ముస్నద్ అహ్మద్ 6735, సహీహుత్ తర్గీబ్ 2649).

అబూ దర్దా రజియ్లలాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

«مَا شَيْءٌ أَثْقَلُ فِي مِيزَانِ الْمُؤْمِنِ يَوْمَ القِيَامَةِ مِنْ خُلُقٍ حَسَنٍ»

“ప్రళయదినాన విశ్వాసుని త్రాసులో సద్వర్తన కంటే బరువైనది మరేదీ ఉండదు”. (తిర్మిజి 2002, సహీహా 876).

ప్రవక్త సద్వర్తన

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ సహాబాలను ఏ సద్వర్తన అలవర్చుకోటానికి ఆహ్వానించేవారో వాటిలో ఆయన అత్యుత్తమ గొప్ప ఆదర్శంగా ఉండేవారు. ప్రవక్త తమ సహచరుల మదిలో అత్యున్నత సద్గుణాలు ఉపదేశాలతో, వివేచనాపరమైన మాటలతో నాటేకి ముందు తమ ఆచరణతో నాటేవారు.

عَنْ أَنَسِ بْنِ مَالِكٍ ﷜، قَالَ: خَدَمْتُ رَسُولَ اللهِ عَشْرَ سِنِينَ، وَاللهِ مَا قَالَ لِي: أُفًّ قَطُّ، وَلَا قَالَ لِي لِشَيْءٍ: لِمَ فَعَلْتَ كَذَا؟ وَهَلَّا فَعَلْتَ كَذَا؟

అనస్ రజియల్లాహు అన్హు తెలిపారు: నేను పది సంవత్సరాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సేవలో ఉన్నాను, అల్లాహ్ సాక్షిగా! ఆయన ఏ ఒక్కసారి కూడా నన్ను కసురుకోలేదు, ఇంకా ఈ పని ఎందుకు చేశావు, ఈ పని ఎందుకు చేయలేదు అని కూడా అనలేదు. (బుఖారీ 6038, ముస్లిం 2309).

عَنْ أَنَسِ بْنِ مَالِكٍ ﷜، قَالَ: كُنْتُ أَمْشِي مَعَ النَّبِيِّ وَعَلَيْهِ بُرْدٌ نَجْرَانِيٌّ غَلِيظُ الحَاشِيَةِ، فَأَدْرَكَهُ أَعْرَابِيٌّ فَجَذَبَهُ جَذْبَةً شَدِيدَةً، حَتَّى نَظَرْتُ إِلَى صَفْحَةِ عَاتِقِ النَّبِيِّ قَدْ أَثَّرَتْ بِهِ حَاشِيَةُ الرِّدَاءِ مِنْ شِدَّةِ جَذْبَتِهِ، ثُمَّ قَالَ: مُرْ لِي مِنْ مَالِ اللَّهِ الَّذِي عِنْدَكَ، فَالْتَفَتَ إِلَيْهِ فَضَحِكَ، ثُمَّ «أَمَرَ لَهُ بِعَطَاءٍ»

“అనస్  రదియల్లాహు అన్హు తెలిపారు: ఒక సారి నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట నడుస్తుండగా -అప్పుడు ఆయన నజ్రాన్‌లో తయారైన మందమైన అంచుగల ఒక దుప్పటి ధరించి ఉన్నారు- ఒక గ్రామీణుడు వచ్చి దుప్పటిని వడిగా లాగాడు. దాని వలన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మెడ భుజానికి దగ్గర మచ్చ ఏర్పడింది నేను స్వయంగా చూశాను. మళ్ళీ  అతను ఇలా అడిగాడు. ముహమ్మద్‌! నీ  వద్ద ఉన్న అల్లాహ్ ధనం నాకింత ఇప్పించండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతని వంక తిరిగి చూస్తూ నవ్వారు. మళ్ళీ అతనికి కొంత ఇవ్వవలసినదిగా ఆదేశించారు. (బుఖారీ 3149, ముస్లిం 1057).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంట్లో ఏమి చేసేవారని ఆయిషా రజియల్లాహు అన్హాను ప్రశ్నించినప్పుడు, ఆమె ఇలా చెప్పారు:

كَانَ يَكُونُ فِي مِهْنَةِ –خِدْمَةَ- أَهْلِهِ فَإِذَا حَضَرَتِ الصَّلاَةُ خَرَجَ إِلَى الصَّلاَةِ

ఆయన ఇంటి పనుల్లో తమ ఇల్లాలికి సహకరిస్తూ ఉండేవారు. నమాజ్‌ సమయమయిన వెంటనే నమాజ్‌ కొరకు వెళ్ళేవారు. (బుఖారీ 676).

అబ్దుల్లాహ్  బిన్‌ హారిస్ రజియల్లాహు అన్హు చెప్పారు:

مَا رَأَيْتُ أَحَدًا أَكْثَرَ تَبَسُّمًا مِنْ رَسُولِ اللهِ .

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ఎక్కువ చిరునవ్వు నవ్వేవారిని నేను చూడలేదు. (తిర్మిజీ 3641, ఇది హసన్ హదీస్).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గుణవిశేష- ణాల్లో; ఆయన దాత, ఎన్నడూ పిసినారితనం వహించలేదు. శూరుడు, సత్యం నుండి ఎన్నడూ వెనక్కి తిరగలేదు. న్యాయశీలి, ఎన్నడూ తీర్పు చేయడంలో అన్యాయం చేయలేదు. పూర్తి జీవితంలో సత్యవంతుడు, విశ్వసనీయుడు అనే ప్రఖ్యాతి చెందారు.

జాబిర్‌ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరైనా ఏదయినా అడిగితే, “లేదు” అని ఎన్నడూ అనలేదు. (బుఖారి 6034, ముస్లిం 2311).

ఆయన తమ సహచరులతో పరిహాసమాడేవారు. (ధనికపేద బేధం లేకుండా) అందరితో కలసి ఉండేవారు. పిల్లవాళ్ళను తమ వడిలో కూర్చోబెట్టి ఆటలాడే వారు. ఆహ్వానాన్ని అంగీకరించేవారు. వ్యాధిగ్రస్తుల్ని పరామర్శిం చేవారు. అపరాధుల సాకును ఒప్పుకునేవారు.

తమ సహచరులను వారికి నచ్చిన మంచి పేర్లతో సంబొధించేవారు. మాట్లాడుతుండేవారి మాట మధ్య అభ్యంతరం కలిగించేవారుకారు.

అబూ ఖతాద రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: ఒక సారి నజ్జాషి రాయబార బృందం ఒకటి ప్రవక్త వద్దకు వచ్చినప్పుడు స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సేవ చేస్తున్నది చూసి, ఆయన సహచరులు ప్రవక్తా! మీరు ఉండండి. మేము వారికి సేవ చేస్తాము అని విన్నవించుకోగా. ఆయన “వారు మా సహచరులతో మంచి విధంగా ప్రవర్తించారు. ప్రతీకగా వారి ఆతిథ్యం స్వయంగా నేనూ మంచి విధంగా చేయాలను- కుంటున్నాను” అని అన్నారు. (దలాఇలున్ నుబువ్వ 2/307, సీరతుబ్ని కసీర్ 2/31).

ఇంకా  ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అనేవారు: “నేను ఒక దాసున్ని, దాసుడు ఎలా తింటాడో అలాగే నేను తింటాను. అతను ఎలా కూర్చుంటాడో అలా నేను కూర్చుంటాను”. ఆయన గాడిదపై స్వారీ చేసేవారు, నిరుపేదలను పరామర్శించేవారు, బీదవాళ్ళతో కలసి కూర్చుండేవారు.

సత్యం

 నిశ్చయంగా విశ్వాసుడు తన ప్రభువు పట్ల సత్యవంతుడు. ప్రజల ఎడల సత్యవంతుడు. అన్ని వేళల్లో, స్థితుల్లో తన మాటల్లో, చేష్టల్లో సత్యవంతుడుగానే ఉంటాడు. అల్లాహ్ ఆదేశం గమనించండి:

 [يَاأَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَكُونُوا مَعَ الصَّادِقِينَ] (التوبة: 119)

విశ్వసించిన ప్రజలారా! అల్లాహ్ కు భయపడండి. సత్యవంతులకు తోడుగా ఉండండి. (తౌబా 9:119).

مَا كَانَ خُلُقٌ أَبْغَضَ إِلَى رَسُولِ اللَّهِ مِنَ الْكَذِبِ

ఆయిషా రజియల్లాహు అన్హా చెప్పారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నింటికంటే ఎక్కువగా అబద్దాన్ని అసహ్యించుకునేవారు. (సహీ ఇబ్ను హిబ్బాన్ 5736, బైహఖీ షుఅబ్ 4475లో).

ఇస్లాం ధర్మం పై అబద్దం చెప్పడం అతి చెడ్డ విషయం, పాపాల్లో అతిఘోరమైనది. అలాంటివారికి నరకమే శిక్ష. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా హెచ్చరించారు:

«مَنْ كَذَبَ عَلَيَّ مُتَعَمِّدًا، فَلْيَتَبَوَّأْ مَقْعَدَهُ مِنَ النَّارِ»

“ఎవరైతే ఉద్దేశ్య పూర్వకంగా నాపై అబద్దాన్ని మోపుతాడో అతడు తన నివాసం నరకంలో నిర్మించుకోవలసి ఉంటుంది”. (బుఖారి 1291, ముస్లిం 3).

బాలల మనుస్సులో సైతం సత్యాన్ని నాటాలని, వారు ఆ మనుగడను అనుసరిస్తూ పెరగాలని ఇస్లాం ప్రోత్సహిస్తుంది. అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

«مَنْ قَالَ لِصَبِيٍّ: تَعَالَ هَاكَ، ثُمَّ لَمْ يُعْطِهِ فَهِيَ كَذْبَةٌ»

“ఇదిగో, తీసుకో అని ఎవరైతే ఒక పిల్లవాణ్ణి పిలిచి అతనికి ఏమీ ఇవ్వకుంటే అది కూడా ఒక అబద్ధం” (అహ్మద్‌ 9836, సహీహా 748).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పరిహాసాని- కైనా, నవ్వించుటకయినా అబద్దం విడనాడాలని అనుచర సంఘాన్ని ప్రోత్సహించారు.

«أَنَا زَعِيمٌ بِبَيْتٍ فِي وَسَطِ الْجَنَّةِ لِمَنْ تَرَكَ الْكَذِبَ وَإِنْ كَانَ مَازِحًا»

అబూ ఉమామ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా శుభవార్త ఇచ్చారు: “పరిహాసానికయినా అసత్యము చెప్పని వ్యక్తి కోసం స్వర్గం మధ్యలో నివాసం లభిస్తుందని నేను హామీ ఇస్తున్నాను. (అబూ దావూద్ 4800, సహీహా 273)

వ్యాపారి తన సరుకు అమ్మడానికి అబద్దం చెబుతాడు. అయితే ప్రవక్త  ఈ హెచ్చరికను వినలేదా, చదవలేదా? “అల్లాహ్ ప్రళయదినాన ముగ్గురితో మాట్లాడడు, వారి వైపు చూడడు, వారిని శుద్ధిపరచడు” అని ప్రవక్త హెచ్చరించి- నప్పుడు, వారెవరు ప్రవక్తా! వారైతే నాశనమై- పోయారు, నష్టములో పడ్డారు అని అబూ జర్ర్ రజియల్లాహు అన్హు అడిగారు. అప్పుడు ప్రవక్త చెప్పారు: “చీలమండలానికి క్రింద దుస్తులు ధరించేవారు, ఉపకారం చేసి దెప్పిపొడిచేవాడు మరియు అసత్య ప్రమాణాలతో తమ సరుకును విక్రయించేవారు”. (ముస్లిం 106).

ఉఖ్బా బిన్ ఆమిర్ చెప్పారు: “ఒక ముస్లిం ఓ సరుకును అమ్మేటప్పుడు అందులో ఉన్న లోపం తెలిసి కూడా దాన్ని (కొనేవారికి) చెప్పకపోవుట ధర్మ సమ్మతంకాదు”. (బుఖారీలో 2079కి ముందు హదీసు).

అమానతు

ఇస్లాం తన అనుచరులకు (విశ్వాసులకు) అమానతులను హక్కుదారులకు అప్పగించాలని ఆదేశిస్తుంది. ప్రతి వ్యక్తి తాను చేసే పని చిన్నదైనా, పెద్దదయినా తన ప్రభువు తనను చూస్తున్నాడు అనే విషయం తెలుసుకోవాలి. ఇది కూడా అమానతే.

ముస్లిం తనపై అల్లాహ్ విధించిన విషయాల్ని నెరవేర్చడములో విశ్వసనీయుడు. ప్రజల ఎడల ప్రవర్తించడంలో సయితం విశ్వసనీయుడు.

 అమానతు అంటే: మనషి తనకు అప్పగించబడిన బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చడానికి కృషి చేయడం. అల్లాహ్ ఆదేశం:

[إِنَّ اللَّهَ يَأْمُرُكُمْ أَن تُؤَدُّوا الْأَمَانَاتِ إِلَىٰ أَهْلِهَا وَإِذَا

حَكَمْتُم بَيْنَ النَّاسِ أَن تَحْكُمُوا بِالْعَدْلِ ۚ]

“ఎవరి అమానతులను వారికి అప్పగించండి. ప్రజల మధ్య తీర్పులు చేసేటప్పుడు న్యాయంగా తీర్పు చేయండి” అని అల్లాహ్‌ మిమ్మల్ని ఆదేశిస్తున్నాడు. (నిసా 4:58).

మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని, అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు:

«لَا إِيمَانَ لِمَنْ لَا أَمَانَةَ لَهُ»

“ఎవరిలోనయితే అమానతు లేదో వారిలో ఈమాన్‌ (విశ్వాసం) లేదు”. (అహ్మద్ 12383, ఇది హసన్ హదీస్).

అమానతు అంటే ఈ రోజుల్లో కొందరు అనుకునే విధంగా “ఒకరి వస్తువును భద్రంగా కాపాడి తను అడిగినప్పుడు తిరిగి ఇవ్వడం” మాత్రమే కాదు. అంతకంటే విశాలమైన భావాలు (విషయాలు) అందులో వస్తాయి. అమానతు అదా చేయడం, అప్పగించడం అంటే: ఒక వ్యక్తి ఏ పని, లేక విధి అతనికి అప్పగించబడినదో, అది ధర్మపరమైనది గాని లేక ప్రాపాంచికమైనది గాని అన్నిటినీ మనఃపూర్వకంగా, సరియైన రీతిలో నెరవేర్చాలి. తన వైపు నుండి ఏ రవ్వంత కొరత లేకుండా నెరవేర్చాలి.

వినయము

ముస్లిం  అవమానానికి గురి కాకుండా వినయ వినమ్రత పాటిస్తాడు.. గర్వాహంకారాలు ముస్లింకు వాంఛనీయం కావు. అల్లాహ్ ఆదేశం:

[وَاخْفِضْ جَنَاحَكَ لِمَنِ اتَّبَعَكَ مِنَ الْمُؤْمِنِينَ]

“విశ్వసించి, నిన్ను అనుసరించేవారి పట్ల మృదువుగా మసలుకో”. (షుఅరా 26:215). ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనం:

«وَمَا تَوَاضَعَ أَحَدٌ لِلَّهِ إِلَّا رَفَعَهُ اللهُ»

“ఎవరయితే అల్లాహ్ కొరకు వినమ్రుడవుతాడో అల్లాహ్ అతన్ని ఉన్నతునిగా చేస్తాడు”. (ముస్లిం 2588). మరో చోట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు:

«وَإِنَّ اللهَ أَوْحَى إِلَيَّ أَنْ تَوَاضَعُوا حَتَّى لَا يَفْخَرَ أَحَدٌ

عَلَى أَحَدٍ، وَلَا يَبْغِي أَحَدٌ عَلَى أَحَدٍ»

“మీరు వినయ, వినమ్రత పాటించండి అని అల్లాహ్ నాకు వహీ (సందేశం) పంపాడు. ఎంతవరకు అనగా మీలో ఒక వ్యక్తి మరో వ్యక్తిపై గర్వాహంకారినికి ఒడికట్టకూడదు. ఒక వ్యక్తి మరో వ్యక్తిపై దౌర్జన్యం చేయకూడదు”. (ముస్లిం 2865).

వినయవినమ్రత యొక్క ప్రత్యక్ష రూపాలు: బీద, నిరుపేదలతో కూర్చుండుట. కలియ గలుపుగా ఉండుట. వారిపై పెత్తనం చలాయించ కుండా, గర్వించకుండా, ప్రజల మధ్య మందహాసముతో ఉండుట. ఇతరుల కంటే తనే ఉన్నతుడు, గొప్పవాడు అన్న భావన మనిషికి ఉండకపోవుట.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మహాప్రవక్త అయినప్పటికీ ఇంటిని శుభ్రపరిచేవారు (ఇల్లు ఊడిచేవారు). మేకపాలు పిండేవారు. బట్టలకు అతుకులు వేసి కుట్టుకునేవారు. తమ బానిసతో కలసి తినేవారు. మార్కెట్‌ (బజారు) నుండి స్వయంగా ఖరీదు చేసేవారు. విశ్వాసులైన చిన్న, పెద్ద, ధనిక, పేద బేధం లేకుండా అందరితో కలిసేవారు. ముసాఫహా (కరచాలనం) చేసేవారు.

లజ్జ

లజ్జా, బిడియం విశ్వాస భాగాల్లో ఓ భాగం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశానుసారం: “లజ్జా గుణం వలన మేలుతప్ప మరేమి చేకూరదు”. (బుఖారి 6117, ముస్లిం 37).

విశ్వాసునికి ఈ మహోన్నత గుణంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గొప్ప ఆదర్శం, ఆయన మహాలజ్జ గుణం గలవారు. అబూ సఈద్‌ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఏదైనా విషయం అసహ్యం కలిగించిందంటే, అది మేము ఆయన ముఖము చూసి తెలుసుకునే వారము. (బుఖారీ 6102).

సిగ్గు, బిడియం గుణాలు ముస్లింను సత్యమైన మాట పలకడం, విద్య అభ్యసించడం, మంచిని ఆదేశించడం, చెడును నివారించడం నుండి ఆపదు. ఉదా: ఈ గుణం ఉమ్మె సులైమ్ రజియల్లాహు అన్హాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇలా ప్రశ్నించడానికి అడ్డుపడలేదు: ప్రవక్తా! అల్లాహ్ హఖ్‌ (ధర్మ) విషయం అడిగితె సిగ్గుపడడు కదా!. స్త్రీలకు స్వప్న స్ఖలనమైనచో స్నానం చేయుట తప్పనిసరియా? అని ప్రశ్నించింది. అందుకు ప్రవక్త “అవును స్వప్న స్ఖలనం అయినట్టు తెలిసి, తడి చూసినచో స్నానం చేయాలి” అని సమాదానమిచ్చారు. (బుఖారి 282).

 కాని ఈ లజ్జగుణం ముస్లింకు, దుష్కార్యాలు చేయునప్పుడు, అతనిపై విధించబడినదానిని సంపూర్ణంగా నిర్వర్థించకుండా ఉన్నప్పుడు. ఒకరి లోపాల్ని బహిర్గతం చేసేటప్పుడు. ఎవరికైనా నష్టం చేయాలని పూనుకున్నప్పుడు తప్పకుండా అడ్డు పడాలి.

 అల్లాహ్ పట్ల లజ్జగుణంతో మెలగడం అత్యంత ప్రధాన హక్కు. విశ్వాసి తన సృష్టికర్త అయిన అల్లాహ్ పట్ల సిగ్గుపడాలి. ఆయనే అతనికి ఉనికి ప్రసాదించి, అనేక వరాలు నొసంగాడు. కనుక ఆయన విధేయతలో, వరాల కృతజ్ఞత తెలుపుటలో అశ్రద్ధ చూపుటకు సిగ్గుపడాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఆదేశించారు: “సిగ్గుపడటానికి ప్రజలకంటే అల్లాహ్ ఎక్కువ అర్హతగలవాడు”. (బుఖారి).

దుర్గుణాలు

జుల్మ్‌ – (అన్యాయం, దౌర్జన్యం)

 నిజమైన ముస్లిం తరపున ఎన్నడూ ఏ ఒకరి పట్ల “జుల్మ్‌” జరగదు. ఎందుకనగా ఇస్లాంలో “జుల్మ్‌” కు పాల్పడుట నిషిద్ధం. అల్లాహ్ ఆదేశం:

[وَمَنْ يَظْلِمْ مِنْكُمْ نُذِقْهُ عَذَابًا كَبِيرًا] {الفرقان:19}

“మీలో ఎవడు “జుల్మ్‌”కి పాల్పడుతాడో, అతనికి మేము కఠిన శిక్షను రుచి చూపిస్తాము”. (ఫుర్‌ఖాన్‌ 25:19).

అల్లాహ్ ఇలా ఆదేశించాడని, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

«يَا عِبَادِي إِنِّي حَرَّمْتُ الظُّلْمَ عَلَى نَفْسِي، وَجَعَلْتُهُ بَيْنَكُمْ مُحَرَّمًا، فَلَا تَظَالَمُوا»

“ఓ నా దాసులారా! నేను దౌర్జన్యాన్ని నిషేధిస్తున్నాను. మీరు కూడా ఒకరి పై నొకరు దౌర్జన్యం చేయడం నిషిద్ధం అని భావించండి, అలాగే ఆచరించండి”. (ముస్లిం).

జుల్మ్‌” మూడు రకాలు:

1. మొదటి రకం: మానవుడు తన ప్రభువు పట్ల చేసే “జుల్మ్‌”. అనగా తన ప్రభువు పట్ల అవిశ్వాసానికి పాల్పడటం. అల్లాహ్ ఆదేశం:

[وَالكَافِرُونَ هُمُ الظَّالِمُونَ] {البقرة:254}

“అవిశ్వాస మార్గం అవలంభించేవారే “జుల్మ్‌” చేయువారు (జాలిములు)” (బఖర 2:254).

ఆరాధనలో అల్లాహ్ తో పాటు ఇతరుల్ని భాగస్వామి చేయడం ద్వారా మనిషి ఈ “జుల్మ్‌” కి పాల్పడతాడు. అంటే ఆరాధనల్లో కొన్నిటిని అల్లాహ్ యేతరుల కొరకు చేయుట. అల్లాహ్ ఆదేశం:

[إِنَّ الشِّرْكَ لَظُلْمٌ عَظِيمٌ] {لقمان:13}

“నిశ్చయంగా ఇతరుల్ని అల్లాహ్ కు భాగస్వాము-

లుగా చేర్చటం ఘోరమైన “జుల్మ్‌” (పరమ దుర్మార్గం) (లుఖ్మాన్‌ 31:13).

2. రెండవ రకం: ఒక వ్యక్తి తన తోటి మానవులపై చేసే “జుల్మ్‌”. అది వారి శీలమానాల్లో జోక్యం చేసుకొని బాధించడం, లేక వారిని శారీరకంగా బాధించడం, లేక అధర్మంగా వారి సొమ్మును కాజేసి బాధించడం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు:

«كُلُّ الْمُسْلِمِ عَلَى الْمُسْلِمِ حَرَامٌ، دَمُهُ، وَمَالُهُ، وَعِرْضُهُ»

ఒక ముస్లిం యొక్క ధన, మాన, ప్రాణము మరొక ముస్లింపై నిషిద్ధం”. (ముస్లిం 2564).

మరో సందర్భంలో ప్రవక్త ఇలా హెచ్చరించారు:

«مَنْ كَانَتْ لَهُ مَظْلَمَةٌ لِأَخِيهِ مِنْ عِرْضِهِ أَوْ شَيْءٍ، فَلْيَتَحَلَّلْهُ مِنْهُ اليَوْمَ، قَبْلَ أَنْ لاَ يَكُونَ دِينَارٌ وَلاَ دِرْهَمٌ، إِنْ كَانَ لَهُ عَمَلٌ صَالِحٌ أُخِذَ مِنْهُ بِقَدْرِ مَظْلَمَتِهِ، وَإِنْ لَمْ تَكُنْ لَهُ حَسَنَاتٌ أُخِذَ مِنْ سَيِّئَاتِ صَاحِبِهِ فَحُمِلَ عَلَيْهِ»

ఎవరైనా తన సోదరున్ని అవమాన పరచి లేదా మరే విధమైన “జుల్మ్‌” చేసి బాధించినచో, దిర్‌హమ్  దీనార్‌ (డబ్బు ధనం) చెల్లని ఆ రోజు రాక ముందు ఈ రోజే (క్షమాపణ కోరి లేక వారి హక్కు ఇచ్చేసి) తొలిగిపోవాలి. (లేదా) ఆ రోజు, తాను చేసిన “జుల్మ్‌”కి పరిమాణంలో అతని పుణ్యాలు తీసుకొని (బాధితునికివ్వబడతాయి). అతని వద్ద పుణ్యాలు లేనిచో బాధితుని పాపాలు తీసుకొని అతనిపై వేయబడతాయి. (బుఖారి 6534).

3- మూడవ రకం: మనిషి తన ఆత్మపై చేసుకునే “జుల్మ్‌”. అదేమిటనగా మనిషి నిషిద్ధ విషయాలకు పాల్పడుట. అల్లాహ్ ఆదేశం:

وَمَا ظَلَمُونَا وَلَكِنْ كَانُوا أَنْفُسَهُمْ يَظْلِمُونَ (57)

“వారు మాపై ఏ మాత్రం “జుల్మ్‌” చేయలేదు. వారు తమకు తామే “జుల్మ్‌” చేసుకున్నారు. (2: ఒఖర: 57).

నిషిద్ధ కార్యాలకు పాల్పడుట మనిషి తన ఆత్మపై చేసుకునే “జుల్మ్‌”. ఎందుకనగా అతని ఈ పాపం అతను అల్లాహ్ శిక్షకు గురికావడానికి కారణమవుతుంది.

అసూయ

అసూయ దుర్గుణాల్లో ఓ గుణం. ముస్లిం దాని నుండి దూరంగా ఉండడం తప్పనిసరి. ఎందుకనగా, అల్లాహ్ తన దాసులకు పంచిన దానిలో ఆక్షేపించినట్లగును. అల్లాహ్ ఆదేశం గమించండి:

[أَمْ يَحْسُدُونَ النَّاسَ عَلَى مَا آتَاهُمُ اللَّهُ مِنْ فَضْلِهِ] {النساء 54}

“ఇతరులను చూసి వారు అసూయపడటానికి కారణం అల్లాహ్ వారికి తన అనుగ్రహాన్ని ప్రసాదించాడనా?”. (నిసా 4:54).

అసూయ రెండు రకాలు:

1. మనిషి ఒక వ్యక్తి వద్ద ఉన్న ధనం, లేక విద్య లేక అధికారం లాంటి వరం నశించిపోయి తనకు లభించాలని కాంక్షించడం.

2. ఒకరి వద్ద ఉన్న ఓ అనుగ్రహం అది అతనికి లభించకున్నా ఆ వ్యక్తి వద్ద ఉండకుండా నశించిపోవాలని కోరడం. ఇవి రెండూ నిషిద్ధం.

ముఖ్య గమనిక:  ఒక వ్యక్తి వద్ద ఉన్న అనుగ్రహం నశించిపోవాలని కాంక్షించకుండా తనకు కూడా అలాంటిదే కావాలని కోరడం అసూయ అనబడదు.

మోసం

ముస్లిం తన సోదరుల పట్ల మంచి చేయువాడు, అందుకు అతను ఏ ఒక్కరికీ మోసం చేయడు. తనకిష్టమైనది తన సోదరుని కొరకు ఇష్టపడతాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు.

«مَنْ غَشَّنَا فَلَيْسَ مِنَّا»

మోసము చేయువాడు మాలోని వాడు కాడు”. (ముస్లిం 101).

أَنَّ رَسُولَ اللهِ مَرَّ عَلَى صُبْرَةِ طَعَامٍ فَأَدْخَلَ يَدَهُ فِيهَا، فَنَالَتْ أَصَابِعُهُ بَلَلًا فَقَالَ: «مَا هَذَا يَا صَاحِبَ الطَّعَامِ؟» قَالَ أَصَابَتْهُ السَّمَاءُ يَا رَسُولَ اللهِ، قَالَ: «أَفَلَا جَعَلْتَهُ فَوْقَ الطَّعَامِ كَيْ يَرَاهُ النَّاسُ، مَنْ غَشَّ فَلَيْسَ مِنِّي»

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఓ ధాన్యముల కుప్ప నుండి దాటుతూ అందులో చెయ్యి వేశారు. వేళ్లకు తడి అంటింది. “ఇదేమిటి ఓ వ్యాపారి?” అని అడిగారు. ‘వర్షము కురిసినందు వలన తడిసినవి (అయితె వాటిని నేను క్రింద ఉంచాను) ప్రవక్తా’ అని జవాబిచ్చాడు ఆ ధాన్యాల యజమాని. “అదే పైన ఎందుకు ఉంచలేదు, ప్రజలకు తెలిసేది కదా. మోసము చేయువారు మాలోని వారు కారు”. అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించారు. (ముస్లిం 102).

గర్వం

మానవుడు తనకున్న విద్యకారణంగా ఒక్కోసారి గర్వానికి గురి అవుతాడు. ఇక ఇతరులపై, లేక విజ్ఞానులపై పెత్తనం చూపుతూ, వారిని చిన్న చూపుతో చూస్తాడు.

ఒక్కో వ్యక్తి తనకు ఉన్న ఆస్తి, సంపదల కారణంగా గర్వానికి లోనయి, ఈ మూలంగా ప్రజల ఎడల అహంకారభావంతో మసులుకుంటాడు.

ఒక్కో మనిషి తనకున్న బలం, శక్తి లేక తాను చేసే ఆరాధన లాంటి పనులతో గర్వానికి గురవుతాడు.

కాని నిజమైన ముస్లిం గర్వహాంకారాలకు గురికాకుండా దాని నుండి దూరంగా, జాగ్రత్తగా ఉంటాడు. ఇబ్లీసును స్వర్గం నుంచి వైదొలిగించింది అతని గర్వం, అహంకారమేనన్న విషయం ముస్లిం గుర్తించాలి. ఆదం అలైహిస్సలాంకు సజ్దా చేయి అని అల్లాహ్  అతన్ని ఆదేశించినప్పుడు అతడు: “నేను అతడికంటే శ్రేష్ఠుణ్ణి. నీవు నన్ను అగ్నితో సృష్టించావు. అతన్ని మట్టితో” అని అన్నాడు. అల్లాహ్ కారుణ్యం నుండి అతను దూరం కావడానికి ఇదేకారణం అయింది.

గర్వం, అహంకారభావం చికిత్స ఏమిటనగా ప్రతి వ్యకి తనకు అల్లాహ్ నొసంగిన అనుగ్రహాల్లో అది; విద్య, లేక ధనం, లేక ఆరోగ్యం మొదలయినవి ఏవైనా, అల్లాహ్ ఏ క్షణంలోనైనా తిరిగి తన నుంచి తీసుకునే శక్తిగలవాడు అని తెలుసుకోవాలి.

నైతిక గుణాలు ఆర్జించు మార్గాలు

 మనిషి ఏ గుణాలపై స్థిరపడ్డాడో వాటిని మార్చడం మానవ నైజానికే అతికష్టం అనడంలో సందేహం ఏ మాత్రం లేదు. అయినా అది అసాధ్యం, అసంభవం కాదు. కొన్ని సాధనాలు, వివిధ మార్గాలున్నాయి వాటి ఆధారంగా మనిషి సద్గుణాలు ఆర్జించవచ్చును. వాటిలో:

1- సలామతుల్‌ అఖీద (విశ్వాస శుద్ది): విశ్వాసం మహోత్తరమైన విషయం. సర్వసాధారణంగా మనిషి నడవడిక, స్వభావం, అతని ఆలోచనకు, విశ్వాసానికి, అతను అవలంభించిన ధర్మానికి ప్రత్యక్ష రూపంగా ఉంటుంది. విశ్వాసులలో అత్యుత్తమ సద్వర్తనగలవాడే వారిలో సంపూర్ణ విశ్వాసం గలవాడు. విశ్వాసం సరిగ్గా ఉంటే ప్రవర్తన కూడా చక్కగా ఉంటుంది. సరియైన విశ్వాసంగల వ్యక్తికి అతని ఆ విశ్వాసం సత్యత, దాతృత్వం, సంయమనం, శూరత్వం సద్గుణాలను ప్రోత్సహిస్తుంది. అదే విధంగా అబద్ధం, పిసినారితనం, కోపం. అజ్ఞానం మొదలయిన దుర్గుణాల నుండి హెచ్చరిస్తుంది.

2 దుఆ: అది గొప్ప ద్వారం. ఒక దాసుని కొరకు అది తెరువబడుతే అల్లాహ్ వైపు నుండి దాతృత్వం, మేళ్ళు, శుభాలు కురుస్తునే ఉంటాయి. సద్గుణ సంపన్నుడవ్వాలని, దుర్గుణాలకు దూరంగా ఉండాలని కోరువారు అల్లాహ్ సన్నిధిలోకి చేరుకొని, ఆయనతో మొరపెట్టుకోవాలి. అల్లాహ్ అతనికి సద్గుణాలు ప్రసాదించాలని, దుర్గుణాల నుండి దూరముంచాలని. ఈ విషయంలో మరియు ఇతర విషయాల్లో దుఆ చాల ప్రయోజన కరమైనది. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వినయ, వినమ్రతతో అల్లాహ్ ను చాలా వేడుకునే, అర్థించేవారు. తక్బీరే తహ్రీమ తరువాత చదివే దుఆలలో అప్పుడప్పుడు ఇలా కూడా దుఆ చేసేవారు.

اَللَّهُمَّ اهْدِنِي لِأَحْسَنِ الْأَخْلَاقِ لَا يَهْدِي لِأَحْسَنِهَا إِلَّا أَنْتَ، وَاصْرِفْ عَنِّي سَيِّئَهَا لَا يَصْرِفْ عَنِّي سَيِّئَهَا إِلَّا أَنْتَ

అల్లాహుమ్మహ్ దినీ  లిఅహ్ సనిల్‌ అఖ్‌లాఖి, లా యహ్ దీ లిఅహ్ సనిహా ఇల్లా అన్‌త, వస్రిఫ్ అన్నీ సయ్యిఅహా, లా యస్రిఫ్ అన్నీ సయ్యిఅహా ఇల్లా అన్‌ “. (ముస్లిం 771).

భావం: ఓ అల్లాహ్! నీవు నాకు సద్గుణాలు ప్రసాదించు. నీవు తప్ప మరెవ్వడూ సద్గుణాలు ప్రసాదించ లేడు. ఓ అల్లాహ్! నన్ను దుర్గుణాల నుండి దూరముంచు, నీవు తప్ప మరెవ్వరూ దుర్గుణాల నుండి దూరముంచలేడు.

3- ముజాహద: (ప్రయత్నం, కృషి) ఈ ప్రక్రియలో “ముజాహద” చాల ప్రయోజనకరంగా ఉంటుంది. ఎవడు సద్గుణాలు అలవర్పుకోటానికి దుర్గుణాలను వదులుకోడానికి ముజాహద చేస్తాడో అతనికి అనేక మేళ్ళు లభించును. భయంకరమైన కీడు అతని నుండి దూరమగును. కొన్ని గుణాలు సహజమైనవి. మరికొన్ని ఆర్జించవలసి యుంటాయి. అవి శిక్షణ, అభ్యాసముతో వస్తాయి.

మనిషి “ముజాహద” ఒక సారి, రెండు సార్లు లేక కొంచెం ఎక్కువసార్లు చేసి విడనాడకూడదు. జీవితాంతం చేస్తునే ఉండాలి. ఎందుకనగ ఈ “ముజాహద” ఆరాధనలో లెక్కిచబడుతుంది. అల్లాహ్ ఆదేశం చదవండి:

[وَاعْبُدْ رَبَّكَ حَتَّى يَأْتِيَكَ الْيَقِينُ]

“తప్పకుండా చివరి గడియ వచ్చే వరకు నీ ప్రభువు దాస్యం చేస్తూవుండు”. (హిజ్ర్‌ 15:99)

4: “ముహాసబ”:  చెడ్డ పని చేసినప్పుడు తన ఆత్మను విమర్శించి, మరోసారి ఆ చెడ్డపనికి అది పాల్పడకుండా ఉంచే ప్రయత్నం చెయ్యాలి.

5: సద్వర్తన వల్ల సంభవించే ప్రభావాలను యోచించాలి. ఏ విషయం యొక్క ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకుంటే, వాటి సత్పలితాల్ని గ్రహిస్తే, అవి చేయుట మరియు చేయుటకు ప్రయత్నించుట సులభమగును.

6: దుర్గుణాల దుష్పలితం పట్ల చింతన చేయాలి. దుర్గుణం వల్ల కలిగే శాశ్వత బాధ, విడదీయని రోధ, పశ్చాత్తాపం, అనుతాపం, ప్రజల మనస్సుల్లో ద్వేషాలు పెరగటం లాంటి విషయాల్ని గమనించాలి (ఇలా దుర్గుణాల నుండి దూరముండ గలుగుతాడు).

7 ఆత్మశుద్ధి చేసుకోలేననే నిరాశకు గురికాకూడదు. విశ్వాసి నిరాశచెందుట మంచి విషయం కాదు. ఎన్నటికీ అది అతనికి తగనిది. తన సంకల్పాన్ని దృఢపరుచుకొని, సంపూర్ణంగా ఆత్మశుద్ధి చేయుటకు ప్రయత్నం చేయాలి. దానిలో ఉన్న లోపాల్ని లేకుండా చేసే ప్రయత్నం చేయాలి.

8: మందహాసము, చిరునవ్వుతో ఉండాలి. ముఖము చిట్లించి, మాడ్పు ముఖముతో ఉండకూడదు. ఒక వ్యక్తి తన ముస్లిం సోదరున్ని కలిసినప్పుడు చిరునవ్వు నవ్వుట “సదఖా” చేసినంత సమానం. దానిపై అతనికి పుణ్యం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా శుభవార్త ఇచ్చారు.

«تَبَسُّمُكَ فِي وَجْهِ أَخِيكَ لَكَ صَدَقَةٌ»

“నీ సోదరున్ని కలిసి చిరునవ్వునవ్వుట నీకు “సదఖా” చేసినంత సమానం”. (తిర్మిజి 1956).

మరో సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు.

«لَا تَحْقِرَنَّ مِنَ الْمَعْرُوفِ شَيْئًا، وَلَوْ أَنْ تَلْقَى أَخَاكَ بِوَجْهٍ طَلْقٍ»

“ఏ ఒక చిన్న సత్కార్యాన్ని చిన్నచూపుతో చూడకు. అది నీ సోదరున్ని మందహాసముతో కలియుట అయినా సరే”. (ముస్లిం 2626).

9: చూచి చూడనట్లు ఉండాలి. ఇది మహాపురుషుల గుణం. ఈ గుణం వలన ప్రేమ ఎక్కువకాలం ఉంటుంది, (ప్రేమ లేని వారిలో ప్రేమ) కుదిరింపజేస్తుంది. శతృత్వాన్ని నశింపజేస్తుంది.

10: సంయమనం, సహనం: అది సద్గుణాల్లో అతి గొప్పది. జ్ఞానుల ఉన్నతమైన గుణం. సంయమనం అంటే ఆగ్రహం కలిగినప్పుడు దాన్ని దిగమింగుట. సంయమనం అంటే ఆ గుణంగల వ్యక్తికి కోపం రాకూడదు అని కాదు. ఆగ్రహం పెంచే కారణాల ఊబిలో చిక్కుకొని తీవ్రకోపానికి గురైనప్పుడు తనను తాను ఓదార్చుకోవాలి. ఒక వ్యక్తిలో సంయమనం గుణం చోటు చేసుకుందంటే  అతన్ని ప్రేమించేవారి సంఖ్య పెరుగుతుంది. అతన్ని ద్వేషించేవారి సంఖ్య తరుగుతుంది. అతని స్థానం ఉన్నతం అవుతుంది.

11.మూర్ఖుల తెరువుకు పోకుండ ఉండుట: మూర్ఖుల జోలికి పోనివాడు తన మానాన్ని కాపాడుకుంటాడు. తనకు తాను తృప్తిగా ఉంటాడు. వారి నుండి బాధాకరమైన  మాటలు వినకుండా శాంతిపొందుతాడు. అల్లాహ్ ఇలా ఆదేశించాడు.

[خُذِ الْعَفْوَ وَأْمُرْ بِالْعُرْفِ وَأَعْرِضْ عَنِ الْجَاهِلِينَ]

“మృదుత్వం, మన్నింపుల వైఖరిని అవలంబించు. మంచిని ప్రబోధించు. మూర్ఖులతో వాదానికి దిగకు” (వారి తెరువుకు పోకు) (ఆరాఫ్ 7:19).

12: దూషించవద్దు: తిట్లు, దుషణాలకు అతి దూరంగా ఉండాలి.

13: బాధను మరచిపోవాలి: నీకు ఎవరైనా బాధ కలిగిస్తే దాన్ని మరచిపో. అతని పట్ల నీ మనుస్సులో కల్మషం లేకుండా ఉండు. అతనితో భయపడకుండా ఉండు. తమ సోదరుల తరపు నుండి కలిగిన బాధను మరువకుండా గుర్తుంచుకునేవారిలో, వారి పట్ల ప్రేమ ఉండదు. అలా మరువనివారు వారితో కలిసి జీవితం గడుపలేరు. ఎంత మరువగలుగుతావో అంత బాధను మరచిపో.

14: మన్నింపు వైఖరి అవలంబించుకో: చెడు చేసినవారికి ప్రతీకారంగా మంచి  చేయాలి. స్థానాలు ఉన్నతం కావడానికి ఇది ఒక సబబు (కారణం). అందులో శాంతి ఉంది. ప్రతీకారంతో తృప్తిపడే మనస్సుకు (ఆ అవకాశము ఇవ్వకుండా) నిరోధించినట్లగును.

15: దాతృత్వం: దాతృత్వం ప్రశంసనీయమైనది. పిసినారితనం నిందార్హమైనది. దాతృత్వం ప్రేమను ఆకర్షిస్తుంది. శతృత్వాన్ని దూరం చేస్తుంది. మంచి ప్రస్తావన సంపాదించి, తప్పిదాలను, లోటుపాట్లను కప్పిఉంచుతుంది.

16: అల్లాహ్ వద్ద ప్రతిఫలం పొందే నమ్మకం ఉండాలి. మహోన్నతమైన గుణాలు ఆర్జించడానికి సహాయపడే విషయాల్లో ఇది అతి గొప్పది. ఓపిక, ముజాహద, ప్రజల నుండి బాధలు, కష్టాలు భరించుటకు కూడా ఇది సహాయ పడుతుంది. విశ్వాసునికి తన సద్గుణాలకు, ఆత్మను అదుపులో ఉంచు కున్నందుకు అల్లాహ్ ప్రతిఫలం ఇచ్చేవాడున్నాడని విశ్వసించినప్పుడు మరింత ఎక్కువ సద్గుణాలు ఆర్జించడానికి ప్రయత్నిస్తాడు. ఈ దారిలో ఎదురయ్యే కష్టాలు కూడా తేలికగా ఏర్పడుతాయి.

17: కోపం నుండి దూరముండాలి. కోపం ఒక అగ్ని. అది గుండెల్లో మంటలు లేపుతుంది. దౌర్జన్యం చేయాలని, ప్రతీకారం తీసుకోవాలని, తృప్తి పొందాలని ప్రోత్సహిస్తుంది. మనిషి తనకు కోపం వచ్చినప్పుడు తన మనుస్సును అదుపులో ఉంచుకుంటే తన మానాన్ని, గౌరవాన్ని కాపాడుకోగలుగుతాడు. తర్వాత హీనమైన సాకులు చెప్పే పరిస్థితికి, పశ్చాత్తాపానికి దూరంగా ఉంటాడు. (కోపం ఎంత చెడ్డదో క్రింది హదీసు ద్వారా తెలుస్తుంది).

أَنَّ رَجُلًا قَالَ لِلنَّبِيِّ : أَوْصِنِي، قَالَ: «لاَ تَغْضَبْ» فَرَدَّدَ مِرَارًا، قَالَ: «لاَ تَغْضَبْ»

అబూ హూరైరా రజియల్లాహు అన్హు కథనం: ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ‘నాకు ఏదైనా ఉపదేశించండి’ అని అర్ధించాడు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “కోపగించుకోకు” అని బోధించారు. ఆ వ్యక్తి దాని తరువాత కూడా మాటిమాటికి ‘ఉపదేశించండి’ అని అర్ధించసాగాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతీసారి “కోపగించుకోకు” అని మాత్రమే బోధించారు. (బుఖారి 6116).

18- ఉద్దేశ్యపూర్వకమైన ఉపదేశాన్ని, నిర్మాణాత్మకమైన విమర్శనను స్వీకరించాలి. తనలో ఉన్న లోపం అతనికి తెలుపబడుతే దాన్ని స్వీకరించి దాన్ని దూరం చేసుకోవాలి. తన లోపాల పట్ల తాను తెలిసి తెలియనట్లు ఉండిపోతే. ఆత్మశుద్ధి సంపూర్ణంగా చేయలేడు.

19: ఒక మనిషికి ఏ పని చేయాలని నిర్ణయంచబడిందో దాన్ని అతడు పరిపూర్ణముగా చెయ్యాలి. అలా తను చీవాట్లకు, ఎత్తిపొడుపులకు, గద్ధింపులకు, నీచమైన సాకులు చెప్పుట నుండి దూరముంటాడు.

20: తప్పు జరిగితే దాన్ని ఒప్పుకోవాలి. బొంకులాడకుండా జాగ్రత్త  పడాలి. ఇది సద్గుణానికి ఒక చిహ్నం. ఎలాంటి అబద్దం చెప్పకుండ ఉండాలి. తప్పును ఒప్పుకొనుట ఘనతగల విషయం. అలా ఆ వ్యక్తి ప్రఖ్యాతి ఇనుమడింపజేయబడుతుంది.

21: సత్యం ఆవశ్యకమైనది. దాని ప్రభావం ప్రశంసనీయమైనది. సత్యం వలన మనిషి గౌరవం, మర్యాద, స్థానం పెరుగుతుంది. అది అసత్య కసటు, వ్యాకులం, పరితాపం, హీనత్వ సాకుల నుండి కాపాడుతుంది. ప్రజలు అతనికి చేసే కీడు నుండి, అతడు నమ్మకద్రోహి కాకుండా రక్షిస్తుంది. అతనిలో గౌరవం, ధైర్యం ఆత్మ విశ్వాసం (సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌) తెఛ్చిపెడుతుంది.

22: చెడు చేసినవారిని మాటిమాటికి చీవాట్లు పెట్టుట, ఎత్తిపొడుచుట మానుకోవాలి. ఆ దుర్గుణం ఆగ్రహాన్ని ఆహ్వానిస్తుంది. శతృత్వానికి కారణభూతమవుతుంది. కష్టతరమయిన విషయాలు వినవలసి వస్తుంది. జ్ఞానుడు, బుద్ధిమంతుడు ప్రతి చిన్న పెద్ద విషయంపై తన సోదరుల్ని చీవాట్లు పెట్టడు. తాను ఓ హేతువు వెతుకుతాడు. ఒక వేళ చీవాట్లు పెట్టవలసి ఉంటే అది మృదువుగా, మంచి విధంగా ఉండాలి.

23: సద్గుణులు, మంచివాళ్ళకు తోడు (దోస్తాన) ఉండాలి. సద్గుణ సంపన్నుడుగా మార్చే విషయాల్లో ఇది అతిగొప్పది. మంచిని మనుస్సులో నాటుకొని యుండుటకు ముఖ్యకారణం అవుతుంది.

24: పరస్పర సంభాషణ, సమావేశ పద్దతులను పాటించాలి. ఆ పద్దతులు ఇవి: మాట్లాడే వ్యక్తి మాట శ్రద్ధతో వినాలి. మధ్యలో మాట ఆపవద్దు. అబద్దం చెబుతున్నాడని (నిందించవద్దు). హేళన చేయవద్దు. మాట పూర్తి కాక ముందు సమావేశం నుండి వెళ్ళ వద్దు.

ఇంకా: సలాం చేస్తూ సమావేశంలో పాల్గొనాలి. సలాం చేస్తూ బైటికి రావాలి. సమావేశాల్లో ఇతరులకు చోటు కల్పించాలి. కూర్చున్న వ్యక్తిని లేపి అతని చోట కూర్చోవద్దు. కలసి కూర్చున్న ఇద్దరిలో వారి అనుమతి లేకుండా విడదీయ వద్దు. ఒక్కరిని వదలి ఇద్దరు పరస్పరం రహస్యంగా మాట్లాడుకోవద్దు.

25: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవిత చరిత్ర చదువుతూ ఉండాలి. అది దాన్ని చదివేవారి ముందు మానవత ఎరిగిన దానికంటే ఒక గొప్ప ఆదర్శాన్నిచూపుతుంది. మానవ జీవిత సరళిలో ఒక సంపూర్ణ మార్గం ఉంచుతుంది

26: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సహచరుల చరిత్రను కూడా చదువుతూ ఉండాలి.

27: సద్గుణాలకు సంబంధించిన రచనలు చదవాలి. అవి సద్గుణాలను బోధిస్తూ, వాటి ఘనత తెలుపుతాయి. వాటిని ఆర్జించటానికి సహాయ పడుతాయి. దుర్గుణాల నుండి హెచ్చరిస్తాయి. వాటి దుష్ఫలితాన్ని, వాటి నుండి దూరముండే విధానాన్ని తెలుపుతాయి.

ఉపవాస ఆదేశాలు [పుస్తకం & వీడియో పాఠాలు]

బిస్మిల్లాహ్

రచయిత: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

[ఇక్కడ పుస్తకం చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [28 పేజీలు]

ఫిఖ్ హ్ (ఉపవాసం) – నసీరుద్దీన్ జామి’ఈ [యూట్యూబ్ ప్లే లిస్ట్] [6 వీడియోలు]
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV23IxNz36OoasS_BwZgcsaU

వీడియో పాఠాలు (పాతవి)

విషయ సూచిక 

  1. రమజాను ఉపవాసాలు విధి
  2. ఉపవాసాలు ఎవరిపై విధి?
  3. ఉపవాసాల ద్వారా లాభం?
  4. రమజాన్‌ & ఉపవాసాల ఘనత
  5. రమజాను నెల ఆరంభ నిదర్శన
  6. ఎవరిపై రోజా విధిగా లేదు
  7. రోజాను భంగపరుచు విషయాలు
  8. రోజాను భంగపరచని విషయాలు
  9. ముఖ్య విషయాలు
  10. రోజా ధర్మములు
  11. తరావీహ్‌ నమాజ్‌
  12. నఫిల్‌ ఉవవాసాలు
  13. రోజా ఉండరాని రోజులు

[పూర్తి పుస్తకం క్రింద చదవండి]

ఉపవాసమంటే ఏమిటి?

ఉపవాసం అంటే: అల్లాహ్ ప్రసన్నత కొరకు, అల్లాహ్ ఆరాధన ఉద్దేశ్యంతో ఉషోదయం నుండి సూర్యాస్తమయం వరకు అన్నపానీయాలు, సంభోగము మరియు ఉపవాసమును భంగ పరుచు కార్యాలన్నిటినీ విడనాడుట. (దీనినే అరబిలో సౌం, ఉర్దులో రోజా అంటారు).

రమజాను ఉపవాసాలు విధి:

రమజాను ఉపవాసాలు ఇస్లాం ఐదు మూల స్తంభాలలో ఒకటి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ఈ ఆదేశానుసారం:

ఇస్లాం పునాది ఐదు మూలస్తంభాలపై ఉంది: (1) సత్య ఆరాధ్యనీయుడు అల్లాహ్ తప్ప మరెవ్వడూ లేడు, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ యొక్క ప్రవక్త అని సాక్ష్యమిచ్చుట. (2) నమాజు స్థాపించుట. (3) జకాత్ (విధిదానం) చెల్లించుట. (4) హజ్ చేయుట. (5) రమజాన్ ఉపవాసాలు పాటించుట. (బుఖారి 8, ముస్లిం 16).

రమజాను ఉపవాసాలు విధిగా ఉన్నాయని క్రింది ఆయతు ఆధారంగా ఏకాభిప్రాయం ఉంది:

 فَمَن شَهِدَ مِنكُمُ الشَّهْرَ فَلْيَصُمْهُ

“మీలో రమజాన్ నెలను పొందేవారు ఆ నెలంతా విధిగా ఉపవాసం పాటించాలి.”
(అల్ బఖర 2: 185).

ఈ ఉపవాసాలు ఎవరిపై విధి?

ప్రతీ తెలివిగల, యుక్తవయస్సుకు చేరిన ముస్లిం స్త్రీ, పురుషునిపై రోజా విధిగా ఉంది. 15 సంవత్సరాలు నిండుట లేదా నాభి క్రింద వెంట్రుకలు మొలుచుట, స్వప్నస్ఖలనమగుట మరియు బాలికలకు పై మూడింటితో పాటు నెలవారి రక్తస్రావమగుట. వీటిలో ఏ ఒక్కటి సంభవించినా యుక్త వయస్సుకు చేరినట్లే.

ఉపవాసం ద్వారా లాభం?

ఉపవాసం ద్వారా మనోవాంఛలకు తెరపడుతుంది. ఐహిక భోగభాగ్యాల వృధా కోరికలు తగ్గుతూ, పరలోక భీతి భావం పెరుగుతుంది. నిరుపేదల పట్ల సానుభూతి కలుగుతుంది. ఉపవాస స్థితిలో కలిగే ఆకలిదప్పులు బీదవాళ్ళ బాధను గుర్తు చేస్తాయి.

రమజాన్ & ఉపవాసాల ఘనత

అల్లాహ్ రమజాను మాసమునకు అనేక ఘనతలు ప్రత్యేకించాడు. ఇతర సమయాల్లో ఆ ఘనతలు లేవు. వాటిలో కొన్ని ఇవి:

  • 1-స్వర్గపు ద్వారాలు తెరువబడతాయి, నరకపు ద్వారాలు మూయబడతాయి, బహిష్కృతులైన షైతానులు బంధించబడతారు.
  • 2- దైవదూతలు ఉపవాసమున్నవారి గురించి ఇఫ్తార్ చేసే వరకు (అల్లాహ్ తో) క్షమాభిక్ష కోరుతూ ఉంటారు.
  • 3- ఇందులో ఒక ఘనతగల మహారాత్రి ఉంది. అది వెయ్యి నెలలకన్నా శ్రేష్ఠమైనది.
  • 4- (నెలంతా) ఉపవాసమున్నవారు రమజాను చివరి రాత్రిలో క్షమించబడుతారు.
  • 5- రమజానులోని ప్రతీ రాత్రి అల్లాహ్ అనేక నరకవాసులకు విముక్తి కలుగజేస్తాడు.
  • 6- రమజానులో ఉమ్రా చేయుట హజ్ చేయుట తో సమానం .
  • 7- రమజానులోని ప్రతి రోజు ముస్లిం భక్తుని ఏదైనా ఒక దుఆ అంగీకరించబడుతుంది.
  • 8- రమజాను మాసమెల్లా విశ్వాసం, పుణ్యాశతో తరావీహ్ నమాజ్ చేసేవారి పాపాలు మన్నించ బడతాయి.
  • 9- ఈ తరావీహ్ జమాఅతుతో చేసేవారికి రాత్రంతా తహజ్జుద్ చేసినంత పుణ్యం.
  • 10- ఉపవాసం ఉండేవారికి స్వర్గంలో ప్రత్యేకం ద్వారం ఉంది. దాని పేరు: రయ్యాన్. వారు తప్ప ఎవరూ దాని నుండి ప్రవేశించరు.
  • 11 – ఉపవాసం మరియు ఖుర్ఆన్ సిఫారసు చేస్తాయి. వారి సిఫారసు అంగీకరించబడుతుంది.
  • 12- ఒక్క ఉపవాసానికి బదులుగా 70 సం. నరకం నుండి దూరం ఉంచబడుతారు.

ఇంకా ఈ గౌరవ మాసపు ఘనతలో అబూ హురైర (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించిన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ఈ శుభవార్త కూడా ఉంది:

ఏ వ్యక్తి సంపూర్ణ విశ్వాసం మరియు పరలోక ప్రతిఫలాపేక్షతో రమజాను ఉపవాసాలు పాటిస్తాడో అతని పూర్వపు పాపాలు మన్నించబడతాయి. (బుఖారి 38, ముస్లిం 760).

ఆదము కుమారుడు చేసే ప్రతీ సత్కార్యానికి రెట్టింపు పుణ్యం ఉంటుంది. అల్లాహ్ చెప్పాడు: “కాని ఉపవాసం, అది నా కొరకు కాబట్టి నేనే స్వయంగా దాని ఫలితమిస్తాను”. (ముస్లిం 1151).

రమజాను నెల ఆరంభ నిదర్శన:

ఈ క్రింది రెండు విషయాల్లో ఏదైనా ఒక దానితో రమజాన్ నెల ప్రారంభమైనదని రుజువగును:

1- రమజాన్ మాసము యొక్క నెలవంక చూసినచో రోజా విధియగును.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆదేశం ఇదే:

నెలవంక చూసి రోజా ఉండండి. నెలవంక చూసి ఇఫ్తార్ (పండుగ) చేయండి.
(బుఖారి 1909, ముస్లిం 1081).

విశ్వాసము (నీతి నిజాయితిగల) ఒక వ్యక్తి రమజాన్ నెలవంక చూశానని సాక్ష్యమిస్తే నమ్మాలి. షవ్వల్ నెలవంక విషయంలో మాత్రం విశ్వాసం గల ఇద్దరు వ్యక్తుల సాక్ష్యం తప్పనిసరి.

2- ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆదేశం:

మేఘాలు క్రమ్ముకొని ఉన్నప్పుడు మీరు 30 రోజుల లెక్క పూర్తి చేయండి.
(బుఖారి 1907, ముస్లిం 1081)

దీని ప్రకారం షాబాన్ నెల 30 రోజులు పూర్తి అయిన తర్వాత 31వ రోజు రమజాన్ యొక్క మొదటి రోజు అగును.

ఎవరిపై రోజా విధిగా లేదు?

1- రోగి: స్వస్థత పొందే నమ్మకం ఉన్న వ్యాదిగ్రస్తుడు. అతనికి ఉపవాసం ఉండుట కష్టంగా ఉంటే, కష్టం ఉన్న రోజుల్లో ఉపవాసం మానుకొని, అన్ని రోజుల ఉపవాసం తర్వాత ఉండాలి.

స్వస్థత పొందే నమ్మకం లేని వ్యాదిగ్రస్తుడు ఉపవాసం ఉండనవసరం లేదు. కాని ప్రతి ఒక్క ఉపవాసానికి బదులుగా ఒక బీదవానికి కడుపు నిండా అన్నం పెట్టాలి. లేదా ఎన్ని రోజుల  ఉపవాసం మానేశాడో లెక్కేసుకొని అంత మంది బీదవాళ్ళకు ఒకే రోజు విందు చేయాలి.

2- ప్రయాణికుడు: ఇంటి నుండి వెళ్ళి తిరిగి వచ్చే వరకు ఉపవాసం మానేయవచ్చును. అయితే అక్కడ నివసించే ఉద్దేశం ఉండకూడదు.

3- గర్భిణి, పసి బిడ్డలకు పాలిచ్చు తల్లి: తనకు లేదా పసిబిడ్డకు అనారోగ్య భయం ఉన్నచో ఉపవాసం మానేసి, ఈ ఆటంకం దూరమయ్యాక అన్ని రోజుల ఉపవాసం వేరే రోజుల్లో ఉండాలి.

4- ఉపవాసముండే శక్తి లేని వృద్ధులు: వారు ఉపవాసం మానుకోవచ్చు. కాని ఒక రోజుకు బదులుగా ఒక బీదవానికి అన్నం పెట్టాలి.

రోజాను భంగ పరుచు విషయాలు:

1- గుర్తుండి తిని త్రాగడం వల్ల రోజా భంగమగును. కాని మరచిపోయి తిన త్రాగటం వల్ల రోజా భంగం కాదు.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు:

ఏ ఉపవాసి అయినా మరచిపోయి ఏదన్నా తిన్నా, త్రాగినా (ఫరవాలేదు) అతను తన రోజాను కొనసాగించాలి. (ముస్లిం 1155).

ముక్కు ద్వారా కడుపులో నీళ్ళు పోయినా రోజా భంగమవుతుంది. నాడి ద్వారా ఏదైనా ఆహారం అందించడం, రక్తం ఎక్కించడం వల్ల రోజా వ్యర్థమవుతుంది. ఇవి ఉపవాసికి ఆహారంగా పని చేస్తాయి.

2- సంభోగించడం. ఉపవాసమున్న వ్యక్తి సంభోగించినచో ఉపవాసం భంగమగును. దానికి బదులుగా రమజాను తర్వాత ఒక రోజు ఉపవాసం ఉంటూ ఈ పరిహారం చెల్లించుటవిధిగా ఉంది. (1) ఒక బానిసకు విముక్తి కలిగించాలి. ఈ శక్తి లేనిచో (2) వరుసగా రెండు నెలల ఉపవాసాలుండాలి. అకారణంగా వరుస తప్పవద్దు. ఉదాః రెండు పండుగలు, ఈదుల్ అజ్హా తర్వాత మూడు రోజులు, లేదా అనారోగ్యం మరియు ప్రయాణం లాంటి కారణాలు. రోజా తప్పాలనే ఉద్దేశంతో ప్రయాణం చేయకూడదు. ఒకవేళ అకారణంగా ఒక రోజు కూడా ఉపవాసం మానుకున్నా మళ్ళీ కొత్త వరుసతో ఉపావాసాలు మొదలు పెట్టాలి. ఒకవేళ రెండు నెలల ఉపవాసాలు కూడా ఉండే శక్తి లేనిచో (3) అరవై మంది పేదలకు అన్నం పెట్టాలి.

3- ముద్దులాట, హస్తప్రయోగం వల్ల వీర్యం పడి పోతే ఉపవాసం భంగమవుతుంది. (హస్త ప్రయోగానికి ఇస్లాంలో అనుమతిలేదు). వాటికి పరిహారం లేదు కాని తర్వతా ఒక రోజా ఉండాలి. ఒకవేళ నిద్రలో స్ఖలనమైనచో రోజా భంగం కాదు.

4- కరిపించి దేహం నుండి రక్తం తీయించుట, లేదా రక్తదానం కొరకు ఆధునిక పద్ధతిలో రక్తం తీయుంచుట వల్ల రోజా భంగమగును. కాని రక్తపరీక్ష ఉద్దేశంతో కొంచం తీయుట వల్ల రోజా భంగం కాదు. అలాగే పుండు నుండి, ముక్కు నుండి రక్తం వెలితే, పన్ను వూడి రక్తం వెలితే రోజా భంగం కాదు.

5- ఉద్దేశ్యంతో కావాలని వాంతి చేస్తే రోజా భంగమవుతుంది. కాని మనిషి తన ప్రమేయం లేకుండా అదే వస్తే రోజా భంగం కాదు.

పై విషయాలు, ఏ మనిషి తెలిసి చేస్తాడో అతని రోజా మాత్రమే భంగమగును. వాటి ధార్మిక ఆదేశాలు తెలియక లేదా సమయం తెలియక (ఉదా: ఉషోదయం కాలేదని అను కొనుట, లేదా సూర్యాస్తమయం అయినది అనుకొనుట లాంటివి) ఏదైనా తప్పు జరిగితే రోజా భంగం కాదు.

గుర్తుండి వాటికి పాల్పడ కూడదు. మతి మరుపుతో జరిగిన విషయంలో కూడా పట్టు బడరు. తాను కావాలని చేయకూడదు. ఎవరైనా అతనిపై ఒత్తిడి, బలవంతం చేసినందు వల్ల అతను వాటికి పాల్పడితే రోజా భంగం కాదు. తర్వాత దాన్ని పూర్తి చేయనవసరం లేదు.

6- ఉపవాస స్థితిలో స్త్రీలకు బహిష్టు వచ్చినా, వారు ప్రసవించినా రోజా భంగమగును. అలాగే రక్తస్రావం ఉన్నన్ని రోజులు ఉపవాసం ఉండరాదు. ఎన్ని రోజుల ఉపవాసం ఉండలేక పోయారో శుద్ధి పొందిన తర్వాత అన్ని రోజుల ఉపవాసం పూర్తి చెయ్యాలి.

రోజాను భంగపరచని విషయాలు:

1- స్నానం చేయుట, ఈతాడుట, వేసవిలో నీళ్ళు పోసుకొని శరీర భాగాన్ని చల్లబరుచుట.

2- ఉషోదయం వరకు తిని త్రాగుట మరియు సంభోగించుట.

3- ఏ సమయములోనైనా మిస్వాక్ చేయుట వల్ల రోజా భంగము కాదు, మక్రూహ్ కాదు. అది ఏ స్థితిలో కూడా చేయుట అభిలషణీయం.

4- ఆహారముగా పని చేయని ధర్మసమ్మతమైన ఏ రకమైన చికిత్స అయినా సరే చేయవచ్చును. ఇంజక్షన్, చెవుల్లో, కళ్ళల్లో మందు వేయించటం, దాని రుచి ఏర్పడినా సరే. ఒకవేళ ఇఫ్తార్ వరకు ఆగటం వల్ల ఏ నష్టం లేకుంటే ఆలస్యం చేయడం మంచిది. ఉబ్బసం (Asthma)తో బాధపడు తున్నవారికి ఆక్సిజన్ (Oxygen) ఎక్కించడం వల్ల రోజా భంగం కాదు. కడుపులో చేరకుండా జాగ్రత్త పడుతూ వంటకాల రుచి చూడడం. అలాగే పుక్కిలించడం, తిన్నగా ముక్కులో నీళ్ళు ఎక్కించడం తప్పు కాదు. అయితే తిన్నగా ఎక్కించే విషయంలో అజాగ్రత్త వల్ల ముక్కు ద్వారా నీళ్ళు కడుపులో పోయే ప్రమాదం ఉంటుంది. సువాసన పూసుకోవడం, దానిని ఆఘ్రాణించడం కూడా తప్పు లేదు.

5- రాత్రి సమయంలో రకస్రావం నిలిచిన బహిష్టురాలు, బాలింతలు అలాగే సంభోగించుకున్న దంపతులు సహరీ తర్వాత ఫజ్ర్ నమాజుకు ముందు గుస్ల్ (స్నానం) చేసినా అభ్యంతరం లేదు.

ముఖ్య విషయాలు:

1- రమజాను మాసములో పగలు ఇస్లాం స్వీకరించిన వ్యక్తి సూర్యస్తమయం వరకు ఏమీ తిన త్రాగకుండా ఉండాలి. కాని ఆ రోజుకు బదులుగా తర్వాత మరో ఉపవాసం ఉండనక్కరలేదు.

2- ఫర్జ్ రోజా సంకల్పం (నియ్యత్) ఉషోదయానికి ముందు వరకు రాత్రి ఏ నమయంలోనైనా చెయ్యాలి. నఫిల్ రోజా సంకల్పం ఏమీ తినత్రాగకుండా ఉన్న వ్యక్తి ఉషోదయమే కాదు పొద్దెక్కిన తర్వాత కూడా చేయవచ్చును.

3- రోజా ఉన్నవారి దుఆ అంగీకరించబడును కనుక ఎక్కవ దుఆ చెయ్యాలి. ఇఫ్తార్ సయమంలో ఈ దుఆ చదవాలి:

“జహబజ్జమఉ  వబ్ తల్లతిల్ ఉరూఖు వసబతల్ అజ్రు ఇన్షా అల్లాహ్”.
( దాహం తీరింది, నరాలు తడి అయ్యా యి. అల్లాహ్ దయతో పుణ్యం కూడా లభించును).

4- సూర్యోదయం తర్వాత ఏ సమయంలో గాని ఈ రోజు మొదటి రమజాన్ నెల అని తెలిసినచో సూర్యాస్తమయం వరకు తినత్రాగ కుండా ఉండాలి. రమజాన్ తర్వాత ఈ రోజు ఉపవాసం పూర్తి చేయాలి.

5 – ఖజా (అప్పు) రోజాల భారము తొందరగా దిగిపోవుటకు రమజాను తర్వాత వెంటనే రోజాలు ఉంటే మంచిది. ఆలస్యమైనా అభ్యంతరం లేదు. అలాగే అవి క్రమంగా ఉండవచ్చు, క్రమం తప్పి ఉండవచ్చు. కాని అకారణంగా మరో రమజాన్ వరకు వేచించుట యోగ్యం లేదు.

రోజా ధర్మములు:

1- సహరి చేయడం. అనగా ఉషోదయమున ఉపవాసం ఉద్దేశంతో భుజించడం.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

సహరి భుజించండి. సహరిలో చాలా బర్కత్ (శుభం) ఉంది.”
(బుఖారి 1923, ముస్లిం 1095).

సహరి చివరి సమయంలో చేయడం చాలా మేలు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు:

“ఇఫ్తార్ చేయడంలో తొందరపడండి, సహరి చేయడంలో ఆలస్యం చేయండి.”
(సహీహ 1773).

2- సూర్యాస్తమయం అయిన వెంటనే ఇఫ్తార్ చెయ్యాలి. రుతబ్ (ఖర్జూరపు ఆరంభపు పండు) తో ఇఫ్తార్ చేయడం సున్నత్. అవి దొరకనప్పుడు ఖర్జూరాలతో, అవీ లేనప్పుడు నీళ్ళతో, అది కూడా లభించనప్పుడు ఏది సులభంగా లభ్యమగునో దానితోనే ఇఫ్తార్ చేయాలి.

3- రోజా స్థితిలో దుఆ చేస్తూ ఉండాలి. ప్రత్యేకంగా ఇఫ్తార్ సమయంలో.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

మూడు దుఆలు అంగీకరించబడతాయి:
ఉపవాసమున్న వారి దుఆ. పీడితుని దుఆ. ప్రయాణికుని దుఆ
“.

(బైహఖీ. సహీహుల్ జామి 3030).

4- ఉపవాసమున్నవారు రమజానులో తరావీహ్ నమాజ్ పాటించాలి.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంచెప్పారు:

“పూర్తి విశ్వాసం, పరలోక ప్రతిఫలాపేక్షతో తరావీహ్ నమాజ్ చేయువారి పూర్వం జరిగిన అపరాధాలు మన్నించబడతాయి.” (బుఖారి 37, ముస్లిం 759).

తరావీహ్ నమాజ్ ఇమాం వెనక పూర్తి చేయడం చాలా మంచిది.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు:

“తరావీహ్ నమాజ్ ఇమాంతో చేసినవారికి పూర్తి రాత్రి తరావీహ్ చేసినంత పుణ్యం లిఖించ బడుతుంది”
(తిర్మిజి 806, నసాయి వగైరా).

5- రమాజాను నెలలో ముస్లిం అత్యధికంగా చేయవలసిన సత్కార్యాలలో ఒకటి దానధర్మాలు.

6- అలాగే ఖుర్ఆన్ పారాయణం ఎక్కువగా చేయాలి. రమజాను మాసము ఖుర్ఆను మాసం. ఖుర్ఆన్ పాఠకునికి ఒక్కో అక్షరం పై పది పుణ్యాలు లభిస్తాయి.

తరావీహ్ నమాజ్:

దీనినే రాత్రి నమాజ్ మరియు తహజ్జుద్ నమాజ్ అని అంటారు. ఇది రమజాను మాసములో జమాఅతుతో పాటించునది. దీని సమయం ఇషా తరువాత నుండి మొదలుకొని ఉషోదయం వరకుంటుంది. దీనిని పాటించాలని ప్రవక్త (సల్లల్లహు అలైహి వసల్లం) చాలా ప్రోత్సహించారు. పదకుండు రకాతులు చేయుటయే సున్నత్. ప్రతి రెండు రకాతులకు సలాం చెప్పాలి. పదకుండు రకాతులకంటే ఎక్కువగా నఫిల్ ఉద్దేశంతో చేస్తే పరవాలేదు. తరావీహ్ నమజులో దీర్ఘంగా ఖుర్ఆన్ పారాయణం చేయుట కూడా ఒక సున్నత్. కాని వెనక జమాఅతులో ఉన్నవారికి కష్టం కాకుండా ఉండాలి. స్త్రీల కొరకు తగిన సురక్షితం ఉన్నప్పుడు, వారు కూడా ఈ నమాజులో మస్జిదుకు రావచ్చు. కాని ఏ అలంకరణ, సువాసన లేకుండా హాజరు కావాలి.

నఫిల్ ఉపవాసాలు:

ప్రవక్త (సల్లల్లహు అలైహి వసల్లం) ఈ రోజుల్లో ఉపవాసాలుండాలని ప్రోత్సహించారు.

1- షవ్వాల్ మాసములో ఆరు రోజాలు. ఆయన ఆదేశం ఇది:

“ఎవరు రమజాను మాసమెల్లా ఉపవాసాలుండి, షవ్వాల్ మాసములో ఆరు ఉపవాసాలుంటాడో అతనికి సంవత్సరమెల్లా ఉపవాసాలున్నంత పుణ్యం లభిస్తుంది.” (ముస్లిం 1164).

2- ప్రతి సోమవారం, గురువారం.

3- ప్రతి నెల మూడు రోజులు. అవి చంద్రమాస ప్రకారం 13,14,15 తారీకుల్లో ఉంటే మంచిది.

4- ఆషూరా రోజు. అంటే ముహర్రం పదవ తారీకు. అయితే ఒక రోజు ముందు 9,10 లేదా ఒక రోజు తర్వాత 10,11 కలిపి రోజా ఉండడం. మంచిది. ఇందులో యూదుల ఆచారానికి భిన్నత్వం కూడా ఉంది. దీని ఘనతలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రభోదించారని, అబూ ఖతాద (రజియల్లాహు అన్హు)  ఉల్లేఖించారు:

“ఆషూరా రోజాకు బదులుగా అల్లాహ్ గత ఒక సంవత్సరపు అపరాధాలు మన్నిస్తాడని నా నమ్మకం.”(ముస్లిం 1162).

5- అరఫా రోజు ఉపవాసం. అది జిల్ హిజ్జ మాసంలో 9వ తారీకు. దీని గురించి ప్రవక్త (సల్లల్లహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు.

“అరఫా రోజాకు బదులుగా అల్లాహ్ గత ఒక సంవత్సరం మరియు వచ్చే ఒక సంవత్సరం రెండు సంవత్సరాల పాపాల్ని మన్నిస్తాడని నా నమ్మకం.” (ముస్లిం 1162).

రోజా ఉండరాని రోజులు:

1- పండుగ రోజుల్లో. ఈదుల్ ఫిత్ర్, ఈదుల్ అజ్ హా

2- ఈదుల్ అజ్ హా తరువాత మూడు రోజులు. కాని హజ్జె ఖిరాన్, హజ్జె తమత్తు చేయువారు ఖుర్బానీ చేయకుంటే, వారు ఈ రోజుల్లో ఉపవాసముండ వచ్చును.

3- బహిష్టురాలు మరియు బాలింతలు తమ గడువులో ఉండరాదు.

4- భర్త ఇంటి వద్ద ఉన్నప్పుడు భార్య తన భర్త అనుమతి లేనిది నఫిల్ ఉపవాసాలుండరాదు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు:

ఒక స్త్రీ తన భర్త ఇంటిలో ఉన్నప్పుడు అతని అనుమతి లేనిదే రోజా ఉండకూడదు. రమజాను మాసము తప్ప. (అబూ దావూద్ 2458, బుఖారి 5192, ముస్లిం 1026).


ఇతరములు: