
[43:50 నిముషాలు]
ఉసూలె సలాసహ్ : త్రి సూత్రాలు (మూడు మౌలిక సూత్రాలు) – పార్ట్ 1
షేఖ్ డా. సఈద్ అహ్మద్ మదనీ హఫిజహుల్లాహ్
ఈ వీడియో పాఠాలు క్రింది పుస్తకం ఆధారంగా వివరించబడ్డాయి:
ఉసూలె సలాస (త్రి సూత్రాలు) [పుస్తకం] [మర్కజ్ దారుల్ బిర్ర్]
[ఈ వీడియోలో చెప్పబడిన బుక్ విషయాలు మీ సౌలభ్యం కోసం క్రింద ఇస్తున్నాము. వీడియో వింటూ క్రింది టెక్స్ట్ ఫాలో కండి]
త్రిసూత్రాలు
- నీ ప్రభువు ఎవరు? 2. నీ ధర్మం ఏది? 3. నీ ప్రవక్త ఎవరు?
కూర్పు : ఇమామ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ (రహిమహుల్లాహ్)
అనువాదం : హాఫిజ్ అబ్దుల్ గఫ్ఫార్ ఉమరి M.A.
మనవి
పరలోక సాఫల్యం పొందాలంటే ఇహలోకంలో విశ్వాసాల పునాదులు పటిష్టంగా ఉండాలి. మన కర్మలు ఆ పునాదులపై ఆధారపడి వుంటాయి. అందువలన విశ్వాసాల పటిష్టతకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణంగా దీని పై శ్రద్ధ వహించని వారి శాతమే ఎక్కువ. అనువదించబడిన ఈ పుస్తకం విశ్వాసాల పటిష్టతకు ఒక మైలురాయి.
పాఠకులారా…
12వ శతాబ్దము నాటికి ముస్లింల ధార్మిక జీవనశైలి చెదిరిపోయింది. ఏధర్మం మూలంగా వారికి సన్మార్గము లభించిందో ఆదే ధర్మంలో షైతాన్ తన సమూహంతో విశ్వాసాల రూపురేఖలను మార్చి ముస్లింల హృదయాలను అనాచారాల (ఇస్లాం అనుసరణాచారాలకు వ్యతిరేకంగా) కు లోబరుచుకున్నాడు. పుణ్యాత్ములను ఆరాధించటం, సమాధులను దర్శించటం (ప్రార్ధించడం), వేడు కోవటం, బలిదానాలు చేయటం, మొక్కు తీర్చటం, లేని పక్షంలో వారి ప్రతాపానికి గురి అయ్యేభయం, తాయత్తుల మహిమలు, దైవ సందేశహరుల విలువలను అగౌరవ పర్చటం, ఇష్టానుసారంగా దిద్దుకున్న ఆచారాలను ఇస్లాం ధర్మంలో కల్పితంచేసి ప్రజలను వక్రమార్గానికి మళ్ళించటం జరిగింది.
ఈ తరుణంలో ఇస్లాం ధార్మిక వాస్తవ రూపురేఖలను వెలికి తీసి ప్రజలకు సన్మార్గం చూపించటానికి అహోరాత్రులు శ్రమించిన వ్యక్తి… “ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హాబ్”.
‘ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హాబ్ హిజ్ర శకం 1115 సంవత్సరంలో “నజ్ద్ ” దేశంలోని “ఉయ్యైనా” పట్టణంలో జన్మించారు. నాడు విద్యా, జ్ఞానాలకు నెలవుగా గుర్తింపు పొందిన ‘బసర’ నగరానికి పయనించి విద్యా విజ్ఞాలలో ప్రావీణ్యం పొందారు. ధర్మప్రచారానికి నడుం బిగించిన సందర్భములో ” ముహమ్మద్ బిన్ సఊద్ ” వెన్నుతట్టి తన వంతు సహాయాన్ని అందించారు. అనతి కాలంలోనే ఈ ప్రచారం విసృతమై ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది.
మీ ముందు వున్న ఈ చిరు పుస్తకం “అల్ ఉసూలు స్సలాసతి వ అదిల్లతిహా” అనే పేరుతో అరేబియా (అరబ్బి) భాషలో లిఖించబడింది. ఈ మహోన్నత పుస్తకాన్ని ప్రపంచంలోని అన్ని భాషల్లో అనువాదం చేసి ప్రచురించడం జరిగింది. దీని వలన ఎంతో మంది ప్రజలు ‘షిర్క్’ (బహుదైవరాధన), ‘బిద్అత్’లను విడనాడి అల్లాహ్ సమక్షంలో పశ్చాత్తాపపడి సన్మార్గము వైపుకు మళ్ళారు. ఇదే సంకల్పముతో దీనిని తెలుగుభాషలో అనువదించటం జరిగింది. దీని లోని ముఖ్యాంశం ఏమిటంటే మరణాంతరం సమాధిలో ప్రతి మానవునికి (విశ్వాసి, అవిశ్వాసి తేడా లేకుండా) ఈ 3 ప్రశ్నలు ప్రశ్నించబడతాయి.
- నీ ఆరాధ్య దేవుడు ఎవరు?
- నీ ధర్మం ఏది?
- నీ ప్రవక్త ఎవరు?
పై ప్రశ్నలకు ఏ అల్ప విశ్వాసము కలిగియున్న వ్యక్తి కూడా జవాబు ఇవ్వగలడు. ఇందుకు సంబంధించి మనలో చోటుచేసుకున్న కలుషితమైన విశ్వాసాలను దైవగ్రంధము పవిత్ర ఖుర్ఆన్, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హదీసుల ఆధారంగా అసత్య, అవాస్తవ విశ్వాసాలను బహిర్గతం చేయడం జరిగింది.
అంతే కాకుండా ధర్మానికి సంబంధించి ఏ అంశమైనా సాక్ష్యాధారాలతోనే అంగీకరించాలనే గీటురాయి కల్పించబడింది. ఈ మహోన్నత పుస్తకాన్ని తెలుగుభాషలో అనువదించే భాగ్యాన్ని కల్పించిన అల్లాహ్ కు సర్వత్రా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అందరికి దీని ప్రయోజనం చేకూరాలని కోరుకుంటున్నాను. తద్వార ఖుర్ఆన్, హదీసు ప్రకారంగా మన జీవితం మెరుగు పడాలని, మరణాంతరం సమాధిలో సరైన జవాబులు ఇచ్చే భాగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను.
ఈ పుస్తక అనువాదానికి, ప్రచురణకు పాలు పంచుకున్న అనేకులకు అల్లాహ్ వారి పుణ్యకర్మలను అంగీకరించి ఇహపరలోకాల్లో మంచి ఫలితం ప్రసాదించాలని ప్రార్ధించుచున్నాను…ఆమీన్.
ధార్మిక సేవలో……….
హాఫిజ్ అబ్దుల్ గఫ్ఫార్ ఉమ్రి, M.A.
తెలుగు అనువాదకులు మర్కజుల్ హిదాయ, బహ్రన్.
అనంతకరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో…
ధర్మ అవగాహనకు అవశ్యకమైన త్రిసూత్రాలు
పాఠకులారా…
అల్లాహ్ మీ పై కరుణించుగాక..! ఇది బాగా గుర్తు పెట్టుకో వలసిన విషయం. నాల్గు విషయాల గురించి జ్ఞానము పొందుట, అవగాహన చేసుకొనుట మనపై విధించబడి ఉన్న విధి.
మొదటి విషయం :విద్యా భ్యాసన
అల్లాహ్, ఆయన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు ఇస్లాం ధర్మం గురించి ఆధారాలతో అవగాహన చేసుకొనుట.
రెండవ విషయం : ఆచరణ
విద్యాభ్యాసనతో అవగాహన చేసుకొన్న దానిని ఆచరించుట.
మూడవ విషయం : ఆహ్వానం, ప్రచారం
ఇస్లాం ధర్మం వైపునకు ఇతరులను ఆహ్వానించుట. నాలుగో విషయం : ఓర్పు, సహనం
ధర్మ ప్రచారంలో ఎదురయ్యే ఇబ్బందులు, కష్టాలపై ఓర్పు, సహనంతో స్థిరంగా ఉండుట.
పై నాలుగు అంశాలకు ఆధారం పవిత్ర ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా పేర్కొంటున్నాడు:
وَالْعَصْرِ إِنَّ الْإِنسَانَ لَفِي خُسْرٍ إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَتَوَاصَوْا بِالْحَقِّ وَتَوَاصَوْا بِالصَّبْرِ
‘కాలం సాక్షిగా..! నిస్సందేహంగా మానవుడు నష్టములోపడివున్నాడు. కాని ఎవరైతే విశ్వసించి, సత్కార్యములు చేస్తూ వుంటారో, మరియు పరస్పరం సత్యోపదేశం, సహనబోధన చేసుకుంటారో వారు తప్ప“. (అల్ అఫ్ 103: 1-3)
ఇమాం ‘షాఫయి’ (రహ్మతుల్లాహి అలైహి) ఈ పవిత్ర సూర గురించి ఇలా పేర్కొన్నారు:
“అల్లాహ్ మానవ సృష్టి పై తన వాగ్దాన ప్రకారం, ఈ ఒక్క సూరానే అవతరింపజేసి ఉంటే, అది వారి సన్మార్గమునకు సరిపోయేది.”
ఇమాం ‘బుఖారి’ (రహ్మతుల్లాహి అలైహి) తన ‘సహిహ్ బుఖారి’ గ్రంధములో ఒక అధ్యాయాన్ని ఈ విధంగా ఆరంభం చేశారు.
“మాట, బాటకు ముందు జ్ఞానం’ (సంబంధిత జ్ఞానాన్ని సేకరించుట, పొందుట)
దీనికి ఆధారం అల్లాహ్ పేర్కొన్న ఈ వచనమే :
فَاعْلَمْ أَنَّهُ لَا إِلَٰهَ إِلَّا اللَّهُ وَاسْتَغْفِرْ لِذَنبِكَ وَلِلْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ
“తెలుసుకోండి..! అల్లాహ్ తప్ప మరెవరూ ఆరాధ్యదేవుడు లేదు. మరియు మీరు మీ పాపాలకు క్షమాపణ కోరుతూవుండండి”. (ముహమ్మద్ 47:19) |
فبدأ بالعلم.
కనుక ఇందులో అల్లాహ్ మాట, బాటకు ముందు జ్ఞాన ప్రస్తావన చేశాడు.
పాఠకులారా..
అల్లాహ్ మీ పై కరుణించుగాక.. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోవలసిన విషయమే. క్రింద పేర్కొనబడే మూడు సమస్యల జ్ఞానం పొందుట, దానిని ఆచరించుట, ప్రతి ముస్లిం (స్త్రీ, పురుషుని) పై విధించబడిన విధి.
మొదటి సమస్య:
అల్లాహ్ యే మనల్ని సృష్టించి, ఉపాధి కల్పించాడు. మరి మాకు అనవసరంగా ఇలాగే వదిలి పెట్టలేదు. తన ప్రవక్తను (సల్లల్లాహు అలైహి వసల్లం)ను మా మార్గదర్శనం కోసం మావైపు పంపిచాడు. ఆయనకు విధేయత చూపిన వారు స్వర్గ వాసులవుతారు. ఆయన ఆజ్ఞను తిరస్కరించిన వారు నరక వాసులవుతారు. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
إِنَّا أَرْسَلْنَا إِلَيْكُمْ رَسُولًا شَاهِدًا عَلَيْكُمْ كَمَا أَرْسَلْنَا إِلَىٰ فِرْعَوْنَ رَسُولًا فَعَصَىٰ فِرْعَوْنُ الرَّسُولَ فَأَخَذْنَاهُ أَخْذًا وَبِيلًا
“మీ వద్దకు అలాగే ఒక ప్రవక్తను సాక్ష్యంగా చేసి పంపాము, ఎలాగైతే మేము ‘ఫిరౌన్’ వద్దకు ప్రవక్తను పంపాము, కాని ఫిరౌన్ ఆ ప్రవక్తను తిరస్కరించాడు. అప్పుడు మేము అతనిని కఠినంగా శిక్షించాము”. (అల్ ముజ్జమ్మిల్ 73:15-16)
రెండవ సమస్య:
అల్లాహ్ కు తన ఆరాధనలో మరెవరినీ సాటి కల్పించడాన్ని ముమ్మాటికి సహించడు. (ప్రఖ్యాత దైవ దూతలు, ప్రవక్తలైనా సరే) అల్లాహ్ ఇలా ప్రవచిస్తున్నాడు:
وَأَنَّ الْمَسَاجِدَ لِلَّهِ فَلَا تَدْعُوا مَعَ اللَّهِ أَحَدًا
“నిస్సందేహంగా మసీదులు అల్లాహ్ కొరకే (ప్రత్యేకించబడ్డాయి). కనుక అందులో అల్లాహ్ తో పాటు మరెవరినీ పిలవకండి”. (జిన్ 72:18)
మూడవ సమస్య:
ఎవరైతే దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను అనుసరించి విధేయత చూపుతూ, అల్లాహ్ ఏకత్వాన్ని కూడ అంగీకరిస్తారో వారికి అల్లాహ్ మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పట్ల శతృత్వం వహించే వాళ్ళతో సత్సంబంధాలు పెట్టుకొనుట ఏ మాత్రం తగని విషయం. ఒకవేళ వారు ఇహలోకపరంగా అతి సమీప బంధువులైన సరె. ఇందుకు ఆధారం అల్లాహ్ పేర్కొన్న ఈ వచనం:
لَّا تَجِدُ قَوْمًا يُؤْمِنُونَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ يُوَادُّونَ مَنْ حَادَّ اللَّهَ وَرَسُولَهُ وَلَوْ كَانُوا آبَاءَهُمْ أَوْ أَبْنَاءَهُمْ أَوْ إِخْوَانَهُمْ أَوْ عَشِيرَتَهُمْ ۚ أُولَٰئِكَ كَتَبَ فِي قُلُوبِهِمُ الْإِيمَانَ وَأَيَّدَهُم بِرُوحٍ مِّنْهُ
“అల్లాహ్ ను పరలోకాన్ని విశ్వసించే వారు, అల్లాహ్ ను ఆయన ప్రవక్తను వ్యతిరేకించే వారిని ప్రేమించటాన్ని నీవు ఎన్నడూ చూడలేవు. ఆ వ్యతిరేకించే వారు, వారి తల్లితండ్రులైనా,వారి కుమారులైనా,వారి సోదరులైనా సరె. లేదా వారి కుటుంబీకులైన సరే. వారి హృదయాలలో అల్లాహ్ విశ్వాసాన్ని స్థిరంగా నాటాడు.తన తరపు నుండి ఒక ఆత్మను ప్రసాదించి, వారికి బలాన్నిచ్చాడు. ఆయన వారిని క్రింద సెలయేరులు ప్రవహించే స్వర్గ వనాలలో ప్రవేశింపజేస్తాడు.ఆ వనాలలో వారు శాశ్వతంగా ఉంటారు. అల్లాహ్ వారి పట్ల ప్రసన్నుడయ్యాడు, వారు అల్లాహ్ పట్ల సంతుష్టి చెందారు. వారు అల్లాహ్ పక్షానికి చెందినవారు. జాగ్రత్తా! అల్లాహ్ షక్షం వారే సఫలీకృతులయ్యే వారు”.(అల్ ముజాదలహ్ 58:22)
పాఠకులారా..
అల్లాహ్ మీకు సన్మార్గాన్ని అనుసరింపచేయు గాక. ఈ విషయాన్ని కూడ బాగా అర్ధం చేసుకోండి. అదేమిటంటే “హనఫీయ్యత్, మిల్లతె ఇబ్రాహీమి” అంటే, మీరు చిత్తశుద్ధితో సంపూర్ణముగా కేవలం ఏకైక అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలి. ఈ కార్యాన్ని గురించే అల్లాహ్ అందరిని ఆజ్ఞాపించాడు. దీని కోసమే మానవుడిని సృష్టించాడు. అల్లాహ్ తన గ్రంధంలో పేర్కొన్నాడు.
“నేను సృష్టించలేదు జిన్నాతులను, మానవులను, కాని నా ఆరాధనకు (తప్ప)”. (అజ్జారియాత్ 51:56)
“య’బుదూన్” అనే పదానికి అర్ధం: నా ఏకత్వాన్ని మనసార అంగీకరించండి.
అల్లాహ్ ప్రస్తావించిన ఆజ్ఞల్లో అన్నిటికంటే ప్రధానమైన, ఉన్నతమైన ఆజ్ఞ “తౌహీద్” అన్ని విధాల ఆరాధనలు ఏకైక అల్లాహ్ కొరకే అర్పించుటకు మారు పేరు. మరి అల్లాహ్ నిర్మూలించిన ఆజ్ఞల్లో అన్నిటికంటే ప్రధాన మైనది “షిర్క్” అల్లాహ్ యేతరులను మన ఆశలను, కోరికలను నెరవేర్చటానికి పిల్చేందుకు అతని భాగస్వామిగా కల్పేందుకు మారు పేరు.
అల్లాహ్ పవిత్ర ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నడు:
وَاعْبُدُوا اللَّهَ وَلَا تُشْرِكُوا بِهِ شَيْئًا
“మరియు మీరందరూ అల్లాహ్ ని ఆరాధించండి, మరి అతనితో ఎవరినీ సాటి కల్పించకండి”. (అన్నిసా 04:36)
బిస్మిల్లా హిర్రహ్మాన్ నిర్రహీం
ధర్మ అవగాహనకు అవశ్యకమైన త్రిసూత్రాలు
ప్రతి మానవుడికి ఏ 3 సూత్రాల అవగాహన అవసరం అని ప్రశ్నించినప్పుడు మీరు ఇలా చెప్పండి:
- ప్రతి వ్యక్తి తన ప్రభువు గురించి అవగాహన పొందడం.
- తన ధర్మం (దీన్) గురించి అవగాహన పొందడం.
- తన ప్రవక్త అయిన ముహమ్మద్ (సల్లల్లాహుఅలైహివసల్లం) గురించి అవగాహన పొందడం.
ప్రధమ సూత్రం:
విశ్వప్రభువైన అల్లాహ్ గురించి అవగాహన
మీ ప్రభువు ఎవరని వివరంగా అడిగినప్పుడు చెప్పండి”నా ప్రభువు అల్లాహ్! ఆయనే తన దయ, కృషితో నన్నూ మరియు ఈ సర్వలోకాన్ని పోషిస్తున్నాడు. ఆయనే నాఆరాధ్యదేవుడు. ఆయన తప్ప మరోక ఆరాధ్యదేవుడు లేడు. ఆయనే విశ్వపోషకుడు. ఆయనే ఆరాధ్య దైవం ఇలా చెప్పటానికి దైవ గ్రంధంలో ఆధారం చూడండి :
الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
“సర్వపొగడ్తలు సర్వలోకాలకు పోషకుడైన అల్లాహ్ కొరకే”. (అల్ ఫాతిహ 01 :02)
అల్లాహ్ తప్ప లోకంలోని సర్వమూ (ప్రతి వస్తువు) సృష్టియే. నేను ఆ సృష్టిలో ఒకణ్ణి.
మీరు మీ ప్రభువును ఎలా కనుగొన్నారు? దేనిద్వార కనుగొన్నారు? అని అడిగినప్పుడు “ఆయన నిదర్శపూరితమైన చిహ్నాలతో, అనేక రకమైన సృష్టితాలతో కనుగొన్నాము” అని చెప్పండి.
ఆయన నిదర్శనాల్లో: రాత్రి, పగలు, సూర్యుడు, చంద్రుడు మొదలైనవి.
ఆయన సృష్టితాల్లో : సప్తభూములు, సప్త ఆకాశాలు, ఆరెండింటి మధ్యలో ఉన్న సర్వమూ (ప్రతీది) కూడ.
అల్లాహ్ చిహ్నాల గురించి ఆధారాలు :
అల్లాహ్ తన పవిత్ర ఖుర్ఆన్ గ్రంధంలో ఇలా తెలుపుతున్నాడు:
وَمِنْ آيَاتِهِ اللَّيْلُ وَالنَّهَارُ وَالشَّمْسُ وَالْقَمَرُ ۚ لَا تَسْجُدُوا لِلشَّمْسِ وَلَا لِلْقَمَرِ وَاسْجُدُوا لِلَّهِ الَّذِي خَلَقَهُنَّ إِن كُنتُمْ إِيَّاهُ تَعْبُدُونَ
“రాత్రి, పగలు, సూర్యుడు, చంద్రుడు,అయన (అల్లాహ్) చిహ్నాల్లోనివే, మీరు సూర్యునికి, చంద్రునికి ఆరాధించకండి (సాష్టాంగం చేయకండి). మీరు ఆరాధించేవారైతే వాటిని సృష్టించిన అల్లాహ్ ను అరాధించండి (సాష్టాంగం చేయండి).” (ఫుస్సిలత్ 41:37)
అల్లాహ్ తన సృష్టి గురించి పవిత్ర ఖుర్ఆన్లో ఇలా సెలవిస్తున్నాడు:
إِنَّ رَبَّكُمُ اللَّهُ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ فِي سِتَّةِ أَيَّامٍ ثُمَّ اسْتَوَىٰ عَلَى الْعَرْشِ يُغْشِي اللَّيْلَ النَّهَارَ يَطْلُبُهُ حَثِيثًا وَالشَّمْسَ وَالْقَمَرَ وَالنُّجُومَ مُسَخَّرَاتٍ بِأَمْرِهِ ۗ أَلَا لَهُ الْخَلْقُ وَالْأَمْرُ ۗ تَبَارَكَ اللَّهُ رَبُّ الْعَالَمِينَ
“వాస్తవానికి మీ ప్రభువు అల్లాహ్ యే. ఆయనే భూమ్యాకాశాలను ఆరు రోజులలో సృష్టించాడు తదనంతరం తన సింహాసనం (అర్ప్)ను అధిష్టించాడు. ఆయనే రాత్రిని పగలుపై కప్పుతున్నాడు, మళ్ళీ పగలుని రాత్రి వెంట పరుగులు తీయిస్తున్నాడు.ఆయనే సూర్యుణ్ణి, చంద్రుణ్ణి మరియు నక్షత్రాలను సృష్టించాడు. అన్ని ఆయన ఆజ్ఞకే లోబడి ఉన్నాయి. గుర్తుంచుకొండి. సృష్టించడం, ఆజ్ఞాపించడం ఆయనకే చెల్లుతుంది. శుభాలుకలవాడు అల్లాహ్ యే, ఆయనే సర్వలోకాలకు ప్రభువు”. (అల్ ఆరాఫ్ 7: 54)
సర్వలోకానికి పోషకుడైన ఆయనే (అల్లాహ్) ఆరాధనకు అర్హుడని దైవ గ్రంధం ఖుర్ఆన్లో ఇలా చెప్పబడింది:
يَا أَيُّهَا النَّاسُ اعْبُدُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُمْ وَالَّذِينَ مِن قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُونَ الَّذِي جَعَلَ لَكُمُ الْأَرْضَ فِرَاشًا وَالسَّمَاءَ بِنَاءً وَأَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَأَخْرَجَ بِهِ مِنَ الثَّمَرَاتِ رِزْقًا لَّكُمْ ۖ فَلَا تَجْعَلُوا لِلَّهِ أَندَادًا وَأَنتُمْ تَعْلَمُونَ
“ఓ మానవులారా..! మీరు ఆ (సత్య) ప్రభువునే ఆరాధించండి ఎవరైతే మీకంటే ముందు మీ పూర్వికుల్ని సృష్టించాడో, దాని ఫలితంగా బహుశ మీరు నరకాగ్ని నుండి విముక్తి పొందగలరు. ఆయనే మీ కొరకు భూమిని పాన్పుగా, ఆకాశాన్ని కప్పుగా చేశాడు. మరియు పైనుండి వర్షాన్ని కురిపించాడు. దాని ద్వారా రకరకాల పండ్లను సృష్టించాడు. వాటిని మీ కొరకు ఆహారంగా ప్రసాదించాడు. ఈ విషయాన్ని గ్రహిస్తూ కూడ మీరు (ఇతరులను) అల్లాహ్ కు సహవర్తిత్వం కల్పించకండి”. (అల్ బఖర 2:21-22)
ఇమామ్ ఇబ్నె కసీర్ (రహిమహుల్లాహ్) ఈ వచనానికి తాత్పర్యం ఇలా తెలిపారు:
“పైన పేర్కొన్న వాటిని సృష్టించినవాడే అన్ని రకాల పూజలకు అసలైన అర్హుడు” (తఫ్సీర్ ఇబ్నె కసీర్)
గమనిక : అల్లాహ్ ఆజ్ఞ ప్రకారం చేయవలసిన ఆరాధనల పేర్లను ముందుగా అరబి వ్యాఖ్యాలతోనే పేర్కొని తరువాత క్లుప్తంగా దాని వివరణ ఇవ్వటం జరిగంది. క్రింది వాటిని గమనిచండి.
అరబి నామాలు (ఆరాధనల పేర్లు)
ఇస్లాం, ఈమాన్, ఇహ్సాన్, దుఆ, ఖాఫ్, తవక్కుల్, ఖుషూ, ఇస్తిఆనత్, రఘ్-బత్ , ఖషియత్, ఇస్తి ఆజహ్, ఖుర్బాని, ఉమ్మీద్ వ రజా, రహ్బత్, రుజూ, జబహ్ఇ, ఇస్తిఘాసహ్, నజర్ వ మిన్నత్ మొదలైనవి.
పై ఆరాధనలన్నీ కేవలం అల్లాహ్ కే పరిమితం. వీటి గురించి దైవ గ్రంధం ఖుర్ఆన్ లోని ఈ ఆయత్ లో ప్రస్తావన జరిగింది:
وَأَنَّ الْمَسَاجِدَ لِلَّهِ فَلَا تَدْعُوا مَعَ اللَّهِ أَحَدًا
“నిస్సందేహంగా మసీదులు అల్లాహ్ (ప్రార్ధన) కొరకే ఉన్నాయి. అందులో అల్లాహ్ తో పాటు మరెవరినీ పిలవకండి“. (అల్ జిన్న్ 72 :18)
పైన పేర్కొన్న ఆరాధనలను ఎవరైన అల్లాహ్ కొరకు కాకుండా మరెవరి కొరకైన చేస్తే అతను ముష్రిక్, మరియు అవిశ్వాసి అవుతాడు. దీనికై పవిత్ర గ్రంధం ఖుర్ఆన్లో ఈ ఆయత్ ని గమనించండి:
وَمَن يَدْعُ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ لَا بُرْهَانَ لَهُ بِهِ فَإِنَّمَا حِسَابُهُ عِندَ رَبِّهِ ۚ إِنَّهُ لَا يُفْلِحُ الْكَافِرُونَ
“ఎవరైనా అల్లాహ్ తో పాటు వేరే దైవాన్ని పిలిస్తే (అప్పటికి) అతని వద్ద అలా పిలవటానికి ఎటువంటి ప్రమాణికం (సూచిక) లేదు. అలాంటి వ్యక్తి లెక్క అల్లాహ్ పై ఉన్నది. నిస్సందేహంగా అవిశ్వాసులు ఎన్నడూ సాఫల్యం పొందలేరు”. (అల్ మొమినూన్ 23:117)
గమనిక :
పైన పేర్కొనబడిన అరబి నామాలను వివరిస్తూ, అవన్నీ ఆరాధనలకు చెందుతాయని చెప్పటానికి తగు ఆధారములు ఖుర్ఆన్ గ్రంధము, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సున్నత్ల నుండి పేర్కొనడం జరిగింది గమనించండి
You must be logged in to post a comment.