సాధారణ ముస్లింలందరి కొరకు ముఖ్య పాఠాలు – ఇమాం ఇబ్నె బాజ్ [పుస్తకం]

సాధారణ ముస్లింలందరి కొరకు ముఖ్య పాఠాలు – ఇమాం ఇబ్నె బాజ్ [పుస్తకం]

Important-lessons-for-every-muslim-ibn-baz

అద్దురూసుల్ ముహిమ్మతు లి ఆమ్మతిల్ ఉమ్మ
(సాధారణ ముస్లింలందరి కొరకు ముఖ్య పాఠాలు)

క్రింది లింక్ క్లిక్ చేసి పుస్తకం చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి
సాధారణ ముస్లింలందరి కొరకు ముఖ్య పాఠాలు – ఇమాం ఇబ్నె బాజ్ [డైరెక్ట్ PDF]

  1. మొదటి పాఠం – సూరతుల్ ఫాతిహ మరియు చిన్న సూరాలు.
  2. రెండవ పాఠం – ఇస్లాం ములస్తంభాలు.
  3. మూడవ పాఠం – ఈమాన్ (విశ్వాస) మూలస్తంభాలు.
  4. నాల్గవ పాఠం – తౌహీద్ రకాలు మరియు షిర్కు రకాలు.
  5. ఐదవ పాఠం – ఇహ్సాన్
  6. ఆరవ పాఠం – నమాజు షరతులు
  7. ఏడవ పాఠం – నమాజు యొక్క విధులు
  8. ఎనిమిదో పాఠం – నమాజులో అనివార్య కార్యాలు
  9. తొమ్మిదవ పాఠం – తషహ్హుద్ యొక్క వివరణ.
  10. పదవ పాఠం – నమాజు యొక్క సున్నతులు
  11. పదకొండవ పాఠం – నమాజును భంగం చేసేవి.
  12. పన్నెండవ పాఠం: – వుజూ షరతులు.
  13. పదమూడవ పాఠం – వుజూలో తప్పనిసరి చేయవలసిన కార్యాలు.
  14. పద్నాల్గవ పాఠం – వుజూను భంగపరిచే విషయాలు.
  15. పదిహేనొవ పాఠం – ప్రతీ ముస్లిం చట్టబద్ధమైన గుణములతో అలంకరించుకోవటం
  16. పదహారవ పాఠం – ఇస్లామీయ పద్దతులను అవలంభించటం.
  17. పదిహేడవ పాఠం – షిర్కు మరియు తదితర పాపముల నుండి హెచ్చరించటం.
  18. పద్దెనిమిదవ పాఠం – మృతుని జనాజా సిద్ధం చేయటం, అతని జనాజా నమాజు చదవటం, అతనిని పూడ్చటం.

అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం

అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్, వ సల్లల్లాహు వ సల్లమ అలా అబ్దిహి వ రసూలిహి నబియ్యినా ముహమ్మద్, వ అలా ఆలిహి వ అస్హాబిహీ అజ్మయీన్. (స్థుతులన్నీ సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే, మంచి పర్యవాసనం దైవభీతి కలవారి కొరకే, అల్లాహ్ మన ప్రవక్త అయిన ముహమ్మద్ పై, ఆయన కుటుంబముపై, ఆయన సహచరులందరిపై శుభాలను, శాంతిని కలిగించుగాక).

అమ్మా బాద్:

ఇస్లాం ధర్మం గురించి ప్రజలు తెలుసుకోవలసిన కొన్ని పదాల ప్రకటనలో ఇవి సంక్షిప్త పదాలు. వాటిని నేను అద్దురూసుల్ ముహిమ్మతు లి ఆమ్మతిల్ ఉమ్మ (సాధారణ ముస్లింలందరి కొరకు ముఖ్య పాఠాలు) అని నామకరణం చేశాను.

వాటితో ముస్లిములకు ప్రయోజనం కలిగించమని మరియు నా నుండి వాటిని స్వీకరించమని నేను అల్లాహ్ తో వేడుకుంటున్నాను. నిశ్చయంగా ఆయన ఉదారమైనవాడు మరియు దయగలవాడు.

అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ బాజ్

దుఆ – ఒక దివ్యౌషధం [పుస్తకం]

దుఆ – ఒక దివ్యౌషధం [పుస్తకం ] 
How to make dua?

క్రింది లింక్ క్లిక్ చేసి పుస్తకం చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి
దుఆ – ఒక దివ్యౌషధం [పుస్తకం] – [పాకెట్ సైజు ]  
కూర్పు: ముహమ్మద్ హమ్మాద్ ఉమరి
పర్యవేక్షణ: ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ
శాంతి మార్గం పబ్లికేషన్ ట్రస్ట్ [PDF] [90 పేజీలు ]

ఈ లోకంలో కష్టాలు, బాధలు ఎవరికి తీపి?! కష్టాల నుంచి విముక్తిని ఆశించటం, సుఖాలకు గాను ఆనందించటం మానవ సహజ లక్షణం. ఎంత గొప్ప ఓర్పు కలవారైనా, తాము అన్ని రకాల శిక్షల నుంచి సురక్షితంగా ఉండాలనే ఆకాంక్షిస్తారు. చిన్న కష్టం కూడా తమ దరి చేరరాదని కోరుకుంటారు.

సాధారణంగా మనుషులకు కలిగే వ్యాధులు,రోగాల వంటివే కష్టాలు, బాధలు కూడా. అల్లాహ్ ఈ లోకంలో ప్రతి రోగానికి చికిత్సను తయారు చేసి ఉంచాడు. ఆ విధంగా ప్రతి వ్యాధికి అల్లాహ్ తరఫున ఒక మందు అందుబాటులో ఉంది. మరి కష్టాలకు, బాధలకు ఆయన దృష్టిలో అత్యంత ప్రభావవంతమైన మందు ఏదో తెలుసా? అదే దుఆ (ప్రార్థన). కాకపోతే,ఆ దివ్యౌషధాన్ని సక్రమంగా వినియోగించు కోవటం మనుషులకు తెలిసి ఉండాలి.

కేవలం కష్టాలను దూరం చేసుకోవటానికే కాదు, ఈ లోకంలో సంతృప్తికర ఆనందాన్ని అంది పుచ్చుకోవాలన్నా, సుఖమయ సంతోషాన్ని తమ పాదాక్రాంతం చేసుకోవాలన్నా మనిషికి దుఆ యే ఏకైక సాధనం. అంతే కాదు, దుఆ అత్యంత పుణ్యప్రదమైన ఒక ఆరాధన కూడా.

దుఆ చేసే సరైన విధానం తెలియని కారణంగా,తాము ఎంతగా దుఆ చేసిన తమ ప్రార్థనలు స్వీకరించబడటం లేదని చాలామంది తరచూ వాపోతుంటారు. ముఖ్యంగా అలాంటి వారి కోసమే ఈ చిరుపుస్తకం రూపొందించబడింది. ఇందులో దుఆ సమయం, దుఆ విధానం, దుఆ పలుకులు, దుఆలో సముచిత, అనుచిత విషయాలు మొదలగునవన్నీ పొందుపరచ బడ్డాయి. మొత్తానికి ఈ చిరు పుస్తకం తెలుగు ప్రజలందరికీ ప్రయోజనకరం కాగలదని ఆశిస్తున్నాం.

పరమ ప్రభువైన అల్లాహ్ మనందరికీ ‘దుఆ’ దివ్యౌషధాన్ని సక్రమంగా వినియోగించుకునే సౌభాగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ….

ఇస్లాం తెలుగు పుస్తకాలు (Telugu Islamic Books) డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ:
https://teluguislam.net/?p=4259

150 కంఠస్తం చేయదగిన దైవ ప్రవక్త ﷺ హదీసులు [పుస్తకం]

మూలం : మౌలానా కె. అమీనుర్రహ్మాన్ మదనీ
భావానువాదం : ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ
శాంతిమార్గం పబ్లికేషన్ ట్రస్ట్

క్రింది లింక్ నొక్కి పూర్తి పుస్తకం చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి
150 కంఠస్తం చేయదగిన దైవ ప్రవక్త ﷺ హదీసులు
[డైరెక్ట్ PDF] [పాకెట్ సైజు]

జనం నోళ్లల్లో నానిపోయే చిన్న చిన్న హదీసులను ఏర్చికూర్చి రూపొందించిన చిరుపుస్తకం. ఎంతో వినసొంపుగా ఉండే ఈ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హదీసులు పాఠకుల సంభాషణను సుసంపన్నం చేస్తాయి. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పలుకుల్లోని ఆ లాలిత్యం మన మాటల్లోనూ జాలువారాలని, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పదాల్లోని పదునుతో మన భావాల్లోను పటుత్వం రావాలని – ఆ దివ్య ప్రవచనాల తెలుగు లిపిని రంగురంగుల ఆకర్షణీయమైన నిండు వాల్ పేపర్స్ పై ఎంతో రమణీయంగా తీర్చిదిద్ది రూపొందించిన పుస్తకం.

ప్రకాశకులు

మరిన్ని ఇస్లాం తెలుగు పుస్తకాలు (Telugu Islamic Books) డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ:
https://teluguislam.net/?p=4259

ఆదర్శ మహిళ హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) [పుస్తకం]

ఇక్కడ పూర్తి పుస్తకాన్ని డౌన్లోడ్ చేసుకోండి
ఆదర్శ మహిళ హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా)
 [డైరెక్ట్ PDF] [203 పేజీలు] – [అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్]

మానవ మహోపకారి, కారుణ్యమూర్తి, హృదయాల విజేత అయిన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) గుణగణాలు, దినచర్యలు, ఆయన వ్యవహార సరళి గురించి తెలిపే పుస్తకాలు తెలుగు భాషలో కొన్ని వచ్చాయి. అలాగే, ఆయా గ్రంధాల్లో దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సతీమణులను గురించి వారి గృహస్థ జీవితంలోని ముఖ్య సంఘటనలను గురించి సవివరంగా తెలిపే పుస్తకాలు తెలుగులో దాదాపు లేవనే చెప్పవచ్చు.

ఒక మహాసాధ్వి జీవిత చరిత్రనే గాకుండా భార్యవలన భర్తకు ఏవిధంగా మనశ్శాంతి, ఊరట లభిస్తాయో, లభించాలో ఈ పుస్తకం మనకు వివరిస్తుంది. ఆయా పరిస్థితులలో తనకెదురయిన వివిధ సంఘటనల్ని ఇబ్బందుల్ని, పరీక్షల్ని ఆ మహిళా లోక మార్గదర్శి ఎలా అధిగమించారో కళ్ళకు కట్టినట్లు చూపే ఓ సజీవ దృశ్య కావ్యం ఈ గ్రంధం. ఇంకా ‘ధర్మేచ, అర్థేచ, కామేచ, నాతిచరామి’ అన్నట్లుగా కష్టాలయినా, సుఖాలయినా భర్తతో ఆమె ఎలా కలిసి పంచుకున్నారో మనకు విశదమవుతుంది.

నేటి ముస్లింల పతనావస్థకు గల కారణాలలో సగభాగం ముస్లిం మహిళలే అంటే అతిశయోక్తి అనిపించవచ్చు. కాని రకరకాల భయాలకు భ్రమలకు దాసోహం కావడాలు, సమాధుల పూజలు, అనాగరిక మూఢాచారాలు, వివాహ సందర్భాల లోనయినా, దుఃఖ సందర్భాలలోనయినా జరుగుతున్న మూఢత్వపు తంతులు, దుబారా వ్యయం మన ప్రాంగణాలలో బ్రతికి బట్టకడుతున్నాయంటే అందుకు కారణం ఏమిటీ? నేటి ముస్లిం మహిళల్లో ఇస్లామీయ చైతన్యం మృగ్యమవడం కాదా? అయితే ఒక్క విషయం! ముస్లిం స్త్రీ యొక్క పరిపూర్ణ నమూనా ఏదీ వారికి లభించనప్పుడు వారు మాత్రం ఏం చేస్తారు? ప్రతి పురుషుడి విజయం వెనుకా ఒక స్త్రీ హస్తం ఉండాలి, ఉంది, అంటే ఆ విజయం సాధించిన పురుషుల తోడ్పాటూ, సహకారం, సమన్వయం వారికి లభించడం వల్లనే కదా!

ఇక ఈ పుస్తకం ద్వారా…

దైవదౌత్య ప్రాతినిధ్యంలో సహధర్మచారిణిగా మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రాంగణంలో దాదాపు 40 ఏళ్ళు బోధనామృత మణిదీపికగా భాసిల్లి, విశ్వాసుల మాతగా ఆచంద్రతారార్కం కీర్తించబడే మహిళా శిరోమణి అపురూప వ్యవహరణా శైలిని మహిళాలోకానికి పరిచయం చేసే భాగ్యం లభించడం మా అదృష్టం!!

స్త్రీ… తరతరాలుగా పీడనకు, పురుషాహంకారానికీ బలవుతూ వచ్చింది. స్త్రీ తన తోటి స్త్రీల వల్ల కూడ చిక్కులకు, వేదనకు, క్షోభకు గురి అయింది. అవుతూ వుంది కూడా. అందుకేనేమో “స్త్రీకి స్త్రీయే శత్రువు” అన్నారు.

‘పితారక్షతి కౌమారే, భర్తా రక్షతి యవ్వనే, సుతా రక్షతి వార్ధక్కే, న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి’ అంటూ కొందరు స్త్రీకి స్వాతంత్య్రమే లేదు పొమ్మన్నారు. మరికొందరు మహానుభావులు స్త్రీని మోక్ష సాధనకు ఆటంకమని ఘోషించారు.

ఇస్లాం ఆవిర్భావానికి పూర్వం అనాగరిక అరబ్బులు స్త్రీని భోగ వస్తువుగా, కోర్కెలు తీర్చుకునే యంత్రంగా చేసుకున్నారు.

ఇస్లాం ఈ విధమయిన రెండు అతివాద భావాలను ఖండిస్తూ ఆమె శారీరక, మానసిక స్వభావానికి అతికినట్లుగా సరిపోయే సమతౌల్యంతో కూడిన కార్యక్షేత్రాన్ని సూచించింది. “తల్లి పాదాల క్రింద స్వర్గం ఉంది” అంటూ స్త్రీకి మహోన్నత స్థానం కల్పించింది. స్వాతంత్ర్యం, ఆస్తిహక్కు, సమాజంలో సమున్నత స్థానం ఇస్లాం ద్వారా మాత్రమే స్త్రీకి లభించాయి. ఇస్లాం స్త్రీకి కల్పించిన స్థానం ఎటువంటిదో పరిశీలిస్తే వాస్తవం వెల్లడవుతుంది. ఆధారాల్లేని విమర్శలతో, పసలేని వాదాలతో వ్యాఖ్యలు చేయడంలో ఔచిత్యం ఏముంటుంది?

హజ్రత్ ఆయిషా జీవితం సుఖ, దుఃఖాల సంభరితం. జీవితంలో ఎన్నో. మార్పుల్ని, కష్టాల్ని, ఎదుర్కొన్నారా మహావనిత. భర్తతో కాపురం, విరహం, ఇల్లు చక్కబెట్టుకోవడం, సవతుల ఈర్ష్యా అసూయల్ని ఆమె చవిచూశారు. వైధవ్యం పొందారు. అనాధ అయ్యారు. ఉత్థాన పతనాల తెరల వెనుక జరిగిన రాజకీయాలను అవలోకనం చేసుకున్నారు. వైముఖ్య ధోరణులను ఎదుర్కొన్నారు. ఒకటేమిటి జీవితంలోని అన్ని పరిస్థితుల్నీ అధిగమించడంలో ఆయా సందర్భాలలో ఆమె వ్యవహరణా సరళి నేటి ముస్లిం స్త్రీకి మార్గదర్శకం. నైతిక, విజ్ఞాన ఆచరణాత్మక ఆణిముత్యాలతో సుసంపన్నమైన ఆమె పవిత్ర జీవితం చదవదగ్గదీ, చదివి తీరవలసినదీను.

ఇందులో మహిళాలోకానికి మార్గదర్శక సూత్రాలు ఉన్నాయి. బాల్యం నుండే విద్యా విజ్ఞాన విషయాలను ఆకళింపు చేసుకోవడం, భర్త ఆశయాలకు అనుగుణంగా తనను తాను మలచుకోవడం, నిస్సంతు అయినప్పటికీ అనాధ పిల్లల్ని పెంచి, వారికి బోధనా శిక్షణలు గరపడంతోపాటు, వారి వివాహాలు చేయడం, భర్త వియోగానంతరం ఆయన నడిపిన ఉద్యమాన్ని కొనసాగించడం, ధార్మిక తీర్పులు ఇవ్వడం, ఇంకా చాలా చాలా విషయాలు ఈనాటికీ ఆదర్శనీయములే. ఒక మహిళ ఇలా బహుముఖ ప్రజ్ఞ కనబర్చడం చూస్తుంటే “ముదితల్ నేర్వగరాని విద్య కలదే!” అనిపిస్తుంది.

పాఠకులకు, ముఖ్యంగా మహిళలకు ఈ పుస్తకం అభిమానపాత్రం కావాలని కాంక్షించడంలో విడ్డూరమేముందీ..!? మజ్లిసె ఇషాఅతె ఇస్లాం తెలుగు ప్రచురణా విభాగం స్థాపకులైన మౌలానా హాఫిజ్ ముహమ్మద్ తఖీయుద్దీన్ గారి ప్రోద్బలం, సోదరులు ముహమ్మద్ అజీజు రహ్మాన్ గారి ప్రోత్సాహం… అన్నింటికీ మించి అల్లాహ్ తోడ్పాటు వల్ల ఇది పుస్తక రూపం దాల్చింది. ఇందలి లోపాలను పాఠకులు దృష్టికి తెస్తే మలిసారి ముద్రణలో సరిదిద్దుకోగలము. ఈ చిరు కృషిని కారుణ్య ప్రభువు స్వీకరించాలని వేడుకుంటూ..

కృతజ్ఞతలతో
ఇఖ్బాల్ అహ్మద్

ఇస్లాం తెలుగు పుస్తకాలు (Telugu Islamic Books) డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ:
https://teluguislam.net/?p=4259

ఖుర్ఆన్ ఘనతల పుస్తకం – జుల్ఫీ దావహ్

كتاب فضائل القرآن (ఖుర్ఆన్ ఘనతల పుస్తకం)
సంకలనం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
జుల్ఫీ ధర్మప్రచార విభాగం (సౌదీ అరేబియా)

[పుస్తకం డౌన్లోడ్]
[PDF] [51 పేజీలు]

ఖుర్ఆన్ ను గట్టిగా పట్టుకునే ఆదేశం

عَنْ جُبَيْرِ بن مُطْعِمٍ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ قَالَ : قَالَ رَسُولُ الله ﷺ : (أَبْشِرُوا فَإِنَّ هَذَا الْقُرْآنَ طَرَفُهُ بِيَدِ الله ، وَطَرَفُهُ بِأَيْدِيكُمْ ، فَتَمَسَّكُوا بِهِ ، فَإِنَّكُمْ لَنْ تَهْلَكُوا ، وَ لَنْ تَضِلُّوا بَعْدَهُ أَبَدًا).

ఈ హదీసులో:

సంబరపరిచే విషయాల శుభవార్త ఇవ్వవచ్చును. సత్కార్యాల సంపాదన ఇహలోక సంపాదన కంటే చాలా గొప్పది. [దానికి ప్రజలు సంబరపడాలి. ప్రజలు కూడబెట్టే వాటన్నింటికంటే అది ఉత్తమమైనది]. (ఖుర్ఆన్ 10: 58).

ఇందులో ఖుర్ఆన్ గొప్పతనం, దానిని గట్టిగా పట్టుకునే ఆదేశం ఉంది. అంటే దాని ఆదేశాలను పాటించడం, దానిలోని నివారణల నుండి దూరముండడం.

అల్లాహ్ కు చేయి ఉందని కూడా రుజువైంది. అయితే అది ఆయన గౌరవానికి తగినట్లు ఉంటుందని విశ్వసించాలి.

ఖుర్ఆన్ ప్రకారం ఆచరించినవాడు మోక్షం పొందుతాడు. దాన్ని త్యజించినవాడు దుర్మార్గుడవుతాడు.[ఎవడు నా ఈ మార్గదర్శ కత్వాన్ని అనుసరిస్తాడో అతడు మార్గము తప్పడు, దౌర్భాగ్యానికి గురికాడు. నా జ్ఞాపికకు (హితోపదేశానికి, ఖుర్ఆనుకు) విముఖుడైన వానికి ప్రపంచంలో జీవితం ఇరుకవుతుంది]. (ఖుర్ఆన్ 20: 123, 124). ఖుర్ఆనును అనుసరించినవానికి భాగ్యము, విజయముందని. దానికి విముఖుడైనవానికి దుర్మార్గం, దౌర్భాగ్యం ఉందని హదీసులో ఉంది. దాసుని మరియు ప్రభువు మధ్య సంబంధంలో అది గొప్ప సబబు.

అల్లాహ్ రక్షణ వలన ఖుర్ఆన్ భద్రంగా ఉంది. ఏలాంటి తారుమారు అందులో జరగలేదు. [అసత్యం దాని మీదకు ముందునుండీ రాజాలదు. వెనుక నుండీ రాజలదు. వివేకవంతుడూ, స్తుతిపాత్రుడూ (అయిన అల్లాహ్ యే) అవతరింపజేసిన గ్రంథం ఇది]. (ఖుర్ఆన్ 41: 42).

తమ అనుచర సంఘ మోక్షానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఉన్న కాంక్ష, ఆయన వారి కొరకు కోరే మేలు మరియు వారి పట్ల ఆయనకు ఉన్న సంపూర్ణ జాలి, దయ ఈ హదీసులో ఉట్టిపడుతుంది.

వడ్డీ (Riba) [పుస్తకం]

[డౌన్లోడ్ పుస్తకం]
[32 పేజీలు] [PDF] [మొబైల్ ఫ్రెండ్లీ]

వడ్డీ – యూట్యూబ్ ప్లే లిస్ట్:
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1NM8ynZdYubB7u7F0gGvnP

వడ్డీ (అన్ని పోస్టులు):
https://teluguislam.net/category/riba-interest-vaddi/

అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో

దివ్యఖుర్ఆన్లో సృష్టికర్త వడ్డీ సొమ్ము తినేవారిని ఉద్దేశ్యించి ఇలా సెలవిచ్చాడు:

“వడ్డీ తినేవారి స్థితి షైతాను పట్టడం వల్ల ఉన్మాది అయిన వ్యక్తి స్థితి లాంటిది. వారు ఈ స్థితికి గురి కావటానికి కారణమేమిటంటే ‘వ్యాపారం కూడా వడ్డీ లాంటిదేగా’ అని వారంటారు. వాస్తవానికి అల్లాహ్ వ్యాపారాన్ని ధర్మసమ్మతం (హలాల్) చేశాడు. వడ్డీని నిషిద్దం (హరామ్) గావించాడు. కనుక ఈ హితబోధ అందే వ్యక్తి మున్ముందు వడ్డీ తినటం త్యజిస్తే, అతను పూర్వం తిన్నదేదో తిన్నాడు. అతని వ్యవహారం చివరకు అల్లాహ్ వద్దకే పోతుంది. ఈ ఆదేశం తర్వాత మళ్ళీ ఈ దుశ్చేష్టకు పాల్పడేవాడు నిశ్చయంగా నరకవాసి. అక్కడ అతడు శాశ్వతంగా ఉంటాడు. అల్లాహ్ వడ్డీని నశింపజేస్తాడు. దానధర్మాలను పెంచి అధికం చేస్తాడు. కృతఘ్నుడూ, దుష్టుడూ అయిన వ్యక్తిని అల్లాహ్ ప్రేమించడు. కాని విశ్వసించి మంచి పనులు చేసేవారికి, నమాజును స్థాపించేవారికి, జకాత్ ను ఇచ్చేవారికి వారి ప్రభువు వద్ద తగిన ప్రతిఫలం లభిస్తుంది. వారికి భయం కానీ, శోకం కానీ కలిగే అవకాశం లేదు. విశ్వసించిన ప్రజలారా! మీరు నిజంగా విశ్వాసులే అయితే అల్లాహ్ కు భయపడండి, ఇంకా మీకు ప్రజల నుండి రావలసిన వడ్డీని విడిచిపెట్టండి. కాని ఒకవేళ మీరు అలా చెయ్యకపోతే, మీ పై అల్లాహ్ తరఫు నుండి యుద్ధ ప్రకటన ఉంది అనే విషయం తెలుసుకోండి. ఇప్పుడైనా మీరు పశ్చాత్తాపపడితే (వడ్డీని వదులుకుంటే) అసలు సొమ్ము తీసుకోవటానికి హక్కుదారులవుతారు. మీరూ అన్యాయం చెయ్యకూడదు. మీకూ అన్యాయం జరగకూడదు. మీ బాకీదారుడు ఆర్థిక ఇబ్బందులలో ఉంటే, అతని పరిస్థితి మెరుగుపడేవరకు గడువు ఇవ్వండి. లేక ఆ రుణాన్ని మాఫీ చేయండి. మీరు తెలుసుకో గలిగితే ఇదే మీ కొరకు మేలైనది. (అల్ బఖర 2 : 275-280)

దివ్యఖుర్ఆన్లోని ఈ వాక్యాలు అరేబియాలో ఇస్లామీయ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అవతరించాయి. దీని తర్వాత ఇస్లామీయ ప్రభుత్వం పరిధిలో వడ్డీ వ్యాపారం శిక్షార్హమైన నేరంగా పరిగణించబడింది.

వడ్డీ‘ని దివ్యఖుర్ఆన్లో ‘రిబా‘గా పేర్కొనటం జరిగింది. రిబా అంటే ‘అధికం‘ లేక ‘అదనం‘ అనే అర్థాలు వస్తాయి. అరబ్బులు ఈ పదాన్ని అధిక సొమ్ము అన్న భావంలో వాడేవారు. అంటే ఒక వ్యక్తి మరో వ్యక్తికి ఒక నిర్ణీత మొత్తాన్ని ఒక నిర్ణీత గడువు వరకు రుణంగా ఇచ్చిదాన్ని పుచ్చుకునే సమయంలో అసలుతో పాటు ఒప్పందం ప్రకారం మరి కొంత అదనపు మొత్తం వసూలు చేసేవాడు. దీన్నే మన నాట ‘వడ్డీ’గా వ్యవహరిస్తాము.

ఈ వడ్డీ వ్యవస్థ ఈ శతాబ్దికి చెందింది కాదనీ, తరతరాలుగా ఇది మానవ సముదాయాల్లో వ్రేళ్లూనుకొని ఉందని తెలుస్తోంది. ప్రపంచంలోని ఇతర దేశాలు, జాతుల మాదిరిగా అరబ్బులలోనూ వడ్డీ లావాదేవీలు కొనసాగేవి. మన దేశంలోని వడ్డీ వ్యాపారులు, వడ్డీ మార్వాడీల వలెనే అరేబియాలో కూడా పెట్టుబడిదారులు వడ్డీ వ్యాపారాన్ని తమ ప్రధాన వృత్తిగా ఎన్నుకునేవారు. రుణగ్రస్తుడు నిర్ణీత గడువులో రుణం చెల్లించలేకపోతే, గడువును పొడిగించి చక్రవడ్డీ తరహాలో మరింత అదనపు సొమ్మును రాబట్టేవారు. తత్కారణంగా ఒకవైపు బాకీదారుల బాకీ నానాటికీ పెరిగిపోతుంటే మరోవైపు వడ్డీ ఆసాములు పేద ప్రజల రక్తం పీలుస్తూ కోట్లకు పడగలెత్తేవారు.

కాగా; ఈ పోకడ ఇస్లాం స్వభావ స్వరూపాలకు ఎంతకీ సరిపడదు. అది ప్రబోధించే సిద్ధాంతానికి వడ్డీ విరుద్ధమైనది. ఇస్లాం అభాగ్య జీవుల్ని ఆదుకోమనీ, పేదవారికి సహాయపడమనీ, అగత్యపరుల అక్కరలు తీర్చమనీ అంటుంది. పైగా ఈ పనులన్నీ ప్రాపంచిక పరమార్థాలతో గాకుండా అల్లాహ్ ప్రసన్నతను, పరలోక ప్రయోజనాలను ఆశించి చేయాలని ప్రబోధిస్తోంది.

సకల రుగ్మతలకు మూలమైన మద్యపానం నుండి జన సామాన్యాన్ని రక్షించడానికి దైవ గ్రంథమైన ఖుర్ఆన్ మరియు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనాలు అంచెలవారీ విధానాన్ని అనుసరించినట్లే వడ్డీ అనే క్రూరాతిక్రూరమైన ఆచారాన్ని రూపుమాపడానికి యుక్తితో, సావధానంతో కూడిన వైఖరిని అనుసరించటం జరిగింది. మొదట్లో ఒక్కసారిగా వడ్డీని నిషేధిస్తున్నట్లు ప్రకటిస్తే ప్రజలకు అది మింగుడు పడేది కాదేమో! అందుకే సకారాత్మకమైన పద్ధతిలో “మీరు సంపదను అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టండి, పేద ప్రజలకు సహాయం చేయండి, బలహీనులను ఆదుకోండి, అగత్యపరుల అవసరాలను తీర్చండి; దయ, జాలి, త్యాగం, దాతృత్వం వంటి ఉన్నత నైతిక సుగుణాలను అలవర్చుకోండి” అని వారిని మానసికంగా సన్నద్ధుల్ని చేయటం జరిగింది.

“మీరు ఎల్లకాలం ఇక్కడ ఉండరు. మీరు నశించినట్లే మీ సిరిసంపదలు కూడా నశిస్తాయి. కాబట్టి అశాశ్వితమైన ఈ ఆస్తిపాస్తుల్ని వెచ్చించి శాశ్వతమైన పరలోక సాఫల్యాన్ని, స్వర్గలోక సుఖాలను సంపాదించండి. ఖారూన్ వంటి ధన పిపాసకులకు పట్టిన గతిని చూసైనా గుణపాఠం నేర్చుకోండి” అంటూ ఒక్కొక్క వాస్తవాన్నీ వారి దృష్టికి తీసుకురావటం జరిగింది.

ఈ ఉపదేశాలు క్రమక్రమంగా ప్రజల మనోభావాలపై ప్రభావం చూపసాగాయి. స్వార్థమే పరమార్థంగా జీవించే ప్రజలు సొసైటీలోని సాటి సోదరుల కష్టాలను సానుభూతితో అర్థం చేసుకోసాగారు. శాశ్వితమైన స్వర్గ సుఖాల ముందు ప్రాపంచిక తళుకు బెళుకులన్నీ అల్పంగా కనిపించసాగాయి. సమాజంలో నిర్మాణాత్మకమైన ఈ కృషి జరిగిన మీదట నిర్దాక్షిణ్యమైన ఈ ‘వ్యాపారాన్ని’ నిషేధించే చట్టం ప్రవేశ పెట్టబడింది. సూరె బఖరాలోని ఈ ఆయతుల (ఆయత్ నెం. 275-280) ద్వారా ఇస్లాంలో వడ్డీ శాశ్వతంగా నిషేధించబడింది.

గతంలో జరిగిందేదో జరిగిపోయిందనీ, ఇక మీదట ఎవరయినా ఈ ఆజ్ఞను లెక్కచేయకపోతే వారు అల్లాహ్ మరియు ప్రవక్తకు బద్ద విరోధులవుతారనీ, అటువంటి వారిపై అల్లాహ్ మరియు దైవప్రవక్త తరఫున యుద్ధ ప్రకటన జరిగినట్లేనని పై వచనాలలో స్పష్టం చేయబడింది. (అల్లాహ్ రక్షించుగాక!)

వడ్డీ సొమ్ము తినేవారి గురించి ఇంతటి తీవ్రమైన హెచ్చరిక రావటం ఆలోచించదగినది. పెద్దపెద్ద పాపాలకు పాల్పడిన వారి కోసం కూడా ఇంతటి తీవ్రమైన హెచ్చరిక రాలేదు. మద్యం సేవించే వారున్నారు, వ్యభిచారం చేసే వారున్నారు; హత్యలు చేసేవారున్నారు. ఇవన్నీ నిషిద్ధాలే. పెద్ద పెద్ద అపరాధాలే. అల్లాహ్ సమక్షంలో ఈ పాపాలకు పాల్పడిన వారికి శిక్ష లభించడమూ తథ్యమే. కాని అల్లాహ్ తరఫున, దైవప్రవక్త తరఫున యుద్ధం ప్రకటించబడే వార్నింగ్ ఒక్క వడ్డీ సొమ్ము తినేవారి విషయంలోనే ఇవ్వబడింది. దీన్ని బట్టి ఇదెంత తీవ్రమైన, అసహ్యకరమైన పాపమో ఊహించవచ్చు. మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రబోధనల ద్వారా కూడా ఇది అత్యంత ఘోరమైన పాపాల జాబితాలో చేర్చబడినట్లు అవగతమవుతోంది. వడ్డీకి ఇచ్చేవారు, వడ్డీ పుచ్చుకునేవారు వడ్డీ లావాదేవీలకు సంబంధించిన దస్తావేజులు వ్రాసేవారు ముగ్గురూ ధూత్కారులుగానే ఖరారు చేయబడ్డారు. మరి కొన్ని ఉల్లేఖనాల ప్రకారం వడ్డీ పాపం వ్యభిచారపు పాపం కన్నా డెబ్బయిరెట్లు అధికమని తెలియవస్తోంది.

‘వడ్డీ కూడా వ్యాపారం లాంటిదేగా’ అని సందేహపడేవారికి, ‘రెండింటి ఉద్దేశ్యం లాభార్జనే కదా!’ అని ప్రశ్నించే వారికి సమాధానం కేవలం హేతుపరంగా ఇస్తే సరిపోదు. ఈ విషయాన్ని భౌతికంగానే కాక ఆధ్యాత్మిక దృష్టితో కూడా పరికించటం అవసరం.

అల్లాహ్ ఆదేశానుసారం ఈ రెండింటి (వడ్డీ-వ్యాపారం)లో భూమ్యాకాశాలంత వ్యత్యాసం ఉంది. పరమ ప్రభువు ఒక దానిని హరామ్ (అధర్మం) గావించగా రెండవ దానిని హలాల్ (ధర్మసమ్మతం)గా ఖరారు చేశాడు. అటువంటప్పుడు రెండూ సమానమెలా అవుతాయి? ఒక వస్తువును సృజించిన వాడే దాని లాభనష్టాలను సరిగ్గా బేరీజు వేయగలుగుతాడు. మరి ఆ సృష్టి కర్త ఒక దానిని హరామ్, మరొక దానిని హలాల్ గా చేశాడంటే హరామ్ గా ఖరారు చేసిన వస్తువులో తప్పకుండా ఏదో ‘కీడు’ ఉండి ఉండాలి. జనసామాన్యానికి ఈ సంగతి బోధపడినా, పడకపోయినా అదంతే. ఎందుకంటే సమస్త విశ్వమండలంలో ఉన్న వస్తువుల వాస్తవిక జ్ఞానం భూమ్యాకాశాలను పరివేష్ఠించి ఉన్న ఆ ప్రభువుకే బాగా తెలుసు. ఆయన జ్ఞాన పరిధికి తాకని వస్తువు అంటూ లేదు. లోకంలోని వ్యక్తులు, సమాజాలకు తమ సొంత లాభనష్టాలు, మంచీ చెబ్బరలు మాత్రమే తెలుసు. సమస్త లోకం యొక్క మంచీ చెబ్బరలను వారు గ్రహించలేరు. కొన్ని వస్తువులు ఒక వ్యక్తికో, ఒక సంఘానికో లాభదాయకంగా కనిపించవచ్చు. అయితే యావత్తు జాతి లేక యావద్దేశానికి అది హానికరం కావచ్చు.

మరొక వాక్యంలో, అల్లాహ్ వడ్డీని మట్టుపెడతాడనీ, దానధర్మాలను వికసింపజేస్తాడని చెప్పబడింది. వడ్డీతో పాటు దానధర్మాలు ప్రస్తావన రావటం ఆశ్చర్యం కల్గిస్తుంది. అయితే ఈ ప్రస్తావన ఒక ప్రత్యేక దృక్పథంతో తీసుకురాబడింది. వాస్తవానికి వడ్డీ మరియు దానధర్మాలు (సదఖాత్) పరస్పర విరుద్ధమైనవి. రెండింటి పరిణామాలు కూడా పరస్పర వ్యాఘాతమైనవి. సాధారణంగా ఈ రెండు పనులు చేసేవారి ఉద్దేశ్యాలు, లక్ష్యాలు కూడా ఒక దానితో ఒకటి సమన్వయం చెందవు.

దానధర్మాలు ఎదుటివారి నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా చేయబడతాయి. వడ్డీ దీనికి భిన్నమైనది. ఎలాంటి మొహమాటం లేకుండా ఎదుటివారి నుండి వడ్డీ సొమ్ము రాబట్టడం జరుగుతుంది. రెండు పనులు చేసేవారి సంకల్పంలో వైరుధ్యం ఎందుకు ఉందంటే దానమిచ్చేవాడు పుణ్యార్జన లక్ష్యంతో, అల్లాహ్ మెప్పును పొందే ఉద్దేశ్యంతో ఇస్తాడు. ఈ పవిత్ర ఆశయం కోసం అతడు తన ఐశ్వర్యం కర్పూరంలా కరిగిపోయినా చింతించడు. కాని వడ్డీ పుచ్చుకునేవాడు!? అతడు పొద్దస్తమానం దొడ్డిదోవలో సంపదను పోగు చేసేందుకు తహతహలాడుతుంటాడు. అందుకే. అటువంటి సంపదను అల్లాహ్ అసహ్యించుకుంటాడు. ఈ కారణంగా ఈ సంపదలోని శుభం లేక వికాసగుణం (బరకత్) మటుమాయమైపోతుంది. కాగా; సదఖాలు (దానధర్మాలు) చేసేవారి ఆస్తిలో అల్లాహ్ శ్రేయో వికాసాలను పుష్కలంగా పొందుపరుస్తాడు.

వడ్డీని రూపుమాపి దానధర్మాలను వికసింపజేయడంలోని ఆంతర్యం ఏమిటీ? అన్న ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. రూపుమాపడం లేదా వికసింపజేయటం అన్నది పరలోక ప్రతిఫలం దృష్ట్యా చెప్పబడిందని కొంత మంది విద్వాంసులు అభిప్రాయపడ్డారు. అంటే వడ్డీ తినేవాడి సొమ్ము పరలోకంలో ఎంత మాత్రం అతనికి ఉపయోగపడదనీ, పైగా అది అతని పాలిట విపత్తుగా పరిణమిస్తుందని, అదే దానధర్మాలు చేసేవారికి అవి పరలోకంలో శాశ్వత అనుగ్రహాలకు, స్వర్గలోక సుఖాలకు పాత్రుల్ని చేస్తాయని పండితులు వివరించారు. సర్వసాధారణంగా విద్వాంసులు దీనిపై చేసే వ్యాఖ్య ఇలా ఉంది: వడ్డీని రూపు మాపటం, దానాలను వికసింపజేయటం పరలోకం దష్ట్యా ఎలాగూ ఉంది. అయితే దాని గుణం ఎంతో కొంత ఈ లోకంలోనే కనిపిస్తుంది.

ప్రజల కడుపులు కొట్టి సంపాదించే ఈ అధర్మమైన సొమ్ము అట్టే కాలం నిలవదు కూడా. పెద్ద పెద్ద కోటీశ్వరులు, వడ్డీ వ్యాపారులు చూస్తుండగానే దివాలా తీసి రోడ్డున పడటం చూస్తుంటాము. అంటే; వడ్డీలేని వ్యాపారాలకు నష్టం రాదని కాదు. వ్యాపారంలో లాభనష్టాలు సహజం. కాని శిఖరాగ్రాన ఉన్నవారు ఒక్కసారిగా అధఃపాతాళానికి పడిపోవటం, నిన్న కోటీశ్వరుడిగా ఉండి నేడు ఒక్కొక్క రూపాయి కోసం దేవురించటం వంటి ఉదాహరణలు మనకు వడ్డీ లావాదేవీల్లో, జూదం పట్టాల అడ్డాలలోనే కనిపిస్తాయి. ఈ సొమ్ము ఎంత శీఘ్రంగా పెరిగినా దీర్ఘకాలం నిలవదు. ఈ పాడు సంపద వారసులకు అచ్చిరాదు. సాధారణంగా ఏదో ఒక విపత్తు వచ్చి కూడబెట్టిన దాన్ని కాస్తా హరించివేస్తుంది.

ఒకవేళ ఆ సంపద వృధా అవుతున్నట్టు పైకి కనిపించకపోయినా దాని లాభాలకు, శుభాలకు మనిషి దూరం అవటం తథ్యం. ఎందుకంటే అధర్మమార్గాల ద్వారా సొమ్మును కూడబెట్టే వ్యక్తి పన్నుల మినహాయింపు నుండి బయట పడేందుకు డొంకదారులు వెతుకుతాడు. స్టేటస్ కోసం వెండీ బంగారాలను, వజ్ర వైఢూర్యాలను సమీకరిస్తాడు. వాటి మూలంగా నిజానికి అతడికి చేకూరే లాభం ఏమీ ఉండదు. వజ్రవైఢూర్యాలు ఆకలి దప్పులు తీర్చవు. ఎండ వేడిమి నుంచీ, చలి తీవ్రత నుంచి అవి అతన్ని కాపాడలేవు. పైగా వాటిని భద్రపరచడానికి నానా కష్టాలు పడాలి. మానసిక ఉద్రిక్తతను అనుభవించాలి.

నిజం చెప్పాలంటే మనిషికి శాంతిని, తృప్తినీ, హాయినీ, గౌరవాన్ని ప్రసాదించే ఐశ్వర్యమే సిసలైన ఐశ్వర్యం. అతని ఐశ్వర్యం అతని జీవితానికి సార్ధకతను చేకూర్చగలగాలి. తన ఆస్తి వల్ల తనకు కలిగిన లాభమే తన సంతతికి కూడా కలగాలని మనిషి అభిలషిస్తాడు. అతని ఈ అభిలాష ఎంతో సహజం కూడా. వాస్తవానికి ఈ సుఖశాంతులు ఎవరికయినా వారి ఆస్తి వల్ల ప్రాప్తిస్తే అది కొద్ది ఆస్తి అయినప్పటికీ ఎంతో విలువైనది, శుభవంతమైనది. నిజానికి శుభము, సమృద్ధి అంటే ఇదే. మరే వ్యక్తి ఈ శుభానికి నోచుకోకుండా పోతాడో అతడి సంపద పరిమాణం రీత్యా చాలా ఎక్కువే అయినప్పటికీ యదార్థానికి అది తరిగిపోయింది.

పైకి అది పెరుగుతున్నట్లు కానవస్తుంది. కాని అది పెరుగుదల కాదు. అది బలుపు కాదు వాపు. వ్యాధి మూలంగా ఒక్కొక్కప్పుడు మనిషి శరీరం విపరీతంగా బరువు పెరుగుతుంది. వివేకవంతుడైన మనిషి ఎవరూ ఆ ‘బరువు’ ను ఆరోగ్యానికి ఆనవాలుగా భావించడు. ఎందుకంటే ఈ ‘పెరుగుదల’ వినాశానికి సంకేతం అని అతనికి తెలుసు. వడ్డీ సొమ్ము పరిస్థితి కూడా ఇంతే. వడ్డీని ఆర్జించే వాని సంపద ఎంతగా పెరుగుతున్నట్టు కానవచ్చినా దాని శ్రేయోవికాసాలకు అతడు నోచుకోకుండా పోతాడు.

ఇక్కడ కొంతమందికి సందేహం కలుగవచ్చు. నేటి వడ్డీ వ్యాపారులు ఆనంద డోలికల్లో తేలియాడుతున్నారే! వారు పెద్ద పెద్ద మేడల్లో, ఎయిర్ కండీషన్డ్ భవనాలలో సేద తీరుతున్నారే! సుఖ సౌఖ్యాలనిచ్చే సకల వస్తు సామగ్రి వారి వద్దనే ఉంది కదా! అవసరానికి మించిన నౌకర్లు వారి దగ్గరే ఉన్నారు. కోరుకున్న రాజభోగాలు అన్నీ వారి స్వంతమై ఉన్నాయి. మరి అటువంటప్పుడు వాళ్ళు ఈ సొమ్ము నుండి లబ్ది పొందడం లేదని ఎలా అంటారు? అని ప్రశ్నించవచ్చు.

అయితే ఇక్కడ విస్మరించరాని విషయం ఒకటుంది. సౌఖ్య సామగ్రి వేరు ‘సౌఖ్యం’ వేరు. సౌఖ్యాన్నిచ్చే సామగ్రి కర్మాగారాల్లో తయారయి, మార్కెట్లలో అమ్ముడు అవుతుంది. కాని ‘సౌఖ్యం’ అనేది ఉంది చూశారు, అది ఏ ఫ్యాక్టరీలోనో తయారు కాదు. అది ఏ మార్కెట్టులోనో విక్రయించబడదు. అది పరమ ప్రభువు తరఫున ప్రసాదించబడే ‘దయానుగ్రహం’. అది ఎంత ఖరీదైనదంటే మనిషి తన దగ్గరున్న సర్వస్వాన్ని అర్పించి కూడా కొనలేకపోతాడు. ఒక్క నిద్ర ప్రసాదించే సుఖాన్నే తీసుకోండి. దాన్ని పొందడం కోసం మనిషి ఖరీదైన బంగళా కట్టగలడు. ఖరీదైన ఫర్నీచర్ను సమకూర్చుకోగలడు. సుతిమెత్తని పరుపులను, కళ్ళు చెదిరే కార్పెట్లును కొనగలడు. గాలి, వెలుతురు నిరంతరాయంగా ఉండే ఉద్దేశ్యంతో జనరేటర్ను కూడా తెచ్చుకోవచ్చు. కాని ఇంత చేసినా ఆ ఇంటి యజమానికి తియ్యని నిద్ర పట్టగలదని గ్యారంటీ ఏమైనా ఉందా? ఎంత మాత్రం లేదు. మీకు నమ్మకం కుదరకపోతే సౌఖ్య సామగ్రిని పుష్కలంగా సమకూర్చుకున్న వారి గురించి సర్వే చేయండి. వేలాది మంది మీకు నెగటివ్ సమాధానమిస్తారు. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల ప్రజల్లో 75 శాతం మంది నిద్ర మాత్రలు మింగి పడుకుంటారని నివేదికలు తెలుపుతున్నాయి. కొన్ని సందర్భాల్లో నిద్రమాత్రలు కూడా పని చేయమని మారాం చేస్తాయి. ఇతరత్రా సుఖాల సంగతి కూడా ఇంతే. మీరు డబ్బులు తగలెట్టి విలాస సామగ్రిని కొనుక్కురావచ్చు. కాని విలాసవంతమైన ఆ జీవితం మీకు ప్రాప్తించే ష్యూరిటీ లేదు.

ఈ పూర్వరంగంలో విషయాన్ని పరికిస్తే మీకే బోధపడుతుంది – వడ్డీ కాముకుల అంగట్లో అన్నీ ఉంటాయి గాని వారికి కావలసిన సుఖం, శాంతి, తృప్తి మాత్రం కరువైపోతాయని! వారు కోటిని కోటిన్నరగా, కోటిన్నరని రెండు కోట్లుగా మార్చాలని పరితపిస్తుంటారే తప్ప తమ ఆయురారోగ్యాల చింత కూడా వారికి ఉండదు. ఆలుబిడ్డలు వారితో కొన్ని క్షణాలైనా గడపాలని పరితపించిపోతుంటారు. కాని ఆ మధుర క్షణాల కోసం కూడా వారికి టైం దొరకదు. ఫ్లైట్ల కోసం పరుగులు తీస్తుండటం, గాల్లో విహరించటంలోనే వారి జీవిత కాలం గడచిపోతుంది. ఆ విధంగా వారు సుఖపడే సామగ్రినయితే ప్రోగు చేస్తారు. కాని సుఖాన్ని ఆస్వాదించలేకపోతారు.

పోనీ వాళ్ళు స్వయంగా సుఖపడకపోతే పోనివ్వండి. తమ ఉనికి ద్వారా వారు ఇతరులకు ప్రయోజనం ఏమైనా చేకూర్చుతారా అంటే అదీ ఉండదు. వడ్డీ సొమ్మును కూడబెట్టే అత్యాశ వాళ్ళను కఠిన మనస్కులుగా మార్చివేస్తుంది. వారి గుండెల్లోంచి దయ, జాలి, కనికారం మటుమాయమైపోతాయి. ఎంతసేపటికీ అభాగ్య జీవుల బలహీనతను సొమ్ము చేసుకుని వాళ్ళ రక్తాన్ని పీల్చి తమ శరీరాన్ని పోషించుకోవడమే వారి పరమావధి అయి ఉంటుంది. అందుచేత సొసైటీలోని ప్రజల హృదయాల్లో వారి పట్ల గౌరవభావం లేశమైనా ఉండదు. మన దేశంలోని వడ్డీ వ్యాపారస్తులను గానీ, అమెరికా బ్రిటన్ల లోని వడ్డీ కుబేరులైన యూదుల చరిత్రను గానీ తరచి చూస్తే. మీకు అవగతమవుతుంది -వారి లాకర్లలో క్వింటాళ్ళ కొద్దీ బంగారు వెండి వజ్రాలుండవచ్చుగాక! కాని ప్రపంచంలో ఎక్కడా, మానవ సముదాయాల్లో ఏ మూలన కూడా ఈ ‘అయ్యవార్ల’కు పరువు ప్రతిష్ఠ ఉన్నట్లు కనిపించదు. పైగా ఈ కుబేరుల పట్ల పేద ప్రజల్లో అసూయాద్వేషాలు ఏర్పడి వర్గ సంఘర్షణకు దారితీస్తాయి. 20వ శతాబ్దిలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన వర్గ సంఘర్షణలకు కారణం ఈ అసూయాద్వేషాలేనన్నది జగమెరిగిన సత్యం. కార్మిక వర్గానికీ పెట్టుబడిదారీ వర్గానికీ మధ్య సాగిన ఈ సంఘర్షణే ప్రపంచాన్ని రెండు బ్లాకులుగా నిలువునా చీల్చివేసింది. ఒక నకారాత్మక (Negative) ధోరణి నుండి పుట్టుకు వచ్చిన సిద్ధాంతం మరో నకారాత్మక పుంతను తొక్కి భీకర రూపం దాల్చింది. తత్ఫలితంగా యావత్ప్రపంచమే రణరంగానికి, నరమేధానికి నిలయమైపోయింది. దీనికంతటికీ మూలకారణం ఏమిటీ? అత్యాశకు పోయిన ధనికులకు కనీసావసరాలకు నోచుకోని అభాగ్య జీవులకు మధ్య ఏర్పడిన అంతులేని అగాధం కాదా? ఈ అగాధానికి మూలం అక్రమ సముపార్జన కాదా?

రక్తం పీల్చే ఈ జలగల మరో ఉపమానం ఇలా ఉంటుంది – పేద ప్రజల రక్తాన్ని పీల్చి తమ వల్లు పెంచుకునే ఈ ఆసాముల సమూహం ఒకటి ఒకచోట ఒక కాలనీని నిర్మించుకుంటే, వీక్షించదలచే వారికి అది అందంగా కానవస్తుంది. అక్కడ నివసించే వారంతా ఆరోగ్యవంతులుగా ఉంటారు. వారి వాకిళ్ళు పచ్చగా నిగనిగ లాడుతుంటాయి. మరి ఈ ఒక్క వాడను చూచి ఇది దేశప్రగతికి ప్రతిబింబం అనాలా? మంచినీ, మానవత్వాన్ని కాంక్షించేవారు ఈ ఒక్క కాలనీని చూసి మురిసిపోరు. అల్లంత దూరాన ఈ అయ్యవార్ల దోపిడీకి గురై పూరి గుడిసెల్లో నివసిస్తున్న పేద ప్రజల పాట్లను కూడా వారు చూడదలుస్తారు. ఈ స్థితిని వారు ప్రగతికి ప్రతీకగా కాక మానవత్వాన్ని మంటగలిపే పోకడగా అభివర్ణిస్తారు.

తద్భిన్నంగా సదఖాలు ఇచ్చే వారినీ, దానధర్మాలు చేసే వారిని చూడండి – వారు ధనార్జన కోసం నిద్రాహారాలు మానేసి పరుగులు తీయరు. వారెంతో స్థిమితంతో ఉంటారు. తమకు లభించిన దానితోనే సంతృప్తి చెంది అందులోంచి కూడా హక్కుదారుల హక్కును తీసి ఉంచుతారు. తత్ఫలితంగా వారు ప్రశాంతంగా జీవితం గడపటంతో పాటు బడుగు ప్రజల శుభాశీస్సుల్ని అందుకుంటూ ఉంటారు. అల్లాహ్ “వడ్డీని నశింపజేసి దాన ధర్మాలను వికసింపజేయటం” అంటే ఇదే.

“మీ బాకీదారుడు ఆర్థిక ఇబ్బందులలో ఉంటే అతని పరిస్థితి మెరుగుపడే వరకు గడువు ఇవ్వండి లేదా ఆ రుణాన్ని మాఫీ చేయండి. మీరు తెలుసుకోగలిగితే ఇదే మీ కొరకు మేలైనది. “ అని అనబడింది.

‘వడ్డీ’ని ‘నిషిద్ధం’గా ఖరారు చేసిన తరువాత అల్లాహ్ ముస్లింలకు చేసిన సూచన ఇది. ఈ నిషేధాజ్ఞ రాకపూర్వం అరబ్బులు తమ బాకీదారుడు ఆర్థిక సమస్యల వల్ల గడువు లోపల బాకీ చెల్లించకపోతే రావలసిన వడ్డీని అసలు కింద జమ చేసుకొని వడ్డీపై వడ్డీ (చక్రవడ్డీ)ని వసూలు చేస్తుండేవారు.

రాజాధిరాజు అయిన అల్లాహ్ ఈ విషయమై శాశ్వతంగా చట్టం ప్రవేశపెట్టి, రుణగ్రస్తుడు దారిద్ర్య స్థితికి లోనై రుణం చెల్లించలేకుండా ఉన్న పక్షంలో అతన్ని వేధించటం ధర్మ సమ్మతం కాదనీ, స్థితిమంతుడయ్యే వరకు అతనికి గడువు ఇవ్వవలసిందేనని నిర్ణయించాడు. పైపెచ్చు ఆ బాకీదారుణ్ణి పెద్ద మనస్సుతో మన్నించి వదలివేస్తే అది మీ పాలిట శ్రేయస్కరమని ప్రోత్సహించటం జరిగింది.

ఇక్కడ ఈ రకమైన ‘మాఫీ’నిసదఖా’తో పోల్చడం జరిగింది. అంటే వడ్డీని వదలి వేయటమేగాక రావలసిన అసలు విషయంలో కూడా చేతులు దులుపు కోవటం అన్నమాట! పైకి ఇది రుణదాతలకు నష్టకరంగానే అగుపిస్తుంది. కాని ఖుర్ఆన్ మాత్రం దీనిని ‘శుభకరం’గా అభివర్ణించింది. ఈ శుభం (మేలు) రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి: మూన్నాళ్ళ ఈ జీవితం ముగిసిన తరువాత అతను వదలుకున్న కొద్దిపాటి సొమ్ముకు బదులుగా శాశ్వితమైన స్వర్గానుగ్రహం అతనికి ప్రాప్తిస్తుంది. రెండు: అతని మన్నింపుల వైఖరి యొక్క శుభపరిణామం ఈ లోకంలోనే కొంత అడ్వాన్సుగా అతనికి కనిపిస్తుంది. ఉదాహరణకు:- అతని దగ్గర ఉన్న సొమ్ము పరిమితమే కావచ్చు. కాని వృధా ఖర్చుల నుండి, అనూహ్యమైన విపత్తుల నుండి అల్లాహ్ అతన్ని రక్షిస్తాడు. రోగాలు, మందులు మాకుల పేరిట, డాక్టర్ల ఫీజుల పేరిట అక్రమార్కుల సొమ్ము లక్షల్లో కరిగిపోగా, సామాన్యజనులు చాలా స్వల్ప మొత్తంలోనే స్వస్థతను పొందుతుంటారు. ఇలాంటి ఉదాహరణలు కొందరికి శుష్క ప్రియాలుగా కన్పించవచ్చునేమోగాని దైనందిన జీవితంలో లెక్కకు మించిన ఇలాంటి ఉపమానాల్ని మనం చూస్తుంటాము.

దారిద్ర్య స్థితిని ఎదుర్కొంటున్న రుణగ్రస్తుని యెడల మృదు వైఖరిని అవలంబించే వారికి హదీసులలో కూడా శుభవార్త వినిపించబడింది. తబ్రానీలోని ఒక హదీసులో ఉంది :

“ఏ వ్యక్తి అయితే ఎవరికీ ఏ నీడా లభించని రోజున అల్లాహ్ కారుణ్య ఛాయ తనకు లభించాలని కోరుకుంటాడో అతడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రుణగ్రస్తుని పట్ల మృదువుగా మెలగాలి లేక అతన్ని మన్నించి వదలి పెట్టాలి”.

మరొక హదీసులో ఇలా ఉంది:-

“ఎవరయితే తన ప్రార్థనలు స్వీకరించబడాలనీ, తన కష్టాలు దూరం కావాలని కోరుకుంటున్నాడో అతడు కష్టాల్లో ఉన్న తన బాకీదారుడికి మరింత గడువును ఇవ్వాలి”.

సహీహ్ ముస్లింలోని ఒక హదీసు ఇది:

“ఎవరయితే ఒక పేద రుణగ్రస్తుడికి గడువు ఇస్తాడో అతనికి ప్రతి రోజూ అతనిచ్చిన రుణానికి సమానంగా దానధర్మాల పుణ్యం లభిస్తూ ఉంటుంది. ఒక గడువు ముగిసే వరకూ పుణ్యం ఈ లెక్కన లభిస్తూ ఉంటుంది. నిర్ణీత గడువు ముగిసే నాటికి రుణగ్రస్తుడు రుణాన్ని తీర్చలేని స్థితిలో ఉండి, రుణదాత మరికొంత గడువును ఇస్తే అట్టిపరిస్థితిలో రెట్టింపు మొత్తం దానమిచ్చిన పుణ్యం ప్రాప్తిస్తుంది.” (సహీహ్ ముస్లిం, ముస్నద్ అహ్మద్)

వడ్డీ యొక్క వాస్తవికతను తెలుసుకోవడానికి దివ్య గ్రంథంలోని ఇతర వచనాలను కూడా ఇక్కడ ప్రస్తావించటం అవసరం.

“విశ్వసించిన ప్రజలారా! ఇబ్బడిముబ్బడిగా పెరిగే ఈ వడ్డీని తినటం మానండి. అల్లాహ్ కు భయపడండి. మీరు సాఫల్యం పొందే అవకాశం ఉంది.” (ఆలి ఇమ్రాన్ 3:130)

పై వచనంలో “ఇబ్బడి ముబ్బడిగా పెరిగే” అనే ప్రత్యేక పదం వాడబడింది. పూర్వం అరేబియాలో ఒక నిర్ణీత గడువు కొరకు వడ్డీపై అప్పు ఇచ్చి గడువు ప్రకారం అప్పు తీర్చకపోతే రుణగ్రస్తునికి మరికొంత గడువు ఇచ్చేవారు. అయితే అదనపు గడువునకుగాను అదనపు వడ్డీని విధించేవారు. మలిసారి గడువు ముగిసేనాటికి రుణం వసూలు కాకుంటే వడ్డీ శాతం మరింతగా పెంచబడేది. ఆ విధంగా ఒకవైపు రుణదాతకు ఇబ్బడిముబ్బడిగా వడ్డీ సొమ్ము వచ్చి పడుతుంటే మరోవైపు వడ్డీ భారంతో రుణగ్రస్తుని నడ్డి విరిగిపోతుండేది.

నిసా సూరాలో ఈ విధంగా సెలవీయబడింది

“యూదుల ఈ దుర్మార్గ వైఖరి వల్లనూ, వారు ఎక్కువగా అల్లాహ్ మార్గంలో ఆటంకాలు సృష్టిస్తున్నందువల్లనూ, వారికి నిషేధించబడిన వడ్డీని తీసుకుంటున్నందువల్లనూ, అధర్మంగా ఇతరుల సొమ్మును కబళిస్తున్నందువల్లనూ మేము వారి కొరకు పూర్వం ధర్మ సమ్మతములైన ఎన్నో పరిశుద్ధమైన వస్తువులను నిషిద్ధాలుగా చేశాము. వారిలో అవిశ్వాసులుగా ఉన్న వారి కొరకు మేము వ్యధాభరితమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాము.” (అన్ నిసా – 160,161)

దైవప్రవక్త హజ్రత్ మూసా (అలైహిస్సలాం) గారి షరీయత్లో కూడా ‘వడ్డీ’ అధర్మంగా ఖరారయినట్టు పై రెండు వచనాల ద్వారా రూఢీ అవుతోంది. ఈ ఆదేశాన్ని ధిక్కరించి, ప్రాపంచిక వ్యామోహంలో యూదులు వడ్డీ సొమ్మును తినసాగితే అల్లాహ్ ఆగ్రహం చెంది కొన్ని హలాల్ వస్తువులు సయితం వారి కొరకు ‘హరామ్’ చేసేశాడు.

ఈ చర్చను మూడు భాగాలుగా విభజించవచ్చు.

(a) ఖుర్ఆన్ హదీసులలో వడ్డీ వాస్తవికత ఏమిటీ?
(b) వడ్డీ నిషేధించబడటంలోని ఔచిత్యం ఏమిటీ?
(c) వడ్డీ ఎంత నికృష్టమైనదైనా అది నేటి ఆర్థిక వ్యవస్థలో, వాణిజ్య రంగంలో అవిభాజ్యమైన అంశంగా మారిపోయింది కదా! ఖుర్ఆన్ ఆదేశాల ప్రకారం దాన్ని విడనాడితే బ్యాంకింగ్ వ్యవస్థ నడిచేదెలా?

(అ) అరబీ భాషలో వడ్డీ కొరకు వాడబడిన పదం ‘రిబా‘. మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రభవించక పూర్వం కూడా అరేబియా ప్రాంతంలో ఈ పదం వ్యవహారంలో ఉంది. కేవలం వ్యవహారంలో ఉండటమే కాదు, ప్రజలు ‘రిబా’ ప్రాతిపదికన లావాదేవీలు ముమ్మరంగా జరిపేవారు. అంతెందుకు, తౌరాత్ గ్రంథం అవతరించిన కాలంలో (దైవ ప్రవక్త మూసా అలైహిస్సలాం హయాంలో) కూడా యూదులు వడ్డీ కార్యకలాపాలు కొనసాగిస్తుండగా అది ‘హరాం’ గావించబడిందని సూరె నిసాలోని ఆయతుల ద్వారా బోధపడుతోంది. తేలిందేమంటే అరబ్బులకు ‘రిబా’ అనే పదం కొత్తకాదు. అందుచేతనే ‘రిబా’ సొమ్మును తినటం హరాం (అధర్మం) అని హిజ్రీ 8వ ఏట ఖుర్ఆన్లో ఆజ్ఞ అవతరించినపుడు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సహచరులకు దాని తఫ్సీర్ లను (వడ్డీ గురించిన వివరాలను) విడమరచి చెప్పవలసిన పరిస్థితి ఏర్పడలేదు. ఏ విధంగా నయితే మద్యపానాన్ని నిషేధించగానే ప్రవక్త సహచరులు దాన్ని తు.చ. తప్పకుండా పాటించారో అదే విధంగా వడ్డీ (రిబా) నిషేధాజ్ఞలు రాగానే వారు వడ్డీ లావాదేవీలన్నిటినీ త్యజించారు. ఆనాటికి ముస్లిమేతర సోదరుల నుండి తమకు రావలసి ఉన్న భారీ మొత్తాన్ని సయితం ముస్లింలు వదులుకున్నారు.

చెప్పవచ్చిందేమంటే వడ్డీ నిషేధాజ్ఞలు వచ్చిన కాలంలో దానికి సంబంధించిన మతలబులు ఏమీ గుట్టుగానో లేక అనిర్వచనీయంగానో ఉంచబడలేదు. ప్రజా జీవితాల్లో పాతుకుపోయి వున్న వడ్డీ (రిబా)నే ఖుర్ఆన్ నిషిద్ధంగా ప్రకటించింది. మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) దీనిని కేవలం ఒక నైతిక కట్టడిగా గాకుండా ‘ఒకదేశ చట్టం’గానే ప్రవేశపెట్టారు. కాకపోతే రెండవ ఖలీఫా హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కాలంలో కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఆ చట్టం అన్వయింపుకు సంబంధించిన కొన్ని చిక్కులు ఎదురై షరియత్ కోవిదులలో ద్వంద్వాభిప్రాయాలు వినిపించాయి, అది వేరే విషయం! అయితే రిబా (వడ్డీ) హరాం అనే విషయంలో మాత్రం ఎవరికీ ఎలాంటి సందేహంగానీ, భేదాభిప్రాయంగానీ లేదు. వివరాల్లోకి పోతే సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాలను తరచి చూడవలసి ఉంటుంది. విషయం లోతుల్లోకి పోవటం మా ఉద్దేశ్యం కాదు. వడ్డీ మూలంగా సమాజంలో జనించే ఆర్థిక, సామాజిక, ఆధ్యాత్మిక కీడులను స్థూలంగా పాఠకుల ముందుంచి, అల్లాహ్ ఆజ్ఞల్ని అనుసరించటంలో దాసుల ఇహపర సాఫల్యాలు ఇమిడి ఉన్నాయని తెలుపడమే ఈ చిరు పుస్తకం ఉద్దేశ్యం.

సారాంశం ఏమిటంటే (1) అప్పుగా ఇచ్చి దానిపై లాభం లేక అదనపు మొత్తం పొందజూడటం వడ్డీ అవుతుంది. (2) ఈ వడ్డీ అధర్మమని ఖుర్ఆన్ హదీసులు స్పష్టం చేయగానే మహాప్రవక్త సహచరులు నిస్సంకోచంగా దీనిని విడనాడారు. ఈ విషయంలో వారు ఎలాంటి ఊగిసలాటకు లోను కాలేదు. (3) క్రింద పేర్కొనబడిన వస్తువులు లావాదేవీలు జరిపినపుడు సరిసమానంగా ఇచ్చి పుచ్చుకోవాలి, ఒకవేళ వాటిలో హెచ్చుతగ్గులు చేస్తే అది కూడా వడ్డీ క్రిందికి వస్తుంది. అవేమంటే; (1) బంగారం, (2) వెండి, (3) గోధుమలు, (4)జవలు, (5) ఖర్జూరం, (6) ద్రాక్ష.

నేడు ఏ వడ్డీనయితే మానవ ఆర్థికాంశానికి కీలకంగా భావించబడుతున్నదో అది ఖుర్ఆన్ హదీసుల ప్రకారం నిషిద్ధం. ఈ విషయంలో ద్వంద్వాభిప్రాయానికి తావులేదు. దీని నిషిద్ధం గురించి 7 ఖుర్ఆన్ వచనాలు, 40కి పై చిలుకు ప్రవక్త ప్రవచనాలు సాక్షిగా ఉన్నాయి.

(b) ఇక ఈ వడ్డీ నిషేధించబడటంలోని ఔచిత్యం లేక పరమార్థం ఏమిటి? ఏ కారణంగా దీనిపై వేటు వేయబడింది? ఏ కారణంగా ఇది శాపగ్రస్తమైన వ్యవస్థగా భావించబడింది? ఇందులో గల ఆధ్యాత్మిక లేక ఆర్థిక కీడు ఏమిటి? అన్న విషయానికి వద్దాం.

ఇక్కడ మనం ఒక విషయాన్ని ప్రశాంత మనస్సుతో అర్థం చేసుకోవాలి. అదేమంటే ప్రపంచవ్యాప్తంగా ప్రజా బాహుళ్యంలో ప్రవేశపెట్టబడిన ఏ ఒక్క వస్తువులో కూడా ఏదో ఒక్క మేలు ఉండకపోదు. ఆఖరికి పాము, తేలు లాంటి విషపూరిత జంతువుల్లో, తోడేళ్లు, సింహాల వంటి క్రూర జంతువుల్లో కూడా లోక కళ్యాణానికి ఉద్దేశించిన బాగోగులు ఎన్నో కొన్ని ఉంటాయి. మానవుడు తొక్కే అడ్డదారుల్లో, వినాశకర పోకడల్లో కూడా ఏదో ఒక లాభం తప్పకుండా దాగి ఉంటుంది. అయితే ఏ మతమైనా, మరే మానవ సమాజమైనా, ఇంకే ఇతర సైద్ధాంతిక వర్గమైనా అతి తక్కువ నష్టాలతో సరిపెట్టి అత్యధిక లాభాలనిచ్చే వస్తువునే లాభకరమైన వస్తువు లేదా మేలైన వస్తువుగా పరిగణిస్తుంది. ఉదాహరణకు:- ఖుర్ఆన్ మద్యపానాన్ని నిషేధిస్తూ, ఇది ఘోరమైన పాపాలకు మూలమనీ, అయితే ఇందులో ప్రజల కోసం ఎంతో కొంత లాభం కూడా ఉందని చెప్పింది. కాని ఇందలి కీడు ఇందలి మేలు కన్నా చాలా ఎక్కువ అని స్పష్టం చేసింది. కాబట్టి నష్టాల ఆధిపత్యం వేటిలోనయితే ఉంటుందో వాటినల్లా నష్టకరమైనవిగానే పరిగణించి వాటికి దూరంగా ఉండటం శ్రేయస్కరం.

వడ్డీ పరిస్థితి కూడా అంతే. వడ్డీ సొమ్ము తినేవాడికి అది తాత్కాలికంగా లాభకరంగా కనిపించవచ్చు. అయితే దాని ఐహిక, పారలౌకిక అనర్థాలు అతనికి వచ్చిన లాభం కన్నా ఎన్నోరెట్లు అధికమై ఉంటాయి. ఏదేని ఒక వస్తువు తృటిలో ప్రయోజనం చేకూర్చి దీర్ఘకాలిక ప్రయోజనాలను దెబ్బతీస్తుందని తెలిసినపుడు వివేకవంతుడైన వ్యక్తి ఎవడూ ఆ వస్తువును లాభకరమైన వస్తువుల జాబితాలో చేర్చడు. పైగా దానిని నష్టాల జాబితాలోనే వ్రాసుకుంటాడు. అదే విధంగా ఒక వస్తువు ఒక వ్యక్తికి మేలు చేకూర్చి సమాజం మొత్తానికి హాని కలిగిస్తుందని తెలిసినపుడు విజ్ఞుడైన మనిషి ఎవడూ దానిని మేలైన వస్తువుగా ఖరారు చేయలేడు. దొంగతనం లేక దొమ్మీ వల్ల ఒక వ్యక్తి లేక ఒక ముఠా లాభం పొందవచ్చు. కాని ఈ కీడు యొక్క ప్రభావం మొత్తం సమాజంపైనే పడుతుంది. సమాజమంతటా భయోత్పాతం నెలకొంటుంది. అందుచేత ఎవరూ దొంగతనాన్ని, దొమ్మీలను మంచివిగా తలపోయరు.

ఈ ఉపోద్ఘాతం తర్వాత మీరు వడ్డీ సమస్యపై దృష్టిని సారించండి. కాస్త నిదానంగా ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. వడ్డీని ఆర్జించే వాడికి తాత్కాలిక లాభాలకన్నా అతనికి వాటిల్లే ఆధ్యాత్మిక, నైతిక దివాలా చాలా తీవ్రంగా ఉంటుందని, మంచిని, మానవత్వాన్ని కాంక్షించే మనుషుల జాబితాలో ఆ వ్యక్తికి చోటు లేకుండా పోతుంది. అతనికొక్కడికి వచ్చే లాభం సమాజాన్నంతటినీ భారీ నష్టంలో పడదోస్తుంది. కాని విచారకరమైన విషయం ఏమిటంటే లోకంలో ఏదైనా ఒక వస్తువు చెలామణిలోకి వచ్చేస్తే దాని మేళ్లు మాత్రమే ప్రజల కంటికి కనిపిస్తుంటాయి. కీడులు మాత్రం కంటికి ఆనవు.

నేటి ఆధునికయుగంలో వడ్డీ ఒక అంటువ్యాధిలా ప్రబలి, యావత్తు ప్రపంచాన్ని చుట్టు ముట్టేసింది. అది మానవ అభిరుచి పై ఎంత తీవ్రమైన ప్రభావం చూపిందంటే దాని వాతన పడిన వారు చేదైన దానిని తియ్యనిదిగా నమ్ముతున్నారు. సమస్త మానవాళి ఆర్థిక వినాశానికి హేతువు అయిన వస్తువు (వడ్డీ) ఆర్థిక సమస్యల పరిష్కారమార్గంగా పరిగణించబడుతోంది. ఇలాంటి పరిస్థితిలో ఏ ఆలోచనాపరుడైనా లేక ఏ ఆర్థికవేత్త అయినా ఈ వడ్డీకి వ్యతిరేకంగా నినదిస్తే అతన్ని పిచ్చివాడిగా జమకట్టేస్తారు.

కాని ఒక విషయాన్ని విస్మరించరాదు – ఒక దేశంలో ఒక అంటువ్యాధి ప్రబలిపోయి దాని చికిత్స అంతగా ప్రభావం చూపకపోవటాన్ని చూసి ఏ డాక్టరైనా ఆ వ్యాధిని వ్యాధిగా పరిగణించకుండా దాన్నే ఒక ఔషధంగా,పరిష్కార మార్గంగా సూచించాడనుకోండి. ఆ డాక్టరును డాక్టరని అంటారా! అతడు డాక్టర్ కాడు. నరరూప రాక్షసుడు, ప్రవీణుడైన డాక్టర్ అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికైనా వ్యాధిని వ్యాధిగానే తలపోస్తాడు. వ్యాధి నివారణను సూచిస్తాడు.

దైవ ప్రవక్తలు (అలైహిముస్సలాం) మానవ సంస్కరణకు బాధ్యులుగా ఉండేవారు. ఎవరు తమ మాటను ఖాతరు చేసినా చేయకపోయినా వారు తమ పనిని తాము చేసుకుపోయేవారు. వారు గనక ప్రజల మనోకాంక్షల కనుగుణంగా నడుచుకుంటూ పోతే నేడు లోకమంతా అవిశ్వాస భావాలతో, మిథ్యావాదులతో అంధకార బంధురంగా ఉండేది.

వడ్డీ నేటి ఆర్థిక జగతికి వెన్నెముకగా భావించబడుతూ ఉన్నప్పటికీ – యూరపుకు చెందిన కొంతమంది విజ్ఞులు ఇప్పటికే దీన్ని ప్రమాదకరమైన బిందువుగా తలపోస్తున్నారు. ఇది ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక కాదని, వెన్నె ముకను తొలచివేసే ఒక పురుగు అని వారు ఇప్పటికే అంగీకరించారు.

కాని శోచనీయమైన విషయం ఏమిటంటే మేధావులు, అర్థశాస్త్ర నిపుణులు కూడా ఒక్కోసారి ఆచార సంప్రదాయాల వలయంలో చిక్కుకుపోయి స్వేచ్ఛగా ఆలోచించలేకపోతారు. కాలపు క్రేజుకు తలఒగ్గి అంతరాత్మ ప్రబోధాన్ని అణచివేస్తారు.

కొద్దిమంది బలుపు కోసం కోట్లాది మంది ప్రాణులు భారీ మూల్యం చెల్లించవలసి రావటం, అనేక మానవ సముదాయాలు ఆకలి దప్పులకు, ఆర్థిక మాంద్యానికి లోను కావటం, దారిద్య్ర రేఖకు దిగువ ఉన్న ప్రజల బ్రతుకులు మరింత నికృష్ట స్థితికి చేరటం, అదే సమయంలో గుప్పెడు మంది పెట్టుబడిదారులు సామాన్య జనుల రక్తం పీల్చి తమ కండలు పెంచుకోవటం సర్వసాధారణమైపోయింది. కడుపు మండి ఎప్పుడైనా ఈ సత్యాన్ని వాళ్ల ముందు వెల్లడిస్తే దాన్ని త్రోసి పుచ్చుతూ వారు అమెరికా, ఇంగ్లాండ్ల మార్కెట్లలో నిలబెట్టి వడ్డీ సమృద్ధిని మనకు చూపించదలుస్తారు. అక్కడ సమృద్ధి కనబడటంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే మేకలను భక్షించే మృగాలు బలిష్టంగానే ఉంటాయి కదా! కాని ఈ మృగాల వేటకు గురైన ప్రజల్లోకి చొచ్చుకుపోయి వారి స్థితిగతుల్ని కాస్త వీక్షించమనండి – అక్కడ ఈ మృగాల వేటకు గురైన వేలాదిమంది సామాన్య జనులు జీవచ్ఛవాల్లా పడి ఉండటం కాన వస్తుంది. ఇలాంటి ఆర్థిక ప్రక్రియను ఇస్లాం ఆరోగ్యవంతమైన ప్రక్రియగా భావించదు. గుప్పెడు మంది బడా వాణిజ్యవేత్తల బలుపుకోసం యావత్తు మానవ సమాజం చిక్కి శల్యమై పోవటం ప్రగతి అనిపించుకోదు.

(c) నేడు వడ్డీ కొత్త పుంతలు తొక్కుతోంది. దీని వ్రేళ్ళు నలువైపుల నుండీ ఆర్థిక వ్యస్థను ఆక్టోపస్ లా అల్లుకుపోతున్నాయి. మద్యం, జూదం, వ్యభిచారం వంటి చెడుగులు నాగరికత పేరిట, ఫ్యాషన్ పేరిట కొత్త మెరుగులు దిద్దుకొని ప్రజల ముందు ప్రత్యక్షమైనట్లే వడ్డీ కూడా కొత్త అవతారమెత్తి ప్రజా జీవితాలతో ఆడుకుంటోంది. నిన్నటి వరకూ దుకాణాలకే పరిమితమైన ఈ రుగ్మత నేడు సేవింగ్ స్కీములు, బ్యాంకులు, సొసైటీల రూపంలో ఆవిర్భవించింది. ఈ కొంగొత్త వ్యవస్థ వల్ల సమాజమంతటికీ లాభం చేకూరుతుందని మభ్య పెట్టడం జరుగుతోంది. డబ్బుండీ వ్యాపారం చేయలేనివారు కొందరుంటే, వ్యాపారం చేయగోరినా చాలినంత పెట్టుబడిలేని వారు కొందరుంటారు. అలాంటి వారి దగ్గరున్న డబ్బును పొదుపు పథకాల క్రింద రాబట్టం జరుగుతుంది. వారికి వడ్డీ రూపేణ ఎంతో కొంత ‘లాభం’ లభిస్తుందనుకోండి. అయితే అలా పోగైన సంపద తిరిగి బడా వ్యాపారుల చేతుల్లోకి రుణం క్రింద వచ్చేస్తుంది. ఈ విధంగా ఈ వడ్డీ లాభాలు అటు సామాన్యులకూ ఇటు పెద్ద వర్తకులకు కూడా లాభసాటిగా ఉన్నట్లు అగుపిస్తుంది.

కాని న్యాయ దృష్టిలో ఆలోచిస్తే ఇదొక మేడిపండు తప్ప మరేమీ కాదన్న వాస్తవం బోధపడుతుంది. ముదనష్టపు వస్తువులను మృదుమధురమైనవిగా సమర్పించే కిటుకులు మన వాళ్లకు బాగా తెలుసు. సారాయి భట్టీలలో అత్యంత దుర్భరమైన స్థితిలో తయారయిన సారాయిని అందమైన హోటళ్లలో సంస్కారవంతమైన శైలిలో సమర్పించటం ఎలాంటిదో, సాని కొంపల్లో మ్రగ్గే వారిని ‘కాల్ గర్ల్’ పేరుతో స్టార్ హోటళ్లకు రప్పించటం ఎటువంటిదో ఇదీ అటువంటిదే. నైతికంగా మానవ సమాజాలను తొలచివేసే వస్తువులకు ఆధునికత పేరిట అందమైన తొడుగులు తొడిగించినంత మాత్రాన అవి విషపూరితం కాకుండా పోవు.

పొదుపు మొత్తాలపై బ్యాంకుల ద్వారా లభించే కొద్దిపాటి వడ్డీ వల్ల వారి జరుగుబాటు ఎలాగూ కాదు. బ్రతుకు తెరువు కోసం వాళ్ళు కూలీనాలీయో ఉద్యోగమో ఎలాగూ చేయక తప్పదు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ళు వ్యాపారం మొదలెట్టి మార్కెట్టులోని వైపరీత్యాలకు తట్టుకొని నిలబడలేరు. పెద్ద తరహాలో వ్యాపారం చేద్దామంటే వారికి భారీ మొత్తంలో రుణాలివ్వడానికి బ్యాంకులు ముందుకు రావు. వ్యాపార రంగంలో పరపతి ఉండి, ఓ మిలియనీరుగా చెలామణీ అవుతున్న వాడికి కోటి రూపాయిలైనా బ్యాంకుల నుండి రుణంగా లభిస్తాయి గాని ఒక సామాన్యుడికి పదివేల అప్పు కూడా పుట్టదు. ఆ విధంగా కలవాడు తన స్థాయి కన్నా పదిరెట్ల వ్యాపారం చేయగలుగుతాడు. లాభాలు కూడా అదే విధంగా జుర్రుకుంటాడు. కాని ఒక సన్నకారు వ్యాపారస్తుడు అప్పుడప్పు చేసి ఒక వేళ వ్యాపారం చేసినా అతడికి వచ్చే లాభం అతని జరుగుబాటుకు కూడా సరిపోదు. ఇదిలా ఉండగా వ్యాపార సంబంధమైన వైపరీత్యాలు గాని సంభవిస్తే ఉన్నది కూడా ఊడ్చుకుపోతుంది. ఆ వైపరీత్యాల్ని సృష్టించేది కూడా ఎవరో కాదు, బడా వాణిజ్యవేత్తలేనన్నది బహిరంగ రహస్యం. తేలిందేమంటే మార్కెట్టులో కొద్దిమంది పెద్ద తరహా వ్యాపారస్తులే మిగులుతారు. మూలధనమంతా క్రమక్రమంగా వారి ఇనుప్పెట్టెలకు తరలిపోతుంది.

1. సమాజమంతా వర్తకానికి దూరమై కొద్దిమంది పెట్టుబడిదారులు ఆర్థిక రంగాన్ని ఏలడం అన్యాయం కాదా?

2. మార్కెట్టులో కొద్దిమంది ఏకస్వామ్యం ఆధిపత్యం పెరిగిపోతుంది. వారు కోరినప్పుడల్లా నిత్యావసర వస్తువులు కృత్రిమ కొరతను సృష్టించి ధరలు పెంచేస్తూ ఉంటారు. మరో విధంగా చెప్పాలంటే క్రయవిక్రయాల వ్యవస్థ అంతా వారి గుప్పెట్లో ఉంటుంది. పరోక్షంగా వాళ్లు దేశాన్నే శాసించే స్థాయికి చేరుకుంటారు. సామాన్య ప్రజల సొమ్ముతో తెగబలిసిన ఈ ఆసాములకు ప్రజా సంక్షేమం పట్ల గాని, సామాజిక న్యాయం అంటేగాని ఎలాంటి ఆసక్తి ఉండదు.

అదే వర్తకం వికేంద్రీకరణ జరిగి, మార్కెట్టులో పరిపూర్ణమైన పోటీ విధానం అమల్లోకి వచ్చినట్లయితే పరిస్థితి తద్ఛిన్నంగా ఉంటుంది. చిన్న చిన్న వర్తకులకు కూడా లాభాలు వచ్చి వారి ఆత్మ విశ్వాసం ఇనుమడిస్తుంది. వేలాది మందికి జీవనోపాధి అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగ సమస్య కొంతలో కొంత పరిష్కృతమవుతుంది. ప్రగతి ఫలాలు అందరికీ లభించి ఆర్థిక అసమానతల అగాధం కొంతవరకైనా పూడుకుంటుంది. కాని ఈ విషయం జనసామాన్యానికి అర్థమయ్యేలా చెప్పేదెవరు? వినాశకరమైన రోగం తగిలించబడింది. ప్రచారం చేసే వారేమో దీన్ని ఒక రోగంగా గాక దివ్య ఔషధంగా ప్రచారం చేస్తున్నారు.

3. బ్యాంకుల వడ్డీ వల్ల సమాజానికి వాటిల్లే మరో ఆర్థిక అనర్థం ఏమిటో చూడండి – ఒక వ్యక్తి వద్ద లక్ష రూపాయిల మూలధనముంటే అతను బ్యాంకు నుండి రుణం తీసుకొని 10 లక్షల వ్యాపారం చేస్తాడు. ఒకవేళ అతడి వ్యాపారం అనూహ్యమైన ఒడిదుడుకులకు లోనై అతడు దివాలా తీస్తే అతడికి కలిగే నష్టం ఒక లక్ష (10 శాతం) మాత్రమే. కాని మిగిలిన 90 శాతం నష్టం ఎవరిపై పడుతుంది? సమాజంపైనే కదా! పైకి బ్యాంకుకు నష్టం వాటిల్లినట్లుగా అగుపిస్తుంది. కాని వాస్తవానికి ఆ బ్యాంకు సొమ్ము ఎవరిది? ప్రజలది కాదా? దీని ద్వారా బోధపడిందేమంటే పెట్టుబడిదారుడు లాభాలు వచ్చినంత కాలం తానొక్కడే లాభాలను ఆర్జించాడు. సమాజానికి లభించింది నామమాత్రం. కాని నష్టం వాటిల్లేసరికి 90 శాతం నష్టం సమాజంపైకి నెట్టేయబడింది.

4. వడ్డీ వ్యవస్థ వలన కలిగే మరో పరాభవం ఏమిటంటే, వడ్డీ సొమ్ముతో వ్యాపారం మొదలెట్టిన వ్యక్తి ఒకసారి నష్టాల ఊబిలో పడ్డాడంటే ఇక అతడు పైకి రాలేడు. ఎందుకంటే నష్టాన్ని భరించేటంత మూలధనం అతని వద్దనయితే లేదు. నష్టాలు వాటిల్లినపుడు అతని ఇక్కట్లు రెట్టింపు అవుతాయి. ఒకవైపు ఉన్నది కాస్తా ఊడ్చుకుపోయింది. రెండోవైపు అతడు బ్యాంకు రుణభారం క్రింద నలిగిపోయాడు. దాన్ని చెల్లించే దారి లేదు. కాని అదే వడ్డీ రహిత వ్యాపారంలో నష్టం వాటిల్లి ఉంటే అతడు బికారి మాత్రమే అయ్యేవాడు. కాని రుణగ్రస్తుడు అయ్యేవాడు కాదు.

ఒక్కడ ఒక సందేహం ఉత్పన్నమవటం సహజం. బ్యాంకుల ద్వారా జాతీయ సంపద ఒక చోట ప్రోగవటం వల్ల జనసామాన్యానికి ఎంతో కొంతయినా లాభం చేకూరింది కదా! పెట్టుబడిదారులకు అధిక మొత్తంలో లాభం చేకూరవచ్చుగాక, కాని సామాన్య ప్రజానీకానికి కూడా ఎంతోకొంత ముట్టింది కదా! ప్రజాధనాన్ని పొదుపు చేసే ఈ బ్యాంకు స్కీములే గనక లేకుంటే ఈ సంపద అంతా పూర్వకాలపు వ్యాపారస్తులు, జమీందార్లు ఖజానాను భూస్థాపితం చేసినట్లుగా ఈ కాలపు ప్రజలు కూడా సంపదను ఫ్రీజ్ చేసేసి నిరుపయోగం చేసేవారు కదా! అని కొందరు ప్రశ్నించవచ్చు.

దీనికి సమాధానం ఏమిటంటే ఇస్లాం వడ్డీని అధర్మంగా ఖరారు చేసి దాని ద్వారాలను మూసివేసినట్లే, సంపదను ఒకచోట ప్రోగు చేసిపెట్టే వారిపై జకాత్ అనే విద్యుక్త ధర్మాన్ని మోపి వాళ్ళు సంపదను నిరుపయోగం చేయకుండా బ్రేకువేసింది. పైగా ఆ సంపదను వెలికితీసి వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టక తప్పని పరిస్థితిని సృష్టించింది. ఎలాగంటారేమో! ఇస్లాం ప్రకారం ఏ ముస్లిమైనా బంగారాన్ని గాని, నగదును గానీ నిల్వ చేస్తే అతడు ఆ సొమ్ముపై సాలీనా రెండున్నర శాతం చొప్పున జకాత్ ని తీసి సమాజంలోని అగత్యపరులకు, నిరాధారులకు ఇవ్వవలసి ఉంటుంది. ఆ విధంగా అతడు తన నిల్వలను పెట్టుబడిగా మార్చకుండా అట్టే పెట్టుకొని ఉంటే కొన్ని సంవత్సరాలకే ఆ ఖజానా కాస్తా ఖాళీ అయిపోతుంది. కాబట్టి అతడు తన దగ్గరున్న మిగులును ఫ్రీజ్ చేసి ఉంచే బదులు దాన్ని వాణిజ్యంలోనో వ్యవసాయంలోనో పెట్టుబడిగా పెట్టి దానిపై వచ్చే లాభాలపైన జకాత్ ఇవ్వడానికే ప్రాధాన్యతనిస్తాడు. అంటే తన దగ్గరున్న సంపద ద్వారా తాను లబ్దిపొందడంతో పాటు ఇతరులకు కూడా జకాత్ రూపంలో లాభాలను పంచిపెడతాడు.

జకాత్ చెల్లింపు ద్వారా సమాజంలోని నిరుపేదలకు, అగత్యపరులకు సాయం లభించినట్లే ముస్లింల ఆర్థిక స్థితిగతులు చక్కబడే అవకాశాలు కూడా మెరుగుపడతాయి. వర్తకాన్ని ప్రోత్సహించేందుకు జకాత్ దోహదపడుతుంది. ఎందుకంటే, నగదు సొమ్మును ఏడాది కాలం పాటు ఇనుప్పెట్టెల్లో మూసి ఉంచడం వల్ల తనకు ప్రయోజనం ఏమీ కలగకపోగా, జకాత్ రూపేణా కొంతధనం బయటకు వెళ్ళిపోతుందే అని మనిషి ఆలోచనలో పడి ఆ నగదుతో వ్యాపారం మొదలెడతాడు. వేలాది మందికి చెందిన కష్టార్జితాన్ని బ్యాంకుల ద్వారా రాబట్టి ఒక పారిశ్రామికవేత్త వ్యాపారం చేసే బదులు స్థితిమంతుడయిన ప్రతి ఒక్కడూ వ్యాపార రంగంలో అడుగుపెడతాడు. వాణిజ్యరంగంలో ఆరోగ్యవంతమైన పోటీ పెరుగుతుంది. మార్కెట్లో ఏకస్వామ్య వ్యవస్థ బదులు పరిపూర్ణపోటీ విధానం అమల్లోకి వస్తుంది. మార్కెట్ సమతౌల్యం ఏర్పడుతుంది. తత్ఫలితంగా సమాజంలోని బడుగు జీవులకు, నిరాధారులకు వెసులుబాటు లభిస్తుంది.

వడ్డీ వ్యాపారం మూలంగా వాటిల్లే ఆర్థిక అస్తవ్యస్త స్థితిని అవలోకనం చేశాము. ఇక దీని మూలంగా మానవుని ఆధ్యాత్మిక, నైతిక రంగాలపై పడే దుష్ప్రభావాన్ని చూద్దాము –

1. మానవుని గుణగణాలలో అత్యంత ముఖ్యమైనది, ఉజ్వలమైనది త్యాగగుణం మరియు దాతృ స్వభావం. స్వయంగా బాధల్ని భరించి ఇతరులకు సుఖాన్ని పంచిపెట్టడమనే భావన ఉన్నత మానవీయతకు తార్కాణం. అయితే వడ్డీ పిశాచం తిష్ఠ వేసిన సమాజాల్లో ఈ పరోపకార గుణం దాదాపు నశిస్తుంది. పరులకు ఉపకారం కాదు కదా పరులు కష్టపడి పైకొచ్చి తన సరసన నిలబడటాన్ని కూడా ఒక వడ్డీ వ్యాపారి సహించలేడు.

2. అతడు ఆపదల్లో ఉన్న వారిపై జాలి చూపకపోగా వారి ఆపదల్ని తన స్వార్థ ప్రయోజనాలకై సొమ్ము చేసుకోజూస్తాడు.

3. వడ్డీ ఆర్జన వల్ల అతనిలో పేరాశ పెరిగిపోతుంది. క్రమంగా అతని హృదయంలోని దయాదాక్షిణ్యాలు మటుమాయమవుతాయి. మంచీ-చెడుల మధ్య గల వ్యత్యాసాన్ని మరచిపోతాడు. ఆ విధంగా అతను నైతికంగా దిగజారి కడకు మానవత్వానికే దూరమైపోతాడు.

వడ్డీ మూలంగా సమాజానికి వాటిల్లే నైతిక, ఆధ్యాత్మిక, ఆర్థిక అనర్థాలను వివరించారు సరే, మరయితే ఈ వడ్డీ లేకుండా వ్యవస్థ నడిచేదెలా? ఆర్థిక వ్యవస్థ అణువణువునూ ‘వడ్డీ’ పెనవేసుకొని ఉండగా దీన్ని ఒక్కసారిగా విడనాడితే వ్యాపారస్తులకు బ్రతికి బట్టకట్టే మార్గం ఏది? అన్న ప్రశ్న ఇక్కడ తలెత్తడం సహజం.

మనం ఇక్కడ ఆవేశానికి లోనవకుండా ఒక విషయాన్ని ప్రశాంతంగా ఆలోచించాలి. ఒక వ్యాధి ప్రబలిపోయి అది అంటువ్యాధిగా మారిపోయినపుడు చికిత్స దుర్లభంగా కనిపిస్తుంది. కానీ ఆ చికిత్స వృధాపోదు. ఆర్థిక సంస్కరణలు ఫలప్రదం కావడానికి సమయం పడుతుంది. దీని కొరకు వ్యక్తులు, సమాజాలు సహన స్థయిర్యాలతో వ్యవహరించవలసి ఉంటుంది. దివ్యఖుర్ఆన్లో అల్లాహ్ స్వయంగా ఇలా సెలవిచ్చాడు.

“అల్లాహ్ ధర్మం విషయంలో మీపై ఎలాంటి లేమి (ఇబ్బంది) నీ ఉంచలేదు.”

దీన్ని బట్టి అవగతమయ్యేదేమిటంటే వడ్డీకి అతీతంగా మానవ సమాజాలకు ఎలాంటి ఆర్థిక ఒడిదుడుకులు, కష్టనష్టాలు లేకుండా నడిపించే మార్గం తప్పక ఉంది.

సమాజంలోని నిరుపేదల అభాగ్యజీవుల పాట్లను నిరోధించే ఉపాయాలు ఇస్లాంలో ఉన్నాయి. ఇస్లాం ధర్మం పట్ల, దాని ఉపదేశాల పట్ల అనాసక్తత మూలంగా ముస్లింల స్థితిగతులు ఇలా తగలడ్డాయి గాని వారు గనక ఇస్లాం ప్రబోధనలను ఖచ్చితంగా తమ దైనందిన జీవితాల్లో ప్రవేశపెట్టుకున్నట్లయితే వారి జీవన గతే మారిపోతుంది. జకాత్, సదకాల రూపంలో వారు సక్రమంగా తమ సంపదను పంపిణీ చేసినట్లయితే నేడున్న సమస్యలు ఉండవు. ఇదంతా వారి నిర్లక్ష్య ధోరణి యొక్క పరిణామమే. నిజం చెప్పాలంటే నేడు జకాత్ విధానం దాదాపు లేదు. ముస్లింలలో చాలామంది నమాజ్ మాదిరిగానే జకాత్ జోలికిపోరు. జకాత్ ఇచ్చేవారు కూడా పాక్షికంగానే ఇస్తున్నారు. జకాత్ ను పూర్తిగా ఇచ్చేవారు చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నారు. పోనీ వారైనా ఆ జకాత్ సొమ్మేదో సక్రమంగా పంపిణీ చేస్తున్నారా అంటే అదీ లేదు. తమ సొమ్ముల్లో ఏడాదికోసారి జకాత్ తీస్తే సరిపోదు, దాన్ని సజావుగా చెల్లించాలి, నిర్ణీత పద్దులకు మాత్రమే కేటాయించాలన్నది అల్లాహ్ ఆదేశం. జకాత్ సొమ్మును దాని హక్కుదారులకు మాత్రమే చెల్లించే నిమిత్తం సిసలైన హక్కుదారులను అన్వేషించే దాతలు ఎంత మంది ఉన్నారో మీరే చెప్పండి.

ముస్లింల మిగులు ధనం ఎంత స్వల్పంగా ఉన్నా సరే, వారిలోని ప్రతి ఒక్క స్థితిమంతుడు గనక చిత్తశుద్ధితో జకాత్ అనే విధానాన్ని వేరుపరచి సక్రమమైన పద్ధతిలో దాని హక్కుదారులకు చేరవేసినట్లయితే అసలెవరికీ ముష్టెత్తుకునే దుస్థితి దాపురించదు. చీటికి మాటికీ అప్పుల కోసం ‘అయ్యవార్ల’ వద్దకు పరుగులు తీయాల్సిన అగత్యం కూడా ఉండదు.

మరి ఈ జకాత్ నే షరీఅత్ ఆదేశాలకు లోబడి సామూహిక పద్ధతిలో వసూలు చేసి ‘బైతుల్ మాల్’ అనే సంస్థను స్థాపించినట్లయితే మరిన్ని మేళ్లు చేకూరుతాయి. అలా పెద్ద మొత్తంలో వసూలైన జకాత్ ను బైతుల్ మాల్ ద్వారా వడ్డీలేని రుణాలుగా కూడా ఇవ్వవచ్చు. జీవనోపాధి లేక రోడ్డున పడ్డ అనేక మందికి రుణాలు ఇచ్చి కుటీర పరిశ్రమల్ని స్థాపించవచ్చు. ఈ విషయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన ఒక ఐరోపా ఆర్థిక నిపుణుడు నిజం చెప్పాడు. అతనిలా అన్నాడు – “ముస్లింల జకాత్ వ్యవస్థ ఎంత ప్రభావవంతమైనదంటే, ముస్లింలే గనక దాన్ని సక్రమంగా పాటిస్తే ఆ జాతిలో ఒక్క దరిద్రుడు, అగత్యపరుడూ మిగలడు”.

ఈ చర్చ ద్వారా చివరకు మేము చెప్పదలచిందేమంటే; వడ్డీ ఒక అంటువ్యాధిలా ప్రబలి పోయిన ఈ రోజుల్లో ఇక దాన్ని విడనాడే దారేలేదని తలపోయటం సరైనది కాదు. కాకపోతే ఇది ఒక్క వ్యక్తి లేక కొందరు వ్యక్తుల పని కాదు. ప్రభుత్వాలు, సామూహిక సంస్థలు చొరవ తీసుకొని వ్యవస్థను మార్చడానికి యత్నించినపుడే ఆశించిన ఫలితాలు వస్తాయి. కనీసం ముస్లిం సమాజాలు, ముస్లిం రాజ్యాలు ఈ సమస్యపై దృష్టిని కేంద్రీకరించి వడ్డీ రహిత వ్యవస్థ కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటే వడ్డీ పిశాచం నుండీ ప్రజానీకాన్ని కాపాడటం దుర్లభమేమీ కాదు. వారు ఈ లక్ష్యాల్ని సాధించిననాడు ఆర్థికంగా యావత్ప్రపంచానికే ఆదర్శప్రాయం కాగలుగుతారు.

మరో విషయాన్ని మేము ముస్లింలకు ప్రత్యేకంగా విన్నవించుకోదలిచాము – వారు కనీసం రోగాన్ని రోగంగానే చూడాలి. అధర్మాన్ని (హరాం) అధర్మంగానే చూడాలి. షరీఅత్లో అధర్మమైన ఒక వస్తువును ధర్మసమ్మతం (హలాల్)గా తలపోయడం కన్నా దౌర్భాగ్యం మరొకటి లేదు. అత్యంత విచారకరమైన విషయమేమంటే ముస్లిం సమాజాల్లో కొంత మంది మేధావులు ఈ ‘హరామ్’ ను ‘హలాల్’గా నిరూపించడానికి నానా అవస్థలు పడుతున్నారు. ఇది చాలా ఘోరమైన పాపం అన్న సంగతిని వారు మరచిపోతున్నారు. అల్లాహ్ వాక్యాలతో చెలగాటమాడటం ధిక్కారవైఖరికి ప్రతీక అని వారు గ్రహించకపోతే అది వారి గ్రహచారం. కనీసం హరామ్ ను హరామ్ గా భావించటం వల్ల వారికి వాటిల్లే నష్టం ఏమీలేదు కదా!

చివర్లో మేము వడ్డీ నిషిద్ధం మరియు దానికి సంబంధించి అల్లాహ్ తరఫున చేయబడిన హెచ్చరికలను తెలిపేందుకు గాను మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి ప్రవచనాలను పొందుపరచదలిచాము. కనీసం పాపాన్ని పాపంగా తలపోసే భావన అయినా ప్రజల్లో మేల్కొనాలన్నదీ, దానికి దూరంగా ఉండటానికి ప్రజలు ఉపాయాలు ఆలోచించాలన్నది మా ఉద్దేశ్యం. ఈ హరామ్ ను హలాల్ గా పరిగణించి వారు రెట్టింపు పాపాన్ని మూటగట్టుకోకుండా ఉన్నా చాలు కొంత వరకు ఉద్దేశ్యం నెరవేరినట్లే. ముస్లింలలో చాలా మంది రాత్రిపూట తహజ్జుద్ నమాజులో, అల్లాహ్ నామస్మరణలో గడుపుతారు. కాని తెల్లవారాక వారు తమ వ్యాపార వ్యవహారాలలో తలమునకలవగానే తాము వడ్డీ అనే అధర్మమైన వ్యవహారానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చేయూతనిస్తున్నామన్న సంగతి మరచిపోతారు. ఇది కడు శోచనీయమని వేరుగా చెప్పనవసరం లేదు. వడ్డీ గురించి తన అనుచర సమాజానికి మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) చేసిన హెచ్చరికల్ని చదవండి.

1) “ఏడు ప్రాణాంతక వస్తువుల బారి నుండి మిమ్మల్ని కాపాడుకోండి” అని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించారు. ‘అవేమిటి ఓ దైవ ప్రవక్తా!’ అని సహాబాలు (రదియల్లాహు అన్హుమ్) ప్రశ్నించగా ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా వివరించారు:- 1) ఒక్కడైన అల్లాహ్ (ఆరాధనలలో)కు సహవర్తునిగా వేరొక దైవాన్ని నిలబెట్టడం. 2) చేతబడి (బాణామతి) చేయడం, 3) ఏ వ్యక్తినయినా అన్యాయంగా హతమార్చడం 4) వడ్డీ తినడం 5) అనాధ సొమ్మును భక్షించటం. 6) ధర్మయుద్ధ సమయంలో యుద్ధ రంగం నుండి వెన్ను చూపి పారిపోవటం 7) సౌశీల్యవతి అయిన మహిళపై అపనింద మోపడం”. (ఈ హదీసు సహీహ్ బుఖారీ మరియు ముస్లింలో ఉంది.)

2) అంతిమ దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు. “ఇవాళ రాత్రి నేను నా దగ్గరకొచ్చిన ఇద్దరు వ్యక్తుల్ని చూశాను. వాళ్లు నన్ను బైతుల్ మఖ్దిస్ వరకు గొనిపోయారు. మేము మరింత ముందుకు సాగిపోగా అక్కడ ఒక నెత్తుటి కాలువ కనిపించింది. అందులో ఒక మనిషి నిలబడి ఉన్నాడు. మరొకతను కాలువ ఒడ్డున నిలుచుని ఉన్నాడు. కాలువలో నిలుచున్న వ్యక్తి బయటకు రావటానికి యత్నించినపుడు ఒడ్డున ఉన్న వ్యక్తి అతని ముఖంపై రాయి రువ్వుతున్నాడు. ఆ దెబ్బతో అతడు మునుపున్న చోటికే పరుగెత్తుకెళుతున్నాడు. మళ్లీ అతడు కాలువ నుంచి బయట పడేందుకు ప్రయత్నించగా ఒడ్డున ఉన్నవాడు మళ్లీ రాయి రువ్వసాగుతున్నాడు. ఏమిటీ తతంగం? అని నేను నా వెంట వున్న ఇద్దరిని ప్రశ్నించగా ‘కాలువలో చిక్కుకుపోయిన వ్యక్తి వడ్డీ సొమ్ము తినేవాడు (ఇప్పుడు తన కర్మకు శిక్ష అనుభవిస్తున్నాడు) అని వాళ్లు బదులిచ్చారు.” (ఈ హదీసు సహీహ్ బుఖారీలోని కితాబుల్ బుయూలో ఉంది).

3) దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వడ్డీ తీసుకునే వారినీ, వడ్డీ ఇచ్చే వారిని కూడా ధూత్కరించారు. మరికొన్ని ఉల్లేఖనాలలో వడ్డీ వ్యవహారం పై సాక్ష్యమిచ్చేవారు, తత్సంబంధితమైన దస్తావేజులు వ్రాసేవారు కూడా ధూత్కరించబడ్డారు.

సహీహ్ ముస్లింలోని ఒక ఉల్లేఖనంలో ఇలా అనబడింది “వీళ్ళంతా ఈ పాపంలో సమాన భాగస్థులే”. మరి కొన్ని ఉల్లేఖనాలలో, సాక్షులు, దస్తావేజులు వ్రాసేవారు తమకు అది వడ్డీ వ్యవహారం అని తెలిసి ఉన్న పక్షంలోనే ధూత్కారానికి గురవుతారు.

4) మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ప్రబోధించారు. “నాలుగు రకాల మనుషులున్నారు. వారికి స్వర్గంలో ప్రవేశం లభించదు గాక లభించదని అల్లాహ్ నిర్ధిష్టంగా నిర్ణయించాడు. ఆ నలుగురు ఎవరంటే (a) మద్యపానానికి ఆలవాటు పడినవాడు. (b) వడ్డీని తిన్నవాడు (c) అనాధ సొమ్మును అన్యాయంగా స్వాహా చేసేవాడు (d) తల్లిదండ్రుల మాట విననివాడు. (ఈ ఉల్లేఖనం ‘ముస్తద్రిక్ హాకిమ్’లో ఉంది)

5) మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారు: “వడ్డీతో కూడిన ఒక్క దిర్హమ్ తిన్నవాడు ముప్ఫయి ఆరుసార్లు వ్యభిచారం చేసిన దానికన్నా ఎక్కువ పాపం చేసినట్లు లెక్క”.

మరొక ఉల్లేఖనంలో “అక్రమ ధనంతో పెరిగిన కండ కోసం అగ్నియే సబబైనది”.

దాంతో పాటు మరో ఉల్లేఖనం ఈ విధంగా ఉంది :- “ఒక ముస్లిం మాన మర్యాదల్ని మంట గలపడం వడ్డీ తినటం కన్నా ఎక్కువ పాపిష్టికరం” (ఈ ఉల్లేఖనం ముస్నద్ అహ్మద్, బ్రానీలలో ఉంది)

6) వేరొక హదీసులో ఉంది:- మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రబోధించారు “(వృక్షం యొక్క) ఫలం నిరుపయోగం కాక ముందే దాన్ని అమ్మి వేయాలి”. ఇంకా ఇలా అన్నారు – “ఏదేని ఒక పేటలో వ్యభిచారం, వడ్డీ వ్యాపారం పెరిగిపోతే అది అల్లాహ్ ఆగ్రహాన్ని తన పైకి ఆహ్వానించినట్లే.” (ఈ ఉల్లేఖనం ‘ముస్తద్రక్ హాకిమ్ లో ఉంది.)

7) మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రబోధించారు “ఏ జాతిలోనయినా లావాదేవీలు వడ్డీ ప్రాతిపదికగా సాగితే అల్లాహ్ వారిపై నిత్యావసర వస్తువుల ధరను విపరీతం చేస్తాడు. మరే జాతిలోనయినా లంచగొండితనం ప్రబలిపోతే శత్రువును చూసి వణికిపోయే భయోత్పాత స్థితి వారిపై నెలకొంటుంది”. (ఈ ఉల్లేఖనం ముస్నద్ అహ్మద్లో ఉంది)

8) దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వివరించారు:- షబే మేరాజ్ సందర్భంగా మేము ఏడవ ఆకాశంలో చేరినపుడు నేను నా పైన ఒక మెరుపును చూశాను. ఆ తరువాత మాకు ఒక జన సమూహం తారసిల్లింది. వారి పొట్టలు నివాస గృహాల మాదిరిగా వ్యాకోచించి ఉన్నాయి. వాటిల్లో సర్పాలు నిండి ఉన్నాయి. అవి బయటకు కనిపిస్తూ ఉన్నాయి. ‘ఎవరు వీరు?’ అని నేను దైవదూత జిబ్రయీల్ (అలైహిస్సలాం)ని అడిగాను. ‘వీళ్లు వడ్డీ సొమ్ము తిన్నవారు’ అని ఆయన సమాధానమిచ్చారు. (ఈ ఉల్లేఖనం ముస్నద్ అహ్మద్ లో నిది)

9) దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఔఫ్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు)ని ఉద్దేశ్యించి చెప్పారు – “క్షమార్హం కాని పాపాలకు దూరంగా ఉండండి. వాటిల్లో ఒకటి:- యుద్ధప్రాప్తిని తస్కరించటం, రెండు:- వడ్డీ సొమ్ము తినటం”. (తబ్రానీ)

10) దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంకా ఇలా ఉపదేశించారు: “మీరు ఎవరికయితే అప్పు ఇచ్చారో అతన్నుంచి కానుక కూడా స్వీకరించకండి”. (బహుశా అతను ఈ కానుక అప్పుకు బదులుగా ఇచ్చాడేమో. అది బహుశా వడ్డీయేమో. అందుచేత అతని కానుకను స్వీకరించే విషయంలో కూడా జాగ్రత్తపడటం మంచిది.)

దివ్యఖుర్ఆన్లోని ఏడు వచనాలు మరియు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పది హదీసుల ఆధారంగా వడ్డీ నిషిద్దం గురించి స్థూలంగా మీ ముందుంచటం జరిగింది. విషయాన్ని వివరంగా చర్చిస్తే ఓ పెద్ద గ్రంథమే తయారవుతుంది
.
ధర్మంలో హరామ్ (నిషిద్ధం) – హలాల్ (ధర్మ సమ్మతం)లు కీలకమైనవి. మోమిన్ (విశ్వాసి) అయిన వాడు హలాల్ వస్తువులను స్వీకరించి హరామ్ వస్తువులను పరిత్యజిస్తాడు. హరామ్ వస్తువుల పట్ల ఏహ్యభావం కలిగి ఉంటాడు. ఇస్లామీయ షరీఅత్ హరామ్ గా ఖరారు చేసిన వాటిలో ఏదైనా హరామే. హరామ్ వస్తువుల జాబితాలో వచ్చే కొన్నింటిని అసహ్యించుకొని మరికొన్నింటిని స్వీకరించటం అంటే ధర్మాన్ని పాక్షికంగా అవలంబించటమే.

కాగా, అల్లాహ్ విశ్వాసుల్ని ఉద్దేశ్యించి ఏమంటున్నాడో తెలుసా?!

‘యా అయ్యుహల్లజీన ఆమనుద్ ఖులూ ఫిస్సిల్మి కాప్ఫహ్’
ఓ విశ్వాసులారా ! ఇస్లాంలో ప్రవేశిస్తే (పాక్షికంగా కాదు) పూర్తి స్థాయిలో ప్రవేశించండి.

సమాప్తం

వడ్డీ – యూట్యూబ్ ప్లే లిస్ట్:
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1NM8ynZdYubB7u7F0gGvnP

కలామే హిక్మత్ (వివేక వచనం) -1 [పుస్తకం]

కలామే హిక్మత్ (వివేక వచనం) -1 [పుస్తకం]

డౌన్లోడ్ – కలామే హిక్మత్ (వివేక వచనం) -1
రచయిత : సఫీ అహ్మద్ మదనీ
[88 పేజీలు] [PDF] [మొబైల్ ఫ్రెండ్లీ]

ముందుమాట – [డౌన్లోడ్ PDF]

“నేను అతి సమీపంలో ఉన్నాను” – మార్గదర్శకాలు & నియమాలు [పుస్తకం]

సంకలనం: అమల్ అన్-నష్వాన్.
సమీక్ష: సనావుల్లాహ్ సిద్ధీఖి, ప్రత్యక్ష వ్యాఖ్యాత, అల్ మస్జిద్ అల్ హరమ్.
తెలుగు అనువాదం: ముహమ్మద్ కరీముల్లాహ్.

బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్
అనంత కరుణాప్రదాత, అపార కృశీలుడైన అల్లాహ్ పేరుతో

బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్

సకల ప్రశంసలు, స్తోత్రములు, కృతజ్ఞతలు సర్వ లోకాల ప్రభువైన అల్లాహ్ కే శోభిస్తాయి మరియు అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, ఆయన కుటుంబీకులపై మరియు ఆయన సహచరులపై అనేక దీవెనలు వర్షించు గాక!

అమల్ బింత్ ఇబ్రాహీం అన్-నష్వాన్ రచించిన “దుఆ: అల్లాహ్ అనుబంధానికి తాళంచెవి” అనే సంకలనం గురించి నాకు తెలిసినది. ఇది కీలకమైన ప్రముఖ సమస్యలను వివరించే ప్రయోజనకరమైన సంకలనం అని గుర్తించాను. దీనిని సంకలనం చేయడంలో అనుసరించిన ఆచరణాత్మక విధానాలు పూర్తిగా ప్రయోజనకరంగా మరియు అత్యుత్తమంగా ఉన్నాయి. దీనిని అమూల్యమైనదిగా చేయమని మరియు ఈ ప్రయోజనకరమైన పనికి బదులుగా దీని రచయిత్రికి తగిన ప్రతిఫలం ప్రసాదించమని నేను అల్లాహ్ ను అర్థిస్తున్నాను. రచయిత్రి యొక్క అభ్యర్థన మేరకు, నేను ఈ తొలి అభిప్రాయాన్ని వ్రాసాను.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, ఆయన కుటుంబీకులపై మరియు ఆయన సహచరులపై అనేక దీవెనలు వర్షించు గాక!

డాక్టర్ ఫాలిహ్ బిన్ ముహమ్మద్ అస్-సగీర్.

1.తొలి అభిప్రాయం
2. అంకితం
3. ఒక అద్భుత ఆశాకిరణం
4. పీఠిక
5. దుఆ: ఒక అనుగ్రహం, దీవెన, ఆశీర్వాదం
6. దుఆ యొక్క ప్రాముఖ్యత
7. దుఆలో పాటించవలసిన ఆవశ్యకతలు మరియు మర్యాదలు
8. కొన్ని యథార్థ గాథలు
9. చివరి మాట

త్రిసూత్రాలు| పుస్తకం & వీడియో పాఠాలు | నసీరుద్దీన్ జామి’ఈ

الأصول الثلاثة– تلغو
ఈ పుస్తక రచయిత: ఇమాం ముహమ్మద్ తమీమీ రహిమహుల్లాహ్
అనువాదకర్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ

ఇమాం ఇబ్ను బాజ్ రహిమహుల్లాహ్ ఈ పుస్తకం 100 సార్లు చదివించారు. దీని ద్వారా ఈ పుస్తకం యొక్క విలువను గమనించండి

[ఇక్కడ పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [ 28పేజీలు]

యూట్యూబ్ ప్లే లిస్ట్: (23 వీడియోలు)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3sKIkLUrdBOs1lCFaW2b0U

విషయసూచిక

1వ పాఠం – నాలుగు విషయాల జ్ఞానం విధి

అల్లాహ్ నిన్ను కరుణించుగాక! 4 విషయాలు నేర్చుకొనుట మనపై విధి అని తెలుసుకో! (1) ఇల్మ్, (2) అమల్, (3) దఅవత్, (4) సబ్ర్ .

  1. ఇల్మ్ (విద్య, జ్ఞానం); అంటే అల్లాహ్, ఆయన ప్రవక్త మరియు ఇస్లాం ధర్మం గురించి (ఖుర్ఆన్, హదీసుల) ఆధారాలతో తెలుసుకొనుట.
  2. అమల్ (తెలుసుకున్న జ్ఞానం ప్రకారం ఆచరించుట).
  3. దఅవత్ (ఇతరులను ఇస్లాం వైపునకు ఆహ్వానించుట).
  4. సబ్ర్ (ఏ కష్టం, ఆపద ఎదురైనా ఓపిక, సహనాలు వహించుట).

వీటన్నిటికి దలీల్ (ఆధారం) ఇది:

وَالْعَصْـرِ (1) إِنَّ الْإِنسَانَ لَفِي خُسـْرٍ (2) إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَتَوَاصَوْا بِالحَقِّ وَتَوَاصَوْا بِالصَّبْرِ (3)

కాలం సాక్షిగా! నిశ్చయంగా మానవుడు నష్టంలో పడి ఉన్నాడు. అయితే విశ్వసించి, సత్కార్యాలు చేసినవారు, పరస్పరం సత్యం గురించి ఉపదేశించినవారు, ఒండొకరికి సహనం (స్థయిర్యం) గురించి తాకీదు చేసినవారు మాత్రం నష్టపోరు. (సూర అస్ర్ 103).

ఈ సూర గురించి ఇమాం షాఫిఈ రహిమహుల్లాహ్ ఇలా చెప్పారు:

لو مَا أَنزَلَ اللهُ حُجَّةً على خَلقهِ إلا هَذهِ السُّورةَ لكَفَتهُم
అల్లాహ్ మానవులపై ప్రమాణంగా కేవలం ఈ ఒక్క సూరాను అవతరింపజేసినా, ఇది వారి కొరకు సరిపోయేది

ఇమాం బుఖారీ రహిమహుల్లాహ్ చెప్పారు: వాచ, కర్మ (మాట మరియు ఆచరణ) కంటే ముందు జ్ఞానం తప్పనిసరి. దీనికి ఆధారం అల్లాహ్ యొక్క ఈ ఆదేశం:

فَاعْلَمْ أَ نَّهُ لَا إِلَهَ إِلَّا اللهُ واسْتَغْفِرْ لِذَنبِكَ

కనుక (ఓ ప్రవక్తా!) అల్లాహ్‌ తప్ప మరో ఆరాధ్యుడు లేడని నువ్వు బాగా తెలుసుకో, నీ పొరపాట్లకుగాను క్షమాపణ వేడుకుంటూ ఉండు“. (ముహమ్మద్ 47:19).

ఈ ఆయతులో వాచ,కర్మ కంటే ముందు జ్ఞానం ప్రస్తావన ఉంది.

ఋతు కాలం (బహిష్టు) : సందేహాలు & సమాధానాలు [పుస్తకం]

రుతు కాలం (బహిష్టు) : సందేహాలు & సమాధానాలు [పుస్తకం]

Menses Rulings QA

ఋతుకాలం – సందేహాలు & సమాధానాలు
మూల రచయిత (అరబీ): షేఖ్ ముహమ్మద్ బిన్ సాలిహ్ అల్ ఉసైమీన్ (రహిమహుల్లాహ్)
తెలుగు అనువాదం: హాఫిజ్ అబ్దుల్ గఫ్ఫార్ ఉమ్రి హఫిజహుల్లాహ్
మర్కజ్ దారుల్ బిర్ర్ పబ్లికేషన్స్

[ఇక్కడ పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
[81 పేజీలు] [14 MB] [PDF] [మొబైల్ ఫ్రెండ్లీ]

స్త్రీ సంస్కరణోద్ధరణకు ఓ గొప్ప కానుక…!

శుచి శుభ్రతల పట్ల ఇతర మతాల కంటే ప్రత్యేకత కల్గియున్నది పవిత్ర ఇస్లామే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించింది నిక్కము. అది ఏమిటంటే : “శుచి శుభ్రత సగవిశ్వాసం”. శుచి(శుద్ధి) అంటే దేహము నుండి సమస్త మలినాలను శుభ్రము చేయుట. అది రెండు విధాలుగా విభజించబడింది.

1.స్వల్ప శుద్ధి.
2. సంపూర్ణ శుద్ధి.

స్వల్ప శుద్ధి : ఇందులో స్త్రీ పురుషులు సమానమే. ఎప్పుడైతే మలమూత్ర ద్వారాల నుండి ఏదైన వెలువడినప్పుడు ముస్లిం అన్న ప్రతి వ్యక్తి శుద్ధిని ఆశ్రయించడం తప్పనిసరి.అదేమిటంటే నమాజ్, ‘తవ్వాఫ్’, మరి పవిత్ర ఖుర్ఆన్ గ్రంధాన్ని తాకటానికి ముందు“వజు” చేయుట, అనగా నిర్దేశించిన అవయవాలను ధర్మాదేశాల ప్రకారం కడుగుట.

సంపూర్ణ శుద్ది : అనేది స్త్రీ పురుషులకు సమానమైనది కాదు. పురుషులకైతేసంభోగానంతరం ఇంకా వీర్యస్ఖలనం జరిగినప్పుడు, స్త్రీలకైతే సంభోగానంతరం, వీర్యస్ఖలనం జరిగినప్పుడు, ఇంకా ఋతుస్రావం, రక్తస్రావం జరిగినప్పుడు, ప్రతి వ్యక్తి స్నానం చేసుకోవాలి(తలంటు పోసుకోవాలి) నమాజుకంటే, ఉపవాసం కంటే, తవ్వాఫ్ కంటే ముందు, మరి పవిత్ర ఖుర్ఆన్ గ్రంథాన్ని తాకటానికి ముందు.

అయితే ఋతుస్రావం, రక్తస్రావం గురించి పరిశుద్ధత పట్ల ప్రత్యేకమైన ఆదేశాలున్నాయి. ఖుర్ఆన్, మరి ప్రవక్త హదీసు (సున్నత్) లో దీని నిమిత్తం సవివరంగా తెల్పబడింది. ధార్మిక విద్వాంసులు, ఇస్లామియా జ్ఞానులు ఈ సందేశాన్ని పూర్తి బాధ్యతతో ప్రజలకు వివరించారు. సమీప కాలంలో గొప్ప ధార్మికజ్ఞానిగా పేరు గాంచిన ప్రముఖ పండితులు ‘ముహమ్మద్ బిన్ సాలెహ్ అల్-ఉసైమీన్ (రహిమహుల్లాహ్) పాఠాల్లో, ప్రసంగాల్లో మరి వ్యాసాల్లో వీటిని ప్రకటించారు. ఆయా స్త్రీల నుండి ప్రశ్నలు, సందేహాలు ఎదురైనప్పుడు ఆయన సంతృప్తి పరంగా సమాధానాలు ఇచ్చారు. ఇక్కడ ఎన్నుకున్నవి ఇటువంటి 60 ప్రశ్నలే. అవి ఋతుస్రావం, రక్తస్రావం అనే అంశాల్లో అన్ని కోణాలతో కూడుకున్నవి. చిత్తశుద్ధితో తన శుద్ధిని కోరుకునే ప్రతి స్త్రీకి సంతృప్తిగల జ్ఞానము మరిఅవగాహన కోసం రచించబడినవి.

దీనిని ప్రముఖ ధార్మిక తెలుగు అనువాదకులు హాఫిజ్ అబ్దుల్ గఫ్ఫార్ ఉమరి (హఫిజహుల్లాహ్) తెలుగు భాషలో తెలుగువారికై అనువదించారు. ఆయన ద్విభాష (అరబిక్, తెలుగు)ల్లో ప్రావిణ్యంగల వ్యక్తి. ఈ అనువాదం ‘అరబి’ రచనకు సమీకరిస్తూ, తెలుగు వారి సరళంలో సులువైన రీతిలో వ్యాకరణ చేస్తుంది. ప్రముఖ ధార్మిక తెలుగు మాస పత్రిక “వెలుగు కిరణాలు“లో దశలవారిగా దీనిని ప్రచురించటం కూడ జరిగింది. అయితే ఇప్పుడు “డిస్కవర్ ఇస్లాం సెంటర్- బహ్రెయిన్” లో గల తెలుగు విభాగం దీనిని ఒక పుస్తక రూపంలో “మర్కజ్ దారుల్ బిర్-పెడన, ఇండియా” ఆధ్వర్యంలో ప్రచురిస్తుంది. ఈ పుస్తకం ప్రతి ఒక్కరికి పరిపూర్ణంగా ఉపయోగపడాలని అల్లాహ్ ప్రార్ధన(దుఆ) చేయుచున్నాను. ఆమీన్.! ఈ పుస్తకాన్ని కూర్పు చేసిన, మరి అనువదించిన మరి ప్రచురించటంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి ఇహపరలోకాల్లో మంచి సత్ఫలితాన్ని ప్రసాదించుగాక.. ఆమీన్!

డా॥ సయీద్ అహ్మద్ ఉమరి మదని.
విద్యా బోధన విభాగ కర్త, అరబి కాలేజి,
మర్కజ్ దారుల్ బిర్-పెడన, ఇండియా

మైలురాయి…!

మానవ సమాజములో కీడుగా భావించే కొన్ని విషయాలలో స్త్రీ కూడా ఒకటి. అందులోనూ ప్రత్యేకించి ఆమె జీవితంలోని ఋతుకాలాన్ని. పూర్వపరాలను ఆశ్రయిస్తే ప్రతి కాలంలోనూ అవలంభించిన విధానం ఇదే. ఋతుకాలాన్ని మైలుగాను, కీడు గాను, చెడుగాను భావించి ప్రతి మంచి, ప్రతి శుభ కార్యాలకు ఆమెని కీడుగానే చూసేవారు

వాస్తవాలు వెలికి తీసినప్పుడు వ్యక్తమౌతున్న విషయం ఏమిటంటే సృష్టికర్త అయిన అల్లాహ్ స్త్రీ (తత్వాన్ని) జాతిని ఈ సహజ గుణము (ఋతుకాలం) తోనే సృష్టించాడు. దీనికి సంబంధించి అనేక ఉపయోగాలు కూడ సూచించాడు.

ఉదా : బాల్యంనుండి యవ్వనంలో అడుగు పెట్టిందని చెప్పటానికి ఇదే గుర్తు, నెలతప్పి గర్భవతిగా మారిందని కూడ ఇదే తొలి గుర్తు, వివాహ సంబంధాలు విడాకుల రూపంలో పురివిప్పినప్పుడు సమస్యనుపరిష్కరించటానికి కేంద్రబిందువుగా ఉపయోగపడేది కూడ ఇదే గుర్తు, కాలధర్మం చెందిన భర్త నుండి విముక్తి పొందటానికి నిర్దేశించబడేది కూడ ఇదే గుర్తు, గర్భంలో పసికందుడు నిరాకారంలో ఉన్నప్పుడు పోషక లవణాలను సేవించటానికి కూడ ఇదే గుర్తు, స్త్రీ స్థితిని శుభ్రం అపరిశుభ్రం అని నిర్ధారించటానికి కూడ ఇదే గుర్తు. మరో అడుగు ముందుకేసినట్లైతే ఆరోగ్యానికి అనారోగ్యానికి కూడ ఇదే గుర్తు. అంతేకాక (అల్లాహ్) సందర్భాను సారం నడుచుకునే విధానాలను కూడా దీని ఆధారంగానే ఉపదేశించాడు.

అయితె చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే, ఈ ఋతుకాలం మానవ జీవనానికి ఎటువంటి కీడు కాదు, మరి అపశకనము కాదు.

కొందరైతే ఈ సందర్భములో స్త్రీని ఏ కోణం నుంచైన మంచిగా భావించే వారు కాదు, మరి కొందరైతే సేవలతో సరిపెట్టుకొని శుభకార్యాలు పై నీడ పడకుండ చూసేవారు. ‘ఆలోచనలు ఎన్నైతె అపోహాలు అన్ని’ అన్నట్టుగా కాలం సాగిపోసాగింది.

మహనీయ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వీటన్నిటిని తొలగించి నవశైలిక నందించారు. తమ నడవడికలతో స్త్రీ యొక్క విలువలను కాపాడి ఉన్నత స్థానంలో అమర్చారు. కనుక ప్రతి ఒక్కరు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ఆదర్శముగా తీసుకొని తమ ఆధీనములో ఉన్న స్త్రీ జాతిని కీడుగా భావించ కుండ సత్ప్రవర్తనలతో జీవనాన్ని సాగించగలరని కోరుకుంటున్నాము.

అయితె నాడు అల్లుకున్న అపోహాల సాంప్రదాయాల్లో నేడు ముస్లిం సమాజం అజ్ఞాన కారణంగాను, సాంప్రదాయ కారణంగాను ప్రభావితం అయింది. ఇస్లాం ధర్మం ఋతుకాలాన్ని ఎంతో ప్రత్యేకతనిస్తుంది. దేనికంటే దైవారాధనులు చేయటానికి దీనిపై పూర్తిగా పట్టుత్వం కల్గివుండాలి. ఋతుకాలం ఏక్షణంలో తొలగిపోతుందో అదే క్షణంలో ఆరాధన విధులు కూడ విధించబడుతాయి ఉదా: ఋతుకాలంలో వున్నప్పుడు ఉపవాసం వుండటం, నమాజు చదవటం, కాబా గృహానికి తవ్వాఫ్ చేయటం, సంభోగానికి సమీపించటం వంటివి చేయకూడదు, అదే ఏ క్షణంలో ఈ కాలం తొలగిపోతుందో వెంటనే స్నానం చేసి క్రమం ప్రకారంగా అన్నీ చేయవలసి వుంటుంది.

ఇక్కడ ఒక్క ముఖ్యవిషయం ఏమంటే ఇంత సున్నితమైన విషయాన్ని ఇండ్లలో కేవలం ఒక మాట “ఆరోగ్యం సరిగా లేదు” అని చెప్పి అన్నింటి నుండి తప్పించుకుంటారు అంతేకాక రేయింబవళ్లలో ఏ క్షణంలో ఇది తొలిగిపోయినా దానిని సరిగ్గా లెక్కించుకోరు, ఇది మహా పాపం. అల్లాహ్ తన పవిత్ర గ్రంధము ఖుర్ఆన్లో దీని నిమిత్తం క్లుప్తంగా ఆదేశాలిచ్చినప్పటికీ, మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్త్రీ పరిపూర్ణంగా తెలిపినప్పటికీ కూడ మనము దాని పట్ల జ్ఞానవగాహన పొందకుండా ఇరుగు పొరుగు సాంప్రదాయాలకు లోబడి మన పిల్లలకు కూడ సరైన జ్ఞానం ఇవ్వలేక పోతున్నాము. దీని గురించి ప్రళయంనాడు ప్రశ్నించబోతాము. సాంప్రదాయాలకు తావివ్వకుండ ప్రవక్త గారి ఆదేశాలను పాటించాలి. అవసరపు మెరకు ఇక్కడ కొన్ని హదీసులు ప్రస్తావించడం జరిగింది. (ఇంకా క్లుప్తంగా తెలుసుకోవాలంటే ఆయా హదీసు గ్రంధాలను సంప్రదించ వలసివుంటుంది) . 

ఇస్లామియా ధార్మిక పరిణితి చెందిన విద్యావంతులు షేక్ సాలెహ్ బిన్ ఉసైమీన్ రహిమహుల్లాహ్ తో చర్చించదగిన 60 ప్రశ్నలు సమాధానాలు ఎంతో విలువైనవి కాబట్టి దీనిని తెలుగు వారి ఉపయోగం కోసం అనువదించటంజరిగింది.

అల్లాహ్ మనందరికి వాస్తవాలను తెలుసుకొని పరలోక సాఫల్యం కొరకు తగు ప్రయత్నంచేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక….

ఆమీన్…!

ఇట్లు ..
ధార్మిక సేవకుడు : హాఫిజ్ అబ్దుల్ గఫ్ఫార్ ఉమరి

[పుస్తకం క్రింద చదవండి]

ప్రశ్న-1: ఒక వేళ స్త్రీ ఫజర్ పిమ్మటే (తరువాత) పరిశుద్ధురాలైతే అన్నపానియాలు మరి ఇతరాత్రా ఆహార వస్తువులు తినకుండా ఆ రోజు ఉపవాసం వుండాలా? మరి ఆమె పాటించే ఆ రోజు ఉపవాసాన్ని లెక్కించబడడం జరుగుతుందా? లేక ఆమె దానికి బదులుగా మరలా ఉపవాసం పాటించవలసి వుంటుందా? 

జవాబు : ఒక వేళ స్త్రీ ఫజర్ పిమ్మటే పరిశుద్ధురాలైతే ఆ రోజు అన్న పానియాలు మరి ఇతరాత్రా ఆహార వస్తువులు తినకుండా వుండటం గురించి ఇస్లామీయ ధార్మిక విద్వాంసుల్లో రెండు అభిప్రాయాలు వున్నాయి. 

1-ఆ రోజు ఆమె ఏమి తినకుండా ఆగిపోవాలి. కాని ఆ రోజు ఉపవాసం లెక్కింపబడదు. దానికి బదులు ఉపవాసం ఉండ వలసి ఉంటుంది. (ఇమాం అహ్మద్-రహిమహుల్లాహ్ వెల్లడించిన ప్రఖ్యాత అభిప్రాయం) 

2-ఆమెకు ఆ రోజు ఏమి తినకుండా ఉండవలసిన అవసరం లేదు. ఆమె ఆ రోజు ఉపవాసం పాటించడం సరికాదు. ఎందుకంటే ఆ రోజు ఉపవాస ప్రారంభ దశలో ఆమె ఋతుకాలం (సమయం ) లోనే వుంది. అలాంటప్పుడు ఉపవాసం పాటించడం సరికాదు. ఉపవాసమే సరికానప్పుడు అన్న పానియాలకు దూరంగా ఉండటంలో ఎలాంటి ప్రయోజనం లేదు. మరియు ఆ ఆ సమయంలో దాని పవిత్రత, గౌరవాన్ని పాటించవలసిన నిబంధన ఆమెపై లేదు. ఎందుకంటే ఆ రోజు ప్రారంభ దశలో ఆమె ఉపవాసానికి అనర్హురాలు. అంతే కాకుండా ఆ పరిస్థితుల్లో ఆమెపై ఉపవాసం నిషేధించ బడింది. షరీఅత్ ప్రకారం ఉపవాసం గురించి మాకు తెలిసిన విషయం ఏమంటే అల్లాహ్ ఆరాధన సంకల్పంతో ‘ఫజర్’ నుండి సూర్యస్తమయం (మగ్రిబ్) వరకు అన్నపానియాలు, ఇతరాత్రా తినే, త్రాగే వస్తూవుల నుండి ఆగిపోవాలి. 

దీనిలో రెండో అభిప్రాయం మొదటి కంటే ఉత్తమమైనది. ఏదేమైన ఈ రెండు అభిప్రాయాల వెలుగులో ఆ రోజు ఉపవాసానికి బదులు (ఖజా) పాటించవలసి వుంటుంది. 

ప్రశ్న-2 : నెలసరిలో ఉన్న స్త్రీ (ఫజర్ కంటే ముందు) పరిశుద్దురాలైంది. ఫజర్ తరువాత స్నానము చేసి నమాజ్ కూడా చేసింది. ఆ రోజు ఉపవాసాన్ని కూడా పూర్తి చేసింది. అయితే ఆమె ఆ రోజు పాటించిన ఉపవాసానికి బదులుగా మరలా ఉపవాసం పాటించాలనే విధి వుందా?’. ఒక సోదరి. 

‘ఫజర్’ కంటే ఒక్క నిమిషం ముందు నెలసరిలో ఉన్న స్త్రీ పరిశుద్ధురాలైనా తన పరిశుద్ధత గురించి పూర్తిగా నమ్మకం కలిగివుంటే మరింకా అది రమజాన్ మాసమే అయితే ఆమె పై ఆరోజు ఉపవాసాన్ని పాటించడం విధిగా పరిగణించబడుతుంది. కనుక అమె ఆరోజు పాటించే ఉపవాసం శ్రేయస్కరంగానే భావించబడుతుంది. దానికి బదులు (ఖజా) ఉపవాసం పాటించవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆమె పరిశుభ్రతలోనే ఉపవాసం (‘సహరి’ చేసింది) పాటించింది. ఆమె ఒకవేళ ‘ఫజర్’ తరువాత స్నానం చేసినా సరే. ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదు. 

దీనికి ఉదాహరణ ఏమిటంటే పురుషుడు కామక్రియల వల్ల లేదా వీర్యస్ఖలనానికి గురై (‘సహ్రి’ చేసుకుని) ఫజర్ తరువాత స్నానము చేసినా అతని ఉపవాసం శ్రేయస్కరంగానే పరిగణించ బడుతుంది. 

దీనికి సంబంధించిన మరొక విషయయాన్ని ప్రస్తావించ దలచుచున్నాను : అదేమిటంటే, ‘ఆమె ఉపవాసం పూర్తి చేసుకుని ఇఫ్తార్ చేసిన తరువాత, ఇషా కంటే ముందు ఋతుస్రావానికి గురైతే ఆమె ఆ రోజు ఉపవాసం వృధా అయిపోతుందని’ కొందరు స్త్రీలు భావిస్తున్నారు. ఇది ఎంత మాత్రం సరి కాదు. అంతే కాకుండా ఒక వేళ సూర్యాస్తమయం తరువాత ఒక క్షణం తరువాత ఋతస్రావం ప్రారంభమైనా కూడ ఆమె ఉపవాసం పరిపూర్ణమవుతుంది. 

ప్ర-3: పచ్చబాలింతరాలు ఒకవేళ నలభై రోజులకు ముందే పరిశుద్ధురాలైతే ఆమెపై ఉపవాసం పాటించడం, నమాజ్ చదవటం విధిగా వుంటుందా? 

జ : ఔను.! పచ్చబాలింతరాలు నలభై రోజులకు ముందే పరిశుద్ధురాలైతే అది కూడా రమజాన్ మాసంలో వుంటే ఆమెపై ఉపవాసం, నమాజ్ పాటించడం విధిగా పరిగణించబడతాయి. ఆమె భర్త ఆమెతో లైంగికంగా పాల్గొనుట కూడా సరైనదే. ఎందుకంటే ఆమె ఇప్పుడు పరిశుద్ధ స్థితిలోనే వుంది. కనుక ఉపవాసం, నమాజ్ ఆమెపై విధిగా పరిగణించబడతాయి. ఆమె తన భర్తతో లైంగికంగా పాల్గొనటానికి ఎలాంటి ఆటంకం లేదు. 

ప్ర -4 : సాధారణంగా స్త్రీ ఋతుస్రావానికి ఏడు లేక ఎనిమిది రోజులుంటాయి. ఒకోక్క సారి సాధారణ రోజుల కంటే ఒకటి రెండు రోజులు ఎక్కువగా వుంటుంది. వాటి గురించి ధార్మిక ఆదేశం ఎలా వుంది? 

సాధారణంగా స్త్రీకి ఋతుస్రావం ఏడు లేక ఎనిమిది రోజులు ఉంటుంది. కాని అప్పుడప్పుడు ఈ కాలం పైబడి (పొడిగి) ఎనిమిది తొమ్మిది లేక పది పదకొండు రోజుల వరకు వుంటే అప్పుడామె ఆస్థితి నుండి పరిశుద్దురాలు కానంత వరకు నమాజ్ చేయరాదు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఋతుస్రావానికి ప్రత్యేకించి ఒక పరిమిత  కాలాన్ని నిర్ణయించలేదు. పవిత్ర ఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: 

وَيَسْأَلُونَكَ عَنِ الْمَحِيضِ قُلْ هُوَ أَذًى 
వారు మిమ్మల్ని ఋతుస్రావం గురించి ప్రశ్నిస్తున్నారు. (ప్రవక్తా!) మీరు చెప్పండి.! అది అశుద్ధి” (అపరిశుభ్రత). – అల్- బఖర (2: 222) 

కనుక ఎప్పటి వరకు ఋతుస్రావపు రక్తం వుంటుందో ఆ స్త్రీ అదే స్థితిలో వుంటుంది. కాబట్టి ఆమె ప్రరిశుద్ధురాలై స్నానం చేసిన తరువాత నమాజు పాటించవలెను. తరువాత నెలలో ఒక వేళ గత నెల కంటే పరిమిత కాలంతగ్గితే పరిశుద్ధురాలైన వెంటనే స్నానం చేయాలి. ఒక వేళ ఈ నెలలో నెలసరి కాలం గత కాలం కంటే తగ్గివున్నా సరె. సంక్షిప్తం ఏమంటే స్త్రీ నెలసరిలో వున్నంత వరకు నమాజు చదవకూడదు. ఎప్పుడైతే నెలసరి నుండి పరిశుద్ధురాలవుతుందో అప్పుడు నమాజు చదవాలి. 

ప్రశ్న-5 బాలింతురాలు నలభై రోజుల వరకు నమాజ్, ఉపవాసం పాటించకుండా వుండాలా? లేదా దీని గురించి బాలింతురాలి రక్తస్రావం ఆగిపోవటాన్ని పరిగణించటం జరుగుతుందా? అంటే రక్తస్రావం ఆగిన వెంటనే స్నానము చేసి నమాజు మొదలు పెట్టాలా? బాలింతురాలు పరిశుద్దురాలవటానికి (బాలింతురాలి) రక్తస్రావపు కనీస పరిమిత కాలం ఎంత? 

బాలింతరాలి రక్తస్రావానికి నిర్ణీత కాలం అంటు లేదు. రక్తస్రావం జరుగుతున్నంత వరకు ఆమె నమాజ్, ఉపవాసం పాటించకూడదు. ఆమె భర్తకు కూడ లైంగికంగా దగ్గర కాకూడదు. మరియు ఆమె పరిశుద్ధతను గ్రహించినప్పుడు నమాజ్ని, ఉపవాసాన్ని పాటించాలి. మరియు ఆమె తన భర్తకు కూడ లైంగికంగా దగ్గరకావచ్చు. ఒకవేళ నలభై రోజులు పూర్తి కాకున్న సరె. అంతే కాకుండా ఒక వేళ ఆమె బాలింతురాలిగా రక్తస్రావంలో పది లేక ఐదు రోజులు గడిపివున్నా సరే. 

ఏదేమైన ‘బాలింతురాలి రక్తస్రావం’ ఎలాంటి విషయమంటే దానికి సంబంధించిన ఆదేశాలు రక్తస్రావం అవుతుందా లేదా అనే దానిపై ఆధార పడివుంటుంది. కనుక రక్తస్రావం అవుతున్నట్లైతే ఆదేశాలు అమలవుతాయి (విధిగా వుంటాయి). ఎప్పుడైతే ఆమె పరిశుద్ధురాలు అవుతుందో రక్తస్రావానికి సంబంధించిన ఆదేశాలు కూడా తొలగిపోతాయి. కాకపోతే ‘బాలింతురాలి రక్తస్రావం 60 రోజుల తరువాత కూడ అవుతున్న పక్షంలో ఆమెని రక్తస్రావం (నెలసరి) గల స్త్రీ అని పరిగణించటం జరుగుతుంది. కాబట్టి అప్పుడామె కేవలం సాధారణ నెలసరి కాలం ఎంతో అంత వరకు నిరీక్షించిన తరువాత ఆమె స్నానం చేసి నమాజు చేయటం జరుగుతుంది. 

ప్రశ్న-6 స్త్రీకి రమజాన్ మాసంలో పగటి సమయములో కొద్దిపాటి మామూలు రక్తపు చుక్కలు వచ్చాయి. మరి ఈ రక్తపు చుక్కలు మాసమంతా వస్తూనే వున్నాయి. అయినా ఆమె ఉపవాసం కొనసాగిస్తునే ఉంది. అయితే ఆమె ఉపవాసం కొనసాగించడం సరైనదేనా? 

ఔను! ఆమె ఉపవాసం సరైనదె! మరి ఆ రక్తపు చుక్కలు పరిగణించబడవు. ఎందుకంటే అవి నరాల నుండి వస్తాయి. హజ్రత్ అలీ రజియల్లాహు అన్హుతో ఇలా ఉల్లేఖనం ఉంది: ‘అంటే ఈ రక్తపు చుక్కలు (ముక్కు నుండి రక్తం కారి నట్టు చిమ్ముతూ వుంటాయి, కాని అది) నెలసరి కాదు. 

ప్రశ్న-7: నెలసరిగల స్త్రీ, బాలింతురాలు ఒకవేళ ఫజర్ కంటె ముందు పరిశుద్ధురాలైంది. కాని ఫజర్ తరువాత స్నానం చేసింది. అయితే మరి ఆమె ఉపవాసం సరైనదేనా? 

జ: ఆమె ఉపవాసం సమ్మతమైనదే (సరైనదే). నెలసరి స్త్రీ, బాలింతురాలు ఒకవేళ ఫజర్ కంటే ముందు పరిశుద్ధురాలై ఫజర్ తరువాత స్నానం చేస్తుంది. అయితే ఆమె ఉపవాసం సమ్మతమైనదే. ఎందుకంటే ఆమె పరిశుద్ధురాలైన సమయములో ఉపవాసం వుండటానికి అర్హురాలు అయివున్నది. ఆమె ఆ వ్యక్తిలా ఫజర్ సమయంలో వీర్యస్ఖలనానికి గురై ఉపవాసం ఉన్నాడు. కాని పజర్ తరువాత పరిశుద్ధుడయ్యాడు. కాబట్టి  ఆమె ఉపవాసం సరైనదె. ఎందుకంటే పవిత్ర ఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: 

الْآنَ بَاشِرُوهُنَّ وَابْتَغُوا مَا كَتَبَ اللَّهُ لَكُمْ ۚ وَكُلُوا وَاشْرَبُوا حَتَّىٰ يَتَبَيَّنَ لَكُمُ الْخَيْطُ الْأَبْيَضُ مِنَ الْخَيْطِ الْأَسْوَدِ مِنَ الْفَجْرِ

“అయితే ఇప్పుడు మీరు మీ (దాంపత్య సుఖాన్ని) అనుభవించండి, మరియు అన్వేషించండి అల్లాహ్ మీకోసం విధిగా వ్రాసియున్న వాటిని. మరి తినండి, త్రాగండి, ఎప్పటి వరకంటే వేకువ జామున పొద్దుటి తెలుపు దారం (రేఖ) నల్లటి దారం (రేఖ)తో (విడిగా) బహిర్గతం అయ్యేవరకు”. (అల్- బఖరహ్ 2:187) 

అయితే వేకువజాము వరకు దాంపత్య సుఖానికి అనుమతించినప్పుడు దానికి తగిన ఉద్దేశం ఏమిటంటే స్నానం ఫజర్ తరువాతే అవుతుంది. 

మరియు హజ్రత్ ఆయిషా రజి అల్లాహు అన్హా హదీసులో దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన పవిత్ర భార్యలతో సంభోగించి అపరిశుద్ధ స్థితిలోనే తెల్లవారు జామున లేచినప్పుడు ఉపవాసంతో ఉండేవారు. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఫజర్ తరువాత పరిశుద్ధతకై స్నానం చేసేవారు. 

ప్రశ్న-8: స్త్రీ రక్తాన్ని లేక నెలసరి బాధను గ్రహించింది. కాని సూర్యస్తమయం కంటె ముందు రక్తం రాలేదు. అలాంటప్పుడు ఉపవాసాన్ని పూర్తి చేయవచ్చా? లేదా దానికి బదులుగా (ఖజా) వుండవలసి వుంటుందా? 

ఒకవేళ పరిశుద్ధ స్త్రీ ఉపవాస స్థితిలో నెలసరి రావటాన్ని గమనించింది లేదా దాని బాధని గమనించింది. కాని సూర్యస్తమయం తరువాత నెలసరి వచ్చింది. అలాంటప్పుడు ఆమె పాటించిన ఆ రోజు ఉపవాసం సరైనదే. దానిని మరలా పూర్తి చేయవలసిన అవసరం లేదు. కనుక ఆమె పాటించిన ఆ ఉపవాసం ఫర్జ్ ఉపవాసం అయితే తిరిగి పాటించదు. ఒక వేళ అది నఫిల్ ఉపవాసం అయితే దాని పుణ్యఫలానికి భంగం వాటిల్లదు. ఇన్షా అల్లాహ్. 

ప్రశ్న-9 : ఒక స్త్రీ రక్తాన్ని గ్రహించింది. కాని అది నెలసరా? కాదా? అన్నది పూర్తిగా నిర్ధారించలేక పోయింది. అలాంటప్పుడు ఆరోజు పాటిస్తున్న ఉపవాసం గురించి ఆదేశం ఏమిటి? 

పై పేర్కొనబడిన స్త్రీ పాటిస్తున్న ఆ రోజు ఉపవాసం సరైనది. ఎందుకంటే నెలసరి వుండక పోవటమే అసలు విషయం. ఇది ఎప్పటి వరకంటే ఆమెకు నెలసరి వచ్చిందని పూర్తిగా నమ్మకం కలిగేంత వరకు. 

 ప్ర-10 : కొన్ని సందర్భాల్లో స్త్రీ పగటి సమయంలో రక్తపు అసాధారణమైన  ప్రభావాన్ని లేదా రక్తపు అసాధారణమైన బిందువుల్ని గ్రహిస్తుంది. మరికొన్నిసార్లు ఇలాగే నెలసరి కాలంలో చూస్తుంది. కాని అప్పుడు ఋతుస్రావం ప్రారంభమై ఉండదు. మరి కొన్నిసార్లు నెలసరి కాలం తరువాత రోజుల్లో గ్రహిస్తుంది. అయితే సందేహమేమిటంటే పై పేర్కొన్న రెండు సందర్భాల్లో ఆమె ఉపవాసం గురించి ఆదేశం ఏమిటి? 

దాదాపు ఇలాంటిదే ఒక ప్రశ్నకు సమాధానం చెప్పడం జరిగింది. అయితే ఆ ప్రశ్నలో ఒక అంశం ప్రస్తావించబడలేదు. అదేమిటంటే రక్తపు చుక్కలు ఒకవేళ నెలసరి కాలంలో గమనిస్తే, మరియు ఆమె దానిని ఋతుస్రావం అని భావిస్తే అవి ఆమెకు తెలిసిన రోజులైతే అప్పుడు అది ఋతుస్రావం పరిధిలోనే వస్తుంది. స్థితి రెండు 

ప్ర-11 : నెలసరి స్త్రీ, బాలింతురాలు పవిత్ర రమజాన్ మాసంలో పగటి సమయాల్లో (అన్న, పానియాలు) తీసుకోవచ్చా? 

అన్నపానియాలు తీసుకోవచ్చు. నెలసరి స్త్రీ, బాలింతురాలు పవిత్ర రంజాన్ మాసంలో పగటి సమయములో (అన్నపానియాలు) తినవచ్చు. కాకపోతె ఇంట్లో పిల్లలుంటే వారికి కనబడకుండా తినటం ఉత్తమం. ఎందు కంటే దాని వల్ల పిల్లలకు ఎలాంటి సందేహాలు రావు.

ప్ర-12 నెలసరి స్త్రీ, లేదా బాలింతరాలు ఒకవేళ అసర్ సమయంలో పరిశుద్ధురాలు అయితే వారికి ‘అసర్’ నమాజుతో పాటు జొహర్’ నమాజు కూడ పాటించాలా? లేదా అసర్ నమాజ్ మాత్రం పాటించాలా? 

జ : ఈ విషయములో ప్రఖ్యాత అభిప్రాయం ఏమిటంటే పై పేర్కొనబడిన స్త్రీ అసర్ నమాజు మాత్రమే పాటించాలి. ఎందుకంటే అలాంటి స్థితిలో జొహర్ నమాజు తప్పనిసరిగా చదవాలి అని చెప్పడానికి ఎటువంటి ఆధారం లేదు. ఫిఖాహ్ సూత్రాల ప్రకారం ఆధారం లేకపోవడమే అసలు (ఆధారం) విషయం. 

రెండో విషయం ఏమిటంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు : 

“ఎవరైతే సూర్యస్తమయానికి ముందు ‘అసర్’ నమాజ్ లోని ఒక్క రకాత్ పొందినా అతను అసర్ నమాజు పొందినట్లే”.. 

పై హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ వ్యక్తి ‘జొహర్’ నమాజ్ కూడా పొందినట్లే అని చెప్పలేదు. ఒకవేళ జొహర్ నమాజు కూడ స్థితిలో విధియై వుంటే ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) తప్పకుండా ప్రస్తావించి ఉండేవారు. 

పై పేర్కొనబడిన స్థితిలో స్త్రీ పై ‘జొహర్’ నమాజు విధిగా కాకపోవటానికి మరో కారణం కూడా వుంది. 

అదేమిటంటే ఒకవేళ స్త్రీ ‘జొహర్’ సమయం మించిపోయిన తరువాత నెలసరికి గురైతే దానికి జోహర్ నమాజు మాత్రమే తరువాత (ఖజా) చేయవలసి వుంటంది, అసర్ నమాజు కాదు. 

కొన్ని సందర్భాల్లో ‘జొహర్’, ‘అసర్’ రెండింటిని కలిపి పాటిస్తారు. మరి అలాంటి సమయంలోనూ, ప్రశ్నలో పేర్కొనబడిన సందర్భములో అంతగా వ్యత్యాసం కనబడదు. కనుక కొన్ని హదీసుల ‘ఖియాస్’ (అంచనా)ల దృష్ట్యా పై పేర్కొనబడిన స్త్రీ పై అసర్ నమాజు పాటించడం తప్పని సరి. 

మరి ఇదే విధంగా ఒక వేళ ఆమె’ఇషా’ నమాజ్ సమయం పూర్తికాక ముందే పరిశుద్ధురాలైతే ఆమెకి ‘ఇషా’ నమాజు మాత్రమే చదవవలసి వుంటుంది ‘మగ్రిబ్ నమాజు కాదు. 

ప్ర -13 : గర్భము కోల్పోయిన స్త్రీల స్థితి రెండు విధాలుగా వుంటుంది. గర్భము కోల్పోవటం అనేది పిండము ఏర్పడక ముందు జరుగుతుంది లేదా పిండము ఏర్పడి అందులో రూపు రేఖలు దిద్దుకున్న తరువాత జరుగుతుంది. అయితే సమస్య ఏమిటంటే ఏ రోజైతే ఆమే గర్భము కోల్పోయిందో ఆ రోజుఉపవాసం గురించి ఆదేశం ఏమిటి? మరింకా అటువంటి రోజుల ఉపవాసము సంగతి ఏమిటి? దేనిలోనైతే ఆమె రక్తాన్ని గమనిస్తుందో? 

జ: గర్భములో పిండము ఏర్పడక పోయినట్లైతే ఆ రక్తం బాలింత దశకు సంబంధించిన రక్తం కాదు. కనుక ఆ స్త్రీ నమాజు, ఉపవాసం పాటించాలి. ఆమె ఉపవాసం సరైనదే. ఒకవేళ గర్భములో పిండము ఏర్పడనట్లైతే ఆ రక్తం బాలింతదశానికి సంబంధించిన రక్తమే. కనుక ఆ స్థితిలో నమాజు చదవకూడదు, ఉపవాసం వుండ కూడదు. ఈ విషయంలో విధానం ఏమిటంటే గర్భాశయంలో పిండం ఏర్పడిన తదనంతరం తొలగించటం జరిగితే దాని తరువాత వచ్చే రక్తం బాలింతదశానికి సంబంధించిన రక్తమే. కనుక ఆ సందర్భములో ఆమెకి ఆ అన్ని విషయాలు నిషిద్దంగానే వర్తిస్తాయి ఏవైతే బాలింతురాలికి నిషిద్ధంగా వుంటాయో. ఒకవేళ గర్భాశయంలో పిండం ఏర్పడని సందర్భములో ఆ రక్తం బాలింత దశానికి సంబంధించిన రక్తం కాదు. కాబట్టి ఏవైతే బాలింతురాలికి నిషిద్ధంగా వుంటాయో అవి ఆమె పై నిషిద్ధం కావు. 

ప్ర-14 : గర్భవతికి పవిత్ర రమజాన్ మాసంలో పగటి పూట రక్తం వస్తే దాని ద్వారా ఆమె పాటిస్తున్న ఉపవాసానికి ఏమైన భంగం వాటిల్లుతుందా? 

సాధారణ స్త్రీ ఒక వేళ ఉపవాసం పాటిస్తున్నప్పుడు ఆమెకు ఋతుస్రావపు రక్తం ప్రారంభమైతే ఆమె ఉపవాసానికి భంగం వాటిల్లుతుంది. ఎందుకంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిస్తున్నారు : “స్త్రీ నెలసరిలో ఉన్నప్పుడు నమాజు, ఉపవాసం పాటించటం లేదు కదా“. 

అందుకే నెలసరిని ఉపవాసాన్ని భంగము కల్గించే అంశాల్లో ఒకటిగా భావించబడుతుంది. మరి బాలింతురాలి దశలో వచ్చే రక్తం కూడా ఈ ఆదేశానికి సంబంధించినదే. కనుక నెలసరి లేక బాలింతురాలి దశలో వచ్చే రక్తం వల్ల ఉపవాసానికి భంగం వాటిల్లుతుంది. 

ఇక గర్భవతికి పవిత్ర రమజాన్ మాసంలో పగటి పూట రక్తం వచ్చే విషయంలోనైతే అది (రక్తం) ఒక వేళ నెలసరికి సంబంధించిందైతే దాని ఆదేశం సాధారణ స్త్రీ (బాలింతురాలు కాదు) నెలసరిగా పరిగణించ బడుతుంది. అంటే దాని ద్వారా ఉపవాసానికి భంగము ఏర్పడుతుంది. ఒక వేళ నెలసరికి సంబంధించింది కాకపోతే దాని వల్ల ఉపవాసానికి ఎలాంటి ఆటంకం ఏర్పడదు. గర్భవతికి ఏ రక్తస్రావం అవుతుందంటే – ఆమె నెలతప్పి గర్భవతి అయిన కూడ నెలసరి ఆగక క్రమం ప్రకారం నెలసరవుతున్నప్పుడు ప్రఖ్యాత అభిప్రాయం ప్రకారం – అది నెలసరిగానే పరిగణించి దానిపై నెలసరికి సంబంధించిన ఆదేశాలే పాటించబడతాయి. కాగా ఒకవేళ ఆమె రక్తస్రావం ఆగిపోయివుండి మళ్ళీ దాని తరువాత ఆమె రక్తం గమనిస్తే, అది నెలసరికి సంబంధం కానటువంటిదైతే అప్పుడు దాని ద్వారా ఉపవాసం ప్రభావితం కాదు ఎందుకంటే ఆ రక్తం నెలసరిది కాదు. 

ప్ర-1 5 : స్త్రీ ఒకవేళ నెలసరి కాలంలో ఒక రోజు రక్తాన్ని గమనించింది. మరుసటి రోజు పూర్తిగా రక్తం చూడకపోతే అప్పుడు ఆమె ఏమి చేయాలి? 

జ: ఈ సమస్యలో ఉన్న విషయం ఏమిటంటే ఆ స్త్రీ తన నెలసరి కాలంలో చూసిన పరిశుద్ధత గాని (రక్తం) ఆగిపోవటం గాని అది నెలసరి పరిగణంలోకే వస్తుంది. కనుక దానిని పరిశుద్ధతలో పరిగణించటం జరగదు. అందుకే ఆమె ఆ విషయాలకు దూరంగానే వుండాలి, ఏ విషయాలతో నెలసరిగల స్త్రీ దూరంగా ఉంటుందో. కాని కొందరు ధార్మిక విద్వాంసులు తమ అభిప్రాయాన్ని ఇలా వ్యక్తం చేశారు : 

‘ఎవరైనా స్త్రీ ఒక రోజు రక్తం చూసి మరో రోజు రక్తం చూడక పోతే అప్పుడు ఆ రక్తం నెలసరిగానే పరిగణింపబడుతుంది. మరి ఏ రోజైతె రక్తం రాలేదో ఆరోజు పరిశుద్దురాలుగా వుంటుంది. ఇలా 15 రోజులు గడిచే వరకు. 15 రోజుల తరువాత అది ఋతుస్రావం క్రింద పరిగణించ బడుతుంది’. ఇదే ఇమాం అహ్మద్ బిన్ హంబల్ (రహిమహు- ల్లాహ్) ప్రఖ్యాత అభిప్రాయం. 

గమనిక: ఒకరోజు రక్తం చూసి మరుసటి రోజు రక్తం చూడనటువంటి స్త్రీ ఋతుకాలాన్ని 15 రోజులుగా నిర్ణయించటం జరుగుతుంది. తరువాత ఏ రోజు రక్తం వస్తుందో ఆ రోజు అపరిశుద్దురాలుగాను మరి ఏ రోజు రక్తం రాదో ఆ రోజు పరిశుద్ధురాలుగాను పరిగణించడం జరుగుతుంది. ఇలా 15 రోజుల వరకు వుంటుంది. ఆ తరువాత కూడ నెలసరి అవుతున్నట్లైతే అది రక్తస్రావంగానే పరిగణించ బడుతుంది. 

రక్తస్రావం : అంటే నెలసరి కాలాన్ని మించి వచ్చే దానిని, మరి బాలింత దశను మించి వచ్చే దానిని రక్తసావ్రం అంటారు. 

ప్ర-16 :నెలసరి చివరి రోజుల్లో పరిశుద్ధతకు ముందు స్త్రీకి రక్తపు మరకలు కానరానప్పుడు ఆమె ఆరోజు ఉపవాసం పాటించవచ్చా? ఎందుకంటే ఇంకా ఆమె తెలుపు నీళ్ళు చూడనే లేదు. అప్పుడు ఆమె ఏమిచేయాలి? 

జ : పై పేర్కొనబడిన స్త్రీకి సాధారణంగా నెలసరి తరువాత తెల్లటి నీళ్ళు కానవచ్చేది కాదు. కొందరు స్త్రీల్లో ఇటువంటి లక్షణం వుండదు. కాబట్టి అలాంటప్పుడు ఆమె ఉపవాసం వుంటుంది. ఒక వేళ ఆమెకు నెలసరి తరువాత తెలుపు నీళ్ళు చూసే అలవాటు వుంటే అప్పడు తెలుపు నీళ్ళు చూసేంత వరకు ఆమె ఉపవాసం వుండరాదు. 

ప్ర- 17 : ఋతుస్రావంలో ఉన్న స్త్రీ, బాలింత దశలో రక్తస్రావం గల స్త్రీ అవసర నిమిత్తం ఉదాహరణకు: విద్యార్థిని లేక ఉపాధ్యాయురాలైనప్పుడు చూసి లేదా చూడకుండా పవిత్ర ఖుర్ఆన్ పారాయణం చేయవచ్చా? 

ఋతుస్రావంలో ఉన్న స్త్రీ, బాలింత దశలో రక్తస్రావం గల అవసర నిమిత్తం ఉదాహరణకు : విధ్యార్ధిని లేక ఉపాధ్యాయురాలైనప్పుడు రాత్రి లేదా పగలు ఏ సమయంలోనైన ఖుర్ఆన్ పారాయణం చేయటం లేదా పదేపదే చదవటంలో ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ పుణ్య సంకల్పముతో ఈ స్థితిలో ఖుర్ఆన్ పారాయణం చేయకపోవటమే మంచిది. ఋతుస్రావం గల స్త్రీ ఖుర్ఆన్ పారాయణం చేయకూడదనేది అనేక ఇస్లామియా ధార్మిక విద్యాసంసులు అభిప్రాయం. 

గమనిక: అంటే ఎవరికైనా ఖుర్ఆన్ చదివించటం లేదా ఎవరైనా పారాయణం చేసినప్పుడు వినటం అవసరాన్ని బట్టి చేయవచ్చు. కానీ పుణ్య సంకల్పంతో స్వయంగా పారాయణం చేయరాదు. 

ప్ర -18 : ఋతుస్రావం గల స్త్రీ పరిశుద్దురాలైన తరువాత వస్త్రాలు (దుస్తులు) తప్పకుండా మార్చాలా? (ఉన్నదుస్తుల్లో) రక్తంగాని అపరిశుభ్రత గా గాని లేనప్పుడు కూడా దుస్తులు మార్చవలసి వుంటుందా? 

జ: లేదు. అవసరం లేదు. ఎందుకంటే ఋతుస్రావంతో దేహం పరిశుభ్రత కాదు కేవలం ఆ ప్రదేశం మాత్రమే అపరిశుభ్రమవుతుంది దేనినైతే రక్తం తాకుతుందో. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్త్రీలకు ఇలా ఆదేశించారు : 

దుస్తుల్లో ఋతుస్రావపు రక్తం అంటుకున్నప్పుడు వారు దానిని పరిశుభ్రం చేసుకుని అందులోనే నమాజు చేసుకోవచ్చు”. 

ప్ర -19 : ఒకరు ఇలా ప్రశ్నిస్తున్నారు : ‘ఒక స్త్రీ రక్తస్రావం కారణంగా పవిత్ర రమజాన్ మాసంలో ఏడు రోజుల ఉపవాసాలు పాటించలేదు. రెండవ రమజాన్ వచ్చెవరకు ఆమె ఆ ఉపవాసాల ఖజా (బదులు) కూడ వుండలేదు. అలాగే మళ్ళీ రెండవ రమజాన్లో కూడ ఏడు రోజుల ఉపవాసాలు పాటించలేక పోయింది. ఎందుకంటే ఆమె తన బిడ్డకు పాలు పట్టేది. అనారోగ్యం కారణంగా ఆ ఉపవాసాల ఖజా(బదులు) కూడ వుండలేదు. అయితే ఇప్పుడు మూడవ రమజాన్ సమీపించింది. ఆస్త్రీ ఏమి చేయాలి? జవాబు చెప్పగలరు. అల్లాహు తఆలా మీకు పుణ్యఫలాలు ఇవ్వుగాక! 

జ: పై పేర్కొనబడిన స్త్రీ నిజంగానే అనారోగ్యవంతురాలైతే, ఆమె ఆ ఉపవాసాల ఖజా (బదులు) వుండగలదు. ఎందుకంటే ఆమె సమ్మతమైన కారణం కలిగివుంది. కనుక ఆమె తనలో స్థోమత పొందినప్పుడు ఉపవాసాల ఖజా చేయవలెను. ఒక వేళ రెండవ రమజాన్ దాపరించినా సరే. కాని అకారణం  లేక కుంటి సాకులతో బద్దకము చేస్తే అది మంచిది కాదు. 

ఒక రమజాన్ మాసంలో వదిలేసిన ఉపవాసాలకు ‘ఖజా’ రెండవ రమజాన్ వరకు ఆలస్యము చేయరాదు. (అలా చేయటం ఏమాత్రం మంచిది కాదు). హ॥ ఆయషా రజియల్లాహు అన్హా ఇలా తెలిపారు:  “నా ఉపవాసాలు మిగిలిపోయేవి. అయితే నేను ‘షాబాన్’ మాసంలోనే వాటి ‘ఖజా’ను పూర్తిచేసేదాన్ని”. 

అయితే ఆ స్త్రీ తన గురించి ఆలోచించుకోవలసిందేమిటంటే ఒక వేళ తన వద్ద సరైన కారణం లేనప్పుడు ఆమె పాపాత్మురాల వుతుంది. అల్లాహ్ మన్నింపుకై వేడుకుని తనపై మిగిలి వున్న ఉపవాసాల ‘ఖజా’ పాటించడంలో త్వరపడాలి. ఒకవేళ నిజంగానే ఆమెకు సమ్మత కారణం వుంటే అప్పుడు ఆమె ‘ఖజా’ చేయటంలో సంవత్సరము గాని రెండు సంవత్సరాలుగాని ఆలస్యమైన పర్వాలేదు. 

20: కొందరు స్త్రీల పరిస్థితి ఎలా వుంటుందంటే రెండవ రమజాన్ మాసం వచ్చేస్తుంది కాని వారు ఇంత వరకూ గత రమజాన్ – మాసంలో వదిలివేసిన ఉపవాసాల ‘ఖజా’ (బదులు) పూర్తి చేసి వుండరు. ఇలాంటి స్త్రీలపై ఏమి విధిగా వుంటుంది? 

ఇలాంటి స్త్రీల పై విధి ఏమిటంటే వారు ఇలాంటి పొరపాట్లకు అల్లాహ్ మనస్ఫూర్తిగా క్షమాపణ కోరాలి. (రెండవ రమజాన్ అయిన వెంటనే ఉపవాసాల ‘ఖజా పూర్తి చేయాలి). ఎందుకంటే ఏ కారణం లేకుండా ఒక రమజాన్ వదిలేసిన ఉపవాసాలకు ‘ఖజా’ రెండవ రమజాన్ వరకు ఆలస్యము చేయరాదు. విశ్వాసుల మాత హ॥ ఆయషా (రజియల్లాహు అనా) హదీసు ప్రకారం : 

“నా ఉపవాసాలు మిగిలిపోయేవి అయితే నేను ‘షాబాన్ మాసం’లో వాటి ‘ఖజా’ను పూర్తి చేసేదాన్ని”. 

(పై హదీసు ద్వారా ఒక రమజాన్ ఉపవాసాల ‘ఖజా’ రెండవ రమజాన్ తరువాత వరకు ఆలస్యం చేయటం తగదని మనకు బోధ పడుతుంది. కనుక ఇలాంటి స్త్రీలు తమ కర్మ నిమిత్తం అల్లాహ్ సన్నిధిలో మనసారా మన్నింపుకై వేడుకోవాలి. అంతే కాక రెండవ రమజాన్ తరువాత వదిలేసిన ఉపవాసాల ‘ఖజా’ కూడా పూర్తిచేయాలి. 

ప్ర- 21 : ఒక వేళ స్త్రీ మధ్యాహ్నం తరువాత అనగా ఒంటి గంట తరువాత ఋతుస్రావానికి గురైంది. ఇంకా ఆమె ఇంతవరకు ‘జొహర్’ నమాజు పాటించలేదు. అయితే ఆమె పరిశుద్ధురాలైన తరువాత 

ఆ (జొహర్) నమాజు ‘ఖజా’ చేయవలసి వుంటుందా? 

జ : ఈ సమస్యలో ఇస్లామీయా విద్వాంసుల్లో భేదాభిప్రాయాలున్నాయి. కొందరు ఇలా అంటున్నారు: 

పై పేర్కొన్న స్త్రీ పై ఆ నమాజు ‘ఖజా’ తప్పనిసరి (‘వాజిబ్) కాదు. ఎందుకంటే ఆమె ఎటువంటి ఆటంకాలు చేయలేదు. మరి పాపానికీ పాల్పడలేదు. ఎందుకంటే ఆమె ఆ నమాజును దాని చివరి సమయం వరకు ఆలస్యంగా చదవవచ్చు. 

కానీ మరి కొందరు విద్వాంసులైతే ఇలా అంటున్నారు: ఆమె పై ఆ నమాజు ‘ఖజా’ పూర్తి చేయవలసి వుంటుంది. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రస్తావించిన ఈ హదీసు అపరిమితమైనది. 

“ఎవరైతే నమాజులోని ఒక రకాతు పొందాడో అతను(పూర్తి) నమాజు పొందాడు (పొందినట్లే)”. 

అయినా జాగ్రత్త గల విషయం ఏమిటంటే ఆమె ఆ నమాజు ‘ఖజా’ పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే ఒక నమాజు మాత్రమే కదా! దాని ‘ఖజా’ చదువుకోవటానికి స్త్రీకి పెద్దగా ఇబ్బంది గాని కష్టం గాని వుండదు. 

22: గర్భవతి ఒక వేళ ప్రసవించటానికి ఒకటి లేదా రెండు రోజుల ముందు రక్తాన్ని చూసినట్లైతే దాని కారణంగా ఆమె నమాజు, ఉపవాసం వదిలివేయాలా? (విరమించుకోవాలా?) 

జ: గర్భవతి ఒక వేళ ప్రసవించటానికి ఒకటి లేదా రెండు రోజుల ముందు రక్తాన్ని చూసింది. పురిటినొప్పులు కూడా గ్రహించింది. అయితే అది బాలింత దశానికి సంబంధించినదిగా పరిగణించబడుతుంది. కనుక దాని కారణంగా ఆమె నమాజు, ఉపవాసం వదిలివేయాలి. కాకపోతే రక్తస్రావంతో పాటు పురిటినొప్పులు రానప్పుడు అది చెడు రక్తంగా నిర్ధారించబడుతుంది. దానికి ఎటువంటి విలువ లేదు. ఇంకా ఈ రక్తం నమాజు మరియు ఉపవాసానికి ఆటంకం కాదు. 

ప్ర-23: అందరితో పాటు ఉపవాసం వుండాలనే నేపంతో నెలసరిని నిర్మూలించె (అరికట్టే) మందులు వాడటం పట్ల మీ అభిప్రాయం ఏమిటి? 

జ: నేనైతే దీనిని గట్టిగా వారిస్తున్నాను. ఎందుకంటే డాక్టర్ల ద్వారా విశ్వసనీయంగా తెలిసిన విషయమేమిటంటే ఈ మందుల వల్ల ఎన్నో దుష్ప్రభావాలు తలెత్తుతున్నాయి. కనుక స్త్రీలకు హితబోధన చేసేదేమిటంటే ఇది అల్లాహ్ వారిపై నిర్ణయించిన విధిరాత (గుణం). అందుకే అల్లాహ్ నియమించిన విధిపై స్థిరముగా వుండండి. ధార్మికంగా ఎలాంటి ఆటంకాలు లేనప్పుడు ఉపవాసం వుండండి. మరియు ధర్మపరమైన అటంకాలు ఎదురైనప్పుడు అల్లాహ్ నిర్ణయించిన విధిపై అంగీకార నేపంతో ఉపవాసం వదిలివేయండి. 

ప్ర- 24 : ఒకరు ఇలా ప్రశ్నిస్తున్నారు: ఒక స్త్రీ భర్తతో సంభోగం, నెలసరితో చెయించి పరిశద్ధురాలైన రెండు మాసాల తరువాత చిన్న చిన్న రక్తపు బొట్టులను గ్రహించింది. అయితే ఈ స్థితిలో ఆమె నమాజు, ఉపవాసము పాటించాలా? లేక విడిచిపెట్టాలా? 

నెలసరి మరి సంభోగానికి సంబంధించి స్త్రీలకు అనేక కష్టాలున్నాయి. దానికి ఒక కారణం నెలసరి నిరోధక, గర్భ నిరోధక మాత్రలు వాడటం కూడా వుంది. పూర్వం ఇలాంటి సందేహాలకు తావువుండేది కాదు. ఇది వాస్తవమే! ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చిన తరువాత నుంచే కాదు స్త్రీ ఉనికి ఏర్పడినప్పటి నుంచే సందేహాలు వున్నాయి. కానీ సందేహాల తీవ్రత ఎంత పెరిగిందంటే మానవుడు వాటిని పరిష్కరించుటలో అల్లాడిపోవటం అనేది ఎంతో బాధకరమైన (విచిత్రమైన) విషయం. 

కాని ఈ కోవలో సాధారణమైన సూత్రం ఏమిటంటే స్త్రీ పరిశుద్ధు రాలైనప్పుడు నెలసరిలో ఖచ్చితంగా పరిశుద్ధతను గ్రహిస్తే (అంటే మహిళలు గుర్తించే ఆ తెలుపు నీళ్ళు ఆమెకు కానవస్తే) ఆ నీళ్ళు మట్టిరంగులా వున్నా, లేదా పసుపు రంగుకు దగ్గరగా వున్నా, లేదా చుక్కైనా, లేదా చెమ్మైనా ఇవన్నీ నెలసరిలో పరిగణించ బడవు. అందుకే ఆమెకు నమాజు, ఉపవాసానికి ఎలాంటి ఆటంకం లేదు. ఆమె తన భర్తతో లైంగిక వ్యవహారాల్లో కూడ ఆటంకం లేదు. ఎందుకంటే ఇవన్నీ నెలసరికి సంబంధించినవి కావు. దీనికి ఈ వాక్యాలే ఆధారం : 

హ॥ ఉమ్మె అతియా (రజియల్లాహు అన్హా) కథనం “మేము పసుపు రంగుకు వున్న నీళ్ళకు ఎలాంటి దగ్గర వున్న లేదా మట్టి రంగులా ప్రాధాన్యత నిచ్చేవారము కాదు”. (సహీహ్ బుఖారి) 

ఇమామ్ అబూదావూద్ (రహిమహుల్లాహ్) ప్రస్తావించిన వాక్యాల్లో “తుహుర్” (పరిశుద్ధత) అనే పదం ఎక్కువగా వుంది. (అంటే పరిశుద్ధురాలైన తరువాత మేము పసుపు రంగుకు దగ్గరలా వున్నా లేదా మట్టిరంగులా వున్న నీళ్ళకు ఎలాంటి ప్రాధాన్యత నిచ్చేవారము కాదు). ఈ హదీసు ‘సనద్’ (పరంపర) పటిష్ఠమైనది. 

దీన్నిబట్టి మనం ఇలా చెప్పవచ్చు ఏమిటంటే పరిశుద్ధత గురించి నమ్మకం ఏర్పడిన తరువాత ఇలాంటిది ఏదైన వ్యక్తమైనప్పుడు అది స్త్రీకి నష్టం కల్గించదు. ఇంకా ఆమెకి నమాజు, ఉపవాసాలు, భర్తతో లైంగిక వ్యవహారాల నుండి ఎలాంటి ఆటంకం వుండదు. కానీ ఆమెపై విధిగా వున్న విషయం ఏమిటంటే ఆమె పరిశుద్ధతను గ్రహించనంత వరకు తొందర పడకూడదు. ఎందుకంటే కొందరు స్త్రీలు రక్తం నిలిచిన వెంటనే పరిశుద్ధతను గ్రహించకుండానే తొందరపాటుతో స్నానము చేసి పరిశుద్ధులైనట్లు భావిస్తారు. 

ఈ కారణంగానే విశ్వాసుల మాత హ॥ ఆయిషా (రజియల్లాహు అన్హా) వద్దకు ‘సహాబియాత్’ (రజియల్లాహు అన్హుం) ‘కురు’ రక్తంతో తడిసిన దూదిని పంపించేవారు. అయితే ఆమె (ర.అ.హ) వారికి “తెలుపు చూడ నంతవరకు తొందర పడకండి” అని బదులిచ్చేవారు. 

ప్ర -25 : కొందరు స్త్రీలకు ఏకదాటిగా రక్తం వస్తూనే వుంటుంది. మరి కొన్ని సారైతే ఒకటి రెండు రోజుల విరామం తరువాత మళ్ళీయధావిధిగా రావటం మొదలవుతుంది. ఇలాంటప్పుడు వారికి నమాజు, ఉపవాసాలు, ఇతరత్రా ఆరాధనల గురించి ఎలాంటి సూచనలున్నాయి?

జ : ఇస్లామీయా ధార్మిక విద్వాంసుల్లో ఒక పెద్ద వర్గం అభిప్రాయం ఏమిటంటే ఒకవేళ స్త్రీకి ఏదైన ప్రత్యేకమైన నియమం (పరిమిత కాలం) వుంటే దాన్ని పూర్తి చేసి స్నానం చేయాలి. తరువాత నమాజు, ఉపవాసాలు పాటించాలి. అయితే రెండు లేక మూడు రోజుల తరువాత రక్తం చూసినా అది నెలసరి కాదు. ఎందుకంటే ఈ ఇస్లామీయా విద్వాంసుల దృష్టిలో ‘తుహుర్’ (పరిశుద్ధత) కు కనీస వ్యవధి 13 రోజులు వుంది. 

మరి కొందరి అభిప్రాయం ఏమిటంటే : “ఎప్పుడైతె ఆమె రక్తం గ్రహిస్తుందో అప్పడు అది నెలసరిగా పరిగణించబడుతుంది. గ్రహించనప్పుడు పరిశుద్దురాలుగా పరిగణించబడుతుంది. ఒకవేళ రెండు నెలసరిల కాలం మధ్యలో 13 రోజుల వ్యవధి లేకున్న సరె. 

ప్ర -26 : స్త్రీలు పవిత్ర రమజాన్ మాసపు రాత్రుల్లో ఇంటిలో నమాజు చేయుట ఉత్తమమా? లేదా మసీదులో చేయుట ఉత్తమమా? ప్రత్యేకించి మసీదుల్లో హితబోధన, ధార్మిక ప్రసంగ కార్యక్రమాలు ఏర్పాటు చేయబడుతున్న సందర్భములో? అంతేకాక మసీదులో నమాజు పాటించే స్త్రీలకు మీరు ఏలాంటి హితబోధనలు చేయదలుచుచున్నారు? 

జ: స్త్రీ తన ఇంట్లో నమాజ్ పాటించడమే ఉత్తమం. ఎందుకంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రస్తావించిన హదీసు విశాలమైనది: “స్త్రీలకు వారి ఇల్లు నమాజుకై ఎంతో మేలైనది” 

అంతే కాకుండా దీనికై స్త్రీలు ఇంటి నుండి బయటకు వెళ్ళుట అనేక సందర్భాల్లో క్లిష్టపరిస్థితులతో కూడుకున్న సమస్యే. అందుకే ఆమె ఇంట్లో నమాజు పాటించడం మసీదు వెళ్ళటానికంటే మేలైనది. అయితే హితబోధన, ధార్మిక ప్రసంగాలు వినాలంటే అది కేసెట్ల ద్వారా కూడ వినవచ్చు. ఏ స్త్రీలు నమాజు కొరకు మసీదుకు వెళ్తున్నారో వారికి నా హితోపదేశం ఏమిటంటే వారు ఎలాంటి అలంకరణను వ్యక్తపరచకూడదు. సువాసనలు వెలువడే వస్తువులు (ఫర్ ఫ్యూమ్, సెంటు లాంటివి) వాడరాదు 

ప్ర-27 – స్త్రీ పవిత్ర రమజాన్ మాసంలో ఉపవాసస్థితిలో వంట రుచిని పరీక్షించగలదా? వాటి పట్ల ఆదేశం ఏముంది? 

జ: అత్యవసరమైనప్పుడు పరీక్షించటంలో ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ రుచి పరీక్షించిన తరువాత దానిని ఉమ్మివేయాలి (తినరాదు). 

ప్ర-28: ఒక స్త్రీ గర్భం దాల్చిన తొలిరోజుల్లో యాక్సిడెంట్ కు గురైంది. విపరీతంగా రక్తం పోవడం వల్ల గర్భం పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఉపవాసాలు పూర్తిచేయాలా? లేదా విరమించుకోవాలా? ఒక వేళ ఉపవాసం విరమించుకుంటే ఆమె పాపానికి గురికాదా? 

జ: మా అభిప్రాయం ఏమిటంటే గర్భవతికి నెలసరి రాదు. ఇమామ్ అహ్మద్ (రహ్మతుల్లాహి అలైహ్) వ్యాఖ్యానం ప్రకారం : ‘స్త్రీలకు నెలసరి ఆగితేనే గర్భం గురించి అవగాహన కలుగుతుంది‘. నెలసరి గురించి విద్యావంతులు ఇలా వ్యాఖ్యానిస్తున్నారు : ‘అల్లాహ్ దానిని తల్లి గర్భములో ఉన్న శిశువుకు పోషకాహారంగా మలచాడనే విషయం బోధపడుతుంది. అందుకే గర్భం ఏర్పడినప్పుడు నెలసరి రావటం ఆగిపోతుంది‘. 

కానీ కొంతమంది స్త్రీలకు గర్భం తరువాత కూడ యధా ప్రకారం నెలసరి వస్తూనే వుంటుంది. అటువంటి స్త్రీలకు ఆదేశం ఏమిటంటే వారి నెలసరి అసలైన నెలసరి కాదు. ఎందుకంటే అది గర్భప్రభావం లేకుండా వస్తుంది. ఇలాంటి నెలసరి గల స్త్రీలకు కూడ సాధారణ (గర్భమేతర) నెలసరి స్త్రీలకు వర్తించే ఆదేశాలే వర్తిస్తాయి. వారిని దేని నుండి నివారించబడిందో వాటి నుండి వీరు కూడా దూరంగా వుండాలి. 

సంక్షిప్తంగా గర్భవతికి వచ్చే రక్తం రెండు రకాలు: ఒక రకమైన రక్తంపై నెలసరి ఆదేశాలు వర్తిస్తాయి. అది ఎలాంటిదంటే గర్భం దాల్చిన తరువాత కూడ మునుపటిలాగే రక్తం వస్తుంది. అంటే అది గర్భప్రభావానికి లోను కాదు. కనుక అది నెలసరిగానే పరిగణించబడుతుంది. రెండో రకం రక్తం ఎలాంటిదంటే ఏదైన యాక్సిడెంట్ కారణంగా లేదా ఏదైన బరువు ఎత్తిన కారణంగా లేదా పడిపోయిన కారణంగా అకస్మాత్తుగా వచ్చేది. అయితే ఇది నెలసరి కాదు. నరములోని రక్తం. కనుక ఇది నమాజుకి ఉపవాసానికి అటంకం కల్గించదు. అంతేకాక వీరు పరిశుద్ధులుగా పరిగణించబడతారు. 

యాక్సిడెంట్ కారణంగా గర్భంలోనున్న శిశువు లేద గర్భం కోల్పోవుట జరిగినప్పుడు ధార్మిక విద్యావంతులు రెండు విధాలుగా వ్యాఖ్యానించారు: మొదటి సందర్భం ఏమిటంటే గర్భంలో వున్న శిశువు రూపురేఖలు దాల్చుకొని పడిపోయినప్పుడు దాని తరువాత వచ్చే రక్తాన్ని బాలింతదశకు సంబంధించిన రక్తస్రావంగా పరిగణించబడుతుంది. ఆ రోజుల్లో ఆమె నమాజు, ఉపవాసాలు పాటించరాదు. పరిశుద్దురాలైనంతవరకూ ఆమె భర్త కూడ ఆమెతో లైంగిక వ్యవహారాలకు దూరంగా వుండాలి. రెండవ సందర్భం : ఏమిటంటే గర్భము పడిపోయిన సమయములో లోపల వచ్చే రూపురేఖలు దాల్చుకోవటం జరగలేదు. అలాంటప్పుడు దాని తరువాత రక్తం చెడు రక్తంగా పరిగణించ బడుతుంది. దాని వల్ల నమాజు, ఉపవాసాలు ఇంకా ఇతర విషయాలకు అది ఏమి ఆటంకంకాదు. 

ఇస్లామీయ ధార్మిక విద్వాంసులు ఇలా ప్రస్తావిస్తున్నారు : సృష్టి ఆకారం వ్యక్తం కావటానికి కనీస కాలం 81 రోజులవుతుంది. అబ్దుల్లా బిన్ మసూద్ (రజియల్లాహు అన్హు) కధనం : దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు : ” ప్రతి వ్యక్తి తన తల్లి గర్భములో నలభై రోజుల వరకు వీర్యముగా వుంటాడు. ఇంకా అంతే కాలం వరకు రక్తపు ముద్దగా వుంటాడు. అంతే కాలం వరకు మాసపు ముద్దలా వుంటాడు. అప్పుడు అతని వద్ద దైవదూత పంపబడతాడు. ఆ దైవదూతకు నాలుగు విషయాల గురించి సూచించడం జరుగుతుంది. కనుక ఆ దైవదూత అతని ఆహారము (ఉపాధి), అతని జీవిత కాలం, అతని కర్మము, ఇంకా అతను పుణ్యాత్ముడా లేక పాపిష్ఠుడా అనే విషయాలను వ్రాసివేస్తాడు“. 

కనుక ఈ గడువు కంటే ముందు గర్భంలో శిశువుకు జీవం వ్యక్తం లేదు. అంతేకాక కొందరు జ్ఞానుల అభిప్రాయం ప్రకారం సాధారణంగా 90 రోజుల కంటే ముందు జీవం బయటపడదు.

ప్ర-29: ఒక స్త్రీ ఇలా ప్రశ్నిస్తుంది: మూడో నెలలో నా గర్భము పోయింది. పరిశుద్ధులు అయ్యేంతవరకు నేను నమాజు చదవలేదు. నా పై నమాజ్ పాటించుట తప్పనిసరి (వాజిబ్) అని కొందరు చెప్పారు. ఇప్పుడు నేను ఏమిచేయాలి? నాకైతే ఖచ్చితంగా ఆ రోజుల సంఖ్య గుర్తులేదు? 

జ : ధార్మిక విద్వాంసుల అభిప్రాయం ఏమిటంటే స్త్రీ మూడు నెలల గర్భాన్ని కోల్పోయినప్పుడు ఆమె నమాజు చదవదు. ఎందుకంటే ఆమె కోల్పోయిన శిశువు రూపురేఖలు వ్యక్తమైవుంటే ఆ సందర్భములో వచ్చే రక్తం బాలింతదశానికి సంబంధించిన రక్తస్రావం. ఆ స్థితిలో స్త్రీ నమాజు పాటించకూడదు. ధార్మిక విధ్వాంసులు ప్రస్తావన ఏమిటంటే శిశువు రూపురేఖలు 81రోజులు నిండిన తరువాతే వ్యక్తమవుతాయి. అయితే ఈ కాలం మూడు మాసాలకంటే తక్కువగా ఉంది. 

ఒక వేళ స్త్రీ కోల్పోయిన శిశువు మూడు నెలలు పూర్తిచేసుకుందనే నమ్మకం వుంటే అలాంటప్పుడు వచ్చే రక్తం బాలింత దశకి చెందిన రక్తస్రావం అవుతుంది. ఒక వేళ గర్భం 80 రోజుల కంటే ముందే పడిపోతే అలాంటి సందర్భములో వచ్చే రక్తం చెడు రక్తమే. కానీ దాని మూలంగా ఆమె నమాజు వదలకూడదు.

అయితే పై పేర్కొనబడిన స్త్రీ తన జ్ఞాపకంతో బాగా ఆలోచించాలి. ఒకవేళ ఆమె గర్భం 80 రోజుల పూర్తికాక ముందే పడిపోయివుంటే అప్పుడు ఆమె నమాజుల ఖజా (బదులుగా) చేయాలి. ఒకవేళ వదిలివేసిన నమాజుల సంఖ్య తెలియనప్పుడు అయినంత వరకు అంచనావేసి ఎక్కువ శాతం దేనిపై అవగాహన కుదిరితే దాని ప్రకారం నమాజుల ‘ఖజా’ (బదులుగా) చేయాలి. 

ప్ర-30: ఒక స్త్రీ ఇలా ప్రశ్నిస్తుంది: తనపై ఉపవాసాలు విధి (ఫర్జ్) అయినప్పటి నుండి ఆమె రమజాన్ మాసపు ఉపవాసాలు పాటిస్తుంది. కాని వాటిలో మిగిలిపోయిన ఉపవాసాలకు ‘ఖజా’ (బదులు) వుండట్లేదు. ఎందుకంటే ఆమె వదిలిపెట్టిన ఉపవాసాల సంఖ్య ఆమెకు తెలియదు. అయితే ఈ స్థితిలో ఆమెపై ఏది తప్పనిసరి (వాజిబ్) అవుతుంది? 

జ: సాక్షాత్తు ముస్లిముల నుండి ఇలాంటి వాక్యాలు వింటున్నందుకు మాకు చాలా బాధగా వుంది. (ఫర్జ్) ఉపవాసాలు ‘ఖజా’ చేయకపోవడానికి కారణం తెలియక (అవగాహన లేకపోవడం) లేక బద్దకం వలన జరుగుతుంది. అయితే ఈ రెండు కూడా ఇబ్బందికరమైన విషయాలే. తెలియని విషయాలకు వైద్యం జ్ఞానం (అవగాహన) నేర్చుకోవాలి. విద్యావంతులతో తెలుసుకోవాలి. కాని బద్దకానికి వైద్యం ఏమంటే అల్లాహ్ భయ భీతిని అలవర్చుకోవాలి, ఆయన శిక్షకు భయపడాలి, ఆయన ఆజ్ఞల వైపు ముందడుగు వేయాలి. 

పై పేర్కొనబడిన స్త్రీ పై తప్పనిసరి (వాజిబ్) ఏమిటంటే ఆమె తన వల్ల జరిగిన పొరపాటుకు అల్లాహ్ సమక్షంలో మనసారా కోరుతూ పశ్చాత్తాప పడాలి. ఎన్ని రోజుల ఉపవాసాలు మిగిలిపోయాయో తన శక్తి మేరకు అంచనావేసి ‘ఖజా’ చేయాలి. అప్పుడే ఆమె తనపై వున్న విధిని పూర్తి చేసుకోగలదు. అల్లాహ్ వారి క్షమాపణను అంగీకరించుగాక… ఆమీన్

ప్ర- 31: ఒకామె ఇలా ప్రశ్నిస్తుంది …. ‘ఏమంటే నమాజు సమయం ప్రారంభం అయిన తరువాత స్త్రీకి నెలసరి వస్తే దాని గురించి ఆదేశం ఎలా వుంది? ఇంకా పరిశుద్ధురాలు అయిన తరువాత ఆమె పై ఆ నమాజు ఖజా (బదులు) చేయటం (వాజిబ్) తప్పనిసరా? మరి ఇలాగే ఆమె నమాజు చివరి సమయం దాటిపోక ముందే పరిశుద్ధురాలైతే దాని గురించి ఆదేశం ఎలా వుంది?’ 

జ: ఒకటి : నమాజు సమయం ప్రారంభం అయిన తరువాత స్త్రీకి నెలసరి వచ్చినప్పుడు ఆమె ఒకవేళ అప్పుడు వరకు నమాజు పాటించకుండా వుండి వుంటే ఆమె పరిశుద్దురాలైన తరువాత ఆ నమాజుని ‘ఖజా’ చేయాలి. ఎందుకంటే ఆ నమాజు సమయంలో ఆమె నెలసరి కల్గియున్నది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: “ఎవరైనా నమాజులోని ఒక ‘రకాత్” పొందినా అతను నమాజు పొందినట్లే.” 

కనుక స్త్రీకి ఏదైన ఒక నమాజులోని ఒక ‘రకాత్’ చదివే సమయం దొరికినప్పుడు ఆమె ఆ నమాజు చదవటానికి ముందే నెలసరికి గురైతె పరిశుద్ధురాలైన తరువాత ఆ నమాజుకి ‘ఖజా’ చేయాలి. 

రెండు : నమాజు సమయం పూర్తి అవ్వక ముందే ఒకవేళ ఆమె నెలసరి నుండి పరిశుద్దురాలైతె ఆమెపై ఆ నమాజు ‘ఖజా’ చేయటం తప్పని సరవుతుంది. ఉదాహరణకు ఒకవేళ సూర్యోదయాని కంటే ముందు కేవలం ఒక రకాత్ చదవగలిగే సమయం వున్నప్పుడు ఆమె నెలసరి నుండి పరిశుద్ధురాలైతె ఫజర్ నమాజు ‘ఖజా’ చేయటం తప్పనిసరి. అలాగే సూర్యస్తమయాని కంటే ముందు కేవలం ఒక ‘రకాత్’ చదవగలిగే సమయం వున్నప్పుడు ఆమె నెలసరి నుండి పరిశుద్ధురాలైతె ‘అస్ర్’ నమాజు ‘ఖజా’ చదవటం తప్పనిసరి. అలాగే అర్థరాత్రి పూర్తి కావటాని కంటే ముందు కేవలం ఒక ‘రకాత్’ చదవగలిగే సమయం వున్నప్పుడు ఆమె నెలసరి నుండి పరిశుద్ధురాలైతె ‘ఇషా’ నమాజు ‘ఖజా’ చదవటం తప్పనిసరి. ఒకవేళ అర్ధరాత్రి తరువాత ఆ స్త్రీ పరిశుద్దురాలైతె ఆమె పై ‘ఇషా’ నమాజు ‘ఖజా’ చదవటం తప్పనిసరి కాదు (అవసరం లేదు). కాకపోతే సమయం అయిన తరువాత ‘ఫజర్’ నమాజు చదవటం ‘వాజిబ్’ (తప్పనిసరి). పవిత్ర ఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు : 

فَإِذَا اطْمَأْنَنتُمْ فَأَقِيمُوا الصَّلَاةَ ۚ إِنَّ الصَّلَاةَ كَانَتْ عَلَى الْمُؤْمِنِينَ كِتَابًا مَّوْقُوتًا

శాంతి కల్గినప్పుడు నమాజు స్థాపించండి, వాస్తవంగా నమాజు విశ్వాసుల పై నిర్ణీతసమయాల్లో విధియయై ఉంది”. (అన్-నిసా 04:103) 

అంటే నమాజు నిర్ణీత సమయాల్లో విధిగా వుంది. కనుక నమాజును నిర్ణీత సమయం నుండి విడదీయటం గాని లేదా నిర్ణీత సమయం కాక ముందే నమాజు చదవటం గాని మానవునికి తగని విషయం. 

32 : ఒక స్త్రీ ఇలా ప్రశ్నిస్తుంది: ‘నాకు నమాజు మధ్యలోనే నెలసరి వచ్చేసింది’ నేను ఏమి చేయను? నెలసరి కాలంలో వదిలిపెట్టిన నమాజుల ‘ఖజా’ చదవాలా? 

జ: నమాజు సమయం మొదలైన అయిన తరువాత స్త్రీకి నెలసరి వస్తే, ఉదాహరణకు: మిట్టమధ్యాహ్నం సూర్యుడు ఒకింత వాలిన అరగంట తరువాత ఆమెకు నెలసరి వస్తే, నెలసరి నుండి పరిశుద్ధురాలైన తరువాత ఏ నమాజు సమయం ఆమెకి చేరుకుందో ఆ నమాజు ‘ఖజా’ చేయాలి. ఎందుకంటే ఆ సమయంలో ఆమె పరిశుద్ధురాలుగా ఉన్నది. పవిత్ర ఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా ఆదేశిస్తున్నాడు: 

إِنَّ الصَّلَاةَ كَانَتْ عَلَى الْمُؤْمِنِينَ كِتَابًا مَوْقُوتًا 

నిస్సందేహంగా నమాజు విశ్వాసుల పై నిర్ణీత సమయాల్లో విధియయైఉంది“. (అన్-నిసా 4:103) 

స్త్రీ పై నెలసరి కాలంలో వదిలిపెట్టిన నమాజుల ఖజా లేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు: ఇలా జరగట్లేదా? ఏమంటే స్త్రీ నెలసరిలో ఉన్నప్పుడు నమాజు చదవదు ఉపవాసం వుండదు? అంతేకాక ధార్మిక విద్వాంసులందరూ ఏకీభవిస్తున్నది ఏమంటే స్త్రీ నెలసరి కాలంలో వదిలి వేసిన నమాజుల ఖజా చేయనక్కరలేదు. కాని ఆమె నెలసరితో పరిశుద్దు రాలైనప్పుడు ఒక రకాత్ లేదా దానికంటే ఎక్కువ చదవగలిగే  సమయం వుంటే, ఏ నమాజు సమయంలో ఆమె పరిశుద్ధురాలైందో నమాజు ఖజా చేయాల్సి వుంటుంది. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు : 

“ఎవరైతే సూర్యస్తమయాని కంటే ముందు అన్రి నమాజులోని ఒక రకాత్ పొందినట్లైతే అతను అస్ర్  నమాజు పొందినట్లే” 

కనుక నెలసరి గల స్త్రీ ‘అన్రి’ సమయంలో సూర్యస్తమయానికంటే ముందు ఒక రకాత్ చదవగలిగే సమయం వున్నప్పుడు ఆమె నెలసరితో పరిశుద్ధురాలైతె లేదా సూర్యోదయాని కంటే ముందు కేవలం ఒక రకాత్ చదవగలిగే సమయం వున్నప్పుడు ఆమె నెలసరితో పరిశుద్దురాలైతె, ముందు పేర్కొన్న ప్రకారం ‘అస్రో’ నమాజు, తరువాత పేర్కొన్న ప్రకారం ఫజర్ నమాజు చదవవలసి వుంటుంది. 

ప్ర- 33: ఒకరు ఇలా ప్రశ్నిస్తున్నారు: మా అమ్మగారి వయసు 65 సంవత్సరాలు కావచ్చింది. 19 సంవత్సరాల నుండి వారికి ఏలాంటి సంతానం కలుగలేదు, కాని ఒక మూడు సంవత్సరాల నుండి వారికి రక్తస్రావం జరుగుతుంది. చూడటానికి ఏదో జబ్బులాగానే కనబడుతుంది. అయితే పవిత్ర రమజాన్ మాసం నెల సమీపంలో వుంది. అందుకని దయచేసి ఆమె గురించి తమరు ఎలాంటి ఆదేశాలు లేక హితబోధనలు చేయగలరో తెల్పండి? ఇంకా దయచేసి ఇది కూడ తెలుపగలరు – ఏమంటే ఇటువంటి స్త్రీలు ఏమి చేయవలెను? 

జ: ఇలాంటి స్త్రీ అంటే రక్తస్రావం జరిగే స్త్రీకై ఆదేశం ఏమంటే ప్రస్తావించిన జబ్బు రాకముందు ఆమె నెలసరి కాలం ఎంత వుందో అన్నిరోజులు ఆమె నమాజు మరియు ఉపవాసం వదిలివేయాలి. ఒకవేళ ఆమెకి సాధారణంగా ప్రతి నెల మొదటి 6 రోజులు నెలసరి వస్తూవున్నట్లైతే ప్రతి నెల మొదటి 6 రోజులు ఆమె నమాజు, ఉపవాసం వదిలివేయాలి. ఆ ఆరు రోజులు పూర్తి అయిన తరువాత స్నానం చేసి నమాజు చదవాలి, ఉపవాసం వుండాలి. ఇలాంటి స్త్రీలకు నమాజు చదివే పద్ధతి ఎలాగంటే తమ మర్మాంగాన్ని శుభ్రముగా కడుక్కొని దానిపై ఏదైన గుడ్డ కట్టుకోవాలి. తరువాత ‘వజు’ చేసుకుని నమాజ్ చేయాలి. ఇలా ‘ఫర్జ్’ నమాజు సమయాల్లో ప్రవేశించిన తరువాత చేయాలి. ఇలాగే ‘ఫర్జ్’ నమాజు కాకుండా ‘నఫిల్’ చదవాలన్న కూడ ఇదే విధానాన్ని పాటించాలి. 

పై పేర్కొనబడిన స్థితిలో కష్టము ఇబ్బంది కారణంగా ఇలాంటి స్త్రీ ‘జొహర్’ను ‘అస్ర్’తో, మరి ‘మఘ్రిబ్’ను ‘ఇషా’తో కలిపి చదవవచ్చు. ఎందుకంటే ఆమె ఒక సారి చేసుకున్న (‘వజు’ మరి శుచిశుభ్రతలు) రెండు నమాజులకి ఉపయోగపడాలని. అంటే ఒక సారి చేసిన వజు, శుభ్రతలు ‘జొహర్’ మరియు ‘అస్ర్’కి, ఇంకో సారి ‘మఘ్రిబ్’ మరియు ‘ఇషా’కి. అలాగే ఇంకోసారి చేసేది ‘ఫజర్’కు (ఉపయోగపడుతుంది). ఈ విధంగా ఐదు సార్లకు బదులు మూడుసార్లే సరిపోతుంది. 

ఈ విషయాన్ని మరోసారి వివరిస్తున్నాను. పేర్కొనబడిన స్త్రీ తన మర్మాంగాన్ని శుభ్రముగా కడుక్కొని దానిపై ఏదైన గుడ్డతో పట్టి కట్టుకోవాలి. ఎందుకంటే వచ్చే రక్తం అదుపులో వుండటానికి. తరువాత ‘వజు’ చేసి నమాజ్ చదవాలి. ‘జోహర్’ 4 రకాతులు చదవాలి, అస్ర్  4 రకాతులు చదవాలి, మఘ్రిబ్ 3 రకాతులు చదవాలి, ‘ఇషా’ 4 రకాతులు చదవాలి, ఇంకా 2 రకాతులు ఫజర్ చదవాలి. అంటే ఈ నమాజుల్లో ఆమె ‘ఖస్ర్’ (అంటే ప్రయాణ సమయములో చదివే సగం నమాజు) చేయకూడదు. ఎందుకంటే కొందరు ఇలాంటి భ్రమలో ఉన్నారు. కాకపోతే ఆమెకి సౌక్యరం కల్పించబడింది ఏమంటే ‘జొహర్’, ‘అన్రి’ రెండు నమాజులు కలిపి, ‘మఘ్రిబ్’, ‘ఇషా’ రెండు నమాజులు కలిపి చదవవచ్చు. అంటే ‘జొహర్’ నమాజ్తో ‘అస్ర్’ నమాజుని కలుపుకొని లేదా ‘అస్ర్’ నమాజ్తో ‘జొహర్’ని కలుపుకొని చదవవచ్చు. అలాగే ‘మఘ్రిబ్’ నమాజు’తో ‘ఇషా నమాజు’ని లేదా ‘ఇషా’తో మఘ్రిబ్’ని కలుపుకొని, ‘జమ’ చేసి చదవవచ్చు. దీనిని ‘జమ-తాఖీర్’ లేదా ‘జమ-తఖ్దీమ్’ అని అంటారు). 

ఇంకా అదే ‘వజు’తో ‘నఫిల్ నమాజులు కూడా చదవవచ్చు ఎలాంటి అభ్యతరం లేదు. 

ప్ర-34: ప్రసంగాలు మరియు ఖుత్బా వినటానికి నెలసరిగల స్త్రీ ‘మస్జిద్-హరాం’లో ఆగుట సరైనదేనా? 

జ : నెలసరిగల స్త్రీ ‘మస్జిద్-హరాం’లో గాని లేదా వేరే ఏ మస్జిద్ లోనూ గాని అగుట సరైనది కాదు. కాకపోతే మస్జిద్ నుండి దాటుట (వెళ్ళుట), ఇంకా అవసరాన్ని బట్టి ఏదైనా వస్తువు తీసుకొనుట చేయవచ్చు. ఎలాగంటే “ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హ॥ ఆయిషా (రజియల్లాహు అన్హా) ను ‘ ముసల్లా’ (జానిమాజ్: నమాజ్ చేయడానికి ఉపయెగించె చాప) అడిగారు. దానికి ఆమె ఇలా అన్నారు: ‘ముసల్లా’ మసీదులో వుంది. (అప్పుడు ఆమె నెలసరితో వున్నారు) అయితె ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు : ” నీ నెలసరి నీ చేతుల్లో (అంటుకొని) లేదు”. 

కనుక నెలసరిగల స్త్రీకి మసీదులో రక్తము చిమ్మే భయం లేనప్పుడు ఆమెకి మసీదు నుండి వెళ్ళటంలో ఎటువంటి అభ్యతరం లేదు. కాని కూర్చునే ఉద్దేశంతో మసీదులో ప్రవేశించకూడదు. దీనికి ఆధారం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ‘ఈద్’ (పండుగ) నమాజుకై పడుచువాళ్ళకు, స్త్రీలకు, నెలసరిగల స్త్రీలకు ‘ఈద్గాహ్’ వెళ్ళాలని ఆదేశించారు. కాని నెలసరిగల స్త్రీలకు ‘ఈద్గాహ్’ నుండి దూరంగా వుండాలని ఆదేశించారు. ఆ మాటే దీనికి ఆధారం. ఏమంటే, ‘ఖుత్బా’ వినటానికి లేదా ప్రసంగాలు వినటానికై నెలసరిగల స్త్రీ మసీదులో ఆగరాదు. 

స్త్రీ నమాజు కొరకు పాటించవలసిన కొన్ని పరిశుద్ధ ఆదేశాలు 

ప్ర-35 : స్త్రీ యోని నుండి తెల్లటి లేదా పసుపచ్చ రంగులో వెలువడే ద్రవం పరిశుభ్రమేనా? లేదా అపరిశుభ్రమా? ఒకవేళ అది నిరంతరంగా వస్తున్నప్పుడు వజు చేయటం ‘వాజిబ్’ (తప్పనిసరి) అవుతుందా? ఒక వేళ అది క్రమ క్రమంగా వస్తున్నప్పుడు దాని ఆదేశం ఏమిటి? ప్రత్యేకించి విద్యావంతులైన స్త్రీలు ఇది సహజంగా వస్తూవుండే తడి, కాబట్టి దీనికి వజు చేయనవసరం లేదు అని భావిస్తున్నారు. ఇలా భావించవచ్చా? 

జ: అనేక విశ్లేషణలు, విచారణల అనంతరం నేను తెలుసుకున్న విషయం ఏమిటంటే స్త్రీ యోని నుండి తెల్లటి లేదా పసుపచ్చ రంగులో వెలువడే ద్రవం మూత్రాశయం నుండి కాకుండా గర్భాశయం నుండి వస్తుంటే అది పరిశుభ్రమే. అది పరిశుభ్రమైనప్పటికి కూడా ‘వజు’కి భంగం వాటిల్లుతుంది. ఎందుకంటే ‘వజు’ను భంగపరిచే అంశాలపై ఈ షరతు విధించబడలేదు. అంటే వెలువడే వస్తువు అపరిశుభ్రమై వుండాలని షరతు విధించబడలేదు. 

ఉదాహరణకు గాలి (మలవిసర్జన దారి) నుండి వెలువడుతుంది. అయితే ఆ గాలికి శరీరం, ఆకారం వుండవు. అయినా.. అది ‘వజు’ను భంగపర్చుతుంది. అందుకే స్త్రీ ‘వజు’తో వున్నప్పుడు ఆమె యోని నుండి ఏదైన ద్రవం వెలువడితే ఆమె ‘వజు’ భంగపడుతుంది. ఆమె మరలా ‘వజు’ చేయవలసి వుంటుంది. 

ఈ ద్రవం ఒకవేళ నిరంతరం వెలువడుతుంటే అప్పుడు అది ‘వజు’ ‘కి భంగం కల్గించదు. కానీ ఇటువంటి సందర్భములో ఆ స్త్రీ ఏమిచేయాలంటే నమాజు సమయం అయినప్పుడు ఆమె నమాజు కోసం ‘వజు’ చేసుకొని ఆ ‘వజు’తో ఫర్జ్, సున్నత్, నఫిల్ నమాజులను సలపాలి. ఖుర్ఆన్ పారాయణం చేయదలుచుకుంటే చేయాలి. అలాగే పరిశుద్ధ స్థితిలో ఆమెకు ఏఏ పనులు వర్తిస్తాయో వాటిలో తలుచుకున్నవి చేయవచ్చు. 

ఇస్లామీయ విద్యావంతులు మూత్ర వ్యాధిగ్రస్థుడికి సంబంధించి ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేశారు. ఇది గర్భాశయం నుండి వెలువడే ద్రవానికి ఆదేశం, ఈ తడి పరిశుభ్రమే. కాని క్రమ క్రమంగా వచ్చిన పక్షంలో వజుకి భంగం కల్గిస్తుంది. ఒకవేళ నిరంతరంగా వస్తే వజుకి భంగం కలిగించదు. కాకపోతే అలాంటి సందర్భంలో స్త్రీ తప్పనిసరిగా నమాజు సమయం ప్రారంభమైన తరువాత ‘వజు’ చేయాలి. యోనిపై గుడ్డ లేక మరేదైనా కట్టుకోవాలి. ఒకవేళ ఈ ద్రవం క్రమ క్రమంగా వస్తూవుండి నమాజు సమయంలో ఆగిపోతున్నట్లైతే అప్పుడు ఆమె అది ఆగిపోయేంత వరకు నిరీక్షించి నమాజును ఆలస్యం చేయాలి. అలస్యం అంటే నమాజు సమయం దాటిపోయే వరకు నిరీక్షించరాదు. ఒకవేళ నమాజు సమయం దాటిపోయే ప్రమాదం వున్నప్పుడు వజూ చేసుకుని ఆ ద్రవం కారకుండా గుడ్డ లేక మరేదైనా ఏర్పాటు చేసు (కట్టు) కొని నమాజు చదువుకోవాలి. 

అయితే కారే ద్రవం స్వల్పమైనా లేక అధికమైనా రెండింటికి ఒకటే ఆదేశం. ఎందుకంటే యోని నుండి వెలువడే ప్రతీది ఎక్కువైనా తక్కువైనా అది వజు ని భంగపర్చుతుంది. దీనికి భిన్నంగా శరీరములోని వేరే ఏ భాగం నుండైన వెలువడేవి (రక్తం, లేక వాంతు). ఇవి వజుని భంగపరచవు. అవి ఎక్కువైనా తక్కువైనా కూడ. 

అయితే కొందరు స్త్రీలు ఇది సహజమైనది కాబట్టి ‘వజు’కు భంగం వాటిల్లదు’ అనే అభిప్రాయం కలిగివున్నారు. నాకున్న జ్ఞానం మెరకు దీనికి సంబంధించి ఎటువంటి ఆధారము లేదు. కాని ఇబ్నె హజ్మ్ రహ్మతుల్లాహి అలైహి అభిప్రాయం ఒకటుంది. అదేమిటంటే దీనితో వజు భంగం కాదు. అయితే ఆయన ఈ అభిప్రాయానికి సంబంధించి ఏ ఆధారం ప్రస్తావించ లేదు. “కితాబ్ వ సున్నత్” లేదా సహాబాల (అనుచరుల) అభిప్రాయాలతో ఏమైన ఆధారం ఇచ్చివుంటే ఖచ్చితంగా అది పటిష్టమైన ఆధారంగా భావించవచ్చు. 

ఏదేమైనా స్త్రీ ఈ విషయంలో అల్లాహ్ కు భయపడాలి. శుచి శుభ్రతల పట్ల ఎంతో మక్కువ కలిగి వుండాలి. ఎందుకంటే శుభ్రత లేకుండా వంద సార్లు నమాజు చదివినా అది వృధాయే. అల్లాహ్ సమక్షంలో అంగీకార యోగ్యం కాదు. ఈ విషయంలో ఇస్లామీయ విద్వాంసులు ఎంతవరకు అభిప్రాయపడ్డారంటే ఎవరైతే శుచి, శుభ్రత లేకుండా నమాజు చదువుతారో వారు కాఫిర్ (అవిశ్వాసి) అని కూడా చెప్పారు. ఎందుకంటే ఇది అల్లాహ్ పట్ల మరి ఆయన ఆయతుల పట్ల ఎగతాళి చేసినట్లే. 

36 : ఒక స్త్రీకి యోని నుండి ఈ తడి నిరంతరం వస్తుంది. ఆమె ఒకవేళ ఏదైన ఫర్జ్ నమాజుకై వజు చేసిన తరువాత ఆ వజుతో మరో నమాజు సమయం వచ్చే వరకు నఫిల్ నమాజులు చదవవచ్చా? పవిత్ర ఖుర్ఆన్ పారాయణం చేయవచ్చా? 

జ : పై పేర్కొనబడిన స్త్రీ ఏదైన ఫర్జ్ నమాజుకై దాని తొలి సమయంలో వజు చేసి ఆ వజుతో మరో ఫర్జ్ నమాజు సమయం వచ్చే వరకు ఎన్ని ‘నఫిల్ నమాజులైన, ఎన్ని ఫర్జ్ నమాజులైన చదువుకోవచ్చు. ఖుర్ఆన్ పారాయణమూ చేసుకోవచ్చు. 

ప్ర -37 : పై పేర్కొనబడిన స్త్రీ ‘ఫజర్’ ‘వజు’తో ‘ఛాష్త్’ నమాజు పాటించుట సరైనదేనా? 

జ : సరైనది కాదు. ఎందుకంటే ‘ఛాష్త్’ నమాజు సమయం ఒక నిర్ణీత సమయం. అందుకే ఆ సమయం వచ్చిన తరువాత వజూ చేయడం తప్పనిసరి. ఎందుకంటే పై పేర్కొనబడిన స్త్రీ రక్తస్రావం గల స్త్రీ ఆదేశంలో వుంది. రక్తస్రావం గల స్త్రీకి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి నమాజుకు ‘వజు’ చేయాలని ఆదేశించారు. 

ఛాష్త్ నమాజ్ :సూర్యోదయం తరువాత పాటించే నమాజు
కితాబ్-వ- సున్నత్ : పవిత్ర ఖుర్ఆన్, హదీసులను అంటారు. 

ప్ర -38 : పై ప్రస్తావించబడిన స్త్రీ ఇషా ‘వజు’తో అర్ధరాత్రి దాటిన తరువాత ‘తహజ్జుద్’ (రాత్రి నమాజు) నమాజు పాటించవచ్చా? తెలుపగలరు. 

జ : పాటించకూడదు. ఈ విషయంలో రెండు అభిప్రాయాలున్నాయి 

ఒక అభిప్రాయం : అర్ధరాత్రి దాటిన తరువాత ఆమె మరలా (కొత్తగా) ‘వజు’ చేయుట ‘వాజిబ్’ (తప్పనిసరి). 
రెండవ అభిప్రాయం : కొత్తగా వజు చేయుట(వాజిబ్) కాదు కాబట్టి పాటించవచ్చు). 

అయితే రెండవ అభిప్రాయమే ఉత్తమమైనది. 

ప్ర -39 : ‘ఇషా’ నమాజు సమయం ఎప్పటి వరకు ఉంటుంది? దానిని ఎలా తెలుసుకోవాలి? 

జ: ‘ఇషా’ నమాజ్ చివరి సమయం అర్ధరాత్రి వరకు వుంటుంది. దానిని తెలుసుకునే విధానం ఏమిటంటే సూర్యాస్తమయం నుండి ‘ఫజర్ ‘ వరకు మధ్యలోగల సమయాన్ని రెండు భాగాలు చేయాలి. తొలి భాగం పూర్తి అయిన వెంటనే ‘ఇషా’ నమాజు సమయం అయిపోతుంది. ఇంకా రెండో భాగంలో ఉన్న రాత్రి సమయం ‘ఇషా’ సమయం కాదు, ‘ఇషా’ మరియు ‘ఫజర్’ నమాజుల మధ్యలో ఒక విభజనరేఖ సమయంగా పరిగణించబడుతుంది. 

ప్ర – 40: పైన ప్రస్తావించిన విషయంలో ఒక స్త్రీకి యోని నుండి ద్రవం (తడి) క్రమక్రమంగా వస్తున్న సందర్భములో ఆమె నమాజుకై ‘వజు’ చేసింది, ‘వజు’ చేసుకున్న తరువాత నమాజు చదవటం ప్రారంభించటానికి ముందే మళ్ళీ అదే పరిస్థితి పునరావృతమైంది. ఆమె ఏమి చేయాలి? 

జ: ఇలాంటి పరిస్థితిలో ఆమె ఈ తడి ఆగి పోయేంతవరకు నిరీక్షించాలి. ఆ తరువాత ‘వజు’ చేసుకుని నమాజ్ సలపాలి. ఒకవేళ పరిస్థితి అర్ధం కానప్పుడు అంటే ఎప్పుడు వస్తుందో? ఎప్పుడు ఆగిపోతుందో అర్ధం కానప్పుడు నమాజు సమయం వచ్చిన తరువాత వజు చేసి నమాజు చేసుకోవాలి. ఇలాంటి పరిస్థితిల్లో ఆమెపై ఎలాంటి దోషముండదు. (ఇన్షా-అల్లాహ్) 

ప్ర-41: పై పేర్కొనబడిన ‘తడి’ (ద్రవం) శరీరానికి లేదా వస్త్రాలకు అంటుకుంటే దాని ఆదేశం ఏమిటి? 

జ: ఈ తడి ప్రరిశుభ్రమైన సందర్భములో ఏమి చేయన వసరంలేదు. అదే అపరిశుభ్రమైతే అంటే మూత్రాశయం నుండి వస్తే దానిని కడిగివేయటం తప్పనిసరి. 

ప్ర -42 : ఒక స్త్రీ ఇలా ప్రశ్నిస్తుంది : ఒక స్త్రీ యోని నుండి తెల్లటి లేదా పసుపచ్చ ద్రవం వెలువడి నప్పుడు ఆ స్త్రీ ఎలా ‘వజూ’ చేయాలి? సాధారణంగా ‘వజూ’లో శుభ్రపరచుకునే అవయవాలనే శుభ్ర పరచు కుంటే సరిపోతుందా? 

జ: సరిపోతుంది. ఆ వెలువడే ద్రవం పరిశుభ్రమైనదైతే సాధారణ ‘వజు’ అవయవాలను శుభ్ర పరచుకుంటే సరిపోతుంది. అంటే అది మూత్రాశయం నుండి కాకుండా గర్భాశయం నుండి వెలువడి వుండాలి. 

43: దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ‘సహాబియాత్ ‘ లు ధార్మిక విషయాలు తెలుసుకోవడానికి ఎక్కువ మక్కువ చూపేవారు. అయితే పైన ప్రస్తావించబడిన (తడితో  వజూకు భంగం వాటిల్లుతుందనే) విషయానికి ఆధారంగా ఏ ఒక్క హదీసు ఉల్లేఖించబడలేదు, ఎందుకు? 

జ: ఈ విషయంపై ఒక హదీసు కూడా ఉండకపోవడానికి కారణం ఏమిటంటే ఈ పరిస్థితి (తడి రావడం) ప్రతి స్త్రీకి సంబంధించినదికాదు. ప్రతి స్త్రీకి రాదు. 

ప్ర -44: ఏ స్త్రీ అయినా పై ప్రస్తావించబడిన సమస్యకు ధార్మిక ఆదేశం తెలియక ‘వజు’ చేయడం లేదు. అలాంటి స్త్రీ ఏమి చేయాలి? 

జ: స్త్రీ తప్పనిసరిగా అల్లాహ్ మన్నింపుకై వేడుకోవాలి. మరియు ఇస్లామియ ధార్మిక విద్వాంసులతో ఈ సమస్యను చర్చించి పరిష్కారాన్ని పొందాలి. 

ప్ర-45: పై పేర్కొనబడిన సమస్యలో ‘వజు’ చేయవలసిన అవసరం లేదనే అభిప్రాయాన్ని కొందరు మీ (షేఖ్ ముహమ్మద్ బిన్ సాలెహ్ అల్-ఉసైమిన్) అభిప్రాయంగా చెబుతున్నారు. ఇది సత్యమా? 

జ: ఎవరైతే ఈ అభిప్రాయాన్ని నాపై మొపుతున్నారో వారు సత్యవంతులు కాదు. వారు నా అభిప్రాయం “ప్రస్తావించబడిన ‘తడి’ పరిశుభ్రమైనది” అనే దానితో అలా భావించి అది ‘వజు’ని భంగపరిచేది  కాదు అని తెలుపుతున్నారు. (వాస్తవానికి అది ‘వజు’ను భంగపరిచేదే)

ప్ర – 46 : సాధారణంగా స్త్రీకి నెలసరి రావటానికి దాదాపు ఒక రోజు ముందు మాసిన నీళ్ళు వెలువడతాయి. అయితే దాని ఆదేశం ఏమిటి? ఈ నీళ్ళు అప్పుడప్పుడు సన్నదారం రూపంలో నలుపు లేదా దట్టమైన ఎరుపు రంగులో వుంటాయి. ఒకవేళ ఈ నీళ్ళు నెలసరి తరువాత వస్తే దాని ఆదేశం ఏమిటి? 

జ : ఈ నీళ్ళు నెలసరికి తొలి సంకేతాలుగా వుంటే అవి కూడా నెలసరి గానే పరిగణించబడతాయి. దాన్ని ఎలా తెలుసుకోవాలంటే.. సాధారణంగా బహిష్టు సమయంలో స్త్రీలు లోనయ్యే ఆ బాధ, కుదుపు ద్వారా తెలుసుకోవచ్చు. 

బహిష్టు తరువాత మాసిన నీళ్ళు వచ్చినప్పుడు స్త్రీకి పరిశుభ్రత కొరకు వేచి చూడవలసి వుంటుంది. ఎందుకంటే నెలసరితో వెంటనే కలిసి వచ్చే నీళ్ళు కూడ నెలసరె అవుతుంది. హ॥ ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా తెలిపేవారు : 

మీరు తొందర పడకండి! తెలుపు చూసేంతవరకు నిరీక్షించండి“. 

బహిష్టు స్త్రీలకు సంబంధించిన హజ్, ఉమ్రాహ్ ఆదేశాలు

ప్ర-47: బహిష్టు స్త్రీ ‘ఇహ్రామ్’ కట్టుకున్న తరువాత రెండు రకాతులు నమాజు ఎలా చదవాలి? బహిష్టు స్త్రీ మెల్లగా ఖుర్ఆన్ ఆయతుల పారాయణం చేయవచ్చా? 

జ : ముందు మనం రెండు విషయాలు తెలుసుకుందాం. 

ఒకటి: ‘ఇహ్రామ్’ కు సంబంధించి ప్రత్యేక నమాజ్ అంటూ లేదు. ఎందుకంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన ఉమ్మత్ కు ప్రత్యేక ‘ఇహ్రామ్’ నమాజు గురించి ఆదేశంగా లేక చేసినట్లు లేక దృవీకరించినట్లు ఆధారాలు లేవు. 

రెండు: ఏ స్త్రీ అయితే ఇహ్రం కట్టుకోవటానికి ముందే ఋతుస్రావానికి గురువుతుందో ఆమె అదే స్థితిలో ‘ఇహ్రామ్’ కట్టుకోవచ్చు. 

హ॥ అబూబక్ర్ (రదియల్లాహు అన్హు) సతీమణి అస్మా బిన్తె ఉమైస్ (రజియల్లాహు అన్హా) మక్కా మార్గంలో ‘జుల్ హులైఫా’ ప్రదేశంలో రక్తస్రావానికి గురైయ్యారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెని “స్నానం చేసి తన యోనిపై గుడ్డ కట్టుకుని ‘ఇహ్రామ్’ కట్టుకోవాలని” ఆదేశించారు. 

అయితే ఋతుస్రావంగల స్త్రీకి కూడా ఆదేశం ఇదే. ఇక వారు పరిశుభ్రమయ్యేంత వరకు ‘ఇహ్రామ్’ నిబంధనల్లోనే ఉండాలి. పరిశుద్ధులైన తరువాత కాబా గృహాన్ని (తవాఫ్ చేయాలి) దర్శించాలి. అలాగే ‘సఫా’, ‘మర్వా’ నడుమ ‘సయీ’ (వేగంగా నడవటం) చేయాలి. 

ఇక ఋతుస్రావంగల స్త్రీ ఖుర్ఆన్ పారాయణం చేయవచ్చా..? అనే ప్రశ్నకు సమాధానం ఏమిటంటే అవసరం మేరకు, ముఖ్య కారణంతో పారాయణం చేయవచ్చు. కానీ కేవలం అల్లాహ్ ఆరాధన నిమిత్తం లేక అల్లాహ్ సన్నిధిలో పుణ్యాలు పొందటానికైతే ఆ స్థితిలో చదవకపోవటమే మంచిది. 

గమనిక: అవసరం మేరకు, ముఖ్యకారణం అంటే పిల్లలకు బోధించేటప్పుడు, ఎవరైన చదువుతుంటే తప్పులు దిద్దటం, అలాగే రోజువారి ఖుర్ఆన్ ఆయతులు వస్తే దుఆ పరంగా చదవటంలో ఎలాంటి దోషం లేదు. 

ప్ర-48 : ఒక స్త్రీ హజ్ కొరకు ప్రయాణించింది. ప్రయాణంలో 5వ రోజు ఆమె ఋతుస్రావానికి గురైంది. ‘మీఖాత్’ వద్దకు చేరి ఆమె స్నానం చేసి ‘ఇహ్రామ్’ కట్టుకుంది. ఆమె ఇంకా ఋతుస్రావ స్థితి నుండి పరిశుద్దురాలు కాలేదు. మక్కా చేరుకున్న తరువాత ఆమె ‘హరం” బయటే నిలిచింది (వెలుపలే ఆగింది). ‘హజ్’, ‘ఉమ్రాహ్’కు సంబంధించి ఆమె ఏ ఒక్క పని కూడ చేయలేదు. రెండు రోజులు ఆమె “మినా” (ప్రదేశం)లో కూడ గడిపింది. తరువాత ఆమె నెలసరి నుండి పరిశుద్ధురాలై స్నానం చేసింది. పరిశుద్ధ స్థితిలో ‘ఉమ్రాహ్ ‘కు సంబంధించి అన్ని కార్యాలు, నియమాలు పూర్తి చేసింది. దాని తరువాత మళ్ళీ ఆమె ‘హజ్’ కొరకు ‘తవాఫ్ – ఇఫాజా’ చేస్తుండగా ఆమెకు మళ్ళీ రక్తస్రావం జరిగింది. సిగ్గుతో ఆమె తమ సంరక్షకులకు చెప్పలేదు. అదే స్థితిలో హజ్ విధానాలను పూర్తిచేసి, స్వస్థలానికి చేరుకున్న తరువాత ఆ విషయాన్ని తన సంరక్షకులకు తెలియపరిచింది. అయితే ఇప్పుడు ఆమెకు ఎలాంటి ఆదేశం వర్తిస్తుంది? 

జ: పై పేర్కొన్న సమస్యకి పరిష్కారం ఏమిటంటే ఆమె తవాఫె – ఇఫాజా’ (తవాఫ్) చేస్తుండగా వచ్చిన రక్తం ఒకవేళ నెలసరి రక్తమైతే (దాన్ని ఆమె రక్తపు స్థితి, బాధతో పసిగట్టగలుగుతుంది) అప్పుడు ఆమె చేసిన ‘తవాఫె  ఇఫాజా’ సరైనది కాదు. ఆమె తప్పకుండా మరలా మక్కా వెళ్ళి ‘తవాఫె-ఇఫాజా’ పూర్తి చేయాలి. ‘మీఖాత్’ నుండి ‘ఉమ్రాహ్’ ‘ఇహ్రాం’ కట్టి ‘తవాఫ్ ‘, ‘సయీ’తో సహా ‘ఉమ్రాహ్’ చేయాలి. ‘ఖస్ర్ ‘ చేసి దాని తరువాత ‘తవాఫె  ఇఫాజా’ చేయాలి.

అయితే ఒక వేళ ‘తవాఫె-ఇఫాజా’ చేస్తున్న మధ్యలో వచ్చే రక్తం సహజంగా నెలసరిది కాకుండా జన ప్రవాహం కారణంగా లేదా భయం కారణంగా లేదా మరే కారణంగా ఉన్నప్పుడు ఆమె ‘తవాఫె  – ఇఫాజా’ ‘తవాఫ్ ‘కు పరిశుద్ధత షరతుగా భావించని వారి పద్ధతి ప్రకారం సరైనదే. 

మొదటి విషయంలో : ఆమెకు రెండో సారి మక్కా రావటం అసాధ్యమైనప్పుడు, అంటే ఇతర దేశస్థురాలైనప్పుడు ఆమె ‘హజ్’ సరైనదె. ఎందుకంటే ఆమె ఏదైతే చేసిందో అంతకు మించి చేసే శక్తి, అవకాశం ఆమెకు లేదు. 

ప్ర-49 : ఒక స్త్రీ ఉమ్రాహ్ ఇహ్రాం కట్టుకుంది. ‘మక్కా’ చేరే సరికి ఆమెకు నెలసరి మొదలైంది. ఆమెతో పాటు వున్న ‘మహ్రమ్’ కి వెంటనే తిరుగు ప్రయాణం చేయవలసి వుంది. అక్కడ కొన్ని రోజులు ఉండే సౌకర్యం లేదు. పైగా ఆమె అక్కడ ఉండటానికి మక్కా నగరంలో ఆమెకు బంధువు లెవరూ లేరు. ఇలాంటి సందర్భంలో ఆమె ఏమి చేయాలి? 

జ.) పై పేర్కొనబడిన స్త్రీ ఒక వేళ అదే ప్రాంతానికి (సౌది అరేబియా) కి చెందినదైతే ఆమె తన ‘మహ్రమ్ ‘ (సంరక్షకుడి) తో తిరిగి వెళ్ళిపోవాలి. ‘ఇహ్రాం’ స్థితిలోనే వుండి, పరిశుద్ధురాలైన తరువాత రెండవ సారి మక్కా నగరానికి రావాలి. ఎందుకంటే ఆమెకు రెండవ సారి రావటం సులువైనదే. ఇందులో ఆమెకు ఎలాంటి అడ్డంకులు లేవు. పాస్పోర్టు కూడ అవసరంలేదు. 

కాని ఒకవేళ ఇతర దేశాల నుండి వచ్చివున్నవారైతే ఆమెకు రెండోసారి ప్రయాణం కష్టమైనప్పుడు ఆమె గుడ్డ కట్టుకోవాలి. మరి ‘తవాఫ్ , సయీ’ చేసి ‘ఖస్ర్’ చేసుకొని అదే ప్రయాణంలో తన ‘ఉమ్రాహ్’ పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ‘తవాఫ్’ చేయుట ఒక అత్యవసరమైన ఆదేశంగా భావించబడుతుంది. కనుక అవసరాన్ని బట్టి కొన్ని నిషేధిత అంశాలు కూడా ‘ముబాహ్’ (అనివార్యం) గా పరిగణించ బడతాయి. 

ప్ర – 50 :ఒక స్త్రీకి నిర్దేశించబడిన హజ్ రోజుల్లో నెలసరి ప్రారంభమైంది. ఆమె గురించి ఆదేశం ఏమిటి? ఈ హజ్ ఆమెకై పరిపూర్ణమవుతుందా? 

జ : ఆమె ఎప్పుడు నెలసరికి గురైందనేది తెలియకుండానే ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వటం అసాధ్యం. ఎందుకంటే హజ్ లో కొన్ని కార్యాలు వున్నాయి. వాటికి నెలసరి ఎలాంటి ఆటంకం కల్గించదు. మరి కొన్ని ఉన్నాయి వాటిని నెలసరిలో చేయకూడదు. కనుక ‘తవాఫ్’ పరిశుభ్రత లేనిదే అసాధ్యం (చేయరాదు). ఇది కాకుండా ఇతరత్రా హజ్ కార్యాలు ఋతుస్రావంలో ఉండి కూడా చేసుకోవచ్చు. 

ప్ర- 51 : ఒక స్త్రీ ఇలా ప్రశ్నిస్తుంది: ‘నేను గత సంవత్సరం హజ్ చేశాను. అయితే హజ్ కి సంబంధించి అన్ని కార్యాలు చేశాను. కాని ‘ధార్మిక ఆటంకం’ వల్ల “తవాఫ్ – ఇఫాజా”, “తవాఫె-విదాత్” చేయలేకపోయాను. ఆ తరువాత ఏదో ఒక రోజు మక్కాకు వచ్చి “తవాఫె-ఇఫాజా”, “తవాఫె-విదాత్” చేసుకోవాలనుకుని నా స్వస్థలం మదీనాకు తిరిగి వెళ్ళిపోయాను. దాని గురించి సరైన ధార్మిక అవగాహన లేనందువల్ల అన్నింటి నుండి ‘హలాల్’ కూడా అయిపోయాను. ‘ఇస్లామ్’ స్థితిలో ఏ ఏ విషయాలకు దూరంగా (‘హరాం’ అవుతాయో) ఉండాలో వాటికి దూరంగా ఉండలేదు. ఈ విషయమై (మక్కా తిరిగి రావటం, తవాఫ్  చేయటం గురించి)కొందరిని సంప్రదించినప్పుడు వారు ఇలా సమాధానమిచ్చారు: ‘మీరు చేసిన ‘తవాఫ్ ‘ సరైనది కాదు. ఎందుకంటే మీరు మీ ‘హజ్’ను వృధా చేసుకున్నారు. కనుక వచ్చే సంవత్సరము మరో సారి ‘హజ్’ చేయాలి. అంతే కాకుండా దానితో పాటు ఒక ఆవు, లేదా ఒక ఒంటే ఫిద్యహ్’ (పరిహారం)గా ‘జిబహ్’ చేయవలసి వుంటుంది’. సందేహం ఏమిటంటే పై ప్రస్తావించబడిన సమాధానం వ్యాధి సరైనదేనా? లేదా నా సమస్యకు వేరే పరిష్కారం ఏమైనా వుందా? నిజంగా నా ‘హజ్’ వృధాయిపోయిందా? నా పై రెండో సారి హజ్ చేయటం ‘వాజిబ్’ (తప్పని సరా)? ఇప్పుడు నేను ఏమి చేయాలో తెల్పండి. అల్లాహ్ మీకు శుభాలు కలుగ చేయుగాక.! 

జ :నేడు మన సమాజంలో ఇది కూడా ఒక సమస్యగా మారిపోయింది. ప్రజలు జ్ఞానం లేకుండా ‘ఫత్వా’ ఇస్తున్నారు. పై పేర్కొనబడిన విధంగానైతే మీరు మక్కా వెళ్ళి కేవలం ‘తవాఫ్-ఇఫాజా’ మాత్రం చేయటం వాజిబ్ (తప్పనిసరి) అవుతుంది. 

మక్కా నుండి బయలుదేరినప్పుడు మీరు నెలసరితో వున్నారు. కాబట్టి మీపై తవాఫ్-విదాత్ వాజిబ్ (తప్పనిసరి) కాదు. ఎందుకంటే ఋతుస్రావం గల స్త్రీ పై తవాఫ్-విదాత్ లేదు. 

హ॥ ఇబ్నె అబ్బాస్ (రజియల్లాహు అన్ను) ఉల్లేఖించిన ఒక హదీసులో ఇలా ఉంది : 

ప్రజలకు ఈ ఆజ్ఞ ఇవ్వబడింది ఏమంటే బైతుల్లా (కాబా గృహము) తవాఫ్(కాబా ప్రదక్షిణం) వారి చివరి కార్యం కావాలని, అయితే నెలసరిగల స్త్రీ నుండి అది తప్పించబడింది“. 

అబుదావూద్ హదీసు గ్రంథంలో ఇలా ఉల్లేఖించబడి వుంది: 

“బైతుల్లాహ్ లో ప్రజల (యాత్రికుల) చివరి కార్యం తవాఫ్  కావాలి”

హ॥ ‘సుఫియా’ (రజియల్లాహు అన్హా ) తవాఫె -ఇఫాజా చేసుకున్నారు (దాని తర్వాతే ఆమెకు నెలసరి ప్రారంభమైంది) అనే విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలిసినప్పుడు ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు : “అయితే బయలుదేరండి!” 

ఈ హదీసు ఆధారం ఏమంటే నెలసరి గల స్త్రీ పై ‘తవాఫె -విదాత్’ లేదు. కాని ‘తవాఫె -ఇఫాజా’ తప్పని సరి. 

ఇక మీరు అన్నింటి నుండి ‘హలాల్’ అయిపోయినదాని గురించి ఏమిటంటే ఇది (ధార్మిక జ్ఞానము లేనందున) తెలియనందున జరిగిన విషయం. కనుక ఇది మీకు ఎలాంటి నష్టం కల్గించదు. ఎందుకంటే ఎవరైనా తెలియకుండా ‘ఇహ్రాం’ స్థితిలో నివారించబడిన ఏదైన కార్యానికి పాల్పడితే దానికి ఎలాంటి పరిహారం లేదు. పవిత్ర ఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: 

رَبَّنَا لَا تُؤَاخِذْنَا إِنْ نَسِينَا أَوْ أَخْطَأْنَا 

“ ఓ మా ప్రభువా! మేము మరచిపోయినా, లేక మేము పొరబడినా మమ్మల్ని నిలదీయకు”.(బఖరా 2:286) 

దాసుడు ఇలా అడిగినప్పుడు అల్లాహ్ దానిని అంగీకరించి సమాధానంగా ఇలా సెలవిచ్చాడు: 

وَلَيْسَ عَلَيْكُمْ جُنَاحٌ فِيمَا أَخْطَأْتُمْ بِهِ وَلَكِنْ مَا تَعَمَّدَتْ قُلُوبُكُمْ 

“మరుపు వల్ల మీ చేత ఏదైన (తప్పు) జరిగిపోతే దాని పాపం మీపై ఉండదు. అయితే హృదయ పూర్వకంగా చేసిన పక్షంలో అది పాపమే“. (33: అల్ అహ్ జాబ్ :5) 

కనుక జాగ్రత్త పడవలసినవన్నీ దేనినైతే అల్లాహ్ మహ్రమ్ కై వారించాడో ఒకవేళ తెలియకుండా లేదా మరచిపోయి వాటిని చేస్తే లేదా మరో దారి లేని పరిస్థితిలో పాల్పడితే అలాంటి పరిస్థితుల్లో అతని పై ఎలాంటి దోషం లేదు. కానీ ఆ స్థితి మారిపోయినప్పుడు దాని నుండి దూరమవ్వట తప్పనిసరవుతుంది. 

ప్ర-52 : బాలింతదశకు చెందిన రక్తస్రావం గల స్త్రీకి ఒక వేళ ‘తర్వియహ్’ రోజు (జిల్ హిజ్జ 8వ తేది) రక్తస్రావం మొదలైయింది. కాని ఆమె ‘తవాఫ్’, ‘సయీ’ తప్ప ‘హజ్’కు సంబంధించిన అన్నీ పనులు పూర్తిచేసుకుంది. అయితే పది రోజుల తరువాత ఆమె తొలిదశగా పరిశుద్ధురాలైనట్లు భావించింది. అప్పుడు ఆమె స్వయంగా పరిశుద్ధురాలుగా నిర్ధారించుకుని మిగిలిన పనులు అంటే ‘తవాఫె ఇఫాజా’ చేసుకోవచ్చా? 

జ: పై పేర్కొనబడిన స్త్రీకి పరిశుద్ధతపై పూర్తిగా విశ్వాసము కలగనంత వరకు ఆమె స్నానము చేసి తవాఫ్  చేయరాదు. ఎందుకంటే ప్రశ్నలో ప్రస్తావించిన తీరులో ‘తొలిదశ’తో ఆమె ఇంకా పూర్తిగా పరిశుద్ధతకు నోచుకోలేదన్న విషయం వ్యక్తమవుతుంది. కనుక ఆమె పూర్తిగా పరిశుద్ధతను గ్రహించిన తరువాతే స్నానము చేసి ‘తవాఫ్’, ‘సయీ’ చేయాలి. ఒక వే ‘తవాఫ్ ‘ కంటే ముందు ‘సయీ’ చేసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే ‘హజ్జతుల్-వదాత్’ సందర్భములో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను ‘ఎవరైన ముందు ‘సయీ’ చేసుకుంటే? అని సంప్రదించినప్పుడు .. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “ఎలాంటి దోషం లేదు” అని సమాధానమిచ్చారు. 

ప్ర- 53 : ఒక స్త్రీ నెలసరి స్థితిలో “సైల్” ప్రదేశం నుండి హజ్ ‘ఇహ్రాం” కట్టుకుంది. మక్కా వెళ్ళిన తరువాత ఏదో అవసరం పై ‘జిద్దాహ్’ ‘వెళ్ళింది. ‘జిద్దాహ్’ లోనే నెలసరి నుండి పరిశుద్దురాలైంది. స్నానం చేసి తలదువ్వుకుని తరువాత తన ‘హజ్’ను పూర్తిచేసుకుంది. అయితే ఆమె ‘హజ్’ సరైనదేనా? ఆమెపై ఇంకేమైన బాధ్యత వుంటుందా? 

జ : పై ప్రస్తావించబడిన స్త్రీ ‘హజ్’ సరైనదే. ఆమె పై ఎలాంటి బాధ్యత లేదు. 

ప్ర – 54 : ఒక స్త్రీ ఇలా ప్రశ్నిస్తుంది: ‘నేను ఉమ్రాహ్ చేయటానికి బయలుదేరాను. ‘మీఖాత్’ చేరుకున్నప్పుడు నేను నెలసరితో వున్నాను కనుక నేను ‘ఇహ్రామ్’ కట్టుకోలేదు. పరిశుద్ధురాలైనంత వరకు మక్కాలోనే ఉన్నాను. తరువాత మక్కానుండి ‘ఇహ్రామ్’ కట్టుకున్నాను. అయితే ఇది సరైనదేనా? నా పై ఏమి వాజిబ్ వుంది? 

జ : పై పేర్కొనబడిన పద్ధతి సరైనది కాదు. ఏ స్త్రీ అయితే ఉమ్రాహ్ సంకల్పం కలిగివుందో ఆమెకు ‘ఇహ్రామ్’ లేకుండా ‘మీఖాత్’ నుండి ముందుకు వెళ్ళటం సరైనది కాదు. ఒకవేళ ఆమె నెలసరితో వున్నా సరే. నెలసరి స్థితిలోనే ఆమె ‘ఇహ్రామ్’ కట్టుకోవాలి. ఆమె కట్టుకునే ఈ ఇహ్రామ్ సరైనదే. 

దీనికి ఆధారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ‘హజ్జతుల్-వదా (అంతిమ హజ్) సంకల్పంతో ‘జుల్ హులైఫా’ ప్రాంతములో వున్నప్పుడు హ॥ అబూ-బక్ర్ సిద్దీఖ్ (రజియల్లాహు అన్హు) సతీమణి ‘అస్మా బిన్తె ఉమైస్’ (రజియల్లాహు అన్హా) కు ఒక శిశువు జన్మించింది. అప్పుడు ‘అస్మా’ (రజియల్లాహు అన్హా) ఈ విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలియపరచి ఈ పరిస్థితిలో తాను ఏమి చేయాలి? అని కబురు పంపారు. దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు : 

“స్నానం చేసి (యోనిపై) గుడ్డ కట్టుకోవాలి. తరువాత ‘ఇహ్రామ్’ వేసుకోవాలి”. 

నెలసరి రక్తం కూడ రక్తస్రావం (బాలింతదశ) ఆదేశాల పరిధిలోనే వస్తుంది. కనుక నెలసరిగల స్త్రీకి మా సూచనేమిటంటే ‘ఆమె ‘హజ్’ లేదా ‘ఉమ్రాహ్’ సంకల్పముతో ‘మీఖాత్’ ప్రదేశము నుండి వెళ్ళినప్పుడు స్నానము చేసి యోని పై గుడ్డ కట్టుకోవాలి. తరువాత ‘హజ్’ లేదా ‘ఉమ్రాహ్’ ‘ఇహ్రామ్’ కట్టుకోవాలి. కాకపోతే ‘ఇహ్రామ్’ కట్టుకొని పవిత్ర మక్కా చేరుకున్న తరువాత పరిశుద్ధురాలైనంత వరకు ‘మస్జిదే-హరామ్’లో ప్రవేశించ కూడదు. కాబా గృహానికి ప్రదక్షిణం చేయరాదు. ఎందుకంటే హ॥ ఆయిషా (రజియల్లాహు అన్హా)కు ‘ఉమ్రాహ్’  మధ్యలోనే ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు (నెలసరి వచ్చినప్పుడు) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెకు  ఇలా సూచించారు: 

హాజీలు చేసినట్టే నీవు కూడ చేయ్యి. కాకపోతే పరిశుద్ధురాలైనంత వరకు కాబా గృహాన్ని ‘తవాఫ్ ‘ చేయకు”. (సహీహ్ బుఖారి, సహీహ్ ముస్లిం) 

‘సహీహ్ బుఖారి’లోని మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది : హ॥ ఆయిషా (రజియల్లాహు అన్హా ) ఇలా తెలిపారు : 

“ఆమె పరిశుద్ధు రాలైనప్పుడు కాబా గృహానికి ప్రదక్షిణం చేశారు. ‘సఫా-మర్వా’ మధ్య ‘సయీ’ కూడా చేశారు”. 

పై ఉల్లేఖనాల ద్వారా తెలిసేదేమిటంటే స్త్రీ నెలసరి కాలంలోనే ‘హజ్’ లేదా ‘ఉమ్రాహ్’ ‘ఇహ్రామ్ కట్టుకోవాలి. లేదా ‘తవాఫ్ ‘ చేయటానికి ముందే నెలసరి ప్రారంభమైనప్పుడు పరిశుద్ధురాలై స్నానం చేయనంత వరకు ‘తవాఫ్ ‘ మరి ‘సయీ’ చేయకూడదు. ఒకవేళ ఆమె పరిశుద్ధ స్థితిలో ‘తవాఫ్ ‘ చేసింది, దాని తరువాత ఆమెకు నెలసరి ప్రారంభమైనప్పుడు ఆమె అదే పరిస్థితిలో తన ‘ఉమ్రహ్ ను పూర్తిచేస్తుంది. ‘సయీ’ చేస్తుంది, తల వెంట్రుకలు కత్రిస్తుంది. ఎందుకంటే సఫా’, ‘మర్వా’ మధ్య ‘సయీ చేయటానికి పరిశుభ్రత అనే షరతు విధించబడలేదు. 

ప్ర – 55: ఒకరు ఇలా ప్రశ్నిస్తున్నారు: ‘నేను నా భార్యతో ‘యమ్ బ’ పట్టణం నుండి ‘ఉమ్రహ్’ కొరకు వచ్చాను. జిద్దాహ్  చేరుకున్నప్పుడు నా భార్యకు ఋతుస్రావం మొదలైంది. కనుక నేను ఒకణ్ణి ‘ఉమ్రహ్’ చేసుకున్నాను. అయితే ఇప్పుడు నా భార్యకు ఎలాంటి ఆదేశాలు వుంటాయి? 

జ: ఇలాంటి పరిస్థితిల్లో మీ భార్య సమస్యకు పరిష్కారం ఏమిటంటే ఆమె పరిశుద్ధురాలైనంత వరకు నిరీక్షించి ఆ తరువాత తన ‘ఉమ్రహ్’ పూర్తి చేయాలి. ఎందుకంటే విశ్వాసులు మాతృమూర్తి హ॥ సఫియ (రదియల్లాహు అన్హా) కు నెలసరి మొదలైనప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి సల్లం) ఇలా అన్నారు: “ఏమిటి మాకు ఈమె ప్రయాణం నుండి ఆపేస్తుందా?” ప్రజలు ఇలా అన్నారు : ఓ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆమె ‘తవాఫె -ఇఫాజా’ అయితే చేసుకున్నది. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “అయితె బయలుదేరుదాం“. 

పై హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన “ఏమిటి మాకు ఈమె ప్రయాణం నుండి ఆపేస్తుందా?” మాట ఆధారంగా స్త్రీకి ఒకవేళ ‘తవాఫె -ఇఫాజా’ కంటే ముందు నెలసరి వస్తే ఆమె పరిశుద్ధురాలైనంత వరకు నిరీక్షించి దాని తరువాత ‘తవ్వా ఫె-ఇఫాజా చేయటం తప్పనిసరి ‘వాజిబ్’గా గుర్తించబడుతుంది. 

అలాగే ‘తవాఫె-ఉమ్రహ్’ కూడ ”తవాఫె-ఇఫాజా’ ఆదేశంలోనే వుంది. ఎందుకంటే అది ”ఉమ్రహ్ ‘కు మూల సూత్రం. కనుక ‘ఉమ్రహ్’ చేయదలుచుకునే స్త్రీ ఒకవేళ ‘తవాఫె-ఉమ్రహ్’ కంటే ముందే నెలసరికి గురైతే పరిశుద్ధత కలిగేవరకు నిరీక్షించి దాని తరువాత ‘తవాఫ్ ‘ చేయాలి. 

ప్ర – 56 : ‘మస్ఆ’ (సయీ చేసే ప్రాంతం) ‘హరం’ (కాబా చుట్టుప్రక్కల కొంత భాగాన్ని అల్లాహ్ పవిత్ర స్థలంగా నిర్దేశించాడు. అందులో ఎలాంటి రక్తపాతాలు, అపవిత్ర కలాపాలకు పాల్పడరాదు. దానిని ‘హరం’ అంటారు) లో భాగమేనా? నెలసరిగల స్త్రీ ‘మస్ఆ’లో ప్రవేశించ గలుగుతుందా? ‘మస్ఆ’ నుండి ‘హరం’లో ప్రవేశించటానికి ‘తహియ్యతుల్ మస్జిద్’ (మసీదులో ప్రవేశించగానే చదివే నమాజు చదువుట ‘వాజిబా’ (తప్పనిసరా)? 

జ: అందరికీ సుపరిచితమైన విషయం ఏమిటంటే ‘మస్ఆ’ (సయీ చేసే ప్రాంతం) ‘హరం’లో భాగం కాదు. ఈ కారణంతోనే దానికి ‘మస్జిదె హరాం’కి మధ్య ఒక చిన్న గోడ నిర్మించబడింది. మస్ఆ ‘హరం’ వెలుపల వుండటమే ప్రజలకు మేలు అని భావించడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఒకవేళ దీన్ని ‘హరం’లో భాగమేనని నిర్ధారిస్తే అప్పుడు ‘తవాఫ్ ‘, ‘సయీ’ చేస్తున్న సమయంలో నెలసరికి గురైయ్యే స్త్రీని కూడా ‘సయీ’ చేయకుండా వారించడం జరిగేది. 

ఈ విషయంలో నా అభిప్రాయం (‘ఫత్వా’) ఏమిటంటే ఒకవేళ స్త్రీ ‘తవాఫ్ ‘ చేసుకున్న తరువాత ‘సయీ’ చేయటానికి ముందు నెలసరికి గురైతే అప్పుడు ఆమె అదే స్థితిలో ‘సయీ’ చేయవచ్చు. ఎందుకంటే ‘మస్ ఆ’ (సయీ చేసే ప్రాంతం) ‘హరం’తో వేరుగా వుంది. 

ఇక ‘తహియ్యతుల్-మస్జిద్’ విషయానికి వస్తే.. ఎవరైన ‘తవాఫ్ ‘ చేసిన తరువాత ‘సయీ’ చేసి, మళ్ళీ ‘మస్జిద్ హరాం’లో రావాలనుకున్నప్పుడు అతనికి  ‘తహియ్యతుల్ మస్జిద్’ చదవవలసి వుంటుంది. ఒకవేళ చదవక పోయినా పర్వాలేదు. కాని అల్లాహ్ ప్రసాదించిన ఈ మహత్తర అవకాశాన్ని వినియోగించుకుంటూ, అక్కడ నమాజు చేయుటలో ఉన్న గొప్పతనాన్ని దృష్టిలో పెట్టుకొని రెండు రకాతుల (తహయ్యతుల్ మస్జిద్) చదువుకోవడమే ఉత్తమమైన కార్యం. 

ప్ర – 57 : ఒక స్త్రీ ఇలా ప్రశ్నిస్తుంది : నేను హజ్ చేశాను. హజ్ లో ఉన్నప్పుడే ఋతుస్రావం ప్రారంభమైంది. సిగ్గు, బిడియం కారణంగా ఎవరికీ చెప్పలేకపోయాను. అదే పరిస్థితిలో ‘హరం’లో కూడ ప్రవేశించాను, నమాజు చదివాను, ‘తవాఫ్ ‘, ‘సయీ’ కూడా చేశాను. అయితే ఇప్పుడు నేను ఏమిచేయాలి? ఒకమాట ఏమిటంటే (బాలింత దశ ) రక్తస్రావం తరువాత నెలసరి వచ్చింది.? 

జ : నెలసరి, రక్తస్రావంగల స్త్రీ నమాజు ఆ స్థితిలో చేయరాదు. అది మక్కాలో నైనా స్వగ్రామంలో నైనా, మరెక్కడైనా సరే. ఎందుకంటే మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) స్త్రీ గురించి ఇలా అన్నారు: “ఏమిటి ఇలా లేదా (వాస్తవం కాదా)? ఏమంటే స్త్రీ నెలసరితో వున్నప్పుడు నమాజు చదవదు మరి ఉపవాసం పాటించదు.” 

యావత్తు ముస్లిములు ఏకీభవించేది ఏమిటంటే నెలసరి గల స్త్రీ నమాజు చదవకూడదు, ఉపవాసం వుండకూడదు. కనుక పై పేర్కొనబడిన స్త్రీ అల్లాహ్ క్షమాపణ కోరుతూ తనతో జరిగిన ఈ తప్పుకి పశ్చాతాపపడాలి. 

ఇక ఈ స్థితిలో ‘తవాఫ్ ‘ చేసే విషయమైతే ఇలా తవాఫ్  చేయుట కూడా సరికాదు. కాని ‘సయీ’ చేయవచ్చు. ఎందుకంటే ఈ విషయంలో ప్రఖ్యాత అభిప్రాయం ఏమిటంటే ‘హజ్’ సందర్భములో తవాఫ్  కంటే ముందు’సయీ’ చేసుకోవచ్చు. కనుక ఆమె రెండోసారి ‘తవాఫ్ ‘ చేయవలసి వుంటుంది. ఎందుకంటే ‘తవాఫ్-ఇఫాజా’ ‘హజ్’ మూల సూత్రాల్లో ఒకటి. అది లేకుండా ‘హలాల్’ కాలేరు (సమ్మత్వాన్ని పొందలేరు). అందుకని ఆ ఒకవేళ వివాహిత అయితే ‘తవాఫ్ ‘ చేయనంత వరకు తన భర్తతో లైంగికంగా దగ్గరకాకూడదు. ఒకవేళ అవివాహితురాలైతే ‘తవాఫ్ ‘ చేయనంత వరకు ‘నికాహ్’ (వివాహం చేసుకోకూడదు. 

ప్ర – 58: స్త్రీకి ‘అరఫహ్’ రోజున ఋతుస్రావం మొదలైతే ఏమిచేయాలి? 

జ: స్త్రీకి ‘అరఫహ్’ రోజున ఋతుస్రావం మొదలైతే ఇతర హాజీల్లా ఆమె కూడ హజ్జ్ లోని  కార్యాలన్ని పూర్తి చేయాలి. కాకపోతే ‘బైతుల్లాహ్’ (కాబాగృహం) తవాఫ్ ‘ చేయరాదు. పరిశుద్ధులయ్యేంత వరకు నిరీక్షించి, పరిశుద్ధులైన తరువాత ‘బైతుల్లాహ్ ‘ (కాబా గృహం) ‘తవాఫ్  చేయాలి. 

ప్ర – 59: ఒకవేళ స్త్రీ ‘జమరయె-ఉఖ్బహ్’ పై రాళ్ళు రవ్వినంతరం – ‘తవాఫ్-ఇఫాజా’ కంటే ముందు ఋతుస్రావానికి గురైంది. ఆమె, ఆ ఒక బృందముతో కలిసి ఉన్నారు. ఆమె ప్రయాణం తరువాత తిరిగి మక్కాకు రావటం కష్టం లేక అసాధ్యం. అప్పుడు ఆమె ఏమిచేయాలి? 

జ: పై ప్రస్తావించబడిన స్త్రీ మళ్ళీ ‘మక్కా’కు రావటం అసాధ్యమైనప్పుడు అవసర నిమిత్తం ఆమె తన యోనిపై గుడ్డ కట్టుకుని ‘తవాఫ్’ చేసుకోవాలి. అలాగే మిగితా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకోవాలి. ఇలాంటి పరిస్థితిలో ఆమెపై ఎటువంటి పరిహారం వాజిబ్ కాదు. 

ప్ర – 60 : రక్తస్రావం గల స్త్రీ ఒకవేళ 40 రోజులకు ముందే పరిశుద్ధురాలైతే ఆమె ‘హజ్’ సరైనదేనా? ఒక వేళ పరిశుద్ధతను గ్రహించకపోతే ఏమిచేయాలి? గమనించవలసిన విషయం ఏమంటే ఆమె ‘హజ్’కై సంకల్పం చేసి వుంది? 

జ : రక్తస్రావం గల స్త్రీ ఒకవేళ 40 రోజులకు ముందే పరిశుద్దురాలైనప్పుడు స్నానముచేసి నమాజు చదువుకోవాలి. పరిశుద్ధ స్త్రీలు చేసే కార్యాలన్నీ చేయాలి. చివరికి ‘బైతుల్లాహ్’ (కాబాగృహం) ‘తవాఫ్ ‘ కూడ చేయాలి. ఎందుకంటే రక్తస్రావం కనీస కాలానికి ఎలాంటి పరిమితం లేదు. సంకల్పం సరైనదే. కాకపోతే పరిశుద్ధురాలైనంత వరకు ఆమె ‘బైతుల్లాహ్’ పై పేర్కొనబడిన స్త్రీ పరిశుద్ధతను చూడనప్పుడు ఆమె ‘హజ్’ (కాబా గృహం) ‘తవాఫ్’ చేయకూడదు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఋతుస్రావంలో గల స్త్రీని బైతుల్లాహ్ (కాబాగృహం) తవాఫ్ ‘ నుండి వారించారు. 

ఈ విషయంలో రక్తస్రావం గల స్త్రీ కూడ నెలసరి గల స్త్రీ ఆదేశంలోనే వుంటుంది

నోట్స్:

  • ఇహ్రామ్ : కాబా దర్శనానికి వెళ్ళేటప్పుడు కట్టుకునే ప్రత్యేక వస్త్రాలు. కానీ స్త్రీలకు ప్రత్యేక వస్త్రాలంటు లేవు. కేవలం పరిమిత కాలంలో తమకు తాముగా ధర్మపరమైన నిబంధనలకు లోబడి ఉండాలి
  • మీఖాత్: పవిత్రం కాబా గృహానికి చుట్టూ నిర్ణయించబడిన పరిధిలో ప్రవేశించడానికి కేటాయించ బడిన పవిత్ర స్థలము ‘హరం’
  • ‘తహియ్యతుల్-మస్జిద్‘ : మసీదులో ప్రవేశించినప్పుడు, మసీదును దర్శించినప్పుడు పాటించ వలసిన రెండు రకాతులను అంటారు. 
  • మస్జిదే హరాం : కాబా చుట్టు నిర్మించబడి వున్న మసీదు. దీనిలో ఒక నమాజు లక్ష నమాజుల పుణ్యంతో సమానం.
  • తవాఫ్  : పవిత్ర ‘కాబా’ గృహానికి ప్రదక్షిణ చేయడం. 
  • తవాఫ్ – ఇఫాజా: ‘జిల్-హిజ్జహ్’ పదో తేది రోజు చేసే ‘కాబా’ ప్రదక్షణం 
  • ఖస్ర్ : తలవెంట్రుకలు కొద్దిగా కత్రించుట. 
  • సయీ : సఫా, మర్వా అనే కొండప్రాంతాల నడుమ వేగంగా నడవడానిని అంటారు. ఇది హజ్, ఉమ్రాహ్ మూలాల్లో ఒకటి. 
  • మహ్రమ్: ఆమెతో వివాహానికి ఆస్కారం లేని వ్యక్తి ఉదాహరణకు : తండ్రి, కుమారుడు, సోదరుడు, మావయ్య లాంటి వారు