ఖుర్ఆన్ ఘనతల పుస్తకం – జుల్ఫీ దావహ్

كتاب فضائل القرآن (ఖుర్ఆన్ ఘనతల పుస్తకం)
సంకలనం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
జుల్ఫీ ధర్మప్రచార విభాగం (సౌదీ అరేబియా)

[పుస్తకం డౌన్లోడ్]
[PDF] [51 పేజీలు]

ఖుర్ఆన్ ను గట్టిగా పట్టుకునే ఆదేశం

عَنْ جُبَيْرِ بن مُطْعِمٍ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ قَالَ : قَالَ رَسُولُ الله ﷺ : (أَبْشِرُوا فَإِنَّ هَذَا الْقُرْآنَ طَرَفُهُ بِيَدِ الله ، وَطَرَفُهُ بِأَيْدِيكُمْ ، فَتَمَسَّكُوا بِهِ ، فَإِنَّكُمْ لَنْ تَهْلَكُوا ، وَ لَنْ تَضِلُّوا بَعْدَهُ أَبَدًا).

ఈ హదీసులో:

సంబరపరిచే విషయాల శుభవార్త ఇవ్వవచ్చును. సత్కార్యాల సంపాదన ఇహలోక సంపాదన కంటే చాలా గొప్పది. [దానికి ప్రజలు సంబరపడాలి. ప్రజలు కూడబెట్టే వాటన్నింటికంటే అది ఉత్తమమైనది]. (ఖుర్ఆన్ 10: 58).

ఇందులో ఖుర్ఆన్ గొప్పతనం, దానిని గట్టిగా పట్టుకునే ఆదేశం ఉంది. అంటే దాని ఆదేశాలను పాటించడం, దానిలోని నివారణల నుండి దూరముండడం.

అల్లాహ్ కు చేయి ఉందని కూడా రుజువైంది. అయితే అది ఆయన గౌరవానికి తగినట్లు ఉంటుందని విశ్వసించాలి.

ఖుర్ఆన్ ప్రకారం ఆచరించినవాడు మోక్షం పొందుతాడు. దాన్ని త్యజించినవాడు దుర్మార్గుడవుతాడు.[ఎవడు నా ఈ మార్గదర్శ కత్వాన్ని అనుసరిస్తాడో అతడు మార్గము తప్పడు, దౌర్భాగ్యానికి గురికాడు. నా జ్ఞాపికకు (హితోపదేశానికి, ఖుర్ఆనుకు) విముఖుడైన వానికి ప్రపంచంలో జీవితం ఇరుకవుతుంది]. (ఖుర్ఆన్ 20: 123, 124). ఖుర్ఆనును అనుసరించినవానికి భాగ్యము, విజయముందని. దానికి విముఖుడైనవానికి దుర్మార్గం, దౌర్భాగ్యం ఉందని హదీసులో ఉంది. దాసుని మరియు ప్రభువు మధ్య సంబంధంలో అది గొప్ప సబబు.

అల్లాహ్ రక్షణ వలన ఖుర్ఆన్ భద్రంగా ఉంది. ఏలాంటి తారుమారు అందులో జరగలేదు. [అసత్యం దాని మీదకు ముందునుండీ రాజాలదు. వెనుక నుండీ రాజలదు. వివేకవంతుడూ, స్తుతిపాత్రుడూ (అయిన అల్లాహ్ యే) అవతరింపజేసిన గ్రంథం ఇది]. (ఖుర్ఆన్ 41: 42).

తమ అనుచర సంఘ మోక్షానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఉన్న కాంక్ష, ఆయన వారి కొరకు కోరే మేలు మరియు వారి పట్ల ఆయనకు ఉన్న సంపూర్ణ జాలి, దయ ఈ హదీసులో ఉట్టిపడుతుంది.

عَن زَيْدِ بْنِ أَرْقَمَ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللهِ ﷺ: (أَمَّا بَعْدُ ، أَلَا أَيُّهَا النَّاسُ! فَإِنَّمَا أَنَا بَشَرٌ يُوشِكُ أَنْ يَأْتِيَ رَسُولُ رَبِّي فَأُجِيبَ ، وَأَنَا تَارِكٌ فِيكُمْ ثَقَلَيْنِ: أَوَّلُهُمَا كِتَابُ الله فِيهِ الْهُدَى وَالنُّورُ ، مَن اسْتَمْسَكَ بِهِ وَأَخَذَ بِهِ كَانَ عَلَى الْهُدَى وَمَنْ أَخْطَأَهُ ضَلَّ ، فَخُذُوا بِكِتَابِ الله وَاسْتَمْسِكُوا بِهِ) فَحَثَّ عَلَى كِتَابِ الله وَرَغَّبَ فِيهِ ثُمَّ قَالَ: (وَأَهْلُ بَيْتِي أُذَكِّرُكُمْ اللهَ فِي أَهْلِ بَيْتِي أُذَكِّرُكُمْ اللهَ فِي أَهْلِ بَيْتِي أُذَكِّرُكُمْ اللهَ فِي أَهْلِ بَيْتِي).

ఈ హదీసులో:

చెప్పబోయే మాటలు శ్రోతలు వినడానికి సిద్ధమయి, వాటిపై శ్రద్ధ వహించుటకు మాట సందర్భంలో, ఖుత్బా (ప్రసంగం)లో ‘అమ్మాబాద్’ అన్న పదం ఉపయోగించుట అభిలషణీయం.

ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా మనిషే అన్న విషయం ఇందులో చాలా స్పష్టంగా ఉంది. ఆయన ఎప్పుడు చనిపోతారనే విషయం స్వయంగా ఆయనకు తెలియదు.

అల్లాహ్ యొక్క గ్రంథ జ్ఞానం పొందాలని, దాని ప్రకారం ఆచరించాలని, దాని పారాయణం (తిలావత్) చేయాలని, దాన్ని కంఠస్తం (హిఫ్జ్) చేయాలని మరియు దానిని బాగుగా అర్థం చేసుకోవాలని తాకీదు చేయబడింది. నిశ్చయంగా అది అల్లాహ్ దయతో మనిషిని దుర్మార్గం నుండి వెలికి తీయునది. అంధత్వం నుండి వెలుగులోకి తెచ్చునది మరియు సన్మార్గం చూపునది. దాన్ని విడనాడుట, దాని ఆదేశాలను పాటించకపోవుట, దాని హద్దులను అతిక్రమించుటయే పరమదుర్మార్గం.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కుటుంబీకులను గౌరవించడం, వారి పట్ల మర్యాద, వారి హక్కులను తెలుసుకొనుట విధిగా ఉందని ఈ హదీసులో తెలిసింది. [వారితో ఇలా అను: నేను ఈ పనికి మీ నుండి ఏ ప్రతిఫలాన్నీ కోరను. అయితే బంధు ప్రేమను తప్పకుండా కోర్తాను[. (ఖుర్ఆన్ 42: 23). వారికి తగిన రీతిలో వారిని గౌరవించడం, మర్యాద నివ్వడం తప్పనిసరి.

ఈ అనుచర సంఘం వహీ (ఖుర్ఆన్, సహీ హదీసుల)ను గట్టిగా పట్టుకొని, ధర్మాదేశాలను పాటించి, ధర్మాన్ని కాపాడుతూ ఉంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణించిన తరువాత కూడా దుర్మార్గానికి గురికాకుండా ఉంటుందని ఈ హదీసులో ఉంది.

ఇందులో ప్రాణంతీయు దూత ప్రస్తావన ఉంది. అల్లాహ్ ఎవరిదైనా ప్రాణం తీయాలనుకున్నప్పుడు అతన్ని పంపుతాడు.


عَنْ أَبِي هُرَيرَةَ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ قَالَ : قَالَ رَسُولُ الله ﷺ:(تَرَكْتُ فِيكُم شَيْئَينِ لَنْ تَضِلُّوا بَعْدَهُما : كِتَابُ الله وَسُنَّتي).

ఈ హదీసులో:

విద్య నేర్చుకొనుటకు అసలైన ఆధారాలు ఖుర్ఆన్, సున్నతులే. ముస్లిం వ్యక్తి అల్లాహ్ గ్రంథం మరియు ప్రవక్త సహీ హదీసుల జ్ఞానం పొందాలి. వాటిని కంఠస్తం చేయడంతో పాటు బాగుగా అర్థం చేసుకోవాలి. వాటిని వదలి, లాభం లేని చదువుల వైపు మ్రొగ్గవద్దు. అంతేకాదు; వాచ, కర్మ, వ్యవహార, ప్రవర్తన అన్ని రూపాల్లో, స్థితుల్లో వాటి శాసనాలనే నమ్ముట విధిగా ఉంది. మన జీవితానికి ఆదర్శంగా అవే ఉండాలి. ఇహపరానికి సంబంధించిన ప్రతి విషయానికి అవే రెండు సంపూర్ణంగా చాలు. ప్రవక్త అనుయాయులందరూ ఖుర్ఆన్, హదీసులను గట్టిగా పట్టుకుంటే (సంపూర్ణంగా ఆచరిస్తే) అల్లాహ్ వారి మధ్య ఐక్యతను బలపరుస్తాడు. వారిని ఒక్కటిగాజేస్తాడు. వారి హోదా అంతస్తులను ఉన్నతం చేస్తాడు. వారి పరువును పెంచుతాడు. వారి శత్రువులను రూపుమాపి, వారి గౌరవాన్ని (శత్రువులపై) తేల్చిచూపుతాడు. వారిపై అనుగ్రహాలు సంపూర్ణం చేస్తాడు, మరింత సహాయాం చేకూర్చి వారిని ఆదరిస్తాడు.

ఖుర్ఆన్ మరియు ప్రవక్త సంప్రదాయాలను విడనాడుట, వాటికి విముఖత చూపుట, వాటి ప్రకారం ఆచరించకపోవుట పరమ దుర్మార్గం. ]ఎవడు నా ఈ మార్గదర్శకత్వాన్ని అనుసరిస్తాడో అతడు మార్గము తప్పడు, దౌర్భాగ్యానికి గురికాడు. నా జ్ఞాపికకు (హితోపదేశానికి, ఖుర్ ఆనుకు) విముఖుడైన వానికి ప్రపంచంలో జీవితం ఇరుకవుతుంది[. (ఖుర్ఆన్ 20: 123, 124).

అల్లాహ్ గ్రంథం (ప్రకారం ఆచరించండని) ఆదేశించుట (వీలునామ వ్రాయుట)

అల్లాహ్ వైపు నుండి మీ దగ్గరకు (అజ్ఞానాంధకారం దూరంచేసే) జ్యోతి వచ్చింది. మరియు (సన్మార్గం చూపే) దేదీప్యమానమైన దివ్యగ్రంథం వచ్చింది. దీని ద్వారా అల్లాహ్ తన ప్రసన్నతాభాగ్యం కోరుకునే వారికి ముక్తిమార్గాలను చూపుతాడు. అంతే కాకుండా ఆయన తన అనుగ్రహంతో వారిని కారు చీకట్ల నుండి కాంతి వైపు తీసుకు వెళ్తాడు, (అపమార్గం నుండి తీసి) రుజుమార్గంలో నడిపిస్తాడు[. (మాఇద 5: 15,16).

عَنْ طَلْحَة رَضِيَ ٱللَّٰهُ عَنْهُ قَالَ: سَأَلْتُ عَبْدَ الله بْنَ أَبِي أَوْفَى رَضِيَ ٱللَّٰهُ عَنْهُ هَلْ كَانَ النَّبِيُّ ﷺ أَوْصَى فَقَالَ لَا فَقُلْتُ كَيْفَ كُتِبَ عَلَى النَّاسِ الْوَصِيَّةُ أَوْ أُمِرُوا بِالْوَصِيَّةِ قَالَ: أَوْصَى بِكِتَابِ الله.

ఈ హదీసులో:

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రత్యేకమైన ఏ వీలునామా వ్రాయలేదు. ప్రజలందరికీ కాకుండా కొందరు సహచరులకు ప్రత్యేకించి ఏ విషయాలు నేర్పలేదు. ప్రవక్త వద్ద ఉన్న విద్య సర్వ ముస్లిములకు చెందినది. దానిలో ఏ కొంచెమూ దాచి ఉంచలేదు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశం (వాంగ్మూలం) అల్లాహ్ గ్రంథం గురించే ఉండింది. దానిని నేర్చుకోవాలని, నేర్పాలని, యోచించాలని, కంఠస్తం చేయాలని మరియు పారాయణం చేస్తూ ఉండాలని ప్రవక్త @ తాకీదు చేశారు. మొదటివారికి మరియు చివరివారికి, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఉపదేశం దైవభీతి మరియు మన ముందు ఉన్న ఈ దివ్యగ్రంథం గురించే ఉండింది. ఈ ఖుర్ఆనులో ప్రతి మంచి విషయం ఉంది. అది ప్రతి చెడు నుండి వారిస్తుంది. ప్రవక్త సల్లల్లహు అలైహి వసల్లం చెప్పారుః

(إِنَّ اللهَ يَرْفَعُ بِهَذَا الْكِتَابِ أَقْوَامًا وَيَضَعُ بِهِ آخَرِينَ).

“నిశ్చయంగా అల్లాహ్ ఈ దివ్యగ్రంథం ద్వారా కొందరిని ఉన్నత స్థానానికి తీసుకెళ్తే మరి కొందరిని పతనానికి పాలు చేస్తాడు”. (ముస్లిం 817). ఎవరు ప్రవక్త వసియ్యతు (వాంగ్మూలం) గురించి, తమ అనుచరుల కొరకు వదలి వెళ్ళిన విద్యను గురించి, ప్రజల కొరకు విడిచిపోయిన తమ ఆస్తి గురించి తెలుసుకోవాలనుకుంటాడో అతడు ఖుర్ఆన్ మరియు ప్రవక్త హదీసులను చదవాలి. ఆ రెండింటిలో సరిపోయేంత సమాచారం, రోగులకు స్వస్థత, గొప్ప లాభం మరియు ఆశింపదగిన ప్రయోజనం ఉంది.

عَنْ أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ الله ﷺ: (أُوصِيكَ بِتَقْوَى الله فَإِنَّهُ رَأْسُ كُلِّ شَيْءٍ وَعَلَيْكَ بِالْجِهَادِ فَإِنَّهُ رَهْبَانِيَّةُ الْإِسْلَامِ وَعَلَيْكَ بِذِكْرِ الله وَتِلَاوَةِ الْقُرْآنِ فَإِنَّهُ رَوْحُكَ فِي السَّمَاءِ وَذِكْرُكَ فِي الْأَرْضِ).

ఈ హదీసులో:

నిశ్చయంగా తఖ్వా (అల్లాహ్ పట్ల భయభీతి) అనేది కార్యాల్లోకెల్ల గొప్ప సత్కార్యం, ప్రతి విషయానికి మూలం. ఇస్లాంలో మాత్రం సన్యాసి తనం (అంటే భార్యపిల్లల్ని వదలి, సంపాదన, లోకాన్ని వీడి అడవిలో ఓ కుటీరంలో అల్లాహ్, అల్లాహ్ అంటూ గడుపుట అనేది) లేదు. కాని అల్లాహ్ మార్గంలో జిహాద్ చేయడం, ప్రాణాలు త్యాగం చేయడం, అల్లాహ్ శత్రువులతో పోరాడడం మరియు అల్లాహ్ ధరిణిపై ఆయన ధర్మం స్థాపించడం లాంటి పనులు ఉన్నాయి.

ఖుర్ఆన్ పారాయణం మరియు అల్లాహ్ స్మరణలు దాసుడిని అల్లాహ్ వద్దకు చేర్చుతాయి. అతని మూసుకున్న మనస్సును తెరుస్తాయి. అతని పేరు, ప్రఖ్యాతులను పెంచుతాయి. అతని పాపాలను తుడిచివేస్తాయి.

ఈ హదీసులో క్రైస్తవులకు విరుద్ధమైన విషయముంది. అదేమిటంటేః వారు జిహాదును వదిలేసి, సన్యాసాన్ని కనిపెట్టారు. దాన్ని అల్లాహ్ వారిపై విధిగా చేయలేదు. అయినా దాన్ని వారు న్యాయపరంగా పాటించ లేకపోయారు. ఇస్లాం వచ్చి ఈ సన్యాసాన్ని తుడిచిపెట్టింది. అల్లాహ్ మాట సర్వదా సర్వోన్నతమగుటకు జిహాదు వైపునకు ఆహ్వానించింది.

ఖుర్ఆన్ ప్రకారం ఆచరించాలి. దానిని సంపాదనకు సాధనంగా చేసుకోవద్దు/ఉపయోగించరాదు (ఈ రెండిటిలో ఏది బావుంటది?)

عَنْ أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ أَنَّهُ قَالَ: سَمِعْتُ رَسُولَ الله ﷺ يَقُولُ: (يَخْرُجُ فِيكُمْ قَوْمٌ تَحْقِرُونَ صَلَاتَكُمْ مَعَ صَلَاتِهِمْ وَصِيَامَكُمْ مَعَ صِيَامِهِمْ وَعَمَلَكُمْ مَعَ عَمَلِهِمْ وَيَقْرَءُونَ الْقُرْآنَ لَا يُجَاوِزُ حَنَاجِرَهُمْ يَمْرُقُونَ مِنْ الدِّينِ كَمَا يَمْرُقُ السَّهْمُ مِنْ الرَّمِيَّةِ يَنْظُرُ فِي النَّصْلِ فَلَا يَرَى شَيْئًا وَيَنْظُرُ فِي الْقِدْحِ فَلَا يَرَى شَيْئًا وَيَنْظُرُ فِي الرِّيشِ فَلَا يَرَى شَيْئًا وَيَتَمَارَى فِي الْفُوقِ)

ఈ హదీసులో:

ఖుర్ఆనులో ఆలోచించడం, దాని పారాయణ సందర్భంలో నమ్రత పాటించడం, దాని ప్రకారం ఆచరించడంలోనే ప్రయోజనం కలుగుతుంది. దాని పారాయణం వదలి, దానికి విముఖత చూపి, దాని ప్రకారం ఆచరించ కుండా ఉంటే ప్రయోజనం ఉండదు. ఖుర్ఆన్ చదివి దాని ప్రకారం ఆచరించనివారికి పాపం కలుగును. అతడు అతి చెడ్డవారిలో ఒకడు. ఒక సహీ హదీసులో ఇలా ఉందిః తొలిసారిగా ఎవరితో నరకాగ్ని దహింపబడునో వారు ముగ్గురు. ఆ ముగ్గురిలో ఖుర్ఆన్ పారాయణం చేయువాడు ఒకతను. అది ఎలా అంటే? ప్రజలు అతడ్ని ఖారీ (చాలా చక్కగా ఖుర్ఆన్ పారాయణం చేయువాడు) అని పిలవాలని అతను ఖుర్ఆన్ పారాయణం చేసేవాడు. కాని దాని ప్రకారం ఆచరించేవాడు కాదు.

వాస్తవంగా ఖుర్ఆన్ పారాయణం చేయువారు ఎవరంటే దాని ఆదేశాలను పాటించి, వారింపుల నుండి దూరముండి అందులోని వార్తలను నిజమని నమ్మేవారు. నిశ్చయంగా అల్లాహ్ “ఉలమాయె సూ” (ఖుర్ఆన్ ప్రకారం ఆచరించని మార్గభ్రష్టులైన పండితుల) నుండి హెచ్చరించాడు. బనీ ఇస్రాఈల్ గురించి ఇలా తెలిపాడుః

[كَمَثَلِ الحِمَارِ يَحْمِلُ أَسْفَارًا] {الجمعة:5}

[వారు పుస్తకాల బరువును మోసే గాడిదను పోలి ఉన్నారు]. (జుముఅ 62: 5).

[وَاتْلُ عَلَيْهِمْ نَبَأَ الَّذِي آَتَيْنَاهُ آَيَاتِنَا فَانْسَلَخَ مِنْهَا فَأَتْبَعَهُ الشَّيْطَانُ فَكَانَ مِنَ الغَاوِينَ] {الأعراف:175}

[ప్రవక్తా! వారికి ఆ వ్యక్తి గాథను వినిపించు. అతనికి మేము మా ఆయతుల జ్ఞానాన్ని ప్రసాదించాము. కాని అతడు వాటిని పాటించ కుండా విముఖుడై పోయాడు. చివరకు షైతాను అతణ్ణి వెంబడించాడు. పర్యవసానంగా అతడు మార్గభ్రష్టులలో కలసిపోయాడు]. (ఆరాఫ్ 7: 175).

ఏ విషయమైనా దాని వాస్తవికతను బట్టే ఎక్కువ ప్రయోజనకరంగా అది ఉంటుంది, దాని బాహ్యరూపం వల్ల కాదు. విశ్వాసం మరియు దైవభయభీతి మనస్సులో ఉంటాయి. ఒకప్పుడు మునాఫిఖ్ నుండి కూడా ప్రశంసింపబడే కార్యాలు జరుగుతాయి. కాని అల్లాహ్ వద్ద అంగీకరింపబడవు. అంతర్యాన్ని ఎరుగువాడు అల్లాహ్ మాత్రమే. మనం బాహ్యాన్ని బట్టే వ్యవహరించాలి. విశ్వాసుల్లో శ్రేష్ఠులవడానికి ప్రమాణం అధిక నమాజులు, ఉపవాసాలు మరియు దానదర్మాలే కావు. వారి స్వచ్ఛత (ఇఖ్లాస్), తమ ప్రభువుతో సత్య వ్యవహారం, సంపూర్ణ విశ్వాసాల ప్రమాణం. హృదయకార్యాలు శరీరావయవాల కార్యాలపై ఆధిక్యం కలిగి ఉంటాయి. విశ్వాసం హృదయంలో స్థానం చేసుకుందంటే అది ఆ వ్యక్తిని అక్కడికి చేరుకోలేని వారికంటే ముందుకు తీసుకెళ్తుంది. ఒక వ్యక్తి ఖుర్ఆన్ పఠిస్తాడు. అధికంగా పఠిస్తాడు కాని తన పారాయణం ద్వారా ఏ ప్రయోజనం పొందడు. అది అతనికి వ్యతిరేకంగా అతను చేసుకున్న దుష్క్రియలకు సాక్ష్యంగా నిలుస్తుంది. అతన్ని నరకంలో పడవేస్తుంది. అల్లాహ్ ఇలాంటి దుష్చేష్ట నుండి కాపాడుగాక! ఆమీన్

చాలా మంది పండితులు ఈ హదీసులో చెప్పబడిన గుణాలు “ఖవారిజ్” అను ఒక వర్గానికి సంబంధించినవని చెప్పారు. సహచరులు ఖవారిజ్ నమాజుల ముందు తమ నమాజులను, వారి ఉపవాసాల ముందు తమ ఉపవాసాలను మరియు వారి సత్కార్యాల ముందు తమ సత్కార్యాలను అల్పముగా భావించేవారు. వారు రేయింబవళ్ళు ఖుర్ఆన్ చదివేవారు. కాని ధర్మ వాస్తవికతల పట్ల అజ్ఞానంగా ఉండేవారు. ఖుర్ఆన్ ఉద్ధేశ్యాలను అవగాహన చేసుకునేవారు కాదు. న్యాయశీలులైన నాయకులకు వ్యతిరేకంగా తిరగబడ్డారు. ఆయుధంతో ముస్లిం సమాజానికి విరుద్ధంగా నిలబడి వారి రక్తపాతమును ధర్మసమ్మతం చేసుకున్నారు. ఇలా ధర్మభ్రష్టులయ్యారు. నరక శునకములయ్యారు. వారి గురించే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారుః

 (لَئِنْ أَدْرَكْتُهُمْ لَأَقْتُلَنَّهُمْ قَتْلَ عَادٍ)

“నేను గనుక వారిని చూసానంటే వారని నరికేస్తాను. ఆద్ జాతివారిలో ఏ ఒక్కరూ మిగలనట్లు వారిలో కూడా ఏ ఒక్కడు మిగిలి ఉండడు”. (బుఖారి 7432).

عَن عَبْدِ الرَّحْمَنِ بْنِ شِبْلٍ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ قَالَ: سَمِعْتُ رَسُولَ الله ﷺ يَقُولُ: (اقْرَءُوا الْقُرْآنَ وَ اعْمَلُوا بِهِ وَلَا تَغْلُوا فِيهِ وَلَا تَجْفُوا عَنْهُ وَلَا تَأْكُلُوا بِهِ وَلَا تَسْتَكْثِرُوا بِهِ)

ఈ హదీసులో:

ఖుర్ఆన్ పారాయణం చేయడం, దాని ఆదేశాలను పాటించడం, నివారణల నుండి దూరముండడం విశ్వాసులకు విధిగా ఉంది. అలాగే దాని పట్ల మధ్యే మార్గాన్ని అవలంబించాలి. దానికి దూరంగా ఉండకూడదు, దాన్ని విడనాడి దాని పట్ల ఆలక్ష్యం చూపకూడదు. మితిమీరి ప్రవర్తించ కూడదు. దాని ప్రకారం ఆచరణలో అతిగా వ్యవహరించకూడదు. తనపై, ప్రజలపై ఒత్తిడి చేయకూడదు. ఎలాగైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సన్మార్గం, రుజుమార్గంపై ఉండిరో అలాగే ఉండాలి.

ఖుర్ఆన్ ద్వారా ఉపాధి సంపాదించే ప్రయత్నాలు నిషిద్ధం అని ఉంది. అంటే ఖుర్ఆన్ పారాయణం చేసి ప్రజల నుండి ధనం, బహుమానాలు, ప్రఖ్యాతి, హోదా, ఉద్యోగాలు కోరడం అన్న మాట. ఇది మరీ ఘోరమైన విషయం, అతి చెడ్డ గుణం. ఏదైనా హోదా, ధనం, ఐహిక వరం (అల్లాహ్ ఎవరికైనా ప్రసాదించి ఉంటే) ఖుర్ఆన్ ద్వారా దాన్ని మరింత రెట్టింపు చేసే ప్రయత్నం చేయవద్దు. ఈ ఖుర్ఆన్ అల్లాహ్ వద్ద మోక్షం, స్వర్గం పొందడానికొక మార్గం. అల్లాహ్ సాన్నిధ్యం పొందుటకు సాధనం. అందుకు దాన్ని ప్రజల వద్ద స్థానం పొందుటకు, తన లాంటి మనుషుల మధ్య గొప్పతనం పొందుటకు ఉపయోగించ కూడదు. ఇలా చేయువాడు స్వయంగా నాశనమయినట్లు, ప్రజల్ని కూడా నాశనం చేసినట్లు అవుతుంది. వారు “ఉలమాయె సూ”లో లెక్కించబడుతారు. వారు ధర్మాన్ని అడ్డుగా పెట్టుకొని ధనం సంపాదిస్తారు. దానిని వలగా ఉపయోగించి ప్రజల సొమ్మును కాజేస్తారు. చివరికి ధర్మం నుండి ప్రజల్ని దూరమే ఉంచుతారు. ఇలాంటి చేష్టల నుండి అల్లాహ్ మనల్ని కాపాడుగాక! అల్లాహ్ ఇలా ఆదేశించాడుః

 [وَلَكِنْ كُونُوا رَبَّانِيِّينَ بِمَا كُنْتُمْ تُعَلِّمُونَ الكِتَابَ وَبِمَا كُنْتُمْ تَدْرُسُونَ] {آل عمران:79}

మీరు అల్లాహ్ గ్రంథాన్ని బోధిస్తున్నారు, స్వయంగా పఠిస్తున్నారు, అందువల్ల మీరు మీ ప్రభువుకు విశ్వసనీయులయిన దాసులుగా రూపొందండి[. (ఆలె ఇమ్రాన్ 3: 79).

ఖుర్ఆన్ ఘనత

عَنْ جَابِرٍ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ الله ﷺ: (اَلْقُرْآنُ شَافِعٌ مُشَفَّعٌ وَ مَاحِلٌ مُصَدَّقٌ مَنْ جَعَلَهُ أَمَامَهُ قَادَهُ إِلَى الجَنَّةِ وَ مَنْ جَعَلَهُ خَلْفَهُ سَاقَهُ إِلَى النَّارِ).

ఈ హదీసులో:

ఖుర్ఆన్ ఘనత రుజువయింది. దాని ప్రకారం ఆచరించిన వారి తరఫున అది ప్రళయదినాన వాదిస్తుంది. దాని పట్ల మితిమీరకుండా, పూర్తిగా వదిలేయకుండా ప్రవర్తించేవారికి అది ప్రయోజనకరంగా ఉంటుంది. నిజమైన ఖుర్ఆన్ వాసుల గురించి దాని సిఫారసు అంగీకరించ బడుతుంది. మరొక హదీసులో ఉందిః “ఖుర్ఆన్ చదవండి, అది తనను చదివిన వారి పట్ల సిఫారసు చేస్తుంది”. ఖుర్ఆన్ వాసునికి అది లాభాన్నివ్వకున్నట్లయితే నష్టంలో పడేస్తుంది. వినాశనానికి గురి చేస్తుంది. ఖుర్ఆనును విడనాడి, దానికి దూరం ఉండి, దాని ఆదేశాలను ఆచరణలో ఉంచని, దాని నివారణలకు పాల్పడిన వానిని అది నశింపజేస్తుంది. ఖుర్ఆన్ ప్రకారం ఆచరించడం, సరియైన రీతిలో దాని పారాయణం చేయడం స్వర్గ ప్రవేశానికి, నరకం నుండి మోక్షానికి ముఖ్య కారణం. మరొక హదీసులో ఉందిః అది ప్రళయదినాన తనవారి గురించి వాదిస్తూ ఇలా అంటుందిః “నేను అతడ్ని రాత్రంతా మేల్కొలిపి ఉంచాను, అందుకు అతని పట్ల నా సిఫారసు అంగీకరించు (ప్రభువా)”. అలాగే సూర ముల్క్ (సూర నం. 67) సమాధి శిక్ష నుండి రక్షణకు కారణమవుతుందని హదీసులో ఉంది. అందుకే ప్రతి ముస్లిం ఈ గొప్ప గ్రంథం ద్వారా మోక్షాన్ని పొందే ప్రయత్నం చేయాలి. దాన్ని బలంగా, గట్టిగా పట్టుకోవాలి. మనసు దాని అర్థభావాలను అవగాహన చేసుకునే విధంగా మెదలాలి. వాంఛలు దానికి లోబడి ఉండేలా కృషి పడాలి.

عَنْ أَبِي سَعِيدٍ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ الله ﷺ: (كِتَابُ الله هُوَ حَبْلُ الله المَمْدُودُ مِنَ السَّمَاءِ إِلَى الأَرْضِ ).

ఈ హదీసులో:

 ఏదైనా విషయ భావాన్ని మనోగోచరమైనవాటితో పోల్చి చూప వచ్చును. అల్లాహ్ గ్రంథం, అల్లాహ్ మరియు దాసుని మధ్య అనుబంధం. దానిని గట్టిగా పట్టుకున్నవాడు విజయవంతుడు. [మీరంతా కలసి అల్లాహ్ త్రాడును గట్టిగా పట్టుకోండి. విభేదాలలో పడకండి]. (సూర ఆలె ఇమ్రాన్ 2: 103). ముస్లిం నేర్చుకోవలసిన జ్ఞానం, ఆదేశాలు, సంస్కారాలన్నియూ ఈ ఖుర్ఆన్ ద్వారా నేర్చుకోవాలి. అది పాతబడదు. దాని వింతలు అంతం కావు. ఎంత పఠిస్తూ ఉన్నా పండితుల మనసు నిండదు. ఈ గ్రంథం పవిత్రుడైన అల్లాహ్ వాక్కు. ఆయన దాన్ని అవతరింపజేశాడు. అది సృష్టి కాదు. విశ్వసనీయమైన ఆత్మ (అంటే దైవదూత అయిన జిబ్రీల్) దీనిని తీసుకొని సర్వలోకాల ప్రభువు యొక్క ప్రవక్త హృదయ ఫలకంపై అవతరించింది. స్వచ్ఛమైన అరబ్బీ భాషలో ఆయన అల్లాహ్ దాసులను హెచ్చరించాలని.

عَن عُقْبَةَ بنِ عَامِرٍ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ الله ﷺ: (لَوْ كَانَ الْقُرْآنُ فِي إِهَابٍ مَا أَكَلَتْهُ النَّارُ).

ఈ హదీసులో:

ఖుర్ఆనును కంఠస్తం చేయాలని, కొద్దికొద్దిగా హృదయంలో భద్రపరుచుకోవాలని ప్రోత్సహించబడినది. దానిని గుర్తులో ఉంచుకోవాలని చెప్పబడినది. ఖుర్ఆన్ కంఠస్తం చేయడం అతి గొప్ప వరం. [ఇవి జ్ఞానం ఇవ్వబడినవారి హృదయాల్లో చోటుచేసుకునే స్పష్టమైన ఆయతులు]. (సూరా అన్కబూత్ 29: 49).

పై హదీసు యొక్క భావం: దివ్యఖుర్ఆనును కంఠస్తం చేయాలని, దానిని మరచిపోకుండా గుర్తుంచుకోవాలని ప్రోత్సహించబడింది. ఎవరు దానిని కంఠస్తం చేసి, దాని ఆదేశాలను పాటించి, నివారణలకు దూరంగా ఉండి, అందులోని వార్తలను సత్యమని నమ్మి దాని ప్రకారం ఆచరించారో అల్లాహ్ వారిని నరకాగ్ని నుండి కాపాడతాడు. అల్లాహ్ గ్రంథం ఉన్న చర్మాన్ని అగ్ని కాల్చనప్పుడు, నమ్రత, ఏకాగ్రతతో (ఖుర్ఆన్ చదివే, ఆచరించే) విశ్వాసి సంగతేమంటారు?

عَنْ أَبِي مُوسَى الْأَشْعَرِيِّ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللهِ ﷺ: (إِنَّ مِنْ إِجْلَالِ اللهِ إِكْرَامَ ذِي الشَّيْبَةِ الْـمُسْلِمِ وَحَامِلِ الْقُرْآنِ غَيْرِ الْغَالِي فِيهِ وَالْـجَافِي عَنْهُ وَإِكْرَامَ ذِي السُّلْطَانِ الْـمُقْسِط).

ఈ హదీసులో:

అల్లాహ్ సన్నిహితులను గౌరవించడం, వారికి తగిన రీతిలో మర్యాద పాటించడం అల్లాహ్ ను గౌరవించే హక్కుల్లో ఒకటి. శ్రేష్ఠతలు, ధర్మపరమైనవయితేనే శ్రేష్ఠతలుగా ఉంటాయి. వృద్ధుడిని గౌరవించడం ఎందుకనగా అతను ముస్లిం. ఖుర్ఆన్ వాసులను గౌరవించేది కూడా వారు దాన్ని ఆచరణలో ఉంచుతున్నందుకే. అలాగే నాయకుడు న్యాయశీలుడయితే. ఘనతల్లో సమానంగా ఉన్నవారిలో వృద్ధులుంటే వారు ఉన్నతశ్రేణిలో, ప్రథమంగా ఉంటారు. ఇందులో వృద్ధాప్య ఘనత ఉంది. మరియు ఆ వయస్సు మర్యాద, అనుభవం (ఎక్కువ ఉన్నదనే) సూచన ఉన్నది.

గులువ్వ్ (అతిశయోక్తి) మరియు ధర్మంలో మితిమీరే ప్రవర్తన నుండి దూరముండాలని ప్రోత్సహించబడింది. అదే విధంగా ధర్మ విషయంలో ఆలక్ష్యం, అలసత్వం మరియు బధ్ధకం విడనాడాలని ప్రోత్సహించబడింది. అల్లాహ్ యొక్క ధర్మం ఈ రెండిటికి మధ్యలో ఉంది: [ఈ విధంగా మేము మిమ్మల్ని మధ్యస్థ సమాజంగా చేశాము]. (సూర బఖర 2: 143).

న్యాయశీలుడైన నాయకుడిని గౌరవించడం, అతని పట్ల మర్యాద పాటించడం మనపై ఉన్న అతని హక్కు అని భావించాలి. అలాగే అతని మాట విని, అతని ఆజ్ఞాపాలన చేయుటకు, అతని ద్వారా హక్కులన్ని యు భద్రంగా ఉండుటకు అతని భయం ఉండుట కూడా అవసరం. ప్రజల వ్యవహారాలు సవ్యంగా ఉండుటకు మూర్ఖులు అతనితో భయపడి ఉండుట కూడా అవసరం. హదీసులో ఉందిః “ఎవడు నాయకుడిని అవమానపరుస్తాడో అల్లాహ్ అతడ్ని అవమానపరుస్తాడు”. మరో హదీసు లో ఉందిః ప్రజల ఘనత తమ కర్మలను బట్టి ఉంటుంది. పుణ్యాత్ములను అవమానపరుచుట ధర్మంలో లోపం చూపినట్లు. అల్లాహ్ కు అవిధేయత చూపినట్లు. ఇది పుణ్యాల్లో వెనకపడి ఉన్నట్లవుతుంది.

عَنْ وَاثِلَةَ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ أَنَّ النَّبِيَّ ﷺ قَالَ: (أُعْطِيتُ مَكَانَ التَّوْرَاةِ السَّبْعَ {الطِّوالَ} وَأُعْطِيتُ مَكَانَ الزَّبُورِ الْـمَئِينَ وَأُعْطِيتُ مَكَانَ الْإِنْجِيلِ المَثَانِيَ وَفُضِّلْتُ بِالمُفَصَّلِ).

([*1])  ప్రవక్త మూసా అలైహిస్సలాంపై అవతరించిన గ్రంథం తౌరాత్. “సబ్ఉత్తివాల్” అంటే: ఖుర్ఆనులోని ఏడు పొడుగు సూరాలు. అవిః బఖర, అలె ఇమ్రాన్, నిసా, మాఇద, అన్ఆమ్, ఆరాఫ్ మరియు తౌబా సూరాలు.

([*2])  మసానీ అంటే మాటిమాటికి చదువబడే లేదా సబ్ఉత్తివాల్, మిఈన్ మరియు ముఫస్సల్ తర్వాత మిగిలిన సూరాలు.

ఈ హదీసులో:

దివ్యఖుర్ఆన్ అవతరణ ద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై ఉన్న అల్లాహ్ యొక్క గొప్ప దయ ప్రస్తావన ఇందులో ఉంది. ఈ దివ్యగ్రంథం గత మూడు ఆకాశ గ్రంథాలకు సమానంగా ఉందిః మూసా అలైహిస్సలాంపై అవతరించిన తౌరాత్. దావూద్ అలైహిస్సలాం యొక్క జబూర్. మరియు ఈసా అలైహిస్సలాం యొక్క ఇంజీల్. ఇంకా అల్లాహ్ తన దాసుడు మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లంకు ముఫస్సల్ (ఖాఫ్ నుండి నాస్ వరకు గల సూరాలు) అదనంగా ఇచ్చాడు. ప్రవక్త తమకు లభించిన అనుగ్రహం గురించి చెబుతున్నారంటే ఇది ఈ వరం యొక్క ఔన్నత్యం మరియు ఈ బహుమానం యొక్క గొప్ప స్థానం యొక్క నిదర్శన. ఈ ఖుర్ఆనే ప్రవక్త యొక్క విద్యజ్ఞానం, మార్గదర్శి, ప్రతి మేలు గురించి తెలుపునది. అదే ఆయనకు తగిన సహవాసి, హృదయానికి తృప్తినిచ్చునది. జీవితం, వ్యవహారంలో ప్రాణంలాంటిది. ఏదైనా పోడగొట్టుకున్నప్పుడు బాధ లేకుండా చేయునది అదే. ప్రవక్త సహచరులు కూడా అలాగే ఉండిరి. వారు అల్లాహ్ యొక్క ఈ అనుగ్రహాన్ని పొంది తగినరీతిలో దానిని గౌరవించి, దాని ప్రకారం ఆచరించేవారు. అందుకే అల్లాహ్ వారికి సంతృప్తి, సహాయం, విజయం మరియు బలాన్నిచ్చాడు.

ఖుర్ఆన్ నేర్పుట, నేర్చుకొనుట మరియు దాని పారాయణం చేయుటలో ఉన్న ఘనత

عن عُمَرَ بن الخَطَّاب رَضِيَ ٱللَّٰهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ الله ﷺ: (إِنَّ اللهَ يَرْفَعُ بِهَذَا الْكِتَابِ أَقْوَامًا وَيَضَعُ بِهِ آخَرِينَ)

ఈ హదీసులో:

ఖుర్ఆన్ ఘనత ఉంది. మరియు దాని ప్రకారం ఆచరించువారే ప్రజల నాయకత్వానికి అసలు అర్హులు. ఖుర్ఆన్ ప్రకారం ఆచరించువాడు ఉన్నతస్థానానికి, గౌరవ మర్యాదలకు, ప్రశంస ప్రఖ్యాతులకు అర్హుడు. ఎవడు ఖుర్ఆన్ పట్ల విముఖత చూపి దానికి దూరదూరంగా ఉంటాడో అతని మానం మట్టిలో కలసినట్లు, అతడు ఉన్నత వంశానికి చెందినా అగౌరవం పాలైనట్లే. బానిసల్లో ఉత్తమ ధర్మం, మంచి విద్య మరియు హోదాకు అర్హత గల గుణాలుంటే వారికి పెద్ద హోదాలు ఇవ్వవచ్చును. ఈ హదీసు ద్వారా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సత్య ప్రవక్త అని రుజువైంది. ఎలా అనగాః వాస్తవంగా ఖుర్ఆన్ ప్రకారం ఆచరించినవారు గౌరవం, ఔన్నత్యం, పేరు ప్రఖ్యాతులు పొందారు. మరియు ఖుర్ఆన్, సున్నతులకు విముఖత చూపినవారు అవమానం, పతనం, హీనస్థితుల పాలయ్యారు. దీనికి మానవ చరిత్రే సాక్ష్యంగా ఉంది.

عَنْ أَنَسِ بْنِ مَالِكٍ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللهِ ﷺ: (إِنَّ لِلهِ أَهْلِينَ مِنَ النَّاسِ) قَالُوا: يَا رَسُولَ الله! مَنْ هُمْ؟ قَالَ: (هُمْ أَهْلُ الْقُرْآنِ أَهْلُ الله وَخَاصَّتُهُ)

ఈ హదీసులో:

అల్లాహ్, ఖుర్ఆన్ వాసులకు గౌరవం, (ఇతరులకు గాకుండా) వారికి ప్రత్యేక దయ, శ్రధ్ధ మరియు సహాయం చూపాడని ఉంది. దాసుల్లో కొందరు అల్లాహ్ యొక్క ప్రత్యేకులున్నారు. సత్కార్యాల ద్వారా మాత్రమే ఆయన సాన్నిధ్యం పొందుట సాధ్యం. వాస్తవంగా ఖుర్ఆన్ వాసులే ప్రజల్లోకెల్లా అత్యుత్తములు. విద్యా మరియు ఆచరణ ప్రకారం ప్రజల స్థానాల్లో వ్యత్యాసం గలదు. ఉత్తమ వంశం, గొప్ప హోదాలు ఐహిక శోభలు మాత్రమే, తర్వాత అవి మాసిపోయేవి, అంతరించిపోయేవి.

మనిషి, పైన తెలిపిన గౌరవాన్ని పొందుటకు పూర్తి ప్రయత్నం చేయాలి; ఖుర్ఆన్ వాసుల్లో చేరి, దాని పారాయణం చేస్తూ, దాని ఆయతులను కంఠస్తం చేస్తూ, దాని ప్రకారం ఆచరిస్తూ మరియు దాని వైపుకు ఇతరులను ఆహ్వానిస్తూ ఉండాలి. ఇతర అన్ని రకాల విద్యలపై ఖుర్ఆన్ ఘనత కూడా ఇందులో ఉంది.

عَنْ عُقْبَةَ بْنِ عَامِرٍ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ قَالَ: خَرَجَ رَسُولُ اللهِ ﷺ وَنَحْنُ فِي الصُّفَّةِ فَقَالَ: (أَيُّكُمْ يُحِبُّ أَنْ يَغْدُوَ كُلَّ يَوْمٍ إِلَى بُطْحَانَ أَوْ إِلَى الْعَقِيقِ فَيَأْتِيَ مِنْهُ بِنَاقَتَيْنِ كَوْمَاوَيْنِ فِي غَيْرِ إِثْمٍ وَلَا قَطْعِ رَحِمٍ) فَقُلْنَا: يَا رَسُولَ اللهِ نُحِبُّ ذَلِكَ قَالَ: (أَفَلَا يَغْدُو أَحَدُكُمْ إِلَى الْمَسْجِدِ فَيَعْلَمُ أَوْ يَقْرَأُ آيَتَيْنِ مِنْ كِتَابِ اللهِ عَزَّ وَجَلَّ خَيْرٌ لَهُ مِنْ نَاقَتَيْنِ وَثَلَاثٌ خَيْرٌ لَهُ مِنْ ثَلَاثٍ وَأَرْبَعٌ خَيْرٌ لَهُ مِنْ أَرْبَعٍ وَمِنْ أَعْدَادِهِنَّ مِنْ الْإِبِلِ).

ఈ హదీసులో:

శ్రద్ధ వహించుటకు, మనస్సు లగ్నం కొరకు పండితుడు తమ శిష్యుల ముందు ప్రశ్న వేయుట మంచిది. ఇందులో ఖుర్ఆన్ వల్ల లభించే గొప్ప పుణ్యం ప్రస్తావన, దాని గొప్పతనం, మస్జిదులో దాన్ని నేర్చుకునే ఘనత మరియు జ్ఞానులతో దాని అర్థభావాలు తెలుసుకునే శ్రేష్ఠత ఉంది. ప్రపంచం మరియు ఇందులో ఉన్నదంతా కలసి సత్కార్యాలకు మరియు అల్లాహ్ తన పుణ్యపురుషులకు సిద్ధపరచిన పుణ్యాలకు సమానం కాజాలదు. ఇక్కడ ఒంటెల ప్రస్తావన రావటానికి కారణం ఏమిటంటే అది అరబ్బుల యందు ఉత్తమ సంపద కావడం. మనిషి ఏ చిన్న సత్కార్యాన్ని కూడా అల్పమైనదిగా భావించవద్దు. అది చిన్నదైనా చేస్తునే ఉండాలి. రోజుకొక్క ఆయతైనా నేర్చుకుంటూ, కంఠస్తం చేస్తూ ఉంటే కొద్ది సంవత్సరాల్లో మొత్తం ఖుర్ఆన్ కంఠస్తం చేయవచ్చు.

عَنْ عُثْمَانَ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ عَنْ النَّبِيِّ ﷺ قَالَ: (خَيْرُكُمْ مَنْ تَعَلَّمَ الْقُرْآنَ وَعَلَّمَهُ).

ఈ హదీసులో:

ఖుర్ఆన్ వాసులు సర్వ ప్రజల్లో శ్రేష్ఠులు. ప్రజలకు శ్రేష్ఠత సత్కార్యాల ద్వారా లభిస్తుంది. ఖుర్ఆన్ ఒకరితో నేర్చుకోవాలి. ఇతరులకు నేర్పే ముందు దాని పారాయణ విధానం దానికి సంబంధించిన వివరాలు నేర్చుకొని యుండాలి. ఖుర్ఆన్ విద్య ఇతర విద్యలపై ప్రాధాన్యత గలది. అన్ని రకాల శాస్త్రాలు, కళలపై ఘనత గలది. పూర్వ పండితుల్లో కొందరు ఈ హదీసు విన్న తర్వాత ముప్పై (30) సంవత్సరాల వరకు మస్జిదులో ప్రజలకు ఖుర్ఆన్ నేర్పుతూ ఉండిపోయారు. ఖుర్ఆన్ నేర్చుకునే, నేర్పే మరియు దానిపై ఆచరించేవారికి ఇందులో గొప్ప శుభవార్త ఉంది. వారు ఈ గొప్ప విజయం, శుభవార్తతో సంతోషపడాలి, అదృష్టంగా భావించాలి.

عَنْ تَمِيمٍ الدَّارِيِّ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللهِ ﷺ: (مَنْ قَرَأَ بِمِائَةِ آيَةٍ فِي لَيْلَةٍ كُتِبَ لَهُ قُنُوتُ لَيْلَةٍ).

ఈ హదీసులో:

తహజ్జుద్ నమాజులో ఎక్కువ ఖుర్ఆన్ పారాయణం చేయుట ఘనతగల విషయం. మనిషి ఎంత ఎక్కువ చదివి, ఆలోచిస్తూ ఉంటాడో అంతే ఉత్తమం. ఉత్తమరీతిలో ఎక్కువ చదువుట, అది లేకుండా ఎక్కువ చదువుట కన్నా మంచిది. రాత్రి నమాజులో ఎక్కువ ఖుర్ఆన్ పారాయణం, ఎక్కువ సజ్దాలకంటే ఉత్తమం. రాత్రి కొంత భాగం తహజ్జుద్ చేసినా అల్లాహ్ మొత్తం రాత్రి తహజ్జుద్ చేసినంత పుణ్యం ఇస్తాడు. పగలు కంటే రాత్రి వేళ ఖుర్ఆన్ చదవడం ఉత్తమం. వేరే సందర్భాల కంటే నమాజులో ఖుర్ఆన్ పారాయణం ఉత్తమం. అల్లాహు తఆలా సాన్నిధ్యం పొందుటకు తహజ్జుద్ సర్వ సత్కార్యాల్లో ఉత్తమం. అది పుణ్యాత్ముల విధానం. ప్రవక్తల నాయకుని సంప్రదాయం. సర్వలోకాల ప్రభువుకు అత్యంత ప్రియమైనది.

عَن عَبْدِ الله بْنِ مَسْعُودٍ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ يَقُولُ: قَالَ رَسُولُ الله ﷺ: (مَنْ قَرَأَ حَرْفًا مِنْ كِتَابِ الله فَلَهُ بِهِ حَسَنَةٌ ، وَالْحَسَنَةُ بِعَشْرِ أَمْثَالِهَا لَا أَقُولُ: [الم] حَرْفٌ ، وَلَكِنْ أَلِفٌ حَرْفٌ وَلَامٌ حَرْفٌ وَمِيمٌ حَرْفٌ).

ఈ హదీసులో:

ఖుర్ఆన్ పారాయణం చేయాలని ప్రోత్సహించబడింది. ఇందులో ప్రస్తావించబడిన పుణ్యం యోచించి, యోచించకుండా చదివే వారందరికీ సమానం. కాని యోచించి చదివేవారికి హృదయంలో విశ్వాసం, భయభీతులు జనిస్తాయి. ఒక పుణ్య ఫలితం ఎక్కువగా లభిస్తుందని ఉంది. ఖుర్ఆన్ పారాయణ ఫలితం అల్లాహ్ స్మరణకంటే ఎక్కువగా, గొప్పగా ఉంది. రేయింబవళ్ళు ఖుర్ఆన్ పారాయణం చేయువారికి గొప్ప శుభవార్త ఇవ్వబడింది. ఇంతటి అధిక, మేలైన, శుభంగల ఫలితంతో వారు ఆనందించాలి. ఎంతటి సులభమైన కార్యం ఇది; మనిషి నిలబడి, కూర్చుండి, పడుకొని ఏ స్థితిలోనైనా గొప్ప ఫలితాన్ని పొందుతాడు. వాస్తవానికి ఇది నిత్యుడు, సజీవుడైన అల్లాహ్ యొక్క మహత్తరమైన బహుమానం. ఉన్నారా, ఎవరైనా శ్రద్ధ, యోచనతో పారాయణం చేసే వారు??!! అయ్యో పాడుగాను!! మేము ఎంత సమయం వృధా చేసితిమి??!!. వృధా మాటల్లో, సమావేశాల్లో ఎంత సమయం వెచ్చిస్తాము. ఖుర్ఆన్ పారాయణం మరియు అల్లాహ్ స్మరణ కొరకు చాలా తక్కువ సమయం కేటాయిస్తాము. మమ్మల్ని కరుణించు ఓ అల్లాహ్! ఆమీన్.

عَنْ عَائِشَةَ رَضِيَ ٱللَّٰهُ عَنْهَا قَالَتْ: قَالَ رَسُولُ الله ﷺ: (الْـمَاهِرُ بِالْقُرْآنِ مَعَ السَّفَرَةِ الْكِرَامِ الْبَرَرَةِ وَالَّذِي يَقْرَأُ الْقُرْآنَ وَيَتَتَعْتَعُ فِيهِ وَهُوَ عَلَيْهِ شَاقٌّ لَهُ أَجْرَانِ).

ఈ హదీసులో:

ఖుర్ఆన్ తజ్వీదు (సరియైన ఉచ్ఛారణ)తో, మంచి స్వరంతో పారాయణం చేయాలని, ప్రతి అక్షర శబ్దం, దానికి తగిన స్థానం నుండి బయటికి రావాలని, దానిని సరియైన పద్ధతిలో పారాయణం చేయాలని ప్రోత్సహించ బడినది. నాలుకపై సులభతరం అయ్యే విధంగా మాటిమాటికి ఖుర్ఆన్ పారాయణం చేస్తూ ఉండాలని చెప్పబడింది. ఖుర్ఆన్ తజ్వీదు తో చక్కగా పారాయణం చేయువాడు, దాన్ని కంఠస్తం చేయువాడు మరియు దాని ప్రకారం ఆచరించువాడు పుణ్యదూతలకు తోడుగా ఉంటాడు. ఇలా అల్లాహ్ అతనికి ఉన్నత స్థానం ప్రసాదించి, మంచి ఆతిథ్యం సిద్ధపరిచి, మరియు గౌరవపదవిని ప్రసాదిస్తాడు. పారాయణంలో కష్టం కలిగినా వదలకుండా పారాయణం చేయడం, కంఠస్తం చేయడం, చక్కగా చదవడం, వాటికి తగిన రీతిలో రాకున్నా ప్రయాసపడుతూ ఉండే వ్యక్తికి అల్లాహ్ రెట్టింపు పుణ్యం వ్రాస్తాడు. ఒకటిః పారాయణ పుణ్యం అయితే. మరొకటిః కష్టపడిన పుణ్యం. ఇదంతా ఖుర్ఆన్ గొప్పతనం. ఎవరు తనకు సహవాసిగా, స్నేహితుడిగా హృదయానికి తృప్తినిచ్చునదిగా ఖుర్ఆనును చేసుకున్నారో వారు అదృష్టవంతులు.

ఒక విషయం: ఎవరికి ఖుర్ఆన్ చదవడం కష్టంగా ఉందో, చక్కగా చదలేకపోయినా, నేను చక్కగా చదవలేను అన్న సాకుతో పారాయణం చేయడం మానుకోవద్దు. సాధ్యమైనంత వరకు మరింత కృషి చేస్తూ ఉండాలి. అందుకు అతనికి రెట్టింపు పుణ్యం లభిస్తుంది. దానికి ఈ హదీసే ఆధారం. అల్లాహ్ అందరికి సద్భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్.

عَنْ أَبِي مُوسَى الْأَشْعَرِيِّ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ الله ﷺ: (مَثَلُ المُؤْمِنِ الَّذِي يَقْرَأُ الْقُرْآنَ كَمَثَلِ الْأُتْرُجَّةِ رِيحُهَا طَيِّبٌ وَطَعْمُهَا طَيِّبٌ وَمَثَلُ المُؤْمِنِ الَّذِي لَا يَقْرَأُ الْقُرْآنَ كَمَثَلِ التَّمْرَةِ لَا رِيحَ لَهَا وَطَعْمُهَا حُلْوٌ وَمَثَلُ المُنَافِقِ الَّذِي يَقْرَأُ الْقُرْآنَ مَثَلُ الرَّيْحَانَةِ رِيحُهَا طَيِّبٌ وَطَعْمُهَا مُرٌّ وَمَثَلُ المُنَافِقِ الَّذِي لَا يَقْرَأُ الْقُرْآنَ كَمَثَلِ الْـحَنْظَلَةِ لَيْسَ لَهَا رِيحٌ وَطَعْمُهَا مُرٌّ).

ఈ హదీసులో:

నలుగురి స్థానాలున్నాయిః

మొదటివాడు భయభీతిగల విశ్వాసి, ఖుర్ఆన్ వాసి, దాని ప్రకారం ఆచరించువాడు, పారాయణ సందర్భంలో యోచించేవాడు మరియు తీర్పు, న్యాయం కొరకు ఈ గొప్ప గ్రంథం వైపే వచ్చే వ్యక్తి. అతను మేలు జాతికి చెందిన నారింజపండు లాంటివాడు. అందులో మెరుపు, మంచి సువాసన ఉంది. మంచి తియ్యని రుచి ఉంది. ఈ ఖుర్ఆన్ వాసి అతను ఖుర్ఆన్ పఠిస్తుంటే మరింత సువాసన పెరుగుతుంది. అతని పారాయణం సువాసన లాంటిది. ఈ పండు రుచి మాదిరిగా అది స్వయంగా మంచిదే. ఈ విధంగా ఖుర్ఆన్ అతి ఉత్తమ సువాసనగల మరియు ప్రకాశవంతమైన జ్యోతి.

రెండోవాడు ఖుర్ఆన్ పఠించని విశ్వాసి నిరక్షరాస్యుడు. కాని తన ప్రభువును ఆరాధిస్తూ, ఆదేశాలను పాటిస్తూ మరియు నివారణల నుండి దూరముంటూ తనలో తాను మంచివాడు కావచ్చు. అందుకే అతను ఖర్జూరపండు లాంటివాడు. అందులో సువాసన లేదు. ఎలాగైతే అతను ఖుర్ఆన్ పఠించడం లేదో, దాని పారాయణ మాధుర్యాన్ని పొందే ప్రయత్నం చేయడం లేదో. ఖర్జూరపండు సువాసన లేకున్నా తిని చూసేవారికి మంచి రుచి లభిస్తుంది. అలాగే విశ్వాసి, లోపట విశ్వాసం మంచిగా ఉండి, (ఖుర్ఆన్ ప్రకారం ఆచరించువాడు) కాని ఖుర్ఆన్ చదవలేడు.

మూడోవాడు ఖుర్ఆనును పఠించే కపటవిశ్వాసి. మార్గదర్శకత్వం, కాంతులున్న ఖుర్ఆనును అతడు పఠిస్తాడు కాని దానితో ప్రయోజనం పొందడు. దానిలోని ఆదేశాలను పాటించడు. వ్యవహారాల పరిష్కారం దాని నుండి కోరడు. దానిని విశ్వసించడు. అట్లే పై,పైకి పఠిస్తాడు. అందుకే వాడు పరిమళం ఉన్న చేదుఫలం లాంటివాడు. దాని సువాసన, పరిమళం, సుగంధ్యం చాలా చక్కగా ఉంటుంది. కాని దాని రుచి చాలా చేదుగా ఉంటుంది. అలాగే కపట విశ్వాసి. అతని ఆంతర్యం చెడు. చెడు మనస్సుగలవాడు. దుష్ట సంకల్పంగల వాడు. అతని ఆంతర్యంలో చూసినప్పుడు పెడమార్గం, అనుమానం, కామం, సందేహం, పాపాలు లాంటి ఎన్నో దోషాలు కానవస్తాయి. అతని మాట, ఖుర్ఆన్ పారాయణం వినే వ్యక్తి ఏదైనా కొంచెం ప్రయోజనం పొందినా అది పరిమళం గల చేదు ఫలం లాంటిదే. కాని ఎప్పుడు అతని దగ్గరికి వెళ్ళి, అతనితో కలిస్తే ఇష్టంలేని, ప్రీతికరం కాని మాటలు అంటాడు.

నాలుగో వ్యక్తి ఖుర్ఆన్ చదవని కపట విశ్వాసి. అతను అడవి దోసకాయ లాంటివాడు. అదులో సువాసన ఉండదు. మంచి రుచీ ఉండదు. ఇతడు మూడోవానికంటే చెడ్డవాడు. పఠించడు, ఆచరించడు. ఆంతర్యం, బాహ్యమంతా చెడే. అడవి దోసకాయలో సువాసన ఉండదు. ఎవడైనా దాని రుచి చూస్తే చేదు రుచే పొందుతాడు.

సులభంగా అర్థమగుటకు ఈ హదీసులో చక్కని ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. ఇందులో ప్రవక్త గారి ఉత్తమ విశ్లేషణ పద్ధతి ఉంది. అలాగే మాట్లాడడంలో నైపుణ్యం, అంతంకాని వాక్పటుత్వం, దిగ్భ్రాంతి కలిగించే సంభాషణ మరియు ఆకర్షించుకునే పద్ధతి ఉంది. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం)ను చక్కటి వక్తగా చేసిన, బుధ్ధిమంతులను ఆకర్శించే గొప్ప సంభాషణ విధానం ప్రసాదించిన అల్లాహ్ చాల పవిత్రుడు. గొప్పవాడు. అల్లాహ్ మనందరిని ఆయన గ్రంథం పఠించేవారుగా చేయుగాక. ఆమీన్! ఆయన ప్రతిదానిపై శక్తి గలవాడు.

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ أَنَّ رَسُولَ الله ﷺ قَالَ: (لَا حَسَدَ إِلَّا فِي اثْنَتَيْنِ رَجُلٌ عَلَّمَهُ اللهُ الْقُرْآنَ فَهُوَ يَتْلُوهُ آنَاءَ اللَّيْلِ وَآنَاءَ النَّهَارِ فَسَمِعَهُ جَارٌ لَهُ فَقَالَ لَيْتَنِي أُوتِيتُ مِثْلَ مَا أُوتِيَ فُلَانٌ فَعَمِلْتُ مِثْلَ مَا يَعْمَلُ وَرَجُلٌ آتَاهُ اللهُ مَالًا فَهُوَ يُهْلِكُهُ فِي الْـحَقِّ فَقَالَ رَجُلٌ لَيْتَنِي أُوتِيتُ مِثْلَ مَا أُوتِيَ فُلَانٌ فَعَمِلْتُ مِثْلَ مَا يَعْمَلُ).

ఈ హదీసులో:

హోదా, ప్రఖ్యాతి, వ్యాపారం మరియు ధనం లాంటి నీచమైన ఐహిక వరాలను ఎవరి వద్దనైనా చూసి వారి పట్ల అసూయ పడుట ఎంత మాత్రం ధర్మసమ్మతం కాదు. ఇది రెండు విషయాల్లో మాత్రమే యోగ్యం.

ఒకటిః అల్లాహ్ యొక్క దివ్య గ్రంథ జ్ఞానం పొందిన వ్యక్తి, అతడు అల్లాహ్ తో భయపడుతూ ఉంటాడు, దానికి తగిన రీతిలో రేయింబవళ్ళు, ఫర్జ్, నఫిల్లో, నివాసం, ప్రయాణంలో, నిలబడి, కూర్చుండి పారాయణం చేస్తాడు, మరియు ఎల్లవేళల్లో పఠిస్తూ ఉంటాడు.

రెండవదిః ముస్లిం వద్ద ఉన్న హలాల్ సంపద, అతను దాన్ని ధర్మ మార్గాల్లో వెచ్చిస్తాడు. దాని ద్వారా బంధుత్వాన్ని పెంచుతాడు, ఆతిథ్యమిస్తాడు, లేనివారి కొరకు సంపాదించి ఇస్తాడు మరియు అనాధలకు సహాయపడతాడు. (వీరిద్దరూ గొప్ప పుణ్యాత్ములు, శ్రేష్ఠతగలవారు. అయితే) మరో ఇద్దరు మనుషులు వీరిద్దరికి సమానంగా ఉంటారు శ్రేష్ఠత మరియు ఫలితంలోః ఒకరుః ఖుర్ఆన్ విద్య గల వ్యక్తి మాదిరిగా కావాలని కోరేవాడు. కాని అతని స్థానానికి చేరుకోలేకపోతాడు. అయినా అతని సదాలోచన మరియు సదుద్దేశం ప్రకారం ఫలితం లభిస్తుంది. మరో వ్యక్తి ఆ ధనికుని వలే కావాలని కోరుతాడు. కాని ఆ స్థానానికి చేరుకోలేడు. అతనికి సత్సంకల్పం మరియు సదుద్దేశం ప్రకారం ఫలితం లభిస్తుంది.

عَنْ عَبْدِ الله بْنِ عَمْرٍو رَضِيَ ٱللَّٰهُ عَنْهُ أَنَّ رَسُولَ الله ﷺ قَالَ: (الصِّيَامُ وَالْقُرْآنُ يَشْفَعَانِ لِلْعَبْدِ يَوْمَ الْقِيَامَةِ يَقُولُ الصِّيَامُ أَيْ رَبِّ مَنَعْتُهُ الطَّعَامَ وَالشَّهَوَاتِ بِالنَّهَارِ فَشَفِّعْنِي فِيهِ وَيَقُولُ الْقُرْآنُ مَنَعْتُهُ النَّوْمَ بِاللَّيْلِ فَشَفِّعْنِي فِيهِ قَالَ فَيُشَفَّعَانِ).

ఈ హదీసులో:

ఉపవాసం (రోజా) మరియు ఖుర్ఆన్ పారాయణం అను రెండు గొప్ప ఆచరణల ఘనత ఉంది.

రోజా పగటి ఆరాధన అయితే ఖుర్ఆన్ పారాయణం రాత్రి ఆరాధన.

సుఖాన్ని త్యజించి, మనస్సు కోరికలను విడనాడే అలవాటు చేయుట ద్వారానే ఉన్నతస్థానాలు పొందగలుగుతాము.

స్వర్గం కష్టతరమైన, ఇష్టం లేని కార్యాలతో కప్పియుంది. సత్కార్యాలు మోక్షం, పాపాల ప్రక్షాళనం మరియు తప్పిదాల మన్నింపుకు గొప్ప కారణం.

రాత్రి వేళ ఖుర్ఆన్ పారాయణంలో ఘనత ఉంది. అది పగటి పారాయణం కంటే ఉత్తమం. సత్కార్యాలు మనిషి తరఫున వాదిస్తాయి. మనిషి దీన్ని స్వర్ణావకాశంగ భావించి తన ప్రభువు దివ్యగ్రంథాన్ని పఠించాలి, రేయింబవళ్ళు దాన్ని పరిశీలించాలి, అధికంగా దాని పారాయణం చేస్తూ ఉండాలి. తహజ్జుద్ నమాజుల్లో దాని పారాయణ సందర్భంగా యోచించాలి.

అలాగే ఉపవాసాలుండే ప్రయత్నం చేయాలి. తనపై తాను అన్యాయం చేసుకోకూడదు. ఒక రోజు ఇలాంటి పుణ్యాల అవసరం చాలా ఉంటుంది. ఆ రోజే మనిషికి తన ధనం, సంతానం పనికిరాని రోజు. కేవలం మంచి మనస్సుతో అల్లాహ్ సాన్నిధ్యంలో హాజరైనా వ్యక్తి తప్ప.

ఈ హదీసులో మరియు ఇతర హదీసుల్లో సత్కార్యాలు సిఫారసు చేస్తాయని ఉంది. అయితే విశ్వాసపరులైన స్త్రీపురుషులు వాటిని పూర్తి సంకల్పశుద్ధితో చేసియుంటేనే అల్లాహ్ అంగీకరిస్తాడు. ఇంకా ఆ కర్మల సిఫారసును వారి పట్ల అంగీకరిస్తాడు, వారిని మన్నిస్తాడు.

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ عَنْ النَّبِيِّ ﷺ قَالَ: (يَجِيءُ الْقُرْآنُ يَوْمَ الْقِيَامَةِ فَيَقُولُ يَا رَبِّ حَلِّهِ فَيُلْبَسُ تَاجَ الْكَرَامَةِ ثُمَّ يَقُولُ يَا رَبِّ زِدْهُ فَيُلْبَسُ حُلَّةَ الْكَرَامَةِ ثُمَّ يَقُولُ يَا رَبِّ ارْضَ عَنْهُ فَيَرْضَى عَنْهُ فَيُقَالُ لَهُ اقْرَأْ وَارْقَ وَتُزَادُ بِكُلِّ آيَةٍ حَسَنَةً).

ఈ హదీసులో:

ఖుర్ఆన్ ప్రకారం ఆచరించే, దాని వైపునకు పిలిచే వారి కొరకు అల్లాహ్ ఏమి సిద్ధపరిచాడో దాని ప్రస్తావన ఉంది. ఎంతటి గొప్ప అదృష్టం. ఎంతటి గొప్ప సఫలం. వాస్తవంగా ఖుర్ఆన్ వాసికి ఇహలోకంలో కూడా మహా గౌరవం లభించింది. ఎందుకనగా అతడు దానితో తన హృదయాన్ని నింపుకున్నాడు. దాని వల్ల అతని హృదయం తెరిసింది. దాని (పారాయణం) కొరకు అతని నాలుక సులభమయింది, అతడు దాని కొరకు రాత్రుల్లో జాగరణ చేశాడు, అందుకు ఖుర్ఆన్ ప్రళయదినాన అతని గురించి సిఫారసు చేస్తుంది, పోరాడుతుంది, సాక్షిగా నిలుస్తుంది. అల్లాహ్ తో అతని కొరకు ఉన్నత స్థానాన్ని కోరుతుంది. ప్రజలందరు నగ్నంగా, మహ్షర్ మైదానంలో సమావేశమయ్యే రోజు అతనికి వస్త్రాలు ధరించమని అల్లాహ్ తో సంభాషిస్తుంది. అతనికి వస్త్రాలు, కిరీటాలు ప్రసాదించబడుతాయి. అల్లాహ్ ప్రసన్నత లభిస్తుంది. ఇంకెప్పుడూ అల్లాహ్ అతనిపై కోపగించుకోడు. ఇంతటితో సరిపోకుండా మరో వరం: ఇహలోకంలో పఠిస్తున్నట్లు ఇప్పుడు మఠించమని ‘ఒక్కో స్థానం ఎక్కుతూ ఉండ’మని అతనికి చెప్పబడుతుంది. తాను కంఠస్తం చేసినంత పఠిస్తూ ఉన్నత స్థానాల్లో పైకి వెళ్ళుతూ ఉంటాడు. ఇన్ని పుణ్యాలు, సత్ఫలితాల తర్వాత దేని కొరకు వేచిస్తున్నావు? ఈ దివ్య గ్రంథ పారాయణం, కంఠస్తం చేసే, పరిశీలించే మరియు ఆచరించే సమయం రాలేదా? వినాశం మరియు చింతలబాధల నుండి మనల్ని మనం కాపాడుకునే సమయం రాలేదా? అల్లాహ్ యే అందరికీ మంచి సహాయం చేయువాడు.

ప్రవక్త సహచరుల్లో ఖుర్ఆన్ పండితులు

عَن عَبْدِ الله بْن عَمْرٍو رَضِيَ ٱللَّٰهُ عَنْهُ إِنَّ رَسُولَ الله ﷺ قَالَ: (اسْتَقْرِئُوا الْقُرْآنَ مِنْ أَرْبَعَةٍ مِنْ عَبْدِ الله بْنِ مَسْعُودٍ وَسَالِمٍ مَوْلَى أَبِي حُذَيْفَةَ وَأُبَيِّ بْنِ كَعْبٍ وَمُعَاذِ بْنِ جَبَلٍ).

ఈ హదీసులో:

ఖుర్ఆన్ విద్య ఖుర్ఆన్ పండితులతో ముఖాముఖిగా నేర్చుకోవలసియుంటుంది. ఖుర్ఆన్ విద్యలో విద్వాంసులు, ప్రావీణ్యులు ఉంటారు. కొందరు సహచరులు (సహాబాలు) మరికొందరి కంటే చక్కగా ఖుర్ఆన్ పారాయణం చేసేవారు. ఎవరు ఏ విద్యలో ప్రత్యేక కోర్సులు చేస్తారో అతడు అందులో ఇతరుల కంటే ముందుగా ఉంటాడు. అంతే కాదు ఆ సబ్జెక్టులో ప్రావీణ్యుడవుతాడు. అబూ బక్ర్, ఉమర్, ఉస్మాన్ మరియు అలీ రజియల్లాహు అన్హుమ్ పైన పేర్కొనబడిన నలుగురికంటే మరియు సర్వ ముస్లిముల కంటే ఉత్తములు, శ్రేష్ఠులు. కాని వారు (పై నలుగురు) అధికంగా ఖుర్ఆన్ పారాయణంలో, దాని తజ్వీదులో మరియు దానికి సంబంధించిన జ్ఞానంలో నిపుణులు అవడం వల్ల ఇతరులందరిపై ఉన్నతులు. ప్రతి విద్య, ప్రతి కళ అందులో నేర్పరి అయిన వారితో నేర్చుకోవాలి.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, తొలి పేరు అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హుది ప్రస్తావించారు. అతను మాక్కా జీవిత కాలం నుండి ప్రవక్త తో ఉన్నారు. ఖుర్ఆన్ తజ్వీదులో చాలా నేర్పరి. ఈ గ్రంథం ద్వారా అల్లాహ్ ఎవరిని తలిస్తే వారిని పైకి లేపుతాడు. సాలిం బానిస అయినప్పటికీ అల్లాహ్ ఈ గ్రంథం ద్వారా అతనిని ఉన్నత స్థానానికి చేర్చాడు. హదీసులో ఇలా ఉందిః “నిశ్చయంగా అల్లాహ్ ఈ దివ్యగ్రంథం ద్వారా కొందరిని ఉన్నతస్థానానికి తీసుకెళ్తే మరి కొందరిని పతనానికి దిగ జారుస్తాడు”. (ముస్లిం 817).

ఇందులో నలుగురి సహచరుల ఘనత ఉంది. వారు ఖుర్ఆన్ తజ్వీదులో ప్రావీణ్యులవడం చేత ఇతరులకు మార్గదర్శకులయ్యారు. వారి ఉచ్ఛారణ ప్రకారం ఖుర్ఆన్ నేర్చుకొనడం జరుగుతుంది. ఇది వారి ఘనతల్లో అతిగొప్పది. ముస్లిం శిష్యుడు ఖుర్ఆన్ నేర్చుకొనుటకు స్వయంగా గురువు వద్దకు వెళ్ళాలి. గురువు సహాయం లేకుండా తనకు తానే నేర్చుకోరాదు. తప్పులు ఎక్కువవుతాయి. సరిగ్గా నేర్చుకోనూ లేడు. విద్య గురువుతో సూటిగా నేర్చుకొనబడుతుంది. ఇక్కడ ఒక సూక్ష్మ సంజ్ఞ ఉందిః

ఈ నలుగురిలో ఇద్దరు ముహాజిరులు మరి ఇద్దరు అన్సారులు.

అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు గురించి ప్రవక్త ఒకసారి ఇలా చెప్పారుః “ఖుర్ఆన్ అవతరించిన విధంగానే నేర్చుకోవాలనుకునే వారు ఇబ్ను ఉమ్మె అబ్ద్ (అంటే అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్) దగ్గర నేర్చుకోవాలి”. (ఇబ్ను మాజ 138).

ఉబై బిన్ కఅబ్ గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః

(لِيَهْنِكَ الْعِلْمُ أَبَا الْـمُنذر)

“అబుల్ ముంజిర్! నీకు విద్య సులభంగా వస్తుంది”. (ముస్లిం 810).

ఉమర్ రజియల్లాహు అన్హు సయ్యిదుల్ ఖుర్రా (ఖుర్ఆన్ పాఠకుల్లో నాయకుడైన) ఉబై బిన్ కఅబ్ రజియల్లాహు అన్హు వెనుక నమాజు చేయండని అందరిని సమూహపరిచారు.

ముఆజ్ బిన్ జబల్ రజియల్లాహు అన్హు గురించి సహీ హదీసులో ఉంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వస్లలం అతడ్ని ప్రేమించే వారని, అలాగే మరో సహీ హదీసులో ఉందిః ప్రళయదినాన ముఆజ్ రజియల్లాహు అన్హు ధర్మపండితులకంటే ముందు వారి యెదుట నుండి స్వర్గంలో ప్రవేశిస్తాడు. మరో హదీసులో ఉందిః అతనికి హలాల్ మరియు హరాం విషయాల జ్ఞానం సహచరులందరికంటే ఎక్కువగా ఉన్నది.

అబూ హుజైఫా బానిస సాలిం చాలా పుణ్య పురుషుడు. ‘యమామ’ యుద్ధంలో షహీదయ్యారు. ‘సాలిం ఒకవేళ బ్రతికి ఉన్నట్లయితే నేను అతడినే ఖలీఫగా నిర్ణయించే వాడిన’ని ఉమర్ రజియల్లాహు అన్హు చెప్పారు.

عَنْ عَبْدِ الله بْنِ مَسْعُودٍ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ أَنَّ أَبَا بَكْرٍ وَعُمَرَ بَشَّرَاهُ أَنَّ رَسُولَ الله ﷺ قَالَ: (مَنْ أَحَبَّ أَنْ يَقْرَأَ الْقُرْآنَ غَضًّا كَمَا أُنْزِلَ فَلْيَقْرَأْهُ عَلَى قِرَاءَةِ ابْنِ أُمِّ عَبْدٍ).

ఈ హదీసులో:

ఖుర్ఆన్ పారాయణం మరియు తజ్వీదులో కొందరు సహచరులు మరి కొందరిపై ఘనతగలవారు. వారందరిలో ఇబ్ను మస్ఊద్ రజియల్లాహు అన్హు ఘనులు. ఖుర్ఆన్ విద్య గురువుగారి దగ్గర ఉండి, ముఖాముఖీగా నేర్చుకోవాలి. ఈ సహచరునికి గొప్ప సాన్నిధ్యం మరియు ఉత్తమ స్థానం లభించింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా ఇతడిని ప్రశంసించారు, అతని గురించి తన సంతృప్తిని తెలియబరిచారు. ఒక సహీ హదీసులో ఇబ్ను మస్ఊద్ రజియల్లాహు అన్హు చెప్పారుః నేను డెబ్బై సూరాలు ప్రవక్త నోటితో నేర్చుకున్నాను. వీటిలో నాకు పోటి పడువాడు ఎవరూ లేరు. వాస్తవంగా అల్లాహ్ అతని ద్వారా చాలా మేలు చేగూర్చాడు. తన హృదయంలో ఉన్న ఖుర్ఆన్ మరియు ధర్మవిద్యతో అతను ఇరాక్ దేశానికి వెళ్ళాడు. అక్కడ ఉండి, ప్రజలకు నేర్పాడు, హితువు చేశాడు, ఇస్లాం వైపునకు ఆహ్వానించాడు. మంచిని గురించి బోధించాడు. చెడు నుండి నివారించాడు. అల్లాహ్ అతనికి విద్య మరియు ఖుర్ఆన్, చదివించడం, బోధ చేయడం మరియు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలపడం ద్వారా చాలా శుభాలు కలుగజేశాడు. అంతే కాకుండా అతని వివేకం, సూక్ష్మజ్ఞానం మరియు చురుకుతనం ద్వారా కూడా చాలా ప్రయోజనం కలిగింది. ఈ విధంగా ఇస్లాం ప్రచారం చేసినందుకు అల్లాహ్ అతనికి అతిఉత్తమ ఫలితం నొసంగుగాక! ఆమీన్!!

عَنْ أَبِي مُوسَى رَضِيَ ٱللَّٰهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ الله ﷺ لِأَبِي مُوسَى: (لَوْ رَأَيْتَنِي وَأَنَا أَسْتَمِعُ لِقِرَاءَتِكَ الْبَارِحَةَ لَقَدْ أُوتِيتَ مِزْمَارًا مِنْ مَزَامِيرِ آلِ دَاوُدَ).

ఈ హదీసులో:

ఖుర్ఆన్ మధురమైన స్వరంతో, సరియైన పద్ధతిలో చదివేవారితో వినడం అభిలషనీయం. ఇలా ఎక్కువ దైవభీతి కలుగుతుంది. నమ్రత, పరిశీలన మరియు యోచన కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది.

మనిషి ఆత్మస్తుతికి, అహంభావానికి గురికాడనే నమ్మకం ఉన్నప్పుడు అతని యదుట అతడ్ని ప్రశంసించవచ్చును. ఇందులో అబూ మూసా కీర్తి ఉంది. ప్రవక్త అతని పారాయణాన్ని ప్రశంసించారు. అతని ఖుర్ఆన్ చదివే విధానంతో ప్రవక్త ప్రభావితులయ్యారు. అతని కంఠస్వరాన్ని పొగడారు.

(వినేవారు ప్రభావితులవటానికి) స్వరాన్ని సవరించడంలో కొంత శ్రమ పడడం తప్పు కాదు. కొందరు హదీసు వేత్తలు (ముహద్దిసీన్) ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఎలా అనగా ఒక ఉల్లేఖనం ప్రకారం అబూ మూసా ప్రవక్తతో అన్నారుః ‘మీరు వింటున్నారని నాకు తెలిసి ఉంటే నేను మరింత మధురకంఠంతో పఠించేవాడిని’. అందుచేత ప్రజల హృదయాల్లో చొరబడటానికి మరియు ఎక్కువ ప్రభావం కలగటానికి ఖుర్ఆన్ పారాయణంలో మధుర స్వరం పాటించడం ప్రదర్శన (రియా) క్రింద లెక్కించబడదు. ప్రసంగాల్ని కూడా ఇందులోనే పరిగణించారు. వినేవారు ప్రభావితులవడానికి, అందులో పదాల శైలిని ఆకర్షణీయంగా, అలంకారికంగా చేర్చడం మరియు సంబోధిస్తూ స్వరాన్ని పెంచడం, దించడం మంచిది. ఎందుకనగా అబూ మూసా చెప్పిన మాటను ప్రవక్త విని మౌనం వహించరు, అనగా దానిని రద్దు చేయలేదు.

ప్రవక్త దావూద్ అలైహిస్సలాం కంఠం చాలా మధురంగా ఉండింది. పర్వతాలు, పక్షులు సయితం ప్రవక్త దావూదుతో కలిసి దైవధ్యానంలో లీనమయిపోయేవి. ఆయన తన మధురకంఠంతో పఠించినప్పుడు పక్షులు, జంతువులు నిశ్శబ్దంగా వింటూ ఉండేవి.

عَنْ عَبْدِ الله بْنِ عَمْرٍو رَضِيَ ٱللَّٰهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ الله ﷺ: (أَكْثَرُ مُنَافِقِي أُمَّتِي قُرَّاؤُهَا).

ఈ హదీసులో:

నిఫాఖ్ (కపటత్వం), ప్రదర్శనాబుద్ధి మరియు పేరు ప్రఖ్యాతులకు ‘ఖుర్రా’ (ఖుర్ఆన్ పారాయణ నిపుణులు) తొందరగా గురి అవుతారు. ఎందుకనగా వారి ఈ క్రియ ప్రజల్ని వారి వైపుకు మరల్చుతుంది. ప్రజల హృదయాల్లో వీరు ఎక్కువ గౌరవ మర్యాదలు పొందుతుంటారు. అందుకు ఈ దారి నుండి షైతాన్ వారిలో ప్రవేశిస్తాడు. స్వరాన్ని మరియు పారాయణ విధానాన్ని సవరించాలని ప్రోత్సహిస్తాడు. ప్రజల్లో ఎక్కువ పేరు వస్తుందని, స్థానం పెరుగుతుందని మరియు గౌరవం లభిస్తుందని ఆశ పుట్టిస్తాడు. ఈ విధంగా నిఫాఖ్ వారిలో చొరబడుతుంది. ఒక సహీ హదీసు లో ఇలా ఉందిః తొలిసారిగా ఏ ముగ్గురితో నరకాగ్ని పెంచబడునో వారిలో ఒకతను “ఖారి సాబ్” అన్న పేరు తెచ్చుకోడానికి ఖుర్ఆన్ చదివే మరియు చదివించే వ్యక్తి. నీవు ఆ పేరు సంపాదించుకున్నావు కదా, ఇక రా అని నరకంలో ప్రవేశింపబడతాడు. ఇందులో పండితులు మరియు మంచిని ఆదేశించి, చెడు నుండి వారించేవారు కూడా రావచ్చు. అందుచేత వారు జాగ్రత్తగా ఉండాలి. ప్రజల దృష్టిని, గౌరవమర్యాదలను మళ్ళించే పని వారిది. కాబట్టి వారు చాలా అపాయంలో పడిపోయే అవకాశం ఉంటుంది. అల్లాహ్ కరుణించినవారు తప్ప.

عَنْ عَوفِ بنِ مَالِكٍ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ الله ﷺ: (أَخَافُ عَلَيكُمْ سِتًّا : إِمَارَةَ السُّفَهَاءِ وَ سَفْكَ الدَّمِ وَ بَيعَ الحُكْمِ وَ قَطِيعَةَ الرَّحْمِ وَ نَشوًا يَتَّخِذُونَ الْقُرْآنَ مَزَامِيرَ وَ كَثْرَةَ الشُّرط) .

ఈ హదీసులో:

“మూర్ఖులైన నాయకులు” అంటేః ముస్లింల నాయకత్వం, వారి వ్యవహారాల పరిష్కారం మరియు ముఖ్య సంఘటనల బాధ్యత మూర్ఖులు మరియు అవివేకులకు అప్పగించడం. దీని వల్ల భయంకరమైన లోటు ఏర్పడి, వారి వ్యవహారాలు పాడవుతాయి. వారి హక్కులు వ్యర్థం అవుతాయి. వారి ధర్మానికి నష్టం కలుగుతుంది. దౌర్జన్యం, అత్యాచారం పెట్రేగి పోతాయి. (అనర్హులనై) తమ వారికి ప్రాధాన్యత ఇవ్వడం, ప్రజల సొమ్ము అక్రమంగా అర్జించడం రెచ్చిపోతుంది. ఇలాంటి వారి ద్వారా ఇస్లాం రూపం వికృతంగా మారుతుంది. తర్వాత రక్తపాతాలు జరుగుతాయి, వ్యభిచారం విచ్చలవిడిగా జరుగుతుంది. బలహీనుల ధనం దోచుకోబడుతుంది. ఐక్యత మట్టిలో కలసిపోయి అనైక్యత, అంతAకలహాలు చోటు చేసుకుంటాయి. ద్వేషం, వైరం మరియు శత్రుత్వాలు మొదలవుతాయి.

“రక్తపాతం”: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినట్లు అన్యాయంగా హత్యలు జరిగాయి, జరుగుతున్నాయి. మరియు హజ్రత్ ఉమర్ రజియల్లాహు అన్హు మరణానంతరం ప్రవక్త అనుచర సంఘంపై పడిన కత్తుల  (అంతరయుద్ధాల) వల్ల మహాఇస్లామీయ రాజ్యం చిన్న చిన్న దేశాల్లో, పార్టీల్లో మరియు రాష్టాల్లో చిన్నాభిన్నమయి పోయింది. ప్రతి రాష్ట నాయకుడు సైన్యాన్ని సిద్ధపరచి యుద్ధానికి దిగాడు. ఇదంతా అల్లాహ్ అభీష్టాన్నీ పొందడానికి గాని, ఇస్లాం ప్రచారానికి గాని మరియు అల్లాహ్ మార్గంలో జిహాద్ ఉద్దేశ్యంతో చేసినవి కావు. కేవలం రాజ్యపాలన, హోదాలు పొందే ఉద్దేశంతో ఉండినవి. దీని వల్ల ఎన్ని ప్రాణాలు పోయాయో చరిత్రే దీనికి సాక్ష్యం.

“హోదాలను అమ్మడం”: ఐహిక లాభాల కొరకు హోదాలు అమ్మబడుతాయి. విద్య, అనుభవం, దైవభీతి మరియు ధార్మికులైన హక్కుగల వారికి ఇవ్వబడవు. అదృష్టం కలిగి వచ్చిన, ఐహిక సాధనాలు సంగమించిన, నిరంకుశ మరియు దౌర్జన్యుడైన మనిషి దాన్ని చేజిక్కించుకుంటాడు. అంటే అతడు దాన్ని (డబ్బు, పలుకుబడి ఆధారంగా) కొన్నాడన్నమాట, న్యాయపరంగా అతనికి లభించింది కాదు.

“బంధుత్వాన్ని తెంచడం”: ప్రజలు ఈ పాపంలో కూడా చిక్కుకొని యున్నారు. అవిధేయత పెరిగిపోయింది. తల్లిదండ్రుల పట్ల మృధువైఖరి నశించింది. రక్త సంబంధాలను మరచిపోవడం జరుగుతుంది. బంధువులను సందర్శించుకొనుట అంతమవుతుంది. బంధువులపై తిరుగుబడి, వారి హక్కులు దోచుకోవడం ఎక్కువవుతుంది. ఆస్తుల పంపకంలో అన్యాయం జరుగుతుంది. అనాథల సొమ్మును కబళించడం జరుగుతుంది. మనిషి తన రక్తసంబంధికుడిని అంటే; కొడుకు తండ్రిని, సోదరుడు సోదరుడిని మరచిపోయాడు. అంతే కాదు తన వ్యక్తిగత ప్రయోజనాలకు, వ్యవహారాలకు బంధువుల చివరికి తల్లిదండ్రుల ప్రయోజనాలపై ప్రాధాన్యత ఇస్తాడు.

“ఖుర్ఆన్ పారాయణాన్ని గేయం మాదిరిగా చేసుకొనుట”: కొందరు నవయువకులు మరియు బాల్య వయస్సులో ఉన్నవారు ఖుర్ఆనును రాగాలతో చదువుతారు. ఆచరణోద్దేశంతో కాదు, దాని ఆదేశాలను పాటించేందుకు కాదు, కేవలం ప్రజల దృష్ఠిని తమ వైపు మళ్ళించు కోడానికి, ఎవరు ఎక్కువ కంఠస్తం చేశారో, ఎవరి కంఠంలో రాగం బాగుందో గర్వపడడానికి పఠించేవారు. వారిది ఒకే ఒక ధ్యేయం; వినే వారికి పాటలు పాడుతున్నారా అనిపించే విధంగా దీర్ఘ రాగంతో, మధుర స్వరంతో పఠించడం. అందువల్ల వారు సరియైన ముఖ్యమైన గొప్ప ఉద్దేశాన్ని ప్రక్కకు పెట్టారు. అవిః ఖుర్ఆన్ ఆదేశాల్ని ఆచరించాలి. దానిని ఇతరులకు నేర్పాలి, దానిని నేర్చుకొనుటకు తగిన సహనం వహించాలి చివరికి ప్రపంచ నలుమూలల్లో దాన్ని వ్యాపింప చేయాలి అనేవి.

నాయకుల వెంట బాడీగార్డులు ఎక్కువయిపోతారు”: రాజ్యంలో దౌర్జన్యం పెరిగినప్పుడు ఇలాంటి వారు ఎక్కువయిపోతారు. బజారుల్లో, ప్రజలు సమూహమయ్యే చోట మరియు ఇతర ప్రాంతాల్లో వేచిఉంటారు. వారి చేతుల్లో ఆవు తోక పొడగంతా కర్రలుంటాయి. అన్యాయంగా ప్రజల్ని కొడుతుంటారు. వారికి లభించిన ఉన్నత స్థానాన్ని ప్రజలపై దౌర్జన్యానికి ఉపయోగిస్తారు. అనవసరంగా ప్రజల్ని పీడిస్తారు. వారి వ్యవహారాలలో, సంపద, సంపత్తి మరియు ప్రత్యేక హక్కుల్లో జోక్యం చేసుకుంటారు. జీవితంలో సుఖం లేకుండా, సంపాదనలో లాభం లేకుండా చేసేస్తారు.

ఖుర్ఆన్ పఠించి పారితోషికం తీసుకొనుట

عَنْ جَابِرِ بْنِ عَبْدِ الله رَضِيَ ٱللَّٰهُ عَنْهُ قَالَ: قَالَ النَّبِيُّ ﷺ: (اقْرَءُوا الْقُرْآنَ وَابْتَغُوا بِهِ الله عَزَّ وَجَلَّ مِنْ قَبْلِ أَنْ يَأْتِيَ قَوْمٌ يُقِيمُونَهُ إِقَامَةَ الْقِدْحِ يَتَعَجَّلُونَهُ وَلَا يَتَأَجَّلُونَهُ).

ఈ హదీసులో:

ఖుర్ఆన్ పారాయణంలో చిత్తశుద్ధి పాటించుట, అల్లాహ్ సంతృప్తినే, ఆయన వద్ద ఉన్న శుభాలనే కోరుట విధిగా ఉంది. పేరు ప్రఖ్యాతులు, ధన సంపాదన, హోదా అంతస్తులు కోరుట నిషిద్ధంగా ఉంది. ఇది అతి చెడ్డ విషయాల్లో ఒకటి. కాలక్రమేనా కొందరు రానున్నారు, వారు ఖుర్ఆన్ పారాయణం చాలా చక్కగా, తజ్వీదుతో చేస్తారు. ప్రతి అక్షర శబ్దం దాని స్థానం నుండి తీస్తారు. మధుర స్వరాన్ని పాటిస్తారు. కాని వారి ఆచరణ వారికే శాపం అవుతుంది. అల్లాహ్ వారికి పుణ్యము, సత్ఫలితము ఇవ్వడు. వారి ఈ క్రియనే అసహ్యించుకుంటాడు. ఎందుకనగా వారు దీని ద్వారా ధన, సంపాదన, పురస్కారాలు, బహుమానాలు, హోదా అంతస్తులు, పేరు ప్రఖ్యాతులైన ఐహిక లాభాలు కోరేవారు. అందుకు వారు తమ పరలోక ఫలాన్ని కోల్పోయారు. అల్లాహ్ వద్ద ఉన్న సత్ఫలితాన్ని నోచుకోలేకపోయారు. వారి వ్యవహారమంతా నాశనానికే గురిఅయింది. ఇదే విషయం అల్లాహ్ ఇలా తెలిపాడుః

[مَنْ كَانَ يُرِيدُ الحَيَاةَ الدُّنْيَا وَزِينَتَهَا نُوَفِّ إِلَيْهِمْ أَعْمَالَهُمْ فِيهَا وَهُمْ فِيهَا لَا يُبْخَسُونَ] {هود:15}

కేవలం ఈ ప్రాపంచిక జీవితాన్నీ, దాని ఆకర్షకాలనూ కోరుకునే వారు చేసిన పనులకు పూర్తి ప్రతి ఫలాన్ని మేము వారికి ఇక్కడనే ఇచ్చేస్తాము. ఇందులో వారికి తక్కువ చెయ్యటం అంటూ జరగదు. (హూద్ 11: 15).

హృదయ నేత్రాలతో చూసి, బుద్ధిజ్ఞానంతో గ్రహించి ఉంటే అల్లాహ్ వద్ద ఉన్న పరలోక ఫలాన్ని పొందేవాడు. నిత్యుడు, సజీవుడైన వాని వద్ద పుణ్యాలు కూడబెట్టుకునే వాడు. అక్కడ మనిషికి తన ధనం, సంతానం పనికిరాదు. కేవలం మంచి మనస్సుతో అల్లాహ్ సాన్నిధ్యంలో హజరైనా వ్యక్తి తప్ప.

عَنْ ابْنِ عَبَّاسٍ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ الله ﷺ: (إِنَّ أَحَقَّ مَا أَخَذْتُمْ عَلَيْهِ أَجْرًا كِتَابُ الله).

ఈ హదీసులో:

ఏ వ్యక్తి తనకు తాను ఖుర్ఆన్ విద్య నేర్పుటకు నిమగ్నుడై ఉన్నాడో అతనికి వేరే ఉపాధి మార్గం లేదో, అతను తన అవసరానికి సరిపడు పారితోషికం తీసుకోవచ్చును. కాని ఏ వ్యక్తి అవసరం లేకున్నా ఖుర్ఆన్ విద్య నేర్పడాన్ని ఉపాధి సాధనంగా చేసుకుంటాడో, ధన సంపాదనే అతని ముఖ్య ఉద్దేశమో, అది చెడు ఔతుంది. దాని నుండే వారించబడింది. ఈ రెండిటిలో ఉన్న వ్యత్యాసాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ హదీసులో చర్చించబడిన కారణాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ఖుర్ఆన్ చదువుతూ శబ్దం పెంచుట

عَنْ أَبِي سَعِيدٍ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ قَالَ: قَالَ النَّبِيُّ ﷺ: (أَلَا إِنَّ كُلَّكُمْ مُنَاجٍ رَبَّهُ فَلَا يُؤْذِيَنَّ بَعْضُكُمْ بَعْضًا وَلَا يَرْفَعْ بَعْضُكُمْ عَلَى بَعْضٍ فِي الْقِرَاءَةِ).

ఈ హదీసులో:

ఖుర్ఆన్ చదువు వ్యక్తి తన ప్రభువుతో సంభాషిస్తూ ఉంటాడు. వచనాల్లో అతి గౌరవమైనది అల్లాహ్ వచనం. అల్లాహ్ కు తన వచనా లంటే చాలా ఇష్టం. ఎవరు అల్లాహ్ వచనాల (ఖుర్ఆన్)ను పఠిస్తాడో అతడు ఈ గొప్ప వచనాల ద్వారా అల్లాహ్ తో సంభాషిస్తున్నా డన్న మాట. మనిషి తనకు వినిపిస్తున్నంత శబ్దంతో పఠించడం అభిలషణీయం. తన ప్రక్కన ఉండి నమాజు చేస్తున్న లేదా ఖుర్ఆన్ పఠిస్తున్నవారికి ఇబ్బంది పెట్టకూడదు. ఎవరు తన స్వరాన్ని పెంచు తాడో అతడు నమాజీయులకు మరియు ఖుర్ఆన్ పారాయుణులకు చిరాకు పెట్టినట్లగును. వారికి బాధ పెట్టినట్లగును. నమాజు మరియు ఖుర్ఆన్ పారాయణం నుండి వారి మనస్సు తొలిగిపోయే ప్రమాదం ఉండును. కొన్ని మస్జిదుల్లో కొందరు ఏకంగా తమ స్వరాన్ని పెంచుతారు. ఇది ప్రవక్తగారి సున్నతుకు వ్యతిరేకం. మరియు దీని వల్ల అంతరాయం మరియు కలత ఏర్పడును. అలాగే ఒక ముస్లిం తన నమాజులో, ఖుర్ఆన్ పారాయణంలో ఏ నమ్రత, మనస్థిమిత, మనస్సులగ్నత, ఆలోచన మరియు యోచన పాటించుట విధిగా ఉందో, దానికి సయితం ఇది విరుద్ధం. మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు తనిష్టానుసారం స్వరం పెంచవచ్చును. సహీ ముస్లిం హదీసు గ్రంథంలో ఇలా ఉందిః ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రి నమాజుల్లో ఒకప్పుడు శబ్దంతో మరొక్కప్పుడు శబ్దం లేకుండా ఖుర్ఆన్ పారయణం చేసేవారు.

عَنْ عُقْبَةَ بْنِ عَامِرٍ الْجُهَنِيِّ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ الله ﷺ: (الجَاهِرُ بِالْقُرْآنِ كَالجَاهِرِ بِالصَّدَقَةِ وَالمُسِرُّ بِالْقُرْآنِ كَالمُسِرِّ بِالصَّدَقَةِ)

ఈ హదీసులో:

 ఖుర్ఆన్ బిగ్గరగా చదువుటకంటే నిశబ్దంగా చదవడం మంచిది. అలాగే గుప్తంగా చేయు దానం బహిరంగముగా చేయుదానికంటే ఉత్తమం. నిశబ్దంగా చదవడంలో మనస్థిమితంగా ఉంటుంది, ఆలోచించవచ్చు. చూపుగోళు, ఆత్మస్తుతికి దూరంగా ఉండవచ్చు. అలాగే నమాజీలకు, ఖుర్ఆన్ పారాయుణులకు కలత కలగకుండా ఉండవచ్చు. ఈ విషయం వ్యక్తుల, పరిస్థితులను బట్టి వేరువేరుగా ఉండవచ్చు. కాని ఈ హదీసు ఆధారంగా శబ్దంతో చదివే వాడికంటే నిశబ్దంగా చదివేవాడు శ్రేష్ఠుడు. ఒకవేళ ఎవరైనా అతని పారాయణాన్ని శ్రద్ధగా వింటూ ప్రయోజనం పొందుతున్నాడని తెలిస్తే అలాంటప్పుడు గొంతెత్తి చదువుట మంచిది. గొంతెత్తి చదవడం వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగే భయం ఉంటే లేదా ఆత్మస్తుతికి గురవుతాడన్న భయం ఉంటే మెల్లగా చదవాలి. ఇదే ఉత్తమం.

మధుర స్వరంతో ఖుర్ఆన్ చదువుట

అల్లాహ్ ఆదేశం

[وَرَتِّلِ القُرْآَنَ تَرْتِيلًا] {المزمل:4}

ఖుర్ఆనును నెమ్మదిగా ఆగి ఆగి పఠించు. (ముజమ్మిల్ 73: 4).

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ الله ﷺ: (لَيْسَ مِنَّا مَنْ لَمْ يَتَغَنَّ بِالْقُرْآنِ).

ఈ హదీసులో:

కొందరు పండితుల ప్రకారం ఈ హదీసులోని “యతగన్న” అన్న పదం అరబీ భాషలోని “ఇస్తిగ్నా” నుండి వచ్చిన పదం. దీని భావం ఏమిటంటే ఒక వస్తువుతో సరిపుచ్చుకొని ఇతర వస్తువుల అవసరం లేకుండా ఉండడం. అంటే ఖుర్ఆన్ విద్య వేరే విద్యల అవసరం లేకుండా చేస్తుంది. ఖుర్ఆనులో దాని(ఖుర్ఆన్) వాసులకు సరిపడేంత సంపద ఉంది. అది ఉండగా వేరే వాటి అవసరం అతనికి ఉండదు.

కాని అనేక ముస్లిం పండితుల వద్ద “యతగన్న బిల్ ఖుర్ఆన్” యొక్క నిజమైన భావం ఏమిటంటేః మధుర స్వరం, అందమైన కంఠం, ఆకర్షితుల్ని చేసే విధంగా పఠించుట. అక్షరాల్ని వాటి స్థానం నుండి ఉచ్చరించే ప్రయత్నం చేయుట. అది శ్రమ పడకుండా, అస్వభావికంగా కష్టపడ కుండా. భయం, నమ్రత మరియు యోచన భావం కలిగే విధంగా మరియు పారాయణం చేయువ్యక్తి, విను వ్యక్తి ఇద్దిరికీ ప్రయోజనకరంగా ఉండాలి.  

ఈ హదీసు యొక్క ఉద్దేశం మొదటి భావం కానప్పటికీ ఖుర్ఆన్ మరియు ప్రవక్త పై వహీగా పంపబడిన హదీసులు ఇతర విద్యల అవసరం లేకుండా సరిపోతాయి. ఖుర్ఆన్ పారాయణం చేయువ్యక్తి సుమధుర స్వరం మరియు మంచి పద్ధతి పాటించుట ధర్మం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, తన అనుచరుడైన అబూ మూసా రజియల్లాహు అన్హు ఖుర్ఆన్ పారాయణాన్ని విన్నారు, అతని మధురకంఠం ప్రవక్తకు చాలా ఆనందం, తృప్తి కలిగించింది. అప్పుడు ఆయన ఇలా చెప్పారుః “దావూద్ అలైహిస్సలాంకు ప్రాప్తమైన మధుర స్వరాల్లో ఒకటి నీకు ప్రాప్తమైనది”. దానికి అబూ మూసా చెప్పారుః ‘ప్రవక్తా! మీరు నా పారాయణాన్ని వింటున్నారని నాకు తెలిసియుంటే నేను మరింత మధురమైన కంఠంతో పఠించేవాణ్ణి’.

చదివే విధానంలో శక్తికి మించి ప్రవర్తించడం, ‘మద్’ అక్షరాలు చదవడంలో మరీ మరీ దీర్ఘంతో, సాగి చదవడం, అక్షరాల ఉచ్ఛరణలో తనే గొప్పవాడని తెలిపే విధంగా ప్రవర్తించడం, సున్నతుకు వ్యెతిరేకం. మరియు అల్లాహ్ ధర్మంలో మొహమాట పడడం మరియు లేనిదాన్ని చెప్పుకునే పద్ధతులు లేవు.

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ أَنَّهُ سَمِعَ النَّبِيَّ ﷺ يَقُولُ: (مَا أَذِنَ اللهُ لِشَيْءٍ مَا أَذِنَ لِنَبِيٍّ حَسَنِ الصَّوْتِ بِالْقُرْآنِ يَجْهَرُ بِهِ).

ఇస్లాం తెలుగు పుస్తకాలు (Telugu Islamic Books)
https://teluguislam.net/telugu-islamic-books/