ప్రళయ దినాన నెలకొల్పబడే త్రాసు యొక్క గాంభీర్యత, కష్టతరం, దాని యొక్క భయంకరత్వం [మరణానంతర జీవితం – పార్ట్ 20] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

ప్రళయ దినాన నెలకొల్పబడే త్రాసు యొక్క గాంభీర్యత, కష్టతరం, దాని యొక్క భయంకరత్వం
https://www.youtube.com/watch?v=75Sw5ptc_50
[మరణానంతర జీవితం – పార్ట్ 20] [21 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహి వహద, వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బాద. అమ్మా బాద్.

రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. ఈనాటి శీర్షిక: ప్రళయ దినాన నెలకొల్పబడే త్రాసు యొక్క గాంభీర్యత, కష్టతరం, దాని యొక్క భయంకరత్వం.

త్రాసు గురించి వింటున్న వివరాలతో ఇహలోకంలోనే మనకు ఒక గుణపాఠం రావాలి. మనం దైనందిన జీవితంలో చేసే సత్కార్యాలు పెరుగుతూ ఉండాలి మరియు దుష్కార్యాలు తగ్గుతూ ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా రేపటి రోజు ఆ త్రాసులో తూకం చేయబడతాయి.

ప్రళయ దినాన ఎప్పుడైతే సూక్ష్మమైన విషయాలను కూడా త్రాసులో పెట్టబడి తూకం చేయడం జరుగుతూ ఉంటుందో, ఇవన్నీ విషయాలు కర్మపత్రాల్లో కూడా వ్రాయబడి ఉంటాయో, ఆ కర్మపత్రాలను కూడా తూకం చేయడం జరుగుతుందో, ఈ విషయాల్ని అపరాధులు, పాపాలు చేస్తూ ఉన్నవారు ఈ విషయాన్ని చూసి చాలా గాంభీర్యతకు గురి అవుతారు. వారు స్వయంగా ఏమంటారు ఆ సందర్భంలో, ఆ విషయాన్ని అల్లాహు తాలా సూరహ్ కహఫ్ లో తెలియజేశాడు.

وَوُضِعَ الْكِتَابُ
కర్మపత్రాలు వారి ముందు పెట్టడం జరుగుతుంది.

فَتَرَى الْمُجْرِمِينَ مُشْفِقِينَ مِمَّا فِيهِ
అపరాధులను నీవు ఆ రోజు చూస్తావు, వారు భయ కంపితులై వాటిలో ఉన్న, వ్రాయబడిన ఆ విషయాలన్నింటినీ చూసి భయకంపితులై పోతారు.

وَيَقُولُونَ
మరియు అంటారు:

يَا وَيْلَتَنَا مَالِ هَٰذَا الْكِتَابِ
మా పాడుగాను, ఇది ఎలాంటి గ్రంథం, ఎలాంటి కర్మపత్రం.

لَا يُغَادِرُ صَغِيرَةً وَلَا كَبِيرَةً
ఏ చిన్న దానిని గానీ, ఏ పెద్ద దానిని గానీ వదిలేయకుండా మొత్తం దీంట్లో వ్రాయబడింది.

إِلَّا أَحْصَاهَا
ప్రతీ ఒక్కటి అందులో చేర్చడం జరిగింది.

وَوَجَدُوا مَا عَمِلُوا حَاضِرًا
వారు చేసుకున్న సర్వాన్ని వారు తమ ముందు హాజరుగా చూస్తారు.

وَلَا يَظْلِمُ رَبُّكَ أَحَدًا
నీ ప్రభువు ఎవరిపై కూడా ఏ మాత్రం అన్యాయం చేయడు, ఎవరిపై ఏ రవ్వంత కూడా దౌర్జన్యం చేయడు.

త్రాసు అంటే ఏమిటి? ప్రళయ దినాన దాని యొక్క గాంభీర్యత, కష్టతరం అనేది ఎలా ఉంటుంది? [మరణానంతర జీవితం – పార్ట్ 19] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

త్రాసు అంటే ఏమిటి? ప్రళయ దినాన దాని యొక్క గాంభీర్యత, కష్టతరం అనేది ఎలా ఉంటుంది?
[మరణానంతర జీవితం – పార్ట్ 19] [21 నిముషాలు]
https://www.youtube.com/watch?v=kKaOZfTuxe0
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహి వహద, వస్సలాతు వస్సలాము అలా మన్ లా నబియ్య బాద అమ్మాబాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

ఈనాటి శీర్షిక: త్రాసు అంటే ఏమిటి? ప్రళయ దినాన దాని యొక్క గాంభీర్యత, కష్టతరం అనేది ఎలా ఉంటుంది?

మహాశయులారా, సృష్టికర్త అయిన అల్లాహ్ సర్వము తెలిసినవాడు. మరియు ఆయన ఎవరి పట్ల కూడా ఎలాంటి అన్యాయం చేయనివాడు. ఆయన కరుణామయుడు, కృపాశీలుడు మరియు దాసులకు వారి పుణ్యాలకంటే ఎంతో ఎక్కువ రేట్లో ఉపకారాలు చేసి వారిని మన్నిస్తూ ఉండేవాడు. కానీ రవ్వంత కూడా ఎవరిపై ఏ అన్యాయము చేయడు.

ఆయన ప్రళయ దినాన తలచుకుంటే, దాసుల పట్ల ఆయనకున్న పరిజ్ఞానంతో వారి యొక్క విశ్వాసం, అవిశ్వాసం, సత్కార్యాలు, దుష్కార్యాలు అనే ఆధారం మీద వారిని స్వర్గంలో పంపడం, నరకంలో పంపడం వంటి తీర్పులు చేయగలడు. అలా చేసే అధికారం అతనికి ఉంది. కానీ, అలా చేయకుండా వారి యొక్క లెక్క, వారి యొక్క తీర్పు, సాక్ష్యాధారాలను, ఇంకా ఆ రోజు త్రాసును నెలకొల్పుతాడు.

త్రాసును నెలకొల్పి, అందులో ప్రజలు చేసినటువంటి సత్కార్యాలను ఒకవైపున, దుష్కార్యాలను మరోవైపున తూకం చేస్తాడు. స్వయంగా సత్కార్యాలు, దుష్కార్యాలు చేసిన ప్రజలను కూడా అందులో పెట్టడం జరుగుతుంది. అంతేకాదు, ఏ కర్మపత్రాలు దైవదూతలు రాస్తూ ఉన్నారో, ఆ పత్రాలను కూడా, ఆ ఫైల్లను కూడా అందులో తూకం చేయడం జరుగుతుంది. ఇదంతా దేని కొరకు? ప్రజలు కూడా స్వయంగా వారు తృప్తికరమైన న్యాయం వారికి లభించినది అని వారికి మనస్తృప్తి కలగాలి.

అల్లాహ్ తో దుఆ చేయడంలో ఎవరిని, ఏ విషయాల్ని మధ్యవర్తిత్వంగా (వసీలాగా) మనం పెట్టుకోవచ్చు? [మరణానంతర జీవితం – పార్ట్ 17] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

అల్లాహ్ తో దుఆ చేయడంలో ఎవరిని, ఏ విషయాల్ని మధ్యవర్తిత్వంగా మనం పెట్టుకోవచ్చు?
[మరణానంతర జీవితం – పార్ట్ 17] [25 నిముషాలు]
https://www.youtube.com/watch?v=x27-UYBIOU4
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహి వహ్ద వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బాద అమ్మాబాద్.

రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. ఈనాటి శీర్షిక అల్లాహ్ తో దుఆ చేయడంలో ఎవరిని ఏ విషయాల్ని మధ్యవర్తిత్వంగా మనం పెట్టుకోవచ్చు.

అయితే మహాశయులారా మన అంశం మరణానంతర జీవితం. మనం సీరియల్ వారీగా పరలోకంలో ఏ ఏ మజిలీలు ఉన్నాయి, ఏ ఏ విషయాలు సంభవిస్తాయి వాటి గురించి వింటూ వస్తున్నాము.అయితే అల్లాహుతాలా తీర్పు గురించి రావడంలో ఏదైతే చాలా ఆలస్యం జరుగుతుందో ఆ దీర్ఘ సమయాన్ని ప్రజలు భరించలేక సిఫారసు గురించి ఏదైతే ప్రవక్తల వద్దకు వెళ్తారో, వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు చివరికి వస్తారు. ఆ విషయాలు వింటూ ఉన్నాము కానీ సిఫారసుకు సంబంధించిన విషయం చాలా ముఖ్య విషయం.

ఆ రోజు ఇంకా ఎన్ని రకాల సిఫారసులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా పొందడం చాలా ముఖ్యము గనుక, దానికి సంబంధించిన ఒక భాగం అంటే ఇహలోకంలో సిఫారసుకు సంబంధించిన ఏ మూఢనమ్మకాలు ఉన్నాయో వాటిని మనం దూరం చేసుకొని సరైన విశ్వాసాన్ని, సరైన సిఫారసు వివరాల్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. అందుగురించి మనం మనం అసలైన మన అంశాన్ని విడిపోయాము అని ఏమాత్రం భావించకండి. అయితే మహాశయులారా మనం ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు అల్లాహ్ తో దుఆ చేసే సందర్భంలో ఎవరినైనా మధ్యవర్తిత్వంగా వసీలాగా పెట్టుకోవడం ఎంతవరకు యోగ్యం.

ప్రళయ దినాన సిఫారసు చేసే హక్కు ఎవరెవరికి లభిస్తుంది? ఎవరి సిఫారిసు చెల్లుతుంది? [మరణానంతర జీవితం – పార్ట్ 18] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]


ప్రళయ దినాన సిఫారసు చేసే హక్కు ఎవరెవరికి లభిస్తుంది? ఎవరి సిఫారిసు చెల్లుతుంది?
[మరణానంతర జీవితం – పార్ట్ 18] [22 నిముషాలు]
https://www.youtube.com/watch?v=5Hpmj-eG9oE
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్. నబీయ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వసహ్బిహి అజ్మయీన్ .అమ్మాబాద్.

రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. ఈనాటి అంశం: ప్రళయ దినాన సిఫారసు చేసే హక్కు ఎవరెవరికి లభిస్తుంది? ఎవరి సిఫారసు చెల్లుతుంది?

మహాశయులారా ఈ శీర్షిక కూడా చాలా ముఖ్యమైనది. దీనిని తెలుసుకోవడం ద్వారా మనకు లాభం ఏమిటంటే ఎవరెవరి సిఫారసు ప్రళయ దినాన చెల్లుతుంది అని అల్లాహ్ ఖురాన్ ద్వారా గాని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహీ హదీసుల ద్వారా గాని మనకు తెలియజేశారో వాటి పట్ల మన బాధ్యత ఏమిటో అవి కూడా తెలియజేశారు. ఉదాహరణకు ప్రళయ దినాన ఖురాన్ సిఫారసు చేస్తుంది. ఖురాన్ అల్లాహ్ యొక్క దివ్య గ్రంథం అని మనకు తెలుసు. అయితే ఖురాన్ ఎవరి పట్ల సిఫారసు చేస్తుంది? ఎవరైతే దానిని ఎల్లవేళల్లో చదువుతూ ఉంటారో, దాని పారాయణం చేస్తూ ఉంటారో, దాని పారాయణంతో పాటు అర్థ భావాలను కూడా అర్థం చేసుకుంటూ వాటిలో యోచిస్తూ ఆచరణలో ఉంచడమే సరిపుచ్చుకోకుండా ఈ ఖురాన్ యొక్క దావత్ ఖురాన్ వైపునకు ఇతరులను కూడా ఆహ్వానిస్తారో మరియు ఏదైనా రోగానికి, అవస్థకు గురి అయినప్పుడు ఖురాన్ ద్వారా స్వస్థత పొందుటకు ఏ ఆయతులు ఏ సందర్భంలో చదవాలో వాటిని పాటిస్తారో, ఈ విధంగా ఖురాన్ చదువుతూ దాని ప్రకారం ఆచరించే వారి పట్ల అది సిఫారసు చేస్తుంది. ఇక ఈ విషయం ఎవరికైతే తెలుస్తుందో వారు ఖురాన్ చదవడం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపవచ్చు. అలాగే మిగతా విషయాలు కూడా. అందుగురించి ఈ శీర్షికను కూడా వినడం, దీనిని గ్రహించడం చాలా అవసరం. ,

మహాశయులారా! మొట్టమొదటి విషయం ఎవరికైతే ప్రళయ దినాన సిఫారసు చేయడానికి అర్హత కలుగుతుందో వారు మన గౌరవనీయులైన, ప్రియులైన మనందరి ప్రియ ప్రవక్త, చిట్టచివరి ప్రవక్త, దయామయ దైవ ప్రవక్త, కారుణ్యమూర్తి సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ విషయం మనం ఇంతకుముందు భాగంలో కూడా విని ఉన్నాము. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కి షఫాఅతె ఉజ్మా ఆ మహా మైదానంలో మకామె మహమూద్ అన్నటువంటి గొప్ప స్థానంలో ప్రశంసనీయబడిన స్థానంలో వారికి ఈ సిఫారసు యొక్క హక్కు లభిస్తుంది. అక్కడ ఆయనకు పోటీ సమానులు ఎవరూ ఉండరు. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కు ఒక్క సందర్భంలోనే కాదు వివిధ సందర్భాల్లో సిఫారసు చేసే హక్కు లభిస్తుంది అని కూడా మనం తెలుసుకున్నాము. ఉదాహరణకు నరకంలో పడిపోయిన వారిని వారి తౌహీద్, నమాజ్ ఇలాంటి మంచి కార్యాల వల్ల వారికి బయటికి తీయడం, స్వర్గంలో చేరే ముందు స్వర్గం తెరవబడటానికి సిఫారసు చేయడం. స్వర్గంలో చేరిన వారికి ఎలాంటి శిక్షా మరీ ఎలాంటి లెక్కా తీర్పు లేకుండా స్వర్గంలో పోవడానికి సిఫారసు ఎక్కువ హక్కు. అలాగే స్వర్గంలో చేరిన వారు వారికి ఉన్నత స్థానాలు లభించాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సిఫారసు చేయడం. ఈ విధంగా ఎన్నో రకాల సిఫారసు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేస్తారు అని వాటికి సంబంధించిన ఆధారాలు కూడా మనం విని ఉన్నాము. అందుగురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విషయంలో ఇప్పుడు ఎక్కువ సమయం తీసుకునే అవసరం లేదు అని భావిస్తున్నాను.

 1.14 జనాజ ప్రకరణం|మహా ప్రవక్త మహితోక్తులు

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) (Al-Lulu-wal-Marjaan) .
జనాజ ప్రకరణం [PDF]

531 – حديث أُسَامَةَ بْنِ زَيْدٍ، قَالَ: أَرْسَلَتِ ابْنَةُ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ إِلَيْهِ، إِنَّ ابْنًا لِي قُبِضَ فَأْتِنَا، فَأَرْسَلَ يُقْرِئُ السَّلاَمَ وَيَقُولُ: إِنَّ للهِ مَا أَخَذَ وَلَهُ مَا أَعْطَى، وَكُلٌّ عِنْدَهُ بِأَجَلٍ مُسَمًّى، فَلْتَصْبِرْ وَلْتَحْتَسِبْ فَأَرْسَلَتْ إِلَيْهِ، تُقْسِمُ عَلَيْهِ لَيأْتِيَنَّهَا؛ فَقَامَ وَمَعَهُ سَعْدُ بْنُ عُبَادَةَ، وَمُعَاذُ بْنُ جَبَلٍ، وَأُبَيُّ بْنُ كَعْبٍ، وَزَيْدُ بْنُ ثَابِتٍ، وَرِجَالٌ؛ فَرُفِعَ إِلَى رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ الصَّبِيُّ وَنَفْسُهُ تَتَقَعْقَعُ كَأَنَّهَا شَنٌّ، فَفَاضَتْ عَيْنَاهُ فَقَالَ سَعْدٌ: يَا رَسُولَ اللهِ مَا هذَا فَقَالَ: هذِهِ رَحْمَةٌ جَعَلَهَا اللهُ فِي قُلُوبِ عِبَادِهِ، وَإِنَّمَا يَرْحَمُ اللهُ مِنْ عِبَادِهِ الرُّحَمَاءُ
__________
أخرجه البخاري في: 32 كتاب الجنائز: 33 باب قول النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يعذب الميت ببعض بُكاء أهله عليه

531. హజ్రత్ ఉసామా బిన్ జైద్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కుమార్తెలలో ఒకరు, (ఒక వ్యక్తి ద్వారా) “నా కొడుకు చావు బ్రతుకుల్లో ఉన్నాడు. మీరు వెంటనే మా ఇంటికి వచ్చేయండి” అని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు కబురు చేశారు. అయితే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దానికి సమాధానంగా “అల్లాహ్ వెనక్కి తీసుకున్నది ఆయనదే; తాను ప్రసాదించినది కూడా ఆయనదే. ఆయన ప్రతి వస్తువుకూ ఒక గడువు (జీవితకాలం) నిర్ణయించాడు. అందువల్ల (ఈ విషాద సంఘటన పట్ల) నీవు సహనం వహించి పుణ్యాన్ని ఆశించు” అని చెప్పి పంపారు. ప్రవక్త కుమార్తె ప్రమాణం చేసి “మీరు తప్పకుండా రావాలి” అని మళ్ళీ కబురు పంపారు.

దాంతో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్రత్ సాద్ బిన్ ఉబాదా (రదియల్లాహు అన్హు), ముఆజ్ బిన్ జబల్ (రదియల్లాహు అన్హు), అబీ బిన్ కాబ్ (రదియల్లాహు అన్హు), జైద్ బిన్ సాబిత్ (రదియల్లాహు అన్హు) మరికొందరు సహచరుల్ని వెంట బెట్టుకొని వెళ్ళారు. పిల్లవాడ్ని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గరకు తీసుకు వచ్చారు. ఆ పసివాడి ఊపిరి కొట్టుమిట్టాడుతోంది. ఖాళీ అయిపోయిన నీటి తిత్తి మాదిరిగా మారిపోయాడు. ఆ పరిస్థితి చూసి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కంటతడిపెట్టారు. అప్పుడు హజ్రత్ సాద్ బిన్ ఉబాదా (రదియల్లాహు అన్హు) (ఆశ్చర్యపోయి చూస్తూ) “దైవప్రవక్తా! ఇదేమిటీ (మీరు దు:ఖిస్తున్నారు)?” అని అడిగారు. దానికి దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “ఇది అల్లాహ్ తన దాసుల హృదయాల్లో ఉంచిన కారుణ్యం. తోటి మానవుల్ని కరుణించే వారినే అల్లాహ్ కరుణిస్తాడు”.

[సహీహ్ బుఖారీ : 23వ ప్రకరణం – జనాయెజ్, 33వ అధ్యాయం]

532 – حديث عَبْدِ اللهِ بْنِ عُمَرَ، قَالَ: اشْتَكَى سَعْدُ بْنُ عُبَادَةَ شَكْوَى لَهُ، فَأَتَاهُ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، يَعُودُهُ، مَعَ عَبْدِ الرَّحْمنِ بْنِ عَوْفٍ، وَسَعْدِ بْنِ أَبِي وَقَّاصٍ، وَعَبْدِ اللهِ بْنِ مَسْعُودٍ، فَلَمَّا دَخَلَ عَلَيْهِ، فَوَجَدَهُ فِي غَاشِيَةِ أَهْلِهِ، فَقَالَ: قَدْ قَضَى [ص:184] قَالُوا: لاَ يَا رَسُولَ اللهِ فَبَكَى النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ؛ فَلَمَّا رَأَى الْقَوْمُ بُكَاءَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بَكَوْا، فَقَالَ: أَلاَ تَسْمَعُونَ، إِنَّ اللهَ لاَ يُعَذِّبُ بِدَمْعِ الْعَيْنِ وَلاَ بِحُزْنِ الْقَلْبِ، وَلكِنْ يُعَذِّبُ بِهذَا وَأَشَارَ إِلَى لِسَانِهِ أَوْ يَرْحَمُ، وَإِنَّ الْمَيِّتَ يُعَذَّبُ بِبُكَاءِ أَهْلِهِ عَلَيْهِ
__________
أخرجه البخاري في: 23 كتاب الجنائز: 54 باب البكاء عند المريض

532. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం:- హజ్రత్ సాద్ బిన్ ఉబాదా (రదియల్లాహు అన్హు) వ్యాధిగ్రస్తులయితే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళారు. అప్పుడు దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) వెంట హజ్రత్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రదియల్లాహు అన్హు), సాద్ బిన్ అబీ వఖ్కాస్ (రదియల్లాహు అన్హు), అబ్దుల్లా బిన్ మసూద్ (రదియల్లాహు అన్హు)లు కూడా ఉన్నారు. దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) అక్కడకు చేరుకోగానే ఆ ఇంటి వాళ్ళు ఆయన చుట్టూ మూగారు. అది చూసి దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) (సందేహిస్తూ) “ఏమిటి ఆయన చనిపోయారా?” అని అడిగారు. దానికి వారు “చనిపోలేదు దైవప్రవక్తా!” అన్నారు.

ఆ తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) (రోగి స్థితి చూసి) కంట తడిపెట్టారు. ఆయన్ని చూసి అందరూ దుఃఖించడం మొదలెట్టారు. తరువాత దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు “వినండి. హృదయావేదన కన్నీళ్ళ వల్ల గానీ లేదా నోట దయార్ద్ర పలుకులు వెలువడటం వల్ల గానీ అల్లాహ్ మనిషిని శిక్షించడు. అయితే దీని విషయంలో (దైవప్రవక్త నోటి వైపు చూపిస్తూ అన్నారు) మాత్రం (పెడబొబ్బలు పెడితే) అల్లాహ్ తప్పకుండా శిక్షిస్తాడు. కుటుంబ సభ్యులు ఏడ్చినా సరే మృతునికి శిక్ష వుంటుంది.”

[సహీహ్ బుఖారీ : 23వ ప్రకరణం – జనాయెజ్, 54వ అధ్యాయం ]

చావును కోరుకోకండి, చావు రావాలని దుఆ చేయకండి! [ఆడియో]

చావును కోరుకోకండి, చావు రావాలని దుఆ చేయకండి!
https://youtu.be/ivuvSaSyQE4 [9 min]
ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

1598 – 1 (1/502)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَتَمَنَّى أَحَدُكُمْ الْمَوْتَ إِمَّا مُحْسِنًا فَلَعَلَّهُ أَنْ يَّزْدَادَ خَيْرًا وَإِمَّا مُسِيْئًا فَلَعَلَّهُ أَنْ يَّسْتَعْتِبَ”. رَوَاهُ الْبُخَارِيُّ.

అబూ హురైరహ్‌ (రదియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనం, ”మీలో ఎవ్వరూ చావును కోరుకోరాదు. ఒకవేళ అతడు ఉత్తముడైతే అధిక ఆయుష్షు వల్ల ఇంకా అధికంగా మంచి పనులు చేయవచ్చు, ఒకవేళ చెడ్డవాడైతే తౌబహ్, ఇస్తిగ్‌ఫార్‌ చేసి దైవాన్ని సంతృప్తి పరచ వచ్చు.” (బు’ఖారీ)

1599 – 2 (1/502)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَتَمَنّى أَحَدُكُمُ الْمَوْتَ وَلَا يَدَعُ بِهِ مِنْ قَبْلِ أَنْ يَّأْتِيَهُ إِنَّهُ إِذَا مَاتَ انْقَطَعَ أَمَلُهُ وَإِنَّهُ لَا يَزِيْدُ الْمُؤْمِن عُمْرُهُ إِلَّا خَيْرًا” .رَوَاهُ مُسْلِمٌ.

అబూ హురైరహ్‌ (రదియల్లాహు అన్హు) కథనం:ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనం – “మీలో ఎవ్వరూ చావును కోరటం గానీ, దాన్ని గురించి దు’ఆ చేయటం గానీ చేయరాదు. ఎందుకంటే మరణిస్తే కోరికలన్నీ వ్యర్థమవుతాయి. విశ్వాసి ఆయుష్షు అతని కోసం మంచినే పెంచుతుంది“. (ముస్లిమ్‌)

1600 -[ 3 ] ( متفق عليه ) (1/502)

وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَتَمَنَّيَنَّ أَحَدُكُمُ الْمَوْتَ مِنْ ضُرٍّ أَصَابَهُ فَإِنْ كَانَ لَابُدَّ فَاعِلًا فَلْيَقُلِ: اَللّهُمَّ أحْيِنِيْ مَا كَانَتِ الْحَيَاةُ خَيْرًا لِّيْ وَتَوَفَّنِيْ إِذَا كَانَتْ الْوَفَاةُ خَيْرًا لِيْ. متفق عليه.

అనస్‌ (రదియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనం, ”మీలో ఎవరికైనా కష్టాలువస్తే, చావును కోరుకోరాదు. కోరితే ఈ విధంగా కోరాలి. ”ఓ అల్లాహ్‌! నేను సజీవంగా ఉండటం నాకు లాభకరంగా ఉన్నంత వరకు నన్ను సజీవంగా ఉంచు. మరణం లాభకరంగా ఉన్నప్పుడు నాకు మరణం ప్రసాదించు.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

వివరణ-1600: ఈ ‘హదీసు’ల ద్వారా చావును కోరుకోరాదని తెలుస్తుంది. అయితే ఉపద్రవాల, కల్లోలాల భయంవల్ల వీరమరణం పొందే కోరికవల్ల కోరటం సమంజసమే. ‘ఉమర్‌ (రదియల్లాహు అన్హు) ఇలా కోరుకునేవారు. ”అల్లాహుమ్మర్ ‘జుఖ్‌నీ షహాదతన్‌ ఫీ సబీలిక వజ్‌’అల్‌ మౌతీ బిబలది రసూలిక.”

అంత్యక్రియల (జనాయి’జ్) పుస్తకం | మిష్కాతుల్ మసాబీహ్
https://teluguislam.net/mm/mm5/

మరణం మరియు సమాధి విషయాలు – సలీం జామిఈ (హఫిజహుల్లాహ్) [వీడియో]

మరణం మరియు సమాధి విషయాలు – సలీం జామిఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/Vs8ZIUaW6Kk [44 నిముషాలు]

పరలోకం (The Hereafter):
https://teluguislam.net/hereafter/

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [91 భాగాలు] [దాదాపు 30+ గంటలు]
https://teluguislam.net/2019/07/31/life-after-death/

అంతిమ శ్వాస ఆగిపోక ముందే … – ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ [ఆడియో]

అంతిమ శ్వాస ఆగిపోక ముందే …
https://youtu.be/dCyoPq6SI4U [14:24 నిముషాలు]
వక్త: ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ (హఫిజహుల్లాహ్)

మరణించిన వారికి పుణ్య సమర్పణ (ఈసాలె సవాబ్)

ఇస్లామీయ షరీఅత్, ఖుర్ఆన్ హదీసుల్లో నిర్ణయించిన పద్ధతుల ద్వారానే మరణించిన వారికి పుణ్యప్రాప్తి జరుగుతుంది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం వసల్లం) ఈ విధంగా ప్రవచించారు:

“మనిషి చనిపోగానే అతని ఆచరణల పరంపర కూడా ఆగిపోతుంది.అయితే మూడు మార్గాల ద్వారా అతనికి పుణ్యం చేరుతూ ఉంటుంది.”

ఆ మూడు మార్గాలు ఇవి :

1) సదఖయె జారియా
2) ప్రయోజనకరమైన విద్య
3) సదాచార సంపన్నులైన సంతానం చేసే దుఆలు

ఈ క్రింది హదీసుకు అనుగుణంగా కూడా తమ మృతులకు పుణ్య సమర్పణ చేయవచ్చు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం వసల్లం) ఈ విధంగా ప్రవచించారు:

విశ్వాసికి తను మరణించిన తర్వాత కూడా తన ఆచరణల, సత్కార్యాల పుణ్యం లభించే మార్గాలు ఇవి:

1) తాను ఇతరులకు బోధించి ప్రచారం చేసిన విద్య

2) తన సంతానాన్ని సదాచార సంపన్నులుగా, ఖుర్ఆన్కు వారసులుగా తీర్చిదిద్దటం

3) మస్జిద్ లు, సత్రాలు నిర్మించటం

4) ఆరోగ్యంగా ఉన్న కాలంలో తన ధనంలో కొంత భాగం దాన ధర్మాల కోసం ఖర్చుపెట్టడం. (ఇబ్నెమాజా)

3) చనిపోయిన వారి తరఫు నుండి ఏదయినా వస్తువు దానం చేస్తే దాని పుణ్యం కూడా మృతులకు లభిస్తుంది. బుఖారీలోని ఒక హదీసులో ఇలా ఉంది: ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం వసల్లం) దగ్గరికి వెళ్ళి, “దైవప్రవక్తా! నా తల్లి చనిపోయింది. నేనామె తరఫున దానధర్మాలు చేస్తే దాని వల్ల ఆమెకు పుణ్యం లభిస్తుందా?” అనడిగాడు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం వసల్లం) ‘లభిస్తుంద‘ని చెప్పారు.

జలదానం అన్నింటి కంటే గొప్ప దానం!

4) ముస్నదె అహ్మద్ మరియు సునన్ గ్రంథాల్లో ఇలా ఉంది: హజ్రత్ సాద్ బిన్ ఉబాదా (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం వసల్లం) దగ్గరకు వెళ్ళి, “దైవప్రవక్తా! నా తల్లి చనిపోయింది. నేను ఆమె తరఫున ఏ వస్తువు దానం చేస్తే ఆమెకు ఎక్కువ పుణ్యం లభిస్తుంది?” అని అడిగారు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం వసల్లం) “నీళ్ళు” అని సమాధానమిచ్చారు. అప్పుడు సాద్ (రదియల్లాహు అన్హు) ఒక బావిని త్రవ్వించి, సాద్ తల్లికి పుణ్య సమర్పణ కోసం ఈ బావి త్రవ్వించ బడిందని ప్రజల మధ్య ప్రకటించారు.

పై హదీసు ద్వారా బోధపడే విషయమేమిటంటే మృతులకు వారి సంతానం తరఫున పుణ్యం చేకూరే మార్గాలలో జల దానం కూడా ఒకటి. ఈ ఆదేశం బావులు, గొట్టపు బావులు, కాలువలు, చెరువులు త్రవ్వించటానికి కూడా వర్తిస్తుంది.

5) సహీహ్ ముస్లింలోని ఒక హదీసులో ఇలా ఉంది: ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం వసల్లం) దగ్గరకు వెళ్ళి, “నా తల్లిదండ్రులు ఆస్తి వదలి వెళ్ళారు. వారు అందులో (దానధర్మాల) గురించి ఎలాంటి వీలునామా రాసి వెళ్ళలేదు. ఇప్పుడు వారి తరఫున నేను దానం చేస్తే దాని పుణ్యం వారికి లభించగలదా?” అని అడిగాడు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం వసల్లం) ‘లభిస్తుంద’ని చెప్పారు.

6) మృతుని కొరకు ముస్లిం ప్రజానీకం దుఆ చేసినా, అతని మన్నింపు కొరకు ప్రార్థించినా దానివల్ల అతనికి పుణ్యం లభిస్తుంది. దాని గురించి అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:

وَالَّذِينَ جَاءُوا مِن بَعْدِهِمْ يَقُولُونَ رَبَّنَا اغْفِرْ لَنَا وَلِإِخْوَانِنَا الَّذِينَ سَبَقُونَا بِالْإِيمَانِ

వారి తరువాత వచ్చిన వారు ఇలా ప్రార్థిస్తారు: ప్రభూ! మమ్మల్నీ, మాకు పూర్వం విశ్వసించిన మా సోదరులందరినీ క్షమించు.”(ఖుర్ఆన్ 59 : 10)

సునన్ గ్రంథాల్లో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం వసల్లం) “మీరు మరణించిన వారి జనాజా నమాజ్ చేస్తే, వారి కొరకు చిత్తశుద్ధితో ప్రార్థించండి” అని ఆదేశించారని ఉంది.

బ్రతికున్న వారి తరఫు నుండి మరణించిన వారికి పుణ్యం చేకూరే మార్గాలు ఇవే. ఇవిగాక ఇతర పద్ధతులకు ఖుర్ఆన్ హదీసుల్లో ఎక్కడా రుజువు లభించదు.

Tags: Conveying Rewards to the Deceased (Dead), Isal e Sawab

క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది. పూర్తి పుస్తకం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఇస్లామీయ ఆరాధనలు ప్రతి ముస్లిం ఇంట్లో ఉండవలసిన పుస్తకం శాంతిమార్గం పబ్లికేషన్ ట్రస్ట్

జనాజా నమాజ్ ఆదేశాలు | ఖుత్ బాతే నబవీ ﷺ

وَٱتَّقُوا۟ يَوْمًۭا تُرْجَعُونَ فِيهِ إِلَى ٱللَّهِ ۖ ثُمَّ تُوَفَّىٰ كُلُّ نَفْسٍۢ مَّا كَسَبَتْ وَهُمْ لَا يُظْلَمُونَ

మీరు అంతా అల్లాహ్ వైపుకు మరలింపబడే రోజుకు భయపడండి. ఆ తర్వాత ప్రతి ఒక్కరికీ తాను చేసుకున్న కర్మలకు పూర్తి ప్రతిఫలం వొసగ బడుతుంది. ఎవరికీ ఎలాంటి అన్యాయం జరగదు. (అల్ బఖర 2:281)

ధార్మిక సోదరులారా….

ఈ రోజు జుమా ప్రసంగంలో జనాజా నమాజ్ ఘనత, ఆదేశాల గురించి తెలుసుకుందాం. ఇది ఎలాంటి గమ్యం అంటే ఏదో ఒకరోజు పుట్టిన ప్రతి ఒక్కరూ ఈ గమ్యానికే చేరుకోవాలి. అల్లాహ్ కూడా ఆ దినం గురించే ఇలా భయపెడు తున్నాడు: “మీరు తిరిగి అల్లాహ్ సమక్షానికి చేరుకోబోయే ఆ దినానికి భయపడండి. అప్పుడు ప్రతి వ్యక్తికి తన కర్మల ప్రతిఫలం ఇవ్వబడుతుంది. వారికెలాంటి అన్యాయం జరగదు.” (అల్ బఖర 2: 287)

ప్రియసోదరులారా..

జనాజా పూర్తిగా తయారయిన తర్వాత ఖనన విషయంలో ఎలాంటి ఆలస్యమూ చేయకూడదు. ఒకవేళ మంచి వ్యక్తి అయితే తన నివాసాన్ని చేరుకోవటంలో త్వరగా విజయం పొందుతాడు. ఒకవేళ చెడ్డవాడైతే అతని బరువును మోయటం నుండి మీ భుజాల త్వరగా బరువు తగ్గించుకుంటాయి. జనాజా వెంట వెళ్ళడంలోనే అధిక పుణ్యాలు ఉన్నాయి. అకారణంగా జనాజా కంటే ముందు వాహనం మీద వెళ్ళటం మంచిది కాదు. జనాజాను మోస్తూ వెంట వెంటనే వెళ్ళటం ఉత్తమం. దగ్గరగా ఉంటూ మూడు సార్లు మోస్తే అతని భాధ్యత పూర్తయినట్లే ఇక ఎన్ని సార్లు మోస్తే అన్ని పుణ్యాలు ఎక్కువగా లభిస్తాయి. జనాజా ఎవరిదైనా కూడా దాన్ని చూసి నిలబడటం ఉత్తమం. జనాజా నమాజ్ అయ్యేంత వరకు మృతుని వద్ద ఉండే వానికి ఉహద్ పర్వతం మాదిరిగా ఒక రాశి పుణ్యఫలం పొందుతారు. ఖనన సంస్కారం అయ్యేంత వరకు వేచి ఉన్న వానికి రెండు రాశుల పుణ్యఫలం పొందుతారు. శవపేటికను నేలపై ఉంచే వరకూ ఎవరూ కూర్చోకూడదు.