5.అంత్యక్రియల (జనాయి’జ్) పుస్తకం | మిష్కాతుల్ మసాబీహ్

5- كِتَابُ الْجَنَائِز

5. అంత్యక్రియల (జనాయిజ్) పుస్తకం

1- بَابُ عِيَادَةِ الْمَرِيْضِ وَثوَابِ الْمَرَضِ

  1. రోగిని పరామర్షించటం, రోగానికి ప్రతిఫలం

జనా’జహ్ అంటే శవం,  ఇంకా శవాన్ని తీసుకువెళ్ళే మంచాన్ని కూడా జనా’జహ్ అంటారు. ఈ ప్రకరణంలో రోగం మరియు మరణానంతర ఆదేశాలు మొదలయినవి వివరించబడ్డాయి.

اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం 

1523 – [ 1 ] (صَحِيْحٌ ) (1/483)

عَنْ أَبِيْ مُوْسَى قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَطْعِمُوْا الجْاَئِعَ وَعُوْدُوْا الْمَرِيْضَ وَفُكُّوا الْعَانِيَ”. رَوَاهُ الْبُخَارِيُّ.

1523. (1) [1/483దృఢం]

అబూ మూసా (ర) కథనం, ప్రవక్త (స) ప్రవచనం: ”ఆకలిగొన్న వారికి అన్నం పెట్టండి, అనారోగ్యులను పరామర్శించండి, ఖైదీలను విడిపించండి.” (బు’ఖారీ)

1524 – [ 2 ] ( مُتَّفَقٌّ عَلَيْهِ ) (1/483)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “حَقُّ الْمُسْلِمِ عَلَى الْمُسْلِمِ خَمْسٌ: رَدُّ السَّلَامِ وَعِيَادَةُ الْمَريْضِ وَاِتِّبَاعُ الجْنَاَئِزِ وَإِجَابَةُ الدَّعْوَةِ وَتَشْمِيْتُ الْعَاطِسِ”.

1524. (2) [1/483-ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం, ప్రవక్త (స) ప్రవచనం: ”ఒక ముస్లిమ్‌ యొక్క మరో ముస్లిమ్‌పై 5 హక్కులు ఉన్నాయి. 1. సలామ్‌కు ప్రతిసలామ్‌ చేయటం, 2. రోగులను పరామర్శించటం, 3. జనా’జహ్ వెంట వెళ్ళటం, 4. ఆహ్వానం స్వీకరించటం, 5. తుమ్మిన వానికి సమాధానం ఇవ్వటం. (బు’ఖారీ, ముస్లిమ్‌)

1525 – [ 3 ] ( صَحِيْحٌ ) (1/483)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم “حَقُّ الْمُسْلِمِ عَلَى الْمُسْلِمِ سِتٌّ”. قِيْلَ: مَا هُنَّ يَا رَسُوْلَ اللهِ؟ قَالَ: “إِذاَ لَقِيْتَهُ فَسَلَّمَ عَلَيْهِ وَإِذَا دَعَاكَ فَأَجِبْهُ وَإِذَا اِسْتَنْصَحَكَ فَانْصَحْ لَهُ وَإِذَا عَطِسَ فَحَمِدَ اللهِ فَشَمِّتْهَ وَإِذَا مَرِضَ فَعُدْهُ وَإِذَا مَاتَ فَاتَّبِعْهُ” .روَاهُ مُسْلِمٌ.

1525. (3) [1/483దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ”ప్రవక్త (స) ఒక ముస్లిమ్‌పై మరో ముస్లిమ్‌ యొక్క 6 హక్కులు ఉన్నాయి అని అన్నారు. ఆ ఆరు హక్కులు ఏమిటని ప్రశ్నించడం జరిగింది. అప్పుడు ప్రవక్త (స), 1. ముస్లిమ్ మరో ముస్లిమ్‌ను కలిస్తే సలామ్‌ చేయాలి, 2. అతను ఆహ్వానిస్తే, అతని ఆహ్వానాన్ని స్వీకరించాలి, 3. నీకేదైనా సలహా అడిగితే శ్రేయోభిలాషతో సలహా ఇవ్వాలి, 4. ఎవరైనా తుమ్మి ‘అల్‌’హమ్‌దులిల్లాహ్‌’ అని అంటే సమాధానంగా ‘యర్‌’హముకల్లాహ్‌’ అని పలకాలి, 5. అతను వ్యాధికి గురైతే, అతన్ని పరామర్శించాలి, 6. అతను మరణిస్తే అతని జనా’జహ్ వెంటవెళ్ళాలి. (ముస్లిమ్‌)

1526 – [ 4 ] (مُتَّفَقٌّ عَلَيْهِ) (1/483)

وَعَنِ الْبَرَاءِ بْنِ عَازِبٍ قَالَ: أَمَرَنَا النَّبِيُّ صلى الله عليه وسلم بِسَبْعٍ وَنَهَانَا عَنْ سَبْعٍ أَمَرنَا: بِعِيَادَةِ الْمَرِيْضِ وَاِتِّبَاعِ الجْنَاَئِزِ وَتَشْمِيْتِ اْلعَاطِسِ وَرَدِّ السَّلَامِ وَإِجَابَةِ الدَّاعِيْ وَإِبْرَارَ الْمُقْسِمِ وَنَصْرِ الْمَظْلُوْمِ وَنَهَانَا عَنْ خَاتمَ الذَّهَبِ وَعَنْ الْحَرِيْرِ وَالْإِسْتَبْرَقِ وَالدِّيْبَاجِ وَالْمِيْثَرَةِ الْحَمْرَاءِ وَالْقَسِيِّ وَآنِيَةُ الْفِضَّةِ.

وَفِي رَوَايَةِ وَعَنْ الشُّرْبِ فِيْ الْفِضَّةِ فَإِنَّهُ مَنْ شَرِبَ فَيْهَا فَيْ الدُّنْيَا لَمْ يَشْرَبْ فَيْهَا فَيْ الْآخِرَةِ.

1526. (4) [1/483-ఏకీభవితం]

బరా’ బిన్‌ ‘ఆ’జిబ్‌ (ర) కథనం: ప్రవక్త (స) మాకు 7 విషయాల గురించి ఆదేశించారు. 1. రోగిని పరామర్శించటం, 2. జనాజా వెంట వెళ్ళటం, 3. తుమ్ముకు సమాధానం ఇవ్వటం, 4. సలాముకు జవాబు ఇవ్వటం, 5. ఆహ్వానించేవాని ఆహ్వానాన్ని స్వీకరించటం, 6. ప్రమాణం చేస్తే దానిని పూర్తిచేయటం, 7. అత్యాచారానికి గురైన వారికి సహాయం చేయటం.

మరియు 7 విషయాల నుండి వారించారు. 1. బంగారు ఉంగరం ధరించటం, 2. పట్టువస్త్రాలు ధరించటం, 3. పట్టు ధరించటం, 4. ఎర్రని పట్టు జీను ధరించటం, 5. పట్టు వస్త్రాలు, 6 ప్రఖ్యాత  ఖస్ ప్రాంత మెరిసే పట్టు 7. వెండి పాత్రల్లో తినటం, త్రాగటం. ప్రపంచంలో వెండి పాత్రల్లో త్రాగేవారు పరలోకంలో వెండి పాత్రల్లో త్రాగలేరు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

1527 – [ 5 ] ( صحيح ) (1/484)

وَعَنْ ثَوْبَانَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ الْمُسْلِمَ إِذَا عَادَ أَخَاهُ الْمُسْلِمِ لَمْ يَزَلْ فَيْ خُرْفَةِ الْجَنَّةِ حَتَّى يَرْجِعَ”. رَوَاهُ مُسْلِمٌ .

1527. (5) [1/484దృఢం]

సౌ’బాన్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక ముస్లిమ్‌ మరో ముస్లిమ్‌ను పరామర్శించటానికి వెళితే, అతడు పరామర్శించినంత సేపు స్వర్గవనాల్లో పళ్ళు తింటూ ఉంటాడు.”(ముస్లిమ్‌)

1528 – [ 6 ] ( صحيح ) (1/484)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم “إِنَّ اللهَ عز وجل يَقُوْلُ يَوْمَ الْقَيَامَةِ: يَا ابْنَ آدَمَ مَرِضْتُ فَلَمْ تَعُدْنِيْ. قَالَ: يَا رَبِّ كَيْفَ أَعُوْدُكَ وَأَنْتَ رَبُّ الْعَالَمِيْنَ؟ قَالَ: أَمَا عَلِمْتَ أَنْ عبْدِيْ فَلَانَا مَرِضَ فَلَمْ تَعُدْهُ؟ أَمَا عَلِمْتَ أَنَّكَ لَوْ عُدْتَّهُ لَوَجَدْتَّنَيْ عَنْدَهُ؟ يَا ابْنَ آَدَمَ اسْتَطْعَمْتُكَ فَلَمْ تَطعِمْنِيْ. قَالَ: يَا رَبِّ كَيْفَ أَطْعِمُكَ وَأَنْتَ رَبُّ الْعَالمَيْنَ؟ قَالَ: أَمَا عَلِمْتَ أَنَّهُ اسْتَطْعَمَكَ عَبْدِيْ فُلَانٌ فَلَمْ تَطْعِمْهُ؟ أَمَا عَلِمْتَ أَنَّكَ لَوْ أَطْعَمْتَهُ لَوْجَدْتَّ ذَلِكَ عَنْدِيْ؟ يَا ابْنَ آدَمَ اسْتَسْقَيْتُكَ فَلَمْ تَسْقِنِيْ. قَالَ: يَا رَبِّ كَيْفَ أَسْقِيْكَ وَأَنْتَ رَبُّ الْعَالَمِيْنَ؟ قَالَ: اسْتَسْقَاكَ عَبْدِيْ فُلَانٌ فَلَمْ تَسْقِهِ أَمَا عَلِمْتَ إنَكَ لَوْ سَقَيْتَهُ  لَوَجَدْتَّ ذَلِكَ عَنْدِيْ” .رَوَاهُ مُسْلِمٌ .

1528. (6) [1/484దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం, ప్రవక్త (స) ప్రవచనం: ”తీర్పుదినం నాడు అల్లాహ్‌, ‘ఓ ఆదమ్‌ కుమారా! నేను ప్రపంచంలో వ్యాధికి గురయ్యాను. నన్ను పరామర్శించటానికి నీవు రాలేదు’ అని అంటాడు. దానికి దాసుడు, ‘ఓ నా ప్రభూ! నేను నిన్నెలా పరామర్శిస్తాను. నీవు సర్వలోకాలను పోషించేవాడివి’ అని అంటాడు. దానికి అల్లాహ్‌, ‘నా ఫలానా దాసుడు అనారోగ్యానికి గురయిన విషయం నీకు తెలియదా, నీవు అతన్ని పరామర్శించలేదు. ఒకవేళ నీవు అతన్ని పరామర్శిస్తే, నా ప్రీతిని పొందేవాడవు,’ అని అంటాడు. ‘ఓ ఆదమ్‌ కుమారా! నేను నిన్ను అన్నం అడిగాను. నీవు నన్ను తినిపించలేదు,’ అని అల్లాహ్‌ అంటాడు. దానికి దాసుడు, ‘ఓ నా ప్రభూ! నేను నీకు తినిపించడం ఏమిటి?’ నీవు సర్వ లోకాలకు తినిపించే వాడివి. అంటే నీకు తినే అవసరం లేదు కదా,’ అని అంటాడు. దానికి అల్లాహ్‌, ‘నా ఫలానా దాసుడు నిన్ను అన్నం అడిగాడు, నీవు అతనికి తినిపించ లేదు, నీవు అతనికి తినిపించి ఉంటే, నా వద్ద ప్రతిఫలం పొందేవాడివి.’ అల్లాహ్‌, ‘ఓ మానవుడా! నేను నిన్ను నీళ్ళు అడిగాను. నీవు నన్ను త్రాపించలేదు’ అని అంటాడు. దానికి దాసుడు, ‘ఓ నా ప్రభూ! నేను నీకు త్రాపించడం ఏమిటి, నీవే అందరికీ త్రాపిస్తావు’ అని అంటాడు. అప్పుడు అల్లాహ్‌ ‘ఫలానా దాసుడు నిన్ను నీళ్ళు అడిగాడు, నీవు త్రాపించలేదు. ఒకవేళ నీవు అతనికి త్రాపిస్తే, నా వద్ద దానికి ప్రతిఫలం పొందేవాడివి’ అని అంటాడు. (ముస్లిమ్‌)

1529 – [ 7 ] ( صحيح ) (1/485)

وَعَنْ ابْنِ عَبَّاسٍ: أَنَّ النَّبِيَ صلى الله عليه وسلم دَخَلَ عَلَى أَعَرَابِيٍّ يَعُوْدُهُ وَكَانَ إِذَا دَخَلَ عَلَى مَرِيْضٍ يَعُوْدُهُ. قَالَ: ” لَا بَأْسَ طَهُوْرٌ إِنْ شَاءَ اللهُ”. فَقَالَ لَهُ: “لَا بَأْسَ طَهُوْرٌ إِنْ شَاءَ اللهُ”. قَالَ: كَلَّا بَلْ حُمًّى تَفُوْرُ عَلَى شَيْخٍ كَبِيْرٍ تُزِيْرُهُ الْقُبُوْرَ. فَقَالَ: ” فَنَعَمْ إِذَنْ”. رَوَاهُ الْبُخَارِيُّ.

1529. (7) [1/485దృఢం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఒక పల్లెవాసి వద్దకు అతన్ని పరామర్శించడానికి వెళ్ళారు. ప్రవక్త (స) రోగులను పరామర్శించినపుడు, ”లా బాస తహూరున్‌ ఇన్‌షా అల్లాహ్‌” అంటే — ‘మరేం ఫర్వాలేదు, విచారించవలసిన పనిలేదు. అల్లాహ్‌ కోరితే ఈ వ్యాధి నీ పాపాలను తొలగించి వేస్తుంది’ అని పలికేవారు. ప్రవక్త (స) అలవాటు ప్రకారం ఆ వ్యక్తితో కూడా, ”లా బాస తహూరున్‌ ఇన్‌షా అల్లాహ్‌” అని అన్నారు. అది విన్న ఆ వ్యక్తి ‘ఎంత మాత్రం కాదు, ఇది జ్వరం, ముసలివానికి వచ్చింది. ఈ జ్వరం సమాధివరకు చేర్చి వేస్తుంది అంటే ఈ జ్వరం వల్ల నేను చనిపోతాను,’ అని అన్నాడు. అది విన్న ప్రవక్త (స), ‘ఒకవేళ నీవు నా మాటలు వినకుండా ఉంటే అలాగే జరుగుతుంది. ఎందుకంటే నీవు కృతఘ్నుడవు,’ అని అన్నారు. (బు’ఖారీ)

1530 – [ 8 ] (مُتَّفَقٌّ عَلَيْهِ) (1/485)

وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: كَانَ رَسُوْلُ الله صلى الله عليه وسلم إِذَا اشْتَكَى مِنَّا إِنْسَانٌ مَسَحَهُ بِيَمِيْنِهِ ثُمَّ قَالَ: “أَذْهِبِ الْبَاْسَ رَبَّ النَّاسَ وَاشْفِ أَنْتَ الشَّافِيْ لَا شِفَاءَ إِلَّا شِفَاؤُكَ شِفَاءً لَا يُغَادِرُ سَقَمًا”.

1530. (8) [1/485ఏకీభవితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: మాలో ఎవరైనా వ్యాధికి గురైతే ప్రవక్త (స) తన కుడిచేతితో అతని శరీరంపై నిమురుతూ, ఈ దు’ఆ పఠించేవారు, ” అజ్‌’హిబిల్‌ బాస రబ్బన్నాసి, వష్‌ఫి అన్‌తష్షాఫీ, లాషిఫాఅ’ ఇల్లా షిఫాఉ’క, షిఫాఅ’న్‌ లా యుగాదిరు సుఖ్‌మన్‌.”  — ‘ఓ ప్రజల ప్రభువా! నీవు ఈ వ్యాధిని దూరం చేయి, ఆరోగ్యాన్ని ప్రసాదించు, ఆరోగ్యం ప్రసాదించేవాడవు నీవే. చికిత్స కేవలం నీ తరఫు నుండే వస్తుంది. ఆ చికిత్స ఏ రోగాన్ని వదలదు.’ (బు’ఖారీ, ముస్లిమ్‌)

1531 – [ 9 ] (مُتَّفَقٌّ عَلَيْهِ) (1/485)

وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: كَانَ رَسُوْلُ الله صلى الله عليه وسلم إِذَا اشْتَكَى الِإنْسَانُ الشَّيْءَ مِنْهُ أَوْ كَانَتْ بِهِ قَرْحَةٌ أَوْ جُرْحٌ قَالَ النَّبِيُّ صلى الله عليه وسلم بِأَصْبَعِهِ: “بِسْمِ اللهِ تُرْبَةُ أَرْضَنَا بِرِيْقَةِ بَعْضِنَا لِيُشْفَى سَقِيْمُنَا بِإِذْنِ رَبَّنَا”.

1531. (9) [1/485ఏకీభవితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ”ఎవరైనా వచ్చి తనకు ఏదైనా రోగం, లేదా గాయం, లేదా నొప్పి ఉందని చెబితే, ప్రవక్త (స) తన చేతి వ్రేలుతో సైగ చేస్తూ ఈ దు’ఆ చదివేవారు, ‘బిస్మిల్లాహి, తుర్‌బతు అర్‌’దినా, బిరీఖతి బ’అదినా, లి షుషా సఖీమునా, బి ఇజ్’ ని రబ్బినా.’ — ‘అల్లాహ్‌ పేరుతో శుభం పొందు తున్నాను. మా నేల మట్టి ఇది మాలోని కొందరి ఉమ్మి, ఇది ఈ నేలలో కలసి ఉంది. దాని ద్వారా మా రోగిని నయంచేయి, మా ప్రభువు ఆజ్ఞద్వారా.’ ” [1](బు’ఖారీ, ముస్లిమ్‌)

1532 – [ 10 ] (مُتَّفَقٌّ عَلَيْهِ) (1/485)

وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: كَانَ رَسُوْلُ الله صلى الله عليه وسلم إِذَا اشْتَكَى نَفَثَ عَلَى نفْسِهِ بِالْمُعَوَّذَاتِ وَمَسَحَ عَنْهُ بِيَدِهِ فَلَمَّا اشْتَكَىَ وَجَعُهُ الَّذِيْ تُوُفِّيَ فِيْهِ كُنْتُ أَنْفُثُ عَلَيْهِ بِالْمُعَوَّذَاتِ الَّتِيْ كَانَ يَنْفُثُ وَأَمْسَحَ بِيَدِ النَّبِيِ صلى الله عليه وسلم.

وَفِيْ رَوَايَةٍ لِّمُسْلِمِ قَالَتْ: كَانَ إِذَا مَرِضَ أَحَدٌ مِنْ أَهْلِ بَيْتِهِ نَفَثَ عَلَيْهِ بِالْمُعَوَّذَاتِ .

1532. (10) [1/485ఏకీభవితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఆరోగ్యానికి గురైతే ఖుల్‌ అ’ఊజు’ బి రబ్బిన్నాస్‌, ఖుల్‌అ’ఊజు’ బి రబ్బిల్‌ ఫలఖ్‌ లను (113, 114) చదువుతూ తన శరీరంపై ఊదేవారు. ఇంకా తన చేతితో చేతులు అందే వరకు తుడుచుకునే వారు. ప్రవక్త (స) మరణించినపుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు, ఆ రెండు సూరాలను చదివి ప్రవక్త (స) చేతులపై ఊదే దాన్ని. ఇంకా ప్రవక్త (స) చేతులతో అతని శరీరంపై తుడిచేదాన్ని. (బు’ఖారీ, ముస్లిమ్‌)

ముస్లిమ్‌లోని ఒక ఉల్లేఖనంలో ఇలాఉంది, ఇంట్లో ఎవరైనా అనారోగ్యానికి గురైతే ప్రవక్త (స) ఈ సూరాలను (113, 114) చదివి వారిపై ఊదేవారు.

1533 – [ 11 ] ( صحيح ) (1/485)

وَعَنْ عُثْمَانَ بَنِ أَبِيْ الْعَاصِ أَنَّهُ شَكَا إِلى رَسُوْلِ الله صلى الله عليه وسلم وَجَعًا يَّجِدُهُ فِيْ جَسَدِهِ. فَقَالَ لَهُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “ضَعْ يَدَكَ عَلَى الَّذِيْ يَأْلَمُ مِنْ جَسَدِكَ وَقُلْ: بِسْمِ اللهِ ثَلاَثاً وَقُلْ سَبْعَ مَرَّاتٍ: أَعُوْذُ بِعِزِّةِ اللهِ وَقُدْرَتِهِ مِنْ شَرِّ مَا أَجِدُ وَأَحَاذِرُ”. قَالَ: فَفَعَلْتُ فَأَذْهَبَ اللهُ مَا كَانَ بِيْ. رَوَاهُ مُسْلِمٌ .

1533. (11) [1/485దృఢం]

‘ఉస్మాన్‌ బిన్‌ అబిల్‌ ‘ఆ’స్‌ (ర) కథనం: ”నేను నా శరీరంలో ఉన్న నొప్పి గురించి ప్రవక్త(స)కు ఫిర్యాదు చేశాను. దానికి ప్రవక్త (స) నన్ను, ‘నీవు నీ చేతిని నొప్పి ఉన్నచోట ఉంచు, ఆ తరువాత 3 సార్లు బిస్మిల్లాహ్‌ అని పలుకు, ఆ తరువాత 7 సార్లు ఈ దు’ఆ చదువు,

ఊజుబి జ్జతిల్లాహి, ఖుద్రతిహి, మిన్ షర్రి మా అజిదు హాజిరు — ‘నేను అల్లాహ్‌ గౌరవ-శక్తుల ద్వారా నాకు కలుగు తున్న, నేను భయపడుతున్న నొప్పి నుండి అల్లాహ్‌ శరణు కోరుతున్నాను,’ అని పలుకు అన్నారు. ప్రవక్త (స) చెప్పినట్టు నేను చేశాను, అల్లాహ్‌ (త) నొప్పిని నా నుండి దూరం చేశాడు. (ముస్లిమ్‌)

1534 – [ 12 ] ( صحيح ) (1/486)

وَعَنْ أَبِيْ سَعِيْدٍ الْخُدْرِيِّ أَنَّ جِبْرِيْلَ أَتَى النَّبِيَّ صلى الله عليه وسلم. فَقَالَ: يَا مُحَمَّدُ اشْتَكَيْتَ؟ فَقَالَ: “نَعَمْ”. قَالَ: ” بِسْمِ اللهِ أَرْقِيْكَ مِنْ كُلّ شَيْءٍ يُّؤْذِيْكَ مِنْ شَرِّ كُلِّ نَفْسٍ أَوْ عَيْنٍِ حَاسِدٍ اللهُ يَشْفَيْكَ بِسْمِ اللهِ أَرْقِيْكَ”. رَوَاهُ مُسْلِم.

1534. (12) [1/486దృఢం]

అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు జిబ్రీల్‌ (అ) వచ్చారు. ‘ఓ ము’హమ్మద్‌! మీరు అనారోగ్యంగా ఉన్నారా’ అని అడిగారు. ప్రవక్త (స) ‘అవును,’ అని అన్నారు. అప్పుడు జిబ్రీల్‌ (అ),

బిస్మిల్లాహి అర్ఖీక మిన్కుల్లి షైయిన్‌, యూజీ, మిన్ షర్రి కుల్లి నఫ్సిన్, అవ్ఐని హాసిదిన్‌, అల్లాహు యష్ఫీక, బిస్మిల్లాహి అర్ఖీక — ‘అల్లాహ్‌ పేరుతో నిన్ను బాధ పెడుతున్న ప్రతి వస్తువు కీడు నుండి, ప్రతి ప్రాణి నుండి దిష్టి నుండి, అసూయాపరుని కంటి నుండి. అల్లాహ్‌ నీకు ఆరోగ్యం ప్రసాదించు గాక! అల్లాహ్‌ పేరుతో నీపై ఊదుతున్నాను.’ (ముస్లిమ్‌)

1535 – [ 13 ] ( صحيح ) (1/486)

وعَنِ ابْنِ عَبَاسٍ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يُعَوِّذُ الْحَسَنَ وَالْحُسْنَ: “أَعِيْذُكُمَا بِكَلِمَاتِ اللهِ التَّامَّةِ مِنْ كُلِّ شَيْطَانٍ وَهَامَّةٍ وَمِنْ كُلِّ عَيْنٍ لَّامَّةٍ” .وَيَقُوْلُ: “إِنَّ أَبَاكُمَا كَانَ يَعُوِّذُ بِهما إِسْمَاعِيْلَ وَإِسْحَاقَ”. رَوَاهُ الْبُخَارِيُّ وَفِيْ أَكْثَرِ نُسَخِ الْمَصَابِيْحِ: “بِهِمَا” عَلَى لَفْظِ الْتَّثْنِيَةِ .

1535. (13) [1/486దృఢం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) తన ఇద్దరు మనమళ్ళు ‘హసన్‌ మరియు ‘హుసైన్‌ల కొరకు ఈ దు’ఆల ద్వారా శరణుకోరేవారు.

యీజుకుమా, బికలిమా తిల్లాహిత్తామ్మాతి  మిన్ షర్రి కుల్లి షైతానిన్ హామ్మతిన్‌, మిన్ కుల్లి ఐనిన్లామ్మతిన్‌.” — ‘నేను మీ ఇద్దరి కోసం అల్లాహ్‌ పూర్తి వచనాల ద్వారా ప్రతి షై’తాన్‌ కీడునుండి, ప్రతి విషపూరిత జంతువునుండి, ప్రతి దిష్టినుండి అల్లాహ్‌ శరణు కోరుతున్నాను.’

‘ఇంకా మీ తండ్రి ఇబ్రాహీమ్‌ (అ) తన కుమారులైన ఇస్మా’యీల్‌ మరియు ఇస్‌’హాఖ్‌ల కోసం ఈ పదాల ద్వారానే శరణుకోరేవారు.’ అని అన్నారు. (బు’ఖారీ)

1536 – [ 14 ] ( صحيح ) (1/486)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ يُرِدِ اللهُ بِهِ خَيْرًا يُّصَبْ مِنْهُ”. رَوَاهُ الْبُخَارِيُّ.

1536. (14) [1/486దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌ మేలు చేకూర్చగోరేవారికి కష్టాలకు గురిచేయడం జరుగుతుంది. లేదా అల్లాహ్‌ కష్టాలకు గురిచేస్తాడు.” [2] (బు’ఖారీ)

1537 – [ 15 ] ( متفق عليه ) (1/486)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ وَأَبِيْ سَعِيدٍ عَنْ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “مَا يُصِيْبُ الْمُسْلِمَ مِنْ نَّصَبِ وَلَا وَصَبٍ وَلَا هَمَّ وَلَا حُزْنٍ وَلَا أَذَى وَلَا غمٍّ حَتَّى الشَّوْكَةُ يُشَاكُّهَا إِلَّا كَفَّرَ اللهُ بِهَا مِنْ خَطَايَاهُ”.

1537. (15) [1/486ఏకీభవితం]

అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక ముస్లిమ్‌ కష్టాలకు గురైనా, విచారానికి గురైనా, ఒకవేళ ముళ్ళు గుచ్చుకున్నా, వాటి ద్వారా అల్లాహ్‌ అతని పాపాలను క్షమించివేస్తాడు.” [3](బు’ఖారీ, ముస్లిమ్‌)

1538 – [ 16 ] ( متفق عليه ) (1/486)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ قَالَ: دَخَلَتُ عَلَى النَّبِيِّ صلى الله عليه وسلم وَهُوَ يُوْعَكُ فَمَسِسْتُهُ بِيَدِيْ فَقُلْتُ:يَا رَسُوْلَ اللهِ إِنَّكَ لَتُوْعَكُ وَعْكًا شَدِيْدًا. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “أَجَلْ إِنِّيْ أَوْعَكُ كَمَا يُوْعَكُ رَجُلَاِن مِنْكُمْ”. قَالَ: فَقُلْتُ: ذَلِكَ لِأَنَّ لَكَ أَجْرَيْنِ؟ فَقَالَ: “أَجَلْ”. ثُمَّ قَالَ: “مَا مِنْ مُّسْلِمٍ يُّصِيْبُهُ أَذَىً مِّنْ مَّرَضٍ فَمَا سِوَاهُ إِلَّا حَطَّ اللهُ تَعَالى بِهِ سَيِّئَاتِهِ كَمَا تَحُّطُ الشَّجَرَةُ وَرَقَهَا”.

1538. (16) [1/4686ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు నేను వెళ్ళాను. అప్పుడు ప్రవక్త (స)కు జ్వరంగా ఉంది. నేను నా చేత్తో ప్రవక్త (స)ను ముట్టు కుని, ‘ప్రవక్తా! తమకు చాలా జ్వరంగా ఉంది’ అని అన్నాను. దానికి ప్రవక్త(స), ‘అవును, మీలో ఇద్దరికి వచ్చే జ్వరం నాకు వస్తుంది,’ అని అన్నారు. దానికి నేను ‘మరి మీకురెట్టింపు పుణ్యం లభిస్తుంది కదా’ అని అన్నాను. దానికి ప్రవక్త (స), ‘అవును, ఒక ముస్లింకు ఎటువంటి ఆపద వచ్చినా, అల్లాహ్‌(త) దాని ద్వారా అతని పాపాలను క్షమించివేస్తాడు. చెట్టు తన ఆకులను రాల్చినట్లు’ అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

1539 – [ 17 ] ( متفق عليه ) (1/487)

وَعَنْ عَائِشَةَ رَضِيَ اللُه عَنْهَا قَالَتْ: مَا رَأَيْتُ أَحَدَا الْوَجَعُ عَلَيْهِ أَشَدُّ مِنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم .

1539. (17) [1/487ఏకీభవితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స)కు కలిగి నంత నొప్పి, బాధ మరెవరికీ చూడలేదు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

1540 – [ 18 ] ( صحيح ) (1/487)

وَعَنْ عَائِشَةَ رَضِيَ اللُه عَنْهَا قَالَتْ: مَاتَ النَّبِيُّ صلى الله عليه وسلم بَيْنَ حَاقِنَتِيْ وَذَاقِنَتِيْ فَلَا أَكْرَهُ شِدَّةَ الْمَوْتِ لِأَحَدٍ أَبَدًا بَعْدَ النَّبِيِّ صلى الله عليه وسلم. رَوَاهُ البُخَارِيُّ .

1540. (18) [1/487దృఢం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ”ప్రవక్త (స) నా ఓడిలో మరణించారు. ప్రవక్త (స) పరిస్థితి కంటే మరెవరి పరిస్థితిని ఆందోళనకరంగా నేను చూడలేదు.” [4](బు’ఖారీ)

1541 – [ 19 ] ( متفق عليه ) (1/487)

وَعَنْ كَعْبِ بْنِ مَالِكٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَثَلُ الْمُؤْمِنِ  كَمَثَلِ الْخَامَةِ مِنَ الزَّرْعِ تُفَيِّئَها الرِّيَاحُ تَصْرَعُهَا مَرَّةً وَتَعْدِلُهَا  اخْرَىَ حَتًّى يَأْتِيْهِ أَجَلُهُ وَمَثَلُ الْمُنَافِقِ كَمَثَلِ الْأَرْزَةِ الْمُجْذِيَةِ الَّتِيْ لَا يُصِيْبُهَا شَيْءٌ حَتَى يَكُوْنَ اِنْجِعَافُهَا مَرَّةً وَاحِدَةٍ”.

1541. (19) [1/487ఏకీభవితం]

క’అబ్‌ బిన్‌ మాలిక్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”విశ్వాసి పరిస్థితి పచ్చని పంటలాంటిది. గాలులు ఒక్కోసారి అటు నుండి, ఒక్కోసారి ఇటు నుండి ఊపుతూ ఉంటాయి. చివరికి మరణం సంభవిస్తుంది. విశ్వాసి పడుతూ లేస్తూ ఉంటాడు. కష్టాలు, ఆపదలు వస్తూపోతూ ఉంటాయి. కపటాచారి ఉదాహరణ బలమైన చెట్టు వంటిది. ఆరోగ్యంగా ఉంటాడు. కాని ఒక్కసారి పీకివేయబడతాడు.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

1542 – [ 20 ] ( متفق عليه ) (1/487)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَثَلُ الْمُؤْمِنِ كَمَثَلِ الزَّرْعِ لَا تَزَالَ الرِّيْحُ تُمِيْلُهُ وَلَا يَزَالُ الْمُؤْمِنُ يُصِيْبُهُ البَلَآءُ وَمَثَلُ الْمُنَافِقِ كَمَثَلِ شَجَرَةِ الْأَرْزَةِ لَا تَهْتَزُّ حَتَى تَسْتَحْصَدَ”.

1542. (20) [1/487ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”విశ్వాసి ఉదాహరణ పంటలాంటిది. గాలి  అతన్ని అటూ ఇటూ కుదుపుతూ ఉంటుంది. విశ్వాసికి ఎల్లప్పుడూ కష్టాలు, ఆపదలు వస్తూ ఉంటాయి. కాని కపటాచారి ‘సనోబర్  చెట్టు లాంటివాడు. కాని ఒకేసారి పీకివేయబడతాడు.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

1543 – [ 21 ] ( صحيح ) (1/487)

وَعَنْ جَابِرٍ قَالَ: دَخَلَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَلَى أُمِّ السَّائِبِ فَقَالَ: “مَالَكٍ تُزَفْزِفِيْنَ؟” قَالَتْ: الْحُمَّى لَا بَارَكَ اللهُ فِيْهَا فَقَالَ: “لَا تَسُبِّي الْحُمَّى فَإِنَّهَا تُذْهِبُ خَطَايَا بَنِيْ آدَمَ كَمَا يُذْهِبُ الْكِيْرُ خَبَثَ الْحَدِيْدِ”. رَوَاهُ مُسْلِمٌ .

1543. (21) [1/487దృఢం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఉమ్ము సాయి’బ్‌ వద్దకు వచ్చారు. అప్పుడు ఆమె అనారోగ్యంగా ఉన్నారు. అది చూసి, ప్రవక్త  (స) ‘ఏమయింది? వణుకుతున్నావు,’ అని అడిగారు. దానికి ఆమె, ‘ప్రవక్తా! జ్వరంగా ఉంది, పాడుగాను,’ అని అన్నది. దానికి ప్రవక్త (స) ‘జ్వరాన్ని తిట్టకు, ఇది మానవుని పాపాలను, కుంపటి ఇనుమును శుభ్రపరచినట్టు దూరం చేస్తుంది’ అని అన్నారు. (ముస్లిమ్‌)

1544 – [ 22 ] ( صحيح ) (1/487)

وَعَنْ أَبِيْ مُوْسَى قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا مَرَضَ الْعَبْدُ أَوْ سَافَرَ كُتِبَ لَهُ بِمِثْلِ مَا كَانَ يَعْمَلُ مُقِيْمًا صَحِيْحًا”. رَوَاهُ الْبُخَارِيُّ

1544. (22) [1/487దృఢం]

అబూ మూసా (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”విశ్వాసి అనారోగ్యానికి గురయినా, లేదా ప్రయాణానికి వెళ్ళినా, అతను స్థానికంగా, ఆరోగ్యంగా ఉండి చేసిన సత్కర్మలు అతమి కర్మ పత్రంలో వ్రాయబడుతాయి.” (బు’ఖారీ)

1545 – [ 23 ] ( متفق عليه ) (1/488)

وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “الطَّاعُوْنُ شَهَادَةٌ لِّكُلِّ مُسْلِمٍ”.

1545. (23) [1/488ఏకీభవితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్లేగు వ్యాధి ప్రతి ముస్లిమ్‌కు వీరమరణంగా వర్తిస్తుంది. అంటే ప్లేగువ్యాధి వల్ల మరణించిన ముస్లిమ్‌ వీరమరణం పొందినట్టు పరిగణించటం జరుగుతుంది.” (బు’ఖారీ)

1546 – [ 24 ] ( متفق عليه ) (1/488)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “الشُّهَدَاءُ خَمْسَةٌ الْمَطْعُوْنُ وَالْمَبْطُوْنَ وَالْغَرِيْقُ وَصَاحِبُ الْهَدَمِ وَالشَّهِيْدُ فِيْ سَبِيْلِ اللهِ”.

1546. (24) [1/488ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”వీర మరణంలో 5 రకాలు ఉన్నాయి. 1. ప్లేగు వ్యాధి వల్ల మరణించినవారు వీరమరణం పొందినట్టే, 2. విరోచనాల ద్వారా మరణించినవారు వీరమరణం పొందినట్టే, 3. మునిగి మరణించిన వారు వీరమరణం పొందినట్టే, 4. గోడపై నుండి క్రిందపడి మరణించినవారు వీరమరణం పొందినట్టే, 5. అల్లాహ్ మార్గంలో పోరాడి మరణించిన వారు వీరమరణం పొందినట్టే. (బు’ఖారీ, ముస్లిమ్‌)

అదేవిధంగా వీరమరణానికి చెందిన ఇంచుమించు 70 రకాలు ఉన్నాయి. వీటిని గురించి దుర్రెముఖ్తార్ పాదసూచిక, ‘తవాలి-ఉల్ అన్వార్’ లో ఉంది.

1547 – [ 25 ] ( صحيح ) (1/488)

وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: سَأَلْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم عَنِ الطَّاعُوْنِ فَأَخْبَرَنِيْ: “أَنَّهُ عَذَابٌ يَّبْعَثُهُ اللهُ عَلَى مَنْ يَّشَاءُ وَأَنَّ اللهَ جَعَلَهُ رَحْمَةً لِّلْمُؤْمِنِيْنَ لَيْسَ مِنْ أَحَدٍ يَّقَعُ الطَّاعُوْنُ فَيَمْكُثُ فِيْ بَلَدِهِ صَابِرًا مُّحْتَسِبًا يَّعْلَمُ أَنَّهُ لَا يُصِيْبُهُ إِلَّا مَا كَتَبَ اللهُ لَهُ إِلَّا كَانَ لَهُ مِثْلُ أَجْرِ شَهِيْدٍ”. رَوَاهُ الْبُخَارِيُّ .

1547. (25) [1/488దృఢం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: నేను ప్రవక్త (స)ను ప్లేగు వ్యాధి గురించి అడిగాను. దానికి ప్రవక్త (స) ప్లేగు వ్యాధి ఒక అల్లాహ్ శిక్ష. అల్లాహ్‌(త) తానుకోరినవారిని దానికి గురి చేస్తాడు. అయితే ముస్లిముల కోసం కారుణ్యంగా చేసి వేస్తాడు. ప్లేగు వ్యాధి వచ్చిన ప్రదేశం నుండి ఎక్కడికీ పారిపోకూడదు. అల్లాహ్ పై భారం వేసి అక్కడే ఉంటూ, ‘అల్లాహ్‌ తప్పకుండా నాకు ప్రతిఫలం ప్రసా దిస్తాడు, అల్లాహ్ ఆజ్ఞ లేకుండా ఏ ఆపదా రాదు,’ అని దృఢనమ్మకం కలిగి ఉంటే అల్లాహ్‌ అతనికి వీరమర ణానికి సమానంగా ప్రతిఫలం ప్రసాదిస్తాడు. (బు’ఖారీ)

1548 – [ 26 ] ( متفق عليه ) (1/488)

وَعَنْ أُسَامَةَ بْنِ زَيْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “الطَّاعُوْنُ رِجْزٌأُرْسِلَ عَلَى طَائِفَةٍ مِّنْ بَنِيْ إِسْرَائِيْل أَوْ عَلَى مَنْ كَانَ قَبْلَكُمْ فَإِذَا سَمِعْتُمْ بِهِ بِأَرْضٍ فَلَا تَقْدَمُوْا عَلَيْهِ وَإِذَا وَقَعَ بِأَرْضٍ وَأَنْتُمْ بِهَا فَلَا تَخْرُجُوْا فِرَارًا مِّنْهُ”.

1548. (26) [1/488ఏకీభవితం]

ఉసామహ్ బిన్‌ ‘జైద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్లేగు వ్యాధి ఒక శిక్ష. దీన్ని బనీ ఇస్రాయీ’ల్‌ మరియు పూర్వీకులపై పంపడం జరిగింది. ఎక్కడైనా ప్లేగు వ్యాధి వ్యాపించిందని వింటే మీరు అక్కడికి వెళ్ళకండి. ఒక వేళ మీరు ఉన్నచోట ప్లేగు వ్యాధి వ్యాపిస్తే అక్కడి నుండి వెళ్ళకండి.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

1549 – [ 27 ] ( صحيح ) (1/488)

وَعَن أَنَسٍ قَالَ: سَمِعْتُ رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ: “قَالَ اللَّهُ سُبْحَانَهُ وَتَعَالَى: إِذَا ابْتَلَيْتُ عَبْدِي بِحَبِيبَتَيْهِ ثُمَّ صَبَرَ عَوَّضْتُهُ مِنْهُمَا الْجنَّة” يُرِيد عَيْنَيْهِ. رَوَاهُ البُخَارِيّ.

1549. (27) [1/488దృఢం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”అల్లాహ్‌ ఆదేశం: నేను మనిషి యొక్క ప్రియమైన వస్తువులు తీసుకుంటే, అంటే కళ్ళులేని గ్రుడ్డివాడిగా చేసివేస్తే, దానిపై సహనం వహిస్తే, దానికి బదులుగా నేను అతనికి స్వర్గం ప్రసాదిస్తాను.” (బు’ఖారీ)

—–

اَلْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం 

1550 – [ 28 ] ( صحيح ) (1/489)

عَنْ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: مَا مِنْ مُّسْلِمٍ يَّعُوْدُ مُسْلِمًا غُدْوَةً إِلَّا صَلَّى عَلَيْهِ سَبْعُوْنَ أَلْفَ مَلَكٍ حَتَّى يُصْبِحَ وَكَانَ لَهُ خَرِيْفٌ فِيْ الْجَنَّةِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ.

1550. (28) [1/489దృఢం]

అలీ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ” ఉదయం ఒక ముస్లిమ్‌ మరో ముస్లిమ్‌ను పరామర్శిస్తే, సాయంత్రం వరకు 70 వేల మంది దైవదూతలు అతన్ని క్షమించమని, కరుణించ మని ప్రార్థిస్తూ ఉంటారు. ఒకవేళ సాయంత్రం పరా మర్శిస్తే ఉదయంవరకు 70 వేల మంది దైవదూతలు అతన్ని క్షమించమని, కరుణించమని ప్రార్థిస్తూ ఉంటారు. ఇంకా స్వర్గంలో అతని కోసం ఒక తోట ప్రత్యేకించబడుతుంది.” (తిర్మిజి’, అబూ దావూద్)

1551 – [ 29 ] ( لم تتم دراسته ) (1/489)

وَعَنْ زَيْدِ بْنِ أَرْقَمٍ قَالَ: عَادَنِيْ النَّبِيُّ صلى الله عليه وسلم مِنْ وَّجَعٍ كَانَ يُصِيْبَنِيْ. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ.

1551. (29) [1/489అపరిశోధితం]

‘జైద్‌ బిన్‌ అర్‌ఖమ్‌ (ర) కథనం: నా కళ్ళల్లో నొప్పి ఉండేది. ప్రవక్త (స) నన్ను పరామర్శించటానికి వచ్చారు. [5] (అ’హ్మద్‌)

1552 – [ 30 ] ( ضعيف ) (1/489)

وَعَنْ أَنَسٍ: قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ تَوَضَّأَ فَأَحْسَنَ الْوُضُوْءَ وَعَادَ أَخَاهُ الْمُسْلِمَ مُحْتَسِبًا بُوْعِدَ مِنْ جَهَنَّمَ مَسِيْرَةَ سِتِّيْنَ خَرِيْفًا”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

1552. (30) [1/489బలహీనం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”పరిపూర్ణంగా వు’జూ చేసి పుణ్య ఫలాపేక్షతో ముస్లిమ్‌ సోదరుణ్ణి పరామర్శిస్తే, అతన్ని నరకం నుండి 60 సంవత్సరాల దూరం ఉంచడం జరుగుతుంది.” (అబూ దావూద్‌)

1553- [31] (صحيح) (1/489)

وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا مِنْ مُّسْلِمٍ يَّعُوْدُ مُسْلِمًا فَيَقُوْلُ سَبْعَ مَرَّاتٍ: “أَسْأَلُ اللهَ الْعَظِيْمَ رَبِّ الْعَرْشِ الْعَظِيْمَ أَنْ يَّشْفِيَكَ إِلَّا شُفِيَ إِلَّا أَنْ يَّكُوْنَ قَدْ حَضَرَ أَجَلُهُ” رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ .

1553. (31) [1/489దృఢం]

ఇబ్ను ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక ముస్లిమ్‌ మరో ముస్లిమ్‌ను పరామర్శించి, అతని కోసం 7 సార్లు ఈ దు’ఆ చదివితే అతనికి స్వస్థత లభిస్తుంది. అంటే అతని వ్యాధి నయమవుతుంది. అయితే అతనికి మరణసమయం వచ్చి ఉండ కూడదు. ”అస్‌ అలుల్లాహల్‌ ‘అ”జీమ, రబ్బల్‌ ‘అర్‌షిల్‌ ‘అ”జీమ్‌. అంయ్యష్‌ ఫీయక” — ‘నేను, గొప్పవాడైన, మహా సింహాసనానికి ప్రభువైన అల్లాహ్‌ను, నీకు ఆరోగ్యం ప్రసాదించమని అర్థిస్తున్నాను.’ (అబూ దావూద్‌, తిర్మిజి’)

1554 – [ 32 ] ( ضعيف ) (1/490)

وَعَنِ ابْنِ عَبَّاسٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم: كَانَ يُعَلِّمُهُمْ مِّنَ الْحُمّى وَمِنَ الْأَوْجَاعِ كُلِّهَا أَنْ يَّقُوْلُوْا: “بِسْمِ اللهِ الْكَبِيْرِ أَعُوْذُ بِاللهِ الْعَظِيْمِ مِنْ شَرِّ كُلِّ عِرْقٍ نَّعَّارٍ وَّمِنْ شَرِّ حَرِّ النَّارِ”. رَوَاهُ التِّرْمِذِيُّ. وَقَالَ هَذَا حَدِيْثٌ غَرِيْبٌ لَا يُعْرِفُ إِلَّا مِنْ حَدِيْثِ إِبْرَاهِيْمَ بْنِ إِسْمَاعِيْلَ وَهُوَ يُضَعَّفُ فِيْ الْحَدِيْثِ .

1554. (32) [1/490బలహీనం]

ఇబ్ను ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త(స) తన అనుచరులను జ్వరం, ఇతర నొప్పులు, వ్యాధులను దూరం చేయటానికి ఈ దు’ఆ నేర్పేవారు. ”బిస్మిల్లాహిల్‌ కబీరి, అ’ఊజు బిల్లాహిల్‌ ‘అ”జీమి, మిన్‌ షర్రి కుల్లి ‘ఇర్‌ఖిన్‌ న ‘ఆరిన్‌, వ మిన్‌ షర్రి హర్రిన్నారి.” — ‘అల్లాహ్‌ యొక్క శుభకరమైన నామ ముల ద్వారా నరాల చెడునుండి, అగ్ని యొక్క వేడి నుండి శరణుకోరుతున్నాను.’ (తిర్మిజి’ – బలహీనం).

1555 – [ 33 ] ( منكر ) (1/490)

وعَنْ أَبِي الدَّرْدَاءِ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “مَنِ أشْتَكَى مِنْكُمْ شَيْئًا أَوِ اشْتَكَاهُ أَخُ لَهُ فَلْيَقُلْ: رَبُّنَا اللهُ الَّذِيْ فِيْ السَّمَاءِ تَقَدَّسَ اسْمُكَ أَمْرُكَ فِيْ السَّمَاءِ وَالْأَرْضِ كَمَا أَنَّ رَحْمَتَكَ فِيْ السَّمَاءِ فَاجْعَلْ رَحْمَتَكَ فِيْ الْأَرْضِ اغْفِرْ لَنَا حُوْبَنَا وَخطَايَانَا أَنْتَ رَبُّ الطَّيِّبِيْنَ أَنْزِلْ رَحْمَةً مِّنْ رَّحْمَتِكَ وَشِفَاءً مِّنْ شِفَائِكَ عَلَى هَذَا الْوَجَعِ . فَيَبْرَأُ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

1555. (33) [1/490తిరస్కృతం]

అబూ దర్‌దా (ర) కథనం: ప్రవక్త (స) ”మీలో ఎవరైనా అనారోగ్యానికి గురయినా, అతని సోదరునికి ఏదైనా ఆపద వచ్చినా, ఈ దు’ఆ చదివితే వ్యాధి నయమవుతుంది” అని ప్రవచించారు. ”రబ్బునల్లా హుల్లజీ ఫిస్సమాయి, తఖద్దస ఇస్ముక, అమృక ఫిస్సమాయి’, వల్‌అర్‌’ది, కమా ర’హ్‌మతక ఫిస్స మాయి, ఫజ్‌’అల్‌ రహ్మతక ఫిల్‌అర్‌’ది, ఇ’గ్‌ఫిర్‌ లనా ‘హూబనా వ ‘ఖ’తా యానా, అంత రబ్బు త్తయ్యిబీన, అన్‌’జిల్‌ ర’హ్మతన్‌ మిన్‌ ర’హ్మతిక, వ షిఫాఅన్‌, మిన్‌ షిఫాయిక ‘అలా హాజల్‌ వజ్‌’హ్.” — ‘ఆకాశాల్లో ఉన్న మా ప్రభూ! నీ నామం పవిత్రమైనది, నీ అధికారం భూమ్యాకాశాల్లో నూ చెల్లుతుంది. నీ కారుణ్యం ఆకాశాల్లో ఉన్నట్టు భూమిపై కూడా దాన్ని వ్యాపింపజేయి, మా పాపాలను క్షమించు, నీవే పరిశుద్ధుల ప్రభువువు, ఇంకా నీ స్వస్థతను, కారుణ్యాన్ని ఈ బాధపై అవతరింపజేయి.’ (అబూ దావూద్‌)

1556 – [ 34 ] ( حسن ) (1/490)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا جَاءَ الرَّجُلُ يَعُوْدُ مَرِيْضًا فَلْيَقُلْ اَللّهُمَّ اشْفِ عَبْدَكَ يَنْكَأُ لَكَ عَدُوًّا أَوْ يَمْشِيْ لَكَ إِلَى جَنَازَةٍ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

1556. (34) [1/490ప్రామాణికం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరైనా మరొకరిని పరామర్శించటానికి వెళితే ఈ దు’ఆను చదవాలి.

అల్లాహుమ్మష్ఫి అబ్దక, యన్కాఉలక, అదువ్వన్అవ్ యమ్షీ లక ఇలా జనాజతిన్‌.’ ‘ఓ అల్లాహ్‌! నీ కోసం నీ శత్రువులను హాని చేకూర్చే, గాయపరిచే, చంపే, పోరాడే లేదా నీ ప్రీతికోసం జనా’జహ్ వెంట వెళ్ళే నీ దాసునికి ఆరోగ్యాన్ని ప్రసాదించు.’ (అబూ దావూద్‌)

1557 – [ 35 ] ( ضعيف ) (1/491)

عَنْ عَلِيِّ بْنِ زَيْدٍ عَنْ أُمَيَّةَ أَنَّهَا سَأَلَتْ عَائِشَةَ عَنْ قَوْلِ اللهِ عَزَّوَجَلَّ: (إِنْ تُبْدُوْا مَا فِيْ أَنْفُسِكُمْ أَوْ تُخْفُوْهُ يُحَاسِبْكُمْ بِهِ اللهُ؛ 2: 284 ) وَعَنْ قَوْلِهِ:(وَ مَنْ يَّعْمَلْ سُوْءًا  يُّجْزَبِهِ؛ 4: 123) فَقَالَتْ: مَا سَأَلَنِيْ عَنْهَا أَحَدٌ مُّنْذُ سَأَلْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم. فَقَالَ: “هَذِهِ مُعَاتَبَةُ اللهِ الْعَبْدَ فِيْمَا يُصِيْبُهُ مِنَ الْحُمَّى وَالنَّكْبَةِ حَتَّى الْبِضَاعَةَ يَضَعُهَا فِيْ يَدِ قَمِيْصِهِ فَيَفْقِدُهَا فَيَفْزَعُ لَهَا حَتَّى إِنَّ الْعَبْدَ لَيَخْرُجُ مِنْ ذُنُوْبِهِ كَمَا يَخْرُجُ الْتِّبْرُ الْأَحْمَرُ مِنَ الْكِيْرِ”. رَوَاهُ التِّرْمِذِيُّ .

1557. (35) [1/491బలహీనం]

‘అలీ బిన్‌ ‘జైద్‌, ఉమయ్య ద్వారా కథనం: అతను ‘ఆయి’షహ్‌ను ఈ ఆయతు గురించి, ”…వఇన్‌ తుబ్‌దూ మాఫీ అన్‌ఫుసికుమ్‌, అవ్‌తు’ఖ్‌ఫూహు, యు’హాసిబ్‌ కుమ్‌ బిహిల్లాహు…”– ‘మీరు మీ హృదయాలలో ఉన్నది వెలుబుచ్చినా లేక దాచినా, అల్లాహ్‌ మీనుంచి దాని లెక్క తీసుకుంటాడు.’ (సూ. అల్ బఖరహ్, 2:284) ”…మన్ య’అమల్‌ సూఅన్‌ యుజ్‌’జ బిహీ…” ‘…పాపం చేసిన వానికి, దానికి తగిన శిక్ష ఇవ్వబడుతుంది…’ (సూ. అన్-నిసాఅ’, 4:123) గురించి అడిగారు. దానికి ‘ఆయి’షహ్‌ (ర) ఇలా వ్రాసారు, ప్రవక్త (స)ను ఈ విషయం గురించి నేను అడిగినప్పటి నుండి, ఎవరూ నన్ను అడగలేదు.

ప్రవక్త (స) ఇలా వివరించారు, ”ఈ రెండు ఆయతుల్లో ఉన్న విచారణ మరియు శిక్ష, దాసునిపై అల్లాహ్‌ ఆగ్రహం. అల్లాహ్ జ్వరం ద్వారా, విచారం ద్వారా తన ఆగ్రహానికి గురిచేస్తాడు. చివరికి చేతుల్లో ఉంచుకున్న వస్తువు కూడా పోగొట్టుకుంటాడు. ఆందోళనకు గురవుతాడు. చివరికి అతడు తన పాపాల నుండి పరిశుద్ధుడై బయటపడతాడు. బంగారం, వెండి పరిశుభ్రమై బట్టీ నుండి బయటకు వచ్చినట్టు.” (తిర్మిజి’)  

1558 – [ 36 ] ( ضعيف ) (1/491)

وَعَنْ أَبِيْ مُوْسَى أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “لَا يُصِيْبُ عَبْدًا نَّكْبَةٌ فَمَا فَوْقَهَا أَوْ دُوْنَهَا إِلَّا بِذَنْبٍ وَمَا يَعْفُو اللهُ عَنْهُ أَكْثَرُ وَقَرَأَ: (وَمَا أَصَابَكُمْ مِنْ مُّصِيْبَةٍ فَبِمَا كَسَبَتْ أَيْدِيْكُمْ وَيَعْفُوْ عَنْ كَثِيْرٍ؛ 42: 30).  رَوَاهُ التِّرْمِذِيُّ.  

1558. (36) [1/491బలహీనం]

అబూ మూసా (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ‘దాసునికి వచ్చే చిన్నా, పెద్దా కష్టాలు, ఆపదలు, అతని ఏదో ఒక పాపం వల్లనే వస్తాయి. అయితే అల్లాహ్‌(త) చాలా పాపాలను క్షమించివేస్తాడు,’ అని పలికి దీన్ని సమర్థిస్తూ ఈ ఆయతును పఠించారు. ”వమా అ’సాబకుమ్‌ మిన్‌ ము’సీబతిన్‌, ఫబిమా కసబత్‌ ఐదీకుమ్‌ వ య’అఫుఅన్‌ కసీర్.” — ‘మీపై ఏ ఆపద వచ్చినా, అది మీ చేతులారా మీరు సంపాదించుకున్నదే! మరియు ఆయన (మీ తప్పులను) ఎన్నింటినో క్షమిస్తాడు.’ (సూ. అష్-షూరా’, 42:30). (తిర్మిజి’)

1559 – [ 37 ] ( صحيح ) (1/491)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ الْعَبْدَ إِذَا كَانَ عَلَى طَرِيْقَةٍ حَسَنَةٍ مِّنَ الْعِبَادَةِ ثُمَّ مَرِضَ قِيْلَ لِلْمَلَكِ الْمُوَكّلِ بِهِ: اكْتُبْ لَهُ مِثْلَ عَمَلِهِ إِذَا كَانَ طَلِيْقًا حَتَّى أَطْلِقَهُ أَوْ أَكْفِتَهُ إِلَيَّ”.

1559. (37) [1/491దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అమ్ర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”దాసుడు ఆరాధన యొక్క సరైన మార్గంపై ఉండి, అనారోగ్యానికి గురైతే అతని కర్మలు వ్రాసే దైవదూతను అతనికి ఆరోగ్యం ప్రసాదించేవరకు లేదా తన వద్దకు పిలుచుకునే వరకు ఆరోగ్యంగా ఉన్నప్పుడు చేసే కర్మలను వ్రాయమని ఆదేశించడం జరుగుతుంది.” (షర్‌’హుస్సున్నహ్‌)

1560 – [ 38 ] ( حسن ) (1/491)

وَعَنْ أَنَسٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “إِذَا ابْتَلَي الْمُسْلِمُ بِبَلاءٍ فِيْ جَسَدِهِ قِيْلَ لِلْمَلَكِ: اكْتُبْ لَهُ صَالِحَ عَمَلِهِ الَّذِيْ كَانَ يَعْمَلُ فَإِنْ شَفَاهُ غَسَّلَهُ وَطَهَّرَهُ وَإِنْ قَبَضَهُ غَفَرَ لَهُ وَرَحِمَهُ”. رَوَاهُمَا فِيْ شَرْحِ السُّنَّةِ .

1560. (38) [1/491ప్రామాణికం]

అనస్‌(ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక ముస్లిమ్‌ను శారీరక బాధలకు గురిచేస్తే, అతని కర్మలను వ్రాసే దైవ దూతను అతడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు చేసే కర్మలను వ్రాయమని ఆదేశించడం జరుగుతుంది. ఒకవేళ అల్లాహ్‌ అతనికి తిరిగి ఆరోగ్యం ప్రసాదిస్తే అతన్ని పాపాల నుండి పరిశుద్ధపరుస్తాడు. ఒకవేళ అతనికి మరణం ప్రసాదిస్తే, అతన్ని క్షమించివేస్తాడు, కరుణిస్తాడు.” (షర్‌’హు స్సున్నహ్‌)

1561 – [ 39 ] ( صحيح ) (1/492)

وَعَنْ جَابِرٍ بْنِ عَتِيْكٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلشَّهَادَةُ سَبْعٌ سِوَى الْقَتْلِ فِيْ سَبِيْلِ اللهِ: اَلْمَطْعُوْنُ شَهِيْدٌ وَالْغَرِيْقُ شَهِيْدٌ وَصَاحِبُ ذَاتِ الْجَنْبِ شَهِيْدٌ وَالْمَبْطُوْنَ شَهِيْدٌ وَصَاحِبُ الْحَرِيْقِ شَهِيْدٌ وَالَّذِيْ يَمُوْتُ تَحْتَ الْهَدْمِ شَهِيْد وَالْمِرْأَةُ تَمُوْتُ بِجَمْعٍ شَهِيْدٌ”. رَوَاهُ مَالِكٌ وَأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ.  

1561. (39) [1/492దృఢం]

జాబిర్‌ బిన్‌ ‘అతీక్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్ మార్గంలో వీరమరణం పొందటం కాకుండా మరో 7 వీరమరణం రకాలు ఉన్నాయి. 1.  ప్లేగువ్యాధి వల్ల మరణించిన వారు, 2. మునిగి మరణించిన వారు, 3. ప్రక్కల్లో నొప్పివల్ల మరణించిన వారు, 4. కలరా వ్యాధివల్ల మరణించిన వారు, 5. మంటల్లో కాలి మరణించినవారు, 6. క్రిందపడి మరణించినవారు, 7. గర్భవతి అయిన స్త్రీ, కడుపు నొప్పి వల్ల మరణిస్తే, లేక పెండ్లి కాని స్త్రీ కన్యగా మరణిస్తే. వీరందరికీ వీరమరణ ప్రతిఫలం లభిస్తుంది. (మాలిక్‌, అబూ దావూద్‌, నసాయి’)

1562 – [ 40 ] ( حسن ) (1/492)

وَعَنْ سَعْدٍ قَالَ: سُئِلَ النَّبِيُّ صلى الله عليه وسلم: أَيُّ النَّاسِ أَشَدُّ بَلَاءً؟ قَالَ: “الْأَنْبِيَاءُ ثُمَّ الْأَمْثَلُ فَالْأَمْثَلُ يُبْتَلَى الرَّجُلُ عَلَى حَسْبِ دِيْنِهِ فَإِنْ كَانَ صُلْبًا فِيْ دِيْنِهِ اشْتَدَّ بَلَاؤُهُ وَإِنْ كَانَ فِيْ دِيْنِهِ رِقَّةٌ هُوِّنَ عَلَيْهِ فَمَا زَالَ كَذَلِكَ حَتَّى يَمْشِيَ عَلَى الْأَرْضِ مَالَهُ ذَنْبٌ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ. وَقَالَ التِّرْمِذِيُّ : هَذَا حَدِيْثٌ حَسَنٌ صَحِيْحٌ .

1562. (40) [1/492ప్రామాణికం]

స’అద్‌ (ర) కథనం: ప్రవక్త (స)ను ఎవరు తీవ్ర బాధలకు గురవుతారని ప్రశ్నించటం జరిగింది. దానికి ప్రవక్త (స) దైవప్రవక్తలు, ప్రవక్తల వంటివారు, వీరి వంటి వారు, ఆ తరువాత మనిషి ధర్మంలో ఎంత నిలకడగా ఉంటే అంత తీవ్రంగా ఆపదలకు గురవుతాడు. ధర్మంలో దృఢంగా ఉంటే ఆపదలు కూడా తీవ్రంగా ఉంటాయి, ఒకవేళ ధర్మంలో తేలిగ్గా ఉంటే ఆపదలు కూడా తేలిగ్గా ఉంటాయి. ఒక ముస్లిమ్‌ పట్ల ఎల్లప్పుడూ ఇలాగే జరుగుతూ ఉంటుంది. చివరికి అతడు ఎటువంటి పాపభారం లేకుండా భూమి పై నడుస్తాడు. అంటే ఆపదలవల్ల అతని పాపాలన్నీ తొలగిపోతాయి. [6] (తిర్మిజి’ – ప్రామాణికం – దృఢం, ఇబ్ను మాజహ్, దార్మీ)

1563 – [ 41 ] ( ضعيف ) (1/492)

وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: مَا أَغْبِطُ أَحَدًا بِهَوْنِ مَوْتٍ بَعْدَ الَّذِيْ رَأَيْتُ مِنْ شِدَّةِ مَوْتِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. رَوَاهُ التِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ .

1563. (41) [1/492బలహీనం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: నేను ప్రవక్త(స) మరణ తీవ్రతను చూసినప్పటి నుండి, నేను మరొకరి సులభ తర మరణం గురించి కోరలేదు. [7] (తిర్మిజి’, నసాయి’)

1564 – [ 42 ] ( ضعيف ) (1/492)

وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: رَأَيْتُ النَّبِيَّ صلى الله عليه وسلم وَهُوَ بِالْمَوْتِ وَعِنْدَهُ قَدْحٌ فِيْهِ مَاءٌ وَهُوَ يُدْخِلُ يَدَهُ فِيْ الْقَدْحِ ثُمَّ يَمْسَحُ وَجْهَهُ ثُمَّ يَقُوْلُ: “اَللّهُمَّ أَعِنِّيْ عَلَى مُنْكَرَاتِ الْمَوْتِ أَوْ سَكَرَاتِ الْمَوْتِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ.

1564. (42) [1/492బలహీనం]

‘ఆయి’షహ్‌(ర) కథనం: ”ప్రవక్త(స)పై మరణ ఘడియ ఆసన్నమవడం నేను చూశాను. అప్పుడు ప్రవక్త (స) వద్ద నీళ్ళ గిన్నె ఉంది. ప్రవక్త (స) తన చేతిని అందులో ముంచి తన ముఖాన్ని తుడుచు కునేవారు. ఇంకా ఇలా పలికేవారు, ”అల్లాహుమ్మ అ’ఇన్నీ ‘అలామున్‌ కిరాతిల్‌ మౌతి” లేదా ”సకరాతిల్‌ మౌతి” — ‘ఓ అల్లాహ్‌! మరణ తీవ్రతపై నాకు సహాయం చేయి. లేదా మరణ ఒత్తిడి పట్ల నాకు సహాయం చేయి.’ [8]  (తిర్మిజి’, ఇబ్నె మాజహ్)

1565 – [ 43 ] ( حسن ) (1/493)

وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا أَرَادَ اللهُ تَعَالى بِعَبْدِهِ الْخَيْرِعَجَّلَ لَهُ الْعُقُوْبَةَ فِيْ الدُّنْيَا وَإِذَا أَرَادَ اللهُ بِعَبْدِهِ الشَّرَّ أَمْسَكَ عَنْهُ بِذَنْبِهِ حَتَّى يُوَافِيَهُ بِهِ يَوْمَ الْقِيَامَةِ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

1565. (43) [1/493ప్రామాణికం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌(త) మేలు చేయగోరే వారిని ప్రపంచంలోనే శిక్షకు గురిచేస్తాడు. అదే విధంగా అల్లాహ్‌(త) కీడు చేయదలచిన వారి నుండి శిక్షను ఆపివేస్తాడు. తీర్పుదినం నాడు పాపాలకు పూర్తిగా శిక్షకు గురిచేస్తాడు.” (తిర్మిజి’)

1566 – [ 44 ] ( حسن ) (1/493)

وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ عِظَمَ الْجَزَاءِ مَعَ عِظَمِ الْبَلَاءِ وَإِنَّ اللهَ عَزَّ وَجَلَّ إِذَا أَحَبَّ قَوْمًا ابْتَلَاهُمْ فَمَنْ رَّضِيَ فَلَهُ الرِّضَاءُ وَمَنْ سَخِطَ فَلَهُ السَّخَطُ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ .

1566. (44) [1/493ప్రామాణికం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”పెద్ద బహు మతి పెద్ద కష్టం ద్వారా లభిస్తుంది. అల్లాహ్‌(త) మేలు చేయగోరే జాతిని కష్టాలకు గురిచేస్తాడు. దానికి ఇష్టపడిన వారికి దైవప్రీతి లభిస్తుంది. దానిపట్ల అసంతృప్తిగా ఉంటే అల్లాహ్ (త) అగ్రహానికి గురి కావలసి వస్తుంది.”(తిర్మిజి’, ఇబ్నె మాజహ్)

1567 – [ 45 ] ( حسن ) (1/493)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَزَالُ الْبَلَاءُ بِالْمُؤْمِنِ أَوِ الْمُؤْمِنَةِ فِيْ نَفْسِهِ وَمَالِهِ وَوَلَدِهِ حَتَّى يَلْقَى اللهَ تَعَالى وَمَا عَلَيْهِ مِنْ خَطِيْئَةٍ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَرَوَى مَالِكٌ نَحْوَهُ. وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيْثٌ حَسَنٌ صَحِيْحٌ .

1567. (45) [1/493ప్రామాణికం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”విశ్వాస స్త్రీ పురుషులకు ఏదో ఒక కష్టం వస్తూనే ఉంటుంది. శారీరకంగా, ధనపరంగా, భార్యాబిడ్డల్లో, చివరికి ఎటువంటి పాపాలు లేకుండా అల్లాహ్‌ను కలుసుకుంటాడు.” (మాలిక్, తిర్మిజి’ – ప్రామాణికం, దృఢం)

1568 – [ 46 ] ( ضعيف ) (1/493)

وَعَنْ مُحَمَّدِ بْنِ خَالِدِ السُّلَمِيِّ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ الْعَبْدَ إِذَا سَبَقَتْ لَهُ مِنَ اللهِ مَنْزِلَةٌ لَمْ يَبْلُغْهَا بِعَمَلِهِ ابْتَلَاهُ اللهُ فِيْ جَسَدِهِ أَوْ فِيْ مَالِهِ أَوْ فِيْ وَلَدِهِ ثُمَّ صَبَّرَهُ عَلَى ذَلِكَ يُبْلِغَهُ الْمَنْزِلَةَ الَّتِيْ سَبَقَتْ لَهُ مِنَ اللهِ”. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ .

1568. (46) [1/493బలహీనం]

ము’హమ్మద్‌ బిన్‌ ‘ఖాలిద్‌ సులమి, తన తండ్రి తాతల ద్వారా కథనం: ”ప్రవక్త (స) ప్రవచనం, ‘అల్లాహ్‌ తరఫునుండి ఉన్నతస్థానం నిర్ణయించబడి, తన కర్మల ద్వారా అక్కడకు చేరలేని వ్యక్తిని శారీరకంగా లేదా ధనపరంగా, లేదా సంతానపరంగా కష్టాలకు గురిచేస్తాడు. అనంతరం అతనికి దానిపై ఓర్పూ, సహనాలను ప్రసాదిస్తాడు. చివరికి ఆ వ్యక్తి అల్లాహ్‌ నిర్ణయించిన స్థానానికి చేరుకుంటాడు.” (అ’హ్మద్‌, అబూ దావూద్‌)

అంటే కష్టాల్లో ఓర్పూ సహనాలు ప్రదర్శించటం వల్ల ఉన్నత స్థానాన్ని పొందుతారు.

1569 – [ 47 ] ( حسن ) (1/494)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ شِخِّيْرٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَثَلَ ابْنِ آدَمَ وَإِلَى جَنْبِهِ تِسْعٌ وَتِسْعُوْنَ مَنِيَّةً إِنْ أَخْطَأَتْهُ الْمَنَايَا وَقَعَ فِيْ الْهَرَمِ حَتَّى يَمُوْتَ” .رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ .

1569. (47) [1/494ప్రామాణికం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ షి’ఖ్ఖీరి (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మానవుడి ప్రక్కలో 99 కష్టాలు, ఆపదలు పెట్టి సృష్టించటం జరిగింది. ఒకవేళ ఆ కష్టాలు రాకపోయినా వృద్ధాప్యానికి చేరుకొని చివరికి మరణిస్తాడు.” [9] (తిర్మిజి’ – ఏకోల్లేఖనం)

1570 – [ 48 ] ( حسن ) (1/494)

وَعَنْ جَابِرٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَوَدُّ أَهْلُ الْعَافِيَةِ يَوْمَ الْقِيَامَةَ حِيْنَ يُعْطَى أَهْلُ الْبَلَاءِ الثَّوَابَ لَوْ أَنَّ جُلُوْدَهُمْ كَانَتْ قُرِضَتْ فِيْ الدُّنْيَا بِالْمَقَارِيْضِ”. رَوَاهُ التِّرْمِذِيُّ .

1570. (48) [1/494ప్రామాణికం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తీర్పు దినం నాడు ప్రాపంచిక కష్టాలు అనుభవించిన వారికి ప్రతిఫలం ప్రసాదించినపుడు, ప్రపంచంలో క్షేమంగా ఉన్నవారు తమ శరీరాలను కత్తెరలతో కోసిఉంటే బాగుణ్ణు అని కోరు కుంటారు.” (తిర్మిజి’)

1571 – [ 49 ] ( ضعيف ) (1/494)

وَعَنْ عَامِرِ الرَّامِ قَالَ: ذَكَرَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم الْأَسْقَامَ فَقَالَ: “إِنَّ الْمُؤْمِنَ إِذَا أَصَابَهُ السَّقَمُ ثُمَّ عَافَاهُ اللهُ مِنْهُ كَانَ كَفَّارَةً لَمَّا مَضَى مِنْ ذُنُوْبِهِ وَمَوْعِظَةً لَهُ فِيْمَا يَسْتَقْبِلُ. وَإِنَّ الْمُنَافِقَ إِذَا مَرِضَ ثُمَّ أُعْفِيَ كَانَ كَالْبَعِيْرِ عَقَلَهُ أَهْلَهُ ثُمَّ أَرْسَلُوْهُ فَلَمْ يَدْرِ لَمْ عَقَلُوْهُ وَلَمْ يَدْرِ لَمْ أَرْسَلُوْهُ”. فَقَالَ رَجُلٌ يَّا رَسُوْلَ اللهِ وَمَا الْأَسْقَامُ؟ وَاللهِ مَا مَرِضْتُ قَطُّ فَقَالَ: “قُمْ عَنَّا فَلَسْتَ مِنَّا”.  رَوَاهُ أَبُوْ دَاوُدَ .

1571. (49) [1/494బలహీనం]

‘ఆమిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) వ్యాధులను గురించి ప్రస్తావించి, ‘విశ్వాసిని వ్యాధులకు మరియు కష్టాలకు గురిచేసిన తర్వాత అల్లాహ్‌(త) ఆరోగ్యం, క్షేమం ప్రసాదిస్తే, ఈ వ్యాధి, కష్టం అతని అంతకు ముందు పాపా లకు పరిహారం అయిపోతుంది. భవిష్యత్తు కోసం గుణపాఠం, హితబోధ అయిపోతుంది. కపటాచారి అనారోగ్యానికి గురయితే, అతనికి ఆరోగ్యం ఇవ్వబడుతుంది. కట్టిన ఒంటెను యజమాని వదలి వేసినట్టు. అయితే ఆ ఒంటెకు ఎందుకు కట్టాడో, ఎందుకు వదలివేసాడో తెలియదు’ అని అన్నారు. ఒకవ్యక్తి, ‘ఓ ప్రవక్తా! వ్యాధులు అంటే ఏమిటి? అల్లాహ్ సాక్షి! నేను ఏనాడూ అనారోగ్యానికి గురికాలేదు,’ అని అన్నాడు. దానికి ప్రవక్త (స) ‘మా దగ్గర నుండి వెళ్ళిపో, నీవు మాలోనివాడవు కావు,’ అని అన్నారు. [10] (అబూ దావూద్‌)

1572 – [ 50 ] ( ضعيف ) (1/495)

وَعَنْ أَبِيْ سَعِيْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا دَخَلْتُمْ عَلَى الْمَرِيْضِ فَنِفْسُوْا لَهُ فِيْ أَجَلِهِ فَإِنَّ ذَلِكَ لَا يَرُدُّ شَيْئًا وَيَطِيْبُ بِنَفْسِهِ”.  رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ. وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ.

1572. (50) [1/495బలహీనం]

అబూ స’యీద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు ఎవరికైనా పరామర్శించటానికి వెళితే, అతని దుఃఖ-విచారాల పట్ల ఓదారుస్తూ, ‘భయపడవలసిన పనిలేదు, నీకింకా చాలా జీవితం ఉంది. నీకు దీర్ఘ ఆయుష్షు ఉంది’ అని అనండి. ఇది అల్లాహ్‌ (త) ఆదేశాలను ఎంతమాత్రం దూరం చేయజాలదు. కాని రోగికి సంతోషం, సంతృప్తి కలుగుతుంది. (తిర్మిజి’ / ఏకోల్లేఖనం, ఇబ్నె మాజహ్)

1573 – [ 51 ] ( حسن ) (1/495)

وَعَنْ سُلَيْمَانَ بْنِ صُرَدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ قَتَلَهُ بَطْنُهُ لَمْ يُعَذَّبْ فِيْ قَبَرِهِ”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ. وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ.

1573. (51) [1/495ప్రామాణికం]

సులైమాన్‌ బిన్‌ ‘సురది (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”కడుపు ద్వారా మరణించిన వాడు సమాధిలో శిక్షకు గురికాడు.” [11](అ’హ్మద్‌, తిర్మిజి’ – ఏకోల్లేఖనం)

—–

اَلْفَصْلُ الثَّالِثُ  మూడవ విభాగం 

1574 – [ 52 ] ( صحيح ) (1/495)

عَنْ أَنَسٍ قَالَ: كَانَ غُلَامُ يَّهُوْدِيٌّ يَّخْدِمُ النَّبِيَّ صلى الله عليه وسلم فَمَرِضَ فَأَتَاهُ النَّبِيُّ صلى الله عليه وسلم يَعُوْدُهُ فَقَعَدَ عِنْدَ رَأْسِهِ فَقَالَ لَهُ: “أَسْلِمْ”. فَنَظَرَ إِلَى أَبِيْهِ وَهُوَ عِنْدَهُ. فَقَالَ: أَطِعْ أَبَا الْقَاسِمِ. فَأَسْلَمَ. فَخَرَجَ النَّبِيُّ صلى الله عليه وسلم وَهُوَ يَقُوْلُ: “اَلْحَمْدُ لِلّهِ الَّذِيْ أَنْقَذَهُ مِنَ النَّارِ”. رَوَاهُ الْبُخَارِيُّ .

1574. (52) [1/495దృఢం]

అనస్‌ (ర) కథనం: ఒక యూద బాలుడు ప్రవక్త (స)కు సేవచేసేవాడు. అనారోగ్యానికి గురయ్యాడు. ప్రవక్త (స) ఆ బాలుణ్ణి పరామర్శించటానికి వెళ్ళారు. అతని తల వద్ద కూర్చొని, ‘ఇస్లామ్‌ స్వీకరించు’ అని అన్నారు. ఆ బాలుడు దగ్గరగా నిలబడి ఉన్న తన తండ్రివైపు చూశాడు. అతని తండ్రి, ‘అబుల్‌ ఖాసిమ్‌ చెప్పింది విను, ఇస్లామ్‌ స్వీకరించు అని’ అన్నాడు. అనంతరం ఆ బాలుడు ఇస్లామ్‌ స్వీకరించాడు. ప్రవక్త (స) లేచి బయటకు వచ్చారు. అనుచరులను ఉద్దే శించి, ‘ఆ బాలుణ్ణి నరకం నుండి విముక్తి ప్రసాదించిన అల్లాహ్‌ కొరకే స్తోత్రాలన్నీ’ అని అన్నారు. [12](బు’ఖారీ)

1575 – [ 53 ] ( ضعيف ) (1/495)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ عَادَ مَرِيْضًا نَادَى مُنَادٍ فِيْ السَّمَاءِ: طِبْتَ وَطَابَ مَمْشَاكَ وَتُبُوِّأْتَ مِنَ الْجَنَّةِ مَنْزِلًا”. رَوَاهُ ابْنُ مَاجَهُ.

1575. (53) [1/495బలహీనం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరైనా రోగిని పరామర్శించటానికి వెళితే, ఆకాశంపై నుండి దైవదూత ‘నీకు ఉభయలోకాల్లో సంతోషం ప్రాప్తించుగాక! ఉభయలోకాల్లో నీవు సంచరించటం శుభం అగుగాక, నీవు రోగిని పరామర్శించి స్వర్గంలో నివాసం సంపాదించు కున్నావు” అని పలుకుతాడు. (ఇబ్నె మాజహ్)

1576 – [ 54 ] ( صحيح ) (1/496)

وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: إِنَّ عَلِيًّا خَرَجَ مِنْ عِنْدَ النَّبِيِّ صلى الله عليه وسلم فِيْ وَجَعِهِ الَّذِيْ تُوُفِّيَ فِيْهِ. فَقَالَ النَّاسُ: يَا أَبَا الْحَسَنِ كَيْفَ أَصْبَحَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم؟ قَالَ: أَصْبَحَ بِحَمْدِ اللهِ بَارِئًا. رَوَاهُ الْبُخَارِيُّ .

1576. (54) [1/496దృఢం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: చివరిసారి అనారోగ్యంగా ఉన్న ప్రవక్త (స) దగ్గర నుండి ‘అలీ (ర) బయటకు వచ్చారు. ప్రజలు, ‘ప్రవక్త (స) ఎలా ఉన్నారు,’ అని అడి గారు. ‘అలీ (ర) సమాధానం ఇస్తూ, ‘అల్‌’హమ్‌దు లిల్లాహ్‌ క్షేమంగా ఉన్నారు’ అని అన్నారు. (బు’ఖారీ)

1577 – [ 55 ] ( متفق عليه ) (1/496)

وَعَنْ عَطَاءِ بْنِ أَبِيْ رِبَاحٍ قَالَ: قَالَ لِيْ ابْنُ عَبَّاسٍ رَضِيَ اللهُ عَنْهُ: أَلَا أُرِيْكَ امْرَأَةً مِّنْ أَهْلِ الْجَنَّةِ؟ فَقُلْتُ: بَلَى. قَالَ: هَذِهِ الْمَرْأَةُ السَّوْدَاءُ أَتَتِ النَّبِيَّ صلى الله عليه وسلم. فَقَالَتْ: إِنِّيْ أُصْرَعُ وَإِنِّيْ أَتَكَشَّفُ فَادْعُ اللهَ تعالى لِيْ. قَالَ: ” إِنْ شِئْتِ صَبَرْتِ وَلَكَ الْجَنَّةُ وَإِنْ شِئْتِ دَعَوْتُ اللهَ تعالى أَنْ يُّعَافِيَكِ”. فَقَالَتْ: أَصْبِرْ. فَقَالَتْ: إِنِّيْ أَتَكَشَّفُ فَادْعُ اللهَ أَنْ لَّا أَتَكَشَّفَ فَدَعَا لَهَا .

1577. (55) [1/496ఏకీభవితం]

‘అ’తా బిన్‌ అబీ రిబా’హ్‌ (ర) కథనం: ఇబ్నె ‘అబ్బాస్‌ నాతో ‘నేను నీకు స్వర్గవాసుల్లోని స్త్రీని చూపెట్టనా’ అని అన్నారు. దానికి నేను’ చూపెట్టండి’ అని అన్నాను. అప్పుడు ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) ”ఈ నల్లని స్త్రీ ప్రవక్త (స) వద్దకు వచ్చి, ‘ఓ ప్రవక్తా! నాకు మూర్ఛవ్యాధి ఉంది. ఆ స్థితిలో దుస్తులు చెదిరి పోతున్నాయి. తమరు అల్లాహ్‌(త)ను నాకు ఆరోగ్యం ప్రసాదించమని ప్రార్థించండి’ అని విన్నవించు కుంది. దానికి ప్రవక్త (స) ‘ఒకవేళ నీవు సహనం పాటిస్తే నీ కోసం స్వర్గం ఉంది. ఒకవేళ నీవు కోరితే నీ ఆరోగ్యం గురించి నేను అల్లాహ్‌(త) ను ప్రార్థిస్తాను’ అని అన్నారు. దానికి ఆ స్త్రీ ‘స్వర్గం పొందటానికి నేను సహనం పాటిస్తాను, కాని నా దుస్తులు చెదిరి పోతున్నాయి. ఆ స్థితిలో నా మర్మాంగాలు బహిర్గతం కాకూడదని తమరు అల్లాహ్‌ను ప్రార్థించండి,’ అని విన్నవించుకుంది. అప్పుడు ప్రవక్త (స) ఆమె గురించి అల్లాహ్‌(త)ను ప్రార్థించారు” అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

1578 – [ 56 ] ( صحيح ) (1/496)

وَعَنْ يَحْيَى بْنِ سَعِيْدٍ قَالَ: إِنَّ رَجُلًا جَاءَهُ الْمَوْتُ فِيْ زَمَنِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. فَقَالَ رَجُلٌ: هَنِيْئًا لَهُ مَاتَ وَلَمْ يُبْتَلْ بِمَرَضٍ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “وَيْحَكَ وَمَا يُدْرِيْكَ لَوْ أَنَّ اللهَ ابْتَلَاهُ بِمَرَضٍ فَكَفَّرَ عَنْهُ مِنْ سَيِّئَاتِهِ”. رَوَاهُ مَالِكٌ مُّرْسَلًا .

1578. (56) [1/496దృఢం]

యహ్‌యా బిన్‌ స’యీద్‌ (ర) కథనం: ప్రవక్త (స) కాలం లో అకస్మాత్తుగా ఒక వ్యక్తి మరణించాడు. మరో వ్యక్తి ‘వీడిమరణం శుభం అగుగాక, ఎటువంటి ఆపదకూ గురికాలేదు’ అని అన్నాడు. అది విన్న ప్రవక్త (స) ‘నీపై జాలివేస్తోంది. నీకు తెలియదు, ఒకవేళ అల్లాహ్‌ (త) అతన్ని వ్యాధికి గురిచేసి చంపితే, దాని వల్ల అల్లాహ్‌(త) అతని పాపాలను క్షమిస్తాడు,’ అని అన్నారు. (మాలిక్‌ / తాబయీ ప్రోక్తం)

1579 – [ 57 ] ( حسن ) (1/496)

وَعَنْ شَدَّادِ بْنِ أَوْسٍ وَالصُّنَابِحِيِّ أَنَّهُمَا دَخَلَا عَلَى رَجُلٍ مَّرِيْضٍ يَّعُوْدَانِهِ. فَقَالَا لَهُ: كَيْفَ أَصْبَحْتَ. قَالَ أَصْبَحْتَ بِنِعْمَةٍ. فَقَالَ لَهُ شَدَّادٌ: أَبْشِرْ بِكَفَّارَاتِ السَّيِّئَاتِ وَحَطِّ الْخَطَايَا. فَإِنِّيْ سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “إِنَّ اللهَ عز وجل يَقُوْلُ إِذَا أَنَا ابْتَلَيْتُ عَبْدًا مِّنْ عِبَادِيْ مُؤْمِنًا فَحَمِدَنِيْ عَلَى مَا ابْتَلَيْتُهُ فَإِنَّهُ يَقُوْمُ مِنْ مَضْجِعِهِ ذَلِكَ كَيَوْمِ وَّلَدَتْهُ أُمُّهُ مِنَ الْخَطَايَا. وَيَقُوْلُ الرَّبُّ تَبَارَكَ وَتَعَالى: أَنَا قَيَّدْتُّ عَبْدِيْ وَابْتَلَيْتُهُ فَأَجْرُوْا لَهُ مَا كُنْتُمْ تُجْرُوْنَ لَهُ وَهُوَ صَحِيْحٌ”. رَوَاهُ اَحْمَدُ .

1579. (57) [1/496ప్రామాణికం]

షద్దాద్‌ బిన్‌ ‘ఔస్‌ (ర) మరియు  ‘సునాబిహియ్యి ఇద్దరూ కలసి ఒక రోగిని పరామర్శించటానికి వెళ్ళారు. ‘నీ పరిస్థితి ఎలా ఉంది, ఈ ఉదయం ఎలా మేల్కొన్నావు’ అని అడిగారు. దానికి ఆ వ్యక్తి ‘దైవానుగ్రహం ద్వారా నేను ఉదయం లేచాను. అంటే అల్లాహ్‌ (త) దయవల్ల క్షేమంగా ఈ రోజు లేచాను’ అని అన్నాడు. అప్పుడు షద్దాద్‌, ”పాపాలు క్షమించబడటంపై సంతోషించు, ఎందుకంటే ప్రవక్త(స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ‘అల్లాహ్‌ ఆదేశం: ” విశ్వాసిని ఏదైనా కష్టానికి గురిచేసి, దానిపై అతడు నన్ను స్తోత్రించి, తన పడకపై నుండి లేస్తే, అతడు తన పాపాల నుండి పరిశుద్ధుడై, ఈ రోజే అతడు జన్మించినట్టుగా మారిపోతాడు. ఇన్ని రోజులు నేనతన్ని బంధించి, కష్టాలకు గురిచేసి ఉంచాను. ఆరోగ్యంగా ఉన్నప్పుడు వ్రాసే సత్కార్యాలు అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా వ్రాయమని దైవదూతలకు ఆదేశిస్తాడు.” (అ’హ్మద్‌)

1580 – [ 58 ] ( ضعيف ) (1/497)

وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا كَثُرَتْ ذُنُوْبُ الْعَبْدِ وَلَمْ يَكُنْ لَهُ مَا يُكَفِّرُهَا مِنَ الْعَمَلِ ابْتَلَاهُ اللهُ بِالْحُزْنِ لِيُكَفِّرَهَا عَنْهُ “. رَوَاهُ أَحْمَدُ.

1580. (58) [1/497బలహీనం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”దాసుని కర్మపత్రంలో పాపాలు అధికమై, అతని వద్ద పాపాలకు పరిహారంగా ఎటువంటి సత్కార్యం లేకపోతే, అల్లాహ్‌ (త) అతన్ని దుఃఖ-విచారాలకు గురిచేసి, దాని ద్వారా అతని పాపాలను క్షమిస్తాడు.” (అ’హ్మద్‌)

1581 – [ 59 ] ( صحيح ) (1/497)

وَعَنْ جَابِرٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ عَادَ مَرِيْضًا لَمْ يَزَلْ يَخُوْضُ الرَّحْمَةَ حَتَّى يَجْلِسَ فَإِذَا جَلَسَ اغْتَمَسَ فِيْهَا”. رَوَاهُ مَالِكٌ وَأَحْمَدُ .

1581. (59) [1/497దృఢం]

జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరైనా రోగిని పరామర్శించడానికి బయలుదేరితే, అతడు అల్లాహ్ కారుణ్యంలో ఈదుతూ ఉంటాడు . అతడు కూర్చుంటే, అల్లాహ్ కారుణ్యంలో మునిగిపోతాడు. (మాలిక్, అ’హ్మద్)

1582 – [ 60 ] ( ضعيف ) (1/497)

وَعَنْ ثَوْبَانَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “إِذَا أَصَابَ أَحَدُكُمْ الْحُمّى فَإِنَّ الْحُمَّى قِطْعَةٌ مِّنَ النَّارِ فَلْيُطْفِئْهَا عَنْهُ بِالْمَاءِ فَلْيَسْتَنْقِعْ فِيْ نَهْرٍ جَارٍ وَلْيَسْتَقْبِلْ جَرْيَتَهُ فَيَقُوْلُ:) بِسْمِ اللهِ اَللّهُمَّ اشْفِ عَبْدَكَ وَصَدِّقْ رَسُوْلَكَ( بَعْدَ صَلَاةِ الصُّبْحِ وَقَبْلَ طُلُوْعِ الشَّمْسِ وَلْيَنْغَمِسْ فِيْهِ ثَلَاثَ غَمَسَاتٍ ثَلَاثَةَ أَيَّامٍ فَإِنْ لَمْ يَبْرَأْ فِيْ ثَلَاثٍ فَخَمْسٌ فَإِنْ لَّمْ يَبْرَأْ فِيْ خَمْسٍ فَسَبْعٌ فَإِنْ لَّمْ يَبْرَأْ فِيْ سَبْع فَتِسْعٌ فَإِنَّهَا لَا تَكَادُ تَجَاوِزُ تِسْعًا بِإِذْنِ اللهِ عَزَّ وَجَلَّ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ .

1582. (60) [1/497బలహీనం]

సౌ’బాన్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీలో ఎవరికైనా జ్వరం వస్తే, జ్వరం ఒక అగ్నికణం, దాన్ని నీటితో ఆర్పివేయండి. అదెలా అంటే, ప్రవహిస్తున్న కాలువ, నదీ ప్రవాహంలో నిలబడి, ”బిస్మిల్లాహి అల్లాహుమ్మష్‌ఫి ‘అబ్‌దక వ ‘సద్దిఖ్‌ రసూలక” — ‘అల్లాహ్‌ పేరుతో ఆరోగ్యం అర్థిస్తున్నాను. ఓ అల్లాహ్‌! నీ దాసునికి ఆరోగ్యం ప్రసాదించు, ఇంకా నీ ప్రవక్త మాటను నిజం చేసి చూపించు.’  దీన్ని ప్రతి రోజూ ఉదయం నమా’జు తర్వాత సూర్యోదయానికి ముందు చేయాలి. మూడు రోజుల వరకు చేయాలి. ఒకవేళ 3 రోజుల్లో తగ్గకపోతే 5 రోజులు చేయాలి. ఒకవేళ 5 రోజుల్లో తగ్గకపోతే 7 రోజులు చేయాలి. ఒకవేళ 7 రోజుల్లో తగ్గకపోతే 9 రోజులు చేయాలి. ఒకవేళ అల్లాహ్‌ కోరితే 9 రోజుల్లో తగ్గిపోతుంది. అంత కంటే ముందుకు వెళ్ళదు. (తిర్మిజి’ – ఏకోల్లేఖనం)

1583 – [ 61 ] ( ضعيف ) (1/498)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: ذُكِرَتِ الْحُمّى عِنْدَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَسَبَّهَا رَجُلٌ. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “لَا تَسُبَّهَا فَإِنَّهَا تَنْفِي الذُّنُوْبَ كَمَا تَنْفِيْ النَّارُ خَبَثَ الْحَدِيْدَ”. رَوَاهُ ابْنُ مَاجَهُ.

1583. (61) [1/498బలహీనం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ముందు జ్వరం గురించి ప్రస్తావించడం జరిగింది. ఒక వ్యక్తి జ్వరాన్ని తిట్టాడు, చెడుగా మాట్లాడాడు. అది విని ప్రవక్త (స) ‘జ్వరాన్ని తిట్టకు, చెడుగా మాట్లాడకు. ఎందుకంటే, బట్టీ ఇనుము యొక్క తుప్పును దూరం చేసినట్టు ఈ జ్వరం పాపాలను దూరం చేస్తుంది’ అని అన్నారు. (ఇబ్నె మాజహ్)

1584 – [ 62 ] ( صحيح ) (1/498)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: إِنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم عَادَ مَرِيْضًا فقَالَ: “أَبْشِرُ فَإِنَّ اللهَ تَعَالى يَقُوْلُ: هِيَ ناَرِيْ أُسَلِّطُهَا عَلَى عَبْدِيْ الْمُؤْمِنِ فِيْ الدُّنْيَا لِتَكُوْنَ حَظَّهُ مِنَ النَّارِ يَوْمَ الْقِيَامَةِ”. رَوَاهُ أَحْمَدُ وَابْنُ مَاجَهُ وَالْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ.

1584. (62) [1/498దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఒక రోగిని పరామర్శించి, సంతోషించు! ఎందుకంటే అల్లాహ్ (త) ఈ జ్వరం నా అగ్ని, నేను ప్రపంచంలో జ్వరానికి గురిచేసిన దాసునికి తీర్పుదినం నాడు ఈ జ్వరం నరక శిక్షకు పరిహారం అయిపోతుంది. (అ’హ్మద్‌, ఇబ్నె మాజహ్, బైహఖీ-షు’అబిల్ ఈమాన్)

1585 – [ 63 ] ( لم تتم دراسته ) (1/498)

وَعَنْ أَنَسٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “إِنَّ الرَّبَّ سُبْحَانَهُ وَ تَعَالى يَقُوْلُ: وَعِزَّتِيْ وَجَلَالِيْ لَا أَخْرِجُ أَحَدًا مِّنَ الدُّنْيَا أُرِيْدُ أَغْفِرَ لَهُ حَتَّى أَسْتَوْفِيَ كُلَّ خَطِيْئَةٍ فِيْ عُنُقِهِ بِسَقْمٍ فِيْ بَدَنِهِ وَإِقْتَارٍ فِيْ رِزْقِهِ” .رَوَاهُ  رَزِيْنٌ.  

1585. (63) [1/498అపరిశోధితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌ తన గౌరవం, గొప్పతనంపై ప్రమాణం చేసి ఇలా ఆదేశిస్తున్నాడు, ‘నేను క్షమించగోరిన ప్రతి వ్యక్తిని అతని మెడనుండి, అతని శరీరం నుండి వ్యాధుల ద్వారా, ఇంకా అతని ఉపాధి నుండి పేదరికం ద్వారా పూర్తి పరిహారం తీసుకోనంత వరకు ప్రపంచం నుండి తొలగించను.” [13] (ర’జీన్‌)

1586 – [ 64 ] ( لم تتم دراسته ) (1/498)

وَعَنْ شَقِيْقٍ قَالَ: مَرِضَ عَبْدُ اللهِ بْنِ مَسْعُوْدٍ فَعُدْنَاهُ فَجَعَلَ يَبْكِيْ فَعُوْتِبَ فَقَالَ: إِنِّيْ لَا أَبْكِيْ لِأَجْلِ الْمَرَضِ لِأَنِّيْ سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “اَلْمَرَضُ كَفَّارَةٌ”. وَإِنَّمَا أَبْكِيْ أَنَّهُ أَصَابَنِيْ عَلَى حَالِ فَتْرَةٍ وَلَمْ يُصِبْنِيْ فِيْ حَالِ اجْتِهَادٍ لِأَنَّهُ يُكْتَبُ لِلْعَبْدِ مِنَ الْأَجْرِ إِذَا مَرِضَ مَا كَانَ يَكْتُبُ لَهُ قَبْلَ أَنْ يَّمْرَضَ فَمَنَعَهُ مِنْهُ الْمَرَضُ. رَوَاهُ رَزِيْنٌ.

1586. (64) [1/498అపరిశోధితం]

షఖీఖ్‌ (ర) కథనం: ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌  అనారోగ్యానికి గురయ్యారు. మేము అతన్ని పరామర్శించటానికి వెళ్ళాము. అప్పుడతను ఏడ్వ సాగారు. ప్రజలు అతన్ని ‘వ్యాధి బాధలో, జీవితంపై ప్రేమతో ఎందుకలా ఏడుస్తున్నావు’ అని వారించారు. దానికి ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) ”నేను వ్యాధి బాధతో ఏడ్వటం లేదు. ఎందుకంటే ప్రవక్త (స) ఇలా అంటూ ఉండగా నేను విన్నాను, ‘వ్యాధి పాపాలకు పరిహారం,’ అంటే అనారోగ్యానికి గురైతే, దానివల్ల పాపాలు క్షమించబడతాయి.’ ఇంకా నేను ఎందుకు ఏడుస్తున్నానంటే, ముసలితనంలో అనారోగ్యానికి గురయ్యాను. యుక్త వయస్సులో అనారోగ్యానికి గురి కాలేదు. ఎందుకంటే ఎవరైనా అనారోగ్యానికి గురైతే, అనారోగ్యం వల్ల ఆరోగ్యంలో చేసే సత్కార్యాలు చేయలేరు. అయితే ఆరోగ్యంలో సత్కార్యాలు చేస్తూ ఉంటే, అనారోగ్యంలో కూడా వ్రాయబడతాయి. ఇప్పుడు సాధారణంగా సత్కార్యాలు చేయలేక పోతున్నాను,’ అని అన్నారు.” [14](ర’జీన్‌)

1587 – [ 65 ] ( ضعيف جدا ) (1/498)

وَعَنْ أَنَسٍ قَالَ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم لَا يَعُوْدُ مَرِيْضًا إِلَّا بَعْدَ ثَلَاثٍ. رَوَاهُ ابْنُ مَاجَهُ وَالْبَيْهَقِيُّ فِيْ شُعُبِ الْإِيْمَان

1587. (65) [1/498అతి బలహీనం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) మూడు రోజుల తర్వాత పరామర్శించటానికి వెళ్ళేవారు.[15] (ఇబ్నె మాజహ్, బైహఖీ)

1588 – [ 66 ] ( ضعيف ) (1/499)

وَعَنْ عُمَرَ بْنِ الْخَطَّابِ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا دَخَلْتَ عَلَى مَرِيْضٍ فَمُرْهُ يَدْعُوْ لَكَ فَإِنَّ دَعَاءَهُ كَدُعَاءِ الْمَلَائِكَةِ”. رَوَاهُ ابْنُ مَاجَهُ.

1588. (66) [1/499బలహీనం]

‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు రోగిని పరామర్శించటానికి వెళితే, అతన్ని మీ గురించి దు’ఆ చేయమని కోరండి. ఎందుకంటే అతని దు’ఆ దైవదూతల దు’ఆ వంటిది.” [16] (ఇబ్నె మాజహ్)

1589 – [ 67 ] ( لم تتم دراسته ) (1/499)

وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: مِنَ السُّنَّةِ تَخْفِيْفُ الْجُلُوْسِ وَقِلَّةُ الصُّخَبِ فِيْ الْعِيَادَةِ عِنْدَ الْمَرِيْضِ قَالَ: وَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم لَمَّا كَثُرَ لَغَطُهُمْ وَاخْتَلَافُهُمْ: “قُوْمُوْا عَنِّيْ”. رَوَاهُ رَزِيْنٌ.

1589. (67) [1/499అపరిశోధితం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: రోగిని పరామర్శించ టానికి వెళ్ళి కొంతసేపు కూర్చోవటం, కోలాహలం చేయకుండా నిశ్శబ్దంగా ఉండటం ప్రవక్త (స) సాంప్ర దాయం. ప్రవక్త (స) అనారోగ్యంగా ఉన్నప్పుడు ప్రజలు పరామర్శించటానికి వచ్చి, కోలాహలం, అభిప్రాయభేదాలు చర్చించటం చేస్తే, ప్రవక్త (స), ‘నా దగ్గర నుండి పోండి,’ అని అన్నారు.[17](ర’జీన్‌)

1590 – [ 68 ] ( ضعيف ) (1/499)

وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْعِيَادَةُ فَوَاقُ نَاقَةٍ”.

1590. (68) [1/499బలహీనం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”రోగిని ఒంటె పాలు రెండు సార్లు పితికినంతసేపు పరామర్శించాలి.

1591 – [ 69 ] ( ضعيف ) (1/499)

وَفِيْ رِوَايَةٍ سَعِيْدِ بْنِ الْمُسَيِّبِ مُرْسَلًا: “أَفْضَلُ الْعِيَادَةِ سُرْعَةُ الْقِيَامِ”. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ شُعُبِ الْإِيْمَانِ .

1591. (69) [1/499బలహీనం]

స’యీద్ బిన్ ముసయ్యిబ్ (ర) కథనం, మరో ఉల్లేఖనంలో, ‘రోగిని పరామర్శించి వెంటనే నిలబడటమే అన్నిటి కంటే ఉత్తమమైన పరామర్శ.’[18] (బైహఖీ-షు’అబిల్ ఈమాన్)

1592 – [ 70 ] ( ضعيف ) (1/499)

وَعَنِ ابْنِ عَبَّاسٍ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم عَادَ رَجُلًا. فَقَالَ لَهُ: “مَا تَشْتَهِىْ؟” قَالَ: أَشْتَهِيْ خُبْزَ بُرٍّ. قَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “مَنْ كَانَ عِنْدَهُ خُبْزُ بُرٍّ فَلْيَبْعَثْ إِلَى أَخِيْهِ”. ثُمَّ قَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “إِذَا اشْتَهَى مَرِيْضُ أَحَدِكُمْ شَيْئًا فَلْيُطْعِمْهُ”. رَوَاهُ ابْنُ مَاجَهُ.

1592. (70) [1/499బలహీనం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఒక రోగిని పరామర్శించి, ‘నీ మనసులో ఏం తినాలని ఉంది’ అని అడిగారు. దానికి ఆ వ్యక్తి, ‘గోదుమరొట్టె తినాలని ఉంది ప్రవక్తా,’ అని అన్నాడు. అది విని, ప్రవక్త (స) అనుచరులతో ‘మీలో ఎవరి వద్దనైనా గోదుమరొట్టె ఉంటే మీ సోదరునికి పంపించండి. రోగి ఒకవేళ హాని చేకూర్చని వస్తువు ఏదైనా తినాలని కోరితే, అతనికి తినిపించండి అని ప్రవచించారు.’ (ఇబ్నె మాజహ్)

1593 – [ 71 ] ( حسن ) (1/500)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو قَالَ تُوُفِّيَ رَجُلٌ بِالْمَدِيْنَةِ مِمَّنْ وُّلِدَ بِهَا فَصَلَّى عَلَيْهِ النَّبِيُّ صلى الله عليه وسلم فَقَالَ: “يَا لَيْتَهُ مَاتَ بِغَيْرِ مَوْلِدِهِ”. قَالُوْا وَلَمْ ذَاكَ يَا رَسُوْلَ اللهِ؟ قَالَ: “إِنَّ الرَّجُلَ إِذَا مَاتَ بِغَيْرِ مَوْلِدِهِ قَيْسَ لَهُ مِنْ مَّوْلِدِهِ إِلَى مُنْقَطَعِ أَثَرِهِ فِيْ الْجَنَّةِ”. رَوَاهُ النَّسَائِيُّ وَابْنُ مَاجَهُ.

1593. (71) [1/500ప్రామాణికం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అమ్ర్ (ర) కథనం: మదీనహ్ లో ఒకవ్యక్తి మరణించాడు. అతడు మదీనహ్ లోనే జన్మించాడు. ప్రవక్త (స) అతని జనా’జహ్ నమా’జు చదివించి, ‘ఈ వ్యక్తి మరో పరదేశంలో మరణిస్తే ఎంతబాగుణ్ణు’ అని అన్నారు. దానికి ప్రజలు ‘ఎందుకు ఓ ప్రవక్తా!’ అని అన్నారు. దానికి ప్రవక్త (స), ”పరదేశం లో మరణిస్తే, జన్మించిన స్థలం నుండి మరణించిన స్థలం దూరమంత ప్రదేశం స్వర్గంలో అతనికి లభిస్తుంది” అని అన్నారు. [19] (నసాయి’, ఇబ్నె మాజహ్)

1594 – [ 72 ] ( ضعيف ) (1/500)

وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَوْتُ غُرْبَةٍ شَهَادَةٌ”. رَوَاهُ ابْنُ مَاجَهُ.

1594. (72) [1/500బలహీనం]

ఇబ్ను ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ”ప్రయాణంలో మరణం వీరమరణం అని ప్రవచించారు.” (ఇబ్నె మాజహ్)

1595 – [ 73 ] ( موضوع ) (1/500)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ مَاتَ مَرِيْضًا مَاتَ شَهِيْدًا أَوْ وُقِيَ فِتْنَةَ الْقَبْرِ وَغُدِيَ وَرُيِحَ عَلَيْهِ بِرِزْقِهِ مِنَ الْجَنَّةِ”. رَوَاهُ ابْنُ مَاجَهُ وَالْبَيْهَقِيُّ فِيْ شُعُبِ الْإِيْمَانِ.

1595. (73) [1/500కల్పితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”వ్యాధికి గురై మరణించినవారు, వీరమరణం పొంది మరణిస్తారు. ఇంకా సమాధి శిక్ష నుండి రక్షించ బడతాడు. స్వర్గంలో ఎల్లప్పుడూ ఉదయం సాయంత్రం అతనికి ఆహారం లభిస్తుంది.” (ఇబ్నె మాజహ్, బైహఖీ-షు’అబిల్ ఈమాన్)

1596 – [ 74 ] ( صحيح ) (1/500)

عَنْ الْعِرْبَاضِ بْنِ سَارِيَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “يَخْتَصِمُ الشُّهَدَاءُ وَالْمُتَوَفُّوْنَ عَلَى فُرُشِهِمْ إِلَى رَبِّنَا فِيْ الَّذِيْنَ يَتَوَفَّوْنَ مِنَ الطَّاعُوْنِ فَيَقُوْلُ الشُّهَدَاءُ: إِخْوَانُنَا قُتِلُوْا كَمَا قُتِلْنَا وَيَقُوْلُ: الْمُتَوَفَّوْنَ عَلَى فُرُشِهِمْ إِخْوَانُنَا مَاتُوْا عَلَى فُرُشِهِمْ كَمَا مِتْنَا. فَيَقُوْلُ رَبُّنَا: انْظُرُوْا إِلَى جِرَاحَتِهِمْ فَإِنْ أَشْبَهَتْ جِرَاحَهُمْ جِرَاحَ الْمَقْتُوْلِيْنَ فَإِنَّهُمْ مِنْهُمْ وَمَعَهُمْ فَإِذَا جِرَاحُهُمْ قَدْ أَشْبَهَتْ جِرَاحَهُمْ”. رَوَاهُ أَحْمَدُ وَالنَّسَائِيُّ .

1596. (74) [1/500దృఢం]

‘ఇర్‌బా’ద్ బిన్‌ సారియహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”వీరమరణం పొందినవారు, పడకలపై మర ణించిన వారు వీరిరువురూ ప్లేగువ్యాధి వల్ల మర ణించిన వారి గురించి వివాదపడుతూ ‘వీరమరణం పొందినవారు. ప్లేగు వ్యాధి వలన మరణించిన వారు మా సోదరులని, ఎలాగైతే శత్రువుల వల్ల చంపబడి మేము వీరమరణం పొందినట్లు, ప్లేగువ్యాధి వల్ల మర ణించినవారు కూడా వీరమరణం పొందినవారే’ అని వాదిస్తారు. పడకలపై మరణించినవారు ‘వీరు మా సోదరులు. ఎందుకంటే మాలా వీరుకూడా పడకలపై మరణించారు’ అని వాదిస్తారు. అల్లాహ్‌ తీర్పు ఇస్తూ ప్లేగువ్యాధితో మరణించిన వారి గాయాలను చూడండి, వారి గాయాల వీరమరణం పొందినవారి గాయాల్లా ఉంటే, వారు అమరవీరులే. వారికి అటు వంటి ప్రతిఫలం లభిస్తుంది.” చూస్తే వారి గాయాలు వీరమరణం పొందిన వారి గాయాల్లా ఉంటాయి. అందు వల్ల వారిని అమరవీరుల్లా పరిగణించటం జరుగుతుంది. (అ’హ్మద్‌, నసాయి’)

1597 – [ 75 ] ( ضعيف ) (1/501)

وَعَنْ جَابِرٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “اَلْفَارُّ مِنَ الطَّاعُوْنِ كَالْفَارِّ مِنَ الزَّحْفِ وَالصَّابِرُ فِيْهِ لَهُ أَجْرُ شَهِيْدٍ”.  رَوَاهُ أَحْمَدُ.

1597. (75) [1/5014బలహీనం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్లేగు వ్యాధి నుండి పారిపోయినవారు, యుద్ధభూమి నుండి పారిపోయినట్టే. ప్లేగువ్యాధిలో సహనం, ఓర్పులను పాటిస్తే, వీరమరణం పొందినట్టు పుణ్యం లభిస్తుంది.” [20] (అ’హ్మద్‌)

=====

2 بَابُ تَمَنِّي الْمَوْتِ وَذِكْرِهِ

2. మరణకోరిక మరియు దానిని గుర్తుంచుకోవటం

మరణ సమయం నిర్థారించబడి ఉంది. దాన్ని కోర టం వల్ల, కోరకపోవటం వల్ల దాని సమయం మారదు. అందువల్లే చావును కోరటం సరికాదు. చావును జ్ఞాపకం చేసుకోవటానికి చాలా ప్రాధాన్యత ఉంది.

اَلْفَصْلُ الثَّالِثُ   మొదటి విభాగం 

1598 – [ 1 ] ( صحيح ) (1/502)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَتَمَنَّى أَحَدُكُمْ الْمَوْتَ إِمَّا مُحْسِنًا فَلَعَلَّهُ أَنْ يَّزْدَادَ خَيْرًا وَإِمَّا مُسِيْئًا فَلَعَلَّهُ أَنْ يَّسْتَعْتِبَ”. رَوَاهُ الْبُخَارِيُّ.

1598. (1) [1/502దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీలో ఎవ్వరూ చావును కోరుకోరాదు. ఒకవేళ అతడు ఉత్తముడైతే అధిక ఆయుష్షు వల్ల ఇంకా అధికంగా మంచి పనులు చేయవచ్చు, ఒకవేళ చెడ్డవాడైతే తౌబహ్, ఇస్తిగ్‌ఫార్‌ చేసి దైవాన్ని సంతృప్తి పరచ వచ్చు.” (బు’ఖారీ)

1599 – [ 2 ] ( صحيح ) (1/502)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَتَمَنّى أَحَدُكُمُ الْمَوْتَ وَلَا يَدَعُ بِهِ مِنْ قَبْلِ أَنْ يَّأْتِيَهُ إِنَّهُ إِذَا مَاتَ انْقَطَعَ أَمَلُهُ وَإِنَّهُ لَا يَزِيْدُ الْمُؤْمِن عُمْرُهُ إِلَّا خَيْرًا” .رَوَاهُ مُسْلِمٌ.

1599. (2) [1/502దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: మీలో ఎవ్వరూ చావును కోరటం గానీ, దాన్ని గురించి దు’ఆ చేయటం గానీ చేయరాదు. ఎందుకంటే మరణిస్తే కోరికలన్నీ వ్యర్థమవుతాయి. విశ్వాసి ఆయుష్షు అతని కోసం మంచినే పెంచుతుంది. (ముస్లిమ్‌)

1600 -[ 3 ] ( متفق عليه ) (1/502)

وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَتَمَنَّيَنَّ أَحَدُكُمُ الْمَوْتَ مِنْ ضُرٍّ أَصَابَهُ فَإِنْ كَانَ لَابُدَّ فَاعِلًا فَلْيَقُلِ: اَللّهُمَّ أحْيِنِيْ مَا كَانَتِ الْحَيَاةُ خَيْرًا لِّيْ وَتَوَفَّنِيْ إِذَا كَانَتْ الْوَفَاةُ خَيْرًا لِيْ. متفق عليه.

1600. (3) [1/502ఏకీభవితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీలో ఎవరికైనా కష్టాలువస్తే, చావును కోరుకోరాదు. కోరితే ఈ విధంగా కోరాలి. ”ఓ అల్లాహ్‌! నేను సజీవంగా ఉండటం నాకు లాభకరంగా ఉన్నంత వరకు నన్ను సజీవంగా ఉంచు. మరణం లాభకరంగా ఉన్నప్పుడు నాకు మరణం ప్రసాదించు.” [21] (బు’ఖారీ, ముస్లిమ్‌)

1601– [ 4 ] ( متفق عليه ) (1/502)

وَعَنْ عُبَادَةَ بْنِ الصَّامِتِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ أَحَبَّ لِقَاءَ اللهِ أَحَبَّ اللهُ لِقَاءَهُ وَمَنْ كَرِهَ لِقَاءَ اللهِ كَرِهَ اللهُ لِقَاءَهُ”. فَقَالَتْ عَائِشَةُ أَوْ بَعْضُ أَزْوَاجِهِ: إِنَّا لَنَكْرَهُ الْمَوْتَ. قَالَ:”لَيْسَ ذَلِكَ وَلَكِنِ الْمؤمِنَ إِذَا حَضَرَهُ الْمَوْتُ بُشِّرَ بِرِضْوَانِ اللهِ وَكَرَامَتِهِ فَلَيْسَ شَيْءٌ أَحَبَّ إِلَيْهِ مِمَّا أَمَامَهُ فَأَحَبَّ لِقَاءَ اللهِ وَأَحَبَّ اللهُ لِقَاءَهُ وَإِنَّ الْكَافِرَ إِذَا حُضِرَ بُشِّرَ بِعَذَابِ اللهِ وَعُقُوْبَتِهِ فَلَيْسَ شَيْءٌ أَكْرَهَ إِلَيْهِ مِمَّا أَمَامَهُ فَكَرِهَ لِقَاءَ اللهِ وَكَرِهَ اللهُ لِقَاءَهُ”.

1601. (4) [1/502ఏకీభవితం]

‘ఉబాదహ్‌ బిన్‌ ‘సామిత్‌ (ర) కథనం: ప్రవక్త (స) ”ఎవరైనా అల్లాహ్‌(త)ను కలవాలని కోరుకుంటే, అల్లాహ్‌ (త) కూడా అతన్ని కలవాలని కోరుకుంటాడు. మరెవరైనా అల్లాహ్‌(త)ను కలవ కూడదని కోరుకుంటే, అల్లాహ్‌ (త) కూడా కలవ కూడదని కోరుకుంటాడు,” అని అన్నారు. అది విని ‘ఆయి’షహ్‌ (ర) లేదా మరో భార్య, ‘ఓ ప్రవక్తా! మేమందరం చావుపట్ల సంతోషించం’ అని అన్నారు. దానికి ప్రవక్త (స) అదికాదు, ఒక విశ్వాసికి మరణ సమయం వచ్చినపుడు అల్లాహ్‌(త) సంతృప్తి, కారుణ్యాల గురించి శుభవార్త ఇవ్వడం జరుగుతుంది. అప్పుడావ్యక్తి చాలా సంతోషిస్తాడు. అప్పుడా వ్యక్తికి అది తప్ప మరోవిషయం ప్రియమైనదిగా ఉండదు. ఎందుకంటే ఆ వ్యక్తికి అది రాబోతుందని, అన్నిటి కంటే ఉత్తమమైనదని అంటే అది స్వర్గమని తెలిసి పోతుంది. అప్పుడావ్యక్తి అల్లాహ్‌(త)ను కలవడానికి అమిత శ్రద్ధతో ఉంటాడు. అల్లాహ్‌(త)కూడా అతనితో కలవాలని అమిత శ్రద్ధ ప్రదర్శిస్తాడు. అదేవిధంగా అవిశ్వాసి వద్దకు చావువస్తే, అతనికి దైవశిక్షల గురించి తెలియ పర్చటం జరుగుతుంది. అప్పుడావ్యక్తి దాన్ని అన్నిటికంటే నీచమైనదిగా భావిస్తాడు. ఎందుకంటే అతడిముందు నరకం ఉందని గ్రహిస్తాడు. అందువల్ల అల్లాహ్‌(త)ను కలవటాన్ని అసహ్యించుకుంటాడు. అల్లాహ్‌ కూడా అతన్ని కలవడానికి అసహ్యించుకుంటాడు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

1602 – [ 5 ] ( متفق عليه ) (1/503)

وَفِيْ رِوَايَةِ عَائِشَةَ: “وَالْمَوْتُ قَبْلَ لِقَاءِ اللهِ”.

1602. (5) [1/503ఏకీభవితం]

‘ఆయి’షహ్‌ (ర) ఉల్లేఖనంలో ”వల్‌ మౌతు ఖబ్‌ల లిఖా యిల్లాహి” అని ఉంది.

1603 – [ 6 ] ( متفق عليه ) (1/503)

وَعَنْ أَبِيْ قَتَادَةَ أَنَّهُ كَانَ يُحَدِّثُ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم مُرَّ عَلَيْهِ بِجَنَازَةٍ فَقَالَ: “مُسْتَرِيْحٌ أَوْ مُسْتَرَاَحٌ مِنْهُ”. فَقَالُوْا: يَا رَسُوْلَ اللهِ مَاالْمُسْتَرِيْحُ وَالْمُسْتَرَاحُ مِنْهُ؟ فَقَالَ: “اَلْعَبْدُ الْمُؤْمِنُ يَسْتَرِيْحُ مِنْ نَّصَبِ الدُّنْيَا وَأَذَاهَا إِلَى رَحْمَةِ اللهِ وَالْعَبْدُ الْفَاجِرُ يَسْتَرِيْحُ مِنْهُ الْعِبَادُ وَالْبِلَادُ وَالشَّجَرُ وَالدَّوَابُّ”.

1603. (6) [1/503ఏకీభవితం]

అబూ ఖతాదహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) సమీపం నుండి ఒక జనా’జహ్ వెళ్ళడం జరిగింది. ప్రవక్త (స), ‘ఇతడు విశ్రాంతి పొందుతాడు లేదా ఇతని నుండి ఇతరులు విశ్రాంతి పొందుతారు’ అని అన్నారు. దానికి ప్రజలు, ‘ప్రవక్తా! విశ్రాంతి పొందేవారెవరు, ఎవరి నుండి విశ్రాంతి లభిస్తుంది,’ అని అడిగారు. దానికి ప్రవక్త (స) విశ్వాసి మరణించి ప్రాపంచిక కష్టాల నుండి విశ్రాంతి పొందుతాడు. దైవానుగ్రహాలను పొందుతాడు. అవిశ్వాసి మరణించటం వల్ల దైవభక్తులు, పట్టణం, వృక్షాలు, జంతువులు విశ్రాంతి పొందుతారు’ అని అన్నారు. [22](బు’ఖారీ, ముస్లిమ్‌)

1604 – [ 7 ] ( صحيح ) (1/503)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عُمَرَ قَالَ: أَخَذَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم بِمَنْكِبِيْ. فَقَالَ: “كُنْ فِيْ الدُّنْيَا كَأَنَّكَ غَرِيْبٌ أَوْ عَابِرُ سَبِيْلٍ”. وَكَانَ ابْنُ عُمَرَ يَقُوْلُ: إِذَا أَمْسَيْتَ فَلَا تَنْتَظِرِالصَّبَاحَ وَإِذَا أَصْبَحَتَ فَلَا تَنْتَظِرِالْمَسَاءَ وَخُذْ مِنْ صِحَّتِكَ لِمَرْضِكَ وَمِنْ حَيَاتِكَ لِمَوْتِكَ. رَوَاهُ الْبُخَارِيُّ.

1604. (7) [1/503దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) నా భుజాన్ని పట్టుకొని, ‘ప్రపంచంలో నీవు ప్రయాణీకునిగా లేదా బాటసారిగా జీవించు’ అని ఉపదేశించారు. అందువల్ల ఇబ్ను ‘ఉమర్‌ నీవు సాయంత్రం అయితే ఉదయం గురించి వేచి ఉండకు, ఉదయం అయితే సాయంత్రం గురించి వేచి వుండకు. నీవు ఆరోగ్యంగా ఉన్నప్పుడు నీ అనారోగ్యం కోసం ఏమైనా చేసుకో, జీవితంలో మరణం కోసం ఏమైనా సిద్ధంచేసుకో. అంటే ఆరోగ్యాన్ని, జీవితాన్ని మహా భాగ్యాలుగా భావించు’ అని అనేవారు. (బు’ఖారీ)

1605 – [ 8 ] ( صحيح ) (1/503)

وَعَنْ جَابِرٍ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَبْلَ مَوْتِهِ بِثَلَاثَةِ أَيَّامٍ يَقُوْلُ: “لَا يَمُوْتَنَّ أَحَدُكُمْ إِلَّا وَهُوَ يُحْسِنُ الظَّنَّ بِاللهِ”. رَوَاهُ مُسْلِمٌ .

1605. (8) [1/503దృఢం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) మరణానికి మూడు రోజుల ముందు, ”మీలో ప్రతి ఒక్కరూ అల్లాహ్‌ (త) పట్ల మంచి నమ్మకంతోనే మరణించాలి” అని ప్రవచించారు.[23]  (ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం 

1606 – [ 9 ] ( ضعيف ) (1/504)

عَنْ مُعَاذِ بْنِ جَبَلٍ رضي الله عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنْ شِئْتُمْ أَنْبَأْتُكُمْ مَا أَوَّلُ مَا يَقُوْلُ اللهُ لِلْمُؤْمِنِيْنَ يَوْمَ الْقِيَامَةِ؟ وَمَا أَوَّلُ مَا يَقُوْلُوْنَ لَهُ؟” قُلْنَا: نَعَمْ يَا رَسُوْلَ اللهِ قَالَ: “إِنَّ اللهَ يَقُوْلُ لِلْمُؤْمِنِيْنَ هَلْ أَحْبَبْتُمْ لِقَائِيْ؟ فَيَقُوْلُوْنَ نَعَمْ يَا رَبَّنَا فَيَقُوْلُ: لَمْا فَيَقُوْلُوْنَ: رَجَوْنَا عَفَوْكَ وَمَغْفِرَتَكَ. فَيَقُوْلُ:قَدْ وَجَبَتْ لَكُمْ مَغْفِرَتِيْ”. رَوَاهُ فِيْ شَرْحِ السُّنَّةِ وَأَبُوْ نَعِيْمٍ فِيْ الْحِلْيَةِ .

1606. (9) [1/504బలహీనం]

ము’ఆజ్‌’ బిన్‌ జబల్‌ (ర) కథనం: ప్రవక్త (స) ‘తీర్పుదినం నాడు అల్లాహ్‌(త) విశ్వాసులతో అన్నిటి కంటే ముందు ఏమంటాడో విశ్వాసులు అల్లాహ్‌(త)తో ఏమంటారో మీకు తెలుపనా’ అని అన్నారు. దానికి మేము, ‘ప్రవక్తా! తెలుపండి’ అని అన్నాం. దానికి ప్రవక్త (స), ”అల్లాహ్‌ తీర్పుదినం నాడు విశ్వాసులతో, ‘మీరు నన్ను కలవటాన్ని కోరుకునేవారా’ అని అడుగుతాడు. దానికి వారు, ‘అవును మా ప్రభూ!’ అని అంటారు. అల్లాహ్‌ వారిని మళ్ళీ, ‘మీరు నన్ను కలవాలని ఎందుకు కోరుకునే వారు,’ అని అడుగుతాడు. దానికి వారు సమాధాన మిస్తూ, ‘ఎందుకంటే తమరు క్షమిస్తారని, కరుణిస్తారని ఆశతో ఉండేవాళ్ళం,’ అని అంటారు. అది విన్న అల్లాహ్‌(త) ‘నా క్షమాపణ మీకోసం తప్పనిసరి అయి పోయింది,’ అని సమాధానం ఇస్తాడు,” అని ప్రవచించారు. (షర్‌’హు స్సున్నహ్‌, అబూ న’యీమ్‌ – ‘హిల్య)

1607 – [ 10 ] ( صحيح ) (1/504)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَكْثِرُوْا ذِكْرَ هَاذِمِ اللَّذَّاتِ الْمَوْتَ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَهُ.

1607. (10) [1/504దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”రుచులను జీర్ణించుకునే మరణాన్ని జ్ఞాపకం చేసు కుంటూ ఉండండి.” (తిర్మిజి’, నసాయి’, ఇబ్నె మాజహ్)

1608 – [ 11 ] ( ضعيف ) (1/504)

وَعَنِ ابْنِ مَسْعُوْدٍ أَنَّ نَبِيَّ اللهِ صلى الله عليه وسلم قَالَ ذَاتَ يَوْمٍ لِّأَصْحَابِهِ: “اِسْتَحْيُوْا مِنَ اللهِ حَقَّ الْحَيَاءِ”. قَالُوْا: إِنَّا نَسْتَحْيِيْ مِنَ اللهِ يَا نَبِيَّ اللهِ وَالْحَمْدُ لِلّهِ. قَالَ: “لَيْسَ ذَلِكَ وَلَكِنْ مِنْ اسْتَحْيَى مِنَ اللهِ حَقَّ الْحَيَاءِ فَلْيَحْفَظِ الرَّأْسَ وَ مَا وَعَى وَلْيَحْفِظِ الْبَطْنَ وَمَا حَوَى وَلْيَذْكُرِ الْمَوْتَ وَالْبَلَى وَمَنْ أَرَادَ الْآخِرَةَ تَرَكَ زِيْنَةَ الدُّنْيَا فَمَنْ فَعَلَ ذَلِكَ فَقَدْ اِسْتَحْيَى مِنَ اللهِ حَقَّ الْحَيَاءِ”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ. وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ.

1608. (11) [1/504బలహీనం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: ఒక రోజు ప్రవక్త (స) తన అనుచరులతో ‘అర్హతకు తగినట్టు అల్లాహ్‌(త)కు సిగ్గుపడండి’ అని హితబోధ చేశారు. దానికి వారు, ‘ఓ ప్రవక్తా! అల్లాహ్‌(త) దయవల్ల అల్లాహ్‌(త) పట్ల సిగ్గుపడుతూనే ఉన్నాం’ అని అన్నారు. దానికి ప్రవక్త (స) ఈ విధంగా కాదు, అర్హతకు తగినట్టు సిగ్గుపడటమంటే తలను-తలలో ఉన్నదాన్ని పరిరక్షించాలి, కడుపును-కడుపులో ఉన్న దాన్ని పరిరక్షించాలి, చావును, దుమ్ములు క్రుళ్ళిపోవటాన్ని గుర్తు చేసుకోవాలి. పరలోకాన్ని కోరుకునేవారు ప్రాపంచిక అలంకరణలకు దూరంగా ఉండాలి. వీటన్నిటినీ చేసేవారు, అర్హతకు తగినట్టు అల్లాహ్‌(త) పట్ల సిగ్గుపడ్డారు,” అని అన్నారు.[24](అ’హ్మద్‌, తిర్మిజి’ –  ఏకోల్లేఖనం)

1609 – [ 12 ] ( لم تتم دراسته ) (1/505)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “تُحْفَةُ الْمُؤْمِنِ الْمَوْتُ”. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ.

1609. (12) [1/505అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవ చనం, ”మరణం విశ్వాసికి కానుకవంటిది.”[25](బైహఖీ)

1610 – [ 13 ] ( صحيح ) (1/505)

وَعَنْ بُرَيْدَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْمُؤْمِنُ يَمُوْتُ بِعَرَقِ الْجَبِيْنِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَهُ .

1610. (13) [1/505దృఢం]

బురైదహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”విశ్వాసి తననుదుటి చెమటద్వారా మరణిస్తాడు.” [26](తిర్మిజి’, నసాయి’, ఇబ్నె మాజహ్)

1611 – [ 14 ] ( صحيح ) (1/505)

وَعَنْ عُبَيْدِ اللهِ بْنِ خَالِدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَوْتُ الْفَجْاءَةِ أَخْذَةُ الْأَسَفِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَزَادَ الْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ .وَ رَزِيْنٌ فِيْ كِتَابِهِ: “أَخْذَةُ الْأَسَفِ لِلْكَافِرِ وَرَحْمَةٌ لِلْمُؤْمِنِ”.

1611. (14) [1/505దృఢం]

‘ఉబైదుల్లాహ్‌ బిన్‌ ‘ఖాలిద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అకస్మాత్తుగా మరణించటం అల్లాహ్ ఆగ్రహానికి, అసంతృప్తికి నిదర్శనం.” (అబూ దావూద్‌) 

బైహఖీ-షుఅబిల్ ఈమాన్ మరియు రజీన్ లో ఇలా ఉంది ”ఆకస్మిక మరణం అవిశ్వాసికి దైవాగ్ర హంగా, విశ్వాసికి కారుణ్యంగా పరిణమిస్తుంది.”

1612 – [ 15 ] ( حسن ) (1/506)

وَعَنْ أَنَسٍ قَالَ: دَخَلَ النَّبِيُّ عَلَى شَابٍّ وَهُوَ فِيْ الْمَوْتِ فَقَالَ: “كَيْفَ تَجِدُكَ؟” قَالَ: أَرْجُواللهَ يَا رَسُوْلَ اللهِ وَإِنِّيْ أَخَافُ ذُنُوْبِيْ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَجْتَمِعَانِ فِيْ قَلْبِ عَبْدٍ فِيْ مِثْلِ هَذَا الْمُوْطِنِ إِلَّا أَعْطَاهُ اللهُ مَا يَرْجُوْ وَآمَنَهُ مِمَّا يَخَافُ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ وَقَالَ التِّرْمِذِيُّ هَذَا حَدِيْثٌ غَرِيْبٌ .

1612. (15) [1/506ప్రామాణికం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఒక యువకుని వద్దకు వెళ్ళారు. అప్పుడతను మరణావస్థలో ఉన్నాడు. ప్రవక్త (స) అతన్ని ‘ఇప్పుడు నీ మనసులో ఏముంది?’ అంటే దైవ కారుణ్యం లేక దైవాగ్రహం ఉందా, అని అడిగారు. దానికి ఆ యువకుడు, ‘ప్రవక్తా! నేను దైవకారుణ్యాన్ని కోరుకుంటున్నాను. నా పాపాల పట్ల భయపడుతున్నాను’ అని అన్నాడు. దానికి ప్రవక్త (స) దాసుని హృదయంలో ఇటువంటి స్థితిలో రెండు విషయాలు మెదిలితే, అల్లాహ్‌(త) అతను కోరింది ప్రసాదిస్తాడు. ఇంకా అతడు భయపడుతున్న దాని నుండి రక్షిస్తాడు’ అని అన్నారు. (తిర్మిజి’ – ఏకోల్లేఖనం, ఇబ్నె మాజహ్)

—–

اَلْفَصْلُ الثَّالِثُ  మూడవ విభాగం 

1613 – [ 16 ] ( ضعيف ) (1/506)

عَنْ جَابِرٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تَمَنّوُا الْمَوْتَ فَإِنَّ هَوْلَ الْمُطَّلَعِ شَدِيْدٌ وَإِنَّ مِنَ السَّعَادَةِ أَنْ يَّطُوْلَ عُمَرُ الْعَبِدِ وَيَرْزُقَهُ اللهُ عَزَّ وَجَلَّ الْإِنَابَةَ”.  رَوَاهُ أَحْمَدُ.

1613. (16) [1/506బలహీనం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు చావును కోరుకోకండి. ఎందుకంటే మరణావస్థ చాలా కఠినమైనది. దీర్ఘాయుష్షు లభించటం అల్లాహ్‌(త)కు విధేయునిగా జీవించే భాగ్యం ప్రసాదించటం దాసుని అదృష్టం.” [27] (అ’హ్మద్‌)

1614 – [ 17 ] ( ضعيف ) (1/506)

وَعَنْ أَبِيْ أُمَامَةَ قَالَ: جَلَسْنَا إِلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَذَكَّرَنَا وَرَقَّقَناَ فبَكَى سَعْدُ بْنُ أَبِيْ وَقَّاصٍ فَأَكْثَرَ الْبُكَاءَ. فَقَالَ: يَا لَيْتَنِيْ مِتُّ. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “يَا سَعْدُ أَعِنْدِيْ تَتَمَنَّى الْمَوْتَ؟” فَرَدَّدَ ذَلِكَ ثَلَاثَ مَرَّاتٍ. ثُمَّ قَالَ: “يَا سَعْدُ إِنْ كُنْتَ خُلِقْتَ لِلْجَنَّةِ فَمَا طَالَ عُمُرُكَ وَحَسُنَ مِنْ عَمَلِكَ فَهُوَ خَيْرٌ لَّكَ”. رَوَاهُ أَحْمَدُ.

1614. (17) [1/506బలహీనం]

అబూ ఉమామహ్ (ర) కథనం: ప్రవక్త (స) వద్ద మేము కూర్చుని ఉన్నాం. ప్రవక్త (స) మాకు హిత బోధచేసి మా హృదయాలను సున్నితపరిచారు. స’అద్‌ బిన్‌ అబీ వఖ్ఖాస్‌ ఏడ్వసాగారు. చాలా ఏడ్చి ‘నేను చనిపోతే బాగుండేది’ అని అన్నారు. అది విన్న ప్రవక్త (స) ‘ఓ స’అద్‌! నా వద్ద కూర్చొని చావును కోరుతు న్నావా?’ అని అడిగారు. ఇలా మూడుసార్లు అన్నారు. ఆ తరువాత, ‘ఓ స’అద్‌! ఒకవేళ నీవు స్వర్గం కోసం సృష్టించబడితే, నీ ఆయుష్షు ఎంత ఎక్కువ ఉంటే సత్కార్యాలు అంత ఎక్కువగా ఉంటాయి, నీకు అంతే మంచిది’ అని అన్నారు. (అ’హ్మద్‌)

1615 – [ 18 ] ( صحيح ) (1/506)

عَنْ حَارِثَةَ بْنِ مُضَرَّبٍ قَالَ: دَخَلْتُ عَلَى خَبَّابٍ وَقَدْ اِكْتَوَى سَبْعًا فَقَالَ: لَوْلَا أَنِّيْ سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “لَا يَتَمَنَّ أَحَدُكُمُ الْمَوْتَ”. لَتَمَنَّيْتُهُ. وَلَقَدْ رَأَيْتُنِيْ مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم مَا أَمْلِكُ دِرْهَمًا. وَإِنَّ فِيْ جَانِبِ بَيْتِيْ الْآنَ لِأَرْبَعِيْنَ أَلْفَ دِرْهَمٍ. قَالَ ثُمَّ أُتِىَ بِكَفَنِهِ فَلَمَّا رَآهُ بَكَى. وَقَالَ لَكِنْ حَمْزَةُ لَمْ يُوْجَدْ لَهُ كَفَنٌ إِلَّا بُرْدَةٌ مَّلْحَاءُ إِذَا جُعِلَتْ عَلَى رَأْسِهِ قَلَصَتْ عَنْ قَدَمِيْهِ وَإِذَا جُعِلَتْ عَلَى قَدَمَيْهِ قَلَصَتْ عَنْ رَأْسِهِ حَتَّى مُدَّتْ عَلَى رَأْسِهِ وَجُعِلَ عَلَى قَدَمَيْهِ الْأِذْخِرُ. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ إِلَّا أَنَّهُ لَمْ يَذْكُرْ: ثُمَّ أُتِيَ بِكَفَنِهِ إِلَى آخِرِهِ.

1615. (18) [1/506దృఢం]

‘హారిస’హ్ బిన్‌ ము’దర్రబ్‌ (ర) కథనం: నేను ‘ఖబ్బాబ్‌ వద్దకు వెళ్ళాను. అతను ఏదో వ్యాధివల్ల తన శరీరంపైన వాతలు వేయించుకొని ఉన్నారు. ఇంకా అతను, ”ప్రవక్త (స), ‘మీలో ఎవరూ చావును కోరుకోకండి,’ అని అనడం నేను వినకుండా ఉంటే నేను చావును కోరుకునేవాడిని. ప్రవక్త (స) వెంట ఉన్నప్పుడు నా వద్ద ఒక్క దిర్‌హమ్‌ కూడా లేదు. ‘ఈ రోజు నా ఇంట్లో 40 వేల దిర్‌హమ్‌లు ఉన్నాయి” అని అన్నారు. ఆ తరువాత అతని వద్దకు అతని కఫన్‌ తీసుకు రావటం జరిగింది. అది చూసి ఏడ్వ సాగారు. ఇంకా,” ‘హమ్‌’జహ్ వీరమరణం పొందారు. అతనికి ఏమీ లభించలేదు. గీతలు గల ఒక తెల్లని చిన్నదుప్పటి తప్ప. తల కప్పితే కాళ్ళు బయట పడేవి, కాళ్ళు కప్పితే తల బయటపడేది. ఆ తరువాత దాన్ని తలపై కప్పి, కాళ్ళపై గడ్డి వేయటం జరిగింది” అని అన్నారు. [28]  (అ’హ్మద్‌, తిర్మిజి’)

=====

3 بَابُ مَا يُقَالُ عِنْدَ مَنْ حَضَرَهُ الْمَوْتُ

3. మరణావస్థలో ఉన్నవారికి ఉపదేశం

మరణిస్తున్నవారు తమ కష్టంలో తాము ఉంటారు. ఒక్కోసారి మతి స్థిమితం ఉండదు. అందువల్ల అతని ముందు కలిమహ్‌ ‘తయ్యిబహ్‌ పలుకుతూ ఉండాలి. అది విని అతను కూడా పలుకుతాడు. దానివల్ల విశ్వాసంతో సమాప్తం అవుతుంది. అయితే ఇదంతా మరణావస్ధకు ముందు జరగాలి. అదేవిధంగా పండితులు అనేక మరణసూచనలు పేర్కొన్నారు. మరణసూచనలో ఒకటేమిటంటే, కాళ్ళు పనికి రాకుండా పోతాయి. ముక్కు వంకరగా అయిపోతుంది. చెవులు కూడా వంగిపోతాయి. ఇటువంటి పరిస్థితుల్లో, ”లా ఇలాహ ఇల్లల్లాహ్‌,” పలుకుతూ ఉండాలి. అయితే, ‘ఇలా చదువు,’ అని ఆదేశించకూడదు. ఎందుకంటే ఆ కష్ట పరిస్థితిలో నిరాకరించనూ వచ్చు. అందువల్ల అతని ముందు పఠిస్తూ ఉండాలి.  

اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం   

1616 – [ 1 ] ( صحيح ) (1/508)

عَنْ أَبِيْ سَعِيْدٍ وَأَبِيْ هُرَيْرَةَ قَالَا: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَقِّنُوْا مَوْتَاكُمْ لَا إِلَهَ إِلَّا اللهُ”.  رَوَاهُ مُسْلِمٌ .

1616. (1) [1/508దృఢం]

అబూ స’యీద్‌ (ర) మరియు అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు మీ మరణించేవారి ముందు లా ఇలాహ ఇల్లల్లాహ్‌’ అని పలకండి.” (ముస్లిమ్‌)

1617 – [ 2 ] ( صحيح ) (1/508)

وَعَنْ أُمِّ سَلَمَةَ قَالَتْ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: ” إِذَا حَضَرْتُمْ الْمَرِيْضَ أَوْ الْمَيِّتَ فَقُوْلُوْا خَيْرًا فَإِنَّ الْمَلَائِكَةَ يُؤَمِّنُوْنَ عَلَى مَا تَقُوْلُوْنَ”. رَوَاهُ مُسْلِمٌ .

1617. (2) [1/508దృఢం]

ఉమ్మె సలమహ్ (ర) కథనం: ప్రవక్త(స) ప్రవచనం, ”మీరు పరామర్శించడానికి వెళ్ళినా, మరణావస్థలో ఉన్న వ్యక్తి వద్దకు వెళ్ళినా, మంచి మాటలు మాట్లాడండి. ఎందుకంటే దైవదూతలు మీ మాటలపై ఆమీన్‌ అని పలుకుతుంటారు.” [29] (ముస్లిమ్‌)

1618 – [ 3 ] ( صحيح ) (1/508)

وَعَنْ أُمِّ سَلَمَةَ قَالَتْ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا مِنْ مُّسْلِمٍ تُصِيْبُهُ مُصِيْبَةٌ فَيَقُوْلُ مَا أَمَرَهُ اللهُ بِهِ: ” إِنَّا لِلّهِ وَإِنَّا إِلَيْهِ رَاجِعُوْنَ. اَللّهُمَّ آجُرْنِيْ فِيْ مُصِيْبَتِيْ وَاخْلُفْ لِيْ خَيْرًا مِّنْهَا.” إِلَّا أَخْلَفَ اللهُ لَهُ خَيْرًا مِّنْهَا. فَلَمَّا مَاتَ أَبُوْ سَلَمَةَ قَالَتْ: أَيُّ الْمُسْلِمِيْنَ خَيْرٌمِّنْ أَبِيْ سَلَمَةَ؟ أَوْ بَيْتٍ هَاجَرَ إِلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. ثُمَّ إِنِّيْ قُلْتُهَا فَأَخْلَفَ اللهُ لِيْ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم. رَوَاهُ مُسْلِمٌ .

1618. (3) [1/508దృఢం]

ఉమ్మె సలమహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ముస్లిమ్‌కు కష్టంగానీ, ఆపదగానీ వచ్చి, అతడు అల్లాహ్‌ తీర్పుకు అనుగుణంగా ఈ దు’ఆ పఠిస్తే అల్లాహ్‌ అతనికి దానికంటే ఉత్తమమైనది ప్రసాదిస్తాడు. ”ఇన్నా లిల్లాహి ఇన్నా ఇలైహి రాజిఊన్. అల్లాహుమ్మాజుర్నీ ఫీముసీబతీ వఅఖ్లిఫ్లీ ఖైరమ్మిన్హా.” — ‘మన మంతా అల్లాహ్‌ కోసమే. మనం అల్లాహ్‌ వైపు మరలే వాళ్ళమే. ఓ అల్లాహ్! ఈ ఆపదపై నాకు పుణ్యం ప్రసాదించు. ఇంకా దీనికంటే ఉత్తమమైనది ప్రసాదించు.’

ఉమ్మె సలమహ్‌ (ర) కథనం: నా భర్త అబూ సలమహ్‌ (ర) మరణించారు. అప్పుడు నేను అబూ సలమహ్‌ కంటే ఉత్తమ ముస్లిమ్‌ మరెవరు ఉండరని భావించాను, ఎందుకంటే అబూ సలమహ్‌ కుటుంబ సమేతంగా హిజ్రత్‌ చేశారు. అందరికంటే ముందు హిజ్రత్‌ చేశారు. ఆ తరువాత ప్రవక్త (స) ఉపదేశించి నట్టు ఈ దు’ఆ చదివాను. అల్లాహ్‌ నాకు అబూ సలమహ్‌ కంటే ఉత్తమ వ్యక్తిని ప్రసాదించారు. అంటే ప్రవక్త (స)ను ప్రసాదించాడు. అంటే ప్రవక్త (స) నన్ను పెళ్ళి చేసుకున్నారు. [30] (ముస్లిమ్‌)

1619 – [ 4 ] ( صحيح ) (1/508)

وَعَنْ أُمِّ سَلَمَةَ قَالَتْ: دَخَلَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَلَى أَبِيْ سَلَمَةَ قَدْ شَقَّ بَصَرُهُ فُأَغْمَضَهُ ثُمَّ قَالَ: “إِنَّ الرُّوْحَ إِذَا قُبِضَ تَبِعَهُ الْبَصَرُ”. فَضَجَّ نَاسٌ مِّنْ أَهْلِهِ فَقَالَ: “لَا تَدْعُوْا عَلَى أَنْفُسِكُمْ إِلَّا بِخَيْرٍ فَإِنَّ الْمَلَائِكَةَ يُؤَمِّنُوْنَ عَلَى مَاتَقُوْلُوْنَ” .ثُمَّ قَالَ: “اَللّهُمَّ اغْفِرْ لِأَبِيْ سَلَمَةَ وَارْفَعْ دَرَجَتَهُ فِيْ الْمَهْدِيِّيْنَ وَاخْلُفْهُ فِيْ عَقِبِهِ فِيْ الْغَابِرِيْنَ وَاغْفِرْ لَنَا وَلَهُ يَا رَبِّ الْعَالَمِيْنَ وَافْسَحْ لَهُ فِيْ قَبْرِهِ وَنَوِّرْ لَهُ فِيْهِ”. رَوَاهُ مُسْلِمٌ.

1619. (4) [1/508దృఢం]

ఉమ్మె సలమహ్ (ర) కథనం: నా భర్త మరణించి నపుడు అతని కళ్ళు తెరచుకొని ఉన్నాయి. ప్రవక్త (స) వచ్చి, తెరుచుకుని ఉన్న కళ్ళు చూచి, మరణించారని నిర్థారించారు. ప్రవక్త (స) తన చేతులతో కళ్ళను మూసారు. ‘ఆత్మ శరీరం నుండి వెళ్ళినపుడు కంటి చూపు కూడా పోతుంది. కళ్ళు తెరచి ఉండటం వల్ల లాభం ఏమీ లేదు. అందువల్ల నేను కళ్ళు మూసివేశాను,’ అని అన్నారు. అది విన్న స్త్రీలు ఏడ్వసాగారు. అప్పుడు ప్రవక్త (స), ‘ఇప్పుడు మీరు మంచి మాటలే మాట్లాడండి. ఎందుకంటే మీనోటి నుండి ఏం వెలువడినా దైవదూతలు ఆమీన్‌,’ అని అంటారు అని అన్నారు. ఆ తరువాత అబూ సలమహ్ కోసం ఇలా దు’ఆ చేశారు:

అల్లాహుమ్మగ్ఫిర్లిఅబీ సలమహ్, వఅర్ దరజతహు ఫిల్మహ్దియ్యీన, ఖ్లుఫ్హు ఫీ అఖీబిహి, ఫిల్ గాబిరీన, గ్ఫిర్లనా వలహు, యారబ్బల్‌ ‘ఆలమీన్‌, వఫ్సహ్లహు, ఫీఖబ్రిహీ, వనవ్విర్లహు ఫీహి.” — ‘ఓ అల్లాహ్‌(త)! అబూ సలమహ్ ను క్షమించు, ఇంకా అతనిని సన్మార్గ గాముల్లో ఒకడిగా పరిగణించు, అతని తరువాత మంచివ్యక్తిని ప్రసాదించు, ఓఅల్లాహ్‌(త)! మమ్మల్ని మరియు అతన్ని క్షమించు, ఇంకా అతని సమాధిలో వెలుగు మరియు కాంతి ప్రసాదించు.’ (ముస్లిమ్‌)

1620 – [ 5 ] ( متفق عليه ) (1/509)

وَعَنْ عَائِشَةَ قَالَتْ: إِنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم حِيْنَ تُوُفِّيَ سُجِّيَ بِبُرْدٍ حِبَرَةٍ.

1620. (5) [1/509ఏకీభవితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) మరణించి నపుడు, ఆయన శరీరాన్ని యమనీ దుప్పటితో కప్పి వేయటం జరిగింది. [31] (బు’ఖారీ, ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّاُنِيِ   రెండవ విభాగం

1621 – [ 6 ] ( صحيح ) (1/509)

عَنْ مُعَاذِ بْنِ جَبَلٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ كَانَ آخِرُ كَلَامِهِ لَا إِلَهَ إِلَّا اللهُ دَخَلَ الْجَنَّةَ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

1621. (6) [1/509దృఢం]

ము’ఆజ్‌’ బిన్‌ జబల్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరి చివరిపలుకు ”లా ఇలాహ ఇల్లల్లాహ్” అయితే వారు స్వర్గంలో ప్రవేశిస్తారు.” [32] (అబూదావూద్‌)

1622 – [ 7 ] ( ضعيف ) (1/509)

وَعَنْ مَعْقِلِ بْنِ يَسَارٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِقْرَؤُوْا سُوْرَةَ ( يس-36 ) عَلَى مَوْتَاكُمْ”. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ .

1622. (7) [1/509బలహీనం]

మ’అఖల్‌ బిన్‌ యసార్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు మీ మృతుల వద్ద సూరహ్‌ యా-సీన్‌(36) పఠించండి.” [33] (అ’హ్మద్‌, అబూ దావూద్‌, ఇబ్నె మాజహ్)

1623 – [ 8 ] ( ضعيف ) (1/509)

وَعَنْ عَائَشَةَ قَالَتْ: إِنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَبَلَ عُثْمَانَ بْنَ مَظْعُوْنٍ وَهُوَ مَيِّتٌ وَهُوَ يَبْكِيْ حَتَّى سَالَ دُمُوْعُ النَّبِيِّ صلى الله عليه وسلم عَلَى وَجْهِ عُثْمَانَ. رَوَاهُ التِّرْمِذِيُّ وَ أَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ.

1623. (8) [1/509బలహీనం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స), ‘ఉస్మాన్‌ బిన్‌ మ”జ్‌’ఊన్‌ మరణానంతరం అతన్ని ముద్దు పెట్టు కున్నారు. అప్పుడు ప్రవక్త (స) కళ్ళంట అశ్రువులు రాలు తున్నాయి. ‘ఉస్మాన్‌ ముఖంపై పడుతు న్నాయి. [34] (తిర్మిజి’, అబూ దావూద్‌, ఇబ్నె మాజహ్)

1624 – [ 9 ] ( صحيح ) (1/510)

وَعَنْ عَائَشَةَ قَالَتْ: إِنَّ أَبَا بَكْرٍ قَبَّلَ النَّبِيَّ صلى الله عليه وسلم وَهُوَ مَيِّتٌ. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ.

1624. (9) [1/510దృఢం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: అబూ బకర్‌ (ర) ప్రవక్త (స) మరణించిన తర్వాత నుదురుపై ముద్దు పెట్టుకున్నారు. (తిర్మిజి’, ఇబ్నె మాజహ్)

1625 – [ 10 ] ( ضعيف ) (1/510)

وعَنْ حُصَيْنِ بْنِ وَحْوَحٍ أَنَّ طَلْحَةَ بْنَ الْبَرَاءِ مَرِضَ فَأَتَاهُ النَّبِيُّ صلى الله عليه وسلم يَعُوْدُهُ فَقَالَ:” إِنِّيْ لَا أُرَى طَلْحَةَ إِلَّا قَدْ حَدَثَ بِهِ الْمَوْتُ فَآذِنُوْنِيْ بِهِ وَعجِّلُوْا فَإِنَّهُ لَا يَنْبَغِيْ لِجِيْفَةِ مُسْلِمٍ أَنْ تُحْبَسَ بَيْنَ ظَهْرَ انَيْ أَهْلِهِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

1625. (10) [1/510బలహీనం]

‘హు’సైన్‌ బిన్‌ వ’హ్‌వ’హ్‌ (ర) కథనం: ‘తల్‌’హా బిన్‌ బరాఅ’ అనారోగ్యానికి గురయ్యారు. ప్రవక్త (స) అతన్ని పరామర్శించటానికి వెళ్ళారు. ప్రవక్త (స) అతని కుటుంబంవారితో, ‘ ‘తల్‌’హాపై మరణ చిహ్నాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ మరణిస్తే, వెంటనే నాకు తెలియపరచండి ఖనన సంస్కారాలు త్వరగా సిద్ధంచేయండి. ఎందుకంటే ముస్లిమ్‌ శవాన్ని అనవసరంగా ఖనన సంస్కారాలు ఆలస్యం చేయటం మంచిది కాదు’ అని అన్నారు. [35] (అబూ దావూద్‌)

—–

اَلْفَصْلُ الثَّالِثُ   మూడవ విభాగం 

1626 – [ 11 ] ( ضعيف ) (1/510)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ جَعْفَرٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَقِّنُوْا مَوْتَاكُمْ لَا إِلَهَ إِلَّا اللهُ الْحَلِيْمُ الْكَرِيْمُ سُبْحَانَ اللهِ رَبِّ الْعَرْشِ الْعَظِيْمِ الْحَمْدُ لِلّهِ رَبِّ الْعَالَمِيْنَ”. قَالُوْا: يَا رَسُوْلَ اللهِ كَيْفَ لِلْأَحْيَاءِ؟ قَالَ: “أَجْوَدُ وَأَجْوَدُ”. رَوَاهُ ابْنُ مَاجَهُ.

1626. (11) [1/510బలహీనం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ జ’అఫర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు, మీలోని మరణించేవారి ముందు ఈ వచనాలను వల్లించండి, విని, వారు కూడా వల్లిస్తారు, ”లా ఇలాహ ఇల్లల్లాహుల్‌ ‘హలీముల్‌ కరీమ్‌, సుబ్‌’హానల్లాహి రబ్బిల్‌ అర్‌షిల్‌ ‘అ”జీమ్‌, అల్‌’హమ్‌దు లిల్లాహి రబ్బిల్‌ ‘ఆలమీన్‌. — ‘అల్లాహ్‌ తప్ప ఆరాధ్యులెవరూ లేరు, ఆయన, శాంత స్వభావుడు మరియు గౌరవనీయుడు, సర్వ లోపాలకు అతీతుడు, మహా సింహాసనానికి అధిపతి. స్తోత్రాలన్నీ అల్లాహ్‌ కొరకే. ఆయనే సర్వలోకాలకూ ప్రభువు.’ అని అన్నారు. అనుచరులు ఒకవేళ ఈ వచనాలను ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి పఠిస్తే ఎలా ఉంటుంది అని విన్నవించుకున్నారు. దానికి ప్రవక్త (స), ‘చాలా బాగుంటుంది,’ అని అన్నారు. (ఇబ్నె మాజహ్)

1627 – [ 12 ] ( حسن ) (1/510)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: اَلْمَيِّتُ تَحْضُرُهُ الْمَلَائِكَةُ فَإِذَا كَانَ الرَّجُلُ صَالِحًا قَالُوْا: اُخْرُجِيْ أَيَّتُهَا النَّفْسُ الطَّيِّبَةُ كَانَتْ فِيْ الْجَسَدِ الطَّيِّبِ أُخْرُجِيْ حَمِيْدَة وَّأَبْشِرِيْ بِرَوْحٍ وَّرَيْحَانٍ وَّرَبٍّ غَيْرِ غَضَبَانٍ فَلَا تَزَالُ. يُقَالُ لَهَا ذَلِكَ حَتَّى تَخْرُجَ ثُمَّ يُعْرَجُ بِهَا إِلَى السَّمَاءِ فَيُفْتَحُ لَهَا فَيُقَالُ: مَنْ هَذَا؟ فَيَقُوْلُوْنَ: فُلَانٌ فَيُقَالُ: مَرْحَبًا بِالنَّفْسِ الطَّيِّبَةِ كَانَتْ فِيْ الْجَسَدِ الطَّيِّبِ اُدْخُلِيْ حَمِيْدَةً وَّأَبْشِرِيْ بِرَوْحٍ وَّرَيْحَانٍ وَّرَبٍّ غَيْرِ غَضْبَانٍ فَلَا تَزَالُ يُقَالُ لَهَا ذَلِكَ حَتَّى تَنْتَهِيْ إِلَى السَّمَاءِ الَّتِيْ فِيْهَا اللهُ فَإِذَا كَانَ الرَّجُلُ السُّوْءُ قَالَ: اُخْرُجِيْ أَيَّتُهَا النَّفْسُ الْخَبِيْثَةُ كَانَتْ فِيْ الْجَسَدِ الْخَبِيْثِ اخْرُجِيْ ذَمِيْمَةً وَأَبْشِرِيْ بِحَمِيْمٍ وَّغَسَّاقٍ وَّآخَرُ مِنْ شَكْلِهِ أَزْوَاجٌ فَمَا تَزَالُ يُقَالُ لَهَا ذَلِكَ حَتَّى تَخْرُجُ ثُمَّ يُعْرَجُ بِهَا إِلَى السَّمَاءِ فَيُفْتَحُ لَهَا فَيُقَالُ: مَنْ هَذَا؟ فَيُقَالُ: فُلَانٌ. فَيُقَالُ: لَا مَرْحَبًا بِالنَّفْسِ الْخَبِيْثَةِ كَانَتْ فِيْ الْجَسَدِ الْخَبِيْثِ ارْجِعِيْ ذَمِيْمَةً فَإِنَّهَا لَا تُفْتَحُ لَهُ أَبْوَابُ السَّمَاءِ فَتُرْسَلُ مِنَ السَّمَاءِ ثُمَّ تَصِيْرُ إِلَى الْقَبْرِ”. رَوَاهُ ابْنُ مَاجَهُ.

1627. (12) [1/510ప్రామాణికం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మరణించిన వారివద్దకు దైవదూతలు వస్తారు. ఒకవేళ పుణ్యాత్ముడైతే, దైవదూతలు ‘ఓ పరిశుద్ధ శరీరంలో ఉండే పరిశుద్ధాత్మా! బయటికి రా! అందరూ నీవు మంచి వాడివని నిన్ను పొగుడుతున్నారు. నీకు స్వర్గ సుఖాలు, పరిశుద్ధ ఉపాధి లభిస్తుందని శుభవార్త అందిస్తున్నారు, నీ ప్రభువు కూడా నీ పట్ల సంతృప్తి కలిగి ఉన్నాడు. ‘దైవదూతలు ఇలాగే పలుకు తుంటారు. చివరికి ఆత్మ ఉత్సాహంగా, సంతోషంగా శరీరం నుండి బయటకు వస్తుంది. దాన్ని తీసుకొని దైవదూతలు ఆకాశంపై ఎక్కుతారు. అతని కోసం ఆకాశ ద్వారాలు తెరువబడతాయి. ‘ఇతనెవరని’ అడగటం జరుగుతుంది. దైవదూతలు ‘ఇతను ఫలానా వ్యక్తి’ అని సమాధానం ఇస్తారు. అప్పుడు ‘పరిశుద్ధ శరీరంలో ఉన్న పరిశుద్ధ ఆత్మకు స్వాగతం, ఓ ఆత్మ! నీవు ఆకాశంలో ప్రవేశించు. ప్రశంసలతో మరియు స్వర్గ శుభవార్తలతో మరియు నీ పట్ల సంతృప్తి కలిగి ఉన్న ప్రభువును కలవటంపై, ఇలాగే పలుకుతుంటారు.’ చివరికి అల్లాహ్‌ (త) ఉన్న ఆకాశంలోకి ఆత్మ వెళ్ళిపోతుంది.

ఒకవేళ పాపాత్ముడైతే, ప్రాణం తీసే దైవదూతలు దాన్ని, ‘ఓ అపరిశుద్ధ శరీరంలో ఉన్న అపరి శుద్ధాత్మా! బయటకు రా! నరకంలోని మరిగే నీటి, చీము, నెత్తురు మరియు ఇతర శిక్షల గురించి నీకు హెచ్చరించబడుతుంది.’ ఇలాగే అంటూ ఉంటారు. చివరికి ఆత్మ శరీరం నుండి బయటకు వస్తుంది. దైవ దూతలు దాన్ని తీసుకొని ఆకాశం పైకి ఎక్కుతారు. ఆకాశద్వారాలు తెరువబడతాయి. ‘ఇతనెవరని’ ప్రశ్నించటం జరుగుతుంది. ‘ఇతను ఫలానా పాపాత్ముడని’ సమాధానం ఇవ్వబడుతుంది. అప్పుడు ‘ఓ అపరిశుద్ధ శరీరంలో ఉండే అపరిశు ద్ధాత్మ, నీ పాడుగాను. తిరిగి వెనక్కి పో, నీ కోసం ఆకాశ ద్వారాలు తెరువబడవు.’ దాన్ని ఆకాశంలో పారవేయడం జరుగుతుంది. మళ్ళీ అది సమాధివైపు తిరిగి వస్తుంది. (ఇబ్నె మాజహ్)

1628 – [ 13 ] ( صحيح ) (1/511)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “إِذَا خَرَجَتْ رُوْحُ الْمُؤْمِنِ تَلَقَّاهَا مَلَكَانِ يُصْعِدَانِهَا”.قَالَ حَمَّادٌ: فَذُكِرَ مِنْ طِيْبِ رِيْحِهَا وَذُكِرَ الْمِسْكَ قَالَ: “وَيَقُوْلُ أَهلُ السَّمَاءِ: رُوْحٌ طَيِّبَةٌ جَاءَتْ مِنْ قِبَلِ الْأَرْضِ صَلّى اللهُ عَلَيْكَ وَعَلَى جَسَدٍ كُنْتِ تَعْمُرِيْنَهُ فَيُنْطَلَقُ بِهِ إِلَى رَبِّهِ ثُمَّ يَقُوْلُ: انْطَلَقُوْا بِهِ إِلَى آخِر الْأَجَلِ”. قَالَ: “وَإِنَّ الْكَافِرَ إِذَا خَرَجَتْ رُوْحُهُ”. قَالَ حَمَّادٌ: وَذَكَرَ مِنْ نَتَنِهَا وَذَكَرَ لَعْنَهَا”. وَّيَقُوْلُ أَهْلُ السَّمَاءِ: رُوْحٌ خَبِيْثَةٌ جَاءَتْ مِنْ قِبَلِ الْأَرْضِ. فَيُقَالُ: انْطَلَقُوْا بِهِ إِلَى آخِرِ الْأَجَلِ”. قَالَ أَبُوْ هُرَيْرَةَ: فَرَدَّ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم رَيْطَةً كَانَتْ عَلَيْهِ عَلَى أَنْفِهِ هَكَذَا. رَوَاهُ مُسْلِمٌ.

1628. (13) [1/511దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”విశ్వాసి శరీరం నుండి ఆత్మ బయటకు వచ్చి నపుడు, దాన్ని ఇద్దరు దైవదూతలు తీసుకొని ఆకాశంపై ఎక్కుతారు. ‘హమ్మాద్‌ ఉల్లేఖనకర్త. అబూ హురైరహ్‌ లేదా ప్రవక్త(స) ఆ ఆత్మ నుండి కస్తూరి సువాసన వస్తుందని అన్నారు. ఆ ఆత్మ ఆకాశం పై ఎక్కితే ఆకాశం వారు భూమి నుండి పరిశుద్ధ శరీరం నుండి పరిశుద్ధాత్మ వచ్చింది. ‘ఓ ఆత్మ! నీపై అల్లాహ్ (త) కారుణ్యం అవతరించుగాక! నీవు ఇంతకు ముందు ఉండే శరీరంపై కూడా దైవకారుణ్యం అవత రించుగాక!’ ఆ తరువాత దాన్ని దాని ప్రభువు వద్దకు తీసుకువెళతారు. అప్పుడు అల్లాహ్‌ (త), ‘దీన్ని తీర్పుదినం వరకు భద్రంగా ఉంచండి’ అని ఆదేశిస్తాడు.

ఒకవేళ అవిశ్వాస ఆత్మ శరీరం నుండి బయటకు వస్తే, అబూ హురైరహ్‌ లేదా ప్రవక్త(స), ‘ఆ ఆత్మనుండి దుర్వాసన వస్తుందని’ అన్నారు. ఆకాశం వారు చూసి, ‘ఈ అపరిశుద్ధ ఆత్మ భూమివైపు నుండి వచ్చింది. దీన్ని తీర్పుదినం వరకు ఉంచండి’ అని ఆదేశించడం జరుగుతుంది. అబూ హురైరహ్‌ (ర) ప్రకారం ప్రవక్త (స) తన దుప్పటి ఒక మూలను తన ముక్కుపై పెట్టుకున్నారు. (ముస్లిమ్‌)

1629 – [ 14 ] ( صحيح ) (1/511)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا حَضَرَ الْمُؤْمِنُ أَتَتْ مَلَائِكَةُ الرَّحْمَةِ بِحَرِيْرَةٍ بَيْضَاءَ فَيَقُوْلُوْنَ: اُخْرُجِيْ رَاضِيَةً مَّرْضِيًّا عَنْكِ إِلَى رَوْحِ اللهِ وَرَيْحَانٌ وَّرَبِّ غَيْرِ غَضَبَانٍ فَتَخْرُجُ كَأَطِيْبِ رِيْحِ الْمِسْكِ حَتَّى إِنَّهُ لَيُنَاوِلُهُ بَعْضُهُمْ بَعْضًا حَتَّى يَأْتُوْا بِهِ أَبْوَابَ السَّمَاءِ فَيَقُوْلُوْنَ: مَا أَطْيَبَ هَذِهِ الرِّيْحَ الَّتِيْ جَاءَتْكُمْ مِّنَ الْأَرْضِ فَيَأْتُوْنَ بِهِ أَرْوَاحَ الْمُؤْمِنِيْنَ فَلَهُمْ أَشَدُّ فَرْحًا بِهِ مِنْ أَحَدِكُمْ بِغَائِبِهِ يَقْدُمُ عَلَيْهِ فَيَسْأَلُوْنَهُ: مَاذَا فَعَلَ فُلَانٌ مَاذَا فَعَلَ فُلَانٌ؟ فَيَقُوْلُوْنَ: دَعُوْهُ فَإِنَّهُ كَانَ فِيْ غَمِّ الدُّنْيَا. فَيَقُوْلُ: قَدْ مَاتَ أَمَا أَتَاكُمْ؟ فَيَقُوْلُوْنَ: قَدْ ذَهَبَ بِهِ إِلَى أُمِّهِ الْهَاوِيَةِ. وَإِنَّ الْكَافِرَ إِذَا احْتُضِرَ أَتَتْهُ مَلَائِكَةُ الْعَذَابِ بِمِسْحٍ فَيَقُوْلُوْنَ: اخْرُجِيْ سَاخِطَةً مَّسْخُوْطًا عَلَيْكَ إِلَى عَذَابِ اللهِ عَزَّ وَجَلَّ. فَتَخْرُجُ كَأَنْتَنِ رِيْحِ جِيْفَةٍ حَتّى يَأْتُوْنَ بِهِ بَابَ الْأَرْضِ فَيَقُوْلُوْنَ: مَا أَنْتَنَ هَذِهِ الرِّيْحُ حَتَّى يَأْتُوْنَ بِهِ أَرْوَاحَ الْكُفَّارِ”. رَوَاهُ أَحْمَدُ وَالنَّسَائِيُّ.

1629. (14) [1/511దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”విశ్వాసి మరణ సమయం వచ్చినపుడు, కారుణ్య దూతలు స్వర్గం నుండి తెల్లని పట్టువస్త్రం తీసుకొని వస్తారు. ఇంకా ఆ ఆత్మతో, నీవు ఈ శరీరం నుండి బయటకు వచ్చి, నీవు అల్లాహ్‌ (త) పట్ల, అల్లాహ్‌ (త) నీ పట్ల సంతృప్తిగా ఉన్న స్థితిలో దైవకారుణ్యం, దైవ అనుగ్రహంవైపు నడు. ‘నీ ప్రభువు నీ పట్ల సంతృప్తిగా ఉన్నాడు’ అని అంటారు. అప్పుడు ఆ ఆత్మ కస్తూరి సువాసనలా బయటకు వస్తుంది. అప్పుడు దైవదూతలు దాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ఆకాశం వైపు తీసుకొనివెళతారు. ఆకాశం దైవదూతలు ‘భూమి వైపునుండి ఎంత మంచి సువాసన వస్తుంది’ అని అంటారు. ఆ తరువాత ఆ ఆత్మను విశ్వాసుల ఆత్మల వద్దకు తీసుకొని వెళతారు. దాన్ని చూసి, ఆ ఆత్మలు ప్రయాణం నుండి తమ బంధువు వచ్చినట్టు చాలా సంతో షిస్తాయి. తరువాత ఆ ఆత్మలు దాన్ని ప్రాపంచిక విషయాలు అడిగి తెలుసుకుంటాయి. ఫలానా వ్యక్తుల సంగతి ఏమిటి, అని అడుగు తాయి. ఆ ఆత్మలు ‘దీన్ని ఇక్కడ వదలివేయండి, ప్రాపంచిక విచారాల్లోమునిగి ఇప్పుడిప్పుడే వచ్చింది, దీన్ని కొంత విశ్రాంతి తీసుకోనివ్వండి’ అని అంటాయి. ఆ ఆత్మ విశ్రాంతి తీసుకున్న తరువాత, ‘మీరు అడుగుతున్న వ్యక్తి నాకంటే ముందు మరణించాడు. ఇంకా మీ వద్దకు రాలేదా’ అని అడుగుతుంది. దానికి వారు ఇక్కడకు మాత్రం రాలేదు, అతన్ని నరకంవైపు తీసుకొని వెళ్ళడం జరిగిందేమో, అందుకే ఇక్కడకు రాలేదు’ అని అంటారు.

అవిశ్వాసి మరణ సమయం వస్తే, శిక్షించే దైవదూతలు గోనెసంచి తీసుకొని అతని వద్దకు వస్తారు. ‘నీవు నీ శరీరం నుండి బయటకు రా, దైవశిక్ష వైపునకు, ‘ నిన్ను విచారం క్రమ్ముతుంది. అప్పుడు ఆ అవిశ్వాసి ఆత్మ శరీరం నుండి బయటకు వస్తుంది. అప్పుడు దాన్నుండి దుర్వాసన వస్తుంది. దాన్ని భూమి ద్వారాలవద్దకు తీసుకొనివస్తారు. ఆ తరువాత దాన్ని అవిశ్వాసుల ఆత్మల్లో కలిపివేస్తారు. [36] (అ’హ్మద్‌, నసాయి’)

1630 – [ 15 ] ( صحيح ) (1/512)

وعَنِ الْبَرَاءِ بْنِ عَازِبٍ قَالَ: خَرَجْنَا مَعَ النَّبِيِّ صلى الله عليه وسلم فِيْ جَنَازَةِ رَجُلٍ مِّنَ الْأَنْصَارِ فَانْتَهَيْنَا إِلَى الْقَبْرِ وَلَمَّا يُلْحَدْ فَجَلَسَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم وَجَلَسْنَا حَوْلَهُ كَأَنَّ عَلَى رُؤُوْسِنَا الطَّيْرُ وَفِيْ يَدِهِ عُوْدٌ يَّنْكُتُ بِهِ فِيْ الْأَرْضِ فَرَفَعَ رَأْسَهُ فَقَالَ: “اسْتَعِيْذُوْا بِاللهِ مِنْ عَذَابِ الْقَبْرِ” مَرَّتَيْنِ أَوْ ثَلَاثًا ثُمَّ قَالَ: “إِنَّ الْعَبْدَ الْمُؤْمِنَ إِذَا كَانَ فِيْ انْقِطَاعٍ مِّنَ الدُّنْيَا وَإِقْبَالٍ مِّنَ الْآخِرَةِ نَزَلَ إِلَيْهِ مِّنَ السَّمَاءِ مَلَائِكَة بِيْضُ الْوُجُوْهِ كَأَنَّ وُجُوْهَهُمُ الشَّمْسُ مَعَهُمْ كَفَنٌ مِّنْ أَكْفَانِ الْجَنَّةِ وَحَنُوْطِ مِّنْ حَنُوْطِ الْجَنَّةِ حَتَّى يَجْلِسُوْا مِنْهُ مَدَّ الْبَصَرِ ثُمَّ يَجِيْءُ مَلَكُ الْمَوْتِ حَتَّى يَجْلِسَ عِنْدَ رَأْسِهِ فَيَقُوْلُ: أَيَّتُهَا النَّفْسُ الطَّيِّبَةُ اُخْرُجِيْ إِلَى مَغْفِرَةٍ مِّنَ اللهِ وَرِضْوَانٍ”. قَالَ: “فَتَخْرُجُ تَسِيْلُ كَمَا تَسِيْلُ الْقَطْرَةُ مِنَ السِّقَاءِ فَيَأْخُذَهَا فَإِذَا أَخَذَهَا لَمْ يَدْعُوْهَا فِيْ يَدِّهِ طَرْفَةَ عَيْنٍ حَتَّى يَأْخُذُوْهَا فَيَجْعَلُوْهَا فِيْ ذَلِكَ الْكَفَنِ وَفِيْ ذَلِكَ الْحُنُوْطِ وَيَخْرُجُ مِنْهَا كَأَطْيَبِ نَفْحَةِ مِّسْكٍ وُّجِدَتْ عَلَى وَجْهِ الْأَرْضِ”. قَالَ: “فَيَصْعُدُوْنَ بِهَا فَلَا يَمُرُّوْنَ – يَعْنِيْ بِهَا – عَلَى مَلَأٍ مِّنَ الْمَلَائِكَةِ إِلَّا قَالُوْا: مَا هَذِهِ الرُّوْحُ الطَّيِّبُ فَيَقُوْلُوْنَ: فُلَانٍ بْنُ فُلَانٍ بِأَحْسَنِ أَسْمَائِهِ الَّتِيْ كَانُوْا يُسَمُّوْنَهُ بِهَا فِيْ الدُّنْيَا حَتَّى يَنْتَهُوْا بِهَا إِلَى السَّمَاءِ الدُّنْيَا فَيَسْتُفْتِحُوْنَ لَهُ فَيُفْتَحُ لَهُ فَيُشَيِّعُهُ مِنْ كُلِّ سَمَاءٍ مُّقَرَّبُوْهَا إِلَى السَّمَاءِ الَّتِيْ تُلِيْهَا حَتَّى يُنْتَهَى بِهَا إِلَى السَّمَاءِ السَّابِعَةِ – فَيَقُوْلُ اللهُ عَزَّ وَجَلَّ: اُكْتُبُوْا كِتَابَ عَبْدِيْ فِيْ عَلِّيِّيْنَ وَأَعِيْدُوْهُ إِلَى الْأَرْضِ فَإِنِّيْ مِنْهَا خَلَقْتُهُمْ وَفِيْهَا أُعِيْدُهُمْ وَمِنْهَا أُخْرِجُهُمْ تَارَةً أُخْرَى. قَالَ: “فَتُعَادَ رُوْحُهُ فَيَأْتِيْهِ مَلَكَانِ فَيُجْلِسَانِهِ فَيَقُوْلَانِ لَهُ: مَنْ رَّبُّكَ؟ فَيَقُوْلُ: رَبِّيَ اللهُ فَيَقُوْلَانِ لَهُ: مَا دِيْنُكَ؟ فَيَقُوْلُ: دِيْنِيْ الْإِسْلَامُ. فَيَقُوْلَانِ لَهُ: مَا هَذَا الرَّجُلُ الَّذِيْ بُعِثَ فِيْكُمْ؟ فَيَقُوْلُ: هُوَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم. فَيَقُوْلَانِ لَهُ: وَمَا عِلْمُكَ؟ فَيَقُوْلُ: قَرَأْتُ كِتَابَ اللهِ فَآمَنْتُ بِهِ وَصَدَّقْتُ فَيُنَادِيْ مُنَادٍ مِّنَ السَّمَاءِ أَنْ قَدْ صَدَقَ فَأَفْرِشُوْهُ مِنَ الْجَنَّةِ وَأَلْبِسُوْهُ مِنَ الْجَنَّةِ وَافْتَحُوْا لَهُ بَابًا إِلَى الْجَنَّةِ”. قَالَ: “فَيَأْتِيْهِ مِنْ رَّوْحِهَا وَطِيْبِهَا وَيُفْسَحُ لَهُ فِيْ قَبْرِهِ مَدَّ بَصَرِهِ”. قَالَ: “وَيَأْتِيْهِ رَجُلٌ حَسَنُ الْوَجْهِ حَسَنُ الثِّيَابِ طَيِّبُ الرِّيْحِ. فَيَقُوْلُ: أَبْشِرْ بِالَّذِيْ يَسُرّكَ هَذَا يَوْمُكَ الَّذِيْ كُنْتَ تُوْعَدُ. فَيَقُوْلُ لَهُ: مَنْ أَنْتَ؟ فَوَجْهُكَ الْوَجْهُ يَجِيْءُ بِالْخَيْرِ. فَيَقُوْلُ: أَنَا عَمَلُكَ الصَّالِحُ. فَيَقُوْلُ: رَبِّ أَقِمِ السَّاعَةَ رَبِّ أَقِمِ السَّاعَةَ حَتَّى أَرْجِعَ إِلَى أَهْلِيْ وَمَالِيْ”. قَالَ: “وَإِنَّ الْعَبْدَ الْكَافِرَ إِذَا كَانَ فِي انْقِطَاعٍ مِّنَ الدُّنْيَا وَإِقْبَالٍ مِنَ الْآخِرَةِ نَزَلَ إِلَيْهِ مِنَ السَّمَاءِ مَلَائِكَةٌ سُوْدُ الْوُجُوْهِ مَعَهُمُ الْمُسُوْحُ فَيْجَلِسُوْنَ مِنْهُ مَدَّ الْبَصَرِ ثُمَّ يَجِيْءُ مَلَكُ الْمَوْتِ حَتَّى يَجْلِسَ عِنْدَ رَأْسِهِ. فَيَقُوْلُ: أَيَّتُهَا النَّفْسُ الْخَبِيْثَةُ اُخْرُجِيْ إِلَى سَخَطٍ مِّنَ اللهِ”. قَالَ: ” فَتَفَرَّقَ فِيْ جَسَدِهِ فَيَنْتَزِعُهَا كَمَا يُنْتَزَعُ السُّفُوْدُ مِنَ الصُّوْفِ الْمَبْلُوْلِ فَيَأْخُذُهَا فَإِذَا أَخَذَهَا لَيَدَعُوْهَا فِيْ يَدِهِ طَرْفَةَ عَيْنٍ حَتَّى يَجْعَلُوْهَا فِيْ تِلَكَ الْمُسُوْحِ وَيَخْرُجُ مِنْهَا كَأَنْتَنِ رِيْحٍ جِيْفَةِ وُّجِدَتْ عَلَى وَجْهِ الْأَرْضِ فَيَصْعَدُوْنَ بِهَا فَلَا يَمُرُّوْنَ بِهَا عَلَى مَلَأٍ مِّنَ الْمَلائِكَةِ إِلَّا قَالُوْا: مَا هَذَا الرُّوْحُ الْخَبِيْثُ؟ فَيَقُوْلُوْنَ: فُلَانُ بْنُ فُلَانٍ – بِأَقْبَحِ أَسْمَائِهِ الَّتِيْ كَانَ يُسَمّى بِهَا فِي الدُّنْيَا – حَتَّى يُنْتَهَي بِهَا إِلَى السَّمَاءِ الدُّنْيَا فَيُسْتَفْتَحُ لَهُ فَلَا يُفْتَحُ لَهُ”. ثُمَّ قَرَأَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم (لَا تُفْتَحُ لَهُمْ أَبْوَابُ السَّمَاءِ وَلَا يَدْخُلُوْنَ الْجَنَّةَ حَتَّى يَلِجَ الْجَمَلُ فِيْ سَمِّ الْخِيَاطِ؛ 7: 40) فَيَقُوْلُ اللهُ عَزَّ وَجَلَّ: اُكْتُبُوْا كِتَابَهُ فِيْ سِجِّيْنٍ فِيْ الْأَرْضِ السُّفْلَى فَتُطْرَحُ رُوْحُهُ طَرْحًا ثُمَّ قَرَأَ: (وَمَنْ يُّشْرِكْ بِاللهِ فَكَأَنَّمَا خَرَّ مِنَ السَّمَاءِ فَتَخْطَفْهُ الطَّيْرُ أَوْ تَهْوِيْ بِهِ الرِّيْحُ فِيْ مَكَانٍ سَحِيْقٍ؛22: 31) فَتُعَادُ رُوْحُهُ فِيْ جَسَدِهِ وَيَأْتِيْهِ مَلَكَانِ فَيُجْلِسَانِهِ فَيَقُوْلَانِ لَهُ: مَنْ رَّبُّكَ: فَيَقُوْلُ: هَاهُ هَاهُ لَا أَدْرِىْ فَيَقُوْلَانَ لَهُ: مَا دِيْنُكَ؟ فَيَقُوْلُ: هَاهُ هَاهُ لَا أَدْرِيْ فَيَقُوْلُانِ لَهُ: مَا هَذَا الرَّجُلُ الَّذِيْ بُعِثَ فِيْكُمْ؟ فَيَقُوْلُ: هَاهُ هَاهُ لَا أَدْرِيْ فَيُنَادِيْ مُنَادٍ مِّنَ السَّمَاءِ أَنْ كَذَبَ فَأَفْرِشُوْهُ مِنَ النَّارِ وَافْتَحُوْا لَهُ بَابًا إِلَى النَّارِ فَيَأْتِيْهِ مِنْ حَرِّهَا وَسَمُوْمِهَا وَيُضَيْقُ عَلَيْهِ قَبْرُهُ حَتَّى تَخْتَلِفَ فِيْهِ أَضْلَاعُهُ وَيَأْتِيْهِ رَجُلٌ قَبِيْحٌ الْوَجْهِ قَبِيْحُ الثِّيَابِ مَنْتِنُ الرِّيْحِ. فَيَقُوْلُ أَبْشِرْ بِالَّذِيْ يَسُوْؤُكَ هَذَا يَوْمُكَ الَّذِيْ كُنْتَ تَوْعَدُ. فَيَقُوْلُ: مَنْ أَنْتَ؟ فَوَجْهُكَ الْوَجْهُ يَجِيْءُ بِالشَّرِّ. فَيَقُوْلُ: أَنَا عَمُلَكَ الْخَبِيْثُ. فَيَقُوْلُ: رَبِّ لَا تَقُمِ السَّاعَةَ.

وَفِيْ رِوَايَةٍ نَحْوَهُ وَزَادَ فِيْهِ: إِذَا خَرَجَ رُوْحُهُ صَلَّى عَلَيْهِ كُلُّ مَلَكٍ بَيْنَ السَّمَاءِ وَالْأَرْضِ وَكُلُّ مَلَكٍ فِيْ السَّمَاءِ وَفُتِحَتْ لَهُ أَبْوَابُ السَّمَاءِ لَيْسَ مِنْ أَهْلِ بَابٍ إِلَّا وَهُمْ يَدْعُوْنَ اللهَ أَنْ يُّعْرَجَ بِرُوْحِهِ مِنْ قَبْلِهِمْ. وَتُنْزَعُ نَفْسُهُ يَعْنِيْ الْكَافِرُ مَعَ الْعُرُوْقِ فَيَلْعَنُهُ كُلُّ مَلَكٍ بَيْنَ السَّمَاءِ وَالْأَرْضِ وَكُلُّ مَلَكٍ فِيْ السَّمَاءِ وَتُغْلَقُ أَبْوَابُ السَّمَاءِ لَيْسَ مِنْ أَهْلِ بَابٍ إِلَّا وَهُمْ يَدْعُوْنَ اللهَ أَنْ لَا يُعْرَجَ رُوْحُهُ مِنْ قَبْلِهِمْ”. رَوَاهُ أَحْمَدُ.

1630. (15) [1/512దృఢం]

బరా’ బిన్‌ ‘ఆజి’బ్‌ (ర) కథనం: మేము ప్రవక్త (స) వెంట ఒక అన్సారీ జనా’జహ్ లో వెళ్ళాము. మేము స్శశానం చేరిన తరువాత సమాధి ఇంకా సిద్ధంగా లేదని, శవాన్ని ఇంకా ఖననం చేయలేమని తెలిసింది. ప్రవక్త (స) కూర్చున్నారు. మేము కూడా ప్రవక్త (స) చుట్టూ నిశ్శబ్దంగా కూర్చున్నాము. మా తలలపై పక్షులు కూర్చున్నట్టే అటూ ఇటూ చూడకుండా తలలు వంచి కూర్చున్నాము. ప్రవక్త(స) చేతిలో కర్ర ఉండేది. దానితో నేలపై గొరుకుతున్నారు. గీత వేస్తున్నారు. ఏదో ఆలోచిస్తున్నట్టు ఉన్నారు. ఆ తరువాత తలఎత్తి ”మీరు అల్లాహ్‌(త)ను సమాధిశిక్ష నుండి శరణుకోరండి.” ఇలా రెండు లేక మూడుసార్లు అన్నారు. ఇంకా విశ్వాసి ఇహలోకంతో సంబంధాలు తెగి పరలోకంలో చేరుతున్నప్పుడు, అంటే మరణించినపుడు అందమైన దైవదూతలు ఆకాశం నుండి దిగుతారు. వారి ముఖాలు సూర్యునిలా వెలుగుతూ ఉంటాయి. వారి వెంట స్వర్గం కఫన్‌ వస్త్రం ఉంటుంది. మరియు స్వర్గ పరిమళం ఉంటుంది. మరణించిన వ్యక్తి వద్ద కనుచూపు మేరకు కూర్చుంటారు. అంటే వినయంగా చాలా దూరం వరకు కూర్చుంటారు. ఆ తరువాత మలకుల్‌ మౌత్‌ వస్తారు. అతని తల వద్ద కూర్చుని, ‘ఓ పరిశుద్ధాత్మ! నీవు అల్లాహ్‌(త) క్షమాపణ మరియు దైవప్రీతి వైపునకు బయలుదేరు’ అని అంటారు. అప్పుడు శరీరం నుండి ఆత్మ, కుండలో నుండి నీటి చుక్క పడినట్లు చాలా సులువుగా బయటకు వస్తుంది. ఆ తరువాత మలకుల్‌ మౌత్‌ దాన్ని తన చేతిలోకి తీసుకుంటారు. ఆ తరువాత వెంటనే ఇతర దైవదూతలు దాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారు. చివరికి దాన్ని స్వర్గం నుండి తెచ్చిన కఫన్‌లో ఉంచుకుంటారు. ఇంకా ఆ ఆత్మలో నుండి మంచి సువాసన వస్తుంది. అది భూమిపై ఉన్న సువాసన లన్నింటి కంటే ఉత్తమంగా ఉంటుంది. తరువాత ఆదైవదూతలు ఆత్మను తీసుకొని పైకి ఎక్కుతారు. మార్గంలో కలిసే దైవదూతలందరూ చాలా సంతోషిస్తారు. ఇంకా ‘ఈ పరిశుద్ధాత్మ, పరిమళ భరితమైన ఆత్మ ఎవరిది?’ అని అంటారు. దానికి వారు, ‘ఫలానా వ్యక్తిది’ అని అంటారు. అంటే ప్రపంచంలో ప్రజలు పిలిచే మంచి పేరును పలుకుతారు. దానిని తీసుకొని ప్రాపంచిక ఆకాశానికి చేరుకుంటారు. అతని కోసం ద్వారాలు తెరువమని చెబుతారు. అనంతరం అతని కోసం ఆకాశద్వారాలు తెరువబడతాయి. అదేవిధంగా అతనికోసం ప్రతి ఆకాశ ద్వారం తెరువబడుతుంది. అతన్ని ఆహ్వానించటానికి ఒక ఆకాశదూతలు మరో ఆకాశం వరకు వెళతారు. ఇదే విధంగా ప్రతి ఆకాశంలో అతనికి ఆహ్వానించటం జరుగుతుంది. ఆ ఆత్మను 7వ ఆకాశానికి చేర్చటం జరుగుతుంది. అప్పుడు అల్లాహ్‌, ‘ఈ నా దాసుని కర్మ పత్రాన్ని ఇల్లీయ్యీన్‌లో అంటే పుణ్యాత్ములు ఉండే చోట ఉంచండి, ఇంకా అతన్ని భూమివైపు తిరిగి పంపి వేయండి, ఎందుకంటే నేను మట్టితోనే సృష్టించాను. ఇంకా దానిలోనే తిరిగి కలుపుతాను, మళ్ళీ దాని నుండే తిరిగి లేపుతాను’ అని ఆదేశిస్తాడు. ఆ తరువాత అతని ఆత్మ అతని శరీరంలో తిరిగి చేర్చటం జరుగుతుంది. ఇద్దరు దైవదూతలు అతని వద్దకు వస్తారు. అతన్ని కూర్చోబెడతారు. ఇంకా అతన్ని, ‘నీ ప్రభువు ఎవరు’ అని అడుగుతారు. ఆ విశ్వాసి, ‘నా ప్రభువు అల్లాహ్‌’ అని సమాధానం ఇస్తాడు. మళ్ళీ ఆ ఇద్దరు దైవదూతలు అతన్ని, ‘నీ ధర్మం ఏమిటి?’ అని అడుగుతారు. దానికి అతడు, ‘నా ధర్మం ఇస్లాం,’ అని అంటాడు. మళ్ళీ ఆ దైవ దూతలు, ‘మీ వైపునకు పంపబడిన వ్యక్తి ఎవరు?’ అని అడుగుతారు. దానికి అతను, ‘అతను అల్లాహ్‌ ప్రవక్త, అల్లాహ్‌ కారుణ్యం, శుభాలు ఆయనపై కురియుగాక!’ అని అంటాడు.

మళ్ళీ వారు, ‘అతను ప్రవక్త అని నీకెలా తెలిసింది’ అని అడుగుతారు. దానికి అతడు, ‘నేను దైవగ్రంథం చదివి, దాన్ని విశ్వసించాను. దాన్ని ధృవీకరించాను’ అని అంటాడు. అప్పుడు ఆకాశం నుండి ఒక ప్రకటించే వాడు, ‘నా దాసుడు సత్యం పలికాడు. అతడి కోసం స్వర్గం పడక పరచండి, స్వర్గదుస్తులు తొడిగించండి, స్వర్గద్వారాలు తెరవండి,’ అని ఆదేశించబడుతుంది. తరువాత, స్వర్గద్వారాలు తెరువబడతాయి. దాని ద్వారా స్వర్గగాలి, సువాసన వస్తూ ఉంటుంది. అతని సమాధి కనుచూపు మేరకు విశాలపరచటం జరుగు తుంది. ఆ తరువాత అతనివద్దకు ఒక అందమైన వ్యక్తి వస్తాడు. అతను మంచి దుస్తులు, సువాసన ద్రవ్యాలు పులుముకొని ఉంటాడు. అతడు, ‘ఓ వ్యక్తీ! నీకు వాగ్దానం చేయబడిన దైవానుగ్రహాలు లభించే రోజు ఇది,’ అని అంటాడు. ఆ వ్యక్తి ‘మీరెవరు, మీరు చాలా అందంగా ఉన్నారు. మీ ముఖంలో అంతా మేలు ఉంది’ అని అంటాడు. దానికి ఆ వ్యక్తి ‘నేను నీ కర్మను’ అని అంటాడు. ఆ వ్యక్తి సంతోషించి, ‘ఓ నా ప్రభూ! పునరుత్థానదినాన్ని ఇప్పుడే సంభ వింపజేయి, నేను నా స్వర్గ కుటుంబం వద్దకు వెళ్ళిపోతాను’ అని అంటాడు.

ఒక అవిశ్వాసి ప్రాపంచిక సంబంధాలు త్రెంచుకొని పరలోకంవైపు వెళ్ళినప్పుడు, అంటే అతడు మరణించి నప్పుడు, నల్లని ముఖాలు గల దైవదూతలు ఆకాశం నుండి దిగి అతని వద్దకు వస్తారు. వారివెంట గోనెసంచి ఉంటుంది. వారు కనుచూపు మేరకు కూర్చుంటారు. అనంతరం మరణ దూత (మలకుల్‌ మౌత్‌) వచ్చి అతని తలవద్ద కూర్చుంటాడు. అవిశ్వాసిని ఉద్దేశించి, ఓ అపరిశుద్ధ ఆత్మ! అల్లాహ్‌ ఆగ్రహం వైపునకు పద,’ అని అంటాడు. అది విన్న అవిశ్వాసి ఆత్మ శరీరంలో అటూ ఇటూ పరిగెత్తుతుంది. అంటే బయటకు రావటానికి భయపడుతుంది. ఆ దైవదూత దాన్ని చాలా కఠినంగా లాగుతాడు. అంటే చాలా కఠినంగా తీయటం జరుగుతుంది. వెంటనే ఇద్దరు దైవదూతలు వచ్చి, దాన్ని గోనె సంచిలో వేసుకుంటారు. అందులో చుట్టుకుంటారు. ఆ ఆత్మనుండి, శవంనుండి వచ్చినట్టు దుర్వాసన వస్తూ ఉంటుంది .తరువాత దైవదూతలు ఆత్మను తీసుకొని ఆకాశంపైకి ఎక్కుతారు. మార్గంలో దైవదూతలు, ‘ఎవరి అపరిశుద్ధ ఆత్మ ఇది’ అని అంటారు. దైవదూతలు, ‘ఇది ఫలానా వ్యక్తిది’, అంటే చెడ్డపేరుతో ప్రస్తావిస్తారు. తలుపులు తెరువమని అంటారు. కాని తలుపులు తెరవరు’, అని చెప్పి ప్రవక్త (స),

లాతుఫ్హు లహుమ్అబ్వాబుస్సమాయివలా యద్‌’ ఖులూనల్జన్నత, హత్తా యలిజల్జమలు ఫీ సమ్మిల్‌ ‘ఖియాత్.” — ‘వారి (అవిశ్వాసుల) కోసం స్వర్గద్వారాలు ఏమాత్రం తెరువబడవు, మరియు ఒంటె సూది బెజ్జంలో నుండి దూరిపోగలిగే వరకు, వారు స్వర్గంలో ప్రవేశించజాలరు’ (సూ. అల్ అ’అరాఫ్, 7:40) అని పఠించారు. అంటే అవిశ్వాసుల కోసం స్వర్గద్వారాలు తెరువబడవు, ఇంకా వారు అందులో ప్రవేశించనూ లేరు. ఆ తరువాత అల్లాహ్ (త) అతని కర్మపత్రాన్ని అన్నిటి కంటే క్రింద ఉన్న సిజ్జీన్ లో చేర్చండి అని ఆదేశిస్తాడు. ఆ ఆత్మను పారవేయటం జరుగుతుంది.

ఆ తరువాత ప్రవక్త(స) దీన్ని సమర్ధిస్తూ ఈ ఆయతు పఠించారు.

మయ్యుష్రిక్బిల్లాహి, ఫకఅన్నమా ఖర్ర మినస్సమాయిఫతఖ్‌’తఫుహుత్తైరు, అవ్ తహ్వీ బిహీ ర్రీహు ఫీ మకానిన్హీఖ్. — ‘…అల్లాహ్‌కు సాటి కల్పించే వానిగతి ఆకాశం నుండి క్రిందపడబోయే దాని వంటిదే! దానిని పక్షులైనా ఎత్తుకొనిపోవచ్చు, లేదా గాలి అయినా దూర ప్రదేశాలకు ఎగురగొట్టుకు పోవచ్చు.’ (సూ. అల్ హజ్జ్, 22:31)

తరువాత ఇద్దరు దైవదూతలు వచ్చి అతడ్ని కూర్చోబెట్టి, అతడ్ని, ‘నీ ప్రభువు ఎవరు?’ అని అడుగుతారు. దానికి ఆ వ్యక్తి, ‘నాకు తెలియదు’, అని అంటాడు. మళ్ళీ వారు, నీ ధర్మం ఏమిటి?’ అని ప్రశ్నిస్తారు. దానికి ఆ వ్యక్తి, ‘నాకు తెలియదు,’ అని అంటాడు.   మళ్ళీ వారు, ‘మీ వద్దకు పంపబడిన వ్యక్తి ఎవరు?’ అని అడుగుతారు. ఆ వ్యక్తి, ‘నాకు తెలియదు,’ అని అంటాడు. అప్పుడు ఆకాశం నుండి ప్రకటించేవాడు, ‘వీడు అసత్యం పలుకుతున్నాడు, వీడికోసం అగ్ని పరుపు పరచండి, నరకద్వారం తెరచి వేయండి,’ అని అనబడుతుంది. వాటి ద్వారా అతని వైపునకు వేడిగాలి దుమారం వస్తుంది. ఇంకా అతని సమాధి ఇరుకుగా చేయబడుతుంది. చివరికి అతని ప్రక్కలు ఒకవైపు నుండి మరో వైపునకు వస్తాయి. ఆ తరువాత అందవికారంగా ఉన్న ఒక వ్యక్తి మాసి పోయిన బట్టలు ధరించి అతని వద్దకు వస్తాడు. అతని వద్ద దుర్వాసన కొడుతూ ఉంటుంది. ”నీకు వాగ్దానం చేయబడిన చెడ్డవార్త ఇవ్వబడేదినం ఇదే,” అని అంటాడు. అప్పుడా వ్యక్తి, ‘నీవెవరవు? నీవు చాలా అందవికారిగా ఉన్నావు, చెడ్డవార్త తెచ్చావు,’ అని అంటాడు. దానికా వ్యక్తి నేను, ‘నీ కర్మను,’ అని అంటాడు. అప్పుడా వ్యక్తి, ‘ఓ అల్లాహ్! తీర్పుదినం సంభవింపజేయకు,’ అని మొరపెట్టుకుంటాడు.

మరో ఉల్లేఖనంలో కూడా ఇలాగే ఉంది. కాని ఈ మాత్రం అధికంగా ఉంది. ”విశ్వాసి శరీరం నుండి ఆత్మ బయటపడినపుడు విశ్వంలోని దైవదూతలందరూ దానిపై కారుణ్యం అవతరింపజేస్తారు. ఇంకా అతని గురించి దు’ఆ చేస్తారు. క్షమాపణ కోరుతారు. ఇంకా అతని గురించి ఆకాశ ద్వారాలు తెరువబడతాయి. ప్రతి ఆకాశద్వార పాలకులు అల్లాహ్‌ను తమ ద్వారం గుండా సాగనంపవలసిందిగా ప్రార్థిస్తారు.

అవిశ్వాసి ఆత్మను అతని నరాల నుండి తీయటం జరుగుతుంది. భూమ్యాకాశాలలో ఉన్న దైవదూతలు ఆకాశ దైవదూతలు అతన్ని శపిస్తారు. ఆకాశంలోని ఏ ద్వారమూ అతనికోసం తెరువబడదు. అన్ని మూసివేయబడతాయి. ప్రతి ఆకాశద్వార పాలకులు అల్లాహ్‌ను తన ద్వారం గుండా అతన్ని తీసుకొని వెళ్ళకుండా చేయమని ప్రార్థిస్తారు. (అ’హ్మద్‌)

1631 – [ 16 ] ( ضعيف ) (1/515)

ؤَعَنْ عَبْدِ الرَّحْمنِ بْنِ كَعْبٍ عَنْ أَبِيْهِ قَالَ: لَمَّا حَضَرَتْ كَعْبًا الْوَفَاةُ أَتَتْهُ أُمُّ بِشْرٍ بِنْتِ الْبَرَاءِ بْنِ مَعْرُوْرٍ فَقَالَتْ: يَا أَبَا عَبْدِ الرَّحْمنِ إِنْ لَقِيْتَ فُلَانًا فَاقْرَأْ عَلَيْهِ مِنِّي السَّلَامَ. فَقَالَ: غَفَرَ اللهُ لَكَ يَا أُمَّ بِشْرٍ نَحْنُ أَشْغَلُ مِنْ ذَلِكَ فَقَالَتْ: يَا أَبَا عَبْدِ الرَّحْمنِ أَمَا سَمِعْتَ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “إِنَّ أَرْوَاحَ الْمُؤْمِنِيْنَ فِيْ طَيْرٍ خُضْرٍ تَعْلَقُ بِشَجَرِ الْجَنَّةِ؟ “قَالَ: بَلَى. قَالَتْ: فَهُوَ ذَاكَ. رَوَاهُ ابْنُ مَاجَهُ وَالْبَيْهَقِيُّ فِيْ كِتَابِ الْبَعْثِ وَالنُّشُوْرِ.

1631. (16) [1/515బలహీనం]

‘అబ్దుర్ర’హ్మాన్‌ బిన్‌ క’అబ్‌ (ర) తన తండ్రి క’అబ్‌ ద్వారా కథనం: క’అబ్‌ మరణ సమయం ఆసన్న మయినపుడు బరా’ బిన్‌ మ’అరూర్‌ కూతురు ఉమ్ము బిష్ర్‌ వచ్చి, ఓ ‘అబ్దుర్ర’హ్మాన్‌ తండ్రి, ‘మీరు ఇహలోకం నుండి పరలోకంవైపు ప్రయాణిస్తున్నారా! పరలోకంలో చాలామంది మా పెద్దలు చేరుకొని ఉన్నారు. ఒకవేళ మీరు ఫలానా వ్యక్తులతో కలిస్తే నా తరఫున సలాములు చెప్పండి,’ అని అన్నారు. దానికి క’అబ్‌ సమాధానమిస్తూ, ‘ఓ ఉమ్మి బుష్ర్‌! అల్లాహ్‌(త) నిన్ను క్షమించుగాక! మేమక్కడ అనేక విచారణలకు గురవుతాము. ఇతరుల గురించి మాకేం తెలుస్తుంది,’ అని అన్నారు. దానికి ఉమ్మె బుష్ర్‌, ‘ఓ అబూ ‘అబ్దుర్ర’హ్మాన్‌! ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా వినలేదా? ‘విశ్వాసుల ఆత్మలు పచ్చని పక్షుల శరీరాల్లో ఉంటాయి. స్వర్గంలోని పళ్ళూ ఫలాలు తింటూ ఉంటాయి,’ అని. దానికి అబ్దుర్ర’హ్మాన్‌ ‘అవును, ప్రవక్త (స) ఇలాగే అన్నారు’ అని అన్నారు. అప్పుడు ఉమ్మె బుష్ర్‌ ‘అదే నేను చెప్పింది’ అని అన్నారు. (ఇబ్ను మాజహ్, బైహఖీ-బ’అస్ వన్నషూర్)

1632 – [ 17 ] ( صحيح ) (1/516)

وَعَنْ عَبْدِ الرَّحْمنِ بْنِ كَعْبٍ عَنْ أَبِيْهِ قَالَ: أَنَّهُ كَانَ يُحَدِّثُ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم. قَالَ: “إِنَّمَا نَسَمَةُ الْمُؤْمِنِ طَيْرٌ تَعْلُقُ فِيْ شَجَرِ الْجَنَّةِ حَتَّى يَرْجِعَهُ اللهُ فِيْ جَسَدِهِ يَوْمَ يَبْعَثُهُ”.  رَوَاهُ مَالِكٌ وَالنَّسَائِيُّ وَالْبَيْهَقِيُّ فِيْ كِتَابِ الْبَعْثِ وَالنُّشُوْرِ.

1632. (17) [1/516దృఢం]

‘అబ్దుర్ర’హ్మాన్‌ బిన్‌ క’అబ్‌ తన తండ్రి క’అబ్‌ (ర) ద్వారా కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”విశ్వాసి ఆత్మ పక్షి రూపంలో స్వర్గంలోని చెట్ల పళ్ళు తింటూ ఉంటుంది. అల్లాహ్‌(త) తీర్పుదినం నాడు దాన్ని తిరిగి దాని శరీరంలోకి పంపుతాడు. అంటే తీర్పుదినం వరకు పక్షి రూపంలో స్వర్గంలోని పళ్ళు తింటూ ఉంటుంది. తీర్పుదినం నాడు తిరిగి శరీరంలోకి వస్తుంది.” (మాలిక్‌, నసాయి’, బైహఖీ-బ’అస్ వన్నషూర్)

1633 – [ 18 ] ( لم تتم دراسته ) (1/516)

وَعَنْ مُحَمَّدِ بْنِ الْمُنْكَدِرِقَالَ: دَخَلْتُ عَلَى جَابِرِبْنِ عَبْدِ اللهِ وَهُوَ يَمُوْتُ فَقُلْتُ: اقْرَأْ عَلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم السَّلَامُ. رَوَاهُ ابْنُ مَاجَهُ

1633. (18) [1/516అపరిశోధితం]

ము’హమ్మద్‌ బిన్‌ ముంకదిర్‌ (ర) కథనం: జాబిర్‌ బిన్‌ ‘అబ్దుల్లాహ్‌ మరణించినపుడు నేనతని వద్దకు వెళ్ళాను. నేనతనితో ప్రవక్త (స)కు నా సలాములు తెలియపర్చండి,’ అని అన్నాను. (ఇబ్నె మాజహ్)

=====

4بَابُ غُسْلِ الْمَيِّتِ وَتَكْفِيْنِهِ

4. శవాన్ని స్నానంచేయించి కఫన్లో చుట్టటం

శవాన్ని స్నానం చేయించటం తప్పనిసరి విధి. స్నానం చేయించినపుడు మర్మాంగాలు బహిర్గతం కాకుండా చూడాలి. అంటే మర్మాంగాలను వస్త్రంతో కప్పి, స్నానం చేయించాలి. అంటే మలమూత్రాల స్థానాలను కడగాలి. ఇంకా ఎక్కడైనా అపరిశుద్ధం ఉంటే శుభ్రపరచాలి. తరువాత నమా’జులా వు’జూ చేయించాలి. అంటే ముందు రెండు అరచేతులను కడగాలి. పుక్కిలించటం సాధ్యమైతే చేయించాలి. స్నానం చేయించేవారు తన చేతివ్రేలికి వస్త్రంచుట్టి నోటిలోని పళ్లను, దవడలను శుభ్రపరచాలి. ముక్కును వేలితో శుభ్రపరచాలి, మూడుసార్లు ముఖం కడగాలి, మూడుసార్లు రెండు చేతులను మోచేతులతో సహా కడగాలి. తల మసహ్‌ చేయాలి. అయితే కుడిప్రక్క నుండి చేయాలి. తరువాత తల, గడ్డం సబ్బురాసి కడగాలి. శవాన్ని కుడి ప్రక్కకు త్రిప్పి మెల్లిగా కడగాలి. అదేవిధంగా రెండవ ప్రక్క కూడా కడగాలి. పూర్తి శరీరాన్ని 3 లేదా 5 సార్లు కడగాలి. అంతకంటే ఎక్కువ సార్లు అవసరమయితే కడగవచ్చు. నీళ్ళు వేడిచేసేటప్పుడు రేగి ఆకులు, లేదా సువాసన గల ఆకులు లేదా పూవులు వేయాలి. చివరకు కర్పూరం కలిపిన నీటిని వేయాలి. స్నానం చివర రెండు కాళ్ళను వు’జూగా మూడు సార్లు కడగాలి. స్నానం చేయించిన తర్వాత శవం మర్మాం గం నుండి ఏదైనా వెలువడితే, దాన్ని కడిగితే సరి పోతుంది. మళ్ళీ స్నానం చేయించటం అవసరం లేదు. ము’హమ్మద్‌ బిన్‌ సీరీన్‌ మళ్ళీ స్నానం చేయించాలని అభిప్రాయ పడుతున్నారు. ఇదే ఉత్తమం.

స్త్రీ వెంట్రుకలను మూడు భాగాలు చేయాలి. జడలు వేసి వెనుక ఉంచాలి. స్నానం చేయించిన తర్వాత వు’దూ భాగాలను కర్పూరం నీటితో కడగాలి. పాదాలపై భాగాలను కూడా కడగాలి. యుద్ధంలో వీరమరణం పొందిన వారిని స్నానం చేయించకూడదు. ఏ స్థితిలో ఉంటే ఆస్థితిలోనే ఉన్న దుస్తుల్లోనే ఖననంచేయించాలి. ఇతర వీరమరణం పొందిన వారిని స్నానం చేయించి ఖననం చేయాలి. జనా’జహ్ నమా’జు చదవాలి. ఒక వేళ శవం స్నానం చేయించకుండా ఖననం చేయబడితే శవం ఇంకా క్రుళ్ళలేదని తెలిసి ఉంటే, సమాధి నుండి తీసి స్నానం చేయించి మళ్ళీ ఖననం చేయించాలి.

శవాన్ని స్నానం చేయించినవారు స్నానం చేయటం, జనా’జహ్ ఎత్తేవారు వు’దూ చేయటం అభిలష ణీయం. తప్పనిసరి కాదు. కొందరు శవాన్ని స్నానం చేయించేటప్పుడు ఏదో చదువుతుంటారు. అది ఎంత మాత్రం ఇస్లామ్‌ ధర్మంలోలేదు. స్నానం చేయించే వారు శవం శరీరంపై సున్నితంగా తుడవాలి. స్నానం చేయించేటప్పుడు శవంలో ఏదైనా లోపం కనబడితే దాన్ని దాచివేయాలి. దీనికి చాలా పుణ్యం లభిస్తుంది. ప్రవక్త (స) ప్రవచనం, ”చెప్పదగినంత ప్రాధాన్యత లేని వస్తువును దాచితే అతని 40 మహా పాపాలు క్షమించబడతాయి.” (‘హాకిమ్‌, బైహఖీ, తబ్‌రానీ)

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”శవాన్ని నిజాయితీగా స్నానం చేయిస్తే అంటే ప్రవక్త సాంప్రదాయం ప్రకారం స్నానం చేయిస్తే, ఏదైనా లోపం కనబడితే దాన్ని కప్పిపుచ్చితే, అతని పాపాలన్నీ హరించబడి, తల్లి గర్భం నుండి పుట్టిన బిడ్డలా అవు తాడు. శవం దగ్గరి బంధువులే స్నానం చేయించాలి. అయితే వారికి స్నానం చేయించడం వచ్చి ఉండాలి. ఒకవేళ వారికి తెలియకపోతే, తెలిసిన వారు, దైవ భీతిపరులు శవాన్ని స్నానం చేయించాలి. (అ’హ్మద్‌)

ఇబ్నె ‘ఉమర్‌ (ర) కథనం: ఒక ముస్లిమ్‌ మరో ముస్లిమ్‌ లోపాలను కప్పిపుచ్చితే, తీర్పుదినం నాడు అల్లాహ్‌(త) అతని లోపాలను కప్పిపుచ్చుతాడు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు మీ మృతుల గొప్ప తనాలను కొనియాడండి. వారి లోపాలను ప్రస్తావించ కండి.” (అబూ దావూద్‌).

తిర్మిజి’, అబూ దావూద్‌, పండితులు: శవాన్ని స్నానం చేయించేవారు శవంలో ఏదైనా మంచి విషయం అంటే ముఖంలో మెరుపు, వెలుగు లేదా దాన్నుండి సువాసన రావటం ఏదైనా జరిగితే ప్రజలకు తెలియపరచాలి. ఒకవేళ ఏదైనా చెడ్డ విషయం చూస్తే అంటే ముఖం లేదా శరీరం నల్లబడటం, ముఖం మారి పోవటం జరిగితే ఎవరికీ తెలియపరచరాదు. స్నానం చేయించేటప్పుడు మర్మాంగంపై దుడ్డుగా ఉన్న వస్త్రం కప్పాలి. శవాన్ని స్నానం చేయించే పలకపై ముందు ఎడమవైపు పడుకో బెట్టాలి. కుడివైపు నుండి ముందు స్నానం చేయించటానికి వీలుగా ఉంటుంది. శరీరాన్నంతా నీటితో కడగాలి. ఆ తరువాత కుడివైపుకు వంచి శరీరాన్నంతా నీటితో కడగాలి. ఆ తరువాత కుడివైపువంచి స్నానం చేయించాలి. ఒకవేళ స్నానం చేయించే పురుషులు గానీ, స్త్రీలు గాని లేకపోతే తయమ్ముమ్‌ చేయించటమే ఉత్తమం.

మువ’త్తాలో ఇమామ్‌ మాలిక్‌ ఇలా వ్రాశారు: ”పండితుల అభిప్రాయం ఏమిటంటే, స్త్రీ చనిపోతే, అక్కడ స్నానం చేయించే స్త్రీలు లేకుంటే, ఆమె బంధువులూ లేకుంటే, భర్త కూడా లేకుంటే ఆమెను తయమ్ముమ్‌ చేయించటమే ఉత్తం. అంటే ముఖం మరియు రెండు అరచేతులు పరిశుభ్రమైన మట్టితో తుడుచుకోవాలి. అదేవిధంగా పురుషుడు చనిపోతే అక్కడ స్త్రీలు మాత్రమే ఉంటే, అతనికి తయమ్ముమ్‌ చేయించడమే ఉత్తమం. అబూ దావూద్‌లోని ఒక ఉల్లేఖనం వల్ల కూడా దీనికి సమర్థన లభిస్తుంది. ఒకవేళ భర్త తన భార్యకు స్నానం చేయిస్తే ధర్మ సమ్మతమే. ‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త(స) నన్ను, ”నీవు నాకన్నాముందు చనిపోతే నేను నీకు స్నానం చేయిస్తాను” అని అన్నారు. (అ’హ్మద్‌, ఇబ్నె మాజహ్, ఇబ్నె హిబ్బాన్‌)

‘అలీ (ర), ఫా’తిమా (ర) కు స్నానం చేయించారు. (దారు ఖుతునీ). ఈ రెండు ఉల్లేఖనాల ద్వారా భర్త, భార్యకు స్నానం చేయించవచ్చని తెలిసింది. అదేవిధంగా భార్యకూడా, భర్తకు స్నానం చేయించ వచ్చు. అబూ బకర్‌కు, అతనిభార్య స్నానం చేయించారు. స్నానం చేయించేవారు తరువాత తాను స్నానం చేసుకోవాలి. శవానికి స్నానం చేయించి నపుడు ఏ దిక్కున పరుండబెట్టాలి అనే దాని గురించి ఎటువంటి ‘హదీసు’ లేదు. కొందరు సమాధిలో పరుండ బెట్టినట్టు పరుండబెట్టి స్నానం చేయించాలని అభిప్రాయపడ్డారు. కొందరు కాళ్ళు ఖిబ్లావైపు ఉండాలని అభిప్రాయపడ్డారు. మరి కొందరు ఎలా వీలైతే అలా స్నానం చేయించవచ్చని అభిప్రాయపడ్డారు. శవాన్ని స్నానం చేయించే టప్పుడు నాలుగు వైపుల నుండి తెరచాటు పెట్టాలి.

కఫన్‌ చుట్టే పద్ధతి: శవాన్నిస్నానం చేయించిన తరువాత చుట్టే వస్త్రాన్ని కఫన్‌ అంటారు. మృతుడు ధనం వదలి వెళితే, దాన్నుండి అతనికి కఫన్‌ ఏర్పాటు చేయాలి. శవం పురుషు డైతే 3 వస్త్రాలు, ఒకవేళ స్త్రీ అయితే 5 వస్త్రాలు కఫన్‌ చుట్టాలి. ఒకవేళ అంత ధనం లేకపోతే 3 లేదా 2వస్త్రాలతోనే సరిపెట్ట వచ్చు. ఒకటి ఉన్నా సరిపెట్టవచ్చు. ఒకవేళ ఒకేవస్త్రం చిన్నది ఉంటే తలకప్పి, కాళ్ళపై గడ్డి వేయవచ్చు. సాధ్యమైనంత వరకు మంచి కఫన్‌ పెట్టాలి. ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు మీ సోదరునికి మంచి కఫన్‌ సమర్పించండి.” (ముస్లిమ్‌).

మంచిది అంటే ప్రవక్త (స) సాంప్రదాయం ప్రకారం, పరి శుభ్రమైన కఫన్‌ ఉండాలి. క్రొత్తదైనా, పరిశుభ్ర పరచినదైనా సాధారణమైన ఖరీదు గల కఫన్‌ పెట్టాలి. ప్రవక్త (స) ”కఫన్‌లో హద్దుమీరి ప్రవర్తించకండి. అంటే ఖరీదైనది పెట్టకండి, ఎందుకంటే అది త్వరగా క్రుళ్ళిపోతుంది. (అబూ దావూద్‌)

 కఫన్‌లో క్రొత్త వస్త్రమే ఇవ్వవలసిన అవసరం లేదు. పాతది, పరిశుభ్రమైనది ఉన్నాసరిపోతుంది. ప్రవక్త (స) తన కుమార్తె జైనబ్ కోసం తన లుంగీ ఇచ్చారు. అబూ బకర్‌ (ర) కూడా ‘ఆయి’షహ్‌ (ర)తో ”ఈ నా పాత బట్టలనే ఉతికి నాకు కఫన్‌ ఇవ్వండి” అని అన్నారు. (బు’ఖారీ)

ఒకవేళ ఎవరైనా తన జీవితంలోనే కఫన్‌ సిద్ధం చేసు కుంటే, అది ధర్మమే. ఒక అనుచరుడు ప్రవక్త (స)ను లుంగీ అడిగి తన కఫన్‌ కోసం ఉంచుకున్నాడు. (బు’ఖారీ)

కొందరు ‘హాజీలు ‘జమ్‌’జమ్‌ నీటిలో బట్టను కడిగి తెచ్చుకొని, దాన్ని కఫన్‌గా ఉపయోగించటాన్ని అభిలషణీయంగా భావిస్తారు. దీనికి ఎలాంటి ఆధారం లేదు. పురుషులకు 3 వస్త్రాల్లో కఫన్‌ ఇవ్వాలి. ఇవి శవాన్ని చుట్టిన విధంగా పొడవు, వెడల్పు కలిగి ఉండాలి. ప్రవక్త (స)కు 3 తెల్లని వస్త్రాల్లో కఫన్‌ ఇవ్వటం జరిగింది. వాటిలో చొక్కా గాని అమామ గాని లేవు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

ఒకవేళ మ’హరమ్‌ ఇ’హ్‌రామ్‌ స్థితిలో మరణిస్తే, అతన్ని స్నానం చేయించి ఆ ఇ’హ్‌రామ్‌ దుస్తుల్లోనే కఫన్‌ ఇవ్వాలి. తల కప్పకూడదు, సువాసన పులమకూడదు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

సాధారణంగా చనిపోయిన వారికి సువాసన పుల మటం, కఫన్‌లో సువాసన పులమటం ధర్మమే. పురుషులను 3 వస్త్రాల్లో, కఫన్‌ ఎలా ఇవ్వాలంటే, 3 వస్త్రాలను క్రింద, మీద పరచాలి. శవాన్ని వాటిపై వెల్ల కిల్లా పడుకోబెట్టాలి. తరువాత పైన ఉన్న వస్త్రాన్ని కుడివైపు నుండి చుట్టాలి. తరువాత ఎడమ వైపు నుండి చుట్టాలి. ఆ తరువాత మిగిలిన రెండు వస్త్రాలను చుట్టాలి. అవసరమైతే శవాన్ని చొక్కాలో, కవర్‌లో కఫన్‌ చుట్టవచ్చును. ముందు వస్త్రం పరచి, శవాన్ని చొక్కా ధరించి, వస్త్రంపై పెట్టి తల మరియు కాళ్ళ వద్ద ముడివేయాలి.

స్త్రీల కోసం 5 వస్త్రాలు పెట్టటం సాంప్రదాయం. ఒకటి నడుముకు కట్టే వస్త్రం, రెండు చొక్కా తలపై వేసుకునే వస్త్రం ఇంకా రెండు వస్త్రాలు. ఉమ్మె కుల్‌సుమ్‌ (ర) ను 5 వస్త్రాల్లో కఫన్‌ చుట్టడం జరిగింది. (అబూ దావూద్‌)

స్త్రీని కఫన్‌ ధరించే పద్ధతి ఏమిటంటే, ఆమె రొమ్ము భాగాన్ని సువాసన, కర్పూరం పులమాలి. ఆమె తల వెంట్రుకలను మూడు జడలుగా చేయాలి. వాటిని వెనుక వేయాలి. తల ముందు భాగం వెంట్రుకలతో ఒకజడ, వెనుక రెండు వైపులా రెండు జడలు చేయాలి. ముందు ఆమెకు నడుము వస్త్రం చుట్టాలి. తరువాత చొక్కా ధరించాలి. తల వస్త్రంతో తలను కప్పాలి. ఆ తరువాత రెండు వస్త్రాల్లో చుట్టాలి. ఒకవేళ చిన్న పిల్ల అయినా సరే 5 వస్త్రాల్లో చుట్టాలి. అబ్బాయి అయితే 3 వస్త్రాల్లో పైన పేర్కొన్న, ప్రవక్త(స) సాంప్రదాయం ప్రకారం చుట్టాలి.

اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం 

1634 – [ 1 ] ( متفق عليه ) (1/517)

عَنْ أُمِّ عَطِيَّةَ قَالَتْ: دَخَلَ عَلَيْنَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم وَنَحْنُ نَغْسِلُ ابْنَتَهُ فَقَالَ: اغْسِلْنَهَا ثَلَاثًا أَوْ خَمْسًا أَوْ أَكْثَرَمِنْ ذَلِكَ إِنْ رَأَيْتُنَّ ذَلِكَ بِمَاءٍ وَّسِدْرٍوَاجْعَلْنَ فِيْ الْاخِرَةِ كَافُوْرٍأَوْ شَيْئًا مِّنْ كَافُوْرِ. فَإِذَا فَرَغْتُنَّ فآذِنَّنِيْ فَلَمَّا فَرَغْنَا آذَنَّاهُ فَأَلْقَى إِلَيْنَا حِقْوَهُ وَقَالَ: “أَشْعِرْنَهَا إِيَّاهُ”.

وَفِيْ رِوَايَةٍ: “اغْسِلْنَهَا وِتْرًا: ثَلَاثًا أَوْ خَمْسًا أَوْ سَبْعًا وَابْدَأْنَ بِمِيَامِنْهَا وَمَوَاضِعَ الْوُضُوْءِ مِنْهَا”. وَقَالَتْ فَضَفَرْنَا شَعْرَهَا ثَلَاثَةَ قُرُوْنٍ فَأَلْقَيْنَاهَا خَلْفَهَا.

1634. (1) [1/517ఏకీభవితం]

ఉమ్మె ‘అతియ్య (ర) కథనం: ప్రవక్త (స) మా వద్దకు వచ్చారు. అప్పుడు మేము ప్రవక్త (స) కూతురు జైనబ్ శవాన్ని స్నానం చేయిస్తున్నాం. అప్పుడు ప్రవక్త (స) ‘ఈమెకు 3 లేదా 5 లేదా మీరు కోరినన్ని సార్లు, స్నానం చేయించండి. ఇంకా ఈమెను ఈ నీటితో అంటే రేగిఆకులు వేయబడిన నీటితో స్నానం చేయించండి, చివరి సారిగా కర్పూరం, సువాసన కలిపి స్నానం చేయించండి. స్నానం చేయించిన తరువాత నాకు తెలియపర్చండి,’ అని అన్నారు. మేము స్నానం చేయించిన తరువాత ప్రవక్త (స)కు తెలియ పరిచాము. ప్రవక్త (స) మా వద్దకు వచ్చి, లుంగీని మా వైపు విసిరి, ‘దీన్ని శవం నడుముకు అంటే క్రింద కట్టండి,’ అని అన్నారు.

మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”ప్రవక్త (స) బేసి సంఖ్యలో అంటే 3 లేదా 5 లేదా 7 సార్లు స్నానం చేయించండి, కుడి వైపు నుండి ప్రారంభించండి, వు’దూ భాగాలను కడగండి,” అని అన్నారు. మేము ‘జైనబ్‌ వెంట్రుకలను 3 జడలుగా చేశాము. వెనుక వైపు ఉంచాము. [37] (బు’ఖారీ, ముస్లిమ్‌)

1635 – [ 2 ] ( متفق عليه ) (1/517)

وَعَنْ عَائَشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: إِنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم كُفِّنَ فِيْ ثَلَاثَةِ أَثْوَابٍ يَّمَانِيَةٍ بَيْضٍ سَحُوْلِيَّةٍ مِّنْ كُرْسُفٍ لَيْسَ فِيْهَا قَمِيْصٌ وَلَا عَمَامَةٌ.

1635. (2) [1/517ఏకీభవితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స)కు మూడు యమనీ తెల్లని దుప్పట్లతో కఫన్‌ చేయడం జరిగింది. వాటిలో చొక్కాగాని, అమామహ్ గాని లేవు. [38] (ముస్లిమ్‌)

1636 – [ 3 ] ( صحيح ) (1/518)

وَعَنْ جَابِرٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا كَفَّنَ أَحَدُكُمْ أَخَاهُ فَلْيُحْسِنْ كَفَنَهُ” .رَوَاهُ مُسْلِمٌ .

1636. (3) [1/518దృఢం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు మీ సోదరునికి కఫన్‌ ఇస్తే, మంచికఫన్‌ ఇవ్వండి.” [39] (ముస్లిమ్‌)

1637 – [ 4 ] ( متفق عليه ) (1/518)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَبَّاسٍ قَالَ: إِنَّ رَجُلَا كَانَ مَعَ النَّبِيِّ صلى الله عليه وسلم فَوَقَصَتْهُ نَاقَتُهُ وَهُوَ مُحْرِمٌ فَمَاتَ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اغْسِلُوْهُ بِمَاءٍ وَّسِدْرٍ وَكَفِّنُوْهُ فِيْ ثَوْبَيْهِ وَلَا تَمَسُّوْهُ بِطِيْبٍ وَّلَا تُخَمِّرُوْا رَأْسَهُ فَإِنَّهُ يُبْعَثُ يَوْمَ الْقِيَامَةِ مُلَبِّيًا”. وَسَنَذْكُرُ حَدِيْث خَبَّابٍ: قُتِلَ مُصْعَبُ بْنُ عُمَيْرٍ فِيْ بَابِ جَامِعِ الْمَنَاقِبِ إِنْ شَاءَ اللهُ.

1637. (4) [1/518ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) చేసిన ‘హజ్జ్ లో ఒక వ్యక్తి ‘హజ్జ్ ఇ’హ్‌రామ్‌ ధరించి ఉన్నాడు. అతని ఒంటె అతన్ని క్రిందపడేసింది. దానివల్ల అతని మెడ విరిగిపోయి, అతడు మరణించాడు. అప్పుడు ప్రవక్త(స), ‘అతన్ని రేగి ఆకులు గల నీటితో స్నానం చేయించి, అతని ఇ’హ్‌రామ్‌ దుస్తులతోనే, సువాసన పులమకుండా, తల కప్పకుండా, కఫన్‌ ఇవ్వమన్నారు, ఎందుకంటే తీర్పుదినం నాడు అతడు తల్‌బియహ్‌ పలుకుతూ లేపబడతాడు,’ అని అన్నారు. [40] (బు’ఖారీ, ముస్లిమ్‌)

—–

الْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం

1638 – [ 5 ] ( صحيح ) (1/518)

وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “الْبَسُوْامِنْ ثِيَابِكُمُ الْبَيَاضَ. فَإِنَّهَا مِنْ خَيْرِ ثِيَابِكُمْ وَكَفِّنُوْا فِيْهَا مَوْتَاكُمْ وَمِنْ خَيْرِ أَكْحَالِكُمُ الْإِثْمِدُ. فَإِنَّهُ يُنْبِتُ الشَّعْرَ وَيَجْلُوا الْبَصَرَ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ.

1638. (5) [1/518దృఢం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు తెల్లని దుస్తులు ధరించండి. ఇవి మీ దుస్తులన్నిటిలో ఉత్తమమైనవి. ఇంకా ఈ తెల్లని దుస్తుల్లోనే మీ మృతులకు కఫన్‌ ఆచరించండి. ఇంకా మీ సుర్మాలలో మంచిది, సుర్మా అస్మద్‌, అంటే నల్లని సుర్మా. దీన్ని పెట్టుకోండి. ఇది మీ కనురెప్పల వెంట్రుకలను పెంచుతుంది. కంటి దృష్టిని అధికం చేస్తుంది.” (అబూ దావూద్‌, తిర్మిజి’, ఇబ్నె మాజహ్)

1639 – [ 6 ] ( ضعيف ) (1/518)

وَعَنْ عَلِيٍّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تُغَالُوْا فيْ الْكَفَنِ فَإِنَّهُ يُسْلَبُ سَلْبًا سَرِيْعًا” .رَوَاهُ أَبُوْ دَاوُدَ .

1639. (6) [1/518బలహీనం]

‘అలీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఖరీదైన వస్త్రాన్ని కఫన్‌గా సమర్పించకండి. ఇది చాలా త్వరగా నశిస్తుంది. అంటే చాలా త్వరగా పాడై పోతుంది.” (అబూ దావూద్‌)

1640 – [ 7 ] ( صحيح ) (1/519)

وَعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ أَنَّهُ لَمَّا حَضَرَهُ الْمَوْتُ. دَعَا بِثِيَابٍ جُدَدٍ فَلَبِسَهَا. ثُمَّ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “اَلْمَيِّتُ يُبْعَثُ فِيْ ثِيَابِهِ الَّتِيْ يَمُوْتُ فِيْهَا”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

1640. (7) [1/519దృఢం]

అబూ స’యీద్‌ (ర) కథనం: అతను మరణించ టానికి ముందు క్రొత్తబట్ట తెప్పించి ధరించారు. ఇంకా ప్రవక్త (స) ఏ దుస్తుల్లోమరణిస్తే ఆదుస్తుల్లోనే లేపబడ తారని ప్రవచించారని అన్నారు. [41] (అబూ దావూద్‌)

1641 – [ 8 ] ( ضعيف ) (1/519)

وَعَنْ عُبَادَةَ بْنِ الصَّامِتْ عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَالَ: “خَيْرُ الْكَفَنِ الْحُلَّةُ وَخَيْرُ الْأَضْحِيَةُ الْكَبْشُ الْأَقْرَنُ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

1641. (8) [1/519-బలహీనం]

‘ఉబాదహ్‌ బిన్‌ ‘సామిత్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవ చనం, ”కఫన్లలో అన్నిటికంటే మంచి కఫన్హుల్లహ్. అంటే వస్త్రం మరియు నడుముకు కట్టుకునేది, ఖుర్‌బానీ జంతువుల్లో శ్రేష్ఠమైనది కొమ్ములుగల బలిసిన గొర్రె.” ఎందుకంటే ఇస్మాయీల్‌కు బదులుగా ఖుర్‌బానీ చేయబడిన గొర్రెకు కొమ్ములు ఉండేవి. ఇంకా అది బలిసి బలమైనదిగా ఉండేది. అందుకే దానికి ప్రాధాన్యత ఇవ్వబడింది. (అబూ దావూద్‌)

1642 – [ 9 ] ( ضعيف ) (1/519)

وَرَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ عَنْ أَبِيْ أُمَامَةَ.

1642. (9) [1/519బలహీనం]

ఈ హదీసునే, అబూ ఉమామహ్ కథనం ఆధారంగా, తిర్మిజి’, ఇబ్నె మాజహ్, ఉల్లేఖించారు.

1643 – [ 10 ] ( ضعيف ) (1/519)

وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: أَمَرَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم بِقَتْلَى أُحدٍ أَنْ يُّنْزَعَ عَنْهُمْ الْحَدِيْدُ وَالْجُلُوْدُ وَأَنْ يُّدْفَنُوْا بِدِمَائِهِمْ وَثِيَابِهِمْ. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ.

1643. (10) [1/519బలహీనం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ఉ’హుద్‌ యుద్ధంలో వీరమరణం పొందినవారి గురించి ప్రవక్త(స) మాట్లాడు తూ వారి శరీరాల నుండి ఆయుధాలు, రక్షణ కవచాలు తీసివేసి, వారిని వారు ఉన్న స్థితిలోనే ఖననం చేయ మని ఆదేశించారు. [42] (అబూ దావూద్‌, ఇబ్నె మాజహ్)

—–

اَلْفَصْلُ الثَّالِثُ  మూడవ విభాగం 

1644 – [ 11 ] ( صحيح ) (1/520)

عَنْ سَعْدِ بْنِ إِبْرَاهِيْمَ عَنْ أَبِيْهِ أَنَّ عَبْدَ الرَّحْمَنِ بْنِ عَوْفٍ أُتِىَ بِطَعَامٍ وَكَانَ صَائِمًا فَقَالَ: قُتِلَ مُصْعَبُ بْنُ عُمَيْرٍ وَهُوَ خَيْرٌ مِّنِّيْ كُفِّنَ فِيْ بُرْدَةٍ إِنْ غُطِّيَ رَأْسُهُ بَدَتْ رِجْلَاهُ وَإِنْ غُطِّيَ رِجْلَاهُ بَدَا رَأْسُهُ وَأُرَاهُ. قَالَ: وَقُتِلَ حَمْزَةُ وَهُوَ خَيْرٌ مِّنِيْ ثُمَّ بُسِطَ لَنَا مِنَ الدُّنْيَا مَا بُسِطَ. أَوْ قَالَ: أُعْطِيْنَا مِنَ الدُّنْيَا مَا أُعْطِيْنَا وَلَقَدْ خَشِيْنَا أَنْ تَكُوْنَ حَسَنَاتُنَا عُجِّلَتْ لَنَا ثُمَّ جَعَلَ يَبْكِيْ حَتَّى تَرَكَ الطَّعَامَ. رَوَاهُ الْبُخَارِيُّ .

1644. (11) [1/520దృఢం]

స’అద్‌ బిన్‌ ఇబ్రాహీమ్‌ (ర) తన తండ్రి ద్వారా కథనం: ‘అబ్దుర్ర’హ్మాన్‌ బిన్‌ ‘ఔఫ్‌ ఉపవాసం ఉండి, అతని వద్దకు భోజనం తీసుకురావటం జరిగింది. అందులో మాంసం, రొట్టెలు ఉన్నాయి. భోజనాన్ని చూసి, ”ము’స్‌’అబ్‌ బిన్‌ ‘ఉమైర్‌ వీరమరణం పొందారు. వారు నాకు మంచి మిత్రులు, అతన్ని ఒక చిన్న దుప్పటిలో కఫన్‌ చేయడం జరిగింది. తల కప్పితే కాళ్ళు బయటపడేవి. కాళ్ళు కప్పితే తల బయటపడేది. ‘హమ్‌’జహ్ వీరమరణం పొందారు. అతను కూడా నాకు మంచి మిత్రులు. అతన్ని కూడా ఆ విధంగానే కఫన్‌ ఇచ్చి ఖననం చేయటం జరిగింది. ఆ తరువాత అల్లాహ్‌(త) మాకు ప్రాపంచిక అనుగ్రహాలు ప్రసాదించాడు. అంతకు ముందు మన సోదరులకు ఆ భాగ్యం కలగలేదు. ‘మన పుణ్యాల ప్రతిఫలంగా త్వరగా మనకు ఇవి ప్రసాదించ బడ్డాయేమో’ అని భయంగా ఉంది, మరి పరలోకంలో ఏం లభిస్తుంది అని పలికి, ఏడుస్తూ ఆ భోజనాన్ని వదలివేసారు. [43] (బు’ఖారీ)

1645 – [ 12 ] ( متفق عليه ) (1/520)

وَعَنْ جَابِرٍ قَالَ: أَتَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَبْدَ اللهِ بْنِ أُبَيِّ بَعْدَمَا أُدْخِلَ حُفْرَتَهُ فَأَمَرَ بِهِ فَأُخْرِجَ فَوَضَعَهُ عَلَى رُكْبَتَيْهِ فَنَفَثَ فِيْهِ مِنْ رِّيْقِهِ وَأَلْبَسَهُ قَمِيْصَهُ قَالَ: وَكَانَ كَسَا عَبَّاسًا قَمِيْصًا. متفق عليه.

1645. (12) [1/520ఏకీభవితం]

జాబిర్‌ (ర) కథనం: ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉబయ్‌ (కపటాచారి) మరణించిన తరువాత, అతన్ని సమాధిలో దించిన తరువాత, ప్రవక్త (స) వచ్చి, అతన్ని సమాధి నుండి తీయటం జరిగింది. ప్రవక్త (స) అతన్ని తన రెండు మోకాళ్ళ పై ఉంచి, అతని నోటిలో తన ఉమ్మి వేశారు, ఇంకా తన చొక్కా అతనికి తొడిగించారు. ఎందుకంటే, ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉబయ్‌, ‘అబ్బాస్‌ (ర)కు తన చొక్కా తొడిగించాడు కనుక. [44]  (బు’ఖారీ, ముస్లిమ్‌)

=====

5اَلْمَشْيِ بِالْجَنَازَةِ وَالصَّلَاةُ عَلَيْهَا

5. జనాజహ్ వెంటవెళ్ళడం, జనాజహ్ నమాజు చేయడం

స్నానం, కఫన్‌ క్రియలు పూర్తయిన తరువాత శవాన్ని మంచంలాంటి దానిపై పెట్టి భుజాలపై మోసుకొని ఖననం చేయడానికి తీసుకొని వెళ్ళాలి. ఎత్తుకొని వెళ్ళటంలో ఏ మాత్రం సిగ్గుగా, అవమానంగా భావించరాదు. ఇది ఇస్లామీయ హక్కు. దాన్ని నిర్వర్తించటం తప్పనిసరి. జనా’జహ్ వెంట వెళ్ళడం వల్ల చాలా పుణ్యం లభిస్తుంది. ప్రవక్త (స) ప్రవచనం, ”విశ్వాసంతో ప్రతిఫలాపేక్షతో ఒక ముస్లిమ్‌ జనా’జహ్ వెంట వెళ్ళి, జనా’జహ్ నమా’జు చదివి, ఖననం చేసిన తర్వాత తిరిగివస్తే, అతనికి 2 ఖీరాత్‌ల పుణ్యం లభిస్తుంది. ప్రతి ఒక్క ఖీరాత్‌ ఉహుద్‌ కొండంత ఉంటుంది. ఖననం చేయకముందే తిరిగి వస్తే 1 ఖీరాత్‌ పుణ్యం లభిస్తుంది. జనా’జహ్ ను త్వరగా తీసుకొని వెళ్ళాలి. కాని పరుగెత్త కూడదు. ప్రవక్త (స) ప్రవచనం, ”జనా’జహ్ ను త్వరగా తీసుకొని వెళ్ళండి.” (బు’ఖారీ)

జనా’జహ్ వెంట వెళ్ళేవారు, జనా’జహ్ ముందు, వెనుక, కుడి, ఎడమల వైపు ఉండవచ్చును. అయితే జనా’జహ్ చాలా దూరం ముందు ఉండకూడదు. చాలా దూరం వెనుక ఉండ కూడదు. జనా’జహ్ కు దగ్గరగా ఉండాలి. వాహనంపై ఉన్న వారు జనా’జహ్ వెనుక ఉండాలి. కాలి నడకన ఉన్నవారు ఎటు ఉన్నా ఫరవా లేదు. జనా’జహ్ పలక లేదా మంచం 4 కాళ్ళను నలుగురు పట్టుకొని ఎత్తాలి. భుజంపై ఉంచుకోవాలి. వెంట ఉన్నవారు తమ భుజాలపై కూడా ఎత్తుకోవాలి. ఎత్తు కున్న వారికి అధిక భారం పడకుండా ఉంటుంది.

తిర్మిజిలో ఇలా ఉంది, ”అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”జనా’జహ్ వెంట నడచి, మూడు సార్లు ఎత్తితే, అతనిపై ఉన్న హక్కును నెరవేర్చినట్టే. అదేవిధంగా 4 మూలలను 4 సార్లు ఎత్తడం మంచిది. ముందు జనా’జహ్ తన కుడి కాలిని తన కుడి భుజంపై ఎత్తాలి. తరువాత కుడి కాలివద్ద ఉన్న కాలిని తన కుడి భుజంపై ఎత్తాలి. తరువాత జనా’జహ్ ఎడమ ప్రక్కను తన ఎడమ భుజంపై ఎత్తాలి. తరువాత జనా’జహ్ కాలివద్ద ఉన్నమంచం కాలును ఎడమ భుజంపై ఎత్తాలి. (కితాబుల్‌ ఆసార్‌)

జనా’జహ్ వెంట స్త్రీలు వెళ్ళకూడదు. అగ్గిని కూడా వెంట తీసుకొని వెళ్ళకూడదు. జనా’జహ్ వెంట పవిత్ర వచనం, ఖుర్‌ఆన్‌ దు’ఆ బిగ్గరగా పఠిస్తూ వెళ్ళ కూడదు. ఎందుకంటే ప్రవక్త సాంప్రదాయంలో దీనికి ఎటువంటి ఆధారం లేదు. జనా’జహ్ ను చూసి ఎవరైనా నిలబడితే ధర్మమే జనా’జహ్ ఎత్తటానికి వుదూ అవసరం లేదు. అయితే జనా’జహ్ నమా’జు కోసం వు’దూ అవసరం. అయితే జనా’జహ్ ను దించి భూమిపై పెట్టేవరకు కూర్చోకూడదు.

జనాజహ్ నమాజు చదివే పద్ధతి

జనా’జహ్ నమా’జు ఫర్జ్‌ కిఫాయహ్. కొంతమంది చదువుకుంటే, అందిరి బాధ్యత తీరిపోతుంది. ఒకవేళ ఎవరూ చదవకపోతే అందరూ పాపానికి గురవుతారు. శవాన్ని సమాధిలో ఉంచిన తరువాత వచ్చి సమాధి పైనే జనా’జహ్ చదువుకుంటే, అది ధర్మమే. ఒకవేళ పురుషుని శవం అయితే ఇమామ్‌ తల ముందు నిల బడాలి. ఒకవేళ స్త్రీ శవం అయితే ఇమామ్‌ నాభి ముందు నిలబడాలి. జనా’జహ్ నమా’జు మస్జిద్‌లో చదవవచ్చును. స్త్రీలు కూడా మస్జిద్‌కు వచ్చి జనా’జహ్ నమా’జులో పాల్గొనవచ్చును. ఒకవేళ అనేక జనా’జహ్ లు ఉంటే ఒక్క నమాజు సరిపోతుంది. జనా’జహ్ నమా’జు 4, 5, 6 తక్బీర్లతో కూడా చదవవచ్చును.

ఇమామ్‌ శవం ముందు నిలబడాలి. అతని వెనుక కనీసం 3 పంక్తులు ఉండాలి. ఈ నమా’జులో అజా’న్‌ మరియు ఇఖామత్‌లు లేవు, పంక్తులు  కట్టిన తరువాత ఇమాము తక్‌బీరె తహ్రీమ్ (1) పలకాలి. ముఖ్తదీలు కూడా పలకాలి. ఆ తరువాత మస్నూన్‌ దు’ఆలు పలకాలి. ”సుబ్‌హాన కల్లాహుమ్మ” లేదా ”అల్లాహుమ్మ బాయిద్‌ బైనీ…” తరువాత ”అఊజుబిల్లాహ్‌, బిస్మిల్లాహ్‌” పఠించిన తరువాత బిగ్గరగా సూరహ్ఫాతిహా చదవాలి. ముఖ్తదీలు మెల్లగా చదవాలి. ఇమాము సూరహ్‌ ఫాతిహా తరువాత ఏదైనా సూరహ్ చదవాలి. తరువాత ఇమాము అల్లాహు అక్బర్‌ (2) అని పలుకుతూ రఫెయదైన్‌ చేయాలి. రుకూ’, సజ్దాలు చేయకూడదు. తరువాత చేతులుకట్టుకొని దరూద్‌చదవాలి. దరూద్‌ పఠించిన తరువాత, ‘అల్లాహు అక్బర్‌,’ (3) పలికిన తరువాత ”అల్లాహుమ్మ’గ్‌ఫిర్‌ లి’హయ్యినా వమయ్యితినా” లేదా ఇటువంటి దు’ఆ పఠించి ‘అల్లాహు అక్బర్‌,’ (4) పలికి సలామ్‌ పలకాలి.

జనా’జహ్ నమా’జులో మొదటి తక్‌బీరె తరువాత సనా దు’ఆ చదవటానికి గల సాక్ష్యాధారాలు: ఫు’జాల బిన్‌ ‘ఉబైద్‌ (ర) కథనం: ప్రవక్త(స) ఒక వ్యక్తిని దు’ఆ చేస్తుండగా చూశారు. అతడు దు’ఆ చేయటానికి ముందు దైవాన్ని స్తుతించ లేదు, ప్రవక్త (స) కొరకు దరూద్‌ కూడా పఠించలేదు. అది చూసిన ప్రవక్త (స) ‘అతడు తొందర పాటుకు గురయ్యాడు’ అని అన్నారు. (అబూ దావూద్‌, తిర్మిజి’, నసాయి’, ఇబ్ను మాజహ్)

ఈ ‘హదీసు’ ద్వారా జనా’జహ్ నమా’జులో దు’ఆయె సనా చదవవచ్చని తెలిసింది.

మువ’త్తా ఇమామ్‌ మాలిక్‌లో ఇలా ఉంది, ”అబూ స’యీద్‌ ‘ఖుద్రీ అబూ హురైరహ్‌ (ర)ను ‘మీరు జనా’జహ్ నమా’జు ఎలా చదువుతారు’ అని ప్రశ్నించారు. దానికి అతను ”నేను జనా’జహ్ వెంట అతని కుటుంబం వారి నుండి బయలుదేరుతాను. జనా’జహ్ ఉంచిన తరువాత అల్లాహు అక్బర్‌ అని పలికిన తరువాత దైవాన్ని స్తుతిస్తాను. తరువాత అల్లాహ్‌ ప్రవక్తపై దరూద్‌ పఠిస్తాను. తరువాత ”అల్లాహుమ్మ అబ్‌దుక వ ఇబ్ను అబ్‌దిక” అని పలుకుతాను అని అన్నారు. ఈ ‘హదీసు’ ద్వారా కూడా జనా’జహ్ నమా’జులోని మొదటి తక్‌బీర్‌ తరువాత దు’ఆయె సనా చదవాలని తెలుస్తుంది. ఇది కూడా నమా’జు గనుక ఇతర నమా’జుల్లా ఇందులో కూడా సనా చదవాలని స్పష్టమౌతుంది.

మొదటి తక్‌బీర్‌ తరువాత సూరహ్ఫాతిహా చదివే సాక్ష్యం ఏమిటంటే, అబూ ఉమామహ్ (ర) ”జనా’జహ్ నమా’జులో సూరహ్‌ ఫాతి’హా చదవటం ప్రవక్త (స) పద్ధతి అని ప్రవక్త (స) సూరహ్‌ ఫాతి’హా పఠించనిదే నమా’జు నెరవేరదని అన్నారని, ఎందు కంటే ఇది కూడా నమా’జు అని” అన్నారు.

‘స’హీ’హ్ బు’ఖారీలో ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: అతను ఒక జనా’జహ్ నమా’జు చదివారు. అందులో సూరహ్‌ ఫాతి’హా చదివి, ‘తెలుసుకోండి, నమా’జులో సూరహ్‌ ఫాతి’హా చదవటం ప్రవక్త (స) పద్ధతి’ అని అన్నారు. ‘హాకిమ్‌ ఉల్లేఖనంలో ఇలా ఉంది: ”ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) జనా’జహ్ నమా’జులో సూరహ్‌ ఫాతి’హా బిగ్గరగా చదివారు. అనంతరం ‘నేను సూరహ్‌ ఫాతి’హా బిగ్గరగా ఎందుకు చదివానంటే, మీరు జనా’జహ్ నమా’జులో సూరహ్‌ ఫాతి’హా బిగ్గరగా చదవాలని తెలుసుకోవడానికి’ అని అన్నారు. జనా’జహ్ నమా’జులో సూరహ్‌ ఫాతి’హా మెల్లగా, బిగ్గరగా చదివినట్టు ఉంది. అయితే బిగ్గరగా చదవడం ఉత్తమం.”

నసాయి’లో అబూ ఉమామహ్ (ర) కథనం: జనా’జహ్ నమా’జు పద్ధతి: ”ముందు అల్లాహు అక్బర్‌ పఠించండి. తరువాత సూరహ్‌ పాతి’హా చదవండి. తరువాత ప్రవక్త (స)పై దరూద్‌ పఠించండి. తరువాత మృతుని కోసం చిత్తశుద్ధితో ప్రార్థించండి. అయితే ఖిరాఅత్‌ కేవలం మొదటి తక్‌బీర్‌ తర్వాతనే.” ‘హాఫిజ్‌ ఇబ్నె ‘హజర్‌ ఫత్‌’హుల్‌ బారీలో ఈ ‘హదీసు’ను ప్రామాణికమైనదిగా పేర్కొన్నారు. జనా’జహ్ నమా’జు 4 తక్‌బీర్లతో కూడా చదవవచ్చును. 5 తక్‌బీర్లతో కూడా చదవవచ్చును. అంతకన్నా ఎక్కువ తక్‌బీర్లతో కూడా చదవ వచ్చును. అయితే 4 తక్‌బీర్ల ఆచరణ ఉత్తమం. ప్రతి తక్‌బీర్‌తో పాటు రఫెయదైన్‌ చేయాలి. అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర), ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) జనా’జహ్ నమా’జులోని 4 తక్‌బీర్లలో రఫెయదైన్‌ చేసేవారు. మాలిక్‌, షాఫ’యీ, అ’హ్మద్‌ బిన్‌ ‘హంబల్‌ల అభిప్రాయం కూడా ఇదే. తిర్మిజీ’ అభిప్రాయం కూడా ఇదే. ఒకవేళ మృతుడు మరో ఊరిలో ఉండి, అతని ఖనన సంస్కారాలు కూడా పూర్తయితే ఇస్తిగ్‌ఫార్‌గా పరోక్షంగా జనాజహ్ నమాజు చదవటం ధర్మమే.

اَلْفَصْلُ الْأَوَّلُ  మొదటి విభాగం

1646 – [ 1 ] ( متفق عليه ) (1/521)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَسْرِعُوْا بِالْجَنَازَةِ فَإِنْ تَكُ صَالِحَةً فَخَيْرٌ تُقَدِّمُوْنَهَا إِلَيْهِ وَإِنْ تَكُ سِوَى ذَلِكَ فَشَرٌّ تَضَعُوْنَهُ عَنْ رِّقَابِكُمْ”.

1646. (1) [1/521ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”జనా’జహ్ ను త్వరగా తీసుకువెళ్ళండి. ఎందుకంటే ఒకవేళ అతను పుణ్యాత్ముడైతే, అతని మంచి వైపుకు త్వరగా చేర్చివేయండి. ఒక వేళ అతడు చెడ్డవాడైతే, అతన్ని త్వరగా మీ భుజాలపై నుండి దించి వేయండి.” [45](బు’ఖారీ, ముస్లిమ్‌)

1647 – [ 2 ] ( صحيح ) (1/521)

وَعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا وُضِعَتِ الْجَنَازَةُ فَاحْتَمَلَهَا الرِّجَالُ عَلَى أَعْنَاقِهِمْ فَإِنْ كَانَتْ صَالِحَةً قَالَتْ: قَدِّمُوْنِيْ وَإِنْ كَانَتْ غَيْرُ صَالِحَةٍ. قَالَتْ لِأَهْلِهَا: يَا وَيْلَهَا أَيْنَ يَذْهَبُوْنَ بِهَا؟ يَسْمَعُ صَوْتَهَا كُلُّ شَيْءٍ إِلَّا الْإِنْسَانَ وَلَوْ سَمِعَ الْإِنْسَانُ لَصَعِقَ” .رَوَاهُ الْبُخَارِيُّ.

1647. (2) [18521దృఢం]

అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”జనా’జహ్ ను తయారు చేసి, ప్రజలు తమ భుజాలపై ఉంచినపుడు పుణ్యాత్ముడైతే, ‘నన్ను త్వరగా తీసుకువెళ్ళండి,’ అని అంటాడు. ఒకవేళ చెడ్డవాడైతే, ‘నన్ను ఎక్కడికి తీసుకు వెళుతున్నారు, వద్దు-వద్దు,’ అని కేకలు వేస్తాడు. మానవులు తప్ప ఇతర ప్రాణులన్నీ వింటాయి. ఒకవేళ మానవులు వింటే స్పృహ కోల్పోతారు.” (బు’ఖారీ)

1648 – [ 3 ] ( متفق عليه ) (1/521)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا رَأَيْتُمُ الْجَنَازَةَ فَقُوْمُوْا فَمَنْ تَبِعَهَا فَلَا يَقْعُدُ حَتَّى تُوْضَعَ”.

1648. (3) [1/521ఏకీభవితం]

అబూ స’యీద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు జనా’జహ్ ను తీసుకొని వెళ్ళటం చూస్తే నిలబడండి. ఇంకా జనా’జహ్ వెంట వెళ్ళేవారు జనా’జహ్ ను భుజాలపై నుండి దించి భూమిపై పెట్టేవరకు కూర్చోరాదు.” [46] (బు’ఖారీ, ముస్లిమ్‌)

1649 – [ 4 ] ( متفق عليه ) (1/521)

وَعَنْ جَابِرٍ قَالَ: مَرَّتْ جَنَازَةٌ فَقَامَ لَهَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم وَقُمْنَا مَعَهُ فَقُلْنَا: يَا رَسُوْلَ اللهِ إِنَّهَا يَهُوْدِيَّةٌ فَقَالَ: “إِنَّ الْمَوْتَ فَزَعٌ فَإِذَا رَأَيْتُمُ الْجَنَازَةَ فَقُوْمُوْا”.

1649. (4) [1/521ఏకీభవితం]

జాబిర్‌ (ర) కథనం: ఒక జనా’జహ్ వెళ్ళడం జరిగింది. ప్రవక్త (స) లేచి నిలబడ్డారు. మేము కూడా ప్రవక్త (స) తో పాటు లేచి నిలబడ్డాము. అప్పుడు మేము, ‘ఓ ప్రవక్తా! ఇది యూద స్త్రీ జనా’జహ్, ముస్లిమ్‌ది కాదు. తమ రెందుకు లేచి నిలబడ్డారు,’ అని విన్నవించుకున్నాం. దానికి ప్రవక్త (స), ”చావు భయపడే, ఆందోళన చెందవలసిన విషయం. మీరు జనా’జహ్ ను చూస్తే నిలబడిపోండి” అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

1650 – [ 5 ] ( صحيح ) (1/521)

وَعَنْ عَلِيٍّ رضي الله عَنْهُ قَالَ: رَأَيْنَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم قَامَ فَقُمْنَا وَقَعَدَ فَقَعَدْنَا يَعْنِيْ فِيْ الْجَنَازَةِ. رَوَاهُ مُسْلِمُ

وَفِيْ رِوَايَةِ مَالِكٍ وَأَبِيْ دَاوُدَ: قَامَ فِيْ الْجَنَازَةِ ثُمَّ قَعَدَ بَعْدُ.

1650. (5) [1/522దృఢం]

‘అలీ (ర) కథనం: ప్రవక్త (స) జనా’జహ్ ను చూసి నిలబడటం మేము చూశాము. మేము కూడా లేచి నిలబడ్డాము. ప్రవక్త (స) కూర్చుంటే, మేము కూడా కూర్చున్నాము. [47] (ముస్లిమ్‌)

మాలిక్‌ మరియు అబూ దావూద్‌ ఉల్లేఖనంలో ”ప్రవక్త (స) జనా’జహ్ ను చూసి నిలబడి, కూర్చున్నారు.” అని ఉంది.

1651 – [ 6 ] ( متفق عليه ) (1/522)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنِ اتَّبَعَ جَنَازَةَ مُسْلِمٍ إِيْمَانًا وَّاحْتِسَابًا وَكَانَ مَعَهُ حَتَّى يُصَلِّيَ عَلَيْهَا وَيَفْرُغَ مِنْ دَفْنِهَا فَإِنَّهُ يَرْجِعُ مِنَ الْأَجْرِ بِقِيْرَاطَيْنِ كُلِّ قِيْرَاطٍ مِثْلَ أُحُدٍ وَمَنْ صَلّى عَلَيْهَا ثُمَّ رَجَعَ قَبْلَ أَنْ تُدْفَنَ فَإِنَّهُ يَرْجِعُ بِقِيْرَاطٍ”. متفق عليه

1651. (6) [1/522ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”విశ్వాసంతో, ప్రతిఫలాపేక్షతో ముస్లిమ్‌ జనా’జహ్ వెంట వెళ్ళి, జనా’జహ్ నమా’జు చదివి, ఖనన సంస్కారాలు పూర్తయిన తర్వాత తిరిగి వస్తే, 2 ఖీరాత్‌ల పుణ్యంతో తిరిగి వస్తాడు. ప్రతి ఖీరాత్‌ ఉ’హుద్‌ కొండంత ఉంటుంది. కేవలం జనా’జహ్ నమా’జు చదివి తిరిగివస్తే కేవలం 1 ఖీరాత్‌  పుణ్యం లభిస్తుంది.” [48] (బు’ఖారీ, ముస్లిమ్‌)

1652 – [ 7 ] ( متفق عليه ) (1/522)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم نَعَى لِلنَّاسِ النَّجَاشِيَّ الْيَوْمَ الَّذِيْ مَاتَ فِيْهِ وَخَرَجَ بِهِمْ إِلَى الْمُصَلَّى فَصَفَّ بِهِمْ وَكَبَّرَ أَرْبَعَ تَكْبِيْرَاتٍ . متفق عليه.

1652. (7) [1/522ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) నజాషీ చక్రవర్తి మరణించిన రోజే ప్రజలకు అతని మరణం గురించి తెలియపరిచారు. ఇంకా ప్రజలను వెంట బెట్టుకొని ‘ఈద్గాహ్‌ వెళ్ళారు. పంక్తులుగా చేసి 4 తక్‌బీర్లతో జనా’జహ్ నమా’జు చదివించారు. [49]  (బు’ఖారీ, ముస్లిమ్‌)

1653 – [ 8 ] ( صحيح ) (1/522)

وَعَنْ عَبْدِ الرَّحْمَنِ بْنِ أَبِيْ لَيْلَى قَالَ: كَانَ زَيْدُ بْنُ أَرْقَمَ يُكَبِّرُ عَلَى جَنَائِزِنَا أَرْبَعًا وَإِنَّهُ كَبَّرَ عَلَى جَنَازَةٍ خَمْسًا فَسَأَلْنَاهُ فَقَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يُكَبِّرُهَا . رَوَاهُ مُسْلِمٌ.

1653. (8) [1/522దృఢం]

‘అబ్దుర్ర’హ్మాన్‌ బిన్‌ అబీ లైలా (ర) కథనం: ‘జైద్‌ బిన్‌ అర్‌ఖమ్‌ మా జనా’జహ్ ల నమా’జులో 4 తక్‌ బీర్లు పఠించేవారు. ఒకసారి ఒక జనా’జహ్ లో 5 తక్‌ బీర్లు పలికారు. అప్పుడు మేము కారణం అడిగాము. దానికి అతను సమాధానం ఇస్తూ ప్రవక్త (స) కూడా 5 తకీబీర్లు పలికేవారని అన్నారు. [50](ముస్లిమ్‌)

1654 – [ 9 ] ( صحيح ) (1/522)

وَعَنْ طَلْحَةَ بْنِ عَبْدِ اللهِ بْنِ عَوْفٍ قَالَ: صَلَّيْتُ خَلْفَ ابْنَ عَبَّاسٍ عَلَى جَنَازَةٍ فَقَرَأَ فَاتِحَةَ الْكِتَابِ فَقَالَ: لِتَعْلَمُوْا أَنَّهَا سُنَّةٌ. رَوَاهُ الْبُخَارِيُّ .

1654. (9) [1/522దృఢం]

‘తల్‌హా బిన్‌ ‘అబ్దుల్లాహ్‌ (ర) కథనం: నేను ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) వెనుక ఒక జనా’జహ్ నమా’జు చదివాను. అతను తక్‌బీర్‌ తరువాత సూరహ్ఫాతిహా చదివారు. ఇంకా జనా’జహ్ నమా’జులో సూరహ్‌ ఫాతి’హా చదవటం ప్రవక్త (స) పద్ధతని మీకు తెలుపటానికి చదివాను’ అని అన్నారు. [51] (బు’ఖారీ)

ఇంకా బుఖారీలో ఇలా ఉంది: ”సూరహ్‌ ఫాతి’హా చదవనిదే ఏ నమా’జు పూర్తికాదు.” జనా’జహ్ నమా’జు కూడా నమా’జే. కనుక అందులో కూడా సూరహ్‌ ఫాతి’హా తప్పనిసరిగా చదవాలి. కొన్ని ఉల్లేఖనాల ద్వారా కూడా దీనికి సమర్థన లభిస్తుంది. ఇబ్నె మాజలో ఉమ్మె  షరీక్‌ (ర) కథనం: ప్రవక్త (స) మాకు జనా’జహ్ నమా’జులో సూరహ్‌ ఫాతి’హా చదవమని ఆదేశించారు. తబ్‌రానీలో కూడా ఈ ‘హదీసు’ ఉమ్మె ‘అఫీఫ్‌ ద్వారా ఉల్లేఖించబడింది. తబ్‌రానీలో అస్మా బిన్‌తె య’జీద్‌(ర) కథనం: ప్రవక్త(స) ప్రవచనం, ”మీరు నమా’జు చదివినపుడు సూ. ఫాతి’హా చదువుకోండి.”

ఫుజాల బిన్‌ అబీ అమీమహ్ (ర) కథనం: అబూ బకర్‌, ‘ఉమర్‌ల జనా’జహ్ నమా’జులో సూరహ్‌ ఫాతి’హా చదవబడింది. ఇంకా నసాయి’, ‘హాకిమ్‌, షాఫయీ, అబూ య’అలా ఉల్లేఖనం: ప్రవక్త (స) జనా’జహ్ నమా’జులో సూరహ్‌ ఫాతి’హా చదివారు. ఇంకా నైలుల్‌ అవ్‌తార్‌లో ఇలా ఉంది: ఇబ్నె మస్‌’ఊద్‌, ‘హసన్‌ బిన్‌ ‘అలీ, ఇబ్ను ‘జుబైర్‌, ము’సవ్విర్‌ బిన్‌ మఖ్‌రమహ్‌ మొదలైన వారు జనా’జహ్ నమా’జులో సూరహ్‌ ఫాతి’హా చదివేవారు. షాఫ’యీ, అ’హ్మద్‌, ఇస్‌’హాఖ్‌ల అభిప్రాయం కూడా ఇదే. షౌకానీ ఉల్లేఖనాలన్నింటినీ పేర్కొన్న తరువాత, ఈ ఉల్లేఖనాలన్నిటి ద్వారా జనా’జహ్ నమా’జులో మొదటి తక్‌బీర్‌ తరువాత సూరహ్‌ ఫాతి’హా ఏదైనా మరో సూరహ్‌ చదవాలని, ప్రవక్త (స) పై దరూద్‌ పంపాలని, జనాజా ప్రత్యేక దు’ఆలు చదవాలని తెలిసింది. అంటే మొదటి తక్‌బీర్‌ తరువాత సూరహ్ఫాతిహా మరియు మరో సూరహ్ చదవాలి. రెండవ తక్బీర్ తరువాత దరూద్చదవాలి. మూడవ తక్బీర్ తరువాత ప్రత్యేక దుఆలు చదవాలి. దీనికి అబూ ఉమామహ్ ‘హదీసు’ ద్వారా సమర్థన లభిస్తుంది. అందులో ప్రవక్త (స) అనుచరుల్లోని ఒకరి కథనం: జనా’జహ్ నమా’జు చదివే పద్ధతి: ఇమాము ముందు అల్లాహు అక్బర్‌ అని పలకాలి. తరువాత సూరహ్‌ ఫాతిహా మెల్లగా చదవాలి. రెండవ తక్‌బీర్‌ తర్వాత ప్రవక్త (స)పై దరూద్‌ పఠించాలి. మూడవ తక్‌బీర్‌ తరువాత ప్రత్యేక దు’ఆలు పఠించాలి. ఈ తక్‌బీరుల్లో ఖుర్‌ఆన్‌ చదవకూడదు. మెల్లగా సలామ్‌ పలకాలి. షాఫ’యీ తన ముస్నద్‌లో దీన్ని పేర్కొన్నారు.

ఏది ఏమైనా జనా’జహ్ నమా’జులో మెల్లగా, బిగ్గరగా రెండు విధాలుగా చదవవచ్చును. ప్రతి తక్‌బీర్‌తో పాటు రఫెయదైన్చేయటం ప్రవక్త సాంప్రదాయం. బు’ఖారీ రఫెయదైన్‌ భాగంలో బైహఖీ ద్వారా ఇబ్నె ‘ఉమర్‌ నుండి ఉల్లేఖించారు. అంటే అతను జనా’జహ్ నమా’జులోని తక్‌బీర్లలో రఫెయదైన్‌ చేసేవారని పేర్కొన్నారు.

1655 – [ 10 ] ( صحيح ) (1/522)

وَعَنْ عَوْفِ بْنِ مَالِكٍ قَالَ: صَلَّى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَلَى جَنَازَةٍ فَحَفِظْتُ مِنْ دُعَائِهِ وَهُوَ يَقُوْلُ: “اَللّهُمَّ اغْفِرْ لَهُ وَارْحَمْهُ وَعَافِهِ وَاعْفُ عَنْهُ وَأَكْرِمْ نُزَلَهُ وَوَسِّعْ مَدْخَلَهُ وَاغْسِلْهُ بِالْمَاءِ وَالثَّلَجِ وَالْبَرْدِ وَنَقِّهِ مِنَ الْخَطَايَا كَمَا نَقَّيْتَ الثَّوْبَ الْأَبْيَضَ مِنَ الدَّنَسِ وَأَبْدِلْهُ دَارًا خَيْرًا مِّنْ دَارِهِ وَأَهْلًا خَيْرًا مِّنْ أَهْلِهِ وَزَوْجًا خَيْرًا مِّنْ زَوْجِهِ وَأَدْخِلْهُ الْجَنَّةَ وَأَعِذْهُ مِنْ عَذَابِ الْقَبْرِ وَمِنْ عَذَابِ النَّار”.

وَفِيْ رِوَايَةٍ: “وَّقِهِ فِتْنَةَ الْقَبْرِ وَعَذَابِ النَّارِ”. قَالَ حَتَّى تَمَنَّيْتُ أَنْ أَكُوْنَ أَنَا ذَلِكَ الْمَيِّتَ. رَوَاهُ مُسْلِمٌ.

1655. (10) [1/522దృఢం]

‘ఔఫ్‌ బిన్‌ మాలిక్‌ (ర) కథనం: ప్రవక్త(స) జనా’జహ్ నమా’జు చదివించారు. అందులో ప్రవక్త (స) చదివిన దు’ఆను నేను గుర్తుచేసుకున్నాను. దు ఇది:

అల్లాహుమ్మగ్ఫిలహు వర్‌’హమ్హు, ఆఫిహీ అఫుఅన్హు, అక్రిమ్ నుజులహు వస్సీ మద్‌’ఖలహు, గ్సిల్హు బిల్మాయి వస్సల్జి వల్బరది వనఖ్ఖిహీ, మినల్‌’తాయా కమా యునఖ్ఖస్సౌబుల్అబ్దు మినద్దనసి, అబ్దిల్హు దారన్‌ ‘ఖైరమ్ మిన్దారిహీ, అహ్లన్‌ ‘ఖైరన్మిన్అహ్లిహి, జౌజన్‌ ‘ఖైరన్మిన్‌ ‘జౌజిహి, అద్‌’ఖిల్హుల్హు జన్నత, ఇజ్‌’హు, మిన్‌ ‘అజాబిల్ఖబ్రి, వమిన్అజాబిన్నార్‌.” — ‘ఓ అల్లాహ్‌! ఇతన్ని క్షమించు. ఇతన్ని కరుణించు మరియు శాంతిని ప్రసాదించు. ఇతనిపై దయచూపు, ఇతని స్థానాన్ని ఉన్నతం చేయి. ఇంకా ఇతని సమాధిని విశాలపరచు, ఇంకా ఇతని పాపాలను మంచుతోను, వడగళ్ళ తోనూ శుభ్రపరచు. తెల్లని వస్త్రం మురికి నుండి పరిశుభ్ర పరచబడినట్లు. ఇంకా ఇతనికి ప్రాపంచిక ఇంటికంటే మంచి ఇంటిని, ప్రాపంచిక కుటుంబం కంటే మంచి కుటుంబాన్నీ, ఇంకా ప్రాపంచిక జత కంటే మంచి జతను ప్రసాదించు, ఇంకా ఇతన్ని స్వర్గంలో ప్రవేశింపజేయి, ఇంకా ఇతనికి సమాధి శిక్ష నుండి, నరక శిక్ష నుండి విముక్తి ప్రసాదించు.”

ప్రవక్త (స) ఈ దు’ఆ చదవటం విన్న నేను ఈ శవం నాదై ఉండి ఉంటే, నాపై ఈ దు’ఆ చదివి ఉంటే ఎంత బాగుణ్ణు’ అని అనుకున్నాను. (ముస్లిమ్‌)

1656 – [ 11 ] ( صحيح ) (1/523)

وَعَنْ أَبِيْ سَلَمَةَ بْنِ عَبْدِ الرَّحْمَنِ أَنَّ عَائِشَةَ لَمَّا تُوُفِّيَ سَعْدُ بْنُ أَبِيْ وَقَّاصٍ قَالَتْ: أُدْخُلُوْا بِهِ الْمَسْجِدَ حَتَّى أُصَلِّيَ عَلَيْهِ فَأَنْكَرَ ذَلِكَ عَلَيْهَا فَقَالَتْ: وَاللهِ لَقَدْ صَلّى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَلَى ابْنَيْ بَيْضَاءَ فِيْ الْمَسْجِدِ سُهَيْلِ وَّأَخِيْهِ. رَوَاهُ مُسْلِمٌ.

1656. (11) [1/523దృఢం]

అబూ సలమహ్ బిన్‌ ‘అబ్దుర్ర’హ్మాన్‌ (ర) కథనం: స’అద్‌ బిన్‌ అబీ వఖ్ఖా’స్‌ మరణించినపుడు స్నానం, కఫన్‌ల తరువాత జనా’జహ్ నమా’జుకు తీసుకు వెళ్ళినపుడు ‘ఆయి’షహ్‌ (ర) ప్రజలతో, ‘మీరు అతని జనా’జహ్ ను మస్జిద్‌లోకి తీసుకు వెళ్ళండి. నేను కూడా అతని కోసం నమా’జు చదువుకుంటాను’ అని అన్నారు. దానికి అభ్యంతరం తెలుపటం జరిగింది. అప్పుడు ‘ఆయి’షహ్‌ (ర) ప్రవక్త (స) బై’దా’ ఇద్దరు కుమారుల జనా’జహ్ నమా’జు మస్జిద్‌లో చదివారు. అంటే, సుహైల్‌ మరియు సహ్‌ల్‌ల జనా’జహ్ నమా’జు.” [52]  (ముస్లిమ్‌)

1657 – [ 12 ] ( متفق عليه ) (1/523)

وَعَنْ سَمُرَةَ بْنِ جُنْدُبٍ قَالَ: صَلَّيْتُ وَرَاءَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم عَلَى امْرَأَةٍ مَاتَتْ فِيْ نِفَاسِهَا فَقَامَ وَسَطَهَا. متفق عليه.

1657. (12) [1/523ఏకీభవితం]

సమురహ్‌ బిన్‌ జున్‌దుబ్‌ (ర) కథనం: ప్రవక్త (స) వెనుక నేను ఒక స్త్రీ జనా’జహ్ పై నమా’జు చదివాను. ఆమె బిడ్డను కన్న తరువాత మరణించింది. ప్రవక్త (స) ఆమె బొడ్డుకు ఎదురుగా నిలబడ్డారు. [53](బు’ఖారీ, ముస్లిమ్‌)

1658 – [ 13 ] ( متفق عليه ) (1/523)

وَعَنِ ابْنِ عَبَّاسٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم مَرَّ بِقَبَرٍدُفِنَ لَيْلًا فَقَالَ: “مَتَى دُفِنَ هَذَا؟” قَالُوْا: اَلْبَارِحَةَ .قَالَ: “أَفَلَا آذَنْتُمُوْنِيْ؟” قَالُوْا: دَفَنَّاهُ فِيْ ظُلْمَةِ اللَّيْلِ فَكَرِهْنَا أَنْ نُّوْقِظَكَ. فَقَامَ فَصَفَفْنَا خَلْفَهُ فَصَلَّى عَلَيْهِ. متفق عليه.

1658. (13) [1/523ఏకీభవితం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఒక సమాధి ప్రక్కనుండి వెళ్ళడం జరిగింది. అతన్ని రాత్రి ఖననం చేయడం జరిగింది. అది చూసి ప్రవక్త (స) ‘ఇతన్ని ఎప్పుడు ఖననం చేయడం జరిగింది’ అని అడిగారు. దానికి ప్రజలు ‘నిన్నరాత్రి’ అని అన్నారు. దానికి ప్రవక్త (స) ‘నాకెందుకు తెలియపర్చలేదు’ అని అన్నారు. దానికి ప్రజలు ‘చీకటిగా ఉండటం వల్ల మేమే ఖననం చేసివేశాము, తమరిని లేపటం మంచిది కాదని భావించాము’ అని అన్నారు. అది విని ప్రవక్త (స), సమాధిపైనే జనా’జహ్ నమా’జు చదవడానికి నిలబడ్డారు. మేము ప్రవక్త (స) వెనుక పంక్తులు కట్టాము. ప్రవక్త (స) ఆ సమాధిపై జనా’జహ్ నమా’జు చదివించారు. [54](బు’ఖారీ, ముస్లిమ్‌)

1659 – [ 14 ] ( متفق عليه ) (1/523)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّ امْرَأةً سَوْدَاءَ كَانَتْ تَقُمُ الْمَسْجِدَ أَوْ شَابٌّ فَفَقَدَهَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فَسَأَلَ عَنْهَا أَوْ عَنْهُ فَقَالُوْا: مَاتَ. قَالَ: “أَفَلَا كُنْتُمْ آذْنْتُمُوْنِيْ؟” قَالَ: فَكَأَنَّهُمْ صَغَّرُوْا أَمَرَهَا أَوْ أَمْرَهُ. فَقَالَ: “دُلُّوْنِيْ عَلَى قَبْرِهِ”. فَدَلُّوْهُ فَصَلّى عَلَيْهَا. قَالَ: “إِنَّ هَذِهِ الْقُبُوْرُ مَمْلُوَّءَةٌ ظُلْمَةً عَلَى أَهْلِهَا. وَإِنَّ اللهَ يُنَوِّرُهَا لَهُمْ بِصَلَاتِيْ عَلَيْهِمْ”. وَلَفْظُهُ لِمُسْلِمٍ. متفق عليه.

1659. (14) [1/523ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ఒక నల్లని స్త్రీ మస్జిద్‌ తుడిచేది. పరిశుభ్రంగా ఉంచేది. లేదా ఒక యువకుడు ఉండే వాడు. అతను మస్జిద్‌ తుడిచేవాడు. ప్రవక్త (స) అతన్ని చూడలేదు. లేకపోవటం చూచి, ‘ఆ మస్జిద్‌ తుడిచే వాడు ఎక్కడ’ అని అడిగారు. అనుచరులు ‘మరణించాడు లేదా మరణించింది’ అని అన్నారు. దానికి ప్రవక్త (స) ‘నాకెందుకు తెలియపరచలేదు’ అని అన్నారు. దానికి వారు ‘చిన్న పనికి తమకు ఎందుకు కష్టపెట్టటం అని భావించామని’ అన్నారు. అప్పుడు ప్రవక్త (స) ‘పదండి, నాకు ఆమె సమాధి చూపెట్టండి’ అని అన్నారు. ప్రజలు సమాధి చూపెట్టారు. ప్రవక్త (స) ఆ సమాధిపై జనా’జహ్ నమా’జు చదివించారు. తరువాత ‘ఈ సమాధులు అంధకారంగా ఉంటాయి. నేను నమా’జు చదవడం వల్ల అల్లాహ్‌ వాటిని వెలుగుతో నింపివేస్తాడు’ అని అన్నారు. [55] (బు’ఖారీ, ముస్లిమ్‌)

1660 – [ 15 ] ( صحيح ) (1/523)

وَعَنْ كُرِيْبٍ مَوْلَى ابْنِ عَبَّاسٍ عَنْ عَبْدِ اللهِ بْنِ عَبَّاسٍ أَنَّهُ مَاتَ لَهُ ابْنٌ بِقُدَيْدٍ أَوْ بِعُسْفَانَ فَقَالَ: يَا كُرِيْبُ انْظُرْ مَا اجْتَمَعَ لَهُ مِنَ النَّاسِ. قَالَ: فَخَرَجْتُ فَإِذَا نَاسٌ قَدْ اجْتَمَعُوْا لَهُ فَأَخْبَرْتُهُ فَقَالَ: تَقُوْلُ: هُمْ أَرْبَعُوْنَ؟ قَالَ: نَعَمْ. قَالَ: أَخْرِجُوْهُ فَإِنِّيْ سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “مَا مِنْ رَجُلٍ مُّسْلِمٍ يَّمُوْتُ فَيَقُوْمُ عَلَى جَنَازَتِهِ أَرْبَعُوْنَ رَجُلًا لَّا يُشْرِكُوْنَ بِاللهِ شَيْئًا إِلَّا شَفَّعَهُمُ اللهُ فِيْهِ”.  رَوَاهُ مُسْلِمٌ.

1660. (15) [1/523దృఢం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) విడుదల చేసిన బానిస (ర) కథనం: ఇబ్నె ‘అబ్బాస్‌ ఒక బిడ్డ ఖుదైద్‌ లేదా ‘అస్‌ఫాన్‌ ప్రాంతంలో మరణించాడు. అప్పుడు నన్ను, ‘ఓ కురైబ్‌! జనా’జహ్ నమా’జు చదవడానికి ఎంత మంది వచ్చారో, బయటకు వెళ్ళిచూడు’ అని ఆదేశించబడింది. నేను బయటకు వెళ్ళి చూసేసరికి చాలామంది వచ్చి ఉన్నారు. నేను తిరిగి ‘చాలా మంది వచ్చి ఉన్నారని’ చెప్పాను. దానికి అతను ‘నాతో ఎంతమంది, 40 మంది ఉంటారా’ అని అన్నారు. నేను ‘అవునని’ అన్నాను. ఇబ్నె అబ్బాస్‌ ”ఇప్పుడు జనా’జహ్ ను బయటకు తీయండి, ఎందు కంటే, ప్రవక్త (స), ముస్లిమ్‌ జనా’జహ్ పై 40 విశ్వాస ఏకదైవారాధకులు చేరితే, వారందరూ కలసి అతనిపై జనా’జహ్ నమా’జు చదివితే, అల్లాహ్‌ వారి సిఫారసు స్వీకరిస్తాడని, మృతుని క్షమించి వేస్తాడని ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను” అని అన్నారు. (ముస్లిమ్‌)

1661 – [ 16 ] ( صحيح ) (1/524)

وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “مَا مِنْ مَّيِّتٍ تُصَلِّيْ عَلَيْهِ أُمَّةٌ مِّنَ الْمُسْلِمِيْنَ يَبْلُغُوْنَ مِائَةً كُلُّهُمْ يَشْفَعُوْنَ لَهُ: إِلَّا شُفِعُوْا فِيْهِ”.  رَوَاهُ مُسْلِمٌ.

1661. (16) [1/524దృఢం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక ముస్లిమ్‌ జనా’జహ్ పై సుమారు100మంది ముస్లింలు నమా’జు చదివి, మృతుని కొరకు సిఫారసు చేస్తే, వారి సిఫారసు స్వీకరించబడుతుంది.” [56](ముస్లిమ్‌)

1662 – [ 17 ] ( متفق عليه ) (1/524)

وَعَنْ أَنَسٍ قَالَ: مَرُّوْا بِجَنَازَةٍ فَأَثْنَوْا عَلَيْهَا خَيْرًا. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “وَجَبَتْ”. ثُمَّ مَرُّوْا بِأُخْرَى فَأَثْنَوْا عَلَيْهَا شَرًّا. فَقَالَ: “وَجَبَتْ” .فَقَالَ عُمَرُ: مَا وَجَبَتْ؟ فَقَالَ:”هَذَا أَثْنَيْتُمْ عَلَيْهِ خَيْرًا فَوَجَبَتْ لَهُ الْجَنَّةُ. وَهَذَا أَثْنَيْتُهُمْ عَلَيْهِ شَرًّا فَوَجَبَتْ لَهُ النَّارُ .أَنْتُمْ شُهَدَاءُ اللهِ فِيْ الْأَرْضِ”.

وَفِيْ رِوَايَةٍ: “الْمُؤْمِنُوْنَ شُهَدَاءُ اللهِ فِيْ الْأَرْضِ”.

1662. (17) [1/524ఏకీభవితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) అనుచరుల బృందం ఒక జనా’జహ్ ప్రక్క నుండి వెళ్ళడం జరిగింది. వారు అతన్ని ప్రశంసించారు. ‘అతడు చాలా మంచి వ్యక్తి’ అని అన్నారు. అది విన్న ప్రవక్త (స), ‘అతని కోసం తప్పనిసరి అయిపోయింది’ అని అన్నారు. ఆ తరువాత మరో జనా’జహ్ ప్రక్క నుండి వెళ్ళడం జరిగింది. ‘అతడు చెడ్డవాడని’ చెప్పుకున్నారు. అప్పుడు ప్రవక్త (స) ‘అతనికోసం తప్పనిసరి అయిపోయింది,’ అని అన్నారు. వారిని గురించి అనుచరులు అడుగగా, ప్రవక్త (స) సమాధానం ఇస్తూ, ”మీరు మొదటి వ్యక్తి గురించి పొగిడినప్పుడు, అతని కోసం స్వర్గం తప్పని సరి అయిపోయింది. రెండవ వ్యక్తిని గురించి మీరు, ‘ఇతను చెడ్డవాడు’ అని అన్న ప్పుడు నరకం తప్పనిసరి అయిపోయింది. మీరు భూమిపై అల్లాహ్‌ సాక్షులు,” అని అన్నారు. [57](బు’ఖారీ, ముస్లిమ్‌)

1663 – [ 18 ] ( صحيح ) (1/524)

وَعَنْ عُمَرَقَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَيُّمَا مُسْلِمٍ شَهِدَ لَهُ أَرْبَعَةٌ بِخَيْرٍأَدْخَلَهُ اللهُ الْجَنَّةَ” .قُلْنَا: وَثَلَاثَةٌ؟ قَالَ: “وَثَلَاثَةٌ”. قُلْنَاوَاثْنَانِ؟ قَالَ: “وَاثْنَانِ”ثُمَّ لَمْ نَسْأَلْهُ عَنِ الْوَاحِدِ. رَوَاهُ الْبُخَارِيُّ.

1663. (18) [1/524దృఢం]

‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స), ”ఒక ముస్లిమ్‌ గురించి నలుగురు సత్య-విశ్వాసులు ‘అతడు మంచి వాడని’ సాక్ష్యం ఇస్తే, అల్లాహ్‌ అతన్ని స్వర్గంలోకి పంపుతాడు,’ అని అన్నారు. దానికి మేము, ‘ఒకవేళ ముగ్గురు సాక్ష్యంఇస్తే’ అని అన్నాము. దానికి ప్రవక్త (స) ‘ముగ్గురు వ్యక్తులు సాక్ష్యం ఇచ్చినాసరే అతన్ని స్వర్గంలోనికి పంపడం జరుగుతుంది’ అని అన్నారు. మళ్ళీ మేము ‘ఒకవేళ ఇద్దరు వ్యక్తులు సాక్ష్యం ఇస్తే’ అని అన్నాము. దానికి ‘ఇద్దరు వ్యక్తులు సాక్ష్యం సరే’ అని అన్నారు. అయితే నేను ఒక వ్యక్తి సాక్ష్యం గురించి అడగలేదు.” [58](బు’ఖారీ)

1664 – [ 19 ] ( صحيح ) (1/524)

وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تَسُبُّوا الْأَمْوَاتَ فَإِنَّهُمْ قَدْ أَفْضُوْا إِلَى مَا قَدَّمُوْا”. رَوَاهُ الْبُخَارِيُّ.

1664. (19) [1/524దృఢం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మృతులను తిట్టకండి. ఇంకా వారి గురించి చెడుగా మాట్లాడకండి. ఎందుకంటే వారు ముందు పంపిన దాని దగ్గరకు వారు చేరుకున్నారు.” [59](బు’ఖారీ)

1665 – [ 20 ] ( صحيح ) (1/525)

وَعَنْ جَابِرٍأَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم كَانَ يَجْمَعُ بَيْنَ الرَّجُلَيْنِ فِيْ قَتْلَى أُحُدٍ فِيْ ثَوْبٍ وَّاحِدٍ ثُمَّ يَقُوْلُ: “أَيُّهُمْ أَكْثَرُ أَخْذًا لِلْقُرْآنِ؟” فَإِذَا أُشِيْرَ لَهُ إِلَى أَحَدِهِمَا قَدَّمَهُ فِيْ اللَّحْدِ وَقَالَ: “أَنَا شَهِيْدٌ عَلَى هَؤُلَاءِ يَوْمَ الْقِيَامَةِ”. وَأَمَرَ بِدَفْنِهِمْ بِدِمَائِهِمْ وَلَمْ يُصَلِّ عَلَيْهِمْ وَلَمْ يُغْسِلُوْا. رَوَاهُ الْبُخَارِيُّ.

1665. (20) [1/525దృఢం]

జాబిర్‌ (ర) కథనం: ఉ’హుద్‌ యుద్ధంలోని వీర మరణం పొందిన వారిని వస్త్రాలు తక్కువగా ఉండటం వల్ల ప్రవక్త(స) ఇద్దరు వ్యక్తులను ఒక కఫన్‌లో చుట్టే వారు. ఇంకా ఆ ఇద్దరు వీరమరణం పొందినవారిలో ఎవరికి ఎక్కువగా ఖుర్‌ఆన్‌ గుర్తుందని అడిగేవారు. ఇద్దరిలో ఒకరివైపు సైగచేస్తే, అతన్ని ముందు సమాధిలో ఖిబ్లా వైపు ఉంచేవారు. ఇంకా ‘నేను తీర్పుదినం నాడు ఈ అమరవీరుల వీరమరణానికి సాక్ష్యం ఇస్తాను, వీరిని రక్తసిక్తంగా ఉన్న స్థితిలోనే ఖననం చేయండి. వీరికి స్నానం చేయించకండి,’ అని అనేవారు. అనంతరం అమర వీరులను స్నానం చేయించకుండా, నమాజు చదవకుండా ఖననం చేయడం జరిగింది. [60](బు’ఖారీ)

1666 – [ 21 ] ( صحيح ) (1/525)

وَعَنْ جَابِرِ بْنِ سَمُرَةَ قَالَ: أُتِىَ النَّبِيُّ صلى الله عليه وسلم بِفَرَسٍ مَعْرُوْرٍ فَرَكِبَهُ حِيْنَ انْصَرَفَ مِنْ جَنَازَةِ ابْنِ الدَّحْدَاحِ وَنَحْنُ نَمْشِيْ حَوْلَهُ. رَوَاهُ مُسْلِمٌ.

1666. (21) [1/525దృఢం]

జాబిర్‌ బిన్‌ సమురహ్‌ (ర) కథనం: ఇబ్ను దహ్‌దాహ్‌ అనుచరులు మరణించినపుడు అతన్ని ఖననం చేయబడింది. ప్రవక్త (స) కోసం ఒక గుర్రం తీసుకురావటం జరిగింది. దానిపై జీనులేదు. ప్రవక్త (స) దానిపై ఎక్కి వచ్చారు. మేము ప్రవక్త (స) వెంట కాలి నడకన బయలు దేరాము. [61](ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం  

1667 – [ 22 ] ( صحيح ) (1/525)

وَعَنْ الْمُغَيْرَةِ بْنِ شُعْبَةَ أَنَّ النَّبيَّ صلى الله عليه وسلم قَالَ: “اَلرَّاكِبُ يَسِيْرُ خَلْفَ الْجَنَازَةِ وَالْمَاشِيْ يَمْشِيْ خَلْفَهَا وَأَمَامَهَا وَعَنْ يَمِيْنَهَاوَعَنْ يَسَارِهَا قَرِيْبًا مِّنْهَا وَالسِّقْطُ يُصَلّى عَلَيْهِ وَيُدْعَى لِوَالِدَيْهِ بِالْمَغْفِرَةِ وَالرَّحْمَةِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَفِيْ رِوَايَةِ أَحْمَدَ وَالتِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَهُ قَالَ: “الرَّاكِبُ خَلْفَ الْجَنَازَةِ وَالْمَاشِيْ حَيْثُ شَاءَ مِنْهَا وَالطِّفْلُ يُصَلّى عَلَيْهِ”.

وَفِيْ الْمَصَابِيْحِ عَنِ الْمُغَيْرَةِ بْنِ زِيَادٍ.

1667. (22) [1/525దృఢం]

ము’గైర బిన్‌ షు’అబహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”వాహనంపై ఉన్నవారు జనా’జహ్ వెనుక నడవాలి. కాలి నడకన ఉన్నవారు ముందు, వెనుక, అటూ ఇటూ నడవవచ్చును. అయితే జనా’జహ్ కు దగ్గరగా ఉండాలి, అర్థాంతరంగా ఉన్న బిడ్డ జనా’జహ్ నమా’జు చదవాలి. ఇంకా అతని తల్లి దండ్రుల కొరకు ప్రార్థించాలి.” [62] (అబూ దావూద్‌, తిర్మిజి’, అ’హ్మద్‌, నసాయి’)

నసాయి’ ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”వాహనంపై ఉన్నవారు జనా’జహ్ వెనుక నడవాలి. కాలినడకన ఉన్న వారు ఎక్కడ ఉన్నా ఫరవా లేదు. ఇంకా మర ణించిన బిడ్డ జనా’జహ్ నమా’జు చదవాలి అని ఉంది.

మసాబీహ్‌లో ఈ ఉల్లేఖనం ము’గీర బిన్‌ జియాద్‌ ద్వారా ఉల్లేఖించబడింది.

1668 – [ 23 ] ( صحيح ) (1/526)

وَعَنِ الزُّهْرِيّ عنْ سَالِمٍ عَنْ أَبِيْهِ قَالَ: رَأَيْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم وَأَبَا بَكْرٍ وَّعُمَرَ يَمْشُوْنَ أَمَامَ الْجَنَازَةِ. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَهُ. وَقَالَ التِّرْمِذِيُّ وَأَهْلُ الْحَدِيْثِ كَأَنَّهُمْ يَرَوْنَهُ مُرْسَلًا.

1668. (23) [1/526దృఢం]

‘జుహ్‌రీ, సాలిమ్‌ ద్వారా సాలిమ్ తన తండ్రి అబ్దుల్లాహ్బిన్‌ ‘ఉమర్ (ర) ద్వారా ఉల్లేఖనం: ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) ”నేను ప్రవక్త (స)ను అబూ బకర్‌ను, ‘ఉమర్‌ను జనా’జహ్ ముందు నడవటం చూశాను.” [63] (అ’హ్మద్‌, అబూ దావూద్‌, నసాయి’, ఇబ్నె మాజహ్, తిర్మిజి’ / తాబయీ ప్రోక్తం)

1669 – [ 24 ] ( لم تتم دراسته ) (1/526)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْجَنَازَةُ مَتْبُوْعَةٌ وَلَا تُتْبَعُ لَيْسَ مَعَهَا مَنْ تَقَدَّمَهَا”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ. وَقَالَ التِّرْمِذِيُّ وَأَبُوْمَاجِدٍ الرَّاوِيْ رَجُلٌ مَّجْهُوْلٌ.

1669. (24) [1/526అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”జనా’జహ్ కు వెనుక ఉండాలి. ముందు ఉండ కూడదు, దానికి ముందు ఉన్నవారు దానివెంట లేనట్లే.” [64] (తిర్మిజి’, అబూ దావూద్‌, ఇబ్ను మాజహ్)

తిర్మిజి’ ఈ ‘హదీసు’ ఉల్లేఖనకర్త అబూ మాజిద్‌ అజ్ఞాని అని పేర్కొన్నారు.

1670 – [ 25 ] ( ضعيف ) (1/526)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ تَبِعَ جَنَازَةً وَحَلَمَهَا ثَلَاثَ مَرَّاتٍ  فَقَدْ قَضَى مَا عَلَيْهِ مِنْ حَقِّهَا”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ.

1670. (25) [1/526బలహీనం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: జనా’జహ్ వెంట వెళ్ళి, మూడు సార్లు భుజం అందించిన వ్యక్తి తన బాధ్యత నిర్వర్తించి నట్లే. (తిర్మిజి’ / ఏకోల్లేఖనం)

1671 – [ 26 ] ( ضعيف ) (1/526)

وَقَدْ رُوِىَ فِيْ”شَرْحِ السُّنَّةِ”: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم حَمَلَ جَنَازَةَ سَعْدٍ ابْنِ مُعَاذٍ بَيْنَ الْعَمُوْدَيْنِ .

1671. (26) [1/526బలహీనం]

ప్రవక్త (స) స’అద్‌ బిన్‌ ము’ఆజ్‌’ జనా’జహ్ ను రెండు కర్రల మధ్య ఎత్తారు. [65] (షర్‌హుస్సున్నహ్‌)

1672 – [ 27 ] ( ضعيف ) (1/526)

وَعَنْ ثَوْبَانَ قَالَ: خَرَجْنَا مَعَ النَّبِيِّ صلى الله عليه وسلم فِيْ جَنَازَةٍ فَرَأَى نَاسًا رُكْبَانًا فَقَالَ: “أَلَا تَسْتَحْيُوْنَ؟ إِنَّ مَلَائِكَةَ اللهِ عَلَى أَقْدَامِهِمْ وَأَنْتُمْ عَلَى ظُهُوْرِ الدَّوَّابِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ. وَرَوَى أَبُوْ دَاوُدَ نَحْوَهُ وَقَالَ التِّرْمِذِيُّ: وَقَدْ رُوِيَ عَنْ ثَوْبَانَ مَوْقُوْفًا .

1672. (27) [1/526బలహీనం]

సౌ’బాన్‌ (ర) కథనం: ప్రవక్త(స) వెంట మేము ఒక జనా’జహ్ లో వెళ్ళాము. ప్రజలు వాహనాలపై కూర్చొని వెళుతూ ఉండటం ప్రవక్త (స) చూశారు. అప్పుడు ప్రవక్త (స) ‘మీకు కొంచమైనా సిగ్గు లేదా? దైవదూతలు జనా’జహ్ వెంట కాలినడకన వస్తుంటే, మీరు పశువుల వీపులపై కూర్చుని వస్తున్నారు’ అని అన్నారు. [66] (అబూ దావూద్‌, ఇబ్నె మాజహ్, తిర్మిజీ’ / ఈ ‘హదీసు’ సౌ’బాన్ ప్రోక్తం).

1673 – [ 28 ] ( ضعيف ) (1/527)

وَعَنِ ابْنِ عَبَّاسٍ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَرَأَ عَلَى الْجَنَازَةِ بِفَاتِحَةِ الْكِتَابِ. رَوَاهُ التِّرْمِذيُّ وَأَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ

1673. (28) [1/527బలహీనం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) జనా’జహ్ నమా’జులో సూరహ్‌ ఫాతి’హా చదివారు. [67](తిర్మిజి’, అబూ దావూద్‌, ఇబ్నె మాజహ్)

1674 – [ 29 ] ( صحيح ) (1/527)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا صَلَّيْتُمْ عَلَى الْمَيِّتِ فَأَخْلِصُوْا لَهُ الدُّعَاءَ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ .

1674. (29) [1/527దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు ఎవరి గురించి అయినా జనా’జహ్ నమా’జు చదివితే, అతని కొరకు చిత్త శుద్ధితో దు’ఆ చేయండి.” (అబూ దావూద్‌, ఇబ్నె మాజహ్)

1675 – [ 30 ] ( صحيح ) (1/527)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِذَا صَلّى عَلَى الْجَنَازَةِ قَالَ: “اَللّهُمَّ اغْفِرْ لِحَيِّنَا وَمَيِّتِنَا وَشَاهِدَنَا وَغَائِبِنَا وَصَغِيْرِنَا وَكَبِيْرِنَا وَذَكَرِنَا وَأُنْثَانًا.اَللّهُمَّ مَنْ أَحْيَيْتَهُ مِنَّا فَأَحْيِهِ عَلَى الْإِسْلَام وَ مَنْ تَوَفَّيْتَهُ مِنَّا فَتَوَفَّهُ عَلَى الْإِيْمَانِ.اَللّهُمَّ لَا تَحْرِمْنَا أَجْرَهُ وَلَا تَفْتِنَّا بَعْدَهُ “. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ .

1675. (30) [1/527దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) జనా’జహ్ నమా’జులో ఈదు’ఆను పఠించేవారు. ”అల్లా హుమ్మగ్ఫిర్లి హయ్యినా వమయ్యితినా, వ షాహిదినా గాయిబినా, గీరినా వ కబీరినా, కరినా ఉన్సానా. అల్లాహుమ్మ మన్హ్యయ్తహు మిన్నా, ఫఅహ్యిహీ అలల్ఇస్లామ్, వమన్తవఫ్ఫయ్తహు మిన్నా ఫతవఫ్ఫహు అలల్ఈమాన్. అల్లాహుమ్మ లా హ్రిమ్నా అజ్రహు, వలా తఫ్తిన్నా అదహు.” — ‘అల్లాహ్‌! మాలో సజీవంగా ఉన్న వారినీ మరణించిన వారినీ, ఇక్కడ ఉన్న వారినీ, ఇక్కడ లేని వారినీ, చిన్నలను పెద్దలను, స్త్రీలను పురుషులను, క్షమించు. ఓ అల్లాహ్‌! నీవు సజీవంగా ఉంచగోరే వారిని ఇస్లామ్‌పై సజీవంగా ఉంచు. ఇంకా నీవు చంపగోరే వారిని విశ్వాసంపై చంపు. ఓ అల్లాహ్‌! ఇతని పుణ్యం నుండి మమ్మల్ని దూరం చేయకు. ఇంకా ఇతని తర్వాత మమ్మల్ని కల్లోలాలకు గురిచేయకు.’ (అ’హ్మద్, అబూ దావూద్‌, తిర్మిజి’, ఇబ్నె మాజహ్)

1676 – [ 31 ] ( ضعيف ) (1/528)

وَرَوَاهُ النَّسَائِيُّ عَنْ إِبْرَاهِيْمِ الْأَشْهَلِيِّ عَنْ أَبِيْهِ وَانَتَهَتْ رِوَايَتُهُ عِنْدَ قَوْلِهِ: وَ”أُنْثَانَا”.

وَفِيْ رِوَايَةٍ أَبِيْ دَاوُدَ: “فَأَحْيِهِ عَلَى الْإِيْمَانِ وَتَوَفَّهُ عَلَى الْإِسْلَامِ”.

وَفِيْ آخِرِهِ: “وَلَا تُضِلَّنَا بَعْدَهُ” .

1676. (31) [1/528బలహీనం]

నసాయి’ దీన్ని ఇబ్రాహీమ్‌ అష్‌హలీ, అతని తండ్రి ద్వారా ఉల్లేఖించారు. ఈ ఉల్లేఖనం ఉన్‌సానా వరకు ఉంది.

అబూ దావూద్‌లో, ఫఅహ్యిహి అలల్ఈమాన్మరియు వతవఫ్ఫహు అలల్ఇస్లామ్‌,’ అనే పదా లున్నాయి. చివరిలో ‘వలాతుదిల్లనా,‘ అని ఉంది.

1677 – [ 32 ] ( صحيح ) (1/528)

وَعَنْ وَاثِلَةَ بْنِ الْأَسْقَعِ قَالَ: صَلَّى بِنَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَلَى رَجُلٍ مِّنَ الْمُسْلِمِيْنَ فَسَمِعْتُهُ يَقُوْلُ: “اَللّهُمَّ إِنَّ فُلَانَ بْنَ فُلَانٍ فِيْ ذِمَّتِكِ وَحَبْلِ جَوَارِكَ فَقِهِ مِنْ فِتْنَةِ الْقَبْرِوَعَذَابِ النَّارِوَأَنْتَ أَهْلُ الْوَفَاءِ وَالْحَقِّ اَللّهُمَّ اغْفِرْ لَهُ وَارْحَمْهُ إِنَّكَ أَنْتَ الْغَفُوْرُالرَّحِيْمِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ .

1677. (32) [1/528దృఢం]

వాసి’లహ్‌ బిన్‌ అస్‌ఖ’అ (ర) కథనం: ప్రవక్త (స) మాకు ఒక ముస్లిమ్‌ జనా’జహ్ నమా’జు చదివించారు. ప్రవక్త (స) ఈ దు’ఆ చదవటం నేను విన్నాను. ”అల్లాహుమ్మ ఫులానబ్‌న ఫులానిన్‌ ఫీ జి’మ్మతిక వ’హబ్‌లి జవారిక, ఫఖిహీ మిన్‌ ఫిత్‌నతిల్‌ ఖబ్‌రి, వ’అజా బిన్నారి, వఅన్‌త అ’హ్‌లుల్‌ వఫాయి’, వల్‌’హఖ్ఖి, అల్లాహుమ్మ’గ్‌ ఫిర్‌లహు వర్‌’హమ్‌హు, ఇన్నక అన్‌తల్‌ ‘గఫూరు ర్ర’హీమ్‌.” — ‘ఓ అల్లాహ్‌! ఫలానా వ్యక్తి ఫలానా కుమారుడు నీసన్నిధిలో, నీ అధీనంలో ఉన్నాడు. అతన్ని సమాధి పరీక్షల నుండి, నరకశిక్షల నుండి కాపాడు. నీవు వాగ్దానం పూర్తి చేసే వాడివి, సత్యవంతుడవు. ఓ అల్లాహ్‌! అతన్ని క్షమించు, అతన్ని కరుణించు, నిస్సందేహంగా నీవే కరుణించేవాడవు, క్షమించే వాడవూను.’ (అబూ దావూద్‌, ఇబ్నె మాజహ్)

అంటే అతని పేరు, అతని తండ్రి పేరు చెప్పి దు’ఆ చేయడం మంచిది.

1678 – [ 33 ] ( ضعيف ) (1/528)

وَعَنِ ابْنِ عُمَرَقَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اذْكُرُوْا مَحَاسِنَ مَوْتَاكُمْ وَكُفُّوْا عَنْ مَّسَاوِيْهِمْ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ.

1678. (33) [1/528బలహీనం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు మీ మృతుల సత్కార్యాలను ప్రస్తా వించండి. ఇంకా వారిచెడులను ప్రస్తావించకండి.” [68](తిర్మిజి’, అబూ దావూద్‌)

1679 – [ 34 ] ( صحيح ) (1/528)

وَعَنْ نَافِعٍ أَبِيْ غَالِبٍ قَالَ: صَلَّيْتُ مَعَ أَنَسِ بْنِ مَالِكٍ عَلَى جَنَازَةِ رَجُلٍ فَقَامَ حِيَالَ رَأْسَهِ ثُمَّ جَاؤُوْا بِجَنَازَةِ امْرَأَةٍ مِّنْ قُرَيْشٍ فَقَالُوْا: يَا أَبَاحَمْزَةَ صَلِّ عَلَيْهَا. فَقَامَ حِيَالَ وَسَطِ السَّرِيْرِ. فَقَالَ لَهُ الْعَلَاءُ بْنُ زِيَادٍ: هَكَذَا رَأَيْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَامَ عَلَى الْجَنَازَةِ مَقَامَكَ مِنْهَا؟ وَمَنِ الرَّجُلِ مَقَامَكَ مِنْهُ؟ قَالَ: نَعَمْ. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ.

وَفِيْ رِوَايَةِ أَبِيْ دَاوُدَ نَحْوَهُ مَعَ زِيَادَةٍ وَفِيْهِ: فَقَامَ عَنْدَ عَجِيْزَةِ الْمَرْأَةِ.

1679. (34) [1/528దృఢం]

నా’ఫె అబూ ‘గాలిబ్‌ (ర) కథనం: అనస్‌ బిన్‌ మాలిక్‌ వెంట నేనొక జనా’జహ్ నమా’జులో పాల్గొన్నాను. అనస్‌ బిన్‌ మాలిక్‌ పురుష జనా’జహ్ తలవద్ద నిలబడ్డారు. ఆ తరువాత ఒక స్త్రీ జనా’జహ్ తీసుకురావటం జరిగింది. అప్పుడు ప్రజలు, ‘ఓ అబూ’హమ్‌’జహ్! ఈ స్త్రీ జనా’జహ్ నమా’జు కూడా చదివించండి’ అని అన్నారు. అప్పుడు అనస్‌ బిన్‌ మాలిక్‌ మధ్య నిలబడ్డారు. అప్పుడు ‘అలా’ బిన్‌ ‘జియాద్‌ అనస్‌ బిన్‌ మాలిక్‌ను ”మీరు చదివించినట్లు ప్రవక్త (స)ను నమా’జు చదివించటం మీరు చూశారా? ” అని అడిగారు. అంటే పురుష జనా’జహ్ తల వద్ద, స్త్రీ జనా’జహ్ మధ్య నిలబడి చదివించారు. దానికి అనస్‌ బిన్‌ మాలిక్‌ ‘అవునని’ అన్నారు. (తిర్మిజి’, ఇబ్నె మాజహ్)

అబూ దావూద్‌ ఉల్లేఖనంలో ”స్త్రీ మర్మాంగం వద్ద నిల బడ్డారు” అని ఉంది.

—–

اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం    

1680 – [ 35 ] ( متفق عليه ) (1/529)

عَنْ عَبْدِ الرَّحْمَنِ بْنِ أَبِيْ لَيْلَى قَالَ: كَانَ ابْنُ حُنَيْفٍ وَّقَيْسُ ابْنُ سَعْدٍ قَاعِدَيْنِ بِالْقَادِسِيَّةِ فَمُرَّ عَلَيْهِمَا بِجَنَازَةٍ. فَقَامَا. فَقِيْلَ لَهُمَا: إِنَّهَا مِنْ أَهْلِ الْأَرْضِ أَيْ مِنْ أَهْلِ الذِّمَّةِ. فَقَالَا: إِنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم مَرَّتْ بِهِ جَنَازَةٌ. فَقَامَ فَقِيْلَ لَهُ: إِنَّهَا جَنَازَةُ يَهُوْدِيٍّ. فَقَالَ: “أَلَيْسَتْ نَفْسًا؟” متفق عليه.

1680. (35) [1/529ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ అబీ లైలా (ర) కథనం: స’హల్‌ బిన్‌ ‘హనీఫ్‌ మరియు ఖైస్‌ బిన్‌ స’అద్‌ ఖాదిసియ్య ప్రాంతంలో కూర్చున్నారు. ఇంతలో వారి ముందు నుండి ఒక జనా’జహ్ వెళ్ళింది. వారిద్దరూ చూసి నిలబడ్డారు. వారికి అది ముస్లిమేతరుని జనా’జహ్ అని, ఎందుకు నిలబడ్డారని అడగటం జరిగింది. దానికి వారు ప్రవక్త (స) ముందు నుండి కూడా ఇలాగే ఒక జనా’జహ్ వెళ్ళడం జరిగింది, ప్రవక్త (స) లేచి నిలబడ్డారు. అప్పుడు ప్రజలు, ‘అది యూదుని జనా’జహ్’ అని చెప్పారు. దానికి ప్రవక్త (స) ‘అతడు ప్రాణికాడా’ అని అన్నారు. [69] (బు’ఖారీ, ముస్లిమ్‌)

1681 – [ 36 ] ( ضعيف ) (1/529)

وَعَنْ عُبَادَةَ بْنِ الصَّامِتِ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِذَا تَبِعَ جَنَازَةً لَمْ يَقْعُدْ حَتَّى تُوْضَعَ فِيْ اللَّحْدِ فَعَرَضَ لَهُ حِبْرٌ مِّنَ الْيَهُوْدِ. فَقَالَ لَهُ: إِنَّا هَكَذَا نَضْعَ يَا مُحَمَّدُ قَالَ: فَجَلَسَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم وَقَالَ: “خَالِفُوْهُمْ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْدَاوُدَ وَابْنُ مَاجَهُ. وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ وَبِشْرُ بْنُ رَافِعِ الرَّاوِيْ لَيْسَ بِالْقَوِيِّ.

1681. (36) [1/529బలహీనం]

‘ఉబాదహ్‌ బిన్‌ ‘సామిత్‌ (ర) కథనం: ప్రవక్త (స) జనా’జహ్ వెంట వెళితే, శవాన్ని సమాధిలో దించే వరకు కూర్చునే వారు కాదు. ఒక యూద పండితుడు ప్రవక్త (స) ముందుకు వచ్చి, ‘ఓ ము’హమ్మద్‌! మేము కూడా ఇలాగే చేస్తాము’ అని అన్నాడు. అది విని ప్రవక్త (స) వెంటనే కూర్చున్నారు. ఇంకా ‘యూదులను వ్యతిరేకించండి’ అని అన్నారు. [70] (అబూ దావూద్‌, ఇబ్నె మాజహ్, తిర్మిజి’ – బలహీనం)

1682 – [ 37 ] ( حسن ) (1/529)

وَعَنْ عَلَيٍّ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم أَمَرَنَا بِالْقِيَامِ فِيْ الْجَنَازَةِ ثُمَّ جَلَسَ بَعْدَ ذَلِكَ وَأَمَرَنَا بِالْجُلُوْسِ. رَوَاهُ أَحْمَد .

1682. (37) [1/529ప్రామాణికం]

‘అలీ (ర) కథనం: ప్రవక్త (స) జనా’జహ్ ను చూసి నిలబడమని ఆదేశించారు. తరువాత ప్రవక్త (స) కూర్చున్నారు. మమ్మల్ని  కూడా కూర్చోమన్నారు. (అ’హ్మద్)

1683 – [ 38 ] ( صحيح ) (1/579)

وَعَنْ مُحَمَّدِ بْنِ سِيْرِيْنَ قَالَ:إِنَّ جَنَازَةً مَرَّتْ بِالْحَسَنِ بْنِ عَلِيٍّ وَابْنِ عَبَّاسٍ فَقَامَ الْحَسَنُ وَلَمْ يَقُمْ اِبْنُ عَبَّاسٍ فَقَالَ الْحَسَنُ:أَلَيْسَ قَدْ قَامَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم لِجَنَازَةِ يَهُوْدِيٍّ؟ قَالَ: نَعَمْ ثُمَّ جَلَسَ. رَوَاهُ النَّسَائِيُّ .

1683. (38) [1/529దృఢం]

ము’హమ్మద్‌ బిన్‌ సీరీన్‌ (ర) కథనం: ‘హసన్‌ బిన్‌ ‘అలీ మరియు ఇబ్నె ‘అబ్బాస్‌ల ముందు నుండి ఒక జనా’జహ్ వెళ్ళింది. ‘హసన్‌ (ర) లేచి నిలబడ్డారు. ఇబ్నె ‘అబ్బాస్‌ లేచి నిలబడలేదు. అప్పుడు ‘హసన్‌ (ర) ఇబ్నె ‘అబ్బాస్‌తో, ”ప్రవక్త (స) యూదుని జనా’జహ్ ను చూచి నిలబడ్డారు కదా!” అని అన్నారు. దానికి ఇబ్నె ‘అబ్బాస్‌ ”అవును, కాని దాని తరువాత ప్రవక్త (స) కూర్చొనే వారు, లేచి నిలబడేవారు కారు,” అని అన్నారు. (నసాయి’)

1684 – [ 39 ] ( صحيح ) (1/530)

وَعَنْ جَعْفَرِ بْنِ مًحَمَّدٍ عَنْ أَبِيْهِ أَنَّ الْحَسَنَ بْنِ عَلِيٍّ كَانَ جَالِسًا فَمَرَّعَلَيْهِ بِجَنَازَةٍ. فَقَامَ النَّاسُ حَتَّى جَاوَزَتِ الْجَنَازَةُ. فَقَالَ الْحَسَنُ: إِنَّمَامُرَّ بِجَنَازَةِ يَهُوْديٍّ وَكَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَلَى طَرِيْقِهَا جَالِسًا وَكَرِهَ أَنْ تَعْلُوْارَأْسَهُ جَنَازَةُ يَهُوْدِيٍّ فَقَامَ. رَوَاُه النَّسَائِيّ .

1684. (39) [1/530-దృఢం]

జ’అఫర్‌ తన తండ్రి ము’హమ్మద్‌ ద్వారా కథనం: ‘హసన్‌ బిన్‌ ‘అలీ కూర్చుని ఉన్నారు. అతని ముందు నుండి ఒక జనా’జహ్ వెళ్ళింది. జనా’జహ్ వెళ్ళేవరకు ప్రజలు లేచి నిలబడ్డారు. అప్పుడు ‘హసన్‌ బిన్‌ ‘అలీ ”ప్రవక్త(స) ఒకచోట కూర్చుని ఉన్నారు. అటునుండి ఒక యూదుని జనా’జహ్ వెళ్ళింది. యూదుని శవం తన తలపై నుండి వెళ్ళడం ఇష్టం లేక ప్రవక్త (స) లేచినిలబడ్డారు అని అన్నారు.”[71] (నసాయి’)

1685 – [ 40 ] ( ضعيف ) (1/530)

وَعَنْ أَبِيْ مُوْسَى أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “إِذَا مَرَّتْ بِكَ جَنَازَةُ يَهُوْدِيٍّ أَوْ نَصْرَانِيٍّ أَوْمُسْلِمٍ فَقُوْمُوْا لَهَا فَلَسْتُمْ لَهَا تَقُوْمُوْنَ إِنَّمَا تَقُوْمُوْنَ لِمَنْ مَّعَهَا مِنَ الْمَلَائِكَةِ”. رَوَاهُ أَحْمَدُ  .

1685. (40) [1/530బలహీనం]

అబూ మూసా (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీ ప్రక్క నుండి ముస్లిముదైనా, యూదునిదైనా జనా’జహ్ వెళితే నిలబడండి. మీరు జనా’జహ్ ను గౌరవిస్తూ నిలబడటంలేదు. అసలు మీరు జనా’జహ్ వెంట ఉన్న దైవదూతల గౌరవార్థం నిలబడు తున్నారు అని అన్నారు.” (అ’హ్మద్‌)

1686 – [ 41 ] ( صحيح ) (1/530)

وَعَنْ أَنَسٍ أَنَّ جَنَازَةَ مَرَّتْ بِرَسُوْلِ اللهِ فَقَامَ. فَقِيْلَ: إِنَّهَا جَنَازَةُ يَّهُوْدِيٍّ. فَقَالَ: “إِنَّمَا قُمْتُ لِلْمَلَائِكَةِ”. رَوَاهُ النَّسَائِيُّ .

1686. (41) [1/530దృఢం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రక్క నుండి ఒక జనా ‘జహ్ వెళ్ళడం జరిగింది. ప్రవక్త (స) నిలబడ్డారు. ఇది యూదుని జనా’జహ్ అని తెలియపరచటం జరిగింది. దానికి ప్రవక్త (స) ”నేను దైవదూతల కోసం నిలబడ్డాను” అని అన్నారు. (నసాయి’)

1687 – [ 42 ] ( لم تتم دراسته ) (1/530)

وَعَنْ مَالِكِ بْنِ هُبَيْرَةَ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “مَا مِنْ مُّسْلِمٍ يَّمُوْتُ فَيُصَلِّيْ عَلَيْهِ ثَلَاثَةَ صُفُوْفٍ مِّنَ الْمُسْلِمِيْنَ إِلَّا أَوْجَبَ”. فَكَانَ مَالِكٌ إِذَا اسْتَقَلَّ أَهْلُ الْجَنازَةِ جَزَّأَهُمْ ثَلَاثَةَ صُفُوْفٍ لِّهَذَا الْحَدِيْثِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

وَفِيْ رِوَاَيِة التِّرْمِذِيُّ: قَالَ كَانَ مَالِكُ بْنُ هُبَيْرَةَ إِذَا صَلّى عَلَى الْجَنَازَةِ فَتَقَالَّ النَّاسُ عَلَيْهَا جَزَّأَهُمْ ثَلَاثَةَ أَجْزَاءٍ. ثُمَّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ صَلّى عَلَيْهِ ثَلَاثَةَ صُفُوْفٍ أَوْجَبَ”. وَرَوَى ابْنُ مَاجَهُ نَحْوَهُ.

1687. (42) [1/530అపరిశోధితం]

మాలిక్‌ బిన్‌ హుబైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”మరణించిన ముస్లిమ్‌పై ముస్లిముల మూడు పంక్తులు జనా’జహ్ నమా’జు చదివితే, అల్లాహ్‌ అతని కోసం స్వర్గం తప్పనిసరి చేస్తాడు.” ఈ ‘హదీసు’ ఉల్లేఖనకర్త మాలిక్‌ బిన్‌ హుబైరహ్‌ జనా’జహ్ వెంట ఉండి ప్రజల సంఖ్య తక్కువగా ఉంటే ప్రజలను 3 పంక్తులుగా చేసేవారు. ఇంకా అతని కోసం అల్లాహ్‌(త) స్వర్గం తప్పనిసరి చేస్తాడు అని ప్రవక్త (స) ప్రవచించారని చెప్పేవారు. [72] (ఇబ్నె మాజహ్, అబూ దావూద్‌, తిర్మిజి’)

1688 – [ 43 ] ( ضعيف ) (1/530)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ عَنِ النَّبِيّ صلى الله عليه وسلم فِيْ الصَّلَاةِ عَلَى الْجَنَازَةِ: “اَللّهُمَّ أَنْتَ رَبُّهَا وَأَنْتَ خَلَقْتَهَا وَأَنْتَ هَدَيْتَهَا إِلَى الْإِسْلَامِ وَ أَنْتَ قَبَضْتَ رُوْحَهَا وَأَنْتَ أَعْلَمُ بِسِرِّهَا وَعَلَانِيَتِهَا جِئْنَا شُفَعَاءَ فَاغْفِرْ لَهُ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

1688. (43) [1/530బలహీనం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) జనా’జహ్ నమా’జులో ఈ దు’ఆ పఠించేవారు: అల్లాహుమ్మ అన్ రబ్బుహా, అన్ ఖలఖ్తహా, అన్ హదైతహా ఇలల్ఇస్లామ్‌, వఅన్ ఖబద్త రూహహా, వఅన్ ఆలముబిసిర్రిహా అలానియతిహా, జీనా షుఫఆఅ‘, గ్ఫిర్లహ్.” — ‘ఓ అల్లాహ్‌! నీవు ఈమృతుని ప్రభు వువి. నీవే దాన్ని సృష్టించావు, నీవే దాన్ని ఇస్లామ్‌ వైపు మార్గం చూపావు, నీవే దాని ప్రాణం తీశావు, నీవే దాని రహస్య, బహిరంగ విషయాలను తెలిసినవాడవు, మే మందరం దాని సిఫారసు కోసం వచ్చాము, కనుక నీవు దాన్ని క్షమించు.’ (అబూ దావూద్‌)

1689 – [ 44 ] ( صحيح ) (1/531)

وَعَنْ سَعِيْدِ بْنِ الْمُسَيِّبِ قَالَ:صَلَّيْتُ وَرَاءَ أَبِيْ هُرَيْرَةَ عَلَى صَبِيِّ لَمْ يَعْمَلْ خَطِيْئَةً قَطُّ فَسَمِعْتُهُ يَقُوْلُ: “اَللّهُمَّ أَعِذْهُ مِنَ عَذَابِ الْقَبْرِ”. رَوَاهُ مَالِكٌ .

1689. (44) [1/531దృఢం]

స’యీద్‌ బిన్‌ ముసయ్యిబ్‌ (ర) కథనం: నేను అబూ హురైరహ్‌ (ర) వెనుక ఏ పాపం ఎరుగని ఒక బాలుని జనా’జహ్ నమా’జు చదివాను. అబూ హురైరహ్‌ (ర) ఆ బాలుని జనా’జహ్ నమా’జులో ఈ దు’ఆ చదవటం విన్నాను. అల్లాహుమ్మ అయిజ్‌’హు మిన్అజాబిల్ఖబ్రి — ‘ఓ అల్లాహ్‌! ఈ బాలుణ్ణి సమాధి శిక్నుండి కాపాడు.’ (మాలిక్)

1690 – [ 45 ] ( لم تتم دراسته ) (1/531)

وَعَنِ الْبُخَارِيِّ تَعْلِيْقًا قَالَ: يَقْرَأُ الْحَسَنُ عَلَى الطِّفْلِ فَاتِحَةَ الْكِتَابِ وَيَقُوْلُ: “اَللّهُمَّ اجْعَلْهُ لَنَا سَلَفًا وَّفَرْطًا وَذُخْرًا وَّأَجْرًا” رَوَاهُ . البُخَارِيُّ.

1690. (45) [1/531అపరిశోధితం]

బు’ఖారీ కథనం: హసన్‌ బస్రీ పిల్లల జనా’జహ్ లో సూరహ్‌ ఫాతి’హా చదివిన తర్వాత ఈ దు’ఆ చదివే వారు, ”అల్లాహుమ్మజ్‌ అల్‌హులనా సలఫన్‌ వ ఫర’తన్‌ వ జు’ఖ్‌రన్‌ వ అజ్‌రన్‌.” — ‘ఓ అల్లాహ్‌! ఈ బిడ్డను మా కంటే ముందు వెళ్ళి పుణ్య ప్రతిఫల కారకునిగా చేయి.’ (బు’ఖారీ)

1691 – [ 46 ] ( ضعيف ) (1/531)

وَعَنْ جَابِرٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “الطِّفْلُ لَا يُصَلَّى عَلَيْهِ وَلَا يَرِثُ وَلَا يُوْرَثُ حَتَّى يَسْتَهِلَّ”.رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ إِلَّا أَنَّهُ لَمْ يَذْكُرْ: “وَلَا يُوْرَثُ”.

1691. (46) [1/531బలహీనం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మరణించి జన్మించిన బిడ్డ జనా’జహ్ నమా’జు చదవరాదు. ఆ బిడ్డ వారసుడు కాలేడు. అతనికి ఎవరూ వారసులు కాలేరు, అయితే జన్మించిన తరువాత శబ్దం చేసి మరణిస్తే జనా’జహ్ నమా’జు  చదవాలి.” [73](తిర్మిజి’, ఇబ్నె మాజహ్)

1692 – [ 47 ] ( صحيح ) (1/531)

وَعَنْ أَبِيْ مَسْعُوْدِ الْأَنْصَارِيِّ قَالَ: نَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم أَنْ يَّقُوْمَ الْإِمَامُ فَوْقَ شَيْءٍ وَالنَّاسُ خَلْفَهُ يَعْنِيْ أَسْفَلَ مِنْهُ. رَوَاهُ الدَّراَقُطْنِيُّ وَأَبُوْ دَاوُدَ .

1692. (47) [1/531దృఢం]

అబూ మస్‌’ఊద్‌ అ’న్సారీ (ర) కథనం: ప్రవక్త (స) ”ఇమాము ఎత్తయిన ప్రదేశంపై, ముఖ్తదీలు అంత కంటే క్రింద ఉండి నమా’జు చదవటాన్ని వారించారు.”[74] (దారు ఖు’తునీ-ముజ్‌తబా కితాబుల్‌ జనాయి’జ్‌’, అబూ దావూద్)

=====

6بَابُ دَفْنِ الْمَيِّتِ

6. ఖనన సంస్కారాలు

సమాధిని విశాలంగా త్రవ్వాలి. పొడవు, వెడల్పు లను దృష్టిలో పెట్టుకొని త్రవ్వాలి. శవాన్ని సులువుగా సమాధిలో దించి ఉంచినట్టు త్రవ్వాలి. ఒకవేళ ఎవరైనా కూర్చోవాలను కుంటే సులువుగా కూర్చో గలిగేలా ఉండాలి. ఇంకా పరిశుభ్రంగా ఉండాలి. సమాధి రెండు రకాలు: 1. పెట్టెలా ఇండియాలో సాధారణంగా దీన్నే త్రవ్వుతారు. 2. బగ్‌లీ దీన్ని లహద్‌ అంటారు. సమాధిలో ఖిబ్లా వైపు త్రవ్వబడు తుంది. అందులో శవాన్ని ఉంచటం జరుగుతుంది. రెండు రకాల సమాధులు ధర్మసమ్మతమైనవే. జనా’జహ్ నమా’జు పూర్తయిన తర్వాత కాళ్ల వైపునుండి శవాన్ని దించాలి. అటు స్థలం లేకపోతే, ఖిబ్లావైపు నుండి, ఎటునుండి సులువుగా ఉంటే అటునుండి దించాలి.

శవాన్ని సమాధిలో దించినపుడు ”బిస్మిల్లాహి అలా మిల్లతి రసూలిల్లాహి,” అని పఠించాలి. అనంతరం పలకలతో మూసి ముస్లిములు 3 పిడికెళ్ళు మట్టివేయాలి. ప్రతి పిడికెడుతో ”మిన్హా ఖలఖ్నాకుమ్‌, వఫీహా నుయీదుకుమ్వమిన్హా నుఖ్రిజుకుమ్తారతన్ఉఖ్రా”(సూ. తా హా, 20:55), పఠించటం అభిలషణీయం. సమాధిని కుప్పలా చేయాలి. అయితే ఒక జానెడు ఎత్తు మాత్రమే ఉండాలి. కట్టడం గాని దాని మీద గోపురం గాని నిర్మించరాదు. దానిపై ఏమీ వ్రాయరాదు. సమాధిపై మలమూత్ర విసర్జన చేయరాదు. శవాన్ని సమాధిలో ఖననం చేసిన తర్వాత సమాధిపై నీళ్ళు చిలకరించటం అభిలషణీయం. తలవైపునుండి ప్రారం భించాలి. కాళ్ళ వైపు పూర్తిచేయాలి. (బైహఖీ)

తరువాత అందరూ సమాధి వద్ద నిలబడి మృతుని కోసం స్థిరత్వానికి, క్షమాపణకు ప్రార్థించాలి. అబూ దావూద్‌లో ‘ఉస్మాన్‌ (ర) కథనం: ప్రవక్త (స) శవాన్ని ఖననం చేసిన తర్వాత అక్కడ నిలబడి ప్రజలతో, ‘మీరు మీ సోదరుని క్షమాపణ కోసం ప్రార్థించండి, ఇంకా అతని నిలకడ కోసం ప్రార్థించండి, ఎందుకంటే ఇప్పుడు అతన్ని ప్రశ్నించటం జరుగుతుంది’ అని అన్నారు.

‘స’హీ’హ్ ముస్లిమ్‌లో ‘అమ్ర్‌ బిన్‌ ‘ఆ’స్‌ (ర) కథనం: అతను తన మరణానికి ముందు తన కుమారుణ్ణి పిలిచి, ”నేను మరణించిన తరువాత, నా జనా’జహ్ వెంట ఏడ్పులు, పెడ బొబ్బలు పెట్టే స్త్రీ వెళ్ళరాదు. నా జనా’జహ్ వెంట అగ్ని తీసుకొని వెళ్ళరాదు. ఇంకా నాపై మెల్లగా మట్టివేయాలి. ఇంకా నా సమాధి వద్ద ఒంటెను జ’బ’హ్‌ చేసినంతసేపు నిలబడాలి. మున్కర్నకీర్లకు సమాధానాలు ఇచ్చినపుడు ధైర్యంగా ఉంటాను” అని అన్నారు. ఈ ‘హదీసు’ ద్వారా ఖననం చేసిన తర్వాత సమాది వద్ద నిలబడి దు’ఆ చేయటం అభిలషణీయం. దు’ఆలో చేతులు ఎత్తవచ్చు, ఎత్తకపోవచ్చు.

సమాధి గుర్తించటానికి సమాధి తల దగ్గర ఒకరాయి పెట్టవచ్చును. (అబూ దావూద్‌).

సమాధిపై రెండు ఖర్జూరపు కొమ్మలు కూడా పాతి పెట్టవచ్చును. కొందరు పెడ్డలపై, సూరహ్‌ ఇఖ్లాస్‌ (112) మొదలైనవి మంత్రించి సమాధిలో ఉంచుతారు. లేదా ఖుర్‌ఆన్‌లోని వాక్యాలు వ్రాసి ఉంచుతారు. లేదా క’అబహ్ తెర ముక్క ఉంచుతారు. ఇటువంటి వన్నీ కల్పితాలు. వీటికి చాలా దూరంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు శ్మశానంలో చెప్పులు ధరించి నడవటం మంచిది కాదు. ముళ్ళు, ఇతర హానికరమైన వస్తువులు ఉంటే ధరించవచ్చును.

—–

اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం   

1693 – [ 1 ] ( صحيح ) (1/532)

عَنْ عَامِرِ بْنِ سَعْدِ بْنِ أَبِيْ وَقَّاصٍ أَنَّ سَعْدَ بْنَ أَبِيْ وَقَّاصٍ قَالَ فِيْ مَرَضِهِ الَّذِيْ هَلَكَ فِيْهِ: إِلْحَدُوْا لِيْ لَحْدًا وَانْصِبُوْا عَلَيَّ اللَّبِنَ نَصْبًا كَمَا صُنِعَ بِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. رَوَاهُ مُسْلِمٍ .

1693. (1) [1/532దృఢం]

‘ఆమిర్‌ బిన్‌ స’అద్ బిన్ అబీ వఖ్ఖా’స్‌ (ర) కథనం: స’అద్‌ బిన్‌ అబీ వఖ్ఖా’స్‌ మరణానికి ముందు వ్యాధిలో, ‘నన్ను ఖననం చేయడానికి ల’హద్‌ సమాధి త్రవ్వాలి. పచ్చి ఇటుకలు నిలబెట్టాలి. ప్రవక్త (స)కు చేసినట్టు’ అని అన్నారు. (ముస్లిమ్‌)

1694 – [ 2 ] ( صحيح ) (1/532)

وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: جَعَلَ فِيْ قَبْرِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَطِيْفَةٌ حَمْرَاءُ. رَوَاهُ مُسْلِمٌ .

1694. (2) [1/532దృఢం]

ఇబ్ను ‘అబ్బాస్‌ (ర) కథనం: ‘ప్రవక్త (స) సమాధిలో ఒక ఎర్రని దుప్పటి పరచబడింది.’ [75] (ముస్లిమ్‌)

1695 – [ 3 ] ( صحيح ) (1/532)

وَعَنْ سُفْيَانَ الْتَّمَّارِ: أَنَّهُ رَأَى قَبْرَ النَّبِيِّ صلى الله عليه وسلم مُسَنَّمًا. رَوَاهُ الْبُخَارِيُّ .

1695. (3) [1/532దృఢం]

సుఫియాన్‌ తమార్‌ కథనం: అతను ప్రవక్త (స) సమాధిని ఒంటె మూపురంలా మధ్యభాగం ఎత్తుగా ఉండటం చూసారు. (బు’ఖారీ)

1696 – [ 4 ] ( صحيح ) (1/532)

وَعَنْ أَبِيْ الْهَيَّاجِ الْأَسْدِيّ قَالَ: قَالَ لِيْ عَلِيٌّ: أَلَا أَبْعَثُكَ عَلَى مَا بَعَثَنِيْ عَلَيْهِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم: أَنْ لَا تَدَعَ تِمْثَالًا إِلَّا طَمَسْتَهُ وَلَا قَبْرًا مُّشْرِفًا إِلَّا سَوَّيْتَهُ. رَوَاهُ مُسْلِمٌ .

1696. (4) [1/532దృఢం]

అబుల్‌ హయ్యాజ్‌ అసదీ కథనం: ‘అలీ (ర) నాతో, ”ప్రవక్త (స) నన్ను ఏ పనిమీద పంపారో, ఆ పనిమీద మీకు పంపనా! అది: 1. నీవు ఎక్కడైనా ప్రాణుల చిత్రాలు చూస్తే వాటిని చెరిపివేయి, 2. ఇంకా నీవు ఎక్కడైనా ఎత్తయిన సమాధి చూస్తే, దాన్ని సమానంగా చేసివేయి. [76](ముస్లిమ్‌)

1697- [5] ( صحيح ) (1/533)

وَعَنْ جَابِرٍ قَالَ: نَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم أَنْ يُّجَصَّصَ الْقَبْرُ وَأَنْ يُّبْنَى عَلَيْهِ وَأَنْ يُّقْعَدَ عَلَيْهِ. رَوَاهُ مُسْلِمٌ .

1697. (5) [1/533దృఢం]

జాబిర్‌ (ర) కథనం: సమాధిని దృఢంగా చేయటం, దానిపై కట్టడాలు కట్టడం, గోపురాలు కట్టడం, సమాధిపై కూర్చోవటాన్ని ప్రవక్త (స) నిషేధించారు. [77] (ముస్లిమ్‌)

1698 – [ 6 ] ( صحيح ) (1/533)

وَعَنْ أَبِيْ مَرْثِدِ الْغَنَوِيِّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تَجْلِسُوْا عَلَى الْقُبُوْرِ وَلَا تُصَلُّوْا إِلَيْهَا”. رَوَاهُ مُسْلِمٌ.

1698. (6) [1/533దృఢం]

అబూ మర్‌స’ద్‌ ‘గనవీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు సమాధులపై కూర్చోకండి, దాని వైపు తిరిగి నమా’జు చదవకండి.” [78] (ముస్లిమ్‌)  

1699 – [ 7 ] ( صحيح ) (1/533)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَأَنْ يَّجْلِسَ أَحَدُكُمْ عَلَى جَمْرَةٍ فَتُحْرِقَ ثِيَابَهُ فَتَخْلُصَ إِلَى جِلْدِهِ خَيْرٌ لَّهُ مِنْ أَنْ يَّجْلِسَ عَلَى قَبْرٍ”. رَوَاهُ مُسْلِمٌ

1699. (7) [1/533దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స), ”మీలో ఎవరైనా అగ్నిపై కూర్చుని, అతని బట్టలు, శరీరం కాలి పోవటం, సమాధిపై కూర్చోవటం కంటే మంచిది,” అని ప్రవచించారు. [79] (ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం    

1700 – [ 8 ] ( ضعيف ) (1/533)

عَنْ عُرْوَةَ بْنِ الزُّبَيْرِ قَالَ: كَانَ بِالْمَدِيْنَةِ رَجُلَانِ أَحَدُهُمَا يَلْحَدُ وَالْآخَرُ لَا يُلْحَدُ. فَقَالُوْا: أَيُّهُمَا جَاءَ أَوَّلًا عَمِلَ عَمَلَهُ. فَجَاءَ الَّذِيْ يَلْحَدُ فَلَحَدَ لِرَسْوُلِ اللهِ صلى الله عليه وسلم. رَوَاهُ فِيْ شَرْحِ السُّنَّةِ.

1700. (8) [1/533బలహీనం]

‘ఉర్‌వహ్‌ బిన్‌ ‘జుబైర్‌ (ర) కథనం: మదీనహ్ లో సమాధి త్రవ్వే ఇద్దరు వ్యక్తులు ఉండేవారు. వారిలో ఒకరు బ’గ్‌లీ (ల’హద్‌) సమాధి త్రవ్వేవారు, మరొకరు పెట్టెలా సమాధి త్రవ్వేవారు. ప్రజలు ఇద్దరి వద్దకు మనిషిని పంపించారు. ఎవరు ముందు వస్తే వారు తమ పని ప్రారంభించాలని, బ’గ్‌లీ సమాధి త్రవ్వే వ్యక్తి ముందు వచ్చాడు, అతడు ప్రవక్త (స) కోసం బ’గ్‌లీ సమాధి త్రవ్వాడు. (షర్‌’హుస్సున్నహ్‌) ఈ ‘హదీసు’ ద్వారా ల’హద్‌ సమాధి ఉత్తమం అని తెలిసింది.

1701 – [ 9 ] ( حسن ) (1/533)

وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اللَّحْدُ لَنَا وَالشَّقُّ لِغَيْرِنَا”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ

1701. (9) [1/533ప్రామాణికం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”హద్సమాధి మనకోసం, పెట్టెలాంటి సమాధి ఇతరుల కోసం.” (తిర్మిజి’, అబూదావూద్‌, ఇబ్నె మాజహ్).

1702 – [ 10 ] ( ضعيف ) (1/534)

وَرَوَاهُ أَحْمَدُ عَنْ جَرِيْرِ بْنِ عَبْدِ اللهِ  .

  1702. (10) [1/534బలహీనం]

దీన్నే జరీర్ బిన్ ‘అబ్దుల్లాహ్ ద్వారా అ’హ్మద్‌ ఉల్లేఖించారు. [80]

1703 – [ 11 ] ( صحيح ) (1/534)

وَعَنْ هَشَّامِ بْنِ عَامِرٍأَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ يوم أحد: “اِحْفِرُوْا وَأَوْسَعُوْا وَأَعْمِقُوْا وَأَحْسِنُوْا وَادْفِنُوْا الْاِثْنَيْنِ وَالثَّلَاثةَ فِيْ قَبْرٍوَّاحِدٍ وَقَدِّمُوْا أَكْثَرَهُمْ قُرْآنًا”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ وَرَوَى ابْنُ مَاجَهُ إِلَى قَوْلِهِ وَأَحْسِنُوْا.

1703. (11) [1/534దృఢం]

హిషామ్‌ బిన్‌ ‘ఆమిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఉ’హుద్‌ యుద్ధ అమరవీరుల సమాధుల గురించి మాట్లాడుతూ, ‘సమాధులను విశాలంగా, లోతుగా, మంచిగా త్రవ్వండి. ఇద్దరేసి, ముగ్గురేసి వ్యక్తులను ఒక సమాధిలో ఖననం చేయండి. వారిలో ఖుర్‌ఆన్‌ అధికంగా గుర్తున్న వారిని ముందు ఉంచండి’ అని ఆదేశించారు. [81] (అ’హ్మద్‌, తిర్మిజి’, అబూ దావూద్‌, నసాయి’. కాని ఇబ్ను మాజ ”అహ్‌సనూ” వరకు ఉల్లేఖించారు.

1704 – [ 12 ] ( صحيح ) (1/534)

وَعَنْ جَابِرٍقَالَ: لَمَّا كَانَ يُوْمُ أُحُدٍ جَاءَتْ عَمَّتِيْ بِأَبِيْ لِتَدْفِنَهُ فِيْ مَقَابِرِنَا فَنَادَى مُنَادِيْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم: “رُدُّوا الْقَتْلَى إِلَى مَضَاجِعِهِمْ”. رَوَاهُ  أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَالنِّسَائِيُّ وَالدَّارَمِيُّ. وَلَفْظُهُ لِلتِّرْمِذِيِّ .

1704. (12) [1/534దృఢం]

జాబిర్‌ (ర) కథనం: ఉ’హుద్‌ యుద్ధంలో మా నాన్నగారు వీరమరణం పొందారు. మా అత్తగారు మా నాన్నగారి శవం తీసుకోవటానికి వచ్చారు, మా శ్మశానంలో ఖననం చేయాలని, ప్రవక్త(స) కు ఈ విషయం తెలిసి, ప్రకటించే వాడి ద్వారా, ‘ఈ అమర వీరులను వారు వీరమరణం పొందినచోటే తీసుకు వెళ్ళండి, అంటే ఉ’హుద్‌ మైదానంలోనే వారిని ఖననం చేయండి’ అని ఆదేశించారు. [82] (అ’హ్మద్‌, తిర్మిజి’, అబూ దావూద్‌, నసాయి’, దార్మి)

1705 – [ 13 ] ( ضعيف ) (1/534)

وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: سُلَّ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم مِنْ قِبَلِ رَأْسِهِ. رَوَاهُ الشَّافِعِيُّ .

1705. (13) [1/534బలహీనం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స)ను, తలవైపు నుండి సమాధిలోకి దించటం జరిగింది. [83] (షాఫయీ’)

1706 – [ 14 ] ( ضعيف ) (1/534)

وَعَنِ ابْنِ عَبَّاسٍ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم دَخَلَ قَبْرًا لَيْلًا فَأُسْرِجَ لَهُ بِسِرَاجٍ فَأَخَذَ مِنْ قِبَلِ الْقِبْلَةِ وَقَالَ: “رَحِمَكَ اللهُ إِنْ كُنْتَ لَأَوَّاهَا تَلَّاءً لِّلْقُرْآنِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ فِيْ شَرْحِ السُّنَّةِ: إِسْنَادُهُ ضَعِيْفٌ .

1706. (14) [1/534బలహీనం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స), ఒక శవాన్ని సమాధిలో దించటానికి సమాధిలోకి దిగారు. అది రాత్రి చీకటి సమయం. వెలుగుకోసం దీపం వెలిగించబడింది. ప్రవక్త (స) శవాన్ని ఖిబ్లావైపు నుండి సమాధిలోకి దించారు. ఇంకా, ”అల్లాహ్‌ నిన్ను కరుణించు గాక! నీవు చాలా ఏడ్చేవాడివి, అత్యధి కంగా ఖుర్‌ఆన్‌ పఠించేవాడివి” అని అన్నారు.[84] (తిర్మిజి’, షర్‌’హు స్సున్నహ్‌లో ఈ ‘హదీసు’ బలహీనమైనదని ఉంది.

1707 – [ 15 ] ( صحيح ) (1/535)

وَعَنِ ابْنِ عُمَرَأَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم كَانَ إِذَا أَدْخَلَ الْمَيِّتَ الْقَبْرَ قَالَ: “بِسْمِ اللهِ وَبِاللهِ وَعَلَى مِلَّةِ رَسُوْلِ اللهِ”.

وَفِيْ رِوَايَةٍ: “وَعَلَى سُنَّةِ رَسُوْلِ اللهِ. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ وَرَوَى أَبُوْ دَاوُدَ الثانِيَةَ.

1707. (15) [1/535దృఢం]

ఇబ్నె ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) శవాన్ని సమాధిలో దించినపుడు ఈ దు’ఆ చదివేవారు. ”బిస్మిల్లాహి, వబిల్లాహి, వ’ఆలా మిల్లతి రసూ లిల్లాహి” అని పఠించేవారు.

మరో ఉల్లేఖనంలో,  ”అలా సున్నతి రసూలిల్లాహి” అని ఉంది. (అ’హ్మద్‌, తిర్మిజి’, ఇబ్నె మాజహ్, అబూ దావూద్‌)

1708 – [ 16 ] ( ضعيف ) (1/535)

وَعَنْ جَعْفِرِ بْنِ مُحَمَّدٍ عَنْ أَبِيْهِ مُرْسَلًا أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم حَثَا عَلَى الْمَيِّتِ ثَلَاثَ حَثَيَاتٍ بِيَدَيْهِ جَمِيْعًا وَأَنَّهُ رَشَّ عَلَى قَبْرِ ابْنِهِ إِبْرَاهِيْمَ وَوَضَعَ عَلَيْهِ حَصْبَاءَ. رَوَاهُ فِيْ شَرْحِ السُّنَّةِ وَرَوَى الشَّافِعِيُّ مِنْ قَوْلِهِ: “رَشَّ.”

1708. (16) [1/535బలహీనం]

జ’అఫర్‌ బిన్‌ ము’హమ్మద్‌ తన తండ్రి ద్వారా కథనం: ప్రవక్త (స) శవంపై తన రెండు చేతులతో మూడు దోసెళ్ళు నిండుగా మట్టివేశారు. ఇంకా ప్రవక్త (స) తన కుమారుడు ఇబ్రాహీమ్‌ సమాధిపై నీళ్ళు చిలకరించారు. ఇంకా దానిపై కంకరరాళ్లను చిహ్నంగా ఉంచారు. [85](షర్‌’హుస్సున్నహ్‌, షాఫయీ’)

1709 – [ 17 ] ( صحيح ) (1/535)

وَعَنْ جَابِرٍ قَالَ: نَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم أَنْ تُجَصَّصَ الْقُبُوْرُ وَأَنْ يُّكْتَبَ عَلَيْهَا وَأَنْ تُوْطَأَ. رَوَاهُ التِّرْمِذِيُّ.

1709. (17) [1/535దృఢం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) సమాధులను దృఢంగా నిర్మించటాన్ని, సమాధులపై వ్రాయటాన్ని, సమాధులను కుమ్మటాన్ని నిషేధించారు. (తిర్మిజి’)

1710 – [ 18 ] ( لم تتم دراسته ) (1/535)

وَعَنْ جَابِ رٍ قَالَ: رُشَّ قَبْرُ النَّبِيِّ صلى الله عليه وسلم وَكَانَ الَّذِيْ رَشَّ الْمَاءَ عَلَى قَبْرِهِ بِلَالُ بْنُ رَبَاحٍ بِقُرْبَةٍ بَدَأَ مِنْ قِبَلِ رَأْسِهِ حَتَّى انْتَهَى إِلَى رِجْلَيْهِ. رَوَاهُ الْبَيْهَقِيُّ. فِيْ دَلَائِلِ النَّبُوَّةَ.

1710. (18) [1/535అపరిశోధితం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) యొక్క సమాధిపై నీళ్ళు చిలకరించటం జరిగింది. నీళ్ళు చిలకరించిన వ్యక్తి పేరు బిలాల్‌ బిన్‌ రిబా’హ్‌. తలవైపు నుండి ప్రారంభించి కాళ్ళవద్ద ముగించారు. [86] (బైహఖీ-దలాయిలిన్నుబువ్వహ్)

1711 – [ 19 ] ( حسن ) (1/536)

وَعَنِ الْمُطَّلِبِ بْنِ أَبِيْ وَدَاعَةَ قَالَ: لَمَّا مَاتَ عُثْمَانُ ابْنُ مَظْعُوْنٍ أُخْرِجَ بِجَنَازَتِهِ فَدُفِنَ أَمَرَ النَّبِيُّ صلى الله عليه وسلم رَجُلًا أَنْ يَّأْتِيَهِ بِحَجَرٍ فَلَمْ يَسْتَطِعْ حَمْلَهَا فَقَامَ إِلَيْهِ رَسُوْلُ الله صلى الله عليه وسلم وَحَسَرَ عَنْ ذِرَاعَيْهِ. قَالَ الْمُطَّلِبُ: قَالَ الَّذِيْ يُخْبِرُنِيْ عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم: كَأَنِّيْ أُنْظُرُ إِلَى بَيَاضِ ذِرَاعَيْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم حِيْنَ حَسَرَ عَنْهُمَا ثُمَّ حَمَلَهَا فَوَضَعَهَا عِنْدَ رَأْسِهِ. وَقَالَ: “أَعْلَمُ بِهَا قَبْرَ أَخِيْ وَأَدْفِنُ إِلَيْهِ مَنْ مَّاتَ مِنْ أَهْلِيْ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

1711. (19) [1/536ప్రామాణికం]

‘అబ్దుల్‌ ము’త్తలిబ్‌ బిన్‌ అబీ వదా’అ (ర) కథనం: ‘ఉస్మా’న్‌ బిన్‌ మ”జ్‌’ఊన్‌ మరణించిన తరువాత, అతని జనా’జహ్ ఎత్తుకొని వెళ్ళి ఖననం చేయటం జరిగింది. ప్రవక్త (స) ఒక వ్యక్తిని రాయి తెమ్మన్నారు. కాని ఆ రాయి చాలా బరువుగా ఉండటం వల్ల స్వయంగా ప్రవక్త (స) వెళ్ళి చొక్కా చేతులు ఎత్తి అంటే నాకు చెప్పిన వ్యక్తి నేనిప్పుడు కూడా ప్రవక్త (స) చంకల తెలుపు చూస్తున్నాను. ప్రవక్త (స) ఆ రాయిని ఎత్తి అతని తలవద్ద పెట్టారు. ఇంకా ”నా సోదరుని సమాధిపై చిహ్నంగా పెడుతున్నాను. ఇంకా నా కుటుంబంలో మరణించిన వారిని అతని ప్రక్కనే ఖననం చేస్తాను” అని అన్నారు. [87] (అబూ దావూద్‌)

1712 – [ 20 ] ( ضعيف ) (1/536)

وَعَنِ الْقَاسِمِ بْنِ مُحَمَّدٍ قَالَ: دَخَلْتُ عَلَى عَائِشَةَ فَقُلْتُ: يَا أُمَّاهُ اِكْشِفِيْ لِيْ عَنِ قَبْرِ النَّبِيّ صلى الله عليه وسلم وَصَاحِبَيْهِ فَكَشَفَتْ لِيْ عَنْ ثَلَاثَةِ قُبُوْرٍلَّا مُشْرِفَةٍ وَّلَا لَا طِئَةٍ مَّبْطُوْحَةٍ بِبَطْحَاءِ الْعَرْصَةِ الْحَمْرَاءِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

1712. (20) [1/536బలహీనం]

ఖాసిమ్బిన్ముహమ్మద్ కథనం: నేను ‘ఆయి’షహ్‌ (ర) వద్దకు వెళ్ళాను. తల్లీ! ప్రవక్త (స) మరియు అబూ బకర్‌, ‘ఉమర్‌ల సమాధులను తెరవండి అన్నాను. ‘ఆయి’షహ్‌ (ర) గది తలుపు తెరిచారు. మూడు సమాధులను నేను చూశాను. అవి ఎత్తుగా లేవు, భూమికి సమానంగా లేవు. వాటిపై మదీనహ్ మైదానాలకు చెందిన ఎర్రని కంకరరాళ్ళు పరచబడి ఉన్నాయి. [88](అబూ దావూద్‌)

1713 – [ 21 ] ( صحيح ) (1/536)

وَعَنِ الْبَرَاءِ بْنِ عَازِبٍ قَالَ: خَرَجْنَا مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فِيْ جَنَازَةِ رَجُلٍ مِّنَ الْأَنْصَارِ فَانْتَهَيْنَا إِلَى الْقَبْرِ وَلَمَّا يُلْحَدُ بَعْدُ فَجَلَسَ النَّبِيُّ صلى الله عليه وسلم مُسْتَقْبِلَ الْقِبْلَةِ وَجَلَسْنَا مَعَهُ. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَهُ. وَزَادَ فِيْ آخِرِهِ: كَأَنَّ عَلَى رُؤُوْسِنَا الطَّيْرَ.

1713. (21) [1/536దృఢం]

బరా’ బిన్‌ ‘ఆజి’బ్‌ (ర) కథనం: మేము ప్రవక్త (స) వెంట ఒక అన్సారీ వ్యక్తి జనా’జహ్ లో వెళ్ళాము. శ్మశానం వెళ్ళే సరికి సమాధి త్రవ్వటం ఇంకా పూర్తి కాలేదని తెలిసింది. అప్పుడు ప్రవక్త(స) ఖిబ్లా వైపు తిరిగి కూర్చున్నారు. మేము కూడా ప్రవక్త (స)తో పాటు కూర్చున్నాము. (అబూ దావూద్‌, నసాయి’)

ఇబ్నె మాజహ్ ఉల్లేఖనం చివరిలో ఇలా ఉంది, ”అందరూ నిశ్శబ్దంగా, మా తలలపై పక్షులు కూర్చున్నట్లు కూర్చున్నారు.”

1714 – [ 22 ] ( حسن ) (1/537)

وَعَنْ عَائِشَةَ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “كَسْرُ عَظْمِ الْمَيِّتِ كَكَسْرِهِ حَيًّا”. رَوَاهُ مَالِكٌ وَأَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ .

1714. (22) [1/537ప్రామాణికం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”శవం ఎముక విరిచివేయటం, సజీవంగా ఉన్న వ్యక్తి ఎముక విరిచినంత పాపం.” (మాలిక్‌, అబూ దావూద్‌, ఇబ్నె మాజహ్)

—–

اَلْفَصْلُ الثَّالِثُ  మూడవ విభాగం

1715 – [ 23 ] ( صحيح ) (1/537)

عَنْ أَنَسٍ قَالَ: شَهِدْنَا بِنْتَ رَسُوْلِ الله صلى الله عليه وسلم تُدْفَنُ وَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم جَالِسٌ عَلَى الْقَبْرِ فَرَأَيْتُ عَيْنَيْهِ تَدْمَعَانِ فَقَالَ: “هَلْ فِيْكُمْ مِّنْ أَحَدٍ لَّمْ يُقَارِفِ اللَّيْلَةَ؟  فَقَالَ أَبُوْ طَلْحَةَ: أَنَا. قَالَ: فَاَنْزِلْ فِيْ قَبْرِهَا فَنَزَلَ فِيْ قَبْرِهَا”. رَوَاهُ الْبُخَارِيُّ .

1715. (23) [1/537దృఢం]

అనస్‌ (ర) కథనం: మేము ప్రవక్త (స) కుమార్తె ఉమ్మె కుల్సూమ్ జనా’జహ్ లో వెళ్ళాము. ఖననం చేస్తున్నప్పుడు ప్రవక్త (స) ప్రక్కన కూర్చున్నారు. ప్రవక్త (స) కళ్ళంట అశ్రువులు కారుతున్నాయి. తరువాత ప్రవక్త (స) ”ఈ రోజు రాత్రి భార్యతో సంభోగించని వ్యక్తి ఎవరైనా మీలో ఉన్నారా” అని అడిగారు. దానికి అబూ తల్‌హా ‘నేను’ అని అన్నారు. ‘అమ్మాయి సమాధిలో దిగు’ అని అన్నారు. అనంతరం అతను దిగారు. [89] (బు’ఖారీ)

1716 – [ 24 ] ( صحيح ) (1/537)

وَعَنْ عَمْرِو بْنِ الْعَاصِ قَالَ لِأبْنِهِ وَهُوَ فِيْ سِيَاقِ الْمَوْتِ: إِذَا أَنَا مِتُّ فَلَا تُصْحِبْنِيْ نَائِحَةٌ وَلَا نَارٌ فَإِذَا دَفَنْتُمُوْنِيْ فَشُنُّوْا عَلَيَّ التُّرَابَ شَنًّا ثُمَّ أَقِيْمُوْا حَوْلَ قَبْرِيْ قَدْرَ مَا يُنْحَرُ جَزُوْرٌ وَّيُقْسَمُ لَحْمُهَا حَتَّى أَسْتَأْنِسَ بِكُمْ وَأَعْلَمَ مَاذَا أُرَاجِعُ بِهِ رُسَلَ رَبِّيْ . رَوَاهُ مُسْلِمٌ .

1716. (24) [1/537దృఢం]

‘అమ్ర్ బిన్‌ ‘ఆ’స్‌ (ర) తన మరణానికి ముందు తన కుమారునికి ఇలా హితోపదేశం చేసారు. ”నేను మరణించిన తరువాత నా జనా’జహ్ వెంట ఏడ్పులు పెడబొబ్బలు పెట్టే స్త్రీలు వెళ్ళరాదు, ఇంకా నా జనా’జహ్ వెంట అగ్గి కూడా తీసుకుని వెళ్ళరాదు. ఇంకా మీరు నన్ను సమాధిలో పెట్టిన తర్వాత నాపై మట్టిని మెల్లగా వేయండి. మట్టివేసి కప్పిన తర్వాత నా సమాధి ప్రక్కన ఒంటెను జ’బ’హ్‌ చేసి, మాంసం పంచిపెట్టినంత సేపు నిలబడండి. ఇలా ఎందుకంటే, మీరు ఉండటం వల్ల నాకు అండగా ఉంటుంది, దైవదూతలకు సమాధానం ఇవ్వటంలో నిర్భయంగా ఉంటాను” అని అన్నారు. [90] (ముస్లిమ్‌)

1717 – [ 25 ] ( ضعيف ) (1/538)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عُمَرَ قَالَ: سَمِعْتُ النَّبِيَّ صلى الله عليه وسلم يَقُوْلُ: “إِذَا مَاتَ أَحَدُكُمْ فَلَا تَحْبِسُوْهُ وَأَسْرِعُوْا بِهِ إِلَى قَبْرِهِ وَلْيَقْرَأْ عِنْدَ رَأْسِهِ فَاتِحَة الْبَقْرَةِ وَعِنْدَ رِجْلَيْهِ بِخَاتِمَةِ الْبَقَرَةِ”. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ. وَقَالَ: وَالصَّحِيْحُ أَنَّهُ مَوْقُوْفٌ عَلَيْهِ.

1717. (25) [1/538బలహీలం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను: ”మీలో ఎవరైనా మరణిస్తే, ఆపి ఉంచి ఆలస్యం చేయకండి. త్వరగా అతన్ని సమాధివైపు తీసుకొని వెళ్ళండి. ఇంకా అతని తల వద్ద సూరహ్‌ బఖరహ్‌ మొదటి రుకూ’ చదవండి. ఇంకా అతని కాళ్ళవద్ద సూరహ్‌ బఖరహ్‌ చివరిరుకూ’ చదవండి.” [91] (బైహఖీ షు’అబిల్ ఈమాన్ లో దీన్ని పేర్కొని, ఇది సహచరుని ప్రోక్తం (మౌఖూఫ్ ‘హదీసు’) అనేది నిజమే అని పేర్కొన్నారు.

1718 – [ 26 ] ( الصحيح ) (1/538)

وَعَنِ ابْنِ أَبِيْ مُلَيْكَةَ قَالَ: لَمَّا تُوُفِّيَ عَبْدُ الرَّحْمَنِ بْنِ أَبِيْ بَكْرٍبِالْحُبْشِيِّ (مَوْضِعٌ قَرِيْبٌ مِنْ مَّكَةٍ) وَهُوَ مَوْضِعٌ فَحُمِلَ إِلَى مَكَّةَ فَدُفِنَ بِهَا فَلَمَّا قَدِمَتْ عَائِشَةَ أَتَتْ قَبْرَعَبْدِ الرَّحْمَنِ بْنِ أَبِيْ بَكْرٍ فَقَالَتْ: وَكُنَّا كَنَدْمَانَيْ جَذِيْمَةَ حِقْبَةً مِنَ الدَّهْرِحَتَّى قِيْلَ لَنْ يَّتَصَدَّعَا فَلَمَّا تَفَرَّقْنَا كَأَنِّيْ وَمَالِكًا لِطُوْلِ اجْتِمَاعِ لَمْ نَبِتْ لَيْلَةً مَعَا ثُمَّ قَالَتْ: وَاللهِ لَوْ حَضَرْتُكَ مَا دُفِنْتَ إِلَّا حَيْثُ مُتَّ وَلَوْ شَهِدْتُّكَ مَا زُرْتُكَ. رَوَاهُ التِّرْمِذِيُّ.

1718. (26) [1/538దృఢం]

ఇబ్నె అబూ ములైకహ్‌ (ర) కథనం: అబ్దుర్రహ్మాన్బిన్అబీ బక్ర్(ర) ‘హుబ్ షాలో మరణించారు. అతని శవాన్ని మక్కహ్ తీసుకువచ్చి, మక్కహ్ లో ఖననం చేశారు. అప్పుడు ‘ఆయి’షహ్‌(ర) ‘హజ్జ్ కోసం మక్కహ్ వచ్చి ఉన్నారు. ఆమె తన సోదరుడు ‘అబ్దు ర్ర’హ్మాన్‌ బిన్‌ అబూ బక్‌ర్‌ (ర) సమాధి వద్దకు కూడా వెళ్ళారు.

అక్కడ  మనమిద్దరం సోదరి, సోదరుడు జజీమ మిత్రుల్లా ఉండేవాళ్ళం. చాలా కాలం వరకు మనం విడిపోలేదు. చివరికి మన గురించి వీరిద్దరూ ఎన్నడూ విడిపోరు అని చెప్పుకోవటం జరిగింది. చాలాకాలం కలసి ఉండి విడిపోతే, మనమెన్నడూ కలసి ఉండ లేదనిపించింది. అనే కవిత్వం చదివారు.

 ఆ తరువాత ”అల్లాహ్ సాక్షి! ఓ నా సోదరా! నిన్ను ఖననం చేసినపుడు నేను ఉండి ఉంటే, నీవు ఇక్కడ ఖననం చేయబడేవాడవు కావు. నీవు మరణించిన చోటే ఖననం చేసేదాన్ని. ఇంకా నీవు మరణించి నపుడు నీ దగ్గర ఉంటే, దర్శనం కోసం నీ సమాధిపై వచ్చేదాన్ని కాను.” అని అన్నారు [92] (తిర్మిజి’)

1719 – [ 27 ] ( ضعيف ) (1/539)

وَعَنْ أَبِيْ رَافِعٍ قَالَ: سَلَّ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم سَعْدًا وَّرَشَّ عَلَى قَبْرِهِ مَاءً. رَوَاهُ ابْنُ مَاجَهُ.

1719. (27) [1/539బలహీనం]

అబూ రా’ఫె (ర) కథనం: ప్రవక్త (స) స’అద్‌ను అతని కాళ్ళవైపు నుండి సమాధిలో దించారు. ఇంకా అతని సమాధిపై నీళ్ళు చిలకరించారు. (ఇబ్నె మాజహ్)

1720 – [ 28 ] ( لم تتم دراسته ) (1/539)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم صَلّى عَلَى جَنَازَةٍ ثُمَّ أَتَى الْقَبْرَ فَحَثَا عَلَيْهِ مِنْ قِبَلِ رَأْسِهِ ثَلَاثًا. رَوَاهُ ابْنُ مَاجَهُ.

1720. (28) [1/539అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) జనా’జహ్ నమా’జు చదివించారు. అతని సమాధి వద్దకు వచ్చారు. ఇంకా అతని తలవైపు నుండి మూడు పిడికెళ్ళు మట్టి వేసారు. (ఇబ్నె మాజహ్)

1721 – [ 29 ] ( ضعيف ) (1/539)

وَعَنْ عَمْرِو بْنِ حَزْمٍ قَالَ: رَآنِي النَّبِيُّ صلى الله عليه وسلم مُتَّكِئًا عَلَى قَبْرٍ فَقَالَ: لَا تُؤْذِ صَاحِبَ هَذَا الْقَبْرِ أَوْلَا تُؤْذِهِ. رَوَاهُ أَحْمَدُ .

1721. (29) [1/539బలహీనం]

‘అమ్ర్ బిన్‌ ‘హ’జ్మ్‌ (ర) కథనం: ప్రవక్త (స) నన్ను ఒక సమాధికి చేరబడి కూర్చోవటం చూశారు. అప్పుడు ప్రవక్త (స) ‘ఆ సమాధి వాడిని హింసించకు లేదా అతన్ని బాధించకు’ అని అన్నారు. [93](అ’హ్మద్‌)

=====

7 باب اَلْبُكَاءِ عَلَى الْمَيِّتِ

7. మరణించిన వారైపై రోధించటం

ఏడ్పులు పెడబొబ్బలు, కేకలు పెట్టకుండా మృతునిపై కన్నీరు కార్చటం, ఏడ్వటం, దుఃఖ విచారాలను వ్యక్తం చేయటం ధర్మసమ్మతమే. కేకలు, ఏడ్పులు, పెడబొబ్బలు పెట్టటం, మృతుని పొగడటం, బట్టలు చించుకోవటం, లెంపలు వేసు కోవటం, తన్ను తాను హింసించటం అధర్మం. మృతుని ఇంటి వారికి ఓర్పూ సహనాలను గురించి చెప్పి ఓదార్చటం అభిలషణీయం. శవాన్ని ఖననం చేసిన తర్వాత, అతని ఇంటిలో ఖుర్‌ఆన్‌ పఠన కార్యక్రమం పెట్టటం, అందరూ చేరటం ధర్మసమ్మతం కాదు. సంతాపసభ ఏర్పాటు చేయటం కూడా ధర్మసమ్మతం కాదు. పదో దినం, 40వ దినం చేయటం కూడా ధర్మసమ్మతం కాదు.

—–

اَلْفَصْلُ الْأَوَّلُ  మొదటి విభాగం

1722 – [ 1 ] ( متفق عليه ) (1/540)

عَنْ أَنَسٍ قَالَ: دَخَلْنَا مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم عَلَى أَبِيْ سَيْفٍ الْقَيْنِ وَكَانَ ظِئْرًا لِإِبْرَاهِيْمَ فَأَخَذَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِبْرَاهِيْمَ فَقَبَّلَهُ وَشَمَّهُ. ثُمَّ دَخَلْنَا عَلَيْهِ بَعْدَ ذَلِكَ وَإِبْرَاهِيْمُ يَجُوْدُ بِنَفْسِهِ فَجَعَلَتْ عَيْنَا رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم تَذْرِفَانِ. فَقَالَ لَهُ عَبْدُ الرَّحْمَنِ بْنِ عَوْفٍ: وَأَنْتَ يَا رَسُوْلَ اللهِ؟ فَقَالَ: “يَا ابْنَ عَوْفٍ إِنَّهَا رَحْمَةٌ. ثُمَّ أَتْبَعَهَا بِأُخْرَى. فَقَالَ: إِنَّ الْعَيْنَ تَدْمَعُ وَالْقَلْبُ يَحْزُنُ وَلَا نَقُوْلُ إِلَّا مَا يَرْضَي رَبُّنَا. وَإِنَّا بِفِرَاقِكَ يَا إِبْرَاهِيْمُ لَمَحْزُوْنُوْنَ”.

1722. (1) [1/540ఏకీభవితం]

అనస్‌ (ర) కథనం: మేము ప్రవక్త (స) వెంట అబూ సైఫ్‌ వడ్రంగి వాడి వద్దకు వెళ్ళాము. అతడు ప్రవక్త (స) కుమారుడు ఇబ్రాహీమ్‌ (ర)కు పాలుపట్టే స్త్రీకి భర్త. ప్రవక్త (స) తన కుమారుణ్ణి తన ఒడిలోకి తీసుకున్నారు. ముద్దు పెట్టుకున్నారు. సువాసన ఆస్వాదించారు. అంటే బిడ్డనోటిపై తననోరు పెట్టి వాసన పీల్చారు. ఆ తరువాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మేమందరం అబూ సైఫ్‌ ఇంటికి వెళ్ళాము. అప్పుడు ఇబ్రాహీమ్‌ అనారోగ్యంగా ఉన్నారు. చివరి శ్వాసలో ఉన్నారు. ప్రవక్త (స) ఆ బిడ్డ పరిస్థితి చూసి ఏడ్వసాగారు. రెండు కళ్ళూ కన్నీళ్ళతో నిండి పోయాయి. అప్పుడు ‘అబ్దు ర్ర’హ్మాన్‌ బిన్‌ ‘ఔఫ్‌, ‘ఓ ప్రవక్తా! తమరు కూడా ఏడుస్తున్నారా?’ అని అడిగారు. అప్పుడు ప్రవక్త (స), ‘ఓ ‘అబ్దుర్ర’హ్మాన్‌! కళ్లంట అశ్రువులు కారటం హృదయసున్నితత్వానికి నిదర్శనం’ అని అన్నారు. ఆ తరువాత మళ్ళీ ప్రవక్త (స) కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. అప్పుడు ప్రవక్త (స) ‘కళ్ళు కన్నీళ్ళు కారుస్తాయి, హృదయం బాధను దుఃఖాన్ని వ్యక్తపరుస్తుంది. అయితే మేము అల్లాహ్‌ (త) కు ఇష్టమైన మాటలనే మాట్లాడుతాము. ఓ ఇబ్రాహీమ్‌! నీవు వదలి పోతున్నందుకు బాధగా, దుఃఖంగా ఉంది’ అని అన్నారు. [94] (బు’ఖారీ, ముస్లిమ్‌)

1723 – [ 2 ] ( متفق عليه ) (1/540)

وَعَنْ أُسَامَةَ بْنِ زَيْدٍ قَالَ: أَرْسَلَتْ اِبْنَةُ النَّبِيِّ صلى الله عليه وسلم إِلَيْهِ: أَنَّ ابْنَا لِّيْ قُبِضَ فَأْتِنَا. فَأَرْسَلَ يُقْرِئُ السَّلَامَ وَيَقُوْلُ: “إِنَّ لِلّهِ مَا أَخَذَ وَلَهُ مَاأَعْطَى وَكُلٌ عِنْدَهُ بِأَجَلٍ مُّسَمًّى فَلْتَصْبِرْ وَلْتَحْتَسِبْ”. فَأَرْسَلَتْ إِلَيْهِ تُقْسِمُ عَلَيْهِ لِيَأْتِيَنَّهَا. فَقَامَ وَمَعَهُ سَعْدُ بْنُ عُبَادَةَ وَمُعَاذُ بْنُ جَبَلٍ وَأُبَيُّ بْنُ كَعْبٍ وَزَيْدُ ابْنُ ثَابِتٍ وَرِجَالٌ. فَرُفِعَ إِلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم الصَّبِيُّ وَنَفْسُهُ تَتَقَعْقَعُ فَفَاضَتْ عَيْنَاهُ. فَقَالَ سَعْدٌ: يَا رَسُوْلَ اللهِ مَا هَذَا؟ فَقَالَ: “هَذِهِ رَحْمَةٌ جَعَلَهَا اللهُ فِيْ قُلُوْبِ عِبَادِهِ. فَإِنَّمَا يَرْحَمُ اللهُ مِنْ عِبَادِهِ الرُّحَمَاءَ”.

1723. (2) [1/540ఏకీభవితం]

ఉసామా బిన్‌ ‘జైద్‌ (ర) కథనం: ప్రవక్త (స) కూతురు జైనబ్(ర) ప్రవక్త (స) వద్దకు ఒక మనిషిని పంపి, ”నా బిడ్డ చివరిశ్వాసలో ఉన్నాడు, త్వరలో మరణిస్తాడు, రండి, వచ్చి మీ మనవడ్ని ఒక చూపు చూసుకోండి” అని చెప్పి పంపించారు. ప్రవక్త (స) ఆ వచ్చిన వ్యక్తితో, ”నువ్వు వెళ్ళి నా కూతురుకు సలాము అందజేయి, ఇంకా నేను వచ్చినందువల్ల ఏమీ లాభం లేదని, అల్లాహ్‌(త) తీసుకున్నది అల్లాహ్‌దే, ఆ వస్తువు ఆయనదే, అల్లాహ్‌(త) వద్ద ప్రతి జీవికి ఒక నిర్ణీత సమయం ఉంది, నీవు సహనం పాటించు, ప్రతి ఫలాపేక్ష కలిగి ఉండు” అని చెప్పి పంపారు. ఆమె మళ్ళీ ఆ వ్యక్తిని, ప్రవక్త (స)ను రమ్మని ప్రమాణం చేసి అల్లాహ్ సాక్షి! ప్రవక్తా! తమరు తప్పకుండా రావాలి అని చెప్పి పంపింది. ప్రవక్త (స) వెళ్ళడానికి నిలబడ్డారు. ప్రవక్త (స) వెంట స’అద్‌ బిన్‌ ‘ఉబాదహ్, ము’ఆజ్‌’ బిన్‌ జబల్‌, ‘ఉబయ్‌ బిన్‌ క’అబ్‌, ‘జైద్‌ బిన్‌ సా’బిత్‌ ఇంకా ఇతర అనుచరులు ఉన్నారు. తన కుమార్తె ఇంటికి వెళ్ళిన తరువాత బిడ్డను తీసుకు రావటం జరిగింది. ప్రవక్త (స) బిడ్డను తన ఒడిలోకి తీసుకున్నారు. అప్పుడు బిడ్డ చివరి శ్వాసలో ఉన్నాడు. ఆ స్థితిని చూచి ప్రవక్త (స) కళ్ళు కన్నీళ్ళతో నిండిపోయాయి. అప్పుడు స’అద్‌ (ర) ‘ప్రవక్తా! ఇదేమిటి?’ అని అన్నారు. దానికి ప్రవక్త (స) ‘ఇది అల్లాహ్‌ కారుణ్యం. దీన్ని అల్లాహ్‌(త) తన దాసుల హృదయాల్లో ప్రవేశింపజేశాడు. అల్లాహ్‌(త) తన  దాసుల్లోని దయాగుణం గల దయామయులైన దాసులపైనే దయ చూపుతాడు’ అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

1724 – [ 3 ] ( متفق عليه ) (1/541)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عُمَرَ قَالَ: اشْتَكَى سَعْدُ بْنُ عُبَادَةَ شَكْوَى لَهُ فَأَتَاهُ النَّبِيُّ صلى الله عليه وسلم يَعُوْدُهُ مَعَ عَبْدِ الرَّحْمنِ بْنِ عَوْفٍ وَّسَعْدِ بْنِ أَبِيْ وَقَّاصٍ وَعَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ فَلَمَّا دَخَلَ عَلَيْهِ وَجَدَهُ فِيْ غَاشِيَةٍ. فَقَالَ: (قَدْ قُضِىَ؟ قَالُوْا: لَا يَا رَسُوْلَ اللهِ. فَبَكَى النَّبِيُّ صلى الله عليه وسلم. فَلَمَّا رَأَى الْقَوْمُ بُكَاءَ النَّبِيِّ صلى الله عليه وسلم بَكَوْا. فَقَالَ: أَلَا تَسْمَعُوْنَ؟ إِنَّ اللهَ لَا يُعَذِّبُ بِدَمْعِ الْعَيْنِ وَلَا بِحُزْنِ الْقَلْبِ وَلَكِنْ يُّعَذِّبُ بِهَذَا وَأَشَارَ إِلَى لِسَانِهِ أَوْ يَرْحَمُ وَإِنَّ الْمَيِّتَ لَعُيَذَّبُ بِبُكَاءِ أَهْلِهِ.

1724. (3) [1/541ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: స’అద్‌ బిన్‌ ‘ఉబా దహ్‌ అనారోగ్యానికి గురయ్యారు. ప్రవక్త (స), ‘అబ్దుర్ర’హ్మాన్‌ బిన్‌ ‘ఔఫ్‌, స’అద్‌ బిన్‌ అబీ వఖ్ఖాస్‌ మరియు ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌లను తీసుకొని ఆయన్ను పరామర్శించటానికి వెళ్ళారు. అప్పు డతడు స్పృహకోల్పోయి ఉన్నాడు. ప్రవక్త (స) అతని కుటుంబం వారితో ‘స’అద్‌ మరణించాడా’ అని అడిగారు. దానికి వారు ‘లేదు ఓ ప్రవక్తా!’ అని అన్నారు. ప్రవక్త (స) అది విని, ఏడ్వసాగారు. ప్రవక్త (స) ఏడ్వటం చూచి, మిగిలిన వారు ఏడ్వసాగారు. తరువాత ప్రవక్త (స) ”మీకు తెలియకపోతే తెలుసు కోండి, అల్లాహ్‌ కళ్ళు ఏడ్చినా హృదయం దుఃఖ, విచారానికి గురైనా శిక్షించడు. అయితే ఇది ఏడిస్తే శిక్షిస్తాడు అని నోటివైపు సైగ చేశారు. అంటే ఏడ్పులు పెడబొబ్బలు, శాపనార్థాలు పెట్టటం వల్ల శిక్షిస్తాడు లేదా క్షమించి వదలివేస్తాడు. అయితే శవాన్ని అతని కుటుంబం అతని పట్ల ఏడ్వటం వల్ల శిక్షించటం జరుగుతుంది అని అన్నారు. [95](బు’ఖారీ, ముస్లిమ్‌)

1725 – [ 4 ] ( متفق عليه ) (1/541)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَيْسَ مِنَّا مَنْ ضَرَبَ الْخُدُوْدَ وَشَقَّ الْجُيُوْبَ وَدَعَا بِدَعْوَى الْجَاهِلِيَّةِ”.

1725. (4) [1/541ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”కష్టసమయాల్లో తన్ను తాను హింసించు కోవటం, బట్టలను చించుకోవటం, అజ్ఞాన కాలంలా, కేకలు వేస్తూ ఏడ్వటం చేసేవాడు, ముస్లిమ్‌ కాడు.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

1726 – [ 5 ] ( متفق عليه ) (1/541)

وَعَنْ أَبِيْ بُرْدَةَ قَالَ: أُغْمِيَ عَلَى أَبِيْ مُوْسَى. فَأَقْبَلَتِ امْرَأَتُهُ أُمُّ عَبْدِ اللهِ تَصِيْحُ بِرَنَّةٍ ثُمَّ أَفَاقَ. فَقَالَ: أَلَمْ تَعْلَمِيْ؟ وَكَانَ يُحَدِّثُهَا أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “أَنَا بَرِيْءٌ مِمَّنْ حَلَقَ وَصَلَقَ وَخَرَقَ”. وَلَفْظُهُ لِمُسْلِمٍ.

1726. (5) [1/541ఏకీభవితం]

అబూ బుర్దహ్ (ర) కథనం: అబూ మూసా అష్‌’అరీ (ర) స్పృహ కోల్పోయినపుడు, అతని భార్య ఉమ్ము ‘అబ్దుల్లాహ్‌ కేకలు వేస్తూ ఏడ్వసాగింది. అబూ మూసా అష్‌’అరీ (ర) స్పృహలోకి వచ్చి, తన భార్యతో, ” ‘ప్రవక్త (స)  కష్ట సమయాల్లో తల వెంట్రుకలు గీయించు కోవటం, కేకలు వేస్తూ ఏడ్వటం, బట్టలు చించుకోవటం చేసేవారికీ నాకు ఎటువంటి సంబంధం లేదు’ అని అనటం నీకు తెలియదా?” అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

1727 – [ 6 ] ( صحيح ) (1/541)

وَعَنْ أَبِيْ مَالِكِ الْأَشْعَرِيِّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَرْبَعٌ فِيْ أُمَّتِيْ مِنْ أَمْرِالْجَاهِلِيَّةِ لَا يَتْرُكُوْنَهُنَّ: اَلْفَخْرُ فِيْ الْأَحْسَابِ وَالطَّعْنُ فِيْ الْأَنْسَابِ وَالْاِسْتَسْقَاءُ بِالنُّجُوْمِ وَالنِّيَاحَةُ”. وَقَالَ: “النَّائِحَةُ إِذَا لَمْ تَتُبْ قَبْلَ مَوْتِهَا تُقَامُ يَوْمَ الْقِيَامَةِ وَعَلَيْهَا سِرْبَالٌ مِّنْ قَطِرَانٍ وَدِرْعٌ مِّنْ جَرَبٍ”. رَوَاهُ مُسْلِمٌ.

1727. (6) [1/541దృఢం]

అబూ మాలిక్‌ అష్‌’అరీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నా అనుచర సమాజంలో, అజ్ఞాన కాలపు విషయాల్లో 4 విషయాలు మిగిలి ఉంటాయి. చాలా మంది వీటిని వదలరు. 1. ధన సంపదలపై గర్వ పడటం, 2. వంశాల పట్ల పరస్పరం ఎత్తి పొడుచు కోవటం, 3. నక్షత్రాల ద్వారా వర్షం కోరటం, 4. కష్టాల్లో కేకలువేస్తూ ఏడ్వటం, ఒకవేళ ఏడ్పులు పెడ బొబ్బలు పెట్టే స్త్రీ మరణానికి ముందు పశ్చాత్తాపం (తౌబహ్) చెందకుంటే, తీర్పుదినం నాడు ఆమెను నిలబెట్టి పైన గజ్జిఅంగి, క్రింద తారుపైజామా తొడిగించబడతాయి. [96] (ముస్లిమ్‌)

1728 – [ 7 ] ( متفق عليه ) (1/542)

وَعَنْ أَنَسٍ قَالَ: مَرَّ النَّبِيُّ صلى الله عليه وسلم بِاِمْرَأَةٍ تَبْكِيْ عِنْدَ قَبْرٍ. فَقَالَ: “اِتَّقِيْ اللهَ وَاصْبِرِيْ”. قَالَتْ: إِلَيْكَ عَنِّيْ فَأَنَّكَ لَمْ تُصَبْ بِمُصِيْبَتِيْ وَلَمْ تَعْرِفْهُ. فَقِيْلَ لَهَا: إِنَّهُ النَّبِيُّ صلى الله عليه وسلم. فَأَتَتْ بَابَ النَّبِيِّ صلى الله عليه وسلم فَلَمْ تَجِدْ عِنْدَهُ بَوَّابَيْنَ. فَقَالَتْ: لَمْ أَعْرِفْكَ. فَقَالَ: “إِنَّمَا الصَّبْرُ عِنْدَ الصَّدْمَةِ الْأَوْلَى”.

1728. (7) [1/542ఏకీభవితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఒక స్త్రీ ప్రక్క నుండి వెళ్ళటం జరిగింది. ఆమె ఒక సమాధి వద్ద కూర్చొని ఏడుస్తుంది. అప్పుడు ప్రవక్త (స) ‘దైవానికి భయపడు, ఓర్పు సహనం పాటించు’ అని అన్నారు. ఆ స్త్రీ ప్రవక్త (స)ను గుర్తించలేదు. ఆ స్త్రీ, ‘ఇక్కడినుండి వెళ్ళు, నా కొచ్చిన కష్టం నీకు రాలేదు,’ అని చెప్పింది. అతను, ప్రవక్త (స) అని ఆమెకు తెలియపర్చటం జరిగింది. అనంతర ఆ స్త్రీ ప్రవక్త (స) ఇంటి ద్వారం వరకు వచ్చింది. ద్వారం వద్ద ఎవరూ లేక పోవటం చూచి లోపలికి వచ్చేసింది. ప్రవక్త (స)ను క్షమాపణ కోరింది. నేను మిమ్మల్ని గుర్తించలేదు. దుఃఖంలో తప్పుగా మాట్లాడాను, నన్ను క్షమించండి అని ప్రాధేయ పడింది. దానికి ప్రవక్త (స) ‘మొట్టమొదట చేసేదే సహనం’ అని అన్నారు. [97] (బు’ఖారీ, ముస్లిమ్‌)

1729 – [ 8 ] ( متفق عليه ) (1/542)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَمُوْتُ لِمُسْلِمٍ ثَلَاثٌ مِّنَ الْوَلَدِ فَيَلِجِ النَّارَ إِلَّا تَحِلَّةَ الْقَسَم”.

1729. (8) [1/542ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తన ముగ్గురు పిల్లలు బాల్యంలో మరణించిన ముస్లిమ్‌, ఓర్పు సహనాలను పాటిస్తే నరకంలోనికి ప్రవేశించడు. అయితే చేసిన ప్రమాణం పూర్తిచేసి ఉండాలి. [98] (బు’ఖారీ, ముస్లిమ్‌)

1730 – [ 9 ] ( صحيح ) (1/542)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم لِنِسْوَةٍ مِّنَ الْأَنْصَارِ: “لَا يَمُوْتُ لِإِحْدَاكُنَّ ثَلَاثَةٌ مِّنَ الْوَلَدِ فَتَحْتَسِبُهُ إِلَّا دَخَلَتِ الْجَنَّةَ. فَقَالَ امْرَأَةٌ مِّنْهُنَّ: أَوِ اثْنَانِ يَا رَسُوْلَ اللهِ؟ قَالَ: أَوِ اثْنَانِ”. رَوَاهُ مُسْلِمٌ

وَفِيْ رِوَايَةٍ لَّهُمَا: “ثَلَاثَةٌ لَمْ يَبْلُغُوْا الْحِنْثَ”.

1730. [1/542దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) కొందరు అన్సారీ స్త్రీలతో ”మీలో ఎవరి బిడ్డలైనా ముగ్గురు బాల్యంలో మరణించి, తల్లి-దండ్రులు ఓర్పూ సహనాలు పాటించి, ప్రతి ఫలాపేక్షతో ఉంటే, వారు స్వర్గంలో ప్రవేశిస్తారు అని ప్రవచించారు. అది విని, ఒక స్త్రీ ప్రవక్తా! ఒకవేళ ఇద్దరే మరణిస్తే? అని ప్రశ్నించింది. దానికి ప్రవక్త (స) ఆమె కూడా స్వర్గంలో ప్రవేశిస్తుంది అని సమాధానం ఇచ్చారు. (ముస్లిమ్‌) 

బు’ఖారీలోని ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”ఆ ముగ్గురు బిడ్డలు బాల్యంలో, యుక్త వయస్సుకు చేరక ముందు మరణించి ఉండాలి.”

1731 – [ 10 ] ( صحيح ) (1/543)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَقُوْلُ اللهُ: مَا لِعَبْدِي الْمُؤْمِنِ عِنْدِيْ جَزَاءٌ إِذَا قَبَضْتُ صَفِيَّهُ مِنْ أَهْلِ الدُّنْيَا ثُمَّ احْتَسَبَهُ إِلَّا الْجَنَّةَ”. رَوَاهُ الْبُخَارِيُّ.

1731. (10) [1/543దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌ ఆదేశం: దాసుని ప్రియమైన దాని ఆత్మను హరించి వేస్తే, దానిపై అతను ఓర్పు సహనాలను పాటించి, ప్రతిఫలాపేక్షతో ఉంటే అతని కోసం స్వర్గం ఉంది.” (బు’ఖారీ)

—–

اَلْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం

1732 – [ 11 ] ( ضعيف ) (1/543)

عَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ قَالَ: لَعَنَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم النَّائِحَةَ وَالْمُسْتَمِعَةَ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

1732. (11) [1/543బలహీనం]

అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స), ”కష్ట సమయాల్లో ఏడ్పులు పెడబొబ్బలు పెట్టే స్త్రీలను, వినే స్త్రీలను శపించారు.” (అబూ దావూద్‌)

1733 – [ 12 ] ( صحيح ) (1/543)

وَعَنْ سَعْدِ بْنِ أَبِيْ وَقَّاصٍ رضي الله عَنْه قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “عَجَبٌ لِّلْمُؤْمِنِ إِن أَصَابَهُ خَيْرٌ حَمِدَ اللهَ وَشَكَرَ وَإِنْ أَصَابَتْهُ مُصِيْبَةٌ حَمِدَ اللهَ وَصَبَرَ. فَالْمُؤْمِنُ يُؤْجَرُ فِيْ كُلِّ أَمْرِهِ حَتَّى فِيْ اللُّقْمَةِ يَرْفَعُهَا إِلَى فِيْ اِمْرَأَتِهِ. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ .

1733. (12) [1/543దృఢం]

స’అద్‌ బిన్‌ అబీ వఖ్ఖా’స్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”విశ్వాసి పరిస్థితి చాలా విచిత్రమైనది. మేలు చేకూరితే అల్లాహ్‌(త)ను స్మరించి కృతజ్ఞతలు తెలుపుకుంటాడు. ఒకవేళ కష్టాలు, ఆపదలు వస్తే, అప్పుడు కూడా అల్లాహ్‌(త)ను స్మరించి, ఓర్పూ సహనాలు పాటిస్తాడు. విశ్వాసి ఏ స్థితిలో ఉన్నా ప్రతిఫలం ఇవ్వబడుతుంది. చివరికి భార్య నోటిలో వేసిన ముద్దకు బదులుగా కూడా అతనికి ప్రతిఫలం లభిస్తుంది.” (బైహఖీ-షు’అబిల్ ఈమాన్)

అంటే మంచి ఉద్దేశ్యంతో భార్యా బిడ్డలను తినిపించినా, త్రాపించినా పుణ్యం లభిస్తుంది.

1734 – [ 13 ] ( ضعيف ) (1/543)

وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا مِنْ مُّؤْمِنٍ إِلَّا وَلَهُ بَابَانِ: بَابٌ يَّصْعَدُ مِنْهُ عَمَلُهُ وَبَابٌ يَنْزِلُ مِنْهُ رِزْقُهُ. فَإِذَا مَاتَ بَكَيَا عَلَيْهِ. فَذَلِكَ قَوْلُهُ تَعَالى: (فَمَا بَكَتْ عَلَيْهِمُ السَّمَاءُ وَالْأَرْضُ-44: 29) رَوَاهُ التِّرْمِذِيز.

1734. (13) [1/543బలహీనం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రతి విశ్వాసి కోసం రెండు ద్వారాలు ఉంటాయి. ఒక ద్వారం గుండా అతని సత్కార్యాలు పైకి వెళతాయి. మరో ద్వారం గుండా అతని ఉపాధి అవతరిస్తుంది. ఆ విశ్వాసి మరణిస్తే ఈ రెండు ద్వారాలు అతనిపై ఏడుస్తాయి. ఖుర్‌ఆన్‌లోని వాక్యం, ”ఫమా బకత్‌ ‘అలైహిమా అస్సమాఉ’ వల్‌ అర్’దు…” — అంటే ‘కాని వారి కొరకు ఆకాశంగానీ, భూమిగానీ విలపించలేదు…[99] (సూ. అద్ దుఖాన్, 44:29). (తిర్మిజి’)

1735 – [ 14 ] ( ضعيف ) (1/544)

وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: مَنْ كَانَ لَهُ فَرَطَانِ مِنْ أُمَّتِىْ أَدْخَلَهُ اللهُ بِهِمَا الْجَنَّةَ”. فَقَالَتْ عَائِشَةُ: فَمَنْ كَانَ لَهُ فَرَطٌ مِّنْ أُمَّتِكَ؟ قَالَ: “وَمَنْ كَانَ لَهُ فَرَطٌّ يَّا مُوَفَّقَةُ”. فَقَالَتْ: فَمَنْ لَّمْ يَكُنْ لَهُ فَرَطٌ مِّنْ أُمَّتِكَ؟ قَالَ: “فَأَنَا فَرَطٌ أُمَّتِيْ لَنْ يُّصَابُوْا بِمِثْلِيْ”.رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ :هَذَا حَدِيْثٌ غَرِيْبٌ

1735. (14) [1/544బలహీనం]

ఇబ్ను ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ‘నా అనుచర సమాజంలో ఒకరి యుక్త వయస్సుకు చేరని ఇద్దరు పిల్లలు మరణించి వారిపట్ల సహనం పాటిస్తే, అల్లాహ్‌ (త) ఆ ఇద్దరి పిల్లల వల్ల, అతన్ని స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు’ అని ప్రవచించారు. అప్పుడు ‘ఆయి’షహ్‌ (ర) ‘ప్రవక్తా! ఒకవేళ ఒక్క బిడ్డ మాత్రమే చనిపోతే’ అని విన్నవించుకున్నారు. దానికి ప్రవక్త (స) మేలు భాగ్యం ప్రసాదించబడింది, ‘ఒక్క బిడ్డ చని పోయినా స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు’ అని అన్నారు. మళ్ళీ ‘ఆయి’షహ్‌ (ర), ఓ ప్రవక్తా! ఒకవేళ ఏ బిడ్డా మరణించకపోతేనో’ అని విన్నవించుకున్నారు. దానికి ప్రవక్త (స) నేనతనికోసం ముందు ఉంటాను. నా లాంటి కష్టంరాదు అని అన్నారు. [100] (తిర్మిజి’)

1736 – [ 15 ] ( ضعيف ) (1/544)

وَعَنْ أَبِيْ مُوْسَى الْأَشْعَرِيِّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا مَاتَ وَلَدُ الْعَبْدِ قَالَ اللهُ تَعَالى لِمَلَائِكَتِهِ: قَبَضْتُمْ وَلَدَ عَبْدِيْ؟ فَيَقُوْلُوْنَ: نَعَمْ. فَيَقُوْلُ: قَبَضْتُمْ ثَمَرَةَ فُؤَادِهِ؟ فَيَقُوْلُوْنَ: نَعَمْ. فَيَقُوْلُ: مَاذَا قَالَ عَبْدِيْ؟ فَيَقُوْلُوْنَ: حَمِدَكَ وَاسْتَرْجَعَ. فَيَقُوْلُ اللهُ: ابْنُوْا لِعَبْدِيْ بَيْتًا فِيْ الْجَنَّةِ وَسَمُّوْهُ بَيْتَ الْحَمْدِ”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ.

1736. (15) [1/544బలహీనం]

అబూ మూసా అష్‌’అరీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”విశ్వాసి బిడ్డ మరణిస్తే, అల్లాహ్‌(త) తన దూతలతో, ”మీరు నా భక్తుని బిడ్డ ఆత్మను లాక్కున్నారా?” అని అడుగుతాడు. దానికి వారు ‘అవును’ అని అంటారు. అప్పుడు అల్లాహ్‌(త) ‘మీరు ఆ దాసుని హృదయపండును త్రెంచు కున్నారు’ అని అంటాడు. దానికి వారు ‘అవును’ అని అంటారు. అప్పుడు అల్లాహ్‌(త) దైవదూతలతో ‘మరి నా భక్తుడు ఏమన్నాడు?’ అని అడుగుతాడు. దానికి వారు, ”అతడు నిన్ను స్తుతించాడు. ఇంకా, ”ఇన్నాలిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజివూన్‌” — ‘మనమంతా అల్లాహ్‌ కోసమే, ఇంకా అల్లాహ్‌(త)వైపే మరలేవాళ్ళం’ అని పలికాడు” అని అంటారు. అప్పుడు అల్లాహ్‌, ”నా ఈ భక్తుని కోసం స్వర్గంలో ఒక భవనం నిర్మించండి. దానికి ‘బైతుల్‌ హమ్ద్‌’ అనే పేరు పెట్టండి” అని ఆదేశిస్తాడు. (అ’హ్మద్‌, తిర్మిజి’)

1737 – [ 16 ] ( ضعيف ) (1/544)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ عَزَّى مُصَابًا فَلَهُ مِثْلُ أَجْرِهِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ. وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ لَا نَعْرِفُهُ مَرْفُوْعًا إِلَّا مِنْ حَدِيْثِ عَلِيِّ بْنِ عَاصِمٍ الرَّاوِيِّ. وَقَالَ: وَرَوَاهُ بَعْضُهُمْ عَنْ مُحَمَّدِ بْنِ سُوْقَةَ بِهَذَا الْإِسْنَادِ مَوْقُوْفًا .

1737. (16) [1/544బలహీనం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరైనా కష్టాల్లో ఉన్నవారిని ఓదార్చితే, కష్టాలకు గురైన వారికి లభించినంత పుణ్యం ఓదార్చే వ్యక్తికి కూడా లభిస్తుంది.” [101] (ఇబ్నె మాజహ్, తిర్మిజి’/ ఏకోల్లేఖనం, సహచరుని ప్రోక్తం)

1738 – [ 17 ] ( ضعيف ) (1/544)

وَعَنْ أَبِيْ بَرْزَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ عَزَّى ثَكْلَى كُسِيَ بُرْدًا فِيْ الْجَنَّةِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ.  

1738. (17) [1/544బలహీనం]

అబూ బుర్‌’జహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”బిడ్డ మరణించి దుఃఖంలో ఉన్న స్త్రీని ఓదార్చే వ్యక్తిని అల్లాహ్‌ (త) స్వర్గంలో ఉత్తమమైన దుస్తులు తొడిగిస్తాడు. (తిర్మిజి’ – ఏకోల్లేఖనం)

1739 – [ 18 ] ( صحيح ) (1/545)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ جَعْفَرٍقَالَ: لَمَّا جَاءَ نَعْيُ جَعْفَرٍ. قَالَ النَّبِيُّ صلى الله عليه و سلم: إِصْنَعُوْا لِآلِ جَعْفَرٍ طَعَامًا فَقَدْ أَتَاهُمْ مَا يَشْغَلُهُمْ. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ .

1739. (18) [1/545దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ జ’అఫర్‌ (ర) కథనం: మా తండ్రి గారి మరణవార్త వచ్చినపుడు, ప్రవక్త (స) ‘జ’అఫర్‌ ఇంటివారి కోసం భోజనం తయారుచేయండి, ఎందు కంటే వారిపై పెద్ద ఆపద వచ్చిపడింది. అది వారిని అన్నం వండటం నుండి ఆపుతుంది’ అని అన్నారు.[102] (తిర్మిజి’, అబూ దావూద్‌, ఇబ్నె మాజహ్)

—–

اَلْفَصْلُ الثَّالِثُ  మూడవ విభాగం

1740 – [ 19 ] ( متفق عليه ) (1/545)

عَنِ الْمُغَيْرَةِ بْنِ شُعْبَةَ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ:”مَنْ نِّيْحَ عَلَيْهِ فَإِنَّهُ يُعَذَّبُ بِمَا نِيْحَ عَلَيْهِ يَوْمَ الْقِيَامَةِ”

1740. (19) [1/545ఏకీభవితం]

ము’గీరహ్ బిన్‌ షు’అబహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా అంటూ ఉండగా నేను విన్నాను, ”ఒకవేళ మృతుడు ఏడ్పులు పెడబొబ్బలు పెట్టమని చెప్పి ఉండి, అతనిపై ఏడ్పులు, పెడబొబ్బలు పెడితే, దానివల్ల అతనికి తీర్పుదినం నాడు శిక్షించడం జరుగుతుంది.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

1741 – [ 20 ] ( متفق عليه ) (1/545)

وَعَنْ عَمْرَةَ بِنْتِ عَبْدِ الرَّحْمنِ أَنَّهَا قَالَتْ: سَمِعْتُ عَائِشَةَ وَذُكِرَ لَهَا أَنَّ عَبْدَ اللهِ بْنَ عُمَرَ يَقُوْلُ: إِنَّ الْمَيِّتَ لَيُعَذَّبُ بِبُكَاءِ الْحَيِّ عَلَيْهِ. تَقُوْلُ: يَغْفِرُ اللهُ لِأَبِيْ عَبْدِ الرَّحْمنِ أَمَا إِنَّهُ لَمْ يَكْذِبْ وَلَكِنَّهُ نَسِيَ أَوْ أَخْطَأَ إِنَّمَا مَرَّ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَلَى يَهُوْدِيَّةٍ يُّبْكَي عَلَيْهَا. فَقَالَ: “إِنَّهُمْ لَيَبْكُوْنَ عَلَيْهَا وَإِنَّهَا لَتُعَذَّبُ فِيْ قَبْرِهَا”.

1741. (20) [1/545ఏకీభవితం]

‘అమ్‌రహ్‌ బిన్‌తె ‘అబ్దుర్ర’హ్మాన్‌ (ర) కథనం: ‘ఆయి’షహ్‌ (ర) ముందు ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) ‘హదీసు’ను అంటే సజీవులు ఏడ్వటం వల్ల మృతున్ని శిక్షించటం జరుగుతుందని అనే విషయాన్ని పేర్కొంటే, ‘ఆయి’షహ్‌ (ర) ”అల్లాహ్‌ ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర)ను క్షమించుగాక! అతను అసత్యం మాత్రం పలకరు. కాని మరచిపోయి ఉంటారు లేదా పొరపాటు జరిగి ఉండవచ్చు. వాస్తవం ఏమిటంటే, ప్రవక్త (స) ఒక యూద స్త్రీ యొక్క సమాధి ప్రక్క నుండి వెళ్ళడం జరిగింది. ఆమెపై ప్రజలు ఏడుస్తున్నారు. అప్పుడు ప్రవక్త (స) వీళ్ళు ఏడుస్తున్నారు. ఆ స్త్రీని సమాధిలో శిక్షించటం జరుగుతోంది,” అని అన్నారని వివరించారు. [103] (బు’ఖారీ, ముస్లిమ్‌)

1742 – [ 21 ] ( متفق عليه ) (1/545)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ أَبِيْ مُلَيْكَةَ قَالَ: تُوُفِّيَتْ بِنْتٌ لِّعُثْمَانَ بْنِ عَفَّانَ بِمَكَّةَ فَجِئْنَا لِنَشْهَدَهَا وَحَضَرَهَا ابْنُ عُمَرَ وَابْنُ عَبَّاسٍ فَإِنِّيْ لِجَالِسٌ بَيْنَهُمَا. فَقَالَ عَبْدُ اللهِ بْنُ عُمَرَ لِعَمْرِو بْنِ عُثْمَانَ وَهُوَ مَوَاجِهُهُ: أَلَا تَنْهَى عَنِ الْبُكَاءِ؟ فَإِنَّ رَسُولَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “إِنَّ الْمَيِّتَ لَيُعَذَّبُ بِبُكَاءِ أَهْلِهِ عَلَيْهِ”. فَقَالَ ابْنُ عَبَّاسٍ: قَدْ كَانَ عُمَرُ يَقُوْلُ بَعْضَ ذَلِكَ. ثُمَّ حَدَّثَ. فَقَالَ: صَدَرْتُ مَعَ عُمَرُ مِنْ مَّكَةَ حَتَّى إِذَا كُنَّا بِالْبَيْدَاءِ فَإِذَا هُوَ بِرَكْبٍ تَحْتَ ظِلِّ سَمُرَةٍ. فَقَالَ: اِذْهَبْ فَانْظُرْ مَنْ هَؤُلَاءِ الرَّكْبُ؟ فَنَظَرْتُ فَإِذَا هُوَ صُهَيْبٌ. قَالَ: فَأَخْبَرْتُهُ. فَقَالَ: ادْعُهُ فَرَجَعْتُ إِلَى صُهَيْبٍ فَقُلْتُ: اِرْتَحِلْ فَالْحَقْ أَمِيْرَ الْمُؤْمِنِيْنَ. فَلَمَّا أَنْ أُصِيْبَ عُمَرُ دَخَلَ صُهَيْبٌ يَبْكِيْ. يَقُوْلُ: وَا أَخَاهُ وَاصَاحِبَاهُ. فَقَالَ عُمَرُ: يَا صُهَيْبُ أَتَبْكِيْ عَلَيَّ. وَقَدْ قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ الْمَيِّتَ لَيُعَذَّبُ بِبَعْضِ بُكَاءِ أَهْلِهِ عَلَيْهِ؟” فَقَالَ ابْنُ عَبَّاسٍ: فَلَمَّا مَاتَ عُمَرُ ذَكَرْتُ ذَلِكَ لِعَائِشَةَ فَقَالَتْ: يَرْحَمُ اللهُ عُمَرَ لَا وَاللهِ مَا حَدَّثَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم أَنَّ الْمَيِّتَ لَيُعَذِّبُ بِبُكَاءِ أَهْلِهِ عَلَيْهِ وَلَكِنْ: إِنَّ اللهَ يَزِيْدُ الْكَافِرَ عَذَابًا بِبُكَاءِ أَهْلِهِ عَلَيْهِ. وَقَالَتْ عَائِشَةُ: حَسْبُكُمْ الْقُرْآنُ: (وَلَا تَزِرُ وَازِرَةٌ وِّزْرَ أُخْرَى-6: 164). قَالَ ابْنُ عَبَّاسٍ عِنْدَ ذَلِكَ: وَاللهِ أَضْحَكَ وَ أَبْكَي. قَالَ ابْنُ أَبِيْ مُلَيْكَةَ: فَمَا قَالَ ابْنُ عُمَرَ شَيْئًا.

1742. (21) [1/545ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ అబీ ములైకహ్ (ర) కథనం: మక్కాహ్ లో ఉస్మాన్బిన్‌ ‘అప్ఫాన్కుమార్తె చని పోయింది. ఆమె జనా’జహ్ లో నేను పాల్గొన్నాను. ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌, ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కూడా పాల్గొన్నారు. నేను వారిద్దరి మధ్య కూర్చుని ఉన్నాను. ఇంటిలో నుండి ఏడ్పుల శబ్దం వచ్చింది. ‘అమ్ర్ బిన్‌ ‘ఉస్మాన్‌ వారి ముందు కూర్చుని ఉన్నారు. ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌, ‘అమ్ర్ బిన్‌ ‘ఉస్మాన్‌తో, నువ్వు నీ బంధువులను ఏడ్వకూడదని వారించవెందుకు? ఎందుకంటే, ప్రవక్త (స) ”మృతుని కుటుంబం వారు ఏడ్వటం వల్ల మృతుణ్ణి శిక్షించటం జరుగుతుందని ప్రవచించారు”  అని అన్నారు. అది విన్న ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) ‘ఉమర్‌ (ర) కూడా ఇలాగే చెప్పేవారని, ఒకసారి నేను ‘హజ్జ్ చేసి ‘ఉమర్‌ (ర) వెంట మక్కహ్ నుండి తిరిగి వస్తుండగా మేము బైదా ప్రాంతానికి చేరుకున్నాము. ‘ఉమర్‌ (ర) ఒక బృందాన్ని చూసారు. జిల్లేడు (కీకర్) చెట్టు క్రింద నిలబడి ఉన్నారు. ‘ఉమర్‌ (ర) నన్ను ఆ బృందంలో ఎవరెవరు ఉన్నారో చూసి రమ్మని పంపారు. నేను వెళ్ళి చూసి వచ్చాను. ‘ఫలానా వ్యక్తులు మరియు సుహైబ్‌ (ర) ఉన్నారని’ అన్నాను. ‘ఉమర్‌ (ర) సుహైబ్‌ను పిలుచుకురమ్మని’ అన్నారు. నేను వెళ్ళి, ‘సుహైబ్‌, నిన్ను ‘ఉమర్‌ (ర) రమ్మంటున్నారు, తమరు ‘ఉమర్‌ (ర) వద్దకు పదండి’ అని అన్నాను. అనంతరం అతను ‘ఉమర్‌ (ర) వద్దకు వచ్చారు. అతను మదీనహ్ వరకు వెంట ఉన్నారు. ‘ఉమర్‌ మరియు సుహైబ్‌ల మధ్య చాలా మంచి స్నేహం ఉండేది. మదీనహ్ చేరిన కొన్ని రోజుల తర్వాత ‘ఉమర్‌ (ర) పై నమా’జు స్థితిలో కత్తితో దాడి జరిగింది. దానివల్ల అతను తీవ్రంగా గాయపడ్డారు. ఈ వార్త అందిన సుహైబ్‌ ఏడుస్తూ ‘ఉమర్‌ (ర) వద్దకు వచ్చారు. సోదరా! సోదరా అని ఏడుస్తూ విలపించ సాగారు. అప్పుడు ‘ఉమర్‌ (ర), సుహైబ్‌! ”నీవు నాపై ఏడుస్తున్నావా? ప్రవక్త (స) మృతుని కుటుంబం వారు ఏడిస్తే మృతుని శిక్షించడం జరుగుతుందని ప్రవచించారు” అని అన్నారు. ‘ఉమర్‌ (ర) మరణం తరువాత ఈ సంఘటన గురించి ‘ఆయి’షహ్‌ (ర) ముందు పేర్కొన్నాను. అప్పుడు ‘ఆయి’షహ్‌ (ర) ”అల్లాహ్‌ ‘ఉమర్‌ను క్షమించుగాక! దైవం సాక్షిగా ప్రవక్త (స) ‘మృతుని కుటుంబం వారు ఏడ్వటం వల్ల మృతుని శిక్షించటం జరుగుతుందని అనలేదు. కాని అల్లాహ్‌ అవిశ్వాసి శిక్షను అధికం చేస్తాడు, అవిశ్వాసి మృతుని కుటుంబంవారు ఏడ్వటం వల్ల’ అని అన్నారు. తర్వాత దాన్ని సమర్థిస్తూ, ఖుర్‌ఆన్‌లోని ఈ వాక్యం చాలు దీన్ని నిరూపించటానికి ”…వలా తజి’రు వాజి’రతన్‌ విజ్ర’ ఉ’ఖ్రా…” — ‘మరియు బరువు మోసేవాడు ఎవ్వడూ ఇతరుల బరువును మోయడు…’ (సూ. అల్ అన్ ఆమ్, 6:164) అని అన్నారు. ఇబ్నె ‘అబ్బాస్‌(ర) అప్పుడు ”అల్లాహ్‌యే ఏడ్పిస్తాడు, నవ్విస్తాడు” అని అన్నారు. ఇబ్నె ములైక ”ఈ సంఘటన విని ఇబ్నె ‘ఉమర్‌ ఏమీ మాట్లాడ లేదు, మౌనంగా ఉన్నారని” అన్నారు. [104] (బు’ఖారీ, ముస్లిమ్)

1743 – [ 22 ] ( متفق عليه ) (1/546)

وَعَنْ عَائِشَةَ قَالَتْ: لَمَّا جَاءَ النَّبِيَّ صلى الله عليه وسلم قَتْلُ ابْنِ حَارِثَةَ وَجَعْفَرٍ وَابْنُ رَوَاحَةَ جَلَسَ يُعْرَفُ فِيْهِ الْحُزْنُ وَأَنَا أَنْظُرُ مِنْ صَائِرِ الْبَابِ تَعْنِيْ شِقَّ الْبَابِ فَأَتَاهُ رَجُلٌ. فَقَالَ: إِنَّ نِسَاءَ جَعْفَرٍ وَّذَكَرَ بُكَاءَهُنَّ فَأَمَرَهُ أَنْ يَّنْهَاهُنَّ فَذَهَبَ ثُمَّ أَتَاهُ الثَّانِيَةَ لَمْ يُطِعْنَهُ. فَقَالَ: انْهَهُنَّ فَأَتَاهُ الثَّالِثَةَ. قَالَ: وَاللهِ غَلَبْنَنَا يَا رَسُوْلَ اللهِ فَزَعَمَتْ أَنَّهُ قَالَ:”فَاحْثُ فِيْ أَفْوَاهِهِنَّ التُّرَابَ”. فَقُلْتُ: أَرْغَمَ اللهُ أَنْفَكَ لَمْ تَفْعَلْ مَا أَمَرَكَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم وَلَمْ تَتْرُكْ رَسُولَ اللهِ صلى الله عليه وسلم مِنَ الْعَنَاءِ. متفق عليه.

1743. (22) [1/546ఏకీభవితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: జైద్ బిన్‌ ‘హారిస’హ్, అఫర్, అబ్దుల్లాహ్ బిన్‌ రవా’హహ్ (ర) వీరమరణం పొందారనే వార్త ప్రవక్త (స)కు అందగానే ప్రవక్త (స) కూర్చుండి పోయారు. ప్రవక్త (స) చాలా విచారానికి గురయ్యారు. నేను తులుపు కన్నంలో నుండి చూస్తున్నాను. ఎందుకంటే ప్రవక్త (స) ఇంటి బయట కూర్చున్నారు. ప్రవక్త (స) వద్దకు ఒక వ్యక్తి వచ్చి, ”జ’అఫర్‌ ఇంటి స్త్రీలు ఏడుస్తున్నారు” అని అన్నాడు. దానికి ప్రవక్త (స) ‘నువ్వు వెళ్ళి వారిని వారించు’ అని అన్నారు. ఆ వ్యక్తి వెళ్ళి వచ్చి ‘వాళ్ళు వినటం లేదు’ అని అన్నాడు. ప్రవక్త (స) ‘మళ్ళీ నువ్వు వెళ్ళి వారిని వారించు’ అని అన్నారు. ఆ వ్యక్తి వెళ్ళి వచ్చి, ‘వాళ్ళు మాట వినటం లేదు’ అని అన్నాడు. మళ్ళీ ప్రవక్త (స) ‘నువ్వు వెళ్ళి వారిని వారించు’ అని అన్నారు. మూడవసారి ఆ వ్యక్తి వచ్చి, ‘అల్లాహ్ సాక్షి! ఓ ప్రవక్తా! ఆమె మమ్మల్ని అధిక మించింది. మేము ఎంత వారించినా వినటం లేదు’ అని అన్నాడు. అప్పుడు ప్రవక్త (స) ‘నువ్వు వెళ్ళి ఆమె నోటిలో మట్టి వేసిరా’ అని అన్నారు. అప్పుడు ఆ వ్యక్తితో నేను ”నీ ముక్కు నేలకు తగలేయ, ప్రవక్త (స) ఆదేశించింది చేయవు, ఇంకా ప్రవక్త (స)ను బాధ పెట్టటం వదలవు, ఎందుకంటే మాటి మాటికీ చెప్పడం వల్ల ప్రవక్త (స)కు బాధ కలుగుతుంది” అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

1744 – [ 23 ] ( صحيح ) (1/547)

وَعَنْ أُمِّ سَلَمَةَ قَالَتْ: لَمَّا مَاتَ أَبُوْ سَلَمَةَ قُلْتُ غَرِيْبٌ وَفِيْ أَرْضِ غُرْبَةٍ لَّأَبْكِيَنَّهُ بُكَاءُ يُّتَحَدَّثَ عَنْهُ فَكُنْتُ قَدْ تَهَيَّأْتْ لِلْبُكَاءِ عَلَيْهِ إِذْ أَقْبَلَتِ امْرَأَةً تُرِيْدُ أَنْ تُسْعِدَنِيْ فَاسْتَقْبَلَهَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فَقَالَ: “أَتُرِيْدِيْنَ أَنْ تَدْخُلِيْ الشَّيْطَانَ بَيْتًا أَخْرَجَهُ اللهُ مِنْهُ؟” مَرَّتَيْنِ وَكَفَفْتُ عَنِ الْبُكَاءِ فَلَمْ أَبْكِ. رَوَاهُ مُسْلِمٌ.

1744. (23) [1/547దృఢం]

ఉమ్మె సలమహ్‌ (ర) కథనం: నా భర్త – అబూ సలమహ్  మరణించినపుడు, (అబూ సలమహ్ పర దేశంలో మరణించారు) – నేను తప్ప అతనికి బంధువు లెవరూ లేరు. అందువల్ల ‘నేనతనిపై ఎంత గొప్పగా ఏడుస్తానంటే ప్రజలు చెప్పుకుంటూ ఉండాలి’ అని అనుకున్నాను. నేను దానికి సిద్ధమవుతుండగా, ఒక స్త్రీ నాతో పాటు ఏడ్వటానికి, నా దుఃఖం దూరం చేయటానికి వచ్చింది. ప్రవక్త (స) కూడా ఆమె వెనుకే వచ్చారు. మేము ఏడ్వటానికి సిద్ధమవుతున్నామని ప్రవక్త (స) గ్రహించారు. అప్పుడు ప్రవక్త (స) ‘నువ్వు నీ ఇంట్లో షై’తాన్‌ను ప్రవేశింపజేసుకో గోరుతున్నావా? వాడిని అల్లాహ్‌(త) ఈ ఇంటి నుండి రెండు సార్లు తీసివేశాడు’ అని అన్నారు. మరి నేను నిర్ణయం మార్చుకున్నాను. ఏడ్వలేదు.” [105] (ముస్లిమ్‌)

1745 – [ 24 ] ( صحيح ) (1/547)

وَعَنِ النُّعْمَانِ بْنِ بَشِيْرٍ قَالَ: أُغْمِيَ عَلَى عَبْدِ اللهِ بْنِ رَوَاحَةَ فَجَعَلَتْ أُخْتُهُ عَمْرَةَ تَبْكِيْ: وَاجَبَلَاهُ وَاكَذَا وَاكَذَا تُعَدِّدُ عَلَيْهِ. فَقَالَ حِيْنَ أَفَاقَ: مَا قُلْتِ شَيْئًا إِلَّا قِيْلَ لِيْ: أَنْتَ كَذَلِكَ؟ زَادَ فِيْ رِوَايَةٍ فَلَمَّا مَاتَ لَمْ تَبْكِ عَلَيْهِ. رَوَاهُ الْبُخَارِيُّ.

1745. (24) [1/547దృఢం]

ను’అమాన్‌ బిన్‌ బషీర్‌ (ర) కథనం: ఒకసారి ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ రవా’హహ్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అందులో ఆయన స్పృహ కోల్పో యారు. కుటుంబం వారు మరణ సమయం దగ్గర పడిందని అనుకున్నారు. అతని సోదరి ‘అమ్ర (ర) ఏడ్వసాగింది. ఇలాగా, అలాగా అని అతన్ని పొగడ సాగింది. ‘అబ్దుల్లాహ్‌కు స్పృహ రాగానే, అతను తన సోదరితో, ‘నీవు ఏడుస్తున్న మైకంలో నా గురించి నీవు చెప్పిందానికి, నీవు అలాంటి వాడివేనా, నీవు అలాంటి వాడివేనా అని అనటం జరిగిందని,’ అన్నారు. మరో ఉల్లేఖనంలో అతను మరణించి నపుడు అతని సోదరి అతనిపై ఏడ్పులు పెడ బొబ్బలు పెట్టలేదని ఉంది. [106] (బు’ఖారీ)

1746 – [ 25 ] ( حسن ) (1/547)

وَعَنْ أَبِيْ مُوْسَى قَالَ: سَمِعْتُ رَسُوْلَ الله صلى الله عليه وسلم يَقُوْلُ: “مَا مِنْ مَّيِّتٍ يَّمُوْتُ فَيَقُوْمُ بَاكِيْهِمْ فَيَقُوْلُ: وَاجَبَلَاهُ وَاسَيِّدَاهُ وَنَحْوَ ذَلِكَ إِلَّا وَكَّلَ اللهُ بِهِ مَلَكَيْنِ يَلْهَزَانِهِ وَيَقُوْلَانِ: أَهَكَذَا كُنْتَ؟” رَوَاهُ التِّرْمِذِيُّ  وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ حَسَنٌ.

1746. (25) [1/547ప్రామాణికం]

అబూ మూసా అష్‌’అరీ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”ఎవరైనా మర ణించి, అతని బంధువులు నువ్వు అలాంటివాడివి, ఇలాంటివాడికి అని ఏడ్పులు పెడబొబ్బలు పెడితే, అల్లాహ్‌ ఆ మృతునిపై ఇద్దరు దైవదూతలను నియ మిస్తాడు. ఆ ఇద్దరు దైవదూతలు అతన్ని గుండెపై కొడుతూ నువ్వు అలాంటివాడివా? అని అంటూ ఉంటారు. [107] (తిర్మిజి’ / ఏకోల్లేఖనం, ప్రామాణికం)

1747 – [ 26 ] ( ضعيف ) (1/547)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: مَاتَ مَيِّتٌ مِنْ آلِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَاجْتَمَعَ النِّسَاءُ يَبْكِيْنَ عَلَيْهِ. فَقَامَ عُمَرُ يَنْهَاهُنَّ وَيَطْرُدُهُنَّ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “دَعْهُنَّ فَإِنَّ الْعَيْنَ دَامِعَةٌ وَّالْقَلْبُ مُصَابٌ وَالْعَهْدُ قَرِيْبٌ”. رَوَاهُ أَحْمَدُ وَالنَّسَائِيُّ .

1747. (26) [1/547బలహీనం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) కుటుంబం లో ఒకరు మరణించారు. ఆ కుటుంబానికి చెందిన స్త్రీలు ఒకచోట చేరి ఏడ్వసాగారు. ‘ఉమర్‌ (ర) వారిని వారించారు, హెచ్చరించారు. అప్పుడు ప్రవక్త (స), ఓ ‘ఉమర్! వారిని ఉన్న స్థితిలో వదలివేయి, ఎందు కంటే, కళ్ళు ఏడుస్తాయి, హృదయం దుఃఖంతో నిండి ఉంది. మరణం కూడా సమీపంలోనే ఉంది. (అ’హ్మద్‌, నసాయి’)

1748 – [ 27 ] ( ضعيف ) (1/548)

وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: مَاتَتْ زَيْنَبُ بِنْتُ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَبَكَتِ النِّسَاءُ. فَجَعَلَ عُمَرَ يَضْرِبُهُنَّ بِسَوْطِهِ فَأَخَّرَهُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم بَيَدِهِ وَقَالَ: “مَهْلًا يَا عُمَرُ” .ثُمَّ قَالَ: “إِيَّاكُنَّ وَنَعِيْقُ الشَّيْطَانِ”. ثُمَّ قَالَ: “إِنَّهُ مَهْمَا كَانَ مِنَ الْعَيْنِ وَمِنْ الْقَلْبِ فَمِنَ اللهِ عَزَّ وَجَلَّ وَمِنَ الرَّحْمَةِ وَمَا كَانَ مِنَ الْيَدِ وَمِنَ اللِّسَانِ فَمِنَ الشَّيْطَانِ”. رَوَاهُ أَحْمَدُ .

1748. (27) [1/548బలహీనం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) కుమార్తె ‘జైనబ్‌ మరణించారు. స్త్రీలు ఏడ్వటానికి ఒకచోట చేరారు. ‘ఉమర్‌ (ర) వారిని కొరడాతో కొట్టటం ప్రారం భించారు. ప్రవక్త(స) ‘ఉమర్‌(ర)ను తన చేతితో ఆపారు. ఇంకా, ”ఓ ఉమర్‌! స్త్రీల పట్ల సున్నితంగా ప్రవర్తించు” అని చెప్పి, స్త్రీలతో స్త్రీలారా! మీరు షై’తాను శబ్దం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి అంటే, కేకలువేస్తూ ఏడ్వకండి, ఏడ్వాలని ఉంటే కళ్ళతో, హృదయంతో ఏడ్వండి అంటే కన్నీళ్ళు కార్చాలి, హృదయం దుఃఖంతో నిండి ఉండాలి. ఇది అల్లాహ్ ప్రసాదించిన కారుణ్యం. ఇంకా చేతులతో, నోటితో అంటే చేతులతో ముఖంపై కొట్టుకోవటం, బట్టలు చించుకోవటం, జుట్టు పీక్కోవటం, కేకలు వేయటం, పెడబొబ్బలు పెట్టటం షై’తాన్‌ పనులు.” అని అన్నారు. (అ’హ్మద్‌)

1749 – [ 28 ] ( لم تتم دراسته ) (1/548)

وَعَنِ الْبُخَارِيِّ تَعْلِيْقًا قَالَ: لَمَّا مَاتَ الْحَسَنُ بْنُ الْحَسَنِ بْنِ عَلِيٍّ ضَرَبَتِ امْرَأَتُهُ الْقُبَّةَ عَلَى قَبْرِهِ سَنَةً ثُمَّ رَفَعَتْ فَسَمِعَتْ صَائِحًا يَقُوْلُ: أَلَا هَلْ وَجَدُوْا مَا فَقَدُوْا؟ فَأَجَابَهُ آخَرُ: بَلْ يَئِسُوْا فَانْقَلَبُوْا.

1749. (28) [1/548అపరిశోధితం]

బు’ఖారీ తన పుస్తకంలో ఈ ‘హదీసు’ను ప్రామాణిక వివరాలు లేకుండా పేర్కొన్నారు. ‘హసన్‌ బిన్‌ ‘హసన్‌ బిన్‌ ‘అలీ (ర) మరణించినపుడు, అతని భార్య సమాధి పై సంవత్సరం వరకు టెంట్‌ వేసి ఉంచింది. సంవత్సరం పూర్తయిన తర్వాత టెంట్‌ తీసి వేయించింది. టెంట్‌ తొలగించిన తర్వాత ఆకాశం నుండి, ”వినండి, పోగొట్టు కున్నదంతా దొరికిందా?” అని ప్రశ్నించటం జరిగింది. మళ్ళీ ఆకాశవాణి ద్వారానే, ”లేదు, నిరాశచెంది తిరిగి వెళుతున్నారు” అని శబ్దం వచ్చింది. [108]

1750 – [ 29 ] ( ضعيف جدا ) (1/548)

وَعَنْ عِمْرَانَ بْنِ حُصَيْنٍ وَأَبِيْ بَرْزَةَ قَالَا: خَرَجْنَا مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فِيْ جَنَازَةٍ فَرَأَى قَوْمًا قَدْ طَرَحُوْا أَرْدِيَتَهُمْ يَمْشُوْنَ فِيْ قُمُصٍ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَبِفِعْلِ الْجَاهِلَيَّةِ تَأْخُذُوْنَ؟ أَوْ بِصَنِيْعِ الْجَاهِلِيَّةِ تُشَبِّهُوْنَ؟ لَقَدْ هَمَمْتُ أَنْ أَدْعُوْ عَلَيْكُمْ دَعْوَةً تَرْجِعُوْنَ فِيْ غَيْرِ صُوَرِكُمْ”. قَالَ: فَأَخَذُوْا أَرْدِيَتَهُمْ وَلَمْ يَعُوْدُوْا لِذَلِكَ. رَوَاهُ ابْنُ مَاجَهُ.

1750. (29) [1/548అతి బలహీనం]

‘ఇమ్రాన్‌ బిన్‌ హు’సైన్‌ (ర) మరియు అబూ బర్‌ ‘జహ్ (ర) కథనం: మేమిద్దరం ప్రవక్త (స) వెంట ఒక జనాజాలో వెళ్ళాము. ప్రవక్త(స) కొంతమందిని చూశారు. వాళ్ళు తమ దుప్పట్లను పారవేశారు. కేవ లం చొక్కా ధరించి నడుస్తున్నారు. అది చూచి ప్రవక్త (స) అజ్ఞాన కాలంలా ఆచరిస్తున్నారా? లేదా అంధ కార యుగంలా అమలు చేస్తున్నారా’ అని అన్నారు. ఈ మీ చేష్టల వల్ల మీ రూపాలు మారి ఇంటికి తిరిగివెళ్ళేలా శపిద్దామని అనుకున్నాను. ప్రవక్త (స) మాటలు వినగానే వారు తమ దుప్పట్లను తీసుకొని, మళ్ళీ అలా చేయలేదు. [109] (ఇబ్నె మాజహ్)

1751 – [ 30 ] ( ضعيف ) (1/548)

وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: نَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم أَنْ تُتَّبَعَ جَنَازَةٌ مَعَهَا رَانَّةٌ. رَوَاهُ أَحْمَدُ وَابْنُ مَاجَهُ.

1751. (30) [1/548బలహీనం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ”ఏడ్పులు, పెడబొబ్బలు పెట్టే స్త్రీ వెంట ఉన్న జనా’జహ్ వెంట వెళ్ళరాదని వారించారు.” [110](అ’హ్మద్‌, ఇబ్నె మాజహ్)

1752 – [ 31 ] ( صحيح ) (1/549)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّ رَجُلًا قَالَ لَهُ: مَاتَ ابْنٌ لِّيْ فَوَجَدْتُّ عَلَيْهِ هَلْ سَمِعْتُ مِنْ خَلِيْلِكَ صَلَواتُ اللهِ عَلَيْهِ شَيْئًا يَطِيْبُ بِأَنْفُسِنَا عَنْ مَوْتَانَا؟ قَالَ: نَعَمْ. سَمِعْتُهُ صلى الله عليه وسلم قَالَ: “صِغَارُهُمْ دَعَامِيْصُ الْجَنَّةِ يَلْقَى أَحَدُهُمْ أَبَاهُ فَيَأْخُذُ بِنَاحِيَةِ ثَوْبِهِ فَلَا يُفَارِقُهُ حَتَّى يُدْخِلَهُ الْجَنَّةَ”. رَوَاهُ مُسْلِمٌ وَأَحْمَدُ وَاللَّفْظُ لَهُ.

1752. (31) [1/549-దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: అతనితో ఒకవ్యక్తి ‘నా చిన్న కొడుకు మరణించాడు, దానివల్ల నేను చాలా దుఃఖం, విచారాలకు గురయ్యాను, మీరు మీ మిత్రులు ప్రవక్త (స) నుండి సంతోషం కలిగించే, సంతృప్తి కలిగించే ‘హదీసు’ ఏదైనా విని ఉన్నారా?’ అని అడిగాడు. దానికి సమాధానంగా అబూ హురైరహ్‌ మాట్లాడుతూ ”అవును, నేను ప్రవక్త (స) ను ఇలా అంటూ ఉండగా విన్నాను, ‘బాల్యంలో మరణించే పిల్లలు స్వర్గంలో తిరుగుతూ ఉంటారు. వారిలో ఎవరైనా తన తండ్రిని కలిస్తే, తన తండ్రి చొక్కా మూల పట్టుకుంటాడు, ఎంత మాత్రం వదలడు, చివరికి తన తండ్రిని స్వర్గంలోకి ప్రవేశింప జేస్తాడు.’ ” [111](ముస్లిమ్‌, అ’హ్మద్‌,)

1753 – [ 32 ] ( صحيح ) (1/549)

وَعَنْ أَبِيْ سَعِيْدٍ قَالَ: جَاءَتِ امْرَأَةٌ إِلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَقَالَتْ: يَا رَسُوْلَ اللهِ ذَهَبَ الرِّجَالُ بِحَدِيْثِكَ فَاجْعَلْ لَنَا مِنْ نَّفْسِكَ يَوْمًا نَّأْتِيْكَ فِيْهِ تُعَلِّمُنَا مِمَّا عَلَّمَكَ اللهُ. فَقَالَ: “اجْتَمِعْنَ فِيْ يَوْمٍ كَذَا وَكَذَا فِيْ مَكَانٍ كَذَا وَكَذَا”. فَاجْتَمَعْنَ فَأَتَا هُنَّ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فَعَلَّمَهُنَّ مِمَّا عَلَّمَهُ اللهُ ثُمَّ قَالَ: “مَا مِنْكُنَّ امْرَأَةٌ تقَدِّمْ بَيْنَ يَدَيْهَا مِنْ وَّلَدِهَا ثَلَاثَةً إِلَّا كَانَ لَهَا حِجَابًا مِّنَ النَّارِ”. فَقَالَتِ امْرَأَةٌ مِّنْهُنَّ: يَا رَسُوْلَ اللهِ أَوِ اثْنَيْنِ؟ فَأَعَادَتْهَا مَرَّتَيْنِ. ثُمَّ قَالَ: “وَاثْنَيْنِ وَاثْنَيْنِ وَاثْنَيْنِ”. رَوَاهُ الْبُخَارِيُّ.

1753. (32) [1/549-దృఢం]

అబూ స’యీద్‌ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు ఒక స్త్రీ వచ్చి, ఓ ప్రవక్తా! తమరి ‘హదీసు’లను పురుషులే పొందుతున్నారు. పురుషులే లాభం పొందు తున్నారు. తమరు మా గురించి కూడా ఏదో ఒక రోజు ప్రత్యేకించితే, మేము కూడా తమరి వద్దకు వచ్చి, అల్లాహ్‌ తమరికి నేర్పిన విషయాలు మేము నేర్చుకుంటాము. దానికి ప్రవక్త (స) ‘మీరు ఫలానా రోజు, ఫలానా సమయం అందరూ చేరండి’ అని ఆదేశించారు. అనంతరం నిర్ణీత సమయం, ప్రదేశానికి అందరూ చేరుకున్నారు. ప్రవక్త (స) అక్కడకు వెళ్ళి హితబోధ చేశారు. అల్లాహ్‌ (త) ఆదేశించిన వాటిని వారికి బోధించారు. ఇంకా ‘మీలో తాను మరణించ టానికి ముందు తన ముగ్గురి బిడ్డలను పంపించిన వారు అంటే,  ఆమె ముగ్గురు బిడ్డలు మరణిస్తే, ఆ బిడ్డలు ఆమెకు నరకానికి అడ్డుతెరగా ఉంటారు. అంటే ఆమెను నరకం నుండి రక్షించు కుంటారు’ అని అన్నారు. వారిలో ఒక స్త్రీ ‘ఓ ప్రవక్తా! ఒకవేళ ఇద్దరే మరణించి ఉంటే’ అని రెండుసార్లు పలికింది. దానికి ప్రవక్త (స) ‘రెండు, రెండు, రెండు, అంటే ఇద్దరు మరణించినా అలాగే జరుగుతుంది’ అని అన్నారు. (బు’ఖారీ)

1754 – [ 33 ] ( ضعيف ) (1/549)

وَعَنْ مُعَاذِ بْنِ جَبَلٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا مِن مُّسْلِمَيْنِ يُتَوَفّى لَهُمَا ثَلَاثَةٌ إِلَّا أَدْخَلَهُمَا اللهُ الْجَنَّةَ بِفَضْلِ رَحْمَتِهِ إِيَّاهُمَا”. فَقَالُوْا: يَا رَسُوْلَ اللهِ أَوِ اثْنَانِ؟ قَالَ: “أَوِاثْنَان”. قَالُوْا أَوْ وَاحِدٌ؟ قَالَ:  أَوْ وَاحِدٌ”. ثُمَّ قَالَ: “وَالَّذِيْ نَفْسِيْ بِيَدِهِ إِنَّ السِّقْطَ لَيَجُرُّ أُمَّهُ بِسَرَرِهِ إِلَى الْجَنَّةِ إِذَا احْتَسَبَتْهُ”. رَوَاهُ أَحْمَدُ وَرَوَى ابْنُ مَاجَهُ مِنْ قَوْلِهِ: “وَالَّذِيْ نَفْسِيْ بِيَدِهِ”.

1754. (33) [1/549బలహీనం]

ము’ఆజ్‌’ బిన్‌ జబల్‌ (ర) కథనం: ప్రవక్త (స) ”ఇద్దరు ముస్లిముల (భార్యా-భర్తల) ముగ్గురు పిల్లలు మరణిస్తే, అల్లాహ్‌(త) తన ప్రత్యేక కారుణ్యంతో వారిద్దరినీ స్వర్గంలో పంపిస్తాడు” అని అన్నారు. దానికి అనుచరులు ‘కేవలం ఇద్దరు పిల్లలు మరణిస్తే ఏం లభిస్తుంది’ అని విన్నవించుకున్నారు. దానికి ప్రవక్త(స) ‘ఇద్దరు పిల్లలు మరణించినా ఇదే జరుగుతుంది’ అని అన్నారు. మళ్ళీ అనుచరులు ‘ఒకవేళ ఒకే బిడ్డ మరణిస్తే’ అని విన్నవించు కున్నారు. ‘ఒక్కబిడ్డ మరణించినా ఇదే జరుగు తుంది’ అని అన్నారు. తరువాత ప్రవక్త (స), ‘ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో ఆయన సాక్షి! అసంపూర్ణంగా జన్మించిన బిడ్డ తన తల్లిని ప్రేగుతో తన తల్లిని లాక్కొని స్వర్గంలోకి తీసుకొని వెళతాడు. అయితే తల్లి ఓర్పు సహనాలు, ప్రతిఫలాపేక్ష కలిగి ఉండాలి’ అని అన్నారు. [112](అ’హ్మద్‌, ఇబ్నె మాజహ్)

1755 – [ 34 ] ( ضعيف ) (1/550)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ قَدَّمَ ثَلَاثَةً مِّنَ الْوَلَدِ لَمْ يَبْلُغُوْا الْحِنْثَ: كَانُوْا لَهُ حِصْنًا حَصِيْنًا مِّنَ النَّارِ”. فَقَالَ أَبُوْ ذَرٍّ: قَدَّمْتُ اثْنَيْنِ. قَالَ: “وَاثْنَيْنِ”. قَالَ أُبَيُّ بْنُ كَعْبٍ أَبُوْ الْمُنْذِرِ سَيِّدُ الْقُرَّاءِ: قَدَّمْتُ وَاحِدً . قَالَ: “وَوَاحِدً”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ. وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ .

1755. (34) [1/549బలహీనం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తనకంటే ముందు యుక్త వయస్సుకు చేరని తన ముగ్గురు పిల్లల్ని పంపిన వ్యక్తి అంటే యుక్తవయస్సుకు చేరక ముందు మరణించి ఉంటే, వారు అతన్ని నరకాగ్ని నుండి రక్షణగా ఉంటారు. అంటే ఆ వ్యక్తి నరకంలో ప్రవేశించడు. అది విని అబూ జ’ర్‌ (ర) ‘నేను నా కంటే ముందు ఇద్దరు పిల్లల్ని పంపి ఉన్నాను’ అని అన్నారు. దానికి ప్రవక్త (స) ‘ఇద్దరు పిల్లల గురించి కూడా ఇదే వర్తిస్తుంది’ అని అన్నారు. వెంటనే ఖారీల నాయకులు ఉబయ్‌ బిన్‌ క’అబ్‌, (ర)  ‘ఓ ప్రవక్తా! నేను ఒక బిడ్డను ముందు పంపించాను’ అని అన్నారు. దానికి ప్రవక్త (స) ఒక బిడ్డను పంపినా ఈ శుభవార్తే వర్తిస్తుంది’ అని అన్నారు. (ఇబ్నె మాజహ్, తిర్మిజి’ / ఏకోల్లేఖనం)

1756 – [ 35 ] ( صحيح ) (1/550)

وَعَنْ قُرَّةَ الْمُزَنِيِّ: أَنَّ رَجُلًا كَانَ يَأْتِي النَّبِيَّ صلى الله عليه وسلم وَمَعَهُ ابْنُ لَهُ . فَقَالَ لَهُ النَّبِيُّ صلى الله عليه وسلم: “أَتُحِبُّهُ؟” فَقَالَ: يَا رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم أَحَبَّكَ اللهُ كَمَا أَحِبُّهُ . فَفَقَدَهُ النَّبِيُّ صلى الله عليه وسلم فَقَالَ: “مَا فَعَلَ ابْنُ فُلَانٍ؟” قَالُوْا : يَا رَسُوْلَ اللهِ مَاتَ.فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: ” أَمَا تُحِبُّ أَلَّا تَأْتِيَ بَابًا مِّنْ أَبْوَابِ الْجَنَّةِ إِلَّا وَجَدْتَّهُ يَنْتَظِرُكَ؟” فَقَالَ رَجُلٌ : يَا رَسُوْلَ اللهِ لَهُ خَاصَّةً أمْ لِكُلِّنَا ؟ قَالَ: “بَلْ لِكُلِكُم”.  رَوَاهُ أَحْمَدُ .

1756. (35) [1/550దృఢం]

ఖుర్రహ్ ము’జునీ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు ఒక వ్యక్తి వచ్చేవారు. అతని వెంట అతని కుమారుడు కూడా వచ్చేవాడు. ఒకసారి ప్రవక్త (స) ‘వచ్చిన ప్రతి సారి ఈ అబ్బాయిని తీసుకు వస్తావు, వీడిని అంతగా ప్రేమిస్తున్నావా?’ అని అడిగారు. దానికి ఆ వ్యక్తి, ‘నేనీ పిల్లవాడిని ప్రేమించినట్లు అల్లాహ్‌ మిమ్మల్ని ప్రేమించు గాక!’ అని అన్నాడు. కొన్నిరోజుల తర్వాత ఆ అబ్బాయి కనబడలేదు. ప్రవక్త (స) ప్రజల్ని ‘ఆ అబ్బాయి కనబడటం లేదు’ అని అన్నారు. దానికి వారు, ‘ఓ ప్రవక్తా! ఆ అబ్బాయి మరణించాడు’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స) ఆ  అబ్బాయి తండ్రితో, ”నీవు స్వర్గద్వారం వద్దకు వెళ్ళినపుడు నీ బిడ్డ అక్కడ నీ గురించి వేచి ఉండటం నీకు ఇష్టం లేదా? అంటే నీ బిడ్డ నిన్ను స్వర్గంలోకి తీసుకొని వెళతాడు” అని అన్నారు. అది విని ఒక వ్యక్తి, ప్రవక్తా! ఈ ఆదేశం కేవలం ఇతని కొరకేనా లేదా అందరికీ వర్తిస్తుందా? అని విన్నవించుకున్నాడు. దానికి ప్రవక్త (స) సమాధానం ఇస్తూ ‘ఇది అందరికీ వర్తిస్తుంది’ అని అన్నారు. (అ’హ్మద్‌)

1757 – [ 36 ] ( ضعيف ) (1/550)

وَعَنْ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ السِّقْطَ لَيُرَاغِمُ رَبَّهُ إِذَا أَدْخَلَ أَبَوَيْهِ النَّارَ فَيُقَالُ: أَيُّهَا السِّقْطُ الْمُرَاغِمُ رَبَّهُ أَدْخِلْ أَبَوَيْكَ الْجَنَّةَ فَيَجُرُّهُمَا بِسَرَرِهِ حَتَّى يُدْخِلَهُمَا الْجَنَّةَ”. رَوَاهُ ابْنُ مَاجَهُ.

1757. (36) [1/550బలహీనం]

‘అలీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అసం పూర్ణంగా జన్మించిన బిడ్డ తన ప్రభువుతో చర్చిస్తాడు. అప్పటికి అతని తల్లిదండ్రులను నరకంలో పంపబడి ఉంటుంది. అప్పుడు ”చర్చించే బిడ్డలు తమ తల్లి-దండ్రులను స్వర్గంలో ప్రవేశింపజేయాలి అని ప్రకటించడం జరుగుతుంది. అప్పుడు ఆ బిడ్డ తన ప్రేగుల ద్వారా తల్లి-దండ్రులను లాగి స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు.” (ఇబ్నె మాజహ్)

1758 – [ 37 ] ( حسن ) (1/550)

وَعَنْ أَبِيْ أُمَامَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “يَقُوْلُ اللهُ تَبَارَكَ وَتَعَالى: “ابْنَ آدَمَ إِنْ صَبَرْتَ وَاحْتَسَبْتَ عِنْدَ الصَّدْمَةِ الْأُوْلَى لَمْ أَرْضَ لَكَ ثَوْابًا دُوْنَ الْجَنَّةِ”. رَوَاهُ ابْنُ مَاجَهُ .

1758. (37) [1/550ప్రామాణికం]

అబూ ఉమామహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, అల్లాహ్‌ ఆదేశం, ”ఓ మానవుడా! ఆపద వచ్చిన వెంటనే ఓర్పూ సహనాలు వహించి, ప్రతిఫలాపేక్ష కలిగి ఉంటే, దానికి బదులుగా నేను నిన్ను స్వర్గంలోకి పంపిస్తాను.”. (ఇబ్నె మాజహ్)

1759 – [ 38 ] ( ضعيف ) (1/551)

وَعَنْ الْحُسَيْنِ بْنِ عَلِيٍّ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “مَا مِنْ مُّسْلِمٍ وَلَا مُسْلِمَةٍ يُّصَابُ بِمُصِيْبَةٍ فَيَذْكُرُهَا وَإِنْ طَالَ عَهْدُهَا فَيُحْدِثُ لَذَلِكَ اسْتِرْجَاعًا إِلَّا جَدَّدَ اللهُ تَبَارَكَ وَتَعَالى لَهُ عِنْدَ ذَلِكَ فَأَعْطَاهُ مِثْلَ أَجْرِهَا يَوْمَ أُصِيْبَ بِهَا”. رَوَاهُ اَحْمَدُ وَالْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ .

1759. (38) [1/551బలహీనం]

‘హుసైన్‌ బిన్‌ ‘అలీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ముస్లిమ్‌ పురుషునికి లేదా స్త్రీకి ఏదైనా ఆపద వస్తే, కొంతకాలం తరువాత దాన్ని గుర్తుకుతెచ్చుకొని ‘ఇన్నాలిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజి’వూన్‌’ అని పలికితే, అల్లాహ్‌ అతనికి ఆపద వచ్చిన వెంటనే ఇచ్చినంత పుణ్యం ప్రసాదిస్తాడు.” (అ’హ్మద్‌, బైహఖీ-షు’అబిల్ ఈమాన్)

1760 – [ 39 ] ( ضعيف ) (1/551)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا انْقَطَعَ شِسْعُ أَحَدِكُمْ فَلْيَسْتَرْجِعْ فَإِنَّهُ مِنَ الْمَصَائِبِ” .رَوَاهُ الْبَيْهَقِيْ فِيْ شُعِبِ الْإِيْمَانِ .

1760. (39) [1/551బలహీనం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీలో ఎవరి చెప్పుపట్లీ అయినా తెగిపోతే, వెంటనే ‘ఇన్నా లిల్లాహి వఇన్నా ఇలైహి రాజి’ఊన్‌’ అని పలకాలి. ఎందుకంటే చెప్పు పట్టీ తెగిపోవటం కూడా ఒక ఆపదే.” [113](బైహఖీ-షు’అబిల్ ఈమాన్)

1761 – [ 40 ] ( ضعيف ) (1/551)

وَعَنْ أُمِّ الدَّرْدَاءِ قَالَتْ: سَمِعْتُ أَبَا الدَّرْدَاءِ يَقُوْلُ: سَمِعْتُ أَبَا الْقَاسِمِ صلى الله عليه وسلم يَقُوْلُ: “إِنَّ اللهَ تَبَارَكَ وَتَعَالى قَالَ: يَا عِيْسَى إِنِّيْ بَاعِثٌ مِّنْ بَعْدِكَ أُمَّةُ إِذَا أَصَابَهُمْ مَا يُحِبُّوْنَ حَمِدُوْا اللهَ وَإِنْ أَصَابَهُمْ مَا يَكْرَهُوْنَ احْتَسَبُوْا وَصَبَرُوْا وَلَا حِلْمَ وَلَا عَقْلَ. فَقَالَ: يَا رَبِّ كَيْفَ يَكُوْنَ هَذَا لَهُم وَلَا حِلْمَ وَلَا عَقْلَ؟ قَالَ: أُعْطِيْهِمْ مِنْ حِلْمِيْ وَعِلْمِيْ”. رَوَاهُمَا الْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ.

1761. (40) [1/551బలహీనం]

ఉమ్ము దర్‌దా (ర) కథనం: నేను నా భర్త అబూ దర్‌దా ద్వారా విన్నాను, ”నేను ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా విన్నాను, అల్లాహ్(త) ‘ఈసా (అ)తో ‘ఓ ‘ఈసా! నీ తరువాత నేనొక సమాజం సృష్టిస్తాను. వారికి ప్రియమైన వస్తువు లభిస్తే దైవానికి కృతజ్ఞతలు తెలుపుకుంటుంది. ఇంకా వారికేదైనా బాధ కలిగితే, దానిపై సహనం పాటిస్తుంది, పుణ్య ఫలా పేక్షతో ఉంటుంది. ఆపదలకు గురై బుద్ధీ- వివేకాలను కోల్పోదు. అంటే కష్టాలకు గురైనా బుద్ధీ-వివేకాలతో ప్రవర్తిస్తుంది” అని అన్నాడు. దానికి ‘ఈసా (అ) ‘అదెలా?’ అని అడగ్గా అల్లాహ్‌, ‘నేను వారికి నా బుద్ధీ-జ్ఞానాలను ప్రసాదిస్తాను’ అని ఆదేశించాడు. (బైహఖీ-షు’అబిల్ ఈమాన్)

=====

8- بَابُ زِيَارَةِ الْقُبُوْرِ

8. సమాధుల సందర్శనం

‘హదీసు’వేత్త ముబారక్‌ పూరీ తన ప్రఖ్యాత పుస్తకం కితాబుల్‌ జనాయిజ్‌లో ”సమాధులను సందర్శిం చటం ప్రవక్త (స) సాంప్రదాయం అని, స్త్రీలకు కొన్ని ‘హదీసు’ల ద్వారా ధర్మసమ్మతమని, మరి కొన్ని ‘హదీసు’ల ద్వారా అధర్మం’ అని పేర్కొన్నారు.

సమాధుల సందర్శన మృతుల కోసం, వారి క్షమాపణ కోసం ప్రార్థించటానికి, సమాధులను చూసి, గుణపాఠం నేర్చుకోవాలని, తన మరణం మరియు తీర్పుదినం గుర్తుకు రావాలని, ప్రాపంచిక వ్యామోహాల నుండి హృదయం మరలాలని, ప్రళయ సంసిద్ధత ఆసక్తి జనించాలని ధర్మసమ్మతం చేయ బడింది. సమాధులను సందర్శించటానికి ప్రత్యేక దినం, ప్రత్యేక సమయం లేదు. ఏ సమయంలో అయినా సమాధులను సందర్శించవచ్చు. అయితే శుక్ర వారం సందర్శించటం అన్నిటికంటే ఉత్తమం.

ము’హమ్మద్‌ బిన్‌ నో’మాన్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రతి శుక్రవారం తన తల్లి-దండ్రుల లేదా వారిలోఒకరి సమాధిని సందర్శించే వ్యక్తిని క్షమించటం జరుగుతుంది. అతడు తన తల్లి-దండ్రుల విధే యుడని, వ్రాయబడుతుంది.” (బైహఖీ -షు’అబిల్‌ ఈమాన్‌)

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రతి జుమ’అహ్‌ రోజు తన తల్లి-దండ్రుల లేదా వారిలో ఒక్కరి సమాధిని దర్శించే వ్యక్తి పాపాలను అల్లాహ్‌ (త) క్షమిస్తాడు. ఇంకా తల్లిదండ్రుల విధేయుడని వ్రాస్తాడు.” (‘హకీమ్‌, తిర్మిజి’)

అబూబకర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”జుమ ‘అహ్‌ రోజు తన తల్లిదండ్రుల లేదా వారిలో ఒకరి సమాధిని దర్శించి, అక్కడ సూరహ్‌ యా-సీన్‌ పఠిం చిన వ్యక్తిని క్షమించటం జరుగుతుంది.” (ఇబ్నె ‘అదీ)

కాని  ఈ మూడు ఉల్లేఖనాలు బలహీనమైనవి.

‘హాకిమ్‌లోని ఒక ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”ఫాతిమహ్ (ర) ప్రతి జుమ’అహ్‌ రోజు ‘హమ్‌’జహ్‌ (ర) సమాధిని దర్శించే వారు. ఒకవేళ రాత్రి దర్శించా లనుకుంటే, రాత్రి చివరి భాగంలో దర్శించటం మంచిది. ప్రవక్త (స) తరచూ రాత్రి చివరి భాగంలో సమాధులను సందర్శించటానికి బఖీ’లోకి వెళ్ళేవారు.

సమాధులను సందర్శించే పద్ధతి ఏమిటంటే, ముఖం సమాధి వైపు, వీపు ఖిబ్లా వైపు ఉంచి నిలబడి, దీని గురించి ఉన్న దు’ఆ లలో ఏదైనా ఒకటి పఠించాలి. ఇదేకాక ఇంకా మృతుల కోసం కూడా దు’ఆలు చేయాలి. ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ”ప్రవక్త (స) మదీనహ్ లోని సమాధుల వద్దకు వెళ్ళి, సమాధులకు అభిముఖంగా నిలబడి, ”అస్సలాము అలైకుమ్‌, యా అహ్‌లల్‌ ఖుబూర్‌, యగ్‌’ఫిరుల్లాహు లనా వలకుమ్‌” అని పలికారు. (తిర్మిజి’)

ముల్లా ‘అలీ ఖారీ మిష్కాత్‌ వివరణలో వ్రాస్తూ, సమాధులను సందర్శించే వారు మృతులకు సలామ్‌ చేసినపుడు సమాధుల ముఖాలకు అభిముఖంగా నిలబడాలని, దు’ఆ చేసినపుడు కూడా సమాధులకు అభిముఖంగా నిలబడాలని ఈ ‘హదీసు’ల ద్వారా నిరూపించబడిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ముస్లిముల ఆచరణ ఈ విధంగానే ఉంది.

సమాధులను దర్శించినపుడు నిలబడి దు’ఆ చేయాలి. కూర్చొని దు’ఆ చేయరాదు. చేతులు ఎత్తి కూడా దు’ఆ చేయవచ్చును.

సహీ ముస్లిమ్‌లో ‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) బఖీ’లోకి వెళ్ళారు. చాలాసేపు వరకు నిలబడ్డారు. మూడుసార్లు దు’ఆ కోసం చేతులు ఎత్తారు. సమాధులను సందర్శించినపుడు చిత్తశుద్ధితో మృతుల కోసం దు’ఆ చేయాలి. ఒకవేళ అల్లాహ్‌ (త) మృతుల గురించి సందర్శకుల దు’ఆలు స్వీకరించి, మృతులను క్షమించినా, లేదా వారి శిక్ష తగ్గినా చాలా గొప్ప విషయం. దు’ఆలు అరబీలో గుర్తుంటే అరబీలో చేయాలి. లేదా తన భాషలో దు చేయాలి.

اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం   

1762 – [ 1 ] ( صحيح ) (1/552)

عَنْ بُرَيْدَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “نَهَيْتُكُمْ عَنْ زِيَارَةِ الْقُبُوْرِ فَزُوْرُوْهَا وَنَهَيْتُكُمْ عَنْ لُحُوْمِ الْأَضَاحِيْ فَوْقَ ثَلَاثٍ فَأَمْسِكُوْا مَا بَدَا لَكُمْ وَنَهَيْتُكُمْ عَنِ النَّبِيْذِ إِلَّا فِيْ سِقَاءٍ فَاشْرَبُوْا فِيْ الْأَسْقِيَةِ كُلِّهَا وَلَا تَشْرَبُوْا مُسْكِرًا”. رَوَاهُ مُسْلِمٌ.

1762. (1) [1/552దృఢం]

బురైదహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఇంతకు ముందు నేను మిమ్మల్ని సమాధులను సందర్శించటాన్ని వారించాను.  ఇప్పుడు మిమ్మల్ని సమాధులను సందర్శించటానికి అనుమతి నిస్తున్నాను. ఇంకా నేను మిమ్మల్ని ఖుర్‌బానీ మాంసాన్ని 3 రోజుల కంటే ఎక్కువ నిల్వ ఉంచరాదని వారించాను. ఇప్పుడు నేను మీరు కోరినన్ని దినాలు ఉంచవచ్చని అనుమతి ఇస్తున్నాను. ఇంకా నేను మీకు కుండల్లో తప్ప మరో పాత్రలో నబీజ్‌’ చేయరాదని వారించాను. ఇప్పుడు నేను మీరు కోరిన పాత్రల్లో నబీజ్‌ తయారు చేయవచ్చని అనుమతి ఇస్తున్నాను. కాని మత్తు పానీయాలు త్రాగకండి. [114] (ముస్లిమ్‌)

1763 – [ 2 ] ( صحيح ) (1/552)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: زَارَ النَّبِيُّ صلى الله عليه وسلم قَبْرَ أُمِّهِ فَبَكَى وَأَبْكَى مَنْ حَوْلَهُ فَقَالَ: “اسْتَأْذَنْتُ رَبِّيْ فِيْ أَنْ أَسْتَغْفِرَ لَهَا فَلَمْ يُؤْذَنْ لِيْ وَاسْتَأْذَنْتُهُ فِيْ أَنْ أَزُوْرَ قَبْرَهَا فَأُذِنَ لِيْ فَزُوْرُوا الْقُبُوْرَ فَإِنَّهَا تُذَكِّرُ الْمَوْتَ” .رَوَاهُ مُسْلِمٌ.

1763. (2) [1/552దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) తన తల్లి సమాధిని సందర్శించారు. ప్రవక్త (స) ఏడ్వసాగారు. అనుచరులు కూడా ఏడ్చారు. అనంతరం ప్రవక్త (స) నేను నా ప్రభువును నా తల్లి క్షమాపణ కోసం ప్రార్థించే అనుమతి కోరగా, అనుమతి లభించలేదు. తరువాత నేను నా తల్లి సమాధిని సందర్శించటానికి అనుమతి కోరగా, అనుమతి లభించింది. కనుక మీరు సమా ధులను సందర్శించండి, ఎందుకంటే సమాధులను సందర్శించటం వల్ల మరణం గుర్తుకు వస్తుంది,” అని అన్నారు. [115] (ముస్లిమ్‌)

1764 – [ 3 ] ( صحيح ) (1/552)

وَعَنْ بُرَيْدَةَ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يُعَلِّمُهُمْ إِذَا خَرَجُوْا إِلَى الْمَقَابِرِ: “السَّلَامُ عَلَيْكُمْ أَهْلَ الدِّيَارِ مِنَ الْمُؤمِنِيْنَ وَالْمُسْلِمِيْنَ وَإِنَّا إِنْ شَاءَ ا للهُ بِكُمْ لَلَاحِقُوْنَ نَسْأَلُ اللهَ لَنَا وَلَكُمْ الْعَافِيَةَ”. رَوَاهُ مُسْلِمٌ.

1764. (3) [1/552దృఢం]

బురైదహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రజలకు శ్మశానం లోకి వెళితే ఈ దు’ఆ చదవాలని బోధించేవారు.

అస్సలాము అలైకుమ్అహ్లద్దియారి మినల్మూమినీన వల్ముస్లిమీన ఇన్నా ఇన్షా అల్లాహు బికుమ్లాహిఖూన్‌. నస్అలుల్లాహ లనా వలకుముల్‌ ‘ఆఫియహ్‌.” — ‘ఓ గృహ వాసులారా! మీపై శాంతి కురియు గాక! మేము కూడా మిమ్మల్ని కలుసుకోనున్నాము. మీకూ, మాకూ క్షేమాన్ని ప్రసాదించమని దైవాన్ని ప్రార్థిస్తున్నాము.’ (ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం   

1765 – [ 4 ] ( ضعيف ) (1/553)

عَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: مَرَّ النَّبِيُّ صلى الله عليه وسلم بِقُبُوْرٍ بِالْمَدِيْنَةَ فَأَقْبَلَ عَلَيْهِمْ بِوَجْهِهِ فَقَالَ: “السَّلَامُ عَلَيْكُمْ يَا أَهْلَ الْقُبُوْرِ يَغْفِرُاللهَ لَنَا وَلَكُمْ أَنْتُمْ سَلَفُنَا وَنَحْنُ بِالْأَثَر”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ حَسَنٌ غَرِيْبٌ .

1765. (4) [1/553-బలహీనం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) శ్మశానం ప్రక్క నుండి వెళ్ళటం జరిగింది. అప్పుడు ప్రవక్త (స) వారివైపు తిరిగి ఈ దు’ఆ పఠించారు.

అస్సలాము అలైకుమ్‌. యా అహ్లల్ఖుబూర్, గ్ఫిరుల్లాహు లనా వలకుమ్అన్తుమ్సలఫునా వనహ్ను బిల్అసర్‌.” — ‘ఓ సమాధిలో ఉన్న వారలారా! అల్లాహ్‌(త) మమ్మల్ని, మిమ్మల్ని క్షమించు గాక! మీరు మా కంటే ముందు వెళ్ళారు. మేము మీ వెనుకనే వస్తున్నాం.’ (తిర్మిజి’ /  పామాణికం, ఏకోల్లేఖనం)

—–

اَلْفَصْلُ الثَّالِثُ  మూడవ విభాగం   

1766 – [ 5 ] ( صحيح ) (1/553)

وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم كُلَّمَا كَانَ لَيْلَتُهَا مِنْ رَّسُوْلِ اللهِ صلى الله عليه وسلم يَخْرُجُ مِنْ آخِرِاللَّيْلِ إِلَى الْبَقِيْعِ فَيَقُوْلُ: “السَّلَامُ عَلَيْكُمْ دَارَ قَوْمٍ مُّؤْمِنِيْنَ وَأَتَاكُمْ مَا تُوْعَدُوْنَ غَدًا مُؤَجَّلُوْنَ وَإِنَّا إِنْ شَاءَ اللهُ بِكُمْ لَاحِقُوْنَ اَللّهُمَّ اغْفِرْ لِأَهْلِ بَقِيْعِ الْغَرْقَدِ”. رواه مسلم .

1766. (5) [1/553దృఢం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) నా వద్దకు వచ్చిన రోజు రాత్రి చివరి భాగంలో మేల్కొని మదీనహ్ లోని బఖీ శ్మశానానికి వెళ్ళి, అక్కడి మృతుల కోసం ఇలా ప్రార్థించే వారు.

అస్సలాము అలైకుమ్దారఖౌమిన్మూమినీన అతా కుమ్మా తూఅదూన్‌ ‘గదన్ముఅజ్జలూన, ఇన్నా ఇన్షా అల్లాహు బికుమ్లాహిఖూన్, అల్లా హమ్మగ్ఫిర్లి అహ్లిల్బఖీయిల్‌ ‘గర్ఖద్‌.” — ‘ఓ సమాధుల్లో ఉన్న విశ్వాసులారా! మీపై శాంతి కురియు గాక! మీతో వాగ్దానం చేయబడింది. మీకు చేరుకుంది. రేపటివరకు మీకు గడువు ఇవ్వబడింది. మేము కూడా మిమ్మల్ని కలుసుకోనున్నాము. ఓ అల్లాహ్‌! బఖీ’లో ఉన్నవారిని క్షమించు.’ (ముస్లిమ్‌) 

1767 – [ 6 ] ( صحيح ) (1/553)

وعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: كَيْفَ أَقُوْلُ يَا رَسُوْلَ اللهِ؟ تَعْنِيْ فِيْ زِيَارَةِ الْقُبُوْرِ قَالَ: “قُوْلِيْ: اَلسَّلَامُ عَلَى أَهْلِ الدِّيَارِ مِنَ الْمُؤْمِنِيْنَ وَالْمُسْلِمِيْنَ وَيَرْحَمُ اللهُ الْمُسْتَقْدِمِيْنَ مِنَّا وَالْمُسْتَأْخِرِيْنَ وَإِنَّا إِنْ شَاءَ اللهُ بِكُمْ لَلَاحِقُوْنَ”.  رَوَاهُ مُسْلِمٌ .

1767. (6) [1/553-దృఢం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స)ను సమాధులను సందర్శించినపుడు ఏమి పఠించాలని ప్రశ్నించారు. దానికి ప్రవక్త (స) క్రింది దు’ఆ చదవమని ఉపదేశించారు. అస్సలాము అలా అహ్లి ద్దియారి మినల్మూమినీన వల్ముస్లిమీన యర్‌’హముల్లాహుల్ముస్తఖ్దిమీన మిన్నా వల్ముస్తాఖిరీన ఇన్నా ఇన్షా అల్లాహు బికుమ్ ల్లాహి ఖూన్‌.” – ‘సమాధుల్లో ఉన్న ముస్లిమ్‌ విశ్వాసులారా! మీపై శాంతి కురియు గాక, మన వెనుక, ముందు తరాల వారిని అల్లాహ్‌ కరుణించు గాక! మేము కూడా మిమ్మల్ని కలవనున్నాము.” (ముస్లిమ్‌)

1768 – [ 7 ] ( موضوع ) (1/553)

وَعَنْ مُحَمَّدِ بْنِ النُّعْمَانَ يَرْفَعُ الْحَدِيْثُ إِلَى النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “مَنْ زَارَ قَبْرَ أَبَوَيْهِ أَوْ أَحَدَهُمَا فِيْ كُلٍّ جُمُعَةٍ غُفِرَ لَهُ وَكُتِبَ بَرًّا”. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ مُرْسَلًا .

1768. (7) [1/553-కల్పితం]

ము’హమ్మద్‌ బిన్‌ నో’మాన్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రతి జుమ’అహ్‌ రోజు తన తల్లి దండ్రుల సమాధులను లేదా వారిలో ఒకరి సమాధిని సందర్శించిన వ్యక్తిని క్షమించటం జరగుతుంది. అతన్ని పుణ్యాత్ముడుగా వ్రాయడం జరుగుతుంది.” (బైహఖీ-షు’అబిల్ ఈమాన్)

1769 – [ 8 ] ( ضعيف ) (1/554)

وَعَنِ ابْنِ مَسْعُوْدٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “كُنْتُ نَهَيْتُكُمْ عَنْ زِيَارَةِ الْقُبُوْرِ فَزُوْرُوْهَا فَإِنَّهَا تُزَهِّدُ فِيْ الدُّنْيَا وَتُذَكِّرُ الْآخِرَةَ”. رَوَاهُ ابْنُ مَاجَهُ.

1769. (8) [1/554బలహీనం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఇంతకు ముందు నేను మిమ్మల్ని సమాధులను సందర్శించవద్దని వారించాను. కాని ఇప్పుడు సమాధులను దర్శించండి. ఎందుకంటే సమాధుల సందర్శనం ప్రాపంచిక వ్యామోహం పట్ల అనాసక్తి, విసుగును జనింపజేస్తుంది. ఇంకా పరలోకాన్ని గుర్తుచేస్తుంది.” (ఇబ్నె మాజహ్)

1770 – [ 9 ] ( صحيح ) (1/554)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم لَعَنَ زَوَّارَاتِ الْقُبُوْرِ. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ. وَقَالَ التِّرْمِذِيُّ هَذَا حَدِيْثٌ حَسَنٌ صَحِيْحٌ. وَقَالَ: قَدْ رَأَى بَعْضُ أَهْلِ الْعِلْمِ أَنَّ هَذَا كَانَ قَبْلَ أَنْ يُّرَخِّصَ النَّبِيُّ فِيْ زِيَارَةِ الْقُبُوْرِفَلَمَّا رَخَّصَ دَخَلَ فِيْ رُخْصَتِهِ الرِّجَالُ وَالنِّسَاءُ. وَقَالَ بَعْضُهُمْ: إِنَّمَا كَرِهَ زِيَارَةَ الْقُبُوْرِ لِلنِّسَاءِ لِقِلَّةِ صَبْرِهِنَّ وَكَثْرَةِ جَزَعِهِنَّ. تَمَّ كَلَامُهُ.

1770. (9) [1/554దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) సమాధు లను సందర్శించే స్త్రీలను శపించారు. [116] (అ’హ్మద్‌, ఇబ్నె మాజహ్, తిర్మిజి’ – ప్రామాణికం, దృఢం)

1771 – [ 10 ] ( صحيح ) (1/554)

وعَنْ عَائِشَةَ قَالَتْ: كُنتُ أَدْخُلُ بَيْتِيَ الَّذِيْ فِيْهِ رَسُوْلُ اللهِ صلى الله عليه و سلم وَإِنِّيْ وَاضِعٌ ثَوْبِيْ وَأَقُوْلُ: إِنَّمَا هُوَ زَوْجِيْ وَأَبِيْ فَلَمَّا دُفِنَ عُمَرُ رَضِيَ اللهُ عَنْهُ مَعَهُمْ فَواللهِ مَا دَخَلْتُهُ إِلَّا وَأَنَا مَشْدُوْدَةٌ عَلَيَّ ثِيَابِيْ حَيَاءً مِّنْ عُمَرَ. رَوَاهُ أَحْمَدُ .

1771. (10) [1/554దృఢం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఖననం చేయబడిన గదిలోకి నేను వెళ్ళేదాన్ని. నాపై వస్త్రాలు బుర్‌ఖహ్, దుప్పటి మొదలైనవి తీసివేసేదాన్ని. ఇంకా మనసులో నా భర్త, నా తండ్రి ఇక్కడ ఉన్నారు. వారితో తెరచాటు దేనికి అని అనుకునేదాన్ని. కాని ‘ఉమర్‌ (ర) ఆ గదిలో ఖననం చేయబడిన తర్వాత ఆ గదిలో బుర్‌ఖహ్, దుప్పటి ధరించి ప్రవేశించే దాన్ని. ‘ఉమర్‌ (ర)తో సిగ్గు వల్ల.” [117] (అ’హ్మద్‌)

*****


[1]) వివరణ-1531: అంటే ప్రవక్త (స) రోగిని మంత్రించినపుడు తన చేతివ్రేలుకు ఉమ్మి తగిలించి, దాన్ని నేలపై పెట్టి, ఆ మట్టి తగిలి ఉన్న వేలుతో నొప్పి ఉన్న చోట నిమురుతూ ఈ దు’ఆ పఠించేవారు. ఇది పుళ్ళకు, నొప్పులకు చాలా ఉపయోగ కరమైనది.

[2]) వివరణ-1536: అంటే శ్రమించకుండా, కష్టాలు, ఆపదలు భరించకుండా ఉన్నత స్థానం లభించదు. అల్లాహ్‌ (త) ఉన్నత స్థానం ప్రసాదించగోరినప్పుడు  అతన్ని పరీక్షిస్తాడు. అతడు ఆ పరీక్షలో నెగ్గితే అతనికి అంతా మేలే జరుగుతుంది. ఎంత అధికంగా బాధలు భరిస్తే అంత అల్లాహ్‌(త)కు ప్రీతిపాత్రుడవుతాడు. అందువల్ల కష్టాలు, ఆపదల వల్ల ఆందోళన చెంద కూడదు. కష్టాలు సుఖాలకు మెట్లని భావించాలి.

[3]) వివరణ-1537: అంటే బాధలు, విచారాలు అని అర్ధం. నిఘంటువులో నస్బ్ అంటే అనారోగ్యం, శాశ్వత రోగం మరియు నొప్పి అని అర్ధం. ఇంకా హమ్మ్ అంటే, దుఃఖ విచారాలు, ఆందోళన అని అర్ధం. అంటే ఒక ముస్లిమ్‌ ఎటువంటి బాధ, విచారానికి గురయినా దానికి బదులుగా అతని పాపాలను అల్లాహ్‌ క్షమించివేస్తాడు.

[4]) వివరణ-1540: ‘ఆయి’షహ్‌ (ర) మరణ సమయంలో వచ్చే ఆందోళనకరమైన పరిస్థితి పాపాల వల్ల కలుగు తుందని భావించేవారు. కాని ప్రవక్త (స) మరణస్థితిని చూసి, ఇలా ఆందోళనకరమైన పరిస్థితి పాపాల వల్ల కలగదని తన అభిప్రాయం మార్చుకున్నారు. ఈ ‘హదీసు’లో హాఖినతీ అని ఉంది. అంటే రొమ్ము మధ్య భాగం. అంటే ప్రవక్త (స) నా ఒడిలో మరణించారు. అప్పుడు కలిగిన కష్టం నాకు బాగా తెలుసు.

[5]) వివరణ-1551: ఈ ‘హదీసు’ ద్వారా వ్యాధి ఎలాంటి దైనా, వ్యాధి ఎంత చిన్నదైనా సరే పరామర్శించటానికి వెళ్ళాలి అని తెలిసింది. కంటినొప్పి ఉన్నవారిని కూడా పరామర్శించడం ప్రవక్త సాంప్రదాయం. అయితే ఒక ‘హదీసు’లో కంటిరోగం గలవారిని పరమర్శించకూడదని ఉంది. దీనికి సమాధానం ఏమిటంటే ఒకవేళ వెళితే అతనికి బాధ కలుగుతుందని అనిపిస్తే వెళ్ళకూడదు. లేపి కూర్చోబెట్టే వారు ఉండకపోవచ్చు, కళ్ళపై కట్లు కట్టబడి ఉండవచ్చు. నేను వెళితే అతనికి బాధ కలుగుతుందని అనిపిస్తే వెళ్ళకూడదు.

[6]) వివరణ-1562: ప్రవక్తలు అల్లాహ్‌కు సత్య, ప్రియభక్తులు. అందువల్లే వారు అధికంగా బాధలకు, నష్టాలకు గురవుతారు. ఆ తరువాత వారి అడుగు జాడల్లో నడిచేవారు కూడా ఈ విధంగానే గురవుతారు. ఈ విధంగా వారు పాపాల నుండి పరిశుభ్రమై అల్లాహ్‌ (త)ను కలుసుకుంటారు.

[7]) వివరణ-1563: అంటే ముందు సులభతరమైన మరణం గురించి కోరుకునేదాన్ని. కాని ప్రవక్త (స) మరణ తీవ్రత చూసి ఆ కోరిక మాయం అయిపోయింది. మరీ తీవ్రత పాపాలవల్లే జరుగుతుందని కాదు, విశ్వాసికి ఉన్నత స్థానాలు ప్రసాదించటానికి కూడా ఇలా జరుగుతుంది. కొంతసేపు బాధ భరిస్తే శాశ్వత సుఖం లభిస్తుంది.

[8]) వివరణ-1564: అంటే మరణావస్థలో చాలా వేడిగా ఉంటుంది. అందువల్ల చేయి తడిపి ముఖం తుడుచు కునేవారు. ఇందులో తన అనుచర సమాజానికి గుణ పాఠం ఉంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రవక్త (స) కష్టాన్ని గుర్తుకు తెచ్చుకొని, ఓర్పూ సహనాలు పాటించాలి. దీనివల్ల ఉన్నత స్థానాలు లభిస్తాయి.

[9]) వివరణ-1569: అంటే ప్రారంభం నుండి మానవుడు కష్టాల్లో చిక్కుకొనిఉన్నాడు. తప్పించుకోవటం అసాధ్యం. వాటి నుండి తప్పించుకున్నా వృద్ధాప్యంలోని కష్టాలకు గురయి చివరికి మరణం చూడవలసి ఉంటుంది.

[10]) వివరణ-1571: విశ్వాసి అనారోగ్యం తరువాత గుణ పాఠం, హితబోధ స్వీకరిస్తాడు. అవిశ్వాసి, కపటాచారి జంతువుల్లా ఏమీ తెలియకుండా ఉంటారు. అనారో గ్యానికి గురికానివాడు పుణ్యాత్ముల్లోనివాడు కాడు.

[11]) వివరణ-1573: అంటే కలరా వ్యాధి వల్ల మరణిస్తే, వీరమరణం పొందినట్లు. సమాధిలో అతన్ని శిక్షించడం జరుగదు.

[12]) వివరణ-1574: ఈ ‘హదీసు’ ద్వారా రోగిని పరామర్శించే వారు ఉపదేశించ వచ్చు, హితబోధ చేయవచ్చు, ఇస్లామ్‌ స్వీకరించమని చెప్పవచ్చును. ఇదే అన్నిటికంటే గొప్ప శ్రేయోభిలాష, అదేవిధంగా అవిశ్వాసిని పరామర్శిస్తే, ఇస్లామ్‌ స్వీకరించమని ప్రోత్సహించాలి. ఒకవేళ అవిశ్వాసుల్లోని బాలుడు ఇస్లామ్‌ స్వీకరిస్తే అతన్ని ముస్లిమ్‌గా పరిగణించటం జరుగుతుంది.

[13]) వివరణ-1585: అంటే అతని పాపాలకు పరిహారంగా వ్యాధులకు, ఆపదలకు అనావృష్టికి గురిచేసి పరిహారం ఇక్కడే తీసుకుంటాను, పరలోకంలో నరకశిక్ష నుండి రక్షించాలని.

[14]) వివరణ-1586: అంటే ‘విశ్వాసి సాధారణంగా యుక్త వయస్సులో చాలా సత్కార్యాలు చేస్తూ ఉంటాడు. యుక్త వయస్సులో అనారోగ్యానికి గురై, సత్కార్యాలు చేయలేక పోతే దైవదూతలు వాటి పుణ్యం వ్రాస్తూ ఉంటారు. కాని వృధ్ధాప్యం బలహీనత వల్ల ఇప్పుడు అవేవీ చేయలేక పోతున్నాను. అనారోగ్యానికి గురైతే వ్రాయబడవు కనుక ఏడుస్తున్నాను,’ అని అన్నారు.

[15]) వివరణ-1587: ‘అ’తా ఈ ‘హదీసు’ను బలహీన మైనదిగా పేర్కొని, పరామర్శించటానికి ఎటువంటి ప్రత్యేక సమయం లేదని, ఎప్పుడైనా వెళ్ళవచ్చని అభిప్రాయపడ్డారు.

[16]) వివరణ-1588: అంటే ఏవిధంగా దైవదూతలు నిర్మల మైనవారో, రోగి కూడా వ్యాధివల్ల నిర్మలంగా ఉంటాడు. అందువల్ల అతనిదు’ఆ స్వీకరించ బడుతుంది.

[17]) వివరణ-1589: చివరి సారిగా అనారోగ్యానికి గురయి నప్పుడు ప్రవక్త (స) ‘కాగితం, కలం, సిరా తీసుకు రమ్మని, నేను వీలునామా వ్రాస్తాను’ అని అన్నారు. కొందరు ‘ఓ ప్రవక్తా! ఇప్పుడు మీ పరిస్థితి బాగా లేదు. ఇప్పుడు వ్రాసే అవసరం లేదు. మాకు ఖుర్‌ఆన్‌ ‘హదీసు’లు చాలు’ అని అన్నారు. కొందరు వ్రాయమని.’ దానికి ప్రవక్త (స) ‘నా వద్ద నుండి వెళ్ళి పోండి’ అని అన్నారు. ఎందుకంటే ప్రవక్త వద్ద కోలాహలం, సందడి, చర్చలు సరికావు.

[18]) వివరణ-1591: అంటే రోగిని పరామర్శించి వెంటనే నిలబడిపోవాలి. అంటే తిరిగి వెళ్ళిపోవాలి. ‘ఫవాఖ్‌ నాఖహ్’ అంటే రెండవసారి ఒంటెపాలు పితికినంత సేపు. ఇది ఎలా అంటే మొదటిసారి పాలు పితికి కొంతసేపు ఆగి, శిరాల్లో పాలురావాలని దాని బిడ్డను వదలివేస్తారు. తరువాత బిడ్డను కట్టివేసి, మళ్ళీ రెండవసారి పాలు పితుకుతారు. లేదా పితుకుతూ ఒక గిన్నె నిండిపోతే, రెండవ గిన్నెలో పితుకుతారు. దీనికి పట్టే సమయాన్ని ‘ఫవాఖ్‌ నాఖహ్’ అంటారు. అంటే రోగిని పరామర్శించి నపుడు క్షేమసమాచారాలు తెలుసుకొని వెంటనే ఆలస్యం చేయకుండా వెనక్కి రావడమే ఉత్తమం.

[19]) వివరణ-1593: దీనివల్ల పరదేశంలో మరణించటానికి గల ప్రాధాన్యత తెలుస్తుంది.

[20]) వివరణ-1597: యుద్ధం చేస్తూ శత్రువులకు వెన్ను చూపటం మహా పాపం. అదేవిధంగా ప్లేగువ్యాధి ప్రబలి ఉన్న ప్రాంతంనుండి పారిపోవటం కూడా మహా పాపమే. అక్కడి నుండి ఎటూ పారిపోకుండా అక్కడే ఉండి ఉంటే అతనికి అమరవీరునికి సమానంగా పుణ్యం లభిస్తుంది.

[21]) వివరణ-1600: ఈ ‘హదీసు’ల ద్వారా చావును కోరుకోరాదని తెలుస్తుంది. అయితే ఉపద్రవాల, కల్లోలాల భయంవల్ల, వీరమరణం పొందే కోరికవల్ల కోరటం సమంజసమే. ‘ఉమర్‌ (ర) ఇలా కోరుకునేవారు. ”అల్లాహుమ్మర్ ‘జుఖ్‌నీ షహాదతన్‌ ఫీ సబీలిక వజ్‌’అల్‌ మౌతీ బిబలది రసూలిక.”

[22]) వివరణ-1603: ఎందుకంటే దుర్మార్గుడి వల్ల అందరికీ బాధ కలుగుతుంది. వాడి మరణం వల్ల అందరికీ సుఖం కలుగుతుంది.

[23]) వివరణ-1605: అల్లాహ్‌(త) కరుణామయుడని క్షమించేవాడని తప్పకుండా మనల్ని క్షమిస్తాడని భావిస్తూ ఉండాలి. అయితే మంచి భావనలు మంచి కర్మల ద్వారానే జనిస్తాయి.

[24]) వివరణ-1608: తలను పరిరక్షించడమంటే, తలను కేవలం అల్లాహ్‌(త) ఆరాధన కొరకే వంచాలి. అల్లాహ్‌(త) కొరకే సజ్దా చేయాలి. అహంకారంగా ప్రవర్తించరాదు. తలలో ఉన్నవాటిని కూడా పరిరక్షించాలి. అంటే నోటిని అసత్యాలకు, పరోక్ష నిందలకు దూరంగా ఉండాలి. కళ్ళతో చెడు విషయా లను చూడకూడదు. చెవులతో చెడు విషయాలను వినరాదు. కడుపును పరరక్షించడం అంటే అధర్మ సంపాదన తినరాదు. మర్మాంగాలను వ్యభిచారానికి దూరంగా ఉంచాలి. కాళ్ళతో చెడు విషయాల వద్దకు వెళ్ళరాదు. చేతులతో ఇతరులకు హాని చేకూర్చరాదు. దొంగతనం చేయరాదు. చావును గుర్తు చేసుకోవటం అంటే ఒకరోజు మరణిస్తామని, సమాధిలోకి వెళ్ళి క్రుళ్ళవలసి ఉందని గుర్తుంచుకోవాలి. ఇవన్నీ చేయటమే అర్హతకు తగినట్టు అల్లాహ్‌(త)కు సిగ్గుపడటం అవుతుంది.

[25]) వివరణ-1609: అంటే విశ్వాసికి మరణం అల్లాహ్‌(త) తరఫున కానుక వంటిది. ఎందుకంటే దీనివల్ల అల్లాహ్‌ (త)ను కలుసుకోవటం జరుగుతుంది. పరలోకంలో, తీర్పుదినంనాడు సాఫల్యం, ఉన్నత స్థానం లభిస్తుంది.

[26]) వివరణ-1610: అంటే మరణించినపుడు మరణావస్థ వల్ల అతని నుదురునుండి చెమటవస్తుంది. ఇది అతను విశ్వాసి అనడానికి నిదర్శనం. దానివల్ల అతనికి ఉన్నత స్థానం లభిస్తుంది. లేదా విశ్వాసి ప్రపంచంలో ధర్మ సంపాదన కోసం శ్రమిస్తాడు. చివరికి మరణిస్తాడు. లేదా మరణించినపుడు చెమట రావటం శుభసూచకం. లేదా మరణించినపుడు ఏమంత కష్టం కలుగదు కాని నుదుటి నుండి చెమటవస్తుంది.

[27]) వివరణ-1613: ఇక్కడ మరణావస్థ మరియు దాని కాఠిన్యత పేర్కొనడం జరిగింది. అందువల్ల అటువం టప్పుడు చావును కోరుకోరాదు. అల్లాహ్‌(త) దీర్ఘాయుష్షు, విధేయతా భాగ్యం ప్రసాదిస్తే, అత్యధికంగా దైవప్రీతిని పొందగలడు.

[28]) వివరణ-1615: ఈ హదీసులో ఖబ్బాబ్ను గురించి ప్రస్తావించబడింది. అతని గురించి కొన్ని వివరాలు ఇక్కడ ప్రస్తావించటం మంచిదని, దీని ద్వారా పాఠకులు గుణ పాఠం నేర్చుకోవాలని భావించి, సియరు స్సహాబా వల్ ముహాజిరీన్ మూడవ భాగం నుండి పేర్కొనడం జరిగింది.

ఖబ్బాబ్(ర): ఇస్లామ్‌ ప్రారంభకాలంలో ప్రవక్త(స) జైద్బిన్ అర్ఖమ్ ఇంట్లో శరణు తీసుకోవటానికి ముందు ఇస్లామ్‌ స్వీకరించిన అదృష్టవంతులు. ఇస్లామ్‌ స్వీకరించిన వారిలో 6 వ్యక్తి. అందువల్ల సాదిసుల్‌ ఇస్లామ్‌ అని పిలిచేవారు. వీరు ఇస్లామ్‌ స్వీకరించినపుడు అవిశ్వాసుల వద్ద అన్నిటికంటే ఘోర పాపం ఇస్లామ్‌ స్వీకరించటంగా పరిగణించబడేది.

ఇస్లామ్ స్వీకరించటంవల్ల ధనసంపదలన్నిటినీ వదలుకో వలసి వచ్చేది. కాని ‘ఖబ్బాబ్‌ (ర) ఏమాత్రం భయపడ కుండా తాను ఇస్లామ్‌ స్వీకరించానని ప్రకటించారు. (అస దుల్ ‘గాబహ్) ఇతడు ఒక బానిస. అందువల్ల ఇతడికి సహాయంగా ఎవరూ ఉండేవారు కారు. అందువల్ల అవిశ్వాసులు ఇతడిని అనేక విధాలుగా హింసించే వారు. అగ్గిపై పడుకోబెట్టి గుండెపై రాతి బండను పెట్టి పైనుండి నొక్కేవారు. (ఇబ్నె స’అద్) ఇతడిని ఎంత హింసించినా సత్యవచనాన్ని మాత్రం వదలలేదు. ప్రవక్త (స) ఇతడిని ఓదార్చేవారు. ఇతడి యజమాని ఎంత కఠినుడంటే, ఇనుపకడ్డీని కాల్చి తలపై వాతపెట్టాడు. (అసదుల్ ‘గాబహ్)

అతడు ప్రవక్త (స)ను నాగురించి అల్లాహ్ ను ప్రార్ధించమని కోరాడు. అనంతరం ప్రవక్త(స), ‘ఓ అల్లాహ్(త) ఖబ్బాబ్ కు సహాయంచేయి,’ అని ప్రార్ధించారు. ఇది చాలక వారు ధనపరంగాకూడా హాని చేకూర్చడానికి ప్రయత్నించారు. ఆస్బిన్వాయిల్పై అతని అప్పు ఉండేది. ‘ఖబ్బాబ్‌ తన బాకీ ఇవ్వమని అడిగితే, ‘నీవు ము’హమ్మద్‌ను వదలనంత వరకు నేను నీ బాకీ ఇవ్వను’ అని అనేవాడు. దానికి ఖబ్బాబ్‌, ‘నీవు మరణించి మళ్ళీ సజీవంగా లేవనంత వరకు నేను ము’హమ్మద్‌ నుండి వేరుకాను,’ అని అనేవారు. దానికి వాడు, ‘సరే, నేను మరణించి లేచిన తర్వాత నాకు ధనం, సంతానం లభించిన తర్వాత నీ అప్పు తీరుస్తాను’ అని అనేవాడు. అంటే మరణించి తిరిగి లేపబడటం అనే ఇస్లామ్‌ విశ్వాసాన్ని ధిక్కరించేవాడు. దీనిపై ఈ ఆయతు అవతరించబడింది. అల్లాహ్‌ ఆదేశం: ”ఏమీ? మా సూచనలను తిరస్కరించి: ”నిశ్చయంగా, నాకు ధనసంపదలూ మరియు సంతానం ఇవ్వబడుతూనే ఉంటాయి.” అని పలికే వానిని నీవు చూశావా? ఏమీ? అతడు అగోచరాన్నిచూశాడా? లేదా అనంత కరుణామయుని వాగ్దానం పొందాడా? అలాకాదు! అతడు చెప్పేది, మేము వ్రాసి పెట్టగలము. మరియు అతడి శిక్షను మరింత పెంచగలము.  మరియు అతడు చెప్పేవస్తువులకు మేమే వారసులమవుతాము మరియు అతడు ఒంటరిగానే మావద్దకు వస్తాడు.” (సూ. మర్యమ్‌, 19:77-80)

ఖబ్బాబ్‌ (ర) చాలా కాలం వరకు ఈ హింసలను భరిస్తూ  ఉన్నారు. హిజ్రత్‌ ఆదేశం వచ్చిన తరువాత హిజ్రత్‌ చేసి మదీనహ్ వచ్చారు. హిజ్రత్‌ కూడా కష్టాలకు, ఆపదలకు భయపడి చేయలేదు, కేవలం దైవప్రీతి కోసమే చేశారు. ఇంకా, ‘నేను కేవలం దైవప్రీతి కోసమే ప్రవక్త (స) వెంట హిజ్రత్ చేసాను,’ అని అనేవారు. మదీనహ్ వచ్చిన తర్వాత ప్రవక్త (స) అతనికి ఖర్రాష్‌ బిన్‌ సమ్మల మధ్య సోదరభావం ఏర్పరిచారు.

మదీనహ్ వచ్చిన తర్వాత ప్రారంభం నుండి చివరివరకు అన్ని యుద్ధాల్లో పాల్గొన్నారు. ‘ఉమర్‌ (ర) అతని ప్రత్యేకతల వల్ల అతన్ని చాలా గౌరవించేవారు. ఒకసారి ‘ఖబ్బాబ్‌ (ర) ‘ఉమర్‌ (ర)ను కలవటానికి వెళ్ళారు. ‘ఉమర్‌ (అ) అతన్ని తన మెడపై కూర్చోబెట్టుకొని, ప్రజలకు చూపిస్తూ, ‘ఇతను కాక నా వీపుపై కూర్చునే మరో వ్యక్తి కూడా ఉన్నాడు’ అని అన్నారు. ‘ఖబ్బాబ్‌ (ర) ‘మరెవరు అని అడిగారు. ‘దానికి ‘ఉమర్‌ (ర) ‘బిలాల్‌ (అ)’ అని అన్నారు. దానికి అతను నాకు సమానంగా ఎలా? అవిశ్వాసుల్లో అతనికి చాలామంది సహాయకులు ఉండేవారు. కాని నాకు అల్లాహ్‌(త) తప్ప అడిగేవారెవరూ ఉండేవారు కారు అని చెప్పి తాను భరించిన కష్టాలను, హింసలను గురించి చెప్పారు.

37వ హిజ్రీలో కూఫాలో అనారోగ్యానికి గురయ్యారు. వ్యాధి తగ్గడానికి బదులు ఇంకా పెరిగిపోయింది. వ్యాధి బాధవల్ల ఆందోళనచెంది ”ఒకవేళ అల్లాహ్‌(త), ఆయన ప్రవక్త చావును కోరరాదని వారించి ఉండకుంటే నేను ప్రార్థించే వాడిని” అని అన్నారు. పరిస్థితి ఇంకా ప్రమాదకరంగా తయారైనపుడు కఫన్‌ తీసుకురావటం జరిగింది. దాన్ని చూసి, అతను చాలా ఏడ్చారు, ఇంకా, ”హమ్‌జహ్ కు పూర్తి కఫన్‌ కూడా లభించలేదు. ఒక చిన్న దుప్పటి కఫన్‌గా చుట్టడం జరిగింది. ఒకవేళ కాళ్ళు కప్పితే తల బయటపడేది. ఒకవేళ తల కప్పితే కాళ్ళు బయట పడేవి. చివరికి తల కప్పి, కాళ్ళపై గడ్డి కప్పటం జరిగింది” అని అన్నారు. కొందరు పరామర్శించటానికి వచ్చారు. అబూ ‘అబ్దుల్లాహ్‌! ‘సంతోషించు. రేపటి వరకు నీవు నీ మిత్రులను కలుసుకుంటావు’ అని అన్నారు. అది విని మౌనంగా ఉండి, ‘నేను చావుకు భయపడటం లేదు. మీరు నన్ను పుణ్యాత్ములను గురించి గుర్తుచేశారు. కాని నాకు పుణ్యానికి బదులు పాపం లభించిందేమోనని భయపడుతున్నాను’ అని అన్నారు. (ఇబ్నె స’అద్)

కూఫా ప్రజలు సాధారణంగా మృతులను పట్టణం లోపలే ఖననం చేసేవారు. కాని అతను, ”నన్ను పట్టణం వెలుపల ఖననం చేయమని” హితవుచేశారు. దాని ప్రకారం అతన్ని పట్టణం వెలుపల ఖననం చేయడం జరిగింది. ఇతని సమాధి వల్ల పట్టణం వెలుపల కూడా జనవాసాలు ఏర్పడ్డాయి. మరణించినపుడు అతని వయస్సు 72 సంవత్సరాలు. ‘అలీ (ర) సిఫ్ఫీన్యుద్ధం నుండి తిరిగివస్తున్నప్పుడు ఇతని మరణవార్త అందింది. ‘అలీ (ర) జనా’జహ్ నమా’జు చదివించారు. దీని ద్వారా 37వ హిజ్రీలో మరణించారని తేలింది. అల్లాహ్‌ మనందరికీ ఖుర్‌ఆన్‌, ‘హదీసు’ల ప్రకారం జీవించే భాగ్యం ప్రసాదించుగాక! ఆమీన్‌.

[29]) వివరణ-1617: ఈ ‘హదీసు’లో మృతులు అంటే మరణా వస్థలో ఉన్నవారు మరియు అనారోగ్యంగా ఉన్న వారు. అంటే రోగివద్దకు వెళితే, పరామర్శించాలి. మరణా వస్థలో ఉన్నవారి వద్దకు వెళితే, ”లాయిలాహ ఇల్లల్లాహ్‌” ఉచ్చరించాలి. అది విని అతడు కూడా వల్లిస్తాడు. ఇంకా అతని క్షమాపణ కోసం దు’ఆ చేయాలి.

[30]) వివరణ-1618: ఉమ్మె సలమహ్ పేరు హింద్బిన్తె ఉమయ్యహ్. ఉమ్మె సలమహ్ ఆమె కునియత్‌. ఈమె ఖురైషుల్లోని ఖ్జూమ్ కుటుంబానికి చెందినవారు. ఈమె అబ్దుల్లాహ్బిన్‌ ‘అబ్దుల్అసద్ను పెళ్ళి చేసుకున్నారు. అయితే అతడు అబూ సలమహ్‌గా అందరికీ పరిచయం. ఇంకా అతడు చిన్నాన్న కొడుకు, మరియు ప్రవక్త(స)కు బాల్యంలోని పాల సోదరుడు. ఉమ్మె సలమహ్‌ తన భర్త వెంట ఇస్లామ్‌ స్వీకరించారు. ఆయన వెంట ‘హబషహ్ వలస పోయారు. ‘హబషహ్ లో కొంత కాలం ఉండి మళ్ళీ మక్కహ్ తిరిగి వచ్చారు. ఇక్కడి నుండి మదీనహ్ వలస వెళ్ళారు. ఈమె మక్కహ్ నుండి మదీనహ్ వలసవెళ్ళిన మొట్టమొదటి స్త్రీ. ఈమె వలస వెళ్ళిన సంఘటన చాలా ఆశ్చర్యకరమైనది. ఉమ్మె సలమహ్‌ తన భర్తవెంట హిజ్రత్‌ చేయాలనుకునే వారు, ఆమె కొడుకు సలమహ్‌ కూడా వెంట ఉన్నాడు. కాని ఉమ్మె సలమహ్‌ కుటుంబం వారు అడ్డుకున్నారు. అందువల్ల అబూ సలమహ్‌ వారిని వదలి మదీనహ్ వెళ్ళిపోయారు. ఆమె ఇంటికి తిరిగి వచ్చారు. ఇటు అబూ సలమహ్‌ కుటుంబం వారు సలమహ్‌ ను లాక్కొని తీసుకుపోయారు. దీనివల్ల ఉమ్మె సలమహ్‌కు మరీ ఎక్కువ బాధ కలిగింది. అందువల్ల రోజూ ఆందోళన చెందుతూ ఇంటినుండి బయలుదేరి, ‘అబ్‌తహ్‌లో కూర్చొని ఏడ్చేవారు. 7- 8 రోజుల వరకు ఇలాగే జరిగింది. కుటుంబ సభ్యులకు ఏ మాత్రం జాలి కలుగ లేదు. ఒకరోజు వారి కుటుంబం నుండి ఒక వ్యక్తి ఉమ్మె సలమహ్‌ ఏడ్వటం చూసి, జాలివేసి, ‘ఆమె నెందుకు హింసిస్తారు, వెళ్ళనివ్వండి. ఆమె బిడ్డను తిరిగి ఇచ్చివేయండి,’ అని అన్నాడు. వెళ్ళడానికి అనుమతి లభించింది. బిడ్డను ఒడిలో పెట్టుకొని ఒంటెపై ఎక్కి మదీనహ్ వైపు బయలుదేరారు. ఆమె ఒంటరిగా ఉన్నారు. తన్యీమ్లో, ఉస్మాన్బిన్‌ ‘తల్‌’హా దృష్టిపడింది. ‘ఎక్కడకు వెళుతున్నారు’ అని అడిగారు. ‘మదీనహ్ కు’ అని సమాధానం ఇచ్చారు. వెంట ఎవరున్నారని అడిగారు. దానికి ఆమె ‘అల్లాహ్‌(త), ఈ బిడ్డ’ అని సమాధానం ఇచ్చారు. దానికి ‘ఉస్మాన్‌ నీవు ఎంతమాత్రం ఒంటరిగా వెళ్ళలేవు అని చెప్పి, ఒంటె కళ్ళెం పట్టుకొని మదీనహ్ వైపు బయలుదేరారు. మార్గంలో ఎక్కడైనా ఒంటెను ఆపితే, కూర్చోబెట్టి ప్రక్కకు తప్పుకునే వారు. ఉమ్మె సలమహ్‌ దిగి అవసరాలు తీర్చుకొనేవారు. బయలుదేరినప్పుడు ఒంటెపై మావటి పెట్టి తప్పుకునేవారు. ఉమ్మె సలమహ్‌ను ఎక్కి కూర్చోమని చెప్పేవారు. ఇటువంటి మంచి వ్యక్తి నేనెప్పుడూ చూడలేదు. ఎలాగైతేనేం మదీనహ్ చేరుకున్నాం. ఖుబా జనవాసం కనపడింది. వారు అటు పోండి, మీ భర్త అక్కడే ఉంటున్నారు అని అన్నారు. ఆమె అటు వెళ్ళింది, ‘ఉస్మాన్‌ మక్కహ్ బయలుదేరారు. (జరఖానీ, 3/272)

  ఖుబాచేరిన తర్వాత ఇతర స్త్రీలు ఆమెను పరిస్థితులు అడిగి తెలుసుకునేవారు. ఆమె తన తండ్రి పేరు చెబితే ఎవరూ నమ్మేవారు కాదు. ఉమ్మె సలమహ్‌ మౌనం వహించేవారు. కొందరు ‘హజ్జ్ కోసం వెళ్ళినపుడు ఆమె ఉత్తరం పంపింది. దాని ద్వారా ఆమె ‘ఉమయ్య కూతురని తెలుసుకున్నారు. ఎందుకంటే ఉమయ్య ఖురైషుల్లోని గౌరవనీయ వ్యక్తి. అందువల్ల ఉమ్మె సలమహ్‌ను గౌరవంగా చూసేవారు. కొంతకాలం సుఖంగా ఉన్నారు. అబూ సలమహ్‌ చాలా గొప్ప పోరాట వీరులు. బద్ర్‌, ఉ’హుద్‌ యుద్ధాల్లో  పాల్గొన్నారు. హుద్లో తగిలిన గాయాల వల్ల మరణించారు. జమాదుస్సానీ 4వ హిజ్రీలో మరణించారు. ఉమ్మె సలమహ్ ప్రవక్త (స) వద్దకు వచ్చి అబూ సలమహ్‌ మరణవార్త వినిపించారు. ప్రవక్త (స) ఆమె ఇంటికి వెళ్ళారు. ఇంట్లో అంతా దుఃఖ వాతావరణం నిండి ఉంది. ప్రవక్త (స) ఆమెను ఓర్పు సహనం వహించమని, ఆయన క్షమాపణకు దు’ఆ చేయమని, అతనికంటే మంచి వ్యక్తిని ప్రసాదించమని దు’ఆ చేయమని ఉపదేశించారు. ఆ తరువాత అబూ సలమహ్ జనా’జహ్ నమా’జు చదివించారు. ప్రవక్త (స) 9 తక్‌బీర్లు చదివారు. ప్రజలు నమా’జు తర్వాత, ప్రవక్తా! ‘మీ వల్ల పొరపాటు జరగలేదు కదా!’ అని అన్నారు. దానికి ప్రవక్త (స), ‘ఇతను 1000 తక్‌బీర్ల అర్హత గలవాడు’ అని అన్నారు. మరణ సమయంలో అబూ సలమహ్‌ కళ్ళు తెరచి ఉన్నాయి. స్వయంగా ప్రవక్త (స) తన చేతులతో కళ్ళను మూసారు. ఇంకా ఆయన క్షమాపణ కోసం దు’ఆ చేశారు. అబూ సలమహ్‌ మరణించినపుడు ఉమ్మె సలమహ్‌ గర్భవతి. ప్రసవం తరువాత ఇద్దత్‌ పూర్తయ్యింది. అబూ బకర్‌ (ర) పెళ్ళి సందేశం పంపారు. కాని ఆమె నిరాకరించింది. ఆ తరువాత ‘ఉమర్‌ (ర) పెళ్ళి సందేశం పంపారు. కాని ఆమె నిరాకరించింది. ఆ తరువాత ‘ఉమర్‌ (ర), ప్రవక్త (స) పెళ్ళి సంబంధం తీసుకొని వెళ్ళారు. దానికి ఉమ్మె సలమహ్‌ నాకు కొన్ని బలహీనతలు ఉన్నాయి. 1. నేను చాలా పౌరుషం గల స్త్రీని. 2. మా కుటుంబం చాలా గొప్పది. 3. అధిక వయస్సు గలదాన్ని’ అని అన్నారు.

  ప్రవక్త (స) వీటన్నిటికీ ఒప్పుకున్నారు. ఇప్పుడు ఆటంకం ఏముండగలదు. వెంటనే తన కుమారునితో, లే, ప్రవక్త (స) తో ‘నా పెళ్ళిచేయి’ అని అన్నారు. 4వ హిజ్రీ షవ్వాల్‌లో పెళ్ళి జరిగింది. అబూ సలమహ్ మరణం వల్ల కలిగిన బాధను అల్లాహ్‌(త) సంతోషంలో మార్చివేశాడు. ఉమ్మె సలమహ్ అల్లాహ్‌ను అబూ సలమహ్ కంటే ఉన్నతమైన వ్యక్తిని ప్రసాదించమని ప్రార్థించేవారు. అయితే అతనికంటే మంచివారు ఎవరున్నారు అని మనసులో సందేహం కలిగేదని, ఆ తరువాత అల్లాహ్‌ ప్రవక్త (స)ను ప్రసాదించాడని అన్నారు. ప్రవక్త (స) ఆమెకు రెండు మరలు, ఒక కుండ, ఒక చర్మం తలగడ ఇచ్చారు. ఇలాగే ఇతర భార్యలకు కూడా ఇచ్చారు. (ముస్నద్ 6/295)

ఆమె గురించి ఇతర వివరాలు సియరుస్సహాబియ్యాత్ మరియు చరిత్ర పుస్తకాల్లో వివరంగా ఉన్నాయి.

[31]) వివరణ-1620: అంటే మరణించిన తరువాత శవాన్ని దుప్పటితో కప్పివేయాలి.

[32]) వివరణ-1621: అంటే మరణానికి ముందు ”లా ఇలాహ ఇల్లల్లాహ్‌, ముహమ్మదు ర్రసూలుల్లాహ్‌” అని పలికితే, స్వర్గంలో ప్రవేశిస్తారు. ఎందుకంటే ఏకత్వం మరియు దైవ దౌత్యంపై మరణించాడు. అల్లాహ్‌(త) మనందరికీ ఏకత్వంపై, దైవదౌత్యంపై మరణించే భాగ్యం ప్రసాదించుగాక!

[33]) వివరణ-1622: అంటే మరణావస్థలో ఉన్నవారు స్పృహలో ఉన్నవారు. ఇటువంటి వారి వద్ద సూరహ్‌ యా-సీన్‌(36) చదవాలి. దీనివల్ల మరణంలో కష్టం కలుగదు. తీర్పుదినం నాడు స్వర్గంలో ప్రవేశిస్తారు. మరణించిన తర్వాత కాదు. మరణానికి ముందు పఠించాలి. ఇదే ఉత్తమమైన అభిప్రాయం. ముస్నద్ ‘అహ్మద్ లోని ‘హదీసు’ దీన్ని సమర్ధిస్తుంది. సఫ్వాన్ కథనం, గజీఫ్ బిన్ ‘హారిస్’ మరణించినపుడు కొందరు అక్కడ ఉన్నారు. వారిలోని ఒకరు ‘ఎవరైనా సూరహ్ యా-సీన్ చదివితే బాగుణ్ణు’ అని అన్నారు. వెంటనే సాలిహ్ బిన్ షురైహ్ చదవటం ప్రారంభించారు. 40 ఆయతులు చదివేసరికి అతను మరణించారు. అప్పుడు ప్రజలు మరణించే వారివద్ద సూరహ్ యాసీన్ పఠిస్తే, దాని శుభంవల్ల సులభంగా మరణించటం జరుగుతుంది. అల్లామా ఇబ్ను ఖయ్యుమ్ కితాబుర్రూహ్ లో సాక్ష్య ధారాలతో సహా మొదటి అభిప్రాయాన్ని వివరించారు. ఇంకా ప్రవక్త(స) అనుచరులు మరియు తాబియీన్లలో ఎవరూ మరణించిన తరువాత సూరహ్ యాసీన్ చదవలేదని పేర్కొన్నారు.

[34]) వివరణ-1623: మరణించిన వ్యక్తిని ముద్దు పెట్టుకో వచ్చు. అబూ బక్‌ర్‌ (ర) కూడా ప్రవక్త (స) మరణించిన తర్వాత ముద్దు పెట్టారు. ఇంకా పెడబొబ్బలు పెట్టకుండా ఏడిస్తే తప్పులేదు.

[35]) వివరణ-1625: ఎందుకంటే ఆలస్యం చేయటంవల్ల శవం క్రుళ్ళిపోయే ప్రమాదముంది. బంధువులు ఆందోలనకూ గురవుతారు. అందువల్ల ఖనన సంస్కారాలు త్వరగా ముగించాలి.

[36]) వివరణ-1629: స్వర్గంనుండి తీసుకువచ్చిన పట్టు వస్త్రం ఆ ఆత్మకు కఫన్‌లా  ఉంటుంది. అవిశ్వాసుని కోసం తీసుకు వచ్చిన ఆ గోనె సంచి దాని కఫన్‌గా ఉంటుంది. విశ్వాసుల ఆత్మలు ‘ఇల్లీయ్యీన్‌లో ఉంటాయి. అవిశ్వాసుల ఆత్మలు సిజ్జీన్‌లో ఉంటాయి.

[37]) వివరణ-1634: ఈ ‘హదీసు’ ద్వారా శవాన్ని స్నానం చేయించే విధానం తెలిసిపోయింది. ఇంకా స్నానం చేయించిన తర్వాత సువాసన పులమాలని, స్త్రీ శవం అయితే ఆమెకు మూడు జడలు చేసి వెనుక వేయాలని కూడా తెలిసింది.

[38]) వివరణ-1635: శవానికి కఫన్‌గా చొక్కా, అమామహ్ లను ఉపయోగించటం ప్రవక్త (స) సాంప్రదాయం కాదు. అయితే అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించవచ్చును.

[39]) వివరణ-1636: అంటే విలువైనది లేదా పనికిరానిది కాకుండా మధ్య తరగతికి చెందిన తెల్లని వస్త్రాలు ఇవ్వడం ఉత్తమం.

[40]) వివరణ-1637: ఈ’హదీసు’ ద్వారా ‘హాజీ మ’హ్‌రమ్‌ ఒక వేళ మరణిస్తే, అతన్ని ఇ’హ్‌రామ్‌ దుస్తుల్లోనే కఫన్‌ చేయాలి. సువాసనలు పులమటంగాని, తల కప్పటం గానీ చేయకూడదు.

[41]) వివరణ-1640: ఈ ‘హదీసు’లో వస్త్ర అంటే కర్మ. ఏ పని చేస్తూ చనిపోతే ఆ స్థితిలోనే లేపబడతాడు. నమా’జు చదువుతూ మరణిస్తే, నమా’జు స్థితిలో లేపబడతాడు. ఉపవాస స్థితిలో మరణిస్తే, ఉపవాస స్థితిలోనే లేపబడతాడు. ‘హజ్జ్ స్థితిలో మరణిస్తే ఆ స్థితిలోనే లేపబడతాడు. మత్తు పానీయాలు త్రాగుతూ వ్యభిచారం చేస్తూ మరణిస్తే ఆ స్థితి లోనేలేస్తాడు. కాని ఇక్కడ కర్మలు అనేదే ఉత్తమ అభిప్రాయం. తీర్పుదినం నాడు అందరూ నగ్నంగా లేపబడతారు. వీర మరణం పొందినవారు ఆ స్థితిలోనే లేపబడతారు.

[42]) వివరణ-1643: అంటే వీరమరణం పొందినవారిని కేవలం ఆయుధాలు, రక్షణ కవచాలు తొలగించి ఉన్న స్థితిలోనే వారికి ఖననంచేయాలి. వారి దుస్తులు కూడా తొలగించరాదు. స్నానం కూడా చేయించరాదు, ఉన్న రక్తంతో సహా వారిని ఖననం చేయాలి.

[43]) వివరణ-1644: అబ్దుర్రహ్మాన్బిన్‌ ‘ఔఫ్ (ర)కు ప్రపంచంలోనే స్వర్గ శుభవార్త లభించింది. అందరికంటే ముందు ఇస్లామ్‌ స్వీకరించిన వారిలో వీరు ఒకరు. ఇస్లామ్‌ స్వీకరించినందుకు మక్కహ్ అవిశ్వాసులు అతన్ని చాలా హింసించారు. అందువల్ల అతను మక్కహ్ వదలి హబ్షహ్ వలస వెళ్ళారు. తరువాత అక్కడి నుండి మదీనహ్ తిరిగి వచ్చారు. మదీనహ్ చేరిన తరువాత ప్రవక్త (స) అతనికి స’అద్‌ బిన్‌ రబీ’అ అన్సారీల మధ్య సోదర సంబంధం ఏర్పరిచారు. అతను అన్సారుల్లో అందరికంటే ధనవంతులు, విశాల హృదయులు. అతను ‘అబ్దుర్ర’హ్మాన్‌ బిన్‌ ‘ఔఫ్‌తో, ‘నా సగం ధనం నీకిస్తాను, నాకు ఇద్దరు భార్యలు ఉన్నారు. నీకు నచ్చింది చెబితే, నేను ఆమెకు ‘తలాఖ్‌ ఇచ్చివేస్తాను. ఇద్దత్‌ గడిపిన తర్వాత నువ్వు నికాహ్‌ చేసుకో’ అని అన్నారు. కాని ‘అబ్దుర్ర’హ్మాన్‌ పౌరుషం దానికి సమ్మతించలేదు. దానికి అతను సమాధానం ఇస్తూ, ‘అల్లాహ్‌ (త) మీ ధనసంపదల్లో, కుటుంబంలో శుభం ప్రసాదించు గాక! నాకు కేవలం బజారు మార్గం చూపించండి చాలు,’ అని అన్నారు. ప్రజలు అతనికి ”బనూ ఖైన్‌ఖాహ్‌” బజారు చూపెట్టారు. మరుసటి రోజు నుండి వ్యాపారం ప్రారంభించారు. కొన్ని రోజుల తర్వాత ప్రవక్త (స) వద్దకు వచ్చారు. అప్పుడు అతని శరీరంపై పెళ్ళి చిహ్నాలు ఉన్నాయి. అడిగితే, ఒకఅ’న్సారీ స్త్రీతో పెళ్ళిజరిగిందని చెప్పారు. ‘మహర్‌ ఏమిచ్చావు’ అని అడిగితే ‘ఖర్జూరం గింజంత బంగారం’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స) ”వలీమ చేయి, ఒక్క మేక అయినా సరే” అని అన్నారు. (బు’ఖారీ)

 ‘అబ్దుర్ర’హ్మాన్‌ గొప్ప పైల్వాన్‌ (కుస్తీదారు) మరియు వీరులు. అనేక యుద్ధాల్లో పాల్గొన్నారు. అతని ఘన కార్యాలు ప్రముఖమైనవి. అతడు పండితుడు, వివేక వంతుడు. సరైన నిర్ణయం తీసుకునే వ్యక్తి. ప్రవక్త (స)ను చాలా గాఢంగా ప్రేమించేవారు. చాలా త్యాగశీలి, శీల వంతుడు, నిజాయితీపరుడు. చాలా గొప్ప దాతృత్వం గలవాడు. వినయ విధేయతలు గలవాడు. గొప్ప వ్యాపారి. వ్యాపారం వల్ల చాలా ధనవంతు డయ్యాడు. దైవమార్గంలో విశాల హృదయంతో ఖర్చు చేసే వారు.

ఇసాబహ్ మరియు అసదుల్‌ ‘గాబహ్‌లో ఇలా ఉంది, ”ఒకసారి అతని వ్యాపార బిడారం వచ్చింది. 700 ఒంటెలపై కేవలం గోదుమలు, పిండి ఇంకా ఇతర వస్తువులు ఉన్నాయి. అంత పెద్ద బిడారం చూడగానే మదీనహ్ నగరంలో కోలాహలం ప్రారంభమయ్యింది. ఈ వార్త విన్న ‘ఆయి’షహ్‌ (ర) ప్రవక్త (స) ‘అబ్దుర్ర’హ్మాన్‌ స్వర్గంలో ప్రాకుతూ వెళతారని ప్రవచించారని అన్నారు. ఈ వార్త ‘అబ్దుర్రహ్మా’న్‌కు తెలిసి, ‘ఆయి’షహ్‌ (ర) వద్దకు వచ్చి, ‘మీ సాక్ష్యంగా ఈ బిడారంలో ఉన్న వాహనాలు, వాటిపై ఉన్న వస్తువులతో సహా అల్లాహ్ మార్గంలో దానం చేస్తున్నాను’ అని అన్నారు.

ప్రవక్త (స) అనుచరులు తమ ధనాన్ని తమ సుఖానికి, విలాసాలకు ఉపయోగించుకునేవారు కారు. ధనం ఎంత అధికంగా ఉంటే అంత అధికంగా అల్లాహ్ మార్గంలో ఖర్చుచేసే వారు. ‘అబ్దు ర్ర’హ్మాన్‌ ప్రవక్త (స) కాలం నుండే అల్లాహ్ మార్గంలో ఖర్చుచేసే వారు. అప్పుడప్పుడూ ప్రజల కోసం, ఇస్లామ్‌ కోసం ధనం సమర్పించేవారు.

సూరహ్‌ బరాఅ’ (9) అవతరించబడింది, అనుచరులను దాన-ధర్మాలు చేయమని ప్రోత్సహించటం జరిగింది. అప్పుడు ‘అబ్దుర్ర’హ్మాన్‌ తన సగం ధనం అంటే 4000 దిర్‌హమ్‌లు సమర్పించారు. మరో రెండుసార్లు 40, 40 దీనార్లు సమ ర్పించారు. అదేవిధంగా యుద్ధం కోసం 500 గుర్రాలు, 500 ఒంటెలు సమర్పించారు.

అతని సాధారణ దానధర్మాలు ఏమిటంటే, ఒక్క రోజులోనే 30 మంది బానిసలను విడుదల చేసేవారు. ఒకసారి ఒక భూమిని 4000 దీనార్లకు ‘ఉస్మాన్‌ (ర)కు అమ్మారు. ఆ ధనమంతా దైవమార్గంలో ధారపోసారు.

ఇంత చేసినా ఈ విధంగా ధనం కలిగి ఉంటే పరలోకంలో నష్టం కలుగుతుందేమోనని భయపడేవారు. ఒకసారి ఉమ్మె సలమహ్ (ర) వద్దకు వెళ్ళి, ‘తల్లీ! అధికధనం నన్ను నాశనం చేస్తుందేమోనని నాకు భయంగా ఉంది’ అని అన్నారు. దానికి ఆమె, కుమారా! ‘అల్లాహ్ మార్గంలో ఖర్చుపెట్టు, ‘ ప్రవక్త (స), ”నా అనుచరుల్లో కొందరు విడిపోయిన తరువాత నా దర్శనం పొందుతారు” అని ప్రవచించారని అన్నారు.

చివరిశ్వాస వరకు అల్లాహ్ మార్గంలో ధనం ఖర్చుచేసే పరంపర కొనసాగింది. మరణించినపుడు కూడా 50 వేల దీనార్లు, 1000 గుర్రాలు అల్లాహ్ మార్గంలో సమర్పించారు. బద్ర్‌ యుద్ధంలో పాల్గొని సజీవంగా ఉన్న అన్సారులకు ప్రతి ఒక్కరికీ 400 దీనార్లు ఇవ్వమని వీలునామా వ్రాశారు. అప్పుడు 100 మంది సజీవంగా ఉన్నారు. వారందరూ లాభం పొందారు. చివరికి ‘ఉస్మాన్‌ (ర) కూడా తనవంతు తీసుకున్నారు.

ప్రవక్త (స) సతీమణుల కోసం కూడా ఒక తోట ఇవ్వవలసిందిగా వీలునామా వ్రాశారు. అది 4 లక్షల దిర్‌హమ్‌లలో విక్రయించబడింది. ఇంకా అనేక సందర్భాల్లో అనేక మొత్తాలు సమర్పించారు. ఒకసారి ఒక భూమి 40 వేల దీనార్లలో అమ్ముడయింది. ‘ఆయి’షహ్‌ (ర), అతని కుమారుడు అబూ సలమహ్ తో కృతజ్ఞతాపూర్వకంగా, ”అల్లాహ్‌(త) మీ తండ్రి గారిని స్వర్గంలోని సల్‌సబీల్‌ ద్వారా త్రాపించుగాక!” అని దీవించారు. (తిర్మిజి’)

ఈ ధన సంపదల వల్ల దైవభీతితో ఏడ్చేవారు. ఇక్కడ ఐశ్వర్యం ఉన్నందు వల్ల, అక్కడ ఆపదలకు గురికావలసి వస్తుందే మోనని భయపడేవారు.

అల్లాహ్‌ ఆదేశం: ఎవడు (ఇహలోక) తాత్కాలిక సుఖాలు కోరుకుంటాడో – మేము కోరిన వానికి – దానిలో మాకు ఇష్టం వచ్చినంత, ఒసంగుతాము. తరువాత అతని కొరకు నరకాన్ని నియమిస్తాము, దానిలో అతడు అవమానంతో బహిష్కరించ బడినవాడై దహింప బడతాడు. మరియు ఎవడు విశ్వాసి అయి, పరలోక (సుఖాన్ని) కోరి దానికై కృషిచేయవలసిన విధంగా కృషిచేస్తాడో, అలాంటివారి కృషి స్వీకరించబడుతుంది. (సూ. బనీ ఇస్రాయీల్‌, 17:1819)

మరో ఆదేశం: మరియు ఆ రోజు సత్యాన్ని తిరస్కరించిన వారిని నరకాగ్ని ముందుకు తెచ్చి, వారితో (ఇలా అనబడుతుంది): “మీరు, మీ ఇహలోక జీవితంలో మీ భోగభాగ్యాలను తరిగించుకున్నారు మరియు వాటిని బాగా అనుభవించారు; కావున మీరు ఏ హక్కూ లేకుండా భూమిలో ప్రదర్శించిన అహంకారానికి మరియు మీరు చేసిన అవిధేయతకు ప్రతిఫలంగా, ఈ రోజు మీకు అవమానకరమైన శిక్ష విధించబడుతుంది.” (సూ. అల్‌ అహ్‌ఖాఫ్‌, 46:20)

అంటే అవిశ్వాసులను నరకం ముందుకు తెచ్చి నిలబెట్టి నప్పుడు, వారు తమ మంచి పనులను గుర్తు చేసుకుంటారు. అప్పుడు వారిని మీరు అల్లాహ్‌కు సాటి కల్పించి, తిరస్కరించి మీ పుణ్యాలను వ్యర్థం చేసుకున్నారని, ఆటపాటల్లో గడిపి లాభం పొందారని, ఇక్కడ శిక్ష తప్ప మరేమీ లేదని చీవాట్లు పెట్టటం జరుగుతుంది. ఈ రెండు ఆయతులు అవిశ్వాసుల గురించి పేర్కొనబడ్డాయి. కాని దైవభీతిపరులు ప్రాపంచిక సుఖాలంటే భయపడతారు. మేమూ వీరిలో ఎక్కడ అయిపోతామో అని భయపడతారు. అందువల్లే ‘ఉమర్‌ (ర) మంచి ఆహార పదార్థాలకు దూరంగా ఉండేవారు. నన్నూ వీరిలా చీవాట్లు పెట్టటం జరుగుతుందేమోనని భయపడేవారు.

అందువల్లే ‘అబ్దుర్ర’హ్మాన్‌ బిన్‌ ‘ఔఫ్‌ రుచికరమైన పదార్థాలను చూచి ఏడ్సేవారు. తినకుండా వదలివేసారు. ‘అబ్దుర్ర’హ్మాన్‌ బిన్‌ ‘ఔఫ్‌ (ర) దైవభీతి వల్ల హమ్‌’జహ్ సంఘటనను గుర్తు చేసుకునేవారు. దానివల్ల అతను చాలా భయానికి గురయ్యేవారు. అందువల్లే అతన్ని చాలా సాధారణ ఆహారాన్ని తీసుకునేవారు. సాధారణ జీవితం గడిపేవారు. అల్లాహ్‌(త) అతని ధనంలో శుభం ప్రసాదించాడు.  ఒకవేళ నేను బండరాయిని ఎత్తినా, దాని క్రింద అనంత బంగారం దొరికేది. అందువల్ల అల్లాహ్ మార్గంలో ఇంత ఖర్చుపెట్టినా తన వారసులకు చాలా అధిక ధనం వదలివెళ్ళారు. చివరికి నలుగురు భార్యలు వారసత్వం లోని 8వ వంతు నుండి ఒక్కొక్కరు 80 వేల దీనార్లు పొందారు. బంగారు ఇటుకలు ఎన్ని ఉండేవంటే వాటిని గొడ్డలితోకోసి పంచడం జరిగింది. కోసేవారి చేతులు వాచి పోయాయి. ఇవేకాక వెయ్యి ఒంటెలు, 100 గుర్రాలు, 3000 మేకలు వదలి వెళ్ళారు.

—–

ముస్‌’అబ్బిన్‌ ‘ఉమైర్‌ ()

ప్రఖ్యాత, ప్రవక్త (స) అనుచరులు. అతనికి చాలా విచిత్ర కరమైన సంఘటన జరిగింది. ఇది ఆదర్శకరమైన, గుణపాఠం నేర్చుకోదగ్గ సంఘటన. అల్లాహ్‌(త) మనందరికీ వారి అడుగు జాడలపై నడిచే భాగ్యం ప్రసాదించు గాక!

అతని పేరు ము’స్‌’అబ్‌, బిన్ ‘ఉమైర్ బిన్ హాషిమ్ బిన్ ‘అబ్దుమునాఫ్ బిన్ ‘అబ్దుద్దార్ బిన్ ఖుసై అల్-ఖురషి, కునియత్‌ అబూ ము’హమ్మద్‌. తల్లి పేరు ‘ఖన్నాన్‌ బింతె మాలిక్‌. ము’స్‌’అబ్‌ మక్కాలోని చాలా అందమైన యువకులు. అతని తల్లి దండ్రులు అతన్ని చాలా ప్రేమించేవారు. అతని తల్లి అతన్ని చాలా అల్లారు ముద్దుగా పెంచారు. ఖరీదైన దుస్తులు, సువాసన ఉపయోగించేవారు. ప్రవక్త (స) అతన్ని ప్రస్తావిస్తూ మక్కహ్ లో ము’స్‌’అబ్‌ కన్నా అందగాడు, ఖరీదైన దుస్తులు ధరించేవారు మరెవ్వడూ లేడు.

అల్లాహ్‌ అందం, ఐశ్వర్యంతో పాటు మంచి హృదయం కూడా ప్రసాదించాడు. కేవలం ఒక్క నిమిషంలోనే ఏకత్వాన్ని స్వీకరించి షిర్క్‌ను అసహ్యించుకునేలా చేశాడు. ప్రవక్త (స) వద్దకు వచ్చి ఇస్లామ్‌ స్వీకరించారు.

ఇది ఎలాంటి పరిస్థితి అంటే ప్రవక్త (స) అర్ఖమ్బిన్అబీ అర్ఖమ్ ఇంట్లో శరణార్థులుగా ఉన్నారు. ముస్లిములు మక్కహ్ నగరంలో హింసలకు గురవుతున్నారు. ము’స్‌’అబ్‌ కొంత కాలం వరకు తన ఇస్లామ్‌ను రహస్యంగా ఉంచారు. రహస్యంగా వచ్చి ప్రవక్త (స)ను కలిసేవారు. అతని కుటుంబానికి తెలియపర్చారు. అది విని వారి ప్రేమ ద్వేషంగా మారిపోయింది. అతన్ని బంధించడం జరిగింది.

ము’స్‌’అబ్‌ కొంతకాలం వరకు చెరసాలలో ఉన్నారు. హింసలు భరిస్తూ ఉన్నారు. చివరికి హింసలు భరించలేక ‘హబ్‌షహ్ వైపు వలస వెళ్ళారు. ఇప్పుడు ఖరీదైన మంచి దుస్తులు లేవు. ప్రాపంచిక కోరికలు లేవు. ఒక్క తౌహీద్‌ కిరణం ఏ వస్తువు అవసరం లేకుండా చేసివేసింది. కొంతకాలం తరువాత మళ్ళీ మక్కహ్ తిరిగి వచ్చారు. అంతకు ముందు ఉన్న అంద-చందాలు అన్నీ తరిగి పోయాయి. అతని తల్లి జాలిపడి వదలివేశారు.

ఈ కాలంలోనే ఇస్లామ్‌ కిరణాలు మదీనహ్ పై పడ్డాయి. మదీనహ్ లోని ఒక వర్గం ఇస్లామ్‌ స్వీకరించింది. ప్రవక్త (స)ను వారు తమ శిక్షణ కోసం ఎవరినైనా పంపమని కోరారు. ప్రవక్త (స) ము’స్‌’అబ్‌ బిన్‌ ‘ఉమైర్‌ను కొన్ని నిర్దేశాలు ఇచ్చి పంపారు.

ము’స్‌’అబ్‌ (ర) మదీనహ్ చేరిన తర్వాత అస్‌’అద్బిన్‌ ‘జరారహ్ ఇంట్లో ఉండి, ఇంటింటికి వెళ్ళి ఇస్లాం బోధించ సాగారు. ఈ విధంగా కొంతమంది ఇస్లామ్‌ స్వీకరించారు. నమా’జు మరియు ఖుర్‌ఆన్‌ పఠనం అస్‌’అద్‌ ఇంట్లో ఒక్కో సారి బనీ ”జఫర్‌ ఇంట్లో ఆచరించసాగారు. ఒకసారి ము’స్‌’అబ్‌ అలవాటు ప్రకారం బనీ ”జఫర్‌ ఇంట్లో ముస్లిములకు శిక్షణ ఇస్తున్నారు. ఇంతలో అబ్దుల్‌ అష్‌హల్‌ నాయకుడు స’అద్‌ బిన్‌ ము’ఆజ్‌’ తన స్నేహితులతో సహా వచ్చి, ‘ఉసైద్‌ బిన్‌ ఖు’దైర్‌ను ”ఈ ఇస్లామ్‌ ప్రచారకుణ్ని మన వీధి నుండి గెంటివేయండి. ఇక్కడకు వచ్చి బలహీనులను చెడగొడుతున్నాడు. ఒకవేళ అస్‌’అద్‌తో నాకు బంధుత్వం లేకుంటే, మీకు చెప్పి ఉండేవాడిని కాను” అని అన్నారు. అది విని ‘ఉసైద్‌ బల్లెం ఎత్తి ము’స్‌’అబ్‌ మరియు అస్‌’అద్‌ వద్దకు వచ్చి కఠినంగా ప్రవర్తిస్తూ ‘నిన్ను ఇక్కడికి ఎవరు పిలిచారు, బలహీనుల్ని చెడగొడుతున్నావు. మీకు మీ ప్రాణులపై ఆశ ఉంటే వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోండి’ అని అన్నారు. దానికి ము’స్‌’అబ్‌ నిదానంగా మాట్లాడుతూ, ‘కూర్చొని మా మాటలు వినండి, మీకు నచ్చితే స్వీకరించండి, లేదా మేము వెళ్ళిపోతాము’ అని అన్నారు. ‘ఉసైద్‌ బల్లెం పాతి కూర్చున్నారు. శ్రద్ధగా వినసాగారు. ము’స్‌’అబ్‌ కొన్ని ఖుర్‌ఆన్‌ ఆయతులు పఠించి ఇస్లామ్‌ బోధనలను అతని ముందు పెట్టారు. కొంతసేపటికే ఉసైద్ హృదయం విశ్వాసంతో మెరవ సాగింది. ఉత్సాహంతో ‘ఎంత మంచి ధర్మం, ఎంత మంచి మార్గదర్శకం, ఈ ధర్మంలో చేరేపద్ధతి ఏమిటి?’ అని అడిగారు. దానికి ము’స్‌’అబ్‌, ‘ముందు స్నానం చేసి పరిశుభ్రమైన దుస్తులు ధరించి, నిర్మలమైన మనస్సుతో,

 ”లా ఇలాహ ఇల్లల్లాహు ముహమ్మదు ర్రసూలుల్లాహ్” అని పఠించి, స్వీకరించు’ అని అన్నారు. అతడు వెంటనే సిద్ధమై పవిత్రవచనం పఠించి ఇస్లాం స్వీకరించారు. ఇంకా ‘నా తరువాత మరోవ్యక్తి ఉన్నాడు. అతను ఇస్లామ్‌ స్వీకరించాలి. ఒకవేళ అతను ఇస్లామ్‌ స్వీకరిస్తే అబ్దుల్అష్హల్ తెగవారందరూ అతన్ని అనుసరిస్తారు. నేనతన్ని మీ వద్దకు పంపిస్తాను’ అని అన్నారు.

ఉ’సైద్‌ (ర) ఆగ్రహానికి బదులు ప్రేమ కొనుగోలు చేసుకొని తన వర్గం వైపు తిరిగి వచ్చారు. స’అద్‌ బిన్‌ ము’ఆజ్‌’ దూరం నుండే చూచి, ‘దైవం సాక్షి! వీడిలో ఏదో గొప్ప విప్లవం వచ్చి ఉంటుంది’ అని అనుకున్నారు. దగ్గరకు రాగానే ‘ఏమయింది’ అని అడిగారు. దానికి ఉ’సైద్‌ (ర) ‘వారిద్దరూ ఏమాత్రం భయపడేటట్లులేదు. నేను వారిని వారించాను. దానికి వారు మీరు కోరిందే మేము చేస్తామని’ అన్నారు. అయితే అస్‌’అద్‌ బిన్‌ ”జరారహ్ నీ పిన్ని కొడుకు కావటం వల్ల బనీ ‘హారిస’హ్ అతన్ని చంపాలని బయలుదేరారు. దానివల్ల నీకు అవమాన పరచినట్లు ఉంటుందని’ అన్నారు. బనీహారిసహ్ మరియు ‘అబ్దుల్‌ అష్‌హల్‌లో చాలా కాలంగా శతృత్వం ఉంది. అందువల్ల ఉ’సైద్‌ ఆలోచన ఫలించింది. అద్బిన్ముఆజ్‌’ ఆగ్రహంతో లేచి నిలబడ్డారు. ధార్మిక వ్యతిరేకత ఉన్న అస్‌’అద్‌ సహాయం కోసం బయలు దేరారు. అక్కడకు చేరి చూసేసరికి అంతా ప్రశాంతంగా ఉండటం చూచి కూర్చున్నారు. ఉ’సైద్‌ వారిద్దరితో మాట్లాడటానికి నన్ను ప్రేరేపించాడని గ్రహించారు. మళ్ళీ ధర్మవ్యతిరేకత చోటుచేసుకుంది. కఠినంగా ప్రవర్తిస్తూ దైవం సాక్షి! అబూ ఉమామహ్ బంధుత్వాన్ని లెక్క చేయ కుంటే నీ పట్ల కఠినంగా ప్రవర్తించేవాడిని మా ప్రాంతంలో బహిరంగంగా ఇటువంటి నమ్మకాలు వ్యాపింపజేసే ధైర్యం నీకు ఎక్కడినుండి వచ్చింది. దానికి ము’స్‌’అబ్‌ ప్రశాంతంగా సమాధానమిస్తూ ‘ముందు మా సందేశం వినండి, ఇష్టమైతే స్వీకరించండి, లేకుంటే మేమే వెళ్ళిపోతాం’ అని అన్నారు. స’అద్‌ దానికి సమ్మతించారు. అప్పుడు ము’స్‌’అబ్‌ (ర) అతనికి ఇస్లామ్‌ సందేశాన్ని అందజేశారు. స’అద్‌ ముఖం విశ్వాసంతో మెరవసాగింది. అప్పటికప్పుడే ఇస్లామ్‌ స్వీకరించారు. అమిత ఉత్సాహంతో తన తెగవారి వద్దకు వచ్చి బహిరంగంగా ఇలా ప్రశ్నించారు: ”ఓ బనీ అష్‌హాల్‌! నే నెవరినో చెప్పండి! దానికి వారు, మీరు మా నాయకులు, మా అందరికంటే వివేకవంతులు, ఉన్నత కుటుంబానికి చెందినవారు” అని అన్నారు.

అప్పుడు, ‘దైవం సాక్షి! మీరు అల్లాహ్‌ను ఆయన ప్రవక్తను విశ్వసించనంతవరకు మీలోని పురుషులతో, స్త్రీలతో మాట్లాడటం నాకు నిషిద్ధం’ అని అన్నారు. ఈ విధంగా స’అద్‌ బిన్‌ ము’ఆజ్‌’ ప్రభావం వల్ల ‘అబ్దుల్‌ అష్‌హాల్‌ తెగవారందరూ ఇస్లామ్‌ స్వీకరించారు.

ము’స్‌’అబ్‌ బిన్‌ ఉమైర్‌ (ర) కొంతకాలం వరకు అస్‌’అద్‌ బిన్‌ ”జరారహ్ అతిథిగా ఉన్నారు. కాని బనీ నజ్జార్‌ అతని పట్ల పక్షపాతంగా వ్యవహరించటం వల్ల స’అద్‌ బిన్‌ ము’ఆజ్‌’ ఇంటికి వచ్చారు. ఇక్కడి నుండే ఇస్లామ్‌ సందేశం అందజేస్తూ ఉన్నారు. చివరికి ఖత్మీ, వాయిల్‌ మరియు వాఖిఫ్‌ల ఇళ్ళు తప్ప మదీనహ్ లోని కుటుంబాలన్నీ ఇస్లామ్‌ స్వీకరించాయి.

మదీనాలో జుమఅహ్ప్రారంభం: మదీనహ్ లో ముస్లిముల ఒక పెద్ద బృందం తయారయింది. ము’స్‌’అబ్‌ బిన్‌ ‘ఉమైర్‌ (ర) ప్రవక్త (స) అనుమతితో, అ’సద్‌ బిన్‌ ఖసీమహ్‌ ఇంటిలో సామూహికంగా జుమ’అహ్‌ నమా’జు ప్రారంభించారు. ముందు నిలబడి ప్రభావ పూరితమైన ఖు’త్బా ఇచ్చారు, తరువాత వినయ విధేయతలతో, భక్తి-శ్రద్ధలతో నమా’జు చదివించారు. తరువాత వచ్చిన వారికి ఒక మేక కోసి విందు ఏర్పాటు చేశారు. ఈ విధంగా ఇస్లామీయ చిహ్నంగా, వారంలో ఒకసారి ముస్లిములు పరస్పరం కలుసుకునే అవకాశం లభించింది. ప్రత్యేకంగా ము’స్‌’అబ్‌ బిన్‌ ఉమైర్‌ (ర) ప్రత్యేక శ్రద్ధవల్ల ప్రారంభించబడింది.

బైఅతెఉఖ్బహ్ సాని: ‘ఉఖ్‌బహ్ మొదటి బై’అత్‌లో కేవలం 12 మంది అ’న్సార్లు పాల్గొన్నారు. కాని ము’స్‌’అబ్‌ బిన్‌ ‘ఉమైర్‌ (ర) కేవలం ఒక్క సంవత్సరంలోనే మదీనహ్  ప్రజలందరినీ ఇస్లామ్‌లో చేర్పించారు. ఇంకా ప్రవక్త (స) ను మదీనహ్ మునవ్వరకు ఆహ్వానించటానికి బయలుదేరారు. వారి గురువు ము’స్‌’అబ్‌ బిన్‌ ‘ఉమైర్‌ (ర) కూడా వెంట ఉన్నారు. అతను మక్కహ్ చేరిన వెంటనే ప్రవక్త (స) వద్దకు వెళ్ళి, తన అసామాన్య విజయం గురించి విన్నవించు కున్నారు. ప్రవక్త (స) వివరాలన్నీ శ్రద్ధగా విన్నారు. అతన్ని చాలా పొగిడారు.

అతని తల్లి తన కుమారుడు వచ్చాడని తెలిసి, ”ఓ అవిధేయ కుమారా! నేను ఉన్నానని తెలిసి కూడా ముందు నన్ను కలవటానికి రాకుండా ఉన్నావా?” అని కబురు పంపారు. దానికి అతను సమాధానమిస్తూ, ‘ప్రవక్త (స) కంటే ముందు ఎవరినీ కలవనని’ కబురు పంపారు. ము’స్‌’అబ్‌ (ర) ప్రవక్త (స)ను కలుసుకున్న తర్వాత తన తల్లి దగ్గరకు వెళ్ళారు. అతని తల్లి, ‘నువ్వు ఇప్పటి వరకు మా ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నావని అనుకుంటున్నాను,’ అని అన్నారు. దానికి ము’స్‌’అబ్‌ (ర) ‘నేను ప్రవక్త (స) ధర్మమైన ఇస్లామ్‌ ధర్మంపై ఉన్నాను. దీన్నే అల్లాహ్‌ తన కోసం, తన ప్రవక్త (స) కోసం ఎన్నుకున్నాడు,’ అని అన్నారు. దానికి అతని తల్లి, ” ‘హబషహ్ లో వచ్చిన కష్టాలు మరచిపోయావా? ఇప్పుడు యస్రిబ్‌లో పడుతున్నావు. రెంటివల్ల నీవు గుణపాఠం నేర్చుకోలేదా” అని అన్నారు.

ము’స్‌’అబ్‌ (ర) మళ్ళీ నన్ను చెరసాలలో వేయాలని అనుకుంటుందని గ్రహించి బిగ్గరగా, ‘నీవు బలవంతంగా ఒకరిని అతని ధర్మం నుండి మార్చగలవా, ఒకవేళ నీవు మళ్ళీ నన్ను బంధించాలని అనుకుంటే, నా వైపునకు ఎవరు ముందుకు వస్తే వాడి తల నరికివేస్తాను’ అని అన్నారు. అది చూసి అతని తల్లి, ”చాలు, ఇక నా ముందు నుండి వెళ్ళిపో” అని ఏడ్వసాగింది.  ము’స్‌’అబ్‌ (ర) ప్రభావితులై, ‘ఓ నా తల్లీ! నీ క్షేమం కోరి సలహా ఇస్తున్నాను. ‘అల్లాహ్‌ తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరని, ము’హమ్మద్‌ (స) ఆయన ప్రవక్త అని సాక్ష్యం ఇవ్వు’ అని అన్నారు. దానికి ఆమె, ‘నక్షత్రాల సాక్షిగా! నేను ఈ ధర్మంలో చేరడానికి అవివేకిని కాను, పో నీనుండి నీ మాటల నుండి నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను నా ధర్మాన్నే అనుసరిస్తాను,’ అని అన్నది.

మదీనహ్ వైపు హిజ్రత్‌: ము’స్‌’అబ్‌ (ర) మక్కహ్ వచ్చిన తరు వాత జిల్‌ ‘హిజ్జహ్‌, ము’హర్రమ్‌, ‘సఫర్‌, ప్రవక్త (స) వెంట ఉన్నారు. రబీ’ఉల్‌ అవ్వల్‌ 1న ప్రవక్త (స) కంటే 12 రోజులు ముందు హిజ్రత్‌ చేసి శాశ్వతంగా మదీనహ్ కు బయలు దేరారు.

పోరాటాలు: 2 హిజ్రీ నుండి సత్యా-సత్యాల మధ్య భయంకర పోరాటాలు ప్రారంభమయ్యాయి. ము’స్‌’అబ్‌ బిన్‌ ‘ఉమైర్‌(ర) యుద్ధ మైదానంలో కూడా చాలా గొప్ప పాత్ర పోషించారు. బద్ర్లో ముహాజిరీన్ల అన్నిటి కంటే  పెద్ద జండా అతని చేతిలో ఉండేది. హుద్ యుద్ధంలో కూడా జండా పట్టుకునే అదృష్టం అతనికే దక్కింది.

వీరమరణం: ఈ యుద్ధంలో చిన్న పొరపాటు విజయాన్ని అపజయంగా మార్చివేసింది. ముస్లిములు ఆందోళనకు గురై చిందరవందర అయిపోయారు. అప్పుడు కూడా ఈ ఇస్లామ్‌ సేవకుడు జెండా పట్టుకొని ఒంటరిగా అవిశ్వాసులకు ఎదురుగా నిలబడ్డారు. వెనక్కి తగ్గడం అవమానంగా భావించారు. ఇంతలోనే అవిశ్వాసుల్లోని ఒకడు ఇబ్నె ఖుమ్మహ్‌ కరవాలంతో దాడిచేశాడు. కుడి చేయి తెగిపోయింది. వెంటనే ఎడమ చేతితో జండాను పట్టుకున్నారు. అప్పుడు అతను ఈ ఆయతు పఠిస్తు న్నారు, ”వమా ము’హమ్మదున్‌ ఇల్లా రసూలున్‌ ఖద్‌’ఖలత్‌ మిన్‌ ఖబ్‌లిహిర్రుసుల్‌” ‘మరియు ము’హమ్మద్‌ కేవలం ఒక సందేశహరుడు మాత్రమే. వాస్తవానికి, అతనికి పూర్వం అనేక సందేశహరులు గడచిపోయారు…” (సూ. ఆల ఇమ్రాన్, 3:144)

ఇబ్ను ఖుమ్మహ్‌ మరోదాడి చేశాడు. ఎడమచేయి కూడా తెగిపడింది. కాని ఈ సారి రెండు చేతులతో జండాను గుండెకు హత్తుకున్నారు. వాడు కరవాలం పారవేసి బల్లెంతో గురిచూసి దాడిచేశాడు. దాని చివరి భాగం తెగి గుండెలో ఉండి పోయింది. ఈ విధంగా ము’స్‌’అబ్‌ వీరమరణం పొందారు. ఆ తరువాత అతని సోదరుడు ముందుకు దూకి జండాను అందుకున్నారు. చివరి వరకు వీరోచితంగా పోరాడారు.

ఖనన సంస్కారాలు: యుద్ధం ముగిసిన తర్వాత ప్రవక్త(స) ము’స్‌’అబ్‌ బిన్‌ ‘ఉమైర్‌ (ర) శవం వద్ద నిలబడి ”మినల్ మూ’మినీన రిజాలున్‌ సదఖూ మా ఆ’హదుల్లాహ అలైహి….” — ‘విశ్వాసులలో అల్లాహ్‌కు తాము చేసిన ఒప్పందం నిజంచేసి చూపినవారు కూడా ఉన్నారు…’ పఠించారు. (సూ. అల్‌ అహ్‌జాబ్‌, 33:23) తరువాత శవాన్ని ఉద్దేశించి ఇలా అన్నారు: ”నేను నిన్ను మక్కహ్ లో చూశాను, నీలాంటి ఖరీదైన దుస్తులు, పరిమళాలు ఎవరూ ధరించేవారు కారు. కాని ఈ రోజు నీ వెంట్రుకలు చిందర వందరగా ఉండటం నేను చూస్తున్నాను. శరీరంపై కేవలం ఒక్క దుప్పటి మాత్రమే ఉంది. నిస్సందేహంగా దైవప్రవక్త సాక్ష్యం ఇస్తున్నాడు, తీర్పుదినం నాడు మీరు అల్లాహ్‌ సన్నిధిలో హాజరౌతారు” అని అన్నారు. తరువాత తోటి యుద్ధ వీరులను చివరిసారిగా దర్శించి సలామ్‌ పంపమని ఆదేశించటం జరిగింది. ఇంకా ఇలా అన్నారు, ”ఎవరిచేతిలో నా ప్రాణం ఉందో, ఆయన సాక్షి! తీర్పుదినం వరకూ ఎవరు సలామ్‌ పంపినా, అతను దానికి సమాధానం ఇస్తారు,” అని అన్నారు.

ఆ కాలంలో దారిద్య్రం వల్ల వీరమరణం పొందిన ఇస్లామీయ వీరులకు కఫన్‌ వస్త్రం అయినా లభించలేదు. ము’స్‌’అబ్‌ బిన్‌ ‘ఉమైర్‌ శవంపై కేవలం ఒక్క దుప్పటి ఉండేది. తల కప్పితే కాళ్ళు బయటపడేవి, కాళ్ళు కప్పితే తల బయటపడేది. చివరికి తలను దుప్పటితో కప్పి, కాళ్ళను గడ్డితో కప్పటం జరిగింది. (బు’ఖారీ)

అతని సోదరులు అబుర్రూమ్‌ బిన్‌ ‘ఉమైర్‌, ఆమిర్‌ బిన్‌ రబీ’అ మరియు సువైబిత్‌ బిన్‌ స’అద్‌ల సహాయంతో ఖనన సంస్కా రాలు పూర్తిచేశారు.

ఇన్నాలిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్‌.

—–

హమ్‌’జహ్ బిన్‌ ‘అబ్దుల్ముత్తలిబ్

ఈ ‘హదీసు’లో ‘అబ్దుర్ర’హ్మాన్‌ బిన్‌ ‘ఔఫ్‌, ‘హమ్‌’జహ్ (ర)ను గురించి కూడా ప్రస్తావించటం జరిగింది. అందు వల్ల అతని గురించి కూడా సంక్షిప్తంగా ప్రస్తావించటం మంచిదనుకుంటాను.

‘హమ్‌’జహ్ (ర) ప్రవక్త చిన్నాన్న మరియు పాల సోదరులు. ఎందుకంటే ప్రవక్త (స) మరియు ‘హమ్‌’జహ్ (ర) ఇద్దరూ అబూ లహబ్‌ సేవకురాలు, సువైబియహ్ పాలు త్రాగారు. ‘హమ్‌’జహ్ (ర) వయస్సులో ప్రవక్త (స) కంటే 10 సంవత్సరాలు పెద్దవారు. వీరు చాలా బలవంతులు మరియు పహెల్‌వాన్‌ వంటివారు. బాల్యం నుండే కత్తి యుద్ధం, బాణ విద్య, కుస్తీలో ఉత్సాహం ఉండేది. పర్యటించటం కూడా అతను చాలా ఇష్టపడేవారు. ఇతని ఇస్లామ్‌ స్వీకరణ సంఘటన చాలా విచిత్రమైనది. ఒకరోజు అలవాటు ప్రకారం వేట నుండి వస్తున్నారు. సఫా కొండవద్దకు రాగానే ఒక సేవకురాలు అబూ అమ్మారహ్‌ కొంచెం ముందు వస్తే బాగుండు, మీ అన్న కొడుకు ము’హమ్మద్‌ (స) కాబా వద్ద తన ధర్మం గురించి బోధిస్తున్నారు. ఇంతలో అబూజహల్‌ చాలా కఠినంగా ప్రవర్తిస్తూ, తిడుతూ, చాలా హింసించాడు. కాని ప్రవక్త (స) ఏమీ సమాధానం ఇవ్వలేదు. మౌనంగా వెళ్ళిపోయారు’ అని చెప్పింది. అది విన్న ‘హమ్‌’జహ్ (ర) ఆగ్రహంతో క’అబహ్ వైపు వెళ్ళారు. వేట నుండి వచ్చినపుడు మార్గంలో ఎవరైనా కలిస్తే, స్వల్పంగా మాట్లాడుకునేవారు. కాని ఆ సమయంలో ఆగ్రహంతో ఎవరితోనూ మాట్లాడకుండా, క’అబహ్ చేరి అబూ జహల్‌ తలపై తన విల్లుతో బలంగా కొట్టారు. దానికి వాడు గాయపడ్డాడు. అది చూసి బనీ మఖ్జూమ్కు చెందిన కొందరు వ్యక్తులు అబూ జహల్‌ సహాయం కోసం పరిగెత్తు కుంటూ వచ్చి, ‘ ‘హమ్‌’జహ్! నీవు కూడా ధర్మం మార్పిడికి గురయినట్లుంది’ అని అన్నారు. దానికి ‘హ’మ్‌జహ్ సమాధానం ఇస్తూ ‘దాని వాస్తం నాకు తెలిసిన తరువాత ఏ శక్తీ నాకు దాన్నుండి ఆపలేదు’ అని అన్నారు. (ముస్తదరక్‌ ‘హాకిమ్‌ 3 / 193)

అవును, ”ము’హమ్మద్‌ (స) అల్లాహ్‌ ప్రవక్త” అని, వారు చెప్పింది వాస్తవం అని నేను సాక్ష్యం ఇస్తున్నాను. ”అల్లాహ్ సాక్షి! ఇప్పుడు నేను దాన్ని వదిలే వాడిని కాను. మీరే గనుక సత్యవంతులే అయితే నన్ను ఆపి చూడండి” అని అన్నారు. దానికి అబూ జహల్‌, ‘అబూ అమ్మారహ్‌ను వదలివేయండి. దైవం సాక్షి! ఇప్పుడే నేను అతని అన్న కొడుకును తిట్టి పోసాను’ అని అన్నాడు.

ఈ కాలంలో ప్రవక్త (స) అర్‌ఖమ్‌ బిన్‌ అబీ అర్‌ఖమ్‌ ఇంట్లో శరణార్థులుగా ఉన్నారు. కేవలం కొంతమంది బలహీనులే విశ్వాసులుగా ఉన్నారు. ‘హమ్‌’జహ్ ఇస్లామ్‌ స్వీకరణ వల్ల పరిస్థితి మారిపోయింది. అవిశ్వాసుల ఆగడాలు, హింసలు ఆగిపోయాయి. ఎందుకంటే ‘హమ్‌’జహ్ వీరత్వం, బలం, దృఢత్వం గురించి మక్కహ్ లో అందరికీ తెలుసు. (అసదుల్‌ ‘గాబహ్‌)

‘హమ్‌’జహ్ ఇస్లామ్‌ స్వీకరించిన తర్వాత ఒకరోజు ‘ఉమర్‌ (ర) ప్రవక్త (స) వద్దకు వచ్చి, తలుపుతట్టారు. చేతిలో కరవాలం ఉంది. అందువల్ల అనుచరులు తలుపులు తెరవటానికి సంశయంలో పడ్డారు. కాని ‘హమ్‌’జహ్(ర), ‘ఏం ఫరవాలేదు, రానివ్వండి, మంచిగా వస్తే సరే, లేకుంటే అతని కరవాలంతోనే అతని తల నరికివేస్తాను’ అని అన్నారు. అనంతరం అతను లోపలికి వచ్చారు. వెంటనే ఇస్లామ్‌ స్వీకరించారు. ముస్లిములు సంతోషంతో అల్లాహు అక్బర్‌ నినాదాలు చేశారు. (‘తబఖాతు ఇబ్నుస’అద్‌)

సోదర భావం: మక్కహ్ లో ప్రవక్త (స) ప్రియ సేవకులు జైద్బిన్‌ ‘హారిసహ్ (ర) ‘హమ్‌’జహ్ సోదరునిగా పరిగణించబడ్డారు. అతను జైద్‌ బిన్‌ ‘హారిస’హ్ ను చాలా ప్రేమించేవారు. పోరాటాల్లోకి వెళ్ళినపుడు అతనికే హితబోధ చేసి వెళ్ళేవారు.

హిజ్రత్‌: 13వ సంవత్సరం ప్రవక్త (స) అనుచరులందరితో కలసి హిజ్రత్‌ చేసి మదీనహ్ చేరుకున్నారు. అతనికి తన వీరత్వం, శక్తి సామర్థ్యాలను ప్రదర్శించే గొప్ప అవకాశం చేజిక్కింది. అనంతరం మొదటి సైనిక దళం అతని వెంట వెళ్ళింది. 30 మందితో కూడిన సైనిక దళం అతని నేతృత్వంలో తీరప్రాంతం వైపు అవిశ్వాసులను అడ్డుకోవటానికి పంపబడింది.

అక్కడకు చేరిన తర్వాత అబూ జహల్‌ వర్గం వారితో సంఘర్షణ జరిగింది. అందులో 300 మంది ఉన్నారు. ఇరు వర్గాలు యుద్ధానికి సిద్ధమయ్యాయి. కాని మజ్‌దీ బిన్‌ ‘అమ్రూ అల్‌ జుహ్‌నీ సంప్రదింపుల ద్వారా యుద్ధం జరగకుండా వారించారు. ‘హమ్‌’జహ్ (ర) యుద్ధం, రక్తపాతం జరగకుండా తిరిగి వచ్చారు. (తబఖాతు ఇబ్ను స’అద్‌)

హమ్‌జహ్ చాలా పోరాట పటిమ మరియు వీరత్వం గలవారు. అనేక పోరాటాల్లో పాల్గొన్నారు. బద్ర్‌ యుద్ధంలో కూడా పాల్గొన్నారు. బద్ర్‌ యుద్ధంలో పంక్తులు సరిచేసిన తర్వాత అవిశ్వాసుల తరఫున ఉత్బహ్, షైబహ్, వలీద్ ముందుకు వచ్చి, యుద్ధం ప్రారంభించమని కోరగా, కొందరు అన్సార్‌ యువకులు ముందుకు వచ్చారు. కాని ‘ఉత్‌బహ్, ‘ఓ ము’హమ్మద్‌! మేము ఊరుపేరు లేనివారితో యుద్ధం చేయము. మాకు తగిన వారిని పంపండి’ అని కేకలు వేసి ఛాలెంజ్‌ చేశాడు. అప్పుడు ప్రవక్త (స), ” హమ్‌’జహ్ (), ‘అలీ (), ఉబైదహ్(ర) లేవండి, ముందుకు వెళ్ళండి” అని ఆదేశించారు. వెంటనే ఆ ముగ్గురూ బల్లాలు త్రిప్పుతూ శత్రువు ఎదుట నిలబడ్డారు. ‘హమ్‌’జహ్ మొదటి దాడిలోనే ‘ఉత్‌బహ్ ను అంతమొందించారు. ‘అలీ (ర) కూడా తన వ్యతిరేకిని అధిగమించారు. కాని అబూ ఉబైదహ్‌ బిన్‌ జర్రాహ్‌ మరియు వలీద్‌తో చాలాసేపు వరకు సంఘర్షణ జరిగింది. అతను గాయపడ్డారు. అప్పుడు వారిద్దరూ వాడిపై దాడి చేసి అంతం చేశారు. (‘తబఖాత్‌ ఇబ్నుస’అద్‌)

అది చూసి తమీమ బిన్‌ ‘అదీ ఆగ్రహం, ప్రతీకార జ్వాలతో ముందుకు దూకాడు. ‘హమ్‌జహ్ (ర) ఒక్క దాడిలోనే వాడిని అంతం చేశారు. అవిశ్వాసులు ఆగ్రహంతో అన్ని వైపుల నుండి దాడిచేశారు. ఇటు ముస్లిమ్‌ వీరులు కూడా వారిపై విరుచుకుపడ్డారు. భీకర పోరాటం జరిగింది. ‘హమ్‌’జహ్ చేతిపై షుతుర్‌ ముర్గ్ బొమ్మ ఉండేది. అతను ఎటు వెళ్ళినా స్పష్టంగా గుర్తించ బడేవారు. రెండు చేతుల్లో కరవాలం ఉండేది. శత్రువుల్లో దూరి వారిని సమాప్తం చేసేవారు. కొద్దిసేపట్లోనే ఖైదీలు, యుద్ధ ధనం వదలి పారిపోయారు. కొందరు ఖైదీలు ‘ఈ షుతుర్‌ ముర్గ్‌ బొమ్మ గల వ్యక్తి ఎవరు’ అని అడిగారు. దానికి ప్రజలు ‘హమ్‌’జహ్ (ర)’ అని అన్నారు. అప్పుడు వారు, ‘ఈ రోజు అందరికంటే అధికంగా ఈయనే మాకు నష్టం చేకూర్చాడు,’ అని అన్నారు. (అసదుల్‌ ‘గాబహ్‌)

బనీ ఖైనుఖాహ్పోరాటం: మదీనాలో బనూ ఖైన్‌ఖాహ్‌ అనే యూదుల ప్రాంతం ఉండేది. వీరు అబ్దుల్లాహ్బిన్ఉబయ్బిన్సలూల్కు మిత్రులు. అందువల్ల ప్రవక్త (స) తో స్నేహ పూర్వకమైన ఒప్పందం జరిగింది. కాని బద్ర్‌ యుద్ధవిజయం వారిని అసూయ, ఈర్ష్యా-ద్వేషాలకు గురిచేసింది. బహిరంగంగా వ్యతిరేకతకు సిద్ధపడ్డారు. అనంతరం ప్రవక్త (స) ఒప్పందం భంగం చేసినందుకు ఆ సంవత్సరమే షవ్వాల్‌ నెలలో వారిపై దాడిచేశారు. వారిని మదీనహ్ నుండి గెంటివేశారు. ఈ యుద్ధంలో కూడా ‘హమ్‌’జహ్ ప్రధాన పాత్ర పోషించారు. (‘తబఖాతు ఇబ్ను స’అద్‌)

బద్ర్‌ యుద్ధంలో అపజయం తరువాత అవిశ్వాసులు ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్నారు. 3వ హిజ్రీలో ఖురైషుల సమూహం మళ్ళీ మదీనహ్ పై దాడి చేసింది. షవ్వాల్‌ 7, శనివారం యుద్ధం ప్రారంభం అయ్యింది. అవిశ్వాసుల తరఫున సబా’ ముందుకు వచ్చి, ఛాలెంజ్‌ చేయగా, ‘హమ్‌’జహ్ తన కరవాలం త్రిప్పుతూ మైదానంలోకి వచ్చారు. బిగ్గరగా, ‘ఓ సబా’! నీచుడా! నీవు అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్తతో యుద్ధం చేయడానికి  వచ్చావా?’ అని హెచ్చరించి, గురిచూసి దాడి చేశారు. ఒక్క దాడితోనే వాడు అంతం అయ్యాడు. తరువాత భీకర పోరాటం జరిగింది. వీర ‘హమ్‌’జహ్ శత్రువుల్లో దూరి వారిని చిందర వందరచేసి, 30 మంది అవిశ్వాసులను అంతం చేశారు. (అసదుల్‌ ‘గాబహ్‌)

వీరమరణం: ‘హమ్‌’జహ్ (ర) బద్ర్‌ యుద్ధంలో ఖురైష్‌ నాయకులను ఏరి ఏరి అంతం చేశారు. అందువల్ల అవిశ్వాసులు అందరి కంటే ‘హమ్‌’జహ్ పై ప్రతీకారం తీర్చు కోవాలని ఎదురుచూస్తున్నారు. జుబైర్బిన్ముత్‌’అమ్, వహ్‌షీ అనే బానిసను తన చిన్నాన్న తమీమహ్ బిన్‌ ‘అదీ ప్రతీకారానికి ప్రత్యేకంగా తయారు చేసాడు. ప్రతిఫలంగా విడుదల చేస్తానని అన్నాడు. అతడు ఉ’హుద్‌ యుద్ధంలో ఒక బండరాయి వెనుక కూర్చొని ‘హమ్‌’జహ్ (ర) గురించి ఎదురు చూస్తున్నాడు. అకస్మాత్తుగా దగ్గర నుండి తన కరవాలంతో దాడి చేశాడు. రెండు ముక్కలై క్రిందపడ్డారు. (బు’ఖారీ) అతని మరణంపై అవిశ్వాస స్త్రీలు సంతోషంతో సంబరాలు చేసుకున్నారు. అబూ సుఫియాన్‌ భార్య హింద బిన్తెఉత్బహ్, చెవులు, ముక్కు కోసి హారంగా వేసుకుంది. గుండెకోసి తీసి నమిలి పారవేసింది. అది విని ప్రవక్త (స) ‘ఆమె తిన్నదా’ అని అడిగారు. దానికి ప్రజలు ‘లేదు’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స) ఓ దేవా! ‘హమ్‌’జహ్ యొక్క ఏ శరీరభాగాన్నీ నరకానికి గురిచేయకు. (‘తబఖాతుల్‌ ఇబ్నుస’అద్‌, బు’ఖారీ)

కఫన్ఖనన సంస్కారాలు: యుద్ధం ముగిసిన తర్వాత వీర మరణం పొందిన వారి ఖనన సంస్కారాలు ప్రారంభ మయ్యాయి. ప్రవక్త (స) తన చిన్నాన్న శవం వద్దకు వచ్చారు. హింద అతని ముక్కు చెవులు కోసి అంద వికారంగా చేసివేసింది. ఆ సన్నివేశం చూసి దుంఖః, విచారం కట్టలు త్రెంచుకొని, శవాన్ని ఉద్దేశించి, ‘నీపై దైవకారుణ్యం అవతరించు గాక! ఎందుకంటే నీవు బంధువులను కనిపెట్టుకొని ఉండే వాడివి. సత్కార్యాల్లో ముందు ఉండేవాడివి. ఒకవేళ నేను, ‘సఫియ్య (ర) దుంఖః, విచారం గురించి ఆలోచించకుంటే నిన్ను ఇలాగే వదలివేసేవాడిని జంతువులు తినివేయటానికి. తీర్పుదినం నాడు వాటి కడుపుల్లో నుండి లేపబడతావు. అల్లాహ్ సాక్షి! నాపై నీ ప్రతీకారం తప్పనిసరి అయి పోయింది. నేను నీకు బదులు 70 మంది అవిశ్వాసులను వ్యతిరేక దిశలో కాళ్ళూ, చేతులూ నరుకుతాను’ అని ప్రతిజ్ఞ చేశారు. కాని కొంతసేపటికే ప్రతీకారం తగదని అల్లాహ్ నిషేధాజ్ఞ రానే వచ్చింది. అందువల్ల పరిహారం తీసుకొని శత్రు ఖైదీలను వదలివేయడం జరిగింది. (‘తబఖాతు ఇబ్ను స’అద్‌)

సఫియ్య () హమ్జహ్ () సొంత చెల్లెలు, సోదరుడు వీర మరణం పొందాడని తెలిసి శవం వద్దకు వచ్చింది. కాని ప్రవక్త (స) చూడనివ్వలేదు. ఓదార్చి పంపివేశారు. ‘సఫియ్య తన కొడుకుజుబైర్కు 2 దుప్పట్లు ఇచ్చి, వాటిని కఫన్‌గా ఉపయోగించమని చెప్పి వెళ్ళారు. కాని ప్రక్కన ఒక అ’న్సారీ శవం కూడా ఉండటం వల్ల ఇద్దరికీ ఒక్కొక్క దుప్పటిని ఉపయోగించటం జరిగింది. ఆ ఒక్క దుప్పటిని తల కప్పితే కాళ్ళు బయటపడేవి. కాళ్ళు కప్పితే తల బయటపడేది. అనంతరం ప్రవక్త (స) తల వైపు దుప్పటితో కప్పమని, కాళ్ళపై గడ్డి, ఆకులతో కప్పమని ఆదేశించారు. ఈవిధంగా అమర వీరుల నాయకుడి జనా’జహ్ తయారయింది. ప్రవక్త (స) జనా’జహ్ నమా’జు చదివించారు. ఆ తరువాత సుమారు 70 మందికి వేర్వేరుగా నమా’జు చదవడం జరిగింది. అందరినీ ఆ మైదానంలోనే ఖననం చేయడం జరిగింది. (‘తబఖాతు ఇబ్నె స’అద్‌)

కాని బు’ఖారీ ఉల్లేఖనం ప్రకారం అప్పుడు ప్రవక్త (స) జనా’జహ్ నమా’జు చదవలేదని తెలుస్తుంది.

[44]) వివరణ-1645: అబ్దుల్లాహ్బిన్‌ ‘ఉబయ్ మదీనహ్ లోని పేరుగాంచిన ధనవంతుడు, కపటాచారి. పైకి తాను ముస్లిమ్ నని చెప్పేవాడు. కాని లోపల అవిశ్వాసిగానే ఉండేవాడు. వాడు ప్రవక్త (స)ను చాలా హింసించాడు. కాని వాడి కొడుకు సత్య విశ్వాసి మరియు ప్రవక్త (స) కోసం ప్రాణాలు అర్పించేవాడు. అతని పేరు కూడా అబ్దుల్లాహ్. తండ్రి మరణించిన తర్వాత అతడు ప్రవక్త (స) వద్దకు వచ్చి, మా తండ్రి మరణించారు, తమరి శుభకరమైన ఉమ్మిని అతని శరీరానికి పులమండి, తమరి చొక్కా తొడిగించండి, జనా’జహ్ నమా’జు చదివించండి, అని విన్నవించుకున్నాడు. ప్రవక్త (స) ఆ విశ్వాసి కొడుకు కోరికపై ప్రోత్సాహంగా సద్దుణపరంగా అతని కోరికను మన్నించి వాగ్దానం చేశారు. అనంతరం ప్రవక్త (స) వాడి శరీరానికి ఉమ్మికూడా పెట్టారు, దు’ఆ చేశారు, చొక్కా ఇచ్చారు, ఇంకా జనా’జహ్ నమా’జు కూడా చదివించారు.

జాబిర్‌ (ర) కథనం: బద్ర్‌ యుద్ధంలో అబ్బాస్ (ర) పట్టు బడ్డారు. ఖైదీలను మదీనహ్ తీసుకు రావటం జరిగింది. ఖైదీలందరికీ ప్రవక్త (స) చొక్కా తొడిగించారు. ‘అబ్బాస్‌ (ర) కోసం కూడా చొక్కా తీసుకురావటం జరిగింది. అది అతనికి ఇరుకైపోయింది. ఎందుకంటే అతను పొడవుగా ఉండేవారు. అప్పుడు ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉబయ్‌ తన చొక్కా తీసి ఇచ్చాడు. అది ‘అబ్బాస్‌ (ర) కు సరిపోయింది. వాడు తన చిన్నాన్నపై ఉపకారం చేశాడు. కనుక ఉపకారానికి బదులుగా ప్రత్యుపకారం చేశారు. బు’ఖారీలో నమా’జు కూడా చదివారని ఉంది. ‘ఉమర్‌ (ర) జనా’జహ్ నమా’జు చదివించవద్దని వారించారు. కాని ప్రవక్త (స) ప్రోత్సాహంగా నమా’జు చదివించారు. అనంతరం కపటాచారి జనా’జహ్ నమా’జు చదవరాదని నిషేధాజ్ఞ వచ్చింది. (సూ. తౌబహ్, 9:84) ఈ ఆయతు అవతరించిన తరువాత ప్రవక్త (స) ఏ కపటాచారి జనాజహ్ నమా’జు చదివించలేదు.

[45]) వివరణ-1646: త్వరగా అంటే అతని స్నానం, కఫన్‌, ఖనన సంస్కారాలను త్వరగా పూర్తిచేయటం, ఆలస్యం చేయకూడదు. శవం కూడా పాడవకుండా, అతని కుటుంబం వారు ఆందోళనకు గురవకుండా చూడాలి. ఒకవేళ అతడు పుణ్యాత్ముడైతే త్వరగా తన నివాసానికి చేర్చబడతాడు. ఒకవేళ చెడ్డ వాడైతే మీరు త్వరగా చేతులు దులుపుకుంటారు.

[46]) వివరణ-1648: జనా’జహ్ ను చూసి నిలబడటం అంటే, జనా’జహ్ తీసుకొని వెళ్ళడానికి ఇంటి నుండి బయటకు తీసుకు వెళ్ళినపుడు, మీరు అక్కడ కూర్చొని ఉంటే, జనా’జహ్ తీసుకొని వెళ్ళడానికి నిలబడండి. కూర్చొని ఉండకండి. లేదా మీరు ఎక్కడైనా కూర్చొని ఉంటే మీ సమీపం నుండి జనా’జహ్ వెళితే, లేచి నిలబడండి. ఆ మృతుడు ముస్లిమైనా, ముస్లిమే తరుడైనా సరే. ఈ నిలబడటం అభిలషణీయం. కొందరు ఈ ఆదేశం రద్దు చేయబడిందని భావిస్తారు.

[47]) వివరణ-1650: నిలబడ్డారు, కూర్చున్నారు అంటే ప్రవక్త (స) ముందు నుండి జనా’జహ్ వెళితే ప్రవక్త (స) నిలబడ్డారు. జనా’జహ్ కొంతదూరం వెళ్ళిపోయిన తర్వాత కూర్చున్నారు. నిలబడటం తప్పనిసరికాదు, అభిలషణీయం.

[48]) వివరణ-1651: అంటే విశ్వాసం మరియు ప్రతిఫలా పేక్షతో ముస్లిమ్‌ జనా’జహ్ లో పాల్గొని నమా’జు చదివి, ఖననంలో కూడా పాల్గొంటే, అతనికి రెండు ఉ’హుద్‌ కొండ లంత పుణ్యం లభిస్తుంది. కేవలం నమా’జు చదివి ఒక ఖీరాత్‌ ఒక కొండంత పుణ్యం లభిస్తుంది.

[49]) వివరణ-1652: ‘హబ్‌షా చక్రవర్తి పేరు నజాషీ. ఫారిస్చక్రవర్తి బిరుదు కిస్రా, రూమ్చక్రవర్తి బిరుదు ఖైసర్‌. ఈజిప్టు చక్రవర్తి పేరు ఫిరౌన్. ఈ’హబ్‌షహ్ చక్రవర్తి అసలు పేరు అస్ఖమహ్. ఇతను ముందు క్రైస్తవుడు. ప్రవక్త (స) అనుచరుల ఇస్లామ్‌ బోధనల ద్వారా ఇస్లామ్‌ స్వీకరించాడు. ముస్లిముల పట్ల చాలా ప్రేమ, వాత్సల్యాలను కనబరిచేవాడు. ప్రవక్త (స) ఆదేశం ప్రకారం ఉమ్మె ‘హబీబహ్ పెళ్ళి ప్రవక్త (స)తో చేశాడు. తన కూతురులా కట్నాలు, కానుకలు ఇచ్చి మదీనహ్ సాగనంపాడు. చారిత్రక పుస్తకాల్లో ఈ సంఘటన వివరంగా ఉంది. అతను మరణించినపుడు దైవవాణి లేదా ప్రేరణ ద్వారా ప్రవక్త(స)కు తెలియపర్చబడింది. ప్రవక్త (స) ఆ రోజే మీ సోదరుడు నజ్జాషీ ‘హబ్‌షహ్ లో మరణించాడు. అతని జనా’జహ్ నమా’జుచదవండి అని పలికి, అనంతరం ఈద్గాహ్ లో పరోక్షంగా అతని జనాజహ్ నమాజు చదవడం జరిగింది.

ఈ ‘హదీసు’ ద్వారా అనేక విషయాలు తెలిసాయి: 1. మరణవార్త బంధువులకు, స్నేహితులకు, నమా’జీలకు అందజేయాలి. దానివల్ల వారు జనా’జహ్ నమా’జులో పాల్గొంటారు. 2. ఒకవేళ జనా’జహ్ నమా’జు మస్జిదులో చదివితే చదవవచ్చును. ఎందుకంటే ముసల్లా ‘ఈద్‌గాహ్‌ను అంటారు. ‘ఈద్గాహ్‌ కూడా మస్జిద్‌ లాంటిదే. ప్రవక్త (స) బైజా కుమారుల జనా’జహ్ నమా’జు మస్జిద్‌లో చదివించారు. ముస్లిమ్‌లో ఇలా ఉంది, ” ‘ఆయి’షహ్‌ (ర) కథనం: ”అబూ బకర్‌ (ర) మరియు ‘ఉమర్‌ (ర)ల జనాజహ్ నమాజు మస్జిద్లో చదవడం జరిగింది. బైహఖీలో కూడా ఉంది. మస్జిద్‌లో జనా’జహ్ నమా’జు చదవకూడదనే ఉల్లేఖనాలు అన్నీ బలహీన మైనవే. ఒకవేళ ఎవరైనా జనా’జహ్ నమా’జు మస్జిదులో చదవాలనుకుంటే నిస్సంకోచంగా చదవవచ్చును. 3. ఒకవేళ మృతుడు ముందు లేకపోతే పరోక్షంగా జనా’జహ్ నమా’జు చదవవచ్చును. 4. జనా’జహ్ నమా’జు 4 తక్బీర్లతో చదవటం ధర్మ సమ్మతమే.

[50]) వివరణ-1653: జనా’జహ్ తక్‌బీర్లలో అనేక రకాల ఉల్లేఖనాలు ఉన్నాయి. అయితే 4 తక్బీర్లతో చదవడమే ఉత్తమం.

[51]) వివరణ-1654: ఇబ్నె ‘అబ్బాస్‌ జనా’జహ్ నమా’జులో బిగ్గరగా సూరహ్‌ ఫాతి’హా చదివారు. ఇది ప్రవక్త (స) పద్ధతి. దీనిద్వారా జనా’జహ్ నమా’జులో సూరహ్‌ ఫాతి’హా చదవటం తప్పనిసరి అని తెలిసింది.

[52]) వివరణ-1656: బై’దా’ ఒక స్త్రీ పేరు. ఆమెకు ముగ్గురు కొడుకులు ఉండేవారు. సుహైల్‌, సహల్‌, సఫ్వాన్‌. సుహైల్‌, సహల్‌లు మరణించినపుడు, వారి జనా’జహ్ నమా’జును ప్రవక్త (స) మస్జిద్‌లో చదివించారు. అందువల్ల జనా’జహ్ నమా’జు మస్జిద్‌లో చదివించటం ప్రవక్త సాంప్రదాయం. ఈ విషయం తెలియనివారు ‘ఆయి’షహ్‌ (ర) కు అభ్యంతరం తెలిపారు. ‘ఆయి’షహ్‌ (ర) సమాధానంగా ఈ ‘హదీసు’ను వినిపించారు. అందరూ  మౌనంగా ఉండిపోయారు. అయితే సాధారణంగా జనా’జహ్ నమా’జు మస్జిద్‌ బయట చదివే వారు. అప్పుడప్పుడూ మస్జిద్‌లో చదివేవారు. అబూ బకర్‌ మరియు ‘ఉమర్‌ల జనా’జహ్ నమా’జు మస్జిద్‌లో చదవటం జరిగింది. ప్రవక్త (స) అనుచరులు కూడా జనా’జహ్ నమా’జు మస్జిద్‌లో చదివేవారు. అందువల్ల ఎటువంటి సంకోచం లేకుండా జనా’జహ్ నమా’జు మస్జిద్‌లో చదవచ్చును.

[53]) వివరణ-1657: పురుషుని జనాజహ్ లో తలకు ఎదురుగా ఇమాము నిలబడాలి. స్త్రీ జనాజహ్లో బొడ్డుకు ఎదురుగా నిలబడాలి.

[54]) వివరణ-1658: ఈ ‘హదీసు’ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో శవాన్ని రాత్రి పూట కూడా ఖననం చేయవచ్చని తెలుస్తుంది. ఒకవేళ జనాజహ్ నమాజు చదవకుండా ఖననం చేస్తే సమాధిపై జనాజహ్ నమాజుచదవవచ్చును.

[55]) వివరణ-1659: ఈ ‘హదీసు’ ద్వారా మస్జిద్‌ తుడవటం, శుభ్రం చేయటం చాలా మంచిపని అని, ఇంకా ఇటువంటి పనులు చేసేవారు సామాన్యులు కారని, అల్లాహ్‌ దృష్టిలో ఉన్నతులని తెలిసింది. దీన్ని నీచపనిగా భావించరాదు. ఒకవేళ ఈ పనులు చేసే వ్యక్తి మరణిస్తే అతని ఖనన సంస్కారాల్లో, జనా’జహ్ నమా’జుల్లో పాల్గొనాలి. ఇంకా అతని గురించి ప్రార్థించాలి. మరో విషయం ఏమిటంటే సమాధిపై కూడా జనా’జహ్ నమా’జు చదవవచ్చును.

[56]) వివరణ-1661: మొదటి ‘హదీసు’లో 40మంది అని ఉంది. ఈ’హదీసు’లో 100మంది అని ఉంది. కొందరు అధిక సంఖ్య అని అభిప్రాయపడ్డారు. కొందరు ముందు 40 మంది గురించి, తరువాత 100 మంది గురించి ప్రవచించారని అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా రెంటిలో వ్యతిరేక తమాత్రం లేదు.

[57]) వివరణ-1662: సత్య-విశ్వాసులు, సత్యవంతులు ఫలానా వ్యక్తి ఇటువంటివాడు అని సాక్ష్యం ఇస్తే వాస్తవంగా అతడు అటువంటివాడే అయిఉంటాడు. అతడు పుణ్యాత్ముడని మీరు సాక్ష్యం ఇస్తే అల్లాహ్‌ ఆసాక్ష్యాన్ని తప్పక ఆమోదిస్తాడు. ఇంకా అతని కోసం స్వర్గం ఉంటుంది. మీరు చెడుగా అన్న వ్యక్తి వాస్తవంగా చెడ్డవాడే. అతని కోసం నరకం ఉంది.

[58]) వివరణ-1663: సత్యవిశ్వాసులు సత్యవిశ్వాసి కోసం సాక్ష్యం ఇస్తారు. అల్లాహ్‌(త) అతని విశ్వాసం, ఆచరణల ద్వారా అతన్ని స్వర్గంలో పంపుతాడు. సాక్ష్యం కనీసం ఇద్దరు ఇవ్వాలి. ఎంతమంది అయినా అధికంగా ఉండ వచ్చు.

[59]) వివరణ-1664: అంటే మృతులను తిట్టరాదు, వారి గురించి చెడుగా మాట్లాడరాదు. వారు చేసిన పాపాల శిక్షకు వారు చేరుకున్నారు. మీరు తిట్టటం వల్ల చెడుగా మాట్లాడటం వల్ల లాభం లేదు.

[60]) వివరణ-1665: 1. వస్త్రాలు తక్కువగా ఉంటే ఒకే వస్త్రంలో కఫన్‌ ఇవ్వవచ్చును. 2. అత్యవసర పరిస్థితుల్లో రెండు శవాలను ఒకే సమాధిలో ఖననం చేయవచ్చును. అయితే ఖుర్‌ఆన్‌ అధికంగా గుర్తున్నవారిని సమాధిలో ఖిబ్లా వైపు పెట్టాలి. 3. వీరమరణం పొందినవారిని స్నానం చేయించకుండా ఉన్న స్థితిలోనే ఖననం చేయాలి. 4. వీరిపై జనా’జహ్ నమా’జు చదవకపోయినా ఫరవాలేదు.

[61]) వివరణ-1666: ఇబ్ను దహ్‌దాహ్‌ (ర) పేరు సాబిత్బిన్దహ్దాహ్బిన్యీమ్బిన్‌ ‘గునైమ్బిన్‌ ‘అయ్యాష్. ప్రవక్త (స) మదీనహ్ వచ్చిన తర్వాత ఇస్లామ్‌ స్వీకరించారు. ప్రవక్త (స) అనుచరుల జీవిత గాథల్లో ఇతని గాథ ఈ విధంగా ఉంది:

ఇబ్నె దహ్దాహ్ ఉ’హుద్‌ యుద్ధంలో పాల్గొన్నారు. యుద్ధ తీవ్రత వల్ల ముస్లిములు అస్థిరతకు గురయినప్పుడు, అతను ముందుకు వచ్చి, అన్సారులను పిలుస్తూ, ఇలా రండి, నేను సా’బిత్‌ బిన్‌ దహ్‌దాహ్‌ను. ఒకవేళ ప్రవక్త (స) చంపబడితే అల్లాహ్ ఉన్నాడు. మీరు మీ ధర్మం కోసం పోరాడాలి. అల్లాహ్ విజయం ప్రసాదిస్తాడు. అన్సారుల్లోని కొందరు వీరులు అతని పిలుపుపై ముందుకు వెళ్ళారు. ఇటు అవిశ్వాసుల్లో ఖాలిద్, అమ్ర్బిన్‌ ‘ఆస్, ఇక్రమ బిన్అబూ హల్‌, జరార్బిన్‌ ‘త్తాబ్ ఇంకా అనేకమంది అవిశ్వాస నాయకులు ఉన్నారు. వీరందరూ అన్సార్‌ యువకులపై దాడిచేశారు. ‘ఖాలిద్‌ బల్లెం విసిరాడు. దానివల్ల ఇబ్నె దహ్‌దాహ్‌ గాయపడి క్రింద పడ్డారు. ప్రజలు ఇంటికి తెచ్చి వైద్యం ప్రారంభించారు. అప్పుడు గాయం మానిపోయింది. కాని హుదైబియహ్ ఒప్పందం తరువాత గాయం పగిలి, భరించలేక మరణించారు.

ప్రవక్త (స) తన అనుచరుల వెంట జనా’జహ్ లో పాల్గొనడానికి వచ్చారు. ఖననం చేసిన తర్వాత గుర్రం తెప్పించి బయలుదేరారు. అప్పుడు ప్రవక్త (స) ”స్వర్గంలో ఖర్జూరాల కొమ్మలు ఎన్నో ఉన్నాయి. అవి ఇబ్నె దహ్‌దాహ్‌ కోసం వ్రేలాడగట్టబడ్డాయి” అని అన్నారు. (‘స’హీ’హ్ ముస్లిమ్‌ 1/356)

తరువాత ఆసిమ్బిన్‌ ‘అదీని పిలిచి, ‘మీకు అతనికి బంధుత్వం ఉందా’ అని అన్నారు. అతను ‘లేదని’ చెప్పారు. అతని అక్క కొడుకైన అబూ లుబాబహ్ బిన్‌ ‘అబ్దుల్మున్‌’జిర్ను పిలిచి ఆస్తి అతనికి అప్ప జెప్పారు. (అసదుల్‌ ‘గాబహ్‌)

విశ్వాసం ఎంత దృఢంగా ఉండేదంటే, ”మన్‌జ’ల్లజీ’ యఖ్‌రి’దుల్లాహ ఖర్‌’దన్‌ ‘హస్‌నన్‌, ఫయు’దా’అఫుహు లహు” (సూ. అల్ ‘హదీద్, 57:11) అవతరించబడి నప్పుడు, ప్రవక్త (స)తో ‘అల్లాహ్‌ మనల్ని అప్పు అడుగుతున్నాడా’ అని అడిగారు. దానికి ప్రవక్త (స) ‘అవునని’ అన్నారు. అప్పుడు ఇబ్నె దహ్‌దాహ్‌ తన ధనాన్ని దానం చేశారు.” (అసదుల్‌ ‘గాబహ్‌)

ఒక వ్యక్తి తన తోట యొక్క గోడ కట్టాలని అనుకున్నాడు. మధ్యలో మరొకరి చెట్టు ఉంది. ఆ చెట్టును నాకు ఇప్పిం చండని ప్రవక్త (స) ను కోరాడు. ప్రవక్త (స) ఆ చెట్టు యజ మానిని పిలిచి మాట్లాడారు. కాని ఆ వ్యక్తి నిరాకరించాడు. అయితే ప్రవక్త (స) ఆ చెట్టుకు బదులు స్వర్గంలో ఒక చెట్టును తీసుకో అన్నారు. అతను దానికీ నిరాకరించాడు. అది విన్న అబూ దహ్‌దాహ్‌ ఆ వ్యక్తి వద్దకు వెళ్ళి, ‘నా నుండి గోడతీసుకో, ఆ చెట్టును నాకు అమ్మివేయి’ అని అన్నారు. దానికి ఆ వ్యక్తి సరేనన్నాడు. ఇబ్నె దహ్‌దాహ్‌ ప్రవక్త (స) వద్దకు వెళ్ళి జరిగింది వివరించారు. ప్రవక్త (స) చాలా సంతోషించి, ”అబూ దహ్‌ దాహ్‌ కోసం స్వర్గంలో ఎన్నో చెట్లు ఉన్నాయి” అని అన్నారు.

ఇబ్నె దహ్‌దాహ్‌ ప్రవక్త (స) వద్ద నుండి లేచి తన తోటలోకి వచ్చి, తన భార్యతో ‘ఇక్కడి నుండి పదండి, నేనీ తోటను స్వర్గంలోని ఒక చెట్టుకు బదులు అమ్మివేసాను’ అని అన్నారు. భర్తలా భార్య కూడా చాలా ఉత్తమురాలు. అది విని ఇది చాలా లాభకరమైన వ్యాపారం అని పలికింది. (అసాబహ్‌ 7/85)

[62]) వివరణ-1667: అవసరం ఉండి వాహనంపై ఉంటే జనా’జహ్ వెనుక నడవాలి. కాలి నడకన వచ్చేవారు ముందు, వెనుక, అటూ, ఇటూ ఎటు ఉన్నా ఫరవా లేదు. అదేవిధంగా అర్థరహితంగా బిడ్డ జన్మించి చని పోతే, ఆ బిడ్డపై జనా’జహ్ నమా’జు చదవాలి. ఇంకా అతని తల్లిదండ్రుల క్షమాపణకోసం దు’ఆ చేయాలి. అయితే జనా’జహ్ ప్రత్యేక దు’ఆ తరువాత, ”అల్లాహు మ్మజ్‌అల్‌హులనా ఫర్‌’తన్‌, వజ్‌’అల్‌హులనా జు”ఖ్‌రన్‌ వజ్‌’అల్‌హులనా షాఫి’అన్‌ వ ముషష్ఫ ‘అన్‌” — ‘ఓ అల్లాహ్‌, ఈ బిడ్డను మా కోసం పుణ్య సాధనంగా చేయి, అతన్ని మా గురించి సిఫారసు చేసేవానిగా చేయి, అతని సిఫారసు స్వీకరించు,’ అని పలకాలి.

[63]) వివరణ-1668: అంటే కాలినడకన వెళ్ళేవారు జనా ‘జహ్ కుముందు వెనుక, అటు, ఇటూ నడవ వచ్చును.

[64]) వివరణ-1669: ‘హదీసు’వేత్తలందరూ ఈ ‘హదీసు’ను బలహీనమైనదిగా ధృవీకరించారు. కనుక జనా’జహ్ ముందు వెనుక ఎటు ఉన్నా ఫరవాలేదు.

[65]) వివరణ-1671: మూడుసార్లు ఎత్తటం వల్ల తీసుకొని వెళ్ళేవారికి సులువుగా ఉంటుంది. ఒకే వ్యక్తి ప్రారంభం నుండి చివరి వరకు ఎత్తుకొని ఉంటే అలసిపోతారు. శవం హక్కు కూడా చెల్లించినట్లు అయిపోతుంది. జనా’జహ్ ను నలుగురు వ్యక్తులు నాలుగువైపులు పట్టుకొని లేపాలి. భుజాలు మారుతూ ఉంటే సులువుగా చేర్చబడుతుంది.

[66]) వివరణ-1672: ఇంతకు ముందు ‘హదీసు’ల ద్వారా కారణం ఉండి వాహనంపై ఎక్కి జనా’జహ్ వెనుక నడిస్తే ధర్మసమ్మతం అని తెలిసింది. ఈ ‘హదీసు’లో ఎటువంటి కారణం లేకుండా వాహనాలపై ఎక్కి వచ్చేవారి గురించి పేర్కొనటం జరిగింది. లేదా నడిచి రావటం ఉత్తమం అని, వాహనంపై వస్తే ధర్మసమ్మతం అని పేర్కొనబడి ఉంటుంది.

[67]) వివరణ-1673: అంటే జనా’జహ్ నమా’జులో సూరహ్‌ ఫాతి’హా చదవాలని తెలుస్తుంది.

[68]) వివరణ-1678: అంటే మంచి వారి, మంచి విషయాలు ప్రస్తావించండి. దానివల్ల దైవకారుణ్యం అవతరిస్తుంది. ఇంకా వారి క్షమాపణ గురించి ప్రార్థించటం జరుగుతుంది. ఇంకా చెడ్డవారి చెడులను ప్రస్తావించకండి. దానివల్ల వారి పరోక్ష నింద, చాడీలు చెప్పటం జరుగుతుంది. వీటిని చాలా కఠినంగా నిషేధించటం జరిగింది.

[69]) వివరణ-1680: ఖాదిసియ్య ఒక ప్రాంతం పేరు. ఇది కూఫా నుండి 15 కోసుల దూరంలో ఉంది. ప్రవక్త (స) అనుచరులు అక్కడ ఉండేవారు. అక్కడ ఇస్లామీయ ప్రభుత్వం ఏర్పడింది. అక్కడ ముస్లిమేతరులు కూడా ఉండేవారు. ఒక ముస్లిమేతరుడు మరణించాడు. ఆ ఇద్దరి ముందు నుండి శవాన్ని తీసుకు వెళ్ళడం జరిగింది. వారు లేచి నిలబడ్డారు. అప్పుడు వారికి అది ముస్లిమేతరుని శవం అని తెలియ పర్చటం జరిగింది. దానికి వారిద్దరూ ప్రవక్త (స) ఆదర్శ జీవితం గురించి చెప్పారు. దానితో పాటు మరణం ప్రతిప్రాణికి వస్తుందని, ముస్లిమ్‌ శవంఅయినా, ముస్లి మేతరుని శవం అయినా దాని ద్వారా గుణపాఠం నేర్చుకోవాలని చెప్పారు.

[70]) వివరణ-1681: యూదులను వ్యతిరేకిస్తూ శవాన్ని సమాధిలో పెట్టకముందే ప్రవక్త(స) కూర్చున్నారు. ఇంకా తన అనుచరులతో ‘మీరు శవాన్ని సమాధిలో పెట్టక ముందు కూర్చోండని’ అన్నారు. మరో ఉల్లేఖనంలో ”జనాజా వెంట వెళితే జనా’జహ్ ను భుజాలపై నుండి దించి క్రింద పెట్టే వరకు కూర్చోకండి” అని ఉంది. ఈ రెండు ఉల్లేఖనాల్లో ఎటువంటి వ్యతిరేకత లేదు. భుజాల నుండి దించి సమాధిలో పెట్టక ముందు కూర్చోవచ్చు. ఈ ‘హదీసు’ బలహీనమైనది. నసాయి’ దీని ఉల్లేఖకుణ్ణి బలహీనుడని పేర్కొన్నారు. దారు ఖుతునీ మున్‌కిరుల్‌ ‘హదీసు’ అన్నారు. అబూ ‘హాతిమ్‌ కూడా బలహీనమైనదని అన్నారు.

[71]) వివరణ-1684: ఈ ‘హదీసు’లను బట్టి జనా’జహ్ ను చూసి నిలబడకూడదని తెలుస్తుంది. కాని ఈ ‘హదీసు’లు బలహీనమైనవి. వాస్తవం ఏమిటంటే, జనా’జహ్ ముస్లిముదైనా, యూదునిదైనా నిలబడటంలో అభ్యంతరం ఏమీలేదు.

[72]) వివరణ-1687: ఈ ‘హదీసు’ ద్వారా ఇమాము వెనుక 3 పంక్తులు ఉండాలి. ప్రజలు అధికంగా ఉన్నా ప్రజలు తక్కువగా ఉన్నా సరే. ఒకవేళ ఒకటి లేదా రెండు పంక్తులు ఉన్నా నమా’జు అయిపోతుంది.

[73]) వివరణ-1691: జన్మించినపుడు బిడ్డ సజీవంగా ఉండి, కేకలు వేసి, ఆ తరువాత చనిపోతే, ఇటువంటి బిడ్డ జనా’జహ్ నమా’జు చదవాలి. అతడు వారసుడు అవుతాడు. ఒకవేళ మరణించి జన్మిస్తే జనాజహ్ నమాజు చదవరాదు, అతడు వారసుడు కాడు.

[74]) వివరణ-1692: ఇమాము ఐదుపూటల నమా’జు చదివించినా, జనా’జహ్ నమా’జ్‌ చదివించినా ఎత్తయిన ప్రదేశంపై నిలబడి చదవించకూడదు. అయితే నమా’జు శిక్షణ కోసం మెంబరుపై నిలబడి బోధిస్తూ, సజ్దా క్రింద చేస్తే ఎటువంటి అభ్యంతరం లేదు.

[75]) వివరణ-1694: షఖ్‌రాన్‌ (ర) అనుచరుల అనుమతి లేకుండా ఎర్రని దుప్పటి సమాధిలో పరచివేశారు. కాని అనుచరుల అభిప్రాయ భేదాల వల్ల మళ్ళీ ఆ దుప్పటిని తీసివేయడం జరిగింది. అంటే సమాధిలో ఏదీ పరచకూడదు.

[76]) వివరణ-1696: అంటే ప్రవక్త (స) ‘అలీ (ర)ను ”నువ్వెళ్ళి ప్రాణుల చిత్రాలను నాశనంచేయి, ఇంకా ఎత్తుగా ఉన్న సమాధులను ధర్మబద్ధమైన విధంగా చేసివేయి” అని ఆదేశించారు. ‘అలీ (ర) కూడా ఆ పనిమీదే అబుర్‌ హయ్యాజ్‌ను పంపించారు.

ఈ ‘హదీసు’ ద్వారా అనుమతికి మించిన ఎత్తుగా సమాధిని నిర్మించరాదు. ఒకవేళ ఎవరైనా ఎత్తుగా నిర్మించి ఉండి, దాన్ని ధర్మబద్ధమైన విధంగా చేసే శక్తి ఉంటే చేయవచ్చు. దాన్ని సరిచేయడంలో కల్లోలం తలెత్తే భయం ఉంటే దూరంగా ఉండాలి. అదేవిధంగా ప్రాణుల చిత్రాలు, విగ్రహాలు ధ్వంసం చేయాలి. ఎందుకంటే కారుణ్య దూతలు ప్రవేశించరు.

[77]) వివరణ-1697: ఈ ‘హదీసు’ ద్వారా సమాధిని సిమెంట్‌తో కట్టడం, దానిపై కట్టడాలు కట్టడం, మల-మూత్ర విసర్జన చేయటం, దానిపై వ్రాయటం చేయరాదని తెలిసింది.

[78]) వివరణ-1698: ఎందుకంటే సమాధివైపు తిరిగి నమా’జు చదివితే, విగ్రహారాధనలా ఉంటుంది.

[79]) వివరణ-1699: సమాధిపై కూర్చోవటం అంటే, మల మూత్ర విసర్జన కోసం కూర్చోవటం, అగ్నిపై కూర్చొని శరీరం బట్టలు కాల్చుకోవటం కంటే సమాధిపై కూర్చోవటం చాలా ప్రమాదకరమైనది.

[80]) వివరణ-1702: ల’హద్‌ సమాధి మనకోసం అంటే ముస్లింల కోసం. పెట్టెలాంటిది ముస్లిమేతరుల కోసం. లేదా సమాధి ప్రవక్తల కోసం, పెట్టెలాంటిది ముస్లిముల కోసం, లేదా ల’హద్‌ సమాధి మదీనహ్ ప్రజల కోసం, పెట్టెలాంటిది ఇతరుల కోసం, ఇది ప్రాధాన్యత మాత్రమే. రెండు రకాలు ధర్మసమ్మత మైనవే.

[81]) వివరణ-1703: ఉ’హుద్‌ యుద్ధంలో 70 మంది అనుచరులు వీరమరణం పొందారు. ఆ మైదానంలోనే వారి సమాధులను త్రవ్వమని, విశాలంగా త్రవ్వమని, లోతుగా త్రవ్వమని, ఇద్దరిని, ముగ్గురిని ఉంచేలా త్రవ్వమని ఆదేశించారు. అంటే అవసరాన్ని బట్టి ఒకే సమాధిలో ఇద్దరినీ, ముగ్గురినీ ఖననం చేయటానికి.

[82]) వివరణ-1704: ఈ ‘హదీసు’ ద్వారా ఏ ఊరిలో మరణిస్తే, ఆ ఊరిలోనే ఖననం చేయాలని తెలుస్తుంది. అక్కడినుండి మరో ఊరికి తీసుకువెళ్ళే అవసరం లేదు.

[83]) వివరణ-1705: అంటే ప్రవక్త (స)ను తలవైపు నుండి సమాధిలో ఉంచటం జరిగింది. అందువల్లే పండితులు తల వైపు నుండి దించటం ప్రవక్త (స) సాంప్రదాయం అని భావిస్తారు. క్రింది ‘హదీసు’లో ప్రవక్త (స) ఒక వ్యక్తిని ఖిబ్లా వైపు నుండి సమాధిలో దించారని ఉంది. అయితే ఈ ‘హదీసు’ బలహీనమైనది.

[84]) వివరణ-1706: ఈ ‘హదీసు’ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో శవాన్ని రాత్రిపూట కూడా ఖననం చేయవచ్చని, వెలుగు కోసం దీపం వెలిగించవచ్చని, తీసుకొని వెళ్ళవచ్చని తెలిసింది.

[85]) వివరణ-1708: ఒక ముస్లిమ్‌ సమాధిపై మూడు దోసెళ్ళ అంటే రెండు చేతుల నిండా మట్టి వేయడం, ప్రవక్త (స) సాంప్రదాయం. ఇది శవం హక్కు. ఈ పుణ్యం తీర్పుదినం నాడు పనికివస్తుంది. ఇంకా ఈ మట్టిని తూనికలో పెట్టి తూయటం జరుగుతుంది.

మిష్కాత్‌ షరహ్‌ మిర్‌ఖాత్‌లో ఇలా ఉంది: ఒక వ్యక్తి కలలో చూసి ‘అల్లాహ్‌ నీ పట్ల ఎలా వ్యవహరించాడు’ అని అడిగాడు. దానికి ఆ వ్యక్తి, నా కర్మలు తూయబడ్డాయి. పుణ్యాల పళ్లెం కంటే పాపాల పళ్ళెం బరువుగా ఉంది. వెంటనే పుణ్యాల పళ్లెంలో ఒక సంచి పడింది. వెంటనే పుణ్యాల పళ్ళెం బరు వెక్కింది. అప్పుడు నేను సంచిని విప్పి చూశాను. అందులో ఒక పిడికెడు మట్టి ఉంది. దాన్ని ముస్లిమ్‌ శవం యొక్క సమాధిపై వేశాను.

అబూ హురైరహ్‌ (ర) కథనం: చిత్తశుద్ధితో, ప్రతిఫలా పేక్షతో ముస్లిమ్‌ శవం యొక్క సమాధిపై మట్టివేస్తే అల్లాహ్‌ ప్రతి మట్టికి బదులు పుణ్యం ప్రసాదిస్తాడు.

బైహఖీలో అబూ ఉమామ (ర) కథనం: ఒక వ్యక్తి మరణిం చాడు. అతని వద్ద ఏ పుణ్యమూ లేదు. కాని మూడు దోసెళ్ళ మట్టి పుణ్యం ఉంది. అతడు ముస్లిమ్‌ శవం యొక్క సమాధిపై వేశాడు. అతని పాపాలు క్షమించబడ్డాయి.

మొదటి దోసెడు మట్టితో ”మిన్హా ఖలఖ్నాకుమ్”, రెండవ దోసెడు మట్టితో ” ఫీహా నుయీదుకుమ్”, మూడవ దోసెడు మట్టితో ” మిన్హా నుఖ్రిజుకుమ్తారతన్ఖ్రా,” అని పఠించటం అభిలషణీయం.

[86]) వివరణ-1710: ఖనన సంస్కారాలు పూర్తయిన తరువాత సమాధిపై నీళ్ళు చిలకరించటం అభిలషణీయం.

[87]) వివరణ-1711: ఈ ‘హదీసు’ ద్వారా ఒకవేళ బండ రాయిని సమాధి తల వద్ద చిహ్నంగా పెడితే పెట్టవచ్చును అని తెలిసింది.

[88]) వివరణ-1712: ప్రవక్త (స), అబూబకర్‌, ‘ఉమర్‌లు ‘ఆయి’షహ్‌ (ర) గదిలో ఖననం చేయబడి ఉన్నారు. గది మూయబడి ఉండేది. చూడాలని కోరారు. ‘ఆయి’షహ్‌ (ర) తలుపు తెరచి చూపెట్టారు. ఇప్పటి వరకు అంటే 1435 హిజ్రీ వరకు పచ్చని గోపురంలో ఈ సమాధులు ఉన్నాయి. ఈ గదికి తాళం వేయబడిఉంది.

[89]) వివరణ-1715: ఈ ‘హదీసు’ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ”గైర్‌ మ’హ్‌రిమ్‌” కూడా సమాధిలోకి దిగవచ్చును. అయితే అతడు దైవ భీతిపరుడై ఉండాలి. అతడు మ’హ్‌రిమ్‌కు బదులుగా అంత్యక్రియలు నెరవేర్చవచ్చును. ‘ఉస్మాన్‌పై ఆ రాత్రి అటువంటి పని చేయకుండా ఉండ వలసిందని ఈ విధంగా ప్రవర్తించటం జరిగింది.

[90]) వివరణ-1716: ‘అమ్ర్‌ బిన్‌ ‘ఆ’స్‌ తన మరణానికి ముందు తన కుమారునికి చేసిన హితబోధ ఇది. దీనివల్ల తెలిసిన విషయం ఏమిటంటే, జనాజ’హ్ వెంట ఆగి తీసుకొని వెళ్ళరాదు, ఇంకా ఏడ్చే స్త్రీలు వెళ్ళరాదు, ఇంకా ఖననం చేసిన తరువాత సమాధి వద్ద నిలబడి అతని నిలకడ కోసం దు’ఆ చేయాలి.

[91]) వివరణ-1717: ఆపి ఉంచటమంటే అతని కఫన్‌, ఖనన సంస్కారాల్లో ఆలస్యం చేయకూడదు. సాధ్యమైనంత తొందరగా ఖనన సంస్కారాలు ముగించిన తర్వాత తల వద్ద సూరహ్‌ బఖర మొదటి రుకూ’ను, కాళ్ళవద్ద చివరి రుకూ’ను చదవాలి. ఇది ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ అభిప్రాయం. ప్రవక్త (స) ప్రవచనం కాదు. అదేవిధంగా మృతులపై ఖుర్‌ఆన్‌ పఠించటం ప్రవక్త (స) సాంప్రదాయంలో, అనుచరుల కాలంలో ఎక్కడా లేదు. కేవలం అతని క్షమాపణ కొరకు ప్రార్థించటం మాత్రమే ఉంది. ప్రవక్త () సాంప్రదాయాన్నే ఆచరించాలి.

[92]) వివరణ-1718: హుబ్షీ మక్కహ్ కు దగ్గరలో ఉన్న ఒక ప్రాంతం పేరు. ‘ఆయి’షహ్‌ (ర) సోదరులు అక్కడకు వెళ్ళారు. అక్కడ మరణించారు. అక్కడ ఉన్నవారు అతని శవాన్ని మక్కహ్ తీసుకొని వచ్చారు. మక్కహ్ లో ఖననం చేయబడ్డారు. అది వారి అభిప్రాయం. మరణించిన చోటే ఖననం చేసి ఉండాల్సింది. ‘ఆయి’షహ్‌ (ర) అన్నట్టు. ‘ఆయి’షహ్‌ (ర) ‘హజ్జ్ కోసం మక్కహ్ వచ్చినపుడు, తన సోదరుడు గుర్తుకు వచ్చి, అతని సమాధి వద్దకు వచ్చారు. ఈ ‘హదీసు’ ద్వారా ఒకవేళ ఎవరైనా స్త్రీ ఓర్పు సహనాలతో తన బంధువు సమాధిని దర్శిస్తే దర్శించవచ్చును.

[93]) వివరణ-1721: ఈ ‘హదీసు’ ద్వారా సమాధిపై కూర్చోవటంగానీ, సమాధిపై చేరబడటంగాని చేయరాదు అని తెలిసింది. దానివల్ల సమాధిలో ఉన్నవారికి బాధ కలుగుతుంది.

[94]) వివరణ-1722: ఇబ్రాహీమ్‌ (ర), ప్రవక్త (స) కుమారులు. పాలు పట్టించటానికి అబూ సైఫ్‌ ఇంటికి పంపించారు. అతని పేరు బరా’. అతను వడ్రంగి. అతని భార్య పేరు ఖీల బిన్‌తె మున్‌జిర్‌. ఆమె ఇబ్రాహీమ్‌కు పాలుపట్టేది. ప్రవక్త (స) అప్పుడప్పుడూ తన బిడ్డను చూడటానికి వారి ఇంటికి వెళ్ళేవారు. ఒడిలో తన బిడ్డను తీసుకొని ముద్దాడేవారు, ముద్దు పెట్టేవారు. వాసన చూసే వారు. ఒకసారి ఇబ్రాహీమ్‌ తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యారు. విషయం తెలిసి ప్రవక్త (స) వచ్చారు. ఆయన వెంట అనుచరులు కూడా ఉన్నారు. ‘అబ్దు ర్ర’హ్మాన్‌ బిన్‌ ‘ఔఫ్‌ కూడా ఉన్నారు. అప్పుడు ఇబ్రాహీమ్‌ చివరి శ్వాసలో ఉన్నారు. ఆ పరిస్థితిని చూసి ప్రవక్త (స) కళ్ళంట అశ్రువులు ప్రవహించ సాగాయి. అది చూసిన ‘అబ్దుర్రహ్మాన్‌ బిన్‌ ‘ఔఫ్‌, ‘తమరు చాలా గొప్పవారు, తమరు ఏడ్వటం తగదు’ అని అన్నారు. దానికి ప్రవక్త (స) సమాధానం ఇస్తూ, ‘కళ్ళంట నీరు కారటం కారుణ్య దాయకం. అయితే నోటితో కేకలు పెడబొబ్బలు పెట్టటం నిషిద్ధం. కళ్ళనిండా అస్రువులు ఉన్నాయి, హృదయం చాలాబాధ, దుఃఖంతో ఉంది. అతని ఎడబాటు విచారం ఉంది’ అని అన్నారు.

[95]) వివరణ-1724: ఒకవేళ మరణించిన వ్యక్తి, ” ‘నేను మరణించిన తరువాత నాపై ఏడ్వండి’ అని, అనిఉంటే, అతను చెప్పినందువల్ల వాళ్ళు ఏడిస్తే, అతన్ని శిక్షించటం జరుగుతుంది. ఎందుకంటే దానికి కారకుడు అతడే. ఒకవేళ అతను దానికి వ్యతిరేకం అయితే, అతన్ని శిక్షించటం జరుగదు. తాము స్వయంగా ఏడ్పులు, పెడబొబ్బలు పెట్టే వారిని శిక్షించటం జరుగుతుంది.

[96]) వివరణ-1727: ఖతిరాన్‌ అంటే తారు. దానికి అగ్ని చాలా తొందరగా అంటుకుంటుంది. అంటే పెడబొబ్బలు పెట్టే స్త్రీకి శరీరంపై తారు పూయటం జరుగుతుంది. దానివల్ల శరీరం కాలుతుంది.

[97]) వివరణ-1728: బాధ కలిగిన వెంటనే ఓర్పు, సహనం పాటిస్తే పూర్తి ప్రతిఫలం లభిస్తుంది. కష్టంవచ్చిన వెంటనే ఓర్పు వహిస్తే పుణ్యం లభిస్తుంది. కష్ట సమయం దాటి పోతే మనిషి ఎలాగైనా కష్టం భరించవలసిందే. అప్పుడు ఓర్పు, సహనాల వల్ల పుణ్యం లభించదు.

[98]) వివరణ-1729: మరియు మీలో ఎవ్వడునూ దాని (నరకంపై గల వంతెన) మీదనుండి దాటకుండా (పోకుండా) ఉండలేడు. ఇది తప్పించు కోలేని, నీ ప్రభువు యొక్క నిర్ణయం. పిదప మేము దైవభీతి గల వారిని రక్షిస్తాము. మరియు దుర్మార్గులను అందులో మోకాళ్ళ మీద పడి ఉండటానికి వదులుతాము (సూ. మర్‌యమ్‌, 19:71-72)  అంటే అల్లాహ్‌ (త) అంటున్నాడు, ప్రతివ్యక్తి విశ్వాసి అయినా, అవిశ్వాసి అయినా ప్రవక్త అయినా సరే. దాని (నరకంపై గల వంతెన) మీద నుండి దాటకుండా ఉండడు. అయితే విశ్వాసులు ప్రవక్తలు, చాలా సులువుగా దాటుకుంటారు. వారికి ఏమాత్రం కష్టం కలుగదు. చాలా వేగంగా దాటుకుంటారు. కొందరు మెరుపులా, గాలిలా, కొందరు వాహనంలా. అల్లాహ్‌(త) తన ప్రమాణాన్ని పూర్తిచేయటానికి ప్రతి ఒక్కరినీ దానిపై నుండి దాటిస్తాడు. విశ్వాసులు సాఫల్యం పొందుతారు. అవిశ్వాసులు అందులో పడిపోతారు. ముగ్గురు బిడ్డలు మరణించిన తండ్రి, ఓర్పు సహనాలు పాటిస్తే, తాత్కాలికంగా నరకంలో ప్రవేశిస్తాడు, శాశ్వతంగా కాదు.

[99]) వివరణ-1734: ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఆదేశం: “(అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు): నీవు నా దాసులను తీసుకొని రాత్రివేళ బయలుదేరు, నిశ్చయంగా మీరు వెంబడించబడతారు. “మరియు సముద్రాన్ని చీల్చి నెమ్మదిగా వెళ్ళిపో. నిశ్చయంగా, మీరు వెంబడించ బడతారు. మరియు సముద్రాన్ని చీల్చి నెమ్మదిగా వెళ్ళి పో. నిశ్చయంగా, ఆ సైనికులు అందులో మునిగిపోతారు!” వారు ఎన్నో తోటలను మరియు చెలమలను వెనుక విడిచిపోయారు; మరియు ఎన్నో పంటపొలాలను మరియు గొప్ప భవనాలను; మరియు వారు అనుభవిస్తూ ఉన్న ఎన్నో సుఖసంతోషాలను కూడా! విధంగా, (వారి ముగింపు జరిగింది). మరియు మేము వాటికి ఇతర జాతివారిని వారసులుగా చేశాము. కాని, వారి కొరకు ఆకాశంగానీ, భూమిగానీ విలపించ లేదు మరియు వారికి ఎలాంటి వ్యవధి కూడా ఇవ్వబడలేదు. (సూ. అద్ దుఖాన్‌, 44:23-29)  అంటే అల్లాహ్‌(త) మూసా (అ)ను, ‘నా దాసులను తీసుకొని రాత్రిపూట ఫిరౌన్‌ మరియు అతని అనుచరులకు తెలియకుండా ఇక్కడి నుండి వెళ్ళిపో, అవిశ్వాసులు మిమ్మల్ని వెంబడిస్తారు, కాని మీరు ఎటువంటి భయం లేకుండా బయలుదేరండి, నేను మీ కోసం సముద్రాన్ని చీల్చుతాను’ అని ఆదేశించాడు. అనంతరం మూసా (అ) బనీ ఇస్రాయీ’ల్‌ లను తీసుకొని బయలుదేరారు. ఫిరౌన్‌ మరియు అతని సైన్యాలు వారిని పట్టుకోవటానికి బయలుదేరారు. మధ్య సముద్రం వచ్చింది., మూసా (అ) తన కర్రతో కొట్టగా అల్లాహ్ (త) ఆజ్ఞతో అది చీలిపోయింది. మూసా (అ) బనీ ఇస్రాయీ’ల్‌ వారితోసహా దాన్ని దాటారు. తరువాత ఫిరౌన్‌ మరియు అతని అనుచరులు అందులో చేరగానే నీళ్ళు తిరిగి వచ్చాయి. వారందరూ అందులో మునిగిపోయారు. తోటలు, పొలాలు, కాలువలు, ఇళ్ళు, ఆసనాలు అన్నీ వదలి నాశనం అయ్యారు. వారి మరణం వల్ల ఎవరూ విచారించ లేదు. ఆకాశంపై ఎక్కటానికి వారి వద్ద ఎటువంటి సత్కార్యం ఉండేది కాదు. వాళ్ళు ఏదైనా మంచి పని చేసి ఉంటే, వాళ్ళపై భూమ్యాకాశాలు ఏడ్చేవి. అంటే పుణ్యాత్ములు మరణించటం వల్ల భూమ్యాకాశాల్లో ఉన్న వారు విచారిస్తారు.

[100]) వివరణ-1735: ఫర్త్ అంటే బిడారం కంటే ముందు వెళ్ళి ఆహార ఏర్పాట్లు చేసేవారు. అంటే ముందు మరణించిన పిల్లలు తమ తల్లిదండ్రుల కోసం సిఫారసు చేస్తారు. ప్రవక్త (స) తల్లిదండ్రులు, పిల్లలు అందరి కంటే ప్రియులు. ప్రవక్త (స) మరణం వల్ల అందరికీ, అందరి కంటే అధికంగా తల్లి దండ్రులకు బాధ కలుగుతుంది. ప్రవక్త (స) ప్రవచనం, ”ఒకవేళ ఎవరికైనా మరొకరి మరణం పట్ల దుఃఖం కలగకపోతే, కనీసం నా మరణం పట్లయినా కలుగుతుంది. దానిపై సహనం, ఓర్పులను పాటిస్తూ, నన్ను అనుసరిస్తూ ఉంటే, నేనతని కోసం స్వర్గంలో ప్రవేశించి, అతని కోసం సిఫారసు చేస్తాను.”

[101]) వివరణ-1737: కష్టాల్లో ఉన్న వ్యక్తిని ఓర్పు సహనాల గురించి బోధించడం, ఓదార్చటాన్ని సంతాపం తెలియజేయటం అని అంటారు. ఇందులో చాలా పుణ్యం ఉంది. మరో ‘హదీసు’లో కూడా ఇలా ఉంది: తన ముస్లిమ్‌ సోదరుణ్ణి ఓదార్చే వ్యక్తిని, తీర్పుదినం నాడు అల్లాహ్‌(త) గౌరవంగా, పురస్కారంగా దుస్తులు ధరింపజేస్తాడు. కష్టాల్లో ఉన్న వ్యక్తి యొక్క దుఃఖవిచారాలు తొలగిపోయేలా మంచి పదాలతో ఓదార్చాలి. ప్రవక్త (స) కూడా సంతాపం తెలియజేశారు. ప్రవక్త (స) మనవడి మరణం సంభవించింది. ప్రవక్త (స) తన కుమార్తెను ”అల్లాహ్‌ (త) తీసుకుంది అల్లాహ్‌(త)దే కదా, అల్లాహ్‌ ఇచ్చింది కూడా అల్లాహ్‌(త)దే కదా, ప్రతి దానికి ఒక నిర్ణీత సమయం ఉంది. నువ్వు సహనం ఓర్పులు పాటించాలి” అని ఓదార్చారు. కష్టాల్లో ఉన్న వ్యక్తి ఒకవేళ దూరంగా ఉంటే, ఉత్తరం ద్వారా కూడా అతనిని ఓదార్చవచ్చును. ప్రవక్త (స) ము’ఆజ్‌’ బిన్‌ జబల్‌ (ర)కు అతని కుమారుడు మరణించినపుడు, ఉత్తరం ద్వారా ఓదార్చారు. ఆ పదాలు ఇవి: ”బిస్మిల్లాహిర్ర’హ్మానిర్ర’హీమ్‌, ము’హమ్మద్‌ దైవప్రవక్త తరఫున, ము’ఆజ్‌’ బిన్‌ జబల్‌ వైపు, నీవు సంతోషించు, నేను నీ ముందు అల్లాహ్‌(త) స్తుతిస్తున్నాను. ఆయన తప్ప ఆరాధ్యులెవరూ లేరు. అమ్మా బ’అద్‌! అల్లాహ్‌(త) నీకు గొప్ప ప్రతిఫలం, ఓర్పూ సహనాలు ప్రసాదించు గాక! మనందరికీ కృతజ్ఞతలు తెలిపే భాగ్యం ప్రసాదించు గాక! ఎందుకంటే, మన ప్రాణాలు, మన ధనసంపదలు, మన భార్యాపిల్లలు, దైవం తరఫున ప్రసాదించబడిన తాత్కాలికమైన అనుగ్రహాలు. ఒక నిర్ణీత సమయం వరకు లాభం పొందాలి. ఆ సమయం పూర్తవగానే వాటిని తీసు కుంటాడు. అతడు ప్రసాదిస్తే, కృతజ్ఞతలు తెలుపటం తప్పనిసరి. అదేవిధంగా పరీక్షలకు గురిచేస్తే ఓర్పూ సహనాలను పాటించడం తప్పని సరి. మీ కుమారుడు అల్లాహ్‌(త) యొక్క ఉత్తమ అనుగ్రహం మరియు ఆయన అమానతు. అల్లాహ్‌ (త) అతన్ని నీ కోసం గర్వ పడేలా ప్రసాదించాడు. అనంతరం పుణ్యం, కారుణ్యం, మార్గదర్శకత్వానికి బదులు తిరిగి తీసుకున్నాడు. ఒకవేళ పుణ్య ఫలాపేక్ష ఉంటే ఓర్పు, సహనాలను పాటించు. నీ ఆందోళన, నీ కష్టాలు నిన్ను పుణ్యానికి దూరం చేయకూడదు సుమా! ఆందోళన చెందటం వల్ల పోయిన వస్తువు తిరిగిరాదు, విచారం దూరం కాదు. ఏది జరిగినా దాన్ని అల్లాహ్ నిర్ణయం అని, అదే మనకు క్షేమం, అని భావించు. వస్సలామ్‌. ”

ప్రవక్త (స) ఈ విధంగా ప్రజలను ఓదార్చేవారు. ప్రవక్త (స) అనుచరులు, తాబ’యీనులు, తబేతాబ’యీనులు, ఈ విధంగానే ఓదార్చేవారు.

మువ’త్తా ఇమామ్‌ మాలిక్‌లో బనీ ఇస్రాయీల్‌కు చెందిన ఒక సంఘటన ఉంది. గుణపాఠం కోసం దీన్ని ఇక్కడ పేర్కొనడం జరిగింది. ”ఖాసిమ్‌ బిన్‌ ము’హమ్మద్‌ (ర) కథనం: నా భార్య మరణించింది. ము’హమ్మద్‌ బిన్‌ క’అబ్‌ ఖర్‌జీ నన్ను పరామర్శించటానికి వచ్చి, నన్ను ఓదార్చటానికి ఈ కథ చెప్పారు: ”బనీ ఇస్రాయీల్‌లో ఒక వ్యక్తి ఉండేవాడు. చాలా గొప్ప భక్తుడు, పండితుడు, విద్వాంసుడు. అతనికి ఒక భార్య ఉండేది. అతడు ఆమెను చాలా ప్రేమించేవాడు. అకస్మాత్తుగా ఆమె మరణించింది. అతడు చాలా విచారానికి గురయ్యాడు. దుఃఖ-విచారాలు అతన్ని ఒంటరిగా ఒక గదిలో బంధించాయి. అంటే ఏకాంతంగా గదిలోపలే తాళం వేసుకొని ఉండేవాడు. ప్రజలతో కలవటం, మాట్లాడటం మానివేశాడు. ఎవ్వరూ అతన్ని కలిసే అవకాశం ఉండేది కాదు. అతని గురించి విని ఒక స్త్రీ అతని వద్దకు వచ్చింది. ‘అతన్ని ఒక సందేహం గురించి అడగాలి’ అని చెప్పింది. కాని ‘నేను అతన్ని అతనికి ఎదురుగా నిలబడి అడుగుతాను. అప్పుడే నాకు సంతృప్తి కలుగుతుంది’ అని చెప్పిది. అతని ఇంటిముందు ఉన్న వారందరూ వెళ్ళి పోయారు. కాని ఆ స్త్రీ మాత్రం అలాగే కూర్చొని ఉంది. ‘ప్రశ్నకు సమాధానం లేకుండా నేను ఇక్కడినుండి వెళ్ళను’ అని చెప్పింది. ఒక వ్యక్తి అతనితో ‘ఒక స్త్రీ మిమ్మల్ని ఏదో విషయంపై అడగటానికి వచ్చింది. ప్రత్యక్షంగా మిమ్మల్ని అడగాలని పట్టుపట్టింది. అందరూ వెళ్ళిపోయారు. కాని ఆమె మాత్రం కూర్చునే ఉంది’ అని తెలియపరిచాడు. దానికి అతను అనుమతించాడు. ఆ స్త్రీ అతని వద్దకు వచ్చింది. ‘నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని వచ్చాను’ అని చెప్పింది. ‘ఏం ప్రశ్న?’ అని అతడు అడిగాడు. దానికి ఆ స్త్రీ ‘నేను పొరుగింటి స్త్రీ వద్ద నుండి ఒక హారం తాత్కాలికంగా తీసుకున్నాను. చాలా కాలం వరకు నేను దాన్ని ధరిస్తూ ఉన్నాను. ఇతరులకు కూడా ధరించటానికి ఇచ్చేదాన్ని. ఇప్పుడామె నన్ను తన హారాన్ని అడుగుతుంది. నేను ఆమె హారాన్ని ఇచ్చి వేయనా?’ అని అడిగింది. దానికి అతను ‘అవును, అల్లాహ్ సాక్షి! ఆమె హారం ఆమెకు ఇచ్చివేయి’ అని అన్నాడు. దానికి ఆమె ‘ఆమె హారం చాలా కాలంగా నా వద్ద ఉంది కదా?’ అని చెప్పింది. ‘అప్పుడైతే మరి ఆమెకు తిరిగి ఇవ్వవలసిందే’ అని అన్నాడు. అప్పుడు ఆ స్త్రీ ‘గురువుగారూ! అల్లాహ్‌(త) మిమ్మల్ని కరుణించుగాక! అల్లాహ్‌(త) ఒక వస్తువును తాత్కాలికంగా మీకు ఇచ్చాడు. మరల తన వస్తువు తిరిగి తీసుకున్నాడు. దానికి మీరు చాలా విచారిస్తున్నారు. వాస్తవంగా అల్లాహ్‌(త) తన వస్తువుపై మీకంటే అధికంగా హక్కు ఉంది.’ స్త్రీ మాటలు విని అతడు వాస్తవం గ్రహించి, గుణపాఠం నేర్చుకొని విషయం తెలుసుకున్నాడు. అతనికి చాలా లాభం కలిగింది.

[102]) వివరణ-1739: అఫర్(ర) ప్రఖ్యాత ప్రవక్త(స) అనుచరులు. ‘అలీ (ర) సోదరులు. వయసులో అతని కంటే 2 సంవత్సరాలు పెద్దవారు. ఆయన ఇస్లామ్‌ స్వీకరణ ఈ విధంగా ఉంది. ఇది అసదుల్‌ ‘గాబహ్‌, తబఖాతు ఇబ్ను స’అద్‌ మరియు సియరుస్స-‘హాబాహ్‌లో ఉంది. ఒకరోజు ప్రవక్త (స) ‘అలీ (ర)తో కలసి ఆరాధనలో నిమగ్నమై ఉన్నారు. హాషిమ్‌ వంశ నాయకులు అబూ ‘తాలిబ్‌ అది చూచి తన కుమారుడు జ’అఫర్‌ను ‘నీవు కూడా వెళ్ళి చిన్నాన్న కొడుకు ప్రక్కన నిలబడు’ అని అన్నారు. జ’అఫర్‌ వెళ్ళి ప్రవక్త (స) ఎడమ వైపు నిలబడ్డారు. అతనికి ఆరాధనలో చాలా మనశ్శాంతి లభించింది. ప్రవక్త (స) ‘జైద్‌ బిన్‌ అర్‌ఖమ్‌ ఇంట్లో శరణు కోరక ముందు ఇస్లామ్‌ స్వీకరించారు. అప్పటి వరకు 31 లేదా 32 మంది ఇస్లామ్‌లో చేరారు. ఖురైష్‌ అవిశ్వాసుల హింసలు భరించలేక ఒక ముస్లిముల బృందం ‘హబ్‌షహ్ వెళ్ళారు. జ’అఫర్‌ కూడా వాళ్ళ వెంట వెళ్ళారు. కాని ఖురైష్‌ అవిశ్వాసులు అక్కడా ముస్లిములను ప్రశాంతంగా ఉండనివ్వ లేదు. అవిశ్వాసులు అమూల్యమైన కానుకలు తీసుకొని ‘హబ్‌షహ్ వెళ్ళి నజాషీ సభలో ఒక బృందంగా వెళ్ళి ‘మా అమాయక యువకులు తమ పూర్వీకుల ధర్మం వదలి, మీ వద్దకు వచ్చి ఉన్నారు. వారు క్రొత్త ధర్మాన్ని అనుస రిస్తున్నారు. ఇంతకు ముందు దాన్ని గురించి మాకు తెలియనే తెలియదు. వాళ్ళ పెద్దలు, బంధువులు వారిని తీసుకొని రమ్మని పంపారు’ అని అన్నారు. సభలో ఉన్నవారు కూడా గట్టిగా సమర్థించారు. అప్పుడు నజ్జాషీ ముస్లిములను పిలిచి, ‘ఏ ధర్మం కొరకు మీరు మీ పెద్దల ధర్మం వదిలారు’ అని ప్రశ్నించాడు.  ముస్లిములు నజ్జాషీతో మాట్లాడటానికి జ’అఫర్‌ (ర)ను ఎన్నుకున్నారు. అతను ఇలా ప్రసంగించారు: ”మహారాజా! మా జాతి గాఢాంధకారంలో ఉండేది. మేము విగ్రహాలను ఆరాధించే వాళ్ళం. శవాలను తినేవాళ్ళం. పాపాలు, వ్యభిచారం, దొంగతనాలు చేసే వాళ్ళం. బంధువులను, ఇరుగుపొరుగు వారిని హింసించే వాళ్ళం. బలవంతుడు బలహీనులను తినేవాడు. మేము దురదృష్టంలో కొట్టుమిట్టాడుతూ ఉండేవాళ్ళం. దైవం మాలో నుండే ఒకరిని ప్రవక్తగా పంపాడు. అతను నిజాయితీ పరుడని, సత్యవంతుడని, సత్యసంధుడని మాకు తెలుసు. అతను మమ్మల్ని దైవానికి సాటి కల్పించటం నుండి, విగ్రహారాధన నుండి వారించి ఏకత్వ సందేశం పట్ల, స్నేహితుల పట్ల ప్రేమగా ఉండాలని మాకు బోధించాడు. అసత్యం పలక కూడదని, అనవసరంగా రక్తపాతాన్ని సృష్టించరాదని, వ్యభిచారం నుండి, మోసం నుండి దూరంగా ఉండాలని, అనాథల సొమ్ము తినరాదని, శీలవతులపై అభాండాలు వేయరాదని, విగ్రహారాధన మానివేయమని, ఏకైక వాస్తవ దైవాన్నే విశ్వసించాలని, నమా’జు చదవాలని, ఉపవాసాలు ఉండాలని, ‘జకాత్‌ చెల్లించాలని, ఆదేశించాడు. మేము అతన్ని విశ్వసించాము, ఇంకా మేము అతని బోధనలను అనుసరించాము. మేము విగ్రహాలను ఆరాధించడం మానివేశాము. కేవలం వాస్తవ దైవాన్నే ఆరాధిస్తున్నాం. ధర్మసమ్మతమైన వాటిని ధర్మసమ్మతమైనదిగా, నిషేధించిన వాటిని నిషేధించబడినవిగా భావించాము. దీనిపై మా జాతివారు మా శత్రువులుగా మారిపోయారు. వారు అనేక రకాలుగా మమ్మల్ని హింసించి, మళ్ళీ మమ్మల్ని విగ్రహారాధనలో నెట్టివేయాలని ప్రయత్నిస్తున్నారు. చివరికి మేము తప్పించుకొని, మీ దేశంలోకి వచ్చాము.” అప్పుడు నజ్జాషీ ”మీ ప్రవక్తపై అవతరించబడిన గ్రంథం నుండి ఏదైనా చదివి వినిపించండి” అని ఆదేశించాడు. అప్పుడు జ’అఫర్‌ (ర) సూరహ్‌ మర్యమ్‌(19) నుండి కొన్ని వాక్యాలు పఠించి వినిపించారు. నజ్జాషీ చాలా ప్రభావితుడయ్యాడు. ఇంకా అల్లాహ్ సాక్షి! ఇది మరియు తౌరాతు ఒకే దీపం నుండి వెలువడ్డాయి అని పలికి ఖురైష్‌ రాయబారులతో, ‘అల్లాహ్ సాక్షి! నేను వారిని ఎన్నడూ వెళ్ళనివ్వను’ అని ప్రకటించాడు. ఖురైష్‌ రాయబారులు మరోసారి ప్రయత్నించారు. మరుసటి రోజు సభలోకి వచ్చి, ‘మహారాజా! ‘ఈసా (అ) గురించి వీళ్ళ అభిప్రాయం ఏమిటో తెలుసుకోండి’ అని విన్నవించుకున్నారు. నజ్జాషీ సమాధానం ఇవ్వటానికి ముస్లిములను పిలిపించాడు. జ’అఫర్‌ (ర) మరియు అతని మిత్రులు సభలోకి వచ్చిన తర్వాత, నజ్జాషీ ” ‘ఈసా (అ) గురించి మీ విశ్వాసం ఏమిటి?” అని అడిగాడు. దానికి జ’అఫర్‌ (ర), ‘మేము అతన్ని అల్లాహ్ దాసులు, ప్రవక్త, అల్లాహ్ పంపిన ఆత్మగా భావిస్తున్నాము’ అని అన్నారు. అప్పుడు నజ్జాషీ నేలపై నుండి ఒక పుల్లతీసి ‘ అల్లాహ్ సాక్షి! నీవు చెప్పిన దానికంటే ఒక్క పుల్లంత అయినా ఎక్కువ కాదు’ అని అన్నాడు. అది విని సభలో ఉన్న క్రైస్తవ పండితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాని నజ్జాషీ ఏ మాత్రం సంకోచానికి గురికాకుండా తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ఈ విధంగా ఖురైషుల రాయబారం ఫలించలేదు. (ముస్నద్‌ అ’హ్మద్‌ – 1 / 201)

జ’అఫర్‌ (ర) ప్రవక్త (స) మదీనహ్ వచ్చిన 6 సంవత్సరాల వరకు ‘హబ్‌షహ్ లోనే ఉన్నారు. 7వ హిజ్రీలో ‘హబ్‌షహ్ నుండి మదీనహ్ వచ్చారు. అప్పటికి ఖైబర్‌ జయించ బడింది. ముస్లిములు సంబరాలు చేసుకుంటున్నారు. దూరంగా ఉన్న తన సోదరులు వచ్చినందుకు వారి సంతోషం రెట్టింపు అయ్యింది. జ’అఫర్‌ (ర) రాగానే ప్రవక్త (స) అతని ఆలింగనం చేసుకున్నారు. నుదురును ముద్దుపెట్టి, ‘జ’అఫర్‌ వచ్చినందువల్ల ఎక్కువ సంతోషం కలిగిందా లేక ఖైబర్‌ విజయం వల్ల ఎక్కువ సంతోషం కలిగిందా నాకు తెలియడం లేదు’ అని అన్నారు. (తబఖాతు ఇబ్ను స’అద్‌, బు’ఖారీ)

జ’అఫర్‌ (ర) వచ్చి ఇంకా ఒక్క సంవత్సరమైనా కాలేదు. అతని పరీక్షా సమయం రానే వచ్చింది. 8వ హిజ్రీలో జమాదుల్‌ అవ్వల్‌లో మౌతపై దండయాత్ర జరిగింది. ప్రవక్త (స) జెండా జైద్బిన్‌ ‘హారిసహ్ (ర)కు ఇచ్చారు. ఇంకా ”ఒకవేళ ‘జైద్‌ వీరమరణం పొందితే అఫర్, ఒకవేళ జ’అఫర్‌ (ర) కూడా వీరమరణం పొందితే అబ్దుల్లాహ్బిన్రవా సైన్య నాయకులుగా ఉండాలి’ అని ఆదేశించారు. (బు’ఖారీ)

జ’అఫర్‌ (ర) ప్రవక్త (స)తో గల ప్రత్యేక సంబంధాల వల్ల నాయకత్వం తనకే లభిస్తుందని భావించారు. అందువల్ల నిలబడి, ‘ప్రవక్తా! తమరు నాపై ‘జైద్‌ను నాయకునిగా నియమిస్తారని ఎన్నడూ భావించలేదు’ అని అన్నారు. దానికి ప్రవక్త (స) ”దాన్ని వదులు, మంచి ఎందులో ఉన్నదో నీకు తెలియదు” అని అన్నారు. (తబఖాతు ఇబ్ను స’అద్‌-3)

ప్రవక్త (స)కు యుద్ధ ఫలితం ముందే తెలిసింది. కాబట్టి ఈ విధంగా ఆదేశించారు. మౌతా చేరిన తర్వాత యుద్ధం ప్రారంభం అయ్యింది. 3 వేల మంది ముస్లిములు లక్ష మందిని ఎదుర్కొన్నారు. సైన్యనాయకులు ‘జైద్‌ వీరమరణం పొందారు. జ’అఫర్‌ (ర) వెంటనే దిగి జెండా అందుకొని శత్రుసైన్యంలో దూసుకుపోయారు. అన్ని వైపుల నుండి ఆయుధాల వర్షం కురుస్తుంది. శరీరమంతా, గాయాల మయమయ్యింది. రెండు చేతులు కూడా ఒక దాని తరువాత ఒకటి తెగిపడ్డాయి. ఆ సమయంలో కూడా జెండాను క్రింద పడనివ్వలేదు. (అసదుల్‌’గాబహ్‌-1) ‘ఖాలిద్‌ సైఫుల్లా జెండా చేతిలోకి తీసుకున్నారు, ముస్లిములను కాపాడుకున్నారు. (తబఖాతు ఇబ్నుస’అద్‌)

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కూడా ఈ యుద్ధంలో ఉన్నారు. అతను ”నేను జ’అఫర్‌ శవాన్నివెదికిచూడగా కేవలం ముందు 50 గాయాలు ఉన్నాయి. శరీరంపై ఉన్న గాయాలన్నీ కలిసి 90కు పైగా ఉన్నాయి. కాని వాటిలో ఏదీ వెనుక లేదు అని” అన్నారు. (బు’ఖారీ)

యుద్ధ మైదానంలో జరుగుతున్నదంతా దైవాజ్ఞ వల్ల ప్రవక్త(స) ముందు ఉంది. అందువల్ల వార్త రాకముందే వీరమరణం పొందిన వారి గురించి వివరాలు తెలియ జేశారు. అప్పుడు ప్రవక్త (స) కళ్ళంట నీళ్ళు నిరంతరంగా ప్రవహించాయి. దుఃఖం, విచారం చిహ్నాలు ప్రవక్త (స) ముఖంపై ఆవరించాయి. (అసదుల్‌ ‘గాబహ్‌)

జ’అఫర్‌ భార్య అస్మా బిన్తెఉమైష్ (ర) కథనం: నేను పిండి సిద్ధం చేసి, పిల్లల్ని స్నానం చేయించి బట్టలు తొడిగిస్తున్నాను. ఇంతలో ప్రవక్త (స) వచ్చారు. ”జ’అఫర్‌ పిల్లల్ని తీసుకురండి” అని అన్నారు. వాళ్ళను తెచ్చి ప్రవక్త (స) ముందు పెట్టాను. ప్రవక్త (స) కళ్ళంట నీళ్ళు కారుస్తూ వాళ్ళను ముద్దాడారు. నేను ”నా తల్లి-దండ్రులు మీ కోసం త్యాగం కాను. మీరు ఏడుస్తున్నారెందుకు” అని అడిగాను. ”జ’అఫర్‌ మరియు అతని అనుచరుల గురించి ఏదైనా వార్త వచ్చిందా?” అని అడిగాను. దానికి ప్రవక్త (స) ”అవును, అతను వీరమరణం పొందారు” అని అన్నారు. అది విని నేను కేకలువేస్తూ ఏడ్వసాగాను. ఇరుగు, పొరుగు స్త్రీలు వచ్చారు. ప్రవక్త (స) తిరిగి వెళ్ళి, తన భార్యలతో ”జ’అఫర్‌ ఇంటివాళ్ళను కనిపెట్టు కొని ఉండండి. ఈ రోజు వాళ్ళు స్పృహలో లేరు.” (ముస్తదరక్‌ ‘హాకిమ్‌/3) ఫా’తిమహ్ (ర) కూడా తన చిన్నాన్న మరణం పట్ల చాలా బాధపడ్డారు. చిన్నాన్న, ‘చిన్నాన్న’ అని కేకలువేస్తూ ప్రవక్త (స) వద్దకు వచ్చారు. అప్పుడు ప్రవక్త (స) ”నిస్సందే హంగా జ’అఫర్‌ వంటి వ్యక్తిపై ఏడ్చే స్త్రీలు ఏడవాలి. ప్రవక్త (స) చాలా రోజుల వరకు తీవ్ర దుఃఖానికి విచారానికి గురయ్యారు. చివరికి జిబ్రీల్‌ (అ), ”అల్లాహ్‌ జ’అఫర్‌కు తెగిన రెండు చేతులకు బదులు, రెండుక్రొత్త చేతులు ప్రసాదించాడు. వాటితో జ’అఫర్‌ స్వర్గంలో దైవదూతలతో పాటు తిరుగుతూ ఉన్నారు” అని శుభవార్త ఇచ్చారు. (‘హాకిమ్‌) అనంతరం జ’అఫర్‌కు జుల్‌జనాహైన్‌, తయ్యారాన్‌ అనే బిరుదులు పడ్డాయి. (సియరుస్స’హాబా)

ఈ ‘హదీసు’ ద్వారా మృతుని బంధువులు, చుట్టాలు మృతుని ఇంటి వారికోసం అన్నపానీయాల ఏర్పాటు చేయాలి. ఆ సమయంలో భోజనం తయారు చేసే అవకాశం లభించదు. దాని వల్ల వారి భార్యాబిడ్డలు ఆకలితో ఉంటారు. ఈ ఆధునిక కాలంలో బంధువులు, స్నేహితులు మృతుని ఇంటివద్ద చేరి విందు ఆరగిస్తారు. ఇది మృతుని కుటుంబంపై భారంగా ఉంటుంది. అందువల్ల ఇటువంటి మూఢాచారాలను అరికట్టాలి.

[103]) వివరణ-1741: ‘ఆయి’షహ్‌ (ర) మాటలకు అర్థం ఏమిటంటే, సజీవులు ఏడ్వటం వల్ల మృతులను శిక్షించటం జరుగదు. వాస్తవం, తిరస్కారం వల్ల శిక్షించడం జరుగుతుంది. మృతులు అంటే, అవిశ్వాసులు యూదులు, మరెవరైనా కావచ్చు. ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ మృతుడు అంటే ఎవరైనా కావచ్చు అని అభిప్రాయపడ్డారు. ‘ఆయి’షహ్‌ (ర) ‘అతను అబద్ధం చెప్పి ఉండరు, మరచిపోయి ఉంటారు, అల్లాహ్‌ (త) అతన్ని క్షమించుగాక’ అని అన్నారు.

[104]) వివరణ-1742: ఒకవేళ మృతుడు మరణానికి ముందు, తనపై ఏడ్వమని చెప్పి ఉంటే, అతని మరణానంతరం ప్రజలు అతని చెప్పిన విధంగా అతనిపై ఏడిస్తే, ఆ పాపం మృతునిపై పడుతుంది, శిక్ష కూడా పడుతుంది. ఎందుకంటే అతను తన జీవితంలోనే ఒక పాపం పట్ల చెప్పి ఉన్నాడు. ‘ఉమర్‌ (ర) ‘హదీసు’ అర్థం ఇదే. ‘ఆయి’షహ్‌ (ర) ఈ ‘హదీసు’ను ప్రవక్త (స) ద్వారా వినలేదు. ఆమె కేవలం యూద స్త్రీకి సంబంధించిన ‘హదీసు’ విన్నారు. ఈ రెండు ‘హదీసు’ల్లో ఏమాత్రం వ్యతిరేకత లేదు. ఇబ్నె ‘ఉమర్‌ (ర) కలహించుకోవటం ఎందుకని మౌనంగా ఉండిపోయారు.

[105]) వివరణ-1744: అబూ సలమహ్ మరణ సంఘటన ఇంతకు ముందు పేర్కొనడం జరిగింది. ఏడ్వడానికి సిద్ధం కావటం అంటే, ప్రత్యేక దుస్తులు ధరించటం అని అర్థం. ఇంటి నుండి రెండుసార్లు షై’తాన్‌ను తీసివేయడమంటే ఒకసారి ఇస్లామ్‌ స్వీకరించినందు వల్ల, మరోసారి హిజ్రత్‌ చేయడం వల్ల. ఇప్పుడు ఏడ్పులు, పెడబొబ్బలు పెట్టటం వల్ల మళ్ళీ షై’తాన్‌ ఇంటిలోకి ప్రవేశిస్తాడు. అంటే ఏడ్పులు, పెడబొబ్బలు పెట్టటం షై’తాన్‌ పనులు అని తెలుస్తుంది.

[106]) వివరణ-1745: అబ్దుల్లాహ్బిన్రవాహహ్ ప్రఖ్యాత అనుచరులు. అతనొక పహెల్వాన్‌. ప్రవక్త (స) ప్రత్యేక గుమస్తా, మరియు కవి. ఇతని గురించి ”అజ్ఞాన కాలంలోనూ, ఇస్లామ్‌లోనూ ప్రత్యేక స్థానం గలవారు. అతను లైలతుల్‌ ‘ఉఖబహ్ లో ఇస్లామ్‌ స్వీకరించారు. బనూహారిసహ్ నాయకులుగా నియమించబడ్డారు. మిఖ్‌దాద్‌ బిన్‌ అస్‌వద్‌ కందీతో సోదర సంబంధం ఏర్ప డింది. బద్ర్‌ యుద్ధంలో పాల్గొన్నారు. యుద్ధం ముగిసిన తర్వాత మదీనహ్ ప్రజలకు విజయ శుభవార్త ఈయనే అందజేశారు. కందక యుద్ధంలో ప్రవక్త (స) ఈయన కవిత్వాలనే చదువుతూ ఉన్నారు. హుదైబియా మరియు బైతె రి’ద్వాన్‌లో కూడా పాల్గొన్నారు. అసీర్‌ బిన్‌ జారిమ్‌ యూదుడు. అబూ రా’ఫె తర్వాత ఖైబర్‌ గవర్నర్‌గా నియమించబడ్డాడు. ఇస్లామ్‌ శతృత్వంలో అతని విధానాన్నే అనుసరించేవాడు. అనంతరం అతడు ‘గత్‌ఫాన్‌ పర్యటించి తెగలన్నింటినీ ప్రేరేపించాడు. ఈ విషయాలన్నీ ప్రవక్త (స) కు తెలిసాయి. రమ’దాన్‌ 6 హిజ్రీలో ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ రవా’హాను 30 మందిని ఇచ్చి ఖైబర్‌ పంపించారు. ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ రవా’హహ్ రహస్యంగా ‘అసీర్‌ యొక్క రహస్యాలన్నీ కనిపెట్టారు. ప్రవక్త (స) వద్దకు వచ్చి తెలియజేశారు. ప్రవక్త (స) వాడిని హత్యచేయటానికి ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ రవా’హహ్ ను నియమించారు. అతని వెంట 30మందిని పంపారు. ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ రవా’హహ్ ‘అసీర్‌ను కలసి, ”నీకు ఒక మాట చెప్పటానికి వచ్చాం, మాకు అభయం ఇవ్వాలి” అని అన్నారు. ‘సరే చెప్పండి’ అని అన్నాడు. అప్పుడు ‘అబ్దుల్లాహ్‌ ”ప్రవక్త (స) మమ్మల్ని నీ వద్దకు పంపారు. నిన్ను ఖైబర్‌ అధికారిగా నియమించాలని అంటున్నారు. అయితే నీవు మదీనహ్ రావాలి” అని అన్నారు. పన్నాగం ఫలించి అతడు 30 మంది యూదు లను తీసుకొని, వారివెంట వెళ్ళాడు. మార్గంలో ‘అబ్దు ల్లాహ్‌ ప్రతియూదునిపై ఒకముస్లిమ్‌ను నియమించారు. అసీర్‌కు అనుమానం కలిగింది. తిరిగి వెళ్ళి పోతానని చెప్పాడు. ముస్లిములు మోసగించిన నేరానికి అందరి మెడలను నరికివేశారు. లేచిన తుఫాన్‌ అక్కడే సమసి పోయింది. (తబఖాతు ఇబ్ను స’అద్‌)

ఖైబర్‌ విజయం తరువాత ప్రవక్త (స) పళ్ళు అంచనా వేయటానికి అతన్నే పంపారు. ‘ఉమ్‌రతుల్‌ ఖ’దాలో ప్రవక్త (స) మక్కహ్ వెళ్ళారు. అప్పుడతను ఒంటె కళ్ళెం పట్టుకొని కవిత్వం చదువుతూ నడిచారు. అప్పుడు ‘ఉమర్‌ (ర) అల్లాహ్‌ ” ‘హరమ్‌ మరియు ప్రవక్త (స) ముందు కవిత్వం చదువుతున్నావా?” అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స), ” ‘ఉమర్‌! నేను వింటున్నాను. అల్లాహ్ సాక్షి! ఇతని కవిత్వం అవిశ్వాసుల పై బాణాల్లా, కరవాలంలా పనిచేస్తుంది.” తరువాత అతనితో నువ్వు ”లా యిలాహ ఇల్లల్లాహు వహ్‌దహు వ నసర ‘అబ్దహు వఅ’అజ్జ జున్‌దహు వ’హ’దమల్‌ అ’హ్‌’జాబ వ’హ్‌దహు” పలుకు’ అని అన్నారు. ఇబ్బు రవా’హహ్ దాన్ని పలకగా అందరూ అతని వెంట బిగ్గరగా గొంతు కలిపి పలకసాగారు. దానివల్ల మక్కహ్ కొండ ప్రాంతం అంతా మారు మ్రోగింది. (తబఖాతు ఇబ్ను స’అద్‌ /88)

8వ హిజ్రీ జమాదుల్‌ ఊలాలో మౌతహ్ యుద్ధం జరిగింది. ప్రవక్త (స) బస్రా అధికారికి ఒక ఉత్తరం పంపారు. మార్గంలో మౌతహ్ ఒక ప్రదేశం పేరు. అక్కడ ఒక గస్సానీ రాయబారిని చంపివేశాడు. రాయబారిని చంపి, యుద్ధం ప్రకటించాడు. ఈ వార్త ప్రవక్త (స)కు అందగానే, 3000 మందిని ‘జైద్‌ బిన్‌ ‘హారిస’హ్ (ర) నేతృత్వంలో మౌతహ్ పంపారు. ఇంకా ‘జైద్‌ వీరమరణం పొందితే, జ’అఫర్‌ (ర), అతను వీరమరణం పొందితే, ఇబ్ను రవా’హహ్ నాయకత్వం వహించాలని, ఒకవేళ అతను కూడా వీరమరణం పొందితే, తగిన వ్యక్తిని ఎన్ను కోమని ఆదేశించారు. సైన్యం సిద్ధమయింది. పంపినపుడు ప్రవక్త (స) మదీనహ్ ప్రజలు దీవెనలతో ఏడ్వడం ఎందుకు అని అన్నారు. దానికి అతను ”నాకు ప్రాపంచిక వాంఛ లేదు, కాని ప్రవక్త (స) ప్రతివ్యక్తికి నరకంలో వెళ్ళవలసి ఉంది” అని పలకటం నేను విన్నాను. అందువల్లనేను నరకంలో వెళ్ళిన తరువాత, బయటకు రాగలనా లేదా అని భయంగాఉంది అని అన్నారు. ప్రజలందరూ ఓదార్చి అల్లాహ్‌ మళ్ళీప్రవక్త (స)తో కలుపుతాడు అని అన్నారు.

ఆ తరువాత ప్రవక్త (స) ను కలవడానికి వచ్చారు. ప్రవక్త (స) వీడ్కోలు పలికారు. ఇటు సైన్యం మదీనహ్ నుండి బయలుదేరింది. అటు శత్రువుకు ఈ వార్త చేరింది. అతడు హిర్‌కల్‌కు తెలియపరచి, 2 లక్షల మందిని కూడబెట్టుకున్నాడు. ముస్లిములు సిరియా చేరి మఆన్‌లో రెండు రాత్రులు బసచేశారు. ప్రవక్త (స)కు ఈ వార్త అందించాలని నిర్ణయం జరిగింది. ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ రవా’హహ్ ధైర్యంగా ”ఏం ఫరవా లేదు, మనం పోరాడాలి” అని అన్నారు. అనంతరం మఆన్‌ నుండి బయలుదేరి, మౌతహ్ చేరారు. అక్కడ అవిశ్వాసులతో యుద్ధం జరిగింది. ముస్లిములు కేవలం 3000 మాత్రమే. అవిశ్వాసులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. యుద్ధం ప్రారంభ మయ్యింది. ముందు ‘జైద్‌ వీరమరణం పొందారు. తరువాత జ’అఫర్‌ (ర) జెండా తీసుకొని వీరోచితంగా పోరాడి వీరమరణం పొందారు. తరువాత ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ రవా’హహ్ కవిత్వం చదువుతూ ముందుకు దూసుకు పోయారు. బల్లెంతో దాడిచేశారు. ఇంతలో ఒక అవిశ్వాసి గురిచూసి బల్లెం విసిరికొట్టాడు. రక్తం చిందింది. అప్పుడు ముస్లిములారా! మీ సోదరుని మాంసాన్ని రక్షించండి, అని కేకవేశాడు. వెంటనే ముస్లిములందరూ అతన్ని చుట్టు ముట్టి అవిశ్వాసులపై దాడి చేశారు. అప్పటికి అతని ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళిపోయి ఉంది.

ప్రవక్త (స) కు దైవవాణి ద్వారా ప్రతి విషయం తెలుస్తూ ఉంది. ప్రవక్త (స) ప్రజల ముందు వివరిస్తూ ఉన్నారు. జ’అఫర్‌ (ర) గురించి చెప్పి మౌనంగా ఉండిపోయారు. ప్రవక్త(స) మౌనం చూసి ప్రజలు ఇబ్ను రవా’హహ్ వీరమరణం పొందారని అనుకున్నారు. కొంతసేపు తర్వాత కన్నీరు కారుతూ ఇబ్ను రవా’హహ్ వీరమరణం పొందారని చెప్పారు. అన్సార్లు ఆ వార్త విని చాలా విచారించారు. ఒకసారి ఇబ్ను రవా’హహ్ స్పృహ కోల్పోయారు. అతని సోదరి ‘అమ్ర నా అన్న, నా అన్న అని ఏడ్పులు, పెడబొబ్బలు పెట్టసాగింది. ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ రవా’హహ్ స్పృహలోకి వచ్చిన తరువాత నీవు పలుకుతున్న వన్నీ నా చేత ధృవీకరించడం జరిగింది. అందువల్ల మరణించి నపుడు ఎవరూ ఎటువంటి అసహనానికి గురి కాలేదు. బు’ఖారీలో ”అతడు మరణించి నపుడు అతనిపై ఏడ్పులు పెడబొబ్బలు పెట్టలేదని” ఉంది. (బు’ఖారీ – 1, అసదుల్‌ ‘గాబహ్‌ – 3, తబఖాతు ఇబ్నుస’అద్‌)

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ రవా’హహ్ (ర) చాలా గొప్ప దైవ భక్తులు, దైవభీతిపరులు. ప్రవక్త(స) అల్లాహ్‌ (త) ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ రవా’హహ్ ను కరుణించు గాక! దైవదూతలు గర్వపడే సభలనే అతను కోరుకునేవారు. (అస్హాబహ్‌ – 4)

అబూ దర్‌దా (ర) కథనం: నేను ప్రతి రోజూ ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ రవా’హహ్ ను గుర్తు చేసుకునేవాడిని. నన్ను కలవడానికి వస్తే, రండి, కొంతసేపటికి ముస్లిమ్‌ అయి పోదాము అని చెప్పి, కూర్చొని మాట్లాడి, ఇది విశ్వాస సభ అని అనేవారు. (అసదుల్‌ ‘గాబహ్‌ / 3) అతని భార్య కథనం: ఇబ్నె రవా’హహ్ ఇంటి నుండి బయలుదేరినపుడు రెండు రకాతులు చదివేవారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా 2 రకాతులు చదివే వారు. ఇందులో ఏమాత్రం అలసత్వం చూపలేదు. ఇక ప్రయాణంలో చాలా తీవ్రంగా వేడి ఉండేది. ఎండవేడికి ప్రజలు తమ తలలపై చేతులు పెట్టుకున్నారు. ఇటువంటి వాతావరణంలో ఎవరు ఉపవాసం ఉండ గలరు. కాని ప్రవక్త (స) మరియు ఇబ్నె రవా’హహ్ ఉపవాసం ఉన్నారు. (బు’ఖారీ 1 / 261)

అతనికి జిహాద్‌ అంటే ఎంతో ఇష్టంగా ఉండేది. బద్ర్‌ నుండి మౌతహ్ వరకు ఒక్క యుద్ధం కూడా వదలలేదు. అస్మా ఉర్రిజాల్‌ రచయిత ఇతన్ని గురించి పేర్కొంటూ, ”అబ్దుల్లాహ్‌ బిన్‌ రవా’హహ్ (ర) యుద్దంలో అందరి కంటే ముందు వెళ్ళి అందరికంటే తరువాత వచ్చేవారు.’ (అసాబహు 4 / 62)

ప్రవక్త (స) విధేయత గురించి ఈ సంఘటన సాక్ష్యం: ప్రవక్త (స) ‘ఖు’త్బహ్ ఇస్తున్నారు. అప్పుడే ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ రవా’హహ్ మస్జిద్‌ చేరుకున్నారు. ప్రవక్త (స) ‘మీ మీ స్థానాల్లో కూర్చొండి’ అని అన్నారు. అప్పటికి ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ రవా’హహ్ మస్జిద్‌ బయట ఉన్నారు, అక్కడే కూర్చున్నారు. ప్రవక్త (స) ‘ఖు’త్బహ్ ముగించిన తర్వాత ఎవరో దీన్ని గురించి తెలియపరిచారు. దానికి ప్రవక్త (స) ”అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్త (స) విధేయ తలో అతని శ్రద్ధాసక్తులను అల్లాహ్‌ ఇంకా అధికం చేయు గాక!” అని దీవించారు. అతను ప్రవక్త (స) ను చాలా ప్రేమించేవారు. ప్రవక్త (స) కూడా అతన్ని చాలా ప్రేమించేవారు. ఒకసారి అనారోగ్యానికి గురయి, స్పృహ కోల్పోయారు. ప్రవక్త (స) అతన్ని పరామర్శించారు. అప్పుడు ఇలా ప్రార్థించారు, ”ఒకవేళ ఇతని మరణ సమయం ఆసన్నమయి ఉంటే, సులభతరం చేయి, లేకుంటే ఆరోగ్యం ప్రసాదించు.” (అసాబహు 4 / 266) విశ్వాసం ఎంత దృఢంగా ఉండేదంటే, ఒకసారి ‘అబ్దు ల్లాహ్‌ బిన్‌ ఉబయ్‌ సభలో కూర్చున్నారు. ప్రవక్త (స) వారి ప్రక్క నుండి వెళితే, గుర్రపు ధూళి ఎగిరి వారిపై పడింది. వెంటనే ఉబయ్‌ ‘ధూళి వేయకు’ అని అన్నాడు. ప్రవక్త (స) అక్కడే దిగి ఏకత్వంపై ప్రసంగించారు. అప్ప టికి ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ఉబయ్‌ ఇంకా ఇస్లామ్‌ స్వీకరించ లేదు. ‘ఇది సరికాదు, నీవు చెప్పేది సత్యమే అయితే, ఇక్కడకు వచ్చి, పీడించ నవసరంలేదు. సంతో షంగా మీ దగ్గరకు వచ్చిన వ్యక్తికి బోధించు’ అని అన్నాడు. ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ రవా’హహ్ కు పౌరుషం, ఆవే శం వచ్చి, ‘ఓ ప్రవక్తా! మీరు తప్పకుండా చెప్పండి. మేమందరం ఇష్టపడుతున్నాం’ అని అన్నాడు. (బు’ఖారీ / 256)

[107]) వివరణ-1746: మృతుడు అంటే వాస్తవంగా మృతుడు లేదా మరణావస్థలో ఉన్న వ్యక్తి. ఈ ‘హదీసు’ ద్వారా మృతులపై ఏడ్పులు పెడబొబ్బలు పెట్టటం వల్ల మృతుని శిక్షించటం జరుగుతుంది. అయితే మృతుడు నాపై ఏడ్వండి అని మృతుని శిక్షించటం జరుగుతుంది. అయితే మృతుడు నాపై ఏడ్వండి అని చెప్పి ఉంటే అలా జరుగుతుంది. మృతుడు అలా చెప్పకుండా ఉంటే, ఏడ్చేవాడికి పాపం చుట్టుకుంటుంది. కొందరు మృతుల చెడుకార్యాల వల్ల వారిని శిక్షించడం జరుగు తుందని అన్నారు. కొందరు ఇది కేవలం అవిశ్వాసులకే చెందుతుందని అన్నారు.

[108]) వివరణ-1749: ‘అలీ (ర) మనవడిని ‘హసన్‌ మస్‌నా అంటారు. అతని మరణంపై అతని భార్యకు చాలా బాధ కలిగింది. తన దుఃఖాన్ని, విచారాన్ని దూరం చేయడానికి సంవత్సరం వరకు అతని సమాధి వద్ద ఉండటానికి టెంట్‌ వేయించింది. సంవత్సరం వరకు అక్కడే ఉన్నది. కాని పోగొట్టుకున్నది లభించలేదు. చివరికి చేసేది లేక టెంట్‌ తీసి తిరిగి వెళదామని నిశ్చయించుకున్నది. ఆకాశవాణి ద్వారా ఆమెను హెచ్చరించటం జరిగింది. ‘పోగొట్టుకున్నది దొరికిందా?’ అని ప్రశ్నించటం జరిగింది. మళ్ళీ సమాధానంగా ‘దొరక లేదు కాని నిరాశచెంది తిరిగి వెళుతున్నది, ‘ అని వినబడింది. సమాధిని ఎత్తుగా నిర్మించటం, కట్టడం నిర్మించడం, గోపురం కట్టడం ధర్మం కాదు. ప్రవక్త (స) స్త్రీలను శ్మశానం వెళ్ళరాదని వారించారు. పురుషులు కూడా సమాధుల వద్ద టెంట్లుపెట్టుకొని ఉండటం ధర్మం కాదు. ఎందుకంటే ప్రవక్త (స) ఈవిధంగా ఆదేశించలేదు.

[109]) వివరణ-1750: ప్రాచీన కాలంలో చొక్కాపై దుప్పటి కప్పు కునేవారు. ఎవరైనా మరణిస్తే, జనా’జహ్ వెంట వెళ్ళినపుడు, దుఃఖం, విచారం వ్యక్తం చేయటానికి దుప్పటిని కప్పుకునేవారు కారు. తీసి పారవేసేవారు. వీరు దుఃఖాన్ని వ్యక్తం చేస్తున్నారని ప్రజలు తెలుసుకోవాలని. అజ్ఞాన కాలంలో సాధారణంగా ఈ ఆచారమే ఉండేది. ప్రవక్త(స) ఈ విధంగా దుఃఖం, విచారం వ్యక్తం చేయటాన్ని నిషేధించారు. శపించాలని నిర్ణయించుకున్నారు. ఈ ఆధునిక కాలంలో దుఃఖం, విచారం వ్యక్తం చేయటానికి నల్లని దుస్తులు ధరించే ఆచారం ధర్మం కాదు. ఇది మూఢాచారం. దీనికి ఇస్లామ్లో ఎటువంటి ఆధారం లేదు.

[110]) వివరణ-1751: అజ్ఞాన కాలంలో జనా’జహ్ వెంట స్త్రీలు, ఏడుస్తూ పెడబొబ్బలు పెడుతూ, ముఖంపై కొట్టు కుంటూ వెళ్ళేవారు. ఇస్లామ్‌లో ఇది ఎంతమాత్రం ధర్మం కాదు. ఇటువంటి జనా’జహ్ లో పాల్గొనరాదు. దీనివల్ల ధర్మవ్యతిరేక కార్యాల్లో, సభల్లో, విందుల్లో, ఆచారాల్లో పాల్గొనరాదు.

[111]) వివరణ-1752: అంటే బాల్యంలో మరణించే పిల్లలు స్వర్గంలో స్వతంత్రంగా తిరుగుతూ ఉంటారు. వాళ్ళకు ఎటువంటి నిబంధనలు ఉండవు. తమ తల్లిదండ్రులను పట్టుకొని స్వర్గంలోకి తీసుకొని వెళతారు.

[112]) వివరణ-1754: అంటే నాభి ప్రేగు. దీనితో తన తల్లిని, తండ్రిని, లాగి స్వర్గంలో తీసుకొని వెళతాడు. అసంపూర్ణంగా జన్మించిన బిడ్డను తల్లిదండ్రులు అంతగా ప్రేమించరు కాని ఆ బిడ్డ తల్లి-దండ్రుల కొరకు అంత లాభదాయకంగా ఉంటాడు. మరి సంపూర్ణంగా పుట్టిన బిడ్డను తల్లి-దండ్రులు ఎంతగానో ప్రేమిస్తారు. అటువంటి బిడ్డ మరణం పట్ల సహనం పాటిస్తే, ఎంత లాభం చేకూరుతుంది! ఆ బిడ్డ తన తల్లి-దండ్రుల కోసం సిఫారసు చేసి వాళ్ళను స్వర్గంలో తీసుకొని వెళతాడు.

[113]) వివరణ-1760: చెప్పు పట్టీ తెగిపోవటం సాధారణంగా వచ్చే ఆపద. అంటే చిన్న ఆపద వచ్చినా ”ఇన్నాలిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజి’ఊన్‌” అని పలకాలి. ఒక ఉల్లేఖనంలో ”దీపం ఆరిపోతే ప్రవక్త (స) ‘ఇన్నాలిల్లాహి’ అని పఠించారు అని ఉంది.

[114]) వివరణ1762: 1. ఇస్లామ్‌ ప్రారంభంలో సమాధులను సందర్శించటాన్ని వారించడం జరిగింది. అజ్ఞాన కాలం సమీపంగా ఉండటం వల్ల, వెళ్ళి అక్కడ ధర్మ-వ్యతిరేక కార్యానికి పాల్పడకూడదని, కాని వారి హృదయాలలో విశ్వాసం దృఢంగా వ్యాపించిన తర్వాత, మూఢ నమ్మకాల పట్ల, మూఢాచారాల పట్ల అసహ్యం వ్యక్తపరచసాగిన తర్వాత, ప్రవక్త (స) పురుషులకు, సమాధులను సందర్శించటానికి అనుమతి ఇచ్చివేసారు. ఎందుకంటే దీనివల్ల అనేక లాభాలు ఉన్నాయి. 2. ఒకసారి కరువుకాటకాలవల్ల చాలామందిగ్రామీణులు పల్లె వాసులు ‘ఈదుల్‌ అ’ద్’హా సమయంలో మదీనహ్ వచ్చారు. ప్రవక్త (స) ఆ పేద ప్రజలకు సహాయ సహ కారాలు అందించాలని, ఖుర్‌బానీ మాంసాన్ని 2 లేక 3 రోజుల కంటే ఎక్కువ దినాలు ఉంచరాదని వారించారు. ఎందుకంటే కొంతమంది ఖుర్‌బానీ మాంసాన్ని ఎండబెట్టి ఉంచుకొని తినేవారు. అప్పుడు ప్రవక్త (స) కేవలం 3 రోజుల వరకు ఉంచవచ్చని, మిగిలిన మాంసం పేదలకు పంచివేయాలని ఆదేశించారు. కష్టాలు పోయి మంచి రోజులు వచ్చిన తర్వాత ప్రవక్త (స) ఇప్పుడు ఖుర్‌బానీ మాంసం మీరు కోరినన్నిదినాలు ఉంచుకొని తిన వచ్చని అన్నారు. 3. నబీజ్‌’ గురించి అనేక ‘హదీసు’ల్లో పేర్కొనడం జరిగింది. అదొక రకమైన పానీయం. దీన్ని ఖర్జూరం, ద్రాక్ష, తేనె, జొన్నలు, గోధుమలతో తయారు చేసేవారు. ఒక్కోసారి అందులో మత్తు కూడా ఏర్పడు తుంది. అజ్ఞాన కాలంలో చాలాఅధికంగా దీన్ని తయారు చేసేవారు, త్రాగేవారు. మద్యాన్ని నిషేధించిన తరువాత, మత్తు తెచ్చే నబీజ్‌’ త్రాగరాదని, మద్యం పాత్రలో నబీజ్‌’ త్రాగరాదని, చర్మపు సంచుల్లో తయారుచేయమని, దానివల్ల మత్తు ఏర్పడదని అన్నారు. మద్యం పాత్రలు విరిగిపోయిన తర్వాత, ప్రజలకు మద్యం అలవాటు పోయిన తర్వాత ప్రవక్త(స), ‘ఇంతకు ముందు నేను కేవలం చర్మపు సంచుల్లోనే నబీజ్‌’ తయారు చేయమని ఆదేశించాను. ఇప్పుడు నేను నబీజ్‌’ ఎటువంటి పాత్రలో అయినా తయారు చేయవచ్చని అనుమతి నిస్తున్నాను. అయితే మత్తుపానీయాలు త్రాగరాదని వారిస్తున్నాను’ అని అన్నారు.

[115]) వివరణ-1763: ప్రవక్త (స) తల్లి పేరు ఆమినహ్. 4 సంవత్సరాల వయస్సుకు ముందు తన పాలు పట్టే తల్లి హలీమహ్ స’అదియ్య వద్ద ఉన్నారు. 4 సంవత్సరాలు వయసు తరువాత తన తల్లి వద్ద ఉండసాగారు. 6 సంవత్సరాల కాలంలో ఆమినహ్ తన భర్త తండ్రి అబ్దుల్‌ ము’త్తలిబ్‌ ఇంటి నుండి తన కన్నవారింటికి, అంటే బనీ నజ్జార్‌ ఇంటికి మదీనహ్ కు వెళ్ళడానికి అనుమతి కోరారు. అబ్దుల్‌ ము’త్తలిబ్‌ అనుమతి ఇచ్చారు. ఆమినహ్ ప్రవక్త (స), ఉమ్మె అయ్‌మన్‌లను తీసుకొని మదీనహ్ చేరుకున్నారు. ఆమినహ్ మదీనహ్ లో ఒక నెల ఉండి, తిరిగి మక్కహ్ కు బయలుదేరారు. మార్గంలో అబ్వాఅనే ప్రాంతంలో అనారోగ్యానికి గురయ్యారు, అక్కడే మరణించారు, అక్కడే ఖననం చేయబడ్డారు. హిజ్రత్‌ తరువాత ప్రవక్త (స) ఆ మార్గం గుండా వెళుతూ, తల్లి సమాధిని చూసి ఏడ్వసాగారు. ప్రవక్త (స)తో పాటు ఇతరులు కూడా ఏడ్వసాగారు. అప్పుడు ప్రవక్త (స), ”నేను తల్లి క్షమాపణ కోసం ప్రార్థించే అనుమతి కోరగా అల్లాహ్‌ అనుమతించలేదు” అని అన్నారు. ఎందుకంటే ముస్లిమేతరుల కోసం ప్రార్థించరాదని ఖుర్‌ఆన్‌లో నిషేధించబడింది. దీనివల్ల ప్రవక్త (స) తల్లిదండ్రులు ముస్లిమేతరులు అని తెలిసింది. అంటే వారు ముస్లిములు కారనే తెలుస్తుంది. ఎందుకంటే ప్రవక్త(స) తండ్రి ప్రవక్త (స), తన తల్లి కడుపులో ఉండగా మరణించారు. ఇంకా 6 సంవత్సరాల వయస్సులో తల్లి మరణించింది. అంటే వారు ఇస్లామ్‌ను పొందలేదు. అందు వల్లే ప్రవక్త (స)కు క్షమాపణ కోసం ప్రార్థించే అనుమతి లభించలేదు. తరువాత ప్రవక్త (స) తల్లి సమాధిని సందర్శించే అనుమతి కోరగా అనుమతి లభించింది. ఎందుకంటే సమాధి సందర్శన కోసం ముస్లిమ్‌ కావటం తప్పనిసరి కాదు.

[116]) వివరణ-1771: కొందరు ప్రవక్త (స) సమాధులను సందర్శించే అనుమతికి ముందు శపించారని భావిస్తున్నారు. ప్రవక్త (స) సమాధులను సందర్శించే అనుమతి ఇస్తే, అది స్త్రీ పురుషు లిరువురికీ వర్తిస్తుంది. కొందరు స్త్రీలలో ఓర్పూ సహనాలు తక్కువగా ఉంటాయని, వెంటనే విలపిస్తారని, ఏడుస్తారని అందువల్ల వారికి మంచిది కాదని అన్నారు.

[117]) వివరణ-1771: జీవితంలో పరాయి పురుషులకు తెరచాటుగా ఉన్నట్టు వారి మరణానంతరం కూడా తెరచాటుగా ఉండాలి అని తెలిసింది.        

***

%d bloggers like this: