ఇటీవల కొందరు ముస్లింలు ఖుర్ఆన్, హదీసుల ప్రకారం ఆచరించే వారిని “కొత్త వర్గం, కొత్త ధర్మం” పేరుతో గుర్తు చేసుకుంటారు. దాన్ని కూడ అతిక్రమిస్తూ నలుగురు ఇమాములలోని ఎవరైనా ఒక్క ఇమామును కూడా అనుసరించని వారిని ‘గైర్ ముఖల్లిద్“లని, ఇస్లాం ధర్మానికి దూరమైన వారనీ, వివిధ బిరుదులతో సత్కరిస్తారు. ఇంకా ఏఏ పేర్లతో పిలుస్తారో కూడా తెలియదు. అసలు ఈ ఖుర్ఆన్, హదీస్లను ఆచరించడానికి ప్రామాణికత ఏమిటి?.
ప్రజల అవగాహన కోసం ప్రామాణిక ఆధారాల ద్వారా నిరూపితమైన సంవత్సరాలను ఈ పుస్తకంలో పొందుపరుస్తున్నాం. ఈ పుస్తకం అసలు ఉద్దేశం అన్ని రకాల ప్రారంభ సంవత్సరాలను తెలుపడం. ఖుర్ఆన్, హదీసులను ఎప్పటి నుండి ఆచరిస్తున్నారు?. వ్యక్తి అనుకరణమరియు నలుగురు ధార్మిక పండితుల అనుకరణ ఎప్పుడు మొదలైంది? ఇది ఇస్లాం ధర్మంలో ఎలా మొదలైంది ? హదీస్ మరియు ఫిఖాల్లో మార్పులు చేయడం ఎప్పటి నుండి జరుగుతుంది? అంతే కాకుండా నలుగురు ఇమాములు వ్యాఖ్యలను పేర్కొని వాటి వివరణ రాయడం జరిగింది. తద్వారా కొత్త, పాత విషయాలను తులనాత్మకంగా చూసుకోవడానికి.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో మొత్తం 28 ఆయతులు ఉన్నాయి. ఏకదైవారాధన, ప్రవక్తల పరంపర గురించి ఈ సూరా ముఖ్యంగా వివరించింది.మొదటి ఆయతులో ప్రస్తావనకు వచ్చిన జిన్నులు అన్న పదాన్ని ఈ సూరాకు పేరుగా పెట్టడం జరిగింది. దివ్య ఖుర్ఆన్ ప్రాముఖ్యానికి జిన్నులు కూడా ప్రభావితమయ్యాయని తెలియజేయడం ద్వారా ఖుర్ఆన్ ఔన్నత్యాన్ని విశదీకరించడం జరిగింది. జిన్నులు రెండు రకాలని, కొందరు మంచివారని, కొందరు చెడ్డవారని తెలిపింది. కొందరు జిన్నులు దైవవాణిని విన్న తర్వాత దానిని విశ్వసించారు. ఈ సూరా ఏకదైవారాధన ప్రాముఖ్యాన్ని నొక్కి చెప్పింది. అల్లాహ్ కు భాగస్వాములను చేర్చడం మహాపరాధమనీ, దానికి దూరంగా ఉండాలని బోధించింది. అల్లాహ్ కు కుమారులు ఎవరూ లేరని, ఆయనకు భాగస్వాములు కూడా లేరని, ఆయనకు అగోచరాలు (కంటికి కనబడనివి) అన్నీ తెలుసనీ, అల్లాహ్ ను,ఆయన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)ను తిరస్కరించిన వారు నరకాగ్నికి ఆహుతి అవుతారని హెచ్చరించింది. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)ను అల్లాహ్ ఎన్నుకుని తన సందేశాన్ని మానవాళికి చేరవేయడానికి పంపాడని, మానవులు ఆయనకు విధేయత చూపాలని, అల్లాహ్ కు భాగస్వాములుగా ఎవరినీ నిలబెట్టరాదని బోధించింది.
ఖురాన్ తఫ్సీర్ – సూరా అల్ జిన్న్ – పార్ట్ 1 (అయతులు 1-7) వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) https://youtu.be/TI28ZCm3pN0 [52 నిముషాలు]
ఈ ప్రసంగంలో సూరతుల్ జిన్ (72వ అధ్యాయం)లోని మొదటి ఏడు ఆయతుల (వచనాలు) యొక్క తఫ్సీర్ (వివరణ) ఇవ్వబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో మరియు తాయిఫ్‌లో తీవ్రమైన తిరస్కరణ, కష్టాలను ఎదుర్కొన్నప్పుడు, అల్లాహ్ ఆయనకు ఓదార్పునివ్వడానికి ఈ సంఘటనను తెలియజేశాడు. మానవులు తిరస్కరించినప్పటికీ, అల్లాహ్ యొక్క మరొక సృష్టి అయిన జిన్నాతులు ఖుర్ఆన్ విని, దాని అద్భుత స్వభావానికి ప్రభావితులై, తక్షణమే విశ్వసించి, షిర్క్‌ను త్యజించారు. ఈ సూరత్ తౌహీద్ (ఏకదైవారాధన), రిసాలత్ (ప్రవక్తృత్వం) మరియు ఆఖిరత్ (పరలోక జీవితం) యొక్క ప్రాథమిక సూత్రాలను నొక్కి చెబుతుంది. ఇస్లాం పూర్వపు అరబ్బులు జిన్నాతుల శరణు వేడుకోవడం వంటి షిర్క్ చర్యలను, మరియు దాని పర్యవసానాలను ఇది ఖండిస్తుంది. ఖుర్ఆన్ యొక్క మార్గదర్శకత్వం, దానిని శ్రద్ధగా వినడం మరియు దాని బోధనల ప్రకారం జీవించడం యొక్క ప్రాముఖ్యతను ఈ వివరణ స్పష్టం చేస్తుంది.
72:1 قُلْ أُوحِيَ إِلَيَّ أَنَّهُ اسْتَمَعَ نَفَرٌ مِّنَ الْجِنِّ فَقَالُوا إِنَّا سَمِعْنَا قُرْآنًا عَجَبًا (ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం!) వారికి చెప్పు: నాకు దివ్యవాణి (వహీ) ద్వారా ఇలా తెలియజేయబడింది – జిన్నుల సమూహం ఒకటి (ఖుర్ఆన్ ను ) విన్నది. వారు (తమ వాళ్లతో) ఇలా అన్నారు: “మేమొక అద్భుతమైన ఖుర్ఆన్ ను విన్నాము.”
72:2 يَهْدِي إِلَى الرُّشْدِ فَآمَنَّا بِهِ ۖ وَلَن نُّشْرِكَ بِرَبِّنَا أَحَدًا “అది సన్మార్గం వైపు దర్శకత్వం వహిస్తోంది. అందుకే మేము దానిని విశ్వసించాము. ఇక నుంచి మేము ఎవరినీ – ఎన్నటికీ – మా ప్రభువుకు సహవర్తుల్ని కల్పించము.”
72:3 وَأَنَّهُ تَعَالَىٰ جَدُّ رَبِّنَا مَا اتَّخَذَ صَاحِبَةً وَلَا وَلَدًا “ఇంకా – మా ప్రభువు మహిమ అత్యున్నతమైనది. ఆయన తన కోసం (ఎవరినీ) భార్యగాగానీ, కొడుకుగాగానీ చేసుకోలేదు.”
72:4 وَأَنَّهُ كَانَ يَقُولُ سَفِيهُنَا عَلَى اللَّهِ شَطَطًا “ఇంకా – మనలోని మూర్ఖుడు అల్లాహ్ గురించి సత్యవిరుద్ధమైన మాటలు పలికే వాడు.”
72:5 وَأَنَّا ظَنَنَّا أَن لَّن تَقُولَ الْإِنسُ وَالْجِنُّ عَلَى اللَّهِ كَذِبًا “మనుషులైనా, జిన్నులైనా అల్లాహ్ కు అబద్ధాలు అంటగట్టడం అనేది అసంభవమని మనం అనుకున్నాము.”
72:6 وَأَنَّهُ كَانَ رِجَالٌ مِّنَ الْإِنسِ يَعُوذُونَ بِرِجَالٍ مِّنَ الْجِنِّ فَزَادُوهُمْ رَهَقًا “అసలు విషయం ఏమిటంటే కొందరు మనుషులు కొందరు జిన్నాతుల శరణు వేడేవారు. ఈ కారణంగా జిన్నాతుల పొగరు మరింత పెరిగిపోయింది.”
72:7 وَأَنَّهُمْ ظَنُّوا كَمَا ظَنَنتُمْ أَن لَّن يَبْعَثَ اللَّهُ أَحَدًا “అల్లాహ్ ఎవరినీ పంపడని (లేక ఎవరినీ తిరిగి బ్రతికించడని) మీరు తలపోసినట్లుగానే మనుషులు కూడా తలపోశారు.”
ఈరోజు సూరతుల్ జిన్ మనం చదవబోతున్నాము. ఒకవేళ రాసుకుంటున్నారంటే త్వరగా రాసుకోండి.
قُلْ (కుల్) (ఓ ప్రవక్తా!) చెప్పు. (72:1)
أُوحِيَ (ఊహియ) నాకు వహీ చేయబడినది. (72:1 నుండి)
సర్వసామాన్యంగా వహీని తెలుగులో దివ్యవాణి లేదా దివ్య సందేశం అని అంటారు. దివ్యవాణి, దివ్య సందేశం చేయబడినది, పంపబడినది.
إِلَيَّ (ఇలయ్య) నా వైపున.
أَنَّهُ اسْتَمَعَ (అన్నహుస్తమ’అ) అదేమనగా, అంటే నాకు వహీ చేయబడిన విషయం ఏమనగా, ఇస్తమ’అ – విన్నారు.
ఇస్తమ’అ అంటే అరబీలో సమి’అ అని కూడా వస్తుంది. మనం రుకూ నుండి నిలబడినప్పుడు కూడా సమి’అల్లాహు లిమన్ హమిద అంటాము. సమి’అ అంటే కూడా విన్నాడు, ఇస్తమ’అ అంటే కూడా విన్నాడు. కానీ ఇస్తమ’అలో కొంచెం శ్రద్ధగా వినే ఒక మాట ఉంటుంది, భావం ఉంటుంది. అయితే కావాలంటే మీరు రాసుకోవచ్చు, ఇస్తమ’అ – శ్రద్ధగా విన్నారు.
نَفَرٌ (నఫరున్) నఫరున్ అంటే చిన్న సమూహం. ఇక్కడ ఎందుకు అంటున్నాము చిన్న సమూహం అని? సర్వసామాన్యంగా అరబీలో మూడు నుండి పది లోపు లెక్క ఏదైతే ఉంటుందో, సంఖ్య ఏదైతే ఉంటుందో, అది ముగ్గురు కావచ్చు, నలుగురు కావచ్చు, ఐదుగురు కావచ్చు పది వరకు, నఫర్ అని అంటారు. చిన్న సమూహం.
مِّنَ الْجِنِّ (మినల్ జిన్) జిన్నాతులలో నుండి.
فَقَالُوا (ఫకాలూ) వారు అన్నారు. అసలు పదం ఇక్కడ కాలూ, వారు పలికారు, వారు అన్నారు.
إِنَّا (ఇన్నా) నిశ్చయంగా మేము
سَمِعْنَا (సమి’అనా) విన్నాము. చూశారా, ఇక్కడ వచ్చింది. ఇక్కడ సమి’అనా అని వచ్చింది ఎందుకు? ఎందుకంటే అక్కడ కేవలం తెలియజేస్తున్నారు ఇతరులకు. అయితే ఆ విషయం అనేది సమి’అనా అని వచ్చింది.
قُرْآنًا (ఖుర్ఆనన్) ఖుర్ఆన్.
عَجَبًا (అజబా) అద్భుతమైన.
يَهْدِي (యహ్ దీ) మార్గదర్శకత్వం చేస్తుంది.
إِلَى الرُّشْدِ (ఇలర్ రుష్ద్) రుష్ద్ అంటే ఇక్కడ సరైన మార్గం, సరైనది. ఆ, సన్మార్గం అని అంటే కూడా తప్పు కాదు.
فَآمَنَّا بِهِ (ఫ ఆమన్నా బిహీ) కనుక మేము విశ్వసించాము దానిని.
وَلَن نُّشْرِكَ (వలన్ నుష్రిక) మరియు మేము షిర్క్ చేయము.
بِرَبِّنَا (బిరబ్బినా) మా ప్రభువుతో పాటు
أَحَدًا (అహదన్) ఏ ఒక్కరిని.
వలన్ నుష్రిక – మేము షిర్క్ చేయము, మేము భాగస్వామి కల్పించము, సహవర్తున్ని నిలబెట్టము.
وَأَنَّهُ تَعَالَىٰ (వ అన్నహూ త’ఆలా) త’ఆలా అంటే ఉన్నతమైనది, మహోన్నతమైనది.
جَدُّ (జద్దు) ఇక్కడ అల్లాహ్ యొక్క గొప్పతనం, ఔన్నత్యం.
అరబీలో మనం తండ్రి యొక్క తండ్రి, ఆ తాతయ్యను, గ్రాండ్ ఫాదర్ని ఉర్దూలో దాదా అని ఏదైతే అంటారో వారిని కూడా జద్ అనబడుతుంది. ఎందుకంటే ఏ ఫ్యామిలీలో కూడా పెద్దవారు ఎవరైతే ఉంటారో వారికి ఒక పెద్ద గౌరవ స్థానం అనేది కూడా ఉంటుంది, దాని పరంగా జద్ అనబడుతుంది అని అంటారు. ఇక్కడ ఉద్దేశం ఏంటి? మా ప్రభువు ఔన్నత్యం చాలా గొప్పది, ఉన్నతమైనది.
مَا اتَّخَذَ (మత్తఖద) చేసుకోలేదు. అంటే అల్లాహు త’ఆలా విషయం చెప్పడం జరుగుతుంది, అల్లాహు త’ఆలా చేసుకోలేదు.
صَاحِبَةً (సాహిబతన్) ఎవరిని కూడా భార్యగా. సాహిబతన్ – భార్యగా.
شَطَطًا (షతతా) షతతా అన్నటువంటి ఆ అరబీ పదానికి వాస్తవానికి ఏదైనా ఒక హద్దును దాటడం అని కూడా వస్తుంది. ఆ, ఏదైనా హద్దును దాటడం. అయితే ఇక్కడ భావం ఏంటంటే సత్యానికి విరుద్ధంగా హద్దులు దాటడాన్ని, మీరు రాసుకోండి సత్య విరుద్ధమైన, దారుణమైన.
وَأَنَّا ظَنَنَّا (వ అన్నా దనన్నా) మరియు నిశ్చయంగా మేము భావించే వారిమి.
أَن لَّن تَقُولَ (అన్ లన్ తకూల) ఈ లన్ అన్నది ఏదైనా విషయం, మాట, పని, లా అని ఏదైతే మనం అంటామో దానికంటే ఎక్కువ ఖచ్చితమైన భావం, నిరాకరణ భావం లన్ అనే పదంలో ఉంటుంది. లన్ తకూలు – ఎన్నటికీ చెప్పరు.
الْإِنسُ وَالْجِنُّ عَلَى اللَّهِ كَذِبًا (అల్ ఇన్సు వల్ జిన్ అలల్లాహి కదిబా) అల్ ఇన్సు – మానవులు, వల్ జిన్ – జిన్నాతులు, అలల్లాహి – అల్లాహ్ పై, కదిబా – అబద్ధాలు. అంటే జిన్నాతులను మానవులు ఎన్నటికీ అల్లాహ్ పై ఎలాంటి అబద్ధం చెప్పనే చెప్పరు, ఇలా మేము అనుకునే వారిమి.
يَعُوذُونَ (య’ఊదూన) అ’ఊదు అని మనం సూరతుల్ ఫలక్ సూరతున్నాస్ లో చదువుతాము. సర్వసామాన్యంగా ఖుర్ఆన్ ప్రారంభం చేసినప్పుడు అ’ఊదు బిల్లాహి అంటాము. దాని మూలం నుండే వచ్చింది య’ఊదూన. య’ఊదూన అంటే శరణు వేడుకునేవారు.
رَهَقًا (రహకా) రహకా అంటే ఇక్కడ తలబిరుసుతనం వస్తుంది, పొగరు. ఈ రెండు కూడా వస్తాయి, రెండు కూడా రాయండి పర్లేదు.
وَأَنَّهُمْ (వ అన్నహుమ్) మరియు వారు
ظَنُّوا (దన్నూ) భావించేవారు.
كَمَا ظَنَنتُمْ (కమా దనన్ తుమ్) ఎలాగైతే మీరు భావించారో.
أَن لَّن يَبْعَثَ اللَّهُ (అన్ లన్ యబ్’అసల్లాహు) أَحَدًا (అహదా) అల్లాహ్ – అల్లాహ్, లన్ యబ్’అస్ – తిరిగి బ్రతికించడు, అల్లాహ్ అహదా – ఏ ఒక్కరిని.
యబ్’అస్ అన్నటువంటి ఈ పదంలో రెండు భావాలు వస్తాయి. ఒకటి, పంపడం, ప్రవక్తగా ఎవరినైనా చేసి పంపడం. మరొకటి, చనిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ లేపడం. ఈ రెండు భావాలు ఉంటాయి.
సూరతుల్ జిన్ – పరిచయం మరియు సందర్భం
బిస్మిల్లాహ్ అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్.
సూరతుల్ జిన్. ఈ సూరత్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తృప్తిని ఇస్తూ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క గౌరవ మర్యాద, గొప్పతనాన్ని తెలియజేస్తూ. ప్రవక్తకు తృప్తి, శాంతి ఏంటి? ఓ ప్రవక్తా ఈ మానవులు ఎవరైతే చిన్నప్పటి నుండి మిమ్మల్ని మంచిగా చూసుకుంటూ అంటే మిమ్మల్ని మంచిగా గ్రహిస్తూ, మీ యొక్క సద్వర్తనను అర్థం చేసుకుంటూ, మీరు ఎంతో మంచివారు అని తెలిసినప్పటికీ కూడా మీ మాట వినకుండా, మీ బోధనను స్వీకరించకుండా మీరు ఏ ఖుర్ఆన్ తిలావత్ చేసి వినిపిస్తున్నారో దానిని వారు తిరస్కరిస్తూ మీ పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారో దాని గురించి రంది పడకండి. ఈ మానవులు మిమ్మల్ని గ్రహించకుంటే గ్రహించకపోయిరి, కానీ అల్లాహ్ సృష్టిలోని మరొక సృష్టి జిన్నాతులు మిమ్మల్ని విశ్వసించి, మీరు చదివే ఖుర్ఆన్‌ను విని, దాని పట్ల ఎలా ప్రభావితులయ్యారో ఆ పూర్తి సంఘటన మీకు తెలియజేస్తున్నాను, మీరు చూడండి, వినండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తృప్తిని ఇవ్వడం జరుగుతుంది.
మీరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్ర చదివి ఉండేది ఉంటే ఇటు ప్రవక్త వారిపై రెండు సంఘటనలు జరిగి ఉంటాయి కదా. అవిశ్వాసుల దౌర్జన్యాలు ప్రవక్తపై చాలా పెరిగిపోయి ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సుమారు 10, 11 సంవత్సరాల వరకు మక్కా వాసుల మధ్యలో అన్ని విధాలుగా వారికి సత్యాన్ని, ధర్మాన్ని బోధించే ప్రయత్నం చేస్తూ వారు వినడం లేదు, చాలా తక్కువ మంది మాత్రమే ఇస్లాం స్వీకరించారు. ఆ మధ్యలోనే హజ్రత్ అబూ తాలిబ్, హజ్రత్ ఖదీజా రదియల్లాహు త’ఆలా అన్హా వారి యొక్క మరణం తర్వాత మరింత ఎక్కువగా దౌర్జన్య కాండలు పెరిగిపోతాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తాయిఫ్ వెళ్లి అక్కడ వారికి దావత్ ఇస్తారు, కానీ వారు కూడా స్వీకరించకుండా తిరిగి వస్తున్నప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చాలా బాధ పెడతారు, శారీరకంగా చాలా నష్టం చేకూరుస్తారు. ఇలా ఇన్ని రకాల బాధలు ఉన్న సందర్భంలోనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తిరిగి వస్తుండగా నఖ్లా అనే ప్రాంతంలో ఉండగా ఈ సంఘటన సంభవిస్తుంది. ఏంటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఫజర్ నమాజ్‌లో ఖుర్ఆన్ యొక్క తిలావత్ చేస్తూ ఉంటారు, జిన్నాతులు వచ్చి విని వెళ్లి తమ జాతి వారికి ఈ ఖుర్ఆన్ గురించి బోధ చేస్తాయి. అయితే దీనికి సంబంధించిన కొన్ని హదీసుల భావం మనం తెలుసుకుందాము. సహీహ్ ముస్లిం గ్రంథంలోని హదీసులు, ఒకవేళ హదీస్ నెంబర్ మీరు ఇంగ్లీష్, అరబీ పుస్తకాల్లో వెతకాలంటే తెలుసుకోవాలంటే 449 హదీస్ నెంబర్ నుండి ఆ తర్వాత కొన్ని హదీసులు.
సారాంశం ఏమిటంటే నేను ఒక రెండు హదీసుల సారాంశం చెబుతున్నాను. మొదటి హదీస్ హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించారు. హజ్రత్ మ’అన్ బిన్ యజీద్, మస్రూఖ్, తాబియీ హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రదియల్లాహు అన్హు వారి యొక్క శిష్యులు మస్రూఖ్. మస్రూఖ్ని మ’అన్ యొక్క తండ్రి యజీద్ అడుగుతున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఫజర్ నమాజ్‌లో ఖుర్ఆన్ తిలావత్ చేస్తున్నప్పుడు జిన్నాతులు వచ్చి విన్నాయి అన్న సంఘటన ప్రవక్తకు ఎవరు తెలియజేశారు? అయితే మస్రూఖ్ చెప్పారు నేను మీ తండ్రి అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ తో విన్నాను. అక్కడ ఒక చెట్టు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలియజేసింది, కొందరు జిన్నాతులు మీ యొక్క తిలావత్‌ను వింటున్నారు అని. ప్రత్యేకంగా ఈ హదీస్‌ను ఎందుకు ప్రస్తావించాను అంటే అల్హందులిల్లాహ్ వాస్తవానికి మనందరికీ కూడా ఇందులో ప్రత్యేకంగా ఎవరైతే దావా పని చేస్తూ ఉంటారో ఇతరులకు బోధ చేస్తూ ఉంటారో వారు ఎన్ని సమస్యలు ఎదురైనా ఎంత ఇబ్బంది కలిగినా ప్రజల నుండి వారికి ఎలాంటి ఆపద కలిగినా అల్లాహ్ కొరకు ఓపిక సహనాలు వహిస్తూ ఉండేది ఉంటే అల్లాహు త’ఆలా వారికి తృప్తినిచ్చే కొన్ని సందర్భాలు కూడా కనబరుస్తాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎలాంటి స్థితిలో ఉన్నారు అక్కడ జిన్నాతులు వచ్చి వినడం, జిన్నాతులు వచ్చి వింటున్న విషయం ప్రవక్తకు తెలియదు. అల్లాహ్ తర్వాత వహీ ద్వారా తెలిపాడు కరెక్టే కానీ అక్కడ చెట్టు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఈ విషయం తెలియజేసింది. అంటే ఆ చెట్టు కూడా అల్లాహ్ యొక్క అనుమతితోనే ప్రవక్తకు తెలియజేస్తుంది. ఇందులో ప్రవక్త వారి ము’అజిజా (మహిమ) కూడా ఉంది, మరియు కేవలం మానవులే కాదు, అల్లాహు త’ఆలా తన యొక్క దాసునికి సహాయం చేయాలి, అతడు అల్లాహ్ కొరకు ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పుడు అతనికి తృప్తిని ఇవ్వాలి అని అల్లాహ్ కోరినప్పుడు ఏ మార్గం నుండైనా గానీ, చెట్టు నుండి అయినా గానీ ఎలాంటి సహాయం అందిస్తాడు, ఎలాంటి తృప్తిని కలుగజేస్తాడు మనకు ఇందులో బోధపడుతుంది.
మరొక విషయం ఇక్కడ మనం గమనించాల్సింది అది నేను ఇంతకుముందు చెప్పిన 449 హదీస్ నెంబర్‌లో కూడా కనబడుతుంది. అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రదియల్లాహు త’ఆలా అన్హు వింటున్నారు, ఉల్లేఖిస్తున్నారు. మరియు దీని తర్వాత హదీస్ నెంబర్ 450లో ఉంది హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖిస్తున్నారు.
ఆ హదీస్‌ల యొక్క సారాంశం ఏమిటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖుర్ఆన్ తిలావత్ చేస్తున్నప్పుడు జిన్నాతులు వచ్చి ఖుర్ఆన్‌ను శ్రద్ధగా విన్నారు మరియు విన్న తర్వాత వారి యొక్క మాట, వారు ఎలా ప్రభావితమయ్యారో ఖుర్ఆన్ ద్వారా దాన్ని ఎలా చెబుతున్నారో ఇక రండి మనం ఖుర్ఆన్ ఆయతుల ద్వారానే తెలుసుకుందాము.
ఇక్కడ ఈ సందర్భంలో మనం మరొక విషయం తెలుసుకోవడం చాలా లాభదాయకంగా ఉంటుంది. ప్రస్తుతం మీరు చదువుతున్నారు సూరత్ అల్-జిన్. కానీ ఈ జిన్నాతుల యొక్క సంఘటన సూరతుల్ అహ్కాఫ్, సూర నెంబర్ 46, ఆయత్ నెంబర్ 29 నుండి సుమారు చివరి వరకు అక్కడ కూడా అల్లాహు త’ఆలా ఈ విషయాన్ని ప్రస్తావించాడు.
ఇక వినండి ఒక్కసారి మీరు శ్రద్ధగా ఆయతుల యొక్క భావాన్ని, అందులో మనకు ఉన్నటువంటి గుణపాఠాలను. అల్లాహ్ ఇక్కడ చెప్తున్నాడు, కుల్ – చెప్పు. ఊహియ ఇలయ్య – నాకు వహీ చేయడం జరిగినది. ఇక్కడే కొంచెం ఆగి మనం ఒక విషయం తెలుసుకోవాలి. అది ఏమిటంటే మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇల్మె గైబ్ (అగోచర జ్ఞానం) లేదు అన్న విషయం ఇక్కడ ఈ ఆయత్ మరియు ఈ ఆయత్‌లో దీని వ్యాఖ్యానంలో వచ్చిన హదీసుల ద్వారా కూడా తెలుస్తుంది. ఎలా అంటే జిన్నాతులు వచ్చి విన్నారు కానీ ప్రవక్తకు ఆ విషయం తెలియదు. వహీ ద్వారా తెలపడం జరిగినది. అయితే ప్రవక్త ఆలిముల్ గైబ్ కారు, అగోచర జ్ఞానం కలిగిన వారు కారు అన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. సరే.
ఇస్తమ’అ నఫరుమ్ మినల్ జిన్ – జిన్నాతులోని కొంతమంది విన్నారు. ఏం విన్నారు? ఈ ఖుర్ఆన్‌ని విన్నారు. అయితే ఈ ఖుర్ఆన్‌ను కొంతమంది జిన్నాతులు కూడా శ్రద్ధగా వింటున్నప్పుడు ఓ మక్కా యొక్క అవిశ్వాసుల్లారా! ఇప్పుడు ఉన్నటువంటి ఓ ముస్లింలారా! మీరు ఈ ఖుర్ఆన్‌ను ఎందుకు శ్రద్ధగా చదవడం లేదు? ఎందుకు శ్రద్ధగా వినడం లేదు? ఎందుకు శ్రద్ధగా అర్థం చేసుకోవడం లేదు? మీరు అష్రఫుల్ మఖ్లూకాత్, సర్వ సృష్టిలో అత్యున్నత, అత్యుత్తమ సృష్టి మీరు. మీరు ఈ ఖుర్ఆన్‌ను మంచిగా అర్థం చేసుకోవడం, వినడం మీపై ఎక్కువ బాధ్యత ఉన్నది. ఈ బోధ మనందరికీ ఉంది, ఖుర్ఆన్ వినని వారి కొరకు ప్రత్యేకంగా ఉంది. ఎందుకంటే జిన్నాతుల కంటే కూడా ఎక్కువ ఘనత గల వారు మానవులు మరియు మానవుల కొరకే ప్రత్యేకంగా ఆ తర్వాత జిన్నాతుల కొరకు కూడా ఈ ఖుర్ఆన్ అవతరింప చేయడం జరిగినది. అలాంటి ఈ ఖుర్ఆన్‌ను మానవులు వినకుంటే ఇది చాలా శోచనీయం, బాధాకరమైన విషయం.
ఆ జిన్నాతులు విన్నారు ఆ తర్వాత ఏమన్నారు?
إِنَّا سَمِعْنَا قُرْآنًا عَجَبًا (ఇన్నా సమి’అనా ఖుర్ఆనన్ అజబా) మేమొక అద్భుతమైన ఖుర్ఆన్ ను విన్నాము. (72:1)
అల్లాహు అక్బర్. కానీ ఒక్కసారి తిరిగి రండి వెనక్కి మళ్ళీ మీరు. సూరతుల్ అహ్కాఫ్‌లో చూడండి ఆయత్ నెంబర్ 29లో యస్తమి’ఊనల్ ఖుర్ఆన్. ఆ జిన్నాతులు ఖుర్ఆన్‌ను శ్రద్ధగా వింటూ,
فَلَمَّا حَضَرُوهُ قَالُوا أَنصِتُوا (ఫలమ్మా హదరూహు కాలూ అన్సితూ) ప్రవక్త వద్దకు హాజరై శ్రద్ధగా వింటూ, ఖుర్ఆన్ వింటున్నప్పుడు పరస్పరం ఒకరికి ఒకరు మీరు మౌనం వహించండి, ఖుర్ఆన్‌ను ఇంకా శ్రద్ధగా వినండి అని ఒకరికి ఒకరు చెప్పుకున్నారు. (46:29 నుండి)
అల్లాహు అక్బర్. ఇక్కడ కూడా వచ్చింది ఇస్తమఅ నఫరుమ్ మినల్ జిన్ అని. కానీ అక్కడ సూరత్ అహ్కాఫ్ లో అన్సితు మీరు మౌనం వహించండి. మరియు సూరత్ ఆలే సూరతుల్ ఆరాఫ్ యొక్క చివర్లో మీరు చూస్తే వఇదా కురిఅల్ ఖుర్ఆను ఫస్తమిఊ లహు వ అన్సితు. ఫస్తమిఊ లహు వ అన్సితు. శ్రద్ధగా వినడం. అంటే మనసు పెట్టడం, మనసు దానికి లగ్నం చేయడం, వ అన్సితు ఎలాంటి వేరే డిస్టర్బెన్స్ లేకుండా వినడానికి ప్రయత్నం చేయడం, మౌనం వహించడం. ఈ విధంగా కూడా వారు పరస్పరం ఒకరికి ఒకరు చెప్పుకున్నారు.
అయితే ఇక్కడ ఏముంది మళ్ళీ ఫలమ్మా కుదియ సూరతుల్ అహ్కాఫ్ లో ఎప్పుడైతే ఖురాన్ తిలావత్ పూర్తి అయిపోయిందో వల్లౌ ఇలా కౌమిహిమ్ ఆ విన్న జిన్నాతులు తమ జాతి వారి వైపునకు వెళ్ళిపోయారు ముందిరీన్ వారిని హెచ్చరిస్తూ.
అల్లాహు అక్బర్. చూశారా? ఒక సత్యం తెలిసింది అంటే దాన్ని ఇతరులకు తెలపడం, షిర్క్ యొక్క చెడుతనం తెలిసింది అంటే దాని గురించి హెచ్చరించడం మన బాధ్యత అని వారు వెంటనే తిరిగిపోయారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద ఆగి ప్రవక్తను కలుసుకోలేదు. వెంటనే వెళ్లి జాతి వారు ఏ చెడులో ఉన్నారో, ఏ షిర్క్ చేస్తున్నారో వారిని ఆ షిర్క్ నుండి కాపాడటానికి వెళ్ళిపోయారు.
ఇక్కడ ధర్మవేత్తలు ఏం చెప్తున్నారంటే జిన్నాతులు అల్లాహ్ యొక్క సృష్టి వారు మనకు కనబడకపోయినప్పటికీ వారిలో స్త్రీలు, పురుషులు అందరూ ఉన్నారు, వారికి కూడా సంతానం కలుగుతుంది, వారిలో కూడా పెళ్లిళ్లు ఉన్నాయి మరియు మానవుల్లో ఎలాగైతే వర్గాలు ఉన్నాయో ధర్మపరంగా ఇంకా వేరే రీతిలో జిన్నుల్లో కూడా యూదులు, క్రైస్తవులు, ఇంకా వేరే రకమైన షిర్క్ చేసే వారు, మంచి వారు, పాపం చేసే వారు ఈ విధంగా రకరకాలుగా ఉన్నారు.
ఎందుకంటే సూరతుల్ అహ్కాఫ్ లోని ఆయత్ నంబర్ 30 ద్వారా చెబుతున్నారు కొందరు ధర్మవేత్తలు. ఏముంది అక్కడ? వారు వెళ్లి తమ జాతి వారికి చెప్పారు యా కౌమనా ఓ ప్రజలారా ఇన్నా సమీఅనా కితాబన్ నిశ్చయంగా మేము ఒక గ్రంథం గురించి విన్నాము ఉంజిల మింబ అది మూసా అది మూసా తర్వాత అవతరింప చేయబడినది. ముసద్దికం లిమాబైన యదైహ్ అంటే ఈ ఖురాన్ కు ముందు అవతరించిన గ్రంథాలను ధృవీకరిస్తుంది. యహదీ ఇలల్ హక్ సత్యం వైపునకు మార్గదర్శకత్వం చేస్తుంది. వఇలా తరీకిమ్ ముస్తకీమ్ మరియు సన్మార్గం వైపునకు. చూశారా వారు సత్యాన్ని విన్న వెంటనే వెళ్లి తమ జాతి వారికి తెలుపుతూ ఇది మూసా తర్వాత అవతరించినటువంటి గ్రంథం అని ఈ ఆయత్ ద్వారా చెప్తున్నారు ధర్మవేత్తలు వారు యూదులుగా ఉండినారు. ఆ జిన్నాతులు ఎవరైతే విన్నారో. ఎందుకంటే యూదులు ఈసా అలైహిస్సలాం ను విశ్వసించరు గనక ఈసా అలైహిస్సలాం ప్రస్తావన ఇక్కడ రాలేదు అంటారు.
మనకు ఇందులో బోధన ఏంటి? ఆ జిన్నాతుల కంటే మేలు, మంచివారము మనం. మనం ఈ ఖుర్ఆన్ పట్ల వారి కంటే ఎక్కువ శ్రద్ధ చూపాలి.
సూరతుల్ జిన్‌లో అజబన్ అని ఏదైతే చూస్తున్నారో దాని యొక్క భావం ఏంటి? అజబన్ అంటే చాలా అద్భుతమైనది. ఏ రకంగా అద్భుతమైనది? ఖుర్ఆన్ దాని యొక్క అరబీ శైలి, అరబీ సాహిత్య ప్రకారంగా చాలా అద్భుతమైనది. మరియు అందులో ఉన్నటువంటి బోధనల ప్రకారంగా చూసుకుంటే కూడా చాలా అద్భుతమైనది. అలాగే ఈ ఖుర్ఆన్ ఇతరులపై ఏ ప్రభావం చూపిస్తుందో దాని ప్రకారంగా కూడా ఇది చాలా అద్భుతమైనది. ఇది చాలా అద్భుతమైన గ్రంథం.
فَآمَنَّا بِهِ (ఫ ఆమన్నా బిహీ) మేము దానిని విశ్వసించాము. (72:2)
అంటే ఖుర్ఆన్ గ్రంథాన్ని విశ్వసించాము. ఇక్కడ చూడండి ఇక ఎంత తొందరగా వారు విశ్వాస మార్గాన్ని అవలంబించారు. సత్యాన్ని విన్నారు అంటే ఏ ఆలస్యం వారు చేయలేదు. అయితే ఇక్కడ ఏంటి ప్రత్యేకంగా మక్కా అవిశ్వాసులకు ఇందులో ఒక రకమైన కొరడాలు ఉన్నాయి. ఖుర్ఆన్ ప్రవక్త వారు తిలావత్ చేస్తూ ఉంటే వారు పరస్పరం ఏమనుకుంటారు? లా తస్మ’ఊ లిహాదల్ ఖుర్ఆన్. సూరత్ హామీమ్ సజ్దాలో ఉంది చూడండి. మీరు ఖుర్ఆన్‌ను వినకండి, వల్గౌ ఫీహి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖుర్ఆన్ తిలావత్ చేస్తుంటే మీరు అల్లరి చేయండి అని వారు ఒకరికొకరు చెప్పుకుంటారు. కానీ ఇక్కడ జిన్నాతులు చూడండి అన్సితూ శ్రద్ధగా వినండి, మౌనం వహించండి అని ఒకరికి ఒకరు చెప్పుకుంటున్నారు. మరియు ఈ జిన్నాతులు విన్న వెంటనే విశ్వసించారు. మరియు ఈ మానవులు సంవత్సరాల తరబడి ఖుర్ఆన్‌ను వింటూనే ఉన్నారు, వింటూనే ఉన్నారు కానీ అది వారి యొక్క మదిలో దిగడం లేదు, దాన్ని వారు ఇంకా విశ్వసించడం లేదు.
షిర్క్ యొక్క ఖండన మరియు జిన్నాతుల పశ్చాత్తాపం
ఆ తర్వాత ఉంది,
وَلَن نُّشْرِكَ بِرَبِّنَا أَحَدًا (వలన్ నుష్రిక బిరబ్బినా అహదా) మరియు మేము మా ప్రభువుకు ఎవ్వరినీ కూడా భాగస్వామిగా, సాటిగా కల్పించము. (72:2)
షిర్క్ యొక్క ఖండన ఇందులో చాలా స్పష్టంగా ఉంది. వారికి కూడా అర్థమైపోయింది షిర్క్ ఎంత చెడ్డ పని అని. అందుకొరకే ఇక మేము ఎన్నటికీ అల్లాహ్‌తో పాటు ఎవరినీ సాటిగా కల్పించము, ఎవరినీ కూడా భాగస్వామిగా చేయము. మరియు అల్లాహు త’ఆలాకు ఎలాంటి భార్య గానీ, సంతానం గానీ లేదు, అలాంటి అవసరం అల్లాహ్‌కు ఏ మాత్రం లేదు అని దాని తర్వాత ఆయతులో చెప్పడం జరుగుతుంది. అందుకొరకే ఉంది,
وَأَنَّهُ تَعَالَىٰ جَدُّ رَبِّنَا (వ అన్నహూ త’ఆలా జద్దు రబ్బినా) మరియు నిశ్చయంగా మా ప్రభువు వైభవం ఎంతో ఉన్నతమైనది. మా ప్రభువు చాలా గొప్పవాడు.
مَا اتَّخَذَ صَاحِبَةً وَلَا وَلَدًا (మత్తఖద సాహిబతన్ వలా వలదా) ఆయన ఎవరినీ కూడా భార్యగా మరియు కుమారునిగా చేసుకోలేదు. (72:3)
ఈ విషయం మనందరికీ కూడా చాలా స్పష్టమైనది. ముష్రికులు దైవదూతలను అల్లాహ్ యొక్క కుమార్తెలు అనేవారు. క్రైస్తవులు ఈసా అలైహిస్సలాంను అల్లాహ్ కుమారుడుగా, యూదులు ఉజైర్ అలైహిస్సలాంని అల్లాహ్ కుమారుడుగా అంటున్నారు. కానీ వాస్తవానికి ఎవరూ కూడా అల్లాహ్ యొక్క భార్య కారు, అల్లాహ్ యొక్క సంతానం కారు.
వాస్తవానికి అల్లాహ్‌కు భాగస్వామి ఎవరూ లేరు, అల్లాహ్‌తో పాటు ఎవరిని షిర్క్ చేయకూడదు మరియు అల్లాహ్‌కు సంతానం, భార్య ఉంది అని నమ్మకూడదు, ఇవన్నీ కూడా తప్పు మాట. కానీ మాలోని కొందరు అవివేకులు, మాలోని కొందరు మూర్ఖులు ఇలాంటి దారుణమైన మాటలు, సత్యానికి విరుద్ధమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఈ ఆయత్ ద్వారా చాలా స్పష్టంగా తెలిసిపోతుంది అల్లాహ్‌కు సంతానం ఉంది అని నమ్మడం, అల్లాహ్‌కు భార్య ఉంది అని నమ్మడం, అల్లాహ్‌కు భాగస్వాములు ఉన్నారు అని నమ్మడం, లేదా అలా నమ్మకపోయినా అల్లాహ్‌కు సంతానం ఉంది, భార్య ఉంది మరియు అల్లాహ్‌కు భాగస్వాములు ఉన్నారు అని నమ్మే వారికి శుభాకాంక్షలు తెలియజేయడం, అలా నమ్మే వారికి ఏదైనా తోడ్పాటు ఇవ్వడం, వారు అలాంటి తప్పుడు విశ్వాసాలతో, షిర్క్ యొక్క నమ్మకాలతో ఏమైనా పండుగలు చేసుకుంటే అందులో వారికి తోడుగా ఉండి వాటిలో పాల్గొనడం, ఇవన్నీ కూడా వాస్తవానికి మూర్ఖత్వం, అవివేకం. ఇవన్నీ కూడా సత్యానికి విరుద్ధమైన మాటలు. 25 డిసెంబర్ క్రిస్మస్ నుండి మొదలుకొని ఫస్ట్ జనవరి వరకు ఏదైతే ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏ రకమైన తప్పుడు పనుల్లో పడి ఉంటారో ఈ ఆయతుల ద్వారా కూడా మనం ఖండించవచ్చు వారికి దీని యొక్క సత్యం తెలియజేయవచ్చును.
ఆయత్ నెంబర్ ఐదును గమనించండి మీరు, చూడండి ఇక్కడ ఆ జిన్నాతులు ఒక సత్యం తెలిసిన తర్వాత వారు తమకు తాము సత్యాన్ని అవలంబించి అంతకు ముందు జ్ఞానం లేక ముందు ఏ తప్పు జరిగిందో దాని గురించి అల్లాహ్ ముందు ఎలా ఒక సాకు తెలుపుకుంటున్నారో, తమ నుండి జరిగిన తప్పును ఒప్పుకుంటూ దానిపై పశ్చాత్తాప పడుతున్నారో ఆ విషయం ఇక్కడ చెప్పడం జరిగినది. ఏంటది? మేము ఇంతకు ముందు అనుకునేవాళ్ళము మానవులు, జిన్నాతులు అల్లాహ్ పై ఎలాంటి అబద్ధం, అసత్యం చెప్పరు అని. కానీ ఇప్పుడు ఈ ఖుర్ఆన్ విన్న తర్వాత మాకు తెలిసింది, ఎంతో మంది ప్రజలు అల్లాహ్‌కు సంతానం కలుగజేస్తున్నారు. ఎంతో మంది జిన్నాతులు కూడా అల్లాహ్‌కు సంతానం ఉంది అన్నట్లుగా, అల్లాహ్‌తో పాటు ఇతరులను భాగస్వాములుగా చేసి షిర్క్ చేస్తున్నారు, ఇవన్నీ తప్పులు వారు చేస్తున్నారు, వాస్తవానికి వారు అది చేస్తున్నది తప్పు అని మాకు కూడా తెలియలేదు, మేము కూడా అజ్ఞానంలో ఉండి, అంధకారంలో ఉండి ఒక తప్పుడు విషయాన్ని విశ్వసిస్తూ వచ్చాము.
అనేక తఫ్సీర్ గ్రంథాల్లో, అరబీ తఫ్సీర్ గ్రంథాల్లో ఈ విషయం చాలా స్పష్టంగా వచ్చి ఉంది. వారి యొక్క నాయకుడైన ఇబ్లీస్ అతడు కేవలం మానవులనే కాదు, ఎంతో మంది జిన్నాతులను కూడా మోసంలో పడవేసి ఉండినాడు. ఎన్నో రకాల కుఫ్రులో వారిని పడవేసి ఉండినాడు వాడు. అందుకొరకే సామాన్య జిన్నులు వారితో ఏ పొరపాటు జరిగిందో మా పెద్దలు మా వారు ఎప్పుడూ కూడా అల్లాహ్ పై ఏదైనా అబద్ధం చెప్పే అటువంటి ధైర్యం చేస్తారు అని మేము అనుకోలేదు. వారు చెప్పే మాటలు సత్యమే అని వారిని మేము గుడ్డిగా అనుసరించాము. కానీ ఇప్పుడు తెలిసింది మాకు వారు కూడా షిర్క్ చేస్తున్నారు మరియు వారు కూడా అల్లాహ్‌కు సంతానం కలుగజేస్తున్నారు. అలాంటి విషయాలన్నిటికీ కూడా మేము దూరంగా ఉంటాము అన్నట్లుగా చాలా స్పష్టంగా వారు తెలియజేశారు.
ఆయత్ నెంబర్ ఆరులో ఉంది. దీనిని కొంచెం శ్రద్ధ వహించాలి. తౌహీద్‌కు సంబంధించిన ఒక చాలా ముఖ్యమైన మాట ఇక్కడ తెలపడం జరుగుతుంది. ఈ ఆయత్ నెంబర్ ఆరును మనం అర్థం చేసుకుంటే ఈ రోజుల్లో షైతానుల పట్ల, జిన్నాతుల పట్ల ఏదైతే భయం ఉంటుందో చాలా మందికి అది కూడా ఇన్ షా అల్లాహ్ దూరం కావచ్చు. ముందు ఒకసారి అనువాదాన్ని గ్రహించండి.
కాన రిజాలుమ్ మినల్ ఇన్సి – మానవుల్లోని కొందరు పురుషులు, మానవుల్లోని కొంతమంది య’ఊదూన – శరణు కోరేవారు, శరణు వేడుకునేవారు. ఎవరితోని? బిరిజాలిమ్ మినల్ జిన్ – జిన్నాతులోని కొందరి పురుషులతో, జిన్నాతులోని కొంతమందితో. ఏంటి ఈ సంఘటన ఇది? దేని గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది?
ధర్మవేత్తలు అంటారు, చాలా కాలం ముందు జిన్నాతులు మనుషులతో భయపడేవారు. కానీ ఈ మనుషులు ప్రయాణాలు చేస్తూ ప్రయాణ దారిలో ఎక్కడైనా వారికి రాత్రి అయింది అంటే ఎక్కడ వారు రాత్రి ఆగిపోయేవారో, రాత్రి పడుకొని ఇక మళ్ళీ పొద్దున్న మనం ప్రయాణం కొనసాగిద్దాము అని ఏదైనా ఒక చోట ఆగిన తర్వాత వారి యొక్క అల్లాహ్ పై నమ్మకం, విశ్వాసం ఎంత బలహీనమైపోయిందంటే అప్పటివరకు, ఆ రాత్రి ఏదైనా చోట ఆగిన వెంటనే ఈ ప్రాంతంలో ఏ జిన్నాతులైతే ఉన్నారో ఆ జిన్నాతులు, ఆ జిన్నాతుల నాయకుల యొక్క మేము శరణు కోరుతున్నాము, మేము రాత్రి ఇక్కడ ఆగుతున్నాము, బస చేస్తున్నాము, మాకు మీరు ఎలాంటి బాధ, హాని కలిగించవద్దు, మాకు ఎలాంటి నష్టం చేకూర్చవద్దు. ఈ విధంగా కేకలు వేసి జిన్నాతుల యొక్క సహాయం, జిన్నాతుల యొక్క శరణు కోరుతూ జిన్నాతులతో భయపడుతూ ఏమీ మీరు మాకు నష్టం చేకూర్చవద్దని విన్నవించుకోవడం, అర్ధించడం, ప్రాధేయపడటం ఇలా చేసేవారు. వేడుకునేవారు.
ఫజాదూహుమ్ రహకా – మానవులు ఇలా చేయడం ద్వారా ఈ విధంగా ఈ మానవులు వారి, హుమ్ – వారి అంటే జిన్నాతుల తలబిరుసుతనం మరింత అధికం చేశారు. అరే మానవులు కూడా మాతో భయపడుతున్నారు అంటే మమ్మల్ని ఇంత పెద్దగా వారు అనుకుంటున్నారు, భావిస్తున్నారు అని మానవులపై తమ యొక్క ఆధిపత్యం, తమ యొక్క పెత్తనం చలాయించడంలో, నడిపించడంలో, మానవులను భయపెట్టడంలో మరింత అధికమైపోయి తమకు తాము ఒక రకమైన గర్వంలో వచ్చేసారు.
ఈ ఫజాదూహుమ్ రహకా అని ఇప్పుడు మీరు చూస్తున్న ప్రకారంగా అనువాదంలో మానవులు, హుమ్ అంటే జిన్నాతులు. కానీ దీనికి విరుద్ధంగా కూడా అనువాదం చేయడం జరిగింది. అంటే ఏమిటి? ఈ మానవుల్లోని కొంతమంది జిన్నాతుల శరణు వేడుకోవడం ద్వారా ఆ జిన్నాతులు మానవుల యొక్క తలబిరుసుతనం, మానవులను సత్యం నుండి దూరం చేయడాన్ని మరింత పెంచేశాయి. అని ఎప్పుడైతే వారు అంటే మానవులు జిన్నాతులను వేడుకోవడం మొదలు పెట్టారో ఆ జిన్నాతులు దీనిని ఆసరగా తీసుకొని ఈ మానవుల్ని మరింత అల్లాహ్ కు దూరం చేయడం, మరింత సత్యం నుండి దూరం చేయడం, మరింత సత్యాన్ని తిరస్కరించడంలో బలంగా ఉండటం, ఇలాంటి తప్పుడు విషయం అన్నది పెంచేశాయి. అందుకొరకే ఈ రెండు భావాలు కూడా కరెక్టే. చెప్పే ఉద్దేశం ఏమిటి? ఎప్పుడూ కూడా మనం అల్లాహ్ వైపు నుండి వచ్చిన సత్యం ఏమిటో దాన్ని గ్రహించామంటే ఎలాంటి ఇబ్బందిలో ఉండము.
ఇక్కడ మరో విషయం తెలుస్తుంది మనకు, అల్లాహ్ ను ఏదైనా ఆపదలో, కష్టంలో, భయంలో మనం శరణు వేడుకోవడం అల్లాహ్ యొక్క ఆరాధన రకాల్లో చాలా గొప్ప రకం. ఇలా అల్లాహ్ యొక్క ఆరాధన రకాల్లో ఈ గొప్ప రకాన్ని అల్లాహ్ తప్ప వేరే ఎవరికైనా మనం అంకితం చేసామంటే ఘోరమైన షిర్క్ చేసిన వాళ్ళం అవుతాము. అందుకొరకే మనం ఏమంటాము? అ’ఊదు బిల్లాహి మినష్షైతానిర్రజీమ్. కుల్ అ’ఊదు బిరబ్బిల్ ఫలక్. కుల్ అ’ఊదు బిరబ్బిన్నాస్. ఈ సూరాలన్నిటిలో కూడా మనకు ఈ ఇస్తి’ఆదా, శరణు కోరడం ఇది అల్లాహ్ యొక్క ఇబాదత్ రకాల్లో ఒక ముఖ్యమైనది, ఇందులో మనం అల్లాహ్ కు ఎవరిని కూడా సాటి కల్పించకూడదు అన్నటువంటి భావం స్పష్టంగా ఉంది.
మరొక విషయం ఇందులో మనం గ్రహించాల్సింది, ఎంత షైతానులకు, జిన్నాతులకు ప్రజలు భయపడతారో అంతే అల్లాహ్ నుండి ఇంకా దూరమైపోతారు. ఇంకా షైతానులు వారిని మరింత ఆసరగా తీసుకొని బెదిరిస్తూనే ఉంటారు. అలా కాకుండా అల్లాహ్ ను మొరపెట్టుకొని ఏ భయం కలిగినా అల్లాహ్ శరణు తీసుకొని అల్లాహ్ పై విశ్వాసం బలంగా ఉంచుకుంటే మనకు షైతానుల నుండి ఏ హాని కలగదు, ఎలాంటి నష్టం అనేది జరగదు. అందుకొరకే చూడండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు నేర్పిన దుఆలలో కూడా ఎన్నో సందర్భాల్లో ఏ ఏ మనకు బాధలు, రంది, చింత, బెంగ ఇంకా ఏదైనా ఆపద, కష్టం వాటన్నిటి నుండి కేవలం అల్లాహ్ యొక్క శరణ మాత్రమే మనం కోరుతూ ఉండాలి అని నేర్పడం జరిగినది. ఉదయం సాయంకాలం చదివే దుఆలలో కూడా ఈ విషయాలు మనకు కనబడతాయి. అల్లాహుమ్మ ఇన్నీ అ’ఊదు బిక మిన్ షర్రి నఫ్సీ వ షర్రిష్షైతాని వ షిర్కిహీ. అల్లాహ్ యొక్క శరణ కోరడం జరుగుతుంది. అల్లాహుమ్మ ఇన్నీ అ’ఊదు బిక మినల్ కుఫ్రి వల్ ఫఖ్రి వ అ’ఊదు బిక మిన్ అదాబిల్ ఖబ్ర్. ఈ విధంగా అల్లాహ్ యొక్క శరణ కోరడం జరుగుతుంది. అల్లాహ్ యొక్క శరణ కోరడం ఇది అసలైన విషయం. ఎంతవరకు మానవులు షైతానులతో భయపడతారో ఆ షైతానులు మరింత మానవుల్ని హిదాయత్ నుండి దూరమే చేస్తారు.
ఆ తర్వాత ఆయతును గనక మనం గమనిస్తే,
وَأَنَّهُمْ ظَنُّوا كَمَا ظَنَنتُمْ أَن لَّن يَبْعَثَ اللَّهُ أَحَدًا (వ అన్నహుమ్ దన్నూ కమా దనన్ తుమ్ అన్ లన్ యబ్’అసల్లాహు అహదా) “అల్లాహ్ ఎవరినీ పంపడని (లేక ఎవరినీ తిరిగి బ్రతికించడని) మీరు తలపోసినట్లుగానే మనుషులు కూడా తలపోశారు.” (72:7)
ఆ ఖుర్ఆన్ విన్నటువంటి జిన్నాతులు వెళ్లి వారి జాతి వారికి తెలియజేస్తున్నారు కదా? అయితే ఏమంటున్నారు? మీరు ఎలాగైతే అల్లాహ్ ఏ ప్రవక్తను పంపడు, చనిపోయిన వారిని తిరిగి లేపడు అని మీరు అనుకునేవారో మానవుల్లో కూడా ఎంతో మంది ఇలాంటి తప్పుడు విశ్వాసంలోనే ఉన్నారు.
ఒకటి నుండి ఏడు వరకు ఈ ఆయతులను గనక మీరు గమనిస్తే చాలా స్పష్టంగా మీకు తౌహీద్, రిసాలత్, ఆఖిరత్ మూడు గురించి తెలుస్తుంది. అందుకొరకే అల్లాహ్ యొక్క గ్రంథం ఖుర్ఆన్‌ను చాలా శ్రద్ధగా చదువుతూ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మనకు ఇందులో అనేక బోధనలు కలుగుతాయి. జిన్నాతుల లాంటి వారు, మనకంటే తక్కువ స్థానంలో ఉన్నవారు అర్థం చేసుకొని తమ జాతి వారికి హెచ్చరించగలిగితే మనం అంతకంటే ఎక్కువ విలువ గలవాళ్ళము, ఘనత గలవాళ్ళము. తప్పకుండా మనం అల్లాహ్ యొక్క దయతో ఈ ఖుర్ఆన్‌ను అర్థం చేసుకున్నామంటే మన జాతి వారికి కూడా మంచి రీతిలో మనం బోధ చేయగలుగుతాము.
ఇక ఈ అన్ లన్ యబ్’అసల్లాహు అహదా, బ’అస్ కొన్ని సందర్భాల్లో ఆ ఎవరినైనా ప్రవక్తగా చేసి పంపడం అనే విషయంలో అలాగే ఇంకా చనిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ లేపడం అనే విషయాల్లో ఖుర్ఆన్‌లో అనేక సందర్భంలో ఉపయోగించడం జరిగింది.
ఉదాహరణకు స్టార్టింగ్‌లో సూరె బఖరాలోనే చూస్తే ఆయత్ నెంబర్ 56లో కనబడుతుంది మనకు, సుమ్మ బ’అస్నాకుమ్ మిమ్ బా’అది మౌతికుమ్. మీరు చనిపోయిన తర్వాత మిమ్మల్ని మేము మళ్ళీ తిరిగి బ్రతికించాము. అదే ఒకవేళ ఆయత్ నెంబర్ 129 చూస్తే ఇబ్రాహీం అలైహిస్సలాం దుఆ చేస్తున్నారు, రబ్బనా వబ్’అస్ ఫీహిమ్ రసూలా. ఓ అల్లాహ్ ఒక ప్రవక్తను వారిలో ప్రభవింపజేయి అని దుఆ చేశారు హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం. అంటే ఇక్కడ చెప్పే ఉద్దేశం ఏంటి? ఈ పదం ఏదైతే ఉందో బ’అస్ రెండు భావాల్లో వస్తుంది. రెండు భావాల్లో. దానికి ఒక ఉదాహరణ మీకు సూరతుల్ బఖరా ఆయత్ నెంబర్ 56 ద్వారా, మరొక ఉదాహరణ సూరతుల్ బఖరా ఆయత్ నెంబర్ 129 ద్వారా తెలపడం జరిగినది. ఇంకా దీనికి మీరు ఆధారాలు చూసుకోవాలనుకుంటే చాలా ఉన్నాయి.
ఉదాహరణకు నేను ఇది తెలుగు ఖుర్ఆన్, https://teluguislam.net/ab. వల్లాహి వల్లాహి అల్లాహు త’ఆలా జజాఏ ఖైర్ ఇవ్వుగాక మన అబ్దుర్రహ్మాన్ భాయ్ గారికి, ఎంత శ్రమ పడ్డారు వారు, వారి యొక్క ఫ్యామిలీ వారు ఈ ఒకే పేజీలో మొత్తం ఖుర్ఆన్ అరబీ టెక్స్ట్, తెలుగు అనువాదం యొక్క టెక్స్ట్ తీసుకురావడంలో. దీని ద్వారా చాలా చాలా లాభం కలుగుతుంది. మీరు ఎంత గ్రహించారో తెలియదు కానీ నేనైతే చాలా దీని ద్వారా లాభం పొందుతూ ఉంటాను. ఉదాహరణకు ఇక్కడే మీరు చూడండి, ఇక్కడ మీరు చూస్తున్నారు చాలా స్పష్టంగా, కేవలం బ’అస్ అన్న పదం నేను రాశాను. బా, ఐన్, సా. మొత్తం 59 రిజల్ట్ ఇక్కడ వచ్చాయి. చూస్తున్నారు కదా మీరు కూడా. ఇప్పుడు ఆయత్ నెంబర్, సూర బఖరా సూర నెంబర్ 2, ఆయత్ నెంబర్ 56. ఇందులో ఏ భావం ఉంది? చనిపోయిన తర్వాత తిరిగి లేపడం భావం ఉంది. ఆ తర్వాత మళ్ళీ మీరు చూడండి సూరతుల్ బఖరా ఆయత్ నెంబర్ 129 లో కనబడుతుంది, రబ్బనా వబ్’అస్ ఫీహిమ్ రసూలా. ఇందులో ప్రవక్తను పంపడం అనే భావంలో ఉంది. ఆ తర్వాత మూడో రిజల్ట్ చూస్తే ఇక్కడ కూడా ఫబ’అసల్లాహున్నబియ్యీన, ప్రవక్తలను పంపడం అన్న భావంలో వచ్చి ఉంది. ఆ, ఇక్కడ ఒక రాజును మా కొరకు పంపు అని ఇందులో కూడా. మరి ఇక్కడ చూస్తే 259వ ఆయత్ నెంబర్‌లో, ఫ అమాతహుల్లాహు మి’అత ఆమిన్ సుమ్మ బ’అసహ్. అల్లాహు త’ఆలా 100 సంవత్సరాల వరకు అతన్ని చంపి ఉంచాడు, ఆ తర్వాత మళ్ళీ తిరిగి లేపాడు. నువ్వు నూరేళ్ళు ఈ స్థితిలో పడి ఉన్నావు. కాస్త నీ అన్న పానీయాల వైపు చూడు. ఈ విధంగా మనం ఏదైనా ఒక పదం గురించి వెతకడం, దాని రిజల్ట్ పొందడం గురించి ఇది చాలా చాలా ఉత్తమ వెబ్సైట్. దీనిని మీరు మీ యొక్క ఫేవరెట్ చేసి పెట్టుకోండి. ఎలాగైతే నేను ఇక్కడ ఫేవరెట్ చేసి పెట్టుకున్నాను, స్టార్ గుర్తుని, ఇది. ఈ విధంగా చేసి పెట్టుకుంటే మీకు వెతకడంలో చాలా సులభం అవుతుంది.
అయితే మన టాపిక్ ఏంటి?
أَن لَّن يَبْعَثَ اللَّهُ أَحَدًا (అన్ లన్ యబ్’అసల్లాహు అహదా) ఆ జిన్నాతులు అంటున్నారు మేము కూడా మరియు మానవులు కూడా అల్లాహ్ ఏ ప్రవక్తను పంపడు, అల్లాహ్ ఎవరిని కూడా చనిపోయిన తర్వాత తిరిగి లేపడు అని అనుకునే వాళ్ళము, కానీ అలా కాదు, తప్పకుండా అల్లాహు త’ఆలా తిరిగి లేపుతాడు అన్నటువంటి స్పష్టమైన విషయం ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ రోజు ఈ ఆయతులు చదివాము మనము. ఇంకా అల్లాహ్ యొక్క దయతో ఇన్ షా అల్లాహ్ తర్వాత పాఠంలో మిగతా ఆయతులు చదివే ప్రయత్నం చేద్దాము. ఇక్కడి వరకే సెలవు తీసుకుంటున్నాను. జజాకుముల్లాహు ఖైరా, బారకల్లాహు ఫీకుమ్, అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహ్.
ఖురాన్ తఫ్సీర్ – సూరా అల్ జిన్న్ – పార్ట్ 2 (అయతులు 8 -13) వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) https://youtu.be/r_5kw6e_trk [49 నిముషాలు]
ఈ ప్రవచనంలో సూరహ్ అల్-జిన్ (72వ సూరా) యొక్క 8 నుండి 13వ ఆయతులపై దృష్టి సారించారు. 8 నుండి 13వ ఆయతుల యొక్క పదపదానికీ అనువాదం మరియు వివరణ ఇవ్వబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రాకకు ముందు, జిన్నాతులు ఆకాశంలోని వార్తలను దొంగతనంగా వినేవారని, కానీ ప్రవక్త ఆగమనం తర్వాత ఆకాశం కఠినమైన కావలి వారితో, ఉల్కలతో నింపబడిందని వివరించారు. ఈ మార్పుకు కారణం ఖుర్ఆన్ అవతరణ అని గ్రహించిన జిన్నాతులు, దానిని విని విశ్వసించారు. అల్లాహ్ యొక్క శక్తి నుండి తాము ఎప్పటికీ తప్పించుకోలేమని, ఆయనను ఓడించలేమని వారు దృఢంగా నమ్మారు. కీడు జరిగినప్పుడు దానిని నేరుగా అల్లాహ్ కు ఆపాదించకుండా, ‘కీడు ఉద్దేశించబడింది’ అని చెప్పడం ద్వారా జిన్నాతులు చూపిన గౌరవాన్ని ప్రవచకులు నొక్కిచెప్పారు. చివరగా, తమ ప్రభువును విశ్వసించిన వారికి పుణ్యాలలో ఎలాంటి నష్టం గానీ, అన్యాయం గానీ జరగదని ఆయతుల ద్వారా స్పష్టం చేశారు.
72:8 وَأَنَّا لَمَسْنَا السَّمَاءَ فَوَجَدْنَاهَا مُلِئَتْ حَرَسًا شَدِيدًا وَشُهُبًا “మేము ఆకాశంలో బాగా వెదికాము. అది అప్రమత్తులైన పహరాదారులతో, అగ్నిజ్వాలలతో నిండి ఉండటం చూశాము.”
72:9 وَأَنَّا كُنَّا نَقْعُدُ مِنْهَا مَقَاعِدَ لِلسَّمْعِ ۖ فَمَن يَسْتَمِعِ الْآنَ يَجِدْ لَهُ شِهَابًا رَّصَدًا “లోగడ మనం విషయాలు వినటానికి ఆకాశంలో పలుచోట్ల (మాటేసి) కూర్చునే వాళ్ళం. ఇప్పుడు ఎవరైనా చెవి యోగ్గి వినదలిస్తే, తన కోసం కాచుకుని ఉన్న అగ్నిజ్వాలను అతను పొందుతున్నాడు.”
72:10 وَأَنَّا لَا نَدْرِي أَشَرٌّ أُرِيدَ بِمَن فِي الْأَرْضِ أَمْ أَرَادَ بِهِمْ رَبُّهُمْ رَشَدًا “ఇంకా – భూమిలో ఉన్న వారి కోసం ఏదైనా కీడు తలపెట్టబడినదో లేక వారి ప్రభువు వారికి సన్మార్గ భాగ్యం ప్రసాదించగోరుతున్నాడో మాకు తెలియదు.”
72:11 وَأَنَّا مِنَّا الصَّالِحُونَ وَمِنَّا دُونَ ذَٰلِكَ ۖ كُنَّا طَرَائِقَ قِدَدًا “ఇంకా ఏమిటంటే – మనలో కొందరు సజ్జనులుంటే మరికొందరు తద్భిన్నంగా ఉన్నారు. మన దారులు వేర్వేరుగా ఉన్నాయి.”
72:12 وَأَنَّا ظَنَنَّا أَن لَّن نُّعْجِزَ اللَّهَ فِي الْأَرْضِ وَلَن نُّعْجِزَهُ هَرَبًا “మనం భూమిలో అల్లాహ్ ను అశక్తుణ్ణి చేయటం గానీ, పారిపోయి (ఊర్థ్వలోకాల్లో) ఆయన్ని ఓడించటంగాని మనవల్ల కాని పని అని మాకర్ధమైపోయింది.”
72:13 وَأَنَّا لَمَّا سَمِعْنَا الْهُدَىٰ آمَنَّا بِهِ ۖ فَمَن يُؤْمِن بِرَبِّهِ فَلَا يَخَافُ بَخْسًا وَلَا رَهَقًا “మేము మాత్రం సన్మార్గ బోధను వినగానే దానిని విశ్వసించాం. ఇక ఎవడు తన ప్రభువును విశ్వసించినా అతనికి ఎలాంటి నష్టంగానీ, అన్యాయంగానీ జరుగుతుందన్న భయం ఉండదు.”
సూరహ్ అల్-జిన్ (ఆయత్ 8-13) పదపదానికీ అనువాదం
وَاَنَّا [వ అన్నా] నిశ్చయంగా మేము.
لَمَسْنَا [లమస్నా] ఇక్కడ లమస్నా అన్నదానికి వెతికాము అని రాయవచ్చు.
السَّمَآءَ [అస్ సమాఅ] ఆకాశం
లమస్నా యొక్క అసలు భావం, అసలు భావం లమ్స్ అంటారు టచ్ చేయడాన్ని, తాకడాన్ని. దేనినైనా ముట్టుకుంటే అది ఏంటి అనేది మనకు తెలుస్తుంది కదా. అది మనకు ఏదైతే తెలిసిందో తాకడం ద్వారా. ఓహ్ ఇది వేడిగా ఉంది. అబ్బో ఇది చల్లగా ఉంది. అని మనం కొంచెం తాకిన తర్వాత ఏర్పడుతుంది. ఆ విషయాన్ని అంటారు వాస్తవానికి. కానీ ఇక్కడ ఉద్దేశ ప్రకారంగా వెతికాము అని భావం తీసుకోవడం జరుగుతుంది. ఆ అస్ సమాఅ, ఆకాశం
مِنْهَا [మిన్హా] అక్కడ ఆకాశంలో ఉన్నవారి స్థలాల్లో.
مَقَاعِدَ [మకాఇద] మకాఇద్ అంటే కూర్చునే స్థలాల్లో.
لِلسَّمْعِ [లిస్సమ్అ] వినడానికి.
فَمَنْ [ఫమన్] కనుక ఎవరూ
يَسْتَمِعُ [యస్తమిఉ] వింటాడో, వినే ప్రయత్నం చేస్తాడో.
ఇంతకుముందే వచ్చింది మనకు
اَنَّهُ اسْتَمَعَ [అన్నహుస్తమఅ.] యస్తమిఉ ఇక్కడ వచ్చింది. కానీ ఇక్కడ ఉద్దేశపరంగా యస్తమిఉ వింటాడో వినే ప్రయత్నం చేస్తాడో అని.
الْاٰنَ [అల్ ఆన] ఇప్పుడు.
يَجِدْ [యజిద్] పొందుతాడు.
لَهٗ [లహూ] తన కొరకు.
شِهَابًا [షిహాబన్] అగ్ని జ్వాలను.
رَّصَدًا [రసదా] మాటు వేసి ఉన్నది. కాచుకొని ఉన్నది.
وَاَنَّا [వ అన్నా] మరియు నిశ్చయంగా మేము
لَا نَدْرِيْٓ [లా నద్రీ] మాకు తెలియదు.
اَشَرٌّ [అషర్రున్.] అ. ఇక్కడ ఆ ప్రశ్నార్థకంగా.
شَرٌّ [షర్రున్] కీడు, చెడు.
اُرِيْدَ [ఉరీద] ఉద్దేశింపబడినదా.
بِمَنْ فِى الْاَرْضِ [బి మన్ ఫిల్ అర్ద్] భూమిలో ఉన్నవారి గురించి.
اَمْ [అమ్] లేదా
اَرَادَ [అరాద] కోరాడా, ఉద్దేశించాడా.
بِهِمْ [బిహిమ్] వారి గురించి.
رَبُّهُمْ [రబ్బుహుమ్] వారి ప్రభువు.
رَشَدًا [రషదా.] ఇంతకుముందు ఏం రాసాము మనం రుష్ద్. సరియైన మార్గం. మేలు. రెండు రాసుకోండి.
وَاَنَّا [వ అన్నా] మరియు మేము.
وَاَنَّا مِنَّا [వ అన్నా మిన్నా] మాలో.
الصّٰلِحُوْنَ [అస్ సాలిహూన్] సజ్జనులు, సద్వర్తనులు. సజ్జనులు చాలా బాగుంటుంది. సద్వర్తన అనసరికి క్యారెక్టర్ కి సంబంధమైన అవుతుంది. కానీ సాలిహ్ లో విశ్వాస పరంగా గానీ ఆచరణ పరంగా గానీ, ప్రవర్తన పరంగా గానీ పరస్పర ప్రజలతో బిహేవియర్ మంచి వ్యవహారం విషయంలో గానీ అన్ని రకాలుగా సాలిహ్, మంచి వాళ్ళు. సాలిహూన్, సజ్జనులు.
وَمِنَّا [వ మిన్నా] మరియు మాలో
دُوْنَ ذٰلِكَ [దూన దాలిక్] దానికి భిన్నంగా.
كُنَّا [కున్నా] మేము ఉంటిమి.
طَرَاۤئِقَ قِدَدًا [తరాయిక, కిదదా] వివిధ మార్గాల్లో. వివిధ వర్గాల్లో. మన దారులు వేరు వేరు.
وَّاَنَّا ظَنَنَّآ [వ అన్నా జనన్నా] మేము భావించేవాళ్ళము. ఇక్కడ భావించడం అంటే ఇది నమ్మకం యొక్క భావంలో. ఒక్కొక్కసారి జనన్నా అనుమానంలో కూడా వస్తుంది కానీ ఇక్కడ అలా కాదు.
وَّلَا رَهَقًا [వలా రహకా.] ఏదైనా దౌర్జన్యం, అన్యాయం. రహకా ఇంతకుముందు కూడా వచ్చింది. ఏం రాశారు? తలబిరుస్తనం షేక్. తలబిరుస్తనం వస్తుంది, దౌర్జన్యం అని కూడా వస్తుంది.
ఓకే, పలక, బలపం పక్కకు పెట్టి మాట ఇప్పుడు శ్రద్ధగా వినండి. వ్యాఖ్యానం తఫ్సీర్ మనం మొదలుపెడుతున్నాము.
సూరహ్ అల్-జిన్ (ఆయత్ 8-13) యొక్క తఫ్సీర్ మరియు వివరణ
బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్. అల్హమ్దులిల్లాహ్, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్, అమ్మా బ’ద్.
సూరతుల్ జిన్, అల్లాహ్ యొక్క దయవల్ల ఇప్పటివరకు మనం ఏడు ఆయత్ లు చదివి ఉన్నాము. ఈరోజు నుండి ఎనిమిదవ ఆయత్ చదవబోతున్నాము. అయితే ఈ ఆయత్ ల యొక్క భావం తెలుసుకునేకి ముందు, దీనికి సంబంధించిన ఒక సంఘటనను మనతో అర్థం చేసుకుంటే చాలా బాగా ఉంటుంది. ఏంటి అది? మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రాకముందు షైతానుల ఒక అలవాటు ఉండినది. ఏంటి? ఒకరిపై ఒకరు అధిరోహించి, ఎక్కి, ఆకాశం వరకు చేరుకొని, అక్కడ వారు మాటు వేసుకొని ఉండే, దొంగతనంగా వినడానికి అక్కడ దైవదూతల మాటలను, వారు కొన్ని స్థానాలు ఏర్పరచుకొని ఉండిరి. అయితే మన ప్రవక్త ముహమ్మమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇక ప్రవక్తగా ప్రభవింపజేయబడతారు అన్న సందర్భంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ షైతానులు అక్కడి మాటలు ఏమీ దొంగలించకుండా ఉండడానికి అక్కడ వారికి, దొంగచాటున వినే అటువంటి షైతానులకు కఠిన శిక్షగా ఆకాశంలో తారలు ఏవైతే ఉన్నాయో కొన్నిటిని నియమించాడు. ఆ తారలు కొన్ని అగ్ని జ్వాలలతో ఆ షైతానులను కాల్చేస్తుండినవి. అయితే ఈ షైతానులు అక్కడి మాటలు వినడానికి ఎందుకు ప్రయత్నం చేసేవారు? అసలు ఏం జరిగేది? మనం ఖుర్ఆన్ లోని వేరే ఆయత్ ల ద్వారా గ్రహిస్తే తెలుస్తున్న విషయం ఏమిటంటే, ఎప్పుడైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏదైనా ఆదేశం దైవదూతలకు ఇవ్వడానికి వారికి ఒకే ఒక ఇస్తాడో, వారిని పిలుస్తాడో అల్లాహ్ యొక్క ఔన్నత్యం, గౌరవం, గొప్పతనంతో అందరూ సొమ్మసిల్లిపోతారు. అల్లాహ్ యొక్క మాట విన్న వెంటనే వారందరిలోకెల్లా జిబ్రీల్ అందరికంటే ముందు కోలుకొని అల్లాహ్ యొక్క మాటను చాలా శ్రద్ధగా వింటారు. ఆ తర్వాత ఆయన ఎవరెవరికి ఏ ఆదేశాలు ఇవ్వాలో అవి తెలియపరుస్తాడు. ఆ సందర్భంలో ఆ మాటలు ఒకరి వెనుక ఒకరి దేవదూతలకు చేరుతూ ఉంటాయి. వారు పంపిస్తూ ఉంటారు అల్లాహ్ వారికి ఇచ్చిన ఆదేశం, వారికి తెలిపిన విధానంలో వారు పంపించుకుంటూ ఉంటారు.
అయితే ఈ షైతానులు ఈ ఒక్క మాటను దొంగలించి అందులో పది మాటలు తమ వైపు నుండి కలిపి కింద మనుషుల్లో ఎవరైతే వారి యొక్క అనుయాయులు, వారిని అనుసరించే వారు ఫాలోవర్స్ ఉన్నారో, ఈ విషయం మనకు సహీహ్ ముస్లిం హదీస్ ద్వారా కూడా తెలుస్తుంది. కాహిన్, అర్రాఫ్, జ్యోతిషి అని మనం ఏదైతే అంటామో వారికి తెలియజేస్తారు. ఆ జ్యోతిష్యులు ఆ అందులో ఇక తొంభై మాటలు ఎక్కువగా కలిపి ఇక ప్రజల నుండి తప్పిపోయిన ఏదైనా వస్తువు గానీ వారి యొక్క భవిష్యత్తులో ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది అన్నటువంటి అగోచర విషయాలు తెలుపుతున్నట్లు, వారి యొక్క భవిష్యత్తు గురించి తెలియజేస్తున్నట్లుగా వారికి చెబుతారు. వాస్తవం ఏమిటంటే, ఒక్క మాట మాత్రమే వారు చెప్పిన వంద మాటల్లో నిజమవుతుంది. కానీ అమాయక ప్రజలు ఆ ఒక్క మాట ఏదైతే నిజమైనదో దాని ద్వారా వారి యొక్క తొంభై తొమ్మిది మాటలు నిజమన్నట్లుగా భావిస్తారు. అయితే ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రాకముందు ప్రవక్తగా ప్రభవించక ముందు ఆకాశంలో కట్టుదిట్టం పహరాలు, అక్కడ ఎవరూ దొంగచాటున వినకుండా ఉండడానికి అక్కడ చెక్ పాయింట్ లాంటివి అనుకోండి ఎక్కువైపోయాయి. అయితే ఈ జిన్నాతులు చాలా ఆశ్చర్యపడ్డారు ఈ విషయాన్ని చూసి, ఎందుకు ఇలా జరుగుతుంది, ఇంతకుముందు ఎప్పుడూ జరగకపోయేది కదా. అయితే ఎప్పుడైతే వారు వచ్చి ఖుర్ఆన్ విన్నారో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నోట, అప్పుడు వారికి అర్థమైంది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన సత్య సందేశాన్ని ప్రజలకు చేరవేయడానికి ఈ విధంగా ఆకాశంలో ఎన్నో రకాల తారలను మా కొరకు మాటు వేసి ఉంచి, మాపై మాటలు వినకుండా శిక్షను పంపించేవారు. వాటి యొక్క ప్రస్తావన ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు కొంచెం మనం ఆయత్ లను చదువుతూ ఈ విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.
వ అన్నా లమస్నస్ సమాఅ ఫవజద్నాహా ములిఅత్ హరసన్ శదీదన్ వ షుహుబా.
وَاَنَّا لَمَسْنَا السَّمَآءَ فَوَجَدْنٰهَا مُلِئَتْ حَرَسًا شَدِيْدًا وَّشُهُبًا ۙ [వ అన్నా లమస్నస్ సమాఅ ఫవజద్నాహా ములిఅత్ హరసన్ శదీదన్ వ షుహుబా] “మరి నిశ్చయంగా మేము ఆకాశాన్ని గాలించాము. అది కఠినమైన కావలి వారితో, నిప్పు రవ్వలతో నింపబడి ఉండటాన్ని మేము గమనించాము.” (72:8)
మరో అనువాదంలో ఏముంది? మేము ఆకాశంలో బాగా వెతికాము, అది అప్రమత్తులైన పహరాదారులతో, అగ్ని జ్వాలలతో నిండి ఉండటం చూశాము. ఈ ఆయత్ లో మనకు చూడడానికి ఇంతవరకు చెప్పుకున్నటువంటి సంఘటన ఏదైతే తెలుసుకున్నామో, అందులో స్పష్టంగా అర్థమైపోయింది మనకు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ షైతానులు వినకుండా ఉండడానికి అక్కడ మంచి బలవంతమైన షైతానులను ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వాటిని కాపలాదారులుగా పెట్టాడు. అయితే ఇక్కడ మనకు రెండు విషయాలు కనబడుతున్నాయి. ఒకటి, హరసన్ శదీదా, బలవంతమైన, కఠినమైన, మంచి పహరాదారులు. వ షుహుబా. షుహుబా అంటే ఇక్కడ ఉల్కలు అని కూడా కొందరు అనువాదం చేశారు. ఈ ఉల్కలు మనం వాడుక భాషలో వేటిని అంటారో మీలో ఎవరికైనా తెలిసి ఉంటే చెప్పండి ఒకసారి. ఆకాశం నుండి రాలేవి షేక్, ఉల్కలు అంటే. ఆకాశం నుండి రాలే అటువంటివి. గ్రహ సకలాలు అని చెప్తారు సార్ వాస్తవానికి సైన్స్ పరంగా. ఉల్కలు అని అంటారు వాటిని. గ్రహ సకలాల్ని. ఇక్కడ కొంచెం మనం, ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. అదేమిటంటే సైన్స్ పరంగా కొన్ని విషయాలు ఏవైతే మనకు తెలుస్తున్నాయో, ధర్మం అన్నది, ఇస్లాం చెప్పేటివి విరుద్ధమేమీ కావు. కొన్ని సందర్భాల్లో ఏదైనా విషయం అర్థం కాకపోతే సైన్స్ పూర్తి రీసెర్చ్ తో జరుగుతుంది అన్నటువంటి వాదనతో దాని వైపు మొగ్గు చూపి కొందరు అల్లాహ్ లేదా ప్రవక్త యొక్క మాటలను తిరస్కరించే ప్రయత్నం చేస్తారు. ఆ భావంలోకి వెళ్లకూడదు. ఎందుకంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏ సత్యాన్ని తెలియజేశాడో అవి ఇంకా సైంటిస్టుల పరిశోధనలకు రాలేదు కావచ్చు అని మనం భావించాలి, వాస్తవం కూడా ఇది. కానీ అల్లాహ్ యొక్క మాట, ప్రవక్త యొక్క మాట సైన్స్ పరిశోధనల కంటే చాలా ఫాస్ట్ గా మరియు చాలా అప్డేట్ గా ఉంటాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే కొందరు తొందరపాటులో ఇది ఇస్లాం దీని గురించి ఏం చెప్తుంది అన్నటువంటి విషయాలను మాట్లాడుతూ వ్యతిరేకత చూపి ఇస్లాంను వంకరగా, ఇస్లాంను తప్పుగా చూపించే ప్రయత్నం అందరూ చేస్తూ ఉంటారు. అయితే ఈ విషయంలో గానీ, ఏదైతే ఉల్కల ప్రస్తావన వచ్చిందో, లేదా భూకంపం విషయంలో గానీ ఇదంతా కూడా సైన్స్ కు మరియు ధర్మానికి వ్యతిరేకత తీసుకువచ్చే ప్రయత్నం ఏమాత్రం చేయనే చేయకూడదు. ఎవరికైనా ఎక్కడైనా ఏదైనా మాట అర్థం కాకుంటే అక్కడ మనం క్లియర్ గా ఒక మాట చెప్పవచ్చు. అదేమిటి? అల్లాహ్ చెప్పిన మాటలో ఎలాంటి రద్దు అనేది, ఎలాంటి అబద్ధం అనేది ఉండదు గనుక సైన్స్ పరిశోధనలు జరిపి, జరిపి, జరిపి, జరిపి వారి దృష్టిలో వచ్చిన విషయం అనుభవంలో వచ్చిన విషయం చెప్తారు గనుక ఇంకా వారి పరిశోధనలకు రాలేదు కావచ్చు అన్నటువంటి విషయంపై మనం ఉండాలి. కానీ ఇక్కడ చెప్పే ఉద్దేశం ఏంటి? అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కొన్ని తారలలో అలాంటి శక్తి వారికి ప్రసాదించి ఉన్నాడు. వారిని కాపలాదారులుగా ఉంచాడు. వారు ఎక్కడ షైతానులను చూస్తారో వాటిని పరిగెత్తించి, వారిని ఆ వారి వెంటపడి వారిని కాల్చేసే ప్రయత్నం చేస్తారు. అయితే మనం కొన్ని సందర్భాల్లో తారా పడిపోయింది లేదా ఉల్కల విషయం ఏదైతే మనం వింటామో లేదా చూస్తామో అయితే వల్లాహు అ’లం ఏదైనా తార షైతానులను కొట్టడానికి ఆ షైతానుల వెంట పరిగెడుతుంది కావచ్చు.
రెండో ఆయత్: వ అన్నా కున్నా నఖ్ ఉదు మిన్హా మకాఇద లిస్సమ్.
وَّاَنَّا كُنَّا نَقْعُدُ مِنْهَا مَقَاعِدَ لِلسَّمْعِ ۖ [వ అన్నా కున్నా నఖ్ ఉదు మిన్హా మకాఇద లిస్సమ్] “మరియు మేము (విషయాలు) వినటానికి ఆకాశంలో కొన్ని చోట్ల కూర్చునేవారము.” (72:9)
అక్కడ మేము కొన్ని కూర్చుండి ఉండే చోట్ల, స్థానాల్లో కూర్చుండే వారిమి లిస్సమ్ వినడానికి. తాను ఇప్పుడు ఎవరైనా అలా వినే ప్రయత్నం చేస్తే వానికి ఆ ఉల్కలు అనేటివి కాల్చేస్తాయి మరియు వారు దాని యొక్క శిక్ష పొందుతారు. ఇది మొదటి మాట దానికే మరింత బలం చేకూరుస్తూ ఆ షైతానులు, ఆ జిన్నాతులు ఎవరైతే విని విశ్వసించారో తమ జాతి వారి వద్దకు వెళ్లి ఈ విషయాలను వారు చెబుతున్నారు. అందులోనే మరొక మాట పదవ ఆయత్ లో వస్తుంది. ఈ పదవ ఆయత్ లో మనకు కొన్ని గుణపాఠాలు ఉన్నాయి. కొన్ని మంచి బోధనలు ఉన్నాయి, గ్రహించాలి. మొదటిది ఏమిటంటే,
వ అన్నా లా నద్రీ అశర్రున్ ఉరీద.
తిలావత్ పరంగా కూడా ప్రత్యేకంగా ఎవరైతే ఇమామ్ గా ఉంటారో, ఖుర్ఆన్ యొక్క తిలావత్ చేస్తూ ఉంటారో తిలావత్ ఎలా చేయాలంటే ప్రత్యేకంగా నమాజ్ లో ఉన్నప్పుడు గానీ, స్వయంగా మన కొరకు ఒంటరిగా మనం తిలావత్ చేసుకుంటున్నప్పుడు గానీ, లేదా ఏదైనా సభలో ఎక్కడైనా ఎవరికైనా ఖుర్ఆన్ మనం వినిపిస్తున్నాము, దాని యొక్క తిలావత్ చేసే విధానం అన్నది ఎంత మంచిగా, సుందరంగా, ఉత్తమంగా ఉండాలంటే ఖుర్ఆన్ యొక్క తిలావత్ ద్వారానే ఎంతో కొంత భావం అర్థమయ్యే రీతిలో తిలావత్ జరగాలి. ఇక్కడ అశర్రున్ అన్న పదం ఏదైతే వచ్చిందో వాస్తవానికి ఇందులో మహా నీచాతి నీచమైన, మహా చెడ్డది అన్నటువంటి భావంలో వస్తుంది. కానీ ఇక్కడ ఆ భావం కాదు. అలాంటి భావం ఉండేది ఉంటే అశర్రున్ డైరెక్ట్ చదవడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏముంది, అశర్రున్ ఉరీద బిమన్ ఫిల్ అర్ది అమ్ అరాద బిహిమ్ రబ్బుహుమ్ రషదా. ఈ మానవుల పట్ల ఏదైనా చెడు కోరడం జరిగినదా? ప్రశ్న. ఆ, ఆ అమిన్తుమ్ అని మీరు ఇంతకుముందు చదివారు కదా? ప్రశ్నార్థకంగా ఏదైతే వస్తుందో ఆ రీతిలో ఇక్కడ ‘ఆ’ ఉంది. షర్రున్ వేరే పదము. అంటే ‘ఆ’ ఒక వేరే పదం, ‘షర్రున్’ వేరే పదం. ఇందులో భావంలో ప్రశ్నార్థకం ఉంది. అందుకొరకే దీనిని ఎలా చదువుతారు, “వ అన్నా లా నద్రీ అశర్రున్”. అశర్, అషర్రున్. ఈ తిలావత్ లో రెండు విధానాలు వేరుగా ఉంటాయి. మొదటిది నేను ఏదైతే చదివానో అందులో అతి చెడ్డది అన్నటువంటి భావం వస్తుంది. రెండో విధానం ఏదైతే చదివామో అందులో చెడు కోరబడినదా అన్నటువంటి ప్రశ్న అడుగోవడడం జరుగుతుంది అన్నట్లుగా అర్థమవుతుంది. దీనిని నబరతుస్ సౌత్ అని అంటారు. ఈ విషయాన్ని ప్రత్యేకంగా ఎవరైతే తిలావత్ ఉత్తమ రీతిలో చేసేవారు, ఇమామ్ లు అలాంటి వారు ఈ విషయాన్ని గ్రహించాలి.
రెండో మాట ఇందులో గమనించండి, అశర్రున్ ఉరీద బిమన్ ఫిల్ అర్ద్ అమ్ అరాద బిహిమ్ రబ్బుహుమ్ రషదా. షర్రున్ మరియు రషదా ఇవి రెండు విరుద్ధ పదాలు. షర్ అంటే కీడు, రషదా అంటే మేలు. అయితే మనం మానవులం, అల్లాహ్ పట్ల పాటించే అటువంటి గౌరవ మర్యాద అన్నది ఎలాంటిదంటే, మనం అల్లాహ్ వైపునకు చెడును అంకితం చేయరాదు. అల్లాహ్ వారి పట్ల ఏదైనా చెడు కోరాడా, లేక అల్లాహ్ వారి పట్ల ఏదైనా మేలు కోరాడా? ఈ విధంగా చెప్పడం సరియైన విషయం కాదు. వాస్తవానికి ఈ లోకంలో జరిగేదంతా అల్లాహ్ కు ఇష్టం లేనిది ఏదైనా జరిగిన గాని దానిని ఏమంటారు, ఇజ్నన్ కౌనీ అంటారు. ఒకటి షరయీ ఒకటి కౌనీ. షరయీ అంటే షరియత్ పరంగా జరిగేది. కౌనీ అంటే అల్లాహ్ కు ఇష్టం లేకపోయినా గాని ఈ లోకంలో సంభవిస్తుంది. అందులో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మానవులను పరీక్షించాలనుకుంటాడు. అయితే అలాంటి అప్పుడు అది కూడా అల్లాహ్ అనుమతితో జరుగుతుంది. కానీ మనం అల్లాహ్ యొక్క గౌరవం మర్యాదను పాటిస్తూ అల్లాహ్ వైపు నుండి చెడు అన్నట్లుగా చెప్పము. ఇది అల్లాహ్ యొక్క గౌరవ మర్యాదలో. ఆ విషయం అర్థమైందని ఆశిస్తున్నాను. కానీ కొన్ని సందర్భాల్లో మనం ఏదైనా తొందరపాటులో ఉండి మన ఆలోచన ఎక్కడైనా ఉంటే, లేక మన యొక్క నాలాంటి తక్కువ జ్ఞానం గలవారు తొందరగా అర్థం కాకపోవచ్చు ఒక చిన్న ఉదాహరణ ఇస్తున్నాను. మనం మన తల్లిదండ్రుల ద్వారా లేదా మనకు విద్య చెప్పే అటువంటి గురువుల ద్వారా స్పష్టంగా గమనిస్తాము. వారి ముందు ఏదైనా పొరపాటు జరిగింది అని. కానీ ఇదిగో నువ్వు తప్పు చేసావు అని ఈ విధంగా చెప్పము. ఎందుకు? పెద్దలు. వారిని గౌరవించాలి. వారితో మర్యాదగా ఎంతో సభ్యత, సంస్కారంతో మనం మెలగాలి. అందుకని అలా చెప్పడం సరియైనది కాదు. ఏం చెబుతాము? ఒక్కసారి ఈ మాటను మీరు మరోసారి ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఈ చెప్పిన విషయాన్ని ఒక్కసారి మీరు విని చూసుకోండి. కరెక్టే చెప్పారు కదా! ఈ విధంగా కొంచెం గౌరవంగా మాట్లాడుతాము. అఊజుబిల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్ అల్లాహ్ కొరకు ఎగ్జాంపుల్ కాదు, మనకు అర్థం కావడానికి చెప్తున్నాను. మనం మన పెద్దల పట్ల మానవుల్లో వారి యొక్క గౌరవార్థం మాట విధానంలో తేడా ఉంటుంది. అదే మన పిల్లవాడు మనకంటే చిన్నవాడు ఎవరైనా స్టూడెంట్ తప్పు చేస్తే అతన్ని దండించే విధానం, మనకంటే పెద్దవారు ఏదైనా తప్పు చేస్తే వారికి చెప్పే విధానంలో తేడా ఉంటుంది. అయితే నేను ఇక్కడ చెప్పే ఉద్దేశం ఏంటి? జిన్నాతులు అల్లాహ్ పట్ల ఎంత మర్యాద పాటించాలో ఇక్కడ మనకు కనబడుతుంది. వారు అల్లాహ్ విషయంలో, అల్లాహ్ చెడును కోరాడా అని అనకుండా ఏమన్నారు, ఉరీద బిమన్ ఫిల్ అర్ద్. భూమిలో ఉన్న వారికి ఏదైనా కీడు ఉద్దేశించబడినదా? ఉరీద. దీనిని ఏమంటారు, ఫెయల్ మజ్హూల్ అని అంటారు. కానీ అదే తర్వాత ఏమొచ్చింది? అమ్ అరాద బిహిమ్ రబ్బుహుమ్. వారి ప్రభువు వారి కొరకు కోరాడా. రషదా మేలు. ఈ ఆయత్ ద్వారా మనకు బోధపడే మరొక విషయం ఏమిటంటే ఈ లోకంలో ఏ మంచి జరిగినా, ఏ కీడు జరిగినా అల్లాహ్ వైపు నుండి జరుగుతుంది కానీ మనం అందులో ఏ పాత్ర మనది లేదు, అందులో మనకు ఏ పాపం గానీ ఎలాంటి మనపై బాధ్యత అనేది ఉండదు అని కాదు. ఎందుకంటే అల్లాహ్ మనకు ఏ బుద్ధి జ్ఞానాలు ప్రసాదించాడో, మనకు మంచి చెడును ఎన్నుకొని పాటించే అటువంటి శక్తి సామర్థ్యాలను ప్రసాదించాడో అందుకని మనం దానికి బాధ్యులం అవుతాము. ఏదైతే మన ఏదైనా కొరత వల్ల, పొరపాటు వల్ల మన నుండి ఏదైనా తప్పు జరుగుతుందో దానికి బాధ్యులం మనం అవుతాము. దానిని మనం అల్లాహ్ పై వేయరాదు.
ఆ తర్వాత గమనించండి: వ అన్నా మిన్నస్ సాలిహూన వ మిన్నా దూన దాలిక్ కున్నా తరాయిక ఖిదదా.
وَاَنَّا مِنَّا الصّٰلِحُوْنَ وَمِنَّا دُوْنَ ذٰلِكَ ۗ كُنَّا طَرَاۤئِقَ قِدَدًا ۙ [వ అన్నా మిన్నస్ సాలిహూన వ మిన్నా దూన దాలిక్ కున్నా తరాయిక ఖిదదా] “మరియు మాలో కొందరు పుణ్యాత్ములు ఉన్నారు, మరికొందరు వేరే రకం వారు ఉన్నారు. మేము వివిధ వర్గాలుగా విడిపోయి ఉన్నాము.” (72:11)
మాలో కొందరు పుణ్యాత్ములు ఉన్నారు మరియు వారికి భిన్నంగా ఉన్నారు. మొన్నటి క్లాస్ లో స్టార్టింగ్ లోనే చెప్పడం జరిగింది. ఎలాగైతే మానవుల్లో అన్ని రకాల మనుషులు ఉన్నారో, వివిధ ధర్మాలను అవలంబించేవారు, మతాలను అవలంబించేవారు, మస్లక్ లను, ఫిర్కాలను అవలంబించేవారు. అలాగే జిన్నాతులో కూడా ఉన్నారు. కాకపోతే అందులో కూడా పుణ్యాత్ములు ఉన్నారు. లేరని కాదు. అదే విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. కున్నా తరాయిక ఖిదదా మేము వివిధ మార్గాల్లో ఉంటిమి. ఈ సందర్భంలో కూడా మనకు ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కొన్ని హదీసులు గుర్తు చేసుకోవాలి. ప్రళయం వచ్చేవరకు ఈ ప్రజల మధ్యలో భేదాభిప్రాయాలు మరియు ఇలాంటి వివిధ వర్గాలు ఇవన్నీ ఉంటాయి, జరుగుతూ ఉంటాయి కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైతే చెప్పారో లా తజాలు తాయిఫతున్ మిన్ ఉమ్మతీ, నా అనుచర సంఘంలో ఒక వర్గం ఉంటుంది, ఒక జమాత్ ఉంటుంది, తాయిఫా, వారు ప్రళయం వరకు కూడా సత్యంపై, అల్లాహ్ యొక్క ధర్మంపై ఉంటారు. వారిని విడనాడిన వారు ఎలాంటి నష్టం వారికి చేకూర్చలేరు. వారిని వదిలి వెళ్లిన వారు స్వయం సత్యం నుండి దూరం అవుతారు తప్ప, వారు ఎలాంటి ధర్మం విషయంలో ధర్మంపై స్థిరంగా ఉన్న వారికి ఇహ పరాల్లో ఏ కీడు కలగజేయలేరు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా చెప్పడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మీరు ఎక్కడ ఉన్న ఏ కాలంలో ఉన్న, ఏ చెడు మీ మధ్యలో ప్రబలినా గానీ, మంచి వారు కూడా ఉంటారు, మీరు వారిని వెతకాలి మరియు అలాంటి మంచి వారి యొక్క తోడుగా ఉండి వారి యొక్క మార్గాన్ని అవలంబించాలి. అయితే ఈ హదీస్ ఆయత్ ఇప్పుడు ఈ సూరహ్ జిన్ లో చదివినటువంటి ఆయత్ నంబర్ 11 మరియు ప్రవక్త వారి ఈ హదీస్ బుఖారీ ముస్లిం ఇత వేరే గ్రంథాల్లో వచ్చి ఉంది. దాని ఆధారంగా ధర్మవేత్తలు ఏమంటున్నారంటే జిన్నాతులో కూడా ఇహలోకంలో మనుషుల్లో ఉన్నటువంటి ఫిర్కాలు, వర్గాలు ఉన్నాయి. సత్యంపై, మన్హజె సలఫ్ పై మరియు అలాగే వేరే షియా ఇత వేరే వర్గాలు ఏవైతే ఉన్నాయో అలాంటి వారిలో కూడా జిన్నాతులో విభజించబడి ఉన్నారు.
ఆ తర్వాత ఆయత్ 12:
وَّاَنَّا ظَنَنَّآ اَنْ لَّنْ نُّعْجِزَ اللّٰهَ فِى الْاَرْضِ وَلَنْ نُّعْجِزَهٗ هَرَبًا ۙ [వ అన్నా జనన్నా అల్లన్ ను’జిజల్లాహ ఫిల్ అర్ది వలన్ ను’జిజహూ హరబా] “మేము భూమిలో అల్లాహ్ ను ఓడించలేమని, పారిపోయి కూడా ఆయన పట్టు నుండి తప్పించుకోలేమని మేము గట్టిగా నమ్ముతున్నాము.” (72:12)
ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే వారి యొక్క నమ్మకం, ఖుర్ఆన్ ని విశ్వసించిన తర్వాత జిన్నాతుల యొక్క నమ్మకం ఎంత మంచిగా ఉండిందో గమనించండి. ఇహ లోకంలో మేము ఈ భూమిలో గానీ, భూమిని తప్ప ఇంకా వేరే ఎక్కడైనా గానీ అల్లాహ్ ను వదలి ఎక్కడికి పారిపోయినా గానీ మేము అల్లాహ్ యొక్క పట్టు నుండి తప్పించుకొని పోయే అవకాశమే లేదు. మేము అల్లాహ్ యొక్క విధేయతకు దూరమై అల్లాహ్ యొక్క శిక్ష నుండి తప్పించుకోవడానికి ఎలాంటి అవకాశం లేదు. మనం ఎంత అశక్తులం, ఎంత బలహీనులం అంటే అల్లాహ్ ను ఆజిజ్ చేయడం, ఆయన మనపై గెలుపు పొందకుండా, ఆయన మనల్ని పట్టుకోకుండా మనం ఆయనపై గెలుపు పొందే రీతిలో ఏదైనా మార్గం ముమ్మాటికి ఉండదు. ఈ విషయం చెప్పడానికే ఈ రెండు పదాలు ఇక్కడ వచ్చి ఉన్నాయి. అల్లన్ ను’జిజల్లాహ ఫిల్ అర్ద్ వలన్ ను’జిజహూ హరబా. అల్లాహు అక్బర్. ఈ సందర్భంలో నాకు సహీ హదీస్ గుర్తుకొస్తుంది ఏదైతే మనకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రి పడుకునే ముందు కూడా చదివి పడుకోవాలి. ఎవరైతే ఈ దుఆ చదివి పడుకుంటారో, ఒకవేళ వారు ఆ రాత్రి చనిపోతే ఫిత్రతే ఇస్లాం పై వారి యొక్క చావు అవుతుంది అని ప్రవక్త వారు శుభవార్త ఇచ్చారు. అల్లాహుమ్మ ఇన్నీ అస్లంతు నఫ్సీ ఇలైక, వ ఫవ్వజ్తు అమ్రీ ఇలైక, వ వజ్జహ్తు వజ్హీ ఇలైక, రగ్బతన్ వ రహబతన్ మిన్క ఇల్లా ఇలైక, ఆ లా మల్జఅ వలా మన్జా మిన్క ఇల్లా ఇలైక్. ఇక్కడ ఈ పదం గమనించండి. నేను నిన్నే విశ్వసించాను. నేను నా కార్యమును నీకే సమర్పించుకున్నాను. నా ముఖాన్ని నీ వైపునకే అంకితం చేసుకున్నాను. భయపడి వచ్చినా నీ వైపునకే రావాలి. ఏదైనా ఆశతో వచ్చినా నీ వైపునకే రావాలి. నీ తప్ప మాకు ఏదైనా భయం నుండి రక్షణ కల్పించే స్థలం మరియు ఏదైనా ఆశకు సంబంధించిన మంచి ఏదైనా జరుగుతుంది అంటే నీ తప్ప వేరే ఎక్కడా లేదు. ఇందులో ఎంత బలమైన విశ్వాసం మనకు నేరపడటం జరిగిందో గమనించండి.
అలాగే ఇంకా మనం గమనించగలిగితే సూరతుజ్ జారియాత్ లో చూడండి. అల్లాహ్ ఏమంటున్నాడు, ఫఫిర్రూ ఇలల్లాహ్. మీరు అల్లాహ్ వైపునకు పరిగెత్తండి. ఇక్కడ ఎందుకు ఈ ఆయత్ ని తీసుకుంటున్నాము? సర్వసామాన్యంగా మనిషి ఇహలోకంలో ఎవరితో భయపడుతున్నాడో అతని వైపునకే పరిగెత్తడు. ఏం చేస్తాడు? అంతకంటే ఎక్కువ శక్తి సామర్థ్యాలు గలవాని వైపునకు పరిగెత్తి అక్కడ శరణు తీసుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ ఈ లోకంలో అల్లాహ్ కంటే గొప్ప శక్తి గలవాడు మరెవడూ లేడు గనుక అల్లాహ్ తో భయపడి వేరే ఎటువైపునకో పరిగెత్తరాదు, కేవలం అల్లాహ్ వైపునకే పరిగెత్తాలి. అదే మాట ఇక్కడ, మేము ఆ అల్లాహ్ ను వదలి ఎక్కడికైనా పారిపోవాలన్నా పారిపోయే అటువంటి శక్తి మాకు లేదు. లేదా ఈ భూమిలో అల్లాహ్ ను ఓడించి మేము గెలుపు పొందాలన్న అలాంటి శక్తి ఏమీ లేదు. మరి అలాంటి అప్పుడు అల్లాహ్ కు అవిధేయత ఎందుకు చూపాలి? అల్లాహ్ మాటను ఎందుకు ధిక్కరించాలి? సత్య ధర్మాన్ని వదిలి ఎందుకు జీవించాలి?
ఆ తర్వాత చెబుతున్నారు, ఈరోజు పాఠంలోని చివరి ఆయత్, ఆయత్ నంబర్ 13. మా పరిస్థితి ఎలాంటిదంటే, 12 యొక్క సంక్షిప్త భావం, మా పరిస్థితి ఎలాంటిదంటే మేము అల్లాహ్ ను తప్ప ఏ ఏ దేవతలను నమ్ముకుంటామో, ఎవరెవరిని పెద్దగా భావిస్తామో వారు మాకు మా క్లిష్ట పరిస్థితుల్లో ఏ సహాయము చేయలేరు. మరియు అల్లాహ్ ను వదలి మేము వారిని నమ్ముకొని అల్లాహ్ యొక్క పట్టు నుండి ఈ భూమిలో ఎక్కడికి మనం దాగి ఉండలేము, ఎటు కూడా పారిపోయి శరణు పొందలేము. అందుకొరకే మేము ఈ మార్గదర్శకత్వాన్ని విన్న వెంటనే విశ్వసించాము. మేము విశ్వసించాము. ఇక ఈ విశ్వాసం అల్లాహ్ పై ఎంత గొప్పది అంటే, ఎవరూ తన ప్రభువుని విశ్వసిస్తాడో ఆ ప్రభువు విషయంలో ఎలాంటి భయం అవసరం లేదు. ఫలా యఖాఫు బఖ్సన్ వలా రహకా. అతని పుణ్యాల్లో ఏ కొరత జరగదు, పాపాల్లో ఏ హెచ్చింపు జరగదు. అతడు ఎంత పుణ్యం చేశాడో అతనికి సంపూర్ణంగా దాని యొక్క ప్రతిఫలం ఇవ్వడం జరుగుతుంది. మరియు అతడు ఏ పాపాలు చేశాడో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అతడి యొక్క పాపాల కారణంగా అతనిపై కోపగించి ఏదైనా అతనికి ఎక్కువ శిక్ష ఇస్తాడా, లేదు. అల్లాహ్ వద్ద సంపూర్ణ న్యాయం ఉంది. ఖుర్ఆన్ లో ఈ విషయం అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. అనేక లా యలిత్కుమ్ మిన్ అ’మాలీకుమ్ షైఆ. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మీ పుణ్యాల్లో ఎలాంటి తగ్గింపు చేయడు. మరో కొన్ని సందర్భాల్లో అయితే అల్లాహ్ ఏం చెప్పాడు? ఖర్జూరపు ముక్కపై, ఖర్జూరపు బీజముపై ఏ పల్చని పొర ఉంటుందో అంత కూడా మీపై ఏ అన్యాయం జరగదు. ఏ అన్యాయం జరగదు. అంతటి న్యాయవంతుడైన అల్లాహ్, ఆ అల్లాహ్ ను విశ్వసించిన వారు చాలా అదృష్టవంతులు, వారు చాలా మంచి పని చేసిన వారు. ఈ జిన్నాతులకు సంబంధించిన మరికొన్ని బోధనలు మరియు వారికి ఇంకా మానవులకు ఒకవేళ సన్మార్గంపై ఉండేది ఉంటే ఎలాంటి మేలు జరుగుతాయి తర్వాత ఆయతులలో రానున్నది. ఇక్కడివరకే ఈ పాఠాన్ని మనం ముగించేస్తున్నాము. జజాకుముల్లాహు ఖైరన్ వ బారకల్లాహు ఫీకుమ్ వ ఆఖిరు ద’వానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఏదైనా ప్రశ్న ఉందా మీ దగ్గర? సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహ్.
“ఇంకా – మనలో కొందరు ముస్లింలై (దైవవిధేయులై)ఉంటే, మరికొందరు సన్మార్గం నుండి తొలగి ఉన్నారు. కనుక విధేయతా వైఖరిని అవలంబించినవారు సన్మార్గాన్ని అన్వేషించుకున్నారు.”
“అయితే నా బాధ్యతల్లా అల్లాహ్ వాణిని, ఆయన సందేశాలను (ప్రజలకు) అందజేయటమే. ఇక ఇప్పుడు ఎవరైనా అల్లాహ్ మాటను, అతని ప్రవక్త మాటను వినకపోతే వారికొరకు నరకాగ్ని ఉంది. అందులో వారు కలకాలం ఉంటారు.”
వారు తమ ప్రభువు సందేశాన్ని అందజేశారని తెలియటానికి (ఈ ఏర్పాటు జరిగింది). ఆయన వారి పరిసరాలన్నింటినీ పరివేష్టించి, ఒక్కో వస్తువును లెక్కపెట్టి ఉంచాడు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
యూసుఫ్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర [వీడియో] వక్త: సలీం జామిఈ (హఫిజహుల్లాహ్) https://youtu.be/3aASE6ZWQGQ [40 నిముషాలు]
[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]
ప్రవక్త యూసుఫ్(అలైహిస్సలాం) (క్రీ.పూ. 1700 నుంచి క్రీ.పూ.1680 వరకు)
(దివ్యఖుర్ఆన్లో ఈ కథ చాలా వివరంగా, చాలా ఆసక్తిదాయకంగా చెప్పడం జరిగింది. ఇందులో హాస్యం, మానవ బలహీనతలు, ఉన్నత గుణగణాలు, ఈర్ష్యాసూయలు, విద్వేషం, అహం, వాంఛలు, మోసం, కుట్ర, క్రూరత్వం, భీభత్సం, సహనం, విశ్వాసం, ధైర్యం, సద్వర్తనం, సానుభూతి వంటి అనేక గుణగణాలు మన ముందుకు వస్తాయి. ప్రాచ్య దేశాల కవులపై ఈ కథ చాలా గొప్ప ప్రభావాన్ని వేసింది. ఈ కథ ఆధారంగా అల్లిన కొన్ని కవితలు సాహిత్యంలో అత్యుత్తమ కళాఖండాలుగా నిలిచి పోయాయి. దివ్యఖుర్ఆన్లో ఈ కథ ప్రస్తావించబడిన తీరు నైతికంగా మనిషిని తీర్చిదిద్దేదిగా ఉంది.)
యూసుఫ్ (అలైహిస్సలాం) పద్ధెనిమిది సంవత్సరాల వయసులో ఉన్నారు. ఆయన దృఢమైన, అందమైన యువకునిగా ఎదిగారు. చాలా నమ్రత కలిగిన వారిగా పేరుపడ్డారు. ఆయన గౌరవంగా వ్యవహరించే వారు. దయ సానుభూతులతోప్రవర్తించేవారు. ఆయన సోదరుడు బినామిన్ కూడా అలాంటి గుణగణాలు కలిగినవాడే. వీరిద్దరూ ఒకే తల్లి రాకెల్ కుమారులు. సుగుణ సంపన్నులైన ఈ ఇరువురు కుమారుల పట్ల తండ్రి యాఖూబ్ (అలైహిస్సలాం) ఎక్కువ ఇష్టం ప్రదర్శించేవారు. వీరిద్దరిని తన దృష్టి నుంచి పక్కకు వెళ్ళనిచ్చే వారు కాదు. వారిని పరిరక్షించడానికిగాను ఇంటి తోటలోనే వారిని పనిచేసేలా నిర్దేశించారు.
సోదరుల కుట్ర (అలైహిస్సలాం) అసూయ అగ్ని వంటిది. అది సోదరుల గుండెల్లో పొగలు గ్రక్కడం ప్రారంభించింది. విద్వేషంగా మారింది. ఒక సోదరుడు మిగిలిన వారితో, “నాన్నగారు మనందరికన్నా యూసుఫ్, బిన్ యామిన్ల పట్ల ఎక్కువ ప్రేమ చూపుతున్నారు.నిజానికి వారిద్దరి కన్నా మనం బలంగా ఉన్నాం. మన అమ్మలకన్నా వారిద్దరి అమ్మనే ఆయన ఎక్కువ ప్రేమిస్తారు. ఇది న్యాయం కాదు” అన్నాడు. వారందరూ తమకు అన్యాయం జరిగి పోతోందని భావించారు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
మానవ మహోపకారి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రబోధించారు :
“ఎవరిలోనయితే మూడు సుగుణాలు ఉన్నాయో అతను విశ్వాసం (ఈమాన్)లోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తాడు. అవేమంటే;
ఇతరులందరికంటే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త అతనికి ప్రియతమమైన వారై ఉండాలి.
అతనెవరిని ప్రేమించినా అల్లాహ్ కొరకే ప్రేమించాలి.
అగ్నిలో నెట్టివేయ బడటమంటే అతనికి ఎంత అయిష్టంగా ఉంటుందో ధిక్కారం(కుఫ్ర్) వైపునకు పోవాలన్నా అంతే అయిష్టత ఉండాలి.” (బుఖారి)
ఉల్లేఖకుని పరిచయం
ఈ హదీసును అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు. హజ్రత్ అనస్రుదైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సేవకులుగా ఉన్నారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మదీనాకు హిజ్రత్ చేసి వచ్చినప్పుడు ఈయన వయస్సు పది సంవత్సరాలు. ఈయన తల్లి ఈయన్ని దైవప్రవక్తకు సేవలు చేయమని చెప్పి అప్పగించింది. తన కుమారుని వయస్సులో, ఆస్తిపాస్తుల్లో, సంతానంలో వృద్ధి కోసం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రార్థించాలన్నది ఆమె ఆకాంక్ష. ఆమె మనోరధం ఈడేర్చడానికి మహాప్రవక్త అనస్ కోసం ప్రార్థించారు. ప్రవక్తగారు చేసిన ప్రార్థనా ఫలితంగా హజ్రత్ అనస్ కు ఇతర సహాబాల కన్నా ఎక్కువ మంది పిల్లలు పుట్టారు. ఈయన తోట ఏడాదిలో రెండుసార్లు పండేది. అయితే ఈ వృద్ధి వికాసాలతో ఝంజాటాలతో తాను విసిగెత్తి పోయానని, అల్లాహ్ మన్నింపు కొరకు నిరీక్షిస్తున్నానని అనస్ అంటూ ఉండేవారు. హిజ్రీ శకం 93లో ఆయన బస్రాలో కన్ను మూశారు. అప్పటికి ఆయనకు నూరేళ్ళు పైబడ్డాయి.
వివరణ
ఈ హదీసులో మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ‘విశ్వాసం’ లోని ఉన్నత శ్రేణిని గురించి వివరించారు. పైగా దీన్ని విశ్వాసంలోని మాధుర్యంగా, తీపిగా అభివర్ణించటం జరిగింది. ఎందుకంటే తియ్యదనాన్ని మానవ నైజం కూడా వాంఛిస్తుంది.
‘షేక్అబ్దుర్రహ్మాన్ బిన్ హసన్ “ఫతహ్ అల్ మజీద్”లో ఇలా అభిప్రాయపడ్డారు.“ఇక్కడ తీపి అది అభిరుచికి తార్కాణం. దైవధర్మాన్ని అవలంబించటం వల్ల ప్రాప్తమయ్యే తృప్తి, ఆనందం, ప్రశాంతతలకు ఇది ప్రతీక. వాస్తవానికి నిష్కల్మష విశ్వాసం ఉన్నవారే ఈ దివ్యానుభూతికి లోనవుతారు.“
‘విశ్వాసంలోని తీపి’ని గురించి నవవి (రహిమహుల్లాహ్) ఏనుంటున్నారో చూడండి : దైవ విధేయతలో, భక్తీ పారవశ్యాలలో లీనమైపోయి తాదాత్మ్యం చెందటం, దైవప్రవక్త ప్రసన్నతను చూరగొనే మార్గంలో కష్టాలు కడగండ్లను ఆహ్వానించి ఓర్పుతో భరించటమే విశ్వాసంలోని తీపికి నిదర్శనం.
విశ్వాసం యొక్క ఈ ఉన్నత స్థానం ప్రాప్తమయ్యేదెలా? దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విషయమై మూడు షరతులను పేర్కొన్నారు.
ఇమామ్ ఇబ్నె తైమియ (రహిమహుల్లాహ్) ఏమన్నారంటే – తృప్తికి, ఆనందానికి ప్రతీక అయిన విశ్వాస మాధుర్యం, దాసుడు తన ప్రభువును అమితంగా ప్రేమించినపుడే ప్రాప్తిస్తుంది.ఈ అమితమయిన ప్రేమ మూడు విషయాలతో పెనవేసుకుని ఉంది. ఒకటి, ఆప్రేమ పరిపూర్ణతను సంతరించుకోవటం. రెండు, దాని ప్రభావం దాసునిపై పడటం.మూడు, దానికి హాని చేకూర్చగల వస్తువులకు, విషయ లాలసకు దూరంగా ఉండటం.
ప్రేమ పరిపూర్ణతను సంతరించు కోవటం అంటే మతలబు దాసుడు ఇతరులందరికన్నా అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను ప్రేమించాలి. ఆ ప్రేమ అతనిపై ఎంత గట్టి ప్రభావం వేయగలగాలంటే, అతను ఎవరిని అభిమానించినా, ఎవరిని సమర్ధించినా, ఎవరికి తోడ్పడినా అది అల్లాహ్ కోసమే అయి ఉండాలి. తనలోని ఈ సత్ప్రవర్తనను, సాధుశీలాన్ని అపహరించే సమస్త వస్తువులను, అలవాట్లను అతను మానుకోవటమే గాకుండా వాటికి బహుదూరంగా మసలుకోవాలి. అంతేకాదు, ఆయా చెడు సాధనాలను మనసులో అసహ్యించుకోవాలి. తనను ఎవరయినా అగ్ని గుండంలో పడవేయజూస్తే ఎంతగా భయాందోళన చెందుతాడో అంతే భయాందోళన ఆ హానికరమయిన సాధనాల పట్ల కూడా చెందాలి.
“ఇతరులందరికంటే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త అతనికి ప్రియతమమైనవారై ఉండాలి” అనే హదీసులోని అంశం ప్రత్యేకంగా గమనించదగినది. ఈనేపథ్యంలో హాఫిజ్ ఇబ్నె హజర్ ఏమంటున్నారో చూడండి: తమ విశ్వాసం పరిపూర్ణతను సంతరించుకోవాలని కాంక్షించేవారు, తమ తల్లిదండ్రుల, భార్యా భర్తల, సమస్త జనుల హక్కుల కన్నా తమపై అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు ఎక్కువ హక్కులున్నాయని తెలుసుకుంటారు. ఎందుకంటే మార్గ విహీనతకు గురై ఉన్న తమకు సన్మార్గం లభించినా, నరకాగ్ని నుండి విముక్తి కలిగినా అది అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త మాలంగానే కదా!”
దివ్య గ్రంథంలోనూ ఆ విషయమే నొక్కి వక్కాణించబడింది :
“ఓ ప్రవక్తా! అనండి, ‘ఒకవేళ మీ తండ్రులు, మీ కుమారులు, మీ సోదరులు, మీభార్యలు, బంధువులు మరియు ఆత్మీయులు, మీరు సంపాదించిన ఆస్తిపాస్తులు,మందగిస్తాయని మీరు భయపడే మీ వ్యాపారాలు, మీరు ఇష్టపడే మీ గృహాలు మీకుగనక అల్లాహ్, ఆయన ప్రవక్త మరియు ఆయన మార్గంలో జిహాద్ చేయటం కంటేఎక్కువ ప్రియతమమైతే అల్లాహ్ తన తీర్పును మీ ముందుకు తీసుకువచ్చే వరకునిరీక్షించండి. అల్లాహ్ హద్దులు మీరే వారికి మార్గం చూపడు.” ( అత్ తౌబా 9:24)
మనిషికి అత్యంత ప్రీతికరమైన ఎనిమిది అంశాలను అల్లాహ్ పై ఆయత్లో ప్రస్తుతించాడు. వాటి ప్రేమలో పడిపోయిన కారణంగానే మనిషి దైవనామ స్మరణపట్ల అలసత్వం, అశ్రద్ధ చూపుతాడు. అందుకే, మనిషి హృదయంలో గనక ఆ ఎనిమిది అంశాలు లేదా వాటిలో ఏ ఒక్కదానిపైనయినా సరే అల్లాహ్ పట్ల కన్నా ఎక్కువ ప్రేమ ఉంటే వ్యధా భరితమయిన శిక్షకు గురవుతాడని హెచ్చరించటం జరిగింది.అటువంటి వారు దుర్మార్గుల్లో కలసిపోతారు (అల్లాహ్ మన్నించుగాక!)
అల్లాహ్ పట్ల, ఆయన ప్రవక్త పట్ల అపారమయిన ప్రేమ ఉందని ఊరకే చెప్పుకుంటూ తిరిగితే సరిపోదు, దాన్ని క్రియాత్మకంగా చాటి చెప్పాలి.అల్లాహ్ మరియు దైవప్రవక్త పట్ల ఎవరికెంత ప్రేమ ఉన్నదీ నిజానికి దైవాజ్ఞాపాలన ద్వారానే తెలుస్తుంది. దైవాజ్ఞల్నితు.చ. తప్పకుండా పాటిస్తూ, అడుగడుగునా భయభక్తులతో జీవించే వాడే యదార్థానికి దైవసామీప్యం పొందగలుగుతాడు. తన స్వామి దేన్ని ఇష్టపడతాడో, మరి దేన్ని ఇష్టపడడో ఆ సామీప్య భాగ్యంతోనే గ్రహిస్తాడు. తనను సృష్టించిన ప్రభువు ప్రసన్నత చూరగొనాలంటే, అంతిమ దైవప్రవక్తకు విధేయత చూపటం కూడా అవసరమన్న సత్యాన్ని గుర్తిస్తాడు.
“ప్రవక్తా! మీరు ప్రజలకు చెప్పండి, ‘మీకు నిజంగానే అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే, నన్ను అనుసరించండి. అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు.మీ పాపాలను మన్నిస్తాడు. ఆయన అమితంగా క్షమించేవాడు, అనన్యంగా కరుణించేవాడు కూడాను.”(ఆలి ఇమ్రాన్ 3: 31)
అల్లాహ్ పట్ల తనకు ప్రగాఢమైన ప్రేమ ఉందని పలికే ప్రతి ఒక్కరికీ ఈ ఆయత్ నిర్ణయాత్మకమైనదని ఇబ్నె కసీర్ (రహిమహుల్లాహ్) వ్యాఖ్యానించారు. ఆయన ఇంకా ఇలా వ్రాశారు: ఎవరయితే అల్లాహ్ యెడల తనకు ప్రేమ ఉందని చాటుకుంటాడో, అలా చాటుకుంటూ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి పద్ధతి ప్రకారం నడవడో అతను అసత్యవాది. మనోవాక్కాయ కర్మలచేత అతను ముహమ్మద్ చూపిన షరీఅత్ను అనుసరించనంత వరకూ అబద్ధాలకోరుగానే పరిగణించబడతాడు.
సహీహ్ హదీస్ మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచనం ఒకటి ఇలా ఉంది – “నేను ఆచరించని పనిని ఎవరయినా చేస్తే అతను ధూత్కారి అవుతాడు”. ఏ వ్యక్తయినా తనకు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త పట్ల గల ప్రేమ పరిమాణాన్ని కొలచుకోదలుస్తే, ఖుర్ఆన్ మరియు హదీసుల గీటురాయిపై అతను తన జీవితాన్ని పరీక్షించి చూసుకోవాలి. ఒకవేళ తన దైనందిన జీవితం షరీఅత్కు అనుగుణంగా ఉందని తెలిస్తే అల్లాహ్ పట్ల, దైవప్రవక్త పట్ల ప్రేమ చెక్కు చెదరకుండా ఉన్నట్లే లెక్ట. అదే అతని ఆచరణ గనక దివ్య గ్రంథం మరియు ప్రవక్త సంప్రదాయం పరిధుల్లో లేదని తేలితే అల్లాహ్ పట్ల, దైవ ప్రవక్త పట్ల తనలో ప్రేమ భావం లేదని అనుకోవాలి. అప్పుడతని ప్రథమ కర్తవ్యం ఏమంటే, తన జీవితాన్ని దైవాదేశాల పరిధిలో, దైవప్రవక్త సంప్రదాయం వెలుగులో మలచుకోవటానికి ప్రయత్నించటం.
“ఎవరిని ప్రేమించినా అల్లాహ్ కొరకే ప్రేమించాలి” : దైవ ప్రవక్తలు, సద్వర్తనులైన ప్రజలు, విశ్వాసులను ప్రేమించటం దైవం యెడల ప్రేమకు ప్రతిరూపం. వారిని ప్రేమించటానికి కారణం అల్లాహ్ వారిని ప్రేమించటమే! అల్లాహ్ దీవెనలు,సహాయం వారికి ఉండటం మూలంగానే!!
అయితే విశ్వాసులయిన మంచివారి పట్ల ఒక వ్యక్తికి గల ఈ ప్రేమాభిమానం ‘షిర్క్’ (బహుదైవోపాసన) కానేరదు. మంచి వారిని ప్రేమించినంత మాత్రాన అల్లాహ్ యెడలగల ప్రేమను విస్మరించినట్లు కాదు. ప్రేమించేవాడు, తన ప్రభువు వారిని ప్రేమిస్తున్నాడు గనకనే తనూ ప్రేమిస్తున్నాడు. ప్రభువు ఎవరిని ఇష్టపడటం లేదో వారిని తనూ ఇష్టపడటం లేదు. తన ప్రభువు స్నేహం చేసిన వారితోనే తనూ సావాసం చేస్తున్నాడు. తన ప్రభువు పట్ల శత్రు భావం కనబరుస్తున్న వారిని తనుకూడా తన శత్రువులుగా పరిగణిస్తున్నాడు. తన ప్రభువు తనతో ప్రసన్నుడయితే పరమానంద భరితుడవుతాడు. తన ప్రభువు ఆగ్రహిస్తే ఆందోళనతో కుమిలి పోతాడు. తన ప్రభువు దేన్ని ఆజ్ఞాపించాడో దాన్నే తనూ ఇతరులకు ఆజ్ఞాపిస్తాడు. తన ప్రభువు వేటి జోలికి పోరాదని చెప్పాడో వాటి విషయంలో ప్రజలను అప్రమత్తం చేస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే అతను ఎట్టి పరిస్థితుల్లోనూ తన ప్రభువు విధేయతలోనే ఉంటాడు. భయభక్తులు గల దాసులను, పశ్చాత్తాపం చెందేవారిని, పరిశుద్ధతను అవలంబించేవారిని, సౌశీల్యవంతులను, ఏకాగ్రతతో ఆరాధనలు చేసేవారిని అల్లాహ్ ఇష్టపడతాడు. కాబట్టి మనం కూడా అటువంటి వారిని – అల్లాహ్ ఇష్టపడుతున్నందున -ఇష్టపడాలి.
స్వామి ద్రోహానికి పాల్పడే వారిని, తలబిరుసుతనం ప్రదర్శించే వారిని, కల్లోలాన్ని రేకెత్తించేవారిని అల్లాహ్ ఇష్టపడడు. కాబట్టి అటువంటి దుర్మార్గులను మనం కూడా అసహ్యించుకోవాలి – ఒకవేళ వారు మన సమీప బంధువులైనప్పటికీ వారికిదూరంగానే మసలుకోవాలి.
“అగ్నిలో నెట్టివేయబడటమంటే ఎంత అయిష్టమో కుఫ్ర్ (ధిక్కారం) వైపునకుపోవాలన్నా అంతే అయిష్టత ఉండాలి.”
మనిషిలో ఈమాన్ (విశ్వాసం) యెడల ఎంత ప్రగాఢమైన ప్రేమ ఉండాలంటే, దానికి విరుద్ధాంశమయిన కుఫ్ర్ (అవిశ్వాసం)ను, కుఫ్ర్ వైపునకు లాక్కుపోయే వస్తువులను తలచుకోగానే అతనిలో అసహ్యం, ఏవగింపు కలగాలి. అవిశ్వాస వైఖరిని అతను ఎంతగా ద్వేషిస్తాడో అతనిలో ఈమాన్ అంతే దృఢంగా ఉన్నట్లు లెక్క. మహాప్రవక్త ప్రియ సహచరులను గురించి అల్లాహ్ అంతిమ గ్రంథంలో ఇలాపేర్కొన్నాడు:
“మీ మధ్య దైవప్రవక్త ఉన్నారన్న సంగతిని బాగా తెలుసుకోండి. ఒకవేళ ఆయన అనేక వ్యవహారాలలో మీరు చెప్పినట్లుగా వింటే, మీరే స్వయంగా నష్టపోతారు.అయితే అల్లాహ్ విశ్వాసాన్ని మీకు ప్రీతికరం గావించాడు. ఇంకా దాన్ని మీ మనసుల్లో సమ్మతమైనదిగా చేశాడు. అవిశ్వాసం, అపచారం, అవిధేయతలను ద్వేషించే వారుగా చేశాడు. సన్మార్గం పొందేది ఇటువంటివారే.” (అల్ హుజురాత్ 49 : 7)
అవిశ్వాసం, అపరాధం, అవిధేయత అంటే ప్రవక్త సహచరులలో ద్వేషం రగుల్కొనేది. తమలోని ఈ సుగుణం మూలంగానే వారు సన్మార్గ భాగ్యం పొందారు.
ఈ హదీసు ద్వారా బోధపడిన మరో సత్యం ఏమంటే, విశ్వాసం (ఈమాన్)లో పలు అంతస్థులు ఉన్నాయి. ఒకరిలో విశ్వాసం పరిపూర్ణంగా ఉంటే, మరొకరిలో అసంపూర్ణంగా ఉంటుంది. దైవారాధన, దైవ నామస్మరణ వల్ల విశ్వాసి హృదయం నెమ్మదిస్తుంది. మనసు ప్రశాంతతను, సంతృప్తిని పొందుతుంది. ఈ ఉన్నత స్థానం కేవలం కుఫ్ర్ కు దూరంగా ఉండటంతోనే ప్రాప్తించదు. కుఫ్ర్ ను ద్వేషించినపుడే ప్రాప్తిస్తుంది.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అంతిమ దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించారని హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు :
“అల్లాహ్ తన దాసుల్లో ఎవరినయినా ఇష్టపడినపుడు జిబ్రయీల్నుపిలిచి, ‘అల్లాహ్ ఫలానా దాసుడ్ని ఇష్టపడుతున్నాడు. కనుక మీరు కూడా అతన్నిప్రేమించండి’ అనంటాడు. జిబ్రయీల్ అతన్ని ప్రేమించటం మొదలెడతారు.తరువాత ఆయన ఆకాశవాసుల్లో ప్రకటన గావిస్తూ ‘అల్లాహ్ ఫలానా దాసుడ్నిఇష్టపడుతున్నాడు కాబట్టి మీరు కూడా అతన్ని ప్రేమించండి’ అని కోరారు.ఆకాశవాసులు అతన్ని ప్రేమించసాగుతారు. ఇంకా భూవాసులలో అతని పట్లఆదరాభిమానం కలుగజేయబడుతుంది.” (ముస్లిం)
ఈ హదీసులో అల్లాహ్ లోని ప్రేమైక గుణం ప్రధానంగా చెప్పబడింది. దైవ ప్రేమకు అర్హుడయ్యే దాసుడెవరు? దీని సమాధానం సుబాన్ (రదియల్లాహు అన్హు) గారి హదీసు ద్వారాచాలా వరకు లభిస్తుంది. మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారు:
దాసుడు దైవప్రసన్నతను బడయటంలో ఎంతగా లీనమై పోతాడంటే, అల్లాహ్ తన దూతతో,‘జిబ్రయీల్! నా ఫలానా దాసుడు నన్ను మెప్పించగోరుతున్నాడు. ఓ జిబ్రయీల్!నా ఫలానా దాసుడు నన్ను ప్రసన్నుడ్ని చేయదలుస్తున్నాడు. వినండి! అతని పై నాకారుణ్యం అలుముకుంది’ అని అంటాడు. అప్పుడు జిబ్రయీల్ ‘ఫలానా దాసునిపై దైవ కారుణ్యం అవతరించుగాక!’ అని అంటారు. ఆకాశ వాసులు కూడా ‘అతనిపై దైవ కారుణ్యం వర్షించుగాక!’ అని ఎలుగెత్తి చాటుతారు.” (అహ్మద్)
దైవ ప్రసన్నతాన్వేషణ అనేది ఆయన నిర్ణయించిన విధ్యుక్త ధర్మాలను పాటించటం ద్వారా, అదనపు ఆరాధనల ద్వారా నెరవేరుతుంది. అలాగే అధర్మమయిన వాటికిదూరంగా మసలుకోవటం, నిష్ఠను ధర్మపరాయణతను అలవరచుకోవటం కూడాఅవసరం. ఈ సందర్భంలో మహాప్రవక్త ఈ ఆయత్ను పఠించినట్లు తిబ్రానీలోఉంది :
“ఎవరయితే విశ్వసించారో, సత్కార్యాలు చేశారో వారికోసంకరుణామయుడు నిశ్చయంగా త్వరలోనే ప్రేమను సృజిస్తాడు.”(మర్యమ్ – 96)
అంటే విశ్వాసుల కొరకు అల్లాహ్ హృదయాలను మెత్తబరుస్తాడు. వారి యెడల ప్రజల మనస్సులలో ప్రేమను పుట్టిస్తాడు.
యజమాని తన దాసుడ్ని ప్రేమించటమనేది ఆయన స్థాయికి తగిన విధంగా ఉంటుంది. యదార్థానికి నిజ యజమాని స్థాయికి ఎవరూ చేరుకోలేరు. అలాగే ఆయన గుణగణాలను ఎవరూ విశ్లేషించనూ లేరు. అయినప్పటికీ అంతటి శక్తిమంతుడు సద్వర్తనుడైన దాసుడ్ని ప్రేమిస్తాడనేది యదార్థం. అందులో ఎటువంటి సందేహానికి ఆస్కారం లేదు.
ప్రేమ ఒక అనిర్వచనీయమైన భావన. అది కేవలం ఆచరణ లేదా ప్రవర్తన ద్వారానే వ్యక్తమవుతుంది. ఆకాశవాసులు భూవాసులు కూడా పరస్పరం ప్రేమించుకుంటారు.ఎదుటివాని శ్రేయాన్ని అభిలషించటం, విపత్తుల బారినుండి అతన్ని కాపాడటం, ఆపదలో ఆదుకోవటం ఇత్యాది విధాలుగా అది వ్యక్తమవుతూ ఉంటుంది. ఇక ఆకాశ వాసుల ప్రేమ ఎలా ఉంటుందంటే, వారు మంచివారైన దాసుల మన్నింపునకై దైవాన్ని ప్రార్థిస్తారు. వారి మనసులలో సవ్యమైన భావాలను కలిగిస్తారు.
“అతని పట్ల ఆదరాభిమానం కలుగ జేయబడుతుంది” అంటే భావం భూవాసులు కూడా అతనంటే ఇష్టపడతారని. ఈ హదీసు ద్వారా సజ్జనులను ప్రేమించడం అల్లాహ్ ప్రేమకు తార్కాణమని కూడా విదితమవుతోంది. “మీరు ధరణిలో అల్లాహ్ కు సాక్షులు” అని మహాప్రవక్త తన సహచరుల నుద్దేశించి చెప్పారు.
అల్లాహ్ ప్రేమకు ప్రతిరూపం. ప్రేమ ఆయన గుణగణాలలో ప్రముఖమైంది. దాని అన్వేషణకు పూనుకున్న వారికి, దానికోసం పరితపించిన వారికే ఆ భాగ్యం ప్రాప్తిస్తుంది.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రబోధించారని అబూ మూసా అష్ అరి (రదియల్లాహు అన్హు) చెప్పారు: “దానం ఇవ్వటం ప్రతి ముస్లింకు తప్పనిసరి.” సహచరులు అడిగారు – ‘ఒకవేళ అతని వద్ద లేకుంటే?!’ ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) అన్నారు :’అతను తన స్వహస్తాలతో శ్రమించి సంపాదించాలి. (దాంతో) తన స్వయానికి ప్రయోజనం చేకూర్చాలి మరియు దానం ఇవ్వాలి.’ సహచరులు సందేహంగా అడిగారు – ‘ఒకవేళ అలా చేయలేకపోతే? లేదా చేయకపోతే?’ ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రబోధించారు: ‘దయనీయ స్థితిలో ఉన్న అగత్యపరునికి సహాయపడాలి.’ సహచరులు అడిగారు – ‘ఒకవేళ అలా చేయకపోతేనో?’ ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) బదులిచ్చారు ‘మంచిని ఆజ్ఞాపించాలి’. సహచరులు మళ్ళీ అడిగారు ‘ఒకవేళ అది కూడా చేయలేకపోతే?!’ ఆయన(సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు : ‘(పరులను) నొప్పించకుండా జాగ్రత్త పడాలి. ఇది కూడా అతని పాలిట దానమే.” (బుఖారి)
తాత్పర్యం :
“దానం ఇవ్వటం ప్రతి ముస్లింకు తప్పనిసరి.” ముస్నద్ తియాసి ఉల్లేఖనంలో “ప్రతిరోజు” అనే పదం అదనంగా ఉంది. ఈ దానం శక్తిమేరకు ప్రతి ఒక్కరిపైతప్పనిసరి అవుతుంది. అంటే ప్రతి ముస్లిం నైజంలో, అతని ప్రవర్తనలో సదకా (దానం) ఒక భాగం కావాలన్నది దీని పరమార్థం. అతను ఏ స్థితిలో ఉన్నా – కలిమిలో ఉన్నా లేమి తాండవిస్తున్నా – అతనిలో దాతృ స్వభావం మాత్రం ఉండాల్సిందే అన్నది పై వాక్యం ఉద్దేశ్యం.
‘ఒకవేళ అతని వద్ద లేకపోతే’ అని ప్రవక్త గారి ప్రియ సహచరులు ప్రశ్నించారు.’దానం’ అనే ప్రస్తావన రాగానే ధన ధాన్యాదుల ద్వారా చేసే సహాయం మాత్రమేనని అసలు సహచరులు తలపోశారు. అయితే ఈ “పదం”కు ఉన్న భావం ఎంతో విస్తృతమయిందని, ఆపదలో ఉన్న ఒక వ్యక్తిని మృదువుగా పలకరించి అతన్ని ఓదార్చటం, అతని ఆపదను కడతేర్చే సంకల్పంతో తరుణోపాయం సూచించటం కూడా “సదకా” కోవలోకే వస్తుందని మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) విశ్లేషించారు.
ఈ నేపథ్యంలో ఇబ్నె అబీ హంజా ఇలా అభిప్రాయపడ్డారు :
“దాన ధర్మాలు చేయడం కేవలం శ్రీమంతులకే పరిమితం కాదని, డబ్బుఖర్చుపెట్టకుండా కూడా దానధర్మాలు చేయవచ్చని ఈ హదీసు ద్వారా ఆధారంలభిస్తున్నది.”
“అతను తన స్వహస్తాలతో శ్రమించి సంపాయించాలి.” అన్న ప్రవక్త గారి పలుకు గమనించదగినది. కష్టపడి ఉపాధిని సంపాయించటం చాలా ముఖ్యం అని దీని ద్వారా విదితమవుతుంది. కష్టపడి సంపాయించ గలిగినప్పుడే ఏ మనిషయినా తన స్వయానికై ఖర్చుచేసుకుని ఇతరుల కేదైనా సహాయం చెయ్యగలుగుతాడు. శ్రమించి సంపాదించుకుంటేనే, ఎదుటివారి ముందు చేతులు చాచి యాచించే దురవస్థ రాకుండా జాగ్రత్త పడగలుగుతాడు. పైపెచ్చు సమాజంలో గౌరవప్రదంగా జీవిస్తూ, ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటూ, వీలయినంత ఎక్కువగా నిరాధారులనుఆదుకోగలుగుతాడు.
“దయనీయ స్థితిలో ఉన్న అగత్యపరునికి సహాయపడాలి” అనేది హదీసు లోని మరో వాక్యం. అటువంటి సహాయం నోటి ద్వారా కావచ్చు. చేతల ద్వారా కూడా కావచ్చు. మరోవిధంగా కూడా కావచ్చు. సహాయపడే తీరు ఎన్నో రకాలు.
“మంచిని గురించి ఆజ్ఞాపించాలి” అనేది మరో వాక్యం. వేరొక ఉల్లేఖనంలో “చెడులనుండి ఆపాలి” అని కూడా ఉంది. మంచిని ఆజ్ఞాపించటంలోనే “చెడుల నుండి ఆపటం” అనే భావం ఇమిడి ఉంది. ఖుర్ఆన్ హదీసుల వెలుగులో సమ్మతమయిన ప్రతిదీ ‘మంచి’గానే పరిగణించబడుతుంది. అలాగే ఖుర్ఆన్, హదీసులలో ఏవేవైతే ‘కూడదు’ అని అనబడ్డాయో అవి చెడుగానే పరిగణింపబడతాయి. వాటి జోలికి ప్రజలను పోనివ్వకుండా చూడటం కూడా గొప్ప సత్కార్యమే.
“(పరుల మనసు) నొప్పించకుండా జాగ్రత్త పడాలి.” నోటి ద్వారా నయినా, చేతలద్వారా నయినా లేక ఆ రెండింటి ద్వారానయినా ఎదుటివారు నొచ్చుకునేలా ప్రవర్తించరాదు. ఎట్టి పరిస్థితిలోనూ దైవ ప్రసన్నత చూరగొనటమే దీని వెనుక అసలు ప్రేరణ అయివుంటే తప్పకుండా ఇది సయితం పుణ్యకార్యంగానే పరిగణించబడుతుంది. దైవదాసులకు బాధ కలగకుండా మసలు కోవటం ఒక నిజమైన ముస్లిం యొక్క చిహ్నం. హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించిన హదీసు ద్వారా ఇదే భావం వ్యక్తమవుతోంది. ఆయన ఉల్లేఖించిన ప్రవచనం ఇలా ఉంది : “నిజమైన ముస్లిం అతనే – ఎవరి నోటి మరియు చేతుల బారి నుండి ముస్లింలుసురక్షితంగా ఉండగలరో.”
“ఒకవేళ అలా చెయ్యలేకపోతే,” ప్రవక్త సహచరులు పలు కోణాల నుంచి ఒకవిషయం యొక్క లోతుపాతులను తెలుసుకునేవారు. వారలా అడగటం వల్లనే “విషయం” ప్రాముఖ్యతను సంతరించుకుంది. సదకా (దానం) యొక్క విస్తృత భావం కూడా తెలిసివచ్చింది. దానధర్మాలు చేయటం, అవసరం ఉన్న వారిని ఆదుకోవటం, మంచిని గురించి ఆజ్ఞాపించటం, చెడుల నుండి ఆపటం ఇవన్నీ చెయ్యవలసిన ముఖ్య పనులేనని, వీటికిగాను దైవసన్నిధిలో ప్రతిఫలం కూడా అపారమని తెలియవచ్చింది.
ఈ హదీసు ద్వారా స్పష్టమయిన మరో విషయం ఏమిటంటే, సత్కార్యాలు వాటి ప్రాముఖ్యత, ప్రతిఫలాల దృష్ట్యా ఎన్నో స్థాయిలను కలిగి ఉంటాయి. అయితే వీటిలో అన్నిటిక న్నా ఉత్తమమయినది, మనిషి తన ధనాన్ని ఇతరులకు దానం చేయటం. ఒక ముస్లిం ఫకీరు భిక్షకుడు – దైవమార్గంలో ఖర్చు పెట్టలేకపోతే అతను, అది మినహా మిగతా సత్కార్యాలపై చొరవ చూపాలి. అల్లాహ్ ఏ ప్రాణి పైనా అతని శక్తికి మించిన భారం మోపడు. మనిషి, తాను ఏ సత్కార్యమూ చేయలేకపోతే, అతను కనీసం చెడుల బారిన పడకుండా జాగ్రత్త వహించాలి.
ఈ హదీసు ద్వారా విదితమయ్యే మరో విషయం ఏమిటంటే, షరీఅత్ ఆదేశాలు -స్థితిగతుల దృష్ట్యా – స్వల్పమయిన వ్యత్యాసంతో వర్తిస్తాయి. ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వసల్లం), ప్రతి ముస్లిం దానం ఇవ్వటం తప్పనిసరి అని ఖరారు చేశారు. అయితే ప్రతి ముస్లిం దానధర్మాలు చెయ్యలేడు. పైగా కొంతమందైతే దానాలు పుచ్చుకోవటం తప్ప మరో గత్యంతరం లేని స్థితిలో ఉంటారు. అటువంటప్పుడు పుచ్చుకోవడం వారి కొరకు సమంజసమే అవుతుంది. విషయాన్ని కూలంకషంగా అర్థం చేసుకునే ఉద్దేశ్యంతో మాటిమాటికీ విద్వాంసుని అడగవచ్చు అని కూడా ఈ హదీసు ద్వారా తెలియవస్తోంది. అదేవిధంగా కష్టపడి చెమటోడ్చి సంపాయించడం శ్రేష్ఠతతో కూడుకున్న విషయమని అలా సంపాయించే వాడే తనను ఆదుకోవటంతో పాటు ఇతరులను కూడా ఆదుకోగలుగుతాడని అవగతమవుతోంది.
ఈ హదీసును ఉల్లేఖించిన వారు అబూ మూసా అష్ అరి (రదియల్లాహు అన్హు) హిజ్రత్ కు ముందే ఈయన మక్కా వచ్చి ఇస్లాంను స్వీకరించారు. తరువాత తన జాతి వారి వైపునకు మరలి వెళ్ళారు. కొంత కాలం గడిచిన తరువాత ఆయన తన దేశం నుండి ఓడలో బయలుదేరారు. మార్గమధ్యంలో గాలి దిశ మారిపోవటం వల్ల ఈయన ఆఫ్రికాకు చేరుకోవలసి వచ్చింది. అక్కడ ఆయన జాఫర్ బిన్ అబీ తాలిబ్ (రదియల్లాహు అన్హు)వద్ద ఆగారు. ఆ తరువాత ఆయనతో పాటే హిజీ 6 వ సంవత్సరం మదీనా వచ్చారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈయన్ని యమన్లోని కొన్ని ప్రాంతాలకు అధికారిగా నియమించారు. ఖలీఫా హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) హయాంలో ఈయన బస్రా గవర్నర్ గా నియమితులయ్యారు. హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) కాలంలో కూఫా గవర్నర్ పదవి లభించింది. ఉమర్ గారి కాలంలో ఈయన ‘అహ్వాన్’, ‘అస్ బహాన్’లను జయించారు. ఈయనగారి కంఠస్వరం మృదు మధురమైనది. తనను కలుసుకున్నప్పుడల్లా ఖుర్ఆన్‌ను చదివి వినిపించమని హజ్రత్ ఉమర్ ఈయన్ని కోరేవారు. ఖలీఫా కోరిక మేరకు ఈయన ఖుర్ఆన్ పఠించి వినిపించేవారు. బస్రా ప్రజల్లో ఈయన ఖుర్ఆన్ మరియు సత్యధర్మాన్ని వ్యాపింపజేశారు. దాదాపు హిజ్రీ శకం 50వ ఏట ఈయన కాలధర్మం చెందారు – అప్పటికి ఈయన వయస్సు రమారమి 63 సంవత్సరాలు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
“రెండు వచనాలున్నాయి. అవి కరుణామయుని (అల్లాహ్)కి అత్యంత ప్రీతికరమైనవి. అవి నోటికి చాలా తేలికైనవే, (కాని) త్రాసులో చాలా బరువుగా ఉంటాయి. అవే ‘సుబ్ హానల్లాహి వబి హమ్ దిహీ ‘, ‘సుబ్ హానల్లాహిల్ అజీమ్.” (బుఖారి)
1. ‘సుబ్ హానల్లాహి వబి హమ్ దిహీ’ అంటే అల్లాహ్ పవిత్రతను ఆయన స్తోత్రంతో సహా కొనియాడుతున్నాను అని అర్థం. ‘సుబహానల్లాహిల్ అజీమ్’ అంటే మహోన్నతుడైన అల్లాహ్ పవిత్రతను వర్ణిస్తున్నాను అని భావం.
అల్లాహ్ పవిత్రత అనేది ఆయన సుగుణాలకు ప్రతీక, సకల లోపాలకు, బలహీనతలకు ఆయన అతీతుడు అనే భావం ఇందులో స్ఫురిస్తుంది. బహు దైవోపాసకులు ఏ బలహీనతలను, మరే భాగస్వామ్యాలను ఆయనకు ఆపాదిస్తారో వాటన్నింటికీ ఆయన అతీతుడు.
విశ్వాసి ఘటించే శ్రద్ధాంజలి అల్లాహ్ ఔన్నత్యానికి, ఆయన స్థాయికి తగిన విధంగా ఉంటుంది. యదార్థానికి ఆయన అన్ని రకాల దోషాలకు దూరంగా ఉన్నవాడు. హదీసులో పేర్కొనబడిన రెండు సద్వచనాలు ఎంతో సంక్షిప్తమైనవి. సులభమైనవి. సృష్టిపై దృష్టిని సారించిన తరువాత, ఈ సువిశాల విశ్వ వ్యవస్థలోని నిర్వహణా యంత్రాంగం, అందలి పరమార్థాలపై యోచించిన తరువాత విశ్వాసి నోట అప్రయత్నంగా వెలువడే ఈ రెండు వచనాలు అనంత విశ్వ వ్యవస్థలోని అన్నింటికన్నా గొప్ప సత్యంగా, నిజమైన దైవస్తోత్రంగా రూపొందుతాయి.
ప్రభువు ఏ విధంగా తన వ్యక్తిత్వంలో, గుణగణాలలో పవిత్రుడో అదేవిధంగా సృష్టి ఏర్పాట్లలోనూ సాటిలేనివాడు. ఆయన మానవులను ఆలోచించమని కోరాడు :
“ఒక దానిపై ఒకటి సప్తాకాశాలను నిర్మించిన వాడు ఆయనే. మీరు కరుణామయుని సృష్టిలో ఎటువంటి సంబంధ రాహిత్యాన్ని కనలేరు. మరి మీ దృష్టిని సారించండి – మీ కేదయినా ఆటంకం కానవస్తోందా? మాటిమాటికీ దృష్టిని సారించండి, మీ దృష్టి అలసిసొలసి, ఓడిపోయి తిరిగివస్తుంది.” (అల్ ముల్క్ : 3,4)
2. “కరుణామయునికి అత్యంత ప్రీతికరమైనవి” :
దీని గురించి హాఫిజ్ ఇబ్నె హజర్ ఇలా అన్నారు : కరుణామయుడు అన్న పదాన్ని ఇక్కడ ప్రధానంగా పేర్కొనడం జరిగిందంటే ఈ హదీసులో అల్లాహ్ యొక్క సువిశాలమైన కారుణ్యాన్ని సుబోధకం చేయడమే దీని పరమ ఉద్దేశ్యం అయి ఉంటుంది. ఆయన కరుణ ఎంత విస్తృతమైనదంటే, తన దాసులు మామూలు ఆచరణకు కూడా ఆయన పుష్కలమైన ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.
అల్లాహ్ కు ఈ వచనాలు అత్యంత ప్రీతికరం ఎందుకంటే, వీటి ద్వారా దాసుడు తన ప్రభువు గొప్పతనాన్ని, ఆయన ఏకత్వాన్ని, ఆయన అద్భుతాలను చాటుతాడు. బహుదైవోపాసకులు, దైవధిక్కారుల వైఖరి ఇందుకు భిన్నంగా ఉంటుంది. వారు ఒకవేళ దైవాన్ని విశ్వసిస్తున్నప్పటికీ ఆయనకు సహవర్తులుగా ఇతరుల్ని నిలబెట్టడం ద్వారా ఆయన గుణగణాలని నిర్లక్ష్యంచేసిన వారవుతారు. ఒక్కోసారి వారు దేవుని శక్తి యుక్తుల్ని సయితం అనుమానించే నిందించే విధంగా ప్రవర్తిస్తారు. అయితే నిజమైన విశ్వాసి, నికార్సయిన ఏకేశ్వరోపాసి చేసే స్తోత్రం, జిక్ (స్మరణ) ఎంతైనా ఆదరణీయమైనవి.
దివ్య ఖుర్ఆన్లో ఎన్నో సూరాల ఆరంభం అల్లాహ్ పవిత్రతను కొనియాడటంతోనే జరిగింది. ‘హదీద్” “హష్ర”, “సఫ్” సూరాలు ఇలా ప్రారంభమయ్యాయి –
“సబ్బహ లిల్లాహి మాఫిస్సమావాతి వ మాఫిల్ అర్జి వహువల్ అజీజుల్ హకీమ్.”
అనువాదం : “భూమ్యాకాశాలలో ఉన్న ప్రతి వస్తువూ అల్లాహ్ను స్తుతించాయి. ఆయన అధిపతి, వివేకవంతుడు.”
ఇదేవిధంగా, “జుమా”, “తగాబున్” సూరాలు కూడా అల్లాహ్ పవిత్ర స్మరణతోనే మొదలయినాయి.
3. “నోటికి చాలా తేలికైనవి” అంటే ఈ వచనాలను వల్లించడం అత్యంత సులువు. అరబీ భాషలోని కొన్ని పదాలను పలకటం సులభం కాదు. పైగా ఆ పదాలను చాలా జాగ్రత్తగా పలకవలసి ఉంటుంది. ఖిరాత్ కళా నిపుణులు అరబీ భాషలోని పదాలను రెండు రకాలుగా విభజించారు :
(అ) షదీద్: అంటే గట్టిగా నొక్కి) పలకబడేవి. (ఆ) రఖ్వ : అంటే తేలిగ్గా ఉచ్చరించబడేవి.
అయితే హదీసులోని రెండు వచనాల – సుబ్ హానల్లాహి వబి హమ్ దిహీ, సుబహానల్లాహిల్ అజీమ్ – లో ‘బ’ అనే అక్షరం తప్ప మిగిలిన అక్షరాలన్నీ “రఖ్వ” లోకే వస్తాయి. ఈ విధంగా, ఈ రెండు వచనాలు నోటికి చాలా తేలికైనవి. మహాప్రవక్త చెప్పింది సత్యమని నిరూపణయింది.
4. “త్రాసులో చాలా బరువైనవి” అంటే తీర్పుదినం నాడు మనిషి కర్మలు తూయబడి నపుడు సత్కర్మల తక్కెడలో అవి బరువును పెంచుతాయి, నోటి ఉచ్చరణకు ఆ పచనాలు తేలికైనప్పటికీ ఫలితం రీత్యా అత్యంత బరువైనవి. ఆ బరువే పరలోకంలో పనికొచ్చేది.
నోటిద్వారా జారిన మాటలు కూడా త్రాసులో తూయబడతాయన్న విషయం గత కాలాల్లో ప్రజలకు అర్థం కాకపోయిందేమో గాని ఉష్ణోగ్రతను, శీతోష్ణ స్థితిని సయితం కొలిచే నేటి ఆధునిక మానవుడికి ఇది వింతేమీ కాదు. ఇన్షా అల్లాహ్ తీర్పుదినం నాడు మనిషి కర్మలు, విశ్వాస పరిమాణం తప్పకుండా తూయబడతాయి. హదీసులోని శుభప్రదమైన ఆ రెండు వచనాలు పఠిస్తూ ఉండాలని పలుచోట్ల చెప్పబడింది. విధ్యుక్త ధర్మాల (ఫరాయిజ్) ను నిర్వర్తించటం మనసుకు కాస్త శ్రమగా తోచవచ్చునేమో గాని ఈ వచనాలను వల్లించడం కష్టతరమేమీ కాదు. అందుకే వీటిని పలుకుతూ ఉండటంలో పిసినారితనం కనబరచరాదు.
ఈ రెండు వచనాలు ఇంతటి మహత్ పూర్వకంగా ఎలా రూపొందాయని ఆలోచిస్తే, పఠిత ఈ రెండు వచనాలను పఠిస్తూ పఠిస్తూ వాటి అర్థంపై యోచించటం మొదలెడతాడని, తద్వారా అతని హృదయాంతరాళంలో నిజస్వామి పట్ల గౌరవం, ప్రేమ ఏర్పడతాయని తెలుస్తోంది. తద్వారా అతని హృదయం నుంచి ఎన్నో రుగ్మతలు దూరం అవుతాయి. నిర్మలమైన మనసుతో ఇప్పుడతను ప్రభువుకు సన్నిహితుడవుతాడు. ప్రభువుకు సన్నిహితుడైన దాసుని స్థానం గురించి ఇక చెప్పవలసిందేముంది!
“ఈ వచనాలు త్రాసులో బరువు కలిగి ఉంటాయి” అంటే భావం విశ్వాసి ఈ రెండు వచనాలను పలుకుతూనే అపరాధాలు చేస్తూ ఉండటం పరిపాటి. అయితే- హదీసులోని రెండు వచనాలు ఎంతటి మహత్తు గలవంటే ఎన్నో దుష్కర్మల కంటే అవి ఎక్కువ బరువు కల్గి ఉంటాయి. అందుచేత ఈ వచనాలను పలికే వారల్లా ఘోర అపరాధాలు చేస్తూ ఉండమని భావం ఎంతమాత్రం కాదు. సాధారణంగా ‘జిక్ర్’ (దైవనామ స్మరణ) లో గడిపే మనిషి దుష్కర్మలకు దూరంగానే ఉంటాడు. మానవ సహజమైన దౌర్బల్యం మూలంగా ఎప్పుడో ఒకప్పుడు అతని చేత తప్పు జరగవచ్చుగాని సతతం జరగదు. అదీగాక ఈ పవిత్ర వచనాలు అతని మనసులో భయభక్తులను సృజిస్తాయి. అటువంటి వ్యక్తికి అల్లాహ్ తరపున కూడా రక్షణ లభిస్తుంది. సహాయం లభిస్తుంది. కనుక అతను ధర్మ సమ్మతమయిన కోర్కెలను ధర్మ సమ్మతమయిన విధానాల ద్వారానే తీర్చుకుంటాడు. నెరవేరని మరెన్నో కోర్కెలను మనసులోనే అణచుకుంటాడు. త్యాగ భావం అలవరచుకుంటాడు.
ఘోర అపరాధాలకు ఒడిగట్టడం విశ్వాస బలహీనతకు తార్కాణం. విశ్వాసంలో బలహీనుడుగా ఉన్నవాడే పెద్ద పాపాలకు పాల్పడతాడని అహ్లెసున్నత్ వర్గం భావిస్తుంది. ఎన్ని అపరాధాలు చేస్తే అంతే అతని ఈమాన్ (విశ్వాసం) క్షీణిస్తూ పోతుంది. అతన్నే “ఫాసిఖ్” “ఫాజిర్” (అపరాధి, అపచారి) అనటం జరుగుతుంది. అయితే అతను గనక తనను విశ్వాసిగా చెప్పుకునేంతవరకు, ధర్మ భ్రష్టతకు పాల్పడ కుండా, షిర్క్ (బహుదైవారాధన)కు ఒడిగట్టకుండా ఉన్నంతవరకూ అతన్ని ముస్లింలలో ఒకడుగానే పరిగణించటం జరుగుతుంది. అతని వ్యవహారం పరలోకంలో అల్లాహ్ కే వదలివేయబడుతుంది. అయితే ఏకేశ్వరోపాసకుడయిన ప్రతి వ్యక్తినీ నరకం నుండి విముక్తి కలిగిస్తానని ఆయన అంటున్నాడు. అందుకే అల్లాహ్ తనగ్రంథంలో శుభవార్తను, హెచ్చరికను ఒకేచోట ప్రస్తావించాడు:
“నేనే ఎక్కువగా మన్నించేవాడిని మరియు కరుణించేవాడినని, అయితే నా శిక్ష కూడా అత్యంత వ్యధాభరితమైన శిక్షేనని (ఓ ప్రవక్తా!) నా దాసులకు చెప్పివేయండి.” (అల్ హిజ్ర్ 15 : 49, 50)
దాసులు తన వైపునకు మరలి రావాలని తనను అధికంగా జ్ఞాపకం చేయాలని, తన గొప్పతనాన్ని గురించి అదే పనిగా చెప్పుకోవాలని, తనను క్షమాశీలునిగా, స్వర్గ యజమానిగా చెప్పుకోవటంలో నిమగ్నులవ్వాలని, తనంటే భయపడుతూ ఉండాలని, పాపాలకు దూరంగా ఉండాలని, క్షమాభిక్ష పెట్టడంలో తాను ఎంత ఉదార స్వభావుడో నేరస్థులను పట్టుకోవటంలో కూడా అంతే కఠినుడని, కనుక తన పట్టు పట్ల తరచూ భయపడుతూ ఉండాలని అల్లాహ్ పై రెండు ఆయత్లలో దాసులకు చెబుతున్నాడు. దైవ కారుణ్యంపై ఆశలు పెంచుకోవటం, ఆయన ఆగ్రహం పట్ల భయపడుతూ ఉండటం విశ్వాసుల ముఖ్య లక్షణం. దైవప్రవక్తలు హజ్రత్ జకరియ్యా, హజ్రత్ యహ్యా (అలైహిముస్సలాం)ల గురించి ఖుర్ఆన్లో సెలవీయబడింది :
“వారు సత్కార్యాల వైపునకు పరుగెత్తేవారు. మమ్మల్ని భయంతో ప్రార్థించేవారు, ఇంకా వారు మా ముందు వంగి ఉండేవారు.” (అంబియా 21: 90)
పై ఆయత్ ద్వారా తెలిసేదేమంటే విశ్వాసి అత్యంత వినయ వినమ్రతలతో దైవనామాన్ని స్మరిస్తూ మంచి పనులు చేస్తూ కూడా ఆయన పట్టు పట్ల భయంతో కంపిస్తూ ఉంటాడు. దైవ నామస్మరణ, దైవారాధనలు అతన్ని ఎంతటి నిష్టాపరునిగా మలుస్తాయంటే చెడు పనులంటేనే అతనిలో అసహ్యం జనిస్తుంది.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
వాటిని అల్లాహ్ వారిపై నిరంతరం ఏడు రాత్రులు , ఎనిమిది పగళ్ళు విధించాడు. (నీవు గనక అక్కడ ఉండి ఉంటే) వారు అక్కడ బోసిపోయిన ఖర్జూరపు బొద్దులవలే నేలకొరిగి పడి ఉండటం చూసేవాడివి.
69:8 فَهَلْ تَرَىٰ لَهُم مِّن بَاقِيَةٍ
మరి వారిలో ఎవడైనా మిగిలి ఉన్నట్లు నీకు కనిపిస్తున్నాడా?
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ప్రవక్త ఇద్రీస్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర https://youtu.be/aog37XDhX8c [33 నిముషాలు] వక్త: సలీం జామిఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో, వక్త ప్రవక్త ఇద్రీస్ (అలైహిస్సలాం) జీవిత చరిత్రను వివరిస్తారు. ఆదం (అలైహిస్సలాం) మరియు వారి కుమారులైన ఖాబిల్ మరియు హాబిల్ కథను పునశ్చరణ చేస్తూ, హాబిల్ హత్య తర్వాత ఖాబిల్ తన తండ్రి నుండి దూరంగా వెళ్ళిపోయాడని గుర్తుచేస్తారు. ఆదం (అలైహిస్సలాం) తర్వాత, ఆయన కుమారుడు షీస్ (అలైహిస్సలాం) ప్రవక్తగా నియమించబడ్డారు. షైతాన్ ఖాబిల్ యొక్క మార్గభ్రష్టులైన సంతానం వద్దకు మానవ రూపంలో వచ్చి, వారిని సంగీతం (ఫ్లూట్) ద్వారా మభ్యపెట్టి, అశ్లీలత మరియు వ్యభిచారంలోకి నెట్టాడు. ఈ పాపం పెరిగిపోయినప్పుడు, అల్లాహ్ ఇద్రీస్ (అలైహిస్సలాం)ను ప్రవక్తగా పంపారు. ఆయన పాపులను హెచ్చరించి, మానవ చరిత్రలో మొదటిసారిగా దైవ మార్గంలో యుద్ధం (జిహాద్) చేశారు. ఇద్రీస్ (అలైహిస్సలాం) మొట్టమొదటిగా కలం ఉపయోగించిన మరియు బట్టలు కుట్టిన వ్యక్తి అని చెప్పబడింది. ఖురాన్ మరియు హదీసులలో ఆయన ఉన్నత స్థానం గురించి ప్రస్తావించబడింది, ముఖ్యంగా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మే’రాజ్ యాత్రలో ఆయనను నాలుగవ ఆకాశంలో కలిశారు. ఈ కథ నుండి, షైతాన్ యొక్క కుతంత్రాలు, సంగీతం యొక్క చెడు ప్రభావం, మరియు పరాయి స్త్రీ పురుషులు ఏకాంతంగా ఉండటం యొక్క నిషేధం వంటి పాఠాలు నేర్చుకోవాలని వక్త ఉద్బోధిస్తారు.
అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్. నబియ్యినా ముహమ్మద్ వ ఆలా ఆలిహి వ అస్హాబిహి అజ్మయీన్
అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వ లోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి.
ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్య మూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.
సోదర సోదరీమణులారా, మీ అందరికీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.
أَسْلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّٰهِ وَبَرَكَاتُهُ (అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు) మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక
ఈనాటి ప్రసంగంలో మనం ఇద్రీస్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రను తెలుసుకుందాం. అయితే, మాట ప్రారంభించడానికి ముందు ఒక విషయం వైపుకు మీ దృష్టి మరలించాలనుకుంటున్నాను. అదేమిటంటే, ఇంతకుముందు జరిగిన ప్రసంగంలో మనం ఆది మానవుడైన ఆదం అలైహిస్సలాం వారి పుట్టుక గురించి, ఆయన భూమండలం మీద దిగడం గురించి, భూమి మీద ఆదం అలైహిస్సలాం మరియు హవ్వా అలైహస్సలాం వారు ఇద్దరూ జంటగా నివసించటము, వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సంతానము ప్రసాదించటము, ఈ విషయాలన్నీ వివరంగా ఆదం అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో విన్నాం.
ఆ ప్రసంగంలో నేను ప్రసంగిస్తూ ప్రసంగిస్తూ ఒకచోట ఏమన్నానంటే, ఆదం అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా 40 మంది సంతానాన్ని కల్పిస్తే వారిలో ఇద్దరు ప్రముఖులు, ఒకరు ఖాబిల్, మరొకరు హాబిల్. వారిద్దరి మధ్య పెళ్ళి విషయంలో గొడవ జరిగింది. ఆ తర్వాత ఖాబిల్ అన్యాయంగా హాబిల్ ని హతమార్చేశాడు. హతమార్చిన తర్వాత, హత్య చేసేసిన తర్వాత అతను తల్లిదండ్రుల వద్ద నుండి దూరంగా వెళ్ళి స్థిరపడిపోయాడు అన్న విషయము నేను ప్రస్తావించాను.
అది మనము ఇప్పుడు ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ ప్రసంగంలో ఇన్ షా అల్లాహ్, ఆ అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోయి స్థిరపడిపోయిన ఖాబిల్ గురించి చర్చ వస్తుంది కాబట్టి.
ఖాబిల్ సంతానం & షైతాన్ కుతంత్రం
ఖాబిల్ హంతకుడు. నేరం చేశాడు. తన సోదరుడిని హతమార్చాడు. ఆ తర్వాత తల్లిదండ్రుల వద్ద నేరస్తుడుగా, అవమానంగా ఉండటానికి ఇష్టపడక అక్కడి నుండి అతను దూరంగా వెళ్ళి స్థిరపడిపోయాడు.
చరిత్రకారులు, ధార్మిక పండితులు తెలియజేసిన దాని ప్రకారం, ఆదం అలైహిస్సలాం మరియు ఆదం అలైహిస్సలాం వారి సంతానము పర్వతాలకు సమీపంలో నివసించేవారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ సృష్టి ప్రారంభంలో, మానవ చరిత్ర ప్రారంభంలో మానవులను ఆ విధంగా జీవించడానికి సౌకర్యం కల్పించగా, వారు పర్వతాలకు సమీపంలో జీవించసాగారు, నివసించసాగారు.
అయితే, ఈ ఖాబిల్ నేరం చేసిన తర్వాత, హత్య చేసిన తర్వాత ఆ ప్రదేశాన్ని విడిచేసి దూరంగా మైదానంలో వెళ్ళి స్థిరపడిపోయాడు. అంటే కొండ పర్వతాలకు సమీపంలో ఉండకుండా మైదానంలో వెళ్ళి అతను అక్కడ స్థిరపడిపోయాడు. అతని జీవితం అక్కడ సాగుతూనే ఉంది. అక్కడ అతనికి సంతానము కలిగింది. ఆ సంతానోత్పత్తిలో అక్కడ ఆ రకంగా పూర్తి ఒక జాతి సృష్టించబడింది.
ఇటు ఆదం అలైహిస్సలాం వారు జీవించినంత కాలం వారి సంతానానికి తండ్రిగాను, ఒక ప్రవక్తగా, బోధకునిగాను సత్ప్రవర్తన నేర్పించి, మంచి గుణాలు నేర్పించి, దైవ భక్తి మరియు దైవ నియమాలు నేర్పించి, ఆ తర్వాత ఆయన మరణించారు. ఆదం అలైహిస్సలాం వారు మరణించిన ఒక సంవత్సరానికి హవ్వా అలైహిస్సలాం వారు కూడా మరణించారు. ఈ విధంగా ఒక సంవత్సర వ్యవధిలోనే ఆది దంపతులు ఇద్దరూ మరణించారు.
అయితే, ఆదం అలైహిస్సలాం వారి మరణానంతరం, ఆదం అలైహిస్సలాం వారి బిడ్డలకు దైవ నియమాలు నేర్పించే బాధ్యత షీస్ అలైహిస్సలాం వారికి ఇవ్వబడింది. ఆదం అలైహిస్సలాం వారి కుమారులలోనే ఒక కుమారుడు షీస్ అలైహిస్సలాం.
షీస్ అలైహిస్సలాం వారికి హవ్వా అలైహిస్సలాం ఆ పేరు ఎందుకు నిర్ణయించారంటే, ఎప్పుడైతే హాబిల్ హతమార్చబడ్డాడో, ఒక బిడ్డను కోల్పోయిన తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ వెంటనే హవ్వా అలైహిస్సలాం వారికి ఒక కుమారుడిని ప్రసాదించాడు. అప్పుడు ఆమె, “నా ఒక బిడ్డ మరణించిన తర్వాత అల్లాహ్ నన్ను ఒక కానుకగా మరొక కుమారుడిని ఇచ్చాడు కాబట్టి ఇతను నాకు అల్లాహ్ తరపు నుంచి ఇవ్వబడిన కానుక” అంటూ, అల్లాహ్ కానుక అనే అర్థం వచ్చేటట్టుగా షీస్ అని ఆయనకు పేరు పెట్టారు, నామకరణం చేశారు.
అంటే ప్రతి బిడ్డ అల్లాహ్ కానుకే, కానీ ఆ సందర్భంలో ఎప్పుడైతే ఒక కుమారుడిని కోల్పోయారో, మరొక కుమారుడిని అల్లాహ్ వెంటనే ప్రసాదించాడు కాబట్టి, ఆ విధంగా ఆమె తలచి అతనికి షీస్ అని నామకరణం చేశారు. ఆ విధంగా ఆయన పేరు షీస్ అని పడింది.
ఆదం అలైహిస్సలాం వారి మరణానంతరం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనకు ప్రవక్త పదవిని ఇచ్చాడు. ఆదం అలైహిస్సలాం కూడా మరణించే ముందే షీస్ వారిని దైవ నియమాలు ఎలా బోధించాలన్న విషయాలు వివరించారు. ఆదం అలైహిస్సలాం వారి మరణానంతరం షీస్ అలైహిస్సలాం ఆదం అలైహిస్సలాం వారి సంతానం మొత్తానికి దైవ వాక్యాలు వినిపించేవారు, దైవ విషయాలు, దైవ నియమాలు బోధించేవారు.
ఇదిలా ఉండగా, ఇప్పుడు షైతాను తన పని ప్రారంభించాడు. అతనేం చేశాడంటే, అతను దూరం నుంచి గమనించాడు. ఆదం అలైహిస్సలాం వారి సంతానం మొత్తం అటు అటవీ ప్రాంతంలో నివసిస్తూ ఉంది. వారిలో ప్రవక్త ఉన్నారు, బోధకులు ఉన్నారు, దైవ నియమాలు నేర్పిస్తున్నారు. వారందరూ భక్తి శ్రద్ధలతో జీవించుకుంటున్నారు. కానీ ఈ ఖాబిల్ మాత్రము దూరంగా వెళ్ళి స్థిరపడిపోయాడు. అతని సంతానము అతని సంతానము కూడా అక్కడనే పెరుగుతూ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే పూర్తి ఒక జాతి అటువైపు స్థిరపడిపోయింది. అటు ఆ జాతి కూడా పెరుగుతూ ఉంది. ఇటు ఆదం అలైహిస్సలాం వారి సంతానము కూడా పెరుగుతూ ఉంది.
అప్పుడు షైతాను, ఇక్కడ ప్రవక్తలు లేరు, ఖాబిల్ నివసిస్తున్న చోట, ఖాబిల్ జాతి నివసిస్తున్న చోట బోధకులు లేరు అని గమనించాడు. అప్పుడు అతను ఒక మానవ అవతారం ఎత్తి మనుషుల మధ్యకి ఖాబిల్ జాతి వద్దకు వెళ్ళిపోయాడు. ఖాబిల్ జాతి వద్దకు వెళ్ళి చూస్తే, వారిలో అసభ్యత, అశ్లీలత, దురాచారాలు చాలా ఎక్కువగా చూశాడు. అప్పుడు అతను అనుకున్నాడు, “నాకు సరైన ప్రదేశం ఇది, నాకు కావలసిన స్థలము ఇదే” అని అతనికి తోచింది.
ఆ తర్వాత అతను అక్కడే స్థిరపడిపోయి, ఆ తర్వాత అతను ఏం చేశాడంటే, ఒక ఫ్లూట్ తయారు చేశాడు. ఇక్కడి నుంచి గమనించండి, ఎలా షైతాన్ మానవులను నెమ్మదిగా తప్పు దోవకి నెట్టుతాడో. ఒకేసారి సడన్‌గా ఒక పెద్ద నేరంలోకి నెట్టేయడు. నెమ్మదిగా, క్రమంగా, క్రమంగా వారిని నెట్టుకుంటూ నెట్టుకుంటూ తీసుకొని వెళ్ళి ఒక పెద్ద పాపంలోకి, ఊబిలోకి నెట్టేస్తాడు. అలా ఎలా చేస్తాడో గమనించండి ఒకసారి.
ఒక ఫ్లూట్ తయారు చేశాడండి. ఒక ఫ్లూట్ తయారు చేసిన తర్వాత, ప్రతి రోజూ సాయంత్రం ఆ రోజుల్లో కరెంటు, అలాగే టీవీలు, ఇతర విషయాలు ఉండేవి కావు. ఆ రోజుల్లో ఎవరైనా ఒక వ్యక్తి సాయంకాలము కూర్చొని ఏదైనా కథ చెప్తున్నాడంటే ప్రజలందరూ అతని వద్ద గుమిగూడతారు. లేదు ఏదైనా ఒక విన్యాసము చేసి చూపిస్తున్నాడు అంటే ప్రజలందరూ అతని వద్ద గుమిగూడతారు. అలా జరిగేది. మన చిన్ననాటి రోజుల్లో కూడా మనం ఇలాంటి కొన్ని విషయాలు చూశాం.
అదే విధంగా ఆ రోజుల్లో అతను ఏం చేసేవాడంటే, ఫ్లూట్ తయారు చేసి సాయంత్రం పూట ఆ ఫ్లూట్ వాయించేవాడు. ఆ ఫ్లూట్ వాయిస్తూ ఉంటే ఆ శబ్దానికి వారందరూ, అక్కడ ఉన్న వాళ్ళందరూ మంత్రముగ్ధులయ్యి అతని వద్ద వచ్చి గుమిగూడేవారు. ఒక రోజు కొంతమంది వచ్చారు. తర్వాత రోజు రోజుకు వారి సంఖ్య పెరుగుతూ పోయింది, పెరుగుతూ పోయింది.
అది గమనించిన షైతాను వారికి ఒక పండగ రోజు కూడా నిర్ణయం చేశాడు తన తరపు నుంచే. చూడండి. ఆ పండగ రోజు అయితే మరీ ఎక్కువ సంఖ్యలో ప్రజలు గుమిగూడేవారు. అప్పుడు ఆడ మగ అనే తేడా లేకుండా వారి కలయిక జరిగేది. అప్పుడు అతను బాగా ఫ్లూట్ వాయిస్తూ ఉంటే ఆ శబ్దానికి వారు ఉర్రూతలూగిపోయేవారు.
అయితే, ఇది ఇలా జరుగుతూ ఉండగా, అటు అటవీ ప్రాంతంలో నివసిస్తున్న వారిలో నుంచి ఒక వ్యక్తి ఒక రోజు అనుకోకుండా ఇటువైపు వచ్చేసాడు.వచ్చి చూస్తే ఇక్కడ నియమాలు, నిబంధనలు, కట్టుబాట్లు అనేటివి ఏమీ లేవు. విచ్చలవిడితనం ఎక్కువ ఉంది. అశ్లీలత ఎక్కువ ఉంది. ఆడ మగ కలయికలు ఎక్కువ ఉన్నాయి. ఎవరికీ ఎలాంటి కట్టుబాట్లు లేవు, నిబంధనలు లేవు, సిగ్గు, లజ్జ, మానం అనే బంధనాలే లేవు. అదంతా అతను చూశాడు. అక్కడ ఉన్న మహిళల్ని, అమ్మాయిల్ని కళ్ళారా చూశాడు. వారి అందానికి ఇతను కూడా ఒక మైకంలోకి దిగిపోయాడు.
తర్వాత జరిగిన విషయం ఏమిటంటే, ఒక రోజు వచ్చాడు, ఇక్కడ జరుగుతున్న విషయాలు, ఆ ఫ్లూట్ వాయించడము, ప్రజలందరూ అక్కడ గుమిగూడటము, వారందరూ కేరింతలు పెట్టడము, ఇదంతా గమనించి అతను వారి అందానికి ప్రభావితుడయ్యి వెళ్ళిపోయి తన స్నేహితులకు ఆయన్ని తెలియజేశాడు. చూడండి. ఒక వ్యక్తి వచ్చాడు, ఈ విషయాలను గమనించాడు, వెళ్ళి తన స్నేహితులకు చెప్పగా వారిలో కూడా కోరిక పుట్టింది. ప్రతి వ్యక్తితో షైతాన్ ఉన్నాడు కదా లోపల, చెడు ఆలోచనలు కలిగించడానికి.
వారిలో కూడా కోరిక పుట్టగా, వారు కూడా రహస్యంగా ఎవరికీ తెలియకుండా వారు కూడా ఒక రోజు వచ్చారు. వారు కూడా వచ్చి ఇక్కడ జరుగుతున్న విషయాలను చూసి, ఆ మహిళల అందానికి వారు కూడా ప్రభావితులయ్యారు. ఆ విధంగా ముందు ఒక వ్యక్తి, ఆ తర్వాత అతని స్నేహితులు, వారి స్నేహితుల స్నేహితులు, ఈ విధంగా అటు అటవీ ప్రాంతంలో భక్తి శ్రద్ధలతో నివసిస్తున్న వారు కూడా కొద్దిమంది కొద్దిమంది రావడం ప్రారంభించారు. ఆ విధంగా వారు కూడా ఇటువైపు వచ్చి వీరితో పాటు కలిసిపోవడం ప్రారంభించారు.
ఈ విధంగా వారి రాకపోకలు ఏర్పడ్డాయి. అటు కొత్త కొత్త మహిళలతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఆ పరిచయాల తర్వాత అక్రమ సంబంధాలకు దారి తీశాయి. ఆ తర్వాత, ఆ అక్రమ సంబంధాల వద్దనే షైతాను వారిని వదిలిపెట్టలేదు. వ్యభిచారం అనే ఊబిలోకి పూర్తిగా నెట్టేశాడు. వ్యభిచారం విచ్చలవిడితనం ప్రారంభమైపోయింది. కొద్ది మంది అయితే ప్రతి రోజూ రావటము, వెళ్ళటం ఎందుకండి, ఇక్కడే స్థిరపడిపోతే పోదు కదా అని ఎవరిలో అయితే భక్తి లోపం ఉందో, బలహీనత ఉందో వారైతే ఆ ప్రదేశాన్నే త్యజించేసి ఏకంగా వచ్చి ఇక్కడే మైదానంలో స్థిరపడిపోయారు.
ఆ విధంగా షైతాన్ ఒక్క ఫ్లూట్ సాధనంతో ప్రజల్లో వ్యభిచారాన్ని ప్రారంభం చేశాడు. అందుకోసమే ఒక్క విషయం గమనించండి. ధార్మిక పండితులు ఒక మాట తెలియజేశారు అదేమిటంటే “అల్-గినావు మిఫ్తాహుజ్జినా” అనగా సంగీతము వ్యభిచారానికి తాళం చెవి లాంటిది. ఇక్కడ ప్రజల మధ్య, ఇతర పురుషుల, మహిళల మధ్య అక్రమ సంబంధం ఎలా ఏర్పడింది? ఏ విషయం వారికి ఆకర్షితులు చేసింది? మ్యూజిక్, ఫ్లూట్ శబ్దం. దానినే మనము మ్యూజిక్ అనొచ్చు, సంగీతము అనొచ్చు. కదండీ. కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, “ఇన్నష్షైతాన యజ్రీ ఫిల్ ఇన్సాని మజ్రద్దమ్.” షైతాన్ మనిషి నరనరాలలో నడుస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మనిషి ఆ సంగీతాన్ని వింటాడో, మ్యూజిక్ వింటాడో, అతనిలో ఉన్న షైతాను నాట్యం చేస్తాడు. అప్పుడు మనిషి కూడా ఉర్రూతలూగిపోతాడు, అతని ఆలోచనలు కూడా చెల్లాచెదురైపోతూ ఉంటాయి. కాబట్టి సంగీతం అల్లాహ్ కు ఇష్టం లేదు. షైతానుకు ప్రియమైనది, ఇష్టమైనది. కాబట్టి అదే పరికరాన్ని అతను తయారు చేశాడు, దాన్నే సాధనంగా మార్చుకొని ప్రజల్లో అతను లేని ఒక చెడ్డ అలవాటుని సృష్టించేశాడు.
ఇద్రీస్ (అలైహిస్సలాం) ప్రవక్తగా రాక
షీస్ అలైహిస్సలాం ఆ రోజుల్లో ప్రవక్తగా ఉంటున్నప్పుడు వారు జాతి వారికి చాలా రకాలుగా వారిని హెచ్చరించారు, దైవ విషయాలు తెలియజేసినప్పటికిని వారు షీస్ అలైహిస్సలాం వారి మాటను గ్రహించలేకపోయారు. షీస్ అలైహిస్సలాం వారి మాటను పడచెవిన పెట్టేశారు. చివరకు ఏమైందంటే, షీస్ అలైహిస్సలాం వారి మరణం సంభవించింది. షీస్ అలైహిస్సలాం వారి మరణానంతరం దైవ భీతితో జీవిస్తున్న వారి సంఖ్య రాను రాను క్షీణిస్తూ పోయింది. వ్యభిచారానికి, అశ్లీలానికి ప్రభావితులైన వారి సంఖ్య రాను రాను పెరుగుతూ పోయింది. అప్పుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరొక ప్రవక్తను, మరొక బోధకుడిని పుట్టించాడు. ఆయన పేరే ఇద్రీస్ అలైహిస్సలాం.
ఇద్రీస్ అలైహిస్సలాం ఈజిప్ట్ (మసర్)దేశంలో జన్మించారని కొంతమంది చరిత్రకారులు తెలియజేశారు. మరి కొంతమంది చరిత్రకారులు ఏమంటున్నారంటే, లేదండీ, ఆయన బాబుల్, బాబిలోనియా నగరంలో జన్మించారు, ఆ తర్వాత వలస ప్రయాణం చేసి ఆయన మసర్, ఈజిప్ట్ కి చేరుకున్నారు అని తెలియజేశారు. ఏది ఏమైనాకి, ఏది ఏమైనప్పటికీ ఇద్రీస్ అలైహిస్సలాం వారు ఈజిప్ట్ దేశంలో, మసర్ దేశంలో నివసించారన్న విషయాన్ని చరిత్రకారులు తెలియజేశారు.
ఇద్రీస్ అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త పదవి ఇవ్వగా, ఇద్రీస్ అలైహిస్సలాం ఎవరైతే వ్యభిచారంలో ఊబిలో కూరుకుపోయి ఉన్నారో వారిని దైవ శిక్షల నుండి హెచ్చరించారు. దైవ నియమాలను తెలియజేశారు. పద్ధతి, సిగ్గు, లజ్జ, సంస్కారం అనే విషయాలు వారికి వివరించి తెలియజేశారు.
దైవ నియమాలకు ఎలా కట్టుబడి, ఎలా సౌశీల్యవంతులుగా జీవించుకోవాలన్న విషయాన్ని వారు వివరించి మరీ తెలియజేయగా చాలా తక్కువ మంది మాత్రమే తప్పును గ్రహించి, పశ్చాత్తాపపడి, తప్పును, నేరాన్ని ఒప్పుకొని అల్లాహ్ సమక్షంలో క్షమాభిక్ష వేడుకొని మళ్ళీ భక్తి వైపు వచ్చేశారు. కానీ అధిక శాతం ప్రజలు మాత్రము తమ తప్పుని అంగీకరించలేదు, తమ తప్పుని వారు అంగీకరించటం అంగీకరించకపోవడమే కాకుండా దానిని విడనాడలేదు, దానిని ఒక సాధారణమైన విషయంగా భావిస్తూ అలాగే జీవితం కొనసాగించడం ప్రారంభం చేశారు.
చాలా సంవత్సరాల వరకు ఇద్రీస్ అలైహిస్సలాం వారికి దైవ వాక్యాలు వినిపిస్తూ పోయారు, బోధిస్తూ పోయారు, తెలియజేస్తూ పోయారు కానీ ఫలితం లేకపోయేసరికి అల్లాహ్ ఆజ్ఞతో ఇద్రీస్ అలైహిస్సలాం తమ వద్ద ఉన్న విశ్వాసులను, దైవ భీతిపరులను, భక్తులను తీసుకొని, దైవ నియమాలను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్న వారి మీద యుద్ధం ప్రకటించారు.
మానవ చరిత్రలో, ఈ భూమండలం మీద అందరికంటే ముందు యుద్ధం ప్రారంభించిన ప్రవక్త ఇద్రీస్ అలైహిస్సలాం అని ధార్మిక పండితులు తెలియజేశారు. ఆ యుద్ధంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భక్తులకు, దైవ భీతిపరులకు సహాయం చేశాడు. అధర్మంగా, అన్యాయంగా, అసభ్యంగా జీవిస్తున్న వారు ఓడిపోయారు. వారు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.
మిత్రులారా, యుద్ధం చేసిన తర్వాత, పాపిష్ఠులు దైవ భక్తుల చేత శిక్షించబడిన తర్వాత ఇద్రీస్ అలైహిస్సలాం మళ్ళీ ప్రజలకు దైవ భీతి, నియమాలు నేర్పించుకుంటూ జీవితం కొనసాగించారు. ఆ విధంగా ప్రపంచంలో కొద్దిమంది దైవ భీతిపరులు మళ్ళీ దైవ భక్తిగా జీవిస్తూ ఉంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇద్రీస్ అలైహిస్సలాం ద్వారా వారికి మరిన్ని విషయాలు నేర్పించాడు.
మనం చూసినట్లయితే, ఇద్రీస్ అలైహిస్సలాం ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రపంచానికి కలం పరిచయం చేయించాడు. ఈ భూమండలం మీద, మానవ చరిత్రలో అందరికంటే ముందు కలం సృష్టించింది, ఉపయోగించింది ఇద్రీస్ అలైహిస్సలాం వారు అని చరిత్రకారులు తెలియజేశారు. అలాగే, బట్టలు కుట్టటము కూడా ఈ భూమండలం మీద అందరికంటే ముందు ఇద్రీస్ అలైహిస్సలాం వారే ప్రారంభించారు అని ధార్మిక పండితులు తెలియజేశారు. ఆ విధంగా ఇద్రీస్ అలైహిస్సలాం వారు ఉన్నంతవరకు జనులకు, మానవులకు అనేక విషయాలు నేర్పించారు, తెలియజేశారు, దైవ వాక్యాలు కూడా వినిపించుకుంటూ జీవితం ముందుకు కొనసాగించారు.
ఇద్రీస్ అలైహిస్సలాం వారి ప్రస్తావన ఖురాన్ లో రెండు చోట్ల వచ్చి ఉంది. ఒకటి సూరా అంబియా, 21వ అధ్యాయం, 85వ వాక్యంలో అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కొంతమంది ప్రవక్తల పేర్లను ప్రస్తావిస్తూ ఇద్రీస్ అలైహిస్సలాం వారి పేరు కూడా ప్రస్తావించాడు. పేరు ప్రస్తావన మాత్రమే అక్కడ జరిగింది. అయితే, రెండవ చోట ఖురాన్ లోని సూరా మర్యం, 19వ అధ్యాయం, 56, 57 వాక్యాలలో ఇద్రీస్ అలైహిస్సలాం వారి గురించి ప్రస్తావిస్తూ,
“ఇంకా ఈ గ్రంథంలో ఇద్రీసు గురించిన ప్రస్తావన కూడా చెయ్యి. అతను కూడా నిజాయితిపరుడైన ప్రవక్తే.మేమతన్ని ఉన్నత స్థానానికి లేపాము.” (19:56-57)
అని తెలియజేశాడు. .ఇక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రెండవ వాక్యంలో “వ రఫఅనాహు మకానన్ అలియ్యా” (మేము అతన్ని ఉన్నత స్థానానికి లేపాము) అని తెలియజేశాడు కదా, దాన్ని వివరిస్తూ కొంతమంది ఉల్లేఖకులు ఏమని తెలియజేశారంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇద్రీస్ అలైహిస్సలాం వారి కీర్తిని పెంచాడు అని తెలియజేశారు.
మరి కొన్ని ఉల్లేఖనాలలో ఏమని తెలపబడింది అంటే, ఇద్రీస్ అలైహిస్సలాం వారు మరణం సమీపించినప్పుడు, ఆయన మరణ సమయం సమీపించిందన్న విషయాన్ని తెలుసుకొని, ఒక దైవదూత వీపు ఎక్కి ఆకాశాల పైకి వెళ్ళిపోయారు. మొదటి ఆకాశం, రెండవ ఆకాశం, మూడవ ఆకాశం దాటుకుంటూ నాలుగవ ఆకాశంలోకి చేరుకుంటే అటువైపు నుంచి ప్రాణం తీసే దూత కూడా వస్తూ ఎదురయ్యాడు. అతను ఆ దూతతో అడిగాడు, “ఏమండీ, నేను ఇద్రీస్ అలైహిస్సలాం వారి ప్రాణాలు తీయటానికి వస్తున్నాను. నాకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇద్రీస్ అలైహిస్సలాం వారి ప్రాణాలు నాలుగవ ఆకాశం మీద తీయండి అని పురమాయించాడు. నాకు ఆశ్చర్యం కలిగింది, ఆయన భూమండలం మీద కదా నివసిస్తున్నాడు, అల్లాహ్ ఏంటి నాకు నాలుగవ ఆకాశం మీద ఆయన ప్రాణము తీయమని చెప్తున్నాడు అని నేను ఆశ్చర్యపోతూ వస్తున్నాను. ఇది ఎలా ఇది ఎలా సంభవిస్తుందండి? ఇది అసంభవం కదా, ఆయన భూమి మీద నివసిస్తున్నాడు, నాలుగో ఆకాశం మీద నేను ఆయన ప్రాణాలు ఎలా తీయగలను?” అని ఆ దూతతో అడిగితే అప్పుడు ఆ దూత అన్నాడు, “లేదండీ, అనుకోకుండా ఇద్రీస్ అలైహిస్సలాం వారు నేను ఆకాశాల పైకి వెళ్ళిపోతాను అంటూ నా వీపు మీద ఎక్కి వచ్చేసారు, చూడండి” అని చెప్పగా అప్పుడు ఆ దూత ఆయన ప్రాణాలు నాలుగవ ఆకాశం మీద తీశాడు అని కొన్ని ఉల్లేఖనాల్లో తెలపబడింది. అయితే చూస్తే ఈ ఉల్లేఖనాలన్నీ బలహీనమైనవి.కాబట్టి ఈ బలహీనమైన ఉల్లేఖనాలను మనము ఆధారంగా తీసుకోలేము. కాకపోతే ఈ బలహీనమైన విషయాలు ఎవరైనా ఎక్కడైనా బోధించవచ్చు, అది బలహీనమైన మాట అన్న విషయము మీ దృష్టికి నేను తీసుకురావాలని ఆ విషయాన్ని వివరించాను.
ఏది ఏమైనప్పటికిని, ఇద్రీస్ అలైహిస్సలాం వారి ఆయుష్షు పూర్తి అయిన తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనకు సహజ మరణమే ప్రసాదించాడు. ఆయన సహజంగానే మరణించారు.
అయితే, ఒక ప్రామాణికమైన ఉల్లేఖనం మనకు దొరుకుతుంది. అది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మే’రాజ్ యాత్ర చేసిన ఉల్లేఖనము. ఆ ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆకాశాల వైపు వెళ్ళినప్పుడు, మొదటి ఆకాశం మీద ఆదం అలైహిస్సలాం వారితో కలిశారు. రెండవ ఆకాశం మీద ఈసా అలైహిస్సలాం వారితో కలిశారు. మూడవ ఆకాశం మీద యూసుఫ్ అలైహిస్సలాం వారితో కలిశారు. నాలుగవ ఆకాశం మీద ఇద్రీస్ అలైహిస్సలాం తో ఆయన కలిశారు. ఇది మాత్రం ప్రామాణికమైన హదీసులలో తెలపబడి ఉంది.
ఆ విధంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కొంతమంది ప్రవక్తలను ఆకాశాల మీద ఉంచి ఉన్నాడో, వారిలో ఇద్రీస్ అలైహిస్సలాం నాలుగవ ఆకాశం మీద ఉన్నారన్న విషయాన్ని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మే’రాజ్ యాత్ర నుండి వచ్చిన తర్వాత తెలియజేశారు. కాబట్టి ఇద్రీస్ అలైహిస్సలాం ఎంతో కీర్తి పొందిన, ఉన్నతమైన, గొప్ప ప్రవక్త అన్న విషయము మనము ఈ వాక్యము ద్వారా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనం ద్వారా తెలుసుకున్నాము.
ఇక్కడ మరొక విషయం నేను చర్చించి నా మాటను ముగిస్తాను, అదేమిటంటే ఇద్రీస్ అలైహిస్సలాం వారి జీవితంలో, ఇద్రీస్ అలైహిస్సలాం మొదటిసారి కలం ప్రవేశపెట్టినా, ఇద్రీస్ అలైహిస్సలాం మొదటిసారి బట్టలు కుట్టి ప్రజలకు తొడిగించినా, ఇద్రీస్ అలైహిస్సలాం దైవ మార్గంలో మొదటిసారి యుద్ధము చేసినా ఆ యుద్ధంలో ఆయన పొందిన మాలె గనీమత్ (యుద్ధంలో లభించిన సొత్తు) ఆ రోజుల్లో మాత్రం అది ధర్మసమ్మతము కాదు.
ఏ ప్రవక్త జీవితంలో కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మాలె గనీమత్ ని ధర్మసమ్మతము చేయలేదు. కేవలం అంతిమ ప్రవక్త, చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శాసనంలో మాత్రమే మాలె గనీమత్ ని ధర్మసమ్మతం చేశాడు. అందుకోసమే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, “ఇతర ప్రవక్తల మీద నాకు కొన్ని విషయాల ద్వారా ఆధిక్యత ప్రసాదించబడింది, అందులో ఒక విషయం ఏమిటంటే, వ ఉహిల్లత్ లి అల్ గనాయిమ్ (నా కొరకు మాలె గనీమత్ ధర్మసమ్మతం చేయబడింది)” అని తెలిపారు.
మరి ఆ రోజుల్లో వారికి యుద్ధము తర్వాత దొరికిన సొమ్ముని వారు ఏం చేసేవారో అని ప్రశ్న కూడా రావచ్చు. దాన్ని కొన్ని ఉల్లేఖనాల ద్వారా చరిత్రకారులు ముఖ్యంగా ధార్మిక పండితులు తెలియజేసిన విషయం ఏమిటంటే, ఆ రోజుల్లో యుద్ధం ముగిసిన తర్వాత దొరికిన సొమ్ము అది ఒకచోట తీసుకొని వెళ్లి ఉంచితే ఆకాశము నుండి అగ్ని వచ్చి ఆ సొమ్ము మొత్తాన్ని కాల్చేసేది. ఆ సొమ్ము ఎవరికీ ధర్మసమ్మతము కాదు అని ఆ రోజుల్లో నియమ నిబంధనలు ఉండేవి అని తెలపబడింది.
నేర్చుకోవలసిన పాఠాలు
అయితే మిత్రులారా, ఇద్రీస్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర ద్వారా మనం గ్రహించాల్సిన కొన్ని పాఠాలు ఏమిటి?
మొదటి పాఠం ఏమిటంటే, షైతాన్ మానవుని బహిరంగ శత్రువు. మానవులకు షైతాను ఎప్పటికీ స్నేహితుడు కాజాలడు. అయితే కొంతమంది మాత్రము అతన్ని స్నేహితులుగా చేసుకుంటున్నారు. వారు ఎవరంటే, ఎవరైతే దైవ భీతికి దూరమైపోతున్నారో వారు మాత్రమే షైతాన్ని స్నేహితులుగా చేసుకుంటున్నారు. మరి షైతాన్ కోరుకుంటుంది ఏమిటి? షైతాను మానవులను ఎలాగైనా సరే తప్పులు చేయించి వారికి శిక్షార్హులుగా మార్చేసి నరకానికి తీసుకెళ్ళి నెట్టేయాలన్నది షైతాన్ యొక్క ప్రయత్నం.
రెండవ విషయం ఏమిటంటే, సంగీతం, మ్యూజిక్ ఇది అల్లాహ్ కు నచ్చిన విషయము కాదు. అల్లాహ్ ఇష్టపడడు. షైతానుకు నచ్చిన విషయము. కాబట్టి ఇస్లాం ధర్మం ప్రకారంగా మ్యూజిక్ నిషేధం, అధర్మమైనది. అల్లాహ్ కు నచ్చనిది. ఎవరైతే మ్యూజిక్ కి ఇష్టపడతారో వారిలో అధిక శాతం ప్రజలు, పురుషులైనా సరే, మహిళలైనా సరే, అక్రమ సంబంధానికి పాల్పడి ఉంటారు. గమనించి చూసుకోండి. అనేక సర్వేలు ఈ విషయాలు తెలియజేస్తున్నాయి.
కాబట్టి షైతాన్ మానవులలో సిగ్గు, లజ్జ, మానం అనేది దూరమైపోయి, అసభ్యత, అశ్లీలత పెరిగిపోవాలని కోరుకుంటాడు కాబట్టి మ్యూజిక్ ని ఆసరాగా చేసుకొని అతను ప్రజల్ని వ్యభిచారంలోకి నెట్టేస్తాడు. వ్యభిచారం నిషేధం, వ్యభిచారం దరిదాపులకు కూడా వెళ్ళకూడదు. ఈ మ్యూజిక్ వ్యభిచారం దరిదాపులకు తీసుకువెళ్తున్న ఒక సాధనం కాబట్టి వ్యభిచారానికి దూరంగా ఉండమని మనకు తెలపబడింది, మరియు వ్యభిచారానికి దగ్గరగా తీసుకుని వెళ్ళే విషయాలకు కూడా దూరంగా ఉండండి అని మనకు తెలపబడింది. “వలా తక్రబుజ్జినా” (వ్యభిచారం దరిదాపులకు వెళ్ళకండి) అని కూడా చెప్పబడింది.
అలాగే, మనం తెలుసుకోవలసిన మరొక విషయం ఏమిటంటే, ఒక పరాయి పురుషుడు, ఒక పరాయి స్త్రీ ఏకంగా ఒకచోట ఉండరాదు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, మీలో ఇద్దరు, పరాయి పురుషుడు, పరాయి మహిళ ఒకచోట ఉంటే అక్కడ మూడవ వాడు షైతాన్ ప్రవేశిస్తాడు. అతని మదిలో కూడా చెడు భావన, ఈమె మదిలో కూడా చెడు ఆలోచనలు రేకెత్తిస్తాడు. కాబట్టి అలా ఒకచోట ఉండటం ధర్మసమ్మతము కాదు.
దీనికి ఉదాహరణగా మనం చూసినట్లయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో జరిగిన ఒక సంఘటన. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక రోజు మస్జిద్ బయట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణితో మాట్లాడుతూ ఉన్నారు. అంతలోనే ఓ ఇద్దరు సహాబీలు, సహచరులు అటువైపు నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. వెంటనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిద్దరిని పిలిచారు. పిలిచి, “ఏమండీ, నేను ఇక్కడ మాట్లాడుతున్నది ఈవిడ నా సతీమణి” అని తెలియజేశారు. అది విని వారికి ఆశ్చర్యం కలిగింది, “ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీరేంటి మాకు సంజాయిషీ ఇచ్చుకుంటున్నారు? మేము మీ మీద అనుమానం చేస్తామని మీకు అనిపిస్తూ ఉందా? మేము మీ మీద ఎందుకు అనుమానం చేస్తామండి?” అన్నారు.
దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, “షైతాను ప్రతి మనిషి శరీరంలో నర నరాల్లో ప్రవహిస్తూ ఉంటాడు కాబట్టి, ఒకవేళ అతను మీలో ఏమైనా ఇలాంటి అనుమానం రేకెత్తిస్తాడేమోనన్న కారణంగా నేను ఆ అనుమానం మీలో రాకుడదని ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను” అని తెలియజేశారు.
అంటే, మనిషి నరనరాల్లో షైతాను ప్రవహిస్తూ ఉంటాడు, కోరికలను రెచ్చగొడతాడు, అనుమానాలు పుట్టిస్తూ ఉంటాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏకాంతంలో అక్కడ ఒక మహిళతో మాట్లాడుతున్నారు కదా అన్న భావన వాటిలో కలిగిస్తాడు. కాబట్టి వెంటనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, “ఈమె పరాయి మహిళ కాదు, ఈమె నా సతీమణి” అని వివరించారు.
ఇక చివరిగా నేను అల్లాహ్ తో దుఆ చేస్తున్నాను. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ ప్రవక్తల జీవితాలను ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ, ఆ ప్రవక్తల జీవితాల ద్వారా మనకు బోధపడే విషయాలను కూడా మనము నేర్చుకుంటూ, మన విశ్వాసాన్ని పెంచుకుంటూ, అల్లాహ్ మీద పూర్తి నమ్మకంతో, భక్తి శ్రద్ధలతో జీవితం గడిపే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక. ఆమీన్.
వ జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
“మీలో ఎవ్వరూ మీ సోదరుని వైపు ఆయుధం ఎక్కుపెట్టరాదు.బహుశా షైతాని అతని చేయిని ఝుళిపించవచ్చు. ఇంకా, అది నరక కూపంలోపడిపోవచ్చు.”(ముస్లిం)
తాత్పర్యం
ఈ హదీనులో ముస్లిం హక్కుల గురించి నొక్కి పలకడం జరిగింది. ఏ ముస్లిమునైనా భయపెట్టడం, కలవరానికి గురిచెయ్యడం, లేదా అతను నొచ్చుకునేలా వ్యవహరించడం పట్ల వారించ బడింది.
“మీ సోదరుని వైపు ఆయుధాన్ని ఎక్కు పెట్టరాదు.” ఇక్కడ సోదరుడంటే ముస్లిం అన్నమాట. ముస్లిములు పరస్పరం అన్నదమ్ములు. అల్లాహ్ సెలవిచ్చాడు :”ఇన్నమల్ మోమినీన ఇఖ్వ” (విశ్వాసులు పరస్పరం సోదరులు). ఆటపాటల్లో, పరాచి కానికయినా భయపెట్టే సంకల్పంతో కరవాలాన్ని, ఖడ్గాన్ని, లేక మరే ప్రమాదకరమైన ఆయుధాన్నయినా లేపటం హరాం (నిషిద్ధం).
“షైతాన్ అతని చేయిని ఝుళిపించవచ్చు” అంటే చేయి జారినా చేయి విసిరినా చేతిలోని ఆయుధానికి ఎదుటి వ్యక్తి గురికావచ్చు. ఇది ఘోర అన్యాయం అవుతుంది.ఒక ముస్లింను అకారణంగా చంపిన కారణంగా ఇతను నరకాగ్నికి ఆహుతి అవుతాడు.ఎందుకంటే అన్యాయంగా, అధర్మంగా ఏ ముస్లిమునైనా వధించటం మహాపాతకం.
అల్లాహ్ సెలవిచ్చాడు :
“ఉద్దేశ్యపూర్వకంగా ఎవడైతే ఒక విశ్వసించిన వాణ్ణి చంపుతాడో అతనికి బహుమానం నరకం. అందులో అతడు సదా ఉంటాడు. అతనిపై అల్లాహ్ ఆగ్రహం మరియు శాపం అవతరిస్తాయి. అల్లాహ్ అతడి కొరకు కఠినమయిన శిక్షను సిద్ధపరచి ఉంచాడు.(అన్ నిసా: 93)
ఏ ముస్లిం హత్యకయినా, గాయాని కయినా కారణభూతమయ్యే ప్రతి విధానాన్ని, ధోరణిని మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) నిషేధంగా (హరామ్)గా ఖరారు చేసినట్లు అసంఖ్యాకమయిన హదీసుల ద్వారా విదితమవుతోంది.
హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ఒకటి ఇలా ఉంది :
“ఎప్పుడయినా ఏ ముస్లిం అయినా మరో ముస్లిం వైపునకు ఇనుప ముక్కతో సంజ్ఞ చేస్తే దైవదూతలు అతన్ని శపిస్తారు – ఒకవేళ అతను సంజ్ఞ చేసిన వ్యక్తి అతని తోబుట్టువు అయినాసరే.”
ఇబ్నుల్ అరబీ ఏమంటున్నారో చూడండి – ‘కేవలం ఇనుప ముక్కతో సంజ్ఞ చేసినమాత్రానికే అతను శాపగ్రస్తుడయితే, ఇక ఆ ఇనుపముక్కతో ఎదుటి ముస్లింపైదాడి జరిపితే, అప్పుడతని పర్యవసానం ఇంకెంత ఘోరంగా ఉంటుందో?’
వేళాకోళంగానే అయినా ఆయుధంతో సైగ చేసిన వ్యక్తి ధూత్కారిగా పరిగణించబడటానికి కారణమేమంటే, అతని, ఈ చేష్ట మూలంగా ఎదుటి వ్యక్తి భయాందోళనకు గురయ్యాడు. అదే ఒకవేళ అతను నిజంగానే ఎదుటి వ్యక్తికి కీడు తలపెట్టే ఉద్దేశ్యంతో చేస్తే అది మహాపరాధమే అవుతుంది. అందుకే ఒరలేని (నగ్న) ఖడ్గాలు ఇచ్చిపుచ్చుకోరాదని అనబడింది. అలా ఇచ్చిపుచ్చు కొంటున్నప్పుడు ఏమరుపాటు వల్ల ఖడ్గం చేజారి పోయి హాని కలిగే ప్రమాదముంది.
జాబిర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక బృందం వైపుగా వెళుతుండగా, వారు ఒరలేని ఖడ్గాలను మార్పిడి చేసుకుంటూ కనిపించారు. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని ఇలా మందలించారు- “ఇలాంటి చేష్ట చేయరాదని నేను మీకు చెప్పలేదా? మీలో ఎవరయినా ఖడ్గాలుమార్చుకుంటున్నప్పుడు ఒరలో పెట్టి మరీ ఇవ్వాలి.” (అహ్మద్, బజార్)
నేటి ఆధునిక కాలంలో ఎవరయినా వేళాకోళానికయినా సరే – రివాల్వర్ను ఎదుటివారికి గురిపెట్టడం, గుళ్లు నింపిన రివాల్వర్తో అనుభవం లేకుండా ప్రాక్టీసు చేయటం కూడా హదీసులో ప్రస్తావించబడిన ఖడ్గాల మార్పిడిలాంటిదే.ముక్తసరిగా హదీసు సారాంశం ఏమంటే ప్రతి ముస్లిం ప్రాణం అత్యంత విలువైనది, గౌరవప్రదమైనది. కాబట్టి అకారణంగా, అన్యాయంగా ఒక ప్రాణానికి హాని తలపెట్టడం దైవ సమక్షంలో పెద్ద నేరం అవుతుంది. అటువంటి వారి నుండి ప్రళయ దినాన కఠినంగా లెక్క తీసుకోవటం జరుగుతుంది.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.