సూర అల్ హాఖ్ఖ తఫ్సీర్ – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2AXotEM112kIXsGz4Z7atA
69:1 الْحَاقَّةُ
జరిగి తీరేది.
69:2 مَا الْحَاقَّةُ
ఏమిటా జరిగి తీరేది?
69:3 وَمَا أَدْرَاكَ مَا الْحَاقَّةُ
ఆ జరిగి తీరే దాని గురించి నీకేం తెలుసు?
69:4 كَذَّبَتْ ثَمُودُ وَعَادٌ بِالْقَارِعَةِ
తట్టేటటువంటి విపత్తును సమూదు, ఆదు జనులు ధిక్కరించారు.
69:5 فَأَمَّا ثَمُودُ فَأُهْلِكُوا بِالطَّاغِيَةِ
(పర్యవసానంగా) సమూదు వారు అత్యంత భయంకరమైన కేక ద్వారా అంత మొందించబడ్డారు.
69:6 وَأَمَّا عَادٌ فَأُهْلِكُوا بِرِيحٍ صَرْصَرٍ عَاتِيَةٍ
ఆదు వారు ప్రచండమైన పెనుగాలుల ద్వారా నాశనం చేయబడ్డారు.
69:7 سَخَّرَهَا عَلَيْهِمْ سَبْعَ لَيَالٍ وَثَمَانِيَةَ أَيَّامٍ حُسُومًا فَتَرَى الْقَوْمَ فِيهَا صَرْعَىٰ كَأَنَّهُمْ أَعْجَازُ نَخْلٍ خَاوِيَةٍ
వాటిని అల్లాహ్ వారిపై నిరంతరం ఏడు రాత్రులు , ఎనిమిది పగళ్ళు విధించాడు. (నీవు గనక అక్కడ ఉండి ఉంటే) వారు అక్కడ బోసిపోయిన ఖర్జూరపు బొద్దులవలే నేలకొరిగి పడి ఉండటం చూసేవాడివి.
69:8 فَهَلْ تَرَىٰ لَهُم مِّن بَاقِيَةٍ
మరి వారిలో ఎవడైనా మిగిలి ఉన్నట్లు నీకు కనిపిస్తున్నాడా?
69:9 وَجَاءَ فِرْعَوْنُ وَمَن قَبْلَهُ وَالْمُؤْتَفِكَاتُ بِالْخَاطِئَةِ
ఫిరౌను, అతనికి పూర్వం గతించినవారు, తలక్రిందులుగా చేయబడిన పట్టణాలవారు కూడా పాపాలకు ఒడిగట్టారు.
69:10 فَعَصَوْا رَسُولَ رَبِّهِمْ فَأَخَذَهُمْ أَخْذَةً رَّابِيَةً
వారు తమ ప్రభువు పంపిన ప్రవక్త(ల)ను ఎదిరించారు. అందువల్ల అల్లాహ్ వాళ్ళను (కూడా) చాలా గట్టిగా పట్టుకున్నాడు.
69:11 إِنَّا لَمَّا طَغَى الْمَاءُ حَمَلْنَاكُمْ فِي الْجَارِيَةِ
నీళ్ళ ఉధృతి పెరిగిపోయినప్పుడు మేము మిమ్మల్ని నావలోకి ఎక్కించాము.
69:12 لِنَجْعَلَهَا لَكُمْ تَذْكِرَةً وَتَعِيَهَا أُذُنٌ وَاعِيَةٌ
దీనిని మీకొక హితబోధగా, జ్ఞాపికగా చేయటానికి, విని జ్ఞాపకముంచుకునే చెవులు దీనిని (ఎల్లకాలం) జ్ఞాపకముంచుకునేందుకు (ఈ విధంగా చేశాము).
69:13 فَإِذَا نُفِخَ فِي الصُّورِ نَفْخَةٌ وَاحِدَةٌ
మరి శంఖం ఒకసారి పూరించబడినప్పుడు,
69:14 وَحُمِلَتِ الْأَرْضُ وَالْجِبَالُ فَدُكَّتَا دَكَّةً وَاحِدَةً
భూమిని, పర్వతాలను ఎత్తి, ఒకే ఒక దెబ్బకు తుత్తునియలుగా చేసి వేయబడినప్పుడు,
69:15 فَيَوْمَئِذٍ وَقَعَتِ الْوَاقِعَةُ
ఆ రోజు జరగవలసిన సంఘటన నిజంగానే జరుగుతుంది.
69:16 وَانشَقَّتِ السَّمَاءُ فَهِيَ يَوْمَئِذٍ وَاهِيَةٌ
అప్పుడు ఆకాశం బ్రద్దలైపోతుంది. మరి ఆ రోజు అది పట్టు సడలిపోతుంది.
69:17 وَالْمَلَكُ عَلَىٰ أَرْجَائِهَا ۚ وَيَحْمِلُ عَرْشَ رَبِّكَ فَوْقَهُمْ يَوْمَئِذٍ ثَمَانِيَةٌ
దైవదూతలు దాని అంచులపై ఉంటారు. ఆ రోజు నీ ప్రభువు సింహాసనాన్ని ఎనమండుగురు (దైవదూతలు) తమపై ఎత్తుకుని ఉంటారు.
69:18 يَوْمَئِذٍ تُعْرَضُونَ لَا تَخْفَىٰ مِنكُمْ خَافِيَةٌ
ఆనాడు మీరందరూ (దైవసన్నిధిలో) హాజరుపరచబడతారు. మీ రహస్యమేదీ దాగి ఉండదు.
69:19 فَأَمَّا مَنْ أُوتِيَ كِتَابَهُ بِيَمِينِهِ فَيَقُولُ هَاؤُمُ اقْرَءُوا كِتَابِيَهْ
మరి ఎవరి కర్మల పత్రం అతని కుడి చేతికి ఇవ్వబడుతుందో అతనంటాడు : “ఇదిగో, నా కర్మల పత్రాన్ని చదవండి.”
69:20 إِنِّي ظَنَنتُ أَنِّي مُلَاقٍ حِسَابِيَهْ
“నాకు నా లెక్క లభించనున్నదన్న గట్టి నమ్మకం నాకుండేది.”
69:21 فَهُوَ فِي عِيشَةٍ رَّاضِيَةٍ
మరి అతను మనసు మెచ్చిన భోగ జీవితం గడుపుతూ ఉంటాడు.
69:22 فِي جَنَّةٍ عَالِيَةٍ
ఉన్నతమైన స్వర్గ వనంలో!
69:23 قُطُوفُهَا دَانِيَةٌ
దాని పండ్లు అతి సమీపంలో వ్రేలాడుతూ ఉంటాయి.
69:24 كُلُوا وَاشْرَبُوا هَنِيئًا بِمَا أَسْلَفْتُمْ فِي الْأَيَّامِ الْخَالِيَةِ
“గత కాలంలో మీరు చేసుకున్న కర్మలకు ప్రతిఫలంగా హాయిగా తినండి, త్రాగండి” (అని వారితో అనబడుతుంది).
69:25 وَأَمَّا مَنْ أُوتِيَ كِتَابَهُ بِشِمَالِهِ فَيَقُولُ يَا لَيْتَنِي لَمْ أُوتَ كِتَابِيَهْ
ఇక ఎవరి కర్మల చిట్టా అతని ఎడమ చేతికి ఇవ్వబడుతుందో అతను ఇలా అంటాడు: “అయ్యో! నా కర్మల పత్రం నాకివ్వబడకుండా ఉంటే….
69:26 وَلَمْ أَدْرِ مَا حِسَابِيَهْ
“నా లెక్కేమిటో నాకసలు తెలియకుండా ఉంటే ఎంత బావుండేది!
69:27 يَا لَيْتَهَا كَانَتِ الْقَاضِيَةَ
“అయ్యో! ఆ చావే (నా వ్యవహారాన్ని) తేల్చేసి ఉంటే బాగుండేదే!
69:28 مَا أَغْنَىٰ عَنِّي مَالِيَهْ ۜ
“నా ధనం నాకేమాత్రం అక్కరకు రాలేదు.
69:29 هَلَكَ عَنِّي سُلْطَانِيَهْ
“నా అధికారం కూడా నా నుండి చేజారిపోయిందే!” (అని బాధపడతాడు).
69:30 خُذُوهُ فَغُلُّوهُ
(అప్పుడిలా ఆదేశించబడుతుంది) “పట్టుకోండి వాణ్ణి. వాడికి (మెడలో) గుదిబండ వేయండి.
69:31 ثُمَّ الْجَحِيمَ صَلُّوهُ
“మరి వాణ్ణి నరకంలోకి త్రోసివేయండి.
69:32 ثُمَّ فِي سِلْسِلَةٍ ذَرْعُهَا سَبْعُونَ ذِرَاعًا فَاسْلُكُوهُ
“మరి వాణ్ణి డెభ్భై మూరల పొడవు గల సంకెళ్ళతో బిగించి కట్టండి.
69:33 إِنَّهُ كَانَ لَا يُؤْمِنُ بِاللَّهِ الْعَظِيمِ
“వాడు మహోన్నతుడైన అల్లాహ్ ను విశ్వసించేవాడూ కాదు,
69:34 وَلَا يَحُضُّ عَلَىٰ طَعَامِ الْمِسْكِينِ
“నిరుపేదకు అన్నం పెట్టమని (కనీసం) ప్రోత్సహించేవాడూ కాదు.
69:35 فَلَيْسَ لَهُ الْيَوْمَ هَاهُنَا حَمِيمٌ
“కాబట్టి ఈ రోజు ఇక్కడ వీడి (స్థితిపై సానుభూతి చూపే) స్నేహితుడెవడూ లేడు.
69:36 وَلَا طَعَامٌ إِلَّا مِنْ غِسْلِينٍ
“గాయాల కడుగు నీరు తప్ప మరొకటేదీ వీడికి ఆహారంగా లభించదు.
69:37 لَّا يَأْكُلُهُ إِلَّا الْخَاطِئُونَ
“దానిని పాపాత్ములు తప్ప వేరెవరూ తినరు.”
69:38 فَلَا أُقْسِمُ بِمَا تُبْصِرُونَ
మరి మీరు చూచే వాటిపై నేను ప్రమాణం చేస్తున్నాను.
69:39 وَمَا لَا تُبْصِرُونَ
ఇంకా మీరు చూడలేని వాటిపై కూడా.
69:40 إِنَّهُ لَقَوْلُ رَسُولٍ كَرِيمٍ
నిశ్చయంగా ఇది (ఈ ఖుర్ఆన్) గౌరవనీయుడైన సందేశహరుడు తెచ్చిన (దైవ) వాక్కు.
69:41 وَمَا هُوَ بِقَوْلِ شَاعِرٍ ۚ قَلِيلًا مَّا تُؤْمِنُونَ
ఏ కవి పుంగవుడో పలికిన మాట కానే కాదు. మీరు విశ్వసించేది చాలా తక్కువ.
69:42 وَلَا بِقَوْلِ كَاهِنٍ ۚ قَلِيلًا مَّا تَذَكَّرُونَ
ఇది ఏ జ్యోతిష్యుని పలుకో అంతకన్నా కాదు. మీరు హితబోధను గ్రహించేది బహుస్వల్పం.
69:43 تَنزِيلٌ مِّن رَّبِّ الْعَالَمِينَ
నిజానికి సకల లోకాల ప్రభువు తరఫున అవతరించింది.
69:44 وَلَوْ تَقَوَّلَ عَلَيْنَا بَعْضَ الْأَقَاوِيلِ
ఒకవేళ ఇతను (ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం) గనక ఏదైనా విషయాన్ని కల్పించి మాకు ఆపాదించి ఉంటే,
69:45 لَأَخَذْنَا مِنْهُ بِالْيَمِينِ
మేమితని కుడి చెయ్యిని పట్టుకుని ఉండేవారం.
69:46 ثُمَّ لَقَطَعْنَا مِنْهُ الْوَتِينَ
మరి ఇతని కంఠనాళాన్ని కోసివేసేవారం.
69:47 فَمَا مِنكُم مِّنْ أَحَدٍ عَنْهُ حَاجِزِينَ
మరి మీలో ఎవరూ నన్ను ఈ పని చేయకుండా ఆపగలిగేవారు కాదు.
69:48 وَإِنَّهُ لَتَذْكِرَةٌ لِّلْمُتَّقِينَ
నిశ్చయంగా ఈ ఖుర్ఆన్ (అల్లాహ్ పట్ల) భయభక్తులు గలవారికి హితబోధిని.
69:49 وَإِنَّا لَنَعْلَمُ أَنَّ مِنكُم مُّكَذِّبِينَ
మీలో కొందరు ధిక్కరించేవారున్నారని మాకు బాగా తెలుసు.
69:50 وَإِنَّهُ لَحَسْرَةٌ عَلَى الْكَافِرِينَ
నిశ్చయంగా ఇది (ఈ ధిక్కారవైఖరి) అవిశ్వాసులను బాధపడేలా చేస్తుంది.
69:51 وَإِنَّهُ لَحَقُّ الْيَقِينِ
నిశ్చయంగా ఇది తిరుగులేని సత్యం.
69:52 فَسَبِّحْ بِاسْمِ رَبِّكَ الْعَظِيمِ
కనుక (ఓ ప్రవక్తా!) నీవు మహోన్నతుడైన నీ ప్రభువు నామం పవిత్రతను కొనియాడు.