1. సూరా అల్ ఫాతిహా
1:1 بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ
అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతొ
1:2 الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
ప్రశంసలు, పొగడ్తలన్నీ అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయి. ఆయన సమస్త లోకాలకు పోషకుడు,
1:3 الرَّحْمَٰنِ الرَّحِيمِ
అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడు.
1:4 مَالِكِ يَوْمِ الدِّينِ
ప్రతిఫల దినానికి (అంటే ప్రళయ దినానికి) యజమాని.
1:5 إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ
మేము నిన్నే ఆరాధిస్తున్నాము, సహాయం కోసం నిన్ను మాత్రమే అర్ధిస్తున్నాము.
1:6 اهْدِنَا الصِّرَاطَ الْمُسْتَقِيمَ
మాకు రుజుమార్గం (సన్మార్గం) చూపించు.
1:7 صِرَاطَ الَّذِينَ أَنْعَمْتَ عَلَيْهِمْ غَيْرِ الْمَغْضُوبِ عَلَيْهِمْ وَلَا الضَّالِّينَ
నీవు అనుగ్రహించిన వారి మార్గం, నీ ఆగ్రహానికి గురికాని వారి, అపమార్గానికి లోనుకాని వారి మార్గం (చూపు).
2.సూరా అల్ బఖర
2:1 الم
అలిఫ్ లామ్ మీమ్.
2:2 ذَٰلِكَ الْكِتَابُ لَا رَيْبَ ۛ فِيهِ ۛ هُدًى لِّلْمُتَّقِينَ
ఈ గ్రంథం (అల్లాహ్ గ్రంథం అన్న విషయం) లో ఎంతమాత్రం సందేహం లేదు. భయభక్తులు కలవారికి ఇది సన్మార్గం చూపుతుంది.
2:3 الَّذِينَ يُؤْمِنُونَ بِالْغَيْبِ وَيُقِيمُونَ الصَّلَاةَ وَمِمَّا رزَقْنَاهُمْ يُنفِقُونَ
వారు గోప్యమైన విషయాలను విశ్వసిస్తారు, నమాజును నెలకొల్పుతారు. ఇంకా మేము ప్రసాదించిన దానిలో (సంపదలో) నుంచి ఖర్చుపెడతారు.
2:4 وَالَّذِينَ يُؤْمِنُونَ بِمَا أُنزِلَ إِلَيْكَ وَمَا أُنزِلَ مِن قَبْلِكَ وَبِالْآخِرَةِ هُمْ يُوقِنُونَ
మేము నీ వైపుకు (అంటే ప్రవక్త వైపుకు) అవతరింపజేసిన దానినీ, నీకు పూర్వం అవతరింపజేసిన వాటినీ వారు విశ్వసి స్తారు. పరలోకం పట్ల కూడా వారు దృఢనమ్మకం కలిగిఉంటారు.
2:5 أُولَٰئِكَ عَلَىٰ هُدًى مِّن رَّبِّهِمْ ۖ وَأُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ
ఇలాంటి వారే తమ ప్రభువు తరఫు నుంచి వచ్చిన సన్మార్గాన ఉన్నారు. సాఫల్యాన్ని పొందేవారు వీరే.
2:6 إِنَّ الَّذِينَ كَفَرُوا سَوَاءٌ عَلَيْهِمْ أَأَنذَرْتَهُمْ أَمْ لَمْ تُنذِرْهُمْ لَا يُؤْمِنُونَ
అవిశ్వాసులను నీవు భయపెట్టినా, భయపెట్టకపోయినా ఒకటే. ఇక వారు విశ్వసించరు.
2:7 خَتَمَ اللَّهُ عَلَىٰ قُلُوبِهِمْ وَعَلَىٰ سَمْعِهِمْ ۖ وَعَلَىٰ أَبْصَارِهِمْ غِشَاوَةٌ ۖ وَلَهُمْ عَذَابٌ عَظِيمٌ
అల్లాహ్ వారి హృదయాలపై,వారి చెవులపై ముద్రవేశాడు. వారి కళ్ళపై పొరవుంది. ఇంకా వారికి మహా (ఘోరమైన) శిక్ష వుంది.
2:8 وَمِنَ النَّاسِ مَن يَقُولُ آمَنَّا بِاللَّهِ وَبِالْيَوْمِ الْآخِرِ وَمَا هُم بِمُؤْمِنِينَ
మేము అల్లాహ్ పట్ల, అంతిమదినం పట్ల విశ్వాసం కలిగి ఉన్నామని కొందరంటున్నారు. కాని యదార్థానికి వారు విశ్వసించినవారు కారు.
2:9 يُخَادِعُونَ اللَّهَ وَالَّذِينَ آمَنُوا وَمَا يَخْدَعُونَ إِلَّا أَنفُسَهُمْ وَمَا يَشْعُرُونَ
వారు అల్లాహ్‌ను, విశ్వాసులనూ మోసపుచ్చుతున్నారు. అయితే వాస్తవానికి వారు స్వయంగా – తమను తామే మోసపుచ్చుకుంటున్నారు. కాని ఈ విషయాన్ని వారు గ్రహించటం లేదు.
2:10 فِي قُلُوبِهِم مَّرَضٌ فَزَادَهُمُ اللَّهُ مَرَضًا ۖ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ بِمَا كَانُوا يَكْذِبُونَ
వారి హృదయాలలో రోగం ఉంది. ఆ రోగాన్ని అల్లాహ్ మరింతగా పెంచాడు. ఇంకా, వారు చెప్పే అబద్ధం మూలంగా వారి కొరకు వ్యధాభరితమయిన శిక్ష ఉంది.
2:11 وَإِذَا قِيلَ لَهُمْ لَا تُفْسِدُوا فِي الْأَرْضِ قَالُوا إِنَّمَا نَحْنُ مُصْلِحُونَ
“భూమిలో కల్లోలాన్ని రేకెత్తించకండి” అని వారితో అన్నప్పుడల్లా, “మేము దిద్దుబాటుకు ప్రయత్నించేవారం మాత్రమే” అని వారు సమాధానమిస్తారు.
2:12 أَلَا إِنَّهُمْ هُمُ الْمُفْسِدُونَ وَلَٰكِن لَّا يَشْعُرُو
జాగ్రత్త! నిజానికి కల్లోల జనకులు వీరే. కాని వారికి ఆ విషయం తెలియటం లేదు.
2:13 وَإِذَا قِيلَ لَهُمْ آمِنُوا كَمَا آمَنَ النَّاسُ قَالُوا أَنُؤْمِنُ كَمَا آمَنَ السُّفَهَاءُ ۗ أَلَا إِنَّهُمْ هُمُ السُّفَهَاءُ وَلَٰكِن لَّا يَعْلَمُونَ
“ఇతరులు (అంటే ప్రవక్త ప్రియ సహచరులు) విశ్వసించినట్లే మీరూ విశ్వసించండి” అని వారితో చెప్పినప్పుడు, “మూర్ఖ జనులు విశ్వసించినట్లుగా మేము విశ్వసించాలా?” అని వారు (ఎదురు) ప్రశ్న వేస్తారు. తస్మాత్! ముమ్మాటికీ వీరే మూర్ఖులు. కాని ఆ సంగతి వీరికి తెలియటం లేదు.
2:14 وَإِذَا لَقُوا الَّذِينَ آمَنُوا قَالُوا آمَنَّا وَإِذَا خَلَوْا إِلَىٰ شَيَاطِينِهِمْ قَالُوا إِنَّا مَعَكُمْ إِنَّمَا نَحْنُ مُسْتَهْزِئُونَ
విశ్వాసులను కలుసుకున్నప్పుడు వారు,”మేమూ విశ్వసించిన వారమే” అని అంటారు. కాని తమ షైతానుల (అంటే తమ పెద్దల లేక సర్దారుల) వద్దకు పోయినప్పుడు, “మేము మీతోనే ఉన్నామండీ. కాకపోతే వాళ్ళతో పరిహాసమాడుతున్నామంతే” అని పలుకుతారు.
2:15 اللَّهُ يَسْتَهْزِئُ بِهِمْ وَيَمُدُّهُمْ فِي طُغْيَانِهِمْ يَعْمَهُونَ
అల్లాహ్ కూడా వారితో పరిహాసమాడుతున్నాడు. వారి తలబిరుసుతనాన్ని మరింత అధికం చేస్తున్నాడు. ఫలితంగా వారు అంధులై గమ్యరహితంగా తిరుగుతూపోతున్నారు.
2:16 أُولَٰئِكَ الَّذِينَ اشْتَرَوُا الضَّلَالَةَ بِالْهُدَىٰ فَمَا رَبِحَت تِّجَارَتُهُمْ وَمَا كَانُوا مُهْتَدِينَ
అపమార్గాన్ని సన్మార్గానికి బదులుగా కొనితెచ్చుకున్నవారు వీరే. అందుచేత వారి ఈ వర్తకం వారికి లాభదాయకమూ కాలేదు, వారు సన్మార్గానికి నోచుకోనూ లేదు.
2:17 مَثَلُهُمْ كَمَثَلِ الَّذِي اسْتَوْقَدَ نَارًا فَلَمَّا أَضَاءَتْ مَا حَوْلَهُ ذَهَبَ اللَّهُ بِنُورِهِمْ وَتَرَكَهُمْ فِي ظُلُمَاتٍ لَّا يُبْصِرُون
వారి ఉపమానం నిప్పు రాజేసిన వ్యక్తి లాంటిది. నిప్పు రాజేసినంతనే పరిసరాల్లోని వస్తువులన్నీ వెలుగులోనికి వచ్చాయి. అంతలోనే అల్లాహ్ వారి వెలుగును హరించి, వారిని కారు చీకట్లలో, ఏమీ కానరాని స్థితిలో వదిలేశాడు.
2:18 صُمٌّ بُكْمٌ عُمْيٌ فَهُمْ لَا يَرْجِعُونَ
వారు చెవిటివారు, మూగవారు, గ్రుడ్డివారు. ఇక వారు (సరైన దారికి) మరలిరారు.
2:19 أَوْ كَصَيِّبٍ مِّنَ السَّمَاءِ فِيهِ ظُلُمَاتٌ وَرَعْدٌ وَبَرْقٌ يَجْعَلُونَ أَصَابِعَهُمْ فِي آذَانِهِم مِّنَ الصَّوَاعِقِ حَذَرَ الْمَوْتِ ۚ وَاللَّهُ مُحِيطٌ بِالْكَافِرِينَ
లేదా (వారి ఉపమానం) ఆకాశం నుంచి కురిసే భారీ వర్షం మాదిరిగా ఉంది – అందులోనూ చిమ్మచీకట్లు, ఉరుములు, మెరుపులు! ఉరుముల గర్జన విని, మృత్యు భయంతో వారు తమ వ్రేళ్ళను తమ చెవులలో దూర్చుకుంటారు. అల్లాహ్ ఈ అవిశ్వాసులను అన్ని వైపుల నుంచీ ముట్టడిస్తాడు.
2:20 يَكَادُ الْبَرْقُ يَخْطَفُ أَبْصَارَهُمْ ۖ كُلَّمَا أَضَاءَ لَهُم مَّشَوْا فِيهِ وَإِذَا أَظْلَمَ عَلَيْهِمْ قَامُوا ۚ وَلَوْ شَاءَ اللَّهُ لَذَهَبَ بِسَمْعِهِمْ وَأَبْصَارِهِمْ ۚ إِنَّ اللَّهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
మెరుపులు వారి దృష్టిని ఎగరవేసుకుపోతాయా! అన్నట్టుంది వారి పరిస్థితి. అవి (మెరుపు తీగలు) వెలుగును విరజిమ్మినపుడల్లా వారు అందులో కొంతదూరం నడుస్తారు. తర్వాత వారిపై చీకటి ఆవరించగానే నిలబడిపోతారు. అల్లాహ్‌యే గనక తలచుకుంటే వారి వినేశక్తినీ, కంటిచూపునూ పోగొట్టేవాడే, నిశ్చయంగా అల్లాహ్ అన్నింటిపై అధికారం గలవాడు.
2:21 يَا أَيُّهَا النَّاسُ اعْبُدُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُمْ وَالَّذِينَ مِن قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُونَ
ప్రజలారా! మిమ్మల్నీ, మీకు పూర్వం వారినీ పుట్టించిన మీ ప్రభువునే ఆరాధించండి- తద్వారానే మీరు (పాపాల నుండి) సురక్షితంగా ఉంటారు.
2:22 الَّذِي جَعَلَ لَكُمُ الْأَرْضَ فِرَاشًا وَالسَّمَاءَ بِنَاءً وَأَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَأَخْرَجَ بِهِ مِنَ الثَّمَرَاتِ رِزْقًا لَّكُمْ ۖ فَلَا تَجْعَلُوا لِلَّهِ أَندَادًا وَأَنتُمْ تَعْلَمُونَ
ఆయనే మీ కోసం భూమిని పాన్పుగానూ, ఆకాశాన్ని కప్పుగానూ చేశాడు, ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి, తద్వారా పండ్లు ఫలాలను పండించి మీకు ఉపాధినొసగాడు. ఇది తెలిసి కూడా మీరు ఇతరులను అల్లాహ్‌కు భాగస్వాములుగా నిలబెట్టకండి.
2:23 وَإِن كُنتُمْ فِي رَيْبٍ مِّمَّا نَزَّلْنَا عَلَىٰ عَبْدِنَا فَأْتُوا بِسُورَةٍ مِّن مِّثْلِهِ وَادْعُوا شُهَدَاءَكُم مِّن دُونِ اللَّهِ إِن كُنتُمْ صَادِقِينَ
మేము మా దాసునిపై అవతరింపజేసిన దాని విషయంలో ఒకవేళ మీకేదన్నా అనుమానముంటే, అటువంటిదే ఒక్క సూరానైనా (రచించి) తీసుకురండి. మీరు సత్యవంతులే అయితే (ఈ పని కోసం) అల్లాహ్‌ను తప్ప మీ సహాయకులందరినీ పిలుచుకోండి.
2:24 فَإِن لَّمْ تَفْعَلُوا وَلَن تَفْعَلُوا فَاتَّقُوا النَّارَ الَّتِي وَقُودُهَا النَّاسُ وَالْحِجَارَةُ ۖ أُعِدَّتْ لِلْكَافِرِينَ
ఒకవేళ మీరు గనక ఈ పని చెయ్యకపోతే- ఎన్నటికీ అది మీ వల్ల కాని పనే- (దీన్ని సత్యమని ఒప్పుకుని) మానవులు,రాళ్ళు ఇంధనం కాగల ఆ అగ్ని నుండి (మిమ్మల్ని మీరు) కాపాడుకోండి. అది సత్య తిరస్కారుల కోసం తయారు చేయబడింది.
2:25 وَبَشِّرِ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ أَنَّ لَهُمْ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ ۖ كُلَّمَا رُزِقُوا مِنْهَا مِن ثَمَرَةٍ رِّزْقًا ۙ قَالُوا هَٰذَا الَّذِي رُزِقْنَا مِن قَبْلُ ۖ وَأُتُوا بِهِ مُتَشَابِهًا ۖ وَلَهُمْ فِيهَا أَزْوَاجٌ مُّطَهَّرَةٌ ۖ وَهُمْ فِيهَا خَالِدُونَ
విశ్వసించి, సత్కార్యాలు చేసే వారికి క్రింద కాలువలు ప్రవహించే (స్వర్గ)వనాల శుభవార్తలను అందజెయ్యి. తినడానికి అక్కడి పండ్లు వారికి ఇవ్వబడినప్పుడల్లా, “ఇలాంటి పండ్లే ఇంతకు మునుపు మాకు ఇవ్వబడినవి” అని వారంటారు. నిజానికి పరస్పరం పోలి వుండే ఫలాలు వారికి ప్రసాదించబడతాయి. వారి కొరకు పరిశుద్ధులైన భార్యలుంటారు. వారు ఈ స్వర్గవనాలలో కలకాలం ఉంటారు.
2:26 إِنَّ اللَّهَ لَا يَسْتَحْيِي أَن يَضْرِبَ مَثَلًا مَّا بَعُوضَةً فَمَا فَوْقَهَا ۚ فَأَمَّا الَّذِينَ آمَنُوا فَيَعْلَمُونَ أَنَّهُ الْحَقُّ مِن رَّبِّهِمْ ۖ وَأَمَّا الَّذِينَ كَفَرُوا فَيَقُولُونَ مَاذَا أَرَادَ اللَّهُ بِهَٰذَا مَثَلًا ۘ يُضِلُّ بِهِ كَثِيرًا وَيَهْدِي بِهِ كَثِيرًا ۚ وَمَا يُضِلُّ بِهِ إِلَّا الْفَاسِقِينَ
నిశ్చయంగా అల్లాహ్ దేనినీ ఉపమానంగా చెప్పటానికి సిగ్గుపడడు- (కడకు) దోమ అయినాసరే, దానికన్నా అల్పమైన వస్తువు అయినాసరే! విశ్వసించినవారు మాత్రం దీన్ని తమ ప్రభువు తరఫు నుంచి వచ్చిన సత్యమని భావిస్తారు. కాని అవిశ్వాసులు, “ఈ ఉపమానం ద్వారా ఇంతకీ అల్లాహ్ ఏం చెప్పదలచుకుంటున్నాడు?” అని అంటారు. ఈ విధంగా ఆయన దీని ద్వారానే ఎంతో మందిని అపమార్గం పట్టిస్తాడు, మరెంతో మందిని సన్మార్గంపైకి తీసుకువస్తాడు. అయితే దీని ద్వారా ఆయన అపమార్గానికి లోను చేసేది అవిధేయులను మాత్రమే.
2:27 الَّذِينَ يَنقُضُونَ عَهْدَ اللَّهِ مِن بَعْدِ مِيثَاقِهِ وَيَقْطَعُونَ مَا أَمَرَ اللَّهُ بِهِ أَن يُوصَلَ وَيُفْسِدُونَ فِي الْأَرْضِ ۚ أُولَٰئِكَ هُمُ الْخَاسِرُونَ
వీరు ఎలాంటి వారంటే అల్లాహ్‌తో చేసిన దృఢమైన ప్రమాణాన్ని భంగపరుస్తారు. అల్లాహ్ కలిపి ఉంచమని చెప్పిన వాటిని త్రెంచివేస్తారు. భువిలో చెడుగును వ్యాపింపజేస్తారు. వీరే అసలు నష్టాన్ని పొందేవారు.
2:28 كَيْفَ تَكْفُرُونَ بِاللَّهِ وَكُنتُمْ أَمْوَاتًا فَأَحْيَاكُمْ ۖ ثُمَّ يُمِيتُكُمْ ثُمَّ يُحْيِيكُمْ ثُمَّ إِلَيْهِ تُرْجَعُونَ
మీరు అల్లాహ్ యెడల తిరస్కార వైఖరికి ఎలా ఒడిగట్టగలరు? చూడబోతే నిర్జీవులుగా ఉన్న మీకు ఆయనే ప్రాణం పోశాడు. మరి మీ ప్రాణం తీసేవాడూ, తిరిగి మిమ్మల్ని బ్రతికించేవాడు కూడా ఆయనే. ఆ తరువాత మీరు ఆయన వైపుకే మరలించబడతారు.
2:29 هُوَ الَّذِي خَلَقَ لَكُم مَّا فِي الْأَرْضِ جَمِيعًا ثُمَّ اسْتَوَىٰ إِلَى السَّمَاءِ فَسَوَّاهُنَّ سَبْعَ سَمَاوَاتٍ ۚ وَهُوَ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ
ఆయనే మీ కోసం భూమిలో ఉన్న సమస్త వస్తువులనూ సృష్టించాడు. తరువాత ఆకాశం వైపుకు ధ్యానాన్ని మరల్చి, తగు రీతిలో సప్తాకాశాలను నిర్మించాడు. ఆయన అన్నీ తెలిసినవాడు.
2:30 وَإِذْ قَالَ رَبُّكَ لِلْمَلَائِكَةِ إِنِّي جَاعِلٌ فِي الْأَرْضِ خَلِيفَةً ۖ قَالُوا أَتَجْعَلُ فِيهَا مَن يُفْسِدُ فِيهَا وَيَسْفِكُ الدِّمَاءَ وَنَحْنُ نُسَبِّحُ بِحَمْدِكَ وَنُقَدِّسُ لَكَ ۖ قَالَ إِنِّي أَعْلَمُ مَا لَا تَعْلَمُونَ
“నేను భువిలో ప్రతినిధిని చేయబోతున్నాను” అని నీ ప్రభువు తన దూతలతో అన్నప్పుడు, “భూమిలో కల్లోలాన్ని రేకెత్తించి, రక్తం ప్రవహింపజేసేవాణ్ణి ఎందుకు సృష్టిస్తావు (ప్రభూ)? నిన్ను స్తుతించటానికి, ప్రశంసించటానికి, నీ పవిత్రతను కొనియాడటానికి మేమున్నాము కదా!” అని వారన్నారు. దానికి అల్లాహ్, “నాకు తెలిసినవన్నీ మీకు తెలియవు” అని అన్నాడు.
2:31 وَعَلَّمَ آدَمَ الْأَسْمَاءَ كُلَّهَا ثُمَّ عَرَضَهُمْ عَلَى الْمَلَائِكَةِ فَقَالَ أَنبِئُونِي بِأَسْمَاءِ هَٰؤُلَاءِ إِن كُنتُمْ صَادِقِينَ
(తరువాత) అల్లాహ్ ఆదంకు అన్ని (వస్తువుల) పేర్లనూ నేర్పి, వాటిని దూతల ముందుంచాడు. “ఒకవేళ మీరు చెప్పేదే నిజమయితే, కాస్త వీటి పేర్లు చెప్పండి?” అన్నాడు.
2:32 قَالُوا سُبْحَانَكَ لَا عِلْمَ لَنَا إِلَّا مَا عَلَّمْتَنَا ۖ إِنَّكَ أَنتَ الْعَلِيمُ الْحَكِيمُ
వారంతా ఇలా అన్నారు : “(ఓ అల్లాహ్!) నీవు అత్యంత పవిత్రుడవు. నీవు మాకు తెలియజేసినది తప్ప ఇంకేమీ మాకు తెలియదు. నిశ్చయంగా అన్నీ తెలిసినవాడవు, వివేకవంతుడవూ నీవే!”
2:33 قَالَ يَا آدَمُ أَنبِئْهُم بِأَسْمَائِهِمْ ۖ فَلَمَّا أَنبَأَهُم بِأَسْمَائِهِمْ قَالَ أَلَمْ أَقُل لَّكُمْ إِنِّي أَعْلَمُ غَيْبَ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَأَعْلَمُ مَا تُبْدُونَ وَمَا كُنتُمْ تَكْتُمُونَ
అప్పుడు అల్లాహ్, “ఓ ఆదం! వీటి పేర్లేమిటో నువ్వు తెలుపు” అన్నాడు. ఆయన వాటి పేర్లన్నీ చెప్పేయగానే అల్లాహ్ ఇలా ప్రకటించాడు: “భూమ్యాకాశాలలో గోప్యంగా వున్నవన్నీ నాకు తెలుసనీ, మీరు బహిర్గతం చేసేవీ, దాచి పెట్టేవీ అన్నీ నాకు తెలుసని (ముందే) నేను మీకు చెప్పలేదా?”
2:34 وَإِذْ قُلْنَا لِلْمَلَائِكَةِ اسْجُدُوا لِآدَمَ فَسَجَدُوا إِلَّا إِبْلِيسَ أَبَىٰ وَاسْتَكْبَرَ وَكَانَ مِنَ الْكَافِرِينَ
“మీరందరూ ఆదం ముందు సాష్టాంగపడండి” అని మేము దూతలను ఆజ్ఞాపించినపుడు ఇబ్లీసు తప్ప అందరూ సాష్టాంగపడ్డారు. వాడు మాత్రం తిరస్కరించాడు. అహంకారి అయి, అవిధేయులలో చేరిపోయాడు.
2:35 وَقُلْنَا يَا آدَمُ اسْكُنْ أَنتَ وَزَوْجُكَ الْجَنَّةَ وَكُلَا مِنْهَا رَغَدًا حَيْثُ شِئْتُمَا وَلَا تَقْرَبَا هَٰذِهِ الشَّجَرَةَ فَتَكُونَا مِنَ الظَّالِمِينَ
(తరువాత) మేము, “ఓ ఆదం! నువ్వూ, నీ భార్య – ఇద్దరూ- స్వర్గంలో ఉండండి, మీరు ఇష్టపడిన చోటు నుంచి స్వేచ్ఛగా తినండి, త్రాగండి. కాని ఈ వృక్షం దరిదాపులకు కూడా పోవద్దు. లేదంటే దుర్మార్గులలో చేరిపోతారు” అని చెప్పాము.
2:36 فَأَزَلَّهُمَا الشَّيْطَانُ عَنْهَا فَأَخْرَجَهُمَا مِمَّا كَانَا فِيهِ ۖ وَقُلْنَا اهْبِطُوا بَعْضُكُمْ لِبَعْضٍ عَدُوٌّ ۖ وَلَكُمْ فِي الْأَرْضِ مُسْتَقَرٌّ وَمَتَاعٌ إِلَىٰ حِينٍ
కాని షైతాన్ వారిని పెడత్రోవ పట్టించి, అక్కడి నుంచి బయటికి తీసివేయించాడు. మేము వారిని ఇలా ఆదేశించాము: “దిగిపోండి. మీరు ఒండొకరికి శత్రువులు. ఒక నిర్ణీత కాలం వరకు భూమిపైనే ఉండి మీరు లబ్ది పొందవలసి ఉంది.”
2:37 فَتَلَقَّىٰ آدَمُ مِن رَّبِّهِ كَلِمَاتٍ فَتَابَ عَلَيْهِ ۚ إِنَّهُ هُوَ التَّوَّابُ الرَّحِيمُ
అప్పుడు ఆదం (అలైహిస్సలాం) తన ప్రభువు నుంచి కొన్ని మాటలు నేర్చుకుని (పశ్చాత్తాపం చెందారు.) అల్లాహ్ ఆయన పశ్చాత్తాపాన్ని ఆమోదించాడు. నిశ్చయంగా ఆయన పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, కరుణించేవాడు కూడాను.
2:38 قُلْنَا اهْبِطُوا مِنْهَا جَمِيعًا ۖ فَإِمَّا يَأْتِيَنَّكُم مِّنِّي هُدًى فَمَن تَبِعَ هُدَايَ فَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ
మేము వారితో అన్నాము: “మీరంతా ఇక్కడి నుంచి దిగిపోండి. నా ఉపదేశం ఎప్పుడు మీ వద్దకు వచ్చినా, దాన్ని అనుసరించే వారికి ఎలాంటి భయంగానీ, దుఃఖంగానీ ఉండదు.”
2:39 وَالَّذِينَ كَفَرُوا وَكَذَّبُوا بِآيَاتِنَا أُولَٰئِكَ أَصْحَابُ النَّارِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ
ఎవరయితే దానిని నిరాకరించి, మా ఆయతులను అసత్యాలని త్రోసిపుచ్చుతారో వారే నరకాగ్నిలోకి పోయేవారు. వారందులో కలకాలం పడి ఉంటారు.
2:40 يَا بَنِي إِسْرَائِيلَ اذْكُرُوا نِعْمَتِيَ الَّتِي أَنْعَمْتُ عَلَيْكُمْ وَأَوْفُوا بِعَهْدِي أُوفِ بِعَهْدِكُمْ وَإِيَّايَ فَارْهَبُونِ
ఓ ఇస్రాయీలు వంశస్థులారా! నేను మీకు అనుగ్రహించిన భాగ్యాన్ని గురించి కాస్త జ్ఞాపకం చేసుకోండి. మీరు నాతో చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోండి, నేను మీతో చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తాను. మీరు నాకు మాత్రమే భయపడండి.
2:41 وَآمِنُوا بِمَا أَنزَلْتُ مُصَدِّقًا لِّمَا مَعَكُمْ وَلَا تَكُونُوا أَوَّلَ كَافِرٍ بِهِ ۖ وَلَا تَشْتَرُوا بِآيَاتِي ثَمَنًا قَلِيلًا وَإِيَّايَ فَاتَّقُونِ
మీ వద్దనున్న గ్రంథాలకు ధృవీకరణగా నేను అవతరింపజేసిన ఈ గ్రంథాన్ని (ఖుర్ఆన్ను) విశ్వసించండి. దీని పట్ల అందరికంటే ముందు మీరే తిరస్కారులు కాకండి. ఇంకా నా ఆయతులను కొద్దిపాటి ధరకు అమ్ముకోకండి. నాకు మాత్రమే భయపడండి.
2:42 وَلَا تَلْبِسُوا الْحَقَّ بِالْبَاطِلِ وَتَكْتُمُوا الْحَقَّ وَأَنتُمْ تَعْلَمُونَ
సత్యాన్ని అసత్యంతో కలిపి కలగాపులగం చేయకండి. తెలిసి కూడా సత్యాన్ని కప్పిపుచ్చకండి.
2:43 وَأَقِيمُوا الصَّلَاةَ وَآتُوا الزَّكَاةَ وَارْكَعُوا مَعَ الرَّاكِعِينَ
(ఇస్రాయీలు సంతతి వారలారా!) మీరు నమాజులను నెలకొల్పండి, జకాతును ఇవ్వండి, (నా సన్నిధిలో) రుకూ చేసే వారితోపాటు మీరూ రుకూ చేయండి.
2:44 أَتَأْمُرُونَ النَّاسَ بِالْبِرِّ وَتَنسَوْنَ أَنفُسَكُمْ وَأَنتُمْ تَتْلُونَ الْكِتَابَ ۚ أَفَلَا تَعْقِلُونَ
ప్రజలకైతే మీరు మంచిని గురించి ఆదేశిస్తారు, కాని మీ స్వయాన్ని మరచిపోతారే?! చూడబోతే మీరు గ్రంథపారాయణం చేస్తారాయె. మరి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదా?
2:45 وَاسْتَعِينُوا بِالصَّبْرِ وَالصَّلَاةِ ۚ وَإِنَّهَا لَكَبِيرَةٌ إِلَّا عَلَى الْخَاشِعِينَ
మీరు ఓర్పు ద్వారా, నమాజు ద్వారా సహాయం అర్థించండి. నిశ్చయంగా ఇది కష్టమయిన పనే. కాని (అల్లాహ్‌కు) భయపడేవారికి (ఇది సులువైనపని).
2:46 الَّذِينَ يَظُنُّونَ أَنَّهُم مُّلَاقُو رَبِّهِمْ وَأَنَّهُمْ إِلَيْهِ رَاجِعُونَ
(ఎందుకంటే) ఎట్టకేలకు తాము తమ ప్రభువును కలుసుకోవాల్సి ఉందనీ, ఆయన వైపునకే మరలిపోవలసి ఉందనీ వారు నమ్ముతారు.
2:47 يَا بَنِي إِسْرَائِيلَ اذْكُرُوا نِعْمَتِيَ الَّتِي أَنْعَمْتُ عَلَيْكُمْ وَأَنِّي فَضَّلْتُكُمْ عَلَى الْعَالَمِينَ
ఓ ఇస్రాయీలు (యాఖూబు) సంతతి వారలారా! నేను మీపై కురిపించిన అనుగ్రహాన్నీ, (నాటి) సమస్త లోకవాసులపై మీకు ఇచ్చిన ప్రాధాన్యతను గురించి (కాస్త) నెమరు వేసుకోండి.
2:48 وَاتَّقُوا يَوْمًا لَّا تَجْزِي نَفْسٌ عَن نَّفْسٍ شَيْئًا وَلَا يُقْبَلُ مِنْهَا شَفَاعَةٌ وَلَا يُؤْخَذُ مِنْهَا عَدْلٌ وَلَا هُمْ يُنصَرُونَ
ఎవరూ ఎవరికీ ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేని, ఎవరి సిఫారసూ స్వీకరించబడని, ఎవరి వద్ద కూడా పరిహారం తీసుకోబడని, ఎలాంటి సాయం అందజేయబడని ఆ దినానికి భయపడండి.
2:49 وَإِذْ نَجَّيْنَاكُم مِّنْ آلِ فِرْعَوْنَ يَسُومُونَكُمْ سُوءَ الْعَذَابِ يُذَبِّحُونَ أَبْنَاءَكُمْ وَيَسْتَحْيُونَ نِسَاءَكُمْ ۚ وَفِي ذَٰلِكُم بَلَاءٌ مِّن رَّبِّكُمْ عَظِيمٌ
(ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోండి) ఫిరౌను మనుషుల బారి నుండి మేము మీకు విముక్తి నొసగాము. వారు మిమ్మల్ని దారుణంగా వేధించేవారు. మీ కొడుకులను చంపివేసి, కూతుళ్ళను మాత్రం విడిచి పెట్టేవాళ్ళు. ఈ విముక్తి నొసగటంలో మీ ప్రభువు తరఫునుండి మీకు గొప్ప పరీక్ష ఉండినది.
2:50 وَإِذْ فَرَقْنَا بِكُمُ الْبَحْرَ فَأَنجَيْنَاكُمْ وَأَغْرَقْنَا آلَ فِرْعَوْنَ وَأَنتُمْ تَنظُرُونَ
అప్పుడు మేము మీ కోసం సముద్రాన్ని చీల్చి, మిమ్మల్ని సురక్షితంగా (ఆవలి ఒడ్డుకు) చేరవేశాము. అదే సమయంలో మీరు చూస్తుండగానే ఫిరౌనీయులను అందులో ముంచివేశాము.
2:51 وَإِذْ وَاعَدْنَا مُوسَىٰ أَرْبَعِينَ لَيْلَةً ثُمَّ اتَّخَذْتُمُ الْعِجْلَ مِن بَعْدِهِ وَأَنتُمْ ظَالِمُونَ
(జ్ఞాపకం చేసుకోండి) మేము మూసా (అలైహిస్సలాం)కు నలభై రాత్రుల వాగ్దానం చేసి (అతన్ని పిలిచి) నప్పుడు, అతను వెళ్ళిన తరువాత మీరు ఆవు దూడను పూజించటం మొదలెట్టారు. ఆ విధంగా మీరు దుర్మార్గానికి పాల్పడ్డారు.
2:52 ثُمَّ عَفَوْنَا عَنكُم مِّن بَعْدِ ذَٰلِكَ لَعَلَّكُمْ تَشْكُرُونَ
అయినప్పటికీ మేము మిమ్మల్ని మన్నించి వదలిపెట్టాము – అలాగయినా కృతజ్ఞులవుతారేమోనని!
2:53 وَإِذْ آتَيْنَا مُوسَى الْكِتَابَ وَالْفُرْقَانَ لَعَلَّكُمْ تَهْتَدُونَ
ఇంకా మేము మూసాకు, మీ మార్గదర్శకత్వం నిమిత్తం గ్రంథాన్నీ, గీటురాయినీ ప్రసాదించాము.
2:54 وَإِذْ قَالَ مُوسَىٰ لِقَوْمِهِ يَا قَوْمِ إِنَّكُمْ ظَلَمْتُمْ أَنفُسَكُم بِاتِّخَاذِكُمُ الْعِجْلَ فَتُوبُوا إِلَىٰ بَارِئِكُمْ فَاقْتُلُوا أَنفُسَكُمْ ذَٰلِكُمْ خَيْرٌ لَّكُمْ عِندَ بَارِئِكُمْ فَتَابَ عَلَيْكُمْ ۚ إِنَّهُ هُوَ التَّوَّابُ الرَّحِيمُ
(గుర్తు చేయి) మూసా తన జాతి ప్రజలతో ఇలా అన్నాడు: “ఓ నా జాతివారలారా! ఆవుదూడను ఆరాధ్య దైవంగా చేసుకుని మీరు మీ స్వయానికి అన్యాయం చేసుకున్నారు. కనుక ఇప్పుడు మీరు పశ్చాత్తాప భావంతో మీ సృష్టికర్త వైపుకు మరలండి. (ఈ ఘోర కృత్యానికి పాల్పడిన) మీలోని వారిని చంపండి. మీ సృష్టికర్త వద్ద ఇదే మీ కొరకు మేలైనది.” మరి ఆయన మీ పశ్చాత్తాపాన్ని స్వీకరించాడు. నిస్సందేహంగా ఆయన పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, కనికరించేవాడు.
2:55 وَإِذْ قُلْتُمْ يَا مُوسَىٰ لَن نُّؤْمِنَ لَكَ حَتَّىٰ نَرَى اللَّهَ جَهْرَةً فَأَخَذَتْكُمُ الصَّاعِقَةُ وَأَنتُمْ تَنظُرُونَ
మీరు మూసాతో అన్న మాటలను గుర్తుకు తెచ్చుకోండి : “ఓ మూసా! మేము అల్లాహ్‌ను కళ్ళారా చూడనంతవరకూ నిన్ను విశ్వసించము.” (మీ ఈ పెడసరి ధోరణికి శిక్షగా) మీరు చూస్తుండగానే (మీపై) పిడుగు పడింది.
2:56 ثُمَّ بَعَثْنَاكُم مِّن بَعْدِ مَوْتِكُمْ لَعَلَّكُمْ تَشْكُرُونَ
అయితే (ఈసారయినా) మీరు కృతజ్ఞులవుతారేమోనన్న ఉద్దేశంతో చనిపోయిన మిమ్మల్ని తిరిగి బ్రతికించాము.
2:57 وَظَلَّلْنَا عَلَيْكُمُ الْغَمَامَ وَأَنزَلْنَا عَلَيْكُمُ الْمَنَّ وَالسَّلْوَىٰ ۖ كُلُوا مِن طَيِّبَاتِ مَا رَزَقْنَاكُمْ ۖ وَمَا ظَلَمُونَا وَلَٰكِن كَانُوا أَنفُسَهُمْ يَظْلِمُونَ
మేము మీపై మేఘాల ఛాయను కల్పించాము. మీపై మన్న్, సల్వాలను (ఆహారంగా) దించాము. “మేము మీకు ప్రసాదించిన పరిశుద్ధమైన వస్తువులను తినండి” (అని చెప్పాము. కాని, వారు ఆ అనుగ్రహాలు అనుభవించి కృతజ్ఞులయ్యే బదులు కృతఘ్నత చూపటం మొదలుపెట్టారు). వారు మాకెలాంటి అన్యాయం చేయలేదు, కాకపోతే వారు తమకు తామే అన్యాయం చేసుకుంటూ పోయారు.
2:58 وَإِذْ قُلْنَا ادْخُلُوا هَٰذِهِ الْقَرْيَةَ فَكُلُوا مِنْهَا حَيْثُ شِئْتُمْ رَغَدًا وَادْخُلُوا الْبَابَ سُجَّدًا وَقُولُوا حِطَّةٌ نَّغْفِرْ لَكُمْ خَطَايَاكُمْ ۚ وَسَنَزِيدُ الْمُحْسِنِينَ
(ఇంకా ఆ విషయాన్ని కూడా నెమరు వేసుకోండి). “ఈ పురములో ప్రవేశించండి. అక్కడ మీకు ఇష్టమైన చోట, కోరుకున్న విధంగా తృప్తిగా తినండి. కాని నగర ముఖద్వారం గుండా పోతున్నప్పుడు ‘సజ్దా’ చేస్తూ మరీ పోవాలి. పోతున్నప్పుడు ‘హిత్తతున్’అని నోటితో పలుకుతూ ముందుకు సాగాలి. అప్పుడు మేము మీ తప్పులను మన్నిస్తాము, సదాచార సంపన్నులకు మరింతగా అనుగ్రహిస్తాము” అని మేము మీతో అన్నాము.
2:59 فَبَدَّلَ الَّذِينَ ظَلَمُوا قَوْلًا غَيْرَ الَّذِي قِيلَ لَهُمْ فَأَنزَلْنَا عَلَى الَّذِينَ ظَلَمُوا رِجْزًا مِّنَ السَّمَاءِ بِمَا كَانُوا يَفْسُقُونَ
కాని దుర్మార్గులు వారితో అనబడిన ఈ మాటను మార్చి వేశారు. అందుచేత మేము కూడా ఆ దుర్మార్గులపై వారి (దుర్మార్గం), ధిక్కార వైఖరికి శాస్తిగా ఆకాశం నుంచి శిక్షను అవతరింపజేశాము.
2:60 وَإِذِ اسْتَسْقَىٰ مُوسَىٰ لِقَوْمِهِ فَقُلْنَا اضْرِب بِّعَصَاكَ الْحَجَرَ ۖ فَانفَجَرَتْ مِنْهُ اثْنَتَا عَشْرَةَ عَيْنًا ۖ قَدْ عَلِمَ كُلُّ أُنَاسٍ مَّشْرَبَهُمْ ۖ كُلُوا وَاشْرَبُوا مِن رِّزْقِ اللَّهِ وَلَا تَعْثَوْا فِي الْأَرْضِ مُفْسِدِينَ
మూసా (అలైహిస్సలాం) తన జాతి ప్రజల కోసం నీటిని అడిగినప్పుడు, “నీ చేతి కర్రతో ఆ (కొండ) రాతిపై కొట్టు” అని మేమన్నాము. (అలా కొట్టగా) దాన్నుండి పన్నెండు ఊటలు పెల్లుబికాయి. వారిలోని ప్రతి తెగవారూ తమ తమ నీటి స్థలాన్ని తెలుసుకున్నారు. (అప్పుడు మేము వారికి ఈ విధంగా ఆదేశించాము:) “అల్లాహ్ (మీకు ప్రసాదించిన) ఉపాధిని తినండి, త్రాగండి. భువిలో అలజడిని రేపుతూ తిరగకండి.”
2:61 وَإِذْ قُلْتُمْ يَا مُوسَىٰ لَن نَّصْبِرَ عَلَىٰ طَعَامٍ وَاحِدٍ فَادْعُ لَنَا رَبَّكَ يُخْرِجْ لَنَا مِمَّا تُنبِتُ الْأَرْضُ مِن بَقْلِهَا وَقِثَّائِهَا وَفُومِهَا وَعَدَسِهَا وَبَصَلِهَا ۖ قَالَ أَتَسْتَبْدِلُونَ الَّذِي هُوَ أَدْنَىٰ بِالَّذِي هُوَ خَيْرٌ ۚ اهْبِطُوا مِصْرًا فَإِنَّ لَكُم مَّا سَأَلْتُمْ ۗ وَضُرِبَتْ عَلَيْهِمُ الذِّلَّةُ وَالْمَسْكَنَةُ وَبَاءُوا بِغَضَبٍ مِّنَ اللَّهِ ۗ ذَٰلِكَ بِأَنَّهُمْ كَانُوا يَكْفُرُونَ بِآيَاتِ اللَّهِ وَيَقْتُلُونَ النَّبِيِّينَ بِغَيْرِ الْحَقِّ ۗ ذَٰلِكَ بِمَا عَصَوا وَّكَانُوا يَعْتَدُونَ
(జ్ఞాపకం చేసుకోండి,) “ఓ మూసా! ఒకే రకమైన తిండిని మేము అస్సలు సహించము. అందుకే భూమిలో పండే ఆకుకూరలు, దోసకాయలు, గోధుమలు, పప్పుదినుసులు, ఉల్లిపాయలు ప్రసాదించవలసినదిగా నీ ప్రభువును ప్రార్థించు” అని మీరు డిమాండు చేసినప్పుడు అతనిలా అన్నాడు: “మీరు శ్రేష్ఠమైన వస్తువుకు బదులుగా అధమమైన దానిని కోరుకుంటున్నారెందుకు? (సరే!) ఏదయినా పట్టణానికి వెళ్ళండి. అక్కడ మీరు కోరుకున్నవన్నీ మీకు లభిస్తాయి.” దాంతో వారిపై పరాభవం, దారిద్య్రం రుద్దబడింది. వారు దైవాగ్రహానికి గురై తరలిపోయారు. వారి ఈ దురవస్థకు కారణమేమిటంటే వారు అల్లాహ్ ఆయతుల పట్ల తిరస్కార వైఖరిని అవలంబించేవారు, అన్యాయంగా ప్రవక్తలను చంపేవారు. ఇది వారి అవిధేయతకు, బరితెగించిన పోకడకు పర్యవసానం మాత్రమే!
2:62 إِنَّ الَّذِينَ آمَنُوا وَالَّذِينَ هَادُوا وَالنَّصَارَىٰ وَالصَّابِئِينَ مَنْ آمَنَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ وَعَمِلَ صَالِحًا فَلَهُمْ أَجْرُهُمْ عِندَ رَبِّهِمْ وَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ
విశ్వసించిన వారైనా, యూదులైనా, నసారాలయినా, సాబియనులయినా – ఎవరయినాసరే – అల్లాహ్‌ను, అంతిమ దినాన్ని విశ్వసించి సదాచరణ చేస్తే వారి ప్రతిఫలం వారి ప్రభువు వద్ద ఉం(టుం)ది. వారికెలాంటి భయంగానీ, దుఃఖంగానీ ఉండదు.
2:63 وَإِذْ أَخَذْنَا مِيثَاقَكُمْ وَرَفَعْنَا فَوْقَكُمُ الطُّورَ خُذُوا مَا آتَيْنَاكُم بِقُوَّةٍ وَاذْكُرُوا مَا فِيهِ لَعَلَّكُمْ تَتَّقُونَ
తూరు పర్వతాన్ని మీ పైకి ఎత్తి మేము మీ చేత చేయించిన ప్రమాణాన్ని కాస్త జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు, “మేము మీకు ప్రసాదించిన దానిని (గ్రంథాన్ని) గట్టిగా పట్టుకోండి. అందులో వున్న వాటిని బాగా జ్ఞాపకం చేసుకోండి, దీని ద్వారానే మిమ్మల్ని మీరు కాపాడుకునే అవకాశం ఉంది” (అని ఉపదేశించాము.)
2:64 ثُمَّ تَوَلَّيْتُم مِّن بَعْدِ ذَٰلِكَ ۖ فَلَوْلَا فَضْلُ اللَّهِ عَلَيْكُمْ وَرَحْمَتُهُ لَكُنتُم مِّنَ الْخَاسِرِينَ
కాని దీని తరువాత మీరు విముఖులైపోయారు. అయినప్పటికీ దైవానుగ్రహం, దైవకారుణ్యం మీపై ఉండింది. లేకపోతే మీరు (తీవ్రంగా) నష్టపోయేవారే.
2:65 وَلَقَدْ عَلِمْتُمُ الَّذِينَ اعْتَدَوْا مِنكُمْ فِي السَّبْتِ فَقُلْنَا لَهُمْ كُونُوا قِرَدَةً خَاسِئِينَ
శనివారం విషయంలో ఆజ్ఞోల్లంఘనకు పాల్పడిన మీ వారి గురించి కూడా మీకు బాగా తెలుసు. “అత్యంత అసహ్యకరమైన, ఛీత్కరించబడిన కోతులుగా మారిపోండి” అని మేము వాళ్ళను శపించాము.
2:66 فَجَعَلْنَاهَا نَكَالًا لِّمَا بَيْنَ يَدَيْهَا وَمَا خَلْفَهَا وَمَوْعِظَةً لِّلْمُتَّقِينَ
దీనిని మేము ఆ కాలం వారికీ, భావితరాల వారికీ గుణపాఠ సూచనగానూ, భయభక్తులు కలవారికి హితబోధగానూ చేశాము.
2:67 وَإِذْ قَالَ مُوسَىٰ لِقَوْمِهِ إِنَّ اللَّهَ يَأْمُرُكُمْ أَن تَذْبَحُوا بَقَرَةً ۖ قَالُوا أَتَتَّخِذُنَا هُزُوًا ۖ قَالَ أَعُوذُ بِاللَّهِ أَنْ أَكُونَ مِنَ الْجَاهِلِينَ
మూసా తన జాతివారితో, “అల్లాహ్ మిమ్మల్ని ఒక ఆవును ‘జిబహ్’ చేయవలసిందిగా ఆజ్ఞాపిస్తున్నాడు” అని అన్నప్పుడు, “ఏమిటీ, మాతో వేళాకోళం చేస్తున్నావా?” అని వారు ప్రశ్నించారు. దానికి అతను, “నేనలాంటి మూర్ఖుల్లో ఒకణ్ణి కాకుండా ఉండేందుకు అల్లాహ్ శరణు వేడుతున్నాను” అని జవాబిచ్చాడు.
2:68 قَالُوا ادْعُ لَنَا رَبَّكَ يُبَيِّن لَّنَا مَا هِيَ ۚ قَالَ إِنَّهُ يَقُولُ إِنَّهَا بَقَرَةٌ لَّا فَارِضٌ وَلَا بِكْرٌ عَوَانٌ بَيْنَ ذَٰلِكَ ۖ فَافْعَلُوا مَا تُؤْمَرُونَ
అప్పుడు వారు, “అయితే అది ఎటువంటిది అయిఉండాలో మాకు వివరించవలసిందిగా నీ ప్రభువును అర్థించు” అని అన్నారు. దానికి అతను, “అది మరీ ముసలిదై ఉండకూడదు, మరీ లేగదూడగా కూడా ఉండరాదు. పైగా అది మధ్యవయస్సులో వున్న ఆవు అయి ఉండాలని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. (సరేనా!) ఇక ఆజ్ఞాపించబడిన విధంగా చెయ్యండి” అని చెప్పాడు.
2:69 قَالُوا ادْعُ لَنَا رَبَّكَ يُبَيِّن لَّنَا مَا لَوْنُهَا ۚ قَالَ إِنَّهُ يَقُولُ إِنَّهَا بَقَرَةٌ صَفْرَاءُ فَاقِعٌ لَّوْنُهَا تَسُرُّ النَّاظِرِينَ
“అది ఏ రంగుదై ఉండాలో మాకు వివరించమని నీ ప్రభువును ప్రార్థించు” అని మళ్ళీ అడిగారు. “అది పసుపు వర్ణంగలదై, నిగనిగలాడుతూ, చూసేవారికి ఆకర్షణీయంగా కనిపించేలా ఉండాలన్నది అల్లాహ్ ఆజ్ఞ” అని మూసా సమాధానమిచ్చాడు.
2:70 قَالُوا ادْعُ لَنَا رَبَّكَ يُبَيِّن لَّنَا مَا هِيَ إِنَّ الْبَقَرَ تَشَابَهَ عَلَيْنَا وَإِنَّا إِن شَاءَ اللَّهُ لَمُهْتَدُونَ
అప్పుడు వారు, “అది ఎలాంటిదై ఉండాలో మాకు (ఇంకా బాగా) వివరించమని నీ ప్రభువును ప్రార్థించు. మాకు ఆవు సంగతి ఇంకా ప్రస్ఫుటం కాలేదు. అల్లాహ్ గనక తలిస్తే మేము మార్గదర్శకత్వం పొందుతాము” అని అన్నారు.
2:71 قَالَ إِنَّهُ يَقُولُ إِنَّهَا بَقَرَةٌ لَّا ذَلُولٌ تُثِيرُ الْأَرْضَ وَلَا تَسْقِي الْحَرْثَ مُسَلَّمَةٌ لَّا شِيَةَ فِيهَا ۚ قَالُوا الْآنَ جِئْتَ بِالْحَقِّ ۚ فَذَبَحُوهَا وَمَا كَادُوا يَفْعَلُونَ
దానికి అతను, “ఆ ఆవు పనిచేసేదీ, దుక్కి దున్నేదీ, సేద్యపు పనిలో ఉపయోగపడేదీ అయి ఉండకూడదు. ఇంకా అది ఆరోగ్యవంతమైనదై, ఎటువంటి మచ్చలూ లేకుండా ఉండాలి అన్నది అల్లాహ్ ఆజ్ఞ” అని చెప్పాడు. దానికి వారు “నువ్వు ఇప్పుడు సరిగ్గా చెప్పావు. (మాకిప్పుడు అర్థం అయింది)” అన్నారు. అసలు వారు ఆదేశపాలనకు ఏమాత్రం సుముఖంగా లేరు. ఎట్టకేలకు (మాట విని) ఆవును జిబహ్ చేశారు.
2:72 وَإِذْ قَتَلْتُمْ نَفْسًا فَادَّارَأْتُمْ فِيهَا ۖ وَاللَّهُ مُخْرِجٌ مَّا كُنتُمْ تَكْتُمُونَ
(జ్ఞాపకం చేసుకోండి.) మీరు ఒక వ్యక్తిని హత్య చేసి, ఆ విషయంలో పరస్పరం విభేదించుకోసాగారు. కాని మీ గుట్టును అల్లాహ్ రట్టు చేయాలనే నిర్ణయించుకున్నాడు.
2:73 فَقُلْنَا اضْرِبُوهُ بِبَعْضِهَا ۚ كَذَٰلِكَ يُحْيِي اللَّهُ الْمَوْتَىٰ وَيُرِيكُمْ آيَاتِهِ لَعَلَّكُمْ تَعْقِلُونَ
కనుక, “ఈ ఆవు (మాంసపు) ముక్క నొకదాన్ని హతుని దేహానికేసి కొట్టండి (అతడు లేచి నిలబడతాడు)” అని మేము అన్నాము. ఈ విధంగా అల్లాహ్ మృతులను బ్రతికించి తన నిదర్శనాలను చూపుతున్నాడు – మీరు ఇకనయినా బుద్ధిగా మసలుకోవాలని!
2:74 ثُمَّ قَسَتْ قُلُوبُكُم مِّن بَعْدِ ذَٰلِكَ فَهِيَ كَالْحِجَارَةِ أَوْ أَشَدُّ قَسْوَةً ۚ وَإِنَّ مِنَ الْحِجَارَةِ لَمَا يَتَفَجَّرُ مِنْهُ الْأَنْهَارُ ۚ وَإِنَّ مِنْهَا لَمَا يَشَّقَّقُ فَيَخْرُجُ مِنْهُ الْمَاءُ ۚ وَإِنَّ مِنْهَا لَمَا يَهْبِطُ مِنْ خَشْيَةِ اللَّهِ ۗ وَمَا اللَّهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُونَ
కాని ఆ తరువాత మీ హృదయాలు కఠినమైపోయాయి. రాళ్ళ మాదిరిగా, కాదు – వాటికంటే కూడా కఠినం అయిపోయాయి. కొన్ని రాళ్ళల్లోనుంచైతే సెలయేళ్ళు ప్రవహిస్తాయి. మరి కొన్ని రాళ్ళు పగలగా వాటి నుంచి నీరు చిమ్ముతుంది. మరికొన్ని అల్లాహ్ భయంతో (కంపించి) క్రిందపడి పోతాయి. మీ కార్యకలాపాల పట్ల అల్లాహ్ పరధ్యానంలో ఉన్నాడని అనుకోకండి.
2:75 أَفَتَطْمَعُونَ أَن يُؤْمِنُوا لَكُمْ وَقَدْ كَانَ فَرِيقٌ مِّنْهُمْ يَسْمَعُونَ كَلَامَ اللَّهِ ثُمَّ يُحَرِّفُونَهُ مِن بَعْدِ مَا عَقَلُوهُ وَهُمْ يَعْلَمُونَ
(ముస్లిములారా!) వారు మీ మాటను నమ్ముతారనే (ఇప్పటికీ) మీరు ఆశపడ్తున్నారా? వాస్తవానికి వారిలో, అల్లాహ్ వాక్కును విని, అర్థం చేసుకుని కూడా ఉద్దేశపూర్వకంగా దాన్ని మార్చి వేసేవారు ఉన్నారు.
2:76 وَإِذَا لَقُوا الَّذِينَ آمَنُوا قَالُوا آمَنَّا وَإِذَا خَلَا بَعْضُهُمْ إِلَىٰ بَعْضٍ قَالُوا أَتُحَدِّثُونَهُم بِمَا فَتَحَ اللَّهُ عَلَيْكُمْ لِيُحَاجُّوكُم بِهِ عِندَ رَبِّكُمْ ۚ أَفَلَا تَعْقِلُونَ
వారు విశ్వాసులను కలుసుకున్నప్పుడు తమ విశ్వాసాన్ని వెల్లడిస్తారు. తమ వర్గానికి చెందినవారిని ఏకాంతంలో కలుసుకున్నప్పుడు, “అల్లాహ్ మీకు తెలియజేసిన విషయాలను మీరు వీరికి ఎందుకు చేరవేస్తున్నారు? తద్వారా మీ ప్రభువు సమక్షంలో వారు మీపై వాదనకు బలం పొందగలరనే సంగతిని విస్మరించారా ఏమి?” అని అంటారు.
2:77 أَوَلَا يَعْلَمُونَ أَنَّ اللَّهَ يَعْلَمُ مَا يُسِرُّونَ وَمَا يُعْلِنُونَ
వారు దాచేదీ, బహిర్గతం చేసేదీ – అంతా అల్లాహ్‌కు తెలుసన్న సంగతి వారికి తెలియదా?!
2:78 وَمِنْهُمْ أُمِّيُّونَ لَا يَعْلَمُونَ الْكِتَابَ إِلَّا أَمَانِيَّ وَإِنْ هُمْ إِلَّا يَظُنُّونَ
వారిలో చదువురాని వారు కొందరున్నారు – వారికి గ్రంథ జ్ఞానం లేదు. వారు కేవలం ఆశల్ని నమ్ముకొని ఉన్నారు. లేనిపోని అంచనాలు వేసి, ఊహల్లో విహరిస్తూ ఉంటారు.
2:79 فَوَيْلٌ لِّلَّذِينَ يَكْتُبُونَ الْكِتَابَ بِأَيْدِيهِمْ ثُمَّ يَقُولُونَ هَٰذَا مِنْ عِندِ اللَّهِ لِيَشْتَرُوا بِهِ ثَمَنًا قَلِيلًا ۖ فَوَيْلٌ لَّهُم مِّمَّا كَتَبَتْ أَيْدِيهِمْ وَوَيْلٌ لَّهُم مِّمَّا يَكْسِبُونَ
తమ స్వహస్తాలతో లిఖించిన గ్రంథాన్ని దైవగ్రంథమని చెప్పి, ప్రాపంచిక తుచ్ఛ ప్రయోజనాన్ని పొందజూసే వారికి ‘వినాశం’ కలదు. వారి ఈ స్వహస్త లిఖిత రచన కూడా వారి వినాశానికి దారితీస్తుంది. వారి ఈ సంపాదన కూడా వారి నాశనానికి కారణ భూతం అవుతుంది.
2:80 وَقَالُوا لَن تَمَسَّنَا النَّارُ إِلَّا أَيَّامًا مَّعْدُودَةً ۚ قُلْ أَتَّخَذْتُمْ عِندَ اللَّهِ عَهْدًا فَلَن يُخْلِفَ اللَّهُ عَهْدَهُ ۖ أَمْ تَقُولُونَ عَلَى اللَّهِ مَا لَا تَعْلَمُونَ
పైగా, “మేము నరకాగ్నిలో కొన్ని రోజులు మాత్రమే ఉంటాము” అని వారంటున్నారు. వారిని అడుగు: మీరు ఆ మేరకు అల్లాహ్ నుండి పొందిన వాగ్దానం ఏదన్నా మీ వద్ద ఉందా? ఒకవేళ ఉంటే అల్లాహ్ ముమ్మాటికీ తన వాగ్దానానికి విరుద్ధంగా వ్యవహరించడు. (అసలు అలా జరగనే లేదు) అసలు మీరు మీకు తెలియని విషయాలను అల్లాహ్‌కు ఆపాదిస్తున్నారు.
2:81 بَلَىٰ مَن كَسَبَ سَيِّئَةً وَأَحَاطَتْ بِهِ خَطِيئَتُهُ فَأُولَٰئِكَ أَصْحَابُ النَّارِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ
నిస్సందేహంగా – ఎవడు పాపకార్యాలకు ఒడిగట్టాడో, అతని పాపాలు అతన్ని చుట్టుముట్టాయో అలాంటివారే నరకవాసులు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు.
2:82 وَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ أُولَٰئِكَ أَصْحَابُ الْجَنَّةِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ
మరెవరు విశ్వసించి, మంచి పనులు చేస్తారో వారు స్వర్గవాసులు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు.
2:83 وَإِذْ أَخَذْنَا مِيثَاقَ بَنِي إِسْرَائِيلَ لَا تَعْبُدُونَ إِلَّا اللَّهَ وَبِالْوَالِدَيْنِ إِحْسَانًا وَذِي الْقُرْبَىٰ وَالْيَتَامَىٰ وَالْمَسَاكِينِ وَقُولُوا لِلنَّاسِ حُسْنًا وَأَقِيمُوا الصَّلَاةَ وَآتُوا الزَّكَاةَ ثُمَّ تَوَلَّيْتُمْ إِلَّا قَلِيلًا مِّنكُمْ وَأَنتُم مُّعْرِضُونَ
మేము ఇస్రాయీల్ వంశస్థుల నుండి వాగ్దానం తీసుకున్నాము (దాన్ని గుర్తుకు తెచ్చుకోండి) : “అల్లాహ్‌ను తప్ప వేరెవరినీ ఆరాధించకూడదు. తల్లిదండ్రుల యెడల ఉత్తమంగా మెలగాలి. అలాగే బంధువులను, అనాధలను, అగత్యపరులను (ఆదరించాలి). ప్రజలతో మర్యాదగా మాట్లాడాలి. నమాజును నెలకొల్పుతూ ఉండాలి, జకాత్ ఇస్తూ ఉండాలి.” అయితే మీలో కొద్దిమంది తప్ప అందరూ మాట తప్పారు, ముఖం తిప్పుకున్నారు.
2:84 وَإِذْ أَخَذْنَا مِيثَاقَكُمْ لَا تَسْفِكُونَ دِمَاءَكُمْ وَلَا تُخْرِجُونَ أَنفُسَكُم مِّن دِيَارِكُمْ ثُمَّ أَقْرَرْتُمْ وَأَنتُمْ تَشْهَدُونَ
పరస్పరం రక్తం చిందించరాదనీ (చంపుకోరాదని), తోటి వారిని వారి నివాసస్థలాల నుంచి బహిష్కరించరాదనీ మీనుండి వాగ్దానం తీసుకున్నప్పుడు, దానికి మీరు అంగీకరించారు. ఆ విషయానికి స్వయంగా మీరే సాక్షులు.
2:85 ثُمَّ أَنتُمْ هَٰؤُلَاءِ تَقْتُلُونَ أَنفُسَكُمْ وَتُخْرِجُونَ فَرِيقًا مِّنكُم مِّن دِيَارِهِمْ تَظَاهَرُونَ عَلَيْهِم بِالْإِثْمِ وَالْعُدْوَانِ وَإِن يَأْتُوكُمْ أُسَارَىٰ تُفَادُوهُمْ وَهُوَ مُحَرَّمٌ عَلَيْكُمْ إِخْرَاجُهُمْ ۚ أَفَتُؤْمِنُونَ بِبَعْضِ الْكِتَابِ وَتَكْفُرُونَ بِبَعْضٍ ۚ فَمَا جَزَاءُ مَن يَفْعَلُ ذَٰلِكَ مِنكُمْ إِلَّا خِزْيٌ فِي الْحَيَاةِ الدُّنْيَا ۖ وَيَوْمَ الْقِيَامَةِ يُرَدُّونَ إِلَىٰ أَشَدِّ الْعَذَابِ ۗ وَمَا اللَّهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُونَ
కాని మీరు పరస్పరం చంపుకున్నారు. మీలోని ఒక వర్గం వారిని ఇండ్ల నుంచి బహిష్కరించటం కూడా చేశారు. పాపానికి, దౌర్జన్యానికి పాల్పడుతూ మీరు వారికి వ్యతిరేకంగా-ఇతరులను సమర్థించారు. మరి వారు బందీలుగా పట్టుబడి మీ వద్దకు వచ్చినప్పుడు మీరు వారికోసం నష్టపరిహారం ఇచ్చిన మాట వాస్తవమే. కాని మీరు వారిని వెళ్ళగొట్టడమే అధర్మం (అప్పుడు మీరు దాన్ని అస్సలు లెక్కచేయలేదు). ఏమిటీ? మీరు కొన్ని ఆజ్ఞలను విశ్వసించి, మరికొన్నింటిని తిరస్కరిస్తున్నారా? మీలో ఇలా చేసేవారికి ప్రపంచ జీవితంలో అవమానం తప్ప ఇంకేం ప్రతిఫలం ఉంటుంది? ఇక ప్రళయ దినాన వారు మరింత కఠినమైన శిక్ష వైపు మరలించబడతారు. అల్లాహ్‌కు మీ చేష్టలు తెలియకుండా లేవు.
2:86 أُولَٰئِكَ الَّذِينَ اشْتَرَوُا الْحَيَاةَ الدُّنْيَا بِالْآخِرَةِ ۖ فَلَا يُخَفَّفُ عَنْهُمُ الْعَذَابُ وَلَا هُمْ يُنصَرُونَ
పరలోకానికి బదులుగా ప్రాపంచిక జీవితాన్ని కొనుక్కున్న వారు వీరే. వీరికి విధించబడే శిక్షల్లో తగ్గింపూ ఉండదు, వారికి సహాయపడటమూ జరగదు.
2:87 وَلَقَدْ آتَيْنَا مُوسَى الْكِتَابَ وَقَفَّيْنَا مِن بَعْدِهِ بِالرُّسُلِ ۖ وَآتَيْنَا عِيسَى ابْنَ مَرْيَمَ الْبَيِّنَاتِ وَأَيَّدْنَاهُ بِرُوحِ الْقُدُسِ ۗ أَفَكُلَّمَا جَاءَكُمْ رَسُولٌ بِمَا لَا تَهْوَىٰ أَنفُسُكُمُ اسْتَكْبَرْتُمْ فَفَرِيقًا كَذَّبْتُمْ وَفَرِيقًا تَقْتُلُونَ
మేము మూసాకు గ్రంథం వొసగాము. అతని తరువాత కూడా ప్రవక్తలను పంపించాము. ఇంకా మేము మర్యమ్ కుమారుడైన ఈసాకు స్పష్టమైన నిదర్శనాలు ఇచ్చాము. రూహుల్ ఖుదుస్ ద్వారా అతనికి సహాయం చేశాము. అయితే ఏ ప్రవక్త అయినా మీ మనసులకు నచ్చని విషయాలు మీ వద్దకు తెచ్చినప్పుడల్లా మీరు అహంకారం ప్రదర్శించారు. వారిలో కొందరిని ధిక్కరించారు, మరి కొందరిని హతమార్చటం కూడా చేశారు.
2:88 وَقَالُوا قُلُوبُنَا غُلْفٌ ۚ بَل لَّعَنَهُمُ اللَّهُ بِكُفْرِهِمْ فَقَلِيلًا مَّا يُؤْمِنُونَ
“మా హృదయాలు గలేబుల్లో చుట్టబడి ఉన్నాయ”ని వారంటున్నారు. కాదు, వారి తిరస్కారవైఖరి మూలంగా అల్లాహ్ వారిని ధూత్కరించాడు. కనుక వారు విశ్వసించేది బహుస్వల్పం.
2:89 وَلَمَّا جَاءَهُمْ كِتَابٌ مِّنْ عِندِ اللَّهِ مُصَدِّقٌ لِّمَا مَعَهُمْ وَكَانُوا مِن قَبْلُ يَسْتَفْتِحُونَ عَلَى الَّذِينَ كَفَرُوا فَلَمَّا جَاءَهُم مَّا عَرَفُوا كَفَرُوا بِهِ ۚ فَلَعْنَةُ اللَّهِ عَلَى الْكَافِرِينَ
వారి వద్ద (ముందు నుంచే) ఉన్న దైవగ్రంథాన్ని ధృవీకరించే గ్రంథం అల్లాహ్ వద్ద నుంచి వచ్చినప్పుడు, తెలిసి కూడా వారు దానిని తిరస్కరించసాగారు – మరి చూడబోతే దీని రాకకు మునుపు తమకు అవిశ్వాసులపై విజయం చేకూరాలని వారు స్వయంగా అభిలషించేవారు. ఇటువంటి తిరస్కారులపై అల్లాహ్ శాపం పడుగాక!
2:90 بِئْسَمَا اشْتَرَوْا بِهِ أَنفُسَهُمْ أَن يَكْفُرُوا بِمَا أَنزَلَ اللَّهُ بَغْيًا أَن يُنَزِّلَ اللَّهُ مِن فَضْلِهِ عَلَىٰ مَن يَشَاءُ مِنْ عِبَادِهِ ۖ فَبَاءُوا بِغَضَبٍ عَلَىٰ غَضَبٍ ۚ وَلِلْكَافِرِينَ عَذَابٌ مُّهِينٌ
ఏ వస్తువుకు బదులుగా వారు తమను అమ్ముకున్నారో అది అత్యంత నీచమైనది- అది వారి తిరస్కారం. అల్లాహ్ తాను ఇష్టపడే తన దాసుణ్ణి ప్రత్యేకంగా అనుగ్రహించాడన్న అసూయతో వారు అల్లాహ్ తరఫున అవతరించిన విషయాలను తిరస్కరించి ఆగ్రహంపై ఆగ్రహానికి పాత్రులయ్యారు. ఇంకా ఈ తిరస్కారుల కొరకు ఘోర అవమానంతో కూడిన శిక్ష ఉంది.
2:91 وَإِذَا قِيلَ لَهُمْ آمِنُوا بِمَا أَنزَلَ اللَّهُ قَالُوا نُؤْمِنُ بِمَا أُنزِلَ عَلَيْنَا وَيَكْفُرُونَ بِمَا وَرَاءَهُ وَهُوَ الْحَقُّ مُصَدِّقًا لِّمَا مَعَهُمْ ۗ قُلْ فَلِمَ تَقْتُلُونَ أَنبِيَاءَ اللَّهِ مِن قَبْلُ إِن كُنتُم مُّؤْمِنِينَ
“అల్లాహ్ అవతరింపజేసిన గ్రంథాన్ని విశ్వసించండి” అని వారితో అన్నప్పుడు, “మాపై అవతరింపజేయబడిన దానిని మేము విశ్వసిస్తున్నాం” అని సమాధానమిస్తారు. దాని తర్వాత వచ్చిన దాన్ని, అది సత్యమైనప్పటికీ, తమవద్ద ఉన్న గ్రంథాన్ని అది ధృవీకరిస్తున్నప్పటికీ వారు తిరస్కరిస్తారు. (సరే! అలాగైతే) వారిని ఈ విధంగా అడుగు: “(మునుపటి గ్రంథాలపై) మీకు నమ్మకముంటే, మరి పూర్వం వచ్చిన దైవప్రవక్తలను ఎందుకు హత్య చేశారు?”
2:92 وَلَقَدْ جَاءَكُم مُّوسَىٰ بِالْبَيِّنَاتِ ثُمَّ اتَّخَذْتُمُ الْعِجْلَ مِن بَعْدِهِ وَأَنتُمْ ظَالِمُونَ
మీ వద్దకు మూసా ఈ సూచనలనే తీసుకువచ్చాడు. అయినా సరే అతను వెళ్ళిన తరువాత మీరు ఆవుదూడను పూజించారు. (అసలు విషయం ఏమిటంటే) మీరు దుర్మార్గులు.
2:93 وَإِذْ أَخَذْنَا مِيثَاقَكُمْ وَرَفَعْنَا فَوْقَكُمُ الطُّورَ خُذُوا مَا آتَيْنَاكُم بِقُوَّةٍ وَاسْمَعُوا ۖ قَالُوا سَمِعْنَا وَعَصَيْنَا وَأُشْرِبُوا فِي قُلُوبِهِمُ الْعِجْلَ بِكُفْرِهِمْ ۚ قُلْ بِئْسَمَا يَأْمُرُكُم بِهِ إِيمَانُكُمْ إِن كُنتُم مُّؤْمِنِينَ
మేము తూరు పర్వతాన్ని మీపైకి ఎత్తి, మీనుండి వాగ్దానం తీసుకున్న సందర్భాన్ని మననం చేసుకోండి – (ఆ సందర్భంగా మేము), “మీకు ప్రసాదించిన దానిని గట్టిగా పట్టుకోండి. మరియు వినండి” అని అనగానే, వారు “మేము విన్నాము. కాని శిరసావహించము” అని బదులిచ్చారు. అసలు వారి హృదయాలలో ఆవుదూడ పట్ల ప్రేమాభిమానాలు నూరి పోయబడ్డాయి. వారి అవిశ్వాసం కారణంగా (వారికీ దుర్గతి పట్టింది). వారితో అనండి : “మీరు విశ్వాసులే అయితే మీ ఈ విశ్వాసం మీకు చెడు ఆజ్ఞ ఇస్తోంది.”
2:94 قُلْ إِن كَانَتْ لَكُمُ الدَّارُ الْآخِرَةُ عِندَ اللَّهِ خَالِصَةً مِّن دُونِ النَّاسِ فَتَمَنَّوُا الْمَوْتَ إِن كُنتُمْ صَادِقِينَ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “ఒకవేళ అల్లాహ్ వద్ద పరలోక నివాసం ఇతర మానవులెవరికీ కాకుండా కేవలం మీ కొరకే ప్రత్యేకమై ఉంటే, రండి! మీ వాదన సత్యమైందనడానికి రుజువుగా మరణాన్ని కోరండి.”
2:95 وَلَن يَتَمَنَّوْهُ أَبَدًا بِمَا قَدَّمَتْ أَيْدِيهِمْ ۗ وَاللَّهُ عَلِيمٌ بِالظَّالِمِينَ
కాని వారు తమ చేజేతులా చేసుకున్న దురాగతాల దృష్ట్యా ఎన్నటికీ మరణాన్ని కోరరు. అల్లాహ్ దుర్మార్గుల గురించి బాగా ఎరిగినవాడు.
2:96 وَلَتَجِدَنَّهُمْ أَحْرَصَ النَّاسِ عَلَىٰ حَيَاةٍ وَمِنَ الَّذِينَ أَشْرَكُوا ۚ يَوَدُّ أَحَدُهُمْ لَوْ يُعَمَّرُ أَلْفَ سَنَةٍ وَمَا هُوَ بِمُزَحْزِحِهِ مِنَ الْعَذَابِ أَن يُعَمَّرَ ۗ وَاللَّهُ بَصِيرٌ بِمَا يَعْمَلُونَ
(ఓ ప్రవక్తా!) జీవితం పట్ల అందరికన్నా ఎక్కువ వ్యామోహం వీరికే ఉందన్న విషయాన్ని నువ్వు గ్రహిస్తావు. (జీవితం పట్ల వ్యామోహంలో) వీరు ముష్రిక్కులను కూడా మించిపోయారు. వీరిలోని ప్రతి ఒక్కడూ వెయ్యి సంవత్సరాల వయస్సును కోరుకుంటాడు. అయితే ఈ దీర్ఘాయుషు కూడా వారిని శిక్ష బారి నుంచి ఏ మాత్రం తప్పించలేదు. అల్లాహ్ వారి కార్యకలాపాలన్నింటినీ చూస్తూనే ఉన్నాడు.
2:97 قُلْ مَن كَانَ عَدُوًّا لِّجِبْرِيلَ فَإِنَّهُ نَزَّلَهُ عَلَىٰ قَلْبِكَ بِإِذْنِ اللَّهِ مُصَدِّقًا لِّمَا بَيْنَ يَدَيْهِ وَهُدًى وَبُشْرَىٰ لِلْمُؤْمِنِينَ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “జిబ్రీల్‌కు శత్రువు అయిన ప్రతివాడూ (అల్లాహ్‌తో శత్రుత్వాన్ని కొనితెచ్చుకున్నాడన్న) యదార్థాన్ని గ్రహించాలి. ఎందుకంటే అల్లాహ్ సూచనపైనే ఆయన నీ హృదయంపై ఈ సందేశాన్ని అవతరింపజేశాడు. ఇది (ఈ ఖుర్ఆన్) తనకు పూర్వం వచ్చిన గ్రంథాలను ధృవీకరిస్తుంది. విశ్వసించేవారికి మార్గదర్శకత్వం వహిస్తూ, వారికి శుభవార్త ఇస్తుంది.
2:98 مَن كَانَ عَدُوًّا لِّلَّهِ وَمَلَائِكَتِهِ وَرُسُلِهِ وَجِبْرِيلَ وَمِيكَالَ فَإِنَّ اللَّهَ عَدُوٌّ لِّلْكَافِرِينَ
ఎవరు అల్లాహ్‌కు, ఆయన దూతలకు, ఆయన ప్రవక్తలకు, జిబ్రీల్ మరియు మీకాయీల్కు శత్రువులుగా ఉంటారో, అటువంటి అవిశ్వాసులకు అల్లాహ్ శత్రువుగా ఉంటాడు.
2:99 وَلَقَدْ أَنزَلْنَا إِلَيْكَ آيَاتٍ بَيِّنَاتٍ ۖ وَمَا يَكْفُرُ بِهَا إِلَّا الْفَاسِقُونَ
(ఓ ప్రవక్తా!) స్పష్టమైన సూచనలను మేము నీపై అవతరింపజేశాము. అవిధేయులు తప్ప వేరెవరూ వాటిని త్రోసిపుచ్చరు.
2:100 أَوَكُلَّمَا عَاهَدُوا عَهْدًا نَّبَذَهُ فَرِيقٌ مِّنْهُم ۚ بَلْ أَكْثَرُهُمْ لَا يُؤْمِنُونَ
వారెప్పుడు ఏ వాగ్దానం చేసినా, వారిలోని ఏదో ఒక వర్గం దాన్ని భంగపరుస్తుంది. పైగా వారిలో అనేకులు విశ్వాసులు కారు.
2:101 وَلَمَّا جَاءَهُمْ رَسُولٌ مِّنْ عِندِ اللَّهِ مُصَدِّقٌ لِّمَا مَعَهُمْ نَبَذَ فَرِيقٌ مِّنَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ كِتَابَ اللَّهِ وَرَاءَ ظُهُورِهِمْ كَأَنَّهُمْ لَا يَعْلَمُونَ
వారి వద్దకు, వారి గ్రంథాన్ని నిజమని ధృవీకరించే ప్రవక్త అల్లాహ్ తరఫు నుంచి ఎప్పుడు వచ్చినా ఆ గ్రంథ వహులలోని ఒక వర్గంవారు, దైవగ్రంథాన్ని, అసలు దాని గురించి ఏమీ తెలియనివారుగా వెనుక పడవేశారు.
2:102 وَاتَّبَعُوا مَا تَتْلُو الشَّيَاطِينُ عَلَىٰ مُلْكِ سُلَيْمَانَ ۖ وَمَا كَفَرَ سُلَيْمَانُ وَلَٰكِنَّ الشَّيَاطِينَ كَفَرُوا يُعَلِّمُونَ النَّاسَ السِّحْرَ وَمَا أُنزِلَ عَلَى الْمَلَكَيْنِ بِبَابِلَ هَارُوتَ وَمَارُوتَ ۚ وَمَا يُعَلِّمَانِ مِنْ أَحَدٍ حَتَّىٰ يَقُولَا إِنَّمَا نَحْنُ فِتْنَةٌ فَلَا تَكْفُرْ ۖ فَيَتَعَلَّمُونَ مِنْهُمَا مَا يُفَرِّقُونَ بِهِ بَيْنَ الْمَرْءِ وَزَوْجِهِ ۚ وَمَا هُم بِضَارِّينَ بِهِ مِنْ أَحَدٍ إِلَّا بِإِذْنِ اللَّهِ ۚ وَيَتَعَلَّمُونَ مَا يَضُرُّهُمْ وَلَا يَنفَعُهُمْ ۚ وَلَقَدْ عَلِمُوا لَمَنِ اشْتَرَاهُ مَا لَهُ فِي الْآخِرَةِ مِنْ خَلَاقٍ ۚ وَلَبِئْسَ مَا شَرَوْا بِهِ أَنفُسَهُمْ ۚ لَوْ كَانُوا يَعْلَمُونَ
వారు సులైమాను రాజ్యంలోని షైతానులు అవలంబించిన విషయాల వెనుకపడ్డారు. అసలు సులైమాను ఎన్నడూ అవిశ్వాసానికి ఒడిగట్టలేదు, ఈ అవిశ్వాస పోకడ అసలు షైతానులదే. వారు ప్రజలకు చేతబడిని నేర్పేవారు. వారు బాబిలోనియాలో హారూత్, మారూత్ అనే ఇద్దరు దైవదూతలపై అవతరింపజేయబడిన విద్య వెంటపడ్డారు. “మేము ఒక పరీక్ష వంటివారం. నువ్వు మాత్రం అవిశ్వాసానికి పాల్పడకు” అని (స్పష్టంగా) చెప్పనంతవరకూ వారు (ఇద్దరూ) ఎవరికీ ఆ విద్యను నేర్పేవారు కూడా కాదు. అయినప్పటికీ జనులు వారి దగ్గర భార్యాభర్తలను విడగొట్టే విద్యను నేర్చుకునేవారు. ఎంత చేసినా వారు అల్లాహ్ అనుమతి లేకుండా ఆ చేతబడి ద్వారా ఎవరికీ ఎలాంటి కీడు కలిగించలేరు సుమా! తమకు నష్టం తప్ప ఏమాత్రం ప్రయోజనం చేకూర్చని దానిని వారు నేర్చుకుంటున్నారు. ఆ విద్యను కొనుక్కున్నవారికి పరలోకంలో (అక్కడి సుఖసౌఖ్యాలలో) ఎలాంటి భాగం లేదన్న సంగతి వారికి సయితం తెలుసు. ఎంత నీచమైన వస్తువుకు బదులుగా వారు తమను తాము అమ్ముకుంటున్నారో వారికి తెలిస్తే ఎంత బావుండు!
2:103 وَلَوْ أَنَّهُمْ آمَنُوا وَاتَّقَوْا لَمَثُوبَةٌ مِّنْ عِندِ اللَّهِ خَيْرٌ ۖ لَّوْ كَانُوا يَعْلَمُونَ
వారే గనక విశ్వసించి, అల్లాహ్ పట్ల భీతిపరులుగా వ్యవహరించి ఉంటే అల్లాహ్ తరఫున వారికి అత్యుత్తమ పుణ్యఫలం లభించి ఉండేది. ఆ సంగతిని వారు తెలుసుకోగలిగితే ఎంత బావుండేది!
2:104 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَقُولُوا رَاعِنَا وَقُولُوا انظُرْنَا وَاسْمَعُوا ۗ وَلِلْكَافِرِينَ عَذَابٌ أَلِيمٌ
ఓ విశ్వాసులారా! (దైవప్రవక్త-సల్లల్లాహు అలైహి వ సల్లంను) ‘రాయినా’ అని అనకండి, ‘ఉన్జుర్నా’ అని అనండి. శ్రద్ధగా వింటూ ఉండండి. అవిశ్వాసుల కొరకు బాధాకరమైన శిక్ష ఉంది.
2:105 مَّا يَوَدُّ الَّذِينَ كَفَرُوا مِنْ أَهْلِ الْكِتَابِ وَلَا الْمُشْرِكِينَ أَن يُنَزَّلَ عَلَيْكُم مِّنْ خَيْرٍ مِّن رَّبِّكُمْ ۗ وَاللَّهُ يَخْتَصُّ بِرَحْمَتِهِ مَن يَشَاءُ ۚ وَاللَّهُ ذُو الْفَضْلِ الْعَظِيمِ
మీపై మీ ప్రభువు తరఫు నుంచి ఏదైనా మేలుతో కూడుకున్న విషయం అవతరించటం గ్రంథవహుల్లోని తిరస్కారులకుగానీ, ముష్రిక్కు (బహుదైవారాధకు)లకు గానీ ఏమాత్రం ఇష్టం లేదు. (వారెంతగా అసూయ చెందినా ఫరవాలేదు) అల్లాహ్ తన ప్రత్యేక కారుణ్యం నుంచి తాను కోరిన వారికి అనుగ్రహిస్తాడు, అల్లాహ్ గొప్ప అనుగ్రహం కలవాడు.
2:106 مَا نَنسَخْ مِنْ آيَةٍ أَوْ نُنسِهَا نَأْتِ بِخَيْرٍ مِّنْهَا أَوْ مِثْلِهَا ۗ أَلَمْ تَعْلَمْ أَنَّ اللَّهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
(ఓ ప్రవక్తా!) ఏదేని ఒక వాక్యాన్ని మేము రద్దుపరచినా లేక మరపింపజేసినా (దాని స్థానంలో) దానికన్నా ఉత్తమమైన దానినీ లేదా కనీసం దానికి సమానమైన దానిని తీసుకువస్తాము. అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడన్న సంగతి నీకు తెలియదా?
2:107 أَلَمْ تَعْلَمْ أَنَّ اللَّهَ لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۗ وَمَا لَكُم مِّن دُونِ اللَّهِ مِن وَلِيٍّ وَلَا نَصِيرٍ
భూమ్యాకాశాల సార్వభౌమత్వం అల్లాహ్దేననీ, అల్లాహ్ తప్ప మరొకరెవరూ మీ రక్షకులూ, సహాయకులూ కారన్న విషయం నీకు తెలియదా?
2:108 أَمْ تُرِيدُونَ أَن تَسْأَلُوا رَسُولَكُمْ كَمَا سُئِلَ مُوسَىٰ مِن قَبْلُ ۗ وَمَن يَتَبَدَّلِ الْكُفْرَ بِالْإِيمَانِ فَقَدْ ضَلَّ سَوَاءَ السَّبِيلِ
లోగడ మూసా (అలైహిస్సలాం)కు వేయబడినటువంటి ప్రశ్నలే మీరు మీ ప్రవక్త (ముహమ్మద్-స)కు వేయదలుస్తున్నారా? (అయితే వినండి) విశ్వాసాన్ని అవిశ్వాస వైఖరి ద్వారా మార్చేవాడు రుజుమార్గం నుంచి తప్పిపోతాడు.
2:109 وَدَّ كَثِيرٌ مِّنْ أَهْلِ الْكِتَابِ لَوْ يَرُدُّونَكُم مِّن بَعْدِ إِيمَانِكُمْ كُفَّارًا حَسَدًا مِّنْ عِندِ أَنفُسِهِم مِّن بَعْدِ مَا تَبَيَّنَ لَهُمُ الْحَقُّ ۖ فَاعْفُوا وَاصْفَحُوا حَتَّىٰ يَأْتِيَ اللَّهُ بِأَمْرِهِ ۗ إِنَّ اللَّهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
ఈ గ్రంథవహుల్లోని అనేకులు, సత్యమేదో స్పష్టంగా తెలిసి పోయినప్పటికీ – కేవలం తమ మనసులలో ఉన్న అసూయ మూలంగా మిమ్మల్ని కూడా విశ్వాస మార్గం నుంచి అవిశ్వాసం వైపు మళ్ళించాలని చూస్తున్నారు. కాబట్టి అల్లాహ్ తన ఆదేశాన్ని తీసుకువచ్చే వరకూ మీరు కూడా మన్నింపుల వైఖరిని అవలంబిస్తూ ఉండండి, వారిని పట్టించుకోకండి. నిశ్చయంగా అల్లాహ్ అన్నింటిపై అధికారం కలవాడు.
2:110 وَأَقِيمُوا الصَّلَاةَ وَآتُوا الزَّكَاةَ ۚ وَمَا تُقَدِّمُوا لِأَنفُسِكُم مِّنْ خَيْرٍ تَجِدُوهُ عِندَ اللَّهِ ۗ إِنَّ اللَّهَ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ
మీరు మాత్రం నమాజును నెలకొల్పుతూ, జకాత్‌ను ఇస్తూ ఉండండి, మీరు మీ కోసం ఏ మంచి పనులను ముందుగా పంపుకున్నా అల్లాహ్ వద్ద వాటిని పొందుతారు. నిస్సందేహంగా అల్లాహ్ మీ కార్యకలాపాలన్నింటినీ గమనిస్తూనే ఉన్నాడు.
2:111 وَقَالُوا لَن يَدْخُلَ الْجَنَّةَ إِلَّا مَن كَانَ هُودًا أَوْ نَصَارَىٰ ۗ تِلْكَ أَمَانِيُّهُمْ ۗ قُلْ هَاتُوا بُرْهَانَكُمْ إِن كُنتُمْ صَادِقِينَ
“యూదులు, క్రైస్తవులు తప్ప వేరెవరూ స్వర్గంలో ప్రవేశించలేర”ని వారంటున్నారు. ఇవి వారి ఆశలు, ఆకాంక్షలు మాత్రమే. “మీరు మీ వాదనలో సత్యవంతులే అయితే ఆ మేరకు ఏదన్నా నిదర్శనం సమర్పించండి” అని వారిని అడుగు.
2:112 بَلَىٰ مَنْ أَسْلَمَ وَجْهَهُ لِلَّهِ وَهُوَ مُحْسِنٌ فَلَهُ أَجْرُهُ عِندَ رَبِّهِ وَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ
ఔను మరి! ఎవడైతే ఆచరణలో అత్యుత్తమ రీతిని అవలంబించి తనను తాను అల్లాహ్ సన్నిధిలో సమర్పించుకుంటాడో, అతనికి తన ప్రభువు వద్ద ప్రతిఫలం ఉంది. అలాంటి వారికి ఎలాంటి భయంగానీ, దుఃఖంగానీ ఉండవు.
2:113 وَقَالَتِ الْيَهُودُ لَيْسَتِ النَّصَارَىٰ عَلَىٰ شَيْءٍ وَقَالَتِ النَّصَارَىٰ لَيْسَتِ الْيَهُودُ عَلَىٰ شَيْءٍ وَهُمْ يَتْلُونَ الْكِتَابَ ۗ كَذَٰلِكَ قَالَ الَّذِينَ لَا يَعْلَمُونَ مِثْلَ قَوْلِهِمْ ۚ فَاللَّهُ يَحْكُمُ بَيْنَهُمْ يَوْمَ الْقِيَامَةِ فِيمَا كَانُوا فِيهِ يَخْتَلِفُونَ
క్రైస్తవులు సత్యంపై లేరని యూదులు అంటున్నారు. యూదులు సత్యంపై లేరని క్రైస్తవులంటున్నారు. మరి చూడబోతే వారంతా గ్రంథాన్ని చదువుతున్నారు. జ్ఞానం లేనివాళ్ళు కూడా ఇలాంటి మాటే అంటున్నారు. కనుక అల్లాహ్ ప్రళయ దినాన వీళ్ళ భేదాభిప్రాయం గురించి వీళ్ళ మధ్య తీర్పు చేస్తాడు.
2:114 وَمَنْ أَظْلَمُ مِمَّن مَّنَعَ مَسَاجِدَ اللَّهِ أَن يُذْكَرَ فِيهَا اسْمُهُ وَسَعَىٰ فِي خَرَابِهَا ۚ أُولَٰئِكَ مَا كَانَ لَهُمْ أَن يَدْخُلُوهَا إِلَّا خَائِفِينَ ۚ لَهُمْ فِي الدُّنْيَا خِزْيٌ وَلَهُمْ فِي الْآخِرَةِ عَذَابٌ عَظِيمٌ
అల్లాహ్ మస్జిదులలో, ఆయన నామస్మరణను అడ్డుకుని, వాటిని పాడుచేయడానికి ప్రయత్నించేవానికంటే పరమ దుర్మార్గుడు ఎవడుంటాడు? అటువంటివారు వాటిలో ప్రవేశించినా భయపడుతూనే ప్రవేశించాలి సుమా! వారికి ప్రపంచంలోనూ పరాభవం తప్పదు, పరలోకంలో కూడా మహా ఘోర శిక్ష తప్పదు.
2:115 وَلِلَّهِ الْمَشْرِقُ وَالْمَغْرِبُ ۚ فَأَيْنَمَا تُوَلُّوا فَثَمَّ وَجْهُ اللَّهِ ۚ إِنَّ اللَّهَ وَاسِعٌ عَلِيمٌ
తూర్పుపడమరలకు అధిపతి అల్లాహ్‌యే. మీరు మీ ముఖాన్ని ఏ వైపుకు త్రిప్పినా, అటు అల్లాహ్ సమ్ముఖం లభిస్తుంది. నిస్సందేహంగా అల్లాహ్ విస్తృతి కలవాడు, సర్వమూ తెలిసినవాడు.
2:116 وَقَالُوا اتَّخَذَ اللَّهُ وَلَدًا ۗ سُبْحَانَهُ ۖ بَل لَّهُ مَا فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ كُلٌّ لَّهُ قَانِتُونَ
అల్లాహ్‌కు సంతానం కలదని వీళ్ళు అంటున్నారు. (ఇలాంటి మాటలకు) ఆయన అతీతుడు, పవిత్రుడు. పైగా భూమ్యాకాశాలలో వున్న సమస్తమూ ఆయనదే. అవన్నీ ఆయన (ఆజ్ఞల)కు తల ఒగ్గి ఉన్నాయి.
2:117 بَدِيعُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ وَإِذَا قَضَىٰ أَمْرًا فَإِنَّمَا يَقُولُ لَهُ كُن فَيَكُونُ
భూమ్యాకాశాలను ప్రప్రథమంగా సృష్టించినవాడు ఆయనే. ఆయన ఏ పనినైనా చేయ సంకల్పించుకున్నప్పుడు దాన్ని ‘అయిపో’ అని అంటే చాలు, అది అయిపోతుంది.
2:118 وَقَالَ الَّذِينَ لَا يَعْلَمُونَ لَوْلَا يُكَلِّمُنَا اللَّهُ أَوْ تَأْتِينَا آيَةٌ ۗ كَذَٰلِكَ قَالَ الَّذِينَ مِن قَبْلِهِم مِّثْلَ قَوْلِهِمْ ۘ تَشَابَهَتْ قُلُوبُهُمْ ۗ قَدْ بَيَّنَّا الْآيَاتِ لِقَوْمٍ يُوقِنُونَ
జ్ఞానం లేనివాళ్లు, “అల్లాహ్ స్వయంగా మాతో ఎందుకు మాట్లాడడు? లేక మా వద్దకు ఏదైనా సూచన ఎందుకురాదు?” అని అంటారు. వారి పూర్వీకులు కూడా ఇలాంటి పలుకులే పలికారు. వారందరి హృదయాలు ఒకే విధమైనవి. వాస్తవానికి నమ్మేవారి కోసం మేము మా సూచనలను స్పష్టం చేసే ఉంచాము.
2:119 إِنَّا أَرْسَلْنَاكَ بِالْحَقِّ بَشِيرًا وَنَذِيرًا ۖ وَلَا تُسْأَلُ عَنْ أَصْحَابِ الْجَحِيمِ
(ఓ ప్రవక్తా!) మేము నిన్ను సత్యంతో పాటు శుభవార్తనిచ్చే వానిగా, హెచ్చరించేవానిగా చేసి పంపాము. నరకవాసుల గురించి నిన్ను (నిలదీసి) అడగటం జరగదు.
2:120 وَلَن تَرْضَىٰ عَنكَ الْيَهُودُ وَلَا النَّصَارَىٰ حَتَّىٰ تَتَّبِعَ مِلَّتَهُمْ ۗ قُلْ إِنَّ هُدَى اللَّهِ هُوَ الْهُدَىٰ ۗ وَلَئِنِ اتَّبَعْتَ أَهْوَاءَهُم بَعْدَ الَّذِي جَاءَكَ مِنَ الْعِلْمِ ۙ مَا لَكَ مِنَ اللَّهِ مِن وَلِيٍّ وَلَا نَصِيرٍ
(ఓ ముహమ్మద్!) నువ్వు వారి విధానాన్ని అనుసరించనంత వరకూ యూదులు, క్రైస్తవులు నిన్ను ఇష్టపడరు. అల్లాహ్ చూపిన మార్గమే సరైన మార్గం అని నువ్వు వారికి చెప్పేయి. ఒకవేళ నువ్వు నీ వద్దకు జ్ఞానం వచ్చిన మీదట కూడా వారి కోరికలను అనుసరిస్తే, అల్లాహ్ (పట్టు) నుండి నిన్ను రక్షించేవాడు, సహాయకుడూ ఎవడూ ఉండడు.
2:121 الَّذِينَ آتَيْنَاهُمُ الْكِتَابَ يَتْلُونَهُ حَقَّ تِلَاوَتِهِ أُولَٰئِكَ يُؤْمِنُونَ بِهِ ۗ وَمَن يَكْفُرْ بِهِ فَأُولَٰئِكَ هُمُ الْخَاسِرُونَ
మేము ఎవరికి గ్రంథం వొసగామో వారు దానిని పారాయణం చేయవలసిన రీతిలో పారాయణం చేస్తారు. (అంతేకాదు,) వారు ఈ గ్రంథాన్ని విశ్వసిస్తారు. ఇక, దీనిపట్ల తిరస్కార వైఖరిని అవలంబించినవారే నష్టపోయేది.
2:122 يَا بَنِي إِسْرَائِيلَ اذْكُرُوا نِعْمَتِيَ الَّتِي أَنْعَمْتُ عَلَيْكُمْ وَأَنِّي فَضَّلْتُكُمْ عَلَى الْعَالَمِينَ
ఓ (యాఖూబు) ఇస్రాయీలు సంతతివారలారా! నేను మీపై కురిపించిన వరాలను జ్ఞప్తికి తెచ్చుకోండి. నేను మీకు సమస్త లోకాలపై (అలనాటి అన్ని జాతులపై, సమాజాలపై) శ్రేష్ఠతను వొసగాను.
2:123 وَاتَّقُوا يَوْمًا لَّا تَجْزِي نَفْسٌ عَن نَّفْسٍ شَيْئًا وَلَا يُقْبَلُ مِنْهَا عَدْلٌ وَلَا تَنفَعُهَا شَفَاعَةٌ وَلَا هُمْ يُنصَرُونَ
ఎవరూ ఎవరికీ ఏ విధంగానూ తోడ్పడలేని, ఎవరి నుంచీ పరిహారం కూడా స్వీకరించబడని, ఏ సిఫారసూ ఎవరికీ ప్రయోజనకరం కాజాలని, ఎవరికీ సహాయం కూడా చేయజాలని ఆ దినానికి భయపడండి.
2:124 وَإِذِ ابْتَلَىٰ إِبْرَاهِيمَ رَبُّهُ بِكَلِمَاتٍ فَأَتَمَّهُنَّ ۖ قَالَ إِنِّي جَاعِلُكَ لِلنَّاسِ إِمَامًا ۖ قَالَ وَمِن ذُرِّيَّتِي ۖ قَالَ لَا يَنَالُ عَهْدِي الظَّالِمِينَ
(జ్ఞాపకం చేసుకోండి) ఇబ్రాహీం (అలైహిస్సలాం)ను అతని ప్రభువు అనేక విషయాలలో పరీక్షించగా, అతను అన్నింటిలోనూ (నికార్సుగా) నెగ్గుకు వచ్చాడు. అప్పుడు అల్లాహ్ అతన్ని ఉద్దేశించి, “నేను నిన్ను ప్రజలకు నాయకునిగా చేస్తాను” అన్నాడు. దానికి అతను, “నా సంతానాన్ని కూడానా!” అని అడిగాడు. అప్పుడు అల్లాహ్, “దుర్మార్గులకు నా వాగ్దానం వర్తించదు” అని సమాధానం ఇచ్చాడు.
2:125 وَإِذْ جَعَلْنَا الْبَيْتَ مَثَابَةً لِّلنَّاسِ وَأَمْنًا وَاتَّخِذُوا مِن مَّقَامِ إِبْرَاهِيمَ مُصَلًّى ۖ وَعَهِدْنَا إِلَىٰ إِبْرَاهِيمَ وَإِسْمَاعِيلَ أَن طَهِّرَا بَيْتِيَ لِلطَّائِفِينَ وَالْعَاكِفِينَ وَالرُّكَّعِ السُّجُودِ
(జ్ఞాపకం చేసుకోండి) మేము ఈ గృహాన్ని (కాబా గృహాన్ని) మానవులందరి పుణ్యక్షేత్రంగానూ, శాంతి నిలయంగానూ చేశాము. మీరు ఇబ్రాహీము నిలబడిన ప్రదేశాన్ని నమాజు స్థలంగా చేసుకోండి. “నా గృహాన్ని (సందర్శించి) ప్రదక్షిణ చేసేవారి కోసం, అక్కడ ఏతెకాఫ్ పాటించేవారి కోసం, రుకూ సజ్దాలు చేసేవారి కోసం మీరు దానిని పరిశుభ్రంగా, పరిశుద్ధంగా ఉంచాలి అని ఇబ్రాహీము, ఇస్మాయీలు నుంచి మేము వాగ్దానం తీసుకున్నాము.
2:126 وَإِذْ قَالَ إِبْرَاهِيمُ رَبِّ اجْعَلْ هَٰذَا بَلَدًا آمِنًا وَارْزُقْ أَهْلَهُ مِنَ الثَّمَرَاتِ مَنْ آمَنَ مِنْهُم بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ ۖ قَالَ وَمَن كَفَرَ فَأُمَتِّعُهُ قَلِيلًا ثُمَّ أَضْطَرُّهُ إِلَىٰ عَذَابِ النَّارِ ۖ وَبِئْسَ الْمَصِيرُ
“నా ప్రభూ! నీవు ఈ ప్రదేశాన్ని శాంతి నగరంగా చెయ్యి. ఈ నగరవాసులలో అల్లాహ్‌ను, అంతిమ దినాన్నీ విశ్వసించే వారికి పండ్లు ఫలాలను ఆహారంగా ప్రసాదించు” అని ఇబ్రాహీం అర్థించినప్పుడు అల్లాహ్ ఈ విధంగా పలికాడు: “విశ్వసించనివారికి కూడా నేను కొంత ప్రయోజనం చేకూర్చుతాను. కాని చివరకు వారిని అగ్నిశిక్ష వైపుకు ఈడుస్తాను. అది అత్యంత చెడ్డ నివాస స్థలం.”
2:127 وَإِذْ يَرْفَعُ إِبْرَاهِيمُ الْقَوَاعِدَ مِنَ الْبَيْتِ وَإِسْمَاعِيلُ رَبَّنَا تَقَبَّلْ مِنَّا ۖ إِنَّكَ أَنتَ السَّمِيعُ الْعَلِيمُ
ఇబ్రాహీం (అలైహిస్సలాం), ఇస్మాయీల్ (అలైహిస్సలాం)- ఇద్దరూ (కాబా) గృహ పునాదులను, గోడలను లేపుతూ ఇలా ప్రార్థించేవారు: “మా ప్రభూ! మా సేవను స్వీకరించు. నీవు మాత్రమే సర్వం వినేవాడవు, సర్వం తెలిసినవాడవు.”
2:128 رَبَّنَا وَاجْعَلْنَا مُسْلِمَيْنِ لَكَ وَمِن ذُرِّيَّتِنَا أُمَّةً مُّسْلِمَةً لَّكَ وَأَرِنَا مَنَاسِكَنَا وَتُبْ عَلَيْنَا ۖ إِنَّكَ أَنتَ التَّوَّابُ الرَّحِيمُ
“మా ప్రభూ! మమ్మల్ని నీ విధేయులు (ముస్లింలు)గా చేసుకో. మా సంతతి నుండి కూడా నీ విధేయతకు కట్టుబడి ఉండే ఒక సమూహాన్ని ప్రభవింపజెయ్యి. మాకు మా ఆరాధనా రీతులను నేర్పు. మమ్మల్ని క్షమించు. నిశ్చయంగా నీవు మాత్రమే పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడవు, అపారంగా కరుణించేవాడవు.”
2:129 رَبَّنَا وَابْعَثْ فِيهِمْ رَسُولًا مِّنْهُمْ يَتْلُو عَلَيْهِمْ آيَاتِكَ وَيُعَلِّمُهُمُ الْكِتَابَ وَالْحِكْمَةَ وَيُزَكِّيهِمْ ۚ إِنَّكَ أَنتَ الْعَزِيزُ الْحَكِيمُ
“మా ప్రభూ! నీ వాక్యాలను వారికి చదివి వినిపించే, గ్రంథజ్ఞానాన్ని నేర్పించే, విజ్ఞతా వివేచనలను విడమరచి చెప్పే, వారిని పరిశుద్ధపరచే ఒక ప్రవక్తను స్వయంగా వారి జాతి నుండే వారిలో ప్రభవింపజెయ్యి. నిస్సందేహంగా నీవు సర్వాధికుడవు, వివేకవంతుడవు.”
2:130 وَمَن يَرْغَبُ عَن مِّلَّةِ إِبْرَاهِيمَ إِلَّا مَن سَفِهَ نَفْسَهُ ۚ وَلَقَدِ اصْطَفَيْنَاهُ فِي الدُّنْيَا ۖ وَإِنَّهُ فِي الْآخِرَةِ لَمِنَ الصَّالِحِينَ
శుద్ధ అవివేకి మాత్రమే ఇబ్రాహీం ధర్మం (విధానం) పట్ల విరక్తి చెందుతాడు. మేము అతన్ని ప్రపంచంలోనూ ఎన్నుకున్నాము, పరలోకంలో కూడా అతడు సజ్జనుల సరసన ఉంటాడు.
2:131 إِذْ قَالَ لَهُ رَبُّهُ أَسْلِمْ ۖ قَالَ أَسْلَمْتُ لِرَبِّ الْعَالَمِينَ
“(ఆత్మ) సమర్పణ చేసుకో” అని అతని ప్రభువు అతన్ని ఆదేశించినప్పుడల్లా , “సకల లోకాల ప్రభువు సమక్షంలో నన్ను నేను సమర్పించుకున్నాను” అని అతను సమాధానం ఇచ్చాడు.
2:132 وَوَصَّىٰ بِهَا إِبْرَاهِيمُ بَنِيهِ وَيَعْقُوبُ يَا بَنِيَّ إِنَّ اللَّهَ اصْطَفَىٰ لَكُمُ الدِّينَ فَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسْلِمُونَ
ఈ ఉపదేశమే ఇబ్రాహీం మరియు యాఖూబ్ తమ సంతానానికి చేశారు. (వారిలా అన్నారు:) “నా బిడ్డలారా! అల్లాహ్ మీ కోసం ఈ (విధేయతా) ధర్మాన్నే ఇష్టపడ్డాడు. కనుక మీరు ముస్లింలుగా తప్ప మరణించకూడదు సుమా!”
2:133 أَمْ كُنتُمْ شُهَدَاءَ إِذْ حَضَرَ يَعْقُوبَ الْمَوْتُ إِذْ قَالَ لِبَنِيهِ مَا تَعْبُدُونَ مِن بَعْدِي قَالُوا نَعْبُدُ إِلَٰهَكَ وَإِلَٰهَ آبَائِكَ إِبْرَاهِيمَ وَإِسْمَاعِيلَ وَإِسْحَاقَ إِلَٰهًا وَاحِدًا وَنَحْنُ لَهُ مُسْلِمُونَ
ఏమిటీ, యాఖూబ్ మరణ ఘడియల్లో ఉన్నప్పుడు మీరక్కడ ఉన్నారా? ఆ సమయంలో ఆయన తన సంతానాన్నుద్దేశించి, “నా తదనంతరం మీరు దేనిని ఆరాధిస్తారు?” అని అడిగాడు. దానికి వారంతా, “మీ ఆరాధ్య దైవాన్ని, మీ పితామహులగు ఇబ్రాహీం, ఇస్మాయీలు, ఇస్హాఖ్ల ఆరాధ్యదైవం అయిన ఏకైక ఆరాధ్యుణ్ణి మాత్రమే ఆరాధిస్తాము, ఆయనకే విధేయులమై ఉంటాము” అని జవాబు ఇచ్చారు.
2:134 تِلْكَ أُمَّةٌ قَدْ خَلَتْ ۖ لَهَا مَا كَسَبَتْ وَلَكُم مَّا كَسَبْتُمْ ۖ وَلَا تُسْأَلُونَ عَمَّا كَانُوا يَعْمَلُونَ
అది గతించిన ఒక సమూహం. వారు చేసుకున్నది వారికి చెందుతుంది. మీరు చేసేది మీకు చెందుతుంది. వారి కర్మల గురించి మీరు ప్రశ్నించబడరు.
2:135 وَقَالُوا كُونُوا هُودًا أَوْ نَصَارَىٰ تَهْتَدُوا ۗ قُلْ بَلْ مِلَّةَ إِبْرَاهِيمَ حَنِيفًا ۖ وَمَا كَانَ مِنَ الْمُشْرِكِينَ
మీరు యూదులుగానో, క్రైస్తవులుగానో మారిపోతే సన్మార్గం పొందగలరని వారు అంటారు. (ఓ ముహమ్మద్!) మీరు వారికి స్పష్టంగా చెప్పండి: “కాదు, ఇబ్రాహీము ధర్మాన్ని అనుసరించే వారే సన్మార్గంపై ఉన్నారు. ఇబ్రాహీం స్వచ్ఛమైన ఏకదైవారాధ కుడు, అతను బహుదైవోపాసకుడు కాదు.”
2:136 قُولُوا آمَنَّا بِاللَّهِ وَمَا أُنزِلَ إِلَيْنَا وَمَا أُنزِلَ إِلَىٰ إِبْرَاهِيمَ وَإِسْمَاعِيلَ وَإِسْحَاقَ وَيَعْقُوبَ وَالْأَسْبَاطِ وَمَا أُوتِيَ مُوسَىٰ وَعِيسَىٰ وَمَا أُوتِيَ النَّبِيُّونَ مِن رَّبِّهِمْ لَا نُفَرِّقُ بَيْنَ أَحَدٍ مِّنْهُمْ وَنَحْنُ لَهُ مُسْلِمُونَ
(ముస్లిములారా!) మీరు ఇలా ప్రకటించండి : ”మేము అల్లాహ్‌ను విశ్వసించాము. మాపై అవతరింపజేయబడిన దానినీ, ఇబ్రాహీం, ఇస్మాయీల్, ఇస్హాఖ్, యాఖూబ్ మరియు వారి సంతతిపై అవతరింపజేయబడిన దానినీ, మూసా, ఈసా ప్రవక్తలకు వారి ప్రభువు తరఫున వొసగబడిన దానిని కూడా మేము విశ్వసించాము. మేము వారిలో ఎవరి మధ్య కూడా ఎలాంటి విచక్షణ (వివక్ష)ను పాటించము. మేము ఆయనకే విధేయులము.”
2:137 فَإِنْ آمَنُوا بِمِثْلِ مَا آمَنتُم بِهِ فَقَدِ اهْتَدَوا ۖ وَّإِن تَوَلَّوْا فَإِنَّمَا هُمْ فِي شِقَاقٍ ۖ فَسَيَكْفِيكَهُمُ اللَّهُ ۚ وَهُوَ السَّمِيعُ الْعَلِيمُ
ఒకవేళ వారు మీరు విశ్వసించినట్లే విశ్వసిస్తే, సన్మార్గం పొందగలరు. విముఖత గనక చూపితే వారు వైరభావానికి లోనై ఉన్నారన్నది సుస్పష్టం. వారి బారి నుండి (రక్షించటానికి) నీకు అల్లాహ్ చాలు. ఆయన అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు.
2:138 صِبْغَةَ اللَّهِ ۖ وَمَنْ أَحْسَنُ مِنَ اللَّهِ صِبْغَةً ۖ وَنَحْنُ لَهُ عَابِدُونَ
అల్లాహ్ రంగును స్వీకరించండి. అల్లాహ్ రంగుకన్నా మంచి రంగు ఎవరిది కాగలదు? మేము మాత్రం ఆయన్నే ఆరాధిస్తాము.
2:139 قُلْ أَتُحَاجُّونَنَا فِي اللَّهِ وَهُوَ رَبُّنَا وَرَبُّكُمْ وَلَنَا أَعْمَالُنَا وَلَكُمْ أَعْمَالُكُمْ وَنَحْنُ لَهُ مُخْلِصُونَ
వారితో చెప్పు : “ఏమిటీ, మాకూ ప్రభువు, మీకూ ప్రభువు అయిన అల్లాహ్ విషయంలో మీరు మాతో వాదులాడుతారా? మా ఆచరణలు మాకు, మీ ఆచరణలు మీకు. మేము ఆయనకే అంకితం అయ్యాము.
2:140 أَمْ تَقُولُونَ إِنَّ إِبْرَاهِيمَ وَإِسْمَاعِيلَ وَإِسْحَاقَ وَيَعْقُوبَ وَالْأَسْبَاطَ كَانُوا هُودًا أَوْ نَصَارَىٰ ۗ قُلْ أَأَنتُمْ أَعْلَمُ أَمِ اللَّهُ ۗ وَمَنْ أَظْلَمُ مِمَّن كَتَمَ شَهَادَةً عِندَهُ مِنَ اللَّهِ ۗ وَمَا اللَّهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُونَ
“ఇబ్రాహీము, ఇస్మాయీలు, ఇస్హాఖు, యాకూబు మరియు వారి సంతానం యూదులుగానో, క్రైస్తవులుగానో ఉన్నారని మీరు అంటున్నారా? ఏమిటీ, మీకు ఎక్కువ తెలుసా లేక అల్లాహ్‌కు ఎక్కువ తెలుసా?” అని వారిని అడుగు. అల్లాహ్ అప్పగించిన సాక్ష్యాన్ని దాచిపెట్టే వానికన్నా ఎక్కువ అన్యాయస్థుడు ఎవడు కాగలడు? మీ చేష్టల పట్ల అల్లాహ్ అజాగ్రత్తగా లేడు.
2:141 تِلْكَ أُمَّةٌ قَدْ خَلَتْ ۖ لَهَا مَا كَسَبَتْ وَلَكُم مَّا كَسَبْتُمْ ۖ وَلَا تُسْأَلُونَ عَمَّا كَانُوا يَعْمَلُونَ
అది గతించిన ఓ సమాజం. వారు చేసుకున్నది వారికి చెందుతుంది. మీరు చేసుకున్నది మీకు లభిస్తుంది. వారి కర్మల గురించి మీరు ప్రశ్నించబడరు.
2:142 سَيَقُولُ السُّفَهَاءُ مِنَ النَّاسِ مَا وَلَّاهُمْ عَن قِبْلَتِهِمُ الَّتِي كَانُوا عَلَيْهَا ۚ قُل لِّلَّهِ الْمَشْرِقُ وَالْمَغْرِبُ ۚ يَهْدِي مَن يَشَاءُ إِلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ
“వీరు ఏ ఖిబ్లా వైపుకు అభిముఖులయ్యేవారో దాన్నుంచి మరలటానికి కారణం ఏమిటీ?” అని మూర్ఖజనులు అంటారు. (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: తూర్పు పడమరలు (అన్నీ) అల్లాహ్‌వే. తాను తలచిన వారికి ఆయన రుజుమార్గం చూపుతాడు.
2:143 وَكَذَٰلِكَ جَعَلْنَاكُمْ أُمَّةً وَسَطًا لِّتَكُونُوا شُهَدَاءَ عَلَى النَّاسِ وَيَكُونَ الرَّسُولُ عَلَيْكُمْ شَهِيدًا ۗ وَمَا جَعَلْنَا الْقِبْلَةَ الَّتِي كُنتَ عَلَيْهَا إِلَّا لِنَعْلَمَ مَن يَتَّبِعُ الرَّسُولَ مِمَّن يَنقَلِبُ عَلَىٰ عَقِبَيْهِ ۚ وَإِن كَانَتْ لَكَبِيرَةً إِلَّا عَلَى الَّذِينَ هَدَى اللَّهُ ۗ وَمَا كَانَ اللَّهُ لِيُضِيعَ إِيمَانَكُمْ ۚ إِنَّ اللَّهَ بِالنَّاسِ لَرَءُوفٌ رَّحِيمٌ
అదే విధంగా మేము మిమ్మల్ని ఒక “న్యాయశీల సమాజం” (ఉమ్మతె వసత్)గా చేశాము – మీరు ప్రజలపై సాక్షులుగా, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మీపై సాక్షిగా ఉండటం కోసం (మేమిలా చేశాము.) ప్రవక్తకు విధేయత చూపటంలో ఎవరు నిజాయితీపరులో, మరెవరు వెనుతిరిగి పోయేవారో తెలుసుకునే (పరీక్షించే) నిమిత్తమే మేము, పూర్వం నీవు అభిముఖుడవై ఉండిన దిశను మీ ‘ఖిబ్లా’గా నిర్ధారించాము. ఇదెంతో కష్టమైన విషయమే అయినప్పటికీ అల్లాహ్ సన్మార్గం చూపిన వారికి (ఏ మాత్రం కష్టతరం కాదు). అల్లాహ్ మీ విశ్వాసాన్ని వృధా కానివ్వడు. నిశ్చయంగా అల్లాహ్ (తన దాసులైన) మానవుల యెడల అమితమైన వాత్సల్యం కలవాడు! పరమ కృపాశీలుడు.
2:144 قَدْ نَرَىٰ تَقَلُّبَ وَجْهِكَ فِي السَّمَاءِ ۖ فَلَنُوَلِّيَنَّكَ قِبْلَةً تَرْضَاهَا ۚ فَوَلِّ وَجْهَكَ شَطْرَ الْمَسْجِدِ الْحَرَامِ ۚ وَحَيْثُ مَا كُنتُمْ فَوَلُّوا وُجُوهَكُمْ شَطْرَهُ ۗ وَإِنَّ الَّذِينَ أُوتُوا الْكِتَابَ لَيَعْلَمُونَ أَنَّهُ الْحَقُّ مِن رَّبِّهِمْ ۗ وَمَا اللَّهُ بِغَافِلٍ عَمَّا يَعْمَلُونَ
(ఓ ప్రవక్తా!) నువ్వు నీ ముఖాన్ని మాటిమాటికీ ఆకాశం వైపుకు ఎత్తటం మేము గమనిస్తూనే ఉన్నాము. కాబట్టి ఇప్పుడు మేము, నువ్వు ఇష్టపడే ఆ దిశ వైపుకే నిన్ను త్రిప్పుతున్నాము. కనుక నువ్వు నీ ముఖాన్ని మస్జిదె హరామ్ వైపుకు త్రిప్పుకో. మీరెక్కడున్నాసరే ఇక మీదట మీ ముఖాలను దాని వైపుకే త్రిప్పాలి. (ఖిబ్లా మార్పుకు సంబంధించిన) ఈ విషయం, తమ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యమేనని గ్రంథం ఇవ్వబడిన వారికి బాగా తెలుసు. అల్లాహ్ వారి కార్యకలాపాల పట్ల అజాగ్రత్తగా లేడు.
2:145 وَلَئِنْ أَتَيْتَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ بِكُلِّ آيَةٍ مَّا تَبِعُوا قِبْلَتَكَ ۚ وَمَا أَنتَ بِتَابِعٍ قِبْلَتَهُمْ ۚ وَمَا بَعْضُهُم بِتَابِعٍ قِبْلَةَ بَعْضٍ ۚ وَلَئِنِ اتَّبَعْتَ أَهْوَاءَهُم مِّن بَعْدِ مَا جَاءَكَ مِنَ الْعِلْمِ ۙ إِنَّكَ إِذًا لَّمِنَ الظَّالِمِينَ
ఒకవేళ నీవు గ్రంథవహులకు నిదర్శనాలన్నీ చూపినా, వారు నీ ‘ఖిబ్లా’ను అనుసరించరు. వారి ‘ఖిబ్లా’ను అంగీకరించటం అన్నది నీవల్ల కూడా కానిపని. వారిలో కూడా కొందరు మరికొందరి ‘ఖిబ్లా’ను అనుసరించరు. ఒకవేళ నువ్వు- జ్ఞానం వచ్చేసిన తరువాత కూడా – వారి కోరికలను అనుసరించినట్లయితే నువ్వు కూడా దుర్మార్గులలో చేరిపోతావు సుమా!
2:146 الَّذِينَ آتَيْنَاهُمُ الْكِتَابَ يَعْرِفُونَهُ كَمَا يَعْرِفُونَ أَبْنَاءَهُمْ ۖ وَإِنَّ فَرِيقًا مِّنْهُمْ لَيَكْتُمُونَ الْحَقَّ وَهُمْ يَعْلَمُونَ
మేము ఎవరికి గ్రంథం వొసగామో వారు తమ కన్న కొడుకులను గుర్తుపట్టినట్లే అతన్ని (అనగా ముహమ్మద్-సఅసం-ను) గుర్తుపడతారు. వారిలోని ఒక సమూహం సత్యాన్ని గుర్తించి కూడా దాన్ని కప్పిపుచ్చుతుంది.
2:147 الْحَقُّ مِن رَّبِّكَ ۖ فَلَا تَكُونَنَّ مِنَ الْمُمْتَرِينَ
అయితే ఇది నీ ప్రభువు తరఫు నుంచి వచ్చిన (స్పష్టమయిన) సత్యం. (జాగ్రత్త!) నీవు మాత్రం సంశయాల్లో ఊగిస లాడేవారి సరసన చేరకు.
2:148 وَلِكُلٍّ وِجْهَةٌ هُوَ مُوَلِّيهَا ۖ فَاسْتَبِقُوا الْخَيْرَاتِ ۚ أَيْنَ مَا تَكُونُوا يَأْتِ بِكُمُ اللَّهُ جَمِيعًا ۚ إِنَّ اللَّهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
ప్రతి ఒక్కడూ ఏదో ఒక దిక్కుకు తిరుగుతున్నాడు. కాబట్టి మీరు సత్కార్యాలలో మించిపోయేందుకు ప్రయత్నించండి. మీరు ఎక్కడ ఉన్నాసరే అల్లాహ్ మిమ్మల్ని సమీకరిస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ ప్రతి వస్తువుపై అధికారం కలవాడు.
2:149 وَمِنْ حَيْثُ خَرَجْتَ فَوَلِّ وَجْهَكَ شَطْرَ الْمَسْجِدِ الْحَرَامِ ۖ وَإِنَّهُ لَلْحَقُّ مِن رَّبِّكَ ۗ وَمَا اللَّهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُونَ
నీవు ఎక్కడి నుంచి బయలుదేరినా (నమాజు కోసం) నీ ముఖాన్ని మస్జిదె హరాం వైపునకు త్రిప్పు. ఇదే నీ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యం. మీరు చేసేదంతా అల్లాహ్‌కు తెలియకుండా లేదు.
2:150 وَمِنْ حَيْثُ خَرَجْتَ فَوَلِّ وَجْهَكَ شَطْرَ الْمَسْجِدِ الْحَرَامِ ۚ وَحَيْثُ مَا كُنتُمْ فَوَلُّوا وُجُوهَكُمْ شَطْرَهُ لِئَلَّا يَكُونَ لِلنَّاسِ عَلَيْكُمْ حُجَّةٌ إِلَّا الَّذِينَ ظَلَمُوا مِنْهُمْ فَلَا تَخْشَوْهُمْ وَاخْشَوْنِي وَلِأُتِمَّ نِعْمَتِي عَلَيْكُمْ وَلَعَلَّكُمْ تَهْتَدُونَ
ఏ స్థలం నుంచి నీవు వెడలినా నీ ముఖాన్ని మజ్జిదె హరాం వైపునకు త్రిప్పు. మీరు ఎక్కడ ఉన్నాసరే, మీ ముఖాలను దాని వైపునకే త్రిప్పండి – జనులు మీతో వాదులాటకు దిగకుండా ఉండటానికి (ఇలాగే చేయండి). వారిలోని దుర్మార్గులకు (వారు ఎలాగూ రాద్ధాంతం చేసేవారే. అంతమాత్రాన మీరు వారికి) భయపడకండి. నాకు మాత్రమే భయపడండి- నేను నా అనుగ్రహాన్ని మీపై సంపూర్తి గావించటానికి, మీరు సన్మార్గగాములు అవటానికి.
2:151 كَمَا أَرْسَلْنَا فِيكُمْ رَسُولًا مِّنكُمْ يَتْلُو عَلَيْكُمْ آيَاتِنَا وَيُزَكِّيكُمْ وَيُعَلِّمُكُمُ الْكِتَابَ وَالْحِكْمَةَ وَيُعَلِّمُكُم مَّا لَمْ تَكُونُوا تَعْلَمُونَ
అదే విధంగా మేము మీ వద్దకు స్వయంగా మీలో నుండే ఒక ప్రవక్తను (నియుక్తం చేసి) పంపాము. అతడు మీకు మా వాక్యాలను చదివి వినిపిస్తున్నాడు, మిమ్మల్ని పరిశుద్ధుల్ని చేస్తున్నాడు, మీకు గ్రంథజ్ఞానాన్నీ, వివేకవంతమైన విషయాలను బోధిస్తున్నాడు, ఇంకా మీకు తెలియని విషయాలను నేర్పుతున్నాడు.
2:152 فَاذْكُرُونِي أَذْكُرْكُمْ وَاشْكُرُوا لِي وَلَا تَكْفُرُونِ
అందుకే మీరు నన్ను స్మరించండి, నేను మిమ్మల్ని జ్ఞాపక ముంచుకుంటాను. నాకు కృతజ్ఞులై ఉండండి. కృతఘ్నతకు పాల్పడకండి.
2:153 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اسْتَعِينُوا بِالصَّبْرِ وَالصَّلَاةِ ۚ إِنَّ اللَّهَ مَعَ الصَّابِرِينَ
ఓ విశ్వాసులారా! సహనం మరియు నమాజు ద్వారా సహాయం అర్థించండి. అల్లాహ్ సహనం పాటించేవారికి తోడుగా ఉంటాడు.
2:154 وَلَا تَقُولُوا لِمَن يُقْتَلُ فِي سَبِيلِ اللَّهِ أَمْوَاتٌ ۚ بَلْ أَحْيَاءٌ وَلَٰكِن لَّا تَشْعُرُونَ
అల్లాహ్ మార్గంలో చంపబడినవారిని మృతులు అని అనకండి. వారు బ్రతికే ఉన్నారు. కాని ఆ విషయం మీకు అర్థం కాదు.
2:155 وَلَنَبْلُوَنَّكُم بِشَيْءٍ مِّنَ الْخَوْفِ وَالْجُوعِ وَنَقْصٍ مِّنَ الْأَمْوَالِ وَالْأَنفُسِ وَالثَّمَرَاتِ ۗ وَبَشِّرِ الصَّابِرِينَ
మేము ఏదో ఒక విధంగా మిమ్మల్ని తప్పకుండా పరీక్షిస్తూ ఉంటాము – భయంతో, ఆకలిదప్పులతో, ధన ప్రాణాల నష్టంతో, పండ్ల కొరతతో (పరీక్షిస్తాము)! ఈ సహనమూర్తులకు శుభవార్త ఇవ్వండి.
2:156 الَّذِينَ إِذَا أَصَابَتْهُم مُّصِيبَةٌ قَالُوا إِنَّا لِلَّهِ وَإِنَّا إِلَيْهِ رَاجِعُونَ
వారికెప్పుడు ఏ ఆపద వచ్చిపడినా, “మేము ఖుద్దుగా అల్లాహ్‌కు చెందినవారము, మేము మరలిపోవలసింది కూడా ఆయన వద్దకే కదా!” అని అంటారు.
2:157 أُولَٰئِكَ عَلَيْهِمْ صَلَوَاتٌ مِّن رَّبِّهِمْ وَرَحْمَةٌ ۖ وَأُولَٰئِكَ هُمُ الْمُهْتَدُونَ
వారిపై వారి ప్రభువు దయానుగ్రహాలు, కారుణ్యం ఉన్నాయి. సన్మార్గాన్ని పొందినవారు కూడా వీరే.
2:158 إِنَّ الصَّفَا وَالْمَرْوَةَ مِن شَعَائِرِ اللَّهِ ۖ فَمَنْ حَجَّ الْبَيْتَ أَوِ اعْتَمَرَ فَلَا جُنَاحَ عَلَيْهِ أَن يَطَّوَّفَ بِهِمَا ۚ وَمَن تَطَوَّعَ خَيْرًا فَإِنَّ اللَّهَ شَاكِرٌ عَلِيمٌ
నిస్సందేహంగా సఫా మర్వాలు అల్లాహ్ చిహ్నాలలోనివి. కనుక కాబా గృహాన్ని (సందర్శించి) హజ్ ఉమ్రహ్‌లు చేసేవారు వాటి మధ్య ప్రదక్షిణ చేస్తే అందులో ఏ మాత్రం తప్పులేదు. స్వచ్ఛందంగా ఎవరైనా ఏదైనా సత్కార్యం చేస్తే అల్లాహ్ ఆదరించేవాడు, తెలుసుకునేవాడు.
2:159 إِنَّ الَّذِينَ يَكْتُمُونَ مَا أَنزَلْنَا مِنَ الْبَيِّنَاتِ وَالْهُدَىٰ مِن بَعْدِ مَا بَيَّنَّاهُ لِلنَّاسِ فِي الْكِتَابِ ۙ أُولَٰئِكَ يَلْعَنُهُمُ اللَّهُ وَيَلْعَنُهُمُ اللَّاعِنُونَ
మేము అవతరింపజేసిన నిదర్శనాలను మరియు సన్మార్గాన్ని ప్రజల కొరకు గ్రంథంలో విశదపరచిన తరువాత కూడా వాటిని దాచిపెట్టే వారిని అల్లాహ్ శపిస్తాడు. ఇంకా, వేరే శపించే వారు కూడా వారిని శపిస్తారు.
2:160 إِلَّا الَّذِينَ تَابُوا وَأَصْلَحُوا وَبَيَّنُوا فَأُولَٰئِكَ أَتُوبُ عَلَيْهِمْ ۚ وَأَنَا التَّوَّابُ الرَّحِيمُ
అయితే పశ్చాత్తాపం చెంది, తమ ప్రవర్తనను సంస్కరించుకుని, సత్యాన్ని బహిర్గతం చేసిన వారి పశ్చాత్తాపాన్ని నేను స్వీకరిస్తాను (వారి తప్పును మన్నిస్తాను). నేను పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాణ్ణి, అపారంగా కనికరించేవాణ్ణి.
2:161 إِنَّ الَّذِينَ كَفَرُوا وَمَاتُوا وَهُمْ كُفَّارٌ أُولَٰئِكَ عَلَيْهِمْ لَعْنَةُ اللَّهِ وَالْمَلَائِكَةِ وَالنَّاسِ أَجْمَعِينَ
నిశ్చయంగా అవిశ్వాసానికి పాల్పడి, అవిశ్వాస స్థితిలోనే మరణించిన వారిపై అల్లాహ్ మరియు ఆయన దూతల, ఇంకా జనులందరి శాపం పడుతుంది.
2:162 خَالِدِينَ فِيهَا ۖ لَا يُخَفَّفُ عَنْهُمُ الْعَذَابُ وَلَا هُمْ يُنظَرُونَ
అందులోనే వారు ఎల్లకాలం ఉంటారు. వారి శిక్షను తగ్గించటం గానీ, వారికి కొంత విడుపు ఇవ్వటంగానీ జరగదు.
2:163 وَإِلَٰهُكُمْ إِلَٰهٌ وَاحِدٌ ۖ لَّا إِلَٰهَ إِلَّا هُوَ الرَّحْمَٰنُ الرَّحِيمُ
మీ అందరి ఆరాధ్య దైవం ఒకే ఆరాధ్య దైవం. ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేనేలేడు. ఆయన అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడు.
2:164 إِنَّ فِي خَلْقِ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَاخْتِلَافِ اللَّيْلِ وَالنَّهَارِ وَالْفُلْكِ الَّتِي تَجْرِي فِي الْبَحْرِ بِمَا يَنفَعُ النَّاسَ وَمَا أَنزَلَ اللَّهُ مِنَ السَّمَاءِ مِن مَّاءٍ فَأَحْيَا بِهِ الْأَرْضَ بَعْدَ مَوْتِهَا وَبَثَّ فِيهَا مِن كُلِّ دَابَّةٍ وَتَصْرِيفِ الرِّيَاحِ وَالسَّحَابِ الْمُسَخَّرِ بَيْنَ السَّمَاءِ وَالْأَرْضِ لَآيَاتٍ لِّقَوْمٍ يَعْقِلُونَ
భూమ్యాకాశాల సృష్టిలో, రేయింబవళ్ళ (నిరంతర) మార్పిడిలో, ప్రజలకు లాభం చేకూర్చే వస్తువులను మోసుకుంటూ సముద్రాలలో నడిచే ఓడలలో, ఆకాశం నుంచి అల్లాహ్ వర్షపు నీటిని కురిపించి మృతభూమిని బ్రతికించటంలో, ఇంకా అందులో అన్ని రకాల ప్రాణులను వ్యాపింపజేయటంలో, వీచే పవనాల దిశలు మార్చటంలో, భూమ్యాకాశాల మధ్య (దేవుని) నియమ నిబంధనలకు కట్టుబడి మసలుకుంటున్న మేఘాలలో బుద్ధిమంతులకు (దేవుని శక్తి సామర్థ్యాలకు సంబంధించిన) ఎన్నో సూచనలున్నాయి.
2:165 وَمِنَ النَّاسِ مَن يَتَّخِذُ مِن دُونِ اللَّهِ أَندَادًا يُحِبُّونَهُمْ كَحُبِّ اللَّهِ ۖ وَالَّذِينَ آمَنُوا أَشَدُّ حُبًّا لِّلَّهِ ۗ وَلَوْ يَرَى الَّذِينَ ظَلَمُوا إِذْ يَرَوْنَ الْعَذَابَ أَنَّ الْقُوَّةَ لِلَّهِ جَمِيعًا وَأَنَّ اللَّهَ شَدِيدُ الْعَذَابِ
కాని అల్లాహ్‌ను కాదని ఆయనకు సహవర్తులుగా ఇతరులను నిలబెట్టి, అల్లాహ్‌ను ప్రేమించవలసిన విధంగా వారిని ప్రేమించేవారు కూడా ప్రజలలో కొందరు ఉన్నారు. అయితే విశ్వసించినవారు అల్లాహ్‌ను అంతకంటే ప్రగాఢంగా (అధికంగా) ప్రేమిస్తారు. సర్వశక్తులూ అల్లాహ్ అధీనంలోనే ఉన్నాయనీ, అల్లాహ్ చాలా కఠినంగా శిక్షించేవాడన్న యదార్థాన్ని ముష్రిక్కులు, అల్లాహ్ విధించే శిక్షలను చూసిన తరువాత తెలుసుకునే బదులు, ఇప్పుడే తెలుసుకుంటే ఎంత బాగుంటుంది! (తెలుసుకుంటే వారు ఈ షిర్క్ పాపానికి ఒడిగట్టరు).
2:166 إِذْ تَبَرَّأَ الَّذِينَ اتُّبِعُوا مِنَ الَّذِينَ اتَّبَعُوا وَرَأَوُا الْعَذَابَ وَتَقَطَّعَتْ بِهِمُ الْأَسْبَابُ
ఆ సమయంలో, వీళ్ళచేత అనుసరించబడిన నాయకులు తమ అనుచరులతో తమకు ఏ మాత్రం సంబంధం లేనట్లుగా ప్రవర్తిస్తారు. ఇంకా వారు శిక్షను కళ్ళారా చూసుకుంటారు. వారి మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలన్నీ తెగిపోతాయి.
2:167 وَقَالَ الَّذِينَ اتَّبَعُوا لَوْ أَنَّ لَنَا كَرَّةً فَنَتَبَرَّأَ مِنْهُمْ كَمَا تَبَرَّءُوا مِنَّا ۗ كَذَٰلِكَ يُرِيهِمُ اللَّهُ أَعْمَالَهُمْ حَسَرَاتٍ عَلَيْهِمْ ۖ وَمَا هُم بِخَارِجِينَ مِنَ النَّارِ
అప్పుడు (కనువిప్పు కలిగిన) అనుచరులు ఇలా అంటారు: “మేమే గనక మరోసారి ప్రాపంచిక జీవితం వైపుకు మరలించబడటమంటూ జరిగితే వీరు (ఈ అయ్యవార్లు) మా పట్ల ఇక్కడ విసుగును ప్రదర్శించినట్లే మేమూ వీరిపట్ల విసుగును ప్రదర్శించేవారం.” ఈ విధంగా వారు సిగ్గుతో కుంచించుకుపోయే విధంగా అల్లాహ్ వారి కర్మలను వారికి చూపిస్తాడు. అయినాసరే వారు నరకం నుంచి బయట పడటమన్నది అసంభవం.
2:168 يَا أَيُّهَا النَّاسُ كُلُوا مِمَّا فِي الْأَرْضِ حَلَالًا طَيِّبًا وَلَا تَتَّبِعُوا خُطُوَاتِ الشَّيْطَانِ ۚ إِنَّهُ لَكُمْ عَدُوٌّ مُّبِينٌ
ప్రజలారా! భూమిలోని ధర్మసమ్మతమైన, పవిత్రమైన వస్తువులన్నింటినీ తినండి. కాని షైతాన్ అడుగుజాడలలో మాత్రం నడవకండి. వాడు మీకు బహిరంగ శత్రువు.
2:169 إِنَّمَا يَأْمُرُكُم بِالسُّوءِ وَالْفَحْشَاءِ وَأَن تَقُولُوا عَلَى اللَّهِ مَا لَا تَعْلَمُونَ
వాడు మిమ్మల్ని కేవలం చెడు వైపుకు, నీతి బాహ్యత వైపుకు పురికొల్పుతాడు. ఏ విషయాల జ్ఞానం మీకు లేదో వాటిని అల్లాహ్ పేరుతో చెప్పమని మీకు ఆజ్ఞాపిస్తాడు.
2:170 وَإِذَا قِيلَ لَهُمُ اتَّبِعُوا مَا أَنزَلَ اللَّهُ قَالُوا بَلْ نَتَّبِعُ مَا أَلْفَيْنَا عَلَيْهِ آبَاءَنَا ۗ أَوَلَوْ كَانَ آبَاؤُهُمْ لَا يَعْقِلُونَ شَيْئًا وَلَا يَهْتَدُونَ
“అల్లాహ్ అవతరింపజేసిన గ్రంథాన్ని అనుసరించండి” అని వారికి చెప్పినప్పుడల్లా, “మా తాతలు తండ్రులు అవలంబిస్తూ ఉండగా చూచిన పద్ధతినే మేము పాటిస్తాము” అని వారు సమాధానమిస్తారు. వారి పూర్వీకులు ఒట్టి అవివేకులు, మార్గ విహీనులైనప్పటికీ (వీళ్లు వారినే అనుసరిస్తారన్నమాట!)
2:171 وَمَثَلُ الَّذِينَ كَفَرُوا كَمَثَلِ الَّذِي يَنْعِقُ بِمَا لَا يَسْمَعُ إِلَّا دُعَاءً وَنِدَاءً ۚ صُمٌّ بُكْمٌ عُمْيٌ فَهُمْ لَا يَعْقِلُونَ
సత్య తిరస్కారుల ఉపమానం పశువుల కాపరి యొక్క కేకను, అరుపును మాత్రమే వినే పశువుల వంటిది (ఆలోచన అన్నమాటే ఉండదు). వారు చెవిటివారు, మూగవారు, గ్రుడ్డివారు. వారు అర్థం చేసుకోరు.
2:172 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُلُوا مِن طَيِّبَاتِ مَا رَزَقْنَاكُمْ وَاشْكُرُوا لِلَّهِ إِن كُنتُمْ إِيَّاهُ تَعْبُدُونَ
ఓ విశ్వసించిన వారలారా! మీరు కేవలం అల్లాహ్‌ను ఆరాధించేవారే అయితే మేము మీకు ప్రసాదించిన పవిత్రమైన వస్తువులను తినండి, త్రాగండి, అల్లాహ్‌కు కృతజ్ఞతలు తెలుపండి.
2:173 إِنَّمَا حَرَّمَ عَلَيْكُمُ الْمَيْتَةَ وَالدَّمَ وَلَحْمَ الْخِنزِيرِ وَمَا أُهِلَّ بِهِ لِغَيْرِ اللَّهِ ۖ فَمَنِ اضْطُرَّ غَيْرَ بَاغٍ وَلَا عَادٍ فَلَا إِثْمَ عَلَيْهِ ۚ إِنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ
అల్లాహ్ మీ కొరకు నిషేధించినవి ఇవే: చచ్చిన జంతువులు, (ప్రవహించిన) రక్తం, పందిమాంసం, ఇంకా అల్లాహ్ తప్ప ఇతరుల పేరు ఉచ్చరించబడినది. ఎవరయినా ఉద్దేశపూర్వకంగా కాకుండా, హద్దులను అతిక్రమించకుండా- గత్యంతరం లేని స్థితిలో – తింటే పాపం కాదు. నిస్సందేహంగా అల్లాహ్ క్షమించేవాడు, జాలి చూపేవాడు.
2:174 إِنَّ الَّذِينَ يَكْتُمُونَ مَا أَنزَلَ اللَّهُ مِنَ الْكِتَابِ وَيَشْتَرُونَ بِهِ ثَمَنًا قَلِيلًا ۙ أُولَٰئِكَ مَا يَأْكُلُونَ فِي بُطُونِهِمْ إِلَّا النَّارَ وَلَا يُكَلِّمُهُمُ اللَّهُ يَوْمَ الْقِيَامَةِ وَلَا يُزَكِّيهِمْ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ
అల్లాహ్ తన గ్రంథంలో అవతరింపజేసిన విషయాలను దాచేవారు, వాటిని కొద్దిపాటి ధరకు అమ్ముకునేవారు వాస్తవానికి తమ పొట్టలను అగ్నితో నింపుకుంటున్నారు. ప్రళయ దినాన అల్లాహ్ వారితో అస్సలు మాట్లాడడు. వారిని పరిశుద్ధపరచడు. పైపెచ్చు వారికి బాధాకరమైన శిక్ష కలదు.
2:175 أُولَٰئِكَ الَّذِينَ اشْتَرَوُا الضَّلَالَةَ بِالْهُدَىٰ وَالْعَذَابَ بِالْمَغْفِرَةِ ۚ فَمَا أَصْبَرَهُمْ عَلَى النَّارِ
అపమార్గాన్ని సన్మార్గానికి బదులుగా, శిక్షను క్షమాభిక్షకు బదులుగా కొనుక్కున్నవారు వీరే. వారు నరకాగ్నిని ఎలా భరిస్తారో?!
2:176 ذَٰلِكَ بِأَنَّ اللَّهَ نَزَّلَ الْكِتَابَ بِالْحَقِّ ۗ وَإِنَّ الَّذِينَ اخْتَلَفُوا فِي الْكِتَابِ لَفِي شِقَاقٍ بَعِيدٍ
ఇలా ఎందుకు జరిగిందంటే, అల్లాహ్ సత్యంతో కూడుకున్న గ్రంథాన్ని అవతరింపజేయగా, ఈ గ్రంథంతో విభేదించే వారు, తమ పెడసరి ధోరణిలో బహుదూరం వెళ్ళిపోయారు.
2:177 لَّيْسَ الْبِرَّ أَن تُوَلُّوا وُجُوهَكُمْ قِبَلَ الْمَشْرِقِ وَالْمَغْرِبِ وَلَٰكِنَّ الْبِرَّ مَنْ آمَنَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ وَالْمَلَائِكَةِ وَالْكِتَابِ وَالنَّبِيِّينَ وَآتَى الْمَالَ عَلَىٰ حُبِّهِ ذَوِي الْقُرْبَىٰ وَالْيَتَامَىٰ وَالْمَسَاكِينَ وَابْنَ السَّبِيلِ وَالسَّائِلِينَ وَفِي الرِّقَابِ وَأَقَامَ الصَّلَاةَ وَآتَى الزَّكَاةَ وَالْمُوفُونَ بِعَهْدِهِمْ إِذَا عَاهَدُوا ۖ وَالصَّابِرِينَ فِي الْبَأْسَاءِ وَالضَّرَّاءِ وَحِينَ الْبَأْسِ ۗ أُولَٰئِكَ الَّذِينَ صَدَقُوا ۖ وَأُولَٰئِكَ هُمُ الْمُتَّقُونَ
మీరు మీ ముఖాలను తూర్పు దిక్కుకో, పడమర దిక్కుకో తిప్పటమే సదాచరణ కాదు. సదాచరణ అంటే వాస్తవానికి అల్లాహ్‌ను, అంతిమ దినాన్నీ, దైవదూతలనూ, దైవగ్రంథాన్నీ, దైవ ప్రవక్తలనూ విశ్వసించటం. ధనప్రీతి ఉన్నప్పటికీ సమీప బంధువులకు, అనాధలకు, అగత్యపరులకు, బాటసారులకు, యాచించే వారికి (ధనాన్ని) ఇవ్వటం, బానిసలకు విముక్తి నొసగటం, నమాజును నెలకొల్పటం, జకాతును చెల్లిస్తూ ఉండటం, ఇచ్చిన మాటను నిలుపుకోవటం, లేమిలో కష్టకాలంలో, యుద్ధ సమయాలలో సహన స్థయిర్యాలను కనబరచటం- ఇవన్నీ కలిగి వున్నవారే వాస్తవానికి సత్యమూర్తులు. భయభక్తులు కలవారు కూడా వీరే.
2:178 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُتِبَ عَلَيْكُمُ الْقِصَاصُ فِي الْقَتْلَى ۖ الْحُرُّ بِالْحُرِّ وَالْعَبْدُ بِالْعَبْدِ وَالْأُنثَىٰ بِالْأُنثَىٰ ۚ فَمَنْ عُفِيَ لَهُ مِنْ أَخِيهِ شَيْءٌ فَاتِّبَاعٌ بِالْمَعْرُوفِ وَأَدَاءٌ إِلَيْهِ بِإِحْسَانٍ ۗ ذَٰلِكَ تَخْفِيفٌ مِّن رَّبِّكُمْ وَرَحْمَةٌ ۗ فَمَنِ اعْتَدَىٰ بَعْدَ ذَٰلِكَ فَلَهُ عَذَابٌ أَلِيمٌ
ఓ విశ్వాసులారా! హతుల విషయంలో ప్రతీకార న్యాయం (ఖిసాస్) మీ కొరకు విధిగా నిర్ణయించబడింది. స్వతంత్రునికి బదులుగా స్వతంత్రుణ్ణి, బానిసకు బదులుగా బానిసను, స్త్రీకి బదులుగా స్త్రీని (మాత్రమే) హతమార్చాలి. ఒకవేళ హతుని సోదరుడు హంతకుణ్ణి కనికరించదలిస్తే అతను రక్తశుల్కాన్ని న్యాయసమ్మతంగా అడగాలి. హంతకుడు కూడా రక్తధనాన్ని ఉత్తమ రీతిలో అతనికి చెల్లించాలి. ఇది మీ ప్రభువు తరఫున ఇవ్వబడిన వెసులుబాటు, కారుణ్యం. ఆ తరువాత కూడా ఎవరయినా హద్దులు అతిక్రమిస్తే అతనికి వ్యధాభరితమైన శిక్ష ఉంటుంది.
2:179 وَلَكُمْ فِي الْقِصَاصِ حَيَاةٌ يَا أُولِي الْأَلْبَابِ لَعَلَّكُمْ تَتَّقُونَ
ఓ బుద్ధిమంతులారా! ఈ ప్రతీకార న్యాయంలోనే మీ జీవనం ఉంది – ఇలా ఉంటేనే మీరు (అమానుషాల నుండి) ఆగి ఉంటారు.
2:180 كُتِبَ عَلَيْكُمْ إِذَا حَضَرَ أَحَدَكُمُ الْمَوْتُ إِن تَرَكَ خَيْرًا الْوَصِيَّةُ لِلْوَالِدَيْنِ وَالْأَقْرَبِينَ بِالْمَعْرُوفِ ۖ حَقًّا عَلَى الْمُتَّقِينَ
మీలో ఎవరికయినా మరణ ఘడియలు సమీపించి, వారి వద్ద ఆస్తిపాస్తులున్నట్లయితే, వారు తమ తల్లిదండ్రుల, సమీప బంధువుల పేర ఉత్తమరీతిలో వీలునామా వ్రాసిపోవటం విధిగా చేయబడింది. భయభక్తులు కలవారికి ఈ విధ్యుక్త ధర్మం మరింతగా వర్తిస్తుంది.
2:181 فَمَن بَدَّلَهُ بَعْدَمَا سَمِعَهُ فَإِنَّمَا إِثْمُهُ عَلَى الَّذِينَ يُبَدِّلُونَهُ ۚ إِنَّ اللَّهَ سَمِيعٌ عَلِيمٌ
వీలునామా (వసీయతు గురించి) విన్న తరువాత కూడా ఏ వ్యక్తయినా దాన్ని మార్చివేస్తే ఆ పాపమంతా ఆ మార్చిన వానిపైనే పడుతుంది. వాస్తవానికి అల్లాహ్ వినేవాడు, తెలిసినవాడూను.
2:182 فَمَنْ خَافَ مِن مُّوصٍ جَنَفًا أَوْ إِثْمًا فَأَصْلَحَ بَيْنَهُمْ فَلَا إِثْمَ عَلَيْهِ ۚ إِنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ
వీలునామా చేసేవాడు పొరబాటున పక్షపాత వైఖరిని అవలంబించాడనో లేక పాపంతో కూడుకున్న శాసనం చేశాడనో భయపడినవారు సంబంధీకులందరినీ పిలిచి, వారందరి మధ్య రాజీ కుదిరిస్తే అందులో దోషం లేదు. అల్లాహ్ క్షమించేవాడు, కనికరించేవాడు కూడా.
2:183 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُتِبَ عَلَيْكُمُ الصِّيَامُ كَمَا كُتِبَ عَلَى الَّذِينَ مِن قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُونَ
ఓ విశ్వసించినవారలారా! ఉపవాసాలుండటం మీపై విధిగా నిర్ణయించబడింది – మీ పూర్వీకులపై కూడా ఇదే విధంగా ఉపవాసం విధించబడింది. దీనివల్ల మీలో భయభక్తులు పెంపొందే అవకాశం ఉంది.
2:184 أَيَّامًا مَّعْدُودَاتٍ ۚ فَمَن كَانَ مِنكُم مَّرِيضًا أَوْ عَلَىٰ سَفَرٍ فَعِدَّةٌ مِّنْ أَيَّامٍ أُخَرَ ۚ وَعَلَى الَّذِينَ يُطِيقُونَهُ فِدْيَةٌ طَعَامُ مِسْكِينٍ ۖ فَمَن تَطَوَّعَ خَيْرًا فَهُوَ خَيْرٌ لَّهُ ۚ وَأَن تَصُومُوا خَيْرٌ لَّكُمْ ۖ إِن كُنتُمْ تَعْلَمُونَ
అదీ లెక్కించదగిన కొన్ని రోజులు మాత్రమే. అయితే మీలో వ్యాధిగ్రస్తులుగానో, ప్రయాణీకులుగానో ఉన్నవారు ఆ ఉపవాసాల లెక్క ఇతర దినాలలో పూర్తి చేసుకోవాలి. స్థోమత ఉన్న వారు (ఉపవాసం పాటించకపోయినందుకు) పరిహారంగా ఒక నిరుపేదకు అన్నం పెట్టాలి. కాని ఎవరైనా స్వచ్ఛందంగా ఇంకా ఎక్కువ పుణ్యం చేస్తే, అది వారికే మేలు. మీరు గ్రహించ గలిగితే ఉపవాసం ఉండటమే మీ కొరకు శ్రేయస్కరం.
2:185 شَهْرُ رَمَضَانَ الَّذِي أُنزِلَ فِيهِ الْقُرْآنُ هُدًى لِّلنَّاسِ وَبَيِّنَاتٍ مِّنَ الْهُدَىٰ وَالْفُرْقَانِ ۚ فَمَن شَهِدَ مِنكُمُ الشَّهْرَ فَلْيَصُمْهُ ۖ وَمَن كَانَ مَرِيضًا أَوْ عَلَىٰ سَفَرٍ فَعِدَّةٌ مِّنْ أَيَّامٍ أُخَرَ ۗ يُرِيدُ اللَّهُ بِكُمُ الْيُسْرَ وَلَا يُرِيدُ بِكُمُ الْعُسْرَ وَلِتُكْمِلُوا الْعِدَّةَ وَلِتُكَبِّرُوا اللَّهَ عَلَىٰ مَا هَدَاكُمْ وَلَعَلَّكُمْ تَشْكُرُونَ
రమజాను నెల – ఖుర్ఆన్ అవతరింపజేయబడిన నెల. అది మానవులందరికీ మార్గదర్శకం. అందులో సన్మార్గంతోపాటు, సత్యాసత్యాలను వేరుపరచే స్పష్టమైన నిదర్శనాలు ఉన్నాయి. కనుక మీలో ఎవరు ఈ నెలను చూస్తారో వారు ఉపవాసాలుండాలి. అయితే రోగగ్రస్తుని గానో, ప్రయాణీకుని గానో ఉన్న వారు ఇతర దినాలలో ఈ లెక్కను పూర్తిచేయాలి. అల్లాహ్ మీకు సౌలభ్యాన్ని సమకూర్చదలుస్తున్నాడేగాని మిమ్మల్ని కష్టపెట్టదలచటం లేదు. మీరు (ఉపవాసాల) నిర్ణీత సంఖ్యను పూర్తిచేసుకోవాలన్నదీ, తాను అనుగ్రహించిన సన్మార్గ భాగ్యానికి ప్రతిగా ఆయన గొప్పతనాన్ని కీర్తించి, తగురీతిలో మీరు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవాలన్నది అల్లాహ్ అభిలాష!
2:186 وَإِذَا سَأَلَكَ عِبَادِي عَنِّي فَإِنِّي قَرِيبٌ ۖ أُجِيبُ دَعْوَةَ الدَّاعِ إِذَا دَعَانِ ۖ فَلْيَسْتَجِيبُوا لِي وَلْيُؤْمِنُوا بِي لَعَلَّهُمْ يَرْشُدُونَ
(ఓ ప్రవక్తా!) నా దాసులు నా గురించి నిన్ను అడిగితే, నేను (వారికి) అత్యంత సమీపంలోనే ఉన్నాననీ, పిలిచేవాడు నన్ను ఎప్పుడు పిలిచినా నేను అతని పిలుపును ఆలకించి ఆమోదిస్తానని (నువ్వు వారికి చెప్పు). కాబట్టి వారు కూడా నా ఆదేశాన్ని శిరసావహించాలి, నన్ను విశ్వసించాలి (ఈ విషయం నీవు వారికి తెలియజేయి). తద్వారానే వారు సన్మార్గ భాగ్యం పొందగల్గుతారు.
2:187 أُحِلَّ لَكُمْ لَيْلَةَ الصِّيَامِ الرَّفَثُ إِلَىٰ نِسَائِكُمْ ۚ هُنَّ لِبَاسٌ لَّكُمْ وَأَنتُمْ لِبَاسٌ لَّهُنَّ ۗ عَلِمَ اللَّهُ أَنَّكُمْ كُنتُمْ تَخْتَانُونَ أَنفُسَكُمْ فَتَابَ عَلَيْكُمْ وَعَفَا عَنكُمْ ۖ فَالْآنَ بَاشِرُوهُنَّ وَابْتَغُوا مَا كَتَبَ اللَّهُ لَكُمْ ۚ وَكُلُوا وَاشْرَبُوا حَتَّىٰ يَتَبَيَّنَ لَكُمُ الْخَيْطُ الْأَبْيَضُ مِنَ الْخَيْطِ الْأَسْوَدِ مِنَ الْفَجْرِ ۖ ثُمَّ أَتِمُّوا الصِّيَامَ إِلَى اللَّيْلِ ۚ وَلَا تُبَاشِرُوهُنَّ وَأَنتُمْ عَاكِفُونَ فِي الْمَسَاجِدِ ۗ تِلْكَ حُدُودُ اللَّهِ فَلَا تَقْرَبُوهَا ۗ كَذَٰلِكَ يُبَيِّنُ اللَّهُ آيَاتِهِ لِلنَّاسِ لَعَلَّهُمْ يَتَّقُونَ
ఉపవాస కాలంలోని రాత్రులలో మీరు మీ భార్యలను కలుసుకోవటం మీ కొరకు ధర్మసమ్మతం చేయబడింది. వారు మీకు దుస్తులు, మీరు వారికి దుస్తులు. మీరు రహస్యంగా ఆత్మద్రోహానికి పాల్పడుతున్నారనే సంగతి అల్లాహ్‌కు తెలుసు. అయినప్పటికీ ఆయన క్షమాగుణంతో మీ వైపుకు మరలి, మీ తప్పును మన్నించాడు. ఇకనుంచి మీరు మీ భార్యలతో (ఉపవాసపు రాత్రులందు) రమించడానికీ, అల్లాహ్ మీ కొరకు రాసిపెట్టిన దాన్ని అన్వేషించటానికీ మీకు అనుమతి ఉంది. తొలిజాములోని తెలుపు నడిరేయి నల్లని చారలో నుండి ప్రస్ఫుటం అయ్యే వరకూ తినండి, త్రాగండి. ఆ తరువాత (వీటన్నింటినీ పరిత్యజించి) రాత్రి చీకటి పడేవరకూ ఉపవాసం ఉండండి. ఇంకా – మీరు మస్జిదులలో ‘ఏతెకాఫ్’ పాటించేకాలంలో మాత్రం మీ భార్యలతో సమాగమం జరపకండి. ఇవి అల్లాహ్ (నిర్ధారించిన) హద్దులు. మీరు వాటి దరిదాపులకు కూడా పోకండి. ప్రజలు అప్రమత్తంగా ఉండగలందులకుగాను అల్లాహ్ తన ఆయతులను ఇలా విడమరచి చెబుతున్నాడు.
2:188 وَلَا تَأْكُلُوا أَمْوَالَكُم بَيْنَكُم بِالْبَاطِلِ وَتُدْلُوا بِهَا إِلَى الْحُكَّامِ لِتَأْكُلُوا فَرِيقًا مِّنْ أَمْوَالِ النَّاسِ بِالْإِثْمِ وَأَنتُمْ تَعْلَمُونَ
ఒకరి సొమ్మును ఇంకొకరు అన్యాయంగా స్వాహా చేయకండి. బుద్ధిపూర్వకంగా, అక్రమమైన రీతిలో ఇతరుల ఆస్తిలో కొంతభాగం కాజేయటం కోసం అధికారులకు ముడుపులు చెల్లించకండి. అది (న్యాయం కాదన్న సంగతి) మీకూ తెలిసినదే.
2:189 يَسْأَلُونَكَ عَنِ الْأَهِلَّةِ ۖ قُلْ هِيَ مَوَاقِيتُ لِلنَّاسِ وَالْحَجِّ ۗ وَلَيْسَ الْبِرُّ بِأَن تَأْتُوا الْبُيُوتَ مِن ظُهُورِهَا وَلَٰكِنَّ الْبِرَّ مَنِ اتَّقَىٰ ۗ وَأْتُوا الْبُيُوتَ مِنْ أَبْوَابِهَا ۚ وَاتَّقُوا اللَّهَ لَعَلَّكُمْ تُفْلِحُونَ
(ఓ ప్రవక్తా!) ప్రజలు నిన్ను నెలవంకలను గురించి ప్రశ్నిస్తున్నారు కదూ! ఇది ప్రజల (ఆరాధనల) వేళలను, హజ్ కాలాన్ని నిర్ధారించటానికి (జరిగిన ఏర్పాటు) అని నువ్వు వారికి సమాధానం ఇవ్వు. (ఇహ్రామ్ స్థితిలో) మీరు మీ ఇళ్ళల్లోకి వెనుక వైపు నుంచి రావటం సత్కార్యం కాదు. అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి వున్నవాడిదే అసలు సత్కార్యం. మీరు మీ ఇండ్లల్లోకి వాకిళ్ళ నుండే ప్రవేశించండి. సాఫల్యం పొందగలందులకుగాను అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి.
2:190 وَقَاتِلُوا فِي سَبِيلِ اللَّهِ الَّذِينَ يُقَاتِلُونَكُمْ وَلَا تَعْتَدُوا ۚ إِنَّ اللَّهَ لَا يُحِبُّ الْمُعْتَدِينَ
మీతో పోరాడే వారితో మీరు కూడా దైవమార్గంలో పోరాడండి. కాని మితిమీరకండి. మితిమీరి పోయేవారిని అల్లాహ్ ఇష్టపడడు.
2:191 وَاقْتُلُوهُمْ حَيْثُ ثَقِفْتُمُوهُمْ وَأَخْرِجُوهُم مِّنْ حَيْثُ أَخْرَجُوكُمْ ۚ وَالْفِتْنَةُ أَشَدُّ مِنَ الْقَتْلِ ۚ وَلَا تُقَاتِلُوهُمْ عِندَ الْمَسْجِدِ الْحَرَامِ حَتَّىٰ يُقَاتِلُوكُمْ فِيهِ ۖ فَإِن قَاتَلُوكُمْ فَاقْتُلُوهُمْ ۗ كَذَٰلِكَ جَزَاءُ الْكَافِرِينَ
వారు ఎక్కడ ఎదురైనా మీరు వారితో తలపడండి, మిమ్మల్ని ఎక్కడి నుంచి వారు తరిమికొట్టారో, అక్కడి నుంచి మీరు కూడా వారిని తరిమికొట్టండి. ఫిత్నా (కుఫ్ర్, షిర్క్, పీడన) అనేది చంపటం కన్నా తీవ్రమైనది. ‘మస్జిదె హరామ్’ వద్ద వారు మీతో యుద్ధం చేయనంతవరకూ మీరూ వారితో పోరాడకండి. వారు గనక మిమ్మల్ని హతమార్చడానికి ప్రయత్నిస్తే మీరు కూడా దీటైన జవాబు ఇవ్వండి. అవిశ్వాసులకు సరైన సమాధానం ఇదే.
2:192 فَإِنِ انتَهَوْا فَإِنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ
ఒకవేళ వారు గనక (తమ దమన నీతిని) మానుకుంటే నిశ్చయంగా అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడు.
2:193 وَقَاتِلُوهُمْ حَتَّىٰ لَا تَكُونَ فِتْنَةٌ وَيَكُونَ الدِّينُ لِلَّهِ ۖ فَإِنِ انتَهَوْا فَلَا عُدْوَانَ إِلَّا عَلَى الظَّالِمِينَ
పీడన (ఫిత్నా) సమసిపోనంతవరకూ, దైవధర్మానిది పైచేయి కానంతవరకూ వారితో పోరాడుతూనే ఉండండి. ఒకవేళ వారు యుద్ధాన్ని విరమిస్తే (మీరూ విరమించండి). మెడలు వంచ వలసింది దౌర్జన్యపరులవే.
2:194 الشَّهْرُ الْحَرَامُ بِالشَّهْرِ الْحَرَامِ وَالْحُرُمَاتُ قِصَاصٌ ۚ فَمَنِ اعْتَدَىٰ عَلَيْكُمْ فَاعْتَدُوا عَلَيْهِ بِمِثْلِ مَا اعْتَدَىٰ عَلَيْكُمْ ۚ وَاتَّقُوا اللَّهَ وَاعْلَمُوا أَنَّ اللَّهَ مَعَ الْمُتَّقِينَ
నిషిద్ధమాసం నిషిద్ధమాసానికి బదులుగా ఉన్నది. నిషేధాజ్ఞలు సరిసమానంగా వర్తిస్తాయి. మీపై ఎవరయినా దౌర్జన్యానికి ఒడిగడితే మీరు కూడా వారిపై ఆ మేరకు ప్రతీకారం తీర్చుకోండి. అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి. అల్లాహ్ భక్తిగలవారికి తోడుగా ఉన్నాడన్న విషయాన్ని తెలుసుకోండి.
2:195 وَأَنفِقُوا فِي سَبِيلِ اللَّهِ وَلَا تُلْقُوا بِأَيْدِيكُمْ إِلَى التَّهْلُكَةِ ۛ وَأَحْسِنُوا ۛ إِنَّ اللَّهَ يُحِبُّ الْمُحْسِنِينَ
అల్లాహ్ మార్గంలో ఖర్చుపెట్టండి. చేజేతులా మిమ్మల్ని మీరు వినాశం పాలు చేసుకోకండి. ఉత్తమంగా మసలుకోండి. నిస్సందేహంగా అల్లాహ్ ఉత్తమంగా వ్యవహరించేవారిని ప్రేమిస్తాడు.
2:196 وَأَتِمُّوا الْحَجَّ وَالْعُمْرَةَ لِلَّهِ ۚ فَإِنْ أُحْصِرْتُمْ فَمَا اسْتَيْسَرَ مِنَ الْهَدْيِ ۖ وَلَا تَحْلِقُوا رُءُوسَكُمْ حَتَّىٰ يَبْلُغَ الْهَدْيُ مَحِلَّهُ ۚ فَمَن كَانَ مِنكُم مَّرِيضًا أَوْ بِهِ أَذًى مِّن رَّأْسِهِ فَفِدْيَةٌ مِّن صِيَامٍ أَوْ صَدَقَةٍ أَوْ نُسُكٍ ۚ فَإِذَا أَمِنتُمْ فَمَن تَمَتَّعَ بِالْعُمْرَةِ إِلَى الْحَجِّ فَمَا اسْتَيْسَرَ مِنَ الْهَدْيِ ۚ فَمَن لَّمْ يَجِدْ فَصِيَامُ ثَلَاثَةِ أَيَّامٍ فِي الْحَجِّ وَسَبْعَةٍ إِذَا رَجَعْتُمْ ۗ تِلْكَ عَشَرَةٌ كَامِلَةٌ ۗ ذَٰلِكَ لِمَن لَّمْ يَكُنْ أَهْلُهُ حَاضِرِي الْمَسْجِدِ الْحَرَامِ ۚ وَاتَّقُوا اللَّهَ وَاعْلَمُوا أَنَّ اللَّهَ شَدِيدُ الْعِقَابِ
హజ్, ఉమ్రహ్లను అల్లాహ్ కొరకు పూర్తిచేయండి. ఒకవేళ మీరు నిలువరించబడితే, మీరు ఇవ్వగలిగిన ఖుర్బానీని ఇచ్చివేయండి. మీరు ఇచ్చే ఖుర్బానీ, ఖుర్బానీ స్థలానికి చేరనంతవరకూ శిరోముండనం చేయించుకోకండి. అయితే మీలో వ్యాధిగ్రస్తులుగా ఉన్నవారు, లేదా తలలో బాధ ఉన్నవారు (శిరోముండనం చేయించుకుంటే ఫరవాలేదు. కాని వారు) దీనికి పరిహారంగా ఉపవాసం ఉండటమో, దానధర్మాలు చేయటమో, ఖుర్బానీ ఇవ్వటమో చేయాలి. మరి ఆ తర్వాత (చిక్కుల నుంచి, నిలువరింపు నుంచి) ప్రశాంతతను పొంది ఉన్న స్థితిలో మీలో ఎవరయినా ఉమ్రహ్ మొదలుకుని హజ్ వరకు సంకల్పం బూని ప్రయోజనం (తమత్తు) పొందినట్లయితే, వారు తమ వద్దనున్న ఖుర్బానీని ఇచ్చివేయాలి. ఖుర్బానీ ఇవ్వలేనివారు హజ్ దినాలలో మూడు రోజులు ఉపవాసం పాటించాలి. హజ్ నుండి తిరిగి వచ్చిన తరువాత ఏడు రోజులు ఉపవాసముండాలి. ఈ విధంగా మొత్తం పది ఉపవాసాలవుతాయి. మస్జిదె హరామ్‌కు సమీపంలో ఉండని వారికి మాత్రమే ఈ ఆదేశం వర్తిస్తుంది. (ప్రజలారా!) అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి. అల్లాహ్ కఠినంగా శిక్షించేవాడన్న సంగతిని తెలుసుకోండి.
2:197 الْحَجُّ أَشْهُرٌ مَّعْلُومَاتٌ ۚ فَمَن فَرَضَ فِيهِنَّ الْحَجَّ فَلَا رَفَثَ وَلَا فُسُوقَ وَلَا جِدَالَ فِي الْحَجِّ ۗ وَمَا تَفْعَلُوا مِنْ خَيْرٍ يَعْلَمْهُ اللَّهُ ۗ وَتَزَوَّدُوا فَإِنَّ خَيْرَ الزَّادِ التَّقْوَىٰ ۚ وَاتَّقُونِ يَا أُولِي الْأَلْبَابِ
హజ్ మాసాలు నిర్థారితమై ఉన్నాయి. కనుక ఈ నిర్ణీత మాసాలలో హజ్‌ను తన కొరకు విధించుకున్న వ్యక్తి – హజ్ దినాలలో – కామ క్రీడలకు, పాపకార్యాలకు, ఘర్షణలకు దూరంగా ఉండాలి. మీరు ఏ సత్కార్యం చేసినా దాని గురించి అల్లాహ్‌కు తెలుసు. (హజ్ యాత్రకు బయలుదేరినప్పుడు) ప్రయాణ సామగ్రి(ఖర్చు)ని వెంటతీసుకెళ్ళండి. అయితే అన్నింటికంటే అత్యుత్తమ సామగ్రి దైవభీతి (అని బాగా గుర్తుంచుకోండి). కనుక ఓ బుద్ధిమంతులారా! నాకు భయపడుతూ ఉండండి.
2:198 لَيْسَ عَلَيْكُمْ جُنَاحٌ أَن تَبْتَغُوا فَضْلًا مِّن رَّبِّكُمْ ۚ فَإِذَا أَفَضْتُم مِّنْ عَرَفَاتٍ فَاذْكُرُوا اللَّهَ عِندَ الْمَشْعَرِ الْحَرَامِ ۖ وَاذْكُرُوهُ كَمَا هَدَاكُمْ وَإِن كُنتُم مِّن قَبْلِهِ لَمِنَ الضَّالِّينَ
(హజ్ యాత్ర సందర్భంగా) మీరు గనక మీ ప్రభువు అనుగ్రహాన్ని అన్వేషిస్తే అందులో తప్పేమీ లేదు. మీరు అరఫాత్ నుండి తిరిగి వస్తున్నప్పుడు ‘మష్అరె హరామ్’ వద్ద దైవనామాన్ని స్మరించండి – ఆయన సూచించిన విధంగానే ఆయన నామస్మరణ చేయండి. ఇంతకు మునుపైతే మీరు దారి తప్పి ఉన్నారు.
2:199 ثُمَّ أَفِيضُوا مِنْ حَيْثُ أَفَاضَ النَّاسُ وَاسْتَغْفِرُوا اللَّهَ ۚ إِنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ
తరువాత మీరు ప్రజలందరూ మరలే చోటు నుంచే మరలండి. క్షమాపణకై అల్లాహ్‌ను వేడుకుంటూ ఉండండి. నిస్సందేహంగా అల్లాహ్ క్షమించేవాడు, కనికరించేవాడూను.
2:200 فَإِذَا قَضَيْتُم مَّنَاسِكَكُمْ فَاذْكُرُوا اللَّهَ كَذِكْرِكُمْ آبَاءَكُمْ أَوْ أَشَدَّ ذِكْرًا ۗ فَمِنَ النَّاسِ مَن يَقُولُ رَبَّنَا آتِنَا فِي الدُّنْيَا وَمَا لَهُ فِي الْآخِرَةِ مِنْ خَلَاقٍ
హజ్ క్రియలన్నింటినీ నిర్వర్తించిన తరువాత అల్లాహ్‌ను ధ్యానించండి. మీ తాతముత్తాతలను జ్ఞాపకం చేసుకున్నట్లే, ఇంకా అంతకంటే అధికంగానే అల్లాహ్‌ను జ్ఞాపకం చేయండి. “ఓ ప్రభూ! మాకు ప్రపంచంలోనే ప్రసాదించు” అని ప్రార్థించేవారు కూడా ప్రజల్లో కొందరున్నారు. అటువంటి వారికి పరలోకంలో ఏ భాగమూ లభించదు.
2:201 وَمِنْهُم مَّن يَقُولُ رَبَّنَا آتِنَا فِي الدُّنْيَا حَسَنَةً وَفِي الْآخِرَةِ حَسَنَةً وَقِنَا عَذَابَ النَّارِ
ప్రజల్లోనే మరికొందరు, “ప్రభూ! మాకు ప్రపంచంలోనూ మేలును ప్రసాదించు, పరలోకంలో కూడా మేలును ప్రసాదించు. ఇంకా మమ్మల్ని నరకాగ్ని శిక్ష నుండి కాపాడు” అని ప్రార్థించేవారు కూడా ఉన్నారు.
2:202 أُولَٰئِكَ لَهُمْ نَصِيبٌ مِّمَّا كَسَبُوا ۚ وَاللَّهُ سَرِيعُ الْحِسَابِ
ఇలాంటి వారికి వారి కర్మలను బట్టి వాటా లభిస్తుంది. అల్లాహ్ వేగంగా లెక్క తీసుకునేవాడు.
2:203 وَاذْكُرُوا اللَّهَ فِي أَيَّامٍ مَّعْدُودَاتٍ ۚ فَمَن تَعَجَّلَ فِي يَوْمَيْنِ فَلَا إِثْمَ عَلَيْهِ وَمَن تَأَخَّرَ فَلَا إِثْمَ عَلَيْهِ ۚ لِمَنِ اتَّقَىٰ ۗ وَاتَّقُوا اللَّهَ وَاعْلَمُوا أَنَّكُمْ إِلَيْهِ تُحْشَرُونَ
గణించదగిన ఆ దినాలలో (తష్రీఖ్ దినాలలో) అల్లాహ్‌ను స్మరించండి. రెండు దినాలలోనే ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళేందుకు ఎవరైనా తొందరపాటు కనబరచినా తప్పులేదు. వెనుక ఉండిపోయిన వారు కూడా నిందార్హులు కారు. ఇది భయభక్తులు గల వారికై ఉద్దేశించినది. అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి. మీరంతా ఆయన వైపుకే సమీకరించబడతారన్న యదార్థాన్ని బాగా తెలుసుకోండి.
2:204 وَمِنَ النَّاسِ مَن يُعْجِبُكَ قَوْلُهُ فِي الْحَيَاةِ الدُّنْيَا وَيُشْهِدُ اللَّهَ عَلَىٰ مَا فِي قَلْبِهِ وَهُوَ أَلَدُّ الْخِصَامِ
(ఓ ప్రవక్తా!) ప్రజలలో కొందరు పలికే ప్రాపంచిక ఉద్దేశాలతో కూడుకున్న మాటలు నిన్ను అలరించవచ్చు. వాడు తన ఆంతర్యంలోనున్న అసలు విషయానికి అల్లాహ్‌ను సాక్షిగా పెడుతున్నాడు. మరి చూడబోతే వాడు పెద్ద తగవులమారి.
2:205 وَإِذَا تَوَلَّىٰ سَعَىٰ فِي الْأَرْضِ لِيُفْسِدَ فِيهَا وَيُهْلِكَ الْحَرْثَ وَالنَّسْلَ ۗ وَاللَّهُ لَا يُحِبُّ الْفَسَادَ
వాడు (నీ వద్ద నుండి) తిరిగి వెళ్ళిన తరువాత ధరణిలో కల్లోలాన్ని రేకెత్తించడంలో, పంటలను నాశనం చేయడంలో, సంతతిని పాడు చేయటంలో నిమగ్నుడైపోతాడు. కాగా; అల్లాహ్ ఇలాంటి చెడుగును సుతరామూ ఇష్టపడడు.
2:206 وَإِذَا قِيلَ لَهُ اتَّقِ اللَّهَ أَخَذَتْهُ الْعِزَّةُ بِالْإِثْمِ ۚ فَحَسْبُهُ جَهَنَّمُ ۚ وَلَبِئْسَ الْمِهَادُ
“అల్లాహ్‌కు భయపడు” అని వాడితో అన్నప్పుడు, వాడి గర్వం, దురభిమానం వాడ్ని పాపం వైపుకే పురికొల్పుతుంది. ఇలాంటి వారికి నరకమే గతి. అది అతి చెడ్డ నివాస స్థలం.
2:207 وَمِنَ النَّاسِ مَن يَشْرِي نَفْسَهُ ابْتِغَاءَ مَرْضَاتِ اللَّهِ ۗ وَاللَّهُ رَءُوفٌ بِالْعِبَادِ
ప్రజల్లోని మరి కొంతమంది ఎలాంటివారంటే, దైవ ప్రసన్నతను చూరగొనే ప్రయత్నంలో వారు తమ ప్రాణాలను సయితం పణంగా పెడుతున్నారు. అటువంటి (త్యాగధనులైన) తన దాసుల పట్ల అల్లాహ్ అమితమైన వాత్సల్యం కలిగి ఉంటాడు.
2:208 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا ادْخُلُوا فِي السِّلْمِ كَافَّةً وَلَا تَتَّبِعُوا خُطُوَاتِ الشَّيْطَانِ ۚ إِنَّهُ لَكُمْ عَدُوٌّ مُّبِينٌ
ఓ విశ్వాసులారా! ఇస్లాంలో పూర్తిగా ప్రవేశించండి. షైతాన్ అడుగు జాడలలో నడవకండి. వాడు మీకు బద్ధవిరోధి.
2:209 فَإِن زَلَلْتُم مِّن بَعْدِ مَا جَاءَتْكُمُ الْبَيِّنَاتُ فَاعْلَمُوا أَنَّ اللَّهَ عَزِيزٌ حَكِيمٌ
మీ వద్దకు స్పష్టమయిన నిదర్శనాలు వచ్చిన తరువాత కూడా మీరు ఒకవేళ తప్పటడుగు వేస్తే అల్లాహ్ సర్వశక్తి మంతుడు, వివేక సంపన్నుడన్న సంగతిని బాగా గుర్తుంచుకోండి.
2:210 هَلْ يَنظُرُونَ إِلَّا أَن يَأْتِيَهُمُ اللَّهُ فِي ظُلَلٍ مِّنَ الْغَمَامِ وَالْمَلَائِكَةُ وَقُضِيَ الْأَمْرُ ۚ وَإِلَى اللَّهِ تُرْجَعُ الْأُمُورُ
ఏమిటీ, అల్లాహ్ మరియు దూతలు స్వయంగా మేఘాల నీడలలో వచ్చి తమ కార్యాన్ని పరిపూర్తిగావిస్తారని వారు ఎదురుచూస్తున్నారా? కార్యాలన్నీ (నిర్ణయం కొరకు) అల్లాహ్ వైపుకే మరలించబడతాయి.
2:211 سَلْ بَنِي إِسْرَائِيلَ كَمْ آتَيْنَاهُم مِّنْ آيَةٍ بَيِّنَةٍ ۗ وَمَن يُبَدِّلْ نِعْمَةَ اللَّهِ مِن بَعْدِ مَا جَاءَتْهُ فَإِنَّ اللَّهَ شَدِيدُ الْعِقَابِ
మేము ఇస్రాయీల్ వంశస్థులకు ఎన్ని స్పష్టమైన నిదర్శనాలను ప్రసాదించామో వారినే అడగండి. దైవ ప్రసాదితాలు తమ వద్దకు చేరిన తరువాత వాటిని తారుమారు చేసేవారు, అల్లాహ్ కఠినమైన శిక్షలు విధించగలవాడన్న విషయాన్ని విస్మరించరాదు.
2:212 زُيِّنَ لِلَّذِينَ كَفَرُوا الْحَيَاةُ الدُّنْيَا وَيَسْخَرُونَ مِنَ الَّذِينَ آمَنُوا ۘ وَالَّذِينَ اتَّقَوْا فَوْقَهُمْ يَوْمَ الْقِيَامَةِ ۗ وَاللَّهُ يَرْزُقُ مَن يَشَاءُ بِغَيْرِ حِسَابٍ
అవిశ్వాసుల కొరకు ప్రాపంచిక జీవితం ఎంతో సుందరంగా, ఆకర్షణీయంగా మలచబడింది. వారు విశ్వసించిన వారిని అవహేళన చేస్తున్నారు. వాస్తవానికి అల్లాహ్ పట్ల భయభక్తులు గలవారు ప్రళయ దినాన వారికన్నా ఎంతో ఉన్నత స్థితిలో ఉంటారు. అల్లాహ్ తాను తలచిన వారికి లెక్కలేనంతగా ఉపాధిని అనుగ్రహిస్తాడు.
2:213 كَانَ النَّاسُ أُمَّةً وَاحِدَةً فَبَعَثَ اللَّهُ النَّبِيِّينَ مُبَشِّرِينَ وَمُنذِرِينَ وَأَنزَلَ مَعَهُمُ الْكِتَابَ بِالْحَقِّ لِيَحْكُمَ بَيْنَ النَّاسِ فِيمَا اخْتَلَفُوا فِيهِ ۚ وَمَا اخْتَلَفَ فِيهِ إِلَّا الَّذِينَ أُوتُوهُ مِن بَعْدِ مَا جَاءَتْهُمُ الْبَيِّنَاتُ بَغْيًا بَيْنَهُمْ ۖ فَهَدَى اللَّهُ الَّذِينَ آمَنُوا لِمَا اخْتَلَفُوا فِيهِ مِنَ الْحَقِّ بِإِذْنِهِ ۗ وَاللَّهُ يَهْدِي مَن يَشَاءُ إِلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ
మానవులంతా ఒకే సమాజంగా ఉండేవారు. అల్లాహ్ ప్రవక్తలను శుభవార్తనిచ్చే వారుగా, భయపెట్టే వారుగా చేసి పంపాడు. ప్రజల మధ్య తలెత్తిన అభిప్రాయ భేదాలపై తీర్పు చేయటానికిగాను వారివెంట (అనగా ప్రవక్తల వెంట) సత్య బద్ధమైన గ్రంథాలను పంపాడు. మరి వాళ్ళే (అనగా ప్రజలే) – స్పష్టమైన ఆదేశాలు వొసగబడిన తరువాత కూడా – పరస్పర వైర భావం, అసూయ మూలంగా అందులో విభేదించుకున్నారు. అందుచేత అల్లాహ్ విశ్వాసులకు ఈ భేదాభిప్రాయం నుండి కూడా తన ఆజ్ఞానుసారం సత్యం వైపుకు దర్శకత్వం వహించాడు. అల్లాహ్ తాను కోరిన వారికి రుజుమార్గం చూపుతాడు.
2:214 أَمْ حَسِبْتُمْ أَن تَدْخُلُوا الْجَنَّةَ وَلَمَّا يَأْتِكُم مَّثَلُ الَّذِينَ خَلَوْا مِن قَبْلِكُم ۖ مَّسَّتْهُمُ الْبَأْسَاءُ وَالضَّرَّاءُ وَزُلْزِلُوا حَتَّىٰ يَقُولَ الرَّسُولُ وَالَّذِينَ آمَنُوا مَعَهُ مَتَىٰ نَصْرُ اللَّهِ ۗ أَلَا إِنَّ نَصْرَ اللَّهِ قَرِيبٌ
ఏమిటీ, మీరు స్వర్గంలో ఇట్టే ప్రవేశించగలమని అనుకుంటున్నారా? వాస్తవానికి మీకు పూర్వం గతించిన వారికి ఎదురైనటువంటి పరిస్థితులు మీకింకా ఎదురు కానేలేదు. వారిపై కష్టాలు, రోగాలు వచ్చిపడ్డాయి. వారు ఎంతగా కుదిపి వేయబడ్డారంటే, (ఆ ధాటికి తాళలేక) “ఇంతకీ దైవసహాయం ఎప్పుడొస్తుంది?” అని ప్రవక్తలు, వారి సహచరులు ప్రశ్నించసాగారు. “వినండి! దైవ సహాయం సమీపంలోనే ఉంది” (అని వారిని ఓదార్చటం జరిగింది).
2:215 يَسْأَلُونَكَ مَاذَا يُنفِقُونَ ۖ قُلْ مَا أَنفَقْتُم مِّنْ خَيْرٍ فَلِلْوَالِدَيْنِ وَالْأَقْرَبِينَ وَالْيَتَامَىٰ وَالْمَسَاكِينِ وَابْنِ السَّبِيلِ ۗ وَمَا تَفْعَلُوا مِنْ خَيْرٍ فَإِنَّ اللَّهَ بِهِ عَلِيمٌ
తాము ఏం ఖర్చు చెయ్యాలి? అని వారు నిన్ను ప్రశ్నిస్తున్నారు. మీరేం ఖర్చు చేసినా అది మీ తల్లిదండ్రుల కొరకూ, బంధువుల కొరకూ, అనాధల కొరకూ, నిరుపేదలు, బాటసారుల కొరకూ ఖర్చు చేయాలి. మీరు ఏ మేలు చేసినా అల్లాహ్‌కు దాని గురించి తెలుసు అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు.
2:216 كُتِبَ عَلَيْكُمُ الْقِتَالُ وَهُوَ كُرْهٌ لَّكُمْ ۖ وَعَسَىٰ أَن تَكْرَهُوا شَيْئًا وَهُوَ خَيْرٌ لَّكُمْ ۖ وَعَسَىٰ أَن تُحِبُّوا شَيْئًا وَهُوَ شَرٌّ لَّكُمْ ۗ وَاللَّهُ يَعْلَمُ وَأَنتُمْ لَا تَعْلَمُونَ
యుద్ధం చేయటం మీకు కష్టంగా అనిపించినప్పటికీ, అది మీపై విధిగా నిర్ణయించబడింది. మీరు దేన్ని ఇష్టపడటం లేదో అదే మీ పాలిట బహుశా శుభకరం కావచ్చు. అలాగే మీరు మీ కోసం ఎంతగానో కోరుకునే విషయాలే మీ పాలిట హానికరంగా రూపొందవచ్చు. నిజ జ్ఞానం అల్లాహ్‌కు మాత్రమే ఉంది. మీకు ఆ విషయం తెలియదు.
2:217 يَسْأَلُونَكَ عَنِ الشَّهْرِ الْحَرَامِ قِتَالٍ فِيهِ ۖ قُلْ قِتَالٌ فِيهِ كَبِيرٌ ۖ وَصَدٌّ عَن سَبِيلِ اللَّهِ وَكُفْرٌ بِهِ وَالْمَسْجِدِ الْحَرَامِ وَإِخْرَاجُ أَهْلِهِ مِنْهُ أَكْبَرُ عِندَ اللَّهِ ۚ وَالْفِتْنَةُ أَكْبَرُ مِنَ الْقَتْلِ ۗ وَلَا يَزَالُونَ يُقَاتِلُونَكُمْ حَتَّىٰ يَرُدُّوكُمْ عَن دِينِكُمْ إِنِ اسْتَطَاعُوا ۚ وَمَن يَرْتَدِدْ مِنكُمْ عَن دِينِهِ فَيَمُتْ وَهُوَ كَافِرٌ فَأُولَٰئِكَ حَبِطَتْ أَعْمَالُهُمْ فِي الدُّنْيَا وَالْآخِرَةِ ۖ وَأُولَٰئِكَ أَصْحَابُ النَّارِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ
నిషిద్ధ మాసాలలో యుద్ధం చెయ్యటం గురించి ప్రజలు నిన్ను అడుగుతున్నారు. నువ్వు వారికి చెప్పు : ఈ మాసాలలో యుద్ధం చేయటం మహాపరాధం. అయితే అల్లాహ్ మార్గంలో అవరోధాలు కల్పించటం, అల్లాహ్‌ను తిరస్కరించటం, మస్జిదె హరామ్‌ను సందర్శించే జనులను అడ్డుకోవటం, అక్కడ నివసించే వారిని అక్కడి నుంచి వెళ్ళగొట్టడం అల్లాహ్ దృష్టిలో అంతకన్నా ఘోరమైన అపరాధం. ఈ ఉపద్రవం (ఫిత్నా) హత్య కన్నా పెద్దది. వారు మీతో యుద్ధం చేస్తూనే ఉంటారు. చివరికి వారికి వీలు కలిగితే మిమ్మల్ని మీ ధర్మం నుంచి మరలించనయినా మరలించేస్తారు. మరి మీలో గనక ఎవరయినా తమ ధర్మం నుంచి తిరిగిపోయి, అవిశ్వాస స్థితిలో మరణిస్తే వారి ఇహపర లోకాల్లోని కర్మలు సర్వనాశనమైపోతాయి. అలాంటి వారే నరకవాసులు. వారందులో కలకాలం పడి ఉంటారు.
2:218 إِنَّ الَّذِينَ آمَنُوا وَالَّذِينَ هَاجَرُوا وَجَاهَدُوا فِي سَبِيلِ اللَّهِ أُولَٰئِكَ يَرْجُونَ رَحْمَتَ اللَّهِ ۚ وَاللَّهُ غَفُورٌ رَّحِيمٌ
అయితే విశ్వసించినవారు, హిజ్రత్ చేసిన (వలసపోయిన) వారు, దైవ మార్గంలో పోరాడేవారు మాత్రమే దైవ కారుణ్యానికి అభ్యర్థులు. అల్లాహ్ అమితంగా క్షమించేవాడు, అపారంగా కరుణించేవాడు.
2:219 يَسْأَلُونَكَ عَنِ الْخَمْرِ وَالْمَيْسِرِ ۖ قُلْ فِيهِمَا إِثْمٌ كَبِيرٌ وَمَنَافِعُ لِلنَّاسِ وَإِثْمُهُمَا أَكْبَرُ مِن نَّفْعِهِمَا ۗ وَيَسْأَلُونَكَ مَاذَا يُنفِقُونَ قُلِ الْعَفْوَ ۗ كَذَٰلِكَ يُبَيِّنُ اللَّهُ لَكُمُ الْآيَاتِ لَعَلَّكُمْ تَتَفَكَّرُونَ
ప్రజలు నిన్ను మద్యపానం గురించి, జూదం గురించి ప్రశ్నిస్తున్నారు. నువ్వు వారికి చెప్పు: “రెండింటిలోనూ చాలా పెద్ద పాపం ఉంది. ప్రజలకు దీనివల్ల కొన్ని ప్రాపంచిక లాభాలు కూడా చేకూరుతాయి. కాని వీటి ద్వారా చేకూరే లాభం కన్నా పాపం చాలా ఎక్కువ.” ఏం ఖర్చు పెట్టాలి? అని వారు నిన్ను అడుగుతారు. ‘మీ ఖర్చులు పోగా మిగిలినది’ అని నువ్వు వారికి చెప్పు. మీరు యోచన చేసేటందుకు గాను అల్లాహ్ ఈ విధంగా తన ఆదేశాలను స్పష్టంగా వివరిస్తున్నాడు.
2:220 فِي الدُّنْيَا وَالْآخِرَةِ ۗ وَيَسْأَلُونَكَ عَنِ الْيَتَامَىٰ ۖ قُلْ إِصْلَاحٌ لَّهُمْ خَيْرٌ ۖ وَإِن تُخَالِطُوهُمْ فَإِخْوَانُكُمْ ۚ وَاللَّهُ يَعْلَمُ الْمُفْسِدَ مِنَ الْمُصْلِحِ ۚ وَلَوْ شَاءَ اللَّهُ لَأَعْنَتَكُمْ ۚ إِنَّ اللَّهَ عَزِيزٌ حَكِيمٌ
ఇహలోక జీవితంలో, పరలోకంలో కూడా. ఇంకా వీరు అనాధలను గురించి కూడా నిన్ను ప్రశ్నిస్తున్నారు కదూ! వారికి బోధపరచు: వారి బాగోగులను అభిలషించటం ఉత్తమం. (బాగు పరచే ఉద్దేశంతో) ఒకవేళ మీరు వారి సొమ్మును మీ సొమ్ములో కలుపుకుంటే వారూ మీ సహోదరులే. చెడగొట్టేవారెవరో, బాగు పరచేవారెవరో అల్లాహ్‌కు బాగా తెలుసు. అల్లాహ్‌యే గనక తలిస్తే మిమ్మల్ని కష్టాల్లో పడవేసేవాడే. నిశ్చయంగా అల్లాహ్ శక్తిమంతుడు, వివేకవంతుడు.
2:221 وَلَا تَنكِحُوا الْمُشْرِكَاتِ حَتَّىٰ يُؤْمِنَّ ۚ وَلَأَمَةٌ مُّؤْمِنَةٌ خَيْرٌ مِّن مُّشْرِكَةٍ وَلَوْ أَعْجَبَتْكُمْ ۗ وَلَا تُنكِحُوا الْمُشْرِكِينَ حَتَّىٰ يُؤْمِنُوا ۚ وَلَعَبْدٌ مُّؤْمِنٌ خَيْرٌ مِّن مُّشْرِكٍ وَلَوْ أَعْجَبَكُمْ ۗ أُولَٰئِكَ يَدْعُونَ إِلَى النَّارِ ۖ وَاللَّهُ يَدْعُو إِلَى الْجَنَّةِ وَالْمَغْفِرَةِ بِإِذْنِهِ ۖ وَيُبَيِّنُ آيَاتِهِ لِلنَّاسِ لَعَلَّهُمْ يَتَذَكَّرُونَ
దైవానికి భాగస్వామ్యం కల్పించే స్త్రీలు విశ్వసించి ముస్లింలు కానంతవరకూ మీరు వారిని వివాహమాడకండి. దైవానికి భాగస్వామ్యం కల్పించే స్వతంత్ర స్త్రీ మీకు ఎంతగా నచ్చినప్పటికీ ఆమెకన్నా అల్లాహ్‌ను విశ్వసించే ఒక బానిస స్త్రీ ఎంతో ఉత్తమురాలు. (అలాగే) షిర్కుకు ఒడిగట్టే పురుషులు విశ్వసించనంతవరకూ మీ స్త్రీలను వారి వివాహ బంధంలోకి ఇవ్వకండి. ఎందుకంటే షిర్కుకు పాల్పడే పురుషుడు మీకు నచ్చినప్పటికీ అతనికంటే విశ్వసించిన ఒక బానిస పురుషుడు ఎన్నో రెట్లు నయం. వీరు (మిమ్మల్ని) నరకం వైపుకు పిలుస్తున్నారు. కాని అల్లాహ్ తన అనుజ్ఞతో స్వర్గం వైపునకూ, క్షమాభిక్ష వైపునకూ పిలుస్తున్నాడు. ప్రజలు గుణపాఠం నేర్చుకునేందుకుగాను ఆయన తన ఆయతులను విడమరచి మరీ చెబుతున్నాడు.
2:222 وَيَسْأَلُونَكَ عَنِ الْمَحِيضِ ۖ قُلْ هُوَ أَذًى فَاعْتَزِلُوا النِّسَاءَ فِي الْمَحِيضِ ۖ وَلَا تَقْرَبُوهُنَّ حَتَّىٰ يَطْهُرْنَ ۖ فَإِذَا تَطَهَّرْنَ فَأْتُوهُنَّ مِنْ حَيْثُ أَمَرَكُمُ اللَّهُ ۚ إِنَّ اللَّهَ يُحِبُّ التَّوَّابِينَ وَيُحِبُّ الْمُتَطَهِّرِينَ
వారు నిన్ను బహిష్టు గురించి ప్రశ్నిస్తున్నారు. నువ్వు వారికి చెప్పు: అదొక అశుద్ధ స్థితి. కనుక అశుద్ధావస్థలో వారికి ఎడంగా ఉండండి. వారు పరిశుద్ధులయ్యేవరకు వారివద్దకు పోకండి. వారు పరిశుద్ధత నొందిన మీదట, అల్లాహ్ అనుమతించిన స్థానం నుంచి మీరు వారితో సమాగమం జరుపవచ్చు. అల్లాహ్ పశ్చాత్తాపపడేవారిని, పారిశుద్ధ్యాన్ని అవలంబించేవారిని ఇష్టపడతాడు.
2:223 نِسَاؤُكُمْ حَرْثٌ لَّكُمْ فَأْتُوا حَرْثَكُمْ أَنَّىٰ شِئْتُمْ ۖ وَقَدِّمُوا لِأَنفُسِكُمْ ۚ وَاتَّقُوا اللَّهَ وَاعْلَمُوا أَنَّكُم مُّلَاقُوهُ ۗ وَبَشِّرِ الْمُؤْمِنِينَ
మీ స్త్రీలు మీ పంటపొలాలు. కాబట్టి మీ పొలాల్లోకి మీరు కోరిన విధంగా రండి. మీ స్వయం కోసం (సత్కర్మలను) ముందుకు పంపండి. అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి. మీరు ఆయన్ని కలుసుకోవలసి ఉందన్న విషయాన్ని గ్రహించండి. (ఓ ప్రవక్తా!) విశ్వాసులకు శుభవార్తను వినిపించు.
2:224 وَلَا تَجْعَلُوا اللَّهَ عُرْضَةً لِّأَيْمَانِكُمْ أَن تَبَرُّوا وَتَتَّقُوا وَتُصْلِحُوا بَيْنَ النَّاسِ ۗ وَاللَّهُ سَمِيعٌ عَلِيمٌ
సత్కార్యాన్నీ, భయభక్తులనూ, మానవుల మధ్య సంస్కరణను విడిచిపెట్టే పరిస్థితి ఏర్పడేలా – మీరు అల్లాహ్‌ను మీ ‘ప్రమాణా’లకు లక్ష్యంగా పెట్టకండి. అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వం తెలిసినవాడు.
2:225 لَّا يُؤَاخِذُكُمُ اللَّهُ بِاللَّغْوِ فِي أَيْمَانِكُمْ وَلَٰكِن يُؤَاخِذُكُم بِمَا كَسَبَتْ قُلُوبُكُمْ ۗ وَاللَّهُ غَفُورٌ حَلِيمٌ
అనాలోచిత ప్రమాణాలను గురించి అల్లాహ్ మిమ్మల్ని నిలదీయడు. హృదయపూర్వకంగా మీరు చేసే ప్రమాణాలను గురించి మాత్రం ఆయన తప్పకుండా నిలదీసి అడుగుతాడు. అల్లాహ్ క్షమాశీలి, సహనశీలి కూడా.
2:226 لِّلَّذِينَ يُؤْلُونَ مِن نِّسَائِهِمْ تَرَبُّصُ أَرْبَعَةِ أَشْهُرٍ ۖ فَإِن فَاءُوا فَإِنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ
ఎవరయితే తమ భార్యలతో సంబంధం పెట్టుకోబోమని ఒట్టేసుకుంటారో వారి కొరకు నాలుగు మాసాల గడువు ఉంది. మరి వారు గనక (ఈలోగా) మరలివస్తే అల్లాహ్ కూడా క్షమించేవాడు, జాలి చూపేవాడు.
2:227 وَإِنْ عَزَمُوا الطَّلَاقَ فَإِنَّ اللَّهَ سَمِيعٌ عَلِيمٌ
ఒకవేళ వారు విడాకులు ఇవ్వాలనే నిశ్చయించుకుంటే, నిస్సందేహంగా అల్లాహ్ అన్నీ వినేవాడు, అంతా తెలిసినవాడు.
2:228 وَالْمُطَلَّقَاتُ يَتَرَبَّصْنَ بِأَنفُسِهِنَّ ثَلَاثَةَ قُرُوءٍ ۚ وَلَا يَحِلُّ لَهُنَّ أَن يَكْتُمْنَ مَا خَلَقَ اللَّهُ فِي أَرْحَامِهِنَّ إِن كُنَّ يُؤْمِنَّ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ ۚ وَبُعُولَتُهُنَّ أَحَقُّ بِرَدِّهِنَّ فِي ذَٰلِكَ إِنْ أَرَادُوا إِصْلَاحًا ۚ وَلَهُنَّ مِثْلُ الَّذِي عَلَيْهِنَّ بِالْمَعْرُوفِ ۚ وَلِلرِّجَالِ عَلَيْهِنَّ دَرَجَةٌ ۗ وَاللَّهُ عَزِيزٌ حَكِيمٌ
విడాకులు పొందిన స్త్రీలు తమను తాము మూడు రుతువుల దాకా ఆపి ఉంచుకోవాలి. వారు అల్లాహ్‌ను, అంతిమదినాన్నీ విశ్వసించేవారే అయితే అల్లాహ్ వారి గర్భాలలో సృష్టించిన దానిని దాచి ఉంచటం వారికి ధర్మ సమ్మతంకాదు. ఒకవేళ ఈ గడువు లోపల వారిని తిరిగి రప్పించుకోవాలన్న సదుద్దేశం భర్తలకు ఉంటే ధర్మం ప్రకారం అలా రప్పించుకునే హక్కు వారికి ఉంది. భర్తలకు స్త్రీలపై హక్కులున్నట్లే స్త్రీలకు కూడా వారిపై హక్కులున్నాయి – కాని ఉత్తమ రీతిలో! కాకపోతే పురుషులకు స్త్రీలపై ఒకింత ప్రాధాన్యత ఉంది. అల్లాహ్ సర్వాధికుడు, వివేచనాపరుడు.
2:229 الطَّلَاقُ مَرَّتَانِ ۖ فَإِمْسَاكٌ بِمَعْرُوفٍ أَوْ تَسْرِيحٌ بِإِحْسَانٍ ۗ وَلَا يَحِلُّ لَكُمْ أَن تَأْخُذُوا مِمَّا آتَيْتُمُوهُنَّ شَيْئًا إِلَّا أَن يَخَافَا أَلَّا يُقِيمَا حُدُودَ اللَّهِ ۖ فَإِنْ خِفْتُمْ أَلَّا يُقِيمَا حُدُودَ اللَّهِ فَلَا جُنَاحَ عَلَيْهِمَا فِيمَا افْتَدَتْ بِهِ ۗ تِلْكَ حُدُودُ اللَّهِ فَلَا تَعْتَدُوهَا ۚ وَمَن يَتَعَدَّ حُدُودَ اللَّهِ فَأُولَٰئِكَ هُمُ الظَّالِمُونَ
ఈ విడాకులు రెండుసార్లే. ఆ తరువాత సక్రమంగా (ఆమెను) ఆపుకోవాలి. లేదంటే ఉత్తమ రీతిలో వదలి పెట్టాలి. మీరు వారికి ఇంతకు ముందు ఇచ్చి ఉన్న వాటిలో నుంచి దేన్నయినా తిరిగి తీసుకోవటం ధర్మసమ్మతం కాదు. ఆఁ ఒకవేళ అల్లాహ్ విధించిన హద్దులకు కట్టుబడి ఉండలేమన్న భయం వారిరువురికీ ఉంటే అది వేరే విషయం. అందువల్ల దంపతులిద్దరూ అల్లాహ్ ఏర్పరచిన హద్దులకు కట్టుబడి ఉండలేరన్న భయం మీకు కలిగి, అదే సమయంలో స్త్రీ తన భర్తకు కొంత నష్టపరిహారం ఇచ్చి వేర్పడదలిస్తే – అట్టి పరిస్థితిలో ఇరువురిపై ఎలాంటి దోషంలేదు. ఇవి అల్లాహ్ నిర్ధారించిన హద్దులు. (జాగ్రత్త!) వాటిని దాటకూడదు. ఎవరు అల్లాహ్ నిర్థారించిన హద్దులను మీరిపోతారో వారే దుర్మార్గులు.
2:230 فَإِن طَلَّقَهَا فَلَا تَحِلُّ لَهُ مِن بَعْدُ حَتَّىٰ تَنكِحَ زَوْجًا غَيْرَهُ ۗ فَإِن طَلَّقَهَا فَلَا جُنَاحَ عَلَيْهِمَا أَن يَتَرَاجَعَا إِن ظَنَّا أَن يُقِيمَا حُدُودَ اللَّهِ ۗ وَتِلْكَ حُدُودُ اللَّهِ يُبَيِّنُهَا لِقَوْمٍ يَعْلَمُونَ
మరి ఆమెకు (మూడవసారి) గనక విడాకులిస్తే, ఆ స్త్రీ ఇతనిని తప్ప వేరొక వ్యక్తిని వివాహం చేసుకోనంతవరకూ ఇతని కోసం ఆమె ధర్మసమ్మతం కాజాలదు. ఆ తరువాత అతను (రెండవ భర్త) కూడా ఆమెకు విడాకులిస్తే, మళ్ళీ వీరిద్దరూ అల్లాహ్ (విధించిన) హద్దులకు కట్టుబడి ఉండగలమన్న నమ్మకం ఉండి వివాహ బంధంలోకి రాదలిస్తే అందులో తప్పులేదు. ఇవి అల్లాహ్ విధించిన హద్దులు. తెలుసుకోగలవారికి ఆయన వీటిని స్పష్టపరుస్తున్నాడు.
2:231 وَإِذَا طَلَّقْتُمُ النِّسَاءَ فَبَلَغْنَ أَجَلَهُنَّ فَأَمْسِكُوهُنَّ بِمَعْرُوفٍ أَوْ سَرِّحُوهُنَّ بِمَعْرُوفٍ ۚ وَلَا تُمْسِكُوهُنَّ ضِرَارًا لِّتَعْتَدُوا ۚ وَمَن يَفْعَلْ ذَٰلِكَ فَقَدْ ظَلَمَ نَفْسَهُ ۚ وَلَا تَتَّخِذُوا آيَاتِ اللَّهِ هُزُوًا ۚ وَاذْكُرُوا نِعْمَتَ اللَّهِ عَلَيْكُمْ وَمَا أَنزَلَ عَلَيْكُم مِّنَ الْكِتَابِ وَالْحِكْمَةِ يَعِظُكُم بِهِ ۚ وَاتَّقُوا اللَّهَ وَاعْلَمُوا أَنَّ اللَّهَ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ
మీరు స్త్రీలకు విడాకులు ఇచ్చినప్పుడు, వారి గడువు (ఇద్దత్) ముగియనుండగా వారిని సహృదయంతో మీ వద్ద ఆపి ఉంచుకోండి. లేదంటే ఉత్తమ రీతిలో సాగనంపండి. వారిపై దౌర్జన్యానికి ఒడిగట్టే ఉద్దేశంతో వారిని ఆపి ఉంచుకొని వేధించకండి. ఈ వైఖరిని అనుసరించినవాడు నిజానికి తనకు తానే అన్యాయం చేసుకున్నాడు. దైవాదేశాలతో పరిహాసమాడకండి. అల్లాహ్ మీకు చేసిన ఉపకారాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి. మీపై గ్రంథాన్ని, హిక్మత్ను (ప్రవక్త సంప్రదాయాన్ని, ధర్మశాస్త్రాన్ని) అవతరింపజేసి, మీకు చేసిన ఉపదేశాన్ని కూడా (అవలోకనం చేసుకోండి). అల్లాహ్ యెడల భయభక్తులు కలిగి ఉండండి. అల్లాహ్‌కు ప్రతిదీ తెలుసు అన్న విషయాన్ని మీరు తెలుసుకోండి.
2:232 وَإِذَا طَلَّقْتُمُ النِّسَاءَ فَبَلَغْنَ أَجَلَهُنَّ فَلَا تَعْضُلُوهُنَّ أَن يَنكِحْنَ أَزْوَاجَهُنَّ إِذَا تَرَاضَوْا بَيْنَهُم بِالْمَعْرُوفِ ۗ ذَٰلِكَ يُوعَظُ بِهِ مَن كَانَ مِنكُمْ يُؤْمِنُ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ ۗ ذَٰلِكُمْ أَزْكَىٰ لَكُمْ وَأَطْهَرُ ۗ وَاللَّهُ يَعْلَمُ وَأَنتُمْ لَا تَعْلَمُونَ
మీరు స్త్రీలకు విడాకులు ఇచ్చిన తరువాత, వారు తమ గడువు (ఇద్దత్)ను ముగించి, తమ (మాజీ) భర్తలను ధర్మబద్ధంగా పరస్పరం ఇష్టపడి వివాహమాడదలిస్తే మీరు వారికి అడ్డు తగలకండి. మీలో ఎవరయితే అల్లాహ్‌ను, అంతిమదినాన్నీ విశ్వసిస్తున్నారో వారికి ఈ ఉపదేశం చేయబడుతోంది. ఇందులోనే మీ పరిశుద్ధత, పరిశుభ్రత ఇమిడి ఉన్నాయి. అంతా అల్లాహ్‌కు తెలుసు, మీకు తెలియదు.
2:233 وَالْوَالِدَاتُ يُرْضِعْنَ أَوْلَادَهُنَّ حَوْلَيْنِ كَامِلَيْنِ ۖ لِمَنْ أَرَادَ أَن يُتِمَّ الرَّضَاعَةَ ۚ وَعَلَى الْمَوْلُودِ لَهُ رِزْقُهُنَّ وَكِسْوَتُهُنَّ بِالْمَعْرُوفِ ۚ لَا تُكَلَّفُ نَفْسٌ إِلَّا وُسْعَهَا ۚ لَا تُضَارَّ وَالِدَةٌ بِوَلَدِهَا وَلَا مَوْلُودٌ لَّهُ بِوَلَدِهِ ۚ وَعَلَى الْوَارِثِ مِثْلُ ذَٰلِكَ ۗ فَإِنْ أَرَادَا فِصَالًا عَن تَرَاضٍ مِّنْهُمَا وَتَشَاوُرٍ فَلَا جُنَاحَ عَلَيْهِمَا ۗ وَإِنْ أَرَدتُّمْ أَن تَسْتَرْضِعُوا أَوْلَادَكُمْ فَلَا جُنَاحَ عَلَيْكُمْ إِذَا سَلَّمْتُم مَّا آتَيْتُم بِالْمَعْرُوفِ ۗ وَاتَّقُوا اللَّهَ وَاعْلَمُوا أَنَّ اللَّهَ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ
పాల గడువును పూర్తి చేయాలని (తండ్రులు) కోరినపక్షంలో తల్లులు తమ పిల్లలకు పూర్తిగా రెండు సంవత్సరాలపాటు పాలు పట్టాలి. బిడ్డల తండ్రులపై పోషణాభారం ఉంటుంది. కనుక వారు వారికి ఉత్తమ రీతిలో అన్నవస్త్రాలను సమకూర్చాలి. ఎవరిపైనా శక్తికి మించిన భారం వేయబడదు. బిడ్డ మూలంగా తల్లిని వేధించటంగానీ, సంతానం కారణంగా తండ్రిని ముప్పు తిప్పలు పెట్టడంగానీ చేయరాదు. వారసులపై కూడా ఇటువంటి బాధ్యతే ఉంటుంది. ఒకవేళ ఉభయులూ (తల్లిదండ్రులు) తమ ఇష్టపూర్వకంగా, పరస్పర సంప్రతింపులతో పాలు విడిపించదలిస్తే వారు నిందార్హులు కారు. ఒకవేళ మీ సంతానానికి పాలు పట్టాలన్నదే మీ అభిలాష అయితే అందులోనూ దోషంలేదు. అయితే మీరు ఆమెకు సముచితమైన రీతిలో ఇవ్వవలసిన దాన్ని ఇవ్వండి. అల్లాహ్‌కు భయపడుతూ మసలుకోండి. అల్లాహ్ మీ కార్యకలాపాలన్నింటినీ గమనిస్తున్నాడన్న విషయాన్ని తెలుసుకోండి.
2:234 وَالَّذِينَ يُتَوَفَّوْنَ مِنكُمْ وَيَذَرُونَ أَزْوَاجًا يَتَرَبَّصْنَ بِأَنفُسِهِنَّ أَرْبَعَةَ أَشْهُرٍ وَعَشْرًا ۖ فَإِذَا بَلَغْنَ أَجَلَهُنَّ فَلَا جُنَاحَ عَلَيْكُمْ فِيمَا فَعَلْنَ فِي أَنفُسِهِنَّ بِالْمَعْرُوفِ ۗ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ خَبِيرٌ
మీలో ఎవరయినా మరణించి, వారు భార్యలను వదలిపోతే అటువంటి స్త్రీలు నాలుగు మాసాల పది రోజుల వరకూ తమను తాము గడువు (ఇద్దత్)లో ఆపుకోవాలి. గడువు ముగిసిన తరువాత వారు సంస్కారవంతమైన పద్ధతిలో తమ కొరకు మంచిదనుకున్న కార్యమేదయినా చేసుకుంటే అందులో మీపై దోషం ఏమీలేదు. మీరు ఏమేం చేస్తున్నారో అల్లాహ్‌కు అంతా తెలుసు.
2:235 وَلَا جُنَاحَ عَلَيْكُمْ فِيمَا عَرَّضْتُم بِهِ مِنْ خِطْبَةِ النِّسَاءِ أَوْ أَكْنَنتُمْ فِي أَنفُسِكُمْ ۚ عَلِمَ اللَّهُ أَنَّكُمْ سَتَذْكُرُونَهُنَّ وَلَٰكِن لَّا تُوَاعِدُوهُنَّ سِرًّا إِلَّا أَن تَقُولُوا قَوْلًا مَّعْرُوفًا ۚ وَلَا تَعْزِمُوا عُقْدَةَ النِّكَاحِ حَتَّىٰ يَبْلُغَ الْكِتَابُ أَجَلَهُ ۚ وَاعْلَمُوا أَنَّ اللَّهَ يَعْلَمُ مَا فِي أَنفُسِكُمْ فَاحْذَرُوهُ ۚ وَاعْلَمُوا أَنَّ اللَّهَ غَفُورٌ حَلِيمٌ
ఆ స్త్రీలను (వితంతువులను) నికాహ్ చేసుకోవాలన్న మీ సంకల్పాన్ని సూచనా ప్రాయంగా వారికి తెలియజేసినా లేక మీ ఉద్దేశాన్ని మీ గుండెల్లోనే దాచుకున్నా అందులో తప్పేమీలేదు. మీరు తప్పకుండా వారి గురించి ప్రస్తావిస్తారన్న సంగతి అల్లాహ్‌కు తెలుసు. అయితే మీరు వారికి లోపాయికారిగా వాగ్దానాలు చేయకండి. ధర్మయుక్తంగా ఏదన్నా చెబితే అది వేరే విషయం! కాని ఇద్దత్ (గడువు) కాలం ముగియనిదే నికాహ్ ఒప్పందాన్ని నిశ్చయం చేయకండి. మీ ఆంతర్యాల్లో దాగి వున్న విషయాలను సయితం అల్లాహ్ తెలుసుకుంటాడని మరువకండి. కనుక ఆయన పట్ల అప్రమత్తంగా ఉండండి. అల్లాహ్ క్షమించేవాడు, సహనశీలి అని కూడా తెలుసుకోండి.
2:236 لَّا جُنَاحَ عَلَيْكُمْ إِن طَلَّقْتُمُ النِّسَاءَ مَا لَمْ تَمَسُّوهُنَّ أَوْ تَفْرِضُوا لَهُنَّ فَرِيضَةً ۚ وَمَتِّعُوهُنَّ عَلَى الْمُوسِعِ قَدَرُهُ وَعَلَى الْمُقْتِرِ قَدَرُهُ مَتَاعًا بِالْمَعْرُوفِ ۖ حَقًّا عَلَى الْمُحْسِنِينَ
ఒకవేళ మీరు స్త్రీలను తాకకుండా, వారి మహర్‌ను నిర్ధారించకుండానే వారికి విడాకులిస్తే అది కూడా మీకు పాపం కాదు. అయితే వారికి ఎంతో కొంత ప్రయోజనం చేకూర్చండి. స్థితిమంతుడు తన స్థితికి తగినట్లుగా, పేదవాడు తన స్థోమతకు తగినట్లుగా ధర్మం ప్రకారం ప్రయోజనం చేకూర్చాలి. ఉత్తమంగా వ్యవహరించేవారికి ఇది విధిగా నిర్ణయించబడింది.
2:237 وَإِن طَلَّقْتُمُوهُنَّ مِن قَبْلِ أَن تَمَسُّوهُنَّ وَقَدْ فَرَضْتُمْ لَهُنَّ فَرِيضَةً فَنِصْفُ مَا فَرَضْتُمْ إِلَّا أَن يَعْفُونَ أَوْ يَعْفُوَ الَّذِي بِيَدِهِ عُقْدَةُ النِّكَاحِ ۚ وَأَن تَعْفُوا أَقْرَبُ لِلتَّقْوَىٰ ۚ وَلَا تَنسَوُا الْفَضْلَ بَيْنَكُمْ ۚ إِنَّ اللَّهَ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ
మీరు స్త్రీలను ముట్టుకోక ముందే విడాకులిచ్చేస్తే, అప్పటికే వారి ‘మహర్’ సొమ్ము కూడా నిర్ణయించబడి ఉంటే, నిర్ణీత మహర్లో సగం సొమ్ము వారికి ఇవ్వండి. ఒకవేళ వారు (స్త్రీలు) ఆ సొమ్మును కూడా మన్నించి వదలిపెడితే లేక వివాహ బంధం తన చేతిలో ఉన్న వ్యక్తి (పురుషుడు తాను పెళ్ళి సందర్భంగా యిచ్చిన మహర్ సొమ్మును) క్షమించివేస్తే అది వేరే విషయం. మీ మన్నింపుల వైఖరి దైవభక్తికి చాలా సన్నిహిత మైనది. ఒండొకరి పట్ల ఔదార్యం చూపటాన్ని విస్మరించకండి. నిస్సందేహంగా అల్లాహ్ మీ కర్మలను గమనిస్తూనే ఉన్నాడు.
2:238 حَافِظُوا عَلَى الصَّلَوَاتِ وَالصَّلَاةِ الْوُسْطَىٰ وَقُومُوا لِلَّهِ قَانِتِينَ
నమాజులను కాపాడుకోండి, ముఖ్యంగా మధ్యలో వున్న నమాజును. అల్లాహ్ సమక్షంలో వినమ్రులై నిలబడండి.
2:239 فَإِنْ خِفْتُمْ فَرِجَالًا أَوْ رُكْبَانًا ۖ فَإِذَا أَمِنتُمْ فَاذْكُرُوا اللَّهَ كَمَا عَلَّمَكُم مَّا لَمْ تَكُونُوا تَعْلَمُونَ
పరిస్థితులు భయానకంగా ఉన్నప్పుడు నడుస్తూనో లేక వాహనంపై పోతూనో (నమాజు చేయండి). శాంతిభద్రతలు నెలకొన్న తరువాత అల్లాహ్ మీకు బోధించిన విధంగా ఆయన్ని ధ్యానించండి. దాని గురించి అంతకుముందు మీకు తెలీదు.
2:240 وَالَّذِينَ يُتَوَفَّوْنَ مِنكُمْ وَيَذَرُونَ أَزْوَاجًا وَصِيَّةً لِّأَزْوَاجِهِم مَّتَاعًا إِلَى الْحَوْلِ غَيْرَ إِخْرَاجٍ ۚ فَإِنْ خَرَجْنَ فَلَا جُنَاحَ عَلَيْكُمْ فِي مَا فَعَلْنَ فِي أَنفُسِهِنَّ مِن مَّعْرُوفٍ ۗ وَاللَّهُ عَزِيزٌ حَكِيمٌ
మీలో ఎవరయినా చనిపోయి, వారు తమ భార్యలను వదలిపోతే, వారు ఒక ఏడాది కాలంపాటు ప్రయోజనం పొందేలా, వారిని ఎవరూ ఇండ్ల నుంచి గెంటివేయకుండా ఉండేలా వీలునామా వ్రాయాలి. ఒకవేళ వారు తమంతట తాముగా వెళ్ళిపోయి, తమ విషయంలో ధర్మసమ్మతంగా ఏమి చేసినా దానికి మీరు నిందార్హులు కారు. అల్లాహ్ సర్వాధికుడు, వివేచనాపరుడు.
2:241 وَلِلْمُطَلَّقَاتِ مَتَاعٌ بِالْمَعْرُوفِ ۖ حَقًّا عَلَى الْمُتَّقِينَ
విడాకులు పొందిన మహిళలకు సముచిత మేలు చేయటం భావ్యం. ఇది దైవభీతిపరులపై విధిగా చేయబడింది.
2:242 كَذَٰلِكَ يُبَيِّنُ اللَّهُ لَكُمْ آيَاتِهِ لَعَلَّكُمْ تَعْقِلُونَ
మీరు అర్థం చేసుకుని బుద్ధిగా మసలుకునేందుకుగాను అల్లాహ్ ఈ విధంగా తన ఆయతులను (ఆజ్ఞలను) మీకు విశద పరుస్తున్నాడు.
2:243 أَلَمْ تَرَ إِلَى الَّذِينَ خَرَجُوا مِن دِيَارِهِمْ وَهُمْ أُلُوفٌ حَذَرَ الْمَوْتِ فَقَالَ لَهُمُ اللَّهُ مُوتُوا ثُمَّ أَحْيَاهُمْ ۚ إِنَّ اللَّهَ لَذُو فَضْلٍ عَلَى النَّاسِ وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَشْكُرُونَ
వేల సంఖ్యలో ఉండి కూడా మరణ భీతితో ఇల్లూ వాకిలీ వదలిపోవడానికి సిద్ధమైన వారిని నీవు చూడలేదా? అల్లాహ్ వారితో “చావండి” అని అన్నాడు. మరి వారిని తిరిగి బ్రతికించాడు. నిస్సందేహంగా అల్లాహ్ జనుల పట్ల దయగలవాడు. కాని వారిలో అత్యధికులు కృతజ్ఞత చూపరు.
2:244 وَقَاتِلُوا فِي سَبِيلِ اللَّهِ وَاعْلَمُوا أَنَّ اللَّهَ سَمِيعٌ عَلِيمٌ
అల్లాహ్ మార్గంలో పోరాడండి. అల్లాహ్ అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడన్న విషయాన్ని మీరు తెలుసుకోండి.
2:245 مَّن ذَا الَّذِي يُقْرِضُ اللَّهَ قَرْضًا حَسَنًا فَيُضَاعِفَهُ لَهُ أَضْعَافًا كَثِيرَةً ۚ وَاللَّهُ يَقْبِضُ وَيَبْسُطُ وَإِلَيْهِ تُرْجَعُونَ
అల్లాహ్‌కు మంచి రుణం ఇచ్చేవారు మీలో ఎవరైనా ఉన్నారా? దాన్ని ఆయన ఎన్నోరెట్లు పెంచి తిరిగి ఇస్తాడు. (ఉపాధిని) తగ్గించేవాడు, పెంచేవాడు అల్లాహ్‌యే. కడకు మీరంతా మరలి పోవలసింది ఆయన వైపుకే.
2:246 أَلَمْ تَرَ إِلَى الْمَلَإِ مِن بَنِي إِسْرَائِيلَ مِن بَعْدِ مُوسَىٰ إِذْ قَالُوا لِنَبِيٍّ لَّهُمُ ابْعَثْ لَنَا مَلِكًا نُّقَاتِلْ فِي سَبِيلِ اللَّهِ ۖ قَالَ هَلْ عَسَيْتُمْ إِن كُتِبَ عَلَيْكُمُ الْقِتَالُ أَلَّا تُقَاتِلُوا ۖ قَالُوا وَمَا لَنَا أَلَّا نُقَاتِلَ فِي سَبِيلِ اللَّهِ وَقَدْ أُخْرِجْنَا مِن دِيَارِنَا وَأَبْنَائِنَا ۖ فَلَمَّا كُتِبَ عَلَيْهِمُ الْقِتَالُ تَوَلَّوْا إِلَّا قَلِيلًا مِّنْهُمْ ۗ وَاللَّهُ عَلِيمٌ بِالظَّالِمِينَ
మూసా తరువాత ఇస్రాయీలు సంతతి పెద్దల (రెండు నాల్కల ధోరణి)ని గురించి నువ్వు ఆలోచించావా? “మేము దైవమార్గంలో పోరాడేందుకుగాను మాకోసం ఎవరినయినా రాజుగా నియమించండి” అని వారు తమ ప్రవక్తను కోరారు. దానికి ఆ ప్రవక్త, “తీరా యుద్ధం విధించబడ్డాక మీరు వెనుకంజ వేస్తారేమో!” అని అన్నాడు. దానికి వారు, “మేము ఇప్పటికే ఇళ్లనుంచి తరిమివేయబడ్డాము. మా పిల్లలకు దూరం చేయబడ్డాము. అలాంటప్పుడు మేము దైవమార్గంలో పోరాడకుండా ఉండటం అనేది ఎలా సాధ్యం?” అని (కడు గంభీరంగా) పలికారు. తీరా యుద్ధం విధిగా చేయబడినప్పుడు, వారిలో కొద్ది మంది మినహా మిగిలిన వారంతా వెన్నుచూపారు. అల్లాహ్ దుర్మార్గులను బాగా ఎరుగు.
2:247 وَقَالَ لَهُمْ نَبِيُّهُمْ إِنَّ اللَّهَ قَدْ بَعَثَ لَكُمْ طَالُوتَ مَلِكًا ۚ قَالُوا أَنَّىٰ يَكُونُ لَهُ الْمُلْكُ عَلَيْنَا وَنَحْنُ أَحَقُّ بِالْمُلْكِ مِنْهُ وَلَمْ يُؤْتَ سَعَةً مِّنَ الْمَالِ ۚ قَالَ إِنَّ اللَّهَ اصْطَفَاهُ عَلَيْكُمْ وَزَادَهُ بَسْطَةً فِي الْعِلْمِ وَالْجِسْمِ ۖ وَاللَّهُ يُؤْتِي مُلْكَهُ مَن يَشَاءُ ۚ وَاللَّهُ وَاسِعٌ عَلِيمٌ
“అల్లాహ్ తాలూత్ను మీ రాజుగా నియమించాడని” వారి ప్రవక్త వారికి తెలియజేసినప్పుడు, “అతని అధికారం మాపై ఎలా నడుస్తుంది? రాజ్యాధికారానికి అతనికన్నా ఎక్కువ హక్కు దారులము మేమాయె! కనీసం అతనికి సిరిసంపదల్లో కూడా విస్తృతి వొసగబడలేదు” అని (సాకులు) చెప్పసాగారు. ప్రవక్త వారికి ఇలా నచ్చజెప్పాడు: “(చూడండి!) అల్లాహ్ అతన్నే మీపై (నాయకునిగా) ఎన్నుకున్నాడు. జ్ఞానపరంగా, శారీరకంగా కూడా అతనికి ఆధిక్యతను ప్రసాదించాడు. అల్లాహ్ తాను కోరిన వారికి రాజ్యాధికారం ఇస్తాడు. అల్లాహ్ విశాల సంపన్నుడు, జ్ఞాన సంపన్నుడు కూడా!”
2:248 وَقَالَ لَهُمْ نَبِيُّهُمْ إِنَّ آيَةَ مُلْكِهِ أَن يَأْتِيَكُمُ التَّابُوتُ فِيهِ سَكِينَةٌ مِّن رَّبِّكُمْ وَبَقِيَّةٌ مِّمَّا تَرَكَ آلُ مُوسَىٰ وَآلُ هَارُونَ تَحْمِلُهُ الْمَلَائِكَةُ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً لَّكُمْ إِن كُنتُم مُّؤْمِنِينَ
వారి ప్రవక్త వారికి మళ్ళీ ఈ విధంగా నచ్చజెప్పాడు: అతని రాజరికానికి సంబంధించిన బహిరంగ నిదర్శనం ఏమిటంటే (అతని ఏలుబడిలో) మీ వద్దకు ఆ (శుభసూచకాల) పెట్టె తిరిగి వస్తుంది. అందులో మీ ప్రభువు తరఫున మీకు గుండె నిబ్బరం ఉంది. మూసా, హారూన్ కుటుంబీకులు వదలి వెళ్ళిన అవశేషాలు కూడా అందులో ఉన్నాయి. దాన్ని దూతలు మోసుకువస్తారు. మీరే గనక విశ్వసించిన వారైతే ఇందులో మీ కొరకు స్పష్టమయిన సూచన ఉంది.
2:249 فَلَمَّا فَصَلَ طَالُوتُ بِالْجُنُودِ قَالَ إِنَّ اللَّهَ مُبْتَلِيكُم بِنَهَرٍ فَمَن شَرِبَ مِنْهُ فَلَيْسَ مِنِّي وَمَن لَّمْ يَطْعَمْهُ فَإِنَّهُ مِنِّي إِلَّا مَنِ اغْتَرَفَ غُرْفَةً بِيَدِهِ ۚ فَشَرِبُوا مِنْهُ إِلَّا قَلِيلًا مِّنْهُمْ ۚ فَلَمَّا جَاوَزَهُ هُوَ وَالَّذِينَ آمَنُوا مَعَهُ قَالُوا لَا طَاقَةَ لَنَا الْيَوْمَ بِجَالُوتَ وَجُنُودِهِ ۚ قَالَ الَّذِينَ يَظُنُّونَ أَنَّهُم مُّلَاقُو اللَّهِ كَم مِّن فِئَةٍ قَلِيلَةٍ غَلَبَتْ فِئَةً كَثِيرَةً بِإِذْنِ اللَّهِ ۗ وَاللَّهُ مَعَ الصَّابِرِينَ
తాలూత్ సైన్యాన్ని తీసుకుని బయలుదేరినప్పుడు ఇలా ప్రకటించాడు : “చూడండి! అల్లాహ్ మిమ్మల్ని ఒక కాలువ ద్వారా పరీక్షించబోతున్నాడు. అందులోని నీళ్ళను త్రాగినవాడు నా వాడు కాడు. త్రాగనివాడు మాత్రమే నా వాడు. చేత్తో గుక్కెడు నీరు తీసుకుని త్రాగితే ఫరవాలేదు.” కాని కొద్దిమంది తప్ప మిగిలిన వారంతా ఆ నీళ్ళను (కడుపునిండా) త్రాగేశారు. తాలూత్ విశ్వాసులైన తన సైన్యంతో కాలువ దాటి ముందుకు పోతున్నప్పుడు, “జాలూత్తో, అతని సైన్యంతో తలపడే శక్తి ఈ రోజు మాలో లేదు” అని వారన్నారు. కాని అల్లాహ్‌ను కలుసుకోవలసి ఉందనే విషయంపై దృఢవిశ్వాసం గల కొంతమంది ఇలా అన్నారు : “ఒక చిన్న వర్గం, ఒక పెద్ద వర్గాన్ని, దైవాజ్ఞతో జయించటం ఎన్నోసార్లు జరిగింది.” అల్లాహ్ సహనం చూపే వారికి అండగా నిలుస్తాడు.
2:250 وَلَمَّا بَرَزُوا لِجَالُوتَ وَجُنُودِهِ قَالُوا رَبَّنَا أَفْرِغْ عَلَيْنَا صَبْرًا وَثَبِّتْ أَقْدَامَنَا وَانصُرْنَا عَلَى الْقَوْمِ الْكَافِرِينَ
జాలూత్తో, అతని సైన్యంతో ముఖాముఖీ అయినప్పుడు వారు ఇలా ప్రార్థించారు: “ప్రభూ! మాకు సహన స్థయిర్యాలు ప్రసాదించు. మా కాళ్లకు నిలకడను ఇవ్వు. అవిశ్వాస జనులపై (జరిగే పోరాటంలో) మాకు తోడ్పడు.”
2:251 فَهَزَمُوهُم بِإِذْنِ اللَّهِ وَقَتَلَ دَاوُودُ جَالُوتَ وَآتَاهُ اللَّهُ الْمُلْكَ وَالْحِكْمَةَ وَعَلَّمَهُ مِمَّا يَشَاءُ ۗ وَلَوْلَا دَفْعُ اللَّهِ النَّاسَ بَعْضَهُم بِبَعْضٍ لَّفَسَدَتِ الْأَرْضُ وَلَٰكِنَّ اللَّهَ ذُو فَضْلٍ عَلَى الْعَالَمِينَ
కడకు అల్లాహ్ అనుజ్ఞతో వారు (జాలూత్ సైన్యాన్ని) ఓడించారు. దావూద్ జాలూత్ను సంహరించాడు. మరి అల్లాహ్ దావూద్‌కు రాజ్యాధికారాన్నీ, వివేచననూ ఒసగాడు. ఇంకా, తాను కోరినంత జ్ఞానాన్ని కూడా ఆయనకు ప్రసాదించాడు. అల్లాహ్ గనక కొందరిని మరికొందరి ద్వారా ఈ విధంగా తొలగించకపోతే భువిలో కల్లోలం రేకెత్తి ఉండేది. కాని అల్లాహ్ లోకవాసులపై ఎంతో దయానుగ్రహం కలవాడు.
2:252 تِلْكَ آيَاتُ اللَّهِ نَتْلُوهَا عَلَيْكَ بِالْحَقِّ ۚ وَإِنَّكَ لَمِنَ الْمُرْسَلِينَ
ఇవి అల్లాహ్ ఆయతులు. వీటిని మేము సత్యబద్ధంగా నీకు వినిపిస్తున్నాము. (ఓ ముహమ్మద్!) నిస్సందేహంగా నువ్వు దైవసందేశహరులలోని వాడవు.
2:253 تِلْكَ الرُّسُلُ فَضَّلْنَا بَعْضَهُمْ عَلَىٰ بَعْضٍ ۘ مِّنْهُم مَّن كَلَّمَ اللَّهُ ۖ وَرَفَعَ بَعْضَهُمْ دَرَجَاتٍ ۚ وَآتَيْنَا عِيسَى ابْنَ مَرْيَمَ الْبَيِّنَاتِ وَأَيَّدْنَاهُ بِرُوحِ الْقُدُسِ ۗ وَلَوْ شَاءَ اللَّهُ مَا اقْتَتَلَ الَّذِينَ مِن بَعْدِهِم مِّن بَعْدِ مَا جَاءَتْهُمُ الْبَيِّنَاتُ وَلَٰكِنِ اخْتَلَفُوا فَمِنْهُم مَّنْ آمَنَ وَمِنْهُم مَّن كَفَرَ ۚ وَلَوْ شَاءَ اللَّهُ مَا اقْتَتَلُوا وَلَٰكِنَّ اللَّهَ يَفْعَلُ مَا يُرِيدُ
వీరు దైవప్రవక్తలు. వీరిలో కొందరికి మరికొందరిపై మేము ప్రాధాన్యతను వొసగాము. వీరిలో కొందరితో అల్లాహ్ సంభాషించాడు. కొందరి తరగతులను ఉన్నతం చేశాడు. ఇంకా మేము మర్యమ్ కుమారుడగు ఈసాకు స్పష్టమైన సూచనలు ప్రసాదించాము. పరిశుద్ధాత్మ ద్వారా అతనికి తోడ్పాటునందించాము. ఒకవేళ అల్లాహ్‌యే గనక తలిస్తే వీరి తరువాత స్పష్టమయిన నిదర్శనాలు చూసిన ప్రజలు పరస్పరం తగవులాడుకునేవారు కాదు. కాని వారు విభేదాల్లో పడిపోయారు. వారిలో కొందరు విశ్వసించగా, మరి కొందరు అవిశ్వాసులుగా ఉండిపోయారు. అల్లాహ్ గనక కోరితే వీరు పరస్పరం కలహించుకునే వారు కారు. కాని అల్లాహ్ మాత్రం తాను తలచిందే చేస్తాడు.
2:254 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَنفِقُوا مِمَّا رَزَقْنَاكُم مِّن قَبْلِ أَن يَأْتِيَ يَوْمٌ لَّا بَيْعٌ فِيهِ وَلَا خُلَّةٌ وَلَا شَفَاعَةٌ ۗ وَالْكَافِرُونَ هُمُ الظَّالِمُونَ
ఓ విశ్వాసులారా! వ్యాపార లావాదేవీలుగానీ, స్నేహబంధాలుగానీ, సిఫార్సులుగానీ ఉండని ఆ రోజు రాకముందే మేము మీకు ప్రసాదించిన దానిలో నుంచి ఖర్చుచేయండి. వాస్తవానికి తిరస్కారులే దుర్మార్గులు.
2:255 اللَّهُ لَا إِلَٰهَ إِلَّا هُوَ الْحَيُّ الْقَيُّومُ ۚ لَا تَأْخُذُهُ سِنَةٌ وَلَا نَوْمٌ ۚ لَّهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۗ مَن ذَا الَّذِي يَشْفَعُ عِندَهُ إِلَّا بِإِذْنِهِ ۚ يَعْلَمُ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ ۖ وَلَا يُحِيطُونَ بِشَيْءٍ مِّنْ عِلْمِهِ إِلَّا بِمَا شَاءَ ۚ وَسِعَ كُرْسِيُّهُ السَّمَاوَاتِ وَالْأَرْضَ ۖ وَلَا يَئُودُهُ حِفْظُهُمَا ۚ وَهُوَ الْعَلِيُّ الْعَظِيمُ
అల్లాహ్ (మాత్రమే నిజానికి ఆరాధ్య దైవం). ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనేలేడు. ఆయన సజీవుడు; అన్నింటికీ మూలాధారం. ఆయనకు కునుకుగానీ, నిద్రగానీ పట్టదు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ ఆయన అధీనంలో ఉంది. ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగలవాడెవడు? వారికి ముందు ఉన్న దానినీ, వెనుక ఉన్నదానిని కూడా ఆయన ఎరుగు. ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయమూ వారి గ్రాహ్యపరిధిలోకి రాదు. ఆయన కుర్చీ వైశాల్యం భూమ్యాకాశాలను చుట్టుముట్టి ఉంది. వాటిని రక్షించటానికి ఆయన ఎన్నడూ అలసిపోడు. ఆయన సర్వోన్నతుడు, గొప్పవాడు.
2:256 لَا إِكْرَاهَ فِي الدِّينِ ۖ قَد تَّبَيَّنَ الرُّشْدُ مِنَ الْغَيِّ ۚ فَمَن يَكْفُرْ بِالطَّاغُوتِ وَيُؤْمِن بِاللَّهِ فَقَدِ اسْتَمْسَكَ بِالْعُرْوَةِ الْوُثْقَىٰ لَا انفِصَامَ لَهَا ۗ وَاللَّهُ سَمِيعٌ عَلِيمٌ
ధర్మం విషయంలో బలవంతం ఏమీ లేదు. సన్మార్గం అపమార్గం నుంచి ప్రస్ఫుటమయ్యింది. కనుక ఎవరయితే అల్లాహ్ తప్ప వేరితర ఆరాధ్యులను (తాగూత్ను) తిరస్కరించి అల్లాహ్‌ను మాత్రమే విశ్వసిస్తారో వారు దృఢమైన కడియాన్ని పట్టుకున్నారు. అది ఎన్నటికీ తెగదు. అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వం తెలిసినవాడు.
2:257 اللَّهُ وَلِيُّ الَّذِينَ آمَنُوا يُخْرِجُهُم مِّنَ الظُّلُمَاتِ إِلَى النُّورِ ۖ وَالَّذِينَ كَفَرُوا أَوْلِيَاؤُهُمُ الطَّاغُوتُ يُخْرِجُونَهُم مِّنَ النُّورِ إِلَى الظُّلُمَاتِ ۗ أُولَٰئِكَ أَصْحَابُ النَّارِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ
విశ్వసించినవారి సంరక్షకునిగా స్వయంగా అల్లాహ్ ఉంటాడు. ఆయన వారిని చీకట్ల నుంచి వెలుగు వైపుకు తీసుకుపోతాడు. కాగా; అవిశ్వాసుల నేస్తాలు షైతానులే (తాగూతే). వాళ్లు వారిని వెలుగు నుంచి చీకట్ల వైపుకు లాక్కు పోతారు. వారు నరకవాసులు, కలకాలం అందులోనే పడి ఉంటారు.
2:258 أَلَمْ تَرَ إِلَى الَّذِي حَاجَّ إِبْرَاهِيمَ فِي رَبِّهِ أَنْ آتَاهُ اللَّهُ الْمُلْكَ إِذْ قَالَ إِبْرَاهِيمُ رَبِّيَ الَّذِي يُحْيِي وَيُمِيتُ قَالَ أَنَا أُحْيِي وَأُمِيتُ ۖ قَالَ إِبْرَاهِيمُ فَإِنَّ اللَّهَ يَأْتِي بِالشَّمْسِ مِنَ الْمَشْرِقِ فَأْتِ بِهَا مِنَ الْمَغْرِبِ فَبُهِتَ الَّذِي كَفَرَ ۗ وَاللَّهُ لَا يَهْدِي الْقَوْمَ الظَّالِمِينَ
అల్లాహ్ తనకు రాజ్యాధికారం ఇచ్చాడని (గర్వం కొద్దీ) ఇబ్రాహీంతో అతని ప్రభువు (ఎవరన్న) విషయంపై గొడవపడిన వానిని నీవు చూడలేదా? “జీవన్మరణాలను ఇచ్చేవాడు నా ప్రభువు” అని ఇబ్రాహీం అన్నప్పుడు, “నేనూ బ్రతికిస్తాను, చంపుతాను” అని అతనన్నాడు. అప్పుడు ఇబ్రాహీం (అలైహిస్సలాం), “సరే! అల్లాహ్ సూర్యుణ్ణి తూర్పు వైపు నుంచి ఉదయింపజేస్తున్నాడు కదా! మరి నువ్వు దాన్ని కాస్త పడమటి వైపు నుంచి ఉదయింపజెయ్యి” అని కోరినప్పుడు ఆ దైవతిరస్కారి బిత్తరపోయాడు. యదార్థమేమిటంటే అల్లాహ్ దుర్మార్గులకు సన్మార్గం చూపడు.
2:259 أَوْ كَالَّذِي مَرَّ عَلَىٰ قَرْيَةٍ وَهِيَ خَاوِيَةٌ عَلَىٰ عُرُوشِهَا قَالَ أَنَّىٰ يُحْيِي هَٰذِهِ اللَّهُ بَعْدَ مَوْتِهَا ۖ فَأَمَاتَهُ اللَّهُ مِائَةَ عَامٍ ثُمَّ بَعَثَهُ ۖ قَالَ كَمْ لَبِثْتَ ۖ قَالَ لَبِثْتُ يَوْمًا أَوْ بَعْضَ يَوْمٍ ۖ قَالَ بَل لَّبِثْتَ مِائَةَ عَامٍ فَانظُرْ إِلَىٰ طَعَامِكَ وَشَرَابِكَ لَمْ يَتَسَنَّهْ ۖ وَانظُرْ إِلَىٰ حِمَارِكَ وَلِنَجْعَلَكَ آيَةً لِّلنَّاسِ ۖ وَانظُرْ إِلَى الْعِظَامِ كَيْفَ نُنشِزُهَا ثُمَّ نَكْسُوهَا لَحْمًا ۚ فَلَمَّا تَبَيَّنَ لَهُ قَالَ أَعْلَمُ أَنَّ اللَّهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
లేదా ఇండ్ల కప్పులు కూలి తలక్రిందులుగా పడివున్న పట్టణం మీదుగా పోయినవాడు; (అతనిని నీవు చూడలేదా?) “దీని చావు తరువాత అల్లాహ్ తిరిగి దీనికి ఎలా ప్రాణం పోస్తాడు?” అని ఆ వ్యక్తి ఆశ్చర్యపోయినప్పుడు అల్లాహ్ అతన్ని చంపి నూరేళ్ళవరకు మరణస్థితిలో ఉంచాడు. తరువాత అతన్ని లేపి, “ఈ స్థితిలో నువ్వు ఎంతకాలం ఉన్నావు?” అని అడిగాడు. “మహా అయితే ఒక రోజు లేక ఒక రోజులో కొంత భాగం” అని అతను బదులిచ్చాడు. “లేదు. నువ్వు నూరేళ్ళు ఈ స్థితిలో పడిఉన్నావు. కాస్త నీ అన్నపానీయాల వైపు చూడు. అవి ఏ మాత్రం చెడిపోలేదు. మరి నీ గాడిదను కూడా చూసుకో. మేము నిన్ను ప్రజల కోసం ఒక నిదర్శనంగా చేయదలిచాము. మేము (గాడిద) ఎముకలను ఏ విధంగా లేపి, వాటిపై మాంసం నింపుతామో చూడు! ఇదంతా ప్రస్ఫుటమయి పోయాక, “అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడని నాకు తెలుసు” అని అన్నాడతను.
2:260 وَإِذْ قَالَ إِبْرَاهِيمُ رَبِّ أَرِنِي كَيْفَ تُحْيِي الْمَوْتَىٰ ۖ قَالَ أَوَلَمْ تُؤْمِن ۖ قَالَ بَلَىٰ وَلَٰكِن لِّيَطْمَئِنَّ قَلْبِي ۖ قَالَ فَخُذْ أَرْبَعَةً مِّنَ الطَّيْرِ فَصُرْهُنَّ إِلَيْكَ ثُمَّ اجْعَلْ عَلَىٰ كُلِّ جَبَلٍ مِّنْهُنَّ جُزْءًا ثُمَّ ادْعُهُنَّ يَأْتِينَكَ سَعْيًا ۚ وَاعْلَمْ أَنَّ اللَّهَ عَزِيزٌ حَكِيمٌ
(మరొక సంఘటన.) “ఓ ప్రభూ! నీవు మృతులను ఎలా బ్రతికిస్తావో కాస్త నాకు చూపవా?” అని ఇబ్రాహీం విన్నవించుకున్నప్పుడు, “నీకు నమ్మకం లేదా?” అని దేవుని తరఫున సెలవీయబడింది. “ఎందుకు లేదు?! (నాకు పూర్తి నమ్మకం ఉంది. కాకపోతే) ఆత్మ తృప్తికై ఇలా అడిగాను” అని అతనన్నాడు. అప్పుడు అల్లాహ్, “నాలుగు పక్షులను తీసుకో. వాటిని మచ్చిక చేసుకో. (వాటిని కోసి ముక్కలు ముక్కలుగా చెయ్యి). తరువాత ఒక్కో పర్వతంపై దాని ఒక్కో (మాంసపు) ముక్కను ఉంచు. ఆపైన వాటిని పిలువు. అవి నీ వద్దకు పరుగెత్తుకుంటూ వస్తాయి. అల్లాహ్ సర్వశక్తిమంతుడు, వివేకవంతుడన్న సంగతిని బాగా తెలుసుకో” అని అన్నాడు.
2:261 مَّثَلُ الَّذِينَ يُنفِقُونَ أَمْوَالَهُمْ فِي سَبِيلِ اللَّهِ كَمَثَلِ حَبَّةٍ أَنبَتَتْ سَبْعَ سَنَابِلَ فِي كُلِّ سُنبُلَةٍ مِّائَةُ حَبَّةٍ ۗ وَاللَّهُ يُضَاعِفُ لِمَن يَشَاءُ ۗ وَاللَّهُ وَاسِعٌ عَلِيمٌ
అల్లాహ్ మార్గంలో తమ ధనాన్ని ఖర్చుచేసేవారి ఉపమానం ఇలా ఉంటుంది: ఒక విత్తనాన్ని నాటగా, అది మొలకెత్తి అందులో నుంచి ఏడు వెన్నులు పుట్టుకువస్తాయి. ప్రతి వెన్నులోనూ నూరేసి గింజలు ఉంటాయి. ఇదే విధంగా అల్లాహ్ తాను కోరినవారికి సమృద్ధి వొసగుతాడు. అల్లాహ్ పుష్కలంగా ప్రసాదించేవాడు, ప్రతిదీ తెలిసినవాడు.
2:262 الَّذِينَ يُنفِقُونَ أَمْوَالَهُمْ فِي سَبِيلِ اللَّهِ ثُمَّ لَا يُتْبِعُونَ مَا أَنفَقُوا مَنًّا وَلَا أَذًى ۙ لَّهُمْ أَجْرُهُمْ عِندَ رَبِّهِمْ وَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ
ఎవరయితే దైవమార్గంలో తమ ధనాన్ని ఖర్చు చేసిన తరువాత తమ దాతృత్వాన్ని మాటిమాటికీ చాటుతూ ఉండకుండా, (గ్రహీతల మనస్సును) నొప్పించకుండా జాగ్రత్త పడతారో, వారి ప్రతిఫలం వారి ప్రభువు వద్ద ఉంటుంది. వారికెలాంటి భీతిగానీ, దుఃఖంగానీ ఉండదు.
2:263 قَوْلٌ مَّعْرُوفٌ وَمَغْفِرَةٌ خَيْرٌ مِّن صَدَقَةٍ يَتْبَعُهَا أَذًى ۗ وَاللَّهُ غَنِيٌّ حَلِيمٌ
దానం చేసిన తరువాత మనసు నొప్పించటం కంటే మంచి మాట పలకటం, క్షమించటం ఎంతో మేలు. అల్లాహ్ అక్కరలేనివాడు, సహనశీలుడు.
2:264 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تُبْطِلُوا صَدَقَاتِكُم بِالْمَنِّ وَالْأَذَىٰ كَالَّذِي يُنفِقُ مَالَهُ رِئَاءَ النَّاسِ وَلَا يُؤْمِنُ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ ۖ فَمَثَلُهُ كَمَثَلِ صَفْوَانٍ عَلَيْهِ تُرَابٌ فَأَصَابَهُ وَابِلٌ فَتَرَكَهُ صَلْدًا ۖ لَّا يَقْدِرُونَ عَلَىٰ شَيْءٍ مِّمَّا كَسَبُوا ۗ وَاللَّهُ لَا يَهْدِي الْقَوْمَ الْكَافِرِينَ
ఓ విశ్వాసులారా! తన ధనాన్ని పరుల మెప్పుకోసం ఖర్చుచేస్తూ, అల్లాహ్‌ను గానీ, అంతిమదినాన్ని గానీ విశ్వసించని వ్యక్తి మాదిరిగా మీరు మీ ఉపకారాన్ని చాటుకుని, (గ్రహీతల) మనస్సులను నొప్పించి మీ దానధర్మాలను వృధా చేసుకోకండి. అతని ఉపమానం కొద్దిగా మట్టి పేరుకుని ఉన్న నున్నని రాతి బండ వంటిది. దానిపై భారీవర్షం కురిసి, ఆ మట్టి కాస్తా కొట్టుకు పోయి, కటికరాయి మాత్రమే మిగులుతుంది. ఈ ప్రదర్శనా కారులకు తాము చేసుకున్న దానిలో నుంచి ఏమీ ప్రాప్తించదు. అల్లాహ్ సత్యతిరస్కారులకు సన్మార్గం చూపడు.
2:265 وَمَثَلُ الَّذِينَ يُنفِقُونَ أَمْوَالَهُمُ ابْتِغَاءَ مَرْضَاتِ اللَّهِ وَتَثْبِيتًا مِّنْ أَنفُسِهِمْ كَمَثَلِ جَنَّةٍ بِرَبْوَةٍ أَصَابَهَا وَابِلٌ فَآتَتْ أُكُلَهَا ضِعْفَيْنِ فَإِن لَّمْ يُصِبْهَا وَابِلٌ فَطَلٌّ ۗ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ
ఇక దైవప్రసన్నతను చూరగొనే తపనతో, దృఢనమ్మకంతో తమ సంపదను ఖర్చుపెట్టేవారి ఉపమానం మెరక ప్రాంతంలో ఉన్న తోట వంటిది. భారీ వర్షం కురిస్తే అది రెట్టింపు పంటను ఇస్తుంది. ఒకవేళ దానిపై పెద్ద వర్షం పడకుండా, కేవలం వానజల్లు కురిసినా సరిపోతుంది. అల్లాహ్ మీ పనులన్నింటినీ చూస్తూనే ఉన్నాడు.
2:266 أَيَوَدُّ أَحَدُكُمْ أَن تَكُونَ لَهُ جَنَّةٌ مِّن نَّخِيلٍ وَأَعْنَابٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ لَهُ فِيهَا مِن كُلِّ الثَّمَرَاتِ وَأَصَابَهُ الْكِبَرُ وَلَهُ ذُرِّيَّةٌ ضُعَفَاءُ فَأَصَابَهَا إِعْصَارٌ فِيهِ نَارٌ فَاحْتَرَقَتْ ۗ كَذَٰلِكَ يُبَيِّنُ اللَّهُ لَكُمُ الْآيَاتِ لَعَلَّكُمْ تَتَفَكَّرُونَ
మీలో ఎవరికయినా ఖర్జూరం, ద్రాక్ష పండ్ల తోట ఉండి, అందులో పిల్ల కాలువలు ప్రవహిస్తూ, అందులో అతనికి అన్ని రకాల ఫలాలు కూడా లభిస్తూ ఉండి, అతను ముసలివాడైపోగా, మరోవైపు అతని పిల్లలు బలహీనులుగా ఉండగా – అకస్మాత్తుగా ఆ తోటపై నిప్పులు చెరిగే వడగాలి వచ్చి ఆ తోట కాలిపోవటాన్ని మీలో ఎవరయినాసరే ఇష్టపడతారా? మీరు ఆలోచించేటందుకుగాను అల్లాహ్ ఈ విధంగా తన ఆయతులను మీకు స్పష్టపరుస్తున్నాడు.
2:267 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَنفِقُوا مِن طَيِّبَاتِ مَا كَسَبْتُمْ وَمِمَّا أَخْرَجْنَا لَكُم مِّنَ الْأَرْضِ ۖ وَلَا تَيَمَّمُوا الْخَبِيثَ مِنْهُ تُنفِقُونَ وَلَسْتُم بِآخِذِيهِ إِلَّا أَن تُغْمِضُوا فِيهِ ۚ وَاعْلَمُوا أَنَّ اللَّهَ غَنِيٌّ حَمِيدٌ
ఓ విశ్వసించినవారలారా! ధర్మ సమ్మతమైన మీ సంపాదనలో నుంచి, మేము మీ కోసం నేల నుంచి ఉత్పత్తిచేసిన వస్తువులలో నుంచి ఖర్చు చేయండి. వాటిలోని చెడు (నాసిరకం) వస్తువులను ఖర్చుపెట్టే సంకల్పం చేసుకోకండి- మీరు స్వయంగా వాటిని తీసుకోరు. ఒకవేళ కళ్లు మూసుకొని ఉంటే అది వేరే విషయం. అల్లాహ్ అక్కరలేనివాడు, సర్వస్తోత్రములకు అర్హుడని తెలుసుకోండి.
2:268 الشَّيْطَانُ يَعِدُكُمُ الْفَقْرَ وَيَأْمُرُكُم بِالْفَحْشَاءِ ۖ وَاللَّهُ يَعِدُكُم مَّغْفِرَةً مِّنْهُ وَفَضْلًا ۗ وَاللَّهُ وَاسِعٌ عَلِيمٌ
షైతాన్ మీకు దారిద్య్రం గురించి భయపెడతాడు. నీతిమాలిన పనులకై పురికొల్పుతాడు. కాగా; అల్లాహ్ మిమ్మల్ని క్షమిస్తాననీ, అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అల్లాహ్ గొప్ప ఉదార స్వభావుడు, అన్నీ తెలిసినవాడు.
2:269 يُؤْتِي الْحِكْمَةَ مَن يَشَاءُ ۚ وَمَن يُؤْتَ الْحِكْمَةَ فَقَدْ أُوتِيَ خَيْرًا كَثِيرًا ۗ وَمَا يَذَّكَّرُ إِلَّا أُولُو الْأَلْبَابِ
ఆయన తాను కోరిన వారికి విజ్ఞతా వివేచనలను ప్రసాదిస్తాడు. ఎవరికి విజ్ఞతా వివేచనలు వొసగబడ్డాయో అతనికి ఎన్నో మేళ్లు వొసగబడినట్లే. హితబోధను బుద్ధిమంతులు తప్ప మరొకరు గ్రహించరు.
2:270 وَمَا أَنفَقْتُم مِّن نَّفَقَةٍ أَوْ نَذَرْتُم مِّن نَّذْرٍ فَإِنَّ اللَّهَ يَعْلَمُهُ ۗ وَمَا لِلظَّالِمِينَ مِنْ أَنصَارٍ
మీరు (దైవమార్గంలో) ఎంత ఖర్చు చేసినా, ఏ మొక్కుబడి చేసుకున్నా అల్లాహ్‌కు దాని గురించి పూర్తిగా తెలుసు. దుర్మార్గులకు సహాయం చేసే వారెవరూ లేరు.
2:271 إِن تُبْدُوا الصَّدَقَاتِ فَنِعِمَّا هِيَ ۖ وَإِن تُخْفُوهَا وَتُؤْتُوهَا الْفُقَرَاءَ فَهُوَ خَيْرٌ لَّكُمْ ۚ وَيُكَفِّرُ عَنكُم مِّن سَيِّئَاتِكُمْ ۗ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ خَبِيرٌ
ఒకవేళ మీరు బహిరంగంగా దానధర్మాలు చేసినా మంచిదే గాని, గోప్యంగా నిరుపేదలకు ఇస్తే అది మీ కొరకు ఉత్తమం. (దీనివల్ల) అల్లాహ్ మీ పాపాలను తుడిచిపెడతాడు. అల్లాహ్‌కు మీరు చేసేదంతా తెలుసు.
2:272 لَّيْسَ عَلَيْكَ هُدَاهُمْ وَلَٰكِنَّ اللَّهَ يَهْدِي مَن يَشَاءُ ۗ وَمَا تُنفِقُوا مِنْ خَيْرٍ فَلِأَنفُسِكُمْ ۚ وَمَا تُنفِقُونَ إِلَّا ابْتِغَاءَ وَجْهِ اللَّهِ ۚ وَمَا تُنفِقُوا مِنْ خَيْرٍ يُوَفَّ إِلَيْكُمْ وَأَنتُمْ لَا تُظْلَمُونَ
(ఓ ప్రవక్తా!) వారిని సన్మార్గంపై తెచ్చి నిలబెట్టే బాధ్యత నీపై లేదు. వాస్తవానికి సన్మార్గ భాగ్యాన్ని అల్లాహ్ తాను కోరిన వారికి అనుగ్రహిస్తాడు. మీరు దైవ మార్గంలో ఏ మంచి వస్తువును వ్యయపరచినా, దాని లాభాన్ని స్వయంగా మీరే పొందుతారు. కాకపోతే మీరు కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసమే ఖర్చు చేయాలి. మీరు ఎంత ఖర్చుచేసినా దాని పూర్తి ప్రతిఫలం మీకు ఇవ్వబడుతుంది. మీకు ఎంతమాత్రం అన్యాయం జరగదు.
2:273 لِلْفُقَرَاءِ الَّذِينَ أُحْصِرُوا فِي سَبِيلِ اللَّهِ لَا يَسْتَطِيعُونَ ضَرْبًا فِي الْأَرْضِ يَحْسَبُهُمُ الْجَاهِلُ أَغْنِيَاءَ مِنَ التَّعَفُّفِ تَعْرِفُهُم بِسِيمَاهُمْ لَا يَسْأَلُونَ النَّاسَ إِلْحَافًا ۗ وَمَا تُنفِقُوا مِنْ خَيْرٍ فَإِنَّ اللَّهَ بِهِ عَلِيمٌ
దైవమార్గంలో నిమగ్నులైన కారణంగా , (బ్రతుకు తెరువు కోసం) భూమిలో సంచరించే వీలులేని నిరుపేదలు వాస్తవానికి మీ ధన సహాయానికి అర్హులు. వారి నిజస్థితిని గురించి తెలియనివారు, (ఆత్మాభిమానం వల్ల) వారెవరినీ అడగకపోవటం చూసి, వారిని అవసరాలు లేనివారుగా తలపోస్తారు. మీరు వారి వాలకాన్ని చూసి వాస్తవస్థితిని ఊహించవచ్చు. తమకు సహాయం చెయ్యమంటూ వారు ప్రజల వెంటపడరు. (అటువంటి త్యాగధనుల సహాయార్థం) మీరు ఎంత సొమ్ము వెచ్చించినా, నిశ్చయంగా దాని గురించి అల్లాహ్‌కు తెలుసు.
2:274 الَّذِينَ يُنفِقُونَ أَمْوَالَهُم بِاللَّيْلِ وَالنَّهَارِ سِرًّا وَعَلَانِيَةً فَلَهُمْ أَجْرُهُمْ عِندَ رَبِّهِمْ وَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ
ఎవరయితే తమ సిరిసంపదలను రేయింబవళ్లు రహస్యంగానూ, బహిరంగంగానూ ఖర్చుచేస్తారో వారి కొరకు వారి ప్రభువు వద్ద (గొప్ప) పుణ్యఫలం ఉంది. వారికెలాంటి భయంగానీ, దుఃఖంగానీ ఉండదు.
2:275 الَّذِينَ يَأْكُلُونَ الرِّبَا لَا يَقُومُونَ إِلَّا كَمَا يَقُومُ الَّذِي يَتَخَبَّطُهُ الشَّيْطَانُ مِنَ الْمَسِّ ۚ ذَٰلِكَ بِأَنَّهُمْ قَالُوا إِنَّمَا الْبَيْعُ مِثْلُ الرِّبَا ۗ وَأَحَلَّ اللَّهُ الْبَيْعَ وَحَرَّمَ الرِّبَا ۚ فَمَن جَاءَهُ مَوْعِظَةٌ مِّن رَّبِّهِ فَانتَهَىٰ فَلَهُ مَا سَلَفَ وَأَمْرُهُ إِلَى اللَّهِ ۖ وَمَنْ عَادَ فَأُولَٰئِكَ أَصْحَابُ النَّارِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ
వడ్డీ సొమ్ము తినేవారు షైతాను పట్టటంవల్ల ఉన్మాది అయినవాని లాగానే నిలబడతారు. వారికీ దుర్గతి పట్టడానికి కారణం “వ్యాపారం కూడా వడ్డీ లాంటిదే కదా!” అని వారు అనటమే. వాస్తవానికి అల్లాహ్ వ్యాపారాన్ని ధర్మసమ్మతం చేసి, వడ్డీని నిషేధించాడు. కనుక ఎవరు తన ప్రభువు వద్దనుంచి వచ్చిన హితబోధను విని వడ్డీని మానుకున్నాడో, అతడు గతంలో పుచ్చుకున్నదేదో పుచ్చుకున్నాడు. అతని వ్యవహారం దైవా ధీనం. ఇకమీదట కూడా దీనికి పాల్పడినవారే నరకవాసులు. వారు కలకాలం అందులో పడి ఉంటారు.
2:276 يَمْحَقُ اللَّهُ الرِّبَا وَيُرْبِي الصَّدَقَاتِ ۗ وَاللَّهُ لَا يُحِبُّ كُلَّ كَفَّارٍ أَثِيمٍ
అల్లాహ్ వడ్డీని హరింపజేస్తాడు, దానధర్మాలను పెంచుతాడు. మేలును మరిచేవారిని, పాపిష్టులను అల్లాహ్ సుతరామూ ప్రేమించడు.
2:277 إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَأَقَامُوا الصَّلَاةَ وَآتَوُا الزَّكَاةَ لَهُمْ أَجْرُهُمْ عِندَ رَبِّهِمْ وَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ
విశ్వసించి (సున్నత్ ప్రకారం) సత్కార్యాలు చేసేవారికి, నమాజులను నెలకొల్పేవారికి, జకాత్‌ను చెల్లించేవారికి తమ ప్రభువు వద్ద పుణ్యఫలం ఉంది. వారికెలాంటి భయంగానీ, చీకూ చింతగానీ ఉండవు.
2:278 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَذَرُوا مَا بَقِيَ مِنَ الرِّبَا إِن كُنتُم مُّؤْمِنِينَ
ఓ విశ్వసించినవారలారా! అల్లాహ్‌కు భయపడండి. మీరు నికార్సయిన విశ్వాసులే అయినట్లయితే మిగిలి వున్న వడ్డీని విడిచి పెట్టండి.
2:279 فَإِن لَّمْ تَفْعَلُوا فَأْذَنُوا بِحَرْبٍ مِّنَ اللَّهِ وَرَسُولِهِ ۖ وَإِن تُبْتُمْ فَلَكُمْ رُءُوسُ أَمْوَالِكُمْ لَا تَظْلِمُونَ وَلَا تُظْلَمُونَ
ఒకవేళ మీరు గనక అలా చేయనట్లయితే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తతో యుద్ధానికి సిద్ధంకండి. ఒకవేళ మీరు పశ్చాత్తాపం చెందితే మీ అసలు సొమ్ము మీకే ఉంటుంది. మీరూ ఒకరికి అన్యాయం చేయకూడదు. మీకు కూడా అన్యాయం జరుగకూడదు.
2:280 وَإِن كَانَ ذُو عُسْرَةٍ فَنَظِرَةٌ إِلَىٰ مَيْسَرَةٍ ۚ وَأَن تَصَدَّقُوا خَيْرٌ لَّكُمْ ۖ إِن كُنتُمْ تَعْلَمُونَ
ఒకవేళ రుణగ్రస్తుడు యిబ్బందుల్లో ఉంటే అతని పరిస్థితి మెరుగుపడేవరకూ అతనికి గడువు ఇవ్వాలి. లేదా మన్నించి దానంగా వదలి పెట్టండి. మీరే గనక తెలుసుకోగలిగితే ఇది మీ కొరకు శ్రేయోదాయకం.
2:281 وَاتَّقُوا يَوْمًا تُرْجَعُونَ فِيهِ إِلَى اللَّهِ ۖ ثُمَّ تُوَفَّىٰ كُلُّ نَفْسٍ مَّا كَسَبَتْ وَهُمْ لَا يُظْلَمُونَ
మీరు అంతా అల్లాహ్ వైపుకు మరలింపబడే రోజుకు భయపడండి. ఆ తర్వాత ప్రతి ఒక్కరికీ తాను చేసుకున్న కర్మలకు పూర్తి ప్రతిఫలం వొసగబడుతుంది. ఎవరికీ ఎలాంటి అన్యాయం జరగదు.
2:282 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا تَدَايَنتُم بِدَيْنٍ إِلَىٰ أَجَلٍ مُّسَمًّى فَاكْتُبُوهُ ۚ وَلْيَكْتُب بَّيْنَكُمْ كَاتِبٌ بِالْعَدْلِ ۚ وَلَا يَأْبَ كَاتِبٌ أَن يَكْتُبَ كَمَا عَلَّمَهُ اللَّهُ ۚ فَلْيَكْتُبْ وَلْيُمْلِلِ الَّذِي عَلَيْهِ الْحَقُّ وَلْيَتَّقِ اللَّهَ رَبَّهُ وَلَا يَبْخَسْ مِنْهُ شَيْئًا ۚ فَإِن كَانَ الَّذِي عَلَيْهِ الْحَقُّ سَفِيهًا أَوْ ضَعِيفًا أَوْ لَا يَسْتَطِيعُ أَن يُمِلَّ هُوَ فَلْيُمْلِلْ وَلِيُّهُ بِالْعَدْلِ ۚ وَاسْتَشْهِدُوا شَهِيدَيْنِ مِن رِّجَالِكُمْ ۖ فَإِن لَّمْ يَكُونَا رَجُلَيْنِ فَرَجُلٌ وَامْرَأَتَانِ مِمَّن تَرْضَوْنَ مِنَ الشُّهَدَاءِ أَن تَضِلَّ إِحْدَاهُمَا فَتُذَكِّرَ إِحْدَاهُمَا الْأُخْرَىٰ ۚ وَلَا يَأْبَ الشُّهَدَاءُ إِذَا مَا دُعُوا ۚ وَلَا تَسْأَمُوا أَن تَكْتُبُوهُ صَغِيرًا أَوْ كَبِيرًا إِلَىٰ أَجَلِهِ ۚ ذَٰلِكُمْ أَقْسَطُ عِندَ اللَّهِ وَأَقْوَمُ لِلشَّهَادَةِ وَأَدْنَىٰ أَلَّا تَرْتَابُوا ۖ إِلَّا أَن تَكُونَ تِجَارَةً حَاضِرَةً تُدِيرُونَهَا بَيْنَكُمْ فَلَيْسَ عَلَيْكُمْ جُنَاحٌ أَلَّا تَكْتُبُوهَا ۗ وَأَشْهِدُوا إِذَا تَبَايَعْتُمْ ۚ وَلَا يُضَارَّ كَاتِبٌ وَلَا شَهِيدٌ ۚ وَإِن تَفْعَلُوا فَإِنَّهُ فُسُوقٌ بِكُمْ ۗ وَاتَّقُوا اللَّهَ ۖ وَيُعَلِّمُكُمُ اللَّهُ ۗ وَاللَّهُ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ
ఓ విశ్వాసులారా! మీరు పరస్పరం ఒక నిర్ణీత గడువు కొరకు అప్పు వ్యవహారం చేసుకుంటున్నప్పుడు దాన్ని (స్పష్టంగా) వ్రాసుకోండి. వ్రాసేవాడు ఈ వ్యవహారాన్ని మీ మధ్య న్యాయబద్ధంగా వ్రాయాలి. అల్లాహ్ ఎవడికైతే వ్రాయటం నేర్పాడో, అతను వ్రాయటానికి నిరాకరించకూడదు. అతడు వ్రాయాలి. రుణం పుచ్చుకున్న వ్యక్తి విషయాన్ని విడమరచి వ్రాయించాలి. ఈ విషయంలో అతను తన ప్రభువైన అల్లాహ్‌కు భయపడాలి. పుచ్చుకున్న దాన్ని తగ్గించి వ్రాయించకూడదు. ఒకవేళ రుణ గ్రహీత అమాయకుడో, బలహీనుడో, లేక చెప్పి వ్రాయించ లేనివాడో అయి ఉంటే అతని సంరక్షకుడు న్యాయంగా వ్రాయించాలి. మీలో ఇద్దరు పురుషులను ఈ వ్యవహారానికి సాక్షులుగా పెట్టుకోండి. ఇద్దరు పురుషులు లభ్యం కానిపక్షంలో మీరిష్టపడే సాక్షులలో ఒక పురుషుణ్ణి, ఇద్దరు స్త్రీలను సాక్షులుగా పెట్టుకోండి. ఎందుకంటే వారిలో ఒకామె మరచిపోతే, రెండవ స్త్రీ మరచిపోయిన ఆమెకు జ్ఞాపకం చేయవచ్చు. సాక్ష్యం కోసం పిలువబడినప్పుడు సాక్షులు రావటానికి నిరాకరించకూడదు. నిర్ణీతకాలం కొరకు తీసుకునే అప్పు, చిన్నదైనా పెద్దదైనా దాన్ని వ్రాసుకోవటంలో మాత్రం అశ్రద్ధ చేయరాదు. అల్లాహ్ దృష్టిలో ఈ పద్ధతి ఎంతో న్యాయవంతమైనది. ఇది సాక్ష్యాన్ని స్థిరంగా ఉంచుతుంది. సందేహాలకు, (అపార్థాలకు) లోనుకాకుండా ఉండేందుకు కూడా ఇది బాగా దోహదపడుతుంది. ఒకవేళ మీ మధ్య జరిగే వ్యవహారం అప్పటికప్పుడు తేలిపోయే వ్యాపార లావాదేవీలదైతే అట్టి పరిస్థితిలో దాన్ని వ్రాసుకోకపోయినా ఫరవాలేదు. కాని క్రయ విక్రయాల సందర్భంగా కూడా సాక్షులను ఉంచుకోండి. దస్తావేజు వ్రాసేవారిని గానీ, సాక్షులను గానీ ఇరకాటంలో పెట్టరాదు (అని తెలుసుకోండి). ఒకవేళ మీరు గనక అలాచేస్తే అది నియమోల్లంఘన క్రిందికి వస్తుంది. అల్లాహ్‌కు భయపడండి. అల్లాహ్ మీకు (పద్ధతిని) నేర్పుతున్నాడు. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు.
2:283 وَإِن كُنتُمْ عَلَىٰ سَفَرٍ وَلَمْ تَجِدُوا كَاتِبًا فَرِهَانٌ مَّقْبُوضَةٌ ۖ فَإِنْ أَمِنَ بَعْضُكُم بَعْضًا فَلْيُؤَدِّ الَّذِي اؤْتُمِنَ أَمَانَتَهُ وَلْيَتَّقِ اللَّهَ رَبَّهُ ۗ وَلَا تَكْتُمُوا الشَّهَادَةَ ۚ وَمَن يَكْتُمْهَا فَإِنَّهُ آثِمٌ قَلْبُهُ ۗ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ عَلِيمٌ
ఒకవేళ మీరు ప్రయాణంలో ఉండి, వ్రాసేవాడు దొరక్క పోతే వస్తువును తాకట్టుగా పెట్టండి. ఒకరికి మరొకరి పట్ల నమ్మకం ఏర్పడినట్లయితే, తనను నమ్మి ఇచ్చిన అమానతును అతను వాపసు చేయాలి. ఇంకా అతను తన ప్రభువైన అల్లాహ్‌కు భయపడుతూ మసలుకోవాలి. మీరు సాక్ష్యాన్ని దాచకండి. సాక్ష్యాన్ని దాచేవాని హృదయం పాపభూయిష్టమైనది. మీరు చేసేదంతా అల్లాహ్‌కు తెలుసు.
2:284 لِّلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۗ وَإِن تُبْدُوا مَا فِي أَنفُسِكُمْ أَوْ تُخْفُوهُ يُحَاسِبْكُم بِهِ اللَّهُ ۖ فَيَغْفِرُ لِمَن يَشَاءُ وَيُعَذِّبُ مَن يَشَاءُ ۗ وَاللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
ఆకాశాలలో, భూమిలో ఉన్న ప్రతి వస్తువూ అల్లాహ్‌దే. మీ మనసులలో ఉన్న దాన్ని మీరు వెల్లడించినా లేక దాచిపెట్టినా అల్లాహ్ మీ నుండి దాని లెక్క తీసుకుంటాడు. ఆ తరువాత ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు, తాను కోరిన వారిని శిక్షిస్తాడు. అల్లాహ్‌కు అన్నింటిపై అధికారం ఉంది.
2:285 آمَنَ الرَّسُولُ بِمَا أُنزِلَ إِلَيْهِ مِن رَّبِّهِ وَالْمُؤْمِنُونَ ۚ كُلٌّ آمَنَ بِاللَّهِ وَمَلَائِكَتِهِ وَكُتُبِهِ وَرُسُلِهِ لَا نُفَرِّقُ بَيْنَ أَحَدٍ مِّن رُّسُلِهِ ۚ وَقَالُوا سَمِعْنَا وَأَطَعْنَا ۖ غُفْرَانَكَ رَبَّنَا وَإِلَيْكَ الْمَصِيرُ
తన ప్రభువు తరఫున అవతరింపజేయబడిన దానిని ప్రవక్త విశ్వసించాడు. దాన్ని విశ్వాసులు కూడా (సత్యమని నమ్మారు). వారంతా అల్లాహ్‌ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలనూ విశ్వసించారు. “మేము ఆయన (పంపిన) ప్రవక్తల మధ్య ఎలాంటి విచక్షణను, భేదభావాన్నీ పాటించము” (అని వారు చెబుతారు). “మేము విన్నాము. విధేయులం అయ్యాము. మా ప్రభూ! మేము నీ క్షమాభిక్షను అర్థిస్తున్నాము. కడకు మేము మరలి రావలసింది నీ వద్దకే” అని అంటారు.
2:286 لَا يُكَلِّفُ اللَّهُ نَفْسًا إِلَّا وُسْعَهَا ۚ لَهَا مَا كَسَبَتْ وَعَلَيْهَا مَا اكْتَسَبَتْ ۗ رَبَّنَا لَا تُؤَاخِذْنَا إِن نَّسِينَا أَوْ أَخْطَأْنَا ۚ رَبَّنَا وَلَا تَحْمِلْ عَلَيْنَا إِصْرًا كَمَا حَمَلْتَهُ عَلَى الَّذِينَ مِن قَبْلِنَا ۚ رَبَّنَا وَلَا تُحَمِّلْنَا مَا لَا طَاقَةَ لَنَا بِهِ ۖ وَاعْفُ عَنَّا وَاغْفِرْ لَنَا وَارْحَمْنَا ۚ أَنتَ مَوْلَانَا فَانصُرْنَا عَلَى الْقَوْمِ الْكَافِرِينَ
అల్లాహ్ ఏ ప్రాణిపైనా దాని శక్తికి మించిన భారం వేయడు. అది ఏ పుణ్యాన్ని సంపాదించినా దానికే లభిస్తుంది. మరి అది ఏ పాపాన్ని మూటగట్టుకున్నా దాని ఫలితాన్ని అది చవి చూస్తుంది. (ఇలా ప్రార్థిస్తూ ఉండండి): “ఓ మా ప్రభూ! మేము మరచిపోయినా, లేక మేము పొరబడినా మమ్మల్ని నిలదీయకు. మా ప్రభూ! మాకు పూర్వం గతించిన వారిపై వేసినటువంటి భారాన్ని మాపై వేయకు. మా ప్రభూ! మేము మోయలేనటువంటి బరువును మాపై మోపకు. మమ్మల్ని మన్నించి వదలిపెట్టు. మాకు క్షమాభిక్ష పెట్టు. మాపై దయజూపు. నీవే మా సంరక్షకుడవు. అందుచేత అవిశ్వాసులకు వ్యతిరేకంగా మాకు సహాయపడు.”
3. సూరా ఆలి ఇమ్రాన్
3:1 الم
అలిఫ్ లామ్ మీమ్.
3:2 اللَّهُ لَا إِلَٰهَ إِلَّا هُوَ الْحَيُّ الْقَيُّومُ
అల్లాహ్ – ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. ఆయన సజీవుడు, సర్వసృష్టికి మూలాధారం.
3:3 نَزَّلَ عَلَيْكَ الْكِتَابَ بِالْحَقِّ مُصَدِّقًا لِّمَا بَيْنَ يَدَيْهِ وَأَنزَلَ التَّوْرَاةَ وَالْإِنجِيلَ
(ఓ ప్రవక్తా!) ఆయన నీపై సత్యంతోపాటు ఈ గ్రంథాన్ని అవతరింపజేశాడు. దానికి పూర్వం వచ్చిన గ్రంథాలను అది ధృవపరుస్తుంది. ఆయనే తౌరాతు, ఇన్జీలు గ్రంథాలను అవతరింపజేశాడు,
3:4 مِن قَبْلُ هُدًى لِّلنَّاسِ وَأَنزَلَ الْفُرْقَانَ ۗ إِنَّ الَّذِينَ كَفَرُوا بِآيَاتِ اللَّهِ لَهُمْ عَذَابٌ شَدِيدٌ ۗ وَاللَّهُ عَزِيزٌ ذُو انتِقَامٍ
ఇంతకు మునుపు ప్రజల కొరకు మార్గదర్శకత్వంగా. ఇంకా గీటురాయి (ఖుర్ఆన్)ని కూడా ఆయనే అవతరింపజేశాడు. అల్లాహ్ ఆయతులను తిరస్కరించిన వారికి కఠినశిక్ష పడటం ఖాయం. అల్లాహ్ సర్వాధిక్యుడు. ప్రతీకారం చేసేవాడూను.
3:5 إِنَّ اللَّهَ لَا يَخْفَىٰ عَلَيْهِ شَيْءٌ فِي الْأَرْضِ وَلَا فِي السَّمَاءِ
నిశ్చయంగా – భూమ్యాకాశాలలోని ఏ వస్తువూ అల్లాహ్‌కు గోప్యంగా లేదు.
3:6 هُوَ الَّذِي يُصَوِّرُكُمْ فِي الْأَرْحَامِ كَيْفَ يَشَاءُ ۚ لَا إِلَٰهَ إِلَّا هُوَ الْعَزِيزُ الْحَكِيمُ
ఆయనే తాను కోరిన విధంగా మాతృ గర్భాల్లో మీ రూపురేఖలను మలుస్తాడు. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ఆయన శక్తి సంపన్నుడు, వివేక సంపన్నుడు కూడాను.
3:7 هُوَ الَّذِي أَنزَلَ عَلَيْكَ الْكِتَابَ مِنْهُ آيَاتٌ مُّحْكَمَاتٌ هُنَّ أُمُّ الْكِتَابِ وَأُخَرُ مُتَشَابِهَاتٌ ۖ فَأَمَّا الَّذِينَ فِي قُلُوبِهِمْ زَيْغٌ فَيَتَّبِعُونَ مَا تَشَابَهَ مِنْهُ ابْتِغَاءَ الْفِتْنَةِ وَابْتِغَاءَ تَأْوِيلِهِ ۗ وَمَا يَعْلَمُ تَأْوِيلَهُ إِلَّا اللَّهُ ۗ وَالرَّاسِخُونَ فِي الْعِلْمِ يَقُولُونَ آمَنَّا بِهِ كُلٌّ مِّنْ عِندِ رَبِّنَا ۗ وَمَا يَذَّكَّرُ إِلَّا أُولُو الْأَلْبَابِ
నీపై గ్రంథాన్ని అవతరింపజేసినవాడు ఆయనే. అందులో సుస్పష్టమైన (ముహ్కమాత్) వచనాలున్నాయి. అవి గ్రంథానికి మూలం. మరికొన్ని బహువిధ భావంతో కూడిన (ముతషాబిహాత్) వచనాలున్నాయి. హృదయాలలో వక్రత ఉన్న వారు అందులోని బహువిధ భావ వచనాల (ముతషాబిహాత్) వెంట పడి (ప్రజలను) భ్రష్టుపట్టించటానికి ప్రయత్నిస్తారు. తమ ఉద్దేశాలకనుగుణంగా తాత్పర్యాలు తీస్తారు. నిజానికి వాటి వాస్తవికత అల్లాహ్‌కు తప్ప వేరెవరికీ తెలీదు. అయితే జ్ఞానంలో పరిపక్వత పొందినవారు మాత్రం, ”మేము వీటిని విశ్వసించాము. ఇవన్నీ మా ప్రభువు తరఫు నుంచి వచ్చినవే” అని అంటారు. వాస్తవానికి బుద్ధీ జ్ఞానాలు కలవారు మాత్రమే హితబోధను గ్రహిస్తారు.
3:8 رَبَّنَا لَا تُزِغْ قُلُوبَنَا بَعْدَ إِذْ هَدَيْتَنَا وَهَبْ لَنَا مِن لَّدُنكَ رَحْمَةً ۚ إِنَّكَ أَنتَ الْوَهَّابُ
(వారు ఇలా వేడుకుంటూ ఉంటారు:) ”మా ప్రభూ! సన్మార్గ భాగ్యం ప్రసాదించిన తరువాత మా హృదయాలలో వక్రతను రానీయకు. నీ వద్ద నుంచి మాకు కారుణ్యాన్ని ప్రసాదించు. నిశ్చయంగా నీవే గొప్ప దాతవు.”
3:9 رَبَّنَا إِنَّكَ جَامِعُ النَّاسِ لِيَوْمٍ لَّا رَيْبَ فِيهِ ۚ إِنَّ اللَّهَ لَا يُخْلِفُ الْمِيعَادَ
”మా ప్రభూ! నిశ్చయంగా నీవు జనులందరినీ ఒక రోజు సమీకరిస్తావు. ఆ రోజు రావటంలో సందేహానికి ఎలాంటి ఆస్కారం లేదు, అల్లాహ్ ఎట్టి పరిస్థితిలోనూ వాగ్దానానికి విరుద్ధంగా వ్యవహరించడు.”
3:10 إِنَّ الَّذِينَ كَفَرُوا لَن تُغْنِيَ عَنْهُمْ أَمْوَالُهُمْ وَلَا أَوْلَادُهُم مِّنَ اللَّهِ شَيْئًا ۖ وَأُولَٰئِكَ هُمْ وَقُودُ النَّارِ
అవిశ్వాసులను వారి సిరిసంపదలు గానీ, వారి సంతానం గానీ అల్లాహ్ (శిక్ష) నుంచి విడిపించటంలో ఏమాత్రం ఉపయోగపడవు. నరకానికి ఇంధనం అయ్యేవారు వీరే.
3:11 كَدَأْبِ آلِ فِرْعَوْنَ وَالَّذِينَ مِن قَبْلِهِمْ ۚ كَذَّبُوا بِآيَاتِنَا فَأَخَذَهُمُ اللَّهُ بِذُنُوبِهِمْ ۗ وَاللَّهُ شَدِيدُ الْعِقَابِ
ఫిరౌను జనులకు, వారికి పూర్వం గతించిన వారికి పట్టిన గతే వీరికీ పడుతుంది. (ఎందుకంటే) వారు మా వచనాలను ధిక్కరించారు. మరి అల్లాహ్ కూడా వారిని వారి పాపాలకుగాను పట్టుకున్నాడు. అల్లాహ్ తీవ్రంగా దండించేవాడు సుమా!
3:12 قُل لِّلَّذِينَ كَفَرُوا سَتُغْلَبُونَ وَتُحْشَرُونَ إِلَىٰ جَهَنَّمَ ۚ وَبِئْسَ الْمِهَادُ
(ఓ ప్రవక్తా!) అవిశ్వాసులతో చెప్పు: ”త్వరలోనే మీరు ఓటమి పాలవుతారు. నరకం వైపుకు సమీకరించబడతారు. అది అత్యంత చెడ్డ నివాస స్థలం.”
3:13 قَدْ كَانَ لَكُمْ آيَةٌ فِي فِئَتَيْنِ الْتَقَتَا ۖ فِئَةٌ تُقَاتِلُ فِي سَبِيلِ اللَّهِ وَأُخْرَىٰ كَافِرَةٌ يَرَوْنَهُم مِّثْلَيْهِمْ رَأْيَ الْعَيْنِ ۚ وَاللَّهُ يُؤَيِّدُ بِنَصْرِهِ مَن يَشَاءُ ۗ إِنَّ فِي ذَٰلِكَ لَعِبْرَةً لِّأُولِي الْأَبْصَارِ
ముఖాముఖీ అయిన ఆ రెండు వర్గాలలో మీ కోసం నిశ్చయంగా గుణపాఠ సూచన ఉంది. వాటిలో ఒక వర్గం దైవ మార్గంలో పోరాడుతూ ఉండగా, రెండోది అవిశ్వాసుల వర్గం. వారు తమకన్నా రెండింతలుండటాన్ని వారు స్వయంగా తమ కళ్ళతో తిలకించారు. అల్లాహ్ తాను తలచిన వారికి తన సహాయంతో బలం చేకూర్చుతాడు. కళ్ళున్న వారికోసం ఇందులో గొప్ప గుణపాఠం ఉంది.
3:14 زُيِّنَ لِلنَّاسِ حُبُّ الشَّهَوَاتِ مِنَ النِّسَاءِ وَالْبَنِينَ وَالْقَنَاطِيرِ الْمُقَنطَرَةِ مِنَ الذَّهَبِ وَالْفِضَّةِ وَالْخَيْلِ الْمُسَوَّمَةِ وَالْأَنْعَامِ وَالْحَرْثِ ۗ ذَٰلِكَ مَتَاعُ الْحَيَاةِ الدُّنْيَا ۖ وَاللَّهُ عِندَهُ حُسْنُ الْمَآبِ
స్త్రీలు, కుమారులూ, పోగుచేయబడిన వెండి బంగారు రాసులూ, అచ్చువేయబడిన (మేలిజాతి) గుర్రాలు, పశువులూ, పంటపొలాలు వంటి వ్యామోహాలపై ప్రేమ, జనులకు మనోజ్ఞంగా చేయబడింది. ఇది ప్రాపంచిక జీవన సామగ్రి. మరలిపోవలసిన అత్యుత్తమ నివాసమైతే అల్లాహ్ వద్దనే ఉంది.
3:15 قُلْ أَؤُنَبِّئُكُم بِخَيْرٍ مِّن ذَٰلِكُمْ ۚ لِلَّذِينَ اتَّقَوْا عِندَ رَبِّهِمْ جَنَّاتٌ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا وَأَزْوَاجٌ مُّطَهَّرَةٌ وَرِضْوَانٌ مِّنَ اللَّهِ ۗ وَاللَّهُ بَصِيرٌ بِالْعِبَادِ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: వీటికన్నా మేలైనదేదో నేను మీకు తెలుపనా? దైవభక్తి కలవారికి వారి ప్రభువు వద్ద స్వర్గ వనాలున్నాయి. వాటి క్రింద కాలువలు ప్రవహిస్తుంటాయి. వాటిలో వారు ఎల్లకాలం ఉంటారు. పవిత్రులైన భార్యలు వారి కోసం ఉంటారు. (వీటన్నింటితో పాటు) అల్లాహ్ ప్రసన్నత వారికి ప్రాప్తిస్తుంది. అల్లాహ్ దాసులను కనిపెట్టుకొని ఉన్నాడు.
3:16 الَّذِينَ يَقُولُونَ رَبَّنَا إِنَّنَا آمَنَّا فَاغْفِرْ لَنَا ذُنُوبَنَا وَقِنَا عَذَابَ النَّارِ
వారు ఇలా వేడుకుంటారు: ”మా ప్రభూ! మేము విశ్వసించాము. కనుక మా పాపాలను క్షమించు. ఇంకా మమ్మల్ని అగ్ని శిక్ష నుంచి కాపాడు.”
3:17 الصَّابِرِينَ وَالصَّادِقِينَ وَالْقَانِتِينَ وَالْمُنفِقِينَ وَالْمُسْتَغْفِرِينَ بِالْأَسْحَارِ
వారు ఓర్పు వహిస్తారు, సదా సత్యమే పలుకుతారు. విధేయత చూపుతారు. దైవమార్గంలో ఖర్చుచేస్తారు. రాత్రి చివరి భాగంలో క్షమాభిక్షకై వేడుకుంటారు.
3:18 شَهِدَ اللَّهُ أَنَّهُ لَا إِلَٰهَ إِلَّا هُوَ وَالْمَلَائِكَةُ وَأُولُو الْعِلْمِ قَائِمًا بِالْقِسْطِ ۚ لَا إِلَٰهَ إِلَّا هُوَ الْعَزِيزُ الْحَكِيمُ
అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యదైవం లేడని స్వయంగా అల్లాహ్, ఆయన దూతలు, జ్ఞానసంపన్నులూ సాక్ష్యమిస్తున్నారు. ఆయన సమత్వం, సమతూకంతో ఈ విశ్వాన్ని నిలిపి ఉంచాడు. సర్వాధిక్యుడు, వివేచనాశీలి అయిన ఆయన తప్ప మరొకరెవరూ ఆరాధనకు అర్హులు కారు.
3:19 إِنَّ الدِّينَ عِندَ اللَّهِ الْإِسْلَامُ ۗ وَمَا اخْتَلَفَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ إِلَّا مِن بَعْدِ مَا جَاءَهُمُ الْعِلْمُ بَغْيًا بَيْنَهُمْ ۗ وَمَن يَكْفُرْ بِآيَاتِ اللَّهِ فَإِنَّ اللَّهَ سَرِيعُ الْحِسَابِ
నిస్సందేహంగా ఇస్లాం మాత్రమే అల్లాహ్ వద్ద సమ్మతమైన ధర్మం. గ్రంథంకల ప్రజలు తమ వద్దకు జ్ఞానం వచ్చేసిన పిదపనే తమలోని పరస్పర అసూయాద్వేషాల కారణంగా విభేదించుకున్నారు. అల్లాహ్ వచనాల పట్ల ఎవరు తిరస్కార వైఖరిని అవలంబించినాసరే, అల్లాహ్ చాలా తొందరగానే వారి లెక్క తేలుస్తాడు.
3:20 فَإِنْ حَاجُّوكَ فَقُلْ أَسْلَمْتُ وَجْهِيَ لِلَّهِ وَمَنِ اتَّبَعَنِ ۗ وَقُل لِّلَّذِينَ أُوتُوا الْكِتَابَ وَالْأُمِّيِّينَ أَأَسْلَمْتُمْ ۚ فَإِنْ أَسْلَمُوا فَقَدِ اهْتَدَوا ۖ وَّإِن تَوَلَّوْا فَإِنَّمَا عَلَيْكَ الْبَلَاغُ ۗ وَاللَّهُ بَصِيرٌ بِالْعِبَادِ
ఒకవేళ అప్పటికీ వారు నీతో గొడవపడితే, ”నేనూ, నా అనుచరులు దైవ విధేయతకు తలఒగ్గాము” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పేయి. ”మరి మీరు కూడా దైవాజ్ఞకు తలఒగ్గుతున్నారా?” అని గ్రంథవహులను, నిరక్షరాస్యులను అడుగు. ఒకవేళ వారేగనక ఒప్పుకున్నట్లయితే సన్మార్గ భాగ్యం పొందినట్లే. ఒకవేళ వారు విముఖతను ప్రదర్శిస్తే, సందేశాన్ని అందజేయటం వరకే నీ బాధ్యత. అల్లాహ్ తన దాసులను చూస్తూనే ఉన్నాడు.
3:21 إِنَّ الَّذِينَ يَكْفُرُونَ بِآيَاتِ اللَّهِ وَيَقْتُلُونَ النَّبِيِّينَ بِغَيْرِ حَقٍّ وَيَقْتُلُونَ الَّذِينَ يَأْمُرُونَ بِالْقِسْطِ مِنَ النَّاسِ فَبَشِّرْهُم بِعَذَابٍ أَلِيمٍ
ఎవరయితే అల్లాహ్ ఆయతులను తిరస్కరిస్తూ, అన్యాయంగా ప్రవక్తలను చంపుతూ, ప్రజల్లో న్యాయం గురించి ఆజ్ఞాపించేవారిని కూడా తుదముట్టిస్తున్నారో వారికి (ఓ ప్రవక్తా!) వ్యధాభరితమైన శిక్ష ఉందన్న శుభవార్తను వినిపించు.
3:22 أُولَٰئِكَ الَّذِينَ حَبِطَتْ أَعْمَالُهُمْ فِي الدُّنْيَا وَالْآخِرَةِ وَمَا لَهُم مِّن نَّاصِرِينَ
వారి కర్మలు ఇహపరాలలో వృధా అయిపోయాయి. వారిని ఆదుకునేవారెవరూ లేరు.
3:23 أَلَمْ تَرَ إِلَى الَّذِينَ أُوتُوا نَصِيبًا مِّنَ الْكِتَابِ يُدْعَوْنَ إِلَىٰ كِتَابِ اللَّهِ لِيَحْكُمَ بَيْنَهُمْ ثُمَّ يَتَوَلَّىٰ فَرِيقٌ مِّنْهُمْ وَهُم مُّعْرِضُونَ
గ్రంథంలోని ఒక భాగం ఇవ్వబడగా, తమ పరస్పర వ్యవహారాల తీర్పుకోసం దైవగ్రంథం వైపునకు రండి అని పిలిచినప్పటికీ వారిలోని ఒక వర్గం ముఖం తిప్పుకుని పోవటాన్ని నీవు చూడలేదా?
3:24 ذَٰلِكَ بِأَنَّهُمْ قَالُوا لَن تَمَسَّنَا النَّارُ إِلَّا أَيَّامًا مَّعْدُودَاتٍ ۖ وَغَرَّهُمْ فِي دِينِهِم مَّا كَانُوا يَفْتَرُونَ
వారి (ఈ వైముఖ్య) ధోరణికి కారణం; ”నరకాగ్ని మమ్మల్ని లెక్కించదగిన కొన్ని రోజులు మాత్రమే కాల్చుతుంది” అని వారు చెప్పటమే. వారి ఈ మనోకల్పిత విషయాలే ధర్మం విషయంలో వారిని మోసంలో పడవేశాయి.
3:25 فَكَيْفَ إِذَا جَمَعْنَاهُمْ لِيَوْمٍ لَّا رَيْبَ فِيهِ وَوُفِّيَتْ كُلُّ نَفْسٍ مَّا كَسَبَتْ وَهُمْ لَا يُظْلَمُونَ
మరి మేము వారిని సమావేశపరచిన రోజున వారి గతేం కాను? అది రావటంలో ఎలాంటి సందేహానికి తావులేదు. అప్పుడు ప్రతి ప్రాణికీ అది సంపాదించుకున్న దాని పూర్తి ప్రతిఫలం ఇవ్వబడుతుంది. ఎవరికీ ఎలాంటి అన్యాయం జరగదు.
3:26 قُلِ اللَّهُمَّ مَالِكَ الْمُلْكِ تُؤْتِي الْمُلْكَ مَن تَشَاءُ وَتَنزِعُ الْمُلْكَ مِمَّن تَشَاءُ وَتُعِزُّ مَن تَشَاءُ وَتُذِلُّ مَن تَشَاءُ ۖ بِيَدِكَ الْخَيْرُ ۖ إِنَّكَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
(ఓ ముహమ్మద్!) ఈ విధంగా పలుకు: ”ఓ అల్లాహ్! విశ్వ రాజ్యాధిపతీ! నీవు కోరినవారికి రాజ్యాధికారం ఇస్తావు. నీవు కోరినవారి నుండి రాజ్యాన్ని లాక్కుంటావు. నీవు కోరిన వారికి గౌరవమొసగుతావు. నీవు కోరిన వారిని పరాభవానికి గురి చేస్తావు. సమస్త మేళ్లూ నీ చేతిలోనే ఉన్నాయి. నిశ్చయంగా నీవు ప్రతి వస్తువుపైన అధికారం కలవాడవు.
3:27 تُولِجُ اللَّيْلَ فِي النَّهَارِ وَتُولِجُ النَّهَارَ فِي اللَّيْلِ ۖ وَتُخْرِجُ الْحَيَّ مِنَ الْمَيِّتِ وَتُخْرِجُ الْمَيِّتَ مِنَ الْحَيِّ ۖ وَتَرْزُقُ مَن تَشَاءُ بِغَيْرِ حِسَابٍ
నువ్వే రాత్రిని పగటిలోనికి ప్రవేశింపజేస్తావు, పగటిని రాత్రి లోనికి తీసుకెళతావు. నువ్వే నిర్జీవమైన వాటి నుంచి జీవమున్న వాటిని తీస్తున్నావు, మరి నువ్వే జీవమున్న వాటి నుంచి నిర్జీవమైన వాటిని వెలికితీస్తున్నావు. ఇంకా నీవు కోరిన వారికి లెక్కలేనంత ఉపాధిని ఇస్తావు.”
3:28 لَّا يَتَّخِذِ الْمُؤْمِنُونَ الْكَافِرِينَ أَوْلِيَاءَ مِن دُونِ الْمُؤْمِنِينَ ۖ وَمَن يَفْعَلْ ذَٰلِكَ فَلَيْسَ مِنَ اللَّهِ فِي شَيْءٍ إِلَّا أَن تَتَّقُوا مِنْهُمْ تُقَاةً ۗ وَيُحَذِّرُكُمُ اللَّهُ نَفْسَهُ ۗ وَإِلَى اللَّهِ الْمَصِيرُ
విశ్వాసులు తమ తోటి విశ్వాసులను వదలి అవిశ్వాసులను స్నేహితులుగా చేసుకోరాదు. అలా చేసేవాడు ఏ విషయంలోనూ అల్లాహ్‌తో సంబంధం లేనివాడు. అయితే ఏ విధంగా నయినా వారి కీడు నుంచి రక్షణ పొందే ఉద్దేశ్యంతో మీరు మైత్రికోసం ప్రయత్నిస్తే అది వేరే విషయం. అల్లాహ్ తనకు మాత్రమే భయపడవలసిందిగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. కడకు (మీరు) మరలిపోవలసింది అల్లాహ్ వద్దకే.
3:29 قُلْ إِن تُخْفُوا مَا فِي صُدُورِكُمْ أَوْ تُبْدُوهُ يَعْلَمْهُ اللَّهُ ۗ وَيَعْلَمُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۗ وَاللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: ”మీరు మీ గుండెల్లోని మాటలను దాచినా లేక వ్యక్తపరచినా – వాటన్నింటినీ అల్లాహ్ తెలుసుకుంటాడు. భూమ్యాకాశాలలో ఉన్నవన్నీ ఆయనకు తెలుసు. అల్లాహ్ సర్వాన్నీ చేయగల సమర్థుడు.”
3:30 يَوْمَ تَجِدُ كُلُّ نَفْسٍ مَّا عَمِلَتْ مِنْ خَيْرٍ مُّحْضَرًا وَمَا عَمِلَتْ مِن سُوءٍ تَوَدُّ لَوْ أَنَّ بَيْنَهَا وَبَيْنَهُ أَمَدًا بَعِيدًا ۗ وَيُحَذِّرُكُمُ اللَّهُ نَفْسَهُ ۗ وَاللَّهُ رَءُوفٌ بِالْعِبَادِ
ఆ రోజు ప్రతి వ్యక్తీ తాను చేసుకున్న పుణ్యాన్నీ, తాను చేసిన పాపాన్నీ తన ముందు చూసుకుంటాడు. తనకూ – తన పాపానికీ మధ్య ఎంతో దూరం ఉంటే బావుండేదే! అని కాంక్షిస్తాడు. అల్లాహ్ తన గురించి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. అల్లాహ్ తన దాసుల పట్ల అమితమైన వాత్సల్యం గలవాడు.
3:31 قُلْ إِن كُنتُمْ تُحِبُّونَ اللَّهَ فَاتَّبِعُونِي يُحْبِبْكُمُ اللَّهُ وَيَغْفِرْ لَكُمْ ذُنُوبَكُمْ ۗ وَاللَّهُ غَفُورٌ رَّحِيمٌ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : ”మీకు నిజంగానే అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే మీరు నన్ను అనుసరించండి. (తత్ఫలితంగా) అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు. మీ పాపాలను మన్నిస్తాడు. ఆయన అమితంగా క్షమించేవాడు, అపారంగా కనికరించేవాడు.”
3:32 قُلْ أَطِيعُوا اللَّهَ وَالرَّسُولَ ۖ فَإِن تَوَلَّوْا فَإِنَّ اللَّهَ لَا يُحِبُّ الْكَافِرِينَ
ఇంకా వారికి చెప్పు : ”మీరు అల్లాహ్కూ, ప్రవక్తకూ విధేయులై ఉండండి.” ఒకవేళ వారు విముఖత చూపితే అల్లాహ్ తిరస్కారులను ఏ మాత్రం ఇష్టపడడు.
3:33 إِنَّ اللَّهَ اصْطَفَىٰ آدَمَ وَنُوحًا وَآلَ إِبْرَاهِيمَ وَآلَ عِمْرَانَ عَلَى الْعَالَمِينَ
నిశ్చయంగా అల్లాహ్ ఆదమ్నూ, నూహ్‌నూ, ఇబ్రాహీం పరివారాన్నీ, ఇమ్రాన్ సంతతినీ సమస్త లోకవాసులపై (వారికి ప్రాధాన్యత ఇచ్చి తన సందేశం కోసం) ఎన్నుకున్నాడు.
3:34 ذُرِّيَّةً بَعْضُهَا مِن بَعْضٍ ۗ وَاللَّهُ سَمِيعٌ عَلِيمٌ
వారిలో కొందరు మరికొందరి సంతానం. అల్లాహ్ అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు.
3:35 إِذْ قَالَتِ امْرَأَتُ عِمْرَانَ رَبِّ إِنِّي نَذَرْتُ لَكَ مَا فِي بَطْنِي مُحَرَّرًا فَتَقَبَّلْ مِنِّي ۖ إِنَّكَ أَنتَ السَّمِيعُ الْعَلِيمُ
(ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేయి,) ఇమ్రాను భార్య ఇలా వేడుకున్నది: ”ఓ నా ప్రభూ! నా గర్భంలో ఉన్న దానిని నీ సేవ కోసం అంకితం చేయాలని మొక్కుకున్నాను. నీవు నా తరఫున దీనిని స్వీకరించు. నిస్సందేహంగా నీవు సర్వం వినేవాడవు, సర్వం తెలిసినవాడవు.”
3:36 فَلَمَّا وَضَعَتْهَا قَالَتْ رَبِّ إِنِّي وَضَعْتُهَا أُنثَىٰ وَاللَّهُ أَعْلَمُ بِمَا وَضَعَتْ وَلَيْسَ الذَّكَرُ كَالْأُنثَىٰ ۖ وَإِنِّي سَمَّيْتُهَا مَرْيَمَ وَإِنِّي أُعِيذُهَا بِكَ وَذُرِّيَّتَهَا مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ
తరువాత ఆమె ప్రసవించినప్పుడు, ”ప్రభూ! నాకు ఆడపిల్ల కలిగినదే!” అని విన్నవించుకుంది. ఆమె కన్న సంతానం ఏదో అల్లాహ్‌కు బాగా తెలుసు. మగ పిల్లవాడు ఆడపిల్ల వంటివాడు కాడు. ”నేను ఈ పాపకు మర్యమ్ అని పేరు పెట్టాను. నేను ఈమెనూ, ఈమె సంతానాన్ని శాపగ్రస్తుడైన షైతాన్ బారి నుంచి రక్షణ పొందటానికి నీకు అప్పగిస్తున్నాను” అని అన్నది.
3:37 فَتَقَبَّلَهَا رَبُّهَا بِقَبُولٍ حَسَنٍ وَأَنبَتَهَا نَبَاتًا حَسَنًا وَكَفَّلَهَا زَكَرِيَّا ۖ كُلَّمَا دَخَلَ عَلَيْهَا زَكَرِيَّا الْمِحْرَابَ وَجَدَ عِندَهَا رِزْقًا ۖ قَالَ يَا مَرْيَمُ أَنَّىٰ لَكِ هَٰذَا ۖ قَالَتْ هُوَ مِنْ عِندِ اللَّهِ ۖ إِنَّ اللَّهَ يَرْزُقُ مَن يَشَاءُ بِغَيْرِ حِسَابٍ
అంతే! ఆమె ప్రభువు ఆ పసిపాపను ఉత్తమరీతిలో స్వీకరించి, అత్యుత్తమ రీతిలో ఆమెను పోషించాడు. ఆమె బాగోగులు చూసే బాధ్యతను జకరియ్యాకు అప్పగించాడు. జకరియ్యా ఆమె కుటీరానికి వెళ్ళినప్పుడల్లా, ఆమె వద్ద ఆహార పదార్థాలు కనిపించేవి. ”మర్యమ్! ఇవి నీ వద్దకు ఎక్కడి నుంచి వచ్చాయి?” అని ఆయన అడిగితే, ”అల్లాహ్ వద్ద నుంచి” అని ఆమె చెప్పేది. నిశ్చయంగా అల్లాహ్ తాను కోరిన వారికి లెక్క లేనంతగా ఉపాధిని ప్రసాదిస్తాడు.
3:38 هُنَالِكَ دَعَا زَكَرِيَّا رَبَّهُ ۖ قَالَ رَبِّ هَبْ لِي مِن لَّدُنكَ ذُرِّيَّةً طَيِّبَةً ۖ إِنَّكَ سَمِيعُ الدُّعَاءِ
అక్కడే జకరియ్యా (అలైహిస్సలాం) తన ప్రభువును వేడుకున్నాడు. ”ఓ నా ప్రభూ! నీ వద్ద నుండి నాకు మంచి సంతానాన్ని ప్రసాదించు. నిస్సందేహంగా నీవు మొరను ఆలకించేవాడవు” అని అన్నాడు.
3:39 فَنَادَتْهُ الْمَلَائِكَةُ وَهُوَ قَائِمٌ يُصَلِّي فِي الْمِحْرَابِ أَنَّ اللَّهَ يُبَشِّرُكَ بِيَحْيَىٰ مُصَدِّقًا بِكَلِمَةٍ مِّنَ اللَّهِ وَسَيِّدًا وَحَصُورًا وَنَبِيًّا مِّنَ الصَّالِحِينَ
కుటీరంలో నిలబడి నమాజు చేస్తుండగా దైవదూతలు తనను పిలిచి, ”అల్లాహ్ నీకు యహ్యా గురించిన శుభవార్త ఇస్తున్నాడు. అతడు దైవవాక్కును ధృవపరుస్తాడు. నాయకుడౌతాడు. ఇంద్రియ నిగ్రహం కలవాడు, దైవప్రవక్త, సద్వర్తనుల కోవకు చెందినవాడై ఉంటాడు” అని చెప్పారు.
3:40 قَالَ رَبِّ أَنَّىٰ يَكُونُ لِي غُلَامٌ وَقَدْ بَلَغَنِيَ الْكِبَرُ وَامْرَأَتِي عَاقِرٌ ۖ قَالَ كَذَٰلِكَ اللَّهُ يَفْعَلُ مَا يَشَاءُ
దానికి జకరియ్యా ఇలా విన్నవించుకున్నాడు : ”ప్రభూ! నేనేమో పండు ముసలివాణ్ణి. నా భార్య ఏమో గొడ్రాలు. అలాంటప్పుడు నాకు కొడుకు ఎలా పుడతాడు?” దానికి, ”అలాగే జరుగుతుంది. అల్లాహ్ తాను కోరినది చేస్తాడు” అని (దైవదూత) సమాధానం ఇచ్చాడు.
3:41 قَالَ رَبِّ اجْعَل لِّي آيَةً ۖ قَالَ آيَتُكَ أَلَّا تُكَلِّمَ النَّاسَ ثَلَاثَةَ أَيَّامٍ إِلَّا رَمْزًا ۗ وَاذْكُر رَّبَّكَ كَثِيرًا وَسَبِّحْ بِالْعَشِيِّ وَالْإِبْكَارِ
”నా ప్రభూ! దీనికి సంబంధించిన నిదర్శనం ఏదన్నా నా కొరకు నిర్ణయించు” అని అతను మనవి చేసుకోగా, ”నీ కొరకు నిదర్శనం ఏమిటంటే, మూడు రోజుల వరకూ నువ్వు సైగలు చేయటం తప్ప జనులతో మాట్లాడలేవు. నువ్వు నీ ప్రభువును అత్యధికంగా స్మరిస్తూ ఉండు. ఉదయం, సాయంత్రం ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉండు” అని చెప్పాడు.
3:42 وَإِذْ قَالَتِ الْمَلَائِكَةُ يَا مَرْيَمُ إِنَّ اللَّهَ اصْطَفَاكِ وَطَهَّرَكِ وَاصْطَفَاكِ عَلَىٰ نِسَاءِ الْعَالَمِينَ
(ఆ సందర్భాన్ని కూడా జ్ఞాపకం చేయి. మర్యమ్‌ను ఉద్దేశించి) దైవదూతలు ఇలా అన్నారు: ”ఓ మర్యమ్! అల్లాహ్ (తన సేవ కొరకు) నిన్ను ఎన్నుకున్నాడు. నిన్ను పరిశుద్ధురాలిగా చేశాడు. ప్రపంచంలోని మహిళలందరిపై నీకు ప్రాధాన్యతను ఇస్తూ నీ ఎంపిక చేశాడు.
3:43 يَا مَرْيَمُ اقْنُتِي لِرَبِّكِ وَاسْجُدِي وَارْكَعِي مَعَ الرَّاكِعِينَ
”(కనుక) ఓ మర్యమ్! నువ్వు నీ ప్రభువుకు విధేయత చూపు. ఆయనకు సజ్దా చెయ్యి (ఆయన సాన్నిధ్యంలో మోకరిల్లు). ‘రుకూ’ చేసే వారితో పాటు నువ్వూ రుకూ చెయ్యి (వినమ్రతతో ఆయన ముందు తలవంచు).”
3:44 ذَٰلِكَ مِنْ أَنبَاءِ الْغَيْبِ نُوحِيهِ إِلَيْكَ ۚ وَمَا كُنتَ لَدَيْهِمْ إِذْ يُلْقُونَ أَقْلَامَهُمْ أَيُّهُمْ يَكْفُلُ مَرْيَمَ وَمَا كُنتَ لَدَيْهِمْ إِذْ يَخْتَصِمُونَ
ఇవి అగోచర విషయాలలోనివి. (ఓ ప్రవక్తా!) వాటిని నీకు వహీ ద్వారా తెలియజేస్తున్నాము. మర్యమ్‌కు పోషకులుగా ఎవరుండాలి? అన్న విషయమై వారు తమ కలములు విసరినప్పుడు నీవు అక్కడ లేవు. (ఈ వ్యవహారంపై) వారు గొడవ పడినప్పుడు కూడా నీవు అక్కడ లేవు.
3:45 إِذْ قَالَتِ الْمَلَائِكَةُ يَا مَرْيَمُ إِنَّ اللَّهَ يُبَشِّرُكِ بِكَلِمَةٍ مِّنْهُ اسْمُهُ الْمَسِيحُ عِيسَى ابْنُ مَرْيَمَ وَجِيهًا فِي الدُّنْيَا وَالْآخِرَةِ وَمِنَ الْمُقَرَّبِينَ
దైవదూతలు, ”ఓ మర్యమ్! అల్లాహ్ నీకు తన వాక్కుకు సంబంధించిన శుభవార్తను వినిపిస్తున్నాడు. అతని పేరు మసీహ్ ఈసా బిన్ మర్యమ్. అతడు ఇహపరాలలో గౌరవనీయుడవుతాడు. అతను (అల్లాహ్) సామీప్యం పొందిన వారిలో ఒకడు.”
3:46 وَيُكَلِّمُ النَّاسَ فِي الْمَهْدِ وَكَهْلًا وَمِنَ الصَّالِحِينَ
”అతడు ఉయ్యాలలో ఉన్నప్పుడూ, పెద్దవాడైనప్పుడూను ప్రజలతో మాట్లాడతాడు. ఇంకా అతడు సద్వర్తనులలోని వాడై ఉంటాడు” అని అన్నప్పుడు;
3:47 قَالَتْ رَبِّ أَنَّىٰ يَكُونُ لِي وَلَدٌ وَلَمْ يَمْسَسْنِي بَشَرٌ ۖ قَالَ كَذَٰلِكِ اللَّهُ يَخْلُقُ مَا يَشَاءُ ۚ إِذَا قَضَىٰ أَمْرًا فَإِنَّمَا يَقُولُ لَهُ كُن فَيَكُونُ
ఆమె, ”నా ప్రభూ! నాకు పిల్లవాడు ఎలా పుడ్తాడు? నన్ను ఏ మనిషీ తాకలేదే!” అని అన్నది. ”అలాగే జరుగుతుంది. అల్లాహ్ తాను కోరినది పుట్టిస్తాడు. ఆయన ఏదైనా పనిని చేయ సంకల్పించుకుని ‘అయిపో’ అని అంటే చాలు, అది ‘అయిపోతుంది’ అని (దైవదూత ద్వారా) సమాధానం లభించింది.
3:48 وَيُعَلِّمُهُ الْكِتَابَ وَالْحِكْمَةَ وَالتَّوْرَاةَ وَالْإِنجِيلَ
అల్లాహ్ అతనికి అక్షర జ్ఞానాన్ని, వివేకాన్ని, తౌరాతు, ఇన్జీలు గ్రంథాల జ్ఞానాన్నీ నేర్పుతాడు (అని కూడా దైవదూతలు తెలిపారు).
3:49 وَرَسُولًا إِلَىٰ بَنِي إِسْرَائِيلَ أَنِّي قَدْ جِئْتُكُم بِآيَةٍ مِّن رَّبِّكُمْ ۖ أَنِّي أَخْلُقُ لَكُم مِّنَ الطِّينِ كَهَيْئَةِ الطَّيْرِ فَأَنفُخُ فِيهِ فَيَكُونُ طَيْرًا بِإِذْنِ اللَّهِ ۖ وَأُبْرِئُ الْأَكْمَهَ وَالْأَبْرَصَ وَأُحْيِي الْمَوْتَىٰ بِإِذْنِ اللَّهِ ۖ وَأُنَبِّئُكُم بِمَا تَأْكُلُونَ وَمَا تَدَّخِرُونَ فِي بُيُوتِكُمْ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً لَّكُمْ إِن كُنتُم مُّؤْمِنِينَ
ఇంకా అతను ఇస్రాయీలు వంశీయుల వైపుకు ప్రవక్తగా పంపబడతాడు. (వారినుద్దేశించి ఆయన ఇలా అంటాడు:) ”నేను మీ వద్దకు మీ ప్రభువు దగ్గరి నుంచి సూచనను తీసుకువచ్చాను. నేను మీ కోసం పక్షి ఆకారం ఉన్న ఒక మట్టి బొమ్మను తయారు చేసి అందులో ఊదుతాను. అల్లాహ్ ఆజ్ఞతో అది పక్షి అవుతుంది. ఇంకా అల్లాహ్ ఆజ్ఞతో నేను పుట్టుగ్రుడ్డిని, కుష్ఠు రోగిని బాగుచేస్తాను. మృతులను బ్రతికిస్తాను. మీరు తినే వాటినీ, మీరు మీ ఇండ్లలో నిలువచేసి ఉంచిన వాటిని గురించి (కూడా) చెబుతాను. మీరే గనక విశ్వసించేవారైతే ఇందులో మీ కొరకు గొప్ప సూచన ఉంది.”
3:50 وَمُصَدِّقًا لِّمَا بَيْنَ يَدَيَّ مِنَ التَّوْرَاةِ وَلِأُحِلَّ لَكُم بَعْضَ الَّذِي حُرِّمَ عَلَيْكُمْ ۚ وَجِئْتُكُم بِآيَةٍ مِّن رَّبِّكُمْ فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ
”ఇంకా నేను నాకు పూర్వం అవతరించిన తౌరాతు (గ్రంథము)ను ధృవపరుస్తున్నాను. మీ కొరకు నిషేధించబడిన కొన్ని వస్తువులను ధర్మసమ్మతం గావించటానికి కూడా నేను వచ్చాను. ఇంకా నేను మీ వద్దకు మీ ప్రభువు సూచనను తీసుకు వచ్చాను. కనుక మీరు అల్లాహ్‌కు భయపడండి. నాకు విధేయత చూపండి.”
3:51 إِنَّ اللَّهَ رَبِّي وَرَبُّكُمْ فَاعْبُدُوهُ ۗ هَٰذَا صِرَاطٌ مُّسْتَقِيمٌ
”నిశ్చయంగా అల్లాహ్ నాకూ ప్రభువే, మీకూ ప్రభువే. కనుక మీరంతా ఆయన్నే ఆరాధించండి. ఇదే రుజుమార్గం.”
3:52 فَلَمَّا أَحَسَّ عِيسَىٰ مِنْهُمُ الْكُفْرَ قَالَ مَنْ أَنصَارِي إِلَى اللَّهِ ۖ قَالَ الْحَوَارِيُّونَ نَحْنُ أَنصَارُ اللَّهِ آمَنَّا بِاللَّهِ وَاشْهَدْ بِأَنَّا مُسْلِمُونَ
అయితే వారిలోని తిరస్కార వైఖరిని పసిగట్టిన తరువాత ఈసా, ”అల్లాహ్ మార్గంలో నాకు తోడ్పడేవారెవరు?” అని ప్రశ్నించగా, హవారీలు, ”అల్లాహ్ మార్గంలో మేము (మీకు) తోడ్పడతాము. మేము అల్లాహ్‌ను విశ్వసించాము. మేము విధేయులమయ్యాము. ఈ విషయానికి మీరు సాక్షులుగా ఉండండి” అని జవాబిచ్చారు.
3:53 رَبَّنَا آمَنَّا بِمَا أَنزَلْتَ وَاتَّبَعْنَا الرَّسُولَ فَاكْتُبْنَا مَعَ الشَّاهِدِينَ
(వారు ఇంకా ఇలా అన్నారు:) ”ప్రభూ! నీవు అవతరింపజేసిన దాన్ని మేము విశ్వసించాము. మేము నీ ప్రవక్తను అనుసరించాము. కనుక సాక్షుల జాబితాలో మా పేర్లు కూడా వ్రాసుకో.”
3:54 وَمَكَرُوا وَمَكَرَ اللَّهُ ۖ وَاللَّهُ خَيْرُ الْمَاكِرِينَ
అవిశ్వాసులు రహస్యంగా ఎత్తులు వేయసాగారు. అల్లాహ్ కూడా వారి ఎత్తులకు పై ఎత్తులు వేశాడు. ఎత్తులు వేసే వారిలో అల్లాహ్ సాటిలేని మేటి.
3:55 إِذْ قَالَ اللَّهُ يَا عِيسَىٰ إِنِّي مُتَوَفِّيكَ وَرَافِعُكَ إِلَيَّ وَمُطَهِّرُكَ مِنَ الَّذِينَ كَفَرُوا وَجَاعِلُ الَّذِينَ اتَّبَعُوكَ فَوْقَ الَّذِينَ كَفَرُوا إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ ۖ ثُمَّ إِلَيَّ مَرْجِعُكُمْ فَأَحْكُمُ بَيْنَكُمْ فِيمَا كُنتُمْ فِيهِ تَخْتَلِفُونَ
అప్పుడు అల్లాహ్ ఇలా అన్నాడు : ఓ ఈసా! నేను నిన్ను పూర్తిగా తీసుకుంటాను. నిన్ను నా వైపుకు లేపుకుంటాను. అవిశ్వాసుల బారి నుంచి నిన్ను పరిశుద్ధునిగా చేస్తాను. నిన్ను అనుసరించిన వారిని ప్రళయదినం వరకూ అవిశ్వాసులపై పైచేయిగా ఉంచుతాను. ఆ తర్వాత మీరంతా మరలి రావలసింది నా వద్దకే. అప్పుడు నేనే మీ మధ్య ఉన్న పరస్పర విభేదాలపై తీర్పు చేస్తాను.
3:56 فَأَمَّا الَّذِينَ كَفَرُوا فَأُعَذِّبُهُمْ عَذَابًا شَدِيدًا فِي الدُّنْيَا وَالْآخِرَةِ وَمَا لَهُم مِّن نَّاصِرِينَ
మరి అవిశ్వాసులకైతే నేను ఇహలోకంలోనూ, పరలోకంలోనూ కఠిన శిక్ష విధిస్తాను. వారిని ఆదుకునే వారెవరూ ఉండరు.
3:57 وَأَمَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ فَيُوَفِّيهِمْ أُجُورَهُمْ ۗ وَاللَّهُ لَا يُحِبُّ الظَّالِمِينَ
అయితే విశ్వసించి, సత్కార్యాలు చేసినవారికి వారి పూర్తి పుణ్యఫలాన్ని అల్లాహ్ ఇస్తాడు. అల్లాహ్ దుర్మార్గులను ఎంత మాత్రం ఇష్టపడడు.
3:58 ذَٰلِكَ نَتْلُوهُ عَلَيْكَ مِنَ الْآيَاتِ وَالذِّكْرِ الْحَكِيمِ
(ఓ ముహమ్మద్!) మేము నీకు (దివ్య ఖుర్ఆన్) ఆయతులను, వివేకంతో కూడిన హితబోధను చదివి వినిపిస్తున్నాము.
3:59 إِنَّ مَثَلَ عِيسَىٰ عِندَ اللَّهِ كَمَثَلِ آدَمَ ۖ خَلَقَهُ مِن تُرَابٍ ثُمَّ قَالَ لَهُ كُن فَيَكُونُ
అల్లాహ్ దృష్టిలో ఈసా ఉపమానం ఆదం ఉపమానాన్ని పోలినదే. (ఆయన) అతన్ని మట్టితో చేసి ‘అయిపో’ అని ఆజ్ఞాపించగానే అతను (మనిషిగా) అయిపోయాడు.
3:60 الْحَقُّ مِن رَّبِّكَ فَلَا تَكُن مِّنَ الْمُمْتَرِينَ
నీ ప్రభువు తరఫు నుంచి (వచ్చిన) సత్యం ఇదే. జాగ్రత్త! శంకించే వారిలో చేరిపోకు.
3:61 فَمَنْ حَاجَّكَ فِيهِ مِن بَعْدِ مَا جَاءَكَ مِنَ الْعِلْمِ فَقُلْ تَعَالَوْا نَدْعُ أَبْنَاءَنَا وَأَبْنَاءَكُمْ وَنِسَاءَنَا وَنِسَاءَكُمْ وَأَنفُسَنَا وَأَنفُسَكُمْ ثُمَّ نَبْتَهِلْ فَنَجْعَل لَّعْنَتَ اللَّهِ عَلَى الْكَاذِبِينَ
కనుక నీ వద్దకు ఈ జ్ఞానం వచ్చిన తరువాత కూడా నీతో ఎవరయినా ఈ విషయంలో వాదనకు దిగితే వారితో స్పష్టంగా ఇలా చెప్పేయి: ”రండి! మీరూ మేము కలసి మన కుమారులను, మన స్త్రీలను పిలుద్దాం. స్వయంగా మనం కూడా వద్దాం. ఆ తర్వాత – ‘అబద్ధాలు చెప్పేవారిపై అల్లాహ్ శాపం పడుగాక’ అని దీనాతిదీనంగా ప్రార్థిద్దాము.”
3:62 إِنَّ هَٰذَا لَهُوَ الْقَصَصُ الْحَقُّ ۚ وَمَا مِنْ إِلَٰهٍ إِلَّا اللَّهُ ۚ وَإِنَّ اللَّهَ لَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ
నిశ్చయంగా ఇదే సత్యబద్ధమైన వృత్తాంతం. అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు. నిస్సందేహంగా అల్లాహ్‌యే సర్వాధిక్యుడు, వివేకవంతుడు.
3:63 فَإِن تَوَلَّوْا فَإِنَّ اللَّهَ عَلِيمٌ بِالْمُفْسِدِينَ
(ఈ సవాలు విసిరిన) తరువాత కూడా వారు (సత్యాన్ని) ఒప్పుకోక తిరిగిపోయినట్లయితే, అసలు సంక్షోభాన్ని రేకెత్తించే వారెవరో అల్లాహ్‌కు బాగా తెలుసు.
3:64 قُلْ يَا أَهْلَ الْكِتَابِ تَعَالَوْا إِلَىٰ كَلِمَةٍ سَوَاءٍ بَيْنَنَا وَبَيْنَكُمْ أَلَّا نَعْبُدَ إِلَّا اللَّهَ وَلَا نُشْرِكَ بِهِ شَيْئًا وَلَا يَتَّخِذَ بَعْضُنَا بَعْضًا أَرْبَابًا مِّن دُونِ اللَّهِ ۚ فَإِن تَوَلَّوْا فَقُولُوا اشْهَدُوا بِأَنَّا مُسْلِمُونَ
(ఓ ప్రవక్తా!) వారికి స్పష్టంగా చెప్పు: ”ఓ గ్రంథవహులారా! మాలోనూ, మీ లోనూ సమానంగా ఉన్న ఒక విషయం వైపుకు రండి. అదేమంటే మనం అల్లాహ్‌ను తప్ప వేరెవరినీ ఆరాధించకూడదు, ఆయనకు భాగస్వాములుగా ఎవరినీ కల్పించరాదు. అల్లాహ్‌ను వదలి మనలో ఎవరూ ఇంకొకరిని ప్రభువులుగా చేసుకోరాదు.” ఈ ప్రతిపాదన పట్ల గనక వారు విముఖత చూపితే, ”మేము మాత్రం ముస్లిం (విధేయు)లము అన్న విషయానికి మీరు సాక్షులుగా ఉండండి” అని వారికి చెప్పేయండి.
3:65 يَا أَهْلَ الْكِتَابِ لِمَ تُحَاجُّونَ فِي إِبْرَاهِيمَ وَمَا أُنزِلَتِ التَّوْرَاةُ وَالْإِنجِيلُ إِلَّا مِن بَعْدِهِ ۚ أَفَلَا تَعْقِلُونَ
ఓ గ్రంథవహులారా! మీరు ఇబ్రాహీం విషయంలో ఎందుకు గొడవపడుతున్నారు. తౌరాతు, ఇన్జీలు గ్రంథాలైతే ఆయన తరువాతనే అవతరించాయి కదా! అయినా మీరు అర్థం చేసుకోరే?!
3:66 هَا أَنتُمْ هَٰؤُلَاءِ حَاجَجْتُمْ فِيمَا لَكُم بِهِ عِلْمٌ فَلِمَ تُحَاجُّونَ فِيمَا لَيْسَ لَكُم بِهِ عِلْمٌ ۚ وَاللَّهُ يَعْلَمُ وَأَنتُمْ لَا تَعْلَمُونَ
చూడండి, మీకు తెలిసిన విషయం గురించి మీరెలాగూ వాదించారు. కాని మీకు తెలియని విషయాల గురించి ఎందుకు వాదిస్తున్నారు? (యదార్థం) అల్లాహ్‌కు తెలుసుగాని మీకు తెలియదు.
3:67 مَا كَانَ إِبْرَاهِيمُ يَهُودِيًّا وَلَا نَصْرَانِيًّا وَلَٰكِن كَانَ حَنِيفًا مُّسْلِمًا وَمَا كَانَ مِنَ الْمُشْرِكِينَ
ఇబ్రాహీం యూదుడూ కాదు, క్రైస్తవుడూ కాదు. ఆయన ఒకే దేవునివైపు అభిముఖుడైన ముస్లిం. ఆయన ముష్రిక్కులలోని వాడు ఎంతమాత్రం కాదు.
3:68 إِنَّ أَوْلَى النَّاسِ بِإِبْرَاهِيمَ لَلَّذِينَ اتَّبَعُوهُ وَهَٰذَا النَّبِيُّ وَالَّذِينَ آمَنُوا ۗ وَاللَّهُ وَلِيُّ الْمُؤْمِنِينَ
అందరికన్నా ఎక్కువగా ఇబ్రాహీంకు దగ్గరివారమని చెప్పుకునే హక్కు ఎవరికయినా ఉందీ అంటే, అది ఆయన్ని అనుసరించినవారికీ, ఈ ప్రవక్తకూ, విశ్వాసులకూ మాత్రమే ఉంది. అల్లాహ్ విశ్వాసులకు మాత్రమే నేస్తం.
3:69 وَدَّت طَّائِفَةٌ مِّنْ أَهْلِ الْكِتَابِ لَوْ يُضِلُّونَكُمْ وَمَا يُضِلُّونَ إِلَّا أَنفُسَهُمْ وَمَا يَشْعُرُونَ
గ్రంథవహులలోని ఒక వర్గం మిమ్మల్ని పెడత్రోవ పట్టించాలని చూస్తోంది. నిజానికి వారు తమను తామే పెడత్రోవలో పడ వేసుకుంటున్నారు. కాని ఆ విషయాన్ని వారు గ్రహించటంలేదు.
3:70 يَا أَهْلَ الْكِتَابِ لِمَ تَكْفُرُونَ بِآيَاتِ اللَّهِ وَأَنتُمْ تَشْهَدُونَ
”ఓ గ్రంథవహులారా! మీరు స్వయంగా అల్లాహ్ ఆయతులకు సాక్షిగా ఉండి కూడా వాటిని ఎందుకు తిరస్కరిస్తున్నారు?”
3:71 يَا أَهْلَ الْكِتَابِ لِمَ تَلْبِسُونَ الْحَقَّ بِالْبَاطِلِ وَتَكْتُمُونَ الْحَقَّ وَأَنتُمْ تَعْلَمُونَ
”గ్రంథం కల ఓ ప్రజలారా! తెలిసి కూడా మీరు సత్యానికి అసత్యపు రంగు పులిమి దానిని ఎందుకు అనుమానాస్పదం చేస్తారు? (ఉద్దేశపూర్వకంగా) సత్యాన్ని ఎందుకు కప్పిపుచ్చుతున్నారు??”
3:72 وَقَالَت طَّائِفَةٌ مِّنْ أَهْلِ الْكِتَابِ آمِنُوا بِالَّذِي أُنزِلَ عَلَى الَّذِينَ آمَنُوا وَجْهَ النَّهَارِ وَاكْفُرُوا آخِرَهُ لَعَلَّهُمْ يَرْجِعُونَ
గ్రంథవహులలోని ఒక వర్గం ఇలా అన్నది : ”విశ్వసించిన వారిపై అవతరించిన దానిని ఉదయం విశ్వసించి, సాయంత్రం తిరస్కరించండి. బహుశా ఇలాగయినా వారు మరలి పోతారేమో!”
3:73 وَلَا تُؤْمِنُوا إِلَّا لِمَن تَبِعَ دِينَكُمْ قُلْ إِنَّ الْهُدَىٰ هُدَى اللَّهِ أَن يُؤْتَىٰ أَحَدٌ مِّثْلَ مَا أُوتِيتُمْ أَوْ يُحَاجُّوكُمْ عِندَ رَبِّكُمْ ۗ قُلْ إِنَّ الْفَضْلَ بِيَدِ اللَّهِ يُؤْتِيهِ مَن يَشَاءُ ۗ وَاللَّهُ وَاسِعٌ عَلِيمٌ
”మీరు మీ ధర్మాన్ని అనుసరించేవారిని తప్ప వేరెవరినీ నమ్మవద్దు” (అని అంటారు). (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : ”నిశ్చయంగా అల్లాహ్ చూపే మార్గమే సన్మార్గం.” (గ్రంథవహులు తమ వారికి ఇంకా ఈ విధంగా కూడా నూరి పోస్తారు:) ”మీకు ఇవ్వబడినదే వేరెవరికయినా ఇవ్వబడి ఉండ వచ్చనీ, లేక వారు మీ ప్రభువు సమక్షంలో మీకు వ్యతిరేకంగా వాదిస్తారని (మీరు ఎంతమాత్రం అనుకోకండి).” ఓ ప్రవక్తా! వారితో అను: ”అనుగ్రహాలన్నీ అల్లాహ్ చేతిలో ఉన్నాయి. ఆయన తాను కోరిన వారికి వాటిని ఇస్తాడు. అల్లాహ్ గొప్ప విస్తృతి కలవాడు, అన్నీ తెలిసినవాడు.”
3:74 يَخْتَصُّ بِرَحْمَتِهِ مَن يَشَاءُ ۗ وَاللَّهُ ذُو الْفَضْلِ الْعَظِيمِ
”ఆయన తాను కోరిన వారిని తన కారుణ్యం కొరకు ప్రత్యేకించుకుంటాడు. అల్లాహ్ గొప్ప అనుగ్రహం కలవాడు.”
3:75 وَمِنْ أَهْلِ الْكِتَابِ مَنْ إِن تَأْمَنْهُ بِقِنطَارٍ يُؤَدِّهِ إِلَيْكَ وَمِنْهُم مَّنْ إِن تَأْمَنْهُ بِدِينَارٍ لَّا يُؤَدِّهِ إِلَيْكَ إِلَّا مَا دُمْتَ عَلَيْهِ قَائِمًا ۗ ذَٰلِكَ بِأَنَّهُمْ قَالُوا لَيْسَ عَلَيْنَا فِي الْأُمِّيِّينَ سَبِيلٌ وَيَقُولُونَ عَلَى اللَّهِ الْكَذِبَ وَهُمْ يَعْلَمُونَ
గ్రంథవహులలో కొందరు ఎలాంటివారంటే, నీవు వారి వద్ద ఒక పెద్ద ధనరాశిని అమానతుగా పెట్టినాసరే, వారు దాన్ని నీకు తిరిగి ఇచ్చేస్తారు. వారిలో మరి కొందరు కూడా ఉన్నారు. వారెలాంటి వారంటే నువ్వు వారికి ఒక్క దీనారును అప్పగించినా వారు తిరిగి ఇవ్వరు – నువ్వు వారి నెత్తిమీద నిల్చుంటే తప్ప! ఎందుకంటే ”నిరక్షర కుక్షుల (యూదేతరుల) హక్కు విషయంలో మమ్మల్ని నిలదీయటం జరగదు” అని వారు చెప్పి ఉన్నారు. వీరు తెలిసి కూడా అల్లాహ్‌కు అబద్ధాన్ని ఆపాదిస్తున్నారు.
3:76 بَلَىٰ مَنْ أَوْفَىٰ بِعَهْدِهِ وَاتَّقَىٰ فَإِنَّ اللَّهَ يُحِبُّ الْمُتَّقِينَ
ఎందుకు నిలదీయటం జరగదు? (వారిని నిలదీయటం ఖాయం). అయితే ఇచ్చిన మాటను నిలుపుకుని, భయభక్తుల వైఖరిని అవలంబిస్తే, అల్లాహ్ భయభక్తులుగలవారిని ప్రేమిస్తాడు.
3:77 إِنَّ الَّذِينَ يَشْتَرُونَ بِعَهْدِ اللَّهِ وَأَيْمَانِهِمْ ثَمَنًا قَلِيلًا أُولَٰئِكَ لَا خَلَاقَ لَهُمْ فِي الْآخِرَةِ وَلَا يُكَلِّمُهُمُ اللَّهُ وَلَا يَنظُرُ إِلَيْهِمْ يَوْمَ الْقِيَامَةِ وَلَا يُزَكِّيهِمْ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ
ఎవరయితే అల్లాహ్ వాగ్దానాన్ని, తమ ప్రమాణాలను కొద్ది పాటి మూల్యానికి అమ్ముకుంటారో అలాంటి వారికి పరలోకంలో ఏ భాగమూ లేదు. అల్లాహ్ వారిని ప్రళయదినాన పలకరించటంగానీ, వారి వంక చూడటంగానీ చేయడు. వారిని పరిశుద్ధ పరచడు. పైగా వారి కోసం బాధాకరమైన శిక్ష ఉంటుంది.
3:78 وَإِنَّ مِنْهُمْ لَفَرِيقًا يَلْوُونَ أَلْسِنَتَهُم بِالْكِتَابِ لِتَحْسَبُوهُ مِنَ الْكِتَابِ وَمَا هُوَ مِنَ الْكِتَابِ وَيَقُولُونَ هُوَ مِنْ عِندِ اللَّهِ وَمَا هُوَ مِنْ عِندِ اللَّهِ وَيَقُولُونَ عَلَى اللَّهِ الْكَذِبَ وَهُمْ يَعْلَمُونَ
వారిలోని మరికొందరు గ్రంథాన్ని పఠిస్తూ తమ నాలుకలను త్రిప్పుతారు – అది గ్రంథంలోని భాగమే అని మీరు భావించాలన్న ఉద్దేశ్యంతో వారలా చేస్తారు. కాని వాస్తవానికి అది గ్రంథంలో అంతర్భాగం కానేకాదు. ”అది అల్లాహ్ తరఫు నుంచి వచ్చినది” అని వారు అంటారు. యదార్థానికి అది అల్లాహ్ తరఫునుండి వచ్చినది కాదు. వారు ఉద్దేశ్యపూర్వకంగా అల్లాహ్‌కు అసత్యాన్ని అంటగడుతున్నారు.
3:79 مَا كَانَ لِبَشَرٍ أَن يُؤْتِيَهُ اللَّهُ الْكِتَابَ وَالْحُكْمَ وَالنُّبُوَّةَ ثُمَّ يَقُولَ لِلنَّاسِ كُونُوا عِبَادًا لِّي مِن دُونِ اللَّهِ وَلَٰكِن كُونُوا رَبَّانِيِّينَ بِمَا كُنتُمْ تُعَلِّمُونَ الْكِتَابَ وَبِمَا كُنتُمْ تَدْرُسُونَ
అల్లాహ్ ఏ మనిషికయినా గ్రంథాన్నీ, వివేకాన్నీ, ప్రవక్త పదవిని (నబువ్వత్ను) ప్రసాదించిన మీదట కూడా ‘మీరు అల్లాహ్‌ను వదలిపెట్టి నాకు దాసులుకండి’ అని అతడు ప్రజలతో అనటం ఎంతమాత్రం తగదు. దానికి బదులు, ‘మీరంతా ప్రభువు వారైపోండి’ అని అతడనాలి. ఎందుకంటే మీరు గ్రంథాన్ని నేర్పేవారవటం చేతనూ, గ్రంథాన్ని చదివేవారవటం చేతనూ (మీరు మీ ప్రభువు వారవటమే ధర్మం).
3:80 وَلَا يَأْمُرَكُمْ أَن تَتَّخِذُوا الْمَلَائِكَةَ وَالنَّبِيِّينَ أَرْبَابًا ۗ أَيَأْمُرُكُم بِالْكُفْرِ بَعْدَ إِذْ أَنتُم مُّسْلِمُونَ
దూతలను, ప్రవక్తలను ప్రభువులుగా చేసుకోమని అతడు మీకు ఎన్నటికీ ఆదేశించ(లే)డు. ఏమిటీ, మీరు ముస్లిములయిన మీదట కూడా అతడు మిమ్మల్ని అవిశ్వాసానికి పాల్పడమని ఆజ్ఞాపిస్తాడా? (ఇది అసంభవం).
3:81 وَإِذْ أَخَذَ اللَّهُ مِيثَاقَ النَّبِيِّينَ لَمَا آتَيْتُكُم مِّن كِتَابٍ وَحِكْمَةٍ ثُمَّ جَاءَكُمْ رَسُولٌ مُّصَدِّقٌ لِّمَا مَعَكُمْ لَتُؤْمِنُنَّ بِهِ وَلَتَنصُرُنَّهُ ۚ قَالَ أَأَقْرَرْتُمْ وَأَخَذْتُمْ عَلَىٰ ذَٰلِكُمْ إِصْرِي ۖ قَالُوا أَقْرَرْنَا ۚ قَالَ فَاشْهَدُوا وَأَنَا مَعَكُم مِّنَ الشَّاهِدِينَ
అల్లాహ్ (తన) ప్రవక్తల నుండి వాగ్దానం తీసుకున్నప్పుడు, ”నేను మీకు గ్రంథాన్ని, వివేకాన్ని ఒసగిన తరువాత, మీ వద్ద ఉన్న దాన్ని సత్యమని ధృవీకరించే ప్రవక్త మీ వద్దకు వస్తే మీరు తప్పకుండా అతన్ని విశ్వసించాలి, అతనికి సహాయపడాలి” అని చెప్పాడు. తరువాత ఆయన, ”ఈ విషయాన్ని మీరు ఒప్పుకుంటున్నారా? నేను మీపై మోపిన బాధ్యతను స్వీకరిస్తున్నారా?” అని ప్రశ్నించగా, ”మేము ఒప్పుకుంటున్నాము” అని అందరూ అన్నారు. ”మరయితే దీనికి మీరు సాక్షులుగా ఉండండి. మీతోపాటు నేనూ సాక్షిగా ఉంటాను” అని అల్లాహ్ అన్నాడు.
3:82 فَمَن تَوَلَّىٰ بَعْدَ ذَٰلِكَ فَأُولَٰئِكَ هُمُ الْفَاسِقُونَ
దీని తరువాత కూడా ఎవరు వెనుతిరిగిపోతారో వారే పరమ అవిధేయులు.
3:83 أَفَغَيْرَ دِينِ اللَّهِ يَبْغُونَ وَلَهُ أَسْلَمَ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ طَوْعًا وَكَرْهًا وَإِلَيْهِ يُرْجَعُونَ
ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న వారంతా – తమకు ఇష్టమున్నా లేకపోయినా అల్లాహ్ విధేయతకు కట్టుబడి ఉండగా, వీరు అల్లాహ్ ధర్మాన్ని కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తున్నారా? ఎట్టకేలకు వారంతా ఆయన వైపునకే మరలించబడతారు.
3:84 قُلْ آمَنَّا بِاللَّهِ وَمَا أُنزِلَ عَلَيْنَا وَمَا أُنزِلَ عَلَىٰ إِبْرَاهِيمَ وَإِسْمَاعِيلَ وَإِسْحَاقَ وَيَعْقُوبَ وَالْأَسْبَاطِ وَمَا أُوتِيَ مُوسَىٰ وَعِيسَىٰ وَالنَّبِيُّونَ مِن رَّبِّهِمْ لَا نُفَرِّقُ بَيْنَ أَحَدٍ مِّنْهُمْ وَنَحْنُ لَهُ مُسْلِمُونَ
(ఓ ప్రవక్తా!) వారితో అను: ”మేము అల్లాహ్‌ను, మాపై అవతరింపజెయ్యబడిన దానినీ విశ్వసించాము. ఇంకా ఇబ్రాహీము, ఇస్మాయీలు, ఇస్హాఖు, యాఖూబుపై, ఆయన సంతానంపై అవతరింపజెయ్యబడిన దానినీ, మూసా, ఈసా ఇంకా ఇతర ప్రవక్తలకు వారి ప్రభువు తరఫున వొసగబడిన వాటిని మేము విశ్వసించాము. మేము వారి మధ్య ఎలాంటి భేదభావాన్ని కనబరచము. మేము ఆయనకే విధేయులము.”
3:85 وَمَن يَبْتَغِ غَيْرَ الْإِسْلَامِ دِينًا فَلَن يُقْبَلَ مِنْهُ وَهُوَ فِي الْآخِرَةِ مِنَ الْخَاسِرِينَ
ఎవరయినా ఇస్లాంను కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తే అతని ధర్మం స్వీకరించబడదు. అలాంటి వ్యక్తి పరలోకంలో నష్టపోయినవారిలో చేరిపోతాడు.
3:86 كَيْفَ يَهْدِي اللَّهُ قَوْمًا كَفَرُوا بَعْدَ إِيمَانِهِمْ وَشَهِدُوا أَنَّ الرَّسُولَ حَقٌّ وَجَاءَهُمُ الْبَيِّنَاتُ ۚ وَاللَّهُ لَا يَهْدِي الْقَوْمَ الظَّالِمِينَ
(తొలుత) విశ్వసించి, ఈయన ప్రవక్త అనే విషయం సత్యమేనని సాక్ష్యం (కూడా) యిచ్చి, తీరా తమ వద్దకు స్పష్టమైన సూచనలు వచ్చేసిన మీదట అవిశ్వాసులైపోయిన వారికి అల్లాహ్ సన్మార్గం ఎలా చూపుతాడు? అల్లాహ్ ఇటువంటి దుర్మార్గులకు దారి చూపడు.
3:87 أُولَٰئِكَ جَزَاؤُهُمْ أَنَّ عَلَيْهِمْ لَعْنَةَ اللَّهِ وَالْمَلَائِكَةِ وَالنَّاسِ أَجْمَعِينَ
వారి పాపఫలంగా వారిపై అల్లాహ్ శాపం, దూతల, సమస్త జనుల శాపం పడుతుంది.
3:88 خَالِدِينَ فِيهَا لَا يُخَفَّفُ عَنْهُمُ الْعَذَابُ وَلَا هُمْ يُنظَرُونَ
ఈ (శాపగ్రస్త) స్థితిలో వారు కలకాలం ఉంటారు. వారి శిక్షను తగ్గించటంగానీ, వారికి గడువు ఇవ్వటంగానీ జరగదు.
3:89 إِلَّا الَّذِينَ تَابُوا مِن بَعْدِ ذَٰلِكَ وَأَصْلَحُوا فَإِنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ
అయితే ఆ తరువాత ఎవరు పశ్చాత్తాపం చెంది, తమ నడవడికను సరిదిద్దుకుంటారో (వారు రక్షించబడతారు). నిశ్చయంగా అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడు.
3:90 إِنَّ الَّذِينَ كَفَرُوا بَعْدَ إِيمَانِهِمْ ثُمَّ ازْدَادُوا كُفْرًا لَّن تُقْبَلَ تَوْبَتُهُمْ وَأُولَٰئِكَ هُمُ الضَّالُّونَ
ఎవరు విశ్వసించిన మీదట అవిశ్వాస వైఖరికి ఒడిగడతారో, ఆ తరువాత అవిశ్వాసంలో మరింత పెచ్చరిల్లుతారో వారి పశ్చాత్తాపం సుతరామూ స్వీకరించబడదు. అపమార్గం పాలైన వారంటే వీరే.
3:91 إِنَّ الَّذِينَ كَفَرُوا وَمَاتُوا وَهُمْ كُفَّارٌ فَلَن يُقْبَلَ مِنْ أَحَدِهِم مِّلْءُ الْأَرْضِ ذَهَبًا وَلَوِ افْتَدَىٰ بِهِ ۗ أُولَٰئِكَ لَهُمْ عَذَابٌ أَلِيمٌ وَمَا لَهُم مِّن نَّاصِرِينَ
మరెవరు అవిశ్వాసానికి ఒడిగట్టి, అవిశ్వాసులుగానే మరణించారో వారిలో ఎవరయినాసరే భూమి నిండా బంగారం సమర్పించినా, తమ పాపానికి పరిహారంగా ఇచ్చినాసరే అది స్వీకారయోగ్యం అవదు. వ్యధాభరితమైన శిక్షకు పాత్రులయ్యే వారంటే వీరే. వీరిని ఆదుకునే వాడెవడూ ఉండడు.
3:92 لَن تَنَالُوا الْبِرَّ حَتَّىٰ تُنفِقُوا مِمَّا تُحِبُّونَ ۚ وَمَا تُنفِقُوا مِن شَيْءٍ فَإِنَّ اللَّهَ بِهِ عَلِيمٌ
మీకు ప్రియాతిప్రియమైన వస్తువుల నుండి మీరు (దైవ మార్గంలో) ఖర్చు పెట్టనంతవరకూ మీరు పుణ్య స్థాయికి చేరుకోలేరు. మీరు ఖర్చుపెట్టేదంతా అల్లాహ్‌కు తెలుసు.
3:93 كُلُّ الطَّعَامِ كَانَ حِلًّا لِّبَنِي إِسْرَائِيلَ إِلَّا مَا حَرَّمَ إِسْرَائِيلُ عَلَىٰ نَفْسِهِ مِن قَبْلِ أَن تُنَزَّلَ التَّوْرَاةُ ۗ قُلْ فَأْتُوا بِالتَّوْرَاةِ فَاتْلُوهَا إِن كُنتُمْ صَادِقِينَ
తౌరాతు గ్రంథం అవతరించక పూర్వం, ఇస్రాయీల్ (యాఖూబు) తన కోసం నిషేధించుకున్న వస్తువులు తప్ప ఇతర ఆహార పదార్థాలన్నీ ఇస్రాయీల్ వంశస్థుల కొరకు ధర్మ సమ్మతం గానే ఉండేవి. ‘మీరు సత్యవంతులే అయితే తౌరాతును తీసుకుని రండి, దాన్ని చదివి వినిపించండి’ అని (ఓ ముహమ్మద్!) వారికి చెప్పు.
3:94 فَمَنِ افْتَرَىٰ عَلَى اللَّهِ الْكَذِبَ مِن بَعْدِ ذَٰلِكَ فَأُولَٰئِكَ هُمُ الظَّالِمُونَ
దీని తరువాత కూడా ఎవరయినా అల్లాహ్‌కు అబద్ధాన్ని ఆపాదిస్తే వారే దుర్మార్గులవుతారు.
3:95 قُلْ صَدَقَ اللَّهُ ۗ فَاتَّبِعُوا مِلَّةَ إِبْرَاهِيمَ حَنِيفًا وَمَا كَانَ مِنَ الْمُشْرِكِينَ
వారికి చెప్పు: ”అల్లాహ్ సత్యం పలికాడు. కనుక మీరంతా ఏకాగ్ర చిత్తంకల ఇబ్రాహీము ధర్మాన్నే అనుసరించండి. ఆయన బహుదైవోపాసకులలోని వాడు కాడు.”
3:96 إِنَّ أَوَّلَ بَيْتٍ وُضِعَ لِلنَّاسِ لَلَّذِي بِبَكَّةَ مُبَارَكًا وَهُدًى لِّلْعَالَمِينَ
నిశ్చయంగా మానవుల కొరకు ప్రప్రథమంగా ఖరారు చేయబడిన (దైవ) గృహం బక్కాలో (మక్కాలో) ఉన్నదే. అది శుభప్రదమైనది, సమస్త లోకవాసులకు మార్గదర్శకం కూడాను.
3:97 فِيهِ آيَاتٌ بَيِّنَاتٌ مَّقَامُ إِبْرَاهِيمَ ۖ وَمَن دَخَلَهُ كَانَ آمِنًا ۗ وَلِلَّهِ عَلَى النَّاسِ حِجُّ الْبَيْتِ مَنِ اسْتَطَاعَ إِلَيْهِ سَبِيلًا ۚ وَمَن كَفَرَ فَإِنَّ اللَّهَ غَنِيٌّ عَنِ الْعَالَمِينَ
అందులో స్పష్టమయిన సూచనలున్నాయి. మఖామె ఇబ్రాహీం (ఇబ్రాహీం నిలబడిన స్థలం) ఉన్నది. అందులోకి ప్రవేశించినవాడు రక్షణ పొందుతాడు. అక్కడికి వెళ్ళే స్థోమత గలవారికి, ఆ గృహ (యాత్ర) హజ్ చేయటాన్ని అల్లాహ్ విధిగా చేశాడు. మరెవరయినా (ఈ ఆజ్ఞను శిరసావహించటానికి) నిరాకరిస్తే అల్లాహ్‌కు సమస్త లోకవాసుల అవసరం ఎంతమాత్రం లేదు.
3:98 قُلْ يَا أَهْلَ الْكِتَابِ لِمَ تَكْفُرُونَ بِآيَاتِ اللَّهِ وَاللَّهُ شَهِيدٌ عَلَىٰ مَا تَعْمَلُونَ
”ఓ గ్రంథవహులారా! మీరు అల్లాహ్ ఆయతుల(వాక్యాల)ను ఎందుకు తిరస్కరిస్తున్నారు? మీరు చేసే కర్మలకు అల్లాహ్ సాక్షిగా ఉన్నాడు” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు.
3:99 قُلْ يَا أَهْلَ الْكِتَابِ لِمَ تَصُدُّونَ عَن سَبِيلِ اللَّهِ مَنْ آمَنَ تَبْغُونَهَا عِوَجًا وَأَنتُمْ شُهَدَاءُ ۗ وَمَا اللَّهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُونَ
”గ్రంథవహులారా! అల్లాహ్ మార్గం నుంచి మీరు విశ్వసించినవారిని ఎందుకు అడ్డుకుంటున్నారు? (ఇదే సన్మార్గం అన్న దానికి) మీరు సాక్షులై ఉండి కూడా అందులో లోపాలు వెతికే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? అల్లాహ్ మీ చేష్టల పట్ల పరధ్యానానికి లోనైలేడు” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు.
3:100 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِن تُطِيعُوا فَرِيقًا مِّنَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ يَرُدُّوكُم بَعْدَ إِيمَانِكُمْ كَافِرِينَ
విశ్వసించిన ఓ ప్రజలారా! మీరు గ్రంథవహులలోని ఏదయినా వర్గంవారి మాటను విన్నారంటే, వారు మిమ్మల్ని మీ విశ్వాసస్థితి నుంచి అవిశ్వాసులుగా మార్చుతారు.
3:101 وَكَيْفَ تَكْفُرُونَ وَأَنتُمْ تُتْلَىٰ عَلَيْكُمْ آيَاتُ اللَّهِ وَفِيكُمْ رَسُولُهُ ۗ وَمَن يَعْتَصِم بِاللَّهِ فَقَدْ هُدِيَ إِلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ
మీకు అల్లాహ్ ఆయతులు (వాక్యాలు) చదివి వినిపిస్తుండగా, ఆయన ప్రవక్త మీ మధ్యనుండగా మీరు అవిశ్వాసానికి ఎలా పాల్పడగలరు? ఎవరు అల్లాహ్ (ధర్మము)ను గట్టిగా పట్టుకున్నాడో నిస్సందేహంగా అతడు రుజుమార్గం వైపు దర్శకత్వం వహించబడినట్లే.
3:102 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ حَقَّ تُقَاتِهِ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسْلِمُونَ
ఓ విశ్వాసులారా! అల్లాహ్‌కు ఎంతగా భయపడాలో అంతగా భయపడండి. ముస్లింలుగా తప్ప మరణించకండి.
3:103 وَاعْتَصِمُوا بِحَبْلِ اللَّهِ جَمِيعًا وَلَا تَفَرَّقُوا ۚ وَاذْكُرُوا نِعْمَتَ اللَّهِ عَلَيْكُمْ إِذْ كُنتُمْ أَعْدَاءً فَأَلَّفَ بَيْنَ قُلُوبِكُمْ فَأَصْبَحْتُم بِنِعْمَتِهِ إِخْوَانًا وَكُنتُمْ عَلَىٰ شَفَا حُفْرَةٍ مِّنَ النَّارِ فَأَنقَذَكُم مِّنْهَا ۗ كَذَٰلِكَ يُبَيِّنُ اللَّهُ لَكُمْ آيَاتِهِ لَعَلَّكُمْ تَهْتَدُونَ
అల్లాహ్ త్రాడును అందరూ కలసి గట్టిగా పట్టుకోండి. చీలిపోకండి. అల్లాహ్ మీపై కురిపించిన దయానుగ్రహాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి – అప్పుడు మీరు ఒండొకరికి శత్రువులుగా ఉండేవారు. ఆయన మీ హృదయాలలో పరస్పరం ప్రేమానురాగాలను సృజించాడు. దాంతో ఆయన అనుగ్రహం వల్ల మీరు ఒకరి కొకరు అన్నదమ్ములుగా మారారు. మీరు అగ్నిగుండం ఆఖరి అంచులకు చేరుకోగా, ఆయన మిమ్మల్ని దాన్నుంచి కాపాడాడు. మీరు సన్మార్గం పొందాలని ఈ విధంగా అల్లాహ్ మీకు తన సూచనలను విశదపరుస్తున్నాడు.
3:104 وَلْتَكُن مِّنكُمْ أُمَّةٌ يَدْعُونَ إِلَى الْخَيْرِ وَيَأْمُرُونَ بِالْمَعْرُوفِ وَيَنْهَوْنَ عَنِ الْمُنكَرِ ۚ وَأُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ
మేలు వైపుకు పిలిచే, మంచిని చెయ్యమని ఆజ్ఞాపించే, చెడుల నుంచి వారించే ఒక వర్గం మీలో ఉండాలి. ఈ పనిని చేసేవారే సాఫల్యాన్ని పొందుతారు.
3:105 وَلَا تَكُونُوا كَالَّذِينَ تَفَرَّقُوا وَاخْتَلَفُوا مِن بَعْدِ مَا جَاءَهُمُ الْبَيِّنَاتُ ۚ وَأُولَٰئِكَ لَهُمْ عَذَابٌ عَظِيمٌ
తమ వద్దకు స్పష్టమయిన నిదర్శనాలు వచ్చేసిన తరువాత కూడా వర్గాలుగా విడిపోయి, విభేదించుకున్న వారి మాదిరిగా మీరు తయారవకండి. మహాశిక్ష ఉన్నది ఇటువంటివారి కోసమే.
3:106 يَوْمَ تَبْيَضُّ وُجُوهٌ وَتَسْوَدُّ وُجُوهٌ ۚ فَأَمَّا الَّذِينَ اسْوَدَّتْ وُجُوهُهُمْ أَكَفَرْتُم بَعْدَ إِيمَانِكُمْ فَذُوقُوا الْعَذَابَ بِمَا كُنتُمْ تَكْفُرُونَ
ఆనాడు కొన్ని ముఖాలు వెలిగిపోతూ ఉంటాయి. మరికొన్ని ముఖాలు నల్లబడి ఉంటాయి. నలుపు ఆవరించి ఉన్న మొహాలు కలిగిన వారినుద్దేశించి, ”మీరు విశ్వసించిన మీదట తిరస్కార వైఖరికి ఒడిగట్టారా? సరే, మీరు తిరస్కరించిన దాని ఫలితంగా శిక్షను చవిచూడండి” (అని అనబడుతుంది).
3:107 وَأَمَّا الَّذِينَ ابْيَضَّتْ وُجُوهُهُمْ فَفِي رَحْمَةِ اللَّهِ هُمْ فِيهَا خَالِدُونَ
తెల్లగా ప్రకాశిస్తున్న మొహాలవారు దైవకారుణ్యంలో ఉంటారు. అందులో వారు కలకాలం ఉంటారు.
3:108 تِلْكَ آيَاتُ اللَّهِ نَتْلُوهَا عَلَيْكَ بِالْحَقِّ ۗ وَمَا اللَّهُ يُرِيدُ ظُلْمًا لِّلْعَالَمِينَ
(ఓ ప్రవక్తా!) ఇవి అల్లాహ్ వచనాలు. వాటిని మేము నీకు ఉన్నదున్నట్లుగా చదివి వినిపిస్తున్నాము. లోకవాసులకు అన్యాయం చేయాలన్న తలంపు అల్లాహ్‌కు ఎంతమాత్రం లేదు.
3:109 وَلِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۚ وَإِلَى اللَّهِ تُرْجَعُ الْأُمُورُ
ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న సమస్తమూ అల్లాహ్‌కే చెందుతుంది. సకల వ్యవహారాలూ అల్లాహ్ వైపుకే మళ్ళించ బడతాయి.
3:110 كُنتُمْ خَيْرَ أُمَّةٍ أُخْرِجَتْ لِلنَّاسِ تَأْمُرُونَ بِالْمَعْرُوفِ وَتَنْهَوْنَ عَنِ الْمُنكَرِ وَتُؤْمِنُونَ بِاللَّهِ ۗ وَلَوْ آمَنَ أَهْلُ الْكِتَابِ لَكَانَ خَيْرًا لَّهُم ۚ مِّنْهُمُ الْمُؤْمِنُونَ وَأَكْثَرُهُمُ الْفَاسِقُونَ
మానవుల కోసం ఉనికిలోనికి తీసుకురాబడిన శ్రేష్ఠ సమాజం మీరు. మీరు మంచి విషయాలకై ఆజ్ఞాపిస్తారు, చెడు నుంచి ఆపుతారు, ఇంకా మీరు అల్లాహ్‌ను విశ్వసిస్తారు. గ్రంథవహులు కూడా విశ్వసించి ఉంటే, అది వారి కోసం శ్రేయస్కరం అయ్యేది. వారిలో కొందరు విశ్వాసులు కూడా ఉన్నారు. కాని అత్యధికులు అవిధేయులే.
3:111 لَن يَضُرُّوكُمْ إِلَّا أَذًى ۖ وَإِن يُقَاتِلُوكُمْ يُوَلُّوكُمُ الْأَدْبَارَ ثُمَّ لَا يُنصَرُونَ
వారు మీకు ఏమాత్రం హాని కలిగించలేరు – మహా అయితే కొంచెం బాధించటం తప్ప. ఒకవేళ మీతో తలపడవలసిన పరిస్థితే ఏర్పడినట్లయితే వారు మీకు వెన్ను చూపి పారిపోతారు. ఆ తరువాత వారికెలాంటి సహాయమూ లభించదు.
3:112 ضُرِبَتْ عَلَيْهِمُ الذِّلَّةُ أَيْنَ مَا ثُقِفُوا إِلَّا بِحَبْلٍ مِّنَ اللَّهِ وَحَبْلٍ مِّنَ النَّاسِ وَبَاءُوا بِغَضَبٍ مِّنَ اللَّهِ وَضُرِبَتْ عَلَيْهِمُ الْمَسْكَنَةُ ۚ ذَٰلِكَ بِأَنَّهُمْ كَانُوا يَكْفُرُونَ بِآيَاتِ اللَّهِ وَيَقْتُلُونَ الْأَنبِيَاءَ بِغَيْرِ حَقٍّ ۚ ذَٰلِكَ بِمَا عَصَوا وَّكَانُوا يَعْتَدُونَ
సర్వత్రా వారిపై పరాభవపు దెబ్బ పడుతుంది – వారికి అల్లాహ్ శరణు లేదా ప్రజల నుండి అభయహస్తం లభిస్తే తప్ప! వారు దైవాగ్రహానికి పాత్రులైపోయారు. వారికి దీనావస్థ అంట గట్టబడింది. వారి ఈ స్థితికి కారణమేమిటంటే వారు అల్లాహ్ ఆయతులను తిరస్కరించేవారు, అన్యాయంగా ప్రవక్తలను చంపి వేసేవారు. వారి అవిధేయతకు, అతిక్రమణలకు శాస్తి ఇది!
3:113 لَيْسُوا سَوَاءً ۗ مِّنْ أَهْلِ الْكِتَابِ أُمَّةٌ قَائِمَةٌ يَتْلُونَ آيَاتِ اللَّهِ آنَاءَ اللَّيْلِ وَهُمْ يَسْجُدُونَ
వారంతా ఒకలాంటివారు కారు. ఈ గ్రంథవహులలోని ఒక వర్గం వారు (సత్యంపై) నిలకడగా ఉన్నారు. వారు రాత్రి సమయాల్లో కూడా దైవవాక్యాలను పారాయణం చేస్తారు, సాష్టాంగపడతారు.
3:114 يُؤْمِنُونَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ وَيَأْمُرُونَ بِالْمَعْرُوفِ وَيَنْهَوْنَ عَنِ الْمُنكَرِ وَيُسَارِعُونَ فِي الْخَيْرَاتِ وَأُولَٰئِكَ مِنَ الصَّالِحِينَ
అల్లాహ్‌ను, అంతిమదినాన్ని కూడా వారు విశ్వసిస్తారు. మంచిని ఆజ్ఞాపిస్తారు, చెడు నుండి ఆపుతారు. సత్కార్యాల కోసం పరస్పరం పోటీపడతారు. వీరు సజ్జనుల కోవకు చెందినవారు.
3:115 وَمَا يَفْعَلُوا مِنْ خَيْرٍ فَلَن يُكْفَرُوهُ ۗ وَاللَّهُ عَلِيمٌ بِالْمُتَّقِينَ
వారు ఏ మంచి పనిచేసినా దానికి విలువ ఇవ్వకపోవటం అనేది జరగదు. భయభక్తులు గలవారి గురించి అల్లాహ్‌కు బాగా తెలుసు.
3:116 إِنَّ الَّذِينَ كَفَرُوا لَن تُغْنِيَ عَنْهُمْ أَمْوَالُهُمْ وَلَا أَوْلَادُهُم مِّنَ اللَّهِ شَيْئًا ۖ وَأُولَٰئِكَ أَصْحَابُ النَّارِ ۚ هُمْ فِيهَا خَالِدُونَ
ఇకపోతే అవిశ్వాసులు; వారి సంపదగానీ, సంతానం గానీ దైవ సమక్షంలో వారికి ఏ మాత్రం పనికిరావు. వారు నరకాగ్ని వాసులు. కలకాలం అందులోనే పడి ఉంటారు.
3:117 مَثَلُ مَا يُنفِقُونَ فِي هَٰذِهِ الْحَيَاةِ الدُّنْيَا كَمَثَلِ رِيحٍ فِيهَا صِرٌّ أَصَابَتْ حَرْثَ قَوْمٍ ظَلَمُوا أَنفُسَهُمْ فَأَهْلَكَتْهُ ۚ وَمَا ظَلَمَهُمُ اللَّهُ وَلَٰكِنْ أَنفُسَهُمْ يَظْلِمُونَ
ఈ అవిశ్వాసులు ఇహలోక జీవితంలో చేస్తున్న ఖర్చు తీవ్రమయిన చలిగాలులు తగిలి సర్వనాశనమైన దుర్మార్గుల పొలాన్ని పోలినది. అల్లాహ్ వారికెలాంటి అన్యాయమూ చేయలేదు. వాస్తవానికి వారే తమ మీద తాము అన్యాయం చేసుకునే వారు.
3:118 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَتَّخِذُوا بِطَانَةً مِّن دُونِكُمْ لَا يَأْلُونَكُمْ خَبَالًا وَدُّوا مَا عَنِتُّمْ قَدْ بَدَتِ الْبَغْضَاءُ مِنْ أَفْوَاهِهِمْ وَمَا تُخْفِي صُدُورُهُمْ أَكْبَرُ ۚ قَدْ بَيَّنَّا لَكُمُ الْآيَاتِ ۖ إِن كُنتُمْ تَعْقِلُونَ
ఓ విశ్వాసులారా! మీరు మీ వారిని తప్ప వేరితరులను మీ ఆంతరంగికులుగా చేసుకోకండి. ఇతరులు మీకు నష్టం కలిగించటానికి తమకు దొరికే ఏ అవకాశాన్నీ విడిచిపెట్టరు. మీరు కష్టాల్లో పడాలన్నదే వారి కోరిక. వారిలోని అక్కసు స్వయంగా వారి నోట వెల్లడయింది. ఇక వారు తమ ఆంతర్యాల్లో దాచి ఉంచినది మరింత తీవ్రమైనది. మేము మీ కొరకు సూచనలను స్పష్టం చేశాము. మీరు బుద్ధిమంతులే అయితే (వీటిపై యోచన చేయండి).
3:119 هَا أَنتُمْ أُولَاءِ تُحِبُّونَهُمْ وَلَا يُحِبُّونَكُمْ وَتُؤْمِنُونَ بِالْكِتَابِ كُلِّهِ وَإِذَا لَقُوكُمْ قَالُوا آمَنَّا وَإِذَا خَلَوْا عَضُّوا عَلَيْكُمُ الْأَنَامِلَ مِنَ الْغَيْظِ ۚ قُلْ مُوتُوا بِغَيْظِكُمْ ۗ إِنَّ اللَّهَ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ
మీరైతే వారిని ప్రేమిస్తున్నారు. కాని వారు మాత్రం మిమ్మల్ని ప్రేమించటం లేదు. మీరు గ్రంథాన్నంతటినీ విశ్వసిస్తున్నారు (కాని వారు విశ్వసించటం లేదు. మరలాంటప్పుడు వారు మీకు స్నేహితులెలా అవుతారు?). వారు మిమ్మల్ని కలసినప్పుడు తాము విశ్వసించామని చెబుతారు, కాని మీ దగ్గరి నుంచి తప్పుకున్నప్పుడు మీపై కోపంకొద్దీ తమ వ్రేళ్లను కసిగా కొరుక్కుం టారు. ”మీరు మీ కోపావేశంలోనే చావండి. నిశ్చయంగా అల్లాహ్ గుండెల్లోని గుట్టును గురించి బాగా తెలిసినవాడు” అని వారికి చెప్పండి.
3:120 إِن تَمْسَسْكُمْ حَسَنَةٌ تَسُؤْهُمْ وَإِن تُصِبْكُمْ سَيِّئَةٌ يَفْرَحُوا بِهَا ۖ وَإِن تَصْبِرُوا وَتَتَّقُوا لَا يَضُرُّكُمْ كَيْدُهُمْ شَيْئًا ۗ إِنَّ اللَّهَ بِمَا يَعْمَلُونَ مُحِيطٌ
మీకేదైనా మేలు కలిగితే వారు బాధపడతారు. అదే మీకేదైనా హాని జరిగితే మాత్రం ఆనందిస్తారు. మీరే గనక సహనంతో, భయభక్తులతో వ్యవహరించినట్లయితే వారి కుట్ర మీకెలాంటి నష్టమూ చేకూర్చదు. ఎందుకంటే వారి కార్యకలాపాలన్నింటినీ అల్లాహ్ ముట్టడించి ఉన్నాడు.
3:121 وَإِذْ غَدَوْتَ مِنْ أَهْلِكَ تُبَوِّئُ الْمُؤْمِنِينَ مَقَاعِدَ لِلْقِتَالِ ۗ وَاللَّهُ سَمِيعٌ عَلِيمٌ
(ఓ ప్రవక్తా! ఆ సమయాన్ని కూడా జ్ఞప్తికి తెచ్చుకో,) అప్పుడు నీవు తెలతెలవారుతుండగా నీ ఇంటి నుండి బయలుదేరి రణరంగంలో విశ్వాసులు మోహరించవలసిన స్థలాలను నిర్థారించ సాగావు. అల్లాహ్ అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు.
3:122 إِذْ هَمَّت طَّائِفَتَانِ مِنكُمْ أَن تَفْشَلَا وَاللَّهُ وَلِيُّهُمَا ۗ وَعَلَى اللَّهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُونَ
మీలోని రెండు సమూహాల వారి ఆత్మవిశ్వాసం సన్నగిల్లినప్పుడు అల్లాహ్ వారికి అండగా ఉన్నాడు. విశ్వాసులైన వారు సదా అల్లాహ్‌నే నమ్ముకోవాలి.
3:123 وَلَقَدْ نَصَرَكُمُ اللَّهُ بِبَدْرٍ وَأَنتُمْ أَذِلَّةٌ ۖ فَاتَّقُوا اللَّهَ لَعَلَّكُمْ تَشْكُرُونَ
బద్ర్ (యుద్ధం)లో మీరు అత్యంత దయనీయ స్థితిలో ఉన్నప్పుడు అల్లాహ్ మిమ్మల్ని ఆదుకున్నాడు. కాబట్టి అల్లాహ్‌కు మాత్రమే భయపడండి. తద్వారా మీకు కృతజ్ఞతలు తెలుపుకునే సద్బుద్ధి ప్రాప్తిస్తుంది.
3:124 إِذْ تَقُولُ لِلْمُؤْمِنِينَ أَلَن يَكْفِيَكُمْ أَن يُمِدَّكُمْ رَبُّكُم بِثَلَاثَةِ آلَافٍ مِّنَ الْمَلَائِكَةِ مُنزَلِينَ
(ఈ కృతజ్ఞతల మూలంగానే మీకు సహాయ సహకారాలు అందవచ్చు. (ఓ ప్రవక్తా!) నీవు విశ్వాసులను ఓదార్చిన ఆ ఘడియలను కాస్త జ్ఞాపకం చేసుకో!) ”ఏమిటీ, ఆకాశం నుంచి మూడు వేల మంది దూతలను దింపి మీ ప్రభువు మీకు తోడ్పడటం మీకు చాలదా?” అని అప్పుడు నువ్వు వారితో అన్నావు.
3:125 بَلَىٰ ۚ إِن تَصْبِرُوا وَتَتَّقُوا وَيَأْتُوكُم مِّن فَوْرِهِمْ هَٰذَا يُمْدِدْكُمْ رَبُّكُم بِخَمْسَةِ آلَافٍ مِّنَ الْمَلَائِكَةِ مُسَوِّمِينَ
”అవును. మీరే గనక సహనం వహించి, భయభక్తులతో మెలగుతూ ఉండి, వారు (దైవ విరోధులు) ఇదే ఆవేశంతో మీపైకి దండెత్తివస్తే, మీ ప్రభువు ఐదువేల మంది ప్రత్యేక చిహ్నాలుగల దూతలతో మీకు సాయమందిస్తాడు.”
3:126 وَمَا جَعَلَهُ اللَّهُ إِلَّا بُشْرَىٰ لَكُمْ وَلِتَطْمَئِنَّ قُلُوبُكُم بِهِ ۗ وَمَا النَّصْرُ إِلَّا مِنْ عِندِ اللَّهِ الْعَزِيزِ الْحَكِيمِ
అల్లాహ్ మీ కొరకు దీనిని శుభవార్తగానూ, ఇంకా మీ మనోనిబ్బరం కోసం జరిగే ఏర్పాటుగానూ చేశాడు. యదార్థానికి అసలు సహాయం మాత్రం అల్లాహ్ తరఫు నుంచి లభించేదే. ఆయన సర్వాధిక్యుడు, వివేచనాపరుడు.
3:127 لِيَقْطَعَ طَرَفًا مِّنَ الَّذِينَ كَفَرُوا أَوْ يَكْبِتَهُمْ فَيَنقَلِبُوا خَائِبِينَ
అవిశ్వాసులలోని ఒక వర్గం కథ ముగించడానికి లేదా వారిని పరాభవం పాలుచేయడానికి, (వారంతా) ఓటమిపాలై వెనుతిరిగిపోవటానికిగాను (అల్లాహ్ మీకు ఈ సహాయమందించాడు).
3:128 لَيْسَ لَكَ مِنَ الْأَمْرِ شَيْءٌ أَوْ يَتُوبَ عَلَيْهِمْ أَوْ يُعَذِّبَهُمْ فَإِنَّهُمْ ظَالِمُونَ
(ఓ ప్రవక్తా! ఈ వ్యవహారంలో) నీకెలాంటి నిర్ణయాధికారం లేదు. అల్లాహ్ (గనక తలిస్తే) వారి పశ్చాత్తాపాన్ని ఆమోదిస్తాడు లేదా వారిని శిక్షిస్తాడు. ప్రస్తుతానికి వారు అక్రమానికి పాల్పడినవారే!
3:129 وَلِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۚ يَغْفِرُ لِمَن يَشَاءُ وَيُعَذِّبُ مَن يَشَاءُ ۚ وَاللَّهُ غَفُورٌ رَّحِيمٌ
భూమ్యాకాశాలలో వున్నదంతా అల్లాహ్‌దే. ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు, తాను కోరిన వారిని శిక్షిస్తాడు. అల్లాహ్ క్షమించేవాడూ, కరుణించేవాడు కూడాను.
3:130 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَأْكُلُوا الرِّبَا أَضْعَافًا مُّضَاعَفَةً ۖ وَاتَّقُوا اللَّهَ لَعَلَّكُمْ تُفْلِحُونَ
ఓ విశ్వసించిన వారలారా! ద్విగుణీకృతం, బహుగుణీకృతం చేసి వడ్డీని తినకండి. మీరు సాఫల్యం పొందటానికి గాను అల్లాహ్‌కు భయపడండి.
3:131 وَاتَّقُوا النَّارَ الَّتِي أُعِدَّتْ لِلْكَافِرِينَ
అవిశ్వాసుల కొరకు సిద్ధం చేయబడిన నరకాగ్నికి భయపడండి.
3:132 وَأَطِيعُوا اللَّهَ وَالرَّسُولَ لَعَلَّكُمْ تُرْحَمُونَ
అల్లాహ్కూ, ప్రవక్తకూ విధేయత చూపండి – తద్వారా మీరు కనికరించబడే అవకాశం ఉంది.
3:133 وَسَارِعُوا إِلَىٰ مَغْفِرَةٍ مِّن رَّبِّكُمْ وَجَنَّةٍ عَرْضُهَا السَّمَاوَاتُ وَالْأَرْضُ أُعِدَّتْ لِلْمُتَّقِينَ
మీ ప్రభువు యొక్క క్షమాభిక్ష వైపునకు, స్వర్గం వైపునకు పరుగెత్తండి. ఆ స్వర్గం వెడల్పు భూమ్యాకాశాలంత ఉంటుంది. అది భయభక్తులు గలవారి కోసం తయారు చేయబడింది.
3:134 الَّذِينَ يُنفِقُونَ فِي السَّرَّاءِ وَالضَّرَّاءِ وَالْكَاظِمِينَ الْغَيْظَ وَالْعَافِينَ عَنِ النَّاسِ ۗ وَاللَّهُ يُحِبُّ الْمُحْسِنِينَ
వారు కలిమిలోనూ, లేమిలోనూ (దైవమార్గంలో) ఖర్చు చేస్తారు. కోపాన్ని దిగమ్రింగుతారు, ప్రజల పట్ల మన్నింపుల వైఖరిని అవలంబిస్తారు. అల్లాహ్ ఇలాంటి సదాచార సంపన్నులనే ప్రేమిస్తాడు.
3:135 وَالَّذِينَ إِذَا فَعَلُوا فَاحِشَةً أَوْ ظَلَمُوا أَنفُسَهُمْ ذَكَرُوا اللَّهَ فَاسْتَغْفَرُوا لِذُنُوبِهِمْ وَمَن يَغْفِرُ الذُّنُوبَ إِلَّا اللَّهُ وَلَمْ يُصِرُّوا عَلَىٰ مَا فَعَلُوا وَهُمْ يَعْلَمُونَ
తమ ద్వారా ఏదైనా నీతిబాహ్యమైన పని జరిగిపోతే లేదా తమ ఆత్మలకు వారు ఏదైనా అన్యాయం చేసుకుంటే వెంటనే అల్లాహ్‌ను తలచుకుని, తమ పాపాల క్షమాపణకై వేడుకుంటారు. – నిజానికి అల్లాహ్ తప్ప పాపాలను క్షమించే వాడెవడున్నాడు? – వారు తమ వల్ల జరిగింది తప్పు అని తెలిసినపుడు దానిపై హటం చెయ్యరు.
3:136 أُولَٰئِكَ جَزَاؤُهُم مَّغْفِرَةٌ مِّن رَّبِّهِمْ وَجَنَّاتٌ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا ۚ وَنِعْمَ أَجْرُ الْعَامِلِينَ
తమ ప్రభువు తరఫు నుంచి క్షమాభిక్ష, క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలు ప్రతిఫలంగా లభించేది ఇటువంటి వారికే. వాటిలో వారు ఎల్లకాలం ఉంటారు. ఈ సత్కార్యాలు చేసేవారికి లభించే పుణ్యఫలం ఎంత చక్కనిది!
3:137 قَدْ خَلَتْ مِن قَبْلِكُمْ سُنَنٌ فَسِيرُوا فِي الْأَرْضِ فَانظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُكَذِّبِينَ
మీకు పూర్వం కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. కనుక (దివ్య సందేశాన్ని) ధిక్కరించిన వారికి పట్టిన గతేమిటో భూమిలో సంచరించి చూడండి.
3:138 هَٰذَا بَيَانٌ لِّلنَّاسِ وَهُدًى وَمَوْعِظَةٌ لِّلْمُتَّقِينَ
సామాన్య ప్రజానీకం కోసం ఇది (ఈ ఖుర్ఆన్) ఒక బోధన. భయభక్తులు కలవారి కోసమైతే ఇది మార్గదర్శకం మరియు హితోపదేశం.
3:139 وَلَا تَهِنُوا وَلَا تَحْزَنُوا وَأَنتُمُ الْأَعْلَوْنَ إِن كُنتُم مُّؤْمِنِينَ
క్రుంగిపోకండి, దుఃఖించకండి. విశ్వాసులుగా ఉంటే కడకు మీరే ఆధిక్యత పొందుతారు.
3:140 إِن يَمْسَسْكُمْ قَرْحٌ فَقَدْ مَسَّ الْقَوْمَ قَرْحٌ مِّثْلُهُ ۚ وَتِلْكَ الْأَيَّامُ نُدَاوِلُهَا بَيْنَ النَّاسِ وَلِيَعْلَمَ اللَّهُ الَّذِينَ آمَنُوا وَيَتَّخِذَ مِنكُمْ شُهَدَاءَ ۗ وَاللَّهُ لَا يُحِبُّ الظَّالِمِينَ
మీరు దెబ్బతిన్నారనుకుంటే మీ ప్రత్యర్థులు కూడా అలాగే దెబ్బతిన్నారు. మేము ఈ కాలచక్రాన్ని జనుల మధ్య త్రిప్పుతూ ఉంటాము. (ఉహుద్ యుద్ధంలో మీకు ఎదురైన అపజయానికి అసలు కారణం ఏమిటంటే) మీలో (నికార్సయిన) విశ్వాసులు ఎవరో అల్లాహ్ చూపించదలిచాడు. మీలో కొందరికి ‘షహాదత్’ (వీర మరణ) స్థాయిని కూడా ఆయన ప్రసాదించదలిచాడు. అల్లాహ్ దుర్మార్గులను సుతరామూ ఇష్టపడడు.
3:141 وَلِيُمَحِّصَ اللَّهُ الَّذِينَ آمَنُوا وَيَمْحَقَ الْكَافِرِينَ
ఈ పరీక్ష ద్వారా అల్లాహ్ సిసలైన విశ్వాసులను వేరు చేసి అవిశ్వాసులను తుదముట్టించదలిచాడు.
3:142 أَمْ حَسِبْتُمْ أَن تَدْخُلُوا الْجَنَّةَ وَلَمَّا يَعْلَمِ اللَّهُ الَّذِينَ جَاهَدُوا مِنكُمْ وَيَعْلَمَ الصَّابِرِينَ
ఏమిటీ, మీరు స్వర్గంలో (ఇట్టే) ప్రవేశించగలమని అనుకుంటున్నారా? వాస్తవానికి మీలో (తన మార్గంలో) పోరాడేవారెవరో, ఓర్పు వహించేవారెవరో ఇప్పటివరకూ అల్లాహ్ పరీక్షించనే లేదు.
3:143 وَلَقَدْ كُنتُمْ تَمَنَّوْنَ الْمَوْتَ مِن قَبْلِ أَن تَلْقَوْهُ فَقَدْ رَأَيْتُمُوهُ وَأَنتُمْ تَنظُرُونَ
యుద్ధానికి ముందైతే మీరు (వీర) మరణాన్ని ఎంతగానో కోరుకునేవారు. ఇప్పుడు దాన్ని మీరు మీ కళ్లారా తిలకించారు.
3:144 وَمَا مُحَمَّدٌ إِلَّا رَسُولٌ قَدْ خَلَتْ مِن قَبْلِهِ الرُّسُلُ ۚ أَفَإِن مَّاتَ أَوْ قُتِلَ انقَلَبْتُمْ عَلَىٰ أَعْقَابِكُمْ ۚ وَمَن يَنقَلِبْ عَلَىٰ عَقِبَيْهِ فَلَن يَضُرَّ اللَّهَ شَيْئًا ۗ وَسَيَجْزِي اللَّهُ الشَّاكِرِينَ
ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఒక ప్రవక్త మాత్రమే. ఈయనకు పూర్వం కూడా (చాలామంది) ప్రవక్తలు గతించారు. ఒకవేళ ఈయన చనిపోతే లేక చంపబడితే మీరు- ఇస్లాం నుంచి – వెనుతిరిగిపోతారా? వెనుతిరిగిపోయేవాడు అల్లాహ్‌కు ఏ మాత్రం హాని కలిగించలేడు. కృతజ్ఞతలు తెలిపే వారికి అల్లాహ్ త్వరలోనే మంచి ప్రతిఫలం వొసగుతాడు.
3:145 وَمَا كَانَ لِنَفْسٍ أَن تَمُوتَ إِلَّا بِإِذْنِ اللَّهِ كِتَابًا مُّؤَجَّلًا ۗ وَمَن يُرِدْ ثَوَابَ الدُّنْيَا نُؤْتِهِ مِنْهَا وَمَن يُرِدْ ثَوَابَ الْآخِرَةِ نُؤْتِهِ مِنْهَا ۚ وَسَنَجْزِي الشَّاكِرِينَ
దైవాజ్ఞ కానంతవరకూ ఏ ప్రాణీ చావదు. నిర్థారిత సమయం రాయబడి ఉంది. ప్రాపంచిక ఫలితాన్ని కోరుకున్న వారికి మేము ఎంతో కొంత ఇచ్చేస్తాము. పరలోక ప్రతిఫలాన్ని కోరుకున్న వారికి మేము దాన్ని కూడా అనుగ్రహిస్తాము. కృతజ్ఞులై ఉండేవారికి మేము త్వరలోనే మంచి ప్రతిఫలాన్ని వొసగుతాము.
3:146 وَكَأَيِّن مِّن نَّبِيٍّ قَاتَلَ مَعَهُ رِبِّيُّونَ كَثِيرٌ فَمَا وَهَنُوا لِمَا أَصَابَهُمْ فِي سَبِيلِ اللَّهِ وَمَا ضَعُفُوا وَمَا اسْتَكَانُوا ۗ وَاللَّهُ يُحِبُّ الصَّابِرِينَ
ఎంతోమంది ప్రవక్తలకు ఆదరువుగా నిలిచి, ఎందరో అల్లాహ్ భక్తులు దైవమార్గంలో పోరాడారు. వారికి కూడా అల్లాహ్ మార్గంలో కష్టాలెదురయ్యాయి. కాని వారెన్నడూ ధైర్యం కోల్పో లేదు, అశక్తతకు లోనుకాలేదు, లొంగిపోనూ లేదు. అల్లాహ్ ఇష్టపడేది (ఇలాంటి) సహనమూర్తులనే.
3:147 وَمَا كَانَ قَوْلَهُمْ إِلَّا أَن قَالُوا رَبَّنَا اغْفِرْ لَنَا ذُنُوبَنَا وَإِسْرَافَنَا فِي أَمْرِنَا وَثَبِّتْ أَقْدَامَنَا وَانصُرْنَا عَلَى الْقَوْمِ الْكَافِرِينَ
వారిది ఒక్కటే పలుకు : ”మా ప్రభూ! మా పాపాలను క్షమించు. మా పనుల్లో మా వల్ల జరిగిన ‘అతి’ని మన్నించు. మా పాదాలకు నిలకడను ప్రసాదించు. అవిశ్వాస జనులకు వ్యతిరేకంగా మాకు తోడ్పాటునందించు.”
3:148 فَآتَاهُمُ اللَّهُ ثَوَابَ الدُّنْيَا وَحُسْنَ ثَوَابِ الْآخِرَةِ ۗ وَاللَّهُ يُحِبُّ الْمُحْسِنِينَ
అల్లాహ్ వారికి ప్రాపంచిక ఫలాన్నీ ఇచ్చాడు, పరలోకపు ఉత్తమ పుణ్య ఫలాన్ని కూడా ప్రసాదించాడు. సత్కార్యాలను ఉత్తమరీతిలో నిర్వర్తించేవారిని అల్లాహ్ ఎంతగానో ప్రేమిస్తాడు.
3:149 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِن تُطِيعُوا الَّذِينَ كَفَرُوا يَرُدُّوكُمْ عَلَىٰ أَعْقَابِكُمْ فَتَنقَلِبُوا خَاسِرِينَ
ఓ విశ్వాసులారా! మీరు గనక అవిశ్వాసుల మాట విన్నారంటే, వారు మిమ్మల్ని మీ కాలి మడమలపైనే తిరోన్ముఖుల్ని చేస్తారు (ధర్మభ్రష్టుల్ని చేస్తారు). అప్పుడు నష్టపోయేది మీరే.
3:150 بَلِ اللَّهُ مَوْلَاكُمْ ۖ وَهُوَ خَيْرُ النَّاصِرِينَ
వాస్తవానికి అల్లాహ్‌యే మీ రక్షకుడు, ఆయనే అత్యుత్తమ సహాయకుడూను.
3:151 سَنُلْقِي فِي قُلُوبِ الَّذِينَ كَفَرُوا الرُّعْبَ بِمَا أَشْرَكُوا بِاللَّهِ مَا لَمْ يُنَزِّلْ بِهِ سُلْطَانًا ۖ وَمَأْوَاهُمُ النَّارُ ۚ وَبِئْسَ مَثْوَى الظَّالِمِينَ
త్వరలోనే మేము అవిశ్వాసుల హృదయాలలో భయాన్ని కలిగిస్తాము. ఎందుకంటే అల్లాహ్ ఏ ప్రమాణాన్నీ అవతరింప జేయనప్పటికీ – నిరాధారంగా – వారు ఇతరత్రా వాటిని అల్లాహ్‌కు భాగస్వాములుగా కల్పిస్తున్నారు. కనుక నరకాగ్నియే వారి నివాస స్థలం. అది దుర్మార్గుల చెడ్డ నివాసం.
3:152 وَلَقَدْ صَدَقَكُمُ اللَّهُ وَعْدَهُ إِذْ تَحُسُّونَهُم بِإِذْنِهِ ۖ حَتَّىٰ إِذَا فَشِلْتُمْ وَتَنَازَعْتُمْ فِي الْأَمْرِ وَعَصَيْتُم مِّن بَعْدِ مَا أَرَاكُم مَّا تُحِبُّونَ ۚ مِنكُم مَّن يُرِيدُ الدُّنْيَا وَمِنكُم مَّن يُرِيدُ الْآخِرَةَ ۚ ثُمَّ صَرَفَكُمْ عَنْهُمْ لِيَبْتَلِيَكُمْ ۖ وَلَقَدْ عَفَا عَنكُمْ ۗ وَاللَّهُ ذُو فَضْلٍ عَلَى الْمُؤْمِنِينَ
అల్లాహ్ మీకు చేసిన వాగ్దానాన్ని నిజం చేసి చూపాడు. అప్పుడు మీరు ఆయన అనుజ్ఞతో వారిని వధించసాగారు. అయితే ఆఖరికి మీరు పిరికితనం చూపారు. కార్యనిర్వహణలో విభేదించుకున్నారు. మీరు ఇష్టపడే వస్తువును ఆయన మీకు చూపేసరికి, మీరు అవిధేయతకు ఒడిగట్టారు. మీలో కొందరు ప్రపంచం కోసం ప్రాకులాడగా, మరికొందరు పరలోకాన్ని కోరుకున్నారు. అందువల్ల అల్లాహ్ మిమ్మల్ని పరీక్షించే నిమిత్తం, మిమ్మల్ని వారి నుంచి వెనక్కి మళ్లించాడు. అయినా ఆయన మిమ్మల్ని క్షమించాడు. యదార్థానికి అల్లాహ్ విశ్వాసుల పట్ల గొప్ప అనుగ్రహం గలవాడు..
3:153 إِذْ تُصْعِدُونَ وَلَا تَلْوُونَ عَلَىٰ أَحَدٍ وَالرَّسُولُ يَدْعُوكُمْ فِي أُخْرَاكُمْ فَأَثَابَكُمْ غَمًّا بِغَمٍّ لِّكَيْلَا تَحْزَنُوا عَلَىٰ مَا فَاتَكُمْ وَلَا مَا أَصَابَكُمْ ۗ وَاللَّهُ خَبِيرٌ بِمَا تَعْمَلُونَ
ఆ సమయంలో మీరు పరారవసాగారు. ఇంకొకరిని పట్టించుకునే ధ్యాసే మీకు లేకపోయింది. ఆ క్షణంలో వెనుక నుంచి ప్రవక్త మిమ్మల్ని కేక వేస్తూనే వున్నాడు. కనుక మీకు దక్కకుండా పోయిన దాని గురించి, వాటిల్లిన నష్టాన్ని గురించి మీరు బాధపడకుండా ఉండటానికి అల్లాహ్ మీకు దుఃఖం వెంబడి దుఃఖం కలుగజేశాడు. మీరు చేసే పనులన్నీ అల్లాహ్‌కు తెలుసు.
3:154 ثُمَّ أَنزَلَ عَلَيْكُم مِّن بَعْدِ الْغَمِّ أَمَنَةً نُّعَاسًا يَغْشَىٰ طَائِفَةً مِّنكُمْ ۖ وَطَائِفَةٌ قَدْ أَهَمَّتْهُمْ أَنفُسُهُمْ يَظُنُّونَ بِاللَّهِ غَيْرَ الْحَقِّ ظَنَّ الْجَاهِلِيَّةِ ۖ يَقُولُونَ هَل لَّنَا مِنَ الْأَمْرِ مِن شَيْءٍ ۗ قُلْ إِنَّ الْأَمْرَ كُلَّهُ لِلَّهِ ۗ يُخْفُونَ فِي أَنفُسِهِم مَّا لَا يُبْدُونَ لَكَ ۖ يَقُولُونَ لَوْ كَانَ لَنَا مِنَ الْأَمْرِ شَيْءٌ مَّا قُتِلْنَا هَاهُنَا ۗ قُل لَّوْ كُنتُمْ فِي بُيُوتِكُمْ لَبَرَزَ الَّذِينَ كُتِبَ عَلَيْهِمُ الْقَتْلُ إِلَىٰ مَضَاجِعِهِمْ ۖ وَلِيَبْتَلِيَ اللَّهُ مَا فِي صُدُورِكُمْ وَلِيُمَحِّصَ مَا فِي قُلُوبِكُمْ ۗ وَاللَّهُ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ
మరి ఈ దుఃఖం తరువాత ఆయన శాంతియుత స్థితిని మీపై అవతరింపజేశాడు. దాంతో మీలోని ఒక వర్గం వారిపై కునుకు ఆవహించసాగింది. అయితే మరోవర్గం వారు తమ ప్రాణరక్షణ గురించి తీవ్ర విచారంలో పడిపోయారు. వారు అల్లాహ్ యెడల మరీ అజ్ఞానంతో కూడిన, సత్యదూరమైన సందేహాలను, అనుమానాలను వ్యక్తపరచసాగారు. ”ఇంతకీ మాకంటూ ఏదన్నా అధికారం ఉందా?” అని వారనేవారు. ”దీనికి సంబంధించిన నిర్ణయాధికారం అంతా అల్లాహ్‌దే” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు. వారు తమ ఆంతర్యాల్లో అణచి పెట్టుకున్న విషయాలను నీ ముందు వెలిబుచ్చటం లేదు. ”మాకంటూ అధికారమేదైనా ఉండి ఉంటే మేమిలా హత మార్చబడి ఉండేవాళ్ళం కాము” అని వారంటున్నారు. (అంటే తమ మనుషులు చంపబడేవారు కాదు అని వారి అభిప్రాయం). ”ఒకవేళ మీరు మీ ఇండ్లల్లోనే ఉన్నప్పటికీ, వధించబడటం అన్నది మీకు రాసిపెట్టి ఉంటే మీ అంతట మీరే వధ్యస్థలాలకు వచ్చి తీర్తారు” అని వారికి చెప్పు. మీ మనసుల్లో దాగి ఉన్న వాటిని పరికించేందుకు, మీ హృదయాలలో వున్న దానిని శుద్ధి చేసేందుకు (అల్లాహ్ ఈ పరిస్థితులను ఉత్పన్నం చేశాడు). అల్లాహ్ గుండెల్లోని గుట్టును బాగా ఎరిగినవాడు.
3:155 إِنَّ الَّذِينَ تَوَلَّوْا مِنكُمْ يَوْمَ الْتَقَى الْجَمْعَانِ إِنَّمَا اسْتَزَلَّهُمُ الشَّيْطَانُ بِبَعْضِ مَا كَسَبُوا ۖ وَلَقَدْ عَفَا اللَّهُ عَنْهُمْ ۗ إِنَّ اللَّهَ غَفُورٌ حَلِيمٌ
ఇరు సమూహాలు ముఖాముఖీ అయిన రోజున మీలో కొందరు వెన్నుచూపారు. వారు చేసిన కొన్ని తప్పుల వల్ల షైతాన్ వారిని తడబాటుకు లోనుచేశాడు. అయినా అల్లాహ్ వారిని మన్నించాడు. అల్లాహ్ క్షమించేవాడు, సహనశీలుడూను.
3:156 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَكُونُوا كَالَّذِينَ كَفَرُوا وَقَالُوا لِإِخْوَانِهِمْ إِذَا ضَرَبُوا فِي الْأَرْضِ أَوْ كَانُوا غُزًّى لَّوْ كَانُوا عِندَنَا مَا مَاتُوا وَمَا قُتِلُوا لِيَجْعَلَ اللَّهُ ذَٰلِكَ حَسْرَةً فِي قُلُوبِهِمْ ۗ وَاللَّهُ يُحْيِي وَيُمِيتُ ۗ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ
ఓ విశ్వసించిన వారలారా! మీరు ఆ అవిశ్వాసుల్లాగా ప్రవర్తించకండి. వారు, తమ సోదరులు ప్రయాణంలోనో, యుద్ధంలోనో ఉన్నప్పుడు, ”ఒకవేళ వారు మా వద్దనే ఉండి ఉంటే చనిపోయేవారూ కాదు, చంపబడేవారూ కాదు” అని అంటారు. ఈ విధమైన తమ ఆలోచనలను అల్లాహ్ తమ హృదయశోకానికి కారణాలుగా చేయాలనే వారిలాంటి మాటలు మాట్లాడుతుంటారు. వాస్తవానికి ప్రాణభిక్ష పెట్టేవాడు, ప్రాణం తీసేవాడు అల్లాహ్ మాత్రమే. మీరు చేసే పనులన్నిటినీ అల్లాహ్ కనిపెడుతూనే ఉన్నాడు.
3:157 وَلَئِن قُتِلْتُمْ فِي سَبِيلِ اللَّهِ أَوْ مُتُّمْ لَمَغْفِرَةٌ مِّنَ اللَّهِ وَرَحْمَةٌ خَيْرٌ مِّمَّا يَجْمَعُونَ
మీరు దైవమార్గంలో చంపబడినా లేక చనిపోయినా, (మీకు లభించే) దేవుని క్షమాభిక్ష మరియు కారుణ్యం వారు కూడబెడుతున్న దానికన్నా ఎంతో మేలైనవి.
3:158 وَلَئِن مُّتُّمْ أَوْ قُتِلْتُمْ لَإِلَى اللَّهِ تُحْشَرُونَ
మీరు చనిపోయినా లేక చంపబడినా (చివరకు) మీరు సమీకరించబడేది అల్లాహ్ వద్దకే (అని మరువకండి).
3:159 فَبِمَا رَحْمَةٍ مِّنَ اللَّهِ لِنتَ لَهُمْ ۖ وَلَوْ كُنتَ فَظًّا غَلِيظَ الْقَلْبِ لَانفَضُّوا مِنْ حَوْلِكَ ۖ فَاعْفُ عَنْهُمْ وَاسْتَغْفِرْ لَهُمْ وَشَاوِرْهُمْ فِي الْأَمْرِ ۖ فَإِذَا عَزَمْتَ فَتَوَكَّلْ عَلَى اللَّهِ ۚ إِنَّ اللَّهَ يُحِبُّ الْمُتَوَكِّلِينَ
(ఓ ప్రవక్తా!) అల్లాహ్ దయవల్లనే నీవు వారి యెడల మృదు మనస్కుడవయ్యావు. ఒకవేళ నువ్వే గనక కర్కశుడవు, కఠిన మనస్కుడవు అయివుంటే వారంతా నీ దగ్గరి నుంచి వెళ్ళిపోయేవారు. కనుక నువ్వు వారిపట్ల మన్నింపుల వైఖరిని అవలంబించు, వారి క్షమాపణ కోసం (దైవాన్ని) వేడుకో. కార్య నిర్వహణలో వారిని సంప్రదిస్తూ ఉండు. ఏదైనా పని గురించి తుది నిర్ణయానికి వచ్చినప్పుడు, అల్లాహ్‌పై భారం మోపు. నిశ్చయంగా అల్లాహ్ తనను నమ్ముకున్న వారిని ప్రేమిస్తాడు.
3:160 إِن يَنصُرْكُمُ اللَّهُ فَلَا غَالِبَ لَكُمْ ۖ وَإِن يَخْذُلْكُمْ فَمَن ذَا الَّذِي يَنصُرُكُم مِّن بَعْدِهِ ۗ وَعَلَى اللَّهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُونَ
అల్లాహ్‌యే గనక మీకు తోడ్పాటునందిస్తే ఇక మిమ్మల్ని ఎవరూ జయించలేరు. ఒకవేళ ఆయనే గనక మిమ్మల్ని విడిచి పెట్టేస్తే, తరువాత మీకు సహాయపడ గలవాడెవడు? కాబట్టి విశ్వసించినవారు సదా అల్లాహ్‌నే నమ్ముకోవాలి.
3:161 وَمَا كَانَ لِنَبِيٍّ أَن يَغُلَّ ۚ وَمَن يَغْلُلْ يَأْتِ بِمَا غَلَّ يَوْمَ الْقِيَامَةِ ۚ ثُمَّ تُوَفَّىٰ كُلُّ نَفْسٍ مَّا كَسَبَتْ وَهُمْ لَا يُظْلَمُونَ
ఒక ప్రవక్త ద్రోహానికి పాల్పడటమనేది జరగని పని. ద్రోహానికి పాల్పడే ప్రతి ఒక్కడూ తను ద్రోహానికి పాల్పడిన దానిని తీసుకుని ప్రళయదినాన హాజరవుతాడు. తరువాత ప్రతి ఒక్కరికీ వారు చేసుకున్న కర్మలకు పూర్తి ప్రతిఫలం ఇవ్వబడుతుంది. వారికెలాంటి అన్యాయం జరగదు.
3:162 أَفَمَنِ اتَّبَعَ رِضْوَانَ اللَّهِ كَمَن بَاءَ بِسَخَطٍ مِّنَ اللَّهِ وَمَأْوَاهُ جَهَنَّمُ ۚ وَبِئْسَ الْمَصِيرُ
ఏమిటీ, దైవ ప్రసన్నతకు అనుగుణంగా నడుచుకున్న వాడు, దైవాగ్రహానికి పాత్రుడై అతిచెడ్డ నివాసమైన నరకానికి పోయేవానితో సమానుడవుతాడా?
3:163 هُمْ دَرَجَاتٌ عِندَ اللَّهِ ۗ وَاللَّهُ بَصِيرٌ بِمَا يَعْمَلُونَ
అల్లాహ్ వద్ద వారి స్థానాలు వేర్వేరుగా ఉన్నాయి సుమా! వారు చేసేదంతా అల్లాహ్ చూస్తూనే ఉన్నాడు.
3:164 لَقَدْ مَنَّ اللَّهُ عَلَى الْمُؤْمِنِينَ إِذْ بَعَثَ فِيهِمْ رَسُولًا مِّنْ أَنفُسِهِمْ يَتْلُو عَلَيْهِمْ آيَاتِهِ وَيُزَكِّيهِمْ وَيُعَلِّمُهُمُ الْكِتَابَ وَالْحِكْمَةَ وَإِن كَانُوا مِن قَبْلُ لَفِي ضَلَالٍ مُّبِينٍ
అల్లాహ్ విశ్వాసులకు చేసిన మహోపకారం ఏమిటంటే, ఆయన వారిలో నుండే ఒక ప్రవక్తను ఎన్నుకుని వారి వద్దకు పంపాడు. అతడు వారికి ఆయన వాక్యాలను చదివి వినిపిస్తాడు. వారిని పరిశుద్ధుల్ని చేస్తాడు. వారికి గ్రంథ జ్ఞానాన్నీ, వివేకాన్నీ బోధిస్తాడు. నిశ్చయంగా అంతకు ముందైతే వాళ్ళు స్పష్టమైన అపమార్గానికి లోనై ఉండేవారు.
3:165 أَوَلَمَّا أَصَابَتْكُم مُّصِيبَةٌ قَدْ أَصَبْتُم مِّثْلَيْهَا قُلْتُمْ أَنَّىٰ هَٰذَا ۖ قُلْ هُوَ مِنْ عِندِ أَنفُسِكُمْ ۗ إِنَّ اللَّهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
(ఏమిటీ?) మీపై ఆపదరాగానే – దీనికన్నా రెండింతలుగా మీరు వారిపై విరుచుకుపడి ఉండి కూడా – ఇదెక్కడి నుంచి వచ్చిపడిందని అంటారా? ”ఇది చేజేతులా మీరు కొనితెచ్చుకున్నదే” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు. నిశ్చయంగా అల్లాహ్ ప్రతి దానినీ చేయగల సమర్థుడు.
3:166 وَمَا أَصَابَكُمْ يَوْمَ الْتَقَى الْجَمْعَانِ فَبِإِذْنِ اللَّهِ وَلِيَعْلَمَ الْمُؤْمِنِينَ
ఇరువర్గాల వారు ఢీకొన్న ఆ రోజున మీకు కలిగిన బాధ అల్లాహ్ ఆజ్ఞ మేరకేనని తెలుసుకోండి. మీలో (సిసలైన) విశ్వాసులెవరో అల్లాహ్ (బహిరంగంగా) తెలుసుకోదలిచాడు.
3:167 وَلِيَعْلَمَ الَّذِينَ نَافَقُوا ۚ وَقِيلَ لَهُمْ تَعَالَوْا قَاتِلُوا فِي سَبِيلِ اللَّهِ أَوِ ادْفَعُوا ۖ قَالُوا لَوْ نَعْلَمُ قِتَالًا لَّاتَّبَعْنَاكُمْ ۗ هُمْ لِلْكُفْرِ يَوْمَئِذٍ أَقْرَبُ مِنْهُمْ لِلْإِيمَانِ ۚ يَقُولُونَ بِأَفْوَاهِهِم مَّا لَيْسَ فِي قُلُوبِهِمْ ۗ وَاللَّهُ أَعْلَمُ بِمَا يَكْتُمُونَ
దగాకోరులెవరో కూడా ఆయన తెలుసుకోవాలను కున్నాడు. ”రండి, అల్లాహ్ మార్గంలో పోరాడండి లేదా అవిశ్వాసులను ఎదుర్కోండి” అని వారితో (కపటులతో) అన్నప్పుడు, ”యుద్ధం జరగబోతుందని మాకు తెలిసి ఉంటే తప్పకుండా మీవెంట వచ్చే వాళ్ళమే” అని వారు బదులిచ్చారు. ఆనాడు వాళ్లు విశ్వాసం కన్నా అవిశ్వాసానికి బహు చేరువలో ఉన్నారు. తమ మనసుల్లో లేని దాన్ని నోటితో పలుకుతున్నారు. వారు దాచి ఉంచే దానిని అల్లాహ్ బాగా ఎరుగు.
3:168 الَّذِينَ قَالُوا لِإِخْوَانِهِمْ وَقَعَدُوا لَوْ أَطَاعُونَا مَا قُتِلُوا ۗ قُلْ فَادْرَءُوا عَنْ أَنفُسِكُمُ الْمَوْتَ إِن كُنتُمْ صَادِقِينَ
వారు తమ ఇండ్లల్లోనే కూర్చున్నదిగాక, తమ సోదరుల గురించి మాట్లాడుకుంటూ, వారు కూడా తమ మాట విని ఉన్నట్లయితే ఈ విధంగా చంపబడి ఉండేవారు కాదు అని అంటారు. ”మీరు సత్యవంతులే అయితే మీ ప్రాణాలను మృత్యు వాతన పడకుండా కాపాడుకోండి” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు.
3:169 وَلَا تَحْسَبَنَّ الَّذِينَ قُتِلُوا فِي سَبِيلِ اللَّهِ أَمْوَاتًا ۚ بَلْ أَحْيَاءٌ عِندَ رَبِّهِمْ يُرْزَقُونَ
అల్లాహ్ మార్గంలో చంపబడిన వారిని సుతరామూ మృతులుగా తలపోయకండి. వారు సజీవులు. వారికి తమ ప్రభువు వద్ద ఆహారం ఇవ్వబడుతుంది.
3:170 فَرِحِينَ بِمَا آتَاهُمُ اللَّهُ مِن فَضْلِهِ وَيَسْتَبْشِرُونَ بِالَّذِينَ لَمْ يَلْحَقُوا بِهِم مِّنْ خَلْفِهِمْ أَلَّا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ
అల్లాహ్ తన అనుగ్రహం నుంచి ప్రసాదించిన దాంతో వారు చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా తమతో వచ్చిచేరని, తమ వెనుక (ప్రపంచంలోనే) ఉండిపోయినవారి (విశ్వాసుల) గురించి పరస్పరం శుభవార్త వినిపించుకుంటున్నారు. భయ పడవలసిన, దుఃఖించవలసిన అవసరం లేనందులకు (వారు ఆనందంగా ఉన్నారు).
3:171 يَسْتَبْشِرُونَ بِنِعْمَةٍ مِّنَ اللَّهِ وَفَضْلٍ وَأَنَّ اللَّهَ لَا يُضِيعُ أَجْرَ الْمُؤْمِنِينَ
అల్లాహ్ వరాల పట్ల, (ఆయన) అనుగ్రహం పట్ల వారు ఎంతగానో సంతోషిస్తున్నారు. అల్లాహ్ విశ్వాసుల పుణ్యఫలాన్ని వృధా కానివ్వడన్న విషయం కూడా వారినెంతగానో సంతృప్త పరచింది.
3:172 الَّذِينَ اسْتَجَابُوا لِلَّهِ وَالرَّسُولِ مِن بَعْدِ مَا أَصَابَهُمُ الْقَرْحُ ۚ لِلَّذِينَ أَحْسَنُوا مِنْهُمْ وَاتَّقَوْا أَجْرٌ عَظِيمٌ
ఎవరయితే తీవ్రంగా గాయపడిన తరువాత కూడా అల్లాహ్ మరియు అల్లాహ్ప్రవక్త ఆజ్ఞలను శిరసావహించారో, వారిలో ఎవరయితే సదాచరణ చేసి, భయభక్తులతో మసలుకున్నారో వారి కొరకు గొప్ప పుణ్యఫలముంది.
3:173 الَّذِينَ قَالَ لَهُمُ النَّاسُ إِنَّ النَّاسَ قَدْ جَمَعُوا لَكُمْ فَاخْشَوْهُمْ فَزَادَهُمْ إِيمَانًا وَقَالُوا حَسْبُنَا اللَّهُ وَنِعْمَ الْوَكِيلُ
”అవిశ్వాస జనులు మీకు వ్యతిరేకంగా భారీ సైన్యాన్ని మోహరించి ఉన్నారు. మీరు వారికి భయపడండి” అని ప్రజలు వారితో అన్నప్పుడు, ఆ మాట వారి విశ్వాసాన్ని మరింతగా పెంచింది. దానికి జవాబుగా, ”మాకు అల్లాహ్ చాలు. ఆయన చాలా మంచి కార్యసాధకుడు” అని వారన్నారు.
3:174 فَانقَلَبُوا بِنِعْمَةٍ مِّنَ اللَّهِ وَفَضْلٍ لَّمْ يَمْسَسْهُمْ سُوءٌ وَاتَّبَعُوا رِضْوَانَ اللَّهِ ۗ وَاللَّهُ ذُو فَضْلٍ عَظِيمٍ
(తత్ఫలితంగా) వారు అల్లాహ్ ప్రసాదించిన వరాలతో, అనుగ్రహంతో తిరిగి వచ్చారు. వారికెలాంటి కీడూ కలగలేదు. వారు అల్లాహ్ ప్రసన్నతను అనుసరించారు. అల్లాహ్ గొప్ప అనుగ్రహం కలవాడు.
3:175 إِنَّمَا ذَٰلِكُمُ الشَّيْطَانُ يُخَوِّفُ أَوْلِيَاءَهُ فَلَا تَخَافُوهُمْ وَخَافُونِ إِن كُنتُم مُّؤْمِنِينَ
నిజానికి (ఈ వార్త అందజేసిన) వాడు షైతాను. వాడు తన మిత్రుల గురించి మీకు భయపెట్టాడు. కనుక మీరు అవిశ్వాసులకు భయపడకండి, మీరు విశ్వాసులే అయితే నాకు భయపడండి.
3:176 وَلَا يَحْزُنكَ الَّذِينَ يُسَارِعُونَ فِي الْكُفْرِ ۚ إِنَّهُمْ لَن يَضُرُّوا اللَّهَ شَيْئًا ۗ يُرِيدُ اللَّهُ أَلَّا يَجْعَلَ لَهُمْ حَظًّا فِي الْآخِرَةِ ۖ وَلَهُمْ عَذَابٌ عَظِيمٌ
(ఓ ప్రవక్తా!) అవిశ్వాసంలో ముందుకు దూసుకుపోతున్న వారిని చూసి నువ్వు దిగులు చెందకు. వారు అల్లాహ్‌కు ఏమాత్రం కీడు కలిగించలేరు. వారికి పరలోకంలో ఎలాంటి భాగమూ ఇవ్వరాదన్నది అల్లాహ్ ఉద్దేశం. వారి కొరకు ఘోర శిక్ష కలదు.
3:177 إِنَّ الَّذِينَ اشْتَرَوُا الْكُفْرَ بِالْإِيمَانِ لَن يَضُرُّوا اللَّهَ شَيْئًا وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ
విశ్వాసానికి బదులుగా అవిశ్వాసాన్ని కొనేవారు ఎట్టి పరిస్థితిలోనూ అల్లాహ్‌కు అపకారం చేయలేరు. పైగా వ్యధాభరితమైన శిక్ష వారికోసం సిద్ధం చేయబడి ఉంది.
3:178 وَلَا يَحْسَبَنَّ الَّذِينَ كَفَرُوا أَنَّمَا نُمْلِي لَهُمْ خَيْرٌ لِّأَنفُسِهِمْ ۚ إِنَّمَا نُمْلِي لَهُمْ لِيَزْدَادُوا إِثْمًا ۚ وَلَهُمْ عَذَابٌ مُّهِينٌ
మేము ఇస్తున్న అవకాశాన్ని అవిశ్వాసులు తమ పాలిట మేలైనదని భావించరాదు సుమా! వారు తమ పాపాల పుట్టను పెంచుకోవటానికే ఈ అవకాశం ఇస్తున్నాం. అవమానభరిత మైన శిక్ష వారి కోసమే ఉంది.
3:179 مَّا كَانَ اللَّهُ لِيَذَرَ الْمُؤْمِنِينَ عَلَىٰ مَا أَنتُمْ عَلَيْهِ حَتَّىٰ يَمِيزَ الْخَبِيثَ مِنَ الطَّيِّبِ ۗ وَمَا كَانَ اللَّهُ لِيُطْلِعَكُمْ عَلَى الْغَيْبِ وَلَٰكِنَّ اللَّهَ يَجْتَبِي مِن رُّسُلِهِ مَن يَشَاءُ ۖ فَآمِنُوا بِاللَّهِ وَرُسُلِهِ ۚ وَإِن تُؤْمِنُوا وَتَتَّقُوا فَلَكُمْ أَجْرٌ عَظِيمٌ
అపవిత్రులను పవిత్రుల నుంచి వేరుపరచే వరకూ అల్లాహ్ విశ్వాసులను ఇప్పుడున్న స్థితిలోనే వదలిపెట్టడు. అలా అని అల్లాహ్ మీకు అగోచర విషయాలనూ తెలుపడు. పైగా అల్లాహ్ తన ప్రవక్తలలో తాను కోరిన వారిని (ఇందుకోసం) ఎన్నుకుంటాడు. అందుచేత మీరు అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తలను విశ్వసించండి. మీరే గనక విశ్వసించి, దైవభీతిపరులుగా మసలుకున్నట్లయితే మీకు గొప్ప పుణ్యఫలం లభిస్తుంది.
3:180 وَلَا يَحْسَبَنَّ الَّذِينَ يَبْخَلُونَ بِمَا آتَاهُمُ اللَّهُ مِن فَضْلِهِ هُوَ خَيْرًا لَّهُم ۖ بَلْ هُوَ شَرٌّ لَّهُمْ ۖ سَيُطَوَّقُونَ مَا بَخِلُوا بِهِ يَوْمَ الْقِيَامَةِ ۗ وَلِلَّهِ مِيرَاثُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۗ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ خَبِيرٌ
అల్లాహ్ తన కృపతో ప్రసాదించిన దానిలో పిసినారులుగా ప్రవర్తించేవారు, ఆ పిసినారితనం తమ పాలిట మేలైనదని భావించరాదు. వాస్తవానికి అది వారి పాలిట హానికరం. పిసినారి తనంతో వారు కూడబెట్టుకున్న వస్తువే ప్రళయదినాన వారి మెడకు గుదిబండగా మారుతుంది. భూమ్యాకాశాల వారసత్వం అల్లాహ్‌కే చెందుతుంది. మీరు చేసేదంతా అల్లాహ్‌కు తెలుసు.
3:181 لَّقَدْ سَمِعَ اللَّهُ قَوْلَ الَّذِينَ قَالُوا إِنَّ اللَّهَ فَقِيرٌ وَنَحْنُ أَغْنِيَاءُ ۘ سَنَكْتُبُ مَا قَالُوا وَقَتْلَهُمُ الْأَنبِيَاءَ بِغَيْرِ حَقٍّ وَنَقُولُ ذُوقُوا عَذَابَ الْحَرِيقِ
”అల్లాహ్ పేదవాడు, మేము ధనికులం” అని అన్నవారి మాటను అల్లాహ్ విన్నాడు. వారి ఈ మాటను మేము వ్రాసుకుంటాము. వారు ప్రవక్తలను అన్యాయంగా హతమార్చటాన్ని కూడా మేము నమోదు చేసుకుంటాము. ”దహించే అగ్ని శిక్షను చవిచూడండి.”
3:182 ذَٰلِكَ بِمَا قَدَّمَتْ أَيْدِيكُمْ وَأَنَّ اللَّهَ لَيْسَ بِظَلَّامٍ لِّلْعَبِيدِ
”ఇది మీరు ఇంతకుమునుపు చేసుకున్న కర్మలకు ప్రతిఫలం. అల్లాహ్ తన దాసులకు అన్యాయం చేసేవాడు కాడు” అని (తీర్పుదినాన) మేము వారికి చెబుతాము.
3:183 الَّذِينَ قَالُوا إِنَّ اللَّهَ عَهِدَ إِلَيْنَا أَلَّا نُؤْمِنَ لِرَسُولٍ حَتَّىٰ يَأْتِيَنَا بِقُرْبَانٍ تَأْكُلُهُ النَّارُ ۗ قُلْ قَدْ جَاءَكُمْ رُسُلٌ مِّن قَبْلِي بِالْبَيِّنَاتِ وَبِالَّذِي قُلْتُمْ فَلِمَ قَتَلْتُمُوهُمْ إِن كُنتُمْ صَادِقِينَ
”అగ్ని తినివేసేటటువంటి ఖుర్బానీని మా వద్దకు తేనంత వరకూ ఏ ప్రవక్తనూ విశ్వసించరాదని అల్లాహ్ మాకు ఆజ్ఞాపించాడు” అని చెప్పిన జనం వారు. ఓ ప్రవక్తా! వారితో ఇలా అను: ”నాకు పూర్వం మీ వద్దకు వచ్చిన ప్రవక్తలు ఇతర అనేక మహిమలతోపాటు, మీరు కోరుతున్న ఈ మహిమను కూడా తీసుకువచ్చారు. మరి మీరు సత్యవంతులే అయితే వారిని ఎందుకు చంపారు?”
3:184 فَإِن كَذَّبُوكَ فَقَدْ كُذِّبَ رُسُلٌ مِّن قَبْلِكَ جَاءُوا بِالْبَيِّنَاتِ وَالزُّبُرِ وَالْكِتَابِ الْمُنِيرِ
(ఇంతగా బోధపరచినప్పటికీ) వారు నిన్ను ధిక్కరిస్తే, నీకు పూర్వం కూడా స్పష్టమయిన నిదర్శనాలను, సహీఫాలను, జోతిర్మయమైన గ్రంథాన్ని తీసుకువచ్చిన ప్రవక్తలు కూడా ఇటువంటి ధిక్కారానికి గురయ్యారు.
3:185 كُلُّ نَفْسٍ ذَائِقَةُ الْمَوْتِ ۗ وَإِنَّمَا تُوَفَّوْنَ أُجُورَكُمْ يَوْمَ الْقِيَامَةِ ۖ فَمَن زُحْزِحَ عَنِ النَّارِ وَأُدْخِلَ الْجَنَّةَ فَقَدْ فَازَ ۗ وَمَا الْحَيَاةُ الدُّنْيَا إِلَّا مَتَاعُ الْغُرُورِ
ప్రతి ప్రాణీ మృత్యువు రుచి చూడవలసిందే. ప్రళయదినాన మీరు అందరూ మీ కర్మల పూర్తి ఫలితాన్ని పొందుతారు. అప్పుడు ఎవడు నరకాగ్ని నుంచి కాపాడబడి, స్వర్గంలో ప్రవేశం కల్పించబడతాడో అతడు నిశ్చయంగా సఫలీకృతుడయ్యాడు. ప్రాపంచిక జీవితమైతే ఒక మాయావస్తువు తప్ప మరేమీ కాదు.
3:186 لَتُبْلَوُنَّ فِي أَمْوَالِكُمْ وَأَنفُسِكُمْ وَلَتَسْمَعُنَّ مِنَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ مِن قَبْلِكُمْ وَمِنَ الَّذِينَ أَشْرَكُوا أَذًى كَثِيرًا ۚ وَإِن تَصْبِرُوا وَتَتَّقُوا فَإِنَّ ذَٰلِكَ مِنْ عَزْمِ الْأُمُورِ
నిశ్చయంగా మీ ధనప్రాణాల ద్వారా మీరు పరీక్షించ బడతారు. అంతేకాదు, మీకు పూర్వం గ్రంథం వొసగబడిన వారి తరఫునుండీ, ముష్రిక్కుల తరఫునుండీ మీరు బాధాకరమైన మాటలెన్నో వినవలసి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు గనక సహనం పాటిస్తూ, భయభక్తులతో మసలుకుంటే ఇదెంతో సాహసోపేతమైన పనే!
3:187 وَإِذْ أَخَذَ اللَّهُ مِيثَاقَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ لَتُبَيِّنُنَّهُ لِلنَّاسِ وَلَا تَكْتُمُونَهُ فَنَبَذُوهُ وَرَاءَ ظُهُورِهِمْ وَاشْتَرَوْا بِهِ ثَمَنًا قَلِيلًا ۖ فَبِئْسَ مَا يَشْتَرُونَ
(జ్ఞాపకం చెయ్యి,) అల్లాహ్ గ్రంథవహుల నుంచి, ”మీరు గ్రంథజ్ఞానాన్ని ప్రజలకు తప్పకుండా వివరించాలి. దానిని దాచకూడదు” అని వాగ్దానం తీసుకున్నాడు. అయినప్పటికీ వారు ఈ వాగ్దానాన్ని తమ వీపు వెనుక పడవేయటమేగాక అతి తక్కువ మూల్యానికి దాన్ని అమ్మివేశారు. వారు చేసిన ఈ వర్తకం బహు చెడ్డది.
3:188 لَا تَحْسَبَنَّ الَّذِينَ يَفْرَحُونَ بِمَا أَتَوا وَّيُحِبُّونَ أَن يُحْمَدُوا بِمَا لَمْ يَفْعَلُوا فَلَا تَحْسَبَنَّهُم بِمَفَازَةٍ مِّنَ الْعَذَابِ ۖ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ
తాము చేసిన పనులపై సంబరపడేవారు, తాము చేయని పనికి కూడా తమకు జేజేలు లభించాలని తహతహలాడేవారు శిక్ష నుంచి బయటపడ్తారని నువ్వు అనుకోకు. వారి కొరకైతే వ్యధా భరితమైన శిక్ష ఉంది.
3:189 وَلِلَّهِ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۗ وَاللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
భూమ్యాకాశాల సార్వభౌమత్వం అల్లాహ్‌దే. అల్లాహ్ ప్రతి వస్తువుపై అధికారం గలవాడు.
3:190 إِنَّ فِي خَلْقِ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَاخْتِلَافِ اللَّيْلِ وَالنَّهَارِ لَآيَاتٍ لِّأُولِي الْأَلْبَابِ
నిశ్చయంగా భూమ్యాకాశాల సృష్టిలో, రేయింబవళ్ల రాకపోకలలో విజ్ఞులకు ఎన్నో సూచనలున్నాయి.
3:191 الَّذِينَ يَذْكُرُونَ اللَّهَ قِيَامًا وَقُعُودًا وَعَلَىٰ جُنُوبِهِمْ وَيَتَفَكَّرُونَ فِي خَلْقِ السَّمَاوَاتِ وَالْأَرْضِ رَبَّنَا مَا خَلَقْتَ هَٰذَا بَاطِلًا سُبْحَانَكَ فَقِنَا عَذَابَ النَّارِ
వారు నిల్చుని, కూర్చుని, తమ పడకలపై ఒత్తిగిలి అల్లాహ్‌ను స్మరిస్తూ ఉంటారు. భూమ్యాకాశాల సృష్టి గురించి యోచన చేస్తూ ఉంటారు. వారిలా అంటారు : ”మా ప్రభూ! నువ్వు ఈ సృష్టిని నిరర్థకంగా చేయలేదు. నువ్వు పవిత్రుడవు. మమ్మల్ని నరకాగ్ని శిక్ష నుంచి కాపాడు.”
3:192 رَبَّنَا إِنَّكَ مَن تُدْخِلِ النَّارَ فَقَدْ أَخْزَيْتَهُ ۖ وَمَا لِلظَّالِمِينَ مِنْ أَنصَارٍ
”ఓ మా పోషకుడా! నువ్వెవరినైతే నరకాగ్నిలో పడవేస్తావో, వాణ్ణి నువ్వు పరాభవానికి, అవమానానికి గురి చేసినట్లే. యదార్థానికి దుర్మార్గులకు తోడ్పడేవారెవరూ ఉండరు.”
3:193 رَّبَّنَا إِنَّنَا سَمِعْنَا مُنَادِيًا يُنَادِي لِلْإِيمَانِ أَنْ آمِنُوا بِرَبِّكُمْ فَآمَنَّا ۚ رَبَّنَا فَاغْفِرْ لَنَا ذُنُوبَنَا وَكَفِّرْ عَنَّا سَيِّئَاتِنَا وَتَوَفَّنَا مَعَ الْأَبْرَارِ
”మా ప్రభూ! పిలిచేవాడొకడు విశ్వాసం (ఈమాన్) వైపుకు పిలవటం, ‘ప్రజలారా! మీ ప్రభువును విశ్వసించండి’ అని పిలుపునివ్వటం మేము విన్నాము. అంతే! మేము విశ్వసించాము. కనుక ఓ ప్రభూ! మా పాపాలను క్షమించు. మా చెడుగులను మా నుంచి దూరం చెయ్యి. సజ్జనులతోపాటు మాకు మరణం వొసగు.”
3:194 رَبَّنَا وَآتِنَا مَا وَعَدتَّنَا عَلَىٰ رُسُلِكَ وَلَا تُخْزِنَا يَوْمَ الْقِيَامَةِ ۗ إِنَّكَ لَا تُخْلِفُ الْمِيعَادَ
”మా ప్రభూ! నీ ప్రవక్తల ద్వారా నీవు మాకు చేసిన వాగ్దానం ప్రకారం మమ్మల్ని అనుగ్రహించు. ప్రళయదినాన మమ్మల్ని అవమానపరచకు. ఎట్టి పరిస్థితిలోనూ నీవు వాగ్దానానికి విరుద్ధంగా వ్యవహరించేవాడవు కావు.”
3:195 فَاسْتَجَابَ لَهُمْ رَبُّهُمْ أَنِّي لَا أُضِيعُ عَمَلَ عَامِلٍ مِّنكُم مِّن ذَكَرٍ أَوْ أُنثَىٰ ۖ بَعْضُكُم مِّن بَعْضٍ ۖ فَالَّذِينَ هَاجَرُوا وَأُخْرِجُوا مِن دِيَارِهِمْ وَأُوذُوا فِي سَبِيلِي وَقَاتَلُوا وَقُتِلُوا لَأُكَفِّرَنَّ عَنْهُمْ سَيِّئَاتِهِمْ وَلَأُدْخِلَنَّهُمْ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ ثَوَابًا مِّنْ عِندِ اللَّهِ ۗ وَاللَّهُ عِندَهُ حُسْنُ الثَّوَابِ
వారి ప్రభువు వారి మొరను ఆలకించి ఆమోదించాడు: ”మీలో పని చేసేవారి పనిని – వారు పురుషులైనా సరే, స్త్రీలయినాసరే – నేను వృధా చేయను. మీరు పరస్పరం ఒకే కోవకు చెందినవారు. కాబట్టి తమ స్వస్థలం వదలి వలస వెళ్ళినవారు (హిజ్రత్ చేసినవారు), తమ ఇళ్ళనుంచి వెళ్లగొట్ట బడినవారు, నా మార్గంలో వేధింపులకు గురైనవారు, నా మార్గంలో పోరాడి చంపబడినవారు – అటువంటి వారి చెడుగులను వారి నుంచి దూరం చేస్తాను. క్రింద కాలువలు ప్రవహించే (స్వర్గ) వనాలలో వారిని ప్రవేశింపజేస్తాను. ఇదీ అల్లాహ్ తరఫున వారికి లభించే పుణ్యఫలం. అల్లాహ్ వద్దనే అత్యుత్తమమయిన పుణ్యఫలం ఉంది” అని సెలవిచ్చాడు.
3:196 لَا يَغُرَّنَّكَ تَقَلُّبُ الَّذِينَ كَفَرُوا فِي الْبِلَادِ
(ఓ ప్రవక్తా!) నగరాలలో దైవ తిరస్కారుల స్వేచ్ఛా సంచారం నిన్ను మోసపుచ్చకూడదు.
3:197 مَتَاعٌ قَلِيلٌ ثُمَّ مَأْوَاهُمْ جَهَنَّمُ ۚ وَبِئْسَ الْمِهَادُ
ఇది చాలా స్వల్ప ప్రయోజనం మాత్రమే. ఆ తరువాత నరకమే వారి నివాస స్థలం అవుతుంది. అదెంతో అధ్వాన్నమైన స్థలం.
3:198 لَٰكِنِ الَّذِينَ اتَّقَوْا رَبَّهُمْ لَهُمْ جَنَّاتٌ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا نُزُلًا مِّنْ عِندِ اللَّهِ ۗ وَمَا عِندَ اللَّهِ خَيْرٌ لِّلْأَبْرَارِ
కాని తమ ప్రభువుకు భయపడుతూ మసలుకునేవారి కోసం క్రింద కాలువలు ప్రవహించే (స్వర్గ) వనాలున్నాయి. వాటిలో వారు కలకాలం ఉంటారు. ఇదీ అల్లాహ్ వద్ద నుంచి వారికి లభించే ఆతిథ్యం. సద్వర్తనుల కోసం అల్లాహ్ వద్ద ఉన్నది అన్నింటికంటే శ్రేష్ఠమైనది.
3:199 وَإِنَّ مِنْ أَهْلِ الْكِتَابِ لَمَن يُؤْمِنُ بِاللَّهِ وَمَا أُنزِلَ إِلَيْكُمْ وَمَا أُنزِلَ إِلَيْهِمْ خَاشِعِينَ لِلَّهِ لَا يَشْتَرُونَ بِآيَاتِ اللَّهِ ثَمَنًا قَلِيلًا ۗ أُولَٰئِكَ لَهُمْ أَجْرُهُمْ عِندَ رَبِّهِمْ ۗ إِنَّ اللَّهَ سَرِيعُ الْحِسَابِ
గ్రంథవహులలో కొందరున్నారు – వారు అల్లాహ్‌ను, మీపై అవతరించిన దానినీ, వారి వైపునకు అవతరించిన దాన్ని కూడా విశ్వసిస్తారు. అల్లాహ్‌కు భయపడుతూ ఉంటారు. అల్లాహ్ ఆయతులను కొద్దిపాటి మూల్యానికి అమ్ముకోరు. అలాంటివారి ప్రతిఫలం వారి ప్రభువు వద్ద ఉంది. నిశ్చయంగా అల్లాహ్ వేగంగా లెక్క తీసుకుంటాడు.
3:200 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اصْبِرُوا وَصَابِرُوا وَرَابِطُوا وَاتَّقُوا اللَّهَ لَعَلَّكُمْ تُفْلِحُونَ
ఓ విశ్వసించిన వారలారా! మీరు సహనస్థయిర్యాలను ప్రదర్శించండి. పరస్పరం సహనం గురించి బోధించుకుంటూ, (అల్లాహ్ మార్గంలో పోరుకు) సమాయత్తమై ఉండండి. అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి. తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు.
4. సూరా అన్ నిసా
4:1 يَا أَيُّهَا النَّاسُ اتَّقُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُم مِّن نَّفْسٍ وَاحِدَةٍ وَخَلَقَ مِنْهَا زَوْجَهَا وَبَثَّ مِنْهُمَا رِجَالًا كَثِيرًا وَنِسَاءً ۚ وَاتَّقُوا اللَّهَ الَّذِي تَسَاءَلُونَ بِهِ وَالْأَرْحَامَ ۚ إِنَّ اللَّهَ كَانَ عَلَيْكُمْ رَقِيبًا
మానవులారా! మిమ్మల్ని ఒకే ప్రాణి నుంచి పుట్టించి, దాన్నుంచే దాని జతను కూడా సృష్టించి, ఆ ఇద్దరి ద్వారా ఎంతో మంది పురుషులను, స్త్రీలను వ్యాపింపజేసిన మీ ప్రభువుకు భయపడండి. ఎవరిపేరుతో మీరు పరస్పరం మీకు కావలసిన వాటిని అడుగుతారో ఆ అల్లాహ్‌కు భయపడండి. బంధుత్వ సంబంధాల తెగత్రెంపులకు దూరంగా ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ మీపై నిఘావేసి ఉన్నాడు.
4:2 وَآتُوا الْيَتَامَىٰ أَمْوَالَهُمْ ۖ وَلَا تَتَبَدَّلُوا الْخَبِيثَ بِالطَّيِّبِ ۖ وَلَا تَأْكُلُوا أَمْوَالَهُمْ إِلَىٰ أَمْوَالِكُمْ ۚ إِنَّهُ كَانَ حُوبًا كَبِيرًا
తండ్రి లేని బిడ్డలకు వారి ఆస్తిని వారికివ్వండి. పరిశుద్ధమైన, ధర్మసమ్మతమైన వస్తువులకు బదులు అపవిత్రమైన, అధర్మమైన వస్తువులను తీసుకోకండి. మీ సొమ్ములతోపాటు వారి సొమ్మును కూడా కలగాపులగం చేసి స్వాహా చేయకండి. ముమ్మాటికీ ఇది మహా పాతకమే.
4:3 وَإِنْ خِفْتُمْ أَلَّا تُقْسِطُوا فِي الْيَتَامَىٰ فَانكِحُوا مَا طَابَ لَكُم مِّنَ النِّسَاءِ مَثْنَىٰ وَثُلَاثَ وَرُبَاعَ ۖ فَإِنْ خِفْتُمْ أَلَّا تَعْدِلُوا فَوَاحِدَةً أَوْ مَا مَلَكَتْ أَيْمَانُكُمْ ۚ ذَٰلِكَ أَدْنَىٰ أَلَّا تَعُولُوا
(మీ సంరక్షణలో ఉన్న) తండ్రిలేని ఆడపిల్లలను వివాహమాడి న్యాయం చేయలేమన్న భయం మీకుంటే, మీకు నచ్చిన వేరితర స్త్రీలలో ఇద్దరినిగానీ, ముగ్గురినిగానీ, నలుగురినిగానీ వివాహ మాడండి. అయితే వారి మధ్య న్యాయబద్ధంగా వ్యవహరించలేమన్న భయం మీకున్నప్పుడు ఒక్కామెతోనే సరిపెట్టుకోండి. లేదా మీ యాజమాన్యంలోకి వచ్చిన బానిస స్త్రీలతో గడపండి. మీరు ఒక వైపుకు మొగ్గిపోకుండా (అంటే అన్యాయానికి పాల్పడకుండా) ఉండటానికి ఇది అత్యుత్తమ మార్గం.
4:4 وَآتُوا النِّسَاءَ صَدُقَاتِهِنَّ نِحْلَةً ۚ فَإِن طِبْنَ لَكُمْ عَن شَيْءٍ مِّنْهُ نَفْسًا فَكُلُوهُ هَنِيئًا مَّرِيئًا
స్త్రీలకు వారి మహర్ సొమ్మును మనస్ఫూర్తిగా ఇవ్వండి. ఒకవేళ వారు గనక తమంతట తాముగా – ఇష్టపూర్వకంగా – మహర్లో కొంత మొత్తాన్ని వదలిపెట్టినట్లయితే సంతోషంగా (నిస్సంకోచంగా) దాన్ని అనుభవించండి.
4:5 وَلَا تُؤْتُوا السُّفَهَاءَ أَمْوَالَكُمُ الَّتِي جَعَلَ اللَّهُ لَكُمْ قِيَامًا وَارْزُقُوهُمْ فِيهَا وَاكْسُوهُمْ وَقُولُوا لَهُمْ قَوْلًا مَّعْرُوفًا
అల్లాహ్ మీ జరుగుబాటుకు ఆధారంగా చేసిన మీ ధనాన్ని అవివేకుల పరం చేయకండి. కాకపోతే ఆ సంపదలో నుంచి వారికి అన్నవస్త్రాలు మొదలగునవి సమకూర్చండి. వారితో మంచితనంతో, మృదువుగా మాట్లాడండి.
4:6 وَابْتَلُوا الْيَتَامَىٰ حَتَّىٰ إِذَا بَلَغُوا النِّكَاحَ فَإِنْ آنَسْتُم مِّنْهُمْ رُشْدًا فَادْفَعُوا إِلَيْهِمْ أَمْوَالَهُمْ ۖ وَلَا تَأْكُلُوهَا إِسْرَافًا وَبِدَارًا أَن يَكْبَرُوا ۚ وَمَن كَانَ غَنِيًّا فَلْيَسْتَعْفِفْ ۖ وَمَن كَانَ فَقِيرًا فَلْيَأْكُلْ بِالْمَعْرُوفِ ۚ فَإِذَا دَفَعْتُمْ إِلَيْهِمْ أَمْوَالَهُمْ فَأَشْهِدُوا عَلَيْهِمْ ۚ وَكَفَىٰ بِاللَّهِ حَسِيبًا
తండ్రిలేని బిడ్డలు పెళ్ళీడుకు వచ్చేవరకూ వారిని తీర్చిదిద్దుతూ, పరీక్షిస్తూ ఉండండి. ఒకవేళ వారిలో తెలివితేటలు, కార్యదక్షత కానవస్తే వారి ఆస్తిని వారికి అప్పగించండి. వారు పెద్దవారవుతున్నారన్న భయంతో వారి ఆస్తిపాస్తులను ఆదరా బాదరాగా దుబారా ఖర్చుచేయకండి. తండ్రిలేని బిడ్డల పోషకుడు ధనవంతుడైన పక్షంలో వారి సొమ్మును ముట్టుకోకూడదు. ఒకవేళ అతడు పేదవాడైతే ధర్మబద్ధంగా – అవసరమైనంత మేరకు – అనుభవించవచ్చు. మరి వారి ఆస్తిని వారికి అప్పగించేటప్పుడు దానికి సాక్షుల్ని పెట్టుకోండి. లెక్క తీసుకోవటానికి అల్లాహ్ చాలు.
4:7 لِّلرِّجَالِ نَصِيبٌ مِّمَّا تَرَكَ الْوَالِدَانِ وَالْأَقْرَبُونَ وَلِلنِّسَاءِ نَصِيبٌ مِّمَّا تَرَكَ الْوَالِدَانِ وَالْأَقْرَبُونَ مِمَّا قَلَّ مِنْهُ أَوْ كَثُرَ ۚ نَصِيبًا مَّفْرُوضًا
తల్లిదండ్రులు, సమీప బంధువులు వదలివెళ్ళిన ఆస్తిలో పురుషులకు భాగం ఉంది. అలాగే తల్లిదండ్రులు, సమీప బంధువులు వదలివెళ్ళిన ఆస్తిలో స్త్రీలకు కూడా భాగం ఉంది. ఆ ఆస్తి తక్కువైనాసరే, ఎక్కువైనాసరే (అందులో) వాటా మాత్రం నిర్ధారితమై ఉంది.
4:8 وَإِذَا حَضَرَ الْقِسْمَةَ أُولُو الْقُرْبَىٰ وَالْيَتَامَىٰ وَالْمَسَاكِينُ فَارْزُقُوهُم مِّنْهُ وَقُولُوا لَهُمْ قَوْلًا مَّعْرُوفًا
ఆస్తిని పంచుకునే సమయంలో బంధువులు, తండ్రిలేని బిడ్డలు, నిరుపేదలు వస్తే అందులో నుంచి వారికీ కొంత ఇవ్వండి. (ఆ సందర్భాన) వారితో మృదువుగా మాట్లాడండి.
4:9 وَلْيَخْشَ الَّذِينَ لَوْ تَرَكُوا مِنْ خَلْفِهِمْ ذُرِّيَّةً ضِعَافًا خَافُوا عَلَيْهِمْ فَلْيَتَّقُوا اللَّهَ وَلْيَقُولُوا قَوْلًا سَدِيدًا
ఒకవేళ తాము తమ వెనుక చిన్న చిన్న పసికందులను విడిచిపోతే, వారికెక్కడ అన్యాయం జరుగుతుందోనని ఆందోళన చెందేవారు (ఈ సందర్భంగా) భయపడాలి. వారు అల్లాహ్‌కు భయపడుతూ, సముచితమైన రీతిలో మాట్లాడాలి.
4:10 إِنَّ الَّذِينَ يَأْكُلُونَ أَمْوَالَ الْيَتَامَىٰ ظُلْمًا إِنَّمَا يَأْكُلُونَ فِي بُطُونِهِمْ نَارًا ۖ وَسَيَصْلَوْنَ سَعِيرًا
తండ్రిలేని బిడ్డల సొమ్మును అన్యాయంగా తినేవారు తమ పొట్టల్ని అగ్నితో నింపుకుంటున్నారు. త్వరలోనే వారు మండే అగ్నిలోకి ప్రవేశిస్తారు.
4:11 يُوصِيكُمُ اللَّهُ فِي أَوْلَادِكُمْ ۖ لِلذَّكَرِ مِثْلُ حَظِّ الْأُنثَيَيْنِ ۚ فَإِن كُنَّ نِسَاءً فَوْقَ اثْنَتَيْنِ فَلَهُنَّ ثُلُثَا مَا تَرَكَ ۖ وَإِن كَانَتْ وَاحِدَةً فَلَهَا النِّصْفُ ۚ وَلِأَبَوَيْهِ لِكُلِّ وَاحِدٍ مِّنْهُمَا السُّدُسُ مِمَّا تَرَكَ إِن كَانَ لَهُ وَلَدٌ ۚ فَإِن لَّمْ يَكُن لَّهُ وَلَدٌ وَوَرِثَهُ أَبَوَاهُ فَلِأُمِّهِ الثُّلُثُ ۚ فَإِن كَانَ لَهُ إِخْوَةٌ فَلِأُمِّهِ السُّدُسُ ۚ مِن بَعْدِ وَصِيَّةٍ يُوصِي بِهَا أَوْ دَيْنٍ ۗ آبَاؤُكُمْ وَأَبْنَاؤُكُمْ لَا تَدْرُونَ أَيُّهُمْ أَقْرَبُ لَكُمْ نَفْعًا ۚ فَرِيضَةً مِّنَ اللَّهِ ۗ إِنَّ اللَّهَ كَانَ عَلِيمًا حَكِيمًا
అల్లాహ్ మీ సంతానం విషయంలో మీకు ఈ విధంగా ఆజ్ఞాపిస్తున్నాడు : ఒక అబ్బాయి వాటా ఇద్దరు అమ్మాయిల వాటాకు సమానం. ఒకవేళ (మృతునికి) ఇద్దరుకన్నా ఎక్కువ మంది కుమార్తెలు మాత్రమే ఉంటే వారికి వారసత్వ ఆస్తిలో మూడింట రెండొంతుల భాగం లభిస్తుంది. ఒకవేళ ఒకే కూతురుంటే ఆమెకు సగభాగం దక్కుతుంది. చనిపోయిన వ్యక్తికి గనక సంతానముంటే, అతని తల్లిదండ్రులలో ఒక్కొక్కరికి అతను వదలివెళ్ళిన ఆస్తిలో ఆరింట ఒక భాగం లభిస్తుంది. ఒకవేళ మృతుడు సంతానం లేనివాడై ఉండి, అతని తల్లిదండ్రులే అతని ఆస్తికి వారసులైనపుడు, అతని తల్లికి మూడింట ఒక భాగం ఇవ్వాలి. ఒకవేళ మృతునికి గనక అనేక మంది అన్నదమ్ములుంటే, అప్పుడు తల్లికి ఆరింట ఒక భాగం మాత్రమే దక్కుతుంది. చనిపోయిన వ్యక్తి వ్రాసిన వీలునామాను అమలు పరచి, అతను చేసి వున్న అప్పులను తీర్చిన మీదటే ఈ (ఆస్తి) వాటాలు లభిస్తాయి. మీ తండ్రులలో లేక కుమారులలో – మీకు ప్రయోజనం చేకూర్చటంలో ఎవరు ఎక్కువ సన్నిహితులో మీకు తెలియదు. ఇవి అల్లాహ్ తరఫున నిర్ణయించబడిన వాటాలు. నిశ్చయంగా అల్లాహ్ సర్వజ్ఞాని, పరిపూర్ణ వివేకం గలవాడు.
4:12 وَلَكُمْ نِصْفُ مَا تَرَكَ أَزْوَاجُكُمْ إِن لَّمْ يَكُن لَّهُنَّ وَلَدٌ ۚ فَإِن كَانَ لَهُنَّ وَلَدٌ فَلَكُمُ الرُّبُعُ مِمَّا تَرَكْنَ ۚ مِن بَعْدِ وَصِيَّةٍ يُوصِينَ بِهَا أَوْ دَيْنٍ ۚ وَلَهُنَّ الرُّبُعُ مِمَّا تَرَكْتُمْ إِن لَّمْ يَكُن لَّكُمْ وَلَدٌ ۚ فَإِن كَانَ لَكُمْ وَلَدٌ فَلَهُنَّ الثُّمُنُ مِمَّا تَرَكْتُم ۚ مِّن بَعْدِ وَصِيَّةٍ تُوصُونَ بِهَا أَوْ دَيْنٍ ۗ وَإِن كَانَ رَجُلٌ يُورَثُ كَلَالَةً أَوِ امْرَأَةٌ وَلَهُ أَخٌ أَوْ أُخْتٌ فَلِكُلِّ وَاحِدٍ مِّنْهُمَا السُّدُسُ ۚ فَإِن كَانُوا أَكْثَرَ مِن ذَٰلِكَ فَهُمْ شُرَكَاءُ فِي الثُّلُثِ ۚ مِن بَعْدِ وَصِيَّةٍ يُوصَىٰ بِهَا أَوْ دَيْنٍ غَيْرَ مُضَارٍّ ۚ وَصِيَّةً مِّنَ اللَّهِ ۗ وَاللَّهُ عَلِيمٌ حَلِيمٌ
మీ భార్యలకు సంతానం లేనిపక్షంలో వారు వదలివెళ్ళిన ఆస్తిలో సగభాగం మీది. ఒకవేళ వారికి సంతానముంటే వారు విడిచిపెట్టిన ఆస్తిలో నాల్గోభాగం మీకు చెందుతుంది. వారు వ్రాసిపోయిన వీలునామాను అమలుపరచిన మీదట, లేదా వారు చేసిన అప్పుల్ని తీర్చిన మీదటే ఈ పంపకం జరగాలి. మీకు పిల్లలు లేని పక్షంలో మీరు వదలిపోయే ఆస్తిలో మీ భార్యలకు నాల్గో భాగం లభిస్తుంది. ఒకవేళ మీకు పిల్లలుంటే అప్పుడు మీరు వదలివెళ్ళే ఆస్తిలో మీ భార్యలకు ఎనిమిదో వంతు మాత్రమే లభిస్తుంది. మీరు వ్రాసి వెళ్ళిన వీలునామాను అమలు పరచి, లేదా మీరు చేసివెళ్ళిన అప్పుల్ని తీర్చిన తరువాతే మిగిలిన ఆస్తిలో పంపకాలు జరుగుతాయి. చనిపోయిన పురుషుడు లేక స్త్రీ ‘కలాలా’ అయి ఉండి (అంటే వారికి తండ్రిగాని, కొడుకు గాని లేకుండా ఉండి) వారికి ఒక సోదరుడు లేక ఒక సోదరి ఉన్నట్లయితే వారిలో ఒక్కొక్కరికి ఆరింట ఒక భాగం చొప్పున లభిస్తుంది. కాని వారు ఒకరికన్నా ఎక్కువ మంది ఉన్నట్లయితే అప్పుడు మొత్తం ఆస్తిలోని మూడో భాగాన్ని వారంతా సమానంగా పంచుకోవాలి. అయితే మృతుడు వ్రాసిన వీలునామాను అమలుపరచి, లేదా అతని అప్పులన్నీ తీర్చిన మీదటే ఈ పంపకం జరగాలి. ఇది ఇతరులకు నష్టకరంగా పరిణమించకూడదు. ఇది అల్లాహ్ తరఫున జరిగిన నిర్థారణ. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, సహనశీలుడు.
4:13 تِلْكَ حُدُودُ اللَّهِ ۚ وَمَن يُطِعِ اللَّهَ وَرَسُولَهُ يُدْخِلْهُ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا ۚ وَذَٰلِكَ الْفَوْزُ الْعَظِيمُ
ఇవి అల్లాహ్ నిర్ధారించిన హద్దులు. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సఅసం)కు విధేయత చూపేవారికి అల్లాహ్, క్రింద కాలువలు ప్రవహించే (స్వర్గ) వనాలలో ప్రవేశం కల్పిస్తాడు. వాటిలో వారు కలకాలం ఉంటారు. గొప్ప విజయం అంటే ఇదే.
4:14 وَمَن يَعْصِ اللَّهَ وَرَسُولَهُ وَيَتَعَدَّ حُدُودَهُ يُدْخِلْهُ نَارًا خَالِدًا فِيهَا وَلَهُ عَذَابٌ مُّهِينٌ
ఎవడు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సఅసం) యెడల అవిధేయుడై, ఆయన నిర్ధారించిన హద్దులను మీరిపోతాడో వాడ్ని ఆయన నరకాగ్నిలో పడవేస్తాడు. వాడందులో ఎల్లకాలం పడి ఉంటాడు. అవమానకరమైన శిక్ష అలాంటి వారికోసమే ఉంది.
4:15 وَاللَّاتِي يَأْتِينَ الْفَاحِشَةَ مِن نِّسَائِكُمْ فَاسْتَشْهِدُوا عَلَيْهِنَّ أَرْبَعَةً مِّنكُمْ ۖ فَإِن شَهِدُوا فَأَمْسِكُوهُنَّ فِي الْبُيُوتِ حَتَّىٰ يَتَوَفَّاهُنَّ الْمَوْتُ أَوْ يَجْعَلَ اللَّهُ لَهُنَّ سَبِيلًا
మీ స్త్రీలలో ఎవరయినా అక్రమ సంబంధం పెట్టుకుంటే వారికి వ్యతిరేకంగా మీలోని నలుగురు వ్యక్తులను సాక్షులుగా తీసుకురండి. వారు గనక సాక్ష్యం ఇస్తే ఆ స్త్రీలను మరణకాలం వచ్చే వరకుగానీ, లేదా అల్లాహ్ వారికోసం ఏదైనా మార్గాంతరం సూచించేవరకు గానీ – గృహాల్లో నిర్బంధించి ఉంచండి.
4:16 وَاللَّذَانِ يَأْتِيَانِهَا مِنكُمْ فَآذُوهُمَا ۖ فَإِن تَابَا وَأَصْلَحَا فَأَعْرِضُوا عَنْهُمَا ۗ إِنَّ اللَّهَ كَانَ تَوَّابًا رَّحِيمًا
మీలో ఏ ఇద్దరయినా ఈ (పాడు) పని చేస్తే వారిద్దరినీ బాధించండి. ఒకవేళ వారు పశ్చాత్తాపపడి, తమ ప్రవర్తనను సరిదిద్దుకుంటే వారిని ఉపేక్షించండి. నిస్సందేహంగా అల్లాహ్ పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, కరుణించేవాడు కూడా.
4:17 إِنَّمَا التَّوْبَةُ عَلَى اللَّهِ لِلَّذِينَ يَعْمَلُونَ السُّوءَ بِجَهَالَةٍ ثُمَّ يَتُوبُونَ مِن قَرِيبٍ فَأُولَٰئِكَ يَتُوبُ اللَّهُ عَلَيْهِمْ ۗ وَكَانَ اللَّهُ عَلِيمًا حَكِيمًا
అవివేకం వల్ల ఏదైనా చెడు కార్యానికి పాల్పడి, వెనువెంటనే తప్పు తెలుసుకుని పశ్చాత్తాపం చెందేవారి పశ్చాత్తాపాన్ని స్వీకరించే బాధ్యత మాత్రమే అల్లాహ్‌పై ఉంది. అటువంటి వారి పశ్చాత్తాపాన్ని అల్లాహ్ స్వీకరిస్తాడు. అల్లాహ్ మహాజ్ఞాని, గొప్ప వివేకవంతుడు.
4:18 وَلَيْسَتِ التَّوْبَةُ لِلَّذِينَ يَعْمَلُونَ السَّيِّئَاتِ حَتَّىٰ إِذَا حَضَرَ أَحَدَهُمُ الْمَوْتُ قَالَ إِنِّي تُبْتُ الْآنَ وَلَا الَّذِينَ يَمُوتُونَ وَهُمْ كُفَّارٌ ۚ أُولَٰئِكَ أَعْتَدْنَا لَهُمْ عَذَابًا أَلِيمًا
నిరంతరం పాపకార్యాలకు పాల్పడుతూ, తీరా మరణ ఘడియలు సమీపించాక, “ఇప్పుడు నేను పశ్చాత్తాపపడుతున్నాను” అని అనే వారి పశ్చాత్తాపం ఆమోదించబడదు. అలాగే అవిశ్వాస స్థితిలో ప్రాణం విడిచే వారి పశ్చాత్తాపం కూడా స్వీకరించబడదు. ఇలాంటి వారి కోసమే మేము వ్యధాభరితమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాము.
4:19 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا يَحِلُّ لَكُمْ أَن تَرِثُوا النِّسَاءَ كَرْهًا ۖ وَلَا تَعْضُلُوهُنَّ لِتَذْهَبُوا بِبَعْضِ مَا آتَيْتُمُوهُنَّ إِلَّا أَن يَأْتِينَ بِفَاحِشَةٍ مُّبَيِّنَةٍ ۚ وَعَاشِرُوهُنَّ بِالْمَعْرُوفِ ۚ فَإِن كَرِهْتُمُوهُنَّ فَعَسَىٰ أَن تَكْرَهُوا شَيْئًا وَيَجْعَلَ اللَّهُ فِيهِ خَيْرًا كَثِيرًا
విశ్వసించిన ఓ ప్రజలారా! మీరు బలవంతంగా స్త్రీలకు వారసులై కూర్చోవటం మీకు ధర్మసమ్మతం కానేరదు. మీరు వారికి ఇచ్చిన దానిలో (మహర్) నుంచి కొంత సొమ్ము కాజేసే ఉద్దేశ్యంతో వారిని ఆపి ఉంచుకోకండి. ఒకవేళ వారు గనక బాహాటంగా ఏదైనా నీతిమాలిన పనికి పాల్పడితే అది వేరే విషయం. వారితో ఉత్తమరీతిలో కాపురం చేయండి. ఒకవేళ వారు మీకు నచ్చకపోతే బహుశా ఏదో ఒక్క విషయం మూలంగా మీకు నచ్చకపోవచ్చు. కాని మీకు నచ్చని ఆ విషయంలోనే అల్లాహ్ అపారమైన శుభాన్ని పొందుపరచాడేమో! (మీకేం తెలుసు?)
4:20 وَإِنْ أَرَدتُّمُ اسْتِبْدَالَ زَوْجٍ مَّكَانَ زَوْجٍ وَآتَيْتُمْ إِحْدَاهُنَّ قِنطَارًا فَلَا تَأْخُذُوا مِنْهُ شَيْئًا ۚ أَتَأْخُذُونَهُ بُهْتَانًا وَإِثْمًا مُّبِينًا
మీరు ఒక భార్య స్థానంలో మరో భార్యను చేసుకోదలిస్తే, వారిలో ఎవరికయినా మీరు పెద్ద ధనరాశిని ఇచ్చివున్నా సరే, దానిలోనుంచి ఏ కొంచెం కూడా తిరిగి తీసుకోకండి. ఏమిటీ, అది అన్యాయం, స్పష్టమైన పాపం అయినప్పటికీ మీరు దాన్ని తీసుకుంటారా?
4:21 وَكَيْفَ تَأْخُذُونَهُ وَقَدْ أَفْضَىٰ بَعْضُكُمْ إِلَىٰ بَعْضٍ وَأَخَذْنَ مِنكُم مِّيثَاقًا غَلِيظًا
మీరు పరస్పరం కలుసుకున్న తరువాత, ఆ స్త్రీలు మీ నుండి గట్టి వాగ్దానం తీసుకున్న తరువాత కూడా ఆ ధనాన్ని మీరెలా (తిరిగి) తీసుకోగలుగుతారు?
4:22 وَلَا تَنكِحُوا مَا نَكَحَ آبَاؤُكُم مِّنَ النِّسَاءِ إِلَّا مَا قَدْ سَلَفَ ۚ إِنَّهُ كَانَ فَاحِشَةً وَمَقْتًا وَسَاءَ سَبِيلًا
మీ తండ్రులు వివాహమాడిన స్త్రీలను మీరు ఎట్టి పరిస్థితిలోనూ పెళ్ళి చేసుకోకండి. పూర్వం జరిగిందేదో జరిగిపోయింది. అదొక సిగ్గుమాలిన పని, ద్వేషానికి మూలం, ఒక చెడు నడత.
4:23 حُرِّمَتْ عَلَيْكُمْ أُمَّهَاتُكُمْ وَبَنَاتُكُمْ وَأَخَوَاتُكُمْ وَعَمَّاتُكُمْ وَخَالَاتُكُمْ وَبَنَاتُ الْأَخِ وَبَنَاتُ الْأُخْتِ وَأُمَّهَاتُكُمُ اللَّاتِي أَرْضَعْنَكُمْ وَأَخَوَاتُكُم مِّنَ الرَّضَاعَةِ وَأُمَّهَاتُ نِسَائِكُمْ وَرَبَائِبُكُمُ اللَّاتِي فِي حُجُورِكُم مِّن نِّسَائِكُمُ اللَّاتِي دَخَلْتُم بِهِنَّ فَإِن لَّمْ تَكُونُوا دَخَلْتُم بِهِنَّ فَلَا جُنَاحَ عَلَيْكُمْ وَحَلَائِلُ أَبْنَائِكُمُ الَّذِينَ مِنْ أَصْلَابِكُمْ وَأَن تَجْمَعُوا بَيْنَ الْأُخْتَيْنِ إِلَّا مَا قَدْ سَلَفَ ۗ إِنَّ اللَّهَ كَانَ غَفُورًا رَّحِيمًا
మీ కొరకు నిషేధించబడినవారు – మీ తల్లులు, మీ కుమార్తెలు, మీ అక్కా చెల్లెళ్ళు, మీ మేనత్తలు, మీ తల్లి సోదరీమణులు (మీ పిన్నమ్మ పెద్దమ్మలు), మీ అన్నదమ్ముల కుమార్తెలు, అక్కాచెల్లెళ్ళ కూతుళ్ళు (మేనకోడళ్ళు), మీకు పాలిచ్చిన తల్లులు, పాల వరుస ద్వారా మీకు అక్కాచెల్లెళ్ళు అయినవారు, మీ భార్యల తల్లులు (అత్తలు), మీరు దాంపత్య సుఖాన్ని అనుభవించిన మీ భార్యల (ఆమె మాజీ భర్త ద్వారా పుట్టిన) మీ సంరక్షణలోనున్న కూతుళ్ళు – ఒకవేళ మీరు వారితో సమాగమం జరపకుండా ఉంటే (కేవలం పెళ్ళిమాత్రం చేసుకుని వారికి విడాకులు యిచ్చేసివున్న పక్షంలో వారి కూతుళ్లను వివాహమాడటం) మీ కొరకు పాపం కాదు. అలాగే మీ వెన్ను నుండి (స్ఖలించబడిన వీర్యంతో) పుట్టిన మీ కొడుకుల భార్యలు (కోడళ్ళు) మీ కోసం నిషేధించబడ్డారు. (ఏకకాలంలో) ఇద్దరు అక్కా చెల్లెళ్ళను కలిపి భార్యలుగా చేసుకోవటం కూడా మీ కొరకు నిషిద్ధమే, లోగడ జరిగిందేదో జరిగిపోయింది. నిస్సందేహంగా అల్లాహ్ క్షమాశీలి, కృపాకరుడు కూడాను.
4:24 وَالْمُحْصَنَاتُ مِنَ النِّسَاءِ إِلَّا مَا مَلَكَتْ أَيْمَانُكُمْ ۖ كِتَابَ اللَّهِ عَلَيْكُمْ ۚ وَأُحِلَّ لَكُم مَّا وَرَاءَ ذَٰلِكُمْ أَن تَبْتَغُوا بِأَمْوَالِكُم مُّحْصِنِينَ غَيْرَ مُسَافِحِينَ ۚ فَمَا اسْتَمْتَعْتُم بِهِ مِنْهُنَّ فَآتُوهُنَّ أُجُورَهُنَّ فَرِيضَةً ۚ وَلَا جُنَاحَ عَلَيْكُمْ فِيمَا تَرَاضَيْتُم بِهِ مِن بَعْدِ الْفَرِيضَةِ ۚ إِنَّ اللَّهَ كَانَ عَلِيمًا حَكِيمًا
భర్తగల స్త్రీలు కూడా మీ కొరకు నిషేధించబడ్డారు. అయితే మీ యాజమాన్యంలోనికి వచ్చిన బానిస స్త్రీలు మాత్రం (నిషేధించబడలేదు). అల్లాహ్ ఈ ఆదేశాలను మీపై విధించాడు. ఈ స్త్రీలు మినహా మిగతా స్త్రీలను మీరు మహర్ రూపంలో ధనం చెల్లించి వివాహమాడటం మీ కొరకు ధర్మసమ్మతం (హలాల్) చేయబడింది. అయితే చెడుల నుండి దూరంగా ఉండే ఉద్దేశ్యంతోనే ఈ పని చెయ్యాలి తప్ప కామక్రీడల కోసం కాదు. అందుకే మీరు ఏ స్త్రీలతో సౌఖ్యాన్ని పొందారో వారికి నిర్థారిత మహర్ సొమ్మును ఇచ్చివేయండి. మహర్ సొమ్ము నిర్ధారించబడిన తరువాత మీరు పరస్పరం – ఇష్టపూర్వకంగా – ఆ విషయమై ఒక అవగాహనకు వస్తే అందులో దోషం ఏమీ లేదు. నిశ్చయంగా అల్లాహ్ సర్వం తెలిసినవాడు, వివేకవంతుడు.
4:25 وَمَن لَّمْ يَسْتَطِعْ مِنكُمْ طَوْلًا أَن يَنكِحَ الْمُحْصَنَاتِ الْمُؤْمِنَاتِ فَمِن مَّا مَلَكَتْ أَيْمَانُكُم مِّن فَتَيَاتِكُمُ الْمُؤْمِنَاتِ ۚ وَاللَّهُ أَعْلَمُ بِإِيمَانِكُم ۚ بَعْضُكُم مِّن بَعْضٍ ۚ فَانكِحُوهُنَّ بِإِذْنِ أَهْلِهِنَّ وَآتُوهُنَّ أُجُورَهُنَّ بِالْمَعْرُوفِ مُحْصَنَاتٍ غَيْرَ مُسَافِحَاتٍ وَلَا مُتَّخِذَاتِ أَخْدَانٍ ۚ فَإِذَا أُحْصِنَّ فَإِنْ أَتَيْنَ بِفَاحِشَةٍ فَعَلَيْهِنَّ نِصْفُ مَا عَلَى الْمُحْصَنَاتِ مِنَ الْعَذَابِ ۚ ذَٰلِكَ لِمَنْ خَشِيَ الْعَنَتَ مِنكُمْ ۚ وَأَن تَصْبِرُوا خَيْرٌ لَّكُمْ ۗ وَاللَّهُ غَفُورٌ رَّحِيمٌ
మీలో ఎవరికయినా స్వతంత్రులగు ముస్లిం స్త్రీలను వివాహమాడే స్థోమత లేకపోతే, మీ యాజమాన్యంలో ఉన్న విశ్వాసులైన బానిస స్త్రీలను నికాహ్ చేసుకోవాలి. మీ విశ్వాస స్థితి గురించి అల్లాహ్‌కు బాగా తెలుసు. మీరంతా పరస్పరం ఒక్కటే కదా! కాబట్టి వారి యజమానుల అనుమతితో వారిని వివాహమాడండి. నియమానుసారం వారి మహర్‌ను వారికి ఇవ్వండి. అయితే వారు సౌశీల్యవతులై ఉండాలి. బాహాటంగా అశ్లీల కార్యాలకు పాల్పడనివారై ఉండాలి. చాటుమాటు ప్రేమ కలాపాలు సాగించేవారు కాకుండా ఉండాలి. మరి ఆ బానిస స్త్రీలు వివాహబంధంలో కట్టుబడిన తరువాత కూడా సిగ్గుమాలిన పనికి గనక ఒడిగడితే స్వతంత్రులగు స్త్రీలకు విధించే శిక్షలో సగం శిక్ష వీరికి విధించబడుతుంది. తమ వల్ల పాపకార్యం జరిగి పోతుందేమో, ఓర్చుకోలేమేమో అన్న భయం ఉన్నవారికి ఇలా బానిస స్త్రీలను వివాహమాడే వెసులుబాటు ఇవ్వబడింది. ఒకవేళ మీరు ఆత్మనిగ్రహాన్ని అలవరచుకుంటే అది మీకే శ్రేయస్కరం. అల్లాహ్ అమితంగా క్షమించేవాడు, అపారంగా కనికరించేవాడూను.
4:26 يُرِيدُ اللَّهُ لِيُبَيِّنَ لَكُمْ وَيَهْدِيَكُمْ سُنَنَ الَّذِينَ مِن قَبْلِكُمْ وَيَتُوبَ عَلَيْكُمْ ۗ وَاللَّهُ عَلِيمٌ حَكِيمٌ
అల్లాహ్ మీకు (ధర్మాధర్మాలను) విడమరచి చెప్పాలనీ, మీ పూర్వీకుల్లోని (సజ్జనుల) మార్గంపై మిమ్మల్ని నడిపించాలనీ, మీ పశ్చాత్తాపాన్ని ఆమోదించాలని అభిలషిస్తున్నాడు. అల్లాహ్ సర్వం తెలిసినవాడు, వివేక సంపన్నుడు.
4:27 وَاللَّهُ يُرِيدُ أَن يَتُوبَ عَلَيْكُمْ وَيُرِيدُ الَّذِينَ يَتَّبِعُونَ الشَّهَوَاتِ أَن تَمِيلُوا مَيْلًا عَظِيمًا
అల్లాహ్ మీ పశ్చాత్తాపాన్ని అంగీకరించాలని కోరుతున్నాడు. కాని, తమ మనోవాంఛలను అనుసరిస్తున్నవారు మాత్రం మీరు (దైవమార్గం నుంచి) పెడదారి తీసి చాలా దూరం వెళ్ళిపోవాలని కోరుకుంటున్నారు.
4:28 يُرِيدُ اللَّهُ أَن يُخَفِّفَ عَنكُمْ ۚ وَخُلِقَ الْإِنسَانُ ضَعِيفًا
మీపైన ఉన్న బరువును తగ్గించాలన్నది అల్లాహ్ అభిలాష. ఎందుకంటే మానవుడు బలహీనుడుగా పుట్టించబడ్డాడు.
4:29 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَأْكُلُوا أَمْوَالَكُم بَيْنَكُم بِالْبَاطِلِ إِلَّا أَن تَكُونَ تِجَارَةً عَن تَرَاضٍ مِّنكُمْ ۚ وَلَا تَقْتُلُوا أَنفُسَكُمْ ۚ إِنَّ اللَّهَ كَانَ بِكُمْ رَحِيمًا
ఓ విశ్వసించిన వారలారా! ఒండొకరి సొమ్మును అధర్మంగా తినకండి. అయితే పరస్పర అంగీకారంతో జరిగే క్రయ విక్రయాల ద్వారా లభించే దానిని (తినవచ్చు). మిమ్మల్ని మీరు చంపుకోకండి. నిస్సందేహంగా అల్లాహ్ మీపై అమితమైన దయగలవాడు.
4:30 وَمَن يَفْعَلْ ذَٰلِكَ عُدْوَانًا وَظُلْمًا فَسَوْفَ نُصْلِيهِ نَارًا ۚ وَكَانَ ذَٰلِكَ عَلَى اللَّهِ يَسِيرًا
తలబిరుసుతనంతో, దౌర్జన్యంతో దీనికి (ఈ అవిధేయతకు) పాల్పడేవాడ్ని మేము నరకాగ్నిలో పడవేస్తాము. ఇలా చేయటం అల్లాహ్‌కు చాలా తేలిక.
4:31 إِن تَجْتَنِبُوا كَبَائِرَ مَا تُنْهَوْنَ عَنْهُ نُكَفِّرْ عَنكُمْ سَيِّئَاتِكُمْ وَنُدْخِلْكُم مُّدْخَلًا كَرِيمًا
మీకు వారించబడే మహాపరాధాలకు గనక మీరు దూరంగా ఉన్నట్లయితే, మీ చిన్న చిన్న పాపాలను మేము మీ (లెక్క) నుండి తీసేస్తాము. ఇంకా మిమ్మల్ని గౌరవప్రద స్థానాల్లో ప్రవేశింపజేస్తాము.
4:32 وَلَا تَتَمَنَّوْا مَا فَضَّلَ اللَّهُ بِهِ بَعْضَكُمْ عَلَىٰ بَعْضٍ ۚ لِّلرِّجَالِ نَصِيبٌ مِّمَّا اكْتَسَبُوا ۖ وَلِلنِّسَاءِ نَصِيبٌ مِّمَّا اكْتَسَبْنَ ۚ وَاسْأَلُوا اللَّهَ مِن فَضْلِهِ ۗ إِنَّ اللَّهَ كَانَ بِكُلِّ شَيْءٍ عَلِيمًا
అల్లాహ్ మీలో కొందరికి మరికొందరిపై దేని మూలంగా విశిష్ఠతను ప్రసాదించాడో దానికోసం ఆశపడకండి. పురుషులు సంపాదించిన దానినిబట్టి వారి భాగం వారికుంటుంది. అలాగే స్త్రీలు సంపాదించిన దానినిబట్టి వారి భాగం వారికుంటుంది. కాకపోతే మీరు అల్లాహ్ నుండి ఆయన అనుగ్రహాన్ని అర్థిస్తూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ ప్రతిదీ తెలిసినవాడు.
4:33 وَلِكُلٍّ جَعَلْنَا مَوَالِيَ مِمَّا تَرَكَ الْوَالِدَانِ وَالْأَقْرَبُونَ ۚ وَالَّذِينَ عَقَدَتْ أَيْمَانُكُمْ فَآتُوهُمْ نَصِيبَهُمْ ۚ إِنَّ اللَّهَ كَانَ عَلَىٰ كُلِّ شَيْءٍ شَهِيدًا
తల్లిదండ్రులు, సమీప బంధువులు వదలివెళ్ళిన ఆస్తికి మేము వారి వారసులను నిర్థారించిపెట్టాము. మీరు ఎవరితోనయినా ఏదయినా ఒప్పందం చేసుకుని ఉంటే, తదనుగుణంగా వారి భాగాన్ని వారికి ఇవ్వండి. యదార్థానికి అల్లాహ్ అన్నింటిపై సాక్షిగా ఉన్నాడు.
4:34 الرِّجَالُ قَوَّامُونَ عَلَى النِّسَاءِ بِمَا فَضَّلَ اللَّهُ بَعْضَهُمْ عَلَىٰ بَعْضٍ وَبِمَا أَنفَقُوا مِنْ أَمْوَالِهِمْ ۚ فَالصَّالِحَاتُ قَانِتَاتٌ حَافِظَاتٌ لِّلْغَيْبِ بِمَا حَفِظَ اللَّهُ ۚ وَاللَّاتِي تَخَافُونَ نُشُوزَهُنَّ فَعِظُوهُنَّ وَاهْجُرُوهُنَّ فِي الْمَضَاجِعِ وَاضْرِبُوهُنَّ ۖ فَإِنْ أَطَعْنَكُمْ فَلَا تَبْغُوا عَلَيْهِنَّ سَبِيلًا ۗ إِنَّ اللَّهَ كَانَ عَلِيًّا كَبِيرًا
పురుషులు స్త్రీలపై అధికారులు. ఎందుకంటే అల్లాహ్ ఒకరికి ఇంకొకరిపై విశిష్ఠతను వొసగాడు. అదీగాక పురుషులు తమ సంపదను (వారిపై) ఖర్చుపెట్టారు. కనుక గుణవంతులైన స్త్రీలు విధేయులై ఉంటారు. తమ భర్తలు లేని సమయంలో అల్లాహ్ రక్షణలో ఉంటూ (తమ శీలాన్నీ, భర్త సంపదను) కాపాడుతారు. ఏ స్త్రీలు అవిధేయతకు పాల్పడతారని మీకు భయం ఉంటుందో వారికి నచ్చజెప్పండి. (అవసరమైతే) పడక దగ్గర వారిని వేరుగా ఉంచండి. వారిని కొట్టండి. ఆ తరువాత వారు గనక మీకు విధేయులైతే వారిని అనవసరంగా వేధించే ఉద్దేశ్యంతో సాకులు వెతక్కండి. నిశ్చయంగా అల్లాహ్ సర్వోన్నతుడు, గొప్పవాడు.
4:35 وَإِنْ خِفْتُمْ شِقَاقَ بَيْنِهِمَا فَابْعَثُوا حَكَمًا مِّنْ أَهْلِهِ وَحَكَمًا مِّنْ أَهْلِهَا إِن يُرِيدَا إِصْلَاحًا يُوَفِّقِ اللَّهُ بَيْنَهُمَا ۗ إِنَّ اللَّهَ كَانَ عَلِيمًا خَبِيرًا
ఒకవేళ ఆలుమగల మధ్య విముఖత విరోధంగా మారే భయం మీకుంటే భర్త తరఫు నుంచి ఒక మధ్యవర్తినీ, భార్య వైపు నుంచి ఒక మధ్యవర్తినీ నియమించుకోండి. వారిద్దరూ గనక సర్దుబాటుకు ప్రయత్నం చేయదలిస్తే అల్లాహ్ ఆ దంపతుల మధ్య రాజీ కుదుర్చుతాడు. నిస్సందేహంగా అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, సర్వం ఎరిగినవాడు.
4:36 وَاعْبُدُوا اللَّهَ وَلَا تُشْرِكُوا بِهِ شَيْئًا ۖ وَبِالْوَالِدَيْنِ إِحْسَانًا وَبِذِي الْقُرْبَىٰ وَالْيَتَامَىٰ وَالْمَسَاكِينِ وَالْجَارِ ذِي الْقُرْبَىٰ وَالْجَارِ الْجُنُبِ وَالصَّاحِبِ بِالْجَنبِ وَابْنِ السَّبِيلِ وَمَا مَلَكَتْ أَيْمَانُكُمْ ۗ إِنَّ اللَّهَ لَا يُحِبُّ مَن كَانَ مُخْتَالًا فَخُورًا
అల్లాహ్‌ను ఆరాధించండి. ఆయనకు సహవర్తులుగా ఎవరినీ కల్పించకండి. తల్లిదండ్రుల పట్ల ఉత్తమంగా వ్యవహరించండి. బంధువుల పట్ల, తండ్రిలేని బిడ్డల పట్ల, నిరుపేదల పట్ల, ఆత్మీయులైన పొరుగువారి పట్ల, బంధువులు కాని పొరుగువారి పట్ల, ప్రక్కనున్న మిత్రుల పట్ల, బాటసారుల పట్ల, మీ అధీనంలో ఉన్న బానిసల పట్ల ఔదార్యంతో మెలగండి. నిశ్చయంగా అల్లాహ్ అహంకారంతో విర్రవీగేవారిని, బడాయి కొట్టే వారిని ఎంతమాత్రం ఇష్టపడడు.
4:37 الَّذِينَ يَبْخَلُونَ وَيَأْمُرُونَ النَّاسَ بِالْبُخْلِ وَيَكْتُمُونَ مَا آتَاهُمُ اللَّهُ مِن فَضْلِهِ ۗ وَأَعْتَدْنَا لِلْكَافِرِينَ عَذَابًا مُّهِينًا
వారు పిసినారులుగా ప్రవర్తించటమే గాక, ఇతరులకు కూడా పిసినారితనాన్ని నేర్పుతారు. అల్లాహ్ తన అనుగ్రహం నుండి తమకు ప్రసాదించిన దాన్ని దాచిపెడతారు. ఇటువంటి తిరస్కారుల కొరకు మేము అవమానకరమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాము.
4:38 وَالَّذِينَ يُنفِقُونَ أَمْوَالَهُمْ رِئَاءَ النَّاسِ وَلَا يُؤْمِنُونَ بِاللَّهِ وَلَا بِالْيَوْمِ الْآخِرِ ۗ وَمَن يَكُنِ الشَّيْطَانُ لَهُ قَرِينًا فَسَاءَ قَرِينًا
వారు ప్రజలకు చూపటానికి తమ సొమ్మును ఖర్చుపెడతారు. అల్లాహ్‌ను, అంతిమదినాన్ని విశ్వసించరు. వాస్తవమేమిటంటే షైతాను ఎవరికి స్నేహితుడయ్యాడో (వారిని ఇలాగే నాశనం చేస్తాడు), వాడు బహుచెడ్డ స్నేహితుడు.
4:39 وَمَاذَا عَلَيْهِمْ لَوْ آمَنُوا بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ وَأَنفَقُوا مِمَّا رَزَقَهُمُ اللَّهُ ۚ وَكَانَ اللَّهُ بِهِمْ عَلِيمًا
వారే గనక అల్లాహ్‌ను, అంతిమదినాన్ని విశ్వసించి, అల్లాహ్ తమకు ప్రసాదించిన దానిలో నుంచి ఖర్చుపెడితే ఏం పోయేది? వారి స్థితిగతులు అల్లాహ్‌కు బాగా తెలుసు.
4:40 إِنَّ اللَّهَ لَا يَظْلِمُ مِثْقَالَ ذَرَّةٍ ۖ وَإِن تَكُ حَسَنَةً يُضَاعِفْهَا وَيُؤْتِ مِن لَّدُنْهُ أَجْرًا عَظِيمًا
అల్లాహ్ ఎవరికీ రవ్వంత అన్యాయం చేయడనేది నిశ్చయం. సత్కార్యం ఉంటే ఆయన దాన్ని రెట్టింపు చేస్తాడు. అంతేకాదు, తన వద్దనున్న దానిలో నుంచి గొప్ప ప్రతిఫలాన్ని వొసగుతాడు.
4:41 فَكَيْفَ إِذَا جِئْنَا مِن كُلِّ أُمَّةٍ بِشَهِيدٍ وَجِئْنَا بِكَ عَلَىٰ هَٰؤُلَاءِ شَهِيدًا
(ఓ ముహమ్మద్-స!) మేము ప్రతి సమాజం నుంచి ఒక సాక్షిని తెచ్చి, వారిపై నిన్ను సాక్షిగా పెట్టినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది?
4:42 يَوْمَئِذٍ يَوَدُّ الَّذِينَ كَفَرُوا وَعَصَوُا الرَّسُولَ لَوْ تُسَوَّىٰ بِهِمُ الْأَرْضُ وَلَا يَكْتُمُونَ اللَّهَ حَدِيثًا
ఆ రోజు అవిశ్వాసులూ, ప్రవక్త పట్ల అవిధేయతకు పాల్పడినవారూ తాము నేలమట్టం చేయబడితే బావుండునే! అని కోరుకుంటారు. వారు దైవసమక్షంలో ఏ ఒక్క విషయాన్నీ దాచలేరు.
4:43 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَقْرَبُوا الصَّلَاةَ وَأَنتُمْ سُكَارَىٰ حَتَّىٰ تَعْلَمُوا مَا تَقُولُونَ وَلَا جُنُبًا إِلَّا عَابِرِي سَبِيلٍ حَتَّىٰ تَغْتَسِلُوا ۚ وَإِن كُنتُم مَّرْضَىٰ أَوْ عَلَىٰ سَفَرٍ أَوْ جَاءَ أَحَدٌ مِّنكُم مِّنَ الْغَائِطِ أَوْ لَامَسْتُمُ النِّسَاءَ فَلَمْ تَجِدُوا مَاءً فَتَيَمَّمُوا صَعِيدًا طَيِّبًا فَامْسَحُوا بِوُجُوهِكُمْ وَأَيْدِيكُمْ ۗ إِنَّ اللَّهَ كَانَ عَفُوًّا غَفُورًا
విశ్వసించిన ప్రజలారా! మీరు (తాగిన) మత్తులో ఉన్నప్పుడు నమాజు దరిదాపులకు కూడా పోకండి. మీరు పలికేదేమిటో మీకు అర్థం కాగలిగినప్పుడే (నమాజు చెయ్యాలి). లైంగిక అశుద్ధావస్థలో కూడా – స్నానం చేయనంతవరకూ – నమాజు చేయరాదు. (మస్జిదు) దారిగుండా సాగిపోయేటి పరిస్థితి అయితే అది వేరే విషయం! ఒకవేళ మీరు వ్యాధిగ్రస్తులైతే, లేక ప్రయాణంలో ఉంటే లేక మీలో ఎవరయినా మలమూత్ర విసర్జన చేసివస్తే లేక మీరు స్త్రీలతో సమాగమం జరిపి ఉంటే – అట్టి స్థితిలో మీకు నీరు లభ్యం కానిపక్షంలో పరిశుభ్రమైన మట్టి(ని ఉపయోగించే) సంకల్పం చేసుకోండి. (దాంతో) మీ ముఖాలను, చేతులను తుడుచుకోండి. నిశ్చయంగా అల్లాహ్ మన్నించేవాడు, క్షమాభిక్ష పెట్టేవాడు.
4:44 أَلَمْ تَرَ إِلَى الَّذِينَ أُوتُوا نَصِيبًا مِّنَ الْكِتَابِ يَشْتَرُونَ الضَّلَالَةَ وَيُرِيدُونَ أَن تَضِلُّوا السَّبِيلَ
గ్రంథంలో కొంతభాగం యివ్వబడిన వారిని మీరు చూడలేదా? వారు మార్గభ్రష్టతను కొనితెచ్చుకుంటారు. మీరు కూడా మార్గం తప్పాలన్నది వారి ఉద్దేశం.
4:45 وَاللَّهُ أَعْلَمُ بِأَعْدَائِكُمْ ۚ وَكَفَىٰ بِاللَّهِ وَلِيًّا وَكَفَىٰ بِاللَّهِ نَصِيرًا
మీ శత్రువుల గురించి అల్లాహ్ బాగా ఎరిగినవాడు. మీకు మిత్రుడిగా అల్లాహ్ చాలు. మీకు సహాయకుడిగా (కూడా) అల్లాహ్ చాలు.
4:46 مِّنَ الَّذِينَ هَادُوا يُحَرِّفُونَ الْكَلِمَ عَن مَّوَاضِعِهِ وَيَقُولُونَ سَمِعْنَا وَعَصَيْنَا وَاسْمَعْ غَيْرَ مُسْمَعٍ وَرَاعِنَا لَيًّا بِأَلْسِنَتِهِمْ وَطَعْنًا فِي الدِّينِ ۚ وَلَوْ أَنَّهُمْ قَالُوا سَمِعْنَا وَأَطَعْنَا وَاسْمَعْ وَانظُرْنَا لَكَانَ خَيْرًا لَّهُمْ وَأَقْوَمَ وَلَٰكِن لَّعَنَهُمُ اللَّهُ بِكُفْرِهِمْ فَلَا يُؤْمِنُونَ إِلَّا قَلِيلًا
కొంతమంది యూదులు పదాలను వాటి నిజస్థానం నుంచి తారుమారు చేస్తారు. “మేము విన్నాము, అవిధేయులం అయ్యాము” అని వారంటారు. అంతేకాదు – “విను. నీకేమీ వినపడకూడదు. రాయినా” అని పలుకుతారు. అలా అనేటప్పుడు వారు తమ నాలుకను మెలి తిప్పుతారు. (ఇస్లాం) ధర్మాన్ని ఎగతాళి చేయాలన్నది అసలు వారి ఉద్దేశం. ఇలా అనే బదులు వారు, “మేము విన్నాము. విధేయులమయ్యాము” అనీ, “వినండి. మా వంక చూడండి” అని పలికి ఉంటే అది వారి కొరకు ఎంతో శ్రేయస్కరంగా, సమంజసంగా ఉండేది. కాని అల్లాహ్ వారి అవిశ్వాసం మూలంగా వారిని శపించాడు. ఇక వారిలో విశ్వసించేది బహుకొద్దిమంది మాత్రమే.
4:47 يَا أَيُّهَا الَّذِينَ أُوتُوا الْكِتَابَ آمِنُوا بِمَا نَزَّلْنَا مُصَدِّقًا لِّمَا مَعَكُم مِّن قَبْلِ أَن نَّطْمِسَ وُجُوهًا فَنَرُدَّهَا عَلَىٰ أَدْبَارِهَا أَوْ نَلْعَنَهُمْ كَمَا لَعَنَّا أَصْحَابَ السَّبْتِ ۚ وَكَانَ أَمْرُ اللَّهِ مَفْعُولًا
ఓ గ్రంథవహులారా! మేము అవతరింపజేసిన దానిని విశ్వసించండి. అది మీ వద్ద ఉన్నదానిని ధృవీకరిస్తుంది. మేము ముఖాలను వికృతం చేసి, వీపు వైపుకు తిప్పకముందే లేక శనివారం వాళ్లను శపించినట్లుగా మేము వారినీ శపించక ముందే దీనిని (ఈ గ్రంథాన్ని) విశ్వసించండి. అల్లాహ్ తలచుకున్న పని ఇక అయిపోయినట్లే.
4:48 إِنَّ اللَّهَ لَا يَغْفِرُ أَن يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَٰلِكَ لِمَن يَشَاءُ ۚ وَمَن يُشْرِكْ بِاللَّهِ فَقَدِ افْتَرَىٰ إِثْمًا عَظِيمًا
తనకు భాగస్వామిగా మరొకరిని కల్పించటాన్ని (షిర్కును) అల్లాహ్ సుతరామూ క్షమించడు. ఇది తప్ప ఆయన తాను కోరిన వారి ఇతర పాపాలను క్షమిస్తాడు. అల్లాహ్‌కు భాగస్వామ్యం కల్పించినవాడు ఘోర పాపంతో కూడిన కల్పన చేశాడు.
4:49 أَلَمْ تَرَ إِلَى الَّذِينَ يُزَكُّونَ أَنفُسَهُم ۚ بَلِ اللَّهُ يُزَكِّي مَن يَشَاءُ وَلَا يُظْلَمُونَ فَتِيلًا
తాము పవిత్రులమని ఆత్మస్తుతి చేసుకునే వారిని నువ్వు చూడలేదా? యదార్థానికి అల్లాహ్ తాను కోరిన వారిని పవిత్రులుగా చేస్తాడు. ఎవరికీ ఒక చిన్న పీచు అంత అన్యాయం కూడా జరగదు.
4:50 انظُرْ كَيْفَ يَفْتَرُونَ عَلَى اللَّهِ الْكَذِبَ ۖ وَكَفَىٰ بِهِ إِثْمًا مُّبِينًا
వారు అల్లాహ్‌కు ఎలాంటి అసత్యాలను ఆపాదిస్తున్నారో చూడు! స్పష్టమైన పాపం కావటానికి ఈ ఒక్క చేష్ట చాలు.
4:51 أَلَمْ تَرَ إِلَى الَّذِينَ أُوتُوا نَصِيبًا مِّنَ الْكِتَابِ يُؤْمِنُونَ بِالْجِبْتِ وَالطَّاغُوتِ وَيَقُولُونَ لِلَّذِينَ كَفَرُوا هَٰؤُلَاءِ أَهْدَىٰ مِنَ الَّذِينَ آمَنُوا سَبِيلًا
గ్రంథంలో కొంతభాగం ఇవ్వబడిన వారిని నీవు చూడలేదా? వారు విగ్రహాల (జిబ్త్)పై, మిథ్యాదైవాల (తాగూత్)పై విశ్వాసం కలిగి ఉన్నారు. అవిశ్వాసుల గురించి అభిప్రాయపడుతూ, “విశ్వాసుల కంటే వీరే చాలా వరకు సన్మార్గాన ఉన్నారు” అని అంటారు.
4:52 أُولَٰئِكَ الَّذِينَ لَعَنَهُمُ اللَّهُ ۖ وَمَن يَلْعَنِ اللَّهُ فَلَن تَجِدَ لَهُ نَصِيرًا
అల్లాహ్ శపించింది కూడా వీరినే. అల్లాహ్ శాపానికి గురైన వారిని ఆదుకునే వాడెవణ్ణీ నీవు చూడవు.
4:53 أَمْ لَهُمْ نَصِيبٌ مِّنَ الْمُلْكِ فَإِذًا لَّا يُؤْتُونَ النَّاسَ نَقِيرًا
రాజ్యాధికారంలో వారికేదన్నా భాగముందా? ఒకవేళ ఉంటే వారు జనులకు రవంత కూడా ఇవ్వరు.
4:54 أَمْ يَحْسُدُونَ النَّاسَ عَلَىٰ مَا آتَاهُمُ اللَّهُ مِن فَضْلِهِ ۖ فَقَدْ آتَيْنَا آلَ إِبْرَاهِيمَ الْكِتَابَ وَالْحِكْمَةَ وَآتَيْنَاهُم مُّلْكًا عَظِيمًا
లేక అల్లాహ్ తన అనుగ్రహంతో ప్రజలకు ప్రసాదించిన దానిపై వారు అసూయ పడుతున్నారా? మేమైతే ఇబ్రాహీము సంతతికి గ్రంథాన్ని, వివేకాన్నీ ప్రసాదించాము. గొప్ప సామ్రాజ్యాన్ని కూడా వొసగాము.
4:55 فَمِنْهُم مَّنْ آمَنَ بِهِ وَمِنْهُم مَّن صَدَّ عَنْهُ ۚ وَكَفَىٰ بِجَهَنَّمَ سَعِيرًا
తరువాత వారిలో కొందరు ఈ గ్రంథాన్ని విశ్వసించగా, కొందరు (విశ్వసించకుండా) ఆగిపోయారు. (వారిని) దహించటానికి నరకం చాలు.
4:56 إِنَّ الَّذِينَ كَفَرُوا بِآيَاتِنَا سَوْفَ نُصْلِيهِمْ نَارًا كُلَّمَا نَضِجَتْ جُلُودُهُم بَدَّلْنَاهُمْ جُلُودًا غَيْرَهَا لِيَذُوقُوا الْعَذَابَ ۗ إِنَّ اللَّهَ كَانَ عَزِيزًا حَكِيمًا
మా ఆయతులను త్రోసిపుచ్చిన వారిని మేము అగ్నిలో పడవేస్తాము. వారి చర్మాలు బాగా ఉడికిపోయినప్పుడల్లా, వాటికి బదులుగా, వారు శిక్ష యొక్క రుచి చూసేందుకు వేరే చర్మాలను సృష్టిస్తాము. నిశ్చయంగా అల్లాహ్ సర్వాధిక్యుడు, వివేకవంతుడు.
4:57 وَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ سَنُدْخِلُهُمْ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا أَبَدًا ۖ لَّهُمْ فِيهَا أَزْوَاجٌ مُّطَهَّرَةٌ ۖ وَنُدْخِلُهُمْ ظِلًّا ظَلِيلًا
మరెవరు విశ్వసించి సత్కార్యాలు చేస్తారో వారిని మేము, క్రింద కాలువలు ప్రవహించే (స్వర్గ) వనాలలోకి తీసుకుపోతాము. వాటిలో వారు కలకాలం ఉంటారు. వారి కోసం అక్కడ పవిత్రులైన భార్యలుంటారు. ఇంకా మేము వారిని దట్టమైన నీడల్లోకి (మరియు పూరిపూర్ణ సౌఖ్యంలోకి) తీసుకుపోతాము.
4:58 إِنَّ اللَّهَ يَأْمُرُكُمْ أَن تُؤَدُّوا الْأَمَانَاتِ إِلَىٰ أَهْلِهَا وَإِذَا حَكَمْتُم بَيْنَ النَّاسِ أَن تَحْكُمُوا بِالْعَدْلِ ۚ إِنَّ اللَّهَ نِعِمَّا يَعِظُكُم بِهِ ۗ إِنَّ اللَّهَ كَانَ سَمِيعًا بَصِيرًا
“ఎవరి అమానతులను వారికి అప్పగించండి. ప్రజల మధ్య తీర్పులు చేసేటప్పుడు న్యాయంగా తీర్పు చేయండి” అని అల్లాహ్ మిమ్మల్ని గట్టిగా ఆదేశిస్తున్నాడు. నిశ్చయంగా అల్లాహ్ మీకు చేసే ఉపదేశం ఎంతో చక్కనిది. నిస్సందేహంగా అల్లాహ్ అన్నీ వింటున్నాడు, చూస్తున్నాడు.
4:59 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَطِيعُوا اللَّهَ وَأَطِيعُوا الرَّسُولَ وَأُولِي الْأَمْرِ مِنكُمْ ۖ فَإِن تَنَازَعْتُمْ فِي شَيْءٍ فَرُدُّوهُ إِلَى اللَّهِ وَالرَّسُولِ إِن كُنتُمْ تُؤْمِنُونَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ ۚ ذَٰلِكَ خَيْرٌ وَأَحْسَنُ تَأْوِيلًا
ఓ విశ్వాసులారా! అల్లాహ్‌కు విధేయత చూపండి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు విధేయత చూపండి. మరియు మీలోని అధికారులకు కూడా. ఆపైన ఏ విషయంలోనైనా మీ మధ్య వివాదం తలెత్తితే దాన్ని అల్లాహ్ మరియు ప్రవక్త వైపుకు మరల్చండి – మీకు నిజంగా అల్లాహ్‌పై, అంతిమ దినంపై నమ్మకం ఉన్నట్లయితే (మీరిలా చేయటం అవశ్యం)! ఇదే మేలైన పద్ధతి. పరిణామం రీత్యా కూడా ఇదే అన్నింటికంటే ఉత్తమమైనది.
4:60 أَلَمْ تَرَ إِلَى الَّذِينَ يَزْعُمُونَ أَنَّهُمْ آمَنُوا بِمَا أُنزِلَ إِلَيْكَ وَمَا أُنزِلَ مِن قَبْلِكَ يُرِيدُونَ أَن يَتَحَاكَمُوا إِلَى الطَّاغُوتِ وَقَدْ أُمِرُوا أَن يَكْفُرُوا بِهِ وَيُرِيدُ الشَّيْطَانُ أَن يُضِلَّهُمْ ضَلَالًا بَعِيدًا
(ఓ ప్రవక్తా!) నీపై అవతరించినదాన్నీ, నీకు పూర్వం వారిపై అవతరించిన దాన్నీ విశ్వసించాము అని అంటూనే తమ వ్యవహారాలను తీర్పు కోసం దైవేతరుల (తాగూత్) వద్దకు తీసుకు పోగోరే వారిని నీవు చూడలేదా? మరి నిజానికి షైతాన్ను (తాగూత్ను) తిరస్కరించమని వారికి (స్పష్టంగా) ఆదేశించటం జరిగింది. షైతానైతే వారిని మార్గం తప్పించి చాలా దూరంలో పడవేయాలని కోరుతున్నాడు.
4:61 وَإِذَا قِيلَ لَهُمْ تَعَالَوْا إِلَىٰ مَا أَنزَلَ اللَّهُ وَإِلَى الرَّسُولِ رَأَيْتَ الْمُنَافِقِينَ يَصُدُّونَ عَنكَ صُدُودًا
“అల్లాహ్ అవతరింపజేసిన దాని వైపుకు, ప్రవక్త (సఅసం) వైపుకు రండి” అని వారితో అన్నప్పుడల్లా, ఈ కపటులు నీ నుండి అయిష్టంగా ముఖం త్రిప్పుకుని పోవటాన్ని నీవు గమనిస్తావు.
4:62 فَكَيْفَ إِذَا أَصَابَتْهُم مُّصِيبَةٌ بِمَا قَدَّمَتْ أَيْدِيهِمْ ثُمَّ جَاءُوكَ يَحْلِفُونَ بِاللَّهِ إِنْ أَرَدْنَا إِلَّا إِحْسَانًا وَتَوْفِيقًا
మరి ఇదేమిటి? వారు తమ చేజేతులా చేసుకున్న దాని పర్యవసానంగా వారిపై ఏదన్నా ఆపద వచ్చిపడితే, అప్పుడు వారు నీ వద్దకు వచ్చి, అల్లాహ్‌పై ప్రమాణం చేస్తూ , “మేము మేలును, సయోధ్యను కాంక్షించి మాత్రమే ఇలా చేశాము” అని అంటారు.
4:63 أُولَٰئِكَ الَّذِينَ يَعْلَمُ اللَّهُ مَا فِي قُلُوبِهِمْ فَأَعْرِضْ عَنْهُمْ وَعِظْهُمْ وَقُل لَّهُمْ فِي أَنفُسِهِمْ قَوْلًا بَلِيغًا
వారి హృదయాలలో ఉన్నదంతా అల్లాహ్‌కు బాగా తెలుసు. కనుక (ఓ ప్రవక్తా!) వారిని పట్టించుకోకు. కాకపోతే వారికి బోధపరుస్తూ ఉండు. వారి మనోక్షేత్రంలో నాటుకునేలా మాట చెబుతూ ఉండు.
4:64 وَمَا أَرْسَلْنَا مِن رَّسُولٍ إِلَّا لِيُطَاعَ بِإِذْنِ اللَّهِ ۚ وَلَوْ أَنَّهُمْ إِذ ظَّلَمُوا أَنفُسَهُمْ جَاءُوكَ فَاسْتَغْفَرُوا اللَّهَ وَاسْتَغْفَرَ لَهُمُ الرَّسُولُ لَوَجَدُوا اللَّهَ تَوَّابًا رَّحِيمًا
మేము ఏ ప్రవక్తను పంపినా దైవాజ్ఞతో (ప్రజలు) అతనిని అనుసరించాలనే పంపాము. వారే గనక తమ ఆత్మలకు అన్యాయం చేసుకున్నప్పుడు, నీ వద్దకు వచ్చి క్షమాపణకై దైవాన్ని వేడుకుని ఉంటే, ప్రవక్త కూడా వారి మన్నింపుకై విన్నవించుకుని ఉంటే అప్పుడు వారు అల్లాహ్‌ను క్షమించేవాడుగా, కరుణించేవాడుగా పొంది ఉండేవారు.
4:65 فَلَا وَرَبِّكَ لَا يُؤْمِنُونَ حَتَّىٰ يُحَكِّمُوكَ فِيمَا شَجَرَ بَيْنَهُمْ ثُمَّ لَا يَجِدُوا فِي أَنفُسِهِمْ حَرَجًا مِّمَّا قَضَيْتَ وَيُسَلِّمُوا تَسْلِيمًا
కనుక (ఓ ప్రవక్తా!) నీ ప్రభువు తోడు! వారు తమ పరస్పర వివాదాలన్నింటిలో నిన్ను తీర్పరిగా చేసుకోనంతవరకూ, తర్వాత నీవు వారి మధ్య చెప్పిన తీర్పుపట్ల వారు తమ మనసులలో ఎలాంటి సంకోచానికి, అసంతృప్తికి ఆస్కారం యివ్వకుండా మనస్ఫూర్తిగా శిరసావహించనంతవరకూ – వారు విశ్వాసులు కాజాలరు.
4:66 وَلَوْ أَنَّا كَتَبْنَا عَلَيْهِمْ أَنِ اقْتُلُوا أَنفُسَكُمْ أَوِ اخْرُجُوا مِن دِيَارِكُم مَّا فَعَلُوهُ إِلَّا قَلِيلٌ مِّنْهُمْ ۖ وَلَوْ أَنَّهُمْ فَعَلُوا مَا يُوعَظُونَ بِهِ لَكَانَ خَيْرًا لَّهُمْ وَأَشَدَّ تَثْبِيتًا
ఒకవేళ మేము “మిమ్మల్ని మీరు చంపుకోండి” లేదా “మీ ఇళ్ల నుంచి వెళ్ళిపోండి” అనే ఆదేశాన్ని వారిపై విధించి ఉంటే, వారిలో బహుకొద్దిమంది మాత్రమే దాన్ని పాటించేవారు. అలా కాకుండా వారు తమకు ఉపదేశించబడుతున్న విధంగా చేసి వుంటే నిశ్చయంగా అది వారి కొరకు శ్రేయస్కరం అయ్యేది, ఎక్కువ స్థయిర్యాన్నీ ఒనగూర్చేది.
4:67 وَإِذًا لَّآتَيْنَاهُم مِّن لَّدُنَّا أَجْرًا عَظِيمًا
అదేగనక జరిగి ఉంటే మేము మా వద్ద నుండి వారికి గొప్ప పుణ్యఫలం ప్రసాదించి ఉండేవాళ్ళం.
4:68 وَلَهَدَيْنَاهُمْ صِرَاطًا مُّسْتَقِيمًا
ఇంకా వారికి రుజుమార్గం చూపించి ఉండేవాళ్ళం.
4:69 وَمَن يُطِعِ اللَّهَ وَالرَّسُولَ فَأُولَٰئِكَ مَعَ الَّذِينَ أَنْعَمَ اللَّهُ عَلَيْهِم مِّنَ النَّبِيِّينَ وَالصِّدِّيقِينَ وَالشُّهَدَاءِ وَالصَّالِحِينَ ۚ وَحَسُنَ أُولَٰئِكَ رَفِيقًا
ఎవరయితే అల్లాహ్‌కు, ప్రవక్త (సఅసం)కు విధేయత కనబరుస్తారో వారే అల్లాహ్ అనుగ్రహం పొందిన ప్రవక్తలతోనూ, సత్య సంధులతోనూ, షహీదులతోనూ, సద్వర్తనులతోనూ ఉంటారు. వీరు ఎంతో మంచి స్నేహితులు.
4:70 ذَٰلِكَ الْفَضْلُ مِنَ اللَّهِ ۚ وَكَفَىٰ بِاللَّهِ عَلِيمًا
ఇదీ అల్లాహ్ తరఫు నుంచి లభించే అనుగ్రహం. తెలుసుకోవటానికి అల్లాహ్‌యే చాలు.
4:71 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا خُذُوا حِذْرَكُمْ فَانفِرُوا ثُبَاتٍ أَوِ انفِرُوا جَمِيعًا
విశ్వాసులారా! మీరు మీ ఆత్మరక్షణా సామగ్రిని సమకూర్చుకోండి. ఆపైన వేర్వేరు దళాలుగా ఏర్పడి బయలుదేరండి లేదా అందరూ కలసికట్టుగా కదలండి.
4:72 وَإِنَّ مِنكُمْ لَمَن لَّيُبَطِّئَنَّ فَإِنْ أَصَابَتْكُم مُّصِيبَةٌ قَالَ قَدْ أَنْعَمَ اللَّهُ عَلَيَّ إِذْ لَمْ أَكُن مَّعَهُمْ شَهِيدًا
మీలో కొందరు వెనుకాడేవారు కూడా ఉన్నారు. ఒకవేళ మీకు ఏదన్నా నష్టం వాటిల్లితే, “అల్లాహ్ నన్ను అనుగ్రహించాడు. ఆ సమయంలో నేను వారివెంట లేను” అని అంటారు.
4:73 وَلَئِنْ أَصَابَكُمْ فَضْلٌ مِّنَ اللَّهِ لَيَقُولَنَّ كَأَن لَّمْ تَكُن بَيْنَكُمْ وَبَيْنَهُ مَوَدَّةٌ يَا لَيْتَنِي كُنتُ مَعَهُمْ فَأَفُوزَ فَوْزًا عَظِيمًا
ఒకవేళ దైవానుగ్రహం ఏదన్నా మీకు లభిస్తే, మీ మధ్య- అతని మధ్య స్నేహబంధమే లేనట్లుగా మాట్లాడుతూ – “అరెరే! నేనూ వారి వెంట ఉండి ఉంటే ఘనవిజయాన్ని పొంది ఉండేవాడినే!” అని చెబుతారు.
4:74 فَلْيُقَاتِلْ فِي سَبِيلِ اللَّهِ الَّذِينَ يَشْرُونَ الْحَيَاةَ الدُّنْيَا بِالْآخِرَةِ ۚ وَمَن يُقَاتِلْ فِي سَبِيلِ اللَّهِ فَيُقْتَلْ أَوْ يَغْلِبْ فَسَوْفَ نُؤْتِيهِ أَجْرًا عَظِيمًا
కాబట్టి ఇహలోక జీవితాన్ని పరలోకానికి బదులుగా అమ్మి వేసినవారు దైవమార్గంలో పోరాడాలి. దైవమార్గంలో పోరాడుతూ చంపబడినవానికి లేదా విజయం పొందినవానికి మేము గొప్ప పుణ్యఫలాన్ని వొసగుతాము.
4:75 وَمَا لَكُمْ لَا تُقَاتِلُونَ فِي سَبِيلِ اللَّهِ وَالْمُسْتَضْعَفِينَ مِنَ الرِّجَالِ وَالنِّسَاءِ وَالْوِلْدَانِ الَّذِينَ يَقُولُونَ رَبَّنَا أَخْرِجْنَا مِنْ هَٰذِهِ الْقَرْيَةِ الظَّالِمِ أَهْلُهَا وَاجْعَل لَّنَا مِن لَّدُنكَ وَلِيًّا وَاجْعَل لَّنَا مِن لَّدُنكَ نَصِيرًا
“మా ప్రభూ! దుర్మార్గుల ఈ పురము నుండి మాకు విముక్తి నొసగు. మా కొరకు నీ వద్దనుంచి ఒక రక్షకుణ్ణి నియమించు, మాకు (అండగా) నీ వద్ద నుంచి ఒక సహాయకుణ్ణి పంపించు” అని వేడుకుంటున్న బలహీన పురుషుల, స్త్రీల, పసివాళ్ళ విమోచనకై మీరు దైవమార్గంలో ఎందుకు పోరాడటం లేదు?!
4:76 الَّذِينَ آمَنُوا يُقَاتِلُونَ فِي سَبِيلِ اللَّهِ ۖ وَالَّذِينَ كَفَرُوا يُقَاتِلُونَ فِي سَبِيلِ الطَّاغُوتِ فَقَاتِلُوا أَوْلِيَاءَ الشَّيْطَانِ ۖ إِنَّ كَيْدَ الشَّيْطَانِ كَانَ ضَعِيفًا
విశ్వసించినవారు దైవమార్గంలో పోరాడతారు. అవిశ్వాస వైఖరిని అవలంబించినవారు దైవేతరుల మార్గంలో పోరాడతారు. కనుక (ఓ విశ్వాసులారా!) మీరు షైతాను స్నేహితులతో యుద్ధం చేయండి. షైతాను జిత్తులు అత్యంత బలహీనమైనవి.
4:77 أَلَمْ تَرَ إِلَى الَّذِينَ قِيلَ لَهُمْ كُفُّوا أَيْدِيَكُمْ وَأَقِيمُوا الصَّلَاةَ وَآتُوا الزَّكَاةَ فَلَمَّا كُتِبَ عَلَيْهِمُ الْقِتَالُ إِذَا فَرِيقٌ مِّنْهُمْ يَخْشَوْنَ النَّاسَ كَخَشْيَةِ اللَّهِ أَوْ أَشَدَّ خَشْيَةً ۚ وَقَالُوا رَبَّنَا لِمَ كَتَبْتَ عَلَيْنَا الْقِتَالَ لَوْلَا أَخَّرْتَنَا إِلَىٰ أَجَلٍ قَرِيبٍ ۗ قُلْ مَتَاعُ الدُّنْيَا قَلِيلٌ وَالْآخِرَةُ خَيْرٌ لِّمَنِ اتَّقَىٰ وَلَا تُظْلَمُونَ فَتِيلًا
“మీ చేతులను ఆపుకోండి, నమాజులను నెలకొల్పుతూ ఉండండి, జకాతును చెల్లిస్తూ ఉండండి” అని ఆదేశించబడిన వారిని నీవు చూడలేదా? తీరా వారికి యుద్ధం చెయ్యమని ఆజ్ఞాపించబడితే, వారిలోని ఒక వర్గంవారు అల్లాహ్‌కు భయపడవలసిన రీతిలో- పైగా అంతకంటే ఎక్కువగానే- జనులకు భయపడసాగారు. “ప్రభూ! నీవు మాపై యుద్ధాన్ని ఎందుకు విధించావు? మరి కొంతకాలంపాటు మమ్మల్ని ఎందుకు బ్రతకనివ్వలేదు?” అని అనసాగారు. వారితో ఇలా చెప్పు: ప్రాపంచిక ప్రయోజనాలు బహు స్వల్పమైనవి. (అల్లాహ్‌కు) భయపడేవారికి పరలోకమే మేలైనది. మీకు (అక్కడ) ఒక చిన్న పీచు అంత అన్యాయం కూడా జరగదు.
4:78 أَيْنَمَا تَكُونُوا يُدْرِككُّمُ الْمَوْتُ وَلَوْ كُنتُمْ فِي بُرُوجٍ مُّشَيَّدَةٍ ۗ وَإِن تُصِبْهُمْ حَسَنَةٌ يَقُولُوا هَٰذِهِ مِنْ عِندِ اللَّهِ ۖ وَإِن تُصِبْهُمْ سَيِّئَةٌ يَقُولُوا هَٰذِهِ مِنْ عِندِكَ ۚ قُلْ كُلٌّ مِّنْ عِندِ اللَّهِ ۖ فَمَالِ هَٰؤُلَاءِ الْقَوْمِ لَا يَكَادُونَ يَفْقَهُونَ حَدِيثًا
మీరెక్కడ ఉన్నాసరే, మృత్యువు మిమ్మల్ని కబళిస్తుంది. ఆఖరికి మీరు పటిష్టమైన కోటలలో ఉన్నాసరే (అది మిమ్మల్ని వదలదు). వారికేదైనా మంచి జరిగితే, “ఇది అల్లాహ్ తరఫున లభించింది” అని అంటారు. అదే వారికేదైనా కీడు కలిగితే, “ఇదంతా నీ మూలంగానే జరిగింది” అని నిందిస్తారు. “ఇవన్నీ వాస్తవానికి అల్లాహ్ తరఫుననే సంభవించాయి” అని (ఓ ప్రవక్తా!) వారికి తెలియజేయి. అసలు వీరికేమైపోయిందీ? ఏ విషయాన్ని కూడా వీరు బొత్తిగా అర్థం చేసుకోరే?!
4:79 مَّا أَصَابَكَ مِنْ حَسَنَةٍ فَمِنَ اللَّهِ ۖ وَمَا أَصَابَكَ مِن سَيِّئَةٍ فَمِن نَّفْسِكَ ۚ وَأَرْسَلْنَاكَ لِلنَّاسِ رَسُولًا ۚ وَكَفَىٰ بِاللَّهِ شَهِيدًا
నీకు ఏ మంచి జరిగినా అది అల్లాహ్ తరఫు నుంచే జరుగుతుంది. నీకు ఏదైనా చెడు జరిగితే అది నీ స్వయంకృతమే. (ఓ ముహమ్మద్!) మేము నిన్ను సమస్త జనులకు సందేశం అందజేసేవానిగా చేసి పంపాము. దీనికి సాక్షిగా అల్లాహ్ చాలు.
4:80 مَّن يُطِعِ الرَّسُولَ فَقَدْ أَطَاعَ اللَّهَ ۖ وَمَن تَوَلَّىٰ فَمَا أَرْسَلْنَاكَ عَلَيْهِمْ حَفِيظًا
ఈ ప్రవక్త (సఅసం)కు విధేయత చూపినవాడు అల్లాహ్‌కు విధేయత చూపినట్లే. మరెవరైతే విముఖత చూపుతారో వారిపై మేము నిన్ను కావలివానిగా చేసి పంపలేదు.
4:81 وَيَقُولُونَ طَاعَةٌ فَإِذَا بَرَزُوا مِنْ عِندِكَ بَيَّتَ طَائِفَةٌ مِّنْهُمْ غَيْرَ الَّذِي تَقُولُ ۖ وَاللَّهُ يَكْتُبُ مَا يُبَيِّتُونَ ۖ فَأَعْرِضْ عَنْهُمْ وَتَوَكَّلْ عَلَى اللَّهِ ۚ وَكَفَىٰ بِاللَّهِ وَكِيلًا
తాము విధేయత చూపుతున్నట్లు వారు నీ ముందర ప్రకటిస్తారు. కాని నీ దగ్గర నుంచి వెళ్ళిపోయిన తరువాత, వారిలోని ఒక వర్గం వారు రాత్రివేళల్లో సమావేశమై తాము చెప్పినదానికి వ్యతిరేకంగా మంతనాలు జరుపుతారు. రాత్రిపూట వారు జరిపే రహస్య మంతనాలను అల్లాహ్ నమోదు చేసుకుంటున్నాడు. కనుక (ఓ ముహమ్మద్!) వారిని పట్టించుకోకు. అల్లాహ్‌పైనే ఆధారపడి ఉండు. కార్యసాధనకై అల్లాహ్‌యే చాలు.
4:82 أَفَلَا يَتَدَبَّرُونَ الْقُرْآنَ ۚ وَلَوْ كَانَ مِنْ عِندِ غَيْرِ اللَّهِ لَوَجَدُوا فِيهِ اخْتِلَافًا كَثِيرًا
ఏమిటీ, వారు ఖుర్ఆన్ గురించి యోచన చేయరా? ఒకవేళ ఇది గనక అల్లాహ్ తరఫు నుంచి గాక ఇంకొకరి తరఫు నుంచి వచ్చి ఉంటే అందులో వారికి ఎంతో వైరుద్ధ్యం కనపడేది.
4:83 وَإِذَا جَاءَهُمْ أَمْرٌ مِّنَ الْأَمْنِ أَوِ الْخَوْفِ أَذَاعُوا بِهِ ۖ وَلَوْ رَدُّوهُ إِلَى الرَّسُولِ وَإِلَىٰ أُولِي الْأَمْرِ مِنْهُمْ لَعَلِمَهُ الَّذِينَ يَسْتَنبِطُونَهُ مِنْهُمْ ۗ وَلَوْلَا فَضْلُ اللَّهِ عَلَيْكُمْ وَرَحْمَتُهُ لَاتَّبَعْتُمُ الشَّيْطَانَ إِلَّا قَلِيلًا
శాంతికి సంబంధించిన వార్తగానీ, భయాందోళనల్ని కలిగించే సమాచారంగానీ ఏదైనా వారికి అందినప్పుడు దాన్ని వారు చాటింపు వేసేస్తారు. దానికి బదులు వారు ఆ విషయాన్ని ప్రవక్తకు, విషయం లోతుల్లోకి వెళ్ళే తమలోని విజ్ఞులకు చేరవేసి ఉంటే వారు అందలి నిజానిజాలను, ఉచితానుచితాలను పరికించి ఒక నిర్ణయానికి రావటానికి ఆస్కారముండేది. దైవానుగ్రహం, ఆయన కారుణ్యమే గనక మీపై లేకుండినట్లయితే మీలో కొందరు తప్ప – అందరూ షైతాను అనుయాయులుగా మారిపోయేవారు.
4:84 فَقَاتِلْ فِي سَبِيلِ اللَّهِ لَا تُكَلَّفُ إِلَّا نَفْسَكَ ۚ وَحَرِّضِ الْمُؤْمِنِينَ ۖ عَسَى اللَّهُ أَن يَكُفَّ بَأْسَ الَّذِينَ كَفَرُوا ۚ وَاللَّهُ أَشَدُّ بَأْسًا وَأَشَدُّ تَنكِيلًا
కనుక నీవు అల్లాహ్ మార్గంలో యుద్ధం చెయ్యి. నీవు నీ స్వయానికి మాత్రమే బాధ్యుడవు. అయితే విశ్వసించిన వారిని (యుద్ధం చేయమని) ప్రేరేపిస్తూ ఉండు. త్వరలో అల్లాహ్ అవిశ్వాసుల యుద్ధాన్ని ఆపినా ఆపి వేయవచ్చు! అల్లాహ్ అందరికంటే గొప్ప శక్తిగలవాడు, శిక్షించటంలో కూడా చాలా కఠినుడు.
4:85 مَّن يَشْفَعْ شَفَاعَةً حَسَنَةً يَكُن لَّهُ نَصِيبٌ مِّنْهَا ۖ وَمَن يَشْفَعْ شَفَاعَةً سَيِّئَةً يَكُن لَّهُ كِفْلٌ مِّنْهَا ۗ وَكَانَ اللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ مُّقِيتًا
ఎవరయినా ఒక మంచి పని కోసం సిఫారసు చేస్తే, అతనికి అందులో కొంత భాగం లభిస్తుంది. మరెవరయినా ఒక చెడు పని కోసం సిఫారసు చేస్తే, ఆ పాపంలో అతనికీ వాటా ఉంటుంది. అల్లాహ్ అన్నింటిపై అదుపు అజమాయిషీ కలవాడు.
4:86 وَإِذَا حُيِّيتُم بِتَحِيَّةٍ فَحَيُّوا بِأَحْسَنَ مِنْهَا أَوْ رُدُّوهَا ۗ إِنَّ اللَّهَ كَانَ عَلَىٰ كُلِّ شَيْءٍ حَسِيبًا
ఎవరయినా మీకు ‘సలాం’ చేసినప్పుడు మీరు అంతకంటే ఉత్తమరీతిలో జవాబు ఇవ్వండి లేదా కనీసం అదే విధంగానైనా చెప్పండి. నిశ్చయంగా అల్లాహ్ ప్రతిదానికీ లెక్క తీసుకుంటాడు.
4:87 اللَّهُ لَا إِلَٰهَ إِلَّا هُوَ ۚ لَيَجْمَعَنَّكُمْ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ لَا رَيْبَ فِيهِ ۗ وَمَنْ أَصْدَقُ مِنَ اللَّهِ حَدِيثًا
అల్లాహ్ – ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. ఆయన మిమ్మల్నందరినీ ప్రళయదినాన సమీకరిస్తాడు. ఆ రోజు (రావటం)లో సందేహానికి తావేలేదు. అల్లాహ్ మాటకన్నా సత్యమైన మాట మరెవరిది కాగలదు?
4:88 فَمَا لَكُمْ فِي الْمُنَافِقِينَ فِئَتَيْنِ وَاللَّهُ أَرْكَسَهُم بِمَا كَسَبُوا ۚ أَتُرِيدُونَ أَن تَهْدُوا مَنْ أَضَلَّ اللَّهُ ۖ وَمَن يُضْلِلِ اللَّهُ فَلَن تَجِدَ لَهُ سَبِيلًا
మీకేమైపోయిందీ? కపటుల విషయంలో మీరు రెండు వర్గాలుగా అయిపోతున్నారు? వాస్తవానికి వారి స్వయంకృతాల మూలంగా అల్లాహ్ వారిని వెనక్కి మరలించాడు. ఏమిటీ, అల్లాహ్ సన్మార్గం నుంచి తప్పించిన వారిని మీరు సన్మార్గానికి తీసుకురాదలుస్తున్నారా? అల్లాహ్ అపమార్గం పట్టించినవారి కోసం నీవు ఎన్నటికీ ఏ మార్గం కనుగొనలేవు సుమా!
4:89 وَدُّوا لَوْ تَكْفُرُونَ كَمَا كَفَرُوا فَتَكُونُونَ سَوَاءً ۖ فَلَا تَتَّخِذُوا مِنْهُمْ أَوْلِيَاءَ حَتَّىٰ يُهَاجِرُوا فِي سَبِيلِ اللَّهِ ۚ فَإِن تَوَلَّوْا فَخُذُوهُمْ وَاقْتُلُوهُمْ حَيْثُ وَجَدتُّمُوهُمْ ۖ وَلَا تَتَّخِذُوا مِنْهُمْ وَلِيًّا وَلَا نَصِيرًا
తాము అవిశ్వాసులుగా ఉన్నట్లే మీరు కూడా అవిశ్వాస వైఖరిని అవలంబించి, ఆపైన అందరూ ఒకేలాగా అయిపోవాలన్నది వారి ఆకాంక్ష! కనుక వారు దైవమార్గంలో తమ స్వస్థలాన్ని వదలి బయలుదేరనంతవరకూ, వారిలో ఎవరినీ మీ స్నేహితులుగా చేసుకోకండి. ఒకవేళ వారు విముఖులైపోతే వారిని పట్టుకోండి. ఎక్కడ దొరికితే అక్కడ వారిని చంపండి. జాగ్రత్త! వారిలో ఎవరినీ మీ మిత్రునిగా, సహాయకునిగా భావించకండి.
4:90 إِلَّا الَّذِينَ يَصِلُونَ إِلَىٰ قَوْمٍ بَيْنَكُمْ وَبَيْنَهُم مِّيثَاقٌ أَوْ جَاءُوكُمْ حَصِرَتْ صُدُورُهُمْ أَن يُقَاتِلُوكُمْ أَوْ يُقَاتِلُوا قَوْمَهُمْ ۚ وَلَوْ شَاءَ اللَّهُ لَسَلَّطَهُمْ عَلَيْكُمْ فَلَقَاتَلُوكُمْ ۚ فَإِنِ اعْتَزَلُوكُمْ فَلَمْ يُقَاتِلُوكُمْ وَأَلْقَوْا إِلَيْكُمُ السَّلَمَ فَمَا جَعَلَ اللَّهُ لَكُمْ عَلَيْهِمْ سَبِيلًا
అయితే మీతో ఒప్పందం చేసుకున్న వారితో కలసిపోయిన వారికీ, లేదా ఇటు మీతోనూ, అటు తమ వర్గం వారితోనూ యుద్ధం చేయటానికి మనసొప్పక మీ దగ్గరకు వచ్చే వారికి మాత్రం ఈ ఆజ్ఞ నుండి మినహాయింపు ఉంది. అల్లాహ్‌యే గనక తలిస్తే మీపై వారికి ప్రాబల్యాన్ని ఒసగేవాడే. అదేగనక జరిగితే వారు మీతో యుద్ధం చేసేవారే. కాబట్టి వారు మీ దారినుంచి తప్పుకుని, మీతో యుద్ధం చేయకుండా, సంధి కోసం ప్రయత్నిస్తే (అప్పుడు వారిపై దాడి జరపటానికి) అల్లాహ్ మీకు మార్గం తెరచి ఉంచలేదు.
4:91 سَتَجِدُونَ آخَرِينَ يُرِيدُونَ أَن يَأْمَنُوكُمْ وَيَأْمَنُوا قَوْمَهُمْ كُلَّ مَا رُدُّوا إِلَى الْفِتْنَةِ أُرْكِسُوا فِيهَا ۚ فَإِن لَّمْ يَعْتَزِلُوكُمْ وَيُلْقُوا إِلَيْكُمُ السَّلَمَ وَيَكُفُّوا أَيْدِيَهُمْ فَخُذُوهُمْ وَاقْتُلُوهُمْ حَيْثُ ثَقِفْتُمُوهُمْ ۚ وَأُولَٰئِكُمْ جَعَلْنَا لَكُمْ عَلَيْهِمْ سُلْطَانًا مُّبِينًا
వారిలో మరి కొంతమందిని కూడా మీరు చూస్తారు. వారు (పైకి) మీ నుంచి, తమ వర్గం వారి నుంచి శాంతిగా ఉండాలని కోరుకుంటారు. (కాని) ఎప్పుడైనా ఉపద్రవం వైపు మరలించ బడితే మాత్రం పిల్లిమొగ్గలు వేస్తారు. వారు గనక మీకు దూరంగా ఉండకపోతే, మీకు స్నేహ హస్తం అందించకపోతే, (యుద్ధం నుంచి) తమ చేతులను ఆపి ఉంచకపోతే వారిని పట్టుకోండి, ఎక్కడ దొరికితే అక్కడే వారిని హతమార్చండి. మేము మీకు స్పష్టమయిన అధికారాన్ని ప్రసాదించినది వీరి పైనే.
4:92 وَمَا كَانَ لِمُؤْمِنٍ أَن يَقْتُلَ مُؤْمِنًا إِلَّا خَطَأً ۚ وَمَن قَتَلَ مُؤْمِنًا خَطَأً فَتَحْرِيرُ رَقَبَةٍ مُّؤْمِنَةٍ وَدِيَةٌ مُّسَلَّمَةٌ إِلَىٰ أَهْلِهِ إِلَّا أَن يَصَّدَّقُوا ۚ فَإِن كَانَ مِن قَوْمٍ عَدُوٍّ لَّكُمْ وَهُوَ مُؤْمِنٌ فَتَحْرِيرُ رَقَبَةٍ مُّؤْمِنَةٍ ۖ وَإِن كَانَ مِن قَوْمٍ بَيْنَكُمْ وَبَيْنَهُم مِّيثَاقٌ فَدِيَةٌ مُّسَلَّمَةٌ إِلَىٰ أَهْلِهِ وَتَحْرِيرُ رَقَبَةٍ مُّؤْمِنَةٍ ۖ فَمَن لَّمْ يَجِدْ فَصِيَامُ شَهْرَيْنِ مُتَتَابِعَيْنِ تَوْبَةً مِّنَ اللَّهِ ۗ وَكَانَ اللَّهُ عَلِيمًا حَكِيمًا
ఒక విశ్వాసి మరో విశ్వాసిని చంపటం ఎంతమాత్రం తగదు. పొరపాటున జరిగితే అది వేరే విషయం. ఎవరయినా పొరపాటున ఒక ముస్లింను చంపితే దానికి పరిహారంగా ఒక ముస్లిం బానిసను బానిసత్వం నుంచి విడిపించాలి. ఇంకా హతుని కుటుంబీకులకు రక్త పరిహారం చెల్లించాలి. ఒకవేళ వారు క్షమాభిక్షపెడితే అది వేరే విషయం. కాని చంపబడిన వ్యక్తి, శత్రు వర్గానికి చెందినవాడై, అతను ముస్లిం కూడా అయి వుంటే అట్టి పరిస్థితిలో ఒక్క ముస్లిం బానిసకు విముక్తి నొసగాలి. ఒకవేళ హతుడు మీతో ఒడంబడిక చేసుకున్న జాతికి చెందినవాడైనపుడు రక్త పరిహారాన్ని అతని కుటుంబీకులకు చెల్లించి తీరాలి. (దాంతో పాటు) ఒక ముస్లిం బానిసను కూడా స్వతంత్రుడ్ని చేయాలి. బానిసకు విముక్తి నొసగే స్థోమత లేనివారు ఎడతెగకుండా రెండు మాసాలు ఉపవాసం ఉండాలి. అల్లాహ్ నుంచి క్షమాభిక్ష పొందటానికి (ఈ పద్ధతి సూచించబడింది). అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, వివేచనా పరుడూను.
4:93 وَمَن يَقْتُلْ مُؤْمِنًا مُّتَعَمِّدًا فَجَزَاؤُهُ جَهَنَّمُ خَالِدًا فِيهَا وَغَضِبَ اللَّهُ عَلَيْهِ وَلَعَنَهُ وَأَعَدَّ لَهُ عَذَابًا عَظِيمًا
ఇక ఉద్దేశ్యపూర్వకంగా ఒక విశ్వాసిని చంపేవానికి ప్రతిఫలం నరకమే. అందులో వాడు కలకాలం పడి ఉంటాడు. వాడిపై దైవాగ్రహం, ఆయన శాపం పడుతుంది. ఇంకా ఆయన అతని కోసం పెద్ద శిక్షను సిద్ధం చేసి ఉంచాడు.
4:94 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا ضَرَبْتُمْ فِي سَبِيلِ اللَّهِ فَتَبَيَّنُوا وَلَا تَقُولُوا لِمَنْ أَلْقَىٰ إِلَيْكُمُ السَّلَامَ لَسْتَ مُؤْمِنًا تَبْتَغُونَ عَرَضَ الْحَيَاةِ الدُّنْيَا فَعِندَ اللَّهِ مَغَانِمُ كَثِيرَةٌ ۚ كَذَٰلِكَ كُنتُم مِّن قَبْلُ فَمَنَّ اللَّهُ عَلَيْكُمْ فَتَبَيَّنُوا ۚ إِنَّ اللَّهَ كَانَ بِمَا تَعْمَلُونَ خَبِيرًا
ఓ విశ్వాసులారా! మీరు దైవమార్గంలో వెళ్తున్నప్పుడు నిజానిజాలను తెలుసుకొని వ్యవహరించండి. ఎవరయినా మీకు సలాం చేస్తే దానికి సమాధానంగా ‘నీవు విశ్వాసివి కావు’ అని అనకండి. మీరు ప్రాపంచిక జీవన సామగ్రిని అన్వేషించటంలో పడి ఉన్నారేమో! అయితే అల్లాహ్ వద్ద విజయధనం పుష్కలంగా ఉంది. లోగడ మీరు కూడా ఇలాగే ఉండేవారు. కాని తరువాత అల్లాహ్ మిమ్మల్ని కటాక్షించాడు. కనుక మీరు విషయాన్ని పరికించి మరీ మసలుకోండి. నిస్సందేహంగా అల్లాహ్‌కు మీరు చేసేదంతా తెలుసు.
4:95 لَّا يَسْتَوِي الْقَاعِدُونَ مِنَ الْمُؤْمِنِينَ غَيْرُ أُولِي الضَّرَرِ وَالْمُجَاهِدُونَ فِي سَبِيلِ اللَّهِ بِأَمْوَالِهِمْ وَأَنفُسِهِمْ ۚ فَضَّلَ اللَّهُ الْمُجَاهِدِينَ بِأَمْوَالِهِمْ وَأَنفُسِهِمْ عَلَى الْقَاعِدِينَ دَرَجَةً ۚ وَكُلًّا وَعَدَ اللَّهُ الْحُسْنَىٰ ۚ وَفَضَّلَ اللَّهُ الْمُجَاهِدِينَ عَلَى الْقَاعِدِينَ أَجْرًا عَظِيمًا
ఏ కారణమూ లేకుండా (ఇంటి పట్టున) కూర్చుండిపోయే విశ్వాసులు, దైవమార్గంలో తమ ధన ప్రాణాలతో పోరాడే విశ్వాసులూ సమానులు కాలేరు. తమ ధనప్రాణాలతో పోరాడేవారికి అల్లాహ్ ఇంట్లో కూర్చుని ఉండేవారిపై అంతస్థుల రీత్యా ఎంతో ఉన్నతిని ప్రసాదించాడు. ఆ మాటకొస్తే అల్లాహ్ ప్రతి ఒక్కరికీ ఉత్తమ ప్రతిఫలం ఇస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు. అయితే ఆయన కూర్చుని ఉండే వారిపై ముజాహిద్ (యోధు)లకు గొప్ప ప్రతిఫలం ద్వారా శ్రేష్ఠతను ప్రసాదించాడు.
4:96 دَرَجَاتٍ مِّنْهُ وَمَغْفِرَةً وَرَحْمَةً ۚ وَكَانَ اللَّهُ غَفُورًا رَّحِيمًا
ఆయన తరఫున వారి కొరకు ఉన్నత స్థానాలూ ఉన్నాయి. మన్నింపు మరియు కారుణ్యం కూడా ఉంది. అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడు కూడాను.
4:97 إِنَّ الَّذِينَ تَوَفَّاهُمُ الْمَلَائِكَةُ ظَالِمِي أَنفُسِهِمْ قَالُوا فِيمَ كُنتُمْ ۖ قَالُوا كُنَّا مُسْتَضْعَفِينَ فِي الْأَرْضِ ۚ قَالُوا أَلَمْ تَكُنْ أَرْضُ اللَّهِ وَاسِعَةً فَتُهَاجِرُوا فِيهَا ۚ فَأُولَٰئِكَ مَأْوَاهُمْ جَهَنَّمُ ۖ وَسَاءَتْ مَصِيرًا
ఎవరయితే తమకు తాము అన్యాయం చేసుకుంటూ ఉన్నారో, వారి ప్రాణాలను తీసేటప్పుడు దైవదూతలు, “మీరే స్థితిలో ఉండేవారు?” అని వారిని అడుగుతారు. దానికి వారు, “మేము మా ప్రదేశంలో బలహీనులముగా, (నిస్సహాయులంగా) ఉండేవారము” అని బదులిస్తారు. “ఏమిటీ? మీరు (ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి) వలసపోవటానికి దేవుని భూమి విశాలంగా లేదా?” అని దైవ దూతలు వారిని అడుగుతారు. వీరి నివాస స్థలమే నరకం. అది అత్యంత చెడ్డ గమ్య స్థానం.
4:98 إِلَّا الْمُسْتَضْعَفِينَ مِنَ الرِّجَالِ وَالنِّسَاءِ وَالْوِلْدَانِ لَا يَسْتَطِيعُونَ حِيلَةً وَلَا يَهْتَدُونَ سَبِيلًا
అయితే నిజంగానే ఏ సాధన సంపత్తి లేని, దారి తెలియని నిస్సహాయులైన పురుషుల, స్త్రీల, పసివాళ్ళ (సంగతి వేరు).
4:99 فَأُولَٰئِكَ عَسَى اللَّهُ أَن يَعْفُوَ عَنْهُمْ ۚ وَكَانَ اللَّهُ عَفُوًّا غَفُورًا
అల్లాహ్ వారిని మన్నించవచ్చు! అల్లాహ్ మన్నించేవాడు, క్షమాభిక్ష పెట్టేవాడు.
4:100 وَمَن يُهَاجِرْ فِي سَبِيلِ اللَّهِ يَجِدْ فِي الْأَرْضِ مُرَاغَمًا كَثِيرًا وَسَعَةً ۚ وَمَن يَخْرُجْ مِن بَيْتِهِ مُهَاجِرًا إِلَى اللَّهِ وَرَسُولِهِ ثُمَّ يُدْرِكْهُ الْمَوْتُ فَقَدْ وَقَعَ أَجْرُهُ عَلَى اللَّهِ ۗ وَكَانَ اللَّهُ غَفُورًا رَّحِيمًا
అల్లాహ్ మార్గంలో తన స్వస్థలాన్ని వదలి వలసపోయిన వాడు భూమండలంలో ఎన్నో ఆశ్రయాలను, విస్తృతిని పొందుతాడు. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సఅసం) వైపుకు వలస వెళ్ళటానికి తన గృహం నుంచి బయలుదేరి దారిలో మృత్యువాతన పడిన వానికి పుణ్యఫలం ప్రసాదించే బాధ్యత అల్లాహ్‌ది. అల్లాహ్ అపారంగా క్షమించేవాడు, అమితంగా కరుణించేవాడు.
4:101 وَإِذَا ضَرَبْتُمْ فِي الْأَرْضِ فَلَيْسَ عَلَيْكُمْ جُنَاحٌ أَن تَقْصُرُوا مِنَ الصَّلَاةِ إِنْ خِفْتُمْ أَن يَفْتِنَكُمُ الَّذِينَ كَفَرُوا ۚ إِنَّ الْكَافِرِينَ كَانُوا لَكُمْ عَدُوًّا مُّبِينًا
మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు, అవిశ్వాసులు మిమ్మల్ని వేధిస్తారనే భయం గనక మీకుంటే, మీరు నమాజులను కుదించుకోవటంలో తప్పులేదు. నిశ్చయంగా అవిశ్వాసులు మీ బహిరంగ శత్రువులే.
4:102 وَإِذَا كُنتَ فِيهِمْ فَأَقَمْتَ لَهُمُ الصَّلَاةَ فَلْتَقُمْ طَائِفَةٌ مِّنْهُم مَّعَكَ وَلْيَأْخُذُوا أَسْلِحَتَهُمْ فَإِذَا سَجَدُوا فَلْيَكُونُوا مِن وَرَائِكُمْ وَلْتَأْتِ طَائِفَةٌ أُخْرَىٰ لَمْ يُصَلُّوا فَلْيُصَلُّوا مَعَكَ وَلْيَأْخُذُوا حِذْرَهُمْ وَأَسْلِحَتَهُمْ ۗ وَدَّ الَّذِينَ كَفَرُوا لَوْ تَغْفُلُونَ عَنْ أَسْلِحَتِكُمْ وَأَمْتِعَتِكُمْ فَيَمِيلُونَ عَلَيْكُم مَّيْلَةً وَاحِدَةً ۚ وَلَا جُنَاحَ عَلَيْكُمْ إِن كَانَ بِكُمْ أَذًى مِّن مَّطَرٍ أَوْ كُنتُم مَّرْضَىٰ أَن تَضَعُوا أَسْلِحَتَكُمْ ۖ وَخُذُوا حِذْرَكُمْ ۗ إِنَّ اللَّهَ أَعَدَّ لِلْكَافِرِينَ عَذَابًا مُّهِينًا
(ఓ ప్రవక్తా!) నీవు వారి మధ్య ఉన్నప్పుడు, వారి కోసం నమాజును మొదలుపెట్టినప్పుడు, వారిలోని ఒక సమూహం తమ ఆయుధాలను తీసుకొని నీ వెంట నిలబడాలి. మరి వారు సజ్దా చేయగానే మీ వెనక్కి వెళ్ళిపోవాలి. అప్పటి వరకూ నమాజ్‌లో పాల్గొనని రెండవ సమూహం వచ్చి నీతోపాటు నమాజు చేయాలి. వారు కూడా తమ రక్షణ సామగ్రిని, తమ ఆయుధాలను చేబూని ఉండాలి. మీరు మీ ఆయుధాల పట్ల, సామగ్రిపట్ల ఏమరుపాటుకు లోనైతే, ఒక్కసారిగా మీపై విరుచుకుపడాలని అవిశ్వాసులు కోరుకుంటారు. అయితే వర్షం మూలంగా లేక అస్వస్థత మూలంగా ఇబ్బందిగా ఉండి మీరు మీ ఆయుధాలను విడిచినట్లయితే అది దోషం కాదు. అయినా ఆత్మరక్షణ సామగ్రిని వెంట తీసుకొని ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ తిరస్కారుల కోసం అవమానకరమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాడు.
4:103 فَإِذَا قَضَيْتُمُ الصَّلَاةَ فَاذْكُرُوا اللَّهَ قِيَامًا وَقُعُودًا وَعَلَىٰ جُنُوبِكُمْ ۚ فَإِذَا اطْمَأْنَنتُمْ فَأَقِيمُوا الصَّلَاةَ ۚ إِنَّ الصَّلَاةَ كَانَتْ عَلَى الْمُؤْمِنِينَ كِتَابًا مَّوْقُوتًا
మరి మీరు నమాజును నెరవేర్చిన తరువాత నిలుచున్నా, కూర్చున్నా, పరుండినా అల్లాహ్‌ను స్మరిస్తూ ఉండండి. అయితే పరిస్థితులు కుదుటపడిన తరువాత మాత్రం నమాజును నెలకొల్పండి. నిస్సందేహంగా నమాజును నిర్ధారిత వేళల్లో చేయటం విశ్వాసులకు విధిగా చేయబడింది.
4:104 وَلَا تَهِنُوا فِي ابْتِغَاءِ الْقَوْمِ ۖ إِن تَكُونُوا تَأْلَمُونَ فَإِنَّهُمْ يَأْلَمُونَ كَمَا تَأْلَمُونَ ۖ وَتَرْجُونَ مِنَ اللَّهِ مَا لَا يَرْجُونَ ۗ وَكَانَ اللَّهُ عَلِيمًا حَكِيمًا
వారిని వెంబడించటంలో ఏ మాత్రం బలహీనతను ప్రదర్శించకండి. ఒకవేళ మీరు అవిశ్రాంతంగా ఉన్నారను కుంటే మీ మాదిరిగానే వారు కూడా అవిశ్రాంతంగా ఉన్నారు. పైగా అల్లాహ్ నుంచి వారు ఆశించని వాటిని మీరు ఆశిస్తున్నారు. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, వివేచనాపరుడు.
4:105 إِنَّا أَنزَلْنَا إِلَيْكَ الْكِتَابَ بِالْحَقِّ لِتَحْكُمَ بَيْنَ النَّاسِ بِمَا أَرَاكَ اللَّهُ ۚ وَلَا تَكُن لِّلْخَائِنِينَ خَصِيمًا
(ఓ ప్రవక్తా!) అల్లాహ్ నీకు చూపిన విధంగా నీవు ప్రజల మధ్య తీర్పు చెయ్యటానికిగాను మేము నీ వైపుకు ఈ గ్రంథాన్ని సత్యంతోపాటు పంపాము. కనుక ద్రోహానికి పాల్పడే వారి తరఫున వాదిగా నిలబడకు.
4:106 وَاسْتَغْفِرِ اللَّهَ ۖ إِنَّ اللَّهَ كَانَ غَفُورًا رَّحِيمًا
క్షమాభిక్షకై అల్లాహ్‌ను వేడుకో. నిస్సందేహంగా అల్లాహ్ క్షమించేవాడు, కనికరించేవాడు.
4:107 وَلَا تُجَادِلْ عَنِ الَّذِينَ يَخْتَانُونَ أَنفُسَهُمْ ۚ إِنَّ اللَّهَ لَا يُحِبُّ مَن كَانَ خَوَّانًا أَثِيمًا
ఆత్మ ద్రోహం చేసుకునే వారి పక్షాన నిలిచి వాదించకు. దగాకోరును, పాపిష్టివాడిని అల్లాహ్ సుతరామూ ఇష్టపడడు.
4:108 يَسْتَخْفُونَ مِنَ النَّاسِ وَلَا يَسْتَخْفُونَ مِنَ اللَّهِ وَهُوَ مَعَهُمْ إِذْ يُبَيِّتُونَ مَا لَا يَرْضَىٰ مِنَ الْقَوْلِ ۚ وَكَانَ اللَّهُ بِمَا يَعْمَلُونَ مُحِيطًا
వారు ప్రజల నుంచి దాక్కోగలరు. కాని అల్లాహ్ నుంచి దాక్కోలేరు. వారు రాత్రివేళల్లో అల్లాహ్ ఇష్టపడని విషయాలపై రహస్య మంతనాలు సాగిస్తున్నప్పుడు ఆయన వారితో పాటు ఉంటాడు. వారి కర్మలన్నింటినీ ఆయన చుట్టుముట్టి ఉన్నాడు.
4:109 هَا أَنتُمْ هَٰؤُلَاءِ جَادَلْتُمْ عَنْهُمْ فِي الْحَيَاةِ الدُّنْيَا فَمَن يُجَادِلُ اللَّهَ عَنْهُمْ يَوْمَ الْقِيَامَةِ أَم مَّن يَكُونُ عَلَيْهِمْ وَكِيلًا
ప్రాపంచిక జీవితంలోనైతే మీరు వారి తరఫున వాదించారుగాని, ప్రళయ దినాన వారికి మద్దతుగా అల్లాహ్‌తో ఎవరు వాదిస్తారు? వారి తరఫున వకాల్తా ఎవరు పుచ్చుకుంటారు?
4:110 وَمَن يَعْمَلْ سُوءًا أَوْ يَظْلِمْ نَفْسَهُ ثُمَّ يَسْتَغْفِرِ اللَّهَ يَجِدِ اللَّهَ غَفُورًا رَّحِيمًا
ఎవరయినా దుష్కార్యానికి పాల్పడి లేదా తనకు తాను అన్యాయం చేసుకుని, ఆ తరువాత క్షమాపణకై అల్లాహ్‌ను అర్థిస్తే, అతడు అల్లాహ్‌ను క్షమాశీలిగా, కృపాశీలిగా పొందుతాడు.
4:111 وَمَن يَكْسِبْ إِثْمًا فَإِنَّمَا يَكْسِبُهُ عَلَىٰ نَفْسِهِ ۚ وَكَانَ اللَّهُ عَلِيمًا حَكِيمًا
కాని ఎవడయినా పాపాన్ని సంపాదించుకుంటే అతను సంపాదించుకున్నది అతనిపైనే పడుతుంది. అల్లాహ్ ప్రతిదీ తెలిసినవాడు, వివేచనాపరుడు.
4:112 وَمَن يَكْسِبْ خَطِيئَةً أَوْ إِثْمًا ثُمَّ يَرْمِ بِهِ بَرِيئًا فَقَدِ احْتَمَلَ بُهْتَانًا وَإِثْمًا مُّبِينًا
ఇంకా ఎవరయినా ఏదైనా తప్పు చేసి, లేదా పాపానికి పాల్పడి, ఆ నిందను ఏ పాపం ఎరుగని అమాయకుని పైకి నెట్టివేస్తే, అలాంటివాడు చాలా పెద్ద అపనిందను, స్పష్టమైన పాపాన్ని ఎత్తుకున్నవాడవుతాడు.
4:113 وَلَوْلَا فَضْلُ اللَّهِ عَلَيْكَ وَرَحْمَتُهُ لَهَمَّت طَّائِفَةٌ مِّنْهُمْ أَن يُضِلُّوكَ وَمَا يُضِلُّونَ إِلَّا أَنفُسَهُمْ ۖ وَمَا يَضُرُّونَكَ مِن شَيْءٍ ۚ وَأَنزَلَ اللَّهُ عَلَيْكَ الْكِتَابَ وَالْحِكْمَةَ وَعَلَّمَكَ مَا لَمْ تَكُن تَعْلَمُ ۚ وَكَانَ فَضْلُ اللَّهِ عَلَيْكَ عَظِيمًا
(ఓ ముహమ్మద్!) దైవానుగ్రహం, ఆయన కారుణ్యం నీపై లేకుండా ఉంటే వారిలోని ఒక సమూహం నిన్ను తప్పు దారి పట్టించాలనే అనుకుంది. కాని నిజానికి వారు తమను తామే అపమార్గానికి లోనుచేసుకుంటున్నారు. వారు నీకెలాంటి హానీ కలిగించలేరు. అల్లాహ్ నీపై గ్రంథాన్ని, వివేకాన్నీ అవతరింపజేశాడు. నీకు తెలియని విషయాలను నీకు నేర్పాడు. నీపై అల్లాహ్ యొక్క గొప్ప అనుగ్రహం ఉంది.
4:114 لَّا خَيْرَ فِي كَثِيرٍ مِّن نَّجْوَاهُمْ إِلَّا مَنْ أَمَرَ بِصَدَقَةٍ أَوْ مَعْرُوفٍ أَوْ إِصْلَاحٍ بَيْنَ النَّاسِ ۚ وَمَن يَفْعَلْ ذَٰلِكَ ابْتِغَاءَ مَرْضَاتِ اللَّهِ فَسَوْفَ نُؤْتِيهِ أَجْرًا عَظِيمًا
వారు జరిపే అత్యధిక రహస్య మంతనాలలో ఏ మేలూ ఉండదు. అయితే దానధర్మాల గురించి లేక మంచి పనుల గురించి లేక ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరచటం గురించి ఆజ్ఞాపించేవాని రహస్య మంతనాల్లో మేలుంటుంది. ఎవరయినా కేవలం దైవప్రసన్నత కోసం ఈ పనులు చేస్తే నిశ్చయంగా మేమతనికి గొప్ప ప్రతిఫలం ప్రసాదిస్తాము.
4:115 وَمَن يُشَاقِقِ الرَّسُولَ مِن بَعْدِ مَا تَبَيَّنَ لَهُ الْهُدَىٰ وَيَتَّبِعْ غَيْرَ سَبِيلِ الْمُؤْمِنِينَ نُوَلِّهِ مَا تَوَلَّىٰ وَنُصْلِهِ جَهَنَّمَ ۖ وَسَاءَتْ مَصِيرًا
కాని ఎవరయినా సన్మార్గం ప్రస్ఫుటమైన మీదట కూడా ప్రవక్త (సఅసం)కు వ్యతిరేకంగా పోతే, విశ్వాసులందరి మార్గాన్ని వీడి, ఇతర మార్గాన్ని అనుసరిస్తే, మేమతన్ని అతను మరలదలచుకున్న వైపుకే మరల్చుతాము. కడకు అతన్ని నరకంలో పడవేస్తాము. అది అత్యంత చెడ్డ గమ్యస్థానం.
4:116 إِنَّ اللَّهَ لَا يَغْفِرُ أَن يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَٰلِكَ لِمَن يَشَاءُ ۚ وَمَن يُشْرِكْ بِاللَّهِ فَقَدْ ضَلَّ ضَلَالًا بَعِيدًا
తనకు భాగస్వామ్యం (షిర్క్) కల్పించటాన్ని అల్లాహ్ ఎట్టి పరిస్థితిలోనూ క్షమించడు. షిర్క్ మినహా తాను కోరిన వారి ఇతర పాపాలను క్షమిస్తాడు. అల్లాహ్‌కు సహవర్తులుగా ఇతరులను నిలబెట్టినవాడు మార్గభ్రష్టతలో చాలా దూరం వెళ్ళి పోయాడు.
4:117 إِن يَدْعُونَ مِن دُونِهِ إِلَّا إِنَاثًا وَإِن يَدْعُونَ إِلَّا شَيْطَانًا مَّرِيدًا
వారు అల్లాహ్‌ను వదలి స్త్రీలను మొరపెట్టుకుంటున్నారు. వాస్తవానికి వారసలు పొగరుబోతు షైతానును మొరపెట్టుకుంటున్నారు.
4:118 لَّعَنَهُ اللَّهُ ۘ وَقَالَ لَأَتَّخِذَنَّ مِنْ عِبَادِكَ نَصِيبًا مَّفْرُوضًا
అల్లాహ్ వాణ్ణి శపించాడు. షైతాను ఇలా అన్నాడు: “నీ దాసుల నుండి నేను నిర్ణీత భాగాన్ని పొంది తీర్తాను.”
4:119 وَلَأُضِلَّنَّهُمْ وَلَأُمَنِّيَنَّهُمْ وَلَآمُرَنَّهُمْ فَلَيُبَتِّكُنَّ آذَانَ الْأَنْعَامِ وَلَآمُرَنَّهُمْ فَلَيُغَيِّرُنَّ خَلْقَ اللَّهِ ۚ وَمَن يَتَّخِذِ الشَّيْطَانَ وَلِيًّا مِّن دُونِ اللَّهِ فَقَدْ خَسِرَ خُسْرَانًا مُّبِينًا
“వారిని దారి నుంచి తప్పిస్తూ ఉంటాను. వారికి ఉత్తుత్తి ఆశలు చూపిస్తూ ఉంటాను. పశువుల చెవులు చీల్చమని వారికి పురమాయిస్తాను. అల్లాహ్ సృష్టిని మార్చమని వారిని ఆదేశిస్తాను.” వినండి! అల్లాహ్‌ను వదలి షైతానును తన స్నేహితునిగా చేసుకున్నవాడు స్పష్టంగా నష్టపోయినట్లే.
4:120 يَعِدُهُمْ وَيُمَنِّيهِمْ ۖ وَمَا يَعِدُهُمُ الشَّيْطَانُ إِلَّا غُرُورًا
వాడు వారికి వట్టి వాగ్దానాలు చేస్తూ ఉంటాడు. ఆశలు కలిగిస్తూ ఉంటాడు. కాని షైతాను వారితో చేసే వాగ్దానాలన్నీ మోసపూరితమైనవే.
4:121 أُولَٰئِكَ مَأْوَاهُمْ جَهَنَّمُ وَلَا يَجِدُونَ عَنْهَا مَحِيصًا
ఇటువంటి వారు చేరుకోవలసిన స్థలం నరకం. ఇక వారికి దాన్నుంచి తప్పించుకునే మార్గం ఏదీ ఉండదు.
4:122 وَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ سَنُدْخِلُهُمْ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا أَبَدًا ۖ وَعْدَ اللَّهِ حَقًّا ۚ وَمَنْ أَصْدَقُ مِنَ اللَّهِ قِيلًا
కాగా; ఎవరు విశ్వసించి సత్కార్యాలు చేస్తారో వారిని మేము క్రింద కాలువలు ప్రవహించే (స్వర్గ) వనాలలోకి తీసుకుపోతాము. అందులో వారు కలకాలం, శాశ్వతంగా ఉంటారు. ఈ అల్లాహ్ వాగ్దానం సత్యమైనది. అల్లాహ్ కంటే సత్యమైన మాట పలికేదెవరు?
4:123 لَّيْسَ بِأَمَانِيِّكُمْ وَلَا أَمَانِيِّ أَهْلِ الْكِتَابِ ۗ مَن يَعْمَلْ سُوءًا يُجْزَ بِهِ وَلَا يَجِدْ لَهُ مِن دُونِ اللَّهِ وَلِيًّا وَلَا نَصِيرًا
నిజస్థితి (సాఫల్యం) మీ ఆకాంక్షల కనుగుణంగా గానీ, గ్రంథవహుల ఆశలు, అభిలాషలపై ఆధారపడిగానీ లేదు. చెడుకు పాల్పడినవాడు ఎవడైనా దాని ఫలితాన్ని అనుభవిస్తాడు. దైవసమక్షంలో తనను సమర్థించే, తనను ఆదుకునే వారెవరినీ అతడు పొందలేడు.
4:124 وَمَن يَعْمَلْ مِنَ الصَّالِحَاتِ مِن ذَكَرٍ أَوْ أُنثَىٰ وَهُوَ مُؤْمِنٌ فَأُولَٰئِكَ يَدْخُلُونَ الْجَنَّةَ وَلَا يُظْلَمُونَ نَقِيرًا
సత్కార్యాలు చేసేవారు – వారు పురుషులైనా, స్త్రీలైనా- విశ్వసించి ఉంటే, ఇలాంటివారు తప్పకుండా స్వర్గంలో ప్రవేశిస్తారు. వారికి ఖర్జూరపు విత్తనంపై ఉండే గాటుకు సమానంగా కూడా అన్యాయం జరగదు.
4:125 وَمَنْ أَحْسَنُ دِينًا مِّمَّنْ أَسْلَمَ وَجْهَهُ لِلَّهِ وَهُوَ مُحْسِنٌ وَاتَّبَعَ مِلَّةَ إِبْرَاهِيمَ حَنِيفًا ۗ وَاتَّخَذَ اللَّهُ إِبْرَاهِيمَ خَلِيلًا
ఒక వ్యక్తి అల్లాహ్ ముందు తలవంచి, సదాచార సంపన్నుడై ఉండి, ఏకాగ్రచిత్తుడైన ఇబ్రాహీము ధర్మాన్ని అనుసరిస్తే – ధర్మం రీత్యా అతని కంటే ఉత్తముడు మరెవడు కాగలడు? ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం)ను అల్లాహ్ తన మిత్రునిగా చేసుకున్నాడు.
4:126 وَلِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۚ وَكَانَ اللَّهُ بِكُلِّ شَيْءٍ مُّحِيطًا
ఆకాశాలలో, భూమిలో ఉన్న సమస్తమూ అల్లాహ్‌దే. అల్లాహ్ అన్నింటినీ పరివేష్ఠించి ఉన్నాడు.
4:127 وَيَسْتَفْتُونَكَ فِي النِّسَاءِ ۖ قُلِ اللَّهُ يُفْتِيكُمْ فِيهِنَّ وَمَا يُتْلَىٰ عَلَيْكُمْ فِي الْكِتَابِ فِي يَتَامَى النِّسَاءِ اللَّاتِي لَا تُؤْتُونَهُنَّ مَا كُتِبَ لَهُنَّ وَتَرْغَبُونَ أَن تَنكِحُوهُنَّ وَالْمُسْتَضْعَفِينَ مِنَ الْوِلْدَانِ وَأَن تَقُومُوا لِلْيَتَامَىٰ بِالْقِسْطِ ۚ وَمَا تَفْعَلُوا مِنْ خَيْرٍ فَإِنَّ اللَّهَ كَانَ بِهِ عَلِيمًا
(ఓ ప్రవక్తా!) వారు నిన్ను స్త్రీల విషయమై ధర్మాదేశం ఏమిటని అడుగుతున్నారు. వారికి చెప్పు: “అల్లాహ్ స్వయంగా వారి విషయంలో మిమ్మల్ని ఆదేశిస్తున్నాడు. ఇంకా తండ్రిలేని ఆడ పిల్లలకు మీరు, వారి కొరకు నిర్ధారించబడిన హక్కును వారికివ్వకుండా, వారిని వివాహమాడాలనే మీ కోరిక గురించీ, బలహీనులైన పిల్లల గురించీ మీకు వినిపించబడుతున్న ఖుర్ఆన్ ఆయతులు కూడా (మిమ్మల్ని ఆదేశిస్తున్నాయి). ఇంకా తండ్రిలేని బిడ్డల విషయంలో న్యాయంగా వ్యవహరించమని కూడా ఆయన మీకు ఆజ్ఞాపిస్తున్నాడు. మీరు ఏ మంచిపని చేసినా దాని గురించి అల్లాహ్‌కు పూర్తిగా తెలుసు.
4:128 وَإِنِ امْرَأَةٌ خَافَتْ مِن بَعْلِهَا نُشُوزًا أَوْ إِعْرَاضًا فَلَا جُنَاحَ عَلَيْهِمَا أَن يُصْلِحَا بَيْنَهُمَا صُلْحًا ۚ وَالصُّلْحُ خَيْرٌ ۗ وَأُحْضِرَتِ الْأَنفُسُ الشُّحَّ ۚ وَإِن تُحْسِنُوا وَتَتَّقُوا فَإِنَّ اللَّهَ كَانَ بِمَا تَعْمَلُونَ خَبِيرًا
భర్త తనను ఈసడించుకుంటాడనో లేక తనను పట్టించుకోడనో స్త్రీకి భయమున్నప్పుడు వారిద్దరూ పరస్పరం సర్దుబాటు చేసుకుంటే అందులో వారిరువురిపై ఏమాత్రం దోషం లేదు. సర్దుబాటు అన్నింటికన్నా మేలైనది. ‘పేరాశ’ అనేది ప్రతి ప్రాణిలోనూ పొందుపరచబడి ఉంది. ఒకవేళ మీరు ఔదార్యాన్ని చూపి, భయభక్తుల వైఖరిని అవలంబించినట్లయితే మీ వ్యవహార శైలి అల్లాహ్‌కు తెలుస్తుంది.
4:129 وَلَن تَسْتَطِيعُوا أَن تَعْدِلُوا بَيْنَ النِّسَاءِ وَلَوْ حَرَصْتُمْ ۖ فَلَا تَمِيلُوا كُلَّ الْمَيْلِ فَتَذَرُوهَا كَالْمُعَلَّقَةِ ۚ وَإِن تُصْلِحُوا وَتَتَّقُوا فَإِنَّ اللَّهَ كَانَ غَفُورًا رَّحِيمًا
మీరు ఎంతగా ఆశించినప్పటికీ, శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ మీ భార్యలందరి మధ్య మీరు అన్నివిధాలా న్యాయం చెయ్యటమన్నది మీ వల్ల కాని పని. కాబట్టి మీరు పూర్తిగా ఒకామె వైపుకు మొగ్గిపోయి, రెండో ఆవిడను అనిశ్చిత స్థితిలో పడవెయ్యకండి. ఒకవేళ మీరు మీ ధోరణిని సరిదిద్దుకుని, భయభక్తుల (తఖ్వా)తో మసలుకుంటే నిశ్చయంగా అల్లాహ్ క్షమించేవాడు, కనికరించేవాడు.
4:130 وَإِن يَتَفَرَّقَا يُغْنِ اللَّهُ كُلًّا مِّن سَعَتِهِ ۚ وَكَانَ اللَّهُ وَاسِعًا حَكِيمًا
ఒకవేళ వారిరువురూ విడిపోవటం జరిగితే, అప్పుడు అల్లాహ్ తన విస్తృతమైన అనుగ్రహంతో వారిరువురికీ- ఒకరి అవసరం ఇంకొకరికి లేకుండా – తోడ్పడతాడు. అల్లాహ్ అపారమైన విస్తృతి కలవాడు, వివేక సంపన్నుడు.
4:131 وَلِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۗ وَلَقَدْ وَصَّيْنَا الَّذِينَ أُوتُوا الْكِتَابَ مِن قَبْلِكُمْ وَإِيَّاكُمْ أَنِ اتَّقُوا اللَّهَ ۚ وَإِن تَكْفُرُوا فَإِنَّ لِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۚ وَكَانَ اللَّهُ غَنِيًّا حَمِيدًا
ఆకాశాలలో, భూమిలో వున్న సమస్తమూ అల్లాహ్‌దే. అల్లాహ్‌కు భయపడుతూ మెలగవలసిందిగా మేము మీకు పూర్వం గ్రంథం వొసగబడినవారికీ, మీకూ ఆజ్ఞాపించాము. ఒకవేళ మీరు తిరస్కరిస్తే, ఆకాశాలలో, భూమిలో ఉన్నదంతా అల్లాహ్దేననీ, అల్లాహ్ అక్కరలు లేనివాడనీ, స్తోత్రనీయుడనీ మరువకండి.
4:132 وَلِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۚ وَكَفَىٰ بِاللَّهِ وَكِيلًا
ఆకాశాలలో, భూమిలో ఉన్న వస్తువులన్నీ అల్లాహ్ అధీనంలోనే ఉన్నాయి. కార్యనిర్వాహకారిగా అల్లాహ్ చాలు.
4:133 إِن يَشَأْ يُذْهِبْكُمْ أَيُّهَا النَّاسُ وَيَأْتِ بِآخَرِينَ ۚ وَكَانَ اللَّهُ عَلَىٰ ذَٰلِكَ قَدِيرًا
అల్లాహ్‌యే గనక తలిస్తే ఓ ప్రజలారా! మిమ్మల్ని తొలగించి, మీ స్థానంలో ఇతరుల్ని తేగలడు. ఈ పని చేయగల పూర్తి శక్తి అల్లాహ్‌కు ఉంది.
4:134 مَّن كَانَ يُرِيدُ ثَوَابَ الدُّنْيَا فَعِندَ اللَّهِ ثَوَابُ الدُّنْيَا وَالْآخِرَةِ ۚ وَكَانَ اللَّهُ سَمِيعًا بَصِيرًا
ఎవరయితే ప్రాపంచిక ప్రతిఫలాన్ని కోరుకుంటున్నాడో (అతడు), అల్లాహ్ వద్ద ప్రాపంచిక ప్రతిఫలంతో పాటు పరలోక ప్రతిఫలం కూడా ఉంది (అని తెలుసుకోవాలి). అల్లాహ్ అంతా వినేవాడు, అన్నింటినీ చూసేవాడు సుమా!
4:135 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُونُوا قَوَّامِينَ بِالْقِسْطِ شُهَدَاءَ لِلَّهِ وَلَوْ عَلَىٰ أَنفُسِكُمْ أَوِ الْوَالِدَيْنِ وَالْأَقْرَبِينَ ۚ إِن يَكُنْ غَنِيًّا أَوْ فَقِيرًا فَاللَّهُ أَوْلَىٰ بِهِمَا ۖ فَلَا تَتَّبِعُوا الْهَوَىٰ أَن تَعْدِلُوا ۚ وَإِن تَلْوُوا أَوْ تُعْرِضُوا فَإِنَّ اللَّهَ كَانَ بِمَا تَعْمَلُونَ خَبِيرًا
ఓ విశ్వసించిన వారలారా! మీరు న్యాయం విషయంలో గట్టిగా నిలబడండి. అల్లాహ్ ప్రసన్నత నిమిత్తం (సత్యం మాత్రమే పలికే) సాక్షులుగా ఉండండి – అది మీ స్వయానికీ, మీ తల్లిదండ్రులకు, మీ బంధువులకు వ్యతిరేకంగా పరిణమించినా సరే! అతను ధనికుడయినా, పేదవాడైనా సరే. వారి పట్ల అల్లాహ్ (మీకన్నా) ఎక్కువ శ్రేయోభిలాషి. కాబట్టి మీరు మీ మనోవాంఛకు లొంగిపోయి న్యాయాన్ని వీడకండి. ఒకవేళ మీరు మీ సాక్ష్యాన్ని వక్రీకరించినా, సాక్ష్యం చెప్పటానికి విముఖత చూపినా మీరు చేసే పనులన్నీ అల్లాహ్‌కు తెలుసు సుమా!
4:136 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا آمِنُوا بِاللَّهِ وَرَسُولِهِ وَالْكِتَابِ الَّذِي نَزَّلَ عَلَىٰ رَسُولِهِ وَالْكِتَابِ الَّذِي أَنزَلَ مِن قَبْلُ ۚ وَمَن يَكْفُرْ بِاللَّهِ وَمَلَائِكَتِهِ وَكُتُبِهِ وَرُسُلِهِ وَالْيَوْمِ الْآخِرِ فَقَدْ ضَلَّ ضَلَالًا بَعِيدًا
ఓ విశ్వాసులారా! అల్లాహ్‌ను, ఆయన ప్రవక్త (స)ను, ఆయన తన ప్రవక్త (స)పై అవతరింపజేసిన గ్రంథాన్నీ, అంతకు మునుపు ఆయన అవతరింపజేసిన గ్రంథాలన్నిటినీ విశ్వసించండి. ఎవడు అల్లాహ్‌ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను, అంతిమ దినాన్ని తిరస్కరించాడో వాడు మార్గం తప్పి చాలాదూరం వెళ్ళిపోయాడు.
4:137 إِنَّ الَّذِينَ آمَنُوا ثُمَّ كَفَرُوا ثُمَّ آمَنُوا ثُمَّ كَفَرُوا ثُمَّ ازْدَادُوا كُفْرًا لَّمْ يَكُنِ اللَّهُ لِيَغْفِرَ لَهُمْ وَلَا لِيَهْدِيَهُمْ سَبِيلًا
ఎవరు విశ్వసించి మళ్ళీ తిరస్కారులయ్యారో, మళ్లీ విశ్వసించి మళ్లీ తిరస్కార వైఖరికి ఒడిగట్టారో, ఆపైన తమ తిరస్కార వైఖరిలో పెచ్చరిల్లిపోయారో అలాంటి వారిని అల్లాహ్ ససేమిరా క్షమించడు. అటువంటి వారికి సన్మార్గం కూడా చూపడు.
4:138 شِّرِ الْمُنَافِقِينَ بِأَنَّ لَهُمْ عَذَابًا أَلِيمًا
కపటులకు వ్యధాభరితమైన శిక్ష ఖాయం అన్న శుభవార్తను వారికి అందజెయ్యి.
4:139 الَّذِينَ يَتَّخِذُونَ الْكَافِرِينَ أَوْلِيَاءَ مِن دُونِ الْمُؤْمِنِينَ ۚ أَيَبْتَغُونَ عِندَهُمُ الْعِزَّةَ فَإِنَّ الْعِزَّةَ لِلَّهِ جَمِيعًا
వారు ఎలాంటివారంటే, విశ్వాసులను వదలి అవిశ్వాసులను తమ మిత్రులుగా చేసుకుంటున్నారు. ఏమిటీ? వారు గౌరవ ప్రతిష్ఠల కోసం వారి వద్దకు వెళుతున్నారా? యదార్థానికి గౌరవమంతా అల్లాహ్ అధీనంలో ఉంది (అని వారు తెలుసుకోవాలి).
4:140 وَقَدْ نَزَّلَ عَلَيْكُمْ فِي الْكِتَابِ أَنْ إِذَا سَمِعْتُمْ آيَاتِ اللَّهِ يُكْفَرُ بِهَا وَيُسْتَهْزَأُ بِهَا فَلَا تَقْعُدُوا مَعَهُمْ حَتَّىٰ يَخُوضُوا فِي حَدِيثٍ غَيْرِهِ ۚ إِنَّكُمْ إِذًا مِّثْلُهُمْ ۗ إِنَّ اللَّهَ جَامِعُ الْمُنَافِقِينَ وَالْكَافِرِينَ فِي جَهَنَّمَ جَمِيعًا
అల్లాహ్ తన గ్రంథంలో ఇదివరకే మీ వద్దకు ఈ ఆజ్ఞను అవతరింపజేశాడు: ఎవరైనా అల్లాహ్ వాక్యాలను తిరస్కరిస్తూ, పరిహాసమాడుతున్నట్లు మీరు విన్నట్లయితే, – వారు ఆ మాటలు విడిచి పెట్టి వేరే మాటలు మాట్లాడటం మొదలు పెట్టనంతవరకూ – ఆ సమూహంలో వారితో కలసి కూర్చోకండి. (అన్యధా) మీరు కూడా ఆ సమయంలో వారిలాంటి వారుగానే పరిగణించబడతారు. అల్లాహ్ నిశ్చయంగా కపటులను, అవిశ్వాసులందరినీ నరకంలో పోగుచేయనున్నాడు.
4:141 الَّذِينَ يَتَرَبَّصُونَ بِكُمْ فَإِن كَانَ لَكُمْ فَتْحٌ مِّنَ اللَّهِ قَالُوا أَلَمْ نَكُن مَّعَكُمْ وَإِن كَانَ لِلْكَافِرِينَ نَصِيبٌ قَالُوا أَلَمْ نَسْتَحْوِذْ عَلَيْكُمْ وَنَمْنَعْكُم مِّنَ الْمُؤْمِنِينَ ۚ فَاللَّهُ يَحْكُمُ بَيْنَكُمْ يَوْمَ الْقِيَامَةِ ۗ وَلَن يَجْعَلَ اللَّهُ لِلْكَافِرِينَ عَلَى الْمُؤْمِنِينَ سَبِيلًا
ఈ కపటులు మీకు ఏ గతి పడుతుందోనని ఆసక్తితో ఎదురుచూస్తూ ఉంటారు. ఒకవేళ అల్లాహ్ తరఫు నుంచి మీకు విజయం చేకూరితే, “మేము మీతో లేమా?!” అని అంటారు. ఒకవేళ అవిశ్వాసులకు కాస్తంత ఆధిక్యత లభిస్తే, “మీకు వ్యతిరేకంగా పోరాడే శక్తి మాకు లేదా? (అయినాసరే) మేము ముస్లింలబారి నుంచి మిమ్మల్ని రక్షించలేదా?” అని (కపటులు) వారితో అంటారు. కాబట్టి ప్రళయదినాన అల్లాహ్ స్వయంగా మీ మధ్య తీర్పు చేస్తాడు. అల్లాహ్ ఎన్నటికీ అవిశ్వాసులకు, విశ్వాసులపై (విజయ) మార్గం సుగమం చేయడు.
4:142 إِنَّ الْمُنَافِقِينَ يُخَادِعُونَ اللَّهَ وَهُوَ خَادِعُهُمْ وَإِذَا قَامُوا إِلَى الصَّلَاةِ قَامُوا كُسَالَىٰ يُرَاءُونَ النَّاسَ وَلَا يَذْكُرُونَ اللَّهَ إِلَّا قَلِيلًا
నిశ్చయంగా కపటులు అల్లాహ్‌ను మోసం చేయజూస్తున్నారు. అయితే అల్లాహ్ వారి మోసానికి శిక్ష విధించనున్నాడు. వారు నమాజు కోసం నిలబడినప్పుడు ఎంతో బద్దకంతో, కేవలం జనులకు చూపే ఉద్దేశంతో నిలబడతారు. ఏదో నామ మాత్రంగా దైవాన్ని స్మరిస్తారు.
4:143 مُّذَبْذَبِينَ بَيْنَ ذَٰلِكَ لَا إِلَىٰ هَٰؤُلَاءِ وَلَا إِلَىٰ هَٰؤُلَاءِ ۚ وَمَن يُضْلِلِ اللَّهُ فَلَن تَجِدَ لَهُ سَبِيلًا
వారు ఎటూ కాకుండా మధ్యలోనే ఊగిసలాడుతున్నారు. పూర్తిగా అటూ ఉండరు, సరిగ్గా ఇటూ ఉండరు. అల్లాహ్ ఎవరినయితే అపమార్గం పాల్జేస్తాడో వాని కోసం నీవు ఏ మార్గాన్నీ కనుగొనలేవు.
4:144 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَتَّخِذُوا الْكَافِرِينَ أَوْلِيَاءَ مِن دُونِ الْمُؤْمِنِينَ ۚ أَتُرِيدُونَ أَن تَجْعَلُوا لِلَّهِ عَلَيْكُمْ سُلْطَانًا مُّبِينًا
ఓ విశ్వసించిన వారలారా! విశ్వాసులను వదలి అవిశ్వాసులను మిత్రులుగా చేసుకోకండి. ఏమిటీ, మీకు వ్యతిరేకంగా మీరే అల్లాహ్‌కు స్పష్టమైన ఆధారం సమకూర్చదలుస్తున్నారా?
4:145 إِنَّ الْمُنَافِقِينَ فِي الدَّرْكِ الْأَسْفَلِ مِنَ النَّارِ وَلَن تَجِدَ لَهُمْ نَصِيرًا
కపటులు నిశ్చయంగా నరకంలోని అధమాతి అధమ శ్రేణిలోకిపోతారు. వారికి సహాయపడే వారిని నీవు ఎన్నటికీ చూడలేవు.
4:146 إِلَّا الَّذِينَ تَابُوا وَأَصْلَحُوا وَاعْتَصَمُوا بِاللَّهِ وَأَخْلَصُوا دِينَهُمْ لِلَّهِ فَأُولَٰئِكَ مَعَ الْمُؤْمِنِينَ ۖ وَسَوْفَ يُؤْتِ اللَّهُ الْمُؤْمِنِينَ أَجْرًا عَظِيمًا
అయితే పశ్చాత్తాపం చెంది, తమ ప్రవర్తనను చక్కదిద్దుకుని, అల్లాహ్‌ను గట్టిగా నమ్మి, తమ ధర్మాన్ని అల్లాహ్ కొరకే ప్రత్యేకించుకున్నట్లయితే అప్పుడు వీరు విశ్వాసులతోపాటు ఉంటారు. త్వరలోనే అల్లాహ్ విశ్వాసులకు గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.
4:147 مَّا يَفْعَلُ اللَّهُ بِعَذَابِكُمْ إِن شَكَرْتُمْ وَآمَنتُمْ ۚ وَكَانَ اللَّهُ شَاكِرًا عَلِيمًا
మీరు కృతజ్ఞులుగా మసలుకుంటూ, విశ్వాసులుగా ఉన్నప్పుడు అల్లాహ్ మిమ్మల్ని శిక్షించి ఏం చేస్తాడు? అల్లాహ్ విలువనిచ్చేవాడూ, అన్నీ తెలిసినవాడు.
4:148 لَّا يُحِبُّ اللَّهُ الْجَهْرَ بِالسُّوءِ مِنَ الْقَوْلِ إِلَّا مَن ظُلِمَ ۚ وَكَانَ اللَّهُ سَمِيعًا عَلِيمًا
అన్యాయానికి గురైనవాడు తప్ప, ఏ మనిషి అయినా చెడు మాటలు బిగ్గరగా పలకటాన్ని అల్లాహ్ ఇష్టపడడు. అల్లాహ్ అంతా వినేవాడూ, అన్నీ తెలిసినవాడు.
4:149 إِن تُبْدُوا خَيْرًا أَوْ تُخْفُوهُ أَوْ تَعْفُوا عَن سُوءٍ فَإِنَّ اللَّهَ كَانَ عَفُوًّا قَدِيرًا
మీరు ఏదన్నా మంచి పనిని బహిర్గతంగా చేసినా, గుట్టుగా చేసినా లేక ఏదైనా చెడుగును మన్నించి వదలి పెట్టినా అల్లాహ్ అమితంగా మన్నించేవాడు, సర్వశక్తుడూ (అని తెలుసుకోండి.)
4:150 إِنَّ الَّذِينَ يَكْفُرُونَ بِاللَّهِ وَرُسُلِهِ وَيُرِيدُونَ أَن يُفَرِّقُوا بَيْنَ اللَّهِ وَرُسُلِهِ وَيَقُولُونَ نُؤْمِنُ بِبَعْضٍ وَنَكْفُرُ بِبَعْضٍ وَيُرِيدُونَ أَن يَتَّخِذُوا بَيْنَ ذَٰلِكَ سَبِيلًا
ఎవరయితే అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తలను తిరస్కరిస్తారో, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తల మధ్య భేదభావం పాటించదలుస్తున్నారో, ఇంకా “మేము కొంతమంది ప్రవక్తలను విశ్వసిస్తాం, మరి కొంతమందిని విశ్వసించం” అని చెబుతూ, రెంటికీ మధ్య ఓ (సరికొత్త) మార్గాన్ని తీయదలుస్తున్నారో-
4:151 أُولَٰئِكَ هُمُ الْكَافِرُونَ حَقًّا ۚ وَأَعْتَدْنَا لِلْكَافِرِينَ عَذَابًا مُّهِينًا
వీళ్ళే అసలైన అవిశ్వాసులు. ఇలాంటి అవిశ్వాసుల కొరకు మేము అవమానకరమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాము.
4:152 وَالَّذِينَ آمَنُوا بِاللَّهِ وَرُسُلِهِ وَلَمْ يُفَرِّقُوا بَيْنَ أَحَدٍ مِّنْهُمْ أُولَٰئِكَ سَوْفَ يُؤْتِيهِمْ أُجُورَهُمْ ۗ وَكَانَ اللَّهُ غَفُورًا رَّحِيمًا
(దీనికి భిన్నంగా) ఎవరు అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తలందరినీ విశ్వసించి, వారిలో ఎవరి మధ్యా తేడా చూపకుండా ఉంటారో వారికి అల్లాహ్ వారి పూర్తి పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాడు. అల్లాహ్ అపారంగా క్షమించేవాడు, అమితంగా కరుణించేవాడు.
4:153 يَسْأَلُكَ أَهْلُ الْكِتَابِ أَن تُنَزِّلَ عَلَيْهِمْ كِتَابًا مِّنَ السَّمَاءِ ۚ فَقَدْ سَأَلُوا مُوسَىٰ أَكْبَرَ مِن ذَٰلِكَ فَقَالُوا أَرِنَا اللَّهَ جَهْرَةً فَأَخَذَتْهُمُ الصَّاعِقَةُ بِظُلْمِهِمْ ۚ ثُمَّ اتَّخَذُوا الْعِجْلَ مِن بَعْدِ مَا جَاءَتْهُمُ الْبَيِّنَاتُ فَعَفَوْنَا عَن ذَٰلِكَ ۚ وَآتَيْنَا مُوسَىٰ سُلْطَانًا مُّبِينًا
(ఓ ప్రవక్తా!) నీవు ఆకాశం నుంచి ఏదైనా గ్రంథాన్ని తమపై అవతరింపజెయ్యవలసిందిగా ఈ గ్రంథవహులు నిన్ను అడుగుతున్నారు. వారు దీనికన్నా పెద్ద కోరికే మూసాను కోరి ఉన్నారు. “మాకు అల్లాహ్‌ను ప్రత్యక్షంగా చూపించు” అని వారు కోరారు. వారి ఈ దుర్మార్గ వైఖరి మూలంగా వారిపై పిడుగు విరుచుకుపడింది. ఆపైన వారి వద్దకు ఎన్నో స్పష్టమైన నిదర్శనాలు వచ్చిన తరువాత కూడా వారు ఆవు దూడను తమ ఆరాధ్య దైవంగా చేసుకున్నారు. అప్పటికీ మేము దాన్ని మన్నించాము. ఇంకా, మేము మూసాకు స్పష్టమైన ప్రాబల్యాన్ని (బహిరంగ నిదర్శనాన్ని) వొసగాము.
4:154 وَرَفَعْنَا فَوْقَهُمُ الطُّورَ بِمِيثَاقِهِمْ وَقُلْنَا لَهُمُ ادْخُلُوا الْبَابَ سُجَّدًا وَقُلْنَا لَهُمْ لَا تَعْدُوا فِي السَّبْتِ وَأَخَذْنَا مِنْهُم مِّيثَاقًا غَلِيظًا
వారి నుంచి ప్రమాణం తీసుకోవటానికి మేము వారిపైకి తూరు పర్వతాన్ని ఎత్తాము. సజ్దా చేస్తూ (నగర) ద్వారంలోనికి ప్రవేశించమని వారిని ఆజ్ఞాపించాము. శనివారం నాడు హద్దు మీరి ప్రవర్తించవద్దని కూడా వారికి ఉపదేశించాము. ఈ విధంగా మేము వారినుంచి చాలా గట్టి వాగ్దానం తీసుకున్నాము.
4:155 فَبِمَا نَقْضِهِم مِّيثَاقَهُمْ وَكُفْرِهِم بِآيَاتِ اللَّهِ وَقَتْلِهِمُ الْأَنبِيَاءَ بِغَيْرِ حَقٍّ وَقَوْلِهِمْ قُلُوبُنَا غُلْفٌ ۚ بَلْ طَبَعَ اللَّهُ عَلَيْهَا بِكُفْرِهِمْ فَلَا يُؤْمِنُونَ إِلَّا قَلِيلًا
వారు ప్రమాణ భంగం చేయటం వల్లనూ, దైవాజ్ఞల పట్ల తిరస్కార వైఖరికి ఒడిగట్టడం వల్లనూ, ప్రవక్తలను అన్యాయంగా హతమార్చటం వల్లనూ, “మా హృదయాలపై గలేబులున్నాయి” అని చెప్పటం వల్లనూ (వారికీ శాస్తి జరిగింది). వాస్తవానికి వారి తిరస్కారం కారణంగా అల్లాహ్ వారి హృదయాలకు సీలువేశాడు. అందువల్ల వారు చాలా తక్కువగా మాత్రమే విశ్వసిస్తారు.
4:156 وَبِكُفْرِهِمْ وَقَوْلِهِمْ عَلَىٰ مَرْيَمَ بُهْتَانًا عَظِيمًا
వారు తిరస్కారానికి పాల్పడటం వల్ల, మర్యమ్పై చాలా ఘోరమైన అపనిందను మోపటం వల్ల,
4:157 وَقَوْلِهِمْ إِنَّا قَتَلْنَا الْمَسِيحَ عِيسَى ابْنَ مَرْيَمَ رَسُولَ اللَّهِ وَمَا قَتَلُوهُ وَمَا صَلَبُوهُ وَلَٰكِن شُبِّهَ لَهُمْ ۚ وَإِنَّ الَّذِينَ اخْتَلَفُوا فِيهِ لَفِي شَكٍّ مِّنْهُ ۚ مَا لَهُم بِهِ مِنْ عِلْمٍ إِلَّا اتِّبَاعَ الظَّنِّ ۚ وَمَا قَتَلُوهُ يَقِينًا
ఇంకా – “మర్యమ్ పుత్రుడగు దైవప్రవక్త ఈసాను మేము హతమార్చాము” అని అనటం వల్ల – (వారు శిక్షను చవిచూశారు). నిజానికి వారు ఆయన్ని చంపనూలేదు, శిలువ పైకి ఎక్కించనూ లేదు. నిజం ఏమిటంటే, వారి కొరకు ఆయన్ని పోలిన వ్యక్తి రూపొందించబడ్డాడు. ఈసా విషయంలో విభేదించినవారు ఆయన వ్యవహారంలో సందేహానికి లోనయ్యారు. అంచనాలను అనుసరించటం తప్ప వారికి ఈ విషయమై ఖచ్చితంగా ఏమీ తెలియదు. అసలు వారు ఆయన్ని చంపలేదు,
4:158 بَل رَّفَعَهُ اللَّهُ إِلَيْهِ ۚ وَكَانَ اللَّهُ عَزِيزًا حَكِيمًا
పైగా అల్లాహ్ ఆయన్ని తన వైపునకు ఎత్తుకున్నాడు. అల్లాహ్ సర్వాధిక్యుడు, మహావివేకి.
4:159 وَإِن مِّنْ أَهْلِ الْكِتَابِ إِلَّا لَيُؤْمِنَنَّ بِهِ قَبْلَ مَوْتِهِ ۖ وَيَوْمَ الْقِيَامَةِ يَكُونُ عَلَيْهِمْ شَهِيدًا
గ్రంథవహులలో ఏ ఒక్కడూ ఈసాను, అతని (అంటే తన లేక ఆయన) మరణానికి మునుపు విశ్వసించకుండా మిగలడు. ప్రళయ దినాన ఆయన వారిపై సాక్షిగా ఉంటాడు.
4:160 فَبِظُلْمٍ مِّنَ الَّذِينَ هَادُوا حَرَّمْنَا عَلَيْهِمْ طَيِّبَاتٍ أُحِلَّتْ لَهُمْ وَبِصَدِّهِمْ عَن سَبِيلِ اللَّهِ كَثِيرًا
యూదుల దుర్మార్గం వల్ల వారికి ధర్మసమ్మతంగా ఉన్న అనేక పరిశుద్ధ వస్తువులను మేము వారికోసం నిషేధించాము. వారు ఎంతో మందిని దైవమార్గం నుంచి అడ్డుకోవటం వల్లనూ,
4:161 وَأَخْذِهِمُ الرِّبَا وَقَدْ نُهُوا عَنْهُ وَأَكْلِهِمْ أَمْوَالَ النَّاسِ بِالْبَاطِلِ ۚ وَأَعْتَدْنَا لِلْكَافِرِينَ مِنْهُمْ عَذَابًا أَلِيمًا
నిషేధించబడిన వడ్డీని పుచ్చుకోవటం వల్లనూ, జనుల సొమ్మును అన్యాయంగా స్వాహా చేయటం వల్లనూ (వారికీ దుర్గతి పట్టింది). వారిలో అవిశ్వాసులుగా ఉన్నవారి కోసం మేము బాధాకరమయిన శిక్షను సిద్ధం చేసి ఉంచాము.
4:162 لَّٰكِنِ الرَّاسِخُونَ فِي الْعِلْمِ مِنْهُمْ وَالْمُؤْمِنُونَ يُؤْمِنُونَ بِمَا أُنزِلَ إِلَيْكَ وَمَا أُنزِلَ مِن قَبْلِكَ ۚ وَالْمُقِيمِينَ الصَّلَاةَ ۚ وَالْمُؤْتُونَ الزَّكَاةَ وَالْمُؤْمِنُونَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ أُولَٰئِكَ سَنُؤْتِيهِمْ أَجْرًا عَظِيمًا
అయితే వారిలో పరిపూర్ణమైన, పరిపక్వతనొందిన జ్ఞానంగలవారూ, విశ్వసించినవారూ, నీపై అవతరింపజెయ్య బడినదానినీ, నీకు పూర్వం అవతరింపజెయ్యబడిన దానినీ విశ్వసించేవారూ, నమాజులను నెలకొల్పేవారూ, జకాతును చెల్లించేవారూ, అల్లాహ్ మరియు అంతిమ దినాన్ని విశ్వసించేవారూ – వీరందరికీ మేము గొప్ప పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాము.
4:163 إِنَّا أَوْحَيْنَا إِلَيْكَ كَمَا أَوْحَيْنَا إِلَىٰ نُوحٍ وَالنَّبِيِّينَ مِن بَعْدِهِ ۚ وَأَوْحَيْنَا إِلَىٰ إِبْرَاهِيمَ وَإِسْمَاعِيلَ وَإِسْحَاقَ وَيَعْقُوبَ وَالْأَسْبَاطِ وَعِيسَىٰ وَأَيُّوبَ وَيُونُسَ وَهَارُونَ وَسُلَيْمَانَ ۚ وَآتَيْنَا دَاوُودَ زَبُورًا
(ఓ ముహమ్మద్!) మేము నూహ్ వైపుకు, అతని తరువాత వచ్చిన ప్రవక్తల వైపుకు వహీ పంపినట్లే (వాణిని అవతరింపజేసినట్లే) నీ వైపుకూ వహీ పంపాము. ఇంకా మేము ఇబ్రాహీము, ఇస్మాయీలు, ఇస్హాఖు, యాకూబు మరియు అతని సంతతి వారికి, ఈసా, అయ్యూబు, యూనుసు, హారూను, సులైమానుల వైపుకు కూడా వహీ పంపాము. ఇంకా మేము దావూదుకు జబూరు (గ్రంథం) వొసగాము.
4:164 وَرُسُلًا قَدْ قَصَصْنَاهُمْ عَلَيْكَ مِن قَبْلُ وَرُسُلًا لَّمْ نَقْصُصْهُمْ عَلَيْكَ ۚ وَكَلَّمَ اللَّهُ مُوسَىٰ تَكْلِيمًا
నీకు పూర్వం గతించిన ఎంతో మంది ప్రవక్తల వృత్తాంతాలను మేము నీకు తెలియజేశాము. మరెంతో మంది ప్రవక్తల గాథలను తెలుపలేదు. మూసా (అలైహిస్సలాం) తోనైతే అల్లాహ్ నేరుగా మాట్లాడాడు.
4:165 رُّسُلًا مُّبَشِّرِينَ وَمُنذِرِينَ لِئَلَّا يَكُونَ لِلنَّاسِ عَلَى اللَّهِ حُجَّةٌ بَعْدَ الرُّسُلِ ۚ وَكَانَ اللَّهُ عَزِيزًا حَكِيمًا
మేము వారిని శుభవార్తలు వినిపించే, హెచ్చరించే ప్రవక్తలుగా చేసి పంపాము – ప్రవక్తలు వచ్చిన తరువాత అల్లాహ్‌కు వ్యతిరేకంగా వాదించటానికి ప్రజల వద్ద ఏ ఆధారమూ మిగలకూడదని (మేమిలా చేశాము). అల్లాహ్‌యే సర్వాధిక్యుడు, మహావివేకి.
4:166 لَّٰكِنِ اللَّهُ يَشْهَدُ بِمَا أَنزَلَ إِلَيْكَ ۖ أَنزَلَهُ بِعِلْمِهِ ۖ وَالْمَلَائِكَةُ يَشْهَدُونَ ۚ وَكَفَىٰ بِاللَّهِ شَهِيدًا
(ఓ ప్రవక్తా!) నీపై అవతరింపజేసిన దానిని గురించి, దాన్ని తన జ్ఞానంతో అవతరింపజేశానని అల్లాహ్ స్వయంగా సాక్ష్యమిస్తున్నాడు. దూతలు సయితం దాని గురించి సాక్ష్యమిస్తున్నారు. అసలు సాక్షిగా అల్లాహ్‌యే చాలు.
4:167 إِنَّ الَّذِينَ كَفَرُوا وَصَدُّوا عَن سَبِيلِ اللَّهِ قَدْ ضَلُّوا ضَلَالًا بَعِيدًا
ఎవరయితే అవిశ్వాసానికి ఒడిగట్టి, అల్లాహ్ మార్గంలోకి రాకుండా ఇతరులను కూడా అడ్డుకున్నారో వారు నిస్సందేహంగా అపమార్గంలో చాలా దూరం వెళ్ళిపోయారు.
4:168 إِنَّ الَّذِينَ كَفَرُوا وَظَلَمُوا لَمْ يَكُنِ اللَّهُ لِيَغْفِرَ لَهُمْ وَلَا لِيَهْدِيَهُمْ طَرِيقًا
అవిశ్వాసులై, అన్యాయానికి పాల్పడిన వారిని అల్లాహ్ ఎట్టి పరిస్థితిలోనూ క్షమించటంగానీ, ఏదైనా మార్గం చూపటంగానీ చేయడు-
4:169 إِلَّا طَرِيقَ جَهَنَّمَ خَالِدِينَ فِيهَا أَبَدًا ۚ وَكَانَ ذَٰلِكَ عَلَى اللَّهِ يَسِيرًا
వారికి నరకమార్గం చూపటం తప్ప! వారందులో ఎల్లకాలం పడి ఉంటారు. ఇలా చేయటం అల్లాహ్‌కు బహు సులువు.
4:170 يَا أَيُّهَا النَّاسُ قَدْ جَاءَكُمُ الرَّسُولُ بِالْحَقِّ مِن رَّبِّكُمْ فَآمِنُوا خَيْرًا لَّكُمْ ۚ وَإِن تَكْفُرُوا فَإِنَّ لِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ وَكَانَ اللَّهُ عَلِيمًا حَكِيمًا
ప్రజలారా! మీ వద్దకు మీ ప్రభువు తరఫు నుంచి ప్రవక్త సత్యం తీసుకువచ్చాడు. కాబట్టి మీరు విశ్వసించండి. అది మీకే మేలు. ఒకవేళ మీరు గనక తిరస్కరిస్తే ఆకాశాలలో, భూమిలో ఉన్నదంతా అల్లాహ్‌దే (అని తెలుసుకోండి). అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, వివేకవంతుడూను.
4:171 يَا أَهْلَ الْكِتَابِ لَا تَغْلُوا فِي دِينِكُمْ وَلَا تَقُولُوا عَلَى اللَّهِ إِلَّا الْحَقَّ ۚ إِنَّمَا الْمَسِيحُ عِيسَى ابْنُ مَرْيَمَ رَسُولُ اللَّهِ وَكَلِمَتُهُ أَلْقَاهَا إِلَىٰ مَرْيَمَ وَرُوحٌ مِّنْهُ ۖ فَآمِنُوا بِاللَّهِ وَرُسُلِهِ ۖ وَلَا تَقُولُوا ثَلَاثَةٌ ۚ انتَهُوا خَيْرًا لَّكُمْ ۚ إِنَّمَا اللَّهُ إِلَٰهٌ وَاحِدٌ ۖ سُبْحَانَهُ أَن يَكُونَ لَهُ وَلَدٌ ۘ لَّهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۗ وَكَفَىٰ بِاللَّهِ وَكِيلًا
ఓ గ్రంథవహులారా! మీరు మీ ధర్మం విషయంలో అతిశయిల్లకండి. సత్యం తప్ప మరోమాట అల్లాహ్‌కు ఆపాదించకండి. మర్యమ్ కుమారుడైన ఈసా మసీహ్ కేవలం దైవప్రవక్త మరియు (అయిపో అన్న) దైవవాక్కు (ద్వారా పుట్టించబడినవారు) మాత్రమే. దాన్ని ఆయన మర్యమ్ వైపు ప్రయోగించాడు. ఇంకా ఆయన (ఈసా), దేవుని దగ్గరి నుంచి వచ్చిన ఆత్మ మాత్రమే. కాబట్టి మీరు అల్లాహ్నూ, ఆయన పంపిన ప్రవక్తలందరినీ విశ్వసించండి. దేవుడు ‘ముగ్గురు’ అని అనకండి. ఈ (త్రిత్వం) వాదనను మానండి. ఇందులోనే మీకు మేలుంది. ఆరాధ్యుడగు అల్లాహ్ ఒక్కడు మాత్రమే. ఆయనకు కుమారుడున్నాడనే విషయానికి ఆయన అతీతుడు, పరిశుద్ధుడు. ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్నదంతా ఆయనకు చెందినదే. కార్య నిర్వాహకారిగా అల్లాహ్ ఒక్కడే చాలు.
4:172 لَّن يَسْتَنكِفَ الْمَسِيحُ أَن يَكُونَ عَبْدًا لِّلَّهِ وَلَا الْمَلَائِكَةُ الْمُقَرَّبُونَ ۚ وَمَن يَسْتَنكِفْ عَنْ عِبَادَتِهِ وَيَسْتَكْبِرْ فَسَيَحْشُرُهُمْ إِلَيْهِ جَمِيعًا
మసీహ్ (అలైహిస్సలాం) గానీ, అల్లాహ్ సామీప్యం పొందిన దూతలుగానీ తాము అల్లాహ్ దాసులు కావటాన్ని అగౌరవంగా, అవమానకరంగా ఎంత మాత్రం భావించరు. అల్లాహ్ దాస్యం చేయటాన్ని అవమానకరంగా, అగౌరవంగా భావించి, గర్వాతిశయంతో విర్రవీగే వారినందరినీ అల్లాహ్ తన వద్దకు ప్రోగుచేస్తాడు.
4:173 فَأَمَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ فَيُوَفِّيهِمْ أُجُورَهُمْ وَيَزِيدُهُم مِّن فَضْلِهِ ۖ وَأَمَّا الَّذِينَ اسْتَنكَفُوا وَاسْتَكْبَرُوا فَيُعَذِّبُهُمْ عَذَابًا أَلِيمًا وَلَا يَجِدُونَ لَهُم مِّن دُونِ اللَّهِ وَلِيًّا وَلَا نَصِيرًا
మరి ఎవరు విశ్వసించి, సత్కార్యాలు ఆచరించారో, వారికి వారి పూర్తి పుణ్య ఫలాన్ని వొసగటమేగాక, తన అనుగ్రహంతో మరింతగా ప్రసాదిస్తాడు. కాగా; (అల్లాహ్ దాస్యాన్ని) చిన్నతనంగా తలపోసి తలబిరుసులుగా ప్రవర్తించిన వారికి ఆయన బాధాకరమైన శిక్షను విధిస్తాడు. అల్లాహ్ తప్ప తమను ఆదుకునే రక్షకుణ్ణిగానీ, సహాయకుణ్ణిగానీ వారు పొందలేరు.
4:174 يَا أَيُّهَا النَّاسُ قَدْ جَاءَكُم بُرْهَانٌ مِّن رَّبِّكُمْ وَأَنزَلْنَا إِلَيْكُمْ نُورًا مُّبِينًا
ప్రజలారా! మీ వద్దకు మీ ప్రభువు తరఫు నుంచి స్పష్టమైన నిదర్శనం (బుర్హాన్) వచ్చేసింది. ఇంకా, మేము మీ వద్దకు స్పష్టమైన జ్యోతిని పంపాము.
4:175 فَأَمَّا الَّذِينَ آمَنُوا بِاللَّهِ وَاعْتَصَمُوا بِهِ فَسَيُدْخِلُهُمْ فِي رَحْمَةٍ مِّنْهُ وَفَضْلٍ وَيَهْدِيهِمْ إِلَيْهِ صِرَاطًا مُّسْتَقِيمًا
కాబట్టి, ఎవరు అల్లాహ్‌ను విశ్వసించి, ఆయనతో తమ సంబంధాన్ని పటిష్ఠం చేసుకుంటారో వారిని ఆయన తన కారుణ్యంలోకి, అనుగ్రహంలోకి తీసేసుకుంటాడు. వారికి తన వైపుకు తెచ్చే రుజుమార్గం చూపుతాడు.
4:176 يَسْتَفْتُونَكَ قُلِ اللَّهُ يُفْتِيكُمْ فِي الْكَلَالَةِ ۚ إِنِ امْرُؤٌ هَلَكَ لَيْسَ لَهُ وَلَدٌ وَلَهُ أُخْتٌ فَلَهَا نِصْفُ مَا تَرَكَ ۚ وَهُوَ يَرِثُهَا إِن لَّمْ يَكُن لَّهَا وَلَدٌ ۚ فَإِن كَانَتَا اثْنَتَيْنِ فَلَهُمَا الثُّلُثَانِ مِمَّا تَرَكَ ۚ وَإِن كَانُوا إِخْوَةً رِّجَالًا وَنِسَاءً فَلِلذَّكَرِ مِثْلُ حَظِّ الْأُنثَيَيْنِ ۗ يُبَيِّنُ اللَّهُ لَكُمْ أَن تَضِلُّوا ۗ وَاللَّهُ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ
(ఓ ప్రవక్తా!) వీరు నిన్ను (‘కలాలా’ గురించి) ధర్మాదేశం అడుగుతున్నారు. అల్లాహ్ (స్వయంగా) ‘కలాలా’ గురించి మీకు ఆదేశం ఇస్తున్నాడని నువ్వు వారికి చెప్పు. ఏ వ్యక్తయినా సంతానం లేకుండా చనిపోతే, అతనికి ఒక సోదరి మాత్రమే ఉంటే, అతను వదలి వెళ్ళిన ఆస్తిలో సగభాగం ఆమెకు లభిస్తుంది. ఒకవేళ సోదరి-సంతానం లేకుండా మరణిస్తే ఆమె సోదరుడు ఆమె ఆస్తికి వారసుడౌతాడు. ఒకవేళ (మరణించిన వ్యక్తికి) ఇద్దరు సోదరీమణులుంటే, అతని మొత్తం ఆస్తిలో మూడింట రెండొంతుల భాగం వారిద్దరికీ దక్కుతుంది. ఒకవేళ సోదరీసోదరులు అనేకమంది వారసులుగా ఉన్నప్పుడు, ఒక పురుషుని భాగం ఇద్దరు స్త్రీలకు ఇచ్చే భాగాలకు సమానంగా ఉంటుంది. మీరు పెడదారి పట్టకుండా ఉండేందుకుగాను అల్లాహ్ మీకు స్పష్టంగా విడమరచి చెబుతున్నాడు. అల్లాహ్ ప్రతిదీ తెలిసినవాడు.
5. సూరా అల్ మాయిద
5:1 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَوْفُوا بِالْعُقُودِ ۚ أُحِلَّتْ لَكُم بَهِيمَةُ الْأَنْعَامِ إِلَّا مَا يُتْلَىٰ عَلَيْكُمْ غَيْرَ مُحِلِّي الصَّيْدِ وَأَنتُمْ حُرُمٌ ۗ إِنَّ اللَّهَ يَحْكُمُ مَا يُرِيدُ
ఓ విశ్వాసులారా! ప్రమాణాలను, ఒప్పందాలను నెరవేర్చండి. మీకు చదివి వినిపించబడేవి తప్ప మిగిలిన చతుష్పాద పశువులన్నీ మీ కోసం ధర్మసమ్మతం (హలాల్) గావించబడ్డాయి. అయితే మీరు ‘ఇహ్రామ్’ స్థితిలో ఉన్నప్పుడు వేటను ధర్మసమ్మతంగా పరిగణించకండి. నిశ్చయంగా అల్లాహ్ తాను కోరినది ఆజ్ఞాపిస్తాడు.
5:2 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تُحِلُّوا شَعَائِرَ اللَّهِ وَلَا الشَّهْرَ الْحَرَامَ وَلَا الْهَدْيَ وَلَا الْقَلَائِدَ وَلَا آمِّينَ الْبَيْتَ الْحَرَامَ يَبْتَغُونَ فَضْلًا مِّن رَّبِّهِمْ وَرِضْوَانًا ۚ وَإِذَا حَلَلْتُمْ فَاصْطَادُوا ۚ وَلَا يَجْرِمَنَّكُمْ شَنَآنُ قَوْمٍ أَن صَدُّوكُمْ عَنِ الْمَسْجِدِ الْحَرَامِ أَن تَعْتَدُوا ۘ وَتَعَاوَنُوا عَلَى الْبِرِّ وَالتَّقْوَىٰ ۖ وَلَا تَعَاوَنُوا عَلَى الْإِثْمِ وَالْعُدْوَانِ ۚ وَاتَّقُوا اللَّهَ ۖ إِنَّ اللَّهَ شَدِيدُ الْعِقَابِ
విశ్వసించిన ఓ ప్రజలారా! అల్లాహ్ చిహ్నాలనుగానీ, ఏ నిషిద్ధ మాసాన్నిగానీ అగౌరవపరచకండి. ఖుర్బానీ నిమిత్తం కాబా గృహానికి గొనిపోబడుతున్న జంతువుల, మెడలో పట్టాలు కట్టబడి ఉన్న జంతువుల జోలికిపోకండి. అలాగే తమ ప్రభువు అనుగ్రహాన్ని, ప్రసన్నతను పొందే ఉద్దేశ్యంతో పవిత్ర గృహం (కాబా) వైపుకు వెళుతున్న వారికి అడ్డు తగలకండి. అయితే మీరు ఇహ్రామ్ దీక్షను విరమించిన మీదట వేటాడవచ్చు. మస్జిదె హరామ్‌కు పోకుండా (ఒకప్పుడు) మిమ్మల్ని నిలువరించిన వారి పట్ల ద్వేషం మిమ్మల్ని హద్దుమీరినవారుగా మార్చివేయరాదు. సత్కార్యాలలో, అల్లాహ్ భీతితో కూడిన విషయాలలో ఒండొకరికి తోడ్పడుతూ ఉండండి. పాపకార్యాలలో, దౌర్జన్యపు పనుల్లో ఎవరితోనూ సహకరించకండి. అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి. నిస్సందేహంగా అల్లాహ్ చాలా కఠినంగా శిక్షించేవాడు.
5:3 حُرِّمَتْ عَلَيْكُمُ الْمَيْتَةُ وَالدَّمُ وَلَحْمُ الْخِنزِيرِ وَمَا أُهِلَّ لِغَيْرِ اللَّهِ بِهِ وَالْمُنْخَنِقَةُ وَالْمَوْقُوذَةُ وَالْمُتَرَدِّيَةُ وَالنَّطِيحَةُ وَمَا أَكَلَ السَّبُعُ إِلَّا مَا ذَكَّيْتُمْ وَمَا ذُبِحَ عَلَى النُّصُبِ وَأَن تَسْتَقْسِمُوا بِالْأَزْلَامِ ۚ ذَٰلِكُمْ فِسْقٌ ۗ الْيَوْمَ يَئِسَ الَّذِينَ كَفَرُوا مِن دِينِكُمْ فَلَا تَخْشَوْهُمْ وَاخْشَوْنِ ۚ الْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِينَكُمْ وَأَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي وَرَضِيتُ لَكُمُ الْإِسْلَامَ دِينًا ۚ فَمَنِ اضْطُرَّ فِي مَخْمَصَةٍ غَيْرَ مُتَجَانِفٍ لِّإِثْمٍ ۙ فَإِنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ
మీ కొరకు నిషేధించబడిన వస్తువులు ఇవి : మృత పశువు, రక్తం, పంది మాంసం, అల్లాహ్ పేరుగాక వేరితరుల పేరు ఉచ్చరించబడినది, గొంతు పిసకబడటం వల్ల చచ్చిన పశువు, దెబ్బ తగిలి చనిపోయిన పశువు, ఎత్తయిన స్థలం నుంచి క్రిందపడి చనిపోయినది లేక కొమ్ము తగలటం వల్ల చచ్చిపోయినది, క్రూరమృగాలు చీల్చి తినటం వల్ల చనిపోయిన పశువు (ఇవి మీ కొరకు హరామ్ గావించబడ్డాయి). కాని మీరు ఒకవేళ ‘జిబహ్’ చేస్తే అది మీ కొరకు నిషిద్ధం కాదు. అలాగే ఆస్థానాల వద్ద బలి ఇచ్చినవి కూడా నిషిద్ధమే. అదే విధంగా బాణాల ప్రయోగం ద్వారా అదృష్టాన్ని పరీక్షించుకోవటం కూడా నిషిద్ధమే. ఇవన్నీ అత్యంత నీచమైన పాప కార్యాలు. ఈ రోజు అవిశ్వాసులు మీ ధర్మం గురించి ఇక ఆశను వదులుకున్నారు. జాగ్రత్త! మీరు భయపడవలసింది వారికి కాదు, మీరు నాకు భయపడండి. ఈ రోజు మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణం గావించాను. మీపై నా అనుగ్రహాన్ని పూర్తిచేశాను. ఇంకా, ఇస్లాంను మీ ధర్మంగా సమ్మతించి ఆమోదించాను. ఎవడయినా తీవ్రమయిన ఆకలి బాధతో అల్లాడిపోతూ – గత్యంతరంలేని పరిస్థితిలో పాపానికి పాల్పడే ఉద్దేశం లేకుండా ఉండి (పై వాటిలో దేన్నయినా తిన్నట్లయితే) నిస్సందేహంగా అల్లాహ్ క్షమించేవాడు, కనికరించేవాడూను.
5:4 يَسْأَلُونَكَ مَاذَا أُحِلَّ لَهُمْ ۖ قُلْ أُحِلَّ لَكُمُ الطَّيِّبَاتُ ۙ وَمَا عَلَّمْتُم مِّنَ الْجَوَارِحِ مُكَلِّبِينَ تُعَلِّمُونَهُنَّ مِمَّا عَلَّمَكُمُ اللَّهُ ۖ فَكُلُوا مِمَّا أَمْسَكْنَ عَلَيْكُمْ وَاذْكُرُوا اسْمَ اللَّهِ عَلَيْهِ ۖ وَاتَّقُوا اللَّهَ ۚ إِنَّ اللَّهَ سَرِيعُ الْحِسَابِ
(ఓ ప్రవక్తా!) తమ కొరకు ‘హలాల్’ (అనగా ధర్మసమ్మతం) చేయబడిన వస్తువులేవి? అని ప్రజలు నిన్ను అడుగుతున్నారు. వారికి ఇలా చెప్పు: “పరిశుద్ధమైన వస్తువులన్నీ మీ కోసం హలాల్ చేయబడ్డాయి. అలాగే మీరు శిక్షణ ఇచ్చిన వేట జంతువులు మీ కోసం ఏదైనా వేటాడితే (ఆ వేట మాంసాన్ని మీరు తినండి). కాని, మీరు వాటిని అల్లాహ్ మీకు బోధించిన పద్ధతిలో తర్ఫీదు చేసి ఉండాలి సుమా! దానిపై అల్లాహ్ నామాన్ని స్మరించండి. అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి. నిస్సందేహంగా అల్లాహ్ తొందరగా లెక్క తీసుకునేవాడు.”
5:5 الْيَوْمَ أُحِلَّ لَكُمُ الطَّيِّبَاتُ ۖ وَطَعَامُ الَّذِينَ أُوتُوا الْكِتَابَ حِلٌّ لَّكُمْ وَطَعَامُكُمْ حِلٌّ لَّهُمْ ۖ وَالْمُحْصَنَاتُ مِنَ الْمُؤْمِنَاتِ وَالْمُحْصَنَاتُ مِنَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ مِن قَبْلِكُمْ إِذَا آتَيْتُمُوهُنَّ أُجُورَهُنَّ مُحْصِنِينَ غَيْرَ مُسَافِحِينَ وَلَا مُتَّخِذِي أَخْدَانٍ ۗ وَمَن يَكْفُرْ بِالْإِيمَانِ فَقَدْ حَبِطَ عَمَلُهُ وَهُوَ فِي الْآخِرَةِ مِنَ الْخَاسِرِينَ
ఈ రోజు పరిశుద్ధమైన వస్తువులన్నీ మీ కోసం హలాల్ చేయబడ్డాయి. గ్రంథవహులు జిబహ్ చేసినది మీ కొరకు ధర్మసమ్మతం. మీరు జిబహ్ చేసినది వారి కొరకు ధర్మసమ్మతం. సౌశీల్యవతులగు ముస్లిం స్త్రీలు, మీకు పూర్వం గ్రంథం వొసగబడినవారి సౌశీల్యవతులగు స్త్రీలు కూడా మీ కొరకు హలాల్ అవుతారు. అయితే మీరు వారికి చెల్లించవలసిన మహర్ సొమ్మును చెల్లించి, వారిని వివాహబంధంలోకి తెచ్చుకోవాలి. అంతేగాని, బహిరంగంగా వ్యభిచారం చేయటం కోసం, చాటు మాటు ప్రేమకలాపాలు జరపటం కోసం వారు మీకు హలాల్ కారు. విశ్వాసాన్ని తిరస్కరించినవారి కర్మలు వృథా అయిపోతాయి. పరలోకంలో వారు నష్టపోయిన వారిలో చేర్తారు.
5:6 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا قُمْتُمْ إِلَى الصَّلَاةِ فَاغْسِلُوا وُجُوهَكُمْ وَأَيْدِيَكُمْ إِلَى الْمَرَافِقِ وَامْسَحُوا بِرُءُوسِكُمْ وَأَرْجُلَكُمْ إِلَى الْكَعْبَيْنِ ۚ وَإِن كُنتُمْ جُنُبًا فَاطَّهَّرُوا ۚ وَإِن كُنتُم مَّرْضَىٰ أَوْ عَلَىٰ سَفَرٍ أَوْ جَاءَ أَحَدٌ مِّنكُم مِّنَ الْغَائِطِ أَوْ لَامَسْتُمُ النِّسَاءَ فَلَمْ تَجِدُوا مَاءً فَتَيَمَّمُوا صَعِيدًا طَيِّبًا فَامْسَحُوا بِوُجُوهِكُمْ وَأَيْدِيكُم مِّنْهُ ۚ مَا يُرِيدُ اللَّهُ لِيَجْعَلَ عَلَيْكُم مِّنْ حَرَجٍ وَلَٰكِن يُرِيدُ لِيُطَهِّرَكُمْ وَلِيُتِمَّ نِعْمَتَهُ عَلَيْكُمْ لَعَلَّكُمْ تَشْكُرُونَ
ఓ విశ్వసించినవారలారా! మీరు నమాజు కొరకు లేచినప్పుడు మీ మొహాలను, మోచేతుల సమేతంగా మీ చేతులను కడుక్కోండి. మీ తలలను మసహ్ చేయండి, చీలమండల వరకు మీ కాళ్ళను కడుక్కోండి. ఒకవేళ మీరు లైంగిక అశుద్ధావస్థకు లోనవుతే స్నానం చేసి పరిశుద్ధులు అవ్వండి. ఒకవేళ మీరు వ్యాధిగ్రస్తులైతే లేక ప్రయాణావస్థలో ఉంటే లేక మీలో ఎవరయినా కాలకృత్యాలు తీర్చుకుని వస్తే లేక మీరు స్త్రీలతో సమాగమం జరిపి ఉంటే – అట్టి పరిస్థితిలో – నీరు లభ్యం కాకపోతే పరిశుభ్రమైన మట్టితో ‘తయమ్ముమ్’ చేసుకోండి. దాన్ని మీ మొహాలపై, చేతులపై తుడుచుకోండి. అల్లాహ్ మిమ్మల్ని ఎలాంటి ఇబ్బందికీ గురి చేయదలచుకోడు. మీరు కృతజ్ఞులయ్యేందుకు మిమ్మల్ని పరిశుద్ధులుగా చేసి, మీపై తన అనుగ్రహాన్ని సంపూర్ణం గావించాలన్నదే ఆయన అభిలాష!
5:7 وَاذْكُرُوا نِعْمَةَ اللَّهِ عَلَيْكُمْ وَمِيثَاقَهُ الَّذِي وَاثَقَكُم بِهِ إِذْ قُلْتُمْ سَمِعْنَا وَأَطَعْنَا ۖ وَاتَّقُوا اللَّهَ ۚ إِنَّ اللَّهَ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ
మీపై ఉన్న అల్లాహ్ అనుగ్రహాన్ని, ఆయన మీనుండి తీసుకున్న ప్రమాణాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. అప్పుడు మీరు, “మేము విన్నాము, శిరసావహించాము” అని చెప్పి ఉన్నారు. అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ మనసుల్లోని విషయాలు సయితం ఎరిగినవాడు.
5:8 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُونُوا قَوَّامِينَ لِلَّهِ شُهَدَاءَ بِالْقِسْطِ ۖ وَلَا يَجْرِمَنَّكُمْ شَنَآنُ قَوْمٍ عَلَىٰ أَلَّا تَعْدِلُوا ۚ اعْدِلُوا هُوَ أَقْرَبُ لِلتَّقْوَىٰ ۖ وَاتَّقُوا اللَّهَ ۚ إِنَّ اللَّهَ خَبِيرٌ بِمَا تَعْمَلُونَ
ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ కొరకు సత్యంపై నిలకడగా ఉండండి. న్యాయానికి సాక్షులుగా ఉండండి. ఏదైనా ఒక వర్గంతో ఉన్న విరోధం మిమ్మల్ని న్యాయవిరుద్ధతకు పాల్పడనీయకూడదు. న్యాయం చెయ్యండి. ఇది దైవభీతికి అత్యంత చేరువైనది. అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి. మీరు చేసే పనులన్నీ అల్లాహ్‌కు తెలుస్తూనే ఉంటాయి.
5:9 وَعَدَ اللَّهُ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ ۙ لَهُم مَّغْفِرَةٌ وَأَجْرٌ عَظِيمٌ
విశ్వసించి, మంచిపనులు చేసిన వారికి గొప్ప మన్నింపుతో పాటు, గొప్ప ప్రతి ఫలం కూడా ఉందని అల్లాహ్ వాగ్దానం చేశాడు.
5:10 وَالَّذِينَ كَفَرُوا وَكَذَّبُوا بِآيَاتِنَا أُولَٰئِكَ أَصْحَابُ الْجَحِيمِ
మరెవరు అవిశ్వాసానికి ఒడిగట్టి, మా ఆదేశాలను ధిక్కరించారో వారే నరకవాసులు.
5:11 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اذْكُرُوا نِعْمَتَ اللَّهِ عَلَيْكُمْ إِذْ هَمَّ قَوْمٌ أَن يَبْسُطُوا إِلَيْكُمْ أَيْدِيَهُمْ فَكَفَّ أَيْدِيَهُمْ عَنكُمْ ۖ وَاتَّقُوا اللَّهَ ۚ وَعَلَى اللَّهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُونَ
విశ్వాసులారా! అల్లాహ్ మీకు చేసిన ఉపకారాన్ని కాస్త జ్ఞప్తికి తెచ్చుకోండి – అప్పుడు ఒక జాతివారు మీపై చేయి చేసుకోవాలని అనుకున్నారు. అయితే అల్లాహ్ వారి చేతులు మీపై లేవకుండా ఆపాడు. అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి. విశ్వాసులు నమ్ముకోవలసింది కూడా అల్లాహ్‌నే.
5:12 وَلَقَدْ أَخَذَ اللَّهُ مِيثَاقَ بَنِي إِسْرَائِيلَ وَبَعَثْنَا مِنْهُمُ اثْنَيْ عَشَرَ نَقِيبًا ۖ وَقَالَ اللَّهُ إِنِّي مَعَكُمْ ۖ لَئِنْ أَقَمْتُمُ الصَّلَاةَ وَآتَيْتُمُ الزَّكَاةَ وَآمَنتُم بِرُسُلِي وَعَزَّرْتُمُوهُمْ وَأَقْرَضْتُمُ اللَّهَ قَرْضًا حَسَنًا لَّأُكَفِّرَنَّ عَنكُمْ سَيِّئَاتِكُمْ وَلَأُدْخِلَنَّكُمْ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ ۚ فَمَن كَفَرَ بَعْدَ ذَٰلِكَ مِنكُمْ فَقَدْ ضَلَّ سَوَاءَ السَّبِيلِ
అల్లాహ్ ఇస్రాయీల్ సంతతి నుండి గట్టి వాగ్దానాన్ని తీసుకున్నాడు. వారిలో నుంచే పన్నెండు మంది నాయకులను మేము నియమించాము. ఇంకా అల్లాహ్ వారితో ఇలా అన్నాడు: “నిశ్చయంగా నేను మీకు తోడుగా ఉన్నాను. మీరు గనక నమాజును నెలకొల్పుతూ ఉంటే, జకాత్ ఇస్తూ ఉంటే, నా ప్రవక్తలను విశ్వసిస్తూ, వారిని గౌరవించి వారికి సహాయ పడితే, అల్లాహ్‌కు ఉత్తమ రుణాన్ని ఇస్తూ ఉంటే నేను మీ చెడుగులను మీ నుంచి దూరం చేస్తాను. క్రింద సెలయేళ్లు ప్రవహించే స్వర్గవనాలలోకి మిమ్మల్ని తీసుకుపోతాను. ఈ ప్రమాణం తరువాత కూడా మీలో ఎవడైనా తిరస్కార వైఖరికి పాల్పడితే అతడు రుజుమార్గం (సవావుస్సబీల్) నుంచి తప్పిపోయాడు.”
5:13 فَبِمَا نَقْضِهِم مِّيثَاقَهُمْ لَعَنَّاهُمْ وَجَعَلْنَا قُلُوبَهُمْ قَاسِيَةً ۖ يُحَرِّفُونَ الْكَلِمَ عَن مَّوَاضِعِهِ ۙ وَنَسُوا حَظًّا مِّمَّا ذُكِّرُوا بِهِ ۚ وَلَا تَزَالُ تَطَّلِعُ عَلَىٰ خَائِنَةٍ مِّنْهُمْ إِلَّا قَلِيلًا مِّنْهُمْ ۖ فَاعْفُ عَنْهُمْ وَاصْفَحْ ۚ إِنَّ اللَّهَ يُحِبُّ الْمُحْسِنِينَ
ఆ తరువాత వారు తమ వాగ్దానాన్ని భంగపరచిన కారణంగా మేము వారిని శపించాము. వారి హృదయాలను కఠినం చేశాము. (తత్కారణంగా) వారు పదాలను వాటి (అసలు) స్థానం నుంచి తారుమారు చేస్తున్నారు. అంతేకాదు, తమకు బోధించబడిన ఉపదేశంలో చాలా భాగం వారు మరచి పోయారు. (ఓ ప్రవక్తా!) వారు పాల్పడే ఏదో ఒక ద్రోహానికి సంబంధించిన సమాచారం నీకు అందుతూనే ఉంటుంది. అయితే వారిలో కొద్దిమంది మాత్రం అలాంటివారు కారు. అయినా సరే నువ్వు వారిని మన్నిస్తూ, ఉపేక్షిస్తూ ఉండు. నిస్సందేహంగా అల్లాహ్ ఉత్తమంగా వ్యవహరించేవారిని అమితంగా ప్రేమిస్తాడు.
5:14 وَمِنَ الَّذِينَ قَالُوا إِنَّا نَصَارَىٰ أَخَذْنَا مِيثَاقَهُمْ فَنَسُوا حَظًّا مِّمَّا ذُكِّرُوا بِهِ فَأَغْرَيْنَا بَيْنَهُمُ الْعَدَاوَةَ وَالْبَغْضَاءَ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ ۚ وَسَوْفَ يُنَبِّئُهُمُ اللَّهُ بِمَا كَانُوا يَصْنَعُونَ
తమను తాము ‘నసారా'(క్రైస్తవులు)గా చెప్పుకునేవారి నుండి కూడా మేము వాగ్దానం తీసుకున్నాము. అయితే వారు కూడా తమకు చేయబడిన ఉపదేశంలోని ఎక్కువ భాగాన్ని విస్మరించారు. ఈ కారణంగా మేము వారి మధ్య విరోధాన్ని, విద్వేషాలను తగిలించాము. అవి ప్రళయ దినం వరకూ ఉంటాయి. వారు చేస్తూ ఉండిన పనులన్నింటినీ అల్లాహ్ త్వరలోనే వారికి తెలియజేస్తాడు.
5:15 يَا أَهْلَ الْكِتَابِ قَدْ جَاءَكُمْ رَسُولُنَا يُبَيِّنُ لَكُمْ كَثِيرًا مِّمَّا كُنتُمْ تُخْفُونَ مِنَ الْكِتَابِ وَيَعْفُو عَن كَثِيرٍ ۚ قَدْ جَاءَكُم مِّنَ اللَّهِ نُورٌ وَكِتَابٌ مُّبِينٌ
ఓ గ్రంథవహులారా! మీ వద్దకు మా ప్రవక్త (సఅసం) వచ్చేశాడు. మీరు కప్పిపుచ్చుతూ ఉండిన గ్రంథంలోని ఎన్నో విషయాలను అతను మీ ముందు విపులీకరిస్తున్నాడు. మరెన్నో విషయాలను ఉపేక్షిస్తున్నాడు. అల్లాహ్ తరఫు నుంచి మీ వద్దకు జ్యోతి వచ్చేసింది. అంటే, స్పష్టమైన గ్రంథం వచ్చేసింది.
5:16 يَهْدِي بِهِ اللَّهُ مَنِ اتَّبَعَ رِضْوَانَهُ سُبُلَ السَّلَامِ وَيُخْرِجُهُم مِّنَ الظُّلُمَاتِ إِلَى النُّورِ بِإِذْنِهِ وَيَهْدِيهِمْ إِلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ
దాని ద్వారా అల్లాహ్ తన ప్రసన్నతను అనుసరించేవారికి శాంతి మార్గాలను చూపుతాడు. తన అనుమతి మేరకు వారిని చీకట్లలో నుంచి వెలికితీసి, కాంతి వైపుకు తీసుకువస్తాడు. రుజుమార్గం వైపుకు వారికి దర్శకత్వం వహిస్తాడు.
5:17 لَّقَدْ كَفَرَ الَّذِينَ قَالُوا إِنَّ اللَّهَ هُوَ الْمَسِيحُ ابْنُ مَرْيَمَ ۚ قُلْ فَمَن يَمْلِكُ مِنَ اللَّهِ شَيْئًا إِنْ أَرَادَ أَن يُهْلِكَ الْمَسِيحَ ابْنَ مَرْيَمَ وَأُمَّهُ وَمَن فِي الْأَرْضِ جَمِيعًا ۗ وَلِلَّهِ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا ۚ يَخْلُقُ مَا يَشَاءُ ۚ وَاللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
“అల్లాహ్ (అంటే) మర్యమ్ పుత్రుడైన మసీహ్యే” అని అన్నవారు నిస్సందేహంగా అవిశ్వాసానికి పాల్పడ్డారు. (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “ఒకవేళ అల్లాహ్ మర్యమ్ పుత్రుడైన మసీహ్‌ని, అతని తల్లిని, భూమండలంలోని సమస్త జనులనూ నాశనం చేయదలిస్తే, ఆయన్ని అడ్డుకోగల శక్తి, అధికారం ఎవరికున్నాయి? భూమ్యాకాశాలలోనూ, వాటి మధ్యలోనూ ఉన్నవాటి సమస్త సార్వభౌమత్వానికి అధిపతి అల్లాహ్‌యే. ఆయన తాను కోరిన దాన్ని సృష్టిస్తాడు. అల్లాహ్ ప్రతిదీ చేయగల అధికారం కలవాడు.”
5:18 وَقَالَتِ الْيَهُودُ وَالنَّصَارَىٰ نَحْنُ أَبْنَاءُ اللَّهِ وَأَحِبَّاؤُهُ ۚ قُلْ فَلِمَ يُعَذِّبُكُم بِذُنُوبِكُم ۖ بَلْ أَنتُم بَشَرٌ مِّمَّنْ خَلَقَ ۚ يَغْفِرُ لِمَن يَشَاءُ وَيُعَذِّبُ مَن يَشَاءُ ۚ وَلِلَّهِ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا ۖ وَإِلَيْهِ الْمَصِيرُ
“మేము అల్లాహ్ పుత్రులం, ఆయనకు ప్రియమైన వారం” అని యూదులు, క్రైస్తవులు (నస్రానీలు) అంటారు. (ఓ ప్రవక్తా!) వారిని ఇలా అడుగు : “మరయితే మీ పాపాలకుగాను ఆయన మిమ్మల్ని ఎందుకు శిక్షిస్తున్నాడు? కాదు, మీరు కూడా ఆయన సృష్టించిన మానవ వర్గానికి చెందినవారే. ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు, తాను కోరిన వారిని శిక్షిస్తాడు. భూమ్యా కాశాలలోనూ, వాటి మధ్యనూ ఉన్నవాటన్నింటిపై అధికారం అల్లాహ్‌దే. ఆయన వైపుకే మరలిపోవలసి ఉంది.”
5:19 يَا أَهْلَ الْكِتَابِ قَدْ جَاءَكُمْ رَسُولُنَا يُبَيِّنُ لَكُمْ عَلَىٰ فَتْرَةٍ مِّنَ الرُّسُلِ أَن تَقُولُوا مَا جَاءَنَا مِن بَشِيرٍ وَلَا نَذِيرٍ ۖ فَقَدْ جَاءَكُم بَشِيرٌ وَنَذِيرٌ ۗ وَاللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
గ్రంథవహులారా! ప్రవక్తల ఆగమన క్రమంలో విరామం తర్వాత మా ప్రవక్త మీ వద్దకు వచ్చేశాడు. అతను మీకు స్పష్టంగా విడమరచి చెబుతున్నాడు. మా వద్దకు శుభవార్త అందించేవాడు, భయపెట్టేవాడు ఎవరూ రాలేదన్న మాట మీరు అనకుండా ఉండేందుకుగాను (ఈ ఏర్పాటు జరిగింది). అందుకే ఇప్పుడు నిజంగా శుభవార్త వినిపించేవాడు, భయపెట్టేవాడు మీ వద్దకు వచ్చేశాడు. అల్లాహ్ అన్నింటిపై అధికారం కలవాడు.
5:20 وَإِذْ قَالَ مُوسَىٰ لِقَوْمِهِ يَا قَوْمِ اذْكُرُوا نِعْمَةَ اللَّهِ عَلَيْكُمْ إِذْ جَعَلَ فِيكُمْ أَنبِيَاءَ وَجَعَلَكُم مُّلُوكًا وَآتَاكُم مَّا لَمْ يُؤْتِ أَحَدًا مِّنَ الْعَالَمِينَ
మూసా తన జాతి వారినుద్దేశించి చెప్పిన విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి : “ఓ నా జాతి ప్రజలారా! అల్లాహ్ మీకు చేసిన ఉపకారాన్ని కాస్త మననం చేసుకోండి – ఆయన మీలో ప్రవక్తల్ని నియమించాడు. మిమ్మల్ని రాజులుగా చేశాడు. లోకవాసులలో ఎవరికీ ప్రసాదించని దానిని మీకు ప్రసాదించాడు.”
5:21 يَا قَوْمِ ادْخُلُوا الْأَرْضَ الْمُقَدَّسَةَ الَّتِي كَتَبَ اللَّهُ لَكُمْ وَلَا تَرْتَدُّوا عَلَىٰ أَدْبَارِكُمْ فَتَنقَلِبُوا خَاسِرِينَ
“నా జాతివారలారా! అల్లాహ్ మీకు రాసిపెట్టిన ఈ పవిత్ర ప్రదేశంలో ప్రవేశించండి. వెన్నుచూపి మరలిపోకండి. వెన్నుచూపి మరలిపోయారంటే మీరే నష్టపోతారు.”
5:22 قَالُوا يَا مُوسَىٰ إِنَّ فِيهَا قَوْمًا جَبَّارِينَ وَإِنَّا لَن نَّدْخُلَهَا حَتَّىٰ يَخْرُجُوا مِنْهَا فَإِن يَخْرُجُوا مِنْهَا فَإِنَّا دَاخِلُونَ
దానికి వారు ఇలా బదులిచ్చారు : “మూసా! అక్కడ మహాబలవంతులు ఉన్నారు. వారక్కణ్ణుంచి వెళ్ళిపోనంత వరకూ మేము అందులో ప్రవేశించేది లేదు. ఒకవేళ వారు వెళ్ళిపోతే మాత్రం, మేము తప్పకుండా అందులోకి ప్రవేశిస్తాము.”
5:23 قَالَ رَجُلَانِ مِنَ الَّذِينَ يَخَافُونَ أَنْعَمَ اللَّهُ عَلَيْهِمَا ادْخُلُوا عَلَيْهِمُ الْبَابَ فَإِذَا دَخَلْتُمُوهُ فَإِنَّكُمْ غَالِبُونَ ۚ وَعَلَى اللَّهِ فَتَوَكَّلُوا إِن كُنتُم مُّؤْمِنِينَ
అప్పుడు, అల్లాహ్‌కు భయపడే వారిలో ఆయన అనుగ్రహం పొందిన ఇద్దరు ఇలా అన్నారు : “మీరు వారిని ఎదుర్కోవటానికి (కనీసం) ద్వారం లోపలికైనా ప్రవేశించండి. మీరు లోపలికి ప్రవేశిస్తే చాలు, మీరే ఆధిక్యత పొందుతారు. మీరు విశ్వాసులే అయితే అల్లాహ్‌నే నమ్మండి.”
5:24 قَالُوا يَا مُوسَىٰ إِنَّا لَن نَّدْخُلَهَا أَبَدًا مَّا دَامُوا فِيهَا ۖ فَاذْهَبْ أَنتَ وَرَبُّكَ فَقَاتِلَا إِنَّا هَاهُنَا قَاعِدُونَ
(కాని ఈ మాటల్ని వారు లక్ష్య పెట్టలేదు). “ఓ మూసా! వారు అక్కడ ఉన్నంత వరకూ మేము సుతరామూ అక్కడికి వెళ్ళబోము. నువ్వూ, నీ ప్రభువూ పోయి ఉభయులూ వారితో పోరాడండి. మేమిక్కడే కూర్చుని ఉంటాము” అని వారు చెప్పారు.
5:25 قَالَ رَبِّ إِنِّي لَا أَمْلِكُ إِلَّا نَفْسِي وَأَخِي ۖ فَافْرُقْ بَيْنَنَا وَبَيْنَ الْقَوْمِ الْفَاسِقِينَ
అప్పుడు మూసా ఇలా విన్నవించుకున్నాడు: “ప్రభూ! నాకు నా స్వయంపైనా, నా సోదరునిపైన మాత్రమే అధికారం ఉంది. కాబట్టి నువ్వు మమ్మల్ని – ఈ అవిధేయులను వేరు చెయ్యి.”
5:26 قَالَ فَإِنَّهَا مُحَرَّمَةٌ عَلَيْهِمْ ۛ أَرْبَعِينَ سَنَةً ۛ يَتِيهُونَ فِي الْأَرْضِ ۚ فَلَا تَأْسَ عَلَى الْقَوْمِ الْفَاسِقِينَ
అప్పుడు అల్లాహ్ ఇలా అన్నాడు: “ఇక ఈ భూమి వారి కోసం నలభై సంవత్సరాల దాకా నిషేధించబడింది. వారు ఎక్కడా నిలువ నీడ లేకుండా నేలపై తచ్చాడుతూ తిరుగుతుంటారు. కనుక నువ్వు ఈ అవిధేయ జనుల విషయంలో దుఃఖించకు.”
5:27 وَاتْلُ عَلَيْهِمْ نَبَأَ ابْنَيْ آدَمَ بِالْحَقِّ إِذْ قَرَّبَا قُرْبَانًا فَتُقُبِّلَ مِنْ أَحَدِهِمَا وَلَمْ يُتَقَبَّلْ مِنَ الْآخَرِ قَالَ لَأَقْتُلَنَّكَ ۖ قَالَ إِنَّمَا يَتَقَبَّلُ اللَّهُ مِنَ الْمُتَّقِينَ
(ఓ ముహమ్మద్-స!) ఆదం యొక్క ఇద్దరు కుమారుల వృత్తాంతాన్ని కూడా వారికి యధాతథంగా వినిపించు. వారిరువురూ దైవానికి నజరానా సమర్పించగా, వారిలో ఒకరి నజరానా స్వీకరించబడింది. మరొకరిది స్వీకరించబడలేదు. అప్పుడు రెండవతను, “నేను నిన్ను చంపేస్తాను” అన్నాడు. దానికి సమాధానంగా మొదటివాడు, “అల్లాహ్ భీతిపరుల నజరానాను మాత్రమే స్వీకరిస్తాడు –
5:28 لَئِن بَسَطتَ إِلَيَّ يَدَكَ لِتَقْتُلَنِي مَا أَنَا بِبَاسِطٍ يَدِيَ إِلَيْكَ لِأَقْتُلَكَ ۖ إِنِّي أَخَافُ اللَّهَ رَبَّ الْعَالَمِينَ
“నువ్వు నన్ను చంపటానికి చెయ్యి ఎత్తినా, నేను మాత్రం నిన్ను చంపే ఉద్దేశంతో చెయ్యి ఎత్తను. నేను సకల లోకాల ప్రభువైన అల్లాహ్‌కు భయపడుతున్నాను.
5:29 إِنِّي أُرِيدُ أَن تَبُوءَ بِإِثْمِي وَإِثْمِكَ فَتَكُونَ مِنْ أَصْحَابِ النَّارِ ۚ وَذَٰلِكَ جَزَاءُ الظَّالِمِينَ
“నువ్వు నీ పాపంతో పాటు, నా పాపం కూడా నీ నెత్తిన పెట్టుకుని నరక వాసుల్లో చేరిపోవాలని కోరుకుంటాను (గాని నేను మాత్రం ఆ పాపానికి ఒడిగట్టలేను). దుర్మార్గులకు ప్రతిఫలం ఇదే” అని అన్నాడు.
5:30 فَطَوَّعَتْ لَهُ نَفْسُهُ قَتْلَ أَخِيهِ فَقَتَلَهُ فَأَصْبَحَ مِنَ الْخَاسِرِينَ
తర్వాత అతని మనసు తన సోదరుని హత్యకే పురికొల్పింది. అతణ్ణి హత్యచేసి అతడు నష్టపోయిన వారిలో చేరిపోయాడు.
5:31 فَبَعَثَ اللَّهُ غُرَابًا يَبْحَثُ فِي الْأَرْضِ لِيُرِيَهُ كَيْفَ يُوَارِي سَوْءَةَ أَخِيهِ ۚ قَالَ يَا وَيْلَتَا أَعَجَزْتُ أَنْ أَكُونَ مِثْلَ هَٰذَا الْغُرَابِ فَأُوَارِيَ سَوْءَةَ أَخِي ۖ فَأَصْبَحَ مِنَ النَّادِمِينَ
ఆ తరువాత సోదరుని శవాన్ని ఎలా దాచాలో అతనికి చూపించటానికి అల్లాహ్ ఒక కాకిని పంపాడు. అది నేలను త్రవ్వసాగింది. అతను (ఆ దృశ్యాన్ని చూసి,) “అయ్యో! నా సోదరుని శవాన్ని దాచే విషయంలో నేను ఈ కాకిపాటి వాణ్ణి కూడా కాలేకపోయానే” అంటూ సిగ్గుతో కుమిలిపోయాడు.
5:32 مِنْ أَجْلِ ذَٰلِكَ كَتَبْنَا عَلَىٰ بَنِي إِسْرَائِيلَ أَنَّهُ مَن قَتَلَ نَفْسًا بِغَيْرِ نَفْسٍ أَوْ فَسَادٍ فِي الْأَرْضِ فَكَأَنَّمَا قَتَلَ النَّاسَ جَمِيعًا وَمَنْ أَحْيَاهَا فَكَأَنَّمَا أَحْيَا النَّاسَ جَمِيعًا ۚ وَلَقَدْ جَاءَتْهُمْ رُسُلُنَا بِالْبَيِّنَاتِ ثُمَّ إِنَّ كَثِيرًا مِّنْهُم بَعْدَ ذَٰلِكَ فِي الْأَرْضِ لَمُسْرِفُونَ
ఈ కారణంగానే మేము ఇస్రాయీలు సంతతిపై ఈ ఫర్మానా విధించాము: “ఎవరయినా ఒకరి హత్యకు ప్రతీకారంగా కాకుండా, భూమిలో కల్లోలాన్ని రేకెత్తించినందుకు కాకుండా, అకారణంగా ఎవరినయినా చంపినట్లయితే అతడు సమస్త మానవులను చంపినవాడవుతాడు. అలాగే ఎవరయినా ఒకరి ప్రాణాన్ని రక్షిస్తే అతడు సమస్త మానవుల ప్రాణాలను రక్షించిన వాడవుతాడు.” వారి వద్దకు మా ప్రవక్తలెందరో స్పష్టమయిన నిదర్శనాలను తీసుకువచ్చారు. కాని ఆ తరువాత కూడా వారిలో చాలా మంది అవనిలో దుర్మార్గం, దౌర్జన్యాలకు పాల్పడేవారు ఉన్నారు.
5:33 إِنَّمَا جَزَاءُ الَّذِينَ يُحَارِبُونَ اللَّهَ وَرَسُولَهُ وَيَسْعَوْنَ فِي الْأَرْضِ فَسَادًا أَن يُقَتَّلُوا أَوْ يُصَلَّبُوا أَوْ تُقَطَّعَ أَيْدِيهِمْ وَأَرْجُلُهُم مِّنْ خِلَافٍ أَوْ يُنفَوْا مِنَ الْأَرْضِ ۚ ذَٰلِكَ لَهُمْ خِزْيٌ فِي الدُّنْيَا ۖ وَلَهُمْ فِي الْآخِرَةِ عَذَابٌ عَظِيمٌ
ఎవరు అల్లాహ్‌తోనూ, ఆయన ప్రవక్తతోనూ పోరాడుతారో, భూమిలో కల్లోలాన్ని రేకెత్తిస్తూ తిరుగుతుంటారో వారు వధించబడాలి. లేదా ఉరి కంబం ఎక్కించబడాలి. లేదా ఎదురుగా వారి కాళ్లు చేతులు ఖండించబడాలి. లేదా వారిని దేశం నుంచి బహిష్కరించాలి. ఇది ఇహలోకంలో వారికి కలగవలసిన పరాభవం. పరలోకంలో వారికి విధించబడే శిక్ష (ఇంతకన్నా) ఘోరంగా ఉంటుంది.
5:34 إِلَّا الَّذِينَ تَابُوا مِن قَبْلِ أَن تَقْدِرُوا عَلَيْهِمْ ۖ فَاعْلَمُوا أَنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ
కాని వారిలో ఎవరయినా మీ అదుపులోకి రాకముందే పశ్చాత్తాపపడితే, అల్లాహ్ అమితంగా క్షమించేవాడు, అపారంగా కరుణించేవాడని తెలుసుకోండి.
5:35 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَابْتَغُوا إِلَيْهِ الْوَسِيلَةَ وَجَاهِدُوا فِي سَبِيلِهِ لَعَلَّكُمْ تُفْلِحُونَ
విశ్వసించిన ఓ ప్రజలారా! అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి. ఆయన సామీప్యాన్ని పొందే సాధనం వెతకండి. ఆయన మార్గంలో(యుద్ధ ప్రాతిపదికన) కృషి సలపండి. తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు.
5:36 إِنَّ الَّذِينَ كَفَرُوا لَوْ أَنَّ لَهُم مَّا فِي الْأَرْضِ جَمِيعًا وَمِثْلَهُ مَعَهُ لِيَفْتَدُوا بِهِ مِنْ عَذَابِ يَوْمِ الْقِيَامَةِ مَا تُقُبِّلَ مِنْهُمْ ۖ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ
తిరస్కార వైఖరిని అవలంబించిన వారివద్ద భూమిలో ఉన్న సంపద మొత్తం, ఇంకా అంతే సంపద దానితోపాటు ఉండి, ఆ మొత్తం సంపదను వారు ప్రళయ దినపు శిక్షనుంచి తప్పించుకోవటానికి పరిహారంగా ఇవ్వదలచినా – అది వారి నుండి స్వీకరింపజాలదు. వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది.
5:37 يُرِيدُونَ أَن يَخْرُجُوا مِنَ النَّارِ وَمَا هُم بِخَارِجِينَ مِنْهَا ۖ وَلَهُمْ عَذَابٌ مُّقِيمٌ
వారు నరకాగ్ని నుంచి బయటపడాలని పరితపిస్తారు. కాని వారు దాన్నుంచి బయటికి రాలేరు. వారి కోసం శాశ్వితమైన శిక్ష ఉంటుంది.
5:38 وَالسَّارِقُ وَالسَّارِقَةُ فَاقْطَعُوا أَيْدِيَهُمَا جَزَاءً بِمَا كَسَبَا نَكَالًا مِّنَ اللَّهِ ۗ وَاللَّهُ عَزِيزٌ حَكِيمٌ
దొంగతనం చేసినది – పురుషుడైనా, స్త్రీ అయినా – ఉభయుల చేతులూ నరకండి. అది వారు చేసిన దానికి ప్రతిఫలం. అల్లాహ్ తరఫున విధించబడిన శిక్ష. అల్లాహ్ సర్వాధిక్యుడు, వివేచనాశీలి కూడా.
5:39 فَمَن تَابَ مِن بَعْدِ ظُلْمِهِ وَأَصْلَحَ فَإِنَّ اللَّهَ يَتُوبُ عَلَيْهِ ۗ إِنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ
పాపం చేసిన తరువాత పశ్చాత్తాపం చెంది, తన నడవడికను సరిదిద్దుకున్నవాని వైపుకు అల్లాహ్ కారుణ్యంతో మరలుతాడు. నిస్సందేహంగా అల్లాహ్ క్షమాభిక్షపెట్టేవాడు, కరుణించేవాడూను.
5:40 أَلَمْ تَعْلَمْ أَنَّ اللَّهَ لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ يُعَذِّبُ مَن يَشَاءُ وَيَغْفِرُ لِمَن يَشَاءُ ۗ وَاللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
ఆకాశాల మరియు భూమి యొక్క రాజ్యాధికారం అల్లాహ్‌దే నన్న సంగతి నీకు తెలియదా? ఆయన తాను తలచిన వారిని శిక్షిస్తాడు, తాను తలచినవారిని క్షమిస్తాడు. అల్లాహ్ అన్నింటిపై తిరుగులేని అధికారం కలవాడు.
5:41 يَا أَيُّهَا الرَّسُولُ لَا يَحْزُنكَ الَّذِينَ يُسَارِعُونَ فِي الْكُفْرِ مِنَ الَّذِينَ قَالُوا آمَنَّا بِأَفْوَاهِهِمْ وَلَمْ تُؤْمِن قُلُوبُهُمْ ۛ وَمِنَ الَّذِينَ هَادُوا ۛ سَمَّاعُونَ لِلْكَذِبِ سَمَّاعُونَ لِقَوْمٍ آخَرِينَ لَمْ يَأْتُوكَ ۖ يُحَرِّفُونَ الْكَلِمَ مِن بَعْدِ مَوَاضِعِهِ ۖ يَقُولُونَ إِنْ أُوتِيتُمْ هَٰذَا فَخُذُوهُ وَإِن لَّمْ تُؤْتَوْهُ فَاحْذَرُوا ۚ وَمَن يُرِدِ اللَّهُ فِتْنَتَهُ فَلَن تَمْلِكَ لَهُ مِنَ اللَّهِ شَيْئًا ۚ أُولَٰئِكَ الَّذِينَ لَمْ يُرِدِ اللَّهُ أَن يُطَهِّرَ قُلُوبَهُمْ ۚ لَهُمْ فِي الدُّنْيَا خِزْيٌ ۖ وَلَهُمْ فِي الْآخِرَةِ عَذَابٌ عَظِيمٌ
ఓ ప్రవక్తా! అవిశ్వాసంలో ముందుకు దూసుకుపోయే వారిని చూసి నువ్వు దుఃఖించకు. తాము ముస్లిములమేనని వారు నోటితో పలికినాసరే – వాస్తవానికి వారి హృదయాలు విశ్వాస పూరితం కావు (వాటిలో కాపట్యం ఉంది). కాగా; యూదుల్లోని కొందరు తప్పుడు మాటలను ఆసక్తితో చెవియొగ్గి వింటారు. ఇంకా ఇంతవరకూ నీ వద్దకు రాని వారి కోసం గూఢచారులుగా వ్యవహరిస్తున్నారు. వారు పదాల అసలు సందర్భాన్ని విడిచిపెట్టి, వాటిని తారుమారు చేస్తారు. “మీకు ఈ ఆదేశమే గనక ఇవ్వబడితే దాన్ని స్వీకరించండి. ఈ ఆదేశం గనక లభించకపోతే దూరంగా ఉండండి” అని (ప్రజలకు) చెబుతారు. అల్లాహ్ ఎవరినయినా వినాశాని (ఫిత్నా)కి లోను చేయదలిస్తే అల్లాహ్‌కు ప్రతిగా నీకు వారిపై ఏ అధికారం ఉండదు. అల్లాహ్ పరిశుద్ధ పరచదలచుకోలేనిది ఇటువంటి వారి హృదయాలనే. వారికి ఇహలోకంలోనూ పరాభవం ఉంటుంది, పరలోకంలో కూడా వారికి ఘోర శిక్ష తప్పదు.
5:42 سَمَّاعُونَ لِلْكَذِبِ أَكَّالُونَ لِلسُّحْتِ ۚ فَإِن جَاءُوكَ فَاحْكُم بَيْنَهُمْ أَوْ أَعْرِضْ عَنْهُمْ ۖ وَإِن تُعْرِضْ عَنْهُمْ فَلَن يَضُرُّوكَ شَيْئًا ۖ وَإِنْ حَكَمْتَ فَاحْكُم بَيْنَهُم بِالْقِسْطِ ۚ إِنَّ اللَّهَ يُحِبُّ الْمُقْسِطِينَ
వీరు చెవియొగ్గి అబద్ధాలు వినేవారు, నిషిద్ధమైన సొమ్ము (హరాం) చాలా ఎక్కువగా తినేవారు. ఒకవేళ వారు (తమ గొడవలను) నీ వద్దకు తీసుకువస్తే, నీకిష్టముంటే వారి మధ్య తీర్పు చెప్పు, లేదంటే విముఖతను తెలుపు. ఒకవేళ నువ్వు వారినుంచి ముఖం త్రిప్పుకున్నా వారు నీకెలాంటి హానీ కలిగించలేరు. ఒకవేళ నువ్వు (వారి వ్యవహారాలపై), తీర్పు చెబితే వారిమధ్య న్యాయసమ్మతంగా తీర్పు చెప్పు. నిస్సందేహంగా అల్లాహ్ న్యాయశీలురను ప్రేమిస్తాడు.
5:43 وَكَيْفَ يُحَكِّمُونَكَ وَعِندَهُمُ التَّوْرَاةُ فِيهَا حُكْمُ اللَّهِ ثُمَّ يَتَوَلَّوْنَ مِن بَعْدِ ذَٰلِكَ ۚ وَمَا أُولَٰئِكَ بِالْمُؤْمِنِينَ
దైవాదేశాలు పొందుపరచబడి వున్న తౌరాతు గ్రంథం తమ వద్ద ఉన్నప్పటికీ వారు నిన్ను ఎట్లా న్యాయనిర్ణేతగా చేసుకుంటున్నారు? (ఇది ఆశ్చర్యకరం కదూ?!) ఆ తరువాత మళ్ళీ తిరిగిపోతున్నారు. యదార్థమేమిటంటే వారసలు విశ్వాసులే కారు.
5:44 إِنَّا أَنزَلْنَا التَّوْرَاةَ فِيهَا هُدًى وَنُورٌ ۚ يَحْكُمُ بِهَا النَّبِيُّونَ الَّذِينَ أَسْلَمُوا لِلَّذِينَ هَادُوا وَالرَّبَّانِيُّونَ وَالْأَحْبَارُ بِمَا اسْتُحْفِظُوا مِن كِتَابِ اللَّهِ وَكَانُوا عَلَيْهِ شُهَدَاءَ ۚ فَلَا تَخْشَوُا النَّاسَ وَاخْشَوْنِ وَلَا تَشْتَرُوا بِآيَاتِي ثَمَنًا قَلِيلًا ۚ وَمَن لَّمْ يَحْكُم بِمَا أَنزَلَ اللَّهُ فَأُولَٰئِكَ هُمُ الْكَافِرُونَ
మేము తౌరాతు గ్రంథాన్ని అవతరింపజేశాము. అందులో మార్గదర్శకత్వము, జ్యోతీ ఉండేవి. ఈ తౌరాతు ఆధారంగానే ముస్లిములైన ప్రవక్తలు, రబ్బానీలు, ధర్మవేత్తలు యూదుల సమస్యలను పరిష్కరించేవారు. ఎందుకంటే దేవుని ఈ గ్రంథాన్ని రక్షించవలసిందిగా వారికి ఆజ్ఞాపించటం జరిగింది. దీనికి వారు సాక్షులుగా ఉండేవారు. కాబట్టి మీరు మనుషులకు భయపడకండి. నాకు మాత్రమే భయపడండి. నా వాక్యాలను కొద్దిపాటి వెలకు అమ్ముకోకండి. ఎవరు అల్లాహ్ అవతరింపజేసిన వహీ ప్రకారం తీర్పు చెయ్యరో వారే (కరడుగట్టిన) అవిశ్వాసులు.
5:45 وَكَتَبْنَا عَلَيْهِمْ فِيهَا أَنَّ النَّفْسَ بِالنَّفْسِ وَالْعَيْنَ بِالْعَيْنِ وَالْأَنفَ بِالْأَنفِ وَالْأُذُنَ بِالْأُذُنِ وَالسِّنَّ بِالسِّنِّ وَالْجُرُوحَ قِصَاصٌ ۚ فَمَن تَصَدَّقَ بِهِ فَهُوَ كَفَّارَةٌ لَّهُ ۚ وَمَن لَّمْ يَحْكُم بِمَا أَنزَلَ اللَّهُ فَأُولَٰئِكَ هُمُ الظَّالِمُونَ
మేము తౌరాతు గ్రంథంలో యూదుల కోసం ఒక శాసనాన్ని లిఖించాము: (దీని ప్రకారం) ప్రాణానికి బదులు ప్రాణం, కన్నుకు బదులు కన్ను, ముక్కుకు బదులు ముక్కు, చెవికి బదులు చెవి, పంటికి బదులు పన్ను. అలాగే కొన్ని ప్రత్యేక గాయాల కోసం కూడా (సరిసమానంగా) ప్రతీకారం ఉంది. కాని ఎవరయినా క్షమాభిక్ష పెడితే అది అతని పాలిట పరిహారం (కప్ఫారా) అవుతుంది. అల్లాహ్ అవతరింపజేసిన దానికనుగుణంగా తీర్పు ఇవ్వనివారే దుర్మార్గులు.
5:46 وَقَفَّيْنَا عَلَىٰ آثَارِهِم بِعِيسَى ابْنِ مَرْيَمَ مُصَدِّقًا لِّمَا بَيْنَ يَدَيْهِ مِنَ التَّوْرَاةِ ۖ وَآتَيْنَاهُ الْإِنجِيلَ فِيهِ هُدًى وَنُورٌ وَمُصَدِّقًا لِّمَا بَيْنَ يَدَيْهِ مِنَ التَّوْرَاةِ وَهُدًى وَمَوْعِظَةً لِّلْمُتَّقِينَ
ఆ ప్రవక్తల తరువాత మేము మర్యమ్ కుమారుడగు ఈసాను పంపాము. అతను తనకు పూర్వం వచ్చిన తౌరాతు గ్రంథాన్ని సత్యమని ధృవీకరించేవాడు. మేమతనికి ఇంజీలు గ్రంథాన్ని వొసగాము. అందులో మార్గదర్శకత్వమూ, జ్యోతీ ఉండేవి. అది తనకు ముందున్న తౌరాతు గ్రంథాన్ని ధృవీకరించేది. అంతేకాదు, అది దైవభీతి కలవారికి ఆసాంతం మార్గదర్శిని మరియు హితబోధిని కూడా.
5:47 وَلْيَحْكُمْ أَهْلُ الْإِنجِيلِ بِمَا أَنزَلَ اللَّهُ فِيهِ ۚ وَمَن لَّمْ يَحْكُم بِمَا أَنزَلَ اللَّهُ فَأُولَٰئِكَ هُمُ الْفَاسِقُونَ
ఇంజీలు గ్రంథం గలవారు కూడా, అల్లాహ్ ఇంజీలులో అవతరింపజేసిన దానికనుగుణంగానే తీర్పు చెయ్యాలి. అల్లాహ్ అవతరింపజేసిన దాని ప్రకారం తీర్పుచెయ్యని వారే పాపాత్ములు.
5:48 وَأَنزَلْنَا إِلَيْكَ الْكِتَابَ بِالْحَقِّ مُصَدِّقًا لِّمَا بَيْنَ يَدَيْهِ مِنَ الْكِتَابِ وَمُهَيْمِنًا عَلَيْهِ ۖ فَاحْكُم بَيْنَهُم بِمَا أَنزَلَ اللَّهُ ۖ وَلَا تَتَّبِعْ أَهْوَاءَهُمْ عَمَّا جَاءَكَ مِنَ الْحَقِّ ۚ لِكُلٍّ جَعَلْنَا مِنكُمْ شِرْعَةً وَمِنْهَاجًا ۚ وَلَوْ شَاءَ اللَّهُ لَجَعَلَكُمْ أُمَّةً وَاحِدَةً وَلَٰكِن لِّيَبْلُوَكُمْ فِي مَا آتَاكُمْ ۖ فَاسْتَبِقُوا الْخَيْرَاتِ ۚ إِلَى اللَّهِ مَرْجِعُكُمْ جَمِيعًا فَيُنَبِّئُكُم بِمَا كُنتُمْ فِيهِ تَخْتَلِفُونَ
ఇంకా (ఓ ప్రవక్తా!) మేము నీ వైపుకు ఈ గ్రంథాన్ని సత్య సమేతంగా అవతరింపజేశాము. అది తనకన్నా ముందు వచ్చిన గ్రంథాలను సత్యమని ధృవీకరిస్తుంది, వాటిని పరిరక్షిస్తుంది. కాబట్టి నువ్వు వారి పరస్పర వ్యవహారాలపై అల్లాహ్ అవతరింపజేసిన ఈ గ్రంథానికనుగుణంగానే తీర్పు చెయ్యి. నీ వద్దకు వచ్చిన ఈ సత్యాన్ని వీడి, వారి మనోవాంఛలను అనుసరించకు. మీలో ప్రతి ఒక్కరి కోసం మేము ఒక విధానాన్ని, మార్గాన్నీ నిర్ధారించాము. అల్లాహ్‌యే గనక తలిస్తే మీ అందరినీ ఒకే సమాజంగా చేసి ఉండేవాడు. అయితే మీకు వొసగబడిన దానిలో మిమ్మల్ని పరీక్షించాలన్నది ఆయన అభిలాష. కాబట్టి మీరు సత్కార్యాలు చేయటంలో త్వరపడండి. మీరంతా మరలిపోవలసింది అల్లాహ్ వైపుకే. ఆ తరువాత ఆయన, మీరు పరస్పరం విభేదించుకునే విషయాల గురించి మీకు (తన తీర్పు) తెలియజేస్తాడు.
5:49 وَأَنِ احْكُم بَيْنَهُم بِمَا أَنزَلَ اللَّهُ وَلَا تَتَّبِعْ أَهْوَاءَهُمْ وَاحْذَرْهُمْ أَن يَفْتِنُوكَ عَن بَعْضِ مَا أَنزَلَ اللَّهُ إِلَيْكَ ۖ فَإِن تَوَلَّوْا فَاعْلَمْ أَنَّمَا يُرِيدُ اللَّهُ أَن يُصِيبَهُم بِبَعْضِ ذُنُوبِهِمْ ۗ وَإِنَّ كَثِيرًا مِّنَ النَّاسِ لَفَاسِقُونَ
(ఓ ప్రవక్తా!) అల్లాహ్ అవతరింపజేసిన దానికనుగుణంగానే నీవు వారి మధ్య తీర్పు చేయి. వాళ్ళ కోరికలను ఎంత మాత్రం అనుసరించకు. అల్లాహ్ నీ వైపుకు అవతరింపజేసిన ఏదేని ఆజ్ఞ విషయంలో వారు నిన్ను ప్రక్కదారి పట్టించకుండా నీవు చాలా అప్రమత్తంగా ఉండు. ఒకవేళ వారు విముఖత చూపితే, వారు ఒడిగట్టిన కొన్ని పాపాలకుగాను వారికి శిక్ష విధించాలన్నదే అల్లాహ్ సంకల్పం అని తెలుసుకో. ప్రజల్లో చాలా మంది అవిధేయులే ఉంటారు.
5:50 أَفَحُكْمَ الْجَاهِلِيَّةِ يَبْغُونَ ۚ وَمَنْ أَحْسَنُ مِنَ اللَّهِ حُكْمًا لِّقَوْمٍ يُوقِنُونَ
ఏమిటీ, వారు మళ్ళీ అజ్ఞాన (కాల)పు తీర్పు కోరుతున్నారా? నమ్మకం గల వారి కోసం అల్లాహ్ కన్నా ఉత్తమ తీర్పు ఇవ్వగల వాడెవడుంటాడు?
5:51 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَتَّخِذُوا الْيَهُودَ وَالنَّصَارَىٰ أَوْلِيَاءَ ۘ بَعْضُهُمْ أَوْلِيَاءُ بَعْضٍ ۚ وَمَن يَتَوَلَّهُم مِّنكُمْ فَإِنَّهُ مِنْهُمْ ۗ إِنَّ اللَّهَ لَا يَهْدِي الْقَوْمَ الظَّالِمِينَ
ఓ విశ్వసించినవారలారా! యూదులను, నసారాను (అంటే క్రైస్తవులను) స్నేహితులుగా చేసుకోకండి. వారు ఒండొకరికి స్నేహితులు. మీలో ఎవరయినాసరే వారితో చెలిమిచేస్తే అతడు కూడా వారిలో ఒకడుగానే భావించబడతాడు. నిశ్చయంగా దుర్మార్గులకు అల్లాహ్ సన్మార్గం చూపడు.
5:52 فَتَرَى الَّذِينَ فِي قُلُوبِهِم مَّرَضٌ يُسَارِعُونَ فِيهِمْ يَقُولُونَ نَخْشَىٰ أَن تُصِيبَنَا دَائِرَةٌ ۚ فَعَسَى اللَّهُ أَن يَأْتِيَ بِالْفَتْحِ أَوْ أَمْرٍ مِّنْ عِندِهِ فَيُصْبِحُوا عَلَىٰ مَا أَسَرُّوا فِي أَنفُسِهِمْ نَادِمِينَ
మరి హృదయాలలో (కాపట్య) రోగం ఉన్నవారు పదేపదే వారి వైపుకు పరుగెత్తటం నీవు చూస్తావు. అంతేకాదు, “మాపై ఏ ఆపద వచ్చిపడుతుందోనని మేము భయపడుతున్నాము” అని వారంటారు. అయితే త్వరలోనే అల్లాహ్ విజయాన్ని చేకూర్చవచ్చు లేక తనవద్ద నుంచి దేన్నయినా అనుగ్రహించవచ్చు. అప్పుడు వారు తమ ఆంతర్యాల్లో దాచిపెట్టిన విషయాలపై పశ్చాత్తాపపడతారు.
5:53 وَيَقُولُ الَّذِينَ آمَنُوا أَهَٰؤُلَاءِ الَّذِينَ أَقْسَمُوا بِاللَّهِ جَهْدَ أَيْمَانِهِمْ ۙ إِنَّهُمْ لَمَعَكُمْ ۚ حَبِطَتْ أَعْمَالُهُمْ فَأَصْبَحُوا خَاسِرِينَ
విశ్వాసులు (వారి ఈ పరిస్థితిని చూసి), “మేము మీతోనే ఉన్నామని అదేపనిగా అల్లాహ్ పేర కఠోర ప్రమాణాలు చేసి చెప్పింది వీళ్ళేనా?!” అని అంటారు. వీళ్ళ సత్కార్యాలన్నీ వృథా అయ్యాయి. ఆ విధంగా వీరు (ఘోరంగా) నష్టపోయారు.
5:54 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا مَن يَرْتَدَّ مِنكُمْ عَن دِينِهِ فَسَوْفَ يَأْتِي اللَّهُ بِقَوْمٍ يُحِبُّهُمْ وَيُحِبُّونَهُ أَذِلَّةٍ عَلَى الْمُؤْمِنِينَ أَعِزَّةٍ عَلَى الْكَافِرِينَ يُجَاهِدُونَ فِي سَبِيلِ اللَّهِ وَلَا يَخَافُونَ لَوْمَةَ لَائِمٍ ۚ ذَٰلِكَ فَضْلُ اللَّهِ يُؤْتِيهِ مَن يَشَاءُ ۚ وَاللَّهُ وَاسِعٌ عَلِيمٌ
ఓ విశ్వాసులారా! మీలో ఎవరయినాసరే తమ ధర్మం నుంచి తిరిగిపోతే (పోవచ్చు), అల్లాహ్ త్వరలోనే మరో జాతి వారిని తీసుకువస్తాడు. అల్లాహ్ వారిని ప్రేమిస్తాడు, వారు అల్లాహ్‌ను ప్రేమిస్తారు. వారు విశ్వాసుల పట్ల మృదు స్వభావులుగానూ, అవిశ్వాసుల పట్ల కఠినులుగానూ ఉంటారు. వారు అల్లాహ్ మార్గంలో పోరాడుతారు. నిందించేవారి నిందలను వారు ఏమాత్రం పట్టించుకోరు. ఇది అల్లాహ్ అనుగ్రహం. ఆయన తాను కోరిన వారికి దీన్ని ప్రసాదిస్తాడు. అల్లాహ్ విస్తృతి కలవాడు, జ్ఞాన సంపన్నుడు.
5:55 إِنَّمَا وَلِيُّكُمُ اللَّهُ وَرَسُولُهُ وَالَّذِينَ آمَنُوا الَّذِينَ يُقِيمُونَ الصَّلَاةَ وَيُؤْتُونَ الزَّكَاةَ وَهُمْ رَاكِعُونَ
(ముస్లిములారా!) వాస్తవానికి మీ స్నేహితులు అల్లాహ్, ఆయన ప్రవక్త, ఇంకా నమాజును నెలకొల్పే, జకాతును చెల్లించే, రుకూ చేసే (ఆరాధనలో అణకువను కలిగి ఉండే) విశ్వాసులు మాత్రమే.
5:56 وَمَن يَتَوَلَّ اللَّهَ وَرَسُولَهُ وَالَّذِينَ آمَنُوا فَإِنَّ حِزْبَ اللَّهِ هُمُ الْغَالِبُونَ
అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తను, విశ్వాసులను మిత్రులుగా చేసుకున్నవారు, అల్లాహ్ పక్షంవారే విజయం పొందుతారన్న విషయాన్ని తెలుసుకోవాలి.
5:57 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَتَّخِذُوا الَّذِينَ اتَّخَذُوا دِينَكُمْ هُزُوًا وَلَعِبًا مِّنَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ مِن قَبْلِكُمْ وَالْكُفَّارَ أَوْلِيَاءَ ۚ وَاتَّقُوا اللَّهَ إِن كُنتُم مُّؤْمِنِينَ
ఓ విశ్వాసులారా! మీకు పూర్వం గ్రంథం వొసగబడిన వారిలో మీ ధర్మాన్ని నవ్వులాటగా, వినోదంగా చేసుకున్న వారినిగానీ, అవిశ్వాసులనుగానీ మీ స్నేహితులుగా చేసుకోకండి. మీరే గనక నిజమయిన విశ్వాసులైతే అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి.
5:58 وَإِذَا نَادَيْتُمْ إِلَى الصَّلَاةِ اتَّخَذُوهَا هُزُوًا وَلَعِبًا ۚ ذَٰلِكَ بِأَنَّهُمْ قَوْمٌ لَّا يَعْقِلُونَ
మీరు నమాజు కోసం పిలిచినప్పుడు వారు దాన్ని నవ్వులాటగా, తమాషాగా చేసుకుంటారు. ఎందుకంటే వారు బొత్తిగా బుద్ధిలేనివారు.
5:59 قُلْ يَا أَهْلَ الْكِتَابِ هَلْ تَنقِمُونَ مِنَّا إِلَّا أَنْ آمَنَّا بِاللَّهِ وَمَا أُنزِلَ إِلَيْنَا وَمَا أُنزِلَ مِن قَبْلُ وَأَنَّ أَكْثَرَكُمْ فَاسِقُونَ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “ఓ గ్రంథవహులారా!(అంటే ఓ యూదులారా, క్రైస్తవులారా!) మేము అల్లాహ్‌ను, మావైపుకు అవతరింపజేయబడిన దానినీ, దానికి పూర్వం అవతరింపజేయబడిన దానిని విశ్వసిస్తున్నామన్న కారణంతో, ఇంకా మీలో అత్యధికులు అపమార్గాన ఉన్న కారణంతోనే కదా మీరు మాతో వైరవైఖరిని అవలంబిస్తున్నది?”
5:60 قُلْ هَلْ أُنَبِّئُكُم بِشَرٍّ مِّن ذَٰلِكَ مَثُوبَةً عِندَ اللَّهِ ۚ مَن لَّعَنَهُ اللَّهُ وَغَضِبَ عَلَيْهِ وَجَعَلَ مِنْهُمُ الْقِرَدَةَ وَالْخَنَازِيرَ وَعَبَدَ الطَّاغُوتَ ۚ أُولَٰئِكَ شَرٌّ مَّكَانًا وَأَضَلُّ عَن سَوَاءِ السَّبِيلِ
వారికి చెప్పు : “అల్లాహ్ వద్ద దీనికన్నా చెడు ప్రతిఫలం పొందేవారు ఎవరో నేను మీకు తెలుపనా? అల్లాహ్ శాపానికి గురైనవారు, ఆయన ఆగ్రహానికి పాత్రులైనవారు – వారిలో కొందరిని ఆయన కోతులుగా, పందులుగా చేశాడు – ఇంకా మిథ్యా దైవాలను పూజించినవారు. అత్యంత అథమశ్రేణికి చెందినవారు వీరే. రుజుమార్గం నుంచి బహుదూరం వెళ్ళి పోయినవారు కూడా వీరే.
5:61 وَإِذَا جَاءُوكُمْ قَالُوا آمَنَّا وَقَد دَّخَلُوا بِالْكُفْرِ وَهُمْ قَدْ خَرَجُوا بِهِ ۚ وَاللَّهُ أَعْلَمُ بِمَا كَانُوا يَكْتُمُونَ
వారు మీ వద్దకు వచ్చినప్పుడు, “మేము విశ్వసించాము” అని అంటారు. నిజానికి వారు అవిశ్వాసంతోనే వచ్చారు. మరి ఆ అవిశ్వాసంతోనే తిరిగి వెళ్ళిపోయారు. వారు దాచిపెట్టే దాన్ని అల్లాహ్ బాగా ఎరుగు.
5:62 وَتَرَىٰ كَثِيرًا مِّنْهُمْ يُسَارِعُونَ فِي الْإِثْمِ وَالْعُدْوَانِ وَأَكْلِهِمُ السُّحْتَ ۚ لَبِئْسَ مَا كَانُوا يَعْمَلُونَ
వారిలో చాలామందిని నీవు చూస్తావు, వారు పాపకార్యాల వైపుకు, దౌర్జన్యం వైపుకు, అధర్మమయిన సొమ్మును స్వాహా చేయటం వైపుకు ఎగబడుతూ ఉంటారు. వారు చేసే ఈ చేష్టలన్నీ పరమ చెడ్డవి.
5:63 لَوْلَا يَنْهَاهُمُ الرَّبَّانِيُّونَ وَالْأَحْبَارُ عَن قَوْلِهِمُ الْإِثْمَ وَأَكْلِهِمُ السُّحْتَ ۚ لَبِئْسَ مَا كَانُوا يَصْنَعُونَ
వారు ఇలాంటి పాపిష్టిమాటలు చెప్పకుండా, అధర్మమైన సొమ్మును తినకుండా వారి మతాచార్యులు, పండితులు వారిని ఎందుకు ఆపరు? వారు చేస్తున్నది చాలా చెడ్డ పని.
5:64 وَقَالَتِ الْيَهُودُ يَدُ اللَّهِ مَغْلُولَةٌ ۚ غُلَّتْ أَيْدِيهِمْ وَلُعِنُوا بِمَا قَالُوا ۘ بَلْ يَدَاهُ مَبْسُوطَتَانِ يُنفِقُ كَيْفَ يَشَاءُ ۚ وَلَيَزِيدَنَّ كَثِيرًا مِّنْهُم مَّا أُنزِلَ إِلَيْكَ مِن رَّبِّكَ طُغْيَانًا وَكُفْرًا ۚ وَأَلْقَيْنَا بَيْنَهُمُ الْعَدَاوَةَ وَالْبَغْضَاءَ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ ۚ كُلَّمَا أَوْقَدُوا نَارًا لِّلْحَرْبِ أَطْفَأَهَا اللَّهُ ۚ وَيَسْعَوْنَ فِي الْأَرْضِ فَسَادًا ۚ وَاللَّهُ لَا يُحِبُّ الْمُفْسِدِينَ
“అల్లాహ్ చేతులు కట్టివేయబడి ఉన్నాయి” అని యూదులు అన్నారు. నిజానికి వారి చేతులే కట్టివేయబడ్డాయి. వారు అన్న ఈ మాట మూలంగా వారిని శపించటం జరిగింది. నిజానికి అల్లాహ్ చేతులు రెండూ విశాలంగా ఉన్నాయి. తాను తలచుకున్న విధంగా ఆయన ఖర్చుపెడుతున్నాడు. నీపైన నీ ప్రభువు తరఫు నుంచి అవతరించిన సందేశం వారిలోని చాలా మందిలో తలబిరుసుతనాన్ని, తిరస్కారభావాన్నే వృద్ధి చేస్తుంది. ఇంకా, మేము వారి మధ్య ప్రళయదినం వరకూ విరోధం, విద్వేషం ఉండేలా చేశాము. వారు యుద్ధాగ్నిని రాజేసినప్పుడల్లా, అల్లాహ్ దాన్ని ఆర్పివేస్తాడు. వారు భూమిలో కల్లోలాన్ని రేకెత్తిస్తూ తిరుగుతుంటారు. కాగా; అల్లాహ్ కల్లోల జనకులను ఎంతమాత్రం ప్రేమించడు.
5:65 وَلَوْ أَنَّ أَهْلَ الْكِتَابِ آمَنُوا وَاتَّقَوْا لَكَفَّرْنَا عَنْهُمْ سَيِّئَاتِهِمْ وَلَأَدْخَلْنَاهُمْ جَنَّاتِ النَّعِيمِ
ఒకవేళ ఈ గ్రంథవహులే గనక విశ్వసించి, భయభక్తులతో కూడుకున్న (తఖ్వా) విధానాన్ని అవలంబించినట్లయితే, మేము వారి పాపాలన్నింటినీ వారి నుంచి దూరంచేసి, సుఖ సౌఖ్యాలతో కూడుకున్న స్వర్గవనాలలో వారికి తప్పకుండా ప్రవేశం కల్పించేవారము.
5:66 وَلَوْ أَنَّهُمْ أَقَامُوا التَّوْرَاةَ وَالْإِنجِيلَ وَمَا أُنزِلَ إِلَيْهِم مِّن رَّبِّهِمْ لَأَكَلُوا مِن فَوْقِهِمْ وَمِن تَحْتِ أَرْجُلِهِم ۚ مِّنْهُمْ أُمَّةٌ مُّقْتَصِدَةٌ ۖ وَكَثِيرٌ مِّنْهُمْ سَاءَ مَا يَعْمَلُونَ
వారు గనక తౌరాతుకూ, ఇంజీలుకూ, తమ ప్రభువు తరఫున తమ వద్దకు పంపబడిన దానికి కట్టుబడి ఉంటే వారు తమపై నుంచీ, క్రింది నుంచీ పుష్కలంగా ఉపాధిని పొందుతూ, హాయిగా తినేవారు. వారిలో ఒక వర్గం మాత్రం మధ్యేమార్గం అవలంబిస్తుంది. కాని వారిలోని అత్యధికులు చేసే పనులు చాలా చెడ్డవి.
5:67 يَا أَيُّهَا الرَّسُولُ بَلِّغْ مَا أُنزِلَ إِلَيْكَ مِن رَّبِّكَ ۖ وَإِن لَّمْ تَفْعَلْ فَمَا بَلَّغْتَ رِسَالَتَهُ ۚ وَاللَّهُ يَعْصِمُكَ مِنَ النَّاسِ ۗ إِنَّ اللَّهَ لَا يَهْدِي الْقَوْمَ الْكَافِرِينَ
ఓ ప్రవక్తా! నీ ప్రభువు తరఫు నుంచి నీపై అవతరింపజేయబడిన దానిని (ప్రజలకు) అందజెయ్యి. ఒకవేళ నువ్వు గనక ఈ పని చెయ్యకపోతే, దైవప్రవక్తగా నీవు నీ ధర్మాన్ని నిర్వర్తించని వాడవవుతావు. అల్లాహ్ నిన్ను ప్రజల (కీడు) నుంచి కాపాడుతాడు. నిశ్చయంగా అల్లాహ్ తిరస్కారులకు సన్మార్గం చూపడు.
5:68 قُلْ يَا أَهْلَ الْكِتَابِ لَسْتُمْ عَلَىٰ شَيْءٍ حَتَّىٰ تُقِيمُوا التَّوْرَاةَ وَالْإِنجِيلَ وَمَا أُنزِلَ إِلَيْكُم مِّن رَّبِّكُمْ ۗ وَلَيَزِيدَنَّ كَثِيرًا مِّنْهُم مَّا أُنزِلَ إِلَيْكَ مِن رَّبِّكَ طُغْيَانًا وَكُفْرًا ۖ فَلَا تَأْسَ عَلَى الْقَوْمِ الْكَافِرِينَ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “ఓ గ్రంథవహులారా! మీరు తౌరాతునూ, ఇంజీలునూ, మీ ప్రభువు తరఫున మీ వద్దకు పంపబడిన దానినీ (మీ జీవితాలలో) నెలకొల్పనంతవరకూ మీరు ఏ ధర్మంపైనా లేనట్లే.” నీ ప్రభువు తరఫున నీపై అవతరింపజేయబడినది వారిలోని అనేకుల తలబిరుసుతనాన్ని, తిరస్కార వైఖరిని మరింత అధికం చేస్తుంది. కనుక నీవు ఈ తిరస్కారులపై దిగులు చెందకు.
5:69 إِنَّ الَّذِينَ آمَنُوا وَالَّذِينَ هَادُوا وَالصَّابِئُونَ وَالنَّصَارَىٰ مَنْ آمَنَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ وَعَمِلَ صَالِحًا فَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ
ముస్లిములైనా, యూదులైనా, సాబియీలైనా, నసారా (క్రైస్తవులు) అయినా- ఎవరయినా సరే- వారు గనక అల్లాహ్‌ను, అంతిమ దినాన్ని విశ్వసించి, సదాచరణ చేసినట్లయితే వారికెలాంటి భయంగానీ, చింతగానీ ఉండబోదు.
5:70 لَقَدْ أَخَذْنَا مِيثَاقَ بَنِي إِسْرَائِيلَ وَأَرْسَلْنَا إِلَيْهِمْ رُسُلًا ۖ كُلَّمَا جَاءَهُمْ رَسُولٌ بِمَا لَا تَهْوَىٰ أَنفُسُهُمْ فَرِيقًا كَذَّبُوا وَفَرِيقًا يَقْتُلُونَ
మేము ఇస్రాయీలు సంతతి వారి నుండి గట్టి వాగ్దానం తీసుకున్నాము. వారి వద్దకు ప్రవక్తలను పంపాము. కాని వారి మనోభీష్టానికి విరుద్ధమైన ఆదేశాలను ప్రవక్తలు వారి వద్దకు తీసుకువచ్చినప్పుడల్లా వారు ప్రవక్తలలో కొందరిని ధిక్కరించారు, మరికొందరిని హత్య చేస్తూ ఉన్నారు.
5:71 وَحَسِبُوا أَلَّا تَكُونَ فِتْنَةٌ فَعَمُوا وَصَمُّوا ثُمَّ تَابَ اللَّهُ عَلَيْهِمْ ثُمَّ عَمُوا وَصَمُّوا كَثِيرٌ مِّنْهُمْ ۚ وَاللَّهُ بَصِيرٌ بِمَا يَعْمَلُونَ
తమకు ఏ ఉపద్రవమూ సంభవించదని వారు తలపోశారు. ఈ కారణంగా వారు గుడ్డివారుగా, చెవిటివారుగా ప్రవర్తించారు. అయితే ఆ తరువాత అల్లాహ్ వారి పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు. కాని ఆ తరువాత కూడా వారిలో చాలామంది అంధులు, బధిరులు అయిపోయారు. అల్లాహ్ వారి చేష్టలన్నింటినీ చూస్తూనే ఉన్నాడు.
5:72 لَقَدْ كَفَرَ الَّذِينَ قَالُوا إِنَّ اللَّهَ هُوَ الْمَسِيحُ ابْنُ مَرْيَمَ ۖ وَقَالَ الْمَسِيحُ يَا بَنِي إِسْرَائِيلَ اعْبُدُوا اللَّهَ رَبِّي وَرَبَّكُمْ ۖ إِنَّهُ مَن يُشْرِكْ بِاللَّهِ فَقَدْ حَرَّمَ اللَّهُ عَلَيْهِ الْجَنَّةَ وَمَأْوَاهُ النَّارُ ۖ وَمَا لِلظَّالِمِينَ مِنْ أَنصَارٍ
“అల్లాహ్ (అంటే) మర్యమ్ కుమారుడగు మసీహ్యే” అని చెప్పినవారు నిస్సందేహంగా అవిశ్వాసానికి పాల్పడినట్లే. యదార్థానికి మసీహ్ ఖుద్దుగా వారితో ఇలా పలికాడు : “ఓ ఇస్రాయీలు వంశస్థులారా! నాకూ, మీకూ ప్రభువైన అల్లాహ్‌ను మాత్రమే పూజించండి.” ఎవడు అల్లాహ్‌కు సహవర్తులుగా ఇతరులను కల్పించాడో అలాంటి వానికోసం అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించాడని తెలుసుకోండి. అతని నివాసం నరకాగ్ని. దుర్మార్గులకు సహాయపడే వాడెవడూ ఉండడు.
5:73 لَّقَدْ كَفَرَ الَّذِينَ قَالُوا إِنَّ اللَّهَ ثَالِثُ ثَلَاثَةٍ ۘ وَمَا مِنْ إِلَٰهٍ إِلَّا إِلَٰهٌ وَاحِدٌ ۚ وَإِن لَّمْ يَنتَهُوا عَمَّا يَقُولُونَ لَيَمَسَّنَّ الَّذِينَ كَفَرُوا مِنْهُمْ عَذَابٌ أَلِيمٌ
“అల్లాహ్ ముగ్గురిలో మూడవవాడు” అని అన్నవారు కూడా ముమ్మాటికీ తిరస్కారానికి (కుఫ్ర్కు) పాల్పడినట్లే. వాస్తవానికి ఒక్కడైన అల్లాహ్ తప్ప మరో ఆరాధ్య దైవం లేనేలేడు. ఒకవేళ వారు గనక తమ ఈ మాటలను మానుకోకపోతే, వారిలో తిరస్కారవైఖరిపై ఉండే వారికి బాధాకరమైన శిక్ష తప్పకుండా అంటుకుంటుంది.
5:74 أَفَلَا يَتُوبُونَ إِلَى اللَّهِ وَيَسْتَغْفِرُونَهُ ۚ وَاللَّهُ غَفُورٌ رَّحِيمٌ
వారు అల్లాహ్ వైపునకు మరలరా? క్షమాపణ కోసం ఆయన్ని వేడుకోరా? అల్లాహ్ అపారంగా క్షమించేవాడు, అమితంగా కరుణించేవాడు కూడా.
5:75 مَّا الْمَسِيحُ ابْنُ مَرْيَمَ إِلَّا رَسُولٌ قَدْ خَلَتْ مِن قَبْلِهِ الرُّسُلُ وَأُمُّهُ صِدِّيقَةٌ ۖ كَانَا يَأْكُلَانِ الطَّعَامَ ۗ انظُرْ كَيْفَ نُبَيِّنُ لَهُمُ الْآيَاتِ ثُمَّ انظُرْ أَنَّىٰ يُؤْفَكُونَ
మర్యమ్ కుమారుడైన మసీహ్ ఒక ప్రవక్త తప్ప మరేమీ కాడు. ఆయనకు మునుపు కూడా ఎంతోమంది ప్రవక్తలు గతించారు. ఆయన తల్లి సద్వర్తనురాలు. ఆ తల్లీ కొడుకులిరువురూ అన్నం తినేవారే. చూడు, మేము వారి ముందు ఏ విధంగా నిదర్శనాలను విశదీకరిస్తున్నామో! అయినా వారు ఎలా తిరిగి పోతున్నారో చూడు!
5:76 قُلْ أَتَعْبُدُونَ مِن دُونِ اللَّهِ مَا لَا يَمْلِكُ لَكُمْ ضَرًّا وَلَا نَفْعًا ۚ وَاللَّهُ هُوَ السَّمِيعُ الْعَلِيمُ
వారితో ఇలా చెప్పు : ఏమిటీ, మీరు అల్లాహ్‌ను కాదని మీకు నష్టంగానీ, లాభంగానీ చేకూర్చే అధికారంలేని వారిని ఆరాధిస్తున్నారా? అల్లాహ్ మాత్రమే అన్నీ వినేవాడు, సర్వమూ తెలిసినవాడు.
5:77 قُلْ يَا أَهْلَ الْكِتَابِ لَا تَغْلُوا فِي دِينِكُمْ غَيْرَ الْحَقِّ وَلَا تَتَّبِعُوا أَهْوَاءَ قَوْمٍ قَدْ ضَلُّوا مِن قَبْلُ وَأَضَلُّوا كَثِيرًا وَضَلُّوا عَن سَوَاءِ السَّبِيلِ
ఇలా చెప్పేయి : “ఓ గ్రంథవహులారా! మీరు మీ ధర్మంలో అన్యాయంగా హద్దులు మీరకండి. పూర్వం తాము మార్గం నుంచి తప్పడమేగాక, ఎంతో మందిని మార్గం నుంచి తప్పించి రుజుమార్గ భ్రష్టులైనవారి మనోవాంఛలను అనుసరించకండి.”
5:78 لُعِنَ الَّذِينَ كَفَرُوا مِن بَنِي إِسْرَائِيلَ عَلَىٰ لِسَانِ دَاوُودَ وَعِيسَى ابْنِ مَرْيَمَ ۚ ذَٰلِكَ بِمَا عَصَوا وَّكَانُوا يَعْتَدُونَ
ఇస్రాయీలు సంతతిలోని అవిశ్వాసులు దావూదు నోట, మర్యమ్ పుత్రుడైన ఈసా నోట శపించబడ్డారు. ఎందుకంటే వారు అవిధేయతకు పాల్పడేవారు. హద్దుమీరి ప్రవర్తించేవారు.
5:79 كَانُوا لَا يَتَنَاهَوْنَ عَن مُّنكَرٍ فَعَلُوهُ ۚ لَبِئْسَ مَا كَانُوا يَفْعَلُونَ
వారు, తాము చేసే చెడు పనుల నుండి ఒండొకరిని నిరోధించేవారు కారు. వారు చేస్తూ ఉండినది బహుచెడ్డది.
5:80 تَرَىٰ كَثِيرًا مِّنْهُمْ يَتَوَلَّوْنَ الَّذِينَ كَفَرُوا ۚ لَبِئْسَ مَا قَدَّمَتْ لَهُمْ أَنفُسُهُمْ أَن سَخِطَ اللَّهُ عَلَيْهِمْ وَفِي الْعَذَابِ هُمْ خَالِدُونَ
వారిలో చాలామందిని నీవు చూస్తావు, వారు అవిశ్వాసులతో స్నేహసంబంధాలు పెట్టుకుంటారు. వారు తమ స్వయం కోసం ఏదయితే ముందుకు పంపుకున్నారో అది చాలా చెడ్డది. అందుకే అల్లాహ్ వారిపట్ల అప్రసన్నుడయ్యాడు. వారు కలకాలం శిక్షలో పడి ఉంటారు.
5:81 وَلَوْ كَانُوا يُؤْمِنُونَ بِاللَّهِ وَالنَّبِيِّ وَمَا أُنزِلَ إِلَيْهِ مَا اتَّخَذُوهُمْ أَوْلِيَاءَ وَلَٰكِنَّ كَثِيرًا مِّنْهُمْ فَاسِقُونَ
వారికి అల్లాహ్ పట్ల, ప్రవక్త పట్ల, ప్రవక్తపై అవతరింపజేయబడిన దానిపట్ల విశ్వాసమే గనక ఉంటే వారు అవిశ్వాసులను స్నేహితులుగా చేసుకునేవారే కాదు. కాని వారిలో చాలా మంది దైవవిధేయతకు దూరమైపోయారు.
5:82 لَتَجِدَنَّ أَشَدَّ النَّاسِ عَدَاوَةً لِّلَّذِينَ آمَنُوا الْيَهُودَ وَالَّذِينَ أَشْرَكُوا ۖ وَلَتَجِدَنَّ أَقْرَبَهُم مَّوَدَّةً لِّلَّذِينَ آمَنُوا الَّذِينَ قَالُوا إِنَّا نَصَارَىٰ ۚ ذَٰلِكَ بِأَنَّ مِنْهُمْ قِسِّيسِينَ وَرُهْبَانًا وَأَنَّهُمْ لَا يَسْتَكْبِرُونَ
విశ్వాసుల పట్ల శత్రుత్వంలో అందరికన్నా ఎక్కువగా కరడు గట్టినవారు యూదులు మరియు ముష్రిక్కులని నీవు తెలుసుకుంటావు. ఇక విశ్వాసులతో స్నేహం విషయానికి వస్తే “మేము సహాయకులం (నసారా లేక క్రైస్తవులం)” అని చెప్పుకునే వారిని నీవు ఎక్కువ సన్నిహితులుగా చూస్తావు. ఎందుకంటే వారిలో పండితులు, భవబంధాలకు దూరంగా ఉండే మతాచార్యులు ఉన్నారు. ఇంకో విషయం ఏమిటంటే వారు అహంకారం చూపరు.
5:83 وَإِذَا سَمِعُوا مَا أُنزِلَ إِلَى الرَّسُولِ تَرَىٰ أَعْيُنَهُمْ تَفِيضُ مِنَ الدَّمْعِ مِمَّا عَرَفُوا مِنَ الْحَقِّ ۖ يَقُولُونَ رَبَّنَا آمَنَّا فَاكْتُبْنَا مَعَ الشَّاهِدِينَ
ప్రవక్తపై అవతరించిన దానిని వారు విన్నప్పుడు, సత్యాన్ని గ్రహించిన కారణంగా వారి కళ్ళ నుంచి కన్నీరు ప్రవహించటం నీవు గమనిస్తావు. వారిలా అంటారు: “మా ప్రభూ! మేము విశ్వసించాము. కాబట్టి మా పేర్లను కూడా ధృవీకరించేవారితో పాటు వ్రాసుకో.
5:84 وَمَا لَنَا لَا نُؤْمِنُ بِاللَّهِ وَمَا جَاءَنَا مِنَ الْحَقِّ وَنَطْمَعُ أَن يُدْخِلَنَا رَبُّنَا مَعَ الْقَوْمِ الصَّالِحِينَ
“మేము అల్లాహ్‌ను, మా వద్దకు వచ్చిన సత్యాన్ని విశ్వసించకుండా ఉండటానికి ఇక మా వద్ద మిగిలిన సాకు ఏముంది? మా ప్రభువు మమ్మల్ని సజ్జనుల సహచర్యంలో చేరుస్తాడన్న ఆశ మాకుంది.”
5:85 فَأَثَابَهُمُ اللَّهُ بِمَا قَالُوا جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا ۚ وَذَٰلِكَ جَزَاءُ الْمُحْسِنِينَ
వారు ఈ విధంగా పలికినందుకుగాను అల్లాహ్ వారికి క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలను ప్రసాదిస్తాడు. వారందులో కలకాలం ఉంటారు. సజ్జనులకు ఇలాంటి ప్రతిఫలమే లభిస్తుంది.
5:86 وَالَّذِينَ كَفَرُوا وَكَذَّبُوا بِآيَاتِنَا أُولَٰئِكَ أَصْحَابُ الْجَحِيمِ
ఇకపోతే తిరస్కార వైఖరికి పాల్పడి, మా ఆయతులను ధిక్కరించేవారు – వారే నరకవాసులు.
5:87 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تُحَرِّمُوا طَيِّبَاتِ مَا أَحَلَّ اللَّهُ لَكُمْ وَلَا تَعْتَدُوا ۚ إِنَّ اللَّهَ لَا يُحِبُّ الْمُعْتَدِينَ
విశ్వసించిన ఓ ప్రజలారా! అల్లాహ్ మీ కోసం ధర్మసమ్మతం (హలాల్) చేసిన పవిత్రమైన వస్తువులను మీ అంతట మీరుగా నిషేధించుకోకండి. మితిమీరి పోకండి. నిశ్చయంగా అల్లాహ్ మితిమీరి పోయేవారిని ఇష్టపడడు.
5:88 وَكُلُوا مِمَّا رَزَقَكُمُ اللَّهُ حَلَالًا طَيِّبًا ۚ وَاتَّقُوا اللَّهَ الَّذِي أَنتُم بِهِ مُؤْمِنُونَ
అల్లాహ్ మీకు ప్రసాదించిన వాటిలో నుంచి ధర్మసమ్మతమైన, పరిశుద్ధమైన పదార్థాలను భుజించండి. మీరు విశ్వసించే అల్లాహ్‌కు భయపడండి.
5:89 لَا يُؤَاخِذُكُمُ اللَّهُ بِاللَّغْوِ فِي أَيْمَانِكُمْ وَلَٰكِن يُؤَاخِذُكُم بِمَا عَقَّدتُّمُ الْأَيْمَانَ ۖ فَكَفَّارَتُهُ إِطْعَامُ عَشَرَةِ مَسَاكِينَ مِنْ أَوْسَطِ مَا تُطْعِمُونَ أَهْلِيكُمْ أَوْ كِسْوَتُهُمْ أَوْ تَحْرِيرُ رَقَبَةٍ ۖ فَمَن لَّمْ يَجِدْ فَصِيَامُ ثَلَاثَةِ أَيَّامٍ ۚ ذَٰلِكَ كَفَّارَةُ أَيْمَانِكُمْ إِذَا حَلَفْتُمْ ۚ وَاحْفَظُوا أَيْمَانَكُمْ ۚ كَذَٰلِكَ يُبَيِّنُ اللَّهُ لَكُمْ آيَاتِهِ لَعَلَّكُمْ تَشْكُرُونَ
మీరు చేసే అర్థంలేని ప్రమాణాలను గురించి అల్లాహ్ మిమ్మల్ని నిలదీయడు. అయితే మీరు పటిష్టపరచిన ప్రమాణాలను గురించి ఆయన మిమ్మల్ని తప్పకుండా నిలదీస్తాడు. (అటువంటి ప్రమాణభంగానికి మీరు చెల్లించవలసిన) పరిహారం ఏమిటంటే, మీరు మీ ఇంటి వారికి పెట్టే మధ్యరకపు అన్నం పది మంది పేదలకు తినిపించాలి లేదా వారికి బట్టలుపెట్టాలి లేదా ఒక బానిసకో, బానిసరాలికో స్వేచ్ఛనొసగాలి. ఇవేవీ చేయలేనివారు మూడు రోజులపాటు ఉపవాసం పాటించాలి – మీరు ప్రమాణాలు చేసినప్పుడు (వాటిని భంగపరచినందుకు గాను ఇచ్చే) ప్రమాణాల పరిహారం ఇది. అందుకే మీరు ప్రమాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ విధంగా మీరు కృతజ్ఞతాపూర్వకంగా మసలుకునేందుకుగాను అల్లాహ్ మీకోసం తన ఆదేశాలను తేటతెల్లం చేస్తున్నాడు.
5:90 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِنَّمَا الْخَمْرُ وَالْمَيْسِرُ وَالْأَنصَابُ وَالْأَزْلَامُ رِجْسٌ مِّنْ عَمَلِ الشَّيْطَانِ فَاجْتَنِبُوهُ لَعَلَّكُمْ تُفْلِحُونَ
ఓ విశ్వసించిన వారలారా! సారాయి, జూదం, బలిపీఠాలు, జోస్యం కోసం వాడే బాణాలు- ఇవన్నీ పరమ జుగుప్సాకరమైన విషయాలు, షైతాన్ చేష్టలు. కాబట్టి వాటికి దూరంగా ఉండండి. మీరలా చేస్తే సాఫల్యం పొందవచ్చు.
5:91 إِنَّمَا يُرِيدُ الشَّيْطَانُ أَن يُوقِعَ بَيْنَكُمُ الْعَدَاوَةَ وَالْبَغْضَاءَ فِي الْخَمْرِ وَالْمَيْسِرِ وَيَصُدَّكُمْ عَن ذِكْرِ اللَّهِ وَعَنِ الصَّلَاةِ ۖ فَهَلْ أَنتُم مُّنتَهُونَ
సారాయి, జూదాల ద్వారా మీ మధ్య విరోధాన్ని, ద్వేషాన్ని సృజించాలనీ, అల్లాహ్ స్మరణ నుంచీ, నమాజు నుంచీ మిమ్మల్ని దూరంగా ఉంచాలని షైతాను కోరుకుంటున్నాడు. కనుక ఇకనయినా వాటిని మానుకోండి.
5:92 وَأَطِيعُوا اللَّهَ وَأَطِيعُوا الرَّسُولَ وَاحْذَرُوا ۚ فَإِن تَوَلَّيْتُمْ فَاعْلَمُوا أَنَّمَا عَلَىٰ رَسُولِنَا الْبَلَاغُ الْمُبِينُ
అల్లాహ్‌కు విధేయత చూపండి. ఆయన ప్రవక్తకు విధేయత చూపండి. (చెడుల పట్ల) కడు జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీరు గనక విముఖత చూపితే, మా ప్రవక్తపై ఉన్న బాధ్యతల్లా స్పష్టంగా విషయాన్ని అందజేయటం వరకేనని తెలుసుకోండి.
5:93 لَيْسَ عَلَى الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ جُنَاحٌ فِيمَا طَعِمُوا إِذَا مَا اتَّقَوا وَّآمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ ثُمَّ اتَّقَوا وَّآمَنُوا ثُمَّ اتَّقَوا وَّأَحْسَنُوا ۗ وَاللَّهُ يُحِبُّ الْمُحْسِنِينَ
విశ్వసించి, సత్కార్యాలు చేసేవారు (ఇంతకు మునుపు) తిన్నదానికి, తాగినదానికి వారిపై ఎటువంటి పాపం ఉండదు. కాకపోతే వారు ఇక మీదట భయభక్తులతో మెలగాలి, విశ్వసించి మంచిపనులు చెయ్యాలి. మళ్లీ భయభక్తుల వైఖరిని అవలంబించాలి, విశ్వసించాలి. మళ్ళీ అల్లాహ్‌కు భయపడుతూ సద్వర్తనులుగా మసలుకోవాలి. ఇటువంటి సద్వర్తనులనే అల్లాహ్ ప్రేమిస్తాడు.
5:94 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَيَبْلُوَنَّكُمُ اللَّهُ بِشَيْءٍ مِّنَ الصَّيْدِ تَنَالُهُ أَيْدِيكُمْ وَرِمَاحُكُمْ لِيَعْلَمَ اللَّهُ مَن يَخَافُهُ بِالْغَيْبِ ۚ فَمَنِ اعْتَدَىٰ بَعْدَ ذَٰلِكَ فَلَهُ عَذَابٌ أَلِيمٌ
విశ్వాసులారా! మీ చేతులకూ, మీ ఈటెలకూ అందుబాటులో ఉన్న కొన్ని వేట జంతువుల ద్వారా అల్లాహ్ మిమ్మల్ని పరీక్షిస్తాడు, తనను చూడకుండానే తనకు భయపడేవారెవరో తెలుసుకోవాలని. దీని తరువాత కూడా హద్దు మీరి ప్రవర్తించే వారికి వ్యధాభరితమైన శిక్ష ఉంటుంది.
5:95 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَقْتُلُوا الصَّيْدَ وَأَنتُمْ حُرُمٌ ۚ وَمَن قَتَلَهُ مِنكُم مُّتَعَمِّدًا فَجَزَاءٌ مِّثْلُ مَا قَتَلَ مِنَ النَّعَمِ يَحْكُمُ بِهِ ذَوَا عَدْلٍ مِّنكُمْ هَدْيًا بَالِغَ الْكَعْبَةِ أَوْ كَفَّارَةٌ طَعَامُ مَسَاكِينَ أَوْ عَدْلُ ذَٰلِكَ صِيَامًا لِّيَذُوقَ وَبَالَ أَمْرِهِ ۗ عَفَا اللَّهُ عَمَّا سَلَفَ ۚ وَمَنْ عَادَ فَيَنتَقِمُ اللَّهُ مِنْهُ ۗ وَاللَّهُ عَزِيزٌ ذُو انتِقَامٍ
ఓ విశ్వాసులారా! మీరు ఇహ్రాము స్థితిలో ఉన్నప్పుడు వేట జంతువులను చంపకండి. మీలో ఎవరైనా ఉద్దేశ్యపూర్వకంగా దానిని చంపినట్లయితే అతడు తాను చంపిన జంతువుకు సమానమైన జంతువును పరిహారంగా చెల్లించటం అవశ్యం. దానిని మీలోని ఇరువురు న్యాయశీలురు నిర్ణయించాలి. పరిహారంగా యివ్వబడే జంతువును ఖుర్బానీ నిమిత్తం కాబా వద్దకు చేర్చాలి. లేదా ఆ పాపానికి పరిహారంగా కొంతమంది పేదలకు అన్నం పెట్టాలి. లేదా దానికి సమానంగా ఉపవాసం పాటించాలి. తాను పాల్పడిన చేష్టకు ఫలితాన్ని చవిచూసేందుకు (ఈ విధంగా నిర్థారించబడింది). గతంలో జరిగిన దాన్ని అల్లాహ్ మన్నించాడు. ఇకమీదట కూడా ఎవరయినా అలా చేస్తే అల్లాహ్ ప్రతీకారం చేస్తాడు. అల్లాహ్ సర్వాధిక్యుడు, ప్రతీకారం చేసేవాడూను.
5:96 أُحِلَّ لَكُمْ صَيْدُ الْبَحْرِ وَطَعَامُهُ مَتَاعًا لَّكُمْ وَلِلسَّيَّارَةِ ۖ وَحُرِّمَ عَلَيْكُمْ صَيْدُ الْبَرِّ مَا دُمْتُمْ حُرُمًا ۗ وَاتَّقُوا اللَّهَ الَّذِي إِلَيْهِ تُحْشَرُونَ
సముద్రపు జంతువులను వేటాడటం, దాని ఆహారం మీకొరకు ధర్మసమ్మతం గావించబడింది. మీ ప్రయోజనం కోసం, ప్రయాణీకుల కోసం కూడా. అయితే మీరు ఇహ్రాము స్థితిలో ఉన్నంతవరకూ భూమిపై వేటాడటం నిషేధించబడింది. అల్లాహ్‌కు భయపడండి. ఆయన వద్దకే మీరంతా సమీకరించబడతారు.
5:97 جَعَلَ اللَّهُ الْكَعْبَةَ الْبَيْتَ الْحَرَامَ قِيَامًا لِّلنَّاسِ وَالشَّهْرَ الْحَرَامَ وَالْهَدْيَ وَالْقَلَائِدَ ۚ ذَٰلِكَ لِتَعْلَمُوا أَنَّ اللَّهَ يَعْلَمُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ وَأَنَّ اللَّهَ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ
గౌరవప్రద గృహమైన ‘కాబా’ను అల్లాహ్ మానవ మనుగడ సాధనంగా చేశాడు. ఇంకా నిషిద్ధ మాసాన్నీ, హదీ పశువును (హరమ్ క్షేత్రంలో ఖుర్బానీ ఇవ్వబడే జంతువులను), మెడలలో పట్టాలు వేసిన జంతువులను కూడా. ఆకాశాలలో, భూమిలో ఉన్న సమస్త వస్తువుల గురించి అల్లాహ్‌కు తెలుసనీ, ఆయన ప్రతిదీ క్షుణ్ణంగా ఎరిగినవాడన్న సంగతి మీకు తెలియడానికిగాను ఆయన ఇలా చేశాడు.
5:98 اعْلَمُوا أَنَّ اللَّهَ شَدِيدُ الْعِقَابِ وَأَنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ
తెలుసుకోండి! అల్లాహ్ శిక్షించటంలో కఠినుడు. దాంతో పాటు అల్లాహ్ అపారంగా క్షమించేవాడు, కనికరించేవాడు కూడా.
5:99 مَّا عَلَى الرَّسُولِ إِلَّا الْبَلَاغُ ۗ وَاللَّهُ يَعْلَمُ مَا تُبْدُونَ وَمَا تَكْتُمُونَ
సందేశాన్ని అందజేయటం వరకే ప్రవక్త బాధ్యత. మీరు వెల్లడించేదీ, దాచి పెట్టేదీ – అంతా అల్లాహ్‌కు తెలుసు.
5:100 قُل لَّا يَسْتَوِي الْخَبِيثُ وَالطَّيِّبُ وَلَوْ أَعْجَبَكَ كَثْرَةُ الْخَبِيثِ ۚ فَاتَّقُوا اللَّهَ يَا أُولِي الْأَلْبَابِ لَعَلَّكُمْ تُفْلِحُونَ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: అపవిత్రత యొక్క ఆధిక్యత నీకు ఎంత బాగా తోచినప్పటికీ అపవిత్రము – పవిత్రము ఎన్నటికీ సమానం కాలేవు. కనుక ఓ వివేకవంతులారా! అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి, తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు.
5:101 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَسْأَلُوا عَنْ أَشْيَاءَ إِن تُبْدَ لَكُمْ تَسُؤْكُمْ وَإِن تَسْأَلُوا عَنْهَا حِينَ يُنَزَّلُ الْقُرْآنُ تُبْدَ لَكُمْ عَفَا اللَّهُ عَنْهَا ۗ وَاللَّهُ غَفُورٌ حَلِيمٌ
ఓ విశ్వాసులారా! మీకు గనక విడమరచి చెబితే మీకు బాధ కలిగించేటటువంటి విషయాలను గురించి అడగకండి. అయితే ఖుర్ఆన్ అవతరించే సమయంలో మీరు వాటిని గురించి ప్రశ్నిస్తే అవి మీకు విడమరచి చెప్పబడతాయి. ఇంత వరకు వేసిన ప్రశ్నలను అల్లాహ్ మన్నించాడు. అల్లాహ్ అమితంగా క్షమించేవాడు, సహనశీలుడు కూడా.
5:102 قَدْ سَأَلَهَا قَوْمٌ مِّن قَبْلِكُمْ ثُمَّ أَصْبَحُوا بِهَا كَافِرِينَ
మీ పూర్వీకుల్లో కూడా కొందరు ఇలాంటి విషయాలను అడిగారు. మరి ఆ విషయాలను తిరస్కరించింది కూడా వారే.
5:103 مَا جَعَلَ اللَّهُ مِن بَحِيرَةٍ وَلَا سَائِبَةٍ وَلَا وَصِيلَةٍ وَلَا حَامٍ ۙ وَلَٰكِنَّ الَّذِينَ كَفَرُوا يَفْتَرُونَ عَلَى اللَّهِ الْكَذِبَ ۖ وَأَكْثَرُهُمْ لَا يَعْقِلُونَ
అల్లాహ్ ‘బహీరా’ను గానీ, ‘సాయిబా’ను గానీ, ‘వసీలా’ను గానీ, ‘హామ్’ను గానీ ఏర్పరచలేదు. అయినప్పటికీ అవిశ్వాసులు అల్లాహ్‌కు అబద్ధాన్ని అంటగడుతున్నారు. వారిలో చాలా మంది అవివేకులు.
5:104 وَإِذَا قِيلَ لَهُمْ تَعَالَوْا إِلَىٰ مَا أَنزَلَ اللَّهُ وَإِلَى الرَّسُولِ قَالُوا حَسْبُنَا مَا وَجَدْنَا عَلَيْهِ آبَاءَنَا ۚ أَوَلَوْ كَانَ آبَاؤُهُمْ لَا يَعْلَمُونَ شَيْئًا وَلَا يَهْتَدُونَ
“అల్లాహ్ అవతరింపజేసిన ఆదేశాల వైపుకు, ప్రవక్త వైపుకు రండి” అని వారితో అన్నప్పుడు, “మా తాత ముత్తాతలు అవలంబిస్తూ ఉండగా మేము చూసిన విధానమే మాకు చాలు” అని వారంటారు. ఏమిటీ? వారి తాత ముత్తాతలకు ఏమీ తెలీకపోయినప్పటికీ, వారు సన్మార్గంలో నడవనప్పటికీ వీరు వాళ్లనే అనుసరిస్తారా?
5:105 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا عَلَيْكُمْ أَنفُسَكُمْ ۖ لَا يَضُرُّكُم مَّن ضَلَّ إِذَا اهْتَدَيْتُمْ ۚ إِلَى اللَّهِ مَرْجِعُكُمْ جَمِيعًا فَيُنَبِّئُكُم بِمَا كُنتُمْ تَعْمَلُونَ
ఓ విశ్వసించినవారలారా! మీరు మీ గురించి జాగ్రత్త పడండి. మీరు గనక సన్మార్గంలో నడుస్తున్నట్లయితే దారి తప్పిన వారు మీకు ఎలాంటి నష్టం కలిగించజాలరు. మీరంతా అల్లాహ్ వద్దకే మరలిపోవలసి ఉంది. అప్పుడు ఆయన మీరు చేసిన కర్మలన్నింటినీ మీకు తెలుపుతాడు.
5:106 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا شَهَادَةُ بَيْنِكُمْ إِذَا حَضَرَ أَحَدَكُمُ الْمَوْتُ حِينَ الْوَصِيَّةِ اثْنَانِ ذَوَا عَدْلٍ مِّنكُمْ أَوْ آخَرَانِ مِنْ غَيْرِكُمْ إِنْ أَنتُمْ ضَرَبْتُمْ فِي الْأَرْضِ فَأَصَابَتْكُم مُّصِيبَةُ الْمَوْتِ ۚ تَحْبِسُونَهُمَا مِن بَعْدِ الصَّلَاةِ فَيُقْسِمَانِ بِاللَّهِ إِنِ ارْتَبْتُمْ لَا نَشْتَرِي بِهِ ثَمَنًا وَلَوْ كَانَ ذَا قُرْبَىٰ ۙ وَلَا نَكْتُمُ شَهَادَةَ اللَّهِ إِنَّا إِذًا لَّمِنَ الْآثِمِينَ
ఓ విశ్వాసులారా! మీలో ఎవరికయినా మరణ సమయం దగ్గరపడి, అతడు విల్లు చెప్పదలచినప్పుడు మీలోని ఇద్దరు వ్యక్తులు సాక్షులుగా ఉండటం భావ్యం. ఆ ఇద్దరు వ్యక్తులూ ధర్మచింతన గలవారై ఉండాలి. (వారు మీ వారై ఉండాలి). లేదా మీరు ప్రయాణావస్థలో ఉండి, మీకు మరణ విపత్తు దాపురిస్తే అన్యులిద్దరిని కూడా సాక్షులుగా తీసుకోవచ్చు. ఒకవేళ మీకు అనుమానం కలిగితే నమాజు అనంతరం ఆ ఇద్దరినీ ఆపుకోండి. మరి వారిద్దరూ దేవునిపై ప్రమాణం చేసి ఇలా చెప్పాలి: “మేము స్వప్రయోజనం కోసం ప్రమాణాలను అమ్ముకునేవాళ్ళం కాము. (మేము సాక్ష్యమిచ్చే వ్యక్తి) మా బంధువు అయినాసరే (మేము నిష్పక్షపాతంగానే వ్యవహరిస్తాము). అల్లాహ్ యొక్క సాక్ష్యాన్ని మేము దాచి పెట్టము. ఒకవేళ మేమలా చేస్తే ఘోరమైన పాపానికి పాల్పడిన వారమవుతాము.”
5:107 فَإِنْ عُثِرَ عَلَىٰ أَنَّهُمَا اسْتَحَقَّا إِثْمًا فَآخَرَانِ يَقُومَانِ مَقَامَهُمَا مِنَ الَّذِينَ اسْتَحَقَّ عَلَيْهِمُ الْأَوْلَيَانِ فَيُقْسِمَانِ بِاللَّهِ لَشَهَادَتُنَا أَحَقُّ مِن شَهَادَتِهِمَا وَمَا اعْتَدَيْنَا إِنَّا إِذًا لَّمِنَ الظَّالِمِينَ
ఆ తరువాత ఆ ఇద్దరు సాక్షులు ఏదయినా పాపానికి పాల్పడ్డారని తెలిస్తే, ఎవరికి వ్యతిరేకంగానయితే పాపం జరిగిందో వారిలో (మృతునికి) చాలా దగ్గరి వారైన ఇద్దరు వ్యక్తులు ముందుకు వచ్చి ఆ ఇద్దరి స్థానంలో నిలబడి, “వారిద్దరి సాక్ష్యం కన్నా మా సాక్ష్యం ఎక్కువ సత్యబద్ధమైనది. ఈ విషయంలో మేము ఎలాంటి అతిక్రమణకూ పాల్పడటం లేదు. మేమే గనక అలా చేస్తే పరమ దుర్మార్గులమవుతాము” అని అల్లాహ్‌పై ప్రమాణం చేసి చెప్పాలి.
5:108 ذَٰلِكَ أَدْنَىٰ أَن يَأْتُوا بِالشَّهَادَةِ عَلَىٰ وَجْهِهَا أَوْ يَخَافُوا أَن تُرَدَّ أَيْمَانٌ بَعْدَ أَيْمَانِهِمْ ۗ وَاتَّقُوا اللَّهَ وَاسْمَعُوا ۗ وَاللَّهُ لَا يَهْدِي الْقَوْمَ الْفَاسِقِينَ
ఈ పద్ధతివల్ల వారు యథాతథంగా సాక్ష్యమిస్తారనీ, తాము ప్రమాణాలు చేసిన తరువాత ప్రమాణాలు తమకు వ్యతిరేకంగా పరిణమిస్తాయన్న భయం వారికి ఉంటుందని ఆశించబడుతోంది. అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి. వినండి! అల్లాహ్ అవిధేయ జనులకు సన్మార్గం చూపడు.
5:109 يَوْمَ يَجْمَعُ اللَّهُ الرُّسُلَ فَيَقُولُ مَاذَا أُجِبْتُمْ ۖ قَالُوا لَا عِلْمَ لَنَا ۖ إِنَّكَ أَنتَ عَلَّامُ الْغُيُوبِ
ఏ రోజున అల్లాహ్ ప్రవక్తలందరినీ సమావేశపరచి, “మీకు ఏం సమాధానం లభించింది?” అని అడుగుతాడో ఆ రోజు, “మాకేమీ తెలియదు. నిశ్చయంగా రహస్య విషయాల గురించి పరిపూర్ణ జ్ఞానం కలవాడవు నువ్వే” అని వారంటారు.
5:110 إِذْ قَالَ اللَّهُ يَا عِيسَى ابْنَ مَرْيَمَ اذْكُرْ نِعْمَتِي عَلَيْكَ وَعَلَىٰ وَالِدَتِكَ إِذْ أَيَّدتُّكَ بِرُوحِ الْقُدُسِ تُكَلِّمُ النَّاسَ فِي الْمَهْدِ وَكَهْلًا ۖ وَإِذْ عَلَّمْتُكَ الْكِتَابَ وَالْحِكْمَةَ وَالتَّوْرَاةَ وَالْإِنجِيلَ ۖ وَإِذْ تَخْلُقُ مِنَ الطِّينِ كَهَيْئَةِ الطَّيْرِ بِإِذْنِي فَتَنفُخُ فِيهَا فَتَكُونُ طَيْرًا بِإِذْنِي ۖ وَتُبْرِئُ الْأَكْمَهَ وَالْأَبْرَصَ بِإِذْنِي ۖ وَإِذْ تُخْرِجُ الْمَوْتَىٰ بِإِذْنِي ۖ وَإِذْ كَفَفْتُ بَنِي إِسْرَائِيلَ عَنكَ إِذْ جِئْتَهُم بِالْبَيِّنَاتِ فَقَالَ الَّذِينَ كَفَرُوا مِنْهُمْ إِنْ هَٰذَا إِلَّا سِحْرٌ مُّبِينٌ
అప్పుడు అల్లాహ్ ఈ విధంగా అడుగుతాడు : “మర్యమ్ కుమారుడవైన ఓ ఈసా! నేను నీకూ, నీ తల్లికి ప్రసాదించిన అనుగ్రహాన్ని జ్ఞప్తికి తెచ్చుకో. అప్పుడు రూహుల్ ఖుదుస్ ద్వారా నేను నీకు సహాయం చేశాను. నీవు ఊయలలో ఉన్నప్పుడు, పెద్దవాడైన తరువాత కూడా ప్రజలతో మాట్లాడేవాడివి. అప్పుడు నేను నీకు గ్రంథాన్నీ, వివేకాన్నీ తౌరాతునూ, ఇంజీలునూ నేర్పాను. అప్పుడు నీవు నా అనుమతితో, మట్టితో పక్షి ఆకారం లాంటి దాన్ని తయారుచేసి, అందులోకి ఊదగానే నా అనుమతితో అది (నిజంగానే) పక్షి అయిపోయేది. అలాగే నీవు నా అనుమతితో పుట్టుగుడ్డినీ, కుష్టు రోగినీ బాగుచేసేవాడివి. నా అనుమతితో మృతులను లేపి నిలబెట్టే వాడివి. నీవు స్పష్టమైన నిదర్శనాలతో ఇస్రాయీలు వంశీయుల వద్దకు వచ్చినపుడు, ‘ఇది స్పష్టమైన మాయాజాలం తప్ప మరేమీ కాదు’ అని వారిలోని సత్య తిరస్కారులు చెప్పారు. ఆ సమయంలో మేము వారిని నీ నుంచి ఆపాము.
5:111 وَإِذْ أَوْحَيْتُ إِلَى الْحَوَارِيِّينَ أَنْ آمِنُوا بِي وَبِرَسُولِي قَالُوا آمَنَّا وَاشْهَدْ بِأَنَّنَا مُسْلِمُونَ
“మీరు నన్నూ, నా ప్రవక్తనూ విశ్వసించండి” అని నేను హవారీలకు ఆజ్ఞాపించినప్పుడు, “మేము విశ్వసించాము, మేము పూర్తిగా విధేయులమయ్యాము అన్నదానికి నువ్వు సాక్షిగా ఉండు” అని వారన్నారు.
5:112 إِذْ قَالَ الْحَوَارِيُّونَ يَا عِيسَى ابْنَ مَرْيَمَ هَلْ يَسْتَطِيعُ رَبُّكَ أَن يُنَزِّلَ عَلَيْنَا مَائِدَةً مِّنَ السَّمَاءِ ۖ قَالَ اتَّقُوا اللَّهَ إِن كُنتُم مُّؤْمِنِينَ
“మర్యమ్ కుమారుడవైన ఓ ఈసా! నీ ప్రభువు మా కోసం ఆహార పదార్థాలతో నిండిన ఒక పళ్లాన్ని ఆకాశం నుంచి దింపగలడా?” అని హవారీలు అడిగిన సందర్భం జ్ఞాపకం చేసుకోదగినది. అప్పుడు ఈసా, “మీరే గనక విశ్వాసులైతే అల్లాహ్‌కు భయపడండి” అన్నాడు.
5:113 قَالُوا نُرِيدُ أَن نَّأْكُلَ مِنْهَا وَتَطْمَئِنَّ قُلُوبُنَا وَنَعْلَمَ أَن قَدْ صَدَقْتَنَا وَنَكُونَ عَلَيْهَا مِنَ الشَّاهِدِينَ
దానికి వారిలా అన్నారు: “అందులోని ఆహారాన్ని తినాలని, తద్వారా మా మనసులు సంతృప్తి చెందాలనీ, నీవు మాకు చెప్పిన దంతా సత్యమనే నమ్మకం మాలో మరింత పెరగాలనీ, మేము సాక్ష్యమిచ్చేవారం కాగలగాలనీ కోరుకుంటున్నాము.”
5:114 قَالَ عِيسَى ابْنُ مَرْيَمَ اللَّهُمَّ رَبَّنَا أَنزِلْ عَلَيْنَا مَائِدَةً مِّنَ السَّمَاءِ تَكُونُ لَنَا عِيدًا لِّأَوَّلِنَا وَآخِرِنَا وَآيَةً مِّنكَ ۖ وَارْزُقْنَا وَأَنتَ خَيْرُ الرَّازِقِينَ
అప్పుడు మర్యమ్ కుమారుడగు ఈసా ఇలా వేడుకున్నాడు : “ఓ అల్లాహ్! మా ప్రభూ! ఆకాశం నుంచి మాపై ఆహారంతో నిండిన పళ్లాన్ని దించు. అది మా కొరకు, అనగా మాలోని తొలివారు, తుది వారందరికీ సంతోషకరమైన విషయం (పండుగ) కావాలి. ఇంకా నీ తరఫున అది ఒక సూచన కాగలగాలి. నీవు మాకు ఆహారం ప్రసాదించు. నీవు అందరికన్నా శ్రేష్ఠమైన ఆహార ప్రదాతవు.”
5:115 قَالَ اللَّهُ إِنِّي مُنَزِّلُهَا عَلَيْكُمْ ۖ فَمَن يَكْفُرْ بَعْدُ مِنكُمْ فَإِنِّي أُعَذِّبُهُ عَذَابًا لَّا أُعَذِّبُهُ أَحَدًا مِّنَ الْعَالَمِينَ
దానికి అల్లాహ్ ఇలా జవాబిచ్చాడు: “సరే, ఆ ఆహారాన్ని నేను మీపై అవతరింపజేస్తాను. మరి ఆ తరువాత కూడా మీలో ఎవరయినా అవిశ్వాసానికి పాల్పడితే లోకంలో ఎవరికీ విధించనటువంటి శిక్షను వారికి విధిస్తాను.”
5:116 وَإِذْ قَالَ اللَّهُ يَا عِيسَى ابْنَ مَرْيَمَ أَأَنتَ قُلْتَ لِلنَّاسِ اتَّخِذُونِي وَأُمِّيَ إِلَٰهَيْنِ مِن دُونِ اللَّهِ ۖ قَالَ سُبْحَانَكَ مَا يَكُونُ لِي أَنْ أَقُولَ مَا لَيْسَ لِي بِحَقٍّ ۚ إِن كُنتُ قُلْتُهُ فَقَدْ عَلِمْتَهُ ۚ تَعْلَمُ مَا فِي نَفْسِي وَلَا أَعْلَمُ مَا فِي نَفْسِكَ ۚ إِنَّكَ أَنتَ عَلَّامُ الْغُيُوبِ
(ఆ తరువాత) “మర్యమ్ పుత్రుడవైన ఓ ఈసా! అల్లాహ్‌ను వదలి నన్నూ, నా తల్లిని ఆరాధ్య దైవాలుగా చేసుకోండి అని గాని నీవు ప్రజలకు చెప్పావా?” అని అల్లాహ్ (నిలదీసి) అడిగే సందర్భం కూడా స్మరించుకోదగినదే. అప్పుడు ఈసా ఇలా విన్నవించుకుంటారు: “(ఓ అల్లాహ్!) నిన్ను పరమ పవిత్రునిగా భావిస్తున్నాను. ఏ మాటను అనే హక్కు నాకు లేదో అలాంటి మాటను అనటం నాకేమాత్రం తగదు. ఒకవేళ నేను గనక అలాంటిదేదైనా అని ఉంటే అది నీకు తెలిసి ఉండేది. నా మనసులో ఏముందో కూడా నీకు తెలుసు. కాని నీలో ఏముందో నాకు తెలీదు. నిశ్చయంగా నీవు సమస్త గుప్త విషయాలను ఎరిగినవాడవు.
5:117 مَا قُلْتُ لَهُمْ إِلَّا مَا أَمَرْتَنِي بِهِ أَنِ اعْبُدُوا اللَّهَ رَبِّي وَرَبَّكُمْ ۚ وَكُنتُ عَلَيْهِمْ شَهِيدًا مَّا دُمْتُ فِيهِمْ ۖ فَلَمَّا تَوَفَّيْتَنِي كُنتَ أَنتَ الرَّقِيبَ عَلَيْهِمْ ۚ وَأَنتَ عَلَىٰ كُلِّ شَيْءٍ شَهِيدٌ
‘నా ప్రభువూ, మీ ప్రభువూ అయిన అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించండి’ అని నీవు చెప్పమని ఆజ్ఞాపించిన విషయం తప్ప మరో మాటను నేను వారికి చెప్పలేదు. నేను వారిమధ్య ఉన్నంత కాలం వారిపై సాక్షిగా ఉన్నాను. నీవు నన్ను పైకి లేపుకున్న తరువాత నువ్వే వారిని కనిపెట్టుకుని ఉన్నావు. వాస్తవానికి అన్ని విషయాలను కనిపెట్టుకుని ఉండేవాడవు నువ్వే.
5:118 إِن تُعَذِّبْهُمْ فَإِنَّهُمْ عِبَادُكَ ۖ وَإِن تَغْفِرْ لَهُمْ فَإِنَّكَ أَنتَ الْعَزِيزُ الْحَكِيمُ
“ఒకవేళ నీవు వారిని శిక్షించినట్లయితే వారు నీ దాసులు. నీవు గనక వారిని క్షమించినట్లయితే నిశ్చయంగా నీవు సర్వాధిక్యుడవు, వివేచనాపరుడవు.”
5:119 قَالَ اللَّهُ هَٰذَا يَوْمُ يَنفَعُ الصَّادِقِينَ صِدْقُهُمْ ۚ لَهُمْ جَنَّاتٌ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا أَبَدًا ۚ رَّضِيَ اللَّهُ عَنْهُمْ وَرَضُوا عَنْهُ ۚ ذَٰلِكَ الْفَوْزُ الْعَظِيمُ
అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తాడు: “ఈ రోజు సత్యవంతులకు వారి సత్యం ప్రయోజనకరమవుతుంది. క్రింద కాలువలు ప్రవహించే (స్వర్గ) వనాలు వారికి ప్రాప్తిస్తాయి. అందులో వారు కలకాలం ఉంటారు. అల్లాహ్ వారి పట్ల ప్రసన్నుడయ్యాడు. వారు అల్లాహ్ పట్ల సంతుష్టులయ్యారు. వాస్తవానికి గొప్ప సాఫల్యమంటే ఇదే.
5:120 لِلَّهِ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا فِيهِنَّ ۚ وَهُوَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
ఆకాశాలు, భూమి, ఇంకా వాటిలో ఉన్న సమస్త వస్తువుల ఆధిపత్యం అల్లాహ్‌దే. ఆయన అన్నింటిపై అధికారం కలవాడు.
6. సూరా అల్ అన్ ఆమ్
6:1 الْحَمْدُ لِلَّهِ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ وَجَعَلَ الظُّلُمَاتِ وَالنُّورَ ۖ ثُمَّ الَّذِينَ كَفَرُوا بِرَبِّهِمْ يَعْدِلُونَ
ప్రశంసలు, పొగడ్తలన్నీ భూమ్యాకాశాలను పుట్టించిన అల్లాహ్‌కు మాత్రమే శోభిస్తాయి. మరి ఆయనే చీకట్లనూ, వెలుగునూ తయారు చేశాడు. అయినప్పటికీ అవిశ్వాసులు (ఇతరులను) తమ ప్రభువుకు సమానులుగా నిలబెడుతున్నారు.
6:2 هُوَ الَّذِي خَلَقَكُم مِّن طِينٍ ثُمَّ قَضَىٰ أَجَلًا ۖ وَأَجَلٌ مُّسَمًّى عِندَهُ ۖ ثُمَّ أَنتُمْ تَمْتَرُونَ
ఆయనే మిమ్మల్ని మట్టితో చేశాడు. ఆపైన ఒక గడువును నిర్థారించాడు. మరో నిర్ణీత గడువు మాత్రం అల్లాహ్ వద్దనే ఉంది. అయినా మీరు సంశయానికి లోనై ఉన్నారు!
6:3 وَهُوَ اللَّهُ فِي السَّمَاوَاتِ وَفِي الْأَرْضِ ۖ يَعْلَمُ سِرَّكُمْ وَجَهْرَكُمْ وَيَعْلَمُ مَا تَكْسِبُونَ
ఆకాశాలలోనూ, భూమిలోనూ నిజదైవం ఆయనే. మీరు దాచిపెట్టేదీ, పైకి వ్యక్తపరచేదీ – అంతా ఆయనకు తెలుసు. మీరు చేసే పనులన్నీ ఆయనకు ఎరుకే.
6:4 وَمَا تَأْتِيهِم مِّنْ آيَةٍ مِّنْ آيَاتِ رَبِّهِمْ إِلَّا كَانُوا عَنْهَا مُعْرِضِينَ
వారి వద్దకు వారి ప్రభువు సూచనలలో నుంచి ఏ సూచన వచ్చినా దానిపట్ల వారు విముఖతే చూపుతున్నారు.
6:5 فَقَدْ كَذَّبُوا بِالْحَقِّ لَمَّا جَاءَهُمْ ۖ فَسَوْفَ يَأْتِيهِمْ أَنبَاءُ مَا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ
తమ వద్దకు వచ్చిన ఈ సత్య గ్రంథాన్ని కూడా వారు అసత్యమని త్రోసిపుచ్చారు. కాబట్టి దేనిపట్ల వారు పరిహాసమాడేవారో దానికి సంబంధించిన వార్తలు వారికి త్వరలోనే అందుతాయి.
6:6 أَلَمْ يَرَوْا كَمْ أَهْلَكْنَا مِن قَبْلِهِم مِّن قَرْنٍ مَّكَّنَّاهُمْ فِي الْأَرْضِ مَا لَمْ نُمَكِّن لَّكُمْ وَأَرْسَلْنَا السَّمَاءَ عَلَيْهِم مِّدْرَارًا وَجَعَلْنَا الْأَنْهَارَ تَجْرِي مِن تَحْتِهِمْ فَأَهْلَكْنَاهُم بِذُنُوبِهِمْ وَأَنشَأْنَا مِن بَعْدِهِمْ قَرْنًا آخَرِينَ
ఏమిటీ, మేము వీళ్ళకు పూర్వం ఎన్ని సముదాయాలను నాశనం చేశామో వీరు చూడలేదా? ప్రపంచంలో మీకు ప్రసాదించని బలిమిని మేము ఆ సముదాయాల వారికి ప్రసాదించాము. వారి కోసం మేము ధారాపాతంగా వర్షాన్ని కురిపించాము. వారి కోసం క్రింది నుంచి కాలువల్ని ప్రవహింపజేశాము. కాని వారి పాపాల మూలంగా మేము వారిని తుద ముట్టించాము. వారి తరువాత ఇతర సముదాయాలను ప్రభవింపజేశాము.
6:7 وَلَوْ نَزَّلْنَا عَلَيْكَ كِتَابًا فِي قِرْطَاسٍ فَلَمَسُوهُ بِأَيْدِيهِمْ لَقَالَ الَّذِينَ كَفَرُوا إِنْ هَٰذَا إِلَّا سِحْرٌ مُّبِينٌ
(ఓ ప్రవక్తా!) ఒకవేళ కాగితంపై లిఖించబడివున్న సందేశాన్నే మేము నీపై అవతరింపజేసినా, మరి వీళ్లు తమ స్వహస్తాలతో దానిని తాకినా, “ఇది స్పష్టమైన మాయాజాలం తప్ప మరేమీ కాదు” అనే అంటారు అవిశ్వాసులు.
6:8 وَقَالُوا لَوْلَا أُنزِلَ عَلَيْهِ مَلَكٌ ۖ وَلَوْ أَنزَلْنَا مَلَكًا لَّقُضِيَ الْأَمْرُ ثُمَّ لَا يُنظَرُونَ
“ఈయన వద్దకు ఒక దైవదూత ఎందుకు అవతరింపజేయబడలేదు?” అని వారు అంటున్నారు. మేమే గనక దూతను పంపి ఉంటే ఈ పాటికి వ్యవహారం ముగిసి ఉండేది. తర్వాత వీళ్ళకు కొద్దిపాటి గడువు కూడా ఇవ్వబడేది కాదు.
6:9 وَلَوْ جَعَلْنَاهُ مَلَكًا لَّجَعَلْنَاهُ رَجُلًا وَلَلَبَسْنَا عَلَيْهِم مَّا يَلْبِسُونَ
ఒకవేళ మేము దూతను పంపినా, అతన్ని మనిషిగానే చేసి ఉండేవారము. అప్పుడు మేము గైకొన్న ఈ చర్యవల్ల వారు ప్రస్తుతం ఏ సందేహానికి లోనై ఉన్నారో మళ్లీ అదే సందేహానికి లోనయ్యేవారు.
6:10 وَلَقَدِ اسْتُهْزِئَ بِرُسُلٍ مِّن قَبْلِكَ فَحَاقَ بِالَّذِينَ سَخِرُوا مِنْهُم مَّا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ
(ఓ ప్రవక్తా!) నీకు పూర్వం కూడా చాలామంది ప్రవక్తలు పరిహసించబడ్డారు. మరి ఆ పరిహాసమాడేవారిని, వారు పరిహసిస్తూ వచ్చిన ఆపదే చుట్టుముట్టింది.
6:11 قُلْ سِيرُوا فِي الْأَرْضِ ثُمَّ انظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُكَذِّبِينَ
‘కాస్త భూమిలో సంచరించి, (సత్యాన్ని) ధిక్కరించేవారికి ఏ గతి పట్టిందో చూడండి’ అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు.
6:12 قُل لِّمَن مَّا فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ قُل لِّلَّهِ ۚ كَتَبَ عَلَىٰ نَفْسِهِ الرَّحْمَةَ ۚ لَيَجْمَعَنَّكُمْ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ لَا رَيْبَ فِيهِ ۚ الَّذِينَ خَسِرُوا أَنفُسَهُمْ فَهُمْ لَا يُؤْمِنُونَ
“ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్నదంతా ఎవరిది?” అని వారిని అడుగు. వారికి చెప్పు: “సమస్తమూ అల్లాహ్‌దే.” కనికరించటాన్ని అల్లాహ్ తన కోసం అవశ్యం చేసుకున్నాడు. అల్లాహ్ ప్రళయదినాన మిమ్మల్నందరినీ సమీకరిస్తాడు. ఇందులో ఎలాంటి సందేహానికీ తావులేదు. కాని తమను తాము నష్టంలో పడవేసుకున్నవారు మాత్రం విశ్వసించరు.
6:13 وَلَهُ مَا سَكَنَ فِي اللَّيْلِ وَالنَّهَارِ ۚ وَهُوَ السَّمِيعُ الْعَلِيمُ
రాత్రిపూట, పగటివేళ విశ్రమిస్తూ ఉండేదంతా అల్లాహ్‌దే. ఆయన సర్వం వినేవాడు, సర్వం తెలిసినవాడు.
6:14 قُلْ أَغَيْرَ اللَّهِ أَتَّخِذُ وَلِيًّا فَاطِرِ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَهُوَ يُطْعِمُ وَلَا يُطْعَمُ ۗ قُلْ إِنِّي أُمِرْتُ أَنْ أَكُونَ أَوَّلَ مَنْ أَسْلَمَ ۖ وَلَا تَكُونَنَّ مِنَ الْمُشْرِكِينَ
“ఆకాశాలను, భూమినీ సృష్టించినవాడు, అందరికీ తినిపించేవాడూ, ఎవరి నుండి కూడా ఆహారం పుచ్చుకోనివాడూ అయిన అల్లాహ్‌ను వదలి నేను వేరొకరిని ఆరాధ్యునిగా చేసుకోవాలా?” అని ఓ ప్రవక్తా! వారిని అడుగు. ”అందరికంటే ముందు నేను ఇస్లాం స్వీకరించాలని నాకు ఆదేశించబడింది” అని నీవు వారికి తెలియజెయ్యి. “ఎట్టి పరిస్థితుల్లోనూ నీవు బహుదైవారాధకులలో చేరిపోకూడదు” (అని కూడా నాకు ఆదేశించబడిందని చెప్పు).
6:15 قُلْ إِنِّي أَخَافُ إِنْ عَصَيْتُ رَبِّي عَذَابَ يَوْمٍ عَظِيمٍ
“నేనే గనక నా ప్రభువు ఆజ్ఞను శిరసావహించకపోతే ఒకానొక మహాదినాన నాకు శిక్ష పడుతుందని నేను భయపడుతున్నాను” అని (కూడా) వారికి చెప్పు.
6:16 مَّن يُصْرَفْ عَنْهُ يَوْمَئِذٍ فَقَدْ رَحِمَهُ ۚ وَذَٰلِكَ الْفَوْزُ الْمُبِينُ
ఆ రోజు ఎవరిపై నుంచి ఆ శిక్ష తొలగించబడుతుందో ఆ వ్యక్తిని అల్లాహ్ అపారంగా కరుణించినట్లే. అదే స్పష్టమైన విజయం.
6:17 وَإِن يَمْسَسْكَ اللَّهُ بِضُرٍّ فَلَا كَاشِفَ لَهُ إِلَّا هُوَ ۖ وَإِن يَمْسَسْكَ بِخَيْرٍ فَهُوَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
ఒకవేళ అల్లాహ్ నిన్ను ఏదన్నా బాధకు గురిచేస్తే, ఆయన తప్ప మరెవరూ దాన్ని దూరం చేయలేరు. ఒకవేళ ఆయన నీకు ఏదన్నా మేలు చేస్తే, ఆయన అన్నింటిపై అధికారం కలవాడు.
6:18 وَهُوَ الْقَاهِرُ فَوْقَ عِبَادِهِ ۚ وَهُوَ الْحَكِيمُ الْخَبِيرُ
తన దాసులపై తిరుగులేని ఆధిపత్యం, అధికారం గలవాడు ఆయనే. ఆయన అత్యంత వివేచనాపరుడు, అన్నీ తెలిసినవాడు.
6:19 قُلْ أَيُّ شَيْءٍ أَكْبَرُ شَهَادَةً ۖ قُلِ اللَّهُ ۖ شَهِيدٌ بَيْنِي وَبَيْنَكُمْ ۚ وَأُوحِيَ إِلَيَّ هَٰذَا الْقُرْآنُ لِأُنذِرَكُم بِهِ وَمَن بَلَغَ ۚ أَئِنَّكُمْ لَتَشْهَدُونَ أَنَّ مَعَ اللَّهِ آلِهَةً أُخْرَىٰ ۚ قُل لَّا أَشْهَدُ ۚ قُلْ إِنَّمَا هُوَ إِلَٰهٌ وَاحِدٌ وَإِنَّنِي بَرِيءٌ مِّمَّا تُشْرِكُونَ
“అందరికన్నా గొప్ప సాక్ష్యం ఎవరిది?” అని వారిని అడుగు. “నాకూ- మీకూ మధ్య సాక్షిగా అల్లాహ్ ఉన్నాడు. ఈ ఖుర్ఆను ద్వారా నేను మిమ్మల్నీ, ఇది ఎవరెవరి వరకు చేరుతుందో వారందరినీ హెచ్చరించటానికి గాను ఈ ఖుర్ఆన్ నా వద్దకు వహీ ద్వారా పంపబడింది” అని (ఓ ప్రవక్తా!) వారికి తెలియపరచు. అల్లాహ్‌తోపాటు మరి కొంతమంది దేవుళ్లు కూడా ఉన్నారని మీరు నిజంగా సాక్ష్యం ఇవ్వగలరా? “నేను మాత్రం అలాంటి సాక్ష్యం (ఇవ్వనుగాక) ఇవ్వను” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు. “ఆయనే ఒకే ఒక్కడైన ఆరాధ్య దేవుడు. మీరు దైవానికి కల్పించే షిర్క్ (భాగస్వామ్యం)తో నాకెలాంటి సంబంధం లేదు” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పెయ్యి.
6:20 الَّذِينَ آتَيْنَاهُمُ الْكِتَابَ يَعْرِفُونَهُ كَمَا يَعْرِفُونَ أَبْنَاءَهُمُ ۘ الَّذِينَ خَسِرُوا أَنفُسَهُمْ فَهُمْ لَا يُؤْمِنُونَ
ఎవరికయితే మేము గ్రంథాన్ని వొసగి ఉన్నామో వారు తమ కన్న కొడుకులను గుర్తుపట్టినట్లే ప్రవక్తను గుర్తుపడతారు. అయితే తమను తాము నష్టంలో పడవేసుకున్నవారు మాత్రం విశ్వసించరు.
6:21 وَمَنْ أَظْلَمُ مِمَّنِ افْتَرَىٰ عَلَى اللَّهِ كَذِبًا أَوْ كَذَّبَ بِآيَاتِهِ ۗ إِنَّهُ لَا يُفْلِحُ الظَّالِمُونَ
అల్లాహ్‌పై అబద్ధపు నిందలు మోపే వాడికంటే లేదా అల్లాహ్ ఆయతులను అసత్యాలని త్రోసిపుచ్చే వాడికంటే ఎక్కువ దుర్మార్గుడెవడుంటాడు? ఇలాంటి దుర్మార్గులకు ఎన్నటికీ సాఫల్యం ప్రాప్తించదు.
6:22 وَيَوْمَ نَحْشُرُهُمْ جَمِيعًا ثُمَّ نَقُولُ لِلَّذِينَ أَشْرَكُوا أَيْنَ شُرَكَاؤُكُمُ الَّذِينَ كُنتُمْ تَزْعُمُونَ
మేము వారందరినీ సమీకరించే రోజున, “మీరు ఆరాధ్య దైవాలుగా చేసుకున్న మీ భాగస్వాములు ఏరి?” అని ముష్రిక్కులను మేము అడిగే సందర్భం కూడా జ్ఞాపకం చేసుకోదగినదే.
6:23 ثُمَّ لَمْ تَكُن فِتْنَتُهُمْ إِلَّا أَن قَالُوا وَاللَّهِ رَبِّنَا مَا كُنَّا مُشْرِكِينَ
అప్పుడు వారు, “మా ప్రభువైన అల్లాహ్ సాక్షి! మేము ముష్రిక్కులము కానేకాము” అని పలకటం తప్ప వారి షిర్కుకు మరే ఫలితమూ ఉండదు.
6:24 انظُرْ كَيْفَ كَذَبُوا عَلَىٰ أَنفُسِهِمْ ۚ وَضَلَّ عَنْهُم مَّا كَانُوا يَفْتَرُونَ
చూడు! వారు తమ గురించి తాము ఎలా అబద్ధం చెప్పుకుంటారో. వారు కల్పించుకుంటూ ఉండినవన్నీ వారినుండి మటుమాయమై పోతాయి.
6:25 وَمِنْهُم مَّن يَسْتَمِعُ إِلَيْكَ ۖ وَجَعَلْنَا عَلَىٰ قُلُوبِهِمْ أَكِنَّةً أَن يَفْقَهُوهُ وَفِي آذَانِهِمْ وَقْرًا ۚ وَإِن يَرَوْا كُلَّ آيَةٍ لَّا يُؤْمِنُوا بِهَا ۚ حَتَّىٰ إِذَا جَاءُوكَ يُجَادِلُونَكَ يَقُولُ الَّذِينَ كَفَرُوا إِنْ هَٰذَا إِلَّا أَسَاطِيرُ الْأَوَّلِينَ
వారిలో కొంతమంది నీ వైపు చెవి యొగ్గి ఉంటారు. మేము వారి హృదయాలపై తెరవేసి ఉంచాము. అందువల్ల వారు దానిని అర్థం చేసుకోలేరు. వారి చెవులలో చెవుడును ఉంచాము. (ఈ కారణంగా) వారు నిదర్శనాలన్నింటినీ చూసినప్పటికీ వాటిని విశ్వసించరు. ఆఖరికి వారు నీ వద్దకు వచ్చినపుడు అనవసరంగా నీతో వాదనకు దిగుతారు. అవిశ్వాసులు “ఇవి పూర్వీకుల నుంచీ చెలామణీలో ఉన్న కట్టుకథలు తప్ప మరేమీ కావు” అని అంటారు.
6:26 وَهُمْ يَنْهَوْنَ عَنْهُ وَيَنْأَوْنَ عَنْهُ ۖ وَإِن يُهْلِكُونَ إِلَّا أَنفُسَهُمْ وَمَا يَشْعُرُونَ
వాళ్లు దాన్నుంచి ఇతరులను ఆపటమే గాకుండా, స్వయంగా వాళ్లు కూడా దానికి దూరంగా ఉంటున్నారు. వాస్తవానికి వారు తమను మాత్రమే నాశనం చేసుకుంటున్నారు. కాని వారికి ఆ స్పృహే లేదు.
6:27 وَلَوْ تَرَىٰ إِذْ وُقِفُوا عَلَى النَّارِ فَقَالُوا يَا لَيْتَنَا نُرَدُّ وَلَا نُكَذِّبَ بِآيَاتِ رَبِّنَا وَنَكُونَ مِنَ الْمُؤْمِنِينَ
నరకం దగ్గర వారు నిలబెట్టబడినప్పుడు నీవు వారిని చూస్తే (ఎంత బావుండు!) – “అయ్యో! మేము మళ్లీ తిరిగి పంపబడితే బావుండునే! అదే గనక జరిగితే మేము మా ప్రభువు సూచనలను తిరస్కరించము. ఇంకా మేము విశ్వాసులలో చేరిపోతాము!” అని (ఆ సమయంలో) వారు పలుకుతారు.
6:28 بَلْ بَدَا لَهُم مَّا كَانُوا يُخْفُونَ مِن قَبْلُ ۖ وَلَوْ رُدُّوا لَعَادُوا لِمَا نُهُوا عَنْهُ وَإِنَّهُمْ لَكَاذِبُونَ
అసలు విషయం అది కాదు. వారు అంతకుముందు దేన్నయితే కప్పిపుచ్చేవారో అది వారి ముందు బహిర్గతం అయింది. ఒకవేళ వారు తిరిగి పంపబడినప్పటికీ, తమకు వారించబడిన పనులన్నీ మళ్లీ చేస్తారు. ముమ్మాటికీ వాళ్లు అబద్ధాలకోరులు.
6:29 وَقَالُوا إِنْ هِيَ إِلَّا حَيَاتُنَا الدُّنْيَا وَمَا نَحْنُ بِمَبْعُوثِينَ
“ఈ ప్రాపంచిక జీవితమే అసలు జీవితం. మళ్లీ మనం బ్రతికించబడటం అనేది కల్ల” అని వారు చెబుతున్నారు.
6:30 وَلَوْ تَرَىٰ إِذْ وُقِفُوا عَلَىٰ رَبِّهِمْ ۚ قَالَ أَلَيْسَ هَٰذَا بِالْحَقِّ ۚ قَالُوا بَلَىٰ وَرَبِّنَا ۚ قَالَ فَذُوقُوا الْعَذَابَ بِمَا كُنتُمْ تَكْفُرُونَ
వారు తమ ప్రభువు ఎదుట నిలబెట్టబడిన దృశ్యాన్ని నీవు చూస్తే (బావుండేది). “ఇది నిజం కాదా?!” అని అల్లాహ్ అడుగుతాడు. దానికి వారు “ఎందుకు నిజం కాదు? మా ప్రభువు సాక్షిగా (ఇది నిజమే)!” అని అంటారు. “మరయితే మీ తిరస్కారానికి బదులుగా శిక్షను చవిచూడండి” అని అల్లాహ్ సెలవిస్తాడు.
6:31 قَدْ خَسِرَ الَّذِينَ كَذَّبُوا بِلِقَاءِ اللَّهِ ۖ حَتَّىٰ إِذَا جَاءَتْهُمُ السَّاعَةُ بَغْتَةً قَالُوا يَا حَسْرَتَنَا عَلَىٰ مَا فَرَّطْنَا فِيهَا وَهُمْ يَحْمِلُونَ أَوْزَارَهُمْ عَلَىٰ ظُهُورِهِمْ ۚ أَلَا سَاءَ مَا يَزِرُونَ
అల్లాహ్‌ను కలుసుకోవలసి ఉందనే విషయాన్ని ధిక్కరించినవారు నిశ్చయంగా నష్టానికి గురయ్యారు. ఆఖరికి ఆ నిర్థారిత సమయం అకస్మాత్తుగా వచ్చిపడినప్పుడు, “అయ్యో! ఈ విషయాన్ని మేము ఎంత నిర్లక్ష్యం చేశాం!” అని బాధపడతారు. వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందంటే, వారు తమ బరువులను తమ వీపులపై మోస్తూ ఉంటారు. తెలుసుకోండి! వారు మోసే బరువు చాలా చెడ్డది.
6:32 وَمَا الْحَيَاةُ الدُّنْيَا إِلَّا لَعِبٌ وَلَهْوٌ ۖ وَلَلدَّارُ الْآخِرَةُ خَيْرٌ لِّلَّذِينَ يَتَّقُونَ ۗ أَفَلَا تَعْقِلُونَ
ప్రాపంచిక జీవితం ఆట, తమాషా తప్ప మరేమీ కాదు. అయితే భయభక్తులు కలవారి కోసం పరలోక నిలయం ఎంతో మేలైనది. ఏమిటీ, మీరు బొత్తిగా బుద్ధిని ఉపయోగించరా?
6:33 قَدْ نَعْلَمُ إِنَّهُ لَيَحْزُنُكَ الَّذِي يَقُولُونَ ۖ فَإِنَّهُمْ لَا يُكَذِّبُونَكَ وَلَٰكِنَّ الظَّالِمِينَ بِآيَاتِ اللَّهِ يَجْحَدُونَ
(ఓ ప్రవక్తా!) వాళ్లు అనే మాటలు నిన్ను దుఃఖానికి గురి చేస్తున్నాయన్న సంగతి మాకు బాగా తెలుసు. వారు ధిక్కరిస్తున్నది నిన్ను కాదు, నిజానికి ఈ దుర్మార్గులు అల్లాహ్ ఆయతులను తిరస్కరిస్తున్నారు.
6:34 وَلَقَدْ كُذِّبَتْ رُسُلٌ مِّن قَبْلِكَ فَصَبَرُوا عَلَىٰ مَا كُذِّبُوا وَأُوذُوا حَتَّىٰ أَتَاهُمْ نَصْرُنَا ۚ وَلَا مُبَدِّلَ لِكَلِمَاتِ اللَّهِ ۚ وَلَقَدْ جَاءَكَ مِن نَّبَإِ الْمُرْسَلِينَ
నీకు పూర్వం కూడా చాలామంది ప్రవక్తలు ధిక్కరించబడ్డారు. అయితే వారు (ప్రజల) ధిక్కారవైఖరికి, తమకు పెట్టబడిన బాధలకు సహనం వహించారు. కడకు వారికి మా సహాయం అందింది. అల్లాహ్ వాక్కులను మార్చేవాడు ఎవడూ లేడు. కొంతమంది ప్రవక్తలకు సంబంధించిన కొన్ని విషయాలు ఇప్పటికే నీ వద్దకు చేరాయి.
6:35 وَإِن كَانَ كَبُرَ عَلَيْكَ إِعْرَاضُهُمْ فَإِنِ اسْتَطَعْتَ أَن تَبْتَغِيَ نَفَقًا فِي الْأَرْضِ أَوْ سُلَّمًا فِي السَّمَاءِ فَتَأْتِيَهُم بِآيَةٍ ۚ وَلَوْ شَاءَ اللَّهُ لَجَمَعَهُمْ عَلَى الْهُدَىٰ ۚ فَلَا تَكُونَنَّ مِنَ الْجَاهِلِينَ
ఒకవేళ వారి వైముఖ్యం (ఓ ముహమ్మద్! (స) నీకు సహించరానిదిగా ఉంటే (నీవే దానికి ఏదైనా ఉపాయం ఆలోచించు). నీకే గనక శక్తి ఉంటే భూమిలో ఏదైనా సొరంగం లేదా ఆకాశంలో ఏదైనా నిచ్చెనను వెతికి వారి కోసం ఏదైనా మహిమ తేగలిగితే తెచ్చుకో. అల్లాహ్‌యే గనక తలచుకుంటే వారందరినీ సన్మార్గంపై సమీకరించి ఉండేవాడే. కనుక (ఓ ప్రవక్తా!) నువ్వు అవివేకుల్లో చేరిపోకు.
6:36 إِنَّمَا يَسْتَجِيبُ الَّذِينَ يَسْمَعُونَ ۘ وَالْمَوْتَىٰ يَبْعَثُهُمُ اللَّهُ ثُمَّ إِلَيْهِ يُرْجَعُونَ
వినేవారు మాత్రమే (సత్యాన్ని) స్వీకరిస్తారు. ఇకపోతే మృతుల విషయం – అల్లాహ్ వారిని బ్రతికించిలేపుతాడు. తర్వాత వారంతా ఆయన వద్దకే మరలించబడతారు.
6:37 وَقَالُوا لَوْلَا نُزِّلَ عَلَيْهِ آيَةٌ مِّن رَّبِّهِ ۚ قُلْ إِنَّ اللَّهَ قَادِرٌ عَلَىٰ أَن يُنَزِّلَ آيَةً وَلَٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ
ఈయన ప్రభువు తరఫు నుంచి ఈయనపై ఏదైనా మహిమ ఎందుకు అవతరింపజేయబడలేదు? అని వారు అడుగుతున్నారు. “అల్లాహ్ (ముమ్మాటికీ) మహిమను అవతరింపజేసే శక్తి కలిగి ఉన్నాడు” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు. అయితే వారిలో అధికులకు తెలియదు.
6:38 وَمَا مِن دَابَّةٍ فِي الْأَرْضِ وَلَا طَائِرٍ يَطِيرُ بِجَنَاحَيْهِ إِلَّا أُمَمٌ أَمْثَالُكُم ۚ مَّا فَرَّطْنَا فِي الْكِتَابِ مِن شَيْءٍ ۚ ثُمَّ إِلَىٰ رَبِّهِمْ يُحْشَرُونَ
భూమిలో సంచరించే ఎన్ని రకాల జంతువులైనా, తమ రెండు రెక్కల సహాయంతో ఎగిరే పక్షులైనా – అన్నీ మీలాంటి సముదాయాలే. మేము గ్రంథంలో నమోదు చేయకుండా దేన్నీ వదలిపెట్టలేదు. ఆపైన అందరూ తమ ప్రభువు వైపుకు సమీకరించబడేవారే.
6:39 وَالَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا صُمٌّ وَبُكْمٌ فِي الظُّلُمَاتِ ۗ مَن يَشَإِ اللَّهُ يُضْلِلْهُ وَمَن يَشَأْ يَجْعَلْهُ عَلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ
ఎవరయితే మా ఆయతులను ధిక్కరిస్తున్నారో వారు చీకట్లలో తచ్చాడుతున్న చెవిటివారు, మూగవారు. అల్లాహ్ తాను కోరిన వారిని పెడదారి పట్టిస్తాడు. అలాగే ఆయన తాను కోరిన వారిని రుజుమార్గంపై నడిపిస్తాడు.
6:40 قُلْ أَرَأَيْتَكُمْ إِنْ أَتَاكُمْ عَذَابُ اللَّهِ أَوْ أَتَتْكُمُ السَّاعَةُ أَغَيْرَ اللَّهِ تَدْعُونَ إِن كُنتُمْ صَادِقِينَ
(ఓ ప్రవక్తా!) వాళ్ళను అడుగు : “చూడండి! అల్లాహ్ తరఫునుంచి మీపై ఏదయినా ఆపద వచ్చిపడితే లేక మీపైన ప్రళయమే వస్తే అప్పుడు మీరు అల్లాహ్‌ను తప్ప వేరొకరెవరినయినా మొరపెట్టుకుంటారా? మీరు సత్యవంతులే అయితే (నిజం) చెప్పండి.”
6:41 بَلْ إِيَّاهُ تَدْعُونَ فَيَكْشِفُ مَا تَدْعُونَ إِلَيْهِ إِن شَاءَ وَتَنسَوْنَ مَا تُشْرِكُونَ
“లేదు. (ఆ క్షణంలో) మీరు కేవలం ఆయన్నే వేడుకుంటారు. దేనికోసం మీరు వేడుకున్నారో ఆ ఆపదను ఆయన మీ నుండి తొలగించదలచుకుంటే తొలగిస్తాడు. అలాంటి సమయాలలో మీరు మాత్రం (అల్లాహ్‌కు) సహవర్తులుగా నిలబెట్టిన వారందరినీ మరచిపోతారు.”
6:42 وَلَقَدْ أَرْسَلْنَا إِلَىٰ أُمَمٍ مِّن قَبْلِكَ فَأَخَذْنَاهُم بِالْبَأْسَاءِ وَالضَّرَّاءِ لَعَلَّهُمْ يَتَضَرَّعُونَ
నీకు పూర్వం ఎన్నో సమాజాల వద్దకు కూడా మేము ప్రవక్తలను పంపాము. ఆయా సమాజాలవారు అణకువను వ్యక్తపరచాలన్న ఉద్దేశంతో మేము వాళ్ళను దారిద్య్రానికి, అనారోగ్య బాధలకు గురిచేసి పట్టుకున్నాము.
6:43 فَلَوْلَا إِذْ جَاءَهُم بَأْسُنَا تَضَرَّعُوا وَلَٰكِن قَسَتْ قُلُوبُهُمْ وَزَيَّنَ لَهُمُ الشَّيْطَانُ مَا كَانُوا يَعْمَلُونَ
మా తరఫున వారిపైకి శిక్ష వచ్చినప్పటికీ వారు అణకువను ఎందుకు ప్రదర్శించలేదు? పైగా వారి హృదయాలు కఠినమై పోయాయి. షైతాన్ వారి దృష్టిలో వారు చేసే పనులన్నీ మంచివే అని భ్రమపడేలా చేశాడు.
6:44 فَلَمَّا نَسُوا مَا ذُكِّرُوا بِهِ فَتَحْنَا عَلَيْهِمْ أَبْوَابَ كُلِّ شَيْءٍ حَتَّىٰ إِذَا فَرِحُوا بِمَا أُوتُوا أَخَذْنَاهُم بَغْتَةً فَإِذَا هُم مُّبْلِسُونَ
తరువాత వారికి బోధించిన విషయాలను వారు విస్మరించినప్పుడు, మేము వారి కోసం అన్ని వస్తువుల ద్వారాలూ తెరిచాము. తమకు ప్రాప్తించిన వస్తువులపై వారు మిడిసిపడుతుండగా, అకస్మాత్తుగా మేము వారిని పట్టుకున్నాము. అప్పుడు, వారు పూర్తిగా నిరాశ చెందారు.
6:45 فَقُطِعَ دَابِرُ الْقَوْمِ الَّذِينَ ظَلَمُوا ۚ وَالْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
ఈ విధంగా, దుర్మార్గాలకు పాల్పడినవారి వేరు త్రెంపబడింది. సమస్త లోకాల ప్రభువైన అల్లాహ్‌కే కృతజ్ఞతలు.
6:46 قُلْ أَرَأَيْتُمْ إِنْ أَخَذَ اللَّهُ سَمْعَكُمْ وَأَبْصَارَكُمْ وَخَتَمَ عَلَىٰ قُلُوبِكُم مَّنْ إِلَٰهٌ غَيْرُ اللَّهِ يَأْتِيكُم بِهِ ۗ انظُرْ كَيْفَ نُصَرِّفُ الْآيَاتِ ثُمَّ هُمْ يَصْدِفُونَ
(ఓ ప్రవక్తా!) వారిని అడుగు: “అల్లాహ్‌యే గనక మీ వినికిడిని, మీ చూపును పూర్తిగా తీసేసుకుని, మీ హృదయాలకు ముద్రవేస్తే, అల్లాహ్ తప్ప వాటిని మీకు తిరిగి ప్రసాదించగల మరో ఆరాధ్యుడు ఎవడున్నాడు చెప్పండి?!” మేమెన్ని విధాలుగా మా సూచనలను వారికి విశదీకరిస్తున్నామో చూడు! అయినా వారు ముఖం త్రిప్పుకుంటున్నారు.
6:47 قُلْ أَرَأَيْتَكُمْ إِنْ أَتَاكُمْ عَذَابُ اللَّهِ بَغْتَةً أَوْ جَهْرَةً هَلْ يُهْلَكُ إِلَّا الْقَوْمُ الظَّالِمُونَ
“చూడండి! ఒకవేళ మీపై అకస్మాత్తుగా గానీ, బహిరంగంగా గానీ అల్లాహ్ యొక్క శిక్ష వచ్చిపడితే దుర్మార్గులు తప్ప ఎవరు నాశనం చేయబడతారు?” అని వారిని అడుగు.
6:48 وَمَا نُرْسِلُ الْمُرْسَلِينَ إِلَّا مُبَشِّرِينَ وَمُنذِرِينَ ۖ فَمَنْ آمَنَ وَأَصْلَحَ فَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ
మేము ప్రవక్తలను పంపేది, వారు శుభవార్త అందజేయటానికి, హెచ్చరించటానికి మాత్రమే. కాబట్టి ఎవరు విశ్వసించి, తమ ప్రవర్తనను సరిదిద్దుకుంటారో వారికెలాంటి భయంగానీ, దుఃఖంగానీ ఉండదు.
6:49 وَالَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا يَمَسُّهُمُ الْعَذَابُ بِمَا كَانُوا يَفْسُقُونَ
అయితే మా ఆయతులను అబద్ధాలని కొట్టిపారేసేవారికి, వారి అవిధేయత కారణంగా శిక్ష అంటుకుంటుంది.
6:50 قُل لَّا أَقُولُ لَكُمْ عِندِي خَزَائِنُ اللَّهِ وَلَا أَعْلَمُ الْغَيْبَ وَلَا أَقُولُ لَكُمْ إِنِّي مَلَكٌ ۖ إِنْ أَتَّبِعُ إِلَّا مَا يُوحَىٰ إِلَيَّ ۚ قُلْ هَلْ يَسْتَوِي الْأَعْمَىٰ وَالْبَصِيرُ ۚ أَفَلَا تَتَفَكَّرُونَ
ఓ ప్రవక్తా! వారికి చెప్పేయి: “నా వద్ద అల్లాహ్ ఖజానాలున్నాయని నేను మీతో అనటం లేదు. నా వద్ద అగోచర జ్ఞానం కూడా లేదు. నేను దైవదూతనని కూడా మీతో అనటం లేదు. నాపై అవతరింపజేయబడే ‘వహీ’ని మాత్రమే నేను అనుసరిస్తున్నాను.” (ఓ ప్రవక్తా!) వారిని అడుగు: ”గ్రుడ్డివాడు, కళ్ళున్నవాడూ – ఇద్దరూ సమానులేనా? మీరు ఈ మాత్రం ఆలోచించరా?”
6:51 وَأَنذِرْ بِهِ الَّذِينَ يَخَافُونَ أَن يُحْشَرُوا إِلَىٰ رَبِّهِمْ ۙ لَيْسَ لَهُم مِّن دُونِهِ وَلِيٌّ وَلَا شَفِيعٌ لَّعَلَّهُمْ يَتَّقُونَ
స్వయంగా తమ ప్రభువు తప్ప, తమను ఆదుకునేవారుగానీ, తమకోసం సిఫారసు చేసేవారుగాని ఉండని స్థితిలో తమ ప్రభువు దగ్గరికి హాజరు కావలసి ఉంటుందని భయపడేవారికి (ఓ ప్రవక్తా!) ఇందుమూలంగా హెచ్చరించు, దీనిద్వారా వారు భయభక్తుల వైఖరిని అవలంబించవచ్చు.
6:52 وَلَا تَطْرُدِ الَّذِينَ يَدْعُونَ رَبَّهُم بِالْغَدَاةِ وَالْعَشِيِّ يُرِيدُونَ وَجْهَهُ ۖ مَا عَلَيْكَ مِنْ حِسَابِهِم مِّن شَيْءٍ وَمَا مِنْ حِسَابِكَ عَلَيْهِم مِّن شَيْءٍ فَتَطْرُدَهُمْ فَتَكُونَ مِنَ الظَّالِمِينَ
ఉదయం, సాయంత్రం తమ ప్రభువును ప్రార్థిస్తూ, కేవలం ఆయన ప్రసన్నతను పొందాలనుకునేవారిని నీ దగ్గరి నుండి తొలగి పొమ్మనకు. (నువ్వు వారిని తొలగి పొమ్మనటానికి) నీపై వారి లెక్క ఏ మాత్రం లేదు. అలాగే నీ లెక్క కూడా వారిపై ఎంతమాత్రం లేదు. అయినప్పటికీ ఒకవేళ నువ్వు వాళ్లను తొలగిపొమ్మన్నావంటే దౌర్జన్యపరులలో చేరిపోతావు.
6:53 وَكَذَٰلِكَ فَتَنَّا بَعْضَهُم بِبَعْضٍ لِّيَقُولُوا أَهَٰؤُلَاءِ مَنَّ اللَّهُ عَلَيْهِم مِّن بَيْنِنَا ۗ أَلَيْسَ اللَّهُ بِأَعْلَمَ بِالشَّاكِرِينَ
“మా అందరిలోకీ అల్లాహ్ అనుగ్రహించినది వీళ్లనేనా!” అని వారు పలికేందుకుగాను మేము వారిలో కొందరిని మరి కొందరి ద్వారా పరీక్షించాము. కృతజ్ఞతా భావంతో మెలిగే వారిని అల్లాహ్ ఎరుగడా ఏమిటీ?!
6:54 وَإِذَا جَاءَكَ الَّذِينَ يُؤْمِنُونَ بِآيَاتِنَا فَقُلْ سَلَامٌ عَلَيْكُمْ ۖ كَتَبَ رَبُّكُمْ عَلَىٰ نَفْسِهِ الرَّحْمَةَ ۖ أَنَّهُ مَنْ عَمِلَ مِنكُمْ سُوءًا بِجَهَالَةٍ ثُمَّ تَابَ مِن بَعْدِهِ وَأَصْلَحَ فَأَنَّهُ غَفُورٌ رَّحِيمٌ
(ఓ ప్రవక్తా!) మా ఆయతులను విశ్వసించేవారు నీ వద్దకు వచ్చినప్పుడు, “మీపై సలామ్! (శాంతి కలుగుగాక!) దయ చూపటాన్ని మీ ప్రభువు తన కోసం విధిగా లిఖించుకున్నాడు. మీలో ఎవరయినా అజ్ఞానం వల్ల ఏదన్నా చెడు పని చేసి, తరువాత పశ్చాత్తాపం చెంది, దిద్దుబాటుకు ప్రయత్నిస్తే అల్లాహ్ అపారంగా క్షమించేవాడు, అమితంగా దయజూపేవాడు” అని చెప్పు.
6:55 وَكَذَٰلِكَ نُفَصِّلُ الْآيَاتِ وَلِتَسْتَبِينَ سَبِيلُ الْمُجْرِمِينَ
ఈ విధంగా మేము, అపరాధులు ఎంచుకున్న మార్గం ఎలాంటిదో విదితమయ్యేందుకుగాను ఆయతులను విడమరచి చెబుతుంటాము.
6:56 قُلْ إِنِّي نُهِيتُ أَنْ أَعْبُدَ الَّذِينَ تَدْعُونَ مِن دُونِ اللَّهِ ۚ قُل لَّا أَتَّبِعُ أَهْوَاءَكُمْ ۙ قَدْ ضَلَلْتُ إِذًا وَمَا أَنَا مِنَ الْمُهْتَدِينَ
(ఓ ప్రవక్తా!) “అల్లాహ్‌ను వదలి మీరు పిలిచే ఇతరులకు దాస్యం చేయటం నాకు నిషేధించబడింది” అని వారికి చెప్పేయి. “నేను మీ కోర్కెలను అనుసరించను. ఒకవేళ నేనలా చేసినట్లయితే మార్గ విహీనతకు లోనైపోతాను. సన్మార్గాన నడిచే వారిలో ఉండను” అని (కూడా) వారికి చెప్పు.
6:57 قُلْ إِنِّي عَلَىٰ بَيِّنَةٍ مِّن رَّبِّي وَكَذَّبْتُم بِهِ ۚ مَا عِندِي مَا تَسْتَعْجِلُونَ بِهِ ۚ إِنِ الْحُكْمُ إِلَّا لِلَّهِ ۖ يَقُصُّ الْحَقَّ ۖ وَهُوَ خَيْرُ الْفَاصِلِينَ
ఇంకా ఇలా చెప్పు: “నా వద్ద నా ప్రభువు తరఫున ఒక ప్రమాణం ఉంది. మీరేమో దాన్ని అసత్యమని త్రోసిపుచ్చుతున్నారు. దేనికోసం మీరు తొందర పెడుతున్నారో అది నా దగ్గరలేదు. నిర్ణయాధికారం అల్లాహ్‌కు తప్ప మరెవరికీ లేదు. ఆయన సత్యాన్ని తెలియపరుస్తాడు. అందరికన్నా ఉత్తమమైన తీర్పరి ఆయనే.”
6:58 قُل لَّوْ أَنَّ عِندِي مَا تَسْتَعْجِلُونَ بِهِ لَقُضِيَ الْأَمْرُ بَيْنِي وَبَيْنَكُمْ ۗ وَاللَّهُ أَعْلَمُ بِالظَّالِمِينَ
“మీరు తొందరపెట్టే ఆ వస్తువే గనక నా దగ్గర ఉండి ఉంటే మీకూ – నాకూ మధ్య ఈపాటికి వ్యవహారం తేలిపోయి ఉండేది. దుర్మార్గుల గురించి అల్లాహ్‌కు బాగా తెలుసు” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు.
6:59 وَعِندَهُ مَفَاتِحُ الْغَيْبِ لَا يَعْلَمُهَا إِلَّا هُوَ ۚ وَيَعْلَمُ مَا فِي الْبَرِّ وَالْبَحْرِ ۚ وَمَا تَسْقُطُ مِن وَرَقَةٍ إِلَّا يَعْلَمُهَا وَلَا حَبَّةٍ فِي ظُلُمَاتِ الْأَرْضِ وَلَا رَطْبٍ وَلَا يَابِسٍ إِلَّا فِي كِتَابٍ مُّبِينٍ
అగోచరాల తాళం చెవులు, (ఖజానాలు) అల్లాహ్ వద్దనే ఉన్నాయి. అల్లాహ్‌కు తప్ప ఇతరులెవరికీ వాటి గురించి తెలీదు. భూమిలోనూ, సముద్రాలలోనూ ఉన్న వస్తువులన్నింటి గురించి ఆయనకు తెలుసు. రాలే ఆకు కూడా ఆయనకు తెలీకుండా ఉండదు. నేలలోని చీకటి పొరలలో పడే ఏ గింజ అయినా – పచ్చిది, ఎండినది ఏది పడినా – స్పష్టమైన గ్రంథంలో నమోదై ఉంది.
6:60 وَهُوَ الَّذِي يَتَوَفَّاكُم بِاللَّيْلِ وَيَعْلَمُ مَا جَرَحْتُم بِالنَّهَارِ ثُمَّ يَبْعَثُكُمْ فِيهِ لِيُقْضَىٰ أَجَلٌ مُّسَمًّى ۖ ثُمَّ إِلَيْهِ مَرْجِعُكُمْ ثُمَّ يُنَبِّئُكُم بِمَا كُنتُمْ تَعْمَلُونَ
ఆయనే రాత్రిపూట (ఒకింత) మీ ఆత్మలను స్వాధీనం చేసుకుంటాడు. పగటిపూట మీరు చేసేదంతా ఆయనకు తెలుసు. మళ్లీ ఆయన నిర్థారిత సమయాన్ని పూర్తిచేయడానికి మిమ్మల్ని అందులో మేల్కొలుపుతున్నాడు. ఆ తర్వాత మీరంతా ఆయన వైపుకే మరలిపోవలసి ఉన్నది. ఆ తరువాత మీరు చేస్తూ ఉండిన కర్మలన్నింటినీ ఆయన మీకు తెలుపుతాడు.
6:61 وَهُوَ الْقَاهِرُ فَوْقَ عِبَادِهِ ۖ وَيُرْسِلُ عَلَيْكُمْ حَفَظَةً حَتَّىٰ إِذَا جَاءَ أَحَدَكُمُ الْمَوْتُ تَوَفَّتْهُ رُسُلُنَا وَهُمْ لَا يُفَرِّطُونَ
ఆయన తన దాసులపై తిరుగులేని ఆధిపత్యం గలవాడు. ఆయన మీపై కావలివాళ్ళను పంపుతాడు. చివరకు మీలో ఎవరికయినా మరణ ఘడియ సమీపిస్తే, మేము పంపిన దూతలు అతని ఆత్మను స్వాధీనం చేసుకుంటారు. (ఈ విధి నిర్వహణలో) వారెలాంటి నిర్లక్ష్యం చేయరు.
6:62 ثُمَّ رُدُّوا إِلَى اللَّهِ مَوْلَاهُمُ الْحَقِّ ۚ أَلَا لَهُ الْحُكْمُ وَهُوَ أَسْرَعُ الْحَاسِبِينَ
ఆపైన అందరూ తమ అసలు యజమాని అయిన అల్లాహ్ సన్నిధికి తీసుకురాబడతారు. బాగా వినండి! నిర్ణయాధికారం అల్లాహ్‌దే. ఆయన బహువేగంగా లెక్క తీసుకుంటాడు.
6:63 قُلْ مَن يُنَجِّيكُم مِّن ظُلُمَاتِ الْبَرِّ وَالْبَحْرِ تَدْعُونَهُ تَضَرُّعًا وَخُفْيَةً لَّئِنْ أَنجَانَا مِنْ هَٰذِهِ لَنَكُونَنَّ مِنَ الشَّاكِرِينَ
(ఓ ప్రవక్తా!) వారిని అడుగు: “నేలపై, సముద్రాలపై అలుముకున్న చీకట్లలో నుండి మిమ్మల్ని రక్షించేవాడెవడు? ‘ఆయన గనక మమ్మల్ని ఈ ఆపద నుంచి రక్షిస్తే మేము తప్పకుండా కృతజ్ఞులమై ఉంటామ’ని కడు దీనంగా, లోలోపలే మీరు ఎవరిని వేడుకుంటారు?”
6:64 قُلِ اللَّهُ يُنَجِّيكُم مِّنْهَا وَمِن كُلِّ كَرْبٍ ثُمَّ أَنتُمْ تُشْرِكُونَ
“ఈ విపత్తు నుండీ, అన్ని రకాల దుఃఖాల నుండీ మీకు విముక్తి నొసగేవాడు అల్లాహ్‌యే. అయినాసరే మీరు (మేలును మరిచిపోయి) షిర్కుకు ఒడిగడతారు!” అని చెప్పు.
6:65 قُلْ هُوَ الْقَادِرُ عَلَىٰ أَن يَبْعَثَ عَلَيْكُمْ عَذَابًا مِّن فَوْقِكُمْ أَوْ مِن تَحْتِ أَرْجُلِكُمْ أَوْ يَلْبِسَكُمْ شِيَعًا وَيُذِيقَ بَعْضَكُم بَأْسَ بَعْضٍ ۗ انظُرْ كَيْفَ نُصَرِّفُ الْآيَاتِ لَعَلَّهُمْ يَفْقَهُونَ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “మీ పై నుండి గానీ, మీ పాదాల క్రింది నుంచి గానీ మీపైకి శిక్షను తెచ్చే, లేదా మిమ్మల్ని వర్గాలుగా విడగొట్టి ఒకరి తడాఖాను ఇంకొకరికి చూపించే శక్తి కూడా ఆయనే కలిగి ఉన్నాడు.” వారు వాస్తవాన్ని గ్రహించగలందులకు ఏ విధంగా మేము సూచనలను పలు రీతులుగా వివరిస్తున్నామో చూడు!
6:66 وَكَذَّبَ بِهِ قَوْمُكَ وَهُوَ الْحَقُّ ۚ قُل لَّسْتُ عَلَيْكُم بِوَكِيلٍ
వాస్తవానికి అది సత్యమైనా, నీ జాతి దాన్ని అసత్యమని తిరస్కరిస్తోంది. “మీపై నేను కాపరిగా నియమించబడలేదు” అని (ప్రవక్తా!) వారికి చెప్పు.
6:67 لِّكُلِّ نَبَإٍ مُّسْتَقَرٌّ ۚ وَسَوْفَ تَعْلَمُونَ
ప్రతి ఒక్క వార్తకు (అనగా అది జరగటానికి) ఒక సమయం నిర్థారితమై ఉంది. త్వరలోనే మీకు తెలిసిపోతుంది.
6:68 وَإِذَا رَأَيْتَ الَّذِينَ يَخُوضُونَ فِي آيَاتِنَا فَأَعْرِضْ عَنْهُمْ حَتَّىٰ يَخُوضُوا فِي حَدِيثٍ غَيْرِهِ ۚ وَإِمَّا يُنسِيَنَّكَ الشَّيْطَانُ فَلَا تَقْعُدْ بَعْدَ الذِّكْرَىٰ مَعَ الْقَوْمِ الظَّالِمِينَ
(ఓ ప్రవక్తా!) మా ఆయతులలో లోపాలు వెతికేవారిని నీవు చూసినప్పుడు, వారు (దీనిని వదలి) ఇతర విషయాలపై మాట్లాడనంత వరకూ వారి మధ్య ఉండకు. ఒకవేళ షైతాను నిన్ను మరుపుకు గురిచేస్తే, జ్ఞాపకం వచ్చిన మీదట ఆ దుర్మార్గుల మధ్యన కూర్చోకు.
6:69 وَمَا عَلَى الَّذِينَ يَتَّقُونَ مِنْ حِسَابِهِم مِّن شَيْءٍ وَلَٰكِن ذِكْرَىٰ لَعَلَّهُمْ يَتَّقُونَ
వారి లెక్కల బాధ్యత ఏదీ దైవభీతిపరులపై లేదు. అయితే వారికి హితబోధ చేయటం మాత్రం మానుకోరాదు. ఎందుకంటే బహుశా వారు కూడా దైవభీతిపరులు కావచ్చు.
6:70 وَذَرِ الَّذِينَ اتَّخَذُوا دِينَهُمْ لَعِبًا وَلَهْوًا وَغَرَّتْهُمُ الْحَيَاةُ الدُّنْيَا ۚ وَذَكِّرْ بِهِ أَن تُبْسَلَ نَفْسٌ بِمَا كَسَبَتْ لَيْسَ لَهَا مِن دُونِ اللَّهِ وَلِيٌّ وَلَا شَفِيعٌ وَإِن تَعْدِلْ كُلَّ عَدْلٍ لَّا يُؤْخَذْ مِنْهَا ۗ أُولَٰئِكَ الَّذِينَ أُبْسِلُوا بِمَا كَسَبُوا ۖ لَهُمْ شَرَابٌ مِّنْ حَمِيمٍ وَعَذَابٌ أَلِيمٌ بِمَا كَانُوا يَكْفُرُونَ
(ప్రవక్తా!) ఎవరు తమ ధర్మాన్ని ఆటగా, వినోదంగా చేసుకున్నారో, ఎవరినయితే ప్రాపంచిక జీవితం మోసపుచ్చిందో వారికి దూరంగా ఉండు. అయితే ఈ ఖుర్ఆను ద్వారా వారికి ఉపదేశం మాత్రం చేస్తూ ఉండు. ఏ వ్యక్తీ తన చేష్టల మూలంగా ఇరుక్కుపోయే పరిస్థితి రాకుండా ఉండటానికి, అల్లాహ్ తప్ప వేరెవరూ సహాయం చేయని, సిఫారసు చేసేవాడెవడూ ఉండని దురవస్థ దాపురించకుండా ఉండటానికి, ప్రపంచ మంతటినీ పరిహారంగా ఇచ్చి బయటపడాలని తహతహలాడినా అది అతన్నుంచి స్వీకరించబడని (గడ్డు) స్థితి ఏర్పడకుండా ఉండటానికి గాను (నీవు వారికి బోధపరుస్తూ ఉండాలి సుమా!). తమ చేష్టల మూలంగా (అటువంటి పరిస్థితిలో) చిక్కుకునేవారు వీరే. తమ తిరస్కార వైఖరి కారణంగా వారికి సలసలా కాగే నీరు త్రాగేందుకు ఇవ్వబడుతుంది. ఇంకా వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది.
6:71 قُلْ أَنَدْعُو مِن دُونِ اللَّهِ مَا لَا يَنفَعُنَا وَلَا يَضُرُّنَا وَنُرَدُّ عَلَىٰ أَعْقَابِنَا بَعْدَ إِذْ هَدَانَا اللَّهُ كَالَّذِي اسْتَهْوَتْهُ الشَّيَاطِينُ فِي الْأَرْضِ حَيْرَانَ لَهُ أَصْحَابٌ يَدْعُونَهُ إِلَى الْهُدَى ائْتِنَا ۗ قُلْ إِنَّ هُدَى اللَّهِ هُوَ الْهُدَىٰ ۖ وَأُمِرْنَا لِنُسْلِمَ لِرَبِّ الْعَالَمِينَ
(ఓ ప్రవక్తా!) వారిని అడుగు : ఏమిటీ, మేము అల్లాహ్‌ను వదలి మాకు లాభంగానీ, నష్టంగానీ చేకూర్చలేని వారిని మొరపెట్టుకోవాలా? అల్లాహ్ మాకు సన్మార్గం చూపిన తరువాత షైతానులు ఒక వ్యక్తిని అడవిలో మార్గవిహీనుణ్ణి చేయగా, అతని సహవాసులు కొందరు ఉండి, “మా వద్దకు రా!” అని అతన్ని సన్మార్గం వైపుకు పిలుస్తున్నప్పటికీ, దిక్కులు చూస్తూ ఉండిపోయేవాని మాదిరిగా – మేము సన్మార్గం నుండి వెనుతిరిగి పోవాలా? వారితో ఇలా అను: “యదార్థానికి అల్లాహ్ చూపిన మార్గమే సన్మార్గం. మేము సర్వలోక ప్రభువుకు పూర్తిగా విధేయులు కావాలని మాకు ఆజ్ఞాపించబడింది.”
6:72 وَأَنْ أَقِيمُوا الصَّلَاةَ وَاتَّقُوهُ ۚ وَهُوَ الَّذِي إِلَيْهِ تُحْشَرُونَ
(ఇంకా ఇలా ఆదేశించబడింది:) “నమాజును నెలకొల్పండి, ఆయనకు భయపడండి, ఆఖరికి మీరంతా ఆయన వద్దకే సమీకరించబడతారు.”
6:73 وَهُوَ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ بِالْحَقِّ ۖ وَيَوْمَ يَقُولُ كُن فَيَكُونُ ۚ قَوْلُهُ الْحَقُّ ۚ وَلَهُ الْمُلْكُ يَوْمَ يُنفَخُ فِي الصُّورِ ۚ عَالِمُ الْغَيْبِ وَالشَّهَادَةِ ۚ وَهُوَ الْحَكِيمُ الْخَبِيرُ
ఆయనే ఆకాశాలనూ, భూమినీ సత్యబద్ధంగా సృష్టించాడు. ఏ రోజున ఆయన “అయిపో” అని ఆజ్ఞాపిస్తాడో అప్పుడు అది అయిపోతుంది. ఆయన మాట సత్యమైనది, ప్రభావపూరితమైనది. శంఖం ఊదబడే రోజున, అధికారమంతా ఆయనదే అవుతుంది. ఆయన నిగూఢమైన విషయాలను, బహిర్గతమై వున్న విషయాలనూ ఎరిగినవాడు. ఆయనే వివేక సంపన్నుడు, సర్వమూ తెలిసినవాడు.
6:74 وَإِذْ قَالَ إِبْرَاهِيمُ لِأَبِيهِ آزَرَ أَتَتَّخِذُ أَصْنَامًا آلِهَةً ۖ إِنِّي أَرَاكَ وَقَوْمَكَ فِي ضَلَالٍ مُّبِينٍ
ఇబ్రాహీము తన తండ్రి ఆజరుతో, “ఏమిటీ, నీవు విగ్రహాలను ఆరాధ్య దైవాలుగా చేసుకుంటున్నావా? నువ్వూ, నీ జాతి వారూ నిస్సందేహంగా స్పష్టమైన అపమార్గానికి గురై ఉన్నారని నాకనిపిస్తోంది” అని పలికిన సందర్భం కూడా స్మరించుకోదగినదే.
6:75 وَكَذَٰلِكَ نُرِي إِبْرَاهِيمَ مَلَكُوتَ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَلِيَكُونَ مِنَ الْمُوقِنِينَ
ఈ విధంగానే మేము ఇబ్రాహీముకు భూమ్యాకాశాలలోని సృష్టితాలను చూపించాము. అతనికి దృఢ నమ్మకం కలగాలన్న ఉద్దేశంతోనే అలా చేశాము.
6:76 فَلَمَّا جَنَّ عَلَيْهِ اللَّيْلُ رَأَىٰ كَوْكَبًا ۖ قَالَ هَٰذَا رَبِّي ۖ فَلَمَّا أَفَلَ قَالَ لَا أُحِبُّ الْآفِلِينَ
అతనిపై రాత్రి చీకటి అలుముకున్నప్పుడు, అతను ఒక నక్షత్రాన్ని చూసి, “ఇతనే నా ప్రభువు” అన్నాడు. కాని అది అస్తమించగానే, “అస్తమించే వాటిని నేను అభిమానించను” అని చెప్పాడు.
6:77 فَلَمَّا رَأَى الْقَمَرَ بَازِغًا قَالَ هَٰذَا رَبِّي ۖ فَلَمَّا أَفَلَ قَالَ لَئِن لَّمْ يَهْدِنِي رَبِّي لَأَكُونَنَّ مِنَ الْقَوْمِ الضَّالِّينَ
మరి అతను ప్రకాశిస్తున్న చంద్రుణ్ణి చూసి, “ఇతను నా ప్రభువు” అన్నాడు. కాని అది కూడా అస్తమించటంతో “ఒకవేళ నా ప్రభువు గనక నాకు మార్గదర్శకత్వం వహించకపోతే నేను మార్గవిహీన జనుల్లో చేరిపోతాను” అని పలికాడు.
6:78 فَلَمَّا رَأَى الشَّمْسَ بَازِغَةً قَالَ هَٰذَا رَبِّي هَٰذَا أَكْبَرُ ۖ فَلَمَّا أَفَلَتْ قَالَ يَا قَوْمِ إِنِّي بَرِيءٌ مِّمَّا تُشْرِكُونَ
ఆ తరువాత సూర్యుణ్ణి ప్రకాశిస్తుండగా చూసి, “ఇతనే నా ప్రభువు. ఇతను అందరికన్నా పెద్దవాడు” అని పలికాడు. కాని అది కూడా అస్తమించేసరికి అతనిలా అన్నాడు: “ఓ నా జాతి వారలారా! మీరు (దైవానికి) కల్పించే భాగస్వామ్యాలతో నాకు ఎలాంటి సంబంధం లేదు.
6:79 إِنِّي وَجَّهْتُ وَجْهِيَ لِلَّذِي فَطَرَ السَّمَاوَاتِ وَالْأَرْضَ حَنِيفًا ۖ وَمَا أَنَا مِنَ الْمُشْرِكِينَ
నేను ఆకాశాలను, భూమిని సృష్టించినవాని వైపుకు ఏకాగ్రతతో నా ముఖాన్ని త్రిప్పుకుంటున్నాను. నేను షిర్క్ చేసేవారిలోని వాణ్ణి కాను.”
6:80 وَحَاجَّهُ قَوْمُهُ ۚ قَالَ أَتُحَاجُّونِّي فِي اللَّهِ وَقَدْ هَدَانِ ۚ وَلَا أَخَافُ مَا تُشْرِكُونَ بِهِ إِلَّا أَن يَشَاءَ رَبِّي شَيْئًا ۗ وَسِعَ رَبِّي كُلَّ شَيْءٍ عِلْمًا ۗ أَفَلَا تَتَذَكَّرُونَ
అతని జాతి వారు అతనితో పిడివాదానికి దిగినప్పుడు, అతనిలా అన్నాడు: “ఏమిటీ, మీరు అల్లాహ్ విషయంలో నాతో వాదులాడుతున్నారా? వాస్తవానికి ఆయన నాకు సన్మార్గం చూపించాడు. మీరు కల్పించే సహవర్తులకు నేను ఏమాత్రం భయపడను. అయితే నా ప్రభువు గనక తలిస్తే ఏమైనా జరగవచ్చు. నా ప్రభువు జ్ఞానం అన్నింటినీ ఆవరించి ఉంది. అయినా మీరు గ్రహించరా?”
6:81 وَكَيْفَ أَخَافُ مَا أَشْرَكْتُمْ وَلَا تَخَافُونَ أَنَّكُمْ أَشْرَكْتُم بِاللَّهِ مَا لَمْ يُنَزِّلْ بِهِ عَلَيْكُمْ سُلْطَانًا ۚ فَأَيُّ الْفَرِيقَيْنِ أَحَقُّ بِالْأَمْنِ ۖ إِن كُنتُمْ تَعْلَمُونَ
“అల్లాహ్ మీ వద్దకు ఏ నిదర్శనాన్నీ అవతరింపజేయనప్పటికీ మీరు అల్లాహ్‌కు భాగస్వాములను కల్పించే విషయానికి భయపడటం లేదు. మరి అటువంటప్పుడు అల్లాహ్‌కు సహవర్తులుగా మీరు నిలబెట్టే వాటికి నేనెలా భయపడతాను? కాబట్టి ఈ రెండు పక్షాలలో సురక్షిత స్థితికి అర్హులెవరో మీకు తెలిస్తే కాస్త చెప్పండి.”
6:82 الَّذِينَ آمَنُوا وَلَمْ يَلْبِسُوا إِيمَانَهُم بِظُلْمٍ أُولَٰئِكَ لَهُمُ الْأَمْنُ وَهُم مُّهْتَدُونَ
విశ్వసించి, తమ విశ్వాసాన్ని దుర్మార్గం (షిర్కు)తో కలగా పులగం చేయకుండా ఉండేవారే సురక్షితంగా ఉన్నవారు. సన్మార్గంపై ఉన్నవారు కూడా వారే.
6:83 وَتِلْكَ حُجَّتُنَا آتَيْنَاهَا إِبْرَاهِيمَ عَلَىٰ قَوْمِهِ ۚ نَرْفَعُ دَرَجَاتٍ مَّن نَّشَاءُ ۗ إِنَّ رَبَّكَ حَكِيمٌ عَلِيمٌ
ఇబ్రాహీము (అలైహిస్సలాం) తన జాతి వారిని ఎదుర్కొనటానికిగాను మేము అతనికి ఇచ్చిన మా ‘నిదర్శనం’ ఇది! మేము తలచుకున్నవారి అంతస్తుల్ని పెంచుతాము. నిశ్చయంగా నీ ప్రభువు వివేకవంతుడు, గొప్ప పరిజ్ఞానం కలవాడు.
6:84 وَوَهَبْنَا لَهُ إِسْحَاقَ وَيَعْقُوبَ ۚ كُلًّا هَدَيْنَا ۚ وَنُوحًا هَدَيْنَا مِن قَبْلُ ۖ وَمِن ذُرِّيَّتِهِ دَاوُودَ وَسُلَيْمَانَ وَأَيُّوبَ وَيُوسُفَ وَمُوسَىٰ وَهَارُونَ ۚ وَكَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ
ఇంకా మేము అతనికి ఇస్హాఖును, యాఖూబ్ను ప్రసాదించాము. వారిలో ప్రతి ఒక్కరికీ మేము సన్మార్గం చూపించాము. అంతకు మునుపు మేము నూహ్‌కు సన్మార్గం చూపించి ఉన్నాము. ఇంకా అతని సంతతి వారిలోనుంచి దావూదు సులైమానులకు, అయ్యూబు యూసుఫులకు, మూసా హారూనులకు మేము సన్మార్గం చూపాము. సత్కార్యాలు చేసేవారికి మేము ఇలాగే ప్రతిఫలం ఇస్తూ ఉంటాము.
6:85 وَزَكَرِيَّا وَيَحْيَىٰ وَعِيسَىٰ وَإِلْيَاسَ ۖ كُلٌّ مِّنَ الصَّالِحِينَ
ఇంకా జకరియ్యా, యహ్యా, ఈసా, ఇల్యాస్లకు కూడా (మేము సన్మార్గం చూపించాము.) వారంతా సద్వర్తనుల కోవకు చెందినవారే.
6:86 وَإِسْمَاعِيلَ وَالْيَسَعَ وَيُونُسَ وَلُوطًا ۚ وَكُلًّا فَضَّلْنَا عَلَى الْعَالَمِينَ
ఇంకా – ఇస్మాయీలుకు, యసఆకు, యూనుసు లూతులకు కూడా (మేము మార్గదర్శకత్వం వహించాము). వారిలో ప్రతి ఒక్కరికీ మేము లోకవాసులందరిపై శ్రేష్ఠతను అనుగ్రహించాము.
6:87 وَمِنْ آبَائِهِمْ وَذُرِّيَّاتِهِمْ وَإِخْوَانِهِمْ ۖ وَاجْتَبَيْنَاهُمْ وَهَدَيْنَاهُمْ إِلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ
అంతేకాదు, వారి పితామహులలో (తాత ముత్తాతలలో), వారి సంతానంలో, వారి సహోదరులలో కూడా కొందరిని (మేము కటాక్షించాము.) వారిని (మా సేవకోసం) ఎన్నుకున్నాము. వారిని రుజుమార్గం వైపుకు నడిపించాము.
6:88 ذَٰلِكَ هُدَى اللَّهِ يَهْدِي بِهِ مَن يَشَاءُ مِنْ عِبَادِهِ ۚ وَلَوْ أَشْرَكُوا لَحَبِطَ عَنْهُم مَّا كَانُوا يَعْمَلُونَ
ఇదీ అల్లాహ్ మార్గదర్శకత్వం. ఆయన తన దాసులలో తాను కోరిన వారిని ఈ మార్గంపై నడిపింపజేస్తాడు. ఒకవేళ వీరు సైతం, దైవత్వంలో భాగస్వామ్యానికి (షిర్కుకు) ఒడిగట్టి ఉంటే, వారు చేసుకున్న కర్మలన్నీ కూడా వృధా అయిపోయేవి.
6:89 أُولَٰئِكَ الَّذِينَ آتَيْنَاهُمُ الْكِتَابَ وَالْحُكْمَ وَالنُّبُوَّةَ ۚ فَإِن يَكْفُرْ بِهَا هَٰؤُلَاءِ فَقَدْ وَكَّلْنَا بِهَا قَوْمًا لَّيْسُوا بِهَا بِكَافِرِينَ
మేము గ్రంథాన్నీ, వివేకాన్నీ, ప్రవక్త పదవినీ ప్రసాదించినది వీరికే. ఒకవేళ వారు గనక దానిని తిరస్కరించే పక్షంలో, దానిని తిరస్కరించకుండా ఉండే చాలా మందిని మేము దానికోసం నియమించి ఉన్నాము.
6:90 أُولَٰئِكَ الَّذِينَ هَدَى اللَّهُ ۖ فَبِهُدَاهُمُ اقْتَدِهْ ۗ قُل لَّا أَسْأَلُكُمْ عَلَيْهِ أَجْرًا ۖ إِنْ هُوَ إِلَّا ذِكْرَىٰ لِلْعَالَمِينَ
అల్లాహ్ సన్మార్గం చూపించినటువంటివారు వీరే. కనుక (ఓ ప్రవక్తా!) నువ్వు కూడా వారి మార్గాన్నే అనుసరించు. “దీనికిగాను నేను మీనుండి ఎలాంటి ప్రతిఫలాన్నీ అడగటం లేదు. ఇది సమస్త లోకవాసుల కోసం హితోపదేశం” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు.
6:91 وَمَا قَدَرُوا اللَّهَ حَقَّ قَدْرِهِ إِذْ قَالُوا مَا أَنزَلَ اللَّهُ عَلَىٰ بَشَرٍ مِّن شَيْءٍ ۗ قُلْ مَنْ أَنزَلَ الْكِتَابَ الَّذِي جَاءَ بِهِ مُوسَىٰ نُورًا وَهُدًى لِّلنَّاسِ ۖ تَجْعَلُونَهُ قَرَاطِيسَ تُبْدُونَهَا وَتُخْفُونَ كَثِيرًا ۖ وَعُلِّمْتُم مَّا لَمْ تَعْلَمُوا أَنتُمْ وَلَا آبَاؤُكُمْ ۖ قُلِ اللَّهُ ۖ ثُمَّ ذَرْهُمْ فِي خَوْضِهِمْ يَلْعَبُونَ
“అల్లాహ్ ఏ మానవమాత్రునిపైనా ఎలాంటి విషయాన్నీ అవతరింపజేయలేదు” అని పలికినప్పుడు ఈ (అవిశ్వాస) జనులు అల్లాహ్‌ను అర్థం చేసుకోవలసిన విధంగా అర్థం చేసుకోలేదు. వారిని అడుగు: “మరి మూసా తెచ్చిన ఆ గ్రంథాన్ని ఎవరు అవతరింపజేసినట్టు? ఆ గ్రంథం ఒక జ్యోతి. మానవుల కొరకు మార్గదర్శకత్వం. మీరు దాన్ని వేర్వేరు కాగితాలుగా విభజించి చూపుతున్నారు. ఎన్నో విషయాలను దాచేస్తున్నారు. మీకుగానీ, మీ పెద్దలకుగానీ తెలియని ఎన్నో విషయాలు (ఇందు మూలంగా) మీకు నేర్పబడ్డాయి.” దాన్ని అవతరింపజేసిన వాడు అల్లాహ్‌యే అని చెప్పు. ఆ తర్వాత వాళ్లను వారి వ్యర్థ విషయాలలోనే ఆడుకోనివ్వు.
6:92 وَهَٰذَا كِتَابٌ أَنزَلْنَاهُ مُبَارَكٌ مُّصَدِّقُ الَّذِي بَيْنَ يَدَيْهِ وَلِتُنذِرَ أُمَّ الْقُرَىٰ وَمَنْ حَوْلَهَا ۚ وَالَّذِينَ يُؤْمِنُونَ بِالْآخِرَةِ يُؤْمِنُونَ بِهِ ۖ وَهُمْ عَلَىٰ صَلَاتِهِمْ يُحَافِظُونَ
ఇది కూడా మేము అవతరింపజేసిన గ్రంథమే. ఎంతో శుభప్రదమైనది, తనకంటే ముందున్న గ్రంథాలను ధృవీకరించేది. నీవు మక్కా (ఉమ్ముల్ ఖురా) వారినీ, దాని పరిసరాల వారిని హెచ్చరించటానికిగాను (దీనిని అవతరింపజేశాము). పరలోకంపై దృఢ విశ్వాసం ఉన్నవారు దీనిని విశ్వసిస్తారు; వారు తమ నమాజులను జాగ్రత్తగా కాపాడుకునేవారై ఉంటారు.
6:93 وَمَنْ أَظْلَمُ مِمَّنِ افْتَرَىٰ عَلَى اللَّهِ كَذِبًا أَوْ قَالَ أُوحِيَ إِلَيَّ وَلَمْ يُوحَ إِلَيْهِ شَيْءٌ وَمَن قَالَ سَأُنزِلُ مِثْلَ مَا أَنزَلَ اللَّهُ ۗ وَلَوْ تَرَىٰ إِذِ الظَّالِمُونَ فِي غَمَرَاتِ الْمَوْتِ وَالْمَلَائِكَةُ بَاسِطُو أَيْدِيهِمْ أَخْرِجُوا أَنفُسَكُمُ ۖ الْيَوْمَ تُجْزَوْنَ عَذَابَ الْهُونِ بِمَا كُنتُمْ تَقُولُونَ عَلَى اللَّهِ غَيْرَ الْحَقِّ وَكُنتُمْ عَنْ آيَاتِهِ تَسْتَكْبِرُونَ
అల్లాహ్‌పై అబద్ధాన్ని కల్పించేవాడికంటే, లేదా తనపై ఎలాంటి వహీ అవతరించకపోయినప్పటికీ ‘నాపై వహీ అవతరించింది’ అని చెప్పే వానికంటే లేదా అల్లాహ్ అవతరింపజేసినటువంటిదే ‘నేను కూడా అవతరింపజేస్తాను’ అని అనేవాడి కంటే పరమ దుర్మార్గుడు ఎవడుంటాడు? ఈ దుర్మార్గులు మరణ యాతనలో ఉన్నప్పుడు, దైవదూతలు తమ చేతులు చాచి, “సరే! ఇక మీ ప్రాణాలు (బయటికి) తీయండి. మీరు అల్లాహ్‌కు అబద్ధాలను ఆపాదించినందుకూ, అల్లాహ్ ఆయతుల పట్ల గర్వాతిశయంతో విర్రవీగినందుకుగాను ఈ రోజు మీకు పరాభవంతో కూడిన శిక్ష విధించబడుతుంది” అని చెబుతుండగా (ఆ దృశ్యాన్ని) నీవు చూడగలిగితే ఎంత బావుండు!
6:94 وَلَقَدْ جِئْتُمُونَا فُرَادَىٰ كَمَا خَلَقْنَاكُمْ أَوَّلَ مَرَّةٍ وَتَرَكْتُم مَّا خَوَّلْنَاكُمْ وَرَاءَ ظُهُورِكُمْ ۖ وَمَا نَرَىٰ مَعَكُمْ شُفَعَاءَكُمُ الَّذِينَ زَعَمْتُمْ أَنَّهُمْ فِيكُمْ شُرَكَاءُ ۚ لَقَد تَّقَطَّعَ بَيْنَكُمْ وَضَلَّ عَنكُم مَّا كُنتُمْ تَزْعُمُونَ
మేము మిమ్మల్ని మొదటిసారి పుట్టించినట్లుగానే, మీరు మా సన్నిధికి ఒంటరిగా వచ్చారు. మేము మీకు ప్రసాదించిన దాన్నంతా మీ వెనుకే వదిలేసి వచ్చారు. మీ వ్యవహారాలలో మాకు భాగస్వాములని మీరు భావించిన మీ సిఫారసుదారులను కూడా ఇప్పుడు మేము మీవెంట చూడటం లేదు! నిజంగానే వారికీ – మీకూ మధ్య గల సంబంధాలన్నీ తెగిపోయాయి. మీరు నమ్ముతూ ఉన్నదంతా మీకు కనిపించకుండా పోయింది.
6:95 إِنَّ اللَّهَ فَالِقُ الْحَبِّ وَالنَّوَىٰ ۖ يُخْرِجُ الْحَيَّ مِنَ الْمَيِّتِ وَمُخْرِجُ الْمَيِّتِ مِنَ الْحَيِّ ۚ ذَٰلِكُمُ اللَّهُ ۖ فَأَنَّىٰ تُؤْفَكُونَ
నిస్సందేహంగా విత్తనాన్ని, టెంకను చీల్చేవాడు అల్లాహ్‌యే. ఆయన జీవమున్న దానిని జీవములేని దానిలో నుంచి తీస్తాడు. జీవములేని దానిని జీవమున్న దానిలో నుంచి తీసేవాడూ ఆయనే. ఆయనే అల్లాహ్. మరలాంటప్పుడు మీరు (సత్యం నుండి) ఎటు మరలిపోతున్నారు?
6:96 فَالِقُ الْإِصْبَاحِ وَجَعَلَ اللَّيْلَ سَكَنًا وَالشَّمْسَ وَالْقَمَرَ حُسْبَانًا ۚ ذَٰلِكَ تَقْدِيرُ الْعَزِيزِ الْعَلِيمِ
ఉదయాన్ని వెలికి తీసేవాడు ఆయనే. ఇంకా ఆయన రాత్రిని విశ్రాంతి సమయంగా చేశాడు. సూర్యచంద్రుల లెక్కను నిర్థారించాడు. ఇదంతా సర్వాధిక్యుడు, మహాజ్ఞాని (అయిన అల్లాహ్) చేసిన నిర్థారణ.
6:97 وَهُوَ الَّذِي جَعَلَ لَكُمُ النُّجُومَ لِتَهْتَدُوا بِهَا فِي ظُلُمَاتِ الْبَرِّ وَالْبَحْرِ ۗ قَدْ فَصَّلْنَا الْآيَاتِ لِقَوْمٍ يَعْلَمُونَ
చీకట్లలోనూ, భూమిలోనూ, సముద్రంలోనూ మీరు మార్గం తెలుసుకునేందుకుగాను ఆయనే మీ కోసం నక్షత్రాలను సృష్టించాడు. మేము జ్ఞానం కలవారి కోసం మా సూచనలను బాగా విడమరచి చెప్పాము.
6:98 وَهُوَ الَّذِي أَنشَأَكُم مِّن نَّفْسٍ وَاحِدَةٍ فَمُسْتَقَرٌّ وَمُسْتَوْدَعٌ ۗ قَدْ فَصَّلْنَا الْآيَاتِ لِقَوْمٍ يَفْقَهُونَ
ఇంకా, మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి పుట్టించినవాడు ఆయనే. మరి ఒక స్థలం ఎక్కువ కాలం ఉండేదీ, ఇంకొక స్థలం తక్కువ కాలం ఉండేదిగా నిర్థారించబడింది. అర్థం చేసుకోగలిగే వారి కోసం మేము మా సూచనలను స్పష్టంగా వివరించాము.
6:99 وَهُوَ الَّذِي أَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَأَخْرَجْنَا بِهِ نَبَاتَ كُلِّ شَيْءٍ فَأَخْرَجْنَا مِنْهُ خَضِرًا نُّخْرِجُ مِنْهُ حَبًّا مُّتَرَاكِبًا وَمِنَ النَّخْلِ مِن طَلْعِهَا قِنْوَانٌ دَانِيَةٌ وَجَنَّاتٍ مِّنْ أَعْنَابٍ وَالزَّيْتُونَ وَالرُّمَّانَ مُشْتَبِهًا وَغَيْرَ مُتَشَابِهٍ ۗ انظُرُوا إِلَىٰ ثَمَرِهِ إِذَا أَثْمَرَ وَيَنْعِهِ ۚ إِنَّ فِي ذَٰلِكُمْ لَآيَاتٍ لِّقَوْمٍ يُؤْمِنُونَ
ఇంకా – ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించినవాడు ఆయనే. ఆ తరువాత దాని ద్వారా మేము అన్నిరకాల మొక్కల్ని వెలికి తీశాము. ఆపైన మేము పచ్చని కొమ్మను సృజించాము. దాని ద్వారా మేము ఒకదానిపై ఒకటి పేరుకుని ఉన్న గింజలు గల పంటల్ని పండిస్తాము. ఖర్జూర చెట్ల నుంచి, అంటే వాటి పాళి నుండి క్రిందికి వ్రేలాడే పండ్ల గెలలను, ద్రాక్ష తోటలను, జైతూనును (ఆలివ్ పండ్లను), దానిమ్మ కాయలను ఉత్పన్నం చేశాము. వాటిలో కొన్ని ఒక దానిని ఇంకొకటి పోలి ఉంటాయి. మరికొన్ని పోలి ఉండవు. ప్రతి చెట్టుకు కాసినకాయ పెరిగి పెద్దదవుతున్నప్పుడు, అది పండుతున్నప్పుడు కాస్త నిశిత దృష్టితో చూడండి! నమ్మేవారి కోసం వీటిలో నిదర్శనాలున్నాయి.
6:100 وَجَعَلُوا لِلَّهِ شُرَكَاءَ الْجِنَّ وَخَلَقَهُمْ ۖ وَخَرَقُوا لَهُ بَنِينَ وَبَنَاتٍ بِغَيْرِ عِلْمٍ ۚ سُبْحَانَهُ وَتَعَالَىٰ عَمَّا يَصِفُونَ
ప్రజలు జిన్నాతులను అల్లాహ్‌కు భాగస్వాములుగా ఖరారు చేసుకున్నారు. మరి చూడబోతే వాళ్లను సృష్టించింది కూడా ఆయనే. అంతేకాదు, వీళ్లు ఎటువంటి జ్ఞానం లేకుండానే ఆయనకు కుమారులను, కుమార్తెలను కూడా కల్పించారు. వాస్తవానికి వీళ్లు చెప్పే ఈ మాటలకు ఆయన పవిత్రుడు, ఉన్నతుడు.
6:101 بَدِيعُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ أَنَّىٰ يَكُونُ لَهُ وَلَدٌ وَلَمْ تَكُن لَّهُ صَاحِبَةٌ ۖ وَخَلَقَ كُلَّ شَيْءٍ ۖ وَهُوَ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ
ఆకాశాలను, భూమినీ ఆవిష్కరించినవాడు ఆయనే. అల్లాహ్‌కు భార్యయే లేనపుడు ఆయనకు సంతానం ఎలా కలుగుతుంది? ఆయన ప్రతి వస్తువునూ సృష్టించాడు. ఆయనకు ప్రతిదీ బాగా తెలుసు.
6:102 ذَٰلِكُمُ اللَّهُ رَبُّكُمْ ۖ لَا إِلَٰهَ إِلَّا هُوَ ۖ خَالِقُ كُلِّ شَيْءٍ فَاعْبُدُوهُ ۚ وَهُوَ عَلَىٰ كُلِّ شَيْءٍ وَكِيلٌ
ఆయనే అల్లాహ్. మీ ప్రభువు. ఆయన తప్ప మరొకరెవరూ ఆరాధ్యులు కారు. సమస్త వస్తువులను సృష్టించినవాడు ఆయనే. కాబట్టి మీరు ఆయన్నే ఆరాధించండి. అన్ని విషయాల కార్యసాధకుడు ఆయనే.
6:103 لَّا تُدْرِكُهُ الْأَبْصَارُ وَهُوَ يُدْرِكُ الْأَبْصَارَ ۖ وَهُوَ اللَّطِيفُ الْخَبِيرُ
ఎవరి చూపులు కూడా ఆయన్ని అందుకోజాలవు. ఆయన మాత్రం అందరి చూపులను అందుకోగలడు. ఆయన సూక్ష్మదృష్టి కలవాడు. సర్వమూ తెలిసినవాడు.
6:104 قَدْ جَاءَكُم بَصَائِرُ مِن رَّبِّكُمْ ۖ فَمَنْ أَبْصَرَ فَلِنَفْسِهِ ۖ وَمَنْ عَمِيَ فَعَلَيْهَا ۚ وَمَا أَنَا عَلَيْكُم بِحَفِيظٍ
“నిస్సందేహంగా మీ వద్దకు మీ ప్రభువు తరఫునుంచి సత్యాన్ని దర్శించే సూచనలు వచ్చేశాయి. కనుక దాన్ని చూసిన వాడు తనకు లాభం చేకూర్చుకుంటాడు. గ్రుడ్డిగా వ్యవహరిస్తే తనకే నష్టం. నేను మాత్రం మీపై రక్షకుణ్ణి కాను” (అని ఓ ప్రవక్తా! చెప్పు).
6:105 وَكَذَٰلِكَ نُصَرِّفُ الْآيَاتِ وَلِيَقُولُوا دَرَسْتَ وَلِنُبَيِّنَهُ لِقَوْمٍ يَعْلَمُونَ
ఈ విధంగా మేము సూచనలను విభిన్న కోణాల నుంచి విశదీకరిస్తూ ఉంటాము- “నీవు ఎవరి వద్దనో పాఠాలు నేర్చుకున్నావు” అని వారు చెప్పేటందుకు, దాన్ని విజ్ఞులకు బాగా స్పష్టపరచేటందుకుగాను (మేమిలా చేస్తాము).
6:106 اتَّبِعْ مَا أُوحِيَ إِلَيْكَ مِن رَّبِّكَ ۖ لَا إِلَٰهَ إِلَّا هُوَ ۖ وَأَعْرِضْ عَنِ الْمُشْرِكِينَ
ఓ ప్రవక్తా! నీవు మాత్రం నీ ప్రభువు తరఫు నుంచి నీ వద్దకు వహీ ద్వారా పంపబడుతున్న విధానాన్ని అనుసరిస్తూ ఉండు. ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. ముష్రిక్కులను పట్టించుకోకు.
6:107 وَلَوْ شَاءَ اللَّهُ مَا أَشْرَكُوا ۗ وَمَا جَعَلْنَاكَ عَلَيْهِمْ حَفِيظًا ۖ وَمَا أَنتَ عَلَيْهِم بِوَكِيلٍ
అల్లాహ్ గనక తలచుకుని ఉంటే వారు షిర్క్‌కు ఒడిగట్టే వారే కారు. మేము నిన్ను వాళ్ళపై కావలివానిగా నియమించలేదు. నువ్వు వారి వ్యవహారాలకు బాధ్యుడవూ కావు.
6:108 وَلَا تَسُبُّوا الَّذِينَ يَدْعُونَ مِن دُونِ اللَّهِ فَيَسُبُّوا اللَّهَ عَدْوًا بِغَيْرِ عِلْمٍ ۗ كَذَٰلِكَ زَيَّنَّا لِكُلِّ أُمَّةٍ عَمَلَهُمْ ثُمَّ إِلَىٰ رَبِّهِم مَّرْجِعُهُمْ فَيُنَبِّئُهُم بِمَا كَانُوا يَعْمَلُونَ
వారు అల్లాహ్‌ను వదలి వేడుకునే వారిని మీరు దూషించకండి. ఎందుకంటే దీనికి బదులుగా వారు కూడా తమ అజ్ఞానం చేత మితిమీరిపోయి అల్లాహ్‌ను దూషిస్తారు. ఈ విధంగానే మేము అన్ని సమాజాలవారికీ వారి పనులు అందమైనవిగా చేశాము. తర్వాత వారంతా తమ ప్రభువు వద్దకే మరలి వెళతారు. అప్పుడు ఆయన, వారు చేస్తూ ఉన్నదేమిటో వారికి ఎరుక పరుస్తాడు.
6:109 وَأَقْسَمُوا بِاللَّهِ جَهْدَ أَيْمَانِهِمْ لَئِن جَاءَتْهُمْ آيَةٌ لَّيُؤْمِنُنَّ بِهَا ۚ قُلْ إِنَّمَا الْآيَاتُ عِندَ اللَّهِ ۖ وَمَا يُشْعِرُكُمْ أَنَّهَا إِذَا جَاءَتْ لَا يُؤْمِنُونَ
వీళ్లు అల్లాహ్‌పై అతి గట్టిగా ప్రమాణం చేస్తూ, తమ వద్దకు ఏదైనా సూచన గనక వస్తే తప్పకుండా విశ్వసిస్తామని అన్నారు. (ఓ ప్రవక్తా!) “సూచనలన్నీ అల్లాహ్ అధీనంలో ఉన్నాయి” అని వారికి చెప్పు. నీకేం తెలుసు? ఒకవేళ ఆ సూచనలు వచ్చినప్పటికీ వీళ్లు మాత్రం విశ్వసించేవారు కారు.
6:110 وَنُقَلِّبُ أَفْئِدَتَهُمْ وَأَبْصَارَهُمْ كَمَا لَمْ يُؤْمِنُوا بِهِ أَوَّلَ مَرَّةٍ وَنَذَرُهُمْ فِي طُغْيَانِهِمْ يَعْمَهُونَ
తొలిసారి ఏ విధంగానయితే వీళ్లు దీనిని విశ్వసించలేదో అదే విధంగా మేము కూడా వీళ్ల హృదయాలను, వీళ్ల చూపులను తిప్పివేస్తాము. వారిని వారి తలబిరుసుతనంలోనే, దారితప్పి తిరిగేలా వదలిపెడతాము.
6:111 وَلَوْ أَنَّنَا نَزَّلْنَا إِلَيْهِمُ الْمَلَائِكَةَ وَكَلَّمَهُمُ الْمَوْتَىٰ وَحَشَرْنَا عَلَيْهِمْ كُلَّ شَيْءٍ قُبُلًا مَّا كَانُوا لِيُؤْمِنُوا إِلَّا أَن يَشَاءَ اللَّهُ وَلَٰكِنَّ أَكْثَرَهُمْ يَجْهَلُونَ
మేము వాళ్ళ దగ్గరికి దూతలను పంపించినా, మృతులు వారితో మాట్లాడినా, సమస్త వస్తువులను మేము వారి కళ్ళ ఎదుటే తెచ్చిపెట్టినా వాళ్ళు విశ్వసించటమనేది కల్ల. ఒకవేళ అల్లాహ్ తలిస్తే అది వేరే విషయం. అయితే వీళ్ళలో చాలామంది అజ్ఞానపు మాటలు మాట్లాడేవారే.
6:112 وَكَذَٰلِكَ جَعَلْنَا لِكُلِّ نَبِيٍّ عَدُوًّا شَيَاطِينَ الْإِنسِ وَالْجِنِّ يُوحِي بَعْضُهُمْ إِلَىٰ بَعْضٍ زُخْرُفَ الْقَوْلِ غُرُورًا ۚ وَلَوْ شَاءَ رَبُّكَ مَا فَعَلُوهُ ۖ فَذَرْهُمْ وَمَا يَفْتَرُونَ
ఇదే విధంగా మేము ప్రతి ప్రవక్తకూ జిన్నులలోని షైతానులను, మనుషులలోని షైతానులను శత్రువులుగా చేశాము. వారిలోని కొందరు మరి కొందరిని మోసపుచ్చటానికి ముచ్చట గొలిపే మాటలతో ప్రేరేపిస్తుంటారు. నీ ప్రభువే గనక తలచుకుంటే వారెన్నటికీ అలా చేయలేరు. కాబట్టి వాళ్ళను, వారి కల్పనలను వదలివెయ్యి.
6:113 وَلِتَصْغَىٰ إِلَيْهِ أَفْئِدَةُ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ وَلِيَرْضَوْهُ وَلِيَقْتَرِفُوا مَا هُم مُّقْتَرِفُونَ
పరలోకాన్ని విశ్వసించని వారి మనసులు దానివైపుకు మొగ్గాలనీ, దానిని ఇష్టపడాలనీ, తాము ఒడిగట్టిన పాపాలకు వారు కూడా ఒడిగట్టాలని (వారీ మాయోపాయాలు చేస్తున్నారు).
6:114 أَفَغَيْرَ اللَّهِ أَبْتَغِي حَكَمًا وَهُوَ الَّذِي أَنزَلَ إِلَيْكُمُ الْكِتَابَ مُفَصَّلًا ۚ وَالَّذِينَ آتَيْنَاهُمُ الْكِتَابَ يَعْلَمُونَ أَنَّهُ مُنَزَّلٌ مِّن رَّبِّكَ بِالْحَقِّ ۖ فَلَا تَكُونَنَّ مِنَ الْمُمْتَرِينَ
ఏమిటీ, నేను అల్లాహ్‌ను కాకుండా ఇంకొక న్యాయనిర్ణేతను వెతకాలా? యదార్థానికి ఆయన ఒక సంపూర్ణ గ్రంథాన్ని మీ వద్దకు పంపి ఉన్నాడు. అందలి విషయాలు స్పష్టంగా విపులీకరించబడ్డాయి. మేము ఎవరికి గ్రంథం వొసగామో వారికి, ఈ గ్రంథం నీ ప్రభువు తరఫు నుంచి సత్యసమేతంగా వచ్చిందన్న విషయం బాగా తెలుసు. కాబట్టి (ఓ ప్రవక్తా!) నువ్వు శంకించేవారిలో చేరిపోకు.
6:115 وَتَمَّتْ كَلِمَتُ رَبِّكَ صِدْقًا وَعَدْلًا ۚ لَّا مُبَدِّلَ لِكَلِمَاتِهِ ۚ وَهُوَ السَّمِيعُ الْعَلِيمُ
సత్యం రీత్యా, న్యాయం రీత్యా నీ ప్రభువు వాక్కు సంపూర్ణమైనది. ఆయన వాక్కులను మార్చగలవాడెవడూ లేడు. ఆయన ప్రతిదీ వినేవాడు, ప్రతిదీ తెలిసినవాడు.
6:116 وَإِن تُطِعْ أَكْثَرَ مَن فِي الْأَرْضِ يُضِلُّوكَ عَن سَبِيلِ اللَّهِ ۚ إِن يَتَّبِعُونَ إِلَّا الظَّنَّ وَإِنْ هُمْ إِلَّا يَخْرُصُونَ
(ఓ ప్రవక్తా!) భూమిపై నివసించే అధిక సంఖ్యాకులు చెప్పినట్లుగా నీవు మసలుకున్నావంటే వారు నిన్ను అల్లాహ్ మార్గం నుంచి అపమార్గం పట్టిస్తారు. వారు వట్టి ఊహలను అనుసరిస్తారు. కేవలం అంచనాలతో మాట్లాడతారు.
6:117 إِنَّ رَبَّكَ هُوَ أَعْلَمُ مَن يَضِلُّ عَن سَبِيلِهِ ۖ وَهُوَ أَعْلَمُ بِالْمُهْتَدِينَ
తన దారిలో నుంచి పెడదారి తీసే వారెవరో నీ ప్రభువుకు బాగా తెలుసు. తన మార్గంపై నడిచేవారెవరో కూడా ఆయనకు బాగా తెలుసు.
6:118 فَكُلُوا مِمَّا ذُكِرَ اسْمُ اللَّهِ عَلَيْهِ إِن كُنتُم بِآيَاتِهِ مُؤْمِنِينَ
కనుక అల్లాహ్ ఆదేశాలపై మీకు గనక విశ్వాసముంటే అల్లాహ్ పేరు స్మరించబడిన జంతువు మాంసాన్ని తినండి.
6:119 وَمَا لَكُمْ أَلَّا تَأْكُلُوا مِمَّا ذُكِرَ اسْمُ اللَّهِ عَلَيْهِ وَقَدْ فَصَّلَ لَكُم مَّا حَرَّمَ عَلَيْكُمْ إِلَّا مَا اضْطُرِرْتُمْ إِلَيْهِ ۗ وَإِنَّ كَثِيرًا لَّيُضِلُّونَ بِأَهْوَائِهِم بِغَيْرِ عِلْمٍ ۗ إِنَّ رَبَّكَ هُوَ أَعْلَمُ بِالْمُعْتَدِينَ
అల్లాహ్ పేరు ఉచ్చరించబడిన జంతువు మాంసాన్ని మీరు తినకపోవటానికి అసలు కారణం ఏమిటీ? అల్లాహ్ మీ కొరకు నిషేధించిన జంతువుల వివరాలను ముందుగానే స్పష్టపరిచాడు కదా! గత్యంతరం లేని పరిస్థితుల్లో అవి కూడా (ప్రాణరక్షణ కోసం నిషిద్ధ జంతువులు సయితం) మీకోసం ధర్మ సమ్మతం అవుతాయి. వాస్తవమేమిటంటే చాలా మంది ఏ ప్రమాణమూ లేకుండానే – తమ కోరికల ఆధారంగా – జనులను పెడత్రోవ పట్టిస్తూ ఉంటారు. నిశ్చయంగా నియమాలను ఉల్లంఘించే వారిని నీ ప్రభువు బాగా ఎరుగు.
6:120 وَذَرُوا ظَاهِرَ الْإِثْمِ وَبَاطِنَهُ ۚ إِنَّ الَّذِينَ يَكْسِبُونَ الْإِثْمَ سَيُجْزَوْنَ بِمَا كَانُوا يَقْتَرِفُونَ
మీరు బహిరంగ పాపాలనూ, గోప్యమైన పాపాలను కూడా విడనాడండి. పాపాలకు ఒడిగట్టేవారికి అతి త్వరలోనే వారు చేసుకున్నదానికి శిక్ష పడి తీరుతుంది.
6:121 وَلَا تَأْكُلُوا مِمَّا لَمْ يُذْكَرِ اسْمُ اللَّهِ عَلَيْهِ وَإِنَّهُ لَفِسْقٌ ۗ وَإِنَّ الشَّيَاطِينَ لَيُوحُونَ إِلَىٰ أَوْلِيَائِهِمْ لِيُجَادِلُوكُمْ ۖ وَإِنْ أَطَعْتُمُوهُمْ إِنَّكُمْ لَمُشْرِكُونَ
అల్లాహ్ పేరు స్మరించబడని జంతువులను తినకండి. ఎందుకంటే ఇది ఆజ్ఞోల్లంఘన క్రిందికి వస్తుంది. మీతో వాదులాడటానికి షైతానులు తమ మిత్రులను ఉసిగొల్పుతుంటారు. ఒకవేళ మీరు గనక వారిని అనుసరించారంటే మీరు కూడా అల్లాహ్‌కు సహవర్తుల్ని కల్పించినవారు (ముష్రిక్కులు) అయిపోతారు (జాగ్రత్త!).
6:122 أَوَمَن كَانَ مَيْتًا فَأَحْيَيْنَاهُ وَجَعَلْنَا لَهُ نُورًا يَمْشِي بِهِ فِي النَّاسِ كَمَن مَّثَلُهُ فِي الظُّلُمَاتِ لَيْسَ بِخَارِجٍ مِّنْهَا ۚ كَذَٰلِكَ زُيِّنَ لِلْكَافِرِينَ مَا كَانُوا يَعْمَلُونَ
మృతుడుగా ఉన్న ఒక వ్యక్తికి మేము జీవితం ప్రసాదించి, అతనికి జ్యోతి నొసగగా, దానిని పుచ్చుకుని అతను జనుల మధ్య సంచరిస్తున్నాడు. ఇలాంటి వ్యక్తి, కటిక చీకట్లలో కూరుకుపోయి వాటి నుండి ఏమాత్రం బయటపడలేని వ్యక్తి లాంటివాడా? ఇదే విధంగా సత్యతిరస్కారులకు వారి పనులు వారికెంతో అందమైనవిగా తోస్తాయి.
6:123 وَكَذَٰلِكَ جَعَلْنَا فِي كُلِّ قَرْيَةٍ أَكَابِرَ مُجْرِمِيهَا لِيَمْكُرُوا فِيهَا ۖ وَمَا يَمْكُرُونَ إِلَّا بِأَنفُسِهِمْ وَمَا يَشْعُرُونَ
ఇదే విధంగా మేము ప్రతి పట్టణంలోనూ అక్కడి సర్దారులనే అపరాధాలకు ఒడిగట్టేవారుగా చేశాము – అక్కడ వారు తమ పన్నాగాలు పన్నటానికి! వాస్తవానికి వారు తమను తామే వంచించుకుంటున్నారు. కాని వారికి ఆ సంగతి తెలియటం లేదు.
6:124 وَإِذَا جَاءَتْهُمْ آيَةٌ قَالُوا لَن نُّؤْمِنَ حَتَّىٰ نُؤْتَىٰ مِثْلَ مَا أُوتِيَ رُسُلُ اللَّهِ ۘ اللَّهُ أَعْلَمُ حَيْثُ يَجْعَلُ رِسَالَتَهُ ۗ سَيُصِيبُ الَّذِينَ أَجْرَمُوا صَغَارٌ عِندَ اللَّهِ وَعَذَابٌ شَدِيدٌ بِمَا كَانُوا يَمْكُرُونَ
వారి వద్దకు ఏదైనా సూచన వచ్చినప్పుడు, “దైవప్రవక్తలకు ఇవ్వబడినదే మాకూ ఇవ్వబడనంతవరకూ మేము విశ్వసించేది లేదు” అని వారు అంటారు. తన దౌత్యాన్ని ఎవరికి అందజేయాలో అల్లాహ్‌కే బాగా తెలుసు. అతి త్వరలోనే అపరాధులు అల్లాహ్ వద్దకు చేరుకుని పరాభవాన్నీ, తమ దుష్టపన్నాగాలకు గాను కఠినాతి కఠినమైన శిక్షను అనుభవిస్తారు.
6:125 فَمَن يُرِدِ اللَّهُ أَن يَهْدِيَهُ يَشْرَحْ صَدْرَهُ لِلْإِسْلَامِ ۖ وَمَن يُرِدْ أَن يُضِلَّهُ يَجْعَلْ صَدْرَهُ ضَيِّقًا حَرَجًا كَأَنَّمَا يَصَّعَّدُ فِي السَّمَاءِ ۚ كَذَٰلِكَ يَجْعَلُ اللَّهُ الرِّجْسَ عَلَى الَّذِينَ لَا يُؤْمِنُونَ
కనుక అల్లాహ్, తాను సన్మార్గ భాగ్యం ప్రసాదించదలచిన వ్యక్తి హృదయాన్ని ఇస్లాం కొరకు విప్పుతాడు. అలాగే తాను అపమార్గాన వదిలేయదలచిన వ్యక్తి హృదయాన్ని ఆకాశానికెక్కే వానిలాగా కుంచింపజేస్తాడు. ఈ విధంగా అల్లాహ్ విశ్వసించని వారికి మాలిన్యాన్ని అంటగడతాడు.
6:126 وَهَٰذَا صِرَاطُ رَبِّكَ مُسْتَقِيمًا ۗ قَدْ فَصَّلْنَا الْآيَاتِ لِقَوْمٍ يَذَّكَّرُونَ
ఇదే నీ ప్రభువు యొక్క రుజుమార్గం. ఉపదేశాన్ని స్వీకరించే వారి కోసం మేము ఈ ఆయతులను స్పష్టంగా విడమరచి చెప్పాము.
6:127 لَهُمْ دَارُ السَّلَامِ عِندَ رَبِّهِمْ ۖ وَهُوَ وَلِيُّهُم بِمَا كَانُوا يَعْمَلُونَ
వారి కొరకు వారి ప్రభువు వద్ద శాంతి నిలయం ఉంది. వారి మంచి పనుల మూలంగా అల్లాహ్ వారికి రక్షకునిగా నిలుస్తాడు.
6:128 وَيَوْمَ يَحْشُرُهُمْ جَمِيعًا يَا مَعْشَرَ الْجِنِّ قَدِ اسْتَكْثَرْتُم مِّنَ الْإِنسِ ۖ وَقَالَ أَوْلِيَاؤُهُم مِّنَ الْإِنسِ رَبَّنَا اسْتَمْتَعَ بَعْضُنَا بِبَعْضٍ وَبَلَغْنَا أَجَلَنَا الَّذِي أَجَّلْتَ لَنَا ۚ قَالَ النَّارُ مَثْوَاكُمْ خَالِدِينَ فِيهَا إِلَّا مَا شَاءَ اللَّهُ ۗ إِنَّ رَبَّكَ حَكِيمٌ عَلِيمٌ
అల్లాహ్ వారందరినీ సమీకరించే రోజు, “ఓ జిన్నాతు వర్గీయులారా! మీరు మనుషుల్లోని చాలామందిని మీవారుగా చేసుకున్నారు” అని అంటాడు. అప్పుడు వారితో సంబంధాలు పెట్టుకుని ఉన్న మనుషులు ఇలా అంటారు: “మా ప్రభూ! మేము ఒండొకరి ద్వారా లబ్ది పొందిన సంగతి నిజమే. ఎట్టకేలకు నీవు మా కోసం నిర్థారించిన గడువుకు మేము చేరుకున్నాము.” అప్పుడు అల్లాహ్ ఇలా అంటాడు: “ఇక నరకమే మీ అందరి నివాస స్థలం. అందులోనే మీరు కలకాలం పడి ఉంటారు. అయితే అల్లాహ్ ఏదయినా తలిస్తే అది వేరే విషయం” నిస్సందేహంగా నీ ప్రభువు వివేక సంపన్నుడు, జ్ఞానవంతుడు.
6:129 وَكَذَٰلِكَ نُوَلِّي بَعْضَ الظَّالِمِينَ بَعْضًا بِمَا كَانُوا يَكْسِبُونَ
ఈ విధంగా కొందరు దుర్మార్గులను (కాఫిర్లను) మేము- వారు చేసుకున్న కర్మల కారణంగా – మరి కొందరికి సన్నిహితులుగా చేస్తాము.
6:130 يَا مَعْشَرَ الْجِنِّ وَالْإِنسِ أَلَمْ يَأْتِكُمْ رُسُلٌ مِّنكُمْ يَقُصُّونَ عَلَيْكُمْ آيَاتِي وَيُنذِرُونَكُمْ لِقَاءَ يَوْمِكُمْ هَٰذَا ۚ قَالُوا شَهِدْنَا عَلَىٰ أَنفُسِنَا ۖ وَغَرَّتْهُمُ الْحَيَاةُ الدُّنْيَا وَشَهِدُوا عَلَىٰ أَنفُسِهِمْ أَنَّهُمْ كَانُوا كَافِرِينَ
ఓ జిన్నాతు మరియు మానవ వర్గీయులారా! ఏమిటీ, నా ఆదేశాలను మీకు విడమరచి చెప్పే, ఈనాటి ఈ దినం గురించి మిమ్మల్ని హెచ్చరించే ప్రవక్తలు స్వయంగా మీనుండే మీ వద్దకు రాలేదా? (అని అల్లాహ్ తరఫున ప్రశ్నించబడినప్పుడు), “అవును వచ్చారు. మాకు వ్యతిరేకంగా స్వయంగా మేమే సాక్ష్యమిస్తున్నాం” అని అంటారు. ప్రాపంచిక జీవితం వారిని మోసానికి గురి చేసింది. తాము తిరస్కారులయ్యామన్న సంగతిని గురించి వారు స్వయంగా సాక్ష్యమిస్తారు.
6:131 ذَٰلِكَ أَن لَّمْ يَكُن رَّبُّكَ مُهْلِكَ الْقُرَىٰ بِظُلْمٍ وَأَهْلُهَا غَافِلُونَ
ఎందుకంటే, నీ ప్రభువు ఏ సీమను కూడా అక్కడి ప్రజలు (సత్యాసత్యాలు) తెలుసుకోకుండా ఉన్న స్థితిలో-వారి తిరస్కార వైఖరి మూలంగా నాశనం చేయడు.
6:132 وَلِكُلٍّ دَرَجَاتٌ مِّمَّا عَمِلُوا ۚ وَمَا رَبُّكَ بِغَافِلٍ عَمَّا يَعْمَلُونَ
ప్రతి ఒక్కరికీ వారి ఆచరణలను బట్టి అంతస్తులు లభిస్తాయి. నీ ప్రభువు వారి పనుల విషయంలో అజాగ్రత్తగా లేడు.
6:133 وَرَبُّكَ الْغَنِيُّ ذُو الرَّحْمَةِ ۚ إِن يَشَأْ يُذْهِبْكُمْ وَيَسْتَخْلِفْ مِن بَعْدِكُم مَّا يَشَاءُ كَمَا أَنشَأَكُم مِّن ذُرِّيَّةِ قَوْمٍ آخَرِينَ
ఇంకా నీ ప్రభువు ఏ అక్కరాలేనివాడు, కనికరించేవాడు. ఆయన గనక తలచుకుంటే మీ అందరినీ తుద ముట్టించి, మిమ్మల్ని వేరొక వంశం నుంచి పుట్టించినట్లే, మీ స్థానంలో తాను కోరినవారిని వసింపజేస్తాడు.
6:134 إِنَّ مَا تُوعَدُونَ لَآتٍ ۖ وَمَا أَنتُم بِمُعْجِزِينَ
మీకు వాగ్దానం చెయ్యబడుతున్నది ముమ్మాటికీ వచ్చి తీర్తుంది. మీరు (అల్లాహ్‌ను) అశక్తుణ్ణి చేయలేరు.
6:135 قُلْ يَا قَوْمِ اعْمَلُوا عَلَىٰ مَكَانَتِكُمْ إِنِّي عَامِلٌ ۖ فَسَوْفَ تَعْلَمُونَ مَن تَكُونُ لَهُ عَاقِبَةُ الدَّارِ ۗ إِنَّهُ لَا يُفْلِحُ الظَّالِمُونَ
ఓ ప్రవక్తా! వారికి ఇలా చెప్పు : “ఓ నా జాతి ప్రజలారా! మీ పని మీరు చేయండి. నా కర్తవ్యాన్ని నేను నెరవేరుస్తూ ఉంటాను. ఈ లోకంలో మేలైన పరిణామం ఎవరికి చెందుతుందో త్వరలోనే మీకు తెలిసిపోతుంది. అన్యాయానికి పాల్పడే వారు నిశ్చయంగా ఎన్నటికీ సాఫల్యం పొందలేరు.’
6:136 وَجَعَلُوا لِلَّهِ مِمَّا ذَرَأَ مِنَ الْحَرْثِ وَالْأَنْعَامِ نَصِيبًا فَقَالُوا هَٰذَا لِلَّهِ بِزَعْمِهِمْ وَهَٰذَا لِشُرَكَائِنَا ۖ فَمَا كَانَ لِشُرَكَائِهِمْ فَلَا يَصِلُ إِلَى اللَّهِ ۖ وَمَا كَانَ لِلَّهِ فَهُوَ يَصِلُ إِلَىٰ شُرَكَائِهِمْ ۗ سَاءَ مَا يَحْكُمُونَ
అల్లాహ్ సృష్టించిన పంట పొలాలలో నుంచి, పశువులలో నుంచి వీళ్లు కొంత భాగాన్ని అల్లాహ్ కోసం నిర్థారించారు. పైపెచ్చు “ఇది అల్లాహ్ భాగం, ఇది మేము నిలబెట్టిన సహవర్తుల భాగం” అని స్వయంగా తామే తీర్మానించుకొని చెబుతారు. సహవర్తుల కోసం నిర్థారించిన భాగం అల్లాహ్‌కు ఎలాగూ చేరదు. కాని అల్లాహ్ కోసం నిర్థారించినది మాత్రం వారు నిలబెట్టిన సహవర్తులకు ఇట్టే చేరిపోతుంది. వారి ఈ తీర్పు ఎంత ఘోరమైనది!?
6:137 وَكَذَٰلِكَ زَيَّنَ لِكَثِيرٍ مِّنَ الْمُشْرِكِينَ قَتْلَ أَوْلَادِهِمْ شُرَكَاؤُهُمْ لِيُرْدُوهُمْ وَلِيَلْبِسُوا عَلَيْهِمْ دِينَهُمْ ۖ وَلَوْ شَاءَ اللَّهُ مَا فَعَلُوهُ ۖ فَذَرْهُمْ وَمَا يَفْتَرُونَ
మరి ఇలాగే చాలామంది ముష్రిక్కుల దృష్టిలో వారి సహవర్తులు, వారిని నాశనం చేయడానికీ, వారి మత ధర్మాన్ని వారికి సందేహాస్పదంగా చేయటానికి వారి సంతాన హత్యను వారికి మంచిదిగా తోచినట్లు చేశారు. అల్లాహ్ తలచుకుని ఉంటే వారలా చేసి ఉండేవారు కాదు. కనుక నీవు వారినీ, వారు కల్పించే కల్పనలనూ వదిలెయ్యి.
6:138 وَقَالُوا هَٰذِهِ أَنْعَامٌ وَحَرْثٌ حِجْرٌ لَّا يَطْعَمُهَا إِلَّا مَن نَّشَاءُ بِزَعْمِهِمْ وَأَنْعَامٌ حُرِّمَتْ ظُهُورُهَا وَأَنْعَامٌ لَّا يَذْكُرُونَ اسْمَ اللَّهِ عَلَيْهَا افْتِرَاءً عَلَيْهِ ۚ سَيَجْزِيهِم بِمَا كَانُوا يَفْتَرُونَ
“ఈ కొన్ని పశువులు, పంట పొలాలు అందరికీ సమ్మతం కావు. మేము కోరినవారు తప్ప ఇతరులెవరూ వాటిని తినటం సమ్మతం కాదు” అని వారు తమంతట తాముగా – కల్పించుకొని – చెబుతారు. కొన్ని పశువులపై స్వారీ చేయటం, వాటి ద్వారా బరువు లాగించటం నిషేధించబడింది (అని అంటారు). మరి కొన్ని పశువులపై (జిబహ్ చేసే సమయంలో) వారు అల్లాహ్ పేరు ఉచ్చరించరు, అల్లాహ్‌కు అబద్ధాన్ని అంటగట్టటానికిగాను (వారు ఇలా చేస్తారు). వారు కల్పించే ఈ అబద్ధాలకుగాను త్వరలోనే అల్లాహ్ వారికి దాని ప్రతిఫలం ఇస్తాడు.
6:139 وَقَالُوا مَا فِي بُطُونِ هَٰذِهِ الْأَنْعَامِ خَالِصَةٌ لِّذُكُورِنَا وَمُحَرَّمٌ عَلَىٰ أَزْوَاجِنَا ۖ وَإِن يَكُن مَّيْتَةً فَهُمْ فِيهِ شُرَكَاءُ ۚ سَيَجْزِيهِمْ وَصْفَهُمْ ۚ إِنَّهُ حَكِيمٌ عَلِيمٌ
“ఈ పశువుల గర్భాలలో ఉన్నది కేవలం మా పురుషుల కోసమే. మా స్త్రీల కోసం అది నిషిద్ధం. ఒకవేళ అది చచ్చినదైతే అందరికీ అందులో భాగం ఉంటుంది” అని కూడా వారంటారు. వారి ఈ తప్పుడు మాటలకుగాను అల్లాహ్ త్వరలోనే వారిని దండిస్తాడు. నిశ్చయంగా ఆయన మహావివేకి, మహాజ్ఞాని.
6:140 قَدْ خَسِرَ الَّذِينَ قَتَلُوا أَوْلَادَهُمْ سَفَهًا بِغَيْرِ عِلْمٍ وَحَرَّمُوا مَا رَزَقَهُمُ اللَّهُ افْتِرَاءً عَلَى اللَّهِ ۚ قَدْ ضَلُّوا وَمَا كَانُوا مُهْتَدِينَ
మూర్ఖత్వం కొద్దీ, ఏ ఆధారమూ లేకుండానే తమ సంతానాన్ని హత్యచేసిన వారూ, అల్లాహ్ ఉపాధిగా ప్రసాదించిన వస్తువులను అల్లాహ్‌కు అబద్ధాలను అంటగడుతూ నిషేధించుకున్నవారూ ముమ్మాటికీ నష్టానికి గురయ్యారు. నిశ్చయంగా వారు మార్గ విహీనతకు లోనయ్యారు. వారు సన్మార్గాన లేరు.
6:141 وَهُوَ الَّذِي أَنشَأَ جَنَّاتٍ مَّعْرُوشَاتٍ وَغَيْرَ مَعْرُوشَاتٍ وَالنَّخْلَ وَالزَّرْعَ مُخْتَلِفًا أُكُلُهُ وَالزَّيْتُونَ وَالرُّمَّانَ مُتَشَابِهًا وَغَيْرَ مُتَشَابِهٍ ۚ كُلُوا مِن ثَمَرِهِ إِذَا أَثْمَرَ وَآتُوا حَقَّهُ يَوْمَ حَصَادِهِ ۖ وَلَا تُسْرِفُوا ۚ إِنَّهُ لَا يُحِبُّ الْمُسْرِفِينَ
ఆయనే పందిళ్ళపై ఎక్కించబడే తోటలను, పందిళ్ళపై ఎక్కించబడని తోటలను, ఖర్జూర చెట్లను, పంటపొలాలను సృజించాడు. వాటి ద్వారా రకరకాల ఆహార వస్తువులు లభ్యమవుతాయి. జైతూను (ఆలివ్), దానిమ్మ వృక్షాలను కూడా సృజించాడు. వాటిలో కొన్ని పరస్పరం పోలి ఉంటాయి. మరికొన్ని పోలి ఉండవు. వాటన్నింటి పండ్లు పండినప్పుడు వాటిని తినండి. పంటకోసే రోజున తప్పనిసరిగా చెల్లించవలసిన దాని హక్కును చెల్లించండి. మితిమీరకండి. మితిమీరే వారిని అల్లాహ్ ఎట్టిపరిస్థితిలోనూ ఇష్టపడడు.
6:142 وَمِنَ الْأَنْعَامِ حَمُولَةً وَفَرْشًا ۚ كُلُوا مِمَّا رَزَقَكُمُ اللَّهُ وَلَا تَتَّبِعُوا خُطُوَاتِ الشَّيْطَانِ ۚ إِنَّهُ لَكُمْ عَدُوٌّ مُّبِينٌ
పశువులలో ఎత్తుగా ఉండే వాటిని, పొట్టిగా ఉండేవాటినీ పుట్టించినవాడు కూడా ఆయనే. అల్లాహ్ మీకు ఇచ్చిన దానిని తినండి. కాని షైతాను అడుగుజాడల్లో నడవకండి. నిశ్చయంగా వాడు మీ బహిరంగ శత్రువు.
6:143 ثَمَانِيَةَ أَزْوَاجٍ ۖ مِّنَ الضَّأْنِ اثْنَيْنِ وَمِنَ الْمَعْزِ اثْنَيْنِ ۗ قُلْ آلذَّكَرَيْنِ حَرَّمَ أَمِ الْأُنثَيَيْنِ أَمَّا اشْتَمَلَتْ عَلَيْهِ أَرْحَامُ الْأُنثَيَيْنِ ۖ نَبِّئُونِي بِعِلْمٍ إِن كُنتُمْ صَادِقِينَ
(ఇవి ఆయన సృష్టించిన) ఎనిమిది ఆడమగలు. అంటే గొఱ్ఱెలలో రెండు రకాలు, మేకలలో రెండు రకాలు. “అల్లాహ్ నిషేధించినది ఆ రెండు మగ పశువులనా లేక రెండు ఆడ పశువులనా లేక ఆ రెండు ఆడపశువుల గర్భాలలో ఉన్న వాటినా? మీరు సత్యవంతులే అయితే ప్రమాణబద్ధంగా నాకు తెలియజేయండి” అని (ఓ ప్రవక్తా!) వారిని అడుగు.
6:144 وَمِنَ الْإِبِلِ اثْنَيْنِ وَمِنَ الْبَقَرِ اثْنَيْنِ ۗ قُلْ آلذَّكَرَيْنِ حَرَّمَ أَمِ الْأُنثَيَيْنِ أَمَّا اشْتَمَلَتْ عَلَيْهِ أَرْحَامُ الْأُنثَيَيْنِ ۖ أَمْ كُنتُمْ شُهَدَاءَ إِذْ وَصَّاكُمُ اللَّهُ بِهَٰذَا ۚ فَمَنْ أَظْلَمُ مِمَّنِ افْتَرَىٰ عَلَى اللَّهِ كَذِبًا لِّيُضِلَّ النَّاسَ بِغَيْرِ عِلْمٍ ۗ إِنَّ اللَّهَ لَا يَهْدِي الْقَوْمَ الظَّالِمِينَ
అలాగే ఒంటెలలో రెండు రకాలు, ఆవులలో రెండు రకాలను (ఆయన పుట్టించాడు). మరి వీటిలో అల్లాహ్ నిషేధించినది రెండు పోతులనా? లేక రెండు పడ్డలనా? లేక ఆ రెండు పడ్డల కడుపులలో ఉన్న దూడలను నిషేధించాడా? అని (ఓ ప్రవక్తా!) వాళ్ళను అడుగు. ఈ మేరకు అల్లాహ్ మీకు ఆదేశించినప్పుడు మీరక్కడ ఉన్నారా? ఏ ఆధారమూ లేకుండానే- ప్రజల్ని అపమార్గం పట్టించే ఉద్దేశంతో- అల్లాహ్‌కు అబద్ధాన్ని ఆపాదించే వానికన్నా పరమ దుర్మార్గుడు ఎవడుంటాడు? ఇలాంటి దుర్మార్గులకు అల్లాహ్ సన్మార్గం చూపడు.
6:145 قُل لَّا أَجِدُ فِي مَا أُوحِيَ إِلَيَّ مُحَرَّمًا عَلَىٰ طَاعِمٍ يَطْعَمُهُ إِلَّا أَن يَكُونَ مَيْتَةً أَوْ دَمًا مَّسْفُوحًا أَوْ لَحْمَ خِنزِيرٍ فَإِنَّهُ رِجْسٌ أَوْ فِسْقًا أُهِلَّ لِغَيْرِ اللَّهِ بِهِ ۚ فَمَنِ اضْطُرَّ غَيْرَ بَاغٍ وَلَا عَادٍ فَإِنَّ رَبَّكَ غَفُورٌ رَّحِيمٌ
ఓ ప్రవక్తా! వారికి చెప్పు : (వహీ ద్వారా) నా వద్దకు వచ్చిన ఆజ్ఞలలో చచ్చిన జంతువు, ప్రవహించే రక్తం, పందిమాంసం – అది పరమ అశుద్ధం గనక! – ఇంకా దైవేతరుల పేర కోయబడిన జంతువు తప్ప మరేదీ తినేవాడి కోసం నిషేధించబడినట్లు నాకు కనిపించదు. అయితే గత్యంతరం లేని పరిస్థితిలో- రుచికోసం కాకుండా, హద్దు మీరకుండా ఉంటే (వాటిని తింటే అట్టి స్థితిలో) నీ ప్రభువు క్షమించేవాడూ, కరుణించేవాడు.
6:146 وَعَلَى الَّذِينَ هَادُوا حَرَّمْنَا كُلَّ ذِي ظُفُرٍ ۖ وَمِنَ الْبَقَرِ وَالْغَنَمِ حَرَّمْنَا عَلَيْهِمْ شُحُومَهُمَا إِلَّا مَا حَمَلَتْ ظُهُورُهُمَا أَوِ الْحَوَايَا أَوْ مَا اخْتَلَطَ بِعَظْمٍ ۚ ذَٰلِكَ جَزَيْنَاهُم بِبَغْيِهِمْ ۖ وَإِنَّا لَصَادِقُونَ
యూదులకు మేము గోళ్ళు గల జంతువులన్నింటినీ నిషేధించాము. ఇంకా వారికి, ఆవు మరియు మేకలలో వాటి వీపులకు తగిలివున్న కొవ్వునీ, ప్రేగులపై ఉన్నదానినీ, ఎముకలతో కలిసి ఉన్న దానిని తప్ప – మిగిలిన క్రొవ్వును కూడా నిషేధించాము. వారి తలబిరుసుతనం మూలంగా మేము వారికి ఈ శిక్ష విధించాము. ముమ్మాటికీ మేము చెప్పేది నిజం.
6:147 فَإِن كَذَّبُوكَ فَقُل رَّبُّكُمْ ذُو رَحْمَةٍ وَاسِعَةٍ وَلَا يُرَدُّ بَأْسُهُ عَنِ الْقَوْمِ الْمُجْرِمِينَ
ఆ తరువాత కూడా వాళ్ళు నిన్ను ధిక్కరిస్తే, “మీ ప్రభువు విస్తృతమైన కారుణ్యం కలవాడు. అయితే ఆయన శిక్ష అపరాధ జనులపై నుంచి తొలగిపోదు” అని వారికి చెప్పెయ్యి.
6:148 سَيَقُولُ الَّذِينَ أَشْرَكُوا لَوْ شَاءَ اللَّهُ مَا أَشْرَكْنَا وَلَا آبَاؤُنَا وَلَا حَرَّمْنَا مِن شَيْءٍ ۚ كَذَٰلِكَ كَذَّبَ الَّذِينَ مِن قَبْلِهِمْ حَتَّىٰ ذَاقُوا بَأْسَنَا ۗ قُلْ هَلْ عِندَكُم مِّنْ عِلْمٍ فَتُخْرِجُوهُ لَنَا ۖ إِن تَتَّبِعُونَ إِلَّا الظَّنَّ وَإِنْ أَنتُمْ إِلَّا تَخْرُصُونَ
“అల్లాహ్ తలచుకొని ఉంటే మేముగానీ, మా తాత ముత్తాతలుగానీ షిర్క్‌కు పాల్పడేవారం కాము; ఏ వస్తువునూ నిషిద్ధంగా ఖరారు చేసేవారం కూడా కాము” అని ముష్రిక్కులు అంటారు. వీరికి పూర్వం గతించిన వారు కూడా ఇలాగే ధిక్కార వైఖరిని అవలంబించారు. కడకు వారు మా శిక్షను చవి చూశారు. (ఓ ప్రవక్తా!) వారిని అడుగు: “మీ దగ్గర ఏదైనా ప్రమాణం ఉంటే, దాన్ని మా ముందు సమర్పించండి. మీరు కేవలం ఊహలను అనుసరిస్తారు. అంచనాలతో మాట్లాడతారు.”
6:149 قُلْ فَلِلَّهِ الْحُجَّةُ الْبَالِغَةُ ۖ فَلَوْ شَاءَ لَهَدَاكُمْ أَجْمَعِينَ
ఇంకా వారికి ఇలా చెప్పు: “పరిపూర్ణమైన వాదన అల్లాహ్‌దే. ఆయనే గనక తలచుకుంటే మీ అందరినీ సన్మార్గంపై నడిపించేవాడే.”
6:150 قُلْ هَلُمَّ شُهَدَاءَكُمُ الَّذِينَ يَشْهَدُونَ أَنَّ اللَّهَ حَرَّمَ هَٰذَا ۖ فَإِن شَهِدُوا فَلَا تَشْهَدْ مَعَهُمْ ۚ وَلَا تَتَّبِعْ أَهْوَاءَ الَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا وَالَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ وَهُم بِرَبِّهِمْ يَعْدِلُونَ
“అల్లాహ్ ఈ వస్తువుల్ని నిషేధించాడు అని సాక్ష్యమిచ్చే మీ సాక్షులను తీసుకురండి” అని వారిని అడుగు. మరి వారు గనక అలా సాక్ష్యమిస్తే నీవు మాత్రం వారితోపాటు సాక్ష్యం ఇవ్వకు. వారి మిథ్యా భావాలను అనుసరించకు. మా ఆయతులను ధిక్కరించేవారి, పరలోకాన్ని విశ్వసించనివారి, ఇంకా ఇతరులను తమ ప్రభువుకు సమానులుగా నిలబెట్టేవారి కోరికలను అనుసరించకు.
6:151 قُلْ تَعَالَوْا أَتْلُ مَا حَرَّمَ رَبُّكُمْ عَلَيْكُمْ ۖ أَلَّا تُشْرِكُوا بِهِ شَيْئًا ۖ وَبِالْوَالِدَيْنِ إِحْسَانًا ۖ وَلَا تَقْتُلُوا أَوْلَادَكُم مِّنْ إِمْلَاقٍ ۖ نَّحْنُ نَرْزُقُكُمْ وَإِيَّاهُمْ ۖ وَلَا تَقْرَبُوا الْفَوَاحِشَ مَا ظَهَرَ مِنْهَا وَمَا بَطَنَ ۖ وَلَا تَقْتُلُوا النَّفْسَ الَّتِي حَرَّمَ اللَّهُ إِلَّا بِالْحَقِّ ۚ ذَٰلِكُمْ وَصَّاكُم بِهِ لَعَلَّكُمْ تَعْقِلُونَ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “రండి, మీ ప్రభువు మీపై నిషేధించిన వస్తువులు ఏవో మీకు చదివి వినిపిస్తాను. అవేమంటే; అల్లాహ్‌కు సహవర్తులుగా ఎవరినీ కల్పించకండి. తల్లిదండ్రుల యెడల ఉత్తమరీతిలో మెలగండి. పేదరికపు భయంతో మీ సంతానాన్ని హతమార్చకండి. మేము మీకూ ఆహారం ఇస్తున్నాము, వారికీ ఇస్తాము. సిగ్గు మాలిన పనులు- అవి బాహాటంగా జరిగేవైనా, గుట్టుగా జరిగేవైనా – వాటి దరిదాపులక్కూడా వెళ్ళకండి. సత్య (న్యాయ) బద్ధంగా తప్ప అల్లాహ్ నిషేధించిన ఏ ప్రాణినీ హతమార్చకండి. మీరు ఆలోచించి పనిచేస్తారని, అల్లాహ్ మీకీ విషయాలను గురించి గట్టిగా తాకీదు చేశాడు.
6:152 وَلَا تَقْرَبُوا مَالَ الْيَتِيمِ إِلَّا بِالَّتِي هِيَ أَحْسَنُ حَتَّىٰ يَبْلُغَ أَشُدَّهُ ۖ وَأَوْفُوا الْكَيْلَ وَالْمِيزَانَ بِالْقِسْطِ ۖ لَا نُكَلِّفُ نَفْسًا إِلَّا وُسْعَهَا ۖ وَإِذَا قُلْتُمْ فَاعْدِلُوا وَلَوْ كَانَ ذَا قُرْبَىٰ ۖ وَبِعَهْدِ اللَّهِ أَوْفُوا ۚ ذَٰلِكُمْ وَصَّاكُم بِهِ لَعَلَّكُمْ تَذَكَّرُونَ
“తండ్రిలేని బిడ్డ, యుక్తవయస్సుకు చేరుకునే వరకూ- ఉత్తమ రీతిలో తప్ప – అతని ఆస్తి దరిదాపులకు కూడా వెళ్ళకండి. కొలతలు తూనికలలో పూర్తిగా, న్యాయంగా వ్యవహరించండి. మేము ఏ ప్రాణిపైన కూడా శక్తికి మించిన భారం మోపము. పలికితే న్యాయమే పలకండి. న్యాయసమ్మతంగా మాట్లాడండి- వ్యవహారం మీ బంధువుకు సంబంధించినదైనా సరే! అల్లాహ్‌తో చేసిన బాసను నెరవేర్చండి. మీరు సదా జ్ఞాపక ముంచుకునేందుకు గాను అల్లాహ్ మీకిలా తాకీదు చేశాడు.
6:153 وَأَنَّ هَٰذَا صِرَاطِي مُسْتَقِيمًا فَاتَّبِعُوهُ ۖ وَلَا تَتَّبِعُوا السُّبُلَ فَتَفَرَّقَ بِكُمْ عَن سَبِيلِهِ ۚ ذَٰلِكُمْ وَصَّاكُم بِهِ لَعَلَّكُمْ تَتَّقُونَ
ఇదే నా రుజుమార్గం. కనుక మీరు దీనినే అనుసరించండి. ఇతరత్రా మార్గాలను అనుసరించకండి. అవి మిమ్మల్ని అల్లాహ్ మార్గం నుండి వేరు పరుస్తాయి. మీరు భయభక్తుల వైఖరిని అవలంబించేటందుకుగాను అల్లాహ్ మీకు ఈ విధంగా తాకీదు చేశాడు.
6:154 ثُمَّ آتَيْنَا مُوسَى الْكِتَابَ تَمَامًا عَلَى الَّذِي أَحْسَنَ وَتَفْصِيلًا لِّكُلِّ شَيْءٍ وَهُدًى وَرَحْمَةً لَّعَلَّهُم بِلِقَاءِ رَبِّهِمْ يُؤْمِنُونَ
తరువాత మేము ఉత్తమంగా ఆచరించేవారిపై అనుగ్రహం పరిపూర్తికావటానికి, ఆజ్ఞలన్నీ స్పష్టంగా వివరించటానికి, మార్గదర్శకత్వం లభించటానికీ, కరుణించబడటానికి, వారు తమ ప్రభువును కలుసుకునే విషయమై దృఢ విశ్వాసం కలిగి ఉండటానికిగాను మూసాకు గ్రంథాన్ని వొసగాము.
6:155 وَهَٰذَا كِتَابٌ أَنزَلْنَاهُ مُبَارَكٌ فَاتَّبِعُوهُ وَاتَّقُوا لَعَلَّكُمْ تُرْحَمُونَ
మరియు ఇది (ఈ ఖుర్ఆన్) మేము అవతరింపజేసిన ఒక శుభప్రదమైన గ్రంథం. కాబట్టి మీరు దీనిని అనుసరించండి. భయభక్తులతో మెలగండి. తద్వారా మీరు కరుణించబడే అవకాశం ఉంది.
6:156 أَن تَقُولُوا إِنَّمَا أُنزِلَ الْكِتَابُ عَلَىٰ طَائِفَتَيْنِ مِن قَبْلِنَا وَإِن كُنَّا عَن دِرَاسَتِهِمْ لَغَافِلِينَ
“మాకు పూర్వముండిన రెండు వర్గాలపై మాత్రం గ్రంథం అవతరింపజేయబడింది. వారు ఏమి చదివేవారో, మరేమి చదివించేవారో అసలు మాకేమీ తెలియదు” అని మీరు అనకుండా ఉండటానికీ,
6:157 أَوْ تَقُولُوا لَوْ أَنَّا أُنزِلَ عَلَيْنَا الْكِتَابُ لَكُنَّا أَهْدَىٰ مِنْهُمْ ۚ فَقَدْ جَاءَكُم بَيِّنَةٌ مِّن رَّبِّكُمْ وَهُدًى وَرَحْمَةٌ ۚ فَمَنْ أَظْلَمُ مِمَّن كَذَّبَ بِآيَاتِ اللَّهِ وَصَدَفَ عَنْهَا ۗ سَنَجْزِي الَّذِينَ يَصْدِفُونَ عَنْ آيَاتِنَا سُوءَ الْعَذَابِ بِمَا كَانُوا يَصْدِفُونَ
“ఒకవేళ మాకే గనక గ్రంథం వొసగబడి ఉంటే మేము వారికన్నా ఎక్కువ రుజువర్తనులం అయ్యేవాళ్ళం” అని అనకుండా ఉండటానికిగాను (మేము ఖుర్ఆన్ గ్రంథాన్ని మీ వద్దకు పంపాము). ఇప్పుడు మీవద్దకు మీ ప్రభువు తరఫునుంచి ఒక స్పష్టమైన గ్రంథం, మార్గదర్శక సాధనం మరియు కారుణ్యం వచ్చేసింది. అయినప్పటికీ అల్లాహ్ ఆయతులను అసత్యాలని కొట్టిపారేసి, వాటి నుంచి (ప్రజలను) ఆపే వాడికన్నా పరమ దుర్మార్గుడు ఇంకెవడుంటాడు? మేము త్వరలోనే మా ఆయతుల నుండి ఆపేవారిని, వారి ఈ ఆపుదల కారణంగా ఘోరంగా శిక్షిస్తాము.
6:158 هَلْ يَنظُرُونَ إِلَّا أَن تَأْتِيَهُمُ الْمَلَائِكَةُ أَوْ يَأْتِيَ رَبُّكَ أَوْ يَأْتِيَ بَعْضُ آيَاتِ رَبِّكَ ۗ يَوْمَ يَأْتِي بَعْضُ آيَاتِ رَبِّكَ لَا يَنفَعُ نَفْسًا إِيمَانُهَا لَمْ تَكُنْ آمَنَتْ مِن قَبْلُ أَوْ كَسَبَتْ فِي إِيمَانِهَا خَيْرًا ۗ قُلِ انتَظِرُوا إِنَّا مُنتَظِرُونَ
ఏమిటీ, తమ వద్దకు దైవదూతలు రావాలనీ, లేక నీ ప్రభువే స్వయంగా ప్రత్యక్షమవ్వాలనీ లేక నీ ప్రభువు వద్ద నుంచి ఏదైనా (గొప్ప) నిదర్శనం రావాలని వీళ్లు వేచి ఉన్నారా? నీ ప్రభువు వద్ద నుంచి ఏదయినా గొప్ప సూచన వచ్చేసిన రోజున, ముందు నుంచీ విశ్వసించకుండా ఆ రోజునే విశ్వసించినవాని విశ్వాసం, లేక విశ్వసించి కూడా ఏ సత్కార్యమూ చేయని వాని విశ్వాసం అతనికి ఏ విధంగానూ ఉపయోగపడదు. కనుక “మీరూ నిరీక్షించండి, మేము కూడా నిరీక్షిస్తూ ఉంటాము” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు.
6:159 إِنَّ الَّذِينَ فَرَّقُوا دِينَهُمْ وَكَانُوا شِيَعًا لَّسْتَ مِنْهُمْ فِي شَيْءٍ ۚ إِنَّمَا أَمْرُهُمْ إِلَى اللَّهِ ثُمَّ يُنَبِّئُهُم بِمَا كَانُوا يَفْعَلُونَ
ఎవరు తమ ధర్మాన్ని ముక్క చెక్కలుగా చేసి, వర్గాలుగా ముఠాలుగా విడిపోయారో వాళ్ళతో నీకే సంబంధమూ లేదు. వాళ్ళ వ్యవహారం దైవాధీనమై ఉంది. తర్వాత వాళ్లు చేసిందేమిటో ఆయన వారికి తెలియజేస్తాడు.
6:160 مَن جَاءَ بِالْحَسَنَةِ فَلَهُ عَشْرُ أَمْثَالِهَا ۖ وَمَن جَاءَ بِالسَّيِّئَةِ فَلَا يُجْزَىٰ إِلَّا مِثْلَهَا وَهُمْ لَا يُظْلَمُونَ
సత్కార్యం చేసినవాని సత్కార్యానికి పదిరెట్లు లభిస్తాయి. దుష్కార్యానికి ఒడిగట్టిన వాని దుష్కార్యానికి దానికి సరిపడా శిక్ష మాత్రమే విధించబడుతుంది. వారికి ఎలాంటి అన్యాయం జరగదు.
6:161 قُلْ إِنَّنِي هَدَانِي رَبِّي إِلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ دِينًا قِيَمًا مِّلَّةَ إِبْرَاهِيمَ حَنِيفًا ۚ وَمَا كَانَ مِنَ الْمُشْرِكِينَ
(ఓ ప్రవక్తా!) ఈ విధంగా చెప్పు: “నా ప్రభువు నాకు రుజుమార్గం చూపించాడు. అదొక స్థిరమైన ధర్మం. ఎలాంటి వక్రతా లేనిది, అల్లాహ్ వైపు ఏకాగ్రతతో మరలిన ఇబ్రాహీమ్ విధానం అది. ఆయన ముష్రిక్కులలోని వాడు కాడు.”
6:162 قُلْ إِنَّ صَلَاتِي وَنُسُكِي وَمَحْيَايَ وَمَمَاتِي لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
ఇంకా ఈ విధంగా ప్రకటించు : “నిస్సందేహంగా నా నమాజు, నా సకల ఆరాధనలు, నా జీవనం, నా మరణం – ఇవన్నీ సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కొరకే.
6:163 لَا شَرِيكَ لَهُ ۖ وَبِذَٰلِكَ أُمِرْتُ وَأَنَا أَوَّلُ الْمُسْلِمِينَ
ఆయనకు భాగస్వాములెవరూ లేరు. దీని గురించే నాకు ఆజ్ఞాపించబడింది. ఆజ్ఞాపాలన చేసే వారిలో నేను మొదటివాణ్ణి.”
6:164 قُلْ أَغَيْرَ اللَّهِ أَبْغِي رَبًّا وَهُوَ رَبُّ كُلِّ شَيْءٍ ۚ وَلَا تَكْسِبُ كُلُّ نَفْسٍ إِلَّا عَلَيْهَا ۚ وَلَا تَزِرُ وَازِرَةٌ وِزْرَ أُخْرَىٰ ۚ ثُمَّ إِلَىٰ رَبِّكُم مَّرْجِعُكُمْ فَيُنَبِّئُكُم بِمَا كُنتُمْ فِيهِ تَخْتَلِفُونَ
(ఓ ప్రవక్తా!) వారిని అడుగు: “ఏమిటీ, నేను అల్లాహ్‌ను కాదని వేరొక ప్రభువును వెతుక్కోవాలా?! వాస్తవానికి ప్రతిదానికీ ప్రభువు ఆయనే. ఎవరు చేసిన పనులకు వారే బాధ్యులు. బరువును మోసేవాడెవడూ ఇంకొకడి బరువును మోయడు. ఆ తర్వాత మీరంతా మీ ప్రభువు వద్దకే పోవలసి ఉంది. అప్పుడు ఆయన మీరు ఏ ఏ విషయాలలో విభేదించుకున్నారో వాటి వాస్తవాలను తెలియజేస్తాడు.
6:165 وَهُوَ الَّذِي جَعَلَكُمْ خَلَائِفَ الْأَرْضِ وَرَفَعَ بَعْضَكُمْ فَوْقَ بَعْضٍ دَرَجَاتٍ لِّيَبْلُوَكُمْ فِي مَا آتَاكُمْ ۗ إِنَّ رَبَّكَ سَرِيعُ الْعِقَابِ وَإِنَّهُ لَغَفُورٌ رَّحِيمٌ
ఆయనే మిమ్మల్ని భూమండలంలో ఖలీఫాలుగా చేశాడు. మీకు ప్రసాదించిన వాటిలో మిమ్మల్ని పరీక్షించే నిమిత్తం కొందరికి మరికొందరిపై ఉన్నత స్థానాలను ప్రసాదించాడు. నిశ్చయంగా నీ ప్రభువు శిక్షించటంలో వేగవంతుడు. అలాగే ఆయన అపారంగా క్షమించేవాడు, కరుణించేవాడు కూడాను.
7. సూరా అల్ ఆరాఫ్
7:1 المص
అలిఫ్ – లామ్ – మీమ్ – సాద్.
7:2 كِتَابٌ أُنزِلَ إِلَيْكَ فَلَا يَكُن فِي صَدْرِكَ حَرَجٌ مِّنْهُ لِتُنذِرَ بِهِ وَذِكْرَىٰ لِلْمُؤْمِنِينَ
ఇదొక గ్రంథం. దీని ఆధారంగా నీవు హెచ్చరించటానికిగాను ఇది నీ వద్దకు పంపబడింది. కాబట్టి (ఓ ప్రవక్తా!) దీని పట్ల నీ మనసులో ఎటువంటి సంకోచం ఉండకూడదు. విశ్వసించిన వారికి ఇది హితబోధిని (జ్ఞాపిక!).
7:3 اتَّبِعُوا مَا أُنزِلَ إِلَيْكُم مِّن رَّبِّكُمْ وَلَا تَتَّبِعُوا مِن دُونِهِ أَوْلِيَاءَ ۗ قَلِيلًا مَّا تَذَكَّرُونَ
(ప్రజలారా!) మీ ప్రభువు తరఫున మీకు వొసగబడిన దానిని మీరు అనుసరించండి. అల్లాహ్‌ను వదలి ఇతర సంరక్షకులను అనుసరించకండి. మీరు బహుకొద్దిగా మాత్రమే హితబోధను గ్రహిస్తారు.
7:4 وَكَم مِّن قَرْيَةٍ أَهْلَكْنَاهَا فَجَاءَهَا بَأْسُنَا بَيَاتًا أَوْ هُمْ قَائِلُونَ
ఎన్నో జనవాసాలను మేము రూపుమాపాము. వాటిపై మా శిక్ష రాత్రి వేళనో లేక మధ్యాహ్నం వారు విశ్రమిస్తున్న సమయంలోనో వచ్చి పడింది.
7:5 فَمَا كَانَ دَعْوَاهُمْ إِذْ جَاءَهُم بَأْسُنَا إِلَّا أَن قَالُوا إِنَّا كُنَّا ظَالِمِينَ
వారిపై మా శిక్ష వచ్చిపడినప్పుడు “మేము నిజంగానే దుర్మార్గులం” అన్న మాట తప్ప మరోమాట వారినోటి నుండి రాలేదు.
7:6 فَلَنَسْأَلَنَّ الَّذِينَ أُرْسِلَ إِلَيْهِمْ وَلَنَسْأَلَنَّ الْمُرْسَلِينَ
ఎవరి వద్దకు ప్రవక్తలు పంపబడ్డారో వారిని తప్పకుండా అడుగుతాము. ప్రవక్తలను కూడా మేము తప్పకుండా ప్రశ్నిస్తాము.
7:7 فَلَنَقُصَّنَّ عَلَيْهِم بِعِلْمٍ ۖ وَمَا كُنَّا غَائِبِينَ
మాకు ప్రతిదీ తెలుసు గనక తర్వాత వారి ముందు ఉన్నదున్నట్టు విప్పి చెబుతాము – మాకు ఏదీ తెలియకుండా లేదు.
7:8 وَالْوَزْنُ يَوْمَئِذٍ الْحَقُّ ۚ فَمَن ثَقُلَتْ مَوَازِينُهُ فَأُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ
ఆ రోజు బరువు (తూకం) కూడా సత్యమే. ఎవరి త్రాసు బరువుగా ఉంటుందో వారే సాఫల్యం పొందేవారు.
7:9 وَمَنْ خَفَّتْ مَوَازِينُهُ فَأُولَٰئِكَ الَّذِينَ خَسِرُوا أَنفُسَهُم بِمَا كَانُوا بِآيَاتِنَا يَظْلِمُونَ
మరెవరి త్రాసు తేలికగా ఉంటుందో వారు, మా ఆయతుల పట్ల దుర్మార్గంగా ప్రవర్తించినందుకుగాను చేజేతులా నష్టాన్ని కొనితెచ్చుకునేవారు.
7:10 وَلَقَدْ مَكَّنَّاكُمْ فِي الْأَرْضِ وَجَعَلْنَا لَكُمْ فِيهَا مَعَايِشَ ۗ قَلِيلًا مَّا تَشْكُرُونَ
నిశ్చయంగా మేము మిమ్మల్ని భువిపై నివసింపజేశాము. మీ కొరకు అందులో జీవన సామగ్రిని సమకూర్చాము. అయినప్పటికీ మీరు కృతజ్ఞత తెలుపుకునేది బహు తక్కువ.
7:11 وَلَقَدْ خَلَقْنَاكُمْ ثُمَّ صَوَّرْنَاكُمْ ثُمَّ قُلْنَا لِلْمَلَائِكَةِ اسْجُدُوا لِآدَمَ فَسَجَدُوا إِلَّا إِبْلِيسَ لَمْ يَكُن مِّنَ السَّاجِدِينَ
మేము మిమ్మల్ని సృష్టించాము. మరి మేమే మీ రూపురేఖలను తీర్చిదిద్దాము. ఆ తరువాత దూతలను, “ఆదం ముందు సాష్టాంగపడండి” అని ఆదేశించాము. ఒక్క ఇబ్లీసు తప్ప అందరూ సాష్టాంగపడ్డారు. వాడు మాత్రం సాష్టాంగ పడేవారిలో చేరలేదు.
7:12 قَالَ مَا مَنَعَكَ أَلَّا تَسْجُدَ إِذْ أَمَرْتُكَ ۖ قَالَ أَنَا خَيْرٌ مِّنْهُ خَلَقْتَنِي مِن نَّارٍ وَخَلَقْتَهُ مِن طِينٍ
“నేను నిన్ను ఆజ్ఞాపించినప్పటికీ సాష్టాంగపడకుండా ఏ విషయం నిన్ను అడ్డుకుంది?” అని (అల్లాహ్) అడిగితే, “నేను అతనికంటే ఘనుడను. నీవు నన్ను అగ్నితో సృష్టించావు, అతన్నేమో మట్టితో చేశావు” అని ఇబ్లీసు చెప్పాడు.
7:13 قَالَ فَاهْبِطْ مِنْهَا فَمَا يَكُونُ لَكَ أَن تَتَكَبَّرَ فِيهَا فَاخْرُجْ إِنَّكَ مِنَ الصَّاغِرِينَ
“అలాగయితే నువ్వు ఆకాశం నుంచి దిగిపో. ఆకాశంలో ఉండి అహంకారం ప్రదర్శించే హక్కు నీకెంతమాత్రం లేదు. కాబట్టి ఇక్కణ్ణుంచి వెళ్ళిపో. నిశ్చయంగా నువ్వు తుచ్ఛుల కోవకు చెందినవాడవు” అని అల్లాహ్ అన్నాడు.
7:14 قَالَ أَنظِرْنِي إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ
“అలాగయితే అందరూ తిరిగి లేపబడే రోజు వరకూ నాకు గడువు ఇవ్వు” అని ఇబ్లీసు అడిగాడు.
7:15 قَالَ إِنَّكَ مِنَ الْمُنظَرِينَ
“నీకు గడువు ఇవ్వబడింది” అని అల్లాహ్ చెప్పాడు.
7:16 قَالَ فَبِمَا أَغْوَيْتَنِي لَأَقْعُدَنَّ لَهُمْ صِرَاطَكَ الْمُسْتَقِيمَ
“నీవు నన్ను భ్రష్టుణ్ణి చేసిన కారణంగా నేను వీళ్ళ కోసం (అంటే మానవుల కోసం) నీ రుజుమార్గంలో (మాటువేసి) కూర్చుంటాను.
7:17 ثُمَّ لَآتِيَنَّهُم مِّن بَيْنِ أَيْدِيهِمْ وَمِنْ خَلْفِهِمْ وَعَنْ أَيْمَانِهِمْ وَعَن شَمَائِلِهِمْ ۖ وَلَا تَجِدُ أَكْثَرَهُمْ شَاكِرِينَ
ఆపైన “ముందు నుంచీ, వెనుక నుంచీ, కుడి వైపు నుంచీ, ఎడమ వైపు నుంచీ వాళ్ళపై దాడి చేస్తాను. వారిలో చాలా మందిని నీవు కృతజ్ఞులుగా పొందవు” అని ఇబ్లీసు సవాలు చేశాడు.
7:18 قَالَ اخْرُجْ مِنْهَا مَذْءُومًا مَّدْحُورًا ۖ لَّمَن تَبِعَكَ مِنْهُمْ لَأَمْلَأَنَّ جَهَنَّمَ مِنكُمْ أَجْمَعِينَ
అప్పుడు అల్లాహ్, “తుచ్ఛుడవై, ధూర్తుడవై ఇక్కడినుంచి వెళ్ళిపో. వారిలో ఎవరు నీ మాట వింటారో మీ అందరితోనూ నరకాన్ని నింపుతాను” అన్నాడు.
7:19 وَيَا آدَمُ اسْكُنْ أَنتَ وَزَوْجُكَ الْجَنَّةَ فَكُلَا مِنْ حَيْثُ شِئْتُمَا وَلَا تَقْرَبَا هَٰذِهِ الشَّجَرَةَ فَتَكُونَا مِنَ الظَّالِمِينَ
“ఓ ఆదమ్! నువ్వూ, నీ భార్య-ఇద్దరూ స్వర్గంలో ఉండండి. మరి మీరు కోరిన చోటునుంచి (మీకు నచ్చిన దాన్ని తీసుకుని) తినండి. కాని ఈ వృక్షం వద్దకు మాత్రం పోకండి. పోయారా, మీరిద్దరూ దుర్మార్గుల్లో చేరిపోతారు” (అని మేము చెప్పాము).
7:20 فَوَسْوَسَ لَهُمَا الشَّيْطَانُ لِيُبْدِيَ لَهُمَا مَا وُورِيَ عَنْهُمَا مِن سَوْآتِهِمَا وَقَالَ مَا نَهَاكُمَا رَبُّكُمَا عَنْ هَٰذِهِ الشَّجَرَةِ إِلَّا أَن تَكُونَا مَلَكَيْنِ أَوْ تَكُونَا مِنَ الْخَالِدِينَ
తరువాత షైతాను, పరస్పరం వారిరువురికి కనబడకుండా ఉన్న వారి మర్మ స్థానాలను వారి ముందు బహిర్గతం చేసే ఉద్దేశంతో వారిద్దరి ఆంతర్యాలలో దుష్ప్రేరణను రేకెత్తించాడు. “మీరు దైవదూతలై పోతారేమో, ఎల్లకాలం సజీవులుగా ఉండే వారిలో కలిసిపోతారేమోనని మీ ప్రభువు మీ ఇద్దరినీ ఈ వృక్షం వద్దకు పోకుండా వారించాడు సుమా!” అని షైతాను వారితో అన్నాడు.
7:21 وَقَاسَمَهُمَا إِنِّي لَكُمَا لَمِنَ النَّاصِحِينَ
“నేను మీ శ్రేయోభిలాషిని” అని వారిద్దరి ముందు ఒట్టేసి మరీ చెప్పాడు.
7:22 فَدَلَّاهُمَا بِغُرُورٍ ۚ فَلَمَّا ذَاقَا الشَّجَرَةَ بَدَتْ لَهُمَا سَوْآتُهُمَا وَطَفِقَا يَخْصِفَانِ عَلَيْهِمَا مِن وَرَقِ الْجَنَّةِ ۖ وَنَادَاهُمَا رَبُّهُمَا أَلَمْ أَنْهَكُمَا عَن تِلْكُمَا الشَّجَرَةِ وَأَقُل لَّكُمَا إِنَّ الشَّيْطَانَ لَكُمَا عَدُوٌّ مُّبِينٌ
ఆ విధంగా వాడు వారిద్దరినీ మోసపుచ్చి క్రిందికి తీసుకువచ్చాడు. వారిద్దరూ ఆ వృక్షం రుచి చూడగానే ఇద్దరి మర్మ స్థానాలూ ఒండొకరి ముందు బహిర్గతం అయిపోయాయి. అప్పుడు వారిరువురూ స్వర్గంలోని ఆకులను తమపై కప్పుకోసాగారు. వారి ప్రభువు వారిని పిలిచి, “మీరుభయులూ ఆ చెట్టు వద్దకు పోరాదని నేను మిమ్మల్ని వారించలేదా? షైతాను మీ బద్ధవిరోధి అని నేను మీకు ముందే చెప్పలేదా?” అన్నాడు.
7:23 قَالَا رَبَّنَا ظَلَمْنَا أَنفُسَنَا وَإِن لَّمْ تَغْفِرْ لَنَا وَتَرْحَمْنَا لَنَكُونَنَّ مِنَ الْخَاسِرِينَ
వారిద్దరూ, “మా ప్రభూ! మేము మా స్వయానికి ఎంతో అన్యాయం చేసుకున్నాము. ఇప్పుడు నీవు గనక మాకు క్షమాభిక్ష పెట్టి, మాపై దయదలచకపోతే నిశ్చయంగా మేము నష్టపోతాము” అని వేడుకున్నారు.
7:24 قَالَ اهْبِطُوا بَعْضُكُمْ لِبَعْضٍ عَدُوٌّ ۖ وَلَكُمْ فِي الْأَرْضِ مُسْتَقَرٌّ وَمَتَاعٌ إِلَىٰ حِينٍ
“దిగిపోండి. మీరు ఒండొకరికి విరోధులు. భూమిలో మీకు నివాస స్థానం ఉంటుంది. ఒక నిర్ణీత కాలం వరకూ మీరు అక్కడే లబ్ది పొందవలసి ఉంటుంది” అని సెలవిచ్చాడు.
7:25 قَالَ فِيهَا تَحْيَوْنَ وَفِيهَا تَمُوتُونَ وَمِنْهَا تُخْرَجُونَ
“మీరు అక్కడే బ్రతకాలి. అక్కడే చావాలి. మరి అక్కడి నుంచే మీరు వెలికి తీయబడతారు” అని కూడా అల్లాహ్ సెలవిచ్చాడు.
7:26 يَا بَنِي آدَمَ قَدْ أَنزَلْنَا عَلَيْكُمْ لِبَاسًا يُوَارِي سَوْآتِكُمْ وَرِيشًا ۖ وَلِبَاسُ التَّقْوَىٰ ذَٰلِكَ خَيْرٌ ۚ ذَٰلِكَ مِنْ آيَاتِ اللَّهِ لَعَلَّهُمْ يَذَّكَّرُونَ
ఓ ఆదం సంతతి వారలారా! మేము మీ కోసం దుస్తుల్ని దించాము. అవి మీ మర్మస్థానాలను కప్పి ఉంచటమేగాకుండా, మీ శరీరానికి శోభాయమానంగా కూడా ఉంటాయి. అయితే భయభక్తులతో కూడుకున్న దుస్తులు ఇంతకన్నా మంచివి. ఇవి వీళ్లు జ్ఞాపకముంచుకునేందుకుగాను అల్లాహ్ (చేసిన) సూచనలలోనివి.
7:27 يَا بَنِي آدَمَ لَا يَفْتِنَنَّكُمُ الشَّيْطَانُ كَمَا أَخْرَجَ أَبَوَيْكُم مِّنَ الْجَنَّةِ يَنزِعُ عَنْهُمَا لِبَاسَهُمَا لِيُرِيَهُمَا سَوْآتِهِمَا ۗ إِنَّهُ يَرَاكُمْ هُوَ وَقَبِيلُهُ مِنْ حَيْثُ لَا تَرَوْنَهُمْ ۗ إِنَّا جَعَلْنَا الشَّيَاطِينَ أَوْلِيَاءَ لِلَّذِينَ لَا يُؤْمِنُونَ
ఓ ఆదం సంతతి వారలారా! షైతాను మీ తల్లిదండ్రులను స్వర్గం నుంచి బయటికి తీయించి, వారి మర్మస్థానాలు వారికి కనిపించేలా చేయటానికి వారి దుస్తుల్ని ఎలా తొలగింపజేశాడో అలాగే వాడు మిమ్మల్ని కూడా చెరపకూడదు సుమా! వాడూ, వాడి సైన్యం, మీరు వారిని చూడలేని చోటు నుంచి మిమ్మల్ని చూస్తున్నారు. మేము అవిశ్వాసులకు షైతానులను స్నేహితులుగా చేశాము.
7:28 وَإِذَا فَعَلُوا فَاحِشَةً قَالُوا وَجَدْنَا عَلَيْهَا آبَاءَنَا وَاللَّهُ أَمَرَنَا بِهَا ۗ قُلْ إِنَّ اللَّهَ لَا يَأْمُرُ بِالْفَحْشَاءِ ۖ أَتَقُولُونَ عَلَى اللَّهِ مَا لَا تَعْلَمُونَ
వారు సిగ్గుమాలిన పని చేసినప్పుడల్లా, “మేము మా తాత ముత్తాతలను కూడా ఇలా చేస్తుండగా చూశాము. అల్లాహ్ కూడా మాకు ఇలాగే చేయమని ఆజ్ఞాపించాడు” అని చెబుతారు. “సిగ్గుమాలిన పనులు చెయ్యమని అల్లాహ్ ఎన్నటికీ ఆజ్ఞాపించడు. మీకు ఏ విషయాలైతే తెలియవో అల్లాహ్‌కు అటువంటి వాటిని ఆపాదిస్తారేమిటీ?” అని (ఓ ప్రవక్తా!) వారిని అడుగు.
7:29 قُلْ أَمَرَ رَبِّي بِالْقِسْطِ ۖ وَأَقِيمُوا وُجُوهَكُمْ عِندَ كُلِّ مَسْجِدٍ وَادْعُوهُ مُخْلِصِينَ لَهُ الدِّينَ ۚ كَمَا بَدَأَكُمْ تَعُودُونَ
(ఓ ప్రవక్తా!) ఈ విధంగా చెప్పు: నా ప్రభువు న్యాయంగురించి ఆదేశించాడు. సజ్దా చేసే ప్రతిసారీ మీ దిశ సరిగ్గా ఉండేటట్లు చూసుకోమని, ధర్మాన్ని (ఇబాదత్ను) కేవలం అల్లాహ్ కొరకే ప్రత్యేకించుకుని ఆయన్ని వేడుకోమని ఆయన ఆజ్ఞాపించాడు. మొదటిసారి అల్లాహ్ మిమ్మల్ని ఎలా పుట్టించాడో మలిసారి కూడా మీరు అలాగే పుట్టించబడతారు.
7:30 فَرِيقًا هَدَىٰ وَفَرِيقًا حَقَّ عَلَيْهِمُ الضَّلَالَةُ ۗ إِنَّهُمُ اتَّخَذُوا الشَّيَاطِينَ أَوْلِيَاءَ مِن دُونِ اللَّهِ وَيَحْسَبُونَ أَنَّهُم مُّهْتَدُونَ
అల్లాహ్ ఒక వర్గానికి సన్మార్గం చూపించాడు. మరో వర్గంపై అపమార్గం రూఢీ అయింది. వారు అల్లాహ్‌ను వదలి షైతానులను తమ స్నేహితులుగా చేసుకున్నారు. పైపెచ్చు – తాము సన్మార్గాన ఉన్నామని వారు అనుకుంటున్నారు.
7:31 يَا بَنِي آدَمَ خُذُوا زِينَتَكُمْ عِندَ كُلِّ مَسْجِدٍ وَكُلُوا وَاشْرَبُوا وَلَا تُسْرِفُوا ۚ إِنَّهُ لَا يُحِبُّ الْمُسْرِفِينَ
ఓ ఆదం సంతతివారలారా! మీరు మస్జిదుకు హాజరైన ప్రతిసారీ వస్త్రాలంకరణ పట్ల శ్రద్ధ వహించండి. తినండి, త్రాగండి. కాని మితిమీరకండి. మితిమీరిపోయే వారిని ఆయన (అల్లాహ్) ఇష్టపడడు.
7:32 قُلْ مَنْ حَرَّمَ زِينَةَ اللَّهِ الَّتِي أَخْرَجَ لِعِبَادِهِ وَالطَّيِّبَاتِ مِنَ الرِّزْقِ ۚ قُلْ هِيَ لِلَّذِينَ آمَنُوا فِي الْحَيَاةِ الدُّنْيَا خَالِصَةً يَوْمَ الْقِيَامَةِ ۗ كَذَٰلِكَ نُفَصِّلُ الْآيَاتِ لِقَوْمٍ يَعْلَمُونَ
(ఓ ప్రవక్తా!) వారిని అడుగు : “అల్లాహ్ తన దాసుల కొరకు సృజించిన అలంకార వస్తువులను, పరిశుద్ధమైన ఆహారవస్తువులను నిషేధించినదెవరు?” ప్రళయదినాన విశ్వసించిన వారికై ప్రత్యేకించబడిన ఈ వస్తువులన్నీ ఇహలోక జీవితంలో కూడా విశ్వాసుల కోసం ఉన్నాయి అని (ఓ ప్రవక్తా!) వాళ్ళకు చెప్పు. ఈ విధంగా మేము జ్ఞానసంపన్నుల కోసం మా ఆయతులన్నింటినీ విపులీకరిస్తూ ఉంటాము.
7:33 قُلْ إِنَّمَا حَرَّمَ رَبِّيَ الْفَوَاحِشَ مَا ظَهَرَ مِنْهَا وَمَا بَطَنَ وَالْإِثْمَ وَالْبَغْيَ بِغَيْرِ الْحَقِّ وَأَن تُشْرِكُوا بِاللَّهِ مَا لَمْ يُنَزِّلْ بِهِ سُلْطَانًا وَأَن تَقُولُوا عَلَى اللَّهِ مَا لَا تَعْلَمُونَ
“నా ప్రభువు నిషేధించినవి ఇవి మాత్రమే : బాహాటంగానూ, గోప్యంగానూ చేసే సిగ్గుమాలిన పనులు, పాపంతో కూడుకున్న ప్రతి విషయమూ, అన్యాయంగా ఒకరిమీద దుర్మార్గానికి ఒడిగట్టటం, అల్లాహ్ ఏ ప్రమాణమూ అవతరింపజేయకపోయినప్పటికీ మీరు అల్లాహ్‌కు భాగస్వామ్యం కల్పించటం, (నిజంగా అల్లాహ్ అన్నాడని) మీకు తెలియని విషయాన్ని మీరు అల్లాహ్ పేరుతో చెప్పటం (వీటిని అల్లాహ్ నిషేధించాడు)” అని ఓ ప్రవక్తా! వారికి చెప్పు.
7:34 وَلِكُلِّ أُمَّةٍ أَجَلٌ ۖ فَإِذَا جَاءَ أَجَلُهُمْ لَا يَسْتَأْخِرُونَ سَاعَةً ۖ وَلَا يَسْتَقْدِمُونَ
ప్రతి సమాజానికీ ఒక గడువు నిర్థారించబడి ఉంది. వారి నిర్ణీత సమయం వచ్చేసినప్పుడు ఒక్క క్షణం కూడా వారు వెనకా ముందూ కాలేరు.
7:35 يَا بَنِي آدَمَ إِمَّا يَأْتِيَنَّكُمْ رُسُلٌ مِّنكُمْ يَقُصُّونَ عَلَيْكُمْ آيَاتِي ۙ فَمَنِ اتَّقَىٰ وَأَصْلَحَ فَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ
ఓ ఆదం సంతతివారలారా! ఒకవేళ మీలో నుంచే (నియుక్తులైన) ప్రవక్తలు మీవద్దకు వచ్చి, నా ఆదేశాలను వారు మీకు వినిపించినపుడు భయభక్తుల (తఖ్వా) వైఖరిని అవలంబించి, తమ్ము తాము సరిదిద్దుకున్న వారికి భయంగానీ, దుఃఖంగానీ ఉండదు.
7:36 وَالَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا وَاسْتَكْبَرُوا عَنْهَا أُولَٰئِكَ أَصْحَابُ النَّارِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ
మరెవరయితే మా ఆదేశాలను అసత్యాలని ధిక్కరించి, వాటిపట్ల దురహంకారాన్ని ప్రదర్శిస్తారో వారు నరక వాసులవుతారు. అందులో వారు ఎల్లకాలం పడి ఉంటారు.
7:37 فَمَنْ أَظْلَمُ مِمَّنِ افْتَرَىٰ عَلَى اللَّهِ كَذِبًا أَوْ كَذَّبَ بِآيَاتِهِ ۚ أُولَٰئِكَ يَنَالُهُمْ نَصِيبُهُم مِّنَ الْكِتَابِ ۖ حَتَّىٰ إِذَا جَاءَتْهُمْ رُسُلُنَا يَتَوَفَّوْنَهُمْ قَالُوا أَيْنَ مَا كُنتُمْ تَدْعُونَ مِن دُونِ اللَّهِ ۖ قَالُوا ضَلُّوا عَنَّا وَشَهِدُوا عَلَىٰ أَنفُسِهِمْ أَنَّهُمْ كَانُوا كَافِرِينَ
అల్లాహ్‌కు అబద్ధాలను అంటగట్టేవాని కంటే లేదా ఆయన ఆయతులను అసత్యాలని కొట్టిపారేసేవాని కంటే పరమ దుర్మార్గుడెవడుంటాడు? అటువంటి వారికోసం రాసిపెట్టి ఉన్న భాగం వారికి లభించి తీరుతుంది. ఆఖరికి మా దూతలు వారి ప్రాణాలు స్వాధీనం చేసుకోవటానికి వారివద్దకు వచ్చినప్పుడు “అల్లాహ్‌ను వదలి మీరు ఆరాధిస్తూ ఉన్నవారు ఇప్పుడెక్కడున్నారు?” అని అడుగుతారు. “వారంతా మా వద్ద నుంచి మటుమాయమై పోయారు” అని వాళ్ళు చెబుతారు. తాము అవిశ్వాసులుగా ఉండేవారన్న విషయాన్ని గురించి వారు స్వయంగా సాక్ష్యమిస్తారు.
7:38 قَالَ ادْخُلُوا فِي أُمَمٍ قَدْ خَلَتْ مِن قَبْلِكُم مِّنَ الْجِنِّ وَالْإِنسِ فِي النَّارِ ۖ كُلَّمَا دَخَلَتْ أُمَّةٌ لَّعَنَتْ أُخْتَهَا ۖ حَتَّىٰ إِذَا ادَّارَكُوا فِيهَا جَمِيعًا قَالَتْ أُخْرَاهُمْ لِأُولَاهُمْ رَبَّنَا هَٰؤُلَاءِ أَضَلُّونَا فَآتِهِمْ عَذَابًا ضِعْفًا مِّنَ النَّارِ ۖ قَالَ لِكُلٍّ ضِعْفٌ وَلَٰكِن لَّا تَعْلَمُونَ
“మీకు పూర్వం గతించిన జిన్నాతు, మానవ సమూహాలతో చేరి, (వారితో పాటు) మీరు కూడా నరకంలోకి ప్రవేశించండి” అని అల్లాహ్ వారితో అంటాడు. వారిలోని ప్రతి సమూహమూ అందులో (నరకంలో) పడుతున్నప్పుడు, తన సహవాస సమూహానికి శాపనార్థాలు పెడుతుంది. ఆఖరికి వారంతా అందులో చేరిపోయిన తరువాత, తరువాతి వారు మొదటివారినుద్దేశించి, ”ప్రభూ! అసలు మమ్మల్ని అపమార్గం పట్టించిన వాళ్లు వీళ్ళే. కనుక వీళ్లకు రెట్టింపు నరక శిక్షను విధించు” అని అంటారు. అప్పుడు అల్లాహ్, “అందరికీ రెట్టింపు శిక్షే పడుతుంది. కాని ఆ సంగతి మీకు అర్థం కాదు” అంటాడు-
7:39 وَقَالَتْ أُولَاهُمْ لِأُخْرَاهُمْ فَمَا كَانَ لَكُمْ عَلَيْنَا مِن فَضْلٍ فَذُوقُوا الْعَذَابَ بِمَا كُنتُمْ تَكْسِبُونَ
మొదటివారు తమ తరువాతి వారినుద్దేశించి, “మీకు మాపై ఎలాంటి ప్రాధాన్యతా లభించలేదు. కాబట్టి మీరు కూడా మీరు సంపాదించుకున్న దానికి ప్రతిఫలంగా శిక్షను రుచి చూడండి” అంటారు.
7:40 إِنَّ الَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا وَاسْتَكْبَرُوا عَنْهَا لَا تُفَتَّحُ لَهُمْ أَبْوَابُ السَّمَاءِ وَلَا يَدْخُلُونَ الْجَنَّةَ حَتَّىٰ يَلِجَ الْجَمَلُ فِي سَمِّ الْخِيَاطِ ۚ وَكَذَٰلِكَ نَجْزِي الْمُجْرِمِينَ
ఎవరు మా ఆయతులను అసత్యాలని ధిక్కరించి, వాటి పట్ల గర్వాతిశయంతో విర్రవీగారో వారి కోసం ఆకాశ ద్వారాలు తెరువబడవు. ఒంటె సూది రంధ్రంలో నుంచి దూరిపోనంత వరకూ వారు స్వర్గంలో ప్రవేశించలేరు. అపరాధులను మేము ఈ విధంగానే శిక్షిస్తాం.
7:41 لَهُم مِّن جَهَنَّمَ مِهَادٌ وَمِن فَوْقِهِمْ غَوَاشٍ ۚ وَكَذَٰلِكَ نَجْزِي الظَّالِمِينَ
వారి క్రింద నరకాగ్నితో చేయబడిన పాన్పుఉంటుంది. పైన దుప్పటి కూడా (దానితోనే తయారైనదయి ఉంటుంది). దుర్మార్గులకు మేము విధించే శిక్ష ఇలాగే ఉంటుంది.
7:42 وَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ لَا نُكَلِّفُ نَفْسًا إِلَّا وُسْعَهَا أُولَٰئِكَ أَصْحَابُ الْجَنَّةِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ
మరెవరు విశ్వసించి, మంచి పనులు చేశారో- ఏ వ్యక్తిపై కూడా మేము శక్తికి మించిన భారం వేయము- యదార్థానికి వారే స్వర్గవాసులు. అందులో వారు కలకాలం ఉంటారు.
7:43 وَنَزَعْنَا مَا فِي صُدُورِهِم مِّنْ غِلٍّ تَجْرِي مِن تَحْتِهِمُ الْأَنْهَارُ ۖ وَقَالُوا الْحَمْدُ لِلَّهِ الَّذِي هَدَانَا لِهَٰذَا وَمَا كُنَّا لِنَهْتَدِيَ لَوْلَا أَنْ هَدَانَا اللَّهُ ۖ لَقَدْ جَاءَتْ رُسُلُ رَبِّنَا بِالْحَقِّ ۖ وَنُودُوا أَن تِلْكُمُ الْجَنَّةُ أُورِثْتُمُوهَا بِمَا كُنتُمْ تَعْمَلُونَ
వారి ఆంతర్యాల్లో ఏ కాస్తయినా విద్వేషం ఉంటే దాన్ని మేము తొలగిస్తాము. వారి (నివాసాల) క్రింద నుంచి కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. “మమ్మల్ని ఈ స్థానం వరకూ చేర్చిన అల్లాహ్‌కు (కోట్లాది) కృతజ్ఞతలు. అల్లాహ్‌యే గనక మాకు మార్గదర్శకత్వం వహించకుండా ఉంటే మేము ఎన్నటికి కూడా ఈ స్థితికి చేరుకునే వాళ్ళంకాము. మా ప్రభువు (తరఫున వచ్చిన) ప్రవక్తలు నిజంగా సత్యాన్నే తీసుకువచ్చారు” అని వారు అంటారు. అప్పుడు వారిని పిలిచి ఇలా చెప్పబడుతుంది: “మీరు చేసుకున్న సత్కర్మలకు బదులుగా మీరు ఈ స్వర్గానికి వారసులయ్యారు.”
7:44 وَنَادَىٰ أَصْحَابُ الْجَنَّةِ أَصْحَابَ النَّارِ أَن قَدْ وَجَدْنَا مَا وَعَدَنَا رَبُّنَا حَقًّا فَهَلْ وَجَدتُّم مَّا وَعَدَ رَبُّكُمْ حَقًّا ۖ قَالُوا نَعَمْ ۚ فَأَذَّنَ مُؤَذِّنٌ بَيْنَهُمْ أَن لَّعْنَةُ اللَّهِ عَلَى الظَّالِمِينَ
స్వర్గవాసులు నరకవాసులను కేకవేసి పిలుస్తూ, “మా ప్రభువు మాకు చేసిన వాగ్దానాన్ని మేము నిజమైనదిగా పొందాము. మరి మీరు కూడా మీ ప్రభువు చేసిన వాగ్దానాన్ని నిజమైనదిగా పొందారా?” అని ప్రశ్నిస్తారు. “అవును” అని వారు సమాధానమిస్తారు. అప్పుడు ప్రకటించేవాడొకడు వారి మధ్య, “ఈ దుర్మార్గులపై అల్లాహ్ శాపం పడుగాక!” అని ప్రకటిస్తాడు.
7:45 الَّذِينَ يَصُدُّونَ عَن سَبِيلِ اللَّهِ وَيَبْغُونَهَا عِوَجًا وَهُم بِالْآخِرَةِ كَافِرُونَ
వారు అల్లాహ్ మార్గం నుంచి విముఖత చూపేవారు, అందులో వక్రతలను వెతికేవారు. పరలోకాన్ని సయితం త్రోసి పుచ్చేవారు.
7:46 وَبَيْنَهُمَا حِجَابٌ ۚ وَعَلَى الْأَعْرَافِ رِجَالٌ يَعْرِفُونَ كُلًّا بِسِيمَاهُمْ ۚ وَنَادَوْا أَصْحَابَ الْجَنَّةِ أَن سَلَامٌ عَلَيْكُمْ ۚ لَمْ يَدْخُلُوهَا وَهُمْ يَطْمَعُونَ
వారిరువురి మధ్య ఒక గోడ అడ్డుగా ఉంటుంది. ‘ఆరాఫ్’ పైన చాలామంది ఉంటారు. వారు ప్రతి ఒక్కరినీ వారి చిహ్నాలను బట్టి గుర్తుపడతారు. వారు స్వర్గవాసులను పిలిచి, “అస్సలాము అలైకుమ్ (మీకు శాంతి కలుగుగాక)!” అని అంటారు. ఈ ఆరాఫ్ వారు అప్పటికింకా స్వర్గంలో ప్రవేశించి ఉండరు. అయితే తమకూ స్వర్గం లభిస్తుందన్న ఆశతో ఉంటారు.
7:47 وَإِذَا صُرِفَتْ أَبْصَارُهُمْ تِلْقَاءَ أَصْحَابِ النَّارِ قَالُوا رَبَّنَا لَا تَجْعَلْنَا مَعَ الْقَوْمِ الظَّالِمِينَ
వారి దృష్టి నరకవాసులపై పడినప్పుడు, “ఓ ప్రభూ! మమ్మల్ని ఈ దుర్మార్గులలో చేర్చకు” అని ప్రార్థిస్తారు.
7:48 وَنَادَىٰ أَصْحَابُ الْأَعْرَافِ رِجَالًا يَعْرِفُونَهُم بِسِيمَاهُمْ قَالُوا مَا أَغْنَىٰ عَنكُمْ جَمْعُكُمْ وَمَا كُنتُمْ تَسْتَكْبِرُونَ
‘ఆరాఫ్’పై ఉన్నవారు ఎంతోమందిని (నరకవాసుల్ని) వారి ఆనవాళ్ల ద్వారా గుర్తుపట్టి పిలుస్తూ, ఇలా అంటారు : “మీ వర్గాలుగానీ, మీ బడాయిగానీ మీకు ఏమాత్రం పనికి రాలేదే!
7:49 أَهَٰؤُلَاءِ الَّذِينَ أَقْسَمْتُمْ لَا يَنَالُهُمُ اللَّهُ بِرَحْمَةٍ ۚ ادْخُلُوا الْجَنَّةَ لَا خَوْفٌ عَلَيْكُمْ وَلَا أَنتُمْ تَحْزَنُونَ
‘అల్లాహ్ వీళ్లపై దయచూపడు’ అని మీరు ప్రమాణాలు చేసి చెప్పేవారు వీరేనా?” అని అడుగుతారు. అప్పుడు “స్వర్గంలో ప్రవేశించండి. ఇక మీకు భయంగానీ, దుఃఖంగానీ ఉండదు” అని వారితో అనబడుతుంది.
7:50 وَنَادَىٰ أَصْحَابُ النَّارِ أَصْحَابَ الْجَنَّةِ أَنْ أَفِيضُوا عَلَيْنَا مِنَ الْمَاءِ أَوْ مِمَّا رَزَقَكُمُ اللَّهُ ۚ قَالُوا إِنَّ اللَّهَ حَرَّمَهُمَا عَلَى الْكَافِرِينَ
నరకవాసులు స్వర్గవాసులను పిలుస్తూ, “మాపైన కొద్దిగా నీళ్ళయినా పోయండి లేదా అల్లాహ్ మీకు ప్రసాదించిన దాంట్లోంచి ఏ కాస్తయినా ఇటు పడేయండి” అని ప్రాధేయ పడతారు. దానికి సమాధానంగా వారు, “ఈ రెండింటినీ అల్లాహ్ అవిశ్వాసుల కొరకు నిషేధించాడు” అని అంటారు.
7:51 الَّذِينَ اتَّخَذُوا دِينَهُمْ لَهْوًا وَلَعِبًا وَغَرَّتْهُمُ الْحَيَاةُ الدُّنْيَا ۚ فَالْيَوْمَ نَنسَاهُمْ كَمَا نَسُوا لِقَاءَ يَوْمِهِمْ هَٰذَا وَمَا كَانُوا بِآيَاتِنَا يَجْحَدُونَ
వారు ఇహలోకంలో మతధర్మాన్ని ఆటగా, తమాషాగా తీసుకున్నారు. ఇహలోక జీవితం వారిని మోసానికి గురిచేసింది. కాబట్టి వారు ఈనాటి సమావేశాన్ని విస్మరించినట్లే, మా ఆయతులను త్రోసిపుచ్చినట్లే ఈ రోజు మేము (కూడా) వీళ్లను విస్మరిస్తాము.
7:52 وَلَقَدْ جِئْنَاهُم بِكِتَابٍ فَصَّلْنَاهُ عَلَىٰ عِلْمٍ هُدًى وَرَحْمَةً لِّقَوْمٍ يُؤْمِنُونَ
మేము ఈ జనుల వద్దకు, మా సంపూర్ణ జ్ఞానంతో బహుస్పష్టంగా విశదీకరించిన గ్రంథాన్ని చేరవేశాము. విశ్వసించినవారికి అది మార్గదర్శక సాధనం మరియు కారుణ్యం.
7:53 هَلْ يَنظُرُونَ إِلَّا تَأْوِيلَهُ ۚ يَوْمَ يَأْتِي تَأْوِيلُهُ يَقُولُ الَّذِينَ نَسُوهُ مِن قَبْلُ قَدْ جَاءَتْ رُسُلُ رَبِّنَا بِالْحَقِّ فَهَل لَّنَا مِن شُفَعَاءَ فَيَشْفَعُوا لَنَا أَوْ نُرَدُّ فَنَعْمَلَ غَيْرَ الَّذِي كُنَّا نَعْمَلُ ۚ قَدْ خَسِرُوا أَنفُسَهُمْ وَضَلَّ عَنْهُم مَّا كَانُوا يَفْتَرُونَ
ఈ గ్రంథంలో తెలియజేయబడిన తుదిఫలితం ఎప్పుడు వస్తుందా అని మాత్రమే తప్ప మరో దానికోసం వీరు నిరీక్షించటం లేదు. ఏ రోజున దీని తుది ఫలితం వచ్చేస్తుందో ఆ రోజు, ముందు నుంచీ దీనిని విస్మరిస్తూ వచ్చినవారే ఇలా అంటారు: “మా ప్రభువు (తరఫున నియుక్తులైన) ప్రవక్తలు నిజంగానే సత్య బద్ధమైన విషయాలు తెచ్చారు. ఇప్పుడు మా కోసం సిఫారసు చేసే సిఫారసుదారులెవరయినా మాకు లభిస్తారా? లేదా లోగడ మేము చేసిన (చెడు) కర్మలకు భిన్నమైన కర్మలు చేసేందుకు మళ్లీ మేము (ఇహలోకానికి) తిరిగి పంపబడతామా?” – నిస్సందేహంగా వీళ్లు తమ స్వయానికి నష్టం చేకూర్చుకున్నారు. వీళ్లు కల్పిస్తూ వచ్చిన విషయాలన్నీ వీళ్ల నుంచి మటుమాయం అయ్యాయి.
7:54 إِنَّ رَبَّكُمُ اللَّهُ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ فِي سِتَّةِ أَيَّامٍ ثُمَّ اسْتَوَىٰ عَلَى الْعَرْشِ يُغْشِي اللَّيْلَ النَّهَارَ يَطْلُبُهُ حَثِيثًا وَالشَّمْسَ وَالْقَمَرَ وَالنُّجُومَ مُسَخَّرَاتٍ بِأَمْرِهِ ۗ أَلَا لَهُ الْخَلْقُ وَالْأَمْرُ ۗ تَبَارَكَ اللَّهُ رَبُّ الْعَالَمِينَ
నిస్సందేహంగా అల్లాహ్‌యే మీ ప్రభువు. ఆయన ఆకాశాలను, భూమిని ఆరు రోజులలో సృష్టించాడు. ఆ తరువాత సింహాసనంపై (అర్ష్‌పై) ఆసీనుడయ్యాడు. ఆయన రాత్రిని పగటిపై కప్పివేస్తాడు. అది దాన్ని వేగంగా వెంబడిస్తూ వస్తుంది. ఇంకా ఆయన సూర్యచంద్రులను, నక్షత్రాలను తన ఆజ్ఞకు కట్టుబడి ఉండే విధంగా సృష్టించాడు. వినండి! సృష్టి ప్రక్రియ ఆయన స్వంతం. ఆజ్ఞాపన ఆయన సొత్తు. సకల లోకాల ప్రభువైన అల్లాహ్ అపారమైన శుభాలు కలవాడు.
7:55 ادْعُوا رَبَّكُمْ تَضَرُّعًا وَخُفْيَةً ۚ إِنَّهُ لَا يُحِبُّ الْمُعْتَدِينَ
మీరు మీ ప్రభువును కడు దీనంగా వేడుకోండి. గోప్యంగా కూడా విన్నవించుకోండి. హద్దు మీరిపోయే వారిని ఆయన సుతరామూ ఇష్టపడడు.
7:56 وَلَا تُفْسِدُوا فِي الْأَرْضِ بَعْدَ إِصْلَاحِهَا وَادْعُوهُ خَوْفًا وَطَمَعًا ۚ إِنَّ رَحْمَتَ اللَّهِ قَرِيبٌ مِّنَ الْمُحْسِنِينَ
సంస్కరణ జరిగిన తరువాత భూమిపై కల్లోలాన్ని సృష్టించకండి. భయపడుతూ, ఆశపడుతూ అల్లాహ్‌ను ఆరాధించండి. నిస్సందేహంగా అల్లాహ్ కారుణ్యం సజ్జనులకు చాలా దగ్గరే ఉంది.
7:57 وَهُوَ الَّذِي يُرْسِلُ الرِّيَاحَ بُشْرًا بَيْنَ يَدَيْ رَحْمَتِهِ ۖ حَتَّىٰ إِذَا أَقَلَّتْ سَحَابًا ثِقَالًا سُقْنَاهُ لِبَلَدٍ مَّيِّتٍ فَأَنزَلْنَا بِهِ الْمَاءَ فَأَخْرَجْنَا بِهِ مِن كُلِّ الثَّمَرَاتِ ۚ كَذَٰلِكَ نُخْرِجُ الْمَوْتَىٰ لَعَلَّكُمْ تَذَكَّرُونَ
తన కారుణ్య జల్లు కురిసేముందు గాలులను శుభవార్త సూచకంగా పంపేది ఆయనే. ఆఖరికి అవి బరువైన మేఘాలను ఎత్తుకున్నప్పుడు, మేము ఆ మేఘాలను నిర్జీవంగా పడివున్న ఏదేని ప్రదేశం వైపుకు తరలిస్తాము. ఆపైన ఆ మేఘాల ద్వారా వర్షాన్ని కురిపిస్తాము. ఆ వర్షపు నీటి ద్వారా అన్నిరకాల పండ్లు ఫలాలను ఉత్పన్నం చేస్తాము. మృతులను కూడా మేము ఇలాగే లేపి నిలబెడతాము. మీరు (నీతిని) గ్రహించేటందుకు గాను(మేము ఇన్ని విధాలుగా విషయాన్ని విడమరచి చెబుతున్నాము సుమా!).
7:58 وَالْبَلَدُ الطَّيِّبُ يَخْرُجُ نَبَاتُهُ بِإِذْنِ رَبِّهِ ۖ وَالَّذِي خَبُثَ لَا يَخْرُجُ إِلَّا نَكِدًا ۚ كَذَٰلِكَ نُصَرِّفُ الْآيَاتِ لِقَوْمٍ يَشْكُرُونَ
మంచి నేల తన ప్రభువు ఆదేశానుసారం పుష్కలమైన పంటనిస్తుంది. (దీనికి భిన్నంగా) చెడ్డ నేల చాలా తక్కువ ఉత్పత్తిని మాత్రమే ఇస్తుంది. ఈ విధంగా మేము కృతజ్ఞులై ఉండేవారి కోసం నిదర్శనాలను పలు విధాలుగా విశ్లేషించి చెబుతాము.
7:59 لَقَدْ أَرْسَلْنَا نُوحًا إِلَىٰ قَوْمِهِ فَقَالَ يَا قَوْمِ اعْبُدُوا اللَّهَ مَا لَكُم مِّنْ إِلَٰهٍ غَيْرُهُ إِنِّي أَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ عَظِيمٍ
మేము నూహ్ (అలైహిస్సలాం)ను అతని జాతి వద్దకు పంపాము. అప్పుడతను, “ఓ నా జాతి ప్రజలారా! మీరు అల్లాహ్‌ను ఆరాధించండి. ఆయన తప్ప వేరెవరూ మీ ఆరాధనకు అర్హులు కారు. మీ విషయంలో ఒక మహాదినం నాటి శిక్ష గురించి నాకు భయంగా ఉంది” అన్నాడు.
7:60 قَالَ الْمَلَأُ مِن قَوْمِهِ إِنَّا لَنَرَاكَ فِي ضَلَالٍ مُّبِينٍ
దానికి అతని జాతి పెద్దలు, “నువ్వు స్పష్టమైన అపమార్గానికి గురైనట్లు మాకు కనిపిస్తోంది” అన్నారు.
7:61 قَالَ يَا قَوْمِ لَيْسَ بِي ضَلَالَةٌ وَلَٰكِنِّي رَسُولٌ مِّن رَّبِّ الْعَالَمِينَ
“ఓ నా జాతి వారలారా! నేనేమాత్రం దారి తప్పలేదు. నిజానికి నేను సర్వలోక ప్రభువు తరఫున పంపబడిన ప్రవక్తను.
7:62 أُبَلِّغُكُمْ رِسَالَاتِ رَبِّي وَأَنصَحُ لَكُمْ وَأَعْلَمُ مِنَ اللَّهِ مَا لَا تَعْلَمُونَ
“నా ప్రభువు సందేశాన్ని మీకు అందజేస్తున్నాను. నేను మీ మేలుకోరేవాడిని. మీకు తెలియని విషయాలు అల్లాహ్ తరఫు నుంచి నాకు తెలుసు.
7:63 أَوَعَجِبْتُمْ أَن جَاءَكُمْ ذِكْرٌ مِّن رَّبِّكُمْ عَلَىٰ رَجُلٍ مِّنكُمْ لِيُنذِرَكُمْ وَلِتَتَّقُوا وَلَعَلَّكُمْ تُرْحَمُونَ
“ఏమిటీ? మిమ్మల్ని హెచ్చరించటానికి, మీరు భయభక్తుల వైఖరిని అవలంబించి తద్వారా మీరు కరుణించబడేటందుకు మీ వద్దకు స్వయంగా మీ నుంచే ఒక వ్యక్తి ద్వారా మీ ప్రభువు తరఫు నుండి ‘ఉపదేశం’ అందటం మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తిందా?” అని (నూహ్) అన్నాడు.
7:64 فَكَذَّبُوهُ فَأَنجَيْنَاهُ وَالَّذِينَ مَعَهُ فِي الْفُلْكِ وَأَغْرَقْنَا الَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا ۚ إِنَّهُمْ كَانُوا قَوْمًا عَمِينَ
అయినప్పటికీ వాళ్లు ఆయన (మాట)ను అసత్యమని ధిక్కరించారు. మేము నూహును, నావలో అతని వెంట ఉన్న అతని సహచరులను రక్షించి, మా ఆయతులను ధిక్కరించిన వారందరినీ ముంచి వేశాము. నిశ్చయంగా వారు మరీ గ్రుడ్డి జనులుగా వ్యవహరించారు.
7:65 وَإِلَىٰ عَادٍ أَخَاهُمْ هُودًا ۗ قَالَ يَا قَوْمِ اعْبُدُوا اللَّهَ مَا لَكُم مِّنْ إِلَٰهٍ غَيْرُهُ ۚ أَفَلَا تَتَّقُونَ
మేము ఆద్‌జాతి వద్దకు వారి సోదరుడైన హూద్‌ను పంపాము. “నా జాతి ప్రజలారా! మీరు అల్లాహ్‌ను ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరో ఆరాధ్య దైవం లేడు. మరలాంటప్పుడు మీరు భయపడరా?” అని అతను చెప్పాడు.
7:66 قَالَ الْمَلَأُ الَّذِينَ كَفَرُوا مِن قَوْمِهِ إِنَّا لَنَرَاكَ فِي سَفَاهَةٍ وَإِنَّا لَنَظُنُّكَ مِنَ الْكَاذِبِينَ
దానికి అతని జాతిలోని అవిశ్వాస సర్దారులు, “నువ్వు మాకు తెలివి తక్కువ వానిలా కనిపిస్తున్నావు. పైగా నువ్వు అబద్ధాల కోరువని మా అభిప్రాయం” అన్నారు.
7:67 قَالَ يَا قَوْمِ لَيْسَ بِي سَفَاهَةٌ وَلَٰكِنِّي رَسُولٌ مِّن رَّبِّ الْعَالَمِينَ
“ఓ నా జాతివారలారా! నాలో ఏ మాత్రం తెలివితక్కువ తనం లేదు. నేను సకల లోకాల ప్రభువు తరఫున పంపబడిన ప్రవక్తను.
7:68 أُبَلِّغُكُمْ رِسَالَاتِ رَبِّي وَأَنَا لَكُمْ نَاصِحٌ أَمِينٌ
“నా ప్రభువు సందేశాలను మీకు చేరవేసేవాణ్ణి. మీరు నమ్మదగ్గ మీ శ్రేయోభిలాషిని.
7:69 أَوَعَجِبْتُمْ أَن جَاءَكُمْ ذِكْرٌ مِّن رَّبِّكُمْ عَلَىٰ رَجُلٍ مِّنكُمْ لِيُنذِرَكُمْ ۚ وَاذْكُرُوا إِذْ جَعَلَكُمْ خُلَفَاءَ مِن بَعْدِ قَوْمِ نُوحٍ وَزَادَكُمْ فِي الْخَلْقِ بَسْطَةً ۖ فَاذْكُرُوا آلَاءَ اللَّهِ لَعَلَّكُمْ تُفْلِحُونَ
“ఏమిటీ, మిమ్మల్ని హెచ్చరించటానికి స్వయంగా మీనుండే ఒక వ్యక్తి ద్వారా, మీ ప్రభువు తరఫునుండి మీ వద్దకు హితోపదేశం రావటం మీకు ఆశ్చర్యం కలిగించిందా? అల్లాహ్ మిమ్మల్ని నూహ్ జాతి అనంతరం వారసులుగా చేసి, మీకు ఎక్కువ శరీర సౌష్ఠవాన్ని ప్రసాదించిన సంగతిని గుర్తుంచుకోండి. అల్లాహ్ అనుగ్రహాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. తద్వారా మీరు సాఫల్యం పొందుతారు” అని హూద్ బోధపరచాడు.
7:70 قَالُوا أَجِئْتَنَا لِنَعْبُدَ اللَّهَ وَحْدَهُ وَنَذَرَ مَا كَانَ يَعْبُدُ آبَاؤُنَا ۖ فَأْتِنَا بِمَا تَعِدُنَا إِن كُنتَ مِنَ الصَّادِقِينَ
“మేము అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించాలనీ, మా తాత ముత్తాతలు పూజిస్తూ వచ్చిన వాటిని వదలివేయమని (చెప్పటానికేనా) నువ్వు మా వద్దకు వచ్చింది? ఒకవేళ నువ్వు సత్యవంతుడవే అయితే ఏ శిక్షను గురించి నువ్వు మమ్మల్ని బెదిరిస్తున్నావో దాన్ని మా వద్దకు రప్పించు చూద్దాం” అని వారు అన్నారు.
7:71 قَالَ قَدْ وَقَعَ عَلَيْكُم مِّن رَّبِّكُمْ رِجْسٌ وَغَضَبٌ ۖ أَتُجَادِلُونَنِي فِي أَسْمَاءٍ سَمَّيْتُمُوهَا أَنتُمْ وَآبَاؤُكُم مَّا نَزَّلَ اللَّهُ بِهَا مِن سُلْطَانٍ ۚ فَانتَظِرُوا إِنِّي مَعَكُم مِّنَ الْمُنتَظِرِينَ
అప్పుడు హూద్ ఇలా అన్నాడు : “ఇక మీ ప్రభువు శిక్ష, ఆయన ఆగ్రహం మీపై విరుచుకుపడినట్లే. ఏమిటీ, మీరూ మీ తాతముత్తాతలూ కల్పించుకున్న పేర్ల విషయంలో నాతో గొడవపడుతున్నారా? వాటి గురించి (అవి ఆరాధ్య దైవాలని నిర్థారించే) ఏ ప్రమాణాన్నీ అల్లాహ్ అవతరింపజెయ్యలేదు. కాబట్టి మీరూ నిరీక్షించండి, మీతోపాటు నేను కూడా నిరీక్షిస్తాను.”
7:72 فَأَنجَيْنَاهُ وَالَّذِينَ مَعَهُ بِرَحْمَةٍ مِّنَّا وَقَطَعْنَا دَابِرَ الَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا ۖ وَمَا كَانُوا مُؤْمِنِينَ
ఎట్టకేలకు మేము అతన్నీ, అతని సహచరులను మా కృపతో కాపాడాము. అయితే మా ఆయతులు అబద్ధాలంటూ కొట్టి పారేసినవారి వేరును త్రెంచివేశాము. వారు ఎట్టి పరిస్థితిలోనూ విశ్వసించేవారు కారు.
7:73 وَإِلَىٰ ثَمُودَ أَخَاهُمْ صَالِحًا ۗ قَالَ يَا قَوْمِ اعْبُدُوا اللَّهَ مَا لَكُم مِّنْ إِلَٰهٍ غَيْرُهُ ۖ قَدْ جَاءَتْكُم بَيِّنَةٌ مِّن رَّبِّكُمْ ۖ هَٰذِهِ نَاقَةُ اللَّهِ لَكُمْ آيَةً ۖ فَذَرُوهَا تَأْكُلْ فِي أَرْضِ اللَّهِ ۖ وَلَا تَمَسُّوهَا بِسُوءٍ فَيَأْخُذَكُمْ عَذَابٌ أَلِيمٌ
ఇంకా మేము సమూదు జాతి వద్దకు వారి సోదరుడైన సాలిహ్ (అలైహిస్సలాం) ను పంపాము. అతడు (తన వారినుద్దేశించి), “ఓ నా జాతి ప్రజలారా! మీరు అల్లాహ్‌ను ఆరాధించండి. ఆయన తప్ప మరొకరెవరూ మీకు ఆరాధ్యులు కారు. మీ వద్దకు మీ ప్రభువు వద్ద నుంచి ఒక స్పష్టమైన నిదర్శనం వచ్చేసింది. ఇది అల్లాహ్ యొక్క ఆడ ఒంటె. ఇది మీ కోసం ఒక సూచనగా ఉంది. కాబట్టి దేవుని భూమిపై మేతమేస్తూ తిరగటానికి దాన్ని వదలిపెట్టండి. దురుద్దేశంతో దాన్ని తాకకండి. (ఒకవేళ మీరు గనక ఈ మాటను ఖాతరు చేయకపోతే) బాధాకరమైన శిక్ష ఒకటి మిమ్మల్ని పట్టుకుంటుంది.
7:74 وَاذْكُرُوا إِذْ جَعَلَكُمْ خُلَفَاءَ مِن بَعْدِ عَادٍ وَبَوَّأَكُمْ فِي الْأَرْضِ تَتَّخِذُونَ مِن سُهُولِهَا قُصُورًا وَتَنْحِتُونَ الْجِبَالَ بُيُوتًا ۖ فَاذْكُرُوا آلَاءَ اللَّهِ وَلَا تَعْثَوْا فِي الْأَرْضِ مُفْسِدِينَ
“మీరు (మీ గతాన్ని గురించి) కాస్త గుర్తుకు తెచ్చుకోండి- ఆదు జాతి అనంతరం అల్లాహ్ మిమ్మల్ని వారసులుగా చేశాడు. మీకు భూమిపై నివాసాన్ని ప్రసాదించగా, దాని మైదానంపై మీరు భవనాలు నిర్మిస్తున్నారు. కొండలను తొలచి వాటిలో గృహాలు నిర్మించుకుంటున్నారు. కనుక మీరు అల్లాహ్ అనుగ్రహాలను జ్ఞాపకం చేసుకోండి. భువిపై సంక్షోభాన్ని సృష్టించకండి.”
7:75 قَالَ الْمَلَأُ الَّذِينَ اسْتَكْبَرُوا مِن قَوْمِهِ لِلَّذِينَ اسْتُضْعِفُوا لِمَنْ آمَنَ مِنْهُمْ أَتَعْلَمُونَ أَنَّ صَالِحًا مُّرْسَلٌ مِّن رَّبِّهِ ۚ قَالُوا إِنَّا بِمَا أُرْسِلَ بِهِ مُؤْمِنُونَ
జాతిలోని గర్విష్టులైన సర్దారులు విశ్వసించిన బలహీన వర్గాల వారిని, “సాలిహ్ తన ప్రభువు తరఫున పంపబడిన ప్రవక్తేనన్న విషయం నిజంగానే మీకు తెలుసా?” అని అడిగారు. దానికి వారు, “నిస్సందేహంగా! ఆయనకు ఇచ్చి పంపబడిన దానిపై మాకు పూర్తి నమ్మకం ఉంది” అని సమాధానమిచ్చారు.
7:76 قَالَ الَّذِينَ اسْتَكْبَرُوا إِنَّا بِالَّذِي آمَنتُم بِهِ كَافِرُونَ
“అయితే మీరు నమ్మే విషయాన్ని మేము త్రోసిపుచ్చుతున్నాం” అని ఆ అహంకారులు అన్నారు.
7:77 فَعَقَرُوا النَّاقَةَ وَعَتَوْا عَنْ أَمْرِ رَبِّهِمْ وَقَالُوا يَا صَالِحُ ائْتِنَا بِمَا تَعِدُنَا إِن كُنتَ مِنَ الْمُرْسَلِينَ
తరువాత, వారు ఆడ ఒంటెను చంపేశారు. తమ ప్రభువు ఆజ్ఞ పట్ల తలబిరుసుతనం ప్రదర్శించారు. “ఓ సాలిహ్! నిజంగానే నువ్వు దైవప్రవక్తవైతే, మమ్మల్ని బెదిరిస్తూ వచ్చిన దానిని మాపైకి తీసుకురా!” అని అన్నారు.
7:78 فَأَخَذَتْهُمُ الرَّجْفَةُ فَأَصْبَحُوا فِي دَارِهِمْ جَاثِمِينَ
అంతే, భూకంపం వారిని పట్టుకుంది. వాళ్లు తమ ఇండ్లలో బోర్లాపడి, అలాగే ఉండిపోయారు.
7:79 فَتَوَلَّىٰ عَنْهُمْ وَقَالَ يَا قَوْمِ لَقَدْ أَبْلَغْتُكُمْ رِسَالَةَ رَبِّي وَنَصَحْتُ لَكُمْ وَلَٰكِن لَّا تُحِبُّونَ النَّاصِحِينَ
అప్పుడు సాలిహ్ (అలైహిస్సలాం) వారి నుండి ముఖం త్రిప్పుకుని, “నా జాతి ప్రజలారా! నా ప్రభువు సందేశాన్ని నేను మీకు అందజేశాను. మీ శ్రేయాన్ని అభిలషించాను. కాని మీకు శ్రేయోభిలాషులంటే ఇష్టం లేకపోయింది” అని చెబుతూ వెళ్ళి పోయారు.
7:80 وَلُوطًا إِذْ قَالَ لِقَوْمِهِ أَتَأْتُونَ الْفَاحِشَةَ مَا سَبَقَكُم بِهَا مِنْ أَحَدٍ مِّنَ الْعَالَمِينَ
మేము లూతు (అలైహిస్సలామ్)ను పంపాము. అతను తన జాతివారిని ఉద్దేశించి, “మీరు ఇంత సిగ్గుమాలిన చేష్టకు పాల్పడుతున్నారేమిటి? మీకు పూర్వం లోకంలో ఎవరూ ఇలాంటి పాడు పని చెయ్యలేదే!
7:81 إِنَّكُمْ لَتَأْتُونَ الرِّجَالَ شَهْوَةً مِّن دُونِ النِّسَاءِ ۚ بَلْ أَنتُمْ قَوْمٌ مُّسْرِفُونَ
“అయ్యో! మీరు స్త్రీలను వదలి, పురుషులతో కామవాంఛ తీర్చుకుంటున్నారా?! అసలు మీరు మరీ బరితెగించి వ్యవహరిస్తున్నారు” అని అన్నారు.
7:82 وَمَا كَانَ جَوَابَ قَوْمِهِ إِلَّا أَن قَالُوا أَخْرِجُوهُم مِّن قَرْيَتِكُمْ ۖ إِنَّهُمْ أُنَاسٌ يَتَطَهَّرُونَ
దానికి అతని జాతి వారు ఇచ్చిన జవాబు ఇదే: “వీళ్లను మీ బస్తీ నుంచి వెళ్లగొట్టండి. మహా పవిత్రులట వీళ్ళు.”
7:83 فَأَنجَيْنَاهُ وَأَهْلَهُ إِلَّا امْرَأَتَهُ كَانَتْ مِنَ الْغَابِرِينَ
అప్పుడు మేము లూత్ (అలైహిస్సలాం)ను, అతని ఇంటి వారిని కాపాడాము. అతని భార్యను తప్ప! ఆమె దైవశిక్షకు గురయినవారితో ఉండిపోయింది.
7:84 وَأَمْطَرْنَا عَلَيْهِم مَّطَرًا ۖ فَانظُرْ كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُجْرِمِينَ
మేము వారిపై ఒక ప్రత్యేకమైన వర్షాన్ని కురిపించాము. చూడు! ఆ అపరాధులకు పట్టిన గతేమిటో!
7:85 وَإِلَىٰ مَدْيَنَ أَخَاهُمْ شُعَيْبًا ۗ قَالَ يَا قَوْمِ اعْبُدُوا اللَّهَ مَا لَكُم مِّنْ إِلَٰهٍ غَيْرُهُ ۖ قَدْ جَاءَتْكُم بَيِّنَةٌ مِّن رَّبِّكُمْ ۖ فَأَوْفُوا الْكَيْلَ وَالْمِيزَانَ وَلَا تَبْخَسُوا النَّاسَ أَشْيَاءَهُمْ وَلَا تُفْسِدُوا فِي الْأَرْضِ بَعْدَ إِصْلَاحِهَا ۚ ذَٰلِكُمْ خَيْرٌ لَّكُمْ إِن كُنتُم مُّؤْمِنِينَ
ఇంకా మేము మద్యన్ (వైపుకు) వారి సోదరుడైన షుఐబ్ (అలైహిస్సలాం)ను పంపాము. అతను (తన జాతివారినుద్దేశించి), “నా జాతి వారలారా! మీరు అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించండి. ఆయన తప్ప మీరు ఆరాధించదగిన వేరొక దైవం లేడు. మీ వద్దకు మీ ప్రభువు తరఫు నుంచి స్పష్టమయిన నిదర్శనం వచ్చేసింది. కాబట్టి మీరు కొలతలు, తూనికలలో ఖచ్చితంగా (పూర్తిగా) వ్యవహరించండి. ప్రజలకు వారి వస్తువులను తగ్గించి ఇవ్వకండి. సంస్కరణ జరిగిన తరువాత భూమిలో అల్లకల్లోలాన్ని సృష్టించకండి. మీరు గనక నమ్మేవారే అయితే మీ మేలు ఇందులోనే ఉంది.
7:86 وَلَا تَقْعُدُوا بِكُلِّ صِرَاطٍ تُوعِدُونَ وَتَصُدُّونَ عَن سَبِيلِ اللَّهِ مَنْ آمَنَ بِهِ وَتَبْغُونَهَا عِوَجًا ۚ وَاذْكُرُوا إِذْ كُنتُمْ قَلِيلًا فَكَثَّرَكُمْ ۖ وَانظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُفْسِدِينَ
“అల్లాహ్‌ను విశ్వసించేవారిని బెదిరించే ఉద్దేశంతో, అల్లాహ్ మార్గం నుంచి అడ్డుకునే ఆలోచనతో, అందులో వక్రతలను వెతుకుతూ రహదారుల్లో కూర్చోకండి. మీరు అల్ప సంఖ్యలో ఉండగా అల్లాహ్ మీ జనసంఖ్యను అధికం చేసిన సంగతిని కాస్త గుర్తుచేసుకోండి. కల్లోలాన్ని రేకెత్తించే వారి కథ ఎలా ముగిసిందో కూడా చూడండి!
7:87 وَإِن كَانَ طَائِفَةٌ مِّنكُمْ آمَنُوا بِالَّذِي أُرْسِلْتُ بِهِ وَطَائِفَةٌ لَّمْ يُؤْمِنُوا فَاصْبِرُوا حَتَّىٰ يَحْكُمَ اللَّهُ بَيْنَنَا ۚ وَهُوَ خَيْرُ الْحَاكِمِينَ
“అల్లాహ్ నాకిచ్చి పంపిన సందేశాన్ని మీలో కొందరు విశ్వసించగా, మరికొందరు విశ్వసించలేదు. కాబట్టి అల్లాహ్ మన మధ్య తీర్పుచేసే వరకూ ఓపిక పట్టండి. ఆయన అందరిలోకెల్లా అత్యుత్తమంగా తీర్పు చెప్పేవాడు.”
7:88 قَالَ الْمَلَأُ الَّذِينَ اسْتَكْبَرُوا مِن قَوْمِهِ لَنُخْرِجَنَّكَ يَا شُعَيْبُ وَالَّذِينَ آمَنُوا مَعَكَ مِن قَرْيَتِنَا أَوْ لَتَعُودُنَّ فِي مِلَّتِنَا ۚ قَالَ أَوَلَوْ كُنَّا كَارِهِينَ
దురహంకారులైన అతని జాతి సర్దారులు (అతన్నుద్దేశించి), “ఓ షుఐబ్! మీరంతా మా మతంలోకి తిరిగి వచ్చేస్తే సరి! లేకపోతే నిన్నూ, నీతోపాటు విశ్వసించినవారిని మా పురము నుంచి వెళ్ళగొడతాం” అని హెచ్చరించారు. దీనికి సమాధానంగా షుఐబ్ ఇలా అన్నారు: “ఏమిటీ, ఆ మతం మాకే మాత్రం ఇష్టం లేకపోయినా మేమందులో కలసి పోవలసిందేనా?!”
7:89 قَدِ افْتَرَيْنَا عَلَى اللَّهِ كَذِبًا إِنْ عُدْنَا فِي مِلَّتِكُم بَعْدَ إِذْ نَجَّانَا اللَّهُ مِنْهَا ۚ وَمَا يَكُونُ لَنَا أَن نَّعُودَ فِيهَا إِلَّا أَن يَشَاءَ اللَّهُ رَبُّنَا ۚ وَسِعَ رَبُّنَا كُلَّ شَيْءٍ عِلْمًا ۚ عَلَى اللَّهِ تَوَكَّلْنَا ۚ رَبَّنَا افْتَحْ بَيْنَنَا وَبَيْنَ قَوْمِنَا بِالْحَقِّ وَأَنتَ خَيْرُ الْفَاتِحِينَ
“అల్లాహ్ మమ్మల్ని మీ ధర్మం నుంచి విముక్తి కలిగించిన తరువాత మళ్లీ మేము గనక అందులోకే వచ్చి కలసిపోతే, మేము అల్లాహ్‌కు పెద్ద అబద్ధాన్ని అంటగట్టిన వాళ్ళం అవుతాము. మీ మతంలోకి మేము తిరిగి రావటమనేది జరగదు – మా ప్రభువైన అల్లాహ్ రాసిపెట్టినదయితే అది వేరే విషయం. మా ప్రభువు జ్ఞానం అన్నింటినీ ఆవరించి ఉంది. మేము అల్లాహ్‌నే నమ్ముకున్నాము. ఓ ప్రభూ! మాకూ – మా జాతివారికీ మధ్య న్యాయంగా తీర్పు చెయ్యి. నీవు అందరికన్నా ఉత్తమంగా తీర్పు చేసేవాడవు.”
7:90 وَقَالَ الْمَلَأُ الَّذِينَ كَفَرُوا مِن قَوْمِهِ لَئِنِ اتَّبَعْتُمْ شُعَيْبًا إِنَّكُمْ إِذًا لَّخَاسِرُونَ
అతని జాతిలోని అవిశ్వాస నాయకులు, “మీరు గనక షుఐబ్ మార్గంలో పోయారంటే తీవ్రంగా నష్టపోతారు!” అని హెచ్చరించారు.
7:91 فَأَخَذَتْهُمُ الرَّجْفَةُ فَأَصْبَحُوا فِي دَارِهِمْ جَاثِمِينَ
అంతే, భూకంపం వాళ్ళను కబళించింది. దాంతో వారు తమ ఇళ్లల్లో బోర్లాపడినట్లే ఉండిపోయారు.
7:92 الَّذِينَ كَذَّبُوا شُعَيْبًا كَأَن لَّمْ يَغْنَوْا فِيهَا ۚ الَّذِينَ كَذَّبُوا شُعَيْبًا كَانُوا هُمُ الْخَاسِرِينَ
షుఐబును ధిక్కరించినవారి పరిస్థితి ఆ ఇండ్లలో వారెప్పుడూ నివసించనే లేదన్నట్టుగా మారిపోయింది. షుఐబును ధిక్కరించినవారే నష్టపోయారు.
7:93 فَتَوَلَّىٰ عَنْهُمْ وَقَالَ يَا قَوْمِ لَقَدْ أَبْلَغْتُكُمْ رِسَالَاتِ رَبِّي وَنَصَحْتُ لَكُمْ ۖ فَكَيْفَ آسَىٰ عَلَىٰ قَوْمٍ كَافِرِينَ
అప్పుడు షుఐబ్ వాళ్లనుండి ముఖం తిప్పుకొని మరలిపోతూ, ”ఓ నా జాతి జనులారా! నా ప్రభువు ఆదేశాలను నేను మీకు అందజేశాను. నిత్యం మీ బాగోగులను కోరుకున్నాను. అలాం టప్పుడు ఈ తిరస్కారుల (దుర్గతి)పై నేనెందుకు బాధపడాలి?” అని అన్నారు.
7:94 وَمَا أَرْسَلْنَا فِي قَرْيَةٍ مِّن نَّبِيٍّ إِلَّا أَخَذْنَا أَهْلَهَا بِالْبَأْسَاءِ وَالضَّرَّاءِ لَعَلَّهُمْ يَضَّرَّعُونَ
మేము ఏ ప్రవక్తను ఏ బస్తీలో పంపినా అక్కడి జనులు అణకువతో మెలగాలన్న ఉద్దేశంతో వారిని అభాగ్యానికి, అనారోగ్య స్థితికీ లోను చేశాము.
7:95 ثُمَّ بَدَّلْنَا مَكَانَ السَّيِّئَةِ الْحَسَنَةَ حَتَّىٰ عَفَوا وَّقَالُوا قَدْ مَسَّ آبَاءَنَا الضَّرَّاءُ وَالسَّرَّاءُ فَأَخَذْنَاهُم بَغْتَةً وَهُمْ لَا يَشْعُرُونَ
ఆ తరువాత వారి దురవస్థను మంచి స్థితిగా మార్చాము. వారు బాగా అభివృద్ధి చెందినప్పుడు, “(ఇదేమీ కొత్త విషయం కాదు) మా తాతముత్తాతలకు కూడా కష్టసుఖాలు ఎదురయ్యాయి” అని అన్నారు. అప్పుడు మేము వారిని అకస్మాత్తుగా పట్టుకున్నాము. (తమకు ఆ పరిస్థితి ఎదురవుతుందని) వాళ్లకు ఏమాత్రం తెలియదు.
7:96 وَلَوْ أَنَّ أَهْلَ الْقُرَىٰ آمَنُوا وَاتَّقَوْا لَفَتَحْنَا عَلَيْهِم بَرَكَاتٍ مِّنَ السَّمَاءِ وَالْأَرْضِ وَلَٰكِن كَذَّبُوا فَأَخَذْنَاهُم بِمَا كَانُوا يَكْسِبُونَ
ఈ బస్తీలో నివసించే వాళ్ళేగనక విశ్వసించి, భయభక్తులతో మెలగి ఉన్నట్లయితే మేము వాళ్ల కోసం భూమ్యాకాశాల శుభాల(ద్వారాల)ను తెరచేవాళ్ళం. కాని వాళ్ళు ధిక్కారానికి పాల్పడ్డారు. అందువల్ల వారి (చెడు) సంపాదనకు కారణంగా మేము వాళ్ళను పట్టుకున్నాము.
7:97 أَفَأَمِنَ أَهْلُ الْقُرَىٰ أَن يَأْتِيَهُم بَأْسُنَا بَيَاتًا وَهُمْ نَائِمُونَ
అయినప్పటికీ ఈ బస్తీల వాళ్లు రాత్రివేళ నిద్రపోతున్నప్పుడు తమపై మా శిక్ష వచ్చిపడదని నిశ్చింతగా ఉన్నారా?
7:98 أَوَأَمِنَ أَهْلُ الْقُرَىٰ أَن يَأْتِيَهُم بَأْسُنَا ضُحًى وَهُمْ يَلْعَبُونَ
ఏమిటీ, పొద్దెక్కుతుండగా తాము ఆటపాటల్లో నిమగ్నులై ఉన్నప్పుడు (హటాత్తుగా) మా ఆపద విరుచుకుపడుతుందన్న భయం ఈ బస్తీల వాళ్లకు బొత్తిగా లేదా?
7:99 أَفَأَمِنُوا مَكْرَ اللَّهِ ۚ فَلَا يَأْمَنُ مَكْرَ اللَّهِ إِلَّا الْقَوْمُ الْخَاسِرُونَ
ఏమిటీ, వాళ్ళు దేవుని ఈ వ్యూహం గురించి నిశ్చింతగా ఉన్నారా? నష్టపోయే వారు తప్ప మరొకరెవరూ దేవుని వ్యూహం గురించి నిర్లక్ష్యంగా ఉండరు.
7:100 أَوَلَمْ يَهْدِ لِلَّذِينَ يَرِثُونَ الْأَرْضَ مِن بَعْدِ أَهْلِهَا أَن لَّوْ نَشَاءُ أَصَبْنَاهُم بِذُنُوبِهِمْ ۚ وَنَطْبَعُ عَلَىٰ قُلُوبِهِمْ فَهُمْ لَا يَسْمَعُونَ
ఏమిటీ, అక్కడి ప్రజల వినాశం తరువాత భూమికి వారసులు అయిన వాళ్లకి (ఆ సంఘటనలు) కనువిప్పు కలిగించలేదా? మేము గనక తలచుకుంటే వారిని వారి పాపాల మూలంగా నాశనం చేయగలమనీ? వారి హృదయాలపై (తిరస్కార) ముద్ర వేసేస్తే ఇక వారు ఏమీ వినలేరనీ?
7:101 تِلْكَ الْقُرَىٰ نَقُصُّ عَلَيْكَ مِنْ أَنبَائِهَا ۚ وَلَقَدْ جَاءَتْهُمْ رُسُلُهُم بِالْبَيِّنَاتِ فَمَا كَانُوا لِيُؤْمِنُوا بِمَا كَذَّبُوا مِن قَبْلُ ۚ كَذَٰلِكَ يَطْبَعُ اللَّهُ عَلَىٰ قُلُوبِ الْكَافِرِينَ
ఈ బస్తీల గాథలను స్థూలంగా మేము నీకు వివరిస్తున్నాము. వాళ్ళందరి వద్దకూ వారి ప్రవక్తలు స్పష్టమయిన మహిమలను తీసుకువచ్చారు. అయితే మొదట్లో ఒకసారి వారు త్రోసి పుచ్చిన దానిని తరువాత విశ్వసించేవారు కాదు. ఈ విధంగా అల్లాహ్ తిరస్కారుల హృదయాలపై ముద్ర వేసేస్తాడు.
7:102 وَمَا وَجَدْنَا لِأَكْثَرِهِم مِّنْ عَهْدٍ ۖ وَإِن وَجَدْنَا أَكْثَرَهُمْ لَفَاسِقِينَ
వారిలో చాలామందిని మేము మాట నిలుపుకునేవారుగా చూడలేదు. వారిలో చాలామందిని మేము అవిధేయులుగానే పొందాము.
7:103 ثُمَّ بَعَثْنَا مِن بَعْدِهِم مُّوسَىٰ بِآيَاتِنَا إِلَىٰ فِرْعَوْنَ وَمَلَئِهِ فَظَلَمُوا بِهَا ۖ فَانظُرْ كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُفْسِدِينَ
వారి తర్వాత మేము మూసా (అలైహిస్సలాం)కు మా సూచనలిచ్చి ఫిరౌను వద్దకు, అతని అధికారుల వద్దకు పంపాము. కాని వారు మా సూచనల పట్ల చాలా ఘోరంగా ప్రవర్తించారు. అయితే చూడు! ఆ కల్లోల జనకులకు ఏ గతి పట్టిందో!
7:104 وَقَالَ مُوسَىٰ يَا فِرْعَوْنُ إِنِّي رَسُولٌ مِّن رَّبِّ الْعَالَمِينَ
మూసా (అలైహిస్సలాం) ఇలా అన్నాడు : “ఓ ఫిరౌన్! నేను సర్వలోక ప్రభువు తరఫున పంపబడిన ప్రవక్తను.
7:105 حَقِيقٌ عَلَىٰ أَن لَّا أَقُولَ عَلَى اللَّهِ إِلَّا الْحَقَّ ۚ قَدْ جِئْتُكُم بِبَيِّنَةٍ مِّن رَّبِّكُمْ فَأَرْسِلْ مَعِيَ بَنِي إِسْرَائِيلَ
అల్లాహ్ పేరుతో సత్యాన్ని తప్ప మరేమాట అయినా చెప్పటం నాకేమాత్రం శోభించదు, నేను మీ దగ్గరకు మీ ప్రభువు వద్దనుంచి స్పష్టమైన సూచనను కూడా తీసుకువచ్చాను. కాబట్టి ఇస్రాయీలు వంశీయులను నాతో పంపు.”
7:106 قَالَ إِن كُنتَ جِئْتَ بِآيَةٍ فَأْتِ بِهَا إِن كُنتَ مِنَ الصَّادِقِينَ
దానికి ఫిరౌను, “ఒకవేళ నువ్వు ఏదన్నా మహిమను తెచ్చివుంటే, నీ వాదనలో నువ్వు సత్యవంతుడవే అయితే, దాన్ని ప్రదర్శించు” అన్నాడు.
7:107 فَأَلْقَىٰ عَصَاهُ فَإِذَا هِيَ ثُعْبَانٌ مُّبِينٌ
అతను (మూసా) తన చేతి కర్రను పడవేశాడు. తక్షణం అది స్పష్టమైన సర్పంగా మారిపోయింది.
7:108 وَنَزَعَ يَدَهُ فَإِذَا هِيَ بَيْضَاءُ لِلنَّاظِرِينَ
తర్వాత అతను తన చేతిని బయటికి తీయగానే, ప్రేక్షకులందరికీ అది ధగధగా మెరిసిపోతున్నట్టు కనిపించింది.
7:109 قَالَ الْمَلَأُ مِن قَوْمِ فِرْعَوْنَ إِنَّ هَٰذَا لَسَاحِرٌ عَلِيمٌ
(ఈ పరిస్థితిని గమనించిన) ఫిరౌను జాతి సర్దారులు, “నిజంగానే ఇతగాడు మహా నైపుణ్యంగల మాంత్రికుడే” అన్నారు.
7:110 يُرِيدُ أَن يُخْرِجَكُم مِّنْ أَرْضِكُمْ ۖ فَمَاذَا تَأْمُرُونَ
“మిమ్మల్ని మీ భూమి (దేశం) నుంచి వెళ్ళగొట్టాలని ఇతను కోరుతున్నాడు. ఇప్పుడేం చేయాలనుకుంటున్నారో మీరే చెప్పండి” (అని సంప్రతింపులు చేసుకున్నారు.)
7:111 قَالُوا أَرْجِهْ وَأَخَاهُ وَأَرْسِلْ فِي الْمَدَائِنِ حَاشِرِينَ
వారిలా అన్నారు : “(ఓ ఫిరౌన్!) తమరు ఇతనికీ ఇతని సోదరునికీ కొంత గడువు ఇవ్వండి. ఈలోగా సమీకరించే భటులను వివిధ పట్టణాలలోకి పంపించండి.
7:112 يَأْتُوكَ بِكُلِّ سَاحِرٍ عَلِيمٍ
వారు నిపుణులైన మాంత్రికులందరిని తీసుకువస్తారు.”
7:113 وَجَاءَ السَّحَرَةُ فِرْعَوْنَ قَالُوا إِنَّ لَنَا لَأَجْرًا إِن كُنَّا نَحْنُ الْغَالِبِينَ
ఆ విధంగా మాంత్రికులు ఫిరౌను వద్దకు వచ్చారు, “మేము గనక గెలిస్తే మాకేదైనా పారితోషికం లభిస్తుందా?” అని విన్నవించుకున్నారు.
7:114 قَالَ نَعَمْ وَإِنَّكُمْ لَمِنَ الْمُقَرَّبِينَ
“ఔను, అంతేకాదు, మీరు నా సన్నిహితుల్లో చేరుతారు” అని ఫిరౌను అన్నాడు.
7:115 قَالُوا يَا مُوسَىٰ إِمَّا أَن تُلْقِيَ وَإِمَّا أَن نَّكُونَ نَحْنُ الْمُلْقِينَ
అప్పుడా మాంత్రికులు, “ఓ మూసా! నువ్వు పడవేస్తావా? లేక మమ్మల్నే పడవేయమంటావా?!” అని ప్రశ్నించారు.
7:116 قَالَ أَلْقُوا ۖ فَلَمَّا أَلْقَوْا سَحَرُوا أَعْيُنَ النَّاسِ وَاسْتَرْهَبُوهُمْ وَجَاءُوا بِسِحْرٍ عَظِيمٍ
“మీరే పడవెయ్యండి” అని మూసా బదులిచ్చాడు. అప్పుడు ఆ మాంత్రికులు (తమ త్రాళ్ళను) పడవేసి ప్రజలకు కనికట్టు చేశారు. వారందరినీ భీతావహస్థితికి లోనుచేసి ఓ పెద్ద మాయాజాలాన్ని ప్రదర్శించారు.
7:117 وَأَوْحَيْنَا إِلَىٰ مُوسَىٰ أَنْ أَلْقِ عَصَاكَ ۖ فَإِذَا هِيَ تَلْقَفُ مَا يَأْفِكُونَ
అప్పుడు, “నీ చేతి కర్రను పడవెయ్యి” అని మేము మూసాను ఆదేశించాము. చేతిలోని కర్రను పడవెయ్యగానే అది వారి (కనికట్టు) క్రీడా విన్యాసాలను మింగేయసాగింది.
7:118 فَوَقَعَ الْحَقُّ وَبَطَلَ مَا كَانُوا يَعْمَلُونَ
ఈ విధంగా సత్యం తేటతెల్లమయింది. వారు చేసినదంతా అసత్యంగా మిగిలిపోయింది.
7:119 فَغُلِبُوا هُنَالِكَ وَانقَلَبُوا صَاغِرِينَ
వారు (ఫిరౌను, అతని తొత్తులు) ఓడిపోయి, పరాభవంపాలై వెనుతిరిగారు.
7:120 وَأُلْقِيَ السَّحَرَةُ سَاجِدِينَ
అయితే మాంత్రికులు మాత్రం సాష్టాంగపడిపోయారు.
7:121 قَالُوا آمَنَّا بِرَبِّ الْعَالَمِينَ
“సర్వలోకాలకూ ప్రభువు అయిన వానిని విశ్వసించాము” అని పలికారు.
7:122 رَبِّ مُوسَىٰ وَهَارُونَ
అంటే, మూసా, హారూనుల ప్రభువును (విశ్వసించాము అన్నారు).
7:123 قَالَ فِرْعَوْنُ آمَنتُم بِهِ قَبْلَ أَنْ آذَنَ لَكُمْ ۖ إِنَّ هَٰذَا لَمَكْرٌ مَّكَرْتُمُوهُ فِي الْمَدِينَةِ لِتُخْرِجُوا مِنْهَا أَهْلَهَا ۖ فَسَوْفَ تَعْلَمُونَ
“ఏమిటీ, నా అనుమతి పొందకుండానే మీరితన్ని విశ్వసిస్తారా? ముమ్మాటికీ ఇదంతా ఈ నగరం నుంచి ప్రజలను వెళ్ళగొట్టేందుకు మీరందరూ కలిసి పన్నిన పన్నాగమే. అసలు సంగతి మీకు ఇప్పుడు తెలుస్తుంది.
7:124 لَأُقَطِّعَنَّ أَيْدِيَكُمْ وَأَرْجُلَكُم مِّنْ خِلَافٍ ثُمَّ لَأُصَلِّبَنَّكُمْ أَجْمَعِينَ
“నేను ఒక ప్రక్క నుంచి మీ చేతిని, మరో ప్రక్కనుంచి మీ కాలినీ నరుకుతాను. ఆ తరువాత మిమ్మల్నందరినీ ఉరి తీస్తాను” అని అన్నాడు ఫిరౌన్.
7:125 قَالُوا إِنَّا إِلَىٰ رَبِّنَا مُنقَلِبُونَ
దానికి వారిలా అన్నారు : “మేము (చనిపోయి) ఎలాగూ మా ప్రభువు వద్దకు చేరుకోవలసిన వారమే.
7:126 وَمَا تَنقِمُ مِنَّا إِلَّا أَنْ آمَنَّا بِآيَاتِ رَبِّنَا لَمَّا جَاءَتْنَا ۚ رَبَّنَا أَفْرِغْ عَلَيْنَا صَبْرًا وَتَوَفَّنَا مُسْلِمِينَ
“మా ప్రభువు సూచనలు మా వద్దకు వచ్చినప్పుడు, వాటిని విశ్వసించటం తప్ప మాలో నీకు కనిపించిన దోషం ఏమిటీ? ఓ ప్రభూ! మాపై సహనాన్ని కురిపించు. నీకు విధేయులు (ముస్లింలు)గా ఉన్న స్థితిలోనే మరణాన్ని వొసగు!”
7:127 وَقَالَ الْمَلَأُ مِن قَوْمِ فِرْعَوْنَ أَتَذَرُ مُوسَىٰ وَقَوْمَهُ لِيُفْسِدُوا فِي الْأَرْضِ وَيَذَرَكَ وَآلِهَتَكَ ۚ قَالَ سَنُقَتِّلُ أَبْنَاءَهُمْ وَنَسْتَحْيِي نِسَاءَهُمْ وَإِنَّا فَوْقَهُمْ قَاهِرُونَ
ఫిరౌను జాతి సర్దారులు (తమ చక్రవర్తినుద్దేశించి), “ఏమిటీ, నువ్వు మూసా (అలైహిస్సలాం)ను, అతని జాతి వారిని రాజ్యంలో కల్లోలం వ్యాపింపజేయటానికి, నిన్నూ, నీ ఆరాధ్య దైవాలను పరిత్యజించటానికి వదలిపెడతావా?” అన్నారు. దానికి ఫిరౌను, “మేము ఇప్పుడే వాళ్ల మగపిల్లలను చంపేయటం మొదలుపెడ్తాము. వారి ఆడవారిని మాత్రం బ్రతకనిస్తాము. వాళ్ళపై మాకు అన్ని విధాలా తిరుగులేని అధికారం ఉంది” అని బదులిచ్చాడు.
7:128 قَالَ مُوسَىٰ لِقَوْمِهِ اسْتَعِينُوا بِاللَّهِ وَاصْبِرُوا ۖ إِنَّ الْأَرْضَ لِلَّهِ يُورِثُهَا مَن يَشَاءُ مِنْ عِبَادِهِ ۖ وَالْعَاقِبَةُ لِلْمُتَّقِينَ
మూసా తన జాతి వారితో, “అల్లాహ్ సహాయాన్ని అర్థించండి, సహనం వహించండి. ఈ భూమి అల్లాహ్‌ది. తన దాసులలో తాను కోరిన వారిని ఆయన దీనికి వారసులుగా చేస్తాడు. అల్లాహ్‌కు భయపడే వారికే ఎట్టకేలకు అంతిమ విజయం లభిస్తుంది” అన్నాడు.
7:129 قَالُوا أُوذِينَا مِن قَبْلِ أَن تَأْتِيَنَا وَمِن بَعْدِ مَا جِئْتَنَا ۚ قَالَ عَسَىٰ رَبُّكُمْ أَن يُهْلِكَ عَدُوَّكُمْ وَيَسْتَخْلِفَكُمْ فِي الْأَرْضِ فَيَنظُرَ كَيْفَ تَعْمَلُونَ
అతని జాతివారు, “మేము సదా పీడించబడ్డాము – నీవు రాకముందూ, నీవు వచ్చిన తరువాత కూడా(మేము పీడించబడుతున్నాము)” అన్నారు. “త్వరలోనే అల్లాహ్ మీ శత్రువును తుదముట్టించి, మిమ్మల్ని భూమికి ప్రతినిధులుగా చేస్తాడు. ఆ తరువాత మీ ప్రవర్తన ఎలా ఉంటుందో చూస్తాడు” అని మూసా వారిని ఓదార్చాడు.
7:130 وَلَقَدْ أَخَذْنَا آلَ فِرْعَوْنَ بِالسِّنِينَ وَنَقْصٍ مِّنَ الثَّمَرَاتِ لَعَلَّهُمْ يَذَّكَّرُونَ
మేము ఫిరౌను జనులను – గుణపాఠం గ్రహిస్తారన్న ఉద్దేశంతో – దుర్భిక్షానికీ, పండ్లు ఫలాల ఉత్పత్తుల కొరతకూ గురిచేసి పరీక్షించాము.
7:131 فَإِذَا جَاءَتْهُمُ الْحَسَنَةُ قَالُوا لَنَا هَٰذِهِ ۖ وَإِن تُصِبْهُمْ سَيِّئَةٌ يَطَّيَّرُوا بِمُوسَىٰ وَمَن مَّعَهُ ۗ أَلَا إِنَّمَا طَائِرُهُمْ عِندَ اللَّهِ وَلَٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ
(వారి గుణం ఎటువంటిదంటే) మేలు కలిగినపుడు ‘ఇది మాకు తగినదే’ అని అనేవారు. కీడు కలిగినప్పుడు దానిని, “మూసా మరియు అతని సహవాసుల మూలంగా కలిగిన దరిద్రం”గా చెప్పుకునేవారు. వినండి! వారి దరిద్రం అల్లాహ్ వద్ద ఉంది. కాని వారిలోని అధికులకు ఆ సంగతి తెలియదు.
7:132 وَقَالُوا مَهْمَا تَأْتِنَا بِهِ مِنْ آيَةٍ لِّتَسْحَرَنَا بِهَا فَمَا نَحْنُ لَكَ بِمُؤْمِنِينَ
“నీవు మాపై మంత్ర ప్రయోగం చేయడానికి ఎటువంటి (అద్భుత) సూచనను తెచ్చినా మేము నీ మాటను నమ్మము గాక నమ్మము” అని వారు (మూసాకు) చెప్పేశారు.
7:133 فَأَرْسَلْنَا عَلَيْهِمُ الطُّوفَانَ وَالْجَرَادَ وَالْقُمَّلَ وَالضَّفَادِعَ وَالدَّمَ آيَاتٍ مُّفَصَّلَاتٍ فَاسْتَكْبَرُوا وَكَانُوا قَوْمًا مُّجْرِمِينَ
ఆ తరువాత మేము వారిపై తుఫానును, మిడతల దండును పంపాము. ధాన్యపు పురుగులను, కప్పల రక్తాన్నీ వదిలాము. వాస్తవానికి ఇవన్నీ స్పష్టమయిన మహిమలు. అయినప్పటికీ వారు అహంకారాన్ని చూపారు. అసలు విషయం ఏమిటంటే వారు అపరాధజనులు.
7:134 وَلَمَّا وَقَعَ عَلَيْهِمُ الرِّجْزُ قَالُوا يَا مُوسَى ادْعُ لَنَا رَبَّكَ بِمَا عَهِدَ عِندَكَ ۖ لَئِن كَشَفْتَ عَنَّا الرِّجْزَ لَنُؤْمِنَنَّ لَكَ وَلَنُرْسِلَنَّ مَعَكَ بَنِي إِسْرَائِيلَ
వారిపై ఏదన్నా ఆపద వచ్చిపడినప్పుడు, “ఓ మూసా! నీకు నీ ప్రభువు చేసిన వాగ్దానం గురించి మా కోసం నీ ప్రభువును ప్రార్థించు. ఈ ఆపదను గనక నువ్వు మానుంచి దూరం చేస్తే మేము నిన్ను తప్పకుండా విశ్వసిస్తాము. ఇస్రాయీలు సంతతి వారిని కూడా (విడుదల చేసి) నీతో పంపిస్తాము” అని అనేవారు.
7:135 فَلَمَّا كَشَفْنَا عَنْهُمُ الرِّجْزَ إِلَىٰ أَجَلٍ هُم بَالِغُوهُ إِذَا هُمْ يَنكُثُونَ
ఆ తరువాత మేము వారు చేరుకోవలసిన ఒక నిర్ణీత గడువు వరకూ ఆ ఆపదను వారి నుంచి తొలగించగానే ఆడిన మాటను తప్పేవారు.
7:136 فَانتَقَمْنَا مِنْهُمْ فَأَغْرَقْنَاهُمْ فِي الْيَمِّ بِأَنَّهُمْ كَذَّبُوا بِآيَاتِنَا وَكَانُوا عَنْهَا غَافِلِينَ
ఆ తర్వాత మేము వారికి ప్రతీకారం చేశాము. వారిని సముద్రంలో ముంచి వేశాము. ఎందుకంటే, వారు మా ఆయతులను అసత్యాలని ధిక్కరించేవారు, వాటి పట్ల బొత్తిగా నిర్లక్ష్యం వహించేవారు.
7:137 وَأَوْرَثْنَا الْقَوْمَ الَّذِينَ كَانُوا يُسْتَضْعَفُونَ مَشَارِقَ الْأَرْضِ وَمَغَارِبَهَا الَّتِي بَارَكْنَا فِيهَا ۖ وَتَمَّتْ كَلِمَتُ رَبِّكَ الْحُسْنَىٰ عَلَىٰ بَنِي إِسْرَائِيلَ بِمَا صَبَرُوا ۖ وَدَمَّرْنَا مَا كَانَ يَصْنَعُ فِرْعَوْنُ وَقَوْمُهُ وَمَا كَانُوا يَعْرِشُونَ
అత్యంత బలహీన వర్గంగా పరిగణించబడే జనులను మేము ఆ భూభాగంలోని తూర్పుపడమరలకు వారసులుగా చేశాము. అందులో శుభాలు నింపాము. ఈ విధంగా ఇస్రాయీలు సంతతివారు పాటించిన సహనం మూలంగా, నీ ప్రభువు వారి విషయంలో చేసిన మంచి వాగ్దానం నెరవేరింది. ఇంకా ఫిరౌనూ, అతని జాతివారూ చేసిన నిర్మాణాలనూ, లేపిన భవనాలనూ మేము నేలమట్టం చేసేశాము.
7:138 وَجَاوَزْنَا بِبَنِي إِسْرَائِيلَ الْبَحْرَ فَأَتَوْا عَلَىٰ قَوْمٍ يَعْكُفُونَ عَلَىٰ أَصْنَامٍ لَّهُمْ ۚ قَالُوا يَا مُوسَى اجْعَل لَّنَا إِلَٰهًا كَمَا لَهُمْ آلِهَةٌ ۚ قَالَ إِنَّكُمْ قَوْمٌ تَجْهَلُونَ
మేము ఇస్రాయీలు సంతతివారిని సముద్రం దాటించాము. వారు సాగిపోతున్న దారిలో, తమ విగ్రహాలను అంటి పెట్టుకుని ఉన్న ఒక జాతి ప్రజలు వారికి కనిపించారు. “ఓ మూసా! వీళ్లకు ఈ ఆరాధ్య దైవాలు ఉన్నట్లు మాక్కూడా ఒక దేముణ్ణి చేసిపెట్టవా?!” అని వారు కోరారు. దానికి మూసా, “నిజంగానే మీరు మూర్ఖజనులు” అన్నాడు.
7:139 إِنَّ هَٰؤُلَاءِ مُتَبَّرٌ مَّا هُمْ فِيهِ وَبَاطِلٌ مَّا كَانُوا يَعْمَلُونَ
“వీళ్ళు ఏ పనిలో నిమగ్నులై ఉన్నారో అది నాశనం చేయబడుతుంది. వీళ్ళు చేస్తున్న ఈ పని ఒక మిథ్య”(అని అన్నాడు).
7:140 قَالَ أَغَيْرَ اللَّهِ أَبْغِيكُمْ إِلَٰهًا وَهُوَ فَضَّلَكُمْ عَلَى الْعَالَمِينَ
“ఏమిటీ, అల్లాహ్‌ను కాదని నేను మీకోసం మరో ఆరాధ్య దైవాన్ని అన్వేషించాలా? మరి చూడబోతే ఆయన మీకు సమస్త లోకవాసులపై ప్రాధాన్యతను ఇచ్చి ఉన్నాడు” అని కూడా మూసా (అలైహిస్సలాం) అన్నాడు.
7:141 وَإِذْ أَنجَيْنَاكُم مِّنْ آلِ فِرْعَوْنَ يَسُومُونَكُمْ سُوءَ الْعَذَابِ ۖ يُقَتِّلُونَ أَبْنَاءَكُمْ وَيَسْتَحْيُونَ نِسَاءَكُمْ ۚ وَفِي ذَٰلِكُم بَلَاءٌ مِّن رَّبِّكُمْ عَظِيمٌ
మేము మిమ్మల్ని ఫిరౌనీయుల నుండి విముక్తి కల్పించిన సందర్భాన్ని కాస్త జ్ఞాపకం చేసుకోండి – వాళ్ళు మిమ్మల్ని విపరీతమైన యాతనలకు గురిచేసేవారు. మీ కుమారులను చంపేసి, మీ స్త్రీలను మాత్రం బ్రతకనిచ్చేవారు. అందులో మీకు మీ ప్రభువు తరఫున పెద్ద పరీక్ష ఉండింది.
7:142 وَوَاعَدْنَا مُوسَىٰ ثَلَاثِينَ لَيْلَةً وَأَتْمَمْنَاهَا بِعَشْرٍ فَتَمَّ مِيقَاتُ رَبِّهِ أَرْبَعِينَ لَيْلَةً ۚ وَقَالَ مُوسَىٰ لِأَخِيهِ هَارُونَ اخْلُفْنِي فِي قَوْمِي وَأَصْلِحْ وَلَا تَتَّبِعْ سَبِيلَ الْمُفْسِدِينَ
మేము మూసా (అలైహిస్సలాం)కు ముఫ్ఫై రాత్రుల వాగ్దానం చేశాము. అదనంగా మరో పది రాత్రులతో వాటిని సంపూర్ణం చేశాము. ఆ విధంగా ప్రభువు నిర్థారించిన పూర్తి గడువు నలభై రాత్రులు అయింది. అప్పుడు మూసా (అలైహిస్సలాం) తన సోదరుడైన హారూనునుద్దేశించి, “నేను వెళ్ళాక నా జాతి ప్రజలలో నీవు నాకు ప్రాతినిధ్యం వహించు. వీళ్ళను తీర్చిదిద్దుతూ ఉండు. విచ్ఛిన్నకారుల అభిప్రాయాలను అనుసరించకు” అని చెప్పారు.
7:143 وَلَمَّا جَاءَ مُوسَىٰ لِمِيقَاتِنَا وَكَلَّمَهُ رَبُّهُ قَالَ رَبِّ أَرِنِي أَنظُرْ إِلَيْكَ ۚ قَالَ لَن تَرَانِي وَلَٰكِنِ انظُرْ إِلَى الْجَبَلِ فَإِنِ اسْتَقَرَّ مَكَانَهُ فَسَوْفَ تَرَانِي ۚ فَلَمَّا تَجَلَّىٰ رَبُّهُ لِلْجَبَلِ جَعَلَهُ دَكًّا وَخَرَّ مُوسَىٰ صَعِقًا ۚ فَلَمَّا أَفَاقَ قَالَ سُبْحَانَكَ تُبْتُ إِلَيْكَ وَأَنَا أَوَّلُ الْمُؤْمِنِينَ
మేము నిర్థారించిన సమయానికి మూసా (అలైహిస్సలాం) వచ్చి, అతని ప్రభువు అతనితో సంభాషించిన తర్వాత అతను, “నా ప్రభూ! నాకు నీ దర్శనం కలిగించు. నేను ఓసారి నిన్ను చూస్తాను” అని విన్నవించుకోగా, “ఎట్టి పరిస్థితిలోనూ నువ్వు నన్ను చూడలేవు. అయితే అదిగో! ఆ కొండ వైపు దృష్టిని సారించు. అది గనక యధాస్థితిలో ఉండగలిగితే నువ్వు కూడా నన్ను చూడగలుగుతావు” అని ఆయన సెలవిచ్చాడు. ఆ తరువాత అతని ప్రభువు తేజస్సు ఆ కొండపై ప్రసరించగానే ఆ తేజస్సు దాన్ని తుత్తునియలు చేసేసింది. మూసా స్పృహతప్పి పడిపోయాడు. స్పృహలోకి రాగానే, “(ప్రభూ!) నీవు పరమ పవిత్రుడవు. నేను నీ సన్నిధిలో పశ్చాత్తాపపడుతున్నాను. అందరి కన్నా ముందు నేనే నిన్ను విశ్వసిస్తున్నాను” అని మనవి చేసుకున్నాడు.
7:144 قَالَ يَا مُوسَىٰ إِنِّي اصْطَفَيْتُكَ عَلَى النَّاسِ بِرِسَالَاتِي وَبِكَلَامِي فَخُذْ مَا آتَيْتُكَ وَكُن مِّنَ الشَّاكِرِينَ
“ఓ మూసా! నిన్ను ప్రవక్తగా ఎన్నుకుని, నీతో సంభాషించి జనులపై నీకు ప్రాధాన్యతనిచ్చాను. కాబట్టి నేను ఇచ్చిన దానిని పుచ్చుకో. కృతజ్ఞుడవై ఉండు” అని అల్లాహ్ సెలవిచ్చాడు.
7:145 وَكَتَبْنَا لَهُ فِي الْأَلْوَاحِ مِن كُلِّ شَيْءٍ مَّوْعِظَةً وَتَفْصِيلًا لِّكُلِّ شَيْءٍ فَخُذْهَا بِقُوَّةٍ وَأْمُرْ قَوْمَكَ يَأْخُذُوا بِأَحْسَنِهَا ۚ سَأُرِيكُمْ دَارَ الْفَاسِقِينَ
మరి మేము మూసాకు పలకలపై అన్ని రకాల ఉపదేశాలనూ, అన్ని విషయాలకు సంబంధించిన వివరాలను వ్రాసి ఇచ్చాము. అతనికి ఇలా ఉపదేశించాము: “ఇక నువ్వు వీటిని చాలా గట్టిగా పట్టుకో. వీటిలోని ఉత్తమ ఆదేశాలను పాలించమని నీ జాతి వారికి ఆజ్ఞాపించు. అతి త్వరలోనే దుర్మార్గుల స్థానాన్ని మీకు చూపిస్తాను.
7:146 سَأَصْرِفُ عَنْ آيَاتِيَ الَّذِينَ يَتَكَبَّرُونَ فِي الْأَرْضِ بِغَيْرِ الْحَقِّ وَإِن يَرَوْا كُلَّ آيَةٍ لَّا يُؤْمِنُوا بِهَا وَإِن يَرَوْا سَبِيلَ الرُّشْدِ لَا يَتَّخِذُوهُ سَبِيلًا وَإِن يَرَوْا سَبِيلَ الْغَيِّ يَتَّخِذُوهُ سَبِيلًا ۚ ذَٰلِكَ بِأَنَّهُمْ كَذَّبُوا بِآيَاتِنَا وَكَانُوا عَنْهَا غَافِلِينَ
ఏ హక్కూ లేకుండా భూమిపై గర్వాన్ని ప్రదర్శించేవారిని నా ఆదేశాల నుంచి మరలిస్తాను. ఒకవేళ సూచనలన్నింటినీ తిలకించినా కూడా వారు వాటిని విశ్వసించరు. సరైన మార్గం వారికి కానవస్తే వారు దానిని తమ మార్గంగా చేసుకోరు. పెడదారి కనిపిస్తే మాత్రం దాన్ని తమ మార్గంగా చేసుకుంటారు. మా ఆయతులను ధిక్కరించి, వాటిపట్ల నిర్లక్ష్య వైఖరిని కనబరచటం వల్ల వారికీ దురవస్థ పట్టింది.
7:147 وَالَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا وَلِقَاءِ الْآخِرَةِ حَبِطَتْ أَعْمَالُهُمْ ۚ هَلْ يُجْزَوْنَ إِلَّا مَا كَانُوا يَعْمَلُونَ
ఇంకా మా ఆయతులను, అంతిమ దినాన కలుసుకునే విషయాన్ని అసత్యాలని తిరస్కరించిన వారి కర్మలన్నీ వృథా అయిపోయాయి. వారికి వారు చేస్తూ ఉండినదాని (శిక్షే) ఇవ్వబడుతుంది.”
7:148 وَاتَّخَذَ قَوْمُ مُوسَىٰ مِن بَعْدِهِ مِنْ حُلِيِّهِمْ عِجْلًا جَسَدًا لَّهُ خُوَارٌ ۚ أَلَمْ يَرَوْا أَنَّهُ لَا يُكَلِّمُهُمْ وَلَا يَهْدِيهِمْ سَبِيلًا ۘ اتَّخَذُوهُ وَكَانُوا ظَالِمِينَ
మూసా జాతివారు అతను వెళ్ళిన తర్వాత తమ నగలతో ఆవుదూడ విగ్రహాన్ని తయారుచేసి, దానిని తమ ఆరాధ్య దైవంగా కొలవసాగారు. అందులో నుంచి ఒకలాంటి శబ్దం వచ్చేది. అది తమతో మాట్లాడలేదనీ, తమకు ఏ దారీ చూపదనీ వారు ఆలోచించలేదా? అయినప్పటికీ వారు దాన్ని ఆరాధ్య దైవంగా ఖరారు చేసుకున్నారు. చాలా పెద్ద అన్యాయానికి పాల్పడ్డారు.
7:149 وَلَمَّا سُقِطَ فِي أَيْدِيهِمْ وَرَأَوْا أَنَّهُمْ قَدْ ضَلُّوا قَالُوا لَئِن لَّمْ يَرْحَمْنَا رَبُّنَا وَيَغْفِرْ لَنَا لَنَكُونَنَّ مِنَ الْخَاسِرِينَ
తమకు పశ్చాత్తాపం కలిగి, తాము నిజంగానే మార్గభ్రష్టతకు లోనయ్యామన్న సంగతి అర్థమయ్యాక వారు, సిగ్గుపడ్డారు. ”మా ప్రభువే గనక మాపై దయజూపకపోతే, మా తప్పును మన్నించకపోతే మేము ఘోరంగా నష్టపోతాము” అని అన్నారు.
7:150 وَلَمَّا رَجَعَ مُوسَىٰ إِلَىٰ قَوْمِهِ غَضْبَانَ أَسِفًا قَالَ بِئْسَمَا خَلَفْتُمُونِي مِن بَعْدِي ۖ أَعَجِلْتُمْ أَمْرَ رَبِّكُمْ ۖ وَأَلْقَى الْأَلْوَاحَ وَأَخَذَ بِرَأْسِ أَخِيهِ يَجُرُّهُ إِلَيْهِ ۚ قَالَ ابْنَ أُمَّ إِنَّ الْقَوْمَ اسْتَضْعَفُونِي وَكَادُوا يَقْتُلُونَنِي فَلَا تُشْمِتْ بِيَ الْأَعْدَاءَ وَلَا تَجْعَلْنِي مَعَ الْقَوْمِ الظَّالِمِينَ
మూసా (అలైహిస్సలాం) తన జాతి వారి వద్దకు కోపంతో, విచారంతో తిరిగివచ్చి, “నేను వెళ్ళగానే ఇంత చెడ్డ నిర్వాకానికి పాల్పడతారా? మీ ప్రభువు ఆజ్ఞలు అందకముందే మీరు తొందరపడ్డారా?” అని చెప్పి, (చేతిలోని) పలకలను విసురుగా ఓ ప్రక్కన పెట్టేసి, తన సోదరుని జుత్తు పట్టుకుని తన వైపుకు ఈడ్వ సాగాడు. అప్పుడు హారూను (అలైహిస్సలాం), “ఓ నా తల్లి పుత్రుడా! వీళ్ళు నన్ను ఏ మాత్రం లెక్క చేయలేదు. నన్ను చంపేయటానికి కూడా సిద్ధమయ్యారు. కాబట్టి నా స్థితిపై శత్రువులు నవ్వుకునేలా చేయకు. నన్ను ఈ దుర్మార్గుల వర్గంలో జమకట్టకు” అని సంజాయిషీ ఇచ్చారు.
7:151 قَالَ رَبِّ اغْفِرْ لِي وَلِأَخِي وَأَدْخِلْنَا فِي رَحْمَتِكَ ۖ وَأَنتَ أَرْحَمُ الرَّاحِمِينَ
అప్పుడు, “ఓ ప్రభూ! నన్నూ, నా సోదరుణ్ణి క్షమించు. మా ఇద్దరినీ నీ కారుణ్యంలో చేర్చుకో. నువ్వు కరుణించే వారందరిలో కెల్లా గొప్ప కరుణామయుడవు” అని (మూసా) వేడుకున్నాడు.
7:152 إِنَّ الَّذِينَ اتَّخَذُوا الْعِجْلَ سَيَنَالُهُمْ غَضَبٌ مِّن رَّبِّهِمْ وَذِلَّةٌ فِي الْحَيَاةِ الدُّنْيَا ۚ وَكَذَٰلِكَ نَجْزِي الْمُفْتَرِينَ
ఆవుదూడను పూజించిన వారిపై అతి త్వరలోనే వారి ప్రభువు తరఫు నుంచి ఆగ్రహం, అవమానం – ప్రాపంచిక జీవితంలోనే – పడుతుంది. అసత్యాలను అల్లేవారిని మేము ఈ విధంగానే శిక్షిస్తాము.
7:153 وَالَّذِينَ عَمِلُوا السَّيِّئَاتِ ثُمَّ تَابُوا مِن بَعْدِهَا وَآمَنُوا إِنَّ رَبَّكَ مِن بَعْدِهَا لَغَفُورٌ رَّحِيمٌ
మరెవరయితే తప్పు చేసిన తరువాత పశ్చాత్తాపం చెంది, విశ్వసిస్తారో వారిని నీ ప్రభువు – ఈ పశ్చాత్తాపం తరువాత- క్షమిస్తాడు, కనికరిస్తాడు.
7:154 وَلَمَّا سَكَتَ عَن مُّوسَى الْغَضَبُ أَخَذَ الْأَلْوَاحَ ۖ وَفِي نُسْخَتِهَا هُدًى وَرَحْمَةٌ لِّلَّذِينَ هُمْ لِرَبِّهِمْ يَرْهَبُونَ
కోపం చల్లారిన తరువాత మూసా (అలైహిస్సలాం) పలకలను ఎత్తుకున్నాడు. వాటిపై రాయబడి ఉన్నదానిలో తమ ప్రభువుకు భయపడేవారి కొరకు సన్మార్గమూ, కారుణ్యమూ ఉండినవి.
7:155 وَاخْتَارَ مُوسَىٰ قَوْمَهُ سَبْعِينَ رَجُلًا لِّمِيقَاتِنَا ۖ فَلَمَّا أَخَذَتْهُمُ الرَّجْفَةُ قَالَ رَبِّ لَوْ شِئْتَ أَهْلَكْتَهُم مِّن قَبْلُ وَإِيَّايَ ۖ أَتُهْلِكُنَا بِمَا فَعَلَ السُّفَهَاءُ مِنَّا ۖ إِنْ هِيَ إِلَّا فِتْنَتُكَ تُضِلُّ بِهَا مَن تَشَاءُ وَتَهْدِي مَن تَشَاءُ ۖ أَنتَ وَلِيُّنَا فَاغْفِرْ لَنَا وَارْحَمْنَا ۖ وَأَنتَ خَيْرُ الْغَافِرِينَ
మేము నిర్థారించిన సమయం కోసం మూసా (అలైహిస్సలాం) తన జాతికి చెందిన డెబ్భై మందిని ఎన్నుకున్నాడు. మరి వారిని భూకంపం కబళించినప్పుడు మూసా (అలైహిస్సలాం) ఇలా నివేదించుకున్నాడు : “నా ప్రభూ! నీవు గనక తలచుకుని ఉంటే ఇంతకు ముందే వీళ్ళనూ, నన్నూ తుదముట్టించి ఉండేవాడివి. ఏమిటీ (ప్రభూ!) మాలోని కొంతమంది అవివేకులు చేసిన పనికి మమ్మల్నందరినీ నాశనం చేస్తావా? ఈ సంఘటన వాస్తవానికి నీ తరఫున పెట్టబడిన ఒక పరీక్ష. ఇలాంటి పరీక్షల ద్వారా నీవు కోరిన వారిని అపమార్గానికి గురిచేసి, నీవు కోరిన వారిని సన్మార్గంపై నిలపగలవు. నువ్వే మా సంరక్షకుడవు. కనుక మాకు క్షమాభిక్ష పెట్టు. మాపై దయజూపు. నీవు క్షమించే వారందరిలోకీ ఉత్తమ క్షమాశీలివి.
7:156 وَاكْتُبْ لَنَا فِي هَٰذِهِ الدُّنْيَا حَسَنَةً وَفِي الْآخِرَةِ إِنَّا هُدْنَا إِلَيْكَ ۚ قَالَ عَذَابِي أُصِيبُ بِهِ مَنْ أَشَاءُ ۖ وَرَحْمَتِي وَسِعَتْ كُلَّ شَيْءٍ ۚ فَسَأَكْتُبُهَا لِلَّذِينَ يَتَّقُونَ وَيُؤْتُونَ الزَّكَاةَ وَالَّذِينَ هُم بِآيَاتِنَا يُؤْمِنُونَ
మా కోసం ప్రపంచంలోనూ, పరలోకంలో కూడా మేలును వ్రాయి. మేము నీ వైపుకే మరలాము.”(సమాధానంగా అల్లాహ్ ఈ విధంగా) సెలవిచ్చాడు : “నేను కోరిన వారికి మాత్రమే శిక్ష విధిస్తాను. అయితే నా కారుణ్యం అన్ని వస్తువులనూ ఆవరించి ఉంది. భయభక్తుల వైఖరిని అవలంబిస్తూ, జకాతును చెల్లిస్తూ, మా ఆయతులను విశ్వసించేవారి పేర ఈ కారుణ్యాన్ని తప్పకుండా వ్రాస్తాను.”
7:157 الَّذِينَ يَتَّبِعُونَ الرَّسُولَ النَّبِيَّ الْأُمِّيَّ الَّذِي يَجِدُونَهُ مَكْتُوبًا عِندَهُمْ فِي التَّوْرَاةِ وَالْإِنجِيلِ يَأْمُرُهُم بِالْمَعْرُوفِ وَيَنْهَاهُمْ عَنِ الْمُنكَرِ وَيُحِلُّ لَهُمُ الطَّيِّبَاتِ وَيُحَرِّمُ عَلَيْهِمُ الْخَبَائِثَ وَيَضَعُ عَنْهُمْ إِصْرَهُمْ وَالْأَغْلَالَ الَّتِي كَانَتْ عَلَيْهِمْ ۚ فَالَّذِينَ آمَنُوا بِهِ وَعَزَّرُوهُ وَنَصَرُوهُ وَاتَّبَعُوا النُّورَ الَّذِي أُنزِلَ مَعَهُ ۙ أُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ
ఈ సందేశహరుణ్ణి, నిరక్షరాసి అయిన ఈ ప్రవక్తను అనుసరించేవారు (కరుణించబడతారు), అతని ప్రస్తావన తమ వద్ద ఉన్న తౌరాతు, ఇంజీలు గ్రంథాలలో లిఖితపూర్వకంగా లభిస్తుంది. ఆ ప్రవక్త మంచిని చెయ్యమని వారికి ఆదేశిస్తాడు. చెడుల నుంచి వారిస్తాడు. పరిశుద్ధమైన వస్తువులను ధర్మ సమ్మతంగా ప్రకటిస్తాడు. అశుద్ధమైన వాటిని నిషిద్ధంగా ఖరారు చేస్తాడు. వారిపై ఉన్న బరువులను దించుతాడు. వారికి వేయబడి వున్న సంకెళ్లను (విప్పుతాడు). కనుక ఎవరు ఈ ప్రవక్తను విశ్వసించి, అతనికి ఆదరువుగా నిలుస్తారో, తోడ్పాటునందిస్తారో, ఇంకా అతనితోపాటు పంపబడిన జ్యోతిని అనుసరిస్తారో వారే సాఫల్యం పొందేవారు.
7:158 قُلْ يَا أَيُّهَا النَّاسُ إِنِّي رَسُولُ اللَّهِ إِلَيْكُمْ جَمِيعًا الَّذِي لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ لَا إِلَٰهَ إِلَّا هُوَ يُحْيِي وَيُمِيتُ ۖ فَآمِنُوا بِاللَّهِ وَرَسُولِهِ النَّبِيِّ الْأُمِّيِّ الَّذِي يُؤْمِنُ بِاللَّهِ وَكَلِمَاتِهِ وَاتَّبِعُوهُ لَعَلَّكُمْ تَهْتَدُونَ
(ఓ ముహమ్మద్!) వారికి చెప్పు : “ఓ ప్రజలారా! నేను భూమ్యాకాశాల సామ్రాజ్యానికి అధిపతి అయిన అల్లాహ్ తరఫున మీ అందరి వద్దకు పంపబడిన ప్రవక్తను. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ఆయనే బ్రతికించేవాడు, ఆయనే మరణాన్ని ఇచ్చేవాడు. కనుక అల్లాహ్‌ను విశ్వసించండి. సందేశహరుడు, నిరక్షరాసి అయిన ఆయన ప్రవక్తను కూడా విశ్వసించండి – ఆ ప్రవక్త అల్లాహ్‌ను మరియు ఆయన ఆదేశాలను విశ్వసిస్తాడు. అతన్ని అనుసరించండి. తద్వారా మీరు సన్మార్గం పొందుతారు.”
7:159 وَمِن قَوْمِ مُوسَىٰ أُمَّةٌ يَهْدُونَ بِالْحَقِّ وَبِهِ يَعْدِلُونَ
మూసా జాతి వారిలో సత్యం ప్రకారం మార్గదర్శకత్వం వహించే, సత్యాన్ననుసరించి న్యాయ నిర్ణయాలు గైకొనే వర్గం కూడా ఒకటుంది.
7:160 وَقَطَّعْنَاهُمُ اثْنَتَيْ عَشْرَةَ أَسْبَاطًا أُمَمًا ۚ وَأَوْحَيْنَا إِلَىٰ مُوسَىٰ إِذِ اسْتَسْقَاهُ قَوْمُهُ أَنِ اضْرِب بِّعَصَاكَ الْحَجَرَ ۖ فَانبَجَسَتْ مِنْهُ اثْنَتَا عَشْرَةَ عَيْنًا ۖ قَدْ عَلِمَ كُلُّ أُنَاسٍ مَّشْرَبَهُمْ ۚ وَظَلَّلْنَا عَلَيْهِمُ الْغَمَامَ وَأَنزَلْنَا عَلَيْهِمُ الْمَنَّ وَالسَّلْوَىٰ ۖ كُلُوا مِن طَيِّبَاتِ مَا رَزَقْنَاكُمْ ۚ وَمَا ظَلَمُونَا وَلَٰكِن كَانُوا أَنفُسَهُمْ يَظْلِمُونَ
మేము (మూసా జాతి) వారిని పన్నెండు తెగలుగా విభజించి, వేర్వేరు సమూహాలుగా చేశాము. మూసా జాతి వారు అతన్ని నీళ్ళు అడిగినప్పుడు, “నీ చేతి కర్రను ఫలానా రాతిపై కొట్టు” అని మేమతన్ని ఆదేశించాము. అంతే! (అతను కర్రతో కొట్టగానే) ఆ రాతి బండ నుంచి పన్నెండు ఊటలు చిమ్ముకువచ్చాయి. ప్రతి తెగవారూ తాము నీళ్లు తాగవలసిన చోటును తెలుసుకున్నారు. మేము వారిపై మబ్బుల ద్వారా నీడను కల్పించాము. వారిపై ‘మన్న సల్వా’లను (ఆహారంగా) దించాము. “మేము మీకు ప్రసాదించిన పరిశుద్ధమైన పదార్థాలను తినండి” (అని వారికి చెప్పాము.) అయితే వారు (కృతఘ్నతకు పాల్పడి) మాకు చేకూర్చిన నష్టం ఏమీలేదు. వారు తమ స్వయానికే నష్టం చేకూర్చుకునేవారు.
7:161 وَإِذْ قِيلَ لَهُمُ اسْكُنُوا هَٰذِهِ الْقَرْيَةَ وَكُلُوا مِنْهَا حَيْثُ شِئْتُمْ وَقُولُوا حِطَّةٌ وَادْخُلُوا الْبَابَ سُجَّدًا نَّغْفِرْ لَكُمْ خَطِيئَاتِكُمْ ۚ سَنَزِيدُ الْمُحْسِنِينَ
“మీరు ఈ పట్నంలోకి పోయి నివసించండి, అక్కడ మీరు కోరిన చోటినుంచి తీసుకుని తినండి. ‘హిత్తతున్’ అని పలుకుతూ, సాష్టాంగపడుతూ ద్వారం గుండా ప్రవేశించండి. మేము మీ తప్పులను క్షమిస్తాము. సత్కార్యాలు చేసేవారికి మరింతగా అనుగ్రహిస్తాము” అని వారికి ఆజ్ఞాపించబడినప్పుడు,
7:162 فَبَدَّلَ الَّذِينَ ظَلَمُوا مِنْهُمْ قَوْلًا غَيْرَ الَّذِي قِيلَ لَهُمْ فَأَرْسَلْنَا عَلَيْهِمْ رِجْزًا مِّنَ السَّمَاءِ بِمَا كَانُوا يَظْلِمُونَ
వారిలోని దుర్మార్గులు తమకు ఇవ్వబడిన వాక్కును మరొక మాటతో మార్చివేశారు. అందువల్ల మేము వారిపై ఆకాశం నుంచి ఆపదను పంపాము. ఎందుకంటే వారు చాలా అన్యాయంగా ప్రవర్తించేవారు.
7:163 وَاسْأَلْهُمْ عَنِ الْقَرْيَةِ الَّتِي كَانَتْ حَاضِرَةَ الْبَحْرِ إِذْ يَعْدُونَ فِي السَّبْتِ إِذْ تَأْتِيهِمْ حِيتَانُهُمْ يَوْمَ سَبْتِهِمْ شُرَّعًا وَيَوْمَ لَا يَسْبِتُونَ ۙ لَا تَأْتِيهِمْ ۚ كَذَٰلِكَ نَبْلُوهُم بِمَا كَانُوا يَفْسُقُونَ
(ఓ ప్రవక్తా!) సముద్ర తీరాన నివసించిన బస్తీ ప్రజల స్థితిగతులను గురించి వారిని (యూదులను) అడుగు. వారు శనివారం నాటి విషయంలో హద్దుమీరి ప్రవర్తించేవారు. మరి ఆ శనివారం నాడే చేపలు పైపైకి తేలియాడుతూ వారి ముందుకు వచ్చేవి. శనివారం కాని దినాలలో అవి వారి ముందుకు వచ్చేవి కావు. వారి అవిధేయత మూలంగా మేము వారిని ఈ విధంగా పరీక్షకు గురి చేసేవారము.
7:164 وَإِذْ قَالَتْ أُمَّةٌ مِّنْهُمْ لِمَ تَعِظُونَ قَوْمًا ۙ اللَّهُ مُهْلِكُهُمْ أَوْ مُعَذِّبُهُمْ عَذَابًا شَدِيدًا ۖ قَالُوا مَعْذِرَةً إِلَىٰ رَبِّكُمْ وَلَعَلَّهُمْ يَتَّقُونَ
ఇంకా వారిలో ఒక వర్గం (మంచిని ప్రబోధించే వారినుద్దేశించి), “అల్లాహ్ నాశనం చేయబోయే లేక కఠినంగా శిక్షించబోయేవారికి ఎందుకు (అనవసరంగా) ఉపదేశిస్తారు?” అని చెప్పగా, “మీ ప్రభువు సమక్షంలో సంజాయిషీ ఇవ్వగలిగే స్థితిలో ఉండటానికి (ఈ పని చేస్తున్నాము). అలాగే బహుశా ఈ జనులు (దైవాగ్రహానికి) భయపడినా భయపడవచ్చు” అని వారు సమాధానమిచ్చారు.
7:165 فَلَمَّا نَسُوا مَا ذُكِّرُوا بِهِ أَنجَيْنَا الَّذِينَ يَنْهَوْنَ عَنِ السُّوءِ وَأَخَذْنَا الَّذِينَ ظَلَمُوا بِعَذَابٍ بَئِيسٍ بِمَا كَانُوا يَفْسُقُونَ
మరి వారికి చేస్తూ వచ్చిన హితబోధను వారు విస్మరించినప్పుడు, ఆ చెడు పోకడ నుంచి వారిస్తూ వచ్చిన వారిని మేము రక్షించి, దుర్మార్గానికి పాల్పడిన వారందరినీ వారి అవిధేయతల కారణంగా ఒక కఠినమైన శిక్షతో పట్టుకున్నాము.
7:166 فَلَمَّا عَتَوْا عَن مَّا نُهُوا عَنْهُ قُلْنَا لَهُمْ كُونُوا قِرَدَةً خَاسِئِينَ
అనగా వారు, తమకు వారించబడిన విషయంపై బరి తెగించి పోయినప్పుడు, “ఇక మీరు నీచులైన కోతులుగా మారిపొండి” అని అన్నాము.
7:167 وَإِذْ تَأَذَّنَ رَبُّكَ لَيَبْعَثَنَّ عَلَيْهِمْ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ مَن يَسُومُهُمْ سُوءَ الْعَذَابِ ۗ إِنَّ رَبَّكَ لَسَرِيعُ الْعِقَابِ ۖ وَإِنَّهُ لَغَفُورٌ رَّحِيمٌ
ప్రళయదినం వరకూ యూదులను తీవ్ర యాతనకు గురి చేస్తూ ఉండేవారిని వారిపై విధిస్తాను అని నీ ప్రభువు ప్రకటించిన విషయం స్మరించదగినది. నిస్సందేహంగా నీ ప్రభువు శిక్షించటంలో వడిగలవాడు. నిస్సందేహంగా ఆయన క్షమించేవాడు, కనికరించేవాడు కూడా.
7:168 وَقَطَّعْنَاهُمْ فِي الْأَرْضِ أُمَمًا ۖ مِّنْهُمُ الصَّالِحُونَ وَمِنْهُمْ دُونَ ذَٰلِكَ ۖ وَبَلَوْنَاهُم بِالْحَسَنَاتِ وَالسَّيِّئَاتِ لَعَلَّهُمْ يَرْجِعُونَ
మేము వారిని (యూదులను) భూమండలంపై అనేక వర్గాలుగా చీల్చి (చెల్లాచెదురుగా చేసి) ఉంచాము. వారిలో కొందరు సజ్జనులూ మరియు తద్భిన్నంగా ఉండేవారు కూడా ఉన్నారు. బహుశా వారు మరలి వస్తారేమోనని మేము వారిని మంచి స్థితిలోనూ, దుస్థితిలోనూ పరీక్షించాము.
7:169 فَخَلَفَ مِن بَعْدِهِمْ خَلْفٌ وَرِثُوا الْكِتَابَ يَأْخُذُونَ عَرَضَ هَٰذَا الْأَدْنَىٰ وَيَقُولُونَ سَيُغْفَرُ لَنَا وَإِن يَأْتِهِمْ عَرَضٌ مِّثْلُهُ يَأْخُذُوهُ ۚ أَلَمْ يُؤْخَذْ عَلَيْهِم مِّيثَاقُ الْكِتَابِ أَن لَّا يَقُولُوا عَلَى اللَّهِ إِلَّا الْحَقَّ وَدَرَسُوا مَا فِيهِ ۗ وَالدَّارُ الْآخِرَةُ خَيْرٌ لِّلَّذِينَ يَتَّقُونَ ۗ أَفَلَا تَعْقِلُونَ
మరి వారి తరువాత వారికి వారసులైనవారు వారి నుంచి గ్రంథాన్ని పొందారు. వారు తుచ్ఛమైన ఐహిక సంపదను తీసుకుంటున్నారు. పైగా, “మేము తప్పకుండా క్షమించబడతాము” అని అంటున్నారు. అలాంటి సొమ్మే మళ్లీ లభిస్తే మళ్లీ దాన్ని కూడా తీసేసుకుంటారు. అల్లాహ్ పేరుతో సత్యం తప్ప మరోమాట చెప్పకూడదని గ్రంథంలో ఉన్నటువంటి ప్రమాణం వారి నుండి తీసుకోబడలేదా? (మరి చూడబోతే) అందులో (గ్రంథంలో) ఉన్న దానిని వారు స్వయంగా చదివారు. భయభక్తులు కలిగి ఉండేవారి కోసం పరలోక నిలయం ఎంతో మేలైనది. మరి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోరేమిటీ?
7:170 وَالَّذِينَ يُمَسِّكُونَ بِالْكِتَابِ وَأَقَامُوا الصَّلَاةَ إِنَّا لَا نُضِيعُ أَجْرَ الْمُصْلِحِينَ
ఎవరు గ్రంథానికి కట్టుబడి ఉంటూ, నమాజులను నెలకొల్పుతూ ఉన్నారో అట్టి సంస్కర్తల పుణ్య ఫలాన్ని మేము వృథా చేయము.
7:171 وَإِذْ نَتَقْنَا الْجَبَلَ فَوْقَهُمْ كَأَنَّهُ ظُلَّةٌ وَظَنُّوا أَنَّهُ وَاقِعٌ بِهِمْ خُذُوا مَا آتَيْنَاكُم بِقُوَّةٍ وَاذْكُرُوا مَا فِيهِ لَعَلَّكُمْ تَتَّقُونَ
మేము పర్వతాన్ని పైకెత్తి కప్పు మాదిరిగా వారిపై నిలిపిన సంఘటన కూడా గుర్తుచేసుకోదగినదే. అది తమపైన పడటం ఖాయం అని వారంతా అనుకున్నారు. (ఆ సమయంలో మేము వారితో), “మేము మీకు వొసగిన దానిని (గ్రంథాన్ని) గట్టిగా పట్టుకోండి. ఇందలి ఆదేశాలను జ్ఞాపకముంచుకోండి. తద్వారా మీరు దైవ భీతిపరులు (ముత్తఖీన్) అవుతారు” (అని చెప్పాము).
7:172 وَإِذْ أَخَذَ رَبُّكَ مِن بَنِي آدَمَ مِن ظُهُورِهِمْ ذُرِّيَّتَهُمْ وَأَشْهَدَهُمْ عَلَىٰ أَنفُسِهِمْ أَلَسْتُ بِرَبِّكُمْ ۖ قَالُوا بَلَىٰ ۛ شَهِدْنَا ۛ أَن تَقُولُوا يَوْمَ الْقِيَامَةِ إِنَّا كُنَّا عَنْ هَٰذَا غَافِلِينَ
నీ ప్రభువు ఆదం సంతతి వీపుల నుండి వారి సంతానాన్ని తీసి, స్వయంగా వారినే వారికి సాక్షులుగా పెట్టి, “నేను మీ ప్రభువును కానా?” అని అడిగినప్పుడు “ఎందుకు కావు? (నువ్వే మా ప్రభువువి). ఈ విషయానికి మేమంతా సాక్షులుగా ఉన్నాం” అని వారు చెప్పారు. ‘దీని గురించి మాకేమీ తెలియదు’ అని ప్రళయ దినాన మీరు అనకుండా ఉండటానికీ
7:173 أَوْ تَقُولُوا إِنَّمَا أَشْرَكَ آبَاؤُنَا مِن قَبْلُ وَكُنَّا ذُرِّيَّةً مِّن بَعْدِهِمْ ۖ أَفَتُهْلِكُنَا بِمَا فَعَلَ الْمُبْطِلُونَ
లేదా “మొదట్లో మా పూర్వీకులు షిర్కుకు పాల్పడ్డారు. మేము వారి తరువాతివారి సంతతిలో పుట్టినవారము. ఆ దుర్జనులు చేసిన పాపానికి నువ్వు మమ్మల్ని వినాశానికి గురిచేస్తావా?!” అని మీరు అనకుండా ఉండటానికిగాను (మేము ముందే మీ నుండి ఈ విధంగా ఖరారు చేయించాము.)
7:174 وَكَذَٰلِكَ نُفَصِّلُ الْآيَاتِ وَلَعَلَّهُمْ يَرْجِعُونَ
వారు మరలివస్తారేమోనని మేము ఈ విధంగా ఆయతులను విడమరచి చెబుతున్నాము.
7:175 وَاتْلُ عَلَيْهِمْ نَبَأَ الَّذِي آتَيْنَاهُ آيَاتِنَا فَانسَلَخَ مِنْهَا فَأَتْبَعَهُ الشَّيْطَانُ فَكَانَ مِنَ الْغَاوِينَ
(ఓ ప్రవక్తా!) మేము మా ఆయతులను ప్రసాదించగా, వాటినుండి తిరిగిపోయిన వాని వృత్తాంతాన్ని వారికి చదివి వినిపించు. చివరకు షైతాను అతని వెంటపడగా, అతడు మార్గభ్రష్టులలో చేరిపోయాడు.
7:176 وَلَوْ شِئْنَا لَرَفَعْنَاهُ بِهَا وَلَٰكِنَّهُ أَخْلَدَ إِلَى الْأَرْضِ وَاتَّبَعَ هَوَاهُ ۚ فَمَثَلُهُ كَمَثَلِ الْكَلْبِ إِن تَحْمِلْ عَلَيْهِ يَلْهَثْ أَوْ تَتْرُكْهُ يَلْهَث ۚ ذَّٰلِكَ مَثَلُ الْقَوْمِ الَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا ۚ فَاقْصُصِ الْقَصَصَ لَعَلَّهُمْ يَتَفَكَّرُونَ
మేము గనక తలిస్తే ఈ ఆయతుల వల్ల అతనికి ఔన్నత్యాన్ని ప్రసాదించి ఉండేవారం. కాని అతనేమో ప్రపంచం వైపుకే మ్రొగ్గాడు. తన మనోవాంఛలనే అనుసరించసాగాడు. అందువల్ల అతని పరిస్థితి కుక్క పరిస్థితిలా తయారయింది. నువ్వు దాన్ని తరిమినా అది నాలుకను బయటపెట్టి రొప్పుతూ ఉంటుంది. దాన్ని దాని మానాన వదలి పెట్టినా (నాలుక తీసి) రొప్పుతూనే ఉంటుంది. మా ఆయతులను అసత్యాలని త్రోసిపుచ్చిన వారి పరిస్థితి కూడా ఇలాంటిదే. కాబట్టి నువ్వు వారికి ఈ గాథలను వినిపిస్తూ ఉండు. బహుశా అలాగైనా వారు యోచన చేస్తారేమో!
7:177 سَاءَ مَثَلًا الْقَوْمُ الَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا وَأَنفُسَهُمْ كَانُوا يَظْلِمُونَ
మా ఆయతులను అసత్యాలని ధిక్కరిస్తూ, తమ స్వయానికి నష్టం చేకూర్చుకునే ప్రజల పరిస్థితి కూడా చాలా చెడ్డది.
7:178 مَن يَهْدِ اللَّهُ فَهُوَ الْمُهْتَدِي ۖ وَمَن يُضْلِلْ فَأُولَٰئِكَ هُمُ الْخَاسِرُونَ
అల్లాహ్ ఎవడికి సన్మార్గం చూపుతాడో అతడే సన్మార్గం పొందినవాడవుతాడు. మరెవరిని ఆయన అపమార్గం పట్టిస్తాడో వారే నష్టపోయినవారవుతారు.
7:179 وَلَقَدْ ذَرَأْنَا لِجَهَنَّمَ كَثِيرًا مِّنَ الْجِنِّ وَالْإِنسِ ۖ لَهُمْ قُلُوبٌ لَّا يَفْقَهُونَ بِهَا وَلَهُمْ أَعْيُنٌ لَّا يُبْصِرُونَ بِهَا وَلَهُمْ آذَانٌ لَّا يَسْمَعُونَ بِهَا ۚ أُولَٰئِكَ كَالْأَنْعَامِ بَلْ هُمْ أَضَلُّ ۚ أُولَٰئِكَ هُمُ الْغَافِلُونَ
ఎంతోమంది జిన్నులను, మానవులను మేము నరకం కోసం పుట్టించాము. వారికి హృదయాలున్నాయి. కాని వాటితో వారు ఆలోచించరు. వారికి కళ్లున్నాయి. కాని వాటితో వారు చూడరు. వారికి చెవులున్నాయి. కాని వాటితో వారు వినరు. వారు పశువుల్లాంటివారు. కాదు, వాటికన్నా ఎక్కువగానే దారి తప్పారు. పరధ్యానంలో పడిపోయిన వారంటే వీరే.
7:180 وَلِلَّهِ الْأَسْمَاءُ الْحُسْنَىٰ فَادْعُوهُ بِهَا ۖ وَذَرُوا الَّذِينَ يُلْحِدُونَ فِي أَسْمَائِهِ ۚ سَيُجْزَوْنَ مَا كَانُوا يَعْمَلُونَ
అల్లాహ్‌కు మంచి మంచి పేర్లున్నాయి. కాబట్టి మీరు ఆ పేర్లతో ఆయన్నే పిలవండి. ఆయన పేర్ల విషయంలో వక్రంగా వాదించే వారిని వదలిపెట్టండి. వారు చేస్తూ ఉండినదానికి వారు తప్పకుండా శిక్షించబడతారు.
7:181 وَمِمَّنْ خَلَقْنَا أُمَّةٌ يَهْدُونَ بِالْحَقِّ وَبِهِ يَعْدِلُونَ
మేము సృష్టించిన వారిలో సత్యానికనుగుణంగా మార్గదర్శకత్వం వహించే, సత్యాన్ననుసరించి న్యాయంచేసే మానవ సముదాయం కూడా ఒకటుంది.
7:182 وَالَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا سَنَسْتَدْرِجُهُم مِّنْ حَيْثُ لَا يَعْلَمُونَ
మా ఆయతులను అసత్యాలని ధిక్కరించిన వారిని మేము- వారికి తెలియకుండానే – క్రమక్రమంగా (మా ఉచ్చులో) బిగిస్తూ పోతాము.
7:183 وَأُمْلِي لَهُمْ ۚ إِنَّ كَيْدِي مَتِينٌ
వారికి కొంత గడువును ఇస్తున్నాను. నిశ్చయంగా నా వ్యూహం ఎంతో పకడ్బందీగా ఉంటుంది.
7:184 أَوَلَمْ يَتَفَكَّرُوا ۗ مَا بِصَاحِبِهِم مِّن جِنَّةٍ ۚ إِنْ هُوَ إِلَّا نَذِيرٌ مُّبِينٌ
ఏమిటీ, తమ సహవాసిపై ఏ మాత్రం ఉన్మాద ప్రభావం లేదన్న విషయాన్ని గురించి వారు ఆలోచించలేదా? అతను స్పష్టంగా హెచ్చరించేవాడు మాత్రమే (అతను ఎంతమాత్రం ఉన్మాది కాడు).
7:185 أَوَلَمْ يَنظُرُوا فِي مَلَكُوتِ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا خَلَقَ اللَّهُ مِن شَيْءٍ وَأَنْ عَسَىٰ أَن يَكُونَ قَدِ اقْتَرَبَ أَجَلُهُمْ ۖ فَبِأَيِّ حَدِيثٍ بَعْدَهُ يُؤْمِنُونَ
ఏమిటి, ఆకాశాల మరియు భూమి యొక్క వ్యవస్థను, అల్లాహ్ సృష్టించిన ఇతర వస్తువులను వారు గమనించలేదా? వారి కాలం దగ్గరపడి ఉండవచ్చునన్న సంగతిని గురించి కూడా వారు ఆలోచించలేదా? మరి ఖుర్ఆన్ తరువాత, వారు విశ్వసించే ఇంకొక వస్తువు ఏముంటుంది?
7:186 مَن يُضْلِلِ اللَّهُ فَلَا هَادِيَ لَهُ ۚ وَيَذَرُهُمْ فِي طُغْيَانِهِمْ يَعْمَهُونَ
అల్లాహ్ అపమార్గాన వదలి పెట్టేసిన వారిని సన్మార్గం పైకి ఎవరూ తీసుకురాలేరు. వారు తమ తలబిరుసుతనంలోనే తచ్చాడుతూ ఉండేలా అల్లాహ్ వారిని వదలివేస్తాడు.
7:187 يَسْأَلُونَكَ عَنِ السَّاعَةِ أَيَّانَ مُرْسَاهَا ۖ قُلْ إِنَّمَا عِلْمُهَا عِندَ رَبِّي ۖ لَا يُجَلِّيهَا لِوَقْتِهَا إِلَّا هُوَ ۚ ثَقُلَتْ فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ لَا تَأْتِيكُمْ إِلَّا بَغْتَةً ۗ يَسْأَلُونَكَ كَأَنَّكَ حَفِيٌّ عَنْهَا ۖ قُلْ إِنَّمَا عِلْمُهَا عِندَ اللَّهِ وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ
“ఇంతకీ ఆ ఘడియ ఎప్పుడొస్తుందీ?’ అని వారు నిన్ను ప్రళయం గురించి అడుగుతున్నారు కదూ! “ఆ జ్ఞానం మాత్రం నా ప్రభువు వద్దనే ఉంది. ఆ సమయం ఆసన్నమైనపుడు ఆయన మాత్రమే దాన్ని ప్రత్యక్షపరుస్తాడు. అది ఆకాశాలలోనూ, భూమిలోనూ మహా బరువైనది (విపత్కరమైన సంఘటన)గా ఉంటుంది. అది అకస్మాత్తుగానే మీపై వచ్చిపడుతుంది” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు. నీవు దాని గురించి పరిశోధన చేసి కనుగొన్నట్లే వారు నిన్ను అడుగుతున్నారు. “దాని జ్ఞానం కేవలం అల్లాహ్ వద్ద మాత్రమే ఉంది. కాని చాలా మంది ఈ విషయాన్ని తెలుసుకోరు” అని వారికి చెప్పు.
7:188 قُل لَّا أَمْلِكُ لِنَفْسِي نَفْعًا وَلَا ضَرًّا إِلَّا مَا شَاءَ اللَّهُ ۚ وَلَوْ كُنتُ أَعْلَمُ الْغَيْبَ لَاسْتَكْثَرْتُ مِنَ الْخَيْرِ وَمَا مَسَّنِيَ السُّوءُ ۚ إِنْ أَنَا إِلَّا نَذِيرٌ وَبَشِيرٌ لِّقَوْمٍ يُؤْمِنُونَ
(ఓ ప్రవక్తా! వారికి) చెప్పు: “అల్లాహ్ తలచినంత మాత్రమే తప్ప నేను సయితం నా కోసం లాభంగానీ, నష్టంగానీ చేకూర్చుకునే అధికారం నాకు లేదు. నాకే గనక అగోచర విషయాలు తెలిసివుంటే నేనెన్నో ప్రయోజనాలు పొంది ఉండేవాణ్ణి. ఏ నష్టమూ నాకు వాటిల్లేది కాదు. నిజానికి నేను విశ్వసించే వారికి హెచ్చరించేవాణ్ణి, శుభవార్తలు అందజేసేవాణ్ణి మాత్రమే.”
7:189 هُوَ الَّذِي خَلَقَكُم مِّن نَّفْسٍ وَاحِدَةٍ وَجَعَلَ مِنْهَا زَوْجَهَا لِيَسْكُنَ إِلَيْهَا ۖ فَلَمَّا تَغَشَّاهَا حَمَلَتْ حَمْلًا خَفِيفًا فَمَرَّتْ بِهِ ۖ فَلَمَّا أَثْقَلَت دَّعَوَا اللَّهَ رَبَّهُمَا لَئِنْ آتَيْتَنَا صَالِحًا لَّنَكُونَنَّ مِنَ الشَّاكِرِينَ
ఆ అల్లాహ్‌యే మిమ్మల్ని ఒకే ప్రాణి (వ్యక్తి) నుంచి పుట్టించాడు. మరి అతని నుండే అతని జంటను కూడా సృష్టించాడు – అతనా జంట ద్వారా ప్రశాంతతను పొందటానికి! ఆ తరువాత అతను తన సహధర్మచారిణితో సమాగమం జరపగా ఆమె ఒక తేలికైన భారం దాల్చింది (గర్భవతి అయింది). ఆమె ఆ భారాన్ని మోసుకుంటూ తిరిగేది. మరి భారం అధికమైనప్పుడు భార్యాభర్తలిరువురూ తమ ప్రభువైన అల్లాహ్‌ను, “నీవు గనక మాకు ఏ లోపమూ లేని బిడ్డను ప్రసాదిస్తే మేము నీకు తప్పకుండా కృతజ్ఞులమై ఉంటామ”ని ప్రార్థించసాగారు.
7:190 فَلَمَّا آتَاهُمَا صَالِحًا جَعَلَا لَهُ شُرَكَاءَ فِيمَا آتَاهُمَا ۚ فَتَعَالَى اللَّهُ عَمَّا يُشْرِكُونَ
మరి అల్లాహ్ వారికి (ఏ లోపమూ లేని) బిడ్డను ప్రసాదించగానే, ఆ ‘ప్రసాదితం’లో వారిద్దరూ ఆయనకు భాగస్వాముల్ని కల్పించటం మొదలెట్టారు. వారు చేసే ఈ భాగస్వామ్య చేష్టలకు అల్లాహ్ అతీతుడు, ఉన్నతుడు.
7:191 أَيُشْرِكُونَ مَا لَا يَخْلُقُ شَيْئًا وَهُمْ يُخْلَقُونَ
ఏమిటీ, ఏ వస్తువునూ సృష్టించలేని వారినీ, వారే స్వయంగా ఒకరి చేత సృష్టించబడిన వారిని వీళ్లు (అల్లాహ్‌కు) భాగస్వాములుగా నిలబెడుతున్నారా?
7:192 وَلَا يَسْتَطِيعُونَ لَهُمْ نَصْرًا وَلَا أَنفُسَهُمْ يَنصُرُونَ
వారు వీళ్ళకు ఏ సహాయమూ చేయలేరు. కనీసం తమకు తాము కూడా సహాయం చేసుకోలేరు.
7:193 وَإِن تَدْعُوهُمْ إِلَى الْهُدَىٰ لَا يَتَّبِعُوكُمْ ۚ سَوَاءٌ عَلَيْكُمْ أَدَعَوْتُمُوهُمْ أَمْ أَنتُمْ صَامِتُونَ
ఒకవేళ మీరు వారిని సన్మార్గం వైపుకు పిలిస్తే వారు మీ మాట వినరు. మీరు వారిని పిలిచినా, మౌనం వహించినా ఒక్కటే.
7:194 إِنَّ الَّذِينَ تَدْعُونَ مِن دُونِ اللَّهِ عِبَادٌ أَمْثَالُكُمْ ۖ فَادْعُوهُمْ فَلْيَسْتَجِيبُوا لَكُمْ إِن كُنتُمْ صَادِقِينَ
మీరు అల్లాహ్‌ను వదలి ఎవరెవరిని మొరపెట్టుకుంటున్నారో వారంతా మీలాంటి దాసులే. మీరు మొరపెట్టుకుంటూనే ఉండండి. (ఈ బహుదైవోపాసనలో) మీరు గనక సత్యవంతులయితే వారు మీ మొరలను ఆలకించి వాటికి సమాధానం ఇవ్వాలి.
7:195 أَلَهُمْ أَرْجُلٌ يَمْشُونَ بِهَا ۖ أَمْ لَهُمْ أَيْدٍ يَبْطِشُونَ بِهَا ۖ أَمْ لَهُمْ أَعْيُنٌ يُبْصِرُونَ بِهَا ۖ أَمْ لَهُمْ آذَانٌ يَسْمَعُونَ بِهَا ۗ قُلِ ادْعُوا شُرَكَاءَكُمْ ثُمَّ كِيدُونِ فَلَا تُنظِرُونِ
ఏమిటి, వారు నడవగలగటానికి వారికేమయినా కాళ్లున్నాయా? వారు దేనినయినా పట్టుకోవటానికి వారికి చేతులున్నాయా? చూడగలగటానికి వారికి కళ్లున్నాయా? వినగలగటానికి వారికి చెవులున్నాయా? (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “మీరు మీ భాగస్వాములందర్నీ పిలుచుకోండి. మరి మీరంతా కలసి నాకు కీడు కలిగించే వ్యూహాన్నీ రచించండి. నాకు కొద్దిపాటి గడువు కూడా ఇవ్వకండి.”
7:196 إِنَّ وَلِيِّيَ اللَّهُ الَّذِي نَزَّلَ الْكِتَابَ ۖ وَهُوَ يَتَوَلَّى الصَّالِحِينَ
“ఈ గ్రంథాన్ని అవతరింపజేసిన అల్లాహ్‌యే ముమ్మాటికీ నా సహాయకుడు. సజ్జనులైన దాసుల రక్షకుడు ఆయనే.”
7:197 وَالَّذِينَ تَدْعُونَ مِن دُونِهِ لَا يَسْتَطِيعُونَ نَصْرَكُمْ وَلَا أَنفُسَهُمْ يَنصُرُونَ
“కాగా; మీరు అల్లాహ్‌ను వదలి ఎవరిని పిలుస్తున్నారో వారు మీకు సహాయపడలేరు. తమ స్వయానికి కూడా వారు సహాయం చేసుకోలేరు.
7:198 وَإِن تَدْعُوهُمْ إِلَى الْهُدَىٰ لَا يَسْمَعُوا ۖ وَتَرَاهُمْ يَنظُرُونَ إِلَيْكَ وَهُمْ لَا يُبْصِرُونَ
“ఒకవేళ మీరు వారికేదయినా చెప్పటానికి పిలిచినా వారు మీ మాటను వినలేరు. వారు నిన్ను చూస్తున్నట్లుగానే నీకు కనిపిస్తుంది. కాని వాస్తవానికి వారసలు ఏమీ చూడలేరు.”
7:199 خُذِ الْعَفْوَ وَأْمُرْ بِالْعُرْفِ وَأَعْرِضْ عَنِ الْجَاهِلِينَ
(ప్రవక్తా!) మన్నింపుల వైఖరిని అవలంబించు. మంచిని ప్రబోధిస్తూ ఉండు. మూర్ఖులను పట్టించుకోకు.
7:200 وَإِمَّا يَنزَغَنَّكَ مِنَ الشَّيْطَانِ نَزْغٌ فَاسْتَعِذْ بِاللَّهِ ۚ إِنَّهُ سَمِيعٌ عَلِيمٌ
షైతాను తరఫు నుంచి ఏదైనా దుష్ప్రేరణ కలిగినట్లయితే అల్లాహ్ శరణు వేడుకో. నిశ్చయంగా ఆయన బాగా వినేవాడు, తెలిసినవాడూను.
7:201 إِنَّ الَّذِينَ اتَّقَوْا إِذَا مَسَّهُمْ طَائِفٌ مِّنَ الشَّيْطَانِ تَذَكَّرُوا فَإِذَا هُم مُّبْصِرُونَ
నిశ్చయంగా అల్లాహ్ భీతిపరులు (ముత్తఖీన్) తమకు ఎప్పుడైనా షైతాన్ తరఫు నుంచి చెడు ఆలోచన తట్టినప్పుడు వారు (తమ ప్రభువు యొక్క ఔన్నత్య) స్మరణలో నిమగ్నులై పోతారు. దాంతో వెంటనే వారికి కనువిప్పు కలుగుతుంది.
7:202 وَإِخْوَانُهُمْ يَمُدُّونَهُمْ فِي الْغَيِّ ثُمَّ لَا يُقْصِرُونَ
ఇక షైతానుల సోదరులను వారు మార్గవిహీనత వైపుకు లాక్కుపోతుంటారు. (వారిని భ్రష్టు పట్టించటంలో) ఏ లోటూ రానివ్వరు.
7:203 وَإِذَا لَمْ تَأْتِهِم بِآيَةٍ قَالُوا لَوْلَا اجْتَبَيْتَهَا ۚ قُلْ إِنَّمَا أَتَّبِعُ مَا يُوحَىٰ إِلَيَّ مِن رَّبِّي ۚ هَٰذَا بَصَائِرُ مِن رَّبِّكُمْ وَهُدًى وَرَحْمَةٌ لِّقَوْمٍ يُؤْمِنُونَ
నీవు వారి ముందు ఏదైనా మహిమను ప్రదర్శించకపోతే,”నువ్వీ మహిమను ఎందుకు తేలేదు?” అని వారంటారు. “నా ప్రభువు తరఫునుంచి నాకు పంపబడిన ఆదేశాన్ని మాత్రమే నేను అనుసరిస్తాను. విశ్వసించేవారికి ఇందులో (దివ్య ఖుర్ఆన్లో) మీ ప్రభువు తరఫు నుంచి ఎన్నో నిదర్శనాలున్నాయి. ఇది మార్గదర్శకత్వం మరియు కారుణ్యం “ అని ఓ ప్రవక్తా! వారికి తెలియజెయ్యి.
7:204 وَإِذَا قُرِئَ الْقُرْآنُ فَاسْتَمِعُوا لَهُ وَأَنصِتُوا لَعَلَّكُمْ تُرْحَمُونَ
దివ్య ఖుర్ఆన్ పారాయణం జరుగుతున్నప్పుడు దానిని శ్రద్ధగా వినండి, నిశ్శబ్దంగా ఉండండి. తద్వారా మీరు కరుణించబడవచ్చు.
7:205 وَاذْكُر رَّبَّكَ فِي نَفْسِكَ تَضَرُّعًا وَخِيفَةً وَدُونَ الْجَهْرِ مِنَ الْقَوْلِ بِالْغُدُوِّ وَالْآصَالِ وَلَا تَكُن مِّنَ الْغَافِلِينَ
నీవు నీ మనసులోనే – కడు వినమ్రతతో, భయంతో – నీ ప్రభువును స్మరించు. ఉదయం, సాయంత్రం బిగ్గరగా కాకుండా మెల్లగా నోటితో కూడా (స్మరించు). విస్మరించే వారిలో చేరిపోకు.
7:206 إِنَّ الَّذِينَ عِندَ رَبِّكَ لَا يَسْتَكْبِرُونَ عَنْ عِبَادَتِهِ وَيُسَبِّحُونَهُ وَلَهُ يَسْجُدُونَ ۩
నీ ప్రభువుకు చేరువలో ఉన్నవారు ఆయన ఆరాధన పట్ల గర్వాతిశయంతో మెలగరు. పైగా వారు (అణకువతో) ఆయన పవిత్రతను కొనియాడుతూ, ఆయన ముందు సాష్టాంగపడుతూ ఉంటారు.
8. సూరా అల్ అన్ ఫాల్
8:1 يَسْأَلُونَكَ عَنِ الْأَنفَالِ ۖ قُلِ الْأَنفَالُ لِلَّهِ وَالرَّسُولِ ۖ فَاتَّقُوا اللَّهَ وَأَصْلِحُوا ذَاتَ بَيْنِكُمْ ۖ وَأَطِيعُوا اللَّهَ وَرَسُولَهُ إِن كُنتُم مُّؤْمِنِينَ
వారు నిన్ను యుద్ధప్రాప్తి (అన్ఫాల్) గురించి అడుగుతున్నారు. (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “ఈ యుద్ధప్రాప్తి (అన్ఫాల్) అల్లాహ్‌కు, ప్రవక్తకు చెందినవి. కాబట్టి మీరు అల్లాహ్‌కు భయపడండి. మీ పరస్పర సంబంధాలను చక్కదిద్దుకోండి. మీరు విశ్వసించినవారే అయితే అల్లాహ్కూ, ఆయన ప్రవక్తకూ విధేయత చూపండి.”
8:2 إِنَّمَا الْمُؤْمِنُونَ الَّذِينَ إِذَا ذُكِرَ اللَّهُ وَجِلَتْ قُلُوبُهُمْ وَإِذَا تُلِيَتْ عَلَيْهِمْ آيَاتُهُ زَادَتْهُمْ إِيمَانًا وَعَلَىٰ رَبِّهِمْ يَتَوَكَّلُونَ
నిజమైన విశ్వాసులు ఎటువంటి వారంటే – అల్లాహ్ ప్రస్తావన రాగానే వారి హృదయాలు భయంతో వణుకుతాయి. అల్లాహ్ ఆయతులు వారి ముందు పఠించబడినపుడు, అవి వారి విశ్వాసాన్ని మరింత వృద్ధిచేస్తాయి. వారు తమ ప్రభువునే నమ్ముకుంటారు.
8:3 الَّذِينَ يُقِيمُونَ الصَّلَاةَ وَمِمَّا رَزَقْنَاهُمْ يُنفِقُونَ
వారు నమాజును నెలకొల్పుతారు. మేము వారికి ప్రసాదించిన దానిలో నుంచి (మా మార్గంలో) ఖర్చుపెడతారు.
8:4 أُولَٰئِكَ هُمُ الْمُؤْمِنُونَ حَقًّا ۚ لَّهُمْ دَرَجَاتٌ عِندَ رَبِّهِمْ وَمَغْفِرَةٌ وَرِزْقٌ كَرِيمٌ
నిజమైన విశ్వాసులంటే వీరే. వీరి కొరకు వీరి ప్రభువు వద్ద ఉన్నత స్థానాలు ఉన్నాయి. మన్నింపు ఉంది. గౌరవప్రదమైన ఆహారం ఉంది.
8:5 كَمَا أَخْرَجَكَ رَبُّكَ مِن بَيْتِكَ بِالْحَقِّ وَإِنَّ فَرِيقًا مِّنَ الْمُؤْمِنِينَ لَكَارِهُونَ
(ఈ అన్ఫాల్ వ్యవహారంలో కూడా ఇదివరకు ఉత్పన్నమైన పరిస్థితి వంటిదే ఉత్పన్నమవుతోంది. అప్పుడు) నీ ప్రభువు నిన్ను సత్యంతో నీ గృహం నుంచి బయటకు తీసుకువచ్చాడు. విశ్వసించిన వారిలోని ఒక వర్గం వారికి ఇది ఇష్టంలేదు.
8:6 يُجَادِلُونَكَ فِي الْحَقِّ بَعْدَمَا تَبَيَّنَ كَأَنَّمَا يُسَاقُونَ إِلَى الْمَوْتِ وَهُمْ يَنظُرُونَ
వారు ఈ సత్యం గురించి – అది సత్యమని స్పష్టం అయిన తరువాత కూడా – తాము మృత్యువు వైపుకు తరుమబడుతున్నట్లు, దాన్ని తాము కళ్ళారా చూస్తున్నట్లుగానే (భీతిల్లి) నీతో వాదులాటకు దిగారు.
8:7 وَإِذْ يَعِدُكُمُ اللَّهُ إِحْدَى الطَّائِفَتَيْنِ أَنَّهَا لَكُمْ وَتَوَدُّونَ أَنَّ غَيْرَ ذَاتِ الشَّوْكَةِ تَكُونُ لَكُمْ وَيُرِيدُ اللَّهُ أَن يُحِقَّ الْحَقَّ بِكَلِمَاتِهِ وَيَقْطَعَ دَابِرَ الْكَافِرِينَ
ఆ రెండు బృందాలలో ఏదో ఒక బృందం మీ చేతికి చిక్కుతుందని అల్లాహ్ మీకు వాగ్దానం చేసిన సమయాన్ని ఓసారి జ్ఞాపకం చేసుకోండి! అప్పుడు మీరు నిరాయుధులైన బృందం చేజిక్కాలని ఉబలాటపడ్డారు. అదే సమయంలో అల్లాహ్ తన ఆదేశాల ద్వారా సత్యాన్ని సత్యంగా తేటతెల్లం చేసి, అవిశ్వాసులను కూకటి వేళ్లతో పెకలించాలని సంకల్పించుకున్నాడు.
8:8 لِيُحِقَّ الْحَقَّ وَيُبْطِلَ الْبَاطِلَ وَلَوْ كَرِهَ الْمُجْرِمُونَ
అపరాధులకు ఎంతగా సహించరానిదయినా సరే సత్యం సత్యంగా, అసత్యం అసత్యంగా నిగ్గుతేలాలన్నది (ఆయన అభిమతం).
8:9 إِذْ تَسْتَغِيثُونَ رَبَّكُمْ فَاسْتَجَابَ لَكُمْ أَنِّي مُمِدُّكُم بِأَلْفٍ مِّنَ الْمَلَائِكَةِ مُرْدِفِينَ
సహాయం కోసం మీరు మీ ప్రభువును మొరపెట్టుకున్న ఆ సందర్భాన్ని కూడా జ్ఞప్తికి తెచ్చుకోండి-మరి అల్లాహ్ మీ మొరను ఆలకించి, “నేను వెయ్యిమంది దూతలతో మీకు సహాయం చేస్తాను. వారు ఎడతెగకుండా – ఒకరి వెనుక ఒకరు – వస్తుంటారు” అని చెప్పాడు.
8:10 وَمَا جَعَلَهُ اللَّهُ إِلَّا بُشْرَىٰ وَلِتَطْمَئِنَّ بِهِ قُلُوبُكُمْ ۚ وَمَا النَّصْرُ إِلَّا مِنْ عِندِ اللَّهِ ۚ إِنَّ اللَّهَ عَزِيزٌ حَكِيمٌ
మీకు శుభవార్తను అందించటానికీ, తద్వారా మీ మనసులు కుదుటపడటానికి అల్లాహ్ ఈ విధంగా తోడ్పడ్డాడు. తోడ్పాటు అనేది కేవలం అల్లాహ్ వద్ద నుంచే లభిస్తుంది సుమా! నిస్సందేహంగా అల్లాహ్ శక్తిమంతుడు, వివేక సంపన్నుడు.
8:11 إِذْ يُغَشِّيكُمُ النُّعَاسَ أَمَنَةً مِّنْهُ وَيُنَزِّلُ عَلَيْكُم مِّنَ السَّمَاءِ مَاءً لِّيُطَهِّرَكُم بِهِ وَيُذْهِبَ عَنكُمْ رِجْزَ الشَّيْطَانِ وَلِيَرْبِطَ عَلَىٰ قُلُوبِكُمْ وَيُثَبِّتَ بِهِ الْأَقْدَامَ
తన తరఫున మీకు నిశ్చింతను ప్రసాదించేందుకు అల్లాహ్ మీపై నిద్ర మత్తును ఆవరింపజేసిన సందర్భాన్ని కూడా ఓసారి జ్ఞాపకం చేసుకోండి! మిమ్మల్ని పరిశుభ్రపరచటానికి, షైతాను ప్రేరణలను మీ నుండి పారద్రోలటానికీ, మీకు గుండెదిటవును కలిగించటానికి, మీ కాళ్ళకు నిలకడను ప్రసాదించటానికి ఆయన (ఆ సందర్భంగా) మీపై ఆకాశం నుంచి వర్షం కురిపించాడు.
8:12 إِذْ يُوحِي رَبُّكَ إِلَى الْمَلَائِكَةِ أَنِّي مَعَكُمْ فَثَبِّتُوا الَّذِينَ آمَنُوا ۚ سَأُلْقِي فِي قُلُوبِ الَّذِينَ كَفَرُوا الرُّعْبَ فَاضْرِبُوا فَوْقَ الْأَعْنَاقِ وَاضْرِبُوا مِنْهُمْ كُلَّ بَنَانٍ
(ఆ సందర్భాన్ని కూడా ఓ సారి జ్ఞాపకం చేసుకోండి) నీ ప్రభువు దూతలను ఈ విధంగా ఆదేశించాడు : “నేను మీ వెంటే ఉన్నాను. కాబట్టి మీరు విశ్వాసులకు ధైర్యాన్ని కలిగించండి. నేను ఇప్పుడే అవిశ్వాసుల గుండెల్లో దడ పుట్టిస్తాను. మీరు వారి మెడలపై కొట్టండి. వారి వ్రేళ్ల కణుపులపై కొట్టండి.”
8:13 ذَٰلِكَ بِأَنَّهُمْ شَاقُّوا اللَّهَ وَرَسُولَهُ ۚ وَمَن يُشَاقِقِ اللَّهَ وَرَسُولَهُ فَإِنَّ اللَّهَ شَدِيدُ الْعِقَابِ
అల్లాహ్‌ను,ఆయన ప్రవక్తను ఎదిరించినందుకు వారికి శిక్ష ఇది. అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తను ఎదిరించిన వారిని నిస్సందేహంగా అల్లాహ్ కఠినంగా శిక్షిస్తాడు.
8:14 ذَٰلِكُمْ فَذُوقُوهُ وَأَنَّ لِلْكَافِرِينَ عَذَابَ النَّارِ
కనుక (ఇహలోకంలో) ఈ శిక్షను చవిచూడండి. తిరస్కారులకు ఇక నరకాగ్ని శిక్ష ఎలాగూ తప్పదు.
8:15 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا لَقِيتُمُ الَّذِينَ كَفَرُوا زَحْفًا فَلَا تُوَلُّوهُمُ الْأَدْبَارَ
ఓ విశ్వసించినవారలారా! మీరు అవిశ్వాసులతో ముఖాముఖీ అయినప్పుడు వారికి వెన్నుచూపకండి.
8:16 وَمَن يُوَلِّهِمْ يَوْمَئِذٍ دُبُرَهُ إِلَّا مُتَحَرِّفًا لِّقِتَالٍ أَوْ مُتَحَيِّزًا إِلَىٰ فِئَةٍ فَقَدْ بَاءَ بِغَضَبٍ مِّنَ اللَّهِ وَمَأْوَاهُ جَهَنَّمُ ۖ وَبِئْسَ الْمَصِيرُ
ఆ సమయంలో రణనీతిలో భాగంగా వెనక్కి తిరగటమో లేదా (తన) సైనిక దళంలో ఆశ్రయం పొందేందుకు తిరిగి రావటమో తప్పితే – (ఆ సమయంలో) శత్రువుకు వెన్నుచూపి పలాయనం చిత్తగించినవాడు దైవాగ్రహంలో చిక్కుకుంటాడు. నరకం అతని నివాసం అవుతుంది. అది అత్యంత చెడ్డ గమ్య స్థానం.
8:17 فَلَمْ تَقْتُلُوهُمْ وَلَٰكِنَّ اللَّهَ قَتَلَهُمْ ۚ وَمَا رَمَيْتَ إِذْ رَمَيْتَ وَلَٰكِنَّ اللَّهَ رَمَىٰ ۚ وَلِيُبْلِيَ الْمُؤْمِنِينَ مِنْهُ بَلَاءً حَسَنًا ۚ إِنَّ اللَّهَ سَمِيعٌ عَلِيمٌ
వాళ్ళను మీరు చంపలేదు. కాని అల్లాహ్ వాళ్ళను చంపాడు.(గుప్పెడు మన్నును) నువ్వు విసిరినప్పుడు, దాన్ని విసిరింది నువ్వు కాదు. అల్లాహ్ దాన్ని విసిరాడు. విశ్వాసుల శ్రమకు తన తరఫున మంచి ప్రతిఫలం ఇచ్చేందుకు అల్లాహ్ ఇలా చేశాడు. నిశ్చయంగా అల్లాహ్ అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు.
8:18 ذَٰلِكُمْ وَأَنَّ اللَّهَ مُوهِنُ كَيْدِ الْكَافِرِينَ
(ఒకటైతే) ఇది జరిగిపోయింది. (రెండవదేమిటంటే) అల్లాహ్ అవిశ్వాసుల కుయుక్తులను బలహీనపరచదలచాడు.
8:19 إِن تَسْتَفْتِحُوا فَقَدْ جَاءَكُمُ الْفَتْحُ ۖ وَإِن تَنتَهُوا فَهُوَ خَيْرٌ لَّكُمْ ۖ وَإِن تَعُودُوا نَعُدْ وَلَن تُغْنِيَ عَنكُمْ فِئَتُكُمْ شَيْئًا وَلَوْ كَثُرَتْ وَأَنَّ اللَّهَ مَعَ الْمُؤْمِنِينَ
(ఓ సత్య తిరస్కారులారా!) మీరు తీర్పును కోరుతున్నట్లయితే, ఇదిగో, ఆ తీర్పు మీ ముందుకు వచ్చేసింది. ఇకనయినా మీరు మానుకుంటే అది మీకెంతో మంచిది. ఒకవేళ మీరు మళ్లీ అవే చేష్టలకు పాల్పడితే మేము కూడా అదేవిధంగా సమాధానం ఇవ్వవలసి వస్తుంది. మీ జన సమూహం ఎంత అధికంగా ఉన్నప్పటికీ అది మీకే విధంగానూ పనికిరాదు – అల్లాహ్ విశ్వాసులకు తోడుగా ఉన్నాడు.
8:20 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَطِيعُوا اللَّهَ وَرَسُولَهُ وَلَا تَوَلَّوْا عَنْهُ وَأَنتُمْ تَسْمَعُونَ
ఓ విశ్వాసులారా! అల్లాహ్‌కు, ఆయన ప్రవక్తకు విధేయులై ఉండండి. అంతా వింటూనే అతని (విధేయత) పట్ల విముఖులు కాకండి.
8:21 وَلَا تَكُونُوا كَالَّذِينَ قَالُوا سَمِعْنَا وَهُمْ لَا يَسْمَعُونَ
వినకుండా (వినిపించుకోకుండా)నే “మేము విన్నాము” అని అనే వారిలా మీరు తయారవకండి.
8:22 إِنَّ شَرَّ الدَّوَابِّ عِندَ اللَّهِ الصُّمُّ الْبُكْمُ الَّذِينَ لَا يَعْقِلُونَ
తమ బుద్ధిని ఉపయోగించని చెవిటివారు, మూగవారు మాత్రమే అల్లాహ్ దృష్టిలో అత్యంత నీచమైన జంతువులు.
8:23 وَلَوْ عَلِمَ اللَّهُ فِيهِمْ خَيْرًا لَّأَسْمَعَهُمْ ۖ وَلَوْ أَسْمَعَهُمْ لَتَوَلَّوا وَّهُم مُّعْرِضُونَ
ఒకవేళ వారిలో ఏకాస్త మంచితనం ఉందనిపించినా అల్లాహ్ వారికి వినగలిగే భాగ్యం ప్రసాదించి ఉండేవాడు. ఇప్పుడు గనక వారికి వినిపిస్తే వారు నిర్లక్ష్యంగా ముఖం త్రిప్పుకుని వెళ్ళిపోతారు.
8:24 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اسْتَجِيبُوا لِلَّهِ وَلِلرَّسُولِ إِذَا دَعَاكُمْ لِمَا يُحْيِيكُمْ ۖ وَاعْلَمُوا أَنَّ اللَّهَ يَحُولُ بَيْنَ الْمَرْءِ وَقَلْبِهِ وَأَنَّهُ إِلَيْهِ تُحْشَرُونَ
ఓ విశ్వాసులారా! మీకు జీవితాన్నిచ్చే వస్తువు వైపుకు ప్రవక్త మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త పిలుపుకు అనుకూలంగా స్పందించండి. అల్లాహ్ మనిషికీ- అతని మనసుకూ మధ్య అడ్డుగా వస్తాడనీ, మీరంతా ఆయన వద్దకే సమీకరించబడతారన్న సంగతిని తెలుసుకోండి.
8:25 وَاتَّقُوا فِتْنَةً لَّا تُصِيبَنَّ الَّذِينَ ظَلَمُوا مِنكُمْ خَاصَّةً ۖ وَاعْلَمُوا أَنَّ اللَّهَ شَدِيدُ الْعِقَابِ
ఏ ఉపద్రవమైతే మీలోని దుర్మార్గులకు మాత్రమే పరిమితం కాకుండా (సాధారణంగా సమాజంలోని వారినందరినీ) కబళిస్తుందో దాని బారి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. అల్లాహ్ చాలా కఠినంగా శిక్షించేవాడన్న సంగతిని తెలుసుకోండి!
8:26 وَاذْكُرُوا إِذْ أَنتُمْ قَلِيلٌ مُّسْتَضْعَفُونَ فِي الْأَرْضِ تَخَافُونَ أَن يَتَخَطَّفَكُمُ النَّاسُ فَآوَاكُمْ وَأَيَّدَكُم بِنَصْرِهِ وَرَزَقَكُم مِّنَ الطَّيِّبَاتِ لَعَلَّكُمْ تَشْكُرُونَ
ఒకప్పటి మీ పరిస్థితిని కాస్త జ్ఞప్తికి తెచ్చుకోండి – అప్పట్లో మీరు అవనిలో అల్ప సంఖ్యలో ఉండేవారు. మరీ బలహీనులుగా పరిగణించబడేవారు. ప్రజలు మిమ్మల్ని మట్టుబెడతారేమోనని మీరు భయంతో బిక్కుబిక్కుమంటూ ఉండేవారు. అలాంటి పరిస్థితిలో అల్లాహ్ మీకు ఆశ్రయమిచ్చి, తన సహాయంతో మీకు బలిమిని ఇచ్చాడు. మీకు పరిశుభ్రమైన, పరిశుద్ధమైన ఆహార వస్తువులను ప్రసాదించాడు – మీరు కృతజ్ఞులై ఉండేందుకు.
8:27 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَخُونُوا اللَّهَ وَالرَّسُولَ وَتَخُونُوا أَمَانَاتِكُمْ وَأَنتُمْ تَعْلَمُونَ
ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్కూ, ఆయన ప్రవక్తకూ (వారి హక్కుల విషయంలో) ఉద్దేశ్యపూర్వకంగా ద్రోహం తలపెట్టకండి. అప్పగింతల విషయంలో కూడా ద్రోహానికి పాల్పడకండి.
8:28 وَاعْلَمُوا أَنَّمَا أَمْوَالُكُمْ وَأَوْلَادُكُمْ فِتْنَةٌ وَأَنَّ اللَّهَ عِندَهُ أَجْرٌ عَظِيمٌ
మీ సిరిసంపదలు, మీ సంతానం మీ పాలిట ఒక పరీక్ష అన్న సంగతిని తెలుసుకోండి. అల్లాహ్ వద్ద గొప్ప పుణ్యఫలం ఉందన్న విషయాన్ని కూడా (విస్మరించకండి).
8:29 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِن تَتَّقُوا اللَّهَ يَجْعَل لَّكُمْ فُرْقَانًا وَيُكَفِّرْ عَنكُمْ سَيِّئَاتِكُمْ وَيَغْفِرْ لَكُمْ ۗ وَاللَّهُ ذُو الْفَضْلِ الْعَظِيمِ
ఓ విశ్వాసులారా! మీరు గనక అల్లాహ్ యెడల భయభక్తులతో మెలిగినట్లయితే ఆయన మీకు నిర్ణయాత్మకమైన ఒక వస్తువును (ఫుర్ఖాన్ను) ప్రసాదిస్తాడు. మీ పాపాలను మీ నుండి దూరం చేస్తాడు. మిమ్మల్ని క్షమిస్తాడు. ఆయన గొప్ప అనుగ్రహం కలవాడు.
8:30 وَإِذْ يَمْكُرُ بِكَ الَّذِينَ كَفَرُوا لِيُثْبِتُوكَ أَوْ يَقْتُلُوكَ أَوْ يُخْرِجُوكَ ۚ وَيَمْكُرُونَ وَيَمْكُرُ اللَّهُ ۖ وَاللَّهُ خَيْرُ الْمَاكِرِينَ
(ఓ ప్రవక్తా!) సత్య తిరస్కారులు నీకు వ్యతిరేకంగా వ్యూహ రచన చేసిన సంఘటనను కూడా గుర్తుకు తెచ్చుకో. నిన్ను బందీగా పట్టుకోవాలా? లేక నిన్ను హత్య చేయాలా? లేక నిన్ను దేశం నుంచి వెళ్ళగొట్టాలా? అని వారు తమ తరఫున ఎత్తులు వేస్తుండగా, అల్లాహ్ పై ఎత్తులు వేస్తూ ఉన్నాడు. ఎత్తులు వేయడంలో అల్లాహ్ సాటిలేని మేటి.
8:31 وَإِذَا تُتْلَىٰ عَلَيْهِمْ آيَاتُنَا قَالُوا قَدْ سَمِعْنَا لَوْ نَشَاءُ لَقُلْنَا مِثْلَ هَٰذَا ۙ إِنْ هَٰذَا إِلَّا أَسَاطِيرُ الْأَوَّلِينَ
వారి ముందు మా ఆయతులను చదివి వినిపించినపుడు, “మేం విన్నాంలే. మేము గనక తలచుకుంటే ఇలాంటి మాటల్ని మేమూ చెప్పగలం. ఇవి పూర్వీకుల నుంచి వస్తున్న కట్టుకథలు తప్ప మరేమీ కావు” అంటారు.
8:32 وَإِذْ قَالُوا اللَّهُمَّ إِن كَانَ هَٰذَا هُوَ الْحَقَّ مِنْ عِندِكَ فَأَمْطِرْ عَلَيْنَا حِجَارَةً مِّنَ السَّمَاءِ أَوِ ائْتِنَا بِعَذَابٍ أَلِيمٍ
(అంతేకాదు),”ఓ అల్లాహ్! ఈ ఖుర్ఆన్ నిజంగా నీ తరఫు నుండే వచ్చి ఉంటే, మాపై ఆకాశం నుంచి రాళ్ళ వాన కురిపించు లేదా మాపై ఏదైనా వ్యధాభరితమైన శిక్షను తీసుకురా” అని కూడా అన్నారు.
8:33 وَمَا كَانَ اللَّهُ لِيُعَذِّبَهُمْ وَأَنتَ فِيهِمْ ۚ وَمَا كَانَ اللَّهُ مُعَذِّبَهُمْ وَهُمْ يَسْتَغْفِرُونَ
(ఓ ప్రవక్తా!) వారి మధ్య నువ్వు ఉన్నంతకాలం అల్లాహ్ వారిపైకి శిక్షను తీసుకురాడు. వారు క్షమాపణకై వేడుకుంటూ ఉండగా కూడా అల్లాహ్ వారిని శిక్షించడు.
8:34 وَمَا لَهُمْ أَلَّا يُعَذِّبَهُمُ اللَّهُ وَهُمْ يَصُدُّونَ عَنِ الْمَسْجِدِ الْحَرَامِ وَمَا كَانُوا أَوْلِيَاءَهُ ۚ إِنْ أَوْلِيَاؤُهُ إِلَّا الْمُتَّقُونَ وَلَٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ
అల్లాహ్ వారిని శిక్షించకుండా ఎందుకు వదలిపెట్టాలి? చూడబోతే వారు మస్జిదె హరామ్‌కు ధర్మకర్తలు (ముతవల్లీలు) కారు. అయినప్పటికీ (జనులను) మస్జిదె హరామ్‌కు రాకుండా అడ్డుకుంటున్నారు. అల్లాహ్ భీతిపరులు తప్ప మరొకరు దానికి ధర్మకర్తలు కాలేరు. కాని వారిలో చాలా మందికి ఈ సంగతి తెలీదు.
8:35 وَمَا كَانَ صَلَاتُهُمْ عِندَ الْبَيْتِ إِلَّا مُكَاءً وَتَصْدِيَةً ۚ فَذُوقُوا الْعَذَابَ بِمَا كُنتُمْ تَكْفُرُونَ
కాబా గృహం వద్ద వారు చేసే నమాజ్ ఈలలు వేయటం, చప్పట్లు చరచటం తప్ప మరొకటి కాదు. కనుక మీరు ఒడిగట్టిన తిరస్కార వైఖరికి ప్రతిఫలంగా ఈ శిక్షను చవిచూడండి.
8:36 إِنَّ الَّذِينَ كَفَرُوا يُنفِقُونَ أَمْوَالَهُمْ لِيَصُدُّوا عَن سَبِيلِ اللَّهِ ۚ فَسَيُنفِقُونَهَا ثُمَّ تَكُونُ عَلَيْهِمْ حَسْرَةً ثُمَّ يُغْلَبُونَ ۗ وَالَّذِينَ كَفَرُوا إِلَىٰ جَهَنَّمَ يُحْشَرُونَ
నిశ్చయంగా ఈ సత్య తిరస్కారులు ప్రజలను అల్లాహ్ మార్గంలోకి రాకుండా అడ్డుకోవటానికి తమ సంపదలను ఖర్చు పెడుతున్నారు. వారు తమ సొమ్ములను ఇలా ఖర్చుపెడుతూనే ఉంటారు. అయితే ఆ సొమ్ములే వారి పాలిట దుఃఖదాయకంగా పరిణమిస్తాయి. ఆ తరువాత వారు ఓడిపోతారు. సత్యతిరస్కారులు నరకం వైపుకు ప్రోగు చేయబడతారు.
8:37 لِيَمِيزَ اللَّهُ الْخَبِيثَ مِنَ الطَّيِّبِ وَيَجْعَلَ الْخَبِيثَ بَعْضَهُ عَلَىٰ بَعْضٍ فَيَرْكُمَهُ جَمِيعًا فَيَجْعَلَهُ فِي جَهَنَّمَ ۚ أُولَٰئِكَ هُمُ الْخَاسِرُونَ
అల్లాహ్ అపవిత్రులను పవిత్రుల నుంచి వేరుపరచటానికీ, అపవిత్రులను పరస్పరం కలిపి, ఒకే గుంపుగా చేసి, ఆపైన వారందరినీ నరకంలో పడవెయ్యటానికి ఇలా చేస్తాడు. పూర్తిగా నష్టపోయేవారంటే వీరే.
8:38 قُل لِّلَّذِينَ كَفَرُوا إِن يَنتَهُوا يُغْفَرْ لَهُم مَّا قَدْ سَلَفَ وَإِن يَعُودُوا فَقَدْ مَضَتْ سُنَّتُ الْأَوَّلِينَ
(ఓ ప్రవక్తా!) ఈ అవిశ్వాసులకు చెప్పు : “వారు గనక మానుకుంటే గతంలో వారివల్ల జరిగిన పాపాలన్నీ క్షమించబడతాయి. ఒకవేళ వారు మళ్ళీ అదే వైఖరిని అవలంబిస్తే గత జాతులపై విధించబడిన ఉత్తర్వుల ఉపమానం ఉండనే ఉంది.”
8:39 وَقَاتِلُوهُمْ حَتَّىٰ لَا تَكُونَ فِتْنَةٌ وَيَكُونَ الدِّينُ كُلُّهُ لِلَّهِ ۚ فَإِنِ انتَهَوْا فَإِنَّ اللَّهَ بِمَا يَعْمَلُونَ بَصِيرٌ
ఫిత్నా (షిర్క్) సమసిపోనంత వరకూ, ధర్మం మొత్తం అల్లాహ్‌దే అయిపోనంత వరకూ వారితో పోరాడండి. ఒకవేళ వారు గనక తమ వైఖరిని మానుకుని దారికివస్తే అల్లాహ్ వారి కర్మలను చూస్తాడు.
8:40 وَإِن تَوَلَّوْا فَاعْلَمُوا أَنَّ اللَّهَ مَوْلَاكُمْ ۚ نِعْمَ الْمَوْلَىٰ وَنِعْمَ النَّصِيرُ
ఒకవేళ వారు (దారికి రాకుండా) తిరిగిపోతే అల్లాహ్‌యే మీ రక్షకుడని నమ్మండి. ఆయన ఉత్తమ సంరక్షకుడు, ఉత్తమ సహాయకుడూను.
8:41 وَاعْلَمُوا أَنَّمَا غَنِمْتُم مِّن شَيْءٍ فَأَنَّ لِلَّهِ خُمُسَهُ وَلِلرَّسُولِ وَلِذِي الْقُرْبَىٰ وَالْيَتَامَىٰ وَالْمَسَاكِينِ وَابْنِ السَّبِيلِ إِن كُنتُمْ آمَنتُم بِاللَّهِ وَمَا أَنزَلْنَا عَلَىٰ عَبْدِنَا يَوْمَ الْفُرْقَانِ يَوْمَ الْتَقَى الْجَمْعَانِ ۗ وَاللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
మీరు అల్లాహ్‌ను, సత్యాసత్యాలను వేరుపరిచే రోజున, అనగా రెండు సైన్యాలు మార్కొనిన రోజున మేము మా దాసునిపై అవతరింపజేసిన దానిని విశ్వసించినట్లయితే – మీకు లభించిన ఎలాంటి యుద్ధప్రాప్తి అయినాసరే, అందులోని ఐదోవంతు అల్లాహ్‌కు, ఆయన ప్రవక్తకు, బంధువులకు, అనాథలకు, నిరుపేదలకు, బాటసారులకు చెందుతుందని తెలుసుకోండి. అల్లాహ్‌కు ప్రతి దానిపై అధికారం ఉంది.
8:42 إِذْ أَنتُم بِالْعُدْوَةِ الدُّنْيَا وَهُم بِالْعُدْوَةِ الْقُصْوَىٰ وَالرَّكْبُ أَسْفَلَ مِنكُمْ ۚ وَلَوْ تَوَاعَدتُّمْ لَاخْتَلَفْتُمْ فِي الْمِيعَادِ ۙ وَلَٰكِن لِّيَقْضِيَ اللَّهُ أَمْرًا كَانَ مَفْعُولًا لِّيَهْلِكَ مَنْ هَلَكَ عَن بَيِّنَةٍ وَيَحْيَىٰ مَنْ حَيَّ عَن بَيِّنَةٍ ۗ وَإِنَّ اللَّهَ لَسَمِيعٌ عَلِيمٌ
ఆ సమయంలో మీరు దగ్గరలో ఉన్న అంచున ఉన్నారు. వారు దూరాన ఉన్న అంచున ఉన్నారు. బిడారు మాత్రం మీకు దిగువన ఉంది. ఒకవేళ మీరు గనక పరస్పరం తీర్మానం చేసుకుని ఉంటే నిర్థారిత సమయానికి అక్కడ చేరుకునే విషయంలో మీరు విభేదించుకునేవారు. కాని అల్లాహ్, ముందే నిర్ణయించబడిన ఒక పనిని చేసి తీరటానికి – నాశనమయ్యేవాడు స్పష్టమైన ఆధారంపై నాశనమవడానికీ, బ్రతికివున్నవాడు కూడా స్పష్టమైన ప్రమాణంపై బ్రతికి ఉండడానికి గాను (ఈ విధంగా వ్యూహ రచన చేశాడు). నిశ్చయంగా అల్లాహ్ అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు.
8:43 إِذْ يُرِيكَهُمُ اللَّهُ فِي مَنَامِكَ قَلِيلًا ۖ وَلَوْ أَرَاكَهُمْ كَثِيرًا لَّفَشِلْتُمْ وَلَتَنَازَعْتُمْ فِي الْأَمْرِ وَلَٰكِنَّ اللَّهَ سَلَّمَ ۗ إِنَّهُ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ
(ఓ ప్రవక్తా! ఆ సమయంలో) అల్లాహ్ నీ కలలో వారి సంఖ్యను అల్పంగా చేసి చూపించాడు. వారిని అధిక సంఖ్యలో చూపి ఉంటే, మీరు జడుసుకుని, ఈ వ్యవహారంలో మీరు పరస్పరం గొడవపడి ఉండేవారు. అయితే అల్లాహ్ (మిమ్మల్ని) కాపాడాడు. నిశ్చయంగా ఆయన గుండెల్లోని గుట్టును (సయితం) బాగా ఎరిగినవాడు.
8:44 وَإِذْ يُرِيكُمُوهُمْ إِذِ الْتَقَيْتُمْ فِي أَعْيُنِكُمْ قَلِيلًا وَيُقَلِّلُكُمْ فِي أَعْيُنِهِمْ لِيَقْضِيَ اللَّهُ أَمْرًا كَانَ مَفْعُولًا ۗ وَإِلَى اللَّهِ تُرْجَعُ الْأُمُورُ
నిర్ణయించబడిన కార్యాన్ని పూర్తి చేసేందుకు మీరు పరస్పరం మార్కొన్న సమయంలో అల్లాహ్, మీ కళ్లకు వారు (శత్రువులు) కొద్దిమందిగా కనిపించేలా చేశాడు. అదే సమయంలో వారి కళ్లకు కూడా మిమ్మల్ని కొద్దిమందిగానే చూపించాడు. సమస్త వ్యవహారాలూ అల్లాహ్ వైపుకే మళ్ళించబడతాయి.
8:45 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا لَقِيتُمْ فِئَةً فَاثْبُتُوا وَاذْكُرُوا اللَّهَ كَثِيرًا لَّعَلَّكُمْ تُفْلِحُونَ
ఓ విశ్వాసులారా! మీరు ఏ ప్రత్యర్థి సైన్యాన్ని అయినా ఎదుర్కోవలసి వచ్చినప్పుడు నిలకడ చూపండి. అత్యధికంగా అల్లాహ్‌ను స్మరించండి. తద్వారా మీకు విజయం ప్రాప్తించవచ్చు.
8:46 وَأَطِيعُوا اللَّهَ وَرَسُولَهُ وَلَا تَنَازَعُوا فَتَفْشَلُوا وَتَذْهَبَ رِيحُكُمْ ۖ وَاصْبِرُوا ۚ إِنَّ اللَّهَ مَعَ الصَّابِرِينَ
ఇంకా మీరందరూ అల్లాహ్కూ, ఆయన ప్రవక్తకూ విధేయులై ఉండండి. పరస్పరం గొడవ పడకండి. అలా చేస్తే (గొడవపడ్డారంటే) మీరు పిరికివారై పోతారు. మీ శక్తి సన్నగిల్లిపోతుంది. అందుకే సహన స్థయిర్యాలను పాటించండి. స్థయిర్యం కనబరచే వారికి అల్లాహ్ తోడుగా ఉంటాడు.
8:47 وَلَا تَكُونُوا كَالَّذِينَ خَرَجُوا مِن دِيَارِهِم بَطَرًا وَرِئَاءَ النَّاسِ وَيَصُدُّونَ عَن سَبِيلِ اللَّهِ ۚ وَاللَّهُ بِمَا يَعْمَلُونَ مُحِيطٌ
అహంకారాన్ని ప్రదర్శిస్తూ, ప్రజల ముందు తమ బడాయిని చాటుకుంటూ తమ ఇండ్ల నుంచి బయలుదేరిన వారి మాదిరిగా, అల్లాహ్ మార్గం నుండి ప్రజలను ఆపే వారిలాగా మీరు తయారవకండి. వారి ఆగడాలపై అల్లాహ్ పట్టు బిగించనున్నాడు.
8:48 وَإِذْ زَيَّنَ لَهُمُ الشَّيْطَانُ أَعْمَالَهُمْ وَقَالَ لَا غَالِبَ لَكُمُ الْيَوْمَ مِنَ النَّاسِ وَإِنِّي جَارٌ لَّكُمْ ۖ فَلَمَّا تَرَاءَتِ الْفِئَتَانِ نَكَصَ عَلَىٰ عَقِبَيْهِ وَقَالَ إِنِّي بَرِيءٌ مِّنكُمْ إِنِّي أَرَىٰ مَا لَا تَرَوْنَ إِنِّي أَخَافُ اللَّهَ ۚ وَاللَّهُ شَدِيدُ الْعِقَابِ
ఆ సమయంలో షైతాను వారి కార్యకలాపాలను వారికి ఎంతో రమణీయమైనవిగా చేసి చూపాడు. “ఈ రోజు మిమ్మల్ని ఓడించేవాడు జనులలో ఎవడూలేడు. నేను సయితం మీకు అండగా ఉన్నాను!” అని చెప్పాడు. కాని తీరా ఆ ఇరుపక్షాలు పరస్పరం ఎదురుపడినప్పుడు వాడు తన మడమలపై వెనుతిరిగి పోయాడు. “ఈ వ్యవహారంలో మీతో నాకెలాంటి సంబంధంలేదు. మీరు చూడనిది నేను చూస్తున్నాను. నేను అల్లాహ్‌కు భయపడుతున్నాను. అల్లాహ్ చాలా కఠినంగా శిక్షించేవాడు” అని అన్నాడు.
8:49 إِذْ يَقُولُ الْمُنَافِقُونَ وَالَّذِينَ فِي قُلُوبِهِم مَّرَضٌ غَرَّ هَٰؤُلَاءِ دِينُهُمْ ۗ وَمَن يَتَوَكَّلْ عَلَى اللَّهِ فَإِنَّ اللَّهَ عَزِيزٌ حَكِيمٌ
ఆ సందర్భంగా కపటులు, హృదయాలలో రోగం ఉన్న వారు కూడా ఇలా అన్నారు : “వీళ్ళ ధర్మం వీళ్ళని మోసంలో పడవేసింది.” కాని ఎవరు అల్లాహ్‌ను నమ్ముకున్నారో నిశ్చయంగా అల్లాహ్ సర్వాధిక్యుడు, వివేకవంతుడు (అని తెలుసుకోవాలి).
8:50 وَلَوْ تَرَىٰ إِذْ يَتَوَفَّى الَّذِينَ كَفَرُوا ۙ الْمَلَائِكَةُ يَضْرِبُونَ وُجُوهَهُمْ وَأَدْبَارَهُمْ وَذُوقُوا عَذَابَ الْحَرِيقِ
(ఓ ప్రవక్తా!) దూతలు సత్యతిరస్కారుల ప్రాణాలు తీస్తూ ఉన్నప్పటి దృశ్యాన్ని నువ్వు చూడగలిగితే ఎంత బావుండు! వారు వాళ్ల ముఖాలపై, పిరుదులపై కొడుతూ ఉంటారు. ఇంకా ఇలా అంటూ ఉంటారు : “ఇదిగో, దహించివేసే శిక్షను చవి చూడండి.
8:51 ذَٰلِكَ بِمَا قَدَّمَتْ أَيْدِيكُمْ وَأَنَّ اللَّهَ لَيْسَ بِظَلَّامٍ لِّلْعَبِيدِ
“ఇది మీ చేతులు ముందుగానే చేసి పంపుకున్న పాపానికి ప్రతిఫలం. అంతేగాని అల్లాహ్ తన దాసులకు అన్యాయం చేసేవాడు కాడు.”
8:52 كَدَأْبِ آلِ فِرْعَوْنَ ۙ وَالَّذِينَ مِن قَبْلِهِمْ ۚ كَفَرُوا بِآيَاتِ اللَّهِ فَأَخَذَهُمُ اللَّهُ بِذُنُوبِهِمْ ۗ إِنَّ اللَّهَ قَوِيٌّ شَدِيدُ الْعِقَابِ
(వీళ్ల ధోరణి) ఫిరౌను అనుయాయుల, వారి పూర్వీకుల ధోరణిని పోలి ఉన్నది. వారు అల్లాహ్ ఆయతులను తిరస్కరించగా, అల్లాహ్ వారి పాపాల కారణంగా వారిని పట్టుకున్నాడు. నిస్సందేహంగా అల్లాహ్ బలవంతుడు, కఠినంగా శిక్షించేవాడూను.
8:53 ذَٰلِكَ بِأَنَّ اللَّهَ لَمْ يَكُ مُغَيِّرًا نِّعْمَةً أَنْعَمَهَا عَلَىٰ قَوْمٍ حَتَّىٰ يُغَيِّرُوا مَا بِأَنفُسِهِمْ ۙ وَأَنَّ اللَّهَ سَمِيعٌ عَلِيمٌ
ఇలా ఎందుకు జరుగుతుందంటే, అల్లాహ్ ఏ జాతివారికైనా అనుగ్రహాన్ని ప్రసాదించిన తర్వాత వారు స్వయంగా తమకు తామై తమ స్థితిని మార్చుకుంటేనే తప్ప అల్లాహ్ తాను ప్రసాదించిన అనుగ్రహాన్ని మార్చడు. నిశ్చయంగా అల్లాహ్ అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు
8:54 كَدَأْبِ آلِ فِرْعَوْنَ ۙ وَالَّذِينَ مِن قَبْلِهِمْ ۚ كَذَّبُوا بِآيَاتِ رَبِّهِمْ فَأَهْلَكْنَاهُم بِذُنُوبِهِمْ وَأَغْرَقْنَا آلَ فِرْعَوْنَ ۚ وَكُلٌّ كَانُوا ظَالِمِينَ
(వీళ్ళ పోకడ) ఫిరౌను అనుచరుల, వారి పూర్వీకుల పోకడను పోలి ఉన్నది – వారు తమ ప్రభువు నిదర్శనాలను ధిక్కరించారు. అప్పుడు మేము వారి పాపాల కారణంగా వారిని నాశనం చేశాము. ఫిరౌనీయులను ముంచివేశాము. వారంతా దుర్మార్గులే.
8:55 إِنَّ شَرَّ الدَّوَابِّ عِندَ اللَّهِ الَّذِينَ كَفَرُوا فَهُمْ لَا يُؤْمِنُونَ
సత్యాన్ని తిరస్కరించి, ఎన్నటికీ దానిని విశ్వసించకుండా ఉండేవారే అల్లాహ్ దృష్టిలో అత్యంత హీనమైన జంతువులు.
8:56 الَّذِينَ عَاهَدتَّ مِنْهُمْ ثُمَّ يَنقُضُونَ عَهْدَهُمْ فِي كُلِّ مَرَّةٍ وَهُمْ لَا يَتَّقُونَ
నువ్వు వారితో ఒప్పందం చేసుకున్నావు. అయినా వారు తమ ఒప్పందాన్ని పదే పదే ఉల్లంఘిస్తున్నారు. పైపెచ్చు ఏమాత్రం భయపడటం లేదు.
8:57 فَإِمَّا تَثْقَفَنَّهُمْ فِي الْحَرْبِ فَشَرِّدْ بِهِم مَّنْ خَلْفَهُمْ لَعَلَّهُمْ يَذَّكَّرُونَ
కాబట్టి యుద్ధంలో నువ్వు ఎప్పుడైనా వారిపై ఆధిక్యం పొందితే వారి వెనుక ఉన్నవారు సయితం బెంబేలెత్తి పారిపోయేలా వారిని గట్టిగా వాయించు. ఆ విధంగానయినా వారికి బుద్ధిరావచ్చు.
8:58 وَإِمَّا تَخَافَنَّ مِن قَوْمٍ خِيَانَةً فَانبِذْ إِلَيْهِمْ عَلَىٰ سَوَاءٍ ۚ إِنَّ اللَّهَ لَا يُحِبُّ الْخَائِنِينَ
ఒకవేళ ఏ జాతి వారైనా నమ్మక ద్రోహానికి పాల్పడవచ్చన్న భయం నీకు కలిగితే – సరిసమానంగా – వారి ఒప్పందాన్ని వారి ముందు విసిరివెయ్యి. నమ్మక ద్రోహం చేసేవారిని అల్లాహ్ ఎంతమాత్రం ఇష్టపడడు.
8:59 وَلَا يَحْسَبَنَّ الَّذِينَ كَفَرُوا سَبَقُوا ۚ إِنَّهُمْ لَا يُعْجِزُونَ
తాము (శిక్ష నుండి తప్పించుకుని) ముందుకు సాగిపోయామని అవిశ్వాసులు ఎన్నడూ తలపోయరాదు. ఎట్టి పరిస్థితిలోనూ వారు మమ్మల్ని అశక్తుల్ని చేయలేరు.
8:60 وَأَعِدُّوا لَهُم مَّا اسْتَطَعْتُم مِّن قُوَّةٍ وَمِن رِّبَاطِ الْخَيْلِ تُرْهِبُونَ بِهِ عَدُوَّ اللَّهِ وَعَدُوَّكُمْ وَآخَرِينَ مِن دُونِهِمْ لَا تَعْلَمُونَهُمُ اللَّهُ يَعْلَمُهُمْ ۚ وَمَا تُنفِقُوا مِن شَيْءٍ فِي سَبِيلِ اللَّهِ يُوَفَّ إِلَيْكُمْ وَأَنتُمْ لَا تُظْلَمُونَ
మీరు వాళ్లను ఎదుర్కోవటానికి శాయశక్తులా బలాన్ని కూడగట్టుకోవటం ద్వారా, కట్టివుంచిన గుఱ్ఱాల ద్వారా సన్నద్ధులై ఉండండి. ఈ సన్నాహాల ద్వారా మీరు అల్లాహ్ విరోధులను, మీ విరోధులను, మీకు తెలియకుండా ఉన్న – కాని అల్లాహ్‌కు మాత్రం బాగా తెలిసిన – ఇతర శత్రువులను కూడా భయకంపితుల్ని చేయవచ్చు. అల్లాహ్ మార్గంలో మీరు వెచ్చించేదంతా మీకు పూర్తిగా తిరిగి ఇవ్వబడుతుంది. మీకెలాంటి అన్యాయమూ జరగదు.
8:61 وَإِن جَنَحُوا لِلسَّلْمِ فَاجْنَحْ لَهَا وَتَوَكَّلْ عَلَى اللَّهِ ۚ إِنَّهُ هُوَ السَّمِيعُ الْعَلِيمُ
ఒకవేళ వారు సంధివైపు మొగ్గు చూపితే (ఓ ప్రవక్తా!) నువ్వు కూడా సంధి వైపుకు మొగ్గుచూపు. అల్లాహ్‌పై భారం మోపు. నిశ్చయంగా ఆయన అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు.
8:62 وَإِن يُرِيدُوا أَن يَخْدَعُوكَ فَإِنَّ حَسْبَكَ اللَّهُ ۚ هُوَ الَّذِي أَيَّدَكَ بِنَصْرِهِ وَبِالْمُؤْمِنِينَ
ఒకవేళ వారు నిన్ను మోసగించదలిస్తే, నీకు అల్లాహ్ చాలు. ఆయనే తన సహాయం ద్వారానూ, విశ్వాసుల ద్వారానూ నీకు తోడ్పడ్డాడు.
8:63 وَأَلَّفَ بَيْنَ قُلُوبِهِمْ ۚ لَوْ أَنفَقْتَ مَا فِي الْأَرْضِ جَمِيعًا مَّا أَلَّفْتَ بَيْنَ قُلُوبِهِمْ وَلَٰكِنَّ اللَّهَ أَلَّفَ بَيْنَهُمْ ۚ إِنَّهُ عَزِيزٌ حَكِيمٌ
వారి హృదయాలలో పరస్పరం ప్రేమానురాగాలను పొందుపరచినది కూడా ఆయనే. భూమిలో వున్న సమస్తాన్నీ ఖర్చుపెట్టినా నువ్వు పరస్పరం వారి హృదయాలను కలపలేక పోయేవాడవు. అల్లాహ్‌యే వారి మనసులను కలిపాడు. నిశ్చయంగా ఆయన సర్వాధిక్యుడు, వివేచనాశీలి.
8:64 يَا أَيُّهَا النَّبِيُّ حَسْبُكَ اللَّهُ وَمَنِ اتَّبَعَكَ مِنَ الْمُؤْمِنِينَ
ఓ ప్రవక్తా! నీకూ, నిన్ను అనుసరించే విశ్వాసులకూ అల్లాహ్‌యే చాలు.
8:65 يَا أَيُّهَا النَّبِيُّ حَرِّضِ الْمُؤْمِنِينَ عَلَى الْقِتَالِ ۚ إِن يَكُن مِّنكُمْ عِشْرُونَ صَابِرُونَ يَغْلِبُوا مِائَتَيْنِ ۚ وَإِن يَكُن مِّنكُم مِّائَةٌ يَغْلِبُوا أَلْفًا مِّنَ الَّذِينَ كَفَرُوا بِأَنَّهُمْ قَوْمٌ لَّا يَفْقَهُونَ
ఓ ప్రవక్తా! విశ్వాసులను యుద్ధానికై ప్రేరేపించు. మీలో గనక ధైర్య స్థయిర్యాలు గలవారు ఇరవైమంది ఉంటే, వారు రెండొందల మందిని జయిస్తారు. ఒకవేళ మీలో వందమంది ఉంటే వారు వెయ్యిమంది అవిశ్వాసులను జయిస్తారు. ఎందుకంటే వారు (అవిశ్వాసులు) అవివేకులు.
8:66 الْآنَ خَفَّفَ اللَّهُ عَنكُمْ وَعَلِمَ أَنَّ فِيكُمْ ضَعْفًا ۚ فَإِن يَكُن مِّنكُم مِّائَةٌ صَابِرَةٌ يَغْلِبُوا مِائَتَيْنِ ۚ وَإِن يَكُن مِّنكُمْ أَلْفٌ يَغْلِبُوا أَلْفَيْنِ بِإِذْنِ اللَّهِ ۗ وَاللَّهُ مَعَ الصَّابِرِينَ
సరే, అల్లాహ్ ఇప్పుడు మీ బరువును తగ్గిస్తున్నాడు. మీలో బలహీనత ఉన్న సంగతి ఆయనకు బాగా తెలుసు. కనుక మీలో వందమంది ధైర్యస్థయిర్యాలు గలవారుంటే వారు రెండొందల మందిని ఓడిస్తారు. ఒకవేళ మీలో గనక వెయ్యి మంది ఉంటే వారు దైవాజ్ఞానుసారం రెండువేల మందిని ఓడిస్తారు. అల్లాహ్ ధైర్యస్థయిర్యాలు గలవారికి తోడుగా ఉంటాడు.
8:67 مَا كَانَ لِنَبِيٍّ أَن يَكُونَ لَهُ أَسْرَىٰ حَتَّىٰ يُثْخِنَ فِي الْأَرْضِ ۚ تُرِيدُونَ عَرَضَ الدُّنْيَا وَاللَّهُ يُرِيدُ الْآخِرَةَ ۗ وَاللَّهُ عَزِيزٌ حَكِيمٌ
రాజ్యంలో బాగా రక్తపాతంతో కూడిన యుద్ధం జరగనంత వరకూ యుద్ధ ఖైదీలను తన వద్ద ఉంచుకోవటం ఏ ప్రవక్తకూ తగదు. మీరు ప్రాపంచిక సంపదలను కోరుకుంటున్నారు. కాని అల్లాహ్ (మీ కోసం) పరలోకాన్ని కోరుకుంటున్నాడు. అల్లాహ్ సర్వాధిక్యుడు, వివేకవంతుడు.
8:68 لَّوْلَا كِتَابٌ مِّنَ اللَّهِ سَبَقَ لَمَسَّكُمْ فِيمَا أَخَذْتُمْ عَذَابٌ عَظِيمٌ
ఒకవేళ ముందు నుంచే అల్లాహ్ వద్ద ఆ విషయం రాసి ఉండకపోతే, మీరు తీసుకున్న దానిపై మీకు పెద్ద శిక్షపడి ఉండేది.
8:69 فَكُلُوا مِمَّا غَنِمْتُمْ حَلَالًا طَيِّبًا ۚ وَاتَّقُوا اللَّهَ ۚ إِنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ
కాబట్టి, మీరు పొందిన ధర్మబద్ధమైన, పరిశుద్ధమైన యుద్ధ ప్రాప్తిని నిస్సంకోచంగా తినండి. అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ క్షమించేవాడు, కనికరించేవాడూను.
8:70 يَا أَيُّهَا النَّبِيُّ قُل لِّمَن فِي أَيْدِيكُم مِّنَ الْأَسْرَىٰ إِن يَعْلَمِ اللَّهُ فِي قُلُوبِكُمْ خَيْرًا يُؤْتِكُمْ خَيْرًا مِّمَّا أُخِذَ مِنكُمْ وَيَغْفِرْ لَكُمْ ۗ وَاللَّهُ غَفُورٌ رَّحِيمٌ
ఓ ప్రవక్తా! మీ అధీనంలోవున్న ఖైదీలతో ఇలా చెప్పు: “అల్లాహ్ మీ హృదయాలలో ఏ కాస్త మంచి సంకల్పాన్ని చూసినా, మీ నుండి పుచ్చుకున్న దానికన్నా మేలైన దాన్నే మీకు ప్రసాదిస్తాడు. మీ తప్పుల్ని కూడా క్షమిస్తాడు. అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడు.”
8:71 وَإِن يُرِيدُوا خِيَانَتَكَ فَقَدْ خَانُوا اللَّهَ مِن قَبْلُ فَأَمْكَنَ مِنْهُمْ ۗ وَاللَّهُ عَلِيمٌ حَكِيمٌ
ఒకవేళ వారు నీకు ద్రోహం చేయాలని అనుకుంటే, ఇంతకు ముందు వారు అల్లాహ్‌కే ద్రోహం తలపెట్టారు. ఎట్టకేలకు ఆయన వాళ్లను నీకప్పగించాడు. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, వివేకవంతుడు.
8:72 إِنَّ الَّذِينَ آمَنُوا وَهَاجَرُوا وَجَاهَدُوا بِأَمْوَالِهِمْ وَأَنفُسِهِمْ فِي سَبِيلِ اللَّهِ وَالَّذِينَ آوَوا وَّنَصَرُوا أُولَٰئِكَ بَعْضُهُمْ أَوْلِيَاءُ بَعْضٍ ۚ وَالَّذِينَ آمَنُوا وَلَمْ يُهَاجِرُوا مَا لَكُم مِّن وَلَايَتِهِم مِّن شَيْءٍ حَتَّىٰ يُهَاجِرُوا ۚ وَإِنِ اسْتَنصَرُوكُمْ فِي الدِّينِ فَعَلَيْكُمُ النَّصْرُ إِلَّا عَلَىٰ قَوْمٍ بَيْنَكُمْ وَبَيْنَهُم مِّيثَاقٌ ۗ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ
ఎవరు విశ్వసించి, వలసపోయారో, అల్లాహ్ మార్గంలో తమ ధనప్రాణాల ద్వారా పోరాడారో వారూ, వారికి ఆశ్రయమిచ్చి సహాయపడినవారూ – వారంతా ఒండొకరికి మిత్రులు. మరెవరు విశ్వసించినప్పటికీ (తమ ఇల్లూ వాకిలిని విడిచి) వలసపోలేదో, వారు వలసపోయి మీ వద్దకు రానంతవరకూ వారితో మీకెలాంటి స్నేహబంధం లేదు. కాకపోతే ధార్మిక వ్యవహారాలలో వారెప్పుడు మీ సహాయం కోరినా, మీరు వారికి సహాయపడటం అవసరం. అయితే మీతో ఒప్పందం చేసుకున్నవారికి వ్యతిరేకంగా మాత్రం కాదు. మీరు చేసే పనులన్నింటినీ అల్లాహ్ చూస్తూనే ఉన్నాడు.
8:73 وَالَّذِينَ كَفَرُوا بَعْضُهُمْ أَوْلِيَاءُ بَعْضٍ ۚ إِلَّا تَفْعَلُوهُ تَكُن فِتْنَةٌ فِي الْأَرْضِ وَفَسَادٌ كَبِيرٌ
అవిశ్వాసులు ఒండొకరికి మిత్రులు. ఒకవేళ మీరు కూడా అలా ఉండకపోతే భువిలో ఉపద్రవం (ఫిత్నా) మొదలవుతుంది. పెద్ద కల్లోలమే చెలరేగుతుంది.
8:74 وَالَّذِينَ آمَنُوا وَهَاجَرُوا وَجَاهَدُوا فِي سَبِيلِ اللَّهِ وَالَّذِينَ آوَوا وَّنَصَرُوا أُولَٰئِكَ هُمُ الْمُؤْمِنُونَ حَقًّا ۚ لَّهُم مَّغْفِرَةٌ وَرِزْقٌ كَرِيمٌ
ఎవరు విశ్వసించి, స్వస్థలాన్ని విడిచి వలసపోయారో, అల్లాహ్ మార్గంలో పోరాటం సలిపారో, మరెవరు (వారికి) ఆశ్రయమిచ్చి ఆదుకున్నారో – వారే నిజమయిన విశ్వాసులు. వారి కొరకు మన్నింపూ ఉంది, గౌరవప్రదమయిన ఉపాధి కూడా ఉంది.
8:75 وَالَّذِينَ آمَنُوا مِن بَعْدُ وَهَاجَرُوا وَجَاهَدُوا مَعَكُمْ فَأُولَٰئِكَ مِنكُمْ ۚ وَأُولُو الْأَرْحَامِ بَعْضُهُمْ أَوْلَىٰ بِبَعْضٍ فِي كِتَابِ اللَّهِ ۗ إِنَّ اللَّهَ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ
మరెవరు ఆ తరువాత విశ్వసించి, వలసపోయారో, మీతో కలసి పోరాడారో- వారు కూడా మీవారే. కాని దైవాజ్ఞ ప్రకారం వారిలో కొందరు మరికొందరికి బంధుత్వ సంబంధాల కారణంగా ఎక్కువ సన్నిహితులు. నిశ్చయంగా అల్లాహ్ ప్రతిదీ తెలిసినవాడు.
9. సూరా అత్ తౌబా
9:1 بَرَاءَةٌ مِّنَ اللَّهِ وَرَسُولِهِ إِلَى الَّذِينَ عَاهَدتُّم مِّنَ الْمُشْرِكِينَ
మీరు ఒప్పందాలు కుదుర్చుకున్న ముష్రిక్కులతో ఇక మీదట ఎలాంటి సంబంధాలుండబోవని అల్లాహ్ తరఫున, ఆయన ప్రవక్త తరఫున ప్రకటించబడుతోంది.
9:2 فَسِيحُوا فِي الْأَرْضِ أَرْبَعَةَ أَشْهُرٍ وَاعْلَمُوا أَنَّكُمْ غَيْرُ مُعْجِزِي اللَّهِ ۙ وَأَنَّ اللَّهَ مُخْزِي الْكَافِرِينَ
కనుక (ఓ ముష్రిక్కులారా!) ఇక మీరు నాలుగు మాసాల వరకు రాజ్యంలో సంచరించండి. మీరు అల్లాహ్‌ను అశక్తుణ్ణి చెయ్యలేరన్న సంగతిని బాగా తెలుసుకోండి. అల్లాహ్ అవిశ్వాసులను పరాభవం పాల్జేస్తాడు(అన్న సంగతిని కూడా మరువకండి).
9:3 وَأَذَانٌ مِّنَ اللَّهِ وَرَسُولِهِ إِلَى النَّاسِ يَوْمَ الْحَجِّ الْأَكْبَرِ أَنَّ اللَّهَ بَرِيءٌ مِّنَ الْمُشْرِكِينَ ۙ وَرَسُولُهُ ۚ فَإِن تُبْتُمْ فَهُوَ خَيْرٌ لَّكُمْ ۖ وَإِن تَوَلَّيْتُمْ فَاعْلَمُوا أَنَّكُمْ غَيْرُ مُعْجِزِي اللَّهِ ۗ وَبَشِّرِ الَّذِينَ كَفَرُوا بِعَذَابٍ أَلِيمٍ
అల్లాహ్ తరఫు నుంచీ, ఆయన ప్రవక్త తరఫు నుంచీ పెద్ద హజ్ దినాన ప్రజలకు తెలియజేయునది ఏమనగా, అల్లాహ్ ముష్రిక్కులకు ఏ విధంగానూ బాధ్యుడు కాడు – ఆయన ప్రవక్త కూడా. కాబట్టి ఇప్పటికయినా మీరు పశ్చాత్తాపం చెందితే అది మీకే శ్రేయస్కరం. ఒకవేళ మీరు విముఖులైతే, మీరు ఎట్టి పరిస్థితిలోనూ అల్లాహ్‌ను ఓడించలేరన్న సంగతిని తెలుసుకోండి. (ఓ ప్రవక్తా!) అవిశ్వాసులకు వ్యధాభరితమైన శిక్ష ఉంటుందన్న శుభవార్తను వినిపించు.
9:4 إِلَّا الَّذِينَ عَاهَدتُّم مِّنَ الْمُشْرِكِينَ ثُمَّ لَمْ يَنقُصُوكُمْ شَيْئًا وَلَمْ يُظَاهِرُوا عَلَيْكُمْ أَحَدًا فَأَتِمُّوا إِلَيْهِمْ عَهْدَهُمْ إِلَىٰ مُدَّتِهِمْ ۚ إِنَّ اللَّهَ يُحِبُّ الْمُتَّقِينَ
అయితే మీరు ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత మీకు ఎలాంటి నష్టం చేకూర్చడంగానీ, మీకు వ్యతిరేకంగా ఎవరికైనా సహాయం చేయటంగానీ చేయకుండా ఉన్న ముష్రిక్కులకు మాత్రం (ఈ ప్రకటన నుంచి) మినహాయింపు ఉంది. మీరు కూడా వారితోపాటు వారి ఒప్పంద గడువును పూర్తిచేయండి. నిశ్చయంగా అల్లాహ్ భయభక్తులుగల వారిని ప్రేమిస్తాడు.
9:5 فَإِذَا انسَلَخَ الْأَشْهُرُ الْحُرُمُ فَاقْتُلُوا الْمُشْرِكِينَ حَيْثُ وَجَدتُّمُوهُمْ وَخُذُوهُمْ وَاحْصُرُوهُمْ وَاقْعُدُوا لَهُمْ كُلَّ مَرْصَدٍ ۚ فَإِن تَابُوا وَأَقَامُوا الصَّلَاةَ وَآتَوُا الزَّكَاةَ فَخَلُّوا سَبِيلَهُمْ ۚ إِنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ
మరి నిషిద్ధ (గౌరవప్రదమైన) మాసాలు గడచిపోగానే ముష్రిక్కులను ఎక్కడ కనబడితే అక్కడే చంపండి, వారిని నిర్బంధించండి, వారిని ముట్టడించండి. ప్రతి మాటు వద్ద వారికొరకు పొంచి కూర్చోండి. ఒకవేళ వారు పశ్చాత్తాపం చెంది, నమాజును నెలకొల్పితే, జకాతును విధిగా చెల్లిస్తే వారి మార్గాన వారిని వదలిపెట్టండి. నిశ్చయంగా అల్లాహ్ క్షమించేవాడు, కనికరించేవాడు.
9:6 وَإِنْ أَحَدٌ مِّنَ الْمُشْرِكِينَ اسْتَجَارَكَ فَأَجِرْهُ حَتَّىٰ يَسْمَعَ كَلَامَ اللَّهِ ثُمَّ أَبْلِغْهُ مَأْمَنَهُ ۚ ذَٰلِكَ بِأَنَّهُمْ قَوْمٌ لَّا يَعْلَمُونَ
ఒకవేళ ముష్రిక్కులలోని ఏ వ్యక్తి అయినా నీ శరణు కోరితే, అతను దైవవాణి వినేంతవరకు అతనికి నువ్వు ఆశ్రయమివ్వు. ఆ తరువాత అతన్ని అతని సురక్షిత స్థానానికి చేర్చు. వారు తెలియని వారవటంచేత వారి పట్ల ఈ విధంగా వ్యవహరించాలి.
9:7 كَيْفَ يَكُونُ لِلْمُشْرِكِينَ عَهْدٌ عِندَ اللَّهِ وَعِندَ رَسُولِهِ إِلَّا الَّذِينَ عَاهَدتُّمْ عِندَ الْمَسْجِدِ الْحَرَامِ ۖ فَمَا اسْتَقَامُوا لَكُمْ فَاسْتَقِيمُوا لَهُمْ ۚ إِنَّ اللَّهَ يُحِبُّ الْمُتَّقِينَ
అల్లాహ్ వద్ద, ఆయన ప్రవక్త వద్ద ముష్రిక్కులకు ఒప్పందం ఎలా సాధ్యం? అయితే మీరు మస్జిదె హరామ్ దగ్గర ఎవరితో ఒప్పందం చేసుకున్నారో వారు మీ ఒప్పందానికి కట్టుబడి ఉన్నంతవరకూ మీరు కూడా వారి ఒప్పందాన్ని గౌరవించండి. నిశ్చయంగా అల్లాహ్ భయభక్తులు గల వారిని ప్రేమిస్తాడు.
9:8 كَيْفَ وَإِن يَظْهَرُوا عَلَيْكُمْ لَا يَرْقُبُوا فِيكُمْ إِلًّا وَلَا ذِمَّةً ۚ يُرْضُونَكُم بِأَفْوَاهِهِمْ وَتَأْبَىٰ قُلُوبُهُمْ وَأَكْثَرُهُمْ فَاسِقُونَ
వారి వాగ్దానాలు ఏ మేరకు నమ్మశక్యం? మీపై వారికి ఏకాస్త ఆధిక్యత లభించినా వారు మీ విషయంలో ఏ బంధుత్వాన్నీ, ఏ ఒడంబడికనూ ఖాతరుచేయరు. వారు తమ నోటి మాటలతో మిమ్మల్ని సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. కాని వారి హృదయాలు మాత్రం ఎంతకీ అంగీకరించటం లేదు. వారిలో అత్యధికులు అవిధేయులు.
9:9 اشْتَرَوْا بِآيَاتِ اللَّهِ ثَمَنًا قَلِيلًا فَصَدُّوا عَن سَبِيلِهِ ۚ إِنَّهُمْ سَاءَ مَا كَانُوا يَعْمَلُونَ
వారు అల్లాహ్ వాక్కులను అతి స్వల్పమైన ధరకు అమ్మేశారు. ఆయన మార్గం నుంచి ప్రజలను ఆపారు. వారి చేష్టలు బహుచెడ్డవి.
9:10 لَا يَرْقُبُونَ فِي مُؤْمِنٍ إِلًّا وَلَا ذِمَّةً ۚ وَأُولَٰئِكَ هُمُ الْمُعْتَدُونَ
ఏ ముస్లిం విషయంలోనూ వారు బంధుత్వ సంబంధాలను, ఒప్పంద మర్యాదలనూ ఏమాత్రం ఖాతరు చేయరు. హద్దులు మీరేవారు వీరే.
9:11 فَإِن تَابُوا وَأَقَامُوا الصَّلَاةَ وَآتَوُا الزَّكَاةَ فَإِخْوَانُكُمْ فِي الدِّينِ ۗ وَنُفَصِّلُ الْآيَاتِ لِقَوْمٍ يَعْلَمُونَ
ఇప్పటికయినా వారు పశ్చాత్తాపం చెంది, నమాజ్‌ను నెలకొల్పుతూ, జకాత్‌ను విధిగా చెల్లించటం మొదలెడితే వారు మీ ధార్మిక సోదరులే. తెలిసినవారి కోసం మేము మా ఆయతులను ఈ విధంగా విడమరచి చెబుతున్నాము.
9:12 وَإِن نَّكَثُوا أَيْمَانَهُم مِّن بَعْدِ عَهْدِهِمْ وَطَعَنُوا فِي دِينِكُمْ فَقَاتِلُوا أَئِمَّةَ الْكُفْرِ ۙ إِنَّهُمْ لَا أَيْمَانَ لَهُمْ لَعَلَّهُمْ يَنتَهُونَ
ఒకవేళ ఒప్పందం చేసుకున్న తరువాత కూడా వీళ్లు తమ ప్రమాణాలను భంగపరచి, మీ ధర్మాన్ని ఎగతాళి చేస్తే మీరు కూడా ఆ అవిశ్వాస నాయకులతో తలపడండి. ఇంక వారి ప్రమాణాలకు ఏపాటి విలువాలేదు. బహుశా (తగిన శాస్తి జరిగిన తరువాతనే) వారు (తమ దుశ్చేష్టలను) మానుకుంటారేమో.
9:13 أَلَا تُقَاتِلُونَ قَوْمًا نَّكَثُوا أَيْمَانَهُمْ وَهَمُّوا بِإِخْرَاجِ الرَّسُولِ وَهُم بَدَءُوكُمْ أَوَّلَ مَرَّةٍ ۚ أَتَخْشَوْنَهُمْ ۚ فَاللَّهُ أَحَقُّ أَن تَخْشَوْهُ إِن كُنتُم مُّؤْمِنِينَ
తమ ప్రమాణాలను భంగం చేసిన వారితో, ప్రవక్తను దేశం నుంచి బహిష్కరించే పథకం వేసిన వారితో మీరు ఎందుకు యుద్ధం చేయరు?(చూడబోతే) తొలిసారి మీపై కవ్వింపు చర్యలకు ఒడిగట్టినది కూడా వారేకదా! ఏమిటీ, మీరు వారికి భయపడుతున్నారా? మీరే గనక విశ్వాసులైతే మీరు భయపడటానికి అల్లాహ్‌యే ఎక్కువ అర్హుడు.
9:14 قَاتِلُوهُمْ يُعَذِّبْهُمُ اللَّهُ بِأَيْدِيكُمْ وَيُخْزِهِمْ وَيَنصُرْكُمْ عَلَيْهِمْ وَيَشْفِ صُدُورَ قَوْمٍ مُّؤْمِنِينَ
వారితో యుద్ధం చేయండి. అల్లాహ్ మీ చేతుల మీదుగా వారిని దండిస్తాడు. వారిని అవమానపరుస్తాడు. వారికి వ్యతిరేకంగా మీకు సాయం చేసి, విశ్వాసుల గుండెలను చల్లబరుస్తాడు.
9:15 وَيُذْهِبْ غَيْظَ قُلُوبِهِمْ ۗ وَيَتُوبُ اللَّهُ عَلَىٰ مَن يَشَاءُ ۗ وَاللَّهُ عَلِيمٌ حَكِيمٌ
వారి హృదయాలలోని దుఃఖాన్ని, కోపాన్ని దూరం చేస్తాడు. ఆయన, తాను కోరినవారి వైపుకు కారుణ్యంతో మరలుతాడు. అల్లాహ్ ప్రతిదీ తెలిసినవాడు, వివేకవంతుడు.
9:16 أَمْ حَسِبْتُمْ أَن تُتْرَكُوا وَلَمَّا يَعْلَمِ اللَّهُ الَّذِينَ جَاهَدُوا مِنكُمْ وَلَمْ يَتَّخِذُوا مِن دُونِ اللَّهِ وَلَا رَسُولِهِ وَلَا الْمُؤْمِنِينَ وَلِيجَةً ۚ وَاللَّهُ خَبِيرٌ بِمَا تَعْمَلُونَ
ఏమిటీ, మీరు ఇట్టే వదలివేయబడతారని భావిస్తున్నారా? వాస్తవానికి మీలో యోధులు ఎవరో, అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తను, విశ్వాసులను తప్ప వేరొకరెవరినీ ఆప్తమిత్రులుగా చేసుకోనివారు ఎవరో అల్లాహ్ ఇంతవరకు (వేరుపరచి) చూడనే లేదు. మీరు చేసేదంతా అల్లాహ్‌కు తెలుసు.
9:17 مَا كَانَ لِلْمُشْرِكِينَ أَن يَعْمُرُوا مَسَاجِدَ اللَّهِ شَاهِدِينَ عَلَىٰ أَنفُسِهِم بِالْكُفْرِ ۚ أُولَٰئِكَ حَبِطَتْ أَعْمَالُهُمْ وَفِي النَّارِ هُمْ خَالِدُونَ
ముష్రిక్కులు తాము స్వయంగా తమ అవిశ్వాసాన్ని గురించి సాక్ష్యమిస్తున్నప్పుడు వారు అల్లాహ్ మస్జిదుల నిర్వహణకు ఎంతమాత్రం తగరు. వారి కర్మలన్నీ వృథా అయిపోయాయి. శాశ్వతంగా వారు నరకాగ్నిలో ఉంటారు.
9:18 إِنَّمَا يَعْمُرُ مَسَاجِدَ اللَّهِ مَنْ آمَنَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ وَأَقَامَ الصَّلَاةَ وَآتَى الزَّكَاةَ وَلَمْ يَخْشَ إِلَّا اللَّهَ ۖ فَعَسَىٰ أُولَٰئِكَ أَن يَكُونُوا مِنَ الْمُهْتَدِينَ
అల్లాహ్‌ను, అంతిమ దినాన్నీ విశ్వసిస్తూ, నమాజులను నెలకొల్పుతూ, జకాత్‌ను విధిగా చెల్లిస్తూ, అల్లాహ్‌కు తప్ప వేరొకరికి భయపడనివారు మాత్రమే అల్లాహ్ మస్జిదుల నిర్వహణకు తగినవారు. సన్మార్గ భాగ్యం పొందినవారు వీరేనని ఆశించవచ్చు.
9:19 أَجَعَلْتُمْ سِقَايَةَ الْحَاجِّ وَعِمَارَةَ الْمَسْجِدِ الْحَرَامِ كَمَنْ آمَنَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ وَجَاهَدَ فِي سَبِيلِ اللَّهِ ۚ لَا يَسْتَوُونَ عِندَ اللَّهِ ۗ وَاللَّهُ لَا يَهْدِي الْقَوْمَ الظَّالِمِينَ
ఏమిటీ, మీరు హజ్ యాత్రీకులకు మంచినీళ్లు సరఫరా చేయటాన్ని, మస్జిదె హరామ్‌కు సేవలు చేయటాన్ని; అల్లాహ్‌ను అంతిమ దినాన్ని విశ్వసించి అల్లాహ్ మార్గంలో యుద్ధం చేసే వారితో సమానంగా పరిగణించారా? వారు అల్లాహ్ దృష్టిలో సమానులు కాజాలరు. అల్లాహ్ దుర్మార్గులకు సన్మార్గం చూపడు.
9:20 الَّذِينَ آمَنُوا وَهَاجَرُوا وَجَاهَدُوا فِي سَبِيلِ اللَّهِ بِأَمْوَالِهِمْ وَأَنفُسِهِمْ أَعْظَمُ دَرَجَةً عِندَ اللَّهِ ۚ وَأُولَٰئِكَ هُمُ الْفَائِزُونَ
విశ్వసించి, వలసపోయి (హిజ్రత్ చేసి), దైవమార్గంలో తమ ధన ప్రాణాలను ఒడ్డి పోరాడినవారు మాత్రమే అల్లాహ్ సన్నిధిలో ఉన్నత శ్రేణికి చెందినవారు. సాఫల్యం పొందేవారు కూడా వీరే.
9:21 يُبَشِّرُهُمْ رَبُّهُم بِرَحْمَةٍ مِّنْهُ وَرِضْوَانٍ وَجَنَّاتٍ لَّهُمْ فِيهَا نَعِيمٌ مُّقِيمٌ
వారి ప్రభువు వారికి తన కారుణ్యాన్ని, ప్రసన్నతను, (స్వర్గ) వనాలను అనుగ్రహిస్తానని శుభవార్త ఇస్తున్నాడు. అక్కడ వారి కోసం శాశ్వతమైన అనుగ్రహాలున్నాయి.
9:22 خَالِدِينَ فِيهَا أَبَدًا ۚ إِنَّ اللَّهَ عِندَهُ أَجْرٌ عَظِيمٌ
వాటిలో వారు కలకాలం ఉంటారు. నిశ్చయంగా అల్లాహ్ వద్ద గొప్ప ప్రతిఫలం ఉంది.
9:23 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَتَّخِذُوا آبَاءَكُمْ وَإِخْوَانَكُمْ أَوْلِيَاءَ إِنِ اسْتَحَبُّوا الْكُفْرَ عَلَى الْإِيمَانِ ۚ وَمَن يَتَوَلَّهُم مِّنكُمْ فَأُولَٰئِكَ هُمُ الظَّالِمُونَ
ఓ విశ్వాసులారా! మీ తండ్రులు, మీ సోదరులు విశ్వాసం కన్నా అవిశ్వాసాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నట్లయితే వారిని మీ స్నేహితులుగా చేసుకోకండి. మీలో ఎవరు వారిని అభిమానిస్తారో వారు దుర్మార్గులవుతారు.
9:24 قُلْ إِن كَانَ آبَاؤُكُمْ وَأَبْنَاؤُكُمْ وَإِخْوَانُكُمْ وَأَزْوَاجُكُمْ وَعَشِيرَتُكُمْ وَأَمْوَالٌ اقْتَرَفْتُمُوهَا وَتِجَارَةٌ تَخْشَوْنَ كَسَادَهَا وَمَسَاكِنُ تَرْضَوْنَهَا أَحَبَّ إِلَيْكُم مِّنَ اللَّهِ وَرَسُولِهِ وَجِهَادٍ فِي سَبِيلِهِ فَتَرَبَّصُوا حَتَّىٰ يَأْتِيَ اللَّهُ بِأَمْرِهِ ۗ وَاللَّهُ لَا يَهْدِي الْقَوْمَ الْفَاسِقِينَ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “ఒకవేళ మీ తండ్రులు, మీ కుమారులు, మీ సోదరులు, మీ భార్యలు, మీ సమీప బంధువులు, మీరు సంపాదించిన సిరిసంపదలు, కుంటుపడుతుందేమోనని మీరు భయపడే మీ వర్తకం, మీకెంతో ప్రియమైన మీ గృహాలు మీకు అల్లాహ్ కన్నా, ఆయన ప్రవక్త కన్నా, ఆయన మార్గంలో సలిపే పోరాటం కన్నా ఎక్కువ ప్రియమైనవైతే అల్లాహ్ తీసుకువచ్చే తీర్పు (శిక్ష) కొరకు ఎదురుచూడండి. అల్లాహ్ అవిధేయులకు సన్మార్గం చూపడు.
9:25 لَقَدْ نَصَرَكُمُ اللَّهُ فِي مَوَاطِنَ كَثِيرَةٍ ۙ وَيَوْمَ حُنَيْنٍ ۙ إِذْ أَعْجَبَتْكُمْ كَثْرَتُكُمْ فَلَمْ تُغْنِ عَنكُمْ شَيْئًا وَضَاقَتْ عَلَيْكُمُ الْأَرْضُ بِمَا رَحُبَتْ ثُمَّ وَلَّيْتُم مُّدْبِرِينَ
లోగడ చాలా సందర్భాలలో అల్లాహ్ మీకు సహాయం చేసి ఉన్నాడు. హునైన్ యుద్ధం జరిగిన రోజున కూడా (మిమ్మల్ని ఆదుకున్నాడు). ఆ సందర్భంగా మీరు మీ అధిక సంఖ్య పై గర్వపడ్డారు. కాని ఆ సంఖ్యాబలం మీకే విధంగానూ ప్రయోజనం కలిగించలేదు. భూమి విశాలంగా ఉండి కూడా మీకోసం ఇరుకైపోయింది. అప్పుడు మీరు వెన్నుచూపి మరలిపోయారు.
9:26 ثُمَّ أَنزَلَ اللَّهُ سَكِينَتَهُ عَلَىٰ رَسُولِهِ وَعَلَى الْمُؤْمِنِينَ وَأَنزَلَ جُنُودًا لَّمْ تَرَوْهَا وَعَذَّبَ الَّذِينَ كَفَرُوا ۚ وَذَٰلِكَ جَزَاءُ الْكَافِرِينَ
ఆ తరువాత అల్లాహ్ తన ప్రవక్తపై, విశ్వాసులపై తన తరఫు నుంచి స్థిమితాన్ని అవతరింపజేశాడు. మీకు కానరాని సేనలను పంపించాడు. సత్య తిరస్కారులను శిక్షించాడు. సత్యాన్ని తిరస్కరించేవారికి లభించవలసిన ప్రతిఫలం ఇదే.
9:27 ثُمَّ يَتُوبُ اللَّهُ مِن بَعْدِ ذَٰلِكَ عَلَىٰ مَن يَشَاءُ ۗ وَاللَّهُ غَفُورٌ رَّحِيمٌ
ఆ తరువాత కూడా అల్లాహ్ తాను కోరినవారిని మన్నించి, వారిపై దయ చూపుతాడు. అల్లాహ్ క్షమాగుణం కలవాడు, దయామయుడు.
9:28 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِنَّمَا الْمُشْرِكُونَ نَجَسٌ فَلَا يَقْرَبُوا الْمَسْجِدَ الْحَرَامَ بَعْدَ عَامِهِمْ هَٰذَا ۚ وَإِنْ خِفْتُمْ عَيْلَةً فَسَوْفَ يُغْنِيكُمُ اللَّهُ مِن فَضْلِهِ إِن شَاءَ ۚ إِنَّ اللَّهَ عَلِيمٌ حَكِيمٌ
ఓ విశ్వాసులారా! ముష్రిక్కులు అశుద్ధులు. కాబట్టి ఈ ఏడాది తరువాత వారు మస్జిదె హరామ్ దరిదాపులకు కూడా రాకూడదు. ఒకవేళ మీకు దారిద్య్ర భయం ఉంటే అల్లాహ్ గనక తలిస్తే తన కృపతో మిమ్మల్ని సంపన్నులుగా చేస్తాడు. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, వివేకవంతుడు.
9:29 قَاتِلُوا الَّذِينَ لَا يُؤْمِنُونَ بِاللَّهِ وَلَا بِالْيَوْمِ الْآخِرِ وَلَا يُحَرِّمُونَ مَا حَرَّمَ اللَّهُ وَرَسُولُهُ وَلَا يَدِينُونَ دِينَ الْحَقِّ مِنَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ حَتَّىٰ يُعْطُوا الْجِزْيَةَ عَن يَدٍ وَهُمْ صَاغِرُونَ
అల్లాహ్నూ, అంతిమదినాన్నీ విశ్వసించని, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త నిషేధించిన వస్తువులను నిషిద్ధంగా భావించని, సత్యధర్మాన్ని అవలంబించని గ్రంథవహులతో – వారు పరాభవం పాలై తమ స్వహస్తాలతో జిజ్యా చెల్లించనంత వరకూ యుద్ధం చేయండి.
9:30 وَقَالَتِ الْيَهُودُ عُزَيْرٌ ابْنُ اللَّهِ وَقَالَتِ النَّصَارَى الْمَسِيحُ ابْنُ اللَّهِ ۖ ذَٰلِكَ قَوْلُهُم بِأَفْوَاهِهِمْ ۖ يُضَاهِئُونَ قَوْلَ الَّذِينَ كَفَرُوا مِن قَبْلُ ۚ قَاتَلَهُمُ اللَّهُ ۚ أَنَّىٰ يُؤْفَكُونَ
“ఉజైర్ అల్లాహ్ కుమారుడు” అని యూదులంటున్నారు. “మసీహ్ (ఏసు క్రీస్తు) అల్లాహ్ కుమారుడు” అని నసారా (క్రైస్తవులు) అంటున్నారు. ఇవి వారి నోటి మాటలు మాత్రమే. తమ పూర్వీకుల్లోని అవిశ్వాసులు చెప్పిన మాటలనే వీళ్ళూ అనుకరిస్తున్నారు. అల్లాహ్ వారిని నాశనం చేయుగాక! (సత్యం నుండి) వారెలా తిరిగిపోతున్నారు!?
9:31 اتَّخَذُوا أَحْبَارَهُمْ وَرُهْبَانَهُمْ أَرْبَابًا مِّن دُونِ اللَّهِ وَالْمَسِيحَ ابْنَ مَرْيَمَ وَمَا أُمِرُوا إِلَّا لِيَعْبُدُوا إِلَٰهًا وَاحِدًا ۖ لَّا إِلَٰهَ إِلَّا هُوَ ۚ سُبْحَانَهُ عَمَّا يُشْرِكُونَ
వారు అల్లాహ్‌ను వదలి తమ పండితుల (అహ్బార్)ను, సన్యాసుల (రుహ్బాన్)ను తమ ప్రభువులుగా చేసుకున్నారు- మర్యమ్ కుమారుడైన మసీహ్‌ను కూడా. నిజానికి వారికి, ఒక్కడైన అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించవలసిందిగా ఆజ్ఞాపించబడింది. ఆయన తప్ప మరో ఆరాధ్యదైవం లేడు. వారు నిర్థారించుకుంటున్న భాగస్వామ్యాలకు ఆయన అతీతుడు, పవిత్రుడు.
9:32 يُرِيدُونَ أَن يُطْفِئُوا نُورَ اللَّهِ بِأَفْوَاهِهِمْ وَيَأْبَى اللَّهُ إِلَّا أَن يُتِمَّ نُورَهُ وَلَوْ كَرِهَ الْكَافِرُونَ
వారు అల్లాహ్ జ్యోతిని తమ నోటితో (ఊది) ఆర్పివేయాలని కోరుతున్నారు. అయితే అల్లాహ్ – అవిశ్వాసులకు ఎంతగా సహించరానిదైనా సరే – తన జ్యోతిని పరిపూర్ణం చేయకుండా వదలిపెట్టటానికి అంగీకరించడు.
9:33 هُوَ الَّذِي أَرْسَلَ رَسُولَهُ بِالْهُدَىٰ وَدِينِ الْحَقِّ لِيُظْهِرَهُ عَلَى الدِّينِ كُلِّهِ وَلَوْ كَرِهَ الْمُشْرِكُونَ
ఆయనే తన ప్రవక్తకు మార్గదర్శకత్వాన్నీ, సత్యధర్మాన్నీ ఇచ్చి పంపాడు – ముష్రిక్కులకు ఎంత సహించరానిదయినా సరే, ఇతర ధర్మాలపై దానికి ఆధిక్యతను వొసగటానికి!
9:34 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِنَّ كَثِيرًا مِّنَ الْأَحْبَارِ وَالرُّهْبَانِ لَيَأْكُلُونَ أَمْوَالَ النَّاسِ بِالْبَاطِلِ وَيَصُدُّونَ عَن سَبِيلِ اللَّهِ ۗ وَالَّذِينَ يَكْنِزُونَ الذَّهَبَ وَالْفِضَّةَ وَلَا يُنفِقُونَهَا فِي سَبِيلِ اللَّهِ فَبَشِّرْهُم بِعَذَابٍ أَلِيمٍ
ఓ విశ్వసించిన వారలారా! పండితుల (అహ్బార్)లలో, సన్యాసుల (రుహ్బాన్)లలో చాలా మంది అక్రమంగా ప్రజల సొమ్ములను స్వాహా చేస్తున్నారు. వారిని అల్లాహ్ మార్గం నుంచి ఆపుతున్నారు. ఎవరు వెండీ, బంగారాలను పోగుచేస్తూ వాటిని దైవమార్గంలో ఖర్చు పెట్టడంలేదో వారికి బాధాకరమైన శిక్ష ఉందన్న శుభవార్తను వినిపించు.
9:35 يَوْمَ يُحْمَىٰ عَلَيْهَا فِي نَارِ جَهَنَّمَ فَتُكْوَىٰ بِهَا جِبَاهُهُمْ وَجُنُوبُهُمْ وَظُهُورُهُمْ ۖ هَٰذَا مَا كَنَزْتُمْ لِأَنفُسِكُمْ فَذُوقُوا مَا كُنتُمْ تَكْنِزُونَ
ఏ రోజున ఈ ఖజానాను నరకాగ్నిలో కాల్చి దాంతో వారి నొసటిపై, పార్శ్వాలపై, వీపులపై వాతలు వేయడం జరుగుతుందో అప్పుడు, “ఇదీ మీరు మీ కోసం సమీకరించినది. కాబట్టి ఇప్పుడు మీ ఖజానా రుచి చూడండి” (అని వారితో అనబడుతుంది).
9:36 إِنَّ عِدَّةَ الشُّهُورِ عِندَ اللَّهِ اثْنَا عَشَرَ شَهْرًا فِي كِتَابِ اللَّهِ يَوْمَ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ مِنْهَا أَرْبَعَةٌ حُرُمٌ ۚ ذَٰلِكَ الدِّينُ الْقَيِّمُ ۚ فَلَا تَظْلِمُوا فِيهِنَّ أَنفُسَكُمْ ۚ وَقَاتِلُوا الْمُشْرِكِينَ كَافَّةً كَمَا يُقَاتِلُونَكُمْ كَافَّةً ۚ وَاعْلَمُوا أَنَّ اللَّهَ مَعَ الْمُتَّقِينَ
నిశ్చయంగా నెలల సంఖ్య అల్లాహ్ దగ్గర – అల్లాహ్ గ్రంథంలో పన్నెండు మాత్రమే. ఆయన ఆకాశాలను, భూమిని సృష్టించిన రోజునుంచీ (ఈ లెక్క ఇలాగే సాగుతున్నది). వాటిలో నాలుగు మాసాలు నిషిద్ధమైనవి (గౌరవప్రదమైనవి.) ఇదే సరైన ధర్మం. కాబట్టి ఈ మాసాలలో మీకు మీరు అన్యాయం చేసుకోకండి. ముష్రిక్కులు మీ అందరితో పోరాడుతున్నట్లే మీరు కూడా వారందరితో పోరాడండి. అల్లాహ్ భయభక్తులుగల వారికి తోడుగా ఉంటాడన్న సంగతిని తెలుసుకోండి.
9:37 إِنَّمَا النَّسِيءُ زِيَادَةٌ فِي الْكُفْرِ ۖ يُضَلُّ بِهِ الَّذِينَ كَفَرُوا يُحِلُّونَهُ عَامًا وَيُحَرِّمُونَهُ عَامًا لِّيُوَاطِئُوا عِدَّةَ مَا حَرَّمَ اللَّهُ فَيُحِلُّوا مَا حَرَّمَ اللَّهُ ۚ زُيِّنَ لَهُمْ سُوءُ أَعْمَالِهِمْ ۗ وَاللَّهُ لَا يَهْدِي الْقَوْمَ الْكَافِرِينَ
నెలలను ముందుకు, వెనక్కి మార్చటం ఓ అదనపు అవిశ్వాస చేష్ట. ఈ చేష్ట ద్వారా అవిశ్వాసులు మార్గభ్రష్టతలో పడవేయబడుతున్నారు. ఒక ఏడాది వారు దాన్ని ధర్మసమ్మతం చేసుకుని, మరో ఏడాది దాన్నే నిషిద్ధంగా ఖరారు చేసుకుంటారు. అల్లాహ్ నిషిద్ధ పరచిన మాసాల గణనలో సారూప్యం సాధించడానికి, అల్లాహ్ నిషేధించిన దానిని ధర్మసమ్మతం చేసుకోవటానికి (వారు ఇలా చేస్తారు). వారి దుష్టచేష్టలు వారికి అందమైనవిగా చూపబడ్డాయి. అవిశ్వాస జనులకు అల్లాహ్ సన్మార్గం చూపడు.
9:38 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا مَا لَكُمْ إِذَا قِيلَ لَكُمُ انفِرُوا فِي سَبِيلِ اللَّهِ اثَّاقَلْتُمْ إِلَى الْأَرْضِ ۚ أَرَضِيتُم بِالْحَيَاةِ الدُّنْيَا مِنَ الْآخِرَةِ ۚ فَمَا مَتَاعُ الْحَيَاةِ الدُّنْيَا فِي الْآخِرَةِ إِلَّا قَلِيلٌ
ఓ విశ్వాసులారా! “అల్లాహ్ మార్గంలో బయలుదేరండి” అని మీతో అనబడినప్పుడు మీరు నేలకు అతుక్కుపోతారేమిటి? అసలు మీకేమైపోయిందీ? మీరు పరలోకానికి బదులు ఇహలోక జీవితాన్నే కోరుకున్నారా? అయితే వినండి! ప్రాపంచిక జీవితపు సకల సామగ్రి పరలోకం ముందు అత్యల్పమైనది.
9:39 إِلَّا تَنفِرُوا يُعَذِّبْكُمْ عَذَابًا أَلِيمًا وَيَسْتَبْدِلْ قَوْمًا غَيْرَكُمْ وَلَا تَضُرُّوهُ شَيْئًا ۗ وَاللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
మీరు గనక (దైవమార్గంలో) బయలు దేరకపోతే అల్లాహ్ మీకు బాధాకరమైన శిక్ష విధిస్తాడు. మీకు బదులుగా మరో జాతిని (మీ స్థానంలో) తీసుకువస్తాడు. మీరు అల్లాహ్‌కు ఎంత మాత్రం నష్టం కలిగించలేరు. అల్లాహ్ అన్నింటిపై అధికారం కలవాడు.
9:40 إِلَّا تَنصُرُوهُ فَقَدْ نَصَرَهُ اللَّهُ إِذْ أَخْرَجَهُ الَّذِينَ كَفَرُوا ثَانِيَ اثْنَيْنِ إِذْ هُمَا فِي الْغَارِ إِذْ يَقُولُ لِصَاحِبِهِ لَا تَحْزَنْ إِنَّ اللَّهَ مَعَنَا ۖ فَأَنزَلَ اللَّهُ سَكِينَتَهُ عَلَيْهِ وَأَيَّدَهُ بِجُنُودٍ لَّمْ تَرَوْهَا وَجَعَلَ كَلِمَةَ الَّذِينَ كَفَرُوا السُّفْلَىٰ ۗ وَكَلِمَةُ اللَّهِ هِيَ الْعُلْيَا ۗ وَاللَّهُ عَزِيزٌ حَكِيمٌ
మీరు గనక అతనికి (ప్రవక్తకు) తోడ్పడకపోతే (పోనివ్వండి), అవిశ్వాసులు దేశం నుంచి అతనిని వెళ్ళగొట్టినప్పుడు- అతను ఇద్దరిలో రెండవవాడు. వారిద్దరూ గుహలో ఉన్నప్పుడు, అతను తన సహచరునితో, “బాధపడకు. నిశ్చయంగా అల్లాహ్ మనకు తోడుగా ఉన్నాడు” అని ఓదార్చినప్పుడు అల్లాహ్‌యే వారికి తోడ్పడ్డాడు. (ఆ ఘడియలో) అల్లాహ్ తన తరఫునుంచి అతనిపై ప్రశాంతతను అవతరింపజేశాడు. మీకు కానరాని సైన్యాలతో అతన్ని ఆదుకున్నాడు. ఆయన అవిశ్వాసుల మాటను అట్టడుగు స్థితికి దిగజార్చాడు. అల్లాహ్ వాక్కు మాత్రమే సర్వోన్నతమైనది, సదా పైన ఉండేది. అల్లాహ్ సర్వాధిక్యుడు, వివేకవంతుడు.
9:41 انفِرُوا خِفَافًا وَثِقَالًا وَجَاهِدُوا بِأَمْوَالِكُمْ وَأَنفُسِكُمْ فِي سَبِيلِ اللَّهِ ۚ ذَٰلِكُمْ خَيْرٌ لَّكُمْ إِن كُنتُمْ تَعْلَمُونَ
తేలిక అనిపించినాసరే, బరువు అనిపించినాసరే – బయలుదేరండి. దైవ మార్గంలో మీ ధన ప్రాణాలొడ్డి పోరాడండి. మీరు గనక తెలుసుకోగలిగితే ఇదే మీ కొరకు మేలైనది.
9:42 لَوْ كَانَ عَرَضًا قَرِيبًا وَسَفَرًا قَاصِدًا لَّاتَّبَعُوكَ وَلَٰكِن بَعُدَتْ عَلَيْهِمُ الشُّقَّةُ ۚ وَسَيَحْلِفُونَ بِاللَّهِ لَوِ اسْتَطَعْنَا لَخَرَجْنَا مَعَكُمْ يُهْلِكُونَ أَنفُسَهُمْ وَاللَّهُ يَعْلَمُ إِنَّهُمْ لَكَاذِبُونَ
(ఓ ప్రవక్తా!) త్వరగా సొమ్ములు లభించి, ప్రయాణం సులభతరమై ఉంటే వాళ్లు తప్పక నీ వెనుక వచ్చి ఉండేవారే. కాని సుదీర్ఘ ప్రయాణం అనేసరికి అది వారికి దుర్భరంగా తోచింది. ఇప్పుడు వాళ్లు, “మాలోనే గనక శక్తీ స్థోమతలు ఉండి ఉంటే తప్పకుండా మీ వెంట వచ్చి ఉండేవారం” అని అల్లాహ్‌పై ఒట్టేసి మరీ చెబుతారు. వాస్తవానికి వారు తమను తాము నాశనం చేసుకుంటున్నారు. వారు అబద్ధాలకోరులన్న సంగతి అల్లాహ్‌కు బాగా తెలుసు.
9:43 عَفَا اللَّهُ عَنكَ لِمَ أَذِنتَ لَهُمْ حَتَّىٰ يَتَبَيَّنَ لَكَ الَّذِينَ صَدَقُوا وَتَعْلَمَ الْكَاذِبِينَ
అల్లాహ్ నిన్ను మన్నించుగాక! నీ సమక్షంలో సత్యవంతులెవరో తేలి, అబద్ధం చెప్పేవారెవరో కూడా నువ్వు తెలుసుకోకుండానే అసలు నువ్వు వారికి అనుమతి ఎందుకిచ్చావు?
9:44 لَا يَسْتَأْذِنُكَ الَّذِينَ يُؤْمِنُونَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ أَن يُجَاهِدُوا بِأَمْوَالِهِمْ وَأَنفُسِهِمْ ۗ وَاللَّهُ عَلِيمٌ بِالْمُتَّقِينَ
అల్లాహ్‌ను, అంతిమ దినాన్ని విశ్వసించేవారు తమ ధన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడే విషయంలో తమకు సెలవు ఇవ్వమని నిన్ను ఎట్టి పరిస్థితిలోనూ విన్నవించుకోరు. భయభక్తులు గల వారెవరో అల్లాహ్‌కు బాగా తెలుసు.
9:45 إِنَّمَا يَسْتَأْذِنُكَ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ وَارْتَابَتْ قُلُوبُهُمْ فَهُمْ فِي رَيْبِهِمْ يَتَرَدَّدُونَ
అల్లాహ్‌పై, అంతిమ దినంపై విశ్వాసం లేనివారు మాత్రమే నీ నుండి ఇలాంటి సెలవును కోరుతారు. వారి హృదయాలు సంశయానికి లోనై ఉంటాయి. వారు తమ సంశయాలు, సందేహాలలోనే ఊగిసలాడుతున్నారు.
9:46 وَلَوْ أَرَادُوا الْخُرُوجَ لَأَعَدُّوا لَهُ عُدَّةً وَلَٰكِن كَرِهَ اللَّهُ انبِعَاثَهُمْ فَثَبَّطَهُمْ وَقِيلَ اقْعُدُوا مَعَ الْقَاعِدِينَ
యుద్ధానికి బయలుదేరాలన్న ఉద్దేశమే గనక వారికి ఉండి ఉంటే వారు ఎలాగయినా ప్రయాణ సామగ్రిని సమకూర్చుకుని ఉండేవారు. కాని వారు బయలుదేరటం అల్లాహ్‌కు అస్సలు ఇష్టంలేదు. అందుకే వారిని కదలకుండా ఆపేశాడు. “వెనుక ఉండిపోయే వారితోనే మీరూ ఉండిపోండి” అని వారికి చెప్పబడింది.
9:47 لَوْ خَرَجُوا فِيكُم مَّا زَادُوكُمْ إِلَّا خَبَالًا وَلَأَوْضَعُوا خِلَالَكُمْ يَبْغُونَكُمُ الْفِتْنَةَ وَفِيكُمْ سَمَّاعُونَ لَهُمْ ۗ وَاللَّهُ عَلِيمٌ بِالظَّالِمِينَ
ఒకవేళ వారు మీతో కలసి బయలుదేరి ఉండినట్లయితే మీకు కీడు చేయటం తప్ప మరి దేనినీ పెంచి ఉండేవారు కారు. పైగా మీ మధ్య అదే పనిగా గుర్రాలను పరుగెత్తించేవారు. మీలో చీలికను తెచ్చే ప్రయత్నాల్లో ఉండేవారు. వారి మాటలను వినేవారు స్వయంగా మీలోనే ఉన్నారు. ఆ దుర్మార్గుల సంగతి అంతా అల్లాహ్‌కు తెలుసు.
9:48 لَقَدِ ابْتَغَوُا الْفِتْنَةَ مِن قَبْلُ وَقَلَّبُوا لَكَ الْأُمُورَ حَتَّىٰ جَاءَ الْحَقُّ وَظَهَرَ أَمْرُ اللَّهِ وَهُمْ كَارِهُونَ
వారు ఇంతకు ముందు కూడా విభేదాలను సృష్టించే ప్రయత్నాలు చేశారు. నీ కార్యక్రమాలను తలక్రిందులుగా చేసే చేష్టలకు కూడా ఒడిగట్టారు. కడకు వారి ఇష్టానికి వ్యతిరేకంగా సత్యం వచ్చేసింది, దైవాజ్ఞే ఆధిపత్యం వహించింది.
9:49 وَمِنْهُم مَّن يَقُولُ ائْذَن لِّي وَلَا تَفْتِنِّي ۚ أَلَا فِي الْفِتْنَةِ سَقَطُوا ۗ وَإِنَّ جَهَنَّمَ لَمُحِيطَةٌ بِالْكَافِرِينَ
“నాకు అనుమతి ఇవ్వండి. నన్ను పరీక్షకు గురి చేయకండి” అని వారిలో ఒకడంటాడు. తెలుసుకోండి! వారు పరీక్షకు గురయ్యే ఉన్నారు. నిశ్చయంగా నరకం అవిశ్వాసులను చుట్టు ముట్టేస్తుంది.
9:50 إِن تُصِبْكَ حَسَنَةٌ تَسُؤْهُمْ ۖ وَإِن تُصِبْكَ مُصِيبَةٌ يَقُولُوا قَدْ أَخَذْنَا أَمْرَنَا مِن قَبْلُ وَيَتَوَلَّوا وَّهُمْ فَرِحُونَ
నీకు ఏదైనా మేలు కలిగితే వారికి అది బాధ కలిగిస్తుంది. ఒకవేళ మీపై ఏదైనా ఆపద వస్తే “(అలాంటిదేదో జరుగుతుందనే) మేము ముందుగానే జాగ్రత్త పడ్డామ”ని చెబుతూ, సంబరపడుతూ వెళ్ళిపోతారు.
9:51 قُل لَّن يُصِيبَنَا إِلَّا مَا كَتَبَ اللَّهُ لَنَا هُوَ مَوْلَانَا ۚ وَعَلَى اللَّهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُونَ
“అల్లాహ్ మాకు రాసిపెట్టినది తప్ప మరొకటి మాకు జరగదు. ఆయనే మా సంరక్షకుడు. విశ్వాసులైనవారు అల్లాహ్‌నే నమ్ముకోవాలి” అని (ఓప్రవక్తా!) వారికిచెప్పు.
9:52 قُلْ هَلْ تَرَبَّصُونَ بِنَا إِلَّا إِحْدَى الْحُسْنَيَيْنِ ۖ وَنَحْنُ نَتَرَبَّصُ بِكُمْ أَن يُصِيبَكُمُ اللَّهُ بِعَذَابٍ مِّنْ عِندِهِ أَوْ بِأَيْدِينَا ۖ فَتَرَبَّصُوا إِنَّا مَعَكُم مُّتَرَبِّصُونَ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “మీరు మా విషయంలో దేనికోసం ఎదురుచూస్తున్నారో అది రెండు మేళ్ళలో ఒకటి తప్ప మరొకటేముంది? కాగా; మీ విషయంలో మేమూ నిరీక్షిస్తున్నాము- అల్లాహ్ తాను స్వయంగానయినా మిమ్మల్ని శిక్షిస్తాడు లేదా మా చేతుల మీదుగానయినా (శిక్ష విధిస్తాడు) కాబట్టి మీరూ ఎదురు చూస్తూ ఉండండి. మరోవైపు మేమూ మీతోపాటే ఎదురు చూస్తూ ఉంటాము.”
9:53 قُلْ أَنفِقُوا طَوْعًا أَوْ كَرْهًا لَّن يُتَقَبَّلَ مِنكُمْ ۖ إِنَّكُمْ كُنتُمْ قَوْمًا فَاسِقِينَ
వారికి చెప్పు: “మీరు ఇష్టపూర్వకంగా ఖర్చుపెట్టినా, ఇష్టం లేకుండా ఖర్చుపెట్టినా అది ఎట్టి పరిస్థితిలోనూ స్వీకారయోగ్యమవదు. నిశ్చయంగా మీరు అవిధేయులే.”
9:54 وَمَا مَنَعَهُمْ أَن تُقْبَلَ مِنْهُمْ نَفَقَاتُهُمْ إِلَّا أَنَّهُمْ كَفَرُوا بِاللَّهِ وَبِرَسُولِهِ وَلَا يَأْتُونَ الصَّلَاةَ إِلَّا وَهُمْ كُسَالَىٰ وَلَا يُنفِقُونَ إِلَّا وَهُمْ كَارِهُونَ
వారు పెట్టే ఖర్చు స్వీకరించబడక పోవటానికి కారణం ఇది తప్ప మరొకటేమీ కాదు: వారు అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తను తిరస్కరించారు. ఒకవేళ వారు నమాజుకు వచ్చినా బద్దకంతో వస్తారు. (దైవ మార్గంలో) ఖర్చుపెట్టినా అయిష్టంగానే ఖర్చుపెడతారు.
9:55 فَلَا تُعْجِبْكَ أَمْوَالُهُمْ وَلَا أَوْلَادُهُمْ ۚ إِنَّمَا يُرِيدُ اللَّهُ لِيُعَذِّبَهُم بِهَا فِي الْحَيَاةِ الدُّنْيَا وَتَزْهَقَ أَنفُسُهُمْ وَهُمْ كَافِرُونَ
వారి సిరిసంపదలు, సంతానం నిన్ను ఆశ్చర్యానికి లోనుచేయకూడదు. వాటి ద్వారా ప్రాపంచిక జీవితంలోనే వారిని శిక్షించాలనీ, సత్యాన్ని తిరస్కరించిన స్థితిలోనే వారి ప్రాణాలు పోవాలని అల్లాహ్ కోరుతున్నాడు.
9:56 وَيَحْلِفُونَ بِاللَّهِ إِنَّهُمْ لَمِنكُمْ وَمَا هُم مِّنكُمْ وَلَٰكِنَّهُمْ قَوْمٌ يَفْرَقُونَ
“మేము మీతోనే ఉన్నాము” అని వారు అల్లాహ్ మీద ఒట్టేసి మరీ చెబుతున్నారు. వాస్తవానికి వారు మీ వారు కారు. వారసలు పిరికిపందలు.
9:57 لَوْ يَجِدُونَ مَلْجَأً أَوْ مَغَارَاتٍ أَوْ مُدَّخَلًا لَّوَلَّوْا إِلَيْهِ وَهُمْ يَجْمَحُونَ
వారికి రక్షణా స్థలంగానీ, గుహలుగానీ, తలదూర్చే చిన్న బిలంగానీ – ఏది కనిపించినా వారు దాని వైపుకు పగ్గాలు త్రెంచుకుని పారిపోతారు.
9:58 وَمِنْهُم مَّن يَلْمِزُكَ فِي الصَّدَقَاتِ فَإِنْ أُعْطُوا مِنْهَا رَضُوا وَإِن لَّمْ يُعْطَوْا مِنْهَا إِذَا هُمْ يَسْخَطُونَ
దానాల పంపిణీ విషయంలో నిన్ను నిందించేవారు కూడా వారిలో ఉన్నారు. అందులో నుంచి వారికి లభిస్తే సంతోషిస్తారు. లభించకపోతే వెంటనే కోపాన్ని వెళ్ళగ్రక్కుతారు.
9:59 وَلَوْ أَنَّهُمْ رَضُوا مَا آتَاهُمُ اللَّهُ وَرَسُولُهُ وَقَالُوا حَسْبُنَا اللَّهُ سَيُؤْتِينَا اللَّهُ مِن فَضْلِهِ وَرَسُولُهُ إِنَّا إِلَى اللَّهِ رَاغِبُونَ
అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఇచ్చిన దానితో తృప్తి చెంది, “మాకు అల్లాహ్ చాలు. అల్లాహ్ తన కృపతో మాకు మరింత అనుగ్రహిస్తాడు. ఆయన ప్రవక్త కూడా మాకు వొసగుతాడు. మేము మాత్రం అల్లాహ్‌పైనే ఆశలు పెట్టుకున్నాము” అని వారు చెప్పి ఉంటే (ఎంత బావుండేది)!
9:60 إِنَّمَا الصَّدَقَاتُ لِلْفُقَرَاءِ وَالْمَسَاكِينِ وَالْعَامِلِينَ عَلَيْهَا وَالْمُؤَلَّفَةِ قُلُوبُهُمْ وَفِي الرِّقَابِ وَالْغَارِمِينَ وَفِي سَبِيلِ اللَّهِ وَابْنِ السَّبِيلِ ۖ فَرِيضَةً مِّنَ اللَّهِ ۗ وَاللَّهُ عَلِيمٌ حَكِيمٌ
దానాలను కేవలం నిరుపేదల కొరకూ, అభాగ్య జీవుల కొరకు, వాటి వసూళ్ల కోసం నియమితులైన వారికొరకు, హృదయాలను ఆకట్టుకోవలసి ఉన్నవారి కొరకు, మెడలను విడిపించటానికీ, రుణగ్రస్తుల కొరకూ, దైవమార్గం కొరకూ, బాటసారుల కొరకూ వెచ్చించాలి. ఇది అల్లాహ్ తరఫున నిర్ణయించబడిన ఒక విధి. అల్లాహ్ మహాజ్ఞాని, మహావివేకి.
9:61 وَمِنْهُمُ الَّذِينَ يُؤْذُونَ النَّبِيَّ وَيَقُولُونَ هُوَ أُذُنٌ ۚ قُلْ أُذُنُ خَيْرٍ لَّكُمْ يُؤْمِنُ بِاللَّهِ وَيُؤْمِنُ لِلْمُؤْمِنِينَ وَرَحْمَةٌ لِّلَّذِينَ آمَنُوا مِنكُمْ ۚ وَالَّذِينَ يُؤْذُونَ رَسُولَ اللَّهِ لَهُمْ عَذَابٌ أَلِيمٌ
ప్రవక్తను బాధించేవారు కూడా వారిలో కొందరున్నారు. “ఈయన చెప్పుడు మాటలు వినేవాడు” అని వారంటున్నారు. వారికి చెప్పు: “ఆ వినేవాడు మీ మేలును కోరేవాడే. అతడు అల్లాహ్‌ను విశ్వసిస్తాడు. ముస్లింల మాటల్ని నమ్ముతాడు. మీలో విశ్వసించిన వారి యెడల అతడు కారుణ్యమూర్తి. దైవప్రవక్త (సఅసం)ను బాధించే వారికి బాధాకరమైన శిక్ష ఖాయం.”
9:62 يَحْلِفُونَ بِاللَّهِ لَكُمْ لِيُرْضُوكُمْ وَاللَّهُ وَرَسُولُهُ أَحَقُّ أَن يُرْضُوهُ إِن كَانُوا مُؤْمِنِينَ
మిమ్మల్నిసంతోషపెట్టడానికి వారు మీ ముందు అల్లాహ్‌పై ప్రమాణాలు చేస్తూ పోతారు. వారు విశ్వాసులే గనక అయితే వారి ఈ సంతోషపెట్టే ధోరణికి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త అందరికంటే ఎక్కువ హక్కుదారులు.
9:63 أَلَمْ يَعْلَمُوا أَنَّهُ مَن يُحَادِدِ اللَّهَ وَرَسُولَهُ فَأَنَّ لَهُ نَارَ جَهَنَّمَ خَالِدًا فِيهَا ۚ ذَٰلِكَ الْخِزْيُ الْعَظِيمُ
ఎవడు అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తను ఎదిరిస్తాడో అతని కొరకు నరకాగ్ని (కాచుకొని) ఉంటుందనీ, అందులో అతను కలకాలం ఉండవలసి వస్తుందనీ, అది ఘోరపరాభవమనీ వారికి తెలియదా?
9:64 يَحْذَرُ الْمُنَافِقُونَ أَن تُنَزَّلَ عَلَيْهِمْ سُورَةٌ تُنَبِّئُهُم بِمَا فِي قُلُوبِهِمْ ۚ قُلِ اسْتَهْزِئُوا إِنَّ اللَّهَ مُخْرِجٌ مَّا تَحْذَرُونَ
తమ గుండెల్లో దాగివున్న గుట్టును రట్టుచేసే సూరా ఏదైనా (ముస్లిములపై) అవతరిస్తుందేమోనన్న భయం ఈ కపటులను అనుక్షణం వెంటాడుతూ ఉంటుంది. (ప్రవక్తా!) వారికి చెప్పు: మీరు ఎగతాళి చేస్తూనే ఉండండి. దేని గురించి మీరు భయపడుతున్నారో దాన్ని అల్లాహ్ ఎలాగూ బయటపెట్టనున్నాడు.
9:65 وَلَئِن سَأَلْتَهُمْ لَيَقُولُنَّ إِنَّمَا كُنَّا نَخُوضُ وَنَلْعَبُ ۚ قُلْ أَبِاللَّهِ وَآيَاتِهِ وَرَسُولِهِ كُنتُمْ تَسْتَهْزِئُونَ
(మీరు చెప్పుకుంటూ ఉన్న విషయం ఏమిటి? అని) నువ్వు వారిని అడిగితే, “అబ్బే ఏమీలేదు. ఏదో సరదాగా, నవ్వులాటకు ఇలా చెప్పుకుంటున్నాము” అని వారంటారు. “ఏమిటీ, మీరు అల్లాహ్‌తో, ఆయన ఆయతులతో, ఆయన ప్రవక్తలతో పరిహాసమాడుతున్నారా? అని అడుగు.
9:66 لَا تَعْتَذِرُوا قَدْ كَفَرْتُم بَعْدَ إِيمَانِكُمْ ۚ إِن نَّعْفُ عَن طَائِفَةٍ مِّنكُمْ نُعَذِّبْ طَائِفَةً بِأَنَّهُمْ كَانُوا مُجْرِمِينَ
“మీరింక సాకులు చెప్పకండి. మీరు విశ్వసించిన తరువాత అవిశ్వాసానికి ఒడిగట్టారు. ఒకవేళ మేము మీలో కొందరిని మన్నించినా, మరికొందరిని వారి నేరాలకుగాను కఠినంగా శిక్షిస్తాము” అని (ఓప్రవక్తా!) వారికి చెప్పు.
9:67 الْمُنَافِقُونَ وَالْمُنَافِقَاتُ بَعْضُهُم مِّن بَعْضٍ ۚ يَأْمُرُونَ بِالْمُنكَرِ وَيَنْهَوْنَ عَنِ الْمَعْرُوفِ وَيَقْبِضُونَ أَيْدِيَهُمْ ۚ نَسُوا اللَّهَ فَنَسِيَهُمْ ۗ إِنَّ الْمُنَافِقِينَ هُمُ الْفَاسِقُونَ
కపటులైన పురుషులూ, స్త్రీలూ- వారంతా ఒక్కటే. వారు చెడు విషయాల గురించి ఆజ్ఞాపించి, మంచి విషయాల నుంచి ఆపుతారు. తమ గుప్పెళ్ళను మూసి ఉంచుతారు. వారు అల్లాహ్‌ను విస్మరించారు. అందుకే అల్లాహ్ కూడా వారిని విస్మరించాడు. నిశ్చయంగా కపటులే పాపాత్ములు (అవిధేయులు).
9:68 وَعَدَ اللَّهُ الْمُنَافِقِينَ وَالْمُنَافِقَاتِ وَالْكُفَّارَ نَارَ جَهَنَّمَ خَالِدِينَ فِيهَا ۚ هِيَ حَسْبُهُمْ ۚ وَلَعَنَهُمُ اللَّهُ ۖ وَلَهُمْ عَذَابٌ مُّقِيمٌ
కపటులైన పురుషులకూ, స్త్రీలకూ, ఇంకా అవిశ్వాసులకూ అల్లాహ్ నరకాగ్ని గురించి వాగ్దానం చేసి వున్నాడు. అందులో వారు సదా పడి ఉంటారు. వారికి తగినది కూడా అదేను. వారిపై అల్లాహ్ యొక్క శాపం పడింది. వారికొరకు శాశ్వితమైన శిక్ష ఉంది.
9:69 كَالَّذِينَ مِن قَبْلِكُمْ كَانُوا أَشَدَّ مِنكُمْ قُوَّةً وَأَكْثَرَ أَمْوَالًا وَأَوْلَادًا فَاسْتَمْتَعُوا بِخَلَاقِهِمْ فَاسْتَمْتَعْتُم بِخَلَاقِكُمْ كَمَا اسْتَمْتَعَ الَّذِينَ مِن قَبْلِكُم بِخَلَاقِهِمْ وَخُضْتُمْ كَالَّذِي خَاضُوا ۚ أُولَٰئِكَ حَبِطَتْ أَعْمَالُهُمْ فِي الدُّنْيَا وَالْآخِرَةِ ۖ وَأُولَٰئِكَ هُمُ الْخَاسِرُونَ
(కపటులారా! చూడబోతే మీ పరిస్థితి కూడా) మీ పూర్వీకుల మాదిరిగానే ఉంది. వారు మీకన్నా బలవంతులు. మీకన్నా ఎక్కువ సిరిసంపదలు, సంతానం కలవారు. వారు తమవంతు భాగ్యాన్ని వాడుకున్నారు, మీరు కూడా మీవంతు భాగ్యాన్ని జుర్రుకున్నారు, మీ పూర్వీకులు తమ వంతు భాగ్యాన్ని జుర్రుకున్నట్లు. వారి మాదిరిగానే మీరు కూడా వేళాకోళపు వాదనల్లో పడ్డారు. వారి కర్మలు ప్రపంచంలోనూ, పరలోకంలోనూ వృధా అయిపోయాయి. నష్టానికి గురైన వారంటే వీరే.
9:70 أَلَمْ يَأْتِهِمْ نَبَأُ الَّذِينَ مِن قَبْلِهِمْ قَوْمِ نُوحٍ وَعَادٍ وَثَمُودَ وَقَوْمِ إِبْرَاهِيمَ وَأَصْحَابِ مَدْيَنَ وَالْمُؤْتَفِكَاتِ ۚ أَتَتْهُمْ رُسُلُهُم بِالْبَيِّنَاتِ ۖ فَمَا كَانَ اللَّهُ لِيَظْلِمَهُمْ وَلَٰكِن كَانُوا أَنفُسَهُمْ يَظْلِمُونَ
ఏమిటీ, వారికి తమ పూర్వీకులైన నూహ్ జాతివారి, ఆద్ సమూద్ జాతివారి, ఇబ్రాహీమ్ జాతివారి, మద్యన్ వారి, తలక్రిందులుగా చేయబడిన బస్తీలవారి సమాచారం అందలేదా? వారి వద్దకు వారి ప్రవక్తలు నిదర్శనాలను తీసుకువచ్చారు. అల్లాహ్ వారికెలాంటి అన్యాయం చేయలేదు. వారు తమ స్వయానికి తామే అన్యాయం చేసుకున్నారు.
9:71 وَالْمُؤْمِنُونَ وَالْمُؤْمِنَاتُ بَعْضُهُمْ أَوْلِيَاءُ بَعْضٍ ۚ يَأْمُرُونَ بِالْمَعْرُوفِ وَيَنْهَوْنَ عَنِ الْمُنكَرِ وَيُقِيمُونَ الصَّلَاةَ وَيُؤْتُونَ الزَّكَاةَ وَيُطِيعُونَ اللَّهَ وَرَسُولَهُ ۚ أُولَٰئِكَ سَيَرْحَمُهُمُ اللَّهُ ۗ إِنَّ اللَّهَ عَزِيزٌ حَكِيمٌ
విశ్వాసులైన పురుషులూ, విశ్వాసులైన స్త్రీలూ – వారంతా ఒండొకరికి మిత్రులుగా (సహాయకులుగా, చేదోడు వాదోడుగా) ఉంటారు. వారు మంచిని గురించి ఆజ్ఞాపిస్తారు. చెడుల నుంచి వారిస్తారు. నమాజులను నెలకొల్పుతారు, జకాత్‌ను చెల్లిస్తారు. అల్లాహ్‌కు, ఆయన ప్రవక్తకు విధేయులై ఉంటారు. అల్లాహ్ అతిత్వరలో తన కారుణ్యాన్ని కురిపించేది వీరిపైనే. నిస్సందేహంగా అల్లాహ్ సర్వాధిక్యుడు, వివేచనాశీలి.
9:72 وَعَدَ اللَّهُ الْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا وَمَسَاكِنَ طَيِّبَةً فِي جَنَّاتِ عَدْنٍ ۚ وَرِضْوَانٌ مِّنَ اللَّهِ أَكْبَرُ ۚ ذَٰلِكَ هُوَ الْفَوْزُ الْعَظِيمُ
విశ్వసించిన ఇలాంటి స్త్రీ పురుషులకు, క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలను ప్రసాదిస్తానని అల్లాహ్ వాగ్దానం చేశాడు. అక్కడ వారు కలకాలం ఉంటారు. శాశ్వతంగా ఉండే స్వర్గవనాలలో పరిశుభ్రమైన మేడలు వారి కొరకు ఉంటాయి. వీటన్నింటికన్నా గొప్పదైన అల్లాహ్ ప్రసన్నత వారికి లభిస్తుంది. గొప్ప సాఫల్యం అంటే ఇదే.
9:73 يَا أَيُّهَا النَّبِيُّ جَاهِدِ الْكُفَّارَ وَالْمُنَافِقِينَ وَاغْلُظْ عَلَيْهِمْ ۚ وَمَأْوَاهُمْ جَهَنَّمُ ۖ وَبِئْسَ الْمَصِيرُ
ఓ ప్రవక్తా! అవిశ్వాసులతో, కపటులతో పోరాడుతూ ఉండు. వారి పాలిట కఠినంగా ప్రవర్తించు. వారి అసలు నివాసస్థలం నరకమే. అది అత్యంత చెడ్డస్థలం.
9:74 يَحْلِفُونَ بِاللَّهِ مَا قَالُوا وَلَقَدْ قَالُوا كَلِمَةَ الْكُفْرِ وَكَفَرُوا بَعْدَ إِسْلَامِهِمْ وَهَمُّوا بِمَا لَمْ يَنَالُوا ۚ وَمَا نَقَمُوا إِلَّا أَنْ أَغْنَاهُمُ اللَّهُ وَرَسُولُهُ مِن فَضْلِهِ ۚ فَإِن يَتُوبُوا يَكُ خَيْرًا لَّهُمْ ۖ وَإِن يَتَوَلَّوْا يُعَذِّبْهُمُ اللَّهُ عَذَابًا أَلِيمًا فِي الدُّنْيَا وَالْآخِرَةِ ۚ وَمَا لَهُمْ فِي الْأَرْضِ مِن وَلِيٍّ وَلَا نَصِيرٍ
“మేమలా చెప్పలేద”ని వారు ప్రమాణాలు చేసి చెబుతున్నారు. యదార్థానికి అవిశ్వాస వాక్కు వారి నోట వెలువడింది. ఇస్లాంను స్వీకరించిన తరువాత వారు కుఫ్ర్కు (తిరస్కారానికి) ఒడిగట్టారు. వారు చేయలేకపోయిన దానిని గురించి కూడా నిశ్చయించుకున్నారు. అల్లాహ్, ఆయన ప్రవక్త (సఅసం) తమ చలువతో వారిని సంపన్నులుగా చేసినందుకే వారు ఈ విధంగా ప్రతీకారం తీర్చుకుంటున్నారు. వారు ఇప్పటికైనా పశ్చాత్తాపం చెందితే అది వారికొరకు శ్రేయస్కరం అవుతుంది. ఒకవేళ వారు ముఖం త్రిప్పుకున్నట్లయితే ప్రపంచంలోనూ, పరలోకంలోనూ అల్లాహ్ వారికి వ్యధాభరితమైన శిక్షకు గురి చేస్తాడు. భూమండలంలో వారిని సమర్థించేవాడు, సహాయపడే వాడెవడూ ఉండడు.
9:75 وَمِنْهُم مَّنْ عَاهَدَ اللَّهَ لَئِنْ آتَانَا مِن فَضْلِهِ لَنَصَّدَّقَنَّ وَلَنَكُونَنَّ مِنَ الصَّالِحِينَ
“ఒకవేళ అల్లాహ్ తన కృపతో మాకు సంపదను వొసగినట్లయితే మేము తప్పకుండా దాన ధర్మాలు చేసి, సద్వర్తనుల్లో చేరతాము” అని అల్లాహ్‌తో వాగ్దానం చేసిన వారు కూడా వారిలో ఉన్నారు.
9:76 فَلَمَّا آتَاهُم مِّن فَضْلِهِ بَخِلُوا بِهِ وَتَوَلَّوا وَّهُم مُّعْرِضُونَ
కాని అల్లాహ్ తన కృపతో వారికి కలిమిని ప్రసాదించగా, వారు అందులో పిసినారితనం ప్రదర్శించసాగారు. మాటను దాటవేస్తూ, ముఖం చాటేశారు.
9:77 فَأَعْقَبَهُمْ نِفَاقًا فِي قُلُوبِهِمْ إِلَىٰ يَوْمِ يَلْقَوْنَهُ بِمَا أَخْلَفُوا اللَّهَ مَا وَعَدُوهُ وَبِمَا كَانُوا يَكْذِبُونَ
ఫలితం ఏమయిందంటే, అల్లాహ్‌తో చేసిన వాగ్దానానికి విరుద్ధంగా ప్రవర్తించిన కారణంగానూ, అబద్ధాలు చెబుతూ ఉన్నందుకుగానూ అల్లాహ్ వారి హృదయాలలో కాపట్యాన్ని ఉంచాడు. అల్లాహ్‌ను కలుసుకునే రోజు వరకూ అది వారిలో ఉంటుంది.
9:78 أَلَمْ يَعْلَمُوا أَنَّ اللَّهَ يَعْلَمُ سِرَّهُمْ وَنَجْوَاهُمْ وَأَنَّ اللَّهَ عَلَّامُ الْغُيُوبِ
ఏమిటీ, తమలోగుట్టు గురించి, తమ గుసగుసల గురించి అల్లాహ్‌కు అంతా తెలుసుననీ, అల్లాహ్ అగోచర విషయాలన్నింటినీ ఎరిగినవాడనీ వారికి తెలియదా?
9:79 الَّذِينَ يَلْمِزُونَ الْمُطَّوِّعِينَ مِنَ الْمُؤْمِنِينَ فِي الصَّدَقَاتِ وَالَّذِينَ لَا يَجِدُونَ إِلَّا جُهْدَهُمْ فَيَسْخَرُونَ مِنْهُمْ ۙ سَخِرَ اللَّهُ مِنْهُمْ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ
విశాలమనసుతో దానధర్మాలు చేసే విశ్వాసులను నిందించేవారిని, (అల్లాహ్ మార్గంలో ఇచ్చేందుకు) తాము చెమటోడ్చి సంపాదించినది తప్ప మరేదీ తమ వద్దలేని వారిని అవహేళన చేస్తూ మాట్లాడేవారిని అల్లాహ్ కూడా ఆట పట్టిస్తాడు. వారికోసం వ్యధాభరితమైన శిక్ష ఉంది.
9:80 اسْتَغْفِرْ لَهُمْ أَوْ لَا تَسْتَغْفِرْ لَهُمْ إِن تَسْتَغْفِرْ لَهُمْ سَبْعِينَ مَرَّةً فَلَن يَغْفِرَ اللَّهُ لَهُمْ ۚ ذَٰلِكَ بِأَنَّهُمْ كَفَرُوا بِاللَّهِ وَرَسُولِهِ ۗ وَاللَّهُ لَا يَهْدِي الْقَوْمَ الْفَاسِقِينَ
(ఓ ప్రవక్తా!) వారి మన్నింపు కోసం నీవు వేడుకున్నా, వేడుకోకపోయినా ఒక్కటే. ఒకవేళ నువ్వు డెబ్భైసార్లు వారి మన్నింపుకోసం వేడుకున్నా సరే అల్లాహ్ క్షమించడుగాక క్షమించడు. ఎందుకంటే, వారు అల్లాహ్ పట్లా, ఆయన ప్రవక్త పట్లా తిరస్కార వైఖరిని అవలంబించారు. ఇటువంటి అవిధేయులకు అల్లాహ్ సన్మార్గం చూపడు.
9:81 فَرِحَ الْمُخَلَّفُونَ بِمَقْعَدِهِمْ خِلَافَ رَسُولِ اللَّهِ وَكَرِهُوا أَن يُجَاهِدُوا بِأَمْوَالِهِمْ وَأَنفُسِهِمْ فِي سَبِيلِ اللَّهِ وَقَالُوا لَا تَنفِرُوا فِي الْحَرِّ ۗ قُلْ نَارُ جَهَنَّمَ أَشَدُّ حَرًّا ۚ لَّوْ كَانُوا يَفْقَهُونَ
వెనుక ఉండి పోయినవారు, దైవప్రవక్త (సఅసం) వెళ్ళిన తరువాత, తాము ఆ విధంగా (ఇంట్లో) ఉండిపోయినందుకు సంబరపడ్డారు. దైవమార్గంలో తమ ధన ప్రాణాలొడ్డి పోరాడటం వారికి బొత్తిగా ఇష్టంలేదు. పై పెచ్చు ”ఇంత తీవ్రమైన ఎండ వేడిలో బయలుదేరకండి” అని అన్నారు. (ఓ ప్రవక్తా!) “నరకాగ్ని ఇంతకన్నా ఎక్కువ వేడిగా ఉంటుంది” అని వారికి చెప్పు. ఆ సంగతిని వారు గ్రహిస్తే ఎంత బావుండు!
9:82 فَلْيَضْحَكُوا قَلِيلًا وَلْيَبْكُوا كَثِيرًا جَزَاءً بِمَا كَانُوا يَكْسِبُونَ
కాబట్టి ఇప్పుడు వారు తమ నిర్వాకానికి (లభించే) ప్రతిఫలంపై బహుకొద్దిగా నవ్వాలి, చాలా ఎక్కువగా ఏడ్వాలి.
9:83 فَإِن رَّجَعَكَ اللَّهُ إِلَىٰ طَائِفَةٍ مِّنْهُمْ فَاسْتَأْذَنُوكَ لِلْخُرُوجِ فَقُل لَّن تَخْرُجُوا مَعِيَ أَبَدًا وَلَن تُقَاتِلُوا مَعِيَ عَدُوًّا ۖ إِنَّكُمْ رَضِيتُم بِالْقُعُودِ أَوَّلَ مَرَّةٍ فَاقْعُدُوا مَعَ الْخَالِفِينَ
ఒకవేళ అల్లాహ్ నిన్ను వారిలోని ఏ వర్గం వద్దకైనా తిరిగి తీసుకువెళితే, అప్పుడు వారు నీవద్దకు వచ్చి, యుద్ధ మైదానానికి రావటానికి నీ అనుమతి గనక అడిగితే, “ఇక మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నాతో కలసి రాలేరు. నాతో కలసి శత్రువులతో పోరాడనూలేరు. మీరు తొలిసారే కూర్చుని ఉండటానికి ఇష్టపడ్డారు. కాబట్టి మీరు ఇప్పుడు కూడా వెనుక ఉండి పోయేవారిలోనే కూర్చుని ఉండండి” అని చెప్పెయ్యి.
9:84 وَلَا تُصَلِّ عَلَىٰ أَحَدٍ مِّنْهُم مَّاتَ أَبَدًا وَلَا تَقُمْ عَلَىٰ قَبْرِهِ ۖ إِنَّهُمْ كَفَرُوا بِاللَّهِ وَرَسُولِهِ وَمَاتُوا وَهُمْ فَاسِقُونَ
వారిలో ఎవడైనా చస్తే నువ్వు వాడి అంత్యక్రియల నమాజు కూడా ఎన్నటికీ చేయకు. వాడి సమాధి వద్ద కూడా నిలబడకు. వారు అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తను తిరస్కరించిన వారు. వారు చచ్చేవరకూ దుష్టులుగా, అవిధేయులుగానే ఉన్నారు.
9:85 وَلَا تُعْجِبْكَ أَمْوَالُهُمْ وَأَوْلَادُهُمْ ۚ إِنَّمَا يُرِيدُ اللَّهُ أَن يُعَذِّبَهُم بِهَا فِي الدُّنْيَا وَتَزْهَقَ أَنفُسُهُمْ وَهُمْ كَافِرُونَ
వారి ఆస్తి పాస్తులను, సంతానాన్ని చూసి నువ్వు ఆశ్చర్యపోకూడదు. వారిని ఈ వస్తువుల ద్వారా ఇహలోకంలోనే శిక్షించాలనీ, ప్రాణాలు పోయే దాకా వారు అవిశ్వాసులుగానే ఉండాలనీ అల్లాహ్ కోరుతున్నాడు.
9:86 وَإِذَا أُنزِلَتْ سُورَةٌ أَنْ آمِنُوا بِاللَّهِ وَجَاهِدُوا مَعَ رَسُولِهِ اسْتَأْذَنَكَ أُولُو الطَّوْلِ مِنْهُمْ وَقَالُوا ذَرْنَا نَكُن مَّعَ الْقَاعِدِينَ
“అల్లాహ్‌ను విశ్వసించండి, ఆయన ప్రవక్తతో కలసి పోరాడండి” అని ఆజ్ఞాపించే సూరా అవతరింపజేయబడినప్పుడు వారిలోని శ్రీమంతుల వర్గం ఒకటి నీ దగ్గరకు వచ్చి, “మమ్మల్ని కూర్చుని ఉండేవారితో పాటే ఉండనివ్వండి” అంటూ అనుమతి కోరుతుంది.
9:87 رَضُوا بِأَن يَكُونُوا مَعَ الْخَوَالِفِ وَطُبِعَ عَلَىٰ قُلُوبِهِمْ فَهُمْ لَا يَفْقَهُونَ
వారు ఇండ్లల్లో ఉండే ఆడవారి వెంట ఉండటానికే ఇష్టపడ్డారు. వారి హృదయాలపై ముద్ర వేయబడింది. కాబట్టి ఇప్పుడు ఏ విషయమూ వారికి అర్థం కాదు.
9:88 لَٰكِنِ الرَّسُولُ وَالَّذِينَ آمَنُوا مَعَهُ جَاهَدُوا بِأَمْوَالِهِمْ وَأَنفُسِهِمْ ۚ وَأُولَٰئِكَ لَهُمُ الْخَيْرَاتُ ۖ وَأُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ
కాని స్వయంగా ప్రవక్తనూ, ఆయనతో పాటు విశ్వసించిన వారినీ చూడండి; వారు తమ ధన ప్రాణాలతో దైవమార్గంలో పోరాడుతున్నారు. కాబట్టి మేళ్లు గలవారు వీరే. సాఫల్యభాగ్యం పొందేవారు కూడా వీరే.
9:89 أَعَدَّ اللَّهُ لَهُمْ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا ۚ ذَٰلِكَ الْفَوْزُ الْعَظِيمُ
వీరి కోసమే అల్లాహ్, క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలను సిద్ధంచేసి ఉంచాడు. వాటిలో వారు శాశ్వతంగా ఉంటారు. గొప్ప విజయభాగ్యం అంటే ఇదే.
9:90 وَجَاءَ الْمُعَذِّرُونَ مِنَ الْأَعْرَابِ لِيُؤْذَنَ لَهُمْ وَقَعَدَ الَّذِينَ كَذَبُوا اللَّهَ وَرَسُولَهُ ۚ سَيُصِيبُ الَّذِينَ كَفَرُوا مِنْهُمْ عَذَابٌ أَلِيمٌ
పల్లెవాసుల్లోని సాకులు చెప్పేవాళ్లు కూడా తమకు (యుద్ధం నుంచి) సెలవు ఇవ్వమని కోరుతూ వచ్చారు. అల్లాహ్‌తోనూ, ఆయన ప్రవక్తతోనూ అబద్దాలాడిన వారు ఎలాగూ కూర్చొనే ఉండిపోయారు. వారిలో అవిశ్వాస పోకడను ప్రదర్శించిన వారికి బాధాకరమైన శిక్ష తప్పదు.
9:91 لَّيْسَ عَلَى الضُّعَفَاءِ وَلَا عَلَى الْمَرْضَىٰ وَلَا عَلَى الَّذِينَ لَا يَجِدُونَ مَا يُنفِقُونَ حَرَجٌ إِذَا نَصَحُوا لِلَّهِ وَرَسُولِهِ ۚ مَا عَلَى الْمُحْسِنِينَ مِن سَبِيلٍ ۚ وَاللَّهُ غَفُورٌ رَّحِيمٌ
బలహీనులపై, రోగపీడితులపై, ఖర్చు పెట్టడానికి తమ వద్ద ఏమీలేని వారిపై – ఏ దోషమూ లేదు. అయితే వారు అల్లాహ్ పట్ల, ఆయన ప్రవక్త పట్ల శ్రేయోభిలాషులై ఉండాలి. అలాంటి సజ్జనులపై ఆరోపణలకు ఏ ఆస్కారమూ లేదు. అల్లాహ్ అపారంగా క్షమించేవాడు, కరుణించేవాడూను.
9:92 وَلَا عَلَى الَّذِينَ إِذَا مَا أَتَوْكَ لِتَحْمِلَهُمْ قُلْتَ لَا أَجِدُ مَا أَحْمِلُكُمْ عَلَيْهِ تَوَلَّوا وَّأَعْيُنُهُمْ تَفِيضُ مِنَ الدَّمْعِ حَزَنًا أَلَّا يَجِدُوا مَا يُنفِقُونَ
నీ వద్దకు వచ్చి, తమకు వాహనాలు సమకూర్చమని విన్నవించుకునే వారిపై కూడా ఎలాంటి ఆక్షేపణలకు ఆస్కారంలేదు. “మీకు ఇవ్వటానికి నా వద్ద ఏ వాహనమూ లేదు” అని నువ్వు వారికి చెప్పినప్పుడు వారు దుఃఖవదనులౌతారు. వారి కళ్లల్లో నుంచి కన్నీరు ఉబికి వస్తుండగా (క్లిష్ట పరిస్థితిలో) ఖర్చుపెట్టడానికి తమ వద్ద ఏమీ లేనందుకు వారు విలపిస్తూ తిరిగి వెళ్ళిపోతారు.
9:93 إِنَّمَا السَّبِيلُ عَلَى الَّذِينَ يَسْتَأْذِنُونَكَ وَهُمْ أَغْنِيَاءُ ۚ رَضُوا بِأَن يَكُونُوا مَعَ الْخَوَالِفِ وَطَبَعَ اللَّهُ عَلَىٰ قُلُوبِهِمْ فَهُمْ لَا يَعْلَمُونَ
స్థితిమంతులై ఉండి కూడా నీ నుండి అనుమతిని కోరేవారిపై మాత్రం దోషం ఉంది. వారు ఇంటి పట్టున ఉండే ఆడవారి వెంట ఉండటానికే ఇష్టపడ్డారు. వారి హృదయాలపై అల్లాహ్ ముద్రవేశాడు. అందువల్ల వారు తెలుసుకోలేకపోతున్నారు.
9:94 يَعْتَذِرُونَ إِلَيْكُمْ إِذَا رَجَعْتُمْ إِلَيْهِمْ ۚ قُل لَّا تَعْتَذِرُوا لَن نُّؤْمِنَ لَكُمْ قَدْ نَبَّأَنَا اللَّهُ مِنْ أَخْبَارِكُمْ ۚ وَسَيَرَى اللَّهُ عَمَلَكُمْ وَرَسُولُهُ ثُمَّ تُرَدُّونَ إِلَىٰ عَالِمِ الْغَيْبِ وَالشَّهَادَةِ فَيُنَبِّئُكُم بِمَا كُنتُمْ تَعْمَلُونَ
మీరు వారి వద్దకు తిరిగి వెళ్ళినప్పుడు, వారు మీ దగ్గరకు వచ్చి సాకులు చెబుతారు. (ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను : “సాకులు చెప్పకండి. మీరు చెప్పే ఏ మాటనూ మేము నమ్మబోము. మీ సమాచారమంతా అల్లాహ్ మాకు తెలియజేశాడు. ఇక మీదట కూడా అల్లాహ్, ఆయన ప్రవక్త మీ కార్యకలాపాలను గమనిస్తూనే ఉంటారు. తరువాత మీరంతా గోచరాగోచర విషయాలన్నీ తెలిసిన వాని వైపుకు మరలింపబడతారు. మరి మీరు ఏమేమి చేస్తూ ఉండేవారో ఆయన మీకు తెలుపుతాడు.”
9:95 سَيَحْلِفُونَ بِاللَّهِ لَكُمْ إِذَا انقَلَبْتُمْ إِلَيْهِمْ لِتُعْرِضُوا عَنْهُمْ ۖ فَأَعْرِضُوا عَنْهُمْ ۖ إِنَّهُمْ رِجْسٌ ۖ وَمَأْوَاهُمْ جَهَنَّمُ جَزَاءً بِمَا كَانُوا يَكْسِبُونَ
మీరు వారి వద్దకు తిరిగి వెళ్ళినప్పుడు, మీరు వారిని వారి మానాన వదలి పెడతారన్న ఉద్దేశంతో, వారు మీ ముందు అల్లాహ్‌పై ప్రమాణాలు చేయటం మొదలెడతారు. కాబట్టి మీరు వాళ్ళను వాళ్ళమానాన వదలిపెట్టండి. వాళ్ళు పరమ అశుద్ధులు. వారు సంపాదించుకున్న దానికి ప్రతిఫలంగా వారి నివాస స్థానం నరకం అవుతుంది.
9:96 يَحْلِفُونَ لَكُمْ لِتَرْضَوْا عَنْهُمْ ۖ فَإِن تَرْضَوْا عَنْهُمْ فَإِنَّ اللَّهَ لَا يَرْضَىٰ عَنِ الْقَوْمِ الْفَاسِقِينَ
మీరు వారి పట్ల ప్రసన్నులవుతారన్న ఉద్దేశంతోనే వారు ప్రమాణాలు చేస్తారు. ఒకవేళ మీరు వారి పట్ల ప్రసన్నులైనా అల్లాహ్ మాత్రం ఆ అవిధేయులపట్ల ప్రసన్నుడు అవడు.
9:97 الْأَعْرَابُ أَشَدُّ كُفْرًا وَنِفَاقًا وَأَجْدَرُ أَلَّا يَعْلَمُوا حُدُودَ مَا أَنزَلَ اللَّهُ عَلَىٰ رَسُولِهِ ۗ وَاللَّهُ عَلِيمٌ حَكِيمٌ
పల్లెటూరి బైతులు అవిశ్వాసం, కాపట్యంలో మరింత కరడు గట్టినవారు. అల్లాహ్ తన ప్రవక్తపై అవతరింపజేసిన ఆదేశాల గురించి వారికి తెలియకుండా ఉండే అవకాశాలు ఎక్కువ. అల్లాహ్ మహాజ్ఞాని, గొప్ప వివేకవంతుడు.
9:98 وَمِنَ الْأَعْرَابِ مَن يَتَّخِذُ مَا يُنفِقُ مَغْرَمًا وَيَتَرَبَّصُ بِكُمُ الدَّوَائِرَ ۚ عَلَيْهِمْ دَائِرَةُ السَّوْءِ ۗ وَاللَّهُ سَمِيعٌ عَلِيمٌ
తాము ఖర్చు పెట్టేదంతా ఒక విధంగా తమపై విధించబడిన జరిమానా అని భావించే వారు కూడా ఈ పల్లెవాసులలో కొందరున్నారు. మీపై చెడ్డకాలం ఎప్పుడు వస్తుందా! అని వారు ఎదురుచూస్తున్నారు. చెడ్డకాలం వాళ్లపైనే వచ్చిపడుతుంది. అల్లాహ్ అంతా వినేవాడు, అన్నీ ఎరిగినవాడు.
9:99 وَمِنَ الْأَعْرَابِ مَن يُؤْمِنُ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ وَيَتَّخِذُ مَا يُنفِقُ قُرُبَاتٍ عِندَ اللَّهِ وَصَلَوَاتِ الرَّسُولِ ۚ أَلَا إِنَّهَا قُرْبَةٌ لَّهُمْ ۚ سَيُدْخِلُهُمُ اللَّهُ فِي رَحْمَتِهِ ۗ إِنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ
మరి ఈ పల్లె జనులలోనే అల్లాహ్‌ను, అంతిమదినాన్ని విశ్వసించేవారు కూడా ఉన్నారు. తాము ఖర్చుపెట్టే సొమ్మును దైవసామీప్యం పొందే, దైవప్రవక్త వేడుకోలుకు (దుఆకు) సాధనంగా ఉపయోగపడే వస్తువుగా వారు తలపోస్తారు. తెలుసుకోండి! వారు చేసే ఈ ఖర్చు నిశ్చయంగా వారి యెడల సామీప్య సాధనం అవుతుంది. అల్లాహ్ తప్పకుండా వారిని తన కారుణ్యంలో చేర్చుకుంటాడు. నిస్సందేహంగా అల్లాహ్ క్షమాశీలుడు, దయామయుడు.
9:100 وَالسَّابِقُونَ الْأَوَّلُونَ مِنَ الْمُهَاجِرِينَ وَالْأَنصَارِ وَالَّذِينَ اتَّبَعُوهُم بِإِحْسَانٍ رَّضِيَ اللَّهُ عَنْهُمْ وَرَضُوا عَنْهُ وَأَعَدَّ لَهُمْ جَنَّاتٍ تَجْرِي تَحْتَهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا أَبَدًا ۚ ذَٰلِكَ الْفَوْزُ الْعَظِيمُ
ముహాజిర్లలో, అన్సార్లలో ప్రప్రథమంగా ముందంజ వేసిన వారితోనూ, తరువాత చిత్తశుద్ధితో వారిని అనుసరించిన వారితోనూ అల్లాహ్ ప్రసన్నుడయ్యాడు. వారు అల్లాహ్ పట్ల ప్రసన్నులయ్యారు. క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలను అల్లాహ్ వారికోసం సిద్ధం చేసి ఉంచాడు. వాటిలో వారు కలకాలం ఉంటారు. గొప్ప సాఫల్యం అంటే ఇదే.
9:101 وَمِمَّنْ حَوْلَكُم مِّنَ الْأَعْرَابِ مُنَافِقُونَ ۖ وَمِنْ أَهْلِ الْمَدِينَةِ ۖ مَرَدُوا عَلَى النِّفَاقِ لَا تَعْلَمُهُمْ ۖ نَحْنُ نَعْلَمُهُمْ ۚ سَنُعَذِّبُهُم مَّرَّتَيْنِ ثُمَّ يُرَدُّونَ إِلَىٰ عَذَابٍ عَظِيمٍ
ఇకపోతే; మీ చుట్టుప్రక్కల ఉండే పల్లెవాసులలోనూ, మదీనాలో నివసించేవారిలోనూ కొందరు వంచకులు (మునాఫిక్లు) ఉన్నారు. వారు వంచనలో మహామొండివారు. (ఓ ప్రవక్తా!) నువ్వు వారిని ఎరుగవు. వారెవరో మాకు తెలుసు. మేము వారికి రెట్టింపు శిక్షను విధిస్తాము. అనంతరం వారు ఘోరమైన శిక్ష వైపుకు తరలించబడతారు.
9:102 وَآخَرُونَ اعْتَرَفُوا بِذُنُوبِهِمْ خَلَطُوا عَمَلًا صَالِحًا وَآخَرَ سَيِّئًا عَسَى اللَّهُ أَن يَتُوبَ عَلَيْهِمْ ۚ إِنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ
తమ తప్పులను ఒప్పుకున్నవారు మరికొందరున్నారు. వారు మిశ్రమమైన కర్మలు చేశారు – కొన్ని సత్కార్యాలు, కొన్ని దుష్కార్యాలు! అల్లాహ్ వారి పశ్చాత్తాపాన్ని స్వీకరిస్తాడన్న ఆశ ఉంది. నిశ్చయంగా అల్లాహ్ అపారంగా క్షమించేవాడు, అమితంగా కరుణించేవాడు.
9:103 خُذْ مِنْ أَمْوَالِهِمْ صَدَقَةً تُطَهِّرُهُمْ وَتُزَكِّيهِم بِهَا وَصَلِّ عَلَيْهِمْ ۖ إِنَّ صَلَاتَكَ سَكَنٌ لَّهُمْ ۗ وَاللَّهُ سَمِيعٌ عَلِيمٌ
(ఓ ప్రవక్తా!) నువ్వు వారిని పరిశుద్ధపరచటానికీ, వారిని తీర్చిదిద్దటానికీ వారి సంపదల నుంచి దానాలను తీసుకో. వారి బాగోగులకోసం ప్రార్థించు. నిస్సందేహంగా నీ ప్రార్థన (దుఆ) వల్ల వారికి శాంతి లభిస్తుంది. అల్లాహ్ అంతావినేవాడు, అన్నీ తెలిసినవాడు.
9:104 أَلَمْ يَعْلَمُوا أَنَّ اللَّهَ هُوَ يَقْبَلُ التَّوْبَةَ عَنْ عِبَادِهِ وَيَأْخُذُ الصَّدَقَاتِ وَأَنَّ اللَّهَ هُوَ التَّوَّابُ الرَّحِيمُ
ఏమిటీ, అల్లాహ్‌యే తన దాసుల పశ్చాత్తాపాన్ని స్వీకరిస్తాడనీ, దానధర్మాలను ఆమోదిస్తాడనీ, పశ్చాత్తాపాన్ని అంగీకరించటంలోనూ, దయజూపటంలోనూ అల్లాహ్‌యే మేటి అనీ వారికి తెలియదా?
9:105 وَقُلِ اعْمَلُوا فَسَيَرَى اللَّهُ عَمَلَكُمْ وَرَسُولُهُ وَالْمُؤْمِنُونَ ۖ وَسَتُرَدُّونَ إِلَىٰ عَالِمِ الْغَيْبِ وَالشَّهَادَةِ فَيُنَبِّئُكُم بِمَا كُنتُمْ تَعْمَلُونَ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “మీ పనులు మీరు చేస్తూపోండి. మీ పనులను అల్లాహ్ స్వయంగా చూస్తాడు. ఆయన ప్రవక్త మరియు విశ్వాసులు కూడా (చూస్తారు). గోప్యమైన వాటినీ, బహిరంగమైన వాటినీ ఎరిగిన వాని వద్దకు మీరు ఎలాగూ మరలక తప్పదు. మీరు చేస్తూ ఉన్న దాన్నంతటినీ ఆయన మీకు తెలియజేస్తాడు.
9:106 وَآخَرُونَ مُرْجَوْنَ لِأَمْرِ اللَّهِ إِمَّا يُعَذِّبُهُمْ وَإِمَّا يَتُوبُ عَلَيْهِمْ ۗ وَاللَّهُ عَلِيمٌ حَكِيمٌ
ఇంకా కొందరున్నారు – వాళ్ల వ్యవహారం దైవాదేశం వచ్చేవరకూ వాయిదా వేయబడింది. అల్లాహ్ వారిని శిక్షించనూవచ్చు లేదా క్షమించనూవచ్చు. అల్లాహ్ అన్నీతెలిసినవాడు, వివేకవంతుడు.
9:107 وَالَّذِينَ اتَّخَذُوا مَسْجِدًا ضِرَارًا وَكُفْرًا وَتَفْرِيقًا بَيْنَ الْمُؤْمِنِينَ وَإِرْصَادًا لِّمَنْ حَارَبَ اللَّهَ وَرَسُولَهُ مِن قَبْلُ ۚ وَلَيَحْلِفُنَّ إِنْ أَرَدْنَا إِلَّا الْحُسْنَىٰ ۖ وَاللَّهُ يَشْهَدُ إِنَّهُمْ لَكَاذِبُونَ
(కపటులలో) మరి కొంతమంది కూడా ఉన్నారు – కీడు కలిగించే, అవిశ్వాసంతో కూడిన మాటలు చెప్పుకునే ఉద్దేశంతో, విశ్వాసుల మధ్య చీలికను తెచ్చే లక్ష్యంతో, అంతకు మునుపు అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తను వ్యతిరేకించిన వ్యక్తికి ఆసరా ఇచ్చే ఆలోచనతో వారు ఒక మస్జిదును నిర్మించారు. (ఈ కట్టడాన్నినిర్మించటంలో) తమ ఉద్దేశం మేలుచేయటం తప్ప మరొకటి కాదని వారు ప్రమాణాలు చేస్తారు. వారు అబద్ధాలకోరులన్న విషయానికి అల్లాహ్‌యే సాక్షి.
9:108 لَا تَقُمْ فِيهِ أَبَدًا ۚ لَّمَسْجِدٌ أُسِّسَ عَلَى التَّقْوَىٰ مِنْ أَوَّلِ يَوْمٍ أَحَقُّ أَن تَقُومَ فِيهِ ۚ فِيهِ رِجَالٌ يُحِبُّونَ أَن يَتَطَهَّرُوا ۚ وَاللَّهُ يُحِبُّ الْمُطَّهِّرِينَ
నువ్వు ఎన్నడూ అందులో నిలబడకు. అయితే తొలినాటి నుంచే భయభక్తుల పునాదిపై నిర్మించబడిన మస్జిదు నువ్వు నిలబడటానికి అన్ని విధాలా తగినది. బాగా పరిశుద్ధతను పొందటాన్ని ఇష్టపడే వారు అందులో ఉన్నారు. బాగా పరిశుద్ధతను పాటించేవారిని అల్లాహ్ ప్రేమిస్తాడు.
9:109 أَفَمَنْ أَسَّسَ بُنْيَانَهُ عَلَىٰ تَقْوَىٰ مِنَ اللَّهِ وَرِضْوَانٍ خَيْرٌ أَم مَّنْ أَسَّسَ بُنْيَانَهُ عَلَىٰ شَفَا جُرُفٍ هَارٍ فَانْهَارَ بِهِ فِي نَارِ جَهَنَّمَ ۗ وَاللَّهُ لَا يَهْدِي الْقَوْمَ الظَّالِمِينَ
తన కట్టడాన్ని దైవభీతి, దైవప్రసన్నతల పునాదిపై కట్టిన వాడు ఉత్తముడా? లేక కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న ఏదైనా లోయ యొక్క డొల్ల అంచున తన కట్టడాన్నికట్టిన వాడు ఉత్తముడా? అటు పిమ్మట అది అతనితో పాటే నరకాగ్నిలో పడిపోయింది. ఇలాంటి దుర్మార్గులకు అల్లాహ్ సన్మార్గం చూపడు.
9:110 لَا يَزَالُ بُنْيَانُهُمُ الَّذِي بَنَوْا رِيبَةً فِي قُلُوبِهِمْ إِلَّا أَن تَقَطَّعَ قُلُوبُهُمْ ۗ وَاللَّهُ عَلِيمٌ حَكِيمٌ
(తమ మనసుల్లోని) అనుమానం మూలంగా వారు కట్టిన ఆకట్టడం నిత్యం వారి హృదయాలను (ముల్లు మాదిరిగా) కెలుకుతూనే ఉంటుంది. వారి హృదయాలు పగిలి తునాతునకలై పోతే అది వేరే విషయం. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, వివేకసంపన్నుడు.
9:111 إِنَّ اللَّهَ اشْتَرَىٰ مِنَ الْمُؤْمِنِينَ أَنفُسَهُمْ وَأَمْوَالَهُم بِأَنَّ لَهُمُ الْجَنَّةَ ۚ يُقَاتِلُونَ فِي سَبِيلِ اللَّهِ فَيَقْتُلُونَ وَيُقْتَلُونَ ۖ وَعْدًا عَلَيْهِ حَقًّا فِي التَّوْرَاةِ وَالْإِنجِيلِ وَالْقُرْآنِ ۚ وَمَنْ أَوْفَىٰ بِعَهْدِهِ مِنَ اللَّهِ ۚ فَاسْتَبْشِرُوا بِبَيْعِكُمُ الَّذِي بَايَعْتُم بِهِ ۚ وَذَٰلِكَ هُوَ الْفَوْزُ الْعَظِيمُ
నిస్సందేహంగా అల్లాహ్ ముస్లింల నుండి, వారి ధన ప్రాణాలను స్వర్గానికి బదులుగా కొన్నాడు. వారు అల్లాహ్ మార్గంలో పోరాడుతారు; చంపుతారు, చంపబడతారు. దీనిపై తౌరాతులోనూ, ఇంజీలులోనూ, ఖుర్ఆన్లోనూ సత్యమైన వాగ్దానం చేయబడింది. వాగ్దానాన్ని నెరవేర్చటంలో అల్లాహ్‌ను మించిన వాడెవడుంటాడు? కాబట్టి మీరు ఖరారు చేసిన ఈ వర్తకానికిగాను సంబరపడండి. ఘనవిజయం అంటే ఇదే.
9:112 التَّائِبُونَ الْعَابِدُونَ الْحَامِدُونَ السَّائِحُونَ الرَّاكِعُونَ السَّاجِدُونَ الْآمِرُونَ بِالْمَعْرُوفِ وَالنَّاهُونَ عَنِ الْمُنكَرِ وَالْحَافِظُونَ لِحُدُودِ اللَّهِ ۗ وَبَشِّرِ الْمُؤْمِنِينَ
వారు ఎలాంటి వారంటే; (దైవసన్నిధిలో) పశ్చాత్తాపం చెందుతూ, ఆరాధనలు చేస్తూ ఉంటారు, అల్లాహ్ స్తోత్రం చేస్తారు, ఉపవాసాలుంటారు (లేక అల్లాహ్ మార్గంలో భూమి మీద సంచారం చేస్తూ ఉంటారు), అల్లాహ్ సమక్షంలో వంగుతూ, సాష్టాంగపడుతూ ఉంటారు. మంచి పనుల గురించి ప్రబోధిస్తూ, చెడు విషయాల నుంచి నిరోధిస్తూ ఉంటారు. ఇంకా అల్లాహ్ నిర్థారించిన హద్దులను కాపాడుతారు. ఇలాంటి విశ్వాసులకు (ఓ ప్రవక్తా!) శుభవార్తను వినిపించు.
9:113 مَا كَانَ لِلنَّبِيِّ وَالَّذِينَ آمَنُوا أَن يَسْتَغْفِرُوا لِلْمُشْرِكِينَ وَلَوْ كَانُوا أُولِي قُرْبَىٰ مِن بَعْدِ مَا تَبَيَّنَ لَهُمْ أَنَّهُمْ أَصْحَابُ الْجَحِيمِ
ముష్రిక్కులు బంధువులైనా సరే, వారు నరకవాసులని స్పష్టమైపోయిన తరువాత వారి మన్నింపుకోసం దైవాన్ని వేడుకోవటం ప్రవక్తకుగానీ, విశ్వాసులకుగానీ ఎంత మాత్రం తగదు.
9:114 وَمَا كَانَ اسْتِغْفَارُ إِبْرَاهِيمَ لِأَبِيهِ إِلَّا عَن مَّوْعِدَةٍ وَعَدَهَا إِيَّاهُ فَلَمَّا تَبَيَّنَ لَهُ أَنَّهُ عَدُوٌّ لِّلَّهِ تَبَرَّأَ مِنْهُ ۚ إِنَّ إِبْرَاهِيمَ لَأَوَّاهٌ حَلِيمٌ
మరి ఇబ్రాహీము (అలైహిస్సలాం) తన తండ్రి మన్నింపుకై ప్రార్థించాడంటే, అతను తండ్రికిచ్చిన మాటప్రకారం అలా చేశాడు. అయితే అతని తండ్రి అల్లాహ్ విరోధి అని స్పష్టమవగానే అతని పట్ల విసిగిపోయాడు. నిశ్చయంగా ఇబ్రాహీము (అలైహిస్సలాం) మృదుమనస్కుడు, సహనశీలి.
9:115 وَمَا كَانَ اللَّهُ لِيُضِلَّ قَوْمًا بَعْدَ إِذْ هَدَاهُمْ حَتَّىٰ يُبَيِّنَ لَهُم مَّا يَتَّقُونَ ۚ إِنَّ اللَّهَ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ
అల్లాహ్ ఏ జాతికైనా సన్మార్గం చూపిన తరువాత – ఆ జాతి ప్రజలు మానుకోవలసిన విషయాలను వారికి విడమరచి చెప్పనంతవరకూ – వారిని అపమార్గానికిలోను చేయడు. నిశ్చయంగా అల్లాహ్‌కు ప్రతిదీ తెలుసు.
9:116 إِنَّ اللَّهَ لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ يُحْيِي وَيُمِيتُ ۚ وَمَا لَكُم مِّن دُونِ اللَّهِ مِن وَلِيٍّ وَلَا نَصِيرٍ
నిస్సందేహంగా భూమ్యాకాశాల సామ్రాజ్యం అల్లాహ్‌దే. జీవింపజేసేదీ, మరణాన్ని ప్రసాదించేదీ ఆయనే. అల్లాహ్ తప్ప మీకు మరో సంరక్షకుడుగానీ, సహాయకుడుగానీ లేడు.
9:117 لَّقَد تَّابَ اللَّهُ عَلَى النَّبِيِّ وَالْمُهَاجِرِينَ وَالْأَنصَارِ الَّذِينَ اتَّبَعُوهُ فِي سَاعَةِ الْعُسْرَةِ مِن بَعْدِ مَا كَادَ يَزِيغُ قُلُوبُ فَرِيقٍ مِّنْهُمْ ثُمَّ تَابَ عَلَيْهِمْ ۚ إِنَّهُ بِهِمْ رَءُوفٌ رَّحِيمٌ
ప్రవక్త వైపుకు, కష్టకాలంలో ప్రవక్తను వెన్నంటివున్న ముహాజిర్ల, అన్సార్ల వైపుకు అల్లాహ్ (దయాభావంతో) మరలాడు, వారిలో కొందరి హృదయాలు తడబాటుకు లోనైనప్పుడు, తర్వాత ఆయన వారి పొరపాటును మన్నించాడు. నిశ్చయంగా ఆయన వారియెడల వాత్సల్యం కలవాడు, కరుణామయుడు.
9:118 وَعَلَى الثَّلَاثَةِ الَّذِينَ خُلِّفُوا حَتَّىٰ إِذَا ضَاقَتْ عَلَيْهِمُ الْأَرْضُ بِمَا رَحُبَتْ وَضَاقَتْ عَلَيْهِمْ أَنفُسُهُمْ وَظَنُّوا أَن لَّا مَلْجَأَ مِنَ اللَّهِ إِلَّا إِلَيْهِ ثُمَّ تَابَ عَلَيْهِمْ لِيَتُوبُوا ۚ إِنَّ اللَّهَ هُوَ التَّوَّابُ الرَّحِيمُ
ఏ ‘ముగ్గురి’ వ్యవహారం వాయిదా వేయబడిందో వారివైపుకు కూడా (అల్లాహ్ దయతో మరలాడు). భూమి విశాలంగా ఉండి కూడా వారికి ఇరుకైపోయింది. వారి ప్రాణాలు కూడా వారికి భారమై పోయాయి. అల్లాహ్ పట్టునుంచి తమను కాపాడుకోవటానికి ఆయన వైపుకు మరలటం తప్ప మార్గాంతరం లేదని వారు గ్రహించారు. ఇక మీదట కూడా వారు ఈ విధంగా మరలివచ్చేటందుకుగాను అల్లాహ్ వారివైపుకు మరలాడు. నిశ్చయంగా అల్లాహ్ అమితంగా పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, అపారంగా కరుణించేవాడూను.
9:119 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَكُونُوا مَعَ الصَّادِقِينَ
ఓ విశ్వాసులారా! అల్లాహ్‌కు భయపడండి. సత్యవంతుల వెంట ఉండండి.
9:120 مَا كَانَ لِأَهْلِ الْمَدِينَةِ وَمَنْ حَوْلَهُم مِّنَ الْأَعْرَابِ أَن يَتَخَلَّفُوا عَن رَّسُولِ اللَّهِ وَلَا يَرْغَبُوا بِأَنفُسِهِمْ عَن نَّفْسِهِ ۚ ذَٰلِكَ بِأَنَّهُمْ لَا يُصِيبُهُمْ ظَمَأٌ وَلَا نَصَبٌ وَلَا مَخْمَصَةٌ فِي سَبِيلِ اللَّهِ وَلَا يَطَئُونَ مَوْطِئًا يَغِيظُ الْكُفَّارَ وَلَا يَنَالُونَ مِنْ عَدُوٍّ نَّيْلًا إِلَّا كُتِبَ لَهُم بِهِ عَمَلٌ صَالِحٌ ۚ إِنَّ اللَّهَ لَا يُضِيعُ أَجْرَ الْمُحْسِنِينَ
దైవప్రవక్తను విడిచి వెనుక ఉండి పోవటం మదీనాలో నివసించే వారికి గానీ, చుట్టుప్రక్కల నివసించే పల్లెటూరి వాళ్ళకుగానీ ఏ మాత్రం శోభాయమానం కాదు. తమ ప్రాణాలను ఆయన ప్రాణంకన్నా మిన్నగా భావించటం కూడా వారికి తగదు. ఎందుకంటే దైవమార్గంలో వారికి దాహం అయినా, అలసట కలిగినా, ఆకలైనా, అవిశ్వాసులను కోపం తెప్పించే స్థలం గుండా వారు సాగిపోయినా, శత్రువుల సంగతి చూసుకున్నా- వాటన్నింటిపై వారి పేర సత్కార్యం లిఖించబడుతుంది. ఎట్టి పరిస్థితిలోనూ అల్లాహ్ సద్వర్తనుల పుణ్యఫలాన్ని వృధా కానివ్వడు.
9:121 وَلَا يُنفِقُونَ نَفَقَةً صَغِيرَةً وَلَا كَبِيرَةً وَلَا يَقْطَعُونَ وَادِيًا إِلَّا كُتِبَ لَهُمْ لِيَجْزِيَهُمُ اللَّهُ أَحْسَنَ مَا كَانُوا يَعْمَلُونَ
అలాగే వారు (దైవ మార్గంలో) చిన్నమొత్తంలో ఖర్చు చేసినా, పెద్ద మొత్తంలో ఖర్చు చేసినా, ఏ లోయను దాటివెళ్ళినా – అల్లాహ్ వారి సత్కార్యాలకు అత్యుత్తమ ప్రతిఫలం ప్రసాదించే నిమిత్తం – అవన్నీ వారి పేర వ్రాయబడ్డాయి.
9:122 وَمَا كَانَ الْمُؤْمِنُونَ لِيَنفِرُوا كَافَّةً ۚ فَلَوْلَا نَفَرَ مِن كُلِّ فِرْقَةٍ مِّنْهُمْ طَائِفَةٌ لِّيَتَفَقَّهُوا فِي الدِّينِ وَلِيُنذِرُوا قَوْمَهُمْ إِذَا رَجَعُوا إِلَيْهِمْ لَعَلَّهُمْ يَحْذَرُونَ
విశ్వాసులందరూ (పోరాటానికి) బయలుదేరవలసిన అవసరంలేదు. కాబట్టి వారి ప్రతి పెద్ద సమూహంలో నుంచి ఒక చిన్న సమూహం బయలుదేరి (తేచాలు. మిగిలినవారు) ధర్మావగాహనను పెంపొందించుకుని, వారు తమ వద్దకు తిరిగి వచ్చినప్పుడు, వారు భయభక్తులను అలవరచుకునేందుకుగాను వారికి భయబోధ చేయాల్సింది. కాని ఇలా ఎందుకు జరగలేదు?
9:123 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا قَاتِلُوا الَّذِينَ يَلُونَكُم مِّنَ الْكُفَّارِ وَلْيَجِدُوا فِيكُمْ غِلْظَةً ۚ وَاعْلَمُوا أَنَّ اللَّهَ مَعَ الْمُتَّقِينَ
ఓ విశ్వాసులారా! మీ పరిసరాలలో ఉన్న అవిశ్వాసులతో పోరాడండి. వారు మీలోని కాఠిన్యాన్ని చవి చూడాలి. అల్లాహ్ భయభక్తులు గలవారికి తోడుగా ఉన్నాడని తెలుసుకోండి.
9:124 وَإِذَا مَا أُنزِلَتْ سُورَةٌ فَمِنْهُم مَّن يَقُولُ أَيُّكُمْ زَادَتْهُ هَٰذِهِ إِيمَانًا ۚ فَأَمَّا الَّذِينَ آمَنُوا فَزَادَتْهُمْ إِيمَانًا وَهُمْ يَسْتَبْشِرُونَ
ఏదైనా ఒక సూరా అవతరించినప్పుడల్లా కపటుల్లోని కొందరు, “ఈ సూరా మీలో ఎవరి విశ్వాసాన్ని వృద్ధి పరచింది?” అని (వెటకారంగా) అడుగుతారు. విశ్వాసుల విశ్వాసాన్ని ఈ సూరా వృద్ధి చేసింది. దానిపై వారు సంతోషిస్తున్నారు.
9:125 وَأَمَّا الَّذِينَ فِي قُلُوبِهِم مَّرَضٌ فَزَادَتْهُمْ رِجْسًا إِلَىٰ رِجْسِهِمْ وَمَاتُوا وَهُمْ كَافِرُونَ
కాగా; ఎవరి హృదయాలు రోగగ్రస్తమై ఉన్నాయో వారి అశుద్ధతలో ఈ సూరా మరింత అశుద్ధతను పెంచింది. ఆఖరికి వారు అవిశ్వాస స్థితిలోనే చచ్చారు.
9:126 أَوَلَا يَرَوْنَ أَنَّهُمْ يُفْتَنُونَ فِي كُلِّ عَامٍ مَّرَّةً أَوْ مَرَّتَيْنِ ثُمَّ لَا يَتُوبُونَ وَلَا هُمْ يَذَّكَّرُونَ
ఏమిటీ, ప్రతి ఏటా ఒకటి లేక రెండుసార్లు తాము ఏదో ఒక ఆపదలో చిక్కుకుపోవటాన్ని వారు గమనించటంలేదా? అయినా సరే వారు పశ్చాత్తాపం చెందటంగానీ, గుణపాఠం నేర్చుకోవటంగానీ జరగటం లేదు.
9:127 وَإِذَا مَا أُنزِلَتْ سُورَةٌ نَّظَرَ بَعْضُهُمْ إِلَىٰ بَعْضٍ هَلْ يَرَاكُم مِّنْ أَحَدٍ ثُمَّ انصَرَفُوا ۚ صَرَفَ اللَّهُ قُلُوبَهُم بِأَنَّهُمْ قَوْمٌ لَّا يَفْقَهُونَ
ఏదైనా సూరా అవతరించినప్పుడు వారు ఒకరినొకరు చూసుకుంటారు. “ఎవడైనా (ముస్లిం) మిమ్మల్ని చూడటం లేదు కదా!”(అన్నది ఆ చూపులకు అర్థం). ఆ తరువాత (నెమ్మదిగా) వెళ్లిపోతారు. అల్లాహ్ వారి హృదయాలను త్రిప్పేశాడు. ఎందుకంటే వారు బొత్తిగా అర్థం చేసుకోనివారు.
9:128 لَقَدْ جَاءَكُمْ رَسُولٌ مِّنْ أَنفُسِكُمْ عَزِيزٌ عَلَيْهِ مَا عَنِتُّمْ حَرِيصٌ عَلَيْكُم بِالْمُؤْمِنِينَ رَءُوفٌ رَّحِيمٌ
మీ దగ్గరకు స్వయంగా మీలోనుంచే ఒక ప్రవక్త వచ్చాడు. మీకు కష్టం కలిగించే ప్రతిదీ అతనికి బాధ కలిగిస్తుంది. అతను మీ మేలును ఎంతగానో కోరుకుంటున్నాడు. విశ్వాసుల యెడల అతను వాత్సల్యం కలవాడు, దయామయుడు.
9:129 فَإِن تَوَلَّوْا فَقُلْ حَسْبِيَ اللَّهُ لَا إِلَٰهَ إِلَّا هُوَ ۖ عَلَيْهِ تَوَكَّلْتُ ۖ وَهُوَ رَبُّ الْعَرْشِ الْعَظِيمِ
ఇక వారు గనక వైముఖ్యధోరణిని కనబరుస్తే “నాకు అల్లాహ్ చాలు. ఆయన తప్ప వేరొక ఆరాధ్యుడు లేనేలేడు. నేను మాత్రం ఆయన్నే నమ్ముకున్నాను. ఆయన మహోన్నతమైన పీఠానికి (అర్ష్‌కు) అధిపతి” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు.
10. సూరా యూనుస్ (Yunus)
10:1 الر ۚ تِلْكَ آيَاتُ الْكِتَابِ الْحَكِيمِ
అలిఫ్ – లామ్ – రా. ఇవి వివేకంతో నిండి వున్న గ్రంథవాక్యాలు.
10:2 أَكَانَ لِلنَّاسِ عَجَبًا أَنْ أَوْحَيْنَا إِلَىٰ رَجُلٍ مِّنْهُمْ أَنْ أَنذِرِ النَّاسَ وَبَشِّرِ الَّذِينَ آمَنُوا أَنَّ لَهُمْ قَدَمَ صِدْقٍ عِندَ رَبِّهِمْ ۗ قَالَ الْكَافِرُونَ إِنَّ هَٰذَا لَسَاحِرٌ مُّبِينٌ
ఏమిటీ, “ప్రజలను హెచ్చరించు, విశ్వసించినవారికి వారి ప్రభువు వద్ద పూర్తి ప్రతిఫలం, ఉన్నత స్థానం ఉందన్న శుభవార్తను వినిపించు” అంటూ వారిలోని ఒక మనిషి వద్దకు మేము వహీ (సందేశం) పంపటం ప్రజలను ఆశ్చర్యచకితుల్ని చేసిందా? (పైగా) తిరస్కారులు, “ఇతడు ముమ్మాటికీ పచ్చిమాంత్రికుడే” అని పలికారు.
10:3 إِنَّ رَبَّكُمُ اللَّهُ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ فِي سِتَّةِ أَيَّامٍ ثُمَّ اسْتَوَىٰ عَلَى الْعَرْشِ ۖ يُدَبِّرُ الْأَمْرَ ۖ مَا مِن شَفِيعٍ إِلَّا مِن بَعْدِ إِذْنِهِ ۚ ذَٰلِكُمُ اللَّهُ رَبُّكُمْ فَاعْبُدُوهُ ۚ أَفَلَا تَذَكَّرُونَ
నిశ్చయంగా మీ ప్రభువు అల్లాహ్‌యే. ఆయన ఆకాశాలను, భూమినీ ఆరు రోజులలో సృష్టించాడు. తర్వాత సింహాసనాన్ని (అర్ష్‌ను) అధీష్టించాడు. ఆయన సమస్త వ్యవహారాలను నిర్వహిస్తున్నాడు. ఆయన అనుమతి లేకుండా (ఆయన సమక్షంలో) సిఫారసు చేయగల వాడెవడూలేడు. అటువంటి అల్లాహ్‌యే మీ ప్రభువు. కాబట్టి మీరు ఆయన్నే ఆరాధించండి. అయినా (ఇంత చెప్పినా) మీరు గుణపాఠం గ్రహించరా?
10:4 إِلَيْهِ مَرْجِعُكُمْ جَمِيعًا ۖ وَعْدَ اللَّهِ حَقًّا ۚ إِنَّهُ يَبْدَأُ الْخَلْقَ ثُمَّ يُعِيدُهُ لِيَجْزِيَ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ بِالْقِسْطِ ۚ وَالَّذِينَ كَفَرُوا لَهُمْ شَرَابٌ مِّنْ حَمِيمٍ وَعَذَابٌ أَلِيمٌ بِمَا كَانُوا يَكْفُرُونَ
మీరంతా ఆయన వద్దకే మరలిపోవలసి ఉంది. అల్లాహ్ వాగ్దానం సత్యమైనది. నిస్సందేహంగా ఆయనే తొలిసారి పుట్టిస్తాడు, మరి విశ్వసించి, మంచిపనులు చేసిన వారికి న్యాయసమ్మతంగా పుణ్యఫలం ప్రసాదించేందుకు మలిసారి పుట్టించేవాడు కూడా ఆయనే. సత్యాన్ని తిరస్కరించిన వారికి వారి తిరస్కారవైఖరి మూలంగా త్రాగటానికి సలసలాకాగే నీరు, బాధాకరమైన శిక్ష ఉంటుంది.
10:5 هُوَ الَّذِي جَعَلَ الشَّمْسَ ضِيَاءً وَالْقَمَرَ نُورًا وَقَدَّرَهُ مَنَازِلَ لِتَعْلَمُوا عَدَدَ السِّنِينَ وَالْحِسَابَ ۚ مَا خَلَقَ اللَّهُ ذَٰلِكَ إِلَّا بِالْحَقِّ ۚ يُفَصِّلُ الْآيَاتِ لِقَوْمٍ يَعْلَمُونَ
సూర్యుణ్ణి ప్రకాశమానంగానూ, చంద్రుణ్ణి కాంతిమంతంగానూ చేసినవాడు ఆయనే. మీరు సంవత్సరాల సంఖ్యను, లెక్కలను తెలుసుకోవటానికి చంద్రుని దశలను కూడా ఆయనే నిర్థారించాడు. అల్లాహ్ వీటిని సత్యబద్ధంగా తప్ప (నిరర్థకంగా) పుట్టించలేదు. తెలుసుకోగలవారికోసం ఆయన ఈ సూచనలను విడమరచి చెబుతున్నాడు.
10:6 إِنَّ فِي اخْتِلَافِ اللَّيْلِ وَالنَّهَارِ وَمَا خَلَقَ اللَّهُ فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ لَآيَاتٍ لِّقَوْمٍ يَتَّقُونَ
నిస్సందేహంగా రేయింబవళ్ళు ఒకదాని తరువాత ఒకటి రావటంలోనూ, భూమ్యాకాశాలలో అల్లాహ్ సృష్టించిన వస్తువులన్నింటిలోనూ దైవభీతి గలవారికోసం సూచనలున్నాయి.
10:7 إِنَّ الَّذِينَ لَا يَرْجُونَ لِقَاءَنَا وَرَضُوا بِالْحَيَاةِ الدُّنْيَا وَاطْمَأَنُّوا بِهَا وَالَّذِينَ هُمْ عَنْ آيَاتِنَا غَافِلُونَ
మమ్మల్ని కలుసుకునే విషయంపై నమ్మకం లేని వారికీ, ప్రాపంచిక జీవితంతోనే సంతోషించిన వారికీ, దానితోనే సంతృప్తి చెందిన వారికీ, మా ఆయతుల పట్ల నిర్లక్ష్యభావం ప్రదర్శించిన వారికీ –
10:8 أُولَٰئِكَ مَأْوَاهُمُ النَّارُ بِمَا كَانُوا يَكْسِبُونَ
వారు ఆర్జించిన దాని ప్రతిఫలంగా వారి నివాసం నరకాగ్ని అవుతుంది.
10:9 إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ يَهْدِيهِمْ رَبُّهُم بِإِيمَانِهِمْ ۖ تَجْرِي مِن تَحْتِهِمُ الْأَنْهَارُ فِي جَنَّاتِ النَّعِيمِ
నిశ్చయంగా – విశ్వసించి, సత్కార్యాలు చేసిన వారికి వారి ప్రభువు వారి విశ్వాసం కారణంగా వారిని గమ్యస్థానానికి చేరుస్తాడు – క్రింద కాలువలు ప్రవహించే అనుగ్రహభరితమైన స్వర్గవనాలలోకి!
10:10 دَعْوَاهُمْ فِيهَا سُبْحَانَكَ اللَّهُمَّ وَتَحِيَّتُهُمْ فِيهَا سَلَامٌ ۚ وَآخِرُ دَعْوَاهُمْ أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
”అల్లాహ్! నీవు పవిత్రుడవు” అనేమాట వారినోట వెలువడుతుంది. ”అస్సలాము అలైకుమ్ (మీకు శాంతి కలుగుగాక)! ”అని వారు పరస్పరం శాంతిపూర్వకంగా చెప్పుకుంటారు. ”సర్వలోక ప్రభువగు అల్లాహ్‌కే సకలస్తోత్రాలు” అన్నది వారి ముగింపు వాక్యం అయి ఉంటుంది.
10:11 وَلَوْ يُعَجِّلُ اللَّهُ لِلنَّاسِ الشَّرَّ اسْتِعْجَالَهُم بِالْخَيْرِ لَقُضِيَ إِلَيْهِمْ أَجَلُهُمْ ۖ فَنَذَرُ الَّذِينَ لَا يَرْجُونَ لِقَاءَنَا فِي طُغْيَانِهِمْ يَعْمَهُونَ
ప్రజలు లాభం కోసం ఎంత తొందరపెడతారో అంతే తొందరగా అల్లాహ్ వారికి నష్టం చేకూర్చితే వారి వాగ్దానం ఎప్పుడో పూర్తయిపోయి ఉండేది. కనుక మా వద్దకు మరలి రావటంపై నమ్మకం లేని వారిని, వారు తమ తలబిరుసుతనంలో తచ్చాడుతూ ఉండేందుకు – వారి మానాన వారిని వదలిపెడతాము.
10:12 وَإِذَا مَسَّ الْإِنسَانَ الضُّرُّ دَعَانَا لِجَنبِهِ أَوْ قَاعِدًا أَوْ قَائِمًا فَلَمَّا كَشَفْنَا عَنْهُ ضُرَّهُ مَرَّ كَأَن لَّمْ يَدْعُنَا إِلَىٰ ضُرٍّ مَّسَّهُ ۚ كَذَٰلِكَ زُيِّنَ لِلْمُسْرِفِينَ مَا كَانُوا يَعْمَلُونَ
మనిషికి ఏదైనా కష్టం కలిగినప్పుడు పడుకొని, కూర్చొని, నిలబడీ మమ్మల్ని మొరపెట్టుకుంటాడు. మరి మేము అతని కష్టాన్ని అతన్నుంచి తొలగించినప్పుడు,తనకు కలిగిన ఏ కష్టానికీ, ఎప్పుడూ, మమ్మల్నిప్రార్థించనే లేదన్నట్లుగా వ్యవహరిస్తాడు. ఈ విధంగా హద్దుమీరిపోయే వారి పనులు వారికి ఎంతో రమణీయంగా చెయ్యబడ్డాయి.
10:13 وَلَقَدْ أَهْلَكْنَا الْقُرُونَ مِن قَبْلِكُمْ لَمَّا ظَلَمُوا ۙ وَجَاءَتْهُمْ رُسُلُهُم بِالْبَيِّنَاتِ وَمَا كَانُوا لِيُؤْمِنُوا ۚ كَذَٰلِكَ نَجْزِي الْقَوْمَ الْمُجْرِمِينَ
మేము మీకు పూర్వం ఎన్నో జాతులను – వారు అన్యాయానికి ఒడిగట్టినప్పుడు – తుదముట్టించాము. వారి వద్దకు వారి ప్రవక్తలు కూడా సూచనలు తీసుకువచ్చారు. కాని వారు విశ్వసిస్తే కదా?! మేము అపరాధజనులకు ఇలాంటి శిక్షనే విధిస్తాము.
10:14 ثُمَّ جَعَلْنَاكُمْ خَلَائِفَ فِي الْأَرْضِ مِن بَعْدِهِمْ لِنَنظُرَ كَيْفَ تَعْمَلُونَ
మరి వారి తర్వాత – మీరు ఏ విధంగా పని చేస్తారో చూడటానికి మేము వారి స్థానంలో మిమ్మల్ని భూమికి వారసులుగా తీసుకువచ్చాము.
10:15 وَإِذَا تُتْلَىٰ عَلَيْهِمْ آيَاتُنَا بَيِّنَاتٍ ۙ قَالَ الَّذِينَ لَا يَرْجُونَ لِقَاءَنَا ائْتِ بِقُرْآنٍ غَيْرِ هَٰذَا أَوْ بَدِّلْهُ ۚ قُلْ مَا يَكُونُ لِي أَنْ أُبَدِّلَهُ مِن تِلْقَاءِ نَفْسِي ۖ إِنْ أَتَّبِعُ إِلَّا مَا يُوحَىٰ إِلَيَّ ۖ إِنِّي أَخَافُ إِنْ عَصَيْتُ رَبِّي عَذَابَ يَوْمٍ عَظِيمٍ
వారి ముందు స్పష్టమైన మా వాక్యాలను చదివి వినిపించినప్పుడు, మమ్మల్ని కలిసే నమ్మకం లేనివారు “ఇది తప్ప వేరొక ఖుర్ఆన్ను తీసుకురా లేదా ఇందులో కొంత సవరణ చెయ్యి” అంటారు. (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “నా తరఫున ఇందులో సవరణ చేసే అధికారం నాకే మాత్రం లేదు. నా వద్దకు ‘వహీ’ ద్వారా పంపబడే దానిని నేను (యధాతథంగా) అనుసరించేవాణ్ణి మాత్రమే. ఒకవేళ నేను గనక నా ప్రభువు పట్ల అవిధేయతకు పాల్పడినట్లయితే ఒక మహాదినమున విధించబడే శిక్షకు భయపడుతున్నాను.”
10:16 قُل لَّوْ شَاءَ اللَّهُ مَا تَلَوْتُهُ عَلَيْكُمْ وَلَا أَدْرَاكُم بِهِ ۖ فَقَدْ لَبِثْتُ فِيكُمْ عُمُرًا مِّن قَبْلِهِ ۚ أَفَلَا تَعْقِلُونَ
“అల్లాహ్ కోరితే దీన్నినేను మీకు చదివి వినిపించటంగానీ, అల్లాహ్ దాని గురించి మీకు తెలియజేయటం గానీ జరిగి ఉండేదే కాదు. ఎందుకంటే ఇంతకు ముందు నేను నా జీవితకాలంలో ఓ పెద్దభాగం మీ మధ్యనే గడిపాను. అసలు మీరు బుద్ధిని ఉపయోగించరా?” అని అడుగు.
10:17 فَمَنْ أَظْلَمُ مِمَّنِ افْتَرَىٰ عَلَى اللَّهِ كَذِبًا أَوْ كَذَّبَ بِآيَاتِهِ ۚ إِنَّهُ لَا يُفْلِحُ الْمُجْرِمُونَ
కనుక అల్లాహ్‌కు అబద్ధాలను అంటగట్టే, లేక ఆయన వాక్యాలను అబద్ధాలుగా ఖరారుచేసే వాడికన్నా పరమదుర్మార్గుడు ఎవడుంటాడు? ఇలాంటి అపరాధులు ఎట్టి పరిస్థితిలోనూ సాఫల్యం పొందరు.
10:18 وَيَعْبُدُونَ مِن دُونِ اللَّهِ مَا لَا يَضُرُّهُمْ وَلَا يَنفَعُهُمْ وَيَقُولُونَ هَٰؤُلَاءِ شُفَعَاؤُنَا عِندَ اللَّهِ ۚ قُلْ أَتُنَبِّئُونَ اللَّهَ بِمَا لَا يَعْلَمُ فِي السَّمَاوَاتِ وَلَا فِي الْأَرْضِ ۚ سُبْحَانَهُ وَتَعَالَىٰ عَمَّا يُشْرِكُونَ
వారు అల్లాహ్‌ను వదలి తమకు నష్టాన్నిగానీ, లాభాన్ని గానీ చేకూర్చలేని వాటిని పూజిస్తున్నారు. ఇంకా, “అల్లాహ్ సమక్షంలో ఇవి మాకు సిఫారసు చేస్తాయి” అని చెబుతున్నారు. “ఏమిటీ, ఆకాశాలలో గానీ, భూమిలో గానీ అల్లాహ్‌కు తెలియని దానిని గురించి మీరు ఆయనకు తెలియజేస్తున్నారా?” వారు కల్పించే భాగస్వామ్యాల నుంచి ఆయన పవిత్రుడు, ఉన్నతుడు అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు.
10:19 وَمَا كَانَ النَّاسُ إِلَّا أُمَّةً وَاحِدَةً فَاخْتَلَفُوا ۚ وَلَوْلَا كَلِمَةٌ سَبَقَتْ مِن رَّبِّكَ لَقُضِيَ بَيْنَهُمْ فِيمَا فِيهِ يَخْتَلِفُونَ
మొదట్లో జనులంతా ఒకే సంఘంగా ఉండేవారు. తరువాత వారు విభేదించుకున్నారు. నీ ప్రభువు తరఫు నుంచి ముందుగానే ఒక విషయం ఖరారు కాకుండా ఉన్నట్లయితే, వారు విభేదించుకునే విషయం ఎప్పుడో తేల్చివెయ్యబడేది.
10:20 وَيَقُولُونَ لَوْلَا أُنزِلَ عَلَيْهِ آيَةٌ مِّن رَّبِّهِ ۖ فَقُلْ إِنَّمَا الْغَيْبُ لِلَّهِ فَانتَظِرُوا إِنِّي مَعَكُم مِّنَ الْمُنتَظِرِينَ
“అతని ప్రభువు తరఫున అతనిపై ఏదైనా సూచన ఎందుకు అవతరించదు?” అని వారంటున్నారు. “రహస్య జ్ఞానం అల్లాహ్ వద్ద మాత్రమే ఉంది. కాబట్టి మీరూ నిరీక్షించండి, మీతోపాటు నేనూ నిరీక్షిస్తున్నాను” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు.
10:21 وَإِذَا أَذَقْنَا النَّاسَ رَحْمَةً مِّن بَعْدِ ضَرَّاءَ مَسَّتْهُمْ إِذَا لَهُم مَّكْرٌ فِي آيَاتِنَا ۚ قُلِ اللَّهُ أَسْرَعُ مَكْرًا ۚ إِنَّ رُسُلَنَا يَكْتُبُونَ مَا تَمْكُرُونَ
ప్రజలపై ఆపద వచ్చిపడిన తరువాత మేము వారికి (మా) కారుణ్యం రుచి చూపితే, వెంటనే వారు మా ఆయతులకు వ్యతిరేకంగా ఎత్తులు వేయటం మొదలెడతారు. “ఎత్తులు వేయటంలో అల్లాహ్ మీకంటే చాలా వేగం” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు. నిశ్చయంగా మా దూతలు మీఎత్తులను వ్రాస్తున్నారు.
10:22 هُوَ الَّذِي يُسَيِّرُكُمْ فِي الْبَرِّ وَالْبَحْرِ ۖ حَتَّىٰ إِذَا كُنتُمْ فِي الْفُلْكِ وَجَرَيْنَ بِهِم بِرِيحٍ طَيِّبَةٍ وَفَرِحُوا بِهَا جَاءَتْهَا رِيحٌ عَاصِفٌ وَجَاءَهُمُ الْمَوْجُ مِن كُلِّ مَكَانٍ وَظَنُّوا أَنَّهُمْ أُحِيطَ بِهِمْ ۙ دَعَوُا اللَّهَ مُخْلِصِينَ لَهُ الدِّينَ لَئِنْ أَنجَيْتَنَا مِنْ هَٰذِهِ لَنَكُونَنَّ مِنَ الشَّاكِرِينَ
ఆయనే మిమ్మల్ని భూమిలోనూ, సముద్రంలోనూ నడుపుతున్నాడు. ఆ విధంగా మీరు ఓడలలో పయనమవుతున్నప్పుడు, అవి ప్రజలను సానుకూలమైన గాలుల ద్వారా తీసుకుపోతుంటాయి. ఆ అనుకూల పవనాలకు ప్రజలు ఆనందడోలికల్లో తేలియాడుతుండగా (అకస్మాత్తుగా) వారిపై ఉధృతమైన గాలి వీస్తుంది. అన్ని వైపుల నుంచీ వారిపై అలలు వచ్చిపడతాయి. తాము (ఆపదలో దారుణంగా) చిక్కుకు పోయామన్న సంగతిని వారు గ్రహిస్తారు. (ఆక్షణంలో) తమ విశ్వాసాన్ని అల్లాహ్‌కే ప్రత్యేకించుకుని, “(అల్లాహ్!) నువ్వు గనక మమ్మల్ని ఈ ఆపదనుంచి గట్టెక్కిస్తే మేము తప్పకుండా నీకు కృతజ్ఞులమై ఉంటామ” ని మొరపెట్టుకుంటారు.
10:23 فَلَمَّا أَنجَاهُمْ إِذَا هُمْ يَبْغُونَ فِي الْأَرْضِ بِغَيْرِ الْحَقِّ ۗ يَا أَيُّهَا النَّاسُ إِنَّمَا بَغْيُكُمْ عَلَىٰ أَنفُسِكُم ۖ مَّتَاعَ الْحَيَاةِ الدُّنْيَا ۖ ثُمَّ إِلَيْنَا مَرْجِعُكُمْ فَنُنَبِّئُكُم بِمَا كُنتُمْ تَعْمَلُونَ
మరి అల్లాహ్ వారిని కాపాడగానే వారు భూమిలో అన్యాయంగా తిరగబడతారు. ప్రజలారా! మీ ఈ తిరుగుబాటు ధోరణి మీకే హానికరం. ప్రాపంచిక జీవితపు ప్రయోజనాలు కొన్నాళ్ళు మాత్రమే. ఆ తరువాత మీరు మా వద్దకే మరలిరావలసి ఉంది. అప్పుడు మేము, మీరు చేస్తూ ఉండిన కర్మలన్నింటినీ మీకు తెలియబరుస్తాము.
10:24 إِنَّمَا مَثَلُ الْحَيَاةِ الدُّنْيَا كَمَاءٍ أَنزَلْنَاهُ مِنَ السَّمَاءِ فَاخْتَلَطَ بِهِ نَبَاتُ الْأَرْضِ مِمَّا يَأْكُلُ النَّاسُ وَالْأَنْعَامُ حَتَّىٰ إِذَا أَخَذَتِ الْأَرْضُ زُخْرُفَهَا وَازَّيَّنَتْ وَظَنَّ أَهْلُهَا أَنَّهُمْ قَادِرُونَ عَلَيْهَا أَتَاهَا أَمْرُنَا لَيْلًا أَوْ نَهَارًا فَجَعَلْنَاهَا حَصِيدًا كَأَن لَّمْ تَغْنَ بِالْأَمْسِ ۚ كَذَٰلِكَ نُفَصِّلُ الْآيَاتِ لِقَوْمٍ يَتَفَكَّرُونَ
ప్రాపంచిక జీవితపు ఉపమానం మేము ఆకాశం నుంచి కురిపించిన వర్షపు నీరులాంటిది. ఆ నీటి ద్వారా మనుషులకు, పశువులకు ఆహారంగా ఉపయోగపడే భూఉత్పత్తులు దట్టంగా మొలకెత్తాయి. క్రమంగా ఆ నేల అందంగా ముస్తాబై, నవనవ లాడుతున్నప్పుడు, ఇక అది పూర్తిగా తమ స్వంతమైనట్లేనని దాని యజమానులు భావించారు. అప్పుడు అకస్మాత్తుగా రాత్రి పూటనో, పగటిపూటనో మా తరఫున ఒక ఆజ్ఞ (ఆపద) దానిపై వచ్చి పడింది. అసలు నిన్న అక్కడ ఏమీ లేనట్లే మేము దానిని తుడిచి పెట్టేశాము. ఈ విధంగా మేము చింతన చేసే వారికోసం ఆయతులను స్పష్టంగా విడమరచి చెబుతాము.
10:25 وَاللَّهُ يَدْعُو إِلَىٰ دَارِ السَّلَامِ وَيَهْدِي مَن يَشَاءُ إِلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ
అల్లాహ్ మిమ్మల్నిశాంతి నిలయం వైపుకు పిలుస్తున్నాడు. ఇంకా, తాను కోరిన వారికి ఆయన రుజుమార్గంపై నడిచే సద్బుద్ధిని ప్రసాదిస్తాడు.
10:26 لِّلَّذِينَ أَحْسَنُوا الْحُسْنَىٰ وَزِيَادَةٌ ۖ وَلَا يَرْهَقُ وُجُوهَهُمْ قَتَرٌ وَلَا ذِلَّةٌ ۚ أُولَٰئِكَ أَصْحَابُ الْجَنَّةِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ
సత్కార్యాలు చేసిన వారికొరకు మేలున్నది. మరింత బహుమానం కూడా ఉన్నది. వారి ముఖాలపై నలుపుగానీ, పరాభవంగానీ ఆవరించవు. వారు స్వర్గవాసులు. అందులో వారు కలకాలం ఉంటారు.
10:27 وَالَّذِينَ كَسَبُوا السَّيِّئَاتِ جَزَاءُ سَيِّئَةٍ بِمِثْلِهَا وَتَرْهَقُهُمْ ذِلَّةٌ ۖ مَّا لَهُم مِّنَ اللَّهِ مِنْ عَاصِمٍ ۖ كَأَنَّمَا أُغْشِيَتْ وُجُوهُهُمْ قِطَعًا مِّنَ اللَّيْلِ مُظْلِمًا ۚ أُولَٰئِكَ أَصْحَابُ النَّارِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ
దుష్కార్యాలు చేసిన వారికి వారి దుష్కార్యాలకు సమానంగా శిక్ష విధించబడుతుంది. పరాభవం వారిని క్రమ్ముకుంటుంది. అల్లాహ్ నుండి వారిని కాపాడేవాడెవడూ ఉండడు. ఒక విధంగా వారి ముఖాలు రాత్రి యొక్క చీకటి తెరలు చుట్టబడినట్లే ఉంటాయి. వారు నరకవాసులు. అందులో వారు కలకాలం పడి ఉంటారు.
10:28 وَيَوْمَ نَحْشُرُهُمْ جَمِيعًا ثُمَّ نَقُولُ لِلَّذِينَ أَشْرَكُوا مَكَانَكُمْ أَنتُمْ وَشُرَكَاؤُكُمْ ۚ فَزَيَّلْنَا بَيْنَهُمْ ۖ وَقَالَ شُرَكَاؤُهُم مَّا كُنتُمْ إِيَّانَا تَعْبُدُونَ
మేము వారందరినీ సమావేశ పరచేరోజు కూడా ప్రస్తావించదగినదే. అప్పుడు మేము మాకు సహవర్తుల్ని కల్పించే వారి నుద్దేశించి, “ఆగండి, మీరూ, మీరు కల్పించిన సహవర్తులూను!” అని అంటాము. ఆ తరువాత వారి మధ్య చీలికను తెస్తాము. అప్పుడు వారు నిలబెట్టిన భాగస్వాములు “మీరసలు మమ్మల్ని పూజించనేలేదు” (అని అంటారు).
10:29 فَكَفَىٰ بِاللَّهِ شَهِيدًا بَيْنَنَا وَبَيْنَكُمْ إِن كُنَّا عَنْ عِبَادَتِكُمْ لَغَافِلِينَ
“ఈ వ్యవహారంలో మీకూ – మాకూ మధ్య సాక్షిగా అల్లాహ్ చాలు. మీరు మిమ్మల్ని పూజించిన సంగతి కూడా మాకు తెలీదాయె” (అని అంటారు).
10:30 هُنَالِكَ تَبْلُو كُلُّ نَفْسٍ مَّا أَسْلَفَتْ ۚ وَرُدُّوا إِلَى اللَّهِ مَوْلَاهُمُ الْحَقِّ ۖ وَضَلَّ عَنْهُم مَّا كَانُوا يَفْتَرُونَ
అక్కడ ప్రతి వ్యక్తీ తాను పూర్వం చేసుకున్న తన కర్మలను పరీక్షించుకుంటాడు. వారు తమ నిజయజమాని అయిన అల్లాహ్ వైపుకు మరలించబడతారు. వారు కల్పిస్తూ ఉండిన అబద్ధాలన్నీ వారి నుండి మటుమాయమవుతాయి.
10:31 قُلْ مَن يَرْزُقُكُم مِّنَ السَّمَاءِ وَالْأَرْضِ أَمَّن يَمْلِكُ السَّمْعَ وَالْأَبْصَارَ وَمَن يُخْرِجُ الْحَيَّ مِنَ الْمَيِّتِ وَيُخْرِجُ الْمَيِّتَ مِنَ الْحَيِّ وَمَن يُدَبِّرُ الْأَمْرَ ۚ فَسَيَقُولُونَ اللَّهُ ۚ فَقُلْ أَفَلَا تَتَّقُونَ
“ఆకాశం నుండి, భూమి నుండి మీకు ఉపాధిని సమకూర్చేవాడెవడు? చెవులపై, కళ్లపై పూర్తి అధికారం కలవాడెవడు? ప్రాణమున్న దానిని ప్రాణములేని దాని నుండీ, ప్రాణములేని దానిని ప్రాణమున్న దాని నుండీ వెలికి తీసేవాడెవడు? సమస్త కార్యాల నిర్వహణకర్త ఎవరు?” అని (ఓ ప్రవక్తా!) వారిని అడుగు. “అల్లాహ్‌యే” అని వారు తప్పకుండా చెబుతారు. “మరలాంటప్పుడు మీరు (దేవుని శిక్షకు) ఎందుకు భయపడరు?
10:32 فَذَٰلِكُمُ اللَّهُ رَبُّكُمُ الْحَقُّ ۖ فَمَاذَا بَعْدَ الْحَقِّ إِلَّا الضَّلَالُ ۖ فَأَنَّىٰ تُصْرَفُونَ
ఆ అల్లాహ్‌యే మీ నిజప్రభువు. సత్యం తరువాత మార్గవిహీనత తప్ప ఇంకేముంటుందీ? మరి మీరు ఎటుమరలిపోతున్నారు?” అని (ఓ ప్రవక్తా!) వారిని అడుగు.
10:33 كَذَٰلِكَ حَقَّتْ كَلِمَتُ رَبِّكَ عَلَى الَّذِينَ فَسَقُوا أَنَّهُمْ لَا يُؤْمِنُونَ
ఈ విధంగా “వారు విశ్వసించరు” అన్న నీ ప్రభువు మాట అవిధేయుల విషయంలో సత్యమని రుజువైపోయింది.
10:34 قُلْ هَلْ مِن شُرَكَائِكُم مَّن يَبْدَأُ الْخَلْقَ ثُمَّ يُعِيدُهُ ۚ قُلِ اللَّهُ يَبْدَأُ الْخَلْقَ ثُمَّ يُعِيدُهُ ۖ فَأَنَّىٰ تُؤْفَكُونَ
“ఏమిటీ, మీరు భాగస్వాములుగా నిలబెట్టిన వారిలో తొలిసారి సృష్టించి, మలిసారి కూడా దాన్ని పునరావృతం చేసే వాడెవడైనా ఉన్నాడా?” అని వారిని అడుగు. “అల్లాహ్‌యే తొలిసారి సృష్టిస్తాడు. మలిసారి కూడా ఆయనే సృష్టిస్తాడు. మరలాంటప్పుడు మీరు (సత్యం నుండి) ఎటుకొట్టుకు పోతున్నారు?” అని వారిని అడుగు.
10:35 قُلْ هَلْ مِن شُرَكَائِكُم مَّن يَهْدِي إِلَى الْحَقِّ ۚ قُلِ اللَّهُ يَهْدِي لِلْحَقِّ ۗ أَفَمَن يَهْدِي إِلَى الْحَقِّ أَحَقُّ أَن يُتَّبَعَ أَمَّن لَّا يَهِدِّي إِلَّا أَن يُهْدَىٰ ۖ فَمَا لَكُمْ كَيْفَ تَحْكُمُونَ
“మీ భాగస్వాములలో సత్యం వైపుకు మార్గదర్శకత్వం వహించేవాడెవడయినా ఉన్నాడా?” అని వారిని అడుగు. ”సత్యం వైపుకు మార్గదర్శకత్వం వహించేవాడు అల్లాహ్ మాత్రమే. అలాంటప్పుడు సన్మార్గం చూపేవాడు అనుసరణకు ఎక్కువ అర్హుడా? లేక ఇతరులు సన్మార్గం చూపేవరకూ తనంతట తానుగా సన్మార్గం తెలుసుకోలేనివాడా? అసలు మీకేమైపోయింది? మీరు ఇలాంటి నిర్ణయాలు గైకొంటున్నారేమిటి?” అని వారిని అడుగు.
10:36 وَمَا يَتَّبِعُ أَكْثَرُهُمْ إِلَّا ظَنًّا ۚ إِنَّ الظَّنَّ لَا يُغْنِي مِنَ الْحَقِّ شَيْئًا ۚ إِنَّ اللَّهَ عَلِيمٌ بِمَا يَفْعَلُونَ
వారిలో అధికులు కేవలం ఊహలను, అనుమానాలను అనుసరిస్తున్నారు. నిశ్చయంగా అనుమానం సత్యం ముందు దేనికీ పనికిరాదు. వారు చేసేదంతా అల్లాహ్‌కు తెలుసు.
10:37 وَمَا كَانَ هَٰذَا الْقُرْآنُ أَن يُفْتَرَىٰ مِن دُونِ اللَّهِ وَلَٰكِن تَصْدِيقَ الَّذِي بَيْنَ يَدَيْهِ وَتَفْصِيلَ الْكِتَابِ لَا رَيْبَ فِيهِ مِن رَّبِّ الْعَالَمِينَ
ఈ ఖుర్ఆన్ అల్లాహ్ (పంపిన వహీ ద్వారా) కాకుండా (ఇతరుల ప్రమేయంతో) చేయబడిన కల్పన కాదు. పైగా ఇది తనకు పూర్వం ఉన్న వాటిని (అవతరించిన గ్రంథాలను) ధృవీకరించేది, ఇంకా గ్రంథం (లోని మౌలిక ఆదేశాలను) విపులీకరించేది. ఇది సర్వలోకాల ప్రభువు తరఫు నుంచి వచ్చిందన్న విషయంలో సందేహానికి ఆస్కారమే లేదు.
10:38 أَمْ يَقُولُونَ افْتَرَاهُ ۖ قُلْ فَأْتُوا بِسُورَةٍ مِّثْلِهِ وَادْعُوا مَنِ اسْتَطَعْتُم مِّن دُونِ اللَّهِ إِن كُنتُمْ صَادِقِينَ
ఏమిటీ, దీనిని (ఖుర్ఆన్ గ్రంథాన్ని) అతనే స్వయంగా కల్పించుకున్నాడని వారంటున్నారా? “మరయితే మీరు దీనిలాంటి ఒక్క సూరానైనా (రచించి) తీసుకురండి. ఒకవేళ మీరు సత్యవంతులే అయితే అల్లాహ్‌ను తప్పఎవరెవరిని పిలుచుకుంటారో పిలుచుకోండి” అని వారికి చెప్పు.
10:39 بَلْ كَذَّبُوا بِمَا لَمْ يُحِيطُوا بِعِلْمِهِ وَلَمَّا يَأْتِهِمْ تَأْوِيلُهُ ۚ كَذَٰلِكَ كَذَّبَ الَّذِينَ مِن قَبْلِهِمْ ۖ فَانظُرْ كَيْفَ كَانَ عَاقِبَةُ الظَّالِمِينَ
పైగా వారు తమ జ్ఞానపరిధిలోకి తీసుకోని దానిని అసత్యమని ధిక్కరించారు. ఇంకా దాని అంతిమ ఫలితం వారి ముందుకు రాలేదు. వారికి పూర్వం గతించిన వారు కూడా ఇలాగే ధిక్కరించారు. మరి ఆ దుర్మార్గులకు పట్టిన గతేమిటో చూడు!
10:40 وَمِنْهُم مَّن يُؤْمِنُ بِهِ وَمِنْهُم مَّن لَّا يُؤْمِنُ بِهِ ۚ وَرَبُّكَ أَعْلَمُ بِالْمُفْسِدِينَ
వారిలో కొందరు దీనిని విశ్వసిస్తారు. మరి కొందరు దీనిని విశ్వసించరు. కల్లోల జనకులగురించి నీ ప్రభువుకు బాగా తెలుసు.
10:41 وَإِن كَذَّبُوكَ فَقُل لِّي عَمَلِي وَلَكُمْ عَمَلُكُمْ ۖ أَنتُم بَرِيئُونَ مِمَّا أَعْمَلُ وَأَنَا بَرِيءٌ مِّمَّا تَعْمَلُونَ
ఒకవేళ వారు నిన్ను ధిక్కరిస్తూనే ఉంటే, “నా పని నాది. మీ పని మీది. నా పనుల బాధ్యత మీపై లేదు. మీ పనుల బాధ్యత నాపై లేదు”అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పెయ్యి.
10:42 وَمِنْهُم مَّن يَسْتَمِعُونَ إِلَيْكَ ۚ أَفَأَنتَ تُسْمِعُ الصُّمَّ وَلَوْ كَانُوا لَا يَعْقِلُونَ
వారిలో కొందరు నీ మాటలను శ్రద్ధగా వింటుంటారు. ఏమిటీ, ఏమాత్రం అర్థం చేసుకోలేని చెవిటి వారికి నీవు వినిపించగలవా?
10:43 وَمِنْهُم مَّن يَنظُرُ إِلَيْكَ ۚ أَفَأَنتَ تَهْدِي الْعُمْيَ وَلَوْ كَانُوا لَا يُبْصِرُونَ
వారిలో కొందరు నిన్ను చూస్తారు. కాని (కొద్దిపాటి) మనో నేత్రం కూడా లేని అంధులకు నువ్వు మార్గం చూపగలవా?
10:44 إِنَّ اللَّهَ لَا يَظْلِمُ النَّاسَ شَيْئًا وَلَٰكِنَّ النَّاسَ أَنفُسَهُمْ يَظْلِمُونَ
అల్లాహ్ ప్రజలకు ఏకాస్త అన్యాయం కూడా చేయడు. కాని ప్రజలే తమకు తాము అన్యాయం చేసుకుంటారు.
10:45 وَيَوْمَ يَحْشُرُهُمْ كَأَن لَّمْ يَلْبَثُوا إِلَّا سَاعَةً مِّنَ النَّهَارِ يَتَعَارَفُونَ بَيْنَهُمْ ۚ قَدْ خَسِرَ الَّذِينَ كَذَّبُوا بِلِقَاءِ اللَّهِ وَمَا كَانُوا مُهْتَدِينَ
అల్లాహ్ వారిని సమీకరించే ఆ రోజు గురించి జ్ఞాపకం చెయ్యి. అప్పుడు వారికి తాము (ప్రపంచ జీవితంలో) దినములో ఒక గడియకాలం ఆగి ఉన్నామేమో!? అనిపిస్తుంది. అల్లాహ్‌ను కలుసుకునే విషయాన్ని అసత్యమని త్రోసిపుచ్చిన వారు నిస్సందేహంగా నష్టపోయారు. వారు సన్మార్గం పొందేవారు కారు.
10:46 وَإِمَّا نُرِيَنَّكَ بَعْضَ الَّذِي نَعِدُهُمْ أَوْ نَتَوَفَّيَنَّكَ فَإِلَيْنَا مَرْجِعُهُمْ ثُمَّ اللَّهُ شَهِيدٌ عَلَىٰ مَا يَفْعَلُونَ
మేము వారికి వాగ్దానం చేస్తున్న దానిలో ఎంతో కొంత నీకు చూపించినా లేక (అది పొడసూపకముందే) మేము నీకు మరణమొసగినా – (ఏం జరిగినా సరే) వారు ఎలాగూ మావద్దకు రావలసినవారే. అదీగాక వారి చేష్టలన్నింటికీ అల్లాహ్ సాక్షిగా ఉన్నాడు.
10:47 وَلِكُلِّ أُمَّةٍ رَّسُولٌ ۖ فَإِذَا جَاءَ رَسُولُهُمْ قُضِيَ بَيْنَهُم بِالْقِسْطِ وَهُمْ لَا يُظْلَمُونَ
ప్రతి సమాజానికీ ఒక ప్రవక్త ఉన్నాడు. కాబట్టి వారి ప్రవక్త వారివద్దకు వచ్చేసినపుడు వారివ్యవహారంలో న్యాయబద్ధంగా తీర్పు చెయ్యబడుతుంది. వారికెలాంటి అన్యాయం జరగదు.
10:48 وَيَقُولُونَ مَتَىٰ هَٰذَا الْوَعْدُ إِن كُنتُمْ صَادِقِينَ
“మీరు సత్యవంతులే అయితే ఆ వాగ్దానం ఎప్పుడు సంభవిస్తుంది?” అని వారు అడుగుతున్నారు.
10:49 قُل لَّا أَمْلِكُ لِنَفْسِي ضَرًّا وَلَا نَفْعًا إِلَّا مَا شَاءَ اللَّهُ ۗ لِكُلِّ أُمَّةٍ أَجَلٌ ۚ إِذَا جَاءَ أَجَلُهُمْ فَلَا يَسْتَأْخِرُونَ سَاعَةً ۖ وَلَا يَسْتَقْدِمُونَ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “అల్లాహ్ తలచినది తప్ప – నా అధీనంలో స్వయంగానా లాభనష్టాలు కూడా లేవు. ప్రతి సమాజానికీ ఒక నిర్ణీత గడువు ఉంది. వారి సమయం వచ్చినప్పుడు వారు ఒక గడియ కూడా వెనకా ముందు జరగరు.”
10:50 قُلْ أَرَأَيْتُمْ إِنْ أَتَاكُمْ عَذَابُهُ بَيَاتًا أَوْ نَهَارًا مَّاذَا يَسْتَعْجِلُ مِنْهُ الْمُجْرِمُونَ
(ఓ ప్రవక్తా!) ఇలా అను: “చెప్పండి, దైవశిక్ష మీపై రాత్రిపూట విరుచుకుపడినా, పగటిపూట వచ్చిపడినా ఆ విషయంలో నేరస్థులకు అంత ఆత్రం ఎందుకట?!”
10:51 أَثُمَّ إِذَا مَا وَقَعَ آمَنتُم بِهِ ۚ آلْآنَ وَقَدْ كُنتُم بِهِ تَسْتَعْجِلُونَ
ఏమిటీ, అది వచ్చిపడినప్పుడు దాన్నివిశ్వసిస్తారా?! ఇప్పుడా విశ్వసించేది?! దీనికోసం మీరు మహాతొందర పెట్టేవారు కదా!”
10:52 ثُمَّ قِيلَ لِلَّذِينَ ظَلَمُوا ذُوقُوا عَذَابَ الْخُلْدِ هَلْ تُجْزَوْنَ إِلَّا بِمَا كُنتُمْ تَكْسِبُونَ
అప్పుడు దుర్మార్గులతో ఇలా చెప్పబడుతుంది: “ఇక శాశ్వతమైన శిక్షను చవిచూడండి. మీరు సంపాదించుకున్న దాని ఫలితమే మీకు లభించింది.”
10:53 وَيَسْتَنبِئُونَكَ أَحَقٌّ هُوَ ۖ قُلْ إِي وَرَبِّي إِنَّهُ لَحَقٌّ ۖ وَمَا أَنتُم بِمُعْجِزِينَ
“ఏమిటీ, అది నిజమేనా?” అని వారు నిన్ను అడుగుతున్నారు. “అవును. నా ప్రభువు తోడు! అది (ఆ శిక్ష) పడటం సత్యం. అది సంభవించకుండా ఆపే శక్తి మీకు లేదు” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు.
10:54 وَلَوْ أَنَّ لِكُلِّ نَفْسٍ ظَلَمَتْ مَا فِي الْأَرْضِ لَافْتَدَتْ بِهِ ۗ وَأَسَرُّوا النَّدَامَةَ لَمَّا رَأَوُا الْعَذَابَ ۖ وَقُضِيَ بَيْنَهُم بِالْقِسْطِ ۚ وَهُمْ لَا يُظْلَمُونَ
దుర్మార్గానికి (షిర్క్‌కు) పాల్పడిన ప్రతి మనిషి దగ్గరా భూమి నిండిపోయేంత (సొమ్ము) ఉన్నా సరే అతను దాన్ని పరిహారంగా ఇచ్చి తనను విడిపించుకునేందుకు ప్రయత్నిస్తాడు. శిక్షను చూసినపుడు వారు లోలోపలే సిగ్గుతో కుమిలిపోతారు. వారి మధ్య న్యాయసమ్మతంగా తీర్పు జరుగుతుంది. వారికెలాంటి అన్యాయం జరగదు.
10:55 أَلَا إِنَّ لِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۗ أَلَا إِنَّ وَعْدَ اللَّهِ حَقٌّ وَلَٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ
వినండి! ఆకాశాలలో, భూమిలో ఉన్న సమస్తమూ అల్లాహ్ సొత్తే. గుర్తుంచుకోండి! అల్లాహ్ వాగ్దానం సత్యం. అయితే చాలామంది (ఈ సత్యాన్ని) తెలుసుకోరు.
10:56 هُوَ يُحْيِي وَيُمِيتُ وَإِلَيْهِ تُرْجَعُونَ
ఆయనే ప్రాణం పోస్తాడు, మరి ఆయనే ప్రాణం తీస్తాడు. మీరంతా ఆయన వద్దకే మరలించబడతారు.
10:57 يَا أَيُّهَا النَّاسُ قَدْ جَاءَتْكُم مَّوْعِظَةٌ مِّن رَّبِّكُمْ وَشِفَاءٌ لِّمَا فِي الصُّدُورِ وَهُدًى وَرَحْمَةٌ لِّلْمُؤْمِنِينَ
ప్రజలారా! మీ ప్రభువు తరఫు నుంచి మీ దగ్గరకు హితోపదేశం వచ్చింది. అది హృదయాలలో ఉన్నవ్యాధుల నుంచి స్వస్థత నొసగేది, నమ్మేవారి కోసం మార్గదర్శకం, కారుణ్యం.
10:58 قُلْ بِفَضْلِ اللَّهِ وَبِرَحْمَتِهِ فَبِذَٰلِكَ فَلْيَفْرَحُوا هُوَ خَيْرٌ مِّمَّا يَجْمَعُونَ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “అల్లాహ్ ప్రదానం చేసిన ఈ బహుమానానికి, కారుణ్యానికి జనులు సంతోషించాలి. వారు కూడబెట్టే దానికంటే ఇది ఎంతో మేలైనది.”
10:59 قُلْ أَرَأَيْتُم مَّا أَنزَلَ اللَّهُ لَكُم مِّن رِّزْقٍ فَجَعَلْتُم مِّنْهُ حَرَامًا وَحَلَالًا قُلْ آللَّهُ أَذِنَ لَكُمْ ۖ أَمْ عَلَى اللَّهِ تَفْتَرُونَ
“అల్లాహ్ మీకోసం ఆహారాన్ని అవతరింపజేయగా దానిలో కొంతభాగాన్ని మీరు మీకోసం నిషేధించుకుని, మరికొంత భాగాన్ని ధర్మసమ్మతం చేసుకున్నారే దీనికి మీ సమాధానం ఏమిటి!?” అని వారిని అడుగు. “ఏమిటీ, ఈ మేరకు అల్లాహ్ మీకు ఆదేశించాడా? లేక మీరే అల్లాహ్‌కు అబద్ధాలను అంటగడుతున్నారా?” అని వారిని అడుగు.
10:60 وَمَا ظَنُّ الَّذِينَ يَفْتَرُونَ عَلَى اللَّهِ الْكَذِبَ يَوْمَ الْقِيَامَةِ ۗ إِنَّ اللَّهَ لَذُو فَضْلٍ عَلَى النَّاسِ وَلَٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَشْكُرُونَ
అల్లాహ్‌కు అబద్ధాలను అంటగట్టే వారు ప్రళయదినం గురించి ఏమనుకుంటున్నారు? నిస్సందేహంగా మానవుల పట్ల అల్లాహ్ అనుగ్రహం కలవాడు. కాని వారిలో చాలా మంది కృతజ్ఞతాపూర్వకంగా వ్యవహరించరు.
10:61 وَمَا تَكُونُ فِي شَأْنٍ وَمَا تَتْلُو مِنْهُ مِن قُرْآنٍ وَلَا تَعْمَلُونَ مِنْ عَمَلٍ إِلَّا كُنَّا عَلَيْكُمْ شُهُودًا إِذْ تُفِيضُونَ فِيهِ ۚ وَمَا يَعْزُبُ عَن رَّبِّكَ مِن مِّثْقَالِ ذَرَّةٍ فِي الْأَرْضِ وَلَا فِي السَّمَاءِ وَلَا أَصْغَرَ مِن ذَٰلِكَ وَلَا أَكْبَرَ إِلَّا فِي كِتَابٍ مُّبِينٍ
(ఓ ప్రవక్తా!) నువ్వు ఏ స్థితిలో వున్నా – ఖుర్ఆనులోని ఏ భాగాలను పారాయణం చేసినా, (ప్రజలారా!) మీరు ఏ పనిచేసినా, మీరు మీ కార్యక్రమాలలో తలమునకలై ఉన్నప్పుడు మేము మిమ్మల్ని గమనిస్తూనే ఉంటాము. భూమిలో, ఆకాశాలలో ఉన్నరవంత వస్తువు కూడా నీ ప్రభువు నుండి గోప్యంగా లేదు – దానికంటే చిన్నదయినా సరే, పెద్దదయినా సరే – స్పష్టమైన గ్రంథంలో నమోదు కాకుండా లేదు.
10:62 أَلَا إِنَّ أَوْلِيَاءَ اللَّهِ لَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ
వినండి! అల్లాహ్ స్నేహితులకు భయముగానీ, దుఃఖంగానీ ఉండదు.
10:63 الَّذِينَ آمَنُوا وَكَانُوا يَتَّقُونَ
వారు విశ్వసించిన వారై, (చెడుల విషయంలో అల్లాహ్‌కు) భయపడేవారై ఉంటారు.
10:64 لَهُمُ الْبُشْرَىٰ فِي الْحَيَاةِ الدُّنْيَا وَفِي الْآخِرَةِ ۚ لَا تَبْدِيلَ لِكَلِمَاتِ اللَّهِ ۚ ذَٰلِكَ هُوَ الْفَوْزُ الْعَظِيمُ
ప్రాపంచిక జీవితంలోనూ, పరలోకంలోనూ వారికి శుభవార్త కలదు . అల్లాహ్ వాక్కుల్లో మార్పు ఉండదు. ఇదే గొప్ప విజయం.
10:65 وَلَا يَحْزُنكَ قَوْلُهُمْ ۘ إِنَّ الْعِزَّةَ لِلَّهِ جَمِيعًا ۚ هُوَ السَّمِيعُ الْعَلِيمُ
(ఓ ప్రవక్తా!) వారి మాటలు నిన్ను దుఃఖానికి లోను చేయకూడదు. యదార్థానికి సర్వాధిపత్యం అల్లాహ్‌దే. ఆయన అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు.
10:66 أَلَا إِنَّ لِلَّهِ مَن فِي السَّمَاوَاتِ وَمَن فِي الْأَرْضِ ۗ وَمَا يَتَّبِعُ الَّذِينَ يَدْعُونَ مِن دُونِ اللَّهِ شُرَكَاءَ ۚ إِن يَتَّبِعُونَ إِلَّا الظَّنَّ وَإِنْ هُمْ إِلَّا يَخْرُصُونَ
ఆకాశాలలో, భూమిలో ఉన్నవారందరూ అల్లాహ్వారేనన్న సంగతిని బాగా తెలుసుకోండి. అల్లాహ్‌ను వదలి ఇతరత్రా భాగస్వాములను పూజించేవారు దేన్ని అనుసరిస్తున్నట్లు?! వారు నిరాధారమైన ఊహలను అనుసరిస్తున్నారు. అంచనాలపై ఆధారపడుతున్నారు.
10:67 هُوَ الَّذِي جَعَلَ لَكُمُ اللَّيْلَ لِتَسْكُنُوا فِيهِ وَالنَّهَارَ مُبْصِرًا ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّقَوْمٍ يَسْمَعُونَ
మీరు విశ్రాంతి తీసుకునేటందుకు ఆయనే మీకోసం రాత్రిని చేశాడు. పగటిని చూడగలగటానికి అనువుగా చేశాడు. నిశ్చయంగా ఇందులో వినేవారికోసం నిదర్శనాలున్నాయి.
10:68 قَالُوا اتَّخَذَ اللَّهُ وَلَدًا ۗ سُبْحَانَهُ ۖ هُوَ الْغَنِيُّ ۖ لَهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۚ إِنْ عِندَكُم مِّن سُلْطَانٍ بِهَٰذَا ۚ أَتَقُولُونَ عَلَى اللَّهِ مَا لَا تَعْلَمُونَ
అల్లాహ్ సంతానం కలిగి ఉన్నాడని వారంటున్నారు. సుబ్హానల్లాహ్! (అల్లాహ్ పరమ పవిత్రుడు). ఆయన ఏ అవసరమూ లేనివాడు. ఆకాశాలలో, భూమిలో ఉన్నదంతా ఆయనసొత్తే. దీనికి గాను (మీరు ఆపాదించే అసత్యానికి గాను) మీవద్ద ఏ ఆధారమూ లేదు. అల్లాహ్‌ను గురించి మీకు తెలియని మాటలంటున్నారా?
10:69 قُلْ إِنَّ الَّذِينَ يَفْتَرُونَ عَلَى اللَّهِ الْكَذِبَ لَا يُفْلِحُونَ
అల్లాహ్‌కు అబద్ధాలను అంటగట్టేవారు ఎట్టి పరిస్థితిలోనూ సాఫల్యం పొందలేరని (ఓప్రవక్తా!) వారికి తెలుపు.
10:70 مَتَاعٌ فِي الدُّنْيَا ثُمَّ إِلَيْنَا مَرْجِعُهُمْ ثُمَّ نُذِيقُهُمُ الْعَذَابَ الشَّدِيدَ بِمَا كَانُوا يَكْفُرُونَ
వారికి ఈ ప్రపంచంలో కొద్దిపాటి భోగముంది. ఆ తరువాత వారు మావద్దకు రావలసి ఉంటుంది. ఆ పిదప మేము వారికి వారి తిరస్కారానికి బదులుగా కఠినమైన శిక్ష రుచి చూపిస్తాము.
10:71 وَاتْلُ عَلَيْهِمْ نَبَأَ نُوحٍ إِذْ قَالَ لِقَوْمِهِ يَا قَوْمِ إِن كَانَ كَبُرَ عَلَيْكُم مَّقَامِي وَتَذْكِيرِي بِآيَاتِ اللَّهِ فَعَلَى اللَّهِ تَوَكَّلْتُ فَأَجْمِعُوا أَمْرَكُمْ وَشُرَكَاءَكُمْ ثُمَّ لَا يَكُنْ أَمْرُكُمْ عَلَيْكُمْ غُمَّةً ثُمَّ اقْضُوا إِلَيَّ وَلَا تُنظِرُونِ
నువ్వు వారికి నూహ్ (అలైహిస్సలాం) గాధను వినిపించు. అప్పుడు అతను తన జాతివారితో, “ఓ నాజాతివారలారా! నేను మీ మధ్య ఉండటం, దైవాజ్ఞలను ఉపదేశించటం మీకు సహింపశక్యం కాకపోతే (పోనివ్వండి), నేను మాత్రం అల్లాహ్‌నే నమ్ముకున్నాను. మీరు మీభాగస్వాములతో కలసి మీ వ్యూహం విషయంలో గట్టి నిర్ణయానికి రండి!. ఆ పిదప మీ వ్యూహరచన మీలో ఎలాంటి శంకకు కారణం కాకూడదు. ఆ పైన నా విషయంలో ఏం చేయాలనుకున్నారో చేయండి. నాకు గడువు ఇవ్వవలసిన అవసరం కూడా లేదు” అని అన్నాడు.
10:72 فَإِن تَوَلَّيْتُمْ فَمَا سَأَلْتُكُم مِّنْ أَجْرٍ ۖ إِنْ أَجْرِيَ إِلَّا عَلَى اللَّهِ ۖ وَأُمِرْتُ أَنْ أَكُونَ مِنَ الْمُسْلِمِينَ
అప్పటికీ మీరు విముఖత చూపితే, నేను మీనుండి ఎలాంటి ప్రతిఫలం కోరలేదు. నాకు ప్రతిఫలం ఇచ్చే బాధ్యత కేవలం అల్లాహ్‌ది. ముస్లింగా ఉండాలని నాకు ఆదేశించబడింది.
10:73 فَكَذَّبُوهُ فَنَجَّيْنَاهُ وَمَن مَّعَهُ فِي الْفُلْكِ وَجَعَلْنَاهُمْ خَلَائِفَ وَأَغْرَقْنَا الَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا ۖ فَانظُرْ كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُنذَرِينَ
అయినా వారు అతన్ని ధిక్కరిస్తూనే ఉన్నారు. అందుచేత మేము అతన్నీ, అతనితోపాటు ఓడలో ఉన్నవారినీ కాపాడాము. వారిని వారసులుగా చేశాము. మా ఆయతులను అసత్యాలని త్రోసిపుచ్చిన వారిని ముంచి వేశాము. చూడు! హెచ్చరించబడిన వారికి ఏ గతిపట్టిందో!
10:74 ثُمَّ بَعَثْنَا مِن بَعْدِهِ رُسُلًا إِلَىٰ قَوْمِهِمْ فَجَاءُوهُم بِالْبَيِّنَاتِ فَمَا كَانُوا لِيُؤْمِنُوا بِمَا كَذَّبُوا بِهِ مِن قَبْلُ ۚ كَذَٰلِكَ نَطْبَعُ عَلَىٰ قُلُوبِ الْمُعْتَدِينَ
మరి నూహ్ (అలైహిస్సలాం) అనంతరం మేము అనేకమంది ప్రవక్తలను వారిజాతుల వద్దకు పంపాము. వారు తమ జనుల వద్దకు స్పష్టమైన నిదర్శనాలను తీసుకువచ్చారు. కాని వారు మొదట్లో ధిక్కరించిన విషయాన్ని మళ్లీ అంగీకరించటం అన్నది జరగనేలేదు. ఈ విధంగా మేము హద్దుమీరిపోయే వారి హృదయాలపై సీలు వేసేస్తాము.
10:75 ثُمَّ بَعَثْنَا مِن بَعْدِهِم مُّوسَىٰ وَهَارُونَ إِلَىٰ فِرْعَوْنَ وَمَلَئِهِ بِآيَاتِنَا فَاسْتَكْبَرُوا وَكَانُوا قَوْمًا مُّجْرِمِينَ
మరి ఆ ప్రవక్తల తరువాత మేము మూసాను, హారూనును ఫిరౌను వద్దకు, అతని సర్దారుల వద్దకు మా సూచనలను ఇచ్చి పంపాము. కాని వారు అహంకారం ప్రదర్శించారు. వారు అపరాధ జనులు.
10:76 فَلَمَّا جَاءَهُمُ الْحَقُّ مِنْ عِندِنَا قَالُوا إِنَّ هَٰذَا لَسِحْرٌ مُّبِينٌ
అటుపిమ్మట మావద్ద నుంచి వారికి సత్యబద్ధమైన నిదర్శనం చేరగా వారు “ఇది పచ్చి మంత్రజాలం” అని అన్నారు.
10:77 قَالَ مُوسَىٰ أَتَقُولُونَ لِلْحَقِّ لَمَّا جَاءَكُمْ ۖ أَسِحْرٌ هَٰذَا وَلَا يُفْلِحُ السَّاحِرُونَ
“ఏమిటీ, సత్యంతో కూడుకున్న నిదర్శనం మీవద్దకు వచ్చేసిన తరువాత దాని గురించి ఇలాంటి మాటలంటారా? ఇది మంత్రజాలమా? మంత్రజాలంచేసే వారు సఫలీకృతులు కాలేరు” అని మూసా (అలైహిస్సలాం) చెప్పాడు.
10:78 قَالُوا أَجِئْتَنَا لِتَلْفِتَنَا عَمَّا وَجَدْنَا عَلَيْهِ آبَاءَنَا وَتَكُونَ لَكُمَا الْكِبْرِيَاءُ فِي الْأَرْضِ وَمَا نَحْنُ لَكُمَا بِمُؤْمِنِينَ
దానికి వారు, “మేము మా తాతముత్తాతలను ఏ పద్ధతిపై చూశామో ఆ పద్ధతి నుంచి మమ్మల్ని తప్పించటానికి నువ్వు మావద్దకు వచ్చావా?! ఇలా చేసి మీరిద్దరూ భూమిలో పెద్దరికం పొందాలనుకుంటున్నారా? మేమెన్నటికీ మీ ఇద్దరినీ విశ్వసించబోము” అని చెప్పారు.
10:79 وَقَالَ فِرْعَوْنُ ائْتُونِي بِكُلِّ سَاحِرٍ عَلِيمٍ
“ఆరితేరిన మాంత్రికులందరినీ నాముందు హాజరుపరచండి” అని ఫిర్ఔన్ ఆదేశించాడు.
10:80 فَلَمَّا جَاءَ السَّحَرَةُ قَالَ لَهُم مُّوسَىٰ أَلْقُوا مَا أَنتُم مُّلْقُونَ
మాంత్రికులు వచ్చినప్పుడు, “మీరు పడవేయాలనుకున్న వాటిని పడవెయ్యండి” అని మూసా వారితో అన్నాడు.
10:81 فَلَمَّا أَلْقَوْا قَالَ مُوسَىٰ مَا جِئْتُم بِهِ السِّحْرُ ۖ إِنَّ اللَّهَ سَيُبْطِلُهُ ۖ إِنَّ اللَّهَ لَا يُصْلِحُ عَمَلَ الْمُفْسِدِينَ
వారు పడవేయగానే మాంత్రికులతో మూసా ఇలా అన్నాడు: “మీరు తెచ్చినది మంత్రజాలం. అల్లాహ్ ఇప్పుడే దానిని మిథ్యగా చేసి చూపిస్తాడు. అల్లాహ్ ఇలాంటి కల్లోల జనకుల పనిని చక్కబడనివ్వడు.
10:82 وَيُحِقُّ اللَّهُ الْحَقَّ بِكَلِمَاتِهِ وَلَوْ كَرِهَ الْمُجْرِمُونَ
అపరాధులకు మింగుడు పడకపోయినా సరే అల్లాహ్ తన ఆదేశాల ద్వారా సత్యాన్ని సత్యంగా నిరూపిస్తాడు.
10:83 فَمَا آمَنَ لِمُوسَىٰ إِلَّا ذُرِّيَّةٌ مِّن قَوْمِهِ عَلَىٰ خَوْفٍ مِّن فِرْعَوْنَ وَمَلَئِهِمْ أَن يَفْتِنَهُمْ ۚ وَإِنَّ فِرْعَوْنَ لَعَالٍ فِي الْأَرْضِ وَإِنَّهُ لَمِنَ الْمُسْرِفِينَ
మూసా (అలైహిస్సలాం)ను అతని జాతికి చెందిన కొద్దిమంది మాత్రమే విశ్వసించారు. ఆ కొద్దిమంది కూడా, ఫిరౌనుకు, అతని సర్దారులకు – వారు తమను ఎక్కడ వేధిస్తారోనని భయపడుతూ ఉండేవారు. అవును మరి! ఆరాజ్యంలో ఫిరౌన్ ప్రాబల్యం కలిగి ఉండేవాడు, దానికి తోడు హద్దు మీరిపోయేవాడు.
10:84 وَقَالَ مُوسَىٰ يَا قَوْمِ إِن كُنتُمْ آمَنتُم بِاللَّهِ فَعَلَيْهِ تَوَكَّلُوا إِن كُنتُم مُّسْلِمِينَ
మూసా (అలైహిస్సలామ్)తన వారినుద్దేశించి, “నా జాతిప్రజలారా! మీరు అల్లాహ్‌ను విశ్వసించేవారే అయితే, మీరు ముస్లిములే అయితే ఆయన్నే నమ్ముకోండి” అన్నాడు.
10:85 فَقَالُوا عَلَى اللَّهِ تَوَكَّلْنَا رَبَّنَا لَا تَجْعَلْنَا فِتْنَةً لِّلْقَوْمِ الظَّالِمِينَ
దానికి వారు, “మేము అల్లాహ్‌నే నమ్ముకున్నాము. మా ప్రభూ! మమ్మల్ని ఈ దుర్మార్గుల పరీక్షా సాధనంగా చేయకు.”
10:86 وَنَجِّنَا بِرَحْمَتِكَ مِنَ الْقَوْمِ الْكَافِرِينَ
“నీ కృపతో మమ్మల్నిఈ అవిశ్వాసుల చెరనుండి విడిపించు” అని వేడుకున్నారు.
10:87 وَأَوْحَيْنَا إِلَىٰ مُوسَىٰ وَأَخِيهِ أَن تَبَوَّآ لِقَوْمِكُمَا بِمِصْرَ بُيُوتًا وَاجْعَلُوا بُيُوتَكُمْ قِبْلَةً وَأَقِيمُوا الصَّلَاةَ ۗ وَبَشِّرِ الْمُؤْمِنِينَ
“మీరిద్దరూ మీ వాళ్ళకోసం ఈజిప్టులో నివాసగృహాలను ఏర్పాటు చేయండి. ఆ ఇళ్లు ఖిబ్లా దిశలో ఉండేట్లు చూసుకోండి. నమాజును నెలకొల్పండి. (మూసా!) నీవు విశ్వాసులకు శుభవార్తను అందజేయి” అని మేము మూసాకు, అతని సోదరునికీ వహీ పంపాము.
10:88 وَقَالَ مُوسَىٰ رَبَّنَا إِنَّكَ آتَيْتَ فِرْعَوْنَ وَمَلَأَهُ زِينَةً وَأَمْوَالًا فِي الْحَيَاةِ الدُّنْيَا رَبَّنَا لِيُضِلُّوا عَن سَبِيلِكَ ۖ رَبَّنَا اطْمِسْ عَلَىٰ أَمْوَالِهِمْ وَاشْدُدْ عَلَىٰ قُلُوبِهِمْ فَلَا يُؤْمِنُوا حَتَّىٰ يَرَوُا الْعَذَابَ الْأَلِيمَ
మూసా ఇలా విన్నవించుకున్నాడు : “మా ప్రభూ! నీవు ఫిరౌనుకు, అతని సర్దారులకు ప్రపంచ జీవితంలో అందమైన సాధన సంపత్తులను, ఐశ్వర్యాన్నీ ఇచ్చావు. వారు ప్రజలను నీమార్గం నుంచి తప్పించటానికే ఇదంతా ఇచ్చావా ప్రభూ!? మాప్రభూ! వారి సిరిసంపదలను సర్వనాశనం చెయ్యి! బాధాకరమైన శిక్షను చూసేవరకూ వారు విశ్వసించకుండా ఉండేలా వారిగుండెలను కఠినమైనవి గానేఉంచు.”
10:89 قَالَ قَدْ أُجِيبَت دَّعْوَتُكُمَا فَاسْتَقِيمَا وَلَا تَتَّبِعَانِّ سَبِيلَ الَّذِينَ لَا يَعْلَمُونَ
“మీరిద్దరి విన్నపం ఆమోదించబడింది. కాబట్టి మీరు నిలకడగా ఉండండి. జ్ఞానం లేనివారి మార్గాన్ని అనుసరించకండి” అని అల్లాహ్ సెలవిచ్చాడు.
10:90 وَجَاوَزْنَا بِبَنِي إِسْرَائِيلَ الْبَحْرَ فَأَتْبَعَهُمْ فِرْعَوْنُ وَجُنُودُهُ بَغْيًا وَعَدْوًا ۖ حَتَّىٰ إِذَا أَدْرَكَهُ الْغَرَقُ قَالَ آمَنتُ أَنَّهُ لَا إِلَٰهَ إِلَّا الَّذِي آمَنَتْ بِهِ بَنُو إِسْرَائِيلَ وَأَنَا مِنَ الْمُسْلِمِينَ
మేము ఇస్రాయీలు వంశీయులను సముద్రం దాటించాము. వారి వెనుకే ఫిరౌను తన సైన్యాన్ని తీసుకుని దౌర్జన్యానికి, అతిక్రమణకు పాల్పడే ఉద్దేశంతో వెంబడించాడు. తీరా (సముద్రంలో) మునిగిపోతున్నప్పుడు; ”బనీఇస్రాయీల్ విశ్వసించిన దేవుణ్ణి నేనూ విశ్వసిస్తున్నాను. ఆ దేవుడు తప్ప మరో ఆరాధ్యుడు లేడు. నేనూ ముస్లింలలోని వాడనే” అని ఫిరౌను పలికాడు.
10:91 آلْآنَ وَقَدْ عَصَيْتَ قَبْلُ وَكُنتَ مِنَ الْمُفْسِدِينَ
ఇప్పుడా విశ్వసించేది?! ఇంతకు ముందు తలబిరుసుతనాన్ని ప్రదర్శిస్తూ, కల్లోల జనకులలో చేరి ఉండేవాడివి కదా!
10:92 فَالْيَوْمَ نُنَجِّيكَ بِبَدَنِكَ لِتَكُونَ لِمَنْ خَلْفَكَ آيَةً ۚ وَإِنَّ كَثِيرًا مِّنَ النَّاسِ عَنْ آيَاتِنَا لَغَافِلُونَ
కాబట్టి ఈ రోజు, నీవు నీ తర్వాతి తరాలకు గుణపాఠం అయ్యే నిమిత్తం నీ శవాన్ని మాత్రమే రక్షిస్తాము. యదార్థమేమిటంటే జనులలో చాలామంది మా సూచనలను నిర్లక్ష్యం చేస్తారు (అని సమాధానం ఇవ్వబడింది).
10:93 وَلَقَدْ بَوَّأْنَا بَنِي إِسْرَائِيلَ مُبَوَّأَ صِدْقٍ وَرَزَقْنَاهُم مِّنَ الطَّيِّبَاتِ فَمَا اخْتَلَفُوا حَتَّىٰ جَاءَهُمُ الْعِلْمُ ۚ إِنَّ رَبَّكَ يَقْضِي بَيْنَهُمْ يَوْمَ الْقِيَامَةِ فِيمَا كَانُوا فِيهِ يَخْتَلِفُونَ
మేము ఇస్రాయీలు సంతతి వారికి చాలా మంచి నివాసస్థలాన్ని, తినటానికి పరిశుద్ధమైన ఆహారపదార్థాలను ఇచ్చాము. వారి వద్దకు (మంచీ చెడుల) జ్ఞానం వచ్చిన తరువాతే వారు విభేదించుకున్నారు! నిశ్చయంగా నీ ప్రభువు ప్రళయదినాన వారు విభేదించుకుంటూ ఉన్న విషయాలపై వారి మధ్య తీర్పు చేస్తాడు.
10:94 فَإِن كُنتَ فِي شَكٍّ مِّمَّا أَنزَلْنَا إِلَيْكَ فَاسْأَلِ الَّذِينَ يَقْرَءُونَ الْكِتَابَ مِن قَبْلِكَ ۚ لَقَدْ جَاءَكَ الْحَقُّ مِن رَّبِّكَ فَلَا تَكُونَنَّ مِنَ الْمُمْتَرِينَ
మరి మేము నీ వద్దకు పంపిన దానిపై ఏమాత్రం సందేహమున్నా నీకు పూర్వపు గ్రంథాన్ని పారాయణం చేస్తున్నవారిని అడిగి చూడు. నిశ్చయంగా నీ వద్దకు నీ ప్రభువు తరఫు నుంచి సత్యం (తోకూడిన గ్రంథం) వచ్చింది. కనుక నువ్వు ఎంతమాత్రం శంకించేవారిలో చేరకు.
10:95 وَلَا تَكُونَنَّ مِنَ الَّذِينَ كَذَّبُوا بِآيَاتِ اللَّهِ فَتَكُونَ مِنَ الْخَاسِرِينَ
అల్లాహ్ ఆయతులను అసత్యాలని ధిక్కరించిన వారిలో కూడా చేరకు. నువ్వు గనక అలాచేశావంటే నష్టపోయినవారిలో చేరిపోతావు సుమా!
10:96 إِنَّ الَّذِينَ حَقَّتْ عَلَيْهِمْ كَلِمَتُ رَبِّكَ لَا يُؤْمِنُونَ
ఎవరి విషయంలో నీ ప్రభువు మాట నిజమని నిరూపితమయిందో వారు ఎన్నటికీ విశ్వసించరు.
10:97 وَلَوْ جَاءَتْهُمْ كُلُّ آيَةٍ حَتَّىٰ يَرَوُا الْعَذَابَ الْأَلِيمَ
ఒకవేళ వారివద్దకు నిదర్శనాలన్నీ చేరినా సరే-వ్యధాభరితమైన శిక్షను చూడనంతవరకూ (వారు విశ్వసించరు).
10:98 فَلَوْلَا كَانَتْ قَرْيَةٌ آمَنَتْ فَنَفَعَهَا إِيمَانُهَا إِلَّا قَوْمَ يُونُسَ لَمَّا آمَنُوا كَشَفْنَا عَنْهُمْ عَذَابَ الْخِزْيِ فِي الْحَيَاةِ الدُّنْيَا وَمَتَّعْنَاهُمْ إِلَىٰ حِينٍ
(ఈ విధంగా ఆపదకు చేరువయిన తరువాత) విశ్వాస ప్రకటనచేసే వారి విశ్వాసం – ఒక్క యూనుస్ జాతివారికి తప్ప ఇతర బస్తీ వాసులెవరికీ లాభదాయకం కాలేదు. వారు (యూనుస్ జాతి ప్రజలు) విశ్వసించగానే ప్రపంచ జీవితంలో అవమానకరమైన శిక్షను వారి నుంచి తొలగించాము. ఒక నిర్ణీత సమయం వరకూ జీవనలాభం పొందే అవకాశం వారికి కల్పించాము.
10:99 وَلَوْ شَاءَ رَبُّكَ لَآمَنَ مَن فِي الْأَرْضِ كُلُّهُمْ جَمِيعًا ۚ أَفَأَنتَ تُكْرِهُ النَّاسَ حَتَّىٰ يَكُونُوا مُؤْمِنِينَ
నీ ప్రభువు గనక తలచుకుంటే భూమండలంలోని జనులంతా విశ్వసించి ఉండేవారే. అలాంటప్పుడు (ఓముహమ్మద్- స!) జనులు విశ్వసించాల్సిందేనని నువ్వు వారిపై బలవంతంచేస్తావా?
10:100 وَمَا كَانَ لِنَفْسٍ أَن تُؤْمِنَ إِلَّا بِإِذْنِ اللَّهِ ۚ وَيَجْعَلُ الرِّجْسَ عَلَى الَّذِينَ لَا يَعْقِلُونَ
వాస్తవానికి దైవాజ్ఞ కానంత వరకూ ఎవడూ విశ్వసించడు. బుద్ధిహీనులపై అల్లాహ్ అశుద్ధతను వేసేస్తాడు.
10:101 قُلِ انظُرُوا مَاذَا فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ وَمَا تُغْنِي الْآيَاتُ وَالنُّذُرُ عَن قَوْمٍ لَّا يُؤْمِنُونَ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “ఆకాశాలలో, భూమిలో ఏ వస్తువులయితే ఉన్నాయో వాటిని కాస్త (నిశిత దృష్టితో) చూడండి!” విశ్వసించని వారికి సూచనలుగానీ, హెచ్చరికలుగానీ లాభదాయకం కాజాలవు.
10:102 فَهَلْ يَنتَظِرُونَ إِلَّا مِثْلَ أَيَّامِ الَّذِينَ خَلَوْا مِن قَبْلِهِمْ ۚ قُلْ فَانتَظِرُوا إِنِّي مَعَكُم مِّنَ الْمُنتَظِرِينَ
బహుశా వీళ్లు తమకు పూర్వం గతించిన వారికి ఎదురయిన సంఘటనల లాంటి వాటికోసం ఎదురుచూస్తున్నారేమో! ”సరే. అలా అయితే మీరూ నిరీక్షించండి. మీతోపాటే నేనూ నిరీక్షిస్తాను” అని (ఓప్రవక్తా!) వారికి చెప్పు.
10:103 ثُمَّ نُنَجِّي رُسُلَنَا وَالَّذِينَ آمَنُوا ۚ كَذَٰلِكَ حَقًّا عَلَيْنَا نُنجِ الْمُؤْمِنِينَ
మరి మేము మా ప్రవక్తలను, విశ్వసించినవారిని కాపాడేవారము. అదే విధంగా విశ్వసించిన వారిని కాపాడటం మా విధి.
10:104 قُلْ يَا أَيُّهَا النَّاسُ إِن كُنتُمْ فِي شَكٍّ مِّن دِينِي فَلَا أَعْبُدُ الَّذِينَ تَعْبُدُونَ مِن دُونِ اللَّهِ وَلَٰكِنْ أَعْبُدُ اللَّهَ الَّذِي يَتَوَفَّاكُمْ ۖ وَأُمِرْتُ أَنْ أَكُونَ مِنَ الْمُؤْمِنِينَ
(ప్రవక్తా!) వారికి చెప్పు: “ప్రజలారా! నాధర్మం పట్ల మీకు సందేహం ఉంటే (వినండి), అల్లాహ్‌ను వదలిపెట్టి మీరు పూజించే వారిని నేను పూజించను. అయితే మీప్రాణాలను స్వాధీనం చేసుకునే అల్లాహ్‌ను నేను ఆరాధిస్తున్నాను. విశ్వసించేవారిలో ఉండాలని నాకు ఆదేశించబడింది.”
10:105 وَأَنْ أَقِمْ وَجْهَكَ لِلدِّينِ حَنِيفًا وَلَا تَكُونَنَّ مِنَ الْمُشْرِكِينَ
“పూర్తి ఏకాగ్రతతో (ఈ) ధర్మం వైపుకు అభిముఖం కావాలనీ, షిర్క్ చేసేవారిలో చేరిపోరాద” ని కూడా నాకు చెప్పబడింది.
10:106 وَلَا تَدْعُ مِن دُونِ اللَّهِ مَا لَا يَنفَعُكَ وَلَا يَضُرُّكَ ۖ فَإِن فَعَلْتَ فَإِنَّكَ إِذًا مِّنَ الظَّالِمِينَ
“అల్లాహ్‌ను వదలిపెట్టి నీకు ఎలాంటి లాభాన్ని గానీ, కీడును గానీ కలిగించలేని దానిని నువ్వు ఆరాధించకు. ఒకవేళ అలాంటి పని చేశావంటే నువ్వు కూడా దుర్మార్గుల్లో ఒకడివవుతావు” (అని హెచ్చరించబడింది).
10:107 وَإِن يَمْسَسْكَ اللَّهُ بِضُرٍّ فَلَا كَاشِفَ لَهُ إِلَّا هُوَ ۖ وَإِن يُرِدْكَ بِخَيْرٍ فَلَا رَادَّ لِفَضْلِهِ ۚ يُصِيبُ بِهِ مَن يَشَاءُ مِنْ عِبَادِهِ ۚ وَهُوَ الْغَفُورُ الرَّحِيمُ
ఒకవేళ అల్లాహ్ నిన్ను ఏదైనా బాధకు గురిచేస్తే ఆయన తప్ప మరొకరెవరూ దానిని దూరం చేయలేడు. ఒకవేళ ఆయన నీకు ఏదైనా మేలు చెయ్యగోరితే ఆయన కృపను అడ్డుకునేవాడు కూడా ఎవడూ లేడు. ఆయన తన కృపను తన దాసులలో తాను కోరిన వారిపై కురిపిస్తాడు. ఆయన అమితంగా క్షమించేవాడు, అపారంగా కనికరించేవాడు.
10:108 قُلْ يَا أَيُّهَا النَّاسُ قَدْ جَاءَكُمُ الْحَقُّ مِن رَّبِّكُمْ ۖ فَمَنِ اهْتَدَىٰ فَإِنَّمَا يَهْتَدِي لِنَفْسِهِ ۖ وَمَن ضَلَّ فَإِنَّمَا يَضِلُّ عَلَيْهَا ۖ وَمَا أَنَا عَلَيْكُم بِوَكِيلٍ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “ప్రజలారా! మీ వద్దకు మీప్రభువు తరఫు నుంచి సత్యం వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు ఎవడైనా సన్మార్గానికి వస్తే అతడు తన (మంచి) కోసమే సన్మార్గానికి వస్తాడు. మరెవడైనా అపమార్గానికి లోనైతే ఆ అపమార్గం అతనికే హానికరం అవుతుంది. నేను మీపై నియమించబడిన కావలివాణ్ణి మాత్రం కాను.”
10:109 وَاتَّبِعْ مَا يُوحَىٰ إِلَيْكَ وَاصْبِرْ حَتَّىٰ يَحْكُمَ اللَّهُ ۚ وَهُوَ خَيْرُ الْحَاكِمِينَ
(ఓ ప్రవక్తా!) నువ్వు నీవద్దకు పంపబడే వహీని అనుసరిస్తూ ఉండు. అల్లాహ్ తీర్పు చేసేవరకూ ఓపిక పట్టు. ఆయన తీర్పుచేసే వారిలోకెల్లా శ్రేష్ఠుడు.
11. సూరా హూద్ (Hud)
11:1 الر ۚ كِتَابٌ أُحْكِمَتْ آيَاتُهُ ثُمَّ فُصِّلَتْ مِن لَّدُنْ حَكِيمٍ خَبِيرٍ
అలిఫ్-లామ్-రా. ఇది ఒక గ్రంథం. దీని వాక్యాలు నిర్దుష్టమైనవిగా చేయబడ్డాయి. అవి వివేచనాపరుడు, సర్వం ఎరిగిన వాని తరఫు నుండి స్పష్టంగా విశదీకరించబడ్డాయి.
11:2 أَلَّا تَعْبُدُوا إِلَّا اللَّهَ ۚ إِنَّنِي لَكُم مِّنْهُ نَذِيرٌ وَبَشِيرٌ
అల్లాహ్‌ను తప్ప వేరెవరినీ ఆరాధించరాదు (అని వాటిలో చెప్పబడింది). నేను ఆయన తరఫున మిమ్మల్ని భయపెట్టేవాడిని, మీకు శుభవార్తను వినిపించేవాడిని.
11:3 وَأَنِ اسْتَغْفِرُوا رَبَّكُمْ ثُمَّ تُوبُوا إِلَيْهِ يُمَتِّعْكُم مَّتَاعًا حَسَنًا إِلَىٰ أَجَلٍ مُّسَمًّى وَيُؤْتِ كُلَّ ذِي فَضْلٍ فَضْلَهُ ۖ وَإِن تَوَلَّوْا فَإِنِّي أَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ كَبِيرٍ
ఇంకా మీరు మీతప్పుల మన్నింపుకోసం మీప్రభువును వేడుకోండి. తర్వాత (పశ్చాత్తాపంతో) ఆయన వైపుకే మరలండి. ఒక నిర్థారిత కాలం వరకూ ఆయన మీకు మంచి (జీవన) సామగ్రిని సమకూరుస్తాడు. ఎక్కువగా ఆచరణచేసే ప్రతిఒక్కరికీ ఎక్కువ పుణ్యఫలం ప్రసాదిస్తాడు. ఒకవేళ మీరు గనక విముఖత ప్రదర్శించిన పక్షంలో ఒకానొక మహాదినాన మిమ్మల్ని చుట్టుముట్టే శిక్ష గురించి నేను భయపడుతున్నాను.
11:4 إِلَى اللَّهِ مَرْجِعُكُمْ ۖ وَهُوَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
మీరు మరలిపోవలసింది అల్లాహ్ వద్దకే. ఆయన అన్నింటిపై అధికారం కలవాడు.
11:5 أَلَا إِنَّهُمْ يَثْنُونَ صُدُورَهُمْ لِيَسْتَخْفُوا مِنْهُ ۚ أَلَا حِينَ يَسْتَغْشُونَ ثِيَابَهُمْ يَعْلَمُ مَا يُسِرُّونَ وَمَا يُعْلِنُونَ ۚ إِنَّهُ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ
వారు తమ (గోప్య) విషయాలను (అల్లాహ్ నుండి) రహస్యంగా పెట్టడానికి తమ రొమ్ములను ముడుచుకుంటున్నారు. వినండి! వారు బట్టలతో తమను తాము కప్పుకున్నప్పుడు కూడా వారు దాచేదీ, బయల్పరచేదీ, అంతా ఆయన తెలుసుకుంటాడు. నిశ్చయంగా ఆయన గుండెల్లోని గుట్టును సయితం ఎరిగినవాడు.
11:6 وَمَا مِن دَابَّةٍ فِي الْأَرْضِ إِلَّا عَلَى اللَّهِ رِزْقُهَا وَيَعْلَمُ مُسْتَقَرَّهَا وَمُسْتَوْدَعَهَا ۚ كُلٌّ فِي كِتَابٍ مُّبِينٍ
భూమిలో సంచరించే ప్రాణులన్నింటికీ ఆహారాన్ని సమకూర్చే బాధ్యత అల్లాహ్‌దే. అవి ఆగి ఉండే, అప్పగించబడే స్థానాలు కూడా ఆయనకు తెలుసు. అవన్నీ స్పష్టమైన గ్రంథంలో నమోదై ఉన్నాయి.
11:7 وَهُوَ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ فِي سِتَّةِ أَيَّامٍ وَكَانَ عَرْشُهُ عَلَى الْمَاءِ لِيَبْلُوَكُمْ أَيُّكُمْ أَحْسَنُ عَمَلًا ۗ وَلَئِن قُلْتَ إِنَّكُم مَّبْعُوثُونَ مِن بَعْدِ الْمَوْتِ لَيَقُولَنَّ الَّذِينَ كَفَرُوا إِنْ هَٰذَا إِلَّا سِحْرٌ مُّبِينٌ
మీలో మంచి పనులు చేసే వారెవరూ పరీక్షించే నిమిత్తం ఆయన ఆరు రోజులలో ఆకాశాలనూ, భూమినీ సృష్టించాడు. (అంతకుముందు) ఆయన సింహాసనం (అర్ష్) నీటిపై ఉండేది. “మీరు చనిపోయిన తరువాత మళ్లీలేపబడతారు” అని నువ్వు వారికి చెప్పావంటే, “ఇది పచ్చి ఇంద్రజాలం తప్ప మరొకటి కాదు” అని అవిశ్వాసులు తప్పకుండా సమాధానమిస్తారు.
11:8 وَلَئِنْ أَخَّرْنَا عَنْهُمُ الْعَذَابَ إِلَىٰ أُمَّةٍ مَّعْدُودَةٍ لَّيَقُولُنَّ مَا يَحْبِسُهُ ۗ أَلَا يَوْمَ يَأْتِيهِمْ لَيْسَ مَصْرُوفًا عَنْهُمْ وَحَاقَ بِهِم مَّا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ
ఒకవేళ మేము వారికి పడే శిక్షను కొంత వ్యవధి వరకు వాయిదా వేస్తే, “ఆ శిక్ష పడకుండా అడ్డుకుంటున్న వస్తువు ఏది?” అంటారు. వినండి! అది వచ్చిపడిన రోజువారి నుంచి అది తొలగిపోవటం అనేది జరగదు. దేని గురించి వారు పరిహసించేవారో అదే వారిని చుట్టుముడుతుంది.
11:9 وَلَئِنْ أَذَقْنَا الْإِنسَانَ مِنَّا رَحْمَةً ثُمَّ نَزَعْنَاهَا مِنْهُ إِنَّهُ لَيَئُوسٌ كَفُورٌ
మేము మనిషికి ఏదైనా మాకారుణ్యం రుచిని చూపి, దాన్ని గనక అతన్నుంచి తిరిగి తీసేసుకుంటే అతను నిరాశ చెందుతాడు; కృతఘ్నుడుగా మారిపోతాడు.
11:10 وَلَئِنْ أَذَقْنَاهُ نَعْمَاءَ بَعْدَ ضَرَّاءَ مَسَّتْهُ لَيَقُولَنَّ ذَهَبَ السَّيِّئَاتُ عَنِّي ۚ إِنَّهُ لَفَرِحٌ فَخُورٌ
అతనికి కలిగిన కష్టాల తరువాత మేము గనక అతనికే దైనాఅనుగ్రహం రుచిచూపితే, “(హమ్మయ్య!) నా దురవస్థలన్నీ దూరమైపోయాయి” అని అంటాడు. నిశ్చయంగా అతడు మిడిసి పడతాడు. గొప్పలు చెప్పుకుంటాడు.
11:11 إِلَّا الَّذِينَ صَبَرُوا وَعَمِلُوا الصَّالِحَاتِ أُولَٰئِكَ لَهُم مَّغْفِرَةٌ وَأَجْرٌ كَبِيرٌ
అయితే సహనం వహించి, మంచిపనులు చేసేవారు మాత్రం అటువంటి వారు కారు. ఇలాంటి వారికోసమే మన్నింపూ, గొప్పపుణ్యఫలమూ ఉన్నాయి.
11:12 فَلَعَلَّكَ تَارِكٌ بَعْضَ مَا يُوحَىٰ إِلَيْكَ وَضَائِقٌ بِهِ صَدْرُكَ أَن يَقُولُوا لَوْلَا أُنزِلَ عَلَيْهِ كَنزٌ أَوْ جَاءَ مَعَهُ مَلَكٌ ۚ إِنَّمَا أَنتَ نَذِيرٌ ۚ وَاللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ وَكِيلٌ
(ఓప్రవక్తా!) బహుశా నీవద్దకు పంపబడే వహీలో ఏదైనా భాగాన్నివదలివేస్తావేమో! “ఇతని పైధనాగారం ఎందుకు అవతరించలేదు? పోనీ, ఇతనితో పాటు దైవదూత అయినా ఎందుకు రాలేదు?” అని వారు చెప్పే మాటలు నీకు మనస్తాపం కలిగించినట్లున్నాయి. చూడు! నువ్వు భయపెట్టేవాడివి మాత్రమే. అన్ని విషయాలకు బాధ్యుడు అల్లాహ్.
11:13 أَمْ يَقُولُونَ افْتَرَاهُ ۖ قُلْ فَأْتُوا بِعَشْرِ سُوَرٍ مِّثْلِهِ مُفْتَرَيَاتٍ وَادْعُوا مَنِ اسْتَطَعْتُم مِّن دُونِ اللَّهِ إِن كُنتُمْ صَادِقِينَ
ఏమిటీ, అతనే (ప్రవక్తే) ఈ ఖురానును కల్పించుకున్నాడని వాళ్ళంటున్నారా? “మరైతే మీరు కూడా ఇలాంటి పది సూరాలు కల్పించి తీసుకురండి. మీరు సత్యవంతులే అయితే, అల్లాహ్‌ను తప్ప మీరు పిలువగలిగితే దీని సహాయం కోసం ఎవరినైనా పిలుచుకోండి” అని (ఓప్రవక్తా!) వారికిచెప్పు.
11:14 فَإِلَّمْ يَسْتَجِيبُوا لَكُمْ فَاعْلَمُوا أَنَّمَا أُنزِلَ بِعِلْمِ اللَّهِ وَأَن لَّا إِلَٰهَ إِلَّا هُوَ ۖ فَهَلْ أَنتُم مُّسْلِمُونَ
మరి వారు గనక మీ సవాలును స్వీకరించకపోతే, ఈ ఖుర్ఆన్ దైవజ్ఞానంతో అవతరింపజేయబడిందనీ, ఆయన తప్ప మరో ఆరాధ్యదైవం లేనే లేడని తెలుసుకోండి. మరి ఇప్పుడైనా మీరు ముస్లింలవుతారా?
11:15 مَن كَانَ يُرِيدُ الْحَيَاةَ الدُّنْيَا وَزِينَتَهَا نُوَفِّ إِلَيْهِمْ أَعْمَالَهُمْ فِيهَا وَهُمْ فِيهَا لَا يُبْخَسُونَ
ఎవరయితే ప్రాపంచిక జీవితం పట్ల, దాని అందచందాల పట్ల వ్యామోహితులవుతున్నారో అలాంటి వారికి వారి కర్మలను (వాటి ఫలితాన్ని) మేము ఇక్కడే పూర్తిగా ఇచ్చేస్తాము. ఇక్కడ (ప్రపంచంలో) వారికి ఏ లోటూ జరగదు.
11:16 أُولَٰئِكَ الَّذِينَ لَيْسَ لَهُمْ فِي الْآخِرَةِ إِلَّا النَّارُ ۖ وَحَبِطَ مَا صَنَعُوا فِيهَا وَبَاطِلٌ مَّا كَانُوا يَعْمَلُونَ
అయితే అలాంటి వారికి పరలోకంలో అగ్ని తప్ప మరేమీ లభించదు. ప్రపంచంలో వారు చేసుకున్నదంతా వృథా అయిపోతుంది. వారు చేసే పనులన్నీ మిథ్యగా మారిపోతాయి.
11:17 أَفَمَن كَانَ عَلَىٰ بَيِّنَةٍ مِّن رَّبِّهِ وَيَتْلُوهُ شَاهِدٌ مِّنْهُ وَمِن قَبْلِهِ كِتَابُ مُوسَىٰ إِمَامًا وَرَحْمَةً ۚ أُولَٰئِكَ يُؤْمِنُونَ بِهِ ۚ وَمَن يَكْفُرْ بِهِ مِنَ الْأَحْزَابِ فَالنَّارُ مَوْعِدُهُ ۚ فَلَا تَكُ فِي مِرْيَةٍ مِّنْهُ ۚ إِنَّهُ الْحَقُّ مِن رَّبِّكَ وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يُؤْمِنُونَ
ఒక వ్యక్తి తన ప్రభువు తరఫు నుండి వచ్చిన నిదర్శనాన్ని కలిగివున్నాడు, దాంతో పాటు అల్లాహ్ వద్ద నుంచి వచ్చిన దానిని సాక్షిగా కలిగి ఉన్నాడు,అంతకుమునుపు మార్గదర్శకంగా, కారుణ్యంగా ఉన్న మూసా గ్రంథాన్ని (కూడా సాక్షిగా) కలిగి ఉన్నాడు. అటువంటి వ్యక్తి (ఇతరులతో ఎలాసమానుడవుతాడు?) ఇలాంటి వారే దానిని (ఖుర్ఆన్ను) విశ్వసిస్తారు. అన్ని వర్గాలలోనూ ఎవరెవరు దానిని త్రోసిపుచ్చుతారో – వారికి వాగ్దానం చెయ్యబడిన – గమ్యస్థానం నరకం. కనుక (ఓప్రవక్తా!) దీని విషయంలో నువ్వు ఎలాంటి సందేహానికి లోను కారాదు. నిస్సందేహంగా ఇది నీప్రభువు తరఫు నుంచి వచ్చిన సత్యం. కాని చాలా మంది (ఈ సత్యాన్ని) విశ్వసించరు.
11:18 وَمَنْ أَظْلَمُ مِمَّنِ افْتَرَىٰ عَلَى اللَّهِ كَذِبًا ۚ أُولَٰئِكَ يُعْرَضُونَ عَلَىٰ رَبِّهِمْ وَيَقُولُ الْأَشْهَادُ هَٰؤُلَاءِ الَّذِينَ كَذَبُوا عَلَىٰ رَبِّهِمْ ۚ أَلَا لَعْنَةُ اللَّهِ عَلَى الظَّالِمِينَ
అల్లాహ్‌కు అబద్ధాన్ని అంటగట్టే వాడికన్నా పరమ దుర్మార్గుడు ఎవడుంటాడు? ఇలాంటి వారంతా తమ ప్రభువు సమక్షంలో హాజరు పరచబడతారు. “తమ ప్రభువుపై అసత్యాలను కల్పించిన వారు వీళ్ళే” అని సాక్షులు సాక్ష్యమిస్తారు. వినండి! (అలాంటి) దుర్మార్గుల పై దేవుని శాపం పడుతుంది.
11:19 الَّذِينَ يَصُدُّونَ عَن سَبِيلِ اللَّهِ وَيَبْغُونَهَا عِوَجًا وَهُم بِالْآخِرَةِ هُمْ كَافِرُونَ
వారు దైవమార్గం నుంచి (జనులను) ఆపుతారు. అందులో వక్రతను వెతుకుతారు – వారే పరలోకాన్ని తిరస్కరించేవారు.
11:20 أُولَٰئِكَ لَمْ يَكُونُوا مُعْجِزِينَ فِي الْأَرْضِ وَمَا كَانَ لَهُم مِّن دُونِ اللَّهِ مِنْ أَوْلِيَاءَ ۘ يُضَاعَفُ لَهُمُ الْعَذَابُ ۚ مَا كَانُوا يَسْتَطِيعُونَ السَّمْعَ وَمَا كَانُوا يُبْصِرُونَ
వారు భూమిపై (అల్లాహ్‌ను) నిస్సహాయుని గానూ చేయలేక పోయారు, అల్లాహ్‌కు వ్యతిరేకంగా వారిని సమర్థించేవారు కూడా లేకపోయారు. వారికి విధించబడే శిక్ష రెండింతలు చేయబడుతుంది. వారు వినగలిగే వారూ కాదు, చూడగలిగే వారూ కాదు.
11:21 أُولَٰئِكَ الَّذِينَ خَسِرُوا أَنفُسَهُمْ وَضَلَّ عَنْهُم مَّا كَانُوا يَفْتَرُونَ
తమను తాము స్వయంగా నష్టానికి గురి చేసుకున్న వారు వీరే. వారు కల్పించుకున్నదంతా వారి నుండి మటు మాయమై పోయింది.
11:22 لَا جَرَمَ أَنَّهُمْ فِي الْآخِرَةِ هُمُ الْأَخْسَرُونَ
నిశ్చయంగా పరలోకంలో అందరికన్నా ఘోరంగా నష్టపోయేవారంటే వారే.
11:23 إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَأَخْبَتُوا إِلَىٰ رَبِّهِمْ أُولَٰئِكَ أَصْحَابُ الْجَنَّةِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ
ఇకపోతే విశ్వసించి మంచి పనులు చేసిన వారూ, తమ ప్రభువు వైపుకు మొగ్గిన వారూ – వారే స్వర్గవాసులు. అందులో వారు కలకాలం ఉంటారు.
11:24 مَثَلُ الْفَرِيقَيْنِ كَالْأَعْمَىٰ وَالْأَصَمِّ وَالْبَصِيرِ وَالسَّمِيعِ ۚ هَلْ يَسْتَوِيَانِ مَثَلًا ۚ أَفَلَا تَذَكَّرُونَ
ఈ రెండు వర్గాల ఉదాహరణ ఇలా ఉంది: వారిలో ఒకడు గుడ్డివాడు, చెవిటివాడు. మరొకడు చూడగలిగే, వినగలిగేవాడు – వీరిద్దరూ పోలికలో సమానులవుతారా? అయినా మీరు గుణపాఠం గ్రహించరే?!
11:25 وَلَقَدْ أَرْسَلْنَا نُوحًا إِلَىٰ قَوْمِهِ إِنِّي لَكُمْ نَذِيرٌ مُّبِينٌ
మేము నూహు (అలైహిస్సలాం)ను ప్రవక్తగా చేసి అతని జాతి వద్దకు పంపాము. “నేను మిమ్మల్ని స్పష్టంగా హెచ్చరించేవాడను.
11:26 أَن لَّا تَعْبُدُوا إِلَّا اللَّهَ ۖ إِنِّي أَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ أَلِيمٍ
“మీరు అల్లాహ్‌ను తప్ప మరొకరిని ఆరాధించకండి. మీరు బాధాకరమైన దినాన శిక్షించబడతారేమోనన్న భయం నాకుంది” (అని అతను చెప్పాడు.)
11:27 فَقَالَ الْمَلَأُ الَّذِينَ كَفَرُوا مِن قَوْمِهِ مَا نَرَاكَ إِلَّا بَشَرًا مِّثْلَنَا وَمَا نَرَاكَ اتَّبَعَكَ إِلَّا الَّذِينَ هُمْ أَرَاذِلُنَا بَادِيَ الرَّأْيِ وَمَا نَرَىٰ لَكُمْ عَلَيْنَا مِن فَضْلٍ بَلْ نَظُنُّكُمْ كَاذِبِينَ
అప్పుడు అతని జాతికి చెందిన అవిశ్వాసుల సర్దారులు ఇలా సమాధానమిచ్చారు: “మా దృష్టిలో నువ్వు మాలాంటి ఒక మానవ మాత్రుడివే తప్ప మరేమీ కావు. ఇంకా మేము గమనిస్తున్నాము, మాలోని అల్పులైనవారే ఆలోచించకుండా, అర్థంచేసుకోకుండా నిన్ను అనుసరిస్తున్నారు. కనుక మాపై మీకెలాంటి ప్రాధాన్యతగాని ఉన్నట్లు కానరావటంలేదు. పైగా మేము మిమ్మల్ని అబద్ధాలకోరులుగా భావిస్తున్నాము.”
11:28 قَالَ يَا قَوْمِ أَرَأَيْتُمْ إِن كُنتُ عَلَىٰ بَيِّنَةٍ مِّن رَّبِّي وَآتَانِي رَحْمَةً مِّنْ عِندِهِ فَعُمِّيَتْ عَلَيْكُمْ أَنُلْزِمُكُمُوهَا وَأَنتُمْ لَهَا كَارِهُونَ
నూహ్ ఇలా అన్నాడు: “నాజాతి వారలారా! ఒకవేళ నేను నాప్రభువు తరఫున వచ్చిన స్పష్టమైన నిదర్శనంపై ఉండి, ఆయన నాకు తన ప్రత్యేక కారుణ్య భాగాన్ని కూడా కలుగ జేసి ఉండి, అది మీకు కనిపించకపోతే (నేనేం చేయను?!) మీకిష్టం లేకపోయినా బలవంతంగా మేము దాన్ని మీ మీద ఎలా రుద్దగలం?
11:29 وَيَا قَوْمِ لَا أَسْأَلُكُمْ عَلَيْهِ مَالًا ۖ إِنْ أَجْرِيَ إِلَّا عَلَى اللَّهِ ۚ وَمَا أَنَا بِطَارِدِ الَّذِينَ آمَنُوا ۚ إِنَّهُم مُّلَاقُو رَبِّهِمْ وَلَٰكِنِّي أَرَاكُمْ قَوْمًا تَجْهَلُونَ
“నా జాతి ప్రజలారా! ఈ కర్తవ్య నిర్వహణకు గాను నేను మీనుంచి ఎలాంటి ధనాన్నీ కోరటం లేదు. నా ప్రతిఫలమైతే అల్లాహ్ వద్ద ఉంది. నేను విశ్వాసులను నావద్ద నుంచి గెంటి వేయలేను. వారెలాగూ తమ ప్రభువును కలుసుకోవలసిన వాళ్ళే. కాని మీరు మాత్రం నాకు అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నట్లు కనిపిస్తున్నారు.
11:30 وَيَا قَوْمِ مَن يَنصُرُنِي مِنَ اللَّهِ إِن طَرَدتُّهُمْ ۚ أَفَلَا تَذَكَّرُونَ
“నాజాతి జనులారా! ఒకవేళ నేను వారిని నావద్ద నుంచి గెంటి వేసినట్లయితే, అల్లాహ్‌కు వ్యతిరేకంగా నాకు సహాయపడే వాడెవడుంటాడు? మీరు బొత్తిగా హితబోధను గ్రహించరా?
11:31 وَلَا أَقُولُ لَكُمْ عِندِي خَزَائِنُ اللَّهِ وَلَا أَعْلَمُ الْغَيْبَ وَلَا أَقُولُ إِنِّي مَلَكٌ وَلَا أَقُولُ لِلَّذِينَ تَزْدَرِي أَعْيُنُكُمْ لَن يُؤْتِيَهُمُ اللَّهُ خَيْرًا ۖ اللَّهُ أَعْلَمُ بِمَا فِي أَنفُسِهِمْ ۖ إِنِّي إِذًا لَّمِنَ الظَّالِمِينَ
“నా దగ్గర అల్లాహ్ నిధులున్నాయని నేను మీతో అనటం లేదే! (వినండి!) నాదగ్గర అగోచర జ్ఞానం కూడా లేదు. నేను దైవదూతనని కూడా అనటం లేదు. మీరు చిన్న చూపు చూస్తున్న వారికి అల్లాహ్ ఏమేలూ చెయ్యబోడని కూడా నేను చెప్పటం లేదు. వారి ఆంతర్యాలలో ఉన్న దానిని అల్లాహ్ బాగా ఎరిగినవాడు. ఒకవేళ నేను గనక అలాంటి మాట ఏదైనా అంటే నేనూ దుర్మార్గుల్లో ఒకడిగా పరిగణించబడతాను.”
11:32 قَالُوا يَا نُوحُ قَدْ جَادَلْتَنَا فَأَكْثَرْتَ جِدَالَنَا فَأْتِنَا بِمَا تَعِدُنَا إِن كُنتَ مِنَ الصَّادِقِينَ
“ఓ నూహ్! నువ్వు మాతో వాదించావు. మరీ మరీ వాదించావు. మరి నువ్వు సత్యవంతుడవే అయితే మమ్మల్ని హెచ్చరించే దానిని (శిక్షను) తీసుకురా” అని అతని జాతి వారు అన్నారు.
11:33 قَالَ إِنَّمَا يَأْتِيكُم بِهِ اللَّهُ إِن شَاءَ وَمَا أَنتُم بِمُعْجِزِينَ
“దానిని తెచ్చేవాడు కూడా అల్లాహ్‌యే, ఆయన గనక తలచుకుంటే (తెచ్చి తీరుతాడు). మీరు మాత్రం ఆయన్ని ఓడించలేరు.
11:34 وَلَا يَنفَعُكُمْ نُصْحِي إِنْ أَرَدتُّ أَنْ أَنصَحَ لَكُمْ إِن كَانَ اللَّهُ يُرِيدُ أَن يُغْوِيَكُمْ ۚ هُوَ رَبُّكُمْ وَإِلَيْهِ تُرْجَعُونَ
“అల్లాహ్ మిమ్మల్ని అపమార్గాన వదిలేయదలచుకుంటే నేను మీశ్రేయాన్ని ఎంతగా అభిలషించినా నా శ్రేయోభిలాష మీకే విధంగానూ ఉపకరించదు. ఆయనే మీ అందరి ప్రభువు. ఆయన వైపునకే మీరంతా మరలించబడతారు” అని (నూహు) సమాధానమిచ్చాడు.
11:35 أَمْ يَقُولُونَ افْتَرَاهُ ۖ قُلْ إِنِ افْتَرَيْتُهُ فَعَلَيَّ إِجْرَامِي وَأَنَا بَرِيءٌ مِّمَّا تُجْرِمُونَ
ఏమిటీ, అతను (ముహమ్మదు) స్వయంగా దీనిని (ఖుర్ఆన్ను) కల్పించుకున్నాడని వాళ్లంటున్నారా? (ఓ ముహమ్మద్!) వారికి చెప్పు: “ఒకవేళ నేనే గనక దాన్ని కల్పించుకుని ఉంటే నానేరం నాపై పడుతుంది. మీరు చేస్తున్న నేరానికి మాత్రం నేను బాధ్యుణ్ణి కాను.”
11:36 وَأُوحِيَ إِلَىٰ نُوحٍ أَنَّهُ لَن يُؤْمِنَ مِن قَوْمِكَ إِلَّا مَن قَدْ آمَنَ فَلَا تَبْتَئِسْ بِمَا كَانُوا يَفْعَلُونَ
“నీ జాతివారిలో (ఇంత వరకూ) విశ్వసించిన వారు తప్ప, ఇక మీదట ఎవరూ విశ్వసించబోరు. కాబట్టి నువ్వు వారి చేష్టలపై దుఃఖించకు” అని నూహు వద్దకు వహీ పంపబడింది.
11:37 وَاصْنَعِ الْفُلْكَ بِأَعْيُنِنَا وَوَحْيِنَا وَلَا تُخَاطِبْنِي فِي الَّذِينَ ظَلَمُوا ۚ إِنَّهُم مُّغْرَقُونَ
“మాకళ్ల ముందరే, మా వహీ అనుసారం ఒక ఓడను తయారుచెయ్యి. మాముందు దుర్మార్గుల ఊసు ఎత్తకు. వారంతా ఎలాగూ ముంచి వేయబడేవారే” (అని అల్లాహ్ సెలవిచ్చాడు).
11:38 وَيَصْنَعُ الْفُلْكَ وَكُلَّمَا مَرَّ عَلَيْهِ مَلَأٌ مِّن قَوْمِهِ سَخِرُوا مِنْهُ ۚ قَالَ إِن تَسْخَرُوا مِنَّا فَإِنَّا نَسْخَرُ مِنكُمْ كَمَا تَسْخَرُونَ
అతను (నూహు) ఓడ నిర్మాణంలో నిమగ్నుడయ్యాడు. అతని జాతి నాయకులలో అతని వద్ద నుంచి సాగిపోయే వారంతా అతన్ని ఎగతాళి చేసేవారు. “మీరు మాస్థితిపై నవ్విపోతున్నారా? మీరు మాస్థితిపై నవ్విపోతున్నట్లే మేము కూడా ఒకనాడు మీస్థితిపై నవ్వుతాము.
11:39 فَسَوْفَ تَعْلَمُونَ مَن يَأْتِيهِ عَذَابٌ يُخْزِيهِ وَيَحِلُّ عَلَيْهِ عَذَابٌ مُّقِيمٌ
“పరాభవానికి గురిచేసే శిక్ష, శాశ్వతంగా ఉండే శిక్ష ఎవరిపై వచ్చిపడుతుందో అతి త్వరలోనే మీకు తెలిసిపోతుంది” అని నూహు పలికాడు.
11:40 حَتَّىٰ إِذَا جَاءَ أَمْرُنَا وَفَارَ التَّنُّورُ قُلْنَا احْمِلْ فِيهَا مِن كُلٍّ زَوْجَيْنِ اثْنَيْنِ وَأَهْلَكَ إِلَّا مَن سَبَقَ عَلَيْهِ الْقَوْلُ وَمَنْ آمَنَ ۚ وَمَا آمَنَ مَعَهُ إِلَّا قَلِيلٌ
తుదకు మాఆదేశం వచ్చి, పొయ్యి పొంగినప్పుడు, “ఈ ఓడలోకి ప్రతి (జీవ)రాసి నుంచి రెండేసి (ఒకటి ఆడ, ఇంకొకటి మగ జంతువు) చొప్పున ఎక్కించుకో. నీ ఇంటి వారలను కూడా తీసుకో. ఎవరి విషయంలోనయితే ముందుగానే మాట ఖరారయిందో వారిని వదిలేయి. ఇంకా విశ్వాసులందరిని కూడా ఎక్కించుకో” అని మేము (అతనికి) చెప్పాము. అయితే అతనితో బాటు విశ్వసించిన వారు బహుకొద్ది మంది మాత్రమే.
11:41 وَقَالَ ارْكَبُوا فِيهَا بِسْمِ اللَّهِ مَجْرَاهَا وَمُرْسَاهَا ۚ إِنَّ رَبِّي لَغَفُورٌ رَّحِيمٌ
“మీరు ఈ ఓడలో కూర్చోండి, అల్లాహ్ పేరుతోనే, దీని గమనం, దీనిఆగటం. నిశ్చయంగా నాప్రభువు అపారంగా క్షమించేవాడు, అమితంగా కరుణించేవాడు” అని (నూహు) అన్నాడు.
11:42 وَهِيَ تَجْرِي بِهِمْ فِي مَوْجٍ كَالْجِبَالِ وَنَادَىٰ نُوحٌ ابْنَهُ وَكَانَ فِي مَعْزِلٍ يَا بُنَيَّ ارْكَب مَّعَنَا وَلَا تَكُن مَّعَ الْكَافِرِينَ
ఆ ఓడ వారిని పర్వతాల్లాంటి అలల్లో నుంచి తీసుకుపోసాగింది. నూహ్ (అలైహిస్సలాం) ఒడ్డున ఉన్న తన కుమారుణ్ణి ఉద్దేశించి, “ఒరేయ్ నాయనా! మాతో పాటే వచ్చి కూర్చోరా. అవిశ్వాసులతో వెళ్ళకురా” అని బిగ్గరగా పిలిచాడు.
11:43 قَالَ سَآوِي إِلَىٰ جَبَلٍ يَعْصِمُنِي مِنَ الْمَاءِ ۚ قَالَ لَا عَاصِمَ الْيَوْمَ مِنْ أَمْرِ اللَّهِ إِلَّا مَن رَّحِمَ ۚ وَحَالَ بَيْنَهُمَا الْمَوْجُ فَكَانَ مِنَ الْمُغْرَقِينَ
దానికి వాడు, “(నాన్నా!) నేను ఏదయినా ఒక పెద్ద పర్వతాన్ని ఆశ్రయిస్తాను. అది నన్ను ఈ నీళ్ళ నుంచి కాపాడుతుంది” అని జవాబిచ్చాడు. “అల్లాహ్ ఉత్తర్వు నుండి ఈ రోజు కాపాడేవాడెవడూలేడురా! అల్లాహ్ తాను దయదలచిన వారిని మాత్రమే కాపాడతాడు” అని నూహ్ చెప్పాడు. అంతలోనే వారిద్దరి మధ్యా ఒక అల అడ్డుగా వచ్చింది. అంతే! వాడు కూడా ముంపుకు గురైన వారిలో చేరిపోయాడు.
11:44 وَقِيلَ يَا أَرْضُ ابْلَعِي مَاءَكِ وَيَا سَمَاءُ أَقْلِعِي وَغِيضَ الْمَاءُ وَقُضِيَ الْأَمْرُ وَاسْتَوَتْ عَلَى الْجُودِيِّ ۖ وَقِيلَ بُعْدًا لِّلْقَوْمِ الظَّالِمِينَ
“ఓ భూమీ! నీ నీళ్ళంతటినీ మ్రింగెయ్యి. ఓ ఆకాశమా! ఇక ఆగిపో (కురిసింది చాలు)!” అని సెలవీయబడింది. అప్పటికప్పుడే నీరంతా ఇంకిపోయింది. కావలసిన పని పూర్తయింది. ఓడ ‘జూదీ’ పర్వతంపై నిలిచింది. “దుర్మార్గులు (దేవుని) అభిశాపానికి గురవుదురుగాక!” అని సెలవీయబడింది.
11:45 وَنَادَىٰ نُوحٌ رَّبَّهُ فَقَالَ رَبِّ إِنَّ ابْنِي مِنْ أَهْلِي وَإِنَّ وَعْدَكَ الْحَقُّ وَأَنتَ أَحْكَمُ الْحَاكِمِينَ
నూహ్ (అలైహిస్సలాం) తన ప్రభువును పిలుస్తూ, “నా ప్రభూ! నా కుమారుడు కూడా నా కుటుంబీకుడే కదా! నిశ్చయంగా నీవాగ్దానం సత్యమైనది. నీవు పాలకుల్లోకెల్లా గొప్ప పాలకుడవు” అని విన్నవించుకున్నాడు.
11:46 قَالَ يَا نُوحُ إِنَّهُ لَيْسَ مِنْ أَهْلِكَ ۖ إِنَّهُ عَمَلٌ غَيْرُ صَالِحٍ ۖ فَلَا تَسْأَلْنِ مَا لَيْسَ لَكَ بِهِ عِلْمٌ ۖ إِنِّي أَعِظُكَ أَن تَكُونَ مِنَ الْجَاهِلِينَ
దీనికి సమాధానంగా, “ఓ నూహు! ముమ్మాటికీ వాడు నీ కుటుంబీకుడుకాడు. వాడి పనులు ఏమాత్రం మంచివి కావు. నీకు తెలియని వాటి గురించి నన్ను అడగకు. (ఈ విధంగా అడిగి) నువ్వు అజ్ఞానులలో ఒకడివి కారాదని నేను నీకు ఉపదేశిస్తున్నాను” అని అల్లాహ్ అన్నాడు.
11:47 قَالَ رَبِّ إِنِّي أَعُوذُ بِكَ أَنْ أَسْأَلَكَ مَا لَيْسَ لِي بِهِ عِلْمٌ ۖ وَإِلَّا تَغْفِرْ لِي وَتَرْحَمْنِي أَكُن مِّنَ الْخَاسِرِينَ
“నా ప్రభూ! నాకు తెలియని దాని గురించి నిన్ను అర్థించటం నుండి నీ శరణు వేడుతున్నాను. నీవు గనక నన్ను క్షమించి దయదలచకపోతే నేను నష్టపోయేవారిలో చేరిపోతాను” అని నూహు అభ్యర్థించాడు.
11:48 قِيلَ يَا نُوحُ اهْبِطْ بِسَلَامٍ مِّنَّا وَبَرَكَاتٍ عَلَيْكَ وَعَلَىٰ أُمَمٍ مِّمَّن مَّعَكَ ۚ وَأُمَمٌ سَنُمَتِّعُهُمْ ثُمَّ يَمَسُّهُم مِّنَّا عَذَابٌ أَلِيمٌ
అప్పుడు ఈ విధంగా సెలవీయబడింది: “ఓ నూహు! మా తరఫు నుండి ప్రశాంతంగా దిగు. నీపైన, నీతోటి వారిపైన శుభాలు కలుగుతాయి. ఇంకా అనేక సమూహాలకు కూడా మేము తప్పకుండా లాభం చేకూర్చుతాము. కాని తర్వాత వారికి మా తరఫున బాధాకరమైన శిక్ష కూడా పడుతుంది.”
11:49 تِلْكَ مِنْ أَنبَاءِ الْغَيْبِ نُوحِيهَا إِلَيْكَ ۖ مَا كُنتَ تَعْلَمُهَا أَنتَ وَلَا قَوْمُكَ مِن قَبْلِ هَٰذَا ۖ فَاصْبِرْ ۖ إِنَّ الْعَاقِبَةَ لِلْمُتَّقِينَ
(ఓ ముహమ్మద్!) ఇవి అగోచర సమాచారాలు. వీటిని మేము నీకు వహీ ద్వారా తెలియజేస్తున్నాము. ఇంతకు మునుపు నీకు గానీ, నీజాతి వారికి గానీ వీటి గురించి ఏమీ తెలియదు. కనుక నీవు ఓర్పు వహిస్తూ ఉండు, నిస్సందేహంగా సత్ఫలితం భయభక్తులు గలవారికే లభిస్తుంది.
11:50 وَإِلَىٰ عَادٍ أَخَاهُمْ هُودًا ۚ قَالَ يَا قَوْمِ اعْبُدُوا اللَّهَ مَا لَكُم مِّنْ إِلَٰهٍ غَيْرُهُ ۖ إِنْ أَنتُمْ إِلَّا مُفْتَرُونَ
మరి మేము ఆద్ జాతి వైపుకు వారి సోదరుడైన హూద్‌ను పంపాము. అతను (తన వారినుద్దేశించి) ఇలా అన్నాడు: “ఓ నా జాతి ప్రజలారా! అల్లాహ్‌నే ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరో ఆరాధ్యుడు లేడు. మీరు కల్పించేవన్నీ అబద్ధాలు తప్ప మరేమీ కావు.”
11:51 يَا قَوْمِ لَا أَسْأَلُكُمْ عَلَيْهِ أَجْرًا ۖ إِنْ أَجْرِيَ إِلَّا عَلَى الَّذِي فَطَرَنِي ۚ أَفَلَا تَعْقِلُونَ
“ఓ నాజాతి ప్రజలారా! ఈ పనికై నేను మీనుండి ఎలాంటి ప్రతిఫలాన్నీ అడగటం లేదు. నాకు ప్రతిఫలం ఇచ్చే బాధ్యత నన్నుసృష్టించిన వానిదే. అయినప్పటికీ మీరు వివేకవంతులుగా వ్యవహరించరే?!”
11:52 وَيَا قَوْمِ اسْتَغْفِرُوا رَبَّكُمْ ثُمَّ تُوبُوا إِلَيْهِ يُرْسِلِ السَّمَاءَ عَلَيْكُم مِّدْرَارًا وَيَزِدْكُمْ قُوَّةً إِلَىٰ قُوَّتِكُمْ وَلَا تَتَوَلَّوْا مُجْرِمِينَ
“ఓ నా జాతి వారలారా! మీ పోషకుని (అంటే అల్లాహ్) సమక్షంలో మీ తప్పుల మన్నింపుకై ప్రార్థించండి. ఆయన సన్నిధిలో పశ్చాత్తాపం చెందండి. ఆయన మీపై (ఆకాశం నుండి) ధారాపాతంగా వర్షం కురిపిస్తాడు. మీకున్న బలిమికి మరింత శక్తినీ, బలాన్నీ చేకూరుస్తాడు. మీరు మాత్రం అపరాధులుగా తిరిగిపోకండి.”
11:53 قَالُوا يَا هُودُ مَا جِئْتَنَا بِبَيِّنَةٍ وَمَا نَحْنُ بِتَارِكِي آلِهَتِنَا عَن قَوْلِكَ وَمَا نَحْنُ لَكَ بِمُؤْمِنِينَ
దానికి వారు, “ఓ హూద్! నువ్వు మావద్దకు ఏ నిదర్శనాన్నీ తేలేదు. నువ్వు (నోటితో) చెప్పినంత మాత్రాన మేము మా ఆరాధ్య దైవాలను వదలి పెట్టలేము. నిన్ను మేము విశ్వసించబోవటం లేదు.
11:54 إِن نَّقُولُ إِلَّا اعْتَرَاكَ بَعْضُ آلِهَتِنَا بِسُوءٍ ۗ قَالَ إِنِّي أُشْهِدُ اللَّهَ وَاشْهَدُوا أَنِّي بَرِيءٌ مِّمَّا تُشْرِكُونَ
పైగా మా ఆరాధ్య దైవాలలో ఎవరో నిన్ను ఏదైనా వ్యాధికి గురిచేసి ఉంటారని మేము అనుకుంటున్నాము” అని పలికారు. అప్పుడు హూద్ ఇలా సమాధానమిచ్చాడు: “అల్లాహ్ తప్ప మీరు భాగస్వాములుగా నిలబెట్టే వారందరితో నేను విసుగెత్తి పోయాను. (వారితో నాకెలాంటి సంబంధం లేదు). నేను ఈ విషయానికి అల్లాహ్‌ను సాక్షిగా పెడుతున్నాను, మీరు కూడా దీనికి సాక్షులుగా ఉండండి.”
11:55 مِن دُونِهِ ۖ فَكِيدُونِي جَمِيعًا ثُمَّ لَا تُنظِرُونِ
“సరే. మీరంతా కలసి నాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నండి. నాకు ఏమాత్రం కూడా గడువు ఇవ్వకండి.
11:56 إِنِّي تَوَكَّلْتُ عَلَى اللَّهِ رَبِّي وَرَبِّكُم ۚ مَّا مِن دَابَّةٍ إِلَّا هُوَ آخِذٌ بِنَاصِيَتِهَا ۚ إِنَّ رَبِّي عَلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ
“నేను కేవలం అల్లాహ్‌నే నమ్ముకున్నాను. ఆయన నాకూ ప్రభువే. మీ అందరికీ ప్రభువే. ప్రతి ప్రాణి యొక్క జుట్టు ఆయన చేతిలోనే ఉంది. నిశ్చయంగా నా ప్రభువు సన్మార్గాన ఉన్నాడు.
11:57 فَإِن تَوَلَّوْا فَقَدْ أَبْلَغْتُكُم مَّا أُرْسِلْتُ بِهِ إِلَيْكُمْ ۚ وَيَسْتَخْلِفُ رَبِّي قَوْمًا غَيْرَكُمْ وَلَا تَضُرُّونَهُ شَيْئًا ۚ إِنَّ رَبِّي عَلَىٰ كُلِّ شَيْءٍ حَفِيظٌ
ఒకవేళ మీరు మరలి పోదలిస్తే (పొండి), నేను మాత్రం నాకిచ్చి పంపబడిన సందేశాన్ని మీకు అందజేశాను. నా ప్రభువు మీ స్థానంలో ఇంకొకరిని తీసుకువస్తాడు. మీరు ఆయనకు ఏవిధమైన కీడూ కలిగించలేరు. నిస్సందేహంగా నా ప్రభువు అన్నింటినీ పర్యవేక్షిస్తున్నాడు.”
11:58 وَلَمَّا جَاءَ أَمْرُنَا نَجَّيْنَا هُودًا وَالَّذِينَ آمَنُوا مَعَهُ بِرَحْمَةٍ مِّنَّا وَنَجَّيْنَاهُم مِّنْ عَذَابٍ غَلِيظٍ
మరి మా ఆజ్ఞ (అమల్లోకి) వచ్చినప్పుడు మేము హూద్‌నూ, అతనితో పాటు విశ్వసించిన అతని సహచరులనూ మా ప్రత్యేక కృపతో కాపాడాము. ఘోరమైన శిక్ష నుంచి వారిని రక్షించాము.
11:59 وَتِلْكَ عَادٌ ۖ جَحَدُوا بِآيَاتِ رَبِّهِمْ وَعَصَوْا رُسُلَهُ وَاتَّبَعُوا أَمْرَ كُلِّ جَبَّارٍ عَنِيدٍ
ఇదీ ఆద్ జాతి (వృత్తాంతం). వీరు తమ ప్రభువు ఆయతులను త్రోసి పుచ్చారు. ఆయన ప్రవక్తల పట్ల అవిధేయతకు పాల్పడ్డారు. ఇంకా అహంకారి, అవిధేయీ అయిన ప్రతివ్యక్తినీ వారు అనుసరించారు.
11:60 وَأُتْبِعُوا فِي هَٰذِهِ الدُّنْيَا لَعْنَةً وَيَوْمَ الْقِيَامَةِ ۗ أَلَا إِنَّ عَادًا كَفَرُوا رَبَّهُمْ ۗ أَلَا بُعْدًا لِّعَادٍ قَوْمِ هُودٍ
ప్రపంచంలోనూ వారికి శాపం అంటగట్టబడింది. ప్రళయదినాన కూడా అది (వారిని) వెన్నంటి ఉంటుంది. చూడండి! ఆద్ జాతి వారు తమ ప్రభువును తిరస్కరించారు. హూద్ జాతి వారైన ఆదు జనులు (దైవ కారుణ్యానికి) దూరం చెయ్యబడ్డారు.
11:61 وَإِلَىٰ ثَمُودَ أَخَاهُمْ صَالِحًا ۚ قَالَ يَا قَوْمِ اعْبُدُوا اللَّهَ مَا لَكُم مِّنْ إِلَٰهٍ غَيْرُهُ ۖ هُوَ أَنشَأَكُم مِّنَ الْأَرْضِ وَاسْتَعْمَرَكُمْ فِيهَا فَاسْتَغْفِرُوهُ ثُمَّ تُوبُوا إِلَيْهِ ۚ إِنَّ رَبِّي قَرِيبٌ مُّجِيبٌ
మరి సమూద్ జాతి వైపుకు వారి సోదరుడైన సాలిహ్‌ను పంపాము. అతను (వారినుద్దేశించి), “ఓ నా జాతి వారలారా! మీరు అల్లాహ్‌ను ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరో ఆరాధ్య దైవం లేడు. ఆయనే మిమ్మల్ని భూమి నుండి పుట్టించి, అందులో మిమ్మల్ని వసింపజేశాడు. కాబట్టి మీరు మన్నింపు కోసం ఆయన్నే వేడుకోండి, ఆయన వైపుకే మరలండి (పశ్చాత్తాపం చెందండి). నిశ్చయంగా నా ప్రభువు చాలా సమీపంలో ఉన్నాడు. ఆయన ప్రార్థనలను ఆలకించి ఆమోదిస్తాడు” అని చెప్పాడు.
11:62 قَالُوا يَا صَالِحُ قَدْ كُنتَ فِينَا مَرْجُوًّا قَبْلَ هَٰذَا ۖ أَتَنْهَانَا أَن نَّعْبُدَ مَا يَعْبُدُ آبَاؤُنَا وَإِنَّنَا لَفِي شَكٍّ مِّمَّا تَدْعُونَا إِلَيْهِ مُرِيبٍ
(దానికి సమాధానంగా వారు) ఇలా అన్నారు: “ఓ సాలిహ్! ఇంతకు మునుపు వరకూ మేము నీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాము. ఏమిటీ, మా తాతముత్తాతలు పూజిస్తూ వచ్చిన వారిని పూజించకుండా నువ్వు మమ్మల్ని ఆపుతున్నావా?! నువ్వు మమ్మల్ని ఏ ధర్మం వైపుకు పిలుస్తున్నావో దానిపై మాకు తీవ్రమయిన సందేహం ఉంది.”
11:63 قَالَ يَا قَوْمِ أَرَأَيْتُمْ إِن كُنتُ عَلَىٰ بَيِّنَةٍ مِّن رَّبِّي وَآتَانِي مِنْهُ رَحْمَةً فَمَن يَنصُرُنِي مِنَ اللَّهِ إِنْ عَصَيْتُهُ ۖ فَمَا تَزِيدُونَنِي غَيْرَ تَخْسِيرٍ
“ఓ నా జాతి ప్రజలారా! మీరే చెప్పండి, నేను నా ప్రభువు తరఫున ఒక బలమైన నిదర్శనాన్ని పొంది ఉండి, ఆయన నాకు తన కారుణ్యాన్ని కూడా ప్రసాదించి ఉండగా, నేను ఆయన పట్ల అవిధేయతను కనబరిస్తే ఆయనకు వ్యతిరేకంగా నన్ను ఆదుకోగలవాడెవడు? మీరు నాకు మరింత నష్టాన్ని కలిగించటం తప్ప ఏమీ చెయ్యలేరు.”
11:64 وَيَا قَوْمِ هَٰذِهِ نَاقَةُ اللَّهِ لَكُمْ آيَةً فَذَرُوهَا تَأْكُلْ فِي أَرْضِ اللَّهِ وَلَا تَمَسُّوهَا بِسُوءٍ فَيَأْخُذَكُمْ عَذَابٌ قَرِيبٌ
“ఓ నా జాతి వారలారా! అల్లాహ్ మీ కోసం ఒక సూచనగా పంపిన ఆడ ఒంటె ఇది. మీరు ఈ ఒంటెను అల్లాహ్ భూమిపై స్వేచ్ఛగా మేస్తూ తిరిగేలా వదిలిపెట్టండి. దానికి ఎలాంటి కీడూ తలపెట్టకండి. మీరు గనక దాని జోలికి పోయారంటే తొందరగానే శిక్ష మీపై విరుచుకుపడుతుంది” అని సాలిహ్ వారికి చెప్పాడు.
11:65 فَعَقَرُوهَا فَقَالَ تَمَتَّعُوا فِي دَارِكُمْ ثَلَاثَةَ أَيَّامٍ ۖ ذَٰلِكَ وَعْدٌ غَيْرُ مَكْذُوبٍ
అయినా సరే వారు ఆ ఒంటె కాళ్ళను నరికేశారు. అప్పుడు సాలిహ్ “మీరు మీ ఇళ్ళల్లో మూడు రోజుల పాటు ఉండి జీవితాన్ని అనుభవించండి. ఈ వాగ్దానం (నిర్థారిత గడువు) అబద్ధం కానేరదు” అని చెప్పాడు.
11:66 فَلَمَّا جَاءَ أَمْرُنَا نَجَّيْنَا صَالِحًا وَالَّذِينَ آمَنُوا مَعَهُ بِرَحْمَةٍ مِّنَّا وَمِنْ خِزْيِ يَوْمِئِذٍ ۗ إِنَّ رَبَّكَ هُوَ الْقَوِيُّ الْعَزِيزُ
మరి మా ఉత్తర్వు (అమలు పరచబడే సమయం) ఆసన్నమైనప్పుడు మేము సాలిహ్‌ను, అతనితోపాటు విశ్వాసులను మాకారుణ్యంతో కాపాడాము. ఆ దినపు అవమానం నుంచి కూడా వారిని రక్షించాము. నిస్సందేహంగా నీ ప్రభువు బలవంతుడు, ఆధిక్యతగలవాడు.
11:67 وَأَخَذَ الَّذِينَ ظَلَمُوا الصَّيْحَةُ فَأَصْبَحُوا فِي دِيَارِهِمْ جَاثِمِينَ
ఇకపోతే దుర్మార్గులను భయంకరమైన అరుపు ఒకటి కబళించింది. దాంతో వారు తమ ఇళ్ళల్లోనే సాగిలపడి (చచ్చి)పోయారు –
11:68 كَأَن لَّمْ يَغْنَوْا فِيهَا ۗ أَلَا إِنَّ ثَمُودَ كَفَرُوا رَبَّهُمْ ۗ أَلَا بُعْدًا لِّثَمُودَ
-అసలు వారెప్పుడూ అక్కడ నివసించనే లేదన్నట్లుగా! తెలుసుకోండి! సమూద్ జాతి వారు తమ ప్రభువును తిరస్కరించారు. తెలుసుకోండి! సమూద్ జాతి వారు (దైవకారుణ్యానికి) దూరం చేయబడ్డారు.
11:69 وَلَقَدْ جَاءَتْ رُسُلُنَا إِبْرَاهِيمَ بِالْبُشْرَىٰ قَالُوا سَلَامًا ۖ قَالَ سَلَامٌ ۖ فَمَا لَبِثَ أَن جَاءَ بِعِجْلٍ حَنِيذٍ
మా ద్వారా పంపబడిన దూతలు శుభవార్తను మోసుకుని ఇబ్రాహీము దగ్గరకు వెళ్ళారు. అతనికి ‘సలామ్’ చేశారు. అతను కూడా ‘ప్రతి సలాం’ చేశాడు. మరి అతను ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వేపిన ఆవుదూడను తెచ్చాడు.
11:70 فَلَمَّا رَأَىٰ أَيْدِيَهُمْ لَا تَصِلُ إِلَيْهِ نَكِرَهُمْ وَأَوْجَسَ مِنْهُمْ خِيفَةً ۚ قَالُوا لَا تَخَفْ إِنَّا أُرْسِلْنَا إِلَىٰ قَوْمِ لُوطٍ
అయితే వారి చేతులు దాని వైపుకు చేరకపోవటం చూసి అతను వారిని శంకించాడు. లోలోపలే భయపడసాగాడు. అప్పుడువారు, “భయపడకు. మేము లూత్ జాతి వైపుకు పంపబడ్డాము” అన్నారు.
11:71 وَامْرَأَتُهُ قَائِمَةٌ فَضَحِكَتْ فَبَشَّرْنَاهَا بِإِسْحَاقَ وَمِن وَرَاءِ إِسْحَاقَ يَعْقُوبَ
అక్కడ నిలబడి ఉన్న అతని భార్య నవ్వేసింది. ఆ సమయంలో మేము ఆమెకు ఇస్హాఖ్ గురించి, ఇస్హాఖు తరువాత యాఖూబు గురించిన శుభవార్తను వినిపించాము.
11:72 قَالَتْ يَا وَيْلَتَىٰ أَأَلِدُ وَأَنَا عَجُوزٌ وَهَٰذَا بَعْلِي شَيْخًا ۖ إِنَّ هَٰذَا لَشَيْءٌ عَجِيبٌ
“అయ్యో! నా దౌర్భాగ్యం! నేను ముసలిదాన్ని. నా భర్త కూడా వృద్ధుడే. అయినా నాకు సంతానం కలుగుతుందా? ఇదేదో వింతగా ఉందే!” అని ఆమె అన్నది.
11:73 قَالُوا أَتَعْجَبِينَ مِنْ أَمْرِ اللَّهِ ۖ رَحْمَتُ اللَّهِ وَبَرَكَاتُهُ عَلَيْكُمْ أَهْلَ الْبَيْتِ ۚ إِنَّهُ حَمِيدٌ مَّجِيدٌ
దానికి దైవదూతలు, “నువ్వు దైవ శక్తి పట్ల ఆశ్చర్యపడుతున్నావా?! (ఇబ్రాహీము) ఇంటివారలారా! మీపై అల్లాహ్ కారుణ్యం, ఆయన శుభాలు కురియుగాక! నిశ్చయంగా ఆయన స్తుతించదగినవాడు, మహాఘనత కలవాడు” అని చెప్పారు.
11:74 فَلَمَّا ذَهَبَ عَنْ إِبْرَاهِيمَ الرَّوْعُ وَجَاءَتْهُ الْبُشْرَىٰ يُجَادِلُنَا فِي قَوْمِ لُوطٍ
ఇబ్రాహీము భయాందోళనలు తొలగిపోయి, శుభవార్త కూడా అతనికి అందిన మీదట, అతను లూత్ జాతి వారి విషయంలో మాతో వాదించసాగాడు.
11:75 إِنَّ إِبْرَاهِيمَ لَحَلِيمٌ أَوَّاهٌ مُّنِيبٌ
నిశ్చయంగా ఇబ్రాహీం ఎంతో సహనశీలి. మృదుమనస్కుడు. నమ్రతతో అల్లాహ్ వైపుకు మరలేవాడు.
11:76 يَا إِبْرَاهِيمُ أَعْرِضْ عَنْ هَٰذَا ۖ إِنَّهُ قَدْ جَاءَ أَمْرُ رَبِّكَ ۖ وَإِنَّهُمْ آتِيهِمْ عَذَابٌ غَيْرُ مَرْدُودٍ
“ఓ ఇబ్రాహీం! ఈ ఆలోచనను వదలిపెట్టు. నీ ప్రభువు ఉత్తర్వు వచ్చేసింది. ఎవరూ తప్పించలేని శిక్ష వారిపై వచ్చి పడటం తథ్యం” (అని దైవదూతలు పలికారు).
11:77 وَلَمَّا جَاءَتْ رُسُلُنَا لُوطًا سِيءَ بِهِمْ وَضَاقَ بِهِمْ ذَرْعًا وَقَالَ هَٰذَا يَوْمٌ عَصِيبٌ
మేము పంపిన దూతలు లూత్ వద్దకు చేరుకున్నప్పుడు వారి రాకపై అతను దుఃఖవదనుడయ్యాడు. లోలోపలే కుంచించుకుపోతూ, “ఇది చాలా గడ్డురోజు” అని అన్నాడు.
11:78 وَجَاءَهُ قَوْمُهُ يُهْرَعُونَ إِلَيْهِ وَمِن قَبْلُ كَانُوا يَعْمَلُونَ السَّيِّئَاتِ ۚ قَالَ يَا قَوْمِ هَٰؤُلَاءِ بَنَاتِي هُنَّ أَطْهَرُ لَكُمْ ۖ فَاتَّقُوا اللَّهَ وَلَا تُخْزُونِ فِي ضَيْفِي ۖ أَلَيْسَ مِنكُمْ رَجُلٌ رَّشِيدٌ
(మరో వైపు నుంచి) అతని జాతి వారు పరుగులు తీస్తూ అతని వద్దకు వచ్చారు. వారు మొదటి నుంచే ఇటువంటి నీచపు పనులు చేస్తుండేవారు. “నా జాతి ప్రజలారా! ఇదిగో, నా కూతుళ్ళు ఉన్నారు. మీకొరకు వీరు పరిశుద్ధులు. మీరు అల్లాహ్‌కు భయపడండి. నా అతిథుల విషయంలో నన్నునవ్వుల పాలు చెయ్యకండి. ఏమిటీ, మీలో ఒక్కరైనా మంచివాడు లేడా?” అని లూతు నచ్చజెప్పాడు.
11:79 قَالُوا لَقَدْ عَلِمْتَ مَا لَنَا فِي بَنَاتِكَ مِنْ حَقٍّ وَإِنَّكَ لَتَعْلَمُ مَا نُرِيدُ
“నీ కూతుళ్ళపై మాకెలాంటి హక్కులేదన్న సంగతి నీకు బాగా తెలుసు. మా కిష్టమైనది ఏదో కూడా నీకు తెలుసు కదా!” అని వారు సమాధానమిచ్చారు.
11:80 قَالَ لَوْ أَنَّ لِي بِكُمْ قُوَّةً أَوْ آوِي إِلَىٰ رُكْنٍ شَدِيدٍ
“(అయ్యో!) మిమ్మల్ని ప్రతిఘటించే బలం నాకుంటే ఎంత బావుండేది! లేదా నేను ఆశ్రయం పొందటానికి ఏదైనా దృఢమైన ఆధారం ఉంటే ఎంత బావుండేది!” అని లూత్ అన్నాడు.
11:81 قَالُوا يَا لُوطُ إِنَّا رُسُلُ رَبِّكَ لَن يَصِلُوا إِلَيْكَ ۖ فَأَسْرِ بِأَهْلِكَ بِقِطْعٍ مِّنَ اللَّيْلِ وَلَا يَلْتَفِتْ مِنكُمْ أَحَدٌ إِلَّا امْرَأَتَكَ ۖ إِنَّهُ مُصِيبُهَا مَا أَصَابَهُمْ ۚ إِنَّ مَوْعِدَهُمُ الصُّبْحُ ۚ أَلَيْسَ الصُّبْحُ بِقَرِيبٍ
అప్పుడు దైవదూతలు “ఓ లూత్! మేము నీ ప్రభువు తరఫున పంపబడిన వారము. వారు నీదాకా రాలేరు. కాబట్టి నువ్వు నీ ఇంటి వారిని తీసుకుని కొంత రాత్రి ఉండగానే బయలుదేరు. మీలో ఎవరూ వెనుతిరిగి చూడకూడదు. అయితే నీభార్య; వారందరికీ పట్టేగతే ఆవిడకూ పట్టనున్నది. వారికోసం ఉదయ సమయం నిశ్చయించబడింది. ఏమిటీ, ఉదయసమయం దగ్గరలో లేదా?” అని పలికారు.
11:82 فَلَمَّا جَاءَ أَمْرُنَا جَعَلْنَا عَالِيَهَا سَافِلَهَا وَأَمْطَرْنَا عَلَيْهَا حِجَارَةً مِّن سِجِّيلٍ مَّنضُودٍ
మరి మా ఉత్తర్వు (ను అమలుపరచే సమయం) రాగానే ఆబస్తీని తలక్రిందులుగా చేసేసి, వారిపై నిరాఘాటంగా గులకరాళ్ళను కురిపించాము.
11:83 مُّسَوَّمَةً عِندَ رَبِّكَ ۖ وَمَا هِيَ مِنَ الظَّالِمِينَ بِبَعِيدٍ
అవి నీ ప్రభువు తరఫున గుర్తు వేయబడినవి. అవి ఈ దుర్మార్గులకు ఎంతో దూరానలేవు.
11:84 وَإِلَىٰ مَدْيَنَ أَخَاهُمْ شُعَيْبًا ۚ قَالَ يَا قَوْمِ اعْبُدُوا اللَّهَ مَا لَكُم مِّنْ إِلَٰهٍ غَيْرُهُ ۖ وَلَا تَنقُصُوا الْمِكْيَالَ وَالْمِيزَانَ ۚ إِنِّي أَرَاكُم بِخَيْرٍ وَإِنِّي أَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ مُّحِيطٍ
ఇంకా మేము మద్యన్ వారి వైపుకు వారి సోదరుడగు షుఐబ్‌ను పంపాము. అతనిలా ప్రబోధించాడు : “ఓ నా జాతిప్రజలారా! అల్లాహ్‌ను ఆరాధించండి. ఆయన తప్ప మీ ఆరాధ్య దేవుడెవడూ లేడు. కొలతలు తూనికలలో తగ్గించి ఇవ్వకండి. మీరు ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నట్టు చూస్తున్నాను. మీ విషయంలో చుట్టుముట్టే దినపు శిక్ష గురించి నేను భయపడుతున్నాను.
11:85 وَيَا قَوْمِ أَوْفُوا الْمِكْيَالَ وَالْمِيزَانَ بِالْقِسْطِ ۖ وَلَا تَبْخَسُوا النَّاسَ أَشْيَاءَهُمْ وَلَا تَعْثَوْا فِي الْأَرْضِ مُفْسِدِينَ
“ఓ నా జాతివారలారా! కొలతలు, తూనికలలో పూర్తిగా, న్యాయంగా వ్యవహరించండి (పూర్తిగా ఇవ్వండి). ప్రజలకు వారి వస్తువులను తగ్గించి ఇవ్వకండి. భూమిలో సంక్షోభాన్ని సృష్టించకండి.
11:86 بَقِيَّتُ اللَّهِ خَيْرٌ لَّكُمْ إِن كُنتُم مُّؤْمِنِينَ ۚ وَمَا أَنَا عَلَيْكُم بِحَفِيظٍ
“మీరు విశ్వాసులే అయితే, అల్లాహ్ ధర్మ సమ్మతం గావించిన మిగులు మాత్రమే మీ కొరకు శ్రేయస్కరమైనది. నేను మీపై కావలివాణ్ణి మాత్రంకాను.”
11:87 قَالُوا يَا شُعَيْبُ أَصَلَاتُكَ تَأْمُرُكَ أَن نَّتْرُكَ مَا يَعْبُدُ آبَاؤُنَا أَوْ أَن نَّفْعَلَ فِي أَمْوَالِنَا مَا نَشَاءُ ۖ إِنَّكَ لَأَنتَ الْحَلِيمُ الرَّشِيدُ
వారిలా అన్నారు : “ఓ షుఐబ్! మేము మా తాతముత్తాతలు పూజిస్తూ వస్తున్న దైవాలను వదలి పెట్టాలనీ, మా సొమ్ములను మా ఇష్టప్రకారం ఖర్చు పెట్టడం మానుకోవాలని నీ నమాజు నీకు ఆజ్ఞాపిస్తోందా? నువ్వు మరీ ఉదాత్త హృదయునిలా,రుజువర్తనునిలా ఉన్నావే?!”
11:88 قَالَ يَا قَوْمِ أَرَأَيْتُمْ إِن كُنتُ عَلَىٰ بَيِّنَةٍ مِّن رَّبِّي وَرَزَقَنِي مِنْهُ رِزْقًا حَسَنًا ۚ وَمَا أُرِيدُ أَنْ أُخَالِفَكُمْ إِلَىٰ مَا أَنْهَاكُمْ عَنْهُ ۚ إِنْ أُرِيدُ إِلَّا الْإِصْلَاحَ مَا اسْتَطَعْتُ ۚ وَمَا تَوْفِيقِي إِلَّا بِاللَّهِ ۚ عَلَيْهِ تَوَكَّلْتُ وَإِلَيْهِ أُنِيبُ
దానికి షుఐబు ఇలా సమాధానమిచ్చాడు : “ఓ నా జాతిసోదరులారా! చూడండి, నేను నా ప్రభువు వద్ద నుంచి ఒక స్పష్టమైన నిదర్శనాన్ని పొంది ఉన్నాను. ఆయన నాకు తన వద్ద నుండి అత్యుత్తమమైన ఉపాధిని ప్రసాదించాడు.(అలాంటప్పుడు నేను అక్రమార్జనకు పాల్పడగలనా?) ఏవిషయాలను మానుకోమని మిమ్మల్ని గట్టిగా చెబుతున్నానో వాటి వైపుకు నేను స్వయంగా మొగ్గిపోయే ఉద్దేశం నాకు లేనే లేదు. శాయశక్తులా దిద్దుబాటుచేయాలన్నదే నా ఉద్దేశం. నా ఈ సద్వర్తన అంతా దైవసహాయం పైనే ఆధారపడి ఉంది. నేను ఆయన్నే నమ్ముకున్నాను. ఆయన వైపుకే మరలుతున్నాను.
11:89 وَيَا قَوْمِ لَا يَجْرِمَنَّكُمْ شِقَاقِي أَن يُصِيبَكُم مِّثْلُ مَا أَصَابَ قَوْمَ نُوحٍ أَوْ قَوْمَ هُودٍ أَوْ قَوْمَ صَالِحٍ ۚ وَمَا قَوْمُ لُوطٍ مِّنكُم بِبَعِيدٍ
“ఓ నా జాతివారలారా! నాకు వ్యతిరేకంగా అవలంబిస్తున్న మీ మొండి వైఖరి నూహ్ జాతిపై, హూద్ జాతిపై, సాలెహ్ జాతిపై వచ్చిపడిన శిక్షల్లాంటి శిక్షలకే మిమ్మల్ని కూడా పాత్రులుగా చేస్తుందేమో (జాగ్రత్త!) ఇక లూతు జాతి వారైతే మీకు ఎంతో దూరాన కూడా లేరు.
11:90 وَاسْتَغْفِرُوا رَبَّكُمْ ثُمَّ تُوبُوا إِلَيْهِ ۚ إِنَّ رَبِّي رَحِيمٌ وَدُودٌ
“మీరు క్షమాపణ కోసం మీ ప్రభువును వేడుకోండి. మరి ఆయన వైపుకే మరలండి. నిశ్చయంగా నా ప్రభువు అమిత దయామయుడు, అపారప్రేమమయుడు.”
11:91 قَالُوا يَا شُعَيْبُ مَا نَفْقَهُ كَثِيرًا مِّمَّا تَقُولُ وَإِنَّا لَنَرَاكَ فِينَا ضَعِيفًا ۖ وَلَوْلَا رَهْطُكَ لَرَجَمْنَاكَ ۖ وَمَا أَنتَ عَلَيْنَا بِعَزِيزٍ
“ఓ షుఐబ్! నువ్వు చెప్పే వాటిలో చాలా విషయాలు మాకు అర్థం కావటం లేదు. మేము నిన్ను మా మధ్య ఎంతో బలహీనునిగా చూస్తున్నాము. నీ వంశస్థులే లేకపోతే ఈ పాటికి నీపై రాళ్ళు రువ్వి ఉండేవాళ్ళం. మా దృష్టిలో నువ్వు ఘనాపాటివి ఏమీకావు” అని వాళ్ళు చెప్పారు.
11:92 قَالَ يَا قَوْمِ أَرَهْطِي أَعَزُّ عَلَيْكُم مِّنَ اللَّهِ وَاتَّخَذْتُمُوهُ وَرَاءَكُمْ ظِهْرِيًّا ۖ إِنَّ رَبِّي بِمَا تَعْمَلُونَ مُحِيطٌ
దానికి అతను ఇలా అన్నాడు: “ఓ నా జాతివారలారా! మీ దృష్టిలో నా వంశస్థులు అల్లాహ్ కన్నా ఎక్కువ గౌరవనీయులా?! తత్కారణంగానే మీరు ఆయన్ని వెనక్కి నెట్టేశారా? నిశ్చయంగా నా ప్రభువు మీ కార్యకలాపాలన్నింటినీ పరివేష్ఠించి ఉన్నాడు.”
11:93 وَيَا قَوْمِ اعْمَلُوا عَلَىٰ مَكَانَتِكُمْ إِنِّي عَامِلٌ ۖ سَوْفَ تَعْلَمُونَ مَن يَأْتِيهِ عَذَابٌ يُخْزِيهِ وَمَنْ هُوَ كَاذِبٌ ۖ وَارْتَقِبُوا إِنِّي مَعَكُمْ رَقِيبٌ
(షుఐబ్ ఇంకా ఇలా అన్నాడు:) “ఓ నా జాతిసోదరులారా! మీరు మీ స్థానాలలో మీ పనులు చేస్తూ ఉండండి. నేనూ నా పని చేసుకుంటాను. పరాభవానికి లోను చేసే శిక్ష ఎవరికి పడుతుందో, అసత్యవాది ఎవరో అతిత్వరలోనే మీకు తెలిసిపోతుంది. మీరూ ఎదురు చూడండి, మీతో పాటు నేనూ ఎదురుచూస్తాను.”
11:94 وَلَمَّا جَاءَ أَمْرُنَا نَجَّيْنَا شُعَيْبًا وَالَّذِينَ آمَنُوا مَعَهُ بِرَحْمَةٍ مِّنَّا وَأَخَذَتِ الَّذِينَ ظَلَمُوا الصَّيْحَةُ فَأَصْبَحُوا فِي دِيَارِهِمْ جَاثِمِينَ
మరి మా ఉత్తర్వు (శిక్ష) వచ్చేసినప్పుడు, మేము షుఐబును, అతని వెంటనున్న విశ్వాసులను మా ప్రత్యేక కటాక్షంతో కాపాడాము. దుర్మార్గానికి ఒడిగట్టిన వారిని మాత్రం భయంకరమైన శబ్దం కబళించింది. దాంతో వారు తమ ఇంట్లో బోర్లా పడి పడినట్లే ఉండిపోయారు.
11:95 كَأَن لَّمْ يَغْنَوْا فِيهَا ۗ أَلَا بُعْدًا لِّمَدْيَنَ كَمَا بَعِدَتْ ثَمُودُ
అసలు వారక్కడ ఎప్పుడూ నివసించనే లేదన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. వినండి! సమూదు వారు దూరం చేయబడినట్లే మద్యను వారు కూడా (దైవ కారుణ్యానికి) దూరం అవుదురుగాక!
11:96 وَلَقَدْ أَرْسَلْنَا مُوسَىٰ بِآيَاتِنَا وَسُلْطَانٍ مُّبِينٍ
ఇంకా – మేము మూసాకు మా సూచనలను, స్పష్టమైన నిదర్శనాలను ఇచ్చి పంపాము.
11:97 إِلَىٰ فِرْعَوْنَ وَمَلَئِهِ فَاتَّبَعُوا أَمْرَ فِرْعَوْنَ ۖ وَمَا أَمْرُ فِرْعَوْنَ بِرَشِيدٍ
ఫిరౌను వద్దకు, అతని సర్దారుల వద్దకు పంపాము. అయినప్పటికీ వారు ఫిరౌను ఆదేశాలనే అనుసరించారు. మరి (చూడబోతే) ఫిరౌను ఆదేశాలలో ఏ ఒక్కటీ సరియైనది కాదు.
11:98 يَقْدُمُ قَوْمَهُ يَوْمَ الْقِيَامَةِ فَأَوْرَدَهُمُ النَّارَ ۖ وَبِئْسَ الْوِرْدُ الْمَوْرُودُ
వాడు ప్రళయదినాన తన జాతికి సారథ్యం వహిస్తూ వస్తాడు. వారందరినీ నరకంలోకి తీసుకుపోయి నిలబెడతాడు. వారు నిలబెట్టబడే ఆ చోటు అత్యంతచెడ్డది.
11:99 وَأُتْبِعُوا فِي هَٰذِهِ لَعْنَةً وَيَوْمَ الْقِيَامَةِ ۚ بِئْسَ الرِّفْدُ الْمَرْفُودُ
ఇహలోకంలోనూ వారికి శాపం అంటగట్టబడింది. ప్రళయదినాన కూడా అది వారిని వెంబడిస్తుంది. వారికి ఇవ్వబడిన బహుమతి బహుచెడ్డది.
11:100 ذَٰلِكَ مِنْ أَنبَاءِ الْقُرَىٰ نَقُصُّهُ عَلَيْكَ ۖ مِنْهَا قَائِمٌ وَحَصِيدٌ
ఇవి (తుదముట్టించబడిన) బస్తీలకు సంబంధించిన కొన్ని సమాచారాలు. వీటిని మేము నీకు వివరిస్తున్నాము. వాటిలో కొన్ని నిలిచి ఉన్నాయి. మరికొన్ని సమూలంగా తుడిచి పెట్టబడ్డాయి.
11:101 وَمَا ظَلَمْنَاهُمْ وَلَٰكِن ظَلَمُوا أَنفُسَهُمْ ۖ فَمَا أَغْنَتْ عَنْهُمْ آلِهَتُهُمُ الَّتِي يَدْعُونَ مِن دُونِ اللَّهِ مِن شَيْءٍ لَّمَّا جَاءَ أَمْرُ رَبِّكَ ۖ وَمَا زَادُوهُمْ غَيْرَ تَتْبِيبٍ
మేము వారికి ఏ మాత్రం అన్యాయం చేయలేదు. కాని వారే తమ స్వయానికి అన్యాయం చేసుకున్నారు. నీ ప్రభువు ఉత్తర్వు వచ్చినప్పుడు, అల్లాహ్‌ను వదలి వారు పూజించే వారి ఆరాధ్యదైవాలు వారికెలాంటి ప్రయోజనమూ చేకూర్చలేదు. పైగా వారి నష్టాన్ని మరింత అధికం చేశారు.
11:102 وَكَذَٰلِكَ أَخْذُ رَبِّكَ إِذَا أَخَذَ الْقُرَىٰ وَهِيَ ظَالِمَةٌ ۚ إِنَّ أَخْذَهُ أَلِيمٌ شَدِيدٌ
బస్తీలలో నివసించే దుర్మార్గులను పట్టదలచుకున్నప్పుడు నీ ప్రభువు పట్టుకునే తీరు ఇలాగే ఉంటుంది. నిశ్చయంగా ఆయన పట్టు బాధాకరంగానూ, కఠినంగానూ ఉంటుంది.
11:103 إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً لِّمَنْ خَافَ عَذَابَ الْآخِرَةِ ۚ ذَٰلِكَ يَوْمٌ مَّجْمُوعٌ لَّهُ النَّاسُ وَذَٰلِكَ يَوْمٌ مَّشْهُودٌ
నిశ్చయంగా పరలోక శిక్షకు భయపడేవారికి ఇందులో గుణపాఠపు సూచన ఉంది. అది జనులంతా సమీకరించబడే రోజు. ఇంకా అది అందరూ హాజరు పరచబడే రోజు.
11:104 وَمَا نُؤَخِّرُهُ إِلَّا لِأَجَلٍ مَّعْدُودٍ
మేము దానిని (తీర్పుదినమును) ఒక నియమిత గడువు వరకు మాత్రమే వాయిదా వేస్తాము.
11:105 يَوْمَ يَأْتِ لَا تَكَلَّمُ نَفْسٌ إِلَّا بِإِذْنِهِ ۚ فَمِنْهُمْ شَقِيٌّ وَسَعِيدٌ
అది వచ్చేసిన రోజు ఆయన అనుమతి లేకుండా పల్లెత్తు మాట అనే ధైర్యం ఎవరికీ ఉండదు. వారిలో కొందరు దౌర్భాగ్యులూ ఉంటారు, కొందరు సౌభాగ్యవంతులూ ఉంటారు.
11:106 فَأَمَّا الَّذِينَ شَقُوا فَفِي النَّارِ لَهُمْ فِيهَا زَفِيرٌ وَشَهِيقٌ
అయితే దౌర్భాగ్యులు నరకంలో ఉంటారు. అక్కడ వారు అరుస్తూ, పెడబొబ్బలు పెడుతూ ఉంటారు.
11:107 خَالِدِينَ فِيهَا مَا دَامَتِ السَّمَاوَاتُ وَالْأَرْضُ إِلَّا مَا شَاءَ رَبُّكَ ۚ إِنَّ رَبَّكَ فَعَّالٌ لِّمَا يُرِيدُ
నీ ప్రభువు వేరొకటి తలిస్తే తప్ప భూమ్యాకాశాలున్నంత వరకూ వారు అందులోనే శాశ్వతంగా ఉంటారు. నిశ్చయంగా నీ ప్రభువు తాను కోరిందల్లా చేసి తీరుతాడు.
11:108 وَأَمَّا الَّذِينَ سُعِدُوا فَفِي الْجَنَّةِ خَالِدِينَ فِيهَا مَا دَامَتِ السَّمَاوَاتُ وَالْأَرْضُ إِلَّا مَا شَاءَ رَبُّكَ ۖ عَطَاءً غَيْرَ مَجْذُوذٍ
ఇక సౌభాగ్యవంతులుగా చేయబడినవారు – నీ ప్రభువు కోరితే తప్ప, వారు భూమ్యాకాశాలున్నంత వరకూ స్వర్గంలోనే కలకాలం ఉంటారు. ఇది అనంతమైన వరం.
11:109 فَلَا تَكُ فِي مِرْيَةٍ مِّمَّا يَعْبُدُ هَٰؤُلَاءِ ۚ مَا يَعْبُدُونَ إِلَّا كَمَا يَعْبُدُ آبَاؤُهُم مِّن قَبْلُ ۚ وَإِنَّا لَمُوَفُّوهُمْ نَصِيبَهُمْ غَيْرَ مَنقُوصٍ
కనుక (ఓ ముహమ్మద్!) వారు పూజించే వాటి విషయంలో నువ్వు సందేహాలకు లోను కారాదు. ఇంతకు మునుపు వారి తాతముత్తాతలు పూజించినట్లుగానే వీళ్ళూ పూజిస్తున్నారు. మేమువాళ్లందరికీ వారి వారి భాగాన్నిపూర్తిగా – ఏ మాత్రం తగ్గించకుండా ఇస్తాము.
11:110 وَلَقَدْ آتَيْنَا مُوسَى الْكِتَابَ فَاخْتُلِفَ فِيهِ ۚ وَلَوْلَا كَلِمَةٌ سَبَقَتْ مِن رَّبِّكَ لَقُضِيَ بَيْنَهُمْ ۚ وَإِنَّهُمْ لَفِي شَكٍّ مِّنْهُ مُرِيبٍ
నిశ్చయంగా మేము మూసా (అలైహిస్సలాం)కు గ్రంథాన్ని ఇచ్చాము. మరి అందులో విభేదించుకోవటం జరిగింది. ఒకవేళ ముందుగానే నీ ప్రభువు తరఫున మాట ఖరారు కాకుండా ఉన్నట్లయితే, వారి మధ్య తీర్పు జరిగి ఉండేది. ఈ విషయంలో వారికి తీవ్రమయిన సందేహం ఉంది.
11:111 وَإِنَّ كُلًّا لَّمَّا لَيُوَفِّيَنَّهُمْ رَبُّكَ أَعْمَالَهُمْ ۚ إِنَّهُ بِمَا يَعْمَلُونَ خَبِيرٌ
వారిలో ప్రతి ఒక్కరికీ నీ ప్రభువు వారి కర్మల యొక్క పూర్తి ప్రతిఫలం ఇస్తాడు. నిశ్చయంగా ఆయనకు వారు చేస్తున్న పనులన్నీ తెలుసు.
11:112 فَاسْتَقِمْ كَمَا أُمِرْتَ وَمَن تَابَ مَعَكَ وَلَا تَطْغَوْا ۚ إِنَّهُ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ
కనుక (ఓ ముహమ్మద్!) నీకు ఆజ్ఞాపించబడినట్లుగా నువ్వూ, నీతోపాటు (పశ్చాత్తాపభావంతో) మరలివచ్చిన వారూ గట్టిగా నిలబడి ఉండండి. హద్దు మీరకండి. నిస్సందేహంగా అల్లాహ్ మీ కర్మలన్నింటినీ చూస్తున్నాడు.
11:113 وَلَا تَرْكَنُوا إِلَى الَّذِينَ ظَلَمُوا فَتَمَسَّكُمُ النَّارُ وَمَا لَكُم مِّن دُونِ اللَّهِ مِنْ أَوْلِيَاءَ ثُمَّ لَا تُنصَرُونَ
చూడండి! ఎట్టి పరిస్థితిలోనూ దుర్మార్గుల పక్షాన మొగ్గకండి. మొగ్గారో మీక్కూడా నిప్పు (నరకాగ్ని) అంటుకుంటుంది. మరి అల్లాహ్ తప్ప మిమ్మల్ని ఆదుకునే వాడెవడూ ఉండడు. మీకు సహాయమూ అందదు.
11:114 وَأَقِمِ الصَّلَاةَ طَرَفَيِ النَّهَارِ وَزُلَفًا مِّنَ اللَّيْلِ ۚ إِنَّ الْحَسَنَاتِ يُذْهِبْنَ السَّيِّئَاتِ ۚ ذَٰلِكَ ذِكْرَىٰ لِلذَّاكِرِينَ
దినము యొక్క రెండు అంచులలోనూ నమాజును స్థాపించు – రాత్రి ఘడియలలో కూడా! నిశ్చయంగా పుణ్యకార్యాలు పాపకార్యాలను దూరం చేస్తాయి. హితబోధను గ్రహించగలిగే వారికి ఇదొక హితోపదేశం.
11:115 وَاصْبِرْ فَإِنَّ اللَّهَ لَا يُضِيعُ أَجْرَ الْمُحْسِنِينَ
నువ్వు సహనంతో మసలుకో. నిశ్చయంగా సద్వర్తనుల పుణ్యఫలాన్ని అల్లాహ్ వృథా కానివ్వడు.
11:116 فَلَوْلَا كَانَ مِنَ الْقُرُونِ مِن قَبْلِكُمْ أُولُو بَقِيَّةٍ يَنْهَوْنَ عَنِ الْفَسَادِ فِي الْأَرْضِ إِلَّا قَلِيلًا مِّمَّنْ أَنجَيْنَا مِنْهُمْ ۗ وَاتَّبَعَ الَّذِينَ ظَلَمُوا مَا أُتْرِفُوا فِيهِ وَكَانُوا مُجْرِمِينَ
మీకు పూర్వం గతించిన కాలాల వారిలో భూమిలో కల్లోలాన్ని వ్యాపింపజేయకుండా అడ్డుకునే మంచివారు ఎందుకు లేరు? ఉన్నా బహు కొద్దిమంది మాత్రమే ఉండేవారు. వారిని మేము రక్షించాము. కాగా; దుర్మార్గులైన వారు తమకు ప్రసాదించబడిన సుఖసౌఖ్యాల వెంటపడ్డారు. వారు అపరాధులు.
11:117 وَمَا كَانَ رَبُّكَ لِيُهْلِكَ الْقُرَىٰ بِظُلْمٍ وَأَهْلُهَا مُصْلِحُونَ
పురములలో నివసించే వారు మంచి పనులు చేస్తున్నప్పుడు నీ ప్రభువు అలాంటి పురములను అన్యాయంగా తుదముట్టించడు.
11:118 وَلَوْ شَاءَ رَبُّكَ لَجَعَلَ النَّاسَ أُمَّةً وَاحِدَةً ۖ وَلَا يَزَالُونَ مُخْتَلِفِينَ
నీ ప్రభువు గనక తలచుకుంటే మనుషులందరినీ ఒకే సమూహంగా చేసి ఉంచేవాడు. కాని వారు మాత్రం విభేదించుకునే వారుగానే ఉంటారు.
11:119 إِلَّا مَن رَّحِمَ رَبُّكَ ۚ وَلِذَٰلِكَ خَلَقَهُمْ ۗ وَتَمَّتْ كَلِمَةُ رَبِّكَ لَأَمْلَأَنَّ جَهَنَّمَ مِنَ الْجِنَّةِ وَالنَّاسِ أَجْمَعِينَ
కాని నీ ప్రభువు దయచూపిన వారు మాత్రం అలా చేయరు. ఆయన వారిని పుట్టించిందే అందుకోసం. “నేను నరకాన్ని జిన్నాతులు, మనుషులు – అందరితోనూ నింపుతాను” అని నీ ప్రభువు అన్నమాట నెరవేరింది.
11:120 وَكُلًّا نَّقُصُّ عَلَيْكَ مِنْ أَنبَاءِ الرُّسُلِ مَا نُثَبِّتُ بِهِ فُؤَادَكَ ۚ وَجَاءَكَ فِي هَٰذِهِ الْحَقُّ وَمَوْعِظَةٌ وَذِكْرَىٰ لِلْمُؤْمِنِينَ
(ఓ ప్రవక్తా!) ప్రవక్తల ఈ సమాచారాలన్నింటినీ మేము నీ మనోనిబ్బరం కోసం నీకు తెలియపరుస్తున్నాము. ఈ సూరాలో కూడా నీకు సత్యం లభించింది. విశ్వాసులకు ఇది హితోపదేశం మరియు జ్ఞాపిక.
11:121 وَقُل لِّلَّذِينَ لَا يُؤْمِنُونَ اعْمَلُوا عَلَىٰ مَكَانَتِكُمْ إِنَّا عَامِلُونَ
విశ్వసించని వారితో, “మీరు మీ పద్ధతి ప్రకారం పనులు చేస్తూ ఉండండి, మా పనులు మేము చేస్తూ ఉంటాము.
11:122 وَانتَظِرُوا إِنَّا مُنتَظِرُونَ
మీరూ నిరీక్షించండి, మేమూ నిరీక్షిస్తూ ఉంటాము” అని (ఓ ప్రవక్తా!) చెప్పు.
11:123 وَلِلَّهِ غَيْبُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَإِلَيْهِ يُرْجَعُ الْأَمْرُ كُلُّهُ فَاعْبُدْهُ وَتَوَكَّلْ عَلَيْهِ ۚ وَمَا رَبُّكَ بِغَافِلٍ عَمَّا تَعْمَلُونَ
భూమ్యాకాశాల రహస్య జ్ఞానం అల్లాహ్ వద్దనే ఉంది. సమస్త వ్యవహారాలూ ఆయన వైపుకే మరలించబడతాయి. కాబట్టి (ఓ ప్రవక్తా!) నువ్వు ఆయన్నే ఆరాధించాలి. ఆయన్నేనమ్ముకోవాలి. మీరు చేసే పనులు అల్లాహ్‌కు తెలియకుండా లేవు.
12. సూరా యూసుఫ్ (Yusuf)
12:1 الر ۚ تِلْكَ آيَاتُ الْكِتَابِ الْمُبِينِ
అలిఫ్ – లామ్ – రా. ఇవి స్పష్టమైన గ్రంథవాక్యాలు.
12:2 إِنَّا أَنزَلْنَاهُ قُرْآنًا عَرَبِيًّا لَّعَلَّكُمْ تَعْقِلُونَ
మీరు అర్థం చేసుకునేటందుకు మేము దీనిని అరబీ ఖుర్ఆనుగా అవతరింపజేశాము.
12:3 نَحْنُ نَقُصُّ عَلَيْكَ أَحْسَنَ الْقَصَصِ بِمَا أَوْحَيْنَا إِلَيْكَ هَٰذَا الْقُرْآنَ وَإِن كُنتَ مِن قَبْلِهِ لَمِنَ الْغَافِلِينَ
(ఓ ప్రవక్తా!) మేము నీ వద్దకు ‘వహీ’ ద్వారా ఈ ఖుర్ఆన్ను పంపి, (దీని ద్వారా) అత్యుత్తమమైన గాధలను నీకు చెబుతున్నాము. నిశ్చయంగా ఇంతకు మునుపు నీకు దీని (ఈ గాధల) గురించి ఏమీ తెలియదు.
12:4 إِذْ قَالَ يُوسُفُ لِأَبِيهِ يَا أَبَتِ إِنِّي رَأَيْتُ أَحَدَ عَشَرَ كَوْكَبًا وَالشَّمْسَ وَالْقَمَرَ رَأَيْتُهُمْ لِي سَاجِدِينَ
యూసుఫ్ తన తండ్రితో, “నాన్నా! నేను (కలగన్నాను. ఆ కలలో) పదకొండు నక్షత్రాలను, సూర్యచంద్రులను చూశాను. – అవి నాకు సాష్టాంగ ప్రణామం చేస్తున్నట్లు కనిపించాయి” అని చెప్పినప్పుడు,
12:5 قَالَ يَا بُنَيَّ لَا تَقْصُصْ رُؤْيَاكَ عَلَىٰ إِخْوَتِكَ فَيَكِيدُوا لَكَ كَيْدًا ۖ إِنَّ الشَّيْطَانَ لِلْإِنسَانِ عَدُوٌّ مُّبِينٌ
“నా ముద్దుల బాబూ! నువ్వు కన్న కలను గురించి నీ సోదరులకు మాత్రం చెప్పకురా. బహుశా వారు నీకు వ్యతిరేకంగా కుట్ర పన్నవచ్చురా. నిశ్చయంగా షైతాన్ మనిషికి బద్ధవిరోధి.
12:6 وَكَذَٰلِكَ يَجْتَبِيكَ رَبُّكَ وَيُعَلِّمُكَ مِن تَأْوِيلِ الْأَحَادِيثِ وَيُتِمُّ نِعْمَتَهُ عَلَيْكَ وَعَلَىٰ آلِ يَعْقُوبَ كَمَا أَتَمَّهَا عَلَىٰ أَبَوَيْكَ مِن قَبْلُ إِبْرَاهِيمَ وَإِسْحَاقَ ۚ إِنَّ رَبَّكَ عَلِيمٌ حَكِيمٌ
“అలాగే (నువ్వు కలగన్నట్లుగానే) జరుగుతుంది. నీ ప్రభువు నిన్ను (తన కార్యం కొరకు) ఎన్నుకుంటాడు. నీకు విషయాలలోతును అందుకునే విద్యను (లేక స్వప్నాల సారాంశాన్ని గ్రహించే జ్ఞానాన్ని) కూడా నేర్పుతాడు. తన అనుగ్రహాన్ని నీపై పరిపూర్ణం గావిస్తాడు. యాఖూబు సంతానాన్నికూడా (అనుగ్రహిస్తాడు). ఆయన లోగడ నీ తాతముత్తాతలైన ఇబ్రాహీము, ఇస్హాఖులకు తన అనుగ్రహాన్ని సంపూర్ణంగా ప్రసాదించినట్లు. నిశ్చయంగా నీ ప్రభువు మహాజ్ఞాని, గొప్పవివేకవంతుడు” అని అతని తండ్రి (యాఖూబ్) ఉపదేశించాడు.
12:7 لَّقَدْ كَانَ فِي يُوسُفَ وَإِخْوَتِهِ آيَاتٌ لِّلسَّائِلِينَ
నిశ్చయంగా యూసుఫ్ మరియు అతని సోదరుల గాథలో అడిగే వారికోసం (గొప్ప) సూచనలున్నాయి.
12:8 إِذْ قَالُوا لَيُوسُفُ وَأَخُوهُ أَحَبُّ إِلَىٰ أَبِينَا مِنَّا وَنَحْنُ عُصْبَةٌ إِنَّ أَبَانَا لَفِي ضَلَالٍ مُّبِينٍ
అప్పుడు వారిలా చెప్పుకున్నారు: “మనం ఒక (బలమైన) జట్టుగా ఉన్నప్పటికీ మన తండ్రి మనకన్నా యూసుఫును, అతని సోదరుణ్ణే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ విషయంలో మా తండ్రి స్పష్టమైన తప్పుచేస్తున్నారు అనేది మాత్రం ముమ్మాటికీ నిజం.
12:9 اقْتُلُوا يُوسُفَ أَوِ اطْرَحُوهُ أَرْضًا يَخْلُ لَكُمْ وَجْهُ أَبِيكُمْ وَتَكُونُوا مِن بَعْدِهِ قَوْمًا صَالِحِينَ
“(అందుకే) యూసుఫ్‌ను చంపేయండి లేదా అతన్నిఏదైనా (తెలియని) చోటపారేయండి. అప్పుడైనా మీ తండ్రి శ్రద్ధాసక్తులు మీవైపుకు మళ్ళవచ్చు. ఆ తరువాత మీరు మంచి వారుగా మారాలి.”
12:10 قَالَ قَائِلٌ مِّنْهُمْ لَا تَقْتُلُوا يُوسُفَ وَأَلْقُوهُ فِي غَيَابَتِ الْجُبِّ يَلْتَقِطْهُ بَعْضُ السَّيَّارَةِ إِن كُنتُمْ فَاعِلِينَ
అప్పుడు వారిలో ఒకడు, “యూసుఫ్‌ను చంపకండి. (ఒకవేళ ఏదైనా చేయాలనే అనుకుంటే) అతన్ని ఏదైనా లోతైన బావిలో పడవెయ్యండి – వచ్చేపోయే బాటసారుల బృందం ఏదైనా అతన్నిఎత్తుకుపోతుంది” అని అన్నాడు.
12:11 قَالُوا يَا أَبَانَا مَا لَكَ لَا تَأْمَنَّا عَلَىٰ يُوسُفَ وَإِنَّا لَهُ لَنَاصِحُونَ
వారంతా అన్నారు: “నాన్నగారూ! తమరు యూసుఫ్ విషయంలో మమ్మల్ని బొత్తిగా నమ్మరేమిటీ? మేము అతని బాగోగులను కోరేవారమేకదా!
12:12 أَرْسِلْهُ مَعَنَا غَدًا يَرْتَعْ وَيَلْعَبْ وَإِنَّا لَهُ لَحَافِظُونَ
“రేపు మీరతన్ని ఎలాగైనా సరే మాతో పంపండి. అక్కడతను బాగాతిని, ఆడుకుంటాడు. అతన్ని కాపాడే బాధ్యత మాదికదా?”
12:13 قَالَ إِنِّي لَيَحْزُنُنِي أَن تَذْهَبُوا بِهِ وَأَخَافُ أَن يَأْكُلَهُ الذِّئْبُ وَأَنتُمْ عَنْهُ غَافِلُونَ
(యాఖూబు – అలైహిస్సలాం) ఇలా సమాధానమిచ్చారు: “మీరతన్ని తీసుకువెళ్లటం నన్ను వ్యాకుల పరుస్తోంది. మీరు పరధ్యానంలో ఉండగా ఎక్కడ తోడేలు వచ్చి అతన్ని తినేస్తుందోనన్న భయంకూడా నన్ను వెంటాడుతోంది.”
12:14 قَالُوا لَئِنْ أَكَلَهُ الذِّئْبُ وَنَحْنُ عُصْبَةٌ إِنَّا إِذًا لَّخَاسِرُونَ
దానికి వారు, “(నాన్నా!) మాలాంటి (బలిష్టమైన) జట్టు ఉండగా తోడేలు వచ్చి ఇతన్ని తినేస్తే మేము ఏ మాత్రం చేతకాని చవటలం అవుతాము” అని చెప్పారు.
12:15 فَلَمَّا ذَهَبُوا بِهِ وَأَجْمَعُوا أَن يَجْعَلُوهُ فِي غَيَابَتِ الْجُبِّ ۚ وَأَوْحَيْنَا إِلَيْهِ لَتُنَبِّئَنَّهُم بِأَمْرِهِمْ هَٰذَا وَهُمْ لَا يَشْعُرُونَ
ఆ విధంగా వాళ్ళు అతన్ని తీసుకుపోయి, లోతైన బావిలో పడవేయాలని నిశ్చయించుకున్నారు. అప్పుడు మేము యూసుఫ్‌కు ‘వహీ’ పంపుతూ, “నువ్వు(ఒకానొకరోజు) తప్పకుండా వారికి ఈ వ్యవహారాన్ని తెలియజేస్తావు. కాని అప్పుడు వారు (నిన్ను) గుర్తుపట్టే స్థితిలో ఉండరు” అని తెలిపాము.
12:16 وَجَاءُوا أَبَاهُمْ عِشَاءً يَبْكُونَ
రాత్రయ్యే సరికి వారంతా లబోదిబో మంటూ తమ తండ్రి వద్దకు వచ్చారు.
12:17 قَالُوا يَا أَبَانَا إِنَّا ذَهَبْنَا نَسْتَبِقُ وَتَرَكْنَا يُوسُفَ عِندَ مَتَاعِنَا فَأَكَلَهُ الذِّئْبُ ۖ وَمَا أَنتَ بِمُؤْمِنٍ لَّنَا وَلَوْ كُنَّا صَادِقِينَ
“ఓ నాన్నా! మేము యూసుఫ్‌ను సామాను వద్ద వదలి పెట్టి పరుగుపందెంలో మునిగిపోయాము. అంతలోనే తోడేలువచ్చి అతన్నితినేసింది. మేము నిజం చెప్పినా మీరు మా మాటను నమ్మరు” అన్నారు.
12:18 وَجَاءُوا عَلَىٰ قَمِيصِهِ بِدَمٍ كَذِبٍ ۚ قَالَ بَلْ سَوَّلَتْ لَكُمْ أَنفُسُكُمْ أَمْرًا ۖ فَصَبْرٌ جَمِيلٌ ۖ وَاللَّهُ الْمُسْتَعَانُ عَلَىٰ مَا تَصِفُونَ
అతని (యూసుఫ్) చొక్కాను బూటకపు (నకిలీ) రక్తంతో రంగరించి తెచ్చారు. “(ఇది నిజం కాదు). ఇది మీ మనోకల్పితమైన మాట మాత్రమే. సరే. ఇక ఓర్పు వహించటమే ఉత్తమం. మీరు కల్పించే మాటలపై నేను అల్లాహ్ సహాయాన్నేఅర్థిస్తున్నాను” అని ఆయన (యాఖూబు) పలికారు.
12:19 وَجَاءَتْ سَيَّارَةٌ فَأَرْسَلُوا وَارِدَهُمْ فَأَدْلَىٰ دَلْوَهُ ۖ قَالَ يَا بُشْرَىٰ هَٰذَا غُلَامٌ ۚ وَأَسَرُّوهُ بِضَاعَةً ۚ وَاللَّهُ عَلِيمٌ بِمَا يَعْمَلُونَ
ఒక ప్రయాణీకుల బృందం అటువైపు వచ్చింది. వారు నీళ్ళు తెచ్చే తమ మనిషిని నీళ్ళ కొరకు పంపగా, అతడు తన బొక్కెను బావిలో వేశాడు – (యూసుఫ్‌ను చూడగానే) “శుభం శుభం, ఇదిగో ఇక్కడ ఒక బాలుడున్నాడ” ని అన్నాడు. వారు అతన్ని వర్తక సామగ్రిగా పరిగణించి దాచి పెట్టారు. అయితే వారు చేస్తున్నదంతా అల్లాహ్‌కు తెలుసు!
12:20 وَشَرَوْهُ بِثَمَنٍ بَخْسٍ دَرَاهِمَ مَعْدُودَةٍ وَكَانُوا فِيهِ مِنَ الزَّاهِدِينَ
వాళ్ళు అతన్ని అతి తక్కువ ధరకు, అనగా కొన్నిదిర్హములకే అమ్మేశారు. ఎందుకంటే యూసుఫ్ వ్యవహారంలో వారికి అంతగా ఆసక్తి లేదు.
12:21 وَقَالَ الَّذِي اشْتَرَاهُ مِن مِّصْرَ لِامْرَأَتِهِ أَكْرِمِي مَثْوَاهُ عَسَىٰ أَن يَنفَعَنَا أَوْ نَتَّخِذَهُ وَلَدًا ۚ وَكَذَٰلِكَ مَكَّنَّا لِيُوسُفَ فِي الْأَرْضِ وَلِنُعَلِّمَهُ مِن تَأْوِيلِ الْأَحَادِيثِ ۚ وَاللَّهُ غَالِبٌ عَلَىٰ أَمْرِهِ وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ
ఈజిప్టు వారిలో యూసుఫును కొన్న వ్యక్తి తన భార్యతో, “ఇతన్నిగౌరవాదరణలతో ఉంచు. బహుశా ఇతని వల్ల మనకు లాభం కలగవచ్చు. లేదా ఇతన్ని మనం మన కొడుకుగా నయినా చేసుకోవచ్చు” అన్నాడు. ఈ విధంగా మేము, స్వప్నాల సారాన్ని గ్రహించే విద్యను నేర్పడానికి ఈజిప్టు భూభాగంపై యూసుఫ్‌కు నిలదొక్కుకునే అవకాశం కల్పించాము. అల్లాహ్ తన నిర్ణయాన్ని అమలు పరచి తీరుతాడు. కాని ప్రజలలో చాలామందికి ఈ విషయం తెలియదు.
12:22 وَلَمَّا بَلَغَ أَشُدَّهُ آتَيْنَاهُ حُكْمًا وَعِلْمًا ۚ وَكَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ
మరి అతను (యూసుఫ్) నిండు యౌవనదశకు చేరుకున్నప్పుడు మేమతనికి నిర్ణయం గైకునే శక్తినీ, జ్ఞానాన్నీ ప్రసాదించాము. సదాచార సంపన్నులకు మేము ఈ విధంగానే ప్రతిఫలాన్నిఅనుగ్రహిస్తాము.
12:23 وَرَاوَدَتْهُ الَّتِي هُوَ فِي بَيْتِهَا عَن نَّفْسِهِ وَغَلَّقَتِ الْأَبْوَابَ وَقَالَتْ هَيْتَ لَكَ ۚ قَالَ مَعَاذَ اللَّهِ ۖ إِنَّهُ رَبِّي أَحْسَنَ مَثْوَايَ ۖ إِنَّهُ لَا يُفْلِحُ الظَّالِمُونَ
అతను (యూసుఫ్) ఉంటున్న ఇంటి స్త్రీ అతని మానసిక ఏకాగ్రతను దెబ్బతీస్తూ కవ్వించటం మొదలెట్టింది. (ఒకసారి) తలుపులు మూసేసి, ‘రా….రా!’ అని అంది. “అల్లాహ్ శరణు! ఆయన నా ప్రభువు. ఆయన నన్ను చాలా మంచి స్థితిలో ఉంచాడు. అన్యాయం చేసేవారు ఎన్నటికీ బాగుపడరు” అని యూసుఫ్ అన్నాడు.
12:24 وَلَقَدْ هَمَّتْ بِهِ ۖ وَهَمَّ بِهَا لَوْلَا أَن رَّأَىٰ بُرْهَانَ رَبِّهِ ۚ كَذَٰلِكَ لِنَصْرِفَ عَنْهُ السُّوءَ وَالْفَحْشَاءَ ۚ إِنَّهُ مِنْ عِبَادِنَا الْمُخْلَصِينَ
ఆమె అతన్ని (యూసుఫ్‌ను) ఆశించింది. ఒకవేళ అతను గనక తన ప్రభువు నిదర్శనాన్ని చూసి ఉండకపోతే అతను కూడా ఆమెను ఆశించి ఉండేవాడే. (కాని అలా జరగలేదు). ఎందుకంటే మేము అతన్నుంచి చెడును, నీతి బాహ్యతను దూరంచేశాము. నిశ్చయంగా అతను మాప్రత్యేక దాసులలో ఒకడు.
12:25 وَاسْتَبَقَا الْبَابَ وَقَدَّتْ قَمِيصَهُ مِن دُبُرٍ وَأَلْفَيَا سَيِّدَهَا لَدَى الْبَابِ ۚ قَالَتْ مَا جَزَاءُ مَنْ أَرَادَ بِأَهْلِكَ سُوءًا إِلَّا أَن يُسْجَنَ أَوْ عَذَابٌ أَلِيمٌ
వారిద్దరూ తలుపు వైపు పరుగెత్తారు. ఆ స్త్రీ యూసుఫ్ చొక్కాను వెనుకవైపు నుంచి లాగిచింపేసింది. తలుపు వద్దనే ఆమె భర్తవారిద్దరికీ ఎదురుపడ్డాడు. “నీ ఇల్లాలిపట్ల దురుద్దేశం కలవాడికి కారాగారశిక్ష విధించటమూ లేక మరేదైనా కఠినశిక్ష విధించటమూ తప్ప వేరేశిక్ష ఏముంటుంది?” అని ఆమె (భర్తను) ప్రశ్నించింది.
12:26 قَالَ هِيَ رَاوَدَتْنِي عَن نَّفْسِي ۚ وَشَهِدَ شَاهِدٌ مِّنْ أَهْلِهَا إِن كَانَ قَمِيصُهُ قُدَّ مِن قُبُلٍ فَصَدَقَتْ وَهُوَ مِنَ الْكَاذِبِينَ
“ఈమెగారే నన్నువలలో వేసుకోవటానికి ప్రయత్నించింది” అని యూసుఫ్ చెప్పాడు. ఆమె వంశానికే చెందిన ఒక వ్యక్తి సాక్ష్యమిస్తూ, “ఇతని చొక్కాగనక ముందువైపు నుంచి చినిగి ఉంటే స్త్రీ చెప్పేది నిజం. ఇతను చెప్పేది అబద్ధం.
12:27 وَإِن كَانَ قَمِيصُهُ قُدَّ مِن دُبُرٍ فَكَذَبَتْ وَهُوَ مِنَ الصَّادِقِينَ
ఒకవేళ ఇతని చొక్కా గనక వెనుక వైపు నుంచి చినిగి ఉంటే స్త్రీ చెప్పేది అబద్ధం. ఇతను చెప్పేది నిజం” అన్నాడు.
12:28 فَلَمَّا رَأَىٰ قَمِيصَهُ قُدَّ مِن دُبُرٍ قَالَ إِنَّهُ مِن كَيْدِكُنَّ ۖ إِنَّ كَيْدَكُنَّ عَظِيمٌ
యూసుఫ్ చొక్కా వెనుక వైపు నుంచి చినిగి ఉండటం గమనించిన ఆమె భర్త ఇలా అన్నాడు : “ఇవి మీఆడవాళ్ల మాయోపాయాలు. నిశ్చయంగా మీ మాయోపాయాలు మహాఘోరంగా ఉంటాయి!
12:29 يُوسُفُ أَعْرِضْ عَنْ هَٰذَا ۚ وَاسْتَغْفِرِي لِذَنبِكِ ۖ إِنَّكِ كُنتِ مِنَ الْخَاطِئِينَ
“యూసుఫ్! ఈ విషయాన్ని ఇంతటితో వదిలెయ్యి. (ఏమే!) నువ్వు మాత్రం నీతప్పుకు (అల్లాహ్‌ను) క్షమాపణ వేడుకో. ముమ్మాటికీ తప్పు నీదే” (అన్నాడు).
12:30 وَقَالَ نِسْوَةٌ فِي الْمَدِينَةِ امْرَأَتُ الْعَزِيزِ تُرَاوِدُ فَتَاهَا عَن نَّفْسِهِ ۖ قَدْ شَغَفَهَا حُبًّا ۖ إِنَّا لَنَرَاهَا فِي ضَلَالٍ مُّبِينٍ
నగర స్త్రీలలో గుసగుసలు మొదలయ్యాయి – “అజీజ్ భార్య తన వద్ద నున్న (యువ) బానిసపై (మోజుపడి), తన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవటానికి వలపన్నుతోంది. ఆమె మనసులో అతని పట్ల ప్రేమ.గూడు కట్టుకుంది. (ఎంతయినా) మా దృష్టిలో ఆమె చేసేది ఘోరమైనతప్పే” అని వారు చెప్పుకోసాగారు.
12:31 فَلَمَّا سَمِعَتْ بِمَكْرِهِنَّ أَرْسَلَتْ إِلَيْهِنَّ وَأَعْتَدَتْ لَهُنَّ مُتَّكَأً وَآتَتْ كُلَّ وَاحِدَةٍ مِّنْهُنَّ سِكِّينًا وَقَالَتِ اخْرُجْ عَلَيْهِنَّ ۖ فَلَمَّا رَأَيْنَهُ أَكْبَرْنَهُ وَقَطَّعْنَ أَيْدِيَهُنَّ وَقُلْنَ حَاشَ لِلَّهِ مَا هَٰذَا بَشَرًا إِنْ هَٰذَا إِلَّا مَلَكٌ كَرِيمٌ
వారి మోసపు మాటల గురించి విని ఆమె వాళ్ళను పిలిపించింది. వారికోసం ఒక సదనాన్ని ఏర్పాటుచేసింది. వారిలో ఒక్కొక్కరికి ఒక్కో కత్తి ఇచ్చి, (వారంతా ఆసీనులైన తరువాత) “వీళ్లముందుకురా!” అని (యూసుఫ్‌ను) ఆదేశించింది. ఆ స్త్రీలు అతన్ని చూడగానే దిగ్భ్రమతో (మైమరచి) తమ చేతులనే కోసుకున్నారు. “హాషాలిల్లాహ్! (దైవమహిమ!) ఇతను మానవమాత్రుడు కాడు. నిశ్చయంగా ఇతను (దివి నుంచి భువికి దిగివచ్చిన) గొప్పదైవదూతే!” అన్నమాటలు వారినోట (అప్రయత్నంగా) వెలువడ్డాయి.
12:32 قَالَتْ فَذَٰلِكُنَّ الَّذِي لُمْتُنَّنِي فِيهِ ۖ وَلَقَدْ رَاوَدتُّهُ عَن نَّفْسِهِ فَاسْتَعْصَمَ ۖ وَلَئِن لَّمْ يَفْعَلْ مَا آمُرُهُ لَيُسْجَنَنَّ وَلَيَكُونًا مِّنَ الصَّاغِرِينَ
అప్పుడు ఆమె (అజీజ్ భార్య) ఇలా అన్నది: “ఎవరి విషయంలో మీరంతా నన్నునిందిస్తున్నారో ఆ వ్యక్తి ఇతనే. నేను ఇతన్ని వల్లో వేసుకోవాలని ప్రయత్నించాను. కాని ఇతను తప్పించుకున్నాడు. నేను ఆజ్ఞాపించిన పనిని ఇతను చేయకపోతే చెరసాలపాలై, తీవ్రమైన అవమానానికి గురవుతాడు.”
12:33 قَالَ رَبِّ السِّجْنُ أَحَبُّ إِلَيَّ مِمَّا يَدْعُونَنِي إِلَيْهِ ۖ وَإِلَّا تَصْرِفْ عَنِّي كَيْدَهُنَّ أَصْبُ إِلَيْهِنَّ وَأَكُن مِّنَ الْجَاهِلِينَ
అప్పుడు యూసుఫ్, “ప్రభూ! ఈ స్త్రీలు దేనికోసం నన్నుపిలుస్తున్నారో దానికన్నా కారాగారమే నాకు ప్రీతికరమైనది. నీవు గనక వీళ్ల జిత్తులను నానుండి దూరం చేయకపోతే, నేను వీళ్ల వలలో పడిపోయి, అవివేకులలో చేరిపోతాను!” అని మొరపెట్టుకున్నాడు.
12:34 فَاسْتَجَابَ لَهُ رَبُّهُ فَصَرَفَ عَنْهُ كَيْدَهُنَّ ۚ إِنَّهُ هُوَ السَّمِيعُ الْعَلِيمُ
అతని ప్రభువు అతని ప్రార్థనను ఆమోదించాడు. ఆ మగువల మాయోపాయాలను అతన్నుంచి తొలగించాడు. నిశ్చయంగా ఆయన అంతా వినేవాడు, అన్నీతెలిసినవాడు.
12:35 ثُمَّ بَدَا لَهُم مِّن بَعْدِ مَا رَأَوُا الْآيَاتِ لَيَسْجُنُنَّهُ حَتَّىٰ حِينٍ
నిదర్శనాలన్నిటిని చూసిన తరువాత కూడా యూసుఫ్‌ను కొంతకాలంపాటు కారాగారంలో ఉంచటమే ఉచితమని వారు భావించారు.
12:36 وَدَخَلَ مَعَهُ السِّجْنَ فَتَيَانِ ۖ قَالَ أَحَدُهُمَا إِنِّي أَرَانِي أَعْصِرُ خَمْرًا ۖ وَقَالَ الْآخَرُ إِنِّي أَرَانِي أَحْمِلُ فَوْقَ رَأْسِي خُبْزًا تَأْكُلُ الطَّيْرُ مِنْهُ ۖ نَبِّئْنَا بِتَأْوِيلِهِ ۖ إِنَّا نَرَاكَ مِنَ الْمُحْسِنِينَ
అతనితో పాటు మరో ఇద్దరు యువకులు కూడా కారాగారానికి వచ్చారు. వారిలో ఒకడు, “నేను సారాయి పిండుతున్నట్లు కలగన్నాన” ని అన్నాడు. రెండో అతను, “నేను (కలలో) నా తలపై రొట్టెలు ఎత్తుకొని ఉన్నాను. వాటిని పక్షులు తింటున్నాయ” ని చెప్పాడు. “దీని మర్మం ఏమిటో కాస్త మాకు చెప్పండి. చూస్తుంటే,మీరు మాకు మంచివారుగా కనిపిస్తున్నారు” అని వారిద్దరూ విన్నవించుకున్నారు.
12:37 قَالَ لَا يَأْتِيكُمَا طَعَامٌ تُرْزَقَانِهِ إِلَّا نَبَّأْتُكُمَا بِتَأْوِيلِهِ قَبْلَ أَن يَأْتِيَكُمَا ۚ ذَٰلِكُمَا مِمَّا عَلَّمَنِي رَبِّي ۚ إِنِّي تَرَكْتُ مِلَّةَ قَوْمٍ لَّا يُؤْمِنُونَ بِاللَّهِ وَهُم بِالْآخِرَةِ هُمْ كَافِرُونَ
అప్పుడు యూసుఫ్ ఇలా అన్నాడు : “ఇక్కడ మీకు ఇవ్వబడే భోజనం మీ వద్దకు రాకముందే నేను మీకు వాటి భావార్థాన్ని వివరిస్తాను. ఇదంతా నా ప్రభువు నాకు నేర్పిన విద్యయే.(అసలు విషయం ఏమిటంటే) అల్లాహ్‌ను నమ్మనివారి, పరలోకాన్ని తిరస్కరించే వారి మతాన్ని నేను వదలిపెట్టాను.
12:38 وَاتَّبَعْتُ مِلَّةَ آبَائِي إِبْرَاهِيمَ وَإِسْحَاقَ وَيَعْقُوبَ ۚ مَا كَانَ لَنَا أَن نُّشْرِكَ بِاللَّهِ مِن شَيْءٍ ۚ ذَٰلِكَ مِن فَضْلِ اللَّهِ عَلَيْنَا وَعَلَى النَّاسِ وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَشْكُرُونَ
“నేను నా తాతతండ్రులైన ఇబ్రాహీం, ఇస్హాఖ్, యాఖూబ్‌ల ధర్మానికి కట్టుబడి ఉన్నాను. అల్లాహ్‌కు భాగస్వామిగా వేరితరులను కల్పించటం మాకు ఎంత మాత్రం తగదు. మాపైన, సమస్త జనులపైన గల దేవుని అనుగ్రహం ఇది. కాని ప్రజల్లో చాలామంది కృతజ్ఞతా పూర్వకంగా మెలగరు.
12:39 يَا صَاحِبَيِ السِّجْنِ أَأَرْبَابٌ مُّتَفَرِّقُونَ خَيْرٌ أَمِ اللَّهُ الْوَاحِدُ الْقَهَّارُ
“ఓ కారాగార సహచరులారా! అనేక మంది విభిన్న ప్రభువులు మేలా? లేక సర్వాధిక్యుడైన ఒక్క అల్లాహ్ మేలా? (మీరే చెప్పండి!)
12:40 مَا تَعْبُدُونَ مِن دُونِهِ إِلَّا أَسْمَاءً سَمَّيْتُمُوهَا أَنتُمْ وَآبَاؤُكُم مَّا أَنزَلَ اللَّهُ بِهَا مِن سُلْطَانٍ ۚ إِنِ الْحُكْمُ إِلَّا لِلَّهِ ۚ أَمَرَ أَلَّا تَعْبُدُوا إِلَّا إِيَّاهُ ۚ ذَٰلِكَ الدِّينُ الْقَيِّمُ وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ
“ఆయనను వదలి మీరు పూజిస్తున్నవి మీరూ, మీ తాత ముత్తాతలూ స్వయంగా కల్పించుకున్న కొన్ని పేర్లు తప్ప మరేమీ కావు. వాటికి సంబంధించి అల్లాహ్ ఏ ప్రమాణాన్నీ అవతరింపజెయ్యలేదు. పరిపాలనాధికారం అల్లాహ్‌కు తప్ప వేరొకరికి లేదు. మీరంతా ఆయన దాస్యాన్ని తప్ప ఇంకొకరి దాస్యం చేయరాదన్నదే ఆయన ఆజ్ఞ. ఇదే సరైన – స్థిరమైన – ధర్మం. కాని చాలామంది ఈ విషయాన్నితెలుసుకోరు.
12:41 يَا صَاحِبَيِ السِّجْنِ أَمَّا أَحَدُكُمَا فَيَسْقِي رَبَّهُ خَمْرًا ۖ وَأَمَّا الْآخَرُ فَيُصْلَبُ فَتَأْكُلُ الطَّيْرُ مِن رَّأْسِهِ ۚ قُضِيَ الْأَمْرُ الَّذِي فِيهِ تَسْتَفْتِيَانِ
“చెరసాల జీవితం గడుపుతున్న నా సహవాసులారా! మీరిద్దరిలో ఒకడు తన చక్రవర్తికి మధువును పోయడానికి నియమించబడతాడు. మరొకతను శిలువ వేయబడతాడు. పక్షులు అతని తలను పొడిచితింటాయి. మీరిద్దరూ ఏ విషయం గురించి వాకబు చేశారో దాని నిర్ణయం జరిగిపోయింది.”
12:42 وَقَالَ لِلَّذِي ظَنَّ أَنَّهُ نَاجٍ مِّنْهُمَا اذْكُرْنِي عِندَ رَبِّكَ فَأَنسَاهُ الشَّيْطَانُ ذِكْرَ رَبِّهِ فَلَبِثَ فِي السِّجْنِ بِضْعَ سِنِينَ
వారిద్దరిలో విడుదల చేయబడతాడని భావించిన వానితో యూసుఫ్, “నీ చక్రవర్తి ముందు నా గురించి కాస్త ప్రస్తావించు” అన్నాడు. కాని చక్రవర్తి ముందు ప్రస్తావన తీసుకురాకుండా షైతాన్ అతన్నిమరుపుకు లోనుచేశాడు. సంవత్సరాల తరబడి యూసుఫ్ కారాగారంలోనే ఉండిపోయాడు.
12:43 وَقَالَ الْمَلِكُ إِنِّي أَرَىٰ سَبْعَ بَقَرَاتٍ سِمَانٍ يَأْكُلُهُنَّ سَبْعٌ عِجَافٌ وَسَبْعَ سُنبُلَاتٍ خُضْرٍ وَأُخَرَ يَابِسَاتٍ ۖ يَا أَيُّهَا الْمَلَأُ أَفْتُونِي فِي رُؤْيَايَ إِن كُنتُمْ لِلرُّؤْيَا تَعْبُرُونَ
ఒకరోజు చక్రవర్తి (సభా సదులను ఉద్దేశించి) “బాగా బలిసిన ఏడు ఆవులను బక్కచిక్కిన ఏడు ఆవులు తినేస్తున్నట్లు, ఏడు ధాన్యపు వెన్నులు పచ్చగా ఉండగా మరో ఏడు వెన్నులు ఎండిపోయి ఉన్నట్లు నేను కలగన్నాను. ఓ సభాసదులారా! మీరు గనక కలల భావార్థం చెప్పగలిగితే నేను కన్న ఈ కలకు భావం ఏమిటో చెప్పండి” అన్నాడు.
12:44 قَالُوا أَضْغَاثُ أَحْلَامٍ ۖ وَمَا نَحْنُ بِتَأْوِيلِ الْأَحْلَامِ بِعَالِمِينَ
దానికి వారు, “ఇవి పీడకలకు సంబంధించిన విషయాలు. ఇలాంటి పీడకలల భావం మాకు తెలియదు” అని సమాధానమిచ్చారు.
12:45 وَقَالَ الَّذِي نَجَا مِنْهُمَا وَادَّكَرَ بَعْدَ أُمَّةٍ أَنَا أُنَبِّئُكُم بِتَأْوِيلِهِ فَأَرْسِلُونِ
ఆ ఇద్దరు ఖైదీలలో విడుదల అయిన వ్యక్తికి చాలా కాలం తరువాత (యూసుఫ్ సంగతి) జ్ఞాపకం వచ్చింది. “దీని భావం నేను వివరిస్తాను. బయటికెళ్ళేందుకు నాకు అనుమతి ఇవ్వండి” అని కోరాడతను.
12:46 يُوسُفُ أَيُّهَا الصِّدِّيقُ أَفْتِنَا فِي سَبْعِ بَقَرَاتٍ سِمَانٍ يَأْكُلُهُنَّ سَبْعٌ عِجَافٌ وَسَبْعِ سُنبُلَاتٍ خُضْرٍ وَأُخَرَ يَابِسَاتٍ لَّعَلِّي أَرْجِعُ إِلَى النَّاسِ لَعَلَّهُمْ يَعْلَمُونَ
“సత్యవంతుడవైన ఓ యూసుఫ్! ఈ కలకు భావం ఏమిటో కాస్త మాకు చెప్పండి – బలిసిన ఏడు ఆవులను బక్కచిక్కిన ఏడు ఆవులు భక్షిస్తున్నాయి. పచ్చగా కళకళలాడే ఏడు ధాన్యపు వెన్నులుండగా, మరో ఏడు వెన్నులు ఎండిపోయి ఉన్నాయి. (మీరు గనక దీని గూఢార్థం చెబితే) నేను తిరిగి వెళ్ళి, వారికి దీని గురించి చెబుతాను. వారు విషయం తెలుసుకుంటారు” (అని ఆ వ్యక్తి అభ్యర్థించాడు).
12:47 قَالَ تَزْرَعُونَ سَبْعَ سِنِينَ دَأَبًا فَمَا حَصَدتُّمْ فَذَرُوهُ فِي سُنبُلِهِ إِلَّا قَلِيلًا مِّمَّا تَأْكُلُونَ
(యూసుఫ్) ఇలా వివరించాడు: “మీరు ఏడు సంవత్సరాల పాటు నిరాఘాటంగా – ఆనవాయితీ ప్రకారం – సేద్యం చేయాలి. కోతలు కోసిన తరువాత మీరు తినటానికి కొంత భాగాన్ని తీసుకుని మిగిలిన ధాన్యాన్ని కంకుల సమేతంగా ఉంచేయండి.
12:48 ثُمَّ يَأْتِي مِن بَعْدِ ذَٰلِكَ سَبْعٌ شِدَادٌ يَأْكُلْنَ مَا قَدَّمْتُمْ لَهُنَّ إِلَّا قَلِيلًا مِّمَّا تُحْصِنُونَ
“ఆ తరువాత తీవ్రమైన (దుర్భిక్షంతో కూడుకున్న) ఏడు సంవత్సరాలు వస్తాయి. మీరు ముందుగా వాటి కోసం నిలువ చేసి ఉంచిన దానిని అవి హరిస్తాయి. ఒకవేళ కొద్దిగా ఏమైనా మిగిలితే అది మీరు దాచిపెట్టి ఉంచుకున్నదే.
12:49 ثُمَّ يَأْتِي مِن بَعْدِ ذَٰلِكَ عَامٌ فِيهِ يُغَاثُ النَّاسُ وَفِيهِ يَعْصِرُونَ
“ఆ తరువాత వచ్చే సంవత్సరంలో ప్రజలపై పుష్కలంగా వర్షాలు కురుస్తాయి. అందులో వారు (ద్రాక్ష) రసాన్ని కూడా దండిగా తీస్తారు.
12:50 وَقَالَ الْمَلِكُ ائْتُونِي بِهِ ۖ فَلَمَّا جَاءَهُ الرَّسُولُ قَالَ ارْجِعْ إِلَىٰ رَبِّكَ فَاسْأَلْهُ مَا بَالُ النِّسْوَةِ اللَّاتِي قَطَّعْنَ أَيْدِيَهُنَّ ۚ إِنَّ رَبِّي بِكَيْدِهِنَّ عَلِيمٌ
“అతన్ని నా దగ్గరకు తీసుకురండి” అని రాజు ఆజ్ఞాపించాడు. (రాజ) దూత యూసుఫ్ వద్దకు చేరుకున్నప్పుడు, “నువ్వు నీ రాజు వద్దకు తిరిగి వెళ్ళి, తమ చేతులను కోసుకున్న మహిళామణుల వ్యవహారంలోని నిజానిజాలేమిటో తేల్చమని అతన్నిఅడుగు. నిశ్చయంగా వారి జిత్తుల గురించి నా ప్రభువుకు అంతా తెలుసు” అన్నాడు యూసుఫ్.
12:51 قَالَ مَا خَطْبُكُنَّ إِذْ رَاوَدتُّنَّ يُوسُفَ عَن نَّفْسِهِ ۚ قُلْنَ حَاشَ لِلَّهِ مَا عَلِمْنَا عَلَيْهِ مِن سُوءٍ ۚ قَالَتِ امْرَأَتُ الْعَزِيزِ الْآنَ حَصْحَصَ الْحَقُّ أَنَا رَاوَدتُّهُ عَن نَّفْسِهِ وَإِنَّهُ لَمِنَ الصَّادِقِينَ
అప్పుడు రాజు (సంబంధిత స్త్రీలను పిలిపించి), “ఓ నారీమణులారా! మీరంతా వలపన్ని,యూసుఫ్ మనసును చలింపజేయటానికి ప్రయత్నించినప్పుడు అసలేం జరిగింది?” అని అడిగాడు. దానికి వారు, “హాషలిల్లాహ్ ! (అల్లాహ్ మమ్మల్ని రక్షించుగాక!) మేము యూసుఫ్‌లో ఏ దోషాన్నీ చూడలేదు” అని జవాబిచ్చారు. తర్వాత అజీజ్ భార్య కూడా ఈ విధంగా చెప్పింది: “ఇప్పుడు నిజం బయటపడింది. అతని మనసును కవ్వించినది నేనే. అతను మాత్రం సత్యవంతుడు.”
12:52 ذَٰلِكَ لِيَعْلَمَ أَنِّي لَمْ أَخُنْهُ بِالْغَيْبِ وَأَنَّ اللَّهَ لَا يَهْدِي كَيْدَ الْخَائِنِينَ
నేను అతని (అజీజు) పరోక్షంలో అతని కెలాంటి ద్రోహం చేయలేదనీ, ద్రోహబుద్ధిగల వారి టక్కరిజిత్తులను అల్లాహ్ పారనివ్వడని (అజీజ్) తెలుసుకోవటానికి నేనిలా చేశాను (అన్నాడు యూసుఫ్).
12:53 وَمَا أُبَرِّئُ نَفْسِي ۚ إِنَّ النَّفْسَ لَأَمَّارَةٌ بِالسُّوءِ إِلَّا مَا رَحِمَ رَبِّي ۚ إِنَّ رَبِّي غَفُورٌ رَّحِيمٌ
నేను నా మనసు పవిత్రతను గురించి చాటు కోవటంలేదు. నిశ్చయంగా మనసైతే చెడువైపుకే పురికొల్పుతుంది. అయితే నా ప్రభువు దయదలచిన వారి విషయంలో మటుకు అలా జరగదు. నిస్సందేహంగా నా ప్రభువు అపారంగా క్షమించేవాడు, అమితంగా దయదలిచేవాడు.
12:54 وَقَالَ الْمَلِكُ ائْتُونِي بِهِ أَسْتَخْلِصْهُ لِنَفْسِي ۖ فَلَمَّا كَلَّمَهُ قَالَ إِنَّكَ الْيَوْمَ لَدَيْنَا مَكِينٌ أَمِينٌ
“అతన్ని నా వద్దకు పిలుచుకురండి. నేనతన్ని నా ఆంతరంగిక కార్యదర్శిగా నియమించుకుంటాను” అని రాజు చెప్పాడు. అతనితో మాట్లాడిన తరువాత, “ఈ రోజు నుంచి మీరు మాదగ్గర గౌరవనీయులు, నమ్మకస్థులు” అని రాజు పలికాడు.
12:55 قَالَ اجْعَلْنِي عَلَىٰ خَزَائِنِ الْأَرْضِ ۖ إِنِّي حَفِيظٌ عَلِيمٌ
అప్పుడు (యూసుఫ్) ఇలా అన్నాడు: “రాజ్యంలోని ఖజానాలపై నన్ను (పర్యవేక్షకునిగా) నియమించండి. నేను వాటిని కాపాడతాను. ఆ పరిజ్ఞానం నాకున్నది.”
12:56 وَكَذَٰلِكَ مَكَّنَّا لِيُوسُفَ فِي الْأَرْضِ يَتَبَوَّأُ مِنْهَا حَيْثُ يَشَاءُ ۚ نُصِيبُ بِرَحْمَتِنَا مَن نَّشَاءُ ۖ وَلَا نُضِيعُ أَجْرَ الْمُحْسِنِينَ
ఈ విధంగా మేము యూసుఫ్‌కు (ఈజిప్టు రాజ్య) భూభాగంలో అధికారాన్ని ప్రసాదించాము. అక్కడ తాను కోరిన చోట నివసించే సౌలభ్యం అతనికి ఇచ్చాము. మేము కోరిన వారికి (ఇలాగే) మా కారుణ్య భాగ్యాన్ని ప్రసాదిస్తాము. సజ్జనుల పుణ్యఫలాన్ని మేము వృథా కానివ్వము.
12:57 وَلَأَجْرُ الْآخِرَةِ خَيْرٌ لِّلَّذِينَ آمَنُوا وَكَانُوا يَتَّقُونَ
విశ్వసించి, భయభక్తుల వైఖరిని అవలంబించిన వారి(కి లభించే) పరలోక పుణ్యఫలం చాలా శ్రేష్ఠమైనది.
12:58 وَجَاءَ إِخْوَةُ يُوسُفَ فَدَخَلُوا عَلَيْهِ فَعَرَفَهُمْ وَهُمْ لَهُ مُنكِرُونَ
యూసుఫ్ సోదరులు వచ్చి, అతని సమక్షంలో హాజరయ్యారు. అతను వాళ్ళను గుర్తుపట్టాడు గాని వాళ్ళు మాత్రం అతన్ని గుర్తుపట్టలేదు.
12:59 وَلَمَّا جَهَّزَهُم بِجَهَازِهِمْ قَالَ ائْتُونِي بِأَخٍ لَّكُم مِّنْ أَبِيكُمْ ۚ أَلَا تَرَوْنَ أَنِّي أُوفِي الْكَيْلَ وَأَنَا خَيْرُ الْمُنزِلِينَ
వారి సామానును సిద్ధం చేయించిన తరువాత, “(మరోసారి మీరు నావద్దకు వచ్చినప్పుడు), మీ తండ్రికి జన్మించిన మీ (సవతి) సోదరుణ్ణి కూడా తీసుకురండి. నేనెలా పూర్తిగా కొలిచి ఇస్తున్నానో, ఎంత చక్కగా అతిథి మర్యాద చేస్తున్నానో మీరు చూడటం లేదా!” అని అన్నాడు.
12:60 فَإِن لَّمْ تَأْتُونِي بِهِ فَلَا كَيْلَ لَكُمْ عِندِي وَلَا تَقْرَبُونِ
“మీరు గనక అతన్ని తీసుకురాని పక్షంలో నా తరఫున మీకు (ధాన్యం) కొలిచి ఇవ్వటం జరగదు. అసలు మీరు నా దరిదాపులకు కూడా రాకూడదు” (అని వారికి చెప్పాడు).
12:61 قَالُوا سَنُرَاوِدُ عَنْهُ أَبَاهُ وَإِنَّا لَفَاعِلُونَ
“సరే! అతని తండ్రి అతనిని పంపటానికి సమ్మతించేలా మేము ప్రయత్నం చేస్తాము. మేము అలా తప్పకుండా చేస్తాము” అని వారు సమాధానమిచ్చారు.
12:62 وَقَالَ لِفِتْيَانِهِ اجْعَلُوا بِضَاعَتَهُمْ فِي رِحَالِهِمْ لَعَلَّهُمْ يَعْرِفُونَهَا إِذَا انقَلَبُوا إِلَىٰ أَهْلِهِمْ لَعَلَّهُمْ يَرْجِعُونَ
“వారి మూలధనాన్ని (డబ్బును) వారి మూటలలోనే ఉంచండి. వారు తమ ఇంటి వారలవద్దకు పోయినప్పుడు, తమ మూల ధనాన్నిగుర్తించి బహుశా తిరిగివస్తారు” అని యూసుఫ్ తన సేవకులకు ఆజ్ఞాపిస్తూ చెప్పాడు.
12:63 فَلَمَّا رَجَعُوا إِلَىٰ أَبِيهِمْ قَالُوا يَا أَبَانَا مُنِعَ مِنَّا الْكَيْلُ فَأَرْسِلْ مَعَنَا أَخَانَا نَكْتَلْ وَإِنَّا لَهُ لَحَافِظُونَ
వారు తిరిగి తమ తండ్రి వద్దకు వచ్చినప్పుడు, “నాన్నా! ఇక మీదట మనకు ధాన్యం కొలవటంపై ఆంక్ష విధించబడింది. కాబట్టి మేము కొలపాత్ర నిండా ధాన్యం తీసుకురావటానికి మీరు మా తమ్ముణ్ణి మా వెంట పంపండి. అతన్ని రక్షించే బాధ్యతమాది” అని విన్నవించుకున్నారు.
12:64 قَالَ هَلْ آمَنُكُمْ عَلَيْهِ إِلَّا كَمَا أَمِنتُكُمْ عَلَىٰ أَخِيهِ مِن قَبْلُ ۖ فَاللَّهُ خَيْرٌ حَافِظًا ۖ وَهُوَ أَرْحَمُ الرَّاحِمِينَ
“లోగడ ఇతని సోదరుని విషయంలో నేను మిమ్మల్ని నమ్మినట్లుగానే ఇతని విషయంలో కూడా నమ్మమంటున్నారు కదూ! అల్లాహ్‌యే అత్యుత్తమ రక్షకుడు. ఆయనే కరుణించే వారందరిలోకీ గొప్పకరుణాకరుడు” అని (యాఖూబ్) పలికాడు.
12:65 وَلَمَّا فَتَحُوا مَتَاعَهُمْ وَجَدُوا بِضَاعَتَهُمْ رُدَّتْ إِلَيْهِمْ ۖ قَالُوا يَا أَبَانَا مَا نَبْغِي ۖ هَٰذِهِ بِضَاعَتُنَا رُدَّتْ إِلَيْنَا ۖ وَنَمِيرُ أَهْلَنَا وَنَحْفَظُ أَخَانَا وَنَزْدَادُ كَيْلَ بَعِيرٍ ۖ ذَٰلِكَ كَيْلٌ يَسِيرٌ
వారు తమ సామాను విప్పినప్పుడు, తమ సొమ్ము తమకు వాపసు చేయబడిన సంగతి తెలుసుకున్నారు. “నాన్నగారూ! మనకు ఇంకేం కావాలి?! చూడండి, మన సొమ్ము కూడా మనకు వాపసు చేయబడింది. మళ్లీ వెళ్ళి మన కుటుంబంకోసం ఆహారపదార్థాలను తెచ్చుకుంటాం. మా తమ్ముణ్ణి కూడా జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉంటాం. ఒక ఒంటె మోయగలిగేంత ధాన్యాన్ని అదనంగా తెచ్చుకుంటాం. ఈ పాటి కొలత (అదనపు ధాన్య ప్రాప్తి) చాలా తేలిక” అని ప్రాధేయపడ్డారు.
12:66 قَالَ لَنْ أُرْسِلَهُ مَعَكُمْ حَتَّىٰ تُؤْتُونِ مَوْثِقًا مِّنَ اللَّهِ لَتَأْتُنَّنِي بِهِ إِلَّا أَن يُحَاطَ بِكُمْ ۖ فَلَمَّا آتَوْهُ مَوْثِقَهُمْ قَالَ اللَّهُ عَلَىٰ مَا نَقُولُ وَكِيلٌ
“మీరతన్ని తిరిగి నా దగ్గరకు చేరుస్తామని దేవుని సాక్షిగా మాటిస్తే తప్ప, నేనతన్ని మీ వెంట పంపించను. ఒకవేళ మీరంతా నిర్బంధించబడితే అది వేరే విషయం” అని యాఖూబ్ (అలైహిస్సలాం) పలికాడు. అప్పుడు వారంతా ఆ మేరకు అతనికి మాటిచ్చారు. “మనం ఆడిన మాటలను అల్లాహ్ గమనిస్తూనే ఉన్నాడ”ని యాఖూబ్ అన్నాడు.
12:67 وَقَالَ يَا بَنِيَّ لَا تَدْخُلُوا مِن بَابٍ وَاحِدٍ وَادْخُلُوا مِنْ أَبْوَابٍ مُّتَفَرِّقَةٍ ۖ وَمَا أُغْنِي عَنكُم مِّنَ اللَّهِ مِن شَيْءٍ ۖ إِنِ الْحُكْمُ إِلَّا لِلَّهِ ۖ عَلَيْهِ تَوَكَّلْتُ ۖ وَعَلَيْهِ فَلْيَتَوَكَّلِ الْمُتَوَكِّلُونَ
ఇంకా (యాఖూబ్) ఇలా ఉపదేశించాడు : “నా కుమారులారా! మీరంతా ఒకే ద్వారం గుండా (నగరంలోనికి) ప్రవేశించకండి. వేర్వేరు ద్వారాల గుండా వెళ్ళండి. అల్లాహ్ తరఫున మీపై విధించబడే ఏ విషయం నుంచి కూడా నేను మిమ్మల్ని తప్పించలేను. ఆయన ఆజ్ఞ మాత్రమే చెల్లుబాటవుతుంది. నేను పూర్తిగా ఆయన్నే నమ్ముకున్నాను. నమ్ముకునే వారంతా ఆయన్నే నమ్ముకోవాలి.”
12:68 وَلَمَّا دَخَلُوا مِنْ حَيْثُ أَمَرَهُمْ أَبُوهُم مَّا كَانَ يُغْنِي عَنْهُم مِّنَ اللَّهِ مِن شَيْءٍ إِلَّا حَاجَةً فِي نَفْسِ يَعْقُوبَ قَضَاهَا ۚ وَإِنَّهُ لَذُو عِلْمٍ لِّمَا عَلَّمْنَاهُ وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ
తమ తండ్రి ఆజ్ఞాపించిన మార్గాల ద్వారానే వారు (నగరంలోకి) ప్రవేశించారు. అల్లాహ్ నిర్థారించిన దాని నుండి యాఖూబ్ సుతారమూ వారిని తప్పించలేడు. కాకపోతే మనసులో జనించిన ఒక విషయాన్ని వెలిబుచ్చాడంతే. నిస్సందేహంగా అతను మేము నేర్పిన విద్య వల్ల జ్ఞాని అయిన వాడు. కాని చాలా మందికి తెలియదు.
12:69 وَلَمَّا دَخَلُوا عَلَىٰ يُوسُفَ آوَىٰ إِلَيْهِ أَخَاهُ ۖ قَالَ إِنِّي أَنَا أَخُوكَ فَلَا تَبْتَئِسْ بِمَا كَانُوا يَعْمَلُونَ
వారంతా యూసుఫ్ వద్దకు వెళ్ళినప్పుడు, అతను తన సోదరుణ్ణి (వేరుగా) తన దగ్గర కూర్చోబెట్టుకుని, “నేను నీ అన్నను (యూసుఫ్‌ను). కాబట్టి వీళ్ళ దుశ్చేష్టలపై నువ్వు బాధపడకు” అని ఓదార్చాడు.
12:70 فَلَمَّا جَهَّزَهُم بِجَهَازِهِمْ جَعَلَ السِّقَايَةَ فِي رَحْلِ أَخِيهِ ثُمَّ أَذَّنَ مُؤَذِّنٌ أَيَّتُهَا الْعِيرُ إِنَّكُمْ لَسَارِقُونَ
ఆ తరువాత వారి సామగ్రిని వారికిచ్చే ఏర్పాటు చేసి, తన (సొంత) సోదరుని సామానులో మాత్రం మంచి నీరు త్రాగే ఒక గిన్నెను ఉంచాడు. తరువాత పిలుపు ఇచ్చేవాడొకడు, “ఓ బిడారు జనులారా! మీరే ఈ దొంగతనం చేశారు” అని ఎలుగెత్తి మరీ చెప్పాడు.
12:71 قَالُوا وَأَقْبَلُوا عَلَيْهِم مَّاذَا تَفْقِدُونَ
వాళ్ళు వారి వైపుకు తిరిగి, “మీదే వస్తువు పోయిందీ?” అని అడిగారు.
12:72 قَالُوا نَفْقِدُ صُوَاعَ الْمَلِكِ وَلِمَن جَاءَ بِهِ حِمْلُ بَعِيرٍ وَأَنَا بِهِ زَعِيمٌ
“రాజు గారి గిన్నెపోయింది. దాన్ని తెచ్చిన వారికి ఒక ఒంటె బరువు ధాన్యం లభిస్తుంది. ఆ బాధ్యత నాది” అని చెప్పాడు.
12:73 قَالُوا تَاللَّهِ لَقَدْ عَلِمْتُم مَّا جِئْنَا لِنُفْسِدَ فِي الْأَرْضِ وَمَا كُنَّا سَارِقِينَ
“అల్లాహ్ తోడు! మేము రాజ్యంలో అరాచకాన్ని సృష్టించటానికి రాలేదు, మేము దొంగలం అంతకన్నాకాము. ఈ సంగతి మీకూ బాగాతెలుసు” అని వారు సమాధానమిచ్చారు.
12:74 قَالُوا فَمَا جَزَاؤُهُ إِن كُنتُمْ كَاذِبِينَ
“అలాగా. మరి మీ మాట అబద్ధమని తేలితే (దొంగిలించిన) అతనికి ఏ శిక్ష విధించాలి?” అని వారు (రాజభటులు) ప్రశ్నించారు.
12:75 قَالُوا جَزَاؤُهُ مَن وُجِدَ فِي رَحْلِهِ فَهُوَ جَزَاؤُهُ ۚ كَذَٰلِكَ نَجْزِي الظَّالِمِينَ
“ఎవరి సామానులో అది దొరుకుతుందో శిక్షగా అతనే (బానిసగా) ఉంచుకోబడాలి. మేము అలాంటి దుర్మార్గులకు విధించే శిక్ష ఇదే” అని వారు బదులిచ్చారు.
12:76 فَبَدَأَ بِأَوْعِيَتِهِمْ قَبْلَ وِعَاءِ أَخِيهِ ثُمَّ اسْتَخْرَجَهَا مِن وِعَاءِ أَخِيهِ ۚ كَذَٰلِكَ كِدْنَا لِيُوسُفَ ۖ مَا كَانَ لِيَأْخُذَ أَخَاهُ فِي دِينِ الْمَلِكِ إِلَّا أَن يَشَاءَ اللَّهُ ۚ نَرْفَعُ دَرَجَاتٍ مَّن نَّشَاءُ ۗ وَفَوْقَ كُلِّ ذِي عِلْمٍ عَلِيمٌ
అప్పుడు యూసుఫ్ తన తమ్ముని సామానును సోదాచేసే ముందు వాళ్ళ సామానును సోదా చేశాడు. ఆ తరువాత ఆ పాత్రను తన తమ్ముని సంచిలో నుంచి తీశాడు. ఈ విధంగా మేము యూసుఫ్ కోసం ఉపాయం సూచించాము. ఎందుకంటే అల్లాహ్ తలిస్తే తప్ప – అక్కడి రాజు ధర్మం (రాజ్యశాసనం) ప్రకారం అతను తన తమ్ముణ్ణి తనతో ఆపుకోలేడు. మేము కోరిన వారి అంతస్థులను పెంచుతాము. ప్రతి జ్ఞానినీ మించిన జ్ఞాని ఒకడున్నాడు.
12:77 قَالُوا إِن يَسْرِقْ فَقَدْ سَرَقَ أَخٌ لَّهُ مِن قَبْلُ ۚ فَأَسَرَّهَا يُوسُفُ فِي نَفْسِهِ وَلَمْ يُبْدِهَا لَهُمْ ۚ قَالَ أَنتُمْ شَرٌّ مَّكَانًا ۖ وَاللَّهُ أَعْلَمُ بِمَا تَصِفُونَ
వాళ్ళు ఇలా అన్నారు: “ఇతను దొంగతనం చేశాడంటే (ఆశ్చర్యం చెందనవసరంలేదు), ఇంతకు ముందు ఇతని అన్న కూడా దొంగతనం చేసి ఉన్నాడు.” వారి ఈ మాటను యూసుఫ్ లోలోపలే దిగమ్రింగాడు. తన మనోభావాన్ని వారి ముందు ఏ మాత్రం బయట పెట్టకుండానే, “మీరు ఇంతటి నీచ స్థితికి దిగజారారు! మీరు కల్పించి చెప్పే విషయాలు అల్లాహ్‌కు బాగా తెలుసు” అని (లోలోన) అనుకున్నాడు.
12:78 قَالُوا يَا أَيُّهَا الْعَزِيزُ إِنَّ لَهُ أَبًا شَيْخًا كَبِيرًا فَخُذْ أَحَدَنَا مَكَانَهُ ۖ إِنَّا نَرَاكَ مِنَ الْمُحْسِنِينَ
అప్పుడు వారు, “ఓ అజీజ్!(ఓ ఈజిప్టు అధినేతా!) ఇతని తండ్రి మరీ ముసలివాడు. మీరు ఇతనికి బదులుగా మాలో ఎవరినయినా సరే తీసేసుకోండి (ఇతన్ని మాత్రం విడిచిపెట్టండి). మీరు మాకు పుణ్యాత్మునిలా కనబడుతున్నారు” అని విన్నవించుకున్నారు.
12:79 قَالَ مَعَاذَ اللَّهِ أَن نَّأْخُذَ إِلَّا مَن وَجَدْنَا مَتَاعَنَا عِندَهُ إِنَّا إِذًا لَّظَالِمُونَ
“అల్లాహ్ శరణు! ఎవరి దగ్గర మా వస్తువు దొరికిందో అతన్ని వదిలేసి మరొకరిని ఎలా పట్టుకోగలం? అలా గనక చేస్తే మేము ముమ్మాటికీ అన్యాయస్థులం అవుతాము” అని యూసుఫ్ చెప్పాడు.
12:80 فَلَمَّا اسْتَيْأَسُوا مِنْهُ خَلَصُوا نَجِيًّا ۖ قَالَ كَبِيرُهُمْ أَلَمْ تَعْلَمُوا أَنَّ أَبَاكُمْ قَدْ أَخَذَ عَلَيْكُم مَّوْثِقًا مِّنَ اللَّهِ وَمِن قَبْلُ مَا فَرَّطتُمْ فِي يُوسُفَ ۖ فَلَنْ أَبْرَحَ الْأَرْضَ حَتَّىٰ يَأْذَنَ لِي أَبِي أَوْ يَحْكُمَ اللَّهُ لِي ۖ وَهُوَ خَيْرُ الْحَاكِمِينَ
వాళ్ళు అతని విషయంలో నిరాశ చెంది, ఏకాంతంలో కూర్చుని పరస్పరం సంప్రతించుకోసాగారు. వారిలో అందరి కన్నా పెద్దవాడు ఇలా అన్నాడు : “అల్లాహ్ పేరు మీద మీచేత ప్రమాణం చేయించి మీతండ్రి మీనుంచి మాట తీసుకున్న సంగతి మీకు తెలియదా? ఇంతకు ముందు మీరు యూసుఫ్ విషయంలో కూడా తప్పుచేసి ఉన్నారు. కాబట్టి! నాన్నగారు స్వయంగా నాకు అనుమతి ఇవ్వనంతవరకూ లేదా అల్లాహ్‌యే నా వ్యవహారంలో ఏదో ఒక తీర్పుచేయనంతవరకూ నేను ఈ భూభాగం నుంచి కదలను. ఆయన తీర్పుచేసే వారందరిలోకెల్లా ఉత్తముడు.”
12:81 ارْجِعُوا إِلَىٰ أَبِيكُمْ فَقُولُوا يَا أَبَانَا إِنَّ ابْنَكَ سَرَقَ وَمَا شَهِدْنَا إِلَّا بِمَا عَلِمْنَا وَمَا كُنَّا لِلْغَيْبِ حَافِظِينَ
“మీరంతా నాన్నగారి దగ్గరకు తిరిగి వెళ్ళి ఇలా చెప్పండి: ‘నాన్నగారూ! మీ కుమారుడు దొంగతనం చేశాడు. మేము మాకు తెలిసిన దాని గురించి మాత్రమే సాక్ష్యం ఇచ్చాము. అగోచర విషయాలను మేము కాపాడేవారముకాము!
12:82 وَاسْأَلِ الْقَرْيَةَ الَّتِي كُنَّا فِيهَا وَالْعِيرَ الَّتِي أَقْبَلْنَا فِيهَا ۖ وَإِنَّا لَصَادِقُونَ
కావాలంటే మేము విడిది చేసిన పట్టణవాసులను, తిరుగు ప్రయాణంలో మేము ఎవరితోపాటు తిరిగి వచ్చామో ఆ బిడారుజనులను కూడా అడిగి తెలుసుకోండి. మేము నిజం చెబుతున్నాము.”
12:83 قَالَ بَلْ سَوَّلَتْ لَكُمْ أَنفُسُكُمْ أَمْرًا ۖ فَصَبْرٌ جَمِيلٌ ۖ عَسَى اللَّهُ أَن يَأْتِيَنِي بِهِمْ جَمِيعًا ۚ إِنَّهُ هُوَ الْعَلِيمُ الْحَكِيمُ
“కానేకాదు. ఇది మీ స్వీయకల్పన మాత్రమే. సరే, ఇప్పుడు ఓర్పు వహించడమే మంచిది. బహుశా అల్లాహ్ వారందరినీ త్వరలోనే నా దగ్గరకు చేర్చవచ్చు! నిశ్చయంగా ఆయన సర్వం తెలిసినవాడు, వివేచనాపరుడూను” అని (యాఖూబ్) చెప్పాడు.
12:84 وَتَوَلَّىٰ عَنْهُمْ وَقَالَ يَا أَسَفَىٰ عَلَىٰ يُوسُفَ وَابْيَضَّتْ عَيْنَاهُ مِنَ الْحُزْنِ فَهُوَ كَظِيمٌ
మరి వారందరి వైపునుంచి ముఖం త్రిప్పుకుని, (ఆవేదనతో) “ఆహ్! యూసుఫ్” అన్నాడు. దుఃఖంతో ఆయన కళ్లు తెల్లగా పాలిపోయాయి. బాధను లోలోపలే అణచి పెట్టుకునేవాడు.
12:85 قَالُوا تَاللَّهِ تَفْتَأُ تَذْكُرُ يُوسُفَ حَتَّىٰ تَكُونَ حَرَضًا أَوْ تَكُونَ مِنَ الْهَالِكِينَ
కొడుకులు (తమ తండ్రినుద్దేశించి), “దైవసాక్షి! తమరు అనుక్షణం యూసుఫ్‌నే తలచుకుంటూ, కడకు ఆ బాధతోనే కృంగి కృశించి పోయేలా లేదా ప్రాణం విడిచేలా ఉన్నారే!” అని చెప్పారు.
12:86 قَالَ إِنَّمَا أَشْكُو بَثِّي وَحُزْنِي إِلَى اللَّهِ وَأَعْلَمُ مِنَ اللَّهِ مَا لَا تَعْلَمُونَ
“నేను నా ఆవేదనను,దుఃఖాన్ని గురించి నా దైవానికే ఫిర్యాదు చేసుకుంటున్నాను. అల్లాహ్ తరఫున మీకు తెలియని విషయాలు నాకు తెలుసు” అని దానికి ఆయన బదులిచ్చాడు.
12:87 يَا بَنِيَّ اذْهَبُوا فَتَحَسَّسُوا مِن يُوسُفَ وَأَخِيهِ وَلَا تَيْأَسُوا مِن رَّوْحِ اللَّهِ ۖ إِنَّهُ لَا يَيْأَسُ مِن رَّوْحِ اللَّهِ إِلَّا الْقَوْمُ الْكَافِرُونَ
“ఒరేయ్ అబ్బాయిలూ! మీరు వెళ్ళి యూసుఫ్‌ను గురించీ, అతని సోదరుని గురించీ బాగా దర్యాప్తు చేయండి. అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. అల్లాహ్‌ను తిరస్కరించిన వారు మాత్రమే ఆయన కారుణ్యం పట్ల నిరాశ చెందుతారు” అని అన్నాడు.
12:88 فَلَمَّا دَخَلُوا عَلَيْهِ قَالُوا يَا أَيُّهَا الْعَزِيزُ مَسَّنَا وَأَهْلَنَا الضُّرُّ وَجِئْنَا بِبِضَاعَةٍ مُّزْجَاةٍ فَأَوْفِ لَنَا الْكَيْلَ وَتَصَدَّقْ عَلَيْنَا ۖ إِنَّ اللَّهَ يَجْزِي الْمُتَصَدِّقِينَ
తరువాత వారు యూసుఫ్ దగ్గరకు వెళ్ళి, “ఓ అజీజ్! (ఈజిప్టు అధినేతా!) మాకూ, మా కుటుంబానికీ గడ్డుకాలం వచ్చింది. మేము కొద్ది మొత్తాన్ని మాత్రమే తెచ్చాము. కనుక మాకు పూర్తి ధాన్యాన్నికొలచి ఇవ్వండి. మాకు దానం చెయ్యండి. అల్లాహ్ దానధర్మాలు చేసే వారికి తప్పకుండా మంచి ప్రతిఫలం ఇస్తాడు” అని అభ్యర్థించారు.
12:89 قَالَ هَلْ عَلِمْتُم مَّا فَعَلْتُم بِيُوسُفَ وَأَخِيهِ إِذْ أَنتُمْ جَاهِلُونَ
“అజ్ఞాన స్థితిలో మీరు యూసుఫ్ పట్లా, అతని సోదరునిపట్లా ఎలా వ్యవహరించారో మీకు తెలుసా?” అని యూసుఫ్ అడిగాడు.
12:90 قَالُوا أَإِنَّكَ لَأَنتَ يُوسُفُ ۖ قَالَ أَنَا يُوسُفُ وَهَٰذَا أَخِي ۖ قَدْ مَنَّ اللَّهُ عَلَيْنَا ۖ إِنَّهُ مَن يَتَّقِ وَيَصْبِرْ فَإِنَّ اللَّهَ لَا يُضِيعُ أَجْرَ الْمُحْسِنِينَ
“ఏమిటీ, (నిజంగా) నువ్వు యూసుఫువేనా?!” అని వారు ఆశ్చర్యపోయారు. “అవును. నేను యూసుఫ్‌నే. ఇతను (బిన్ యామిన్) నా సోదరుడు. అల్లాహ్ మాపై దయదలిచాడు. అసలు విషయం ఏమిటంటే భయభక్తులతో, సహన స్థయిర్యాలతో మెలిగే సజ్జనుల ప్రతిఫలాన్ని అల్లాహ్ వృధా పోనివ్వడు” అని యూసుఫ్ చెప్పాడు.
12:91 قَالُوا تَاللَّهِ لَقَدْ آثَرَكَ اللَّهُ عَلَيْنَا وَإِن كُنَّا لَخَاطِئِينَ
“దైవసాక్షి! దేవుడు నీకు మాపై ఔన్నత్యాన్ని ప్రసాదించాడు. ముమ్మాటికీ మేమే దోషులం” అని వారంతా చెప్పారు.
12:92 قَالَ لَا تَثْرِيبَ عَلَيْكُمُ الْيَوْمَ ۖ يَغْفِرُ اللَّهُ لَكُمْ ۖ وَهُوَ أَرْحَمُ الرَّاحِمِينَ
అప్పుడు యూసుఫ్, “ఈ రోజు మీపై ఎలాంటి నిందాలేదు. అల్లాహ్ మిమ్మల్ని క్షమించుగాక! ఆయన కరుణించే వారందరిలోకీ గొప్పగా కరుణించేవాడు.”
12:93 اذْهَبُوا بِقَمِيصِي هَٰذَا فَأَلْقُوهُ عَلَىٰ وَجْهِ أَبِي يَأْتِ بَصِيرًا وَأْتُونِي بِأَهْلِكُمْ أَجْمَعِينَ
“నా ఈ చొక్కాను తీసుకెళ్ళి, నా తండ్రి ముఖంపై వేయండి. దాంతో ఆయనకు చూపు తిరిగి వస్తుంది. మరి మీ కుటుంబీకులందరినీ నా దగ్గరకు పిలుచుకురండి” అని చెప్పాడు.
12:94 وَلَمَّا فَصَلَتِ الْعِيرُ قَالَ أَبُوهُمْ إِنِّي لَأَجِدُ رِيحَ يُوسُفَ ۖ لَوْلَا أَن تُفَنِّدُونِ
(ఇక్కడ ఈజిప్టు నుంచి) ఈ బిడారు సెలవు తీసుకోగానే, (అక్కడ కన్ఆన్లో) “నాకు మతి భ్రమించిందని మీరు అనుకోనంటే (ఒక విషయం చెబుతాను) – నాకు యూసుఫ్ సువాసన వస్తోంది” అని తండ్రి చెప్పాడు.
12:95 قَالُوا تَاللَّهِ إِنَّكَ لَفِي ضَلَالِكَ الْقَدِيمِ
“అల్లాహ్ తోడు! మీరు ఇప్పటికీ ఆ పాతభ్రమలోనే పడి ఉన్నారు” అని అక్కడి వారు చెప్పారు.
12:96 فَلَمَّا أَن جَاءَ الْبَشِيرُ أَلْقَاهُ عَلَىٰ وَجْهِهِ فَارْتَدَّ بَصِيرًا ۖ قَالَ أَلَمْ أَقُل لَّكُمْ إِنِّي أَعْلَمُ مِنَ اللَّهِ مَا لَا تَعْلَمُونَ
ఆ తరువాత శుభవార్త అందించేవాడు వచ్చి అతని ముఖంపై ఆ చొక్కాను వేయగానే అతనికి కంటిచూపు వచ్చేసింది. “మీకు తెలియని విషయాలెన్నో అల్లాహ్ తరఫున నాకు తెలుసని నేను మీకు చెప్పలేదా?!” అన్నాడాయన.
12:97 قَالُوا يَا أَبَانَا اسْتَغْفِرْ لَنَا ذُنُوبَنَا إِنَّا كُنَّا خَاطِئِينَ
“ఓ నాన్నగారూ! మా పాపాల మన్నింపుకై (దైవసన్నిధిలో) అర్థించండి. మేము నిజంగానే దోషులం” అని వారు (కొడుకులు) విన్నవించుకున్నారు.
12:98 قَالَ سَوْفَ أَسْتَغْفِرُ لَكُمْ رَبِّي ۖ إِنَّهُ هُوَ الْغَفُورُ الرَّحِيمُ
“సరే! త్వరలోనే నేను మీ మన్నింపుకోసం నా ప్రభువును వేడుకుంటాను. ఆయన అపారంగా మన్నించేవాడు, అమితంగా కరుణించేవాడు” అని అతను (యాఖూబ్) చెప్పాడు.
12:99 فَلَمَّا دَخَلُوا عَلَىٰ يُوسُفَ آوَىٰ إِلَيْهِ أَبَوَيْهِ وَقَالَ ادْخُلُوا مِصْرَ إِن شَاءَ اللَّهُ آمِنِينَ
తరువాత ఈ కుటుంబీకులంతా యూసుఫ్ వద్దకు చేరుకున్నప్పుడు, యూసుఫ్ తన తల్లిదండ్రులకు తన దగ్గర స్థానం ఇచ్చాడు. “అల్లాహ్‌కు సమ్మతమైనట్లయితే మీరంతా సురక్షితంగా ఈజిప్టులోకి వచ్చేయండి” అని అన్నాడు.
12:100 وَرَفَعَ أَبَوَيْهِ عَلَى الْعَرْشِ وَخَرُّوا لَهُ سُجَّدًا ۖ وَقَالَ يَا أَبَتِ هَٰذَا تَأْوِيلُ رُؤْيَايَ مِن قَبْلُ قَدْ جَعَلَهَا رَبِّي حَقًّا ۖ وَقَدْ أَحْسَنَ بِي إِذْ أَخْرَجَنِي مِنَ السِّجْنِ وَجَاءَ بِكُم مِّنَ الْبَدْوِ مِن بَعْدِ أَن نَّزَغَ الشَّيْطَانُ بَيْنِي وَبَيْنَ إِخْوَتِي ۚ إِنَّ رَبِّي لَطِيفٌ لِّمَا يَشَاءُ ۚ إِنَّهُ هُوَ الْعَلِيمُ الْحَكِيمُ
అతను తన తల్లిదండ్రులను ఎత్తయిన సింహాసనంపై కూర్చోబెట్టాడు. వారందరూ అతని ముందు సాష్టాంగపడ్డారు. అప్పుడు అతనిలా అన్నాడు : “నాన్నగారూ! పూర్వం నేను కన్నకలకు భావం ఇది. నా ప్రభువు దీన్ని నిజం చేసి చూపాడు. కారాగారం నుండి బయటకు తీసినపుడు ఆయన నాకు మహోపకారం చేశాడు. నాకూ – నా సోదరులకూ మధ్య షైతాన్ చిచ్చుపెట్టిన తరువాత అందరినీ ఎడారి ప్రాంతం నుంచి తీసుకొచ్చి కలిపాడు. నా ప్రభువు తన సంకల్పాన్ని ఎవరూ గ్రహించలేని యుక్తులద్వారా నెరవేరుస్తాడు. ఆయన అన్నీ తెలిసినవాడూ, వివేకవంతుడూను.
12:101 رَبِّ قَدْ آتَيْتَنِي مِنَ الْمُلْكِ وَعَلَّمْتَنِي مِن تَأْوِيلِ الْأَحَادِيثِ ۚ فَاطِرَ السَّمَاوَاتِ وَالْأَرْضِ أَنتَ وَلِيِّي فِي الدُّنْيَا وَالْآخِرَةِ ۖ تَوَفَّنِي مُسْلِمًا وَأَلْحِقْنِي بِالصَّالِحِينَ
“నా ప్రభూ! నీవు నాకు రాజ్యాన్ని ప్రసాదించావు. ఇంకా, నీవు నాకు కలల భావార్థాన్ని వివరించే విద్యను నేర్పావు. ఓ భూమ్యాకాశాల సృష్టికర్తా! ఇహంలోనూ, పరంలోనూ నువ్వే నా సంరక్షకుడవు. ముస్లింగా ఉన్న స్థితిలోనే నాకు మరణం వొసగు. నన్ను సజ్జనులలో చేర్చు” అని వేడుకున్నాడు.
12:102 ذَٰلِكَ مِنْ أَنبَاءِ الْغَيْبِ نُوحِيهِ إِلَيْكَ ۖ وَمَا كُنتَ لَدَيْهِمْ إِذْ أَجْمَعُوا أَمْرَهُمْ وَهُمْ يَمْكُرُونَ
(ఓ ముహమ్మద్!) ఇది అగోచర సమాచారాలలోనిది. దీన్ని మేము నీకు వహీ ద్వారా తెలియపరుస్తున్నాము. వారంతా కూడ బలుక్కుని, కుతంత్రం చేస్తున్నప్పుడు నువ్వు వారి దగ్గరలేవు.
12:103 وَمَا أَكْثَرُ النَّاسِ وَلَوْ حَرَصْتَ بِمُؤْمِنِينَ
నువ్వు ఎంతగా పరితపించినా వారిలో చాలామంది విశ్వసించేవారు కారు.
12:104 وَمَا تَسْأَلُهُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ ۚ إِنْ هُوَ إِلَّا ذِكْرٌ لِّلْعَالَمِينَ
ఈ పనికి గాను నువ్వు వారి నుండి ఎలాంటి ప్రతిఫలాన్నీ(వేతనాన్ని) అడగటంలేదు. ఇది సమస్త జగతికీ ఒక హితబోధ.
12:105 وَكَأَيِّن مِّنْ آيَةٍ فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ يَمُرُّونَ عَلَيْهَا وَهُمْ عَنْهَا مُعْرِضُونَ
ఆకాశాలలో, భూమిలో ఎన్నో సూచనలున్నాయి. కాని వారు వాటిని పట్టించుకోకుండానే సాగిపోతుంటారు.
12:106 وَمَا يُؤْمِنُ أَكْثَرُهُم بِاللَّهِ إِلَّا وَهُم مُّشْرِكُونَ
వారిలో చాలామంది అల్లాహ్‌ను విశ్వసిస్తూ కూడా ఆయనతోపాటు ఇతరులను భాగస్వాములుగా నిలబెడుతున్నారు.
12:107 أَفَأَمِنُوا أَن تَأْتِيَهُمْ غَاشِيَةٌ مِّنْ عَذَابِ اللَّهِ أَوْ تَأْتِيَهُمُ السَّاعَةُ بَغْتَةً وَهُمْ لَا يَشْعُرُونَ
ఏమిటీ, దైవశిక్షలలో ఏ శిక్ష కూడా తమపై వచ్చిపడదనీ, అకస్మాత్తుగా – తమకు తెలియకుండా – ప్రళయం విరుచుకుపడదని వారునిశ్చింతగా ఉన్నారా?
12:108 قُلْ هَٰذِهِ سَبِيلِي أَدْعُو إِلَى اللَّهِ ۚ عَلَىٰ بَصِيرَةٍ أَنَا وَمَنِ اتَّبَعَنِي ۖ وَسُبْحَانَ اللَّهِ وَمَا أَنَا مِنَ الْمُشْرِكِينَ
(ఓ ప్రవక్తా!) నువ్వు వాళ్ళకు చెప్పేయి : “నా మార్గమైతే ఇదే. నేనూ, నా అనుయాయులూ పూర్తి అవగాహనతో, దృఢనమ్మకంతో అల్లాహ్ వైపుకు పిలుస్తున్నాము. అల్లాహ్ పరమపవిత్రుడు. నేను, అల్లాహ్‌కు భాగస్వాముల్ని కల్పించే (షిర్క్ చేసే) వారిలోనివాణ్ణికాను.”
12:109 وَمَا أَرْسَلْنَا مِن قَبْلِكَ إِلَّا رِجَالًا نُّوحِي إِلَيْهِم مِّنْ أَهْلِ الْقُرَىٰ ۗ أَفَلَمْ يَسِيرُوا فِي الْأَرْضِ فَيَنظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الَّذِينَ مِن قَبْلِهِمْ ۗ وَلَدَارُ الْآخِرَةِ خَيْرٌ لِّلَّذِينَ اتَّقَوْا ۗ أَفَلَا تَعْقِلُونَ
(ఓ ప్రవక్తా!) నీకు పూర్వం మేము పట్టణవాసుల్లో నుంచి పంపిన ప్రవక్తలందరూ పురుషులే. వారి వద్దకు మేము వహీ పంపుతూ ఉండేవాళ్ళం. ఏమిటీ, తమకు పూర్వం గతించిన వారికథ ఎలా ముగిసిందో వీళ్ళు భూమిపై సంచరించి చూడలేదా? నిశ్చయంగా భయభక్తులు గలవారికి పరలోక నిలయం ఎంతోమేలైనది. అయినా మీరు అర్థం చేసుకోరా?!
12:110 حَتَّىٰ إِذَا اسْتَيْأَسَ الرُّسُلُ وَظَنُّوا أَنَّهُمْ قَدْ كُذِبُوا جَاءَهُمْ نَصْرُنَا فَنُجِّيَ مَن نَّشَاءُ ۖ وَلَا يُرَدُّ بَأْسُنَا عَنِ الْقَوْمِ الْمُجْرِمِينَ
చివరకు ప్రవక్తలు ఆశలు వదులుకోగా, తమతో అబద్ధం చెప్పబడిందని వారు (జాతి జనులు) ఊహాగానాలు చేస్తుండగా, అకస్మాత్తుగా వారికి (ప్రవక్తలకు) మా తోడ్పాటు అందింది. మరి మేము కోరిన వారిని కాపాడాము. అసలు విషయం ఏమిటంటే మా శిక్ష అపరాధ జనుల నుంచి తొలగించబడదు.
12:111 لَقَدْ كَانَ فِي قَصَصِهِمْ عِبْرَةٌ لِّأُولِي الْأَلْبَابِ ۗ مَا كَانَ حَدِيثًا يُفْتَرَىٰ وَلَٰكِن تَصْدِيقَ الَّذِي بَيْنَ يَدَيْهِ وَتَفْصِيلَ كُلِّ شَيْءٍ وَهُدًى وَرَحْمَةً لِّقَوْمٍ يُؤْمِنُونَ
నిశ్చయంగా వీరి (ఈ జాతుల) గాథలలో విజ్ఞతగల వారికి గుణపాఠం ఉంది. ఈ ఖుర్ఆన్ కల్పితమైన విషయం ఎంతమాత్రం కాదు. పైగా ఇది తనకు పూర్వం ఉన్న గ్రంథాలను ధ్రువీకరిస్తుంది, ప్రతి విషయాన్నీ స్పష్టంగా విడమరచి చెబుతుంది. విశ్వసించే జనులకు ఇది సన్మార్గం, కారుణ్యం.
13. సూరా ఆర్ రాద్ (Ar-R’ad)
13:1 المر ۚ تِلْكَ آيَاتُ الْكِتَابِ ۗ وَالَّذِي أُنزِلَ إِلَيْكَ مِن رَّبِّكَ الْحَقُّ وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يُؤْمِنُونَ
అలిఫ్ – లామ్ – మీమ్ – రా. ఇవి ఖుర్ఆన్ గ్రంథ వాక్యాలు. నీ ప్రభువు తరఫునుంచి నీపై అవతరింపజేయబడేదంతా పరమ సత్యం. కాని చాలా మంది విశ్వసించరు.
13:2 اللَّهُ الَّذِي رَفَعَ السَّمَاوَاتِ بِغَيْرِ عَمَدٍ تَرَوْنَهَا ۖ ثُمَّ اسْتَوَىٰ عَلَى الْعَرْشِ ۖ وَسَخَّرَ الشَّمْسَ وَالْقَمَرَ ۖ كُلٌّ يَجْرِي لِأَجَلٍ مُّسَمًّى ۚ يُدَبِّرُ الْأَمْرَ يُفَصِّلُ الْآيَاتِ لَعَلَّكُم بِلِقَاءِ رَبِّكُمْ تُوقِنُونَ
స్తంభాలు లేకుండా (నే) ఆకాశాలను అంతేసి ఎత్తుకు లేపిన వాడే అల్లాహ్. దీన్ని మీరు చూస్తూనే ఉన్నారు. మరి ఆయన అర్ష్ (సింహాసనం) పై ఆసీనుడయ్యాడు. సూర్యచంద్రులను నియంత్రణలో ఉంచినది కూడా ఆయనే – ప్రతి ఒక్కటీ నిర్థారిత సమయంలో తిరుగుతోంది. కార్యక్రమాల నిర్వహణకర్త కూడా ఆయనే. మీరు మీ ప్రభువును కలుసుకునే విషయాన్ని నమ్మగలందులకు ఆయన తన నిదర్శనాలను స్పష్టంగా వివరిస్తున్నాడు.
13:3 وَهُوَ الَّذِي مَدَّ الْأَرْضَ وَجَعَلَ فِيهَا رَوَاسِيَ وَأَنْهَارًا ۖ وَمِن كُلِّ الثَّمَرَاتِ جَعَلَ فِيهَا زَوْجَيْنِ اثْنَيْنِ ۖ يُغْشِي اللَّيْلَ النَّهَارَ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّقَوْمٍ يَتَفَكَّرُونَ
ఆయనే భూమిని విశాలంగా పరచి అందులో పర్వతాలను, నదీనదాలను సృష్టించాడు. ఇంకా అందులో అన్నిరకాల పండ్లను రెండేసి జతలుగా సృష్టించాడు. ఆయనే పగటిపై రాత్రిని కప్పేస్తాడు. నిశ్చయంగా చింతన చేసేవారి కోసం ఇందులో పలు నిదర్శనాలున్నాయి.
13:4 وَفِي الْأَرْضِ قِطَعٌ مُّتَجَاوِرَاتٌ وَجَنَّاتٌ مِّنْ أَعْنَابٍ وَزَرْعٌ وَنَخِيلٌ صِنْوَانٌ وَغَيْرُ صِنْوَانٍ يُسْقَىٰ بِمَاءٍ وَاحِدٍ وَنُفَضِّلُ بَعْضَهَا عَلَىٰ بَعْضٍ فِي الْأُكُلِ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّقَوْمٍ يَعْقِلُونَ
భూమిలో అనేక (రకాల) నేలలు ఒక దానికొకటి ఆనుకుని ఉన్నాయి. (అందులో) ద్రాక్ష తోటలూ ఉన్నాయి, పంటపొలాలూ ఉన్నాయి. ఖర్జూరపు చెట్లూ ఉన్నాయి. వాటిలో కొన్ని శాఖలుగా చీలి ఉండగా, మరికొన్ని వేరే రకంగా ఉన్నాయి. వాటన్నింటికీ ఒకే నీరు సరఫరా అవుతోంది. అయినప్పటికీ మేము ఆ పండ్లలో ఒకదానికి మరోదానిపై శ్రేష్ఠతను ప్రసాదిస్తున్నాము. నిశ్చయంగా విజ్ఞులకు ఇందులో ఎన్నో సూచనలున్నాయి.
13:5 وَإِن تَعْجَبْ فَعَجَبٌ قَوْلُهُمْ أَإِذَا كُنَّا تُرَابًا أَإِنَّا لَفِي خَلْقٍ جَدِيدٍ ۗ أُولَٰئِكَ الَّذِينَ كَفَرُوا بِرَبِّهِمْ ۖ وَأُولَٰئِكَ الْأَغْلَالُ فِي أَعْنَاقِهِمْ ۖ وَأُولَٰئِكَ أَصْحَابُ النَّارِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ
(ఓ ప్రవక్తా!) ఒకవేళ నువ్వు ఆశ్చర్యపడవలసి ఉంటే; “ఏమిటీ, మేము (మరణించి) మట్టి అయిపోయిన తరువాత మళ్లీ క్రొత్తగా పుట్టించబడతామా?!” అన్న వారి మాటలపై ఆశ్చర్యపోవాలి. తమ ప్రభువు పట్ల తిరస్కార వైఖరిని అవలంబించిన వారు వీరే. పట్టాలు వేయబడేది వీరి మెడలలోనే. నరకవాసులు కూడా వారే. అందులో వారు కలకాలం ఉంటారు.
13:6 وَيَسْتَعْجِلُونَكَ بِالسَّيِّئَةِ قَبْلَ الْحَسَنَةِ وَقَدْ خَلَتْ مِن قَبْلِهِمُ الْمَثُلَاتُ ۗ وَإِنَّ رَبَّكَ لَذُو مَغْفِرَةٍ لِّلنَّاسِ عَلَىٰ ظُلْمِهِمْ ۖ وَإِنَّ رَبَّكَ لَشَدِيدُ الْعِقَابِ
మేలుకు ముందే వారు కీడు కోసం నిన్ను తొందరపెడుతున్నారు కదూ! వారికి పూర్వం అలాంటి ఉదాహరణలు (శిక్షలు) గడచి ఉన్నాయి. నిశ్చయంగా ప్రజలు దుర్మార్గాలకు పాల్పడిన తరువాత కూడా నీ ప్రభువు వారిపట్ల క్షమాశీలుడుగా ఉంటాడు. అయితే నీ ప్రభువు శిక్షించే విషయంలో కూడా మహా కఠినుడు సుమా!
13:7 وَيَقُولُ الَّذِينَ كَفَرُوا لَوْلَا أُنزِلَ عَلَيْهِ آيَةٌ مِّن رَّبِّهِ ۗ إِنَّمَا أَنتَ مُنذِرٌ ۖ وَلِكُلِّ قَوْمٍ هَادٍ
”అతనిపై అతని ప్రభువు తరఫున ఏదైనా సూచన (మహిమ)ఎందుకు అవతరించలేదు?”అని అవిశ్వాసులు అంటున్నారు. (ఓ ప్రవక్తా!) వాస్తవానికి నువ్వు వారిని హెచ్చరించేవాడివి మాత్రమే. ప్రతి జాతికీ మార్గదర్శకుడంటూ ఒకడున్నాడు.
13:8 اللَّهُ يَعْلَمُ مَا تَحْمِلُ كُلُّ أُنثَىٰ وَمَا تَغِيضُ الْأَرْحَامُ وَمَا تَزْدَادُ ۖ وَكُلُّ شَيْءٍ عِندَهُ بِمِقْدَارٍ
ప్రతి స్త్రీ తన గర్భంలో మోసే దానిని గురించి, గర్భం తరగటం, పెరగటం గురించి అల్లాహ్‌కు బాగా తెలుసు. ప్రతి వస్తువుకూ ఆయన వద్ద ఒక పరిమాణం నిర్ధారితమై ఉంది.
13:9 عَالِمُ الْغَيْبِ وَالشَّهَادَةِ الْكَبِيرُ الْمُتَعَالِ
ఆయన గోప్యంగా ఉన్నదానినీ, బహిర్గతమై ఉన్నదానినీ ఎరిగినవాడు, అందరికంటే గొప్పవాడు, సర్వోన్నతుడు.
13:10 سَوَاءٌ مِّنكُم مَّنْ أَسَرَّ الْقَوْلَ وَمَن جَهَرَ بِهِ وَمَنْ هُوَ مُسْتَخْفٍ بِاللَّيْلِ وَسَارِبٌ بِالنَّهَارِ
మీలో ఎవరయినాసరే తమ మాటను మెల్లిగా చెప్పినా, బిగ్గరగా చెప్పినా, ఎవరయినా రాత్రిపూట దాక్కున్నా, పగటిపూట సంచరిస్తున్నా – అల్లాహ్‌కు మాత్రం వారంతా సమానమే.
13:11 لَهُ مُعَقِّبَاتٌ مِّن بَيْنِ يَدَيْهِ وَمِنْ خَلْفِهِ يَحْفَظُونَهُ مِنْ أَمْرِ اللَّهِ ۗ إِنَّ اللَّهَ لَا يُغَيِّرُ مَا بِقَوْمٍ حَتَّىٰ يُغَيِّرُوا مَا بِأَنفُسِهِمْ ۗ وَإِذَا أَرَادَ اللَّهُ بِقَوْمٍ سُوءًا فَلَا مَرَدَّ لَهُ ۚ وَمَا لَهُم مِّن دُونِهِ مِن وَالٍ
మనిషికి ముందూ వెనుకా (ఆయన నియమించిన) కావలి వాళ్ళు అంటి ఉన్నారు. వారు దైవాజ్ఞానుసారం అతన్ని కనిపెట్టుకుని ఉంటారు. ఏ జాతి అయినా సరే స్వయంగా తన మనోమయ స్థితిని మార్చుకోనంతవరకూ అల్లాహ్ కూడా దాని స్థితిని మార్చడు . అల్లాహ్ ఏ జాతినయినా శిక్షించాలనుకుంటే ఇక ఆ శిక్ష తొలగిపోయే ప్రసక్తే ఉండదు. ఆయన తప్ప వారిని రక్షించే వారు కూడా ఎవరూ ఉండరు.
13:12 هُوَ الَّذِي يُرِيكُمُ الْبَرْقَ خَوْفًا وَطَمَعًا وَيُنشِئُ السَّحَابَ الثِّقَالَ
ఆయనే మీకు మెరుపులను చూపిస్తున్నాడు. వాటివల్ల మీకు భయం కలగటంతోపాటు, మీలో ఆశలు కూడా చిగురిస్తున్నాయి. ఇంకా (ఆయనే) బరువైన మబ్బులను సృజిస్తున్నాడు.
13:13 وَيُسَبِّحُ الرَّعْدُ بِحَمْدِهِ وَالْمَلَائِكَةُ مِنْ خِيفَتِهِ وَيُرْسِلُ الصَّوَاعِقَ فَيُصِيبُ بِهَا مَن يَشَاءُ وَهُمْ يُجَادِلُونَ فِي اللَّهِ وَهُوَ شَدِيدُ الْمِحَالِ
ఉరుము సయితం ఆయన పవిత్రతను కొనియాడుతోంది, ఆయన్ని ప్రశంసిస్తోంది. దూతలు కూడా ఆయన భీతివల్ల ఆయన్ని స్తుతిస్తున్నారు. ఆయనే పిడుగులను పంపి, తాను కోరినవారిపై పడవేస్తున్నాడు. అవిశ్వాసులు అల్లాహ్ విషయంలో పిడి వాదానికి దిగుతున్నారు! ఆయన మహా శక్తిమంతుడు!
13:14 لَهُ دَعْوَةُ الْحَقِّ ۖ وَالَّذِينَ يَدْعُونَ مِن دُونِهِ لَا يَسْتَجِيبُونَ لَهُم بِشَيْءٍ إِلَّا كَبَاسِطِ كَفَّيْهِ إِلَى الْمَاءِ لِيَبْلُغَ فَاهُ وَمَا هُوَ بِبَالِغِهِ ۚ وَمَا دُعَاءُ الْكَافِرِينَ إِلَّا فِي ضَلَالٍ
ఆయన్ని (అల్లాహ్‌ను) వేడుకోవటమే సత్యం. ఆయన్ని వదలి వారు వేడుకుంటున్న వారంతా వారి ప్రార్థనలకు ఏ సమాధానమూ ఇవ్వలేరు. ఒక వ్యక్తి తన రెండు చేతులనూ నీళ్ళ వైపుకు చాచి, ఆ నీరు తన నోటిలోనికి వచ్చి పడాలని అనుకుంటే అది అతని నోటిలోనికి రాదు. (అల్లాహ్‌ను కాదని చిల్లర దేవుళ్లను పిలిచేవారి) ఈ పిలుపు కూడా అంతే. ఈ అవిశ్వాసుల ప్రార్థనలన్నీ అధర్మమైనవే.
13:15 وَلِلَّهِ يَسْجُدُ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ طَوْعًا وَكَرْهًا وَظِلَالُهُم بِالْغُدُوِّ وَالْآصَالِ ۩
ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న సృష్టితాలన్నీ – తమకు ఇష్టమున్నా, లేకపోయినా – అల్లాహ్‌కు సాష్టాంగపడుతున్నాయి. వాటి నీడలు సయితం ఉదయం సాయంత్రం (ఆయనకే సాష్టాంగ ప్రణామం చేస్తున్నాయి).
13:16 قُلْ مَن رَّبُّ السَّمَاوَاتِ وَالْأَرْضِ قُلِ اللَّهُ ۚ قُلْ أَفَاتَّخَذْتُم مِّن دُونِهِ أَوْلِيَاءَ لَا يَمْلِكُونَ لِأَنفُسِهِمْ نَفْعًا وَلَا ضَرًّا ۚ قُلْ هَلْ يَسْتَوِي الْأَعْمَىٰ وَالْبَصِيرُ أَمْ هَلْ تَسْتَوِي الظُّلُمَاتُ وَالنُّورُ ۗ أَمْ جَعَلُوا لِلَّهِ شُرَكَاءَ خَلَقُوا كَخَلْقِهِ فَتَشَابَهَ الْخَلْقُ عَلَيْهِمْ ۚ قُلِ اللَّهُ خَالِقُ كُلِّ شَيْءٍ وَهُوَ الْوَاحِدُ الْقَهَّارُ
“భూమ్యాకాశాలకు ప్రభువు ఎవరు?” అని వారిని అడుగు. “అల్లాహ్‌యే” అని వారికి చెప్పు. “అయినప్పటికీ మీరు ఆయన్ని కాదని, తమ స్వయానికి సయితం లాభంగానీ, నష్టంగానీ చేకూర్చలేని వారిని మీ రక్షకులుగా చేసుకుంటున్నారా?” అని వారిని అడుగు. “గుడ్డివాడూ – చూడగలిగేవాడు సమానులు కాగలరా? అంధకారాలూ – వెలుగూ ఒకటి కాగలవా? పోనీ, వారి దృష్టిలో ‘సృష్టి’ అనేది సందేహాస్పదం కావటానికి, వారు అల్లాహ్‌కు భాగస్వాములుగా చేర్చినవారుగాని అల్లాహ్ మాదిరిగా దేన్నయినా సృష్టించారా?” అని కూడా వారిని అడుగు. “అల్లాహ్‌యే అన్నింటినీ సృష్టించినవాడు. ఆయన ఒక్కడే. ఆయన సర్వాధిక్యుడు” అని వారికి స్పష్టంగా చెప్పు.
13:17 أَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَسَالَتْ أَوْدِيَةٌ بِقَدَرِهَا فَاحْتَمَلَ السَّيْلُ زَبَدًا رَّابِيًا ۚ وَمِمَّا يُوقِدُونَ عَلَيْهِ فِي النَّارِ ابْتِغَاءَ حِلْيَةٍ أَوْ مَتَاعٍ زَبَدٌ مِّثْلُهُ ۚ كَذَٰلِكَ يَضْرِبُ اللَّهُ الْحَقَّ وَالْبَاطِلَ ۚ فَأَمَّا الزَّبَدُ فَيَذْهَبُ جُفَاءً ۖ وَأَمَّا مَا يَنفَعُ النَّاسَ فَيَمْكُثُ فِي الْأَرْضِ ۚ كَذَٰلِكَ يَضْرِبُ اللَّهُ الْأَمْثَالَ
ఆయనే ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించాడు. ప్రతి నదీ, ప్రతి కాలువా తన వైశాల్యాన్నిబట్టి ఆ నీటిని గ్రహించి బయలుదేరింది. వరద వచ్చినప్పుడు నీళ్ళ ఉపరితలంపైకి నురుగు కూడా వచ్చింది. నగల తయారీ కోసం, సామానుల కోసం అగ్నిలో కాల్చే వాటిపై (లోహాలపై) కూడా (ఈ విధమైన) నురుగే వస్తుంది. ఈ విధంగా అల్లాహ్ సత్యాసత్యాల ఉదాహరణను స్పష్టపరుస్తున్నాడు. కడకు నురుగంతా పనికి రాకుండా (ఎగిరి) పోతుంది. ప్రజలకు ఉపయోగపడే వస్తువు మాత్రం భూమిలో మిగిలి ఉంటుంది. ఈ విధంగా అల్లాహ్ ఉదాహరణల ద్వారా (విషయాన్ని) వివరిస్తున్నాడు.
13:18 لِلَّذِينَ اسْتَجَابُوا لِرَبِّهِمُ الْحُسْنَىٰ ۚ وَالَّذِينَ لَمْ يَسْتَجِيبُوا لَهُ لَوْ أَنَّ لَهُم مَّا فِي الْأَرْضِ جَمِيعًا وَمِثْلَهُ مَعَهُ لَافْتَدَوْا بِهِ ۚ أُولَٰئِكَ لَهُمْ سُوءُ الْحِسَابِ وَمَأْوَاهُمْ جَهَنَّمُ ۖ وَبِئْسَ الْمِهَادُ
తమ ప్రభువు ఆజ్ఞను పాటించేవారి కొరకు మేలు ఉంది. ఆయన ఆజ్ఞను పాటించనివారు భూమిలో ఉన్న సమస్త సంపదకు యజమానులైనా, అంతకు మరింత సంపద కూడా వారికి ఉన్నా, దాన్నంతటినీ తమకు (విధించబడే శిక్షకు) బదులుగా ఇవ్వటానికి సిద్ధమవుతారు. చెడ్డ (కఠినమైన) లెక్క తీసుకోబడేది వారి నుంచే. నరకం వారి నివాసమవుతుంది. అది బహుచెడ్డ స్థలం.
13:19 أَفَمَن يَعْلَمُ أَنَّمَا أُنزِلَ إِلَيْكَ مِن رَّبِّكَ الْحَقُّ كَمَنْ هُوَ أَعْمَىٰ ۚ إِنَّمَا يَتَذَكَّرُ أُولُو الْأَلْبَابِ
ఏమిటీ, నీ ప్రభువు తరఫున నీపై అవతరింపజేయబడినది నిలువెల్లా సత్యమని తెలుసుకున్న వాడునూ, గుడ్డివాడు ఒక్కటే అవుతారా? విజ్ఞులు మాత్రమే హితబోధను గ్రహిస్తారు.
13:20 الَّذِينَ يُوفُونَ بِعَهْدِ اللَّهِ وَلَا يَنقُضُونَ الْمِيثَاقَ
(వారి గుణగణాలు ఇవి:) వారు అల్లాహ్‌కు ఇచ్చిన మాటను నిలుపుకుంటారు. చేసుకున్న ఒప్పందాన్ని భంగపరచరు.
13:21 وَالَّذِينَ يَصِلُونَ مَا أَمَرَ اللَّهُ بِهِ أَن يُوصَلَ وَيَخْشَوْنَ رَبَّهُمْ وَيَخَافُونَ سُوءَ الْحِسَابِ
వేటినయితే కలిపి ఉంచమని అల్లాహ్ ఆదేశించాడో వాటిని కలిపి ఉంచుతారు. వారు తమ ప్రభువుకు భయపడుతూ ఉంటారు. తమ నుండి కఠినంగా లెక్క తీసుకోబడుతుందేమోనని జడుస్తూ ఉంటారు.
13:22 وَالَّذِينَ صَبَرُوا ابْتِغَاءَ وَجْهِ رَبِّهِمْ وَأَقَامُوا الصَّلَاةَ وَأَنفَقُوا مِمَّا رَزَقْنَاهُمْ سِرًّا وَعَلَانِيَةً وَيَدْرَءُونَ بِالْحَسَنَةِ السَّيِّئَةَ أُولَٰئِكَ لَهُمْ عُقْبَى الدَّارِ
వారు తమ ప్రభువు ప్రసన్నతను చూరగొనే ఉద్దేశంతో సహనం పాటిస్తారు. నమాజులను నెలకొల్పుతారు. మేము వారికి ప్రసాదించిన దానిలో నుంచి గోప్యంగానూ, బహిరంగంగానూ ఖర్చుపెడతారు. చెడును సయితం మంచితనంతో పారద్రోలుతారు. అంతిమ నిలయం ఉన్నది ఇలాంటి వారి కొరకే.
13:23 جَنَّاتُ عَدْنٍ يَدْخُلُونَهَا وَمَن صَلَحَ مِنْ آبَائِهِمْ وَأَزْوَاجِهِمْ وَذُرِّيَّاتِهِمْ ۖ وَالْمَلَائِكَةُ يَدْخُلُونَ عَلَيْهِم مِّن كُلِّ بَابٍ
శాశ్వతంగా ఉండే స్వర్గవనాలలోకి వారు ప్రవేశిస్తారు. వారి పూర్వీకులలో, వారి భార్యాబిడ్డలలో సజ్జనులైనవారు కూడా (వారితోపాటే స్వర్గానికి వెళతారు). దైవదూతలు అన్ని ద్వారాల నుండి వారివద్దకు వస్తారు.
13:24 سَلَامٌ عَلَيْكُم بِمَا صَبَرْتُمْ ۚ فَنِعْمَ عُقْبَى الدَّارِ
“మీరు చూపిన సహనానికి బదులుగా మీపై శాంతి కురియు గాక! (మీకు లభించిన) ఈ అంతిమ గృహం ఎంత మంచిది!” అని వారు అంటారు.
13:25 وَالَّذِينَ يَنقُضُونَ عَهْدَ اللَّهِ مِن بَعْدِ مِيثَاقِهِ وَيَقْطَعُونَ مَا أَمَرَ اللَّهُ بِهِ أَن يُوصَلَ وَيُفْسِدُونَ فِي الْأَرْضِ ۙ أُولَٰئِكَ لَهُمُ اللَّعْنَةُ وَلَهُمْ سُوءُ الدَّارِ
మరెవరయితే అల్లాహ్‌తో చేసుకున్న ఒడంబడికను దృఢపరచిన తరువాత భంగపరుస్తారో, ఇంకా అల్లాహ్ కలపమని ఆజ్ఞాపించిన వాటిని త్రెంచేస్తారో, భూమిలో అలజడిని సృష్టిస్తారో వారే శాపానికి అర్హులు. వారికోసం బహుచెడ్డ నిలయం ఉంది.
13:26 اللَّهُ يَبْسُطُ الرِّزْقَ لِمَن يَشَاءُ وَيَقْدِرُ ۚ وَفَرِحُوا بِالْحَيَاةِ الدُّنْيَا وَمَا الْحَيَاةُ الدُّنْيَا فِي الْآخِرَةِ إِلَّا مَتَاعٌ
అల్లాహ్ తాను కోరినవారి ఉపాధిని పెంచుతాడు, తాను కోరిన వారికి తగ్గిస్తాడు. వారు ప్రాపంచిక జీవితంలోనే పూర్తిగా లీనమైపోయారు. యదార్థానికి పరలోకం ముందు ప్రాపంచిక జీవితం అత్యంత (అల్పమైన) సామగ్రి మాత్రమే.
13:27 وَيَقُولُ الَّذِينَ كَفَرُوا لَوْلَا أُنزِلَ عَلَيْهِ آيَةٌ مِّن رَّبِّهِ ۗ قُلْ إِنَّ اللَّهَ يُضِلُّ مَن يَشَاءُ وَيَهْدِي إِلَيْهِ مَنْ أَنَابَ
“అతనిపై (ముహమ్మద్‌పై) అతని ప్రభువు తరఫు నుంచి ఏదైనా మహిమ ఎందుకు అవతరించదు?” అని అవిశ్వాసులు అంటున్నారు. “అల్లాహ్ తాను కోరిన వారిని మార్గభ్రష్టులుగా చేస్తాడు, తన వైపుకు మరలేవారికి ఆయన సన్మార్గం చూపుతాడు” అని వారికి చెప్పు.
13:28 الَّذِينَ آمَنُوا وَتَطْمَئِنُّ قُلُوبُهُم بِذِكْرِ اللَّهِ ۗ أَلَا بِذِكْرِ اللَّهِ تَطْمَئِنُّ الْقُلُوبُ
విశ్వసించిన వారి హృదయాలు అల్లాహ్ స్మరణ ద్వారా తృప్తి చెందుతాయి. తెలుసుకోండి! అల్లాహ్ స్మరణ ద్వారానే హృదయాలు నెమ్మదిస్తాయి.
13:29 الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ طُوبَىٰ لَهُمْ وَحُسْنُ مَآبٍ
విశ్వసించి, మంచిపనులు చేసినవారు సౌభాగ్యవంతులు. వారి కొరకు మంచి నివాసం ఉంటుంది.
13:30 كَذَٰلِكَ أَرْسَلْنَاكَ فِي أُمَّةٍ قَدْ خَلَتْ مِن قَبْلِهَا أُمَمٌ لِّتَتْلُوَ عَلَيْهِمُ الَّذِي أَوْحَيْنَا إِلَيْكَ وَهُمْ يَكْفُرُونَ بِالرَّحْمَٰنِ ۚ قُلْ هُوَ رَبِّي لَا إِلَٰهَ إِلَّا هُوَ عَلَيْهِ تَوَكَّلْتُ وَإِلَيْهِ مَتَابِ
(ఓ ముహమ్మద్!) అదే విధంగా మేము నిన్ను ఈ సమాజంలోకి పంపాము – ఇంతకు మునుపు ఎన్నో సమాజాలు గతించాయి – మా తరఫున నీపై అవతరించిన వాణిని నువ్వు వారికి చదివి వినిపించటానికి. కరుణామయుడైన అల్లాహ్‌ను వారు తిరస్కరిస్తున్నారు. వారికి చెప్పు: “ఆయనే నా పోషకుడు. ఆయన తప్ప మరొకరెవరూ ఆరాధనకు అర్హులు కానేకారు. నేను ఆయన్నే నమ్ముకున్నాను – ఆయన వైపుకే నేను మరలుతున్నాను.”
13:31 وَلَوْ أَنَّ قُرْآنًا سُيِّرَتْ بِهِ الْجِبَالُ أَوْ قُطِّعَتْ بِهِ الْأَرْضُ أَوْ كُلِّمَ بِهِ الْمَوْتَىٰ ۗ بَل لِّلَّهِ الْأَمْرُ جَمِيعًا ۗ أَفَلَمْ يَيْأَسِ الَّذِينَ آمَنُوا أَن لَّوْ يَشَاءُ اللَّهُ لَهَدَى النَّاسَ جَمِيعًا ۗ وَلَا يَزَالُ الَّذِينَ كَفَرُوا تُصِيبُهُم بِمَا صَنَعُوا قَارِعَةٌ أَوْ تَحُلُّ قَرِيبًا مِّن دَارِهِمْ حَتَّىٰ يَأْتِيَ وَعْدُ اللَّهِ ۚ إِنَّ اللَّهَ لَا يُخْلِفُ الْمِيعَادَ
ఒకవేళ ఏదైనా(ఆకాశగ్రంథమైన)ఖుర్ఆన్ ద్వారా పర్వతాలు నడిపింపబడినా, భూమి బ్రద్దలు కొట్టబడినా, లేదా శవాల చేత మాట్లాడించినా (వీళ్లు మాత్రం విశ్వసించేవారు కారు) – వాస్తవానికి ఈ పనులన్నీ అల్లాహ్ అధీనంలోనే ఉన్నాయి. అల్లాహ్ గనక తలచుకుంటే సమస్త మానవాళినీ సన్మార్గంపైకి తేగలడు. విశ్వాసుల మనసు కుదుటపడటానికి ఈ ఒక్క విషయం సరిపోదా? అవిశ్వాసులకు వారి అవిశ్వాస పోకడల ఫలితంగా ఎల్లప్పుడూ ఏదో ఒక ఆపద వస్తూనే ఉంటుంది లేదా వారి ఇళ్లకు సమీపంలోనే అది వచ్చిపడుతూ ఉంటుంది. అల్లాహ్ వాగ్దానం నెరవేరే వరకూ ఈ స్థితి నెలకొనే ఉంటుంది. నిశ్చయంగా అల్లాహ్ వాగ్దానానికి వ్యతిరేకంగా చేయడు.
13:32 وَلَقَدِ اسْتُهْزِئَ بِرُسُلٍ مِّن قَبْلِكَ فَأَمْلَيْتُ لِلَّذِينَ كَفَرُوا ثُمَّ أَخَذْتُهُمْ ۖ فَكَيْفَ كَانَ عِقَابِ
(ఓ ప్రవక్తా!) నీకు పూర్వం ఎంతో మంది ప్రవక్తలు పరిహసించబడ్డారు. మరి నేను కూడా అవిశ్వాసులకు (కొంత) విడుపు ఇచ్చాను. ఆ తరువాత (అకస్మాత్తుగా) పట్టుకున్నాను. అప్పుడు నా శిక్ష ఎంత భయంకరంగా ఉందో(చూశారా!)
13:33 أَفَمَنْ هُوَ قَائِمٌ عَلَىٰ كُلِّ نَفْسٍ بِمَا كَسَبَتْ ۗ وَجَعَلُوا لِلَّهِ شُرَكَاءَ قُلْ سَمُّوهُمْ ۚ أَمْ تُنَبِّئُونَهُ بِمَا لَا يَعْلَمُ فِي الْأَرْضِ أَم بِظَاهِرٍ مِّنَ الْقَوْلِ ۗ بَلْ زُيِّنَ لِلَّذِينَ كَفَرُوا مَكْرُهُمْ وَصُدُّوا عَنِ السَّبِيلِ ۗ وَمَن يُضْلِلِ اللَّهُ فَمَا لَهُ مِنْ هَادٍ
ఏమిటీ, ఒక్కొక్క ప్రాణి చేసే కర్మలను పర్యవేక్షిస్తున్నటువంటి అల్లాహ్కా వీళ్లు సహవర్తుల్ని కల్పించేది? వారిని అడుగు: “కాస్త వారి పేర్లయినా చెప్పండి! ఏమిటీ, భూమిలో అల్లాహ్‌కే తెలియని విషయాలు మీరు ఆయనకు తెలియపరుస్తున్నారా? లేక పై పై మాటలు చెబుతున్నారా? అసలు విషయం ఏమిటంటే తిరస్కార వైఖరిపై మొండికేసిన వారికి, వారి కుతంత్రాలు అందంగా (కానవచ్చేలా) చేయబడ్డాయి. వారు సన్మార్గం నుంచి ఆపివేయబడ్డారు. అల్లాహ్ అపమార్గానికి లోనుచేసినవారిని ఎవరూ సన్మార్గానికి తేలేరు.
13:34 لَّهُمْ عَذَابٌ فِي الْحَيَاةِ الدُّنْيَا ۖ وَلَعَذَابُ الْآخِرَةِ أَشَقُّ ۖ وَمَا لَهُم مِّنَ اللَّهِ مِن وَاقٍ
అలాంటి వారికి ప్రాపంచిక జీవితంలోనూ శిక్ష ఉంది. ఇక పరలోక శిక్ష అయితే ఇంతకంటే ఎంతో కఠినమైనది. అల్లాహ్ ఆగ్రహం నుంచి వాళ్ళను కాపాడే వాడెవడూ ఉండడు.
13:35 مَّثَلُ الْجَنَّةِ الَّتِي وُعِدَ الْمُتَّقُونَ ۖ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ ۖ أُكُلُهَا دَائِمٌ وَظِلُّهَا ۚ تِلْكَ عُقْبَى الَّذِينَ اتَّقَوا ۖ وَّعُقْبَى الْكَافِرِينَ النَّارُ
(అల్లాహ్ పట్ల) భయభక్తులు కలిగివుండే వారికి వాగ్దానం చేయబడిన స్వర్గం ఇలా ఉంటుంది : దాని క్రింద కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. దాని పండ్లు ఫలాలు ఎన్నటికీ తరగనివి. దాని నీడ కూడా శాశ్వితమైనది. భయభక్తులు కలవారి అంతిమ పరిణామం ఇది. కాగా; తిరస్కారుల అంతిమ పరిణామం నరకం.
13:36 وَالَّذِينَ آتَيْنَاهُمُ الْكِتَابَ يَفْرَحُونَ بِمَا أُنزِلَ إِلَيْكَ ۖ وَمِنَ الْأَحْزَابِ مَن يُنكِرُ بَعْضَهُ ۚ قُلْ إِنَّمَا أُمِرْتُ أَنْ أَعْبُدَ اللَّهَ وَلَا أُشْرِكَ بِهِ ۚ إِلَيْهِ أَدْعُو وَإِلَيْهِ مَآبِ
(ఓ ప్రవక్తా!) ఎవరికైతే మేము గ్రంథం ఇచ్చి ఉన్నామో వారు, నీపై అవతరింపజేయబడే దాని పట్ల సంతోషిస్తూ ఉంటారు. ఇతర వర్గాలవారు ఇందులోని కొన్ని భాగాలను తిరస్కరిస్తున్నారు. “నేను అల్లాహ్‌ను ఆరాధించాలనీ, ఆయనకు భాగస్వామ్యం కల్పించరాదని మాత్రమే నాకు ఆజ్ఞాపించబడింది. కాబట్టి ఆయన వైపుకే నేను పిలుపు ఇస్తున్నాను. ఆయన వైపే నేను మరలుతున్నాను” అని నువ్వు వారికి చెప్పేయి.
13:37 وَكَذَٰلِكَ أَنزَلْنَاهُ حُكْمًا عَرَبِيًّا ۚ وَلَئِنِ اتَّبَعْتَ أَهْوَاءَهُم بَعْدَمَا جَاءَكَ مِنَ الْعِلْمِ مَا لَكَ مِنَ اللَّهِ مِن وَلِيٍّ وَلَا وَاقٍ
ఇదే విధంగా మేము ఈ ఖుర్ఆన్ను అరబీ భాషలో(ఉన్న) ఉత్తర్వుగా పంపాము. జ్ఞానం వచ్చేసిన తరువాత కూడా నువ్వు గనక వారి కోరికలను అనుసరించావంటే అల్లాహ్ (శిక్ష) నుండి నీకు సహాయపడేవాడు గాని, నిన్ను రక్షించేవాడు గాని ఎవడూ ఉండడు.
13:38 وَلَقَدْ أَرْسَلْنَا رُسُلًا مِّن قَبْلِكَ وَجَعَلْنَا لَهُمْ أَزْوَاجًا وَذُرِّيَّةً ۚ وَمَا كَانَ لِرَسُولٍ أَن يَأْتِيَ بِآيَةٍ إِلَّا بِإِذْنِ اللَّهِ ۗ لِكُلِّ أَجَلٍ كِتَابٌ
నీకు పూర్వం కూడా మేము చాలా మంది ప్రవక్తలను పంపి ఉన్నాము. మేము వారిని భార్యాబిడ్డలు కలవారుగానే చేశాము. అల్లాహ్ అనుజ్ఞ లేకుండా ఏ నిదర్శనాన్నయినా తీసుకురావటమనేది ఏ ప్రవక్త వల్ల కూడా కాని పని. ప్రతి నిర్థారిత వాగ్దానం లిఖితమై ఉంది.
13:39 يَمْحُو اللَّهُ مَا يَشَاءُ وَيُثْبِتُ ۖ وَعِندَهُ أُمُّ الْكِتَابِ
అల్లాహ్ తాను కోరినదాన్ని చెరిపివేస్తాడు, తాను కోరినదాన్నిఅలాగే ఉండనిస్తాడు. మూలగ్రంథం (లౌహె మహ్ఫూజ్) ఆయన దగ్గరే ఉంది.
13:40 وَإِن مَّا نُرِيَنَّكَ بَعْضَ الَّذِي نَعِدُهُمْ أَوْ نَتَوَفَّيَنَّكَ فَإِنَّمَا عَلَيْكَ الْبَلَاغُ وَعَلَيْنَا الْحِسَابُ
(ఓ ప్రవక్తా!) వారికి చేసివున్న వాగ్దానాలలో దేన్నయినా మేము నీకు చూపించినా లేక (అంతకు ముందే) మేము నీ ప్రాణాన్ని స్వాధీనం చేసుకున్నా (ఏది ఏమైనాసరే…) సందేశాన్ని చేరవేయటమే నీ పని. లెక్క తీసుకునే బాధ్యత మాది.
13:41 أَوَلَمْ يَرَوْا أَنَّا نَأْتِي الْأَرْضَ نَنقُصُهَا مِنْ أَطْرَافِهَا ۚ وَاللَّهُ يَحْكُمُ لَا مُعَقِّبَ لِحُكْمِهِ ۚ وَهُوَ سَرِيعُ الْحِسَابِ
మేము భూమిని దాని అంచుల (ఎల్లల)నుంచి ఎలా కుదించుకుంటూ వస్తున్నామో వారు గమనించటం లేదా? అల్లాహ్ ఆదేశాలు జారీ చేస్తాడు, ఆయన ఆదేశాలను పునఃపరిశీలించే వాడెవడూ లేడు. ఆయన చాలా వేగంగా లెక్క తీసుకునేవాడు కూడా.
13:42 وَقَدْ مَكَرَ الَّذِينَ مِن قَبْلِهِمْ فَلِلَّهِ الْمَكْرُ جَمِيعًا ۖ يَعْلَمُ مَا تَكْسِبُ كُلُّ نَفْسٍ ۗ وَسَيَعْلَمُ الْكُفَّارُ لِمَنْ عُقْبَى الدَّارِ
వీరికి పూర్వం (గతించిన) ప్రజలు కూడా పెద్ద పెద్ద కుట్రలు పన్నారు. అయితే (అసలు సిసలు) తంత్రాలన్నీ అల్లాహ్ అధీనంలో ఉన్నాయి. ఎవరేం చేస్తున్నదీ ఆయనకు తెలుసు. ఇహలోక పుణ్యఫలం ఎవరి కోసం ఉందో అవిశ్వాసులు త్వరలోనే తెలుసుకుంటారు.
13:43 وَيَقُولُ الَّذِينَ كَفَرُوا لَسْتَ مُرْسَلًا ۚ قُلْ كَفَىٰ بِاللَّهِ شَهِيدًا بَيْنِي وَبَيْنَكُمْ وَمَنْ عِندَهُ عِلْمُ الْكِتَابِ
“నువ్వు ప్రవక్తవు కావు” అని ఈ అవిశ్వాసులు అంటున్నారు. “ఈ విషయమై నాకూ – మీకూ మధ్య సాక్షిగా అల్లాహ్ చాలు. గ్రంథజ్ఞానం గలవారు కూడా (ఈ విషయానికి సాక్షులుగా ఉంటారు)” అని వారికి చెప్పు.
14. సూరా ఇబ్రహీం (Ibrahim)
14:1 الر ۚ كِتَابٌ أَنزَلْنَاهُ إِلَيْكَ لِتُخْرِجَ النَّاسَ مِنَ الظُّلُمَاتِ إِلَى النُّورِ بِإِذْنِ رَبِّهِمْ إِلَىٰ صِرَاطِ الْعَزِيزِ الْحَمِيدِ
అలిఫ్ లామ్ రా. (ఓ ముహమ్మద్ – సఅసం!) నువ్వు ప్రజలను అంధకారాల నుంచి వెలికి తీసి కాంతి వైపుకు తీసుకురావటానికి మహోన్నతమైన ఈ గ్రంథాన్ని మేము నీ వైపు పంపాము – వారి ప్రభువు ఆజ్ఞపై. తిరుగులేనివాడు, స్తోత్రములకు అర్హుడైన వాని మార్గం వైపుకు (తీసుకురావటానికి).
14:2 اللَّهِ الَّذِي لَهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۗ وَوَيْلٌ لِّلْكَافِرِينَ مِنْ عَذَابٍ شَدِيدٍ
ఆకాశాలలో, భూమిలో ఉన్న సమస్తమూ ఆ అల్లాహ్‌దే. తిరస్కారుల కొరకు కఠిన శిక్ష మూలంగా వినాశం ఉంది.
14:3 الَّذِينَ يَسْتَحِبُّونَ الْحَيَاةَ الدُّنْيَا عَلَى الْآخِرَةِ وَيَصُدُّونَ عَن سَبِيلِ اللَّهِ وَيَبْغُونَهَا عِوَجًا ۚ أُولَٰئِكَ فِي ضَلَالٍ بَعِيدٍ
వారు పరలోకానికి బదులు ప్రాపంచిక జీవితాన్నే ప్రేమిస్తున్నారు. అల్లాహ్ మార్గం నుంచి (ప్రజలను)ఆపుతూ అందులో వక్రతను సృజించగోర్తున్నారు. మార్గభ్రష్టతలో వారు చాలా దూరం వెళ్ళిపోయారు.
14:4 وَمَا أَرْسَلْنَا مِن رَّسُولٍ إِلَّا بِلِسَانِ قَوْمِهِ لِيُبَيِّنَ لَهُمْ ۖ فَيُضِلُّ اللَّهُ مَن يَشَاءُ وَيَهْدِي مَن يَشَاءُ ۚ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ
మేము ఏ ప్రవక్తను పంపినా, అతడు విషయాన్ని స్పష్టంగా విడమరచి చెప్పడానికి వీలుగా తన జాతి వారి భాషలో మాట్లాడే వానిగా చేసి పంపాము. ఆపైన అల్లాహ్ తాను కోరినవారిని అపమార్గం పట్టిస్తాడు, తాను కోరిన వారికి సన్మార్గం చూపిస్తాడు. ఆయన సర్వాధిక్యుడు, వివేకవంతుడు.
14:5 وَلَقَدْ أَرْسَلْنَا مُوسَىٰ بِآيَاتِنَا أَنْ أَخْرِجْ قَوْمَكَ مِنَ الظُّلُمَاتِ إِلَى النُّورِ وَذَكِّرْهُم بِأَيَّامِ اللَّهِ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّكُلِّ صَبَّارٍ شَكُورٍ
మేము మూసాకు మా సూచనలిచ్చి పంపుతూ, “నువ్వు నీ జాతి వారిని అంధకారాల నుంచి – వెలికి తీసి – వెలుగులోకి తీసుకురా. అల్లాహ్ యొక్క మహోపకారాలను వారికి జ్ఞాపకం చేయి” అని చెప్పిన సందర్భాన్ని (గుర్తుకు తెచ్చుకోండి). నిశ్చయంగా ఇందులో సహనమూర్తులు, కృతజ్ఞతా మనస్కులైన ప్రతి ఒక్కరికీ సూచనలు ఉన్నాయి.
14:6 وَإِذْ قَالَ مُوسَىٰ لِقَوْمِهِ اذْكُرُوا نِعْمَةَ اللَّهِ عَلَيْكُمْ إِذْ أَنجَاكُم مِّنْ آلِ فِرْعَوْنَ يَسُومُونَكُمْ سُوءَ الْعَذَابِ وَيُذَبِّحُونَ أَبْنَاءَكُمْ وَيَسْتَحْيُونَ نِسَاءَكُمْ ۚ وَفِي ذَٰلِكُم بَلَاءٌ مِّن رَّبِّكُمْ عَظِيمٌ
మూసా తన జాతి వారితో ఇలా అన్నప్పటి విషయం కూడా గుర్తుంచుకోదగినదే: “అల్లాహ్ మీకు చేసిన మేళ్ళను జ్ఞాపకం చేసుకోండి – మిమ్మల్ని తీవ్రంగా వేధిస్తూ ఉన్న ఫిరౌను జనుల చెర నుండి ఆయన మీకు విముక్తిని కల్పించాడు. వారు మీ కొడుకులను చంపేసి, మీ స్త్రీలను మాత్రమే బ్రతకనిచ్చేవారు. ఇది మీకు మీ ప్రభువు తరఫున పెద్ద పరీక్షగా ఉండేది.”
14:7 وَإِذْ تَأَذَّنَ رَبُّكُمْ لَئِن شَكَرْتُمْ لَأَزِيدَنَّكُمْ ۖ وَلَئِن كَفَرْتُمْ إِنَّ عَذَابِي لَشَدِيدٌ
“మీరు గనక కృతజ్ఞులుగా మెలిగితే, నేను మీకు మరింత అధికంగా అనుగ్రహిస్తాను. ఒకవేళ మీరు గనక (చేసిన) మేలును మరచిపోతే నిశ్చయంగా నా శిక్ష చాలా కఠినమైనది (అని మరువకండి)” అని మీ ప్రభువు మిమ్మల్ని సావధానపరచిన విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి!
14:8 وَقَالَ مُوسَىٰ إِن تَكْفُرُوا أَنتُمْ وَمَن فِي الْأَرْضِ جَمِيعًا فَإِنَّ اللَّهَ لَغَنِيٌّ حَمِيدٌ
మూసా ఇంకా ఇలా అన్నాడు: “ఒకవేళ మీరూ, భూమండలంలోని వారందరూ కూడా దేవుని పట్ల, మేలును మరచి ప్రవర్తించినా (ఆయనకు వాటిల్లే నష్టం ఏమీ లేదు) ఆయన ఏ అక్కరా లేనివాడు, ప్రశంసనీయుడు.”
14:9 أَلَمْ يَأْتِكُمْ نَبَأُ الَّذِينَ مِن قَبْلِكُمْ قَوْمِ نُوحٍ وَعَادٍ وَثَمُودَ ۛ وَالَّذِينَ مِن بَعْدِهِمْ ۛ لَا يَعْلَمُهُمْ إِلَّا اللَّهُ ۚ جَاءَتْهُمْ رُسُلُهُم بِالْبَيِّنَاتِ فَرَدُّوا أَيْدِيَهُمْ فِي أَفْوَاهِهِمْ وَقَالُوا إِنَّا كَفَرْنَا بِمَا أُرْسِلْتُم بِهِ وَإِنَّا لَفِي شَكٍّ مِّمَّا تَدْعُونَنَا إِلَيْهِ مُرِيبٍ
ఏమిటీ, మీకు పూర్వం గతించిన వారి సమాచారాలు మీకు చేరలేదా? నూహ్ జాతి, ఆద్, సమూదు జాతి, ఇంకా వాటి తరువాత వచ్చిన వారి సంగతులు, వారి గురించి అల్లాహ్‌కు తప్ప ఇంకెవరికీ తెలియదు. వారి వద్దకు వారి ప్రవక్తలు స్పష్టమైన నిదర్శనాలు తీసుకుని వచ్చారు. కాని వాళ్ళు తమ చేతులను తమ నోటిలో పెట్టుకున్నారు. “మీకు ఏ విషయం ఇచ్చి పంపటం జరిగిందో దాన్ని మేము తిరస్కరిస్తున్నాము. ఏ విషయం వైపుకు మీరు మమ్మల్ని పిలుస్తున్నారో దానిపై మాకు తీవ్రమైన సందేహం ఉంది” అని అన్నారు.
14:10 قَالَتْ رُسُلُهُمْ أَفِي اللَّهِ شَكٌّ فَاطِرِ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ يَدْعُوكُمْ لِيَغْفِرَ لَكُم مِّن ذُنُوبِكُمْ وَيُؤَخِّرَكُمْ إِلَىٰ أَجَلٍ مُّسَمًّى ۚ قَالُوا إِنْ أَنتُمْ إِلَّا بَشَرٌ مِّثْلُنَا تُرِيدُونَ أَن تَصُدُّونَا عَمَّا كَانَ يَعْبُدُ آبَاؤُنَا فَأْتُونَا بِسُلْطَانٍ مُّبِينٍ
“ఏమిటీ, భూమ్యాకాశాల నిర్మాత అయిన అల్లాహ్‌పైనే మీకు అనుమానం ఉందా? మీ పాపాలన్నింటినీ క్షమించి, ఒక నిర్ణీత కాలం వరకు మీకు గడువు ఇవ్వడానికే ఆయన మిమ్మల్ని పిలుస్తున్నాడు” అని వారి ప్రవక్తలు అన్నారు. దానికి వారు, “మీరూ మాలాంటి మనుషులే తప్ప మరేమీ కాదు. మా తాత ముత్తాతలు పూజిస్తూ వచ్చిన దేవుళ్ళ ఆరాధన నుండి మమ్మల్ని ఆపాలన్నది మీ ఉద్దేశం. మరైతే స్పష్టమైన ప్రమాణాన్ని మా ముందు తీసుకురండి” అని చెప్పారు.
14:11 قَالَتْ لَهُمْ رُسُلُهُمْ إِن نَّحْنُ إِلَّا بَشَرٌ مِّثْلُكُمْ وَلَٰكِنَّ اللَّهَ يَمُنُّ عَلَىٰ مَن يَشَاءُ مِنْ عِبَادِهِ ۖ وَمَا كَانَ لَنَا أَن نَّأْتِيَكُم بِسُلْطَانٍ إِلَّا بِإِذْنِ اللَّهِ ۚ وَعَلَى اللَّهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُونَ
వారి ప్రవక్తలు వారితో ఇలా అన్నారు: “అవును, మేమూ మీలాంటి మనుషులమే. అయితే అల్లాహ్ తన దాసులలో తాను కోరిన వారిపై ప్రత్యేకంగా దయదలుస్తాడు. అల్లాహ్ అనుజ్ఞ లేకుండా మేము ఏ ప్రమాణాన్ని కూడా మీ వద్దకు తేలేము. విశ్వాసులైనవారు కేవలం అల్లాహ్‌నే నమ్ముకోవాలి.
14:12 وَمَا لَنَا أَلَّا نَتَوَكَّلَ عَلَى اللَّهِ وَقَدْ هَدَانَا سُبُلَنَا ۚ وَلَنَصْبِرَنَّ عَلَىٰ مَا آذَيْتُمُونَا ۚ وَعَلَى اللَّهِ فَلْيَتَوَكَّلِ الْمُتَوَكِّلُونَ
“ఇంతకీ మనం అల్లాహ్‌ను ఎందుకు నమ్మకూడదు? మనకు మన మార్గాలను చూపింది ఆయనే కదా! దైవసాక్షి! మీ వేధింపులపై మేము ఓపిక పడతాము. నమ్ముకునే వారు అల్లాహ్‌ను మాత్రమే నమ్ముకోవాలి.”
14:13 وَقَالَ الَّذِينَ كَفَرُوا لِرُسُلِهِمْ لَنُخْرِجَنَّكُم مِّنْ أَرْضِنَا أَوْ لَتَعُودُنَّ فِي مِلَّتِنَا ۖ فَأَوْحَىٰ إِلَيْهِمْ رَبُّهُمْ لَنُهْلِكَنَّ الظَّالِمِينَ
తిరస్కారులు తమ ప్రవక్తల నుద్దేశించి, “మేము మిమ్మల్ని దేశం నుంచి వెళ్ళగొడ్తాము. లేదంటారా, మీరు మా మతంలోకి తిరిగి వచ్చేయండి” అని బెదిరించారు. అప్పుడు వారి ప్రభువు వారి వద్దకు ‘వహీ’ (సందేశం) పంపిస్తూ, “మేము ఈ దుర్మార్గులను నాశనం చేస్తాము.
14:14 وَلَنُسْكِنَنَّكُمُ الْأَرْضَ مِن بَعْدِهِمْ ۚ ذَٰلِكَ لِمَنْ خَافَ مَقَامِي وَخَافَ وَعِيدِ
“వారి తరువాత మేము మిమ్మల్ని ఈ ధరణిపై నివసింపజేస్తాము. నా సమక్షంలో నిలబడే విషయమై భయపడేవారికి, నా హెచ్చరికపై భీతిల్లేవారికి లభించే బహుమానం ఇది” (అని అభయమిచ్చాడు).
14:15 وَاسْتَفْتَحُوا وَخَابَ كُلُّ جَبَّارٍ عَنِيدٍ
వారు తీర్పును కోరారు. (అప్పుడు) పొగరుబోతు, సత్య విరోధి అయిన ప్రతి ఒక్కడూ పరాభవం పాలయ్యాడు.
14:16 مِّن وَرَائِهِ جَهَنَّمُ وَيُسْقَىٰ مِن مَّاءٍ صَدِيدٍ
అతడి (చావు) వెనుకే నరకం ఉన్నది. అక్కడ అతడికి త్రాగటానికి చీము నెత్తురుతో కూడుకున్న నీరు ఇవ్వబడు తుంది.
14:17 يَتَجَرَّعُهُ وَلَا يَكَادُ يُسِيغُهُ وَيَأْتِيهِ الْمَوْتُ مِن كُلِّ مَكَانٍ وَمَا هُوَ بِمَيِّتٍ ۖ وَمِن وَرَائِهِ عَذَابٌ غَلِيظٌ
అతడు అతి కష్టమ్మీద ఒక్కొక్క గుక్కెడూ త్రాగుతాడు. కాని గొంతులోకి దించలేకపోతాడు. అన్నిచోట్ల నుంచీ మృత్యువు వచ్చి కబళించబోతున్నట్లు అతనికి అనిపిస్తుంది. కాని అతడు చావడు. మరి అతడి వెనుక కూడా మరో దుర్భరమైన శిక్ష ఉంటుంది.
14:18 مَّثَلُ الَّذِينَ كَفَرُوا بِرَبِّهِمْ ۖ أَعْمَالُهُمْ كَرَمَادٍ اشْتَدَّتْ بِهِ الرِّيحُ فِي يَوْمٍ عَاصِفٍ ۖ لَّا يَقْدِرُونَ مِمَّا كَسَبُوا عَلَىٰ شَيْءٍ ۚ ذَٰلِكَ هُوَ الضَّلَالُ الْبَعِيدُ
తమ పరిపోషకుని పట్ల తిరస్కార వైఖరిని అవలంబించిన వారి ఉపమానం వారి కర్మలు తుఫాను రోజున వీచే పెనుగాలి వాతన పడిన బూడిద లాంటివి. తాము చేసుకున్న కర్మలలో దేనిపైనా వారికి అధికారం ఉండదు. బహు దూరపు మార్గభ్రష్టత అంటే ఇదే.
14:19 أَلَمْ تَرَ أَنَّ اللَّهَ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ بِالْحَقِّ ۚ إِن يَشَأْ يُذْهِبْكُمْ وَيَأْتِ بِخَلْقٍ جَدِيدٍ
ఏమిటీ, అల్లాహ్ భూమ్యాకాశాలను సత్యబద్ధంగా (అత్యంత యుక్తితో) సృష్టించటాన్ని నువ్వు చూడటం లేదా? ఆయన గనక తలచుకుంటే మీ అందరినీ తుద ముట్టించి, మరో సరికొత్త సృష్టిని తేగలడు.
14:20 وَمَا ذَٰلِكَ عَلَى اللَّهِ بِعَزِيزٍ
అలా చేయటం అల్లాహ్‌కు ఏమాత్రం కష్టతరం కాదు.
14:21 وَبَرَزُوا لِلَّهِ جَمِيعًا فَقَالَ الضُّعَفَاءُ لِلَّذِينَ اسْتَكْبَرُوا إِنَّا كُنَّا لَكُمْ تَبَعًا فَهَلْ أَنتُم مُّغْنُونَ عَنَّا مِنْ عَذَابِ اللَّهِ مِن شَيْءٍ ۚ قَالُوا لَوْ هَدَانَا اللَّهُ لَهَدَيْنَاكُمْ ۖ سَوَاءٌ عَلَيْنَا أَجَزِعْنَا أَمْ صَبَرْنَا مَا لَنَا مِن مَّحِيصٍ
వారంతా అల్లాహ్‌కు ఎదురుగా నిలబడతారు. అప్పుడు బలహీనులు, (ప్రపంచంలో) పెద్ద మనుషులుగా చెలామణి అయినవారిని ఉద్దేశించి, “మేము (ఒకప్పుడు) మీకు అనుయాయులుగా ఉండేవాళ్ళం. మరి మీరు ఇప్పుడు మా నుంచి దైవశిక్షలలో ఏ కొంచెమైనా శిక్షను తొలగించగలరా?” అని అడుగుతారు. దానికి వారు ఇలా సమాధానమిస్తారు : “అల్లాహ్ గనక మాకు సన్మార్గం చూపి ఉంటే మేము కూడా తప్పకుండా మీకు మార్గదర్శకత్వం వహించి ఉండేవాళ్ళం. ఇప్పుడు మనం అసహనాన్ని ప్రదర్శించినా, సహనం వహించినా ఒక్కటే. మనకిక తప్పించుకునే మార్గం ఏదీ లేదు.”
14:22 وَقَالَ الشَّيْطَانُ لَمَّا قُضِيَ الْأَمْرُ إِنَّ اللَّهَ وَعَدَكُمْ وَعْدَ الْحَقِّ وَوَعَدتُّكُمْ فَأَخْلَفْتُكُمْ ۖ وَمَا كَانَ لِيَ عَلَيْكُم مِّن سُلْطَانٍ إِلَّا أَن دَعَوْتُكُمْ فَاسْتَجَبْتُمْ لِي ۖ فَلَا تَلُومُونِي وَلُومُوا أَنفُسَكُم ۖ مَّا أَنَا بِمُصْرِخِكُمْ وَمَا أَنتُم بِمُصْرِخِيَّ ۖ إِنِّي كَفَرْتُ بِمَا أَشْرَكْتُمُونِ مِن قَبْلُ ۗ إِنَّ الظَّالِمِينَ لَهُمْ عَذَابٌ أَلِيمٌ
సమస్త వ్యవహారంపై తీర్పు జరిగిపోయిన తరువాత షైతాన్ ఇలా అంటాడు: “అల్లాహ్ మీకు సత్యబద్ధమైన వాగ్దానం చేశాడు. నేను మాత్రం మీకు చేసిన వాగ్దానాలకు విరుద్ధంగా ప్రవర్తించాను. నాకు మీపై ఎలాంటి అధికారమూ లేదు. కాకపోతే, నేను మీకు పిలుపునిచ్చాను. మీరు నా మాటను అంగీకరించారు. కాబట్టి మీరు (ఇప్పుడు) నన్ను నిందించకండి; మిమ్మల్ని మీరే నిందించుకోండి. మీ మొరలను నేను ఆలకించ లేను. నా మొరను మీరూ ఆలకించలేరు. ఇంతకు మునుపు మీరు నన్ను దైవత్వంలో భాగస్థునిగా నిలబెట్టారన్న విషయాన్ని నేను ఎంత మాత్రం ఒప్పుకోను. నిశ్చయంగా అటువంటి దుర్మార్గుల కోసం వ్యధాభరితమైన శిక్ష ఉంది.”
14:23 وَأُدْخِلَ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا بِإِذْنِ رَبِّهِمْ ۖ تَحِيَّتُهُمْ فِيهَا سَلَامٌ
విశ్వసించి, సత్కార్యాలు చేసినవారు క్రింద సెలయేరులు ప్రవహించే స్వర్గ వనాలలో ప్రవేశింపజెయ్యబడతారు. తమ ప్రభువు అనుజ్ఞపై వారక్కడ కలకాలం ఉంటారు. ‘సలామ్’తో సహా అక్కడ వారికి స్వాగతం లభిస్తుంది.
14:24 أَلَمْ تَرَ كَيْفَ ضَرَبَ اللَّهُ مَثَلًا كَلِمَةً طَيِّبَةً كَشَجَرَةٍ طَيِّبَةٍ أَصْلُهَا ثَابِتٌ وَفَرْعُهَا فِي السَّمَاءِ
అల్లాహ్ పరిశుద్ధ వచనాన్ని దేంతో పోల్చాడో మీరు గమనించలేదా? అది ఒక పరిశుద్ధ వృక్షం వంటిది. అది బాగా వ్రేళ్లూనుకుని ఉంది. దాని శాఖలు ఆకాశంలో ఉన్నాయి.
14:25 تُؤْتِي أُكُلَهَا كُلَّ حِينٍ بِإِذْنِ رَبِّهَا ۗ وَيَضْرِبُ اللَّهُ الْأَمْثَالَ لِلنَّاسِ لَعَلَّهُمْ يَتَذَكَّرُونَ
తన ప్రభువు ఆజ్ఞతో అది ఎల్లప్పుడూ పండ్లను ఇస్తోంది. ప్రజలు గుణపాఠం నేర్చుకునేందుకుగాను అల్లాహ్ వారి ముందు ఈ ఉపమానాలను వివరిస్తున్నాడు.
14:26 وَمَثَلُ كَلِمَةٍ خَبِيثَةٍ كَشَجَرَةٍ خَبِيثَةٍ اجْتُثَّتْ مِن فَوْقِ الْأَرْضِ مَا لَهَا مِن قَرَارٍ
(దీనికి భిన్నంగా) అశుద్ధ వచనం ఉపమానం అశుద్ధ వృక్షం వంటిది. అది నేల ఉపరితలంపై నుంచే పెకలించి వేయబడింది. దానికి స్థిరత్వం అనేదే లేదు.
14:27 يُثَبِّتُ اللَّهُ الَّذِينَ آمَنُوا بِالْقَوْلِ الثَّابِتِ فِي الْحَيَاةِ الدُّنْيَا وَفِي الْآخِرَةِ ۖ وَيُضِلُّ اللَّهُ الظَّالِمِينَ ۚ وَيَفْعَلُ اللَّهُ مَا يَشَاءُ
విశ్వసించిన వారికి అల్లాహ్ స్థిరమైన మాటపై ప్రాపంచిక జీవితంలోనూ, పరలోకంలోనూ నిలకడను ప్రసాదిస్తాడు. అయితే అన్యాయపరులను మాత్రం ఆయన అపమార్గానికి లోను చేస్తాడు. అల్లాహ్ తాను తలచుకున్నది చేసి తీరుతాడు.
14:28 أَلَمْ تَرَ إِلَى الَّذِينَ بَدَّلُوا نِعْمَتَ اللَّهِ كُفْرًا وَأَحَلُّوا قَوْمَهُمْ دَارَ الْبَوَارِ
అల్లాహ్ ప్రసాదించిన అనుగ్రహానికి బదులుగా కృతఘ్నతకు పాల్పడి, తమ జాతిని వినాశకర కుహరంలోనికి దించిన వారి వైపు నీవు దృష్టిని సారించలేదా?!
14:29 جَهَنَّمَ يَصْلَوْنَهَا ۖ وَبِئْسَ الْقَرَارُ
అంటే – నరకంలోనికి. వారంతా అందులోకి ప్రవేశిస్తారు. అది అత్యంత చెడ్డ నివాస స్థానం.
14:30 وَجَعَلُوا لِلَّهِ أَندَادًا لِّيُضِلُّوا عَن سَبِيلِهِ ۗ قُلْ تَمَتَّعُوا فَإِنَّ مَصِيرَكُمْ إِلَى النَّارِ
ప్రజలను అల్లాహ్ మార్గం నుంచి పెడత్రోవ పట్టించటానికి వారు అల్లాహ్‌కు సహవర్తుల్ని కల్పించారు. “సరే! సుఖాలను జుర్రుకోండి. చివరికి మీరు మరలిపోవలసింది నరకానికే” అని (ఓ ప్రవక్తా!) నీవు చెప్పు.
14:31 قُل لِّعِبَادِيَ الَّذِينَ آمَنُوا يُقِيمُوا الصَّلَاةَ وَيُنفِقُوا مِمَّا رَزَقْنَاهُمْ سِرًّا وَعَلَانِيَةً مِّن قَبْلِ أَن يَأْتِيَ يَوْمٌ لَّا بَيْعٌ فِيهِ وَلَا خِلَالٌ
(ఓ ప్రవక్తా!) క్రయవిక్రయాలుగానీ, స్నేహబంధాలుగానీ ఉండని రోజు రాకముందే నమాజులను నెలకొల్పమనీ, మేము ప్రసాదించిన దానిలో నుంచి గోప్యంగానూ, బహిరంగంగానూ ఖర్చు పెట్టమని విశ్వాసులైన నా దాసులకు చెప్పు.
14:32 اللَّهُ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ وَأَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَأَخْرَجَ بِهِ مِنَ الثَّمَرَاتِ رِزْقًا لَّكُمْ ۖ وَسَخَّرَ لَكُمُ الْفُلْكَ لِتَجْرِيَ فِي الْبَحْرِ بِأَمْرِهِ ۖ وَسَخَّرَ لَكُمُ الْأَنْهَارَ
భూమ్యాకాశాలను సృష్టించి, ఆకాశాల నుండి వర్షాన్ని కురిపించి, తద్వారా మీ ఆహారం కోసం పండ్లు ఫలాలను ఉత్పన్నం చేసినవాడే అల్లాహ్. ఆయనే తన ఆజ్ఞతో సముద్రంలో నౌకలు నడవటానికి వాటిని మీకు లోబరచాడు. ఆయనే నదీ నదాలను మీ అధీనంలో ఉంచాడు.
14:33 وَسَخَّرَ لَكُمُ الشَّمْسَ وَالْقَمَرَ دَائِبَيْنِ ۖ وَسَخَّرَ لَكُمُ اللَّيْلَ وَالنَّهَارَ
ఆయనే నిరంతర ప్రయాణం చేస్తూ పోతున్న సూర్యచంద్రులను మీకు లోబరచాడు. రేయింబవళ్ళను కూడా ఆయన మీ సేవకై కట్టుబడి ఉండేలా చేశాడు.
14:34 وَآتَاكُم مِّن كُلِّ مَا سَأَلْتُمُوهُ ۚ وَإِن تَعُدُّوا نِعْمَتَ اللَّهِ لَا تُحْصُوهَا ۗ إِنَّ الْإِنسَانَ لَظَلُومٌ كَفَّارٌ
మరి ఆయనే మీరు అడిగిన దానినల్లా మీకు ఇచ్చి ఉన్నాడు. మీరు అల్లాహ్ చేసిన మేళ్లను లెక్కించదలిచినా లెక్కించలేరు. నిశ్చయంగా మానవుడు మహా అన్యాయపరుడు, మేలును మరిచేవాడు.
14:35 وَإِذْ قَالَ إِبْرَاهِيمُ رَبِّ اجْعَلْ هَٰذَا الْبَلَدَ آمِنًا وَاجْنُبْنِي وَبَنِيَّ أَن نَّعْبُدَ الْأَصْنَامَ
ఇబ్రాహీమ్ (ప్రార్థించిన ఆ సందర్భాన్ని కూడా కాస్త జ్ఞాపకం చేసుకోండి. అతను) ఇలా వేడుకున్నాడు: “నా ప్రభూ! ఈ నగరాన్ని శాంతి భద్రతల నగరంగా చేయి.నన్నూ, నా సంతానాన్నీ విగ్రహ పూజ నుంచి కాపాడు.”
14:36 رَبِّ إِنَّهُنَّ أَضْلَلْنَ كَثِيرًا مِّنَ النَّاسِ ۖ فَمَن تَبِعَنِي فَإِنَّهُ مِنِّي ۖ وَمَنْ عَصَانِي فَإِنَّكَ غَفُورٌ رَّحِيمٌ
“నా ప్రభూ! అవి ఎంతో మందిని పెడదారి పట్టించాయి. కనుక నన్ను అనుసరించినవాడే నా వాడు. కాని ఎవడైనా నాకు అవిధేయత చూపితే నువ్వు అమితంగా క్షమించేవాడవు, కనికరించేవాడవు.”
14:37 رَّبَّنَا إِنِّي أَسْكَنتُ مِن ذُرِّيَّتِي بِوَادٍ غَيْرِ ذِي زَرْعٍ عِندَ بَيْتِكَ الْمُحَرَّمِ رَبَّنَا لِيُقِيمُوا الصَّلَاةَ فَاجْعَلْ أَفْئِدَةً مِّنَ النَّاسِ تَهْوِي إِلَيْهِمْ وَارْزُقْهُم مِّنَ الثَّمَرَاتِ لَعَلَّهُمْ يَشْكُرُونَ
“మా ప్రభూ! నా సంతానంలో కొందరిని పంటలు పండని కటికలోయలో, నీ పవిత్రగృహం వద్ద వసింపజేశాను. మా ప్రభూ! వారు నమాజును నెలకొల్పేందుకే (ఇక్కడ వదలిపెట్టాను). కనుక ప్రజలలో కొందరి మనసులు వారి వైపుకు మొగ్గేలా చేయి. వారికి తినటానికి పండ్లు ఫలాలను ప్రసాదించు – వారు కృతజ్ఞులుగా మెలిగేందుకు.
14:38 رَبَّنَا إِنَّكَ تَعْلَمُ مَا نُخْفِي وَمَا نُعْلِنُ ۗ وَمَا يَخْفَىٰ عَلَى اللَّهِ مِن شَيْءٍ فِي الْأَرْضِ وَلَا فِي السَّمَاءِ
“ఓ మా ప్రభూ! మేము దాస్తున్నదీ, బహిర్గతం చేస్తున్నదీ అంతా నీకు తెలుసు. “భూమిలోగాని, ఆకాశాలలోగాని ఏ వస్తువూ అల్లాహ్ నుండి దాగి లేదు.
14:39 الْحَمْدُ لِلَّهِ الَّذِي وَهَبَ لِي عَلَى الْكِبَرِ إِسْمَاعِيلَ وَإِسْحَاقَ ۚ إِنَّ رَبِّي لَسَمِيعُ الدُّعَاءِ
“ఈ ముసలితనంలో నాకు ఇస్మాయీల్, ఇస్‌హాఖులను ప్రసాదించిన అల్లాహ్‌కు కృతజ్ఞతలు. నిశ్చయంగా నా ప్రభువు మొరను ఆలకించేవాడు.”
14:40 رَبِّ اجْعَلْنِي مُقِيمَ الصَّلَاةِ وَمِن ذُرِّيَّتِي ۚ رَبَّنَا وَتَقَبَّلْ دُعَاءِ
“నా ప్రభూ! నన్ను నమాజును నెలకొల్పేవానిగా చెయ్యి. నా సంతతి నుండి కూడా (ఈ వ్యవస్థను నెలకొల్పే వారిని నిలబెట్టు). ప్రభూ! నా ప్రార్థనను ఆమోదించు.”
14:41 رَبَّنَا اغْفِرْ لِي وَلِوَالِدَيَّ وَلِلْمُؤْمِنِينَ يَوْمَ يَقُومُ الْحِسَابُ
“మా ప్రభూ! నన్ను, నా తల్లిదండ్రులను, విశ్వాసులను లెక్క తేల్చే రోజున క్షమించు.”
14:42 وَلَا تَحْسَبَنَّ اللَّهَ غَافِلًا عَمَّا يَعْمَلُ الظَّالِمُونَ ۚ إِنَّمَا يُؤَخِّرُهُمْ لِيَوْمٍ تَشْخَصُ فِيهِ الْأَبْصَارُ
దుర్మార్గుల కార్యకలాపాల పట్ల అల్లాహ్ అశ్రద్ధ వహిస్తున్నాడని అనుకోకు. ఆయన వారికి ఒకానొక రోజు వరకు గడువు ఇస్తున్నాడు – ఆ రోజు వారు కన్నులు తేలవేస్తారు.
14:43 مُهْطِعِينَ مُقْنِعِي رُءُوسِهِمْ لَا يَرْتَدُّ إِلَيْهِمْ طَرْفُهُمْ ۖ وَأَفْئِدَتُهُمْ هَوَاءٌ
తలలు పైకెత్తి పరుగులు తీస్తుంటారు. వారి చూపులు స్వయంగా వారి వైపుకు కూడా తిరిగిరావు. వారి హృదయాల్లో శూన్యం ఆవరిస్తుంది.
14:44 وَأَنذِرِ النَّاسَ يَوْمَ يَأْتِيهِمُ الْعَذَابُ فَيَقُولُ الَّذِينَ ظَلَمُوا رَبَّنَا أَخِّرْنَا إِلَىٰ أَجَلٍ قَرِيبٍ نُّجِبْ دَعْوَتَكَ وَنَتَّبِعِ الرُّسُلَ ۗ أَوَلَمْ تَكُونُوا أَقْسَمْتُم مِّن قَبْلُ مَا لَكُم مِّن زَوَالٍ
(ఓ ప్రవక్తా!) శిక్ష వచ్చే రోజు గురించి ప్రజలను హెచ్చరించు. ఆ సమయంలో దుర్మార్గులు, “ప్రభూ! మాకు కొద్దిపాటి వ్యవధిని ఇస్తే మేము నీ పిలుపును అందుకుని, నీ ప్రవక్తలను అనుసరిస్తాము” అని అంటారు. (అప్పుడు వారితో ఇలా అనబడుతుంది), “ఏమిటీ, ప్రపంచం నుండి నిష్క్రమించటమనేది మాకు లేనే లేదని ఇంతకు ముందు మీరు ఒట్టేసి మరీ చెప్పలేదా?”
14:45 وَسَكَنتُمْ فِي مَسَاكِنِ الَّذِينَ ظَلَمُوا أَنفُسَهُمْ وَتَبَيَّنَ لَكُمْ كَيْفَ فَعَلْنَا بِهِمْ وَضَرَبْنَا لَكُمُ الْأَمْثَالَ
“తమకు తాము అన్యాయం చేసుకున్న వారి ఇండ్లలో మీరు మీ నివాసాలను ఏర్పరచుకోలేదా? వారి పట్ల మేము ఎలా వ్యవహరించామో మీకు అవగతం కాలేదా? (మీకు బోధపడేందుకు) మేము ఎన్నో ఉదాహరణలను వివరించాము కదా!”
14:46 وَقَدْ مَكَرُوا مَكْرَهُمْ وَعِندَ اللَّهِ مَكْرُهُمْ وَإِن كَانَ مَكْرُهُمْ لِتَزُولَ مِنْهُ الْجِبَالُ
వాళ్ళు తమ ఎత్తుల్ని తాము వేసి చూసుకున్నారు. వారి ఎత్తుగడలన్నీ అల్లాహ్ దృష్టిలో ఉన్నాయి. వారి ఎత్తుగడలు పర్వతాలను కదిలించేటంతటి భీకరమైనవేమీ కావు.
14:47 فَلَا تَحْسَبَنَّ اللَّهَ مُخْلِفَ وَعْدِهِ رُسُلَهُ ۗ إِنَّ اللَّهَ عَزِيزٌ ذُو انتِقَامٍ
(ఓ ప్రవక్తా!) అల్లాహ్ తన ప్రవక్తలకు చేసిన వాగ్దానానికి విరుద్ధంగా వ్యవహరిస్తాడని అనుకోకు. నిశ్చయంగా అల్లాహ్ సర్వాధిక్యుడు, ప్రతీకారం చేసేవాడు.
14:48 يَوْمَ تُبَدَّلُ الْأَرْضُ غَيْرَ الْأَرْضِ وَالسَّمَاوَاتُ ۖ وَبَرَزُوا لِلَّهِ الْوَاحِدِ الْقَهَّارِ
ఏ రోజున ఈ భూమి మరో భూమిగా మార్చివేయబడుతుందో, ఆకాశం సయితం (మారిపోతుందో), అప్పుడు అందరూ సర్వశక్తిమంతుడు, ఒకే ఒక్కడైన అల్లాహ్ ముందుకు వస్తారు.
14:49 وَتَرَى الْمُجْرِمِينَ يَوْمَئِذٍ مُّقَرَّنِينَ فِي الْأَصْفَادِ
ఆ రోజు అపరాధులంతా ఒకచోట సంకెళ్ళతో బంధించబడి ఉండటం నువ్వు చూస్తావు.
14:50 سَرَابِيلُهُم مِّن قَطِرَانٍ وَتَغْشَىٰ وُجُوهَهُمُ النَّارُ
వారి దుస్తులు గంధకంతో చేయబడిన దుస్తులై ఉంటాయి. అగ్నిజ్వాలలు వారి ముఖాలను సయితం ఆవరించి ఉంటాయి.
14:51 لِيَجْزِيَ اللَّهُ كُلَّ نَفْسٍ مَّا كَسَبَتْ ۚ إِنَّ اللَّهَ سَرِيعُ الْحِسَابِ
అల్లాహ్ ప్రతి వ్యక్తికీ అతని సంపాదనకు తగిన ప్రతిఫలం ఇవ్వటానికే ఇదంతా ఏర్పరచబడింది. నిశ్చయంగా అల్లాహ్ చాలా వేగంగా లెక్క తీసుకుంటాడు.
14:52 هَٰذَا بَلَاغٌ لِّلنَّاسِ وَلِيُنذَرُوا بِهِ وَلِيَعْلَمُوا أَنَّمَا هُوَ إِلَٰهٌ وَاحِدٌ وَلِيَذَّكَّرَ أُولُو الْأَلْبَابِ
ఈ ఖుర్ఆన్ సమస్త మానవుల కొరకు ఒక సందేశం. తద్వారా వారిని హెచ్చరించటానికి, అల్లాహ్ ఒక్కడే ఆరాధ్య దైవమని వారు గ్రహించటానికి, ఇంకా విజ్ఞులు గ్రహించగలగటానికి (ఇది పంపబడింది).
15. సూరా అల్ హిజ్ర్
15:1 الر ۚ تِلْكَ آيَاتُ الْكِتَابِ وَقُرْآنٍ مُّبِينٍ
అలిఫ్ లామ్ రా. ఇవి దైవగ్రంథపు వాక్యాలు. స్పష్టమైన ఖుర్ఆన్లోనివి.
15:2 رُّبَمَا يَوَدُّ الَّذِينَ كَفَرُوا لَوْ كَانُوا مُسْلِمِينَ
తాము ముస్లింలమై ఉంటే బావుండేదే! అని అవిశ్వాసులు ఆశపడే సమయం కూడా వస్తుంది.
15:3 ذَرْهُمْ يَأْكُلُوا وَيَتَمَتَّعُوا وَيُلْهِهِمُ الْأَمَلُ ۖ فَسَوْفَ يَعْلَمُونَ
నువ్వు వాళ్ళను తింటూ, అనుభవిస్తూ, (బూటకపు) ఆశల్లో మునిగిపోయి ఉండేలా వదిలిపెట్టు. త్వరలోనే (వాస్తవం) స్వయంగా వారికే తెలిసివస్తుంది.
15:4 وَمَا أَهْلَكْنَا مِن قَرْيَةٍ إِلَّا وَلَهَا كِتَابٌ مَّعْلُومٌ
మేము ఏ పట్టణాన్ని తుదముట్టించినా రాసిపెట్టిన ఒక నిర్థారిత గడువు ప్రకారమే తుదముట్టించాము.
15:5 مَّا تَسْبِقُ مِنْ أُمَّةٍ أَجَلَهَا وَمَا يَسْتَأْخِرُونَ
ఏ సముదాయం కూడా తన నిర్థారిత సమయానికి ముందు గానీ, వెనుకగానీ పోజాలదు.
15:6 وَقَالُوا يَا أَيُّهَا الَّذِي نُزِّلَ عَلَيْهِ الذِّكْرُ إِنَّكَ لَمَجْنُونٌ
“ఓ జిక్ర్ (ఖుర్ఆన్) అవతరించిన మనిషీ! ఖచ్చితంగా నువ్వు పిచ్చివాడివే.”
15:7 لَّوْ مَا تَأْتِينَا بِالْمَلَائِكَةِ إِن كُنتَ مِنَ الصَّادِقِينَ
“ఒకవేళ నువ్వు సత్యవంతుడవే అయితే దైవదూతలను మా వద్దకు ఎందుకు తీసుకురావు?” అని వారు అంటారు.
15:8 مَا نُنَزِّلُ الْمَلَائِكَةَ إِلَّا بِالْحَقِّ وَمَا كَانُوا إِذًا مُّنظَرِينَ
సత్యబద్ధత లేకుండా మేము (మా) దూతలను పంపము. ఆ సమయంలో వారికి గడువు ఇవ్వబడదు.
15:9 إِنَّا نَحْنُ نَزَّلْنَا الذِّكْرَ وَإِنَّا لَهُ لَحَافِظُونَ
మేమే ఈ ఖుర్ఆన్ను అవతరింపజేశాము. మరి మేమే దీనిని రక్షిస్తాము.
15:10 وَلَقَدْ أَرْسَلْنَا مِن قَبْلِكَ فِي شِيَعِ الْأَوَّلِينَ
మేము నీకు పూర్వం గతించిన సమాజాలలో కూడా ప్రవక్తలను పంపాము.
15:11 وَمَا يَأْتِيهِم مِّن رَّسُولٍ إِلَّا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ
అయితే తమ వద్దకు ఏ ప్రవక్త వచ్చినా వాళ్ళు అతన్ని పరిహసించేవారు.
15:12 كَذَٰلِكَ نَسْلُكُهُ فِي قُلُوبِ الْمُجْرِمِينَ
ఈ విధంగానే మేము అపరాధుల హృదయాల్లోకి దీనిని (అవిశ్వాసాన్ని) పోనిస్తాము.
15:13 لَا يُؤْمِنُونَ بِهِ ۖ وَقَدْ خَلَتْ سُنَّةُ الْأَوَّلِينَ
వారు దానిని విశ్వసించరు. పూర్వీకుల విధానం కూడా ఇలాగే ఉండేది.
15:14 وَلَوْ فَتَحْنَا عَلَيْهِم بَابًا مِّنَ السَّمَاءِ فَظَلُّوا فِيهِ يَعْرُجُونَ
ఒకవేళ మేము వారికోసం ఆకాశద్వారం తెరిచినా, అందులోకి వారు ఎక్కిపోతున్నా సరే,
15:15 لَقَالُوا إِنَّمَا سُكِّرَتْ أَبْصَارُنَا بَلْ نَحْنُ قَوْمٌ مَّسْحُورُونَ
“మాకేదో కనికట్టు లాంటిది చేయబడింది. అంతేకాదు, మాకేదో చేతబడి చేయబడింది” అని అంటారు వారు.
15:16 وَلَقَدْ جَعَلْنَا فِي السَّمَاءِ بُرُوجًا وَزَيَّنَّاهَا لِلنَّاظِرِينَ
నిశ్చయంగా మేము ఆకాశంలో బురుజులను నిర్మించాము. చూపరుల కోసం దానిని అందంగా ముస్తాబు చేశాము.
15:17 وَحَفِظْنَاهَا مِن كُلِّ شَيْطَانٍ رَّجِيمٍ
ఇంకా, దానిని ధూత్కారి అయిన ప్రతి షైతాను బారి నుంచి రక్షించాము.
15:18 إِلَّا مَنِ اسْتَرَقَ السَّمْعَ فَأَتْبَعَهُ شِهَابٌ مُّبِينٌ
కాకపోతే దొంగచాటుగా (ఎవడైనా అక్కడి రహస్య విషయాలను) వినటానికి ప్రయత్నించినప్పుడు స్పష్టమైన అగ్నిజ్వాల ఒకటి వాడ్ని వెంటాడుతుంది.
15:19 وَالْأَرْضَ مَدَدْنَاهَا وَأَلْقَيْنَا فِيهَا رَوَاسِيَ وَأَنبَتْنَا فِيهَا مِن كُلِّ شَيْءٍ مَّوْزُونٍ
ఇంకా మేము భూమిని పరచి, దానిపై పర్వతాలను పాతి పెట్టాము. మరి అందులో ప్రతి వస్తువునూ నిర్ణీత మోతాదులో మొలిపించాము.
15:20 وَجَعَلْنَا لَكُمْ فِيهَا مَعَايِشَ وَمَن لَّسْتُمْ لَهُ بِرَازِقِينَ
అందులోనే మేము మీ జీవనోపాధికి వనరులను సమకూర్చాము ఇంకా మీరు జీవనోపాధి కల్పించని వాటికి కూడా.
15:21 وَإِن مِّن شَيْءٍ إِلَّا عِندَنَا خَزَائِنُهُ وَمَا نُنَزِّلُهُ إِلَّا بِقَدَرٍ مَّعْلُومٍ
అన్నివస్తువుల ఖజానాలు మా వద్దనే ఉన్నాయి. ప్రతి వస్తువునూ మేము తగు మోతాదులో అవతరింపజేస్తాము.
15:22 وَأَرْسَلْنَا الرِّيَاحَ لَوَاقِحَ فَأَنزَلْنَا مِنَ السَّمَاءِ مَاءً فَأَسْقَيْنَاكُمُوهُ وَمَا أَنتُمْ لَهُ بِخَازِنِينَ
మేమే బరువైన గాలులను పంపిస్తున్నాము. మరి ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి, దాన్ని మీకు త్రాపిస్తున్నాము. ఈ (జల) నిధిని సమకూర్చుకోవటం అన్నది మీ వల్ల కాని పని.
15:23 وَإِنَّا لَنَحْنُ نُحْيِي وَنُمِيتُ وَنَحْنُ الْوَارِثُونَ
ప్రాణం పోసేదీ, ప్రాణం తీసేది కూడా మేమే. (ఎట్టకేలకు) వారసులం కూడా మేమే.
15:24 وَلَقَدْ عَلِمْنَا الْمُسْتَقْدِمِينَ مِنكُمْ وَلَقَدْ عَلِمْنَا الْمُسْتَأْخِرِينَ
మీకు పూర్వం సాగిపోయిన వారినీ మేము ఎరుగుదుము. తరువాత వచ్చే వారిని కూడా ఎరుగుదుము.
15:25 وَإِنَّ رَبَّكَ هُوَ يَحْشُرُهُمْ ۚ إِنَّهُ حَكِيمٌ عَلِيمٌ
నీ ప్రభువు వారందరినీ సమీకరిస్తాడు. నిశ్చయంగా అతడు మహా వివేకవంతుడు, అన్నీ తెలిసినవాడు.
15:26 وَلَقَدْ خَلَقْنَا الْإِنسَانَ مِن صَلْصَالٍ مِّنْ حَمَإٍ مَّسْنُونٍ
మేము మనిషిని కుళ్ళి, బాగా ఎండిన మట్టితో సృష్టించాము.
15:27 وَالْجَانَّ خَلَقْنَاهُ مِن قَبْلُ مِن نَّارِ السَّمُومِ
అంతకు ముందు మేము జిన్నాతులను తీవ్రమైన ఉష్ణ జ్వాలతో సృష్టించాము.
15:28 وَإِذْ قَالَ رَبُّكَ لِلْمَلَائِكَةِ إِنِّي خَالِقٌ بَشَرًا مِّن صَلْصَالٍ مِّنْ حَمَإٍ مَّسْنُونٍ
“కుళ్ళి, బాగా ఎండిపోయిన (నల్లని) మట్టితో నేను ఒక మానవుణ్ణి సృష్టించబోతున్నాను” అని నీ ప్రభువు దూతలతో అన్నాడు.
15:29 فَإِذَا سَوَّيْتُهُ وَنَفَخْتُ فِيهِ مِن رُّوحِي فَقَعُوا لَهُ سَاجِدِينَ
“నేను అతణ్ణి పూర్తిగా తయారుచేసి, అతనిలో నా ఆత్మను ఊదినప్పుడు మీరంతా అతని ముందు సాష్టాంగపడండి.”
15:30 فَسَجَدَ الْمَلَائِكَةُ كُلُّهُمْ أَجْمَعُونَ
దూతలందరూ సాష్టాంగపడ్డారు –
15:31 إِلَّا إِبْلِيسَ أَبَىٰ أَن يَكُونَ مَعَ السَّاجِدِينَ
ఒక్క ఇబ్లీసు తప్ప! సాష్టాంగపడే వారితో చేరటానికి వాడు నిరాకరించాడు.
15:32 قَالَ يَا إِبْلِيسُ مَا لَكَ أَلَّا تَكُونَ مَعَ السَّاجِدِينَ
“ఓ ఇబ్లీస్! సాష్టాంగపడేవారితో నువ్వు ఎందుకు చేరలేదు?” అని (అల్లాహ్) నిలదీశాడు.
15:33 قَالَ لَمْ أَكُن لِّأَسْجُدَ لِبَشَرٍ خَلَقْتَهُ مِن صَلْصَالٍ مِّنْ حَمَإٍ مَّسْنُونٍ
“కుళ్ళి, ఎండిన (నల్లని) మట్టితో నీవు సృష్టించిన మనిషి ముందు నేను మోకరిల్లబోను” అని వాడు (షైతాను తెగేసి) చెప్పాడు.
15:34 قَالَ فَاخْرُجْ مِنْهَا فَإِنَّكَ رَجِيمٌ
“అయితే ఇక్కణ్ణుంచి వెళ్ళిపో, నువ్వు ధూత్కరించబడ్డావు.
15:35 وَإِنَّ عَلَيْكَ اللَّعْنَةَ إِلَىٰ يَوْمِ الدِّينِ
ప్రళయదినం వరకూ నీపై నా అభిశాపం ఉంటుంది” అని అల్లాహ్ సెలవిచ్చాడు.
15:36 قَالَ رَبِّ فَأَنظِرْنِي إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ
“ప్రభూ! ప్రజలు (మరణానంతరం) తిరిగి లేపబడే రోజు వరకూ నాకు గడువు ఇవ్వు” అని వాడు విన్నవించుకున్నాడు.
15:37 قَالَ فَإِنَّكَ مِنَ الْمُنظَرِينَ
“సరే! నీకు గడువు ఇవ్వబడింది” అని అల్లాహ్ సెలవిచ్చాడు.
15:38 إِلَىٰ يَوْمِ الْوَقْتِ الْمَعْلُومِ
“ఆ నిర్ధారిత సమయం వచ్చే రోజు వరకూ” (అన్నాడు).
15:39 قَالَ رَبِّ بِمَا أَغْوَيْتَنِي لَأُزَيِّنَنَّ لَهُمْ فِي الْأَرْضِ وَلَأُغْوِيَنَّهُمْ أَجْمَعِينَ
“ఓ ప్రభూ! నీవు నన్నుఅపమార్గం పట్టించినందువల్ల, నేను వారికి (మానవులకు) భూమండలంలో పాపాన్ని అందంగా కనిపించేలా చేస్తాను. వారినందరినీ పెడత్రోవ పట్టిస్తాను” అని ఇబ్లీసు చెప్పాడు.
15:40 إِلَّا عِبَادَكَ مِنْهُمُ الْمُخْلَصِينَ
“నీ ద్వారా ఎన్నుకోబడిన ప్రత్యేక దాసులను తప్ప” (అన్నాడు).
15:41 قَالَ هَٰذَا صِرَاطٌ عَلَيَّ مُسْتَقِيمٌ
(అల్లాహ్) ఇలా సెలవిచ్చాడు : ”నన్ను చేరే రుజుమార్గం మాత్రం ఇది.
15:42 إِنَّ عِبَادِي لَيْسَ لَكَ عَلَيْهِمْ سُلْطَانٌ إِلَّا مَنِ اتَّبَعَكَ مِنَ الْغَاوِينَ
“నా దాసులపై నీ అధికారం సాగదు. నీ అధికారం నిన్ను అనుసరించే భ్రష్టులపై మాత్రమే సాగుతుంది.”
15:43 وَإِنَّ جَهَنَّمَ لَمَوْعِدُهُمْ أَجْمَعِينَ
(అలాంటి) వారందరి కోసం వాగ్దానం చేయబడిన చోటు నరకం.
15:44 لَهَا سَبْعَةُ أَبْوَابٍ لِّكُلِّ بَابٍ مِّنْهُمْ جُزْءٌ مَّقْسُومٌ
దానికి ఏడు ద్వారాలు ఉంటాయి. ఒక్కో ద్వారం వారిలోని ఒక్కో వర్గం కోసం కేటాయించబడింది.
15:45 إِنَّ الْمُتَّقِينَ فِي جَنَّاتٍ وَعُيُونٍ
నిశ్చయంగా దైవభక్తిగలవారు ఉద్యానవనాల, సెలయేరుల మధ్యన ఉంటారు.
15:46 ادْخُلُوهَا بِسَلَامٍ آمِنِينَ
ప్రశాంతంగా, నిశ్చింతగా అందులోనికి ప్రవేశించండి (అని వారితో అనబడుతుంది).
15:47 وَنَزَعْنَا مَا فِي صُدُورِهِم مِّنْ غِلٍّ إِخْوَانًا عَلَىٰ سُرُرٍ مُّتَقَابِلِينَ
వారి హృదయాలలో ఏ కాస్త కోపం, ద్వేషం మిగిలివున్నా దాన్ని మేము తొలగిస్తాము. వారంతా అన్నదమ్ములై ఎదురెదురుగా ఆసనాలపై కూర్చుని ఉంటారు.
15:48 لَا يَمَسُّهُمْ فِيهَا نَصَبٌ وَمَا هُم مِّنْهَا بِمُخْرَجِينَ
అక్కడ వారికి ఏ బాధా అంటుకోదు. అక్కణ్ణుంచి వారిని ఎన్నటికీ వెళ్ళగొట్టడం కూడా జరగదు.
15:49 نَبِّئْ عِبَادِي أَنِّي أَنَا الْغَفُورُ الرَّحِيمُ
(ఓ ప్రవక్తా!) నేను అమితంగా క్షమించేవాడిననీ, అపారంగా కరుణించేవాడిననీ, నా దాసులకు తెలియజేయి.
15:50 وَأَنَّ عَذَابِي هُوَ الْعَذَابُ الْأَلِيمُ
అలాగే నా శిక్ష కూడా అత్యంత బాధాకరమైన శిక్షేనని (చెప్పు).
15:51 وَنَبِّئْهُمْ عَن ضَيْفِ إِبْرَاهِيمَ
వారికి ఇబ్రాహీమ్ అతిథుల గురించి (కూడా) వినిపించు.
15:52 إِذْ دَخَلُوا عَلَيْهِ فَقَالُوا سَلَامًا قَالَ إِنَّا مِنكُمْ وَجِلُونَ
వారు అతని దగ్గరకు వచ్చి ‘సలామ్’ చెప్పినప్పుడు” మిమ్మల్ని చూస్తే మాకెందుకో భయమేస్తున్నది” అని అతను అన్నాడు.
15:53 قَالُوا لَا تَوْجَلْ إِنَّا نُبَشِّرُكَ بِغُلَامٍ عَلِيمٍ
“భయపడకు. మేము నీకు జ్ఞాన సంపన్నుడైన కుమారుడు పుడతాడన్న శుభవార్తను అందజేస్తున్నాము” అని వారన్నారు.
15:54 قَالَ أَبَشَّرْتُمُونِي عَلَىٰ أَن مَّسَّنِيَ الْكِبَرُ فَبِمَ تُبَشِّرُونَ
“ఏమిటీ, వృద్ధాప్యం వచ్చేసిన తరువాత మీరు నాకు ఈ శుభవార్త వినిపిస్తున్నారా? ఈ శుభవార్తను అసలు మీరు ఎలా వినిపిస్తున్నారు?” అని అతను అన్నాడు.
15:55 قَالُوا بَشَّرْنَاكَ بِالْحَقِّ فَلَا تَكُن مِّنَ الْقَانِطِينَ
దానికి వారు, “మేము నిజమైన శుభవార్తనే నీకు అందజేస్తున్నాము. కాబట్టి నువ్వు నిరాశచెందిన వారిలో చేరకు” అని సమాధానమిచ్చారు.
15:56 قَالَ وَمَن يَقْنَطُ مِن رَّحْمَةِ رَبِّهِ إِلَّا الضَّالُّونَ
“మార్గభ్రష్టులు మాత్రమే తమ ప్రభువు కారుణ్యం పట్ల నిరాశ చెందుతారు” అని అతను (ఇబ్రాహీము) అన్నాడు.
15:57 قَالَ فَمَا خَطْبُكُمْ أَيُّهَا الْمُرْسَلُونَ
(ఆ తరువాత ఇబ్రాహీం వారినుద్దేశించి) “ఓ అల్లాహ్ తరఫున పంపబడినవారలారా! ఇంతకీ మీరు వచ్చిన పనేమిటి? అని ప్రశ్నించాడు.
15:58 قَالُوا إِنَّا أُرْسِلْنَا إِلَىٰ قَوْمٍ مُّجْرِمِينَ
వారు ఇలా సమాధానమిచ్చారు:” మేమొక నేరస్థుల మూక వైపు పంపబడ్డాము.
15:59 إِلَّا آلَ لُوطٍ إِنَّا لَمُنَجُّوهُمْ أَجْمَعِينَ
“అయితే లూత్ కుటుంబీకులందరినీ మేము కాపాడుతాము-
15:60 إِلَّا امْرَأَتَهُ قَدَّرْنَا ۙ إِنَّهَا لَمِنَ الْغَابِرِينَ
“ఒక్క అతని (లూత్) భార్యను తప్ప! ఆమె (కూడా) వెనుక ఉండిపోయేవారిలో చేరిపోతుందని మేము నిర్థారించాము.”
15:61 فَلَمَّا جَاءَ آلَ لُوطٍ الْمُرْسَلُونَ
పంపబడిన దూతలు లూత్ ఇంటివారల వద్దకు వచ్చినప్పుడు,
15:62 قَالَ إِنَّكُمْ قَوْمٌ مُّنكَرُونَ
“మీరు అపరిచిత వ్యక్తుల్లా ఉన్నారే!” అని అతను (లూత్) అన్నాడు.
15:63 قَالُوا بَلْ جِئْنَاكَ بِمَا كَانُوا فِيهِ يَمْتَرُونَ
“కాదు, కాని వీళ్లు ఏ విషయంలో అనుమానానికి లోనై ఉన్నారో దాన్ని మేము నీ దగ్గరకు తీసుకువచ్చాము.
15:64 وَأَتَيْنَاكَ بِالْحَقِّ وَإِنَّا لَصَادِقُونَ
“మేము నీ వద్దకు (స్పష్టమైన) సత్యాన్ని తెచ్చాము. మేము చెప్పేది నిజం.
15:65 فَأَسْرِ بِأَهْلِكَ بِقِطْعٍ مِّنَ اللَّيْلِ وَاتَّبِعْ أَدْبَارَهُمْ وَلَا يَلْتَفِتْ مِنكُمْ أَحَدٌ وَامْضُوا حَيْثُ تُؤْمَرُونَ
“నువ్వు నీ కుటుంబ సమేతంగా ఈ రాత్రికి రాత్రే ఇక్కణ్ణుంచి వెళ్ళిపో. నువ్వు మాత్రం వీళ్ళ వెనుక ఉండాలి. (జాగ్రత్త!) మీలో ఎవరూ వెనుతిరిగి కూడా చూడకూడదు. మీకు ఆదేశించబడిన వైపుకు వెళ్ళిపోండి” అని వారు చెప్పారు.
15:66 وَقَضَيْنَا إِلَيْهِ ذَٰلِكَ الْأَمْرَ أَنَّ دَابِرَ هَٰؤُلَاءِ مَقْطُوعٌ مُّصْبِحِينَ
(ఈ విధంగా) తెలతెలవారుతుండగా వారు సమూలంగా త్రుంచి వేయబడతారన్న మా నిర్ణయాన్ని మేము అతనికి తెలియజేశాము.
15:67 وَجَاءَ أَهْلُ الْمَدِينَةِ يَسْتَبْشِرُونَ
నగరవాసులు మహా సంబరపడుతూ (లూత్ ఇంటికి) వచ్చారు.
15:68 قَالَ إِنَّ هَٰؤُلَاءِ ضَيْفِي فَلَا تَفْضَحُونِ
“వీళ్ళు నా అతిథులు. మీరు (వీళ్ళ ముందు) నా పరువు తీయకండి” అని (లూత్) అన్నాడు.
15:69 وَاتَّقُوا اللَّهَ وَلَا تُخْزُونِ
“అల్లాహ్‌కు భయపడండి. నన్ను అవమానపరచకండి” (అని అన్నాడు).
15:70 قَالُوا أَوَلَمْ نَنْهَكَ عَنِ الْعَالَمِينَ
“ఏమిటీ, లోకంలోని జనులందరినీ వెనకేసుకు రావద్దని మేము నిన్ను వారించలేదా?” అని వారంతా అన్నారు.
15:71 قَالَ هَٰؤُلَاءِ بَنَاتِي إِن كُنتُمْ فَاعِلِينَ
“మీకు అంతగా కావాలనుకుంటే, ఇదిగో నా ఈ కూతుళ్ళు ఉన్నారు” అని (లూత్) ప్రాధేయపడ్డాడు.
15:72 لَعَمْرُكَ إِنَّهُمْ لَفِي سَكْرَتِهِمْ يَعْمَهُونَ
(ఓ ముహమ్మద్!) నీ ఆయుష్షు సాక్షిగా! వారు తమ (ముదనష్టపు) కైపులో గుడ్డివారయి పోయారు.
15:73 فَأَخَذَتْهُمُ الصَّيْحَةُ مُشْرِقِينَ
సూర్యోదయం అవుతున్న సమయంలో ఒక భయంకరమైన ప్రేలుడు వారిని ముట్టడించింది.
15:74 فَجَعَلْنَا عَالِيَهَا سَافِلَهَا وَأَمْطَرْنَا عَلَيْهِمْ حِجَارَةً مِّن سِجِّيلٍ
చివరికి మేము ఆ నగరాన్ని తలక్రిందులుగా చేసివేశాము. వారిపై కంకర రాళ్ల వర్షం కురిపించాము.
15:75 إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّلْمُتَوَسِّمِينَ
నిస్సందేహంగా యోచన చేసేవారి కొరకు ఇందులో ఎన్నో సూచనలున్నాయి.
15:76 وَإِنَّهَا لَبِسَبِيلٍ مُّقِيمٍ
ఈ పట్టణం (జనులు) వచ్చేపోయే రహదారిపైనే ఉంది.
15:77 إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً لِّلْمُؤْمِنِينَ
విశ్వసించిన వారి కోసం ఇందులో గొప్ప సూచన ఉంది.
15:78 وَإِن كَانَ أَصْحَابُ الْأَيْكَةِ لَظَالِمِينَ
అయ్కా వారు (అడవి జనులు) కూడా దుర్మార్గులే.
15:79 فَانتَقَمْنَا مِنْهُمْ وَإِنَّهُمَا لَبِإِمَامٍ مُّبِينٍ
(ఆఖరికి) వారికి కూడా మేము ప్రతీకారం చేశాం. ఈ రెండు పట్టణాలు కూడా ప్రధాన రహదారి మీదే ఉన్నాయి.
15:80 وَلَقَدْ كَذَّبَ أَصْحَابُ الْحِجْرِ الْمُرْسَلِينَ
హిజ్ర్ వారు కూడా ప్రవక్తలను ధిక్కరించారు.
15:81 وَآتَيْنَاهُمْ آيَاتِنَا فَكَانُوا عَنْهَا مُعْرِضِينَ
(మరి చూడబోతే) మేము వారికి మా సూచనలను కూడా వొసగాము. అయినప్పటికీ వారు వాటి పట్ల విముఖతే చూపుతూ వచ్చారు.
15:82 وَكَانُوا يَنْحِتُونَ مِنَ الْجِبَالِ بُيُوتًا آمِنِينَ
వారు నిర్భయంగా పర్వతాలను తొలచి ఇండ్లు నిర్మించేవారు.
15:83 فَأَخَذَتْهُمُ الصَّيْحَةُ مُصْبِحِينَ
ఆఖరికి వారిపై కూడా తెల తెలవారుతుండగా ఒక కేక విరుచుకుపడింది.
15:84 فَمَا أَغْنَىٰ عَنْهُم مَّا كَانُوا يَكْسِبُونَ
అంతే! వారి సంపాదన వారికి ఏమాత్రం పనికిరాకుండా పోయింది.
15:85 وَمَا خَلَقْنَا السَّمَاوَاتِ وَالْأَرْضَ وَمَا بَيْنَهُمَا إِلَّا بِالْحَقِّ ۗ وَإِنَّ السَّاعَةَ لَآتِيَةٌ ۖ فَاصْفَحِ الصَّفْحَ الْجَمِيلَ
మేము ఆకాశాలనూ, భూమినీ, వాటి మధ్యనున్న సమస్త వస్తువులనూ సత్యబద్ధంగానే సృష్టించాము. ప్రళయ ఘడియ రావటం తథ్యం. కనుక (ఓ ప్రవక్తా!) నువ్వు హుందాగా (వారిని) మన్నిస్తూ ఉండు.
15:86 إِنَّ رَبَّكَ هُوَ الْخَلَّاقُ الْعَلِيمُ
నిశ్చయంగా నీ ప్రభువే (సర్వాన్నీ) సృష్టించినవాడు, (సర్వమూ) తెలిసినవాడు.
15:87 وَلَقَدْ آتَيْنَاكَ سَبْعًا مِّنَ الْمَثَانِي وَالْقُرْآنَ الْعَظِيمَ
మేము నీకు ఏడు ఆయతులను ఇచ్చి ఉన్నాము. అవి పదే పదే పునరావృతం అవుతుంటాయి. ఇంకా మహోన్నతమైన ఖుర్ఆన్ను నీకు ప్రసాదించాము.
15:88 لَا تَمُدَّنَّ عَيْنَيْكَ إِلَىٰ مَا مَتَّعْنَا بِهِ أَزْوَاجًا مِّنْهُمْ وَلَا تَحْزَنْ عَلَيْهِمْ وَاخْفِضْ جَنَاحَكَ لِلْمُؤْمِنِينَ
వారిలోని పలు వర్గాల వారికి మేము ఇచ్చిన ప్రాపంచిక సంపద వైపుకు నువ్వు ఆబగా చూడకు. వారి స్థితిపై దిగులు చెందకు. విశ్వాసుల కోసం నీ (వాత్సల్య భరిత) రెక్కలను వంచిపెట్టు.
15:89 وَقُلْ إِنِّي أَنَا النَّذِيرُ الْمُبِينُ
“నేను స్పష్టంగా హెచ్చరించేవాణ్ణి మాత్రమే” అని వారికి చెప్పు.
15:90 كَمَا أَنزَلْنَا عَلَى الْمُقْتَسِمِينَ
ఆ విభజనకారులపై మేము పంపినటువంటిదే (ఇది).
15:91 الَّذِينَ جَعَلُوا الْقُرْآنَ عِضِينَ
వారు ఈ దైవగ్రంథాన్ని ముక్క చెక్కలుగా చేశారు.
15:92 فَوَرَبِّكَ لَنَسْأَلَنَّهُمْ أَجْمَعِينَ
నీ ప్రభువు సాక్షిగా! మేము వారందరినీ తప్పకుండా నిలదీసి అడుగుతాము,
15:93 عَمَّا كَانُوا يَعْمَلُونَ
వారు చేస్తూ ఉండిన పనుల గురించి.
15:94 فَاصْدَعْ بِمَا تُؤْمَرُ وَأَعْرِضْ عَنِ الْمُشْرِكِينَ
కాబట్టి (ఓ ప్రవక్తా!) నీకు ఆదేశించబడిన దానిని వారికి విడమరచి చెప్పు. బహుదైవారాధకులను (ముష్రిక్కులను) పట్టించుకోకు.
15:95 إِنَّا كَفَيْنَاكَ الْمُسْتَهْزِئِينَ
నిన్ను పరిహసించే వారి సంగతి చూసుకోవటానికి మేము చాలు.
15:96 الَّذِينَ يَجْعَلُونَ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ ۚ فَسَوْفَ يَعْلَمُونَ
వారు అల్లాహ్‌తో పాటు వేరే ఆరాధ్యుడిని నిలబెడుతున్నారు. త్వరలోనే (యదార్థం) వారికి తెలిసిపోతుంది.
15:97 وَلَقَدْ نَعْلَمُ أَنَّكَ يَضِيقُ صَدْرُكَ بِمَا يَقُولُونَ
వారి మాటల వల్ల నీకు మనస్తాపం కలుగుతుందన్నసంగతి మాకు బాగా తెలుసు.
15:98 فَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ وَكُن مِّنَ السَّاجِدِينَ
అందుకే నీ ప్రభువు పవిత్రతను కొనియాడు. ఆయన్ని స్తుతిస్తూ ఉండు. సాష్టాంగపడేవారిలో చేరిపో.
15:99 وَاعْبُدْ رَبَّكَ حَتَّىٰ يَأْتِيَكَ الْيَقِينُ
నిశ్చయమైనది (అనగా మరణం) వచ్చేవరకూ నీ ప్రభువును ఆరాధిస్తూ ఉండు.
16. సూరా అన్ నహ్ల్ (An-Nahl)
16:1 أَتَىٰ أَمْرُ اللَّهِ فَلَا تَسْتَعْجِلُوهُ ۚ سُبْحَانَهُ وَتَعَالَىٰ عَمَّا يُشْرِكُونَ
అల్లాహ్ ఆజ్ఞ వచ్చేసింది. కనుక దాని కోసం తొందర పెట్టకండి. ఆయన పరమ పవిత్రుడు. వీరు కల్పించే భాగస్వామ్యాల నుండి ఆయన పవిత్రుడు, ఉన్నతుడు.
16:2 يُنَزِّلُ الْمَلَائِكَةَ بِالرُّوحِ مِنْ أَمْرِهِ عَلَىٰ مَن يَشَاءُ مِنْ عِبَادِهِ أَنْ أَنذِرُوا أَنَّهُ لَا إِلَٰهَ إِلَّا أَنَا فَاتَّقُونِ
“నేను తప్ప వేరే ఆరాధ్య దైవం లేడు. కనుక మీరు నాకు భయపడండి” అని ప్రజలను హెచ్చరించటానికి, ఆయనే దూతలకు తన ‘వహీ’ని ఇచ్చి, తన ఆదేశానుసారం దాన్ని తన దాసులలో తాను కోరిన వారిపై అవతరింపజేస్తాడు-
16:3 خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ بِالْحَقِّ ۚ تَعَالَىٰ عَمَّا يُشْرِكُونَ
ఆయన ఆకాశాలను, భూమిని సత్యబద్ధంగా సృష్టించాడు. వారు కల్పించే భాగస్వామ్యాలకు (షిర్కుకు) ఆయన అతీతుడు, ఉన్నతుడు.
16:4 خَلَقَ الْإِنسَانَ مِن نُّطْفَةٍ فَإِذَا هُوَ خَصِيمٌ مُّبِينٌ
ఆయన మనిషిని వీర్యపు బొట్టుతో సృష్టించాడు. కాని వాడు పచ్చి తగవులమారిగా తయారయ్యాడు.
16:5 وَالْأَنْعَامَ خَلَقَهَا ۗ لَكُمْ فِيهَا دِفْءٌ وَمَنَافِعُ وَمِنْهَا تَأْكُلُونَ
ఆయనే పశువులను సృష్టించాడు. వాటిలో మీ కొరకు వేడినిచ్చే దుస్తులు, ఇతరత్రా ఎన్నో ప్రయోజనాలున్నాయి. మరికొన్ని (పశువులు) మీకు ఆహారంగా కూడా ఉపయోగపడతాయి.
16:6 وَلَكُمْ فِيهَا جَمَالٌ حِينَ تُرِيحُونَ وَحِينَ تَسْرَحُونَ
మీరు వాటిని మేపుకుని రావటంలోనూ, మేపటానికి తోలుకు పోవటంలోనూ అందం (కళ) ఉట్టిపడుతూ ఉంటుంది.
16:7 وَتَحْمِلُ أَثْقَالَكُمْ إِلَىٰ بَلَدٍ لَّمْ تَكُونُوا بَالِغِيهِ إِلَّا بِشِقِّ الْأَنفُسِ ۚ إِنَّ رَبَّكُمْ لَرَءُوفٌ رَّحِيمٌ
మీరెంతో ప్రయాసపడితేగాని చేరుకోలేని ప్రదేశాలకు అవి మీ బరువులను మోసుకునిపోతాయి. నిశ్చయంగా మీ ప్రభువు వాత్సల్యం కలవాడు, దయామయుడు.
16:8 وَالْخَيْلَ وَالْبِغَالَ وَالْحَمِيرَ لِتَرْكَبُوهَا وَزِينَةً ۚ وَيَخْلُقُ مَا لَا تَعْلَمُونَ
మీరు స్వారీ చేయటానికీ, మీకు శోభాయమానంగా ఉండటానికి ఆయన గుర్రాలనూ, కంచర గాడిదలనూ, గాడిదలనూ సృష్టించాడు. మీకు తెలియని ఇంకా ఎన్నో వస్తువులను ఆయన సృష్టిస్తూ ఉంటాడు.
16:9 وَعَلَى اللَّهِ قَصْدُ السَّبِيلِ وَمِنْهَا جَائِرٌ ۚ وَلَوْ شَاءَ لَهَدَاكُمْ أَجْمَعِينَ
సన్మార్గం చూపే బాధ్యత అల్లాహ్‌పై ఉంది. కొన్ని వక్ర మార్గాలు కూడా ఉన్నాయి. ఆయన గనక తలచుకుంటే మీ అందరినీ సన్మార్గాన నడిపించేవాడే.
16:10 هُوَ الَّذِي أَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً ۖ لَّكُم مِّنْهُ شَرَابٌ وَمِنْهُ شَجَرٌ فِيهِ تُسِيمُونَ
ఆయనే మీ కోసం ఆకాశం నుంచి నీళ్ళను కురిపిస్తున్నాడు. దాన్ని మీరూ త్రాగుతారు. దానివల్ల మొలకెత్తిన పచ్చికను (వృక్షాలను) మీ పశువులకు కూడా మేపుతారు.
16:11 يُنبِتُ لَكُم بِهِ الزَّرْعَ وَالزَّيْتُونَ وَالنَّخِيلَ وَالْأَعْنَابَ وَمِن كُلِّ الثَّمَرَاتِ ۗ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً لِّقَوْمٍ يَتَفَكَّرُونَ
దాంతోనే (ఆ నీటితోనే) ఆయన మీ కోసం పొలాలను పండిస్తాడు. జైతూను (ఆలివ్), ఖర్జూరం, ద్రాక్ష మరియు అన్ని రకాల పండ్లను పండిస్తాడు. నిశ్చయంగా చింతన చేసేవారి కోసం ఇందులో గొప్ప సూచన ఉంది.
16:12 وَسَخَّرَ لَكُمُ اللَّيْلَ وَالنَّهَارَ وَالشَّمْسَ وَالْقَمَرَ ۖ وَالنُّجُومُ مُسَخَّرَاتٌ بِأَمْرِهِ ۗ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّقَوْمٍ يَعْقِلُونَ
ఆయనే మీ కోసం రేయింబవళ్ళనూ, సూర్యచంద్రులను నియంత్రణలో పెట్టాడు. నక్షత్రాలు కూడా ఆయన ఆజ్ఞకు కట్టుబడి ఉన్నాయి. బుద్ధిమంతుల కోసం ఇందులో ఎన్నో నిదర్శనాలున్నాయి.
16:13 وَمَا ذَرَأَ لَكُمْ فِي الْأَرْضِ مُخْتَلِفًا أَلْوَانُهُ ۗ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً لِّقَوْمٍ يَذَّكَّرُونَ
ఇంకా రంగురంగుల వస్తువులెన్నింటినో ఆయన మీకోసం భూమిలో సృష్టించాడు. నిస్సందేహంగా గుణపాఠం గ్రహించే వారికోసం ఇందులో చాలా పెద్ద సూచన ఉంది.
16:14 وَهُوَ الَّذِي سَخَّرَ الْبَحْرَ لِتَأْكُلُوا مِنْهُ لَحْمًا طَرِيًّا وَتَسْتَخْرِجُوا مِنْهُ حِلْيَةً تَلْبَسُونَهَا وَتَرَى الْفُلْكَ مَوَاخِرَ فِيهِ وَلِتَبْتَغُوا مِن فَضْلِهِ وَلَعَلَّكُمْ تَشْكُرُونَ
ఆయనే సముద్రాన్ని మీకు వశపరిచాడు – మీరు అందులో నుంచి (తీయబడిన) తాజా మాంసాన్ని తినటానికీ, మీరు తొడిగే ఆభరణాలను అందులో నుంచి వెలికితీయటానికీ. నీవు చూస్తావు! ఓడలు అందులో నీటిని చీల్చుకుంటూ పోతుంటాయి. మీరు ఆయన అనుగ్రహాన్ని అన్వేషించటానికి, కృతజ్ఞతాపూర్వకంగా మసలుకోవటానికి (ఈ ఏర్పాటు చేయబడింది).
16:15 وَأَلْقَىٰ فِي الْأَرْضِ رَوَاسِيَ أَن تَمِيدَ بِكُمْ وَأَنْهَارًا وَسُبُلًا لَّعَلَّكُمْ تَهْتَدُونَ
భూమి మిమ్మల్ని తీసుకుని కంపించకుండా ఉండటానికి ఆయన పర్వతాలను అందులో పాతిపెట్టాడు. మీరు మీ గమ్యాలను చేరుకోవటానికి ఆయన నదులను, త్రోవలను కూడా సృష్టించాడు.
16:16 وَعَلَامَاتٍ ۚ وَبِالنَّجْمِ هُمْ يَهْتَدُونَ
ఇంకా ఎన్నో సూచనలను నిర్ణయించి పెట్టాడు. నక్షత్రాల ద్వారా కూడా జనులు మార్గాలను కనుగొంటారు.
16:17 أَفَمَن يَخْلُقُ كَمَن لَّا يَخْلُقُ ۗ أَفَلَا تَذَكَّرُونَ
ఏమిటీ, (సర్వాన్నీ) సృష్టించేవాడూ – ఏమీ సృష్టించలేనివాడు ఇద్దరూ ఒకటేనా? మీరు బొత్తిగా ఆలోచించరా?
16:18 وَإِن تَعُدُّوا نِعْمَةَ اللَّهِ لَا تُحْصُوهَا ۗ إِنَّ اللَّهَ لَغَفُورٌ رَّحِيمٌ
ఒకవేళ మీరు అల్లాహ్ అనుగ్రహాలను లెక్కించదలిస్తే లెక్కించలేరు. నిశ్చయంగా అల్లాహ్ అమితంగా క్షమించేవాడు, అపారంగా కనికరించేవాడు.
16:19 وَاللَّهُ يَعْلَمُ مَا تُسِرُّونَ وَمَا تُعْلِنُونَ
మీరు గోప్యంగా ఉంచేదీ, బహిర్గతం చేసేదీ – అంతా అల్లాహ్‌కు తెలుసు.
16:20 وَالَّذِينَ يَدْعُونَ مِن دُونِ اللَّهِ لَا يَخْلُقُونَ شَيْئًا وَهُمْ يُخْلَقُونَ
అల్లాహ్‌ను వదలి వాళ్లు పిలుస్తున్నవారు ఏ వస్తువునూ సృష్టించలేరు. పైగా వారు స్వయంగా సృష్టించబడినవారు.
16:21 أَمْوَاتٌ غَيْرُ أَحْيَاءٍ ۖ وَمَا يَشْعُرُونَ أَيَّانَ يُبْعَثُونَ
వారు నిర్జీవులేగాని సజీవులు కారు. తాము ఎప్పుడు (బ్రతికించి) లేపబడతారో కూడా వారికి తెలీదు.
16:22 إِلَٰهُكُمْ إِلَٰهٌ وَاحِدٌ ۚ فَالَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ قُلُوبُهُم مُّنكِرَةٌ وَهُم مُّسْتَكْبِرُونَ
మీరందరి ఆరాధ్య దైవం అల్లాహ్ ఒక్కడే. అయితే పరలోకం పట్ల నమ్మకం లేనివారి హృదయాలు ఈ విషయాన్ని తిరస్కరిస్తున్నాయి. వారు స్వయంగా అహంకారంతో విర్రవీగుతున్నారు.
16:23 لَا جَرَمَ أَنَّ اللَّهَ يَعْلَمُ مَا يُسِرُّونَ وَمَا يُعْلِنُونَ ۚ إِنَّهُ لَا يُحِبُّ الْمُسْتَكْبِرِينَ
నిశ్చయంగా అల్లాహ్‌కు వారు దాచేది, బహిర్గతం చేసేది-అంతా తెలుసు. గర్విష్టులను ఆయన ఏ మాత్రం ఇష్టపడడు.
16:24 وَإِذَا قِيلَ لَهُم مَّاذَا أَنزَلَ رَبُّكُمْ ۙ قَالُوا أَسَاطِيرُ الْأَوَّلِينَ
“ఇంతకీ మీ ప్రభువు ఏం అవతరింపజేశాడ”ని వారిని అడిగి నప్పుడు, “పాతకాలపు కట్టుకథలు” అని చెబుతారు.
16:25 لِيَحْمِلُوا أَوْزَارَهُمْ كَامِلَةً يَوْمَ الْقِيَامَةِ ۙ وَمِنْ أَوْزَارِ الَّذِينَ يُضِلُّونَهُم بِغَيْرِ عِلْمٍ ۗ أَلَا سَاءَ مَا يَزِرُونَ
పర్యవసానంగా ప్రళయదినాన వారు తమ (పాప) భారమంతటినీ మోయటంతోపాటు, అజ్ఞానంతో తాము పెడదారి పట్టించిన వారి బరువును మోయటంలో కూడా భాగస్థులవుతారు. చూడండి! ఎంత చెడ్డ బరువును వారు తమ నెత్తిపై వేసుకుంటున్నారో!
16:26 قَدْ مَكَرَ الَّذِينَ مِن قَبْلِهِمْ فَأَتَى اللَّهُ بُنْيَانَهُم مِّنَ الْقَوَاعِدِ فَخَرَّ عَلَيْهِمُ السَّقْفُ مِن فَوْقِهِمْ وَأَتَاهُمُ الْعَذَابُ مِنْ حَيْثُ لَا يَشْعُرُونَ
వీరి పూర్వీకులు కూడా కుట్రలు పన్నారు. (చివరికి) అల్లాహ్ వారి (కుట్రల) కట్టడాలను కూకటి వ్రేళ్లతో పెకలించివేశాడు. వారి (కట్టడాల) కప్పులు వారి (నెత్తి) మీదే పడ్డాయి. వారు ఊహించనైనాలేని చోటునుంచి వారిపై శిక్ష వచ్చి పడింది.
16:27 ثُمَّ يَوْمَ الْقِيَامَةِ يُخْزِيهِمْ وَيَقُولُ أَيْنَ شُرَكَائِيَ الَّذِينَ كُنتُمْ تُشَاقُّونَ فِيهِمْ ۚ قَالَ الَّذِينَ أُوتُوا الْعِلْمَ إِنَّ الْخِزْيَ الْيَوْمَ وَالسُّوءَ عَلَى الْكَافِرِينَ
మళ్ళీ ప్రళయదినాన కూడా అల్లాహ్ వారిని పరాభవానికి లోనుచేస్తాడు. “నా భాగస్వాములు ఏరి? వారి గురించి మీరు జగడమాడేవారు కదా?!” అని వారిని ప్రశ్నిస్తాడు. అప్పుడు జ్ఞానమొసగబడిన వారు చెబుతారు -“ఈ రోజు పరాభవం, కీడు పడేది అవిశ్వాసులపైనే” అని!
16:28 الَّذِينَ تَتَوَفَّاهُمُ الْمَلَائِكَةُ ظَالِمِي أَنفُسِهِمْ ۖ فَأَلْقَوُا السَّلَمَ مَا كُنَّا نَعْمَلُ مِن سُوءٍ ۚ بَلَىٰ إِنَّ اللَّهَ عَلِيمٌ بِمَا كُنتُمْ تَعْمَلُونَ
వారు తమ ఆత్మలకు తాము అన్యాయం చేసుకుంటూ ఉండగా దైవదూతలు వారి ప్రాణాలు తీసుకుంటున్నప్పుడు, వెంటనే పూర్తిగా లొంగిపోయి వారు, “మేము ఏ పాపం ఎరుగం” అని అంటారు. “ఎందుకెరుగరు? మీరు ఏమేం చేసే వారో అల్లాహ్‌కు బాగా తెలుసు.
16:29 فَادْخُلُوا أَبْوَابَ جَهَنَّمَ خَالِدِينَ فِيهَا ۖ فَلَبِئْسَ مَثْوَى الْمُتَكَبِّرِينَ
“ఇక మీరు కలకాలం ఉండేందుకు గాను నరకద్వారాలలో ప్రవేశించండి” అని వారితో అనబడుతుంది. గర్విష్ఠుల నివాస స్థానం ఎంత చెడ్డది!?”
16:30 وَقِيلَ لِلَّذِينَ اتَّقَوْا مَاذَا أَنزَلَ رَبُّكُمْ ۚ قَالُوا خَيْرًا ۗ لِّلَّذِينَ أَحْسَنُوا فِي هَٰذِهِ الدُّنْيَا حَسَنَةٌ ۚ وَلَدَارُ الْآخِرَةِ خَيْرٌ ۚ وَلَنِعْمَ دَارُ الْمُتَّقِينَ
“మీ ప్రభువు ఏం అవతరింపజేశాడు?” అని దైవభీతిపరులను అడిగినప్పుడు “మేలైనదాన్నే (అవతరింపజేశాడు)” అని వారు చెబుతారు. మేలు చేసిన వారికి ఈ ప్రపంచంలో మేలు చేకూరుతుంది. ఇక పరలోక నిలయమైతే మరింత మేలైనది. దైవభీతిపరులకు లభించే ఈ నిలయం ఎంత చక్కనిది!
16:31 جَنَّاتُ عَدْنٍ يَدْخُلُونَهَا تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ ۖ لَهُمْ فِيهَا مَا يَشَاءُونَ ۚ كَذَٰلِكَ يَجْزِي اللَّهُ الْمُتَّقِينَ
కలకాలం ఉండే స్వర్గ వనాలలో వారు ప్రవేశిస్తారు. వాటి క్రింద సెలయేళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడ వారు కోరినదల్లా వారి కోసం ఉంటుంది. భయభక్తులు కలవారికి అల్లాహ్ ఇలాంటి ప్రతిఫలాన్నే ప్రసాదిస్తాడు మరి.
16:32 الَّذِينَ تَتَوَفَّاهُمُ الْمَلَائِكَةُ طَيِّبِينَ ۙ يَقُولُونَ سَلَامٌ عَلَيْكُمُ ادْخُلُوا الْجَنَّةَ بِمَا كُنتُمْ تَعْمَلُونَ
వారు పవిత్రులుగా ఉన్న స్థితిలో దైవదూతలు వారి ప్రాణాలు స్వాధీనం చేసుకుంటూ, “మీకు శాంతి కల్గుగాక! మీరు చేసుకున్న సత్కర్మల ఫలితంగా స్వర్గంలో ప్రవేశించండి” అని అంటారు.
16:33 هَلْ يَنظُرُونَ إِلَّا أَن تَأْتِيَهُمُ الْمَلَائِكَةُ أَوْ يَأْتِيَ أَمْرُ رَبِّكَ ۚ كَذَٰلِكَ فَعَلَ الَّذِينَ مِن قَبْلِهِمْ ۚ وَمَا ظَلَمَهُمُ اللَّهُ وَلَٰكِن كَانُوا أَنفُسَهُمْ يَظْلِمُونَ
ఏమిటీ, తమ వద్దకు దైవదూతలు రావాలనో లేక నీ ప్రభువు ఉత్తర్వు రావాలనో వీళ్ళు ఎదురు చూస్తున్నారా? వీరి పూర్వీకులు కూడా అలాగే చేశారు. అల్లాహ్ వారికి ఎలాంటి అన్యాయమూ చేయలేదు. వారంతట వారే తమ స్వయానికి అన్యాయం చేసుకున్నారు.
16:34 فَأَصَابَهُمْ سَيِّئَاتُ مَا عَمِلُوا وَحَاقَ بِهِم مَّا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ
కాబట్టి వారి దుష్కర్మల ఫలితాలు వారికి లభించాయి. దేని గురించి వారు నవ్విపోయేవారో అదే వారిని చుట్టుముట్టింది.
16:35 وَقَالَ الَّذِينَ أَشْرَكُوا لَوْ شَاءَ اللَّهُ مَا عَبَدْنَا مِن دُونِهِ مِن شَيْءٍ نَّحْنُ وَلَا آبَاؤُنَا وَلَا حَرَّمْنَا مِن دُونِهِ مِن شَيْءٍ ۚ كَذَٰلِكَ فَعَلَ الَّذِينَ مِن قَبْلِهِمْ ۚ فَهَلْ عَلَى الرُّسُلِ إِلَّا الْبَلَاغُ الْمُبِينُ
ముష్రిక్కులు ఇలా అన్నారు : “అల్లాహ్ గనక తలచుకుని ఉంటే మేమూ, మా తాతముత్తాతలూ ఆయన్ని తప్ప ఇంకొక రెవరినీ ఆరాధించేవాళ్ళం కాము. ఆయన ఉత్తర్వులేకుండా ఏ వస్తువునూ నిషేధించే వాళ్ళం కాము. “వీరి పూర్వీకులు చేసింది కూడా అదే. కనుక ప్రవక్తల బాధ్యత సందేశాన్ని స్పష్టంగా అందజేయటం తప్ప మరొకటి కాదు.
16:36 وَلَقَدْ بَعَثْنَا فِي كُلِّ أُمَّةٍ رَّسُولًا أَنِ اعْبُدُوا اللَّهَ وَاجْتَنِبُوا الطَّاغُوتَ ۖ فَمِنْهُم مَّنْ هَدَى اللَّهُ وَمِنْهُم مَّنْ حَقَّتْ عَلَيْهِ الضَّلَالَةُ ۚ فَسِيرُوا فِي الْأَرْضِ فَانظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُكَذِّبِينَ
మేము ప్రతి సముదాయంలోనూ ప్రవక్తను ప్రభవింపజేశాము. అతని ద్వారా (ప్రజలారా!) “అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించండి. ఆయన తప్ప ఇతరత్రా మిథ్యా దైవాలకు దూరంగా ఉండండి” అని బోధపరచాము. ఆ తరువాత అల్లాహ్ కొందరికి సన్మార్గం చూపాడు. మరికొందరిపై అపమార్గం రూఢీ అయిపోయింది. ధిక్కరించినవారికి పట్టిన గతేమిటో మీరు స్వయంగా భువిలో తిరిగి చూడండి.
16:37 إِن تَحْرِصْ عَلَىٰ هُدَاهُمْ فَإِنَّ اللَّهَ لَا يَهْدِي مَن يُضِلُّ ۖ وَمَا لَهُم مِّن نَّاصِرِينَ
(ఓ ప్రవక్తా!) నువ్వు వారిని సన్మార్గానికి తీసుకురావాలని తీవ్రంగా కోరుకున్నప్పటికీ, అల్లాహ్ తాను అపమార్గాన వదిలేసిన వారికి సన్మార్గం చూపడు. వారిని ఆదుకునేవారు కూడా ఎవరూ ఉండరు.
16:38 وَأَقْسَمُوا بِاللَّهِ جَهْدَ أَيْمَانِهِمْ ۙ لَا يَبْعَثُ اللَّهُ مَن يَمُوتُ ۚ بَلَىٰ وَعْدًا عَلَيْهِ حَقًّا وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ
“చనిపోయిన వారిని అల్లాహ్ తిరిగి లేపడు” అని వారు అల్లాహ్‌పై గట్టిగా ప్రమాణాలు చేసి మరీ చెబుతారు. ఎందుకు లేపడు? (తప్పకుండా మళ్లీ బ్రతికించి లేపుతాడు) ఇది ఆయన వాగ్దానం – దాన్ని నెరవేర్చటాన్ని ఆయన విధిగా చేసుకున్నాడు. కాని చాలామందికి ఈ విషయం తెలియదు.
16:39 لِيُبَيِّنَ لَهُمُ الَّذِي يَخْتَلِفُونَ فِيهِ وَلِيَعْلَمَ الَّذِينَ كَفَرُوا أَنَّهُمْ كَانُوا كَاذِبِينَ
వారు విభేదించుకునే విషయాన్ని అల్లాహ్ వారికి స్పష్టంగా తెలియజేయటానికి,తాము అబద్ధాలకోరులం అని అవిశ్వాసులు స్వయంగా తెలుసుకోవటానికి (వారిని తిరిగి బ్రతికించటం జరుగుతుంది).
16:40 إِنَّمَا قَوْلُنَا لِشَيْءٍ إِذَا أَرَدْنَاهُ أَن نَّقُولَ لَهُ كُن فَيَكُونُ
మేము దేన్నయినా చేయాలని సంకల్పించుకున్నప్పుడు ‘అయిపో’ అని అంటే చాలు, అది అయిపోతుంది.
16:41 وَالَّذِينَ هَاجَرُوا فِي اللَّهِ مِن بَعْدِ مَا ظُلِمُوا لَنُبَوِّئَنَّهُمْ فِي الدُّنْيَا حَسَنَةً ۖ وَلَأَجْرُ الْآخِرَةِ أَكْبَرُ ۚ لَوْ كَانُوا يَعْلَمُونَ
దౌర్జన్యానికి గురైన తరువాత దైవమార్గంలో (ఇల్లూ వాకిలిని వదలి) వలసపోయిన వారికి మేము ప్రపంచంలోనూ ఉత్తమ నివాసాన్ని కల్పిస్తాము. ఇక పరలోకంలో లభించే పుణ్యఫలమైతే మరింత గొప్పది. ఈ విషయాన్ని జనులు తెలుసుకుంటే ఎంత బావుండు!
16:42 الَّذِينَ صَبَرُوا وَعَلَىٰ رَبِّهِمْ يَتَوَكَّلُونَ
వారు సహన స్థయిర్యాలను ప్రదర్శిస్తూ, (సతతం) తమ పరిపోషకుణ్ణే నమ్ముకుని ఉండేవారు.
16:43 وَمَا أَرْسَلْنَا مِن قَبْلِكَ إِلَّا رِجَالًا نُّوحِي إِلَيْهِمْ ۚ فَاسْأَلُوا أَهْلَ الذِّكْرِ إِن كُنتُمْ لَا تَعْلَمُونَ
(ఓ ప్రవక్తా!) నీకు పూర్వం కూడా మేము పురుషులనే (ప్రవక్తలుగా నియమించి) పంపాము. వారి వద్దకు మా వహీని పంపేవారము. ఒకవేళ మీకు తెలియకపోతే (గ్రంథ) జ్ఞానం గల వారిని అడిగి తెలుసుకోండి.
16:44 بِالْبَيِّنَاتِ وَالزُّبُرِ ۗ وَأَنزَلْنَا إِلَيْكَ الذِّكْرَ لِتُبَيِّنَ لِلنَّاسِ مَا نُزِّلَ إِلَيْهِمْ وَلَعَلَّهُمْ يَتَفَكَّرُونَ
(మేము వారిని) స్పష్టమైన నిదర్శనాలతోనూ, గ్రంథాలతోనూ (పంపి ఉన్నాము. అలాగే) ప్రజల వద్దకు పంపబడిన దానిని నువ్వు వారికి స్పష్టంగా విడమరచి చెప్పేందుకు, తద్వారా వారు యోచన చేసేందుకుగాను మేము నీపై ఈ జ్ఞాపిక (గ్రంథము)ను అవతరింపజేశాము.
16:45 أَفَأَمِنَ الَّذِينَ مَكَرُوا السَّيِّئَاتِ أَن يَخْسِفَ اللَّهُ بِهِمُ الْأَرْضَ أَوْ يَأْتِيَهُمُ الْعَذَابُ مِنْ حَيْثُ لَا يَشْعُرُونَ
ఏమిటి నీచాతి నీచమైన కుట్రలు పన్నేవారు, అల్లాహ్ తమను నేలలో కూరుకుపోయేలా చేస్తాడనిగానీ లేక తాము ఊహించనైనా లేని చోటు నుంచి తమ వైపుకు శిక్ష వచ్చిపడుతుందని గానీ భయపడటం లేదా?
16:46 أَوْ يَأْخُذَهُمْ فِي تَقَلُّبِهِمْ فَمَا هُم بِمُعْجِزِينَ
లేదా తాము విహరిస్తుండగా తమను పట్టుకుంటాడని గానీ – అలా అయితే వారు ఎట్టి పరిస్థితిలోనూ (అల్లాహ్‌ను) నిస్సహాయుణ్ణి చేయలేరు సుమా!
16:47 أَوْ يَأْخُذَهُمْ عَلَىٰ تَخَوُّفٍ فَإِنَّ رَبَّكُمْ لَرَءُوفٌ رَّحِيمٌ
లేదా తమను భయాందోళనలకు లోనుచేసి పట్టుకుంటాడని గానీ వారు భయపడటం లేదా? నిశ్చయంగా నీ ప్రభువు అసామాన్య వాత్సల్యం కలవాడు, అనంత కరుణామయుడు.
16:48 أَوَلَمْ يَرَوْا إِلَىٰ مَا خَلَقَ اللَّهُ مِن شَيْءٍ يَتَفَيَّأُ ظِلَالُهُ عَنِ الْيَمِينِ وَالشَّمَائِلِ سُجَّدًا لِّلَّهِ وَهُمْ دَاخِرُونَ
ఏమిటీ, వారు అల్లాహ్ సృష్టించిన వాటిలో ఏ వస్తువును కూడా (నిశిత దృష్టితో) చూడలేదా? వాటి నీడలు కుడివైపు, ఎడమ వైపు వాలుతూ, అల్లాహ్ సన్నిధిలో సాష్టాంగపడుతుంటాయి. తమ వినమ్రతను చాటుకుంటూ ఉంటాయి. (దీన్ని వారు గమనించటం లేదా?).
16:49 وَلِلَّهِ يَسْجُدُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ مِن دَابَّةٍ وَالْمَلَائِكَةُ وَهُمْ لَا يَسْتَكْبِرُونَ
నిశ్చయంగా ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న సమస్త ప్రాణులు, దూతలు – అందరూ అల్లాహ్ సన్నిధిలో సాష్టాంగపడుతున్నారు – ఏమాత్రం అహంకారం చూపటం లేదు.
16:50 يَخَافُونَ رَبَّهُم مِّن فَوْقِهِمْ وَيَفْعَلُونَ مَا يُؤْمَرُونَ ۩
తమపైనున్న ప్రభువు పట్ల వారు భయంతో వణికిపోతున్నారు. తమకు ఆజ్ఞాపించబడిన దానినల్లా పాటిస్తున్నారు.
16:51 وَقَالَ اللَّهُ لَا تَتَّخِذُوا إِلَٰهَيْنِ اثْنَيْنِ ۖ إِنَّمَا هُوَ إِلَٰهٌ وَاحِدٌ ۖ فَإِيَّايَ فَارْهَبُونِ
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: “ఇద్దరు ఆరాధ్య దైవాలను కల్పించుకోకండి. ఆరాధ్య దైవం మటుకు ఆయన ఒక్కడే. కాబట్టి మీరంతా కేవలం నాకే భయపడండి.”
16:52 وَلَهُ مَا فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ وَلَهُ الدِّينُ وَاصِبًا ۚ أَفَغَيْرَ اللَّهِ تَتَّقُونَ
ఆకాశాలలో, భూమిలో ఉన్న సమస్తమూ ఆయనదే. ఆయన్ని ఆరాధించటం సదా అవశ్యం. మరలాంటప్పుడు మీరు అల్లాహ్‌కు గాక ఇతరులకు భయపడతారా?
16:53 وَمَا بِكُم مِّن نِّعْمَةٍ فَمِنَ اللَّهِ ۖ ثُمَّ إِذَا مَسَّكُمُ الضُّرُّ فَإِلَيْهِ تَجْأَرُونَ
మీ దగ్గరున్న భాగ్యాలన్నీ అల్లాహ్ ప్రసాదించినవే. ఇప్పటికీ మీకేదైనా కష్టంవస్తే మీరు ఆయనకే మొరపెట్టుకుంటారు.
16:54 ثُمَّ إِذَا كَشَفَ الضُّرَّ عَنكُمْ إِذَا فَرِيقٌ مِّنكُم بِرَبِّهِمْ يُشْرِكُونَ
మరి ఆయన ఆ కష్టాన్ని మీనుండి తొలగించినప్పుడు మీలోని కొందరు తమ ప్రభువుకు సహవర్తుల్ని కల్పించటం మొదలెడతారు.
16:55 لِيَكْفُرُوا بِمَا آتَيْنَاهُمْ ۚ فَتَمَتَّعُوا ۖ فَسَوْفَ تَعْلَمُونَ
మా ప్రసాదితాల పట్ల కృతఘ్నతా వైఖరిని అవలంబించటానికే వారలా చేస్తారు! సరే. కొంత లబ్దిని పొందండి. చివరకు (దాని పర్యవసానం ఏమిటో) మీకే తెలుస్తుంది.
16:56 وَيَجْعَلُونَ لِمَا لَا يَعْلَمُونَ نَصِيبًا مِّمَّا رَزَقْنَاهُمْ ۗ تَاللَّهِ لَتُسْأَلُنَّ عَمَّا كُنتُمْ تَفْتَرُونَ
మేము ప్రసాదించిన ఉపాధిలోనుంచి ఒక భాగాన్ని వారు తమకు ఏమాత్రం తెలియని వారి కోసం కేటాయిస్తున్నారు. అల్లాహ్ సాక్షి! మీరు అంటగడుతున్న ఈ అబద్ధం గురించి మిమ్మల్ని తప్పకుండా ప్రశ్నించటం జరుగుతుంది.
16:57 وَيَجْعَلُونَ لِلَّهِ الْبَنَاتِ سُبْحَانَهُ ۙ وَلَهُم مَّا يَشْتَهُونَ
వారు పరమ పవిత్రుడైన అల్లాహ్ కోసం కూతుళ్ళను నిర్ణయించి, తమ కోసమేమో తమ మనసు కోరిన దాన్ని నిర్ధారించుకుంటున్నారు.
16:58 وَإِذَا بُشِّرَ أَحَدُهُم بِالْأُنثَىٰ ظَلَّ وَجْهُهُ مُسْوَدًّا وَهُوَ كَظِيمٌ
వారిలో ఎవరికైనా కూతురు పుట్టిందన్న శుభవార్తను వినిపిస్తే, వాడి మొహం నల్లగా మారిపోతుంది. లోలోపలే కుత కుత లాడిపోతాడు.
16:59 يَتَوَارَىٰ مِنَ الْقَوْمِ مِن سُوءِ مَا بُشِّرَ بِهِ ۚ أَيُمْسِكُهُ عَلَىٰ هُونٍ أَمْ يَدُسُّهُ فِي التُّرَابِ ۗ أَلَا سَاءَ مَا يَحْكُمُونَ
ఈ దుర్వార్త విన్న తరువాత (ఇక లోకులకు ముఖం ఎలా చూపేది? అని) అతడు నక్కి నక్కి తిరుగుతుంటాడు. ఈ అవమానాన్ని ఇలాగే భరిస్తూ బిడ్డను అట్టిపెట్టుకోవాలా? లేక దానిని మట్టిలో పూడ్చిపెట్టాలా? అని (పరిపరి విధాలుగా) ఆలోచిస్తాడు. చూడు! ఎంతటి జుగుప్సాకరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు వీరు!?
16:60 لِلَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ مَثَلُ السَّوْءِ ۖ وَلِلَّهِ الْمَثَلُ الْأَعْلَىٰ ۚ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ
పరలోకాన్ని విశ్వసించనివారి ఉపమానం మాత్రమే చెడ్డది. అల్లాహ్ అత్యున్నతమైన గుణగణాల దర్పం కలవాడు. ఆయన సర్వాధిక్యుడు, వివేక సంపన్నుడు కూడా.
16:61 وَلَوْ يُؤَاخِذُ اللَّهُ النَّاسَ بِظُلْمِهِم مَّا تَرَكَ عَلَيْهَا مِن دَابَّةٍ وَلَٰكِن يُؤَخِّرُهُمْ إِلَىٰ أَجَلٍ مُّسَمًّى ۖ فَإِذَا جَاءَ أَجَلُهُمْ لَا يَسْتَأْخِرُونَ سَاعَةً ۖ وَلَا يَسْتَقْدِمُونَ
అల్లాహ్‌యే గనక ప్రజలు పాల్పడే (ఒక్కో) అఘాయిత్యంపై వారిని నిలదీసినట్లయితే భూమండలంపై ఒక్క ప్రాణి కూడా మిగిలి ఉండదు. కాని ఆయన వారికి ఒక నిర్ణీత కాలం వరకు విడుపునిస్తున్నాడు. మరి వారి కోసం నిర్ణయించబడిన ఆ సమయం వచ్చేసిందంటే వారు ఒక్క ఘడియ వెనక్కిగానీ, ముందుకు గానీ జరగలేరు.
16:62 وَيَجْعَلُونَ لِلَّهِ مَا يَكْرَهُونَ وَتَصِفُ أَلْسِنَتُهُمُ الْكَذِبَ أَنَّ لَهُمُ الْحُسْنَىٰ ۖ لَا جَرَمَ أَنَّ لَهُمُ النَّارَ وَأَنَّهُم مُّفْرَطُونَ
వారు తమ కోసం ఇష్టపడని దానిని అల్లాహ్‌కు కేటాయిస్తున్నారు. తమకు మంచే జరుగుతుందని వారి నోళ్లు అబద్ధాలు ప్రేలుతున్నాయి. అసంభవం. వారి కోసం ఉన్నది నరకాగ్ని మాత్రమే. అందరికన్నా ముందు అందులోకి పోయేది వాళ్ళే.
16:63 تَاللَّهِ لَقَدْ أَرْسَلْنَا إِلَىٰ أُمَمٍ مِّن قَبْلِكَ فَزَيَّنَ لَهُمُ الشَّيْطَانُ أَعْمَالَهُمْ فَهُوَ وَلِيُّهُمُ الْيَوْمَ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ
అల్లాహ్ సాక్షి! (ఓ ప్రవక్తా!) మేము నీకు పూర్వం గతించిన సమాజాల వద్దకు కూడా మా ప్రవక్తలను పంపి ఉన్నాము. కాని షైతాన్ వారి దుష్కర్మలను వారికి అందమైనవిగా చేసి చూపాడు. నేటికీ ఆ షైతాను వారి నేస్తంగా ఉన్నాడు. వారి కోసం వ్యధాభరితమైన శిక్ష ఉంది.
16:64 وَمَا أَنزَلْنَا عَلَيْكَ الْكِتَابَ إِلَّا لِتُبَيِّنَ لَهُمُ الَّذِي اخْتَلَفُوا فِيهِ ۙ وَهُدًى وَرَحْمَةً لِّقَوْمٍ يُؤْمِنُونَ
వారు విభేదించుకునే ప్రతి విషయాన్నీ నువ్వు వారికి స్పష్టంగా విడమరచి చెప్పాలని మేము ఈ గ్రంథాన్ని నీపై అవతరింపజేశాము. విశ్వసించిన జనులకు ఇది మార్గదర్శకత్వం మరియు కారుణ్యం.
16:65 وَاللَّهُ أَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَأَحْيَا بِهِ الْأَرْضَ بَعْدَ مَوْتِهَا ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً لِّقَوْمٍ يَسْمَعُونَ
అల్లాహ్ ఆకాశం నుంచి నీళ్ళను కురిపించి, దాని ద్వారా – భూమి చచ్చిపోయిన తరువాత దానిని తిరిగి బ్రతికిస్తున్నాడు. వినేవారి కోసం నిశ్చయంగా ఇందులో నిదర్శనం ఉంది.
16:66 وَإِنَّ لَكُمْ فِي الْأَنْعَامِ لَعِبْرَةً ۖ نُّسْقِيكُم مِّمَّا فِي بُطُونِهِ مِن بَيْنِ فَرْثٍ وَدَمٍ لَّبَنًا خَالِصًا سَائِغًا لِّلشَّارِبِينَ
మీ కోసం పశువులలో కూడా ఒక గుణపాఠం ఉంది. వాటి కడుపులలో ఉన్న పేడకు – రక్తానికి మధ్యలో నుంచి స్వచ్ఛమైన పాలు మీకు త్రాగిస్తున్నాము. త్రాగేవారికి అది కమ్మగా ఉంటుంది.
16:67 وَمِن ثَمَرَاتِ النَّخِيلِ وَالْأَعْنَابِ تَتَّخِذُونَ مِنْهُ سَكَرًا وَرِزْقًا حَسَنًا ۗ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً لِّقَوْمٍ يَعْقِلُونَ
ఇంకా ఖర్జూరం, ద్రాక్షపండ్ల నుంచి మీరు మత్తుపానీయాన్ని తయారు చేస్తారు. (వాటి నుంచి) మంచి ఆహారాన్ని కూడా గ్రహిస్తున్నారు. విజ్ఞత గలవారి కోసం ఇందులోనూ గొప్ప సూచన ఉంది.
16:68 وَأَوْحَىٰ رَبُّكَ إِلَى النَّحْلِ أَنِ اتَّخِذِي مِنَ الْجِبَالِ بُيُوتًا وَمِنَ الشَّجَرِ وَمِمَّا يَعْرِشُونَ
నీ ప్రభువు తేనెటీగకు ఈ సంకేతమిచ్చాడు: “కొండల్లో, చెట్లలో, ప్రజలు కట్టుకున్నఎత్తయిన పందిళ్ళలో నీ ఇండ్లను (తెట్టెలను) నిర్మించుకో.
16:69 ثُمَّ كُلِي مِن كُلِّ الثَّمَرَاتِ فَاسْلُكِي سُبُلَ رَبِّكِ ذُلُلًا ۚ يَخْرُجُ مِن بُطُونِهَا شَرَابٌ مُّخْتَلِفٌ أَلْوَانُهُ فِيهِ شِفَاءٌ لِّلنَّاسِ ۗ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً لِّقَوْمٍ يَتَفَكَّرُونَ
“అన్ని రకాల పండ్లను తిను. నీ ప్రభువు సులభతరం చేసిన మార్గాలలో విహరిస్తూ ఉండు.” వాటి కడుపులలో నుంచి పానకం ఒకటి వెలువడుతుంది. దాని రంగులు వేర్వేరుగా ఉంటాయి. అందులో ప్రజలకు స్వస్థత ఉంది. ఆలోచించేవారి కోసం ఇందులో (గొప్ప) సూచన ఉంది.
16:70 وَاللَّهُ خَلَقَكُمْ ثُمَّ يَتَوَفَّاكُمْ ۚ وَمِنكُم مَّن يُرَدُّ إِلَىٰ أَرْذَلِ الْعُمُرِ لِكَيْ لَا يَعْلَمَ بَعْدَ عِلْمٍ شَيْئًا ۚ إِنَّ اللَّهَ عَلِيمٌ قَدِيرٌ
అల్లాహ్‌యే మిమ్మల్నందరినీ పుట్టించాడు. మరి ఆయనే మీకు చావునిస్తాడు. మీలో అత్యంత దుర్భరమైన వయస్సుకు చేర్చబడే వారు కూడా ఉంటారు-అన్నీ తెలిసి ఉండి కూడా ఏమీ తెలియని వారవటానికి! నిస్సందేహంగా అల్లాహ్ సర్వజ్ఞుడు, సర్వాధికారి.
16:71 وَاللَّهُ فَضَّلَ بَعْضَكُمْ عَلَىٰ بَعْضٍ فِي الرِّزْقِ ۚ فَمَا الَّذِينَ فُضِّلُوا بِرَادِّي رِزْقِهِمْ عَلَىٰ مَا مَلَكَتْ أَيْمَانُهُمْ فَهُمْ فِيهِ سَوَاءٌ ۚ أَفَبِنِعْمَةِ اللَّهِ يَجْحَدُونَ
అల్లాహ్‌యే ఉపాధి విషయంలో మీలో ఒకరికి ఇంకొకరిపై ఆధిక్యతను వొసగి ఉన్నాడు. ఆధిక్యత వొసగబడినవారు తమ ఉపాధిని తమ క్రిందనున్న బానిసలకు తామూ-వారూ సమానులయ్యేలా ఇవ్వరు. మరి వీరు అల్లాహ్ అనుగ్రహాలనే తిరస్కరిస్తున్నారా?
16:72 وَاللَّهُ جَعَلَ لَكُم مِّنْ أَنفُسِكُمْ أَزْوَاجًا وَجَعَلَ لَكُم مِّنْ أَزْوَاجِكُم بَنِينَ وَحَفَدَةً وَرَزَقَكُم مِّنَ الطَّيِّبَاتِ ۚ أَفَبِالْبَاطِلِ يُؤْمِنُونَ وَبِنِعْمَتِ اللَّهِ هُمْ يَكْفُرُونَ
అల్లాహ్ మీ కోసం స్వయంగా మీలో నుంచే మీ భార్యలను సృష్టించాడు. మరి మీ భార్యల ద్వారా మీ కొరకు మీ కుమారులను, మీ మనవళ్ళను పుట్టించాడు. ఇంకా, మీకు తినటానికి మంచి మంచి వస్తువులను సమకూర్చాడు. అయినప్పటికీ ప్రజలు మిథ్యనే నమ్ముకుంటున్నారా? వారు అల్లాహ్ అనుగ్రహాల పట్ల కృతఘ్నతకు పాల్పడుతున్నారా??
16:73 وَيَعْبُدُونَ مِن دُونِ اللَّهِ مَا لَا يَمْلِكُ لَهُمْ رِزْقًا مِّنَ السَّمَاوَاتِ وَالْأَرْضِ شَيْئًا وَلَا يَسْتَطِيعُونَ
వారు అల్లాహ్‌ను వదలి, తమకు ఆకాశాల నుంచిగానీ, భూమి నుంచిగానీ ఎలాంటి ఉపాధినీ సమకూర్చలేని వారిని, ఏ శక్తిసామర్థ్యమూ లేనివారిని పూజిస్తున్నారా?
16:74 فَلَا تَضْرِبُوا لِلَّهِ الْأَمْثَالَ ۚ إِنَّ اللَّهَ يَعْلَمُ وَأَنتُمْ لَا تَعْلَمُونَ
కాబట్టి అల్లాహ్‌కు పోలికలను కల్పించకండి. నిశ్చయంగా అల్లాహ్‌కు అన్నీ తెలుసు. మీకు తెలియదు.
16:75 ضَرَبَ اللَّهُ مَثَلًا عَبْدًا مَّمْلُوكًا لَّا يَقْدِرُ عَلَىٰ شَيْءٍ وَمَن رَّزَقْنَاهُ مِنَّا رِزْقًا حَسَنًا فَهُوَ يُنفِقُ مِنْهُ سِرًّا وَجَهْرًا ۖ هَلْ يَسْتَوُونَ ۚ الْحَمْدُ لِلَّهِ ۚ بَلْ أَكْثَرُهُمْ لَا يَعْلَمُونَ
అల్లాహ్ ఒక ఉదాహరణ ఇస్తున్నాడు: ఇతరుల యాజమాన్యంలో ఉన్న ఒక బానిస ఉన్నాడు. అతనికి ఏ అధికారమూ లేదు. కాగా; మరో వ్యక్తి ఉన్నాడు – అతనికి మేము మా వద్ద నుంచి మంచి ఉపాధిని సమకూర్చాము. అందులో నుంచి అతడు రహస్యంగానూ, బహిర్గతంగానూ ఖర్చుపెడతాడు. మరి వీరిద్దరూ సమానులేనా? సర్వస్తోత్రాలూ అల్లాహ్ కొరకే. అయితే వీరిలో చాలామందికి తెలీదు.
16:76 وَضَرَبَ اللَّهُ مَثَلًا رَّجُلَيْنِ أَحَدُهُمَا أَبْكَمُ لَا يَقْدِرُ عَلَىٰ شَيْءٍ وَهُوَ كَلٌّ عَلَىٰ مَوْلَاهُ أَيْنَمَا يُوَجِّههُّ لَا يَأْتِ بِخَيْرٍ ۖ هَلْ يَسْتَوِي هُوَ وَمَن يَأْمُرُ بِالْعَدْلِ ۙ وَهُوَ عَلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ
అల్లాహ్ మరో ఇద్దరు వ్యక్తుల ఉదాహరణను కూడా ఇస్తున్నాడు: వారిలో ఒకడు మూగవాడు. ఏదీ చెయ్యలేడు. పైగా అతను తన యజమానికి భారంగా తయారయ్యాడు. అతన్ని ఎక్కడికి పంపినా మేలును తీసుకురాడు. మరొకతను న్యాయం గురించి ఆదేశిస్తున్నాడు. పైగా అతను సన్మార్గాన ఉన్నాడు. వీరిద్దరూ ఒకటేనా?
16:77 وَلِلَّهِ غَيْبُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ وَمَا أَمْرُ السَّاعَةِ إِلَّا كَلَمْحِ الْبَصَرِ أَوْ هُوَ أَقْرَبُ ۚ إِنَّ اللَّهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న నిగూఢ విషయాలు అల్లాహ్‌కు మాత్రమే తెలుసు. ప్రళయ వ్యవహారం రెప్పపాటు కాలంలో, లేదా అంతకన్నా తక్కువ సమయంలోనే జరిగిపోతుంది. నిశ్చయంగా అల్లాహ్ అన్నింటిపై అధికారం కలవాడు.
16:78 وَاللَّهُ أَخْرَجَكُم مِّن بُطُونِ أُمَّهَاتِكُمْ لَا تَعْلَمُونَ شَيْئًا وَجَعَلَ لَكُمُ السَّمْعَ وَالْأَبْصَارَ وَالْأَفْئِدَةَ ۙ لَعَلَّكُمْ تَشْكُرُونَ
అల్లాహ్ మిమ్మల్ని మీ మాతృ గర్భాల నుండి – మీకేమీ తెలీని స్థితిలో బయటికి తీశాడు. మీ కొరకు చెవులను, కళ్లను, హృదయాలను తయారుచేసినది ఆయనే – మీరు కృతజ్ఞులుగా వ్యవహరిస్తారని!
16:79 أَلَمْ يَرَوْا إِلَى الطَّيْرِ مُسَخَّرَاتٍ فِي جَوِّ السَّمَاءِ مَا يُمْسِكُهُنَّ إِلَّا اللَّهُ ۗ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّقَوْمٍ يُؤْمِنُونَ
శూన్యాకాశంలో ఆజ్ఞాబద్ధులై ఉన్న పక్షులను వారు చూడలేదా? అల్లాహ్ తప్ప వాటిని ఆ స్థితిలో నిలిపి ఉంచేవారెవరూ లేరు. నిశ్చయంగా విశ్వసించేవారి కోసం ఇందులో గొప్ప సూచనలున్నాయి.
16:80 وَاللَّهُ جَعَلَ لَكُم مِّن بُيُوتِكُمْ سَكَنًا وَجَعَلَ لَكُم مِّن جُلُودِ الْأَنْعَامِ بُيُوتًا تَسْتَخِفُّونَهَا يَوْمَ ظَعْنِكُمْ وَيَوْمَ إِقَامَتِكُمْ ۙ وَمِنْ أَصْوَافِهَا وَأَوْبَارِهَا وَأَشْعَارِهَا أَثَاثًا وَمَتَاعًا إِلَىٰ حِينٍ
అల్లాహ్ మీ కొరకు మీ ఇండ్లను విశ్రాంతి స్థలాలుగా చేశాడు. ఇంకా ఆయనే మీ కోసం పశువుల చర్మాలతో ఇళ్ళను చేశాడు. ప్రయాణ దినాన, విడిది చేసిన దినాన కూడా అవి మీకు తేలిగ్గా – అనువైనవిగా – ఉంటాయి. ఇంకా వాటి ఉన్నితోనూ, రోమాలతోనూ, వెంట్రుకలతోనూ ఆయన ఎన్నో సామానులను, కొంతకాలం వరకూ ఉపయోగపడే వస్తువులనూ తయారుచేశాడు.
16:81 وَاللَّهُ جَعَلَ لَكُم مِّمَّا خَلَقَ ظِلَالًا وَجَعَلَ لَكُم مِّنَ الْجِبَالِ أَكْنَانًا وَجَعَلَ لَكُمْ سَرَابِيلَ تَقِيكُمُ الْحَرَّ وَسَرَابِيلَ تَقِيكُم بَأْسَكُمْ ۚ كَذَٰلِكَ يُتِمُّ نِعْمَتَهُ عَلَيْكُمْ لَعَلَّكُمْ تُسْلِمُونَ
మరి అల్లాహ్‌యే మీ కోసం తాను సృష్టించిన వస్తువులతో నీడను ఏర్పాటు చేశాడు. మరి ఆయనే మీకోసం కొండలలో గుహలను చేశాడు. ఇంకా ఆయనే మీకోసం, మిమ్మల్ని వేడిమి నుంచి కాపాడే చొక్కాలను, యుద్ధ సమయాలలో మీకు రక్షా కవచంగా ఉపయోగపడే చొక్కాలను కూడా చేశాడు. ఈ విధంగా ఆయన – మీరు ఆజ్ఞల్ని శిరసావహించే వారౌతారని – తన అనుగ్రహాలను పరిపూర్తి చేస్తున్నాడు.
16:82 فَإِن تَوَلَّوْا فَإِنَّمَا عَلَيْكَ الْبَلَاغُ الْمُبِينُ
అప్పటికీ వారు విముఖత చూపినట్లయితే (ఓ ప్రవక్తా!) విషయాన్ని స్పష్టంగా అందజేయటం వరకే నీ బాధ్యత.
16:83 يَعْرِفُونَ نِعْمَتَ اللَّهِ ثُمَّ يُنكِرُونَهَا وَأَكْثَرُهُمُ الْكَافِرُونَ
వీరు అల్లాహ్ అనుగ్రహాలను గుర్తించి కూడా నిరాకరిస్తున్నారు. పైగా వారిలో చాలా మంది చేసిన మేలును మరిచేవారే.
16:84 وَيَوْمَ نَبْعَثُ مِن كُلِّ أُمَّةٍ شَهِيدًا ثُمَّ لَا يُؤْذَنُ لِلَّذِينَ كَفَرُوا وَلَا هُمْ يُسْتَعْتَبُونَ
ఏ రోజున మేము ప్రతి సమాజం నుంచీ ఒక సాక్షిని నిలబెడతామో (ఆ రోజున) అవిశ్వాసులకు (సంజాయిషీ ఇచ్చుకునే) అనుమతి ఇవ్వబడదు. ‘పశ్చాత్తాప పడండి’ అని కూడా వారితో అనటం జరగదు.
16:85 وَإِذَا رَأَى الَّذِينَ ظَلَمُوا الْعَذَابَ فَلَا يُخَفَّفُ عَنْهُمْ وَلَا هُمْ يُنظَرُونَ
ఆ దుర్మార్గులు శిక్షను చూసినప్పుడు దాన్ని వారి నుంచి తేలిక చేయటంగానీ, వారికి విడుపు ఇవ్వటంగానీ జరగదు.
16:86 وَإِذَا رَأَى الَّذِينَ أَشْرَكُوا شُرَكَاءَهُمْ قَالُوا رَبَّنَا هَٰؤُلَاءِ شُرَكَاؤُنَا الَّذِينَ كُنَّا نَدْعُو مِن دُونِكَ ۖ فَأَلْقَوْا إِلَيْهِمُ الْقَوْلَ إِنَّكُمْ لَكَاذِبُونَ
ఈ ముష్రిక్కులు తాము (అల్లాహ్‌కు) భాగస్వాములుగా నిలబెట్టే వారిని చూడగానే, “ఓ మా ప్రభూ! మేము నిన్ను వదిలేసి మొరపెట్టుకున్న మా భాగస్వాములు వీరే” అని అంటారు. అప్పుడు వారు (ఆ భాగస్వాములు), “మీరు చెప్పేది పచ్చి అబద్ధం” అని వారి మాటను ఖండిస్తారు.
16:87 وَأَلْقَوْا إِلَى اللَّهِ يَوْمَئِذٍ السَّلَمَ ۖ وَضَلَّ عَنْهُم مَّا كَانُوا يَفْتَرُونَ
ఆ రోజు వారంతా అల్లాహ్ సమక్షంలో పూర్తిగా లొంగి పోవటానికి సిద్ధమవుతారు. వారు చేస్తూ ఉండిన కల్పనలన్నీ వారి నుంచి మటుమాయమౌతాయి.
16:88 الَّذِينَ كَفَرُوا وَصَدُّوا عَن سَبِيلِ اللَّهِ زِدْنَاهُمْ عَذَابًا فَوْقَ الْعَذَابِ بِمَا كَانُوا يُفْسِدُونَ
ఎవరు తిరస్కరించారో, అల్లాహ్ మార్గం నుంచి (జనులను) ఆపారో వారికి మేము శిక్షపై శిక్షను పెంచుతూపోతాము. వారి దురాగతాలకు ఫలితం అది.
16:89 وَيَوْمَ نَبْعَثُ فِي كُلِّ أُمَّةٍ شَهِيدًا عَلَيْهِم مِّنْ أَنفُسِهِمْ ۖ وَجِئْنَا بِكَ شَهِيدًا عَلَىٰ هَٰؤُلَاءِ ۚ وَنَزَّلْنَا عَلَيْكَ الْكِتَابَ تِبْيَانًا لِّكُلِّ شَيْءٍ وَهُدًى وَرَحْمَةً وَبُشْرَىٰ لِلْمُسْلِمِينَ
ఆ రోజు మేము ప్రతి సమాజంలో నుంచీ వారిపై ఒక సాక్షిని నిలబెడతాము. మరి (ఓ ప్రవక్తా!) నిన్ను వారందరిపై సాక్షిగా తీసుకువస్తాము. మేము నీపై ఈ గ్రంథాన్ని అవతరింపజేశాము. అందులో ప్రతి విషయం విశదీకరించబడింది. విధేయత చూపేవారికి (ముస్లింలకు) అది మార్గదర్శకం, కారుణ్యం, శుభవార్త.
16:90 إِنَّ اللَّهَ يَأْمُرُ بِالْعَدْلِ وَالْإِحْسَانِ وَإِيتَاءِ ذِي الْقُرْبَىٰ وَيَنْهَىٰ عَنِ الْفَحْشَاءِ وَالْمُنكَرِ وَالْبَغْيِ ۚ يَعِظُكُمْ لَعَلَّكُمْ تَذَكَّرُونَ
అల్లాహ్ న్యాయం చేయమనీ, ఉపకారం (ఇహ్సాన్) చేయమనీ, బంధువుల హక్కులను నెరవేర్చమనీ ఆజ్ఞాపిస్తున్నాడు. ఇంకా – నీతిబాహ్యమైన పనుల నుండీ, చెడుల నుండీ, దౌర్జన్యం నుండీ ఆయన ఆపుతున్నాడు. మీరు గుణపాఠం గ్రహించటానికి ఆయన స్వయంగా మీకు ఉపదేశిస్తున్నాడు.
16:91 وَأَوْفُوا بِعَهْدِ اللَّهِ إِذَا عَاهَدتُّمْ وَلَا تَنقُضُوا الْأَيْمَانَ بَعْدَ تَوْكِيدِهَا وَقَدْ جَعَلْتُمُ اللَّهَ عَلَيْكُمْ كَفِيلًا ۚ إِنَّ اللَّهَ يَعْلَمُ مَا تَفْعَلُونَ
మీరు పరస్పరం ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు అల్లాహ్‌కు ఇచ్చిన మాటను నిలుపుకోండి. ప్రమాణాలను ఖరారు చేసుకున్న మీదట భంగపరచకండి. (ఎందుకంటే) మీరు అల్లాహ్‌ను మీ సాక్షిగా చేసుకున్నారు. నిశ్చయంగా మీరు చేసేదంతా ఆయనకు తెలుసు.
16:92 وَلَا تَكُونُوا كَالَّتِي نَقَضَتْ غَزْلَهَا مِن بَعْدِ قُوَّةٍ أَنكَاثًا تَتَّخِذُونَ أَيْمَانَكُمْ دَخَلًا بَيْنَكُمْ أَن تَكُونَ أُمَّةٌ هِيَ أَرْبَىٰ مِنْ أُمَّةٍ ۚ إِنَّمَا يَبْلُوكُمُ اللَّهُ بِهِ ۚ وَلَيُبَيِّنَنَّ لَكُمْ يَوْمَ الْقِيَامَةِ مَا كُنتُمْ فِيهِ تَخْتَلِفُونَ
తన నూలును గట్టిగా వడికిన తరువాత, తనే స్వయంగా ముక్కలుముక్కలుగా త్రెంచివేసిన స్త్రీ మాదిరిగా అయిపోకండి. ఒక వర్గం మరో వర్గం కంటే మించిపోవాలన్న ఉద్దేశంతో మీరు మీ ప్రమాణాలను పరస్పరం మోసగించుకునే సాధనాలుగా చేసుకుంటున్నారు. అసలు విషయం ఏమిటంటే ఈ ప్రమాణం ద్వారా అల్లాహ్ మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. నిశ్చయంగా అల్లాహ్ ప్రళయదినాన మీరు విభేదించుకునే విషయాలన్నింటినీ మీకు విడమరచి చెబుతాడు.
16:93 وَلَوْ شَاءَ اللَّهُ لَجَعَلَكُمْ أُمَّةً وَاحِدَةً وَلَٰكِن يُضِلُّ مَن يَشَاءُ وَيَهْدِي مَن يَشَاءُ ۚ وَلَتُسْأَلُنَّ عَمَّا كُنتُمْ تَعْمَلُونَ
అల్లాహ్ గనక తలచుకుంటే మీ అందరినీ ఒకే సమాజంగా చేసి ఉండేవాడు. కాని ఆయన తాను తలచిన వారిని అపమార్గానికి లోనుచేస్తాడు, తాను తలచిన వారికి సన్మార్గం చూపుతాడు. మీరు చేస్తున్న పనులన్నింటి గురించి మీరు తప్పకుండా ప్రశ్నించబడతారు.
16:94 وَلَا تَتَّخِذُوا أَيْمَانَكُمْ دَخَلًا بَيْنَكُمْ فَتَزِلَّ قَدَمٌ بَعْدَ ثُبُوتِهَا وَتَذُوقُوا السُّوءَ بِمَا صَدَدتُّمْ عَن سَبِيلِ اللَّهِ ۖ وَلَكُمْ عَذَابٌ عَظِيمٌ
మీరు మీ ప్రమాణాలను పరస్పరం మోసగించుకోవటానికి సాధనాలుగా చేసుకోకండి. (మీ ధోరణి గనక ఇలాగే ఉంటే) నిలదొక్కుకున్న మీదట (మీ) అడుగులు తడబడతాయి. మీరు కఠినమైన శిక్షను చవిచూడవలసి ఉంటుంది. ఎందుకంటే మీరు అల్లాహ్ మార్గాన అడ్డు తగిలారు. మీకు పెద్ద శిక్షపడుతుంది.
16:95 وَلَا تَشْتَرُوا بِعَهْدِ اللَّهِ ثَمَنًا قَلِيلًا ۚ إِنَّمَا عِندَ اللَّهِ هُوَ خَيْرٌ لَّكُمْ إِن كُنتُمْ تَعْلَمُونَ
మీరు అల్లాహ్‌తో చేసిన వాగ్దానాన్ని కొద్దిపాటి మూల్యానికి అమ్మివేయకండి. గుర్తుంచుకోండి! మీరు గనక తెలుసుకోగలిగితే అల్లాహ్ వద్ద ఉన్నదే మీ కొరకు శ్రేయోదాయకమైనది.
16:96 مَا عِندَكُمْ يَنفَدُ ۖ وَمَا عِندَ اللَّهِ بَاقٍ ۗ وَلَنَجْزِيَنَّ الَّذِينَ صَبَرُوا أَجْرَهُم بِأَحْسَنِ مَا كَانُوا يَعْمَلُونَ
మీ దగ్గర ఉన్నదంతా నశించేదే. అల్లాహ్ వద్ద ఉన్నదే మిగిలి ఉండేది. ఓర్పు వహించేవారికి మేము వారి సదాచరణలకుగాను మంచి ప్రతిఫలాన్ని తప్పక ప్రసాదిస్తాము.
16:97 مَنْ عَمِلَ صَالِحًا مِّن ذَكَرٍ أَوْ أُنثَىٰ وَهُوَ مُؤْمِنٌ فَلَنُحْيِيَنَّهُ حَيَاةً طَيِّبَةً ۖ وَلَنَجْزِيَنَّهُمْ أَجْرَهُم بِأَحْسَنِ مَا كَانُوا يَعْمَلُونَ
సత్కార్యాలు చేసేవారు పురుషులైనా, స్త్రీలయినా-విశ్వాసులై ఉంటే మేము వారికి అత్యంత పవిత్రమైన జీవితాన్ని ప్రసాదిస్తాము. వారి సత్కర్మలకు బదులుగా సత్ఫలితాన్ని కూడా మేము వారికి తప్పకుండా ఇస్తాము.
16:98 فَإِذَا قَرَأْتَ الْقُرْآنَ فَاسْتَعِذْ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ
(ఓ ముహమ్మద్!) ఖుర్ఆన్ పఠనానికి ఉపక్రమించినపుడు శాపగ్రస్తుడైన షైతాను బారి నుంచి అల్లాహ్ శరణు వేడుకో.
16:99 إِنَّهُ لَيْسَ لَهُ سُلْطَانٌ عَلَى الَّذِينَ آمَنُوا وَعَلَىٰ رَبِّهِمْ يَتَوَكَّلُونَ
విశ్వసించి, తమ ప్రభువుపైనే భారం మోపిన వారిపై వాడికి ఎలాంటి అధికారం ఉండదు.
16:100 إِنَّمَا سُلْطَانُهُ عَلَى الَّذِينَ يَتَوَلَّوْنَهُ وَالَّذِينَ هُم بِهِ مُشْرِكُونَ
అయితే వాడితో స్నేహం చేసి, వాడిని అల్లాహ్‌కు భాగస్వామిగా నిలబెట్టే వారిపై మాత్రం వాడి అధికారం నడుస్తుంది.
16:101 وَإِذَا بَدَّلْنَا آيَةً مَّكَانَ آيَةٍ ۙ وَاللَّهُ أَعْلَمُ بِمَا يُنَزِّلُ قَالُوا إِنَّمَا أَنتَ مُفْتَرٍ ۚ بَلْ أَكْثَرُهُمْ لَا يَعْلَمُونَ
మేము ఒక ఆయతు స్థానంలో మరో ఆయతును మార్చినప్పుడు “నువ్వే కల్పిస్తున్నావు” అని వారంటారు. వాస్తవానికి తాను అవతరింపజేసిన దానిని గురించి అల్లాహ్‌కు బాగా తెలుసు. అయితే వారిలో అత్యధికులకు అసలు విషయం తెలియదు.
16:102 قُلْ نَزَّلَهُ رُوحُ الْقُدُسِ مِن رَّبِّكَ بِالْحَقِّ لِيُثَبِّتَ الَّذِينَ آمَنُوا وَهُدًى وَبُشْرَىٰ لِلْمُسْلِمِينَ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “విశ్వసించిన వారికి నిలకడను వొసగటానికి, ముస్లింలకు సన్మార్గం చూపటానికీ, వారికి శుభవార్తను వినిపించటానికీ నీ ప్రభువు వద్ద నుంచి పరిశుద్ధాత్మ (జిబ్రయీల్) దీన్ని సత్యసమేతంగా అవతరింపజేశాడు.”
16:103 وَلَقَدْ نَعْلَمُ أَنَّهُمْ يَقُولُونَ إِنَّمَا يُعَلِّمُهُ بَشَرٌ ۗ لِّسَانُ الَّذِي يُلْحِدُونَ إِلَيْهِ أَعْجَمِيٌّ وَهَٰذَا لِسَانٌ عَرَبِيٌّ مُّبِينٌ
“అతనికి ఒక మనిషి నేర్పుతున్నాడ”ని ఈ అవిశ్వాసులు పలకటం మాకు బాగా తెలుసు. వాస్తవానికి వారు ఎవరిని దృష్టిలో పెట్టుకుని అలా అంటున్నారో అతని భాష అరబ్బేతర (అజమీ) భాష. కాగా; ఈ ఖుర్ఆన్ స్వచ్ఛమైన, స్పష్టమైన అరబీ భాషలో ఉంది.
16:104 إِنَّ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِآيَاتِ اللَّهِ لَا يَهْدِيهِمُ اللَّهُ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ
అల్లాహ్ ఆయతులను విశ్వసించని వారికి అల్లాహ్ తరఫున సన్మార్గం లభించదు. వారికోసం బాధాకరమైన శిక్ష ఉంది.
16:105 إِنَّمَا يَفْتَرِي الْكَذِبَ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِآيَاتِ اللَّهِ ۖ وَأُولَٰئِكَ هُمُ الْكَاذِبُونَ
అల్లాహ్ ఆయతులపై విశ్వాసం లేనివారు మాత్రమే అబద్ధాలను కల్పిస్తారు. వారే అసలు అబద్ధాలకోరులు.
16:106 مَن كَفَرَ بِاللَّهِ مِن بَعْدِ إِيمَانِهِ إِلَّا مَنْ أُكْرِهَ وَقَلْبُهُ مُطْمَئِنٌّ بِالْإِيمَانِ وَلَٰكِن مَّن شَرَحَ بِالْكُفْرِ صَدْرًا فَعَلَيْهِمْ غَضَبٌ مِّنَ اللَّهِ وَلَهُمْ عَذَابٌ عَظِيمٌ
ఎవరయితే విశ్వసించిన తరువాత అల్లాహ్ పట్ల తిరస్కార వైఖరికి పాల్పడతాడో – కాని బలవంతం చేయబడి (తిరస్కారాన్ని ప్రకటిస్తే), అదే సమయంలో అతని హృదయం విశ్వాసంపై స్థిరంగా ఉంటే (అది వేరే విషయం) – అలాగాకుండా ఎవరైనా హృదయపూర్వకంగా తిరస్కార వైఖరికి పాల్పడితే మాత్రం వారిపై దైవాగ్రహం పడుతుంది. అలాంటి వారి కోసమే చాలా పెద్ద శిక్ష ఉంది.
16:107 ذَٰلِكَ بِأَنَّهُمُ اسْتَحَبُّوا الْحَيَاةَ الدُّنْيَا عَلَى الْآخِرَةِ وَأَنَّ اللَّهَ لَا يَهْدِي الْقَوْمَ الْكَافِرِينَ
ఎందుకంటే వారు పరలోకంకన్నా ప్రాపంచిక జీవితాన్ని ఎక్కువగా ప్రేమించారు. నిశ్చయంగా అల్లాహ్ అవిశ్వాసులకు సన్మార్గం చూపడు.
16:108 أُولَٰئِكَ الَّذِينَ طَبَعَ اللَّهُ عَلَىٰ قُلُوبِهِمْ وَسَمْعِهِمْ وَأَبْصَارِهِمْ ۖ وَأُولَٰئِكَ هُمُ الْغَافِلُونَ
వారి హృదయాలపై, వారి చెవులపై, వారి కళ్లపై అల్లాహ్ ముద్ర వేసేశాడు. విస్మరణకు (పరధ్యానానికి) గురైన వారంటే వీరే.
16:109 لَا جَرَمَ أَنَّهُمْ فِي الْآخِرَةِ هُمُ الْخَاسِرُونَ
పరలోకంలో వారు ఘోరంగా నష్టపోతారన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు.
16:110 ثُمَّ إِنَّ رَبَّكَ لِلَّذِينَ هَاجَرُوا مِن بَعْدِ مَا فُتِنُوا ثُمَّ جَاهَدُوا وَصَبَرُوا إِنَّ رَبَّكَ مِن بَعْدِهَا لَغَفُورٌ رَّحِيمٌ
మరెవరయితే బాధలు భరించిన తరువాత (దైవ మార్గంలో) వలసపోయారో, తర్వాత (అల్లాహ్ మార్గంలో) పోరాటం చేశారో, సహన స్థయిర్యాలను కనబరిచారో వారిని నీ ప్రభువు – వీటన్నింటి తరువాత – క్షమిస్తాడు, కరుణిస్తాడు.
16:111 يَوْمَ تَأْتِي كُلُّ نَفْسٍ تُجَادِلُ عَن نَّفْسِهَا وَتُوَفَّىٰ كُلُّ نَفْسٍ مَّا عَمِلَتْ وَهُمْ لَا يُظْلَمُونَ
ఆ రోజు ప్రతి ఒక్కడూ తన ఆత్మ రక్షణ కోసం వాదులాడుతూ వస్తాడు. అప్పుడు ప్రతి ఒక్కరికీ అతను చేసుకున్న కర్మల ప్రతిఫలమంతా ఇవ్వబడుతుంది. ఎవరికీ ఎలాంటి అన్యాయం జరగదు.
16:112 وَضَرَبَ اللَّهُ مَثَلًا قَرْيَةً كَانَتْ آمِنَةً مُّطْمَئِنَّةً يَأْتِيهَا رِزْقُهَا رَغَدًا مِّن كُلِّ مَكَانٍ فَكَفَرَتْ بِأَنْعُمِ اللَّهِ فَأَذَاقَهَا اللَّهُ لِبَاسَ الْجُوعِ وَالْخَوْفِ بِمَا كَانُوا يَصْنَعُونَ
అల్లాహ్ ఒక పట్నం ఉదాహరణను ఇస్తున్నాడు. ఆ పట్నం ఎంతో ప్రశాంతంగా, తృప్తిగా ఉండేది. దానికి అన్ని వైపుల నుంచీ పుష్కలంగా జీవనోపాధి లభించేది. మరి ఆ పట్నవాసులు అల్లాహ్ అనుగ్రహాలపై కృతఘ్నత చూపగా, అల్లాహ్ వారి స్వయంకృతాలకు బదులుగా వారికి ఆకలి, భయాందోళనల రుచి చూపించాడు.
16:113 وَلَقَدْ جَاءَهُمْ رَسُولٌ مِّنْهُمْ فَكَذَّبُوهُ فَأَخَذَهُمُ الْعَذَابُ وَهُمْ ظَالِمُونَ
వారి వద్దకు స్వయంగా వారిలో నుంచే ఒక ప్రవక్త వచ్చాడు. అయినప్పటికీ వారతన్ని ధిక్కరించారు. ఫలితంగా శిక్ష వారిని పట్టుకున్నది. ఎందుకంటే వారు పరమ దుర్మార్గులుగా ఉండేవారు.
16:114 فَكُلُوا مِمَّا رَزَقَكُمُ اللَّهُ حَلَالًا طَيِّبًا وَاشْكُرُوا نِعْمَتَ اللَّهِ إِن كُنتُمْ إِيَّاهُ تَعْبُدُونَ
మీరు అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించేవారు అయితే ఆయన మీకు ప్రసాదించిన ధర్మసమ్మతమైన, పరిశుద్ధమైన ఆహారాన్ని తినండి, అల్లాహ్ అనుగ్రహాలకుగాను కృతజ్ఞత చూపండి.
16:115 إِنَّمَا حَرَّمَ عَلَيْكُمُ الْمَيْتَةَ وَالدَّمَ وَلَحْمَ الْخِنزِيرِ وَمَا أُهِلَّ لِغَيْرِ اللَّهِ بِهِ ۖ فَمَنِ اضْطُرَّ غَيْرَ بَاغٍ وَلَا عَادٍ فَإِنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ
నిశ్చయంగా, ఆయన చచ్చిన పశువు, రక్తం, పందిమాంసం, అల్లాహ్ పేరుగాక ఇతరుల పేరు ఉచ్చరించబడినవి మీకు నిషేధించాడు. అయితే ఎవరయినా ఇష్టంతో కాకుండా, మితిమీరే ఉద్దేశం కూడా లేకుండా- గత్యంతరంలేని పరిస్థితిలో- (వాటిని తిన్నట్లయితే) అల్లాహ్ క్షమించేవాడు, జాలి చూపేవాడు.
16:116 وَلَا تَقُولُوا لِمَا تَصِفُ أَلْسِنَتُكُمُ الْكَذِبَ هَٰذَا حَلَالٌ وَهَٰذَا حَرَامٌ لِّتَفْتَرُوا عَلَى اللَّهِ الْكَذِبَ ۚ إِنَّ الَّذِينَ يَفْتَرُونَ عَلَى اللَّهِ الْكَذِبَ لَا يُفْلِحُونَ
ఏ వస్తువునయినా తమ నోటితో ‘ఇది ధర్మసమ్మతం’ అని, ‘ఇది నిషిద్ధమనీ’ ఇష్టమొచ్చినట్లు అబద్ధం చెప్పేసి, అల్లాహ్‌కు అబద్ధాలు ఆపాదించకండి. అల్లాహ్‌కు అబద్ధాలు ఆపాదించే వారు సాఫల్యాన్ని పొందలేరు.
16:117 مَتَاعٌ قَلِيلٌ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ
వారికి లభించే ప్రయోజనం బహు స్వల్పం. వారి కోసం వ్యధాభరితమైన శిక్ష ఉంది.
16:118 وَعَلَى الَّذِينَ هَادُوا حَرَّمْنَا مَا قَصَصْنَا عَلَيْكَ مِن قَبْلُ ۖ وَمَا ظَلَمْنَاهُمْ وَلَٰكِن كَانُوا أَنفُسَهُمْ يَظْلِمُونَ
యూదుల కొరకు మేము నిషేధించిన వాటిని గురించి మేము ఇంతకు ముందే నీకు వినిపించి ఉన్నాము. మేము వారికి అన్యాయం చేయలేదు. కాని వారు తమ స్వయానికి తామే అన్యాయం చేసుకున్నారు.
16:119 ثُمَّ إِنَّ رَبَّكَ لِلَّذِينَ عَمِلُوا السُّوءَ بِجَهَالَةٍ ثُمَّ تَابُوا مِن بَعْدِ ذَٰلِكَ وَأَصْلَحُوا إِنَّ رَبَّكَ مِن بَعْدِهَا لَغَفُورٌ رَّحِيمٌ
మరి ఎవరయినా అజ్ఞానం వల్ల దురాగతాలకు పాల్పడి, ఆపైన పశ్చాత్తాపం చెందితే, దిద్దుబాటు కూడా చేసుకుంటే అప్పుడు నిశ్చయంగా నీ ప్రభువు అపారంగా క్షమించేవాడు, అమితంగా కనికరించేవాడు.
16:120 إِنَّ إِبْرَاهِيمَ كَانَ أُمَّةً قَانِتًا لِّلَّهِ حَنِيفًا وَلَمْ يَكُ مِنَ الْمُشْرِكِينَ
నిశ్చయంగా ఇబ్రాహీం ఒక అనుసరణీయ నాయకుడు. నికార్సయిన దైవవిధేయుడు. అల్లాహ్ యందే మనస్సు నిలిపిన వాడు. అతడు బహుదైవారాధకులలో చేరినవాడు కాడు.
16:121 شَاكِرًا لِّأَنْعُمِهِ ۚ اجْتَبَاهُ وَهَدَاهُ إِلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ
అల్లాహ్ అనుగ్రహాల పట్ల కృతజ్ఞతాభావం కలవాడు. అల్లాహ్ అతన్ని ఎన్నుకున్నాడు. అతనికి రుజుమార్గం చూపించాడు.
16:122 وَآتَيْنَاهُ فِي الدُّنْيَا حَسَنَةً ۖ وَإِنَّهُ فِي الْآخِرَةِ لَمِنَ الصَّالِحِينَ
మేమతనికి ప్రపంచంలోనూ మేలును ప్రసాదించాము. పరలోకంలోనూ అతను సజ్జనులలో చేరి ఉంటాడు.
16:123 ثُمَّ أَوْحَيْنَا إِلَيْكَ أَنِ اتَّبِعْ مِلَّةَ إِبْرَاهِيمَ حَنِيفًا ۖ وَمَا كَانَ مِنَ الْمُشْرِكِينَ
తరువాత మేము, ఏకాగ్రచిత్తుడైన ఇబ్రాహీం ధర్మాన్ని అనుసరించమని నీ వద్దకు వహీ పంపాము. అతడు బహుదైవోపాసకులలో చేరినవాడు కాడు.
16:124 إِنَّمَا جُعِلَ السَّبْتُ عَلَى الَّذِينَ اخْتَلَفُوا فِيهِ ۚ وَإِنَّ رَبَّكَ لَيَحْكُمُ بَيْنَهُمْ يَوْمَ الْقِيَامَةِ فِيمَا كَانُوا فِيهِ يَخْتَلِفُونَ
ఎవరు శనివారం విషయంలో విభేదించుకున్నారో వారికి మాత్రమే దాని విశిష్ఠత విధించబడింది. అసలు విషయమేమిటంటే నీ ప్రభువు స్వయంగా ప్రళయదినాన వారి విభేదంపై వారి మధ్య తీర్పు చేస్తాడు.
16:125 ادْعُ إِلَىٰ سَبِيلِ رَبِّكَ بِالْحِكْمَةِ وَالْمَوْعِظَةِ الْحَسَنَةِ ۖ وَجَادِلْهُم بِالَّتِي هِيَ أَحْسَنُ ۚ إِنَّ رَبَّكَ هُوَ أَعْلَمُ بِمَن ضَلَّ عَن سَبِيلِهِ ۖ وَهُوَ أَعْلَمُ بِالْمُهْتَدِينَ
నీ ప్రభువు మార్గం వైపు జనులను వివేకంతోనూ, చక్కని ఉపదేశంతోనూ పిలువు. అత్యుత్తమ రీతిలో వారితో సంభాషణ జరుపు. నిశ్చయంగా తన మార్గం నుంచి తప్పిన వారెవరో నీ ప్రభువుకు బాగా తెలుసు. సన్మార్గాన ఉన్నవారెవరో కూడా ఆయనకు బాగా తెలుసు.
16:126 وَإِنْ عَاقَبْتُمْ فَعَاقِبُوا بِمِثْلِ مَا عُوقِبْتُم بِهِ ۖ وَلَئِن صَبَرْتُمْ لَهُوَ خَيْرٌ لِّلصَّابِرِينَ
ఒకవేళ మీరు ప్రతీకారం తీర్చుకోదలచినా, మీకు ఏ మేరకు బాధపెట్టడం జరిగిందో ఆ మేరకే ప్రతీకారం తీర్చుకోండి. ఒకవేళ మీరు ఓర్చుకున్నట్లయితే, ఓర్పు వహించేవారి పాలిట ఇది ఎంతో శ్రేయస్కరమైనది.
16:127 وَاصْبِرْ وَمَا صَبْرُكَ إِلَّا بِاللَّهِ ۚ وَلَا تَحْزَنْ عَلَيْهِمْ وَلَا تَكُ فِي ضَيْقٍ مِّمَّا يَمْكُرُونَ
(ఓ ముహమ్మద్- స!) నువ్వు సహనం వహించు. (అయితే) అల్లాహ్ తోడ్పాటు లేకుండా నువ్వు సహనం వహించలేవు. వారి పరిస్థితిపై బాధపడకు. వారు పన్నే కుట్రలు, కుయుక్తులకు లోలోపలే దుఃఖించకు.
16:128 إِنَّ اللَّهَ مَعَ الَّذِينَ اتَّقَوا وَّالَّذِينَ هُم مُّحْسِنُونَ
నిశ్చయంగా అల్లాహ్ తనకు భయపడుతూ జీవితం గడిపే వారికి, సద్వర్తనులకు తోడుగా ఉంటాడు.
17. సూరా బనీ ఇస్రాయీల్ (Al-Isra or Bani Israel)
17:1 سُبْحَانَ الَّذِي أَسْرَىٰ بِعَبْدِهِ لَيْلًا مِّنَ الْمَسْجِدِ الْحَرَامِ إِلَى الْمَسْجِدِ الْأَقْصَى الَّذِي بَارَكْنَا حَوْلَهُ لِنُرِيَهُ مِنْ آيَاتِنَا ۚ إِنَّهُ هُوَ السَّمِيعُ الْبَصِيرُ
తన దాసుణ్ణి రాత్రికి రాత్రే మస్జిదె హరామ్ నుండి మస్జిదె అక్సా వరకు తీసుకుపోయిన అల్లాహ్ పరిశుద్ధుడు. దాని పరిసరాలను మేము శుభవంతం చేశాము. ఎందుకంటే; మేమతనికి మా (శక్తిసామర్థ్యాలకు సంబంధించిన) కొన్ని సూచనలను చూపదలిచాము. నిశ్చయంగా అల్లాహ్ మాత్రమే బాగా వినేవాడు, చూసేవాడు.
17:2 وَآتَيْنَا مُوسَى الْكِتَابَ وَجَعَلْنَاهُ هُدًى لِّبَنِي إِسْرَائِيلَ أَلَّا تَتَّخِذُوا مِن دُونِي وَكِيلًا
మేము మూసాకు గ్రంథాన్ని వొసగాము. దానిని ఇస్రాయీల్ సంతతి కోసం మార్గదర్శకంగా చేశాము. “మీరు నన్ను తప్ప వేరెవరినీ మీ కార్యసాధకునిగా చేసుకోకండి” అని (వారికి ఆజ్ఞాపించాము).
17:3 ذُرِّيَّةَ مَنْ حَمَلْنَا مَعَ نُوحٍ ۚ إِنَّهُ كَانَ عَبْدًا شَكُورًا
నూహుతో పాటు మేము (ఓడలో) ఎక్కించిన వారి సంతానమా! అతడు (నూహు) మాత్రం కృతజ్ఞతాపూర్వకంగా మెలగిన మా దాసుడు (అన్న సంగతిని తెలుసుకోండి).
17:4 وَقَضَيْنَا إِلَىٰ بَنِي إِسْرَائِيلَ فِي الْكِتَابِ لَتُفْسِدُنَّ فِي الْأَرْضِ مَرَّتَيْنِ وَلَتَعْلُنَّ عُلُوًّا كَبِيرًا
మీరు భువిలో రెండుసార్లు కల్లోలాన్ని రేకెత్తిస్తారనీ, మరీ దారుణంగా చెలరేగి పోతారని ఇస్రాయీలు సంతతి వారికి మేము వారి గ్రంథంలో స్పష్టంగా తేల్చివేశాము.
17:5 فَإِذَا جَاءَ وَعْدُ أُولَاهُمَا بَعَثْنَا عَلَيْكُمْ عِبَادًا لَّنَا أُولِي بَأْسٍ شَدِيدٍ فَجَاسُوا خِلَالَ الدِّيَارِ ۚ وَكَانَ وَعْدًا مَّفْعُولًا
ఆ రెండింటిలో మొదటి వాగ్దానం వచ్చేసినప్పుడు, మీకు వ్యతిరేకంగా తీవ్రంగా పోరాడే మా దాసులను పంపించాము. వారు మీ ఇళ్ళల్లోనికి చొచ్చుకుని వచ్చారు. ఎందుకంటే ఆ వాగ్దానం నెరవేరటం తథ్యం గనక.
17:6 ثُمَّ رَدَدْنَا لَكُمُ الْكَرَّةَ عَلَيْهِمْ وَأَمْدَدْنَاكُم بِأَمْوَالٍ وَبَنِينَ وَجَعَلْنَاكُمْ أَكْثَرَ نَفِيرًا
మరి ఆ తరువాత మేము మీకు వారిపై ఆధిక్యతను వొసగి, మీ రోజులు మార్చాము. సంపద ద్వారా, సంతానం ద్వారా మీకు సహాయపడ్డాము. ఇంకా మిమ్మల్ని భారీ సంఖ్యాబలం గలవారు చేశాము.
17:7 إِنْ أَحْسَنتُمْ أَحْسَنتُمْ لِأَنفُسِكُمْ ۖ وَإِنْ أَسَأْتُمْ فَلَهَا ۚ فَإِذَا جَاءَ وَعْدُ الْآخِرَةِ لِيَسُوءُوا وُجُوهَكُمْ وَلِيَدْخُلُوا الْمَسْجِدَ كَمَا دَخَلُوهُ أَوَّلَ مَرَّةٍ وَلِيُتَبِّرُوا مَا عَلَوْا تَتْبِيرًا
ఒకవేళ మీరు మంచి చేస్తే ఆ మంచి మీ స్వయం కోసమే. ఒకవేళ మీరు చెడుకు ఒడిగడితే అది మీ పాలిటే హానికరంగా పరిణమిస్తుంది. మరి రెండవ వాగ్దాన సమయం వచ్చినప్పుడు- మీ ముఖాలను వికృతం చేయటానికి మొదటిసారి లాగానే మళ్లీ అదే మస్జిదులోనికి జొరబడటానికి, తమకు దొరికిన దానినల్లా ధ్వంసం చేయటానికి (మేము ఇతరులను మీపైకి పంపాము).
17:8 عَسَىٰ رَبُّكُمْ أَن يَرْحَمَكُمْ ۚ وَإِنْ عُدتُّمْ عُدْنَا ۘ وَجَعَلْنَا جَهَنَّمَ لِلْكَافِرِينَ حَصِيرًا
మీ ప్రభువు మీపై కరుణ చూపే అవకాశం ఉంది. కాని మీరు గనక మళ్లీ అలాగే చేయటం మొదలెడితే మేము కూడా మళ్లీ అలాగే చేస్తాము. మేము నరకాన్ని తిరస్కారుల కోసం కారాగారంగా చేసి ఉంచాము.
17:9 إِنَّ هَٰذَا الْقُرْآنَ يَهْدِي لِلَّتِي هِيَ أَقْوَمُ وَيُبَشِّرُ الْمُؤْمِنِينَ الَّذِينَ يَعْمَلُونَ الصَّالِحَاتِ أَنَّ لَهُمْ أَجْرًا كَبِيرًا
నిశ్చయంగా ఈ ఖుర్ఆన్ అన్నిటికంటే సవ్యమైన మార్గాన్ని చూపిస్తుంది. మంచి పనులు చేసే విశ్వాసులకు గొప్ప పుణ్యఫల ముందన్న శుభవార్తను అది వినిపిస్తుంది.
17:10 وَأَنَّ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ أَعْتَدْنَا لَهُمْ عَذَابًا أَلِيمًا
ఇంకా, పరలోకాన్ని నమ్మనివారి కోసం మేము వ్యధాభరితమైన శిక్షను సిద్ధంచేసి ఉంచాము.
17:11 وَيَدْعُ الْإِنسَانُ بِالشَّرِّ دُعَاءَهُ بِالْخَيْرِ ۖ وَكَانَ الْإِنسَانُ عَجُولًا
మానవుడు తన కోసం మేలును అర్థించినట్లే కీడునూ అర్థిస్తున్నాడు. మానవుడు మహా తొందరపాటు స్వభావి.
17:12 وَجَعَلْنَا اللَّيْلَ وَالنَّهَارَ آيَتَيْنِ ۖ فَمَحَوْنَا آيَةَ اللَّيْلِ وَجَعَلْنَا آيَةَ النَّهَارِ مُبْصِرَةً لِّتَبْتَغُوا فَضْلًا مِّن رَّبِّكُمْ وَلِتَعْلَمُوا عَدَدَ السِّنِينَ وَالْحِسَابَ ۚ وَكُلَّ شَيْءٍ فَصَّلْنَاهُ تَفْصِيلًا
మేము రేయింబవళ్ళను (మాశక్తి) సూచనలుగా చేశాము. రాత్రి సూచనను మేము కాంతిహీనంగానూ, పగటి సూచనను కాంతిమంతంగానూ చేశాము – మీరు మీ ప్రభువు అనుగ్రహాన్ని అన్వేషించగలగటానికి! సంవత్సరాల సంఖ్యను, లెక్కను తెలుసు కోగలగటానికి!! మేము ప్రతి విషయాన్ని బాగా విడమరచి చెప్పాము.
17:13 وَكُلَّ إِنسَانٍ أَلْزَمْنَاهُ طَائِرَهُ فِي عُنُقِهِ ۖ وَنُخْرِجُ لَهُ يَوْمَ الْقِيَامَةِ كِتَابًا يَلْقَاهُ مَنشُورًا
మేము ప్రతి మనిషి యొక్క మంచి చెడులను అతని మెడలోనే వ్రేలాడదీశాము. ప్రళయ దినాన మేము అతని కర్మల పత్రాన్ని (అతని సమక్షంలో) బయటపెడతాము. దాన్ని అతను తెరచిన పుస్తకంలా చూసుకుంటాడు.
17:14 اقْرَأْ كِتَابَكَ كَفَىٰ بِنَفْسِكَ الْيَوْمَ عَلَيْكَ حَسِيبًا
“(ఇదిగో!) నువ్వు స్వయంగా నీ పుస్తకాన్ని చదువుకో. ఈ రోజు నీ లెక్క తీసుకోవటానికి నువ్వే చాలు” (అని అతనితో అనబడుతుంది).
17:15 مَّنِ اهْتَدَىٰ فَإِنَّمَا يَهْتَدِي لِنَفْسِهِ ۖ وَمَن ضَلَّ فَإِنَّمَا يَضِلُّ عَلَيْهَا ۚ وَلَا تَزِرُ وَازِرَةٌ وِزْرَ أُخْرَىٰ ۗ وَمَا كُنَّا مُعَذِّبِينَ حَتَّىٰ نَبْعَثَ رَسُولًا
సన్మార్గాన్ని పొందేవాడు తన మేలు కోసమే సన్మార్గాన్ని పొందుతాడు. పెడదారి పట్టేవాడు తన కీడుకు తానే కారకుడౌతాడు. బరువు మోసే వాడెవడూ ఇంకొకరి బరువును తనపై వేసుకోడు. ఒక ప్రవక్తను పంపనంతవరకూ ఎవరినయినా శిక్షించటం మా సంప్రదాయం కాదు.
17:16 وَإِذَا أَرَدْنَا أَن نُّهْلِكَ قَرْيَةً أَمَرْنَا مُتْرَفِيهَا فَفَسَقُوا فِيهَا فَحَقَّ عَلَيْهَا الْقَوْلُ فَدَمَّرْنَاهَا تَدْمِيرًا
మేము ఏదైనా ఒక పట్టణాన్ని నాశనం చెయ్యాలని సంకల్పించుకున్నప్పుడు, అక్కడి స్థితిమంతులకు (కొన్ని) ఆజ్ఞలు జారీ చేస్తాము. కాని వారేమో అందులో అవిధేయతకు పాల్పడతారు. ఆ విధంగా వారిపై (శిక్షకు సంబంధించిన) మాట నిరూపితమవుతుంది. ఆపై మేము ఆ పట్టణాన్ని సర్వనాశనం చేసేస్తాము.
17:17 وَكَمْ أَهْلَكْنَا مِنَ الْقُرُونِ مِن بَعْدِ نُوحٍ ۗ وَكَفَىٰ بِرَبِّكَ بِذُنُوبِ عِبَادِهِ خَبِيرًا بَصِيرًا
మేము నూహు తరువాత కూడా ఎన్నో జాతులను తుద ముట్టించాము. తన దాసుల పాపాలను తెలుసుకోవటానికి, చూడటానికి నీ ప్రభువు (ఒక్కడే) చాలు.
17:18 مَّن كَانَ يُرِيدُ الْعَاجِلَةَ عَجَّلْنَا لَهُ فِيهَا مَا نَشَاءُ لِمَن نُّرِيدُ ثُمَّ جَعَلْنَا لَهُ جَهَنَّمَ يَصْلَاهَا مَذْمُومًا مَّدْحُورًا
ఎవడు తొందరగా లభించే ప్రాపంచిక లాభాలను కోరుకుంటాడో అతనికి మేము ఇహంలో తొందరగానే – మేము తలచిన వానికి తలచినంతగా – ఇస్తాము. ఎట్టకేలకు అతని కోసం మేము నరకాన్ని నియమిస్తాము. అందులోకి వాడు అత్యంత నికృష్ట స్థితిలో, కారుణ్యానికి దూరమైనవాడై ప్రవేశిస్తాడు.
17:19 وَمَنْ أَرَادَ الْآخِرَةَ وَسَعَىٰ لَهَا سَعْيَهَا وَهُوَ مُؤْمِنٌ فَأُولَٰئِكَ كَانَ سَعْيُهُم مَّشْكُورًا
మరెవరయితే పరలోకాన్ని కోరుకుని, దానికోసం కృషి చేయవలసిన విధంగా కృషిచేస్తాడో, విశ్వాసి అయి ఉంటాడో అలాంటి వాని కృషి అల్లాహ్ వద్ద ఆదరణ పొందుతుంది.
17:20 كُلًّا نُّمِدُّ هَٰؤُلَاءِ وَهَٰؤُلَاءِ مِنْ عَطَاءِ رَبِّكَ ۚ وَمَا كَانَ عَطَاءُ رَبِّكَ مَحْظُورًا
వారికీ, వీరికీ – ప్రతి ఒక్కరికీ – మేము (ప్రపంచంలో) నీ ప్రభువు అనుగ్రహాల నుంచి వొసగుతూపోతున్నాము. నీ ప్రభువు ప్రసాదాలు (ఎవరి విషయంలో కూడా) ఆగిపోలేదు.
17:21 انظُرْ كَيْفَ فَضَّلْنَا بَعْضَهُمْ عَلَىٰ بَعْضٍ ۚ وَلَلْآخِرَةُ أَكْبَرُ دَرَجَاتٍ وَأَكْبَرُ تَفْضِيلًا
చూడు! వారిలో ఒకరిపై ఇంకొకరికి మేము ఎలా ఆధిక్యతను ఇచ్చి ఉన్నామో! పరలోకం అంతస్థుల రీత్యా మరింత గొప్పది. శ్రేష్ఠతరీత్యా మరింత ఉన్నతమైనది.
17:22 لَّا تَجْعَلْ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ فَتَقْعُدَ مَذْمُومًا مَّخْذُولًا
అల్లాహ్‌తో పాటు వేరొక ఆరాధ్యుణ్ణి నిలబెట్టకు. అలా గనక చేస్తే నువ్వు నిందితుడవై, నిస్సహాయుడవై కూర్చుంటావు.
17:23 وَقَضَىٰ رَبُّكَ أَلَّا تَعْبُدُوا إِلَّا إِيَّاهُ وَبِالْوَالِدَيْنِ إِحْسَانًا ۚ إِمَّا يَبْلُغَنَّ عِندَكَ الْكِبَرَ أَحَدُهُمَا أَوْ كِلَاهُمَا فَلَا تَقُل لَّهُمَا أُفٍّ وَلَا تَنْهَرْهُمَا وَقُل لَّهُمَا قَوْلًا كَرِيمًا
నీ ప్రభువు స్పష్టంగా ఆజ్ఞాపించాడు: మీరు ఆయనను తప్ప మరొకరెవరినీ ఆరాధించకూడదు. తల్లిదండ్రుల యెడల ఉత్తమంగా వ్యవహరించాలి. నీ సమక్షంలో వారిలో ఒకరుగాని, ఇద్దరుగానీ వృద్ధాప్యానికి చేరుకుని ఉంటే వారి ముందు (విసుగ్గా) “ఊహ్” అని కూడా అనకు. వారిని కసురుకుంటూ మాట్లాడకు. పైగా వారితో మర్యాదగా మాట్లాడు.
17:24 وَاخْفِضْ لَهُمَا جَنَاحَ الذُّلِّ مِنَ الرَّحْمَةِ وَقُل رَّبِّ ارْحَمْهُمَا كَمَا رَبَّيَانِي صَغِيرًا
అణకువ, దయాభావం ఉట్టిపడే విధంగా నీ భుజాలను వారి ముందు అణచిపెట్టు. “ఓ ప్రభూ! బాల్యంలో వీరు నన్ను (ప్రేమానురాగాలతో) పోషించినట్లుగానే నీవు వీరిపై దయజూపు” అని వారి కోసం ప్రార్థిస్తూ ఉండు.
17:25 رَّبُّكُمْ أَعْلَمُ بِمَا فِي نُفُوسِكُمْ ۚ إِن تَكُونُوا صَالِحِينَ فَإِنَّهُ كَانَ لِلْأَوَّابِينَ غَفُورًا
మీ ఆంతర్యాలలో ఏముందో మీ ప్రభువుకు బాగా తెలుసు. మీరు గనక మంచివారుగా మసలుకుంటే, అలా (మంచి వైపుకు) మరలివచ్చే వారిని అల్లాహ్ క్షమిస్తాడు.
17:26 وَآتِ ذَا الْقُرْبَىٰ حَقَّهُ وَالْمِسْكِينَ وَابْنَ السَّبِيلِ وَلَا تُبَذِّرْ تَبْذِيرًا
బంధువుల, నిరుపేదల, ప్రయాణీకుల హక్కును వారికి ఇస్తూ ఉండు. దుబారా ఖర్చు చేయకు.
17:27 إِنَّ الْمُبَذِّرِينَ كَانُوا إِخْوَانَ الشَّيَاطِينِ ۖ وَكَانَ الشَّيْطَانُ لِرَبِّهِ كَفُورًا
దుబారా ఖర్చు చేసేవారు షైతానుల సోదరులు. మరి షైతానేమో తన ప్రభువునకు కృతఘ్నుడు.
17:28 وَإِمَّا تُعْرِضَنَّ عَنْهُمُ ابْتِغَاءَ رَحْمَةٍ مِّن رَّبِّكَ تَرْجُوهَا فَقُل لَّهُمْ قَوْلًا مَّيْسُورًا
ఒకవేళ నువ్వు ఆశించే నీ ప్రభువు కారుణ్యాన్ని నువ్వు ఇంకా అన్వేషిస్తూ ఉన్నందువల్ల వారి నుంచి ముఖం తిప్పుకోవలసివస్తే మృదువుగా వారికి నచ్చజెప్పు.
17:29 وَلَا تَجْعَلْ يَدَكَ مَغْلُولَةً إِلَىٰ عُنُقِكَ وَلَا تَبْسُطْهَا كُلَّ الْبَسْطِ فَتَقْعُدَ مَلُومًا مَّحْسُورًا
నీ చేతిని నీ మెడకు కట్టి ఉంచకు. అలాగని దానిని విచ్చల విడిగానూ వదలి పెట్టకు. అలా చేశావంటే నువ్వు నిందల పాలవుతావు, దిక్కుమాలిన స్థితికి లోనై కూర్చుంటావు.
17:30 إِنَّ رَبَّكَ يَبْسُطُ الرِّزْقَ لِمَن يَشَاءُ وَيَقْدِرُ ۚ إِنَّهُ كَانَ بِعِبَادِهِ خَبِيرًا بَصِيرًا
నిశ్చయంగా నీ ప్రభువు తాను కోరిన వారి కోసం ఉపాధిని విస్తృతపరుస్తాడు. తాను కోరిన వారికి పరిమితం చేస్తాడు. నిస్సందేహంగా ఆయన తన దాసుల గురించి అన్నీ తెలిసినవాడు, అంతా చూస్తున్నవాడు.
17:31 وَلَا تَقْتُلُوا أَوْلَادَكُمْ خَشْيَةَ إِمْلَاقٍ ۖ نَّحْنُ نَرْزُقُهُمْ وَإِيَّاكُمْ ۚ إِنَّ قَتْلَهُمْ كَانَ خِطْئًا كَبِيرًا
దారిద్య్ర భయంతో మీరు మీ సంతానాన్ని చంపేయకండి. వారికీ, మీకూ ఉపాధిని ఇచ్చేది మేమే. ముమ్మాటికీ వారి హత్య మహాపాతకం.
17:32 وَلَا تَقْرَبُوا الزِّنَا ۖ إِنَّهُ كَانَ فَاحِشَةً وَسَاءَ سَبِيلًا
వ్యభిచారం దరిదాపులకు కూడా పోకూడదు సుమా! ఎందుకంటే అది నీతి బాహ్యమైన చేష్ట. మహా చెడ్డమార్గం.
17:33 وَلَا تَقْتُلُوا النَّفْسَ الَّتِي حَرَّمَ اللَّهُ إِلَّا بِالْحَقِّ ۗ وَمَن قُتِلَ مَظْلُومًا فَقَدْ جَعَلْنَا لِوَلِيِّهِ سُلْطَانًا فَلَا يُسْرِف فِّي الْقَتْلِ ۖ إِنَّهُ كَانَ مَنصُورًا
న్యాయసమ్మతంగా తప్ప – అల్లాహ్ నిషేధించిన ఏ ప్రాణినీ హతమార్చకూడదు. అన్యాయంగా చంపబడినవాని వారసునికి మేము అధికారం ఇచ్చి ఉన్నాము. అయితే అతను వధించటంలో మితి మీరకూడదు. నిశ్చయంగా అతను సహాయం చేయబడిన వాడు.
17:34 وَلَا تَقْرَبُوا مَالَ الْيَتِيمِ إِلَّا بِالَّتِي هِيَ أَحْسَنُ حَتَّىٰ يَبْلُغَ أَشُدَّهُ ۚ وَأَوْفُوا بِالْعَهْدِ ۖ إِنَّ الْعَهْدَ كَانَ مَسْئُولًا
అత్యుత్తమమైన పద్ధతిలో తప్ప అనాధ ఆస్తి దరిదాపులకు కూడా వెళ్ళకండి – అతను యుక్త వయస్సుకు చేరేవరకు. వాగ్దానాన్ని (చేసుకున్న ప్రతి ఒప్పందాన్ని) నెరవేర్చండి. ఎందుకంటే వాగ్దానం (ఒప్పందం) గురించి ప్రశ్నించబడుతుంది.
17:35 وَأَوْفُوا الْكَيْلَ إِذَا كِلْتُمْ وَزِنُوا بِالْقِسْطَاسِ الْمُسْتَقِيمِ ۚ ذَٰلِكَ خَيْرٌ وَأَحْسَنُ تَأْوِيلًا
మీరు కొలచి ఇస్తున్నప్పుడు నిండుగా కొలిచి ఇవ్వండి. సరైన త్రాసుతో తూయండి. ఇదే ఉత్తమమైనది. పర్యవసానం రీత్యా కూడా ఇదే మేలైనది.
17:36 وَلَا تَقْفُ مَا لَيْسَ لَكَ بِهِ عِلْمٌ ۚ إِنَّ السَّمْعَ وَالْبَصَرَ وَالْفُؤَادَ كُلُّ أُولَٰئِكَ كَانَ عَنْهُ مَسْئُولًا
నీవు తెలుసుకోవలసిన అవసరం లేని విషయాల వెంట పడకు. ఎందుకంటే చెవి, కన్ను, హృదయం – వీటన్నింటి గురించి ప్రశ్నించటం జరుగుతుంది.
17:37 وَلَا تَمْشِ فِي الْأَرْضِ مَرَحًا ۖ إِنَّكَ لَن تَخْرِقَ الْأَرْضَ وَلَن تَبْلُغَ الْجِبَالَ طُولًا
నేలపై నిక్కుతూ నడవకు – నువ్వు నేలను చీల్చనూ లేవు. పర్వత శిఖరాలను అందుకునే ఎత్తుకు ఎదగనూ లేవు.
17:38 كُلُّ ذَٰلِكَ كَانَ سَيِّئُهُ عِندَ رَبِّكَ مَكْرُوهًا
వీటన్నింటిలో గల చెడుగు నీ ప్రభువు సన్నిధిలో (అత్యధికంగా) అసహ్యించుకోబడుతుంది.
17:39 ذَٰلِكَ مِمَّا أَوْحَىٰ إِلَيْكَ رَبُّكَ مِنَ الْحِكْمَةِ ۗ وَلَا تَجْعَلْ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ فَتُلْقَىٰ فِي جَهَنَّمَ مَلُومًا مَّدْحُورًا
ఇవన్నీ కూడా నీ ప్రభువు నీ వద్దకు వహీ ద్వారా పంపిన వివేచనాభరిత విషయాలు. నువ్వు అల్లాహ్‌తోపాటు వేరొకరిని ఆరాధ్యునిగా కల్పించకు. ఒకవేళ అలా చేశావంటే నిందితుడవై, ప్రతి మేలుకు దూరమైనవాడై నరకంలోకి నెట్టివేయబడతావు.
17:40 أَفَأَصْفَاكُمْ رَبُّكُم بِالْبَنِينَ وَاتَّخَذَ مِنَ الْمَلَائِكَةِ إِنَاثًا ۚ إِنَّكُمْ لَتَقُولُونَ قَوْلًا عَظِيمًا
ఏమిటీ, మీ ప్రభువు మీ కోసం కొడుకుల్ని కేటాయించి, తన కోసమేమో దూతలను కూతుళ్ళుగా చేసుకున్నాడా? నిశ్చయంగా మీరు చాలా పెద్ద (ఘోరమైన) మాట అంటున్నారు.
17:41 وَلَقَدْ صَرَّفْنَا فِي هَٰذَا الْقُرْآنِ لِيَذَّكَّرُوا وَمَا يَزِيدُهُمْ إِلَّا نُفُورًا
ప్రజలు హితవు గ్రహించటానికిగాను మేము ఈ ఖుర్ఆన్లో (విషయాన్ని) పలు విధాలుగా విడమరిచి చెప్పాము. కాని దాని మూలంగా వారిలో సత్యం పట్ల దూరమే మరింతగా పెరుగుతోంది.
17:42 قُل لَّوْ كَانَ مَعَهُ آلِهَةٌ كَمَا يَقُولُونَ إِذًا لَّابْتَغَوْا إِلَىٰ ذِي الْعَرْشِ سَبِيلًا
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: వారు చెబుతున్నట్లుగా అల్లాహ్‌తో పాటు వేరే ఆరాధ్య దైవాలు గనక ఉండి ఉంటే వారు ఇప్పటికే సింహాసనాధీశుని వైపుకు వెళ్ళే మార్గాన్ని అన్వేషించి ఉండేవారే.
17:43 سُبْحَانَهُ وَتَعَالَىٰ عَمَّا يَقُولُونَ عُلُوًّا كَبِيرًا
ఆయన పరిశుద్ధుడు. వారు అనే ఈ మాటలకు ఎంతో అతీతుడు, ఎంతో ఉన్నతుడు.
17:44 تُسَبِّحُ لَهُ السَّمَاوَاتُ السَّبْعُ وَالْأَرْضُ وَمَن فِيهِنَّ ۚ وَإِن مِّن شَيْءٍ إِلَّا يُسَبِّحُ بِحَمْدِهِ وَلَٰكِن لَّا تَفْقَهُونَ تَسْبِيحَهُمْ ۗ إِنَّهُ كَانَ حَلِيمًا غَفُورًا
సప్తాకాశాలు, భూమి, వాటిలో ఉన్నవన్నీ ఆయన పవిత్రతనే కొనియాడుతున్నాయి. ఆయన స్తోత్రంతోపాటు ఆయన పవిత్రతను కొనియాడని వస్తువంటూ ఏదీ లేదు. అయితే మీరు వాటి స్తుతిని గ్రహించలేరు. ఆయన గొప్ప సహనశీలుడు, క్షమాగుణం కలవాడు.
17:45 وَإِذَا قَرَأْتَ الْقُرْآنَ جَعَلْنَا بَيْنَكَ وَبَيْنَ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ حِجَابًا مَّسْتُورًا
(ఓ ప్రవక్తా!) నువ్వు ఖుర్ఆను పఠిస్తున్నప్పుడు, మేము నీకూ – పరలోకాన్ని నమ్మనివారికీ మధ్య కనిపించని ఒక తెరను వేసేస్తాము.
17:46 وَجَعَلْنَا عَلَىٰ قُلُوبِهِمْ أَكِنَّةً أَن يَفْقَهُوهُ وَفِي آذَانِهِمْ وَقْرًا ۚ وَإِذَا ذَكَرْتَ رَبَّكَ فِي الْقُرْآنِ وَحْدَهُ وَلَّوْا عَلَىٰ أَدْبَارِهِمْ نُفُورًا
అంటే, వారు దానిని అర్థం చేసుకోకుండా వారి హృదయాలపై తెరలు వేసేస్తాము. వారి చెవులను మొద్దుబారజేస్తాము. నువ్వు ఈ ఖుర్ఆన్లో ఒక్కడైన అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని (తౌహీద్‌ను) ప్రస్తావించినప్పుడల్లా వారు తీవ్ర అయిష్టతను వ్యక్తం చేస్తూ వెనుతిరిగి వెళ్ళిపోతారు.
17:47 نَّحْنُ أَعْلَمُ بِمَا يَسْتَمِعُونَ بِهِ إِذْ يَسْتَمِعُونَ إِلَيْكَ وَإِذْ هُمْ نَجْوَىٰ إِذْ يَقُولُ الظَّالِمُونَ إِن تَتَّبِعُونَ إِلَّا رَجُلًا مَّسْحُورًا
వారు నీ వైపుకు చెవియొగ్గి వింటున్నప్పుడు ఏ ఉద్దేశ్యంతో వింటున్నారో మాకు బాగా తెలుసు. పరస్పరం చెవులు కొరుక్కుంటూ “చేతబడి ప్రభావానికి లోనైన వ్యక్తిని మీరు అనుసరిస్తున్నారు” అని ఆ దుర్మార్గులు పలికేది కూడా (మాకు తెలుసు).
17:48 انظُرْ كَيْفَ ضَرَبُوا لَكَ الْأَمْثَالَ فَضَلُّوا فَلَا يَسْتَطِيعُونَ سَبِيلًا
చూడు, వారు నీ గురించి ఎలాంటి ఉదాహరణలు ఇస్తున్నారో! వారు దారి తప్పుతున్నారు. ఇక వారు దారికి రావట మనేది వారి వల్ల కాని పని.
17:49 وَقَالُوا أَإِذَا كُنَّا عِظَامًا وَرُفَاتًا أَإِنَّا لَمَبْعُوثُونَ خَلْقًا جَدِيدًا
“మేము (చచ్చి) ఎముకలై, తుత్తునియలైపోయిన తరువాత, మళ్లీ సరికొత్తగా సృష్టించబడి లేపబడతామా?” అని వారు అంటున్నారు (కదూ!)
17:50 قُلْ كُونُوا حِجَارَةً أَوْ حَدِيدًا
వారికి చెప్పు: “మీరు రాళ్లయిపోయినా, ఇనుమైపోయినా”
17:51 أَوْ خَلْقًا مِّمَّا يَكْبُرُ فِي صُدُورِكُمْ ۚ فَسَيَقُولُونَ مَن يُعِيدُنَا ۖ قُلِ الَّذِي فَطَرَكُمْ أَوَّلَ مَرَّةٍ ۚ فَسَيُنْغِضُونَ إِلَيْكَ رُءُوسَهُمْ وَيَقُولُونَ مَتَىٰ هُوَ ۖ قُلْ عَسَىٰ أَن يَكُونَ قَرِيبًا
“…లేక మీ మనసులకు ఎంతో కఠినమైనదిగా తోచే మరేదైనా సృష్టిగా మారినా సరే(మీ పునరుత్థానం తథ్యం).” “మమ్మల్ని తిరిగి లేపేవాడెవడు?” అని వారు మళ్లీ అడుగుతారు. “తొలిసారి మిమ్మల్ని సృష్టించినవాడే (మలిసారి కూడా సృష్టిస్తాడు)” అని ఓ ప్రవక్తా! వారికి చెప్పు. దానిపై వారు తమ తలలను ఆడిస్తూ “ఇంతకీ అది ఎప్పుడు సంభవిస్తుందీ?” అని అడుగుతారు. వారికి సమాధానమివ్వు – “అది త్వరలోనే సంభవించవచ్చు”.
17:52 يَوْمَ يَدْعُوكُمْ فَتَسْتَجِيبُونَ بِحَمْدِهِ وَتَظُنُّونَ إِن لَّبِثْتُمْ إِلَّا قَلِيلًا
ఆ రోజు ఆయన మిమ్మల్ని పిలుస్తాడు. అప్పుడు మీరు ఆయన్ని స్తుతిస్తూ (ఆయన పిలుపుకు) హాజరు పలుకుతారు. అప్పుడు మీరు ‘మేము కొద్ది సమయం మాత్రమే (ప్రపంచంలో) ఉన్నామ’ని అనుకుంటారు.”
17:53 وَقُل لِّعِبَادِي يَقُولُوا الَّتِي هِيَ أَحْسَنُ ۚ إِنَّ الشَّيْطَانَ يَنزَغُ بَيْنَهُمْ ۚ إِنَّ الشَّيْطَانَ كَانَ لِلْإِنسَانِ عَدُوًّا مُّبِينًا
(ఓ ప్రవక్తా!) నా దాసులతో, వారు తమ నోట అత్యంత మంచి మాటలనే పలకాలని చెప్పు. ఎందుకంటే షైతాన్ వారి మధ్య కలతలు రేపుతాడు. నిశ్చయంగా షైతాన్ మానవుని పాలిట బహిరంగ శత్రువు.
17:54 رَّبُّكُمْ أَعْلَمُ بِكُمْ ۖ إِن يَشَأْ يَرْحَمْكُمْ أَوْ إِن يَشَأْ يُعَذِّبْكُمْ ۚ وَمَا أَرْسَلْنَاكَ عَلَيْهِمْ وَكِيلًا
మీ ప్రభువుకు మీ గురించి బాగా తెలుసు. ఆయన తలచుకుంటే మిమ్మల్ని కరుణిస్తాడు లేదా ఆయన కోరితే మిమ్మల్ని శిక్షిస్తాడు. మేము నిన్ను వారిపై సంరక్షకునిగా చేసి పంపలేదు.
17:55 وَرَبُّكَ أَعْلَمُ بِمَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۗ وَلَقَدْ فَضَّلْنَا بَعْضَ النَّبِيِّينَ عَلَىٰ بَعْضٍ ۖ وَآتَيْنَا دَاوُودَ زَبُورًا
ఆకాశాలలో, భూమిలో ఉన్న వాటన్నింటి గురించి నీ ప్రభువుకు బాగా తెలుసు. మేము ప్రవక్తలలో కొందరికి మరి కొందరిపై శ్రేష్ఠతను ప్రసాదించాము. ఇంకా, మేము దావూదుకు జబూరు (గ్రంథం) వొసగాము.
17:56 قُلِ ادْعُوا الَّذِينَ زَعَمْتُم مِّن دُونِهِ فَلَا يَمْلِكُونَ كَشْفَ الضُّرِّ عَنكُمْ وَلَا تَحْوِيلًا
వారికి చెప్పు: “మీరు అల్లాహ్‌ను వదలి ఆరాధ్య దైవాలుగా భావిస్తున్న వారిని పిలిచి చూడండి, వారు మీ నుండి ఏ కష్టాన్నీ దూరం చేయటంగానీ, మార్చటంగానీ చేయలేరు.”
17:57 أُولَٰئِكَ الَّذِينَ يَدْعُونَ يَبْتَغُونَ إِلَىٰ رَبِّهِمُ الْوَسِيلَةَ أَيُّهُمْ أَقْرَبُ وَيَرْجُونَ رَحْمَتَهُ وَيَخَافُونَ عَذَابَهُ ۚ إِنَّ عَذَابَ رَبِّكَ كَانَ مَحْذُورًا
వీళ్లు ఎవరిని పిలుస్తున్నారో వారే స్వయంగా తమ ప్రభువు సామీప్యం కోసం మార్గాన్ని వెతుక్కుంటున్నారు. తమలో ఎవరు ఎక్కువ సామీప్యం పొందుతారోనని (పోటీపడుతున్నారు). వారు ఖుద్దుగా ఆయన కారుణ్యాన్ని ఆశిస్తున్నారు. ఆయన శిక్ష పట్ల భీతిల్లుతున్నారు. (అవును మరి) నీ ప్రభువు శిక్ష భయపడ దగినదే.
17:58 وَإِن مِّن قَرْيَةٍ إِلَّا نَحْنُ مُهْلِكُوهَا قَبْلَ يَوْمِ الْقِيَامَةِ أَوْ مُعَذِّبُوهَا عَذَابًا شَدِيدًا ۚ كَانَ ذَٰلِكَ فِي الْكِتَابِ مَسْطُورًا
ప్రళయదినానికి ముందే మేము ప్రతి పట్టణాన్ని నాశనం చేయటమో, లేదా దానిని ఘోరమైన విపత్తుకు గురి చేయటమో చేస్తాము. ఈ విషయం గ్రంథంలో లిఖితమై ఉంది.
17:59 وَمَا مَنَعَنَا أَن نُّرْسِلَ بِالْآيَاتِ إِلَّا أَن كَذَّبَ بِهَا الْأَوَّلُونَ ۚ وَآتَيْنَا ثَمُودَ النَّاقَةَ مُبْصِرَةً فَظَلَمُوا بِهَا ۚ وَمَا نُرْسِلُ بِالْآيَاتِ إِلَّا تَخْوِيفًا
పూర్వీకులు సూచనలను (మహిమలను) తిరస్కరించినందు వల్లనే మేము సూచనలను పంపటం ఆపేశాము. మేము సమూదు వారికి స్పష్టమైన సూచనగా ఆడ ఒంటెను ఇచ్చాము. కాని వారు దానిపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. మేము (యదార్థానికి) ప్రజలను భయపెట్టడానికి మాత్రమే సూచనలను పంపిస్తాము.
17:60 وَإِذْ قُلْنَا لَكَ إِنَّ رَبَّكَ أَحَاطَ بِالنَّاسِ ۚ وَمَا جَعَلْنَا الرُّؤْيَا الَّتِي أَرَيْنَاكَ إِلَّا فِتْنَةً لِّلنَّاسِ وَالشَّجَرَةَ الْمَلْعُونَةَ فِي الْقُرْآنِ ۚ وَنُخَوِّفُهُمْ فَمَا يَزِيدُهُمْ إِلَّا طُغْيَانًا كَبِيرًا
నీ ప్రభువు ఈ జనులను చుట్టుముట్టి ఉన్నాడని మేము నీకు చెప్పిన సంగతిని (ఓ ప్రవక్తా!) జ్ఞాపకం చేసుకో. మేము నీకు చూపిన దృశ్యం ప్రజల పాలిట ఓ పరీక్ష. అదేవిధంగా ఖుర్ఆనులో శపించబడిన వృక్షం కూడా (ఓ పరీక్షే). మేము వారిని భయ పెడుతూనే ఉన్నాము. కాని మా భయబోధ వారిలోని పెద్ద తలబిరుసుతనాన్ని మరింతగా పెంచుతూ పోతుంది.
17:61 وَإِذْ قُلْنَا لِلْمَلَائِكَةِ اسْجُدُوا لِآدَمَ فَسَجَدُوا إِلَّا إِبْلِيسَ قَالَ أَأَسْجُدُ لِمَنْ خَلَقْتَ طِينًا
“ఆదమ్‌కు సాష్టాంగపడండి” అని మేము దూతలకు ఆజ్ఞాపించినపుడు, ఒక్క ఇబ్లీసు తప్ప అందరూ సాష్టాంగపడ్డారు. (పైగా) వాడు, “ఏమిటీ, నీవు మట్టితో పుట్టించినవానికి నేను సాష్టాంగపడాలా?” అన్నాడు.
17:62 قَالَ أَرَأَيْتَكَ هَٰذَا الَّذِي كَرَّمْتَ عَلَيَّ لَئِنْ أَخَّرْتَنِ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ لَأَحْتَنِكَنَّ ذُرِّيَّتَهُ إِلَّا قَلِيلًا
ఇంకా ఇలా అన్నాడు: “సరే! చూసుకో, నువ్వు ఇతనికి నాపై శ్రేష్ఠతనైతే వొసగావు. కాని నాకు కూడా ప్రళయదినం వరకూ విడుపు ఇస్తే నేను ఇతని సంతతిలో – కొద్ది మందిని తప్ప – అందరినీ లొంగదీసుకుంటాను.”
17:63 قَالَ اذْهَبْ فَمَن تَبِعَكَ مِنْهُمْ فَإِنَّ جَهَنَّمَ جَزَاؤُكُمْ جَزَاءً مَّوْفُورًا
(అల్లాహ్) అన్నాడు : “వెళ్లు. వారిలో ఎవరెవరు నిన్ను అనుసరిస్తారో వారికీ, నీకూ – అందరికీ నరకం సంపూర్ణ శిక్షగా ఉండనే ఉంది.”
17:64 وَاسْتَفْزِزْ مَنِ اسْتَطَعْتَ مِنْهُم بِصَوْتِكَ وَأَجْلِبْ عَلَيْهِم بِخَيْلِكَ وَرَجِلِكَ وَشَارِكْهُمْ فِي الْأَمْوَالِ وَالْأَوْلَادِ وَعِدْهُمْ ۚ وَمَا يَعِدُهُمُ الشَّيْطَانُ إِلَّا غُرُورًا
“వారిలో ఎవరెవరిని నువ్వు నీ స్వరంతో భ్రష్టులుగా చెయ్యగలవో చేసుకో. (వీలైతే) వారిపై నీ అశ్వబలాన్నీ, పదాతి దళాన్ని తీసుకురా. సిరిసంపదలలోనూ, సంతానంలోనూ వారికి భాగస్వామిగా ఉండు. వారికి (బూటకపు) వాగ్దానాలు చెయ్యి. షైతాను వారికి చేసే వాగ్దానాలన్నీ మోసపూరితమైనవే.
17:65 إِنَّ عِبَادِي لَيْسَ لَكَ عَلَيْهِمْ سُلْطَانٌ ۚ وَكَفَىٰ بِرَبِّكَ وَكِيلًا
“(నువ్వు ఎంత చేసినా) నికార్సయిన నా దాసులపై నీకు ఏ అధికారమూ ఉండదు. రక్షకుడుగా నీ ప్రభువు (ఒక్కడే) చాలు.”
17:66 رَّبُّكُمُ الَّذِي يُزْجِي لَكُمُ الْفُلْكَ فِي الْبَحْرِ لِتَبْتَغُوا مِن فَضْلِهِ ۚ إِنَّهُ كَانَ بِكُمْ رَحِيمًا
మీ కోసం సముద్రంలో ఓడలను నడిపేవాడే మీ ప్రభువు. తద్వారా మీరు ఆయన ఉపాధిని అన్వేషించాలని. నిశ్చయంగా ఆయన మీ పట్ల ఎంతో దయగలవాడు.
17:67 وَإِذَا مَسَّكُمُ الضُّرُّ فِي الْبَحْرِ ضَلَّ مَن تَدْعُونَ إِلَّا إِيَّاهُ ۖ فَلَمَّا نَجَّاكُمْ إِلَى الْبَرِّ أَعْرَضْتُمْ ۚ وَكَانَ الْإِنسَانُ كَفُورًا
సముద్రాలలో మీకు ఆపద ఎదురైనప్పుడు – మీరు మొరపెట్టుకునే వారంతా మటుమాయమైపోతారు – ఒక్క అల్లాహ్ మాత్రమే మిగిలి ఉంటాడు. మరి ఆయన మిమ్మల్ని కాపాడి ఒడ్డుకు చేర్చగానే మీరు ఆయన నుండి ముఖం త్రిప్పేసుకుంటారు. మానవుడు నిజంగానే చేసిన మేలును మరిచేవాడు.
17:68 أَفَأَمِنتُمْ أَن يَخْسِفَ بِكُمْ جَانِبَ الْبَرِّ أَوْ يُرْسِلَ عَلَيْكُمْ حَاصِبًا ثُمَّ لَا تَجِدُوا لَكُمْ وَكِيلًا
ఏమిటీ, (నేల మీదికి చేర్చిన తరువాత) అల్లాహ్ మిమ్మల్ని నేలలో కూర్చివేయడనీ, మీపై రాళ్లను కురిపించే తుఫానును పంపించడని మీరు నిర్భయంగా ఉన్నారా? (ఒకవేళ అదే గనక జరిగితే) మీరు మీ కోసం ఏ రక్షకుడినీ పొందజాలరు.
17:69 أَمْ أَمِنتُمْ أَن يُعِيدَكُمْ فِيهِ تَارَةً أُخْرَىٰ فَيُرْسِلَ عَلَيْكُمْ قَاصِفًا مِّنَ الرِّيحِ فَيُغْرِقَكُم بِمَا كَفَرْتُمْ ۙ ثُمَّ لَا تَجِدُوا لَكُمْ عَلَيْنَا بِهِ تَبِيعًا
లేక అల్లాహ్ మిమ్మల్ని మరోసారి సముద్రయానానికి తీసుకుపోయి, మీ కృతఘ్నతా వైఖరికి శాస్తిగా మీపై ప్రచండమైన పెనుగాలులను పంపి మిమ్మల్ని ముంచివేయడని మీరు నిశ్చింతగా ఉన్నారా? ఒకవేళ అదేగనక జరిగితే మీ తరఫున దీని గురించి మమ్మల్ని అడిగే వాడెవడూ మీకు దొరకడు.
17:70 وَلَقَدْ كَرَّمْنَا بَنِي آدَمَ وَحَمَلْنَاهُمْ فِي الْبَرِّ وَالْبَحْرِ وَرَزَقْنَاهُم مِّنَ الطَّيِّبَاتِ وَفَضَّلْنَاهُمْ عَلَىٰ كَثِيرٍ مِّمَّنْ خَلَقْنَا تَفْضِيلًا
మేము ఆదం సంతతికి గౌరవం వొసగాము. వారికి నేలపైనా, నీటిలోనూ నడిచే వాహనాలను ఇచ్చాము. ఇంకా పరిశుద్ధమైన వస్తువులను వారికి ఆహారంగా ప్రసాదించాము. మేము సృష్టించిన ఎన్నో సృష్టితాలపై వారికి ఆధిక్యతను ఇచ్చాము.
17:71 يَوْمَ نَدْعُو كُلَّ أُنَاسٍ بِإِمَامِهِمْ ۖ فَمَنْ أُوتِيَ كِتَابَهُ بِيَمِينِهِ فَأُولَٰئِكَ يَقْرَءُونَ كِتَابَهُمْ وَلَا يُظْلَمُونَ فَتِيلًا
ఆ రోజు (తీర్పు దినాన) మేము ప్రతి మానవ సముదాయాన్నీ దాని నాయకుని సమేతంగా పిలుస్తాము. అప్పుడు తమ కర్మల పత్రం కుడి చేతికివ్వబడివారు (ఉత్సాహంగా) తమ కర్మల పత్రాన్ని చదువుకుంటారు. వారికి పీచంత అన్యాయం కూడా జరగదు.
17:72 وَمَن كَانَ فِي هَٰذِهِ أَعْمَىٰ فَهُوَ فِي الْآخِرَةِ أَعْمَىٰ وَأَضَلُّ سَبِيلًا
ఇక ఈ ప్రపంచంలో గుడ్డిగా మెలగినవాడు, పరలోకంలో కూడా గుడ్డివాడుగానే ఉంటాడు. మార్గానికి బహుదూరాన తచ్చాడుతూ ఉంటాడు.
17:73 وَإِن كَادُوا لَيَفْتِنُونَكَ عَنِ الَّذِي أَوْحَيْنَا إِلَيْكَ لِتَفْتَرِيَ عَلَيْنَا غَيْرَهُ ۖ وَإِذًا لَّاتَّخَذُوكَ خَلِيلًا
(ఓ ప్రవక్తా!) వాళ్లు, మేము నీ వద్దకు పంపిన వహీ గురించి నిన్ను తడబాటుకు లోనుచేసే ఉద్దేశంతో, దీనికి బదులు మరి దేన్నయినా మా పేరున కల్పించి తీసుకురావాలని కోరుతున్నారు. నువ్వే గనక వారి కోరికను మన్నించి ఉంటే వాళ్లు నిన్ను స్నేహితునిగా చేసుకుని ఉండేవారు.
17:74 وَلَوْلَا أَن ثَبَّتْنَاكَ لَقَدْ كِدتَّ تَرْكَنُ إِلَيْهِمْ شَيْئًا قَلِيلًا
మేమే గనక నీకు నిలకడను ప్రసాదించి ఉండకపోతే, నువ్వు కొంతైనా వారివైపుకు మొగ్గేవాడివి.
17:75 إِذًا لَّأَذَقْنَاكَ ضِعْفَ الْحَيَاةِ وَضِعْفَ الْمَمَاتِ ثُمَّ لَا تَجِدُ لَكَ عَلَيْنَا نَصِيرًا
ఒకవేళ (నీ తరఫున) అదే గనక జరిగి ఉంటే మేము ఈ జీవితంలోనూ నీకు రెట్టింపు శిక్షను విధించేవాళ్లం. మరణం తర్వాత కూడా రెండింతల శిక్షను విధించి ఉండేవాళ్ళం. మరి మాకు వ్యతిరేకంగా, నువ్వు ఏ సహాయకుడినీ పొందలేక పోయేవాడివి.
17:76 وَإِن كَادُوا لَيَسْتَفِزُّونَكَ مِنَ الْأَرْضِ لِيُخْرِجُوكَ مِنْهَا ۖ وَإِذًا لَّا يَلْبَثُونَ خِلَافَكَ إِلَّا قَلِيلًا
వాళ్లు నిన్ను ఈ భూభాగం నుంచి వెళ్ళగొట్టే ఉద్దేశంతో నిన్ను నిలదొక్కుకోకుండా చేయడానికి సిద్ధమయ్యారు. ఒకవేళ అదే జరిగితే నీ తరువాత వాళ్లు కూడా అక్కడ ఎంతో కాలం నిలువ లేరు.
17:77 سُنَّةَ مَن قَدْ أَرْسَلْنَا قَبْلَكَ مِن رُّسُلِنَا ۖ وَلَا تَجِدُ لِسُنَّتِنَا تَحْوِيلًا
నీకు పూర్వం మేము పంపిన ప్రవక్తలకు కూడా ఈ విధానమే వర్తించింది. మా విధానంలో నువ్వు ఎలాంటి మార్పునూ కనుగొనలేవు.
17:78 أَقِمِ الصَّلَاةَ لِدُلُوكِ الشَّمْسِ إِلَىٰ غَسَقِ اللَّيْلِ وَقُرْآنَ الْفَجْرِ ۖ إِنَّ قُرْآنَ الْفَجْرِ كَانَ مَشْهُودًا
నమాజును నెలకొల్పు – సూర్యుడు నెత్తి నుండి వాలినప్పటి నుంచి రాత్రి చీకటి అలుముకునే వరకు. తెల్లవారు జామున ఖుర్ఆను పారాయణం చెయ్యి. నిశ్చయంగా తెల్లవారు జామున చేసే ఖుర్ఆన్ పారాయణానికి సాక్ష్యం ఇవ్వబడుతుంది.
17:79 وَمِنَ اللَّيْلِ فَتَهَجَّدْ بِهِ نَافِلَةً لَّكَ عَسَىٰ أَن يَبْعَثَكَ رَبُّكَ مَقَامًا مَّحْمُودًا
రాత్రిపూట కొంతభాగం తహజ్జుద్ (నమాజు)లో ఖుర్ఆన్ పఠనం చెయ్యి. ఇది నీ కొరకు అదనం. త్వరలోనే నీ ప్రభువు నిన్ను ”మఖామె మహ్మూద్”కు (ప్రశంసాత్మకమైన స్థానానికి) చేరుస్తాడు.
17:80 وَقُل رَّبِّ أَدْخِلْنِي مُدْخَلَ صِدْقٍ وَأَخْرِجْنِي مُخْرَجَ صِدْقٍ وَاجْعَل لِّي مِن لَّدُنكَ سُلْطَانًا نَّصِيرًا
ఈ విధంగా పలుకు: “నా ప్రభూ! నన్ను ఎక్కడికి తీసుకెళ్ళినా మంచిస్థితిలో తీసుకుని వెళ్ళు. ఎక్కడి నుంచి తీసినా మంచిస్థితిలోనే తియ్యి. నా కోసం నీ వద్ద నుండి అధికారాన్ని, తోడ్పాటును ప్రసాదించు.”
17:81 وَقُلْ جَاءَ الْحَقُّ وَزَهَقَ الْبَاطِلُ ۚ إِنَّ الْبَاطِلَ كَانَ زَهُوقًا
ఇంకా ఈ విధంగా ప్రకటించు: “సత్యం వచ్చేసింది. అసత్యం సమసిపోయింది. నిశ్చయంగా, అసత్యం సమసి పోవలసినదే.”
17:82 وَنُنَزِّلُ مِنَ الْقُرْآنِ مَا هُوَ شِفَاءٌ وَرَحْمَةٌ لِّلْمُؤْمِنِينَ ۙ وَلَا يَزِيدُ الظَّالِمِينَ إِلَّا خَسَارًا
మేము అవతరింపజేసే ఈ ఖుర్ఆన్ విశ్వాసుల కొరకు ఆసాంతం స్వస్థత, కారుణ్య ప్రదాయిని. అయితే దుర్మార్గులకు (దీని వల్ల) నష్టం కలగటం తప్ప మరే వృద్ధీ జరగదు.
17:83 وَإِذَا أَنْعَمْنَا عَلَى الْإِنسَانِ أَعْرَضَ وَنَأَىٰ بِجَانِبِهِ ۖ وَإِذَا مَسَّهُ الشَّرُّ كَانَ يَئُوسًا
మేము మానవుణ్ణి అనుగ్రహించినప్పుడు అతడు వైముఖ్య ధోరణిని ప్రదర్శిస్తూ, ఓప్రక్కకు తిరిగిపోతాడు. బాధ కలిగినప్పుడు మాత్రం నిరాశకు గురవుతాడు.
17:84 قُلْ كُلٌّ يَعْمَلُ عَلَىٰ شَاكِلَتِهِ فَرَبُّكُمْ أَعْلَمُ بِمَنْ هُوَ أَهْدَىٰ سَبِيلًا
వారికి చెప్పు : “ప్రతి ఒక్కడూ తన విధానం ప్రకారం ఆచరిస్తున్నాడు. పూర్తిగా సన్మార్గంపై ఉన్నదెవరో నీ ప్రభువుకే బాగా తెలుసు.”
17:85 وَيَسْأَلُونَكَ عَنِ الرُّوحِ ۖ قُلِ الرُّوحُ مِنْ أَمْرِ رَبِّي وَمَا أُوتِيتُم مِّنَ الْعِلْمِ إِلَّا قَلِيلًا
వారు ఆత్మను గురించి నిన్ను ప్రశ్నిస్తున్నారు. “ఆత్మ నా ప్రభువు ఆజ్ఞతో (ముడిపడి) ఉంది. మీకు ఒసగబడిన జ్ఞానం బహుస్వల్పం” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు.
17:86 وَلَئِن شِئْنَا لَنَذْهَبَنَّ بِالَّذِي أَوْحَيْنَا إِلَيْكَ ثُمَّ لَا تَجِدُ لَكَ بِهِ عَلَيْنَا وَكِيلًا
మేము గనక తలచుకుంటే, నీ వద్దకు పంపిన వహీ మొత్తాన్ని తిరిగి స్వాధీనం చేసుకోగలము. ఆ తరువాత మాకు వ్యతిరేకంగా దానిని తిరిగి ఇప్పించగలిగే ఏ సహాయకుణ్ణీ నీవు పొందలేవు.
17:87 إِلَّا رَحْمَةً مِّن رَّبِّكَ ۚ إِنَّ فَضْلَهُ كَانَ عَلَيْكَ كَبِيرًا
నీ ప్రభువు అనుగ్రహంతో తప్ప! నిస్సందేహంగా నీపై ఉన్న ఆయన అనుగ్రహం చాలా గొప్పది.
17:88 قُل لَّئِنِ اجْتَمَعَتِ الْإِنسُ وَالْجِنُّ عَلَىٰ أَن يَأْتُوا بِمِثْلِ هَٰذَا الْقُرْآنِ لَا يَأْتُونَ بِمِثْلِهِ وَلَوْ كَانَ بَعْضُهُمْ لِبَعْضٍ ظَهِيرًا
వారికి చెప్పు: “ఒకవేళ సమస్త మానవులు, యావత్తు జిన్నులు కలిసి ఈ ఖుర్ఆను లాంటి గ్రంథాన్ని తేదలచినా – వారు ఒండొకరికి తోడ్పాటును అందజేసుకున్నా ఇటువంటి దానిని తీసుకురావటం వారివల్ల కాని పని.
17:89 وَلَقَدْ صَرَّفْنَا لِلنَّاسِ فِي هَٰذَا الْقُرْآنِ مِن كُلِّ مَثَلٍ فَأَبَىٰ أَكْثَرُ النَّاسِ إِلَّا كُفُورًا
మేము ప్రజల బోధనార్థం ఈ ఖుర్ఆనులో అన్ని (విధాలు గాను) ఉపమానాలను ఇచ్చాము. కాని చాలా మంది తమ తిరస్కార వైఖరిని మానుకోలేదు.
17:90 وَقَالُوا لَن نُّؤْمِنَ لَكَ حَتَّىٰ تَفْجُرَ لَنَا مِنَ الْأَرْضِ يَنبُوعًا
వారిలా అన్నారు: “నువ్వు మా కోసం భూమి నుంచి నీటి ఊటను ప్రవహింపజేయనంతవరకూ మేము నిన్ను నమ్మేది లేదు.
17:91 أَوْ تَكُونَ لَكَ جَنَّةٌ مِّن نَّخِيلٍ وَعِنَبٍ فَتُفَجِّرَ الْأَنْهَارَ خِلَالَهَا تَفْجِيرًا
“లేదా నీ కోసమైనా ఖర్జూరాలు, ద్రాక్ష పండ్లు గల తోట ఒకటి ఉండాలి. దాని మధ్యన నువ్వు అనేక కాలువలను ప్రవహింప జేయాలి.
17:92 أَوْ تُسْقِطَ السَّمَاءَ كَمَا زَعَمْتَ عَلَيْنَا كِسَفًا أَوْ تَأْتِيَ بِاللَّهِ وَالْمَلَائِكَةِ قَبِيلًا
“లేదా నువ్వు చెబుతున్నట్లుగా ఆకాశాన్ని ముక్కలు ముక్కలుగా చేసి మాపై పడవెయ్యి లేదా నువ్వు ఖుద్దుగా అల్లాహ్‌ను, దూతలను తెచ్చి మా ఎదుట నిలబెట్టు.
17:93 أَوْ يَكُونَ لَكَ بَيْتٌ مِّن زُخْرُفٍ أَوْ تَرْقَىٰ فِي السَّمَاءِ وَلَن نُّؤْمِنَ لِرُقِيِّكَ حَتَّىٰ تُنَزِّلَ عَلَيْنَا كِتَابًا نَّقْرَؤُهُ ۗ قُلْ سُبْحَانَ رَبِّي هَلْ كُنتُ إِلَّا بَشَرًا رَّسُولًا
“లేదా నీ కోసం స్వర్ణ గృహం ఏదన్నా సిద్ధం కావాలి లేదా నువ్వు ఆకాశానికి ఎక్కిపోవాలి. (ఒకవేళ నువ్వు అలా ఎక్కి పోయినా) మేము స్వయంగా చదవగలిగే గ్రంథమేదైనా మాపై అవతరింపజేయనంతవరకూ నీ అధిరోహణను కూడా మేము నమ్మేది లేదు. “(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “నా ప్రభువు పరమ పవిత్రుడు. నేను ప్రవక్తగా పంపబడిన ఒక మానవ మాత్రుణ్ణి మాత్రమే.”
17:94 وَمَا مَنَعَ النَّاسَ أَن يُؤْمِنُوا إِذْ جَاءَهُمُ الْهُدَىٰ إِلَّا أَن قَالُوا أَبَعَثَ اللَّهُ بَشَرًا رَّسُولًا
ప్రజల వద్దకు మార్గదర్శకత్వం వచ్చిన మీదట, విశ్వసించ నీయకుండా వారిని ఆపిన విషయమల్లా ఒక్కటే – “అల్లాహ్ ఒక మానవమాత్రుణ్ణి ప్రవక్తగా పంపాడా?!” అని వారన్నారు.
17:95 قُل لَّوْ كَانَ فِي الْأَرْضِ مَلَائِكَةٌ يَمْشُونَ مُطْمَئِنِّينَ لَنَزَّلْنَا عَلَيْهِم مِّنَ السَّمَاءِ مَلَكًا رَّسُولًا
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “ఒకవేళ దైవదూతలు భూమండలం మీద తిరుగుతూ, నివాసమేర్పరచుకుంటూ ఉన్నట్లయితే, మేము వారి వద్దకు కూడా ఆకాశం నుంచి దైవదూతనే ప్రవక్తగా పంపి ఉండేవారం.”
17:96 قُلْ كَفَىٰ بِاللَّهِ شَهِيدًا بَيْنِي وَبَيْنَكُمْ ۚ إِنَّهُ كَانَ بِعِبَادِهِ خَبِيرًا بَصِيرًا
వారితో అను: ”నాకూ – మీకూ మధ్య సాక్షిగా అల్లాహ్ చాలు. తన దాసుల గురించి ఆయనకు అంతా తెలుసు. ఆయన వారిని చూస్తూనే ఉన్నాడు.”
17:97 وَمَن يَهْدِ اللَّهُ فَهُوَ الْمُهْتَدِ ۖ وَمَن يُضْلِلْ فَلَن تَجِدَ لَهُمْ أَوْلِيَاءَ مِن دُونِهِ ۖ وَنَحْشُرُهُمْ يَوْمَ الْقِيَامَةِ عَلَىٰ وُجُوهِهِمْ عُمْيًا وَبُكْمًا وَصُمًّا ۖ مَّأْوَاهُمْ جَهَنَّمُ ۖ كُلَّمَا خَبَتْ زِدْنَاهُمْ سَعِيرًا
అల్లాహ్ ఎవరికి సన్మార్గం చూపుతాడో అతనే సన్మార్గం పొందుతాడు. ఆయన మార్గవిహీనతకు లోనుచేసిన వారికి, ఆయన (శిక్ష)కు విరుద్ధంగా ఇతరులెవరినీ నువ్వు సహాయ కులుగా పొందజాలవు. అలాంటి వారిని మేము ప్రళయ దినాన ముఖాల ఆధారంగా సమీకరిస్తాము. మరి చూడబోతే వారు గుడ్డివారు, మూగవారు, చెవిటివారై ఉంటారు. నరకం వారి నివాసమవుతుంది. అది మందగించినప్పుడల్లా వారి కోసం దాన్ని రాజేస్తూ ఉంటాం.
17:98 ذَٰلِكَ جَزَاؤُهُم بِأَنَّهُمْ كَفَرُوا بِآيَاتِنَا وَقَالُوا أَإِذَا كُنَّا عِظَامًا وَرُفَاتًا أَإِنَّا لَمَبْعُوثُونَ خَلْقًا جَدِيدًا
వారు మా ఆయతులను తిరస్కరించి, “మేము ఎముకలై, తుత్తునియలు అయిపోయిన తరువాత కూడా మళ్లీ సరికొత్తగా పుట్టించబడతామా?!” అని చెప్పినందుకుగాను వారికి (లభించే) ప్రతిఫలం ఇది.
17:99 أَوَلَمْ يَرَوْا أَنَّ اللَّهَ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ قَادِرٌ عَلَىٰ أَن يَخْلُقَ مِثْلَهُمْ وَجَعَلَ لَهُمْ أَجَلًا لَّا رَيْبَ فِيهِ فَأَبَى الظَّالِمُونَ إِلَّا كُفُورًا
ఏమిటీ,ఆకాశాలను, భూమిని సృష్టించిన అల్లాహ్ తమ లాంటి వారిని సృష్టించే శక్తి కలిగి ఉన్నాడన్న విషయంపై వారు దృష్టిని సారించలేదా? ఏమాత్రం సంకోచానికి తావులేని ఒక సమయాన్ని ఆయన వారి కోసం నియమించి ఉన్నాడు. కాని దుర్మార్గులు (ఎంత చెప్పినా) తిరస్కరించకుండా ఉండరు.
17:100 قُل لَّوْ أَنتُمْ تَمْلِكُونَ خَزَائِنَ رَحْمَةِ رَبِّي إِذًا لَّأَمْسَكْتُمْ خَشْيَةَ الْإِنفَاقِ ۚ وَكَانَ الْإِنسَانُ قَتُورًا
వారికి చెప్పు: “ఒకవేళ నా ప్రభువు కారుణ్య నిధులే గనక మీ అధీనంలోకి వస్తే, అప్పుడు మీరు అవి ఖర్చయిపోతాయే మోనన్న భయంతో వాటిని ఆపి ఉంచేవారు. (అసలు విషయం ఏమిటంటే) మానవుడు సంకుచిత మనస్కుడు.”
17:101 وَلَقَدْ آتَيْنَا مُوسَىٰ تِسْعَ آيَاتٍ بَيِّنَاتٍ ۖ فَاسْأَلْ بَنِي إِسْرَائِيلَ إِذْ جَاءَهُمْ فَقَالَ لَهُ فِرْعَوْنُ إِنِّي لَأَظُنُّكَ يَا مُوسَىٰ مَسْحُورًا
మేము మూసాకు స్పష్టమైన తొమ్మిది మహిమలను ఇచ్చాము. (కావాలంటే) నువ్వు స్వయంగా ఇస్రాయీల్ వంశీయులను అడుగు. అతను వారి వద్దకు వచ్చినప్పుడు, “మూసా! నువ్వు చేతబడి చేయబడ్డావేమోనని నా అనుమానం” అన్నాడు ఫిరౌను.
17:102 قَالَ لَقَدْ عَلِمْتَ مَا أَنزَلَ هَٰؤُلَاءِ إِلَّا رَبُّ السَّمَاوَاتِ وَالْأَرْضِ بَصَائِرَ وَإِنِّي لَأَظُنُّكَ يَا فِرْعَوْنُ مَثْبُورًا
మూసా ఇలా సమాధానమిచ్చాడు: “గుణపాఠంతో కూడుకున్న ఈ సూచనలను భూమ్యాకాశాల ప్రభువు తప్ప మరొకరెవరూ అవతరింపజేయలేదన్న విషయం నీకూ తెలుసు. ఓ ఫిరౌన్! నిశ్చయంగా నువ్వు వినాశానికి గురయ్యావని నేను భావిస్తున్నాను.”
17:103 فَأَرَادَ أَن يَسْتَفِزَّهُم مِّنَ الْأَرْضِ فَأَغْرَقْنَاهُ وَمَن مَّعَهُ جَمِيعًا
ఆ తరువాత ఫిరౌను, వారిని భూభాగం (రాజ్యం) నుంచే పెకలించి వేయాలని గట్టిగా నిశ్చయించుకున్నప్పుడు మేము వాణ్ణీ, వాడి వెంటవున్న వారినే ముంచివేశాము.
17:104 وَقُلْنَا مِن بَعْدِهِ لِبَنِي إِسْرَائِيلَ اسْكُنُوا الْأَرْضَ فَإِذَا جَاءَ وَعْدُ الْآخِرَةِ جِئْنَا بِكُمْ لَفِيفًا
ఆ తరువాత మేము ఇస్రాయీలు సంతతితో, “ఈ భూభాగంపై మీరు ఉండండి. అయితే పరలోక వాగ్దాన తరుణం ఆసన్నమైనప్పుడు మేము మీ అందరినీ కలిపి (ఒకే చోటికి) తీసుకువస్తాము” అని చెప్పాము.
17:105 وَبِالْحَقِّ أَنزَلْنَاهُ وَبِالْحَقِّ نَزَلَ ۗ وَمَا أَرْسَلْنَاكَ إِلَّا مُبَشِّرًا وَنَذِيرًا
మేము దీనిని (ఖుర్ఆన్ను) సత్యసమేతంగా అవతరింపజేశాము. ఇది కూడా సత్యంతోనే అవతరించింది. మేము నిన్ను శుభవార్తను వినిపించేవానిగా, హెచ్చరించేవానిగా మాత్రమే పంపాము.
17:106 وَقُرْآنًا فَرَقْنَاهُ لِتَقْرَأَهُ عَلَى النَّاسِ عَلَىٰ مُكْثٍ وَنَزَّلْنَاهُ تَنزِيلًا
నువ్వు నెమ్మది నెమ్మదిగా ప్రజలకు వినిపించటానికి వీలుగా మేము ఖుర్ఆను గ్రంథాన్ని కొద్ది కొద్దిగా చేసి అవతరింపజేశాము. మేము దీనిని అంచెలవారీగా అవతరింపజేశాము.
17:107 قُلْ آمِنُوا بِهِ أَوْ لَا تُؤْمِنُوا ۚ إِنَّ الَّذِينَ أُوتُوا الْعِلْمَ مِن قَبْلِهِ إِذَا يُتْلَىٰ عَلَيْهِمْ يَخِرُّونَ لِلْأَذْقَانِ سُجَّدًا
వారికి చెప్పు : “మీరు దీనిని నమ్మినా నమ్మకపోయినా, దీనికి పూర్వం జ్ఞానం వొసగబడిన వారి ఎదుట ఇది పఠించబడినప్పుడల్లా వారు ముఖాల ఆధారంగా సాష్టాంగపడి పోతారు.”
17:108 وَيَقُولُونَ سُبْحَانَ رَبِّنَا إِن كَانَ وَعْدُ رَبِّنَا لَمَفْعُولًا
“మా ప్రభువు పరమపవిత్రుడు. మా ప్రభువు వాగ్దానం నెరవేరటం తథ్యం” అని అంటారు.
17:109 وَيَخِرُّونَ لِلْأَذْقَانِ يَبْكُونَ وَيَزِيدُهُمْ خُشُوعًا ۩
వారు విలపిస్తూ, ముఖాల ఆధారంగా (సాష్టాంగ) పడిపోతారు. ఈ ఖుర్ఆన్ వారి అణకువను (వినమ్రతను) మరింత పెంచుతుంది.
17:110 قُلِ ادْعُوا اللَّهَ أَوِ ادْعُوا الرَّحْمَٰنَ ۖ أَيًّا مَّا تَدْعُوا فَلَهُ الْأَسْمَاءُ الْحُسْنَىٰ ۚ وَلَا تَجْهَرْ بِصَلَاتِكَ وَلَا تُخَافِتْ بِهَا وَابْتَغِ بَيْنَ ذَٰلِكَ سَبِيلًا
వారికి చెప్పు : “అల్లాహ్‌ను అల్లాహ్ అని పిలిచినా, రహ్మాన్ అని పిలిచినా – ఏ పేరుతో పిలిచినా – మంచి పేర్లన్నీ ఆయనవే.” నువ్వు నీ నమాజును మరీ బిగ్గరగానూ, మరీ మెల్లగానూ పఠించకు. వీటికి నడుమ మధ్యేమార్గాన్ని అవలంబించు.
17:111 وَقُلِ الْحَمْدُ لِلَّهِ الَّذِي لَمْ يَتَّخِذْ وَلَدًا وَلَمْ يَكُن لَّهُ شَرِيكٌ فِي الْمُلْكِ وَلَمْ يَكُن لَّهُ وَلِيٌّ مِّنَ الذُّلِّ ۖ وَكَبِّرْهُ تَكْبِيرًا
ఇంకా ఇలా చెప్పు: “ప్రశంసలన్నీ అల్లాహ్‌కే శోభిస్తాయి. ఆయన ఎవరినీ సంతానంగా చేసుకోలేదు. తన విశ్వ సామ్రాజ్యంలో ఆయనకు భాగస్వాములెవరూలేరు. ఒకరి సహాయ సహకారాలపై ఆధారపడటానికి ఆయన ఏ మాత్రం బలహీనుడు కాడు. కాబట్టి నువ్వు ఆయన గొప్పదనాన్ని ఘనంగా కీర్తిస్తూ ఉండు.”
18. సూరా అల్ కహఫ్ (Al-Kahf)
18:1 الْحَمْدُ لِلَّهِ الَّذِي أَنزَلَ عَلَىٰ عَبْدِهِ الْكِتَابَ وَلَمْ يَجْعَل لَّهُ عِوَجًا ۜ
ప్రశంసలన్నీ అల్లాహ్‌కు మాత్రమే శోభిస్తాయి. ఆయన తన దాసునిపై ఈ (ఖుర్ఆన్) గ్రంథాన్ని అవతరింపజేశాడు. ఇందులో ఎలాంటి వక్రతనూ ఉంచలేదు.
18:2 قَيِّمًا لِّيُنذِرَ بَأْسًا شَدِيدًا مِّن لَّدُنْهُ وَيُبَشِّرَ الْمُؤْمِنِينَ الَّذِينَ يَعْمَلُونَ الصَّالِحَاتِ أَنَّ لَهُمْ أَجْرًا حَسَنًا
పైగా అన్నివిధాలా సరైనదిగా ఉంచాడు – తన వద్దనుంచి విధించబడే కఠినమైన శిక్ష గురించి హెచ్చరించటానికి, మంచి పనులు చేసే విశ్వాసులకు ఉత్తమ ప్రతిఫలం ఉందని శుభవార్తలు ఇవ్వటానికి,
18:3 مَّاكِثِينَ فِيهِ أَبَدًا
అందులో వారు శాశ్వతంగా ఉంటారని (తెలుపటానికి),
18:4 وَيُنذِرَ الَّذِينَ قَالُوا اتَّخَذَ اللَّهُ وَلَدًا
అల్లాహ్ సంతానం కలిగి ఉన్నాడని పలికేవారిని హెచ్చరించటానికి (ఈ గ్రంథం అవతరింపజెయ్యబడింది).
18:5 مَّا لَهُم بِهِ مِنْ عِلْمٍ وَلَا لِآبَائِهِمْ ۚ كَبُرَتْ كَلِمَةً تَخْرُجُ مِنْ أَفْوَاهِهِمْ ۚ إِن يَقُولُونَ إِلَّا كَذِبًا
యదార్థానికి వారికిగానీ, వారి తాత ముత్తాతలకుగానీ ఈ విషయం ఏమీ తెలియదు. వారి నోట వెలువడే ఈ మాట ఎంతో దారుణమైనది. వారు చెప్పేదంతా పచ్చి అబద్ధమే.
18:6 فَلَعَلَّكَ بَاخِعٌ نَّفْسَكَ عَلَىٰ آثَارِهِمْ إِن لَّمْ يُؤْمِنُوا بِهَٰذَا الْحَدِيثِ أَسَفًا
(ఓ ముహమ్మద్!) ఒకవేళ ఈ జనులు ఈ మాటను విశ్వసించకపోతే నువ్వు వారి వెనుక దుఃఖంతో కుమిలిపోతూ నీ ప్రాణాలు పోగొట్టుకుంటావా ఏమి?
18:7 إِنَّا جَعَلْنَا مَا عَلَى الْأَرْضِ زِينَةً لَّهَا لِنَبْلُوَهُمْ أَيُّهُمْ أَحْسَنُ عَمَلًا
జనులలో ఎవరు మంచి పనులు చేస్తారో పరీక్షించే నిమిత్తం మేము భూమండలంలో ఉన్న దాన్నంతటినీ భూమికి శోభాయమానంగా చేశాము.
18:8 وَإِنَّا لَجَاعِلُونَ مَا عَلَيْهَا صَعِيدًا جُرُزًا
దాని (భూమి)పై ఉన్న దానినంతటినీ మేము (నేలమట్టం చేసి) చదునైన మైదానంగా చేయనున్నాము.
18:9 أَمْ حَسِبْتَ أَنَّ أَصْحَابَ الْكَهْفِ وَالرَّقِيمِ كَانُوا مِنْ آيَاتِنَا عَجَبًا
ఏమిటీ, గుహవారిని, శిలాఫలకం వారిని నువ్వు మా శక్తి సూచనలలో మహా విచిత్రమైన సూచనగా తలపోస్తున్నావా?
18:10 إِذْ أَوَى الْفِتْيَةُ إِلَى الْكَهْفِ فَقَالُوا رَبَّنَا آتِنَا مِن لَّدُنكَ رَحْمَةً وَهَيِّئْ لَنَا مِنْ أَمْرِنَا رَشَدًا
ఆ యువకులు గుహలో ఆశ్రయం పొందినపుడు ఇలా ప్రార్థించారు: “మా ప్రభూ! నీ వద్ద నుంచి మాకు కారుణ్యాన్ని ప్రసాదించు. మా పనిలో మా కోసం సన్మార్గాన్ని సులభతరం చెయ్యి.”
18:11 فَضَرَبْنَا عَلَىٰ آذَانِهِمْ فِي الْكَهْفِ سِنِينَ عَدَدًا
అంతే! మేము ఆ గుహలో ఎన్నదగ్గ కొన్నేండ్లవరకూ వారి చెవులపై జోకొట్టి పడుకోబెట్టాము.
18:12 ثُمَّ بَعَثْنَاهُمْ لِنَعْلَمَ أَيُّ الْحِزْبَيْنِ أَحْصَىٰ لِمَا لَبِثُوا أَمَدًا
ఆ తరువాత, ఆ రెండు వర్గాల వారిలో ఎవరు ఆ స్థితిలో గడిపిన గరిష్ఠకాలాన్ని ఖచ్చితంగా లెక్కగడతారో తెలుసుకుందామని మేము వారిని తిరిగి లేపాము.
18:13 نَّحْنُ نَقُصُّ عَلَيْكَ نَبَأَهُم بِالْحَقِّ ۚ إِنَّهُمْ فِتْيَةٌ آمَنُوا بِرَبِّهِمْ وَزِدْنَاهُمْ هُدًى
వారి యదార్ధ గాథను మేము నీకు వివరిస్తున్నాము – తమ ప్రభువును విశ్వసించిన కొంతమంది యువకులు వారు. మేము వారి సన్మార్గంలో వృద్ధినొసగాము.
18:14 وَرَبَطْنَا عَلَىٰ قُلُوبِهِمْ إِذْ قَامُوا فَقَالُوا رَبُّنَا رَبُّ السَّمَاوَاتِ وَالْأَرْضِ لَن نَّدْعُوَ مِن دُونِهِ إِلَٰهًا ۖ لَّقَدْ قُلْنَا إِذًا شَطَطًا
వారు లేచి నిలబడి ఈ ప్రకటన చేసినప్పుడు మేము వారి హృదయాలకు దృఢత్వాన్ని కలుగజేశాము; “భూమ్యాకాశాలకు ప్రభువైనవాడే మా ప్రభువు. మేము ఆయన్ని తప్ప వేరొక ఆరాధ్య దైవాన్ని పిలవటమన్నది జరగని పని. ఒకవేళ మేము గనక అలా చేస్తే ఎంతో దుర్మార్గపు మాటను పలికిన వారమవుతాము.”
18:15 هَٰؤُلَاءِ قَوْمُنَا اتَّخَذُوا مِن دُونِهِ آلِهَةً ۖ لَّوْلَا يَأْتُونَ عَلَيْهِم بِسُلْطَانٍ بَيِّنٍ ۖ فَمَنْ أَظْلَمُ مِمَّنِ افْتَرَىٰ عَلَى اللَّهِ كَذِبًا
“ఆయన్ని వదలి ఇతరులను ఆరాధ్య దైవాలుగా చేసుకున్న మన జాతి వారు వారి దైవత్వానికి సంబంధించిన స్పష్టమైన ప్రమాణాన్ని ఎందుకు తీసుకురావటం లేదు? అల్లాహ్‌కు అబద్ధాన్ని అంట గట్టేవాడికన్నా ఎక్కువ దుర్మార్గుడెవడుంటాడు?
18:16 وَإِذِ اعْتَزَلْتُمُوهُمْ وَمَا يَعْبُدُونَ إِلَّا اللَّهَ فَأْوُوا إِلَى الْكَهْفِ يَنشُرْ لَكُمْ رَبُّكُم مِّن رَّحْمَتِهِ وَيُهَيِّئْ لَكُم مِّنْ أَمْرِكُم مِّرْفَقًا
“ఇప్పుడు మీరు వాళ్ళతోనూ, అల్లాహ్‌ను గాకుండా వారు పూజిస్తున్న ఇతర దైవాలతోనూ తెగత్రెంపులు చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఏదన్నా గుహలోకి పోయి కూర్చోండి. మీ ప్రభువు మీపై తన కారుణ్యాన్ని విస్తరింపజేస్తాడు. మీ కార్యసిద్ధికై సౌలభ్యాన్ని సమకూరుస్తాడు.”
18:17 وَتَرَى الشَّمْسَ إِذَا طَلَعَت تَّزَاوَرُ عَن كَهْفِهِمْ ذَاتَ الْيَمِينِ وَإِذَا غَرَبَت تَّقْرِضُهُمْ ذَاتَ الشِّمَالِ وَهُمْ فِي فَجْوَةٍ مِّنْهُ ۚ ذَٰلِكَ مِنْ آيَاتِ اللَّهِ ۗ مَن يَهْدِ اللَّهُ فَهُوَ الْمُهْتَدِ ۖ وَمَن يُضْلِلْ فَلَن تَجِدَ لَهُ وَلِيًّا مُّرْشِدًا
సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు వారి గుహకు కుడిప్రక్కకు ఒరిగిపోవటాన్ని, అస్తమించే సమయంలో వారికి ఎడమ ప్రక్కకు జరిగిపోవటాన్ని నువ్వు చూస్తావు. వారేమో ఆ గుహలోని విశాలమైన స్థలంలో ఉన్నారు. ఇది అల్లాహ్ సూచనల్లోనిది. అల్లాహ్ సన్మార్గం చూపినవాడు మాత్రమే సన్మార్గాన ఉంటాడు. మరి ఆయన పెడత్రోవ పట్టించిన వానిని ఆదుకుని మార్గదర్శకత్వం వహించే వాడెవడినీ నీవు పొందలేవు.
18:18 وَتَحْسَبُهُمْ أَيْقَاظًا وَهُمْ رُقُودٌ ۚ وَنُقَلِّبُهُمْ ذَاتَ الْيَمِينِ وَذَاتَ الشِّمَالِ ۖ وَكَلْبُهُم بَاسِطٌ ذِرَاعَيْهِ بِالْوَصِيدِ ۚ لَوِ اطَّلَعْتَ عَلَيْهِمْ لَوَلَّيْتَ مِنْهُمْ فِرَارًا وَلَمُلِئْتَ مِنْهُمْ رُعْبًا
వారు మేల్కొని ఉన్నారని నువ్వు భావిస్తావు. కాని వారు నిద్రపోతూ ఉంటారు. మేమే వారిని కుడి ప్రక్కకూ, ఎడమ ప్రక్కకూ ఒత్తిగిలి పడుకునేలా చేస్తూ ఉన్నాము. వారి కుక్క కూడా గుహ ముఖద్వారం వద్ద తన ముందు కాళ్ళను చాపి (కూర్చుని) ఉండేది. ఒకవేళ నువ్వు వారిని తొంగి చూస్తే, వెనుతిరిగి పారిపోబోతావు. వారి గాంభీర్యం నిన్ను భయకంపితుణ్ణి చేస్తుంది.
18:19 وَكَذَٰلِكَ بَعَثْنَاهُمْ لِيَتَسَاءَلُوا بَيْنَهُمْ ۚ قَالَ قَائِلٌ مِّنْهُمْ كَمْ لَبِثْتُمْ ۖ قَالُوا لَبِثْنَا يَوْمًا أَوْ بَعْضَ يَوْمٍ ۚ قَالُوا رَبُّكُمْ أَعْلَمُ بِمَا لَبِثْتُمْ فَابْعَثُوا أَحَدَكُم بِوَرِقِكُمْ هَٰذِهِ إِلَى الْمَدِينَةِ فَلْيَنظُرْ أَيُّهَا أَزْكَىٰ طَعَامًا فَلْيَأْتِكُم بِرِزْقٍ مِّنْهُ وَلْيَتَلَطَّفْ وَلَا يُشْعِرَنَّ بِكُمْ أَحَدًا
ఇదే విధంగా – వారు పరస్పరం ప్రశ్నించుకోవటానికి మేము వారిని లేపి కూర్చోబెట్టాము. వారిలో ఒకతను “మీరు ఎంతసేపు ఇక్కడ విశ్రమించి ఉంటారు?” అని అడగ్గా, “ఒక రోజో లేక ఒక రోజుకన్నా తక్కువ సమయమో ఉండి ఉంటాం” అని వారు సమాధాన మిచ్చారు. మళ్లీ ఇలా చెప్పారు : “మీరు ఎంతసేపు ఉన్నారన్న విషయం మీ ప్రభువుకే బాగా తెలుసు. సరే, ఇప్పుడు ఈ వెండి (నాణెము)ని ఇచ్చి, మీలో ఒకరిని పట్టణానికి పంపండి – అతను వెళ్ళి అత్యంత పరిశుద్ధమైన భోజనం ఏదో కనుక్కుని, అందులో నుంచి మీ కోసం తినటానికి తీసుకు వస్తాడు. అయితే అతను మృదువుగా, జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ జాడ ఎవరికీ తెలియనివ్వకూడదు.
18:20 إِنَّهُمْ إِن يَظْهَرُوا عَلَيْكُمْ يَرْجُمُوكُمْ أَوْ يُعِيدُوكُمْ فِي مِلَّتِهِمْ وَلَن تُفْلِحُوا إِذًا أَبَدًا
“వారు గనక మిమ్మల్ని పట్టుకున్నారంటే మీపై రాళ్ళయినా రువ్వుతారు లేదా మిమ్మల్ని తమ మతంలోకైనా తిరిగి రప్పించు కుంటారు. (అదే గనక జరిగితే) మీరెన్నటికీ సాఫల్యం పొంద లేరు.”
18:21 وَكَذَٰلِكَ أَعْثَرْنَا عَلَيْهِمْ لِيَعْلَمُوا أَنَّ وَعْدَ اللَّهِ حَقٌّ وَأَنَّ السَّاعَةَ لَا رَيْبَ فِيهَا إِذْ يَتَنَازَعُونَ بَيْنَهُمْ أَمْرَهُمْ ۖ فَقَالُوا ابْنُوا عَلَيْهِم بُنْيَانًا ۖ رَّبُّهُمْ أَعْلَمُ بِهِمْ ۚ قَالَ الَّذِينَ غَلَبُوا عَلَىٰ أَمْرِهِمْ لَنَتَّخِذَنَّ عَلَيْهِم مَّسْجِدًا
ఈ విధంగా అల్లాహ్ వాగ్దానం సత్యమనీ, ప్రళయం (సంభవించటం)లో సందేహానికి తావులేదని ప్రజలు తెలుసుకోవటానికి మేము వారి పరిస్థితిని గురించి ప్రజలకు తెలియజేశాము. మరి వారేమో అప్పుడు ఈ వ్యవహారంలో పరస్పరం తర్జనభర్జన చేసుకోసాగారు – “వీరి గుహపై ఒక కట్టడం కట్టండి” అని కొందరన్నారు. వీరి సంగతి వీరి ప్రభువుకే బాగా తెలుసు. వీళ్ల వ్యవహారంలో పైచేయిగా ఉన్నవారు మాత్రం ఇలా అన్నారు: “మేము వీళ్లు ఉన్నచోట ఒక ఆరాధనాలయం కడతాము.”
18:22 سَيَقُولُونَ ثَلَاثَةٌ رَّابِعُهُمْ كَلْبُهُمْ وَيَقُولُونَ خَمْسَةٌ سَادِسُهُمْ كَلْبُهُمْ رَجْمًا بِالْغَيْبِ ۖ وَيَقُولُونَ سَبْعَةٌ وَثَامِنُهُمْ كَلْبُهُمْ ۚ قُل رَّبِّي أَعْلَمُ بِعِدَّتِهِم مَّا يَعْلَمُهُمْ إِلَّا قَلِيلٌ ۗ فَلَا تُمَارِ فِيهِمْ إِلَّا مِرَاءً ظَاهِرًا وَلَا تَسْتَفْتِ فِيهِم مِّنْهُمْ أَحَدًا
“వాళ్లు ముగ్గురు, నాల్గోది వారి కుక్క” అని కొందరంటారు. “వారు అయిదుగురు. ఆరోది వారి కుక్క” అని మరి కొంద రంటారు. వారు తమకు తెలియని విషయంలో ఊహాగానాలు చేస్తున్నారు. “వారు ఏడుగురు, ఎనిమిదోది వారి కుక్క” అని ఇంకా కొంతమంది అంటారు. “వారి సంఖ్య గురించి నా ప్రభువు బాగా ఎరుగు. వారి సంఖ్య గురించి బహుకొద్ది మందికి మాత్రమే తెలుసు” అని వారికి చెప్పు. కాబట్టి నువ్వు వారి విషయంలో స్థూలంగా మాత్రమే వాదించు. ఇంకా (గుహ) వారిని గురించి వీళ్ళలో ఎవరినీ అడగకు.
18:23 وَلَا تَقُولَنَّ لِشَيْءٍ إِنِّي فَاعِلٌ ذَٰلِكَ غَدًا
ఏ విషయంలోనయినాసరే “రేపు నేను ఈ పని చేస్తాను” అని ఎట్టిపరిస్థితిలోనూ చెప్పకు.
18:24 إِلَّا أَن يَشَاءَ اللَّهُ ۚ وَاذْكُر رَّبَّكَ إِذَا نَسِيتَ وَقُلْ عَسَىٰ أَن يَهْدِيَنِ رَبِّي لِأَقْرَبَ مِنْ هَٰذَا رَشَدًا
అయితే “అల్లాహ్ తలిస్తే చేస్తాను (ఇన్షాఅల్లాహ్)” అని అనాలి. మరచిపోయినప్పుడల్లా నీ ప్రభువును స్మరించు. “నా ప్రభువు దీనికన్నా సన్మార్గానికి దగ్గరగా ఉండే విషయం వైపుకు నాకు దారి చూపిస్తాడన్న ఆశ వుంది” అని చెబుతూ ఉండు.
18:25 وَلَبِثُوا فِي كَهْفِهِمْ ثَلَاثَ مِائَةٍ سِنِينَ وَازْدَادُوا تِسْعًا
వారు తమ గుహలో మూడు వందల సంవత్సరాలు ఉన్నారు. మరో తొమ్మిదేండ్లు అదనం.
18:26 قُلِ اللَّهُ أَعْلَمُ بِمَا لَبِثُوا ۖ لَهُ غَيْبُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ أَبْصِرْ بِهِ وَأَسْمِعْ ۚ مَا لَهُم مِّن دُونِهِ مِن وَلِيٍّ وَلَا يُشْرِكُ فِي حُكْمِهِ أَحَدًا
వారికి చెప్పు : “వారు అక్కడ ఖచ్చితంగా ఎంతకాలం ఉన్నారో అల్లాహ్‌కే తెలుసు. భూమ్యాకాశాల రహస్యం ఆయనకు మాత్రమే తెలుసు. ఆయనెంత చక్కగా చూసేవాడు! మరెంత చక్కగా వినేవాడు! అల్లాహ్ తప్ప వారిని ఆదుకునే వాడెవడూ లేడు. అల్లాహ్ తన పరిపాలనాధికారంలో (నిర్ణయాలలో) ఎవరినీ భాగస్వామిగా చేర్చుకోడు.”
18:27 وَاتْلُ مَا أُوحِيَ إِلَيْكَ مِن كِتَابِ رَبِّكَ ۖ لَا مُبَدِّلَ لِكَلِمَاتِهِ وَلَن تَجِدَ مِن دُونِهِ مُلْتَحَدًا
నీ వద్దకు వహీ ద్వారా పంపబడిన నీ ప్రభువు గ్రంథాన్ని పఠిస్తూ ఉండు. ఆయన వచనాలను మార్చగలవాడెవడూ లేడు. నువ్వు ఎట్టి పరిస్థితిలోనూ ఆయన ఆశ్రయం తప్ప వేరే ఆశ్రయాన్ని పొందజాలవు.
18:28 وَاصْبِرْ نَفْسَكَ مَعَ الَّذِينَ يَدْعُونَ رَبَّهُم بِالْغَدَاةِ وَالْعَشِيِّ يُرِيدُونَ وَجْهَهُ ۖ وَلَا تَعْدُ عَيْنَاكَ عَنْهُمْ تُرِيدُ زِينَةَ الْحَيَاةِ الدُّنْيَا ۖ وَلَا تُطِعْ مَنْ أَغْفَلْنَا قَلْبَهُ عَن ذِكْرِنَا وَاتَّبَعَ هَوَاهُ وَكَانَ أَمْرُهُ فُرُطًا
తమ ప్రభువును ఉదయం, సాయంత్రం వేడుకుంటూ, ఆయన ప్రసన్నతను చూరగొనే ప్రయత్నంలో ఉన్నవారి సహచర్యం పట్ల నీ మనసును సంతృప్త పరచుకో. జాగ్రత్త! వారి నుంచి నీ దృష్టిని మరల్చుకోకు. ప్రాపంచిక జీవితపు అందాలను నీవు కోరుకుంటావేమో! చూడు! ఎవరి హృదయాన్ని మేము మా ధ్యానం పట్ల నిర్లక్ష్యానికి లోనుచేశామో, ఎవడు తన మనోవాంఛల వెనుక పరుగులు తీస్తున్నాడో, ఎవడి పనితీరు మితిమీరిపోయిందో అతనికి విధేయత చూపకు.
18:29 وَقُلِ الْحَقُّ مِن رَّبِّكُمْ ۖ فَمَن شَاءَ فَلْيُؤْمِن وَمَن شَاءَ فَلْيَكْفُرْ ۚ إِنَّا أَعْتَدْنَا لِلظَّالِمِينَ نَارًا أَحَاطَ بِهِمْ سُرَادِقُهَا ۚ وَإِن يَسْتَغِيثُوا يُغَاثُوا بِمَاءٍ كَالْمُهْلِ يَشْوِي الْوُجُوهَ ۚ بِئْسَ الشَّرَابُ وَسَاءَتْ مُرْتَفَقًا
ఈ విధంగా ప్రకటించు : (ఆసాంతం) సత్యం(తో కూడుకున్న ఈ ఖుర్ఆన్) మీ ప్రభువు తరఫు నుంచి వచ్చింది. కనుక కోరిన వారు దీనిని విశ్వసించవచ్చు, కోరినవారు నిరాకరించవచ్చు. (అయితే సత్యాన్ని నిరాకరించిన) దుర్మార్గుల కోసం మేము అగ్నిని సిద్ధం చేసి ఉంచాము. దాని కీలలు వారిని చుట్టుముడతాయి. ఒకవేళ వారు సహాయం (ఉపశమనం, నీళ్లు) అడిగితే, నూనె మడ్డిలాంటి నీటితో వారికి సహాయం అందజేయబడుతుంది. అది ముఖాలను మాడ్చివేస్తుంది. అత్యంత అసహ్యకరమైన నీరు అది! అత్యంత దుర్భరమైన నివాసం (నరకం) అది!!
18:30 إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ إِنَّا لَا نُضِيعُ أَجْرَ مَنْ أَحْسَنَ عَمَلًا
ఇక విశ్వసించి, సత్కార్యాలు చేసినవారి విషయం – నిశ్చయంగా మేము ఉత్తమ ఆచరణ చేసిన వారి ప్రతిఫలాన్ని వృధా కానివ్వము.
18:31 أُولَٰئِكَ لَهُمْ جَنَّاتُ عَدْنٍ تَجْرِي مِن تَحْتِهِمُ الْأَنْهَارُ يُحَلَّوْنَ فِيهَا مِنْ أَسَاوِرَ مِن ذَهَبٍ وَيَلْبَسُونَ ثِيَابًا خُضْرًا مِّن سُندُسٍ وَإِسْتَبْرَقٍ مُّتَّكِئِينَ فِيهَا عَلَى الْأَرَائِكِ ۚ نِعْمَ الثَّوَابُ وَحَسُنَتْ مُرْتَفَقًا
వారి కోసం శాశ్వితమైన స్వర్గవనాలున్నాయి. వారి క్రింది నుంచి కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడ వారు బంగారు కంకణాలు తొడిగించబడతారు. సన్నగానూ, దళసరిగానూ ఉండే సుతిమెత్తని ఆకుపచ్చ రంగుగల పట్టు వస్త్రాలు ధరిస్తారు. వారక్కడ ఆసనాలపై (దిండ్లకు) ఆనుకుని ఆసీనులై ఉంటారు. ఎంత చక్కటి పుణ్యఫలం అది! ఎంత అమోఘమైన విశ్రాంతి నిలయం అది!!
18:32 وَاضْرِبْ لَهُم مَّثَلًا رَّجُلَيْنِ جَعَلْنَا لِأَحَدِهِمَا جَنَّتَيْنِ مِنْ أَعْنَابٍ وَحَفَفْنَاهُمَا بِنَخْلٍ وَجَعَلْنَا بَيْنَهُمَا زَرْعًا
(ఓ ప్రవక్తా!) వారికి ఆ ఇద్దరు వ్యక్తుల ఉదాహరణను కూడా వినిపించు – వారిలో ఒకతనికి మేము రెండు ద్రాక్ష తోటలను ఇచ్చాము. వాటి చుట్టూ ఖర్జూరపు చెట్ల కంచెను నిర్మించాము. ఆ రెంటికీ మధ్య పచ్చని పంట పొలాలను కూడా వొసగాము.
18:33 كِلْتَا الْجَنَّتَيْنِ آتَتْ أُكُلَهَا وَلَمْ تَظْلِم مِّنْهُ شَيْئًا ۚ وَفَجَّرْنَا خِلَالَهُمَا نَهَرًا
ఆ రెండు తోటలూ దిట్టంగా పండాయి. అందులో ఏ లోటూ చేయలేదు. ఇంకా, ఆ రెండు తోటల మధ్య మేము ఒక కాలువను కూడా ప్రవహింపజేశాము.
18:34 وَكَانَ لَهُ ثَمَرٌ فَقَالَ لِصَاحِبِهِ وَهُوَ يُحَاوِرُهُ أَنَا أَكْثَرُ مِنكَ مَالًا وَأَعَزُّ نَفَرًا
మొత్తానికి అతని పంట పండింది. ఒకనాడతను మాటల సందర్భంగా తన స్నేహితునితో, “నేను నీకన్నా ఎక్కువ ధనవంతుణ్ణి. మందీమార్బలం రీత్యా కూడా నీకంటే ఎక్కువ బలవంతుణ్ణే” అని అన్నాడు.
18:35 وَدَخَلَ جَنَّتَهُ وَهُوَ ظَالِمٌ لِّنَفْسِهِ قَالَ مَا أَظُنُّ أَن تَبِيدَ هَٰذِهِ أَبَدًا
ఇలా అతను తన ఆత్మకు అన్యాయం చేసుకున్న స్థితిలో తన తోటలోకి వెళ్ళాడు. ఇలా అన్నాడు: “ఏనాటికైనా ఈ తోట నాశనమై పోతుందని నేననుకోను.”
18:36 وَمَا أَظُنُّ السَّاعَةَ قَائِمَةً وَلَئِن رُّدِدتُّ إِلَىٰ رَبِّي لَأَجِدَنَّ خَيْرًا مِّنْهَا مُنقَلَبًا
“ప్రళయ ఘడియ ఆసన్నమవుతుందని కూడా నేను భావించటం లేదు. ఒకవేళ (అలాంటిదేదైనా జరిగి) నేను నా ప్రభువు వద్దకు మరలింపబడినా, నిస్సందేహంగా నేను (ఆ మళ్ళింపు స్థానంలో) ఇంతకన్నా మంచి స్థితిలోనే ఉంటాను.”
18:37 قَالَ لَهُ صَاحِبُهُ وَهُوَ يُحَاوِرُهُ أَكَفَرْتَ بِالَّذِي خَلَقَكَ مِن تُرَابٍ ثُمَّ مِن نُّطْفَةٍ ثُمَّ سَوَّاكَ رَجُلًا
అప్పుడు అతని స్నేహితుడు అతనితో మాట్లాడుతూ ఇలా అన్నాడు : “ఏమిటీ, నిన్ను మట్టితో చేసి, ఆ తరువాత వీర్యపు బిందువుతో సృష్టించి, ఆపైన నిన్ను నిండు మనిషిగా తీర్చిదిద్దిన ఆయననే (ఆ ఆరాధ్య దైవాన్నే) తిరస్కరిస్తున్నావా?
18:38 لَّٰكِنَّا هُوَ اللَّهُ رَبِّي وَلَا أُشْرِكُ بِرَبِّي أَحَدًا
“నా మట్టుకు నేను ఆ అల్లాహ్‌యే నా ప్రభువు అని నమ్ముతున్నాను. నేను నా ప్రభువుకు సహవర్తునిగా ఎవరినీ కల్పించను.
18:39 وَلَوْلَا إِذْ دَخَلْتَ جَنَّتَكَ قُلْتَ مَا شَاءَ اللَّهُ لَا قُوَّةَ إِلَّا بِاللَّهِ ۚ إِن تَرَنِ أَنَا أَقَلَّ مِنكَ مَالًا وَوَلَدًا
“(మిత్రమా!) నువ్వు నీ తోటలోకి పోతున్నప్పుడు ‘అల్లాహ్ తలచినదే అవుతుంది. అల్లాహ్ ద్వారా లభించే శక్తి తప్ప వేరే శక్తి ఏదీ లేదు’ అని ఎందుకు పలకలేదు? ఒకవేళ నువ్వు నన్ను సంపదలో, సంతానంలో నీకన్నా అల్పునిగా చూస్తున్నట్లయితే,
18:40 فَعَسَىٰ رَبِّي أَن يُؤْتِيَنِ خَيْرًا مِّن جَنَّتِكَ وَيُرْسِلَ عَلَيْهَا حُسْبَانًا مِّنَ السَّمَاءِ فَتُصْبِحَ صَعِيدًا زَلَقًا
“(తెలుసుకో!) నా ప్రభువు నాకు నీ తోట కన్నా మేలైనదాన్ని ప్రసాదించి, నీ తోటపై ఆకాశం నుంచి ఏదన్నా శిక్షను పంపినా పంపవచ్చు (ఆశ్చర్యపోనవసరం లేదు). అప్పుడది తెల్లవారేసరికి చదునైన – నున్నని – మైదానంలా అయిపోవచ్చు!
18:41 أَوْ يُصْبِحَ مَاؤُهَا غَوْرًا فَلَن تَسْتَطِيعَ لَهُ طَلَبًا
“లేదా దీని నీరు భూమిలో ఇంకిపోనూవచ్చు. దాన్ని వెతికి తీసుకురావటం నీ తరం కాకపోవచ్చు.”
18:42 وَأُحِيطَ بِثَمَرِهِ فَأَصْبَحَ يُقَلِّبُ كَفَّيْهِ عَلَىٰ مَا أَنفَقَ فِيهَا وَهِيَ خَاوِيَةٌ عَلَىٰ عُرُوشِهَا وَيَقُولُ يَا لَيْتَنِي لَمْ أُشْرِكْ بِرَبِّي أَحَدًا
అతని పండ్లన్నీ ముట్టడించబడ్డాయి. దాని కోసం పెట్టిన పెట్టుబడిపై అతను చేతులు నలుపుకుంటూ ఉండి పోయాడు. ఆ తోట తలక్రిందులై (తడికెలపై) పడి ఉంది. “అయ్యో! నేను నా ప్రభువుకు సహవర్తులుగా ఎవరినీ నిలబెట్టకుండా ఉంటే ఎంత బావుండేది!” అని (ఆ వ్యక్తి) అన్నాడు.
18:43 وَلَمْ تَكُن لَّهُ فِئَةٌ يَنصُرُونَهُ مِن دُونِ اللَّهِ وَمَا كَانَ مُنتَصِرًا
అల్లాహ్ పట్టు నుంచి అతన్ని రక్షించి, సహాయపడటానికి అతని జన సమూహమేదీ రాలేదు. స్వయంగా అతను కూడా ప్రతిఘటించలేకపోయాడు.
18:44 هُنَالِكَ الْوَلَايَةُ لِلَّهِ الْحَقِّ ۚ هُوَ خَيْرٌ ثَوَابًا وَخَيْرٌ عُقْبًا
సర్వాధికారాలు సత్యబద్ధుడైన అల్లాహ్వేననీ, పుణ్యఫలం ప్రసాదించటంలోనూ ఆయనే ఉత్తముడనీ, పర్యవసానం రీత్యా కూడా ఆయనే అత్యుత్తముడనీ అక్కడే తేలిపోయింది.
18:45 وَاضْرِبْ لَهُم مَّثَلَ الْحَيَاةِ الدُّنْيَا كَمَاءٍ أَنزَلْنَاهُ مِنَ السَّمَاءِ فَاخْتَلَطَ بِهِ نَبَاتُ الْأَرْضِ فَأَصْبَحَ هَشِيمًا تَذْرُوهُ الرِّيَاحُ ۗ وَكَانَ اللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ مُّقْتَدِرًا
(ఓ ప్రవక్తా!) ప్రాపంచిక జీవితపు ఉదాహరణను కూడా వారికి తెలుపు. అది మేము ఆకాశం నుంచి కురిపించే వర్షపు నీరు వంటిది. దానివల్ల నేలలో దట్టమైన పచ్చిక మొలిచింది. ఆఖరికి అది పొట్టు పొట్టుగా మారిపోగా, గాలులు దాన్ని లేపుకుపోతాయి. అల్లాహ్ అన్నింటిపై అధికారం కలిగి ఉన్నాడు.
18:46 الْمَالُ وَالْبَنُونَ زِينَةُ الْحَيَاةِ الدُّنْيَا ۖ وَالْبَاقِيَاتُ الصَّالِحَاتُ خَيْرٌ عِندَ رَبِّكَ ثَوَابًا وَخَيْرٌ أَمَلًا
సిరిసంపదలైనా, సంతానమైనా ప్రాపంచిక జీవితానికి అలంకారం మాత్రమే. అయితే మిగిలివుండే సత్కార్యాలు నీ ప్రభువు దగ్గర ప్రతిఫలం రీత్యా మేలైనవి. అత్యుత్తమం కాగలవని ఆశించబడేవి అవే.
18:47 وَيَوْمَ نُسَيِّرُ الْجِبَالَ وَتَرَى الْأَرْضَ بَارِزَةً وَحَشَرْنَاهُمْ فَلَمْ نُغَادِرْ مِنْهُمْ أَحَدًا
మేము పర్వతాలను నడిపిస్తాము, నువ్వు ఆ రోజున భూమిని చదును చేయబడి ఉన్నట్లుగా చూస్తావు. జనులందరినీ మేము (ఒకచోట) సమీకరిస్తాము. వారిలో ఏ ఒక్కరినీ వదలి పెట్టము.
18:48 وَعُرِضُوا عَلَىٰ رَبِّكَ صَفًّا لَّقَدْ جِئْتُمُونَا كَمَا خَلَقْنَاكُمْ أَوَّلَ مَرَّةٍ ۚ بَلْ زَعَمْتُمْ أَلَّن نَّجْعَلَ لَكُم مَّوْعِدًا
వారంతా నీ ప్రభువు సమక్షంలో వరుసగా నిలబెట్టబడతారు. “నిశ్చయంగా – మేము మిమ్మల్ని మొదటిసారి పుట్టించినట్లుగానే మీరు మా వద్దకు వచ్చేశారు. కాని మీరు మాత్రం, మేమెన్నటికీ మీ కోసం వాగ్దాన సమయం నిర్ధారించము అనే తలపోసేవారు.”
18:49 وَوُضِعَ الْكِتَابُ فَتَرَى الْمُجْرِمِينَ مُشْفِقِينَ مِمَّا فِيهِ وَيَقُولُونَ يَا وَيْلَتَنَا مَالِ هَٰذَا الْكِتَابِ لَا يُغَادِرُ صَغِيرَةً وَلَا كَبِيرَةً إِلَّا أَحْصَاهَا ۚ وَوَجَدُوا مَا عَمِلُوا حَاضِرًا ۗ وَلَا يَظْلِمُ رَبُّكَ أَحَدًا
కర్మల పత్రాలు (వారి) ముందు ఉంచబడతాయి. నేరస్తులు ఆ పత్రాల్లో రాయబడి ఉన్నదాన్ని చూసి భీతిల్లుతూ, “అయ్యో! మా దౌర్భాగ్యం! ఇదేమి పత్రం? ఇది ఏ చిన్న విషయాన్నీ,ఏ పెద్ద విషయాన్నీ వదలకుండా నమోదు చేసిందే?!” అని వాపోవటం నువ్వు చూస్తావు. తాము చేసినదంతా వారు ప్రత్యక్షంగా చూసుకుంటారు. నీ ప్రభువు ఎవరికీ అన్యాయం చేయడు.
18:50 وَإِذْ قُلْنَا لِلْمَلَائِكَةِ اسْجُدُوا لِآدَمَ فَسَجَدُوا إِلَّا إِبْلِيسَ كَانَ مِنَ الْجِنِّ فَفَسَقَ عَنْ أَمْرِ رَبِّهِ ۗ أَفَتَتَّخِذُونَهُ وَذُرِّيَّتَهُ أَوْلِيَاءَ مِن دُونِي وَهُمْ لَكُمْ عَدُوٌّ ۚ بِئْسَ لِلظَّالِمِينَ بَدَلًا
ఆదమ్ ముందు సాష్టాంగపడమని మేము దూతలకు ఆజ్ఞాపించినప్పుడు, ఒక్క ఇబ్లీసు తప్ప అందరూ సాష్టాంగపడ్డారు. అతడు జిన్నాతుల కోవకు చెందినవాడు. వాడు తన ప్రభువు ఆజ్ఞను జవదాటాడు. అయినప్పటికీ మీరు నన్ను వదిలేసి, మీ అందరికీ శత్రువు అయినవాణ్ణీ, వాడి సంతానాన్నీ మీ స్నేహితులుగా చేసుకుంటున్నారా? ఇటువంటి దుర్మార్గులకు లభించే ప్రతిఫలం ఎంత చెడ్డది!
18:51 مَّا أَشْهَدتُّهُمْ خَلْقَ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَلَا خَلْقَ أَنفُسِهِمْ وَمَا كُنتُ مُتَّخِذَ الْمُضِلِّينَ عَضُدًا
నేను భూమ్యాకాశాలను సృష్టించినప్పుడుగానీ, స్వయంగా వీళ్ళను పుట్టించినపుడుగానీ వారిని అక్కడ ఉంచలేదు. అపమార్గం పట్టించే వారిని నేను నా సహాయకులుగా చేసుకోను.
18:52 وَيَوْمَ يَقُولُ نَادُوا شُرَكَائِيَ الَّذِينَ زَعَمْتُمْ فَدَعَوْهُمْ فَلَمْ يَسْتَجِيبُوا لَهُمْ وَجَعَلْنَا بَيْنَهُم مَّوْبِقًا
“నాకు భాగస్వాములని మీరు భావించిన (వారెక్కడ?) వారిని పిలవండి” అని ఆయన చెప్పిన రోజున వారు (తమ మిధ్యా దైవాలను) పిలుస్తారు. కాని వారిలో ఏ ఒక్కరూ సమాధానం ఇవ్వరు. మేము వారి మధ్యన వినాశాన్ని ఏర్పరుస్తాము.
18:53 وَرَأَى الْمُجْرِمُونَ النَّارَ فَظَنُّوا أَنَّهُم مُّوَاقِعُوهَا وَلَمْ يَجِدُوا عَنْهَا مَصْرِفًا
అపరాధులు నరకాన్ని చూడగానే, తాము పడవలసి ఉన్నది అందులోనేనని అర్థం చేసుకుంటారు. దాన్నుంచి తప్పించుకునే మార్గం ఏదీ వారికి కనిపించదు.
18:54 وَلَقَدْ صَرَّفْنَا فِي هَٰذَا الْقُرْآنِ لِلنَّاسِ مِن كُلِّ مَثَلٍ ۚ وَكَانَ الْإِنسَانُ أَكْثَرَ شَيْءٍ جَدَلًا
మేము ఈ ఖుర్ఆనులో ప్రజల కోసం పలు పలు విధాలుగా ఉపమానాలన్నింటినీ వివరించాము. కాని మానవుడు అందరి కన్నా ఎక్కువ తగవులమారి.
18:55 وَمَا مَنَعَ النَّاسَ أَن يُؤْمِنُوا إِذْ جَاءَهُمُ الْهُدَىٰ وَيَسْتَغْفِرُوا رَبَّهُمْ إِلَّا أَن تَأْتِيَهُمْ سُنَّةُ الْأَوَّلِينَ أَوْ يَأْتِيَهُمُ الْعَذَابُ قُبُلًا
ప్రజల వద్దకు మార్గదర్శకత్వం వచ్చేసిన తరువాత కూడా వారు విశ్వసించకుండా, క్షమాభిక్షకై తమ ప్రభువును వేడుకోకుండా వారిని ఆపిన విషయం ఒక్కటే – అదేమిటంటే, గత కాలంలోని ప్రజలకు ఎదురైన వ్యవహారమే తమకూ ఎదురవ్వాలనీ లేదా ప్రత్యక్షంగా తమ ముందుకు శిక్ష రావాలని వారు నిరీక్షించటం.
18:56 وَمَا نُرْسِلُ الْمُرْسَلِينَ إِلَّا مُبَشِّرِينَ وَمُنذِرِينَ ۚ وَيُجَادِلُ الَّذِينَ كَفَرُوا بِالْبَاطِلِ لِيُدْحِضُوا بِهِ الْحَقَّ ۖ وَاتَّخَذُوا آيَاتِي وَمَا أُنذِرُوا هُزُوًا
మేము ప్రవక్తలను శుభవార్తలను అందజేయటానికి, హెచ్చరికలు చేయటానికి మాత్రమే పంపిస్తాము. అవిశ్వాసులు అసత్యం ఆధారంగా వాదులాడతారు. దాని ద్వారా సత్యాన్ని ఖండించటానికి (ప్రయత్నిస్తారు.) వారు నా ఆయతులను, వారికి చేస్తున్న హెచ్చరికలను ఆషామాషీగా తీసుకున్నారు.
18:57 وَمَنْ أَظْلَمُ مِمَّن ذُكِّرَ بِآيَاتِ رَبِّهِ فَأَعْرَضَ عَنْهَا وَنَسِيَ مَا قَدَّمَتْ يَدَاهُ ۚ إِنَّا جَعَلْنَا عَلَىٰ قُلُوبِهِمْ أَكِنَّةً أَن يَفْقَهُوهُ وَفِي آذَانِهِمْ وَقْرًا ۖ وَإِن تَدْعُهُمْ إِلَى الْهُدَىٰ فَلَن يَهْتَدُوا إِذًا أَبَدًا
తన ప్రభువు వచనాల ద్వారా హితబోధ చేసినప్పటికీ, విముఖత చూపి, తన చేతులతో ముందుగా చేసి పంపుకున్న దానినే మరచిపోయిన వానికన్నా ఎక్కువ దుర్మార్గుడెవడుంటాడు? వారు దానిని (ఖుర్ఆనును) అర్థం చేసుకోకుండా మేము వారి హృదయాలపై తెరలు వేసేశాము. వారి చెవులకు చెవుడు కలిగించాము. నువ్వు సన్మార్గం వైపుకు వారిని పిలుస్తూ ఉన్నప్పటికీ, వారు ఎన్నటికీ సన్మార్గం పొందేవారు కారు.
18:58 وَرَبُّكَ الْغَفُورُ ذُو الرَّحْمَةِ ۖ لَوْ يُؤَاخِذُهُم بِمَا كَسَبُوا لَعَجَّلَ لَهُمُ الْعَذَابَ ۚ بَل لَّهُم مَّوْعِدٌ لَّن يَجِدُوا مِن دُونِهِ مَوْئِلًا
నీ ప్రభువు క్షమాగుణం కలవాడు, దయాశీలి. వారి చేష్టలకు శిక్షగా ఆయన గనక వారిని పట్టుకున్నట్లయితే, వారిని తొందరగానే శిక్షించి ఉండేవాడు. అసలు విషయం ఏమిటంటే వారి కోసం ఒక వాగ్దాన సమయం నిర్ధారితమై ఉంది. దాన్నుంచి తప్పించుకునిపోయే చోటేదీ వారికి దొరకదు.
18:59 وَتِلْكَ الْقُرَىٰ أَهْلَكْنَاهُمْ لَمَّا ظَلَمُوا وَجَعَلْنَا لِمَهْلِكِهِم مَّوْعِدًا
తమ దురాగతాల మూలంగా మేము సర్వనాశనం చేసిన వారి పట్టణాలు ఇవే. వీరి వినాశానికి కూడా మేము ఒక గడువును నిర్ధారించి పెట్టాము.
18:60 وَإِذْ قَالَ مُوسَىٰ لِفَتَاهُ لَا أَبْرَحُ حَتَّىٰ أَبْلُغَ مَجْمَعَ الْبَحْرَيْنِ أَوْ أَمْضِيَ حُقُبًا
“ఏళ్ళ తరబడి నడవవలసి వచ్చినా సరే, రెండు సముద్రాలు కలిసే సాగర సంగమానికి చేరుకోనంతవరకూ నేను నడుస్తూనే ఉంటాను” అని మూసా తన వెంటనున్న యువకునితో చెప్పినప్పుడు (జరిగిన సంఘటనను కాస్త జ్ఞప్తికి తెచ్చుకోండి).
18:61 فَلَمَّا بَلَغَا مَجْمَعَ بَيْنِهِمَا نَسِيَا حُوتَهُمَا فَاتَّخَذَ سَبِيلَهُ فِي الْبَحْرِ سَرَبًا
తీరా వారిద్దరు సాగర సంగమానికి చేరుకున్నాక, అక్కడ తమ చేపను మరచి పోయారు. అదేమో సొరంగం మాదిరిగా దారి చేసుకుని సముద్రంలోకి జారుకుంది.
18:62 فَلَمَّا جَاوَزَا قَالَ لِفَتَاهُ آتِنَا غَدَاءَنَا لَقَدْ لَقِينَا مِن سَفَرِنَا هَٰذَا نَصَبًا
వారుభయులూ ముందుకు సాగిపోయిన తరువాత మూసా తన (వెంటనున్న) యువకుణ్ణి ఉద్దేశించి, “మా ఉదయ భోజనం తీసుకురా. నిజంగానే ఈ ప్రయాణంలో చాలా ప్రయాస పడాల్సి వచ్చింది” అన్నాడు.
18:63 قَالَ أَرَأَيْتَ إِذْ أَوَيْنَا إِلَى الصَّخْرَةِ فَإِنِّي نَسِيتُ الْحُوتَ وَمَا أَنسَانِيهُ إِلَّا الشَّيْطَانُ أَنْ أَذْكُرَهُ ۚ وَاتَّخَذَ سَبِيلَهُ فِي الْبَحْرِ عَجَبًا
దానికతను, “చూశారా (ఎంత పనయిందో)! మనం రాతి బండకు ఆనుకుని విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు నేను చేప సంగతి మరచేపోయాను. అసలేం జరిగిందో మీకు చెప్పకుండా షైతానే నన్ను మరుపుకు లోను చేశాడు. ఆ చేప చాలా విచిత్రంగా సముద్రంలోకి దారి చేసుకుని వెళ్ళిపోయింది” అని వివరించాడు.
18:64 قَالَ ذَٰلِكَ مَا كُنَّا نَبْغِ ۚ فَارْتَدَّا عَلَىٰ آثَارِهِمَا قَصَصًا
“(అరె!) మనం వెతుక్కుంటూ వచ్చింది ఆ స్థలం కోసమే కదా!” అని మూసా అన్నాడు. ఆ తరువాత వారిద్దరూ తమ పాదచిహ్నాల ఆధారంగా వెనక్కి తిరిగి వచ్చారు.
18:65 فَوَجَدَا عَبْدًا مِّنْ عِبَادِنَا آتَيْنَاهُ رَحْمَةً مِّنْ عِندِنَا وَعَلَّمْنَاهُ مِن لَّدُنَّا عِلْمًا
అక్కడ వారు మా దాసులలోని ఒక దాసుణ్ణి కనుగొన్నారు. మేము అతనికి మా వద్ద నుంచి ఓ ప్రత్యేక కారుణ్యాన్ని ప్రసాదించి ఉన్నాము. ఇంకా మా వద్ద నుంచి అతనికి ఓ ప్రత్యేక విద్యను నేర్పి ఉన్నాము.
18:66 قَالَ لَهُ مُوسَىٰ هَلْ أَتَّبِعُكَ عَلَىٰ أَن تُعَلِّمَنِ مِمَّا عُلِّمْتَ رُشْدًا
మూసా అతనితో, “మీకు నేర్పబడిన మంచి విద్యను మీరు నాకు నేర్పడానికి, నేను మీ వెంట ఉండవచ్చా?” అని అభ్యర్థించాడు.
18:67 قَالَ إِنَّكَ لَن تَسْتَطِيعَ مَعِيَ صَبْرًا
దానికతను, “మీరు నా సహచర్యంలో ఉంటూ ఏమాత్రం ఓపిక పట్టలేరు.
18:68 وَكَيْفَ تَصْبِرُ عَلَىٰ مَا لَمْ تُحِطْ بِهِ خُبْرًا
“అయినా మీరు మీ జ్ఞానపరిధిలోకి తీసుకోని విషయంపై ఓపిక పట్టడం మీ వల్ల ఎలా సాధ్యమవుతుంది?” అన్నాడు.
18:69 قَالَ سَتَجِدُنِي إِن شَاءَ اللَّهُ صَابِرًا وَلَا أَعْصِي لَكَ أَمْرًا
“అల్లాహ్ తలిస్తే మీరు నన్ను సహనశీలిగా పొందుతారు. ఏ విషయంలోనూ నేను మీ ఆజ్ఞను జవదాటను” అని (మూసా) సమాధానమిచ్చాడు.
18:70 قَالَ فَإِنِ اتَّبَعْتَنِي فَلَا تَسْأَلْنِي عَن شَيْءٍ حَتَّىٰ أُحْدِثَ لَكَ مِنْهُ ذِكْرًا
“సరే! నా వెంట రావాలన్నదే మీ అభిలాష అయితే (బాగా గుర్తుంచుకోండి!) ఏ విషయం గురించైనాసరే నేను స్వయంగా మీతో ప్రస్తావించనంతవరకూ నన్నేమీ అడగకూడదు” అన్నాడతను.
18:71 فَانطَلَقَا حَتَّىٰ إِذَا رَكِبَا فِي السَّفِينَةِ خَرَقَهَا ۖ قَالَ أَخَرَقْتَهَا لِتُغْرِقَ أَهْلَهَا لَقَدْ جِئْتَ شَيْئًا إِمْرًا
వారిద్దరూ బయలుదేరారు. చివరకు ఒక పడవలో పయనమైనప్పుడు అతను (ఖిజరు) దాని చెక్క పలకలను పగులగొట్టారు. దానికి మూసా, “ఇదేమిటీ, పడవ ప్రయాణీకులందరినీ ముంచేయటానికా వీటిని పగులగొట్టారు? మీరు చాలా ఘోరమైన పనికి ఒడిగట్టారు” అని చెప్పనే చెప్పేశాడు.
18:72 قَالَ أَلَمْ أَقُلْ إِنَّكَ لَن تَسْتَطِيعَ مَعِيَ صَبْرًا
“మీరు నా వెంట ఉండి ఓపిక పట్టలేరని ముందే చెప్పానా!?” అని (ఖిజరు) అన్నాడు.
18:73 قَالَ لَا تُؤَاخِذْنِي بِمَا نَسِيتُ وَلَا تُرْهِقْنِي مِنْ أَمْرِي عُسْرًا
“నా మరుపుపై నన్ను పట్టుకోకండి. నా విషయంలో కఠినంగా వ్యవహరించకండి” అని మూసా విన్నవించుకున్నాడు.
18:74 فَانطَلَقَا حَتَّىٰ إِذَا لَقِيَا غُلَامًا فَقَتَلَهُ قَالَ أَقَتَلْتَ نَفْسًا زَكِيَّةً بِغَيْرِ نَفْسٍ لَّقَدْ جِئْتَ شَيْئًا نُّكْرًا
ఆ తరువాత వారుభయులూ ముందుకు సాగిపోయారు. వారికి ఒక అబ్బాయి తారసపడ్డాడు. అతనా అబ్బాయిని చంపేశాడు. “మీరు పవిత్రమైన ఒక ప్రాణాన్ని తీసేశారు. అతను ఏ ప్రాణినీ హతమార్చి ఉండలేదుకదా! నిశ్చయంగా మీరు అత్యంత ఘోరకృత్యానికి పాల్పడ్డారు” అని మూసా చెప్పాడు.
18:75 قَالَ أَلَمْ أَقُل لَّكَ إِنَّكَ لَن تَسْتَطِيعَ مَعِيَ صَبْرًا
“నా వెంట ఉంటూ మీరు ఏ మాత్రం సహనం పాటించలేరని ముందే చెప్పానా లేదా?” అని ఆయన అన్నాడు.
18:76 قَالَ إِن سَأَلْتُكَ عَن شَيْءٍ بَعْدَهَا فَلَا تُصَاحِبْنِي ۖ قَدْ بَلَغْتَ مِن لَّدُنِّي عُذْرًا
“ఒకవేళ దీని తరువాత ఏ విషయంలోనయినా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తే నన్ను మీ వెంట ఉండనివ్వకండి. ఇక మీదట నాపై చర్య గైకొనేందుకు తగిన కారణం మీకు లభించింది” అని మూసా ప్రాధేయపడ్డాడు.
18:77 فَانطَلَقَا حَتَّىٰ إِذَا أَتَيَا أَهْلَ قَرْيَةٍ اسْتَطْعَمَا أَهْلَهَا فَأَبَوْا أَن يُضَيِّفُوهُمَا فَوَجَدَا فِيهَا جِدَارًا يُرِيدُ أَن يَنقَضَّ فَأَقَامَهُ ۖ قَالَ لَوْ شِئْتَ لَاتَّخَذْتَ عَلَيْهِ أَجْرًا
వారిద్దరూ అక్కణ్ణుంచి బయలుదేరి ఒక పట్టణానికి చేరుకున్నారు. తమ కోసం భోజన ఏర్పాటు చేయమని అక్కడి ప్రజలను అభ్యర్థించగా వారికి ఆతిథ్యమివ్వటానికి స్థానికులు నిరాకరించారు. అంతలో ఆ ఊరిలో కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న ఒక గోడపై వారి దృష్టి పడింది. ఆయన ఆ గోడను (యధాతథంగా) నిలబెట్టాడు. “మీరు గనక తలచుకుంటే ఈ పనికి వేతనం తీసుకోవచ్చు కదా!” అని మూసా అన్నాడు.
18:78 قَالَ هَٰذَا فِرَاقُ بَيْنِي وَبَيْنِكَ ۚ سَأُنَبِّئُكَ بِتَأْوِيلِ مَا لَمْ تَسْتَطِع عَّلَيْهِ صَبْرًا
దానికతను ఈ విధంగా సమాధానమిచ్చాడు: “ఇక మీకూ- నాకూ మధ్య చీలిక ఏర్పడినట్లే (మన సావాసం చెల్లిపోయింది). మీరు సహించలేకపోయిన ఆ మూడు విషయాల పరమార్థాన్ని కూడా మీకు వివరిస్తాను (వినండి)….”
18:79 أَمَّا السَّفِينَةُ فَكَانَتْ لِمَسَاكِينَ يَعْمَلُونَ فِي الْبَحْرِ فَأَرَدتُّ أَنْ أَعِيبَهَا وَكَانَ وَرَاءَهُم مَّلِكٌ يَأْخُذُ كُلَّ سَفِينَةٍ غَصْبًا
“ఆ పడవ సంగతి – అది సముద్రంలో పనిచేసుకునే కొందరు నిరుపేదలది. నేను కావాలనే ఆ పడవలో కొంత లోపం ఏర్పర చాలనుకున్నాను. ఎందుకంటే, ఇంకాస్త ముందుకుపోతే కనిపించిన ప్రతి (మంచి) పడవనూ బలవంతంగా వశపరచుకునే రాజు ఒకడున్నాడు.
18:80 وَأَمَّا الْغُلَامُ فَكَانَ أَبَوَاهُ مُؤْمِنَيْنِ فَخَشِينَا أَن يُرْهِقَهُمَا طُغْيَانًا وَكُفْرًا
“ఇకపోతే ఆ అబ్బాయి సంగతి; అతని తల్లిదండ్రులు విశ్వాసులు. అతను తన తలబిరుసుతనంతో, తిరస్కారవైఖరితో వారిని వేధిస్తాడని మాకు భయమేసింది.
18:81 فَأَرَدْنَا أَن يُبْدِلَهُمَا رَبُّهُمَا خَيْرًا مِّنْهُ زَكَاةً وَأَقْرَبَ رُحْمًا
“అందుకే వారికి వారి ప్రభువు – అతనికి బదులుగా – అతనికన్నా సౌశీల్యవంతుడైన, దయార్ద్రతకు దగ్గరగా ఉండే బాలుడిని ప్రసాదించాలని మేము కోరుకున్నాము.
18:82 وَأَمَّا الْجِدَارُ فَكَانَ لِغُلَامَيْنِ يَتِيمَيْنِ فِي الْمَدِينَةِ وَكَانَ تَحْتَهُ كَنزٌ لَّهُمَا وَكَانَ أَبُوهُمَا صَالِحًا فَأَرَادَ رَبُّكَ أَن يَبْلُغَا أَشُدَّهُمَا وَيَسْتَخْرِجَا كَنزَهُمَا رَحْمَةً مِّن رَّبِّكَ ۚ وَمَا فَعَلْتُهُ عَنْ أَمْرِي ۚ ذَٰلِكَ تَأْوِيلُ مَا لَمْ تَسْطِع عَّلَيْهِ صَبْرًا
“ఇక గోడ సంగతంటారా, ఆ గోడ ఈ పట్టణంలో నివసించే ఇద్దరు అనాధ బాలలది. వారికి చెందవలసిన ఒక నిధి ఆ గోడ క్రింద పాతిపెట్టబడి ఉంది. వారి తండ్రి సజ్జనుడు. ఈ అనాధలిద్దరూ యుక్త వయస్కులై నీ ప్రభువు దయానుగ్రహంతో తమ ఈ నిధిని వెలికి తీసుకోవాలన్నది నీ ప్రభువు సంకల్పం. అంతేగాని నా అంతట నేనుగా ఈ పని చేయలేదు. మీరు సహించలేకపోయిన ఆ సంఘటనల వెనుక దాగివున్న వాస్తవికత ఇదే!”
18:83 وَيَسْأَلُونَكَ عَن ذِي الْقَرْنَيْنِ ۖ قُلْ سَأَتْلُو عَلَيْكُم مِّنْهُ ذِكْرًا
(ఓ ప్రవక్తా!) వారు నిన్ను జుల్ఖర్నైన్ గురించి అడుగుతున్నారు. “నేను మీకు అతని వృత్తాంతం కొద్దిగా చదివి వినిపిస్తాన”ని వారికి చెప్పు.
18:84 إِنَّا مَكَّنَّا لَهُ فِي الْأَرْضِ وَآتَيْنَاهُ مِن كُلِّ شَيْءٍ سَبَبًا
మేము అతనికి భువిలో అధికారం ఇచ్చాము. అన్ని రకాల సాధన సంపత్తుల్నికూడా అతనికి సమకూర్చాము.
18:85 فَأَتْبَعَ سَبَبًا
అతను ఒక దిశలో పోసాగాడు.
18:86 حَتَّىٰ إِذَا بَلَغَ مَغْرِبَ الشَّمْسِ وَجَدَهَا تَغْرُبُ فِي عَيْنٍ حَمِئَةٍ وَوَجَدَ عِندَهَا قَوْمًا ۗ قُلْنَا يَا ذَا الْقَرْنَيْنِ إِمَّا أَن تُعَذِّبَ وَإِمَّا أَن تَتَّخِذَ فِيهِمْ حُسْنًا
చివరకు అతను సూర్యుడు అస్తమించే ప్రదేశానికి చేరుకుని, సూర్యుడు ఒక బురద చెలమలో అస్తమిస్తుండగా చూశాడు. దాని సమీపంలో అతను ఒక జాతి వారిని కూడా కనుగొన్నాడు. “ఓ జుల్ఖర్నైన్! నువ్వు వీళ్లను శిక్షించవచ్చు. లేదా వీరి విషయంలో మరేదయినా ఉత్తమ వైఖరిని అవలంబించవచ్చు” అని మేమతనికి సెలవిచ్చాము.
18:87 قَالَ أَمَّا مَن ظَلَمَ فَسَوْفَ نُعَذِّبُهُ ثُمَّ يُرَدُّ إِلَىٰ رَبِّهِ فَيُعَذِّبُهُ عَذَابًا نُّكْرًا
దానికతను, “దుర్మార్గానికి ఒడిగట్టిన వాణ్ణి మేము శిక్షిస్తాము. తరువాత అతను తన ప్రభువు వద్దకు మరలించబడతాడు. ఆయన అతనికి మరింత తీవ్రమైన శిక్ష విధిస్తాడు” అని అన్నాడు.
18:88 وَأَمَّا مَنْ آمَنَ وَعَمِلَ صَالِحًا فَلَهُ جَزَاءً الْحُسْنَىٰ ۖ وَسَنَقُولُ لَهُ مِنْ أَمْرِنَا يُسْرًا
“అయితే విశ్వసించి, మంచిపనులు చేసినవారికి ప్రతి ఫలంగా మేలు కలుగుతుంది. అలాంటి వారికి మేము సయితం మా పనిలో తేలికపాటి ఆదేశాలే ఇస్తాము” (అని అన్నాడు).
18:89 ثُمَّ أَتْبَعَ سَبَبًا
ఆ తరువాత అతను మరో దారి పట్టాడు –
18:90 حَتَّىٰ إِذَا بَلَغَ مَطْلِعَ الشَّمْسِ وَجَدَهَا تَطْلُعُ عَلَىٰ قَوْمٍ لَّمْ نَجْعَل لَّهُم مِّن دُونِهَا سِتْرًا
అతను సూర్యుడు ఉదయించే ప్రదేశానికి చేరుకున్నప్పుడు, అక్కడ సూర్యుడు ఒక జాతి వారిపై ఉదయించటం చూశాడు. మేము వారికీ – సూర్యునికీ మధ్య ఎలాంటి అడ్డునూ ఉంచలేదు.
18:91 كَذَٰلِكَ وَقَدْ أَحَطْنَا بِمَا لَدَيْهِ خُبْرًا
ఇదీ పరిస్థితి! అతనికి సంబంధించిన విషయాలన్నీ మా జ్ఞానపరిధిలో ఉన్నాయి.
18:92 ثُمَّ أَتْبَعَ سَبَبًا
ఆ తరువాత అతను ఇంకొక మార్గాన్ని అనుసరించాడు.
18:93 حَتَّىٰ إِذَا بَلَغَ بَيْنَ السَّدَّيْنِ وَجَدَ مِن دُونِهِمَا قَوْمًا لَّا يَكَادُونَ يَفْقَهُونَ قَوْلًا
అతను రెండు కొండల మధ్య ప్రదేశానికి చేరుకున్నప్పుడు, ఆ రెంటికీ నడుమ ఒక జాతివారిని చూశాడు. వారు అతని (ఒక్క) మాటనైనా అర్థం చేసుకునే స్థితిలో లేరు.
18:94 قَالُوا يَا ذَا الْقَرْنَيْنِ إِنَّ يَأْجُوجَ وَمَأْجُوجَ مُفْسِدُونَ فِي الْأَرْضِ فَهَلْ نَجْعَلُ لَكَ خَرْجًا عَلَىٰ أَن تَجْعَلَ بَيْنَنَا وَبَيْنَهُمْ سَدًّا
“ఓ జుల్ ఖర్నైన్! యాజూజ్ మాజూజ్‌లు ఈ దేశంలో కల్లోలాన్ని సృష్టిస్తున్నారు. నువ్వు మాకూ – వారికీ మధ్య ఒక అడ్డుగోడను నిర్మిస్తావా? దానికయ్యే ఖర్చులు నీకు చెల్లించమంటావా?” అని వాళ్లు విన్నవించుకున్నారు.
18:95 قَالَ مَا مَكَّنِّي فِيهِ رَبِّي خَيْرٌ فَأَعِينُونِي بِقُوَّةٍ أَجْعَلْ بَيْنَكُمْ وَبَيْنَهُمْ رَدْمًا
అతనిలా సమాధానమిచ్చాడు: “నాకు నా ప్రభువు అనుగ్రహించిన అధికారమే ఎంతో శ్రేష్ఠమైనది. మీరు మీ (శ్రమ) శక్తి ద్వారా నాకు సహాయపడండి చాలు. నేను మీకూ – వారికీ మధ్య ఒక పటిష్టమైన గోడను నిర్మిస్తాను.
18:96 آتُونِي زُبَرَ الْحَدِيدِ ۖ حَتَّىٰ إِذَا سَاوَىٰ بَيْنَ الصَّدَفَيْنِ قَالَ انفُخُوا ۖ حَتَّىٰ إِذَا جَعَلَهُ نَارًا قَالَ آتُونِي أُفْرِغْ عَلَيْهِ قِطْرًا
“….నాకు ఇనుపరేకులను తెచ్చి ఇవ్వండి.” ఆ విధంగా అతను ఆ రెండు పర్వతాల మధ్య గోడను – సమానంగా – లేపిన తరువాత, “అగ్నిని రాజేయండి” అని ఆజ్ఞాపించాడు. ఆ ఇనుప రేకులు బాగా కాలి అగ్నిగా మారిన తరువాత “కరిగిన రాగిని తెండి, దానిపై పోస్తాను” అని అన్నాడు.
18:97 فَمَا اسْطَاعُوا أَن يَظْهَرُوهُ وَمَا اسْتَطَاعُوا لَهُ نَقْبًا
ఇక వారిలో (యాజూజు మాజూజుల్లో) ఆ గోడను ఎక్కే శక్తి లేకపోయింది. దానికి రంధ్రం వేయటం కూడా వారి తరం కాదు.
18:98 قَالَ هَٰذَا رَحْمَةٌ مِّن رَّبِّي ۖ فَإِذَا جَاءَ وَعْدُ رَبِّي جَعَلَهُ دَكَّاءَ ۖ وَكَانَ وَعْدُ رَبِّي حَقًّا
“ఇది కేవలం నా ప్రభువు కటాక్షం. అయితే నా ప్రభువు వాగ్దాన సమయం వచ్చినపుడు ఆయన దాన్ని నేలమట్టం చేసేస్తాడు. నిశ్చయంగా నా ప్రభువు వాగ్దానం నెరవేరటం తథ్యం” అని జుల్ఖర్నైన్ చెప్పాడు.
18:99 وَتَرَكْنَا بَعْضَهُمْ يَوْمَئِذٍ يَمُوجُ فِي بَعْضٍ ۖ وَنُفِخَ فِي الصُّورِ فَجَمَعْنَاهُمْ جَمْعًا
ఆ రోజు మేము వారిని (సముద్రపు అలల మాదిరిగా) ఒండొకరిలో చొచ్చుకుపోయేలా వదలిపెడతాము. శంఖం ఊద బడుతుంది. అంతే! మేము జనులందరినీ ఒకేసారి సమీకరిస్తాము.
18:100 وَعَرَضْنَا جَهَنَّمَ يَوْمَئِذٍ لِّلْكَافِرِينَ عَرْضًا
ఆ రోజు మేము నరకాన్ని అవిశ్వాసుల ముందు ప్రత్యక్షపరుస్తాము.
18:101 الَّذِينَ كَانَتْ أَعْيُنُهُمْ فِي غِطَاءٍ عَن ذِكْرِي وَكَانُوا لَا يَسْتَطِيعُونَ سَمْعًا
నా స్మరణ పట్ల వారి కళ్లు పొరలు క్రమ్ముకుని ఉండేవి. అప్పుడు వారు (సత్య వాక్కును) వినే స్థితిలో కూడా లేరు.
18:102 أَفَحَسِبَ الَّذِينَ كَفَرُوا أَن يَتَّخِذُوا عِبَادِي مِن دُونِي أَوْلِيَاءَ ۚ إِنَّا أَعْتَدْنَا جَهَنَّمَ لِلْكَافِرِينَ نُزُلًا
ఇప్పుడీ అవిశ్వాసులు, నన్ను కాదని నా దాసులను తమ సహాయకులుగా చేసుకుందామని అనుకుంటున్నారా? (వినండి!) మేము ఈ అవిశ్వాసుల ఆతిథ్యం కోసం నరకాన్ని సిద్ధంచేసి ఉంచాము.
18:103 قُلْ هَلْ نُنَبِّئُكُم بِالْأَخْسَرِينَ أَعْمَالًا
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “చేసుకున్న కర్మల రీత్యా మీలో అందరికన్నా ఎక్కువగా నష్టపోయే వారెవరో నేను మీకు చెప్పనా?
18:104 الَّذِينَ ضَلَّ سَعْيُهُمْ فِي الْحَيَاةِ الدُّنْيَا وَهُمْ يَحْسَبُونَ أَنَّهُمْ يُحْسِنُونَ صُنْعًا
“తమ ప్రాపంచిక జీవితపు ప్రయత్నాలన్నీ వృధా అయిపోతున్నప్పటికీ, తాము చేసేదంతా సజావుగానే ఉందని భ్రమ పడేవారే వారు.”
18:105 أُولَٰئِكَ الَّذِينَ كَفَرُوا بِآيَاتِ رَبِّهِمْ وَلِقَائِهِ فَحَبِطَتْ أَعْمَالُهُمْ فَلَا نُقِيمُ لَهُمْ يَوْمَ الْقِيَامَةِ وَزْنًا
తమ ప్రభువు ఆయతులను, ఆయన్ని కలుసుకోవలసి ఉందన్న విషయాన్ని త్రోసి పుచ్చినవారు వీరే. అందువల్ల వారి కర్మలన్నీ వృధా అయిపోయాయి. కాబట్టి ప్రళయదినాన మేము వారి కర్మల బరువును తూయము.
18:106 ذَٰلِكَ جَزَاؤُهُمْ جَهَنَّمُ بِمَا كَفَرُوا وَاتَّخَذُوا آيَاتِي وَرُسُلِي هُزُوًا
వారికి లభించే ప్రతిఫలం నరకం. ఎందుకంటే వారు (సత్యాన్ని) తిరస్కరించారు. నా ఆయతులను, నా ప్రవక్తలను పరిహసించారు.
18:107 إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ كَانَتْ لَهُمْ جَنَّاتُ الْفِرْدَوْسِ نُزُلًا
అయితే విశ్వసించి, సత్కార్యాలు కూడా చేసిన వారికి ఆతిథ్యంగా ఫిరదౌసు వనాలు ఉన్నాయి.
18:108 خَالِدِينَ فِيهَا لَا يَبْغُونَ عَنْهَا حِوَلًا
వారక్కడ కలకాలం ఉంటారు. ఆ స్థలాన్ని వదలి మరెక్కడి కైనా పోవాలని వారు ఎన్నటికీ కోరుకోరు.
18:109 قُل لَّوْ كَانَ الْبَحْرُ مِدَادًا لِّكَلِمَاتِ رَبِّي لَنَفِدَ الْبَحْرُ قَبْلَ أَن تَنفَدَ كَلِمَاتُ رَبِّي وَلَوْ جِئْنَا بِمِثْلِهِ مَدَدًا
(ఓ ప్రవక్తా!) ఈ విధంగా చెప్పు : “ఒకవేళ నా ప్రభువు మాటలను వ్రాయటానికి సముద్రం సిరాగా మారిపోయినా సరే, నా ప్రభువు మాటలు పూర్తి కాకముందే, అది అయి పోతుంది.” – మేము మళ్లీ దాని వంటిదే (మరో సముద్రం) దాని సహాయార్థం తెచ్చినాసరే.”
18:110 قُلْ إِنَّمَا أَنَا بَشَرٌ مِّثْلُكُمْ يُوحَىٰ إِلَيَّ أَنَّمَا إِلَٰهُكُمْ إِلَٰهٌ وَاحِدٌ ۖ فَمَن كَانَ يَرْجُو لِقَاءَ رَبِّهِ فَلْيَعْمَلْ عَمَلًا صَالِحًا وَلَا يُشْرِكْ بِعِبَادَةِ رَبِّهِ أَحَدًا
(ఓ ప్రవక్తా!) వారికి ఇలా చెప్పు: “నేనూ మీలాంటి మానవ మాత్రుణ్ణే.(కాకపోతే) ‘మీ అందరి ఆరాధ్యదైవం ఒకే ఆరాధ్య దైవం’ అన్న సందేశం (వహీ) నా వద్దకు పంపబడుతుంది. కనుక తన ప్రభువును కలుసుకోవాలన్న ఆకాంక్ష ఉన్నవాడు సత్కార్యాలు చేయాలి. తన ప్రభువు ఆరాధనలో వేరొకరికి భాగస్వామ్యం కల్పించకూడదు.”
19. సూరా మర్యం (Maryam)
19:1 كهيعص
కాఫ్ – హా – యా – ఐన్ – సాద్. –
19:2 ذِكْرُ رَحْمَتِ رَبِّكَ عَبْدَهُ زَكَرِيَّا
నీ ప్రభువు తన దాసుడైన జకరియ్యాపై దయదలచినప్పటి ప్రస్తావన ఇది.
19:3 إِذْ نَادَىٰ رَبَّهُ نِدَاءً خَفِيًّا
అతను తన ప్రభువును గోప్యంగా మొరపెట్టుకున్నప్పుడు (జరిగిన సంఘటన ఇది).
19:4 قَالَ رَبِّ إِنِّي وَهَنَ الْعَظْمُ مِنِّي وَاشْتَعَلَ الرَّأْسُ شَيْبًا وَلَمْ أَكُن بِدُعَائِكَ رَبِّ شَقِيًّا
అతనిలా విన్నవించుకున్నాడు: “నా ప్రభూ! నా ఎముకలు బలహీనమైపోయాయి. వార్థక్యం వల్ల నా తల నెరసిపోయింది. నిన్ను ప్రార్థించి నేనెన్నడూ విఫలుణ్ణి కాలేదు.
19:5 وَإِنِّي خِفْتُ الْمَوَالِيَ مِن وَرَائِي وَكَانَتِ امْرَأَتِي عَاقِرًا فَهَبْ لِي مِن لَّدُنكَ وَلِيًّا
“నా తదనంతరం నా ఆప్తుల గురించి నాకు భయం పట్టుకుంది. మరేమో నా భార్య గొడ్రాలు. కాబట్టి (ఓ అల్లాహ్!) నాకు వారసుడు ఇవ్వు .
19:6 يَرِثُنِي وَيَرِثُ مِنْ آلِ يَعْقُوبَ ۖ وَاجْعَلْهُ رَبِّ رَضِيًّا
నాకు వారసుడుగా ఉండటంతోపాటు, యాఖూబు సంతతికి కూడా వారసుడు అయ్యే ఒక వారసుణ్ణి నువ్వు నీ వద్ద నుంచి ప్రత్యేకంగా నాకు అనుగ్రహించు. ప్రభూ! నువ్వతన్ని ప్రియతమునిగా చేయి.”
19:7 يَا زَكَرِيَّا إِنَّا نُبَشِّرُكَ بِغُلَامٍ اسْمُهُ يَحْيَىٰ لَمْ نَجْعَل لَّهُ مِن قَبْلُ سَمِيًّا
“ఓ జకరియ్యా! మేము నీకు ఒక కుమారుని శుభవార్తను వినిపిస్తున్నాము – అతని పేరు యహ్యా. మేము ఇంతకు ముందు ఈ పేరుగల వానిని చేయలేదు” (అని సెలవీయబడింది).
19:8 قَالَ رَبِّ أَنَّىٰ يَكُونُ لِي غُلَامٌ وَكَانَتِ امْرَأَتِي عَاقِرًا وَقَدْ بَلَغْتُ مِنَ الْكِبَرِ عِتِيًّا
“నా ప్రభూ! నాకు పిల్లవాడు ఎలా పుడతాడు? నా భార్యయేమో గొడ్రాలు. నేనేమో వృద్ధాప్యపు ఆఖరి దశకు చేరుకున్నవాణ్ణి” అని జకరియ్యా చెప్పుకున్నాడు.
19:9 قَالَ كَذَٰلِكَ قَالَ رَبُّكَ هُوَ عَلَيَّ هَيِّنٌ وَقَدْ خَلَقْتُكَ مِن قَبْلُ وَلَمْ تَكُ شَيْئًا
“అలాగే అవుతుంది” అని సెలవీయబడింది. “అది నాకు చాలా తేలిక. ఇంతకు ముందు నీకంటూ ఒక అస్థిత్వమే లేనపుడు నేను నిన్ను పుట్టించలేదా?!” అని నీ ప్రభువు అన్నాడు.
19:10 قَالَ رَبِّ اجْعَل لِّي آيَةً ۚ قَالَ آيَتُكَ أَلَّا تُكَلِّمَ النَّاسَ ثَلَاثَ لَيَالٍ سَوِيًّا
“నా ప్రభూ! (మరయితే) నా కొరకు ఏదన్నా సూచనను నిర్ణయించు” అని అతను విన్నవించుకోగా,”నువ్వు కులాసాగా ఉన్నప్పటికీ మూడు రాత్రుల వరకూ ప్రజలతో మాట్లాడలేవు. ఇదే నీ కొరకు ఆనవాలు” అని సెలవీయబడింది.
19:11 فَخَرَجَ عَلَىٰ قَوْمِهِ مِنَ الْمِحْرَابِ فَأَوْحَىٰ إِلَيْهِمْ أَن سَبِّحُوا بُكْرَةً وَعَشِيًّا
అందువల్ల అతను తన కుటీరం నుంచి తన జాతి ప్రజల వద్దకు వచ్చి, ఉదయం సాయంత్రం అల్లాహ్ పవిత్రతను కొనియాడమని సైగ ద్వారా ఉపదేశించసాగాడు.
19:12 يَا يَحْيَىٰ خُذِ الْكِتَابَ بِقُوَّةٍ ۖ وَآتَيْنَاهُ الْحُكْمَ صَبِيًّا
“ఓ యహ్యా! నా గ్రంథాన్ని గట్టిగా పట్టుకో.” మేమతనికి బాల్యం నుంచే విజ్ఞతను వొసగాము.
19:13 وَحَنَانًا مِّن لَّدُنَّا وَزَكَاةً ۖ وَكَانَ تَقِيًّا
ఇంకా మా వద్ద నుంచి వాత్సల్యాన్నీ, పవిత్రతను కూడా ప్రసాదించాము. అతను భయభక్తులు గలవాడు.
19:14 وَبَرًّا بِوَالِدَيْهِ وَلَمْ يَكُن جَبَّارًا عَصِيًّا
అతను తన తల్లిదండ్రుల పట్ల సత్ప్రవర్తన కలిగి ఉండేవాడు. అతను దౌర్జన్యపరుడూ కాడు, అవిధేయుడూ కాడు.
19:15 وَسَلَامٌ عَلَيْهِ يَوْمَ وُلِدَ وَيَوْمَ يَمُوتُ وَيَوْمَ يُبْعَثُ حَيًّا
అతను పుట్టిన రోజునా, మరణించే రోజునా, అతను తిరిగి బ్రతికించి లేపబడే రోజునా అతనికి శాంతి కల్గుగాక!
19:16 وَاذْكُرْ فِي الْكِتَابِ مَرْيَمَ إِذِ انتَبَذَتْ مِنْ أَهْلِهَا مَكَانًا شَرْقِيًّا
(ఓ ముహమ్మద్ – స!) ఈ గ్రంథంలో మర్యమ్ విషయాన్ని కూడా ప్రస్తావించు. అప్పుడామె తన వాళ్ళనుంచి వేరై, తూర్పు వైపుకు వచ్చింది.
19:17 فَاتَّخَذَتْ مِن دُونِهِمْ حِجَابًا فَأَرْسَلْنَا إِلَيْهَا رُوحَنَا فَتَمَثَّلَ لَهَا بَشَرًا سَوِيًّا
ఆ తరువాత వారికి చాటుగా తెరవేసుకుంది. అప్పుడు మేము ఆమె వద్దకు మా ఆత్మ (జిబ్రయీలు అలైహిస్సలాం)ను పంపాము. అతడు ఆమె ఎదుట సంపూర్ణ మానవాకారంలో వచ్చాడు.
19:18 قَالَتْ إِنِّي أَعُوذُ بِالرَّحْمَٰنِ مِنكَ إِن كُنتَ تَقِيًّا
“నేను నీ బారి నుంచి కరుణామయుని (అల్లాహ్) శరణు వేడుతున్నాను, నువ్వు ఏ మాత్రం దైవభీతి గలవాడవైనా (ఇక్కణ్ణుంచి వెళ్ళిపో)” అని ఆమె చెప్పింది.
19:19 قَالَ إِنَّمَا أَنَا رَسُولُ رَبِّكِ لِأَهَبَ لَكِ غُلَامًا زَكِيًّا
“నేను నీ ప్రభువు తరఫున పంపబడిన దూతను. నీకు ఒక పవిత్రుడైన పిల్లవాణ్ణి ఇవ్వటానికి వచ్చాను” అని అతనన్నాడు.
19:20 قَالَتْ أَنَّىٰ يَكُونُ لِي غُلَامٌ وَلَمْ يَمْسَسْنِي بَشَرٌ وَلَمْ أَكُ بَغِيًّا
“నాకు పిల్లవాడు కలగటమేమిటీ? నన్ను ఏ మగాడూ కనీసం తాకనైనా లేదే! నేను దుర్నడత గల దాన్ని కూడా కానే!!” అని ఆమె అన్నది.
19:21 قَالَ كَذَٰلِكِ قَالَ رَبُّكِ هُوَ عَلَيَّ هَيِّنٌ ۖ وَلِنَجْعَلَهُ آيَةً لِّلنَّاسِ وَرَحْمَةً مِّنَّا ۚ وَكَانَ أَمْرًا مَّقْضِيًّا
“జరిగేది మాత్రం ఇదే. ‘అది నాకు చాలా సులువు. మేము అతన్ని జనుల కోసం ఒక సూచనగా, మా ప్రత్యేక కృపగా చేయదలిచాము. ఇదొక నిర్ధారిత విషయం’ అని నీ ప్రభువు సెలవిచ్చాడు” అని అతను వివరించాడు.
19:22 فَحَمَلَتْهُ فَانتَبَذَتْ بِهِ مَكَانًا قَصِيًّا
అంతే, ఆమె గర్భవతి అయింది. ఈ కారణంగా ఆమె ఏకాంతం కోసం దూర ప్రదేశానికి వెళ్ళిపోయింది.
19:23 فَأَجَاءَهَا الْمَخَاضُ إِلَىٰ جِذْعِ النَّخْلَةِ قَالَتْ يَا لَيْتَنِي مِتُّ قَبْلَ هَٰذَا وَكُنتُ نَسْيًا مَّنسِيًّا
ఆ తరువాత పురిటినొప్పులు ఆమెను ఒక ఖర్జూర చెట్టు క్రిందికి చేర్చాయి. “అయ్యో! నేను ఇంతకు మునుపే చచ్చిపోయి వుంటే, లోకులు నన్ను మరచిపోయి ఉంటే బావుండునే!” అని ఆమె బాధపడసాగింది.
19:24 فَنَادَاهَا مِن تَحْتِهَا أَلَّا تَحْزَنِي قَدْ جَعَلَ رَبُّكِ تَحْتَكِ سَرِيًّا
అంతలో (దైవదూత) క్రింది నుంచే ఆమెను పిలిచి ఇలా అన్నాడు: “బాధ పడకు. నీ ప్రభువు నీ క్రింద ఒక నీటి ఊటను ప్రవహింపజేశాడు.
19:25 وَهُزِّي إِلَيْكِ بِجِذْعِ النَّخْلَةِ تُسَاقِطْ عَلَيْكِ رُطَبًا جَنِيًّا
“ఆ ఖర్జూరపు మొదలును నీ వైపుకు ఊపు. తాజా ఖర్జూర పండ్లు నీపై రాల్తాయి.
19:26 فَكُلِي وَاشْرَبِي وَقَرِّي عَيْنًا ۖ فَإِمَّا تَرَيِنَّ مِنَ الْبَشَرِ أَحَدًا فَقُولِي إِنِّي نَذَرْتُ لِلرَّحْمَٰنِ صَوْمًا فَلَنْ أُكَلِّمَ الْيَوْمَ إِنسِيًّا
“ఇక హాయిగా తిను, త్రాగు, కన్నుల పండుగ చేసుకో. ఏమనిషైనా నీకు తారసపడితే, ‘నేను కరుణామయుని కోసం ఉపవాస వ్రతం పాటిస్తున్నాను. ఈ రోజు నేను ఎవరితోనూ మాట్లాడను’ అని చెప్పు.”
19:27 فَأَتَتْ بِهِ قَوْمَهَا تَحْمِلُهُ ۖ قَالُوا يَا مَرْيَمُ لَقَدْ جِئْتِ شَيْئًا فَرِيًّا
ఆ తరువాత ఆమె ఆ పసివాణ్ణి ఎత్తుకుని తన జాతి వారి వద్దకు వచ్చింది. “ఓ మర్యమ్! నువ్వు పెద్ద పాపం చేశావు.
19:28 يَا أُخْتَ هَارُونَ مَا كَانَ أَبُوكِ امْرَأَ سَوْءٍ وَمَا كَانَتْ أُمُّكِ بَغِيًّا
ఓ హారూన్ సోదరీ! నీ తండ్రీ చెడ్డవాడు కాడు. నీ తల్లి కూడా చెడు నడత గల స్త్రీ కాదే!” అని అందరూ అన్నారు.
19:29 فَأَشَارَتْ إِلَيْهِ ۖ قَالُوا كَيْفَ نُكَلِّمُ مَن كَانَ فِي الْمَهْدِ صَبِيًّا
మర్యమ్ తన పసిపిల్లవాని వైపు సైగ చేసి చూపించింది. “ఒడిలో ఉన్న ఈ పసికందుతో మేమెలా మాట్లాడగలం?” అన్నారు వారంతా.
19:30 قَالَ إِنِّي عَبْدُ اللَّهِ آتَانِيَ الْكِتَابَ وَجَعَلَنِي نَبِيًّا
ఆ పసివాడు ఇలా పలికాడు: “నేను అల్లాహ్ దాసుడను. ఆయన నాకు గ్రంథం వొసగాడు. నన్ను తన ప్రవక్తగా నియమించాడు.
19:31 وَجَعَلَنِي مُبَارَكًا أَيْنَ مَا كُنتُ وَأَوْصَانِي بِالصَّلَاةِ وَالزَّكَاةِ مَا دُمْتُ حَيًّا
“నేనెక్కడున్నాసరే ఆయన నన్ను శుభవంతునిగా చేశాడు. నేను జీవించి ఉన్నంతకాలం నమాజు, జకాతులకు కట్టుబడి ఉండమని ఆయన నాకు ఆదేశించాడు.”
19:32 وَبَرًّا بِوَالِدَتِي وَلَمْ يَجْعَلْنِي جَبَّارًا شَقِيًّا
“ఇంకా – ఆయన నన్ను నా తల్లికి సేవచేసేవానిగా చేశాడు. నన్ను దౌర్జన్యపరునిగానూ, దౌర్భాగ్యునిగానూ చేయలేదు.
19:33 وَالسَّلَامُ عَلَيَّ يَوْمَ وُلِدتُّ وَيَوْمَ أَمُوتُ وَيَوْمَ أُبْعَثُ حَيًّا
“నేను పుట్టిన రోజూ, నేను చనిపోయే రోజూ, నేను సజీవినై తిరిగి లేపబడేరోజూ నాపై శాంతి కలుగుతుంది.”
19:34 ذَٰلِكَ عِيسَى ابْنُ مَرْيَمَ ۚ قَوْلَ الْحَقِّ الَّذِي فِيهِ يَمْتَرُونَ
ఇదీ మర్యమ్ కుమారుడైన ఈసా యదార్థ గాథ. ప్రజలు సంశయంలో పడివున్న సత్యవాక్కు ఇదే.
19:35 مَا كَانَ لِلَّهِ أَن يَتَّخِذَ مِن وَلَدٍ ۖ سُبْحَانَهُ ۚ إِذَا قَضَىٰ أَمْرًا فَإِنَّمَا يَقُولُ لَهُ كُن فَيَكُونُ
అల్లాహ్‌కు సంతానం ఉండటం అనేది ఎంత మాత్రం తగదు. ఆయన పరమ పవిత్రుడు. ఆయన ఏ పనినైనా చేయాలని సంకల్పించుకున్నప్పుడు ‘అయిపో’ అని ఆజ్ఞాపిస్తాడు. వెంటనే అది అయిపోతుంది.
19:36 وَإِنَّ اللَّهَ رَبِّي وَرَبُّكُمْ فَاعْبُدُوهُ ۚ هَٰذَا صِرَاطٌ مُّسْتَقِيمٌ
నిశ్చయంగా నాకూ, మీకందరికీ ప్రభువు అల్లాహ్ మాత్రమే. కనుక ఆయన్నే ఆరాధించండి. ఇదే రుజుమార్గం (అని ఈసా – ఏసుక్రీస్తు – బోధించాడు).
19:37 فَاخْتَلَفَ الْأَحْزَابُ مِن بَيْنِهِمْ ۖ فَوَيْلٌ لِّلَّذِينَ كَفَرُوا مِن مَّشْهَدِ يَوْمٍ عَظِيمٍ
మరి ఈ ముఠాలు పరస్పరం విభేదించుకున్నాయి. కాబట్టి సత్యతిరస్కారులు ఒక మహా (కఠినమైన) దినాన హాజరైనపుడు, వారికి మూడుతుంది.
19:38 أَسْمِعْ بِهِمْ وَأَبْصِرْ يَوْمَ يَأْتُونَنَا ۖ لَٰكِنِ الظَّالِمُونَ الْيَوْمَ فِي ضَلَالٍ مُّبِينٍ
వారు మా సమక్షంలో హాజరైన రోజు ఎంత బాగా వింటూ, చూస్తూ ఉంటారు! కాని ఈ దుర్మార్గులు ఈనాడు మాత్రం స్పష్టమైన అపమార్గానికి లోనై ఉన్నారు.
19:39 وَأَنذِرْهُمْ يَوْمَ الْحَسْرَةِ إِذْ قُضِيَ الْأَمْرُ وَهُمْ فِي غَفْلَةٍ وَهُمْ لَا يُؤْمِنُونَ
వ్యవహారం తేల్చబడి వారు బాధపడే రోజు గురించి (ఓ ముహమ్మద్ – సఅసం!) వారిని హెచ్చరించు. (ఏమైనా) వారు పరధ్యానానికి గురై ఉన్నారు. వారు విశ్వసించే రకం కాదు.
19:40 إِنَّا نَحْنُ نَرِثُ الْأَرْضَ وَمَنْ عَلَيْهَا وَإِلَيْنَا يُرْجَعُونَ
స్వయంగా మేమే భూమికీ, భూమిపై ఉండే వారందరికీ వారసులమవుతాము. వారంతా మా వద్దకే మరలించబడతారు.
19:41 وَاذْكُرْ فِي الْكِتَابِ إِبْرَاهِيمَ ۚ إِنَّهُ كَانَ صِدِّيقًا نَّبِيًّا
ఈ గ్రంథంలో ఇబ్రాహీము (అలైహిస్సలాం) వృత్తాంతాన్ని కూడా ప్రస్తావించు. నిస్సందేహంగా అతను సత్యవంతుడైన ప్రవక్త.
19:42 إِذْ قَالَ لِأَبِيهِ يَا أَبَتِ لِمَ تَعْبُدُ مَا لَا يَسْمَعُ وَلَا يُبْصِرُ وَلَا يُغْنِي عَنكَ شَيْئًا
అతను తన తండ్రితో, “ఓ నాన్నా! వినలేని, చూడలేని, మీకు ఏమాత్రం ఉపయోగపడలేని వాటిని ఎందుకు పూజిస్తారు?
19:43 يَا أَبَتِ إِنِّي قَدْ جَاءَنِي مِنَ الْعِلْمِ مَا لَمْ يَأْتِكَ فَاتَّبِعْنِي أَهْدِكَ صِرَاطًا سَوِيًّا
“ఓ పితామహా! చూడండి! మీ వద్దకు రాని జ్ఞానం నా వద్దకు వచ్చింది. కనుక మీరు నన్ను అనుసరించండి. నేను మీకు సరైన మార్గం వైపుకు దర్శకత్వం వహిస్తాను.
19:44 يَا أَبَتِ لَا تَعْبُدِ الشَّيْطَانَ ۖ إِنَّ الشَّيْطَانَ كَانَ لِلرَّحْمَٰنِ عَصِيًّا
“ఓ తండ్రీ! మీరు షైతాను దాస్యాన్ని విడనాడండి. నిశ్చయంగా షైతాన్ కరుణామయుడైన అల్లాహ్‌కు అవిధేయుడు.
19:45 يَا أَبَتِ إِنِّي أَخَافُ أَن يَمَسَّكَ عَذَابٌ مِّنَ الرَّحْمَٰنِ فَتَكُونَ لِلشَّيْطَانِ وَلِيًّا
“ఓ నా తండ్రీ! తమరు ఎక్కడ కరుణామయుని ఆగ్రహానికి గురవుతారోనని, షైతాను సహవాసి అయిపోతారోనని నాకు భయంగా ఉంది” అని అన్నప్పుడు…
19:46 قَالَ أَرَاغِبٌ أَنتَ عَنْ آلِهَتِي يَا إِبْرَاهِيمُ ۖ لَئِن لَّمْ تَنتَهِ لَأَرْجُمَنَّكَ ۖ وَاهْجُرْنِي مَلِيًّا
“ఓ ఇబ్రాహీం! నువ్వు నా దైవాలకే విముఖత చూపుతున్నావా? విను! నువ్వు నీ వైఖరిని మానుకోకపోతే నేను నిన్ను రాళ్లతో కొడతాను. మర్యాదగా నన్ను నా మానాన వదలిపెట్టు” అని అతని తండ్రి అన్నాడు.
19:47 قَالَ سَلَامٌ عَلَيْكَ ۖ سَأَسْتَغْفِرُ لَكَ رَبِّي ۖ إِنَّهُ كَانَ بِي حَفِيًّا
“సరే (నాన్నా). మీకు సలాం! నేను మాత్రం మీ మన్నింపు కోసం నా ప్రభువును వేడుకుంటూనే ఉంటాను. నిశ్చయంగా ఆయన నాపై ఎంతో జాలి కలవాడు.
19:48 وَأَعْتَزِلُكُمْ وَمَا تَدْعُونَ مِن دُونِ اللَّهِ وَأَدْعُو رَبِّي عَسَىٰ أَلَّا أَكُونَ بِدُعَاءِ رَبِّي شَقِيًّا
“నేను మిమ్మల్నీ, అల్లాహ్‌ను విడిచి మీరు మొరపెట్టుకునే వారందరినీ వదలి పోతున్నాను. కేవలం నా ప్రభువును మాత్రమే వేడుకుంటాను. నా ప్రభువుని వేడుకుని విఫలుణ్ణి కానన్న నమ్మకం నాకుంది” అని (ఇబ్రాహీం) చెప్పాడు.
19:49 فَلَمَّا اعْتَزَلَهُمْ وَمَا يَعْبُدُونَ مِن دُونِ اللَّهِ وَهَبْنَا لَهُ إِسْحَاقَ وَيَعْقُوبَ ۖ وَكُلًّا جَعَلْنَا نَبِيًّا
ఆ విధంగా ఇబ్రాహీం వాళ్ళందరినీ, వారు అల్లాహ్‌ను కాదని పూజించే వారందరినీ వదలి పోయినప్పుడు, మేమతనికి ఇస్హాఖ్ను, యాఖూబును అనుగ్రహించాము. వారిద్దరినీ ప్రవక్తలుగా చేశాము.
19:50 وَوَهَبْنَا لَهُم مِّن رَّحْمَتِنَا وَجَعَلْنَا لَهُمْ لِسَانَ صِدْقٍ عَلِيًّا
వారందరికీ మేము మా కరుణను ప్రసాదించి, (భావి తరాల నోట) వారి శుభ నామస్మరణను ఉన్నతం చేశాము.
19:51 وَاذْكُرْ فِي الْكِتَابِ مُوسَىٰ ۚ إِنَّهُ كَانَ مُخْلَصًا وَكَانَ رَسُولًا نَّبِيًّا
ఈ ఖుర్ఆను గ్రంథంలో మూసా విషయాన్ని కూడా ప్రస్తావించు. అతను ఎన్నుకోబడినవాడు, సందేశ వాహకుడైన ప్రవక్త.
19:52 وَنَادَيْنَاهُ مِن جَانِبِ الطُّورِ الْأَيْمَنِ وَقَرَّبْنَاهُ نَجِيًّا
మేమతన్ని తూరు పర్వతం కుడివైపు నుంచి పిలిచాము. రహస్య సంభాషణ నిమిత్తం అతన్ని దగ్గరకు చేర్చాము.
19:53 وَوَهَبْنَا لَهُ مِن رَّحْمَتِنَا أَخَاهُ هَارُونَ نَبِيًّا
ఇంకా మా ప్రత్యేక కృపతో అతని సోదరుడైన హారూనును ప్రవక్తగా చేసి అతనికి (సహాయకునిగా) ఇచ్చాము.
19:54 وَاذْكُرْ فِي الْكِتَابِ إِسْمَاعِيلَ ۚ إِنَّهُ كَانَ صَادِقَ الْوَعْدِ وَكَانَ رَسُولًا نَّبِيًّا
ఈ గ్రంథంలో ఇస్మాయీలు వృత్తాంతాన్ని గురించి కూడా ప్రస్తావించు. అతను వాగ్దాన పాలనలో సత్యవంతుడు. మా తరఫున పంపబడిన సందేశహరుడు, ప్రవక్త కూడా.
19:55 وَكَانَ يَأْمُرُ أَهْلَهُ بِالصَّلَاةِ وَالزَّكَاةِ وَكَانَ عِندَ رَبِّهِ مَرْضِيًّا
అతను తన కుటుంబీకులకు నమాజు గురించి, జకాత్ గురించి ఆదేశిస్తూ ఉండేవాడు. అతను తన ప్రభువు సన్నిధిలో ప్రియతముడు.
19:56 وَاذْكُرْ فِي الْكِتَابِ إِدْرِيسَ ۚ إِنَّهُ كَانَ صِدِّيقًا نَّبِيًّا
ఇంకా ఈ గ్రంథంలో ఇద్రీసు గురించిన ప్రస్తావన కూడా చెయ్యి. అతను కూడా నిజాయితిపరుడైన ప్రవక్తే.
19:57 وَرَفَعْنَاهُ مَكَانًا عَلِيًّا
మేమతన్ని ఉన్నత స్థానానికి లేపాము.
19:58 أُولَٰئِكَ الَّذِينَ أَنْعَمَ اللَّهُ عَلَيْهِم مِّنَ النَّبِيِّينَ مِن ذُرِّيَّةِ آدَمَ وَمِمَّنْ حَمَلْنَا مَعَ نُوحٍ وَمِن ذُرِّيَّةِ إِبْرَاهِيمَ وَإِسْرَائِيلَ وَمِمَّنْ هَدَيْنَا وَاجْتَبَيْنَا ۚ إِذَا تُتْلَىٰ عَلَيْهِمْ آيَاتُ الرَّحْمَٰنِ خَرُّوا سُجَّدًا وَبُكِيًّا ۩
అల్లాహ్ అనుగ్రహించిన ప్రవక్తలు వీరు. వారు ఆదం సంతతికి చెందినవారు. నూహుతో పాటు మేము ఓడలోకి ఎక్కించిన వారి వంశీయులు. ఇబ్రాహీము, యాఖూబు (ఇస్రాయీలు)సంతతికి చెందినవారు. వారంతా మా ద్వారా సన్మార్గం పొందినవారు, మా చేత ఎన్నుకోబడిన ప్రజల్లోని వారు. వారి ముందు కరుణామయుడైన దేవుని వచనాలు పారాయణం చేయబడినప్పుడు వారు విలపిస్తూ సాష్టాంగపడేవారు.
19:59 فَخَلَفَ مِن بَعْدِهِمْ خَلْفٌ أَضَاعُوا الصَّلَاةَ وَاتَّبَعُوا الشَّهَوَاتِ ۖ فَسَوْفَ يَلْقَوْنَ غَيًّا
ఆ తరువాత కొందరు అనర్హులు వచ్చి, నమాజులను వృధా చేశారు, మనోవాంఛలను అనుసరించసాగారు. తమకు కలిగిన నష్టం గురించి వారు మున్ముందు చూసుకుంటారు.
19:60 إِلَّا مَن تَابَ وَآمَنَ وَعَمِلَ صَالِحًا فَأُولَٰئِكَ يَدْخُلُونَ الْجَنَّةَ وَلَا يُظْلَمُونَ شَيْئًا
కాని పశ్చాత్తాపం చెంది, విశ్వసించి, సత్కార్యాలు చేసినవారు (మాత్రం నష్టపోరు). వారు స్వర్గంలో ప్రవేశిస్తారు. వారికి రవంత కూడా అన్యాయం జరగదు.
19:61 جَنَّاتِ عَدْنٍ الَّتِي وَعَدَ الرَّحْمَٰنُ عِبَادَهُ بِالْغَيْبِ ۚ إِنَّهُ كَانَ وَعْدُهُ مَأْتِيًّا
అగోచరాలైన, శాశ్వత స్వర్గవనాలలోకి (వారు ప్రవేశిస్తారు.) వాటిని గురించి కరుణామయుడు (అయిన అల్లాహ్) తన దాసులకు వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానం నెరవేరటం తథ్యం.
19:62 لَّا يَسْمَعُونَ فِيهَا لَغْوًا إِلَّا سَلَامًا ۖ وَلَهُمْ رِزْقُهُمْ فِيهَا بُكْرَةً وَعَشِيًّا
అక్కడ వారు ‘సలామ్’ తప్ప వ్యర్థమైన మాటలేవీ వినరు. వారికోసం అక్కడ ఉదయం సాయంత్రం వారి ఆహారం సమకూరుతూ ఉంటుంది.
19:63 تِلْكَ الْجَنَّةُ الَّتِي نُورِثُ مِنْ عِبَادِنَا مَن كَانَ تَقِيًّا
మేము మా దాసులలో భయభక్తులు కలిగి ఉండేవారిని వారసులుగా చేసే స్వర్గం ఇదే.
19:64 وَمَا نَتَنَزَّلُ إِلَّا بِأَمْرِ رَبِّكَ ۖ لَهُ مَا بَيْنَ أَيْدِينَا وَمَا خَلْفَنَا وَمَا بَيْنَ ذَٰلِكَ ۚ وَمَا كَانَ رَبُّكَ نَسِيًّا
నీ ప్రభువు ఆజ్ఞ లేకుండా (దైవదూతలమైన) మేము దిగి రాలేము. మాకు ముందూ, వెనుకా, వాటికి మధ్య ఉన్న వస్తువులన్నీ ఆయన సొత్తే. నీ ప్రభువు మరచిపోయేవాడు కాడు.
19:65 رَّبُّ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا فَاعْبُدْهُ وَاصْطَبِرْ لِعِبَادَتِهِ ۚ هَلْ تَعْلَمُ لَهُ سَمِيًّا
ఆకాశాలకూ, భూమికీ, వాటి మధ్య నున్న సమస్తానికీ ప్రభువు ఆయనే. కనుక నువ్వు ఆయన్నే ఆరాధించు. ఆయన ఆరాధనపైనే స్థిరంగా ఉండు. నీకు తెలిసినంతవరకూ ఆయన పేరు గలవాడు ఎవడయినా ఉన్నాడా?
19:66 وَيَقُولُ الْإِنسَانُ أَإِذَا مَا مِتُّ لَسَوْفَ أُخْرَجُ حَيًّا
“ఏమిటీ, నేను చచ్చిన తరువాత మళ్లీ బ్రతికించి బయటికి తీయబడతానా?” అని మనిషి అంటున్నాడు.
19:67 أَوَلَا يَذْكُرُ الْإِنسَانُ أَنَّا خَلَقْنَاهُ مِن قَبْلُ وَلَمْ يَكُ شَيْئًا
ఇంతకుముందు అతనికంటూ ఒక అస్థిత్వం లేనపుడు మేమతన్ని సృష్టించామన్న సంగతి ఈ మనిషికి జ్ఞాపకం లేదా?
19:68 فَوَرَبِّكَ لَنَحْشُرَنَّهُمْ وَالشَّيَاطِينَ ثُمَّ لَنُحْضِرَنَّهُمْ حَوْلَ جَهَنَّمَ جِثِيًّا
నీ ప్రభువు సాక్షి! నిశ్చయంగా మేము వాళ్ళను, (వాళ్ళతో పాటు) షైతానులను కూడా పోగు చేసి, నరకం చుట్టూ వారిని మోకాళ్ళ మీద పడి ఉన్న స్థితిలో హాజరు పరుస్తాము.
19:69 ثُمَّ لَنَنزِعَنَّ مِن كُلِّ شِيعَةٍ أَيُّهُمْ أَشَدُّ عَلَى الرَّحْمَٰنِ عِتِيًّا
ఆ తరువాత కరుణామయుడైన అల్లాహ్ పట్ల ఎక్కువగా అహంకారంతో విర్రవీగే వారిని మేము ఒక్కో వర్గం నుంచి వేరు పరుస్తాము.
19:70 ثُمَّ لَنَحْنُ أَعْلَمُ بِالَّذِينَ هُمْ أَوْلَىٰ بِهَا صِلِيًّا
ఇంకా నరకంలోకి త్రోయబడటానికి ఎక్కువ అర్హులెవరో మాకు బాగా తెలుసు.
19:71 وَإِن مِّنكُمْ إِلَّا وَارِدُهَا ۚ كَانَ عَلَىٰ رَبِّكَ حَتْمًا مَّقْضِيًّا
మీలోని ప్రతి ఒక్కరూ అక్కడికి రావలసిందే. ఇది నీ ప్రభువు చేసిన తిరుగులేని నిర్ణయం. దాన్ని నిర్వర్తించే బాధ్యత ఆయనపై ఉంది.
19:72 ثُمَّ نُنَجِّي الَّذِينَ اتَّقَوا وَّنَذَرُ الظَّالِمِينَ فِيهَا جِثِيًّا
తర్వాత మేము భయభక్తులు కలిగివున్న వారిని రక్షిస్తాము. దుర్మార్గులను అందులో మోకాళ్లపైపడి ఉన్న స్థితిలోనే వదిలేస్తాము.
19:73 وَإِذَا تُتْلَىٰ عَلَيْهِمْ آيَاتُنَا بَيِّنَاتٍ قَالَ الَّذِينَ كَفَرُوا لِلَّذِينَ آمَنُوا أَيُّ الْفَرِيقَيْنِ خَيْرٌ مَّقَامًا وَأَحْسَنُ نَدِيًّا
స్పష్టమైన మా ఆయతులను వారి ముందు చదివి వినిపించినపుడు అవిశ్వాసులు “ఇంతకీ మన ఇరు వర్గాలలో ఎవరు మంచి స్థితిలోఉన్నారో, ఎవరి సభలు ఉత్తమంగా ఉన్నాయో చెప్పండి?” అని ముస్లిములతో అంటారు.
19:74 وَكَمْ أَهْلَكْنَا قَبْلَهُم مِّن قَرْنٍ هُمْ أَحْسَنُ أَثَاثًا وَرِئْيًا
మేము వీరికి మునుపు వీళ్లకన్నాఎక్కువ సాధన సంపత్తులను, అట్టహాసాలను కలిగి ఉన్న ఎన్నో సముదాయాలను తుదముట్టించాము.
19:75 قُلْ مَن كَانَ فِي الضَّلَالَةِ فَلْيَمْدُدْ لَهُ الرَّحْمَٰنُ مَدًّا ۚ حَتَّىٰ إِذَا رَأَوْا مَا يُوعَدُونَ إِمَّا الْعَذَابَ وَإِمَّا السَّاعَةَ فَسَيَعْلَمُونَ مَنْ هُوَ شَرٌّ مَّكَانًا وَأَضْعَفُ جُندًا
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “అపమార్గానికి లోనై ఉన్నవారికి కరుణామయుడైన అల్లాహ్ బాగా గడువు ఇస్తాడు. కడకు వారు- తమకు వాగ్దానం చేయబడుతున్న శిక్షను లేదా ప్రళయ గడియను చూచినపుడు ఎవరి స్థానం నికృష్టమైనదో, ఎవరి సమూహం బలహీనమైనదో తెలుసుకుంటారు.”
19:76 وَيَزِيدُ اللَّهُ الَّذِينَ اهْتَدَوْا هُدًى ۗ وَالْبَاقِيَاتُ الصَّالِحَاتُ خَيْرٌ عِندَ رَبِّكَ ثَوَابًا وَخَيْرٌ مَّرَدًّا
ఇంకా, సన్మార్గం పొందినవారి సన్మార్గంలో అల్లాహ్ వృద్ధిని వొసగుతాడు. మిగిలి ఉండే సత్కార్యాలు పుణ్యఫలం రీత్యానూ, పరిణామం రీత్యానూ నీ ప్రభువు సన్నిధిలో ఎంతో మేలైనవి.
19:77 أَفَرَأَيْتَ الَّذِي كَفَرَ بِآيَاتِنَا وَقَالَ لَأُوتَيَنَّ مَالًا وَوَلَدًا
మా ఆయతులను తిరస్కరించి, “నాకు సిరిసంపదలు, సంతానం తప్పకుండా వొసగబడతాయి” అని చెప్పేవాడిని నువ్వు చూశావా?
19:78 أَطَّلَعَ الْغَيْبَ أَمِ اتَّخَذَ عِندَ الرَّحْمَٰنِ عَهْدًا
అగోచర విషయమేదయినా అతనికి తెలిసిపోయిందా? లేదా ఆ మేరకు కరుణామయుడైన అల్లాహ్ నుంచి ఏదన్నా వాగ్దానం పొంది ఉన్నాడా?
19:79 كَلَّا ۚ سَنَكْتُبُ مَا يَقُولُ وَنَمُدُّ لَهُ مِنَ الْعَذَابِ مَدًّا
కానే కాదు. వాడు చెప్పేదంతా మేము వ్రాసిపెడతాము. వాడి కోసం శిక్షను పెంచుతూ పోతాము.
19:80 وَنَرِثُهُ مَا يَقُولُ وَيَأْتِينَا فَرْدًا
వాడు చెబుతున్న వస్తువులన్నింటినీ వాడి తదనంతరం మేము తీసేసుకుంటాము. వాడు ఒంటరిగా మా ముందు హాజరవుతాడు.
19:81 وَاتَّخَذُوا مِن دُونِ اللَّهِ آلِهَةً لِّيَكُونُوا لَهُمْ عِزًّا
వారు అల్లాహ్‌ను కాదని, ఇతరులను – తమకు ఆదరువుగా నిలుస్తారన్న ఉద్దేశంతో – ఆరాధ్యులుగా చేసుకున్నారు.
19:82 كَلَّا ۚ سَيَكْفُرُونَ بِعِبَادَتِهِمْ وَيَكُونُونَ عَلَيْهِمْ ضِدًّا
కాని అలా జరగనేరదు. వారి పూజలను వాళ్లు (వారి మిధ్యా దైవాలు) త్రోసి పుచ్చుతారు. పైగా వారికి శత్రువులుగా (వ్యతిరేకులుగా) మారతారు.
19:83 أَلَمْ تَرَ أَنَّا أَرْسَلْنَا الشَّيَاطِينَ عَلَى الْكَافِرِينَ تَؤُزُّهُمْ أَزًّا
సత్యాన్ని తిరస్కరించేవారిని అదేపనిగా పురిగొల్పుతూ ఉండే షైతానులను మేము వారిపైకి వదలటాన్ని నువ్వు చూడలేదా?
19:84 فَلَا تَعْجَلْ عَلَيْهِمْ ۖ إِنَّمَا نَعُدُّ لَهُمْ عَدًّا
నువ్వు వారి విషయంలో ఏమాత్రం తొందరపడకు. మేము స్వయంగా వారి గడువును లెక్కిస్తున్నాము.
19:85 يَوْمَ نَحْشُرُ الْمُتَّقِينَ إِلَى الرَّحْمَٰنِ وَفْدًا
భయభక్తులు గలవారిని కరుణామయుడైన అల్లాహ్ సన్నిధిలో అతిథులుగా మేము సమావేశపరచే రోజున,
19:86 وَنَسُوقُ الْمُجْرِمِينَ إِلَىٰ جَهَنَّمَ وِرْدًا
అపరాధులను తీవ్రంగా దప్పికగొన్న స్థితిలో నరకం వైపుకు తోలుకుపోతాము.
19:87 لَّا يَمْلِكُونَ الشَّفَاعَةَ إِلَّا مَنِ اتَّخَذَ عِندَ الرَّحْمَٰنِ عَهْدًا
అప్పుడు కరుణామయుడు అయిన అల్లాహ్ తరఫున హామీ పొందినవారు తప్ప ఇతరులెవరికీ సిఫారసు చేసే అధికారం ఉండదు.
19:88 وَقَالُوا اتَّخَذَ الرَّحْمَٰنُ وَلَدًا
కరుణామయుడైన అల్లాహ్‌కు సంతానం ఉంది అని వారంటున్నారు.
19:89 لَّقَدْ جِئْتُمْ شَيْئًا إِدًّا
నిజానికి మీరు చాలా దారుణమైన విషయాన్ని తెచ్చారు.
19:90 تَكَادُ السَّمَاوَاتُ يَتَفَطَّرْنَ مِنْهُ وَتَنشَقُّ الْأَرْضُ وَتَخِرُّ الْجِبَالُ هَدًّا
త్వరలోనే ఆకాశాలు పగిలి, భూమి బ్రద్దలై, పర్వతాలు తుత్తునియలై పోతాయేమో,
19:91 أَن دَعَوْا لِلرَّحْمَٰنِ وَلَدًا
కరుణామయుడైన అల్లాహ్‌కు సంతానం ఉందని వారు చేసే వాదన కారణంగా.
19:92 وَمَا يَنبَغِي لِلرَّحْمَٰنِ أَن يَتَّخِذَ وَلَدًا
సంతానం కలిగి ఉండటం అనేది కరుణామయుని (ఔన్నత్యాని)కి ఏమాత్రం శోభించదు.
19:93 إِن كُلُّ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ إِلَّا آتِي الرَّحْمَٰنِ عَبْدًا
ఆకాశాలలో, భూమిలో ఉన్న వారందరూ కరుణామయుని వద్దకు దాసులుగా రావలసిందే.
19:94 لَّقَدْ أَحْصَاهُمْ وَعَدَّهُمْ عَدًّا
వారందరినీ ఆయన చుట్టుముట్టి ఉన్నాడు. అందరినీ పూర్తిగా లెక్కపెట్టి ఉంచాడు.
19:95 وَكُلُّهُمْ آتِيهِ يَوْمَ الْقِيَامَةِ فَرْدًا
వారంతా ప్రళయదినాన ఆయన సమక్షంలో ఒంటరిగా హాజరవుతారు.
19:96 إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ سَيَجْعَلُ لَهُمُ الرَّحْمَٰنُ وُدًّا
నిశ్చయంగా విశ్వసించి, సత్కార్యాలు చేసిన వారి యెడల కరుణామయుడైన అల్లాహ్ ప్రేమానురాగాలను సృజిస్తాడు.
19:97 فَإِنَّمَا يَسَّرْنَاهُ بِلِسَانِكَ لِتُبَشِّرَ بِهِ الْمُتَّقِينَ وَتُنذِرَ بِهِ قَوْمًا لُّدًّا
నువ్వు ఈ గ్రంథం ఆధారంగా భయభక్తులు గలవారికి శుభవార్తను వినిపించటానికీ, తగవులమారులను హెచ్చరించ టానికీదీనిని నీ భాషలో చాలా సులభతరం చేశాము.
19:98 وَكَمْ أَهْلَكْنَا قَبْلَهُم مِّن قَرْنٍ هَلْ تُحِسُّ مِنْهُم مِّنْ أَحَدٍ أَوْ تَسْمَعُ لَهُمْ رِكْزًا
మేము వీరికి మునుపు ఎన్నో సమూహాలను తుదముట్టించాము. వారిలో ఏ ఒక్కరి జాడనైనా నువ్వు పసిగట్ట గలుగుతున్నావా? లేక కనీసం వారి నిట్టూర్పునైనా వింటున్నావా??
20. సూరా తాహా (Taha)
20:1 طه
తా హా.
20:2 مَا أَنزَلْنَا عَلَيْكَ الْقُرْآنَ لِتَشْقَىٰ
(ఓ ముహమ్మద్ – సఅసం!) మేము ఈ ఖుర్ఆన్ను నీపై అవతరింపజేసింది నువ్వు కష్టాల్లో పడడానికి కాదు-
20:3 إِلَّا تَذْكِرَةً لِّمَن يَخْشَىٰ
అల్లాహ్‌కు భయపడేవాని బోధనార్థం మాత్రమే (దీనిని అవతరింపజేశాము).
20:4 تَنزِيلًا مِّمَّنْ خَلَقَ الْأَرْضَ وَالسَّمَاوَاتِ الْعُلَى
భూమినీ, ఎత్తయిన ఆకాశాలనూ సృష్టించిన వాని తరఫున ఇది అవతరింపజేయబడింది.
20:5 الرَّحْمَٰنُ عَلَى الْعَرْشِ اسْتَوَىٰ
ఆ కరుణామయుడు అర్ష్ (సింహాసనము) పై ఆసీనుడై ఉన్నాడు.
20:6 لَهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ وَمَا بَيْنَهُمَا وَمَا تَحْتَ الثَّرَىٰ
ఆకాశాలలో, భూమిలో ఆ రెండింటి మధ్యనా, ఇంకా (నేల) అట్టడుగు భాగాన ఉన్న ప్రతిదీ ఆయనదే.
20:7 وَإِن تَجْهَرْ بِالْقَوْلِ فَإِنَّهُ يَعْلَمُ السِّرَّ وَأَخْفَى
నువ్వు మాటను బిగ్గరగా పలికినా (ఫరవాలేదు). ఆయనైతే మెల్లగా (పలికినా), అతి గోప్యంగా విన్నవించుకున్నా ప్రతిదీ తెలుసుకుంటాడు.
20:8 اللَّهُ لَا إِلَٰهَ إِلَّا هُوَ ۖ لَهُ الْأَسْمَاءُ الْحُسْنَىٰ
ఆయనే అల్లాహ్. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. సుందరమైన పేర్లన్నీ ఆయనవే.
20:9 وَهَلْ أَتَاكَ حَدِيثُ مُوسَىٰ
మూసా వృత్తాంతం నీకు చేరిందా?
20:10 إِذْ رَأَىٰ نَارًا فَقَالَ لِأَهْلِهِ امْكُثُوا إِنِّي آنَسْتُ نَارًا لَّعَلِّي آتِيكُم مِّنْهَا بِقَبَسٍ أَوْ أَجِدُ عَلَى النَّارِ هُدًى
అతను నిప్పును చూసినప్పుడు తన ఇంటివారితో, “కాస్సేపు ఆగండి. నాకు నిప్పు కనిపించింది. వీలైతే కొంత నిప్పును అందులో నుంచి మీకోసం తెస్తాను లేదా (కనీసం) ఆ మంట ఉన్న చోటునుంచి దారినయినా కనుగొంటాను” అన్నాడు.
20:11 فَلَمَّا أَتَاهَا نُودِيَ يَا مُوسَىٰ
తీరా అతను అక్కడకు చేరుకోగానే, ఈ పిలుపు వచ్చింది: “ఓ మూసా!
20:12 إِنِّي أَنَا رَبُّكَ فَاخْلَعْ نَعْلَيْكَ ۖ إِنَّكَ بِالْوَادِ الْمُقَدَّسِ طُوًى
“నేనే నీ ప్రభువును. నువ్వు నీ చెప్పులు విడువు. ఎందుకంటే (ఇప్పుడు) నువ్వు పవిత్రమైన ‘తువా’ లోయలో ఉన్నావు.
20:13 وَأَنَا اخْتَرْتُكَ فَاسْتَمِعْ لِمَا يُوحَىٰ
“నేను నిన్ను ఎన్నుకున్నాను. ఇప్పుడు వహీ ద్వారా అందజేయబడేదంతా శ్రద్ధగా విను –
20:14 إِنَّنِي أَنَا اللَّهُ لَا إِلَٰهَ إِلَّا أَنَا فَاعْبُدْنِي وَأَقِمِ الصَّلَاةَ لِذِكْرِي
“నిశ్చయంగా నేనే అల్లాహ్‌ను. నేను తప్ప మరో ఆరాధ్యుడు లేడు. కాబట్టి నువ్వు నన్నే ఆరాధించు. నన్ను జ్ఞాపకం చేయటానికి నమాజును నెలకొల్పు.
20:15 إِنَّ السَّاعَةَ آتِيَةٌ أَكَادُ أُخْفِيهَا لِتُجْزَىٰ كُلُّ نَفْسٍ بِمَا تَسْعَىٰ
“ప్రళయ ఘడియ రావటం తథ్యం. ప్రతి వ్యక్తి తన కృషికి తగ్గ ప్రతిఫలం పొందటానికి ఆ సమయాన్నినేను గోప్యంగా ఉంచదలిచాను.
20:16 فَلَا يَصُدَّنَّكَ عَنْهَا مَن لَّا يُؤْمِنُ بِهَا وَاتَّبَعَ هَوَاهُ فَتَرْدَىٰ
“అయితే దానిని నమ్మకుండా, తన కోర్కెల వెనుక పరుగెత్తే వాడు ఎవడయినా నిన్ను ఆ విషయంలో అడ్డు తగలకూడదు సుమా! అన్యధా నువ్వు కూడా వినాశానికి గురవుతావు (జాగ్రత్త!)”
20:17 وَمَا تِلْكَ بِيَمِينِكَ يَا مُوسَىٰ
“నీ కుడిచేతిలో ఉన్నదేమిటి ఓ మూసా?!” (అని దేవుడు ప్రశ్నించగా)
20:18 قَالَ هِيَ عَصَايَ أَتَوَكَّأُ عَلَيْهَا وَأَهُشُّ بِهَا عَلَىٰ غَنَمِي وَلِيَ فِيهَا مَآرِبُ أُخْرَىٰ
“ఇది నా చేతి కర్ర. దీన్ని ఊతగా చేసుకుంటాను. దీంతో నా మేకల కోసం ఆకులు రాలుస్తాను. దీనివల్ల నాకింకా ఎన్నో ప్రయోజనాలున్నాయి” అని (మూసా) బదులిచ్చాడు.
20:19 قَالَ أَلْقِهَا يَا مُوسَىٰ
“ఓ మూసా! దాన్ని పడవెయ్యి” అన్నాడు (అల్లాహ్).
20:20 فَأَلْقَاهَا فَإِذَا هِيَ حَيَّةٌ تَسْعَىٰ
అతను దాన్ని పడవెయ్యగానే, అది పాముగా మారి పరుగెత్తసాగింది.
20:21 قَالَ خُذْهَا وَلَا تَخَفْ ۖ سَنُعِيدُهَا سِيرَتَهَا الْأُولَىٰ
(అల్లాహ్) ఇలా సెలవిచ్చాడు :”దాన్ని పట్టుకో. భయపడకు. మేము వెంటనే దాన్ని పూర్వ స్థితిలోకి తీసుకువస్తాము.”
20:22 وَاضْمُمْ يَدَكَ إِلَىٰ جَنَاحِكَ تَخْرُجْ بَيْضَاءَ مِنْ غَيْرِ سُوءٍ آيَةً أُخْرَىٰ
నీ చేతిని చంకలో నొక్కి పెట్టు. అది ఎలాంటి లోపం లేకుండా తెల్లగా (ధగ ధగా) మెరిసిపోతూ వస్తుంది. ఇది రెండవ మహిమ.
20:23 لِنُرِيَكَ مِنْ آيَاتِنَا الْكُبْرَى
“నీకు మా గొప్ప సూచనలను చూపటానికే ఇదంతా చేస్తున్నాము.”
20:24 اذْهَبْ إِلَىٰ فِرْعَوْنَ إِنَّهُ طَغَىٰ
“ఇక నువ్వు ఫిరౌను వద్దకు వెళ్ళు. వాడు తలబిరుసుగా తయారయ్యాడు.”
20:25 قَالَ رَبِّ اشْرَحْ لِي صَدْرِي
అప్పుడు మూసా ఇలా విన్నవించుకున్నాడు: “ఓ నా ప్రభూ! నా కోసం నా ఛాతీ (మనసు)ని విశాలమైనదిగా చేయి.
20:26 وَيَسِّرْ لِي أَمْرِي
“నా కార్యాన్ని నా కోసం సులభతరం చేయి.
20:27 وَاحْلُلْ عُقْدَةً مِّن لِّسَانِي
“నా నాలుక ముడిని విప్పు,
20:28 يَفْقَهُوا قَوْلِي
“ప్రజలు నా మాటను బాగా అర్థం చేసుకోగలిగేందుకు.
20:29 وَاجْعَل لِّي وَزِيرًا مِّنْ أَهْلِي
“నా కుటుంబంలో నుంచి ఒకతన్ని నాకు సహాయకునిగా నియమించు.
20:30 هَارُونَ أَخِي
“అంటే, నా సోదరుడైన హారూనును (నియమించు) !
20:31 اشْدُدْ بِهِ أَزْرِي
“అతని ద్వారా నా బలాన్ని పెంచు.
20:32 وَأَشْرِكْهُ فِي أَمْرِي
“నా కార్యంలో అతన్ని నా భాగస్థునిగాచేయి.
20:33 كَيْ نُسَبِّحَكَ كَثِيرًا
“తద్వారా మేమిద్దరం నీ పవిత్రతను అత్యధికంగా కొనియాడ గలగటానికి!
20:34 وَنَذْكُرَكَ كَثِيرًا
“నిన్ను అత్యధికంగా స్మరిస్తూ ఉండటానికి!!
20:35 إِنَّكَ كُنتَ بِنَا بَصِيرًا
“నిశ్చయంగా నువ్వు మమ్మల్ని బాగా కనిపెట్టుకుని ఉండే వాడవు.”
20:36 قَالَ قَدْ أُوتِيتَ سُؤْلَكَ يَا مُوسَىٰ
(అల్లాహ్ ఈ విధంగా) సెలవిచ్చాడు: “మూసా! నువ్వు అడిగిన వన్నీ నీకు ఇవ్వబడ్డాయి.
20:37 وَلَقَدْ مَنَنَّا عَلَيْكَ مَرَّةً أُخْرَىٰ
“మేము నీకు మరో మహోపకారం కూడా చేసి ఉన్నాము.
20:38 إِذْ أَوْحَيْنَا إِلَىٰ أُمِّكَ مَا يُوحَىٰ
“అప్పట్లో మేము నీ తల్లికి పంపిన సందేశం ఇది –
20:39 أَنِ اقْذِفِيهِ فِي التَّابُوتِ فَاقْذِفِيهِ فِي الْيَمِّ فَلْيُلْقِهِ الْيَمُّ بِالسَّاحِلِ يَأْخُذْهُ عَدُوٌّ لِّي وَعَدُوٌّ لَّهُ ۚ وَأَلْقَيْتُ عَلَيْكَ مَحَبَّةً مِّنِّي وَلِتُصْنَعَ عَلَىٰ عَيْنِي
‘నువ్వు అతన్ని (మూసాను) పెట్టెలో పెట్టి నదిలో వదిలిపెట్టు. ఆ తరువాత నది ఆ పెట్టెను ఒడ్డుకు చేరుస్తుంది. నాకూ, ఇతనికీ శత్రువు అయినవాడు దాన్ని తీసుకుంటాడు.’ “అప్పుడు నేను నా తరఫున ఓ ప్రత్యేకమైన ప్రేమానురాగాన్ని నీపై వేశాను. నువ్వు నా కనుసన్నలలో పోషించబడేందుకే ఈ ఏర్పాటు చేశాను.
20:40 إِذْ تَمْشِي أُخْتُكَ فَتَقُولُ هَلْ أَدُلُّكُمْ عَلَىٰ مَن يَكْفُلُهُ ۖ فَرَجَعْنَاكَ إِلَىٰ أُمِّكَ كَيْ تَقَرَّ عَيْنُهَا وَلَا تَحْزَنَ ۚ وَقَتَلْتَ نَفْسًا فَنَجَّيْنَاكَ مِنَ الْغَمِّ وَفَتَنَّاكَ فُتُونًا ۚ فَلَبِثْتَ سِنِينَ فِي أَهْلِ مَدْيَنَ ثُمَّ جِئْتَ عَلَىٰ قَدَرٍ يَا مُوسَىٰ
“(జ్ఞాపకం చేసుకో) అప్పుడు నీ అక్క (పెట్టె నదిలో కొట్టుకు పోతున్న వైపుకే) నడుస్తూ వచ్చి, “మీరు గనక సెలవిస్తే ఇతన్ని చక్కగా సాకేవారిని చూపిస్తాను” అని అంటుంది.ఈ ఉపాయం ద్వారా – నీ తల్లి కంటిచలువ కోసం, ఆమె దుఃఖించకుండా ఉండటం కోసం మేము మళ్లీ నిన్ను నీ తల్లి దగ్గరకు చేర్చాము. ఆ తరువాత నువ్వు ఒక వ్యక్తిని చంపావు. ఆ గండం నుంచి కూడా మేము నిన్ను కాపాడాము. ఆ విధంగా మేము నిన్ను బాగా పరీక్షించాము. అటు పిమ్మట నువ్వు అనేక సంవత్సరాలపాటు మద్యను ప్రజల మధ్య గడిపావు. ఆ తరువాత (మా) నిర్ణయం ప్రకారం ఓ మూసా! ఇదిగో, ఇలా వచ్చావు.
20:41 وَاصْطَنَعْتُكَ لِنَفْسِي
“నేను ప్రత్యేకంగా నా కోసం నిన్ను ఎంపిక చేసుకున్నాను.
20:42 اذْهَبْ أَنتَ وَأَخُوكَ بِآيَاتِي وَلَا تَنِيَا فِي ذِكْرِي
“ఇప్పుడు నువ్వూ, నీ సోదరుడూ నా సూచనలను తీసుకుని వెళ్లండి. (జాగ్రత్త!) నా ధ్యానం పట్ల బద్దకం చూపకూడదు సుమా!
20:43 اذْهَبَا إِلَىٰ فِرْعَوْنَ إِنَّهُ طَغَىٰ
“మీరిద్దరూ ఫిరౌను వద్దకు వెళ్లండి. వాడు మరీ బరితెగించి పోయాడు.
20:44 فَقُولَا لَهُ قَوْلًا لَّيِّنًا لَّعَلَّهُ يَتَذَكَّرُ أَوْ يَخْشَىٰ
“వాడితో కాస్త మృదువుగా మాట్లాడండి- బహుశా వాడు అర్థం చేసుకోవచ్చు లేదా భయపడవచ్చు.”
20:45 قَالَا رَبَّنَا إِنَّنَا نَخَافُ أَن يَفْرُطَ عَلَيْنَا أَوْ أَن يَطْغَىٰ
“ప్రభూ! వాడు మాపై దౌర్జన్యానికి పాల్పడతాడేమోననీ లేదా (తలబిరుసుతనంతో) హద్దుమీరి పోతాడేమోనని మాకు భయంగా ఉంది” అని వారిద్దరూ అన్నారు.
20:46 قَالَ لَا تَخَافَا ۖ إِنَّنِي مَعَكُمَا أَسْمَعُ وَأَرَىٰ
“మీరు ఏ మాత్రం భయపడకండి. నేను మీతోనే ఉన్నాను. అంతా వింటూ, చూస్తూ ఉంటాను” అని సమాధానమిచ్చాడు ఆయన.
20:47 فَأْتِيَاهُ فَقُولَا إِنَّا رَسُولَا رَبِّكَ فَأَرْسِلْ مَعَنَا بَنِي إِسْرَائِيلَ وَلَا تُعَذِّبْهُمْ ۖ قَدْ جِئْنَاكَ بِآيَةٍ مِّن رَّبِّكَ ۖ وَالسَّلَامُ عَلَىٰ مَنِ اتَّبَعَ الْهُدَىٰ
“మీరు అతని దగ్గరకు వెళ్ళి ఇలా అనండి: ‘మేము నీ ప్రభువు తరఫున పంపబడిన సందేశహరులము. నువ్వు ఇస్రాయీలు సంతతి వారిని మా వెంట పంపించు. వారిని పీడించకు. మేము నీ ప్రభువు తరఫున నీవద్దకు సూచనను తెచ్చాము. సన్మార్గాన్ని అనుసరించిన వానికి మాత్రమే శాంతి ఉంది.
20:48 إِنَّا قَدْ أُوحِيَ إِلَيْنَا أَنَّ الْعَذَابَ عَلَىٰ مَن كَذَّبَ وَتَوَلَّىٰ
“ధిక్కారవైఖరికి ఒడిగట్టి, విముఖత ప్రదర్శించేవానికి శిక్ష ఉంది అని మాకు వహీ ద్వారా తెలుపబడింది.”
20:49 قَالَ فَمَن رَّبُّكُمَا يَا مُوسَىٰ
“ఇంతకీ మీరిద్దరి ప్రభువు ఎవరయ్యా ఓ మూసా?” అని (ఫిరౌను) అడిగాడు.
20:50 قَالَ رَبُّنَا الَّذِي أَعْطَىٰ كُلَّ شَيْءٍ خَلْقَهُ ثُمَّ هَدَىٰ
“ప్రతి వస్తువుకూ దాని ప్రత్యేక రూపును ఇచ్చి, తర్వాత దానికి మార్గాన్ని చూపినవాడే మా ప్రభువు” అని (మూసా) చెప్పాడు.
20:51 قَالَ فَمَا بَالُ الْقُرُونِ الْأُولَىٰ
“మరైతే పూర్వం గతించిన వారి సంగతేమిటీ?” అని (ఫిరౌను) ప్రశ్నించగా,
20:52 قَالَ عِلْمُهَا عِندَ رَبِّي فِي كِتَابٍ ۖ لَّا يَضِلُّ رَبِّي وَلَا يَنسَى
“వారి సంగతి నా ప్రభువు వద్ద గ్రంథంలో ఉంది. నా ప్రభువు పొరబడటంగానీ, మరువటంగానీ జరగదు” అని (మూసా) సమాధానమిచ్చాడు.
20:53 الَّذِي جَعَلَ لَكُمُ الْأَرْضَ مَهْدًا وَسَلَكَ لَكُمْ فِيهَا سُبُلًا وَأَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَأَخْرَجْنَا بِهِ أَزْوَاجًا مِّن نَّبَاتٍ شَتَّىٰ
ఆయనే మీ కొరకు భూమిని పాన్పుగా చేశాడు. అందులో మీరు నడిచేందుకు మార్గాలను సుగమం చేశాడు. ఆకాశం నుంచి వర్షపు నీటిని కూడా కురిపించాడు. మరి ఆ వర్షపు నీటి ద్వారా రకరకాల పంటలను (పచ్చికలను) మేమే పండిస్తున్నాము.
20:54 كُلُوا وَارْعَوْا أَنْعَامَكُمْ ۗ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّأُولِي النُّهَىٰ
వాటిని మీరూ తినండి, మీ పశువులను కూడా మేపండి. నిశ్చయంగా బుద్ధిమంతులకోసం ఇందులో ఎన్నో సూచనలున్నాయి.
20:55 مِنْهَا خَلَقْنَاكُمْ وَفِيهَا نُعِيدُكُمْ وَمِنْهَا نُخْرِجُكُمْ تَارَةً أُخْرَىٰ
దీని (ఈ నేల)లో నుంచే మేము మిమ్మల్ని సృష్టించాము. మళ్లీ ఇందులోనికే మిమ్మల్ని చేరుస్తాము. మరి ఇందులో నుంచే మరోసారి మీ అందరినీ వెలికి తీస్తాము.
20:56 وَلَقَدْ أَرَيْنَاهُ آيَاتِنَا كُلَّهَا فَكَذَّبَ وَأَبَىٰ
మేము వాడికి (ఫిరౌనుకు) మా సూచనలన్నింటినీ చూపాము. అయినాసరే వాడు ఖండించాడు, త్రోసిపుచ్చాడు.
20:57 قَالَ أَجِئْتَنَا لِتُخْرِجَنَا مِنْ أَرْضِنَا بِسِحْرِكَ يَا مُوسَىٰ
“ఓ మూసా? నువ్వు నీ మంత్రజాలంతో మమ్మల్ని మా రాజ్యం నుంచి వెళ్లగొట్టడానికి వచ్చావా?
20:58 فَلَنَأْتِيَنَّكَ بِسِحْرٍ مِّثْلِهِ فَاجْعَلْ بَيْنَنَا وَبَيْنَكَ مَوْعِدًا لَّا نُخْلِفُهُ نَحْنُ وَلَا أَنتَ مَكَانًا سُوًى
“సరే. మేము కూడా నీకు దీటుగా అటువంటి జాలవిద్యనే తీసుకువస్తాము. కాబట్టి నువ్వు నీకూ – మాకూ మధ్య పోటీకి ఒక పోటీ సమయాన్ని నిర్ణయించు. మేముగానీ, నువ్వుగానీ మాట తప్పకూడదు. బహిరంగ స్థలంలో పోటీ జరగాలి” అని (ఫిరౌన్) సవాలు చేశాడు.
20:59 قَالَ مَوْعِدُكُمْ يَوْمُ الزِّينَةِ وَأَن يُحْشَرَ النَّاسُ ضُحًى
“పర్వదినాన (పోటీ) పెట్టుకుందాం. పొద్దెక్కిన తరువాత ప్రజలంతా గుమిగూడినప్పుడే” అని (మూసా) బదులిచ్చాడు.
20:60 فَتَوَلَّىٰ فِرْعَوْنُ فَجَمَعَ كَيْدَهُ ثُمَّ أَتَىٰ
అంతే! ఫిరౌను వెళ్ళి తన తాంత్రిక ఒనరులన్నింటినీ సమకూర్చుకుని (సర్వసన్నద్ధుడై) వచ్చాడు.
20:61 قَالَ لَهُم مُّوسَىٰ وَيْلَكُمْ لَا تَفْتَرُوا عَلَى اللَّهِ كَذِبًا فَيُسْحِتَكُم بِعَذَابٍ ۖ وَقَدْ خَابَ مَنِ افْتَرَىٰ
మూసా వాళ్లను ఉద్దేశించి, “మీకు మూడింది! అల్లాహ్‌కు అబద్ధాలను అంటగట్టకండి. ఆయన మిమ్మల్ని శిక్ష ద్వారా సర్వ నాశనం చేసేస్తాడు. అబద్ధాన్ని కల్పించేవాడు ఎన్నటికీ సాఫల్యం పొందలేడని తెలుసుకోండి” అని అన్నారు.
20:62 فَتَنَازَعُوا أَمْرَهُم بَيْنَهُمْ وَأَسَرُّوا النَّجْوَىٰ
అప్పుడు వారు ఈ విషయంపై పరస్పరం మల్లగుల్లాలు పడ్డారు. రహస్య సంప్రదింపులు జరుపుకున్నారు.
20:63 قَالُوا إِنْ هَٰذَانِ لَسَاحِرَانِ يُرِيدَانِ أَن يُخْرِجَاكُم مِّنْ أَرْضِكُم بِسِحْرِهِمَا وَيَذْهَبَا بِطَرِيقَتِكُمُ الْمُثْلَىٰ
వారిలా చెప్పుకున్నారు: “వీళ్ళిద్దరూ వట్టి మాంత్రికులే. తమ మంత్రశక్తితో మిమ్మల్ని మీ రాజ్యం నుంచి వెళ్లగొట్టాలనీ, మీ ఉత్తమ విధానాన్ని సర్వనాశనం చేయాలని వీళ్లు కోరుకుంటున్నారు.
20:64 فَأَجْمِعُوا كَيْدَكُمْ ثُمَّ ائْتُوا صَفًّا ۚ وَقَدْ أَفْلَحَ الْيَوْمَ مَنِ اسْتَعْلَىٰ
“కాబట్టి మీరు మీ తంత్రాలన్నింటినీ సమాయత్తం చేసుకోండి. ఆ తరువాత వరుసలు తీరి రండి. ఈ రోజు విజృంభించిన వాడే గెలుస్తాడు.”
20:65 قَالُوا يَا مُوسَىٰ إِمَّا أَن تُلْقِيَ وَإِمَّا أَن نَّكُونَ أَوَّلَ مَنْ أَلْقَىٰ
“ఓ మూసా! ముందు నువ్వయినా పడ వెయ్యి లేదా ముందు మేమైనా పడవేస్తాము” అని వారు చెప్పగా,
20:66 قَالَ بَلْ أَلْقُوا ۖ فَإِذَا حِبَالُهُمْ وَعِصِيُّهُمْ يُخَيَّلُ إِلَيْهِ مِن سِحْرِهِمْ أَنَّهَا تَسْعَىٰ
“ఫరవాలేదు, ముందు మీరే పడ వెయ్యండి” అని మూసా అన్నాడు. అప్పుడు వారి త్రాళ్లు, వారి కర్రలు వారి మంత్రశక్తిచే పరుగెత్తుతున్నట్లు అనిపించింది మూసాకు.
20:67 فَأَوْجَسَ فِي نَفْسِهِ خِيفَةً مُّوسَىٰ
అందువల్ల మూసా మనసులోనే భయపడ్డాడు.
20:68 قُلْنَا لَا تَخَفْ إِنَّكَ أَنتَ الْأَعْلَىٰ
అప్పుడు మేమిలా అన్నాము: “నువ్వు ఏమాత్రం భయపడకు. నిశ్చయంగా నీదే పైచేయి అవుతుంది.
20:69 وَأَلْقِ مَا فِي يَمِينِكَ تَلْقَفْ مَا صَنَعُوا ۖ إِنَّمَا صَنَعُوا كَيْدُ سَاحِرٍ ۖ وَلَا يُفْلِحُ السَّاحِرُ حَيْثُ أَتَىٰ
“నీ కుడి చేతిలో ఉన్న దానిని పడవేయి. అది వాళ్ల మాయా జాలాన్ని ఇట్టే మింగేస్తుంది. వాళ్లు కల్పించిందంతా మాంత్రికుల జిమ్మిక్కు మాత్రమే. మాంత్రికుడు ఏ విధంగా (ఎంత అట్టహాసంగా) వచ్చినా సఫలీకృతుడు కాలేడు.”
20:70 فَأُلْقِيَ السَّحَرَةُ سُجَّدًا قَالُوا آمَنَّا بِرَبِّ هَارُونَ وَمُوسَىٰ
ఎట్టకేలకు మాంత్రికులంతా సాష్టాంగపడి, “మేము హారూన్, మూసాల ప్రభువును విశ్వసించాము” అని ఎలుగెత్తి చాటారు.
20:71 قَالَ آمَنتُمْ لَهُ قَبْلَ أَنْ آذَنَ لَكُمْ ۖ إِنَّهُ لَكَبِيرُكُمُ الَّذِي عَلَّمَكُمُ السِّحْرَ ۖ فَلَأُقَطِّعَنَّ أَيْدِيَكُمْ وَأَرْجُلَكُم مِّنْ خِلَافٍ وَلَأُصَلِّبَنَّكُمْ فِي جُذُوعِ النَّخْلِ وَلَتَعْلَمُنَّ أَيُّنَا أَشَدُّ عَذَابًا وَأَبْقَىٰ
“ఏమిటీ, నేను అనుమతించకముందే మీరు అతన్ని విశ్వసిస్తారా? నిశ్చయంగా మీకు మంత్ర విద్యను నేర్పిన మీ పెద్ద ఇతనే (అని ఇప్పుడర్థం అయింది). నేను ఒక ప్రక్కనుంచి మీ చేతుల్ని, మరో ప్రక్కనుంచి మీ కాళ్లను నరికించి, మీ అందరినీ ఖర్జూరపు దూలాలకు ఉరి తీస్తాను. మాలో ఎవరి శిక్ష తీవ్రతరమైనదో, ఎక్కువ కాలం ఉంటుందో అప్పుడు మీకు తెలిసివస్తుంది” అని ఫిరౌన్ అన్నాడు.
20:72 قَالُوا لَن نُّؤْثِرَكَ عَلَىٰ مَا جَاءَنَا مِنَ الْبَيِّنَاتِ وَالَّذِي فَطَرَنَا ۖ فَاقْضِ مَا أَنتَ قَاضٍ ۖ إِنَّمَا تَقْضِي هَٰذِهِ الْحَيَاةَ الدُّنْيَا
వారు (మాంత్రికులు) ఈ విధంగా సమాధానమిచ్చారు: “మా వద్దకు వచ్చేసిన స్పష్టమైన నిదర్శనాలపై, మమ్మల్ని సృష్టించిన వానిపైనీకు ప్రాధాన్యతనివ్వటమా?!అసంభవం. ఇప్పుడు నువ్వేం చేస్తావో చేసుకో. నువ్వేం నిర్ణయం చేసినా అది ప్రాపంచిక జీవితం వరకే.
20:73 إِنَّا آمَنَّا بِرَبِّنَا لِيَغْفِرَ لَنَا خَطَايَانَا وَمَا أَكْرَهْتَنَا عَلَيْهِ مِنَ السِّحْرِ ۗ وَاللَّهُ خَيْرٌ وَأَبْقَىٰ
“మా ప్రభువు మా తప్పులను క్షమించేటందుకు,(ముఖ్యంగా) నువ్వు బలవంతంగా మాచేత చేయించిన మాయాజాలపు మహా పరాధాన్ని మన్నించేటందుకు మేము ఆయన్ని విశ్వసించాము. అల్లాహ్‌యే ఉత్తముడు, ఎప్పటికీ మిగిలి ఉండేవాడు.”
20:74 إِنَّهُ مَن يَأْتِ رَبَّهُ مُجْرِمًا فَإِنَّ لَهُ جَهَنَّمَ لَا يَمُوتُ فِيهَا وَلَا يَحْيَىٰ
అసలు విషయం ఏమిటంటే,అపరాధిగా అల్లాహ్ సన్నిధి లోకి వచ్చేవాడి కోసం నరకం ఉన్నది. అందులో అతను చావనూ లేడు బ్రతకనూ లేడు.
20:75 وَمَن يَأْتِهِ مُؤْمِنًا قَدْ عَمِلَ الصَّالِحَاتِ فَأُولَٰئِكَ لَهُمُ الدَّرَجَاتُ الْعُلَىٰ
మరెవరు ఆయన సన్నిధికి విశ్వాసిగా వస్తాడో, సత్కార్యాలు కూడా చేసి ఉంటాడో – అలాంటి వారి కోసం ఉన్నత తరగతులున్నాయి.
20:76 جَنَّاتُ عَدْنٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا ۚ وَذَٰلِكَ جَزَاءُ مَن تَزَكَّىٰ
శాశ్వతమైన స్వర్గవనాలున్నాయి. వాటి క్రింద సెలయేళ్లు ప్రవహిస్తుంటాయి. వాటిలో వారు కలకాలం ఉంటారు. పరిశుద్ధుడైన ప్రతి వ్యక్తికీ లభించే ప్రతిఫలం ఇదే.
20:77 وَلَقَدْ أَوْحَيْنَا إِلَىٰ مُوسَىٰ أَنْ أَسْرِ بِعِبَادِي فَاضْرِبْ لَهُمْ طَرِيقًا فِي الْبَحْرِ يَبَسًا لَّا تَخَافُ دَرَكًا وَلَا تَخْشَىٰ
“నా దాసులను రాత్రికి రాత్రే తీసుకుని బయలుదేరు. వారి కోసం సముద్రంలో పొడి త్రోవను ఏర్పరచుకో. ఎవరయినా వచ్చి పట్టుకుంటారేమోనని భీతిచెందకు. (ముంపుకు గురవుతామేమోనన్న) ఆందోళన కూడా అక్కరలేదు” అని మేము మూసాకు వహీ ద్వారా తెలిపాము.
20:78 فَأَتْبَعَهُمْ فِرْعَوْنُ بِجُنُودِهِ فَغَشِيَهُم مِّنَ الْيَمِّ مَا غَشِيَهُمْ
ఆ తరువాత ఫిరౌను తన సైన్యంతో వారిని వెంబడించాడు. అయితే సముద్రం వారందరినీ ఆవరించవలసిన విధంగానే ఆవరించింది.
20:79 وَأَضَلَّ فِرْعَوْنُ قَوْمَهُ وَمَا هَدَىٰ
ఫిరౌను తన జాతివారిని అపమార్గానికి లోను చేశాడు. వారికి సన్మార్గం చూపలేదు.
20:80 يَا بَنِي إِسْرَائِيلَ قَدْ أَنجَيْنَاكُم مِّنْ عَدُوِّكُمْ وَوَاعَدْنَاكُمْ جَانِبَ الطُّورِ الْأَيْمَنَ وَنَزَّلْنَا عَلَيْكُمُ الْمَنَّ وَالسَّلْوَىٰ
ఓ ఇస్రాయీలు వంశీయులారా! చూడండి! మేము మిమ్మల్ని మీ శత్రువు చెరనుండి విడిపించాము. తూరు పర్వతం కుడివైపు గురించి మీకు వాగ్దానం చేశాము.మీపై ‘మన్న్’ మరియు ‘సల్వా’ లను అవతరింపజేశాము.
20:81 كُلُوا مِن طَيِّبَاتِ مَا رَزَقْنَاكُمْ وَلَا تَطْغَوْا فِيهِ فَيَحِلَّ عَلَيْكُمْ غَضَبِي ۖ وَمَن يَحْلِلْ عَلَيْهِ غَضَبِي فَقَدْ هَوَىٰ
మేము ప్రసాదించిన పవిత్రమైన ఆహార పదార్థాలను తినండి. అందులో మితి మీరకండి. మితిమీరితే మీపై నా ఆగ్రహం విరుచుకుపడుతుంది. నా ఆగ్రహం ఎవరిపై విరుచుకుపడినా వాడు పతనమైనట్టే.
20:82 وَإِنِّي لَغَفَّارٌ لِّمَن تَابَ وَآمَنَ وَعَمِلَ صَالِحًا ثُمَّ اهْتَدَىٰ
అయితే పశ్చాత్తాపం చెంది, విశ్వసించి, సత్కార్యాలు చేసి, ఆపై సన్మార్గంపై స్థిరంగా ఉన్న వారిని నేను అమితంగా క్షమిస్తాను.
20:83 وَمَا أَعْجَلَكَ عَن قَوْمِكَ يَا مُوسَىٰ
“ఓ మూసా! నిన్ను నీ జాతి వారి నుంచి (ఏమార్చి) ఇంత తొందరగా రావటానికి ప్రేరేపించిన విషయం ఏదీ?” (అని అల్లాహ్ కారణం అడిగాడు).
20:84 قَالَ هُمْ أُولَاءِ عَلَىٰ أَثَرِي وَعَجِلْتُ إِلَيْكَ رَبِّ لِتَرْضَىٰ
“వాళ్లూ నా వెనుకే వస్తున్నారు. ఇక నా విషయానికి వస్తే ఓ ప్రభూ! నువ్వు ప్రసన్నుడవు కావాలన్న ఉద్దేశంతోనే తొందరగా వచ్చేశాను” అని అతను అన్నాడు.
20:85 قَالَ فَإِنَّا قَدْ فَتَنَّا قَوْمَكَ مِن بَعْدِكَ وَأَضَلَّهُمُ السَّامِرِيُّ
“మేము నీ జాతి వారిని నీ వెనుక పరీక్షకు గురిచేశాము. సామిరీ (అనేవాడు) వాళ్లను పెడదారి పట్టించాడు” అని అల్లాహ్ సెలవిచ్చాడు.
20:86 فَرَجَعَ مُوسَىٰ إِلَىٰ قَوْمِهِ غَضْبَانَ أَسِفًا ۚ قَالَ يَا قَوْمِ أَلَمْ يَعِدْكُمْ رَبُّكُمْ وَعْدًا حَسَنًا ۚ أَفَطَالَ عَلَيْكُمُ الْعَهْدُ أَمْ أَرَدتُّمْ أَن يَحِلَّ عَلَيْكُمْ غَضَبٌ مِّن رَّبِّكُمْ فَأَخْلَفْتُم مَّوْعِدِي
మూసా ఆగ్రహోదగ్రుడై, దుఃఖవదనుడై జాతివారి వైపుకు తిరిగి వచ్చాడు. “ఓ నా జాతి ప్రజలారా! మీ ప్రభువు మీకు మంచి వాగ్దానం చేయలేదా?! ఆ గడువు మీకు మరీ అంత సుదీర్ఘం అనిపించిందా?! లేక మీ ప్రభువు ఆగ్రహం మీపై విరుచుకుపడాలనే మీరు కోరుకున్నారా? అందుకే మీరు నాకు చేసిన వాగ్దానానికి విరుద్ధంగా ప్రవర్తించారా?” అని ఆవేదన చెందాడు.
20:87 قَالُوا مَا أَخْلَفْنَا مَوْعِدَكَ بِمَلْكِنَا وَلَٰكِنَّا حُمِّلْنَا أَوْزَارًا مِّن زِينَةِ الْقَوْمِ فَقَذَفْنَاهَا فَكَذَٰلِكَ أَلْقَى السَّامِرِيُّ
దానికి వారు, “మేము నీకు ఇచ్చిన మాటను మా అంతట మేముగా జవదాటలేదు. మాపై వేయబడిన (ఫిరౌను) జనుల నగల భారాన్ని మేము తీసి (అగ్నిలో) పడవేశాము. అలాగే సామిరీ కూడా పడవేశాడు” (అని చెప్పారు).
20:88 فَأَخْرَجَ لَهُمْ عِجْلًا جَسَدًا لَّهُ خُوَارٌ فَقَالُوا هَٰذَا إِلَٰهُكُمْ وَإِلَٰهُ مُوسَىٰ فَنَسِيَ
ఆ తరువాత అతను (కరిగించిన నగలతో) ప్రజలకు ఒక ఆవుదూడ విగ్రహమును చేసి పెట్టాడు. అందులో నుంచి (అంబా అనే) శబ్దం వినవచ్చేది. దాన్ని చూసి, “ఇదే మీకూ, మూసాకూ ఆరాధ్య దైవం. కాకపోతే అతను (మూసా) మరచి పోయాడు” (అని వారు చెప్పసాగారు).
20:89 أَفَلَا يَرَوْنَ أَلَّا يَرْجِعُ إِلَيْهِمْ قَوْلًا وَلَا يَمْلِكُ لَهُمْ ضَرًّا وَلَا نَفْعًا
ఏమిటీ, అది వారు అడిగిన దానికి సమాధానం ఇవ్వజాలదనీ, తమకు ఎలాంటి కీడుగానీ, మేలుగానీ చేయలేదన్నసంగతిని వాళ్లు గమనించటం లేదా?
20:90 وَلَقَدْ قَالَ لَهُمْ هَارُونُ مِن قَبْلُ يَا قَوْمِ إِنَّمَا فُتِنتُم بِهِ ۖ وَإِنَّ رَبَّكُمُ الرَّحْمَٰنُ فَاتَّبِعُونِي وَأَطِيعُوا أَمْرِي
అంతకు ముందే హారూను (అలైహిస్సలాం) వారితో, “నా జాతి జనులారా! ఈ ఆవు దూడ ద్వారా మీరు సంకటస్థితిలో పడ్డారు. యదార్థానికి మీ నిజ ప్రభువు మాత్రం కరుణామయుడైన అల్లాహ్‌యే. కాబట్టి మీరందరూ నన్ను అనుసరించండి. నేను చెప్పినట్లు నమ్మి నడవండి” అని ప్రబోధించాడు.
20:91 قَالُوا لَن نَّبْرَحَ عَلَيْهِ عَاكِفِينَ حَتَّىٰ يَرْجِعَ إِلَيْنَا مُوسَىٰ
“మూసా తిరిగి వచ్చేవరకు మేము దీన్ని సేవించుకుంటూ ఉంటాము” అని వారు సమాధానమిచ్చారు.
20:92 قَالَ يَا هَارُونُ مَا مَنَعَكَ إِذْ رَأَيْتَهُمْ ضَلُّوا
“ఓ హారూన్! వీళ్లు పెడదారి పట్టడం చూస్తూ కూడా (ఊరుకున్నావా?) ఏ విషయం నిన్ను అడ్డుకుంది?
20:93 أَلَّا تَتَّبِعَنِ ۖ أَفَعَصَيْتَ أَمْرِي
“నువ్వు నా వెనుక రాలేదేమి? ఏమిటీ, నువ్వు కూడా నా ఆజ్ఞను ఎదిరించావా?” అని మూసా అడిగారు.
20:94 قَالَ يَا ابْنَ أُمَّ لَا تَأْخُذْ بِلِحْيَتِي وَلَا بِرَأْسِي ۖ إِنِّي خَشِيتُ أَن تَقُولَ فَرَّقْتَ بَيْنَ بَنِي إِسْرَائِيلَ وَلَمْ تَرْقُبْ قَوْلِي
“ఓ నా మాతా పుత్రుడా! నా గడ్డాన్ని పట్టుకోకు. నా జుత్తు పట్టి లాగకు. ‘నువ్వు ఇస్రాయీలు సంతతిలో చీలిక తెచ్చావు. నా ఉత్తర్వుకోసం నిరీక్షించలేదు’అని నువ్వు అంటావేమోనన్న భయంతో ఆగిపోయాను” అని హారూన్ వివరించాడు.
20:95 قَالَ فَمَا خَطْبُكَ يَا سَامِرِيُّ
“సామిరీ! ఇక నీ సంగతేమిటీ?” అని (మూసా) అడిగాడు.
20:96 قَالَ بَصُرْتُ بِمَا لَمْ يَبْصُرُوا بِهِ فَقَبَضْتُ قَبْضَةً مِّنْ أَثَرِ الرَّسُولِ فَنَبَذْتُهَا وَكَذَٰلِكَ سَوَّلَتْ لِي نَفْسِي
“వారు చూడని దాన్ని నేను చూశాను. నేను దైవసందేశవాహకుని పాద ముద్రలో నుంచి ఒక పిడికెడు మన్ను తీసుకుని అందులో వేశాను. నా మనసు కూడా నాకు దీనిని సరైనదిగా సూచింపజేసింది” అని అతను జవాబిచ్చాడు.
20:97 قَالَ فَاذْهَبْ فَإِنَّ لَكَ فِي الْحَيَاةِ أَن تَقُولَ لَا مِسَاسَ ۖ وَإِنَّ لَكَ مَوْعِدًا لَّن تُخْلَفَهُ ۖ وَانظُرْ إِلَىٰ إِلَٰهِكَ الَّذِي ظَلْتَ عَلَيْهِ عَاكِفًا ۖ لَّنُحَرِّقَنَّهُ ثُمَّ لَنَنسِفَنَّهُ فِي الْيَمِّ نَسْفًا
అప్పుడు మూసా,”సరే! ఇక్కణ్ణుంచి వెళ్ళిపో. నీకు శిక్ష ఏమిటంటే, నీవు జీవితాంతం ‘అమ్మో నన్ను ముట్టుకోకండి’ అని అంటూ ఉంటావు. నీ నుంచి ఎట్టి పరిస్థితిలోనూ తప్పిపోని వాగ్దానం మరొకటి కూడా నీ కోసం ఉంది. ఇన్నాళ్ళూ నువ్వు అంటిపెట్టుకుని ఉన్న నీ ఆరాధ్య దేవునికి పట్టే గతేమిటో కూడా చూసుకో. మేము దాన్ని కాల్చి, భస్మం చేసి సముద్రంలో విసిరేస్తాము” అన్నాడు.
20:98 إِنَّمَا إِلَٰهُكُمُ اللَّهُ الَّذِي لَا إِلَٰهَ إِلَّا هُوَ ۚ وَسِعَ كُلَّ شَيْءٍ عِلْمًا
యదార్థమేమిటంటే మీ అందరి ఆరాధ్యదైవం అల్లాహ్ మాత్రమే. ఆయన తప్ప వేరొక ఆరాధ్య దైవం లేనే లేడు. ఆయన జ్ఞానం అన్నింటినీ ఆవరించి ఉంది” (అని చెప్పాడు).
20:99 كَذَٰلِكَ نَقُصُّ عَلَيْكَ مِنْ أَنبَاءِ مَا قَدْ سَبَقَ ۚ وَقَدْ آتَيْنَاكَ مِن لَّدُنَّا ذِكْرًا
(ఓ ముహమ్మద్!) ఈ విధంగా మేము పూర్వం జరిగిన ఘటనలను నీకు వివరిస్తూ ఉన్నాము. నిశ్చయంగా మేము నీకు మా వద్ద నుండి ఒక హితోపదేశాన్ని ఇచ్చి ఉన్నాము.
20:100 مَّنْ أَعْرَضَ عَنْهُ فَإِنَّهُ يَحْمِلُ يَوْمَ الْقِيَامَةِ وِزْرًا
దీనిపట్ల విముఖత చూపినవాడు ప్రళయదినాన పెద్ద (పాప) భారం మోస్తాడు.
20:101 خَالِدِينَ فِيهِ ۖ وَسَاءَ لَهُمْ يَوْمَ الْقِيَامَةِ حِمْلًا
అందులో వాడు శాశ్వతంగా చిక్కుకుపోతాడు. అలాంటి వారి కోసం ప్రళయ దినాన మహా చెడ్డ బరువు ఉంటుంది.
20:102 يَوْمَ يُنفَخُ فِي الصُّورِ ۚ وَنَحْشُرُ الْمُجْرِمِينَ يَوْمَئِذٍ زُرْقًا
శంఖం ఊదబడే రోజు – మేము అపరాధులను ఆ రోజు (భయం మూలంగా) కళ్లు నీలి రంగులోకి మారి పోయిన స్థితిలో సమీకరిస్తాము.
20:103 يَتَخَافَتُونَ بَيْنَهُمْ إِن لَّبِثْتُمْ إِلَّا عَشْرًا
వారు పరస్పరం, “మనం (ప్రపంచంలో) పది రోజులకన్నా ఎక్కువ ఉండి ఉండం” అని గుసగుసలాడుకుంటూ ఉంటారు.
20:104 نَّحْنُ أَعْلَمُ بِمَا يَقُولُونَ إِذْ يَقُولُ أَمْثَلُهُمْ طَرِيقَةً إِن لَّبِثْتُمْ إِلَّا يَوْمًا
వారేం చెప్పుకుంటున్నారో మాకు బాగా తెలుసు. వారిలో (ధార్మికంగా) అందరికన్నా మంచి పద్ధతిపై ఉన్నవాడు, “అసలు మీరు ఒక్క రోజు మాత్రమే ఉన్నారు” అంటాడు.
20:105 وَيَسْأَلُونَكَ عَنِ الْجِبَالِ فَقُلْ يَنسِفُهَا رَبِّي نَسْفًا
వారు నిన్ను పర్వతాల పరిస్థితి గురించి అడుగుతున్నారు. వారికిలా చెప్పు: “నా ప్రభువు వాటిని తుత్తునియలుగా చేసి ఎగురవేస్తాడు.
20:106 فَيَذَرُهَا قَاعًا صَفْصَفًا
“మరి భూమిని చదునైన మైదానంగా చేసివేస్తాడు.
20:107 لَّا تَرَىٰ فِيهَا عِوَجًا وَلَا أَمْتًا
“అందులో నీకు ఎలాంటి వంకరలు గానీ, మెట్టపల్లాలు గానీ కానరావు.”
20:108 يَوْمَئِذٍ يَتَّبِعُونَ الدَّاعِيَ لَا عِوَجَ لَهُ ۖ وَخَشَعَتِ الْأَصْوَاتُ لِلرَّحْمَٰنِ فَلَا تَسْمَعُ إِلَّا هَمْسًا
ఆ రోజు వారందరూ పిలిచేవాని వెనుక పడిపోతుంటారు. అందులో (ఆ అనుసరణలో) ఎలాంటి వంకరతనం ఉండదు. కరుణామయుడైన అల్లాహ్ సమక్షంలో అందరి కంఠస్వరాలు తగ్గిపోయి ఉంటాయి. గుసగుసలు తప్ప నీకు మరొకటి వినిపించదు.
20:109 يَوْمَئِذٍ لَّا تَنفَعُ الشَّفَاعَةُ إِلَّا مَنْ أَذِنَ لَهُ الرَّحْمَٰنُ وَرَضِيَ لَهُ قَوْلًا
ఆ రోజు కరుణామయుడు ఎవరికయినా అనుమతించి, అతని మాటను (వినడానికి) ఇష్టపడితే తప్ప – ఎవరి సిఫారసూ చెల్లనేరదు.
20:110 يَعْلَمُ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ وَلَا يُحِيطُونَ بِهِ عِلْمًا
వారికి ముందూ వెనుకా ఉన్న స్థితిని గురించి అల్లాహ్‌కు మాత్రమే తెలుసు. అయితే వారికి మాత్రం ఆయన్ని గురించి పూర్తిగా తెలీదు.
20:111 وَعَنَتِ الْوُجُوهُ لِلْحَيِّ الْقَيُّومِ ۖ وَقَدْ خَابَ مَنْ حَمَلَ ظُلْمًا
(ఆనాడు) అందరి ముఖాలు సజీవుడు, నిత్యుడు అయిన అల్లాహ్ ఎదుట పూర్తిగా క్రిందికి వాలి ఉంటాయి. నిశ్చయంగా దుర్మార్గం (బరువు) మోసేవాడు నాశనమవుతాడు.
20:112 وَمَن يَعْمَلْ مِنَ الصَّالِحَاتِ وَهُوَ مُؤْمِنٌ فَلَا يَخَافُ ظُلْمًا وَلَا هَضْمًا
ఇక సత్కార్యాలు చేసినవాడు; అతను విశ్వాసి కూడా అయివుంటే – అతనికి అన్యాయం జరుగుతుందన్న జంకుగానీ, తన హక్కు కాజేయబడుతుందన్న భీతిగానీ ఉండదు.
20:113 وَكَذَٰلِكَ أَنزَلْنَاهُ قُرْآنًا عَرَبِيًّا وَصَرَّفْنَا فِيهِ مِنَ الْوَعِيدِ لَعَلَّهُمْ يَتَّقُونَ أَوْ يُحْدِثُ لَهُمْ ذِكْرًا
ఇదే విధంగా (ఓ ప్రవక్తా!) మేము దీనిని నీపై అరబ్బీ ఖుర్ఆన్గా అవతరింపజేశాము. ప్రజలు భయభక్తులు కలిగి ఉండగలందులకు, లేదా వారిలో ధర్మచింతన రేకెత్తేందుకుపలు విధాలుగా ఇందులో భయబోధ చేశాము.
20:114 فَتَعَالَى اللَّهُ الْمَلِكُ الْحَقُّ ۗ وَلَا تَعْجَلْ بِالْقُرْآنِ مِن قَبْلِ أَن يُقْضَىٰ إِلَيْكَ وَحْيُهُ ۖ وَقُل رَّبِّ زِدْنِي عِلْمًا
కనుక నిజ సామ్రాట్టు అయిన అల్లాహ్‌యే సర్వోన్నతుడు. నీ వద్దకు పంపబడే ‘వహీ'(దైవవాణి) పూర్తి కానంత వరకూ నువ్వు ఖుర్ఆన్ పఠించటంలో తొందరపడకు. అయితే “ప్రభూ! నా జ్ఞానాన్ని పెంచు” అని మాత్రం వేడుకో.
20:115 وَلَقَدْ عَهِدْنَا إِلَىٰ آدَمَ مِن قَبْلُ فَنَسِيَ وَلَمْ نَجِدْ لَهُ عَزْمًا
మేము ఆదమ్‌కు ముందే గట్టిగా తాకీదు చేశాము. కాని అతను మరచిపోయాడు. మాకు అతనిలో సంకల్పబలం కనిపించ లేదు.
20:116 وَإِذْ قُلْنَا لِلْمَلَائِكَةِ اسْجُدُوا لِآدَمَ فَسَجَدُوا إِلَّا إِبْلِيسَ أَبَىٰ
“ఆదమ్‌కు సాష్టాంగపడండి” అని మేము దైవదూతలతో అన్నప్పుడు ఇబ్లీసు తప్ప అందరూ సాష్టాంగపడ్డారు. వాడు మాత్రం స్పష్టంగా నిరాకరించాడు.
20:117 فَقُلْنَا يَا آدَمُ إِنَّ هَٰذَا عَدُوٌّ لَّكَ وَلِزَوْجِكَ فَلَا يُخْرِجَنَّكُمَا مِنَ الْجَنَّةِ فَتَشْقَىٰ
అప్పుడు మేము ఇలా అన్నాము: “ఓ ఆదమ్! వీడు నీకూ, నీ భార్యకూ బద్ధ విరోధి. (జాగ్రత్త!) వాడు మీరిద్దరినీ స్వర్గం నుంచి వెళ్లగొట్టే స్థితి రాకూడదు సుమా! ఒకవేళ అదేగనక జరిగితే నువ్వు కష్టాల్లో పడాల్సివస్తుంది.
20:118 إِنَّ لَكَ أَلَّا تَجُوعَ فِيهَا وَلَا تَعْرَىٰ
“(ఇక్కడ నువ్వు ఎంతో హాయిగా ఉన్నావు). ఇక్కడ నీకు ఆకలీ ఉండదు, నువ్వు నగ్నంగానూ ఉండవు.”
20:119 وَأَنَّكَ لَا تَظْمَأُ فِيهَا وَلَا تَضْحَىٰ
“నీకు దప్పికగానీ,ఎండ బాధగానీ ఉండదు.”
20:120 فَوَسْوَسَ إِلَيْهِ الشَّيْطَانُ قَالَ يَا آدَمُ هَلْ أَدُلُّكَ عَلَىٰ شَجَرَةِ الْخُلْدِ وَمُلْكٍ لَّا يَبْلَىٰ
మరి షైతాను అతన్ని కవ్వించాడు. “ఓ ఆదమ్! నేను నీకు శాశ్వత జీవితాన్ని ప్రసాదించే వృక్షాన్ని, ఎన్నటికీ పాతబడని సామ్రాజ్యాన్ని చూపించనా?!” అన్నాడు.
20:121 فَأَكَلَا مِنْهَا فَبَدَتْ لَهُمَا سَوْآتُهُمَا وَطَفِقَا يَخْصِفَانِ عَلَيْهِمَا مِن وَرَقِ الْجَنَّةِ ۚ وَعَصَىٰ آدَمُ رَبَّهُ فَغَوَىٰ
ఆ విధంగా వారిద్దరూ ఆ వృక్షం నుండి (ఫలం) తినగానే వారి మర్మస్థానాలు బహిర్గతమైపోయాయి. వారిద్దరూ స్వర్గంలోని ఆకులతో వాటిని కప్పుకోసాగారు. ఆదమ్ తన ప్రభువు మాటను జవదాటి, దారి తప్పాడు.
20:122 ثُمَّ اجْتَبَاهُ رَبُّهُ فَتَابَ عَلَيْهِ وَهَدَىٰ
దరిమిలా అతని ప్రభువు అతన్ని ఎన్నుకున్నాడు. అతని పశ్చాత్తాపాన్ని స్వీకరించాడు. అతనికి మార్గం చూపాడు.
20:123 قَالَ اهْبِطَا مِنْهَا جَمِيعًا ۖ بَعْضُكُمْ لِبَعْضٍ عَدُوٌّ ۖ فَإِمَّا يَأْتِيَنَّكُم مِّنِّي هُدًى فَمَنِ اتَّبَعَ هُدَايَ فَلَا يَضِلُّ وَلَا يَشْقَىٰ
(అల్లాహ్) ఇలా సెలవిచ్చాడు : “మీరిద్దరూ ఇక్కణ్ణుంచి దిగిపోండి. మీరు ఒండొకరికి శత్రువులు. ఇకమీదట మీ వద్దకు నా నుండి మార్గదర్శకత్వం గనక వస్తే, నా మార్గాన్ని అవలంబించే వాడు దారి తప్పటంగానీ, ప్రయాసకు లోనవటంగానీ జరగదు.
20:124 وَمَنْ أَعْرَضَ عَن ذِكْرِي فَإِنَّ لَهُ مَعِيشَةً ضَنكًا وَنَحْشُرُهُ يَوْمَ الْقِيَامَةِ أَعْمَىٰ
అయితే నా ధ్యానం పట్ల విముఖత చూపినవాడి బ్రతుకు దుర్భరమైపోతుంది. ప్రళయదినాన మేమతన్ని గుడ్డివానిగా చేసి లేపుతాము.”
20:125 قَالَ رَبِّ لِمَ حَشَرْتَنِي أَعْمَىٰ وَقَدْ كُنتُ بَصِيرًا
“ప్రభూ! నన్ను గుడ్డివానిగా చేసి లేపారేమిటీ? నాకు చూపు ఉండేదికదా!” అని అతను అంటాడు.
20:126 قَالَ كَذَٰلِكَ أَتَتْكَ آيَاتُنَا فَنَسِيتَهَا ۖ وَكَذَٰلِكَ الْيَوْمَ تُنسَىٰ
“జరగవలసిన విధంగానే జరిగింది. (ఒకప్పుడు) నీ వద్దకు వచ్చిన మా ఆయతులను (వచనాలను, సూచనలను, మహిమలను) నువ్వు విస్మరించావు. అందుకే ఈనాడు నువ్వు కూడా విస్మరించబడుతున్నావు” అని అనబడుతుంది.
20:127 وَكَذَٰلِكَ نَجْزِي مَنْ أَسْرَفَ وَلَمْ يُؤْمِن بِآيَاتِ رَبِّهِ ۚ وَلَعَذَابُ الْآخِرَةِ أَشَدُّ وَأَبْقَىٰ
హద్దుమీరిపోయి, తన ప్రభువు ఆయతులను విశ్వసించేందుకు నిరాకరించిన ప్రతి ఒక్కరికీ మేము ఇటువంటి ప్రతిఫలాన్నే ఇస్తాము. నిశ్చయంగా పరలోక శిక్ష ఇంతకన్నా కఠినమైనది, ఎప్పటికీ ఉండేది.
20:128 أَفَلَمْ يَهْدِ لَهُمْ كَمْ أَهْلَكْنَا قَبْلَهُم مِّنَ الْقُرُونِ يَمْشُونَ فِي مَسَاكِنِهِمْ ۗ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّأُولِي النُّهَىٰ
వీరికి పూర్వం ఎన్నో సమూహాలను మేము తుదముట్టించాము. వారి నివాస స్థలాలలో (ప్రస్తుతం) వీళ్లు తిరుగుతున్నారు. ఈ విషయం కూడా వారికి సన్మార్గం చూపటం లేదా? నిశ్చయంగా ఇందులో వివేచన గల వారి కొరకు ఎన్నో సూచనలున్నాయి.
20:129 وَلَوْلَا كَلِمَةٌ سَبَقَتْ مِن رَّبِّكَ لَكَانَ لِزَامًا وَأَجَلٌ مُّسَمًّى
నీ ప్రభువు తరఫు నుంచి మాట ముందే ఖరారు కాకుండా, గడువు ముందుగానే నిర్థారించబడకుండా ఉన్నట్లయితే ఇప్పటికిప్పుడే వీళ్లకు, శిక్ష అంటుకొని ఉండేది.
20:130 فَاصْبِرْ عَلَىٰ مَا يَقُولُونَ وَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ قَبْلَ طُلُوعِ الشَّمْسِ وَقَبْلَ غُرُوبِهَا ۖ وَمِنْ آنَاءِ اللَّيْلِ فَسَبِّحْ وَأَطْرَافَ النَّهَارِ لَعَلَّكَ تَرْضَىٰ
కనుక (ఓ ముహమ్మద్!) వారు కల్పించే మాటలపై ఓర్పు వహించు. నీ ప్రభువు స్తోత్రంతో పాటు,ఆయన పవిత్రతను కొనియాడు. సూర్యోదయం కాకముందు, సూర్యాస్తమయానికి ముందు, రాత్రివేళల్లోనూ, పగటి అంచుల్లోనూ ప్రభువును ధ్యానిస్తూ ఉండు. తద్వారా నువ్వు సంతృప్తి చెందే అవకాశం ఉంది.
20:131 وَلَا تَمُدَّنَّ عَيْنَيْكَ إِلَىٰ مَا مَتَّعْنَا بِهِ أَزْوَاجًا مِّنْهُمْ زَهْرَةَ الْحَيَاةِ الدُّنْيَا لِنَفْتِنَهُمْ فِيهِ ۚ وَرِزْقُ رَبِّكَ خَيْرٌ وَأَبْقَىٰ
వారిలోని పలు రకాల జనులకు మేము ఇచ్చిన ప్రాపంచిక జీవిత వైభవాల వైపు ఆశగా చూడకు. వాటి ద్వారా వాళ్లను పరీక్షించటానికే మేము ఆ వస్తువులను వారికి ఇచ్చాము. వాస్తవానికి నీ ప్రభువు ప్రసాదించిన ఉపాధి మాత్రమే మేలైనది, మిగిలి ఉండేదీను.
20:132 وَأْمُرْ أَهْلَكَ بِالصَّلَاةِ وَاصْطَبِرْ عَلَيْهَا ۖ لَا نَسْأَلُكَ رِزْقًا ۖ نَّحْنُ نَرْزُقُكَ ۗ وَالْعَاقِبَةُ لِلتَّقْوَىٰ
నీ కుటుంబీకులకు నమాజు గురించి తాకీదు చెయ్యి. నువ్వు సయితం దానిపై స్థిరంగా ఉండు. మేము నీ నుంచి ఉపాధిని అడగటంలేదు. పైగా మేమే నీకు ఉపాధిని ఇస్తున్నాము. చివరికి మంచి జరిగేది భయభక్తులకే.
20:133 وَقَالُوا لَوْلَا يَأْتِينَا بِآيَةٍ مِّن رَّبِّهِ ۚ أَوَلَمْ تَأْتِهِم بَيِّنَةُ مَا فِي الصُّحُفِ الْأُولَىٰ
“ఈయనగారు తన ప్రభువు తరఫు నుంచి మా దగ్గరకు ఏదన్నా నిదర్శనాన్ని ఎందుకు తీసుకురాడు?” అని వారు అంటున్నారు. ఏమిటీ, పూర్వ గ్రంథాల స్పష్టమైన నిదర్శనం వారి వద్దకు చేరలేదా?
20:134 وَلَوْ أَنَّا أَهْلَكْنَاهُم بِعَذَابٍ مِّن قَبْلِهِ لَقَالُوا رَبَّنَا لَوْلَا أَرْسَلْتَ إِلَيْنَا رَسُولًا فَنَتَّبِعَ آيَاتِكَ مِن قَبْلِ أَن نَّذِلَّ وَنَخْزَىٰ
ఒకవేళ మేము ఇతని (రాక)కి ముందే, ఏదైనా శిక్ష ద్వారా వాళ్ళను అంతమొందించి ఉంటే, “మా ప్రభూ! నువ్వు మా వద్దకు ప్రవక్తను ఎందుకు పంపలేదు? పంపి ఉంటే మేము పరాభవానికి, అవమానానికి లోనవకముందే నీ సూచనలను అనుసరించి ఉండేవాళ్ళం కదా!” అని తప్పకుండా అని ఉండేవారు.
20:135 قُلْ كُلٌّ مُّتَرَبِّصٌ فَتَرَبَّصُوا ۖ فَسَتَعْلَمُونَ مَنْ أَصْحَابُ الصِّرَاطِ السَّوِيِّ وَمَنِ اهْتَدَىٰ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “ప్రతి ఒక్కడూ (ఫలితం కోసం) నిరీక్షిస్తున్నాడు. కాబట్టి మీరు కూడా నిరీక్షించండి. సన్మార్గాన ఉన్నదెవరో, మార్గదర్శకత్వం ఎవరు పొందారో త్వరలోనే మీరు తెలుసుకుంటారు.
21. సూరా అల్ అంబియా (Al-Anbiya)
21:1 اقْتَرَبَ لِلنَّاسِ حِسَابُهُمْ وَهُمْ فِي غَفْلَةٍ مُّعْرِضُونَ
ప్రజల లెక్కల ఘడియ సమీపించింది. అయినప్పటికీ వారు పరధ్యానంలో పడి, విముఖత చూపుతున్నారు.
21:2 مَا يَأْتِيهِم مِّن ذِكْرٍ مِّن رَّبِّهِم مُّحْدَثٍ إِلَّا اسْتَمَعُوهُ وَهُمْ يَلْعَبُونَ
వారి వద్దకు వారి ప్రభువు తరఫు నుంచి క్రొత్తగా ఏ ఉపదేశం వచ్చినా దాన్ని వారు ఆడుకుంటూ వింటారు. (ఆషామాషీగా తీసుకుంటారు).
21:3 لَاهِيَةً قُلُوبُهُمْ ۗ وَأَسَرُّوا النَّجْوَى الَّذِينَ ظَلَمُوا هَلْ هَٰذَا إِلَّا بَشَرٌ مِّثْلُكُمْ ۖ أَفَتَأْتُونَ السِّحْرَ وَأَنتُمْ تُبْصِرُونَ
అసలు వారి హృదయాలు ప్రమత్తతలో పడి ఉన్నాయి. “ఇతనూ మీలాంటి మానవ మాత్రుడే కదా! మరలాంటప్పుడు మీరు చూస్తూ చూస్తూ ఇతని మాయాజాలంలో ఎందుకు పడిపోతున్నారు?” అంటూ ఈ దుర్మార్గులు రహస్య మంతనాలు సాగించారు.
21:4 قَالَ رَبِّي يَعْلَمُ الْقَوْلَ فِي السَّمَاءِ وَالْأَرْضِ ۖ وَهُوَ السَّمِيعُ الْعَلِيمُ
“నా ప్రభువు భూమ్యాకాశాలలోని ప్రతి మాటనూ ఎరిగినవాడు. ఆయన అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు” అని ప్రవక్త అన్నాడు.
21:5 بَلْ قَالُوا أَضْغَاثُ أَحْلَامٍ بَلِ افْتَرَاهُ بَلْ هُوَ شَاعِرٌ فَلْيَأْتِنَا بِآيَةٍ كَمَا أُرْسِلَ الْأَوَّلُونَ
అంతేకాదు, “ఈ ఖుర్ఆన్ పీడకలల పుట్ట. పైగా ఇతను స్వయంగా దీన్ని కల్పించాడు. అదికాదు, అసలితను ఒక కవి. అదే కాకపోతే వెనుకటి ప్రవక్తలు ఇచ్చిపంపబడినట్లుగా ఇతగాడు కూడా మా వద్దకు ఏదైనా సూచనను ఎందుకు తీసుకురాడు?!” అని వారంటున్నారు.
21:6 مَا آمَنَتْ قَبْلَهُم مِّن قَرْيَةٍ أَهْلَكْنَاهَا ۖ أَفَهُمْ يُؤْمِنُونَ
వీరికి మునుపు మేము నాశనం చేసిన ఏ జనవాసం కూడా విశ్వసించలేదు. ఇప్పుడు వీళ్లు మాత్రం విశ్వసిస్తారా?!
21:7 وَمَا أَرْسَلْنَا قَبْلَكَ إِلَّا رِجَالًا نُّوحِي إِلَيْهِمْ ۖ فَاسْأَلُوا أَهْلَ الذِّكْرِ إِن كُنتُمْ لَا تَعْلَمُونَ
(ఓ ముహమ్మద్-సఅసం!) నీకు పూర్వం మేము ప్రవక్తలుగా పంపిన వారంతా పురుషులే. వారివద్దకు మేము మా సందేశాన్ని (వహీని) పంపేవాళ్ళం. ఈ సంగతి మీకు తెలియకపోతే జ్ఞానులను (గ్రంథవహులను) అడిగి తెలుసుకోండి.
21:8 وَمَا جَعَلْنَاهُمْ جَسَدًا لَّا يَأْكُلُونَ الطَّعَامَ وَمَا كَانُوا خَالِدِينَ
మేము వారి శరీరాన్ని వారు అన్నం తినకుండా ఉండగలిగేలా నిర్మించలేదు. వారు ఎల్లకాలం ఉండేవారు కూడా కాదు.
21:9 ثُمَّ صَدَقْنَاهُمُ الْوَعْدَ فَأَنجَيْنَاهُمْ وَمَن نَّشَاءُ وَأَهْلَكْنَا الْمُسْرِفِينَ
ఆ తరువాత మేము వారికి చేసిన వాగ్దానాలన్నింటినీ సత్యమైనవిగా నిరూపించాము. వారినీ, ఇంకా మేము కోరిన వాళ్ళనూ కాపాడాము. హద్దుమీరిపోయిన వారిని మాత్రం అంతమొందించాము.
21:10 لَقَدْ أَنزَلْنَا إِلَيْكُمْ كِتَابًا فِيهِ ذِكْرُكُمْ ۖ أَفَلَا تَعْقِلُونَ
నిశ్చయంగా మేము మీ వద్దకు (ఖుర్ఆన్) గ్రంథాన్ని పంపాము. అందులో మీ కొరకు హితబోధ ఉంది. అయినా మీరు గ్రహించరా?
21:11 وَكَمْ قَصَمْنَا مِن قَرْيَةٍ كَانَتْ ظَالِمَةً وَأَنشَأْنَا بَعْدَهَا قَوْمًا آخَرِينَ
దురాగతాలకు ఒడిగట్టే ఎన్నో జనవాసాలను మేము చెరిగేశాము. వారి తరువాత (వారి స్థానంలో) మేము మరో జాతిని ప్రభవింపజేశాము.
21:12 فَلَمَّا أَحَسُّوا بَأْسَنَا إِذَا هُم مِّنْهَا يَرْكُضُونَ
వారు మా శిక్షను పసిగట్టగానే పలాయనం చిత్తగించారు.
21:13 لَا تَرْكُضُوا وَارْجِعُوا إِلَىٰ مَا أُتْرِفْتُمْ فِيهِ وَمَسَاكِنِكُمْ لَعَلَّكُمْ تُسْأَلُونَ
“పారిపోకండి. మీకు సుఖసౌఖ్యాలు ఇవ్వబడిన చోటికే, మీ విశ్రాంతి నిలయాల వైపే మరలిపోండి – బహుశా మీరు దానిని గురించి ప్రశ్నించబడతారేమో!” (అని వారితో అనబడింది).
21:14 قَالُوا يَا وَيْلَنَا إِنَّا كُنَّا ظَالِمِينَ
(దానికి వారు) “మా పాడుగాను! నిశ్చయంగా మేమే దుర్మార్గులం” అని అనసాగారు.
21:15 فَمَا زَالَت تِّلْكَ دَعْوَاهُمْ حَتَّىٰ جَعَلْنَاهُمْ حَصِيدًا خَامِدِينَ
చివరకు మేము వారిని కోతకోసిన చేనులా, చల్లారిపోయిన అగ్నిలా చేసి వేసేంతవరకూ వారు ఆ విధంగా మొత్తుకుంటూనే ఉండిపోయారు.
21:16 وَمَا خَلَقْنَا السَّمَاءَ وَالْأَرْضَ وَمَا بَيْنَهُمَا لَاعِبِينَ
మేము ఆకాశాన్నీ భూమిని, వాటి మధ్యనున్న సమస్తాన్నీ ఏదో ఆటగా సృష్టించలేదు.
21:17 لَوْ أَرَدْنَا أَن نَّتَّخِذَ لَهْوًا لَّاتَّخَذْنَاهُ مِن لَّدُنَّا إِن كُنَّا فَاعِلِينَ
ఏదో కాలక్షేపం చేసుకోవాలన్న ఉద్దేశమే మాకుంటే, నిజంగానే, మా వద్దనున్న దానితోనే చేసుకుని ఉండేవారము.
21:18 بَلْ نَقْذِفُ بِالْحَقِّ عَلَى الْبَاطِلِ فَيَدْمَغُهُ فَإِذَا هُوَ زَاهِقٌ ۚ وَلَكُمُ الْوَيْلُ مِمَّا تَصِفُونَ
అది కాదు. మేము సత్యాన్ని అసత్యంపై విసరికొడతాము. అది అసత్యం మాడు బద్దలుగొడుతుంది. దాంతో అది (అసత్యం) అంతమయిపోతుంది. మీరు కల్పించే మాటలన్నీ మీ పాలిట వినాశకరంగా పరిణమిస్తాయి సుమా!
21:19 وَلَهُ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ وَمَنْ عِندَهُ لَا يَسْتَكْبِرُونَ عَنْ عِبَادَتِهِ وَلَا يَسْتَحْسِرُونَ
భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ ఆయనదే. ఆయన వద్ద ఉన్నవారు ఆయన్ని ఆరాధించటం పట్ల గర్వం ప్రదర్శించరు. (ఆయన దాస్యం చేస్తూ) అలసిపోరు.
21:20 يُسَبِّحُونَ اللَّيْلَ وَالنَّهَارَ لَا يَفْتُرُونَ
వారు రేయింబవళ్లు ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉంటారు. ఏమాత్రం బద్దకం కూడా చూపరు.
21:21 أَمِ اتَّخَذُوا آلِهَةً مِّنَ الْأَرْضِ هُمْ يُنشِرُونَ
ఏమిటీ, వీరు భువిలో దేవుళ్ళుగా కల్పించుకున్నవారు వీరిని సజీవులుగా చేసి నిలబెడతారా?
21:22 لَوْ كَانَ فِيهِمَا آلِهَةٌ إِلَّا اللَّهُ لَفَسَدَتَا ۚ فَسُبْحَانَ اللَّهِ رَبِّ الْعَرْشِ عَمَّا يَصِفُونَ
ఒకవేళ భూమ్యాకాశాలలో అల్లాహ్ గాక ఇతర దేవుళ్ళు కూడా ఉండి ఉంటే ఈ రెండింటిలో అరాచకం ఏర్పడేది. కాబట్టి సింహాసనానికి (అర్ష్‌కు) అధిపతి అయిన అల్లాహ్ వారు కల్పించే భాగస్వామ్య (షిర్క్) విషయాలన్నింటికీ అతీతుడు, పవిత్రుడు.
21:23 لَا يُسْأَلُ عَمَّا يَفْعَلُ وَهُمْ يُسْأَلُونَ
ఆయన తాను చేసే పనులకు (ఎవరికీ) జవాబుదారు కాడు. అయితే అందరూ (ఆయన ముందు) జవాబుదారులే.
21:24 أَمِ اتَّخَذُوا مِن دُونِهِ آلِهَةً ۖ قُلْ هَاتُوا بُرْهَانَكُمْ ۖ هَٰذَا ذِكْرُ مَن مَّعِيَ وَذِكْرُ مَن قَبْلِي ۗ بَلْ أَكْثَرُهُمْ لَا يَعْلَمُونَ الْحَقَّ ۖ فَهُم مُّعْرِضُونَ
ఏమిటీ, వారు అల్లాహ్‌ను కాకుండా ఇతర దేవుళ్ళను కూడా కల్పించుకున్నారా? ఒకవేళ వారలాచేస్తే, “మీరు మీ ప్రమాణాన్ని సమర్పించండి. ఇది నా సహచరుల గ్రంథం. నా పూర్వీకుల నిదర్శనం” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు. అసలు విషయం ఏమిటంటే వారిలో చాలామందికి యదార్థం తెలియదు. అందుకే వారు విముఖులై ఉన్నారు.
21:25 وَمَا أَرْسَلْنَا مِن قَبْلِكَ مِن رَّسُولٍ إِلَّا نُوحِي إِلَيْهِ أَنَّهُ لَا إِلَٰهَ إِلَّا أَنَا فَاعْبُدُونِ
నీకు పూర్వం మేము ఏ ప్రవక్తను పంపినా, “నేను తప్ప మరో ఆరాధ్యుడు లేడు, కనుక మీరు నన్నే ఆరాధించండి” అనే సందేశాన్ని (వహీని) అతనికి పంపాము.
21:26 وَقَالُوا اتَّخَذَ الرَّحْمَٰنُ وَلَدًا ۗ سُبْحَانَهُ ۚ بَلْ عِبَادٌ مُّكْرَمُونَ
కరుణామయునికి సంతానం ఉందని వారు (ముష్రిక్కులు) చెబుతున్నారు. (ఇది నిజం కాదు) ఆయన పవిత్రుడు. పైగా వారంతా (దైవదూతలంతా) గౌరవించబడిన ఆయన దాసులు.
21:27 لَا يَسْبِقُونَهُ بِالْقَوْلِ وَهُم بِأَمْرِهِ يَعْمَلُونَ
ఏ విషయంలోనూ వారు ఆయనకంటే ముందు మాట్లాడరు. పైగా ఆయన ఆజ్ఞను ఖచ్చితంగా పాటిస్తారు.
21:28 يَعْلَمُ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ وَلَا يَشْفَعُونَ إِلَّا لِمَنِ ارْتَضَىٰ وَهُم مِّنْ خَشْيَتِهِ مُشْفِقُونَ
వారికి ముందున్నవాటి గురించి, వెనుక ఉన్న వాటి గురించి కూడా ఆయనకు తెలుసు. సిఫారసు వినటానికి అల్లాహ్ ఇష్టపడిన వారి విషయంలో తప్ప వారు ఎవరి గురించి కూడా సిఫారసు చేయజాలరు. వారు స్వయంగా అల్లాహ్ రౌద్రానికి భీతిల్లుతూ ఉంటారు.
21:29 وَمَن يَقُلْ مِنْهُمْ إِنِّي إِلَٰهٌ مِّن دُونِهِ فَذَٰلِكَ نَجْزِيهِ جَهَنَّمَ ۚ كَذَٰلِكَ نَجْزِي الظَّالِمِينَ
వారిలో ఎవరయినా “అల్లాహ్‌తో పాటు నేనూ పూజ్యుడినే” అని అంటే మేమతన్ని నరకయాతనకు గురి చేస్తాము. మేము దుర్మార్గులకు వొసగే ప్రతిఫలం ఇదే.
21:30 أَوَلَمْ يَرَ الَّذِينَ كَفَرُوا أَنَّ السَّمَاوَاتِ وَالْأَرْضَ كَانَتَا رَتْقًا فَفَتَقْنَاهُمَا ۖ وَجَعَلْنَا مِنَ الْمَاءِ كُلَّ شَيْءٍ حَيٍّ ۖ أَفَلَا يُؤْمِنُونَ
భూమ్యాకాశాలు కలిసి వుండగా, మేము వాటిని విడదీసినవైనాన్ని తిరస్కారులు చూడలేదా? ఇంకా, ప్రాణమున్న ప్రతి దానినీ మేము నీటితోనే చేశాము. అయినప్పటికీ వీళ్లు విశ్వసించరా?
21:31 وَجَعَلْنَا فِي الْأَرْضِ رَوَاسِيَ أَن تَمِيدَ بِهِمْ وَجَعَلْنَا فِيهَا فِجَاجًا سُبُلًا لَّعَلَّهُمْ يَهْتَدُونَ
భూమి వారిని కుదిపివేయకుండా ఉండటానికని మేము అందులో పర్వతాలను చేశాము. వారు తమ మార్గాలను పొందటానికి అందులో సువిశాలమైన రహదార్లను ఏర్పరచాము.
21:32 وَجَعَلْنَا السَّمَاءَ سَقْفًا مَّحْفُوظًا ۖ وَهُمْ عَنْ آيَاتِهَا مُعْرِضُونَ
మరి ఆకాశాన్ని సురక్షితమైన కప్పుగా చేసినది కూడా మేమే. కాని ప్రజలు దాని సూచనలపై (పనితనంపై, సృష్టి ప్రక్రియపై) బొత్తిగా ధ్యాస కనబరచరు.
21:33 وَهُوَ الَّذِي خَلَقَ اللَّيْلَ وَالنَّهَارَ وَالشَّمْسَ وَالْقَمَرَ ۖ كُلٌّ فِي فَلَكٍ يَسْبَحُونَ
రేయింబవళ్లనూ, సూర్యచంద్రులనూ సృష్టించినవాడు కూడా ఆయనే. వాటిలో ప్రతిదీ తన తన కక్ష్యలో తేలియాడుతూ ఉంది.
21:34 وَمَا جَعَلْنَا لِبَشَرٍ مِّن قَبْلِكَ الْخُلْدَ ۖ أَفَإِن مِّتَّ فَهُمُ الْخَالِدُونَ
(ఓ ప్రవక్తా!) నీకు పూర్వం కూడా మేము ఏ మానవుణ్ణీ శాశ్వతంగా జీవించి ఉండేట్లుగా చేయలేదు. ఒకవేళ నువ్వు చనిపోతే, వాళ్లు మాత్రం శాశ్వతంగా బ్రతికి ఉంటారా ఏమిటీ?
21:35 كُلُّ نَفْسٍ ذَائِقَةُ الْمَوْتِ ۗ وَنَبْلُوكُم بِالشَّرِّ وَالْخَيْرِ فِتْنَةً ۖ وَإِلَيْنَا تُرْجَعُونَ
ప్రతి ప్రాణీ మృత్యువును చవి చూడవలసిందే. మేము మిమ్మల్ని పరీక్షించే నిమిత్తం కష్టసుఖాలకు (కలిమి లేములకు) గురిచేస్తూ ఉంటాము. ఎట్టకేలకు మీరు మా వద్దకే మరలించబడతారు.
21:36 وَإِذَا رَآكَ الَّذِينَ كَفَرُوا إِن يَتَّخِذُونَكَ إِلَّا هُزُوًا أَهَٰذَا الَّذِي يَذْكُرُ آلِهَتَكُمْ وَهُم بِذِكْرِ الرَّحْمَٰنِ هُمْ كَافِرُونَ
ఈ అవిశ్వాసులు నిన్ను చూసినప్పుడల్లా నిన్ను ఎగతాళి చేయటం తప్ప వారికి వేరే పనీపాటాలేదు. “మీ దేవుళ్లను గురించి (చెడుగా) ప్రస్తావించేది ఈయన గారేనా!?” అని (వెటకారంగా) వారంటారు. మరి (చూడబోతే) కరుణామయుని ప్రస్తావన రాగానే తిరస్కారానికి పాల్పడుతున్నది వారే.
21:37 خُلِقَ الْإِنسَانُ مِنْ عَجَلٍ ۚ سَأُرِيكُمْ آيَاتِي فَلَا تَسْتَعْجِلُونِ
మానవుడు మహా తొందరపాటు స్వభావిగా పుట్టించబడ్డాడు. మీకు నా సూచనలను ఇప్పుడే చూపిస్తాను-కనుక నన్ను తొందర పెట్టకండి.
21:38 وَيَقُولُونَ مَتَىٰ هَٰذَا الْوَعْدُ إِن كُنتُمْ صَادِقِينَ
“మీరు సత్యవంతులే అయితే ఆ వాగ్దానం ఎప్పుడు సంభవిస్తుందో చెప్పండి?” అని వారు అంటున్నారు.
21:39 لَوْ يَعْلَمُ الَّذِينَ كَفَرُوا حِينَ لَا يَكُفُّونَ عَن وُجُوهِهِمُ النَّارَ وَلَا عَن ظُهُورِهِمْ وَلَا هُمْ يُنصَرُونَ
ఆ సమయంలో తాము ఈ నరకాగ్నిని తమ ముఖాల నుంచి గానీ, తమ వీపుల నుంచి గానీ తొలగించజాలరనీ, తమకు సహాయం కూడా అందజాలదనీ అవిశ్వాసులు తెలుసుకుంటే ఎంత బావుంటుంది!
21:40 بَلْ تَأْتِيهِم بَغْتَةً فَتَبْهَتُهُمْ فَلَا يَسْتَطِيعُونَ رَدَّهَا وَلَا هُمْ يُنظَرُونَ
(అవును!) ఆ ఘడియ అకస్మాత్తుగా వారిపై వచ్చిపడుతుంది. అది వారిని ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది. మరి వారు దాన్ని దాట వేయనూ లేరు, కొద్దిపాటి గడువు కూడా వారికి ఇవ్వబడదు.
21:41 وَلَقَدِ اسْتُهْزِئَ بِرُسُلٍ مِّن قَبْلِكَ فَحَاقَ بِالَّذِينَ سَخِرُوا مِنْهُم مَّا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ
(ఓ ముహమ్మద్ – సఅసం!) నీకు పూర్వం వచ్చిన ప్రవక్తలను కూడా పరిహసించటం జరిగింది. అయితే చివరికి పరిహసిస్తూ ఉన్నవారికే, తాము పరిహసించినది చుట్టుకున్నది.
21:42 قُلْ مَن يَكْلَؤُكُم بِاللَّيْلِ وَالنَّهَارِ مِنَ الرَّحْمَٰنِ ۗ بَلْ هُمْ عَن ذِكْرِ رَبِّهِم مُّعْرِضُونَ
“(ఓ ప్రవక్తా!) కరుణామయుని (ఆగ్రహం) నుంచి రేయీ పగలూ మిమ్మల్ని రక్షించగల వాడెవడు?” అని వారిని అడుగు. అసలు విషయమేమిటంటే వాళ్లు తమ ప్రభువు ధ్యానం పట్ల విముఖులై ఉన్నారు.
21:43 أَمْ لَهُمْ آلِهَةٌ تَمْنَعُهُم مِّن دُونِنَا ۚ لَا يَسْتَطِيعُونَ نَصْرَ أَنفُسِهِمْ وَلَا هُم مِّنَّا يُصْحَبُونَ
ఏమిటీ, మేము తప్ప వారిని ఆపదల నుంచి కాపాడే వేరే దేవుళ్లు కూడా ఎవరయినా ఉన్నారా? వారు స్వయంగా తమకు సహాయం చేసుకునే శక్తిని కలిగిలేరు. మా తరఫున కూడా వారికెలాంటి అండదండలూ లేవు.
21:44 بَلْ مَتَّعْنَا هَٰؤُلَاءِ وَآبَاءَهُمْ حَتَّىٰ طَالَ عَلَيْهِمُ الْعُمُرُ ۗ أَفَلَا يَرَوْنَ أَنَّا نَأْتِي الْأَرْضَ نَنقُصُهَا مِنْ أَطْرَافِهَا ۚ أَفَهُمُ الْغَالِبُونَ
పైగా మేము వారికీ, వారి తాత ముత్తాతలకూ జీవన సామగ్రిని ఇచ్చాము. చివరికి (దాన్ని అనుభవిస్తూనే) వారి ఆయుషు గడచిపోయింది. మేము భూమిని దాని అంచుల నుంచి కుదించుకుంటూ రావటాన్నివారు చూడటం లేదా? ఏమిటి, ఇప్పటికీ వీళ్ళే ప్రాబల్యం వహిస్తారటనా?
21:45 قُلْ إِنَّمَا أُنذِرُكُم بِالْوَحْيِ ۚ وَلَا يَسْمَعُ الصُّمُّ الدُّعَاءَ إِذَا مَا يُنذَرُونَ
(ఓ ప్రవక్తా!) “నేను మిమ్మల్ని కేవలం దైవసందేశం (వహీ) ఆధారంగా హెచ్చరిస్తున్నాను” అని వారికి చెప్పు. అయితే తమను హెచ్చరించినప్పుడు, చెవిటివారు ఆ పిలుపును వినరు.
21:46 وَلَئِن مَّسَّتْهُمْ نَفْحَةٌ مِّنْ عَذَابِ رَبِّكَ لَيَقُولُنَّ يَا وَيْلَنَا إِنَّا كُنَّا ظَالِمِينَ
ఒకవేళ నీ ప్రభువు శిక్షా తాకిడి వారికి ఏ కాస్త తగిలినా “అయ్యో! మా పాడుగాను! ముమ్మాటికీ మేమే దుర్మార్గులం” అని హాహాకారాలు చేస్తారు.
21:47 وَنَضَعُ الْمَوَازِينَ الْقِسْطَ لِيَوْمِ الْقِيَامَةِ فَلَا تُظْلَمُ نَفْسٌ شَيْئًا ۖ وَإِن كَانَ مِثْقَالَ حَبَّةٍ مِّنْ خَرْدَلٍ أَتَيْنَا بِهَا ۗ وَكَفَىٰ بِنَا حَاسِبِينَ
మేము ప్రళయదినాన న్యాయంగా తూచే త్రాసులను నెలకొల్పుతాము. మరి ఏ ప్రాణికీ రవంత అన్యాయం కూడా జరగదు. ఒకవేళ ఆవగింజంత ఆచరణ ఉన్నా మేము దానిని హాజరు పరుస్తాము. లెక్క తీసుకోవటానికి మేము చాలు.
21:48 وَلَقَدْ آتَيْنَا مُوسَىٰ وَهَارُونَ الْفُرْقَانَ وَضِيَاءً وَذِكْرًا لِّلْمُتَّقِينَ
మేము మూసా, హారూనులకు తీర్పులు చేసే గీటురాయిని, జ్యోతినీ, భయభక్తులు గలవారికి హితోపదేశంతో కూడిన గ్రంథాన్నీ ఇచ్చాము.
21:49 الَّذِينَ يَخْشَوْنَ رَبَّهُم بِالْغَيْبِ وَهُم مِّنَ السَّاعَةِ مُشْفِقُونَ
తమ ప్రభువును చూడకుండానే భయపడే భక్తులు వారు. ప్రళయ ఘడియపట్ల (గల తలంపుతోనే) వారు వణికిపోతారు.
21:50 وَهَٰذَا ذِكْرٌ مُّبَارَكٌ أَنزَلْنَاهُ ۚ أَفَأَنتُمْ لَهُ مُنكِرُونَ
ఇది శుభప్రదమైన ఉపదేశం. దీనిని అవతరింపజేసినది కూడా మేమే. అయినా మీరు దీనిని త్రోసిపుచ్చుతున్నారా?
21:51 وَلَقَدْ آتَيْنَا إِبْرَاهِيمَ رُشْدَهُ مِن قَبْلُ وَكُنَّا بِهِ عَالِمِينَ
అంతకుముందే మేము ఇబ్రాహీముకు అతని మార్గదర్శకత్వాన్ని (ప్రజ్ఞను) ప్రసాదించాము. అతని (యోగ్యత) గురించి మాకు ముందు నుంచే బాగా తెలుసు.
21:52 إِذْ قَالَ لِأَبِيهِ وَقَوْمِهِ مَا هَٰذِهِ التَّمَاثِيلُ الَّتِي أَنتُمْ لَهَا عَاكِفُونَ
అతను తన తండ్రితో, తన జాతి వారితో, “ఇంతకీ మీరు ఇంతటి శ్రద్ధాభక్తులతో పూజిస్తూ కూర్చున్న ఈ విగ్రహాల సంగతేమిటీ?” అని అడిగినప్పుడు,
21:53 قَالُوا وَجَدْنَا آبَاءَنَا لَهَا عَابِدِينَ
“మా తాతముత్తాతలు వీటిని పూజిస్తూ ఉండగా మేము చూసి ఉన్నాము” అని వారంతా సమాధానమిచ్చారు.
21:54 قَالَ لَقَدْ كُنتُمْ أَنتُمْ وَآبَاؤُكُمْ فِي ضَلَالٍ مُّبِينٍ
“అలాగయితే మీరూ, మీ తాత ముత్తాతలంతా స్పష్టమైన అపమార్గానికి లోనై ఉన్నారు” అని అతను అన్నాడు.
21:55 قَالُوا أَجِئْتَنَا بِالْحَقِّ أَمْ أَنتَ مِنَ اللَّاعِبِينَ
“ఏమిటీ? నువ్వు మా వద్దకు నిజంగానే సత్యం తీసుకుని వచ్చావా? లేక ఇట్టే ఆటపట్టిస్తున్నావా?” అని అడిగారు వారు.
21:56 قَالَ بَل رَّبُّكُمْ رَبُّ السَّمَاوَاتِ وَالْأَرْضِ الَّذِي فَطَرَهُنَّ وَأَنَا عَلَىٰ ذَٰلِكُم مِّنَ الشَّاهِدِينَ
అతను ఇలా చెప్పాడు: “కాదు, వాస్తవానికి భూమ్యాకాశాల ప్రభువే మీ ప్రభువు. ఆయనే వాటిని సృష్టించాడు. ఈ విషయానికి సాక్ష్యమిచ్చే వారిలో నేనూ ఒకణ్ణి.
21:57 وَتَاللَّهِ لَأَكِيدَنَّ أَصْنَامَكُم بَعْدَ أَن تُوَلُّوا مُدْبِرِينَ
“అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను. మీరు వెనుతిరిగి వెళ్ళి పోయిన తరువాత నేను మీ విగ్రహాల అంతు చూస్తాను.”
21:58 فَجَعَلَهُمْ جُذَاذًا إِلَّا كَبِيرًا لَّهُمْ لَعَلَّهُمْ إِلَيْهِ يَرْجِعُونَ
ఆ తరువాత అతను వాటన్నింటినీ ముక్కలు ముక్కలుగా పగులగొట్టాడు. అయితే పెద్ద విగ్రహాన్ని మాత్రం విడిచి పెట్టాడు. వారంతా దానివైపు మరలటానికే (అలా చేశాడు).
21:59 قَالُوا مَن فَعَلَ هَٰذَا بِآلِهَتِنَا إِنَّهُ لَمِنَ الظَّالِمِينَ
“మా దేవుళ్లకు ఈ దుర్గతిని పట్టించిందెవరు? వాడెవడో నిజంగా పెద్ద దుర్మార్గుడే” అని వారు అనసాగారు.
21:60 قَالُوا سَمِعْنَا فَتًى يَذْكُرُهُمْ يُقَالُ لَهُ إِبْرَاهِيمُ
“ఒక యువకుడు మా విగ్రహాలను గురించి (చెడుగా) ప్రస్తావించటం మేము విన్నాము. అతను ఇబ్రాహీంగా పిలువ బడతాడు” అని కొందరు చెప్పారు.
21:61 قَالُوا فَأْتُوا بِهِ عَلَىٰ أَعْيُنِ النَّاسِ لَعَلَّهُمْ يَشْهَدُونَ
“అయితే అతన్ని ప్రజలందరి సమక్షంలోకి తీసుకురండి, అందరూ అతనికి ప్రత్యక్ష సాక్ష్యంగా ఉంటార”ని అన్నారు.
21:62 قَالُوا أَأَنتَ فَعَلْتَ هَٰذَا بِآلِهَتِنَا يَا إِبْرَاهِيمُ
“ఓ ఇబ్రాహీం! మా విగ్రహాలకు ఈ (దు)స్థితిని కలిగించింది నువ్వేనా?” అని అతన్ని అడిగారు.
21:63 قَالَ بَلْ فَعَلَهُ كَبِيرُهُمْ هَٰذَا فَاسْأَلُوهُمْ إِن كَانُوا يَنطِقُونَ
“ఆహా! ఆ పనిని వీళ్ళ పెద్దాయనే చేశాడు. ఒకవేళ వాళ్లు చెప్పగలిగితే వాళ్లనే అడిగి తెలుసుకోండి” అన్నాడు ఇబ్రాహీం.
21:64 فَرَجَعُوا إِلَىٰ أَنفُسِهِمْ فَقَالُوا إِنَّكُمْ أَنتُمُ الظَّالِمُونَ
దాంతో వారు మనసుల్లోనే (వాస్తవాన్ని ఒప్పుకుని,)” అసలు దుర్మార్గులు మీరే కదా!” అని (పరస్పరం) గొణుక్కున్నారు.
21:65 ثُمَّ نُكِسُوا عَلَىٰ رُءُوسِهِمْ لَقَدْ عَلِمْتَ مَا هَٰؤُلَاءِ يَنطِقُونَ
కాని తరువాత వారి బుద్ధి తలక్రిందులైంది; “ఇవి మాట్లాడలేవన్న సంగతి నీకూ తెలుసు కదా!” అన్నారు వారు.
21:66 قَالَ أَفَتَعْبُدُونَ مِن دُونِ اللَّهِ مَا لَا يَنفَعُكُمْ شَيْئًا وَلَا يَضُرُّكُمْ
(ఇబ్రాహీమ్ అప్పటికప్పుడే) అడిగేశాడు : “(మీ పరిస్థితి కడు శోచనీయం!) మీరు అల్లాహ్‌ను వదలి మీకు ఏమాత్రం లాభం గానీ, నష్టంగానీ కలిగించలేని వాటిని పూజిస్తున్నారా?”
21:67 أُفٍّ لَّكُمْ وَلِمَا تَعْبُدُونَ مِن دُونِ اللَّهِ ۖ أَفَلَا تَعْقِلُونَ
“ధూత్కారం, మీపైనా, అల్లాహ్‌ను కాదని మీరు పూజించే దేవుళ్ళపైనా. మీకు ఈపాటి ఇంగిత జ్ఞానం కూడా లేదా?”
21:68 قَالُوا حَرِّقُوهُ وَانصُرُوا آلِهَتَكُمْ إِن كُنتُمْ فَاعِلِينَ
(దానికి వారి అహం దెబ్బతిన్నది) “మీరేదన్నా చేయాలనే అనుకుంటే ఇతన్ని అగ్నికి ఆహుతి చేయండి. మీ దేవుళ్లకు సహాయంగా నిలబడండి” అని వారన్నారు.
21:69 قُلْنَا يَا نَارُ كُونِي بَرْدًا وَسَلَامًا عَلَىٰ إِبْرَاهِيمَ
“ఓ అగ్నీ, నువ్వు ఇబ్రాహీమ్ కొరకు చల్లగానూ, సురక్షితం గానూ మారిపో” అని మేము ఆదేశించాము.
21:70 وَأَرَادُوا بِهِ كَيْدًا فَجَعَلْنَاهُمُ الْأَخْسَرِينَ
వారు ఇబ్రాహీముకు కీడు చేయాలనుకున్నారు. కాని మేము వాళ్ళనే ఎక్కువగా నష్టానికి గురిచేశాము.
21:71 وَنَجَّيْنَاهُ وَلُوطًا إِلَى الْأَرْضِ الَّتِي بَارَكْنَا فِيهَا لِلْعَالَمِينَ
మేము అతనినీ, లూతునూ కాపాడి, లోకవాసుల కోసం శుభాలను పొందుపరచిన భూభాగం వైపుకు తీసుకువెళ్ళాము.
21:72 وَوَهَبْنَا لَهُ إِسْحَاقَ وَيَعْقُوبَ نَافِلَةً ۖ وَكُلًّا جَعَلْنَا صَالِحِينَ
ఇంకా మేము అతనికి (ఇబ్రాహీమునకు) ఇస్హాఖును ప్రసాదించాము. ఆపైన అదనంగా (మనవడిగా) యాఖూబును కూడా అనుగ్రహించాము. వారందరినీ సద్వర్తనులుగా చేశాము.
21:73 وَجَعَلْنَاهُمْ أَئِمَّةً يَهْدُونَ بِأَمْرِنَا وَأَوْحَيْنَا إِلَيْهِمْ فِعْلَ الْخَيْرَاتِ وَإِقَامَ الصَّلَاةِ وَإِيتَاءَ الزَّكَاةِ ۖ وَكَانُوا لَنَا عَابِدِينَ
ఇంకా – మా ఆదేశానుసారం ప్రజలకు మార్గదర్శకత్వం వహించటానికి మేము వారిని ఇమాములు (నాయకులు)గా తీర్చిదిద్దాము. పుణ్యకార్యాలు చేస్తూ ఉండాలనీ, నమాజులను నెలకొల్పుతూ ఉండాలనీ, జకాత్ (దానాన్ని) చెల్లిస్తూ ఉండాలనీ మేము వారికి సూచించాము (వారి వైపుకు వహీ పంపాము). వారంతా మమ్మల్నే ఆరాధించేవారు.
21:74 وَلُوطًا آتَيْنَاهُ حُكْمًا وَعِلْمًا وَنَجَّيْنَاهُ مِنَ الْقَرْيَةِ الَّتِي كَانَت تَّعْمَلُ الْخَبَائِثَ ۗ إِنَّهُمْ كَانُوا قَوْمَ سَوْءٍ فَاسِقِينَ
మేము లూతు (అలైహిస్సలాం)కు నిర్ణయం గైకొనే శక్తినీ, జ్ఞానాన్నీ ప్రసాదించాము. నీతిమాలిన పనులకు లోనై ఉన్న జనవాసం బారి నుంచి అతనికి విముక్తిని కల్పించాము. ఆ జాతి వారు పరమ నీచులు, అవిధేయులు.
21:75 وَأَدْخَلْنَاهُ فِي رَحْمَتِنَا ۖ إِنَّهُ مِنَ الصَّالِحِينَ
మేము లూతును మా కారుణ్యంలో చేర్చుకున్నాము. నిశ్చయంగా అతను సజ్జనుల కోవకు చెందినవాడు.
21:76 وَنُوحًا إِذْ نَادَىٰ مِن قَبْلُ فَاسْتَجَبْنَا لَهُ فَنَجَّيْنَاهُ وَأَهْلَهُ مِنَ الْكَرْبِ الْعَظِيمِ
అంతకుముందు నూహ్ మొరపెట్టుకున్నప్పటి సమయాన్ని కూడా గుర్తు చేసుకోండి. మేము అతని మొరను ఆలకించి ఆమోదిం చాము. అతన్నీ, అతని ఇంటి వారినీ తీవ్రమైన వ్యధ నుంచి కాపాడాము.
21:77 وَنَصَرْنَاهُ مِنَ الْقَوْمِ الَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا ۚ إِنَّهُمْ كَانُوا قَوْمَ سَوْءٍ فَأَغْرَقْنَاهُمْ أَجْمَعِينَ
మా ఆయతులను ధిక్కరిస్తూ వచ్చిన జాతికి వ్యతిరేకంగా మేము అతనికి సహాయం చేశాము. నిశ్చయంగా ఆ జాతి వారు పాపాత్ములు. అందుకే మేము వారందరినీ ముంచివేశాము.
21:78 وَدَاوُودَ وَسُلَيْمَانَ إِذْ يَحْكُمَانِ فِي الْحَرْثِ إِذْ نَفَشَتْ فِيهِ غَنَمُ الْقَوْمِ وَكُنَّا لِحُكْمِهِمْ شَاهِدِينَ
దావూదు, సులైమానులను కూడా (జ్ఞప్తికి తెచ్చుకోండి). కొందరి మేకలు రాత్రి పూట పొలంలో పడి మేయగా, ఆ పొలం విషయంలో వారిద్దరూ తీర్పు చేస్తున్నప్పుడు, ఆ తీర్పునంతటినీ మేము గమనిస్తూనే ఉన్నాము.
21:79 فَفَهَّمْنَاهَا سُلَيْمَانَ ۚ وَكُلًّا آتَيْنَا حُكْمًا وَعِلْمًا ۚ وَسَخَّرْنَا مَعَ دَاوُودَ الْجِبَالَ يُسَبِّحْنَ وَالطَّيْرَ ۚ وَكُنَّا فَاعِلِينَ
మరి (ఆ సమయంలో ఆ వివాదంపై) మేము సులైమానుకు సరైన అవగాహనను కలుగజేశాము. ఆ మాటకొస్తే వారిలో ప్రతి ఒక్కరికీ మేము నిర్ణయం తీసుకునే శక్తినీ, జ్ఞానాన్నీఇచ్చి ఉన్నాము. మేము దావూదుతోపాటు పర్వతాలు, పక్షులు అతనికి లోబడి (దైవ) స్తోత్రం చేసేవిగా చేశాము. ఇదంతా చేసినది మేమే.
21:80 وَعَلَّمْنَاهُ صَنْعَةَ لَبُوسٍ لَّكُمْ لِتُحْصِنَكُم مِّن بَأْسِكُمْ ۖ فَهَلْ أَنتُمْ شَاكِرُونَ
మీ కోసం ఒక (ప్రత్యేక) వస్త్రాన్ని అల్లే కళను మేమతనికి నేర్పాము – తద్వారా మీరు యుద్ధంలో (వేటు పడకుండా) రక్షణ పొందటానికి! మరి మీరు కృతజ్ఞులుగా మసలుకుంటున్నారా?
21:81 وَلِسُلَيْمَانَ الرِّيحَ عَاصِفَةً تَجْرِي بِأَمْرِهِ إِلَى الْأَرْضِ الَّتِي بَارَكْنَا فِيهَا ۚ وَكُنَّا بِكُلِّ شَيْءٍ عَالِمِينَ
ఇంకా మేము ప్రచండ వేగంతో వీచే గాలిని సులైమానుకు లోబరచాము. అది అతని ఆజ్ఞలననుసరించి, మేము శుభాలను ప్రోదిచేసిన భూభాగం వైపుకు నడిచేది. అన్ని విషయాలూ మా జ్ఞాన పరిధిలో ఉన్నాయి.
21:82 وَمِنَ الشَّيَاطِينِ مَن يَغُوصُونَ لَهُ وَيَعْمَلُونَ عَمَلًا دُونَ ذَٰلِكَ ۖ وَكُنَّا لَهُمْ حَافِظِينَ
అలాగే ఎన్నో షైతానులను కూడా మేము అతని అదుపాజ్ఞలలో ఉంచాము. అతని కోసం అవి (సముద్రంలో) మునకలు వేసేవి. ఇది గాకుండా ఇంకా ఇతరత్రా ఎన్నో పనులు కూడా చేసి పెట్టేవి. వాటన్నింటినీ మేమే పర్యవేక్షిస్తూ ఉండేవారం.
21:83 وَأَيُّوبَ إِذْ نَادَىٰ رَبَّهُ أَنِّي مَسَّنِيَ الضُّرُّ وَأَنتَ أَرْحَمُ الرَّاحِمِينَ
మరి అయ్యూబు (స్థితిని గురించి కూడా ఓసారి మననం చేసుకోండి). అతను “నాకు ఈ వ్యాధి సోకింది. నువ్వు కరుణించే వారందరిలోకీ అపారంగా కరుణించేవాడవు” అని తన ప్రభువును మొరపెట్టుకున్నప్పుడు,
21:84 فَاسْتَجَبْنَا لَهُ فَكَشَفْنَا مَا بِهِ مِن ضُرٍّ ۖ وَآتَيْنَاهُ أَهْلَهُ وَمِثْلَهُم مَّعَهُمْ رَحْمَةً مِّنْ عِندِنَا وَذِكْرَىٰ لِلْعَابِدِينَ
మేము అతని ప్రార్థనను ఆలకించి, ఆమోదించాము. అతని బాధను దూరం చేశాము. అతనికి అతని ఇంటివారలను ప్రసాదించాము. పైగా వారితోపాటు వారిని పోలిన మరి అంతే మందిని మా ప్రత్యేక కటాక్షంతో అతనికి వొసగాము – నికార్సయిన దాసుల కొరకు ఇదొక గుణపాఠం కావాలని!
21:85 وَإِسْمَاعِيلَ وَإِدْرِيسَ وَذَا الْكِفْلِ ۖ كُلٌّ مِّنَ الصَّابِرِينَ
ఇంకా ఇస్మాయీలు, ఇద్రీసు, జుల్కిఫ్ల్(లను కూడా జ్ఞప్తికి తెచ్చుకోండి). వారంతా సహనశీలుర కోవకు చెందినవారు.
21:86 وَأَدْخَلْنَاهُمْ فِي رَحْمَتِنَا ۖ إِنَّهُم مِّنَ الصَّالِحِينَ
మేము వారందరినీ మా కారుణ్యం లోనికి చేర్చుకున్నాము. ఎందుకంటే వారందరూ సజ్జనుల కోవకు చెందినవారు.
21:87 وَذَا النُّونِ إِذ ذَّهَبَ مُغَاضِبًا فَظَنَّ أَن لَّن نَّقْدِرَ عَلَيْهِ فَنَادَىٰ فِي الظُّلُمَاتِ أَن لَّا إِلَٰهَ إِلَّا أَنتَ سُبْحَانَكَ إِنِّي كُنتُ مِنَ الظَّالِمِينَ
చేపవాడు (యూనుస్ అలైహిస్సలాం) కోపగించుకుని వెళ్ళిపోయినప్పటి స్థితి(ని కూడా జ్ఞప్తికి తెచ్చుకోండి.) మేము తనను పట్టుకోలేమని అతడు భావించాడు. ఆఖరికి అతను చీకట్లలో నుంచి, “అల్లాహ్! నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. నీవు పవిత్రుడవు. నిజానికి నేనే దోషులలో చేరిన వాణ్ణి” అని మొరపెట్టుకున్నాడు.
21:88 فَاسْتَجَبْنَا لَهُ وَنَجَّيْنَاهُ مِنَ الْغَمِّ ۚ وَكَذَٰلِكَ نُنجِي الْمُؤْمِنِينَ
అందువల్ల మేము అతని మొరను ఆలకించాము. దుఃఖం నుంచి అతనికి విముక్తిని కల్పించాము. విశ్వాసులను మేము ఇలాగే కాపాడుతాము.
21:89 وَزَكَرِيَّا إِذْ نَادَىٰ رَبَّهُ رَبِّ لَا تَذَرْنِي فَرْدًا وَأَنتَ خَيْرُ الْوَارِثِينَ
జకరియ్యా (వృత్తాంతాన్నికూడా స్మరించుకోండి). అతను తన ప్రభువుతో, “నా ప్రభూ! నన్ను ఒంటరివానిగా వదలకు. నీవు అందరికన్నా అత్యుత్తమ వారసుడవు” అని మొరపెట్టుకున్నాడు.
21:90 فَاسْتَجَبْنَا لَهُ وَوَهَبْنَا لَهُ يَحْيَىٰ وَأَصْلَحْنَا لَهُ زَوْجَهُ ۚ إِنَّهُمْ كَانُوا يُسَارِعُونَ فِي الْخَيْرَاتِ وَيَدْعُونَنَا رَغَبًا وَرَهَبًا ۖ وَكَانُوا لَنَا خَاشِعِينَ
మేము అతని ప్రార్థనను స్వీకరించి, అతనికి యహ్యాను ప్రసాదించాము. అతని భార్యను అతని కోసం బాగు చేశాము. ఈ సద్వర్తనులు సత్కార్యాల కోసం త్వరపడేవారు. ఆశతోనూ, భయంతోనూ మమ్మల్ని వేడుకునేవారు. మా ముందు అశక్తతను, అణకువను కనబరచేవారు.
21:91 وَالَّتِي أَحْصَنَتْ فَرْجَهَا فَنَفَخْنَا فِيهَا مِن رُّوحِنَا وَجَعَلْنَاهَا وَابْنَهَا آيَةً لِّلْعَالَمِينَ
ఇక తన శీలాన్ని కాపాడుకున్న ఆ శీలవతి గురించి; ఆమె(చొక్కా చేతి)యందు మేము మా ఆత్మ (జిబ్రీల్) ద్వారా ఊదాము. స్వయంగా ఆమెనూ, ఆమె కుమారుణ్ణీ లోకవాసుల కోసం నిదర్శనంగా చేశాము.
21:92 إِنَّ هَٰذِهِ أُمَّتُكُمْ أُمَّةً وَاحِدَةً وَأَنَا رَبُّكُمْ فَاعْبُدُونِ
మీ ఈ సమాజం (లేక మతధర్మం) వాస్తవానికి ఒకే సమాజం (ఒకే మత ధర్మం). నేను మీ అందరి ప్రభువును. కనుక మీరు నన్నే ఆరాధించండి.
21:93 وَتَقَطَّعُوا أَمْرَهُم بَيْنَهُمْ ۖ كُلٌّ إِلَيْنَا رَاجِعُونَ
కాని ప్రజలు పరస్పరం (విభేదించుకుని) తమ ధర్మంలో ముఠాలు సృష్టించుకున్నారు. అయితే అందరూ మా వద్దకు మరలి రావలసిన వారే.
21:94 فَمَن يَعْمَلْ مِنَ الصَّالِحَاتِ وَهُوَ مُؤْمِنٌ فَلَا كُفْرَانَ لِسَعْيِهِ وَإِنَّا لَهُ كَاتِبُونَ
మరెవరయితే సత్కార్యాలు చేస్తూ ఉంటాడో అతను విశ్వాసి (కూడా) అయి వుంటే, అతని కృషికి గుర్తింపు లభించకపోవటం అంటూ జరగదు. మేము దాన్ని వ్రాసి ఉంచుతాము.
21:95 وَحَرَامٌ عَلَىٰ قَرْيَةٍ أَهْلَكْنَاهَا أَنَّهُمْ لَا يَرْجِعُونَ
ఏ పట్టణాన్ని మేము నాశనం చేశామో అక్కడి ప్రజలు మళ్లీ తిరిగి రావటం అన్నది అసంభవం.
21:96 حَتَّىٰ إِذَا فُتِحَتْ يَأْجُوجُ وَمَأْجُوجُ وَهُم مِّن كُلِّ حَدَبٍ يَنسِلُونَ
చివరికి యాజూజ్ మాజూజ్‌లు వదలి పెట్టబడతారు. వారు ఎత్తయిన ప్రదేశాలన్నింటి నుంచీ ఎగబడి వస్తారు.
21:97 وَاقْتَرَبَ الْوَعْدُ الْحَقُّ فَإِذَا هِيَ شَاخِصَةٌ أَبْصَارُ الَّذِينَ كَفَرُوا يَا وَيْلَنَا قَدْ كُنَّا فِي غَفْلَةٍ مِّنْ هَٰذَا بَلْ كُنَّا ظَالِمِينَ
మరి సత్యమైన వాగ్దానం సంభవించే సమయం ఆసన్నమవుతుంది. ఆ సమయంలో అవిశ్వాసుల కనుగుడ్లు విచ్చుకున్నవి విచ్చుకున్నట్లుగానే ఉండిపోతాయి. “అయ్యో! మా పాడు గాను! మేము ఈ పరిస్థితి పట్ల పరధ్యానానికి గురయ్యాము. అసలు మేమే దుర్మార్గులం” (అని వారు ఒప్పుకుంటారు).
21:98 إِنَّكُمْ وَمَا تَعْبُدُونَ مِن دُونِ اللَّهِ حَصَبُ جَهَنَّمَ أَنتُمْ لَهَا وَارِدُونَ
(ఓ అవిశ్వాసులారా!) మీరూ, అల్లాహ్‌ను వదలి మీరు పూజించే మీ దైవాలు – అందరూ నరకానికి ఇంధనం అవుతారు. మీరంతా దానికి ఆహుతి కావలసినవారే.
21:99 لَوْ كَانَ هَٰؤُلَاءِ آلِهَةً مَّا وَرَدُوهَا ۖ وَكُلٌّ فِيهَا خَالِدُونَ
వీళ్ళే గనక (నిజమైన) దైవాలు అయివుంటే నరకానికి ఆహుతి అయ్యేవారే కారు. ఇక వారంతా శాశ్వతంగా అందులో పడి ఉండాల్సినవారే.
21:100 لَهُمْ فِيهَا زَفِيرٌ وَهُمْ فِيهَا لَا يَسْمَعُونَ
అందులో వారు పెడబొబ్బలు పెడుతూ ఉంటారు. అయితే అందులో వారేమీ వినలేరు.
21:101 إِنَّ الَّذِينَ سَبَقَتْ لَهُم مِّنَّا الْحُسْنَىٰ أُولَٰئِكَ عَنْهَا مُبْعَدُونَ
అయితే ముందు నుంచే మా వద్ద ఎవరి కొరకు మేలు ఖరారై ఉందో వారంతా నరకానికి దూరంగానే ఉంచబడతారు.
21:102 لَا يَسْمَعُونَ حَسِيسَهَا ۖ وَهُمْ فِي مَا اشْتَهَتْ أَنفُسُهُمْ خَالِدُونَ
వారు నరకం సవ్వడి అయినా వినరు. తమ మనసు మెచ్చిన సుఖవిలాసాల మధ్య వారు శాశ్వతంగా ఉంటారు.
21:103 لَا يَحْزُنُهُمُ الْفَزَعُ الْأَكْبَرُ وَتَتَلَقَّاهُمُ الْمَلَائِكَةُ هَٰذَا يَوْمُكُمُ الَّذِي كُنتُمْ تُوعَدُونَ
ఆ మహాకలవరం (కూడా) వారిని వ్యాకుల పరచదు. దైవదూతలు వారిని తీసుకోవటానికి వచ్చి, “మీకు వాగ్దానం చేయబడుతూ ఉన్న రోజు ఇదే” అని అంటారు.
21:104 يَوْمَ نَطْوِي السَّمَاءَ كَطَيِّ السِّجِلِّ لِلْكُتُبِ ۚ كَمَا بَدَأْنَا أَوَّلَ خَلْقٍ نُّعِيدُهُ ۚ وَعْدًا عَلَيْنَا ۚ إِنَّا كُنَّا فَاعِلِينَ
ఆ రోజున మేము వ్రాతప్రతులను చుట్టిపెట్టినట్లుగా ఆకాశాన్ని చుట్టివేస్తాము. ఏ విధంగా మేము మొదటిసారి సృష్టించామో అదేవిధంగా మలిసారి కూడా చేస్తాము. ఈ వాగ్దానాన్ని నెరవేర్చే బాధ్యత మాపైన ఉంది. దాన్ని మేము తప్పకుండా నెరవేరుస్తాము.
21:105 وَلَقَدْ كَتَبْنَا فِي الزَّبُورِ مِن بَعْدِ الذِّكْرِ أَنَّ الْأَرْضَ يَرِثُهَا عِبَادِيَ الصَّالِحُونَ
సజ్జనులైన నా దాసులే భూమికి వారసులవుతారని మేము జబూర్ (గ్రంథం)లో హితబోధ అనంతరం వ్రాసిపెట్టాము.
21:106 إِنَّ فِي هَٰذَا لَبَلَاغًا لِّقَوْمٍ عَابِدِينَ
అల్లాహ్‌ను ఆరాధించే దాసుల కోసం ఇందులో (ఈ ఖుర్ఆనులో) ఓ గొప్ప సందేశం ఉంది.
21:107 وَمَا أَرْسَلْنَاكَ إِلَّا رَحْمَةً لِّلْعَالَمِينَ
(ఓ ముహమ్మద్!) మేము నిన్ను సమస్త లోకవాసుల కోసం కారుణ్యంగా చేసి పంపాము.
21:108 قُلْ إِنَّمَا يُوحَىٰ إِلَيَّ أَنَّمَا إِلَٰهُكُمْ إِلَٰهٌ وَاحِدٌ ۖ فَهَلْ أَنتُم مُّسْلِمُونَ
వారికి చెప్పు: “మీరందరి ఆరాధ్య దైవం ఒక్కడే అని మాత్రమే నా వద్దకు సందేశం (వహీ) పంపబడుతోంది. మరి మీరు కూడా విధేయులవుతారా?”
21:109 فَإِن تَوَلَّوْا فَقُلْ آذَنتُكُمْ عَلَىٰ سَوَاءٍ ۖ وَإِنْ أَدْرِي أَقَرِيبٌ أَم بَعِيدٌ مَّا تُوعَدُونَ
ఒకవేళ వారు గనక ముఖం త్రిప్పుకుంటే వారికీవిధంగా చెప్పెయ్యి: “నేను మిమ్మల్ని సమానంగా హెచ్చరించాను. మీకు వాగ్దానం చేయబడుతున్న విషయం సమీపంలో ఉందో, దూరాన ఉందో నాకైతే తెలియదు.”
21:110 إِنَّهُ يَعْلَمُ الْجَهْرَ مِنَ الْقَوْلِ وَيَعْلَمُ مَا تَكْتُمُونَ
అయితే మీరు బిగ్గరగా పలికేదీ ఆ ప్రభువుకు తెలుసు. మీరు దాచి పెట్టేది కూడా ఆయనకు తెలుసు.
21:111 وَإِنْ أَدْرِي لَعَلَّهُ فِتْنَةٌ لَّكُمْ وَمَتَاعٌ إِلَىٰ حِينٍ
బహుశా ఇది మీకొక పరీక్ష కాబోలు! ఒక నిర్ణీత గడువు వరకు లబ్ది (చేకూర్చటం) దీని ఉద్దేశం కాబోలు! ఇది కూడా నాకు తెలియదు.
21:112 قَالَ رَبِّ احْكُم بِالْحَقِّ ۗ وَرَبُّنَا الرَّحْمَٰنُ الْمُسْتَعَانُ عَلَىٰ مَا تَصِفُونَ
“ఓ ప్రభూ! న్యాయంగా తీర్పు చెయ్యి. మా ప్రభువు అపార కరుణామయుడు. మీరు కల్పించే విషయాలపై ఆయన సహాయమే కోరబడుతోంది” అని (ప్రవక్త) స్వయంగా పలికాడు.
22. సూరా అల్ హజ్ (Al-Hajj)
22:1 يَا أَيُّهَا النَّاسُ اتَّقُوا رَبَّكُمْ ۚ إِنَّ زَلْزَلَةَ السَّاعَةِ شَيْءٌ عَظِيمٌ
ఓ ప్రజలారా! మీ ప్రభువుకు భయపడండి. నిశ్చయంగా ప్రళయ సమయాన జరిగే ప్రకంపనం మహా (భీకర) విషయం.
22:2 يَوْمَ تَرَوْنَهَا تَذْهَلُ كُلُّ مُرْضِعَةٍ عَمَّا أَرْضَعَتْ وَتَضَعُ كُلُّ ذَاتِ حَمْلٍ حَمْلَهَا وَتَرَى النَّاسَ سُكَارَىٰ وَمَا هُم بِسُكَارَىٰ وَلَٰكِنَّ عَذَابَ اللَّهِ شَدِيدٌ
ఆనాడు మీరు దాన్ని చూస్తారు… పాలుపట్టే ప్రతి తల్లీ పాలు త్రాగే తన పసికందును మరచిపోతుంది. గర్భవతుల గర్భాలూ పడిపోతాయి. ప్రజలు మైకంలో తూలుతున్నట్లు నీకు కనిపిస్తారు. వాస్తవానికి వారు మైకంలో ఉండరు. అయితే అల్లాహ్ (తరఫున వచ్చిపడిన) విపత్తు అత్యంత తీవ్రంగా ఉంటుంది.
22:3 وَمِنَ النَّاسِ مَن يُجَادِلُ فِي اللَّهِ بِغَيْرِ عِلْمٍ وَيَتَّبِعُ كُلَّ شَيْطَانٍ مَّرِيدٍ
జ్ఞానం లేకపోయినా అల్లాహ్ విషయంలో వాదించేవారు కూడా జనులలో కొందరున్నారు. వారు తలబిరుసు అయిన ప్రతి షైతానును అనుసరిస్తారు.
22:4 كُتِبَ عَلَيْهِ أَنَّهُ مَن تَوَلَّاهُ فَأَنَّهُ يُضِلُّهُ وَيَهْدِيهِ إِلَىٰ عَذَابِ السَّعِيرِ
అతని సహవాసం చేసిన వారినల్లా అతను అపమార్గం పట్టించి, అతన్ని అగ్ని శిక్ష వైపుకు తీసుకుపోతాడని అతని గురించి (విధివ్రాతలో) రాయబడి ఉంది.
22:5 يَا أَيُّهَا النَّاسُ إِن كُنتُمْ فِي رَيْبٍ مِّنَ الْبَعْثِ فَإِنَّا خَلَقْنَاكُم مِّن تُرَابٍ ثُمَّ مِن نُّطْفَةٍ ثُمَّ مِنْ عَلَقَةٍ ثُمَّ مِن مُّضْغَةٍ مُّخَلَّقَةٍ وَغَيْرِ مُخَلَّقَةٍ لِّنُبَيِّنَ لَكُمْ ۚ وَنُقِرُّ فِي الْأَرْحَامِ مَا نَشَاءُ إِلَىٰ أَجَلٍ مُّسَمًّى ثُمَّ نُخْرِجُكُمْ طِفْلًا ثُمَّ لِتَبْلُغُوا أَشُدَّكُمْ ۖ وَمِنكُم مَّن يُتَوَفَّىٰ وَمِنكُم مَّن يُرَدُّ إِلَىٰ أَرْذَلِ الْعُمُرِ لِكَيْلَا يَعْلَمَ مِن بَعْدِ عِلْمٍ شَيْئًا ۚ وَتَرَى الْأَرْضَ هَامِدَةً فَإِذَا أَنزَلْنَا عَلَيْهَا الْمَاءَ اهْتَزَّتْ وَرَبَتْ وَأَنبَتَتْ مِن كُلِّ زَوْجٍ بَهِيجٍ
ఓ ప్రజలారా! ఒకవేళ మరణానంతర జీవితం గురించి మీకేదన్నా సందేహం ఉంటే కాస్త ఆలోచించండి… మేము మిమ్మల్ని మట్టితో సృష్టించాము, ఆ తరువాత వీర్యపు బొట్టుతో, ఆపైన గడ్డకట్టిన రక్తంతో, అటు పిమ్మట మాంసపు ముద్దతో చేశాము-అప్పటికి అది రూపం కలదిగానూ, రూపరహితంగానూ ఉన్నది. మేము మీకు స్పష్టంగా తెలియజెప్పేందుకు (ఇదంతా చేస్తున్నాము). మరి మేము కోరిన దానిని నిర్ధారిత సమయం వరకు మాతృగర్భాలలో ఉంచుతున్నాము. ఆ తరువాత మిమ్మల్ని శైశవ దశలో బయటికి తెస్తాము – మరి మీరు నిండు యౌవనానికి చేరుకోవటానికి! మీలో కొందరు (యుక్త వయస్సుకు చేరక ముందే) మృత్యువుకు గురిచేయబడతారు. మరి కొందరు అన్నీ తెలిసి ఉండి కూడా ఏమీ గ్రహించలేనంత నికృష్టమైన వయస్సుకు చేర్చబడతారు. నేల ఎండిపోయి (బీడుగా మారి) ఉండటం నువ్వు చూస్తావు. ఆ తరువాత మేము దానిపై వర్షం కురిపించగానే అది పులకిస్తుంది, ఉబికి వస్తుంది, అన్ని రకాల మనోహరమైన మొక్కలను మొలకెత్తిస్తుంది.
22:6 ذَٰلِكَ بِأَنَّ اللَّهَ هُوَ الْحَقُّ وَأَنَّهُ يُحْيِي الْمَوْتَىٰ وَأَنَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
అల్లాహ్‌యే సత్యం గనక, మృతులను తిరిగి బ్రతికించేవాడు ఆయనే గనక, అన్నింటిపై ఆయనే అధికారం కలవాడు గనక ఇదంతా జరుగుతోంది సుమా!
22:7 وَأَنَّ السَّاعَةَ آتِيَةٌ لَّا رَيْبَ فِيهَا وَأَنَّ اللَّهَ يَبْعَثُ مَن فِي الْقُبُورِ
(దీంతోపాటు) ప్రళయం రావటం తథ్యం. అందులో సందేహానికి ఆస్కారమే లేదు. నిశ్చయంగా అల్లాహ్ సమాధులలో ఉన్నవారిని తిరిగి లేపుతాడు.
22:8 وَمِنَ النَّاسِ مَن يُجَادِلُ فِي اللَّهِ بِغَيْرِ عِلْمٍ وَلَا هُدًى وَلَا كِتَابٍ مُّنِيرٍ
మరి కొంతమంది (కూడా ఉన్నారు. వారు) జ్ఞానంగానీ, మార్గదర్శకత్వంగానీ, జ్యోతిర్మయమైన గ్రంథంగానీ లేకుండానే అల్లాహ్ విషయంలో పిడివాదన చేస్తారు.
22:9 ثَانِيَ عِطْفِهِ لِيُضِلَّ عَن سَبِيلِ اللَّهِ ۖ لَهُ فِي الدُّنْيَا خِزْيٌ ۖ وَنُذِيقُهُ يَوْمَ الْقِيَامَةِ عَذَابَ الْحَرِيقِ
గర్వంతో ప్రక్కకు తిరిగిపోయేవాడై! అల్లాహ్ మార్గం నుంచి (ప్రజలను) తప్పించాలన్నది వాడి ఉద్దేశం. వాడికి ప్రపంచంలోనూ పరాభవం ఉంది, ప్రళయదినాన కూడా మేమతన్ని నరకంలో దహించివేసే యాతనను చవిచూపిస్తాము.
22:10 ذَٰلِكَ بِمَا قَدَّمَتْ يَدَاكَ وَأَنَّ اللَّهَ لَيْسَ بِظَلَّامٍ لِّلْعَبِيدِ
నీ చేతులు ముందుగా చేసి పంపుకున్న కర్మల మూలంగా నీకీ ఖర్మ పట్టింది. అల్లాహ్ తన దాసులకు అన్యాయం చేసేవాడు కాడన్న సంగతిని తెలుసుకోండి.
22:11 وَمِنَ النَّاسِ مَن يَعْبُدُ اللَّهَ عَلَىٰ حَرْفٍ ۖ فَإِنْ أَصَابَهُ خَيْرٌ اطْمَأَنَّ بِهِ ۖ وَإِنْ أَصَابَتْهُ فِتْنَةٌ انقَلَبَ عَلَىٰ وَجْهِهِ خَسِرَ الدُّنْيَا وَالْآخِرَةَ ۚ ذَٰلِكَ هُوَ الْخُسْرَانُ الْمُبِينُ
ప్రజలలో మరికొంతమంది (కూడా ఉన్నారు. వారు) ఎలాంటి వారంటే, వారు ఒక అంచున (నిలబడి) అల్లాహ్‌ను ఆరాధిస్తుంటారు. తమకేదన్నా లాభం కలిగితే ఆరాధన పట్ల సంతృప్తి చెందుతారు. ఏదన్నా ఆపద వచ్చిపడితే మాత్రం అప్పటికప్పుడే ముఖం తిప్పుకునిపోతారు. అలాంటి వారు ప్రాపంచికంగానూ, పారలౌకికంగానూ నష్టపోయారు. స్పష్టంగా నష్టపోవటం అంటే ఇదే.
22:12 يَدْعُو مِن دُونِ اللَّهِ مَا لَا يَضُرُّهُ وَمَا لَا يَنفَعُهُ ۚ ذَٰلِكَ هُوَ الضَّلَالُ الْبَعِيدُ
మరి వారు అల్లాహ్‌ను వదలి తమకు నష్టంగానీ, లాభంగానీ కలిగించలేని వారిని మొరపెట్టుకోసాగుతారు. చాలా దూరపు అపమార్గం అంటే ఇదే.
22:13 يَدْعُو لَمَن ضَرُّهُ أَقْرَبُ مِن نَّفْعِهِ ۚ لَبِئْسَ الْمَوْلَىٰ وَلَبِئْسَ الْعَشِيرُ
ఎవరి నష్టం (కీడు) అతని లాభం కన్నా చేరువలో ఉన్నదో అలాంటి వానిని వారు వేడుకుంటున్నారు. ముమ్మాటికీ అలాంటి వాడు మహా చెడ్డ సహాయకుడు, మహాచెడ్డ స్నేహితుడు.
22:14 إِنَّ اللَّهَ يُدْخِلُ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ ۚ إِنَّ اللَّهَ يَفْعَلُ مَا يُرِيدُ
విశ్వసించి, మంచి పనులు చేసిన వారిని అల్లాహ్ సెలయేరులు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. అల్లాహ్ అనుకున్న దాన్ని చేసి తీరుతాడు.
22:15 مَن كَانَ يَظُنُّ أَن لَّن يَنصُرَهُ اللَّهُ فِي الدُّنْيَا وَالْآخِرَةِ فَلْيَمْدُدْ بِسَبَبٍ إِلَى السَّمَاءِ ثُمَّ لْيَقْطَعْ فَلْيَنظُرْ هَلْ يُذْهِبَنَّ كَيْدُهُ مَا يَغِيظُ
అల్లాహ్ ప్రపంచంలోనూ, పరలోకంలోనూ తన ప్రవక్తకు సహాయం చేయడని తలపోసేవాడు పైనుంచి ఒక త్రాడును కట్టి తన మెడకు ఉరేసుకొని వేలాడాలి. ఆ తరువాత తన ఈ ఉపాయం వల్ల తన కసి తీరిందేమో చూసుకోవాలి.
22:16 وَكَذَٰلِكَ أَنزَلْنَاهُ آيَاتٍ بَيِّنَاتٍ وَأَنَّ اللَّهَ يَهْدِي مَن يُرِيدُ
ఈ విధంగా మేము ఈ ఖుర్ఆన్ను సుస్పష్టమైన సూచనలతో అవతరింపజేశాము. అల్లాహ్ తాను కోరిన వారికి (మాత్రమే) సన్మార్గ భాగ్యం ప్రసాదిస్తాడు.
22:17 إِنَّ الَّذِينَ آمَنُوا وَالَّذِينَ هَادُوا وَالصَّابِئِينَ وَالنَّصَارَىٰ وَالْمَجُوسَ وَالَّذِينَ أَشْرَكُوا إِنَّ اللَّهَ يَفْصِلُ بَيْنَهُمْ يَوْمَ الْقِيَامَةِ ۚ إِنَّ اللَّهَ عَلَىٰ كُلِّ شَيْءٍ شَهِيدٌ
విశ్వాసులు, యూదులు, సాబియీలు, క్రైస్తవులు, మజూసీలు, బహుదైవారాధకులు – వీరందరి మధ్యా అల్లాహ్ ప్రళయదినాన తప్పకుండా తీర్పుచేస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ అన్నింటికీ సాక్షిగా ఉన్నాడు.
22:18 أَلَمْ تَرَ أَنَّ اللَّهَ يَسْجُدُ لَهُ مَن فِي السَّمَاوَاتِ وَمَن فِي الْأَرْضِ وَالشَّمْسُ وَالْقَمَرُ وَالنُّجُومُ وَالْجِبَالُ وَالشَّجَرُ وَالدَّوَابُّ وَكَثِيرٌ مِّنَ النَّاسِ ۖ وَكَثِيرٌ حَقَّ عَلَيْهِ الْعَذَابُ ۗ وَمَن يُهِنِ اللَّهُ فَمَا لَهُ مِن مُّكْرِمٍ ۚ إِنَّ اللَّهَ يَفْعَلُ مَا يَشَاءُ ۩
ఆకాశాలలో ఉన్నవారూ, భూలోకవాసులు, సూర్యచంద్రులూ, నక్షత్రాలు, పర్వతాలు, వృక్షాలు, జంతువులు, చాలా మంది మనుషులుకూడా అల్లాహ్ ముందు మోకరిల్లడాన్ని నువ్వు గమనించటం లేదా? (దైవ) శిక్షకు అర్హులైన వారు కూడా చాలా మంది ఉన్నారు. అల్లాహ్ పరాభవం పాల్జేసిన వానిని ఎవరూ ఆదరించరు. అల్లాహ్ తాను కోరినదాన్ని చేస్తాడు.
22:19 هَٰذَانِ خَصْمَانِ اخْتَصَمُوا فِي رَبِّهِمْ ۖ فَالَّذِينَ كَفَرُوا قُطِّعَتْ لَهُمْ ثِيَابٌ مِّن نَّارٍ يُصَبُّ مِن فَوْقِ رُءُوسِهِمُ الْحَمِيمُ
ఆ ఇరువర్గాల వారు తమ ప్రభువు విషయంలో గొడవపడతారు. అయితే అవిశ్వాసుల కోసం అగ్ని వస్త్రాలు కత్తిరించబడతాయి. సలసల కాగే నీరు వారి తలలపై నుంచి కుమ్మరించబడుతుంది.
22:20 يُصْهَرُ بِهِ مَا فِي بُطُونِهِمْ وَالْجُلُودُ
దాని మూలంగా వారి చర్మాలే కాకుండా వారి కడుపుల్లో ఉన్నవి కూడా కరిగిపోతాయి.
22:21 وَلَهُم مَّقَامِعُ مِنْ حَدِيدٍ
ఇంకా, వారి కొరకు (వారిని చితక బాదటానికి) ఇనుప సుత్తులు కూడా ఉన్నాయి.
22:22 كُلَّمَا أَرَادُوا أَن يَخْرُجُوا مِنْهَا مِنْ غَمٍّ أُعِيدُوا فِيهَا وَذُوقُوا عَذَابَ الْحَرِيقِ
ఆ బాధకు తట్టుకోలేక వారు అక్కణ్ణుంచి పారిపోవాలని అనుకున్నప్పుడల్లా తిరిగి అందులోనికే నెట్టివేయబడతారు. “దహనయాతన రుచి చూడండి” (అని వారితో అనబడుతుంది).
22:23 إِنَّ اللَّهَ يُدْخِلُ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ يُحَلَّوْنَ فِيهَا مِنْ أَسَاوِرَ مِن ذَهَبٍ وَلُؤْلُؤًا ۖ وَلِبَاسُهُمْ فِيهَا حَرِيرٌ
విశ్వసించి, సత్కార్యాలు చేసిన వారికి క్రింద సెలయేరులు పారే (స్వర్గ) వనాలలో అల్లాహ్ ప్రవేశం కల్పిస్తాడు. అక్కడ వారు బంగారు కంకణాలు తొడిగించబడతారు – స్వచ్ఛమైన ముత్యాలు కూడా! వారు ధరించే వస్త్రాలు కూడా పట్టు వస్త్రాలై ఉంటాయి.
22:24 وَهُدُوا إِلَى الطَّيِّبِ مِنَ الْقَوْلِ وَهُدُوا إِلَىٰ صِرَاطِ الْحَمِيدِ
పవిత్రమైన మాటలు పలికే బుద్ధి వారికి వొసగబడుతుంది. స్తుతించదగిన వాని మార్గం కూడా వారికి నిర్దేశించబడింది.
22:25 إِنَّ الَّذِينَ كَفَرُوا وَيَصُدُّونَ عَن سَبِيلِ اللَّهِ وَالْمَسْجِدِ الْحَرَامِ الَّذِي جَعَلْنَاهُ لِلنَّاسِ سَوَاءً الْعَاكِفُ فِيهِ وَالْبَادِ ۚ وَمَن يُرِدْ فِيهِ بِإِلْحَادٍ بِظُلْمٍ نُّذِقْهُ مِنْ عَذَابٍ أَلِيمٍ
నిశ్చయంగా ఎవరయితే అవిశ్వాసానికి ఒడిగట్టి, అల్లాహ్ మార్గం నుండి, మస్జిదె హరామ్ నుండి (జనులను) అడ్డుకుంటున్నారో, ఇంకా అక్కడ అన్యాయంగా అడ్డదారులు తొక్కాలని ప్రయత్నిస్తున్నారో వారికి మేము బాధాకరమైన శిక్ష రుచి చూపిస్తాం. వాస్తవానికి మేము దానిని సర్వమానవుల కోసం సమానంగా చేసి ఉన్నాము. స్థానికులకు, బయటి నుంచి వచ్చే వారికి కూడా (ఆ హక్కు సమానంగా వర్తిస్తుంది.)
22:26 وَإِذْ بَوَّأْنَا لِإِبْرَاهِيمَ مَكَانَ الْبَيْتِ أَن لَّا تُشْرِكْ بِي شَيْئًا وَطَهِّرْ بَيْتِيَ لِلطَّائِفِينَ وَالْقَائِمِينَ وَالرُّكَّعِ السُّجُودِ
మేము ఇబ్రాహీమునకు కాబా గృహ స్థలాన్ని నిర్థారించినపుడు పెట్టిన షరతు ఇది: నాకు భాగస్వామ్యంగా దేనినీ కల్పించకూడదు. నా గృహాన్ని ప్రదక్షిణ చేసేవారి కోసం, నిలబడేవారి కోసం, తల వంచేవారి కోసం, సాష్టాంగపడే వారి కోసం పవిత్రంగా ఉంచాలి.
22:27 وَأَذِّن فِي النَّاسِ بِالْحَجِّ يَأْتُوكَ رِجَالًا وَعَلَىٰ كُلِّ ضَامِرٍ يَأْتِينَ مِن كُلِّ فَجٍّ عَمِيقٍ
హజ్ (యాత్ర)కై ప్రజలలో ప్రకటన గావించు. ప్రజలు నీ వద్దకు అన్ని సుదూర మార్గాల నుంచి కాలినడకన కూడా వస్తారు, బక్కచిక్కిన ఒంటెలపై కూడా స్వారీ అయి వస్తారు.
22:28 لِّيَشْهَدُوا مَنَافِعَ لَهُمْ وَيَذْكُرُوا اسْمَ اللَّهِ فِي أَيَّامٍ مَّعْلُومَاتٍ عَلَىٰ مَا رَزَقَهُم مِّن بَهِيمَةِ الْأَنْعَامِ ۖ فَكُلُوا مِنْهَا وَأَطْعِمُوا الْبَائِسَ الْفَقِيرَ
వారు తమ ప్రయోజనాలు పొందటానికి రావాలి. అల్లాహ్ తమకు ప్రసాదించిన తమ పెంపుడు పశువుల మీద ఆ నిర్ణీత దినాలలో అల్లాహ్ నామాన్ని స్మరించాలి (ఉచ్చరించాలి). ఆ తరువాత వాటిని మీరూ తినండి, దుర్భర స్థితిలో ఉన్న అగత్య పరులకు కూడా తినిపించండి.
22:29 ثُمَّ لْيَقْضُوا تَفَثَهُمْ وَلْيُوفُوا نُذُورَهُمْ وَلْيَطَّوَّفُوا بِالْبَيْتِ الْعَتِيقِ
ఆ తరువాత వారు తమ మురికిని దూరం చేసుకోవాలి, తమ మొక్కుబడులను చెల్లించాలి.(అనంతరం దేవుని) ఆ ప్రాచీన గృహానికి ప్రదక్షిణ చేయాలి.
22:30 ذَٰلِكَ وَمَن يُعَظِّمْ حُرُمَاتِ اللَّهِ فَهُوَ خَيْرٌ لَّهُ عِندَ رَبِّهِ ۗ وَأُحِلَّتْ لَكُمُ الْأَنْعَامُ إِلَّا مَا يُتْلَىٰ عَلَيْكُمْ ۖ فَاجْتَنِبُوا الرِّجْسَ مِنَ الْأَوْثَانِ وَاجْتَنِبُوا قَوْلَ الزُّورِ
ఇది (హజ్ కొరకు నిర్దేశించబడిన పద్ధతి). ఎవడయితే అల్లాహ్ విధించిన కట్టుబాట్లను గౌరవిస్తాడో అతనికోసం అతని ప్రభువు వద్ద మేలుంది. మీకు తెలియజేయబడిన (హరాం) జంతువులు తప్ప మిగిలిన పశువులు మీకోసం ధర్మసమ్మతం (హలాల్) చేయబడ్డాయి. కాబట్టి మీరు విగ్రహాల మాలిన్యానికి దూరంగా ఉండాలి, సత్యవిరుద్ధమైన మాటలకు కూడా దూరంగా ఉండాలి.
22:31 حُنَفَاءَ لِلَّهِ غَيْرَ مُشْرِكِينَ بِهِ ۚ وَمَن يُشْرِكْ بِاللَّهِ فَكَأَنَّمَا خَرَّ مِنَ السَّمَاءِ فَتَخْطَفُهُ الطَّيْرُ أَوْ تَهْوِي بِهِ الرِّيحُ فِي مَكَانٍ سَحِيقٍ
ఏకాగ్రతతో దేవుని ఏకత్వాన్ని అనుసరిస్తూ, ఆయనకు సాటి కల్పించకుండా ఉండాలి. వినండి! అల్లాహ్‌కు సాటి కల్పించేవాడు ఆకాశం నుంచి క్రిందపడి పోయిన వానితో సమానం. ఇప్పుడతన్ని పక్షులైనా తన్నుకుపోతాయి లేదా పెనుగాలి అయినా ఎత్తి దూరప్రదేశంలో విసిరేస్తుంది.
22:32 ذَٰلِكَ وَمَن يُعَظِّمْ شَعَائِرَ اللَّهِ فَإِنَّهَا مِن تَقْوَى الْقُلُوبِ
ఇది (తెలుసుకున్నారు కదా! ఇది కూడా తెలుసుకోండి!). అల్లాహ్ చిహ్నాలను ఎవరయినా గౌరవిస్తున్నారంటే అది వారి హృదయాలలోని భక్తిభావన వల్లనే సుమా!
22:33 لَكُمْ فِيهَا مَنَافِعُ إِلَىٰ أَجَلٍ مُّسَمًّى ثُمَّ مَحِلُّهَا إِلَى الْبَيْتِ الْعَتِيقِ
ఒక నిర్థారిత గడువు వరకు వాటిలో (ఖుర్బానీ పశువులలో) మీ కోసం కొన్ని లాభాలు ఉన్నాయి. ఆ తరువాత అవి జిబహ్ చేయబడే చోటు ప్రాచీన గృహం (వద్దనే ఉంది).
22:34 وَلِكُلِّ أُمَّةٍ جَعَلْنَا مَنسَكًا لِّيَذْكُرُوا اسْمَ اللَّهِ عَلَىٰ مَا رَزَقَهُم مِّن بَهِيمَةِ الْأَنْعَامِ ۗ فَإِلَٰهُكُمْ إِلَٰهٌ وَاحِدٌ فَلَهُ أَسْلِمُوا ۗ وَبَشِّرِ الْمُخْبِتِينَ
తమకు అల్లాహ్ ప్రసాదించివున్న పశువులపై అల్లాహ్ పేరును స్మరించటానికిగాను మేము ప్రతి అనుచర సమాజం కోసం ఖుర్బానీ ఆచారాన్ని నిర్థారించాము. కనుక మీ ఆరాధ్య దేవుడు ఒకే ఆరాధ్యదేవుడని తెలుసుకోండి. కాబట్టి మీరు ఆయన ఆజ్ఞలనే శిరసావహించండి. (కనుక ఓ ముహమ్మద్) వినమ్రులైన వారికి శుభవార్తను వినిపించు.
22:35 الَّذِينَ إِذَا ذُكِرَ اللَّهُ وَجِلَتْ قُلُوبُهُمْ وَالصَّابِرِينَ عَلَىٰ مَا أَصَابَهُمْ وَالْمُقِيمِي الصَّلَاةِ وَمِمَّا رَزَقْنَاهُمْ يُنفِقُونَ
(వారిలోని సుగుణం ఏమిటంటే) అల్లాహ్ నామం స్మరించినప్పుడు వారి హృదయాలు వణుకుతాయి. తమపై ఏ ఆపద వచ్చిపడినా వారు ఓర్పు వహిస్తారు, నమాజులను నెలకొల్పుతారు. మేము వారికి ప్రసాదించిన దానిలో నుంచి (మా మార్గంలో) ఖర్చు చేస్తూ ఉంటారు.
22:36 وَالْبُدْنَ جَعَلْنَاهَا لَكُم مِّن شَعَائِرِ اللَّهِ لَكُمْ فِيهَا خَيْرٌ ۖ فَاذْكُرُوا اسْمَ اللَّهِ عَلَيْهَا صَوَافَّ ۖ فَإِذَا وَجَبَتْ جُنُوبُهَا فَكُلُوا مِنْهَا وَأَطْعِمُوا الْقَانِعَ وَالْمُعْتَرَّ ۚ كَذَٰلِكَ سَخَّرْنَاهَا لَكُمْ لَعَلَّكُمْ تَشْكُرُونَ
ఖుర్బానీ ఒంటెలను(కూడా) మేము మీకోసం అల్లాహ్ చిహ్నాలుగా నిర్థారించాము. వాటిలో మీకు మేలున్నది. కాబట్టి వాటిని వరుసగా నిలబెట్టి, వాటిపై అల్లాహ్ పేరును ఉచ్చరించండి. మరి వాటి ప్రక్కలు నేలకొరిగిన తరువాత, వాటిని (మీరూ) తినండి, అడగని అభాగ్యులకు, అడిగే అగత్యపరులకు కూడా తినిపించండి. ఈ విధంగా మీరు కృతజ్ఞతాపూర్వకంగా మసలుకునేందుకుగాను మేము ఈ పశువులను మీకు స్వాధీన పరిచాము.
22:37 لَن يَنَالَ اللَّهَ لُحُومُهَا وَلَا دِمَاؤُهَا وَلَٰكِن يَنَالُهُ التَّقْوَىٰ مِنكُمْ ۚ كَذَٰلِكَ سَخَّرَهَا لَكُمْ لِتُكَبِّرُوا اللَّهَ عَلَىٰ مَا هَدَاكُمْ ۗ وَبَشِّرِ الْمُحْسِنِينَ
వాటి మాంసంగానీ, రక్తంగానీ అల్లాహ్‌కు చేరవు. అయితే మీలోని భక్తి పరాయణత (తఖ్వా) మాత్రం ఆయనకు చేరుతుంది. ఈ విధంగా అల్లాహ్ ఈ పశువులను మీకు లోబరిచాడు- ఆయన మార్గదర్శకత్వానికి కృతజ్ఞతగా మీరు ఆయన గొప్పదనాన్ని కొనియాడటానికి! (ఓ ముహమ్మద్!) సదాచార సంపన్నులకు సంతోషవార్త వినిపించు.
22:38 إِنَّ اللَّهَ يُدَافِعُ عَنِ الَّذِينَ آمَنُوا ۗ إِنَّ اللَّهَ لَا يُحِبُّ كُلَّ خَوَّانٍ كَفُورٍ
నిశ్చయంగా అల్లాహ్ నికార్సయిన విశ్వాసుల నుండి శత్రువులను పారద్రోలుతాడు. విశ్వాస ఘాతకులైన కృతఘ్నులను అల్లాహ్ సుతరామూ ఇష్టపడడు.
22:39 أُذِنَ لِلَّذِينَ يُقَاتَلُونَ بِأَنَّهُمْ ظُلِمُوا ۚ وَإِنَّ اللَّهَ عَلَىٰ نَصْرِهِمْ لَقَدِيرٌ
ఎవరికి వ్యతిరేకంగా యుద్ధం చేయబడుతుందో, వారికి (కూడా ప్రతిఘటనకు) అనుమతి ఇవ్వబడుతోంది. ఎందుకంటే వారు (ముస్లిములు) పీడితులు. నిశ్చయంగా అల్లాహ్ వారిని ఆదుకోగల శక్తి గలవాడు.
22:40 الَّذِينَ أُخْرِجُوا مِن دِيَارِهِم بِغَيْرِ حَقٍّ إِلَّا أَن يَقُولُوا رَبُّنَا اللَّهُ ۗ وَلَوْلَا دَفْعُ اللَّهِ النَّاسَ بَعْضَهُم بِبَعْضٍ لَّهُدِّمَتْ صَوَامِعُ وَبِيَعٌ وَصَلَوَاتٌ وَمَسَاجِدُ يُذْكَرُ فِيهَا اسْمُ اللَّهِ كَثِيرًا ۗ وَلَيَنصُرَنَّ اللَّهُ مَن يَنصُرُهُ ۗ إِنَّ اللَّهَ لَقَوِيٌّ عَزِيزٌ
వారు అన్యాయంగా తమ ఇళ్ల నుంచి వెళ్ళగొట్టబడ్డారు. (ఇంతకీ వారు చేసిన నేరం) ఏమిటంటే, “మా ప్రభువు అల్లాహ్” అని పలకటమే. అల్లాహ్‌యే గనక జనులలో కొందరిని మరి కొందరి ద్వారా అడ్డుకోకపోతే మఠాలు, చర్చీలు, యూదుల ప్రార్థనాలయాలు, అల్లాహ్ పేరు అత్యధికంగా స్మరించబడే మస్జిదులు ధ్వంసం చేయబడేవి. అల్లాహ్‌కు సహాయపడేందుకు సమాయత్తం అయిన వారికి అల్లాహ్ కూడా తప్పకుండా సహాయ పడతాడు. నిశ్చయంగా అల్లాహ్ మహా బలుడు, సర్వాధిక్యుడు.
22:41 الَّذِينَ إِن مَّكَّنَّاهُمْ فِي الْأَرْضِ أَقَامُوا الصَّلَاةَ وَآتَوُا الزَّكَاةَ وَأَمَرُوا بِالْمَعْرُوفِ وَنَهَوْا عَنِ الْمُنكَرِ ۗ وَلِلَّهِ عَاقِبَةُ الْأُمُورِ
(ఈ విశ్వాసులు ఎలాంటివారంటే) మేము గనక వారికి భూమిపై అధికారాన్ని ప్రసాదిస్తే వారు ఖచ్చితంగా నమాజును నెలకొల్పుతారు. జకాతు (అనే విధ్యుక్త దానధర్మాన్ని) చెల్లిస్తారు. మంచి పనులు చేయమని ఆజ్ఞాపిస్తారు. చెడు పనుల నుంచి ఆపుతారు. సమస్త వ్యవహారాల ఫలితం అల్లాహ్ అధీనంలోనే ఉంది.
22:42 وَإِن يُكَذِّبُوكَ فَقَدْ كَذَّبَتْ قَبْلَهُمْ قَوْمُ نُوحٍ وَعَادٌ وَثَمُودُ
(ఓ ప్రవక్తా!) ఒకవేళ వీళ్లు నిన్ను ధిక్కరిస్తే (ఆశ్చర్యపోనవసరం లేదు), వీరికి పూర్వం నూహ్, ఆద్, సమూద్ జాతుల వారు ధిక్కరించి ఉన్నారు.
22:43 وَقَوْمُ إِبْرَاهِيمَ وَقَوْمُ لُوطٍ
అలాగే ఇబ్రాహీమ్ జాతివారు, లూతు జాతి వారు,
22:44 وَأَصْحَابُ مَدْيَنَ ۖ وَكُذِّبَ مُوسَىٰ فَأَمْلَيْتُ لِلْكَافِرِينَ ثُمَّ أَخَذْتُهُمْ ۖ فَكَيْفَ كَانَ نَكِيرِ
మద్యన్ వారు కూడా (తమ తమ ప్రవక్తలను ధిక్కరించారు). మూసా కూడా ధిక్కరించబడ్డాడు. నేను అవిశ్వాసులకు కాస్త విడుపు ఇచ్చాను. ఆ తరువాత వారిని పట్టుకున్నాను. మరి నా శిక్ష (వారిపై) ఎలా పడిందో! (చూశావుగా!)
22:45 فَكَأَيِّن مِّن قَرْيَةٍ أَهْلَكْنَاهَا وَهِيَ ظَالِمَةٌ فَهِيَ خَاوِيَةٌ عَلَىٰ عُرُوشِهَا وَبِئْرٍ مُّعَطَّلَةٍ وَقَصْرٍ مَّشِيدٍ
ఎన్నో పట్టణాలను మేము తుడిచిపెట్టేశాము. ఎందుకంటే అవి దుర్మార్గానికి ఒడిగట్టాయి. అవి తమ కప్పులపై తల క్రిందులుగా పడి ఉన్నాయి. ఎన్నో బావులు పాడుపడి ఉన్నాయి. మరెన్నో పటిష్టమైన, ఎత్తైన మేడలు నిర్మానుష్యంగా ఉన్నాయి.
22:46 أَفَلَمْ يَسِيرُوا فِي الْأَرْضِ فَتَكُونَ لَهُمْ قُلُوبٌ يَعْقِلُونَ بِهَا أَوْ آذَانٌ يَسْمَعُونَ بِهَا ۖ فَإِنَّهَا لَا تَعْمَى الْأَبْصَارُ وَلَٰكِن تَعْمَى الْقُلُوبُ الَّتِي فِي الصُّدُورِ
ఏమిటీ, వారు భూమిలో సంచరించలేదా? (ఒకవేళ తిరిగి చూచినట్లయితే) వారి హృదయాలు ఆ విషయాలను గ్రహించగలిగేవి, లేదా వారి చెవులు (ఆ సంఘటనలను గురించి) విని ఉండేవి. అసలు విషయం ఏమిటంటే కళ్లు మాత్రమే గుడ్డివై ఉండవు, రొమ్ములలో ఉన్న హృదయాలు గుడ్డివి అవుతాయి.
22:47 وَيَسْتَعْجِلُونَكَ بِالْعَذَابِ وَلَن يُخْلِفَ اللَّهُ وَعْدَهُ ۚ وَإِنَّ يَوْمًا عِندَ رَبِّكَ كَأَلْفِ سَنَةٍ مِّمَّا تَعُدُّونَ
(దైవ) శిక్షకోసం వారు నిన్ను తొందరపెడుతున్నారు. అల్లాహ్ ఎట్టిపరిస్థితిలోనూ తన వాగ్దానానికి విరుద్ధంగా చేయడు. కాకపోతే నీ ప్రభువు దగ్గర ఒకరోజు (అంటే) మీరు లెక్కించే వెయ్యేండ్లకు సమానం.
22:48 وَكَأَيِّن مِّن قَرْيَةٍ أَمْلَيْتُ لَهَا وَهِيَ ظَالِمَةٌ ثُمَّ أَخَذْتُهَا وَإِلَيَّ الْمَصِيرُ
ఎన్నో పట్టణాలకు, అవి దారుణంగా చెలరేగిపోయినప్పటికీ నేను ఒకింత విడుపు ఇచ్చాను. తర్వాత వారిని పట్టుకున్నాను. వారు తిరిగి రావలసింది నా దగ్గరకే కదా!
22:49 قُلْ يَا أَيُّهَا النَّاسُ إِنَّمَا أَنَا لَكُمْ نَذِيرٌ مُّبِينٌ
(ఓ ప్రవక్తా!) ఇలా ప్రకటించు: “ఓ మానవులారా! నేను మిమ్మల్ని స్పష్టంగా సావధానపరచేవాడిని మాత్రమే.”
22:50 فَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ لَهُم مَّغْفِرَةٌ وَرِزْقٌ كَرِيمٌ
కనుక విశ్వసించి, సత్కార్యాలు చేసిన వారికే మన్నింపు, గౌరవప్రదమైన ఉపాధి లభిస్తాయి.
22:51 وَالَّذِينَ سَعَوْا فِي آيَاتِنَا مُعَاجِزِينَ أُولَٰئِكَ أَصْحَابُ الْجَحِيمِ
మరి మా ఆయతులను లొంగదీసుకోవటానికి ప్రయత్నించేవారు – వారే నరక వాసులవుతారు.
22:52 وَمَا أَرْسَلْنَا مِن قَبْلِكَ مِن رَّسُولٍ وَلَا نَبِيٍّ إِلَّا إِذَا تَمَنَّىٰ أَلْقَى الشَّيْطَانُ فِي أُمْنِيَّتِهِ فَيَنسَخُ اللَّهُ مَا يُلْقِي الشَّيْطَانُ ثُمَّ يُحْكِمُ اللَّهُ آيَاتِهِ ۗ وَاللَّهُ عَلِيمٌ حَكِيمٌ
(ఓ ప్రవక్తా!) మేము నీకు పూర్వం ఏ ప్రవక్తను, లేదా ఏ సందేశహరుణ్ణి పంపినా – అతను తన మనసులో ఏదైనా సంకల్పం చేసుకున్నప్పుడల్లా షైతాను అతని సంకల్పంలో ఏదో ఒకటి కలుషితం చేసేవాడు. మరయితే అల్లాహ్ షైతాన్ కల్తీని పారద్రోలి, తన వచనాలను స్థిరపరుస్తాడు. అల్లాహ్ సర్వం తెలిసినవాడు, వివేక సంపన్నుడు.
22:53 لِّيَجْعَلَ مَا يُلْقِي الشَّيْطَانُ فِتْنَةً لِّلَّذِينَ فِي قُلُوبِهِم مَّرَضٌ وَالْقَاسِيَةِ قُلُوبُهُمْ ۗ وَإِنَّ الظَّالِمِينَ لَفِي شِقَاقٍ بَعِيدٍ
ఎవరి హృదయాలలో రోగం ఉందో, మరెవరి గుండెలు కరకు గుండెలుగా మారిపోయాయో వారిని ఈ షైతాను కలిపే దాని ద్వారా పరీక్షించటానికి అల్లాహ్ (ఇదంతా చేశాడు). నిశ్చయంగా దుర్మార్గులు వ్యతిరేకతలో చాలా దూరం వెళ్ళిపోయారు.
22:54 وَلِيَعْلَمَ الَّذِينَ أُوتُوا الْعِلْمَ أَنَّهُ الْحَقُّ مِن رَّبِّكَ فَيُؤْمِنُوا بِهِ فَتُخْبِتَ لَهُ قُلُوبُهُمْ ۗ وَإِنَّ اللَّهَ لَهَادِ الَّذِينَ آمَنُوا إِلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ
జ్ఞాన మొసగబడినవారు, ఇది నీ ప్రభువు తరఫునుంచి వచ్చిన సత్యం అని తెలుసుకుని, దాన్ని విశ్వసించటానికి, ఇంకా వారి హృదయాలు ఆయన వైపుకు మొగ్గటానికి (కూడా ఈ విధంగా చేయబడింది). నిశ్చయంగా అల్లాహ్ విశ్వసించిన వారికి రుజుమార్గం వైపునకు దర్శకత్వం వహిస్తాడు.
22:55 وَلَا يَزَالُ الَّذِينَ كَفَرُوا فِي مِرْيَةٍ مِّنْهُ حَتَّىٰ تَأْتِيَهُمُ السَّاعَةُ بَغْتَةً أَوْ يَأْتِيَهُمْ عَذَابُ يَوْمٍ عَقِيمٍ
తమపై అకస్మాత్తుగా ప్రళయ ఘడియ వచ్చిపడేవరకూ లేదా తమ వద్దకు అశుభ దినపు శిక్ష వచ్చేవరకూ అవిశ్వాసులు దైవ సందేశం (వహీ) గురించి సంశయంలోనే పడి ఉంటారు.
22:56 الْمُلْكُ يَوْمَئِذٍ لِّلَّهِ يَحْكُمُ بَيْنَهُمْ ۚ فَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ فِي جَنَّاتِ النَّعِيمِ
ఆ రోజు సర్వసత్తాధికారం అల్లాహ్‌దే. ఆయనే వారి మధ్య తీర్పులు చేస్తాడు. మరి విశ్వసించి, సత్కార్యాలు చేసినవారు వరాలు నిండిన స్వర్గవనాలలో ఉంటారు.
22:57 وَالَّذِينَ كَفَرُوا وَكَذَّبُوا بِآيَاتِنَا فَأُولَٰئِكَ لَهُمْ عَذَابٌ مُّهِينٌ
విశ్వసించకుండా, మా ఆయతులను ధిక్కరించినవారి కోసం అవమానభరితమైన శిక్ష ఉంది.
22:58 وَالَّذِينَ هَاجَرُوا فِي سَبِيلِ اللَّهِ ثُمَّ قُتِلُوا أَوْ مَاتُوا لَيَرْزُقَنَّهُمُ اللَّهُ رِزْقًا حَسَنًا ۚ وَإِنَّ اللَّهَ لَهُوَ خَيْرُ الرَّازِقِينَ
ఎవరయితే అల్లాహ్ మార్గంలో (స్వస్థలాన్ని వదలి) వలసపోయారో, తరువాత చంపబడ్డారో లేదా చనిపోయారో, వారికి అల్లాహ్ అత్యుత్తమమైన ఉపాధిని ప్రసాదిస్తాడు. నిస్సందేహంగా అల్లాహ్ మాత్రమే ఉపాధి ప్రదాతలలోకెల్లా శ్రేష్ఠుడు.
22:59 لَيُدْخِلَنَّهُم مُّدْخَلًا يَرْضَوْنَهُ ۗ وَإِنَّ اللَّهَ لَعَلِيمٌ حَلِيمٌ
వారు ఇష్టపడే చోటికి ఆయన వారిని చేరుస్తాడు. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, ఓరిమి కలవాడు.
22:60 ذَٰلِكَ وَمَنْ عَاقَبَ بِمِثْلِ مَا عُوقِبَ بِهِ ثُمَّ بُغِيَ عَلَيْهِ لَيَنصُرَنَّهُ اللَّهُ ۗ إِنَّ اللَّهَ لَعَفُوٌّ غَفُورٌ
ఇదీ (వారికి లభించే పుణ్యఫలం). తనకు బాధపెట్టబడిన మేరకే ప్రతీకారం తీర్చుకున్న వ్యక్తిపై తిరిగి దౌర్జన్యం జరిపితే,అప్పుడు అల్లాహ్ స్వయంగా అతనికి తోడ్పడతాడు. నిశ్చయంగా అల్లాహ్ మన్నించి వదలిపెట్టేవాడు, క్షమాభిక్షపెట్టేవాడూను.
22:61 ذَٰلِكَ بِأَنَّ اللَّهَ يُولِجُ اللَّيْلَ فِي النَّهَارِ وَيُولِجُ النَّهَارَ فِي اللَّيْلِ وَأَنَّ اللَّهَ سَمِيعٌ بَصِيرٌ
అల్లాహ్ రాత్రిని పగటిలోనూ, పగటిని రాత్రిలోనూ ప్రవేశింపజేస్తూ ఉండటం వల్లనూ, నిశ్చయంగా అల్లాహ్ వినేవాడు, చూచే వాడవటం వల్లనూ ఈ విధంగా జరుగుతోంది.
22:62 ذَٰلِكَ بِأَنَّ اللَّهَ هُوَ الْحَقُّ وَأَنَّ مَا يَدْعُونَ مِن دُونِهِ هُوَ الْبَاطِلُ وَأَنَّ اللَّهَ هُوَ الْعَلِيُّ الْكَبِيرُ
ఇంకా అల్లాహ్‌యే సత్యం అవటం మూలంగా, అల్లాహ్‌ను వదలి వారు మొర పెట్టుకునే వారంతా అసత్యం అవటం మూలంగా, ముమ్మాటికీ అల్లాహ్‌యే సర్వోన్నతుడు, గొప్పవాడు అవటం మూలంగా ఇలా జరుగుతోంది.
22:63 أَلَمْ تَرَ أَنَّ اللَّهَ أَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَتُصْبِحُ الْأَرْضُ مُخْضَرَّةً ۗ إِنَّ اللَّهَ لَطِيفٌ خَبِيرٌ
ఏమిటీ, అల్లాహ్ ఆకాశం నుంచి వర్షపు నీరును కురిపించటాన్ని, ఆపైన భూమి పచ్చగా కళకళలాడటాన్ని నువ్వు చూడటం లేదా? నిస్సందేహంగా అల్లాహ్ దయాశీలి. సర్వాన్నీ ఎరిగినవాడు.
22:64 لَّهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۗ وَإِنَّ اللَّهَ لَهُوَ الْغَنِيُّ الْحَمِيدُ
భూమ్యాకాశాలలో వున్న సమస్తం ఆయనదే. నిశ్చయంగా అల్లాహ్‌యే అక్కర లేనివాడు, ప్రశంసనీయుడు.
22:65 أَلَمْ تَرَ أَنَّ اللَّهَ سَخَّرَ لَكُم مَّا فِي الْأَرْضِ وَالْفُلْكَ تَجْرِي فِي الْبَحْرِ بِأَمْرِهِ وَيُمْسِكُ السَّمَاءَ أَن تَقَعَ عَلَى الْأَرْضِ إِلَّا بِإِذْنِهِ ۗ إِنَّ اللَّهَ بِالنَّاسِ لَرَءُوفٌ رَّحِيمٌ
ఏమిటీ, అల్లాహ్ భూమండలంలో ఉన్న సమస్తాన్నీ, ఆయన ఆదేశానుసారమే సముద్రంలో నడిచే ఓడలను మీకు వశ పరచటాన్ని మీరు చూడటం లేదా? తన అనుజ్ఞ కానంతవరకూ భూమిపై విరుచుకుపడకుండా ఉండేలా ఆయనే ఆకాశాన్ని నిలిపి ఉంచాడు. నిశ్చయంగా అల్లాహ్ మనుషులపై దయార్ద్రత కలవాడు, జాలి చూపేవాడు.
22:66 وَهُوَ الَّذِي أَحْيَاكُمْ ثُمَّ يُمِيتُكُمْ ثُمَّ يُحْيِيكُمْ ۗ إِنَّ الْإِنسَانَ لَكَفُورٌ
మీకు జీవనం ప్రసాదించినవాడు ఆయనే. మరి ఆయనే మీకు మరణం వొసగుతాడు. మళ్లీ ఆయనే మిమ్మల్ని తిరిగి బ్రతికిస్తాడు. అయినా మానవుడు మేలును మరిచేవాడే.
22:67 لِّكُلِّ أُمَّةٍ جَعَلْنَا مَنسَكًا هُمْ نَاسِكُوهُ ۖ فَلَا يُنَازِعُنَّكَ فِي الْأَمْرِ ۚ وَادْعُ إِلَىٰ رَبِّكَ ۖ إِنَّكَ لَعَلَىٰ هُدًى مُّسْتَقِيمٍ
ప్రతి అనుచర సమాజానికీ మేము ఒక ఆరాధనా పద్ధతిని నిర్థారించి ఉన్నాము. దాన్ని వారు పాటిస్తున్నారు. కాబట్టి వారు ఈ విషయంలో నీతో గొడవ పడకూడదు. నువ్వు మాత్రం ప్రజలను నీ ప్రభువు వైపు పిలువు. నిశ్చయంగా నువ్వు సన్మార్గాన ఉన్నావు.
22:68 وَإِن جَادَلُوكَ فَقُلِ اللَّهُ أَعْلَمُ بِمَا تَعْمَلُونَ
ఒకవేళ అప్పటికీ వాళ్లు నీతో వాదులాటకు దిగితే వారికి ఇలా చెప్పెయ్యి: “మీ కర్మల సంగతి అల్లాహ్‌కు బాగా తెలుసు లెండి.
22:69 اللَّهُ يَحْكُمُ بَيْنَكُمْ يَوْمَ الْقِيَامَةِ فِيمَا كُنتُمْ فِيهِ تَخْتَلِفُونَ
“మీరు విభేదించుకుంటున్న విషయాల గురించి అల్లాహ్ ప్రళయదినాన మీ మధ్య తప్పకుండా తీర్పు చేస్తాడు.”
22:70 أَلَمْ تَعْلَمْ أَنَّ اللَّهَ يَعْلَمُ مَا فِي السَّمَاءِ وَالْأَرْضِ ۗ إِنَّ ذَٰلِكَ فِي كِتَابٍ ۚ إِنَّ ذَٰلِكَ عَلَى اللَّهِ يَسِيرٌ
భూమ్యాకాశాలలో ఉన్న ప్రతి వస్తువు గురించీ అల్లాహ్‌కు తెలుసన్న సంగతి నీకు తెలియదా? అంతా ఒక గ్రంథంలో వ్రాయబడి ఉంది. నిస్సందేహంగా ఈ విషయం అల్లాహ్‌కు చాలా సులువైనది.
22:71 وَيَعْبُدُونَ مِن دُونِ اللَّهِ مَا لَمْ يُنَزِّلْ بِهِ سُلْطَانًا وَمَا لَيْسَ لَهُم بِهِ عِلْمٌ ۗ وَمَا لِلظَّالِمِينَ مِن نَّصِيرٍ
వారు అల్లాహ్‌ను వదలి ఆయన ఏ ప్రమాణాన్నీ అవతరింపజెయ్యనటువంటి వాటిని పూజిస్తున్నారు. పోనీ వారికైనా తత్సంబంధిత జ్ఞానం ఏదైనా ఉందా అంటే అదీ లేదు. దుర్మార్గులను ఆదుకునే వాడెవడూ లేడు.
22:72 وَإِذَا تُتْلَىٰ عَلَيْهِمْ آيَاتُنَا بَيِّنَاتٍ تَعْرِفُ فِي وُجُوهِ الَّذِينَ كَفَرُوا الْمُنكَرَ ۖ يَكَادُونَ يَسْطُونَ بِالَّذِينَ يَتْلُونَ عَلَيْهِمْ آيَاتِنَا ۗ قُلْ أَفَأُنَبِّئُكُم بِشَرٍّ مِّن ذَٰلِكُمُ ۗ النَّارُ وَعَدَهَا اللَّهُ الَّذِينَ كَفَرُوا ۖ وَبِئْسَ الْمَصِيرُ
వారి ముందు స్పష్టమైన మా ఆయతులను చదివి వినిపించినప్పుడు అవిశ్వాసుల ముఖాలపై తిరస్కార (అసహన) భావం తొంగిచూడటాన్ని నువ్వు గ్రహిస్తావు. మా ఆయతులను చదివి వినిపించే వారిపై విరుచుకుపడతారేమో అన్నట్లు వారు కనిపిస్తారు.(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “దీనికన్నా దారుణమైన సమాచారాన్ని నేను మీకు తెలుపనా?! అదే నరకాగ్ని. దాని గురించి అల్లాహ్ అవిశ్వాసులకు వాగ్దానం చేసి ఉన్నాడు. అది బహుచెడ్డ గమ్యస్థానం.”
22:73 يَا أَيُّهَا النَّاسُ ضُرِبَ مَثَلٌ فَاسْتَمِعُوا لَهُ ۚ إِنَّ الَّذِينَ تَدْعُونَ مِن دُونِ اللَّهِ لَن يَخْلُقُوا ذُبَابًا وَلَوِ اجْتَمَعُوا لَهُ ۖ وَإِن يَسْلُبْهُمُ الذُّبَابُ شَيْئًا لَّا يَسْتَنقِذُوهُ مِنْهُ ۚ ضَعُفَ الطَّالِبُ وَالْمَطْلُوبُ
ఓ ప్రజలారా! ఒక ఉపమానం వివరించబడుతోంది – శ్రద్ధగా వినండి. అల్లాహ్‌ను వదలి మీరు ఎవరెవరినయితే మొర పెట్టుకుంటున్నారో, వారంతా ఏకమైనా- ఒక్క ఈగను కూడా సృష్టించలేరు. పైగా ఈగ వారి నుంచి ఏదైనా వస్తువును ఎగరేసుకుపోతే వారు దాన్ని కూడా దాని నుండి విడిపించుకోలేరు. అర్థించేవాడూ, అర్థించబడేవాడూ – ఇరువురూ బలహీనులే.
22:74 مَا قَدَرُوا اللَّهَ حَقَّ قَدْرِهِ ۗ إِنَّ اللَّهَ لَقَوِيٌّ عَزِيزٌ
వీళ్లు అల్లాహ్ స్థాయికి అనుగుణంగా ఆయన గొప్పదనాన్ని గుర్తించనే లేదు. అల్లాహ్ మహా శక్తిశాలి, ప్రాబల్యం కలవాడు.
22:75 اللَّهُ يَصْطَفِي مِنَ الْمَلَائِكَةِ رُسُلًا وَمِنَ النَّاسِ ۚ إِنَّ اللَّهَ سَمِيعٌ بَصِيرٌ
అల్లాహ్‌యే దైవదూతలలో నుంచి, మానవులలో నుంచి తన సందేశహరులను ఎంపిక చేసుకుంటాడు. నిశ్చయంగా అల్లాహ్ అంతా వింటాడు, అన్నీ చూస్తాడు.
22:76 يَعْلَمُ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ ۗ وَإِلَى اللَّهِ تُرْجَعُ الْأُمُورُ
వారికి ముందున్నదీ, వారికి వెనుక ఉన్నదీ – అంతా ఆయనకు తెలుసు. సమస్త వ్యవహారాలు అల్లాహ్ వైపుకే మరలించబడతాయి.
22:77 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا ارْكَعُوا وَاسْجُدُوا وَاعْبُدُوا رَبَّكُمْ وَافْعَلُوا الْخَيْرَ لَعَلَّكُمْ تُفْلِحُونَ ۩
ఓ విశ్వాసులారా! రుకూ, సజ్దాలు చేస్తూ ఉండండి. మీ ప్రభువును ఆరాధిస్తూ ఉండండి. మంచి పనులు చేస్తూ ఉండండి- తద్వారా మీరు సఫలీకృతులవుతారు.
22:78 وَجَاهِدُوا فِي اللَّهِ حَقَّ جِهَادِهِ ۚ هُوَ اجْتَبَاكُمْ وَمَا جَعَلَ عَلَيْكُمْ فِي الدِّينِ مِنْ حَرَجٍ ۚ مِّلَّةَ أَبِيكُمْ إِبْرَاهِيمَ ۚ هُوَ سَمَّاكُمُ الْمُسْلِمِينَ مِن قَبْلُ وَفِي هَٰذَا لِيَكُونَ الرَّسُولُ شَهِيدًا عَلَيْكُمْ وَتَكُونُوا شُهَدَاءَ عَلَى النَّاسِ ۚ فَأَقِيمُوا الصَّلَاةَ وَآتُوا الزَّكَاةَ وَاعْتَصِمُوا بِاللَّهِ هُوَ مَوْلَاكُمْ ۖ فَنِعْمَ الْمَوْلَىٰ وَنِعْمَ النَّصِيرُ
అల్లాహ్ (ప్రసన్నత) కోసం పాటుపడవలసిన విధంగా పాటుపడండి. ఆయన మిమ్మల్ని ఎన్నుకున్నాడు. ధర్మం విషయంలో ఆయన మీపై ఎలాంటి ఇబ్బందినీ ఉంచలేదు. మీ పితామహుడైన ఇబ్రాహీము (అలైహిస్సలాం) ధర్మానికి కట్టుబడి ఉండండి. ఈ ఖుర్ఆన్కు పూర్వం కూడా ఆయన (అల్లాహ్) మిమ్మల్ని ‘ముస్లింలు’ గానే నామకరణం చేశాడు. మరి ఇందులో కూడా (మీ పేరు అదే). దైవప్రవక్త మీపై సాక్షిగా, మీరు మానవాళిపై సాక్షులుగా ఉండటానికి(ఈ విధంగా చేయబడింది). కనుక మీరు నమాజును నెలకొల్పండి, జకాతును చెల్లించండి, అల్లాహ్‌ను స్థిరంగా ఆశ్రయించండి. ఆయనే మీ సంరక్షకుడు! (ఆయన) ఎంత చక్కని సంరక్షకుడు! మరెంత చక్కని సహాయకుడు!
23. సూరా అల్ మూ ‘మినూన్ (Al-Mu’minun)
23:1 قَدْ أَفْلَحَ الْمُؤْمِنُونَ
నిశ్చయంగా విశ్వాసులు సాఫల్యం పొందారు.
23:2 الَّذِينَ هُمْ فِي صَلَاتِهِمْ خَاشِعُونَ
వారు ఎలాంటివారంటే తమ నమాజులో వారు అణకువ కలిగి ఉంటారు.
23:3 وَالَّذِينَ هُمْ عَنِ اللَّغْوِ مُعْرِضُونَ
వారు పనికిమాలిన వాటిని పట్టించుకోరు
23:4 وَالَّذِينَ هُمْ لِلزَّكَاةِ فَاعِلُونَ
వారు (తమపై విధించబడిన) జకాతు విధానాన్ని పాటిస్తారు.
23:5 وَالَّذِينَ هُمْ لِفُرُوجِهِمْ حَافِظُونَ
వారు తమ మర్మస్థానాలను కాపాడుకుంటారు.
23:6 إِلَّا عَلَىٰ أَزْوَاجِهِمْ أَوْ مَا مَلَكَتْ أَيْمَانُهُمْ فَإِنَّهُمْ غَيْرُ مَلُومِينَ
అయితే తమ భార్యల, (షరీయతు ప్రకారం) తమ యాజమాన్యంలోకి వచ్చిన బానిసరాళ్ళ విషయంలో మటుకు వారిపై ఎలాంటి నింద లేదు.
23:7 فَمَنِ ابْتَغَىٰ وَرَاءَ ذَٰلِكَ فَأُولَٰئِكَ هُمُ الْعَادُونَ
కాని ఎవరయినా దీనికి మించి మరేదైనా కోరితే వారు హద్దు మీరిన వారవుతారు.
23:8 وَالَّذِينَ هُمْ لِأَمَانَاتِهِمْ وَعَهْدِهِمْ رَاعُونَ
వారు తమ అప్పగింతల, వాగ్దానాల పట్ల కడు అప్రమత్తంగా ఉంటారు.
23:9 وَالَّذِينَ هُمْ عَلَىٰ صَلَوَاتِهِمْ يُحَافِظُونَ
వారు తమ నమాజులను పరిరక్షిస్తూ ఉంటారు.
23:10 أُولَٰئِكَ هُمُ الْوَارِثُونَ
ఇలాంటి వారే వారసులు.
23:11 الَّذِينَ يَرِثُونَ الْفِرْدَوْسَ هُمْ فِيهَا خَالِدُونَ
(స్వర్గంలోని) ఫిర్దౌసు ప్రదేశానికి వారు వారసులవుతారు. వారక్కడ కలకాలం ఉంటారు.
23:12 وَلَقَدْ خَلَقْنَا الْإِنسَانَ مِن سُلَالَةٍ مِّن طِينٍ
నిశ్చయంగా మేము మనిషి (ఆదం)ని మట్టిసారముతో సృజించాము.
23:13 ثُمَّ جَعَلْنَاهُ نُطْفَةً فِي قَرَارٍ مَّكِينٍ
తరువాత అతన్ని వీర్య బిందువుగా చేసి ఓ సురక్షిత చోటులో నిలిపి ఉంచాము.
23:14 ثُمَّ خَلَقْنَا النُّطْفَةَ عَلَقَةً فَخَلَقْنَا الْعَلَقَةَ مُضْغَةً فَخَلَقْنَا الْمُضْغَةَ عِظَامًا فَكَسَوْنَا الْعِظَامَ لَحْمًا ثُمَّ أَنشَأْنَاهُ خَلْقًا آخَرَ ۚ فَتَبَارَكَ اللَّهُ أَحْسَنُ الْخَالِقِينَ
మరి ఆ వీర్య బిందువును ఘనీభవించిన రక్తంగా చేశాము. మరి ఆ రక్తపు ముద్దను మాంసపు పిండంగా మార్చాము. దరిమిలా ఆ పిండాన్ని ఎముకలుగా చేశాము. పిదప ఆ ఎముకలకు మాంసం తొడిగించాము. అటుపిమ్మట దాన్ని భిన్నమైన సృష్టిగా ప్రభవింపజేశాము. అందరికన్నా ఉత్తమ సృష్టికర్త అయిన అల్లాహ్ శుభకరుడు.
23:15 ثُمَّ إِنَّكُم بَعْدَ ذَٰلِكَ لَمَيِّتُونَ
మరి ఆ తరువాత మీరంతా తప్పకుండా మరణిస్తారు.
23:16 ثُمَّ إِنَّكُمْ يَوْمَ الْقِيَامَةِ تُبْعَثُونَ
మరి ప్రళయ దినాన మీరంతా నిశ్చయంగా లేపబడతారు.
23:17 وَلَقَدْ خَلَقْنَا فَوْقَكُمْ سَبْعَ طَرَائِقَ وَمَا كُنَّا عَنِ الْخَلْقِ غَافِلِينَ
మేము మీపై సప్తాకాశాలను నిర్మించాము. మేము సృష్టి విషయంలో అజాగ్రత్తగా లేము.
23:18 وَأَنزَلْنَا مِنَ السَّمَاءِ مَاءً بِقَدَرٍ فَأَسْكَنَّاهُ فِي الْأَرْضِ ۖ وَإِنَّا عَلَىٰ ذَهَابٍ بِهِ لَقَادِرُونَ
మేము తగు మోతాదులో ఆకాశం నుంచి వర్షపు నీరును కురిపిస్తున్నాము. మరి దానిని భూమిలో నిలువచేస్తున్నాము. మేము దాన్ని తిరిగి తీసేసుకోగలము కూడా.
23:19 فَأَنشَأْنَا لَكُم بِهِ جَنَّاتٍ مِّن نَّخِيلٍ وَأَعْنَابٍ لَّكُمْ فِيهَا فَوَاكِهُ كَثِيرَةٌ وَمِنْهَا تَأْكُلُونَ
మరి ఆ నీటి ద్వారా మేము మీకోసం ఖర్జూరపు తోటలను, ద్రాక్షతోటలను ఉత్పన్నం చేశాము. మీ కొరకు వాటిలో ఎన్నో పండ్లు ఫలాలు ఉన్నాయి. వాటిని మీరు ఆరగిస్తారు కూడా.
23:20 وَشَجَرَةً تَخْرُجُ مِن طُورِ سَيْنَاءَ تَنبُتُ بِالدُّهْنِ وَصِبْغٍ لِّلْآكِلِينَ
ఇంకా – సినాయ్ పర్వత ప్రాంతంలో మొలకెత్తే వృక్షాన్ని కూడా మీకు సమకూర్చాము. అది నూనెను ఇస్తుంది. తినేవారి కోసం కూరగా కూడా ఉపయోగపడుతుంది.
23:21 وَإِنَّ لَكُمْ فِي الْأَنْعَامِ لَعِبْرَةً ۖ نُّسْقِيكُم مِّمَّا فِي بُطُونِهَا وَلَكُمْ فِيهَا مَنَافِعُ كَثِيرَةٌ وَمِنْهَا تَأْكُلُونَ
మీకు పశువుల్లో కూడా పెద్ద గుణపాఠం ఉంది. వాటి కడుపులలో నుంచి మేము మీకు ఒక పదార్థాన్ని (పాలను) త్రాపుతున్నాము. ఇంకా, వాటిలో మీకు ఇతరత్రా ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఆ పశువుల్లో కొన్నింటిని మీరు తింటున్నారు కూడాను.
23:22 وَعَلَيْهَا وَعَلَى الْفُلْكِ تُحْمَلُونَ
మీరు వాటిపైనా, ఓడలపైనా ఎక్కి పోతుంటారు.
23:23 وَلَقَدْ أَرْسَلْنَا نُوحًا إِلَىٰ قَوْمِهِ فَقَالَ يَا قَوْمِ اعْبُدُوا اللَّهَ مَا لَكُم مِّنْ إِلَٰهٍ غَيْرُهُ ۖ أَفَلَا تَتَّقُونَ
మేము నూహు (అలైహిస్సలాం)ను అతని జాతి వారి వద్దకు ప్రవక్తగా చేసి పంపాము. అతను, “ఓ నా జాతి ప్రజలారా! అల్లాహ్‌ను ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరో ఆరాధ్యుడు లేడు. మరి మీరు (ఆయనకు) భయపడరా?” అని అన్నాడు.
23:24 فَقَالَ الْمَلَأُ الَّذِينَ كَفَرُوا مِن قَوْمِهِ مَا هَٰذَا إِلَّا بَشَرٌ مِّثْلُكُمْ يُرِيدُ أَن يَتَفَضَّلَ عَلَيْكُمْ وَلَوْ شَاءَ اللَّهُ لَأَنزَلَ مَلَائِكَةً مَّا سَمِعْنَا بِهَٰذَا فِي آبَائِنَا الْأَوَّلِينَ
దానికి అవిశ్వాసులైన అతని జాతి సర్దారులు ఇలా అన్నారు: “ఇతను కూడా మీలాంటి ఒక మానవమాత్రుడే. అయితే ఇతను మీపై పెద్దరికాన్ని కోరుకుంటున్నాడు. దేవుడే గనక తలిస్తే (తన ప్రవక్తగా) ఏ దైవదూతనో పంపి ఉండేవాడు. ఇతను చెప్పే దానిని మేము ఇదివరకెన్నడూ, మా తాత ముత్తాతల కాలంలో వినలేదు.
23:25 إِنْ هُوَ إِلَّا رَجُلٌ بِهِ جِنَّةٌ فَتَرَبَّصُوا بِهِ حَتَّىٰ حِينٍ
“నిజంగానే ఇతనికి పిచ్చిపట్టినట్లుంది. కాబట్టి ఇతని విషయంలో మరి కొంత కాలం వేచి ఉండండి.”
23:26 قَالَ رَبِّ انصُرْنِي بِمَا كَذَّبُونِ
“ఓ ప్రభూ! వీళ్ల ధిక్కార వైఖరికి ప్రతిగా నాకు సహాయం చెయ్యి” అని నూహ్ అర్థించాడు.
23:27 فَأَوْحَيْنَا إِلَيْهِ أَنِ اصْنَعِ الْفُلْكَ بِأَعْيُنِنَا وَوَحْيِنَا فَإِذَا جَاءَ أَمْرُنَا وَفَارَ التَّنُّورُ ۙ فَاسْلُكْ فِيهَا مِن كُلٍّ زَوْجَيْنِ اثْنَيْنِ وَأَهْلَكَ إِلَّا مَن سَبَقَ عَلَيْهِ الْقَوْلُ مِنْهُمْ ۖ وَلَا تُخَاطِبْنِي فِي الَّذِينَ ظَلَمُوا ۖ إِنَّهُم مُّغْرَقُونَ
అప్పుడు మేమతనికి ఈ సందేశం పంపాము: “మా కళ్ల ఎదుటే, మేము పంపే సందేశాన్ని (వహీని) అనుసరించి ఒక ఓడను నిర్మించు. మా ఆజ్ఞ వచ్చి, నేలలో నీటి ఊటలు పెల్లుబికినపుడు అన్ని రకాలకు చెందిన ఒక్కొక్క జతను (ఒక ఆడ, ఒక మగ చొప్పున) అందులోకి ఎక్కించుకో. నీ ఇంటి వారిని కూడా తీసుకో. అయితే వారిలో ఎవరి గురించి ముందుగానే మా మాట ఖరారయిందో వారిని వెంట బెట్టుకోకు. జాగ్రత్త! అన్యాయానికి ఒడిగట్టినవారి గురించి నాతో మాట్లాడవద్దు. వారంతా ముంపుకు గురయ్యేవారే.
23:28 فَإِذَا اسْتَوَيْتَ أَنتَ وَمَن مَّعَكَ عَلَى الْفُلْكِ فَقُلِ الْحَمْدُ لِلَّهِ الَّذِي نَجَّانَا مِنَ الْقَوْمِ الظَّالِمِينَ
మరి నువ్వూ, నీ వెంటవచ్చిన వారూ ఓడలో పయన మయ్యాక, “దుర్మార్గుల బారి నుంచి మమ్మల్ని రక్షించిన అల్లాహ్‌కు కృతజ్ఞతలు” అని పలుకు.
23:29 وَقُل رَّبِّ أَنزِلْنِي مُنزَلًا مُّبَارَكًا وَأَنتَ خَيْرُ الْمُنزِلِينَ
ఇంకా ఈ విధంగా వేడుకో: “నా ప్రభూ! నన్ను శుభప్రదమైన చోట దించు. నీవు ఎంతో సురక్షితంగా (క్షేమంగా) దించేవాడవు.”
23:30 إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ وَإِن كُنَّا لَمُبْتَلِينَ
నిశ్చయంగా ఇందులో గొప్ప సూచనలున్నాయి. మేము తప్పక పరీక్షిస్తాము.
23:31 ثُمَّ أَنشَأْنَا مِن بَعْدِهِمْ قَرْنًا آخَرِينَ
వారి తరువాత మేము మరో తరాన్ని ప్రభవింపజేశాము.
23:32 فَأَرْسَلْنَا فِيهِمْ رَسُولًا مِّنْهُمْ أَنِ اعْبُدُوا اللَّهَ مَا لَكُم مِّنْ إِلَٰهٍ غَيْرُهُ ۖ أَفَلَا تَتَّقُونَ
మరి వారివద్దకు వారి జాతికే చెందిన ప్రవక్తను పంపాము. (అతనిలా పిలుపు ఇచ్చాడు:) “మీరంతా అల్లాహ్‌ను ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరో ఆరాధ్యుడు లేడు. మీరెందుకు భయపడరు?”
23:33 وَقَالَ الْمَلَأُ مِن قَوْمِهِ الَّذِينَ كَفَرُوا وَكَذَّبُوا بِلِقَاءِ الْآخِرَةِ وَأَتْرَفْنَاهُمْ فِي الْحَيَاةِ الدُّنْيَا مَا هَٰذَا إِلَّا بَشَرٌ مِّثْلُكُمْ يَأْكُلُ مِمَّا تَأْكُلُونَ مِنْهُ وَيَشْرَبُ مِمَّا تَشْرَبُونَ
సత్యాన్ని తిరస్కరించిన, పరలోకంలో కలవటాన్ని ధిక్కరించిన, ప్రాపంచిక జీవితంలో మేము భోగభాగ్యాలను ఇచ్చిన అతని జాతి నాయకులు ఇలా అన్నారు: “ఇతను కూడా మీలాంటి సామాన్య మానవుడే. మీరు తినేదే ఇతనూ తింటున్నాడు. మీరు త్రాగేదే ఇతనూ త్రాగుతున్నాడు.”
23:34 وَلَئِنْ أَطَعْتُم بَشَرًا مِّثْلَكُمْ إِنَّكُمْ إِذًا لَّخَاسِرُونَ
“మీరు గనక మీలాంటి ఒక మానవమాత్రుణ్ణి అనుసరించారంటే తప్పక నష్టపోతారు.”
23:35 أَيَعِدُكُمْ أَنَّكُمْ إِذَا مِتُّمْ وَكُنتُمْ تُرَابًا وَعِظَامًا أَنَّكُم مُّخْرَجُونَ
“ఏమిటీ, మీరు చచ్చి, మట్టిగా, ఎముకలుగా మారిపోయిన తరువాత కూడా మీరు మళ్లీ లేపబడతారని ఇతను వాగ్దానం చేస్తున్నాడా?”
23:36 هَيْهَاتَ هَيْهَاتَ لِمَا تُوعَدُونَ
“అసంభవం, మీకు చేయబడే ఈ వాగ్దానం అసంభవం”.
23:37 إِنْ هِيَ إِلَّا حَيَاتُنَا الدُّنْيَا نَمُوتُ وَنَحْيَا وَمَا نَحْنُ بِمَبْعُوثِينَ
“జీవితం అంటే అసలు ప్రాపంచిక జీవితమే. మనం ఇక్కడే చస్తూ, బతుకుతూ ఉంటాం. మళ్లీ మనం (సజీవులుగా) లేప బడటం అనేది ఉండదు.”
23:38 إِنْ هُوَ إِلَّا رَجُلٌ افْتَرَىٰ عَلَى اللَّهِ كَذِبًا وَمَا نَحْنُ لَهُ بِمُؤْمِنِينَ
“ఇతనూ మనిషే. (అయినా కూడా ఇతను) అల్లాహ్‌కు అబద్ధాలు అంటగడ్తున్నాడు. మేము ఇతన్ని నమ్మేది లేదు.”
23:39 قَالَ رَبِّ انصُرْنِي بِمَا كَذَّبُونِ
“ప్రభూ! వీళ్ల ధిక్కార వైఖరికి ప్రతిగా నాకు సహాయపడు” అని దైవప్రవక్త ప్రార్థించాడు.
23:40 قَالَ عَمَّا قَلِيلٍ لَّيُصْبِحُنَّ نَادِمِينَ
అప్పుడు, “వీళ్ళు (తమ స్వయం కృతంపై సిగ్గుతో) కుమిలి పోయే సమయం దగ్గరలోనే ఉంది” అని సమాధానం లభించింది.
23:41 فَأَخَذَتْهُمُ الصَّيْحَةُ بِالْحَقِّ فَجَعَلْنَاهُمْ غُثَاءً ۚ فَبُعْدًا لِّلْقَوْمِ الظَّالِمِينَ
ఎట్టకేలకు న్యాయం వాంఛించే దాని ప్రకారం ఒక పెద్ద అరుపు (అమాంతం) వారిని కబళించింది. అంతే! మేము వారిని చెత్తాచెదారంలా చేసేశాము. దుర్మార్గులు దూరమవుగాక!
23:42 ثُمَّ أَنشَأْنَا مِن بَعْدِهِمْ قُرُونًا آخَرِينَ
మేము వారి తరువాత మరెన్నో తరాలను ప్రభవింపజేశాము.
23:43 مَا تَسْبِقُ مِنْ أُمَّةٍ أَجَلَهَا وَمَا يَسْتَأْخِرُونَ
వాటిలో ఏ సమాజం కూడా నిర్థారిత గడువుకు ముందు పోవటంగానీ, వెనుక ఉండిపోవటంగానీ జరగలేదు.
23:44 ثُمَّ أَرْسَلْنَا رُسُلَنَا تَتْرَىٰ ۖ كُلَّ مَا جَاءَ أُمَّةً رَّسُولُهَا كَذَّبُوهُ ۚ فَأَتْبَعْنَا بَعْضَهُم بَعْضًا وَجَعَلْنَاهُمْ أَحَادِيثَ ۚ فَبُعْدًا لِّقَوْمٍ لَّا يُؤْمِنُونَ
తరువాత మేము మా ప్రవక్తలను ఎడతెగకుండా పంపాము. ఎప్పుడు ఏ జాతి వద్దకు వారి ప్రవక్త వచ్చినా ఆ జాతి అతనిని ధిక్కరిస్తూనే వచ్చింది. అందువల్ల మేము ఒకరి తరువాత ఒకరిని తుదముట్టించి, వారిని జరిగిన కథలుగా చేసేశాము. విశ్వసించని జాతులు దూరమవుదురు గాక!
23:45 ثُمَّ أَرْسَلْنَا مُوسَىٰ وَأَخَاهُ هَارُونَ بِآيَاتِنَا وَسُلْطَانٍ مُّبِينٍ
ఆ తరువాత మేము మూసాకు, అతని సోదరుడు హారూనుకు మా సూచనలను, స్పష్టమైన ప్రమాణాన్ని ఇచ్చి పంపాము.
23:46 إِلَىٰ فِرْعَوْنَ وَمَلَئِهِ فَاسْتَكْبَرُوا وَكَانُوا قَوْمًا عَالِينَ
ఫిరౌను వద్దకు, అతని సర్దారుల వద్దకు. కాని వారు అహం కారం ప్రదర్శించారు. అసలే వారు తలబిరుసు మనుషులు.
23:47 فَقَالُوا أَنُؤْمِنُ لِبَشَرَيْنِ مِثْلِنَا وَقَوْمُهُمَا لَنَا عَابِدُونَ
“ఏమిటీ, మనలాంటి ఇద్దరు మానవ మాత్రులను మనం విశ్వసించాలా? చూడబోతే వీళ్ల జాతి వారు స్వయంగా మనకు బానిసలుగా ఉన్నారు” అని వారన్నారు.
23:48 فَكَذَّبُوهُمَا فَكَانُوا مِنَ الْمُهْلَكِينَ
ఆ విధంగా వారిద్దరినీ ధిక్కరించి వాళ్లు కూడా నాశనమయ్యే వారిలో చేరిపోయారు.
23:49 وَلَقَدْ آتَيْنَا مُوسَى الْكِتَابَ لَعَلَّهُمْ يَهْتَدُونَ
ప్రజలు సన్మార్గం పొందటానికి మేము మూసాకు గ్రంథం ప్రసాదించాము.
23:50 وَجَعَلْنَا ابْنَ مَرْيَمَ وَأُمَّهُ آيَةً وَآوَيْنَاهُمَا إِلَىٰ رَبْوَةٍ ذَاتِ قَرَارٍ وَمَعِينٍ
మేము మర్యమ్ కుమారుణ్ణి, అతని తల్లిని ఒక సూచనగా చేశాము. వారిద్దరికీ ఎత్తయిన ప్రదేశంలో ఆశ్రయం కల్పించాము. అది ప్రశాంతమైన స్థలం, నీటి కాలువగల ప్రదేశం.
23:51 يَا أَيُّهَا الرُّسُلُ كُلُوا مِنَ الطَّيِّبَاتِ وَاعْمَلُوا صَالِحًا ۖ إِنِّي بِمَا تَعْمَلُونَ عَلِيمٌ
ఓ ప్రవక్తలారా! పరిశుద్ధ వస్తువులు తినండి, సదాచరణ చేయండి. మీరు చేసేదంతా నాకు తెలుసు.
23:52 وَإِنَّ هَٰذِهِ أُمَّتُكُمْ أُمَّةً وَاحِدَةً وَأَنَا رَبُّكُمْ فَاتَّقُونِ
నిశ్చయంగా మీ ఈ ధర్మం ఒకే ధర్మం. నేనే మీ అందరి ప్రభువును. కాబట్టి మీరు నాకు భయపడండి.
23:53 فَتَقَطَّعُوا أَمْرَهُم بَيْنَهُمْ زُبُرًا ۖ كُلُّ حِزْبٍ بِمَا لَدَيْهِمْ فَرِحُونَ
అయితే వారంతట వారే (విభేదించుకుని), తమ ధర్మాన్ని ముక్కచెక్కలుగా చేసుకున్నారు. ప్రతి (మత) వర్గం తన వద్దనున్న దాంతోనే సంబరపడిపోసాగింది.
23:54 فَذَرْهُمْ فِي غَمْرَتِهِمْ حَتَّىٰ حِينٍ
కనుక నువ్వు (కూడా) వాళ్ళను వాళ్ళ ఏమరుపాటులో కొంత కాలం మునిగి ఉండేలా విడిచిపెట్టు.
23:55 أَيَحْسَبُونَ أَنَّمَا نُمِدُّهُم بِهِ مِن مَّالٍ وَبَنِينَ
సంతానం మరియు సంపదల ద్వారా మేము వారికి ప్రసాదిస్తున్న సమృద్ధిని చూసి వారేమనుకుంటున్నారు?
23:56 نُسَارِعُ لَهُمْ فِي الْخَيْرَاتِ ۚ بَل لَّا يَشْعُرُونَ
తమకు మేళ్లు చేయటంలో మేము వేగిరపడ్తున్నామని వారు తలపోస్తున్నారా?! (లేదు లేదు) వారసలు (యదార్థాన్ని) గ్రహించటం లేదు.
23:57 إِنَّ الَّذِينَ هُم مِّنْ خَشْيَةِ رَبِّهِم مُّشْفِقُونَ
నిశ్చయంగా ఎవరు తమ ప్రభువు పట్ల భీతితో భయపడుతున్నారో,
23:58 وَالَّذِينَ هُم بِآيَاتِ رَبِّهِمْ يُؤْمِنُونَ
మరెవరు తమ ప్రభువు ఆయతులను విశ్వసిస్తున్నారో,
23:59 وَالَّذِينَ هُم بِرَبِّهِمْ لَا يُشْرِكُونَ
ఎవరు తమ ప్రభువుకు సహవర్తులను కల్పించకుండా ఉంటారో,
23:60 وَالَّذِينَ يُؤْتُونَ مَا آتَوا وَّقُلُوبُهُمْ وَجِلَةٌ أَنَّهُمْ إِلَىٰ رَبِّهِمْ رَاجِعُونَ
ఇంకా (దైవమార్గంలో) ఇవ్వవలసిన దాన్ని ఇస్తూ కూడా, తమ ప్రభువు వద్దకు మరలిపోవలసి ఉందనే భావనతో ఎవరి హృదయాలు వణుకుతూ ఉంటాయో,
23:61 أُولَٰئِكَ يُسَارِعُونَ فِي الْخَيْرَاتِ وَهُمْ لَهَا سَابِقُونَ
వారే త్వరత్వరగా మంచి పనులు చేసుకుంటూ పోతున్న వారు. వాటికోసం వారు పోటీపడతారు.
23:62 وَلَا نُكَلِّفُ نَفْسًا إِلَّا وُسْعَهَا ۖ وَلَدَيْنَا كِتَابٌ يَنطِقُ بِالْحَقِّ ۚ وَهُمْ لَا يُظْلَمُونَ
మేము ఏ ప్రాణిపైనా దాని శక్తికి మించిన భారం వేయము. మా వద్ద సత్యం పలికే గ్రంథం ఉంది. వారికెలాంటి అన్యాయం జరగదు.
23:63 بَلْ قُلُوبُهُمْ فِي غَمْرَةٍ مِّنْ هَٰذَا وَلَهُمْ أَعْمَالٌ مِّن دُونِ ذَٰلِكَ هُمْ لَهَا عَامِلُونَ
పైగా వారి హృదయాలే దీని విషయంలో అశ్రద్ధకు గురై ఉన్నాయి. ఇవి గాకుండా వారు చేసే మరెన్నో (చెడు) చేష్టలుకూడా ఉన్నాయి.
23:64 حَتَّىٰ إِذَا أَخَذْنَا مُتْرَفِيهِم بِالْعَذَابِ إِذَا هُمْ يَجْأَرُونَ
ఆఖరికి మేము వారిలోని భోగలాలసులను శిక్షగా పట్టుకున్నప్పుడు, వారు ఆర్తనాదాలు చేయసాగారు.
23:65 لَا تَجْأَرُوا الْيَوْمَ ۖ إِنَّكُم مِّنَّا لَا تُنصَرُونَ
ఈ రోజు అరవవలసిన అవసరం లేదు. మాకు వ్యతిరేకంగా మీరు ఎవరి సహాయమూ పొందలేరు.
23:66 قَدْ كَانَتْ آيَاتِي تُتْلَىٰ عَلَيْكُمْ فَكُنتُمْ عَلَىٰ أَعْقَابِكُمْ تَنكِصُونَ
(ఒకప్పుడు) నా ఆయతులు మీకు చదివి వినిపించబడేవి. అయినా మీరు కాలి మడమలపైన వెనుతిరిగి పోయేవారు (కదా)!
23:67 مُسْتَكْبِرِينَ بِهِ سَامِرًا تَهْجُرُونَ
గర్విష్టుల్లా ప్రవర్తించేవారు. కల్లబొల్లి కబుర్లు చెప్పుకుని, దాన్ని (ఖుర్ఆన్ను) వదిలిపోయేవారు (అని వారితో అనబడుతుంది).
23:68 أَفَلَمْ يَدَّبَّرُوا الْقَوْلَ أَمْ جَاءَهُم مَّا لَمْ يَأْتِ آبَاءَهُمُ الْأَوَّلِينَ
ఏమిటీ, వారు ఈ వాక్కు గురించి ఎన్నడూ చింతన చేయలేదా? లేక పూర్వం తమ తాతముత్తాతల వద్దకు రాని విషయం వారి వద్దకు వచ్చినందుకా? (ఈ మంకుతనం?)
23:69 أَمْ لَمْ يَعْرِفُوا رَسُولَهُمْ فَهُمْ لَهُ مُنكِرُونَ
లేక తమ సందేశహరుణ్ణి ఎరుగకపోవటం వల్ల వారు అతన్ని నిరాకరిస్తున్నారా?
23:70 أَمْ يَقُولُونَ بِهِ جِنَّةٌ ۚ بَلْ جَاءَهُم بِالْحَقِّ وَأَكْثَرُهُمْ لِلْحَقِّ كَارِهُونَ
లేక అతనికి పిచ్చిపట్టిందని వారంటున్నారా? అసలు విషయం ఏమిటంటే అతను వారి వద్దకు సత్యాన్ని తీసుకువచ్చాడు. అయితే వారిలో చాలా మందికి సత్యమంటే అసలే పడదు.
23:71 وَلَوِ اتَّبَعَ الْحَقُّ أَهْوَاءَهُمْ لَفَسَدَتِ السَّمَاوَاتُ وَالْأَرْضُ وَمَن فِيهِنَّ ۚ بَلْ أَتَيْنَاهُم بِذِكْرِهِمْ فَهُمْ عَن ذِكْرِهِم مُّعْرِضُونَ
సత్యమే గనక వారి కోర్కెల వెనుక పరుగెత్తినట్లయితే భూమ్యాకాశాలు, అందులో వున్న సమస్తం చిందరవందర అయిపోయేవి. యదార్థమేమిటంటే మేము వారికి వారి ఉపదేశాన్ని చేరవేశాము. కాని వారు మాత్రం తమ ఉపదేశం పట్ల విముఖత చూపుతున్నారు.
23:72 أَمْ تَسْأَلُهُمْ خَرْجًا فَخَرَاجُ رَبِّكَ خَيْرٌ ۖ وَهُوَ خَيْرُ الرَّازِقِينَ
పోనీ, నువ్వు వారినుంచి వేతనం ఏదన్నా అడుగుతున్నావా? నీ ప్రభువు ఇచ్చే ప్రతిఫలం చాలా మేలైనదని తెలుసుకో. ఆయన ఉపాధి ప్రదాతలలోకెల్లా శ్రేష్ఠుడు.
23:73 وَإِنَّكَ لَتَدْعُوهُمْ إِلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ
(ఓ ప్రవక్తా!) నిశ్చయంగా నువ్వు వారిని రుజుమార్గం వైపునకు పిలుస్తున్నావు.
23:74 وَإِنَّ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ عَنِ الصِّرَاطِ لَنَاكِبُونَ
అయితే పరలోకంపై నమ్మకం లేనివారు నిశ్చయంగా సన్మార్గం నుంచి తప్పిపోతారు.
23:75 وَلَوْ رَحِمْنَاهُمْ وَكَشَفْنَا مَا بِهِم مِّن ضُرٍّ لَّلَجُّوا فِي طُغْيَانِهِمْ يَعْمَهُونَ
ఒకవేళ మేము వారిపై దయదలచి, వారి కష్టాలను దూరం చేస్తే వారు తమ తలబిరుసుతనంలో మరింతగా మొండికేసి, అంధులుగా ప్రవర్తిస్తారు.
23:76 وَلَقَدْ أَخَذْنَاهُم بِالْعَذَابِ فَمَا اسْتَكَانُوا لِرَبِّهِمْ وَمَا يَتَضَرَّعُونَ
మేము వారిని శిక్షలో (భాగంగా) కూడా పట్టుకున్నాము. కాని వారు తమ ప్రభువు సమక్షంలో లొంగనూ లేదు, వినమ్రతను వ్యక్తపరచనూ లేదు.
23:77 حَتَّىٰ إِذَا فَتَحْنَا عَلَيْهِم بَابًا ذَا عَذَابٍ شَدِيدٍ إِذَا هُمْ فِيهِ مُبْلِسُونَ
ఆఖరికి మేము వారిపై కఠినమైన శిక్షా ద్వారాన్ని తెరచివేసినప్పుడు, వారు వెంటనే నిరాశానిస్పృహలకు లోనయ్యారు.
23:78 وَهُوَ الَّذِي أَنشَأَ لَكُمُ السَّمْعَ وَالْأَبْصَارَ وَالْأَفْئِدَةَ ۚ قَلِيلًا مَّا تَشْكُرُونَ
ఆయనే (అల్లాహ్‌యే) మీకు చెవులను, కళ్లను, హృదయాలను చేశాడు. కాని మీరు కృతజ్ఞతలు తెలిపేది బహుతక్కువ.
23:79 وَهُوَ الَّذِي ذَرَأَكُمْ فِي الْأَرْضِ وَإِلَيْهِ تُحْشَرُونَ
మిమ్మల్ని భూమిపై వ్యాపింపజేసినవాడు కూడా ఆయనే. ఎట్టకేలకు ఆయన వద్దకే మీరు సమీకరించబడతారు.
23:80 وَهُوَ الَّذِي يُحْيِي وَيُمِيتُ وَلَهُ اخْتِلَافُ اللَّيْلِ وَالنَّهَارِ ۚ أَفَلَا تَعْقِلُونَ
జీవన్మరణాలను ఇచ్చేవాడు కూడా ఆయనే. రేయింబవళ్ళ మార్పిడి కూడా ఆయన అధీనంలోనే ఉంది. మరి మీరు ఆ మాత్రం గ్రహించలేరా?
23:81 بَلْ قَالُوا مِثْلَ مَا قَالَ الْأَوَّلُونَ
అసలు అది కాదు. తమ పూర్వీకులు చెబుతూ వచ్చిన దానినే వీళ్ళూ చెబుతున్నారు –
23:82 قَالُوا أَإِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا وَعِظَامًا أَإِنَّا لَمَبْعُوثُونَ
“మేము మరణించి, మట్టిగా, ఎముకలుగా మారిపోయిన తరువాత కూడా మళ్లీ సజీవులుగా లేపబడతామా?” అనంటారు.
23:83 لَقَدْ وُعِدْنَا نَحْنُ وَآبَاؤُنَا هَٰذَا مِن قَبْلُ إِنْ هَٰذَا إِلَّا أَسَاطِيرُ الْأَوَّلِينَ
“మాకూ, మా తాతముత్తాతలకు మునుపటి నుంచే ఇలాంటి వాగ్దానం చేయబడుతూ వస్తోంది. ఇవి పూర్వీకుల కట్టుకథలు తప్ప మరేమీ కావు” (అని చెబుతారు).
23:84 قُل لِّمَنِ الْأَرْضُ وَمَن فِيهَا إِن كُنتُمْ تَعْلَمُونَ
“భూమి మరియు అందులో ఉన్న సమస్త వస్తువులు ఎవరివో మీకే గనక తెలిసి ఉంటే చెప్పండి?” అని (ఓ ప్రవక్తా!) వారిని అడుగు.
23:85 سَيَقُولُونَ لِلَّهِ ۚ قُلْ أَفَلَا تَذَكَّرُونَ
“అల్లాహ్‌వే” అని వారు వెంటనే సమాధానం ఇస్తారు. “మరయితే మీరు హితబోధను ఎందుకు గ్రహించటం లేదు?” అని అడుగు.
23:86 قُلْ مَن رَّبُّ السَّمَاوَاتِ السَّبْعِ وَرَبُّ الْعَرْشِ الْعَظِيمِ
“సప్తాకాశాలకు, మహోన్నతమైన (అర్ష్) పీఠానికి అధిపతి ఎవరు?” అని వారిని ప్రశ్నించు.
23:87 سَيَقُولُونَ لِلَّهِ ۚ قُلْ أَفَلَا تَتَّقُونَ
“అల్లాహ్‌యే” అని వారు జవాబిస్తారు. “మరలాంటప్పుడు మీరెందుకు భయపడరు?” అని వారిని (నిలదీసి) అడుగు.
23:88 قُلْ مَن بِيَدِهِ مَلَكُوتُ كُلِّ شَيْءٍ وَهُوَ يُجِيرُ وَلَا يُجَارُ عَلَيْهِ إِن كُنتُمْ تَعْلَمُونَ
సమస్త విషయాల సార్వభౌమత్వం ఎవరి చేతుల్లో ఉందో, శరణు ఇచ్చేవాడెవడో, ఎవరికి వ్యతిరేకంగా ఏ శరణూ లభించదో- ఆయనెవరో మీకు తెలిసి ఉంటే చెప్పండి? అని (ఓ ప్రవక్తా!) వారిని అడుగు.
23:89 سَيَقُولُونَ لِلَّهِ ۚ قُلْ فَأَنَّىٰ تُسْحَرُونَ
“అల్లాహ్ మాత్రమే” అని వారు చెబుతారు. “మరైతే మీరు ఎలా మోసపోతున్నారు?” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు.
23:90 بَلْ أَتَيْنَاهُم بِالْحَقِّ وَإِنَّهُمْ لَكَاذِبُونَ
నిజానికి మేము వారికి సత్యాన్ని అందజేశాము. వారే ముమ్మాటికీ అబద్ధాల కోరులు.
23:91 مَا اتَّخَذَ اللَّهُ مِن وَلَدٍ وَمَا كَانَ مَعَهُ مِنْ إِلَٰهٍ ۚ إِذًا لَّذَهَبَ كُلُّ إِلَٰهٍ بِمَا خَلَقَ وَلَعَلَا بَعْضُهُمْ عَلَىٰ بَعْضٍ ۚ سُبْحَانَ اللَّهِ عَمَّا يَصِفُونَ
అల్లాహ్ ఎవరినీ కొడుకుగా చేసుకోలేదు. ఆయనతోపాటు ఇంకొక ఆరాధ్య దేవుడు కూడా (భాగస్వామిగా) లేడు. ఒకవేళ అలాంటిదేదైనా ఉంటే ప్రతి దేవుడూ తాను సృష్టించిన సృష్టితాలను వేరుగా తీసుకుని వేరయిపోయేవాడు. ఒకడు ఇంకొకనిపై దండయాత్ర చేసేవాడు. వారు అల్లాహ్‌కు ఏ లక్షణాలను ఆపాదిస్తున్నారో వాటికి ఆయన అతీతుడు, పవిత్రుడు.
23:92 عَالِمِ الْغَيْبِ وَالشَّهَادَةِ فَتَعَالَىٰ عَمَّا يُشْرِكُونَ
గోప్యంగా ఉన్నదానినీ, బహిర్గతంగా ఉన్నదానినీ ఆయన ఎరిగినవాడు. వారు కల్పించే భాగస్వామ్యానికి (షిర్కుకు) ఆయన అతీతుడు, ఉన్నతుడు.
23:93 قُل رَّبِّ إِمَّا تُرِيَنِّي مَا يُوعَدُونَ
(ఓ ముహమ్మద్- (స) !) ఈ విధంగా ప్రార్థించు : “నా ప్రభూ! అవిశ్వాసులకు చేయబడుతున్న వాగ్దానాన్ని (శిక్షను) గనక నీవు నాకు చూపదలిస్తే,
23:94 رَبِّ فَلَا تَجْعَلْنِي فِي الْقَوْمِ الظَّالِمِينَ
“ప్రభూ! నీవు నన్ను ఈ దుర్మార్గుల సమూహంలో మటుకు ఉంచకు.”
23:95 وَإِنَّا عَلَىٰ أَن نُّرِيَكَ مَا نَعِدُهُمْ لَقَادِرُونَ
మేము వారికి వాగ్దానం చేస్తున్నదంతా నీకు చూపగలం.
23:96 ادْفَعْ بِالَّتِي هِيَ أَحْسَنُ السَّيِّئَةَ ۚ نَحْنُ أَعْلَمُ بِمَا يَصِفُونَ
(ఓ ముహమ్మద్!) ఏదయితే మంచిదో దాని ద్వారానే చెడును తొలగించు. వారు కల్పించేవన్నీ మాకు బాగా తెలుసు.
23:97 وَقُل رَّبِّ أَعُوذُ بِكَ مِنْ هَمَزَاتِ الشَّيَاطِينِ
ఇంకా ఇలా ప్రార్థిస్తూ ఉండు: “ఓ నా ప్రభూ! షైతానులు కలిగించే ప్రేరణల నుంచి నేను నీ శరణుకోరుతున్నాను.
23:98 وَأَعُوذُ بِكَ رَبِّ أَن يَحْضُرُونِ
ప్రభూ! వారు నా వద్దకు రావటం నుంచి నీ శరణు వేడుతున్నాను.”
23:99 حَتَّىٰ إِذَا جَاءَ أَحَدَهُمُ الْمَوْتُ قَالَ رَبِّ ارْجِعُونِ
చివరికి వారిలో ఎవరికైనా చావు వచ్చినప్పుడు,” ఓ ప్రభూ! నన్ను తిరిగి వెనక్కి పంపించు.
23:100 لَعَلِّي أَعْمَلُ صَالِحًا فِيمَا تَرَكْتُ ۚ كَلَّا ۚ إِنَّهَا كَلِمَةٌ هُوَ قَائِلُهَا ۖ وَمِن وَرَائِهِم بَرْزَخٌ إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ
“నేను వదలి వచ్చిన లోకంలోకే వెళ్ళి సత్కార్యం చేస్తాను” అని అంటాడు. ముమ్మాటికీ అలా జరగదు. అది అతను అంటున్న ఒక మాట మాత్రమే. వారు మళ్లీ సజీవులై లేచే రోజు వరకూ వారి వెనుక ఒక అడ్డుతెర ఉంటుంది.
23:101 فَإِذَا نُفِخَ فِي الصُّورِ فَلَا أَنسَابَ بَيْنَهُمْ يَوْمَئِذٍ وَلَا يَتَسَاءَلُونَ
మరి శంఖం పూరించబడినప్పుడు వారి మధ్యన బంధుత్వాలుగానీ, ఒండొకరిని అడిగి చూడటంగానీ ఆనాడు ఉండదు.
23:102 فَمَن ثَقُلَتْ مَوَازِينُهُ فَأُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ
ఎవరి త్రాసు పళ్ళెం బరువుగా ఉంటుందో వారు సాఫల్యం పొందినవారవుతారు.
23:103 وَمَنْ خَفَّتْ مَوَازِينُهُ فَأُولَٰئِكَ الَّذِينَ خَسِرُوا أَنفُسَهُمْ فِي جَهَنَّمَ خَالِدُونَ
మరెవరి త్రాసుపళ్ళెం తేలికగా ఉంటుందో వారే తమకు తాము నష్టం చేకూర్చుకున్నవారు. వారు సదా నరకంలో ఉంటారు.
23:104 تَلْفَحُ وُجُوهَهُمُ النَّارُ وَهُمْ فِيهَا كَالِحُونَ
వారి ముఖాలను అగ్ని మాడ్చివేస్తూ ఉంటుంది. అందువల్ల వారు కడు అందవికారంగా మారిపోతారు.
23:105 أَلَمْ تَكُنْ آيَاتِي تُتْلَىٰ عَلَيْكُمْ فَكُنتُم بِهَا تُكَذِّبُونَ
“నా ఆయతులు మీకు చదివి వినిపించబడలేదా? అయినప్పటికీ మీరు వాటిని ధిక్కరించేవారు” (అని వారితో చెప్పినప్పుడు),
23:106 قَالُوا رَبَّنَا غَلَبَتْ عَلَيْنَا شِقْوَتُنَا وَكُنَّا قَوْمًا ضَالِّينَ
“ప్రభూ! మా దౌర్భాగ్యం మమ్మల్ని శాసించింది. (నిజంగా) మేము మార్గభ్రష్టులం” అని వారు అంటారు.
23:107 رَبَّنَا أَخْرِجْنَا مِنْهَا فَإِنْ عُدْنَا فَإِنَّا ظَالِمُونَ
“మా ప్రభూ! మాకు ఇక్కణ్ణుంచి విముక్తిని ప్రసాదించు. మేము గనక మళ్లీ ఇలాగే చేస్తే అప్పుడు నిశ్చయంగా మేము దుర్మార్గులమవుతాము” (అని విజ్ఞప్తి చేసుకుంటారు).
23:108 قَالَ اخْسَئُوا فِيهَا وَلَا تُكَلِّمُونِ
“ధూర్తులై ఇందులోనే పడి ఉండండి. నాతో మాట్లాడకండి” అని అల్లాహ్ అంటాడు.
23:109 إِنَّهُ كَانَ فَرِيقٌ مِّنْ عِبَادِي يَقُولُونَ رَبَّنَا آمَنَّا فَاغْفِرْ لَنَا وَارْحَمْنَا وَأَنتَ خَيْرُ الرَّاحِمِينَ
నా దాసులలోని ఒక వర్గంవారు, “ఓ మా ప్రభూ! మేము విశ్వసించాము. కనుక మమ్మల్ని క్షమించు, మాపై దయజూపు. నువ్వు దయచూపే వారందరిలోకెల్లా శ్రేష్ఠుడవు” అని వేడుకునే వారు.
23:110 فَاتَّخَذْتُمُوهُمْ سِخْرِيًّا حَتَّىٰ أَنسَوْكُمْ ذِكْرِي وَكُنتُم مِّنْهُمْ تَضْحَكُونَ
కాని మీరేమో వారిని నవ్వులాటగా తీసుకున్నారు. ఆఖరికి మీ ఈ పరాచికాలు మిమ్మల్ని నా ధ్యానం కూడా మరిపింపజేశాయి. అయినా మీరు వారిని పరిహసిస్తూనే ఉన్నారు.
23:111 إِنِّي جَزَيْتُهُمُ الْيَوْمَ بِمَا صَبَرُوا أَنَّهُمْ هُمُ الْفَائِزُونَ
నేను ఈ రోజు వారికి వారి సహనానికి తగిన ప్రతిఫలం ఇచ్చాను. వాస్తవానికి వారు (ఆశించిన మేరకు) సఫలీకృతులయ్యారు (అని అల్లాహ్ సెలవిస్తాడు).
23:112 قَالَ كَمْ لَبِثْتُمْ فِي الْأَرْضِ عَدَدَ سِنِينَ
“మీరు ఎన్ని సంవత్సరాల పాటు భూలోకంలో ఉండి ఉంటారు?” అని (అల్లాహ్) వారిని అడుగుతాడు.
23:113 قَالُوا لَبِثْنَا يَوْمًا أَوْ بَعْضَ يَوْمٍ فَاسْأَلِ الْعَادِّينَ
“ఒక రోజో లేక ఒక రోజుకన్నా తక్కువ సమయమో ఉండి ఉంటాము. కావాలంటే లెక్కించేవారిని అడగండి” అని వారంటారు.
23:114 قَالَ إِن لَّبِثْتُمْ إِلَّا قَلِيلًا ۖ لَّوْ أَنَّكُمْ كُنتُمْ تَعْلَمُونَ
అల్లాహ్ అంటాడు: “నిజంగానే మీరు చాలా కొద్ది సమయమే అక్కడ ఉన్నారు. ఈ సంగతిని మీరు ముందే గ్రహిస్తే ఎంత బావుండేది!
23:115 أَفَحَسِبْتُمْ أَنَّمَا خَلَقْنَاكُمْ عَبَثًا وَأَنَّكُمْ إِلَيْنَا لَا تُرْجَعُونَ
“మేము మిమ్మల్ని ఏదో ఆషామాషీగా (అర్థరహితంగా) పుట్టించామనీ, మీరు మా దగ్గరకు మరలిరావటం అనేది జరగని పని అని అనుకున్నారా?”
23:116 فَتَعَالَى اللَّهُ الْمَلِكُ الْحَقُّ ۖ لَا إِلَٰهَ إِلَّا هُوَ رَبُّ الْعَرْشِ الْكَرِيمِ
అల్లాహ్‌యే నిజమైన సార్వభౌముడు. ఆయన మహోన్నతుడు. ఆయన తప్ప మరో ఆరాధ్య దేవుడు లేడు. మహోన్నత పీఠానికి ఆయనే అధిపతి.
23:117 وَمَن يَدْعُ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ لَا بُرْهَانَ لَهُ بِهِ فَإِنَّمَا حِسَابُهُ عِندَ رَبِّهِ ۚ إِنَّهُ لَا يُفْلِحُ الْكَافِرُونَ
ఎవడైనా, తన దగ్గర ఏ ప్రమాణమూ లేకపోయినప్పటికీ- అల్లాహ్‌తో పాటు వేరొక దేవుణ్ణి మొరపెట్టుకుంటే, అటువంటి వ్యక్తి లెక్క అతని ప్రభువు వద్ద ఉన్నది. నిశ్చయంగా అవిశ్వాసులు సఫలురు కాలేరు.
23:118 وَقُل رَّبِّ اغْفِرْ وَارْحَمْ وَأَنتَ خَيْرُ الرَّاحِمِينَ
(ఓ ప్రవక్తా!) ఇలా ప్రార్థించు: “నా ప్రభూ! క్షమించు. కనికరించు. కనికరించే వారందరిలోకెల్లా నీవు ఉత్తముడవు.”
24. సూరా అన్ నూర్ (An-Nur)
24:1 سُورَةٌ أَنزَلْنَاهَا وَفَرَضْنَاهَا وَأَنزَلْنَا فِيهَا آيَاتٍ بَيِّنَاتٍ لَّعَلَّكُمْ تَذَكَّرُونَ
ఇది మేము అవతరింపజేసిన (ఒక) సూరా. మరి మేమే దానిని విధించాము. మీరు జ్ఞాపకముంచుకునేందుకు, అందులో మేము స్పష్టమైన ఆయతులను (ఆజ్ఞలను) అవతరింపజేశాము.
24:2 الزَّانِيَةُ وَالزَّانِي فَاجْلِدُوا كُلَّ وَاحِدٍ مِّنْهُمَا مِائَةَ جَلْدَةٍ ۖ وَلَا تَأْخُذْكُم بِهِمَا رَأْفَةٌ فِي دِينِ اللَّهِ إِن كُنتُمْ تُؤْمِنُونَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ ۖ وَلْيَشْهَدْ عَذَابَهُمَا طَائِفَةٌ مِّنَ الْمُؤْمِنِينَ
వ్యభిచారం చేసే స్త్రీ, వ్యభిచారం చేసే పురుషుడు – వారిద్దరిలో ఒక్కొక్కరికి నూరేసి కొరడా దెబ్బలు కొట్టండి. మీరు అల్లాహ్‌పై, అంతిమదినంపై విశ్వాసం గలవారే అయితే వారిపై దైవాజ్ఞను (షరీయతు ప్రకారం శిక్షను) విధించేటప్పుడు మీకు ఎంతమాత్రం జాలి కలగకూడదు. పైగా వారిని శిక్షించే సమయంలో ముస్లింలలో కొంతమంది అక్కడ ఉండాలి.
24:3 الزَّانِي لَا يَنكِحُ إِلَّا زَانِيَةً أَوْ مُشْرِكَةً وَالزَّانِيَةُ لَا يَنكِحُهَا إِلَّا زَانٍ أَوْ مُشْرِكٌ ۚ وَحُرِّمَ ذَٰلِكَ عَلَى الْمُؤْمِنِينَ
వ్యభిచారి అయిన పురుషుడు వ్యభిచారం చేసే స్త్రీని లేక ముష్రిక్కు స్త్రీని తప్ప మరెవరినీ వివాహమాడలేడు. అలాగే వ్యభిచారానికి పాల్పడే స్త్రీ కూడా వ్యభిచారం చేసే పురుషుడిని లేక ముష్రిక్కు మగాణ్ణి తప్ప వేరితరులను మనువాడజాలదు. విశ్వాసుల కొరకు ఇది నిషేధించబడింది.
24:4 وَالَّذِينَ يَرْمُونَ الْمُحْصَنَاتِ ثُمَّ لَمْ يَأْتُوا بِأَرْبَعَةِ شُهَدَاءَ فَاجْلِدُوهُمْ ثَمَانِينَ جَلْدَةً وَلَا تَقْبَلُوا لَهُمْ شَهَادَةً أَبَدًا ۚ وَأُولَٰئِكَ هُمُ الْفَاسِقُونَ
శీలవతులైన స్త్రీలపై అపనిందను మోపి, దానికి సంబంధించిన నలుగురు సాక్షుల్ని తీసుకురాలేని వారికి ఎనభై కొరడా దెబ్బలు కొట్టండి. ఇక మీదట ఎన్నడూ వారి సాక్ష్యాన్ని ఆమోదించకండి. వారు అవిధేయులు.
24:5 إِلَّا الَّذِينَ تَابُوا مِن بَعْدِ ذَٰلِكَ وَأَصْلَحُوا فَإِنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ
అయితే ఆ తరువాత ఎవరు పశ్చాత్తాపం చెంది, తమ ప్రవర్తనను సరిదిద్దుకుంటారో (అలాంటి వారిని) అల్లాహ్ క్షమిస్తాడు, కరుణిస్తాడు.
24:6 وَالَّذِينَ يَرْمُونَ أَزْوَاجَهُمْ وَلَمْ يَكُن لَّهُمْ شُهَدَاءُ إِلَّا أَنفُسُهُمْ فَشَهَادَةُ أَحَدِهِمْ أَرْبَعُ شَهَادَاتٍ بِاللَّهِ ۙ إِنَّهُ لَمِنَ الصَّادِقِينَ
ఎవరయినా తమ భార్యలపై (అక్రమ సంబంధపు) నిందమోపి, దానికి స్వయంగా తాము తప్ప మరెవరూ సాక్షులు లేని పక్షంలో వారిలో ప్రతి ఒక్కరూ నాలుగుసార్లు అల్లాహ్‌పై ప్రమాణం చేసి, తాను చెప్పేది నిజం అని పలకాలి (అదే వారి సాక్ష్యం).
24:7 وَالْخَامِسَةُ أَنَّ لَعْنَتَ اللَّهِ عَلَيْهِ إِن كَانَ مِنَ الْكَاذِبِينَ
అయిదవసారి -‘ఒకవేళ తాను చెప్పేది అబద్ధమైతే తనపై అల్లాహ్ శాపం పడుగాక!’ అని చెప్పాలి.
24:8 وَيَدْرَأُ عَنْهَا الْعَذَابَ أَن تَشْهَدَ أَرْبَعَ شَهَادَاتٍ بِاللَّهِ ۙ إِنَّهُ لَمِنَ الْكَاذِبِينَ
ఇక ఆ స్త్రీ శిక్ష నుంచి బయటపడే మార్గం ఏమిటంటే, ఆమె నాలుగుసార్లు అల్లాహ్‌పై ప్రమాణం చేసి, ‘తన భర్త చెప్పేది అబద్ధం’ అని పలకాలి.
24:9 وَالْخَامِسَةَ أَنَّ غَضَبَ اللَّهِ عَلَيْهَا إِن كَانَ مِنَ الصَّادِقِينَ
అయిదవసారి -‘ఒకవేళ అతను (తన భర్త) చెప్పేదే నిజమైతే, తనపై అల్లాహ్ ఆగ్రహం పడుగాక!'(అ) అని చెప్పాలి.
24:10 وَلَوْلَا فَضْلُ اللَّهِ عَلَيْكُمْ وَرَحْمَتُهُ وَأَنَّ اللَّهَ تَوَّابٌ حَكِيمٌ
అల్లాహ్ అనుగ్రహము, ఆయన దయాదాక్షిణ్యాలే గనక మీపైన లేకుండా పోతే (మీరు కష్టాల పాలయ్యేవారు). అల్లాహ్ పశ్చాత్తాపాన్ని ఆమోదించేవాడు, వివేకవంతుడు.
24:11 إِنَّ الَّذِينَ جَاءُوا بِالْإِفْكِ عُصْبَةٌ مِّنكُمْ ۚ لَا تَحْسَبُوهُ شَرًّا لَّكُم ۖ بَلْ هُوَ خَيْرٌ لَّكُمْ ۚ لِكُلِّ امْرِئٍ مِّنْهُم مَّا اكْتَسَبَ مِنَ الْإِثْمِ ۚ وَالَّذِي تَوَلَّىٰ كِبْرَهُ مِنْهُمْ لَهُ عَذَابٌ عَظِيمٌ
ఈ పెద్ద అపనిందను కల్పించి తెచ్చినది కూడా మీలోని ఒక వర్గమే. మీరు దీనిని మీ పాలిట కీడుగా భావించకండి. పైగా ఇది మీ కొరకు మేలైనదే. కాకపోతే (ఈ వ్యవహారంలో), వారిలో ప్రతి ఒక్కరికీ వారు సంపాదించిన దాన్నిబట్టి పాపం లభిస్తుంది. మరి వారిలో చాలా పెద్ద పాత్రను పోషించిన వాడికి మాత్రం మహా శిక్ష పడుతుంది.
24:12 لَّوْلَا إِذْ سَمِعْتُمُوهُ ظَنَّ الْمُؤْمِنُونَ وَالْمُؤْمِنَاتُ بِأَنفُسِهِمْ خَيْرًا وَقَالُوا هَٰذَا إِفْكٌ مُّبِينٌ
దాన్ని గురించి వినగానే విశ్వాసులైన స్త్రీ పురుషులు తమ వారిపట్ల మంచి తలంపుతో, “ఇది పచ్చి అభాండం” అని ఎందుకనలేదు?
24:13 لَّوْلَا جَاءُوا عَلَيْهِ بِأَرْبَعَةِ شُهَدَاءَ ۚ فَإِذْ لَمْ يَأْتُوا بِالشُّهَدَاءِ فَأُولَٰئِكَ عِندَ اللَّهِ هُمُ الْكَاذِبُونَ
దీనిపై వారు నలుగురు సాక్షుల్ని ఎందుకు తీసుకురాలేదు? సాక్షుల్ని తీసుకురానందున ఈ నీలాపనిందను మోపినవారు అల్లాహ్ సన్నిధిలో అబద్ధాల కోరులయ్యారు.
24:14 وَلَوْلَا فَضْلُ اللَّهِ عَلَيْكُمْ وَرَحْمَتُهُ فِي الدُّنْيَا وَالْآخِرَةِ لَمَسَّكُمْ فِي مَا أَفَضْتُمْ فِيهِ عَذَابٌ عَظِيمٌ
ఇహపరలోకాలలో మీపై అల్లాహ్ అనుగ్రహం, ఆయన దయ గనక ఉండకపోతే ఏ మాటల్లోనయితే మీరు పడిపోయారో, దానికి పర్యవసానంగా, ఓ పెద్ద శిక్ష మిమ్మల్ని చుట్టుకునేదే.
24:15 إِذْ تَلَقَّوْنَهُ بِأَلْسِنَتِكُمْ وَتَقُولُونَ بِأَفْوَاهِكُم مَّا لَيْسَ لَكُم بِهِ عِلْمٌ وَتَحْسَبُونَهُ هَيِّنًا وَهُوَ عِندَ اللَّهِ عَظِيمٌ
(ఎందుకంటే) అప్పుడు మీరు ఆ విషయాన్ని ఆ నోటా ఈ నోటా అందుకుని (వ్యాపింపజేశారు.) మీకు ఏమాత్రం తెలియని విషయాన్ని మీ నోటితో పేలటం మొదలెట్టారు. మీరు దాన్ని చిన్న విషయంగా భావించారు. కాని అల్లాహ్ దృష్టిలో మాత్రం అది చాలా పెద్ద విషయం.
24:16 وَلَوْلَا إِذْ سَمِعْتُمُوهُ قُلْتُم مَّا يَكُونُ لَنَا أَن نَّتَكَلَّمَ بِهَٰذَا سُبْحَانَكَ هَٰذَا بُهْتَانٌ عَظِيمٌ
అసలు మీరు ఆ మాట వినగానే, “ఇలాంటి మాట చెప్పటం మనకు ఎంత మాత్రం తగదు. ఓ అల్లాహ్! నీవు పరమ పవిత్రుడవు. ఇది మాత్రం పెద్ద అభాండమే” అని ఎందుకు అనలేదు?
24:17 يَعِظُكُمُ اللَّهُ أَن تَعُودُوا لِمِثْلِهِ أَبَدًا إِن كُنتُم مُّؤْمِنِينَ
మీరు నిజమైన విశ్వాసులే అయితే ఇక మీదట ఎన్నడూ ఇలాంటి చేష్టకు పాల్పడరాదని అల్లాహ్ మీకు బోధపరుస్తున్నాడు.
24:18 وَيُبَيِّنُ اللَّهُ لَكُمُ الْآيَاتِ ۚ وَاللَّهُ عَلِيمٌ حَكِيمٌ
అల్లాహ్ మీకు తన ఆయతులను విశదపరుస్తున్నాడు. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, వివేకవంతుడు.
24:19 إِنَّ الَّذِينَ يُحِبُّونَ أَن تَشِيعَ الْفَاحِشَةُ فِي الَّذِينَ آمَنُوا لَهُمْ عَذَابٌ أَلِيمٌ فِي الدُّنْيَا وَالْآخِرَةِ ۚ وَاللَّهُ يَعْلَمُ وَأَنتُمْ لَا تَعْلَمُونَ
ముస్లింలలో అశ్లీలత వ్యాపించాలని కోరుకునేవారికి ప్రపంచంలోనూ, పరలోకంలోనూ వ్యధాభరితమైన యాతన ఉంది. అల్లాహ్‌కు అంతా తెలుసు. కాని మీకు తెలియదు.
24:20 وَلَوْلَا فَضْلُ اللَّهِ عَلَيْكُمْ وَرَحْمَتُهُ وَأَنَّ اللَّهَ رَءُوفٌ رَّحِيمٌ
అల్లాహ్ దయానుగ్రహాలే గనక మీపై లేకపోయినట్లయితే (మీ నిర్వాకానికిగాను ఇప్పటికే శిక్ష అవతరించేది). అల్లాహ్ ప్రేమ మయుడు, కనికరం కలవాడు (కాబట్టి సరిపోయింది).
24:21 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَتَّبِعُوا خُطُوَاتِ الشَّيْطَانِ ۚ وَمَن يَتَّبِعْ خُطُوَاتِ الشَّيْطَانِ فَإِنَّهُ يَأْمُرُ بِالْفَحْشَاءِ وَالْمُنكَرِ ۚ وَلَوْلَا فَضْلُ اللَّهِ عَلَيْكُمْ وَرَحْمَتُهُ مَا زَكَىٰ مِنكُم مِّنْ أَحَدٍ أَبَدًا وَلَٰكِنَّ اللَّهَ يُزَكِّي مَن يَشَاءُ ۗ وَاللَّهُ سَمِيعٌ عَلِيمٌ
ఓ విశ్వాసులారా! షైతాను అడుగు జాడల్లో నడవకండి. షైతాను అడుగు జాడలలో నడిచే వారికి వాడు అశ్లీలతను, చెడు పనులను గురించి మాత్రమే ఆదేశిస్తాడు. అల్లాహ్ చలువ, ఆయన దాక్షిణ్యం గనక మీపై లేకపోతే మీలో ఎవడూ, ఎన్నటికీ పరిశుద్ధుడు అయ్యేవాడు కాడు. అయితే అల్లాహ్ తాను కోరిన వారిని పరిశుద్ధులుగా చేస్తాడు. అల్లాహ్ అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు.
24:22 وَلَا يَأْتَلِ أُولُو الْفَضْلِ مِنكُمْ وَالسَّعَةِ أَن يُؤْتُوا أُولِي الْقُرْبَىٰ وَالْمَسَاكِينَ وَالْمُهَاجِرِينَ فِي سَبِيلِ اللَّهِ ۖ وَلْيَعْفُوا وَلْيَصْفَحُوا ۗ أَلَا تُحِبُّونَ أَن يَغْفِرَ اللَّهُ لَكُمْ ۗ وَاللَّهُ غَفُورٌ رَّحِيمٌ
మీలోని ఐశ్వర్యవంతులు, స్థితిమంతులు తమ బంధువులకు, నిరుపేదలకు, అల్లాహ్ మార్గంలో స్వస్థలం వదలి వచ్చిన వారికి ‘ఇవ్వబోము’ అని ఒట్టేసుకోరాదు. పైగా వారిని క్షమించాలి. (వారి పట్ల) మన్నింపుల వైఖరిని అవలంబించాలి. ఏమిటీ, అల్లాహ్ మిమ్మల్ని క్షమించాలని మీరు అభిలషించరా ? అల్లాహ్ మాత్రం (తప్పులను) క్షమించేవాడు, కరుణామయుడు.
24:23 إِنَّ الَّذِينَ يَرْمُونَ الْمُحْصَنَاتِ الْغَافِلَاتِ الْمُؤْمِنَاتِ لُعِنُوا فِي الدُّنْيَا وَالْآخِرَةِ وَلَهُمْ عَذَابٌ عَظِيمٌ
సౌశీల్యవతులుగా ఉన్న, ఏ పాపం ఎరుగని విశ్వసించిన స్త్రీలపై అపనింద మోపేవారు ఇహపరాలలో శపించబడ్డారు. వారి కోసం చాలా పెద్ద శిక్ష ఉంది.
24:24 يَوْمَ تَشْهَدُ عَلَيْهِمْ أَلْسِنَتُهُمْ وَأَيْدِيهِمْ وَأَرْجُلُهُم بِمَا كَانُوا يَعْمَلُونَ
ఆ రోజు వారి నోళ్లూ, వారి కాళ్లూ చేతులు స్వయంగా వారి చేష్టలను గురించి సాక్ష్యమిస్తాయి.
24:25 يَوْمَئِذٍ يُوَفِّيهِمُ اللَّهُ دِينَهُمُ الْحَقَّ وَيَعْلَمُونَ أَنَّ اللَّهَ هُوَ الْحَقُّ الْمُبِينُ
ఆ రోజు అల్లాహ్ వారికి న్యాయబద్ధంగా పూర్తి ప్రతిఫలాన్ని (శిక్షను) ఇస్తాడు. అప్పుడు అల్లాహ్‌యే సత్యమనీ, (ఆయనే సత్యాన్ని) స్పష్టపరచేవాడనీ వారు తెలుసుకుంటారు.
24:26 الْخَبِيثَاتُ لِلْخَبِيثِينَ وَالْخَبِيثُونَ لِلْخَبِيثَاتِ ۖ وَالطَّيِّبَاتُ لِلطَّيِّبِينَ وَالطَّيِّبُونَ لِلطَّيِّبَاتِ ۚ أُولَٰئِكَ مُبَرَّءُونَ مِمَّا يَقُولُونَ ۖ لَهُم مَّغْفِرَةٌ وَرِزْقٌ كَرِيمٌ
అపవిత్ర స్త్రీలు అపవిత్ర పురుషులకు తగినవారు. అపవిత్ర పురుషులు అపవిత్ర స్త్రీలకు తగినవారు. (అలాగే) పవిత్ర స్త్రీలు పవిత్ర పురుషులకు తగినవారు. పవిత్ర పురుషులు పవిత్ర స్త్రీలకు తగినవారు. అలాంటి పవిత్రుల గురించి వారు (కపటులు) బొంకే మాటలతో వారికెలాంటి సంబంధం లేదు. వారి కొరకు మన్నింపుతో పాటు గౌరవప్రదమైన ఉపాధి ఉంది.
24:27 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَدْخُلُوا بُيُوتًا غَيْرَ بُيُوتِكُمْ حَتَّىٰ تَسْتَأْنِسُوا وَتُسَلِّمُوا عَلَىٰ أَهْلِهَا ۚ ذَٰلِكُمْ خَيْرٌ لَّكُمْ لَعَلَّكُمْ تَذَكَّرُونَ
ఓ విశ్వాసులారా! మీరు మీ ఇళ్లల్లోకి తప్ప ఇతరుల ఇళ్లల్లోకి – వారి అనుమతి పొందనంతవరకూ, అక్కడున్న వారికి ‘సలామ్’ చేయనంతవరకూ – ప్రవేశించకండి. ఇదే మీ కొరకు మేలైన పద్ధతి. మీరు గుర్తుంచుకునేందుకుగాను (ఈ విధంగా బోధపరచ బడింది).
24:28 فَإِن لَّمْ تَجِدُوا فِيهَا أَحَدًا فَلَا تَدْخُلُوهَا حَتَّىٰ يُؤْذَنَ لَكُمْ ۖ وَإِن قِيلَ لَكُمُ ارْجِعُوا فَارْجِعُوا ۖ هُوَ أَزْكَىٰ لَكُمْ ۚ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ عَلِيمٌ
మరి మీకు అక్కడ ఎవరూ కనిపించకపోతే (అప్పటికీ) అనుమతి లేకుండా లోనికి ప్రవేశించకండి. తిరిగి వెళ్ళిపొమ్మని ఒకవేళ మీతో అనబడితే, మీరు (సంస్కారవంతుల్లా) తిరిగి వెళ్ళిపోండి. అదే మీ కొరకు ఎంతో పవిత్రమైనది. మీరు చేసేదంతా అల్లాహ్‌కు తెలుసు సుమా!
24:29 لَّيْسَ عَلَيْكُمْ جُنَاحٌ أَن تَدْخُلُوا بُيُوتًا غَيْرَ مَسْكُونَةٍ فِيهَا مَتَاعٌ لَّكُمْ ۚ وَاللَّهُ يَعْلَمُ مَا تُبْدُونَ وَمَا تَكْتُمُونَ
అయితే ఎవరూ నివసించని ఇండ్లలో, మీకు చెందిన ప్రయోజనకరమైన వస్తు సామగ్రి ఏదన్నా ఉన్నప్పుడు మీరు వాటిలోకి ప్రవేశిస్తే అందులో తప్పులేదు. మీరు బహిర్గతం చేసేదీ, గోప్యంగా ఉంచేదీ – అంతా అల్లాహ్‌కు తెలుసు.
24:30 قُل لِّلْمُؤْمِنِينَ يَغُضُّوا مِنْ أَبْصَارِهِمْ وَيَحْفَظُوا فُرُوجَهُمْ ۚ ذَٰلِكَ أَزْكَىٰ لَهُمْ ۗ إِنَّ اللَّهَ خَبِيرٌ بِمَا يَصْنَعُونَ
(ఓ ప్రవక్తా!) ముస్లిం పురుషులు తమ చూపులను క్రిందికి ఉంచాలనీ, వారు తమ మర్మస్థానాలను కాపాడుకోవాలనీ, అది వారి కొరకు పవిత్రమైనదని వారితో చెప్పు. వారు చేసేదంతా అల్లాహ్‌కు తెలుసు.
24:31 وَقُل لِّلْمُؤْمِنَاتِ يَغْضُضْنَ مِنْ أَبْصَارِهِنَّ وَيَحْفَظْنَ فُرُوجَهُنَّ وَلَا يُبْدِينَ زِينَتَهُنَّ إِلَّا مَا ظَهَرَ مِنْهَا ۖ وَلْيَضْرِبْنَ بِخُمُرِهِنَّ عَلَىٰ جُيُوبِهِنَّ ۖ وَلَا يُبْدِينَ زِينَتَهُنَّ إِلَّا لِبُعُولَتِهِنَّ أَوْ آبَائِهِنَّ أَوْ آبَاءِ بُعُولَتِهِنَّ أَوْ أَبْنَائِهِنَّ أَوْ أَبْنَاءِ بُعُولَتِهِنَّ أَوْ إِخْوَانِهِنَّ أَوْ بَنِي إِخْوَانِهِنَّ أَوْ بَنِي أَخَوَاتِهِنَّ أَوْ نِسَائِهِنَّ أَوْ مَا مَلَكَتْ أَيْمَانُهُنَّ أَوِ التَّابِعِينَ غَيْرِ أُولِي الْإِرْبَةِ مِنَ الرِّجَالِ أَوِ الطِّفْلِ الَّذِينَ لَمْ يَظْهَرُوا عَلَىٰ عَوْرَاتِ النِّسَاءِ ۖ وَلَا يَضْرِبْنَ بِأَرْجُلِهِنَّ لِيُعْلَمَ مَا يُخْفِينَ مِن زِينَتِهِنَّ ۚ وَتُوبُوا إِلَى اللَّهِ جَمِيعًا أَيُّهَ الْمُؤْمِنُونَ
(ఓ ప్రవక్తా!) ముస్లిం స్త్రీలు తమ చూపులను క్రిందికి ఉంచాలనీ, తమ మర్మస్థానాలను రక్షించుకోవాలనీ, బహిర్గతమై ఉండేది తప్ప – తమ అలంకరణను బహిర్గతం చేయరాదనీ, తమ వక్షస్థలాలపై ఓణీలు వేసుకోవాలనీ, తమ భర్త లేక తమ తండ్రి లేక తమ మామగారు లేక తమ కొడుకులు లేక తమ భర్త కొడుకులు లేక తమ సోదరులు లేక తమ సోదరుల కుమారులు లేక తమ అక్కాచెల్లెళ్ల కొడుకులు లేక తమతో కలిసిమెలిసి ఉండే స్త్రీలు, లేక తమ బానిసలు లేక ఇతరత్రా ఉద్దేశాలు లేకుండా తమకు లోబడి ఉన్న పురుష సేవకులు లేక స్త్రీల గుప్త విషయాల గురించి ఇంకా తెలియని బాలురు – వీళ్ల ఎదుట తప్ప ఇతరుల ఎదుట తమ అలంకరణలను (అంద చందాలను) కనబడనివ్వకూడదనీ, దాగివున్న తమ అలంకరణ ఇతరులకు తెలిసిపోయేలా తమ కాళ్ళను నేలపై కొడుతూ నడవరాదని వారితో చెప్పు. ముస్లింలారా! మీరంతా కలసి అల్లాహ్ సన్నిధిలో పశ్చాత్తాపం చెందండి. తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు.
24:32 وَأَنكِحُوا الْأَيَامَىٰ مِنكُمْ وَالصَّالِحِينَ مِنْ عِبَادِكُمْ وَإِمَائِكُمْ ۚ إِن يَكُونُوا فُقَرَاءَ يُغْنِهِمُ اللَّهُ مِن فَضْلِهِ ۗ وَاللَّهُ وَاسِعٌ عَلِيمٌ
మీలో వివాహం కాకుండా ఉన్న స్త్రీ పురుషుల వివాహం చేయండి. అలాగే మంచి నడవడికగల మీ బానిసల, బానిస స్త్రీల వివాహం కూడా జరిపించండి. ఒకవేళ వారు పేదవారై ఉంటే అల్లాహ్ తన అనుగ్రహంతో వారిని ధనవంతులుగా చేస్తాడు. అల్లాహ్ విశాల సంపన్నుడు, సమస్తమూ తెలిసిన వాడు.
24:33 وَلْيَسْتَعْفِفِ الَّذِينَ لَا يَجِدُونَ نِكَاحًا حَتَّىٰ يُغْنِيَهُمُ اللَّهُ مِن فَضْلِهِ ۗ وَالَّذِينَ يَبْتَغُونَ الْكِتَابَ مِمَّا مَلَكَتْ أَيْمَانُكُمْ فَكَاتِبُوهُمْ إِنْ عَلِمْتُمْ فِيهِمْ خَيْرًا ۖ وَآتُوهُم مِّن مَّالِ اللَّهِ الَّذِي آتَاكُمْ ۚ وَلَا تُكْرِهُوا فَتَيَاتِكُمْ عَلَى الْبِغَاءِ إِنْ أَرَدْنَ تَحَصُّنًا لِّتَبْتَغُوا عَرَضَ الْحَيَاةِ الدُّنْيَا ۚ وَمَن يُكْرِههُّنَّ فَإِنَّ اللَّهَ مِن بَعْدِ إِكْرَاهِهِنَّ غَفُورٌ رَّحِيمٌ
వివాహం చేసుకునే ఆర్థిక స్థోమతలేనివారు, అల్లాహ్ తన అనుగ్రహంతో తమకు స్థోమతను ప్రసాదించేవరకూ శీల శుద్ధతను పాటించాలి. మీ బానిసలలో ఎవరయినా మీకేదైనా (సొమ్మును) ఇచ్చి, విడుదలకు సంబంధించిన లిఖిత పూర్వక ఒప్పందం (ముకాతబత్) మీతో చేసుకోదలిస్తే – వారిలో మీకు మంచితనం కానవచ్చిన పక్షంలో – వారికి వ్రాతపత్రం వ్రాసి ఇవ్వండి. అల్లాహ్ మీకు ప్రసాదించిన ధనంలో నుంచి వారికీ కొంత ఇవ్వండి. మీ బానిస స్త్రీలు శీలవతులుగా ఉండగోరి నప్పుడు, మీరు మీ ప్రాపంచిక జీవితపు స్వలాభాల కోసం వాళ్ళను వేశ్యావృత్తికై బలవంతపెట్టకండి. ఒకవేళ ఎవరయినా వారిని (ఆ నీచమైన పని కోసం) బలవంతం చేస్తే, ఆ బలాత్కారం తరువాత అల్లాహ్ (ఆ అభాగినులను) క్షమించేవాడు, కనికరించేవాడు.
24:34 وَلَقَدْ أَنزَلْنَا إِلَيْكُمْ آيَاتٍ مُّبَيِّنَاتٍ وَمَثَلًا مِّنَ الَّذِينَ خَلَوْا مِن قَبْلِكُمْ وَمَوْعِظَةً لِّلْمُتَّقِينَ
మేము మీ వద్దకు స్పష్టమైన ఆయతులను, మీకు పూర్వం గతించిన వారి ఉదాహరణలను, భయభక్తులు గల వారి కొరకు ఉపదేశాన్నీ పంపాము.
24:35 اللَّهُ نُورُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ مَثَلُ نُورِهِ كَمِشْكَاةٍ فِيهَا مِصْبَاحٌ ۖ الْمِصْبَاحُ فِي زُجَاجَةٍ ۖ الزُّجَاجَةُ كَأَنَّهَا كَوْكَبٌ دُرِّيٌّ يُوقَدُ مِن شَجَرَةٍ مُّبَارَكَةٍ زَيْتُونَةٍ لَّا شَرْقِيَّةٍ وَلَا غَرْبِيَّةٍ يَكَادُ زَيْتُهَا يُضِيءُ وَلَوْ لَمْ تَمْسَسْهُ نَارٌ ۚ نُّورٌ عَلَىٰ نُورٍ ۗ يَهْدِي اللَّهُ لِنُورِهِ مَن يَشَاءُ ۚ وَيَضْرِبُ اللَّهُ الْأَمْثَالَ لِلنَّاسِ ۗ وَاللَّهُ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ
అల్లాహ్ ఆకాశాలకూ, భూమికి కాంతి. ఆయన కాంతి ఒక గూటిని పోలి వున్నది. ఆ గూటిలో ఒక దీపం ఉంది. ఆ దీపం ఒక గాజు చిమ్నీలో ఉంది. ఆ గాజు చిమ్నీ మెరిసే నక్షత్రం మాదిరిగా ఉంది. ఆ దీపం శుభప్రదమైన ఒక జైతూను వృక్షం (నుండి తీసిన) నూనెతో వెలిగించబడుతోంది. ఆ వృక్షం తూర్పుకూ చెందదు, పడమరకూ చెందదు; దాని నూనె – అగ్ని తగలకపోయినా-దానంతట అదే జ్వలిస్తున్నట్లు ఉంది. కాంతిపై కాంతి వుంది. అల్లాహ్ తాను కోరిన వారికి తన కాంతి వైపు మార్గదర్శకత్వం వహిస్తాడు. ప్రజలకు (విషయం అర్థం అవటానికి) ఈ ఉపమానాలను అల్లాహ్ విశదపరుస్తున్నాడు. అల్లాహ్‌కు అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసు.
24:36 فِي بُيُوتٍ أَذِنَ اللَّهُ أَن تُرْفَعَ وَيُذْكَرَ فِيهَا اسْمُهُ يُسَبِّحُ لَهُ فِيهَا بِالْغُدُوِّ وَالْآصَالِ
ఏ గృహాల గౌరవ ప్రతిపత్తిని పెంచాలని, మరి వేటిలో తన నామస్మరణ చేయాలని అల్లాహ్ ఆజ్ఞాపించాడో వాటిలో ఉదయం సాయంత్రం అల్లాహ్ పవిత్రతను కొనియాడుతుంటారు,
24:37 رِجَالٌ لَّا تُلْهِيهِمْ تِجَارَةٌ وَلَا بَيْعٌ عَن ذِكْرِ اللَّهِ وَإِقَامِ الصَّلَاةِ وَإِيتَاءِ الزَّكَاةِ ۙ يَخَافُونَ يَوْمًا تَتَقَلَّبُ فِيهِ الْقُلُوبُ وَالْأَبْصَارُ
(కొందరు) పురుషులు. వర్తకంగానీ, క్రయవిక్రయాలుగానీ అల్లాహ్ నామస్మరణ, నమాజు స్థాపన, జకాత్ చెల్లింపు విషయంలో వారిని పరధ్యానానికి లోను చేయలేవు. ఏ రోజున హృదయాలు తలక్రిందులై, కనుగుడ్లు తేలిపోతాయో దానికి వారు భయపడుతూ ఉంటారు.
24:38 لِيَجْزِيَهُمُ اللَّهُ أَحْسَنَ مَا عَمِلُوا وَيَزِيدَهُم مِّن فَضْلِهِ ۗ وَاللَّهُ يَرْزُقُ مَن يَشَاءُ بِغَيْرِ حِسَابٍ
తమ సత్కార్యాలకు అల్లాహ్ ఉత్తమ ప్రతిఫలం ఇవ్వటానికి, అల్లాహ్ తన కృపతో మరింత అధికంగా వొసగటానికి (వారు ఈ విధంగా మసలుకుంటారు). అల్లాహ్ తాను తలచిన వారికి లెక్క లేనంత ఉపాధిని ప్రసాదిస్తాడు.
24:39 وَالَّذِينَ كَفَرُوا أَعْمَالُهُمْ كَسَرَابٍ بِقِيعَةٍ يَحْسَبُهُ الظَّمْآنُ مَاءً حَتَّىٰ إِذَا جَاءَهُ لَمْ يَجِدْهُ شَيْئًا وَوَجَدَ اللَّهَ عِندَهُ فَوَفَّاهُ حِسَابَهُ ۗ وَاللَّهُ سَرِيعُ الْحِسَابِ
అవిశ్వాసుల కర్మల ఉపమానం చదునైన ఎడారి ప్రదేశంలో మెరిసే ఎండమావి లాంటిది. దప్పిక గొన్నవాడు దూరం నుంచి చూసి దాన్ని నీరని భ్రమ చెందుతాడు. తీరా దాని దగ్గరకు వెళితే అక్కడ ఏమీ ఉండదు. అయితే అతనక్కడ అల్లాహ్‌ను పొందుతాడు. ఆయన అక్కడికక్కడే అతని లెక్కను తేల్చివేస్తాడు. అల్లాహ్ లెక్క తీసుకోవటంలో మహా శీఘ్రగామి.
24:40 أَوْ كَظُلُمَاتٍ فِي بَحْرٍ لُّجِّيٍّ يَغْشَاهُ مَوْجٌ مِّن فَوْقِهِ مَوْجٌ مِّن فَوْقِهِ سَحَابٌ ۚ ظُلُمَاتٌ بَعْضُهَا فَوْقَ بَعْضٍ إِذَا أَخْرَجَ يَدَهُ لَمْ يَكَدْ يَرَاهَا ۗ وَمَن لَّمْ يَجْعَلِ اللَّهُ لَهُ نُورًا فَمَا لَهُ مِن نُّورٍ
లేదా (వారికర్మల ఉపమానం) లోతైన సముద్రపు (అట్టడుగున ఉన్న) చీకట్ల వంటిది. దానిపై అల, ఆపైన మరో అల కమ్ముకొని ఉంది. వాటిపై మేఘాలు ఆవరించి వున్నాయి. ఆ విధంగా చీకట్లు ఒకదానిపై ఒకటి (దట్టంగా) అలుముకుని ఉన్నాయి. ఎవరయినా తమ చేతిని బయటికి తీస్తే కానరాని పరిస్థితి అది! (యదార్థ మేమిటంటే) అల్లాహ్ ఎవరికి కాంతిని వొసగడో అతనికి కాంతి అనేదే లభించదు.
24:41 أَلَمْ تَرَ أَنَّ اللَّهَ يُسَبِّحُ لَهُ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ وَالطَّيْرُ صَافَّاتٍ ۖ كُلٌّ قَدْ عَلِمَ صَلَاتَهُ وَتَسْبِيحَهُ ۗ وَاللَّهُ عَلِيمٌ بِمَا يَفْعَلُونَ
భూమ్యాకాశాలలో వున్న సమస్త సృష్టితాలు, రెక్కలు చాచి ఎగురుతున్న పక్షులూ అల్లాహ్ పవిత్రతను కొనియాడటాన్ని నువ్వు చూడటం లేదా? వాటిలో ప్రతిదీ తన నమాజు విధానాన్ని, స్తోత్రాన్ని గురించి ఎరిగి ఉన్నది. వారు (జనులు) చేసేదంతా అల్లాహ్‌కు తెలుసు.
24:42 وَلِلَّهِ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ وَإِلَى اللَّهِ الْمَصِيرُ
భూమ్యాకాశాల సార్వభౌమత్వం అల్లాహ్‌దే. (కడకు అంతా) అల్లాహ్ వైపుకే మరలవలసి ఉంది.
24:43 أَلَمْ تَرَ أَنَّ اللَّهَ يُزْجِي سَحَابًا ثُمَّ يُؤَلِّفُ بَيْنَهُ ثُمَّ يَجْعَلُهُ رُكَامًا فَتَرَى الْوَدْقَ يَخْرُجُ مِنْ خِلَالِهِ وَيُنَزِّلُ مِنَ السَّمَاءِ مِن جِبَالٍ فِيهَا مِن بَرَدٍ فَيُصِيبُ بِهِ مَن يَشَاءُ وَيَصْرِفُهُ عَن مَّن يَشَاءُ ۖ يَكَادُ سَنَا بَرْقِهِ يَذْهَبُ بِالْأَبْصَارِ
అల్లాహ్ మేఘాలను నడిపించటాన్నీ, మరి వాటిని పరస్పరం కలపటాన్ని, ఆ తరువాత వాటిని ఒకదానిపై ఒకటి పొరలు పొరలుగా పేర్చటాన్ని నువ్వు గమనించటం లేదా? మరి వాటి మధ్య నుంచి వర్షం కురవటాన్ని నువ్వు చూస్తావు. మరి ఆయనే ఆకాశంలోని వడగండ్ల పర్వతాల నుంచి వడగండ్లను కురిపిస్తాడు. తాను కోరినవారిపై వాటిని కురిపిస్తాడు, తాను కోరిన వారినుంచి వాటిని తొలగిస్తాడు. మరి ఆ మేఘాల నుంచి వెలువడే మెరుపు తీగ కంటి చూపును పోగొట్టినట్లే ఉంటుంది.
24:44 يُقَلِّبُ اللَّهُ اللَّيْلَ وَالنَّهَارَ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَعِبْرَةً لِّأُولِي الْأَبْصَارِ
అల్లాహ్ రేయింబవళ్ళను మారుస్తూ ఉంటాడు. కళ్లున్న వారికి ఇందులో గొప్ప గుణపాఠం ఉంది.
24:45 وَاللَّهُ خَلَقَ كُلَّ دَابَّةٍ مِّن مَّاءٍ ۖ فَمِنْهُم مَّن يَمْشِي عَلَىٰ بَطْنِهِ وَمِنْهُم مَّن يَمْشِي عَلَىٰ رِجْلَيْنِ وَمِنْهُم مَّن يَمْشِي عَلَىٰ أَرْبَعٍ ۚ يَخْلُقُ اللَّهُ مَا يَشَاءُ ۚ إِنَّ اللَّهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
సంచరించే సమస్త ప్రాణులను అల్లాహ్ నీటితో సృజించాడు. వాటిలో కొన్ని తమ పొట్ట ఆధారంగా ప్రాకుతుండగా, కొన్ని రెండు కాళ్ళపై నడుస్తున్నాయి. మరి కొన్ని నాలుగు కాళ్లపై నడుస్తున్నాయి. అల్లాహ్ తాను కోరిన దాన్ని సృజిస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడు.
24:46 لَّقَدْ أَنزَلْنَا آيَاتٍ مُّبَيِّنَاتٍ ۚ وَاللَّهُ يَهْدِي مَن يَشَاءُ إِلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ
నిస్సందేహంగా మేము స్పష్టంగా విడమరచి చెప్పే సూచనలను అవతరింపజేశాము. అల్లాహ్ తాను కోరిన వారికి రుజు మార్గం చూపుతాడు.
24:47 وَيَقُولُونَ آمَنَّا بِاللَّهِ وَبِالرَّسُولِ وَأَطَعْنَا ثُمَّ يَتَوَلَّىٰ فَرِيقٌ مِّنْهُم مِّن بَعْدِ ذَٰلِكَ ۚ وَمَا أُولَٰئِكَ بِالْمُؤْمِنِينَ
“మేము అల్లాహ్‌ను, ప్రవక్తను విశ్వసించాము, విధేయులమయ్యాము” అని వారంటారు. మరి ఆ తరువాత వారిలోని ఒక వర్గం వెనుతిరిగిపోతుంది. వారసలు విశ్వసించినవారే కారు.
24:48 وَإِذَا دُعُوا إِلَى اللَّهِ وَرَسُولِهِ لِيَحْكُمَ بَيْنَهُمْ إِذَا فَرِيقٌ مِّنْهُم مُّعْرِضُونَ
వారి మధ్య గల వివాదాలను పరిష్కరించటానికి అల్లాహ్వైపు, ఆయన ప్రవక్త వద్దకు రమ్మని వారిని పిలిచినప్పుడు కూడా వారిలోని ఒక వర్గం విముఖత చూపుతుంది.
24:49 وَإِن يَكُن لَّهُمُ الْحَقُّ يَأْتُوا إِلَيْهِ مُذْعِنِينَ
అయితే హక్కు తమకే లభిస్తుందనుకున్నప్పుడు మాత్రం ఎంతో వినయంతో అతని వద్దకు వస్తారు.
24:50 أَفِي قُلُوبِهِم مَّرَضٌ أَمِ ارْتَابُوا أَمْ يَخَافُونَ أَن يَحِيفَ اللَّهُ عَلَيْهِمْ وَرَسُولُهُ ۚ بَلْ أُولَٰئِكَ هُمُ الظَّالِمُونَ
ఏమిటీ, వారి హృదయాలలో రోగం ఉందా? లేక వారు సంశయంలో పడి ఊగిసలాడుతున్నారా? లేక అల్లాహ్, ఆయన ప్రవక్త తమకు అన్యాయం చేస్తారని వారికి భయం పట్టుకున్నదా? యదార్థానికి వారే అన్యాయపరులు.
24:51 إِنَّمَا كَانَ قَوْلَ الْمُؤْمِنِينَ إِذَا دُعُوا إِلَى اللَّهِ وَرَسُولِهِ لِيَحْكُمَ بَيْنَهُمْ أَن يَقُولُوا سَمِعْنَا وَأَطَعْنَا ۚ وَأُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ
అదే విశ్వసించిన వారిని తమ మధ్యగల వివాదాలను పరిష్కరించటానికి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త వద్దకు పిలిచి నప్పుడు, “మేము విన్నాము, శిరసావహించాము” అని వారు అంటారు. సాఫల్యం పొందేవారు వారే.
24:52 وَمَن يُطِعِ اللَّهَ وَرَسُولَهُ وَيَخْشَ اللَّهَ وَيَتَّقْهِ فَأُولَٰئِكَ هُمُ الْفَائِزُونَ
ఎవరు అల్లాహ్‌కు, ఆయన ప్రవక్తకు విధేయత చూపుతారో, అల్లాహ్‌కు భయపడుతూ, ఆయన (శిక్షల) నుండి తమను కాపాడు కుంటారో వారే విజయం సాధించేవారు.
24:53 وَأَقْسَمُوا بِاللَّهِ جَهْدَ أَيْمَانِهِمْ لَئِنْ أَمَرْتَهُمْ لَيَخْرُجُنَّ ۖ قُل لَّا تُقْسِمُوا ۖ طَاعَةٌ مَّعْرُوفَةٌ ۚ إِنَّ اللَّهَ خَبِيرٌ بِمَا تَعْمَلُونَ
“తమరు ఆజ్ఞాపించగానే బయలుదేరటానికి సిద్ధంగా ఉన్నాము” అని (కపటులు) అల్లాహ్‌పై గట్టిగా ప్రమాణం చేసి మరీ చెబుతారు. “ప్రమాణాలు చేయకండి. మీ విధేయత (లోని చిత్తశుద్ధి) ఏ పాటిదో విదితమే. మీ కార్యకలాపాల గురించి అల్లాహ్‌కు బాగా తెలుసు” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు.
24:54 قُلْ أَطِيعُوا اللَّهَ وَأَطِيعُوا الرَّسُولَ ۖ فَإِن تَوَلَّوْا فَإِنَّمَا عَلَيْهِ مَا حُمِّلَ وَعَلَيْكُم مَّا حُمِّلْتُمْ ۖ وَإِن تُطِيعُوهُ تَهْتَدُوا ۚ وَمَا عَلَى الرَّسُولِ إِلَّا الْبَلَاغُ الْمُبِينُ
(ఓ ప్రవక్తా! వారికి ఈ విధంగా) చెప్పు: “అల్లాహ్ ఆదేశాన్ని పాలించండి. దైవప్రవక్తను అనుసరించండి. ఒకవేళ మీరు గనక విముఖత చూపితే దైవప్రవక్తపై మోపబడిన కార్యభారం వరకే అతను బాధ్యుడు, మీపై ఉన్న కర్తవ్య నిర్వహణకు మీరే సంజాయిషీ ఇచ్చుకోవలసి ఉంటుంది. మీరు దైవప్రవక్త మాటను విన్నప్పుడే మీకు సన్మార్గం లభిస్తుంది. విషయాన్ని స్పష్టంగా చేరవేయటం వరకే ప్రవక్త బాధ్యత (అని తెలుసుకోండి!”)
24:55 وَعَدَ اللَّهُ الَّذِينَ آمَنُوا مِنكُمْ وَعَمِلُوا الصَّالِحَاتِ لَيَسْتَخْلِفَنَّهُمْ فِي الْأَرْضِ كَمَا اسْتَخْلَفَ الَّذِينَ مِن قَبْلِهِمْ وَلَيُمَكِّنَنَّ لَهُمْ دِينَهُمُ الَّذِي ارْتَضَىٰ لَهُمْ وَلَيُبَدِّلَنَّهُم مِّن بَعْدِ خَوْفِهِمْ أَمْنًا ۚ يَعْبُدُونَنِي لَا يُشْرِكُونَ بِي شَيْئًا ۚ وَمَن كَفَرَ بَعْدَ ذَٰلِكَ فَأُولَٰئِكَ هُمُ الْفَاسِقُونَ
మీలో ఎవరు విశ్వసించి, మంచి పనులు చేశారో వారికి అల్లాహ్, వారి పూర్వీకులను భూమికి ప్రతినిధులుగా చేసినట్లుగానే వారికి కూడా తప్పకుండా ప్రాతినిధ్యం వొసగుతానని, తాను వారి కోసం సమ్మతించి ఆమోదించిన ధర్మాన్ని వారి కొరకు పటిష్టం చేసి, దానికి స్థిరత్వాన్ని కల్పిస్తానని, వారికున్న భయాందోళనల స్థానే శాంతిభద్రతల స్థితిని కల్పిస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు. వారు నన్నే ఆరాధిస్తారు. నాకు సహవర్తులుగా ఎవరినీ కల్పించరు. ఇంత జరిగిన తరువాత కూడా ఎవరైనా విశ్వాస ఘాతుకానికి పాల్పడితే ముమ్మాటికీ వారు అవిధేయు లవుతారు.
24:56 وَأَقِيمُوا الصَّلَاةَ وَآتُوا الزَّكَاةَ وَأَطِيعُوا الرَّسُولَ لَعَلَّكُمْ تُرْحَمُونَ
నమాజును నెలకొల్పండి. జకాతును ఇవ్వండి. దైవప్రవక్తకు విధేయులుగా మసలుకోండి. తద్వారానే మీరు కరుణించబడతారు.
24:57 لَا تَحْسَبَنَّ الَّذِينَ كَفَرُوا مُعْجِزِينَ فِي الْأَرْضِ ۚ وَمَأْوَاهُمُ النَّارُ ۖ وَلَبِئْسَ الْمَصِيرُ
ఈ అవిశ్వాసులు రాజ్యంలో (అటూ ఇటూ పరుగులు తీసి) మమ్మల్ని అశక్తుల్ని చేస్తారని ఎన్నడూ తలపోయకు. వారి అసలు నివాసస్థలం నరకమే. అది మహా చెడ్డ గమ్యస్థానం.
24:58 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لِيَسْتَأْذِنكُمُ الَّذِينَ مَلَكَتْ أَيْمَانُكُمْ وَالَّذِينَ لَمْ يَبْلُغُوا الْحُلُمَ مِنكُمْ ثَلَاثَ مَرَّاتٍ ۚ مِّن قَبْلِ صَلَاةِ الْفَجْرِ وَحِينَ تَضَعُونَ ثِيَابَكُم مِّنَ الظَّهِيرَةِ وَمِن بَعْدِ صَلَاةِ الْعِشَاءِ ۚ ثَلَاثُ عَوْرَاتٍ لَّكُمْ ۚ لَيْسَ عَلَيْكُمْ وَلَا عَلَيْهِمْ جُنَاحٌ بَعْدَهُنَّ ۚ طَوَّافُونَ عَلَيْكُم بَعْضُكُمْ عَلَىٰ بَعْضٍ ۚ كَذَٰلِكَ يُبَيِّنُ اللَّهُ لَكُمُ الْآيَاتِ ۗ وَاللَّهُ عَلِيمٌ حَكِيمٌ
ఓ విశ్వాసులారా! మీ అధీనంలో వున్న మీ బానిసలుగానీ, ఇంకా ప్రాజ్ఞవయస్సుకు చేరని మీ పిల్లలుగానీ మూడు వేళల్లో మాత్రం మీ అనుమతి పొందిన మీదటే మీ వద్దకు రావాలి – 1.ఫజ్ర్ నమాజుకు పూర్వం, 2.మధ్యాహ్నం (జుహ్ర్) వేళ మీరు మీ బట్టలు విడిచి ఉన్నప్పుడు, 3.ఇషా నమాజు తరువాత. ఈ మూడు వేళలు మీరు ఏకాంతం (పరదా)లో ఉండే వేళలు. ఈ మూడు వేళల్ని మినహాయిస్తే (రాకపోకలు సాగించటంలో) మీపై గానీ, వారిపైగానీ ఎలాంటి దోషం లేదు. (ఎందుకంటే) మీరు తరచూ ఒండొకరి దగ్గరకు వస్తూపోతూ ఉండవలసిన వారే. ఈ విధంగా అల్లాహ్ తన ఆజ్ఞలను మీకు స్పష్టంగా విడమరచి చెబుతున్నాడు. అల్లాహ్ సంపూర్ణ జ్ఞాని, పరిపూర్ణ వివేకవంతుడు.
24:59 وَإِذَا بَلَغَ الْأَطْفَالُ مِنكُمُ الْحُلُمَ فَلْيَسْتَأْذِنُوا كَمَا اسْتَأْذَنَ الَّذِينَ مِن قَبْلِهِمْ ۚ كَذَٰلِكَ يُبَيِّنُ اللَّهُ لَكُمْ آيَاتِهِ ۗ وَاللَّهُ عَلِيمٌ حَكِيمٌ
మరి మీ పిల్లలు (కూడా) ప్రాజ్ఞ వయస్సుకు చేరుకున్న తరువాత, తమ పూర్వీకులు అనుమతి పొందినట్లే వారు కూడా అనుమతి పొంది మరీ రావాలి. అల్లాహ్ ఈ విధంగా తన ఆదేశాలను మీకు విశదపరుస్తున్నాడు. అల్లాహ్‌యే సర్వజ్ఞాని, వివేకసంపన్నుడు.
24:60 وَالْقَوَاعِدُ مِنَ النِّسَاءِ اللَّاتِي لَا يَرْجُونَ نِكَاحًا فَلَيْسَ عَلَيْهِنَّ جُنَاحٌ أَن يَضَعْنَ ثِيَابَهُنَّ غَيْرَ مُتَبَرِّجَاتٍ بِزِينَةٍ ۖ وَأَن يَسْتَعْفِفْنَ خَيْرٌ لَّهُنَّ ۗ وَاللَّهُ سَمِيعٌ عَلِيمٌ
పెళ్ళిపై ఆశ (కోరిక) లేని వృద్ధ స్త్రీలు – తమ అందాలంకరణలు ప్రదర్శించే ఉద్దేశం లేకుండా – తమపై దుప్పట్లను తీసేసినా తప్పులేదు. అయినప్పటికీ వారు జాగ్రత్త వహిస్తే అది వారికే శ్రేయస్కరం. అల్లాహ్ అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు.
24:61 لَّيْسَ عَلَى الْأَعْمَىٰ حَرَجٌ وَلَا عَلَى الْأَعْرَجِ حَرَجٌ وَلَا عَلَى الْمَرِيضِ حَرَجٌ وَلَا عَلَىٰ أَنفُسِكُمْ أَن تَأْكُلُوا مِن بُيُوتِكُمْ أَوْ بُيُوتِ آبَائِكُمْ أَوْ بُيُوتِ أُمَّهَاتِكُمْ أَوْ بُيُوتِ إِخْوَانِكُمْ أَوْ بُيُوتِ أَخَوَاتِكُمْ أَوْ بُيُوتِ أَعْمَامِكُمْ أَوْ بُيُوتِ عَمَّاتِكُمْ أَوْ بُيُوتِ أَخْوَالِكُمْ أَوْ بُيُوتِ خَالَاتِكُمْ أَوْ مَا مَلَكْتُم مَّفَاتِحَهُ أَوْ صَدِيقِكُمْ ۚ لَيْسَ عَلَيْكُمْ جُنَاحٌ أَن تَأْكُلُوا جَمِيعًا أَوْ أَشْتَاتًا ۚ فَإِذَا دَخَلْتُم بُيُوتًا فَسَلِّمُوا عَلَىٰ أَنفُسِكُمْ تَحِيَّةً مِّنْ عِندِ اللَّهِ مُبَارَكَةً طَيِّبَةً ۚ كَذَٰلِكَ يُبَيِّنُ اللَّهُ لَكُمُ الْآيَاتِ لَعَلَّكمْ تَعْقِلُونَ
గుడ్డివానిపైగానీ, కుంటివానిపైగానీ, వ్యాధిగ్రస్తునిపైగానీ, స్వయంగా మీపైనగానీ – మీ ఇండ్లలో నుంచి అయినా లేదా మీ తండ్రుల ఇళ్ళ నుంచి అయినా లేదా మీ తల్లుల ఇళ్ల నుంచి అయినా, లేదా మీ అన్నదమ్ముల ఇళ్లనుంచి అయినా లేదా మీ అక్కాచెల్లెళ్ల ఇళ్ల నుంచి అయినా, లేదా మీ పిన తండ్రుల ఇళ్లనుంచి అయినా, లేదా మీ మేనత్తల ఇళ్లనుంచి అయినా లేదా మీ మేనమామల ఇళ్లనుంచి అయినా లేదా మీ పినతల్లుల ఇళ్లనుంచి అయినా లేదా తాళపు చెవులు మీ అధీనంలో వున్న ఇళ్లనుంచి అయినా లేదా మీ స్నేహితుల ఇళ్లనుంచి అయినా – ఏమైనా (ఆహార వస్తువులు) తీసుకుని తింటే అది అభ్యంతరకరం ఏమీ కాదు. మీరంతా కలిసి భుజించినా, లేక వేర్వేరుగా భుజించినా తప్పులేదు. అయితే మీరు ఇండ్లలో ప్రవేశించేటప్పుడు మాత్రం మీ స్వయానికి సలాం చేసుకోండి. ఇది అల్లాహ్ తరఫు నుంచి అవతరించిన, మేలు కొరకు చేయబడే ప్రార్థన, శుభకరమైనది, పవిత్రమైనది. ఈ విధంగా అల్లాహ్ మీరు గ్రహించగలందులకు తన ఆజ్ఞలను మీకు తేటతెల్లం చేస్తున్నాడు.
24:62 إِنَّمَا الْمُؤْمِنُونَ الَّذِينَ آمَنُوا بِاللَّهِ وَرَسُولِهِ وَإِذَا كَانُوا مَعَهُ عَلَىٰ أَمْرٍ جَامِعٍ لَّمْ يَذْهَبُوا حَتَّىٰ يَسْتَأْذِنُوهُ ۚ إِنَّ الَّذِينَ يَسْتَأْذِنُونَكَ أُولَٰئِكَ الَّذِينَ يُؤْمِنُونَ بِاللَّهِ وَرَسُولِهِ ۚ فَإِذَا اسْتَأْذَنُوكَ لِبَعْضِ شَأْنِهِمْ فَأْذَن لِّمَن شِئْتَ مِنْهُمْ وَاسْتَغْفِرْ لَهُمُ اللَّهَ ۚ إِنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ
అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తను నమ్ముతూ, ఏదైనా సామూహిక వ్యవహారంలో దైవప్రవక్త వెంట ఉన్నప్పుడు ఆయన అనుమతి పొందనంత వరకూ ఎక్కడికీ పోకుండా ఉండేవారే సిసలైన విశ్వాసులు. అలాంటి (కీలక) సమయాలలో నీ నుండి అనుమతి తీసుకునేవారే వాస్తవానికి అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తను విశ్వసించినవారు. కనుక (ఓ ప్రవక్తా!) అలాంటి వారు ఎప్పుడయినా, ఏదయినా తమ పని మీద నీ నుండి సెలవు కోరితే, వారిలో నువ్వు తలచిన వారికి సెలవు ఇస్తూ ఉండు. ఇంకా వారి మన్నింపు కొరకు అల్లాహ్‌ను వేడుకుంటూ ఉండు. నిశ్చయంగా అల్లాహ్ క్షమాశీలి, కృపాకరుడు.
24:63 لَّا تَجْعَلُوا دُعَاءَ الرَّسُولِ بَيْنَكُمْ كَدُعَاءِ بَعْضِكُم بَعْضًا ۚ قَدْ يَعْلَمُ اللَّهُ الَّذِينَ يَتَسَلَّلُونَ مِنكُمْ لِوَاذًا ۚ فَلْيَحْذَرِ الَّذِينَ يُخَالِفُونَ عَنْ أَمْرِهِ أَن تُصِيبَهُمْ فِتْنَةٌ أَوْ يُصِيبَهُمْ عَذَابٌ أَلِيمٌ
మీరు దైవప్రవక్త పిలుపును, మీలో ఒండొకరిని పిలుచుకునే మామూలు పిలుపులా అనుకోకండి. మీలో ఒకరి వెనుక ఒకరు దాక్కుంటూ మెల్లగా జారుకునే వారెవరో అల్లాహ్‌కు తెలుసు. వినండి! ఎవరు ప్రవక్త ఆజ్ఞను ఎదిరిస్తున్నారో వారు, తమపై ఏదయినా ఘోర విపత్తు వచ్చిపడుతుందేమోనని లేదా తమను ఏదయినా బాధాకరమైన శిక్ష చుట్టు ముడుతుందేమోనని భయపడాలి.
24:64 أَلَا إِنَّ لِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ قَدْ يَعْلَمُ مَا أَنتُمْ عَلَيْهِ وَيَوْمَ يُرْجَعُونَ إِلَيْهِ فَيُنَبِّئُهُم بِمَا عَمِلُوا ۗ وَاللَّهُ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ
వినండి! భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ అల్లాహ్‌దే. మీ స్థితిగతుల గురించి ఆయనకు బాగా తెలుసు. వారందరూ ఆయన వైపుకు మరలించబడిన రోజున, వారు చేసిన కర్మలన్నింటినీ ఆయన వారికి తెలియపరుస్తాడు. అల్లాహ్ ప్రతిదీ క్షుణ్ణంగా తెలిసినవాడు.
25. సూరా అల్ ఫుర్ఖాన్ (Al-Furqan)
25:1 تَبَارَكَ الَّذِي نَزَّلَ الْفُرْقَانَ عَلَىٰ عَبْدِهِ لِيَكُونَ لِلْعَالَمِينَ نَذِيرًا
సమస్త లోకవాసులను హెచ్చరించేవానిగా ఉండటానికిగాను తన దాసునిపై గీటురాయిని అవతరింపజేసిన అల్లాహ్ గొప్ప శుభకరుడు.
25:2 الَّذِي لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَلَمْ يَتَّخِذْ وَلَدًا وَلَمْ يَكُن لَّهُ شَرِيكٌ فِي الْمُلْكِ وَخَلَقَ كُلَّ شَيْءٍ فَقَدَّرَهُ تَقْدِيرًا
భూమ్యాకాశాల సార్వభౌమత్వం ఆయనదే. ఆయన ఎవరినీ సంతానంగా చేసుకోలేదు. ఆయన రాజ్యాధికారంలో ఆయనకు భాగస్వాములు కూడా ఎవరూ లేరు. ఆయన ప్రతి వస్తువునూ సృష్టించి, దానికి తగ్గట్టుగా – దాని లెక్కను నిర్థారించాడు.
25:3 وَاتَّخَذُوا مِن دُونِهِ آلِهَةً لَّا يَخْلُقُونَ شَيْئًا وَهُمْ يُخْلَقُونَ وَلَا يَمْلِكُونَ لِأَنفُسِهِمْ ضَرًّا وَلَا نَفْعًا وَلَا يَمْلِكُونَ مَوْتًا وَلَا حَيَاةً وَلَا نُشُورًا
వారు అల్లాహ్‌ను వదలి (బూటకపు) దేవుళ్లను కల్పించుకున్నారు. వారు (అంటే ఆ బూటకపు దేవుళ్లు) ఏ వస్తువునూ సృష్టించలేరు. పైగా వారు స్వయంగా సృష్టించబడినవారు. వారు తమ స్వయానికి సైతం లాభనష్టాలు చేకూర్చుకునే అధికారం కలిగిలేరు. జీవన్మరణాలు కూడా వారి అధీనంలో లేవు. (మరణానంతరం) తిరిగి లేచే శక్తి కూడా వారివద్ద లేదు.
25:4 وَقَالَ الَّذِينَ كَفَرُوا إِنْ هَٰذَا إِلَّا إِفْكٌ افْتَرَاهُ وَأَعَانَهُ عَلَيْهِ قَوْمٌ آخَرُونَ ۖ فَقَدْ جَاءُوا ظُلْمًا وَزُورًا
“ఇది, ఇతను స్వయంగా కల్పించుకున్న అబద్ధం తప్ప మరేమీ కాదు. ఈ విషయంలో ఇతరులు కూడా ఇతనికి సాయపడ్డారు” అని అవిశ్వాసులు చెప్పసాగారు. నిజానికి వారు చాలా అన్యాయానికి, ఆసాంతం అబద్ధానికి ఒడిగట్టారు.
25:5 وَقَالُوا أَسَاطِيرُ الْأَوَّلِينَ اكْتَتَبَهَا فَهِيَ تُمْلَىٰ عَلَيْهِ بُكْرَةً وَأَصِيلًا
“ఇవి పూర్వీకుల గాథలు. వాటిని ఇతను వ్రాయించాడు. అవి ఉదయం సాయంత్రం అతని ముందు పఠించబడుతున్నాయి” అని కూడా ఈ అవిశ్వాసులు అన్నారు.
25:6 قُلْ أَنزَلَهُ الَّذِي يَعْلَمُ السِّرَّ فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ إِنَّهُ كَانَ غَفُورًا رَّحِيمًا
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “భూమ్యాకాశాలలో వున్న రహస్యాలన్నింటినీ ఎరిగినవాడు దీనిని (ఈ ఖుర్ఆనును) అవతరింపజేశాడు. ఆయన అమితంగా క్షమించేవాడు, అపారంగా కనికరించేవాడు.”
25:7 وَقَالُوا مَالِ هَٰذَا الرَّسُولِ يَأْكُلُ الطَّعَامَ وَيَمْشِي فِي الْأَسْوَاقِ ۙ لَوْلَا أُنزِلَ إِلَيْهِ مَلَكٌ فَيَكُونَ مَعَهُ نَذِيرًا
అవిశ్వాసులు ఇలా అనసాగారు : “ఏం ప్రవక్తయ్యా ఇతను?! (చూడబోతే అందరిలాగే) ఇతను కూడా అన్నం తింటున్నాడు, బజార్లలో తిరుగుతున్నాడు. ఇతనికి తోడుగా ఉంటూ (ప్రజలను) హెచ్చరించే నిమిత్తం ఒక దైవదూత (అయినా) ఇతని వద్దకు ఎందుకు పంపబడలేదట?
25:8 أَوْ يُلْقَىٰ إِلَيْهِ كَنزٌ أَوْ تَكُونُ لَهُ جَنَّةٌ يَأْكُلُ مِنْهَا ۚ وَقَالَ الظَّالِمُونَ إِن تَتَّبِعُونَ إِلَّا رَجُلًا مَّسْحُورًا
“పోనీ ఇతని వద్దకు ఏదైనా ఖజానా ఎందుకు వచ్చిపడలేదు? పోనీ, ఇతను (హాయిగా) తింటూ ఉండటానికి ఇతనికి ఒక తోటన్నా లేదేమిటీ?” “మీరు చేతబడి చేయబడిన ఒక వ్యక్తి వెనుక నడుస్తున్నారు” అని కూడా ఆ దుర్మార్గులు అన్నారు.
25:9 انظُرْ كَيْفَ ضَرَبُوا لَكَ الْأَمْثَالَ فَضَلُّوا فَلَا يَسْتَطِيعُونَ سَبِيلًا
(ఓ ముహమ్మద్!) చూశావా! వాళ్లు నీ గురించి ఎలాంటి ఉదాహరణల్ని ఇస్తున్నారో! (అది కాదులే), నిజానికి వాళ్లు అసలు మార్గం తప్పారు. ఇక వాళ్లు మార్గానికి రావటం అనేది జరగదు.
25:10 تَبَارَكَ الَّذِي إِن شَاءَ جَعَلَ لَكَ خَيْرًا مِّن ذَٰلِكَ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ وَيَجْعَل لَّكَ قُصُورًا
అల్లాహ్ శుభకరుడు. ఆయన గనక తలచుకుంటే వాళ్ళు ఉదాహరించిన తోటకన్నా మేలైన ఎన్నో తోటల్ని – క్రింద కాలువలు ప్రవహించే తోటల్ని – నీ కోసం సమకూర్చగలడు. ఇంకా నీ కోసం ఎన్నో (బ్రహ్మాండమైన) మేడల్ని కూడా చేయగలడు.
25:11 بَلْ كَذَّبُوا بِالسَّاعَةِ ۖ وَأَعْتَدْنَا لِمَن كَذَّبَ بِالسَّاعَةِ سَعِيرًا
(అది కాదు). వారసలు ఆ ఘడియ (తీర్పుదినము)ను ధిక్కరిస్తున్నారు. అయితే ఆ ఘడియను ధిక్కరించేవారి కోసం మేము మండే అగ్నిని సిద్ధం చేసి ఉంచాము.
25:12 إِذَا رَأَتْهُم مِّن مَّكَانٍ بَعِيدٍ سَمِعُوا لَهَا تَغَيُّظًا وَزَفِيرًا
దూరం నుంచే అది వారిని చూసినప్పుడు, ఆగ్రహంతో అది ఉడికిపోతూ, గర్జిస్తూ ఉండటాన్ని వారు వింటారు.
25:13 وَإِذَا أُلْقُوا مِنْهَا مَكَانًا ضَيِّقًا مُّقَرَّنِينَ دَعَوْا هُنَالِكَ ثُبُورًا
నరకంలోని ఒక ఇరుకైన స్థలంలో వారిని కాళ్ళూ, చేతులూ బంధింపబడిన స్థితిలో పడవేయబడినప్పుడు వారు చావు కోసం అరుస్తారు.
25:14 لَّا تَدْعُوا الْيَوْمَ ثُبُورًا وَاحِدًا وَادْعُوا ثُبُورًا كَثِيرًا
“ఈ రోజు ఒక్క చావు కోసం అరవకండి, అనేక చావుల కోసం అరుస్తూ ఉండండి” (అని వారితో అనబడుతుంది).
25:15 قُلْ أَذَٰلِكَ خَيْرٌ أَمْ جَنَّةُ الْخُلْدِ الَّتِي وُعِدَ الْمُتَّقُونَ ۚ كَانَتْ لَهُمْ جَزَاءً وَمَصِيرًا
వారికి చెప్పు:”ఇది మేలా? లేక భయభక్తులు గలవారికి వాగ్దానం చేయబడిన శాశ్వతమైన స్వర్గం మేలా? అది వారి ప్రతిఫలం. వారు చేరుకోవలసిన (చివరి) గమ్యస్థానం.”
25:16 لَّهُمْ فِيهَا مَا يَشَاءُونَ خَالِدِينَ ۚ كَانَ عَلَىٰ رَبِّكَ وَعْدًا مَّسْئُولًا
వారు (స్వర్గవాసులు) కోరుకున్నదల్లా అందులో వారికి లభిస్తుంది. వారందులో శాశ్వతంగా ఉంటారు. అర్థించదగిన ఈ వాగ్దానాన్ని నెరవేర్చవలసిన బాధ్యత నీ ప్రభువుపై ఉంది.
25:17 وَيَوْمَ يَحْشُرُهُمْ وَمَا يَعْبُدُونَ مِن دُونِ اللَّهِ فَيَقُولُ أَأَنتُمْ أَضْلَلْتُمْ عِبَادِي هَٰؤُلَاءِ أَمْ هُمْ ضَلُّوا السَّبِيلَ
ఆ రోజున అల్లాహ్ వారినీ, అల్లాహ్‌ను వదిలి వారు పూజించే వారినీ సమావేశపరచి, “నా ఈ దాసులను మీరు అపమార్గం పట్టించారా? లేక వీళ్ళంతట వీళ్లే మార్గం తప్పారా?” అని అడుగుతాడు.
25:18 قَالُوا سُبْحَانَكَ مَا كَانَ يَنبَغِي لَنَا أَن نَّتَّخِذَ مِن دُونِكَ مِنْ أَوْلِيَاءَ وَلَٰكِن مَّتَّعْتَهُمْ وَآبَاءَهُمْ حَتَّىٰ نَسُوا الذِّكْرَ وَكَانُوا قَوْمًا بُورًا
వారు ఇలా విన్నవించుకుంటారు: “(ఓ అల్లాహ్) నీవు పవిత్రుడవు. నిన్ను కాదని, వేరొకరిని మా రక్షకుడిగా చేసుకోవటం మాకు సయితం తగదు. కాని (అసలు విషయం ఏమిటంటే) నీవు వీళ్ళకీ, వీరి తాతముత్తాతలకీ సాధనసంపత్తులను పుష్కలంగా ప్రసాదించావు. తుదకు వీరు హితబోధను విస్మరించారు. ఆ విధంగా వీరు వినాశం పొందేవారయ్యారు.”
25:19 فَقَدْ كَذَّبُوكُم بِمَا تَقُولُونَ فَمَا تَسْتَطِيعُونَ صَرْفًا وَلَا نَصْرًا ۚ وَمَن يَظْلِم مِّنكُمْ نُذِقْهُ عَذَابًا كَبِيرًا
“(చూశారా!) మీరు చెప్పే మాటలన్నింటినీ వారు కాదన్నారు. కనుక శిక్షలను తొలగించుకునే శక్తిగానీ, సహాయాన్ని పొందే స్థోమతగానీ ఇప్పుడు మీకు లేదు. మీలో దుర్మార్గానికి పాల్పడిన ఒక్కొక్కడికీ మేము పెద్ద శిక్షను చవి చూపిస్తాము” (అని అల్లాహ్ అంటాడు).
25:20 وَمَا أَرْسَلْنَا قَبْلَكَ مِنَ الْمُرْسَلِينَ إِلَّا إِنَّهُمْ لَيَأْكُلُونَ الطَّعَامَ وَيَمْشُونَ فِي الْأَسْوَاقِ ۗ وَجَعَلْنَا بَعْضَكُمْ لِبَعْضٍ فِتْنَةً أَتَصْبِرُونَ ۗ وَكَانَ رَبُّكَ بَصِيرًا
(ఓ ముహమ్మద్ -సఅసం!) మేము నీకు పూర్వం పంపిన ప్రవక్తలందరూ కూడా అన్నంతినేవారు, బజారులలో సంచరించే వారే. మేము మీలో కొందరిని మరికొందరి కోసం పరీక్షా సాధనంగా చేశాము. మరి మీరు ఓపికపట్టగలరా? నీ ప్రభువు సర్వాన్నీ చూస్తున్నాడు.
25:21 وَقَالَ الَّذِينَ لَا يَرْجُونَ لِقَاءَنَا لَوْلَا أُنزِلَ عَلَيْنَا الْمَلَائِكَةُ أَوْ نَرَىٰ رَبَّنَا ۗ لَقَدِ اسْتَكْبَرُوا فِي أَنفُسِهِمْ وَعَتَوْا عُتُوًّا كَبِيرًا
మమ్మల్ని కలుసుకునే (విషయంపై) ఆశలేని వారు, “దైవ దూతలు మా వద్దకు ఎందుకు పంపబడటం లేదు? పోనీ, మేమైనా మా కళ్లతో మా ప్రభువును ఎందుకు చూడలేక పోతున్నాము?” అని అంటారు. వారు, తమలో తామే చాలా గొప్ప వారుగా ఊహించుకుంటున్నారు. అహంకారంతో మరీ బరితెగించి పోతున్నారు.
25:22 يَوْمَ يَرَوْنَ الْمَلَائِكَةَ لَا بُشْرَىٰ يَوْمَئِذٍ لِّلْمُجْرِمِينَ وَيَقُولُونَ حِجْرًا مَّحْجُورًا
వారు ఏ రోజున దైవదూతలను చూస్తారో ఆ రోజు ఆ అపరాధులకు ఎంత మాత్రం సంతోషం కలగదు. “(శుభవార్తలన్నీ) సంతోషదాయక వార్తలన్నీ మీకు పూర్తిగా నిషిద్ధం” అని (దైవదూతలు) అంటారు.
25:23 وَقَدِمْنَا إِلَىٰ مَا عَمِلُوا مِنْ عَمَلٍ فَجَعَلْنَاهُ هَبَاءً مَّنثُورًا
వారు (ప్రాపంచిక జీవితంలో) చేసి వున్న కర్మల వైపుకు మేము వచ్చి వాటిని ఎగిరిన దుమ్ము ధూళివలే చేసేశాము.
25:24 أَصْحَابُ الْجَنَّةِ يَوْمَئِذٍ خَيْرٌ مُّسْتَقَرًّا وَأَحْسَنُ مَقِيلًا
అయితే ఆ రోజు స్వర్గవాసుల నివాసం చాలా బావుంటుంది. వారి విశ్రాంతి నిలయం కూడా అత్యుత్తమంగా ఉంటుంది.
25:25 وَيَوْمَ تَشَقَّقُ السَّمَاءُ بِالْغَمَامِ وَنُزِّلَ الْمَلَائِكَةُ تَنزِيلًا
ఏ రోజున ఆకాశం మేఘాల సమేతంగా బద్దలైపోతుందో, మరి దైవదూతలు వరుసగా దింపబడతారో,
25:26 الْمُلْكُ يَوْمَئِذٍ الْحَقُّ لِلرَّحْمَٰنِ ۚ وَكَانَ يَوْمًا عَلَى الْكَافِرِينَ عَسِيرًا
ఆ రోజు అసలు సిసలు అధికారం కరుణామయునిదై ఉంటుంది. ఆ రోజు అవిశ్వాసుల పాలిట గడ్డురోజై ఉంటుంది.
25:27 وَيَوْمَ يَعَضُّ الظَّالِمُ عَلَىٰ يَدَيْهِ يَقُولُ يَا لَيْتَنِي اتَّخَذْتُ مَعَ الرَّسُولِ سَبِيلًا
ఆ రోజు దుర్మార్గుడైన వ్యక్తి తన చేతులను కొరుక్కుంటూ ఇలా అంటాడు: “అయ్యో! నేను దైవప్రవక్త (సఅసం) మార్గాన్ని అనుసరించి ఉంటే ఎంత బావుందేది!”
25:28 يَا وَيْلَتَىٰ لَيْتَنِي لَمْ أَتَّخِذْ فُلَانًا خَلِيلًا
“అయ్యో! నా పాడుగాను. నేను ఫలానా వ్యక్తిని స్నేహితునిగా చేసుకోకుండా ఉంటే ఎంత బావుండేది!
25:29 لَّقَدْ أَضَلَّنِي عَنِ الذِّكْرِ بَعْدَ إِذْ جَاءَنِي ۗ وَكَانَ الشَّيْطَانُ لِلْإِنسَانِ خَذُولًا
“నా వద్దకు ఉపదేశం వచ్చిన తరువాత కూడా వాడు నన్ను అపమార్గం పట్టించాడే! ఎంతయినా షైతాను మనిషికి (అదను చూసి) ద్రోహం చేసేవాడే!”
25:30 وَقَالَ الرَّسُولُ يَا رَبِّ إِنَّ قَوْمِي اتَّخَذُوا هَٰذَا الْقُرْآنَ مَهْجُورًا
అప్పుడు దైవప్రవక్త, “నా ప్రభూ! నిశ్చయంగా నా జాతివారు ఈ ఖుర్ఆన్ను వదలిపెట్టారు” అని పలుకుతాడు.
25:31 وَكَذَٰلِكَ جَعَلْنَا لِكُلِّ نَبِيٍّ عَدُوًّا مِّنَ الْمُجْرِمِينَ ۗ وَكَفَىٰ بِرَبِّكَ هَادِيًا وَنَصِيرًا
ఈ విధంగా మేము ప్రతి ప్రవక్తకూ కొందరు పాపాత్ములను శత్రువులుగా చేశాము. మార్గదర్శకత్వం వహించడానికి, సహాయం చేయడానికి నీ ప్రభువు (ఒక్కడే) సరిపోతాడు.
25:32 وَقَالَ الَّذِينَ كَفَرُوا لَوْلَا نُزِّلَ عَلَيْهِ الْقُرْآنُ جُمْلَةً وَاحِدَةً ۚ كَذَٰلِكَ لِنُثَبِّتَ بِهِ فُؤَادَكَ ۖ وَرَتَّلْنَاهُ تَرْتِيلًا
“ఇతనిపై ఖుర్ఆన్ సాంతం ఒకేసారి ఎందుకు అవతరింపజేయబడలేదు?” అని అవిశ్వాసులు అంటారు. దీనిద్వారా నీ మనసును దృఢంగా ఉంచడానికి మేము దీనిని ఇలాగే (కొద్ది కొద్దిగా), అంచెలవారీగా పంపాము.
25:33 وَلَا يَأْتُونَكَ بِمَثَلٍ إِلَّا جِئْنَاكَ بِالْحَقِّ وَأَحْسَنَ تَفْسِيرًا
వారు నీ వద్దకు ఏ సందేహాన్ని తీసుకువచ్చినా దానికి సత్యంతో కూడిన సమాధానాన్నీ, అత్యుత్తమమైన వివరణను నీకు తెలియజేస్తాము.
25:34 الَّذِينَ يُحْشَرُونَ عَلَىٰ وُجُوهِهِمْ إِلَىٰ جَهَنَّمَ أُولَٰئِكَ شَرٌّ مَّكَانًا وَأَضَلُّ سَبِيلًا
ముఖాలను నేలకు రాస్తూ నరకం వైపుకు ఈడ్చబడేవారే నీచమైన నివాస స్థానం కలవారు, బాగా పెడత్రోవ పట్టిన వారు.
25:35 وَلَقَدْ آتَيْنَا مُوسَى الْكِتَابَ وَجَعَلْنَا مَعَهُ أَخَاهُ هَارُونَ وَزِيرًا
నిశ్చయంగా (ఇంతకు మునుపు) మేము మూసాకు గ్రంథాన్ని వొసగాము. అతనితోపాటు అతని సోదరుడైన హారూనును అతని సహాయకునిగా నియమించాము.
25:36 فَقُلْنَا اذْهَبَا إِلَى الْقَوْمِ الَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا فَدَمَّرْنَاهُمْ تَدْمِيرًا
“మీరిద్దరూ, మా ఆయతులను ధిక్కరిస్తున్న జనుల వద్దకు వెళ్ళండి” అని మేము వారికి ఆదేశించాము. ఆ తరువాత మేము వారిని (తిరస్కారులను) పూర్తిగా తుదముట్టించాము.
25:37 وَقَوْمَ نُوحٍ لَّمَّا كَذَّبُوا الرُّسُلَ أَغْرَقْنَاهُمْ وَجَعَلْنَاهُمْ لِلنَّاسِ آيَةً ۖ وَأَعْتَدْنَا لِلظَّالِمِينَ عَذَابًا أَلِيمًا
నూహ్ జాతి వారు కూడా తమ ప్రవక్తలను ధిక్కరించినపుడు మేము వారిని ముంచివేశాము. ప్రజల కొరకు వారిని గుణపాఠ సూచనగా చేశాము. మేము దుర్మార్గుల కోసం వ్యధాభరితమైన శిక్షను సిద్ధంచేసి ఉంచాము.
25:38 وَعَادًا وَثَمُودَ وَأَصْحَابَ الرَّسِّ وَقُرُونًا بَيْنَ ذَٰلِكَ كَثِيرًا
ఇంకా ఆదు జాతివారినీ, సమూదు జాతివారినీ, బావి వారినీ, వారి మధ్యన ఉన్న మరెన్నో తరాలను కూడా (తుడిచి పెట్టేశాము).
25:39 وَكُلًّا ضَرَبْنَا لَهُ الْأَمْثَالَ ۖ وَكُلًّا تَبَّرْنَا تَتْبِيرًا
మేము వారికి ఉదాహరణలతో సహా బోధపరచాము. ఆ తరువాత ప్రతి ఒక్కరినీ సమూలంగా తుడిచిపెట్టాము.
25:40 وَلَقَدْ أَتَوْا عَلَى الْقَرْيَةِ الَّتِي أُمْطِرَتْ مَطَرَ السَّوْءِ ۚ أَفَلَمْ يَكُونُوا يَرَوْنَهَا ۚ بَلْ كَانُوا لَا يَرْجُونَ نُشُورًا
దారుణంగా (రాళ్ళ) వర్షం కురిపించబడిన పట్టణం సమీపం నుంచి వారు (అవిశ్వాసులు) రాకపోకలు సాగిస్తున్నారు. అయినా వారు దానిని చూడటం లేదా? అసలు విషయం ఏమిటంటే వారికి మరణానంతరం తిరిగి లేపబడతామన్న దానిపై ఆశలేదు.
25:41 وَإِذَا رَأَوْكَ إِن يَتَّخِذُونَكَ إِلَّا هُزُوًا أَهَٰذَا الَّذِي بَعَثَ اللَّهُ رَسُولًا
వారు (అవిశ్వాసులు) నిన్ను చూచినప్పుడల్లా, నీతో పరిహాసానికి దిగుతారు. “దేవుడు ప్రవక్తగా చేసి పంపినది ఈయనగారి నేనా?!
25:42 إِن كَادَ لَيُضِلُّنَا عَنْ آلِهَتِنَا لَوْلَا أَن صَبَرْنَا عَلَيْهَا ۚ وَسَوْفَ يَعْلَمُونَ حِينَ يَرَوْنَ الْعَذَابَ مَنْ أَضَلُّ سَبِيلًا
“మేము మా దేముళ్లపై గట్టిగా నిలబడి ఉండకపోతే, ఇతడు మమ్మల్ని మా దేవుళ్ల నుంచి తప్పించి ఉండేవాడే” అని అంటారు. పూర్తిగా మార్గభ్రష్టతకు గురై ఉన్నదెవరో శిక్షలను చూసినపుడు వారికి స్పష్టంగా తెలిసివస్తుంది.
25:43 أَرَأَيْتَ مَنِ اتَّخَذَ إِلَٰهَهُ هَوَاهُ أَفَأَنتَ تَكُونُ عَلَيْهِ وَكِيلًا
(ఓ ప్రవక్తా!) తన మనోవాంఛలను తన ఆరాధ్య దైవంగా చేసుకున్న వానిని నువ్వు చూశావా? నువ్వు అలాంటి వ్యక్తి(ని రుజుమార్గానికి తెచ్చే) బాధ్యత తీసుకోగలవా?
25:44 أَمْ تَحْسَبُ أَنَّ أَكْثَرَهُمْ يَسْمَعُونَ أَوْ يَعْقِلُونَ ۚ إِنْ هُمْ إِلَّا كَالْأَنْعَامِ ۖ بَلْ هُمْ أَضَلُّ سَبِيلًا
ఏమిటీ, వారిలో అత్యధికమంది వింటారనీ, అర్థం చేసుకుంటారని నువ్వు (ఇప్పటికీ) అనుకుంటున్నావా? వారు వట్టి పశువుల్లాంటి వారు. పైగా వాటికన్నా ఎక్కువగా దారితప్పారు.
25:45 أَلَمْ تَرَ إِلَىٰ رَبِّكَ كَيْفَ مَدَّ الظِّلَّ وَلَوْ شَاءَ لَجَعَلَهُ سَاكِنًا ثُمَّ جَعَلْنَا الشَّمْسَ عَلَيْهِ دَلِيلًا
ఏమిటి, నీ ప్రభువు నీడను ఎలా వ్యాపింపజేశాడో నువ్వు చూడలేదా? ఆయన గనక తలచుకుంటే దాన్ని నిలిచి ఉండేదిగానే చేసేవాడు. మరి మేము సూర్యుణ్ణి దానికి నిదర్శనంగా చేశాము.
25:46 ثُمَّ قَبَضْنَاهُ إِلَيْنَا قَبْضًا يَسِيرًا
మరి మేము దాన్ని క్రమక్రమంగా మా వైపుకు లాక్కున్నాము.
25:47 وَهُوَ الَّذِي جَعَلَ لَكُمُ اللَّيْلَ لِبَاسًا وَالنَّوْمَ سُبَاتًا وَجَعَلَ النَّهَارَ نُشُورًا
మరి ఆయనే మీకోసం రాత్రిని తెర (ఆసరా)గానూ, నిద్రను విశ్రాంతిగానూ చేశాడు. ఇంకా పగటిని లేచి తిరిగే సమయంగా చేశాడు.
25:48 وَهُوَ الَّذِي أَرْسَلَ الرِّيَاحَ بُشْرًا بَيْنَ يَدَيْ رَحْمَتِهِ ۚ وَأَنزَلْنَا مِنَ السَّمَاءِ مَاءً طَهُورًا
తన కారుణ్యానికి (వర్షానికి) ముందు శుభవార్తను మోసుకు వచ్చే గాలులను పంపేవాడు ఆయనే. మరి మేము ఆకాశం నుంచి స్వచ్ఛమైన నీళ్లను కురిపిస్తాము.
25:49 لِّنُحْيِيَ بِهِ بَلْدَةً مَّيْتًا وَنُسْقِيَهُ مِمَّا خَلَقْنَا أَنْعَامًا وَأَنَاسِيَّ كَثِيرًا
తద్వారా మృత ప్రదేశాన్ని బ్రతికించటానికి, మా సృష్టితాల లోని అనేక జంతువులకు, మనుషులకు (నీరు) త్రాగించటానికి (మేము ఈ ఏర్పాటును చేస్తున్నాము).
25:50 وَلَقَدْ صَرَّفْنَاهُ بَيْنَهُمْ لِيَذَّكَّرُوا فَأَبَىٰ أَكْثَرُ النَّاسِ إِلَّا كُفُورًا
వారు గుణపాఠం నేర్చుకునేందుకు మేము దీనిని వారి మధ్య పలు విధాలుగా విశదీకరించాము. అయినప్పటికీ మానవులలో చాలామంది అవిశ్వాసం, కృతఘ్నతలు తప్ప మరొక వైఖరిని అవలంబించటానికి తిరస్కరిస్తున్నారు.
25:51 وَلَوْ شِئْنَا لَبَعَثْنَا فِي كُلِّ قَرْيَةٍ نَّذِيرًا
మేము కోరుకుంటే ఒక్కో ఊరిలో ఒక్కో హెచ్చరిక చేసేవాణ్ణి పంపి ఉండేవారం.
25:52 فَلَا تُطِعِ الْكَافِرِينَ وَجَاهِدْهُم بِهِ جِهَادًا كَبِيرًا
కాబట్టి నువ్వు తిరస్కారుల మాట వినకు. ఖుర్ఆన్ (బోధన) మూలముగా వారితో గొప్ప పోరాటపటిమను ప్రదర్శిస్తూ ఉండు.
25:53 وَهُوَ الَّذِي مَرَجَ الْبَحْرَيْنِ هَٰذَا عَذْبٌ فُرَاتٌ وَهَٰذَا مِلْحٌ أُجَاجٌ وَجَعَلَ بَيْنَهُمَا بَرْزَخًا وَحِجْرًا مَّحْجُورًا
రెండు సముద్రాలను – పరస్పరం – కలిపి ఉంచినవాడు ఆయనే. వాటిలో ఒకటి తియ్యనిది, రుచికరమైనది. మరొకటి ఉప్పగా, చేదుగా ఉంది. ఆ రెండింటి మధ్య ఒక తెర (అడ్డు గోడగా) ఉంది. అది వాటిని వేరుగా ఉంచుతుంది.
25:54 وَهُوَ الَّذِي خَلَقَ مِنَ الْمَاءِ بَشَرًا فَجَعَلَهُ نَسَبًا وَصِهْرًا ۗ وَكَانَ رَبُّكَ قَدِيرًا
నీటితో మానవుణ్ణి సృష్టించినవాడు ఆయనే. ఆ తరువాత అతనికి వంశపారంపర్యాన్ని, అత్తగారి బంధుత్వాన్ని కల్పించాడు. నిశ్చయంగా నీ ప్రభువు (ప్రతిదీ చేయగల) శక్తి గలవాడు.
25:55 وَيَعْبُدُونَ مِن دُونِ اللَّهِ مَا لَا يَنفَعُهُمْ وَلَا يَضُرُّهُمْ ۗ وَكَانَ الْكَافِرُ عَلَىٰ رَبِّهِ ظَهِيرًا
వారు అల్లాహ్‌ను వదలి తమకు లాభాన్నిగానీ, నష్టాన్నిగానీ చేకూర్చలేని వాటిని ఆరాధిస్తున్నారు. ఎంతయినా అవిశ్వాసి మటుకు తన ప్రభువుకు వ్యతిరేకంగా (షైతానుకు) తోడ్పడేవాడే.
25:56 وَمَا أَرْسَلْنَاكَ إِلَّا مُبَشِّرًا وَنَذِيرًا
అయితే (ఓ ప్రవక్తా!) మేము మాత్రం నిన్ను శుభవార్తాహరునిగా, హెచ్చరించేవానిగా చేసి పంపాము.
25:57 قُلْ مَا أَسْأَلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ إِلَّا مَن شَاءَ أَن يَتَّخِذَ إِلَىٰ رَبِّهِ سَبِيلًا
“ఈ ఖుర్ఆన్ సందేశాన్ని అందజేసి నేను మీ నుంచి ఎలాంటి ప్రతిఫలాన్నీ అడగటం లేదు. కాని ఎవరయినా తన ప్రభువు వైపు వెళ్ళే మార్గాన్ని (రుజుమార్గాన్ని) అవలంబిస్తే చాలు” అని వారికి చెప్పు.
25:58 وَتَوَكَّلْ عَلَى الْحَيِّ الَّذِي لَا يَمُوتُ وَسَبِّحْ بِحَمْدِهِ ۚ وَكَفَىٰ بِهِ بِذُنُوبِ عِبَادِهِ خَبِيرًا
ఎన్నటికీ మరణించనివాడూ, నిత్యుడూ అయిన అల్లాహ్‌ను నమ్ముకో. స్తోత్రసమేతంగా ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉండు. తన దాసుల పాపాలను గురించి తెలుసుకునేందుకు ఆయన ఒక్కడే చాలు.
25:59 الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ وَمَا بَيْنَهُمَا فِي سِتَّةِ أَيَّامٍ ثُمَّ اسْتَوَىٰ عَلَى الْعَرْشِ ۚ الرَّحْمَٰنُ فَاسْأَلْ بِهِ خَبِيرًا
ఆయనే ఆకాశాలనూ, భూమినీ, వాటి మధ్యనున్న సమస్త వస్తువులను ఆరు దినాలలో సృష్టించాడు. ఆ తరువాత అధికార పీఠంపై (అర్ష్‌పై) ఆసీనుడయ్యాడు. ఆయన కరుణామయుడు. కావాలంటే (ఆయన వైభవాన్ని గురించి) తెలిసిన వానిని అడుగు.
25:60 وَإِذَا قِيلَ لَهُمُ اسْجُدُوا لِلرَّحْمَٰنِ قَالُوا وَمَا الرَّحْمَٰنُ أَنَسْجُدُ لِمَا تَأْمُرُنَا وَزَادَهُمْ نُفُورًا ۩
“కరుణామయునికి సాష్టాంగపడండి” అని వారితో అన్నప్పుడు, ‘కరుణామయుడంటే ఏమిటీ? (ఆయనెవడు?) నువ్వు ఆజ్ఞాపించినవానికి మేము సాష్టాంగపడాలా?’ అని వారంటారు. ఇది (ఈ ధర్మబోధ) వారి ద్వేషాన్ని మరింత అధికం చేసింది.
25:61 تَبَارَكَ الَّذِي جَعَلَ فِي السَّمَاءِ بُرُوجًا وَجَعَلَ فِيهَا سِرَاجًا وَقَمَرًا مُّنِيرًا
ఆకాశంలో బురుజులను నిర్మించి, అందులో ప్రజ్వలమైన దీపాన్ని, కాంతిమంతమైన చంద్రుణ్ణి ఆవిష్కరించినవాడు శుభకరుడు.
25:62 وَهُوَ الَّذِي جَعَلَ اللَّيْلَ وَالنَّهَارَ خِلْفَةً لِّمَنْ أَرَادَ أَن يَذَّكَّرَ أَوْ أَرَادَ شُكُورًا
ఆయనే రేయింబవళ్ళను ఒకదాని వెనుక ఒకటి వచ్చేలా చేశాడు. ఇదంతా గుణపాఠం నేర్చుకునే వాని కోసం, లేదా కృతజ్ఞతాపూర్వకంగా మసలుకోదలచిన వాని కోసం చేయబడింది.
25:63 وَعِبَادُ الرَّحْمَٰنِ الَّذِينَ يَمْشُونَ عَلَى الْأَرْضِ هَوْنًا وَإِذَا خَاطَبَهُمُ الْجَاهِلُونَ قَالُوا سَلَامًا
కరుణామయుని (విశ్వాసపాత్రులైన) దాసులెవరంటే, వారు నేలపై వినమ్రులై నడుస్తారు. మూర్ఖులు వారితో మాట్లాడినప్పుడు ‘మీకు సలాం’ అంటూ సాగిపోతారు.
25:64 وَالَّذِينَ يَبِيتُونَ لِرَبِّهِمْ سُجَّدًا وَقِيَامًا
వారు తమ ప్రభువు సన్నిధిలో సాష్టాంగపడుతూ, నిలబడుతూ రాత్రులు గడుపుతారు.
25:65 وَالَّذِينَ يَقُولُونَ رَبَّنَا اصْرِفْ عَنَّا عَذَابَ جَهَنَّمَ ۖ إِنَّ عَذَابَهَا كَانَ غَرَامًا
వారిలా ప్రార్థిస్తూ ఉంటారు: “మా ప్రభూ! మాపై నుంచి నరకశిక్షను తొలగించు. ఎందుకంటే ఆ శిక్ష ఎన్నటికీ వీడనిది.”
25:66 إِنَّهَا سَاءَتْ مُسْتَقَرًّا وَمُقَامًا
నిశ్చయంగా అది చాలా చెడ్డచోటు. చెడ్డ నివాస స్థలం.
25:67 وَالَّذِينَ إِذَا أَنفَقُوا لَمْ يُسْرِفُوا وَلَمْ يَقْتُرُوا وَكَانَ بَيْنَ ذَٰلِكَ قَوَامًا
వారు – ఖర్చుపెట్టే సమయంలో కూడా అటు మరీ దుబారా ఖర్చు చేయకుండా, ఇటు మరీ పిసినారితనం కూడా చూపకుండా – రెండింటికీ మధ్య – సమతూకాన్ని పాటిస్తారు.
25:68 وَالَّذِينَ لَا يَدْعُونَ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ وَلَا يَقْتُلُونَ النَّفْسَ الَّتِي حَرَّمَ اللَّهُ إِلَّا بِالْحَقِّ وَلَا يَزْنُونَ ۚ وَمَن يَفْعَلْ ذَٰلِكَ يَلْقَ أَثَامًا
వారు అల్లాహ్‌తోపాటు మరో దైవాన్ని మొరపెట్టుకోరు. న్యాయబద్ధంగా తప్ప – అల్లాహ్ ఏ ప్రాణిని హత్య చేయటాన్ని నిషేధించాడో దానిని హతమార్చరు. వారు వ్యభిచారానికి పాల్పడరు. ఈ చేష్టలకు ఒడిగట్టినవాడు పాపఫలాన్ని పొంది తీరుతాడు.
25:69 يُضَاعَفْ لَهُ الْعَذَابُ يَوْمَ الْقِيَامَةِ وَيَخْلُدْ فِيهِ مُهَانًا
ప్రళయదినాన అతనికి రెట్టింపు శిక్ష వడ్డించబడుతుంది. వాడు పరాభవంపాలై, అత్యంత నికృష్టస్థితిలో కలకాలం అందులో పడి ఉంటాడు.
25:70 إِلَّا مَن تَابَ وَآمَنَ وَعَمِلَ عَمَلًا صَالِحًا فَأُولَٰئِكَ يُبَدِّلُ اللَّهُ سَيِّئَاتِهِمْ حَسَنَاتٍ ۗ وَكَانَ اللَّهُ غَفُورًا رَّحِيمًا
అయితే (ఈ పాప కార్యాల తరువాత) ఎవరు పశ్చాత్తాపం చెంది, విశ్వసిస్తారో, సదాచరణ చేస్తారో అలాంటి వారి పాపాలను అల్లాహ్ పుణ్యాలుగా మార్చి వేస్తాడు. అల్లాహ్ క్షమాభిక్ష పెట్టేవాడు, కరుణాకరుడు.
25:71 وَمَن تَابَ وَعَمِلَ صَالِحًا فَإِنَّهُ يَتُوبُ إِلَى اللَّهِ مَتَابًا
మరెవరయితే పశ్చాత్తాపం చెంది, సదాచరణ చేస్తాడో అతడు (వాస్తవంగా) అల్లాహ్ వైపునకు మరలి వచ్చినవాడవుతాడు.
25:72 وَالَّذِينَ لَا يَشْهَدُونَ الزُّورَ وَإِذَا مَرُّوا بِاللَّغْوِ مَرُّوا كِرَامًا
వారు (కరుణామయుని సిసలైన దాసులు) అసత్యానికి సాక్షులుగా ఉండరు. ఎప్పుడైనా వ్యర్థమైనవాటి గుండా పోవలసి వస్తే, హుందాగా ముందుకు సాగిపోతారు.
25:73 وَالَّذِينَ إِذَا ذُكِّرُوا بِآيَاتِ رَبِّهِمْ لَمْ يَخِرُّوا عَلَيْهَا صُمًّا وَعُمْيَانًا
వారికి వారి ప్రభువు వాక్యాల ఆధారంగా బోధపరచినపుడు, వారు గుడ్డివారుగా, చెవిటివారుగా వాటి మీద పడిపోరు.
25:74 وَالَّذِينَ يَقُولُونَ رَبَّنَا هَبْ لَنَا مِنْ أَزْوَاجِنَا وَذُرِّيَّاتِنَا قُرَّةَ أَعْيُنٍ وَاجْعَلْنَا لِلْمُتَّقِينَ إِمَامًا
వారు ఇలా ప్రార్థిస్తూ ఉంటారు : “ఓ మా ప్రభూ! నువ్వు మా భార్యల ద్వారా, మా సంతానం ద్వారా మా కళ్లకు చలువను ప్రసాదించు. మమ్మల్ని దైవ భక్తిపరుల (ముత్తఖీన్‌ల) నాయకునిగా చేయి.”
25:75 أُولَٰئِكَ يُجْزَوْنَ الْغُرْفَةَ بِمَا صَبَرُوا وَيُلَقَّوْنَ فِيهَا تَحِيَّةً وَسَلَامًا
ఇలాంటి వారికే వారి సహన స్థయిర్యాలకు బదులుగా స్వర్గంలోని అత్యున్నత స్థానాలు వొసగబడతాయి. అక్కడ సలాం, దీవెనలతో వారికి స్వాగత సత్కారాలు లభిస్తాయి.
25:76 خَالِدِينَ فِيهَا ۚ حَسُنَتْ مُسْتَقَرًّا وَمُقَامًا
వారందులో (స్వర్గవనాలలో) కలకాలం ఉంటారు. అదెంతో రమణీయమైన స్థలం, అత్యుత్తమ నివాసం.
25:77 قُلْ مَا يَعْبَأُ بِكُمْ رَبِّي لَوْلَا دُعَاؤُكُمْ ۖ فَقَدْ كَذَّبْتُمْ فَسَوْفَ يَكُونُ لِزَامًا
“ఒకవేళ మీరు మొరపెట్టుకోకపోతే, నా ప్రభువు మిమ్మల్ని ఏ మాత్రం లక్ష్యపెట్టేవాడే కాదు. మీరెలాగూ ధిక్కరించారు. ఇప్పుడు శీఘ్రంగానే తప్పించనలవికాని శిక్ష మిమ్మల్ని అంటుకుంటుంది” అని (ఓ ప్రవక్తా! తిరస్కార జనులకు) చెప్పు.
26. సూరా ఆష్ షుఅరా (As-Shu’ara)
26:1 طسم
తా – సీన్ – మీమ్.
26:2 تِلْكَ آيَاتُ الْكِتَابِ الْمُبِينِ
ఇవి స్పష్టమైన గ్రంథ వచనాలు.
26:3 لَعَلَّكَ بَاخِعٌ نَّفْسَكَ أَلَّا يَكُونُوا مُؤْمِنِينَ
(ఓ ముహమ్మద్-స!) వారు విశ్వసించలేదే! అన్న బెంగతో నువ్వు నీ ప్రాణాలను పోగొట్టుకుంటావు కాబోలు!
26:4 إِن نَّشَأْ نُنَزِّلْ عَلَيْهِم مِّنَ السَّمَاءِ آيَةً فَظَلَّتْ أَعْنَاقُهُمْ لَهَا خَاضِعِينَ
మేము గనక తలచుకుంటే ఆకాశం నుంచి ఒక (గొప్ప) నిదర్శనాన్ని అవతరింపజేసి, దాని ముందు వారి మెడలు వంగిపోయేలా చేయగలం.
26:5 وَمَا يَأْتِيهِم مِّن ذِكْرٍ مِّنَ الرَّحْمَٰنِ مُحْدَثٍ إِلَّا كَانُوا عَنْهُ مُعْرِضِينَ
కరుణామయుని (అల్లాహ్) తరఫు నుంచి వారివద్దకు ఏ నూతన ఉపదేశం వచ్చినా వారు దాని పట్ల విముఖత చూపకుండా ఉండలేదు.
26:6 فَقَدْ كَذَّبُوا فَسَيَأْتِيهِمْ أَنبَاءُ مَا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ
వారు ధిక్కరించారు. కాబట్టి వారు అవహేళన చేసిన విషయాల వార్తలు త్వరలోనే వారివద్దకు చేరుతాయి.
26:7 أَوَلَمْ يَرَوْا إِلَى الْأَرْضِ كَمْ أَنبَتْنَا فِيهَا مِن كُلِّ زَوْجٍ كَرِيمٍ
ఏమిటీ, వారు భూమిపై దృష్టిని సారించలేదా? అందులో మేము అన్నిరకాల శ్రేష్ఠమైన జంట వస్తువులను ఎలా ఉత్పన్నం చేసి ఉన్నామో! (చూడలేదా?)
26:8 إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ
నిస్సందేహంగా అందులో ఓ సూచన ఉంది. అయినప్పటికీ వారిలో చాలా మంది విశ్వసించరు.
26:9 وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ
నిశ్చయంగా నీ ప్రభువు, ఆయనే – సర్వశక్తుడు, దయాశీలుడు.
26:10 وَإِذْ نَادَىٰ رَبُّكَ مُوسَىٰ أَنِ ائْتِ الْقَوْمَ الظَّالِمِينَ
నీ ప్రభువు మూసాను పిలిచి, “నువ్వు దుర్మార్గులైన ప్రజల వద్దకు వెళ్ళు (అని చెప్పిన సంఘటనను జ్ఞప్తికి తెచ్చుకో).
26:11 قَوْمَ فِرْعَوْنَ ۚ أَلَا يَتَّقُونَ
“అంటే ఫిర్ఔను జనుల వద్దకు! వారు (అల్లాహ్‌కు) భయపడరా?”
26:12 قَالَ رَبِّ إِنِّي أَخَافُ أَن يُكَذِّبُونِ
(మూసా) ఇలా అన్నాడు : “నా ప్రభూ! వారు నన్ను ధిక్కరిస్తారేమోనని నాకు భయంగా ఉంది.
26:13 وَيَضِيقُ صَدْرِي وَلَا يَنطَلِقُ لِسَانِي فَأَرْسِلْ إِلَىٰ هَارُونَ
“నా గుండె కుంచించుకుపోతోంది. నా నోరు సరిగ్గా (స్వేచ్ఛగా) పెగలటం లేదు. అందుకే హారూను వైపుకు కూడా సందేశం (వహీ) పంపించు.
26:14 وَلَهُمْ عَلَيَّ ذَنبٌ فَأَخَافُ أَن يَقْتُلُونِ
“వారి తరఫున నాపై ఒక నేరారోపణ కూడా ఉంది. అందువల్ల వారు నన్ను చంపేస్తారేమోనని భయపడుతున్నాను.”
26:15 قَالَ كَلَّا ۖ فَاذْهَبَا بِآيَاتِنَا ۖ إِنَّا مَعَكُم مُّسْتَمِعُونَ
(అల్లాహ్) ఇలా సెలవిచ్చాడు: “ఎట్టి పరిస్థితిలోనూ అలా జరగదు. మీరిద్దరూ నా నిదర్శనాలను తీసుకుని వెళ్ళండి. మేము స్వయంగా మీ వెంట ఉండి అంతా వింటూ ఉంటాము.
26:16 فَأْتِيَا فِرْعَوْنَ فَقُولَا إِنَّا رَسُولُ رَبِّ الْعَالَمِينَ
“మీరిద్దరూ ఫిర్ఔను దగ్గరకు వెళ్ళి, ‘నిశ్చయంగా మేము సర్వలోక ప్రభువు తరఫున పంపబడ్డాము’ అని పలకండి.”
26:17 أَنْ أَرْسِلْ مَعَنَا بَنِي إِسْرَائِيلَ
‘నువ్వు ఇస్రాయీలు సంతతి వారిని మా వెంట పంపించు’ అని అనండి.
26:18 قَالَ أَلَمْ نُرَبِّكَ فِينَا وَلِيدًا وَلَبِثْتَ فِينَا مِنْ عُمُرِكَ سِنِينَ
(మూసాతో ఫిరౌను) ఇలా అన్నాడు : “ఏమిటీ? మేము నీ పసితనంలో నిన్ను మా దగ్గర పోషించలేదా? నీ జీవితంలోని అనేక సంవత్సరాలు నువ్వు మా వద్ద గడిపావు కూడా!
26:19 وَفَعَلْتَ فَعْلَتَكَ الَّتِي فَعَلْتَ وَأَنتَ مِنَ الْكَافِرِينَ
“ఆ తరువాత నువ్వు చేయాల్సింది చేసి వెళ్ళావు. మొత్తానికి చేసిన మేలును మరచిన వారిలో నువ్వూ ఒకడివి.”
26:20 قَالَ فَعَلْتُهَا إِذًا وَأَنَا مِنَ الضَّالِّينَ
మూసా ఈ విధంగా సమాధానమిచ్చాడు : “(అవును). నేను దారితప్పి వున్న స్థితిలో ఆ పని చేశాను.
26:21 فَفَرَرْتُ مِنكُمْ لَمَّا خِفْتُكُمْ فَوَهَبَ لِي رَبِّي حُكْمًا وَجَعَلَنِي مِنَ الْمُرْسَلِينَ
“ఆ తరువాత నేను మీకు భయపడి మీ నుంచి పారిపోయాను. ఆ తరువాత నా ప్రభువు నాకు వివేకాన్ని, జ్ఞానాన్ని వొసగాడు. నన్ను తన సందేశహరులలో చేర్చుకున్నాడు.
26:22 وَتِلْكَ نِعْمَةٌ تَمُنُّهَا عَلَيَّ أَنْ عَبَّدتَّ بَنِي إِسْرَائِيلَ
“ఇక నువ్వు నాకు ఉపకారం చేశావని ఎత్తిపొడుస్తున్న విషయమంటావా? వాస్తవానికి నువ్వు ఇస్రాయీలు సంతతిని బానిసలుగా చేసి పెట్టుకున్నావు.”
26:23 قَالَ فِرْعَوْنُ وَمَا رَبُّ الْعَالَمِينَ
“ఇంతకీ సకల లోకాల ప్రభువు అంటే ఏమిటి?” అని ప్రశ్నించాడు ఫిరౌను.
26:24 قَالَ رَبُّ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا ۖ إِن كُنتُم مُّوقِنِينَ
“మీరు నమ్మగలవారే అయితే (వినండి) ఆయన ఆకాశాలకూ, భూమికీ, వాటి మధ్యనున్న సమస్త వస్తువులకు ప్రభువు” అని మూసా జవాబిచ్చాడు.
26:25 قَالَ لِمَنْ حَوْلَهُ أَلَا تَسْتَمِعُونَ
ఫిరౌను తన చుట్టూ ఉన్న వారినుద్దేశించి, “(ఇతనేమంటున్నాడో) మీరు వినటంలేదా?” అన్నాడు.
26:26 قَالَ رَبُّكُمْ وَرَبُّ آبَائِكُمُ الْأَوَّلِينَ
“ఆయన మీకూ ప్రభువే, మీ పూర్వీకులైన మీ తాతముత్తాతలకు కూడా ప్రభువే” అన్నాడు మూసా.
26:27 قَالَ إِنَّ رَسُولَكُمُ الَّذِي أُرْسِلَ إِلَيْكُمْ لَمَجْنُونٌ
“(ప్రజలారా!) మీ వద్దకు పంపబడిన ఈ మీ ప్రవక్త ముమ్మాటికీ పిచ్చివాడే” అని ఫిరౌన్ అన్నాడు.
26:28 قَالَ رَبُّ الْمَشْرِقِ وَالْمَغْرِبِ وَمَا بَيْنَهُمَا ۖ إِن كُنتُمْ تَعْقِلُونَ
“మీరు గనక గ్రహించగలిగితే, ప్రాక్పశ్చిమాలకు, వాటి మధ్య నున్న సమస్తానికీ ఆయనే ప్రభువు” అని మూసా చెప్పుకుపోతున్నాడు.
26:29 قَالَ لَئِنِ اتَّخَذْتَ إِلَٰهًا غَيْرِي لَأَجْعَلَنَّكَ مِنَ الْمَسْجُونِينَ
“(ఇదిగో జాగ్రత్తగా విను!) నువ్వు నన్ను గాక వేరెవరినయినా ఆరాధ్య దైవంగా చేసుకున్నావంటే నేను నిన్ను కారాగారంలో పడవేస్తాను” అని ఫిరౌను హెచ్చరించాడు.
26:30 قَالَ أَوَلَوْ جِئْتُكَ بِشَيْءٍ مُّبِينٍ
“ఏమిటీ? నేను స్పష్టమైన వస్తువును నీ వద్దకు తెచ్చినప్పటికీ (నువ్వు దారికి రావా?)” అని మూసా పలికాడు.
26:31 قَالَ فَأْتِ بِهِ إِن كُنتَ مِنَ الصَّادِقِينَ
“నువ్వు సత్యవంతుడవే అయితే అదేదో చూపు” అని ఫిరౌన్ అన్నాడు.
26:32 فَأَلْقَىٰ عَصَاهُ فَإِذَا هِيَ ثُعْبَانٌ مُّبِينٌ
అతను (అప్పటికప్పుడే) తన చేతి కర్రను పడవేయగానే అదొక స్పష్టమైన పెద్ద సర్పంగా మారిపోయింది.
26:33 وَنَزَعَ يَدَهُ فَإِذَا هِيَ بَيْضَاءُ لِلنَّاظِرِينَ
అతను తన చేతిని (చంకలో నుంచి) బయటికి లాగగానే, అది చూపరులకు తెల్లగా (మెరిసిపోతూ ఉన్నట్లు) కానవచ్చింది.
26:34 قَالَ لِلْمَلَإِ حَوْلَهُ إِنَّ هَٰذَا لَسَاحِرٌ عَلِيمٌ
ఫిరౌను తన దగ్గరున్న పెద్దలనుద్దేశించి ఇలా అన్నాడు : “ఇతను ఆరితేరిన మాంత్రికునిలా ఉన్నాడు.
26:35 يُرِيدُ أَن يُخْرِجَكُم مِّنْ أَرْضِكُم بِسِحْرِهِ فَمَاذَا تَأْمُرُونَ
“తన మాంత్రిక బలంతో మిమ్మల్ని మీ భూమి నుంచి వెళ్ళ గొట్టాలని చూస్తున్నాడు. ఇప్పుడు మీఆదేశం ఏమిటో చెప్పండి.”
26:36 قَالُوا أَرْجِهْ وَأَخَاهُ وَابْعَثْ فِي الْمَدَائِنِ حَاشِرِينَ
“తమరు ఇతనికీ, ఇతని సోదరునికి కొంత గడువు ఇవ్వండి. పట్టణాలన్నింటికీ మీ ప్రకటన కర్తలను పంపించండి –
26:37 يَأْتُوكَ بِكُلِّ سَحَّارٍ عَلِيمٍ
మాంత్రిక విద్యలో ప్రవీణులైన వారందరిని వారు మీ వద్దకు తీసుకు వస్తారు” అని వారంతా సలహా ఇచ్చారు.
26:38 فَجُمِعَ السَّحَرَةُ لِمِيقَاتِ يَوْمٍ مَّعْلُومٍ
ఆ తరువాత ఒక నిర్ధారిత దినాన నిర్దేశిత స్థలంలో మాంత్రికులంతా సమావేశపరచబడ్డారు.
26:39 وَقِيلَ لِلنَّاسِ هَلْ أَنتُم مُّجْتَمِعُونَ
ప్రజలతో, “మీరు కూడా సమావేశానికి హాజరవుతారా?!” అని అనబడింది.
26:40 لَعَلَّنَا نَتَّبِعُ السَّحَرَةَ إِن كَانُوا هُمُ الْغَالِبِينَ
“ఒకవేళ (మన) మాంత్రికులు గనక గెలిస్తే మనమంతా వాళ్ళ (మతము)నే అనుసరిద్దాం” (అని చెప్పటం జరిగింది).
26:41 فَلَمَّا جَاءَ السَّحَرَةُ قَالُوا لِفِرْعَوْنَ أَئِنَّ لَنَا لَأَجْرًا إِن كُنَّا نَحْنُ الْغَالِبِينَ
మంత్రగాళ్ళు వచ్చాక, ఫిర్ఔనుతో, “మేము గెలిస్తే మాకేదన్నా పారితోషికం ఉంటుందా?” అని అడిగారు.
26:42 قَالَ نَعَمْ وَإِنَّكُمْ إِذًا لَّمِنَ الْمُقَرَّبِينَ
“అవును. మీరు నా సన్నిహితులుగా ఉంటారు” అని చెప్పాడు ఫిరౌన్ (సంబరపడుతూ).
26:43 قَالَ لَهُم مُّوسَىٰ أَلْقُوا مَا أَنتُم مُّلْقُونَ
మూసా మాంత్రికులనుద్దేశించి, “మీరు పడవేయదలచుకున్న వాటిని పడవెయ్యండి” అన్నాడు.
26:44 فَأَلْقَوْا حِبَالَهُمْ وَعِصِيَّهُمْ وَقَالُوا بِعِزَّةِ فِرْعَوْنَ إِنَّا لَنَحْنُ الْغَالِبُونَ
వాళ్లు తమ త్రాళ్లను, కర్రలను పడవేసి, “ఫిరౌను గౌరవ మర్యాదల సాక్షిగా! ముమ్మాటికీ మేమే గెలుస్తాము” అని పలికారు.
26:45 فَأَلْقَىٰ مُوسَىٰ عَصَاهُ فَإِذَا هِيَ تَلْقَفُ مَا يَأْفِكُونَ
మరి మూసా కూడా తన చేతికర్రను పడవేశాడు. అమాంతం అది వారి బూటకపు విన్యాసాలను మ్రింగటం మొదలెట్టింది.
26:46 فَأُلْقِيَ السَّحَرَةُ سَاجِدِينَ
అంతే! మాంత్రికులంతా (అనూహ్యంగా) సాష్టాంగపడి పోయారు.
26:47 قَالُوا آمَنَّا بِرَبِّ الْعَالَمِينَ
వారు (స్పష్టంగా) ఇలా అన్నారు: “మేము సర్వలోక ప్రభువైన అల్లాహ్‌ను విశ్వసించాము
26:48 رَبِّ مُوسَىٰ وَهَارُونَ
అంటే మూసా, హారూనుల ప్రభువును (విశ్వసించాము).”
26:49 قَالَ آمَنتُمْ لَهُ قَبْلَ أَنْ آذَنَ لَكُمْ ۖ إِنَّهُ لَكَبِيرُكُمُ الَّذِي عَلَّمَكُمُ السِّحْرَ فَلَسَوْفَ تَعْلَمُونَ ۚ لَأُقَطِّعَنَّ أَيْدِيَكُمْ وَأَرْجُلَكُم مِّنْ خِلَافٍ وَلَأُصَلِّبَنَّكُمْ أَجْمَعِينَ
“ఏమిటీ? నేను అనుమతి ఇవ్వక ముందే మీరతన్ని విశ్వసించారా? నిశ్చయంగా ఇతడు మీకందరికీ మంత్ర విద్యను నేర్పిన పెద్ద (గురువు)లా ఉన్నాడు. సరే, ఇప్పుడే మీకు తెలుస్తుంది…. నేనిప్పుడే మీ కాళ్లు చేతుల్ని వ్యతిరేక దిశలో నరికి, మీ అందరికీ శిలువవేస్తాను” అని ఫిరౌన్ గర్జించాడు.
26:50 قَالُوا لَا ضَيْرَ ۖ إِنَّا إِلَىٰ رَبِّنَا مُنقَلِبُونَ
దానికి వారు ఇలా అన్నారు : “మరేమీ ఫరవాలేదు. మేమెలాగూ మా ప్రభువు వద్దకు మరలి వెళ్ళవలసిన వారమే.
26:51 إِنَّا نَطْمَعُ أَن يَغْفِرَ لَنَا رَبُّنَا خَطَايَانَا أَن كُنَّا أَوَّلَ الْمُؤْمِنِينَ
“అందరికంటే ముందు మేము విశ్వసించాము. కనుక మా ప్రభువు మా పాపాలన్నింటినీ క్షమిస్తాడన్న ఆశ మాకుంది.”
26:52 وَأَوْحَيْنَا إِلَىٰ مُوسَىٰ أَنْ أَسْرِ بِعِبَادِي إِنَّكُم مُّتَّبَعُونَ
“రాత్రికి రాత్రే నా దాసులను తీసుకుని వెళ్ళిపో. మీరంతా వెంబడించబడతారు” అని మేము మూసాకు వహీ పంపాము.
26:53 فَأَرْسَلَ فِرْعَوْنُ فِي الْمَدَائِنِ حَاشِرِينَ
ఫిరౌన్ అన్ని పట్టణాలకూ తన వార్తాహరులను పంపించాడు.
26:54 إِنَّ هَٰؤُلَاءِ لَشِرْذِمَةٌ قَلِيلُونَ
“చూడబోతే వాళ్లు (ఇస్రాయీలు సంతతివారు) అతికొద్ది మంది మాత్రమే.
26:55 وَإِنَّهُمْ لَنَا لَغَائِظُونَ
“కాని వాళ్లు మమ్మల్ని ఆగ్రహోదగ్రుల్ని చేస్తున్నారు.
26:56 وَإِنَّا لَجَمِيعٌ حَاذِرُونَ
“యదార్థానికి మా సమూహం (చాలా పెద్దది) సదా అప్రమత్తంగా ఉండేది” (అంటూ ఫిరౌను జాతి ప్రజలను రెచ్చ గొట్టటం జరిగింది).”
26:57 فَأَخْرَجْنَاهُم مِّن جَنَّاتٍ وَعُيُونٍ
ఎట్టకేలకు మేము వాళ్ళను (వారి) తోటల నుండి, చెలమల నుండి బైటికి లాగాము.
26:58 وَكُنُوزٍ وَمَقَامٍ كَرِيمٍ
ధనాగారాల నుండి, గౌరవప్రదమైన స్థానాల నుండి (బయటికి ఈడ్చాము).
26:59 كَذَٰلِكَ وَأَوْرَثْنَاهَا بَنِي إِسْرَائِيلَ
ఈ విధంగా జరిగింది. మరి మేము ఈ వస్తువులకు ఇస్రాయీలు సంతతివారిని వారసులుగా చేశాము.
26:60 فَأَتْبَعُوهُم مُّشْرِقِينَ
సూర్యోదయమవగానే వారు (ఫిరౌనీయులు) ఇస్రాయీల్ జాతిని వెంబడించసాగారు.
26:61 فَلَمَّا تَرَاءَى الْجَمْعَانِ قَالَ أَصْحَابُ مُوسَىٰ إِنَّا لَمُدْرَكُونَ
ఇరు పక్షాలవారు ఒండొకరిని చూడగానే, “ఇక మనం పట్టుబడిపోయినట్లే” అని మూసా సహచరులు (ఆందోళనతో) పలికారు.
26:62 قَالَ كَلَّا ۖ إِنَّ مَعِيَ رَبِّي سَيَهْدِينِ
“అలా ఎంతమాత్రం జరగదు. నిశ్చయంగా నా ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు. ఆయన నాకు తప్పకుండా దారి చూపుతాడు” అని మూసా అన్నాడు.
26:63 فَأَوْحَيْنَا إِلَىٰ مُوسَىٰ أَنِ اضْرِب بِّعَصَاكَ الْبَحْرَ ۖ فَانفَلَقَ فَكَانَ كُلُّ فِرْقٍ كَالطَّوْدِ الْعَظِيمِ
“నీ చేతి కర్రతో సముద్రాన్ని కొట్టు” అని మేము మూసాకు వహీ పంపాము. అంతే! అప్పటికప్పుడే సముద్రం చీలిపోయింది. ప్రతి చీలిక భాగం పెద్ద పర్వతంలా అయిపోయింది.
26:64 وَأَزْلَفْنَا ثَمَّ الْآخَرِينَ
మేము ఆ స్థలానికి దగ్గరగా రెండో సమూహాన్ని చేర్చాము.
26:65 وَأَنجَيْنَا مُوسَىٰ وَمَن مَّعَهُ أَجْمَعِينَ
మూసాను, అతని వెంటవున్న సహచరులందరినీ కాపాడాము.
26:66 ثُمَّ أَغْرَقْنَا الْآخَرِينَ
మరి మిగతా వారందరినీ ముంచి వేశాము.
26:67 إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ
నిశ్చయంగా ఇందులో గొప్ప సూచన ఉంది. (అయినప్పటికీ) వారిలో అత్యధికులు విశ్వసించేవారు కారు.
26:68 وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ
నిస్సందేహంగా నీ ప్రభువు శక్తిశాలి, దయాశీలి.
26:69 وَاتْلُ عَلَيْهِمْ نَبَأَ إِبْرَاهِيمَ
వారికి ఇబ్రాహీమ్ సమాచారాన్ని కూడా చదివి వినిపించు.
26:70 إِذْ قَالَ لِأَبِيهِ وَقَوْمِهِ مَا تَعْبُدُونَ
“మీరెవరిని పూజిస్తున్నారు?” అని అతను తన తండ్రిని, తన జాతి వారిని అడిగినప్పుడు,
26:71 قَالُوا نَعْبُدُ أَصْنَامًا فَنَظَلُّ لَهَا عَاكِفِينَ
“మేము విగ్రహాలను పూజిస్తున్నాము. (ఎల్లప్పుడూ) వాటి సేవకే అంకితమై ఉన్నాము” అని వారు సమాధానమిచ్చారు.
26:72 قَالَ هَلْ يَسْمَعُونَكُمْ إِذْ تَدْعُونَ
ఆయన వారిని ఇలా అడిగారు: “మీరు వాటిని పిలిచినప్పుడు అవి మీ పిలుపును వింటాయా?
26:73 أَوْ يَنفَعُونَكُمْ أَوْ يَضُرُّونَ
లేదా మీకు లాభంగానీ, నష్టంగానీ కలిగిస్తాయా?”
26:74 قَالُوا بَلْ وَجَدْنَا آبَاءَنَا كَذَٰلِكَ يَفْعَلُونَ
“(అదంతా మాకు అనవసరం) మా తాతముత్తాతలు ఈ విధంగా చేస్తుండగా మేము చూశాము” అని వారు బదులిచ్చారు.
26:75 قَالَ أَفَرَأَيْتُم مَّا كُنتُمْ تَعْبُدُونَ
అతను (ఇబ్రాహీం) ఇలా అన్నాడు : “మీరు పూజిస్తున్నవాటిని (కాస్తయినా) గమనించారా?
26:76 أَنتُمْ وَآبَاؤُكُمُ الْأَقْدَمُونَ
“మీరుగానీ, మీ పూర్వీకులైన మీ తాతముత్తాతలు గానీ!
26:77 فَإِنَّهُمْ عَدُوٌّ لِّي إِلَّا رَبَّ الْعَالَمِينَ
“వారంతా నా శత్రువులు. ఒక్క సకలలోక ప్రభువు తప్ప.
26:78 الَّذِي خَلَقَنِي فَهُوَ يَهْدِينِ
“ఆయనే నన్ను సృష్టించాడు, మరి ఆయనే నాకు మార్గదర్శకత్వం వహిస్తున్నాడు.
26:79 وَالَّذِي هُوَ يُطْعِمُنِي وَيَسْقِينِ
“ఆయనే నన్ను తినిపిస్తున్నాడు, త్రాగిస్తున్నాడు.
26:80 وَإِذَا مَرِضْتُ فَهُوَ يَشْفِينِ
“నేను జబ్బు పడినప్పుడు, ఆయనే నన్ను నయం చేస్తున్నాడు.
26:81 وَالَّذِي يُمِيتُنِي ثُمَّ يُحْيِينِ
“ఆయనే నన్ను చంపుతాడు, మళ్లీ తిరిగి బ్రతికిస్తాడు.
26:82 وَالَّذِي أَطْمَعُ أَن يَغْفِرَ لِي خَطِيئَتِي يَوْمَ الدِّينِ
“ప్రతిఫలదినాన ఆయన నా తప్పులను మన్నిస్తాడన్న ఆశ కూడా నాకుంది.”
26:83 رَبِّ هَبْ لِي حُكْمًا وَأَلْحِقْنِي بِالصَّالِحِينَ
(తరువాత ఇబ్రాహీమ్ ఇలా ప్రార్థించాడు): “నా ప్రభూ! నాకు ‘ప్రజ్ఞ’ను ప్రసాదించు. నన్ను సద్వర్తనులలో కలుపు.
26:84 وَاجْعَل لِّي لِسَانَ صِدْقٍ فِي الْآخِرِينَ
“భావితరాల వారి (నోటి)లో నన్ను కీర్తిశేషునిగా ఉంచు.
26:85 وَاجْعَلْنِي مِن وَرَثَةِ جَنَّةِ النَّعِيمِ
“అనుగ్రహభరితమైన స్వర్గానికి వారసులయ్యే వారిలో నన్ను (కూడా ఒకడిగా) చెయ్యి.
26:86 وَاغْفِرْ لِأَبِي إِنَّهُ كَانَ مِنَ الضَّالِّينَ
“నా తండ్రిని క్షమించు. నిశ్చయంగా ఆయన మార్గభ్రష్టులలోనివాడు.
26:87 وَلَا تُخْزِنِي يَوْمَ يُبْعَثُونَ
“ప్రజలు మళ్లీ తిరిగి లేపబడే రోజున నన్ను అవమానపరచకు.”
26:88 يَوْمَ لَا يَنفَعُ مَالٌ وَلَا بَنُونَ
ఆ రోజు సిరిసంపదలుగానీ, సంతానంగానీ దేనికీ పనికిరావు.
26:89 إِلَّا مَنْ أَتَى اللَّهَ بِقَلْبٍ سَلِيمٍ
నిష్కల్మషమైన మనసుతో అల్లాహ్ సన్నిధిలోకి వచ్చినవాడు మాత్రమే (ఆనాడు మోక్షం పొందుతాడు).
26:90 وَأُزْلِفَتِ الْجَنَّةُ لِلْمُتَّقِينَ
(ఆ రోజు) దైవభక్తిపరుల కోసం స్వర్గం దగ్గరకు తేబడుతుంది.
26:91 وَبُرِّزَتِ الْجَحِيمُ لِلْغَاوِينَ
నరకం మార్గభ్రష్టుల ముందు ప్రత్యక్ష పరచబడుతుంది.
26:92 وَقِيلَ لَهُمْ أَيْنَ مَا كُنتُمْ تَعْبُدُونَ
“అల్లాహ్‌ను వదలి మీరు ఎవరెవరినయితే పూజించే వారో వారేరి?
26:93 مِن دُونِ اللَّهِ هَلْ يَنصُرُونَكُمْ أَوْ يَنتَصِرُونَ
వారు మీకేదన్నా సాయం చేస్తున్నారా? పోనీ, వారు తమకు తామైనా సహాయం చేసుకోగలుగుతున్నారా?” అని వారితో అనటం జరుగుతుంది.
26:94 فَكُبْكِبُوا فِيهَا هُمْ وَالْغَاوُونَ
మరి వారూ, మార్గభ్రష్టులైన వారందరూ నరకంలో బోర్ల పడవేయబడతారు.
26:95 وَجُنُودُ إِبْلِيسَ أَجْمَعُونَ
ఇబ్లీసు సైనికులంతా కూడా (నరకం లోనికే నెట్టబడతారు).
26:96 قَالُوا وَهُمْ فِيهَا يَخْتَصِمُونَ
వారు పరస్పరం గొడవపడుతూ ఇలా అంటారు –
26:97 تَاللَّهِ إِن كُنَّا لَفِي ضَلَالٍ مُّبِينٍ
“అల్లాహ్ సాక్షి! మేము స్పష్టమైన అపమార్గానికి పాల్పడ్డాము,
26:98 إِذْ نُسَوِّيكُم بِرَبِّ الْعَالَمِينَ
మిమ్మల్ని సకల లోకాల ప్రభువైన అల్లాహ్‌కు సమానులుగా భావించినపుడు.
26:99 وَمَا أَضَلَّنَا إِلَّا الْمُجْرِمُونَ
“మమ్మల్ని పెడదారి పట్టించింది ఈ పాపాత్ములే (వేరెవరూ కాదు.)
26:100 فَمَا لَنَا مِن شَافِعِينَ
“కనుక ఇప్పుడు మా కోసం సిఫారసు చేసేవారెవరూ లేకుండా పోయారు.
26:101 وَلَا صَدِيقٍ حَمِيمٍ
“(మా బాధను అర్థం చేసుకునే) ఆప్తమిత్రుడు కూడా లేకుండా పోయాడు.
26:102 فَلَوْ أَنَّ لَنَا كَرَّةً فَنَكُونَ مِنَ الْمُؤْمِنِينَ
“ఒకవేళ మమ్మల్నే గనక మరోసారి తిరిగి పంపటం జరిగితే (నిజమైన) విశ్వాసులమవుతాము!”
26:103 إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ
నిశ్చయంగా ఈ వృత్తాంతంలో గొప్ప గుణపాఠ సూచన ఉంది. అయితే వారిలో అనేకులు విశ్వసించేవారు కారు.
26:104 وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ
నిశ్చయంగా నీ ప్రభువు మాత్రమే శక్తిశాలి, దయాశీలి.
26:105 كَذَّبَتْ قَوْمُ نُوحٍ الْمُرْسَلِينَ
నూహు జాతి వారు (కూడా) దైవ ప్రవక్తలను ధిక్కరించారు.
26:106 إِذْ قَالَ لَهُمْ أَخُوهُمْ نُوحٌ أَلَا تَتَّقُونَ
అప్పుడు వారి సోదరుడైన నూహు వారినుద్దేశించి ఇలా అన్నాడు : “ఏమిటి, మీరు అల్లాహ్‌కు భయపడరా?
26:107 إِنِّي لَكُمْ رَسُولٌ أَمِينٌ
“వినండి! నేను మీ వైపుకు పంపబడిన నమ్మకస్తుణ్ణి అయిన దైవప్రవక్తను.
26:108 فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ
“కనుక మీరు అల్లాహ్‌కు భయపడండి, నేను చెప్పినట్లు వినండి.
26:109 وَمَا أَسْأَلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ ۖ إِنْ أَجْرِيَ إِلَّا عَلَىٰ رَبِّ الْعَالَمِينَ
“దీనికిగాను నేను మీనుండి ఎలాంటి ప్రతిఫలాన్నీ అడగటం లేదు. నాకు ప్రతిఫలమిచ్చే బాధ్యత సర్వలోకాల ప్రభువుది.
26:110 فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ
“కాబట్టి మీరు అల్లాహ్‌కు భయపడండి. నాకు విధేయత చూపండి.”
26:111 قَالُوا أَنُؤْمِنُ لَكَ وَاتَّبَعَكَ الْأَرْذَلُونَ
(దానికి అతని) జాతివారు, “ఏమిటీ? మేము నిన్ను విశ్వసించాలా? చూడబోతే అధములు మాత్రమే నిన్ను అనుసరిస్తున్నారు” అని సమాధానమిచ్చారు.
26:112 قَالَ وَمَا عِلْمِي بِمَا كَانُوا يَعْمَلُونَ
(దానికి నూహ్) ఇలా అన్నాడు: “లోగడ వారేం చేసేవారో నాకేం తెలుసు?
26:113 إِنْ حِسَابُهُمْ إِلَّا عَلَىٰ رَبِّي ۖ لَوْ تَشْعُرُونَ
“మీరు గనక అర్థం చేసుకోగలిగితే, వారి లెక్క తీసుకునే బాధ్యత నా ప్రభువుది.
26:114 وَمَا أَنَا بِطَارِدِ الْمُؤْمِنِينَ
“నేను మాత్రం విశ్వాసులను గెంటివేసే వాణ్ణికాను.
26:115 إِنْ أَنَا إِلَّا نَذِيرٌ مُّبِينٌ
“నేను (ప్రజలను) స్పష్టంగా హెచ్చరించేవాణ్ణి మాత్రమే.”
26:116 قَالُوا لَئِن لَّمْ تَنتَهِ يَا نُوحُ لَتَكُونَنَّ مِنَ الْمَرْجُومِينَ
వారిలా పలికారు: “ఓ నూహు! నువ్వు గనక (ఈ పనిని) మానుకోకపోతే, నిన్ను రాళ్లతో కొట్టడం (చంపటం) ఖాయం.”
26:117 قَالَ رَبِّ إِنَّ قَوْمِي كَذَّبُونِ
అప్పుడు అతనిలా ప్రార్థించాడు: “నా ప్రభూ! నా జాతి వారు నన్ను ధిక్కరించారు.
26:118 فَافْتَحْ بَيْنِي وَبَيْنَهُمْ فَتْحًا وَنَجِّنِي وَمَن مَّعِيَ مِنَ الْمُؤْمِنِينَ
“కాబట్టి నీవు నాకూ – వారికీ మధ్య ఏదైనా అంతిమ నిర్ణయం చెయ్యి. నన్నూ, నాతో ఉన్న విశ్వాసులనూ కాపాడు.”
26:119 فَأَنجَيْنَاهُ وَمَن مَّعَهُ فِي الْفُلْكِ الْمَشْحُونِ
తుదకు మేము అతన్నీ, అతని సహచరులను నిండు నౌకలో (ఎక్కించి) కాపాడాము.
26:120 ثُمَّ أَغْرَقْنَا بَعْدُ الْبَاقِينَ
ఆ తరువాత మిగిలివున్న వారందరినీ మేము ముంచి వేశాము.
26:121 إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ
నిశ్చయంగా ఇందులో (చాలా పెద్ద) సూచన ఉంది. కాని వారిలో పెక్కుమంది విశ్వసించే రకం కాదు.
26:122 وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ
నిస్సందేహంగా నీ ప్రభువు సర్వాధిక్యుడు, దయాశీలి.
26:123 كَذَّبَتْ عَادٌ الْمُرْسَلِينَ
ఆద్ జాతి వారు (కూడా) దైవ ప్రవక్తలను ధిక్కరించారు.
26:124 إِذْ قَالَ لَهُمْ أَخُوهُمْ هُودٌ أَلَا تَتَّقُونَ
అప్పుడు వారి సోదరుడైన హూద్, (వారినుద్దేశించి) ఇలా అన్నాడు : “మీరు బొత్తిగా భయపడరా?
26:125 إِنِّي لَكُمْ رَسُولٌ أَمِينٌ
“నేను మీ వద్దకు పంపబడిన నమ్మకస్థుణ్ణి అయిన ప్రవక్తను.
26:126 فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ
“కనుక అల్లాహ్‌కు భయపడండి. నా విధానాన్ని అనుసరించండి.
26:127 وَمَا أَسْأَلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ ۖ إِنْ أَجْرِيَ إِلَّا عَلَىٰ رَبِّ الْعَالَمِينَ
“ఈ పనికిగాను నేను మీనుండి ఎలాంటి ప్రతిఫలాన్నీ అడగటం లేదు. నాకు ప్రతిఫలం ఇచ్చే బాధ్యత సర్వలోకాల ప్రభువుపై ఉంది.
26:128 أَتَبْنُونَ بِكُلِّ رِيعٍ آيَةً تَعْبَثُونَ
“ఏమిటీ, మీరు ఎత్తయిన ప్రతి స్థలంలోనూ ఏమీ ప్రయోజనం లేని ఒక స్మారక కట్టడాన్ని నిర్మిస్తారా?
26:129 وَتَتَّخِذُونَ مَصَانِعَ لَعَلَّكُمْ تَخْلُدُونَ
“మీరు ఇక్కడే శాశ్వతంగా ఉంటామన్నట్లు అపురూపమైన (పటిష్టమైన) భవనాలను నిర్మిస్తున్నారే!
26:130 وَإِذَا بَطَشْتُم بَطَشْتُمْ جَبَّارِينَ
“మీరు ఎప్పుడు, ఎవరిని పట్టుకున్నా చాలా దౌర్జన్య పూరితంగా పంజా విసురుతున్నారే!?
26:131 فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ
“కనుక, మీరు అల్లాహ్‌కు భయపడండి. నా విధానాన్ని అనుసరించండి.
26:132 وَاتَّقُوا الَّذِي أَمَدَّكُم بِمَا تَعْلَمُونَ
“మీకు తెలిసివున్న సమస్త (మంచి) వస్తువులను మీకు వొసగి, మిమ్మల్ని ఆదుకున్న వానికి భయపడండి.
26:133 أَمَدَّكُم بِأَنْعَامٍ وَبَنِينَ
“ఆయన మీకు పశువుల ద్వారా, సంతానం ద్వారా తోడ్పడ్డాడు.
26:134 وَجَنَّاتٍ وَعُيُونٍ
“తోటల ద్వారా, చెలమల ద్వారా (సహాయపడ్డాడు).
26:135 إِنِّي أَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ عَظِيمٍ
“నేను మీ విషయంలో ఒక మహా దినపు శిక్ష గురించి భయపడుతున్నాను.”
26:136 قَالُوا سَوَاءٌ عَلَيْنَا أَوَعَظْتَ أَمْ لَمْ تَكُن مِّنَ الْوَاعِظِينَ
వారిలా అన్నారు : “నువ్వు మాకు బోధించినా, బోధించే వారిలో ఒకడవు కాకపోయినా మాకు ఒకటే.
26:137 إِنْ هَٰذَا إِلَّا خُلُقُ الْأَوَّلِينَ
“ఇది పూర్వీకుల పాత అలవాటు తప్ప మరేమీ కాదు.
26:138 وَمَا نَحْنُ بِمُعَذَّبِينَ
“ఎట్టి పరిస్థితిలోనూ మేము శిక్షించబడము.”
26:139 فَكَذَّبُوهُ فَأَهْلَكْنَاهُمْ ۗ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ
ఆద్ (జాతి) వారు అతనిని (హూదును) ధిక్కరించిన కారణంగా మేము వారిని అంతమొందించాము. నిశ్చయంగా ఇందులో సూచన ఉంది. కాని వారిలో అనేకులు విశ్వాసులు కాలేదు.
26:140 وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ
మరి నిస్సందేహంగా నీ ప్రభువు అపార శక్తిసంపన్నుడు, పరమ కృపాశీలుడు.
26:141 كَذَّبَتْ ثَمُودُ الْمُرْسَلِينَ
సమూదు (జాతి) వారు కూడా దైవసందేశహరులను ధిక్కరించారు.
26:142 إِذْ قَالَ لَهُمْ أَخُوهُمْ صَالِحٌ أَلَا تَتَّقُونَ
అప్పుడు వారి సోదరుడైన సాలెహ్ వారినుద్దేశించి ఇలా అన్నాడు: “ఏమిటీ? మీరు (అల్లాహ్‌కు) భయపడరా?
26:143 إِنِّي لَكُمْ رَسُولٌ أَمِينٌ
“నేను మీ వైపునకు పంపబడిన విశ్వసనీయుడనైన ప్రవక్తను.
26:144 فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ
“అందుకే మీరు అల్లాహ్‌కు భయపడండి. నా విధానాన్ని అనుసరించండి.
26:145 وَمَا أَسْأَلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ ۖ إِنْ أَجْرِيَ إِلَّا عَلَىٰ رَبِّ الْعَالَمِينَ
“ఈ పనికిగాను నేను మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్నీ అడగటం లేదు. నాకు ప్రతిఫలం ఇచ్చే బాధ్యత సర్వలోక ప్రభువుపై ఉంది.
26:146 أَتُتْرَكُونَ فِي مَا هَاهُنَا آمِنِينَ
“ఏమిటీ, ఇక్కడున్న ఈ వస్తువుల మధ్య మీరు ప్రశాంతంగా (ఉండగలిగేలా) వదలివేయబడతారా?
26:147 فِي جَنَّاتٍ وَعُيُونٍ
“అంటే – ఈ తోటలలో, ఈ చెలమలలో…
26:148 وَزُرُوعٍ وَنَخْلٍ طَلْعُهَا هَضِيمٌ
“ఈ పొలాల్లో, సుతిమెత్తని, కోమలమైన పండ్ల గెలలు గల ఈ ఖర్జూర తోటలలో (కలకాలం ఉంటామని అనుకుంటున్నారా?)
26:149 وَتَنْحِتُونَ مِنَ الْجِبَالِ بُيُوتًا فَارِهِينَ
“మీరు పర్వతాలను చెక్కి ఆడంబరమైన ఇండ్లను తయారు చేస్తున్నారు.
26:150 فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ
“కనుక, మీరు అల్లాహ్‌కు భయపడండి. నాకు విధేయత చూపండి.
26:151 وَلَا تُطِيعُوا أَمْرَ الْمُسْرِفِينَ
“హద్దుమీరి పోయేవారికి విధేయత చూపటం మానండి-
26:152 الَّذِينَ يُفْسِدُونَ فِي الْأَرْضِ وَلَا يُصْلِحُونَ
“వారు భువిలో కల్లోలాన్ని రేకెత్తిస్తున్నారు. ఎలాంటి సంస్కరణా కార్యాలు చేయరు.”
26:153 قَالُوا إِنَّمَا أَنتَ مِنَ الْمُسَحَّرِينَ
దానికి వారు ఇచ్చిన జవాబు ఇది : “నువ్వు చేతబడికి గురయిన వానిలా ఉన్నావు.
26:154 مَا أَنتَ إِلَّا بَشَرٌ مِّثْلُنَا فَأْتِ بِآيَةٍ إِن كُنتَ مِنَ الصَّادِقِينَ
“నువ్వూ మాలాంటి ఒక మామూలు మనిషివే. ఒకవేళ నువ్వు నిజంగా సత్యవంతుడవే అయితే ఏదైనా నిదర్శనాన్ని తీసుకురా.”
26:155 قَالَ هَٰذِهِ نَاقَةٌ لَّهَا شِرْبٌ وَلَكُمْ شِرْبُ يَوْمٍ مَّعْلُومٍ
అతను ఇలా అన్నాడు : “ఇదిగో ఆడ ఒంటె! నీరు త్రాగటానికి ఒక వంతు దీనిది. ఒక నిర్ధారిత దినం మీది.
26:156 وَلَا تَمَسُّوهَا بِسُوءٍ فَيَأْخُذَكُمْ عَذَابُ يَوْمٍ عَظِيمٍ
“(జాగ్రత్త!) దీన్ని దురుద్దేశంతో తాకకండి. (ఒకవేళ మీరు అలా చేశారంటే) పర్యవసానంగా ఒక మహాదినపు విపత్తు మిమ్మల్ని చుట్టుముట్టుతుంది.”
26:157 فَعَقَرُوهَا فَأَصْبَحُوا نَادِمِينَ
అయినాసరే వాళ్లు దాని కాలి గిట్టెలను నరికేశారు. ఆ తరువాత వారు బాధపడసాగారు.
26:158 فَأَخَذَهُمُ الْعَذَابُ ۗ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ
అంతే! శిక్ష వారిని కబళించింది. నిశ్చయంగా ఇందులో గుణపాఠ సూచన ఉంది. కాని వారిలో చాలామంది విశ్వసించలేదు.
26:159 وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ
నిశ్చయంగా నీ ప్రభువు సర్వాధిక్యుడు, కరుణామయుడు.
26:160 كَذَّبَتْ قَوْمُ لُوطٍ الْمُرْسَلِينَ
లూత్ జాతివారు (కూడా) ప్రవక్తలను ధిక్కరించారు.
26:161 إِذْ قَالَ لَهُمْ أَخُوهُمْ لُوطٌ أَلَا تَتَّقُونَ
వారి సోదరుడైన లూత్ వారినుద్దేశ్యించి ఇలా అన్నాడు: “మీరు (అల్లాహ్‌కు) భయపడరా?
26:162 إِنِّي لَكُمْ رَسُولٌ أَمِينٌ
“నేను మీ వద్దకు పంపబడిన నమ్మకస్థుడనైన ప్రవక్తను.
26:163 فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ
“కనుక మీరు అల్లాహ్‌కు భయపడండి. నా విధానాన్ని అనుసరించండి.
26:164 وَمَا أَسْأَلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ ۖ إِنْ أَجْرِيَ إِلَّا عَلَىٰ رَبِّ الْعَالَمِينَ
“దీనికిగాను నేను మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్నీ అడగటం లేదు. నాకు ప్రతిఫలం ఇచ్చే బాధ్యత సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌పై ఉంది.
26:165 أَتَأْتُونَ الذُّكْرَانَ مِنَ الْعَالَمِينَ
“మీరు లోకంలో(ని) పురుషుల వద్దకు పోతున్నారేమిటీ?
26:166 وَتَذَرُونَ مَا خَلَقَ لَكُمْ رَبُّكُم مِّنْ أَزْوَاجِكُم ۚ بَلْ أَنتُمْ قَوْمٌ عَادُونَ
“అల్లాహ్ మీ కొరకు జతగా సృష్టించిన మీ భార్యలను విడిచిపెడుతున్నారే! మీరు బొత్తిగా హద్దుమీరిపోయే జనంలా ఉన్నారు.”
26:167 قَالُوا لَئِن لَّمْ تَنتَهِ يَا لُوطُ لَتَكُونَنَّ مِنَ الْمُخْرَجِينَ
దానికి వారు “ఓ లూత్! నువ్వు (నీ ధోరణిని) మానుకోకపోతే, ఇక్కణ్ణుంచి వెళ్ళగొట్టబడతావు (జాగ్రత్త!)” అని చెప్పారు.
26:168 قَالَ إِنِّي لِعَمَلِكُم مِّنَ الْقَالِينَ
“మీ చేష్టలను నేను తీవ్రంగా అసహ్యించుకుంటున్నాను” అన్నాడు లూత్.
26:169 رَبِّ نَجِّنِي وَأَهْلِي مِمَّا يَعْمَلُونَ
(తరువాత అతను ఇలా ప్రార్థించాడు): “ప్రభూ! వీళ్లు చేసే నీతిమాలిన పని (దుష్ఫలితం) నుంచి నన్నూ, నా ఇంటివారినీ కాపాడు.”
26:170 فَنَجَّيْنَاهُ وَأَهْلَهُ أَجْمَعِينَ
అందువల్ల మేము అతన్నీ, అతని సంబంధీకులందరినీ రక్షించాము.
26:171 إِلَّا عَجُوزًا فِي الْغَابِرِينَ
ఒక ముసలావిడను తప్ప! – ఆమె (మాత్రం) వెనుక ఉండిపోయేవారిలో చేరిపోయింది.
26:172 ثُمَّ دَمَّرْنَا الْآخَرِينَ
మరి మేము మిగిలిన వారందరినీ నాశనం చేశాము.
26:173 وَأَمْطَرْنَا عَلَيْهِم مَّطَرًا ۖ فَسَاءَ مَطَرُ الْمُنذَرِينَ
మేము వారిపై ఒక ప్రత్యేకమైన (రాళ్ల) వర్షం కురిపించాము. హెచ్చరించబడిన వారిపై కురిసిన ఆ వర్షం చాలా చెడ్డది.
26:174 إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ
ఈ వృత్తాంతం కూడా ఆసాంతం గుణపాఠంతో కూడుకున్నది. కాని వారిలో అధికులు విశ్వాసులు కారు.
26:175 وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ
నిశ్చయంగా నీ ప్రభువు ఆధిపత్యం కలవాడు, జాలిచూపే వాడూను.
26:176 كَذَّبَ أَصْحَابُ الْأَيْكَةِ الْمُرْسَلِينَ
‘అయికా’ జనులు కూడా దైవప్రవక్తలను ధిక్కరించారు.
26:177 إِذْ قَالَ لَهُمْ شُعَيْبٌ أَلَا تَتَّقُونَ
అప్పుడు షుఐబ్ (అలైహిస్సలాం) వాళ్ళనుద్దేశించి ఇలా ప్రబోధించాడు: “మీరు (బొత్తిగా) భయపడరా?
26:178 إِنِّي لَكُمْ رَسُولٌ أَمِينٌ
“నేను మీ వద్దకు పంపబడిన నమ్మదగ్గ ప్రవక్తను.
26:179 فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ
“కనుక మీరు అల్లాహ్‌కు భయపడండి. నాకు విధేయులై ఉండండి.
26:180 وَمَا أَسْأَلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ ۖ إِنْ أَجْرِيَ إِلَّا عَلَىٰ رَبِّ الْعَالَمِينَ
“దీనికిగాను నేను మీనుంచి ఎలాంటి ప్రతిఫలాన్నీ అడగటం లేదు. నాకు ప్రతిఫలం ఇచ్చే బాధ్యత సర్వలోక ప్రభువు అయిన అల్లాహ్‌పై ఉంది.
26:181 أَوْفُوا الْكَيْلَ وَلَا تَكُونُوا مِنَ الْمُخْسِرِينَ
“మీరు (కొలచి ఇస్తున్నప్పుడు) పూర్తిగా ఇవ్వండి. తగ్గించి ఇవ్వకండి.
26:182 وَزِنُوا بِالْقِسْطَاسِ الْمُسْتَقِيمِ
“తూచి ఇస్తే సరైన త్రాసుతో తూకం వేసి ఇవ్వండి.
26:183 وَلَا تَبْخَسُوا النَّاسَ أَشْيَاءَهُمْ وَلَا تَعْثَوْا فِي الْأَرْضِ مُفْسِدِينَ
“ప్రజలకు వారి వస్తువులను తగ్గించి ఇవ్వకండి. భువిలో విచ్చలవిడిగా కల్లోలాన్ని రేకెత్తిస్తూ తిరగకండి.
26:184 وَاتَّقُوا الَّذِي خَلَقَكُمْ وَالْجِبِلَّةَ الْأَوَّلِينَ
“మిమ్మల్నీ, మీ పూర్వీకుల్ని సృష్టించిన వానికి భయపడండి.”
26:185 قَالُوا إِنَّمَا أَنتَ مِنَ الْمُسَحَّرِينَ
దానికి వారు ఇచ్చిన సమాధానం ఇది: “అసలు నువ్వు చేతబడికి గురైన వాడివి.
26:186 وَمَا أَنتَ إِلَّا بَشَرٌ مِّثْلُنَا وَإِن نَّظُنُّكَ لَمِنَ الْكَاذِبِينَ
“నువ్వూ మాలాంటి ఒక మనిషివే. నువ్వు అబద్ధం చెప్పే వారిలో ఒకడివని మేము భావిస్తున్నాము.
26:187 فَأَسْقِطْ عَلَيْنَا كِسَفًا مِّنَ السَّمَاءِ إِن كُنتَ مِنَ الصَّادِقِينَ
“ఒకవేళ నువ్వు సత్యవంతులలో ఒకడివైతే ఆకాశం నుంచి ఏదైనా తునకను మాపై పడవెయ్యి.”
26:188 قَالَ رَبِّي أَعْلَمُ بِمَا تَعْمَلُونَ
“మీరు చేసేదంతా నా ప్రభువుకు బాగా తెలుసు” అని అతను (షుఐబ్) చెప్పాడు.
26:189 فَكَذَّبُوهُ فَأَخَذَهُمْ عَذَابُ يَوْمِ الظُّلَّةِ ۚ إِنَّهُ كَانَ عَذَابَ يَوْمٍ عَظِيمٍ
మొత్తానికి వారు అతన్ని ధిక్కరించిన కారణంగా (కారు మబ్బుతో కూడిన) ఛాయావృత దినపు విపత్తు వారిని కబళించింది. నిజంగానే అది మహాదినపు శిక్ష!
26:190 إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ
నిశ్చయంగా ఇందులో గొప్ప నిదర్శనం ఉంది. మరైతే వారిలో చాలా మంది విశ్వాసులు కారు.
26:191 وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ
నిస్సందేహంగా నీ ప్రభువు మహా శక్తిమంతుడు, పరమ కృపాశీలుడు.
26:192 وَإِنَّهُ لَتَنزِيلُ رَبِّ الْعَالَمِينَ
నిశ్చయంగా ఇది (ఈ ఖుర్ఆన్) సకల లోకాల ప్రభువు అవతరింపజేసినది.
26:193 نَزَلَ بِهِ الرُّوحُ الْأَمِينُ
విశ్వసనీయుడైన దైవదూత దీన్ని తీసుకువచ్చాడు.
26:194 عَلَىٰ قَلْبِكَ لِتَكُونَ مِنَ الْمُنذِرِينَ
(ఓ ముహమ్మద్ – సఅసం!) నువ్వు హెచ్చరించే వారిలోని వాడవు కావటానికి ఇది నీ హృదయంపై అవతరించింది.
26:195 بِلِسَانٍ عَرَبِيٍّ مُّبِينٍ
(ఇది) సుస్పష్టమైన అరబీ భాషలో ఉంది.
26:196 وَإِنَّهُ لَفِي زُبُرِ الْأَوَّلِينَ
పూర్వీకుల గ్రంథాలలో కూడా దీని (ఖుర్ఆన్) ప్రస్తావన ఉంది.
26:197 أَوَلَمْ يَكُن لَّهُمْ آيَةً أَن يَعْلَمَهُ عُلَمَاءُ بَنِي إِسْرَائِيلَ
ఈ సంగతి (ఖుర్ఆన్ వాస్తవికత) ఇస్రాయీలు సంతతికి చెందిన విద్వాంసులకు సయితం తెలిసి ఉండటం వారికొక నిదర్శనం కాదా?
26:198 وَلَوْ نَزَّلْنَاهُ عَلَىٰ بَعْضِ الْأَعْجَمِينَ
ఒకవేళ మేము దీన్ని ఏ అరబ్బేతరునిపైనో అవతరింపజేసి వుంటే,
26:199 فَقَرَأَهُ عَلَيْهِم مَّا كَانُوا بِهِ مُؤْمِنِينَ
మరి అతడు దానిని వారి ముందు చదివి వినిపించి వున్నట్లయితే, వారు దాన్ని విశ్వసించేవారు కాదు.
26:200 كَذَٰلِكَ سَلَكْنَاهُ فِي قُلُوبِ الْمُجْرِمِينَ
మేము పాపాత్ముల హృదయాలలో ఇలాగే ఈ తిరస్కార భావాన్ని జొప్పించాము.
26:201 لَا يُؤْمِنُونَ بِهِ حَتَّىٰ يَرَوُا الْعَذَابَ الْأَلِيمَ
వ్యధాభరితమైన శిక్షను చూచేవరకూ వారు దాన్ని విశ్వసించరు.
26:202 فَيَأْتِيَهُم بَغْتَةً وَهُمْ لَا يَشْعُرُونَ
మరి ఆ శిక్ష అకస్మాత్తుగా వారిపై వచ్చిపడుతుంది. దాని గురించిన ధ్యాస కూడా వారికుండదు.
26:203 فَيَقُولُوا هَلْ نَحْنُ مُنظَرُونَ
అప్పుడు వారు, “మాకేమన్నా కాస్త గడువు ఇవ్వబడుతుందా?” అంటారు.
26:204 أَفَبِعَذَابِنَا يَسْتَعْجِلُونَ
ఇంతకీ వారు మా శిక్ష కోసం ఆత్రం చేస్తున్నారా?
26:205 أَفَرَأَيْتَ إِن مَّتَّعْنَاهُمْ سِنِينَ
దీనిని గురించి నీవేమైనా ఆలోచించావా? ఒకవేళ మేము కొన్ని సంవత్సరాల పాటు వారికి లబ్దిపొందే అవకాశం కల్పించినా….
26:206 ثُمَّ جَاءَهُم مَّا كَانُوا يُوعَدُونَ
తరువాత వారికి హెచ్చరించబడే ఆ శిక్ష వచ్చిపడినప్పుడు,
26:207 مَا أَغْنَىٰ عَنْهُم مَّا كَانُوا يُمَتَّعُونَ
వారు అనుభవిస్తూ వచ్చిన సుఖసౌఖ్యాలు, సాధన సంపత్తులు వారికెలాంటి ప్రయోజనాన్నీ చేకూర్చలేవు.
26:208 وَمَا أَهْلَكْنَا مِن قَرْيَةٍ إِلَّا لَهَا مُنذِرُونَ
హెచ్చరిక చేసేవారు రాకుండా మేము ఎన్నడూ ఏ జనవాసాన్నీ అంతమొందించలేదు.
26:209 ذِكْرَىٰ وَمَا كُنَّا ظَالِمِينَ
(వారు) హితబోధ (చేసిన పిమ్మటే మేము జోక్యం చేసుకున్నాము). మేము అన్యాయం చేసేవారంకాము.
26:210 وَمَا تَنَزَّلَتْ بِهِ الشَّيَاطِينُ
దీనిని (ఈ ఖుర్ఆను గ్రంథాన్ని) షైతానులు తీసుకుని దిగలేదు.
26:211 وَمَا يَنبَغِي لَهُمْ وَمَا يَسْتَطِيعُونَ
దానికి వారు యోగ్యులూ కారు, దాన్ని తెచ్చే స్థోమత కూడా వారికి లేదు.
26:212 إِنَّهُمْ عَنِ السَّمْعِ لَمَعْزُولُونَ
పైగా వారు దానిని (కనీసం) వినకుండా – దూరం – చేయబడ్డారు.
26:213 فَلَا تَدْعُ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ فَتَكُونَ مِنَ الْمُعَذَّبِينَ
కనుక (ఓ ప్రవక్తా!) నువ్వు అల్లాహ్‌తోపాటు మరే ఇతర దైవాన్నీ మొరపెట్టుకోకు. నువ్వుగాని అలా చేశావంటే శిక్షించబడేవారిలో చేరిపోతావు సుమా!
26:214 وَأَنذِرْ عَشِيرَتَكَ الْأَقْرَبِينَ
నీ సమీప బంధువులను హెచ్చరించు.
26:215 وَاخْفِضْ جَنَاحَكَ لِمَنِ اتَّبَعَكَ مِنَ الْمُؤْمِنِينَ
విశ్వసించి, నిన్ను అనుసరించేవారి పట్ల మృదువుగా మసలుకో.
26:216 فَإِنْ عَصَوْكَ فَقُلْ إِنِّي بَرِيءٌ مِّمَّا تَعْمَلُونَ
ఒకవేళ వారు గనక నీకు అవిధేయత చూపితే, “మీ పోకడలతో నాకు ఎటువంటి సంబంధం లేదు” అని చెప్పు.
26:217 وَتَوَكَّلْ عَلَى الْعَزِيزِ الرَّحِيمِ
సర్వాధిక్యుడు, కరుణామయుడు అయిన అల్లాహ్‌నే నమ్ముకో.
26:218 الَّذِي يَرَاكَ حِينَ تَقُومُ
నువ్వు (ఒంటరిగా ఆరాధనలో) నిలబడి ఉన్నప్పుడు ఆయన నిన్ను చూస్తూ ఉంటాడు.
26:219 وَتَقَلُّبَكَ فِي السَّاجِدِينَ
సాష్టాంగపడేవారి మధ్య (కూడా) నీ కదలికలను (కనిపెట్టుకుని ఉంటాడు).
26:220 إِنَّهُ هُوَ السَّمِيعُ الْعَلِيمُ
నిశ్చయంగా ఆయన అన్నీ వినేవాడు, అంతా తెలిసినవాడు.
26:221 هَلْ أُنَبِّئُكُمْ عَلَىٰ مَن تَنَزَّلُ الشَّيَاطِينُ
(ప్రజలారా!) షైతానులు ఎవడిపైన దిగుతారో నేను మీకు తెలుపనా?
26:222 تَنَزَّلُ عَلَىٰ كُلِّ أَفَّاكٍ أَثِيمٍ
అబద్ధాలకోరు, పాపాత్ముడు అయిన ప్రతి ఒక్కరిపై వారు దిగుతారు.
26:223 يُلْقُونَ السَّمْعَ وَأَكْثَرُهُمْ كَاذِبُونَ
వినీవినని కొన్ని మాటల్ని చెవుల్లో వేస్తారు. వారిలో అనేకులు అబద్ధాలు చెప్పేవారే.
26:224 وَالشُّعَرَاءُ يَتَّبِعُهُمُ الْغَاوُونَ
ఇకపోతే కవులు – దారి తప్పినవారే వారి వెనుక నడుస్తారు.
26:225 أَلَمْ تَرَ أَنَّهُمْ فِي كُلِّ وَادٍ يَهِيمُونَ
ఏమిటీ, వారు ప్రతి లోయలోనూ ఎలా తచ్చాడుతూ తిరుగుతున్నారో నీవు చూడలేదా?
26:226 وَأَنَّهُمْ يَقُولُونَ مَا لَا يَفْعَلُونَ
చెయ్యని దాన్ని గురించి (తమ కవనంలో) ఎలా గొప్పలు చెబుతున్నారో (నీవు గమనించలేదా?)
26:227 إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَذَكَرُوا اللَّهَ كَثِيرًا وَانتَصَرُوا مِن بَعْدِ مَا ظُلِمُوا ۗ وَسَيَعْلَمُ الَّذِينَ ظَلَمُوا أَيَّ مُنقَلَبٍ يَنقَلِبُونَ
అయితే విశ్వసించి, మంచి పనులు చేసేవారు, అత్యధికంగా అల్లాహ్‌ను స్మరించేవారు, తమకు అన్యాయం జరిగినప్పుడు కేవలం ప్రతిగా చర్య తీసుకునేవారు అలాంటి వారు కారు. ఇక అన్యాయానికి ఒడిగట్టేవారు తమకు ఏ గతి పడుతుందో శీఘ్రంగానే తెలుసుకుంటారు.
27. సూరా అన్ నమ్ల్ (An-Naml)
27:1 طس ۚ تِلْكَ آيَاتُ الْقُرْآنِ وَكِتَابٍ مُّبِينٍ
తా – సీన్. ఇవి ఖుర్ఆన్ ఆయతులు- స్పష్టమైన గ్రంథానికి చెందినవి.
27:2 هُدًى وَبُشْرَىٰ لِلْمُؤْمِنِينَ
విశ్వసించిన వారికి మార్గదర్శకం, శుభవార్త.
27:3 الَّذِينَ يُقِيمُونَ الصَّلَاةَ وَيُؤْتُونَ الزَّكَاةَ وَهُم بِالْآخِرَةِ هُمْ يُوقِنُونَ
వారు (విశ్వాసులు) నమాజును నెలకొల్పుతారు, జకాతును ఇస్తారు, పరలోకాన్ని నమ్ముతారు.
27:4 إِنَّ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ زَيَّنَّا لَهُمْ أَعْمَالَهُمْ فَهُمْ يَعْمَهُونَ
ఎవరయితే పరలోకాన్ని విశ్వసించరో వారికి మేము, వారి పనులు ఎంతో అందమైనవిగా అనిపించేటట్లు చేశాము. అందుచేత వారు దారితప్పి తిరుగుతుంటారు.
27:5 أُولَٰئِكَ الَّذِينَ لَهُمْ سُوءُ الْعَذَابِ وَهُمْ فِي الْآخِرَةِ هُمُ الْأَخْسَرُونَ
చెడ్డ శిక్షను పొందేవారు వీరే. పరలోకంలో కూడా వారు తీవ్రమైన నష్టాన్ని పొందుతారు.
27:6 وَإِنَّكَ لَتُلَقَّى الْقُرْآنَ مِن لَّدُنْ حَكِيمٍ عَلِيمٍ
(ఓ ప్రవక్తా!) వివేచనాపరుడు, జ్ఞాన సంపన్నుడైన అల్లాహ్ తరఫు నుంచి నీకు ఖుర్ఆన్ బోధించబడుతున్నది.
27:7 إِذْ قَالَ مُوسَىٰ لِأَهْلِهِ إِنِّي آنَسْتُ نَارًا سَآتِيكُم مِّنْهَا بِخَبَرٍ أَوْ آتِيكُم بِشِهَابٍ قَبَسٍ لَّعَلَّكُمْ تَصْطَلُونَ
మూసా తన ఇంటివారితో, “నేను అగ్నిని చూశాను. నేను అక్కణ్ణుంచి ఏదైనా సమాచారంగానీ లేదా మీరు (చలి) కాచుకోవటానికి నిప్పు కొరివినిగానీ తెస్తాను” అని చెప్పినప్పటి విషయం (జ్ఞాపకమేనా?!)
27:8 فَلَمَّا جَاءَهَا نُودِيَ أَن بُورِكَ مَن فِي النَّارِ وَمَنْ حَوْلَهَا وَسُبْحَانَ اللَّهِ رَبِّ الْعَالَمِينَ
తీరా అతను అక్కడకు చేరుకోగానే పిలుపు (విన)వచ్చింది: “ఈ అగ్నిలో ఉన్నవాడు, శుభవంతుడు, దాని చుట్టు ప్రక్కల ఉన్న వారికి శుభము వొసగబడింది. సర్వలోకాల పోషకుడైన అల్లాహ్ పవిత్రుడు.
27:9 يَا مُوسَىٰ إِنَّهُ أَنَا اللَّهُ الْعَزِيزُ الْحَكِيمُ
“ఓ మూసా! విను! సర్వశక్తుణ్ణి, వివేకవంతుణ్ణి అయిన అల్లాహ్‌ను నేనే.
27:10 وَأَلْقِ عَصَاكَ ۚ فَلَمَّا رَآهَا تَهْتَزُّ كَأَنَّهَا جَانٌّ وَلَّىٰ مُدْبِرًا وَلَمْ يُعَقِّبْ ۚ يَا مُوسَىٰ لَا تَخَفْ إِنِّي لَا يَخَافُ لَدَيَّ الْمُرْسَلُونَ
“నీ చేతి కర్రను పడవెయ్యి.” ఆ తరువాత అదొక పాము మాదిరిగా ప్రాకుతూ ఉండటం చూచి మూసా వెన్ను చూపి పారిపోయాడు. వెనక్కి తిరిగి చూడనయినా లేదు. “ఓ మూసా! భయపడకు. నా ముందర ప్రవక్తలు భీతి చెందరు.
27:11 إِلَّا مَن ظَلَمَ ثُمَّ بَدَّلَ حُسْنًا بَعْدَ سُوءٍ فَإِنِّي غَفُورٌ رَّحِيمٌ
“కాని తప్పు చేసిన వారు (మాత్రం భయపడతారు.) మరి ఆ తరువాత ఆ దుష్కార్యానికి బదులుగా సత్కార్యం చేస్తే నేను క్షమించేవాడను, కనికరించేవాడను.
27:12 وَأَدْخِلْ يَدَكَ فِي جَيْبِكَ تَخْرُجْ بَيْضَاءَ مِنْ غَيْرِ سُوءٍ ۖ فِي تِسْعِ آيَاتٍ إِلَىٰ فِرْعَوْنَ وَقَوْمِهِ ۚ إِنَّهُمْ كَانُوا قَوْمًا فَاسِقِينَ
“నీ చేతిని నీ చొక్కా లోపల పెట్టుకో- అది ఎలాంటి లోపం లేకుండా ప్రకాశిస్తూ బయటికి వస్తుంది. నువ్వు తొమ్మిది నిదర్శనాలను తీసుకుని ఫిర్ఔన్ మరియు అతని జాతి వారి వద్దకు వెళ్ళు. నిశ్చయంగా వారు పరమ అవిధేయులు.”
27:13 فَلَمَّا جَاءَتْهُمْ آيَاتُنَا مُبْصِرَةً قَالُوا هَٰذَا سِحْرٌ مُّبِينٌ
మరి కళ్లు తెరిపించే మా సూచనలు వారి వద్దకు చేరిన తరువాత కూడా “ఇది స్పష్టమైన ఇంద్రజాలం” అని వారు తేలిగ్గా కొట్టేశారు.
27:14 وَجَحَدُوا بِهَا وَاسْتَيْقَنَتْهَا أَنفُسُهُمْ ظُلْمًا وَعُلُوًّا ۚ فَانظُرْ كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُفْسِدِينَ
నిజానికి వారి మనసులు (సత్యాన్ని) నమ్మినప్పటికీ అన్యాయం, అహంకారంతో వారు దాన్ని త్రోసిపుచ్చారు. కాబట్టి ఆ కల్లోల జనకులకు ఏ గతి పట్టిందో చూడు!
27:15 وَلَقَدْ آتَيْنَا دَاوُودَ وَسُلَيْمَانَ عِلْمًا ۖ وَقَالَا الْحَمْدُ لِلَّهِ الَّذِي فَضَّلَنَا عَلَىٰ كَثِيرٍ مِّنْ عِبَادِهِ الْمُؤْمِنِينَ
నిశ్చయంగా మేము దావూదు, సులైమానులకు జ్ఞానాన్ని వొసగాము. “విశ్వాసులైన తన దాసులెందరిపైనో మాకు ప్రాధాన్యతను వొసగిన అల్లాహ్‌కు సర్వస్తోత్రాలు” అని వారిద్దరూ పలికారు.
27:16 وَوَرِثَ سُلَيْمَانُ دَاوُودَ ۖ وَقَالَ يَا أَيُّهَا النَّاسُ عُلِّمْنَا مَنطِقَ الطَّيْرِ وَأُوتِينَا مِن كُلِّ شَيْءٍ ۖ إِنَّ هَٰذَا لَهُوَ الْفَضْلُ الْمُبِينُ
సులైమాను దావూదుకు వారసుడయ్యాడు. అతను ఇలా అన్నాడు : “ఓ ప్రజలారా! మాకు పక్షుల భాష నేర్పబడింది. ఇంకా మాకు ప్రతిదీ ప్రసాదించబడింది. ముమ్మాటికీ ఇది స్పష్టమైన దైవానుగ్రహమే.”
27:17 وَحُشِرَ لِسُلَيْمَانَ جُنُودُهُ مِنَ الْجِنِّ وَالْإِنسِ وَالطَّيْرِ فَهُمْ يُوزَعُونَ
సులైమాను ఎదుట అతని జిన్నాతుల దళం, మనుషుల సైన్యం, పక్షుల గుంపు సమీకరించబడింది. అవన్నీ (వేర్వేరుగా) వివిధ జట్లుగా మోహరించబడ్డాయి.
27:18 حَتَّىٰ إِذَا أَتَوْا عَلَىٰ وَادِ النَّمْلِ قَالَتْ نَمْلَةٌ يَا أَيُّهَا النَّمْلُ ادْخُلُوا مَسَاكِنَكُمْ لَا يَحْطِمَنَّكُمْ سُلَيْمَانُ وَجُنُودُهُ وَهُمْ لَا يَشْعُرُونَ
చివరకు వారంతా ఒక చీమల లోయకు చేరుకున్నప్పుడు ఒక చీమ ఇలా ప్రకటించింది: “ఓ చీమల్లారా! సులైమాను, అతని సైన్యాలు తెలీకుండా మిమ్మల్ని నలిపివేసే స్థితి ఏర్పడకుండా ఉండేందుకు, మీరు మీ మీ పుట్టలలోనికి దూరిపోండి.”
27:19 فَتَبَسَّمَ ضَاحِكًا مِّن قَوْلِهَا وَقَالَ رَبِّ أَوْزِعْنِي أَنْ أَشْكُرَ نِعْمَتَكَ الَّتِي أَنْعَمْتَ عَلَيَّ وَعَلَىٰ وَالِدَيَّ وَأَنْ أَعْمَلَ صَالِحًا تَرْضَاهُ وَأَدْخِلْنِي بِرَحْمَتِكَ فِي عِبَادِكَ الصَّالِحِينَ
దాని మాటపై సులైమాను చిరునవ్వును చిందించాడు. అతనిలా ప్రార్థించసాగాడు : “నా ప్రభూ! నువ్వు నాకూ, నా తల్లి దండ్రులకూ ప్రసాదించిన అనుగ్రహాలకుగాను నిత్యం నీకు కృతజ్ఞతలు తెలుపుకునే సద్బుద్ధిని నాకు ఇవ్వు. నేను, నీ మెప్పును పొందే మంచిపనులు చేసేలా చూడు. నీ దయతో నన్ను నీ సజ్జన దాసులలో చేర్చుకో.”
27:20 وَتَفَقَّدَ الطَّيْرَ فَقَالَ مَا لِيَ لَا أَرَى الْهُدْهُدَ أَمْ كَانَ مِنَ الْغَائِبِينَ
అతను పక్షులను తనిఖీ చేసి, “హుద్ హుద్ పక్షి (వడ్రంగి పిట్ట!) నాకు కనిపించటంలేదేమిటి? అది నిజంగానే హాజరు కాలేదా?” అని అన్నాడు.
27:21 لَأُعَذِّبَنَّهُ عَذَابًا شَدِيدًا أَوْ لَأَذْبَحَنَّهُ أَوْ لَيَأْتِيَنِّي بِسُلْطَانٍ مُّبِينٍ
“నేను దానిని కఠినంగా శిక్షిస్తాను లేదా దాన్ని కోసివేస్తాను లేదా అది నాకు సరైన సంజాయిషీ అన్నా ఇవ్వాలి” (అని చెప్పాడు).
27:22 فَمَكَثَ غَيْرَ بَعِيدٍ فَقَالَ أَحَطتُ بِمَا لَمْ تُحِطْ بِهِ وَجِئْتُكَ مِن سَبَإٍ بِنَبَإٍ يَقِينٍ
కొద్ది సేపట్లోనే అది వచ్చి ఇలా విన్న వించుకోసాగింది : “మీకు తెలియని ఒక సమాచారాన్ని నేను సేకరించాను. నేను ‘సబా’ (జాతి)కి చెందిన ఒక నిజవార్తను మోసుకువచ్చాను.
27:23 إِنِّي وَجَدتُّ امْرَأَةً تَمْلِكُهُمْ وَأُوتِيَتْ مِن كُلِّ شَيْءٍ وَلَهَا عَرْشٌ عَظِيمٌ
“(ఆ జాతి) వారిని ఒక స్త్రీ పరిపాలిస్తుండటం నేను కనుగొన్నాను. ఆమెకు అన్ని వస్తువులలో నుంచి (అంతో ఇంతో) ప్రసాదించబడింది. ఆమె సింహాసనం కూడా వైభవోపేతమైనదే.
27:24 وَجَدتُّهَا وَقَوْمَهَا يَسْجُدُونَ لِلشَّمْسِ مِن دُونِ اللَّهِ وَزَيَّنَ لَهُمُ الشَّيْطَانُ أَعْمَالَهُمْ فَصَدَّهُمْ عَنِ السَّبِيلِ فَهُمْ لَا يَهْتَدُونَ
“అయితే ఆమె, ఆమె ప్రజలు కూడా అల్లాహ్‌ను వదలి సూర్యునికి ప్రణమిల్లటం నేను గమనించాను. షైతాను వారి కర్మలను వారికి మంచివిగా కనిపించేటట్లు చేసి, వాళ్లను సన్మార్గం పొందకుండా అడ్డుకున్నాడు. అందువల్ల వారు సన్మార్గ భాగ్యం పొందలేకపోతున్నారు.”
27:25 أَلَّا يَسْجُدُوا لِلَّهِ الَّذِي يُخْرِجُ الْخَبْءَ فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ وَيَعْلَمُ مَا تُخْفُونَ وَمَا تُعْلِنُونَ
ఆకాశాలలోనూ, భూమిలోను నిక్షిప్తమై ఉన్న వస్తువులను వెలికితీసేవాడు, మీరు గోప్యంగా ఉంచే, బహిర్గతం చేసే విషయాలన్నీ తెలిసినవాడైన అల్లాహ్‌కు వారు సాష్టాంగపడాల్సింది (కాని వారలా చేయటం లేదు).
27:26 اللَّهُ لَا إِلَٰهَ إِلَّا هُوَ رَبُّ الْعَرْشِ الْعَظِيمِ ۩
అల్లాహ్-ఆయన తప్ప వేరొక ఆరాధ్య దైవం లేడు. ఆయనే మహోన్నతమైన సింహాసనానికి అధిపతి.
27:27 قَالَ سَنَنظُرُ أَصَدَقْتَ أَمْ كُنتَ مِنَ الْكَاذِبِينَ
సులైమాను ఇలా అన్నాడు: “సరే, నువ్వు నిజం చెబుతున్నావో లేక అబద్ధం చెబుతున్నావో మేము చూస్తాము.
27:28 اذْهَب بِّكِتَابِي هَٰذَا فَأَلْقِهْ إِلَيْهِمْ ثُمَّ تَوَلَّ عَنْهُمْ فَانظُرْ مَاذَا يَرْجِعُونَ
“నా ఈ ఉత్తరాన్ని తీసుకుపోయి వారివద్ద పడవెయ్యి. వారి దగ్గరి నుంచి తొలగిపోయి, వారేవిధంగా స్పందిస్తారో చూడు.”
27:29 قَالَتْ يَا أَيُّهَا الْمَلَأُ إِنِّي أُلْقِيَ إِلَيَّ كِتَابٌ كَرِيمٌ
ఆమె (రాణి) ఇలా చెప్పింది : “సభాసదులారా! నా వద్ద గౌరవప్రదమైన ఒక ఉత్తరం వెయ్యబడింది.
27:30 إِنَّهُ مِن سُلَيْمَانَ وَإِنَّهُ بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ
“ఇది సులైమాను దగ్గరి నుంచి వచ్చింది. – ఇది అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం” (అయింది అంటూ చదువసాగింది).
27:31 أَلَّا تَعْلُوا عَلَيَّ وَأْتُونِي مُسْلِمِينَ
“మీరు నాకు వ్యతిరేకంగా ఏమాత్రం తలబిరుసుతనం చూపకుండా, విధేయులై (ముస్లింలై) నా దగ్గరకు వచ్చేయండి (అని ఇందులో లిఖించబడివుంది).”
27:32 قَالَتْ يَا أَيُّهَا الْمَلَأُ أَفْتُونِي فِي أَمْرِي مَا كُنتُ قَاطِعَةً أَمْرًا حَتَّىٰ تَشْهَدُونِ
“ఓ ప్రముఖులారా! ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి. ఏ విషయాన్నయినా మీ దృష్టికి తేకుండా, (మిమ్మల్ని సంప్రతించకుండా) నేను ఏ నిర్ణయమూ తీసుకోను కదా!” అని రాణి చెప్పింది.
27:33 قَالُوا نَحْنُ أُولُو قُوَّةٍ وَأُولُو بَأْسٍ شَدِيدٍ وَالْأَمْرُ إِلَيْكِ فَانظُرِي مَاذَا تَأْمُرِينَ
దానికి వారంతా, “(అమ్మా!) మనం బలవంతులం. గొప్ప పోరాటపటిమగల వారం. ఇకమీదట ఏం చేయాలన్నది మీపైనే ఆధారపడి ఉంది. మాకే ఆదేశం ఇవ్వాలో స్వయంగా మీరే ఆలోచించుకోండి” అన్నారు.
27:34 قَالَتْ إِنَّ الْمُلُوكَ إِذَا دَخَلُوا قَرْيَةً أَفْسَدُوهَا وَجَعَلُوا أَعِزَّةَ أَهْلِهَا أَذِلَّةً ۖ وَكَذَٰلِكَ يَفْعَلُونَ
ఆమె (రాణి)గారు ఇలా అభిప్రాయపడ్డారు : “సాధారణంగా రాజులు ఏ నగరంలో జొరబడినా దాన్ని ధ్వంసం చేస్తారు. అక్కడి మర్యాదస్తులను అవమానాలపాలు చేస్తారు. (బహుశా) వీళ్లూ అదే చేయవచ్చు.
27:35 وَإِنِّي مُرْسِلَةٌ إِلَيْهِم بِهَدِيَّةٍ فَنَاظِرَةٌ بِمَ يَرْجِعُ الْمُرْسَلُونَ
“నేను వాళ్ళకు ఒక కానుక పంపిస్తాను. ఆ తరువాత దౌత్యకారులు ఏం జవాబు తీసుకువస్తారో చూస్తాను.”
27:36 فَلَمَّا جَاءَ سُلَيْمَانَ قَالَ أَتُمِدُّونَنِ بِمَالٍ فَمَا آتَانِيَ اللَّهُ خَيْرٌ مِّمَّا آتَاكُم بَلْ أَنتُم بِهَدِيَّتِكُمْ تَفْرَحُونَ
(రాణిగారి) దూత సులైమాను వద్దకు చేరుకున్నప్పుడు, “ఏమిటీ, మీరు నాకు ధనరూపేణా సహాయం చేయాలనుకుంటున్నారా? నా ప్రభువు నాకు, మీకిచ్చిన దానికన్నా మేలైనది ప్రసాదించాడు. కాబట్టి మీ కానుకతో మీరే సంతోషపడండి” అని సులైమాను అన్నాడు.
27:37 ارْجِعْ إِلَيْهِمْ فَلَنَأْتِيَنَّهُم بِجُنُودٍ لَّا قِبَلَ لَهُم بِهَا وَلَنُخْرِجَنَّهُم مِّنْهَا أَذِلَّةً وَهُمْ صَاغِرُونَ
“నువ్వు వారి వద్దకే తిరిగి వెళ్ళు. మేము వారిపైకి వారు నిలువరించలేని సైన్యాలను తీసుకువస్తాము. వారిని పరాభవం పాల్జేసి అక్కణ్ణుంచి వెళ్ళగొడతాము. తుదకు వారు కడు నిస్సహాయులుగా ఉండిపోతారు” (అని చెప్పాడు).
27:38 قَالَ يَا أَيُّهَا الْمَلَأُ أَيُّكُمْ يَأْتِينِي بِعَرْشِهَا قَبْلَ أَن يَأْتُونِي مُسْلِمِينَ
“ఓ ప్రముఖులారా! వారు విధేయులై ఇక్కడకు చేరుకొనక ముందే, ఆమె సింహాసనాన్ని నా దగ్గరకు తేగలవారు మీలో ఎవరయినా ఉన్నారా?” అని అతను అడిగాడు.
27:39 قَالَ عِفْرِيتٌ مِّنَ الْجِنِّ أَنَا آتِيكَ بِهِ قَبْلَ أَن تَقُومَ مِن مَّقَامِكَ ۖ وَإِنِّي عَلَيْهِ لَقَوِيٌّ أَمِينٌ
జిన్నులలో బలిష్టుడైన ఒకతను, “మీరు మీ స్థానం నుంచి లేచే లోపలే నేను దానిని మీ ముందు సమర్పిస్తాను. అంతటి శక్తి నాకుంది. నేను విశ్వసనీయుణ్ణి కూడాను” అని చెప్పాడు.
27:40 قَالَ الَّذِي عِندَهُ عِلْمٌ مِّنَ الْكِتَابِ أَنَا آتِيكَ بِهِ قَبْلَ أَن يَرْتَدَّ إِلَيْكَ طَرْفُكَ ۚ فَلَمَّا رَآهُ مُسْتَقِرًّا عِندَهُ قَالَ هَٰذَا مِن فَضْلِ رَبِّي لِيَبْلُوَنِي أَأَشْكُرُ أَمْ أَكْفُرُ ۖ وَمَن شَكَرَ فَإِنَّمَا يَشْكُرُ لِنَفْسِهِ ۖ وَمَن كَفَرَ فَإِنَّ رَبِّي غَنِيٌّ كَرِيمٌ
(అప్పుడు వారిలో) గ్రంథజ్ఞానం గల ఒకతను, “మీరు కళ్లుమూసి తెరిచే లోగానే నేను దాన్ని మీ ముందు తెచ్చిపెట్టగలను” అన్నాడు. తన కళ్ళముందర ఆ సింహాసనం ఉండటం చూసి సులైమాను, “ఇది నా ప్రభువు అనుగ్రహం. నేను కృతజ్ఞుణ్ణి అవుతానో లేక (ప్రభువు) చేసిన మేలును మరచిపోతానో పరీక్షించటానికే (ఆయన ఇదంతా చేశాడు). ఎవడైనా కృతజ్ఞతా పూర్వకంగా వ్యవహరిస్తే అతని కృతజ్ఞతాభావం అతనికే ప్రయోజనకరం అవుతుంది. మరెవరయినా మేలును మరచి ప్రవర్తిస్తే నా ప్రభువు లక్ష్యపెట్టనివాడు, గొప్ప ఉదాత్తుడు” అని పలికాడు.
27:41 قَالَ نَكِّرُوا لَهَا عَرْشَهَا نَنظُرْ أَتَهْتَدِي أَمْ تَكُونُ مِنَ الَّذِينَ لَا يَهْتَدُونَ
“ఆ సింహాసనం రూపురేఖలను (స్వల్పంగా) మార్చేయండి. ఆమె తన సింహాసనాన్ని గుర్తించే విషయంలో మార్గం పొందుతుందో లేక మార్గం తప్పిన వారిలో చేరుతుందో చూద్దాం” అని సులైమాను ఆదేశించాడు.
27:42 فَلَمَّا جَاءَتْ قِيلَ أَهَٰكَذَا عَرْشُكِ ۖ قَالَتْ كَأَنَّهُ هُوَ ۚ وَأُوتِينَا الْعِلْمَ مِن قَبْلِهَا وَكُنَّا مُسْلِمِينَ
ఆమె రాగానే, “నీ సింహాసనం కూడా ఇలాంటిదేనా?!” అని అనబడింది. దానికామె, “ఇది అచ్చం అలాగే ఉంది. మాకు ముందుగానే (విషయం) తెలిసి వచ్చింది. మేము అప్పుడే విధేయులం (ముస్లింలం) అయ్యాము” అని సమాధానమిచ్చింది.
27:43 وَصَدَّهَا مَا كَانَت تَّعْبُدُ مِن دُونِ اللَّهِ ۖ إِنَّهَا كَانَتْ مِن قَوْمٍ كَافِرِينَ
అల్లాహ్‌ను వదలి ఆమె ఎవరెవరినయితే పూజించేదో వారు ఆమెను (సన్మార్గం నుంచి) ఆపి ఉంచేవారు. నిశ్చయంగా (లోగడ) ఆమె అవిశ్వాస జనులకు చెందినది.
27:44 قِيلَ لَهَا ادْخُلِي الصَّرْحَ ۖ فَلَمَّا رَأَتْهُ حَسِبَتْهُ لُجَّةً وَكَشَفَتْ عَن سَاقَيْهَا ۚ قَالَ إِنَّهُ صَرْحٌ مُّمَرَّدٌ مِّن قَوَارِيرَ ۗ قَالَتْ رَبِّ إِنِّي ظَلَمْتُ نَفْسِي وَأَسْلَمْتُ مَعَ سُلَيْمَانَ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
“మేడలోనికి పదండి” అని ఆమెతో అనబడింది. దాన్ని చూడగానే, ‘ ఇది నీటి కొలను కాబోలు’ అని అనుకుని ఆమె తన పిక్కలపైని వస్త్రాన్ని ఎత్తిపట్టుకుంది. అప్పుడతను, “ఇది గాజుతో చేయబడిన నున్నని నిర్మాణం మాత్రమే” అన్నాడు. “ప్రభూ! నేను (ఇప్పటివరకూ) నా ఆత్మకు అన్యాయం చేసుకున్నాను. ఇప్పుడు నేను సులైమానుతో పాటు సర్వలోక ప్రభువు అయిన అల్లాహ్‌కు విధేయత చూపుతున్నాను” అని ఆమె ప్రకటించింది.
27:45 وَلَقَدْ أَرْسَلْنَا إِلَىٰ ثَمُودَ أَخَاهُمْ صَالِحًا أَنِ اعْبُدُوا اللَّهَ فَإِذَا هُمْ فَرِيقَانِ يَخْتَصِمُونَ
మేము సమూద్ జాతి వారి వైపు వారి సోదరుడైన సాలెహ్‌ను “మీరంతా అల్లాహ్‌ను ఆరాధించండి” అని సందేశం ఇచ్చి పంపాము. కాని వారు మాత్రం రెండు వర్గాలుగా చీలిపోయి పరస్పరం పోట్లాడుకోసాగారు.
27:46 قَالَ يَا قَوْمِ لِمَ تَسْتَعْجِلُونَ بِالسَّيِّئَةِ قَبْلَ الْحَسَنَةِ ۖ لَوْلَا تَسْتَغْفِرُونَ اللَّهَ لَعَلَّكُمْ تُرْحَمُونَ
అతను (సాలెహ్) ఇలా అన్నాడు : “ఓ నా జాతివారలారా! మీరు మంచి పనికి ముందు చెడుకోసం ఎందుకింత ఆత్రం చేస్తున్నారు? మీరు క్షమాపణ కొరకు అల్లాహ్‌ను ఎందుకు వేడుకోరు? తద్వారా మీరు కరుణించబడవచ్చు కదా!”
27:47 قَالُوا اطَّيَّرْنَا بِكَ وَبِمَن مَّعَكَ ۚ قَالَ طَائِرُكُمْ عِندَ اللَّهِ ۖ بَلْ أَنتُمْ قَوْمٌ تُفْتَنُونَ
దానికి వారు, “నీ మూలంగా, నీ వెంటవున్న వారి మూలంగానే మాకు ఈ దరిద్రం పట్టుకుందని మేము భావిస్తున్నాము” అన్నారు. “మీ దరిద్రం ఏదో అల్లాహ్ వద్దనే ఉంది. నిజానికి మీరు పరీక్షించబడుతున్నారు” అని సాలెహ్ చెప్పాడు.
27:48 وَكَانَ فِي الْمَدِينَةِ تِسْعَةُ رَهْطٍ يُفْسِدُونَ فِي الْأَرْضِ وَلَا يُصْلِحُونَ
ఆ నగరంలో తొమ్మిది మందితో కూడిన (దుష్ట) మూక ఒకటి ఉండేది. వారు భువిలో అరాచకాన్ని సృష్టించేవారు. సంస్కరణ కోసం ఏమాత్రం ప్రయత్నించేవారు కారు.
27:49 قَالُوا تَقَاسَمُوا بِاللَّهِ لَنُبَيِّتَنَّهُ وَأَهْلَهُ ثُمَّ لَنَقُولَنَّ لِوَلِيِّهِ مَا شَهِدْنَا مَهْلِكَ أَهْلِهِ وَإِنَّا لَصَادِقُونَ
వారిలా కూడబలుక్కున్నారు : “రాత్రికి రాత్రే సాలెహ్పై, అతని ఇంటివారిపై దాడి జరుపుదాం. అతని ఇంటివారు హతమార్చబడినప్పుడు మేమక్కడ లేమని, మేము చెప్పేది సత్యమని అతని వారసులతో చెబుదాము. ఈ మేరకు అల్లాహ్‌పై ప్రమాణం చేసి మరీ శపథం చేయండి.”
27:50 وَمَكَرُوا مَكْرًا وَمَكَرْنَا مَكْرًا وَهُمْ لَا يَشْعُرُونَ
ఈ విధంగా వారు (రహస్యంగా) కుట్ర పన్నారు. మరి మేము కూడా మా వ్యూహాన్ని రచించాము. కాని దాని గురించి వారికి తెలీదు.
27:51 فَانظُرْ كَيْفَ كَانَ عَاقِبَةُ مَكْرِهِمْ أَنَّا دَمَّرْنَاهُمْ وَقَوْمَهُمْ أَجْمَعِينَ
మరి వారి కుట్ర ఎలా పరిణమించిందో చూడండి! మేము వారినీ, వారి జాతి జనులందరినీ మట్టుపెట్టాము.
27:52 فَتِلْكَ بُيُوتُهُمْ خَاوِيَةً بِمَا ظَلَمُوا ۗ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً لِّقَوْمٍ يَعْلَمُونَ
అవిగో, అవే వారి ఇండ్లు! వారి దౌర్జన్యం మూలంగా పాడుబడి ఉన్నాయి. జ్ఞానమున్న వారి కోసం ఇందులో గొప్ప సూచన ఉంది.
27:53 وَأَنجَيْنَا الَّذِينَ آمَنُوا وَكَانُوا يَتَّقُونَ
అయితే విశ్వసించి, భయభక్తులతో మెలిగే వారిని మేము కాపాడాము.
27:54 وَلُوطًا إِذْ قَالَ لِقَوْمِهِ أَتَأْتُونَ الْفَاحِشَةَ وَأَنتُمْ تُبْصِرُونَ
ఇంకా లూతు (ను పంపినప్పటి సంగతిని జ్ఞాపకం తెచ్చుకో) – అతను తన జాతివారితో, “మీరు అంతా తెలిసి కూడా సిగ్గుమాలిన పని చేస్తున్నారే?! అని చెప్పాడు.
27:55 أَئِنَّكُمْ لَتَأْتُونَ الرِّجَالَ شَهْوَةً مِّن دُونِ النِّسَاءِ ۚ بَلْ أَنتُمْ قَوْمٌ تَجْهَلُونَ
“మీరు ఆడవారిని వదిలేసి, మగవారి వద్దకు కామవాంఛతో ఎగబడి వస్తారేమిటి? నిజానికి మీరు వట్టి మూర్ఖులుగా ప్రవర్తిస్తున్నారు” (అని చెప్పాడు).
27:56 فَمَا كَانَ جَوَابَ قَوْمِهِ إِلَّا أَن قَالُوا أَخْرِجُوا آلَ لُوطٍ مِّن قَرْيَتِكُمْ ۖ إِنَّهُمْ أُنَاسٌ يَتَطَهَّرُونَ
“లూతు పరివారాన్ని మీ నగరం నుంచి వెళ్ళగొట్టండి. వారు మహా పవిత్రులుగా చెలామణీ కాగోరుతున్నారు” అనటం తప్ప అతని జాతి వద్ద మరో సమాధానం లేకపోయింది.
27:57 فَأَنجَيْنَاهُ وَأَهْلَهُ إِلَّا امْرَأَتَهُ قَدَّرْنَاهَا مِنَ الْغَابِرِينَ
అందుచేత మేము అతని భార్య మినహా అతన్నీ, అతని పరివారాన్నీ కాపాడాము. ఆమె వెనుక ఉండిపోయేవారిలో చేరుతుందని మేము ముందే నిర్ధారించాము.
27:58 وَأَمْطَرْنَا عَلَيْهِم مَّطَرًا ۖ فَسَاءَ مَطَرُ الْمُنذَرِينَ
వారిపై ఒక (ప్రత్యేకమైన రాళ్ల) వాన కురిపించాము. హెచ్చరించబడిన ఆ జనులపై చాలా చెడ్డ వాన కురిసింది.
27:59 قُلِ الْحَمْدُ لِلَّهِ وَسَلَامٌ عَلَىٰ عِبَادِهِ الَّذِينَ اصْطَفَىٰ ۗ آللَّهُ خَيْرٌ أَمَّا يُشْرِكُونَ
(ఓ ప్రవక్తా!) ఇలా చెప్పు : “ప్రశంసలన్నీ అల్లాహ్‌కే శోభిస్తాయి. ఆయన ఎన్నుకున్న దాసులపై శాంతి కురియుగాక! ఏమిటీ, అల్లాహ్ మేలా? లేక వారు భాగస్వాములుగా కల్పించుకున్న బూటకపు దేముళ్ళు మేలా?”
27:60 أَمَّنْ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ وَأَنزَلَ لَكُم مِّنَ السَّمَاءِ مَاءً فَأَنبَتْنَا بِهِ حَدَائِقَ ذَاتَ بَهْجَةٍ مَّا كَانَ لَكُمْ أَن تُنبِتُوا شَجَرَهَا ۗ أَإِلَٰهٌ مَّعَ اللَّهِ ۚ بَلْ هُمْ قَوْمٌ يَعْدِلُونَ
కాస్త చెప్పండి, ఆకాశాలనూ, భూమిని సృష్టించిన వారెవరు? ఆకాశం నుంచి మీ కొరకు వర్షాన్ని కురిపించిందెవరు? మరి దాని ద్వారా అందాలు జాలువారే తోటలను ఉత్పత్తి చేసింది ఎవరు? ఆ తోటల చెట్లను మొలకెత్తించటం అనేది మీ వల్ల కాని పని. మరి అల్లాహ్‌తో పాటు మరో ఆరాధ్య దేవుడు కూడా ఉన్నాడా? (లేనే లేడు) కాని ఈ జనులు సమతౌల్యం నుంచి తొలగిపోతున్నారు.
27:61 أَمَّن جَعَلَ الْأَرْضَ قَرَارًا وَجَعَلَ خِلَالَهَا أَنْهَارًا وَجَعَلَ لَهَا رَوَاسِيَ وَجَعَلَ بَيْنَ الْبَحْرَيْنِ حَاجِزًا ۗ أَإِلَٰهٌ مَّعَ اللَّهِ ۚ بَلْ أَكْثَرُهُمْ لَا يَعْلَمُونَ
భూమిని నివాసయోగ్యంగా చేసినదెవరు? దాని మధ్య నదీనదాలను ప్రవహింపజేసింది, దాని నిలకడ కోసం పర్వతాలను పాతిపెట్టింది ఎవరు? రెండు సముద్రాల మధ్య అడ్డుతెరను ఏర్పరచినదెవరు? (ఈ ఏర్పాట్లలో) అల్లాహ్‌తో పాటు ఇంకొక ఆరాధ్య దేవుడు కూడా (సహాయకుడుగా) ఉన్నాడా? (ముమ్మాటికీ లేడు). అయితే వారిలో అనేకులకు అసలేమీ తెలీదు.
27:62 أَمَّن يُجِيبُ الْمُضْطَرَّ إِذَا دَعَاهُ وَيَكْشِفُ السُّوءَ وَيَجْعَلُكُمْ خُلَفَاءَ الْأَرْضِ ۗ أَإِلَٰهٌ مَّعَ اللَّهِ ۚ قَلِيلًا مَّا تَذَكَّرُونَ
కలత చెందినవాడు మొరపెట్టుకున్నప్పుడు, అతని మొరను ఆలకించి, అతని వ్యాకులతను దూరం చేసేవాడెవడు? మిమ్మల్ని భూమికి ప్రతినిధులుగా చేసేవాడెవడు? ఏమిటీ, అల్లాహ్‌తో పాటు మరో ఆరాధ్య దేవుడు కూడా ఉన్నాడా? మీరు మాత్రం గుణపాఠం గ్రహించేది బహు తక్కువ.
27:63 أَمَّن يَهْدِيكُمْ فِي ظُلُمَاتِ الْبَرِّ وَالْبَحْرِ وَمَن يُرْسِلُ الرِّيَاحَ بُشْرًا بَيْنَ يَدَيْ رَحْمَتِهِ ۗ أَإِلَٰهٌ مَّعَ اللَّهِ ۚ تَعَالَى اللَّهُ عَمَّا يُشْرِكُونَ
భూమిపైన, సముద్రంపైన – అలుముకున్న చీకట్లలో మీకు దారి చూపేవాడెవడు? తన కారుణ్యానికి (వర్షానికి) ముందే శుభవార్తల్ని అందజేసే గాలులను పంపేవాడెవడు? ఏమిటీ, అల్లాహ్‌తో పాటు వేరొక ఆరాధ్య దేవుడు కూడా ఉన్నాడా? వారు కల్పించే భాగస్వామ్యాలకు అల్లాహ్ అతీతుడు, ఉన్నతుడు.
27:64 أَمَّن يَبْدَأُ الْخَلْقَ ثُمَّ يُعِيدُهُ وَمَن يَرْزُقُكُم مِّنَ السَّمَاءِ وَالْأَرْضِ ۗ أَإِلَٰهٌ مَّعَ اللَّهِ ۚ قُلْ هَاتُوا بُرْهَانَكُمْ إِن كُنتُمْ صَادِقِينَ
చెప్పండి, తొలిసారి సృష్టిని చేసినదెవరు? మళ్ళీ దాన్ని పునరావృతం చేయగలవాడెవడు? భూమ్యాకాశాల నుంచి మీకు ఉపాధిని (ఆహార వనరులను) సమకూర్చేవాడెవడు? ఏమిటీ, అల్లాహ్‌తో పాటు (ఈ కార్యనిర్వహణలో) ఇంకొక ఆరాధ్య దేవుడు కూడా ఉన్నాడా? మీరు సత్యవంతులే అయితే ఆ మేరకు మీ ప్రమాణం ఏదన్నా తీసుకురండి అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు.
27:65 قُل لَّا يَعْلَمُ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ الْغَيْبَ إِلَّا اللَّهُ ۚ وَمَا يَشْعُرُونَ أَيَّانَ يُبْعَثُونَ
“అల్లాహ్‌కు తప్ప ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న వారెవరికీ అగోచర జ్ఞానం లేదు. తాము ఎప్పుడు తిరిగి లేపబడతామో కూడా వారికి తెలియదు” అని ఓ ప్రవక్తా (స) వారికి చెప్పు.
27:66 بَلِ ادَّارَكَ عِلْمُهُمْ فِي الْآخِرَةِ ۚ بَلْ هُمْ فِي شَكٍّ مِّنْهَا ۖ بَلْ هُم مِّنْهَا عَمُونَ
అసలు పరలోకానికి సంబంధించి వారి జ్ఞానం స్థంభించిపోయింది. పైగా దాని గురించి వారు సంశయంలో పడి ఉన్నారు. కాదు, దానిపట్ల వారు అంధులైపోయారు.
27:67 وَقَالَ الَّذِينَ كَفَرُوا أَإِذَا كُنَّا تُرَابًا وَآبَاؤُنَا أَئِنَّا لَمُخْرَجُونَ
అవిశ్వాసులు ఇలా అన్నారు : “ఏమిటీ, మేమును, మా తాతముత్తాతలూను మట్టిగా మారిపోయిన తరువాత కూడా మమ్మల్ని మళ్లీ బయటికి తీయటం జరుగుతుందా?
27:68 لَقَدْ وُعِدْنَا هَٰذَا نَحْنُ وَآبَاؤُنَا مِن قَبْلُ إِنْ هَٰذَا إِلَّا أَسَاطِيرُ الْأَوَّلِينَ
“చాలా కాలంగా మాకు, మా తాతముత్తాతలకు కూడా ఇలాంటి వాగ్దానాలే చేయబడుతూ వచ్చాయి. ఇవి పూర్వీకుల కట్టుకథలు తప్ప మరేమీ కావు.”
27:69 قُلْ سِيرُوا فِي الْأَرْضِ فَانظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُجْرِمِينَ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “అపరాధులకు పట్టిన గతేమిటో కాస్త భూమిలో సంచరించి చూడండి!”
27:70 وَلَا تَحْزَنْ عَلَيْهِمْ وَلَا تَكُن فِي ضَيْقٍ مِّمَّا يَمْكُرُونَ
నువ్వు వాళ్ల గురించి దుఃఖించకు. వాళ్లు పన్నే కుట్రలకు కూడా నీకు మనస్తాపం కలగకూడదు.
27:71 وَيَقُولُونَ مَتَىٰ هَٰذَا الْوَعْدُ إِن كُنتُمْ صَادِقِينَ
“మీరు చెప్పేదే నిజమైతే ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుందో?” అని వారు (వెటకారంగా) అంటున్నారు కదూ!
27:72 قُلْ عَسَىٰ أَن يَكُونَ رَدِفَ لَكُم بَعْضُ الَّذِي تَسْتَعْجِلُونَ
“మీరు వేటిని గురించి తొందరపెడుతున్నారో వాటిలో కొన్ని విషయాలు బహుశా మీకు అత్యంత సమీపంలోనే ఉన్నాయేమో!” అని వారికి సమాధానం ఇవ్వు.
27:73 وَإِنَّ رَبَّكَ لَذُو فَضْلٍ عَلَى النَّاسِ وَلَٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَشْكُرُونَ
వాస్తవానికి నీ ప్రభువు మానవులపై ఎంతో దయగలవాడు. కాని వారిలో చాలా మంది కృతజ్ఞులుగా మెలగరు.
27:74 وَإِنَّ رَبَّكَ لَيَعْلَمُ مَا تُكِنُّ صُدُورُهُمْ وَمَا يُعْلِنُونَ
నిశ్చయంగా నీ ప్రభువుకు వారి ఆంతర్యాలు దాచి ఉంచేవీ తెలుసు, బహిర్గతం చేసేవి కూడా తెలుసు.
27:75 وَمَا مِنْ غَائِبَةٍ فِي السَّمَاءِ وَالْأَرْضِ إِلَّا فِي كِتَابٍ مُّبِينٍ
భూమ్యాకాశాలలో దాగివున్న ఏ వస్తువు కూడా స్పష్టమైన ఒక గ్రంథంలో నమోదవకుండా లేదు.
27:76 إِنَّ هَٰذَا الْقُرْآنَ يَقُصُّ عَلَىٰ بَنِي إِسْرَائِيلَ أَكْثَرَ الَّذِي هُمْ فِيهِ يَخْتَلِفُونَ
నిశ్చయంగా ఈ ఖుర్ఆన్ ఇస్రాయీలు వంశీయులకు వారు విభేదించుకునే ఎన్నో విషయాల (లోని వాస్తవికత)ను విడమరచి చెబుతున్నది.
27:77 وَإِنَّهُ لَهُدًى وَرَحْمَةٌ لِّلْمُؤْمِنِينَ
ఇంకా నిస్సందేహంగా ఈ ఖుర్ఆన్ విశ్వాసుల కొరకు మార్గదర్శిగానూ, కారుణ్యంగానూ ఉన్నది.
27:78 إِنَّ رَبَّكَ يَقْضِي بَيْنَهُم بِحُكْمِهِ ۚ وَهُوَ الْعَزِيزُ الْعَلِيمُ
నీ ప్రభువు వీరి మధ్య తన ఆజ్ఞానుసారం తీర్పు చేస్తాడు. ఆయన అత్యంత శక్తిసంపన్నుడు, అన్నీ తెలిసినవాడు.
27:79 فَتَوَكَّلْ عَلَى اللَّهِ ۖ إِنَّكَ عَلَى الْحَقِّ الْمُبِينِ
కనుక (ఓ ప్రవక్తా!) నువ్వు అల్లాహ్ పైనే భారం మోపు. ముమ్మాటికీ నువ్వు స్పష్టమైన సత్యపథాన ఉన్నావు.
27:80 إِنَّكَ لَا تُسْمِعُ الْمَوْتَىٰ وَلَا تُسْمِعُ الصُّمَّ الدُّعَاءَ إِذَا وَلَّوْا مُدْبِرِينَ
నువ్వు మృతులకు వినిపించలేవు. అలాగే వీపు తిప్పుకుని, విముఖతను ప్రదర్శిస్తూ పోయే చెవిటి వారికి కూడా నువ్వు నీ పిలుపును వినిపించలేవు.
27:81 وَمَا أَنتَ بِهَادِي الْعُمْيِ عَن ضَلَالَتِهِمْ ۖ إِن تُسْمِعُ إِلَّا مَن يُؤْمِنُ بِآيَاتِنَا فَهُم مُّسْلِمُونَ
గుడ్డివారిని కూడా నువ్వు వారి అపమార్గం నుంచి మళ్ళించి, సన్మార్గానికి తేలేవు. మా ఆయతులను విశ్వసించి, విధేయత చూపేవారికి మాత్రమే నువ్వు (నీ వాణిని) వినిపించగలవు.
27:82 وَإِذَا وَقَعَ الْقَوْلُ عَلَيْهِمْ أَخْرَجْنَا لَهُمْ دَابَّةً مِّنَ الْأَرْضِ تُكَلِّمُهُمْ أَنَّ النَّاسَ كَانُوا بِآيَاتِنَا لَا يُوقِنُونَ
వారిని శిక్షించే మాట ఖరారు అయినప్పుడు, మేము వారి కోసం భూమి నుండి ఒక జంతువును వెలికి తీస్తాము. అది వారితో మాట్లాడుతుంది: ఎందుకంటే ప్రజలు మా ఆయతులను నమ్మేవారుకారు.
27:83 وَيَوْمَ نَحْشُرُ مِن كُلِّ أُمَّةٍ فَوْجًا مِّمَّن يُكَذِّبُ بِآيَاتِنَا فَهُمْ يُوزَعُونَ
ఆ రోజు మేము ప్రతి మానవ సమాజం నుంచి, మా ఆయతులను ధిక్కరించే ఒక్కొక్క సమూహాన్ని చుట్టుముట్టి మరీ తెస్తాము. ఆ తరువాత వారంతా వర్గీకరించబడతారు.
27:84 حَتَّىٰ إِذَا جَاءُوا قَالَ أَكَذَّبْتُم بِآيَاتِي وَلَمْ تُحِيطُوا بِهَا عِلْمًا أَمَّاذَا كُنتُمْ تَعْمَلُونَ
వారంతా ఒకచోట చేరిన తరువాత (అల్లాహ్ ఇలా) అడుగుతాడు: “మీరు నా ఆయతులను గురించి పూర్తిగా తెలియక పోయినప్పటికీ ఎందుకు ఖండించారు? ఇంతకీ మీరేం చేస్తూ ఉండేవారో చెప్పండి?”
27:85 وَوَقَعَ الْقَوْلُ عَلَيْهِم بِمَا ظَلَمُوا فَهُمْ لَا يَنطِقُونَ
వారు చేసిన దురాగతాల మూలంగా శిక్షకు సంబంధించిన మాట వారి విషయంలో నెరవేరుతుంది. అందువల్ల వారేమీ మాట్లాడలేరు.
27:86 أَلَمْ يَرَوْا أَنَّا جَعَلْنَا اللَّيْلَ لِيَسْكُنُوا فِيهِ وَالنَّهَارَ مُبْصِرًا ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّقَوْمٍ يُؤْمِنُونَ
వారు విశ్రాంతి తీసుకునేందుకుగాను మేము రాత్రిని చేశాము. ఇంకా పగటిని చూపగలిగేదిగా చేశాము. దీనిని వారు గమనించటం లేదా? నిశ్చయంగా విశ్వసించే వారికోసం ఇందులో నిదర్శనాలున్నాయి.
27:87 وَيَوْمَ يُنفَخُ فِي الصُّورِ فَفَزِعَ مَن فِي السَّمَاوَاتِ وَمَن فِي الْأَرْضِ إِلَّا مَن شَاءَ اللَّهُ ۚ وَكُلٌّ أَتَوْهُ دَاخِرِينَ
శంఖం ఊదబడే రోజున ఆకాశాలలో ఉన్నవారు, భూమిపై ఉన్న వారంతా భీతావహులై పోతారు – కాని అల్లాహ్ తలచిన వారికి మాత్రం ఆ స్థితి ఏర్పడదు. అందరూ (అశక్తులై), కడు వినమ్రులై ఆయన ముందు హాజరవుతారు.
27:88 وَتَرَى الْجِبَالَ تَحْسَبُهَا جَامِدَةً وَهِيَ تَمُرُّ مَرَّ السَّحَابِ ۚ صُنْعَ اللَّهِ الَّذِي أَتْقَنَ كُلَّ شَيْءٍ ۚ إِنَّهُ خَبِيرٌ بِمَا تَفْعَلُونَ
నీవు పర్వతాలను చూచి, అవి ఉన్న చోటే స్థిరంగా ఉంటాయని అనుకుంటున్నావు. కాని అవి కూడా మేఘ మాలికల్లా తేలిపోతుంటాయి. ఇది అల్లాహ్ పనితనం, ఆయన ప్రతి వస్తువును చాలా గట్టిగా చేశాడు. మీరు చేసేదంతా ఆయనకు తెలుసు.
27:89 مَن جَاءَ بِالْحَسَنَةِ فَلَهُ خَيْرٌ مِّنْهَا وَهُم مِّن فَزَعٍ يَوْمَئِذٍ آمِنُونَ
ఎవరయితే మంచిని తీసుకువస్తారో వారికి దానికంటే ఉత్తమమైన ప్రతిఫలం లభిస్తుంది. వారు ఆనాటి భయోత్పాతం నుండి సురక్షితంగా ఉంటారు.
27:90 وَمَن جَاءَ بِالسَّيِّئَةِ فَكُبَّتْ وُجُوهُهُمْ فِي النَّارِ هَلْ تُجْزَوْنَ إِلَّا مَا كُنتُمْ تَعْمَلُونَ
మరెవరయితే చెడును తీసుకువస్తారో వారు బోర్లాగా అగ్నిలో పడవేయబడతారు. మీరు చేసుకున్న కర్మలకు తగిన ప్రతిఫలమే మీకు ఇవ్వబడుతుంది (అని వారితో అనబడుతుంది).
27:91 إِنَّمَا أُمِرْتُ أَنْ أَعْبُدَ رَبَّ هَٰذِهِ الْبَلْدَةِ الَّذِي حَرَّمَهَا وَلَهُ كُلُّ شَيْءٍ ۖ وَأُمِرْتُ أَنْ أَكُونَ مِنَ الْمُسْلِمِينَ
నేను ఈ నగరం (మక్కా) ప్రభువును మాత్రమే ఆరాధిస్తూ ఉండాలని నాకు ఆదేశించబడింది. ఆయన దీన్ని పవిత్ర మైనదిగా చేశాడు. అన్నింటికీ ఆయనే యజమాని. నేను విధేయులలో ఒకడిగా ఉండాలని కూడా నాకు ఆజ్ఞాపించబడింది.
27:92 وَأَنْ أَتْلُوَ الْقُرْآنَ ۖ فَمَنِ اهْتَدَىٰ فَإِنَّمَا يَهْتَدِي لِنَفْسِهِ ۖ وَمَن ضَلَّ فَقُلْ إِنَّمَا أَنَا مِنَ الْمُنذِرِينَ
ఇంకా, నేను ఖుర్ఆన్ను పారాయణం చేస్తూ ఉండాలి (అని కూడా నాకు ఆజ్ఞాపించబడింది). సన్మార్గానికి వచ్చినవాడు తన స్వయానికి మేలు చేసుకోవటానికే సన్మార్గానికి వచ్చాడు. మరెవరయినా అపమార్గానపోతే, “నేను హెచ్చరించేవాణ్ణి మాత్రమే” అని (ఓ ప్రవక్తా!) చెప్పు.
27:93 وَقُلِ الْحَمْدُ لِلَّهِ سَيُرِيكُمْ آيَاتِهِ فَتَعْرِفُونَهَا ۚ وَمَا رَبُّكَ بِغَافِلٍ عَمَّا تَعْمَلُونَ
ఇంకా ఈ విధంగా చెప్పు : “సర్వస్తోత్రములు అల్లాహ్‌కే శోభిస్తాయి. ఆయన త్వరలోనే తన సూచనలను మీకు చూపిస్తాడు. వాటిని మీరు స్వయంగా తెలుసుకుంటారు. మీరు చేసే పనుల విషయంలో అల్లాహ్ ఏమాత్రం అజాగ్రత్తగా లేడు.
28. సూరా అల్ ఖసస్ (Al-Qasas)
28:1 طسم
తా – సీన్ – మీమ్.
28:2 تِلْكَ آيَاتُ الْكِتَابِ الْمُبِينِ
ఇవి తేటతెల్లమైన గ్రంథానికి చెందిన ఆయతులు.
28:3 نَتْلُو عَلَيْكَ مِن نَّبَإِ مُوسَىٰ وَفِرْعَوْنَ بِالْحَقِّ لِقَوْمٍ يُؤْمِنُونَ
విశ్వసించిన జనుల కోసం మేము నీకు మూసా, ఫిరౌనుల వృత్తాంతం (లోని కొంత భాగాన్ని) ఉన్నదున్నట్లుగా వినిపిస్తున్నాము.
28:4 إِنَّ فِرْعَوْنَ عَلَا فِي الْأَرْضِ وَجَعَلَ أَهْلَهَا شِيَعًا يَسْتَضْعِفُ طَائِفَةً مِّنْهُمْ يُذَبِّحُ أَبْنَاءَهُمْ وَيَسْتَحْيِي نِسَاءَهُمْ ۚ إِنَّهُ كَانَ مِنَ الْمُفْسِدِينَ
నిజంగానే ఫిరౌను భువిలో (ఈజిప్టు రాజ్యంలో) చెలరేగి పోయాడు. అక్కడి ప్రజలను విభిన్న వర్గాలుగా విభజించాడు. వారిలో ఒక వర్గం వారిని మరీ బలహీనుల్ని చేసేశాడు. వారి మగ పిల్లలను చంపేసి, వారి ఆడపిల్లల్ని మాత్రం బ్రతక నిచ్చేవాడు. నిశ్చయంగా వాడు కల్లోలాన్ని రేకెత్తించినవారి కోవకు చెందినవాడు.
28:5 وَنُرِيدُ أَن نَّمُنَّ عَلَى الَّذِينَ اسْتُضْعِفُوا فِي الْأَرْضِ وَنَجْعَلَهُمْ أَئِمَّةً وَنَجْعَلَهُمُ الْوَارِثِينَ
భువిలో మరీ బలహీనుల్ని చేసి అణచివేయబడిన ఆ జనులను అనుగ్రహించాలనీ, వారికి సారథ్య బాధ్యతలు అప్పగించాలనీ, వారిని (భూమికి) వారసులుగా చేయాలనీ మేము కోరుకున్నాం.
28:6 وَنُمَكِّنَ لَهُمْ فِي الْأَرْضِ وَنُرِيَ فِرْعَوْنَ وَهَامَانَ وَجُنُودَهُمَا مِنْهُم مَّا كَانُوا يَحْذَرُونَ
భువిలో వారికి ప్రాబల్యాన్ని, స్థిరత్వాన్ని ప్రసాదించాలనీ, ఫిరౌను, హామాను మరియు వారి సైన్యాలకు వారు దేనికి భయపడుతూ ఉండేవారో దాన్నే చూపాలని (మేము అభిలషించాము).
28:7 وَأَوْحَيْنَا إِلَىٰ أُمِّ مُوسَىٰ أَنْ أَرْضِعِيهِ ۖ فَإِذَا خِفْتِ عَلَيْهِ فَأَلْقِيهِ فِي الْيَمِّ وَلَا تَخَافِي وَلَا تَحْزَنِي ۖ إِنَّا رَادُّوهُ إِلَيْكِ وَجَاعِلُوهُ مِنَ الْمُرْسَلِينَ
మేము మూసా (అలైహిస్సలాం) తల్లికి ఇలా సూచించాము: “నువ్వతనికి పాలిస్తూ ఉండు. అతని విషయంలో నువ్వు ఎప్పుడు ప్రమాదాన్ని పసిగట్టినా అతన్ని నదిలో విడిచిపెట్టు. భయపడకు. దుఃఖించకు. నిశ్చయంగా మేమతన్ని నీ వైపుకే మరలిస్తాము. ఇంకా, మేమతన్ని మా ప్రవక్తలలో ఒకడుగా చేసుకుంటాము.”
28:8 فَالْتَقَطَهُ آلُ فِرْعَوْنَ لِيَكُونَ لَهُمْ عَدُوًّا وَحَزَنًا ۗ إِنَّ فِرْعَوْنَ وَهَامَانَ وَجُنُودَهُمَا كَانُوا خَاطِئِينَ
చివరకు ఫిరౌను కుటుంబీకులు ఆ పసికందును ఎత్తుకున్నారు – ఎట్టకేలకు ఈ పసివాడే వారికి శత్రువుగా తయారై, వారి విషాదానికి కారకుడయ్యేందుకు. మొత్తానికి ఫిరౌను, హామాను, వారి సేనలు – వారందరూ పాపాత్ములనటంలో సందేహమే లేదు.
28:9 وَقَالَتِ امْرَأَتُ فِرْعَوْنَ قُرَّتُ عَيْنٍ لِّي وَلَكَ ۖ لَا تَقْتُلُوهُ عَسَىٰ أَن يَنفَعَنَا أَوْ نَتَّخِذَهُ وَلَدًا وَهُمْ لَا يَشْعُرُونَ
ఫిరౌను భార్య (తన భర్తతో), “(ఏవండీ!) ఈ అబ్బాయి మీకూ, నాకూ కన్నుల పండువగా ఉన్నాడండీ! ఇతన్ని మాత్రం చంపకండీ! బహుశా ఇతను మనకు ఉపయోగపడవచ్చండీ! లేదంటే మనం ఇతన్ని మన పుత్రునిగానైనా దత్తత తీసుకోవచ్చండి!” అని ప్రాధేయపడింది. కాని (దాని పర్యవసానం గురించి) వారికి తెలీదు.
28:10 وَأَصْبَحَ فُؤَادُ أُمِّ مُوسَىٰ فَارِغًا ۖ إِن كَادَتْ لَتُبْدِي بِهِ لَوْلَا أَن رَّبَطْنَا عَلَىٰ قَلْبِهَا لِتَكُونَ مِنَ الْمُؤْمِنِينَ
మూసా తల్లి మనసు తల్లడిల్లి పోయింది. ఆమె విశ్వాసులలోనే స్థిరంగా ఉండడానికి మేము ఆమె మనసును కుదుటపరచి ఉండకపోతే, ఆ విషయాన్ని ఆమె బయటపెట్టి ఉండేదే!
28:11 وَقَالَتْ لِأُخْتِهِ قُصِّيهِ ۖ فَبَصُرَتْ بِهِ عَن جُنُبٍ وَهُمْ لَا يَشْعُرُونَ
మూసా తల్లి, అతని అక్కతో, “నువ్వు ఇతని వెనకాలే వెళ్ళు” అని చెప్పింది. అందువల్ల ఆమె దూరం నుంచే గమనిస్తూ పోయింది. కాని ఆ సంగతి వారికి (ఫిరౌనీయులకు) తెలియదు.
28:12 وَحَرَّمْنَا عَلَيْهِ الْمَرَاضِعَ مِن قَبْلُ فَقَالَتْ هَلْ أَدُلُّكُمْ عَلَىٰ أَهْلِ بَيْتٍ يَكْفُلُونَهُ لَكُمْ وَهُمْ لَهُ نَاصِحُونَ
అంతకుముందే మేము మూసా కొరకు దాదుల పాలను నిషేధించాము. (పరిస్థితుల స్వరూపాన్ని గమనించిన) ఆ బాలిక వారితో, “మీ కోసం ఈ బాలుణ్ణి పోషించే, ఇతని బాగోగులను కోరే ఇంటి వారిని గురించి నేను మీకు తెలుపనా?!” అని చెప్పింది.
28:13 فَرَدَدْنَاهُ إِلَىٰ أُمِّهِ كَيْ تَقَرَّ عَيْنُهَا وَلَا تَحْزَنَ وَلِتَعْلَمَ أَنَّ وَعْدَ اللَّهِ حَقٌّ وَلَٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ
ఆ విధంగా మేము అతన్ని తిరిగి అతని తల్లి దగ్గరకు చేర్చాము – తద్వారా ఆమె కన్నులు చల్లబడాలనీ, ఆమె దుఃఖితురాలు కాకుండా ఉండాలనీ, అల్లాహ్ వాగ్దానం సత్యమని ఆమె తెలుసుకోవాలని (మేమిలా చేశాము). కాని చాలా మందికి (ఇందలి పరమార్థం) తెలియదు.
28:14 وَلَمَّا بَلَغَ أَشُدَّهُ وَاسْتَوَىٰ آتَيْنَاهُ حُكْمًا وَعِلْمًا ۚ وَكَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ
మూసా తన యుక్త వయస్సుకు చేరుకుని, పరిపక్వతను పొందిన మీదట మేమతనికి వివేకాన్నీ, (ధర్మ) జ్ఞానాన్నీ ప్రసాదించాము. సద్వర్తనులకు మేము ఇలాగే (ఉత్తమ) ప్రతిఫలాన్ని ఇస్తుంటాము.
28:15 وَدَخَلَ الْمَدِينَةَ عَلَىٰ حِينِ غَفْلَةٍ مِّنْ أَهْلِهَا فَوَجَدَ فِيهَا رَجُلَيْنِ يَقْتَتِلَانِ هَٰذَا مِن شِيعَتِهِ وَهَٰذَا مِنْ عَدُوِّهِ ۖ فَاسْتَغَاثَهُ الَّذِي مِن شِيعَتِهِ عَلَى الَّذِي مِنْ عَدُوِّهِ فَوَكَزَهُ مُوسَىٰ فَقَضَىٰ عَلَيْهِ ۖ قَالَ هَٰذَا مِنْ عَمَلِ الشَّيْطَانِ ۖ إِنَّهُ عَدُوٌّ مُّضِلٌّ مُّبِينٌ
(ఒకసారి) నగరవాసులు ఏమరుపాటులో ఉన్న సమయంలో అతను నగరంలోకి వచ్చాడు. అక్కడ ఇద్దరు వ్యక్తులు దెబ్బలాడు కోవటం చూశాడు. వారిలో ఒకతను తన వర్గానికి చెందినవాడు, ఇంకొకతను వైరి వర్గానికి చెందినవాడు. తన వర్గానికి చెందిన వ్యక్తి, శత్రువర్గానికి చెందినవానికి వ్యతిరేకంగా తనకు సహాయపడమని మూసాను పిలిచాడు. మూసా అతనికి ఒకే ఒక గుద్దు గుద్దాడు. అంతే, అది అతన్ని కడతేర్చింది. (అప్పుడు) మూసా “ఇది షైతాను పని. నిశ్చయంగా షైతాన్ బద్ధ విరోధి. స్పష్టంగా పెడదారి పట్టించేవాడు” అని పలికాడు.
28:16 قَالَ رَبِّ إِنِّي ظَلَمْتُ نَفْسِي فَاغْفِرْ لِي فَغَفَرَ لَهُ ۚ إِنَّهُ هُوَ الْغَفُورُ الرَّحِيمُ
ఆ తరువాత అతను “నా ప్రభూ! నాకు నేనే అన్యాయం చేసుకున్నాను. నన్ను క్షమించు” అని మొరపెట్టుకున్నాడు. అప్పుడు అల్లాహ్ అతన్ని క్షమించాడు. నిశ్చయంగా ఆయన క్షమాశీలుడు, దయామయుడు.
28:17 قَالَ رَبِّ بِمَا أَنْعَمْتَ عَلَيَّ فَلَنْ أَكُونَ ظَهِيرًا لِّلْمُجْرِمِينَ
“నా ప్రభూ! నీవు నన్ను అనుగ్రహించినట్లే నేను కూడా ఇకమీదట ఏ నేరస్థునికీ సహాయపడను” అని మూసా విన్నవించుకున్నాడు.
28:18 فَأَصْبَحَ فِي الْمَدِينَةِ خَائِفًا يَتَرَقَّبُ فَإِذَا الَّذِي اسْتَنصَرَهُ بِالْأَمْسِ يَسْتَصْرِخُهُ ۚ قَالَ لَهُ مُوسَىٰ إِنَّكَ لَغَوِيٌّ مُّبِينٌ
(మరునాడు) తెల్లవారుతుండగా మూసా భయపడుతూనే- నలువైపులా పరికిస్తూ – నగరంలోకి వెళ్ళాడు. అంతలోనే నిన్న సహాయం కోసం తనను అభ్యర్థించిన వ్యక్తే మళ్లీ తనకు ఫిర్యాదు చేశాడు. అప్పుడు మూసా అతన్నుద్దేశించి, “నువ్వు పూర్తిగా మార్గం తప్పినవాడిలా ఉన్నావు” అన్నాడు.
28:19 فَلَمَّا أَنْ أَرَادَ أَن يَبْطِشَ بِالَّذِي هُوَ عَدُوٌّ لَّهُمَا قَالَ يَا مُوسَىٰ أَتُرِيدُ أَن تَقْتُلَنِي كَمَا قَتَلْتَ نَفْسًا بِالْأَمْسِ ۖ إِن تُرِيدُ إِلَّا أَن تَكُونَ جَبَّارًا فِي الْأَرْضِ وَمَا تُرِيدُ أَن تَكُونَ مِنَ الْمُصْلِحِينَ
ఆ తరువాత మూసా, తామిద్దరికీ శత్రువు అయిన వ్యక్తిని పట్టుకోబోతుండగా, “మూసా! ఏమిటీ, నువ్వు నిన్న ఒక వ్యక్తిని చంపేసినట్లే నన్ను కూడా చంపేయాలనుకుంటున్నావా? నువ్వు రాజ్యంలో దౌర్జన్యపరునిలా ప్రవర్తిస్తున్నావు. దిద్దుబాటు కోసం ప్రయత్నించాలన్న ధ్యాస నీలో ఏ కోశానా లేదే?!” అని ఆ వ్యక్తి అన్నాడు.
28:20 وَجَاءَ رَجُلٌ مِّنْ أَقْصَى الْمَدِينَةِ يَسْعَىٰ قَالَ يَا مُوسَىٰ إِنَّ الْمَلَأَ يَأْتَمِرُونَ بِكَ لِيَقْتُلُوكَ فَاخْرُجْ إِنِّي لَكَ مِنَ النَّاصِحِينَ
నగరం అటు చివరి నుంచి ఒక వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి, “మూసా! ఇక్కడి పెద్దలు నిన్ను తుదముట్టించేందుకు సంప్రతింపులు జరుపుతున్నారు. అందుకే నువ్వు తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో (నా మాట నమ్ము). నీ మంచిని కోరే వారిలో నేనూ ఒకణ్ణి” అన్నాడు.
28:21 فَخَرَجَ مِنْهَا خَائِفًا يَتَرَقَّبُ ۖ قَالَ رَبِّ نَجِّنِي مِنَ الْقَوْمِ الظَّالِمِينَ
అప్పుడు మూసా, భయపడుతూనే, (అటూ ఇటూ) చూసుకుంటూ అక్కణ్ణుంచి బయటపడ్డాడు. “ప్రభూ! నన్ను దుర్మార్గ జనుల చెర నుండి కాపాడు” అని వేడుకోసాగాడు.
28:22 وَلَمَّا تَوَجَّهَ تِلْقَاءَ مَدْيَنَ قَالَ عَسَىٰ رَبِّي أَن يَهْدِيَنِي سَوَاءَ السَّبِيلِ
అతను (మూసా) మద్యన్ దిక్కుకు ప్రయాణమైనప్పుడు, “నా ప్రభువు నన్ను సరైన మార్గంలోనే తీసుకుపోతాడని ఆశిస్తున్నాను” అన్నాడు.
28:23 وَلَمَّا وَرَدَ مَاءَ مَدْيَنَ وَجَدَ عَلَيْهِ أُمَّةً مِّنَ النَّاسِ يَسْقُونَ وَوَجَدَ مِن دُونِهِمُ امْرَأَتَيْنِ تَذُودَانِ ۖ قَالَ مَا خَطْبُكُمَا ۖ قَالَتَا لَا نَسْقِي حَتَّىٰ يُصْدِرَ الرِّعَاءُ ۖ وَأَبُونَا شَيْخٌ كَبِيرٌ
అతను మద్యన్ నీటి (బావి) వద్దకు చేరుకున్నప్పుడు, అక్కడ ఓ ప్రజా సమూహం (తమ పశువులకు) నీరు త్రాగిస్తున్నట్లు చూశాడు. మరో వైపు ఇద్దరు స్త్రీలు వేరుగా నిలబడి తమ (పశువుల)ను ఆపుతూ ఉండటం కనిపించింది. “ఇంతకీ మీ సమస్య ఏమిటీ?” అని మూసా దర్యాప్తు చేయగా, “ఈ పశువుల కాపరులు తిరిగిపోనంతవరకూ మేము (మా పశువులకు) నీరు త్రాగించలేము. మా నాన్నగారేమో మరీ ముసలివారు” అని ఆ పడతులు చెప్పారు.
28:24 فَسَقَىٰ لَهُمَا ثُمَّ تَوَلَّىٰ إِلَى الظِّلِّ فَقَالَ رَبِّ إِنِّي لِمَا أَنزَلْتَ إِلَيَّ مِنْ خَيْرٍ فَقِيرٌ
అందువల్ల అతను (స్వయంగా ముందుకు వచ్చి) వారి పశువులకు నీరు త్రాగించాడు. ఆ తరువాత నీడ వున్న చోటికి తిరిగి వచ్చి, “ప్రభూ! నువ్వు నా వద్దకు ఏ మేలును పంపినా నాకు దాని అవసరం ఎంతైనా వుంది” అని చెప్పుకున్నాడు.
28:25 فَجَاءَتْهُ إِحْدَاهُمَا تَمْشِي عَلَى اسْتِحْيَاءٍ قَالَتْ إِنَّ أَبِي يَدْعُوكَ لِيَجْزِيَكَ أَجْرَ مَا سَقَيْتَ لَنَا ۚ فَلَمَّا جَاءَهُ وَقَصَّ عَلَيْهِ الْقَصَصَ قَالَ لَا تَخَفْ ۖ نَجَوْتَ مِنَ الْقَوْمِ الظَّالِمِينَ
అంతలోనే ఆ ఇద్దరు యువతులలో ఒకామె బిడియంతో అతని దగ్గరకు నడుచుకుంటూ వచ్చి, “మీరు మా (పశువుల)కు నీరు త్రాగించిన దానికి ప్రతిఫలం ఇవ్వటానికి, మా నాన్నగారు మిమ్మల్ని పిలుస్తున్నారు” అని చెప్పింది. మూసా ఆయన వద్దకు వచ్చినప్పుడు, తన వృత్తాంతమంతా వివరించాడు. “భయపడకు. నువ్వు దుర్మార్గ జనుల బారి నుంచి విముక్తి పొందావు” అని ఆయన ఓదార్చాడు.
28:26 قَالَتْ إِحْدَاهُمَا يَا أَبَتِ اسْتَأْجِرْهُ ۖ إِنَّ خَيْرَ مَنِ اسْتَأْجَرْتَ الْقَوِيُّ الْأَمِينُ
ఆ ఇద్దరు అమ్మాయిలలో ఒకామె, “ఓ నాన్నా! ఈయన్ని జీతంపై పెట్టుకోండి. ఎందుకంటే, మీరు జీతంపై నియమించుకునే వారిలో బలవంతునిగా, నమ్మకస్థునిగా ఉండేవాడే ఉత్తముడు” అని అన్నది.
28:27 قَالَ إِنِّي أُرِيدُ أَنْ أُنكِحَكَ إِحْدَى ابْنَتَيَّ هَاتَيْنِ عَلَىٰ أَن تَأْجُرَنِي ثَمَانِيَ حِجَجٍ ۖ فَإِنْ أَتْمَمْتَ عَشْرًا فَمِنْ عِندِكَ ۖ وَمَا أُرِيدُ أَنْ أَشُقَّ عَلَيْكَ ۚ سَتَجِدُنِي إِن شَاءَ اللَّهُ مِنَ الصَّالِحِينَ
(ఆ పెద్ద మనిషి) ఇలా అన్నాడు: “నా ఇద్దరు కుమార్తెలలో ఒకామెను నీకిచ్చి వివాహం చేయాలనుకుంటున్నాను. అయితే- నువ్వు (మహరుగా) ఎనిమిది సంవత్సరాలు నా దగ్గర సేవకునిగా ఉండాలి. ఒకవేళ నువ్వు పది సంవత్సరాలు పూర్తి చేయగలిగితే, అది నీ తరుఫు నుంచి (నాకు చేసిన మేలు అవుతుంది.) నిన్ను ఇబ్బందులపాలు చేయాలన్నది నా అభిమతం ఎంతమాత్రం కాదు. దైవచిత్తమయితే మున్ముందు నువ్వు నన్ను మంచివానిగా పొందుతావు.”
28:28 قَالَ ذَٰلِكَ بَيْنِي وَبَيْنَكَ ۖ أَيَّمَا الْأَجَلَيْنِ قَضَيْتُ فَلَا عُدْوَانَ عَلَيَّ ۖ وَاللَّهُ عَلَىٰ مَا نَقُولُ وَكِيلٌ
“మీకూ – నాకూ మధ్య ఇది (ఈ ఒప్పందం) కుదిరినట్లే. నేను ఈ రెండు గడువులలో ఏ ఒక్కటి పూర్తిచేసినా- ఆ తరువాత నాపై ఎలాంటి ఒత్తిడీ రాకూడదు. మనం చెప్పుకునే మాటలకు అల్లాహ్ సాక్షిగా ఉన్నాడు” అని మూసా పలికాడు.
28:29 فَلَمَّا قَضَىٰ مُوسَى الْأَجَلَ وَسَارَ بِأَهْلِهِ آنَسَ مِن جَانِبِ الطُّورِ نَارًا قَالَ لِأَهْلِهِ امْكُثُوا إِنِّي آنَسْتُ نَارًا لَّعَلِّي آتِيكُم مِّنْهَا بِخَبَرٍ أَوْ جَذْوَةٍ مِّنَ النَّارِ لَعَلَّكُمْ تَصْطَلُونَ
మరి మూసా ఆ గడువును పూర్తి చేసి, తన ఇంటివారిని తీసుకుని వెళుతుండగా తూరు (పర్వతం) వైపు అగ్ని కనిపించింది. ఆయన తన ఇంటామెతో, “ఇక్కడే ఉండండి. నేను అగ్నిని చూశాను. బహుశా అక్కణ్ణుంచి నేను ఏదైనా సమాచారాన్నిగానీ, లేదా మీరు చలి కాచుకోవటానికి నిప్పు రవ్వనుగానీ తెస్తాను” అన్నాడు.
28:30 فَلَمَّا أَتَاهَا نُودِيَ مِن شَاطِئِ الْوَادِ الْأَيْمَنِ فِي الْبُقْعَةِ الْمُبَارَكَةِ مِنَ الشَّجَرَةِ أَن يَا مُوسَىٰ إِنِّي أَنَا اللَّهُ رَبُّ الْعَالَمِينَ
తీరా అక్కడకు చేరుకోగానే, ఆ లోయకు కుడి అంచున గల శుభప్రదమైన స్థలంలోని ఒక వృక్షం నుంచి, “మూసా! నేను సకల లోకాల ప్రభువైన అల్లాహ్‌ను” అని పిలుపు వినవచ్చింది.
28:31 وَأَنْ أَلْقِ عَصَاكَ ۖ فَلَمَّا رَآهَا تَهْتَزُّ كَأَنَّهَا جَانٌّ وَلَّىٰ مُدْبِرًا وَلَمْ يُعَقِّبْ ۚ يَا مُوسَىٰ أَقْبِلْ وَلَا تَخَفْ ۖ إِنَّكَ مِنَ الْآمِنِينَ
“నీ చేతికర్రను పడవెయ్యి” (అన్న వాణి కూడా వినిపించింది). మరి ఆ కర్ర పాము మాదిరిగా మెలికలు తిరగటం చూసి, అతను వెనుతిరిగి పారిపోసాగాడు. కనీసం తిరిగి (దాని వంక) చూడనైనా లేదు. “ఓ మూసా! ముందుకు రా! భయపడకు. నిశ్చయంగా నువ్వు అన్ని విధాలా సురక్షితంగా ఉన్నావు.”
28:32 اسْلُكْ يَدَكَ فِي جَيْبِكَ تَخْرُجْ بَيْضَاءَ مِنْ غَيْرِ سُوءٍ وَاضْمُمْ إِلَيْكَ جَنَاحَكَ مِنَ الرَّهْبِ ۖ فَذَانِكَ بُرْهَانَانِ مِن رَّبِّكَ إِلَىٰ فِرْعَوْنَ وَمَلَئِهِ ۚ إِنَّهُمْ كَانُوا قَوْمًا فَاسِقِينَ
“నీ చేతిని నీ చొక్కా లోపల పెట్టుకో. అది ఎలాంటి లోపం లేకుండానే – తెల్లగా మెరిసిపోతూ – బయటికి వస్తుంది. భీతావహస్థితి నుంచి (సురక్షితంగా ఉండటానికి) నీ చేతిని (మడచి) నీ పార్శ్యానికి ఆనించిపెట్టు. నువ్వు ఫిరౌను మరియు అతని అధికారుల వద్ద సమర్పించటానికి నీ ప్రభువు తరఫు నుంచి నీకు ఇవ్వబడిన రెండు మహిమలు ఇవి! నిశ్చయంగా వారంతా అవిధేయులుగా తయారయ్యారు” (అని మేమన్నాము).
28:33 قَالَ رَبِّ إِنِّي قَتَلْتُ مِنْهُمْ نَفْسًا فَأَخَافُ أَن يَقْتُلُونِ
మూసా ఇలా విన్నవించుకున్నాడు: “ప్రభూ! నేను వాళ్ల మనిషినొకతన్ని చంపి ఉన్నాను. కాబట్టి వాళ్ళిప్పుడు నన్ను హతమారుస్తారేమోనని నాకు భయంగా ఉంది.”
28:34 وَأَخِي هَارُونُ هُوَ أَفْصَحُ مِنِّي لِسَانًا فَأَرْسِلْهُ مَعِيَ رِدْءًا يُصَدِّقُنِي ۖ إِنِّي أَخَافُ أَن يُكَذِّبُونِ
“నా సోదరుడైన హారూను నా కంటే మంచి వాక్పటిమ కలవాడు. అందువల్ల నన్ను ధృవీకరించే నిమిత్తం అతన్ని నా సహాయకునిగా చేసి పంపు. వాళ్ళు నన్ను ధిక్కరిస్తారేమోనని నాకు భయంగా ఉంది.”
28:35 قَالَ سَنَشُدُّ عَضُدَكَ بِأَخِيكَ وَنَجْعَلُ لَكُمَا سُلْطَانًا فَلَا يَصِلُونَ إِلَيْكُمَا ۚ بِآيَاتِنَا أَنتُمَا وَمَنِ اتَّبَعَكُمَا الْغَالِبُونَ
“మేము నీ సోదరునిచే నీ బాహువులను బలపరుస్తాము. మీరిద్దరికీ ప్రాబల్యాన్ని ఇస్తాము. వాళ్లు అసలు మీ దాకా రాలేరు. మా సూచనల ఆధారంగా మీరు, మీ అనుయాయులు విజయం సాధిస్తారు” అని అల్లాహ్ సెలవిచ్చాడు.
28:36 فَلَمَّا جَاءَهُم مُّوسَىٰ بِآيَاتِنَا بَيِّنَاتٍ قَالُوا مَا هَٰذَا إِلَّا سِحْرٌ مُّفْتَرًى وَمَا سَمِعْنَا بِهَٰذَا فِي آبَائِنَا الْأَوَّلِينَ
ఆ తరువాత మూసా, మేము ప్రసాదించిన స్పష్టమైన మహిమలను తీసుకుని వారి వద్దకు వచ్చినప్పుడు, “ఇది కాల్పనిక మాంత్రిక విద్యలా ఉంది. మేము మా పూర్వీకులైన మా తాత ముత్తాతల కాలంలో కూడా దీన్ని గురించి ఎన్నడూ వినలేదు” అని వారన్నారు.
28:37 وَقَالَ مُوسَىٰ رَبِّي أَعْلَمُ بِمَن جَاءَ بِالْهُدَىٰ مِنْ عِندِهِ وَمَن تَكُونُ لَهُ عَاقِبَةُ الدَّارِ ۖ إِنَّهُ لَا يُفْلِحُ الظَّالِمُونَ
మూసా ఇలా చెప్పాడు: “తన వద్ద నుంచి మార్గదర్శకత్వాన్ని తెచ్చే వ్యక్తి గురించి, పరలోక పరిణామం రీత్యా కృతార్థులయ్యే వారి గురించి నా ప్రభువుకు బాగా తెలుసు. దుర్మార్గులు ఎన్నటికీ సాఫల్యం పొందరు.”
28:38 وَقَالَ فِرْعَوْنُ يَا أَيُّهَا الْمَلَأُ مَا عَلِمْتُ لَكُم مِّنْ إِلَٰهٍ غَيْرِي فَأَوْقِدْ لِي يَا هَامَانُ عَلَى الطِّينِ فَاجْعَل لِّي صَرْحًا لَّعَلِّي أَطَّلِعُ إِلَىٰ إِلَٰهِ مُوسَىٰ وَإِنِّي لَأَظُنُّهُ مِنَ الْكَاذِبِينَ
అప్పుడు ఫిరౌన్ ఇలా అన్నాడు: “ఓ ప్రముఖులారా! నేను తప్ప మీకు మరో దేవుడున్నాడన్న సంగతి నాకు తెలీదు. హామాన్! విను. నువ్వు నా కోసం మట్టిని కాల్చు (ఇటుకలు తయారు చేయి). నా కోసం ఓ ఎత్తయిన ఆకాశహర్మ్యం నిర్మించు. (దాని పైకెక్కి) మూసా దేవుణ్ణి (అసలున్నాడో లేడో) తొంగి చూస్తాను. ఇతను మాత్రం అసత్యవాదుల్లో ఒకడని నా అనుమానం.”
28:39 وَاسْتَكْبَرَ هُوَ وَجُنُودُهُ فِي الْأَرْضِ بِغَيْرِ الْحَقِّ وَظَنُّوا أَنَّهُمْ إِلَيْنَا لَا يُرْجَعُونَ
వాడూ, వాడి సైనికులూ అకారణంగా రాజ్యంలో అహంకారం ప్రదర్శించారు. మా వద్దకు మరలి రావటం అనేది జరగదని వారు తలపోశారు.
28:40 فَأَخَذْنَاهُ وَجُنُودَهُ فَنَبَذْنَاهُمْ فِي الْيَمِّ ۖ فَانظُرْ كَيْفَ كَانَ عَاقِبَةُ الظَّالِمِينَ
ఎట్టకేలకు మేము వాణ్ణి, వాడి సైన్యాలను పట్టుకున్నాము. మరి వాళ్ళను సముద్రంలో పారేశాము. మరి చూడు, ఆ దుర్మార్గులకు ఏ గతిపట్టిందో!
28:41 وَجَعَلْنَاهُمْ أَئِمَّةً يَدْعُونَ إِلَى النَّارِ ۖ وَيَوْمَ الْقِيَامَةِ لَا يُنصَرُونَ
మేము వాళ్ళను నరకం వైపునకు పిలిచే నాయకులుగా చేశాము. ప్రళయ దినాన వారు ఏ సహాయానికీ నోచుకోరు.
28:42 وَأَتْبَعْنَاهُمْ فِي هَٰذِهِ الدُّنْيَا لَعْنَةً ۖ وَيَوْمَ الْقِيَامَةِ هُم مِّنَ الْمَقْبُوحِينَ
మేము ఈ ప్రపంచంలో కూడా వారి వెనుక శాపాన్ని తగిలించాము. ప్రళయ దినాన కూడా వారు దౌర్భాగ్యుల జాబితాలో చేర్తారు.
28:43 وَلَقَدْ آتَيْنَا مُوسَى الْكِتَابَ مِن بَعْدِ مَا أَهْلَكْنَا الْقُرُونَ الْأُولَىٰ بَصَائِرَ لِلنَّاسِ وَهُدًى وَرَحْمَةً لَّعَلَّهُمْ يَتَذَكَّرُونَ
ఈ పాత తరాన్ని అంతమొందించిన తరువాత మేము మానవులకు వెలుగుగా, మార్గదర్శనంగా, కారుణ్యంగా ఉండే గ్రంథాన్ని మూసాకు ప్రసాదించాము – తద్వారా వారు గుణపాఠం గ్రహిస్తారని!
28:44 وَمَا كُنتَ بِجَانِبِ الْغَرْبِيِّ إِذْ قَضَيْنَا إِلَىٰ مُوسَى الْأَمْرَ وَمَا كُنتَ مِنَ الشَّاهِدِينَ
(ఓ ముహమ్మద్-స!) మేము మూసాకు ఆజ్ఞను అందజేసినప్పుడు నువ్వు (తూరు పర్వతం) పశ్చిమం వైపున లేవు. దానికి నువ్వు సాక్షివి కూడా కావు.
28:45 وَلَٰكِنَّا أَنشَأْنَا قُرُونًا فَتَطَاوَلَ عَلَيْهِمُ الْعُمُرُ ۚ وَمَا كُنتَ ثَاوِيًا فِي أَهْلِ مَدْيَنَ تَتْلُو عَلَيْهِمْ آيَاتِنَا وَلَٰكِنَّا كُنَّا مُرْسِلِينَ
కాని మేము ఎన్నో తరాల వారిని ప్రభవింపజేశాము. వారిపై సుదీర్ఘకాలం గడచిపోయింది. అయితే నువ్వు మద్యన్ వాసుల మధ్య కూడా – మా ఆయతులను చదివి వినిపించడానికి అక్కడ నివసించి ఉండలేదు. కాని మేము మాత్రం ప్రవక్తలను పంపిస్తూనే ఉండేవారము.
28:46 وَمَا كُنتَ بِجَانِبِ الطُّورِ إِذْ نَادَيْنَا وَلَٰكِن رَّحْمَةً مِّن رَّبِّكَ لِتُنذِرَ قَوْمًا مَّا أَتَاهُم مِّن نَّذِيرٍ مِّن قَبْلِكَ لَعَلَّهُمْ يَتَذَكَّرُونَ
మేము (మూసాను) పిలిచినప్పుడు కూడా నువ్వు తూర్ (పర్వతం) వైపున లేవు. నిజానికి నీకు పూర్వం అప్రమత్తం చేసే వాడెవడూ రాని జాతిని నువ్వు అప్రమత్తం చేయడానికి; నీ ప్రభువు తరఫున (నీకు వొసగబడిన) కారుణ్యం ఇది. దీనిద్వారా వారు బహుశా గుణపాఠం నేర్చుకుంటారేమో!
28:47 وَلَوْلَا أَن تُصِيبَهُم مُّصِيبَةٌ بِمَا قَدَّمَتْ أَيْدِيهِمْ فَيَقُولُوا رَبَّنَا لَوْلَا أَرْسَلْتَ إِلَيْنَا رَسُولًا فَنَتَّبِعَ آيَاتِكَ وَنَكُونَ مِنَ الْمُؤْمِنِينَ
వారు తమ చేతులారా ముందుగా చేసి పంపుకున్న (చెడు) కర్మల కారణంగా వారిపై ఏదన్నా ఆపద వచ్చిపడిన పక్షంలో, “మా ప్రభూ! నువ్వు మా వద్దకు ఏ ప్రవక్తనయినా ఎందుకు పంపలేదు? (పంపి ఉంటే) మేము నీ ఆయతులను అనుసరించి, విశ్వాసులలో చేరి ఉండేవారము కదా!” అని అనేవారు. వారలా అనకుండా ఉండేపక్షంలో (మేము వారి వద్దకు ప్రవక్తను పంపి ఉండేవారమే కాదు).
28:48 فَلَمَّا جَاءَهُمُ الْحَقُّ مِنْ عِندِنَا قَالُوا لَوْلَا أُوتِيَ مِثْلَ مَا أُوتِيَ مُوسَىٰ ۚ أَوَلَمْ يَكْفُرُوا بِمَا أُوتِيَ مُوسَىٰ مِن قَبْلُ ۖ قَالُوا سِحْرَانِ تَظَاهَرَا وَقَالُوا إِنَّا بِكُلٍّ كَافِرُونَ
మరి వారి వద్దకు మా తరఫు నుంచి సత్యం వచ్చినప్పుడు, “మూసాకు ఇవ్వబడినదే ఈయనకు ఎందుకు ఇవ్వబడలేదు?” అని అనసాగారు. మరైతే ఇంతకు మునుపు మూసాకు ఇవ్వబడిన దానిపట్ల జనులు తిరస్కార వైఖరిని అవలంబించలేదా ఏమిటి? “వీరిద్దరూ (ఆరితేరిన) మాంత్రికులే. ఒండొకరికి చేదోడు వాదోడుగా ఉన్నారు” అని తేల్చి చెప్పేశారు. “మేము వీళ్ళందరినీ త్రోసి పుచ్చుతున్నాము” అని కూడా అన్నారు.
28:49 قُلْ فَأْتُوا بِكِتَابٍ مِّنْ عِندِ اللَّهِ هُوَ أَهْدَىٰ مِنْهُمَا أَتَّبِعْهُ إِن كُنتُمْ صَادِقِينَ
“ఒకవేళ మీరు సత్యవంతులే అయితే ఈ రెండింటికన్నా ఎక్కువగా సన్మార్గం చూపే గ్రంథాన్ని అల్లాహ్ వద్దనుంచి తీసుకురండి. నేను దానిని అనుసరిస్తాను” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు.
28:50 فَإِن لَّمْ يَسْتَجِيبُوا لَكَ فَاعْلَمْ أَنَّمَا يَتَّبِعُونَ أَهْوَاءَهُمْ ۚ وَمَنْ أَضَلُّ مِمَّنِ اتَّبَعَ هَوَاهُ بِغَيْرِ هُدًى مِّنَ اللَّهِ ۚ إِنَّ اللَّهَ لَا يَهْدِي الْقَوْمَ الظَّالِمِينَ
మరి వారు గనక నీ సవాలును స్వీకరించకపోతే, వారు తమ మనోవాంఛలను అనుసరించే జనులని తెలుసుకో. అల్లాహ్ మార్గ దర్శకత్వాన్ని కాకుండా తన మనోవాంఛల వెనుక నడిచేవాని కన్నా ఎక్కువ మార్గభ్రష్టుడెవడుంటాడు? అల్లాహ్ దుర్మార్గులకు ఎట్టి పరిస్థితిలోనూ సన్మార్గం చూపడు.
28:51 وَلَقَدْ وَصَّلْنَا لَهُمُ الْقَوْلَ لَعَلَّهُمْ يَتَذَكَّرُونَ
ప్రజలు హితబోధను గ్రహించగలందులకు మేము మాత్రం వారికి మా వాక్కును నిరంతరం పంపించాము.
28:52 الَّذِينَ آتَيْنَاهُمُ الْكِتَابَ مِن قَبْلِهِ هُم بِهِ يُؤْمِنُونَ
మేము లోగడ ఎవరికయితే గ్రంథం వొసగామో వారు దీనిని (ఖుర్ఆన్ను) కూడా విశ్వసిస్తారు.
28:53 وَإِذَا يُتْلَىٰ عَلَيْهِمْ قَالُوا آمَنَّا بِهِ إِنَّهُ الْحَقُّ مِن رَّبِّنَا إِنَّا كُنَّا مِن قَبْلِهِ مُسْلِمِينَ
వారికి, దానిని (ఖుర్ఆన్ను) చదివి వినిపించినప్పుడు, “ఇది మా ప్రభువు తరఫు నుంచి వచ్చిన సత్యం అని మేము విశ్వసిస్తున్నాము. అసలు మేము దీనికి ముందు నుంచే ముస్లిములుగా ఉన్నాము” అని వారు చెబుతారు.
28:54 أُولَٰئِكَ يُؤْتَوْنَ أَجْرَهُم مَّرَّتَيْنِ بِمَا صَبَرُوا وَيَدْرَءُونَ بِالْحَسَنَةِ السَّيِّئَةَ وَمِمَّا رَزَقْنَاهُمْ يُنفِقُونَ
తాము చూపిన నిలకడ (సహన స్థయిర్యాల)కు గాను వారు రెండింతల ప్రతిఫలం ప్రసాదించబడతారు. వారు మంచి ద్వారా చెడును పారద్రోలుతారు. మేము ప్రసాదించిన దానిలో నుంచి (దానధర్మాల రూపేణా) ఖర్చుపెడతారు.
28:55 وَإِذَا سَمِعُوا اللَّغْوَ أَعْرَضُوا عَنْهُ وَقَالُوا لَنَا أَعْمَالُنَا وَلَكُمْ أَعْمَالُكُمْ سَلَامٌ عَلَيْكُمْ لَا نَبْتَغِي الْجَاهِلِينَ
వారు ఏదైనా పనికిమాలిన విషయం విన్నప్పుడు, వినీవిననట్లుగా తరలిపోతారు. “మా కర్మలు మావి. మీ కర్మలు మీవి. అయ్యా! మీకో సలాం. అజ్ఞానులతో వాదించదలచుకోలేదు” అని చెప్పేస్తారు.
28:56 إِنَّكَ لَا تَهْدِي مَنْ أَحْبَبْتَ وَلَٰكِنَّ اللَّهَ يَهْدِي مَن يَشَاءُ ۚ وَهُوَ أَعْلَمُ بِالْمُهْتَدِينَ
(ఓ ప్రవక్తా!) నువ్వు కోరిన వారినల్లా సన్మార్గానికి తేలేవు. అయితే అల్లాహ్ తాను కోరిన వారిని సన్మార్గానికి తీసుకువస్తాడు. సన్మార్గానికి రాగలిగేవారెవరో ఆయనకు బాగా తెలుసు.
28:57 وَقَالُوا إِن نَّتَّبِعِ الْهُدَىٰ مَعَكَ نُتَخَطَّفْ مِنْ أَرْضِنَا ۚ أَوَلَمْ نُمَكِّن لَّهُمْ حَرَمًا آمِنًا يُجْبَىٰ إِلَيْهِ ثَمَرَاتُ كُلِّ شَيْءٍ رِّزْقًا مِّن لَّدُنَّا وَلَٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ
“మేమే గనక నీతో చేరి సన్మార్గాన్ని అనుసరిస్తే మా భూభాగం నుంచి మేము తరిమివేయబడటం ఖాయం” అని వారు గగ్గోలు చెందసాగారు. ఏమిటి? మేము వారికి సురక్షితమైన, పవిత్రమైన చోట స్థిరనివాసం కల్పించలేదా? అక్కడ వారికి అన్ని రకాల పండ్లు ఫలాలు ఉపాధి రూపంలో మావద్ద నుంచి సరఫరా చేయబడలేదా? కాని వారిలోని చాలా మంది (ఈ యదార్థాన్ని) తెలుసుకోరు.
28:58 وَكَمْ أَهْلَكْنَا مِن قَرْيَةٍ بَطِرَتْ مَعِيشَتَهَا ۖ فَتِلْكَ مَسَاكِنُهُمْ لَمْ تُسْكَن مِّن بَعْدِهِمْ إِلَّا قَلِيلًا ۖ وَكُنَّا نَحْنُ الْوَارِثِينَ
ఇంకా మేము, భోగభాగ్యాల మూలంగా మిడిసిపడే ఎన్నో జనవాసాలను తుదముట్టించాము. అవిగో, అవే వారి నివాస స్థలాలు! వారి తదనంతరం చాలా కొద్దిమంది మాత్రమే అక్కడ ఉండగలిగారు. ఆఖరికి అన్నింటికీ వారసులం అయ్యేది మేమే సుమా!
28:59 وَمَا كَانَ رَبُّكَ مُهْلِكَ الْقُرَىٰ حَتَّىٰ يَبْعَثَ فِي أُمِّهَا رَسُولًا يَتْلُو عَلَيْهِمْ آيَاتِنَا ۚ وَمَا كُنَّا مُهْلِكِي الْقُرَىٰ إِلَّا وَأَهْلُهَا ظَالِمُونَ
జనవాసాల ముఖ్య పట్టణంలో తన ఆయతులను చదివి వినిపించే ప్రవక్తను పంపనంతవరకూ నీ ప్రభువు ఏ జనవాసాన్నీ (ఊరకే) నాశనం చేయడు. జనవాసాలలోని వారు దౌర్జన్య కాండకు ఒడిగట్టినప్పుడు మాత్రమే మేము వాటిని అంత మొందిస్తాము.
28:60 وَمَا أُوتِيتُم مِّن شَيْءٍ فَمَتَاعُ الْحَيَاةِ الدُّنْيَا وَزِينَتُهَا ۚ وَمَا عِندَ اللَّهِ خَيْرٌ وَأَبْقَىٰ ۚ أَفَلَا تَعْقِلُونَ
మీకు ఏదైతే ఇవ్వబడిందో అది (అశాశ్వితమైన) ప్రాపంచిక జీవిత సామగ్రి, దాని పైపూత (అలంకరణ) మాత్రమే. అయితే అల్లాహ్ వద్ద ఉన్నది అత్యుత్తమమైనది, శాశ్వితమైనదీను. ఏమిటి, మీరు ఆ మాత్రం గ్రహించరా?
28:61 أَفَمَن وَعَدْنَاهُ وَعْدًا حَسَنًا فَهُوَ لَاقِيهِ كَمَن مَّتَّعْنَاهُ مَتَاعَ الْحَيَاةِ الدُّنْيَا ثُمَّ هُوَ يَوْمَ الْقِيَامَةِ مِنَ الْمُحْضَرِينَ
మేము తనకు చేసిన మంచి వాగ్దానాన్ని పొందిన వ్యక్తీను, మేము ప్రాపంచిక జీవితపు కొన్ని లాభాలను ప్రసాదించిన తరువాత ప్రళయదినాన (శిక్షకై) బంధించి తేబడిన వ్యక్తీను – ఇద్దరూ ఒక్కటవుతారా?
28:62 وَيَوْمَ يُنَادِيهِمْ فَيَقُولُ أَيْنَ شُرَكَائِيَ الَّذِينَ كُنتُمْ تَزْعُمُونَ
ఆ రోజు ఆయన వారిని పిలిచి, “మీరు నాకు భాగస్వాములుగా తలపోసినవారెక్కడ?” అని అడుగుతాడు.
28:63 قَالَ الَّذِينَ حَقَّ عَلَيْهِمُ الْقَوْلُ رَبَّنَا هَٰؤُلَاءِ الَّذِينَ أَغْوَيْنَا أَغْوَيْنَاهُمْ كَمَا غَوَيْنَا ۖ تَبَرَّأْنَا إِلَيْكَ ۖ مَا كَانُوا إِيَّانَا يَعْبُدُونَ
ఎవరెవరికి ఈ మాట వర్తిస్తుందో వారిలా జవాబిస్తారు: “మా ప్రభూ! మేము దారి తప్పించింది ఇదిగో వీళ్ళనే. మేము దారి తప్పినట్లుగానే వీళ్ళను కూడా దారి తప్పించాము. ఇక వాళ్ళతో మాకెలాంటి సంబంధం లేదని నీ సమక్షంలో ప్రకటిస్తున్నాము. వీళ్లు మమ్మల్ని పూజించేవారు కారు.”
28:64 وَقِيلَ ادْعُوا شُرَكَاءَكُمْ فَدَعَوْهُمْ فَلَمْ يَسْتَجِيبُوا لَهُمْ وَرَأَوُا الْعَذَابَ ۚ لَوْ أَنَّهُمْ كَانُوا يَهْتَدُونَ
“మీరు మీ ‘భాగస్వాములను’ పిలుచుకోండి” అని వారితో అనబడుతుంది. వారు వారిని (తమ భాగస్వాములను) పిలుస్తారు. కాని వారు కనీసం వారికి సమాధానం కూడా ఇవ్వరు. మరి వారంతా శిక్షను చూస్తారు. వారు సన్మార్గం పొంది ఉంటే ఎంత బావుండేది!
28:65 وَيَوْمَ يُنَادِيهِمْ فَيَقُولُ مَاذَا أَجَبْتُمُ الْمُرْسَلِينَ
ఆ రోజు (అల్లాహ్) వారిని పిలిచి, “ఇంతకీ మీరు ప్రవక్తలకు ఏం సమాధానమిచ్చారు?” అని అడుగుతాడు.
28:66 فَعَمِيَتْ عَلَيْهِمُ الْأَنبَاءُ يَوْمَئِذٍ فَهُمْ لَا يَتَسَاءَلُونَ
మరి ఆ రోజు వారి నిదర్శనాలన్నీ మాయమయిపోతాయి. వారు పరస్పరం ఏమీ అడగనూ లేరు.
28:67 فَأَمَّا مَن تَابَ وَآمَنَ وَعَمِلَ صَالِحًا فَعَسَىٰ أَن يَكُونَ مِنَ الْمُفْلِحِينَ
అయితే ఎవరు పశ్చాత్తాపం చెంది, విశ్వసించి, సదాచరణ చేస్తారో వారు సాఫల్యం పొందేవారిలో చేరే అవకాశం ఎంతైనా ఉందని ఆశించవచ్చు.
28:68 وَرَبُّكَ يَخْلُقُ مَا يَشَاءُ وَيَخْتَارُ ۗ مَا كَانَ لَهُمُ الْخِيَرَةُ ۚ سُبْحَانَ اللَّهِ وَتَعَالَىٰ عَمَّا يُشْرِكُونَ
నీ ప్రభువు తాను కోరిన దాన్ని సృష్టిస్తాడు, తాను కోరిన వారిని ఎంపిక చేసుకుంటాడు. వారిలో ఎవరికీ ఎటువంటి అధికారం లేదు. అల్లాహ్ పరమ పవిత్రుడు. వారు కల్పించే భాగస్వామ్యాలన్నింటికీ ఆయన అతీతుడు, ఉన్నతుడు.
28:69 وَرَبُّكَ يَعْلَمُ مَا تُكِنُّ صُدُورُهُمْ وَمَا يُعْلِنُونَ
వారి హృదయాలలో దాగి ఉండేదీ, వారు బయటపెట్టేది – అంతా నీ ప్రభువుకు తెలుసు.
28:70 وَهُوَ اللَّهُ لَا إِلَٰهَ إِلَّا هُوَ ۖ لَهُ الْحَمْدُ فِي الْأُولَىٰ وَالْآخِرَةِ ۖ وَلَهُ الْحُكْمُ وَإِلَيْهِ تُرْجَعُونَ
ఆయనే అల్లాహ్. ఆయన తప్ప వేరొకరెవరూ ఆరాధనకు అర్హులు కారు. ఆదిలోనూ, అంతంలోనూ ఆయనే స్తుతింపదగిన వాడు. శాసించే అధికారం కూడా ఆయనకే చెల్లుతుంది. (ఎట్టకేలకు) మీరంతా ఆయన వైపుకే మరలించబడతారు.
28:71 قُلْ أَرَأَيْتُمْ إِن جَعَلَ اللَّهُ عَلَيْكُمُ اللَّيْلَ سَرْمَدًا إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ مَنْ إِلَٰهٌ غَيْرُ اللَّهِ يَأْتِيكُم بِضِيَاءٍ ۖ أَفَلَا تَسْمَعُونَ
(ఓ ప్రవక్తా!) వారిని అడుగు : “చూడండి! ఒకవేళ అల్లాహ్ ప్రళయదినం వరకూ మీపై రాత్రిని – శాశ్వతంగా – ఆవరింపజేస్తే, అట్టి పరిస్థితిలో అల్లాహ్ తప్ప మీ వద్దకు (పగటి) వెలుతురును తెచ్చే దేముడు ఎవడున్నాడు? మరి మీరు వినరేమిటి?”
28:72 قُلْ أَرَأَيْتُمْ إِن جَعَلَ اللَّهُ عَلَيْكُمُ النَّهَارَ سَرْمَدًا إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ مَنْ إِلَٰهٌ غَيْرُ اللَّهِ يَأْتِيكُم بِلَيْلٍ تَسْكُنُونَ فِيهِ ۖ أَفَلَا تُبْصِرُونَ
(ఓ ప్రవక్తా!) వారిని అడుగు: “చూడండి! ఒకవేళ అల్లాహ్ ప్రళయదినం వరకూ మీపై పగలును – శాశ్వతంగా – విధించినట్లయితే అప్పుడైనా అల్లాహ్ తప్ప మీ వద్దకు – మీరు విశ్రాంతిని పొందేందుకు రాత్రిని తేగల దేవుడెవడు? మరి మీరు గమనించరేమిటి?”
28:73 وَمِن رَّحْمَتِهِ جَعَلَ لَكُمُ اللَّيْلَ وَالنَّهَارَ لِتَسْكُنُوا فِيهِ وَلِتَبْتَغُوا مِن فَضْلِهِ وَلَعَلَّكُمْ تَشْكُرُونَ
ఆయనే తన కృపతో మీకోసం రేయింబవళ్ళను చేశాడు – మీరు రాత్రిపూట విశ్రాంతిని పొందటానికి, పగటిపూట ఆయన అనుగ్రహాన్ని అన్వేషించటానికీను! మీరు కృతజ్ఞులుగా వ్యవహరిస్తారనే ఇదంతా చేయబడింది.
28:74 وَيَوْمَ يُنَادِيهِمْ فَيَقُولُ أَيْنَ شُرَكَائِيَ الَّذِينَ كُنتُمْ تَزْعُمُونَ
ఆ రోజు ఆయన వారిని పిలిచి, “మీరు ఎవరెవరిని నా భాగస్వాములుగా తలపోసేవారో వారెక్కడ?” అని అడుగుతాడు.
28:75 وَنَزَعْنَا مِن كُلِّ أُمَّةٍ شَهِيدًا فَقُلْنَا هَاتُوا بُرْهَانَكُمْ فَعَلِمُوا أَنَّ الْحَقَّ لِلَّهِ وَضَلَّ عَنْهُم مَّا كَانُوا يَفْتَرُونَ
ఇంకా, మేము ప్రతి మానవ సముదాయం నుంచి ఒక్కో సాక్షిని తీసుకుంటాము. ఆ తరువాత, “ఏదీ, మీ ప్రమాణాన్ని తీసుకురండి” అని అంటాము. అప్పుడు వారు, సత్యం అల్లాహ్ పక్షానే ఉందని తెలుసుకుంటారు. వారు అల్లే కట్టుకథలన్నీ వారి నుండి మటుమాయమవుతాయి.
28:76 إِنَّ قَارُونَ كَانَ مِن قَوْمِ مُوسَىٰ فَبَغَىٰ عَلَيْهِمْ ۖ وَآتَيْنَاهُ مِنَ الْكُنُوزِ مَا إِنَّ مَفَاتِحَهُ لَتَنُوءُ بِالْعُصْبَةِ أُولِي الْقُوَّةِ إِذْ قَالَ لَهُ قَوْمُهُ لَا تَفْرَحْ ۖ إِنَّ اللَّهَ لَا يُحِبُّ الْفَرِحِينَ
చూడబోతే, ఖారూన్ కూడా మూసా జాతికి చెందినవాడే. కాని వాడు తన వారిపైనే దురాగతాలకు పాల్పడసాగాడు. మేము వాడికి ఎంత ఖజానాను ప్రసాదించామంటే దాని తాళపుచెవులను అనేక మంది బలాఢ్యులు కలసి కూడా అతి కష్టమ్మీద ఎత్తగలిగే వారు. ఒకసారి అతని జాతివారు అతన్నుద్దేశించి ఇలా అన్నారు: “మిడిసిపడకు. మిడిసిపడే వారిని అల్లాహ్ ఇష్ట పడడు.
28:77 وَابْتَغِ فِيمَا آتَاكَ اللَّهُ الدَّارَ الْآخِرَةَ ۖ وَلَا تَنسَ نَصِيبَكَ مِنَ الدُّنْيَا ۖ وَأَحْسِن كَمَا أَحْسَنَ اللَّهُ إِلَيْكَ ۖ وَلَا تَبْغِ الْفَسَادَ فِي الْأَرْضِ ۖ إِنَّ اللَّهَ لَا يُحِبُّ الْمُفْسِدِينَ
“అల్లాహ్ నీకు ప్రసాదించిన దానితో పరలోక స్థానాన్ని కూడా అన్వేషించు. మరి నీ ప్రాపంచిక భాగాన్ని కూడా మరువబోకు. అల్లాహ్ నీకు ఏ విధంగా మేలు చేశాడో అదేవిధంగా నువ్వు కూడా (ప్రజల పట్ల) సద్వ్యవహారం చెయ్యి. భువిలో అరాచకం కోసం ఆరాటపడకు. అరాచకం సృష్టించగోరే వారిని అల్లాహ్ ఎంతమాత్రం ఇష్టపడడు.”
28:78 قَالَ إِنَّمَا أُوتِيتُهُ عَلَىٰ عِلْمٍ عِندِي ۚ أَوَلَمْ يَعْلَمْ أَنَّ اللَّهَ قَدْ أَهْلَكَ مِن قَبْلِهِ مِنَ الْقُرُونِ مَنْ هُوَ أَشَدُّ مِنْهُ قُوَّةً وَأَكْثَرُ جَمْعًا ۚ وَلَا يُسْأَلُ عَن ذُنُوبِهِمُ الْمُجْرِمُونَ
“ఇదంతా నాకున్న ప్రజ్ఞాపాటవాల మూలంగానే నాకు వొసగబడింద”ని వాడు (ఖారూన్) చెప్పాడు. ఏమిటి, ఇతనికి మునుపు ఇతనికన్నా ఎక్కువ బలవంతులను, మూలధనాన్ని ప్రోగు చేసిన వారినెంతో మందిని అల్లాహ్ అంతమొందించాడన్న సంగతి ఇతనికి తెలియదా? అట్టి పరిస్థితిలో పాపాత్ములను వారి పాపాల గురించి అడగటం జరగదు.
28:79 فَخَرَجَ عَلَىٰ قَوْمِهِ فِي زِينَتِهِ ۖ قَالَ الَّذِينَ يُرِيدُونَ الْحَيَاةَ الدُّنْيَا يَا لَيْتَ لَنَا مِثْلَ مَا أُوتِيَ قَارُونُ إِنَّهُ لَذُو حَظٍّ عَظِيمٍ
మరి వాడు అంగరంగ వైభవంతో తన జాతి జనులలోకి కదలి వచ్చాడు. అప్పుడు ప్రాపంచిక జీవితాన్ని కోరుకునే వారు, “ఖారూనుకు ప్రసాదించబడినదే మాకు కూడా లభిస్తే ఎంత బాగుండును! నిజంగా ఇతను గొప్ప భాగ్యవంతుడు” అన్నారు.
28:80 وَقَالَ الَّذِينَ أُوتُوا الْعِلْمَ وَيْلَكُمْ ثَوَابُ اللَّهِ خَيْرٌ لِّمَنْ آمَنَ وَعَمِلَ صَالِحًا وَلَا يُلَقَّاهَا إِلَّا الصَّابِرُونَ
అప్పుడు (ధర్మ) జ్ఞానం వొసగబడిన వారు వారిని బోధపరుస్తూ ఇలా అన్నారు: (మీ పరిస్థితి) కడు శోచనీయం! పుణ్యం రూపంలో అల్లాహ్ ఇచ్చేదే విశ్వసించి, సదాచరణ చేసే వారి కొరకు మేలైనది సుమా! అయితే ఈ విషయం (భాగ్యం) సహనశీలురైన వారికే ప్రాప్తిస్తుంది.”
28:81 فَخَسَفْنَا بِهِ وَبِدَارِهِ الْأَرْضَ فَمَا كَانَ لَهُ مِن فِئَةٍ يَنصُرُونَهُ مِن دُونِ اللَّهِ وَمَا كَانَ مِنَ الْمُنتَصِرِينَ
(ఎట్టకేలకు) మేమతన్ని, అతని నిలయాన్ని నేలలో కూర్చివేశాము. అప్పుడు అల్లాహ్ బారి నుంచి అతన్ని ఆదుకోవటానికి ఏ సమూహమూ లేకపోయింది. మరి వాడు సయితం తనకు ఏ సాయమూ చేసుకోలేకపోయాడు.
28:82 وَأَصْبَحَ الَّذِينَ تَمَنَّوْا مَكَانَهُ بِالْأَمْسِ يَقُولُونَ وَيْكَأَنَّ اللَّهَ يَبْسُطُ الرِّزْقَ لِمَن يَشَاءُ مِنْ عِبَادِهِ وَيَقْدِرُ ۖ لَوْلَا أَن مَّنَّ اللَّهُ عَلَيْنَا لَخَسَفَ بِنَا ۖ وَيْكَأَنَّهُ لَا يُفْلِحُ الْكَافِرُونَ
నిన్నటి రోజున అతని స్థాయికి చేరుకోవాలని కాంక్షించిన వారంతా నేటి ఉదయం ఇలా చెప్పుకున్నారు : “ఆహ్! అల్లాహ్ తన దాసులలో తాను కోరినవారి ఉపాధిని విస్తృతపరుస్తాడు. మరి తాను కోరిన వారికి కుంచింపజేస్తాడు. అల్లాహ్ కృపయే గనక మాపై లేకుండాపోతే ఆయన మమ్మల్ని కూడా నేలలో కూర్చివేసి ఉండేవాడే. దేవుని మేళ్లను మరచినవారెన్నటికీ సాఫల్యం పొందలేరన్న సంగతిని మీరు గమనించటం లేదా?”
28:83 تِلْكَ الدَّارُ الْآخِرَةُ نَجْعَلُهَا لِلَّذِينَ لَا يُرِيدُونَ عُلُوًّا فِي الْأَرْضِ وَلَا فَسَادًا ۚ وَالْعَاقِبَةُ لِلْمُتَّقِينَ
ఎవరు భువిలో బడాయిని ప్రదర్శించకుండా, కల్లోలాన్ని రేకెత్తించకుండా ఉంటారో వారి కోసమే మేము ఈ పరలోక నెలవును ప్రత్యేకించాము. సత్ఫలితం భయభక్తులు గల వారి కొరకే సుమా!
28:84 مَن جَاءَ بِالْحَسَنَةِ فَلَهُ خَيْرٌ مِّنْهَا ۖ وَمَن جَاءَ بِالسَّيِّئَةِ فَلَا يُجْزَى الَّذِينَ عَمِلُوا السَّيِّئَاتِ إِلَّا مَا كَانُوا يَعْمَلُونَ
(తీర్పుదినాన) మంచిని తెచ్చిన వానికి, దానికన్నా మేలైనది లభిస్తుంది. ఇక చెడును తెచ్చినవారికి; వారి చెడు కర్మ మేరకే ప్రతిఫలం ఇవ్వబడుతుంది.
28:85 إِنَّ الَّذِي فَرَضَ عَلَيْكَ الْقُرْآنَ لَرَادُّكَ إِلَىٰ مَعَادٍ ۚ قُل رَّبِّي أَعْلَمُ مَن جَاءَ بِالْهُدَىٰ وَمَنْ هُوَ فِي ضَلَالٍ مُّبِينٍ
(ఓ ప్రవక్తా!) నీపై ఖుర్ఆన్ను అవతరింపజేసినవాడు నిన్ను తిరిగి పూర్వస్థలానికి చేర్చనున్నాడు. ఈ విధంగా చెప్పు: సన్మార్గాన్ని తీసుకువచ్చిన వారెవరో నా ప్రభువుకు బాగా తెలుసు. స్పష్టమైన అపమార్గంలో పడిఉన్నదెవరో కూడా ఆయనకు తెలుసు.”
28:86 وَمَا كُنتَ تَرْجُو أَن يُلْقَىٰ إِلَيْكَ الْكِتَابُ إِلَّا رَحْمَةً مِّن رَّبِّكَ ۖ فَلَا تَكُونَنَّ ظَهِيرًا لِّلْكَافِرِينَ
నీ వద్దకు గ్రంథం పంపబడుతుందని నువ్వు కనీసం ఊహించనైనా లేదు. అయితే నీ ప్రభువు దయవల్ల (ఇది నీ వద్దకు పంపబడింది). కాబట్టి ఇక నువ్వు అవిశ్వాసులకు సహాయకుడవు కారాదు.
28:87 وَلَا يَصُدُّنَّكَ عَنْ آيَاتِ اللَّهِ بَعْدَ إِذْ أُنزِلَتْ إِلَيْكَ ۖ وَادْعُ إِلَىٰ رَبِّكَ ۖ وَلَا تَكُونَنَّ مِنَ الْمُشْرِكِينَ
అల్లాహ్ ఆయతులు నీవద్దకు పంపబడిన తరువాత వారు (ఈ అవిశ్వాసులు) నిన్ను దైవాదేశాల (ప్రచారం) నుండి ఆపరాదు సుమా! కనుక నువ్వు నీ ప్రభువు వైపునకు పిలుస్తూ ఉండు. షిర్క్ చేసేవారిలో చేరిపోకు.
28:88 وَلَا تَدْعُ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ ۘ لَا إِلَٰهَ إِلَّا هُوَ ۚ كُلُّ شَيْءٍ هَالِكٌ إِلَّا وَجْهَهُ ۚ لَهُ الْحُكْمُ وَإِلَيْهِ تُرْجَعُونَ
అల్లాహ్‌తో పాటు మరే దేవుణ్ణీ మొరపెట్టుకోకు. ఆయన తప్ప మరే ఆరాధ్యుడూ లేడు. ఆయన ముఖం తప్ప ప్రతిదీ నశించిపోయేదే. ఆజ్ఞాపించే అధికారం ఆయనకే చెల్లు. మీరంతా ఆయన వద్దకే మరలించబడతారు.
29. సూరా అల్ అన్ కబూత్ (Al-Ankabut)
29:1 الم
అలిఫ్ – లామ్ – మీమ్.
29:2 أَحَسِبَ النَّاسُ أَن يُتْرَكُوا أَن يَقُولُوا آمَنَّا وَهُمْ لَا يُفْتَنُونَ
“మేము విశ్వసించాము” అని చెప్పినంత మాత్రాన తాము ఇట్టే వదలి వేయబడతామనీ, తాము పరీక్షింపబడమని ప్రజలు అనుకుంటున్నారా?
29:3 وَلَقَدْ فَتَنَّا الَّذِينَ مِن قَبْلِهِمْ ۖ فَلَيَعْلَمَنَّ اللَّهُ الَّذِينَ صَدَقُوا وَلَيَعْلَمَنَّ الْكَاذِبِينَ
వారి పూర్వీకులను కూడా మేము బాగా పరీక్షించాము. వీరిలో సత్యవంతులెవరో, అసత్యవాదులెవరో నిశ్చయంగా అల్లాహ్ తెలుసుకుంటాడు.
29:4 أَمْ حَسِبَ الَّذِينَ يَعْمَلُونَ السَّيِّئَاتِ أَن يَسْبِقُونَا ۚ سَاءَ مَا يَحْكُمُونَ
దుష్కార్యాలకు పాల్పడేవారు, మా అదుపు నుండి తప్పించుకుని పోగలమని భావిస్తున్నారా ఏమిటీ? ఎటువంటి చెడ్డ తీర్మానాలు చేసుకుంటున్నారు వారు!
29:5 مَن كَانَ يَرْجُو لِقَاءَ اللَّهِ فَإِنَّ أَجَلَ اللَّهِ لَآتٍ ۚ وَهُوَ السَّمِيعُ الْعَلِيمُ
అల్లాహ్‌ను కలుసుకోవాలని ఆశిస్తున్న వారెవరయినాసరే అల్లాహ్ నిర్థారించిన ఆ ఘడియ తప్పక రానున్నది (అని వారు గ్రహించాలి). ఆయన అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు.
29:6 وَمَن جَاهَدَ فَإِنَّمَا يُجَاهِدُ لِنَفْسِهِ ۚ إِنَّ اللَّهَ لَغَنِيٌّ عَنِ الْعَالَمِينَ
సాధన చేసే ప్రతి ఒక్కడూ తన (స్వయం) కోసమే సాధన చేస్తున్నాడు. నిశ్చయంగా అల్లాహ్ లోకవాసుల అక్కర లేనివాడు.
29:7 وَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ لَنُكَفِّرَنَّ عَنْهُمْ سَيِّئَاتِهِمْ وَلَنَجْزِيَنَّهُمْ أَحْسَنَ الَّذِي كَانُوا يَعْمَلُونَ
ఎవరయితే విశ్వసించి, (సున్నత్ ప్రకారం) మంచి పనులు చేస్తారో వారి నుంచి మేము వారి పాపాలను దూరం చేస్తాము. వారు చేసిన సత్కర్మలకుగాను వారికి అత్యుత్తమ ప్రతిఫలం ఇస్తాము.
29:8 وَوَصَّيْنَا الْإِنسَانَ بِوَالِدَيْهِ حُسْنًا ۖ وَإِن جَاهَدَاكَ لِتُشْرِكَ بِي مَا لَيْسَ لَكَ بِهِ عِلْمٌ فَلَا تُطِعْهُمَا ۚ إِلَيَّ مَرْجِعُكُمْ فَأُنَبِّئُكُم بِمَا كُنتُمْ تَعْمَلُونَ
తన తల్లిదండ్రుల యెడల ఉత్తమంగా మెలగాలని మేము మానవునికి తాకీదు చేశాము. అయితే వారు గనక నీకు తెలియని వాటిని, నాకు సాటిగా కల్పించమని నీపై ఒత్తిడి తీసుకువస్తే మటుకు, వారి మాట వినకు. మీరంతా నా వద్దకే మరలి రావలసి ఉంది. అప్పుడు నేను మీరు చేసే పనుల (వాస్తవికత)ను మీకు తెలియజేస్తాను.
29:9 وَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ لَنُدْخِلَنَّهُمْ فِي الصَّالِحِينَ
మరెవరయితే విశ్వసించి, సత్కార్యాలు చేశారో వారిని మేము సజ్జను(లైన మా దాసు)లలో చేర్చుకుంటాము.
29:10 وَمِنَ النَّاسِ مَن يَقُولُ آمَنَّا بِاللَّهِ فَإِذَا أُوذِيَ فِي اللَّهِ جَعَلَ فِتْنَةَ النَّاسِ كَعَذَابِ اللَّهِ وَلَئِن جَاءَ نَصْرٌ مِّن رَّبِّكَ لَيَقُولُنَّ إِنَّا كُنَّا مَعَكُمْ ۚ أَوَلَيْسَ اللَّهُ بِأَعْلَمَ بِمَا فِي صُدُورِ الْعَالَمِينَ
జనులలో కొందరు, “మేము అల్లాహ్‌ను విశ్వసించాము” అని (పైకి) మాత్రం చెబుతారు. కాని అల్లాహ్ మార్గంలో ఏదైనా బాధ కలిగినప్పుడు, ప్రజల తరఫున పెట్టబడిన బాధను ‘దైవ శిక్ష’గా తలపోస్తారు. మరి నీ ప్రభువు తరఫున తోడ్పాటు అందితే మాత్రం, “మేమూ మీతోనే ఉన్నామండీ!” అని అంటారు. లోకవాసుల ఆంతర్యాలలో ఏముందో అల్లాహ్‌కు తెలియదా ఏమిటి?
29:11 وَلَيَعْلَمَنَّ اللَّهُ الَّذِينَ آمَنُوا وَلَيَعْلَمَنَّ الْمُنَافِقِينَ
సిసలైన విశ్వాసులెవరో అల్లాహ్ తేల్చుతాడు, ఇంకా కపటులెవరో కూడా ఆయన తప్పకుండా తెలుసుకుంటాడు.
29:12 وَقَالَ الَّذِينَ كَفَرُوا لِلَّذِينَ آمَنُوا اتَّبِعُوا سَبِيلَنَا وَلْنَحْمِلْ خَطَايَاكُمْ وَمَا هُم بِحَامِلِينَ مِنْ خَطَايَاهُم مِّن شَيْءٍ ۖ إِنَّهُمْ لَكَاذِبُونَ
అవిశ్వాసులు విశ్వసించినవారితో, “మీరు మా మార్గాన్ని అనుసరించండి. మీ పాపాలను మేము మోస్తాం” అని అన్నారు. వాస్తవానికి వీళ్ళ పాపాలలో దేన్నీ వారు మోయరు. వారు పచ్చి అబద్ధాలకోరులు.
29:13 وَلَيَحْمِلُنَّ أَثْقَالَهُمْ وَأَثْقَالًا مَّعَ أَثْقَالِهِمْ ۖ وَلَيُسْأَلُنَّ يَوْمَ الْقِيَامَةِ عَمَّا كَانُوا يَفْتَرُونَ
కాకపోతే, వారు తమ (పాపాల) బరువును మాత్రం మోస్తారు. తమ బరువులతో పాటు మరిన్ని బరువులు కూడా మోస్తారు. ఇంకా – వారు కల్పించే అభూత కల్పనలను గురించి ప్రళయ దినాన వారిని తప్పకుండా ప్రశ్నించటం జరుగుతుంది.
29:14 وَلَقَدْ أَرْسَلْنَا نُوحًا إِلَىٰ قَوْمِهِ فَلَبِثَ فِيهِمْ أَلْفَ سَنَةٍ إِلَّا خَمْسِينَ عَامًا فَأَخَذَهُمُ الطُّوفَانُ وَهُمْ ظَالِمُونَ
మేము నూహు (అలైహిస్సలాం)ను అతని జాతి వైపునకు పంపాము. అతను వారిమధ్య యాభై తక్కువ వెయ్యి సంవత్సరాలు ఉన్నాడు. ఆ తరువాత వారిని తుఫాను ముట్టడించింది. (ఎందుకంటే) వారు దుర్మార్గులుగా ఉన్నారు.
29:15 فَأَنجَيْنَاهُ وَأَصْحَابَ السَّفِينَةِ وَجَعَلْنَاهَا آيَةً لِّلْعَالَمِينَ
మరి మేము అతన్ని, ఓడలోని వారినీ కాపాడాము. ఇంకా ఆ సంఘటనను మేము సమస్త లోకవాసులకు (గుణపాఠం గరిపే) సూచనగా చేశాము.
29:16 وَإِبْرَاهِيمَ إِذْ قَالَ لِقَوْمِهِ اعْبُدُوا اللَّهَ وَاتَّقُوهُ ۖ ذَٰلِكُمْ خَيْرٌ لَّكُمْ إِن كُنتُمْ تَعْلَمُونَ
మరి ఇబ్రాహీం (అలైహిస్సలాం) కూడా తన జాతి వారినుద్దేశించి ఇలా అన్నాడు : “అల్లాహ్‌ను ఆరాధించండి. ఆయనకు భయపడుతూ ఉండండి. మీరు గనక గ్రహించగలిగితే ఇదే మీ కొరకు మేలైనది.
29:17 إِنَّمَا تَعْبُدُونَ مِن دُونِ اللَّهِ أَوْثَانًا وَتَخْلُقُونَ إِفْكًا ۚ إِنَّ الَّذِينَ تَعْبُدُونَ مِن دُونِ اللَّهِ لَا يَمْلِكُونَ لَكُمْ رِزْقًا فَابْتَغُوا عِندَ اللَّهِ الرِّزْقَ وَاعْبُدُوهُ وَاشْكُرُوا لَهُ ۖ إِلَيْهِ تُرْجَعُونَ
“మీరు అల్లాహ్‌ను వదలి ఈ విగ్రహాలను పూజిస్తున్నారే! మీ అంతట మీరు అసత్యాలను అల్లుతున్నారు. వినండి! అల్లాహ్‌ను కాదని మీరు వేటినయితే పూజిస్తున్నారో, మీకు ఉపాధిని సమకూర్చే అధికారం వాటికి లేదు. కాబట్టి జీవనోపాధి కోసం మీరు దైవసమక్షంలోనే అర్థించండి. ఆయన్ని మాత్రమే ఆరాధించండి, ఆయనకే కృతజ్ఞతలు చెల్లించండి. ఎట్టకేలకు మీరు ఆయన వద్దకే మరలించబడతారు.
29:18 وَإِن تُكَذِّبُوا فَقَدْ كَذَّبَ أُمَمٌ مِّن قَبْلِكُمْ ۖ وَمَا عَلَى الرَّسُولِ إِلَّا الْبَلَاغُ الْمُبِينُ
“ఒకవేళ మీరు ధిక్కరించే పక్షంలో మీకు పూర్వం గతించిన సమాజాలు కూడా ధిక్కరించాయి (అన్న సంగతిని మరువకండి). విషయాన్ని స్పష్టంగా అందజేయటం వరకే ప్రవక్త బాధ్యత.”
29:19 أَوَلَمْ يَرَوْا كَيْفَ يُبْدِئُ اللَّهُ الْخَلْقَ ثُمَّ يُعِيدُهُ ۚ إِنَّ ذَٰلِكَ عَلَى اللَّهِ يَسِيرٌ
అల్లాహ్ ఏ విధంగా సృష్టిని మొదలెడుతున్నాడో వారు చూడటం లేదా? మరి ఆయనే దాన్ని పునరావృతం చేస్తాడు. ఇలా చేయటం అల్లాహ్‌కు చాలా తేలిక.
29:20 قُلْ سِيرُوا فِي الْأَرْضِ فَانظُرُوا كَيْفَ بَدَأَ الْخَلْقَ ۚ ثُمَّ اللَّهُ يُنشِئُ النَّشْأَةَ الْآخِرَةَ ۚ إِنَّ اللَّهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
వారికి చెప్పు : “భువిలో సంచరించండి. అల్లాహ్ ఏ విధంగా సృష్టిని మొదలెట్టాడో కాస్త చూడండి! మరి అల్లాహ్‌యే మలిసారి పునరుజ్జీవనం కూడా ప్రసాదిస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ అన్నింటిపై అధికారం గలవాడు.”
29:21 يُعَذِّبُ مَن يَشَاءُ وَيَرْحَمُ مَن يَشَاءُ ۖ وَإِلَيْهِ تُقْلَبُونَ
తాను కోరిన వారిని ఆయన శిక్షిస్తాడు, తాను కోరినవారిని కనికరిస్తాడు. అందరూ ఆయన వైపునకే మరలించబడతారు.
29:22 وَمَا أَنتُم بِمُعْجِزِينَ فِي الْأَرْضِ وَلَا فِي السَّمَاءِ ۖ وَمَا لَكُم مِّن دُونِ اللَّهِ مِن وَلِيٍّ وَلَا نَصِيرٍ
మీరు భూమిలోగానీ, ఆకాశంలోగానీ అల్లాహ్‌ను అశక్తుణ్ణి చేయలేరు సుమా! అల్లాహ్ తప్ప మీకు మరో సంరక్షకుడు గానీ, సహాయకుడుగానీ లేడు.
29:23 وَالَّذِينَ كَفَرُوا بِآيَاتِ اللَّهِ وَلِقَائِهِ أُولَٰئِكَ يَئِسُوا مِن رَّحْمَتِي وَأُولَٰئِكَ لَهُمْ عَذَابٌ أَلِيمٌ
ఎవరయితే అల్లాహ్ ఆయతులను, ఆయనను కలవటాన్ని త్రోసిపుచ్చుతారో వారే నా కారుణ్యం పట్ల ఆశ వదులుకున్న వారు. వారికోసం బాధాకరమైన శిక్ష ఉంది.
29:24 فَمَا كَانَ جَوَابَ قَوْمِهِ إِلَّا أَن قَالُوا اقْتُلُوهُ أَوْ حَرِّقُوهُ فَأَنجَاهُ اللَّهُ مِنَ النَّارِ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّقَوْمٍ يُؤْمِنُونَ
మరి అతని (ఇబ్రాహీము) జాతివారు, “ఇతన్ని చంపేయండి లేదా ఇతన్ని కాల్చేయండి” అని అన్నారు. అంతకుమించి వారి దగ్గర ఏ సమాధానమూ లేకపోయింది. ఎట్టకేలకు అల్లాహ్ అతన్ని అగ్ని నుంచి కాపాడాడు. విశ్వసించే జనుల కోసం ఇందులో ఎన్నో సూచనలున్నాయి.
29:25 وَقَالَ إِنَّمَا اتَّخَذْتُم مِّن دُونِ اللَّهِ أَوْثَانًا مَّوَدَّةَ بَيْنِكُمْ فِي الْحَيَاةِ الدُّنْيَا ۖ ثُمَّ يَوْمَ الْقِيَامَةِ يَكْفُرُ بَعْضُكُم بِبَعْضٍ وَيَلْعَنُ بَعْضُكُم بَعْضًا وَمَأْوَاكُمُ النَّارُ وَمَا لَكُم مِّن نَّاصِرِينَ
(ఇబ్రాహీము వారితో) ఇలా అన్నాడు: “మీరు అల్లాహ్‌ను వదలి విగ్రహాలను ఆశ్రయించారు. మీ పరస్పర ప్రాపంచిక స్నేహసంబంధాల ప్రాతిపదికపైన్నే మీరు (ఇదంతా) కల్పించుకున్నారు. కాని ప్రళయదినాన మీరంతా ఒండొకరిని తిరస్కరిస్తారు. ఒకరినొకరు శపించుకుంటారు. నరకాగ్ని మీ నివాసమవుతుంది. (అక్కడ) మిమ్మల్ని ఆదుకునే వాడెవడూ ఉండడు.”
29:26 فَآمَنَ لَهُ لُوطٌ ۘ وَقَالَ إِنِّي مُهَاجِرٌ إِلَىٰ رَبِّي ۖ إِنَّهُ هُوَ الْعَزِيزُ الْحَكِيمُ
అప్పుడు లూతు (అలైహిస్సలాం) మటుకు అతన్ని విశ్వసించాడు. అతనిలా అన్నాడు: “నేను నా స్వస్థలం నుంచి నా ప్రభువు వైపునకు ప్రస్థానం చేస్తాను. ఆయన గొప్ప శక్తిమంతుడు, వివేకవంతుడు.”
29:27 وَوَهَبْنَا لَهُ إِسْحَاقَ وَيَعْقُوبَ وَجَعَلْنَا فِي ذُرِّيَّتِهِ النُّبُوَّةَ وَالْكِتَابَ وَآتَيْنَاهُ أَجْرَهُ فِي الدُّنْيَا ۖ وَإِنَّهُ فِي الْآخِرَةِ لَمِنَ الصَّالِحِينَ
మరి మేము అతనికి (ఇబ్రాహీముకు) ఇస్హాఖ్, యాఖూబు (అలైహిముస్సలాం) లను ప్రసాదించాము. అతని సంతతిలో మేము ప్రవక్త పదవిని, గ్రంథాన్ని ఉంచాము. మరి మేము అతనికి ప్రపంచంలో కూడా అతని మంచి ప్రతిఫలాన్ని వొసగాము. పరలోకంలో కూడా అతడు సజ్జనులతో చేరి ఉంటాడు.
29:28 وَلُوطًا إِذْ قَالَ لِقَوْمِهِ إِنَّكُمْ لَتَأْتُونَ الْفَاحِشَةَ مَا سَبَقَكُم بِهَا مِنْ أَحَدٍ مِّنَ الْعَالَمِينَ
లూత్ (అలైహిస్సలాం)ను కూడా జ్ఞప్తికి తెచ్చుకోండి. అతను తన జాతి వారినుద్దేశించి ఇలా అన్నాడు : “మీకు పూర్వం లోకవాసులెవరూ చేయని నీతిమాలిన పనికి మీరు పాల్పడుతున్నారే?!
29:29 أَئِنَّكُمْ لَتَأْتُونَ الرِّجَالَ وَتَقْطَعُونَ السَّبِيلَ وَتَأْتُونَ فِي نَادِيكُمُ الْمُنكَرَ ۖ فَمَا كَانَ جَوَابَ قَوْمِهِ إِلَّا أَن قَالُوا ائْتِنَا بِعَذَابِ اللَّهِ إِن كُنتَ مِنَ الصَّادِقِينَ
“ఏమిటి? మీరు పురుషుల వద్దకు పోయి పాడుపని చేస్తారా? దారిని మూసేస్తారా? మీరు మీ సమావేశాల్లోనే (నిస్సిగ్గుగా) నీతిబాహ్యమైన పనులకు ఒడిగడతారా?” దీనికి సమాధానంగా అతని జాతి వారు, “సరే! నువ్వు సత్యవంతుడవే అయితే మాపైకి దైవశిక్షను తీసుకురా!” అని అనటం తప్ప మరేమీ చెప్పలేకపోయారు.
29:30 قَالَ رَبِّ انصُرْنِي عَلَى الْقَوْمِ الْمُفْسِدِينَ
అప్పుడు లూత్, “ప్రభూ! ఈ అల్లరి మూకకు వ్యతిరేకంగా నాకు సహాయపడు” అని అభ్యర్థించాడు.
29:31 وَلَمَّا جَاءَتْ رُسُلُنَا إِبْرَاهِيمَ بِالْبُشْرَىٰ قَالُوا إِنَّا مُهْلِكُو أَهْلِ هَٰذِهِ الْقَرْيَةِ ۖ إِنَّ أَهْلَهَا كَانُوا ظَالِمِينَ
మేము పంపిన దూతలు శుభవార్తను తీసుకుని ఇబ్రాహీము (అలైహిస్సలాం) వద్దకు చేరుకున్నప్పుడు, “ఈ పట్టణ వాసులను మేము నాశనం చేయనున్నాము. నిశ్చయంగా ఇక్కడి వాళ్ళు పరమ దుర్మార్గులుగా తయారయ్యారు” అని చెప్పారు.
29:32 قَالَ إِنَّ فِيهَا لُوطًا ۚ قَالُوا نَحْنُ أَعْلَمُ بِمَن فِيهَا ۖ لَنُنَجِّيَنَّهُ وَأَهْلَهُ إِلَّا امْرَأَتَهُ كَانَتْ مِنَ الْغَابِرِينَ
“కాని అక్కడ లూత్ ఉన్నాడు కదా!” అని (ఇబ్రాహీము) సందేహపడ్డాడు. “అక్కడ ఉన్న వారెవరో మాకు బాగా తెలుసు. మేము అతని భార్యను తప్ప- అతన్ని, అతని ఇంటివారిని కాపాడుతాము. ఆ స్త్రీ మాత్రం వెనుక ఉండిపోయే వారితో చేరుతుంది” అని దైవదూతలు చెప్పారు.
29:33 وَلَمَّا أَن جَاءَتْ رُسُلُنَا لُوطًا سِيءَ بِهِمْ وَضَاقَ بِهِمْ ذَرْعًا وَقَالُوا لَا تَخَفْ وَلَا تَحْزَنْ ۖ إِنَّا مُنَجُّوكَ وَأَهْلَكَ إِلَّا امْرَأَتَكَ كَانَتْ مِنَ الْغَابِرِينَ
మరి మా దూతలు లూత్ (అలైహిస్సలాం) వద్దకు చేరుకున్నప్పుడు, అతను వారిని చూసి ఆందోళన చెందాడు. లోలోపలే కుమిలిపోయాడు. అప్పుడు వారిలా అన్నారు : “నువ్వు భయపడకు. కలత చెందకు. మేము నీ భార్యను తప్ప – నిన్నూ, నీ పరివారాన్నీ కాపాడుతాము. ఎందుకంటే ఆమె (శిక్షను అనుభవించటానికి) వెనుక ఉండిపోయే వారితో చేరుతుంది.”
29:34 إِنَّا مُنزِلُونَ عَلَىٰ أَهْلِ هَٰذِهِ الْقَرْيَةِ رِجْزًا مِّنَ السَّمَاءِ بِمَا كَانُوا يَفْسُقُونَ
“మేము ఈ పట్టణవాసులపై, వారి తిరుగుబాటు ధోరణి కారణంగా ఆకాశం నుంచి శిక్షను అవతరింపజేయనున్నాము.”
29:35 وَلَقَد تَّرَكْنَا مِنْهَا آيَةً بَيِّنَةً لِّقَوْمٍ يَعْقِلُونَ
(ఆ విధంగా) మేము ఆ పట్టణాన్ని బుద్ధిజీవుల కోసం స్పష్టమైన గుణపాఠ సూచనగా చేశాము.
29:36 وَإِلَىٰ مَدْيَنَ أَخَاهُمْ شُعَيْبًا فَقَالَ يَا قَوْمِ اعْبُدُوا اللَّهَ وَارْجُوا الْيَوْمَ الْآخِرَ وَلَا تَعْثَوْا فِي الْأَرْضِ مُفْسِدِينَ
ఇంకా మద్యన్ వైపునకు మేము వారి సోదరుడైన షుఐబు (అలైహిస్సలాం)ను పంపాము. అతనిలా అన్నాడు: “ఓ నా జాతి ప్రజలారా! అల్లాహ్‌ను ఆరాధించండి. అంతిమ దినాన్ని ఆశించండి. భువిలో అలజడిని సృష్టిస్తూ తిరగకండి.”
29:37 فَكَذَّبُوهُ فَأَخَذَتْهُمُ الرَّجْفَةُ فَأَصْبَحُوا فِي دَارِهِمْ جَاثِمِينَ
అయినా వారు ఆయన్ని ధిక్కరించారు. ఎట్టకేలకు భూకంపం వారిని కబళించింది. వాళ్లు తమ ఇండ్లలో- కూర్చున్న వారు కూర్చున్నట్లే (చచ్చి) ఉండిపోయారు.
29:38 وَعَادًا وَثَمُودَ وَقَد تَّبَيَّنَ لَكُم مِّن مَّسَاكِنِهِمْ ۖ وَزَيَّنَ لَهُمُ الشَّيْطَانُ أَعْمَالَهُمْ فَصَدَّهُمْ عَنِ السَّبِيلِ وَكَانُوا مُسْتَبْصِرِينَ
ఆద్, సమూద్ వారిని కూడా మేము తుదముట్టించాము. వారి నివాస స్థలాల గురించి మీకు తెలిసిందే. షైతాను వారికి వారి దురాగతాలను అందమైనవిగా చేసి చూపాడు. వారు నిశిత దృష్టి గల వారైనప్పటికీ (షైతాను) వారిని సన్మార్గం నుంచి అడ్డుకున్నాడు.
29:39 وَقَارُونَ وَفِرْعَوْنَ وَهَامَانَ ۖ وَلَقَدْ جَاءَهُم مُّوسَىٰ بِالْبَيِّنَاتِ فَاسْتَكْبَرُوا فِي الْأَرْضِ وَمَا كَانُوا سَابِقِينَ
ఖారూన్, ఫిరౌన్, హామానులను కూడా (మేము నాశనం చేశాము). వారి వద్దకు మూసా స్పష్టమైన సూచనలను తీసుకువచ్చాడు. అయినాసరే వారు భువిలో అహంకారంతో విర్రవీగారు. కాని (ఎంత విర్రవీగినా) మమ్మల్ని మించిపోలేకపోయారు.
29:40 فَكُلًّا أَخَذْنَا بِذَنبِهِ ۖ فَمِنْهُم مَّنْ أَرْسَلْنَا عَلَيْهِ حَاصِبًا وَمِنْهُم مَّنْ أَخَذَتْهُ الصَّيْحَةُ وَمِنْهُم مَّنْ خَسَفْنَا بِهِ الْأَرْضَ وَمِنْهُم مَّنْ أَغْرَقْنَا ۚ وَمَا كَانَ اللَّهُ لِيَظْلِمَهُمْ وَلَٰكِن كَانُوا أَنفُسَهُمْ يَظْلِمُونَ
మరి వారిలో ప్రతి ఒక్కడినీ మేము అతని పాపాలకుగాను పట్టుకున్నాము. వారిలో కొందరిపై మేము రాళ్ళ వాన కురిపించాము. వారిలో మరి కొందరిని భయంకరమైన శబ్దం ద్వారా మట్టు పెట్టాము. వారిలో ఇంకా కొందరిని మేము భూమిలో కూర్చివేశాము. వారిలో కొందరిని మేము ముంపుకు గురిచేశాము. (అకారణంగా) అల్లాహ్ వారికి అన్యాయం చేసేవాడు కాడు. (నిజానికి) వాళ్ళే తమకు తాము అన్యాయం చేసుకున్నారు.
29:41 مَثَلُ الَّذِينَ اتَّخَذُوا مِن دُونِ اللَّهِ أَوْلِيَاءَ كَمَثَلِ الْعَنكَبُوتِ اتَّخَذَتْ بَيْتًا ۖ وَإِنَّ أَوْهَنَ الْبُيُوتِ لَبَيْتُ الْعَنكَبُوتِ ۖ لَوْ كَانُوا يَعْلَمُونَ
అల్లాహ్‌ను వదలి ఇతరులను సంరక్షకులుగా చేసుకున్న వారి ఉదాహరణ సాలెపురుగు లాంటిది. అది (సాలెపురుగు) కూడా తన కోసం ఓ ఇల్లు కట్టుకుంటుంది. మరి వాస్తవానికి ఇండ్లన్నింటికంటే అత్యంత బలహీనమైనది సాలె పురుగు ఇల్లే. ఈ సంగతిని వారు తెలుసుకోగలిగితే ఎంత బావుండు!
29:42 إِنَّ اللَّهَ يَعْلَمُ مَا يَدْعُونَ مِن دُونِهِ مِن شَيْءٍ ۚ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ
వారు ఆయన్ని కాదని ఎవరెవరిని పిలుస్తున్నారో వాటిని గురించి అల్లాహ్‌కు బాగా తెలుసు. ఆయన అపార శక్తిమంతుడు, వివేచనాపరుడు.
29:43 وَتِلْكَ الْأَمْثَالُ نَضْرِبُهَا لِلنَّاسِ ۖ وَمَا يَعْقِلُهَا إِلَّا الْعَالِمُونَ
ప్రజలకు బోధపరచడానికి మేము ఈ ఉపమానాలను ఇస్తున్నాము. అయితే జ్ఞానం కలవారు మాత్రమే వీటిని అర్థం చేసుకోగలుగుతారు.
29:44 خَلَقَ اللَّهُ السَّمَاوَاتِ وَالْأَرْضَ بِالْحَقِّ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً لِّلْمُؤْمِنِينَ
అల్లాహ్ ఆకాశాలనూ, భూమినీ సత్య బద్ధంగా (పరమార్ధం దృష్ట్యా) సృష్టించాడు. విశ్వసించే వారి కోసం ఇందులో గొప్ప నిదర్శనం ఉంది.
29:45 اتْلُ مَا أُوحِيَ إِلَيْكَ مِنَ الْكِتَابِ وَأَقِمِ الصَّلَاةَ ۖ إِنَّ الصَّلَاةَ تَنْهَىٰ عَنِ الْفَحْشَاءِ وَالْمُنكَرِ ۗ وَلَذِكْرُ اللَّهِ أَكْبَرُ ۗ وَاللَّهُ يَعْلَمُ مَا تَصْنَعُونَ
(ఓ ప్రవక్తా!) నీ వైపుకు పంపబడిన (వహీ చేయబడిన) గ్రంథాన్ని పారాయణం చేస్తూ ఉండు. నమాజును నెలకొల్పు. నిశ్చయంగా నమాజ్ సిగ్గుమాలినతనం నుంచి, చెడు విషయాల నుంచి ఆపుతుంది. నిశ్చయంగా అల్లాహ్ స్మరణ చాలా గొప్ప విషయం (అన్న సంగతిని మరువరాదు). మీరు చేసేదంతా అల్లాహ్‌కు తెలుసు.
29:46 وَلَا تُجَادِلُوا أَهْلَ الْكِتَابِ إِلَّا بِالَّتِي هِيَ أَحْسَنُ إِلَّا الَّذِينَ ظَلَمُوا مِنْهُمْ ۖ وَقُولُوا آمَنَّا بِالَّذِي أُنزِلَ إِلَيْنَا وَأُنزِلَ إِلَيْكُمْ وَإِلَٰهُنَا وَإِلَٰهُكُمْ وَاحِدٌ وَنَحْنُ لَهُ مُسْلِمُونَ
ఉత్తమ పద్ధతిలో తప్ప గ్రంథవహులతో వాదించకండి. అయితే వారిలోని దుర్మార్గులతో (వాదులాడటం సమంజసమే). “మేము మా వద్దకు పంపబడిన గ్రంథాన్నీ, మీ వద్దకు పంపబడిన గ్రంథాన్ని కూడా విశ్వసిస్తున్నాం. మా ఆరాధ్య దేవుడూ, మీ ఆరాధ్య దేవుడూ ఒక్కడే. మేము ఆయన ఆజ్ఞలకే కట్టుబడి ఉన్నాము” అని స్పష్టంగా చెప్పేయండి.
29:47 وَكَذَٰلِكَ أَنزَلْنَا إِلَيْكَ الْكِتَابَ ۚ فَالَّذِينَ آتَيْنَاهُمُ الْكِتَابَ يُؤْمِنُونَ بِهِ ۖ وَمِنْ هَٰؤُلَاءِ مَن يُؤْمِنُ بِهِ ۚ وَمَا يَجْحَدُ بِآيَاتِنَا إِلَّا الْكَافِرُونَ
మరి ఇదే విధంగా మేము నీ వైపునకు మా గ్రంథాన్ని అవతరింపజేశాము. అందువల్ల (పూర్వం) మేము గ్రంథం వొసగబడిన వారు దీనిని విశ్వసిస్తారు. వీరిలో (మక్కా ముష్రిక్కులలో) కూడా కొందరు దీనిని విశ్వసిస్తారు. అవిశ్వాసులు మాత్రమే మా ఆయతులను త్రోసి పుచ్చుతారు.
29:48 وَمَا كُنتَ تَتْلُو مِن قَبْلِهِ مِن كِتَابٍ وَلَا تَخُطُّهُ بِيَمِينِكَ ۖ إِذًا لَّارْتَابَ الْمُبْطِلُونَ
(ఓ ప్రవక్తా!) ఇంతకు ముందు నువ్వు ఏ గ్రంథాన్నీ చదివిన వాడవు కావు, ఏ గ్రంథాన్నీ నీ కుడిచేత్తో వ్రాసిన వాడవూ కావు. ఒకవేళ అదేగనక జరిగివుంటే ఈ మిథ్యావాదులు (నీ విషయంలో) సందేహానికి లోనయ్యేవారే.
29:49 بَلْ هُوَ آيَاتٌ بَيِّنَاتٌ فِي صُدُورِ الَّذِينَ أُوتُوا الْعِلْمَ ۚ وَمَا يَجْحَدُ بِآيَاتِنَا إِلَّا الظَّالِمُونَ
అసలు ఇవి (ఈ ఖుర్ఆన్ వచనాలు) జ్ఞానం వొసగబడిన వారి హృదయాలలో (పదిలమై) ఉన్న స్పష్టమైన ఆయతులు. మా ఆయతులను దుర్మార్గులు తప్ప మరెవరూ త్రోసిపుచ్చరు.
29:50 وَقَالُوا لَوْلَا أُنزِلَ عَلَيْهِ آيَاتٌ مِّن رَّبِّهِ ۖ قُلْ إِنَّمَا الْآيَاتُ عِندَ اللَّهِ وَإِنَّمَا أَنَا نَذِيرٌ مُّبِينٌ
“ఇతని ప్రభువు తరఫున ఇతనిపై కొన్ని నిదర్శనాలు (మహిమలు) ఎందుకు అవతరింపజేయబడలేదు?” అని వారు అన్నారు. “నిదర్శనాలన్నీ అల్లాహ్ వద్ద ఉన్నాయి. నేను స్పష్టంగా హెచ్చరించే వాణ్ణి మాత్రమే” అని వారికి చెప్పు.
29:51 أَوَلَمْ يَكْفِهِمْ أَنَّا أَنزَلْنَا عَلَيْكَ الْكِتَابَ يُتْلَىٰ عَلَيْهِمْ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَرَحْمَةً وَذِكْرَىٰ لِقَوْمٍ يُؤْمِنُونَ
మేము నీపై గ్రంథాన్ని అవతరింపజేశాము. అది వారికి చదివి వినిపించబడుతోంది. విశ్వసించేవారి కొరకు ఇందులో కారుణ్యమూ ఉంది, హితబోధ కూడా ఉంది. ఏమిటి? ఇది వారికి సరిపోదా?
29:52 قُلْ كَفَىٰ بِاللَّهِ بَيْنِي وَبَيْنَكُمْ شَهِيدًا ۖ يَعْلَمُ مَا فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۗ وَالَّذِينَ آمَنُوا بِالْبَاطِلِ وَكَفَرُوا بِاللَّهِ أُولَٰئِكَ هُمُ الْخَاسِرُونَ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “మీకూ – నాకూ మధ్య సాక్షిగా అల్లాహ్ చాలు. భూమ్యాకాశాలలో వున్న ప్రతిదీ ఆయనకు తెలుసు. అసత్యాన్ని నమ్మి, అల్లాహ్‌ను తిరస్కరించినవారే తీవ్రంగా నష్టపోయేవారు.”
29:53 وَيَسْتَعْجِلُونَكَ بِالْعَذَابِ ۚ وَلَوْلَا أَجَلٌ مُّسَمًّى لَّجَاءَهُمُ الْعَذَابُ وَلَيَأْتِيَنَّهُم بَغْتَةً وَهُمْ لَا يَشْعُرُونَ
వాళ్లు శిక్ష కోసం నిన్ను తొందరపెడుతున్నారు. (నా తరఫునే గనక) ఒక సమయం నిర్ధారించబడకుండా ఉన్నట్లయితే ఈ పాటికి శిక్ష వీళ్ళ వద్దకు వచ్చి ఉండేదే. వారికి తెలియని స్థితిలో అది వారిపై అమాంతం వచ్చిపడటం ఖాయం.
29:54 يَسْتَعْجِلُونَكَ بِالْعَذَابِ وَإِنَّ جَهَنَّمَ لَمُحِيطَةٌ بِالْكَافِرِينَ
వారు శిక్ష కోసం హడావిడి చేస్తున్నారు కదూ! ఎట్టి పరిస్థితిలోనూ నరకం అవిశ్వాసులను ముట్టడించనున్నది.
29:55 يَوْمَ يَغْشَاهُمُ الْعَذَابُ مِن فَوْقِهِمْ وَمِن تَحْتِ أَرْجُلِهِمْ وَيَقُولُ ذُوقُوا مَا كُنتُمْ تَعْمَلُونَ
ఆ రోజు శిక్ష వారి పైనుంచి, వారి పాదాల క్రింద నుంచి వారిని ఆక్రమించుకుంటూ ఉంటుంది. అప్పుడు (అల్లాహ్) వారితో “మీరు చేసుకున్న కర్మల రుచి చూడండి” అని అంటాడు.
29:56 يَا عِبَادِيَ الَّذِينَ آمَنُوا إِنَّ أَرْضِي وَاسِعَةٌ فَإِيَّايَ فَاعْبُدُونِ
విశ్వసించిన ఓ నా దాసులారా! నా భూమి ఎంతో విశాలమైనది. కనుక మీరు నన్నే ఆరాధించండి.
29:57 كُلُّ نَفْسٍ ذَائِقَةُ الْمَوْتِ ۖ ثُمَّ إِلَيْنَا تُرْجَعُونَ
ప్రతి ప్రాణీ మరణం రుచి చూడవలసిందే. మరి మీరంతా నా వైపునకే మరలించబడతారు.
29:58 وَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ لَنُبَوِّئَنَّهُم مِّنَ الْجَنَّةِ غُرَفًا تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا ۚ نِعْمَ أَجْرُ الْعَامِلِينَ
ఎవరు విశ్వసించి మంచి పనులు చేశారో వారికి మేము స్వర్గంలోని ఎత్తయిన మేడలలో చోటు కల్పిస్తాము. వాటి క్రింద కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. వారక్కడ శాశ్వతంగా ఉంటారు. సదాచరణ చేసిన వారికి లభించిన ఈ ప్రతిఫలం ఎంత మంచిది!
29:59 الَّذِينَ صَبَرُوا وَعَلَىٰ رَبِّهِمْ يَتَوَكَّلُونَ
వారు సహనం వహించినవారు, తమ ప్రభువునే నమ్ముకున్నవారు.
29:60 وَكَأَيِّن مِّن دَابَّةٍ لَّا تَحْمِلُ رِزْقَهَا اللَّهُ يَرْزُقُهَا وَإِيَّاكُمْ ۚ وَهُوَ السَّمِيعُ الْعَلِيمُ
ఎన్నో జంతువులు తమ ఆహారాన్ని మోసుకుంటూ తిరగవు. వాటికీ, మీకు కూడా అల్లాహ్‌యే ఉపాధిని ఇస్తున్నాడు. ఆయన అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు.
29:61 وَلَئِن سَأَلْتَهُم مَّنْ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ وَسَخَّرَ الشَّمْسَ وَالْقَمَرَ لَيَقُولُنَّ اللَّهُ ۖ فَأَنَّىٰ يُؤْفَكُونَ
భూమ్యాకాశాలను సృష్టించినవాడెవడు? సూర్యచంద్రులను పనిలో నిమగ్నుల్ని చేసినవాడెవడు? అని నువ్వు వారిని అడిగితే ‘అల్లాహ్‌యే’ అని వారు చెబుతారు. మరలాంటప్పుడు వారు (సత్యం నుంచి) ఎలా తిరిగిపోతున్నారు?
29:62 اللَّهُ يَبْسُطُ الرِّزْقَ لِمَن يَشَاءُ مِنْ عِبَادِهِ وَيَقْدِرُ لَهُ ۚ إِنَّ اللَّهَ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ
అల్లాహ్ తన దాసులలో తాను తలచిన వారికి విస్తృతంగా ఉపాధిని ఇస్తాడు. తాను తలచిన వారికి పరిమితంగా ఇస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ ప్రతిదీ తెలిసినవాడు.
29:63 وَلَئِن سَأَلْتَهُم مَّن نَّزَّلَ مِنَ السَّمَاءِ مَاءً فَأَحْيَا بِهِ الْأَرْضَ مِن بَعْدِ مَوْتِهَا لَيَقُولُنَّ اللَّهُ ۚ قُلِ الْحَمْدُ لِلَّهِ ۚ بَلْ أَكْثَرُهُمْ لَا يَعْقِلُونَ
ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి, తద్వారా భూమిని, అది చచ్చిన తరువాత బ్రతికించినదెవరు? అని నువ్వు వారిని ప్రశ్నించినట్లయితే ‘అల్లాహ్‌యే’ అని వారి నుంచి సమాధానం వస్తుంది. సకల స్తోత్రాలు అల్లాహ్‌కే శోభిస్తాయి అని నువ్వు చెప్పు. కాని వారిలో అనేకులు ఇంగిత జ్ఞానం లేనివారు.
29:64 وَمَا هَٰذِهِ الْحَيَاةُ الدُّنْيَا إِلَّا لَهْوٌ وَلَعِبٌ ۚ وَإِنَّ الدَّارَ الْآخِرَةَ لَهِيَ الْحَيَوَانُ ۚ لَوْ كَانُوا يَعْلَمُونَ
ఈ ప్రాపంచిక జీవితం కేవలం ఒక సయ్యాట, వినోదం తప్ప మరేమీ కాదు. అయితే పరలోక నిలయపు జీవితమే అసలు సిసలైన జీవితం. ఈ విషయాన్ని వీళ్ళు తెలుసుకోగలిగితే ఎంత బావుండు!
29:65 فَإِذَا رَكِبُوا فِي الْفُلْكِ دَعَوُا اللَّهَ مُخْلِصِينَ لَهُ الدِّينَ فَلَمَّا نَجَّاهُمْ إِلَى الْبَرِّ إِذَا هُمْ يُشْرِكُونَ
మరి వారు ఓడలో ప్రయాణమైనప్పుడు, తమ ఆరాధనను అల్లాహ్‌కే ప్రత్యేకించుకుని – కేవలం ఆయన్నే మొరపెట్టుకుంటారు. తరువాత ఆయన వారిని సురక్షితంగా తీరానికి చేర్చగానే, అప్పటికప్పుడే వారు దైవానికి సహవర్తుల్ని కల్పించటం మొదలెడతారు.
29:66 لِيَكْفُرُوا بِمَا آتَيْنَاهُمْ وَلِيَتَمَتَّعُوا ۖ فَسَوْفَ يَعْلَمُونَ
మా అనుగ్రహాల పట్ల తిరస్కార వైఖరిని అవలంబిస్తూ, సుఖసౌఖ్యాలను జుర్రుకోవటానికి (వారిలా ప్రవర్తిస్తున్నారు). మరి వారు అతి త్వరలోనే (దీని పర్యవసానం) తెలుసుకుంటారు.
29:67 أَوَلَمْ يَرَوْا أَنَّا جَعَلْنَا حَرَمًا آمِنًا وَيُتَخَطَّفُ النَّاسُ مِنْ حَوْلِهِمْ ۚ أَفَبِالْبَاطِلِ يُؤْمِنُونَ وَبِنِعْمَةِ اللَّهِ يَكْفُرُونَ
ఏమిటీ, మేము హరమ్ను (మక్కా పుణ్యక్షేత్రాన్ని) సురక్షితమైన క్షేత్రంగా చేయటాన్ని వారు చూడటం లేదా? మరి (చూడబోతే) వారి చుట్టుప్రక్కల ఉన్న ప్రజలు ఎగరేసుకుపోబడుతున్నారు. ఏమిటీ, (ఇప్పటికీ) వారు అసత్యాన్నే నమ్మి, దైవానుగ్రహాల పట్ల తిరస్కార వైఖరిని అవలంబిస్తారా?
29:68 وَمَنْ أَظْلَمُ مِمَّنِ افْتَرَىٰ عَلَى اللَّهِ كَذِبًا أَوْ كَذَّبَ بِالْحَقِّ لَمَّا جَاءَهُ ۚ أَلَيْسَ فِي جَهَنَّمَ مَثْوًى لِّلْكَافِرِينَ
అల్లాహ్‌కు అబద్ధాన్ని అంటగట్టేవానికన్నా లేదా తన వద్దకు సత్యం వచ్చినప్పుడు దాన్ని ధిక్కరించేవానికన్నా పరమ దుర్మార్గుడెవడుంటాడు? ఏమిటీ, అటువంటి తిరస్కారుల నివాస స్థలం నరకంలో ఉండదా?!
29:69 وَالَّذِينَ جَاهَدُوا فِينَا لَنَهْدِيَنَّهُمْ سُبُلَنَا ۚ وَإِنَّ اللَّهَ لَمَعَ الْمُحْسِنِينَ
ఎవరయితే మా మార్గంలో బాధలు భరిస్తారో, వారికి మేము తప్పకుండా మా ‘మార్గాలు’ చూపుతాము. నిశ్చయంగా అల్లాహ్ సద్వర్తనులకు తోడుగా ఉంటాడు.
30. సూరా ఆర్ రూమ్ (Ar-Rum)
30:1 الم
అలిఫ్ – లామ్ – మీమ్.
30:2 غُلِبَتِ الرُّومُ
రోమనులు ఓడిపోయారు-
30:3 فِي أَدْنَى الْأَرْضِ وَهُم مِّن بَعْدِ غَلَبِهِمْ سَيَغْلِبُونَ
సమీప భూభాగంలో. అయితే (ఈ) అపజయం తరువాత త్వరలోనే వారు విజేతలవుతారు.
30:4 فِي بِضْعِ سِنِينَ ۗ لِلَّهِ الْأَمْرُ مِن قَبْلُ وَمِن بَعْدُ ۚ وَيَوْمَئِذٍ يَفْرَحُ الْمُؤْمِنُونَ
కొన్నేండ్లలోనే (తొమ్మిదేండ్లలోపే!). దానికి ముందైనా, తరువాతైనా నిర్ణయాధికారం అల్లాహ్‌దే. ఆ రోజు ముస్లింలు సంతోషిస్తారు-
30:5 بِنَصْرِ اللَّهِ ۚ يَنصُرُ مَن يَشَاءُ ۖ وَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ
అల్లాహ్ అండదండల వల్ల. ఆయన తాను కోరిన వారికి సహాయం చేస్తాడు. ఆయన మాత్రమే సర్వాధికుడు, దయాశీలి.
30:6 وَعْدَ اللَّهِ ۖ لَا يُخْلِفُ اللَّهُ وَعْدَهُ وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ
(ఇది) అల్లాహ్ వాగ్దానం. అల్లాహ్ తన వాగ్దానానికి విరుద్ధంగా చేయడు. కాని చాలామంది (ఈ సంగతిని) తెలుసుకోరు.
30:7 يَعْلَمُونَ ظَاهِرًا مِّنَ الْحَيَاةِ الدُّنْيَا وَهُمْ عَنِ الْآخِرَةِ هُمْ غَافِلُونَ
వారికి ప్రాపంచిక జీవితపు పై పై విషయాలు (మాత్రమే) తెలుసు. పరలోకం గురించి వారికి బొత్తిగా తెలీదు.
30:8 أَوَلَمْ يَتَفَكَّرُوا فِي أَنفُسِهِم ۗ مَّا خَلَقَ اللَّهُ السَّمَاوَاتِ وَالْأَرْضَ وَمَا بَيْنَهُمَا إِلَّا بِالْحَقِّ وَأَجَلٍ مُّسَمًّى ۗ وَإِنَّ كَثِيرًا مِّنَ النَّاسِ بِلِقَاءِ رَبِّهِمْ لَكَافِرُونَ
ఏమిటీ, వారు తమ (పుట్టుక) గురించి (లోతుగా) ఆలోచించటం లేదా? అల్లాహ్ భూమ్యాకాశాలనూ, వాటి మధ్యనున్న సమస్తాన్నీ అత్యుత్తమ రీతిలో, నిర్ణీత కాలం కొరకు మాత్రమే సృష్టించాడు. అయితే చాలా మంది తమ ప్రభువును కలుసుకోవలసి ఉందనే విషయాన్ని తిరస్కరిస్తారు.
30:9 أَوَلَمْ يَسِيرُوا فِي الْأَرْضِ فَيَنظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الَّذِينَ مِن قَبْلِهِمْ ۚ كَانُوا أَشَدَّ مِنْهُمْ قُوَّةً وَأَثَارُوا الْأَرْضَ وَعَمَرُوهَا أَكْثَرَ مِمَّا عَمَرُوهَا وَجَاءَتْهُمْ رُسُلُهُم بِالْبَيِّنَاتِ ۖ فَمَا كَانَ اللَّهُ لِيَظْلِمَهُمْ وَلَٰكِن كَانُوا أَنفُسَهُمْ يَظْلِمُونَ
ఏమిటీ, వారు భువిలో సంచరించి, తమ పూర్వీకులకు పట్టిన గతేమిటో చూడలేదా? వారు బలపరాక్రమాలలో వీళ్ళ కన్నా మరింత గట్టివారే. వారు (కూడా) భూమిని బాగా దున్నారు. వీళ్ళకన్నా బాగా సేద్యం చేశారు (వసింపజేశారు). వారి వద్దకు వారి ప్రవక్తలు స్పష్టమైన నిదర్శనాలను తీసుకువచ్చారు. అల్లాహ్ వారికి అన్యాయం చేయలేదు. కాని (యదార్థానికి) వారు తమకు తామే అన్యాయం చేసుకునేవారు.
30:10 ثُمَّ كَانَ عَاقِبَةَ الَّذِينَ أَسَاءُوا السُّوأَىٰ أَن كَذَّبُوا بِآيَاتِ اللَّهِ وَكَانُوا بِهَا يَسْتَهْزِئُونَ
మరి ఎట్టకేలకు – దుర్మార్గాలకు ఒడిగట్టిన వారికి దుర్గతే పట్టింది. ఎందుకంటే వారు అల్లాహ్ ఆయతులను ధిక్కరించే వారు. వాటిని పరిహసించేవారు.
30:11 اللَّهُ يَبْدَأُ الْخَلْقَ ثُمَّ يُعِيدُهُ ثُمَّ إِلَيْهِ تُرْجَعُونَ
సృష్టి (ప్రక్రియ)ని మొదలెట్టేవాడు అల్లాహ్‌యే. మరి ఆయనే దాన్ని పునరావృతం చేస్తాడు. మరి మీరంతా ఆయన వైపునకే మరలించబడతారు.
30:12 وَيَوْمَ تَقُومُ السَّاعَةُ يُبْلِسُ الْمُجْرِمُونَ
ప్రళయం నెలకొన్ననాడు అపరాధులు దిగ్భ్రాంతి చెందుతారు.
30:13 وَلَمْ يَكُن لَّهُم مِّن شُرَكَائِهِمْ شُفَعَاءُ وَكَانُوا بِشُرَكَائِهِمْ كَافِرِينَ
వారు కల్పించే భాగస్వాములలో ఏ ఒక్కరూ వారికోసం సిఫారసు చేయరు. మరి (వీళ్లు సైతం) తమ భాగస్వాములను త్రోసిపుచ్చుతారు.
30:14 وَيَوْمَ تَقُومُ السَّاعَةُ يَوْمَئِذٍ يَتَفَرَّقُونَ
ఏ రోజున ప్రళయ ఘడియ నెలకొంటుందో ఆ రోజు (మానవులు) విభిన్న వర్గాలుగా విడిపోతారు.
30:15 فَأَمَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ فَهُمْ فِي رَوْضَةٍ يُحْبَرُونَ
మరి విశ్వసించి, మంచి పనులు చేసిన వారు స్వర్గంలో ఆనందంతో పరవశించిపోతూ ఉంటారు.
30:16 وَأَمَّا الَّذِينَ كَفَرُوا وَكَذَّبُوا بِآيَاتِنَا وَلِقَاءِ الْآخِرَةِ فَأُولَٰئِكَ فِي الْعَذَابِ مُحْضَرُونَ
మరెవరయితే తిరస్కార వైఖరిని అనుసరిస్తూ, మా ఆయతులను, పరలోక సమావేశాన్ని ధిక్కరిస్తారో వారందరూ శిక్షలో నిర్బంధించబడి ఉంటారు.
30:17 فَسُبْحَانَ اللَّهِ حِينَ تُمْسُونَ وَحِينَ تُصْبِحُونَ
కనుక మీరు పొద్దుగూకినప్పుడు, తెల్లవారినప్పుడు అల్లాహ్ పవిత్రతను కొనియాడండి.
30:18 وَلَهُ الْحَمْدُ فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ وَعَشِيًّا وَحِينَ تُظْهِرُونَ
భూమ్యాకాశాలలో సమస్త స్తోత్రాలకు అర్హుడు ఆయన మాత్రమే. సాయం సమయాన, మధ్యాహ్న సమయాన కూడా (అల్లాహ్ పవిత్రతను కొనియాడండి).
30:19 يُخْرِجُ الْحَيَّ مِنَ الْمَيِّتِ وَيُخْرِجُ الْمَيِّتَ مِنَ الْحَيِّ وَيُحْيِي الْأَرْضَ بَعْدَ مَوْتِهَا ۚ وَكَذَٰلِكَ تُخْرَجُونَ
ఆయనే సజీవిని నిర్జీవి నుంచి, నిర్జీవిని సజీవి నుంచి వెలికి తీస్తాడు. ఆయనే భూమిని అది చచ్చిన తరువాత బ్రతికిస్తాడు. మీరు (కూడా) అలాగే తీయబడతారు.
30:20 وَمِنْ آيَاتِهِ أَنْ خَلَقَكُم مِّن تُرَابٍ ثُمَّ إِذَا أَنتُم بَشَرٌ تَنتَشِرُونَ
ఆయన సూచనలలో ఒకటేమంటే; ఆయన మిమ్మల్ని మట్టితో పుట్టించాడు. ఆ తరువాత మీరు మానవులుగా మారి వ్యాపిస్తున్నారు.
30:21 وَمِنْ آيَاتِهِ أَنْ خَلَقَ لَكُم مِّنْ أَنفُسِكُمْ أَزْوَاجًا لِّتَسْكُنُوا إِلَيْهَا وَجَعَلَ بَيْنَكُم مَّوَدَّةً وَرَحْمَةً ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّقَوْمٍ يَتَفَكَّرُونَ
మరి ఆయన సూచనలలోనే ఒకటేమంటే; ఆయన మీ కోసం స్వయంగా మీలో నుంచే భార్యలను సృజించాడు – మీరు వారి వద్ద ప్రశాంతత పొందటానికి! ఆయన మీ మధ్య ప్రేమనూ, దయాభావాన్నీ పొందుపరచాడు. నిశ్చయంగా ఆలోచించే వారి కోసం ఇందులో ఎన్నో సూచనలున్నాయి.
30:22 وَمِنْ آيَاتِهِ خَلْقُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَاخْتِلَافُ أَلْسِنَتِكُمْ وَأَلْوَانِكُمْ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّلْعَالِمِينَ
భూమ్యాకాశాల సృష్టి, మీ భాషల్లో, రంగుల్లో ఉన్న వైవిధ్యం కూడా ఆయన (శక్తి) సూచనలలోనివే. జ్ఞాన సంపన్నుల కోసం ఇందులో పలు సూచనలున్నాయి.
30:23 وَمِنْ آيَاتِهِ مَنَامُكُم بِاللَّيْلِ وَالنَّهَارِ وَابْتِغَاؤُكُم مِّن فَضْلِهِ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّقَوْمٍ يَسْمَعُونَ
(ఇంకా) ఆయన (శక్తి) సూచనలలో రాత్రివేళ, పగటిపూట మీరు నిద్రపోవటం, మీరు ఆయన కృపను (జీవనోపాధిని) అన్వేషించటం కూడా ఉన్నాయి. (జాగ్రత్తగా) వినేవారికి ఇందులో అనేక సూచనలున్నాయి.
30:24 وَمِنْ آيَاتِهِ يُرِيكُمُ الْبَرْقَ خَوْفًا وَطَمَعًا وَيُنَزِّلُ مِنَ السَّمَاءِ مَاءً فَيُحْيِي بِهِ الْأَرْضَ بَعْدَ مَوْتِهَا ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّقَوْمٍ يَعْقِلُونَ
ఇంకా ఆయన సూచనలలో (ఇంకొకటి) ఏమిటంటే; ఆయన మిమ్మల్ని భయపెట్టటానికి, ఆశపెట్టటానికి మెరుపును చూపిస్తున్నాడు. ఆకాశం నుంచి వర్షం కురిపిస్తున్నాడు. మరి దాని ద్వారా మృతభూమికి జీవం పోస్తున్నాడు. ఇందులో కూడా బుద్ధిజీవుల కోసం ఎన్నో నిదర్శనాలున్నాయి.
30:25 وَمِنْ آيَاتِهِ أَن تَقُومَ السَّمَاءُ وَالْأَرْضُ بِأَمْرِهِ ۚ ثُمَّ إِذَا دَعَاكُمْ دَعْوَةً مِّنَ الْأَرْضِ إِذَا أَنتُمْ تَخْرُجُونَ
ఆయన సూచనలలో (వేరొకటి) ఇది కూడా ఉంది : భూమ్యాకాశాలు ఆయన ఆదేశంతోనే నెలకొని ఉన్నాయి. మరి ఆయన మిమ్మల్ని పిలువగానే, ఒక్క పిలుపుపైనే మీరంతా భూమిలో నుంచి బయటికి వస్తారు.
30:26 وَلَهُ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ كُلٌّ لَّهُ قَانِتُونَ
ఆకాశాలలో, భూమిలో ఉన్న ప్రతి వస్తువూ ఆయనదే. అన్నీ ఆయన ఆజ్ఞకే లోబడి ఉన్నాయి.
30:27 وَهُوَ الَّذِي يَبْدَأُ الْخَلْقَ ثُمَّ يُعِيدُهُ وَهُوَ أَهْوَنُ عَلَيْهِ ۚ وَلَهُ الْمَثَلُ الْأَعْلَىٰ فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ
ఆయనే సృష్టి (ప్రక్రియ)ని ప్రారంభిస్తున్నాడు. మరి ఆయనే దాన్ని పునరావృతం చేస్తాడు. ఇది ఆయనకు చాలా తేలిక. ఆకాశాలలోనూ, భూమిలోనూ ఆయన గుణగణాల దర్పమే సర్వోన్నతమైనది. ఆయన సర్వాధిక్యుడు, వివేకవంతుడు.
30:28 ضَرَبَ لَكُم مَّثَلًا مِّنْ أَنفُسِكُمْ ۖ هَل لَّكُم مِّن مَّا مَلَكَتْ أَيْمَانُكُم مِّن شُرَكَاءَ فِي مَا رَزَقْنَاكُمْ فَأَنتُمْ فِيهِ سَوَاءٌ تَخَافُونَهُمْ كَخِيفَتِكُمْ أَنفُسَكُمْ ۚ كَذَٰلِكَ نُفَصِّلُ الْآيَاتِ لِقَوْمٍ يَعْقِلُونَ
అల్లాహ్ మీ కోసం స్వయంగా మీకు సంబంధించిన ఉదాహరణనే ఇస్తున్నాడు – మేము మీకు ప్రసాదించిన సంపదలో మీతో సమంగా పంచుకునే మీ బానిసలు ఎవరయినా ఉన్నారా? మీరు మీ తోటి వారికి భయపడినట్లు వారికి భయపడుతున్నారా? బుద్ధీ వివేచనలున్న వారి కోసం మేము ఈ విధంగా సూచనలను విడమరచి చెబుతుంటాము.
30:29 بَلِ اتَّبَعَ الَّذِينَ ظَلَمُوا أَهْوَاءَهُم بِغَيْرِ عِلْمٍ ۖ فَمَن يَهْدِي مَنْ أَضَلَّ اللَّهُ ۖ وَمَا لَهُم مِّن نَّاصِرِينَ
అసలు విషయం ఏమిటంటే ఈ దుర్మార్గులు జ్ఞానంతో నిమిత్తం లేకుండానే తమ కోర్కెలను అనుసరిస్తున్నారు. అల్లాహ్ అపమార్గం పట్టించినవాణ్ణి ఎవడు సన్మార్గానికి తేగలడనీ? అలాంటి వారికి తోడ్పడేవాడు ఎవడూ లేడు.
30:30 فَأَقِمْ وَجْهَكَ لِلدِّينِ حَنِيفًا ۚ فِطْرَتَ اللَّهِ الَّتِي فَطَرَ النَّاسَ عَلَيْهَا ۚ لَا تَبْدِيلَ لِخَلْقِ اللَّهِ ۚ ذَٰلِكَ الدِّينُ الْقَيِّمُ وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ
కనుక నీవు ఏకాగ్రతతో నీ ముఖాన్ని (అల్లాహ్) ధర్మంపై నిలుపు. అల్లాహ్ మానవులను ఏ స్వభావంపై పుట్టించాడో ఆ స్వభావంపైన్నే (ఉండండి). అల్లాహ్ సృష్టిని మార్చకూడదు సుమా! ఇదే సరైన ధర్మం. కాని చాలామంది తెలుసుకోరు.
30:31 مُنِيبِينَ إِلَيْهِ وَاتَّقُوهُ وَأَقِيمُوا الصَّلَاةَ وَلَا تَكُونُوا مِنَ الْمُشْرِكِينَ
(ప్రజలారా!) అల్లాహ్ వైపునకే మరలి, ఆయనకు భయపడుతూ ఉండండి. నమాజును నెలకొల్పండి. ముష్రికులలో చేరకండి.
30:32 مِنَ الَّذِينَ فَرَّقُوا دِينَهُمْ وَكَانُوا شِيَعًا ۖ كُلُّ حِزْبٍ بِمَا لَدَيْهِمْ فَرِحُونَ
వారు తమ ధర్మాన్ని ముక్కచెక్కలు చేసేశారు. వారు సయితం విభిన్న ముఠాలుగా చీలిపోయారు. ప్రతి ముఠా తన దగ్గర ఉన్న దానితోనే తెగ సంబరపడిపోతోంది.
30:33 وَإِذَا مَسَّ النَّاسَ ضُرٌّ دَعَوْا رَبَّهُم مُّنِيبِينَ إِلَيْهِ ثُمَّ إِذَا أَذَاقَهُم مِّنْهُ رَحْمَةً إِذَا فَرِيقٌ مِّنْهُم بِرَبِّهِمْ يُشْرِكُونَ
ప్రజల (పరిస్థితి ఎలాంటిదంటే; వారి) పై ఎప్పుడైనా, ఏదైనా ఆపద వచ్చిపడితే తమ ప్రభువు వైపునకు (పూర్తిగా) మరలి ప్రార్థనలు చేస్తారు. మరి ఆయన తన తరఫు నుంచి కారుణ్య రుచిని చూపించగానే, వారిలోని ఒక వర్గం తమ ప్రభువుకు సహవర్తుల్ని కల్పించసాగుతుంది-
30:34 لِيَكْفُرُوا بِمَا آتَيْنَاهُمْ ۚ فَتَمَتَّعُوا فَسَوْفَ تَعْلَمُونَ
మేము వారికి అనుగ్రహించిన దానిపై కృతఘ్నత చూపటానికి?! సరే. లబ్ది పొందండి! అతి త్వరలోనే (పరిణామం) మీకు తెలిసిపోతుంది.
30:35 أَمْ أَنزَلْنَا عَلَيْهِمْ سُلْطَانًا فَهُوَ يَتَكَلَّمُ بِمَا كَانُوا بِهِ يُشْرِكُونَ
ఏమిటీ; వారు పాల్పడే షిర్కును సమర్థిస్తూ మాట్లాడే ప్రమాణాన్ని దేన్నయినా మేము వారిపై దించామా?
30:36 وَإِذَا أَذَقْنَا النَّاسَ رَحْمَةً فَرِحُوا بِهَا ۖ وَإِن تُصِبْهُمْ سَيِّئَةٌ بِمَا قَدَّمَتْ أَيْدِيهِمْ إِذَا هُمْ يَقْنَطُونَ
మరి మేము ప్రజలకు కారుణ్యం రుచిని చూపించినపుడు వారు ఆనందంతో ఉబ్బిపోతారు. మరి ఒకవేళ తమ చేజేతులా చేసుకున్న చేష్టల మూలంగా వారికి ఏదైనా కీడు కలిగితే మాత్రం పూర్తిగా నిరాశచెందుతారు.
30:37 أَوَلَمْ يَرَوْا أَنَّ اللَّهَ يَبْسُطُ الرِّزْقَ لِمَن يَشَاءُ وَيَقْدِرُ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّقَوْمٍ يُؤْمِنُونَ
ఏమిటీ, అల్లాహ్ తాను కోరిన వారికి విస్తృతంగా జీవనోపాధిని ఇచ్చి, తాను కోరిన వారికి కుదించి ఇవ్వటాన్ని వారు చూడలేదా? నిశ్చయంగా ఇందులో కూడా విశ్వసించేవారికి సూచనలు ఉన్నాయి.
30:38 فَآتِ ذَا الْقُرْبَىٰ حَقَّهُ وَالْمِسْكِينَ وَابْنَ السَّبِيلِ ۚ ذَٰلِكَ خَيْرٌ لِّلَّذِينَ يُرِيدُونَ وَجْهَ اللَّهِ ۖ وَأُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ
కనుక సమీప బంధువుకు అతని హక్కును ఇవ్వు. అగత్యపరునికి, బాటసారికి కూడా (వారి హక్కులను ఇవ్వాలి). అల్లాహ్ సమ్ముఖ దర్శన భాగ్యం పొందగోరేవారికి ఈ పద్ధతి ఉత్తమమైనది. సాఫల్యం పొందేవారంటే వీరే.
30:39 وَمَا آتَيْتُم مِّن رِّبًا لِّيَرْبُوَ فِي أَمْوَالِ النَّاسِ فَلَا يَرْبُو عِندَ اللَّهِ ۖ وَمَا آتَيْتُم مِّن زَكَاةٍ تُرِيدُونَ وَجْهَ اللَّهِ فَأُولَٰئِكَ هُمُ الْمُضْعِفُونَ
ప్రజల సొమ్ములలో చేరి వృద్ధి చెందుతుందన్న ఉద్దేశంతో మీరు ఇచ్చే వడ్డీ అల్లాహ్ దృష్టిలో ఎంతమాత్రం వృద్ధి చెందదు. అయితే అల్లాహ్ ముఖాన్ని చూచేందుకు (ప్రసన్నతను చూరగొనేందుకు) మీరు జకాతు దానం ఇచ్చినట్లయితే – అలాంటి వారే (తమ సంపదలను) ఎన్నోరెట్లు వృద్ధిపరచుకున్న వారవుతారు.
30:40 اللَّهُ الَّذِي خَلَقَكُمْ ثُمَّ رَزَقَكُمْ ثُمَّ يُمِيتُكُمْ ثُمَّ يُحْيِيكُمْ ۖ هَلْ مِن شُرَكَائِكُم مَّن يَفْعَلُ مِن ذَٰلِكُم مِّن شَيْءٍ ۚ سُبْحَانَهُ وَتَعَالَىٰ عَمَّا يُشْرِكُونَ
ఆ అల్లాహ్‌యే మిమ్మల్ని సృష్టించాడు, తర్వాత మీకు ఉపాధిని సమకూర్చాడు, మరి ఆయనే మిమ్మల్ని చంపుతాడు, ఆ తరువాత మిమ్మల్ని బ్రతికిస్తాడు. చెప్పండి! ఈ పనులలో దేన్నయినా చేయగలవాడు మీరు కల్పించే భాగస్వాములలో ఎవడయినా ఉన్నాడా? వారు కల్పించే భాగస్వామ్యాల నుండి అల్లాహ్ ఎంతో పవిత్రుడు, ఉన్నతుడు.
30:41 ظَهَرَ الْفَسَادُ فِي الْبَرِّ وَالْبَحْرِ بِمَا كَسَبَتْ أَيْدِي النَّاسِ لِيُذِيقَهُم بَعْضَ الَّذِي عَمِلُوا لَعَلَّهُمْ يَرْجِعُونَ
ప్రజలు చేజేతులా చేసుకున్న (పాప) కార్యాల మూలంగానే భూమిలోనూ, సముద్రంలోనూ కల్లోలం వ్యాపించింది. వారు చేసుకున్న కొన్ని చేష్టల ప్రతిఫలం అల్లాహ్ వారికి చవి చూపించటానికి (ఇలా జరిగింది). బహుశా వారు (దీనివల్ల) దారికి తిరిగి రావచ్చేమోనని (కూడా ఈ విధంగా జరిగింది).
30:42 قُلْ سِيرُوا فِي الْأَرْضِ فَانظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الَّذِينَ مِن قَبْلُ ۚ كَانَ أَكْثَرُهُم مُّشْرِكِينَ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “భూమిలో సంచరించి, (మీ) పూర్వీకులకు ఏ గతి పట్టిందో కాస్త చూడండి! వారిలో అనేకులు ముష్రికులే.”
30:43 فَأَقِمْ وَجْهَكَ لِلدِّينِ الْقَيِّمِ مِن قَبْلِ أَن يَأْتِيَ يَوْمٌ لَّا مَرَدَّ لَهُ مِنَ اللَّهِ ۖ يَوْمَئِذٍ يَصَّدَّعُونَ
కనుక (ఓ ప్రవక్తా!) ఏ రోజు అల్లాహ్ తరఫునుంచి తొలగిపోయే అవకాశం ఎంతమాత్రం లేదో ఆ రోజు రాకముందే నీ ముఖాన్ని సత్యమైన, స్థిరమైన ధర్మం వైపు మరల్చుకో. ఆ రోజు అందరూ (రెండు వర్గాలుగా) వేర్వేరు అయిపోతారు.
30:44 مَن كَفَرَ فَعَلَيْهِ كُفْرُهُ ۖ وَمَنْ عَمِلَ صَالِحًا فَلِأَنفُسِهِمْ يَمْهَدُونَ
తిరస్కారానికి పాల్పడిన వారిపై వారి తిరస్కారపు పాపఫలం పడుతుంది. ఇక సత్కార్యాలు చేసేవారు తమ సౌఖ్యం కోసం (స్వర్గ) మార్గం సుగమం చేసుకుంటున్నారు.
30:45 لِيَجْزِيَ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ مِن فَضْلِهِ ۚ إِنَّهُ لَا يُحِبُّ الْكَافِرِينَ
విశ్వసించి, సత్కార్యాలు చేసిన వారికి అల్లాహ్ తన కృపతో (మంచి) ప్రతిఫలం వొసగటానికి! ఎట్టి పరిస్థితిలోనూ ఆయన అవిశ్వాసులను ఇష్టపడడు.
30:46 وَمِنْ آيَاتِهِ أَن يُرْسِلَ الرِّيَاحَ مُبَشِّرَاتٍ وَلِيُذِيقَكُم مِّن رَّحْمَتِهِ وَلِتَجْرِيَ الْفُلْكُ بِأَمْرِهِ وَلِتَبْتَغُوا مِن فَضْلِهِ وَلَعَلَّكُمْ تَشْكُرُونَ
శుభవార్తలను అందజేసే గాలులను పంపటం కూడా ఆయన శక్తి సూచనలలోనిదే. ఎందుకంటే మీకు తన కనికారపు రుచి చూపించటానికి, తన ఆజ్ఞతో నావలు నడవటానికీ, తన కృపను (ఉపాధిని) మీరు అన్వేషించటానికి, మీరు కృతజ్ఞతా పూర్వకంగా మసలుకోవటానికిగాను (ఆయన ఇదంతా చేస్తున్నాడు).
30:47 وَلَقَدْ أَرْسَلْنَا مِن قَبْلِكَ رُسُلًا إِلَىٰ قَوْمِهِمْ فَجَاءُوهُم بِالْبَيِّنَاتِ فَانتَقَمْنَا مِنَ الَّذِينَ أَجْرَمُوا ۖ وَكَانَ حَقًّا عَلَيْنَا نَصْرُ الْمُؤْمِنِينَ
మేము నీకు పూర్వం కూడా ప్రవక్తలను వారి జనుల వద్దకు పంపాము. వారు వారి వద్దకు నిదర్శనాలను తీసుకుని వెళ్ళారు. ఆ తరువాత మేము అపరాధులకు ప్రతీకారం చేశాము. (ఎందుకంటే) విశ్వాసులకు సహాయపడటం మా బాధ్యత.
30:48 اللَّهُ الَّذِي يُرْسِلُ الرِّيَاحَ فَتُثِيرُ سَحَابًا فَيَبْسُطُهُ فِي السَّمَاءِ كَيْفَ يَشَاءُ وَيَجْعَلُهُ كِسَفًا فَتَرَى الْوَدْقَ يَخْرُجُ مِنْ خِلَالِهِ ۖ فَإِذَا أَصَابَ بِهِ مَن يَشَاءُ مِنْ عِبَادِهِ إِذَا هُمْ يَسْتَبْشِرُونَ
అల్లాహ్‌యే గాలులను పంపిస్తున్నాడు. అవి మేఘాలను ఎత్తుతాయి. ఆ తరువాత అల్లాహ్ తన అభీష్టానికనుగుణంగా వాటిని ఆకాశంలో విస్తరింపజేస్తాడు. మరి వాటిని తునాతునకలుగా చేస్తాడు. ఆ తరువాత వాటి మధ్యలో నుంచి వర్షపు నీటి బిందువులు వెలువడటాన్ని నువ్వు చూస్తావు. ఆ తరువాత అల్లాహ్ ఆ వర్షపు నీటిని తన దాసులలో తాను కోరిన వారిపై కురిపించినపుడు వారు ఆనందంతో పులకించిపోతారు.
30:49 وَإِن كَانُوا مِن قَبْلِ أَن يُنَزَّلَ عَلَيْهِم مِّن قَبْلِهِ لَمُبْلِسِينَ
మరి నిజానికి ఆ వర్షం తమపై కురవకముందు వారు నిరాశా నిస్పృహలకు లోనై ఉండేవారు.
30:50 فَانظُرْ إِلَىٰ آثَارِ رَحْمَتِ اللَّهِ كَيْفَ يُحْيِي الْأَرْضَ بَعْدَ مَوْتِهَا ۚ إِنَّ ذَٰلِكَ لَمُحْيِي الْمَوْتَىٰ ۖ وَهُوَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
మరి నువ్వు అల్లాహ్ కారుణ్య చిహ్నాలను చూడు- భూమిని, చచ్చిన తరువాత ఏ విధంగా ఆయన బ్రతికిస్తున్నాడో!? ఆయన మృతులను బ్రతికిస్తాడన్న విషయంలో కూడా ఎలాంటి సందేహానికి తావులేదు. ఆయనకు ప్రతిదీ చేయగల శక్తి ఉంది.
30:51 وَلَئِنْ أَرْسَلْنَا رِيحًا فَرَأَوْهُ مُصْفَرًّا لَّظَلُّوا مِن بَعْدِهِ يَكْفُرُونَ
ఒకవేళ మేము తీవ్రమైన (చెడు) గాలిని పంపినట్లయితే, తమ పంట పొలాలు పసుపుపచ్చగా వాడిపోవటం చూసి, అటు పిమ్మట వారు కృతఘ్నులుగా తయారవుతారు.
30:52 فَإِنَّكَ لَا تُسْمِعُ الْمَوْتَىٰ وَلَا تُسْمِعُ الصُّمَّ الدُّعَاءَ إِذَا وَلَّوْا مُدْبِرِينَ
(ఓ ప్రవక్తా!) నువ్వు ఎట్టి పరిస్థితిలోనూ మృతులకు వినిపించలేవు. నీవు పిలిచినప్పుడు వెన్నుచూపి వెళ్ళిపోయే చెవిటి వారికి కూడా (నీ వాణిని) వినిపించలేవు.
30:53 وَمَا أَنتَ بِهَادِ الْعُمْيِ عَن ضَلَالَتِهِمْ ۖ إِن تُسْمِعُ إِلَّا مَن يُؤْمِنُ بِآيَاتِنَا فَهُم مُّسْلِمُونَ
నువ్వు గుడ్డివారిని కూడా వారు పయనిస్తున్న పెడత్రోవ నుంచి సన్మార్గానికి తేలేవు. మా ఆయతులను విశ్వసించే వారికి మాత్రమే నువ్వు (నీ సందేశాన్ని) వినిపించగలవు. వారు మాత్రమే విధేయత చూపుతారు.
30:54 اللَّهُ الَّذِي خَلَقَكُم مِّن ضَعْفٍ ثُمَّ جَعَلَ مِن بَعْدِ ضَعْفٍ قُوَّةً ثُمَّ جَعَلَ مِن بَعْدِ قُوَّةٍ ضَعْفًا وَشَيْبَةً ۚ يَخْلُقُ مَا يَشَاءُ ۖ وَهُوَ الْعَلِيمُ الْقَدِيرُ
అల్లాహ్ – ఆయనే మిమ్మల్ని బలహీన స్థితిలో పుట్టించాడు. మరి ఈ బలహీనత తరువాత (మీకు) బలాన్ని ఇచ్చాడు. మరి ఈ బలం తరువాత మళ్లీ (మీకు) బలహీనతను ఇచ్చాడు, వృద్ధాప్యానికి చేర్చాడు. ఆయన తాను తలచినది సృష్టిస్తాడు. ఆయన అన్నీ తెలిసినవాడు, అన్నింటిపై అధికారం కలవాడు.
30:55 وَيَوْمَ تَقُومُ السَّاعَةُ يُقْسِمُ الْمُجْرِمُونَ مَا لَبِثُوا غَيْرَ سَاعَةٍ ۚ كَذَٰلِكَ كَانُوا يُؤْفَكُونَ
ప్రళయ ఘడియ సంభవించిననాడు అపరాధులు, తాము (ప్రపంచంలో) ఒక్క గడియకాలం కన్నా ఎక్కువగా ఉండలేదని ప్రమాణాలు చేస్తారు. (ఇహలోకంలో కూడా) వారు ఇలాగే తిరిగిపోతూ ఉండేవారు.
30:56 وَقَالَ الَّذِينَ أُوتُوا الْعِلْمَ وَالْإِيمَانَ لَقَدْ لَبِثْتُمْ فِي كِتَابِ اللَّهِ إِلَىٰ يَوْمِ الْبَعْثِ ۖ فَهَٰذَا يَوْمُ الْبَعْثِ وَلَٰكِنَّكُمْ كُنتُمْ لَا تَعْلَمُونَ
అయితే జ్ఞానమూ, విశ్వాసమూ వొసగబడినవారు ఇలా సమాధానమిస్తారు: “మీరు దైవగ్రంథంలో (లిఖించబడి) ఉన్నట్లే ప్రళయదినం వరకూ ఆగి ఉన్నారు. నేటి ఈ దినం ప్రళయదినమే. కాని మీరు మాత్రం నమ్మేవారే కాదు.”
30:57 فَيَوْمَئِذٍ لَّا يَنفَعُ الَّذِينَ ظَلَمُوا مَعْذِرَتُهُمْ وَلَا هُمْ يُسْتَعْتَبُونَ
కాబట్టి ఆ రోజు దుర్మార్గులకు, వారు చెప్పుకునే క్షమాపణలు (సంజాయిషీలు) వారికి ఎలాంటి లాభాన్నీ చేకూర్చవు. “క్షమాపణలు కోరుకోండి” అని వారితో అనటం కూడా జరగదు.
30:58 وَلَقَدْ ضَرَبْنَا لِلنَّاسِ فِي هَٰذَا الْقُرْآنِ مِن كُلِّ مَثَلٍ ۚ وَلَئِن جِئْتَهُم بِآيَةٍ لَّيَقُولَنَّ الَّذِينَ كَفَرُوا إِنْ أَنتُمْ إِلَّا مُبْطِلُونَ
నిశ్చయంగా మేము ఈ ఖుర్ఆన్లో జనుల కోసం అన్నిరకాల దృష్టాంతాలనూ వివరించాము. నువ్వు వారి దగ్గరకు ఏ సూచనను తెచ్చినా, “మీరంతా మిథ్యావాదులే” అని ఈ అవిశ్వాసులు చెబుతారు.
30:59 كَذَٰلِكَ يَطْبَعُ اللَّهُ عَلَىٰ قُلُوبِ الَّذِينَ لَا يَعْلَمُونَ
ఈ విధంగా అల్లాహ్ అజ్ఞానుల హృదయాలకు సీలు వేసేస్తాడు.
30:60 فَاصْبِرْ إِنَّ وَعْدَ اللَّهِ حَقٌّ ۖ وَلَا يَسْتَخِفَّنَّكَ الَّذِينَ لَا يُوقِنُونَ
కనుక (ఓ ప్రవక్తా!) నువ్వు సహనం వహించు. నిశ్చయంగా అల్లాహ్ వాగ్దానం సత్యమైంది. నమ్మకం లేనివారు నిన్ను తడబాటుకు లోనుచేసే స్థితి రాకూడదు సుమా!
- సూరా లుక్మాన్
31:1 الم
అలిఫ్ – లామ్ – మీమ్.
31:2 تِلْكَ آيَاتُ الْكِتَابِ الْحَكِيمِ
ఇవి వివేకంతో కూడిన గ్రంథ వాక్యాలు.
31:3 هُدًى وَرَحْمَةً لِّلْمُحْسِنِينَ
సద్వర్తనుల కొరకు మార్గదర్శకం, (నిలువెల్లా) కారుణ్యం.
31:4 الَّذِينَ يُقِيمُونَ الصَّلَاةَ وَيُؤْتُونَ الزَّكَاةَ وَهُم بِالْآخِرَةِ هُمْ يُوقِنُونَ
వారు (ఆ సద్వర్తనులు) నమాజులను నెలకొల్పుతారు. జకాతు ఇస్తూ ఉంటారు. పరలోకంపై (పూర్తి) విశ్వాసం కలిగి ఉంటారు.
31:5 أُولَٰئِكَ عَلَىٰ هُدًى مِّن رَّبِّهِمْ ۖ وَأُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ
వారే తమ ప్రభువు తరఫు నుంచి సన్మార్గంపై ఉన్నవారు. వారే సాఫల్యం పొందేవారు.
31:6 وَمِنَ النَّاسِ مَن يَشْتَرِي لَهْوَ الْحَدِيثِ لِيُضِلَّ عَن سَبِيلِ اللَّهِ بِغَيْرِ عِلْمٍ وَيَتَّخِذَهَا هُزُوًا ۚ أُولَٰئِكَ لَهُمْ عَذَابٌ مُّهِينٌ
జ్ఞానంతో నిమిత్తం లేకుండానే ప్రజలను అల్లాహ్ మార్గం నుంచి తప్పించటానికి, దాన్ని వేళాకోళం చేయడానికి మనసును వశీకరించే విషయాలను కొనుగోలు చేసేవాడు కూడా మనుషుల్లో ఉన్నాడు. పరాభవం పాల్జేసే శిక్ష ఉన్నది ఇలాంటి వారికోసమే.
31:7 وَإِذَا تُتْلَىٰ عَلَيْهِ آيَاتُنَا وَلَّىٰ مُسْتَكْبِرًا كَأَن لَّمْ يَسْمَعْهَا كَأَنَّ فِي أُذُنَيْهِ وَقْرًا ۖ فَبَشِّرْهُ بِعَذَابٍ أَلِيمٍ
వాడి ముందు మా వాక్యాలను చదివి వినిపించినప్పుడు వాడు అహంకారంతో, తాను వాటిని అసలు విననే లేదన్నట్లుగా, తన రెండు చెవులలోనూ చెవుడు ఉన్నట్లుగా ముఖం త్రిప్పుకుని పోతాడు. కాబట్టి నువ్వు వాడికి వ్యధాభరితమైన శిక్ష యొక్క శుభవార్తను వినిపించు.
31:8 إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ لَهُمْ جَنَّاتُ النَّعِيمِ
నిశ్చయంగా ఎవరు విశ్వసించి, (ప్రవక్త సంప్రదాయం ప్రకారం) సత్కార్యాలు కూడా చేశారో వారి కోసం అనుగ్రహ భరితమైన స్వర్గవనాలున్నాయి.
31:9 خَالِدِينَ فِيهَا ۖ وَعْدَ اللَّهِ حَقًّا ۚ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ
వాటిలో వారు కలకాలం ఉంటారు. అల్లాహ్ వాగ్దానం నిజమవుతుంది. ఆయన గౌరవము, ప్రాబల్యము కలవాడు, పరిపూర్ణ వివేచనాపరుడు.
31:10 خَلَقَ السَّمَاوَاتِ بِغَيْرِ عَمَدٍ تَرَوْنَهَا ۖ وَأَلْقَىٰ فِي الْأَرْضِ رَوَاسِيَ أَن تَمِيدَ بِكُمْ وَبَثَّ فِيهَا مِن كُلِّ دَابَّةٍ ۚ وَأَنزَلْنَا مِنَ السَّمَاءِ مَاءً فَأَنبَتْنَا فِيهَا مِن كُلِّ زَوْجٍ كَرِيمٍ
ఆయన ఆకాశాలను ఎలాంటి స్థంభాలు లేకుండానే సృష్టించాడు. మీరు దాన్ని చూస్తూనే ఉన్నారు. ఇంకా ఆయన భూమిలో పర్వతాలను నెలకొల్పాడు – అది (భూమి) మీతో పాటు ఒరిగి పోకుండా ఉండేటందుకు! ఇంకా అన్నిరకాల జంతువులను భూమిలో వ్యాపింపజేశాడు. ఇంకా మేము ఆకాశం నుంచి వర్షపు నీటిని కురిపించి భూమిలో అన్ని రకాల మేలు జాతి జంటలను (మొలకలను) ఉత్పన్నం చేశాము.
31:11 هَٰذَا خَلْقُ اللَّهِ فَأَرُونِي مَاذَا خَلَقَ الَّذِينَ مِن دُونِهِ ۚ بَلِ الظَّالِمُونَ فِي ضَلَالٍ مُّبِينٍ
ఇదీ అల్లాహ్ సృష్టి! ఇప్పుడు ఆయన తప్ప వేరితరులు ఏం సృష్టించారో మీరు నాకు చూపించండి? (ఏమీ సృష్టించలేదు) నిజానికి ఈ దుర్మార్గులు స్పష్టమైన మార్గభ్రష్టత్వానికి లోనై ఉన్నారు.
31:12 وَلَقَدْ آتَيْنَا لُقْمَانَ الْحِكْمَةَ أَنِ اشْكُرْ لِلَّهِ ۚ وَمَن يَشْكُرْ فَإِنَّمَا يَشْكُرُ لِنَفْسِهِ ۖ وَمَن كَفَرَ فَإِنَّ اللَّهَ غَنِيٌّ حَمِيدٌ
నిశ్చయంగా మేము లుఖ్మానుకు వివేచనను ప్రసాదించి, “నువ్వు అల్లాహ్‌కు కృతజ్ఞుడవై ఉండు” అని చెప్పాము. కృతజ్ఞతా పూర్వకంగా మసలుకునే ప్రతి ఒక్కడూ తన (మేలు) కొరకే కృతజ్ఞుడవుతాడు. మరెవరయినా కృతఘ్నతకు పాల్పడితే, అల్లాహ్ అక్కరలు లేనివాడు, ప్రశంసనీయుడు (అన్న సంగతిని అతను తెలుసుకోవాలి).
31:13 وَإِذْ قَالَ لُقْمَانُ لِابْنِهِ وَهُوَ يَعِظُهُ يَا بُنَيَّ لَا تُشْرِكْ بِاللَّهِ ۖ إِنَّ الشِّرْكَ لَظُلْمٌ عَظِيمٌ
లుఖ్మాన్ తన కుమారునికి హితబోధ చేస్తూ ఇలా అన్నాడు: “ఓ నా ముద్దుల పుత్రుడా! అల్లాహ్‌కు భాగస్వాములను కల్పించకు. నిస్సందేహంగా అల్లాహ్‌కు భాగస్వాముల్ని కల్పించటం (షిర్క్ చేయటం) ఘోరమైన అన్యాయం.”
31:14 وَوَصَّيْنَا الْإِنسَانَ بِوَالِدَيْهِ حَمَلَتْهُ أُمُّهُ وَهْنًا عَلَىٰ وَهْنٍ وَفِصَالُهُ فِي عَامَيْنِ أَنِ اشْكُرْ لِي وَلِوَالِدَيْكَ إِلَيَّ الْمَصِيرُ
మరి మేము మానవునికి అతని తల్లిదండ్రుల విషయంలో గట్టిగా తాకీదు చేశాము- అతని తల్లి అతన్ని ప్రయాసపై ప్రయాసకు ఓర్చుకుంటూ తన గర్భంలో మోసింది. మరి అతని పాలను విడిపించటానికి రెండు సంవత్సరాలు పట్టింది. (కనుక ఓ మానవుడా!) నువ్వు నాకూ, నీ తల్లిదండ్రులకూ కృతజ్ఞుడవై ఉండు. (ఎట్టకేలకు మీరంతా) మరలి రావలసింది నా వద్దకే.
31:15 وَإِن جَاهَدَاكَ عَلَىٰ أَن تُشْرِكَ بِي مَا لَيْسَ لَكَ بِهِ عِلْمٌ فَلَا تُطِعْهُمَا ۖ وَصَاحِبْهُمَا فِي الدُّنْيَا مَعْرُوفًا ۖ وَاتَّبِعْ سَبِيلَ مَنْ أَنَابَ إِلَيَّ ۚ ثُمَّ إِلَيَّ مَرْجِعُكُمْ فَأُنَبِّئُكُم بِمَا كُنتُمْ تَعْمَلُونَ
ఒకవేళ నీకు తెలియని వారినెవరినైనా నాకు భాగస్వాములుగా నిలబెట్టమని వారిద్దరూ నీపై ఒత్తిడి తీసుకువస్తే మటుకు నువ్వు వారి మాట వినకు. ప్రపంచంలో మాత్రం వారి యెడల ఉత్తమరీతిలో మసలుకో. అయితే (మార్గానుసరణ విషయంలో మాత్రం) నా వైపు మరలి ఉన్న వానినే ఆదర్శంగా తీసుకో. ఆ తరువాత మీరంతా నా వైపుకే మరలి రావలసి ఉంటుంది. అప్పుడు నేను మీకు, మీరు చేస్తూ ఉండిన కర్మలన్నింటినీ తెలియపరుస్తాను.”
31:16 يَا بُنَيَّ إِنَّهَا إِن تَكُ مِثْقَالَ حَبَّةٍ مِّنْ خَرْدَلٍ فَتَكُن فِي صَخْرَةٍ أَوْ فِي السَّمَاوَاتِ أَوْ فِي الْأَرْضِ يَأْتِ بِهَا اللَّهُ ۚ إِنَّ اللَّهَ لَطِيفٌ خَبِيرٌ
(లుఖ్మాన్ తన కుమారునికి ఇలా బోధపరిచాడు) “నాయనా! ఏదైనా వస్తువు ఆవగింజంత ఉన్నా, అది ఏదైనా రాతి బండలో ఉన్నా, లేక అది ఆకాశాలలో ఉన్నా లేదా భూమిలో ఉన్నా దాన్ని అల్లాహ్ తప్పకుండా తీసుకువస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ సూక్ష్మ విషయాలను ఎరిగినవాడు, అన్నీ తెలిసినవాడు.
31:17 يَا بُنَيَّ أَقِمِ الصَّلَاةَ وَأْمُرْ بِالْمَعْرُوفِ وَانْهَ عَنِ الْمُنكَرِ وَاصْبِرْ عَلَىٰ مَا أَصَابَكَ ۖ إِنَّ ذَٰلِكَ مِنْ عَزْمِ الْأُمُورِ
“ఓ (ప్రియమైన) కుమారా! నువ్వు నమాజును నెలకొల్పుతూ ఉండు. సత్కార్యాల గురించి ఆజ్ఞాపిస్తూ ఉండు. చెడు పనుల నుంచి వారిస్తూ ఉండు. ఏ ఆపద వచ్చిపడినా సహనం పాటించు. నిశ్చయంగా ఇవి ఎంతో గట్టిగా ఆజ్ఞాపించబడిన పనులు.
31:18 وَلَا تُصَعِّرْ خَدَّكَ لِلنَّاسِ وَلَا تَمْشِ فِي الْأَرْضِ مَرَحًا ۖ إِنَّ اللَّهَ لَا يُحِبُّ كُلَّ مُخْتَالٍ فَخُورٍ
“జనుల ముందు (గర్వంతో) మొహం తిప్పుకొని మాట్లాడకు. భూమిపై నిక్కుతూ నడవకు. ఎట్టి పరిస్థితిలోనూ అల్లాహ్ డాబులు చెప్పుకునే గర్విష్టిని ఇష్టపడడు.
31:19 وَاقْصِدْ فِي مَشْيِكَ وَاغْضُضْ مِن صَوْتِكَ ۚ إِنَّ أَنكَرَ الْأَصْوَاتِ لَصَوْتُ الْحَمِيرِ
“నీ నడకలో మధ్యేమార్గం అవలంబించు. నీ కంఠ స్వరాన్ని కాస్త తగ్గించు. నిశ్చయంగా స్వరాలన్నింటిలోకీ అత్యంత కఠోరమైనది గాడిదల స్వరం.”
31:20 أَلَمْ تَرَوْا أَنَّ اللَّهَ سَخَّرَ لَكُم مَّا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ وَأَسْبَغَ عَلَيْكُمْ نِعَمَهُ ظَاهِرَةً وَبَاطِنَةً ۗ وَمِنَ النَّاسِ مَن يُجَادِلُ فِي اللَّهِ بِغَيْرِ عِلْمٍ وَلَا هُدًى وَلَا كِتَابٍ مُّنِيرٍ
అల్లాహ్ భూమ్యాకాశాల్లో ఉన్న వస్తువులన్నింటినీ మీ పనిలో తగిలించి, తన గోచర అగోచర వరాలను పుష్కలంగా మీకు ప్రసాదించిన విషయాన్ని మీరు చూడటం లేదా? కొంతమంది జ్ఞానం లేకుండా, మార్గదర్శకత్వం లేకుండా, ప్రకాశవంతమైన గ్రంథం లేకుండానే అల్లాహ్ గురించి వాదులాడుతున్నారు.
31:21 وَإِذَا قِيلَ لَهُمُ اتَّبِعُوا مَا أَنزَلَ اللَّهُ قَالُوا بَلْ نَتَّبِعُ مَا وَجَدْنَا عَلَيْهِ آبَاءَنَا ۚ أَوَلَوْ كَانَ الشَّيْطَانُ يَدْعُوهُمْ إِلَىٰ عَذَابِ السَّعِيرِ
అల్లాహ్ అవతరింపజేసిన దానిని (వహీని) అనుసరించండి అని వారితో అన్నప్పుడు, “లేదు. మా తాత ముత్తాతలు అవలంబిస్తూ ఉండగా చూసిన విధానాన్నే మేము అనుసరిస్తాము” అని వారంటారు. ఒకవేళ షైతాను వారి పెద్దలను నరకయాతన వైపుకు పిలుస్తూ ఉన్నప్పటికీ (వారు దాన్నే అనుసరిస్తారా?)
31:22 وَمَن يُسْلِمْ وَجْهَهُ إِلَى اللَّهِ وَهُوَ مُحْسِنٌ فَقَدِ اسْتَمْسَكَ بِالْعُرْوَةِ الْوُثْقَىٰ ۗ وَإِلَى اللَّهِ عَاقِبَةُ الْأُمُورِ
ఎవరయితే సద్వర్తనుడయి ఉండి-తన్ను తాను అల్లాహ్‌కు సమర్పించుకున్నాడో, అతను నిశ్చయంగా గట్టి కడియాన్ని పట్టుకున్నాడు. సమస్త వ్యవహారాల తుది నిర్ణయం అల్లాహ్ అధీనంలోనే ఉంటుంది.
31:23 وَمَن كَفَرَ فَلَا يَحْزُنكَ كُفْرُهُ ۚ إِلَيْنَا مَرْجِعُهُمْ فَنُنَبِّئُهُم بِمَا عَمِلُوا ۚ إِنَّ اللَّهَ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ
(ఓ ముహమ్మద్-స!) అవిశ్వాసుల అవిశ్వాస వైఖరిపై నువ్వు కుమిలిపోకూడదు. చివరకు వారంతా మరలి రావలసింది మా వైపుకే. అప్పుడు మేము వారు చేసుకున్నదాన్ని వారికి తెలియపరుస్తాము. నిశ్చయంగా అల్లాహ్ గుండెల్లోని గుట్టును సయితం ఎరిగినవాడు.
31:24 نُمَتِّعُهُمْ قَلِيلًا ثُمَّ نَضْطَرُّهُمْ إِلَىٰ عَذَابٍ غَلِيظٍ
మేము వారికి (ఇక్కడ) కొన్ని ప్రయోజనాలను ఇచ్చినప్పటికీ, (తుదకు) వారిని కడు నిస్సహాయ స్థితిలో కఠినమైన శిక్ష వైపుకు తరుముకుంటూ పోతాము.
31:25 وَلَئِن سَأَلْتَهُم مَّنْ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ لَيَقُولُنَّ اللَّهُ ۚ قُلِ الْحَمْدُ لِلَّهِ ۚ بَلْ أَكْثَرُهُمْ لَا يَعْلَمُونَ
ఆకాశాలను, భూమిని సృష్టించిన వారెవరు? అని నువ్వు వారిని అడిగితే “అల్లాహ్” అని వారు తప్పకుండా చెబుతారు. “సమస్త స్తోత్రాలు అల్లాహ్‌కే శోభిస్తాయి” అని నువ్వు వారికి చెప్పు, కాని వారిలో చాలామంది (సత్యాన్ని) తెలుసుకోరు.
31:26 لِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ إِنَّ اللَّهَ هُوَ الْغَنِيُّ الْحَمِيدُ
ఆకాశాలలో, భూమిలో ఉన్నదంతా అల్లాహ్‌దే. నిశ్చయంగా అల్లాహ్ ఏ అక్కరా లేనివాడు, స్తుతింపదగినవాడు.
31:27 وَلَوْ أَنَّمَا فِي الْأَرْضِ مِن شَجَرَةٍ أَقْلَامٌ وَالْبَحْرُ يَمُدُّهُ مِن بَعْدِهِ سَبْعَةُ أَبْحُرٍ مَّا نَفِدَتْ كَلِمَاتُ اللَّهِ ۗ إِنَّ اللَّهَ عَزِيزٌ حَكِيمٌ
భూమండలంలో ఉన్న వృక్షాలన్నీ కలములుగా, సముద్రాలన్నీ సిరాగా మారినా, ఆపైన మరో సప్త సముద్రాలు (సిరాగా) చేరినా అల్లాహ్ మాటలు (రాయటానికి) పూర్తికావు. నిస్సందేహంగా అల్లాహ్ సర్వాధికుడు, వివేకవంతుడు.
31:28 مَّا خَلْقُكُمْ وَلَا بَعْثُكُمْ إِلَّا كَنَفْسٍ وَاحِدَةٍ ۗ إِنَّ اللَّهَ سَمِيعٌ بَصِيرٌ
మీ అందరినీ సృష్టించటం, మరణానంతరం తిరిగిలేపటం ఒక్క ప్రాణిని (సృష్టించి, బ్రతికించి లేపటం) వంటిదే. నిశ్చయంగా అల్లాహ్ అంతా వినేవాడు, చూసేవాడు.
31:29 أَلَمْ تَرَ أَنَّ اللَّهَ يُولِجُ اللَّيْلَ فِي النَّهَارِ وَيُولِجُ النَّهَارَ فِي اللَّيْلِ وَسَخَّرَ الشَّمْسَ وَالْقَمَرَ كُلٌّ يَجْرِي إِلَىٰ أَجَلٍ مُّسَمًّى وَأَنَّ اللَّهَ بِمَا تَعْمَلُونَ خَبِيرٌ
అల్లాహ్ ఏ విధంగా రాత్రిని పగటి లోనికి, పగటిని రాత్రి లోనికి చొప్పిస్తున్నాడో నువ్వు గమనించటం లేదా? ఆయనే సూర్యచంద్రులను కూడా నియమబద్ధంగా చేశాడు. ప్రతి ఒక్కటి నిర్ణీత సమయం వరకు సాగిపోతున్నాయి. మీరు చేసేదంతా కూడా అల్లాహ్‌కు తెలుసు.
31:30 ذَٰلِكَ بِأَنَّ اللَّهَ هُوَ الْحَقُّ وَأَنَّ مَا يَدْعُونَ مِن دُونِهِ الْبَاطِلُ وَأَنَّ اللَّهَ هُوَ الْعَلِيُّ الْكَبِيرُ
అల్లాహ్‌యే సత్యం గనక, ఆయన్ని వదలి ప్రజలు మొర పెట్టుకునేవన్నీ అసత్యం గనక, అల్లాహ్‌యే మహోన్నతుడూ గొప్పవాడు గనక ఇదంతా (ఈ విధంగా) సజావుగా సాగుతోంది.
31:31 أَلَمْ تَرَ أَنَّ الْفُلْكَ تَجْرِي فِي الْبَحْرِ بِنِعْمَتِ اللَّهِ لِيُرِيَكُم مِّنْ آيَاتِهِ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّكُلِّ صَبَّارٍ شَكُورٍ
అల్లాహ్ అనుగ్రహంతో ఓడలు సముద్రంలో నడవటాన్ని నువ్వు గమనించటం లేదా? ఆయన తన సూచనలను మీకు చూపించటానికి (ఇదంతా చేస్తున్నాడు). నిశ్చయంగా ఇందులో సహనం వహించే, కృతజ్ఞతా భావం కలిగి ఉండే ప్రతి ఒక్కరికీ ఎన్నో సూచనలున్నాయి.
31:32 وَإِذَا غَشِيَهُم مَّوْجٌ كَالظُّلَلِ دَعَوُا اللَّهَ مُخْلِصِينَ لَهُ الدِّينَ فَلَمَّا نَجَّاهُمْ إِلَى الْبَرِّ فَمِنْهُم مُّقْتَصِدٌ ۚ وَمَا يَجْحَدُ بِآيَاتِنَا إِلَّا كُلُّ خَتَّارٍ كَفُورٍ
మరి వారిపై (సముద్ర) కెరటాలు నీడల మాదిరిగా క్రమ్ముకున్నప్పుడు, వారు తమ నమ్మకాన్ని పూర్తిగా అల్లాహ్‌కే ప్రత్యేకించుకుని, ఆయన్ని మొరపెట్టుకుంటారు. మరి ఆయన వారిని రక్షించి నేలమీదకు చేర్చిన తరువాత వారిలో కొందరు (విశ్వాసానికీ – అవిశ్వాసానికి) మధ్యలో ఊగిసలాడతారు. నమ్మకద్రోహి, చేసినమేలును మరచినవాడు తప్ప వేరెవరూ మా ఆయతులను త్రోసిపుచ్చరు.
31:33 يَا أَيُّهَا النَّاسُ اتَّقُوا رَبَّكُمْ وَاخْشَوْا يَوْمًا لَّا يَجْزِي وَالِدٌ عَن وَلَدِهِ وَلَا مَوْلُودٌ هُوَ جَازٍ عَن وَالِدِهِ شَيْئًا ۚ إِنَّ وَعْدَ اللَّهِ حَقٌّ ۖ فَلَا تَغُرَّنَّكُمُ الْحَيَاةُ الدُّنْيَا وَلَا يَغُرَّنَّكُم بِاللَّهِ الْغَرُورُ
ప్రజలారా! మీ ప్రభువుకు భయపడండి. ఏ తండ్రీ తన కుమారునికి ఉపయోగపడని, ఏ కుమారుడూ తన తండ్రికి ఏ విధంగానూ ఉపయోగపడని దినానికి భయపడండి. అల్లాహ్ వాగ్దానం సత్యమైనది (అని తెలుసుకోండి). ప్రాపంచిక జీవితం మిమ్మల్ని మోసపుచ్చటంగానీ, మోసగాడు (షైతాను) మిమ్మల్ని మోసగించటంగానీ జరగరాదు సుమా!
31:34 إِنَّ اللَّهَ عِندَهُ عِلْمُ السَّاعَةِ وَيُنَزِّلُ الْغَيْثَ وَيَعْلَمُ مَا فِي الْأَرْحَامِ ۖ وَمَا تَدْرِي نَفْسٌ مَّاذَا تَكْسِبُ غَدًا ۖ وَمَا تَدْرِي نَفْسٌ بِأَيِّ أَرْضٍ تَمُوتُ ۚ إِنَّ اللَّهَ عَلِيمٌ خَبِيرٌ
నిస్సందేహంగా ప్రళయానికి సంబంధించిన జ్ఞానం అల్లాహ్ వద్ద మాత్రమే ఉంది. ఆయనే వర్షాన్ని కురిపిస్తున్నాడు. మాతృ గర్భాలలో ఏముందో ఆయనకు తెలుసు. తాను రేపు ఏం చేయనున్నదో ఏ ప్రాణీ ఎరుగదు. తాను ఏ గడ్డపై మరణిస్తాడో కూడా ఎవరికీ తెలీదు. అల్లాహ్‌యే సర్వజ్ఞాని, అన్నీ తెలిసినవాడు (అని తెలుసుకోండి).
- సూరా అస్ సజ్ ద హ్
32:1 الم
అలిఫ్ – లామ్ – మీమ్.
32:2 تَنزِيلُ الْكِتَابِ لَا رَيْبَ فِيهِ مِن رَّبِّ الْعَالَمِينَ
(ఇది) సర్వలోకాల ప్రభువు తరఫున అవతరింపజేయబడిన గ్రంథం. ఇందులో ఎలాంటి సందేహమే లేదు.
32:3 أَمْ يَقُولُونَ افْتَرَاهُ ۚ بَلْ هُوَ الْحَقُّ مِن رَّبِّكَ لِتُنذِرَ قَوْمًا مَّا أَتَاهُم مِّن نَّذِيرٍ مِّن قَبْلِكَ لَعَلَّهُمْ يَهْتَدُونَ
ఏమిటీ, ఇతను (ప్రవక్త) స్వయంగా దీనిని కల్పించుకున్నాడని వారంటున్నారా? (ముమ్మాటికీ కాదు) వాస్తవానికి ఇది నీ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యం – నీకు పూర్వం హెచ్చరించే వాడెవడూ రాని వారిని నువ్వు హెచ్చరించటానికి, తద్వారా వారు సన్మార్గానికి రావటానికిగాను (ఇది పంపబడినది).
32:4 اللَّهُ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ وَمَا بَيْنَهُمَا فِي سِتَّةِ أَيَّامٍ ثُمَّ اسْتَوَىٰ عَلَى الْعَرْشِ ۖ مَا لَكُم مِّن دُونِهِ مِن وَلِيٍّ وَلَا شَفِيعٍ ۚ أَفَلَا تَتَذَكَّرُونَ
అల్లాహ్‌యే ఆకాశాలనూ, భూమినీ, వాటి మధ్యనున్న సమస్తాన్నీ ఆరు రోజులలో సృష్టించాడు. ఆ తరువాత సింహాసనాన్ని (అర్ష్‌ను) అధిష్టించాడు. ఆయన తప్ప మీకు ఏ సహాయకుడూ, మరే సిఫారసు చేసేవాడూ లేడు. అయినా మీరు హితబోధను గ్రహించరేమిటీ?
32:5 يُدَبِّرُ الْأَمْرَ مِنَ السَّمَاءِ إِلَى الْأَرْضِ ثُمَّ يَعْرُجُ إِلَيْهِ فِي يَوْمٍ كَانَ مِقْدَارُهُ أَلْفَ سَنَةٍ مِّمَّا تَعُدُّونَ
ఆయనే ఆకాశాలు మొదలుకుని భూమి వరకు (ప్రతి) పనిని నడుపుతున్నాడు. మరి అది (ఆ పని) మీరు లెక్కించే వెయ్యి సంవత్సరాలంతటి ఒకానొక రోజున పైకి ఆయన వద్దకు చేరిపోతుంది.
32:6 ذَٰلِكَ عَالِمُ الْغَيْبِ وَالشَّهَادَةِ الْعَزِيزُ الرَّحِيمُ
ఆయనే గోప్యంగా, బహిర్గతంగా ఉన్న వాటిని ఎరిగినవాడు- అపార శక్తిసంపన్నుడు, అనంత కరుణామయుడు.
32:7 الَّذِي أَحْسَنَ كُلَّ شَيْءٍ خَلَقَهُ ۖ وَبَدَأَ خَلْقَ الْإِنسَانِ مِن طِينٍ
ఆయన ఏ వస్తువును చేసినా చాలా చక్కగా చేశాడు. మానవ సృష్టిని మట్టితో మొదలుపెట్టాడు.
32:8 ثُمَّ جَعَلَ نَسْلَهُ مِن سُلَالَةٍ مِّن مَّاءٍ مَّهِينٍ
ఆ తరువాత అతని సంతతిని అత్యంత అల్పమైన నీటి సారం (వీర్యం)తో కొనసాగించాడు.
32:9 ثُمَّ سَوَّاهُ وَنَفَخَ فِيهِ مِن رُّوحِهِ ۖ وَجَعَلَ لَكُمُ السَّمْعَ وَالْأَبْصَارَ وَالْأَفْئِدَةَ ۚ قَلِيلًا مَّا تَشْكُرُونَ
ఆ తరువాత తగు రీతిలో దానిని మలచి, అందులో తన వద్ద నుండి ఆత్మను ఊదాడు. మరి ఆయనే మీ చెవులను, కళ్లను, హృదయాలను చేశాడు. (ఈ ఉపకారాలకు కూడా) మీరు కృతజ్ఞతలు తెలుపుకునేది చాలా తక్కువే.
32:10 وَقَالُوا أَإِذَا ضَلَلْنَا فِي الْأَرْضِ أَإِنَّا لَفِي خَلْقٍ جَدِيدٍ ۚ بَلْ هُم بِلِقَاءِ رَبِّهِمْ كَافِرُونَ
“ఏమిటీ, మేము మట్టిలో కలసి, మాయమయిపోయిన తరువాత కూడా మళ్లీ సరికొత్తగా సృష్టించబడతామా?” అని అంటారు. అసలు విషయం ఏమిటంటే వారు తమ ప్రభువును కలుసుకోవటాన్ని త్రోసిపుచ్చుతున్నారు.
32:11 قُلْ يَتَوَفَّاكُم مَّلَكُ الْمَوْتِ الَّذِي وُكِّلَ بِكُمْ ثُمَّ إِلَىٰ رَبِّكُمْ تُرْجَعُونَ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “మీపై నియమించబడివున్న మృత్యుదూత మీ ప్రాణాలను వశపరచుకుంటాడు. ఆ తరువాత మీరంతా మీ ప్రభువు వైపునకు మరలించబడతారు.”
32:12 وَلَوْ تَرَىٰ إِذِ الْمُجْرِمُونَ نَاكِسُو رُءُوسِهِمْ عِندَ رَبِّهِمْ رَبَّنَا أَبْصَرْنَا وَسَمِعْنَا فَارْجِعْنَا نَعْمَلْ صَالِحًا إِنَّا مُوقِنُونَ
అపరాధులు తమ ప్రభువు సమక్షంలో తలలు వంచుకుని ఉండటాన్ని నువ్వు చూస్తే ఎంత బావుంటుంది! (వారిలా అంటారు): “మా ప్రభూ! మేమంతా చూసుకున్నాము. (అంతా) విన్నాము. ఇక మమ్మల్ని తిరిగి పంపించు. (ఇక నుంచి) మేము సత్కార్యాలు చేస్తాము. మాకిక పూర్తి నమ్మకం కలిగింది.”
32:13 وَلَوْ شِئْنَا لَآتَيْنَا كُلَّ نَفْسٍ هُدَاهَا وَلَٰكِنْ حَقَّ الْقَوْلُ مِنِّي لَأَمْلَأَنَّ جَهَنَّمَ مِنَ الْجِنَّةِ وَالنَّاسِ أَجْمَعِينَ
మేము గనక తలచుకుంటే, ప్రతి ఒక్కరికీ సన్మార్గం ప్రసాదించి ఉండేవాళ్ళం. అయితే, “నేను నరకాన్ని జిన్నులతోనూ, మనుషులతోనూ తప్పకుండా నింపుతాను” అన్న నా మాట నిజమయింది.
32:14 فَذُوقُوا بِمَا نَسِيتُمْ لِقَاءَ يَوْمِكُمْ هَٰذَا إِنَّا نَسِينَاكُمْ ۖ وَذُوقُوا عَذَابَ الْخُلْدِ بِمَا كُنتُمْ تَعْمَلُونَ
ఇక మీరు, మీకు చెందిన ఈనాటి సమావేశాన్ని విస్మరించినందుకు (శిక్ష) రుచిని చూడండి. మేము కూడా మిమ్మల్ని విస్మరించాము. ఇక మీరు చేసుకున్న చేష్టలకు (పర్యవసానంగా) శాశ్వతమైన శిక్ష రుచిచూడండి.
32:15 إِنَّمَا يُؤْمِنُ بِآيَاتِنَا الَّذِينَ إِذَا ذُكِّرُوا بِهَا خَرُّوا سُجَّدًا وَسَبَّحُوا بِحَمْدِ رَبِّهِمْ وَهُمْ لَا يَسْتَكْبِرُونَ ۩
మా ఆయతులు బోధించబడినప్పుడు సజ్దాలో పడిపోయేవారు, తమ ప్రభువును స్తుతిస్తూ ఆయన పవిత్రతను కొనియాడేవారు, గర్వపడనివారు మాత్రమే మా సూక్తులను నమ్ముతారు.
32:16 تَتَجَافَىٰ جُنُوبُهُمْ عَنِ الْمَضَاجِعِ يَدْعُونَ رَبَّهُمْ خَوْفًا وَطَمَعًا وَمِمَّا رَزَقْنَاهُمْ يُنفِقُونَ
వారి ప్రక్కలు వారి పడకల నుంచి వేరుగా ఉంటాయి. వారు తమ ప్రభువును భయంతోనూ, ఆశతోనూ ప్రార్థిస్తారు. మేము వారికి ప్రసాదించిన దానినుండి ఖర్చుపెడతారు.
32:17 فَلَا تَعْلَمُ نَفْسٌ مَّا أُخْفِيَ لَهُم مِّن قُرَّةِ أَعْيُنٍ جَزَاءً بِمَا كَانُوا يَعْمَلُونَ
వారు చేసిన కర్మలకు ప్రతిఫలంగా, వారి కళ్లకు చలువనిచ్చే ఎలాంటి సామగ్రిని మేము దాచిపెట్టామో (దాని గురించి) ఏ ప్రాణికీ తెలియదు.
32:18 أَفَمَن كَانَ مُؤْمِنًا كَمَن كَانَ فَاسِقًا ۚ لَّا يَسْتَوُونَ
ఏమిటి? విశ్వసించిన వ్యక్తిని అవిధేయునితో సరిపోల్చటం తగునా? వారిద్దరు ఎన్నటికీ సమానులు కాజాలరు.
32:19 أَمَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ فَلَهُمْ جَنَّاتُ الْمَأْوَىٰ نُزُلًا بِمَا كَانُوا يَعْمَلُونَ
ఎవరు విశ్వసించి, సత్కార్యాలు కూడా చేశారో వారు చేసుకున్న కర్మలకు బదులుగా వారికి శాశ్వతమైన స్వర్గనివాసం ఆతిథ్యంగా లభిస్తుంది.
32:20 وَأَمَّا الَّذِينَ فَسَقُوا فَمَأْوَاهُمُ النَّارُ ۖ كُلَّمَا أَرَادُوا أَن يَخْرُجُوا مِنْهَا أُعِيدُوا فِيهَا وَقِيلَ لَهُمْ ذُوقُوا عَذَابَ النَّارِ الَّذِي كُنتُم بِهِ تُكَذِّبُونَ
మరెవరు అవిధేయతకు ఒడిగట్టారో వారి నివాసస్థలం నరకం అవుతుంది. దాన్నుంచి బయటపడేందుకు వారు ప్రయత్నించినప్పుడల్లా అందులోనికే నెట్టివేయబడతారు. “మీరు తిరస్కరిస్తూ ఉండిన అగ్ని శిక్షను చవిచూడండి” అని వారితో అనబడుతుంది.
32:21 وَلَنُذِيقَنَّهُم مِّنَ الْعَذَابِ الْأَدْنَىٰ دُونَ الْعَذَابِ الْأَكْبَرِ لَعَلَّهُمْ يَرْجِعُونَ
ఆ పెద్ద శిక్షకు ముందు మేము వారికి సమీపంలోని కొన్ని (చిన్నపాటి) శిక్షల రుచి తప్పకుండా చూపిస్తూ ఉంటాము- (ఆ విధంగానయినా) వారు దారికి వస్తారని!
32:22 وَمَنْ أَظْلَمُ مِمَّن ذُكِّرَ بِآيَاتِ رَبِّهِ ثُمَّ أَعْرَضَ عَنْهَا ۚ إِنَّا مِنَ الْمُجْرِمِينَ مُنتَقِمُونَ
తన ప్రభువు ఆయతుల ఆధారంగా బోధపరచినప్పటికీ వాటి నుండి ముఖం త్రిప్పుకుపోయిన వాని కంటే దుర్మార్గుడెవడుంటాడు? మేము కూడా (అలాంటి) పాపాత్ములకు తప్పకుండా ప్రతీకారం చేస్తాము.
32:23 وَلَقَدْ آتَيْنَا مُوسَى الْكِتَابَ فَلَا تَكُن فِي مِرْيَةٍ مِّن لِّقَائِهِ ۖ وَجَعَلْنَاهُ هُدًى لِّبَنِي إِسْرَائِيلَ
నిశ్చయంగా మేము మూసాకు గ్రంథం వొసగి ఉన్నాము. కాబట్టి అతన్ని కలుసుకునే విషయంలో నువ్వు ఏమాత్రం సంశయంలో పడకూడదు. మేము దానిని ఇస్రాయీల్ సంతతి వారికోసం మార్గదర్శక సాధనంగా చేశాము.
32:24 وَجَعَلْنَا مِنْهُمْ أَئِمَّةً يَهْدُونَ بِأَمْرِنَا لَمَّا صَبَرُوا ۖ وَكَانُوا بِآيَاتِنَا يُوقِنُونَ
మరి వారు సహన స్థయిర్యాలను కనబరచినప్పుడు, మా ఆదేశానుసారం జనులకు మార్గదర్శకత్వం వహించే నాయకులను మేము వారిలో చేశాము. వారు మా ఆయతులపై దృఢ విశ్వాసం కలిగి ఉండేవారు.
32:25 إِنَّ رَبَّكَ هُوَ يَفْصِلُ بَيْنَهُمْ يَوْمَ الْقِيَامَةِ فِيمَا كَانُوا فِيهِ يَخْتَلِفُونَ
వారు పరస్పరం విభేదించుకుంటున్న విషయాలపై ప్రళయ దినాన నీ ప్రభువు వారి మధ్య (తప్పకుండా) తీర్పు చేస్తాడు.
32:26 أَوَلَمْ يَهْدِ لَهُمْ كَمْ أَهْلَكْنَا مِن قَبْلِهِم مِّنَ الْقُرُونِ يَمْشُونَ فِي مَسَاكِنِهِمْ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ ۖ أَفَلَا يَسْمَعُونَ
ఏమిటీ, మేము వారికి పూర్వం ఎన్నో సమాజాలను తుద ముట్టించిన సంగతి కూడా వారికి సన్మార్గం చూపలేదా? మరి (చూడబోతే) వాళ్ళు నివసించిన స్థలాలలోకి వారు వస్తూ పోతూనే ఉన్నారు. నిశ్చయంగా ఇందులో (గొప్ప) సూచనలున్నాయి. అయినప్పటికీ వారు వినరా?
32:27 أَوَلَمْ يَرَوْا أَنَّا نَسُوقُ الْمَاءَ إِلَى الْأَرْضِ الْجُرُزِ فَنُخْرِجُ بِهِ زَرْعًا تَأْكُلُ مِنْهُ أَنْعَامُهُمْ وَأَنفُسُهُمْ ۖ أَفَلَا يُبْصِرُونَ
ఏమిటీ, వీళ్లు గమనించటం లేదా? – మేము నీళ్ళను బంజరు భూమి వైపుకు ప్రవహింపజేస్తూ తీసుకుపోతున్నాము, మరి దాని ద్వారా పంటలను వెలికి తీస్తున్నాము. వాటిని వారి పశువులూ తింటున్నాయి. స్వయంగా వారు కూడా (తింటున్నారు). అయినా వాళ్ళు దృష్టిని సారించరా?
32:28 وَيَقُولُونَ مَتَىٰ هَٰذَا الْفَتْحُ إِن كُنتُمْ صَادِقِينَ
“ఇంతకీ ఈ తీర్పు ఎప్పుడు జరుగుతుంది? మీరు సత్యవంతులే అయితే (చెప్పండి)” అని వారంటున్నారు.
32:29 قُلْ يَوْمَ الْفَتْحِ لَا يَنفَعُ الَّذِينَ كَفَرُوا إِيمَانُهُمْ وَلَا هُمْ يُنظَرُونَ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “తీర్పు జరిగే దినాన విశ్వసించటం అవిశ్వాసులకు ఏ విధంగానూ ఉపకరించదు. వారికి గడువు కూడా ఇవ్వబడదు.”
32:30 فَأَعْرِضْ عَنْهُمْ وَانتَظِرْ إِنَّهُم مُّنتَظِرُونَ
కనుక (ఓ ముహమ్మద్ – స!) వాళ్ళ సంగతిని వదలిపెట్టు. నిరీక్షించు. వాళ్ళు కూడా నిరీక్షిస్తున్నారు. - సూరా అల్ ఆహ్ జాబ్
33:1 يَا أَيُّهَا النَّبِيُّ اتَّقِ اللَّهَ وَلَا تُطِعِ الْكَافِرِينَ وَالْمُنَافِقِينَ ۗ إِنَّ اللَّهَ كَانَ عَلِيمًا حَكِيمًا
ఓ ప్రవక్తా! అల్లాహ్‌కు భయపడుతూ ఉండు. అవిశ్వాసులకు, కపటులకు విధేయత చూపకు. నిశ్చయంగా అల్లాహ్‌యే మహాజ్ఞాని, మహావివేకి.
33:2 وَاتَّبِعْ مَا يُوحَىٰ إِلَيْكَ مِن رَّبِّكَ ۚ إِنَّ اللَّهَ كَانَ بِمَا تَعْمَلُونَ خَبِيرًا
నీ ప్రభువు తరఫు నుంచి నీవద్దకు వచ్చే వహీని అనుసరిస్తూ ఉండు. మీరు చేసే ప్రతి పనీ అల్లాహ్‌కు బాగా తెలుసు.
33:3 وَتَوَكَّلْ عَلَى اللَّهِ ۚ وَكَفَىٰ بِاللَّهِ وَكِيلًا
నువ్వు అల్లాహ్‌ను మాత్రమే నమ్ముకో. కార్యసిద్ధికి అల్లాహ్ ఒక్కడే చాలు.
33:4 مَّا جَعَلَ اللَّهُ لِرَجُلٍ مِّن قَلْبَيْنِ فِي جَوْفِهِ ۚ وَمَا جَعَلَ أَزْوَاجَكُمُ اللَّائِي تُظَاهِرُونَ مِنْهُنَّ أُمَّهَاتِكُمْ ۚ وَمَا جَعَلَ أَدْعِيَاءَكُمْ أَبْنَاءَكُمْ ۚ ذَٰلِكُمْ قَوْلُكُم بِأَفْوَاهِكُمْ ۖ وَاللَّهُ يَقُولُ الْحَقَّ وَهُوَ يَهْدِي السَّبِيلَ
ఏ మనిషి శరీరంలోనూ అల్లాహ్ రెండు హృదయాలను ఉంచలేదు. మీరు మీ భార్యల్లో ఎవరినయినా మీ తల్లులుగా ప్రకటించినంతమాత్రాన అల్లాహ్ వారిని (నిజంగానే) మీ తల్లులుగా చేయలేదు. మీ దత్తపుత్రులను కూడా మీ (కన్న) కొడుకులుగా చేయలేదు. ఇవన్నీ మీ నోటిమాటలే. అల్లాహ్ సత్యం పలుకుతున్నాడు. ఆయన (రుజు) మార్గం చూపుతున్నాడు.
33:5 ادْعُوهُمْ لِآبَائِهِمْ هُوَ أَقْسَطُ عِندَ اللَّهِ ۚ فَإِن لَّمْ تَعْلَمُوا آبَاءَهُمْ فَإِخْوَانُكُمْ فِي الدِّينِ وَمَوَالِيكُمْ ۚ وَلَيْسَ عَلَيْكُمْ جُنَاحٌ فِيمَا أَخْطَأْتُم بِهِ وَلَٰكِن مَّا تَعَمَّدَتْ قُلُوبُكُمْ ۚ وَكَانَ اللَّهُ غَفُورًا رَّحِيمًا
దత్తపుత్రులను వారి (కన్న) తండ్రుల సంబంధంతోనే పిలవండి. అల్లాహ్ దృష్టిలో ఇదే న్యాయం. ఒకవేళ వారి (కన్న) తండ్రులెవరో మీకు తెలీకపోతే, అట్టి పరిస్థితిలో వారు మీ ధార్మిక సోదరులు, స్నేహితులు అవుతారు. మరుపు వల్ల మీచేత ఏదన్నా (తప్పు) జరిగిపోతే దాని పాపం మీపై ఉండదు. అయితే హృదయపూర్వకంగా చేసిన పక్షంలో అది పాపమే. అల్లాహ్ అపారంగా క్షమించేవాడు, అమితంగా కనికరించేవాడు.
33:6 النَّبِيُّ أَوْلَىٰ بِالْمُؤْمِنِينَ مِنْ أَنفُسِهِمْ ۖ وَأَزْوَاجُهُ أُمَّهَاتُهُمْ ۗ وَأُولُو الْأَرْحَامِ بَعْضُهُمْ أَوْلَىٰ بِبَعْضٍ فِي كِتَابِ اللَّهِ مِنَ الْمُؤْمِنِينَ وَالْمُهَاجِرِينَ إِلَّا أَن تَفْعَلُوا إِلَىٰ أَوْلِيَائِكُم مَّعْرُوفًا ۚ كَانَ ذَٰلِكَ فِي الْكِتَابِ مَسْطُورًا
దైవ ప్రవక్తకు విశ్వాసులపై స్వయంగా వారి ఆత్మల కన్నా ఎక్కువ హక్కు ఉంది. అతని భార్యలు విశ్వాసుల కొరకు తల్లులు. మరి దైవగ్రంథం ప్రకారం రక్తసంబంధీకులు ఇతర విశ్వాసుల, ముహాజిర్ల కన్నా పరస్పరం ఎక్కువ హక్కుదారులు. ఒకవేళ మీరు మీ స్నేహితుల యెడల సద్వ్యవహారం (ఏదన్నా) చేయదలిస్తే అది వేరే విషయం. ఈ ఉత్తర్వు (దైవ) గ్రంథంలో లిఖితమై ఉంది.
33:7 وَإِذْ أَخَذْنَا مِنَ النَّبِيِّينَ مِيثَاقَهُمْ وَمِنكَ وَمِن نُّوحٍ وَإِبْرَاهِيمَ وَمُوسَىٰ وَعِيسَى ابْنِ مَرْيَمَ ۖ وَأَخَذْنَا مِنْهُم مِّيثَاقًا غَلِيظًا
(ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకో) మేము ప్రవక్తలందరి నుండి వాగ్దానం తీసుకున్నాము- (ముఖ్యంగా) నీ నుండి, నూహ్ నుండి, ఇబ్రాహీం నుండి, మూసా నుండి, మర్యమ్ కుమారుడైన ఈసా నుండి. మేము వారందరి నుండి గట్టి వాగ్దానం తీసుకున్నాము –
33:8 لِّيَسْأَلَ الصَّادِقِينَ عَن صِدْقِهِمْ ۚ وَأَعَدَّ لِلْكَافِرِينَ عَذَابًا أَلِيمًا
అల్లాహ్ సత్యవంతులను వారి సత్యత గురించి ప్రశ్నించటానికి. అవిశ్వాసుల కొరకు ఆయన బాధాకరమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాడు.
33:9 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اذْكُرُوا نِعْمَةَ اللَّهِ عَلَيْكُمْ إِذْ جَاءَتْكُمْ جُنُودٌ فَأَرْسَلْنَا عَلَيْهِمْ رِيحًا وَجُنُودًا لَّمْ تَرَوْهَا ۚ وَكَانَ اللَّهُ بِمَا تَعْمَلُونَ بَصِيرًا
ఓ విశ్వాసులారా! అల్లాహ్ మీపై కురిపించిన దయానుగ్రహాన్ని కాస్త జ్ఞప్తికి తెచ్చుకోండి. మీపై సైనిక దళాలు దండెత్తి వచ్చినప్పుడు మేము వాటిపై ప్రచండమైన పెనుగాలిని, మీకు కానరాని సైన్యాలను పంపాము. మీరు చేస్తున్నదంతా అల్లాహ్ చూస్తూనే ఉన్నాడు.
33:10 إِذْ جَاءُوكُم مِّن فَوْقِكُمْ وَمِنْ أَسْفَلَ مِنكُمْ وَإِذْ زَاغَتِ الْأَبْصَارُ وَبَلَغَتِ الْقُلُوبُ الْحَنَاجِرَ وَتَظُنُّونَ بِاللَّهِ الظُّنُونَا
(శత్రువులు) మీపైకి పైతట్టునుంచీ, లోతట్టునుంచీ దండెత్తి వచ్చినప్పుడు (మీరు) కళ్ళు తేలవేసినప్పుడు, (మీ) గుండెలు గొంతుల దాకా వచ్చేసినప్పుడు, మీరు అల్లాహ్ విషయంలో రకరకాల అనుమానాలకు లోనయ్యారు.
33:11 هُنَالِكَ ابْتُلِيَ الْمُؤْمِنُونَ وَزُلْزِلُوا زِلْزَالًا شَدِيدًا
అప్పుడు విశ్వాసులు పరీక్షించబడ్డారు. తీవ్రంగా కుదిపివేయబడ్డారు.
33:12 وَإِذْ يَقُولُ الْمُنَافِقُونَ وَالَّذِينَ فِي قُلُوبِهِم مَّرَضٌ مَّا وَعَدَنَا اللَّهُ وَرَسُولُهُ إِلَّا غُرُورًا
ఆ సమయంలో కపటులు, హృదయాలలో (అనుమానపు) రోగం ఉన్నవారు, “అల్లాహ్, ఆయన ప్రవక్త మాతో చేసిన వాగ్దానం మోసం తప్ప మరేమీ కాదు” అని చెప్పసాగారు.
33:13 وَإِذْ قَالَت طَّائِفَةٌ مِّنْهُمْ يَا أَهْلَ يَثْرِبَ لَا مُقَامَ لَكُمْ فَارْجِعُوا ۚ وَيَسْتَأْذِنُ فَرِيقٌ مِّنْهُمُ النَّبِيَّ يَقُولُونَ إِنَّ بُيُوتَنَا عَوْرَةٌ وَمَا هِيَ بِعَوْرَةٍ ۖ إِن يُرِيدُونَ إِلَّا فِرَارًا
అప్పుడు వారిలోని ఒక వర్గం ఈ విధంగా గగ్గోలు చెందింది: “ఓ యస్రిబ్ (మదీనా) వాసులారా! ఇక మీరిక్కడ ఉండటానికి అవకాశమే లేదు. తిరుగు ముఖం పట్టండి.” మరి వారిలోని ఒక బృందం, “మా ఇండ్లు సురక్షితంగా లేవు” అని చెప్పి దైవప్రవక్త (స) నుంచి అనుమతి కోరసాగింది. మరి (చూడబోతే) అవి అభద్రంగా ఏమీలేవు. (అసలు) వారి ఉద్దేశం పలాయనం చిత్తగించాలన్నదే.
33:14 وَلَوْ دُخِلَتْ عَلَيْهِم مِّنْ أَقْطَارِهَا ثُمَّ سُئِلُوا الْفِتْنَةَ لَآتَوْهَا وَمَا تَلَبَّثُوا بِهَا إِلَّا يَسِيرًا
ఒకవేళ (మదీనా) నగరం నలువైపుల నుంచీ (శత్రువులు) చొచ్చుకు వచ్చి, అరాచకం సృష్టించమని వారిని కోరితే దానికి వారు తప్పకుండా అలా చేస్తారు. చాలా కొద్దిగా తప్ప ఆలస్యం చేయరు.
33:15 وَلَقَدْ كَانُوا عَاهَدُوا اللَّهَ مِن قَبْلُ لَا يُوَلُّونَ الْأَدْبَارَ ۚ وَكَانَ عَهْدُ اللَّهِ مَسْئُولًا
ఇదివరకు వారు, తాము వెన్ను చూపము అని అల్లాహ్‌కు మాటిచ్చి ఉన్నారు. అల్లాహ్‌తో చేసిన బాస గురించి తప్పకుండా ప్రశ్నించటం జరుగుతుంది.
33:16 قُل لَّن يَنفَعَكُمُ الْفِرَارُ إِن فَرَرْتُم مِّنَ الْمَوْتِ أَوِ الْقَتْلِ وَإِذًا لَّا تُمَتَّعُونَ إِلَّا قَلِيلًا
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “మీరు చావు నుండి లేదా వధ బారి నుండి భయపడి పారిపోతే ఈ పారిపోవటం మీకేమాత్రం ప్రయోజనం కలిగించదు. అట్టి పరిస్థితిలో మీరు కొద్దిపాటి ప్రయోజనాన్ని మాత్రమే పొందుతారు.
33:17 قُلْ مَن ذَا الَّذِي يَعْصِمُكُم مِّنَ اللَّهِ إِنْ أَرَادَ بِكُمْ سُوءًا أَوْ أَرَادَ بِكُمْ رَحْمَةً ۚ وَلَا يَجِدُونَ لَهُم مِّن دُونِ اللَّهِ وَلِيًّا وَلَا نَصِيرًا
వారిని అడుగు: “ఒకవేళ అల్లాహ్ మీకు ఏదన్నా కీడు కలుగ జేయాలనుకున్నా లేక మీపై దయజూపాలనుకున్నా ఆయన నుండి మిమ్మల్ని కాపాడగలవాడెవడు? (లేక అడ్డుకోగల వాడెవడు?) వారు తమ కోసం అల్లాహ్ తప్ప ఏ సంరక్షకుణ్ణీ, ఏ సహాయకుణ్ణీ పొందలేరు.
33:18 قَدْ يَعْلَمُ اللَّهُ الْمُعَوِّقِينَ مِنكُمْ وَالْقَائِلِينَ لِإِخْوَانِهِمْ هَلُمَّ إِلَيْنَا ۖ وَلَا يَأْتُونَ الْبَأْسَ إِلَّا قَلِيلًا
మీలో ఇతరులను అడ్డుకునేవారెవరో, తమ సోదరులనుద్దేశించి, “మా దగ్గరకు వచ్చేయండి” అని చెప్పేవారెవరో అల్లాహ్‌కు (బాగా) తెలుసు. వారు ఎప్పుడో గాని యుద్ధానికి రారు.
33:19 أَشِحَّةً عَلَيْكُمْ ۖ فَإِذَا جَاءَ الْخَوْفُ رَأَيْتَهُمْ يَنظُرُونَ إِلَيْكَ تَدُورُ أَعْيُنُهُمْ كَالَّذِي يُغْشَىٰ عَلَيْهِ مِنَ الْمَوْتِ ۖ فَإِذَا ذَهَبَ الْخَوْفُ سَلَقُوكُم بِأَلْسِنَةٍ حِدَادٍ أَشِحَّةً عَلَى الْخَيْرِ ۚ أُولَٰئِكَ لَمْ يُؤْمِنُوا فَأَحْبَطَ اللَّهُ أَعْمَالَهُمْ ۚ وَكَانَ ذَٰلِكَ عَلَى اللَّهِ يَسِيرًا
వారు మీకు తోడ్పడే విషయంలో (పరమ) పీనాసులు. మరి భయాందోళనల పరిస్థితి ఎదురైనప్పుడు, చచ్చిపోయేవాడు కను గుడ్లు తేలవేసినట్లు, వారు నీ వైపు అదేపనిగా చూడటాన్ని నువ్వు గమనిస్తావు. ఆ తరువాత భయోత్పాతం వీడిపోతున్నప్పుడు, తమ పదునైన నాలుకలతో కోతలు కోస్తూ, నీ దగ్గరకు వస్తారు. విపరీతమైన ధనవ్యామోహం ఉన్నవారు. వారసలు విశ్వసించనే లేదు. అల్లాహ్ వారి కర్మలన్నింటినీ వృధా గావించాడు. అలా చేయటం అల్లాహ్‌కు చాలా తేలిక.
33:20 يَحْسَبُونَ الْأَحْزَابَ لَمْ يَذْهَبُوا ۖ وَإِن يَأْتِ الْأَحْزَابُ يَوَدُّوا لَوْ أَنَّهُم بَادُونَ فِي الْأَعْرَابِ يَسْأَلُونَ عَنْ أَنبَائِكُمْ ۖ وَلَوْ كَانُوا فِيكُم مَّا قَاتَلُوا إِلَّا قَلِيلًا
(దండెత్తి వచ్చిన) సైన్యాలు ఇంతవరకూ తిరిగి వెళ్ళలేదనే వారు భావిస్తున్నారు. ఒకవేళ సైన్యాలు(మళ్లీ) వచ్చిపడినట్లయితే, తాము ఎడారుల్లో పల్లెవాసులతోనే ఉండి, మీ సమాచారాలు తెలుసుకుంటూ ఉంటే బావుండేదే’ అని కోరుకుంటారు. ఒకవేళ వారు మీ మధ్యలో వున్నా (ఒరిగేదేమీ లేదు. వారు) అంతంత మాత్రంగానే పోరాడతారు.
33:21 لَّقَدْ كَانَ لَكُمْ فِي رَسُولِ اللَّهِ أُسْوَةٌ حَسَنَةٌ لِّمَن كَانَ يَرْجُو اللَّهَ وَالْيَوْمَ الْآخِرَ وَذَكَرَ اللَّهَ كَثِيرًا
నిశ్చయంగా దైవప్రవక్తలో మీ కొరకు అత్యుత్తమ ఆదర్శం ఉంది- అల్లాహ్ పట్ల, అంతిమ దినం పట్ల ఆశ కలిగి ఉండి, అల్లాహ్‌ను అత్యధికంగా స్మరించే ప్రతి ఒక్కరి కొరకు.
33:22 وَلَمَّا رَأَى الْمُؤْمِنُونَ الْأَحْزَابَ قَالُوا هَٰذَا مَا وَعَدَنَا اللَّهُ وَرَسُولُهُ وَصَدَقَ اللَّهُ وَرَسُولُهُ ۚ وَمَا زَادَهُمْ إِلَّا إِيمَانًا وَتَسْلِيمًا
విశ్వాసులు (అవిశ్వాసుల) సేనలను చూడగానే (అప్రయత్నంగా) ఇలా అన్నారు: “అల్లాహ్, ఆయన ప్రవక్త మనకు వాగ్దానం చేసిన విషయం ఇదే. అల్లాహ్, ఆయన ప్రవక్త చెప్పింది నిజమే.” ఆ సంఘటన వారి విశ్వాసాన్ని, ఆత్మ సమర్పణాభావాన్ని మరింత అధికం చేసింది.
33:23 مِّنَ الْمُؤْمِنِينَ رِجَالٌ صَدَقُوا مَا عَاهَدُوا اللَّهَ عَلَيْهِ ۖ فَمِنْهُم مَّن قَضَىٰ نَحْبَهُ وَمِنْهُم مَّن يَنتَظِرُ ۖ وَمَا بَدَّلُوا تَبْدِيلًا
విశ్వాసులలో కొందరు అల్లాహ్‌తో చేసిన వాగ్దానాన్ని నిజం చేసి చూపిన వారున్నారు. కొందరు తమ వాగ్దానాన్ని నెరవేర్చుకోగా, మరి కొందరు (అవకాశం కోసం) ఎదురు చూస్తున్నారు. వారు (తమ పోరాట స్ఫూర్తిలో) ఎలాంటి మార్పు రానివ్వలేదు.
33:24 لِّيَجْزِيَ اللَّهُ الصَّادِقِينَ بِصِدْقِهِمْ وَيُعَذِّبَ الْمُنَافِقِينَ إِن شَاءَ أَوْ يَتُوبَ عَلَيْهِمْ ۚ إِنَّ اللَّهَ كَانَ غَفُورًا رَّحِيمًا
(ఎందుకంటే) అల్లాహ్ సత్యవంతులకు వారి సత్యత యొక్క ప్రతిఫలం వొసగటానికి, ఇంకా (అల్లాహ్) తాను కోరితే కపటులను శిక్షించటానికి లేదా వారి పశ్చాత్తాపాన్ని స్వీకరించటానికి (ఇదంతా జరిగింది). అల్లాహ్ అపారంగా క్షమించేవాడు, అమితంగా కరుణించేవాడు.
33:25 وَرَدَّ اللَّهُ الَّذِينَ كَفَرُوا بِغَيْظِهِمْ لَمْ يَنَالُوا خَيْرًا ۚ وَكَفَى اللَّهُ الْمُؤْمِنِينَ الْقِتَالَ ۚ وَكَانَ اللَّهُ قَوِيًّا عَزِيزًا
అల్లాహ్ అవిశ్వాసులను వారి కోపం (రగులుతున్న) స్థితిలోనే వెనక్కి తరిమాడు. (అక్కడ) వారు ఏ లాభాన్నీ పొందలేదు. విశ్వాసుల పక్షాన యుద్ధం చేయటానికి అల్లాహ్‌యే సరిపోయాడు. అల్లాహ్ మహాబలుడు, ప్రాబల్యం కలవాడు.
33:26 وَأَنزَلَ الَّذِينَ ظَاهَرُوهُم مِّنْ أَهْلِ الْكِتَابِ مِن صَيَاصِيهِمْ وَقَذَفَ فِي قُلُوبِهِمُ الرُّعْبَ فَرِيقًا تَقْتُلُونَ وَتَأْسِرُونَ فَرِيقًا
వారికి (అంటే అవిశ్వాసులకు) తోడ్పడిన గ్రంథవహులను కూడా అల్లాహ్ వారి కోటల నుంచి దించేశాడు. (మీపట్ల) వారి గుండెలలో గుబులును నింపేశాడు. (దాంతో) మీరు వారిలోని ఒక వర్గాన్ని వధించసాగారు, మరో వర్గాన్ని బందీలుగా పట్టుకోసాగారు.
33:27 وَأَوْرَثَكُمْ أَرْضَهُمْ وَدِيَارَهُمْ وَأَمْوَالَهُمْ وَأَرْضًا لَّمْ تَطَئُوهَا ۚ وَكَانَ اللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرًا
ఇంకా ఆయన వారి భూములకు, వారి ఇండ్లకు, వారి సిరిసంపదలకు మిమ్మల్ని వారసులుగా చేశాడు. మీరు కాలు మోపని భూమిని కూడా (ఆయన మీ పాదాక్రాంతం చేశాడు). అల్లాహ్ అన్నింటిపై అధికారం కలవాడు సుమా!
33:28 يَا أَيُّهَا النَّبِيُّ قُل لِّأَزْوَاجِكَ إِن كُنتُنَّ تُرِدْنَ الْحَيَاةَ الدُّنْيَا وَزِينَتَهَا فَتَعَالَيْنَ أُمَتِّعْكُنَّ وَأُسَرِّحْكُنَّ سَرَاحًا جَمِيلًا
ఓ ప్రవక్తా! నీ భార్యలకు ఇలా చెప్పు: “మీరు గనక ప్రాపంచిక జీవితాన్ని, దాని తళుకు బెళుకులను కోరుకుంటూ ఉన్నట్లయితే, రండి, నేను మీకు ఎంతో కొంత ఇచ్చి, మిమ్మల్ని ఉత్తమరీతిలో సాగనంపుతాను –
33:29 وَإِن كُنتُنَّ تُرِدْنَ اللَّهَ وَرَسُولَهُ وَالدَّارَ الْآخِرَةَ فَإِنَّ اللَّهَ أَعَدَّ لِلْمُحْسِنَاتِ مِنكُنَّ أَجْرًا عَظِيمًا
“కాని ఒకవేళ అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తను, పరలోక నిలయాన్ని పొందాలన్నదే మీ లక్ష్యమైతే, మీలోని సద్వర్తనుల కోసం అల్లాహ్ గొప్ప పుణ్యఫలాన్ని సిద్ధం చేసి ఉంచాడు.”
33:30 يَا نِسَاءَ النَّبِيِّ مَن يَأْتِ مِنكُنَّ بِفَاحِشَةٍ مُّبَيِّنَةٍ يُضَاعَفْ لَهَا الْعَذَابُ ضِعْفَيْنِ ۚ وَكَانَ ذَٰلِكَ عَلَى اللَّهِ يَسِيرًا
ఓ ప్రవక్త సతీమణులారా! మీలో ఎవరయినాసరే స్పష్టంగా అసభ్యకరమైన చేష్టకి పాల్పడినట్లయితే ఆమెకు రెండింతల శిక్ష విధించబడుతుంది. ఇది అల్లాహ్‌కు చాలా తేలిక.
33:31 وَمَن يَقْنُتْ مِنكُنَّ لِلَّهِ وَرَسُولِهِ وَتَعْمَلْ صَالِحًا نُّؤْتِهَا أَجْرَهَا مَرَّتَيْنِ وَأَعْتَدْنَا لَهَا رِزْقًا كَرِيمًا
మరి మీలో ఎవరు అల్లాహ్‌కు, ఆయన ప్రవక్తకు విధేయత కనబరుస్తారో, సదాచరణ చేస్తారో ఆమెకు మేము రెండింతల పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాము. ఆమె కోసం మేము గౌరవప్రదమైన ఉపాధిని సిద్ధం చేసి ఉంచాము.
33:32 يَا نِسَاءَ النَّبِيِّ لَسْتُنَّ كَأَحَدٍ مِّنَ النِّسَاءِ ۚ إِنِ اتَّقَيْتُنَّ فَلَا تَخْضَعْنَ بِالْقَوْلِ فَيَطْمَعَ الَّذِي فِي قَلْبِهِ مَرَضٌ وَقُلْنَ قَوْلًا مَّعْرُوفًا
ఓ ప్రవక్త సతీమణులారా! మీరు సాధారణ స్త్రీల వంటివారు కారు. మీరు (అల్లాహ్‌కు) భయపడేవారే అయితే సుతిమెత్తని శైలిలో మాట్లాడకండి. దాని వల్ల హృదయంలో (దురాలోచనా) రోగం ఉన్నవాడు అత్యాశకు పోవచ్చు. కనుక మాట్లాడితే ఉత్తమ రీతిలోనే మాట్లాడండి.
33:33 وَقَرْنَ فِي بُيُوتِكُنَّ وَلَا تَبَرَّجْنَ تَبَرُّجَ الْجَاهِلِيَّةِ الْأُولَىٰ ۖ وَأَقِمْنَ الصَّلَاةَ وَآتِينَ الزَّكَاةَ وَأَطِعْنَ اللَّهَ وَرَسُولَهُ ۚ إِنَّمَا يُرِيدُ اللَّهُ لِيُذْهِبَ عَنكُمُ الرِّجْسَ أَهْلَ الْبَيْتِ وَيُطَهِّرَكُمْ تَطْهِيرًا
మీరు మీ ఇండ్లల్లోనే ఆగి ఉండండి. పూర్వపు అజ్ఞాన కాలంలో మాదిరిగా మీ సింగారాన్ని చూపిస్తూ తిరగకండి. నమాజు చేస్తూ ఉండండి. జకాతు ఇస్తూ ఉండండి. అల్లాహ్‌కు, ఆయన ప్రవక్తకు విధేయత చూపుతూ ఉండండి. ఓ ప్రవక్త ఇంటివారలారా! మీ నుండి (అన్ని రకాల) మాలిన్యాన్ని దూరం చేయాలన్నది, మిమ్మల్ని పూర్తిగా పరిశుద్ధపరచాలన్నది అల్లాహ్ అభిలాష.
33:34 وَاذْكُرْنَ مَا يُتْلَىٰ فِي بُيُوتِكُنَّ مِنْ آيَاتِ اللَّهِ وَالْحِكْمَةِ ۚ إِنَّ اللَّهَ كَانَ لَطِيفًا خَبِيرًا
మీ ఇండ్లలో పారాయణం చేయబడే అల్లాహ్ ఆయతులను, ప్రవక్త ప్రవచనాలను స్మరించుకుంటూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ మృదుస్వభావి, అన్నీ తెలిసినవాడు.
33:35 إِنَّ الْمُسْلِمِينَ وَالْمُسْلِمَاتِ وَالْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ وَالْقَانِتِينَ وَالْقَانِتَاتِ وَالصَّادِقِينَ وَالصَّادِقَاتِ وَالصَّابِرِينَ وَالصَّابِرَاتِ وَالْخَاشِعِينَ وَالْخَاشِعَاتِ وَالْمُتَصَدِّقِينَ وَالْمُتَصَدِّقَاتِ وَالصَّائِمِينَ وَالصَّائِمَاتِ وَالْحَافِظِينَ فُرُوجَهُمْ وَالْحَافِظَاتِ وَالذَّاكِرِينَ اللَّهَ كَثِيرًا وَالذَّاكِرَاتِ أَعَدَّ اللَّهُ لَهُم مَّغْفِرَةً وَأَجْرًا عَظِيمًا
నిశ్చయంగా ముస్లిం పురుషులు – ముస్లిం స్త్రీలు, విశ్వాసులైన పురుషులు – విశ్వాసులైన స్త్రీలు, విధేయులైన పురుషులు- విధేయులైన స్త్రీలు, సత్యసంధులైన పురుషులు – సత్యసంధులైన స్త్రీలు, సహనశీలురైన పురుషులు – సహనవతులైన స్త్రీలు, అణకువ గల పురుషులు – అణకువ గల స్త్రీలు, దానధర్మాలు చేసే పురుషులు – దానధర్మాలు చేసే స్త్రీలు, ఉపవాసం ఉండే పురుషులు – ఉపవాసం ఉండే స్త్రీలు, తమ మర్మాంగాలను కాపాడుకునే పురుషులు – కాపాడుకునే స్త్రీలు, అల్లాహ్‌ను అత్యధికంగా స్మరించే పురుషులు – స్మరించే స్త్రీలు – వీరందరి కోసం అల్లాహ్ (విస్తృతమైన) మన్నింపును, గొప్ప పుణ్యఫలాన్ని సిద్ధం చేసి ఉంచాడు.
33:36 وَمَا كَانَ لِمُؤْمِنٍ وَلَا مُؤْمِنَةٍ إِذَا قَضَى اللَّهُ وَرَسُولُهُ أَمْرًا أَن يَكُونَ لَهُمُ الْخِيَرَةُ مِنْ أَمْرِهِمْ ۗ وَمَن يَعْصِ اللَّهَ وَرَسُولَهُ فَقَدْ ضَلَّ ضَلَالًا مُّبِينًا
(చూడండి) అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఏ వ్యవహారం లోనయినా ఒక నిర్ణయం చేసిన తరువాత విశ్వాసులైన ఏ పురుషునికి గానీ, స్త్రీకి గానీ తమకు వర్తించే ఆ వ్యవహారంలో ఎలాంటి స్వయం నిర్ణయాధికారం మిగిలి ఉండదు. ఒకవేళ ఎవరైనా అల్లాహ్‌కు, ఆయన ప్రవక్తకు అవిధేయత చూపితే అతను స్పష్టమైన అపమార్గానికి లోనైనట్లే (జాగ్రత్త!).
33:37 وَإِذْ تَقُولُ لِلَّذِي أَنْعَمَ اللَّهُ عَلَيْهِ وَأَنْعَمْتَ عَلَيْهِ أَمْسِكْ عَلَيْكَ زَوْجَكَ وَاتَّقِ اللَّهَ وَتُخْفِي فِي نَفْسِكَ مَا اللَّهُ مُبْدِيهِ وَتَخْشَى النَّاسَ وَاللَّهُ أَحَقُّ أَن تَخْشَاهُ ۖ فَلَمَّا قَضَىٰ زَيْدٌ مِّنْهَا وَطَرًا زَوَّجْنَاكَهَا لِكَيْ لَا يَكُونَ عَلَى الْمُؤْمِنِينَ حَرَجٌ فِي أَزْوَاجِ أَدْعِيَائِهِمْ إِذَا قَضَوْا مِنْهُنَّ وَطَرًا ۚ وَكَانَ أَمْرُ اللَّهِ مَفْعُولًا
(ఓ ప్రవక్తా! ఆ సందర్భాన్ని కాస్త జ్ఞాపకం చేసుకో) అల్లాహ్ అనుగ్రహించిన వ్యక్తితో, నువ్వు సయితం ఉపకారం చేసినవానితో “నువ్వు నీ భార్యను నీ దగ్గరే ఉండనివ్వు, అల్లాహ్‌కు భయపడు” అని చెప్పేవాడివి. కాని అల్లాహ్ బయటపెట్టాలని ఉన్న ఒక విషయాన్ని నువ్వు నీ మనసులోనే దాచిపెట్టావు. నువ్వు జనులకు భయపడేవాడివి. నిజానికి నువ్వు భయపడటానికి అల్లాహ్‌యే ఎక్కువ హక్కుదారుడు. మరి జైద్ ఆ స్త్రీతో తన లాంఛనాలన్నీ పూర్తి చేసిన తరువాత, మేము ఆమె వివాహం నీతో జరిపించాము. దత్తపుత్రులు తమ భార్యల లాంఛనాలన్నీ పూర్తిచేసిన తరువాత (వారికి విడాకులిచ్చిన పిమ్మట) వారి భార్యల (ను వివాహమాడే) విషయంలో ముస్లింలు ఎలాంటి సంకోచానికీ లోనుకాకుండా ఉండేటందుకు మేమిలా చేశాము. అల్లాహ్ ఆజ్ఞ అమలు జరిగి తీరవలసిందే.
33:38 مَّا كَانَ عَلَى النَّبِيِّ مِنْ حَرَجٍ فِيمَا فَرَضَ اللَّهُ لَهُ ۖ سُنَّةَ اللَّهِ فِي الَّذِينَ خَلَوْا مِن قَبْلُ ۚ وَكَانَ أَمْرُ اللَّهِ قَدَرًا مَّقْدُورًا
అల్లాహ్ తన ప్రవక్త కోసం నిర్ధారించిన దానిని ప్రవక్త అవలంబించటం ఏ విధంగానూ ఆక్షేపణీయం కాదు. పూర్వం గతించిన వారిలో కూడా దేవుని ఈ సంప్రదాయమే ఉండేది. అల్లాహ్ ఆజ్ఞ నిర్ణీత లక్ష్యాలతో కూడుకున్నదై ఉంటుంది.
33:39 الَّذِينَ يُبَلِّغُونَ رِسَالَاتِ اللَّهِ وَيَخْشَوْنَهُ وَلَا يَخْشَوْنَ أَحَدًا إِلَّا اللَّهَ ۗ وَكَفَىٰ بِاللَّهِ حَسِيبًا
వారంతా (దైవప్రవక్తలంతా) అల్లాహ్ సందేశాలను అందజేసేవారు. అల్లాహ్‌కు మాత్రమే భయపడేవారు. అల్లాహ్‌కు తప్ప వేరొకరికి భయపడేవారు కారు. లెక్క తేల్చటానికి అల్లాహ్ ఒక్కడే చాలు.
33:40 مَّا كَانَ مُحَمَّدٌ أَبَا أَحَدٍ مِّن رِّجَالِكُمْ وَلَٰكِن رَّسُولَ اللَّهِ وَخَاتَمَ النَّبِيِّينَ ۗ وَكَانَ اللَّهُ بِكُلِّ شَيْءٍ عَلِيمًا
(ప్రజలారా!) ముహమ్మద్ (సఅసం) మీ మగవారిలో ఎవరికీ తండ్రికాడు. అయితే ఆయన అల్లాహ్ యొక్క సందేశహరుడు. ప్రవక్తల పరంపరను పరిసమాప్తం చేసే (చివరి) వాడు. అల్లాహ్ ప్రతిదీ తెలిసినవాడు.
33:41 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اذْكُرُوا اللَّهَ ذِكْرًا كَثِيرًا
ఓ విశ్వాసులారా! అల్లాహ్‌ను అత్యధికంగా స్మరించండి.
33:42 وَسَبِّحُوهُ بُكْرَةً وَأَصِيلًا
ఉదయం, సాయంకాలం ఆయన పవిత్రతను కొనియాడండి.
33:43 هُوَ الَّذِي يُصَلِّي عَلَيْكُمْ وَمَلَائِكَتُهُ لِيُخْرِجَكُم مِّنَ الظُّلُمَاتِ إِلَى النُّورِ ۚ وَكَانَ بِالْمُؤْمِنِينَ رَحِيمًا
మీపై తన కరుణానుగ్రహాలను పంపేవాడు ఆయనే. ఇంకా ఆయన దూతలు కూడా (మీపై కారుణ్యం కురవాలని ప్రార్థిస్తారు)- ఆయన మిమ్మల్ని చీకట్ల నుంచి వెలికితీసి వెలుగు వైపుకు తీసుకు వచ్చేటందుకు! అల్లాహ్ విశ్వాసుల పాలిట అపార కరుణామయుడు.
33:44 تَحِيَّتُهُمْ يَوْمَ يَلْقَوْنَهُ سَلَامٌ ۚ وَأَعَدَّ لَهُمْ أَجْرًا كَرِيمًا
వారు ఆయన్ని (అల్లాహ్‌ను) కలుసుకున్న రోజున, వారికి ‘సలాం’తో స్వాగత సత్కారాలు లభిస్తాయి. వారి కోసం అల్లాహ్ గౌరవప్రదమైన పుణ్యఫలాన్ని సిద్ధం చేసి ఉంచాడు.
33:45 يَا أَيُّهَا النَّبِيُّ إِنَّا أَرْسَلْنَاكَ شَاهِدًا وَمُبَشِّرًا وَنَذِيرًا
ఓ ప్రవక్తా! నిశ్చయంగా మేమే నిన్ను (ప్రవక్తగా ఎన్నుకుని) సాక్ష్యమిచ్చేవానిగా, శుభవార్తలు వినిపించేవానిగా, హెచ్చరించే వానిగా చేసి పంపాము.
33:46 وَدَاعِيًا إِلَى اللَّهِ بِإِذْنِهِ وَسِرَاجًا مُّنِيرًا
ఇంకా – అల్లాహ్ ఆజ్ఞచే ఆయన వైపుకు పిలిచేవానిగా, వెలుగును విరజిమ్మే దీపంగా (చేసి పంపాము).
33:47 وَبَشِّرِ الْمُؤْمِنِينَ بِأَنَّ لَهُم مِّنَ اللَّهِ فَضْلًا كَبِيرًا
విశ్వసించిన వారికి అల్లాహ్ తరఫున గొప్ప అనుగ్రహం ఉందన్న శుభవార్తను నువ్వు వారికి వినిపించు.
33:48 وَلَا تُطِعِ الْكَافِرِينَ وَالْمُنَافِقِينَ وَدَعْ أَذَاهُمْ وَتَوَكَّلْ عَلَى اللَّهِ ۚ وَكَفَىٰ بِاللَّهِ وَكِيلًا
అవిశ్వాసుల, వంచకుల మాట వినకు. (వారి తరఫున జరిగే) వేధింపులను లెక్కచేయకు. అల్లాహ్‌నే నమ్ముకో. కార్య సాధకునిగా అల్లాహ్ (ఒక్కడే) చాలు.
33:49 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا نَكَحْتُمُ الْمُؤْمِنَاتِ ثُمَّ طَلَّقْتُمُوهُنَّ مِن قَبْلِ أَن تَمَسُّوهُنَّ فَمَا لَكُمْ عَلَيْهِنَّ مِنْ عِدَّةٍ تَعْتَدُّونَهَا ۖ فَمَتِّعُوهُنَّ وَسَرِّحُوهُنَّ سَرَاحًا جَمِيلًا
ఓ విశ్వాసులారా! మీరు విశ్వాసులైన స్త్రీలను వివాహమాడినపుడు, వారిని తాకకముందే మీరు వారికి విడాకులిస్తే, అట్టి పరిస్థితిలో మీరు లెక్కించే గడువు కాలం (ఇద్దత్) పూర్తిచేయమని వారిని కోరే అధికారం మీకు లేదు. కాబట్టి వారికి ఎంతో కొంత ముట్టజెప్పి ఉత్తమ రీతిలో సాగనంపండి.
33:50 يَا أَيُّهَا النَّبِيُّ إِنَّا أَحْلَلْنَا لَكَ أَزْوَاجَكَ اللَّاتِي آتَيْتَ أُجُورَهُنَّ وَمَا مَلَكَتْ يَمِينُكَ مِمَّا أَفَاءَ اللَّهُ عَلَيْكَ وَبَنَاتِ عَمِّكَ وَبَنَاتِ عَمَّاتِكَ وَبَنَاتِ خَالِكَ وَبَنَاتِ خَالَاتِكَ اللَّاتِي هَاجَرْنَ مَعَكَ وَامْرَأَةً مُّؤْمِنَةً إِن وَهَبَتْ نَفْسَهَا لِلنَّبِيِّ إِنْ أَرَادَ النَّبِيُّ أَن يَسْتَنكِحَهَا خَالِصَةً لَّكَ مِن دُونِ الْمُؤْمِنِينَ ۗ قَدْ عَلِمْنَا مَا فَرَضْنَا عَلَيْهِمْ فِي أَزْوَاجِهِمْ وَمَا مَلَكَتْ أَيْمَانُهُمْ لِكَيْلَا يَكُونَ عَلَيْكَ حَرَجٌ ۗ وَكَانَ اللَّهُ غَفُورًا رَّحِيمًا
ఓ ప్రవక్తా! నువ్వు మహర్ సొమ్మును చెల్లించిన నీ భార్యలను నీ కోసం ధర్మ సమ్మతం చేశాము. ఇంకా – విజయ ప్రాప్తిగా అల్లాహ్ నీకు ప్రసాదించిన బానిస స్త్రీలను, నీతోపాటు వలస వచ్చిన నీ పినతండ్రి, పెత్తండ్రి కుమార్తెలను, నీ మేనత్తల పుత్రికలను, నీ మేనమామ కూతుళ్ళను, నీ పిన్నమ్మ, పెద్దమ్మల కుమార్తెలను కూడా నీకు ధర్మసమ్మతం చేశాము. మరి విశ్వసించిన ఒక స్త్రీ తనను తాను దైవప్రవక్తకు అర్పించుకోదలిస్తే- అట్టి పరిస్థితిలో దైవప్రవక్త కూడా ఆమెను పెండ్లాడదలిస్తే- పెండ్లాడవచ్చు. (ఓ ప్రవక్తా!) ఈ మినహాయింపు విశ్వాసులందరికీ కాకుండా నీకొక్కనికే ప్రత్యేకం. సాధారణ ముస్లింలకు వారి భార్యల, వారి బానిస స్త్రీల విషయంలో ఏ ఏ ఆదేశాలను నిర్థారించి ఉన్నామో మాకు బాగా తెలుసు. నీకెలాంటి ఇబ్బందీ కలుగకుండా ఉండేటందుకే (మేము నీకు ప్రత్యేక రాయితీలు ప్రకటించాము). అల్లాహ్ ఎంతగానో క్షమించేవాడు, మరెంతగానో కరుణించేవాడు.
33:51 تُرْجِي مَن تَشَاءُ مِنْهُنَّ وَتُؤْوِي إِلَيْكَ مَن تَشَاءُ ۖ وَمَنِ ابْتَغَيْتَ مِمَّنْ عَزَلْتَ فَلَا جُنَاحَ عَلَيْكَ ۚ ذَٰلِكَ أَدْنَىٰ أَن تَقَرَّ أَعْيُنُهُنَّ وَلَا يَحْزَنَّ وَيَرْضَيْنَ بِمَا آتَيْتَهُنَّ كُلُّهُنَّ ۚ وَاللَّهُ يَعْلَمُ مَا فِي قُلُوبِكُمْ ۚ وَكَانَ اللَّهُ عَلِيمًا حَلِيمًا
(ఓ ముహమ్మద్-స! వంతుల విషయంలో) వారిలో నువ్వు కోరినవారిని దూరంగా ఉంచవచ్చు. నువ్వు కోరినవారిని నీ దగ్గర ఉంచుకోవచ్చు. ఒకవేళ నువ్వు దూరంగా ఉంచిన వారిలో కూడా ఎవరినయినా నువ్వు నీ దగ్గరకు పిలుచుకుంటే నీపై ఏ దోషమూ లేదు. దీనిద్వారా వారి కళ్లు చల్లబడతాయనీ, వారు ఆవేదన చెందకుండా ఉంటారనీ, నువ్వు వారికి ఏది ఇచ్చినా దానిపై వారంతా సంతృప్తి చెందుతారని ఎక్కువగా ఆశించవచ్చు. మీ హృదయాలలో ఏముందో అల్లాహ్‌కు (బాగా) తెలుసు. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, సహనశీలుడు.
33:52 لَّا يَحِلُّ لَكَ النِّسَاءُ مِن بَعْدُ وَلَا أَن تَبَدَّلَ بِهِنَّ مِنْ أَزْوَاجٍ وَلَوْ أَعْجَبَكَ حُسْنُهُنَّ إِلَّا مَا مَلَكَتْ يَمِينُكَ ۗ وَكَانَ اللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ رَّقِيبًا
ఇక దీని తరువాత, వేరితర స్త్రీలు నీ కొరకు ధర్మసమ్మతం కారు. వీరికి బదులుగా ఇతర స్త్రీలను భార్యలుగా చేసుకోవటం కూడా నీకు సమ్మతం కాదు – వారి అందచందాలు నీకు ఎంత నచ్చినాసరే! అయితే (విజయ ప్రాప్తిగా) నీ స్వాధీనంలోకి వచ్చినవారైతే అది వేరే విషయం. అల్లాహ్ అన్నింటినీ కనిపెట్టుకుని ఉన్నాడు సుమా!
33:53 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَدْخُلُوا بُيُوتَ النَّبِيِّ إِلَّا أَن يُؤْذَنَ لَكُمْ إِلَىٰ طَعَامٍ غَيْرَ نَاظِرِينَ إِنَاهُ وَلَٰكِنْ إِذَا دُعِيتُمْ فَادْخُلُوا فَإِذَا طَعِمْتُمْ فَانتَشِرُوا وَلَا مُسْتَأْنِسِينَ لِحَدِيثٍ ۚ إِنَّ ذَٰلِكُمْ كَانَ يُؤْذِي النَّبِيَّ فَيَسْتَحْيِي مِنكُمْ ۖ وَاللَّهُ لَا يَسْتَحْيِي مِنَ الْحَقِّ ۚ وَإِذَا سَأَلْتُمُوهُنَّ مَتَاعًا فَاسْأَلُوهُنَّ مِن وَرَاءِ حِجَابٍ ۚ ذَٰلِكُمْ أَطْهَرُ لِقُلُوبِكُمْ وَقُلُوبِهِنَّ ۚ وَمَا كَانَ لَكُمْ أَن تُؤْذُوا رَسُولَ اللَّهِ وَلَا أَن تَنكِحُوا أَزْوَاجَهُ مِن بَعْدِهِ أَبَدًا ۚ إِنَّ ذَٰلِكُمْ كَانَ عِندَ اللَّهِ عَظِيمًا
ఓ విశ్వాసులారా! మీకు అనుమతి లేనిదే మీరు ప్రవక్త ఇండ్లలోకి వెళ్ళకండి. భోజనార్థం మీకు పిలుపు అందినపుడు మాత్రం వెళ్ళండి. అయితే భోజనం తయారయ్యేవరకు వేచి ఉండే విధంగా కాదు. మరి భోజనం చేసిన వెంటనే బయలుదేరండి. కబుర్లు చెప్పుకుంటూ అక్కడే ఉండిపోకండి. ఈ రకమయిన మీ ప్రవర్తనవల్ల ప్రవక్తకు బాధ కలుగుతుంది. మొహమాటం కొద్దీ అతను మీకేమీ చెప్పడు. అయితే అల్లాహ్ మాత్రం నిజం చెప్పటానికి మొహమాటపడడు. మీరు ప్రవక్త సతీమణులను ఏదైనా అడగవలసి వచ్చినప్పుడు తెర వెనుక నుంచి అడగండి. మీ ఆంతర్యాల, వారి హృదయాల పరిశుద్ధత కోసం ఇదే సముచితమైన పద్ధతి. దైవప్రవక్తకు మనస్తాపం కలిగించటంగానీ, అతని తదనంతరం అతని భార్యలను వివాహమాడటంగానీ ఎన్నటికీ మీకు ధర్మసమ్మతం కాదు. అల్లాహ్ దృష్టిలో ఇది మహా పాతకం (అని తెలుసుకోండి).
33:54 إِن تُبْدُوا شَيْئًا أَوْ تُخْفُوهُ فَإِنَّ اللَّهَ كَانَ بِكُلِّ شَيْءٍ عَلِيمًا
మీరేదన్నా విషయాన్ని బాహాటం చేసినా లేక గోప్యంగా ఉంచినా – అల్లాహ్ మాత్రం ప్రతిదీ తెలిసినవాడు.
33:55 لَّا جُنَاحَ عَلَيْهِنَّ فِي آبَائِهِنَّ وَلَا أَبْنَائِهِنَّ وَلَا إِخْوَانِهِنَّ وَلَا أَبْنَاءِ إِخْوَانِهِنَّ وَلَا أَبْنَاءِ أَخَوَاتِهِنَّ وَلَا نِسَائِهِنَّ وَلَا مَا مَلَكَتْ أَيْمَانُهُنَّ ۗ وَاتَّقِينَ اللَّهَ ۚ إِنَّ اللَّهَ كَانَ عَلَىٰ كُلِّ شَيْءٍ شَهِيدًا
ఆ స్త్రీలు (ప్రవక్త సతీమణులు) తమ తండ్రుల, తమ కుమారుల, తమ సోదరుల ఎదుట, తమ సహోదరుల పుత్రుల ఎదుట, తమ అక్కాచెల్లెళ్ళ కొడుకుల ఎదుట, తమతో కలసి మెలసి ఉండే స్త్రీల ఎదుట, తమ యాజమాన్యంలో వున్నవారి (బానిసల, బానిస స్త్రీల) ఎదుట రావటం పాపం కాదు. (మహిళా మణులారా!) అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ ప్రతిదానికీ సాక్షిగా ఉన్నాడు.
33:56 إِنَّ اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ ۚ يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تَسْلِيمًا
నిశ్చయంగా అల్లాహ్, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై కారుణ్యాన్ని పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్ పంపండి. అత్యధికంగా అతనికి ‘సలాములు’ పంపుతూ ఉండండి.
33:57 إِنَّ الَّذِينَ يُؤْذُونَ اللَّهَ وَرَسُولَهُ لَعَنَهُمُ اللَّهُ فِي الدُّنْيَا وَالْآخِرَةِ وَأَعَدَّ لَهُمْ عَذَابًا مُّهِينًا
అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తను బాధించేవారిపై ప్రపంచంలోనూ, పరలోకంలోనూ అల్లాహ్ శాపం పడుతుంది. ఇంకా వారి కోసం అత్యంత అవమానకరమైన శిక్ష సిద్ధంగా ఉంది.
33:58 وَالَّذِينَ يُؤْذُونَ الْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ بِغَيْرِ مَا اكْتَسَبُوا فَقَدِ احْتَمَلُوا بُهْتَانًا وَإِثْمًا مُّبِينًا
తప్పు చేయని విశ్వాసులైన పురుషులను, విశ్వాసులైన స్త్రీలను వేధించేవారు (చాలా పెద్ద) అభాండాన్ని, స్పష్టమైన పాపభారాన్ని మోసినవారవుతారు.
33:59 يَا أَيُّهَا النَّبِيُّ قُل لِّأَزْوَاجِكَ وَبَنَاتِكَ وَنِسَاءِ الْمُؤْمِنِينَ يُدْنِينَ عَلَيْهِنَّ مِن جَلَابِيبِهِنَّ ۚ ذَٰلِكَ أَدْنَىٰ أَن يُعْرَفْنَ فَلَا يُؤْذَيْنَ ۗ وَكَانَ اللَّهُ غَفُورًا رَّحِيمًا
ఓ ప్రవక్తా! తమపై నుంచి తమ దుప్పట్లను (క్రిందికి) వ్రేలాడేలా కప్పుకోమని నీ భార్యలకు, నీ కుమార్తెలకు, విశ్వాసులైన స్త్రీలకు చెప్పు. తద్వారా వారు చాలా తొందరగా (మర్యాదస్తులుగా) గుర్తించబడి, వేధింపుకు గురికాకుండా ఉంటారు. అల్లాహ్ క్షమించేవాడు, కనికరించేవాడు.
33:60 لَّئِن لَّمْ يَنتَهِ الْمُنَافِقُونَ وَالَّذِينَ فِي قُلُوبِهِم مَّرَضٌ وَالْمُرْجِفُونَ فِي الْمَدِينَةِ لَنُغْرِيَنَّكَ بِهِمْ ثُمَّ لَا يُجَاوِرُونَكَ فِيهَا إِلَّا قَلِيلًا
ఈ కపటులు, హృదయాలలో రోగమున్నవారు, మదీనాలో తప్పుడు వదంతులను వ్యాపింపజేస్తున్నవారు (ఇప్పటికైనా తమ దుష్ట వైఖరిని) మానుకోకపోతే, (వారికి వ్యతిరేకంగా చర్య తీసుకోవటానికి) మేము నిన్ను వారిపై నియమిస్తాము. ఆ తరువాత వారు కొన్నాళ్ళు మాత్రమే నీతోపాటు ఇక్కడ (ఈ నగరంలో) ఉండగలుగుతారు.
33:61 مَّلْعُونِينَ ۖ أَيْنَمَا ثُقِفُوا أُخِذُوا وَقُتِّلُوا تَقْتِيلًا
వారు శాపగ్రస్తులయ్యారు – ఎక్కడ దొరికితే అక్కడే పట్టుకోబడతారు. దారుణంగా చంపబడతారు.
33:62 سُنَّةَ اللَّهِ فِي الَّذِينَ خَلَوْا مِن قَبْلُ ۖ وَلَن تَجِدَ لِسُنَّةِ اللَّهِ تَبْدِيلًا
వీరి పూర్వీకుల విషయంలో కూడా అల్లాహ్ యొక్క ఈ సంప్రదాయమే ఉండేది. అల్లాహ్ సంప్రదాయంలో నువ్వు ఎలాంటి మార్పునూ కానలేవు.
33:63 يَسْأَلُكَ النَّاسُ عَنِ السَّاعَةِ ۖ قُلْ إِنَّمَا عِلْمُهَا عِندَ اللَّهِ ۚ وَمَا يُدْرِيكَ لَعَلَّ السَّاعَةَ تَكُونُ قَرِيبًا
ప్రళయ ఘడియ గురించి జనులు నిన్ను ప్రశ్నిస్తున్నారు కదూ! ‘ఆ సంగతి అల్లాహ్‌కే తెలుసు’ అని వారికి చెప్పు. నీకేం తెలుసు? బహుశా ప్రళయం అతి సమీపంలోనే ఉందేమో!
33:64 إِنَّ اللَّهَ لَعَنَ الْكَافِرِينَ وَأَعَدَّ لَهُمْ سَعِيرًا
అల్లాహ్ అవిశ్వాసులను శపించాడు. ఇంకా వారి కోసం మండే అగ్నిని సిద్ధం చేసి ఉంచాడు.
33:65 خَالِدِينَ فِيهَا أَبَدًا ۖ لَّا يَجِدُونَ وَلِيًّا وَلَا نَصِيرًا
అందులో వారు ఎల్లకాలం పడి ఉంటారు. వారు ఏ సంరక్షకుణ్ణీ, సహాయకుణ్ణీ పొందలేరు.
33:66 يَوْمَ تُقَلَّبُ وُجُوهُهُمْ فِي النَّارِ يَقُولُونَ يَا لَيْتَنَا أَطَعْنَا اللَّهَ وَأَطَعْنَا الرَّسُولَا
ఆ రోజు వారి ముఖాలు అగ్నిలో అటూ ఇటూ పొర్లింపబడతాయి. అప్పుడు వారు, “అయ్యో! మేము అల్లాహ్‌కు, ప్రవక్తకు విధేయత చూపి ఉంటే ఎంత బావుండేది?” అని అంటారు.
33:67 وَقَالُوا رَبَّنَا إِنَّا أَطَعْنَا سَادَتَنَا وَكُبَرَاءَنَا فَأَضَلُّونَا السَّبِيلَا
ఇంకా ఇలా అంటారు : “ప్రభూ! మేము మా సర్దారులు, పెద్దలు చెప్పినట్లు విన్నాము. వారు మమ్మల్ని పెడత్రోవ పట్టించారు.
33:68 رَبَّنَا آتِهِمْ ضِعْفَيْنِ مِنَ الْعَذَابِ وَالْعَنْهُمْ لَعْنًا كَبِيرًا
“ప్రభూ! నీవు వారికి రెండింతల శిక్షను విధించు. వారిపై పెద్ద శాపాన్ని అవతరింపజెయ్యి.”
33:69 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَكُونُوا كَالَّذِينَ آذَوْا مُوسَىٰ فَبَرَّأَهُ اللَّهُ مِمَّا قَالُوا ۚ وَكَانَ عِندَ اللَّهِ وَجِيهًا
విశ్వసించిన ఓ ప్రజలారా! మీరు మూసాను కష్టపెట్టిన వారి మాదిరిగా తయారవకండి. మరి వారు అన్న మాట నుంచి అల్లాహ్ అతన్ని-మచ్చలేని వానిగా – నిగ్గుతేల్చాడు. అతను అల్లాహ్ దృష్టిలో ఎంతో ఆదరణీయుడుగా ఉండేవాడు.
33:70 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَقُولُوا قَوْلًا سَدِيدًا
ఓ విశ్వాసులారా! అల్లాహ్‌కు భయపడండి. మాట్లాడితే సూటిగా మాట్లాడండి (సత్యమే పలకండి).
33:71 يُصْلِحْ لَكُمْ أَعْمَالَكُمْ وَيَغْفِرْ لَكُمْ ذُنُوبَكُمْ ۗ وَمَن يُطِعِ اللَّهَ وَرَسُولَهُ فَقَدْ فَازَ فَوْزًا عَظِيمًا
తద్వారా అల్లాహ్ మీ ఆచరణలను చక్కదిద్దుతాడు. మీ పాపాలను మన్నిస్తాడు. ఎవరయితే అల్లాహ్‌కు, ఆయన ప్రవక్తకు విధేయత కనబరచాడో అతను గొప్ప విజయం సాధించాడు.
33:72 إِنَّا عَرَضْنَا الْأَمَانَةَ عَلَى السَّمَاوَاتِ وَالْأَرْضِ وَالْجِبَالِ فَأَبَيْنَ أَن يَحْمِلْنَهَا وَأَشْفَقْنَ مِنْهَا وَحَمَلَهَا الْإِنسَانُ ۖ إِنَّهُ كَانَ ظَلُومًا جَهُولًا
మేము మా అప్పగింత(అమానతు)ను ఆకాశాల ముందూ, భూమి ముందూ, పర్వతాల ముందూ ఉంచాము. కాని అవన్నీ దాన్ని మోయటానికి నిరాకరించాయి. దానికి భయపడిపోయాయి. (అయితే) మానవుడు మాత్రం దాన్ని ఎత్తుకున్నాడు. అవును, వాడు అక్రమానికి ఒడిగట్టేవాడు, మూర్ఖుడు.
33:73 لِّيُعَذِّبَ اللَّهُ الْمُنَافِقِينَ وَالْمُنَافِقَاتِ وَالْمُشْرِكِينَ وَالْمُشْرِكَاتِ وَيَتُوبَ اللَّهُ عَلَى الْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ ۗ وَكَانَ اللَّهُ غَفُورًا رَّحِيمًا
అల్లాహ్ కపటులైన పురుషులను, కపటులైన స్త్రీలను, ముష్రిక్కులైన పురుషులను, ముష్రిక్కులైన స్త్రీలను శిక్షించటానికి, విశ్వాసులైన పురుషుల, విశ్వాసులైన స్త్రీల పశ్చాత్తాపాన్ని స్వీకరించటానికి (ఇదంతా జరిగింది). అల్లాహ్ అపారంగా క్షమించేవాడు, అమితంగా కరుణించేవాడు. - సూరా సబా
34:1 الْحَمْدُ لِلَّهِ الَّذِي لَهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ وَلَهُ الْحَمْدُ فِي الْآخِرَةِ ۚ وَهُوَ الْحَكِيمُ الْخَبِيرُ
ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న సమస్తానికి యజమాని అయిన అల్లాహ్‌యే సకల స్తోత్రాలకు అర్హుడు. పరలోకంలో కూడా ప్రశంసలు ఆయనకే తగును. ఆయన వివేక సంపన్నుడు, (ప్రతిదీ) తెలిసినవాడు.
34:2 يَعْلَمُ مَا يَلِجُ فِي الْأَرْضِ وَمَا يَخْرُجُ مِنْهَا وَمَا يَنزِلُ مِنَ السَّمَاءِ وَمَا يَعْرُجُ فِيهَا ۚ وَهُوَ الرَّحِيمُ الْغَفُورُ
భూమిలోనికి వెళ్ళేదీ, దానినుండి వెలువడేదీ, ఆకాశం నుంచి దిగేదీ, అందులోకి ఎక్కిపోయేదీ – అంతా ఆయనకు తెలుసు. ఆయన పరమ కృపాశీలుడు, క్షమాగుణం కలవాడు.
34:3 وَقَالَ الَّذِينَ كَفَرُوا لَا تَأْتِينَا السَّاعَةُ ۖ قُلْ بَلَىٰ وَرَبِّي لَتَأْتِيَنَّكُمْ عَالِمِ الْغَيْبِ ۖ لَا يَعْزُبُ عَنْهُ مِثْقَالُ ذَرَّةٍ فِي السَّمَاوَاتِ وَلَا فِي الْأَرْضِ وَلَا أَصْغَرُ مِن ذَٰلِكَ وَلَا أَكْبَرُ إِلَّا فِي كِتَابٍ مُّبِينٍ
“మాపై ప్రళయం వచ్చిపడదు” అని అవిశ్వాసులు అంటున్నారు. “ఎందుకు రాదు? అగోచరాల జ్ఞాని అయిన నా ప్రభువు సాక్షిగా! అది మీపై తప్పకుండా వస్తుంది. రవ్వంత వస్తువు కూడా – అది ఆకాశాలలో ఉన్నా, భూమిలో ఉన్నా – ఆయన నుండి గోప్యంగా లేదు. దాని కన్నా చిన్న వస్తువైనా, పెద్ద వస్తువైనా, ప్రతిదీ ఒక స్పష్టమైన గ్రంథంలో (లిఖిత పూర్వకంగా) ఉంది” అని వారికి చెప్పు.
34:4 لِّيَجْزِيَ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ ۚ أُولَٰئِكَ لَهُم مَّغْفِرَةٌ وَرِزْقٌ كَرِيمٌ
విశ్వసించి, సత్కార్యాలు చేసిన వారికి మంచి ప్రతిఫలం ఇవ్వటానికి (ప్రళయం వస్తుంది). ఇలాంటి వారి కోసమే మన్నింపు, గౌరవప్రదమైన ఉపాధి ఉన్నాయి.
34:5 وَالَّذِينَ سَعَوْا فِي آيَاتِنَا مُعَاجِزِينَ أُولَٰئِكَ لَهُمْ عَذَابٌ مِّن رِّجْزٍ أَلِيمٌ
మరెవరయితే మా ఆయతులను లొంగదీసుకునేందుకు ప్రయత్నాలు చేశారో వారి కొరకు అత్యంత దుర్భరమైన, బాధాకరమైన శిక్ష ఉంది.
34:6 وَيَرَى الَّذِينَ أُوتُوا الْعِلْمَ الَّذِي أُنزِلَ إِلَيْكَ مِن رَّبِّكَ هُوَ الْحَقَّ وَيَهْدِي إِلَىٰ صِرَاطِ الْعَزِيزِ الْحَمِيدِ
(ఓ ముహమ్మద్-స!) నీ ప్రభువు తరఫున నీపై అవతరించినది (ఆసాంతం) సత్యమని, అది సర్వాధిపతి, స్తోత్రనీయుడైన అల్లాహ్ మార్గం వైపుకు దర్శకత్వం వహిస్తుందన్న సంగతిని జ్ఞానం వొసగబడిన వారు చూస్తారు.
34:7 وَقَالَ الَّذِينَ كَفَرُوا هَلْ نَدُلُّكُمْ عَلَىٰ رَجُلٍ يُنَبِّئُكُمْ إِذَا مُزِّقْتُمْ كُلَّ مُمَزَّقٍ إِنَّكُمْ لَفِي خَلْقٍ جَدِيدٍ
అవిశ్వాసులు ఇలా అనసాగారు: “మీరు పగిలి తునాతునకలై పోయిన తరువాత, మీరు మళ్లీ సరికొత్త సృష్టిలోనికి వస్తారని మీకు సమాచారం అందజేసే వ్యక్తిని మీకు చూపమంటారా?!
34:8 أَفْتَرَىٰ عَلَى اللَّهِ كَذِبًا أَم بِهِ جِنَّةٌ ۗ بَلِ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ فِي الْعَذَابِ وَالضَّلَالِ الْبَعِيدِ
“అతను (స్వయంగానే) అల్లాహ్‌కు అబద్ధాలు ఆపాదిస్తున్నాడో లేక అతనికి పిచ్చిపట్టిందో (మాకు తెలియదు)!” కాదు, (యదార్థమేమిటంటే) పరలోకంపై నమ్మకం లేనివారు మాత్రమే శిక్షకు, బహుదూరపు అపమార్గానికి లోనై ఉన్నారు.
34:9 أَفَلَمْ يَرَوْا إِلَىٰ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُم مِّنَ السَّمَاءِ وَالْأَرْضِ ۚ إِن نَّشَأْ نَخْسِفْ بِهِمُ الْأَرْضَ أَوْ نُسْقِطْ عَلَيْهِمْ كِسَفًا مِّنَ السَّمَاءِ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً لِّكُلِّ عَبْدٍ مُّنِيبٍ
ఏమిటీ, వారు తమకు ముందూ, వెనుకా ఉన్న ఆకాశాన్ని, భూమిని చూడటం లేదా? మేము గనక తలచుకుంటే వారిని భూమిలో కూరుకుపోయేలా చేయగలము లేదా వారిపై ఆకాశపు తునకను పడవేయగలము. (మనస్ఫూర్తిగా) మరలే ప్రతి దాసునికి ఇందులో సూచన ఉంది.
34:10 وَلَقَدْ آتَيْنَا دَاوُودَ مِنَّا فَضْلًا ۖ يَا جِبَالُ أَوِّبِي مَعَهُ وَالطَّيْرَ ۖ وَأَلَنَّا لَهُ الْحَدِيدَ
ఇంకా మేము దావూదుకు మా తరఫునుండి గొప్ప అనుగ్రహాన్ని ప్రసాదించాము. “ఓ పర్వతాల్లారా! అతనితో కలసి స్తోత్రగానం చేయండి” (అని ఆజ్ఞాపించాము). పక్షులకు కూడా (ఇదే విధంగా ఆదేశించాము). ఇంకా అతని కొరకు మేము ఇనుమును మెత్తబరచాము.
34:11 أَنِ اعْمَلْ سَابِغَاتٍ وَقَدِّرْ فِي السَّرْدِ ۖ وَاعْمَلُوا صَالِحًا ۖ إِنِّي بِمَا تَعْمَلُونَ بَصِيرٌ
“పరిపూర్ణమైన కవచాలను నిర్మించు. కడియాలను సరిగ్గా- సమతూకంతో – అమర్చు. ఇంకా, మీరంతా సదాచరణ చేయండి. నేను మీరు చేసేదంతా చూస్తున్నాను (అని నమ్మండి)” అని ఆదేశించాము.
34:12 وَلِسُلَيْمَانَ الرِّيحَ غُدُوُّهَا شَهْرٌ وَرَوَاحُهَا شَهْرٌ ۖ وَأَسَلْنَا لَهُ عَيْنَ الْقِطْرِ ۖ وَمِنَ الْجِنِّ مَن يَعْمَلُ بَيْنَ يَدَيْهِ بِإِذْنِ رَبِّهِ ۖ وَمَن يَزِغْ مِنْهُمْ عَنْ أَمْرِنَا نُذِقْهُ مِنْ عَذَابِ السَّعِيرِ
ఇంకా – మేము సులైమాను కోసం గాలిని అదుపులో ఉంచాము. దాని ప్రొద్దుటి (ప్రయాణ) గమ్యం ఒక మాసానికి, సాయంత్రపు గమ్యం కూడా ఒక మాసానికి సమానంగా ఉండేది. ఇంకా మేము అతని కోసం కరిగిన రాగి ఊటను ప్రవహింపజేశాము. ఇంకా – అతని ప్రభువు ఆజ్ఞపై జిన్నులు అతని చెప్పుచేతల్లో ఉండి, అతని ముందర పనిచేసేవి. వారిలో ఎవరు మా ఆజ్ఞలను ఉల్లంఘించినా మేము వాడికి జ్వలించే అగ్ని శిక్షను చవి చూపిస్తాము.
34:13 يَعْمَلُونَ لَهُ مَا يَشَاءُ مِن مَّحَارِيبَ وَتَمَاثِيلَ وَجِفَانٍ كَالْجَوَابِ وَقُدُورٍ رَّاسِيَاتٍ ۚ اعْمَلُوا آلَ دَاوُودَ شُكْرًا ۚ وَقَلِيلٌ مِّنْ عِبَادِيَ الشَّكُورُ
వారు (ఆ జిన్నులు) అతని కోసం అతను కోరినదల్లా చేసి పెట్టేవారు – (ఉదాహరణకు :) ఎత్తయిన కట్టడాలు, ప్రతిమలు, కోనేరుల్లాంటి గంగాళాలు, పొయ్యిలపైనే స్థిరంగా ఉండే దేగిశాలు. “ఓ దావూదు కుటుంబీకులారా! ఇందుకు కృతజ్ఞతగా సదాచరణ చెయ్యండి.” నా దాసులలో కృతజ్ఞతాపూర్వకంగా మసలుకునేవారు బహుకొద్దిమంది మాత్రమే.
34:14 فَلَمَّا قَضَيْنَا عَلَيْهِ الْمَوْتَ مَا دَلَّهُمْ عَلَىٰ مَوْتِهِ إِلَّا دَابَّةُ الْأَرْضِ تَأْكُلُ مِنسَأَتَهُ ۖ فَلَمَّا خَرَّ تَبَيَّنَتِ الْجِنُّ أَن لَّوْ كَانُوا يَعْلَمُونَ الْغَيْبَ مَا لَبِثُوا فِي الْعَذَابِ الْمُهِينِ
మరి మేము అతనిపై మరణ శాసనాన్ని అమలు పరచినప్పుడు, అతని చేతికర్రను తింటూవున్న చీడ పురుగు తప్ప వేరెవరూ అతని చావు కబురును వారికి (జిన్నులకు) తెలియ పరచలేదు. మరి అతను (సులైమాను) పడిపోయినప్పుడు, తమకే గనక రహస్య విషయాల జ్ఞానం ఉండి ఉంటే ఇంతటి అవమానకరమైన యాతనకు లోనయ్యేవారం కాము అని జిన్నులు తెలుసుకున్నారు.
34:15 لَقَدْ كَانَ لِسَبَإٍ فِي مَسْكَنِهِمْ آيَةٌ ۖ جَنَّتَانِ عَن يَمِينٍ وَشِمَالٍ ۖ كُلُوا مِن رِّزْقِ رَبِّكُمْ وَاشْكُرُوا لَهُ ۚ بَلْدَةٌ طَيِّبَةٌ وَرَبٌّ غَفُورٌ
సబా జాతి వారి కొరకు వారి నివాస స్థలంలోనే (దైవ శక్తికి సంబంధించిన) ఒక సూచన ఉండేది. వారికి కుడి వైపునా, ఎడమ వైపునా రెండు తోటలుండేవి. “మీ ప్రభువు ప్రసాదించిన ఉపాధిని తినండి, ఆయనకు కృతజ్ఞులై ఉండండి” (అని మేము వారికి సూచించి ఉన్నాము). పట్నమేమో ఉత్తమమైనది, ప్రభువేమో మన్నించేవాడు.
34:16 فَأَعْرَضُوا فَأَرْسَلْنَا عَلَيْهِمْ سَيْلَ الْعَرِمِ وَبَدَّلْنَاهُم بِجَنَّتَيْهِمْ جَنَّتَيْنِ ذَوَاتَيْ أُكُلٍ خَمْطٍ وَأَثْلٍ وَشَيْءٍ مِّن سِدْرٍ قَلِيلٍ
కాని వారు వైముఖ్య ధోరణిని అవలంబించారు. మేము వారిపై ఉధృతమైన వరద (నీరు)ను పంపాము. ఇంకా మేము వారి (నవనవలాడే) తోటలను రెండు (నాసిరకపు) తోటలుగా మార్చివేశాము. వాటి పండ్లు వగరుగా ఉండేవి. (అందులో ఎక్కువగా) ఝూవుక వృక్షాలు, కొన్ని రేగి చెట్లు ఉండేవి.
34:17 ذَٰلِكَ جَزَيْنَاهُم بِمَا كَفَرُوا ۖ وَهَلْ نُجَازِي إِلَّا الْكَفُورَ
వారి కృతఘ్నతా వైఖరికి బదులుగా మేము ఇచ్చిన ప్రతిఫలం (శిక్ష) ఇది! మా మేళ్ళను మరచిన వారికి మేము ఇలాంటి (కఠిన) శిక్షనే విధిస్తాము.
34:18 وَجَعَلْنَا بَيْنَهُمْ وَبَيْنَ الْقُرَى الَّتِي بَارَكْنَا فِيهَا قُرًى ظَاهِرَةً وَقَدَّرْنَا فِيهَا السَّيْرَ ۖ سِيرُوا فِيهَا لَيَالِيَ وَأَيَّامًا آمِنِينَ
మరి మేము వారికీ – మేము శుభాలు ప్రోదిచేసి ఉంచిన పట్టణాలకూ మధ్య దారిలో కానవచ్చే మరికొన్ని జనపదాలను కూడా ఉంచాము. వాటి మధ్య ప్రయాణ మజిలీలను కూడా మేము తగురీతిలో నిర్ధారించాము. “రేయింబవళ్ళు సురక్షితంగా వాటిలో సంచరిస్తూ ఉండండి” (అని వారికి సూచించాము).
34:19 فَقَالُوا رَبَّنَا بَاعِدْ بَيْنَ أَسْفَارِنَا وَظَلَمُوا أَنفُسَهُمْ فَجَعَلْنَاهُمْ أَحَادِيثَ وَمَزَّقْنَاهُمْ كُلَّ مُمَزَّقٍ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّكُلِّ صَبَّارٍ شَكُورٍ
కాని వారు, “మా ప్రభూ! మా ప్రయాణ మజిలీల దూరాలను పెంచు” అని అన్నారు. వారు తమకు తామే అన్యాయం చేసుకున్నందువల్ల మేము వారిని (పూర్వ) గాథలుగా మార్చి వేశాము. వారిని పూర్తిగా చిందరవందర చేసి వేశాము. నిశ్చయంగా సహనం వహించి కృతజ్ఞతలర్పించే ప్రతి ఒక్కరికీ ఇందులో (ఈ వృత్తాంతంలో) ఎన్నో సూచనలున్నాయి.
34:20 وَلَقَدْ صَدَّقَ عَلَيْهِمْ إِبْلِيسُ ظَنَّهُ فَاتَّبَعُوهُ إِلَّا فَرِيقًا مِّنَ الْمُؤْمِنِينَ
వారి విషయంలో తాను ఊహించినది నిజమని షైతాను నిరూపించాడు. విశ్వాసులకు చెందిన ఒక సమూహం తప్ప మిగిలిన జనులంతా వాడిని అనుసరించారు.
34:21 وَمَا كَانَ لَهُ عَلَيْهِم مِّن سُلْطَانٍ إِلَّا لِنَعْلَمَ مَن يُؤْمِنُ بِالْآخِرَةِ مِمَّنْ هُوَ مِنْهَا فِي شَكٍّ ۗ وَرَبُّكَ عَلَىٰ كُلِّ شَيْءٍ حَفِيظٌ
నిజానికి షైతానుకు వారిపై ఎలాంటి అధికారం లేకుండింది. కాని పరలోకాన్ని విశ్వసించేవారిని మేము పరలోకంపట్ల సంశయానికి గురైన వారినుంచి వేరుపరచటానికి ఇలా చేశాము. నీ ప్రభువు ప్రతి విషయాన్నీ కనిపెట్టుకుని ఉన్నాడు.
34:22 قُلِ ادْعُوا الَّذِينَ زَعَمْتُم مِّن دُونِ اللَّهِ ۖ لَا يَمْلِكُونَ مِثْقَالَ ذَرَّةٍ فِي السَّمَاوَاتِ وَلَا فِي الْأَرْضِ وَمَا لَهُمْ فِيهِمَا مِن شِرْكٍ وَمَا لَهُ مِنْهُم مِّن ظَهِيرٍ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : అల్లాహ్‌ను వదలి మీరు ఎవరెవరినయితే ఊహించుకుంటున్నారో వారందరినీ పిలిచి చూడండి. భూమ్యాకాశాలలో వారికి రవంత అధికారంగానీ, వాటిలో వారికి ఎలాంటి వాటాగానీ లేదు. వారిలో ఏ ఒక్కడూ అల్లాహ్‌కు సహాయకుడు కూడా కాడు.
34:23 وَلَا تَنفَعُ الشَّفَاعَةُ عِندَهُ إِلَّا لِمَنْ أَذِنَ لَهُ ۚ حَتَّىٰ إِذَا فُزِّعَ عَن قُلُوبِهِمْ قَالُوا مَاذَا قَالَ رَبُّكُمْ ۖ قَالُوا الْحَقَّ ۖ وَهُوَ الْعَلِيُّ الْكَبِيرُ
ఆయన వద్ద – ఆయన అనుమతించిన వారి కొరకు తప్ప- (ఒకరి) సిఫారసు (ఇంకొకరికి) ఏమాత్రం ఉపకరించదు. తుదకు వారి హృదయాలలోని ఆందోళన తొలగించబడిన తరువాత, “ఇంతకీ మీ ప్రభువు సెలవిచ్చినదేమిటి?” అని అడుగుతారు. “సత్యమే పలికాడు. ఆయన మహోన్నతుడు, ఘనాఘనుడు” అని వారు చెబుతారు.
34:24 قُلْ مَن يَرْزُقُكُم مِّنَ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ قُلِ اللَّهُ ۖ وَإِنَّا أَوْ إِيَّاكُمْ لَعَلَىٰ هُدًى أَوْ فِي ضَلَالٍ مُّبِينٍ
“ఆకాశాల నుంచి, భూమి నుంచీ మీకు ఉపాధిని సమకూర్చే వాడెవడు?” అని వారిని అడుగు. ‘అల్లాహ్‌యే’ అని వారికి చెప్పు. “మరయితే (వినండి) మేమో లేక మీరో నిశ్చయంగా సన్మార్గంలోనయినా ఉన్నాము లేదా స్పష్టమైన మార్గభ్రష్టతకైనా లోనై ఉన్నాము” (అని చెప్పండి).
34:25 قُل لَّا تُسْأَلُونَ عَمَّا أَجْرَمْنَا وَلَا نُسْأَلُ عَمَّا تَعْمَلُونَ
“మేము చేసిన తప్పులను గురించి మిమ్మల్ని ప్రశ్నించటం గానీ, మీ కర్మలను గురించి మమ్మల్ని ప్రశ్నించటంగానీ జరగదు” అని వారికి చెప్పు.
34:26 قُلْ يَجْمَعُ بَيْنَنَا رَبُّنَا ثُمَّ يَفْتَحُ بَيْنَنَا بِالْحَقِّ وَهُوَ الْفَتَّاحُ الْعَلِيمُ
“మన ప్రభువు మనందరినీ సమావేశపరచి ఆ తరువాత మన మధ్య సత్యబద్ధంగా తీర్పుచేస్తాడు. ఆయన తీర్పులు చేసేవాడు, సర్వం తెలిసినవాడు” అని చెప్పు.
34:27 قُلْ أَرُونِيَ الَّذِينَ أَلْحَقْتُم بِهِ شُرَكَاءَ ۖ كَلَّا ۚ بَلْ هُوَ اللَّهُ الْعَزِيزُ الْحَكِيمُ
“సరే, మీరు అల్లాహ్‌కు భాగస్వాములుగా ఖరారు చేసి, ఆయనతో కలుపుతున్నటువంటి వారిని కాస్త నాక్కూడా చూపించండి! అలాంటి వారెవరూ లేరు. వాస్తవానికి ఆయనే అల్లాహ్- సర్వాధిక్యుడు, వివేక సంపన్నుడు” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు.
34:28 وَمَا أَرْسَلْنَاكَ إِلَّا كَافَّةً لِّلنَّاسِ بَشِيرًا وَنَذِيرًا وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ
(ఓ ముహమ్మద్!) మేము నిన్ను సమస్త జనులకు శుభవార్తను అందజేసేవానిగా, హెచ్చరించేవానిగా చేసి పంపాము. అయితే జనులలో అధికులకు ఈ విషయం తెలియదు.
34:29 وَيَقُولُونَ مَتَىٰ هَٰذَا الْوَعْدُ إِن كُنتُمْ صَادِقِينَ
“నువ్వు సత్యవంతుడవే అయితే ఆ వాగ్దానం ఎప్పుడు సంభవిస్తుందో చెప్పు?” అని వారంటున్నారు.
34:30 قُل لَّكُم مِّيعَادُ يَوْمٍ لَّا تَسْتَأْخِرُونَ عَنْهُ سَاعَةً وَلَا تَسْتَقْدِمُونَ
“వాగ్దాన దినం ఖచ్చితంగా నిర్ధారితమై ఉంది. దానికన్నా ఒక ఘడియ కూడా మీరు వెనక్కి జరగలేరు, ముందుకు పోలేరు” అని వారికి చెప్పు.
34:31 وَقَالَ الَّذِينَ كَفَرُوا لَن نُّؤْمِنَ بِهَٰذَا الْقُرْآنِ وَلَا بِالَّذِي بَيْنَ يَدَيْهِ ۗ وَلَوْ تَرَىٰ إِذِ الظَّالِمُونَ مَوْقُوفُونَ عِندَ رَبِّهِمْ يَرْجِعُ بَعْضُهُمْ إِلَىٰ بَعْضٍ الْقَوْلَ يَقُولُ الَّذِينَ اسْتُضْعِفُوا لِلَّذِينَ اسْتَكْبَرُوا لَوْلَا أَنتُمْ لَكُنَّا مُؤْمِنِينَ
“మేము ఈ ఖుర్ఆన్నుగానీ, దీనికి పూర్వం వచ్చిన గ్రంథాలనుగానీ ఎట్టి పరిస్థితిలోనూ నమ్మము” అని అవిశ్వాసులు అంటున్నారు. ఈ దుర్మార్గులు తమ ప్రభువు ఎదుట నిలబెట్టబడి, వారు ఒండొకరిని నిందించుకుంటున్నప్పుడు నువ్వు చూస్తే ఎంత బాగుంటుంది! బలహీనులు పెద్దలమనుకున్న వారినుద్దేశించి, “మీరే గనక లేకుండా ఉంటే మేము విశ్వాసులమై ఉండేవారం” అని అంటారు.
34:32 قَالَ الَّذِينَ اسْتَكْبَرُوا لِلَّذِينَ اسْتُضْعِفُوا أَنَحْنُ صَدَدْنَاكُمْ عَنِ الْهُدَىٰ بَعْدَ إِذْ جَاءَكُم ۖ بَلْ كُنتُم مُّجْرِمِينَ
“ఏమిటీ, మీ వద్దకు మార్గదర్శకత్వం వచ్చిన తరువాత దాన్ని అవలంబించకుండా మేము మిమ్మల్ని ఆపామా? (లేదు కదా!) పైగా మీరంతట మీరే అపరాధానికి ఒడిగట్టారు” అని పెద్దలు బలహీన జనులకు సమాధానమిస్తారు.
34:33 وَقَالَ الَّذِينَ اسْتُضْعِفُوا لِلَّذِينَ اسْتَكْبَرُوا بَلْ مَكْرُ اللَّيْلِ وَالنَّهَارِ إِذْ تَأْمُرُونَنَا أَن نَّكْفُرَ بِاللَّهِ وَنَجْعَلَ لَهُ أَندَادًا ۚ وَأَسَرُّوا النَّدَامَةَ لَمَّا رَأَوُا الْعَذَابَ وَجَعَلْنَا الْأَغْلَالَ فِي أَعْنَاقِ الَّذِينَ كَفَرُوا ۚ هَلْ يُجْزَوْنَ إِلَّا مَا كَانُوا يَعْمَلُونَ
మరి (దానికి బదులుగా) ఈ బలహీన ప్రజలు పెద్దలతో ఇలా అంటారు: “(లేదు లేదు) రేయింబవళ్ళు మీరు పన్నిన కుట్ర ఇది! అల్లాహ్‌ను తిరస్కరించమనీ, ఆయనకు సహవర్తులుగా ఇతరులను కల్పించమని మీరు జారీ చేసే ఆజ్ఞలే మా అవిశ్వాసానికి కారణభూతం అయ్యాయి.” శిక్షను చూడగానే లోలోపలే వారంతా పశ్చాత్తాపపడతారు. మేము అవిశ్వాసుల మెడలలో ఇనుప పట్టాలు వేస్తాము. వారు చేసుకున్న కర్మల ఫలితమే వారికి ఇవ్వబడుతుంది.
34:34 وَمَا أَرْسَلْنَا فِي قَرْيَةٍ مِّن نَّذِيرٍ إِلَّا قَالَ مُتْرَفُوهَا إِنَّا بِمَا أُرْسِلْتُم بِهِ كَافِرُونَ
మరి మేము ఏ పట్టణంలో, హెచ్చరించేవాణ్ణి పంపినా అక్కడి సంపన్న వర్గాలవారు, “నీకిచ్చి పంపబడిన దానిని మేము త్రోసి పుచ్చుతున్నాం” అని చెప్పేశారు.
34:35 وَقَالُوا نَحْنُ أَكْثَرُ أَمْوَالًا وَأَوْلَادًا وَمَا نَحْنُ بِمُعَذَّبِينَ
“మేము సిరిసంపదలలో, సంతాన భాగ్యంలో ఎంతో అధికులము. మేము శిక్షించబడటమనేది జరగని పని” అని వారన్నారు.
34:36 قُلْ إِنَّ رَبِّي يَبْسُطُ الرِّزْقَ لِمَن يَشَاءُ وَيَقْدِرُ وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “నా ప్రభువు తాను కోరిన వారి ఉపాధిని విస్తృతం చేస్తాడు. (తాను కోరిన వారికి) కుంచింప జేస్తాడు. కాని చాలామంది (ఈ యదార్థాన్ని) గ్రహించరు.
34:37 وَمَا أَمْوَالُكُمْ وَلَا أَوْلَادُكُم بِالَّتِي تُقَرِّبُكُمْ عِندَنَا زُلْفَىٰ إِلَّا مَنْ آمَنَ وَعَمِلَ صَالِحًا فَأُولَٰئِكَ لَهُمْ جَزَاءُ الضِّعْفِ بِمَا عَمِلُوا وَهُمْ فِي الْغُرُفَاتِ آمِنُونَ
మీ సిరిసంపదలుగానీ, మీ సంతానంగానీ మా సన్నిధిలో (అంతస్తుల రీత్యా) మిమ్మల్ని ఏమాత్రం దగ్గరకు చేర్చలేవు. అయితే ఎవరైనా విశ్వసించి, సదాచరణ చేస్తే, అటువంటి వారికి వారి ఆచరణకు బదులుగా రెండింతల ప్రతిఫలం ఉంటుంది. వారు ఎత్తయిన మేడలలో సురక్షితంగా ఉంటారు.
34:38 وَالَّذِينَ يَسْعَوْنَ فِي آيَاتِنَا مُعَاجِزِينَ أُولَٰئِكَ فِي الْعَذَابِ مُحْضَرُونَ
మరెవరయితే మా ఆయతులను లొంగ దీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తారో వారు శిక్షకు హాజరుపరచబడతారు.
34:39 قُلْ إِنَّ رَبِّي يَبْسُطُ الرِّزْقَ لِمَن يَشَاءُ مِنْ عِبَادِهِ وَيَقْدِرُ لَهُ ۚ وَمَا أَنفَقْتُم مِّن شَيْءٍ فَهُوَ يُخْلِفُهُ ۖ وَهُوَ خَيْرُ الرَّازِقِينَ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “నా ప్రభువు తన దాసులలో తాను తలచిన వారి ఉపాధిని విస్తృతపరుస్తాడు. మరి తాను తలచిన వారికి కుదిస్తాడు. (అల్లాహ్ మార్గంలో) మీరు ఏది ఖర్చు చేసినా ఆయన దానికి (సంపూర్ణ) ప్రతిఫలం ఇస్తాడు. ఆయన అందరి కన్నా ఉత్తమ ఉపాధి ప్రదాత.
34:40 وَيَوْمَ يَحْشُرُهُمْ جَمِيعًا ثُمَّ يَقُولُ لِلْمَلَائِكَةِ أَهَٰؤُلَاءِ إِيَّاكُمْ كَانُوا يَعْبُدُونَ
ఆ రోజు అల్లాహ్ వారందరినీ సమీకరించి, “ఏమిటి, వీళ్లు మిమ్మల్ని పూజించేవారా?” అని దూతలను అడుగుతాడు.
34:41 قَالُوا سُبْحَانَكَ أَنتَ وَلِيُّنَا مِن دُونِهِم ۖ بَلْ كَانُوا يَعْبُدُونَ الْجِنَّ ۖ أَكْثَرُهُم بِهِم مُّؤْمِنُونَ
“(ఓ అల్లాహ్!) నీవు పవిత్రుడవు. మా రక్షకుడవు నువ్వు మాత్రమే గాని వీళ్లు కాదు. అసలు వీళ్లు జిన్నులను పూజించే వాళ్ళు. వీరిలో చాలా మంది వాళ్ళనే (జిన్నులనే) నమ్ము కున్నారు” అని వారు సమాధానమిస్తారు.
34:42 فَالْيَوْمَ لَا يَمْلِكُ بَعْضُكُمْ لِبَعْضٍ نَّفْعًا وَلَا ضَرًّا وَنَقُولُ لِلَّذِينَ ظَلَمُوا ذُوقُوا عَذَابَ النَّارِ الَّتِي كُنتُم بِهَا تُكَذِّبُونَ
కనుక ఈ రోజు మీలో పరస్పరం ఎవరికీ ఎటువంటి లాభాన్ని గానీ, నష్టాన్నిగానీ చేకూర్చే అధికారం లేదు. “మీరు త్రోసి పుచ్చుతూ వచ్చిన అగ్నిశిక్ష రుచి చూడండి” అని మేము దుర్మార్గులతో అంటాము.
34:43 وَإِذَا تُتْلَىٰ عَلَيْهِمْ آيَاتُنَا بَيِّنَاتٍ قَالُوا مَا هَٰذَا إِلَّا رَجُلٌ يُرِيدُ أَن يَصُدَّكُمْ عَمَّا كَانَ يَعْبُدُ آبَاؤُكُمْ وَقَالُوا مَا هَٰذَا إِلَّا إِفْكٌ مُّفْتَرًى ۚ وَقَالَ الَّذِينَ كَفَرُوا لِلْحَقِّ لَمَّا جَاءَهُمْ إِنْ هَٰذَا إِلَّا سِحْرٌ مُّبِينٌ
వారి ముందు స్పష్టమైన మా ఆయతులు పఠించబడినప్పుడు, “ఈ వ్యక్తి మిమ్మల్ని మీ తాతముత్తాతల ఆరాధ్య దైవాల నుంచి ఆపదలుస్తున్నాడు (అంతకుమించి మరేమీ లేదు)” అని అంటారు. “ఇదొక కల్పిత అబద్ధం” అని కూడా అంటారు. వాస్తవానికి సత్యం వారివద్దకు వచ్చేసినప్పటికీ “ఇది స్పష్టమైన ఇంద్రజాలం తప్ప మరేమీ కాదు” అని అవిశ్వాసులు అంటారు.
34:44 وَمَا آتَيْنَاهُم مِّن كُتُبٍ يَدْرُسُونَهَا ۖ وَمَا أَرْسَلْنَا إِلَيْهِمْ قَبْلَكَ مِن نَّذِيرٍ
మరి మేము వారికి (మక్కావాసులకు), వారు చదివేందుకు (లోగడ) గ్రంథాలు ఇచ్చి ఉండటంగానీ, నీకు మునుపు వారి వద్దకు పంపటం గానీ జరగలేదు.
34:45 وَكَذَّبَ الَّذِينَ مِن قَبْلِهِمْ وَمَا بَلَغُوا مِعْشَارَ مَا آتَيْنَاهُمْ فَكَذَّبُوا رُسُلِي ۖ فَكَيْفَ كَانَ نَكِيرِ
వారి పూర్వీకులు కూడా మా బోధనలను త్రోసిపుచ్చారు. మేము వారికి ప్రసాదించిన దానిలో పదో వంతుకు కూడా వీరు చేరుకోలేదు. మొత్తానికి వారు నా ప్రవక్తలను ధిక్కరించారు. మరి నా శిక్ష ఎంత (కఠినంగా ఉండిందో చూడు!)
34:46 قُلْ إِنَّمَا أَعِظُكُم بِوَاحِدَةٍ ۖ أَن تَقُومُوا لِلَّهِ مَثْنَىٰ وَفُرَادَىٰ ثُمَّ تَتَفَكَّرُوا ۚ مَا بِصَاحِبِكُم مِّن جِنَّةٍ ۚ إِنْ هُوَ إِلَّا نَذِيرٌ لَّكُم بَيْنَ يَدَيْ عَذَابٍ شَدِيدٍ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “నేను మీకు చేసే ఉపదేశం ఒక్కటే – మీరు అల్లాహ్ కోసం (మంకుతనం మాని) ఇద్దరిద్దరు చొప్పున లేదా ఒక్కొక్కరు చొప్పున సంసిద్ధులై ఆలోచించండి – మీ ఈ సహచరునికి ఎలాంటి ఉన్మాదంలేదు, తీవ్రమైన శిక్ష రాకముందే అతడు కేవలం మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు” (అన్న సంగతి మీకిట్టే బోధపడుతుంది).”
34:47 قُلْ مَا سَأَلْتُكُم مِّنْ أَجْرٍ فَهُوَ لَكُمْ ۖ إِنْ أَجْرِيَ إِلَّا عَلَى اللَّهِ ۖ وَهُوَ عَلَىٰ كُلِّ شَيْءٍ شَهِيدٌ
(ఇంకా ఈ విధంగా) చెప్పు: “ఒకవేళ నేను మీ నుండి ఏదన్నా ప్రతిఫలాన్ని ఆపేక్షించి ఉంటే, దాన్ని మీరే ఉంచుకోండి. నాకు ప్రతిఫలం ఇచ్చే బాధ్యత అల్లాహ్‌ది. ఆయన ప్రతిదానికీ సాక్షిగా ఉన్నాడు.”
34:48 قُلْ إِنَّ رَبِّي يَقْذِفُ بِالْحَقِّ عَلَّامُ الْغُيُوبِ
(ఈ విధంగా కూడా) చెప్పు: “నా ప్రభువు సత్యాన్ని పంపిస్తున్నాడు. ఆయన అగోచర విషయాలన్నీ తెలిసినవాడు.”
34:49 قُلْ جَاءَ الْحَقُّ وَمَا يُبْدِئُ الْبَاطِلُ وَمَا يُعِيدُ
(ఇంకా ఇలా) చెప్పు : “సత్యం వచ్చేసింది. అసత్యం ఇంతకు ముందు కూడా ఏమీ చెయ్యలేకపోయింది. ఇక మీదట కూడా ఏమీ చెయ్యజాలదు.”
34:50 قُلْ إِن ضَلَلْتُ فَإِنَّمَا أَضِلُّ عَلَىٰ نَفْسِي ۖ وَإِنِ اهْتَدَيْتُ فَبِمَا يُوحِي إِلَيَّ رَبِّي ۚ إِنَّهُ سَمِيعٌ قَرِيبٌ
(ఇంకా ఈ విధంగా కూడా) చెప్పెయ్యి: “ఒకవేళ నేను గనక పెడదోవ పడితే, నా పెడదోవ (పాపం) నాపైనే పడుతుంది. ఒకవేళ నేను సన్మార్గాన ఉంటే, అది నా ప్రభువు నాకు పంపిన వహీ మూలంగానే. నిశ్చయంగా ఆయన అంతా వినేవాడు, అతి చేరువలో ఉన్నవాడు.”
34:51 وَلَوْ تَرَىٰ إِذْ فَزِعُوا فَلَا فَوْتَ وَأُخِذُوا مِن مَّكَانٍ قَرِيبٍ
వారు (అవిశ్వాసులు) భయకంపితులై, తప్పించుకుని పారిపోయేదిక్కు తోచక, చాలా దగ్గరి స్థలం నుంచే పట్టుబడినప్పుడు నువ్వు చూస్తే (ఎంత బావుండు!)
34:52 وَقَالُوا آمَنَّا بِهِ وَأَنَّىٰ لَهُمُ التَّنَاوُشُ مِن مَّكَانٍ بَعِيدٍ
అప్పుడు వారు, “మేము దీనిని (ఖుర్ఆన్ను) విశ్వసించాము” అనంటారు. కాని అంత దూరస్థలం నుంచి వారు (ఆశించిన వస్తువును) ఎలా అందుకుంటారు?
34:53 وَقَدْ كَفَرُوا بِهِ مِن قَبْلُ ۖ وَيَقْذِفُونَ بِالْغَيْبِ مِن مَّكَانٍ بَعِيدٍ
అంతకు ముందైతే వాళ్ళు దాన్ని త్రోసిపుచ్చారు. బహుదూరం నుంచి, చూడకుండానే కోతలు కోసేవారు.
34:54 وَحِيلَ بَيْنَهُمْ وَبَيْنَ مَا يَشْتَهُونَ كَمَا فُعِلَ بِأَشْيَاعِهِم مِّن قَبْلُ ۚ إِنَّهُمْ كَانُوا فِي شَكٍّ مُّرِيبٍ
మరి (ఇప్పుడు) వారికీ – వారి ఆకాంక్షలకు మధ్య అడ్డు తెరవేయబడింది. లోగడ వీళ్ళలాంటి వీరి పూర్వీకుల పట్ల కూడా ఈ వ్యవహారమే జరిగింది. వారు కూడా (వీళ్ళ మాదిరిగానే) వ్యాకులపరిచే సంశయంలో పడి ఉండేవారు. - సూరా ఫాతిర్
35:1 الْحَمْدُ لِلَّهِ فَاطِرِ السَّمَاوَاتِ وَالْأَرْضِ جَاعِلِ الْمَلَائِكَةِ رُسُلًا أُولِي أَجْنِحَةٍ مَّثْنَىٰ وَثُلَاثَ وَرُبَاعَ ۚ يَزِيدُ فِي الْخَلْقِ مَا يَشَاءُ ۚ إِنَّ اللَّهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
సర్వస్తోత్రాలు (శూన్యంలో నుంచి) ఆకాశాలను, భూమిని సృష్టించిన అల్లాహ్‌కే శోభిస్తాయి. ఆయన రెండేసి, మూడేసి, నాలుగేసి రెక్కలు గల దూతలను తన సందేశ వాహకులుగా చేసుకుంటాడు. సృష్టిలో తాను కోరిన దాన్ని పెంచుతాడు. అల్లాహ్ అన్నింటిపై అధికారం కలవాడు.
35:2 مَّا يَفْتَحِ اللَّهُ لِلنَّاسِ مِن رَّحْمَةٍ فَلَا مُمْسِكَ لَهَا ۖ وَمَا يُمْسِكْ فَلَا مُرْسِلَ لَهُ مِن بَعْدِهِ ۚ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ
అల్లాహ్ తన దాసుల కోసం తెరిచే కారుణ్యాన్ని నిలిపివేసే వాడెవడూ లేడు. మరి ఆయన దేన్నయినా నిలిపివేస్తే, ఆ తరువాత దాన్ని పంపేవాడు కూడా ఎవడూ లేడు. ఆయన సర్వాధిక్యుడు, వివేక సంపన్నుడు.
35:3 يَا أَيُّهَا النَّاسُ اذْكُرُوا نِعْمَتَ اللَّهِ عَلَيْكُمْ ۚ هَلْ مِنْ خَالِقٍ غَيْرُ اللَّهِ يَرْزُقُكُم مِّنَ السَّمَاءِ وَالْأَرْضِ ۚ لَا إِلَٰهَ إِلَّا هُوَ ۖ فَأَنَّىٰ تُؤْفَكُونَ
ఓ ప్రజలారా! మీపైవున్న అల్లాహ్ అనుగ్రహాన్ని కాస్త జ్ఞాపకం చేసుకోండి. ఏమిటి, అల్లాహ్ గాకుండా ఆకాశం నుంచి, భూమి నుంచి మీకు ఉపాధిని సమకూర్చే వేరే సృష్టికర్త కూడా ఎవడైనా ఉన్నాడా? ఆయన తప్ప మరో ఆరాధ్యుడెవడూలేడు. మరి మీరు (ఆయన వైపు నుండి) ఎటు తిరిగిపోతున్నారు?
35:4 وَإِن يُكَذِّبُوكَ فَقَدْ كُذِّبَتْ رُسُلٌ مِّن قَبْلِكَ ۚ وَإِلَى اللَّهِ تُرْجَعُ الْأُمُورُ
(ఓ ప్రవక్తా!) ఒకవేళ వీళ్ళు నిన్ను ధిక్కరించినట్లయితే నీకు పూర్వం గతించిన ప్రవక్తలంతా ధిక్కరించబడినవారే. సమస్త వ్యవహారాలు (ఎట్టకేలకు) అల్లాహ్ వైపునకే మరలించబడతాయి.
35:5 يَا أَيُّهَا النَّاسُ إِنَّ وَعْدَ اللَّهِ حَقٌّ ۖ فَلَا تَغُرَّنَّكُمُ الْحَيَاةُ الدُّنْيَا ۖ وَلَا يَغُرَّنَّكُم بِاللَّهِ الْغَرُورُ
ఓ ప్రజలారా! నిశ్చయంగా అల్లాహ్ వాగ్దానం సత్యమైనది. కాబట్టి ప్రాపంచిక జీవితం ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని మోసంలో పడవేయకూడదు. ఆ మాయలమారి (షైతాను) కూడా మిమ్మల్ని మోసగించకూడదు సుమా!
35:6 إِنَّ الشَّيْطَانَ لَكُمْ عَدُوٌّ فَاتَّخِذُوهُ عَدُوًّا ۚ إِنَّمَا يَدْعُو حِزْبَهُ لِيَكُونُوا مِنْ أَصْحَابِ السَّعِيرِ
నిశ్చయంగా షైతాను మీ శత్రువు. కనుక మీరు కూడా వాణ్ణి శత్రువుగానే పరిగణించండి. వాడు తన సమూహాన్ని, వారంతా నరకవాసులలో చేరిపోవటానికే పిలుస్తున్నాడు.
35:7 الَّذِينَ كَفَرُوا لَهُمْ عَذَابٌ شَدِيدٌ ۖ وَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ لَهُم مَّغْفِرَةٌ وَأَجْرٌ كَبِيرٌ
అవిశ్వాస వైఖరిని అవలంబించినవారి కోసం తీవ్రమైన శిక్ష ఉంది. విశ్వసించి, సత్కార్యాలు చేసిన వారి కోసం మన్నింపు ఉంది. గొప్ప పుణ్యఫలం ఉంది.
35:8 أَفَمَن زُيِّنَ لَهُ سُوءُ عَمَلِهِ فَرَآهُ حَسَنًا ۖ فَإِنَّ اللَّهَ يُضِلُّ مَن يَشَاءُ وَيَهْدِي مَن يَشَاءُ ۖ فَلَا تَذْهَبْ نَفْسُكَ عَلَيْهِمْ حَسَرَاتٍ ۚ إِنَّ اللَّهَ عَلِيمٌ بِمَا يَصْنَعُونَ
మరి ఏ వ్యక్తికయినా అతని దుష్కర్మలు అందమైనవిగా చేయబడగా, అతను వాటిని మంచి పనులుగా భావిస్తున్నట్లయితే (అతను సన్మార్గం పొందిన వానితో సరితూగుతాడా?)! అల్లాహ్ తాను తలచిన వారిని మార్గవిహీనతకు లోనుచేస్తున్నాడు, తాను తలచిన వారికి సన్మార్గం చూపుతున్నాడు. కనుక (ఓ ప్రవక్తా!) నువ్వు వాళ్ల గురించి అదేపనిగా బెంగ పెట్టుకుని నీ ప్రాణానికి ముప్పు తెచ్చి పెట్టుకోకూడదు. వారు చేసేదంతా అల్లాహ్‌కు పూర్తిగా తెలుసు.
35:9 وَاللَّهُ الَّذِي أَرْسَلَ الرِّيَاحَ فَتُثِيرُ سَحَابًا فَسُقْنَاهُ إِلَىٰ بَلَدٍ مَّيِّتٍ فَأَحْيَيْنَا بِهِ الْأَرْضَ بَعْدَ مَوْتِهَا ۚ كَذَٰلِكَ النُّشُورُ
అల్లాహ్‌యే గాలులను పంపిస్తున్నాడు. తరువాత అవి మేఘాలను లేపుతాయి. మరి ఆ మేఘాలను మేము ఒక మృత ప్రదేశం (భూమి) వైపుకు తీసుకుపోతాము. తద్వారా ఆ భూమిని- మృతిచెందిన మీదట – బ్రతికిస్తున్నాము. మళ్లీ తిరిగి లేపటం అనేది (కూడా) ఇలాగే జరుగుతుంది.
35:10 مَن كَانَ يُرِيدُ الْعِزَّةَ فَلِلَّهِ الْعِزَّةُ جَمِيعًا ۚ إِلَيْهِ يَصْعَدُ الْكَلِمُ الطَّيِّبُ وَالْعَمَلُ الصَّالِحُ يَرْفَعُهُ ۚ وَالَّذِينَ يَمْكُرُونَ السَّيِّئَاتِ لَهُمْ عَذَابٌ شَدِيدٌ ۖ وَمَكْرُ أُولَٰئِكَ هُوَ يَبُورُ
గౌరవాన్ని ఆశించే వారెవరయినాసరే సకల గౌరవోన్నతులు అల్లాహ్‌వే (నని తెలుసుకోవాలి). సద్వచనాలన్నీ ఆయన వైపుకే ఎగబ్రాకుతాయి. సదాచరణ వాటికి (మరింత) ఉన్నతినిస్తుంది. మరెవరయితే కుతంత్రాలలో నిమగ్నులై ఉంటారో వారి కొరకు ఘోరాతి ఘోరమైన శిక్ష ఉంది. కడకు వారి ఈ కుతంత్రం కకావికలమైపోతుంది.
35:11 وَاللَّهُ خَلَقَكُم مِّن تُرَابٍ ثُمَّ مِن نُّطْفَةٍ ثُمَّ جَعَلَكُمْ أَزْوَاجًا ۚ وَمَا تَحْمِلُ مِنْ أُنثَىٰ وَلَا تَضَعُ إِلَّا بِعِلْمِهِ ۚ وَمَا يُعَمَّرُ مِن مُّعَمَّرٍ وَلَا يُنقَصُ مِنْ عُمُرِهِ إِلَّا فِي كِتَابٍ ۚ إِنَّ ذَٰلِكَ عَلَى اللَّهِ يَسِيرٌ
(ప్రజలారా!) అల్లాహ్ మిమ్మల్ని మట్టితో, ఆ తరువాత వీర్య బిందువుతో సృష్టించాడు. ఆ పైన మిమ్మల్ని జతలు (స్త్రీలు, పురుషులు)గా చేశాడు. ఆయనకు తెలియకుండా ఏ స్త్రీ కూడా గర్భవతి కావటంగానీ, బిడ్డను కనటంగానీ జరగదు. దీర్ఘాయుషు పొందినవాని ఆయుష్షు పెరగటమైనా, మరొకతని ఆయుష్షు తరగటమైనా – అంతా గ్రంథంలో లిఖితమై ఉంది. ఇదంతా అల్లాహ్‌కు చాలా తేలిక.
35:12 وَمَا يَسْتَوِي الْبَحْرَانِ هَٰذَا عَذْبٌ فُرَاتٌ سَائِغٌ شَرَابُهُ وَهَٰذَا مِلْحٌ أُجَاجٌ ۖ وَمِن كُلٍّ تَأْكُلُونَ لَحْمًا طَرِيًّا وَتَسْتَخْرِجُونَ حِلْيَةً تَلْبَسُونَهَا ۖ وَتَرَى الْفُلْكَ فِيهِ مَوَاخِرَ لِتَبْتَغُوا مِن فَضْلِهِ وَلَعَلَّكُمْ تَشْكُرُونَ
రెండు జలధులూ సమానం కావు – వాటిలో (ఒకటి)ఇదేమో తియ్యనిది, దాహం తీర్చేది, త్రాగటానికి హాయిగా ఉండేది. మరి (రెండవది) అదేమో ఉప్పగా, చేదుగా ఉంది. అయితే మీరు ఆ రెండింటిలో నుంచీ తాజామాంసాన్ని తింటున్నారు. మీరు ధరించే నగలను వెలికి తీస్తున్నారు. జల ప్రవాహాలను చీల్చుకుంటూ పోయే పెద్దపెద్ద ఓడలను నువ్వు చూస్తున్నావు – మీరు ఆయన కృపను అన్వేషించడానికి, మీరు ఆయనకు కృతజ్ఞులై ఉండటానికిగాను (ఈ వ్యవస్థ ఏర్పరచబడింది).
35:13 يُولِجُ اللَّيْلَ فِي النَّهَارِ وَيُولِجُ النَّهَارَ فِي اللَّيْلِ وَسَخَّرَ الشَّمْسَ وَالْقَمَرَ كُلٌّ يَجْرِي لِأَجَلٍ مُّسَمًّى ۚ ذَٰلِكُمُ اللَّهُ رَبُّكُمْ لَهُ الْمُلْكُ ۚ وَالَّذِينَ تَدْعُونَ مِن دُونِهِ مَا يَمْلِكُونَ مِن قِطْمِيرٍ
ఆయన రాత్రిని పగటిలోనికి జొప్పిస్తున్నాడు, పగటిని రాత్రి లోనికి జొప్పిస్తున్నాడు. మరి ఆయన సూర్యచంద్రులను (తన శాసన) నిబద్ధుల్ని చేశాడు – ప్రతిదీ ఒక నిర్ధారిత కాలం ప్రకారం నడుస్తోంది. ఈ అల్లాహ్‌యే మీ ప్రభువు. విశ్వసామ్రాజ్యాధికారం ఆయనదే. ఆయన్ని వదలి మీరు ఎవరెవరిని పిలుస్తున్నారో వారు ఖర్జూరపు టెంకపై ఉండే పొరకు కూడా యజమానులు కారు.
35:14 إِن تَدْعُوهُمْ لَا يَسْمَعُوا دُعَاءَكُمْ وَلَوْ سَمِعُوا مَا اسْتَجَابُوا لَكُمْ ۖ وَيَوْمَ الْقِيَامَةِ يَكْفُرُونَ بِشِرْكِكُمْ ۚ وَلَا يُنَبِّئُكَ مِثْلُ خَبِيرٍ
ఒకవేళ మీరు వారిని మొర పెట్టుకున్నా, వారు మీ మొరను ఆలకించరు. ఒకవేళ ఆలకించినా, మీ అక్కరను తీర్చలేరు. పైపెచ్చు ప్రళయదినాన మీరు కల్పించే భాగస్వామ్యాన్ని (షిర్క్‌ను) వారు (సూటిగా) త్రోసిపుచ్చుతారు. అన్నీ తెలిసిన దేవుని మాదిరిగా (సావధానపరిచే సమాచారాన్ని) నీకు తెలిపే వాడెవడూ ఉండడు సుమా!
35:15 يَا أَيُّهَا النَّاسُ أَنتُمُ الْفُقَرَاءُ إِلَى اللَّهِ ۖ وَاللَّهُ هُوَ الْغَنِيُّ الْحَمِيدُ
ఓ ప్రజలారా! మీరంతా అల్లాహ్ అవసరం కలిగినవారు. అల్లాహ్ మాత్రం అక్కరలేనివాడు. (సర్వ విధాలా) స్తుతించదగిన వాడు.
35:16 إِن يَشَأْ يُذْهِبْكُمْ وَيَأْتِ بِخَلْقٍ جَدِيدٍ
ఆయన గనక తలిస్తే మిమ్మల్ని తుదముట్టించి, (మీ స్థానంలో) మరో నూతన సృష్టిని చేయగలడు.
35:17 وَمَا ذَٰلِكَ عَلَى اللَّهِ بِعَزِيزٍ
ఇలా చేయటం అల్లాహ్‌కు ఏమాత్రం కష్టతరం కాదు.
35:18 وَلَا تَزِرُ وَازِرَةٌ وِزْرَ أُخْرَىٰ ۚ وَإِن تَدْعُ مُثْقَلَةٌ إِلَىٰ حِمْلِهَا لَا يُحْمَلْ مِنْهُ شَيْءٌ وَلَوْ كَانَ ذَا قُرْبَىٰ ۗ إِنَّمَا تُنذِرُ الَّذِينَ يَخْشَوْنَ رَبَّهُم بِالْغَيْبِ وَأَقَامُوا الصَّلَاةَ ۚ وَمَن تَزَكَّىٰ فَإِنَّمَا يَتَزَكَّىٰ لِنَفْسِهِ ۚ وَإِلَى اللَّهِ الْمَصِيرُ
బరువును మోసేవాడెవడూ మరొకరి బరువును మోయడు. బరువు మోసేవాడు ఒకవేళ తన బరువును మోపే నిమిత్తం వేరొకరిని పిలిచినా, అతడు – సమీప బంధువు అయినాసరే – కొద్దిగా కూడా ఎత్తుకోడు. (ఓ ప్రవక్తా!) చూడకపోయినా తమ ప్రభువుకు భయపడేవారిని, నమాజులను నెలకొల్పేవారిని మాత్రమే నువ్వు సావధానపరచగలవు. ఎవడు పరిశుద్ధుడైనా తన స్వయం కోసమే పరిశుద్ధుడవుతాడు. (కడకు అందరూ) అల్లాహ్ వైపునకే మరలిపోవలసి ఉంది.
35:19 وَمَا يَسْتَوِي الْأَعْمَىٰ وَالْبَصِيرُ
గుడ్డివాడు – చూసేవాడూ సమానులు కారు.
35:20 وَلَا الظُّلُمَاتُ وَلَا النُّورُ
చీకట్లు – వెలుతురు ఒకటి కావు.
35:21 وَلَا الظِّلُّ وَلَا الْحَرُورُ
నీడా – ఎండా సమం కావు.
35:22 وَمَا يَسْتَوِي الْأَحْيَاءُ وَلَا الْأَمْوَاتُ ۚ إِنَّ اللَّهَ يُسْمِعُ مَن يَشَاءُ ۖ وَمَا أَنتَ بِمُسْمِعٍ مَّن فِي الْقُبُورِ
బ్రతికి ఉన్నవారూ చచ్చినవారు (ఎన్నటికీ) సమానులు కాలేరు. అల్లాహ్ తాను కోరిన వారికి వినిపిస్తాడు. సమాధుల్లో ఉన్నవారికి నువ్వు వినిపించలేవు.
35:23 إِنْ أَنتَ إِلَّا نَذِيرٌ
నువ్వు హెచ్చరించేవాడవు మాత్రమే.
35:24 إِنَّا أَرْسَلْنَاكَ بِالْحَقِّ بَشِيرًا وَنَذِيرًا ۚ وَإِن مِّنْ أُمَّةٍ إِلَّا خَلَا فِيهَا نَذِيرٌ
మేము నీకు సత్యాన్ని ఇచ్చి, శుభవార్తను అందజేసేవానిగా, హెచ్చరించేవానిగా చేసి పంపాము. హెచ్చరించేవాడు గడచి ఉండని సమాజం అంటూ ఏదీ లేదు.
35:25 وَإِن يُكَذِّبُوكَ فَقَدْ كَذَّبَ الَّذِينَ مِن قَبْلِهِمْ جَاءَتْهُمْ رُسُلُهُم بِالْبَيِّنَاتِ وَبِالزُّبُرِ وَبِالْكِتَابِ الْمُنِيرِ
ఒకవేళ వీళ్ళు నిన్ను ధిక్కరించినట్లయితే, వీరికి మునుపు గతించిన వారు కూడా ధిక్కరించినవారే. వారి దగ్గరకు కూడా వారి ప్రవక్తలు మహిమలను, ప్రతుల (సహీఫాల)ను, ప్రకాశమానమైన గ్రంథాలను తీసుకువచ్చారు.
35:26 ثُمَّ أَخَذْتُ الَّذِينَ كَفَرُوا ۖ فَكَيْفَ كَانَ نَكِيرِ
ఆ తరువాత నేను అవిశ్వాసులను పట్టుకున్నాను. మరి నా ఝుళిపింపు ఎలా ఉందో (చూశారుగా)!
35:27 أَلَمْ تَرَ أَنَّ اللَّهَ أَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَأَخْرَجْنَا بِهِ ثَمَرَاتٍ مُّخْتَلِفًا أَلْوَانُهَا ۚ وَمِنَ الْجِبَالِ جُدَدٌ بِيضٌ وَحُمْرٌ مُّخْتَلِفٌ أَلْوَانُهَا وَغَرَابِيبُ سُودٌ
అల్లాహ్ ఆకాశం నుంచి వర్షం కురిపించటాన్ని నువ్వు చూడలేదా? మరి దాని ద్వారా మేము పలు రంగుల పండ్లను ఉత్పన్నం చేశాము. మరి పర్వతాలలో కూడా పలు భాగాలు ఉన్నాయి- తెల్లనివి, ఎర్రనివి. వాటి రంగులు కూడా వేర్వేరుగా ఉన్నాయి. చాలా నల్లనివి కూడా ఉన్నాయి.
35:28 وَمِنَ النَّاسِ وَالدَّوَابِّ وَالْأَنْعَامِ مُخْتَلِفٌ أَلْوَانُهُ كَذَٰلِكَ ۗ إِنَّمَا يَخْشَى اللَّهَ مِنْ عِبَادِهِ الْعُلَمَاءُ ۗ إِنَّ اللَّهَ عَزِيزٌ غَفُورٌ
అలాగే మనుషులలో, జంతువులలో, పశువులలో కూడా పలు రంగులు గలవి ఉన్నాయి. అల్లాహ్ దాసులలో జ్ఞాన సంపన్నులు మాత్రమే ఆయనకు భయపడతారు. నిశ్చయంగా అల్లాహ్ సర్వాధిక్యుడు, క్షమాశీలి.
35:29 إِنَّ الَّذِينَ يَتْلُونَ كِتَابَ اللَّهِ وَأَقَامُوا الصَّلَاةَ وَأَنفَقُوا مِمَّا رَزَقْنَاهُمْ سِرًّا وَعَلَانِيَةً يَرْجُونَ تِجَارَةً لَّن تَبُورَ
దైవగ్రంథాన్ని పఠిస్తూ నమాజును నెలకొల్పేవారు, మేము ప్రసాదించిన దానిలో నుంచి గోప్యంగానూ, బహిరంగంగానూ ఖర్చు చేసేవారు ఎన్నటికీ నష్టం కలుగని వర్తకాన్ని ఆశిస్తున్నారు.
35:30 لِيُوَفِّيَهُمْ أُجُورَهُمْ وَيَزِيدَهُم مِّن فَضْلِهِ ۚ إِنَّهُ غَفُورٌ شَكُورٌ
వారికి వారి ప్రతిఫలాలు (అల్లాహ్) పూర్తిగా ఇవ్వటానికి, తన కృపతో ఆయన వారికి మరింతగా ప్రసాదించటానికిగాను (వారు ఈ విధానాన్ని అవలంబిస్తున్నారు). నిశ్చయంగా ఆయన అమితంగా క్షమించేవాడు, సన్మానించేవాడు.
35:31 وَالَّذِي أَوْحَيْنَا إِلَيْكَ مِنَ الْكِتَابِ هُوَ الْحَقُّ مُصَدِّقًا لِّمَا بَيْنَ يَدَيْهِ ۗ إِنَّ اللَّهَ بِعِبَادِهِ لَخَبِيرٌ بَصِيرٌ
(ఓ ప్రవక్తా!) మేము ‘వహీ’ రూపంలో నీ వద్దకు పంపిన ఈ గ్రంథం సత్యమైంది, తనకు పూర్వం వచ్చిన గ్రంథాలను ధృవపరిచేది. నిస్సందేహంగా అల్లాహ్ తన దాసుల స్థితిగతులన్నీ తెలిసినవాడు, అన్నీ చూసేవాడు.
35:32 ثُمَّ أَوْرَثْنَا الْكِتَابَ الَّذِينَ اصْطَفَيْنَا مِنْ عِبَادِنَا ۖ فَمِنْهُمْ ظَالِمٌ لِّنَفْسِهِ وَمِنْهُم مُّقْتَصِدٌ وَمِنْهُمْ سَابِقٌ بِالْخَيْرَاتِ بِإِذْنِ اللَّهِ ۚ ذَٰلِكَ هُوَ الْفَضْلُ الْكَبِيرُ
తరువాత మా దాసులలో మేము ఎన్నుకున్న వారిని (ఈ) గ్రంథానికి వారసులుగా చేశాము. మరి వారిలో కొందరు తమ ఆత్మలపై అన్యాయానికి ఒడిగడుతున్నారు. వారిలో మరి కొందరు మధ్య రకానికి చెందినవారు. వారిలో ఇంకొందరు అల్లాహ్ అనుమతితో సత్కార్యాలలో ముందంజ వేస్తున్నారు. ఇది మహదనుగ్రహం.
35:33 جَنَّاتُ عَدْنٍ يَدْخُلُونَهَا يُحَلَّوْنَ فِيهَا مِنْ أَسَاوِرَ مِن ذَهَبٍ وَلُؤْلُؤًا ۖ وَلِبَاسُهُمْ فِيهَا حَرِيرٌ
(వారి కోసం) కలకాలం నిలిచే స్వర్గ వనాలున్నాయి. వాటిలో వారు ప్రవేశిస్తారు. అక్కడ వారు స్వర్ణకంకణాలతో, ముత్యాలతో ముస్తాబు అవుతారు. వారు ధరించే వస్త్రాలు పట్టు వస్త్రాలై ఉంటాయి.
35:34 وَقَالُوا الْحَمْدُ لِلَّهِ الَّذِي أَذْهَبَ عَنَّا الْحَزَنَ ۖ إِنَّ رَبَّنَا لَغَفُورٌ شَكُورٌ
వారిలా అంటారు: ‘మా నుంచి దుఃఖాన్ని దూరం చేసిన అల్లాహ్‌కు (శతకోటి) కృతజ్ఞతలు. నిశ్చయంగా మా ప్రభువు అమితంగా క్షమించేవాడు, సత్కార స్వభావుడు.
35:35 الَّذِي أَحَلَّنَا دَارَ الْمُقَامَةِ مِن فَضْلِهِ لَا يَمَسُّنَا فِيهَا نَصَبٌ وَلَا يَمَسُّنَا فِيهَا لُغُوبٌ
“ఆయన తన కృపతో నిత్యం ఉండే నెలవులో మమ్మల్ని దించాడు. అందులో మాకు బాధగానీ, అలసటగానీ ఉండట్లేదు.”
35:36 وَالَّذِينَ كَفَرُوا لَهُمْ نَارُ جَهَنَّمَ لَا يُقْضَىٰ عَلَيْهِمْ فَيَمُوتُوا وَلَا يُخَفَّفُ عَنْهُم مِّنْ عَذَابِهَا ۚ كَذَٰلِكَ نَجْزِي كُلَّ كَفُورٍ
మరి తిరస్కార వైఖరికి పాల్పడిన వారికోసం నరకాగ్ని ఉన్నది. వారు చావటానికి తీర్మానించటంగానీ, వారి నరక శిక్షను తగ్గించటంగాని జరగదు. మేలును మరచిన వారందరికీ మేము ఇలాంటి ప్రతిఫలమే ఇస్తాము.
35:37 وَهُمْ يَصْطَرِخُونَ فِيهَا رَبَّنَا أَخْرِجْنَا نَعْمَلْ صَالِحًا غَيْرَ الَّذِي كُنَّا نَعْمَلُ ۚ أَوَلَمْ نُعَمِّرْكُم مَّا يَتَذَكَّرُ فِيهِ مَن تَذَكَّرَ وَجَاءَكُمُ النَّذِيرُ ۖ فَذُوقُوا فَمَا لِلظَّالِمِينَ مِن نَّصِيرٍ
అందులో వారిలా ఘోషిస్తారు: “ప్రభూ! మమ్మల్ని బయటికి తియ్యి. మేము ఇప్పటిదాకా చేసిన పనులకు భిన్నంగా మంచి పనులు చేస్తాము.” (సమాధానంగా అల్లాహ్ ఇలా అంటాడు): “అర్థం చేసుకునేవానికి అర్థం చేసుకోగలిగేంత వయస్సును మేము మీకు ఇవ్వలేదా? హెచ్చరించేవాడు సయితం మీ వద్దకు వచ్చాడు – కనుక (శిక్షను) చవిచూడండి. (ఇలాంటి) దుర్మార్గులను ఆదుకునే వాడెవడూ లేడు.”
35:38 إِنَّ اللَّهَ عَالِمُ غَيْبِ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ إِنَّهُ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ
నిశ్చయంగా అల్లాహ్ ఆకాశాలలో, భూమిలో ఉన్న రహస్యాలను ఎరిగినవాడు. నిశ్చయంగా గుండెల్లోని గుట్టును సయితం ఆయన ఎరిగినవాడు.
35:39 هُوَ الَّذِي جَعَلَكُمْ خَلَائِفَ فِي الْأَرْضِ ۚ فَمَن كَفَرَ فَعَلَيْهِ كُفْرُهُ ۖ وَلَا يَزِيدُ الْكَافِرِينَ كُفْرُهُمْ عِندَ رَبِّهِمْ إِلَّا مَقْتًا ۖ وَلَا يَزِيدُ الْكَافِرِينَ كُفْرُهُمْ إِلَّا خَسَارًا
మిమ్మల్ని భూమిలో ప్రతినిధులుగా చేసినవాడు ఆయనే. కాబట్టి ఇక ఎవరయినా తిరస్కార వైఖరికి పాల్పడితే అతని తిరస్కార పాపం అతని మీదే పడుతుంది. తిరస్కారుల తిరస్కార వైఖరి వారి ప్రభువు సన్నిధిలో అయిష్టతను (ఆగ్రహాన్ని) మాత్రమే పెంచుతుంది. ఇంకా తిరస్కారుల కొరకు వారి తిరస్కార వైఖరి నష్టాన్ని మాత్రమే వృద్ధిచేస్తుంది.
35:40 قُلْ أَرَأَيْتُمْ شُرَكَاءَكُمُ الَّذِينَ تَدْعُونَ مِن دُونِ اللَّهِ أَرُونِي مَاذَا خَلَقُوا مِنَ الْأَرْضِ أَمْ لَهُمْ شِرْكٌ فِي السَّمَاوَاتِ أَمْ آتَيْنَاهُمْ كِتَابًا فَهُمْ عَلَىٰ بَيِّنَتٍ مِّنْهُ ۚ بَلْ إِن يَعِدُ الظَّالِمُونَ بَعْضُهُم بَعْضًا إِلَّا غُرُورًا
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : అల్లాహ్‌ను వదలి మీరు మొరపెట్టుకుంటున్న మీ కల్పిత భాగస్వాముల సంగతిని కాస్త తెలియజేస్తారా?! వారు భూమిలో సృష్టించిందేమిటో నాకు చూపండి. లేక ఆకాశాలలో వారికేదైనా భాగస్వామ్యం ఉన్నదా? పోనీ వారికి మేమేదైనా పుస్తకం ఇచ్చామా, దాని ప్రమాణానికి వారు కట్టుబడి ఉన్నారనటానికి!? లేదు. వాస్తవానికి ఈ దుర్మార్గులు ఒండొకరికి మోసపూరితమైన వాగ్దానాలు చేస్తూవస్తున్నారు.
35:41 إِنَّ اللَّهَ يُمْسِكُ السَّمَاوَاتِ وَالْأَرْضَ أَن تَزُولَا ۚ وَلَئِن زَالَتَا إِنْ أَمْسَكَهُمَا مِنْ أَحَدٍ مِّن بَعْدِهِ ۚ إِنَّهُ كَانَ حَلِيمًا غَفُورًا
యదార్థానికి అల్లాహ్ ఆకాశాలను, భూమిని వాటి స్థానాల నుంచి తొలగిపోకుండా నిలిపి ఉంచాడు. అవి గనక తమ స్థానాల నుంచి తొలగిపోతే అల్లాహ్ తప్ప వాటిని నిలిపి ఉంచేవాడు కూడా ఎవడూ లేడు. నిశ్చయంగా ఆయన సహనశీలి, క్షమాశీలి.
35:42 وَأَقْسَمُوا بِاللَّهِ جَهْدَ أَيْمَانِهِمْ لَئِن جَاءَهُمْ نَذِيرٌ لَّيَكُونُنَّ أَهْدَىٰ مِنْ إِحْدَى الْأُمَمِ ۖ فَلَمَّا جَاءَهُمْ نَذِيرٌ مَّا زَادَهُمْ إِلَّا نُفُورًا
తమ వద్దకే గనక హెచ్చరించేవాడెవడయినా వస్తే, వేరితర సమాజాల కన్నా ఎక్కువగా తామే సన్మార్గాన్ని అవలంబిస్తామని ఈ అవిశ్వాసులు పెద్ద పెద్ద ప్రమాణాలు చేసి మరీ చెప్పేవారు. కాని తీరా హెచ్చరించేవాడు (ప్రవక్త) వారి వద్దకు వచ్చాక, వారిలో విద్వేషం మాత్రమే మరింత పెచ్చరిల్లింది.
35:43 اسْتِكْبَارًا فِي الْأَرْضِ وَمَكْرَ السَّيِّئِ ۚ وَلَا يَحِيقُ الْمَكْرُ السَّيِّئُ إِلَّا بِأَهْلِهِ ۚ فَهَلْ يَنظُرُونَ إِلَّا سُنَّتَ الْأَوَّلِينَ ۚ فَلَن تَجِدَ لِسُنَّتِ اللَّهِ تَبْدِيلًا ۖ وَلَن تَجِدَ لِسُنَّتِ اللَّهِ تَحْوِيلًا
లోకంలో తమంతటి వారు లేరనే గర్వాహంకారం మూలంగానూ, వారి దుష్టపన్నాగాల కారణంగానూ (వారిలో ఈ నకారాత్మక భావం జనించింది). అయితే దుష్ట పన్నాగాల కీడు ఆ పన్నాగాలను పన్నేవారి మీదే పడుతుంది. తమ పూర్వీకుల పట్ల అవలంబించబడుతూ వచ్చిన విధానమే తమపట్ల కూడా అవలంబించబడాలని వారు ఎదురు చూస్తున్నారా? మరయితే నువ్వు అల్లాహ్ విధానంలో ఎలాంటి మార్పునూ చూడలేవు. అల్లాహ్ విధానం (తన దిశ నుంచి) మరలి పోవటాన్ని కూడా నువ్వు చూడలేవు.
35:44 أَوَلَمْ يَسِيرُوا فِي الْأَرْضِ فَيَنظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الَّذِينَ مِن قَبْلِهِمْ وَكَانُوا أَشَدَّ مِنْهُمْ قُوَّةً ۚ وَمَا كَانَ اللَّهُ لِيُعْجِزَهُ مِن شَيْءٍ فِي السَّمَاوَاتِ وَلَا فِي الْأَرْضِ ۚ إِنَّهُ كَانَ عَلِيمًا قَدِيرًا
ఏమిటీ, వారు భువిలో సంచరించి, తమకు పూర్వం గడచిన వారికి పట్టిన గతేమిటో చూడలేదా? మరి చూడబోతే వారు బలపరాక్రమంలో వీరికన్నా గట్టివారే. ఆకాశాలలోగానీ, భూమిలో గానీ ఉన్న ఏ వస్తువూ అల్లాహ్‌ను లొంగదీసుకోజాలదు. ఆయన ప్రతిదీ తెలిసినవాడు, ప్రతిదీ చేయగలవాడు.
35:45 وَلَوْ يُؤَاخِذُ اللَّهُ النَّاسَ بِمَا كَسَبُوا مَا تَرَكَ عَلَىٰ ظَهْرِهَا مِن دَابَّةٍ وَلَٰكِن يُؤَخِّرُهُمْ إِلَىٰ أَجَلٍ مُّسَمًّى ۖ فَإِذَا جَاءَ أَجَلُهُمْ فَإِنَّ اللَّهَ كَانَ بِعِبَادِهِ بَصِيرًا
అల్లాహ్‌యే గనక జనుల చేష్టల ఆధారంగా వారిని పట్టుకోవటం మొదలెడితే భూమండలంపైన ఏ జీవినీ వదలిపెట్టడు. అయితే అల్లాహ్ వారికి ఒక నిర్ణీత గడువు వరకు విడుపును ఇస్తున్నాడు. మరి ఆ గడువు ముగియగానే అల్లాహ్ స్వయంగా తన దాసుల (సంగతి)ని చూసుకుంటాడు. - సూరా యాసీన్
36:1 يس
యా-సీన్.
36:2 وَالْقُرْآنِ الْحَكِيمِ
వివేకంతో నిండిన ఖుర్ఆన్ సాక్షిగా!
36:3 إِنَّكَ لَمِنَ الْمُرْسَلِينَ
(ఓ ముహమ్మద్!) నిశ్చయంగా నువ్వు సందేశహరులలోని వాడవు.
36:4 عَلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ
రుజుమార్గాన ఉన్నవాడవు.
36:5 تَنزِيلَ الْعَزِيزِ الرَّحِيمِ
సర్వాధిక్యుడు, కృపాకరుడు (అయిన అల్లాహ్) తరఫున ఇది (ఈ ఖుర్ఆన్ గ్రంథం) అవతరింపజేయబడింది.
36:6 لِتُنذِرَ قَوْمًا مَّا أُنذِرَ آبَاؤُهُمْ فَهُمْ غَافِلُونَ
ఎవరి తాతముత్తాతలు మునుపు హెచ్చరించబడలేదో ఆ జనులను నువ్వు హెచ్చరించటానికి (ప్రవక్తగా పంపబడ్డావు) – అందువల్లనే వారు పరధ్యానానికి లోనై ఉన్నారు.
36:7 لَقَدْ حَقَّ الْقَوْلُ عَلَىٰ أَكْثَرِهِمْ فَهُمْ لَا يُؤْمِنُونَ
వారిలో చాలా మందికి వ్యతిరేకంగా (శిక్ష విధించాలన్న) మాట ఖరారై పోయింది. ఇక వారు విశ్వసించేవారు కారు.
36:8 إِنَّا جَعَلْنَا فِي أَعْنَاقِهِمْ أَغْلَالًا فَهِيَ إِلَى الْأَذْقَانِ فَهُم مُّقْمَحُونَ
మేము వారి మెడలలో (ఇనుప) పట్టాలు వేసేశాము. అవి వారి చుబుకముల వరకూ (ఆక్రమించి) ఉన్నాయి. అందుచేత వారి తలలు పై వైపుకే తిరిగిపోయాయి.
36:9 وَجَعَلْنَا مِن بَيْنِ أَيْدِيهِمْ سَدًّا وَمِنْ خَلْفِهِمْ سَدًّا فَأَغْشَيْنَاهُمْ فَهُمْ لَا يُبْصِرُونَ
మేము వారి ముందు ఒక అడ్డును, వారి వెనుక మరో అడ్డును పెట్టాము. ఆ విధంగా మేము వారిని కప్పివేశాము. తత్కారణంగా వారు చూడలేరు.
36:10 وَسَوَاءٌ عَلَيْهِمْ أَأَنذَرْتَهُمْ أَمْ لَمْ تُنذِرْهُمْ لَا يُؤْمِنُونَ
కాబట్టి నువ్వు వారిని హెచ్చరించినా, హెచ్చరించకపోయినా ఒక్కటే. వారు విశ్వసించరు.
36:11 إِنَّمَا تُنذِرُ مَنِ اتَّبَعَ الذِّكْرَ وَخَشِيَ الرَّحْمَٰنَ بِالْغَيْبِ ۖ فَبَشِّرْهُ بِمَغْفِرَةٍ وَأَجْرٍ كَرِيمٍ
హితబోధను అనుసరిస్తూ, చూడకపోయినా కరుణామయునికి (అల్లాహ్‌కు) భయపడే వ్యక్తిని మాత్రమే నువ్వు హెచ్చరించగలవు. కాబట్టి అలాంటి వ్యక్తికి నువ్వు క్షమాభిక్ష, గౌరవప్రదమైన ప్రతిఫలం గురించిన శుభవార్తను వినిపించు.
36:12 إِنَّا نَحْنُ نُحْيِي الْمَوْتَىٰ وَنَكْتُبُ مَا قَدَّمُوا وَآثَارَهُمْ ۚ وَكُلَّ شَيْءٍ أَحْصَيْنَاهُ فِي إِمَامٍ مُّبِينٍ
నిశ్చయంగా మేము మృతులను బ్రతికిస్తాము. జనులు ముందుగా చేసి పంపుకున్న దానినీ, వారు వెనుక వదలివెళ్ళిన కర్మలను కూడా మేము వ్రాస్తూ పోతున్నాము. ఇంకా మేము ప్రతి విషయాన్నీ స్పష్టమైన ఒక గ్రంథంలో నమోదు చేసి పెట్టాము.
36:13 وَاضْرِبْ لَهُم مَّثَلًا أَصْحَابَ الْقَرْيَةِ إِذْ جَاءَهَا الْمُرْسَلُونَ
ఉదాహరణగా (నీవు) వారికి ఒక పట్టణవాసుల వద్దకు (అనేక మంది) ప్రవక్తలు వచ్చినప్పుడు జరిగిన దానిని వివరించు.
36:14 إِذْ أَرْسَلْنَا إِلَيْهِمُ اثْنَيْنِ فَكَذَّبُوهُمَا فَعَزَّزْنَا بِثَالِثٍ فَقَالُوا إِنَّا إِلَيْكُم مُّرْسَلُونَ
మేము వారి వద్దకు ఇద్దరిని (అంటే ఇద్దరు ప్రవక్తలను) పంపగా (మొదట) ఆ ఇద్దరినీ వారు ధిక్కరించారు. మరి వారికి (ఆ ఇద్దరికి) అండగా మేము మూడవ వానిని పంపగా, “మేము మీ దగ్గరకు ప్రవక్తలుగా పంపబడ్డాము” అని వారు (ఆ పట్టణ ప్రజలతో) అన్నారు.
36:15 قَالُوا مَا أَنتُمْ إِلَّا بَشَرٌ مِّثْلُنَا وَمَا أَنزَلَ الرَّحْمَٰنُ مِن شَيْءٍ إِنْ أَنتُمْ إِلَّا تَكْذِبُونَ
దానికి వారు “మీరు కూడా మాలాంటి మానవమాత్రులే. కరుణామయుడు అసలు దేనినీ అవతరింపజేయలేదు. మీరు చెప్పేదంతా పచ్చి అబద్ధం” అని సమాధానమిచ్చారు.
36:16 قَالُوا رَبُّنَا يَعْلَمُ إِنَّا إِلَيْكُمْ لَمُرْسَلُونَ
ప్రవక్తలు ఇలా అన్నారు : “మేము నిశ్చయంగా మీ వద్దకు ప్రవక్తలుగా పంపబడ్డామన్న సంగతి మా ప్రభువుకు తెలుసు.
36:17 وَمَا عَلَيْنَا إِلَّا الْبَلَاغُ الْمُبِينُ
“స్పష్టంగా విషయాన్ని అందజేయటం వరకే మా కర్తవ్యం.”
36:18 قَالُوا إِنَّا تَطَيَّرْنَا بِكُمْ ۖ لَئِن لَّمْ تَنتَهُوا لَنَرْجُمَنَّكُمْ وَلَيَمَسَّنَّكُم مِّنَّا عَذَابٌ أَلِيمٌ
దానికి వారు, “మేము మిమ్మల్ని దరిద్ర సూచకంగా భావిస్తున్నాము. మీరు గనక (ఈ పనిని) మానుకోకపోతే, మేము మిమ్మల్ని రాళ్లతో కొట్టి చంపేస్తాము. మా తరఫున మీకు బాధాకరమైన శిక్ష అంటుకుంటుంది” అని చెప్పారు.
36:19 قَالُوا طَائِرُكُم مَّعَكُمْ ۚ أَئِن ذُكِّرْتُم ۚ بَلْ أَنتُمْ قَوْمٌ مُّسْرِفُونَ
అప్పుడు ప్రవక్తలు ఇలా అన్నారు : “మీ దరిద్రమంతా మీ వెంటే ఉంది, ఏమిటీ, మీకు చేసే ఉపదేశాన్ని మీరు దరిద్రంగా తలపోస్తున్నారా? అసలు విషయం అదికాదు. మీరసలు బరితెగించి పోయారు.”
36:20 وَجَاءَ مِنْ أَقْصَى الْمَدِينَةِ رَجُلٌ يَسْعَىٰ قَالَ يَا قَوْمِ اتَّبِعُوا الْمُرْسَلِينَ
(అంతలోనే ఆ) నగరం చివరి వైపు నుంచి ఒక వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి ఇలా అన్నాడు : “ఓ నా జాతివారలారా! మీరు ప్రవక్తలను అనుసరించండి.
36:21 اتَّبِعُوا مَن لَّا يَسْأَلُكُمْ أَجْرًا وَهُم مُّهْتَدُونَ
“మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్నీ అడగని వారి, సన్మార్గాన ఉన్న వారి వెనుక నడవండి.”
36:22 وَمَا لِيَ لَا أَعْبُدُ الَّذِي فَطَرَنِي وَإِلَيْهِ تُرْجَعُونَ
“నన్ను పుట్టించిన వానిని నేను ఆరాధించకుండా ఉండటం ఎంతవరకు సమంజసం? మరి (నిజానికి) మీరంతా ఆయన వైపు మరలించబడేవారే.
36:23 أَأَتَّخِذُ مِن دُونِهِ آلِهَةً إِن يُرِدْنِ الرَّحْمَٰنُ بِضُرٍّ لَّا تُغْنِ عَنِّي شَفَاعَتُهُمْ شَيْئًا وَلَا يُنقِذُونِ
“అట్టి (నిజ) దైవాన్ని వదిలేసి నేను ఇతరులను ఆరాధ్యులుగా ఆశ్రయించాలా? ఒకవేళ కరుణామయుడు (అయిన అల్లాహ్) నాకేదైనా నష్టం కలిగించదలిస్తే వారి సిఫారసు నాకెలాంటి లాభమూ చేకూర్చదు. వారు నన్ను కాపాడనూ లేరు.
36:24 إِنِّي إِذًا لَّفِي ضَلَالٍ مُّبِينٍ
“మరి నేను స్పష్టమైన దుర్మార్గంలో పడిపోతాను.
36:25 إِنِّي آمَنتُ بِرَبِّكُمْ فَاسْمَعُونِ
“అందుకే నేను చెప్పేది వినండి! నేను మటుకు మీరందరి (ఏకైక) ప్రభువును విశ్వసించాను.”
36:26 قِيلَ ادْخُلِ الْجَنَّةَ ۖ قَالَ يَا لَيْتَ قَوْمِي يَعْلَمُونَ
“స్వర్గంలో చేరిపో” అని (అతనితో) అనబడింది. “నా జాతి వారికి ఇది తెలిస్తే ఎంత బావుండేది!” అని అతనన్నాడు.
36:27 بِمَا غَفَرَ لِي رَبِّي وَجَعَلَنِي مِنَ الْمُكْرَمِينَ
“నా ప్రభువు నన్ను క్షమించి, ఆదరణీయులలో నన్ను చేర్చిన సంగతి.”
36:28 وَمَا أَنزَلْنَا عَلَىٰ قَوْمِهِ مِن بَعْدِهِ مِن جُندٍ مِّنَ السَّمَاءِ وَمَا كُنَّا مُنزِلِينَ
అతని తరువాత మేము అతని జాతి వారిపై ఆకాశం నుంచి ఏ సైనిక దళాన్నీ దింపలేదు. దాని అవసరం మాకు లేదు కూడా.
36:29 إِن كَانَتْ إِلَّا صَيْحَةً وَاحِدَةً فَإِذَا هُمْ خَامِدُونَ
అది (ఆ శిక్ష) ఒకే ఒక్క కేక మాత్రమే! అంతే. వారంతా (ఆ దెబ్బకు) ఆరిపోయారు.
36:30 يَا حَسْرَةً عَلَى الْعِبَادِ ۚ مَا يَأْتِيهِم مِّن رَّسُولٍ إِلَّا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ
(అలాంటి) దాసుల పరిస్థితి కడు శోచనీయం! తమ వద్దకు ఎప్పుడు, ఏ ప్రవక్త వచ్చినా వారతన్ని పరిహసించకుండా ఉండలేదు.
36:31 أَلَمْ يَرَوْا كَمْ أَهْلَكْنَا قَبْلَهُم مِّنَ الْقُرُونِ أَنَّهُمْ إِلَيْهِمْ لَا يَرْجِعُونَ
వారికి పూర్వం ఎన్నో సముదాయాలను మేము తుదముట్టించటాన్ని వారు చూడలేదా? వారెన్నటికీ వారిదగ్గరకు తిరిగిరారు.
36:32 وَإِن كُلٌّ لَّمَّا جَمِيعٌ لَّدَيْنَا مُحْضَرُونَ
అయితే ఎట్టకేలకు వారంతా సమీకరించబడి (తీర్పు నిమిత్తం) మా ముందు హాజరు పరచబడతారు.
36:33 وَآيَةٌ لَّهُمُ الْأَرْضُ الْمَيْتَةُ أَحْيَيْنَاهَا وَأَخْرَجْنَا مِنْهَا حَبًّا فَمِنْهُ يَأْكُلُونَ
మరి వారి కోసం మృతభూమి కూడా ఒక సూచనే. దాన్ని మేము బ్రతికించాము. దాన్నుంచి ఆహార ధాన్యాన్ని ఉత్పత్తి చేశాము. దాన్నుంచి వారు భుజిస్తున్నారు.
36:34 وَجَعَلْنَا فِيهَا جَنَّاتٍ مِّن نَّخِيلٍ وَأَعْنَابٍ وَفَجَّرْنَا فِيهَا مِنَ الْعُيُونِ
ఇంకా మేము అందులో ఖర్జూరం, ద్రాక్షతోటలను (ఉత్పన్నం) చేశాము. వాటిలో ఊటలను ప్రవహింపజేశాము.
36:35 لِيَأْكُلُوا مِن ثَمَرِهِ وَمَا عَمِلَتْهُ أَيْدِيهِمْ ۖ أَفَلَا يَشْكُرُونَ
దాని ఫలాలను (ప్రజలు) తినేందుకు! వారి చేతులైతే దాన్ని నిర్మించలేదు. మరలాంటప్పుడు వారు కృతజ్ఞులుగా ఎందుకు వ్యవహరించరు?
36:36 سُبْحَانَ الَّذِي خَلَقَ الْأَزْوَاجَ كُلَّهَا مِمَّا تُنبِتُ الْأَرْضُ وَمِنْ أَنفُسِهِمْ وَمِمَّا لَا يَعْلَمُونَ
భూమి నుండి ఉత్పన్నం అయిన వస్తువులలోనైనా, మరి స్వయంగా వారిలోనే (మనుషులలోనే) అయినా, వారికి తెలియని వాటిలోనైనా – వాటన్నింటి జతలను సృష్టించినవాడు పరమ పవిత్రుడు.
36:37 وَآيَةٌ لَّهُمُ اللَّيْلُ نَسْلَخُ مِنْهُ النَّهَارَ فَإِذَا هُم مُّظْلِمُونَ
వారి కొరకు రాత్రి కూడా ఒక సూచనే. దాన్నుంచి మేము పగటిని లాగివేస్తాము. దాంతో వారు చీకటిలో ఉండిపోతారు.
36:38 وَالشَّمْسُ تَجْرِي لِمُسْتَقَرٍّ لَّهَا ۚ ذَٰلِكَ تَقْدِيرُ الْعَزِيزِ الْعَلِيمِ
సూర్యుడు తన కోసం నిర్ధారించబడిన కక్ష్యలోనే పయనిస్తున్నాడు. ఇది సర్వాధిక్యుడు, సర్వజ్ఞుడు అయిన అల్లాహ్ నిర్ధారించిన విధానం.
36:39 وَالْقَمَرَ قَدَّرْنَاهُ مَنَازِلَ حَتَّىٰ عَادَ كَالْعُرْجُونِ الْقَدِيمِ
మరి చంద్రుని మజిలీలను కూడా మేము నిర్ధారించాము. తుదకు అది (వాడిపోయిన ఖర్జూరపు) పాత మండలా తయారవుతుంది.
36:40 لَا الشَّمْسُ يَنبَغِي لَهَا أَن تُدْرِكَ الْقَمَرَ وَلَا اللَّيْلُ سَابِقُ النَّهَارِ ۚ وَكُلٌّ فِي فَلَكٍ يَسْبَحُونَ
చంద్రుణ్ణి పట్టుకోవటం సూర్యుని తరంకాదు. పగటిని మించిపోవటం రాత్రి వల్ల కాదు. అవన్నీ (తమ తమ నిర్ధారిత) కక్ష్యల్లో తేలియాడుతున్నాయి.
36:41 وَآيَةٌ لَّهُمْ أَنَّا حَمَلْنَا ذُرِّيَّتَهُمْ فِي الْفُلْكِ الْمَشْحُونِ
మరి మేము వారి సంతతిని నిండు నౌకలో ఎక్కించటం కూడా వారి కొరకు ఒక సూచనే.
36:42 وَخَلَقْنَا لَهُم مِّن مِّثْلِهِ مَا يَرْكَبُونَ
ఇంకా వారి కోసం దాని (నౌక) లాంటివే మరికొన్ని వస్తువులను కూడా సృష్టించాము. వాటిపై వారు ప్రయాణం చేస్తున్నారు.
36:43 وَإِن نَّشَأْ نُغْرِقْهُمْ فَلَا صَرِيخَ لَهُمْ وَلَا هُمْ يُنقَذُونَ
మరి మేము గనక తలచుకుంటే వాటిని ముంచివేయగలం. అప్పుడు వారి ఫిర్యాదును వినేవారుగానీ, వారిని రక్షించేవారు గానీ ఎవరూ ఉండరు.
36:44 إِلَّا رَحْمَةً مِّنَّا وَمَتَاعًا إِلَىٰ حِينٍ
కాని మేము మా తరఫున దయదలచి, ఓ నిర్ణీత కాలం వరకు వారికి లబ్దిని చేకూరుస్తున్నాము.
36:45 وَإِذَا قِيلَ لَهُمُ اتَّقُوا مَا بَيْنَ أَيْدِيكُمْ وَمَا خَلْفَكُمْ لَعَلَّكُمْ تُرْحَمُونَ
“మీరు ముందు ఎదుర్కోబోతున్న పరిణామానికి, మీరు మీ వెనుక వదలిపోయే వాటికి (పాపకార్యాలకు) భయపడండి, – మీరు కరుణించబడతారు” అని వారికి ఎప్పుడు నచ్చచెప్పినా (వారు లక్ష్యపెట్టరు).
36:46 وَمَا تَأْتِيهِم مِّنْ آيَةٍ مِّنْ آيَاتِ رَبِّهِمْ إِلَّا كَانُوا عَنْهَا مُعْرِضِينَ
తమ వద్దకు వచ్చిన ప్రభువు సూచనలలో, వారు విముఖత చూపకుండా ఉన్న సూచన అంటూ ఏదీ లేదు.
36:47 وَإِذَا قِيلَ لَهُمْ أَنفِقُوا مِمَّا رَزَقَكُمُ اللَّهُ قَالَ الَّذِينَ كَفَرُوا لِلَّذِينَ آمَنُوا أَنُطْعِمُ مَن لَّوْ يَشَاءُ اللَّهُ أَطْعَمَهُ إِنْ أَنتُمْ إِلَّا فِي ضَلَالٍ مُّبِينٍ
“అల్లాహ్ ప్రసాదించిన దానిలో నుంచి కొంత ఖర్చు చేయండి” అని వారితో అన్నప్పుడల్లా, ఈ తిరస్కారులు విశ్వాసులతో, “మేము వారికి ఎందుకు తినిపించాలి? అల్లాహ్ తలిస్తే ఆయన స్వయంగా వారికి అన్నం పెట్టేవాడు. ఎటొచ్చీ మీరే స్పష్టమైన అపమార్గంలో పడి ఉన్నారు” అని సమాధానమిస్తారు.
36:48 وَيَقُولُونَ مَتَىٰ هَٰذَا الْوَعْدُ إِن كُنتُمْ صَادِقِينَ
“మీరు సత్యవంతులే అయితే ఆ (ప్రళయ) వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుందో చెప్పండి” అని వారంటున్నారు.
36:49 مَا يَنظُرُونَ إِلَّا صَيْحَةً وَاحِدَةً تَأْخُذُهُمْ وَهُمْ يَخِصِّمُونَ
వారు దేనికోసం ఎదురు చూస్తున్నారో అది ఒకే ఒక (భయంకరమైన) కేక మాత్రమే. అది వారిని అమాంతం కబళిస్తుంది. అప్పుడు వారేమో పరస్పరం విభేదించుకుంటూ ఉంటారు.
36:50 فَلَا يَسْتَطِيعُونَ تَوْصِيَةً وَلَا إِلَىٰ أَهْلِهِمْ يَرْجِعُونَ
ఆ ఘడియలో వారు వీలునామా వ్రాయటంగానీ, తమ ఇంటివారి వద్దకు మరలిరావటంగానీ చేయలేరు.
36:51 وَنُفِخَ فِي الصُّورِ فَإِذَا هُم مِّنَ الْأَجْدَاثِ إِلَىٰ رَبِّهِمْ يَنسِلُونَ
మరి శంఖం పూరించబడగానే అందరూ తమ తమ గోరీల నుంచి లేచి, తమ ప్రభువు వైపునకు వడివడిగా వస్తారు.
36:52 قَالُوا يَا وَيْلَنَا مَن بَعَثَنَا مِن مَّرْقَدِنَا ۜ ۗ هَٰذَا مَا وَعَدَ الرَّحْمَٰنُ وَصَدَقَ الْمُرْسَلُونَ
“అయ్యో మా దౌర్భాగ్యం! మమ్మల్ని మా శయనాగారాల నుంచి లేపినదెవరు?” అని వారు వాపోతారు. “కరుణామయుడు (అయిన అల్లాహ్) చేసిన వాగ్దానమిదే. ప్రవక్తలు చెప్పింది నిజం” (అని వారితో అనబడుతుంది).
36:53 إِن كَانَتْ إِلَّا صَيْحَةً وَاحِدَةً فَإِذَا هُمْ جَمِيعٌ لَّدَيْنَا مُحْضَرُونَ
అది ఒకే ఒక (భయంకర) అరుపు తప్ప మరేమీ కాదు. అంతే! వారంతా మా ముందు హాజరుపరచబడతారు.
36:54 فَالْيَوْمَ لَا تُظْلَمُ نَفْسٌ شَيْئًا وَلَا تُجْزَوْنَ إِلَّا مَا كُنتُمْ تَعْمَلُونَ
మరి ఈనాడు ఎవరికీ ఎటువంటి అన్యాయమూ జరగదు. మీరు చేసుకున్న కర్మల ప్రతిఫలం తప్ప మరొకటి ఏదీ మీకు ఇవ్వబడదు.
36:55 إِنَّ أَصْحَابَ الْجَنَّةِ الْيَوْمَ فِي شُغُلٍ فَاكِهُونَ
స్వర్గవాసులు ఈ రోజు తమ (ఆహ్లాదకర) వ్యాపకాలలో నిమగ్నులై ఆనందిస్తూ ఉన్నారు.
36:56 هُمْ وَأَزْوَاجُهُمْ فِي ظِلَالٍ عَلَى الْأَرَائِكِ مُتَّكِئُونَ
వారూ, వారి సతీమణులు (చల్లని) నీడలలో పీఠాలపై దిండ్లకు ఆనుకుని ఆసీనులై ఉంటారు.
36:57 لَهُمْ فِيهَا فَاكِهَةٌ وَلَهُم مَّا يَدَّعُونَ
అందులో వారి కోసం అన్ని రకాల పండ్లు ఉంటాయి. ఇంకా వారు కోరినదల్లా ఉంటుంది.
36:58 سَلَامٌ قَوْلًا مِّن رَّبٍّ رَّحِيمٍ
కృపాశీలుడైన ప్రభువు తరఫున వారికి ‘సలామ్’ చెప్పబడుతుంది.
36:59 وَامْتَازُوا الْيَوْمَ أَيُّهَا الْمُجْرِمُونَ
“ఓ పాపాత్ములారా! ఈ రోజు మీరు వేరైపోండి.”
36:60 أَلَمْ أَعْهَدْ إِلَيْكُمْ يَا بَنِي آدَمَ أَن لَّا تَعْبُدُوا الشَّيْطَانَ ۖ إِنَّهُ لَكُمْ عَدُوٌّ مُّبِينٌ
“ఓ ఆదం సంతతివారలారా! మీరు షైతాన్ను పూజించకండి, వాడు మీ బహిరంగ శత్రువు” అని నేను మీ నుండి వాగ్దానం తీసుకోలేదా?
36:61 وَأَنِ اعْبُدُونِي ۚ هَٰذَا صِرَاطٌ مُّسْتَقِيمٌ
“మీరు నన్నే ఆరాధించండి. ఇదే రుజుమార్గం” అని కూడా.
36:62 وَلَقَدْ أَضَلَّ مِنكُمْ جِبِلًّا كَثِيرًا ۖ أَفَلَمْ تَكُونُوا تَعْقِلُونَ
షైతాను మీలో ఎంతోమంది సృష్టిని పెడదారి పట్టించాడు. మరి మీకు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకపోయిందా?
36:63 هَٰذِهِ جَهَنَّمُ الَّتِي كُنتُمْ تُوعَدُونَ
మీకు వాగ్దానం చేయబడుతూ ఉన్న నరకం ఇదే.
36:64 اصْلَوْهَا الْيَوْمَ بِمَا كُنتُمْ تَكْفُرُونَ
“మీ తిరస్కార వైఖరికి బదులుగా ఈ రోజు దీనిలోకి ప్రవేశించండి” (అని వారితో అనబడుతుంది).
36:65 الْيَوْمَ نَخْتِمُ عَلَىٰ أَفْوَاهِهِمْ وَتُكَلِّمُنَا أَيْدِيهِمْ وَتَشْهَدُ أَرْجُلُهُم بِمَا كَانُوا يَكْسِبُونَ
ఈ రోజు మేము వారి నోళ్ళకు సీలు వేస్తాము. వారి చేతులు మాతో మాట్లాడతాయి. వారు చేసిన పనుల గురించి వారి కాళ్లు సాక్ష్యమిస్తాయి.
36:66 وَلَوْ نَشَاءُ لَطَمَسْنَا عَلَىٰ أَعْيُنِهِمْ فَاسْتَبَقُوا الصِّرَاطَ فَأَنَّىٰ يُبْصِرُونَ
మేము గనక తలచుకుంటే వారి కళ్లను కాంతిహీనం చేసేవారము. మరి వారేమో దారి వైపుకు పరుగులు తీసి దేవులాడే వారు. కాని వారికి (దారి) ఎలా కనిపిస్తుంది?
36:67 وَلَوْ نَشَاءُ لَمَسَخْنَاهُمْ عَلَىٰ مَكَانَتِهِمْ فَمَا اسْتَطَاعُوا مُضِيًّا وَلَا يَرْجِعُونَ
మరి మేము తలిస్తే వారున్న చోటే వారి రూపురేఖలను మార్చివేస్తాము. తత్కారణంగా వారు ముందుకు పోనూలేరు, వెనక్కి తిరిగి రానూలేరు.
36:68 وَمَن نُّعَمِّرْهُ نُنَكِّسْهُ فِي الْخَلْقِ ۖ أَفَلَا يَعْقِلُونَ
మేము వృద్ధాప్యానికి చేర్చిన వానిని (మళ్లీ) జనన స్థితికి తిప్పి తీసుకుపోతాము. అయినా వాళ్ళు అర్థం చేసుకోరేమిటి?
36:69 وَمَا عَلَّمْنَاهُ الشِّعْرَ وَمَا يَنبَغِي لَهُ ۚ إِنْ هُوَ إِلَّا ذِكْرٌ وَقُرْآنٌ مُّبِينٌ
మేమతనికి (ముహమ్మద్‌కు) కవిత్వం నేర్పలేదు. అది అతనికి తగదు కూడా. అది హితోపదేశం మరియు స్పష్టమైన ఖుర్ఆన్ మాత్రమే.
36:70 لِّيُنذِرَ مَن كَانَ حَيًّا وَيَحِقَّ الْقَوْلُ عَلَى الْكَافِرِينَ
బ్రతికి ఉన్న ప్రతి వ్యక్తినీ హెచ్చరించటానికి, అవిశ్వాసులపై మాట రూఢీ అవటానికి (ఈ దైవ దౌత్య ఏర్పాటు జరిగింది).
36:71 أَوَلَمْ يَرَوْا أَنَّا خَلَقْنَا لَهُم مِّمَّا عَمِلَتْ أَيْدِينَا أَنْعَامًا فَهُمْ لَهَا مَالِكُونَ
మేము మా స్వహస్తాలతో చేసిన వాటిలో వారికొరకు చతుష్పాదాలు (కూడా) సృజించబడి ఉండటాన్ని వారు గమనించటం లేదా? మరి (చూస్తే) వాటికి వారు యజమానులుగా ఉన్నారు.
36:72 وَذَلَّلْنَاهَا لَهُمْ فَمِنْهَا رَكُوبُهُمْ وَمِنْهَا يَأْكُلُونَ
మరి మేము ఆ పశువులను వారికి లోబడి ఉండేటట్లు చేశాము. వాటిలో కొన్నేమో వారి వాహనాలుగా ఉన్నాయి. మరికొన్నింటి మాంసాన్ని వారు భుజిస్తున్నారు.
36:73 وَلَهُمْ فِيهَا مَنَافِعُ وَمَشَارِبُ ۖ أَفَلَا يَشْكُرُونَ
ఇంకా వాటి ద్వారా వారికి మరెన్నో ప్రయోజనాలు చేకూరుతున్నాయి. త్రాగే (పాల) పదార్థాలు లభ్యమవుతున్నాయి. అయినా వారు కృతజ్ఞులుగా మసలుకోరా?
36:74 وَاتَّخَذُوا مِن دُونِ اللَّهِ آلِهَةً لَّعَلَّهُمْ يُنصَرُونَ
తమను ఆదుకుంటారనే ఆశతో వారు అల్లాహ్‌ను వదలి ఇతరత్రా దైవాలను ఆశ్రయిస్తున్నారు.
36:75 لَا يَسْتَطِيعُونَ نَصْرَهُمْ وَهُمْ لَهُمْ جُندٌ مُّحْضَرُونَ
(యదార్థానికి) వారిని ఆదుకునే శక్తీస్థోమత వారికి ఎంత మాత్రం లేదు. అయినప్పటికీ వారు (ముష్రిక్కులు) వారిని అంటిపెట్టుకుని ఉండే సైనికులుగా ఉన్నారు.
36:76 فَلَا يَحْزُنكَ قَوْلُهُمْ ۘ إِنَّا نَعْلَمُ مَا يُسِرُّونَ وَمَا يُعْلِنُونَ
అయినాసరే (ఓ ముహమ్మద్ – స!) వారి మాటలకు నువ్వు దుఃఖించకు. వారు దాచిపెట్టేవి, వ్యక్తపరిచేవి అన్నీ మాకు తెలుసు.
36:77 أَوَلَمْ يَرَ الْإِنسَانُ أَنَّا خَلَقْنَاهُ مِن نُّطْفَةٍ فَإِذَا هُوَ خَصِيمٌ مُّبِينٌ
మేము మనిషిని పుట్టించింది (ఎంతో అల్పమైన) వీర్యపు బిందువుతోనన్న సంగతిని (కూడా) అతను గమనించటం లేదా? మరి ఉన్నట్టుండి అతను – బహిరంగంగానే – తగవులమారిగా తయారయ్యాడు.
36:78 وَضَرَبَ لَنَا مَثَلًا وَنَسِيَ خَلْقَهُ ۖ قَالَ مَن يُحْيِي الْعِظَامَ وَهِيَ رَمِيمٌ
వాడు మమ్మల్ని (ఇతరులతో) పోల్చాడు. కాని (మరోవైపు) తన అసలు పుట్టుకనే మరచిపోయాడు. “కుళ్ళి కృశించిపోయిన ఎముకలను ఎవడు బ్రతికిస్తాడు?” అని వాడు సవాలు విసురుతున్నాడు.
36:79 قُلْ يُحْيِيهَا الَّذِي أَنشَأَهَا أَوَّلَ مَرَّةٍ ۖ وَهُوَ بِكُلِّ خَلْقٍ عَلِيمٌ
(వారికి) సమాధానం ఇవ్వు : “వాటిని తొలిసారి సృష్టించిన వాడే (మలిసారి కూడా) బ్రతికిస్తాడు. ఆయన అన్ని రకాల సృష్టి ప్రక్రియను గురించి క్షుణ్ణంగా తెలిసినవాడు.”
36:80 الَّذِي جَعَلَ لَكُم مِّنَ الشَّجَرِ الْأَخْضَرِ نَارًا فَإِذَا أَنتُم مِّنْهُ تُوقِدُونَ
ఆయనే మీ కోసం పచ్చని చెట్టు నుంచి అగ్నిని సృష్టించాడు. మరి మీరిప్పుడు దాంతో నిప్పును రాజేస్తున్నారు.
36:81 أَوَلَيْسَ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ بِقَادِرٍ عَلَىٰ أَن يَخْلُقَ مِثْلَهُم ۚ بَلَىٰ وَهُوَ الْخَلَّاقُ الْعَلِيمُ
భూమ్యాకాశాలనే పుట్టించినవాడు వీరిలాంటివారిని (తిరిగి) పుట్టించలేడా? ఎందుకు పుట్టించలేడు? ఆయనే అన్నీ తెలిసిన సృష్టికర్త.
36:82 إِنَّمَا أَمْرُهُ إِذَا أَرَادَ شَيْئًا أَن يَقُولَ لَهُ كُن فَيَكُونُ
ఆయన ఎప్పుడైనా, ఏదైనా వస్తువును చేయ సంకల్పించుకుని ‘అయిపో’ అని ఆదేశించగానే అది అయిపోతుంది.
36:83 فَسُبْحَانَ الَّذِي بِيَدِهِ مَلَكُوتُ كُلِّ شَيْءٍ وَإِلَيْهِ تُرْجَعُونَ
కనుక – ఎవరి చేతుల్లోనయితే సమస్త వస్తువుల సర్వాధికారముందో ఆ అల్లాహ్ పరమ పవిత్రుడు. మీరంతా ఆయన వద్దకే మరలిపోవలసి ఉంది సుమా! - సూరా అస్ సాఫ్ఫాత్
37:1 وَالصَّافَّاتِ صَفًّا
వరుస తీరి నిలబడేవారి (దైవ దూతల) తోడు!
37:2 فَالزَّاجِرَاتِ زَجْرًا
మరి తీవ్రంగా మందలించేవారి తోడు!
37:3 فَالتَّالِيَاتِ ذِكْرًا
మరి (అల్లాహ్) ఉపదేశాన్ని పఠించేవారి తోడు!
37:4 إِنَّ إِلَٰهَكُمْ لَوَاحِدٌ
నిస్సందేహంగా మీరందరి ఆరాధ్య దైవం ఒక్కడే.
37:5 رَّبُّ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا وَرَبُّ الْمَشَارِقِ
(ఆయన) ఆకాశాలకు, భూమికి, వాటి మధ్యనున్న సమస్త వస్తువులకు ప్రభువు, సూర్యోదయ బిందువులకు ప్రభువు.
37:6 إِنَّا زَيَّنَّا السَّمَاءَ الدُّنْيَا بِزِينَةٍ الْكَوَاكِبِ
మేము సమీప ఆకాశాన్ని నక్షత్రాల (అందం)తో ముస్తాబు చేశాము.
37:7 وَحِفْظًا مِّن كُلِّ شَيْطَانٍ مَّارِدٍ
తలబిరుసు అయిన ప్రతి షైతాను బారి నుంచి దాన్ని కాపాడాము.
37:8 لَّا يَسَّمَّعُونَ إِلَى الْمَلَإِ الْأَعْلَىٰ وَيُقْذَفُونَ مِن كُلِّ جَانِبٍ
పైలోకాల్లోని దైవదూతల (మాటల)ను వారు (షైతానులు) చెవియొగ్గి కూడా వినలేరు. (ఒకవేళ వారలా చేస్తే) అన్ని వైపుల నుంచీ విసరివేయబడతారు.
37:9 دُحُورًا ۖ وَلَهُمْ عَذَابٌ وَاصِبٌ
తరిమివేయబడుతూ, మరియు వారి కొరకు శాశ్వతమైన శిక్ష కలదు.
37:10 إِلَّا مَنْ خَطِفَ الْخَطْفَةَ فَأَتْبَعَهُ شِهَابٌ ثَاقِبٌ
ఒకవేళ వారిలో ఎవడయినా ఏదైనా ఒకటీ అరా మాటను ఎగరేసుకుపోయినట్లయితే తక్షణమే మండే ఒక అగ్నిజ్వాల అతన్ని వెంబడిస్తుంది.
37:11 فَاسْتَفْتِهِمْ أَهُمْ أَشَدُّ خَلْقًا أَم مَّنْ خَلَقْنَا ۚ إِنَّا خَلَقْنَاهُم مِّن طِينٍ لَّازِبٍ
కాస్త వారిని అడిగి చూడు: వారిని సృష్టించటం కష్టతరమా? లేక (వారు గాకుండా) మేము చేసిన ఇతర సృష్టి కష్టతరమా? మేము వారిని (మనుషులను) బంకమన్నుతో సృష్టించాము.
37:12 بَلْ عَجِبْتَ وَيَسْخَرُونَ
కాదు, నువ్వేమో (వారి తిరస్కార వైఖరిపై) ఆశ్చర్యపోతుంటే, వారేమో ఎగతాళి చేస్తున్నారు.
37:13 وَإِذَا ذُكِّرُوا لَا يَذْكُرُونَ
వారికి నచ్చజెప్పినపుడు ఏమాత్రం పట్టించుకోరు.
37:14 وَإِذَا رَأَوْا آيَةً يَسْتَسْخِرُونَ
ఏదైనా మహిమను చూసినప్పుడు, దాన్ని వేళాకోళంగా తీసుకుంటారు.
37:15 وَقَالُوا إِنْ هَٰذَا إِلَّا سِحْرٌ مُّبِينٌ
ఇంకా వారిలా అంటారు : “ఇది స్పష్టమైన మాయాజాలం తప్ప మరేమీ కాదు.
37:16 أَإِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا وَعِظَامًا أَإِنَّا لَمَبْعُوثُونَ
“ఏమిటీ, మేము మరణించి, మట్టిలో కలిసి, ఎముకలుగా మారిన తరువాత కూడా (మేము నిజంగానే) లేపబడతామా?
37:17 أَوَآبَاؤُنَا الْأَوَّلُونَ
“మా పూర్వీకులైన మా తాతముత్తాతలు కూడానా? (వారు కూడా బ్రతికించబడతారా?)”
37:18 قُلْ نَعَمْ وَأَنتُمْ دَاخِرُونَ
“అవును (లేపబడతారు). మీరు పరాభవంపాలు (కూడా) అవుతారు” అని నువ్వు వారికి చెప్పు.
37:19 فَإِنَّمَا هِيَ زَجْرَةٌ وَاحِدَةٌ فَإِذَا هُمْ يَنظُرُونَ
అది ఒకే ఒక్క గద్దింపు మాత్రమే. అంతే! వారు (బిక్కబోయి) దిక్కులు చూడటం మొదలెడతారు.
37:20 وَقَالُوا يَا وَيْلَنَا هَٰذَا يَوْمُ الدِّينِ
“అయ్యో! మా పాడుగాను! ఇదే ప్రతిఫలపు దినము (లాగుందే!)” అని అంటారు.
37:21 هَٰذَا يَوْمُ الْفَصْلِ الَّذِي كُنتُم بِهِ تُكَذِّبُونَ
“మీరు ధిక్కరిస్తూ వచ్చిన తీర్పుదినం ఇదే” (అని వారితో అనబడుతుంది).
37:22 احْشُرُوا الَّذِينَ ظَلَمُوا وَأَزْوَاجَهُمْ وَمَا كَانُوا يَعْبُدُونَ
“దుర్మార్గులనూ, వారితో జతకట్టినవారినీ, వారు ఎవరెవరినయితే పూజించేవారో వారందరినీ ప్రోగుచేయండి.
37:23 مِن دُونِ اللَّهِ فَاهْدُوهُمْ إِلَىٰ صِرَاطِ الْجَحِيمِ
అల్లాహ్‌ను వదలిపెట్టి (సుమా)! మరి వారందరికీ జ్వలించే అగ్ని (నరకం) దారి చూపండి.
37:24 وَقِفُوهُمْ ۖ إِنَّهُم مَّسْئُولُونَ
“అయితే కాస్త వాళ్ళను ఆపండి. వారికి (కొన్ని ముఖ్యమైన) ప్రశ్నలు వేయాల్సివుంది.
37:25 مَا لَكُمْ لَا تَنَاصَرُونَ
“అవును, మీకేమైపోయిందీ? (ఇప్పుడు) మీరు ఒండొకరికి సహాయం చేసుకోవటం లేదేమిటి?” (అని వారు ప్రశ్నించబడతారు).
37:26 بَلْ هُمُ الْيَوْمَ مُسْتَسْلِمُونَ
అది కాదు. ఈ రోజు (వారందరూ) ఆత్మసమర్పణ చేసుకున్నారు.
37:27 وَأَقْبَلَ بَعْضُهُمْ عَلَىٰ بَعْضٍ يَتَسَاءَلُونَ
వారు ఒకరింకొకరి వైపు తిరిగి (‘త్వం’ అంటే ‘త్వం’ అని) ప్రశ్నించుకోసాగారు.
37:28 قَالُوا إِنَّكُمْ كُنتُمْ تَأْتُونَنَا عَنِ الْيَمِينِ
“మీరు మా దగ్గరకు కుడి వైపు నుంచి వచ్చేవారు కదా! (ఇప్పుడేమంటారు?)” అని అడుగుతారు.
37:29 قَالُوا بَل لَّمْ تَكُونُوا مُؤْمِنِينَ
వారిలా సమాధానమిస్తారు : “అదేం కాదు. అసలు విశ్వాసం అనేది మీలోనే లేకపోయింది.
37:30 وَمَا كَانَ لَنَا عَلَيْكُم مِّن سُلْطَانٍ ۖ بَلْ كُنتُمْ قَوْمًا طَاغِينَ
“మేమెలాంటి పెత్తనమూ మీపై చెలాయించలేదు. నిజానికి మీరే తిరుగుబాటు జనంగా వ్యవహరించారు.
37:31 فَحَقَّ عَلَيْنَا قَوْلُ رَبِّنَا ۖ إِنَّا لَذَائِقُونَ
“కనుక మన ప్రభువు వాక్కు ఇప్పుడు మనందరిపై రూఢీ అయిపోయింది. మనమంతా (శిక్షను) రుచి చూడవలసి ఉంది.
37:32 فَأَغْوَيْنَاكُمْ إِنَّا كُنَّا غَاوِينَ
“సరే, మేము మిమ్మల్ని దారి తప్పించాము. మేము సయితం స్వయంగా దారి తప్పినవారము” (అని వారు జవాబు ఇస్తారు).
37:33 فَإِنَّهُمْ يَوْمَئِذٍ فِي الْعَذَابِ مُشْتَرِكُونَ
కాబట్టి ఆ రోజు వారంతా శిక్షలో భాగస్తులవుతారు.
37:34 إِنَّا كَذَٰلِكَ نَفْعَلُ بِالْمُجْرِمِينَ
మేము అపరాధుల పట్ల ఈ విధంగానే వ్యవహరిస్తాము.
37:35 إِنَّهُمْ كَانُوا إِذَا قِيلَ لَهُمْ لَا إِلَٰهَ إِلَّا اللَّهُ يَسْتَكْبِرُونَ
“అల్లాహ్ తప్ప మరో ఆరాధ్య దేవుడు లేడ”ని వారితో అన్నప్పుడు వారు అహంకారంతో విర్రవీగేవారు.
37:36 وَيَقُولُونَ أَئِنَّا لَتَارِكُو آلِهَتِنَا لِشَاعِرٍ مَّجْنُونٍ
“పిచ్చిపట్టిన ఒక కవి చెప్పినంత మాత్రాన మేము మా పూజ్య దైవాలను వదులుకోవాలా?” అని అనేవారు.
37:37 بَلْ جَاءَ بِالْحَقِّ وَصَدَّقَ الْمُرْسَلِينَ
(కాదు కాదు) వాస్తవానికి అతను (ప్రవక్త) సత్యాన్నే తీసుకుని వచ్చాడు. దైవప్రవక్తలందరినీ (సత్యవంతులుగా) ధృవీకరిస్తున్నాడు.
37:38 إِنَّكُمْ لَذَائِقُو الْعَذَابِ الْأَلِيمِ
మీరు మాత్రం బాధాకరమైన శిక్షను చవిచూడటం ఖాయం.
37:39 وَمَا تُجْزَوْنَ إِلَّا مَا كُنتُمْ تَعْمَلُونَ
మీరు చేసుకున్న (పాపిష్టి) పనుల ప్రతిఫలమే మీకు ఇవ్వబడుతుంది.
37:40 إِلَّا عِبَادَ اللَّهِ الْمُخْلَصِينَ
అయితే అల్లాహ్ ఎన్నుకున్న దాసులు మాత్రం (ఆ శిక్ష నుంచి సురక్షితంగా ఉంటారు).
37:41 أُولَٰئِكَ لَهُمْ رِزْقٌ مَّعْلُومٌ
నిర్ధారిత ఆహారం వారికి ప్రత్యేకం.
37:42 فَوَاكِهُ ۖ وَهُم مُّكْرَمُونَ
(అందులో రకరకాల) పండ్లు, ఫలాలు ఉంటాయి. వారు అపూర్వంగా సత్కరించబడతారు –
37:43 فِي جَنَّاتِ النَّعِيمِ
అనుగ్రహభరితమైన స్వర్గవనాలలో!
37:44 عَلَىٰ سُرُرٍ مُّتَقَابِلِينَ
ఆసనాలపై ఎదురెదురుగా (ఆసీనులై) ఉంటారు.
37:45 يُطَافُ عَلَيْهِم بِكَأْسٍ مِّن مَّعِينٍ
ప్రవహించే మధువులా మధుపాత్రలు వారి ముందు పదే పదే సమర్పించబడుతూ ఉంటాయి.
37:46 بَيْضَاءَ لَذَّةٍ لِّلشَّارِبِينَ
అదెంతో స్వచ్ఛంగా, సేవించేవారికి కమ్మగా ఉంటుంది.
37:47 لَا فِيهَا غَوْلٌ وَلَا هُمْ عَنْهَا يُنزَفُونَ
దానివల్ల (తల) నొప్పి రాదు, మతి చలించటం జరగదు.
37:48 وَعِندَهُمْ قَاصِرَاتُ الطَّرْفِ عِينٌ
వారి దగ్గర చూపులు క్రిందికి వాలి ఉండే పెద్ద పెద్ద కన్నులు గల మగువలు ఉంటారు.
37:49 كَأَنَّهُنَّ بَيْضٌ مَّكْنُونٌ
వారు చాలా జాగ్రత్తగా భద్రపరచబడిన గ్రుడ్డుల మాదిరిగా (కోమలంగా, స్వచ్ఛంగా) ఉంటారు.
37:50 فَأَقْبَلَ بَعْضُهُمْ عَلَىٰ بَعْضٍ يَتَسَاءَلُونَ
మరి వారు (స్వర్గవాసులు) ఒండొకరి వైపుకు తిరిగి ప్రశ్నలు వేసుకుంటారు.
37:51 قَالَ قَائِلٌ مِّنْهُمْ إِنِّي كَانَ لِي قَرِينٌ
వారిలో ఒకతను ఇలా అంటాడు: “నాకొక స్నేహితుడుండేవాడు.
37:52 يَقُولُ أَإِنَّكَ لَمِنَ الْمُصَدِّقِينَ
“అతను నాతో, ‘ఏమిటీ? (ప్రళయ దినం వస్తుందని) ధృవీకరించే వారిలో నువ్వూ చేరిపోయావా?’ అని అనేవాడు.
37:53 أَإِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا وَعِظَامًا أَإِنَّا لَمَدِينُونَ
“ఏమిటి, మనం మరణించి, మట్టిలో కలిసి, ఎముకలుగా మారిపోయిన మీదట మాకు ప్రతిఫలం ఇవ్వబడుతుందా?” (అని అనేవాడు).
37:54 قَالَ هَلْ أَنتُم مُّطَّلِعُونَ
“ఏం? మీరతన్ని తొంగిచూస్తారా?” అంటాడు.
37:55 فَاطَّلَعَ فَرَآهُ فِي سَوَاءِ الْجَحِيمِ
తొంగిచూడగానే అతను నరకం మధ్యలో (కాలుతూ) కనిపిస్తాడు.
37:56 قَالَ تَاللَّهِ إِن كِدتَّ لَتُرْدِينِ
అతను (స్వర్గవాసి) ఇలా అంటాడు : “అల్లాహ్ సాక్షి! నువ్వు నన్ను కూడా నాశనం చేసి ఉండేవాడివే.
37:57 وَلَوْلَا نِعْمَةُ رَبِّي لَكُنتُ مِنَ الْمُحْضَرِينَ
“నా ప్రభువు అనుగ్రహమే గనక లేకుండా ఉంటే నేను కూడా (నేరస్తులుగా నరకానికి) పట్టి తేబడిన వారిలో ఉండేవాణ్ణి.
37:58 أَفَمَا نَحْنُ بِمَيِّتِينَ
ఆ మొదటి చావే తప్ప మనకిక చావులేదు (అన్నది నిజమేనా?)
37:59 إِلَّا مَوْتَتَنَا الْأُولَىٰ وَمَا نَحْنُ بِمُعَذَّبِينَ
మనకిక శిక్ష కూడా పడదట కదా! (ఇదీ నిజమేనా? అని స్వర్గవాసి తన తోటి సావాసులతో అంటాడు).”
37:60 إِنَّ هَٰذَا لَهُوَ الْفَوْزُ الْعَظِيمُ
నిస్సందేహంగా ఇదే గొప్ప సాఫల్యం.
37:61 لِمِثْلِ هَٰذَا فَلْيَعْمَلِ الْعَامِلُونَ
ఇటువంటి దాని (సాఫల్యం) కోసం పని చేసేవారు పని చేయాలి.
37:62 أَذَٰلِكَ خَيْرٌ نُّزُلًا أَمْ شَجَرَةُ الزَّقُّومِ
ఈ ఆతిథ్యం మంచిదా? లేక జఖ్ఖూమ్ (నరకంలోని జెముడు) వృక్షం (మంచిదా?)
37:63 إِنَّا جَعَلْنَاهَا فِتْنَةً لِّلظَّالِمِينَ
దానిని మేము దుర్మార్గుల కోసం పరీక్షగా చేసి ఉంచాము.
37:64 إِنَّهَا شَجَرَةٌ تَخْرُجُ فِي أَصْلِ الْجَحِيمِ
నిశ్చయంగా ఆ వృక్షం వేరు నరకం వేరు (అట్టడుగు భాగం) నుంచి మొలకెత్తుతుంది.
37:65 طَلْعُهَا كَأَنَّهُ رُءُوسُ الشَّيَاطِينِ
దాని పండ్ల గుత్తులు షైతానుల తలల మాదిరిగా ఉంటాయి.
37:66 فَإِنَّهُمْ لَآكِلُونَ مِنْهَا فَمَالِئُونَ مِنْهَا الْبُطُونَ
మరి (నరకవాసులు) దాన్నుంచే తింటారు. దాంతోనే తమ పొట్టలు నింపుకుంటారు.
37:67 ثُمَّ إِنَّ لَهُمْ عَلَيْهَا لَشَوْبًا مِّنْ حَمِيمٍ
మరి దానిపైన సలసలా కాగే నీళ్లు త్రాగేందుకు ఇవ్వబడతాయి.
37:68 ثُمَّ إِنَّ مَرْجِعَهُمْ لَإِلَى الْجَحِيمِ
మరి వారంతా తరలించబడేది మండే (నరక) అగ్ని వైపునకే.
37:69 إِنَّهُمْ أَلْفَوْا آبَاءَهُمْ ضَالِّينَ
తమ తాతముత్తాతలను వీరు భ్రష్టమార్గంలో నడుస్తుండగా చూశారు.
37:70 فَهُمْ عَلَىٰ آثَارِهِمْ يُهْرَعُونَ
అయినప్పటికీ వారి పాద చిహ్నాలలోనే పరుగులు తీశారు.
37:71 وَلَقَدْ ضَلَّ قَبْلَهُمْ أَكْثَرُ الْأَوَّلِينَ
వీరికి మునుపు కూడా ఎందరో పూర్వీకులు పెడదారి పట్టి ఉన్నారు.
37:72 وَلَقَدْ أَرْسَلْنَا فِيهِم مُّنذِرِينَ
వాళ్ల మధ్య కూడా మేము హెచ్చరించే వారిని పంపి ఉన్నాము.
37:73 فَانظُرْ كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُنذَرِينَ
మరి హెచ్చరించబడిన వారికి పట్టిన గతేమిటో నువ్వే చూడు!
37:74 إِلَّا عِبَادَ اللَّهِ الْمُخْلَصِينَ
అల్లాహ్ ఎన్నుకున్నదాసులు తప్ప. (వారు మాత్రం ఆ దుష్పరిణామం నుంచి రక్షించబడ్డారు).
37:75 وَلَقَدْ نَادَانَا نُوحٌ فَلَنِعْمَ الْمُجِيبُونَ
నూహ్ మమ్మల్ని పిలిచాడు. మరి మేము (పిలుపుకు) ఎంత చక్కగా బదులు పలుకుతామో (చూడండి!)
37:76 وَنَجَّيْنَاهُ وَأَهْلَهُ مِنَ الْكَرْبِ الْعَظِيمِ
మేము అతన్నీ, అతని ఇంటివారిని ఆ ఘోరమైన ఆపద నుంచి కాపాడాము.
37:77 وَجَعَلْنَا ذُرِّيَّتَهُ هُمُ الْبَاقِينَ
అతని సంతానాన్ని మాత్రమే మేము మిగిలి ఉండేలా చేశాము.
37:78 وَتَرَكْنَا عَلَيْهِ فِي الْآخِرِينَ
రాబోయే తరాల వారిలో అతని సత్కీర్తిని మిగిల్చి ఉంచాము.
37:79 سَلَامٌ عَلَىٰ نُوحٍ فِي الْعَالَمِينَ
సమస్త లోకాలలో నూహుపై శాంతి కలుగుగాక!
37:80 إِنَّا كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ
సద్వర్తనులకు మేము ఇలాగే ప్రతిఫలం ప్రసాదిస్తాము.
37:81 إِنَّهُ مِنْ عِبَادِنَا الْمُؤْمِنِينَ
నిశ్చయంగా అతను విశ్వసించిన మా దాసులలోని వాడు.
37:82 ثُمَّ أَغْرَقْنَا الْآخَرِينَ
అటుపిమ్మట మేము ఇతరులను ముంచివేశాము.
37:83 وَإِنَّ مِن شِيعَتِهِ لَإِبْرَاهِيمَ
అతని (నూహ్) మార్గాన్ని అవలంబించిన వారిలో ఇబ్రాహీమ్ (కూడా) ఉన్నాడు.
37:84 إِذْ جَاءَ رَبَّهُ بِقَلْبٍ سَلِيمٍ
అతను నిర్మల హృదయంతో తన ప్రభువు వద్దకు వచ్చినప్పుడు…
37:85 إِذْ قَالَ لِأَبِيهِ وَقَوْمِهِ مَاذَا تَعْبُدُونَ
(అతను) తన తండ్రితో, తన జాతి వారితో ఇలా అన్నాడు: “మీరు వేటిని పూజిస్తున్నారు?
37:86 أَئِفْكًا آلِهَةً دُونَ اللَّهِ تُرِيدُونَ
“అల్లాహ్‌ను వదలి స్వయం కల్పిత ఆరాధ్యదైవాలను కోరుకుంటున్నారా?
37:87 فَمَا ظَنُّكُم بِرَبِّ الْعَالَمِينَ
“ఇంతకీ సకల లోకాల ప్రభువు గురించి మీరేమనుకుంటున్నారు?”
37:88 فَنَظَرَ نَظْرَةً فِي النُّجُومِ
తర్వాత అతను నక్షత్రాల వైపు ఒకసారి దృష్టిని సారించాడు.
37:89 فَقَالَ إِنِّي سَقِيمٌ
“నేను రోగగ్రస్తుణ్ణి అయ్యాను” అన్నాడు.
37:90 فَتَوَلَّوْا عَنْهُ مُدْبِرِينَ
అందువల్ల వారంతా ముఖం త్రిప్పుకుని, వెళ్ళిపోయారు.
37:91 فَرَاغَ إِلَىٰ آلِهَتِهِمْ فَقَالَ أَلَا تَأْكُلُونَ
అప్పుడతను (మెల్లగా) వారి దేవుళ్ళ వద్దకు వెళ్ళి, ‘మీరు తినరేమిటి?’ అన్నాడు.
37:92 مَا لَكُمْ لَا تَنطِقُونَ
“అసలు మీకేమైపోయిందీ? మీరు కనీసం మాట్లాడరే?!” (అని అన్నాడు).
37:93 فَرَاغَ عَلَيْهِمْ ضَرْبًا بِالْيَمِينِ
ఆ తరువాత కుడిచేత్తో వాటిని (ఎడాపెడా) వాయించసాగాడు.
37:94 فَأَقْبَلُوا إِلَيْهِ يَزِفُّونَ
వారు (ఆ విగ్రహారాధకులు) అతని దగ్గరకు పరుగులు తీస్తూ వచ్చారు.
37:95 قَالَ أَتَعْبُدُونَ مَا تَنْحِتُونَ
వారితో అతనిలా అన్నాడు: “ఏమిటి? మీరు (మీ స్వహస్తాలతో) చెక్కిన శిలలను పూజిస్తారా?”
37:96 وَاللَّهُ خَلَقَكُمْ وَمَا تَعْمَلُونَ
“మరి (చూడబోతే) మిమ్మల్నీ, మీరు చేసిన వాటినీ సృష్టించిన వాడు అల్లాహ్‌యే కదా!”
37:97 قَالُوا ابْنُوا لَهُ بُنْيَانًا فَأَلْقُوهُ فِي الْجَحِيمِ
వారిలా అన్నారు : “ఇతని కోసం ఓ కట్టడం (భారీ కొలిమి) నిర్మించండి. ఆ తరువాత ఇతన్ని మండే అగ్ని (గుండం)లో పడవేయండి.”
37:98 فَأَرَادُوا بِهِ كَيْدًا فَجَعَلْنَاهُمُ الْأَسْفَلِينَ
వారు అతనికి వ్యతిరేకంగా కుట్ర పన్నదలిచారు. అయితే మేము వారినే బోల్తా కొట్టించాము.
37:99 وَقَالَ إِنِّي ذَاهِبٌ إِلَىٰ رَبِّي سَيَهْدِينِ
అతను (ఇబ్రాహీమ్) ఇలా అన్నాడు : “నేను నా ప్రభువు వైపుకే పోతాను. ఆయన తప్పకుండా నాకు మార్గం చూపుతాడు.
37:100 رَبِّ هَبْ لِي مِنَ الصَّالِحِينَ
“నా ప్రభూ! నాకు గుణవంతుడైన కుమారుణ్ణి ప్రసాదించు” (అని ప్రార్థించాడు).
37:101 فَبَشَّرْنَاهُ بِغُلَامٍ حَلِيمٍ
అందువల్ల మేమతనికి, సహనశీలుడైన ఒక అబ్బాయి గురించిన శుభవార్తను అందజేశాము.
37:102 فَلَمَّا بَلَغَ مَعَهُ السَّعْيَ قَالَ يَا بُنَيَّ إِنِّي أَرَىٰ فِي الْمَنَامِ أَنِّي أَذْبَحُكَ فَانظُرْ مَاذَا تَرَىٰ ۚ قَالَ يَا أَبَتِ افْعَلْ مَا تُؤْمَرُ ۖ سَتَجِدُنِي إِن شَاءَ اللَّهُ مِنَ الصَّابِرِينَ
మరి ఆ కుర్రాడు అతని వెంట పరుగెత్తే ఈడుకు చేరుకున్నప్పుడు, “ఒరేయ్ చంటీ! నేను నిన్ను ‘జిబహ్’ చేస్తున్నట్లు కల చూస్తున్నాను! మరి నీ అభిప్రాయమేమిటో చెప్పు” అని అతను (ఇబ్రాహీం) అన్నాడు. “నాన్నగారూ! మీకు ఆజ్ఞాపించబడిన దానిని (నిస్సంకోచంగా) నెరవేర్చండి. అల్లాహ్ తలిస్తే మీరు నన్ను సహనశీలిగా పొందుతారు” అని ఆ బాలుడు అన్నాడు.
37:103 فَلَمَّا أَسْلَمَا وَتَلَّهُ لِلْجَبِينِ
మరి వారిరువురూ (దైవాజ్ఞను) శిరసావహించినప్పుడు అతను తన కుమారుణ్ణి ఒక పక్కకు తిప్పి పడుకోబెట్టాడు.
37:104 وَنَادَيْنَاهُ أَن يَا إِبْرَاهِيمُ
అప్పుడు మేమతన్ని పిలిచాము – “ఓ ఇబ్రాహీం!
37:105 قَدْ صَدَّقْتَ الرُّؤْيَا ۚ إِنَّا كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ
“నువ్వు కలను నిజంచేసి చూపావు.” నిశ్చయంగా మేము సదాచార సంపన్నులకు ఇటువంటి ప్రతిఫలాన్నే ఇస్తాము.
37:106 إِنَّ هَٰذَا لَهُوَ الْبَلَاءُ الْمُبِينُ
యదార్థానికి అదొక బహిరంగ పరీక్ష!
37:107 وَفَدَيْنَاهُ بِذِبْحٍ عَظِيمٍ
మేము ఒక పెద్ద బలిపశువుని పరిహారంగా ఇచ్చి ఆ బాలుణ్ణి విడిపించాము.
37:108 وَتَرَكْنَا عَلَيْهِ فِي الْآخِرِينَ
ఇంకా భావి తరాల వారిలో అతని సచ్చరిత్రను మిగిల్చి ఉంచాము.
37:109 سَلَامٌ عَلَىٰ إِبْرَاهِيمَ
ఇబ్రాహీంకు శాంతి కలుగుగాక!
37:110 كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ
సజ్జనులకు మేము ఇలాంటి ప్రతిఫలాన్నే ప్రసాదిస్తాము.
37:111 إِنَّهُ مِنْ عِبَادِنَا الْمُؤْمِنِينَ
నిస్సందేహంగా అతను విశ్వాసులైన మా దాసులలోని వాడు.
37:112 وَبَشَّرْنَاهُ بِإِسْحَاقَ نَبِيًّا مِّنَ الصَّالِحِينَ
మరి మేమతనికి, సద్వర్తనులలో ఒకడైన ఇస్హాఖ్ ప్రవక్త గురించిన శుభవార్తను ఇచ్చాము.
37:113 وَبَارَكْنَا عَلَيْهِ وَعَلَىٰ إِسْحَاقَ ۚ وَمِن ذُرِّيَّتِهِمَا مُحْسِنٌ وَظَالِمٌ لِّنَفْسِهِ مُبِينٌ
ఇంకా మేము అతని (ఇబ్రాహీము)పైనా, ఇస్హాఖ్పైనా శుభాలను కురిపించాము. వారిద్దరి సంతతిలో కొందరు సజ్జనులైతే, మరికొందరు తమ ఆత్మలకు తీరని అన్యాయం చేసుకున్నారు.
37:114 وَلَقَدْ مَنَنَّا عَلَىٰ مُوسَىٰ وَهَارُونَ
మరి మేము మూసా, హారూనులకు కూడా ఉపకారం చేశాము.
37:115 وَنَجَّيْنَاهُمَا وَقَوْمَهُمَا مِنَ الْكَرْبِ الْعَظِيمِ
వారినీ, వారి జాతివారినీ పెద్ద పీడన నుండి రక్షించాము.
37:116 وَنَصَرْنَاهُمْ فَكَانُوا هُمُ الْغَالِبِينَ
మేము వారికి సహాయపడగా, వారే విజయం సాధించారు.
37:117 وَآتَيْنَاهُمَا الْكِتَابَ الْمُسْتَبِينَ
మరి వారిద్దరికి మేము సవివరమైన (తేటతెల్లమైన) గ్రంథం ప్రసాదించాము.
37:118 وَهَدَيْنَاهُمَا الصِّرَاطَ الْمُسْتَقِيمَ
ఇంకా వారికి రుజుమార్గం వైపు దర్శకత్వం వహించాము.
37:119 وَتَرَكْنَا عَلَيْهِمَا فِي الْآخِرِينَ
రాబోయే తరాలలో వారి కీర్తి మిగిలి ఉండేలా చేశాము.
37:120 سَلَامٌ عَلَىٰ مُوسَىٰ وَهَارُونَ
మూసా, హారూనులపై శాంతి కలుగుగాక!
37:121 إِنَّا كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ
నిశ్చయంగా మేము సజ్జనులకు ఇలాగే ప్రతిఫలం ఇస్తూ ఉంటాము.
37:122 إِنَّهُمَا مِنْ عِبَادِنَا الْمُؤْمِنِينَ
నిస్సందేహంగా వారిద్దరూ విశ్వాసులైన మా దాసుల్లో చేరిన వారు.
37:123 وَإِنَّ إِلْيَاسَ لَمِنَ الْمُرْسَلِينَ
మరి నిశ్చయంగా ఇలియాస్ కూడా ప్రవక్తలలోని వాడే.
37:124 إِذْ قَالَ لِقَوْمِهِ أَلَا تَتَّقُونَ
అతను తన జాతి వారితో ఇలా అన్నాడు: “మీరు అల్లాహ్‌కు భయపడరా?
37:125 أَتَدْعُونَ بَعْلًا وَتَذَرُونَ أَحْسَنَ الْخَالِقِينَ
“మీరు బాల్ (అనే విగ్రహము)ను ప్రార్థిస్తూ, సర్వోత్తమ సృష్టికర్త (అయిన అల్లాహ్)ను వదలిపెడుతున్నారేమిటి?
37:126 اللَّهَ رَبَّكُمْ وَرَبَّ آبَائِكُمُ الْأَوَّلِينَ
అంటే మీ ప్రభువు, మీ తాతముత్తాతల ప్రభువైన అల్లాహ్‌ను”
37:127 فَكَذَّبُوهُ فَإِنَّهُمْ لَمُحْضَرُونَ
కాని వారతన్ని ధిక్కరించారు. కనుక వారు తప్పనిసరిగా (శిక్ష నిమిత్తం) హాజరు పరచబడతారు.
37:128 إِلَّا عِبَادَ اللَّهِ الْمُخْلَصِينَ
అల్లాహ్ ఎన్నుకున్న దాసులు తప్ప! (వారు మాత్రమే రక్షించబడతారు).
37:129 وَتَرَكْنَا عَلَيْهِ فِي الْآخِرِينَ
మేమతని మంచి ప్రస్తావనను భావితరాల వారిలో మిగిల్చి ఉంచాము.
37:130 سَلَامٌ عَلَىٰ إِلْ يَاسِينَ
ఇలియాస్‌పై శాంతి కలుగుగాక!
37:131 إِنَّا كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ
సదాచార సంపన్నులకు మేము ఇలాగే ప్రతిఫలం ఇస్తుంటాము.
37:132 إِنَّهُ مِنْ عِبَادِنَا الْمُؤْمِنِينَ
నిశ్చయంగా అతను విశ్వాసులైన మా దాసులలోని వాడు.
37:133 وَإِنَّ لُوطًا لَّمِنَ الْمُرْسَلِينَ
మరి లూత్ కూడా ప్రవక్తలలోని వాడే.
37:134 إِذْ نَجَّيْنَاهُ وَأَهْلَهُ أَجْمَعِينَ
మేము అతన్నీ, అతని కుటుంబీకులందరినీ కాపాడాము-
37:135 إِلَّا عَجُوزًا فِي الْغَابِرِينَ
వెనుక ఉండిపోయిన వారితో చేరిన ఆ ముసలావిడను తప్ప!
37:136 ثُمَّ دَمَّرْنَا الْآخَرِينَ
ఆ తరువాత మేము ఇతరులందరినీ నాశనం చేసి వేశాము.
37:137 وَإِنَّكُمْ لَتَمُرُّونَ عَلَيْهِم مُّصْبِحِينَ
మీరు ప్రభాత సమయాలలో, ఆ ప్రదేశాల మీదుగా సాగిపోతూ ఉంటారు.
37:138 وَبِاللَّيْلِ ۗ أَفَلَا تَعْقِلُونَ
ఇంకా రాత్రివేళల్లో కూడా. అయినా మీరు అర్థం చేసుకోరా?
37:139 وَإِنَّ يُونُسَ لَمِنَ الْمُرْسَلِينَ
నిస్సందేహంగా యూనుస్ (కూడా) మా ప్రవక్తలలోని వాడే.
37:140 إِذْ أَبَقَ إِلَى الْفُلْكِ الْمَشْحُونِ
అతను (తన జనుల నుండి) పలాయనం చిత్తగించి నిండు నౌక వద్దకు చేరుకున్నప్పుడు,
37:141 فَسَاهَمَ فَكَانَ مِنَ الْمُدْحَضِينَ
చీటీలు వేయటం జరిగింది. చివరకు అతనే ఓడిపోయాడు.
37:142 فَالْتَقَمَهُ الْحُوتُ وَهُوَ مُلِيمٌ
తరువాత అతన్ని చేప మ్రింగేసింది. అప్పుడు అతను తన్ను తానే నిందించుకోసాగాడు.
37:143 فَلَوْلَا أَنَّهُ كَانَ مِنَ الْمُسَبِّحِينَ
ఒకవేళ అతను గనక (అల్లాహ్) పవిత్రతను కొనియాడటంలో నిమగ్నుడై ఉండకపోతే…
37:144 لَلَبِثَ فِي بَطْنِهِ إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ
పునరుత్థానదినం వరకు చేప కడుపులోనే ఉండిపోయేవాడు.
37:145 فَنَبَذْنَاهُ بِالْعَرَاءِ وَهُوَ سَقِيمٌ
తరువాత మేమతన్ని (సముద్ర తీర) మైదానంలో పడవేశాము. అప్పుడతను అస్వస్థతకు గురై ఉన్నాడు.
37:146 وَأَنبَتْنَا عَلَيْهِ شَجَرَةً مِّن يَقْطِينٍ
అతనికి నీడనిచ్చే ఒక తీగచెట్టును అతనిపై మొలకెత్తించాము.
37:147 وَأَرْسَلْنَاهُ إِلَىٰ مِائَةِ أَلْفٍ أَوْ يَزِيدُونَ
మరి మేమతన్ని ఒక లక్షమంది, అంతకన్నా ఎక్కువ మంది వైపుకే (ప్రవక్తగా) పంపాము.
37:148 فَآمَنُوا فَمَتَّعْنَاهُمْ إِلَىٰ حِينٍ
వారు విశ్వసించారు. అందువల్ల మేము వారిని కొంత కాలంపాటు సుఖ సౌఖ్యాలతో వర్థిల్లజేశాము.
37:149 فَاسْتَفْتِهِمْ أَلِرَبِّكَ الْبَنَاتُ وَلَهُمُ الْبَنُونَ
వారిని అడుగు: నీ ప్రభువుకు (కేవలం) కుమార్తెలూను, వారికేమో కుమారులా?
37:150 أَمْ خَلَقْنَا الْمَلَائِكَةَ إِنَاثًا وَهُمْ شَاهِدُونَ
పోనీ, మేము దైవదూతలను ఆడవారుగా సృష్టించినప్పుడు వారు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారా ఏమి?
37:151 أَلَا إِنَّهُم مِّنْ إِفْكِهِمْ لَيَقُولُونَ
నిశ్చయంగా వీరు తమ కల్పిత మాటలు చెబుతున్నారు సుమా!
37:152 وَلَدَ اللَّهُ وَإِنَّهُمْ لَكَاذِبُونَ
అల్లాహ్‌కు సంతానముంది (అంటున్నారు). వాస్తవానికి వారు అబద్ధమాడుతున్నారు.
37:153 أَصْطَفَى الْبَنَاتِ عَلَى الْبَنِينَ
ఏమిటి? అల్లాహ్ (తన కోసం) కొడుకులకు బదులుగా కూతుళ్ళను ఎంపిక చేసుకున్నాడా?
37:154 مَا لَكُمْ كَيْفَ تَحْكُمُونَ
అసలేమైపోయింది మీకు? ఈ మేరకు ఎలా నిర్ణయిస్తున్నారు?
37:155 أَفَلَا تَذَكَّرُونَ
మీరు ఆ మాత్రం కూడా గ్రహించలేరా?
37:156 أَمْ لَكُمْ سُلْطَانٌ مُّبِينٌ
పోనీ, మీ దగ్గర దానికి సంబంధించిన స్పష్టమైన ప్రమాణం ఏదైనా ఉందా?
37:157 فَأْتُوا بِكِتَابِكُمْ إِن كُنتُمْ صَادِقِينَ
మరి మీరు సత్యవంతులే అయితే మీ పుస్తకాన్నే తీసుకుని రండి!
37:158 وَجَعَلُوا بَيْنَهُ وَبَيْنَ الْجِنَّةِ نَسَبًا ۚ وَلَقَدْ عَلِمَتِ الْجِنَّةُ إِنَّهُمْ لَمُحْضَرُونَ
ఆఖరికి వారు అల్లాహ్‌కు – జిన్నాతులకు మధ్య కూడా బంధుత్వ సంబంధాన్ని కల్పించారు. వాస్తవానికి తాము (ఇలాంటి మిథ్యా విశ్వాసం గలవారు శిక్ష నిమిత్తం) హాజరు పరచబడతామన్న సంగతి స్వయంగా జిన్నాతులకు కూడా తెలుసు.
37:159 سُبْحَانَ اللَّهِ عَمَّا يَصِفُونَ
(అల్లాహ్ విషయంలో) వారు చెప్పే విషయాలకు అల్లాహ్ పవిత్రుడు.
37:160 إِلَّا عِبَادَ اللَّهِ الْمُخْلَصِينَ
చిత్తశుద్ధిగల అల్లాహ్ దాసులు తప్ప (వారు మాత్రమే ఇలాంటి అభూత కల్పనలకు దూరంగా ఉంటారు)!
37:161 فَإِنَّكُمْ وَمَا تَعْبُدُونَ
నిశ్చయంగా మీరూ, మీ (బూటకపు) దైవాలు (అందరూ ఏకమైనా సరే)
37:162 مَا أَنتُمْ عَلَيْهِ بِفَاتِنِينَ
ఏ ఒక్కరినీ (అల్లాహ్ వైపునుంచి) దారి తప్పించలేరు –
37:163 إِلَّا مَنْ هُوَ صَالِ الْجَحِيمِ
నరకాగ్నికి ఆహుతి అయ్యేవానిని తప్ప!
37:164 وَمَا مِنَّا إِلَّا لَهُ مَقَامٌ مَّعْلُومٌ
“మాలో ప్రతి ఒక్కరి స్థానం (శ్రేణి) నిర్ధారితమై ఉంది.
37:165 وَإِنَّا لَنَحْنُ الصَّافُّونَ
“ఇంకా, మేము (దైవారాధన నిమిత్తం) వరుస తీరి నిలబడ్డాము.
37:166 وَإِنَّا لَنَحْنُ الْمُسَبِّحُونَ
“ఆయన (అల్లాహ్) పవిత్రతను కొనియాడుతున్నాము” (అని దైవదూతలు పలుకుతారు).
37:167 وَإِن كَانُوا لَيَقُولُونَ
వారు (అవిశ్వాసులు) ఇలా అనేవారు –
37:168 لَوْ أَنَّ عِندَنَا ذِكْرًا مِّنَ الْأَوَّلِينَ
“మా వద్దనే గనక పూర్వీకుల మాదిరి ఉపదేశం ఉండి ఉంటే…
37:169 لَكُنَّا عِبَادَ اللَّهِ الْمُخْلَصِينَ
“మేము కూడా ఎంపిక చేయబడిన అల్లాహ్ దాసులై ఉండే వారము.”
37:170 فَكَفَرُوا بِهِ ۖ فَسَوْفَ يَعْلَمُونَ
కాని (తీరా ఖుర్ఆన్ వచ్చాక) వారు దానిని తిరస్కరించారు. సరే. తొందరగానే వారు తెలుసుకుంటారు.
37:171 وَلَقَدْ سَبَقَتْ كَلِمَتُنَا لِعِبَادِنَا الْمُرْسَلِينَ
మా ప్రియతమ దాసులైన ప్రవక్తలకు మేమిచ్చిన మాట ఇంతకుముందే నెరవేరింది.
37:172 إِنَّهُمْ لَهُمُ الْمَنصُورُونَ
నిశ్చయంగా వారు మాత్రమే విజయం సాధిస్తారు.
37:173 وَإِنَّ جُندَنَا لَهُمُ الْغَالِبُونَ
మరి నిశ్చయంగా మా సైన్యాలే గెలుపొందుతాయి.
37:174 فَتَوَلَّ عَنْهُمْ حَتَّىٰ حِينٍ
కనుక (ఓ ప్రవక్తా!) కొంతకాలం పాటు వాళ్ళను పట్టించుకోకు.
37:175 وَأَبْصِرْهُمْ فَسَوْفَ يُبْصِرُونَ
మరి వాళ్ళను గమనిస్తూ ఉండు. మున్ముందు (తమకు పట్టే దుర్గతిని) వాళ్ళూ చూసుకుంటారు.
37:176 أَفَبِعَذَابِنَا يَسْتَعْجِلُونَ
ఏమిటి? వాళ్లు మా శిక్ష కోసం ఆత్రం చేస్తున్నారా?
37:177 فَإِذَا نَزَلَ بِسَاحَتِهِمْ فَسَاءَ صَبَاحُ الْمُنذَرِينَ
మరి (వినండి!) మా శిక్ష వారి మైదానంలో వచ్చి వాలినప్పుడు, హెచ్చరించబడిన వారి పాలిట ఆ ఉదయం దారుణంగా ఉంటుంది.
37:178 وَتَوَلَّ عَنْهُمْ حَتَّىٰ حِينٍ
కనుక (ఓ ప్రవక్తా!) కొన్నాళ్ళపాటు వాళ్ళను గురించి ఆలోచించకు.
37:179 وَأَبْصِرْ فَسَوْفَ يُبْصِرُونَ
కాకపోతే వాళ్ళను చూస్తూ ఉండు. వాళ్ళు కూడా (త్వరలోనే) చూసుకుంటారు.
37:180 سُبْحَانَ رَبِّكَ رَبِّ الْعِزَّةِ عَمَّا يَصِفُونَ
గౌరవనీయుడగు నీ ప్రభువు, వారు (ముష్రిక్కులు) కల్పించి చెప్పే విషయాలకు అతీతుడు, పరమ పవిత్రుడు.
37:181 وَسَلَامٌ عَلَى الْمُرْسَلِينَ
ప్రవక్తలపై శాంతి కురియుగాక!
37:182 وَالْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
సమస్త స్తోత్రాలు సకల లోక ప్రభువైన అల్లాహ్‌కే చెందుతాయి. - సూరా సాద్
38:1 ص ۚ وَالْقُرْآنِ ذِي الذِّكْرِ
సాద్. హితబోధతో నిండిన ఖుర్ఆన్ సాక్షిగా!
38:2 بَلِ الَّذِينَ كَفَرُوا فِي عِزَّةٍ وَشِقَاقٍ
అసలు (ఈ) తిరస్కారులు అహంకారానికి, మొండితనానికి లోనై ఉన్నారు.
38:3 كَمْ أَهْلَكْنَا مِن قَبْلِهِم مِّن قَرْنٍ فَنَادَوا وَّلَاتَ حِينَ مَنَاصٍ
మేము వారికి మునుపు కూడా ఎన్నో సముదాయాలను సర్వనాశనం చేశాము. మరి వారు (ఆఖరి క్షణాలలో) కేకలు పెట్టారు. కాని అది వారు తప్పించుకునే సమయం కాదు కదా!
38:4 وَعَجِبُوا أَن جَاءَهُم مُّنذِرٌ مِّنْهُمْ ۖ وَقَالَ الْكَافِرُونَ هَٰذَا سَاحِرٌ كَذَّابٌ
తమ వద్దకు హెచ్చరించేవాడొకడు స్వయంగా తమలో నుంచే వచ్చాడే! అని వారు ఆశ్చర్యపోయారు. “ఇతడొక మాంత్రికుడు, అబద్ధాలకోరు” అని అవిశ్వాసులు అన్నారు.
38:5 أَجَعَلَ الْآلِهَةَ إِلَٰهًا وَاحِدًا ۖ إِنَّ هَٰذَا لَشَيْءٌ عُجَابٌ
(వారింకా ఇలా అన్నారు) “ఏమిటి? ఇతగాడు ఇంతమంది దేముళ్ళను ఒకే ఆరాధ్య దైవంగా చేసేశాడా? నిజంగా ఇది వింతగా ఉందే!”
38:6 وَانطَلَقَ الْمَلَأُ مِنْهُمْ أَنِ امْشُوا وَاصْبِرُوا عَلَىٰ آلِهَتِكُمْ ۖ إِنَّ هَٰذَا لَشَيْءٌ يُرَادُ
వారి నాయకమన్యులు ఈ విధంగా చెబుతూ వెళ్ళిపోయారు: “పదండ్రా. మీరు మీ దేముళ్ళ (పూజాపునస్కారాల) పైనే గట్టిగా నిలబడండి. నిశ్చయంగా ఈ మాటలో (మీకు వ్యతిరేకంగా) ఏదో మర్మం ఉంది.
38:7 مَا سَمِعْنَا بِهَٰذَا فِي الْمِلَّةِ الْآخِرَةِ إِنْ هَٰذَا إِلَّا اخْتِلَاقٌ
“ఈ విషయాన్ని మేము వెనుకటి మతధర్మంలో కూడా వినలేదు. ఇదొక కల్పిత విషయం తప్ప మరేమీ కాదు.
38:8 أَأُنزِلَ عَلَيْهِ الذِّكْرُ مِن بَيْنِنَا ۚ بَلْ هُمْ فِي شَكٍّ مِّن ذِكْرِي ۖ بَل لَّمَّا يَذُوقُوا عَذَابِ
“ఏమిటీ, మనందరిలో కేవలం అతనొక్కడిపైనే దైవవాణి అవతరించిందా!?” అసలు విషయమేమిటంటే వారు నా సందేశం (వహీ) విషయంలో సంశయానికి లోనయ్యారు. అదికాదు, ఇంతవరకు వారసలు నా శిక్ష రుచి చూడలేదు.
38:9 أَمْ عِندَهُمْ خَزَائِنُ رَحْمَةِ رَبِّكَ الْعَزِيزِ الْوَهَّابِ
పోనీ వాళ్ళ దగ్గర శక్తిమంతుడు, పరమదాత అయిన నీ ప్రభువు కారుణ్య నిధులుగానీ ఉన్నాయా?
38:10 أَمْ لَهُم مُّلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا ۖ فَلْيَرْتَقُوا فِي الْأَسْبَابِ
లేదా భూమ్యాకాశాల, వాటి మధ్యనున్న సమస్త వస్తువులపై అధికారం గానీ వారి సొంతమయిందా? ఒకవేళ అయి వుంటే ఇంకేం? త్రాళ్ళు వేసి (ఆకాశానికి) ఎక్కిపోవాలి?
38:11 جُندٌ مَّا هُنَالِكَ مَهْزُومٌ مِّنَ الْأَحْزَابِ
ఇది కూడా (పెద్ద పెద్ద) సైనిక కూటములలో ఓడిపోయిన ఒక (చిన్న) సైనిక దళమే సుమా!
38:12 كَذَّبَتْ قَبْلَهُمْ قَوْمُ نُوحٍ وَعَادٌ وَفِرْعَوْنُ ذُو الْأَوْتَادِ
వీరికి మునుపు నూహ్ జాతివారు, ఆద్ వారు, మేకులు గల ఫిరౌను వారు కూడా ధిక్కరించారు.
38:13 وَثَمُودُ وَقَوْمُ لُوطٍ وَأَصْحَابُ الْأَيْكَةِ ۚ أُولَٰئِكَ الْأَحْزَابُ
సమూదువారు, లూత్ జాతివారు, అయికావారు (కూడా ధిక్కరించినవారే). వారే (పెద్ద పెద్ద) సైనిక పటాలాల వారు.
38:14 إِن كُلٌّ إِلَّا كَذَّبَ الرُّسُلَ فَحَقَّ عِقَابِ
వారిలో దైవప్రవక్తలను ధిక్కరించని వారంటూ ఎవరూ లేరు. అందువల్ల నా శిక్ష వారిపై ఖరారు అయ్యింది.
38:15 وَمَا يَنظُرُ هَٰؤُلَاءِ إِلَّا صَيْحَةً وَاحِدَةً مَّا لَهَا مِن فَوَاقٍ
వారు ఒకే ఒక్క కేక కోసం నిరీక్షిస్తున్నారు. అందులో ఎలాంటి తెరిపి కూడా ఉండదు.
38:16 وَقَالُوا رَبَّنَا عَجِّل لَّنَا قِطَّنَا قَبْلَ يَوْمِ الْحِسَابِ
“ప్రభూ! మా (మంచీచెడుల) భాగమేదో లెక్కల దినానికి ముందే మాకు ఇచ్చేయకూడదా?!” అని వారంటున్నారు.
38:17 اصْبِرْ عَلَىٰ مَا يَقُولُونَ وَاذْكُرْ عَبْدَنَا دَاوُودَ ذَا الْأَيْدِ ۖ إِنَّهُ أَوَّابٌ
(ఓ ప్రవక్తా!) వారు చెప్పే మాటలపై ఓపిక పట్టు. మా దాసుడైన దావూదు (అలైహిస్సలాం)ను జ్ఞాపకం చేసుకో! అతడు మహాశక్తిమంతుడు. నిశ్చయంగా అతను (అల్లాహ్ వైపునకు) అధికంగా మరలేవాడు.
38:18 إِنَّا سَخَّرْنَا الْجِبَالَ مَعَهُ يُسَبِّحْنَ بِالْعَشِيِّ وَالْإِشْرَاقِ
మేము పర్వతాలను అతని అదుపులోపెట్టాము. అవి అతనితో పాటే సాయంత్రం పూట, ఉదయం పూట (మా) పవిత్రతను కొనియాడేవి.
38:19 وَالطَّيْرَ مَحْشُورَةً ۖ كُلٌّ لَّهُ أَوَّابٌ
అలాగే, పక్షులను కూడా గుమిగూడిన స్థితిలో. అవన్నీ కలసి అతనితో పాటే (దైవం వైపుకు) మరలేవి.
38:20 وَشَدَدْنَا مُلْكَهُ وَآتَيْنَاهُ الْحِكْمَةَ وَفَصْلَ الْخِطَابِ
మేమతని రాజ్యవ్యవస్థను పటిష్ట పరిచాము. అతనికి వివేకాన్ని ప్రసాదించాము. (వివాదాస్పద) విషయాలపై తీర్పు చేయటం (కూడా నేర్పాము).
38:21 وَهَلْ أَتَاكَ نَبَأُ الْخَصْمِ إِذْ تَسَوَّرُوا الْمِحْرَابَ
మరి తగవుపడిన వారి సమాచారంగాని నీకు అందిందా? అప్పుడు వారు గోడదూకి (అతని) ప్రార్థనా గదిలోకి వచ్చేశారు.
38:22 إِذْ دَخَلُوا عَلَىٰ دَاوُودَ فَفَزِعَ مِنْهُمْ ۖ قَالُوا لَا تَخَفْ ۖ خَصْمَانِ بَغَىٰ بَعْضُنَا عَلَىٰ بَعْضٍ فَاحْكُم بَيْنَنَا بِالْحَقِّ وَلَا تُشْطِطْ وَاهْدِنَا إِلَىٰ سَوَاءِ الصِّرَاطِ
వారు దావూదు (అలైహిస్సలాం)ను సమీపించగానే అతను వారి పట్ల భీతి చెందాడు. వారు ఇలా విన్నవించుకున్నారు : “భయపడకండి. మేమిద్దరం తగాదా పడ్డాము. మాలో ఒకరింకొకరిపై అన్యాయానికి పాల్పడ్డారు. కాబట్టి తమరు మా ఇద్దరి మధ్య న్యాయసమ్మతంగా తీర్పుచేయండి. అన్యాయం మాత్రం చేయకండి. మాకు సరైన దారి చూపండి.
38:23 إِنَّ هَٰذَا أَخِي لَهُ تِسْعٌ وَتِسْعُونَ نَعْجَةً وَلِيَ نَعْجَةٌ وَاحِدَةٌ فَقَالَ أَكْفِلْنِيهَا وَعَزَّنِي فِي الْخِطَابِ
“ఇతను నా సోదరుడు. ఇతని దగ్గర తొంభై తొమ్మిది గొర్రెలున్నాయి. నా దగ్గర మాత్రం ఒకే ఒక్క గొర్రె ఉన్నది. అయినా ఈ ఒక్కదానిని కూడా తనకే ఇచ్చేయమని ఇతనంటున్నాడు. వాదనలో నాతో చాలా పరుషంగా వ్యవహరిస్తున్నాడు.”
38:24 قَالَ لَقَدْ ظَلَمَكَ بِسُؤَالِ نَعْجَتِكَ إِلَىٰ نِعَاجِهِ ۖ وَإِنَّ كَثِيرًا مِّنَ الْخُلَطَاءِ لَيَبْغِي بَعْضُهُمْ عَلَىٰ بَعْضٍ إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَقَلِيلٌ مَّا هُمْ ۗ وَظَنَّ دَاوُودُ أَنَّمَا فَتَنَّاهُ فَاسْتَغْفَرَ رَبَّهُ وَخَرَّ رَاكِعًا وَأَنَابَ ۩
అతను (దావూదు) ఇలా అన్నాడు: “ఇతను తన గొర్రెలతో పాటు నీ గొర్రెనొక్క దానిని కూడా కలుపుకుంటానని అడిగి నీపై అన్యాయానికి ఒడిగడుతున్నాడు. భాగస్వాములలో చాలామంది (ఇలాంటి వారే అయి ఉంటారు. వారు) ఒండొకరిపై అన్యాయానికి పాల్పడుతూ ఉంటారు. అయితే విశ్వసించి, సత్కార్యాలు చేసేవారు మాత్రం అలా చేయరు. కాని అలాంటి వారు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు.” (అంతే!) మేము అతన్ని పరీక్షిస్తున్నామన్న సంగతిని దావూదు గ్రహించాడు. మరి తన ప్రభువును క్షమాభిక్ష కోరసాగాడు. కడుదీనంగా మోకరిల్లాడు. (ఏకాగ్రతతో తన ప్రభువు వైపునకు) మరలాడు.
38:25 فَغَفَرْنَا لَهُ ذَٰلِكَ ۖ وَإِنَّ لَهُ عِندَنَا لَزُلْفَىٰ وَحُسْنَ مَآبٍ
మేము కూడా అతని (ఆ తప్పు)ని మన్నించాము. నిశ్చయంగా అతను మా వద్ద సామీప్యం పొందినవాడు, మంచి స్థానం పొందినవాడు.
38:26 يَا دَاوُودُ إِنَّا جَعَلْنَاكَ خَلِيفَةً فِي الْأَرْضِ فَاحْكُم بَيْنَ النَّاسِ بِالْحَقِّ وَلَا تَتَّبِعِ الْهَوَىٰ فَيُضِلَّكَ عَن سَبِيلِ اللَّهِ ۚ إِنَّ الَّذِينَ يَضِلُّونَ عَن سَبِيلِ اللَّهِ لَهُمْ عَذَابٌ شَدِيدٌ بِمَا نَسُوا يَوْمَ الْحِسَابِ
ఓ దావూద్! మేము నిన్ను భువిలో వారసుడి (ఖలీఫా)గా చేశాము. కనుక నువ్వు ప్రజల మధ్య సత్య (న్యాయ) బద్ధంగా తీర్పులు ఇస్తూ ఉండు. నీ మనోవాంఛలను అనుసరించకు. అన్యధా అవి నిన్ను అల్లాహ్ మార్గం నుంచి తప్పిస్తాయి. అల్లాహ్ మార్గం నుంచి తప్పిపోయిన వారికి కఠిన శిక్ష పడటం ఖాయం. ఎందుకంటే వారు లెక్కల దినాన్ని విస్మరించారు.
38:27 وَمَا خَلَقْنَا السَّمَاءَ وَالْأَرْضَ وَمَا بَيْنَهُمَا بَاطِلًا ۚ ذَٰلِكَ ظَنُّ الَّذِينَ كَفَرُوا ۚ فَوَيْلٌ لِّلَّذِينَ كَفَرُوا مِنَ النَّارِ
మేము భూమ్యాకాశాలను, వాటి మధ్యనున్న వాటిని లక్ష్య రహితంగా పుట్టించలేదు. ఇది అవిశ్వాసుల ఆలోచన మాత్రమే. కాబట్టి అవిశ్వాసులకు (నరక) అగ్ని నుండి వినాశం తప్పదు.
38:28 أَمْ نَجْعَلُ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ كَالْمُفْسِدِينَ فِي الْأَرْضِ أَمْ نَجْعَلُ الْمُتَّقِينَ كَالْفُجَّارِ
ఏమిటి? మేము విశ్వసించి, సత్కార్యాలు చేసిన వారిని భూమిలో (నిత్యం) కల్లోలం రేకెత్తించే వారితో సమానులుగా చేసేస్తామా? లేక భయభక్తులు గలవారిని పాపాత్ములతో సమానంగా చేస్తామా?
38:29 كِتَابٌ أَنزَلْنَاهُ إِلَيْكَ مُبَارَكٌ لِّيَدَّبَّرُوا آيَاتِهِ وَلِيَتَذَكَّرَ أُولُو الْأَلْبَابِ
ఇదొక శుభప్రదమైన గ్రంథం. ప్రజలు దీని వాక్యాలపై చింతన చేసేటందుకు, బుద్ధిజీవులు దీని ద్వారా గుణపాఠం నేర్చుకునేందుకు మేము దీనిని నీ వైపుకు పంపాము.
38:30 وَوَهَبْنَا لِدَاوُودَ سُلَيْمَانَ ۚ نِعْمَ الْعَبْدُ ۖ إِنَّهُ أَوَّابٌ
మేము దావూదుకు సులైమాను (అనే కొడుకు)ను ప్రసాదించాము. అతను ఎంతో మంచి దాసుడు, (నిత్యం మా వైపుకు) మరలేవాడు.
38:31 إِذْ عُرِضَ عَلَيْهِ بِالْعَشِيِّ الصَّافِنَاتُ الْجِيَادُ
అతని ముందు (ఒకనాడు) సాయం సమయాన అతివేగంగా పరుగెత్తే మేలు జాతి అశ్వాలు తేబడినప్పుడు…
38:32 فَقَالَ إِنِّي أَحْبَبْتُ حُبَّ الْخَيْرِ عَن ذِكْرِ رَبِّي حَتَّىٰ تَوَارَتْ بِالْحِجَابِ
అతనిలా అన్నాడు : “నేను నా ప్రభువు ధ్యానంపై ఈ (మేలు జాతి అశ్వ) సంపద పట్లగల మోజుకు ప్రాధాన్యతనిచ్చాను. ఈలోగా (సూర్యుడు) తెరచాటుకు వెళ్ళి పోయాడు.
38:33 رُدُّوهَا عَلَيَّ ۖ فَطَفِقَ مَسْحًا بِالسُّوقِ وَالْأَعْنَاقِ
“వాటిని మళ్లీ నా దగ్గరకు తీసుకురండి.” తరువాత (అతను) వాటి పిక్కలను, మెడలను నిమరసాగాడు.
38:34 وَلَقَدْ فَتَنَّا سُلَيْمَانَ وَأَلْقَيْنَا عَلَىٰ كُرْسِيِّهِ جَسَدًا ثُمَّ أَنَابَ
మేము సులైమానును పరీక్షించాము. అతని సింహాసనంపై ఒక దేహాన్ని పడవేశాము. తరువాత అతను (మా వైపు) మరలాడు.
38:35 قَالَ رَبِّ اغْفِرْ لِي وَهَبْ لِي مُلْكًا لَّا يَنبَغِي لِأَحَدٍ مِّن بَعْدِي ۖ إِنَّكَ أَنتَ الْوَهَّابُ
“ప్రభూ! నన్ను మన్నించు. నాకు తప్ప ఇతరులెవరివల్లా కాని సామ్రాజ్యాన్ని నాకు ప్రసాదించు. నిశ్చయంగా నీవు గొప్ప ప్రదాతవు” అని వేడుకున్నాడు.
38:36 فَسَخَّرْنَا لَهُ الرِّيحَ تَجْرِي بِأَمْرِهِ رُخَاءً حَيْثُ أَصَابَ
అందుచేత మేము గాలిని అతని అదుపాజ్ఞలలో ఉంచాము. అది అతని ఆదేశానుసారం మలయమారుతంలా (వీస్తూ) అతను కోరినచోటికల్లా చేర్చేది.
38:37 وَالشَّيَاطِينَ كُلَّ بَنَّاءٍ وَغَوَّاصٍ
(బలాఢ్యులైన) జిన్నాతులను కూడా (అతని స్వాధీనంలో ఉంచాము), అన్ని రకాల కట్టడాలు కట్టేవారిని, గజ ఈతగాళ్ళను,
38:38 وَآخَرِينَ مُقَرَّنِينَ فِي الْأَصْفَادِ
సంకెళ్ళలో బంధించబడి ఉండే ఇతర జిన్నాతులను కూడా (వశపరచాము).
38:39 هَٰذَا عَطَاؤُنَا فَامْنُنْ أَوْ أَمْسِكْ بِغَيْرِ حِسَابٍ
ఇదీ మా అనుగ్రహం! ఇక నువ్వు (ఎవరికైనా) ఉపకారం చేసినా, ఆపి ఉంచినా నీ నుండి లెక్క తీసుకోబడదు.
38:40 وَإِنَّ لَهُ عِندَنَا لَزُلْفَىٰ وَحُسْنَ مَآبٍ
అతనికి మా దగ్గర మంచి సామీప్యం ఉంది. చాలా మంచి గమ్యస్థానం కూడా.
38:41 وَاذْكُرْ عَبْدَنَا أَيُّوبَ إِذْ نَادَىٰ رَبَّهُ أَنِّي مَسَّنِيَ الشَّيْطَانُ بِنُصْبٍ وَعَذَابٍ
మా దాసుడైన అయ్యూబ్ (అలైహిస్సలాం)ను జ్ఞప్తికి తెచ్చుకో. “షైతాను నన్ను దుఃఖానికి, బాధకు లోను చేశాడు” అని అతను తన ప్రభువుకు మొరపెట్టుకున్నప్పుడు,
38:42 ارْكُضْ بِرِجْلِكَ ۖ هَٰذَا مُغْتَسَلٌ بَارِدٌ وَشَرَابٌ
“నీ కాలిని (నేలకేసి) కొట్టు. ఇది స్నానం చేయటానికి, త్రాగటానికి చల్లని నీరు” (అని మేము సూచించాము).
38:43 وَوَهَبْنَا لَهُ أَهْلَهُ وَمِثْلَهُم مَّعَهُمْ رَحْمَةً مِّنَّا وَذِكْرَىٰ لِأُولِي الْأَلْبَابِ
మరి మేమతనికి, అతని పరివారాన్నంతటినీ (తిరిగి) ప్రసాదించాము. వారితో పాటు మరి అంతమందిని కూడా మా (ప్రత్యేక) కృపతో అనుగ్రహించాము – విజ్ఞులకు గుణపాఠం కాగలిగేందుకు!
38:44 وَخُذْ بِيَدِكَ ضِغْثًا فَاضْرِب بِّهِ وَلَا تَحْنَثْ ۗ إِنَّا وَجَدْنَاهُ صَابِرًا ۚ نِّعْمَ الْعَبْدُ ۖ إِنَّهُ أَوَّابٌ
“గడ్డిపరకల కట్టను చేత్తో పట్టుకుని కొట్టు. ప్రమాణ భంగానికి పాల్పడకు” (అని మేమతనికి సెలవిచ్చాము). వాస్తవానికి మేమతన్ని సహనశీలునిగా పొందాము. నిశ్చయంగా అతను మంచి దాసుడు, (ప్రభువు వైపు) అమితంగా మరలేవాడు.
38:45 وَاذْكُرْ عِبَادَنَا إِبْرَاهِيمَ وَإِسْحَاقَ وَيَعْقُوبَ أُولِي الْأَيْدِي وَالْأَبْصَارِ
ఇంకా మా దాసులైన ఇబ్రాహీము, ఇస్హాఖు, యాఖూబు (అలైహిముస్సలాం) లను కూడా జ్ఞాపకం చేసుకో. వారు చేతులు గలవారు, కళ్లుగలవారు.
38:46 إِنَّا أَخْلَصْنَاهُم بِخَالِصَةٍ ذِكْرَى الدَّارِ
మేము వారిని ఒకానొక ప్రత్యేక విషయానికై – అంటే పరలోక స్మరణ నిమిత్తం – ప్రత్యేకించాము.
38:47 وَإِنَّهُمْ عِندَنَا لَمِنَ الْمُصْطَفَيْنَ الْأَخْيَارِ
వారంతా మా వద్ద ఎన్నుకోబడినవారు, ఉత్తములు.
38:48 وَاذْكُرْ إِسْمَاعِيلَ وَالْيَسَعَ وَذَا الْكِفْلِ ۖ وَكُلٌّ مِّنَ الْأَخْيَارِ
ఇస్మాయీల్, యసా, జుల్ కిఫ్ల్ (అలైహిముస్సలాం) లను కూడా జ్ఞాపకం చేసుకో. వారంతా ఉత్తముల సమూహానికి చెందినవారు.
38:49 هَٰذَا ذِكْرٌ ۚ وَإِنَّ لِلْمُتَّقِينَ لَحُسْنَ مَآبٍ
ఇదొక ఉపదేశం. నిశ్చయంగా భక్తి పరాయణుల కోసం చాలా మంచి నివాసముంటుంది.
38:50 جَنَّاتِ عَدْنٍ مُّفَتَّحَةً لَّهُمُ الْأَبْوَابُ
శాశ్వితమైన స్వర్గవనాలున్నాయి. వాటి ద్వారాలు వారికోసం తెరువబడి ఉన్నాయి.
38:51 مُتَّكِئِينَ فِيهَا يَدْعُونَ فِيهَا بِفَاكِهَةٍ كَثِيرَةٍ وَشَرَابٍ
వాటిలో వారు నిక్షేపంగా దిండ్లకు ఆనుకుని, బోలెడు పండ్లను, పానీయాలను తెప్పించుకుంటూ ఉంటారు.
38:52 وَعِندَهُمْ قَاصِرَاتُ الطَّرْفِ أَتْرَابٌ
వారి దగ్గర చూపులు క్రిందికి వాలి ఉండే సమవయస్కులైన సుందరీమణులుంటారు.
38:53 هَٰذَا مَا تُوعَدُونَ لِيَوْمِ الْحِسَابِ
ఇదీ లెక్కల దినానికి సంబంధించి మీతో చేయబడిన వాగ్దానం.
38:54 إِنَّ هَٰذَا لَرِزْقُنَا مَا لَهُ مِن نَّفَادٍ
ఇదీ మా ప్రసాదిత ఉపాధి! దీనికి అంతం అంటూ ఉండదు.
38:55 هَٰذَا ۚ وَإِنَّ لِلطَّاغِينَ لَشَرَّ مَآبٍ
ఇదీ (పుణ్యఫలం) సంగతి. మరి తలబిరుసుల కొరకు చాలా చెడ్డ నివాసం ఉంది.
38:56 جَهَنَّمَ يَصْلَوْنَهَا فَبِئْسَ الْمِهَادُ
(అది) నరకం – దానికి వారు ఆహుతి అవుతారు. (ఆహ్!) ఎంతచెడ్డ పాన్పు అది!
38:57 هَٰذَا فَلْيَذُوقُوهُ حَمِيمٌ وَغَسَّاقٌ
ఇదీ (వారి గతి)! దాన్ని వారు రుచి చూడాలి. మరిగే నీళ్లు, చీము నెత్తురు,
38:58 وَآخَرُ مِن شَكْلِهِ أَزْوَاجٌ
అదిగాకుండా, అలాంటివే రకరకాల శిక్షలు ఉంటాయి.
38:59 هَٰذَا فَوْجٌ مُّقْتَحِمٌ مَّعَكُمْ ۖ لَا مَرْحَبًا بِهِمْ ۚ إِنَّهُمْ صَالُو النَّارِ
ఇదిగో! మీతోపాటే (నరకానికి) ఆహుతి అయ్యే మరో జట్టు వచ్చింది. వారి కొరకు ఎలాంటి స్వాగత సన్నాహాలు లేవు. వారు అగ్నికి ఆహుతి కానున్నారు.
38:60 قَالُوا بَلْ أَنتُمْ لَا مَرْحَبًا بِكُمْ ۖ أَنتُمْ قَدَّمْتُمُوهُ لَنَا ۖ فَبِئْسَ الْقَرَارُ
వారు (తమను పెడత్రోవ పట్టించిన నాయకులను ఉద్దేశించి) ఇలా అంటారు: “కాదు. అసలు స్వాగతానికి నోచుకోనిది మీరే. దీనిని మా ముందు తెచ్చి పెట్టింది కూడా మీరే కదా! కాబట్టి ఉండటానికి బహుచెడ్డ స్థలమే ఉంది.”
38:61 قَالُوا رَبَّنَا مَن قَدَّمَ لَنَا هَٰذَا فَزِدْهُ عَذَابًا ضِعْفًا فِي النَّارِ
వారు (అనుచరులు ఇంకా) ఇలా అంటారు : “మా ప్రభూ! మా కొరకు ముందు నుంచే (అవిశ్వాస పోకడను) తీసినవారికి నరకయాతనను రెండింతలు చేయి.”
38:62 وَقَالُوا مَا لَنَا لَا نَرَىٰ رِجَالًا كُنَّا نَعُدُّهُم مِّنَ الْأَشْرَارِ
వారు (ఇంకా) ఇలా అంటారు : “మనం దుష్టజనులుగా జమ కట్టినవారు మనకిక్కడ కనిపించటం లేదేమిటి?
38:63 أَتَّخَذْنَاهُمْ سِخْرِيًّا أَمْ زَاغَتْ عَنْهُمُ الْأَبْصَارُ
“ఏమిటీ, మనమే వాళ్లను ఆట పట్టించామా? లేక మన చూపులు వారి నుంచి తొలగిపోయాయా?”
38:64 إِنَّ ذَٰلِكَ لَحَقٌّ تَخَاصُمُ أَهْلِ النَّارِ
నరకవాసుల మధ్య ఈ రకమయిన ఘర్షణ తప్పకుండా జరిగి తీరుతుంది.
38:65 قُلْ إِنَّمَا أَنَا مُنذِرٌ ۖ وَمَا مِنْ إِلَٰهٍ إِلَّا اللَّهُ الْوَاحِدُ الْقَهَّارُ
(ఓ ప్రవక్తా!) వారికిలా చెప్పు : “నేనైతే హెచ్చరించేవాణ్ణి మాత్రమే. ఒక్కడు, తిరుగులేనివాడు అయిన అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు.
38:66 رَبُّ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا الْعَزِيزُ الْغَفَّارُ
“ఆయన భూమ్యాకాశాలకు, వాటి మధ్యనున్న సమస్తానికీ ప్రభువు. ఆయన శక్తిశాలి, క్షమాశీలి.”
38:67 قُلْ هُوَ نَبَأٌ عَظِيمٌ
(ఇంకా ఇలా) చెప్పు: “అది చాలా గొప్ప విషయం.
38:68 أَنتُمْ عَنْهُ مُعْرِضُونَ
“కాని మీరు దాన్ని లక్ష్యపెట్టడం లేదు.
38:69 مَا كَانَ لِيَ مِنْ عِلْمٍ بِالْمَلَإِ الْأَعْلَىٰ إِذْ يَخْتَصِمُونَ
“ఊర్ధ్వలోక సదస్సులో తలెత్తిన వివాదం గురించి నాకేమీ తెలీదు.
38:70 إِن يُوحَىٰ إِلَيَّ إِلَّا أَنَّمَا أَنَا نَذِيرٌ مُّبِينٌ
“నేను స్పష్టంగా హెచ్చరించేవాణ్ణి మాత్రమే అన్న సందేశమే నా వద్దకు వస్తుంది.”
38:71 إِذْ قَالَ رَبُّكَ لِلْمَلَائِكَةِ إِنِّي خَالِقٌ بَشَرًا مِّن طِينٍ
నీ ప్రభువు దైవదూతలతో, “నేను మట్టితో ఒక మనిషిని సృష్టించబోతున్నాను” అని అన్నాడు.
38:72 فَإِذَا سَوَّيْتُهُ وَنَفَخْتُ فِيهِ مِن رُّوحِي فَقَعُوا لَهُ سَاجِدِينَ
“నేనతన్ని (సంపూర్ణంగా) తీర్చిదిద్ది, అతనిలో నా ఆత్మను ఊదినప్పుడు, మీరంతా అతనికి సాష్టాంగ ప్రణామం చేయాలి” (అన్నాడు).
38:73 فَسَجَدَ الْمَلَائِكَةُ كُلُّهُمْ أَجْمَعُونَ
అప్పుడు దైవదూతలంతా (ఆదంకు) సాష్టాంగపడ్డారు.
38:74 إِلَّا إِبْلِيسَ اسْتَكْبَرَ وَكَانَ مِنَ الْكَافِرِينَ
ఇబ్లీసు తప్ప! (అతను మాత్రం సాష్టాంగపడలేదు) వాడు గర్వం ప్రదర్శించి, తిరస్కారుల కోవలో చేరాడు.
38:75 قَالَ يَا إِبْلِيسُ مَا مَنَعَكَ أَن تَسْجُدَ لِمَا خَلَقْتُ بِيَدَيَّ ۖ أَسْتَكْبَرْتَ أَمْ كُنتَ مِنَ الْعَالِينَ
“ఓ ఇబ్లీస్! నేను నా స్వహస్తాలతో సృష్టించిన వానిముందు సాష్టాంగపడకుండా ఏ విషయం నిన్ను ఆపింది? నువ్వు గర్వపడుతున్నావా? లేక నువ్వు ఉన్నత శ్రేణికి చెందినవాడివా?” అని (అల్లాహ్) అడిగితే,
38:76 قَالَ أَنَا خَيْرٌ مِّنْهُ ۖ خَلَقْتَنِي مِن نَّارٍ وَخَلَقْتَهُ مِن طِينٍ
“నేను అతనికంటే ఘనుడను. (ఎందుకంటే) నీవు నన్ను అగ్నితో సృష్టించావు. అతన్నేమో మట్టితో సృష్టించావు” అని వాడు సమాధానమిచ్చాడు.
38:77 قَالَ فَاخْرُجْ مِنْهَا فَإِنَّكَ رَجِيمٌ
(అప్పుడు అల్లాహ్ ఈ విధంగా) సెలవిచ్చాడు : “నువ్విక్కణ్ణుంచి వెళ్ళిపో. నువ్వు ధూత్కరించబడ్డావు.
38:78 وَإِنَّ عَلَيْكَ لَعْنَتِي إِلَىٰ يَوْمِ الدِّينِ
“తీర్పుదినం వరకూ నీపై నా శాపం ఉంటుంది.”
38:79 قَالَ رَبِّ فَأَنظِرْنِي إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ
“ప్రభూ! అలాగయితే వారు తిరిగి లేపబడే రోజు వరకూ నాకు గడువు ఇవ్వు” అని (ఇబ్లీసు) విన్నవించుకోగా,
38:80 قَالَ فَإِنَّكَ مِنَ الْمُنظَرِينَ
“నీకు గడువు ఇవ్వబడింది” అని (అల్లాహ్) సెలవిచ్చాడు.
38:81 إِلَىٰ يَوْمِ الْوَقْتِ الْمَعْلُومِ
“సమయం నిర్ధారించబడివున్న రోజు వరకే” (అన్నాడు).
38:82 قَالَ فَبِعِزَّتِكَ لَأُغْوِيَنَّهُمْ أَجْمَعِينَ
ఇబ్లీసు పలికాడు: “మరయితే నీ గౌరవమర్యాదల సాక్షిగా (చెబుతున్నాను) – అందరినీ నేను పెడదారి పట్టిస్తాను.”
38:83 إِلَّا عِبَادَكَ مِنْهُمُ الْمُخْلَصِينَ
“ఎంపిక కాబడిన కొంతమంది నీ దాసులను తప్ప!” (అని అన్నాడు).
38:84 قَالَ فَالْحَقُّ وَالْحَقَّ أَقُولُ
“సరే! సత్యం మాత్రం ఇదే! నేను సత్యమే పలుకుతాను” అని అల్లాహ్ అన్నాడు.
38:85 لَأَمْلَأَنَّ جَهَنَّمَ مِنكَ وَمِمَّن تَبِعَكَ مِنْهُمْ أَجْمَعِينَ
“(అదేమిటంటే) నీతోనూ, నిన్ను అనుసరించే వారందరితోనూ నేను నరకాన్ని నింపుతాను” (అని చెప్పాడు).
38:86 قُلْ مَا أَسْأَلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ وَمَا أَنَا مِنَ الْمُتَكَلِّفِينَ
(ఓ ముహమ్మద్!) వారికి చెప్పు : “నేను ఈ పనికిగాను మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్నీ అడగటంలేదు. ఇంకా – నేను మభ్యపెట్టేవాడిని కూడా కాను.
38:87 إِنْ هُوَ إِلَّا ذِكْرٌ لِّلْعَالَمِينَ
-“ఇది లోకవాసులందరి కోసం ఆసాంతం ఒక జ్ఞాపిక (హితబోధ).
38:88 وَلَتَعْلَمُنَّ نَبَأَهُ بَعْدَ حِينٍ
“దీని వాస్తవికతను మీరు అనతికాలంలోనే (క్షుణ్ణంగా) తెలుసుకుంటారు.” - సూరా అజ్ జుమర్
39:1 تَنزِيلُ الْكِتَابِ مِنَ اللَّهِ الْعَزِيزِ الْحَكِيمِ
ఈ గ్రంథావతరణ సర్వాధిక్యుడైన, వివేకవంతుడైన అల్లాహ్ తరఫున జరిగింది.
39:2 إِنَّا أَنزَلْنَا إِلَيْكَ الْكِتَابَ بِالْحَقِّ فَاعْبُدِ اللَّهَ مُخْلِصًا لَّهُ الدِّينَ
(ఓ ముహమ్మద్ – సఅసం!) మేమీ గ్రంథాన్ని సత్యబద్ధంగా నీ వైపుకు పంపాము. కాబట్టి నువ్వు అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించు – ధర్మాన్ని ఆయనకు మాత్రమే ప్రత్యేకిస్తూ!
39:3 أَلَا لِلَّهِ الدِّينُ الْخَالِصُ ۚ وَالَّذِينَ اتَّخَذُوا مِن دُونِهِ أَوْلِيَاءَ مَا نَعْبُدُهُمْ إِلَّا لِيُقَرِّبُونَا إِلَى اللَّهِ زُلْفَىٰ إِنَّ اللَّهَ يَحْكُمُ بَيْنَهُمْ فِي مَا هُمْ فِيهِ يَخْتَلِفُونَ ۗ إِنَّ اللَّهَ لَا يَهْدِي مَنْ هُوَ كَاذِبٌ كَفَّارٌ
జాగ్రత్త! నిష్కల్మషమైన ఆరాధన మాత్రమే అల్లాహ్‌కు చెందుతుంది. ఎవరయితే అల్లాహ్‌ను గాకుండా ఇతరులను సంరక్షకులుగా ఆశ్రయించారో వారు, “ఈ పెద్దలు మమ్మల్ని అల్లాహ్ సాన్నిధ్యానికి చేర్చటంలో తోడ్పడతారని భావించి మాత్రమే మేము వీళ్లను ఆరాధిస్తున్నామ”ని అంటారు. ఏ విషయం గురించి వారు భేదాభిప్రాయానికి లోనై ఉన్నారో దానికి సంబంధించిన (అసలు) తీర్పు అల్లాహ్ (స్వయంగా) చేస్తాడు. అబద్ధాలకోరులకు, కృతఘ్నులకు అల్లాహ్ ఎట్టి పరిస్థితిలోనూ సన్మార్గం చూపడు.
39:4 لَّوْ أَرَادَ اللَّهُ أَن يَتَّخِذَ وَلَدًا لَّاصْطَفَىٰ مِمَّا يَخْلُقُ مَا يَشَاءُ ۚ سُبْحَانَهُ ۖ هُوَ اللَّهُ الْوَاحِدُ الْقَهَّارُ
అల్లాహ్ (ఎవరినయినా) సంతానంగా చేసుకోదలచుకుంటే, తన సృష్టితాలలో తాను కోరిన వారిని ఎన్నుకుని ఉండేవాడు. (కాని) ఆయన పరమ పవిత్రుడు. ఆ అల్లాహ్ ఒకే ఒక్కడు, తిరుగులేనివాడు.
39:5 خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ بِالْحَقِّ ۖ يُكَوِّرُ اللَّيْلَ عَلَى النَّهَارِ وَيُكَوِّرُ النَّهَارَ عَلَى اللَّيْلِ ۖ وَسَخَّرَ الشَّمْسَ وَالْقَمَرَ ۖ كُلٌّ يَجْرِي لِأَجَلٍ مُّسَمًّى ۗ أَلَا هُوَ الْعَزِيزُ الْغَفَّارُ
ఆయన ఆకాశాలను, భూమిని సత్యబద్ధంగా నిర్మించాడు. ఆయన రాత్రిని పగటిపై, పగటిని రాత్రిపై చుట్టివేస్తున్నాడు. సూర్యచంద్రులను కార్యబద్ధుల్ని చేశాడు. (వాటిలో) ప్రతిదీ నిర్ణీత సమయం వరకు సంచరిస్తూ ఉంది. ఆయనే అపార శక్తిమంతుడు, పాపాలను క్షమించేవాడు అని తెలుసుకోండి!
39:6 خَلَقَكُم مِّن نَّفْسٍ وَاحِدَةٍ ثُمَّ جَعَلَ مِنْهَا زَوْجَهَا وَأَنزَلَ لَكُم مِّنَ الْأَنْعَامِ ثَمَانِيَةَ أَزْوَاجٍ ۚ يَخْلُقُكُمْ فِي بُطُونِ أُمَّهَاتِكُمْ خَلْقًا مِّن بَعْدِ خَلْقٍ فِي ظُلُمَاتٍ ثَلَاثٍ ۚ ذَٰلِكُمُ اللَّهُ رَبُّكُمْ لَهُ الْمُلْكُ ۖ لَا إِلَٰهَ إِلَّا هُوَ ۖ فَأَنَّىٰ تُصْرَفُونَ
ఆయన మిమ్మల్నందరినీ ఒకే ప్రాణి నుండి పుట్టించాడు. మరి దాంతోనే దాని జతను కూడా చేశాడు. ఇంకా మీ కోసం పశువులలో ఎనిమిది (రకాల) పెంటి – పోతులను అవతరింపజేశాడు. ఆయన మిమ్మల్ని, మీ మాతృగర్భాలలో – మూడేసి చీకట్లలో – ఒకదాని తరువాత ఒకటిగా రూపకల్పన చేస్తున్నాడు. ఈ అల్లాహ్‌యే మీ ప్రభువు. రాజ్యాధికారం ఆయనదే. ఆయన తప్ప మరో ఆరాధ్య దేవుడు లేడు. మరలాంటప్పుడు మీరు ఎటు తిరిగిపోతున్నారు?
39:7 إِن تَكْفُرُوا فَإِنَّ اللَّهَ غَنِيٌّ عَنكُمْ ۖ وَلَا يَرْضَىٰ لِعِبَادِهِ الْكُفْرَ ۖ وَإِن تَشْكُرُوا يَرْضَهُ لَكُمْ ۗ وَلَا تَزِرُ وَازِرَةٌ وِزْرَ أُخْرَىٰ ۗ ثُمَّ إِلَىٰ رَبِّكُم مَّرْجِعُكُمْ فَيُنَبِّئُكُم بِمَا كُنتُمْ تَعْمَلُونَ ۚ إِنَّهُ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ
ఒకవేళ మీరు తిరస్కార వైఖరిని అవలంబించినట్లయితే అల్లాహ్‌కు మీ అవసరం ఎంతమాత్రం లేదు (అన్న విషయాన్ని తెలుసుకోండి). తన దాసుల కృతఘ్నతా ధోరణిని ఆయన ఇష్టపడడు. మీరు గనక కృతజ్ఞతాపూర్వకంగా మసలుకుంటే, దాన్ని ఆయన మీ కోసం ఇష్టపడతాడు. బరువును మోసే వాడెవడూ ఇంకొకరి బరువును మోయడు. మరి మీరంతా మరలి పోవలసింది మీ ప్రభువు వైపునకే. మీరు చేస్తూ ఉన్న కర్మలను ఆయన మీకు తెలియపరుస్తాడు. ఆయన ఆంతర్యాల్లోని విషయాన్ని సయితం ఎరిగినవాడు.
39:8 وَإِذَا مَسَّ الْإِنسَانَ ضُرٌّ دَعَا رَبَّهُ مُنِيبًا إِلَيْهِ ثُمَّ إِذَا خَوَّلَهُ نِعْمَةً مِّنْهُ نَسِيَ مَا كَانَ يَدْعُو إِلَيْهِ مِن قَبْلُ وَجَعَلَ لِلَّهِ أَندَادًا لِّيُضِلَّ عَن سَبِيلِهِ ۚ قُلْ تَمَتَّعْ بِكُفْرِكَ قَلِيلًا ۖ إِنَّكَ مِنْ أَصْحَابِ النَّارِ
మనిషికి ఎప్పుడైనా, ఏదైనా ఆపద వచ్చిపడితే తన ప్రభువు వైపుకు మరలి ఆయన్ని(అదేపనిగా) మొరపెట్టుకుంటాడు. మరి అల్లాహ్ అతనికి తన వద్ద నుంచి అనుగ్రహాన్ని ప్రసాదిస్తే అంతకు మునుపు అతను దేనికోసం (కడుదీనంగా) మొరపెట్టుకున్నాడో దాన్ని మరచిపోతాడు. అల్లాహ్ మార్గం నుంచి (ఇతరుల్ని కూడా) పెడత్రోవ పట్టించడానికి అల్లాహ్‌కు భాగస్వాముల్ని కల్పించటం మొదలెడతాడు. (ఓ ప్రవక్తా!) ఇలా చెప్పు : “నీ తిరస్కార వైఖరి లాభాలను కొన్నాళ్ళపాటు అనుభవించు. తుదకు నువ్వు నరక వాసులలో చేరేవాడివే.”
39:9 أَمَّنْ هُوَ قَانِتٌ آنَاءَ اللَّيْلِ سَاجِدًا وَقَائِمًا يَحْذَرُ الْآخِرَةَ وَيَرْجُو رَحْمَةَ رَبِّهِ ۗ قُلْ هَلْ يَسْتَوِي الَّذِينَ يَعْلَمُونَ وَالَّذِينَ لَا يَعْلَمُونَ ۗ إِنَّمَا يَتَذَكَّرُ أُولُو الْأَلْبَابِ
ఏమిటి, ఏ వ్యక్తి అయితే రాత్రి వేళల్లో సాష్టాంగప్రణామం చేస్తూ, దైవారాధనలో నిలబడుతున్నాడో, పరలోకానికి భయపడుతూ, తన ప్రభువు కారుణ్యాన్ని ఆశిస్తున్నాడో అతను (మరియు దానికి విరుద్ధంగా ప్రవర్తించేవాడు – ఇద్దరూ సమానులు కాగలరా?). చెప్పండి – తెలిసినవారు, తెలియనివారు ఒక్కటేనా? బుద్ధిమంతులు మాత్రమే ఉపదేశాన్ని గ్రహిస్తారు.
39:10 قُلْ يَا عِبَادِ الَّذِينَ آمَنُوا اتَّقُوا رَبَّكُمْ ۚ لِلَّذِينَ أَحْسَنُوا فِي هَٰذِهِ الدُّنْيَا حَسَنَةٌ ۗ وَأَرْضُ اللَّهِ وَاسِعَةٌ ۗ إِنَّمَا يُوَفَّى الصَّابِرُونَ أَجْرَهُم بِغَيْرِ حِسَابٍ
(ఓ ప్రవక్తా!) ఇలా చెప్పు : “విశ్వసించిన ఓ నా దాసులారా! మీ ప్రభువుకు భయపడుతూ ఉండండి. ఈ లోకంలో సత్కర్మలు చేసినవారికి మేలు జరుగుతుంది. అల్లాహ్ భూమి ఎంతో విశాలమైనది. సహనం వహించేవారికి లెక్కలేనంత పుణ్యఫలం ప్రసాదించబడుతుంది.”
39:11 قُلْ إِنِّي أُمِرْتُ أَنْ أَعْبُدَ اللَّهَ مُخْلِصًا لَّهُ الدِّينَ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “ఆరాధనను అల్లాహ్‌కే ప్రత్యేకించి ఆయన్ని మాత్రమే ఆరాధించాలని నాకు ఆజ్ఞాపించబడింది.”
39:12 وَأُمِرْتُ لِأَنْ أَكُونَ أَوَّلَ الْمُسْلِمِينَ
“ఆజ్ఞను శిరసావహించే వారిలో నేను తొలివాణ్ణి కావాలని కూడా నాకు ఆజ్ఞాపించబడింది.”
39:13 قُلْ إِنِّي أَخَافُ إِنْ عَصَيْتُ رَبِّي عَذَابَ يَوْمٍ عَظِيمٍ
“నేను గనక నా ప్రభువుకు అవిధేయత చూపినట్లయితే, ఆ మహాదినాన పడే శిక్షను గురించి భయపడుతున్నాను” అని కూడా చెప్పు.
39:14 قُلِ اللَّهَ أَعْبُدُ مُخْلِصًا لَّهُ دِينِي
ఇలా చెప్పు: “నేను మాత్రం నా దాస్యాన్ని అల్లాహ్‌కే ప్రత్యేకించి, ఆయన్నే ఆరాధిస్తాను.
39:15 فَاعْبُدُوا مَا شِئْتُم مِّن دُونِهِ ۗ قُلْ إِنَّ الْخَاسِرِينَ الَّذِينَ خَسِرُوا أَنفُسَهُمْ وَأَهْلِيهِمْ يَوْمَ الْقِيَامَةِ ۗ أَلَا ذَٰلِكَ هُوَ الْخُسْرَانُ الْمُبِينُ
“మీరు ఆయన్ని వదలి ఎవరెవరిని పూజించదలుస్తున్నారో పూజించుకోండి.” ఇంకా ఇలా చెప్పు: “ప్రళయదినాన తాము నష్టపోయినదిగాక, తమ పరివారానికి కూడా నష్టం చేకూర్చినవారే పూర్తిగా నష్టపోయినవారు. బాగా వినండి! ఘోరమైన నష్టం ఇదే.”
39:16 لَهُم مِّن فَوْقِهِمْ ظُلَلٌ مِّنَ النَّارِ وَمِن تَحْتِهِمْ ظُلَلٌ ۚ ذَٰلِكَ يُخَوِّفُ اللَّهُ بِهِ عِبَادَهُ ۚ يَا عِبَادِ فَاتَّقُونِ
వారిని పైనుంచీ, క్రిందినుంచీ అగ్ని మేఘాలు (జ్వాలలు) ఆవరిస్తూ ఉంటాయి. వాటి (యాతన) గురించి అల్లాహ్ తన దాసులను భయపెడుతున్నాడు. “ఓ నా దాసులారా! అందుకే నాకు భయపడండి.”
39:17 وَالَّذِينَ اجْتَنَبُوا الطَّاغُوتَ أَن يَعْبُدُوهَا وَأَنَابُوا إِلَى اللَّهِ لَهُمُ الْبُشْرَىٰ ۚ فَبَشِّرْ عِبَادِ
మరెవరయితే తాగూత్ (షైతాన్) దాస్యానికి దూరంగా ఉన్నారో, (సంపూర్తిగా) అల్లాహ్ వైపునకు మరలారో, వారు శుభవార్తకు అర్హులు. కనుక (అటువంటి) నా దాసులకు (ఓ ముహమ్మద్!) శుభవార్తను వినిపించు.
39:18 الَّذِينَ يَسْتَمِعُونَ الْقَوْلَ فَيَتَّبِعُونَ أَحْسَنَهُ ۚ أُولَٰئِكَ الَّذِينَ هَدَاهُمُ اللَّهُ ۖ وَأُولَٰئِكَ هُمْ أُولُو الْأَلْبَابِ
వారు మాటను శ్రద్ధగా వింటారు. అందులోని మంచి విషయాన్ని ఖచ్చితంగా అనుసరిస్తారు. అల్లాహ్ సన్మార్గం చూపినది వారికే. బుద్ధికలవారు కూడా వారే.
39:19 أَفَمَنْ حَقَّ عَلَيْهِ كَلِمَةُ الْعَذَابِ أَفَأَنتَ تُنقِذُ مَن فِي النَّارِ
ఏ వ్యక్తికి వ్యతిరేకంగా శిక్షా వాక్కు ఖరారైపోయిందో, అగ్నికి ఆహుతి అయిపోయిన (అటువంటి) వాణ్ణి నువ్వు బయటికి తీయగలవా?
39:20 لَٰكِنِ الَّذِينَ اتَّقَوْا رَبَّهُمْ لَهُمْ غُرَفٌ مِّن فَوْقِهَا غُرَفٌ مَّبْنِيَّةٌ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ ۖ وَعْدَ اللَّهِ ۖ لَا يُخْلِفُ اللَّهُ الْمِيعَادَ
అయితే తమ ప్రభువుకు భయపడుతూ ఉండేవారికోసం (అంతస్తులుగా కట్టబడిన) మేడలున్నాయి. వాటిపై (మరిన్ని) అంతస్తులు నిర్మించబడి ఉన్నాయి. మరి వాటి క్రింద కాలువలు ప్రవహిస్తూ ఉన్నాయి. అల్లాహ్ వాగ్దానం ఇది. అల్లాహ్ తన వాగ్దానానికి విరుద్ధంగా చేయడు.
39:21 أَلَمْ تَرَ أَنَّ اللَّهَ أَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَسَلَكَهُ يَنَابِيعَ فِي الْأَرْضِ ثُمَّ يُخْرِجُ بِهِ زَرْعًا مُّخْتَلِفًا أَلْوَانُهُ ثُمَّ يَهِيجُ فَتَرَاهُ مُصْفَرًّا ثُمَّ يَجْعَلُهُ حُطَامًا ۚ إِنَّ فِي ذَٰلِكَ لَذِكْرَىٰ لِأُولِي الْأَلْبَابِ
ఏమిటి, నువ్వు చూడలేదా? – అల్లాహ్ ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి, దాన్ని భూగర్భంలోని ఊటలలోనికి చేరుస్తున్నాడు. మరి దాని ద్వారా రకరకాల పంటల్ని ఉత్పన్నం చేస్తున్నాడు. మరి అవి ఎండిపోతాయి. అప్పుడు నువ్వు వాటిని పసుపు రంగులో చూస్తావు. తరువాత వాటిని పొట్టుపొట్టుగా చేసేస్తాడు. విజ్ఞుల కోసం ఇందులో మహోపదేశం ఉంది.
39:22 أَفَمَن شَرَحَ اللَّهُ صَدْرَهُ لِلْإِسْلَامِ فَهُوَ عَلَىٰ نُورٍ مِّن رَّبِّهِ ۚ فَوَيْلٌ لِّلْقَاسِيَةِ قُلُوبُهُم مِّن ذِكْرِ اللَّهِ ۚ أُولَٰئِكَ فِي ضَلَالٍ مُّبِينٍ
ఏ వ్యక్తి హృదయాన్ని అల్లాహ్ ఇస్లాం కోసం విప్పాడో, (అతను గుణపాఠం నేర్చుకోని వ్యక్తిలాంటివాడు కాగలడా?) అతడు తన ప్రభువు తరఫు నుంచి వచ్చిన కాంతిపై ఉన్నాడు. అల్లాహ్ స్మరణ పట్ల ఎవరి హృదయాలు (మెత్తబడకుండా) కరకుగా మారాయో వారికి వినాశం తప్పదు. వారు స్పష్టమైన మార్గభ్రష్టతకు గురై ఉన్నారు.
39:23 اللَّهُ نَزَّلَ أَحْسَنَ الْحَدِيثِ كِتَابًا مُّتَشَابِهًا مَّثَانِيَ تَقْشَعِرُّ مِنْهُ جُلُودُ الَّذِينَ يَخْشَوْنَ رَبَّهُمْ ثُمَّ تَلِينُ جُلُودُهُمْ وَقُلُوبُهُمْ إِلَىٰ ذِكْرِ اللَّهِ ۚ ذَٰلِكَ هُدَى اللَّهِ يَهْدِي بِهِ مَن يَشَاءُ ۚ وَمَن يُضْلِلِ اللَّهُ فَمَا لَهُ مِنْ هَادٍ
అల్లాహ్ అత్యుత్తమమైన విషయాన్ని అవతరింపజేశాడు. అది పరస్పరం పోలిక కలిగి ఉండే, పదేపదే పునరావృతం అవుతూ ఉండే ఆయతులతో కూడిన గ్రంథం రూపంలో ఉంది. దాని వల్ల తమ ప్రభువుకు భయపడేవారి శరీరాలపై రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆ తరువాత వారి శరీరాలు, హృదయాలు అల్లాహ్ స్మరణపట్ల మెత్తబడి పోతాయి. ఇదీ అల్లాహ్ మార్గదర్శకత్వం. దాని ద్వారా ఆయన తాను కోరిన వారిని సన్మార్గానికి తెస్తాడు. మరి అల్లాహ్ ఎవరిని మార్గం నుండి తప్పిస్తాడో అతనికి మార్గం చూపేవాడెవడూ ఉండడు.
39:24 أَفَمَن يَتَّقِي بِوَجْهِهِ سُوءَ الْعَذَابِ يَوْمَ الْقِيَامَةِ ۚ وَقِيلَ لِلظَّالِمِينَ ذُوقُوا مَا كُنتُمْ تَكْسِبُونَ
ఎవరయితే ప్రళయదినాన దుర్భరమైన శిక్ష పడకుండా తన ముఖాన్ని డాలుగా పెట్టుకుంటాడో (అతను ప్రళయదినాన నిశ్చింతగా ఉండేవానితో సమానం కాగలడా?) “మీరు సంపాదించుకున్న దాని రుచిని చూడండి” అని ఆ దుర్మార్గులతో అనబడుతుంది.
39:25 كَذَّبَ الَّذِينَ مِن قَبْلِهِمْ فَأَتَاهُمُ الْعَذَابُ مِنْ حَيْثُ لَا يَشْعُرُونَ
వారి పూర్వీకులు (కూడా) ధిక్కరించారు. మరి వారిపై వారు ఊహించనైనా లేని చోటునుంచి శిక్ష వచ్చిపడింది.
39:26 فَأَذَاقَهُمُ اللَّهُ الْخِزْيَ فِي الْحَيَاةِ الدُّنْيَا ۖ وَلَعَذَابُ الْآخِرَةِ أَكْبَرُ ۚ لَوْ كَانُوا يَعْلَمُونَ
అల్లాహ్ ప్రాపంచిక జీవితంలోనే వారికి అవమానం రుచి చూపించాడు. పరలోక యాతనైతే ఇంతకన్నా ఎంతో పెద్దది. ఈ సంగతిని వారు గ్రహిస్తే ఎంత బావుండు!
39:27 وَلَقَدْ ضَرَبْنَا لِلنَّاسِ فِي هَٰذَا الْقُرْآنِ مِن كُلِّ مَثَلٍ لَّعَلَّهُمْ يَتَذَكَّرُونَ
నిశ్చయంగా మేము ఈ ఖుర్ఆనులో ప్రజల కొరకు అన్ని రకాల ఉపమానాలను వివరించాము – బహుశా వారు హితబోధను గ్రహిస్తారేమోనని!
39:28 قُرْآنًا عَرَبِيًّا غَيْرَ ذِي عِوَجٍ لَّعَلَّهُمْ يَتَّقُونَ
(ఈ) ఖుర్ఆన్ అరబీలో ఉంది. ఇందులో ఎలాంటి వక్రతా లేదు. (దీని ద్వారా) వారు బహుశా భయభక్తుల వైఖరిని అవలంబించవచ్చు.
39:29 ضَرَبَ اللَّهُ مَثَلًا رَّجُلًا فِيهِ شُرَكَاءُ مُتَشَاكِسُونَ وَرَجُلًا سَلَمًا لِّرَجُلٍ هَلْ يَسْتَوِيَانِ مَثَلًا ۚ الْحَمْدُ لِلَّهِ ۚ بَلْ أَكْثَرُهُمْ لَا يَعْلَمُونَ
అల్లాహ్ ఒక ఉదాహరణ ఇస్తున్నాడు: ఒక (బానిస) వ్యక్తి ఉన్నాడు. అతను విరుద్ధ భావాలు గల అనేకమంది భాగస్వాముల క్రింద ఉన్నాడు. రెండవ వ్యక్తి ఒక్కనికే చెందినవాడు (ఒక యజమానికి చెందిన బానిస). వారిద్దరూ సమానులవుతారా? ప్రశంసలన్నీ అల్లాహ్ కొరకే. కాని వారిలో చాలా మంది తెలియనివారు.
39:30 إِنَّكَ مَيِّتٌ وَإِنَّهُم مَّيِّتُونَ
నిశ్చయంగా (ఏదో ఒకనాడు) నీకూ చావు వస్తుంది. వారికీ చావు వస్తుంది.
39:31 ثُمَّ إِنَّكُمْ يَوْمَ الْقِيَامَةِ عِندَ رَبِّكُمْ تَخْتَصِمُونَ
తర్వాత మీరంతా ప్రళయదినాన మీ ప్రభువు ఎదుట గొడవపడతారు.
39:32 فَمَنْ أَظْلَمُ مِمَّن كَذَبَ عَلَى اللَّهِ وَكَذَّبَ بِالصِّدْقِ إِذْ جَاءَهُ ۚ أَلَيْسَ فِي جَهَنَّمَ مَثْوًى لِّلْكَافِرِينَ
అల్లాహ్‌పై అబద్ధాలు చెప్పే వాడి కంటే, తన వద్దకు సత్య ధర్మం వచ్చినప్పుడు దాన్ని అసత్యమని ధిక్కరించేవాడి కంటే పరమదుర్మార్గుడు ఎవడుంటాడు? అటువంటి తిరస్కారుల నివాస స్థలం నరకం కాక మరేమవుతుందీ??
39:33 وَالَّذِي جَاءَ بِالصِّدْقِ وَصَدَّقَ بِهِ ۙ أُولَٰئِكَ هُمُ الْمُتَّقُونَ
ఎవరయితే సత్యధర్మాన్ని తీసుకువచ్చాడో, మరెవరయితే దాన్ని సత్యమని ధృవీకరించాడో అటువంటి వారే భయభక్తులు గలవారు.
39:34 لَهُم مَّا يَشَاءُونَ عِندَ رَبِّهِمْ ۚ ذَٰلِكَ جَزَاءُ الْمُحْسِنِينَ
వారికోసం వారి ప్రభువు దగ్గర వారు కోరినదల్లా ఉంది. సదాచార సంపన్నులకు లభించే ప్రతిఫలం ఇదే.
39:35 لِيُكَفِّرَ اللَّهُ عَنْهُمْ أَسْوَأَ الَّذِي عَمِلُوا وَيَجْزِيَهُمْ أَجْرَهُم بِأَحْسَنِ الَّذِي كَانُوا يَعْمَلُونَ
అల్లాహ్ వారి దురాచరణలను వారి నుండి దూరం చేయటానికి, వారు చేసిన సదాచరణలకుగాను ఉత్తమ పుణ్యఫలం ఇవ్వటానికి (ఈ వ్యవస్థను నెలకొల్పుతాడు).
39:36 أَلَيْسَ اللَّهُ بِكَافٍ عَبْدَهُ ۖ وَيُخَوِّفُونَكَ بِالَّذِينَ مِن دُونِهِ ۚ وَمَن يُضْلِلِ اللَّهُ فَمَا لَهُ مِنْ هَادٍ
ఏమిటి, తన దాసునికి అల్లాహ్ సరిపోడా? వీళ్లు నిన్ను అల్లాహ్ తప్ప ఇతరుల గురించి భయపెడుతున్నారు. అల్లాహ్ అపమార్గం పట్టించిన వానికి మార్గం చూపించగల వాడెవడూ లేడు.
39:37 وَمَن يَهْدِ اللَّهُ فَمَا لَهُ مِن مُّضِلٍّ ۗ أَلَيْسَ اللَّهُ بِعَزِيزٍ ذِي انتِقَامٍ
అల్లాహ్ మార్గం చూపినవానిని ఎవడూ అపమార్గం పట్టించలేడు. ఏమిటి, అల్లాహ్ ప్రాబల్యం కలవాడు, ప్రతీకారం చేసే వాడు కాడా?
39:38 وَلَئِن سَأَلْتَهُم مَّنْ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ لَيَقُولُنَّ اللَّهُ ۚ قُلْ أَفَرَأَيْتُم مَّا تَدْعُونَ مِن دُونِ اللَّهِ إِنْ أَرَادَنِيَ اللَّهُ بِضُرٍّ هَلْ هُنَّ كَاشِفَاتُ ضُرِّهِ أَوْ أَرَادَنِي بِرَحْمَةٍ هَلْ هُنَّ مُمْسِكَاتُ رَحْمَتِهِ ۚ قُلْ حَسْبِيَ اللَّهُ ۖ عَلَيْهِ يَتَوَكَّلُ الْمُتَوَكِّلُونَ
ఆకాశాలను, భూమిని సృష్టించిన వాడెవడు? అని నువ్వు గనక వారిని అడిగితే, “అల్లాహ్” అని వారు తప్పకుండా చెబుతారు. వారితో చెప్పు : “సరే! చూడండి. మీరు అల్లాహ్‌ను వదలి ఎవరెవరిని పిలుస్తున్నారో వారు, అల్లాహ్ నాకేదన్నా కీడు చేయదలిస్తే, ఆ కీడును తొలగించగలరా? పోనీ, అల్లాహ్ నన్ను కటాక్షించదలిస్తే, వారు ఆయన కృపను అడ్డుకోగలరా?” ఇలా అను: “నాకు అల్లాహ్ చాలు. నమ్మేవారు ఆయన్నే నమ్ముకుంటారు.”
39:39 قُلْ يَا قَوْمِ اعْمَلُوا عَلَىٰ مَكَانَتِكُمْ إِنِّي عَامِلٌ ۖ فَسَوْفَ تَعْلَمُونَ
ఇలా చెప్పు : “నా జాతి ప్రజలారా! మీరున్న స్థితిలో మీరు ఆచరిస్తూ ఉండండి. నేను కూడా ఆచరిస్తున్నాను. త్వరలోనే మీరు తెలుసుకుంటారు –
39:40 مَن يَأْتِيهِ عَذَابٌ يُخْزِيهِ وَيَحِلُّ عَلَيْهِ عَذَابٌ مُّقِيمٌ
“పరాభవానికి గురిచేసే శిక్ష ఎవరిపై రానున్నదో, శాశ్వతంగా ఉండే శిక్ష ఎవరిపై పడుతుందో! (మీకే తెలుస్తుంది).”
39:41 إِنَّا أَنزَلْنَا عَلَيْكَ الْكِتَابَ لِلنَّاسِ بِالْحَقِّ ۖ فَمَنِ اهْتَدَىٰ فَلِنَفْسِهِ ۖ وَمَن ضَلَّ فَإِنَّمَا يَضِلُّ عَلَيْهَا ۖ وَمَا أَنتَ عَلَيْهِم بِوَكِيلٍ
(ఓ ముహమ్మద్ – సఅసం!) జనుల కోసం మేము ఈ గ్రంథాన్ని సత్యబద్ధంగా నీ వద్దకు పంపాము. కాబట్టి ఎవడయినా దారికి వస్తే అతను తన స్వయానికే మేలు చేసుకున్నాడు. మరెవరయినా దారితప్పితే ఆ పెడదారి (పాపం) అతని మీదే పడుతుంది. నీవు వారికి బాధ్యుడవు కావు.
39:42 اللَّهُ يَتَوَفَّى الْأَنفُسَ حِينَ مَوْتِهَا وَالَّتِي لَمْ تَمُتْ فِي مَنَامِهَا ۖ فَيُمْسِكُ الَّتِي قَضَىٰ عَلَيْهَا الْمَوْتَ وَيُرْسِلُ الْأُخْرَىٰ إِلَىٰ أَجَلٍ مُّسَمًّى ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّقَوْمٍ يَتَفَكَّرُونَ
అల్లాహ్‌యే ఆత్మలను వాటి మరణ సమయంలో స్వాధీనం చేసుకుంటాడు. మరణం రాని వారి ఆత్మలను కూడా వాటి నిద్రావస్థలో ఆయన వశపరచుకుంటున్నాడు. మరి మరణ ఉత్తర్వు ఖరారైన వారి ఆత్మలను ఆపుకుంటున్నాడు. ఇతర ఆత్మలను ఒక నిర్ణీత గడువు వరకు వదలిపెడుతున్నాడు. చింతన చేసే వారి కోసం ఇందులో ఎన్నో సూచనలున్నాయి.
39:43 أَمِ اتَّخَذُوا مِن دُونِ اللَّهِ شُفَعَاءَ ۚ قُلْ أَوَلَوْ كَانُوا لَا يَمْلِكُونَ شَيْئًا وَلَا يَعْقِلُونَ
ఏమిటి, వారు అల్లాహ్‌ను వదలి (వేరితరులను) సిఫార్సు చేసేవారుగా చేసుకుంటున్నారా? “వారికి ఏ అధికారం లేకున్నా, తెలివి లేకపోయినా (మీరు వారిని సిఫార్సు కోసం నిలబెడతారా?)?” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు.
39:44 قُل لِّلَّهِ الشَّفَاعَةُ جَمِيعًا ۖ لَّهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ ثُمَّ إِلَيْهِ تُرْجَعُونَ
“సిఫారసు అంతా అల్లాహ్ అధీనంలోనే ఉంది. భూమ్యాకాశాల సామ్రాజ్యం ఆయనదే. కడకు మీరంతా ఆయన వైపునకే మరలించబడతారు” అని చెప్పు.
39:45 وَإِذَا ذُكِرَ اللَّهُ وَحْدَهُ اشْمَأَزَّتْ قُلُوبُ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ ۖ وَإِذَا ذُكِرَ الَّذِينَ مِن دُونِهِ إِذَا هُمْ يَسْتَبْشِرُونَ
అల్లాహ్ ఒక్కని గురించి ప్రస్తావించినప్పుడు పరలోకాన్ని నమ్మని వారి గుండెలు అక్కసుతో ఉడికిపోతాయి. మరి అల్లాహ్ తప్ప ఇతరుల గురించి చెప్పినప్పుడు మాత్రం అవి ఆనందంతో విప్పారుతాయి.
39:46 قُلِ اللَّهُمَّ فَاطِرَ السَّمَاوَاتِ وَالْأَرْضِ عَالِمَ الْغَيْبِ وَالشَّهَادَةِ أَنتَ تَحْكُمُ بَيْنَ عِبَادِكَ فِي مَا كَانُوا فِيهِ يَخْتَلِفُونَ
(ఓ ప్రవక్తా! నువ్వు ఇలా) అను: “ఓ అల్లాహ్! భూమ్యాకాశాల సృష్టికర్తా! గోచర అగోచరాలను గురించి తెలిసినవాడా! నీ దాసులు విభేదించుకుంటున్న విషయాలపై నీవు మాత్రమే తీర్పు చేస్తావు.”
39:47 وَلَوْ أَنَّ لِلَّذِينَ ظَلَمُوا مَا فِي الْأَرْضِ جَمِيعًا وَمِثْلَهُ مَعَهُ لَافْتَدَوْا بِهِ مِن سُوءِ الْعَذَابِ يَوْمَ الْقِيَامَةِ ۚ وَبَدَا لَهُم مِّنَ اللَّهِ مَا لَمْ يَكُونُوا يَحْتَسِبُونَ
దుర్మార్గానికి ఒడిగట్టే వారి వద్ద భూమి యందలి సమస్తమూ ఉన్నా, దాంతోపాటు మరి అంతటి సంపద ఉన్నా ఘోర శిక్ష నుండి తప్పించుకోవటానికి ప్రళయ దినాన వారు దాన్నంతటినీ కూడా – పరిహారంగా – ఇచ్చివేస్తారు. వారు ఊహించి కూడా ఉండనిది అల్లాహ్ తరఫున వారి ముందు ప్రస్ఫుటమవుతుంది.
39:48 وَبَدَا لَهُمْ سَيِّئَاتُ مَا كَسَبُوا وَحَاقَ بِهِم مَّا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ
వారు చేసుకున్న దురాగతాల దుష్ఫలితాలన్నీ వారికి ఎదురవుతాయి. దేని గురించి వారు వేళాకోళం చేసేవారో అదే వారిని చుట్టుముట్టుతుంది.
39:49 فَإِذَا مَسَّ الْإِنسَانَ ضُرٌّ دَعَانَا ثُمَّ إِذَا خَوَّلْنَاهُ نِعْمَةً مِّنَّا قَالَ إِنَّمَا أُوتِيتُهُ عَلَىٰ عِلْمٍ ۚ بَلْ هِيَ فِتْنَةٌ وَلَٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ
మనిషికి ఏదన్నా ఆపద వచ్చిపడినప్పుడు అతడు మమ్మల్ని (సహాయం కోసం) మొరపెట్టుకోసాగుతాడు. మరి మేమతనికి మా తరఫునుండి ఏదైనా అనుగ్రహాన్ని ప్రసాదిస్తే “ఇది నా ప్రజ్ఞా పాటవాల మూలంగా నాకు ఇవ్వబడింద”ని అంటాడు. కాదు, వాస్తవానికి అదొక పరీక్ష. కాని వారిలో చాలా మంది ఈ విషయాన్ని గ్రహించరు.
39:50 قَدْ قَالَهَا الَّذِينَ مِن قَبْلِهِمْ فَمَا أَغْنَىٰ عَنْهُم مَّا كَانُوا يَكْسِبُونَ
వారి పూర్వీకులు కూడా అదే మాటన్నారు. కాని వారు ఆర్జించినదేదీ వారికి ఎంతమాత్రం ఉపయోగపడలేదు.
39:51 فَأَصَابَهُمْ سَيِّئَاتُ مَا كَسَبُوا ۚ وَالَّذِينَ ظَلَمُوا مِنْ هَٰؤُلَاءِ سَيُصِيبُهُمْ سَيِّئَاتُ مَا كَسَبُوا وَمَا هُم بِمُعْجِزِينَ
మరి వారి దురాగతాల దుష్ఫలితాలన్నీ వారిపైనే పడ్డాయి. ఇక వీరిలోని పాపాత్ములు చేసిన పాపకార్యాల దుష్ఫలితాలు కూడా వీరిపై వచ్చిపడతాయి. వీరు మమ్మల్ని (ఎట్టి పరిస్థితిలోనూ) అశక్తుల్ని చేయలేరు.
39:52 أَوَلَمْ يَعْلَمُوا أَنَّ اللَّهَ يَبْسُطُ الرِّزْقَ لِمَن يَشَاءُ وَيَقْدِرُ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّقَوْمٍ يُؤْمِنُونَ
ఏమిటి, అల్లాహ్ తాను కోరిన వారి ఉపాధిని విస్తృతపరుస్తాడనీ, పరిమితం కూడా చేయగలడని వారికి తెలియదా? విశ్వసించే జనుల కోసం ఇందులో (గొప్ప) సూచనలున్నాయి.
39:53 قُلْ يَا عِبَادِيَ الَّذِينَ أَسْرَفُوا عَلَىٰ أَنفُسِهِمْ لَا تَقْنَطُوا مِن رَّحْمَةِ اللَّهِ ۚ إِنَّ اللَّهَ يَغْفِرُ الذُّنُوبَ جَمِيعًا ۚ إِنَّهُ هُوَ الْغَفُورُ الرَّحِيمُ
(ఓ ప్రవక్తా! నా తరఫున వారికి ఇలా) చెప్పు: “తమ ఆత్మలపై అన్యాయానికి ఒడిగట్టిన ఓ నా దాసులారా! మీరు అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా అల్లాహ్ పాపాలన్నింటినీ క్షమిస్తాడు. నిజంగా ఆయన అమితంగా క్షమించేవాడు, అపారంగా కరుణించేవాడు.
39:54 وَأَنِيبُوا إِلَىٰ رَبِّكُمْ وَأَسْلِمُوا لَهُ مِن قَبْلِ أَن يَأْتِيَكُمُ الْعَذَابُ ثُمَّ لَا تُنصَرُونَ
“మీపై విపత్తు వచ్చిపడకముందే మీరు మీ ప్రభువు వైపునకు మరలండి. ఆయనకు విధేయత చూపండి. ఆ తరువాత మీకెలాంటి సహాయమూ లభించదు.
39:55 وَاتَّبِعُوا أَحْسَنَ مَا أُنزِلَ إِلَيْكُم مِّن رَّبِّكُم مِّن قَبْلِ أَن يَأْتِيَكُمُ الْعَذَابُ بَغْتَةً وَأَنتُمْ لَا تَشْعُرُونَ
“మీకు తెలియకుండానే మీపై అకస్మాత్తుగా ఆపద వచ్చి పడకముందే, మీ ప్రభువు తరఫు నుండి మీకు పంపబడిన ఉత్తమ విషయాన్ని అనుసరించండి.”
39:56 أَن تَقُولَ نَفْسٌ يَا حَسْرَتَا عَلَىٰ مَا فَرَّطتُ فِي جَنبِ اللَّهِ وَإِن كُنتُ لَمِنَ السَّاخِرِينَ
“అప్పుడు ఏ ప్రాణి అయినా, ‘అయ్యో! ఏమి దురవస్థ నాది! నేను అల్లాహ్ విషయంలో లోటు చేశానే! నేను గేలిచేసే వారిలో ఉండిపోయానే!?’ అని చెబుతుందేమో! (ఆ పరిస్థితి రాకూడదు సుమా!)
39:57 أَوْ تَقُولَ لَوْ أَنَّ اللَّهَ هَدَانِي لَكُنتُ مِنَ الْمُتَّقِينَ
“లేదా ‘అల్లాహ్ గనక నాకు సన్మార్గం చూపి ఉంటే నేను కూడా భయభక్తులు గలవారిలో చేరి ఉండేదాన్నేమో!’ అని చెబుతుందేమో!
39:58 أَوْ تَقُولَ حِينَ تَرَى الْعَذَابَ لَوْ أَنَّ لِي كَرَّةً فَأَكُونَ مِنَ الْمُحْسِنِينَ
“లేదా శిక్షను చూసిన తరువాత, ‘ఎలాగయినాసరే నేను తిరిగి (ప్రపంచానికి) పంపబడితే నేను సజ్జనులలో చేరుతాను’ అని పలుకుతుందేమో! (మీకు ఆ దురవస్థ రాకూడదనే ఈ విషయాలన్నీ విడమరచి చెప్పబడ్డాయి).”
39:59 بَلَىٰ قَدْ جَاءَتْكَ آيَاتِي فَكَذَّبْتَ بِهَا وَاسْتَكْبَرْتَ وَكُنتَ مِنَ الْكَافِرِينَ
“అదికాదు, నిశ్చయంగా నా సూచనలు నీ వద్దకు వచ్చాయి. కాని నువ్వు వాటిని ధిక్కరించావు. గర్వాతిశయంతో విర్రవీగావు. అసలు నువ్వు అవిశ్వాసులలో ఒకడవు” (అని అనబడుతుంది).
39:60 وَيَوْمَ الْقِيَامَةِ تَرَى الَّذِينَ كَذَبُوا عَلَى اللَّهِ وُجُوهُهُم مُّسْوَدَّةٌ ۚ أَلَيْسَ فِي جَهَنَّمَ مَثْوًى لِّلْمُتَكَبِّرِينَ
ఎవరయితే అల్లాహ్‌పై అబద్ధాలు చెప్పారో, ప్రళయదినాన వారి ముఖాలు నల్లగా మారిపోవటాన్ని నీవు చూస్తావు. ఏమిటి, గర్వంతో విర్రవీగే వారి నివాస స్థలం నరకం కాదా?
39:61 وَيُنَجِّي اللَّهُ الَّذِينَ اتَّقَوْا بِمَفَازَتِهِمْ لَا يَمَسُّهُمُ السُّوءُ وَلَا هُمْ يَحْزَنُونَ
మరెవరయితే భయభక్తులతో మెలిగారో వారిని అల్లాహ్, వారి సాఫల్యంతో సహా కాపాడుతాడు. వారిని ఏ బాధ కూడా తాకదు. వారికి ఏ దుఃఖం ఉండదు.
39:62 اللَّهُ خَالِقُ كُلِّ شَيْءٍ ۖ وَهُوَ عَلَىٰ كُلِّ شَيْءٍ وَكِيلٌ
అన్ని వస్తువులనూ సృష్టించినవాడు అల్లాహ్‌యే. అన్ని వస్తువులకూ సంరక్షకుడు కూడా ఆయనే.
39:63 لَّهُ مَقَالِيدُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۗ وَالَّذِينَ كَفَرُوا بِآيَاتِ اللَّهِ أُولَٰئِكَ هُمُ الْخَاسِرُونَ
భూమ్యాకాశాల తాళం చెవులకు యజమాని ఆయనే. అల్లాహ్ సూచనలను తిరస్కరించినవారే (చివరకు) నష్ట పోయేవారు.
39:64 قُلْ أَفَغَيْرَ اللَّهِ تَأْمُرُونِّي أَعْبُدُ أَيُّهَا الْجَاهِلُونَ
“ఓ అజ్ఞానులారా! అల్లాహ్‌ను వదలి ఇతరులను పూజించమని మీరు నాకు చెబుతారా?” అని (ఓ ప్రవక్తా!) వారిని అడుగు.
39:65 وَلَقَدْ أُوحِيَ إِلَيْكَ وَإِلَى الَّذِينَ مِن قَبْلِكَ لَئِنْ أَشْرَكْتَ لَيَحْبَطَنَّ عَمَلُكَ وَلَتَكُونَنَّ مِنَ الْخَاسِرِينَ
నిశ్చయంగా నీ వద్దకు, నీ పూర్వీకులైన ప్రవక్తల వద్దకు పంపబడిన సందేశం (వహీ) ఇది : “ఒకవేళ నువ్వు గనక బహుదైవారాధనకు పాల్పడితే నువ్వు చేసుకున్నదంతా వృధా అయిపోతుంది. మరి నిశ్చయంగా నువ్వు నష్టపోయినవారిలో చేర్తావు.”
39:66 بَلِ اللَّهَ فَاعْبُدْ وَكُن مِّنَ الشَّاكِرِينَ
కాదు, నువ్వు మాత్రం (ఒక్కడైన) అల్లాహ్‌నే ఆరాధించు. కృతజ్ఞతలు తెలుపుకునే వారిలో చేరిపో.
39:67 وَمَا قَدَرُوا اللَّهَ حَقَّ قَدْرِهِ وَالْأَرْضُ جَمِيعًا قَبْضَتُهُ يَوْمَ الْقِيَامَةِ وَالسَّمَاوَاتُ مَطْوِيَّاتٌ بِيَمِينِهِ ۚ سُبْحَانَهُ وَتَعَالَىٰ عَمَّا يُشْرِكُونَ
వారసలు అల్లాహ్‌ను గౌరవించవలసిన విధంగా గౌరవించలేదు. ప్రళయ దినాన భూమి అంతా ఆయన గుప్పెట్లో ఉంటుంది. ఆకాశాలన్నీ ఆయన కుడిచేతిలో చుట్టబడి ఉంటాయి. ఆయన పవిత్రుడు. వీళ్లు కల్పించే భాగస్వామ్యాలకు అతీతుడు – ఎంతో ఉన్నతుడు.
39:68 وَنُفِخَ فِي الصُّورِ فَصَعِقَ مَن فِي السَّمَاوَاتِ وَمَن فِي الْأَرْضِ إِلَّا مَن شَاءَ اللَّهُ ۖ ثُمَّ نُفِخَ فِيهِ أُخْرَىٰ فَإِذَا هُمْ قِيَامٌ يَنظُرُونَ
మరి శంఖం ఊదబడగానే ఆకాశాలలో, భూమిలో ఉన్న వారంతా స్పృహ తప్పి పడిపోతారు – కాని అల్లాహ్ కోరిన వారు మాత్రం (స్పృహ కోల్పోరు)! మళ్లీ శంఖం పూరించబడగానే వారంతా ఒక్కసారిగా లేచి చూస్తూ ఉంటారు.
39:69 وَأَشْرَقَتِ الْأَرْضُ بِنُورِ رَبِّهَا وَوُضِعَ الْكِتَابُ وَجِيءَ بِالنَّبِيِّينَ وَالشُّهَدَاءِ وَقُضِيَ بَيْنَهُم بِالْحَقِّ وَهُمْ لَا يُظْلَمُونَ
భూమి తన ప్రభువు జ్యోతితో ధగధగా మెరిసిపోతుంది. కర్మల పత్రాలు హాజరు పరచబడతాయి. ప్రవక్తలు, సాక్షులు రప్పించబడతారు. వారి మధ్య న్యాయసమ్మతంగా తీర్పు చేయబడుతుంది. వారికి అన్యాయం అనేది జరగదు.
39:70 وَوُفِّيَتْ كُلُّ نَفْسٍ مَّا عَمِلَتْ وَهُوَ أَعْلَمُ بِمَا يَفْعَلُونَ
ప్రతి ప్రాణికీ – అది చేసుకున్న దాన్ని బట్టి పూర్తి ప్రతిఫలం ఇవ్వబడుతుంది. ప్రజలు చేసేవన్నీ ఆయనకు బాగా తెలుసు.
39:71 وَسِيقَ الَّذِينَ كَفَرُوا إِلَىٰ جَهَنَّمَ زُمَرًا ۖ حَتَّىٰ إِذَا جَاءُوهَا فُتِحَتْ أَبْوَابُهَا وَقَالَ لَهُمْ خَزَنَتُهَا أَلَمْ يَأْتِكُمْ رُسُلٌ مِّنكُمْ يَتْلُونَ عَلَيْكُمْ آيَاتِ رَبِّكُمْ وَيُنذِرُونَكُمْ لِقَاءَ يَوْمِكُمْ هَٰذَا ۚ قَالُوا بَلَىٰ وَلَٰكِنْ حَقَّتْ كَلِمَةُ الْعَذَابِ عَلَى الْكَافِرِينَ
అవిశ్వాసులు గుంపులు గుంపులుగా నరకం వైపు తోలబడతారు. వారు అక్కడకు చేరుకోగానే దాని ద్వారాలు తెరువబడతాయి. “ఏమిటి? మీ ప్రభువు వాక్యాలను చదివి వినిపించే, ఈ దినం రానున్నదని మిమ్మల్ని హెచ్చరించే ప్రవక్తలు – మీలో నుంచి – ఎవరూ రాలేదా?” అని అక్కడి పర్యవేక్షకులు వారిని అడుగుతారు. దానికి వారు “ఎందుకు రాలేదు? (వచ్చారు). కాని అవిశ్వాసులపై శిక్షా ఉత్తర్వు ఖరారై పోయింది” అని చెబుతారు.
39:72 قِيلَ ادْخُلُوا أَبْوَابَ جَهَنَّمَ خَالِدِينَ فِيهَا ۖ فَبِئْسَ مَثْوَى الْمُتَكَبِّرِينَ
“ఇక నరక ద్వారాలలో ప్రవేశించండి. మీరు శాశ్వతంగా ఉండాల్సింది అక్కడే. తలబిరుసుల నివాస స్థలం చాలా చెడ్డది” అని అనబడుతుంది.
39:73 وَسِيقَ الَّذِينَ اتَّقَوْا رَبَّهُمْ إِلَى الْجَنَّةِ زُمَرًا ۖ حَتَّىٰ إِذَا جَاءُوهَا وَفُتِحَتْ أَبْوَابُهَا وَقَالَ لَهُمْ خَزَنَتُهَا سَلَامٌ عَلَيْكُمْ طِبْتُمْ فَادْخُلُوهَا خَالِدِينَ
మరెవరయితే తమ ప్రభువుకు భయపడుతూ ఉండేవారో, వారు గుంపులు గుంపులుగా స్వర్గం వైపునకు పంపబడతారు. తుదకు వారు అక్కడకు చేరుకునేటప్పటికే దాని ద్వారాలు తెరువబడి ఉంటాయి. స్వర్గ పర్యవేక్షకులు వారినుద్దేశ్యించి, “మీపై శాంతి కురియుగాక! మీరు హాయిగా ఉండండి. శాశ్వతంగా ఉండేటందుకు ఇందులో ప్రవేశించండి” అంటారు.
39:74 وَقَالُوا الْحَمْدُ لِلَّهِ الَّذِي صَدَقَنَا وَعْدَهُ وَأَوْرَثَنَا الْأَرْضَ نَتَبَوَّأُ مِنَ الْجَنَّةِ حَيْثُ نَشَاءُ ۖ فَنِعْمَ أَجْرُ الْعَامِلِينَ
“అల్లాహ్‌కే కృతజ్ఞతలు. ఆయన మాకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాడు. మమ్మల్ని ఈ భూమికి వారసులుగా చేశాడు. ఇక స్వర్గంలో మేము కోరిన చోటల్లా ఉంటాము. మొత్తానికి (మంచి) కర్మలు చేసేవారికి లభించే ప్రతిఫలం ఎంత గొప్పది!” అని వారు అంటారు.
39:75 وَتَرَى الْمَلَائِكَةَ حَافِّينَ مِنْ حَوْلِ الْعَرْشِ يُسَبِّحُونَ بِحَمْدِ رَبِّهِمْ ۖ وَقُضِيَ بَيْنَهُم بِالْحَقِّ وَقِيلَ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
మరి నువ్వు, దైవదూతలు దైవ సింహాసనం చుట్టూ చేరి, తమ ప్రభువు పవిత్రతను కొనియాడటాన్ని, స్తోత్రం చేయటాన్ని చూస్తావు. వారి మధ్య న్యాయబద్ధంగా తీర్పు చేయబడుతుంది. “సకల లోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వస్తోత్రాలు” అని అనబడుతుంది - సూరా అల్ మూమిన్
40:1 حم
హా మీమ్.
40:2 تَنزِيلُ الْكِتَابِ مِنَ اللَّهِ الْعَزِيزِ الْعَلِيمِ
ఈ గ్రంథావతరణ అల్లాహ్ తరఫున జరిగింది. ఆయన మహాశక్తిమంతుడు, సర్వం తెలిసినవాడు.
40:3 غَافِرِ الذَّنبِ وَقَابِلِ التَّوْبِ شَدِيدِ الْعِقَابِ ذِي الطَّوْلِ ۖ لَا إِلَٰهَ إِلَّا هُوَ ۖ إِلَيْهِ الْمَصِيرُ
పాపాలను క్షమించేవాడు, పశ్చాత్తాపాన్ని ఆమోదించేవాడు, కఠినంగా శిక్షించేవాడు, (అనంతంగా) అనుగ్రహించేవాడు – ఆయన తప్ప వేరే ఆరాధ్య దైవం లేడు. ఆయన వద్దకే మరలి పోవలసి ఉన్నది.
40:4 مَا يُجَادِلُ فِي آيَاتِ اللَّهِ إِلَّا الَّذِينَ كَفَرُوا فَلَا يَغْرُرْكَ تَقَلُّبُهُمْ فِي الْبِلَادِ
సత్యతిరస్కారులు మాత్రమే అల్లాహ్ వాక్యాల విషయంలో వాదులాడుతారు. కాబట్టి పట్టణ ప్రాంతాలలో వారి స్వైర విహారం నిన్ను మోసపుచ్చకూడదు సుమా!
40:5 كَذَّبَتْ قَبْلَهُمْ قَوْمُ نُوحٍ وَالْأَحْزَابُ مِن بَعْدِهِمْ ۖ وَهَمَّتْ كُلُّ أُمَّةٍ بِرَسُولِهِمْ لِيَأْخُذُوهُ ۖ وَجَادَلُوا بِالْبَاطِلِ لِيُدْحِضُوا بِهِ الْحَقَّ فَأَخَذْتُهُمْ ۖ فَكَيْفَ كَانَ عِقَابِ
వీరికి పూర్వం నూహ్ జాతి వారు, వారి తరువాత వచ్చిన వర్గాల వారు కూడా ధిక్కార వైఖరికి ఒడిగట్టారు. ప్రతి సముదాయం వారూ తమ ప్రవక్తను పట్టుకో జూశారు. అసత్యంతో సత్యాన్ని దెబ్బతీసేందుకు పిడివాదనలు చేశారు. అందుకే నేను వాళ్ళను పట్టుకున్నాను. మరి నా తరఫున ఎలా దెబ్బపడిందో (చూడు)!
40:6 وَكَذَٰلِكَ حَقَّتْ كَلِمَتُ رَبِّكَ عَلَى الَّذِينَ كَفَرُوا أَنَّهُمْ أَصْحَابُ النَّارِ
ఈ విధంగా – సత్యతిరస్కారులు నరక వాసులవుతారన్న నీ ప్రభువు వాక్కు నిజమని రుజువయింది.
40:7 الَّذِينَ يَحْمِلُونَ الْعَرْشَ وَمَنْ حَوْلَهُ يُسَبِّحُونَ بِحَمْدِ رَبِّهِمْ وَيُؤْمِنُونَ بِهِ وَيَسْتَغْفِرُونَ لِلَّذِينَ آمَنُوا رَبَّنَا وَسِعْتَ كُلَّ شَيْءٍ رَّحْمَةً وَعِلْمًا فَاغْفِرْ لِلَّذِينَ تَابُوا وَاتَّبَعُوا سَبِيلَكَ وَقِهِمْ عَذَابَ الْجَحِيمِ
అర్ష్ (అల్లాహ్ సింహాసనం)ను మోసేవారు, దాని చుట్టూ ఉన్న వారు (దైవదూతలు) స్తోత్రసమేతంగా తమ ప్రభువు పవిత్రతను కొనియాడుతున్నారు. వారు ఆయన్ని విశ్వసిస్తున్నారు. విశ్వాసుల మన్నింపు కొరకు ప్రార్థిస్తూ వారు ఇలా అంటారు: “మా ప్రభూ! నీవు ప్రతి వస్తువును నీ దయానుగ్రహంతో, పరిజ్ఞానంతో ఆవరించి ఉన్నావు. కనుక పశ్చాత్తాపం చెంది, నీ మార్గాన్ని అనుసరించినవారిని నీవు క్షమించు. ఇంకా వారిని నరక శిక్ష నుంచి కూడా కాపాడు.
40:8 رَبَّنَا وَأَدْخِلْهُمْ جَنَّاتِ عَدْنٍ الَّتِي وَعَدتَّهُمْ وَمَن صَلَحَ مِنْ آبَائِهِمْ وَأَزْوَاجِهِمْ وَذُرِّيَّاتِهِمْ ۚ إِنَّكَ أَنتَ الْعَزِيزُ الْحَكِيمُ
“మా ప్రభూ! నువ్వు వారికి వాగ్దానం చేసివున్న శాశ్వితమైన స్వర్గవనాలలో వారికి ప్రవేశం కల్పించు. మరి వారి పితామహులలోని, సతీమణులలోని, సంతానంలోని సజ్జనులకు కూడా (స్వర్గంలో స్థానం కల్పించు). నిశ్చయంగా నీవు సర్వసత్తాధికారివి, వివేక సంపన్నుడివి.
40:9 وَقِهِمُ السَّيِّئَاتِ ۚ وَمَن تَقِ السَّيِّئَاتِ يَوْمَئِذٍ فَقَدْ رَحِمْتَهُ ۚ وَذَٰلِكَ هُوَ الْفَوْزُ الْعَظِيمُ
“వారిని చెడుల నుండి కూడా కాపాడు. యదార్థమేమిటంటే ఆనాడు నీవు చెడుల నుంచి కాపాడినవారిపై నీవు (అమితంగా) దయ జూపినట్లే. గొప్ప సాఫల్యం అంటే అదే!”
40:10 إِنَّ الَّذِينَ كَفَرُوا يُنَادَوْنَ لَمَقْتُ اللَّهِ أَكْبَرُ مِن مَّقْتِكُمْ أَنفُسَكُمْ إِذْ تُدْعَوْنَ إِلَى الْإِيمَانِ فَتَكْفُرُونَ
తిరస్కార వైఖరిని అవలంబించిన వారిని పిలిచి ఇలా అనబడుతుంది : “మీపై మీకు ఎంత కోపం వస్తుందో, అంతకంటే ఎక్కువగానే అల్లాహ్‌కు మీపై కోపం వచ్చేది – మిమ్మల్ని విశ్వాసం వైపునకు పిలిచినపుడు, మీరేమో అవిశ్వాసానికి ఒడిగట్టేవారు.”
40:11 قَالُوا رَبَّنَا أَمَتَّنَا اثْنَتَيْنِ وَأَحْيَيْتَنَا اثْنَتَيْنِ فَاعْتَرَفْنَا بِذُنُوبِنَا فَهَلْ إِلَىٰ خُرُوجٍ مِّن سَبِيلٍ
(అప్పుడు వారు) “మా ప్రభూ! నీవు రెండుసార్లు మాకు చావు నిచ్చావు. రెండు సార్లు బ్రతికించావు. ఇప్పుడు మేము మా పాపాలను ఒప్పుకుంటున్నాము. మరి ఇప్పుడు బయటపడే మార్గం ఏదన్నా ఉందా?” అని విన్నవించుకుంటారు.
40:12 ذَٰلِكُم بِأَنَّهُ إِذَا دُعِيَ اللَّهُ وَحْدَهُ كَفَرْتُمْ ۖ وَإِن يُشْرَكْ بِهِ تُؤْمِنُوا ۚ فَالْحُكْمُ لِلَّهِ الْعَلِيِّ الْكَبِيرِ
(సమాధానంగా ఇలా అనబడుతుంది) “మీకు ఈ దుర్గతి ఎందుకు పట్టిందంటే, ఒక్కడైన అల్లాహ్‌ను గురించి ప్రస్తావించబడినపుడు మీరు త్రోసిపుచ్చేవారు. మరి అదే ఆయనకు ఎవరినయినా సహవర్తుల్ని కల్పించినపుడు (సంతోషంగా) అంగీకరించేవారు. కాబట్టి ఇప్పుడు (అంతిమ) నిర్ణయాధికారం సర్వోన్నతుడు, గొప్పవాడు అయిన అల్లాహ్‌దే.”
40:13 هُوَ الَّذِي يُرِيكُمْ آيَاتِهِ وَيُنَزِّلُ لَكُم مِّنَ السَّمَاءِ رِزْقًا ۚ وَمَا يَتَذَكَّرُ إِلَّا مَن يُنِيبُ
ఆయనే తన సూచనలను మీకు చూపిస్తున్నాడు. మీ కోసం ఆకాశం నుంచి ఉపాధిని కురిపిస్తున్నాడు. (అల్లాహ్ వైపునకు) మరలేవారు మాత్రమే దీన్నుండి హితబోధను గ్రహిస్తారు.
40:14 فَادْعُوا اللَّهَ مُخْلِصِينَ لَهُ الدِّينَ وَلَوْ كَرِهَ الْكَافِرُونَ
కాబట్టి మీరు మీ ధర్మాన్ని అల్లాహ్‌కే ప్రత్యేకం చేసుకుని ఆయన్నే వేడుకుంటూ ఉండండి – అవిశ్వాసులకు అది ఎంతగా సహించరానిదైనా సరే!
40:15 رَفِيعُ الدَّرَجَاتِ ذُو الْعَرْشِ يُلْقِي الرُّوحَ مِنْ أَمْرِهِ عَلَىٰ مَن يَشَاءُ مِنْ عِبَادِهِ لِيُنذِرَ يَوْمَ التَّلَاقِ
ఆయన ఉన్నత శ్రేణులు కలవాడు, అర్ష్‌కు (సింహాసనానికి) అధిపతి. ఆయన తన దాసులలో తాను కోరినవారిపై తన సందేశాన్ని (వహీని) అవతరింపజేస్తాడు – సమావేశం కానున్న ఆ దినం గురించి అతడు (ప్రవక్త) భయపెట్టడానికి!
40:16 يَوْمَ هُم بَارِزُونَ ۖ لَا يَخْفَىٰ عَلَى اللَّهِ مِنْهُمْ شَيْءٌ ۚ لِّمَنِ الْمُلْكُ الْيَوْمَ ۖ لِلَّهِ الْوَاحِدِ الْقَهَّارِ
ఆ రోజున అందరూ బయల్పడతారు. అప్పుడు వారి (లోగుట్టు) విషయమేదీ అల్లాహ్ నుండి దాగి ఉండదు. ఈ రోజు విశ్వసార్వభౌమత్వం ఎవరిది? ఒక్కడైన, తిరుగులేనివాడైన అల్లాహ్‌ది మాత్రమే.
40:17 الْيَوْمَ تُجْزَىٰ كُلُّ نَفْسٍ بِمَا كَسَبَتْ ۚ لَا ظُلْمَ الْيَوْمَ ۚ إِنَّ اللَّهَ سَرِيعُ الْحِسَابِ
ఈ రోజు ప్రతి ప్రాణికీ అది సంపాదించిన దాని ప్రతిఫలం ఇవ్వబడుతుంది. ఈ రోజు (ఎవరికీ, ఎలాంటి) అన్యాయం జరగదు. నిశ్చయంగా అల్లాహ్ బహు శీఘ్రంగా లెక్కతేల్చేవాడు.
40:18 وَأَنذِرْهُمْ يَوْمَ الْآزِفَةِ إِذِ الْقُلُوبُ لَدَى الْحَنَاجِرِ كَاظِمِينَ ۚ مَا لِلظَّالِمِينَ مِنْ حَمِيمٍ وَلَا شَفِيعٍ يُطَاعُ
(ఓ ప్రవక్తా!) చాలా దగ్గరలోనే ఉన్న ఆ దినం గురించి వారిని హెచ్చరించు. అప్పుడు వారిగుండెలు గొంతుల దాకా వచ్చేస్తాయి. వారంతా గమ్మున (బాధను) దిగమ్రింగుతూ ఉంటారు. (ఆ రోజు) దుర్మార్గులను ఆదుకునే ఆప్తమిత్రుడు గానీ, మాట చెలామణీ చేసుకోగల సిఫారసు చేసేవాడుగానీ ఎవడూ ఉండడు.
40:19 يَعْلَمُ خَائِنَةَ الْأَعْيُنِ وَمَا تُخْفِي الصُّدُورُ
ఆయన కళ్లల్లోని మోసాన్ని, గుండెల్లోని గుట్టును సయితం (బాగా) ఎరిగినవాడు.
40:20 وَاللَّهُ يَقْضِي بِالْحَقِّ ۖ وَالَّذِينَ يَدْعُونَ مِن دُونِهِ لَا يَقْضُونَ بِشَيْءٍ ۗ إِنَّ اللَّهَ هُوَ السَّمِيعُ الْبَصِيرُ
అల్లాహ్ ఖచ్చితంగా న్యాయంగా తీర్పు చేస్తాడు. మరి అల్లాహ్‌ను వదలి వారు ఎవరెవరిని మొరపెట్టుకునేవారో వారు ఏ విషయంలోనూ తీర్పు చేయలేరు. నిశ్చయంగా అల్లాహ్ అంతా వినేవాడు, అంతా చూసేవాడు.
40:21 أَوَلَمْ يَسِيرُوا فِي الْأَرْضِ فَيَنظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الَّذِينَ كَانُوا مِن قَبْلِهِمْ ۚ كَانُوا هُمْ أَشَدَّ مِنْهُمْ قُوَّةً وَآثَارًا فِي الْأَرْضِ فَأَخَذَهُمُ اللَّهُ بِذُنُوبِهِمْ وَمَا كَانَ لَهُم مِّنَ اللَّهِ مِن وَاقٍ
ఏమిటి, వారు భూమిపై సంచరించి, తమకు పూర్వం గడచిన వారికి పట్టిన గతేమిటో చూడలేదా? బలపరాక్రమాల రీత్యాగానీ, భూమిపై వదలి వెళ్ళిన చిహ్నాల దృష్ట్యాగానీ వారు వీరికన్నా గట్టివారే. మరి అల్లాహ్ వారి దురాగతాల కారణంగా వారిని పట్టుకున్నాడు. మరి అల్లాహ్‌కు వ్యతిరేకంగా వారిని ఆదుకునేవాడెవడూ లేకపోయాడు.
40:22 ذَٰلِكَ بِأَنَّهُمْ كَانَت تَّأْتِيهِمْ رُسُلُهُم بِالْبَيِّنَاتِ فَكَفَرُوا فَأَخَذَهُمُ اللَّهُ ۚ إِنَّهُ قَوِيٌّ شَدِيدُ الْعِقَابِ
వారికీ దుర్గతి పట్టటానికి కారణమేమిటంటే, వారి వద్దకు వారి ప్రవక్తలు స్పష్టమైన సూచనలను తీసుకువచ్చేవారు. కాని వారు మాత్రం వాటిని త్రోసిపుచ్చేవారు. అందుకే అల్లాహ్ వారిని పట్టుకున్నాడు. నిస్సందేహంగా ఆయన బలాఢ్యుడు. కఠినంగా శిక్షించేవాడు.
40:23 وَلَقَدْ أَرْسَلْنَا مُوسَىٰ بِآيَاتِنَا وَسُلْطَانٍ مُّبِينٍ
మేము మూసా (అలైహిస్సలాం)కు మా నిదర్శనాలను, తిరుగులేని ప్రమాణాన్ని ఇచ్చి పంపాము –
40:24 إِلَىٰ فِرْعَوْنَ وَهَامَانَ وَقَارُونَ فَقَالُوا سَاحِرٌ كَذَّابٌ
ఫిరౌను, హామాను, ఖారూను వద్దకు (పంపాము). కాని వారేమో, “ఇతను మాంత్రికుడు, అబద్ధాలకోరు” అని అన్నారు.
40:25 فَلَمَّا جَاءَهُم بِالْحَقِّ مِنْ عِندِنَا قَالُوا اقْتُلُوا أَبْنَاءَ الَّذِينَ آمَنُوا مَعَهُ وَاسْتَحْيُوا نِسَاءَهُمْ ۚ وَمَا كَيْدُ الْكَافِرِينَ إِلَّا فِي ضَلَالٍ
మరి అతను (మూసా) వారివద్దకు మా తరఫు నుంచి సత్యాన్ని తీసుకుని వచ్చినప్పుడు, “అతని పంచనచేరి విశ్వసించిన వారి కొడుకులను చంపేయండి, వారి ఆడవాళ్ళను మాత్రం బ్రతకనివ్వండి” అని వారు పలికారు. కాని అవిశ్వాసుల ఎత్తుగడలన్నీ భ్రష్టమైనవి.
40:26 وَقَالَ فِرْعَوْنُ ذَرُونِي أَقْتُلْ مُوسَىٰ وَلْيَدْعُ رَبَّهُ ۖ إِنِّي أَخَافُ أَن يُبَدِّلَ دِينَكُمْ أَوْ أَن يُظْهِرَ فِي الْأَرْضِ الْفَسَادَ
ఫిరౌన్ ఇలా అన్నాడు: “నన్ను వదలండి. నేను మూసాను చంపేస్తాను. అతడు తన ప్రభువును పిలుచుకోనివ్వండి. ఇతడు మీ మతాన్ని ఎక్కడ మార్చివేస్తాడో లేక రాజ్యంలో (చాలా పెద్ద) అరాచకాన్ని ఎక్కడ సృష్టిస్తాడోనని నేను భయపడుతున్నాను.”
40:27 وَقَالَ مُوسَىٰ إِنِّي عُذْتُ بِرَبِّي وَرَبِّكُم مِّن كُلِّ مُتَكَبِّرٍ لَّا يُؤْمِنُ بِيَوْمِ الْحِسَابِ
దానికి మూసా, “లెక్కల దినాన్ని విశ్వసించని ప్రతి దురహంకారి (కీడు) నుంచి రక్షణకై నేను నా ప్రభువును, మీ ప్రభువును వేడుకుంటున్నాను” అన్నాడు.
40:28 وَقَالَ رَجُلٌ مُّؤْمِنٌ مِّنْ آلِ فِرْعَوْنَ يَكْتُمُ إِيمَانَهُ أَتَقْتُلُونَ رَجُلًا أَن يَقُولَ رَبِّيَ اللَّهُ وَقَدْ جَاءَكُم بِالْبَيِّنَاتِ مِن رَّبِّكُمْ ۖ وَإِن يَكُ كَاذِبًا فَعَلَيْهِ كَذِبُهُ ۖ وَإِن يَكُ صَادِقًا يُصِبْكُم بَعْضُ الَّذِي يَعِدُكُمْ ۖ إِنَّ اللَّهَ لَا يَهْدِي مَنْ هُوَ مُسْرِفٌ كَذَّابٌ
(అప్పటివరకూ) తన విశ్వాసాన్ని గోప్యంగా ఉంచిన, ఫిరౌన్ వంశానికి చెందిన విశ్వాసి అయిన ఒక పురుషుడు ఇలా అన్నాడు: “ఏమిటీ, ‘అల్లాహ్ నా ప్రభువు’ అని అన్నంత మాత్రానికే ఒక వ్యక్తిని మీరు చంపేస్తారా? నిజానికి అతడు మీ ప్రభువు తరఫు నుంచి స్పష్టమైన నిదర్శనాలను తీసుకువచ్చాడు. ఒకవేళ అతను చెప్పేది అబద్ధమైతే అతని అబద్ధం (పాపఫలం) అతని మీదే పడుతుంది. మరి అతను గనక తన వాదనలో సత్యవంతుడైతే, అతను మీకు చేసే వాగ్దానం (శిక్ష)లో ఎంతో కొంత మీపై కూడా వచ్చి పడుతుంది. బరితెగించి పోయేవాడికి, అబద్ధాల కోరుకి అల్లాహ్ సన్మార్గం చూపడు.
40:29 يَا قَوْمِ لَكُمُ الْمُلْكُ الْيَوْمَ ظَاهِرِينَ فِي الْأَرْضِ فَمَن يَنصُرُنَا مِن بَأْسِ اللَّهِ إِن جَاءَنَا ۚ قَالَ فِرْعَوْنُ مَا أُرِيكُمْ إِلَّا مَا أَرَىٰ وَمَا أَهْدِيكُمْ إِلَّا سَبِيلَ الرَّشَادِ
“ఓ నా జాతి ప్రజలారా! ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారు. భూమిపై మీ ఆధిక్యత కొనసాగుతోంది. కాని అల్లాహ్ తరఫున మనపై ఏదైనా విపత్తు వచ్చిపడితే, మనల్ని ఆదుకునే వాడెవడు?” దానికి ఫిరౌన్ ఇలా సమాధానమిచ్చాడు: “నేను చూసేదే మీకు చెబుతున్నాను. సక్రమమైన మార్గం వైపుకే మీకు దర్శకత్వం వహిస్తున్నాను.”
40:30 وَقَالَ الَّذِي آمَنَ يَا قَوْمِ إِنِّي أَخَافُ عَلَيْكُم مِّثْلَ يَوْمِ الْأَحْزَابِ
అప్పుడు ఆ విశ్వాసి ఇలా అన్నాడు : “ఓ నా జాతివారలారా! ఇతర సముదాయాలపై వచ్చిన (గడ్డు) దినం మీపై కూడా వస్తుందేమోనని నాకు భయంగా ఉంది.
40:31 مِثْلَ دَأْبِ قَوْمِ نُوحٍ وَعَادٍ وَثَمُودَ وَالَّذِينَ مِن بَعْدِهِمْ ۚ وَمَا اللَّهُ يُرِيدُ ظُلْمًا لِّلْعِبَادِ
“ఉదాహరణకు నూహ్, ఆద్, సమూద్ జాతుల వారికి, ఆ తరువాత వచ్చిన వారికి (పట్టిన దుర్గతే మీకూ పట్టవచ్చు). తన దాసులకు అన్యాయం చేయాలన్నది అల్లాహ్ అభిమతం ఎంత మాత్రం కాదు.
40:32 وَيَا قَوْمِ إِنِّي أَخَافُ عَلَيْكُمْ يَوْمَ التَّنَادِ
“మరి ఓ నా జాతివారలారా! కేకలేసి పిలిచే రోజు మీకు దాపురిస్తుందన్న భయం కూడా నాకుంది.
40:33 يَوْمَ تُوَلُّونَ مُدْبِرِينَ مَا لَكُم مِّنَ اللَّهِ مِنْ عَاصِمٍ ۗ وَمَن يُضْلِلِ اللَّهُ فَمَا لَهُ مِنْ هَادٍ
“ఆ రోజు మీరు వెన్ను చూపి తిరిగిపోతారు. మిమ్మల్ని అల్లాహ్ (పట్టు) నుండి కాపాడేవాడెవడూ ఉండడు. అల్లాహ్ మార్గ భ్రష్టతకు గురిచేసినవారికి సన్మార్గం చూపేవాడెవడూ ఉండడు.
40:34 وَلَقَدْ جَاءَكُمْ يُوسُفُ مِن قَبْلُ بِالْبَيِّنَاتِ فَمَا زِلْتُمْ فِي شَكٍّ مِّمَّا جَاءَكُم بِهِ ۖ حَتَّىٰ إِذَا هَلَكَ قُلْتُمْ لَن يَبْعَثَ اللَّهُ مِن بَعْدِهِ رَسُولًا ۚ كَذَٰلِكَ يُضِلُّ اللَّهُ مَنْ هُوَ مُسْرِفٌ مُّرْتَابٌ
“లోగడ యూసుఫ్ (అలైహిస్సలాం) కూడా మీ వద్దకు స్పష్టమైన ప్రమాణాలను తీసుకువచ్చాడు. అయినప్పటికీ ఆయన తెచ్చిన విషయాలపై మీరు అనుమానంతోనే ఉన్నారు. చివరకు ఆయన మరణించినపుడు, ‘ఈయన తరువాత అల్లాహ్ ఇంకా ఏ ప్రవక్తనూ పంపబోడు’ అని మీరు చెప్పుకోసాగారు. ఈ విధంగా అల్లాహ్ హద్దుమీరే వారినీ, సందేహాలతో బతికేవారిని అపమార్గానికి లోను చేస్తాడు.
40:35 الَّذِينَ يُجَادِلُونَ فِي آيَاتِ اللَّهِ بِغَيْرِ سُلْطَانٍ أَتَاهُمْ ۖ كَبُرَ مَقْتًا عِندَ اللَّهِ وَعِندَ الَّذِينَ آمَنُوا ۚ كَذَٰلِكَ يَطْبَعُ اللَّهُ عَلَىٰ كُلِّ قَلْبِ مُتَكَبِّرٍ جَبَّارٍ
“(ఎందుకంటే) వారు తమ వద్దకు వచ్చిన ఏ ప్రమాణమూ లేకుండానే, అల్లాహ్ నిదర్శనాల విషయంలో (మొండిగా) వాదిస్తారు. ఈ పోకడ అల్లాహ్ వద్ద, విశ్వాసుల వద్ద కూడా ఎంతో అయిష్టకరమైనది. ఈ విధంగా గర్విష్టి, క్రూరుడైన ప్రతి వ్యక్తి హృదయంపై అల్లాహ్ ముద్ర వేసేస్తాడు.”
40:36 وَقَالَ فِرْعَوْنُ يَا هَامَانُ ابْنِ لِي صَرْحًا لَّعَلِّي أَبْلُغُ الْأَسْبَابَ
ఫిరౌన్ ఇలా అన్నాడు: “ఓ హామాన్! నా కోసం ఒక ఎత్తయిన కట్టడాన్ని నిర్మించు. బహుశా నేను ఆ మార్గాలపైకి పోతానేమో-
40:37 أَسْبَابَ السَّمَاوَاتِ فَأَطَّلِعَ إِلَىٰ إِلَٰهِ مُوسَىٰ وَإِنِّي لَأَظُنُّهُ كَاذِبًا ۚ وَكَذَٰلِكَ زُيِّنَ لِفِرْعَوْنَ سُوءُ عَمَلِهِ وَصُدَّ عَنِ السَّبِيلِ ۚ وَمَا كَيْدُ فِرْعَوْنَ إِلَّا فِي تَبَابٍ
“ఆ గగన మార్గాలలోకి పోయి, మూసా ఆరాధిస్తున్న దేవుణ్ణి తొంగి చూస్తాను. ఖచ్చితంగా ఇతను (మూసా) అబద్ధాల కోరని నా అనుమానం.” ఈ విధంగా ఫిరౌన్ దురాగతాలు అతనికి అందమైనవిగా చూపబడ్డాయి. అతడు సన్మార్గం నుంచి ఆపి వేయబడ్డాడు. ఫిరౌన్ పన్నిన పన్నాగాలన్నీ (అతని) వినాశానికే దోహదపడ్డాయి.
40:38 وَقَالَ الَّذِي آمَنَ يَا قَوْمِ اتَّبِعُونِ أَهْدِكُمْ سَبِيلَ الرَّشَادِ
విశ్వసించిన ఆ వ్యక్తే ఇంకా ఇలా అన్నాడు : “ఓ నా జాతి (ప్రజలారా)! మీరు (అందరూ) నన్ను అనుసరించండి. నేను మిమ్మల్ని మంచి మార్గం వైపుకు దర్శకత్వం వహిస్తాను.
40:39 يَا قَوْمِ إِنَّمَا هَٰذِهِ الْحَيَاةُ الدُّنْيَا مَتَاعٌ وَإِنَّ الْآخِرَةَ هِيَ دَارُ الْقَرَارِ
“ఓ నా జాతి (వారలారా!) ఈ ప్రాపంచిక జీవిత సౌఖ్యాలు తాత్కాలికమైనవి. పరలోకమే శాశ్వతంగా ఉండే నిలయం.
40:40 مَنْ عَمِلَ سَيِّئَةً فَلَا يُجْزَىٰ إِلَّا مِثْلَهَا ۖ وَمَنْ عَمِلَ صَالِحًا مِّن ذَكَرٍ أَوْ أُنثَىٰ وَهُوَ مُؤْمِنٌ فَأُولَٰئِكَ يَدْخُلُونَ الْجَنَّةَ يُرْزَقُونَ فِيهَا بِغَيْرِ حِسَابٍ
“ఎవడయినా పాపానికి పాల్పడితే దానికి సరిసమానమైన (పాప) ఫలమే అతనికి లభిస్తుంది. మరెవడయినా పుణ్యకార్యం చేస్తే – అతడు పురుషుడైనా, స్త్రీ అయినా-అతడు గనక విశ్వాసి అయివుంటే – అలాంటి వారంతా స్వర్గంలో ప్రవేశిస్తారు. వారక్కడ లెక్క లేనంత ఉపాధిని పొందుతారు.
40:41 وَيَا قَوْمِ مَا لِي أَدْعُوكُمْ إِلَى النَّجَاةِ وَتَدْعُونَنِي إِلَى النَّارِ
“ఓ నా జాతి (జనులారా)! నేను మిమ్మల్ని మోక్షం వైపునకు పిలుస్తుంటే, మీరు నన్ను నరకాగ్ని వైపునకు పిలుస్తారేమిటి?
40:42 تَدْعُونَنِي لِأَكْفُرَ بِاللَّهِ وَأُشْرِكَ بِهِ مَا لَيْسَ لِي بِهِ عِلْمٌ وَأَنَا أَدْعُوكُمْ إِلَى الْعَزِيزِ الْغَفَّارِ
“నేను అల్లాహ్‌ను తిరస్కరించాలనీ, నేనెరుగని వాటిని ఆయనకు సహవర్తులుగా నిలబెట్టాలని మీరు నన్ను ఆహ్వానిస్తుంటే, నేను మాత్రం మిమ్మల్ని అసాధారణ శక్తిశాలి, క్షమాశీలి (అయిన అల్లాహ్) వైపునకు ఆహ్వానిస్తున్నాను.
40:43 لَا جَرَمَ أَنَّمَا تَدْعُونَنِي إِلَيْهِ لَيْسَ لَهُ دَعْوَةٌ فِي الدُّنْيَا وَلَا فِي الْآخِرَةِ وَأَنَّ مَرَدَّنَا إِلَى اللَّهِ وَأَنَّ الْمُسْرِفِينَ هُمْ أَصْحَابُ النَّارِ
“మీరు నన్ను ఎవరి వైపునకు పిలుస్తున్నారో వారు ఇహలోకంలోగానీ, పరలోకంలోగానీ పిలువటానికి అసలు యోగ్యులు కారన్న విషయంలో సందేహానికి ఆస్కారమే లేదు. మరి మనమంతా మరలిపోవలసింది అల్లాహ్ వద్దకే (అన్నది కూడా నిర్వివాదాంశమే). మరి బరితెగించి పోయేవారే నరక వాసులవుతారు (అనేది కూడా ముమ్మాటికీ నిజం).
40:44 فَسَتَذْكُرُونَ مَا أَقُولُ لَكُمْ ۚ وَأُفَوِّضُ أَمْرِي إِلَى اللَّهِ ۚ إِنَّ اللَّهَ بَصِيرٌ بِالْعِبَادِ
“మున్ముందు మీరు నేను చెప్పిన మాటల్ని జ్ఞాపకం చేసుకుంటారు. నేను మటుకు నా వ్యవహారాన్ని అల్లాహ్‌కు అప్పగిస్తున్నాను. నిశ్చయంగా అల్లాహ్ తన దాసులందరినీ చూస్తూనే ఉన్నాడు.”
40:45 فَوَقَاهُ اللَّهُ سَيِّئَاتِ مَا مَكَرُوا ۖ وَحَاقَ بِآلِ فِرْعَوْنَ سُوءُ الْعَذَابِ
ఎట్టకేలకు అల్లాహ్ అతన్ని, వారు పన్నిన దుష్టపన్నాగాల కీడు నుంచి రక్షించాడు. కాగా; ఫిరౌనీయులపై బహు చెడ్డ విపత్తు విరుచుకుపడింది.
40:46 النَّارُ يُعْرَضُونَ عَلَيْهَا غُدُوًّا وَعَشِيًّا ۖ وَيَوْمَ تَقُومُ السَّاعَةُ أَدْخِلُوا آلَ فِرْعَوْنَ أَشَدَّ الْعَذَابِ
(ఇదిగో) అగ్ని – దాని ఎదుట వారు ప్రతి ఉదయం, సాయంత్రం రప్పించబడుతుంటారు. మరి ప్రళయం సంభవించిననాడు, “ఫిరౌను జనులను దుర్భరమైన శిక్షలో పడవేయండి” (అని సెలవీయబడుతుంది).
40:47 وَإِذْ يَتَحَاجُّونَ فِي النَّارِ فَيَقُولُ الضُّعَفَاءُ لِلَّذِينَ اسْتَكْبَرُوا إِنَّا كُنَّا لَكُمْ تَبَعًا فَهَلْ أَنتُم مُّغْنُونَ عَنَّا نَصِيبًا مِّنَ النَّارِ
మరి వారు నరకాగ్నిలో (కాలుతూ) పరస్పరం వాదోపవాదాలు మొదలెట్టినప్పుడు బలహీనులు, గర్విష్టులనుద్దేశించి, “మేము మీకు తాబేదార్లుగా ఉన్నాం కదా! మరి మీరిప్పుడు ఈ అగ్నిలో ఏ కొంత భాగాన్నయినా మా నుండి తొలగించగలరా?!” అని అంటారు.
40:48 قَالَ الَّذِينَ اسْتَكْبَرُوا إِنَّا كُلٌّ فِيهَا إِنَّ اللَّهَ قَدْ حَكَمَ بَيْنَ الْعِبَادِ
దానికి ఆ గర్విష్టులు “మనమంతా ఈ అగ్నిలో ఉన్నాం కదా! అల్లాహ్ తన దాసుల మధ్య తీర్పు చేసేశాడు” అని సమాధానమిస్తారు.
40:49 وَقَالَ الَّذِينَ فِي النَّارِ لِخَزَنَةِ جَهَنَّمَ ادْعُوا رَبَّكُمْ يُخَفِّفْ عَنَّا يَوْمًا مِّنَ الْعَذَابِ
మరి నరకవాసులంతా కలసి, “(కనీసం) ఒక్కరోజు శిక్షనైనా కాస్త తగ్గించమని మీ ప్రభువును కోరండి” అని నరక పాలకులతో అంటారు.
40:50 قَالُوا أَوَلَمْ تَكُ تَأْتِيكُمْ رُسُلُكُم بِالْبَيِّنَاتِ ۖ قَالُوا بَلَىٰ ۚ قَالُوا فَادْعُوا ۗ وَمَا دُعَاءُ الْكَافِرِينَ إِلَّا فِي ضَلَالٍ
దానికి వారు, “ఎందుకు, మీ ప్రవక్తలు స్పష్టమైన నిదర్శనాలు తీసుకుని మీ వద్దకు రాలేదా?!” అని అడుగుతారు. “ఎందుకు రాలేదు? (వచ్చిన సంగతి నిజమే)” అని నరకవాసులు అంటారు. “మరైతే మీరే విజ్ఞప్తి చేసుకోండి” అని నరకపాలకులు చెబుతారు. (కాని) అవిశ్వాసుల విజ్ఞాపనలు నిరర్థకం తప్ప మరేమీ కావు.
40:51 إِنَّا لَنَنصُرُ رُسُلَنَا وَالَّذِينَ آمَنُوا فِي الْحَيَاةِ الدُّنْيَا وَيَوْمَ يَقُومُ الْأَشْهَادُ
నిశ్చయంగా మేము మా ప్రవక్తలకు, విశ్వాసులకు ప్రాపంచిక జీవితంలోనూ సహాయపడతాము, సాక్ష్యాలిచ్చేవారు నిలబడే రోజున కూడా (సహాయం చేస్తాము).
40:52 يَوْمَ لَا يَنفَعُ الظَّالِمِينَ مَعْذِرَتُهُمْ ۖ وَلَهُمُ اللَّعْنَةُ وَلَهُمْ سُوءُ الدَّارِ
ఆ రోజు దుర్మార్గులకు వారి సంజాయిషీ ఎంతమాత్రం ఉపయోగపడదు. వారిపై శాపం పడుతుంది. మరి వారి కోసం బహుచెడ్డ నివాసం ఉంటుంది.
40:53 وَلَقَدْ آتَيْنَا مُوسَى الْهُدَىٰ وَأَوْرَثْنَا بَنِي إِسْرَائِيلَ الْكِتَابَ
మరి మేము మూసాకు మార్గదర్శిని ప్రసాదించాము. ఇస్రాయీల్ సంతతిని ఆ గ్రంథానికి వారసులుగా చేశాము.
40:54 هُدًى وَذِكْرَىٰ لِأُولِي الْأَلْبَابِ
బుద్ధిజీవులకు అది మార్గదర్శినిగా, హితబోధినిగా ఉండేది.
40:55 فَاصْبِرْ إِنَّ وَعْدَ اللَّهِ حَقٌّ وَاسْتَغْفِرْ لِذَنبِكَ وَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ بِالْعَشِيِّ وَالْإِبْكَارِ
కనుక (ఓ ప్రవక్తా!) సహనం వహించు. నిస్సందేహంగా అల్లాహ్ వాగ్దానం నిజమైనది. నువ్వు నీ పొరపాట్ల క్షమాపణకై వేడుకుంటూ ఉండు. సాయం సమయంలోనూ, ప్రభాత సమయంలోనూ నీ ప్రభువు పవిత్రతను కొనియాడుతూ, స్తోత్రం చేస్తూ ఉండు.
40:56 إِنَّ الَّذِينَ يُجَادِلُونَ فِي آيَاتِ اللَّهِ بِغَيْرِ سُلْطَانٍ أَتَاهُمْ ۙ إِن فِي صُدُورِهِمْ إِلَّا كِبْرٌ مَّا هُم بِبَالِغِيهِ ۚ فَاسْتَعِذْ بِاللَّهِ ۖ إِنَّهُ هُوَ السَّمِيعُ الْبَصِيرُ
ఎవరయితే తమ వద్దకు వచ్చిన ప్రమాణమేదీ లేకుండానే అల్లాహ్ ఆయతుల విషయంలో గొడవపడుతున్నారో, వారి ఆంతర్యాలలో గర్వం తప్ప మరేమీ లేదు. వారు ఎలాగూ దానిని (తమ లక్ష్యాన్ని) చేరుకోలేరు. కనుక నువ్వు మాత్రం అల్లాహ్ శరణువేడుతూ ఉండు. నిశ్చయంగా ఆయన అంతా వినేవాడు, అన్నింటినీ చూసేవాడు.
40:57 لَخَلْقُ السَّمَاوَاتِ وَالْأَرْضِ أَكْبَرُ مِنْ خَلْقِ النَّاسِ وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ
నిశ్చయంగా భూమ్యాకాశాల సృష్టి మానవ సృష్టికన్నా గొప్ప విషయం. కాని చాలామంది దీన్ని తెలుసుకోరు.
40:58 وَمَا يَسْتَوِي الْأَعْمَىٰ وَالْبَصِيرُ وَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَلَا الْمُسِيءُ ۚ قَلِيلًا مَّا تَتَذَكَّرُونَ
గుడ్డివాడు – చూపున్నవాడు సమానులు కారు. అలాగే విశ్వసించి, మంచి పనులు చేసేవారు – పాపాత్ములు (సమానులు కాజాలరు). కాని మీరు హితబోధను గ్రహించేది (చాలా) తక్కువ.
40:59 إِنَّ السَّاعَةَ لَآتِيَةٌ لَّا رَيْبَ فِيهَا وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يُؤْمِنُونَ
ప్రళయం (రావటం) తథ్యం. అందులో సందేహానికి తావే లేదు. కాని చాలామంది దీన్ని విశ్వసించరు (అది వేరే విషయం).
40:60 وَقَالَ رَبُّكُمُ ادْعُونِي أَسْتَجِبْ لَكُمْ ۚ إِنَّ الَّذِينَ يَسْتَكْبِرُونَ عَنْ عِبَادَتِي سَيَدْخُلُونَ جَهَنَّمَ دَاخِرِينَ
మరి మీ ప్రభువు ఏమంటున్నాడంటే, “మీరు నన్నే ప్రార్థించండి. నేను మీ ప్రార్థనలను ఆమోదిస్తాను. నా దాస్యం పట్ల గర్వాహంకారం ప్రదర్శించేవారు త్వరలోనే అవమానితులై నరకంలో ప్రవేశించటం తథ్యం.”
40:61 اللَّهُ الَّذِي جَعَلَ لَكُمُ اللَّيْلَ لِتَسْكُنُوا فِيهِ وَالنَّهَارَ مُبْصِرًا ۚ إِنَّ اللَّهَ لَذُو فَضْلٍ عَلَى النَّاسِ وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَشْكُرُونَ
అల్లాహ్ మీ కొరకు రాత్రిని చేశాడు – అందులో మీరు విశ్రాంతి పొందటానికి! మరి ఆయనే పగటిని (మీరు) చూడ గలిగేదిగా చేశాడు. నిశ్చయంగా అల్లాహ్ ప్రజల పట్ల దయా దాక్షిణ్యాలు గలవాడు. కాని ప్రజలలో చాలామంది కృతజ్ఞత తెలుపరు.
40:62 ذَٰلِكُمُ اللَّهُ رَبُّكُمْ خَالِقُ كُلِّ شَيْءٍ لَّا إِلَٰهَ إِلَّا هُوَ ۖ فَأَنَّىٰ تُؤْفَكُونَ
ఈ అల్లాహ్‌యే మీ (అందరికీ) ప్రభువు, ప్రతి వస్తువునూ సృష్టించినవాడు. ఆయన తప్ప వేరే ఆరాధ్యుడు లేడు. మరి మీరు ఎటు తిరిగిపోతున్నారు?
40:63 كَذَٰلِكَ يُؤْفَكُ الَّذِينَ كَانُوا بِآيَاتِ اللَّهِ يَجْحَدُونَ
ఇదే విధంగా (పూర్వం) అల్లాహ్ ఆయతులను తిరస్కరించే వారు కూడా తిరిగిపోయేవారు.
40:64 اللَّهُ الَّذِي جَعَلَ لَكُمُ الْأَرْضَ قَرَارًا وَالسَّمَاءَ بِنَاءً وَصَوَّرَكُمْ فَأَحْسَنَ صُوَرَكُمْ وَرَزَقَكُم مِّنَ الطَّيِّبَاتِ ۚ ذَٰلِكُمُ اللَّهُ رَبُّكُمْ ۖ فَتَبَارَكَ اللَّهُ رَبُّ الْعَالَمِينَ
అల్లాహ్‌యే మీ కోసం భూమిని నివాసస్థలంగా చేశాడు. ఆకాశాన్ని పందిరిగా నిర్మించాడు. మీ రూపురేఖలను తీర్చి దిద్దాడు. మీకు చాలా అందమైన రూపాన్నిచ్చాడు. తినటానికి పరిశుద్ధమైన ఆహార పదార్థాలను ప్రసాదించాడు. ఈ అల్లాహ్‌యే మీ ప్రభువు. మరి సకల లోకాలకు ప్రభువైన అల్లాహ్ శుభాలు కలవాడు.
40:65 هُوَ الْحَيُّ لَا إِلَٰهَ إِلَّا هُوَ فَادْعُوهُ مُخْلِصِينَ لَهُ الدِّينَ ۗ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
ఆయన సజీవుడు. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. కాబట్టి మీరు స్వచ్ఛమైన ఆరాధనను ఆయనకే సమర్పిస్తూ ఆయన్ని వేడుకోండి. ప్రశంసలన్నీ సకల లోకాల ప్రభువైన అల్లాహ్‌కే చెందుతాయి.
40:66 قُلْ إِنِّي نُهِيتُ أَنْ أَعْبُدَ الَّذِينَ تَدْعُونَ مِن دُونِ اللَّهِ لَمَّا جَاءَنِيَ الْبَيِّنَاتُ مِن رَّبِّي وَأُمِرْتُ أَنْ أُسْلِمَ لِرَبِّ الْعَالَمِينَ
(ఓ ప్రవక్తా!) వారికి ఈ విధంగా చెప్పు: “మీరు అల్లాహ్‌ను వదలి మొరపెట్టుకుంటున్నటువంటి వాటిని నేను పూజించటాన్ని వారించటం జరిగింది. ఆ మేరకు నా వద్దకు నా ప్రభువు తరఫున సూచనలు వచ్చేశాయి. సకల లోకాల ప్రభువుకే నేను విధేయుడనై ఉండాలని (కూడా) నాకు ఆజ్ఞాపించబడింది.”
40:67 هُوَ الَّذِي خَلَقَكُم مِّن تُرَابٍ ثُمَّ مِن نُّطْفَةٍ ثُمَّ مِنْ عَلَقَةٍ ثُمَّ يُخْرِجُكُمْ طِفْلًا ثُمَّ لِتَبْلُغُوا أَشُدَّكُمْ ثُمَّ لِتَكُونُوا شُيُوخًا ۚ وَمِنكُم مَّن يُتَوَفَّىٰ مِن قَبْلُ ۖ وَلِتَبْلُغُوا أَجَلًا مُّسَمًّى وَلَعَلَّكُمْ تَعْقِلُونَ
ఆయనే మిమ్మల్ని మట్టితో, పిమ్మట వీర్యపు బిందువుతో, ఆ తరువాత ఘనీభవించిన రక్తంతో సృష్టించాడు. తరువాత మిమ్మల్ని శిశువు రూపంలో (తల్లి గర్భం నుంచి) బయటకు తీస్తున్నాడు. మరి మీరు యుక్తవయస్సుకు చేరేటందుకు మీకు ఎదుగుదలను ఇస్తున్నాడు, ఆపైన వార్ధక్యానికి చేరుకునేందుకు (గడువు ఇస్తున్నాడు). మీలో కొందరు ఆ స్థితికి చేరకముందే చనిపోతున్నారు. మీరు నిర్ణీత గడువుకు చేరుకోవటానికి, మీరు గ్రహించగలగటానికి (వీలుగా ఆయన మీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు).
40:68 هُوَ الَّذِي يُحْيِي وَيُمِيتُ ۖ فَإِذَا قَضَىٰ أَمْرًا فَإِنَّمَا يَقُولُ لَهُ كُن فَيَكُونُ
జీవితాన్ని ప్రసాదించేవాడు, మరణాన్ని వొసగేవాడు ఆయనే. మరి ఆయన ఏ పనైనా చేయాలని నిర్ణయించుకున్నప్పుడు, దాన్నుద్దేశించి ‘అయిపో’ అని మాత్రమే అంటాడు. అంతే, అది అయిపోతుంది.
40:69 أَلَمْ تَرَ إِلَى الَّذِينَ يُجَادِلُونَ فِي آيَاتِ اللَّهِ أَنَّىٰ يُصْرَفُونَ
అల్లాహ్ వాక్యాల విషయంలో గొడవ చేసే వారిని నువ్వు చూడలేదా? ఇంతకీ వారెక్కడికి మరలించబడుతున్నట్టు?
40:70 الَّذِينَ كَذَّبُوا بِالْكِتَابِ وَبِمَا أَرْسَلْنَا بِهِ رُسُلَنَا ۖ فَسَوْفَ يَعْلَمُونَ
వారు గ్రంథాన్ని, మా ప్రవక్తలతోపాటు పంపినదానిని కూడా ధిక్కరించారు. వారు త్వరలోనే (యదార్థం ఏమిటో) తెలుసుకుంటారు.
40:71 إِذِ الْأَغْلَالُ فِي أَعْنَاقِهِمْ وَالسَّلَاسِلُ يُسْحَبُونَ
అప్పుడు వారి మెడలలో (ఇనుప) పట్టాలు వేయబడి ఉంటాయి, సంకెళ్లు కూడా ఉంటాయి. మరి వారు ఈడ్వబడతారు.
40:72 فِي الْحَمِيمِ ثُمَّ فِي النَّارِ يُسْجَرُونَ
సలసలా కాగే నీళ్లలోకి. తరువాత నరకాగ్నిలో కాల్చబడతారు.
40:73 ثُمَّ قِيلَ لَهُمْ أَيْنَ مَا كُنتُمْ تُشْرِكُونَ
“మీరు అల్లాహ్‌ను వదలి సాటి కల్పించిన వారు (చిల్లర దేవుళ్లు) ఎక్కడున్నారు?” అని వారిని అడగటం జరుగుతుంది.
40:74 مِن دُونِ اللَّهِ ۖ قَالُوا ضَلُّوا عَنَّا بَل لَّمْ نَكُن نَّدْعُو مِن قَبْلُ شَيْئًا ۚ كَذَٰلِكَ يُضِلُّ اللَّهُ الْكَافِرِينَ
(అంటే) అల్లాహ్‌ను వదలి అన్న మాట. “వారు మా నుండి అదృశ్యమైపోయారు. కాదు, మేమింతకు ముందు అసలు దేనినీ మొరపెట్టుకోనేలేదు” అని వారు (తడబడుతూ) చెబుతారు. ఈ విధంగా అల్లాహ్ అవిశ్వాసులను దారి తప్పిస్తాడు.
40:75 ذَٰلِكُم بِمَا كُنتُمْ تَفْرَحُونَ فِي الْأَرْضِ بِغَيْرِ الْحَقِّ وَبِمَا كُنتُمْ تَمْرَحُونَ
“మీరు భూమ్మీద అన్యాయంగా అదిరిపడుతూ, అనుచిత రీతిలో మిడిసి పడినందుకు జరిగిన శాస్తి ఇది.
40:76 ادْخُلُوا أَبْوَابَ جَهَنَّمَ خَالِدِينَ فِيهَا ۖ فَبِئْسَ مَثْوَى الْمُتَكَبِّرِينَ
“ఇక నరక ద్వారాలలోనికి ప్రవేశించండి, ఎల్లకాలం అందులోనే పడి ఉందురు గాని; అహంకారులకు లభించిన ఈ చోటు ఎంత చెడ్దది?!” (అని అనబడుతుంది).
40:77 فَاصْبِرْ إِنَّ وَعْدَ اللَّهِ حَقٌّ ۚ فَإِمَّا نُرِيَنَّكَ بَعْضَ الَّذِي نَعِدُهُمْ أَوْ نَتَوَفَّيَنَّكَ فَإِلَيْنَا يُرْجَعُونَ
కనుక (ఓ ముహమ్మద్ -స!) నువ్వు సహనం వహించు. అల్లాహ్ వాగ్దానం ముమ్మాటికీ సత్యమైనది. మేము వారికి చేసివున్న వాగ్దానాలలో (హెచ్చరికలలో) కొన్నింటిని మేము నీకు చూపించినా లేక (అంతకుముందే) మేము నీకు మరణం వొసగినా (ఎట్టకేలకు) వారంతా మరలిరావలసింది మా వద్దకే కదా!
40:78 وَلَقَدْ أَرْسَلْنَا رُسُلًا مِّن قَبْلِكَ مِنْهُم مَّن قَصَصْنَا عَلَيْكَ وَمِنْهُم مَّن لَّمْ نَقْصُصْ عَلَيْكَ ۗ وَمَا كَانَ لِرَسُولٍ أَن يَأْتِيَ بِآيَةٍ إِلَّا بِإِذْنِ اللَّهِ ۚ فَإِذَا جَاءَ أَمْرُ اللَّهِ قُضِيَ بِالْحَقِّ وَخَسِرَ هُنَالِكَ الْمُبْطِلُونَ
నిశ్చయంగా నీకు పూర్వం కూడా మేము ఎంతోమంది ప్రవక్తల్ని పంపి ఉన్నాము. వారిలో కొందరి సంగతులు మేము నీకు తెలియపర్చాము. మరికొందరి వృత్తాంతాలను అసలు నీకు తెలుపనే లేదు. ఏ ప్రవక్త కూడా అల్లాహ్ అనుజ్ఞ లేకుండా ఏ మహిమనూ తీసుకురాలేకపోయేవాడు. మరి అల్లాహ్ ఆజ్ఞ వచ్చేసినపుడు సత్య (న్యాయ)బద్ధంగా తీర్పు జరిగితీరుతుంది. మరి అసత్యవాదులు మాత్రం అక్కడ నష్టానికి గురవుతారు.
40:79 اللَّهُ الَّذِي جَعَلَ لَكُمُ الْأَنْعَامَ لِتَرْكَبُوا مِنْهَا وَمِنْهَا تَأْكُلُونَ
అల్లాహ్ – ఆయనే మీ కొరకు పశువులను చేశాడు. వాటిలో కొన్నింటిపై మీరు స్వారీ చేస్తారు. మరి కొన్నింటిని తింటారు.
40:80 وَلَكُمْ فِيهَا مَنَافِعُ وَلِتَبْلُغُوا عَلَيْهَا حَاجَةً فِي صُدُورِكُمْ وَعَلَيْهَا وَعَلَى الْفُلْكِ تُحْمَلُونَ
వాటిలో మీ కొరకు మరెన్నో ప్రయోజనాలున్నాయి. మీరు వాటిపై ఎక్కి, మీ ఆంతర్యాల్లో ఉన్న అక్కరలను సాధించటానికి (అవి ఉపయోగపడుతున్నాయి) – మీరు వాటిపైన, ఓడలపైన తరలించబడుతున్నారు.
40:81 وَيُرِيكُمْ آيَاتِهِ فَأَيَّ آيَاتِ اللَّهِ تُنكِرُونَ
(ఈ విధంగా) అల్లాహ్ మీకు తన(శక్తి) సూచనలను చూపుతూపోతున్నాడు. మరి మీరు అల్లాహ్ సూచనల్లో వేటిని తిరస్కరించగలరు?
40:82 أَفَلَمْ يَسِيرُوا فِي الْأَرْضِ فَيَنظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الَّذِينَ مِن قَبْلِهِمْ ۚ كَانُوا أَكْثَرَ مِنْهُمْ وَأَشَدَّ قُوَّةً وَآثَارًا فِي الْأَرْضِ فَمَا أَغْنَىٰ عَنْهُم مَّا كَانُوا يَكْسِبُونَ
వీరు భువిలో సంచారం చేసి, తమకు పూర్వం గడచిన వారికి పట్టిన గతేమిటో చూడలేదా? వారు సంఖ్యాపరంగా వీరి కన్నా అధికులే. బలపరాక్రమాల రీత్యా వీళ్లకన్నా గట్టివారే. భువిలో వారు ఎన్నో చిహ్నాలను (కూడా) వదలిపోయారు. కాని వారి ఘనకార్యాలు వారికి ఏ విధంగానూ ఉపయోగపడలేదు.
40:83 فَلَمَّا جَاءَتْهُمْ رُسُلُهُم بِالْبَيِّنَاتِ فَرِحُوا بِمَا عِندَهُم مِّنَ الْعِلْمِ وَحَاقَ بِهِم مَّا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ
వారివద్దకు వారి ప్రవక్తలు ఎప్పుడు స్పష్టమైన సూచనలను తీసుకువచ్చినా తమవద్ద ఉన్న ‘విద్య’ ఆధారంగా వారు వికటాట్టహాసం చేసేవారు. వారు దేనిని పరిహసించేవారో ఎట్టకేలకు అదే వారిపై విరుచుకుపడింది.
40:84 فَلَمَّا رَأَوْا بَأْسَنَا قَالُوا آمَنَّا بِاللَّهِ وَحْدَهُ وَكَفَرْنَا بِمَا كُنَّا بِهِ مُشْرِكِينَ
మరి మా శిక్షను చూశాక – “ఒక్కడైన అల్లాహ్‌ను మేము విశ్వసించాము. ఆయనకు సహవర్తులుగా నిలబెడుతూ వచ్చిన వారందరినీ మేము త్రోసిపుచ్చుతున్నాం” అని చాటి చెప్పారు.
40:85 فَلَمْ يَكُ يَنفَعُهُمْ إِيمَانُهُمْ لَمَّا رَأَوْا بَأْسَنَا ۖ سُنَّتَ اللَّهِ الَّتِي قَدْ خَلَتْ فِي عِبَادِهِ ۖ وَخَسِرَ هُنَالِكَ الْكَافِرُونَ
కాని మా శిక్షను చూసిన తరువాత, వారి ‘విశ్వాసం’ వారికే విధంగానూ లాభదాయకం కాలేకపోయింది. ఇది అల్లాహ్ సంప్రదాయం! ఇది (తరతరాలుగా) ఆయన దాసుల్లో నెరవేరుతూ వస్తోంది. (దాన్ననుసరించే) అక్కడ అవిశ్వాసులు ఘోరంగా నష్టపోయారు. - సూరా హామీమ్ అస్ సజ్ ద హ్
41:1 حم
హా మీమ్.
41:2 تَنزِيلٌ مِّنَ الرَّحْمَٰنِ الرَّحِيمِ
(ఇది) అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడైన వాని తరఫునుంచి అవతరింపజేయబడినది.
41:3 كِتَابٌ فُصِّلَتْ آيَاتُهُ قُرْآنًا عَرَبِيًّا لِّقَوْمٍ يَعْلَمُونَ
(ఇది) ఎటువంటి గ్రంథమంటే, దీని వాక్యాలు చాలా విపులంగా వివరించబడ్డాయి. జ్ఞానమున్న జనుల కోసం అరబీలో ఉన్న ఖుర్ఆన్ ఇది…..
41:4 بَشِيرًا وَنَذِيرًا فَأَعْرَضَ أَكْثَرُهُمْ فَهُمْ لَا يَسْمَعُونَ
శుభవార్తను ఇచ్చేది, హెచ్చరిక చేసేది కూడా. అయినప్పటికీ వారిలోని అధికులు విముఖత చూపారు. అందుకే వారు (కనీసం) విననైనా వినటం లేదు.
41:5 وَقَالُوا قُلُوبُنَا فِي أَكِنَّةٍ مِّمَّا تَدْعُونَا إِلَيْهِ وَفِي آذَانِنَا وَقْرٌ وَمِن بَيْنِنَا وَبَيْنِكَ حِجَابٌ فَاعْمَلْ إِنَّنَا عَامِلُونَ
వారిలా అన్నారు : “నువ్వు దేని వైపుకు మమ్మల్ని పిలుస్తున్నావో దానికి సంబంధించి మా హృదయాలు తెరలలో ఉన్నాయి. మా చెవులలో భారం ఉంది. నీకూ – మాకూ మధ్య ఒక (అడ్డు) తెర ఉంది. కాబట్టి నీ పనేదో నువ్వు చేసుకో. మా పనిని మేము చేసి తీరుతాము.”
41:6 قُلْ إِنَّمَا أَنَا بَشَرٌ مِّثْلُكُمْ يُوحَىٰ إِلَيَّ أَنَّمَا إِلَٰهُكُمْ إِلَٰهٌ وَاحِدٌ فَاسْتَقِيمُوا إِلَيْهِ وَاسْتَغْفِرُوهُ ۗ وَوَيْلٌ لِّلْمُشْرِكِينَ
(ఓ ప్రవక్తా!) వారికీ విధంగా చెప్పు: “నేనూ మీలాంటి మానవమాత్రుణ్ణే. ‘మీరందరి ఆరాధ్య దైవం అల్లాహ్ ఒక్కడే’ అనే వహీ (వాణి) నా వద్దకు వస్తుంది. కనుక మీరంతా ఆయన వైపునే (నిజాయితీగా) నిలబడండి. మన్నింపు కోసం ఆయన్ని అర్థించండి.” ఈ ముష్రిక్కులకు వినాశం ఉంది.
41:7 الَّذِينَ لَا يُؤْتُونَ الزَّكَاةَ وَهُم بِالْآخِرَةِ هُمْ كَافِرُونَ
వారు జకాత్ ఇవ్వరు. పరలోకాన్ని కూడా తిరస్కరిస్తుంటారు.
41:8 إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ لَهُمْ أَجْرٌ غَيْرُ مَمْنُونٍ
నిశ్చయంగా విశ్వసించి, సత్కార్యాలు చేసినవారి కొరకు ఎన్నటికీ అంతంకాని పుణ్యఫలమున్నది.
41:9 قُلْ أَئِنَّكُمْ لَتَكْفُرُونَ بِالَّذِي خَلَقَ الْأَرْضَ فِي يَوْمَيْنِ وَتَجْعَلُونَ لَهُ أَندَادًا ۚ ذَٰلِكَ رَبُّ الْعَالَمِينَ
(ఓ ప్రవక్తా! వారికి) నువ్వు ఇలా చెప్పు: ఏమిటి, రెండు రోజులలో భూమిని సృష్టించిన వానినే (అల్లాహ్‌ను) మీరు తిరస్కరిస్తారా? ఇతరులను ఆయనకు భాగస్వాములుగా నిలబెడతారా? ఆయనే (వాస్తవానికి) సకల లోకాలకు ప్రభువు సుమా!
41:10 وَجَعَلَ فِيهَا رَوَاسِيَ مِن فَوْقِهَا وَبَارَكَ فِيهَا وَقَدَّرَ فِيهَا أَقْوَاتَهَا فِي أَرْبَعَةِ أَيَّامٍ سَوَاءً لِّلسَّائِلِينَ
మరి ఆయనే భూమిలో, దానిపై నుంచి పర్వతాలను పాతిపెట్టాడు. అందులో శుభాన్ని పొందుపరిచాడు. అందులో (నివసించే వారికొరకు) ఆహార పదార్థాలను కూడా తగు మోతాదులో సమకూర్చాడు. ఇదంతా (కేవలం) నాలుగు రోజుల్లో అయిపోయింది. ఇది అడిగేవారికి తగిన విధంగా ఉంది.
41:11 ثُمَّ اسْتَوَىٰ إِلَى السَّمَاءِ وَهِيَ دُخَانٌ فَقَالَ لَهَا وَلِلْأَرْضِ ائْتِيَا طَوْعًا أَوْ كَرْهًا قَالَتَا أَتَيْنَا طَائِعِينَ
తరువాత ఆయన పొగ(మాదిరి)గా ఉన్న ఆకాశం వైపు దృష్టిని మరల్చాడు. మరి దానినీ, భూమినీ ఉద్దేశించి, “మీకు ఇష్టం ఉన్నాసరే, ఇష్టం లేకున్నాసరే (ఉనికిలోకి) వచ్చేయండి” అన్నాడు. “మేము ఇష్టపూర్వకంగా వచ్చేశాము” అని అవి పలికాయి.
41:12 فَقَضَاهُنَّ سَبْعَ سَمَاوَاتٍ فِي يَوْمَيْنِ وَأَوْحَىٰ فِي كُلِّ سَمَاءٍ أَمْرَهَا ۚ وَزَيَّنَّا السَّمَاءَ الدُّنْيَا بِمَصَابِيحَ وَحِفْظًا ۚ ذَٰلِكَ تَقْدِيرُ الْعَزِيزِ الْعَلِيمِ
అంతే! రెండు రోజులలో సప్తాకాశాలను చేసేశాడు. ప్రతి ఆకాశంలోనూ తగిన ఆదేశాలతో కూడుకున్న ‘వహీ’ని పంపాడు. ఇంకా మేము సమీప ఆకాశాన్ని (క్రింది ఆకాశాన్ని) దీపాలతో ముస్తాబు చేశాము. (వాటి ద్వారా) దాన్ని సురక్షితమైనదిగా చేశాము. ఇదంతా సర్వాధిక్యుడు, జ్ఞానసంపన్నుడైన అల్లాహ్ నియామకం.
41:13 فَإِنْ أَعْرَضُوا فَقُلْ أَنذَرْتُكُمْ صَاعِقَةً مِّثْلَ صَاعِقَةِ عَادٍ وَثَمُودَ
అప్పటికీ వాళ్ళు గనక వైముఖ్యాన్ని ప్రదర్శిస్తే వారికీ విధంగా చెప్పేయ్ : “ఆద్ సమూద్ జాతులపై అకస్మాత్తుగా విరుచుకుపడినటువంటి విపత్తు గురించి నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను.”
41:14 إِذْ جَاءَتْهُمُ الرُّسُلُ مِن بَيْنِ أَيْدِيهِمْ وَمِنْ خَلْفِهِمْ أَلَّا تَعْبُدُوا إِلَّا اللَّهَ ۖ قَالُوا لَوْ شَاءَ رَبُّنَا لَأَنزَلَ مَلَائِكَةً فَإِنَّا بِمَا أُرْسِلْتُم بِهِ كَافِرُونَ
ప్రవక్తలు వారి దగ్గరకు వారి ముందు వైపు నుంచీ, వెనుక వైపునుంచీ వచ్చి “మీరు అల్లాహ్‌ను తప్ప మరొకరిని ఆరాధించకండి” అని చెప్పినపుడు, “మా ప్రభువు గనక కోరితే, ఆయన (తన) దూతలనే పంపి ఉండేవాడు. అందుకే మీకు ఇచ్చి పంపబడిన దానిని మేము త్రోసిపుచ్చుతున్నాం” అని చెప్పారు.
41:15 فَأَمَّا عَادٌ فَاسْتَكْبَرُوا فِي الْأَرْضِ بِغَيْرِ الْحَقِّ وَقَالُوا مَنْ أَشَدُّ مِنَّا قُوَّةً ۖ أَوَلَمْ يَرَوْا أَنَّ اللَّهَ الَّذِي خَلَقَهُمْ هُوَ أَشَدُّ مِنْهُمْ قُوَّةً ۖ وَكَانُوا بِآيَاتِنَا يَجْحَدُونَ
ఆద్ (జాతి వారి) విషయానికి వస్తే, వారు ఏ హక్కూ లేకుండానే భువిలో చెలరేగిపోయారు. “బలపరాక్రమాలలో మాకన్నా మొనగాడెవడున్నాడు?’ అని (బీరాలు) పలికారు. ఏమిటి, తమను పుట్టించిన అల్లాహ్ తమకన్నా ఎంతో బలవంతుడన్న సంగతి వారికి స్ఫురించలేదా? (కడ దాకా) వారు మా ఆయతులను తిరస్కరిస్తూనే ఉండేవారు.
41:16 فَأَرْسَلْنَا عَلَيْهِمْ رِيحًا صَرْصَرًا فِي أَيَّامٍ نَّحِسَاتٍ لِّنُذِيقَهُمْ عَذَابَ الْخِزْيِ فِي الْحَيَاةِ الدُّنْيَا ۖ وَلَعَذَابُ الْآخِرَةِ أَخْزَىٰ ۖ وَهُمْ لَا يُنصَرُونَ
ఎట్టకేలకు మేము వారికి, ప్రాపంచిక జీవితంలోనే అవమానకరమైన శిక్షను రుచి చూపించటానికి – దుర్దినాలలో వారిపై భయంకరమైన ఓ పెనుగాలిని పంపాము. పరలోక శిక్ష ఇంతకన్నా పరాభవంతో కూడుకున్నది సుమా! మరి (అక్కడ) వారికెలాంటి సహాయమూ అందదు.
41:17 وَأَمَّا ثَمُودُ فَهَدَيْنَاهُمْ فَاسْتَحَبُّوا الْعَمَىٰ عَلَى الْهُدَىٰ فَأَخَذَتْهُمْ صَاعِقَةُ الْعَذَابِ الْهُونِ بِمَا كَانُوا يَكْسِبُونَ
ఇకపోతే సమూద్ (జాతి) వారు; మేము వారికి కూడా సన్మార్గం చూపించాము. అయినప్పటికీ వారు మార్గదర్శనంపై అంధత్వానికే ప్రాధాన్యత ఇచ్చారు. మరి వారి దురాగతాలకు బదులుగా వారిని (నిలువెల్లా) అవమానకరమైన శిక్ష యొక్క గర్జన కబళించింది.
41:18 وَنَجَّيْنَا الَّذِينَ آمَنُوا وَكَانُوا يَتَّقُونَ
మరయితే విశ్వాసులను, భక్తిపరాయణులను మాత్రం మేము (ఆ విపత్తు నుంచి) కాపాడాము.
41:19 وَيَوْمَ يُحْشَرُ أَعْدَاءُ اللَّهِ إِلَى النَّارِ فَهُمْ يُوزَعُونَ
ఏ రోజున అల్లాహ్ విరోధులు నరకాగ్ని వైపుకు సమీకరించబడతారో, అప్పుడు వారంతా (పలు సమూహాలుగా) విడగొట్టబడతారు.
41:20 حَتَّىٰ إِذَا مَا جَاءُوهَا شَهِدَ عَلَيْهِمْ سَمْعُهُمْ وَأَبْصَارُهُمْ وَجُلُودُهُم بِمَا كَانُوا يَعْمَلُونَ
ఆ విధంగా వారు నరకాగ్నికి చాలా సమీపంలోకి రాగానే వారి చెవులు, వారి కళ్లు, వారి చర్మాలు సయితం వారు చేస్తూ ఉండిన పనుల గురించి సాక్ష్యమిస్తాయి.
41:21 وَقَالُوا لِجُلُودِهِمْ لِمَ شَهِدتُّمْ عَلَيْنَا ۖ قَالُوا أَنطَقَنَا اللَّهُ الَّذِي أَنطَقَ كُلَّ شَيْءٍ وَهُوَ خَلَقَكُمْ أَوَّلَ مَرَّةٍ وَإِلَيْهِ تُرْجَعُونَ
“మీరు మాకు వ్యతిరేకంగా ఎందుకు సాక్ష్యమిచ్చారు?” అని వారు తమ చర్మాలనుద్దేశించి అడుగుతారు. “అన్ని వస్తువులకూ మాట్లాడే శక్తిని ఇచ్చిన అల్లాహ్‌యే మాకూ మాట్లాడే శక్తిని ప్రసాదించాడు. ఆయనే మిమ్మల్ని తొలిసారి పుట్టించాడు. మరి ఆయన వైపునకే మీరంతా మరలించబడతారు” అని సమాధానమిస్తాయి.
41:22 وَمَا كُنتُمْ تَسْتَتِرُونَ أَن يَشْهَدَ عَلَيْكُمْ سَمْعُكُمْ وَلَا أَبْصَارُكُمْ وَلَا جُلُودُكُمْ وَلَٰكِن ظَنَنتُمْ أَنَّ اللَّهَ لَا يَعْلَمُ كَثِيرًا مِّمَّا تَعْمَلُونَ
“మీరు రహస్యంగా (చెడుపనులకు) పాల్పడుతున్నప్పుడు మీ చెవులు, మీ కళ్లు, మీ చర్మాలు మీకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తాయన్న ఆలోచన మీకు ఉండేది కాదు. పైగా మీరు చేసే చాలా పనులు అల్లాహ్‌కు కూడా తెలియవని అనుకునేవారు.”
41:23 وَذَٰلِكُمْ ظَنُّكُمُ الَّذِي ظَنَنتُم بِرَبِّكُمْ أَرْدَاكُمْ فَأَصْبَحْتُم مِّنَ الْخَاسِرِينَ
“మీ ప్రభువు గురించి మీరు చేసిన ఈ దురాలోచనే మిమ్మల్ని సర్వనాశనం చేసింది. చివరకు మీరు ఘోర నష్టానికి గురయ్యారు.”
41:24 فَإِن يَصْبِرُوا فَالنَّارُ مَثْوًى لَّهُمْ ۖ وَإِن يَسْتَعْتِبُوا فَمَا هُم مِّنَ الْمُعْتَبِينَ
ఈ స్థితిలో వీరు ఓర్పు వహించినా (వహించకపోయినా), నరకాగ్నే వారి నివాసం. ఒకవేళ వారు క్షమాభిక్ష కోసం అర్థించినా క్షమించబడరు.
41:25 وَقَيَّضْنَا لَهُمْ قُرَنَاءَ فَزَيَّنُوا لَهُم مَّا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ وَحَقَّ عَلَيْهِمُ الْقَوْلُ فِي أُمَمٍ قَدْ خَلَتْ مِن قَبْلِهِم مِّنَ الْجِنِّ وَالْإِنسِ ۖ إِنَّهُمْ كَانُوا خَاسِرِينَ
మేము వారి వెంట కొందరు సహవాసులను నియమించాము. వారేమో వీరికి ముందూ వెనుకా ఉన్న వీరి కర్మలను అందమైనవిగా కనిపించేలా చేశారు. వీరికి పూర్వం గతించిన జిన్నాతుల, మానవ జాతుల విషయంలో ఖరారైన అల్లాహ్ వాక్కే వీరి విషయంలో కూడా జరిగింది. నిశ్చయంగా వీరు నష్టపోయిన వారయ్యారు.
41:26 وَقَالَ الَّذِينَ كَفَرُوا لَا تَسْمَعُوا لِهَٰذَا الْقُرْآنِ وَالْغَوْا فِيهِ لَعَلَّكُمْ تَغْلِبُونَ
అవిశ్వాసులు ఇలా అన్నారు: “ఈ ఖుర్ఆన్ను అస్సలు వినకండి. (అది పఠించబడినప్పుడు) గోల (గలాటా) చేయండి. బహుశా (అలాగైనా) మీది పైచేయి కావచ్చు.”
41:27 فَلَنُذِيقَنَّ الَّذِينَ كَفَرُوا عَذَابًا شَدِيدًا وَلَنَجْزِيَنَّهُمْ أَسْوَأَ الَّذِي كَانُوا يَعْمَلُونَ
కాబట్టి మేము తప్పకుండా ఈ అవిశ్వాసులకు చాలా కఠినమైన శిక్ష రుచి చూపిస్తాము. వారు చేస్తూ ఉండిన పరమ దుష్కార్యాలకు తగిన ప్రతిఫలాన్ని తప్పకుండా ఇస్తాము.
41:28 ذَٰلِكَ جَزَاءُ أَعْدَاءِ اللَّهِ النَّارُ ۖ لَهُمْ فِيهَا دَارُ الْخُلْدِ ۖ جَزَاءً بِمَا كَانُوا بِآيَاتِنَا يَجْحَدُونَ
అల్లాహ్ విరోధులకు శిక్ష(గా లభించవలసింది) ఈ నరకాగ్నే. అందులో వారి శాశ్వత నివాస గృహం ఉంటుంది. మా ఆయతులను త్రోసిపుచ్చినందుకు (వారికి లభించిన) ప్రతిఫలం ఇది.
41:29 وَقَالَ الَّذِينَ كَفَرُوا رَبَّنَا أَرِنَا اللَّذَيْنِ أَضَلَّانَا مِنَ الْجِنِّ وَالْإِنسِ نَجْعَلْهُمَا تَحْتَ أَقْدَامِنَا لِيَكُونَا مِنَ الْأَسْفَلِينَ
(అప్పుడు) అవిశ్వాసులు, “మా ప్రభూ! మమ్మల్ని పెడదారి పట్టించిన జిన్నులను, మనుషులను కాస్త చూపించు. వాళ్ళను మేము మా పాదాల క్రింద వేసి, (నరకంలో) అట్టడుగు స్థానానికి పోయేలా తొక్కి వేస్తాము” అని విన్నవించుకుంటారు.
41:30 إِنَّ الَّذِينَ قَالُوا رَبُّنَا اللَّهُ ثُمَّ اسْتَقَامُوا تَتَنَزَّلُ عَلَيْهِمُ الْمَلَائِكَةُ أَلَّا تَخَافُوا وَلَا تَحْزَنُوا وَأَبْشِرُوا بِالْجَنَّةِ الَّتِي كُنتُمْ تُوعَدُونَ
“మా ప్రభువు అల్లాహ్ మాత్రమే ” అని పలికి, దానిపై స్థిరంగా ఉన్న వారి వద్దకు దైవదూతలు దిగివచ్చి, (ఇలా అంటూ ఉంటారు): “మీరు భయపడకండి. దుఃఖించకండి. మీకు వాగ్దానం చేయబడిన స్వర్గలోకపు శుభవార్తను అందుకోండి.
41:31 نَحْنُ أَوْلِيَاؤُكُمْ فِي الْحَيَاةِ الدُّنْيَا وَفِي الْآخِرَةِ ۖ وَلَكُمْ فِيهَا مَا تَشْتَهِي أَنفُسُكُمْ وَلَكُمْ فِيهَا مَا تَدَّعُونَ
“ప్రాపంచిక జీవితంలో కూడా మేము మీ నేస్తాలుగా ఉంటూవచ్చాము. పరలోకంలో కూడా ఉంటాము. మీ మనసు కోరినదల్లా, మీరు అడిగినదల్లా అందులో మీకు లభిస్తుంది.
41:32 نُزُلًا مِّنْ غَفُورٍ رَّحِيمٍ
“క్షమాశీలి, దయాశీలి (అయిన అల్లాహ్) తరఫున లభించే ఆతిథ్యమిది.”
41:33 وَمَنْ أَحْسَنُ قَوْلًا مِّمَّن دَعَا إِلَى اللَّهِ وَعَمِلَ صَالِحًا وَقَالَ إِنَّنِي مِنَ الْمُسْلِمِينَ
అల్లాహ్ వైపు (జనులను) పిలుస్తూ, సత్కార్యాలు చేస్తూ ‘నేను విధేయుల (ముస్లింల)లో ఒకడను’ అని పలికేవాని మాటకంటే మంచిమాట మరెవరిది కాగలదు?
41:34 وَلَا تَسْتَوِي الْحَسَنَةُ وَلَا السَّيِّئَةُ ۚ ادْفَعْ بِالَّتِي هِيَ أَحْسَنُ فَإِذَا الَّذِي بَيْنَكَ وَبَيْنَهُ عَدَاوَةٌ كَأَنَّهُ وَلِيٌّ حَمِيمٌ
మంచీ – చెడు (ఎట్టి పరిస్థితిలోనూ) సమానం కాలేవు. (ఓ ప్రవక్తా!) చెడును మంచి ద్వారా తొలగించు. ఆ తరువాత (నువ్వే చూద్దువుగాని), నీకూ- తనకూ మధ్య బద్ధవిరోధం ఉన్న అతను సైతం నీకు ప్రాణస్నేహితుడైపోతాడు.
41:35 وَمَا يُلَقَّاهَا إِلَّا الَّذِينَ صَبَرُوا وَمَا يُلَقَّاهَا إِلَّا ذُو حَظٍّ عَظِيمٍ
అయితే ఈ భాగ్యం సహనశీలురకు మాత్రమే ప్రాప్తిస్తుంది. దీన్ని గొప్ప అదృష్టవంతులు మాత్రమే పొందగలుగుతారు.
41:36 وَإِمَّا يَنزَغَنَّكَ مِنَ الشَّيْطَانِ نَزْغٌ فَاسْتَعِذْ بِاللَّهِ ۖ إِنَّهُ هُوَ السَّمِيعُ الْعَلِيمُ
ఒకవేళ (ఏ సమయంలోనయినా) షైతాను తరఫున నీకు ఏదయినా దుష్ప్రేరణ కలిగితే అల్లాహ్ శరణు వేడుకో. నిస్సందేహంగా ఆయన అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు.
41:37 وَمِنْ آيَاتِهِ اللَّيْلُ وَالنَّهَارُ وَالشَّمْسُ وَالْقَمَرُ ۚ لَا تَسْجُدُوا لِلشَّمْسِ وَلَا لِلْقَمَرِ وَاسْجُدُوا لِلَّهِ الَّذِي خَلَقَهُنَّ إِن كُنتُمْ إِيَّاهُ تَعْبُدُونَ
రేయింబవళ్లూ, సూర్యచంద్రులు కూడా ఆయన (శక్తి) సూచనలలోనివే. మీరు సూర్యునికిగానీ, చంద్రునికిగానీ సాష్టాంగప్రణామం (సజ్దా) చేయకండి. నిజంగా మీరు అల్లాహ్ దాస్యం చేసేవారే అయితే వీటన్నింటినీ సృష్టించిన అల్లాహ్ ముందు సాష్టాంగపడండి.
41:38 فَإِنِ اسْتَكْبَرُوا فَالَّذِينَ عِندَ رَبِّكَ يُسَبِّحُونَ لَهُ بِاللَّيْلِ وَالنَّهَارِ وَهُمْ لَا يَسْأَمُونَ ۩
అయినప్పటికీ వారు గనక అహంకారంతో హఠం చేస్తే (చేయనివ్వు) నీ ప్రభువు దగ్గర ఉన్నవారు (దైవదూతలు) అహో రాత్రులు ఆయన పవిత్రతను కొనియాడుతున్నారు. (ఈ పనిలో ఎన్నటికీ) వారు విసిగిపోరు.
41:39 وَمِنْ آيَاتِهِ أَنَّكَ تَرَى الْأَرْضَ خَاشِعَةً فَإِذَا أَنزَلْنَا عَلَيْهَا الْمَاءَ اهْتَزَّتْ وَرَبَتْ ۚ إِنَّ الَّذِي أَحْيَاهَا لَمُحْيِي الْمَوْتَىٰ ۚ إِنَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
ఆయన శక్తిసూచనలలో మరొకటేమిటంటే నేల అణగి మణగి ఉండటాన్ని నువ్వు చూస్తావు. మరి దానిపై మేము వర్షం కురిపించగానే అది చిగురిస్తూ, ఉబికి వస్తుంది. ఈ నేలను బ్రతికించినవాడే నిస్సందేహంగా మృతులను కూడా బ్రతికిస్తాడు. నిశ్చయంగా ఆయన ప్రతిదీ చేయగల అధికారం గలవాడు.
41:40 إِنَّ الَّذِينَ يُلْحِدُونَ فِي آيَاتِنَا لَا يَخْفَوْنَ عَلَيْنَا ۗ أَفَمَن يُلْقَىٰ فِي النَّارِ خَيْرٌ أَم مَّن يَأْتِي آمِنًا يَوْمَ الْقِيَامَةِ ۚ اعْمَلُوا مَا شِئْتُمْ ۖ إِنَّهُ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ
మా వాక్యాల విషయంలో వక్ర వైఖరిని అవలంబిస్తున్న వారు మా దృష్టిలో లేకుండా లేరు. (చెప్పండి!) అగ్నిలో పడవేయబడేవాడు మేలా? లేక ప్రళయ దినాన సురక్షితంగా (ప్రశాంత స్థితిలో) వచ్చేవాడు మేలా? మీరు ఇష్టం వచ్చింది చేసుకుంటూ పోండి. ఆయన మీరు చేసే పనులన్నిటినీ చూస్తూనే ఉన్నాడు.
41:41 إِنَّ الَّذِينَ كَفَرُوا بِالذِّكْرِ لَمَّا جَاءَهُمْ ۖ وَإِنَّهُ لَكِتَابٌ عَزِيزٌ
తమ వద్దకు హితోపదేశం (ఖుర్ఆన్) వచ్చేసినప్పటికీ, దాన్ని త్రోసిపుచ్చిన వారు (కూడా మా నుండి దాగిలేరు). అదొక ప్రతిష్ఠాత్మకమైన గ్రంథం.
41:42 لَّا يَأْتِيهِ الْبَاطِلُ مِن بَيْنِ يَدَيْهِ وَلَا مِنْ خَلْفِهِ ۖ تَنزِيلٌ مِّنْ حَكِيمٍ حَمِيدٍ
అసత్యం దాని దరిదాపుల్లోకి కూడా – దాని ముందునుండిగానీ, దాని వెనుక నుండిగానీ – రాజాలదు. (ఎందుకంటే) అది మహా వివేకవంతుడు, ప్రశంసనీయుడైన అల్లాహ్ తరఫున అవతరింపజేయబడినది.
41:43 مَّا يُقَالُ لَكَ إِلَّا مَا قَدْ قِيلَ لِلرُّسُلِ مِن قَبْلِكَ ۚ إِنَّ رَبَّكَ لَذُو مَغْفِرَةٍ وَذُو عِقَابٍ أَلِيمٍ
(ఓ ప్రవక్తా!) నీకు పూర్వం గతించిన ప్రవక్తలతో చెప్పబడినదే నీకూ చెప్పబడుతోంది. నిశ్చయంగా నీ ప్రభువు క్షమకలవాడు, వ్యధాభరితంగా శిక్షించేవాడు కూడా.
41:44 وَلَوْ جَعَلْنَاهُ قُرْآنًا أَعْجَمِيًّا لَّقَالُوا لَوْلَا فُصِّلَتْ آيَاتُهُ ۖ أَأَعْجَمِيٌّ وَعَرَبِيٌّ ۗ قُلْ هُوَ لِلَّذِينَ آمَنُوا هُدًى وَشِفَاءٌ ۖ وَالَّذِينَ لَا يُؤْمِنُونَ فِي آذَانِهِمْ وَقْرٌ وَهُوَ عَلَيْهِمْ عَمًى ۚ أُولَٰئِكَ يُنَادَوْنَ مِن مَّكَانٍ بَعِيدٍ
ఒకవేళ మేము ఈ ఖుర్ఆను (గ్రంథము)ను అరబ్బీయేతర ఖుర్ఆన్గా చేసివుంటే, “దీని వాక్యాలు స్పష్టంగా ఎందుకు వివరించబడలేదు? (ఇదేమిటయ్యా!) ఇదేమో అరబ్బీయేతర గ్రంథమూను, నువ్వేమో అరబీ ప్రవక్తవా!” అని వారు చెప్పి ఉండేవారు. (ఓ ప్రవక్తా!) నువ్వు వారికి చెప్పేయి: “ఇది విశ్వసించిన వారికోసం మార్గదర్శిని, ఆరోగ్య ప్రదాయిని. కాని విశ్వసించని వారి చెవులలో మాత్రం బరువు (చెవుడు) ఉంది. పైగా ఇది వారి పాలిట అంధత్వంగా పరిణమించింది. వారు బహు దూరపు చోటు నుంచి పిలువబడే జనుల్లా ఉన్నారు.”
41:45 وَلَقَدْ آتَيْنَا مُوسَى الْكِتَابَ فَاخْتُلِفَ فِيهِ ۗ وَلَوْلَا كَلِمَةٌ سَبَقَتْ مِن رَّبِّكَ لَقُضِيَ بَيْنَهُمْ ۚ وَإِنَّهُمْ لَفِي شَكٍّ مِّنْهُ مُرِيبٍ
మేము మూసాకు (కూడా) గ్రంథాన్ని ఇచ్చి ఉన్నాము. మరైతే అందులో కూడా విభేదించుకోవటం జరిగింది. నీ ప్రభువు తరఫున ముందుగానే (ఆ) విషయం నిర్ధారించబడకుండా ఉంటే, వీళ్ళ మధ్య వ్యవహారం ఎప్పుడో తేల్చేయబడి ఉండేది. వీళ్లు ఆ విషయంలో తీవ్రంగా వ్యాకులపరిచే సందేహానికి లోనై ఉన్నారు.
41:46 مَّنْ عَمِلَ صَالِحًا فَلِنَفْسِهِ ۖ وَمَنْ أَسَاءَ فَعَلَيْهَا ۗ وَمَا رَبُّكَ بِظَلَّامٍ لِّلْعَبِيدِ
ఎవరయినా సత్కార్యం చేస్తే తన మేలు కోసమే చేసుకుంటాడు. మరెవరయినా దుష్కార్యానికి ఒడిగడితే దాని దుష్ఫలితం అతని మీదే పడుతుంది. నీ ప్రభువు మాత్రం (తన) దాసులకు అన్యాయం చేసేవాడు కాడు.
41:47 إِلَيْهِ يُرَدُّ عِلْمُ السَّاعَةِ ۚ وَمَا تَخْرُجُ مِن ثَمَرَاتٍ مِّنْ أَكْمَامِهَا وَمَا تَحْمِلُ مِنْ أُنثَىٰ وَلَا تَضَعُ إِلَّا بِعِلْمِهِ ۚ وَيَوْمَ يُنَادِيهِمْ أَيْنَ شُرَكَائِي قَالُوا آذَنَّاكَ مَا مِنَّا مِن شَهِيدٍ
ప్రళయ ఘడియకు సంబంధించిన జ్ఞానం అల్లాహ్‌కే ఉందని అనటం సమంజసం. ఆయనకు తెలియకుండా ఏ ఫలము కూడా తన గుబురు గలీబు నుంచి బయటకు రావటంగానీ, ఏ ఆడదీ గర్భందాల్చటంగానీ, ప్రసవించటంగానీ జరగదు. “నా భాగస్వాములు ఎక్కడున్నారు?” అని అల్లాహ్ (ముష్రిక్కులను) పిలిచి వాకబు చేసిననాడు, “మాలో ఎవడూ దానికి (సంబంధించి) సాక్ష్యమిచ్చేవాడు లేడని నీతో విన్నవించుకున్నాము” అని వారంటారు.
41:48 وَضَلَّ عَنْهُم مَّا كَانُوا يَدْعُونَ مِن قَبْلُ ۖ وَظَنُّوا مَا لَهُم مِّن مَّحِيصٍ
అంతకు మునుపు వారు ఎవరెవరినయితే పూజించేవారో వాళ్ళంతా వారి నుండి అదృశ్యమైపోయారు. ఇక తమకు ఎక్కడా రక్షణ లేదని వారు అర్థం చేసుకుంటారు.
41:49 لَّا يَسْأَمُ الْإِنسَانُ مِن دُعَاءِ الْخَيْرِ وَإِن مَّسَّهُ الشَّرُّ فَيَئُوسٌ قَنُوطٌ
మేలును అర్థించటంలో మానవుడు (ఎప్పటికీ) అలసిపోడు. అతనికేదైనా కీడు కలిగితే మాత్రం ఆశలన్నీ వదులుకుని నిస్పృహ చెందుతాడు.
41:50 وَلَئِنْ أَذَقْنَاهُ رَحْمَةً مِّنَّا مِن بَعْدِ ضَرَّاءَ مَسَّتْهُ لَيَقُولَنَّ هَٰذَا لِي وَمَا أَظُنُّ السَّاعَةَ قَائِمَةً وَلَئِن رُّجِعْتُ إِلَىٰ رَبِّي إِنَّ لِي عِندَهُ لَلْحُسْنَىٰ ۚ فَلَنُنَبِّئَنَّ الَّذِينَ كَفَرُوا بِمَا عَمِلُوا وَلَنُذِيقَنَّهُم مِّنْ عَذَابٍ غَلِيظٍ
కష్టాలు వచ్చిన తర్వాత మేమతనికి మా కారుణ్యం రుచిని చూపినట్లయితే “అదెలాగూ నాకు దక్కవలసిందే (ఆ యోగ్యత నాలో ఉంది గనక). ప్రళయ ఘడియ నెలకొంటుందని నేనైతే అనుకోను. ఒకవేళ నేను నా ప్రభువు వద్దకు మరలించబడినా, నిశ్చయంగా ఆయన దగ్గర నాకు మంచి (స్థానమే) లభిస్తుంది” అని బీరాలు పలుకుతాడు. ఇలాంటి తిరస్కారులకు మేము తప్పకుండా వారు ఏమేమి చేశారో తెలియపరుస్తాము. వారికి దుర్భరమైన యాతనను చవిచూపిస్తాము.
41:51 وَإِذَا أَنْعَمْنَا عَلَى الْإِنسَانِ أَعْرَضَ وَنَأَىٰ بِجَانِبِهِ وَإِذَا مَسَّهُ الشَّرُّ فَذُو دُعَاءٍ عَرِيضٍ
మానవునిపై మేము మా అనుగ్రహాలను కురిపించినప్పుడు, అతడు ముఖం త్రిప్పుకుంటాడు, తన(కు నచ్చిన) ప్రక్కకు తిరిగి పోతాడు. తనపై ఆపద వచ్చిపడినప్పుడు మాత్రం సుదీర్ఘమైన ప్రార్థనలు చేసేవాడిగా మారిపోతాడు.
41:52 قُلْ أَرَأَيْتُمْ إِن كَانَ مِنْ عِندِ اللَّهِ ثُمَّ كَفَرْتُم بِهِ مَنْ أَضَلُّ مِمَّنْ هُوَ فِي شِقَاقٍ بَعِيدٍ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “చూడండి! ఒకవేళ ఈ ఖుర్ఆన్ అల్లాహ్ తరఫునుంచి వచ్చి ఉంటే, మరి మీరు దానిని తిరస్కరిస్తే, (దాన్ని) వ్యతిరేకించటంలో బహుదూరం వెళ్ళిపోయిన వ్యక్తి కన్నా మార్గభ్రష్టుడు ఎవడుంటాడు?”
41:53 سَنُرِيهِمْ آيَاتِنَا فِي الْآفَاقِ وَفِي أَنفُسِهِمْ حَتَّىٰ يَتَبَيَّنَ لَهُمْ أَنَّهُ الْحَقُّ ۗ أَوَلَمْ يَكْفِ بِرَبِّكَ أَنَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ شَهِيدٌ
త్వరలోనే మేము వారికి మా సూచనలను జగతిలోనూ చూపిస్తాము, స్వయంగా వారి(ఉనికి)లోనూ చూపిస్తాము. తుదకు సత్యమిదే అనే విషయం వారికి తేటతెల్లమవుతుంది. ఏమిటి, నీ ప్రభువు ప్రతిదానికీ సాక్షిగా ఉన్నాడనే విషయం చాలదా?
41:54 أَلَا إِنَّهُمْ فِي مِرْيَةٍ مِّن لِّقَاءِ رَبِّهِمْ ۗ أَلَا إِنَّهُ بِكُلِّ شَيْءٍ مُّحِيطٌ
(నీకు) తెలుసా! వీళ్లు తమ ప్రభువును కలుసుకునే విషయమై అనుమానానికి గురై ఉన్నారు. గుర్తుంచుకో! ఆయన ప్రతి వస్తువునూ ఆవరించి ఉన్నాడు. - సూరా ఆష్ షూరా
42:1 حم
హా మీమ్.
42:2 عسق
ఐన్ సీన్ ఖాఫ్.
42:3 كَذَٰلِكَ يُوحِي إِلَيْكَ وَإِلَى الَّذِينَ مِن قَبْلِكَ اللَّهُ الْعَزِيزُ الْحَكِيمُ
ఇదే విధంగా అపార శక్తిమంతుడూ, వివేచనాపరుడైన అల్లాహ్ నీకూ, నీకు పూర్వం గతించిన వారికీ వహీ (సందేశము)ని పంపిస్తూ వచ్చాడు.
42:4 لَهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۖ وَهُوَ الْعَلِيُّ الْعَظِيمُ
ఆకాశాలలో, భూమిలో ఉన్నవన్నీ ఆయనవే. ఆయన మహోన్నతుడు, చాలా గొప్పవాడు.
42:5 تَكَادُ السَّمَاوَاتُ يَتَفَطَّرْنَ مِن فَوْقِهِنَّ ۚ وَالْمَلَائِكَةُ يُسَبِّحُونَ بِحَمْدِ رَبِّهِمْ وَيَسْتَغْفِرُونَ لِمَن فِي الْأَرْضِ ۗ أَلَا إِنَّ اللَّهَ هُوَ الْغَفُورُ الرَّحِيمُ
ఆకాశం వారిపై నుంచి పగిలి పడిపోవటానికి సిద్ధంగా ఉన్నట్లే ఉంది. మరి దైవదూతలంతా స్తోత్రసమేతంగా తమ ప్రభువు పవిత్రతను కొనియాడుతున్నారు. భూవాసుల మన్నింపు కోసం వారు వేడుకుంటున్నారు. విన్నావా! నిస్సందేహంగా అల్లాహ్‌యే క్షమించేవాడు, కృపాకరుడు.
42:6 وَالَّذِينَ اتَّخَذُوا مِن دُونِهِ أَوْلِيَاءَ اللَّهُ حَفِيظٌ عَلَيْهِمْ وَمَا أَنتَ عَلَيْهِم بِوَكِيلٍ
ఆయన్ని వదలి ఇతరులను సంరక్షకులుగా చేసుకున్న వారిని అల్లాహ్ కనిపెట్టుకునే ఉన్నాడు. వాళ్ల (వ్యవహారాల)కు నువ్వు బాధ్యుడవు కావు.
42:7 وَكَذَٰلِكَ أَوْحَيْنَا إِلَيْكَ قُرْآنًا عَرَبِيًّا لِّتُنذِرَ أُمَّ الْقُرَىٰ وَمَنْ حَوْلَهَا وَتُنذِرَ يَوْمَ الْجَمْعِ لَا رَيْبَ فِيهِ ۚ فَرِيقٌ فِي الْجَنَّةِ وَفَرِيقٌ فِي السَّعِيرِ
అలాగే నీవు ఉమ్ముల్ ఖురా (మక్కా) వారినీ, దాని పరిసరాల వారిని హెచ్చరించటానికి, సందేహానికి ఆస్కారమేలేని, అందరూ సమావేశమయ్యే రోజు గురించి అప్రమత్తం చేయటానికి మేము నీ వద్దకు అరబీ ఖుర్ఆన్ను వహీ చేశాము. (తీర్పు అనంతరం) ఒక వర్గం స్వర్గంలో ఉండగా, మరో వర్గం నరకాగ్నిలో ఉంటుంది.
42:8 وَلَوْ شَاءَ اللَّهُ لَجَعَلَهُمْ أُمَّةً وَاحِدَةً وَلَٰكِن يُدْخِلُ مَن يَشَاءُ فِي رَحْمَتِهِ ۚ وَالظَّالِمُونَ مَا لَهُم مِّن وَلِيٍّ وَلَا نَصِيرٍ
అల్లాహ్‌యే గనక తలచుకుంటే వారందరినీ ఒకే సముదాయంగా చేసి ఉండేవాడు. అయితే ఆయన తాను తలచిన వారిని తన కారుణ్యంలోకి తీసుకుంటాడు. దుర్మార్గులను కాపాడే వాడు, సహాయపడేవాడెవడూ ఉండడు.
42:9 أَمِ اتَّخَذُوا مِن دُونِهِ أَوْلِيَاءَ ۖ فَاللَّهُ هُوَ الْوَلِيُّ وَهُوَ يُحْيِي الْمَوْتَىٰ وَهُوَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
ఏమిటి, వారు అల్లాహ్‌ను వదలి ఇతరుల్ని తమ కార్యసాధకులుగా చేసుకున్నారా? (యదార్థమేమిటంటే) అల్లాహ్‌యే కార్యసాధకుడు, ఆయనే మృతులను బ్రతికిస్తాడు, ఆయన ప్రతిదానిపై అధికారం కలవాడు.
42:10 وَمَا اخْتَلَفْتُمْ فِيهِ مِن شَيْءٍ فَحُكْمُهُ إِلَى اللَّهِ ۚ ذَٰلِكُمُ اللَّهُ رَبِّي عَلَيْهِ تَوَكَّلْتُ وَإِلَيْهِ أُنِيبُ
ఏ ఏ విషయంలో మీరు విభేదించారో, దానికి సంబంధించిన తీర్పు అల్లాహ్‌కే అప్పగించబడుతుంది. ఈ అల్లాహ్‌యే నా ప్రభువు. ఆయన్నే నేను నమ్ముకున్నాను. ఆయన వైపునకే నేను మరలుతున్నాను (అని ఓ ప్రవక్తా! నువ్వు వారికి చెప్పు).
42:11 فَاطِرُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ جَعَلَ لَكُم مِّنْ أَنفُسِكُمْ أَزْوَاجًا وَمِنَ الْأَنْعَامِ أَزْوَاجًا ۖ يَذْرَؤُكُمْ فِيهِ ۚ لَيْسَ كَمِثْلِهِ شَيْءٌ ۖ وَهُوَ السَّمِيعُ الْبَصِيرُ
భూమ్యాకాశాలను పుట్టించినవాడు ఆయనే. ఆయన మీకోసం మీ నుండే మీ జతలను చేశాడు. పశువుల జతలను కూడా చేశాడు. ఈ విధంగా (ఇలలో) మిమ్మల్ని వ్యాపింపజేస్తున్నాడు. ఆయన్ని పోలిన వస్తువేదీ లేదు. ఆయన వినేవాడు, చూచేవాడు.
42:12 لَهُ مَقَالِيدُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ يَبْسُطُ الرِّزْقَ لِمَن يَشَاءُ وَيَقْدِرُ ۚ إِنَّهُ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ
భూమ్యాకాశాల తాళం చెవులు ఆయనవే. ఆయన తాను కోరిన వారికి ఉపాధిని విస్తృతంగా ఇస్తాడు, (మరి తాను కోరిన వారికి) తగ్గించి ఇస్తాడు. నిశ్చయంగా ఆయన ప్రతిదీ తెలిసిన వాడు.
42:13 شَرَعَ لَكُم مِّنَ الدِّينِ مَا وَصَّىٰ بِهِ نُوحًا وَالَّذِي أَوْحَيْنَا إِلَيْكَ وَمَا وَصَّيْنَا بِهِ إِبْرَاهِيمَ وَمُوسَىٰ وَعِيسَىٰ ۖ أَنْ أَقِيمُوا الدِّينَ وَلَا تَتَفَرَّقُوا فِيهِ ۚ كَبُرَ عَلَى الْمُشْرِكِينَ مَا تَدْعُوهُمْ إِلَيْهِ ۚ اللَّهُ يَجْتَبِي إِلَيْهِ مَن يَشَاءُ وَيَهْدِي إِلَيْهِ مَن يُنِيبُ
ఏ ధర్మాన్ని స్థాపించమని అల్లాహ్ నూహ్‌కు ఆజ్ఞాపించాడో ఆ ధర్మాన్నే మీ కొరకూ నిర్ధారించాడు. దానినే (ఓ ముహమ్మద్- సఅసం!) మేము నీ వైపుకు (వహీ ద్వారా) పంపాము. దాని గురించే ఇబ్రాహీముకు, మూసాకు, ఈసా (అలైహిముస్సలాం)కు కూడా తాకీదు చేశాము. ఈ ధర్మాన్నే నెలకొల్పాలనీ, అందులో చీలిక తీసుకురావద్దనీ (వారికి) ఉపదేశించాము. (ఓ ముహమ్మద్ – సఅసం!) నువ్వు ఏ విషయం వైపునకు వారిని పిలుస్తున్నావో అది బహుదైవారాధకులకు చాలా భారంగా తోస్తుంది. అల్లాహ్ తాను కోరిన వారిని (తన కార్యం కొరకు) ఎన్నుకుంటాడు. తన వైపు మరలే వానికి ఆయన సన్మార్గం చూపుతాడు.
42:14 وَمَا تَفَرَّقُوا إِلَّا مِن بَعْدِ مَا جَاءَهُمُ الْعِلْمُ بَغْيًا بَيْنَهُمْ ۚ وَلَوْلَا كَلِمَةٌ سَبَقَتْ مِن رَّبِّكَ إِلَىٰ أَجَلٍ مُّسَمًّى لَّقُضِيَ بَيْنَهُمْ ۚ وَإِنَّ الَّذِينَ أُورِثُوا الْكِتَابَ مِن بَعْدِهِمْ لَفِي شَكٍّ مِّنْهُ مُرِيبٍ
వాళ్లు తమ వద్దకు ‘జ్ఞానం’ వచ్చిన మీదటే విభేదించుకున్నారు – (అదీ కేవలం) తమ మధ్యగల పంతాల కారణంగానే! ‘ఒక నిర్ణీత కాలం కోసం’ అనే నీ ప్రభువు మాట ముందుగానే ఖరారై ఉండకపోతే వాళ్ల వ్యవహారం (ఎప్పుడో) తేలిపోయి ఉండేది. వాళ్ల తరువాత గ్రంథం ప్రసాదించబడిన వారు కూడా దాని విషయంలో చాలా తొలచి వేసే అనుమానానికి లోనై ఉన్నారు.
42:15 فَلِذَٰلِكَ فَادْعُ ۖ وَاسْتَقِمْ كَمَا أُمِرْتَ ۖ وَلَا تَتَّبِعْ أَهْوَاءَهُمْ ۖ وَقُلْ آمَنتُ بِمَا أَنزَلَ اللَّهُ مِن كِتَابٍ ۖ وَأُمِرْتُ لِأَعْدِلَ بَيْنَكُمُ ۖ اللَّهُ رَبُّنَا وَرَبُّكُمْ ۖ لَنَا أَعْمَالُنَا وَلَكُمْ أَعْمَالُكُمْ ۖ لَا حُجَّةَ بَيْنَنَا وَبَيْنَكُمُ ۖ اللَّهُ يَجْمَعُ بَيْنَنَا ۖ وَإِلَيْهِ الْمَصِيرُ
కనుక (ఓ ప్రవక్తా!) నువ్వు వారిని దాని వైపునకే పిలుస్తూ ఉండు. నీకు ఆదేశించబడిన దానిపై నిలకడగా ఉండు. వాళ్ల మనోవాంఛలకనుగుణంగా మాత్రం నడవకు. వాళ్లకు ఇలా చెప్పేయ్: “అల్లాహ్ అవతరింపజేసిన ప్రతి గ్రంథాన్నీ నేను విశ్వసించాను. మీ మధ్య న్యాయం చేయాలని నాకు ఆజ్ఞాపించబడింది. అల్లాహ్‌యే మా ప్రభువు, మీ ప్రభువు కూడాను. మా కర్మలు మావి. మీ కర్మలు మీవి. మాకూ – మీకు మధ్య ఎలాంటి వితండవాదానికి తావు లేదు. అల్లాహ్ మనందరినీ సమావేశపరుస్తాడు. కడకు ఆయన వద్దకే మరలి పోవలసిఉంది.”
42:16 وَالَّذِينَ يُحَاجُّونَ فِي اللَّهِ مِن بَعْدِ مَا اسْتُجِيبَ لَهُ حُجَّتُهُمْ دَاحِضَةٌ عِندَ رَبِّهِمْ وَعَلَيْهِمْ غَضَبٌ وَلَهُمْ عَذَابٌ شَدِيدٌ
ఎవరయితే అల్లాహ్ విషయాన్ని (ప్రజలు) ఒప్పుకున్న మీదట, అందులో వివాదాన్ని మొదలెడతారో, వారి పిడివాదం వారి ప్రభువు దృష్టిలో నిరర్థకమైనది. వారిపై (దేవుని) ఆగ్రహం పడుతుంది. వారి కొరకు కఠినమైన శిక్ష ఉంది.
42:17 اللَّهُ الَّذِي أَنزَلَ الْكِتَابَ بِالْحَقِّ وَالْمِيزَانَ ۗ وَمَا يُدْرِيكَ لَعَلَّ السَّاعَةَ قَرِيبٌ
అల్లాహ్‌యే గ్రంథాన్ని సత్యబద్ధంగా అవతరింపజేశాడు. త్రాసును కూడా (అవతరింపజేశాడు). నీకేం తెలుసు? బహుశా ప్రళయం దగ్గరపడిందేమో!
42:18 يَسْتَعْجِلُ بِهَا الَّذِينَ لَا يُؤْمِنُونَ بِهَا ۖ وَالَّذِينَ آمَنُوا مُشْفِقُونَ مِنْهَا وَيَعْلَمُونَ أَنَّهَا الْحَقُّ ۗ أَلَا إِنَّ الَّذِينَ يُمَارُونَ فِي السَّاعَةِ لَفِي ضَلَالٍ بَعِيدٍ
దాన్ని నమ్మనివారే దాని గురించి ఆత్రం చేస్తున్నారు. దాన్ని నమ్మేవారు మాత్రం దానికి భయపడుతూ ఉన్నారు. అది రావటం సత్యమని (తథ్యమని) వారికి తెలుసు. గుర్తుంచుకోండి! ఆ గడియ విషయంలో గోల చేసేవారు బహుదూరపు అపమార్గంలో పడి ఉన్నారు.
42:19 اللَّهُ لَطِيفٌ بِعِبَادِهِ يَرْزُقُ مَن يَشَاءُ ۖ وَهُوَ الْقَوِيُّ الْعَزِيزُ
అల్లాహ్ తన దాసుల పట్ల ఎంతో మృదువుగా వ్యవహరిస్తాడు. తాను కోరిన వారికి విస్తృతంగా ఉపాధిని ఇస్తాడు. ఆయన గొప్ప బలశాలి, ప్రాబల్యం కలవాడు.
42:20 مَن كَانَ يُرِيدُ حَرْثَ الْآخِرَةِ نَزِدْ لَهُ فِي حَرْثِهِ ۖ وَمَن كَانَ يُرِيدُ حَرْثَ الدُّنْيَا نُؤْتِهِ مِنْهَا وَمَا لَهُ فِي الْآخِرَةِ مِن نَّصِيبٍ
ఎవరయితే పరలోక పంటను ఆశిస్తాడో, మేమతనికి అతని పంటలో సమృద్ధిని ఇస్తాము. మరెవరయితే ఇహలోక పంటను ఆశిస్తాడో అతనికి మేము అందులో నుంచే ఎంతో కొంత ఇస్తాము. ఇలాంటి వ్యక్తికి పరలోకంలో ఏ భాగమూ ఉండదు.
42:21 أَمْ لَهُمْ شُرَكَاءُ شَرَعُوا لَهُم مِّنَ الدِّينِ مَا لَمْ يَأْذَن بِهِ اللَّهُ ۚ وَلَوْلَا كَلِمَةُ الْفَصْلِ لَقُضِيَ بَيْنَهُمْ ۗ وَإِنَّ الظَّالِمِينَ لَهُمْ عَذَابٌ أَلِيمٌ
ఏమిటి, అల్లాహ్ అనుమతితో నిమిత్తం లేకుండానే తమ కోసం ఏవైనా ధర్మాదేశాలను నిర్ధారించే (అల్లాహ్) భాగస్థులను గాని వారు కలిగి ఉన్నారా? ‘తీర్పు’కు సంబంధించిన మాటే గనక ఖరారై ఉండకపోయినట్లయితే వీళ్ల మధ్య (ఇప్పుడే) వ్యవహారం తేల్చివేయబడేది. నిజానికి (ఇలాంటి) దుర్మార్గుల కోసమే వ్యధాభరితమైన శిక్ష ఉన్నది.
42:22 تَرَى الظَّالِمِينَ مُشْفِقِينَ مِمَّا كَسَبُوا وَهُوَ وَاقِعٌ بِهِمْ ۗ وَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ فِي رَوْضَاتِ الْجَنَّاتِ ۖ لَهُم مَّا يَشَاءُونَ عِندَ رَبِّهِمْ ۚ ذَٰلِكَ هُوَ الْفَضْلُ الْكَبِيرُ
ఈ దుర్మార్గులు తాము చేసుకున్న దానిపై భయపడటం నువ్వు చూస్తావు. అది (ఆ పాపం) వారిపై పడి తీరుతుంది. మరెవరయితే విశ్వసించి, సత్కార్యాలు చేశారో వారు స్వర్గవనాలలో ఉంటారు. వారు కోరినదల్లా వారికి వారి ప్రభువు వద్ద లభిస్తుంది. అదే అసలు గొప్ప అనుగ్రహం.
42:23 ذَٰلِكَ الَّذِي يُبَشِّرُ اللَّهُ عِبَادَهُ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ ۗ قُل لَّا أَسْأَلُكُمْ عَلَيْهِ أَجْرًا إِلَّا الْمَوَدَّةَ فِي الْقُرْبَىٰ ۗ وَمَن يَقْتَرِفْ حَسَنَةً نَّزِدْ لَهُ فِيهَا حُسْنًا ۚ إِنَّ اللَّهَ غَفُورٌ شَكُورٌ
విశ్వసించి, (‘సున్నత్’ ప్రకారం) సత్కార్యాలు చేసిన తన దాసులకు అల్లాహ్ ఇచ్చే శుభవార్త ఇదే! (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “దీనికిగాను నేను మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్నీ అడగటంలేదు. కాని బంధుత్వ ప్రేమను మాత్రం కోరుతున్నాను.” ఎవడయినా మంచి చేస్తే మేమతని మంచిలో మరింత వృద్ధినిస్తాము. నిశ్చయంగా అల్లాహ్ అపారంగా మన్నించేవాడు, (సేవలకు తగ్గ) గుర్తింపునిచ్చేవాడూను.
42:24 أَمْ يَقُولُونَ افْتَرَىٰ عَلَى اللَّهِ كَذِبًا ۖ فَإِن يَشَإِ اللَّهُ يَخْتِمْ عَلَىٰ قَلْبِكَ ۗ وَيَمْحُ اللَّهُ الْبَاطِلَ وَيُحِقُّ الْحَقَّ بِكَلِمَاتِهِ ۚ إِنَّهُ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ
“ఏమిటి, ఇతను (దైవప్రవక్త – స) అల్లాహ్‌కు వ్యతిరేకంగా అబద్ధం కల్పించాడని వారంటున్నారా?” అల్లాహ్‌యే గనక తలిస్తే నీ హృదయానికి సీలు వేస్తాడు. అల్లాహ్ అసత్యాన్ని చెరిపివేసి, సత్యాన్ని తన వచనాల ద్వారా సత్యంగా నిలిపి ఉంచుతాడు. ఆయన ఆంతర్యాల్లో దాగివున్న విషయాలను సైతం ఎరిగినవాడు.
42:25 وَهُوَ الَّذِي يَقْبَلُ التَّوْبَةَ عَنْ عِبَادِهِ وَيَعْفُو عَنِ السَّيِّئَاتِ وَيَعْلَمُ مَا تَفْعَلُونَ
ఆయనే తన దాసుల పశ్చాత్తాపాన్ని స్వీకరిస్తాడు, వారి తప్పులను మన్నిస్తాడు. మీరు చేసేదంతా ఆయనకు తెలుసు.
42:26 وَيَسْتَجِيبُ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَيَزِيدُهُم مِّن فَضْلِهِ ۚ وَالْكَافِرُونَ لَهُمْ عَذَابٌ شَدِيدٌ
ఆయన విశ్వసించి, సదాచరణ చేసే వారి (విన్నపాల)ని వింటాడు. తన కృపతో వారికి మరింతగా అనుగ్రహిస్తాడు. మరి అవిశ్వాసులకేమో చాలా కఠిన శిక్ష పడుతుంది.
42:27 وَلَوْ بَسَطَ اللَّهُ الرِّزْقَ لِعِبَادِهِ لَبَغَوْا فِي الْأَرْضِ وَلَٰكِن يُنَزِّلُ بِقَدَرٍ مَّا يَشَاءُ ۚ إِنَّهُ بِعِبَادِهِ خَبِيرٌ بَصِيرٌ
మరి అల్లాహ్ గనక తన దాసులందరికీ పుష్కలంగా ఉపాధిని ప్రసాదిస్తే వారు భువిలో చెలరేగిపోతారు. కాని ఆయన మాత్రం ఒక లెక్క ప్రకారం – తాను కోరినదాన్ని అవతరింపజేస్తూ ఉంటాడు. తన దాసుల సంగతిని ఆయన బాగా ఎరిగినవాడు. (ఆయన వారిని) గమనిస్తూ ఉన్నాడు.
42:28 وَهُوَ الَّذِي يُنَزِّلُ الْغَيْثَ مِن بَعْدِ مَا قَنَطُوا وَيَنشُرُ رَحْمَتَهُ ۚ وَهُوَ الْوَلِيُّ الْحَمِيدُ
ప్రజలు ఆశలన్నీ వదులుకున్న మీదట (ఆకాశం నుంచి) వర్షాన్ని కురిపించేవాడు ఆయనే. ఆయనే తన కారుణ్యాన్ని వ్యాపింపజేస్తున్నాడు. ఆయనే కార్యసాధకుడు, ప్రశంసనీయుడు.
42:29 وَمِنْ آيَاتِهِ خَلْقُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَثَّ فِيهِمَا مِن دَابَّةٍ ۚ وَهُوَ عَلَىٰ جَمْعِهِمْ إِذَا يَشَاءُ قَدِيرٌ
భూమ్యాకాశాల సృష్టి, వాటిలో ప్రాణుల సర్వవ్యాప్తి కూడా ఆయన నిదర్శనాలలోనివే. మరి తాను కోరినప్పుడు వారందరినీ సమీకరించే శక్తి కూడా ఆయనకుంది.
42:30 وَمَا أَصَابَكُم مِّن مُّصِيبَةٍ فَبِمَا كَسَبَتْ أَيْدِيكُمْ وَيَعْفُو عَن كَثِيرٍ
మీపై ఏ ఆపదలొచ్చిపడినా, అవి మీ చేజేతులా చేసుకున్న చేష్టల (పాపాల) ఫలమే. ఆయనైతే (వాటిలో) చాలా విషయాలను మన్నిస్తూ ఉంటాడు.
42:31 وَمَا أَنتُم بِمُعْجِزِينَ فِي الْأَرْضِ ۖ وَمَا لَكُم مِّن دُونِ اللَّهِ مِن وَلِيٍّ وَلَا نَصِيرٍ
మీరు భూమిలో (పారిపోయి) మమ్మల్ని లొంగదీయటం అనేది జరగని పని. మీకు అల్లాహ్ తప్ప మరో కార్యసాధకుడుగానీ, సహాయకుడుగానీ లేడు.
42:32 وَمِنْ آيَاتِهِ الْجَوَارِ فِي الْبَحْرِ كَالْأَعْلَامِ
సముద్రంలో నడిచే పర్వతాల్లాంటి ఓడలు (కూడా) ఆయన నిదర్శనాలలోనివే.
42:33 إِن يَشَأْ يُسْكِنِ الرِّيحَ فَيَظْلَلْنَ رَوَاكِدَ عَلَىٰ ظَهْرِهِ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّكُلِّ صَبَّارٍ شَكُورٍ
ఆయన గనక తలచుకుంటే గాలిని స్థంభింపజేయగలడు. అప్పుడు ఆ ఓడలు సముద్రంపైనే నిలిచిపోతాయి. నిశ్చయంగా ఇందులో సహనం వహించే, కృతజ్ఞులై ఉండే ప్రతి ఒక్కరి కొరకు సూచనలున్నాయి.
42:34 أَوْ يُوبِقْهُنَّ بِمَا كَسَبُوا وَيَعْفُ عَن كَثِيرٍ
లేదా (ఆయన) వారి దురాగతాల మూలంగా వారిని ముంచివేసినా (ఆశ్చర్యం లేదు). ఆయన మటుకు (వారి) తప్పులెన్నింటినో మన్నిస్తూ ఉంటాడు.
42:35 وَيَعْلَمَ الَّذِينَ يُجَادِلُونَ فِي آيَاتِنَا مَا لَهُم مِّن مَّحِيصٍ
మా సూచనల విషయంలో జగడం చేసేవారికి, తాము పారిపోయి ఆశ్రయం పొందే చోటు ఏదీ లేదని తెలిసివచ్చేలా చేయటానికి (మేమీ విధంగా చేస్తాము).
42:36 فَمَا أُوتِيتُم مِّن شَيْءٍ فَمَتَاعُ الْحَيَاةِ الدُّنْيَا ۖ وَمَا عِندَ اللَّهِ خَيْرٌ وَأَبْقَىٰ لِلَّذِينَ آمَنُوا وَعَلَىٰ رَبِّهِمْ يَتَوَكَّلُونَ
మరి మీకు ఏది ఇవ్వబడినా అది ప్రాపంచిక జీవితపు (తాత్కాలిక) సంపద మాత్రమే. అల్లాహ్ దగ్గర ఉన్నది ఇంతకన్నా మేలైనది, శాశ్వితమైనది. విశ్వసించి, కేవలం తమ ప్రభువును నమ్ముకునేవారికి మాత్రమే అది లభిస్తుంది.
42:37 وَالَّذِينَ يَجْتَنِبُونَ كَبَائِرَ الْإِثْمِ وَالْفَوَاحِشَ وَإِذَا مَا غَضِبُوا هُمْ يَغْفِرُونَ
(మరి ఈ భాగ్యవంతుల గుణగణాలు ఎటువంటివంటే) వారు పెద్ద పెద్ద పాపాలకు, నీతిమాలిన చేష్టలకు దూరంగా ఉంటారు. కోపం వచ్చినప్పుడు (కూడా) క్షమిస్తారు.
42:38 وَالَّذِينَ اسْتَجَابُوا لِرَبِّهِمْ وَأَقَامُوا الصَّلَاةَ وَأَمْرُهُمْ شُورَىٰ بَيْنَهُمْ وَمِمَّا رَزَقْنَاهُمْ يُنفِقُونَ
ఇంకా, వారు తమ ప్రభువు ఆజ్ఞను శిరసావహిస్తారు. నమాజును నెలకొల్పుతారు. వారి (ప్రతి) పని పరస్పర సలహా సంప్రతింపుల ద్వారా జరుగుతుంది. మేము వారికి ప్రసాదించిన దానిలో నుంచి (మా పేరున) ఖర్చుపెడతారు.
42:39 وَالَّذِينَ إِذَا أَصَابَهُمُ الْبَغْيُ هُمْ يَنتَصِرُونَ
తమపై దౌర్జన్యం జరిగినప్పుడు, ప్రతీకారం మటుకు తీర్చుకుంటారు.
42:40 وَجَزَاءُ سَيِّئَةٍ سَيِّئَةٌ مِّثْلُهَا ۖ فَمَنْ عَفَا وَأَصْلَحَ فَأَجْرُهُ عَلَى اللَّهِ ۚ إِنَّهُ لَا يُحِبُّ الظَّالِمِينَ
అపకారానికి బదులు అటువంటి అపకారమే. కాని ఎవరయినా (ప్రత్యర్థిని) క్షమించి, సయోధ్యకు వస్తే అతనికి పుణ్య ఫలం ఇచ్చే బాధ్యత అల్లాహ్‌ది. ఎట్టి పరిస్థితిలోనూ అల్లాహ్ దుర్మార్గులను ప్రేమించడు.
42:41 وَلَمَنِ انتَصَرَ بَعْدَ ظُلْمِهِ فَأُولَٰئِكَ مَا عَلَيْهِم مِّن سَبِيلٍ
తనకు అన్యాయం జరిగిన మీదట ఎవరైనా (సరిసమానంగా) ప్రతీకారం తీర్చుకుంటే, అలాంటి వారిపై (నిందలు మోపే) మార్గమేదీ లేదు.
42:42 إِنَّمَا السَّبِيلُ عَلَى الَّذِينَ يَظْلِمُونَ النَّاسَ وَيَبْغُونَ فِي الْأَرْضِ بِغَيْرِ الْحَقِّ ۚ أُولَٰئِكَ لَهُمْ عَذَابٌ أَلِيمٌ
ఇతరులపై దౌర్జన్యానికి ఒడిగట్టి, అకారణంగా భువిలో అరాచకాన్ని సృష్టించేవారిని మాత్రమే (నిందార్హులుగా నిలబెట్టే) మార్గముంటుంది. అలాంటి వారికోసం బాధాకరమైన శిక్ష ఉంది.
42:43 وَلَمَن صَبَرَ وَغَفَرَ إِنَّ ذَٰلِكَ لَمِنْ عَزْمِ الْأُمُورِ
మరెవడయినా సహనం వహించి, క్షమాభిక్షపెడితే, నిస్సందేహంగా అది సాహసోపేతమైన పనులలో (ఒకటిగా) పరిగణించబడుతుంది.
42:44 وَمَن يُضْلِلِ اللَّهُ فَمَا لَهُ مِن وَلِيٍّ مِّن بَعْدِهِ ۗ وَتَرَى الظَّالِمِينَ لَمَّا رَأَوُا الْعَذَابَ يَقُولُونَ هَلْ إِلَىٰ مَرَدٍّ مِّن سَبِيلٍ
అల్లాహ్ ఎవరినయినా దారితప్పిస్తే, ఇక ఆ తరువాత అతన్ని ఆదుకునే వాడెవడూ ఉండడు. మరి నువ్వే చూద్దువు గాని, దుర్మార్గులు శిక్షను చూచినపుడు, “మేము తిరిగి వెళ్ళే మార్గం ఏదైనా ఉందా?!” అని అంటూ ఉంటారు.
42:45 وَتَرَاهُمْ يُعْرَضُونَ عَلَيْهَا خَاشِعِينَ مِنَ الذُّلِّ يَنظُرُونَ مِن طَرْفٍ خَفِيٍّ ۗ وَقَالَ الَّذِينَ آمَنُوا إِنَّ الْخَاسِرِينَ الَّذِينَ خَسِرُوا أَنفُسَهُمْ وَأَهْلِيهِمْ يَوْمَ الْقِيَامَةِ ۗ أَلَا إِنَّ الظَّالِمِينَ فِي عَذَابٍ مُّقِيمٍ
ఇంకా నువ్వే చూస్తావు – వాళ్లు (నరకం) ఎదుట తేబడినప్పుడు, అవమానభారంతో కృంగిపోతుంటారు. దొంగ చూపులు చూస్తుంటారు. అప్పుడు విశ్వాసులు ఇలా అంటారు: “ఈ ప్రళయదినాన తమ స్వయాన్ని, తమ ఇంటివారలను నష్టానికి గురిచేసినవారే వాస్తవానికి నష్టం పొందినవారు.” నిశ్చయంగా దుర్మార్గులు శాశ్విత యాతనలో పడి ఉన్నారని తెలుసుకోండి.
42:46 وَمَا كَانَ لَهُم مِّنْ أَوْلِيَاءَ يَنصُرُونَهُم مِّن دُونِ اللَّهِ ۗ وَمَن يُضْلِلِ اللَّهُ فَمَا لَهُ مِن سَبِيلٍ
అల్లాహ్ తప్ప వారిని ఆదుకునే మిత్రులెవరూ ఉండరు. అల్లాహ్ దారి తప్పించినవారికి మరేమార్గమూ ఉండదు.
42:47 اسْتَجِيبُوا لِرَبِّكُم مِّن قَبْلِ أَن يَأْتِيَ يَوْمٌ لَّا مَرَدَّ لَهُ مِنَ اللَّهِ ۚ مَا لَكُم مِّن مَّلْجَإٍ يَوْمَئِذٍ وَمَا لَكُم مِّن نَّكِيرٍ
(ప్రజలారా!) తప్పించనలవికాని ఆ రోజు అల్లాహ్ తరఫున రాకమునుపే, మీ ప్రభువు ఆజ్ఞను శిరసావహించండి. ఆ రోజు మీకు ఏ ఆశ్రయమూ లభించదు, దాక్కొని ఆగంతకుల్లా వ్యవహరించేందుకు తగినచోటు కూడా దొరకదు.
42:48 فَإِنْ أَعْرَضُوا فَمَا أَرْسَلْنَاكَ عَلَيْهِمْ حَفِيظًا ۖ إِنْ عَلَيْكَ إِلَّا الْبَلَاغُ ۗ وَإِنَّا إِذَا أَذَقْنَا الْإِنسَانَ مِنَّا رَحْمَةً فَرِحَ بِهَا ۖ وَإِن تُصِبْهُمْ سَيِّئَةٌ بِمَا قَدَّمَتْ أَيْدِيهِمْ فَإِنَّ الْإِنسَانَ كَفُورٌ
(ఓ ప్రవక్తా!) ఒకవేళ వారు గనక ముఖం త్రిప్పుకుంటే, మేము నిన్ను వారిపై కావలివానిగా చేసి పంపలేదు సుమా! సందేశాన్ని అందజేయటం వరకే నీ బాధ్యత. మేము మనిషికి మా కారుణ్యం రుచిని చూపించినపుడు అతడు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోతాడు. ఒకవేళ వారిపై వారి స్వయంకృతాల మూలంగా ఏదైనా ఆపద వచ్చిపడితే, మానవుడు మా మేలునంతా మరచిపోతాడు.
42:49 لِّلَّهِ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ يَخْلُقُ مَا يَشَاءُ ۚ يَهَبُ لِمَن يَشَاءُ إِنَاثًا وَيَهَبُ لِمَن يَشَاءُ الذُّكُورَ
భూమ్యాకాశాల సామ్రాజ్యం అల్లాహ్‌దే. (ఆయన) తాను కోరినది సృష్టిస్తాడు. తాను కోరినవారికి ఆడపిల్లల్ని ఇస్తాడు, తాను కోరిన వారికి మగపిల్లల్ని ఇస్తాడు.
42:50 أَوْ يُزَوِّجُهُمْ ذُكْرَانًا وَإِنَاثًا ۖ وَيَجْعَلُ مَن يَشَاءُ عَقِيمًا ۚ إِنَّهُ عَلِيمٌ قَدِيرٌ
లేదా వారికి మగపిల్లలను, ఆడపిల్లలను కలిపి ఇస్తాడు. మరి తాను కోరిన వారిని సంతాన హీనులుగా చేసేస్తాడు. ఆయన మహాజ్ఞాని, సంపూర్ణ అధికారం కలవాడు.
42:51 وَمَا كَانَ لِبَشَرٍ أَن يُكَلِّمَهُ اللَّهُ إِلَّا وَحْيًا أَوْ مِن وَرَاءِ حِجَابٍ أَوْ يُرْسِلَ رَسُولًا فَيُوحِيَ بِإِذْنِهِ مَا يَشَاءُ ۚ إِنَّهُ عَلِيٌّ حَكِيمٌ
ఏ మానవమాత్రునితోనూ, అల్లాహ్ (నేరుగా) సంభాషించటం అనేది జరగదు. అయితే వహీ ద్వారా లేదా తెర వెనుక నుంచీ లేదా ఒక దూతను పంపటం ద్వారా (ఇది సంభవమే). మరి ఆ దూత అల్లాహ్ ఆజ్ఞననుసరించి అల్లాహ్ కోరిన సందేశాన్ని (వహీ రూపంలో) అందజేస్తాడు. నిశ్చయంగా ఆయన మహోన్నతుడు, వివేకవంతుడు.
42:52 وَكَذَٰلِكَ أَوْحَيْنَا إِلَيْكَ رُوحًا مِّنْ أَمْرِنَا ۚ مَا كُنتَ تَدْرِي مَا الْكِتَابُ وَلَا الْإِيمَانُ وَلَٰكِن جَعَلْنَاهُ نُورًا نَّهْدِي بِهِ مَن نَّشَاءُ مِنْ عِبَادِنَا ۚ وَإِنَّكَ لَتَهْدِي إِلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ
అలాగే (ఓ ముహమ్మద్ – సఅసం!) మేము మా ఆజ్ఞతో నీ వద్దకు ఒక ‘రూహ్’ (ఆత్మ)ను పంపాము. అంతకుముందు నీకు గ్రంథమంటే ఏమిటో, విశ్వాసమంటే ఏమిటో తెలీదాయె. కాని మేము దాన్ని జ్యోతిగా చేశాము. దాని ద్వారా మా దాసులలో మేము కోరిన వారికి సన్మార్గం చూపుతున్నాము. నిస్సందేహంగా (ఓ ముహమ్మద్-స!) నువ్వు (ప్రజలకు) రుజుమార్గం వైపుకు దర్శకత్వం వహిస్తున్నావు…
42:53 صِرَاطِ اللَّهِ الَّذِي لَهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۗ أَلَا إِلَى اللَّهِ تَصِيرُ الْأُمُورُ
….భూమ్యాకాశాల్లోని సమస్తానికీ యజమాని అయిన అల్లాహ్ మార్గం వైపుకు (నడిపిస్తున్నావు). తుదకు సమస్త వ్యవహారాలూ అల్లాహ్ వద్దకే చేరతాయి సుమా! - సూరా అజ్ జుఖ్ రుఫ్
43:1 حم
హా మీమ్.
43:2 وَالْكِتَابِ الْمُبِينِ
సుస్పష్టమైన (ఈ) గ్రంథం సాక్షిగా!
43:3 إِنَّا جَعَلْنَاهُ قُرْآنًا عَرَبِيًّا لَّعَلَّكُمْ تَعْقِلُونَ
మీరు అర్థం చేసుకోవటానికిగాను మేము దీనిని అరబీ ఖురానుగా చేశాము.
43:4 وَإِنَّهُ فِي أُمِّ الْكِتَابِ لَدَيْنَا لَعَلِيٌّ حَكِيمٌ
నిశ్చయంగా ఇది మాతృగ్రంథం (లౌహె మహ్ఫూజ్)లో ఉన్నది. మా వద్ద అది ఎంతో ఉన్నతమైన, వివేకంతో నిండిన గ్రంథంగా ఉన్నది.
43:5 أَفَنَضْرِبُ عَنكُمُ الذِّكْرَ صَفْحًا أَن كُنتُمْ قَوْمًا مُّسْرِفِينَ
ఏమిటి? మీరు హద్దు మీరిపోయే జనులైనందున మేము ఈ ఉపదేశాన్ని మీ నుంచి మళ్లించాలా?
43:6 وَكَمْ أَرْسَلْنَا مِن نَّبِيٍّ فِي الْأَوَّلِينَ
మేము పూర్వీకులలో కూడా ఎంతోమంది ప్రవక్తల్ని పంపించాము.
43:7 وَمَا يَأْتِيهِم مِّن نَّبِيٍّ إِلَّا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ
తమ వద్దకు ఏ ప్రవక్త వచ్చినా వారు అతన్ని పరిహసించకుండా వదల్లేదు.
43:8 فَأَهْلَكْنَا أَشَدَّ مِنْهُم بَطْشًا وَمَضَىٰ مَثَلُ الْأَوَّلِينَ
మేము వీళ్ళకన్నా ఎక్కువ ఘటికులనే పట్టుకొని అంత మొందించాము. పూర్వీకుల దృష్టాంతాలు గడచిఉన్నాయి.
43:9 وَلَئِن سَأَلْتَهُم مَّنْ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ لَيَقُولُنَّ خَلَقَهُنَّ الْعَزِيزُ الْعَلِيمُ
“భూమ్యాకాశాలను సృష్టించినదెవరు?” అని నువ్వు గనక వారిని ప్రశ్నిస్తే, “సర్వశక్తుడు, సర్వజ్ఞాని అయినవాడే (అల్లాహ్‌యే) సృష్టించాడ”ని వారు తప్పకుండా సమాధానమిస్తారు.
43:10 الَّذِي جَعَلَ لَكُمُ الْأَرْضَ مَهْدًا وَجَعَلَ لَكُمْ فِيهَا سُبُلًا لَّعَلَّكُمْ تَهْتَدُونَ
ఆయనే మీకోసం భూమిని పాన్పుగా చేశాడు. మీరు మార్గం తెలుసుకోగలగటానికి అందులో మీ కోసం దారులను ఏర్పరచాడు.
43:11 وَالَّذِي نَزَّلَ مِنَ السَّمَاءِ مَاءً بِقَدَرٍ فَأَنشَرْنَا بِهِ بَلْدَةً مَّيْتًا ۚ كَذَٰلِكَ تُخْرَجُونَ
మరి ఆయనే ఒక లెక్క ప్రకారం ఆకాశం నుంచి నీళ్ళను కురిపించాడు. ఆ విధంగా మేము దాంతో (ఆ నీటితో) సచ్చిన సీమను బ్రతికించాము. మీరూ (సమాధుల నుండి) అలాగే వెలికి తీయబడతారు.
43:12 وَالَّذِي خَلَقَ الْأَزْوَاجَ كُلَّهَا وَجَعَلَ لَكُم مِّنَ الْفُلْكِ وَالْأَنْعَامِ مَا تَرْكَبُونَ
ఆయన వస్తువులన్నింటికీ జతలను సృష్టించాడు. మరి మీ కోసం ఓడలను, పశువులను (కూడా) చేశాడు. వాటిపై మీరు ఎక్కిపోతుంటారు.
43:13 لِتَسْتَوُوا عَلَىٰ ظُهُورِهِ ثُمَّ تَذْكُرُوا نِعْمَةَ رَبِّكُمْ إِذَا اسْتَوَيْتُمْ عَلَيْهِ وَتَقُولُوا سُبْحَانَ الَّذِي سَخَّرَ لَنَا هَٰذَا وَمَا كُنَّا لَهُ مُقْرِنِينَ
మీరు వాటి వీపులపై ఎక్కి, ఆ తర్వాత వాటి మీద సర్దుకుని కూర్చున్నప్పుడు మీ ప్రభువు అనుగ్రహాన్ని స్మరిస్తారని (ఇదంతా చేశాము). మీరు ఇలా పలకండి: “దీనిని మాకు వశపరచినవాడు పరమ పవిత్రుడు. లేకపోతే దీనిని వశపరచుకోవటం మావల్ల అయ్యేపనికాదు.
43:14 وَإِنَّا إِلَىٰ رَبِّنَا لَمُنقَلِبُونَ
“నిశ్చయంగా మేము (ఎట్టకేలకు) మా ప్రభువు వద్దకు మరలిపోవలసిన వారమే.”
43:15 وَجَعَلُوا لَهُ مِنْ عِبَادِهِ جُزْءًا ۚ إِنَّ الْإِنسَانَ لَكَفُورٌ مُّبِينٌ
ఇంకా వీళ్లు అల్లాహ్ దాసులలో కొందరిని ఆయన భాగంగా చేశారు. నిజంగా మానవుడు చాలా స్పష్టంగా కృతఘ్నతకు పాల్పడతాడు.
43:16 أَمِ اتَّخَذَ مِمَّا يَخْلُقُ بَنَاتٍ وَأَصْفَاكُم بِالْبَنِينَ
ఏమిటి, అల్లాహ్ తాను సృష్టించిన వారిలో నుంచి కూతుళ్ళను తన కోసం కేటాయించుకుని, మీకేమో కొడుకులను అనుగ్రహించాడా?
43:17 وَإِذَا بُشِّرَ أَحَدُهُم بِمَا ضَرَبَ لِلرَّحْمَٰنِ مَثَلًا ظَلَّ وَجْهُهُ مُسْوَدًّا وَهُوَ كَظِيمٌ
మరి వారిలో ఎవరికయినా, కరుణామయుడైన అల్లాహ్‌కు అతను అంటగట్టిన ఉపమానం అతనికే కలిగిందనే శుభవార్తను అందజేస్తే అతని ముఖంపై చీకటి ఆవరిస్తుంది. ఆపై అతను దుఃఖించసాగుతాడు.
43:18 أَوَمَن يُنَشَّأُ فِي الْحِلْيَةِ وَهُوَ فِي الْخِصَامِ غَيْرُ مُبِينٍ
ఏమిటీ, ఆభరణాల మధ్య పెరిగి, వాదోపవాదాలలో (తన మాటను) స్పష్టంగా విడమరచి చెప్పలేని (ఆడ సంతానం అల్లాహ్ వాటాలోనికి వస్తుందా?)
43:19 وَجَعَلُوا الْمَلَائِكَةَ الَّذِينَ هُمْ عِبَادُ الرَّحْمَٰنِ إِنَاثًا ۚ أَشَهِدُوا خَلْقَهُمْ ۚ سَتُكْتَبُ شَهَادَتُهُمْ وَيُسْأَلُونَ
కరుణామయుని (అల్లాహ్) దాసులైన దైవదూతలను వీళ్లు ఆడవారుగా ఖరారు చేశారు. ఏమిటి, వారి పుట్టుక సందర్భంగా వీళ్ళుగాని అక్కడ ఉన్నారా? వీళ్ల ఈ సాక్ష్యం వ్రాసుకోబడుతుంది. (దీని గురించి) వీళ్లు తప్పకుండా నిలదీసి అడగబడతారు.
43:20 وَقَالُوا لَوْ شَاءَ الرَّحْمَٰنُ مَا عَبَدْنَاهُم ۗ مَّا لَهُم بِذَٰلِكَ مِنْ عِلْمٍ ۖ إِنْ هُمْ إِلَّا يَخْرُصُونَ
“కరుణామయుడు (అయిన అల్లాహ్) తలచి ఉంటే మేము వాళ్ళను పూజించేవారం కాము” అని (వీళ్లు కబుర్లు) చెబుతున్నారు. దీనికి సంబంధించి వీరికసలు ఏమీ తెలీదు. అవి కేవలం వీళ్ల ఊహాగానాలు మాత్రమే.
43:21 أَمْ آتَيْنَاهُمْ كِتَابًا مِّن قَبْلِهِ فَهُم بِهِ مُسْتَمْسِكُونَ
ఏమిటి, దీనికి మునుపు మేము వారికి ఏదైనా (వేరే) గ్రంథం ఇచ్చి ఉన్నామా? దాన్ని గాని వారు గట్టిగా పట్టుకొని ఉన్నారా?
43:22 بَلْ قَالُوا إِنَّا وَجَدْنَا آبَاءَنَا عَلَىٰ أُمَّةٍ وَإِنَّا عَلَىٰ آثَارِهِم مُّهْتَدُونَ
అది కాదు, “మా తాతముత్తాతలు ఒకానొక పద్ధతిపై ఉండటం మేము చూశాము. మేము వాళ్ల అడుగుజాడలలోనే నడుచుకుని సన్మార్గం పొందాము” అని వారు బుకాయిస్తారు.
43:23 وَكَذَٰلِكَ مَا أَرْسَلْنَا مِن قَبْلِكَ فِي قَرْيَةٍ مِّن نَّذِيرٍ إِلَّا قَالَ مُتْرَفُوهَا إِنَّا وَجَدْنَا آبَاءَنَا عَلَىٰ أُمَّةٍ وَإِنَّا عَلَىٰ آثَارِهِم مُّقْتَدُونَ
ఇలాగే నీకు మునుపు మేము ఏ బస్తీలో హెచ్చరించేవాణ్ణి పంపినా అక్కడి శ్రీమంతులు కూడా, “మేము మా తాత ముత్తాతలను ఒక పద్ధతిపై ఉండటం చూశాము. మేము కూడా వారి పాదచిహ్నాలలోనే నడుస్తాము” అని చెప్పేవారు.
43:24 قَالَ أَوَلَوْ جِئْتُكُم بِأَهْدَىٰ مِمَّا وَجَدتُّمْ عَلَيْهِ آبَاءَكُمْ ۖ قَالُوا إِنَّا بِمَا أُرْسِلْتُم بِهِ كَافِرُونَ
“మీ తాతముత్తాతలు అనుసరిస్తుండగా మీరు చూసిన మార్గం కంటే చాలా మంచి మార్గాన్ని (గమ్యానికి చేర్చే మార్గాన్ని) నేను మీ వద్దకు తీసుకువచ్చాను” అని (దైవప్రవక్త) అన్నప్పుడు, “మీకిచ్చి పంపబడిన పద్ధతిని మేము తిరస్కరిస్తున్నాం” అని వాళ్లు (తెగేసి) చెప్పారు.
43:25 فَانتَقَمْنَا مِنْهُمْ ۖ فَانظُرْ كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُكَذِّبِينَ
అందుకే మేము వారిపై ప్రతీకారం తీర్చుకున్నాము. మరి ధిక్కరించిన వారికి పట్టిన గతేమిటో చూడు!
43:26 وَإِذْ قَالَ إِبْرَاهِيمُ لِأَبِيهِ وَقَوْمِهِ إِنَّنِي بَرَاءٌ مِّمَّا تَعْبُدُونَ
ఇబ్రాహీము తన తండ్రితోనూ, తన జాతి వారితోనూ పలికినప్పటి విషయం (స్మరించదగినది. ఆయన ఇలా అన్నాడు): “మీరు పూజించే వాటి నుంచి నేను వేరైపోయాను.
43:27 إِلَّا الَّذِي فَطَرَنِي فَإِنَّهُ سَيَهْدِينِ
“నన్ను పుట్టించిన వానిని మాత్రమే (నేను ఆరాధిస్తాను). ఆయనే నాకు సన్మార్గం చూపుతాడు.”
43:28 وَجَعَلَهَا كَلِمَةً بَاقِيَةً فِي عَقِبِهِ لَعَلَّهُمْ يَرْجِعُونَ
మరి ఇబ్రాహీము ఈ మాటే – తన తదనంతరం – తన సంతానంలో మిగిలి ఉండేట్లుగా చేసి వెళ్ళాడు – ప్రజలు (షిర్క్ నుంచి) మరలిరావటానికి.
43:29 بَلْ مَتَّعْتُ هَٰؤُلَاءِ وَآبَاءَهُمْ حَتَّىٰ جَاءَهُمُ الْحَقُّ وَرَسُولٌ مُّبِينٌ
పైగా నేను వారికీ, వారి పితామహులకు జీవన సామగ్రిని విరివిగా ప్రసాదించాను – చివరికి వారి వద్దకు సత్యం వచ్చేసింది. అన్నింటినీ విడమరచి చెప్పే ప్రవక్త కూడా వచ్చేశాడు.
43:30 وَلَمَّا جَاءَهُمُ الْحَقُّ قَالُوا هَٰذَا سِحْرٌ وَإِنَّا بِهِ كَافِرُونَ
తీరా సత్యం వచ్చేశాక, “ఇదొక ఇంద్రజాలం. దీన్ని మేము త్రోసిపుచ్చుతున్నాం” అని వారు చెప్పేశారు.
43:31 وَقَالُوا لَوْلَا نُزِّلَ هَٰذَا الْقُرْآنُ عَلَىٰ رَجُلٍ مِّنَ الْقَرْيَتَيْنِ عَظِيمٍ
“అవునూ, ఈ ఖుర్ఆను ఈ రెండు (ప్రసిద్ధ) నగరాలలో ఉండే ఎవరో ఒక ప్రముఖునిపై ఎందుకు అవతరింపజేయబడలేదు?” అని వారు అనసాగారు.
43:32 أَهُمْ يَقْسِمُونَ رَحْمَتَ رَبِّكَ ۚ نَحْنُ قَسَمْنَا بَيْنَهُم مَّعِيشَتَهُمْ فِي الْحَيَاةِ الدُّنْيَا ۚ وَرَفَعْنَا بَعْضَهُمْ فَوْقَ بَعْضٍ دَرَجَاتٍ لِّيَتَّخِذَ بَعْضُهُم بَعْضًا سُخْرِيًّا ۗ وَرَحْمَتُ رَبِّكَ خَيْرٌ مِّمَّا يَجْمَعُونَ
ఏమిటి, వారు నీ ప్రభువు కారుణ్యాన్ని పంచుతున్నారా? యదార్థానికి మేమే వారి ప్రాపంచిక జీవితంలో వారి ఉపాధిని వారి మధ్య పంచిపెట్టాము. కొందరు మరి కొందరిని లోబరచి ఉంచేందుకుగాను – అంతస్థుల రీత్యా – కొందరికి మరి కొందరిపై ఆధిక్యతను వొసగాము. వారు ప్రోగు చేస్తూపోయే దానికన్నా నీ ప్రభువు కారుణ్యం ఎంతో మేలైనది సుమా!
43:33 وَلَوْلَا أَن يَكُونَ النَّاسُ أُمَّةً وَاحِدَةً لَّجَعَلْنَا لِمَن يَكْفُرُ بِالرَّحْمَٰنِ لِبُيُوتِهِمْ سُقُفًا مِّن فِضَّةٍ وَمَعَارِجَ عَلَيْهَا يَظْهَرُونَ
మానవులంతా ఒకే వర్గంగా తయారవుతారనే మాటే గనక లేకుంటే, కరుణామయుని పట్ల తిరస్కార వైఖరిని అవలంబించే వారి ఇళ్ళ పైకప్పులను, వారు ఎక్కే మెట్లను (కూడా) మేము వెండితో చేసి ఉండేవారం.
43:34 وَلِبُيُوتِهِمْ أَبْوَابًا وَسُرُرًا عَلَيْهَا يَتَّكِئُونَ
వారి ఇళ్ల తలుపులను, వారు దిండ్లకు ఆనుకుని కూర్చునే పీఠాలను కూడా (వెండితో చేసి ఉండేవారము).
43:35 وَزُخْرُفًا ۚ وَإِن كُلُّ ذَٰلِكَ لَمَّا مَتَاعُ الْحَيَاةِ الدُّنْيَا ۚ وَالْآخِرَةُ عِندَ رَبِّكَ لِلْمُتَّقِينَ
బంగారు వస్తువులుగా కూడా చేసి ఉండేవారం. ఇదంతా ఐహిక జీవితపు లాభం మాత్రమే. పరలోకం మాత్రం నీ ప్రభువు దగ్గర కేవలం భయభక్తులు గలవారికే లభిస్తుంది.
43:36 وَمَن يَعْشُ عَن ذِكْرِ الرَّحْمَٰنِ نُقَيِّضْ لَهُ شَيْطَانًا فَهُوَ لَهُ قَرِينٌ
కరుణామయుని స్మరణ పట్ల గుడ్డిగా వ్యవహరించే వ్యక్తిపై మేము షైతానును నియమిస్తాము. ఇక వాడే అతనికి సహవాసిగా ఉంటాడు.
43:37 وَإِنَّهُمْ لَيَصُدُّونَهُمْ عَنِ السَّبِيلِ وَيَحْسَبُونَ أَنَّهُم مُّهْتَدُونَ
వారు (ఆ షైతానులు) వారిని సన్మార్గాన పోకుండా అడ్డుకుంటారు. మరి వారేమో తాము సన్మార్గంపైనే ఉన్నామని భ్రమపడుతూ ఉంటారు.
43:38 حَتَّىٰ إِذَا جَاءَنَا قَالَ يَا لَيْتَ بَيْنِي وَبَيْنَكَ بُعْدَ الْمَشْرِقَيْنِ فَبِئْسَ الْقَرِينُ
ఆఖరికి అతను మా వద్దకు వచ్చినప్పుడు, “ఆహ్! నీకూ – నాకూ మధ్య తూర్పు – పడమరలకు మధ్య ఉన్నంత దూరం ఉండి ఉంటే ఎంత బావుండేది! నువ్వు మహాచెడ్డ సావాసివి” అని (తన వెంటనున్న షైతానుతో) అంటాడు.
43:39 وَلَن يَنفَعَكُمُ الْيَوْمَ إِذ ظَّلَمْتُمْ أَنَّكُمْ فِي الْعَذَابِ مُشْتَرِكُونَ
మీరు దుర్మార్గులని తేలిపోయినప్పుడు, ఈ రోజు మీరంతా నరక యాతనలో భాగస్థులై ఉండటం మీకెలాంటి లబ్దినీ చేకూర్చదు.
43:40 أَفَأَنتَ تُسْمِعُ الصُّمَّ أَوْ تَهْدِي الْعُمْيَ وَمَن كَانَ فِي ضَلَالٍ مُّبِينٍ
(ఓ ప్రవక్తా!) మరి నువ్వు చెవిటివారికి వినిపించగలవా? అంధులకుగాని, స్పష్టమైన మార్గభ్రష్టతకు లోనై ఉన్నవారికిగాని సన్మార్గం చూపగలవా?
43:41 فَإِمَّا نَذْهَبَنَّ بِكَ فَإِنَّا مِنْهُم مُّنتَقِمُونَ
ఒకవేళ మేము నిన్ను ఇక్కడి నుంచి తీసుకుపోయినా, మేము వారిపై ప్రతీకారం తీర్చుకోవటం మటుకు ఖాయం.
43:42 أَوْ نُرِيَنَّكَ الَّذِي وَعَدْنَاهُمْ فَإِنَّا عَلَيْهِم مُّقْتَدِرُونَ
లేదా మేము వారికి చేసిన వాగ్దానాన్ని నీకు చూపిస్తాము. వారిపై మాకు పూర్తి అదుపు (అధికారం) ఉంది.
43:43 فَاسْتَمْسِكْ بِالَّذِي أُوحِيَ إِلَيْكَ ۖ إِنَّكَ عَلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ
కనుక నీకు పంపబడిన సందేశాన్ని (వహీని) నువ్వు గట్టిగా పట్టుకో. నిశ్చయంగా నువ్వు రుజుమార్గంపై ఉన్నావు.
43:44 وَإِنَّهُ لَذِكْرٌ لَّكَ وَلِقَوْمِكَ ۖ وَسَوْفَ تُسْأَلُونَ
నిస్సందేహంగా ఇది (ఈ గ్రంథం) నీకూ, నీ జాతివారికి హితబోధిని. త్వరలోనే మీరంతా ప్రశ్నించబడతారు.
43:45 وَاسْأَلْ مَنْ أَرْسَلْنَا مِن قَبْلِكَ مِن رُّسُلِنَا أَجَعَلْنَا مِن دُونِ الرَّحْمَٰنِ آلِهَةً يُعْبَدُونَ
మరి నీకు పూర్వం మేము పంపిన మా ప్రవక్తలను “కరుణామయుడు (అయిన అల్లాహ్)ను వదలి వేరితర పూజించబడుతున్న దైవాలను మేము నిర్ధారించామేమో” అడిగిచూడు.
43:46 وَلَقَدْ أَرْسَلْنَا مُوسَىٰ بِآيَاتِنَا إِلَىٰ فِرْعَوْنَ وَمَلَئِهِ فَقَالَ إِنِّي رَسُولُ رَبِّ الْعَالَمِينَ
మేము మూసాకు మా సూచనలను ఇచ్చి ఫిరౌన్ వద్దకు, అతని నాయకుల వద్దకు పంపించాము. అప్పుడు (మూసా వాళ్ల దగ్గరకు వెళ్ళి) “నేను సకల లోకాల ప్రభువు యొక్క ప్రవక్తను” అన్నాడు.
43:47 فَلَمَّا جَاءَهُم بِآيَاتِنَا إِذَا هُم مِّنْهَا يَضْحَكُونَ
మరి అతను మా సూచనలను తీసుకుని వారి వద్దకు వచ్చినపుడు వారు వాటిపై వికటాట్టహాసం చేశారు.
43:48 وَمَا نُرِيهِم مِّنْ آيَةٍ إِلَّا هِيَ أَكْبَرُ مِنْ أُخْتِهَا ۖ وَأَخَذْنَاهُم بِالْعَذَابِ لَعَلَّهُمْ يَرْجِعُونَ
మేము వారికి చూపిస్తూపోయిన ఒక్కో సూచన దానికి ముందు వచ్చిన దానికి మించినదిగా ఉండేది. మరి మేము వాళ్ళను శిక్షగా పట్టుకున్నాము – అలాగైనా దారికి వస్తారేమోనని!
43:49 وَقَالُوا يَا أَيُّهَ السَّاحِرُ ادْعُ لَنَا رَبَّكَ بِمَا عَهِدَ عِندَكَ إِنَّنَا لَمُهْتَدُونَ
వారిలా అన్నారు: “ఓ మాంత్రికుడా! నీ ప్రభువు నీతో వాగ్దానం చేసివున్న దాని గురించి మా కొరకుకాస్త ప్రార్థించవోయ్! (ఈ ఆపద గనక తొలగిపోతే) మేము తప్పకుండా సన్మార్గంపైకి వస్తాము.”
43:50 فَلَمَّا كَشَفْنَا عَنْهُمُ الْعَذَابَ إِذَا هُمْ يَنكُثُونَ
అయితే మేము ఆ శిక్షను వారి నుంచి తొలగించగా, అప్పటికప్పుడే వారు ఆడిన మాటను తప్పారు.
43:51 وَنَادَىٰ فِرْعَوْنُ فِي قَوْمِهِ قَالَ يَا قَوْمِ أَلَيْسَ لِي مُلْكُ مِصْرَ وَهَٰذِهِ الْأَنْهَارُ تَجْرِي مِن تَحْتِي ۖ أَفَلَا تُبْصِرُونَ
మరి ఫిరౌను తన జాతి (జనుల) మధ్య చాటింపు వేయిస్తూ ఇలా అన్నాడు : “ఓ నా జాతి జనులారా! ఈజిప్టు రాజ్యం నాది కాదా? ఈ కాలువలు నా (మేడల) క్రింద ప్రవహిస్తున్నాయి. మీరు చూడటం లేదా?
43:52 أَمْ أَنَا خَيْرٌ مِّنْ هَٰذَا الَّذِي هُوَ مَهِينٌ وَلَا يَكَادُ يُبِينُ
“పైగా తుచ్ఛుడైన అతని కంటే నేను ఉత్తముడను, కనీసం స్పష్టంగా చెప్పటం కూడా అతనికి చేత కాదాయె.
43:53 فَلَوْلَا أُلْقِيَ عَلَيْهِ أَسْوِرَةٌ مِّن ذَهَبٍ أَوْ جَاءَ مَعَهُ الْمَلَائِكَةُ مُقْتَرِنِينَ
“సరే, అతనిపై బంగారు కంకణాలు ఎందుకు దించబడలేదు? పోనీ, అతని వెంట బారులు తీరిన దైవదూతలు ఎందుకు రాలేదు?”
43:54 فَاسْتَخَفَّ قَوْمَهُ فَأَطَاعُوهُ ۚ إِنَّهُمْ كَانُوا قَوْمًا فَاسِقِينَ
ఆ విధంగా అతను తన ప్రజలను మభ్యపెట్టి, మూర్ఖుల్ని చేశాడు. తుదకు వారు అతని మాటే విన్నారు. నిశ్చయంగా వారంతా అవిధేయ జనులే.
43:55 فَلَمَّا آسَفُونَا انتَقَمْنَا مِنْهُمْ فَأَغْرَقْنَاهُمْ أَجْمَعِينَ
ఆ తరువాత వారు మాకు కోపం తెప్పించగా మేము వారిపై ప్రతీకారం తీర్చుకున్నాం. వారందరినీ (సముద్రంలో) ముంచి వేశాము.
43:56 فَجَعَلْنَاهُمْ سَلَفًا وَمَثَلًا لِّلْآخِرِينَ
ఆ విధంగా మేము వారిని గతించిన వారుగా, రాబోయే తరాల వారికి ఒక ఉదాహరణగా చేశాము.
43:57 وَلَمَّا ضُرِبَ ابْنُ مَرْيَمَ مَثَلًا إِذَا قَوْمُكَ مِنْهُ يَصِدُّونَ
మర్యమ్ కుమారుని ఉదాహరణ ఇవ్వబడినపుడు నీ జాతి జనులు (సంబరపడి) కేకలు వేశారు.
43:58 وَقَالُوا أَآلِهَتُنَا خَيْرٌ أَمْ هُوَ ۚ مَا ضَرَبُوهُ لَكَ إِلَّا جَدَلًا ۚ بَلْ هُمْ قَوْمٌ خَصِمُونَ
“ఇంతకీ మా దేవుళ్ళు మంచివాళ్ళా లేక అతనా?” అని వారు (తరచి తరచి) అడగటం మొదలెట్టారు. వారు నిన్ను అలా అడగటం వెనుక వారి ఉద్దేశం జగడం తప్ప మరేమీ కాదు. అసలా జనులే జగడాలమారులు.
43:59 إِنْ هُوَ إِلَّا عَبْدٌ أَنْعَمْنَا عَلَيْهِ وَجَعَلْنَاهُ مَثَلًا لِّبَنِي إِسْرَائِيلَ
అతను (మర్యమ్ కుమారుడైన ఈసా) కూడా ఒక దాసుడు మాత్రమే. మేమతన్ని అనుగ్రహించాము. ఇస్రాయీలు సంతతి వారికొరకు అతన్ని ఒక ఉదాహరణ (మా శక్తి నిదర్శనం)గా చేశాము.
43:60 وَلَوْ نَشَاءُ لَجَعَلْنَا مِنكُم مَّلَائِكَةً فِي الْأَرْضِ يَخْلُفُونَ
మరి మేమే గనక తలచుకుంటే మీకు బదులుగా దైవదూతలనే భూమికి వారసులుగా చేసి ఉండేవారం.
43:61 وَإِنَّهُ لَعِلْمٌ لِّلسَّاعَةِ فَلَا تَمْتَرُنَّ بِهَا وَاتَّبِعُونِ ۚ هَٰذَا صِرَاطٌ مُّسْتَقِيمٌ
నిశ్చయంగా అతను (ఈసా – అలైహిస్సలాం) ప్రళయానికి ఒక సూచన. కాబట్టి మీరు దాని (ప్రళయదినం) విషయంలో సందేహపడకండి. మీరు నన్ను అనుసరించండి. ఇదే రుజు మార్గం.
43:62 وَلَا يَصُدَّنَّكُمُ الشَّيْطَانُ ۖ إِنَّهُ لَكُمْ عَدُوٌّ مُّبِينٌ
షైతాన్ మిమ్మల్ని అడ్డుకోరాదు సుమా! వాడు మీకు బద్ధ విరోధి.
43:63 وَلَمَّا جَاءَ عِيسَىٰ بِالْبَيِّنَاتِ قَالَ قَدْ جِئْتُكُم بِالْحِكْمَةِ وَلِأُبَيِّنَ لَكُم بَعْضَ الَّذِي تَخْتَلِفُونَ فِيهِ ۖ فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ
స్పష్టమైన నిదర్శనాలను తీసుకుని వచ్చినప్పుడు ఈసా (ఏసు – అలైహిస్సలాం) ఇలా అన్నాడు: “నేను మీ దగ్గరకు వివేకాన్ని తెచ్చాను. మీరు విభేదించుకుంటున్న కొన్ని విషయాల వాస్తవికతను విడమరచి చెప్పటానికే వచ్చాను. కనుక మీరు అల్లాహ్‌కు భయపడండి. నాకు విధేయత చూపండి.
43:64 إِنَّ اللَّهَ هُوَ رَبِّي وَرَبُّكُمْ فَاعْبُدُوهُ ۚ هَٰذَا صِرَاطٌ مُّسْتَقِيمٌ
“నిజానికి నా ప్రభువూ, మీ ప్రభువూ అల్లాహ్ మాత్రమే. కాబట్టి మీరంతా ఆయన్నే ఆరాధించండి. ఇదే రుజుమార్గం.”
43:65 فَاخْتَلَفَ الْأَحْزَابُ مِن بَيْنِهِمْ ۖ فَوَيْلٌ لِّلَّذِينَ ظَلَمُوا مِنْ عَذَابِ يَوْمٍ أَلِيمٍ
అయితే ఆ తర్వాత (ఇస్రాయీల్ సంతతికి చెందిన) పలు కూటములవారు పరస్పరం విభేదించుకున్నారు. కనుక దుర్మార్గులకు బాధాకరమైన దినమునందలి శిక్ష వల్ల వినాశం తప్పదు.
43:66 هَلْ يَنظُرُونَ إِلَّا السَّاعَةَ أَن تَأْتِيَهُم بَغْتَةً وَهُمْ لَا يَشْعُرُونَ
తమకు తెలీకుండానే, తమపై అకస్మాత్తుగా ప్రళయం వచ్చి పడాలని వారు ఎదురు చూస్తున్నారా?
43:67 الْأَخِلَّاءُ يَوْمَئِذٍ بَعْضُهُمْ لِبَعْضٍ عَدُوٌّ إِلَّا الْمُتَّقِينَ
ఆ రోజు (ప్రాణ) మిత్రులు కూడా ఒకరికొకరు శత్రువులై పోతారు – అయితే దైవభక్తి పరాయణులు మాత్రం అలా ప్రవర్తించరు.
43:68 يَا عِبَادِ لَا خَوْفٌ عَلَيْكُمُ الْيَوْمَ وَلَا أَنتُمْ تَحْزَنُونَ
ఓ నా దాసులారా! ఈ రోజు మీకెలాంటి భయంగానీ, దుఃఖంగానీ ఉండదు.
43:69 الَّذِينَ آمَنُوا بِآيَاتِنَا وَكَانُوا مُسْلِمِينَ
మా సూచనలను విశ్వసించి, విధేయులు (ముస్లింలు)గా ఉన్న వారినుద్దేశించి (ఈ విధంగా అనబడుతుంది:)
43:70 ادْخُلُوا الْجَنَّةَ أَنتُمْ وَأَزْوَاجُكُمْ تُحْبَرُونَ
మీరూ, మీ భార్యలూ సంతోషంగా (సగౌరవంగా) స్వర్గంలో ప్రవేశించండి.
43:71 يُطَافُ عَلَيْهِم بِصِحَافٍ مِّن ذَهَبٍ وَأَكْوَابٍ ۖ وَفِيهَا مَا تَشْتَهِيهِ الْأَنفُسُ وَتَلَذُّ الْأَعْيُنُ ۖ وَأَنتُمْ فِيهَا خَالِدُونَ
వారి వద్దకు నలువైపుల నుంచి బంగారు పళ్లాలూ, బంగారు గ్లాసులూ తేబడతాయి. మనసు కోరేవీ, కళ్లు ఆస్వాదించేవీ- అన్నీ అక్కడ ఉంటాయి. అందులో మీరు కలకాలం (సుఖంగా) ఉంటారు.
43:72 وَتِلْكَ الْجَنَّةُ الَّتِي أُورِثْتُمُوهَا بِمَا كُنتُمْ تَعْمَلُونَ
ఈ స్వర్గం – మీరు చేసుకున్న సత్కర్మలకు బదులుగా మీరు దీనికి వారసులయ్యారు.
43:73 لَكُمْ فِيهَا فَاكِهَةٌ كَثِيرَةٌ مِّنْهَا تَأْكُلُونَ
ఇందులో మీరు ఆరగించటానికి ఎన్నో పండ్లు ఫలాలున్నాయి (అని అనబడుతుంది).
43:74 إِنَّ الْمُجْرِمِينَ فِي عَذَابِ جَهَنَّمَ خَالِدُونَ
(ఇకపోతే) అపరాధులు ఖచ్చితంగా శాశ్వతమైన నరకయాతనకు లోనై ఉంటారు.
43:75 لَا يُفَتَّرُ عَنْهُمْ وَهُمْ فِيهِ مُبْلِسُونَ
ఆ యాతన వారినుంచి ఎన్నటికీ తగ్గించబడదు. ఇక వారు ఆశలన్నీ వదులుకుని, అందులోనే పడి ఉంటారు.
43:76 وَمَا ظَلَمْنَاهُمْ وَلَٰكِن كَانُوا هُمُ الظَّالِمِينَ
మేము వారికెలాంటి అన్యాయం చేయలేదు. కాని వారంతట వారే అన్యాయస్థులయ్యారు.
43:77 وَنَادَوْا يَا مَالِكُ لِيَقْضِ عَلَيْنَا رَبُّكَ ۖ قَالَ إِنَّكُم مَّاكِثُونَ
“ఓ మాలిక్! నీ ప్రభువు మమ్మల్ని అంతం చేసేస్తే (అంటే పూర్తిగా ఒకేసారి చంపేస్తే) పోతుంది కదయ్యా” అని వారు అరుస్తారు. దానికతను “మీరు (నిత్యం) ఇలా ఉండాల్సిందే” అంటాడు.
43:78 لَقَدْ جِئْنَاكُم بِالْحَقِّ وَلَٰكِنَّ أَكْثَرَكُمْ لِلْحَقِّ كَارِهُونَ
“మేము మీ దగ్గరకు సత్యాన్ని తీసుకువచ్చాము. కాని మీలో చాలా మంది సత్యాన్ని ఏవగించుకున్నారు కదా!”
43:79 أَمْ أَبْرَمُوا أَمْرًا فَإِنَّا مُبْرِمُونَ
ఏమిటి, వీళ్లు (నీకు వ్యతిరేకంగా) ఏదన్నా విషయాన్ని గట్టిగా నిర్ధారించారా? మరైతే మేము కూడా గట్టిగానే నిర్ధారిస్తాము.
43:80 أَمْ يَحْسَبُونَ أَنَّا لَا نَسْمَعُ سِرَّهُمْ وَنَجْوَاهُم ۚ بَلَىٰ وَرُسُلُنَا لَدَيْهِمْ يَكْتُبُونَ
ఏమిటి, వాళ్ల రహస్య విషయాలను, వారి గుసగుసలను మేము వినలేమని వారనుకుంటున్నారా? (తప్పకుండా వింటాము) మేము పంపిన దూతలు వాళ్ల దగ్గరే వ్రాస్తున్నారు.
43:81 قُلْ إِن كَانَ لِلرَّحْمَٰنِ وَلَدٌ فَأَنَا أَوَّلُ الْعَابِدِينَ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “కరుణామయునికి సంతానమే గనక ఉంటే, అందరికన్నా ముందు నేనే వారిని ఆరాధించి ఉండేవాణ్ణి.”
43:82 سُبْحَانَ رَبِّ السَّمَاوَاتِ وَالْأَرْضِ رَبِّ الْعَرْشِ عَمَّا يَصِفُونَ
వీళ్లు భూమ్యాకాశాల ప్రభువు, అర్ష్ (సింహాసనము) నకు అధిపతి అయిన అల్లాహ్ వీళ్లు బొంకే మాటలన్నింటికీ అతీతుడు, పవిత్రుడు.
43:83 فَذَرْهُمْ يَخُوضُوا وَيَلْعَبُوا حَتَّىٰ يُلَاقُوا يَوْمَهُمُ الَّذِي يُوعَدُونَ
కాబట్టి నువ్వు వాళ్ళను వాళ్ళ వాగుడులోనే, ఆటపాటల్లోనే పడి ఉండనివ్వు. తుదకు వాళ్లకు వాగ్దానం చేయబడుతున్న రోజు వారికి ఎదురవుతుంది.
43:84 وَهُوَ الَّذِي فِي السَّمَاءِ إِلَٰهٌ وَفِي الْأَرْضِ إِلَٰهٌ ۚ وَهُوَ الْحَكِيمُ الْعَلِيمُ
ఆయనే ఆకాశాలలో ఆరాధించదగినవాడు. భూమిలో కూడా ఆయనే ఆరాధ్యుడు. ఆయన అపార వివేక సంపన్నుడు, సంపూర్ణ జ్ఞానం కలవాడు.
43:85 وَتَبَارَكَ الَّذِي لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا وَعِندَهُ عِلْمُ السَّاعَةِ وَإِلَيْهِ تُرْجَعُونَ
ఇంకా ఆయన గొప్ప శుభకరుడు. భూమ్యాకాశాల్లోనూ, వాటి మధ్య నున్న సమస్త వస్తువుల మీదనూ ఆధిపత్యం ఆయనదే. ప్రళయ ఘడియ గురించిన జ్ఞానం కూడా ఆయన వద్దనే ఉంది. మీరంతా (ఆఖరికి) ఆయన వద్దకే మరలించబడతారు.
43:86 وَلَا يَمْلِكُ الَّذِينَ يَدْعُونَ مِن دُونِهِ الشَّفَاعَةَ إِلَّا مَن شَهِدَ بِالْحَقِّ وَهُمْ يَعْلَمُونَ
అల్లాహ్‌ను వదలి వీళ్లు ఎవరెవరిని మొరపెట్టుకుంటున్నారో వారికి, సిఫారసుకు సంబంధించిన ఏ అధికారమూ లేదు. కాని సత్యం గురించి సాక్ష్యమిచ్చి, దానికి సంబంధించిన జ్ఞానమున్న వారు మాత్రం (సిఫారసుకు యోగ్యులు).
43:87 وَلَئِن سَأَلْتَهُم مَّنْ خَلَقَهُمْ لَيَقُولُنَّ اللَّهُ ۖ فَأَنَّىٰ يُؤْفَكُونَ
“మిమ్మల్ని పుట్టించినదెవర”ని నువ్వు గనక వారిని అడిగితే, “అల్లాహ్” అని వారు తప్పకుండా అంటారు. మరలాంటప్పుడు వారు ఎటు తిరిగిపోతున్నారు(ట)?!
43:88 وَقِيلِهِ يَا رَبِّ إِنَّ هَٰؤُلَاءِ قَوْمٌ لَّا يُؤْمِنُونَ
“ఓ నా ప్రభూ! వీళ్లు మాత్రం విశ్వసించే జనులు కారు” అన్న తన ప్రవక్త పలుకు గురించి కూడా ఆయనకు తెలుసు.
43:89 فَاصْفَحْ عَنْهُمْ وَقُلْ سَلَامٌ ۚ فَسَوْفَ يَعْلَمُونَ
కనుక (ఓ ప్రవక్తా!) నువ్వు వారి నుంచి ముఖం త్రిప్పుకో. “(నాయనలారా!) మీకో సలాం!” అని చెప్పు. త్వరలో వారికే తెలిసివస్తుంది. - సూరా అద్ దుఖాన్
44:1 حم
హా మీమ్.
44:2 وَالْكِتَابِ الْمُبِينِ
స్పష్టమైన ఈ గ్రంథం తోడు!
44:3 إِنَّا أَنزَلْنَاهُ فِي لَيْلَةٍ مُّبَارَكَةٍ ۚ إِنَّا كُنَّا مُنذِرِينَ
నిశ్చయంగా మేము దీనిని శుభప్రదమైన రాత్రియందు అవతరింపజేశాము. నిస్సందేహంగా మేము హెచ్చరిక చేసేవాళ్ళము.
44:4 فِيهَا يُفْرَقُ كُلُّ أَمْرٍ حَكِيمٍ
ఆ రాత్రియందే కీలకమైన ప్రతి ఉత్తర్వూ జారీ చేయబడుతుంది.
44:5 أَمْرًا مِّنْ عِندِنَا ۚ إِنَّا كُنَّا مُرْسِلِينَ
మా వద్ద నుండే ఆజ్ఞ రూపంలో! (ప్రవక్తలను) పంపేది కూడా మేమే.
44:6 رَحْمَةً مِّن رَّبِّكَ ۚ إِنَّهُ هُوَ السَّمِيعُ الْعَلِيمُ
నీ ప్రభువు దయానుగ్రహం వల్ల. ఆయన సర్వం వినేవాడు, సర్వం తెలిసినవాడు.
44:7 رَبِّ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا ۖ إِن كُنتُم مُّوقِنِينَ
మీరు గనక నమ్మగలిగితే ఆయనే భూమ్యాకాశాలకు, వాటి మధ్యనున్న సమస్తానికీ ప్రభువు.
44:8 لَا إِلَٰهَ إِلَّا هُوَ يُحْيِي وَيُمِيتُ ۖ رَبُّكُمْ وَرَبُّ آبَائِكُمُ الْأَوَّلِينَ
ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. ఆయనే బ్రతికిస్తున్నాడు, ఆయనే చంపుతున్నాడు. ఆయనే మీ ప్రభువు, పూర్వీకులైన మీ తాతముత్తాతలకు కూడా (ఆయనే) ప్రభువు.
44:9 بَلْ هُمْ فِي شَكٍّ يَلْعَبُونَ
అది కాదు, వారు సంశయానికి లోనై, ఆడుకుంటున్నారు.
44:10 فَارْتَقِبْ يَوْمَ تَأْتِي السَّمَاءُ بِدُخَانٍ مُّبِينٍ
కనుక నువ్వు, ఆకాశం స్పష్టమయిన పొగను తీసుకువచ్చే రోజు కోసం ఎదురు చూడు.
44:11 يَغْشَى النَّاسَ ۖ هَٰذَا عَذَابٌ أَلِيمٌ
అది మనుషుల్ని ముట్టడిస్తుంది. అదొక వ్యధాభరితమైన శిక్ష.
44:12 رَّبَّنَا اكْشِفْ عَنَّا الْعَذَابَ إِنَّا مُؤْمِنُونَ
(అప్పుడు వారు) “మా ప్రభూ! ఈ విపత్తును మా నుండి దూరం చేయి. మేము నిజంగానే విశ్వసిస్తాము” (అని ప్రాధేయపడతారు).
44:13 أَنَّىٰ لَهُمُ الذِّكْرَىٰ وَقَدْ جَاءَهُمْ رَسُولٌ مُّبِينٌ
ఉపదేశం ఇప్పుడు వారికి ఎలా లాభదాయకం అవుతుంది? – అన్నీ విడమరచి చెప్పే ప్రవక్త వారి వద్దకు (ఎప్పుడో) వచ్చేశాడు.
44:14 ثُمَّ تَوَلَّوْا عَنْهُ وَقَالُوا مُعَلَّمٌ مَّجْنُونٌ
అయినా వాళ్లు అతన్నుండి ముఖం త్రిప్పుకున్నారు. “ఇతను (ఇతరుల చేత మాటలు) నేర్పబడిన పిచ్చివానిలా ఉన్నాడు” అని అన్నారు.
44:15 إِنَّا كَاشِفُو الْعَذَابِ قَلِيلًا ۚ إِنَّكُمْ عَائِدُونَ
మేము ఈ విపత్తును కొద్దిగా తొలగిస్తాము. (కాని ఏం లాభం?) మీరు మళ్లీ యధాస్థితి (అవిశ్వాస స్థితి)కి వస్తారు.
44:16 يَوْمَ نَبْطِشُ الْبَطْشَةَ الْكُبْرَىٰ إِنَّا مُنتَقِمُونَ
ఏ రోజున మేము మిమ్మల్ని చాలా గట్టిగా పట్టుకుంటామో (ఆ రోజు) మీపై తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాము.
44:17 وَلَقَدْ فَتَنَّا قَبْلَهُمْ قَوْمَ فِرْعَوْنَ وَجَاءَهُمْ رَسُولٌ كَرِيمٌ
వీరికి పూర్వం ఫిరౌన్ జాతి వారిని (కూడా) మేము పరీక్షించాము. వాళ్ల దగ్గరకు గౌరవనీయుడైన ప్రవక్త వచ్చాడు.
44:18 أَنْ أَدُّوا إِلَيَّ عِبَادَ اللَّهِ ۖ إِنِّي لَكُمْ رَسُولٌ أَمِينٌ
(అతనిలా అన్నాడు): “దైవదాసులను నాకప్పగించండి. నేను మీ వద్దకు పంపబడిన నమ్మకస్థుణ్ణి అయిన ప్రవక్తను.
44:19 وَأَن لَّا تَعْلُوا عَلَى اللَّهِ ۖ إِنِّي آتِيكُم بِسُلْطَانٍ مُّبِينٍ
“మీరు అల్లాహ్ ముందు తలబిరుసుతనం ప్రదర్శించకండి. నేను మీ వద్దకు స్పష్టమైన ప్రమాణం తీసుకువచ్చాను.
44:20 وَإِنِّي عُذْتُ بِرَبِّي وَرَبِّكُمْ أَن تَرْجُمُونِ
“మీరు రాళ్లు రువ్వి నన్ను చంపే ప్రయత్నం నుంచి నా ప్రభువూ, మీ ప్రభువూ అయిన అల్లాహ్‌ను నేను శరణు వేడుతున్నాను.
44:21 وَإِن لَّمْ تُؤْمِنُوا لِي فَاعْتَزِلُونِ
“ఒకవేళ మీకు నాపై నమ్మకం లేకపోతే, నా నుండి వేరై పోండి.”
44:22 فَدَعَا رَبَّهُ أَنَّ هَٰؤُلَاءِ قَوْمٌ مُّجْرِمُونَ
(కాని ఎంత నచ్చజెప్పినా వారు వినకపోవటంతో) అతను, “(ఓ ప్రభూ!) ఈ జనులు పాపాత్ములు” అంటూ తన ప్రభువును ప్రార్థించాడు.
44:23 فَأَسْرِ بِعِبَادِي لَيْلًا إِنَّكُم مُّتَّبَعُونَ
“సరే! రాత్రికి రాత్రే నువ్వు నా దాసులను తీసుకుని వెళ్ళిపో. ఖచ్చితంగా మీరు వెంబడించబడతారు.
44:24 وَاتْرُكِ الْبَحْرَ رَهْوًا ۖ إِنَّهُمْ جُندٌ مُّغْرَقُونَ
“నువ్వు సముద్రాన్ని నిలిచి (చీలి) ఉన్న స్థితిలోనే వదలి వెళ్ళిపో. అయితే ఈ సైన్యం మాత్రం ముంచివేయబడుతుంది” (అని మేమతనికి సూచించాము).
44:25 كَمْ تَرَكُوا مِن جَنَّاتٍ وَعُيُونٍ
వారు ఎన్నో తోటలను, ఊటలను వదలిపోయారు.
44:26 وَزُرُوعٍ وَمَقَامٍ كَرِيمٍ
మరెన్నో పచ్చని పొలాలను, చక్కని నిలయాలను,
44:27 وَنَعْمَةٍ كَانُوا فِيهَا فَاكِهِينَ
ఇంకా తాము అనుభవిస్తూ ఉండే విలాసవంతమైన వస్తువులను కూడా (వదలిపోయారు).
44:28 كَذَٰلِكَ ۖ وَأَوْرَثْنَاهَا قَوْمًا آخَرِينَ
అంతా ఇట్టే అయిపోయింది. మేము మరో జాతి వారిని వాటన్నింటికీ వారసులుగా చేశాము.
44:29 فَمَا بَكَتْ عَلَيْهِمُ السَّمَاءُ وَالْأَرْضُ وَمَا كَانُوا مُنظَرِينَ
వారి స్థితిపై నింగీ, నేలా రోదించలేదు. వారికి (కనీసం) గడువు కూడా లభించలేదు.
44:30 وَلَقَدْ نَجَّيْنَا بَنِي إِسْرَائِيلَ مِنَ الْعَذَابِ الْمُهِينِ
నిస్సందేహంగా మేమే ఇస్రాయీలు సంతతిని (అత్యంత) అవమానకరమైన శిక్ష (పీడన) నుంచి విడిపించాము.
44:31 مِن فِرْعَوْنَ ۚ إِنَّهُ كَانَ عَالِيًا مِّنَ الْمُسْرِفِينَ
ఫిరౌన్ తరఫున జరిగే (పీడన నుంచి)! నిశ్చయంగా వాడు మహా తలబిరుసు, బరితెగించిపోయినవాడు.
44:32 وَلَقَدِ اخْتَرْنَاهُمْ عَلَىٰ عِلْمٍ عَلَى الْعَالَمِينَ
మేము జ్ఞానంతోనే వారికి (ఇస్రాయీలీయులకు) లోకవాసులపై ప్రాధాన్యతను వొసగాము.
44:33 وَآتَيْنَاهُم مِّنَ الْآيَاتِ مَا فِيهِ بَلَاءٌ مُّبِينٌ
ఇంకా, మేము వారికి స్పష్టమైన పరీక్ష గల సూచనలను ఇచ్చాము
44:34 إِنَّ هَٰؤُلَاءِ لَيَقُولُونَ
వాళ్లు (మక్కా తిరస్కారులు) ఇలా అంటున్నారు –
44:35 إِنْ هِيَ إِلَّا مَوْتَتُنَا الْأُولَىٰ وَمَا نَحْنُ بِمُنشَرِينَ
“ఇక్కడ (ఈ ప్రపంచంలో) మాకు వచ్చే మొదటి మరణమే తప్ప మరొకటిలేదు. మళ్లీ మేము తిరిగి లేపబడటమనేది ఉండదు.
44:36 فَأْتُوا بِآبَائِنَا إِن كُنتُمْ صَادِقِينَ
“ఒకవేళ మీరు చెప్పేదే నిజమైతే మా తాతముత్తాతలను (తిరిగి) తీసుకురండి!”
44:37 أَهُمْ خَيْرٌ أَمْ قَوْمُ تُبَّعٍ وَالَّذِينَ مِن قَبْلِهِمْ ۚ أَهْلَكْنَاهُمْ ۖ إِنَّهُمْ كَانُوا مُجْرِمِينَ
ఏమిటి, వీళ్లు గొప్పవారా లేక ‘తుబ్బా’ జాతి వారు, వారికి పూర్వం గతించిన వారు గొప్పవారా? మేము వాళ్ళందరినీ అంత మొందించాము. ఎందుకంటే వాళ్లు పాపాత్ములుగా తయారయ్యారు.
44:38 وَمَا خَلَقْنَا السَّمَاوَاتِ وَالْأَرْضَ وَمَا بَيْنَهُمَا لَاعِبِينَ
మేము భూమ్యాకాశాలను, వాటి మధ్యనున్న వస్తువులను ఏదో తమాషాగా (ఆషామాషీగా) సృష్టించలేదు.
44:39 مَا خَلَقْنَاهُمَا إِلَّا بِالْحَقِّ وَلَٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ
పైగా మేము వాటిని సత్య (ప్రణాళికా) బద్ధంగానే సృజించాము. కాని వారిలో చాలామందికి తెలీదు.
44:40 إِنَّ يَوْمَ الْفَصْلِ مِيقَاتُهُمْ أَجْمَعِينَ
నిశ్చయంగా తీర్పుదినం, వారందరి కోసం నిర్ణయించబడిన ఒక (వాగ్దాన) సమయం.
44:41 يَوْمَ لَا يُغْنِي مَوْلًى عَن مَّوْلًى شَيْئًا وَلَا هُمْ يُنصَرُونَ
ఆ రోజు ఏ స్నేహితుడూ మరో స్నేహితునికి ఏ కాస్త కూడా పనికిరాడు. మరి వారికెలాంటి సహాయం కూడా లభించదు.
44:42 إِلَّا مَن رَّحِمَ اللَّهُ ۚ إِنَّهُ هُوَ الْعَزِيزُ الرَّحِيمُ
కాని అల్లాహ్ ఎవరినయినా కనికరిస్తే అది వేరే విషయం. నిశ్చయంగా ఆయన సర్వాధిక్యుడు, దయాశీలి.
44:43 إِنَّ شَجَرَتَ الزَّقُّومِ
నిశ్చయంగా జెముడు వృక్షం (జఖ్ఖూమ్ చెట్టు).
44:44 طَعَامُ الْأَثِيمِ
పాపాత్ముల ఆహారంగా ఉంటుంది.
44:45 كَالْمُهْلِ يَغْلِي فِي الْبُطُونِ
అది నూనె గసి లాగా ఉంటుంది. కడుపులోకి పోయి ఉడుకుతూ ఉంటుంది.
44:46 كَغَلْيِ الْحَمِيمِ
సలసలా కాగే నీరు మాదిరిగా ఉడుకుతూ ఉంటుంది!
44:47 خُذُوهُ فَاعْتِلُوهُ إِلَىٰ سَوَاءِ الْجَحِيمِ
“వాడ్ని పట్టుకోండి. ఈడ్చుకుంటూ పోయి నరకాగ్ని నడి బొడ్డున పడవెయ్యండి.”
44:48 ثُمَّ صُبُّوا فَوْقَ رَأْسِهِ مِنْ عَذَابِ الْحَمِيمِ
“పిదప అతని నెత్తి మీద సలసలా కాగే నీరును – శిక్షగా – కుమ్మరించండి” (అని కేక వేయబడుతుంది).
44:49 ذُقْ إِنَّكَ أَنتَ الْعَزِيزُ الْكَرِيمُ
రుచిచూడు! నువ్వు గొప్ప శక్తిమంతునిలా, మర్యాదస్తునిలా వుండే వాడివిగా!
44:50 إِنَّ هَٰذَا مَا كُنتُم بِهِ تَمْتَرُونَ
దేనిపట్ల మీరు సందిగ్ధంలో పడ్డారో అది ఇదే (అని వారితో అనబడుతుంది).
44:51 إِنَّ الْمُتَّقِينَ فِي مَقَامٍ أَمِينٍ
నిశ్చయంగా దైవభీతి పరాయణులు సురక్షిత (ప్రశాంత) స్థలంలో ఉంటారు.
44:52 فِي جَنَّاتٍ وَعُيُونٍ
ఉద్యానవనాల, చెలమల మధ్యన…
44:53 يَلْبَسُونَ مِن سُندُسٍ وَإِسْتَبْرَقٍ مُّتَقَابِلِينَ
పల్చటి సిల్కు వస్త్రాలను, దళసరి పట్టు వస్త్రాలను ధరించి ఎదురెదురుగా ఆసీనులై ఉంటారు.
44:54 كَذَٰلِكَ وَزَوَّجْنَاهُم بِحُورٍ عِينٍ
(భక్తిపరాయణుల పట్ల) ఇలాగే వ్యవహరించబడుతుంది. (అంతేకాదు) పెద్ద పెద్ద కన్నులు గల (హూరు) అందగత్తెలతో మేము వారి వివాహం జరిపిస్తాము.
44:55 يَدْعُونَ فِيهَا بِكُلِّ فَاكِهَةٍ آمِنِينَ
వారక్కడ నిక్షేపంగా (కూర్చొని) అన్నిరకాల పండ్లు ఫలాదులను తెప్పించుకుంటూ ఉంటారు.
44:56 لَا يَذُوقُونَ فِيهَا الْمَوْتَ إِلَّا الْمَوْتَةَ الْأُولَىٰ ۖ وَوَقَاهُمْ عَذَابَ الْجَحِيمِ
మొదటిసారి వచ్చిన మరణం తప్ప, మరింకా వారు అక్కడ మరణం రుచి చూడటమనేదే ఉండదు. నరకాగ్ని శిక్ష నుండి అల్లాహ్ వారిని రక్షించాడు.
44:57 فَضْلًا مِّن رَّبِّكَ ۚ ذَٰلِكَ هُوَ الْفَوْزُ الْعَظِيمُ
ఇది కేవలం నీ ప్రభువు కృప మాత్రమే. చాలా గొప్ప విజయమంటే ఇదే.
44:58 فَإِنَّمَا يَسَّرْنَاهُ بِلِسَانِكَ لَعَلَّهُمْ يَتَذَكَّرُونَ
(ఓ ప్రవక్తా!) వారు ఉపదేశాన్ని గ్రహించేటందుకుగాను మేము దీనిని (ఈ ఖురానును) నీ భాషలో సులభతరం చేశాము.
44:59 فَارْتَقِبْ إِنَّهُم مُّرْتَقِبُونَ
కనుక నువ్వు కూడా నిరీక్షించు, వారు కూడా నిరీక్షిస్తున్నారు. - సూరా అల్ జాసియ హ్
45:1 حم
హా మీమ్.
45:2 تَنزِيلُ الْكِتَابِ مِنَ اللَّهِ الْعَزِيزِ الْحَكِيمِ
ఈ గ్రంథావతరణ సర్వాధిక్యుడు, వివేచనాపరుడైన అల్లాహ్ తరఫున జరిగింది.
45:3 إِنَّ فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ لَآيَاتٍ لِّلْمُؤْمِنِينَ
నిశ్చయంగా ఆకాశాలలో, భూమిలో విశ్వసించిన వారి కోసం ఎన్నో సూచనలున్నాయి.
45:4 وَفِي خَلْقِكُمْ وَمَا يَبُثُّ مِن دَابَّةٍ آيَاتٌ لِّقَوْمٍ يُوقِنُونَ
స్వయంగా మీ పుట్టుకలోనూ, ఆయన సర్వవ్యాప్తం చేసే జంతువుల పుట్టుకలోనూ నమ్మే జనుల కొరకు సూచనలున్నాయి.
45:5 وَاخْتِلَافِ اللَّيْلِ وَالنَّهَارِ وَمَا أَنزَلَ اللَّهُ مِنَ السَّمَاءِ مِن رِّزْقٍ فَأَحْيَا بِهِ الْأَرْضَ بَعْدَ مَوْتِهَا وَتَصْرِيفِ الرِّيَاحِ آيَاتٌ لِّقَوْمٍ يَعْقِلُونَ
రేయింబవళ్ళ రాకపోకలలోనూ, అల్లాహ్ ఆకాశం నుంచి ఉపాధిని (వర్షం రూపంలో) కురిపించి, భూమిని చచ్చిన పిదప బ్రతికించటంలోనూ, వాయువుల మార్పులోనూ బుద్ధీజ్ఞానాలు గలవారికి పలు సూచనలున్నాయి.
45:6 تِلْكَ آيَاتُ اللَّهِ نَتْلُوهَا عَلَيْكَ بِالْحَقِّ ۖ فَبِأَيِّ حَدِيثٍ بَعْدَ اللَّهِ وَآيَاتِهِ يُؤْمِنُونَ
ఇవి అల్లాహ్ వాక్యాలు. వీటిని మేము నీకు ఉన్నదున్నట్టుగా వినిపిస్తున్నాము. ఇక వారు అల్లాహ్ మరియు ఆయన సూచనల (ను కాదన్న) తరువాత ఇక ఏ విషయాన్ని విశ్వసిస్తారు(ట)!?
45:7 وَيْلٌ لِّكُلِّ أَفَّاكٍ أَثِيمٍ
అబద్ధాలకోరు, పాపాత్ముడైన ప్రతి ఒక్కరికీ మూడుతుంది.
45:8 يَسْمَعُ آيَاتِ اللَّهِ تُتْلَىٰ عَلَيْهِ ثُمَّ يُصِرُّ مُسْتَكْبِرًا كَأَن لَّمْ يَسْمَعْهَا ۖ فَبَشِّرْهُ بِعَذَابٍ أَلِيمٍ
వాడెలాంటివాడంటే, తన ముందు అల్లాహ్ వాక్యాలను చదివి వినిపించినప్పుడు, వాటిని విని, ఆ తర్వాత అసలు వాటిని విననే లేదన్నట్లుగా అహంకారంతో మొండికేస్తాడు. కనుక అలాంటి వారికి బాధాకరమైన శిక్షపడుతుందన్న వార్తను వినిపించు.
45:9 وَإِذَا عَلِمَ مِنْ آيَاتِنَا شَيْئًا اتَّخَذَهَا هُزُوًا ۚ أُولَٰئِكَ لَهُمْ عَذَابٌ مُّهِينٌ
మా వాక్యాలలోని ఏదైనా విషయం అతనికి తెలిసినప్పుడు, దాన్ని ఎగతాళి చేస్తాడు. అవమానకరమైన శిక్ష ఉన్నది ఇలాంటి వారికోసమే.
45:10 مِّن وَرَائِهِمْ جَهَنَّمُ ۖ وَلَا يُغْنِي عَنْهُم مَّا كَسَبُوا شَيْئًا وَلَا مَا اتَّخَذُوا مِن دُونِ اللَّهِ أَوْلِيَاءَ ۖ وَلَهُمْ عَذَابٌ عَظِيمٌ
వారికి ముందు నరకం ఉన్నది. వారు సంపాదించుకున్నదేదీ వారికెలాంటి ప్రయోజనం చేకూర్చదు. అల్లాహ్‌ను వదలి వారు ఆశ్రయించిన సంరక్షకులు కూడా వారికి పనికి రారు. వారికోసం చాలా ఘోరమైన యాతన (సిద్ధంగా) ఉంది.
45:11 هَٰذَا هُدًى ۖ وَالَّذِينَ كَفَرُوا بِآيَاتِ رَبِّهِمْ لَهُمْ عَذَابٌ مِّن رِّجْزٍ أَلِيمٌ
ఇదే (అసలు సిసలు) మార్గదర్శిని. మరెవరయితే తమ ప్రభువు సూచనలను త్రోసిపుచ్చారో వారికొరకు అత్యంత బాధాకరమైన – వణుకుపుట్టించే – శిక్ష ఉన్నది.
45:12 اللَّهُ الَّذِي سَخَّرَ لَكُمُ الْبَحْرَ لِتَجْرِيَ الْفُلْكُ فِيهِ بِأَمْرِهِ وَلِتَبْتَغُوا مِن فَضْلِهِ وَلَعَلَّكُمْ تَشْكُرُونَ
అల్లాహ్‌యే మీ కోసం సముద్రాన్ని వశపరిచాడు – ఆయన ఆజ్ఞతో అందులో ఓడలు నడవటానికి, మరి మీరు ఆయన కృపను (ఉపాధిని) అన్వేషించటానికి, ఇంకా – మీరు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవటానికి.
45:13 وَسَخَّرَ لَكُم مَّا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ جَمِيعًا مِّنْهُ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّقَوْمٍ يَتَفَكَّرُونَ
ఇంకా భూమ్యాకాశాలలో ఉన్న వస్తువులన్నింటినీ ఆయన – తన తరఫున – మీ సేవలో ఉండేటట్లుగా చేశాడు. నిశ్చయంగా యోచన చేసేవారికి ఇందులో ఎన్నో సూచనలున్నాయి.
45:14 قُل لِّلَّذِينَ آمَنُوا يَغْفِرُوا لِلَّذِينَ لَا يَرْجُونَ أَيَّامَ اللَّهِ لِيَجْزِيَ قَوْمًا بِمَا كَانُوا يَكْسِبُونَ
(ఓ ప్రవక్తా!) అల్లాహ్ ఒక వర్గం వారికి, వారు చేసుకున్న దానికి తగిన ప్రతిఫలం ఇవ్వాలి కదా; అందుకే అల్లాహ్ తరఫున గడ్డు దినాలు రావని నిక్షేపంగా ఉన్నవారిని క్షమించి వదలి పెట్టమని నువ్వు విశ్వాసులకు చెప్పు.
45:15 مَنْ عَمِلَ صَالِحًا فَلِنَفْسِهِ ۖ وَمَنْ أَسَاءَ فَعَلَيْهَا ۖ ثُمَّ إِلَىٰ رَبِّكُمْ تُرْجَعُونَ
ఎవడయినా సత్కార్యం చేస్తే తన స్వయం కొరకే చేసుకుంటాడు. మరెవడయినా దుష్కార్యానికి ఒడిగడితే దాని పాపఫలం స్వయంగా అతని మీదే పడుతుంది. తరువాత మీరంతా మీ ప్రభువు వైపునకే మరలించబడతారు.
45:16 وَلَقَدْ آتَيْنَا بَنِي إِسْرَائِيلَ الْكِتَابَ وَالْحُكْمَ وَالنُّبُوَّةَ وَرَزَقْنَاهُم مِّنَ الطَّيِّبَاتِ وَفَضَّلْنَاهُمْ عَلَى الْعَالَمِينَ
మరి మేము ఇస్రాయీలు సంతతి వారికి గ్రంథాన్నీ, రాజ్యాధికారాన్ని, ప్రవక్తా పదవిని ప్రసాదించాము. ఇంకా మేము వారికి పవిత్రమైన ఆహారాన్ని (మంచి మంచి వస్తువులను) వొసగాము. అంతేకాదు, లోకవాసులపై వారికి ఆధిక్యతను కూడా అనుగ్రహించాము.
45:17 وَآتَيْنَاهُم بَيِّنَاتٍ مِّنَ الْأَمْرِ ۖ فَمَا اخْتَلَفُوا إِلَّا مِن بَعْدِ مَا جَاءَهُمُ الْعِلْمُ بَغْيًا بَيْنَهُمْ ۚ إِنَّ رَبَّكَ يَقْضِي بَيْنَهُمْ يَوْمَ الْقِيَامَةِ فِيمَا كَانُوا فِيهِ يَخْتَلِفُونَ
మరి ధర్మానికి సంబంధించిన స్పష్టమైన నిదర్శనాలను కూడా వారికి ఇచ్చాము. కాని తీరా జ్ఞానం వచ్చేసిన పిమ్మట వారు తమ మధ్య గల ద్వేషం, శత్రుత్వం కారణంగా విభేదించుకున్నారు. వారు ఏ ఏ విషయాలలో విభేదించుకుంటున్నారో, దానికి సంబంధించిన తీర్పును – వారి మధ్య – ప్రళయదినాన నీ ప్రభువు చెబుతాడు.
45:18 ثُمَّ جَعَلْنَاكَ عَلَىٰ شَرِيعَةٍ مِّنَ الْأَمْرِ فَاتَّبِعْهَا وَلَا تَتَّبِعْ أَهْوَاءَ الَّذِينَ لَا يَعْلَمُونَ
తర్వాత మేము నిన్ను ధర్మానికి సంబంధించిన (రాచ)బాటపై నిలబెట్టాము. కనుక (ఓ ముహమ్మద్ – స!) నువ్వు దీనినే అనుసరించు. అజ్ఞానుల ఆకాంక్షలను అనుసరించకు.
45:19 إِنَّهُمْ لَن يُغْنُوا عَنكَ مِنَ اللَّهِ شَيْئًا ۚ وَإِنَّ الظَّالِمِينَ بَعْضُهُمْ أَوْلِيَاءُ بَعْضٍ ۖ وَاللَّهُ وَلِيُّ الْمُتَّقِينَ
(బాగా గుర్తుంచుకో!) అల్లాహ్ ముందు వాళ్ళెవరూ ఏ విధంగానూ నీకు ఉపయోగపడరు. ఈ దుర్మార్గులు ఒండొకరికి స్నేహితులుగా ఉంటారు. మరి భయభక్తులు గలవారికి అండగా అల్లాహ్ ఉంటాడు సుమా!
45:20 هَٰذَا بَصَائِرُ لِلنَّاسِ وَهُدًى وَرَحْمَةٌ لِّقَوْمٍ يُوقِنُونَ
ఇది (ఈ ఖుర్ఆన్) ప్రజలకు ముందు చూపును ఇచ్చే సూచనల సమాహారం. నమ్మి నడుచుకునే జనం కోసం మార్గదర్శిని, కారుణ్యప్రదాయిని.
45:21 أَمْ حَسِبَ الَّذِينَ اجْتَرَحُوا السَّيِّئَاتِ أَن نَّجْعَلَهُمْ كَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ سَوَاءً مَّحْيَاهُمْ وَمَمَاتُهُمْ ۚ سَاءَ مَا يَحْكُمُونَ
పాపిష్టి పనులు చేసినవారు, తమనూ, విశ్వసించి మంచి పనులు చేసే వారినీ మేము సమానంగా చేస్తామనీ, వారిరువురి జీవన్మరణాలు ఒకే విధంగా ఉండేలా చేస్తామనీ అనుకుంటున్నారా? వాళ్ళ తీర్పు చాలా ఘోరమైనది.
45:22 وَخَلَقَ اللَّهُ السَّمَاوَاتِ وَالْأَرْضَ بِالْحَقِّ وَلِتُجْزَىٰ كُلُّ نَفْسٍ بِمَا كَسَبَتْ وَهُمْ لَا يُظْلَمُونَ
భూమ్యాకాశాలను అల్లాహ్ ఎంతో సమతూకంతో సృష్టించాడు – ప్రతి ప్రాణికీ తాను సంపాదించుకున్నదాని సంపూర్ణ ప్రతిఫలం ఇవ్వబడటానికి! వారికెలాంటి అన్యాయం జరగదు.
45:23 أَفَرَأَيْتَ مَنِ اتَّخَذَ إِلَٰهَهُ هَوَاهُ وَأَضَلَّهُ اللَّهُ عَلَىٰ عِلْمٍ وَخَتَمَ عَلَىٰ سَمْعِهِ وَقَلْبِهِ وَجَعَلَ عَلَىٰ بَصَرِهِ غِشَاوَةً فَمَن يَهْدِيهِ مِن بَعْدِ اللَّهِ ۚ أَفَلَا تَذَكَّرُونَ
తన మనోవాంఛను ఆరాధ్యదైవంగా చేసుకున్న వాడ్ని నువ్వు చూశావా? అంతా తెలిసినప్పటికీ – అల్లాహ్ అతన్ని అపమార్గానికి లోను చేశాడు. అతని చెవులకూ, అతని హృదయానికి సీలు వేశాడు. అతని కళ్లపై కూడా తెరను వేసేశాడు. ఇప్పుడలాంటి వ్యక్తిని – అల్లాహ్ తర్వాత – సన్మార్గానికి తెచ్చే వాడెవడుంటాడు? ఏమిటి, ఇప్పటికీ మీరు విషయాన్ని గ్రహించరా?
45:24 وَقَالُوا مَا هِيَ إِلَّا حَيَاتُنَا الدُّنْيَا نَمُوتُ وَنَحْيَا وَمَا يُهْلِكُنَا إِلَّا الدَّهْرُ ۚ وَمَا لَهُم بِذَٰلِكَ مِنْ عِلْمٍ ۖ إِنْ هُمْ إِلَّا يَظُنُّونَ
“మా జీవితం మటుకు ఈ ప్రాపంచిక జీవితమే. మేము చస్తున్నాము, బ్రతుకుతున్నాము. కాలం తప్ప మరేదీ మమ్మల్ని చంపటం లేదు” అని వారంటారు. (నిజానికి) వారికి దీని గురించి బొత్తిగా తెలియదు. వారు కేవలం ఊహాస్త్రాలను సంధిస్తూ పోతున్నారు.
45:25 وَإِذَا تُتْلَىٰ عَلَيْهِمْ آيَاتُنَا بَيِّنَاتٍ مَّا كَانَ حُجَّتَهُمْ إِلَّا أَن قَالُوا ائْتُوا بِآبَائِنَا إِن كُنتُمْ صَادِقِينَ
మరి వాళ్లముందు స్పష్టమైన మా వాక్యాలను చదివి వినిపించినప్పుడు, “ఒకవేళ మీరు సత్యవంతులే అయితే మా తాత ముత్తాతలను (బ్రతికించి) తీసుకురండి” అని చెప్పటం తప్ప వారి దగ్గర మరో ఆధారం ఏమీ ఉండదు.
45:26 قُلِ اللَّهُ يُحْيِيكُمْ ثُمَّ يُمِيتُكُمْ ثُمَّ يَجْمَعُكُمْ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ لَا رَيْبَ فِيهِ وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “అల్లాహ్‌యే మిమ్మల్ని బ్రతికిస్తున్నాడు. మరి ఆయనే మిమ్మల్ని చంపుతున్నాడు. తరువాత ఆయనే మిమ్మల్ని ప్రళయదినాన సమీకరిస్తాడు. ఇందులో సందేహానికి తావేలేదు.” కాని చాలామంది తెలుసుకోరు.
45:27 وَلِلَّهِ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ وَيَوْمَ تَقُومُ السَّاعَةُ يَوْمَئِذٍ يَخْسَرُ الْمُبْطِلُونَ
భూమ్యాకాశాల సార్వభౌమత్వం అల్లాహ్‌కే చెందుతుంది. ఏ రోజున ప్రళయ ఘడియ నెలకొంటుందో ఆనాడు అసత్యవాదులు తీవ్రంగా నష్టపోతారు.
45:28 وَتَرَىٰ كُلَّ أُمَّةٍ جَاثِيَةً ۚ كُلُّ أُمَّةٍ تُدْعَىٰ إِلَىٰ كِتَابِهَا الْيَوْمَ تُجْزَوْنَ مَا كُنتُمْ تَعْمَلُونَ
ప్రతి మానవ సముదాయం మోకాళ్ళపై పడి ఉండటాన్ని, ప్రతి వర్గం తన కర్మల పత్రం వైపునకు పిలువబడటాన్ని నువ్వు చూస్తావు. “ఈ రోజు మీరు చేసుకున్న కర్మల ప్రతిఫలం మీకు లభిస్తుంది.
45:29 هَٰذَا كِتَابُنَا يَنطِقُ عَلَيْكُم بِالْحَقِّ ۚ إِنَّا كُنَّا نَسْتَنسِخُ مَا كُنتُمْ تَعْمَلُونَ
“ఇదిగో, ఇదీ మా రికార్డు. మీ గురించి (ఇది) ఉన్నదున్నట్లుగా చెబుతోంది. మేము మీ కర్మలన్నింటినీ నమోదు చేయించేవాళ్ళం” (అని వారితో అనబడుతుంది).
45:30 فَأَمَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ فَيُدْخِلُهُمْ رَبُّهُمْ فِي رَحْمَتِهِ ۚ ذَٰلِكَ هُوَ الْفَوْزُ الْمُبِينُ
కాని విశ్వసించి, సత్కార్యాలు చేసిన వారిని మాత్రం వారి ప్రభువు తన కారుణ్యంలోకి తీసేసుకుంటాడు. స్పష్టమైన సాఫల్యమంటే ఇదే.
45:31 وَأَمَّا الَّذِينَ كَفَرُوا أَفَلَمْ تَكُنْ آيَاتِي تُتْلَىٰ عَلَيْكُمْ فَاسْتَكْبَرْتُمْ وَكُنتُمْ قَوْمًا مُّجْرِمِينَ
కాని ఎవరయితే తిరస్కరిస్తారో (వారితో నేనిలా అంటాను), “ఏమిటి నా వాక్యాలు మీకు చదివి వినిపించబడలేదా? అయినా మీరు పొగరును ప్రదర్శించారు. అసలు మీరు (ముందు నుంచే) అపరాధ జనులు.”
45:32 وَإِذَا قِيلَ إِنَّ وَعْدَ اللَّهِ حَقٌّ وَالسَّاعَةُ لَا رَيْبَ فِيهَا قُلْتُم مَّا نَدْرِي مَا السَّاعَةُ إِن نَّظُنُّ إِلَّا ظَنًّا وَمَا نَحْنُ بِمُسْتَيْقِنِينَ
“అల్లాహ్ వాగ్దానం తప్పకుండా నెరవేరుతుందనీ, ప్రళయం సంభవించటంలో సందేహమే లేదని చెప్పబడినప్పుడల్లా, ‘ప్రళయం అంటే ఏమిటో మాకు తెలీదు. కాకపోతే దానికి సంబంధించి ఏదో ఊహా మాత్రంగా ఆలోచన వస్తూ ఉంటుంది. అంతేగాని మేము దాన్ని నమ్మబోము’ అని మీరు అనేవారు.”
45:33 وَبَدَا لَهُمْ سَيِّئَاتُ مَا عَمِلُوا وَحَاقَ بِهِم مَّا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ
వారి కర్మల దుష్ఫలితాలు వారి ముందు తేటతెల్లమైనాయి. దేన్ని గురించి వారు పరిహసించేవారో అదే వారిని చుట్టు ముట్టింది.
45:34 وَقِيلَ الْيَوْمَ نَنسَاكُمْ كَمَا نَسِيتُمْ لِقَاءَ يَوْمِكُمْ هَٰذَا وَمَأْوَاكُمُ النَّارُ وَمَا لَكُم مِّن نَّاصِرِينَ
వారితో ఇలా అనబడింది : “మీరు ఈనాటి మీ సమావేశాన్ని ఎలా మరచిపోయారో అలాగే మేము కూడా మిమ్మల్ని మరచిపోతాము. మీ నివాసం ఇక నరకమే. ఇక్కడ మిమ్మల్ని ఆదుకునే వాడెవడూ లేడు.”
45:35 ذَٰلِكُم بِأَنَّكُمُ اتَّخَذْتُمْ آيَاتِ اللَّهِ هُزُوًا وَغَرَّتْكُمُ الْحَيَاةُ الدُّنْيَا ۚ فَالْيَوْمَ لَا يُخْرَجُونَ مِنْهَا وَلَا هُمْ يُسْتَعْتَبُونَ
“ఎందుకంటే మీరు అల్లాహ్ వాక్యాలను వేళాకోళంగా తీసుకున్నారు. ప్రాపంచిక జీవితం మిమ్మల్ని మోసంలో పడవేసింది.” కనుక ఈ రోజు వీళ్లు నరకం నుంచి తీయబడటంగానీ, వీళ్ళ సంజాయిషీని ఆమోదించటంగానీ జరగదు.
45:36 فَلِلَّهِ الْحَمْدُ رَبِّ السَّمَاوَاتِ وَرَبِّ الْأَرْضِ رَبِّ الْعَالَمِينَ
కాబట్టి ఆకాశాల ప్రభువు, భూమండల ప్రభువు, సమస్త లోకాల ప్రభువు అయిన అల్లాహ్ మాత్రమే స్తుతించదగినవాడు.
45:37 وَلَهُ الْكِبْرِيَاءُ فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ
భూమ్యాకాశాలలో పెద్దరికం ఆయనకే చెల్లుతుంది.ఆయనే ఆధిక్యతగలవాడు,వివేచనాపరుడు. - సూరా అల్ ఆహ్ ఖాఫ్
46:1 حم
హా – మీమ్.
46:2 تَنزِيلُ الْكِتَابِ مِنَ اللَّهِ الْعَزِيزِ الْحَكِيمِ
ఈ గ్రంథావతరణ సర్వాధిక్యుడు, వివేకవంతుడైన అల్లాహ్ తరఫున జరిగింది.
46:3 مَا خَلَقْنَا السَّمَاوَاتِ وَالْأَرْضَ وَمَا بَيْنَهُمَا إِلَّا بِالْحَقِّ وَأَجَلٍ مُّسَمًّى ۚ وَالَّذِينَ كَفَرُوا عَمَّا أُنذِرُوا مُعْرِضُونَ
మేము భూమ్యాకాశాలను, వాటి మధ్యనున్న వస్తువులన్నింటినీ సత్య (ప్రణాళికా) బద్ధంగా ఒక నిర్ణీత గడువు కొరకు సృష్టించాము. కాని అవిశ్వాసులు తాము హెచ్చరించబడే విషయం నుండి ముఖం త్రిప్పుకుంటున్నారు.
46:4 قُلْ أَرَأَيْتُم مَّا تَدْعُونَ مِن دُونِ اللَّهِ أَرُونِي مَاذَا خَلَقُوا مِنَ الْأَرْضِ أَمْ لَهُمْ شِرْكٌ فِي السَّمَاوَاتِ ۖ ائْتُونِي بِكِتَابٍ مِّن قَبْلِ هَٰذَا أَوْ أَثَارَةٍ مِّنْ عِلْمٍ إِن كُنتُمْ صَادِقِينَ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “చూడండి! మీరు అల్లాహ్ ను వదలి ఎవరెవరిని పూజిస్తున్నారో వారు భూమండలంలో ఏ భాగాన్ని సృష్టించారో కాస్త నాకు చూపుతారా? పోనీ, ఆకాశాలలో అయినా వారికేదన్న వాటా ఉన్నదా?! మీరు సత్యవంతులే అయితే (ఆ మేరకు) దీనికి మునుపు వచ్చిన ఏదైనా గ్రంథం గానీ, లేక ఉల్లేఖించబడే ఏదైనా జ్ఞానాన్ని గాని నా వద్దకు తీసుకురండి.
46:5 وَمَنْ أَضَلُّ مِمَّن يَدْعُو مِن دُونِ اللَّهِ مَن لَّا يَسْتَجِيبُ لَهُ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ وَهُمْ عَن دُعَائِهِمْ غَافِلُونَ
అల్లాహ్ ను వదలి ప్రళయదినం వరకూ తన మొరను ఆమోదించలేని వారిని, పైగా తను మొరపెట్టుకున్న సంగతి కూడా తెలియని వారిని మొరపెట్టుకునేవానికన్నా పెద్ద మార్గభ్రష్టుడు ఎవడుంటాడు?
46:6 وَإِذَا حُشِرَ النَّاسُ كَانُوا لَهُمْ أَعْدَاءً وَكَانُوا بِعِبَادَتِهِمْ كَافِرِينَ
మానవులంతా సమీకరించబడినపుడు వారు వారికి (తమ భక్తులకు) శత్రువులై పోతారు. వీళ్ళ పూజాపురస్కారాలను కూడా వాళ్ళు త్రోసిపుచ్చుతారు.
46:7 وَإِذَا تُتْلَىٰ عَلَيْهِمْ آيَاتُنَا بَيِّنَاتٍ قَالَ الَّذِينَ كَفَرُوا لِلْحَقِّ لَمَّا جَاءَهُمْ هَٰذَا سِحْرٌ مُّبِينٌ
స్పష్టమైన మా వాక్యాలను వారికి చదివి వినిపించినప్పుడు, తమ వద్దకు వచ్చేసిన సత్యానుద్దేశించి ఈ తిరస్కారులు, “ఇదొక పచ్చి ఇంద్రజాలం” అంటారు.
46:8 أَمْ يَقُولُونَ افْتَرَاهُ ۖ قُلْ إِنِ افْتَرَيْتُهُ فَلَا تَمْلِكُونَ لِي مِنَ اللَّهِ شَيْئًا ۖ هُوَ أَعْلَمُ بِمَا تُفِيضُونَ فِيهِ ۖ كَفَىٰ بِهِ شَهِيدًا بَيْنِي وَبَيْنَكُمْ ۖ وَهُوَ الْغَفُورُ الرَّحِيمُ
ఏమిటి, “అతనే (ప్రవక్తే) స్వయంగా దీన్ని కల్పించాడ”ని వారంటున్నారా? (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “ఒకవేళ నేనే దీన్ని స్వయంగా కల్పించుకుని ఉంటే, మీరు అల్లాహ్ సమక్షంలో నాకు ఏవిధంగానూ తోడ్పడలేరు. మీరు దీని (ఖుర్ఆన్) గురించి చెప్పే లేక వినే విషయాలన్నీ అల్లాహ్ కు బాగా తెలుసు. మీకూ – నాకూ మధ్య సాక్షిగా ఆయన ఒక్కడే చాలు. ఆయన క్షమించేవాడు, దయ చూపేవాడు.
46:9 قُلْ مَا كُنتُ بِدْعًا مِّنَ الرُّسُلِ وَمَا أَدْرِي مَا يُفْعَلُ بِي وَلَا بِكُمْ ۖ إِنْ أَتَّبِعُ إِلَّا مَا يُوحَىٰ إِلَيَّ وَمَا أَنَا إِلَّا نَذِيرٌ مُّبِينٌ
వారికి చెప్పు : “నేను కొత్తగా వచ్చిన ప్రవక్తనేమీ కాను. (రేపు) నా పట్లా, మీ పట్లా జరిగే వ్యవహారం ఎలాంటిదో కూడా నాకు తెలీదు. నా వద్దకు పంపబడిన సందేశాన్ని (వహీని) మాత్రమే నేను అనుసరిస్తాను. నేను చాలా స్పష్టంగా హెచ్చరించే వాణ్ణి మాత్రమే.”
46:10 قُلْ أَرَأَيْتُمْ إِن كَانَ مِنْ عِندِ اللَّهِ وَكَفَرْتُم بِهِ وَشَهِدَ شَاهِدٌ مِّن بَنِي إِسْرَائِيلَ عَلَىٰ مِثْلِهِ فَآمَنَ وَاسْتَكْبَرْتُمْ ۖ إِنَّ اللَّهَ لَا يَهْدِي الْقَوْمَ الظَّالِمِينَ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “చూడండి! ఒకవేళ ఇది (ఈ ఖుర్ఆన్) అల్లాహ్ తరఫు నుంచే వచ్చి ఉండి, మీరు దాన్ని తిరస్కరించినట్లయితే ఇస్రాయీలు సంతతికి చెందిన ఒక సాక్షి ఇలాంటి (ఒక గ్రంథానికి) సాక్ష్యాన్ని కూడా ఇచ్చి, అతను విశ్వసించి ఉండగా మీరు మాత్రం అహంకారం ప్రదర్శిస్తే (మీ గతేమవుతుందో ఆలోచించారా?) నిశ్చయంగా అల్లాహ్ దుర్మార్గులకు సన్మార్గం చూపడు.”
46:11 وَقَالَ الَّذِينَ كَفَرُوا لِلَّذِينَ آمَنُوا لَوْ كَانَ خَيْرًا مَّا سَبَقُونَا إِلَيْهِ ۚ وَإِذْ لَمْ يَهْتَدُوا بِهِ فَسَيَقُولُونَ هَٰذَا إِفْكٌ قَدِيمٌ
అవిశ్వాసులు విశ్వసించిన వారినుద్దేశించి, “ఒకవేళ ఇది (ఈ ధర్మం) గనక శ్రేయస్కరమైనదై ఉంటే వీళ్ళు మాకన్నా ముందు దీని వైపుకు వెళ్లి ఉండేవారు కారు” అని అంటున్నారు. వారెలాగూ ఈ గ్రంథం ద్వారా సన్మార్గం పొందలేదు. అందువల్ల ‘ఇదొక పాత అబద్ధం’ అని కొట్టిపారేస్తారు.
46:12 وَمِن قَبْلِهِ كِتَابُ مُوسَىٰ إِمَامًا وَرَحْمَةً ۚ وَهَٰذَا كِتَابٌ مُّصَدِّقٌ لِّسَانًا عَرَبِيًّا لِّيُنذِرَ الَّذِينَ ظَلَمُوا وَبُشْرَىٰ لِلْمُحْسِنِينَ
దీనికి పూర్వం మూసా గ్రంథం సారధిగా, కారుణ్యంగా ఉండేది. కాగా; ఈ గ్రంథం దాన్ని ధృవీకరించేదిగా అరబీ భాషలో ఉన్నది. దుర్మార్గులను హెచ్చరించటానికి, సద్వర్తనులకు శుభవార్త ఇవ్వటానికి!
46:13 إِنَّ الَّذِينَ قَالُوا رَبُّنَا اللَّهُ ثُمَّ اسْتَقَامُوا فَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ
ఎవరైతే “మా ప్రభువు అల్లాహ్ యే” అని పలికి, తర్వాత దానిపై గట్టిగా నిలబడ్డారో వారికెలాంటి భయంగానీ, దుఃఖంగానీ లేదు.
46:14 أُولَٰئِكَ أَصْحَابُ الْجَنَّةِ خَالِدِينَ فِيهَا جَزَاءً بِمَا كَانُوا يَعْمَلُونَ
వారే స్వర్గవాసులు. వారందులో కలకాలం ఉంటారు. వారు చేసుకున్న కర్మలకు ప్రతిఫలం (ఇది).
46:15 وَوَصَّيْنَا الْإِنسَانَ بِوَالِدَيْهِ إِحْسَانًا ۖ حَمَلَتْهُ أُمُّهُ كُرْهًا وَوَضَعَتْهُ كُرْهًا ۖ وَحَمْلُهُ وَفِصَالُهُ ثَلَاثُونَ شَهْرًا ۚ حَتَّىٰ إِذَا بَلَغَ أَشُدَّهُ وَبَلَغَ أَرْبَعِينَ سَنَةً قَالَ رَبِّ أَوْزِعْنِي أَنْ أَشْكُرَ نِعْمَتَكَ الَّتِي أَنْعَمْتَ عَلَيَّ وَعَلَىٰ وَالِدَيَّ وَأَنْ أَعْمَلَ صَالِحًا تَرْضَاهُ وَأَصْلِحْ لِي فِي ذُرِّيَّتِي ۖ إِنِّي تُبْتُ إِلَيْكَ وَإِنِّي مِنَ الْمُسْلِمِينَ
మేము మనిషికి, తన తల్లిదండ్రుల యెడల ఉత్తమరీతిలో వ్యవహరించవలసినదిగా తాకీదు చేశాము. అతని తల్లి బాధను భరిస్తూ గర్భంలో అతన్ని మోసింది. బాధను భరిస్తూనే అతన్ని ప్రసవించింది. అతన్ని గర్భంలో మోయటానికి, అతని పాలు విడిపించటానికి ముఫ్ఫై మాసాల కాలం పట్టింది. తుదకు అతను పూర్తి పరిపక్వతకు, అంటే నలభై ఏళ్లప్రాయానికి చేరుకున్నప్పుడు ఇలా విన్నవించుకున్నాడు : “నా ప్రభూ! నీవు నాపై, నా తల్లిదండ్రులపై కురిపించిన అనుగ్రహ భాగ్యాలకుగాను కృతఙ్ఞతలు తెలుపుకునే, నీ ప్రసన్నతను చూరగొనే విధంగా సత్కార్యాలు చేసే సద్బుద్ధిని నాకు ప్రసాదించు. ఇంకా నా సంతానాన్ని కూడా సజ్జనులుగా తీర్చిదిద్దు. నేను నీ వైపునకే మరలుతున్నాను. నేను నీ విధేయులలో ఒకణ్ణి.”
46:16 أُولَٰئِكَ الَّذِينَ نَتَقَبَّلُ عَنْهُمْ أَحْسَنَ مَا عَمِلُوا وَنَتَجَاوَزُ عَن سَيِّئَاتِهِمْ فِي أَصْحَابِ الْجَنَّةِ ۖ وَعْدَ الصِّدْقِ الَّذِي كَانُوا يُوعَدُونَ
ఇలాంటి వారి సత్కార్యాలనే మేము స్వీకరిస్తాము. వారి తప్పులను క్షమిస్తాము. వారికి చేయబడిన సత్య వాగ్దానం ప్రకారం వారు స్వర్గవాసులలో ఉంటారు.
46:17 وَالَّذِي قَالَ لِوَالِدَيْهِ أُفٍّ لَّكُمَا أَتَعِدَانِنِي أَنْ أُخْرَجَ وَقَدْ خَلَتِ الْقُرُونُ مِن قَبْلِي وَهُمَا يَسْتَغِيثَانِ اللَّهَ وَيْلَكَ آمِنْ إِنَّ وَعْدَ اللَّهِ حَقٌّ فَيَقُولُ مَا هَٰذَا إِلَّا أَسَاطِيرُ الْأَوَّلِينَ
మరెవరయితే తన తల్లిదండ్రులతో, “ఛీ, (నేను మీతో విసిగివేసారి పోయాను). నేను చచ్చాక మళ్ళి లేపబడతాననే మీరు (పద్దాకా) చెబుతూ ఉంటారా ఏమిటి?! నాకు పూర్వం కూడా ఎన్నో తరాలు గతించాయి తెలుసా?!” అని అంటాడో, అతనికి సమాధానంగా వారిద్దరూ (తల్లిదండ్రులు) అల్లాహ్ సహాయం వేడుకుంటూ, “నీ పాడుగాను! ఒరేయ్ నువ్వు విశ్వసించరా! అల్లాహ్ వాగ్దానం తప్పకుండా నిజమవుతుందిరా” అని అంటారు. దానికతను “ఇవన్నీ పూర్వీకుల పసలేని గాధలు” అంటాడు.
46:18 أُولَٰئِكَ الَّذِينَ حَقَّ عَلَيْهِمُ الْقَوْلُ فِي أُمَمٍ قَدْ خَلَتْ مِن قَبْلِهِم مِّنَ الْجِنِّ وَالْإِنسِ ۖ إِنَّهُمْ كَانُوا خَاسِرِينَ
వీళ్లపైనే (అల్లాహ్ శిక్ష అవతరిస్తుందనే) వాక్కు రూఢీ అయింది. వీరికి పూర్వం గతించిన జిన్నాతుల, మానవుల వర్గాల లోనే వీరు కూడా చేరిపోతారు. నిస్సందేహంగా వీళ్లంతా నష్ట పోయేవారే.
46:19 وَلِكُلٍّ دَرَجَاتٌ مِّمَّا عَمِلُوا ۖ وَلِيُوَفِّيَهُمْ أَعْمَالَهُمْ وَهُمْ لَا يُظْلَمُونَ
ప్రతి ఒక్కరికీ వారి వారి కర్మలను బట్టి తరగతులు లభిస్తాయి. వారి ఆచరణలకుగాను సంపూర్ణ ప్రతిఫలం లభించటానికి (ఈ తరగతులు నిర్ధారించబడ్డాయి). వారికి ఏ విధమైన అన్యాయం కూడా జరగదు.
46:20 وَيَوْمَ يُعْرَضُ الَّذِينَ كَفَرُوا عَلَى النَّارِ أَذْهَبْتُمْ طَيِّبَاتِكُمْ فِي حَيَاتِكُمُ الدُّنْيَا وَاسْتَمْتَعْتُم بِهَا فَالْيَوْمَ تُجْزَوْنَ عَذَابَ الْهُونِ بِمَا كُنتُمْ تَسْتَكْبِرُونَ فِي الْأَرْضِ بِغَيْرِ الْحَقِّ وَبِمَا كُنتُمْ تَفْسُقُونَ
అవిశ్వాసులు నరకాగ్ని ముందుకు తీసుకురాబడిన రోజున (వారితో ఇలా అనబడుతుంది:) మీరు మీ మంచి మంచి వస్తువులను ప్రాపంచిక జీవితంలోనే పొందారు. వాటిని అక్కడే అనుభవించారు. ఈ రోజు మీకు అవమానకరమైన శిక్ష విధించబడుతుంది. ఎందుకంటే మీరు భువిలో అకారణంగా అహంకారం ప్రదర్శించేవారు, ఆజ్ఞోల్లంఘనకు పాల్పడేవారు.
46:21 وَاذْكُرْ أَخَا عَادٍ إِذْ أَنذَرَ قَوْمَهُ بِالْأَحْقَافِ وَقَدْ خَلَتِ النُّذُرُ مِن بَيْنِ يَدَيْهِ وَمِنْ خَلْفِهِ أَلَّا تَعْبُدُوا إِلَّا اللَّهَ إِنِّي أَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ عَظِيمٍ
మరి ఆద్ (జాతి) సోదరుడు తన జాతి వారిని ఇసుక గుట్టల వద్ద హెచ్చరించిన సంగతిని జ్ఞాపకం చేసుకో. అతనికి పూర్వం కూడా హెచ్చరిక చేసేవారు గడిచారు, అతని తరువాత కూడా. “మీరు అల్లాహ్‌ను తప్ప ఇతరులను పూజించకండి. ఒక మహానాడు మీపై విరుచుకుపడే శిక్ష గురించి నేను భయపడుతున్నాను” (అని అతను హెచ్చరించాడు).
46:22 قَالُوا أَجِئْتَنَا لِتَأْفِكَنَا عَنْ آلِهَتِنَا فَأْتِنَا بِمَا تَعِدُنَا إِن كُنتَ مِنَ الصَّادِقِينَ
దానికి వారు, “ఏమిటి, మమ్మల్ని మా దేవుళ్ళ (పూజ) నుంచి మళ్ళించడానికేనా నువ్వు వచ్చింది?! ఒకవేళ నువ్వు సత్యవంతుడవే అయితే, ఏదీ నువ్వు మాతో వాగ్దానం చేసే ఆ ఆపదను మాపైకి తీసుకురా!” అని ఎద్దేవా చేశారు.
46:23 قَالَ إِنَّمَا الْعِلْمُ عِندَ اللَّهِ وَأُبَلِّغُكُم مَّا أُرْسِلْتُ بِهِ وَلَٰكِنِّي أَرَاكُمْ قَوْمًا تَجْهَلُونَ
(హూద్) ఇలా అన్నాడు: “(దాని) జ్ఞానం అల్లాహ్ వద్దనే ఉంది. నేను మట్టుకు నాకిచ్చి పంపబడిన సందేశాన్ని మీకు అందజేస్తున్నాను. కాని మీరు మాత్రం మూర్ఖజనంగా కనబడుతున్నారు.”
46:24 فَلَمَّا رَأَوْهُ عَارِضًا مُّسْتَقْبِلَ أَوْدِيَتِهِمْ قَالُوا هَٰذَا عَارِضٌ مُّمْطِرُنَا ۚ بَلْ هُوَ مَا اسْتَعْجَلْتُم بِهِ ۖ رِيحٌ فِيهَا عَذَابٌ أَلِيمٌ
మరి వాళ్లు ఆ విపత్తును కారు మేఘం రూపంలో తమ లోయల వైపునకు రావటం చూసి, “ఇది మాపై వర్షాన్ని కురిపించే మబ్బు తునక” అని చెప్పుకోసాగారు. కాదు, నిజానికది మీరు తొందరపెట్టిన (విపత్కర) మేఘం. అదొక పెనుగాలి. అందులో వ్యధాభరితమైన శిక్ష ఉంది.
46:25 تُدَمِّرُ كُلَّ شَيْءٍ بِأَمْرِ رَبِّهَا فَأَصْبَحُوا لَا يُرَىٰ إِلَّا مَسَاكِنُهُمْ ۚ كَذَٰلِكَ نَجْزِي الْقَوْمَ الْمُجْرِمِينَ
తన ప్రభువు ఆజ్ఞపై అది సర్వాన్నీ తుడిచిపెట్టేస్తుంది. అంతే! తెల్లవారేసరికి వారి నివాస గృహాలు తప్ప మరేమీ కనిపించలేదు. అపరాధ జనులను మేము ఇలాగే దండిస్తాము.
46:26 وَلَقَدْ مَكَّنَّاهُمْ فِيمَا إِن مَّكَّنَّاكُمْ فِيهِ وَجَعَلْنَا لَهُمْ سَمْعًا وَأَبْصَارًا وَأَفْئِدَةً فَمَا أَغْنَىٰ عَنْهُمْ سَمْعُهُمْ وَلَا أَبْصَارُهُمْ وَلَا أَفْئِدَتُهُم مِّن شَيْءٍ إِذْ كَانُوا يَجْحَدُونَ بِآيَاتِ اللَّهِ وَحَاقَ بِهِم مَّا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ
నిశ్చయంగా మేము వారికి (ఆదు జాతి వారికి), మీకు సయితం ఇవ్వని ఎన్నో శక్తియుక్తులను ఇచ్చాము. మేము వారికి చెవులను, కళ్లను, హృదయాలను కూడా ప్రసాదించాము. కాని వారు అల్లాహ్ వాక్యాలను త్రోసిపుచ్చినప్పుడు వారి చెవులుగానీ, కళ్లుగానీ, వారి హృదయాలుగానీ వారికే విధంగానూ ఉపకరించలేదు. వారు దేన్ని గురించి ఎగతాళి చేసేవారో చివరకు అదే వారిని చుట్టుముట్టింది.
46:27 وَلَقَدْ أَهْلَكْنَا مَا حَوْلَكُم مِّنَ الْقُرَىٰ وَصَرَّفْنَا الْآيَاتِ لَعَلَّهُمْ يَرْجِعُونَ
మీ చుట్టుప్రక్కల ఉండే ఎన్నో జనవాసాలను మేము తుడిచి పెట్టేశాము. వారు దారికి వస్తారేమోనన్న ఉద్దేశంతో మేము రకరకాలుగా మా సూచనలను వారికి వివరించాము.
46:28 فَلَوْلَا نَصَرَهُمُ الَّذِينَ اتَّخَذُوا مِن دُونِ اللَّهِ قُرْبَانًا آلِهَةً ۖ بَلْ ضَلُّوا عَنْهُمْ ۚ وَذَٰلِكَ إِفْكُهُمْ وَمَا كَانُوا يَفْتَرُونَ
దైవ సామీప్యం పొందటానికి వారు – అల్లాహ్‌ను వదలి – ఆశ్రయించిన దేముళ్లు వారినెందుకు ఆదుకోలేదు? పైగా వారు వీళ్లకు అస్సలు కనబడకుండా పోయారు. (నిజానికి) అది వారి అసత్యం, వారు కల్పించుకున్న అభూతకల్పన మాత్రమే.
46:29 وَإِذْ صَرَفْنَا إِلَيْكَ نَفَرًا مِّنَ الْجِنِّ يَسْتَمِعُونَ الْقُرْآنَ فَلَمَّا حَضَرُوهُ قَالُوا أَنصِتُوا ۖ فَلَمَّا قُضِيَ وَلَّوْا إِلَىٰ قَوْمِهِم مُّنذِرِينَ
(ఓ ప్రవక్తా!) జిన్నుల సమూహం ఒకదానిని మేము ఖుర్ఆన్ వినేందుకు నీ వైపునకు పంపిన సంగతిని కాస్త మననం చేసుకో. వారు ప్రవక్త దగ్గరకు చేరుకున్నప్పుడు, “నిశ్శబ్దంగా వినండి” అని (పరస్పరం) చెప్పుకున్నారు. మరి ఆ పారాయణం ముగియ గానే, తమ వర్గం వారిని హెచ్చరించటానికి వాళ్ల వద్దకు తిరిగి వచ్చారు.
46:30 قَالُوا يَا قَوْمَنَا إِنَّا سَمِعْنَا كِتَابًا أُنزِلَ مِن بَعْدِ مُوسَىٰ مُصَدِّقًا لِّمَا بَيْنَ يَدَيْهِ يَهْدِي إِلَى الْحَقِّ وَإِلَىٰ طَرِيقٍ مُّسْتَقِيمٍ
వారిలా అన్నారు : “ఓ మా జాతివారలారా! మూసా తరువాత అవతరింపజేయబడిన గ్రంథాన్ని మేము విన్నాము. అది తనకు పూర్వం ఉన్న దైవగ్రంథాలన్నింటినీ ధృవీకరిస్తోంది. ఇంకా – అది సత్యధర్మం వైపునకు, తిన్నని దారి వైపునకూ దర్శకత్వం వహిస్తోంది.
46:31 يَا قَوْمَنَا أَجِيبُوا دَاعِيَ اللَّهِ وَآمِنُوا بِهِ يَغْفِرْ لَكُم مِّن ذُنُوبِكُمْ وَيُجِرْكُم مِّنْ عَذَابٍ أَلِيمٍ
“ఓ మా జాతివారలారా! అల్లాహ్ వైపునకు పిలిచేవాని మాట వినండి. అతన్ని విశ్వసించండి. అల్లాహ్ మీ పాపాలను మన్నిస్తాడు. బాధాకరమైన శిక్ష నుండి మిమ్మల్ని రక్షిస్తాడు.
46:32 وَمَن لَّا يُجِبْ دَاعِيَ اللَّهِ فَلَيْسَ بِمُعْجِزٍ فِي الْأَرْضِ وَلَيْسَ لَهُ مِن دُونِهِ أَوْلِيَاءُ ۚ أُولَٰئِكَ فِي ضَلَالٍ مُّبِينٍ
“అల్లాహ్వైపు పిలిచేవాని మాట విననివాడు భూమిలో ఎక్కడా (పారిపోయి అల్లాహ్‌ను) అలుపుకు గురిచేయలేడు. అల్లాహ్ తప్ప అతనికి సాయపడేవారు కూడా ఎవరూ ఉండరు. ఇలాంటి వారు స్పష్టమైన మార్గభ్రష్టతకు లోనై ఉన్నారు.”
46:33 أَوَلَمْ يَرَوْا أَنَّ اللَّهَ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ وَلَمْ يَعْيَ بِخَلْقِهِنَّ بِقَادِرٍ عَلَىٰ أَن يُحْيِيَ الْمَوْتَىٰ ۚ بَلَىٰ إِنَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
ఏమిటి, భూమ్యాకాశాలను సృష్టించిన అల్లాహ్, వాటిని సృష్టించటంలో ఏ విధంగానయితే అలసిపోలేదో అదే విధంగా ఆయన మృతులను తిరిగి బ్రతికించగలడని వారు చూడటం లేదా? అవును, ఆయన ప్రతిదీ చేయగల అధికారం కలవాడు.
46:34 وَيَوْمَ يُعْرَضُ الَّذِينَ كَفَرُوا عَلَى النَّارِ أَلَيْسَ هَٰذَا بِالْحَقِّ ۖ قَالُوا بَلَىٰ وَرَبِّنَا ۚ قَالَ فَذُوقُوا الْعَذَابَ بِمَا كُنتُمْ تَكْفُرُونَ
అవిశ్వాసులు నరకం వద్దకు తేబడిన రోజున, “ఏమిటి, ఇది సత్యం కాదా?!” (అని వారిని ప్రశ్నించటం జరుగుతుంది). “అవును. మా ప్రభువు సాక్షిగా! (ఇది సత్యమే” అని వారి నుంచి సమాధానం వస్తుంది). “సరే! ఇప్పుడు మీ తిరస్కార వైఖరికి బదులుగా శిక్షను చవిచూడండి” అనంటాడు (అల్లాహ్).
46:35 فَاصْبِرْ كَمَا صَبَرَ أُولُو الْعَزْمِ مِنَ الرُّسُلِ وَلَا تَسْتَعْجِل لَّهُمْ ۚ كَأَنَّهُمْ يَوْمَ يَرَوْنَ مَا يُوعَدُونَ لَمْ يَلْبَثُوا إِلَّا سَاعَةً مِّن نَّهَارٍ ۚ بَلَاغٌ ۚ فَهَلْ يُهْلَكُ إِلَّا الْقَوْمُ الْفَاسِقُونَ
కనుక (ఓ ప్రవక్తా!) సాహసమూర్తులైన ప్రవక్తలు ఓపిక పట్టినట్లే నువ్వు కూడా ఓపిక పట్టు. వారి విషయంలో (శిక్ష కోసం) తొందరపెట్టకు. వారికి వాగ్దానం చేయబడుతున్న దానిని (శిక్షను) వారు కళ్ళారా చూసుకున్నప్పుడు, తాము (మహా అంటే) ఒక దినములోని ఒక గడియ మాత్రమే (ప్రపంచంలో) ఉండి ఉంటామని వారికి అనిపిస్తుంది. ఇదీ (నీవు అందజేయవలసిన) సందేశం! ఇక అవిధేయులు మాత్రమే సర్వనాశనం చేయబడతారు. - సూరా ముహమ్మద్
47:1 الَّذِينَ كَفَرُوا وَصَدُّوا عَن سَبِيلِ اللَّهِ أَضَلَّ أَعْمَالَهُمْ
ఎవరయితే తిరస్కార వైఖరిని అవలంబించి, (ప్రజలను) అల్లాహ్ మార్గంలో పోకుండా ఆపారో వారి కర్మలను అల్లాహ్ వృధా చేసేశాడు.
47:2 وَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَآمَنُوا بِمَا نُزِّلَ عَلَىٰ مُحَمَّدٍ وَهُوَ الْحَقُّ مِن رَّبِّهِمْ ۙ كَفَّرَ عَنْهُمْ سَيِّئَاتِهِمْ وَأَصْلَحَ بَالَهُمْ
మరెవరైతే విశ్వసించి, సత్కార్యాలు చేశారో, ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం పై అవతరింపజేయబడిన దానిని కూడా విశ్వసించారో – యదార్థానికి తమ ప్రభువు తరఫు నుంచి వచ్చిన సత్యం అదేను – అల్లాహ్ వారి పాపాలను వారి నుంచి దూరం చేశాడు. వారి పరిస్థితిని చక్కదిద్దాడు.
47:3 ذَٰلِكَ بِأَنَّ الَّذِينَ كَفَرُوا اتَّبَعُوا الْبَاطِلَ وَأَنَّ الَّذِينَ آمَنُوا اتَّبَعُوا الْحَقَّ مِن رَّبِّهِمْ ۚ كَذَٰلِكَ يَضْرِبُ اللَّهُ لِلنَّاسِ أَمْثَالَهُمْ
ఇలా ఎందుకు జరిగిందంటే అల్లాహ్ ను తిరస్కరించినవారు అసత్యాన్ని అనుసరించగా, విశ్వాసులేమో తమ ప్రభువు నుండి వచ్చిన సత్యాన్ని అనుసరించారు. ఇలాగే అల్లాహ్ మానవులకు వారి స్థితిగతులను తెలియపరుస్తాడు.
47:4 فَإِذَا لَقِيتُمُ الَّذِينَ كَفَرُوا فَضَرْبَ الرِّقَابِ حَتَّىٰ إِذَا أَثْخَنتُمُوهُمْ فَشُدُّوا الْوَثَاقَ فَإِمَّا مَنًّا بَعْدُ وَإِمَّا فِدَاءً حَتَّىٰ تَضَعَ الْحَرْبُ أَوْزَارَهَا ۚ ذَٰلِكَ وَلَوْ يَشَاءُ اللَّهُ لَانتَصَرَ مِنْهُمْ وَلَٰكِن لِّيَبْلُوَ بَعْضَكُم بِبَعْضٍ ۗ وَالَّذِينَ قُتِلُوا فِي سَبِيلِ اللَّهِ فَلَن يُضِلَّ أَعْمَالَهُمْ
మరి మీరు అవిశ్వాసులను (రణరంగంలో) ఎదుర్కొన్నప్పుడు వారి మెడలపై వ్రేటు వేయండి. వారిని బాగా అణచిన తరువాత గట్టిగా బంధించండి. పిదప మీరు వారిని (పరిహారం తీసుకోకుండా) వదలిపెట్టి మేలు చేసినా లేక పరిహారం పుచ్చుకొని వదలినా ( అది మీ ఇష్టం). యుద్ధం ఆయుధాలను పడవేసే దాకా (ఈ పోరు సాగాలి). (ఆజ్ఞాపించబడినది మాత్రం) ఇదే. అల్లాహ్ గనక తలచుకొంటే (స్వయంగా) తానొక్కడే ప్రతీకారం తీర్చుకునేవాడు. కాని మీలో ఒకరిని ఇంకొకరి ద్వారా పరీక్షించాలన్నది ఆయన అభిమతం. అల్లాహ్ మార్గంలో చంపబడినవారి కర్మలను ఆయన వృధా కానివ్వడు.
47:5 سَيَهْدِيهِمْ وَيُصْلِحُ بَالَهُمْ
ఆయన వారికి సన్మార్గం చూపుతాడు. వారి పరిస్థితిని చక్కదిద్దుతాడు.
47:6 وَيُدْخِلُهُمُ الْجَنَّةَ عَرَّفَهَا لَهُمْ
వారికి (ముందుగా) తెలిపిఉన్న స్వర్గంలో ప్రవేశం కల్పిస్తాడు.
47:7 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِن تَنصُرُوا اللَّهَ يَنصُرْكُمْ وَيُثَبِّتْ أَقْدَامَكُمْ
విశ్వసించిన ఓ ప్రజలారా! మీరు గనక అల్లాహ్ కు సాయం చేస్తే ఆయన మీకు సాయం చేస్తాడు. మీ పాదాలకు నిలకడను ఇస్తాడు.
47:8 وَالَّذِينَ كَفَرُوا فَتَعْسًا لَّهُمْ وَأَضَلَّ أَعْمَالَهُمْ
మరెవరయితే తిరస్కార వైఖరిని అవలంబించారో వారికి వినాశం తప్పదు. అల్లాహ్ వారి కర్మలను వృధా చేసేస్తాడు.
47:9 ذَٰلِكَ بِأَنَّهُمْ كَرِهُوا مَا أَنزَلَ اللَّهُ فَأَحْبَطَ أَعْمَالَهُمْ
అల్లాహ్ అవతరింపజేసిన వస్తువును వారు ఇష్టపడకపోవటం చేత ఈ విధంగా జరిగింది. అందుకే అల్లాహ్ (కూడా) వారి కర్మలను నిష్ఫలం చేశాడు.
47:10 أَفَلَمْ يَسِيرُوا فِي الْأَرْضِ فَيَنظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الَّذِينَ مِن قَبْلِهِمْ ۚ دَمَّرَ اللَّهُ عَلَيْهِمْ ۖ وَلِلْكَافِرِينَ أَمْثَالُهَا
ఏమిటి, వారు భూమిలో సంచరించి, తమకు పూర్వం గడచిన వారికి పట్టిన గతేమిటో గమనించలేదా? అల్లాహ్ వారిని సమూలంగా తుడిచిపెట్టేశాడు. తిరస్కారులకు ఇలాంటి శిక్షలే ఉంటాయి.
47:11 ذَٰلِكَ بِأَنَّ اللَّهَ مَوْلَى الَّذِينَ آمَنُوا وَأَنَّ الْكَافِرِينَ لَا مَوْلَىٰ لَهُمْ
విశ్వాసులకు అల్లాహ్ కార్యసాధకునిగా ఉండటం వల్లనూ, అవిశ్వాసులను ఆదుకునే వాడెవడూ లేకపోవటం వల్లనూ ఈ విధంగా జరిగింది.
47:12 إِنَّ اللَّهَ يُدْخِلُ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ ۖ وَالَّذِينَ كَفَرُوا يَتَمَتَّعُونَ وَيَأْكُلُونَ كَمَا تَأْكُلُ الْأَنْعَامُ وَالنَّارُ مَثْوًى لَّهُمْ
నిశ్చయంగా అల్లాహ్ విశ్వసించి, సత్కార్యాలు చేసిన వారిని క్రింద కాలువలు ప్రవహించే (స్వర్గ) వనాలలో ప్రవేశింపజేస్తాడు. ఇకపోతే తిరస్కార వైఖరిని అవలంబించినవారు; వారు (అదేపనిగా ప్రాపంచిక) ప్రయోజనాలను జుర్రుకుంటున్నారు. పశువులు మెక్కినట్లుగా మెక్కుతున్నారు. మరి నరకాగ్ని వారి నివాసమవుతుంది.
47:13 وَكَأَيِّن مِّن قَرْيَةٍ هِيَ أَشَدُّ قُوَّةً مِّن قَرْيَتِكَ الَّتِي أَخْرَجَتْكَ أَهْلَكْنَاهُمْ فَلَا نَاصِرَ لَهُمْ
(ఓ ప్రవక్తా!) నిన్ను తీసివేసిన నీ నగరంకన్నా బలోపేతమైన నగరాలెన్నో ఉండేవి. (ఆ నగరవాసుల దురాగతాల మూలంగా) మేము వాటిని అంతం చేసేశాము. మరి వారిని ఆదుకునేవాడెవడూ లేకపోయాడు.
47:14 أَفَمَن كَانَ عَلَىٰ بَيِّنَةٍ مِّن رَّبِّهِ كَمَن زُيِّنَ لَهُ سُوءُ عَمَلِهِ وَاتَّبَعُوا أَهْوَاءَهُم
ఏమిటి, తన ప్రభువు తరఫున స్పష్టమైన పద్ధతిపై ఉన్న వ్యక్తి, తన దుష్కార్యాలు అందమైనవిగా అనిపించేలా చేయబడి, తన మనోవాంఛల వెనుక పరుగెత్తే వాని మాదిరిగా కాగలడా?
47:15 مَّثَلُ الْجَنَّةِ الَّتِي وُعِدَ الْمُتَّقُونَ ۖ فِيهَا أَنْهَارٌ مِّن مَّاءٍ غَيْرِ آسِنٍ وَأَنْهَارٌ مِّن لَّبَنٍ لَّمْ يَتَغَيَّرْ طَعْمُهُ وَأَنْهَارٌ مِّنْ خَمْرٍ لَّذَّةٍ لِّلشَّارِبِينَ وَأَنْهَارٌ مِّنْ عَسَلٍ مُّصَفًّى ۖ وَلَهُمْ فِيهَا مِن كُلِّ الثَّمَرَاتِ وَمَغْفِرَةٌ مِّن رَّبِّهِمْ ۖ كَمَنْ هُوَ خَالِدٌ فِي النَّارِ وَسُقُوا مَاءً حَمِيمًا فَقَطَّعَ أَمْعَاءَهُمْ
భయభక్తులు గలవారికి వాగ్దానం చేయబడిన స్వర్గ విశిష్టత ఇలా ఉంటుంది: దుర్వాసనకు (కాలుష్యానికి) తావులేని నీటి కాలువలు ఉన్నాయి. రుచిలో మార్పురాని పాల కాలువలు కూడా ఉన్నాయి. త్రాగే వారికి మృదు మధురంగా ఉండే మద్యం కాలువలు కూడా ఉన్నాయి. ఇంకా వారికోసం అందులో అన్ని రకాల పండ్లు ఫలాలు కూడా ఉన్నాయి. అంతేకాదు, వారి ప్రభువు తరఫునుంచి మన్నింపు కూడా ఉంది. ఏమిటి, ఈ అనుగ్రహాలను పొందినవాడు ఎల్లకాలం అగ్నిలో మాడుతూ ఉండేవాని మాదిరిగా, పేగులను సయితం ముక్కలు ముక్కలుగా చేసి వేసేటటువంటి సలసలా కాగే నీరు ఇవ్వబడే వారి మాదిరిగా కాగలడా?
47:16 وَمِنْهُم مَّن يَسْتَمِعُ إِلَيْكَ حَتَّىٰ إِذَا خَرَجُوا مِنْ عِندِكَ قَالُوا لِلَّذِينَ أُوتُوا الْعِلْمَ مَاذَا قَالَ آنِفًا ۚ أُولَٰئِكَ الَّذِينَ طَبَعَ اللَّهُ عَلَىٰ قُلُوبِهِمْ وَاتَّبَعُوا أَهْوَاءَهُمْ
వారిలో కొందరు (ఉన్నారు. వారు) నీ వైపు చెవియొగ్గి వింటారు. కాని వారు నీ దగ్గరి నుంచి నిష్క్రమించాక, జ్ఞానసంపన్నులతో, “ఇందాక ఈయనగారు చెప్పినదేమిటి?!” అని అడుగుతారు. అల్లాహ్ సీలు వేసినది ఇలాంటి వారి హృదయాలకే. వారు (ఎంతసేపటికీ) తమ మనోవాంఛలను అనుసరిస్తూ ఉంటారు.
47:17 وَالَّذِينَ اهْتَدَوْا زَادَهُمْ هُدًى وَآتَاهُمْ تَقْوَاهُمْ
మరెవరయితే సన్మార్గాన్ని పొందారో, వారి సన్మార్గభాగ్యంలో ఆయన (అల్లాహ్) మరింత వృద్ధిని ప్రసాదించాడు. వారికి వారి ధర్మ నిష్టను (తఖ్వా’ను) కూడా అనుగ్రహించాడు.
47:18 فَهَلْ يَنظُرُونَ إِلَّا السَّاعَةَ أَن تَأْتِيَهُم بَغْتَةً ۖ فَقَدْ جَاءَ أَشْرَاطُهَا ۚ فَأَنَّىٰ لَهُمْ إِذَا جَاءَتْهُمْ ذِكْرَاهُمْ
ఏమిటీ, ప్రళయ ఘడియ హటాత్తుగా తమపైకి రావాలని వారు ఎదురు చూస్తున్నారా? నిస్సందేహంగా దానికి సంబంధించిన సూచనలు (ఇప్పటికే) వచ్చేశాయి. మరి ఆ ఘడియ గనక వచ్చిపడితే హితబోధను గ్రహించే అవకాశం వారికి ఎక్కడ ఉంటుందనీ?
47:19 فَاعْلَمْ أَنَّهُ لَا إِلَٰهَ إِلَّا اللَّهُ وَاسْتَغْفِرْ لِذَنبِكَ وَلِلْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ ۗ وَاللَّهُ يَعْلَمُ مُتَقَلَّبَكُمْ وَمَثْوَاكُمْ
కనుక (ఓ ప్రవక్తా!) అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడని నువ్వు బాగా తెలుసుకో. నీ పొరపాట్లకుగాను క్షమాపణ వేడుకుంటూ ఉండు. విశ్వాసులైన పురుషుల, విశ్వాసులైన స్త్రీలందరి (మన్నింపు) కోసం కూడా వేడుకుంటూ ఉండు. మీ రాకపోకలను గురించి, మీ విశ్రాంతి స్థలాల గురించి అల్లాహ్‌కు బాగా తెలుసు.
47:20 وَيَقُولُ الَّذِينَ آمَنُوا لَوْلَا نُزِّلَتْ سُورَةٌ ۖ فَإِذَا أُنزِلَتْ سُورَةٌ مُّحْكَمَةٌ وَذُكِرَ فِيهَا الْقِتَالُ ۙ رَأَيْتَ الَّذِينَ فِي قُلُوبِهِم مَّرَضٌ يَنظُرُونَ إِلَيْكَ نَظَرَ الْمَغْشِيِّ عَلَيْهِ مِنَ الْمَوْتِ ۖ فَأَوْلَىٰ لَهُمْ
“ఏదైనా సూరా ఎందుకు అవతరించలేదు?” అని విశ్వసించినవారు అంటున్నారు. మరి యుద్ధ ప్రస్తావనతో కూడిన చాలా స్పష్టమైన భావం గల సూరా అవతరించినపుడు, హృదయాలలో రోగమున్నవారు, మరణ సమయంలో స్పృహలో లేనివాడు చూసినట్లుగా నిన్ను చూడటాన్ని నువ్వు గమనిస్తావు. (వారు అల్లాహ్‌కు విధేయత చూపి ఉంటే అది) వారి కొరకు చాలా బావుండేది.
47:21 طَاعَةٌ وَقَوْلٌ مَّعْرُوفٌ ۚ فَإِذَا عَزَمَ الْأَمْرُ فَلَوْ صَدَقُوا اللَّهَ لَكَانَ خَيْرًا لَّهُمْ
(వారు గనక) విధేయత (చూపి ఉంటే), మంచిమాట (పలికి ఉంటే), మరి కార్యాచరణ నిర్ణయించబడినపుడు వారు అల్లాహ్ పక్షాన సత్యవంతులుగా నిలబడి ఉంటే అది వారి కొరకు శ్రేయోదాయకమై ఉండేది.
47:22 فَهَلْ عَسَيْتُمْ إِن تَوَلَّيْتُمْ أَن تُفْسِدُوا فِي الْأَرْضِ وَتُقَطِّعُوا أَرْحَامَكُمْ
ఒకవేళ మీకు అధికారం లభిస్తే మీరు రాజ్యంలో (భువిలో) అరాచకం సృష్టించటానికి, బంధుత్వ సంబంధాల విచ్ఛిత్తికి పాల్పడటానికి కూడా వెనుకాడరు.
47:23 أُولَٰئِكَ الَّذِينَ لَعَنَهُمُ اللَّهُ فَأَصَمَّهُمْ وَأَعْمَىٰ أَبْصَارَهُمْ
అల్లాహ్ శాపం పడినది వీళ్ళపైనే. మరి (అల్లాహ్) వారిని చెవిటివారుగా చేశాడు, వారి కంటిచూపును పోగొట్టాడు.
47:24 أَفَلَا يَتَدَبَّرُونَ الْقُرْآنَ أَمْ عَلَىٰ قُلُوبٍ أَقْفَالُهَا
ఏమిటి, వారు ఖుర్ఆన్ గురించి లోతుగా ఆలోచించరా? లేక వారి హృదయాలపై తాళాలు పడి ఉన్నాయా?
47:25 إِنَّ الَّذِينَ ارْتَدُّوا عَلَىٰ أَدْبَارِهِم مِّن بَعْدِ مَا تَبَيَّنَ لَهُمُ الْهُدَى ۙ الشَّيْطَانُ سَوَّلَ لَهُمْ وَأَمْلَىٰ لَهُمْ
ఎవరయితే తమకు సన్మార్గం తేటతెల్లమైన తరువాత కూడా వీపు త్రిప్పుకుని మరలిపోయారో వారి కొరకు షైతాను ఒక విషయాన్ని (వారి చేష్టను) అందమైనదిగా చిత్రీకరించాడు. వారికి (మోసపూరితమైన) గడువును ఇచ్చాడు.
47:26 ذَٰلِكَ بِأَنَّهُمْ قَالُوا لِلَّذِينَ كَرِهُوا مَا نَزَّلَ اللَّهُ سَنُطِيعُكُمْ فِي بَعْضِ الْأَمْرِ ۖ وَاللَّهُ يَعْلَمُ إِسْرَارَهُمْ
ఇలా ఎందుకు జరిగిందంటే, వారు అల్లాహ్ అవతరింపజేసిన వాణిని ద్వేషించే వారితో, “మేము కూడా కొన్ని విషయాలలో మీరు చెప్పినట్లు వింటాము” అని అన్నారు. వారి లోపాయికారి వ్యవహారాలన్నీ అల్లాహ్‌కు తెలుసు.
47:27 فَكَيْفَ إِذَا تَوَفَّتْهُمُ الْمَلَائِكَةُ يَضْرِبُونَ وُجُوهَهُمْ وَأَدْبَارَهُمْ
మరి దైవదూతలు వారి ఆత్మలను స్వాధీనం చేసుకుంటూ (ఎడాపెడా) వారి చెంపలపై, వారి పిరుదులపై వాయిస్తూ ఉన్నప్పుడు వారి గతేమవుతుందీ!?
47:28 ذَٰلِكَ بِأَنَّهُمُ اتَّبَعُوا مَا أَسْخَطَ اللَّهَ وَكَرِهُوا رِضْوَانَهُ فَأَحْبَطَ أَعْمَالَهُمْ
వారి ఈ దుర్గతికి కారణం వారు అవలంబించిన మార్గమే. తద్వారా వారు అల్లాహ్‌ను అప్రసన్నుణ్ణి చేశారు. ఆయన ప్రసన్నతను వారు ఇష్టపడలేదు. అందుకే అల్లాహ్ వారి కర్మలను వృధా గావించాడు.
47:29 أَمْ حَسِبَ الَّذِينَ فِي قُلُوبِهِم مَّرَضٌ أَن لَّن يُخْرِجَ اللَّهُ أَضْغَانَهُمْ
హృదయాలలో రోగమున్నవారు, అల్లాహ్ తమ (ఆంతర్యాల్లోని) కాపట్యాన్ని బహిర్గతం చేయడని అనుకుంటున్నారా?
47:30 وَلَوْ نَشَاءُ لَأَرَيْنَاكَهُمْ فَلَعَرَفْتَهُم بِسِيمَاهُمْ ۚ وَلَتَعْرِفَنَّهُمْ فِي لَحْنِ الْقَوْلِ ۚ وَاللَّهُ يَعْلَمُ أَعْمَالَكُمْ
మేము గనక తలచుకుంటే వారందరినీ నీకు చూపి ఉండేవారము. నువ్వు వాళ్ళ ముఖ కవళికలను బట్టి వాళ్లను పసిగట్ట గలిగేవాడివి. అయినప్పటికీ నువ్వు వాళ్లను వాళ్ల మాటల తీరును బట్టి తెలుసుకోగలవు. మీ కార్యకలాపాలన్నీ అల్లాహ్‌కు తెలుసు సుమా!
47:31 وَلَنَبْلُوَنَّكُمْ حَتَّىٰ نَعْلَمَ الْمُجَاهِدِينَ مِنكُمْ وَالصَّابِرِينَ وَنَبْلُوَ أَخْبَارَكُمْ
మీలో ధర్మయుద్ధం చేసేవారెవరో, సహనమూర్తులెవరో నిగ్గుతేల్చడానికి మేము తప్పకుండా మిమ్మల్ని పరీక్షిస్తాము. మీ స్థితిగతులను కూడా పరికిస్తాము.
47:32 إِنَّ الَّذِينَ كَفَرُوا وَصَدُّوا عَن سَبِيلِ اللَّهِ وَشَاقُّوا الرَّسُولَ مِن بَعْدِ مَا تَبَيَّنَ لَهُمُ الْهُدَىٰ لَن يَضُرُّوا اللَّهَ شَيْئًا وَسَيُحْبِطُ أَعْمَالَهُمْ
తమకు సన్మార్గం స్పష్టమైన తరువాత కూడా తిరస్కార వైఖరిని అవలంబించి, అల్లాహ్ మార్గం నుంచి జనులను ఆపుతూ, దైవప్రవక్తకు విరోధులైన వారు ఎట్టి పరిస్థితిలోనూ అల్లాహ్‌కు నష్టం కలిగించలేరు. త్వరలోనే అల్లాహ్ వారి ఆచరణలను వృధా చేస్తాడు.
47:33 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَطِيعُوا اللَّهَ وَأَطِيعُوا الرَّسُولَ وَلَا تُبْطِلُوا أَعْمَالَكُمْ
ఓ విశ్వాసులారా! అల్లాహ్‌కు విధేయత చూపండి. ప్రవక్త చెప్పినట్లు వినండి. మీ కర్మలను పాడు చేసుకోకండి.
47:34 إِنَّ الَّذِينَ كَفَرُوا وَصَدُّوا عَن سَبِيلِ اللَّهِ ثُمَّ مَاتُوا وَهُمْ كُفَّارٌ فَلَن يَغْفِرَ اللَّهُ لَهُمْ
నిశ్చయంగా -ఎవరయితే తిరస్కార వైఖరిని అవలంబించారో, అల్లాహ్ మార్గం నుంచి ఇతరులను అడ్డుకున్నారో, ఆపై అవిశ్వాస స్థితిలోనే మరణించారో వారిని అల్లాహ్ ఎంతమాత్రం క్షమించడు.
47:35 فَلَا تَهِنُوا وَتَدْعُوا إِلَى السَّلْمِ وَأَنتُمُ الْأَعْلَوْنَ وَاللَّهُ مَعَكُمْ وَلَن يَتِرَكُمْ أَعْمَالَكُمْ
కాబట్టి మీరు ధైర్యం కోల్పోయి సంధి కోసం వారిని పిలవకండి. నిజానికి మీదే పైచేయి అవుతుంది. అల్లాహ్ మీకు అండగా ఉన్నాడు. ఆయన మీ కర్మలను వృధా చేయటమనేది జరగదు.
47:36 إِنَّمَا الْحَيَاةُ الدُّنْيَا لَعِبٌ وَلَهْوٌ ۚ وَإِن تُؤْمِنُوا وَتَتَّقُوا يُؤْتِكُمْ أُجُورَكُمْ وَلَا يَسْأَلْكُمْ أَمْوَالَكُمْ
నిజానికి ఈ ప్రాపంచిక జీవితం ఓ ఆట, కాలక్షేపం మాత్రమే. మీరు గనక విశ్వసించి, భయభక్తుల వైఖరిని అవలంబించినట్లయితే అల్లాహ్ మీ పుణ్యఫలం మీకిస్తాడు. ఆయన మీ నుండి మీ సొమ్ముల్ని అడగడు.
47:37 إِن يَسْأَلْكُمُوهَا فَيُحْفِكُمْ تَبْخَلُوا وَيُخْرِجْ أَضْغَانَكُمْ
ఒకవేళ ఆయన మీనుండి మీ సొమ్మును అడిగితే, ఇవ్వమని మరీ గట్టిగా అడిగితే మీరు పిసినారులుగా ప్రవర్తిస్తారు. మరి ఆయన మీ కాపట్యాన్ని బట్టబయలు చేస్తాడు.
47:38 هَا أَنتُمْ هَٰؤُلَاءِ تُدْعَوْنَ لِتُنفِقُوا فِي سَبِيلِ اللَّهِ فَمِنكُم مَّن يَبْخَلُ ۖ وَمَن يَبْخَلْ فَإِنَّمَا يَبْخَلُ عَن نَّفْسِهِ ۚ وَاللَّهُ الْغَنِيُّ وَأَنتُمُ الْفُقَرَاءُ ۚ وَإِن تَتَوَلَّوْا يَسْتَبْدِلْ قَوْمًا غَيْرَكُمْ ثُمَّ لَا يَكُونُوا أَمْثَالَكُم
ఇదిగో! అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయండని పిలిచినపుడు మీలో కొందరు పిసినారులుగా వ్యవహరిస్తున్నారు. ఎవడయితే పిసినారితనం వహిస్తున్నాడో అతను తన పట్లనే పిసినారితనం వహిస్తున్నాడు. అల్లాహ్ సంపన్నుడు (అక్కరలేనివాడు). మీరేమో పేదలు (ఆయనపై ఆధారపడినవారు). ఒకవేళ మీరు గనక మరలిపోతే ఆయన మీ బదులు – మీ స్థానంలో – మరో జాతివారిని తీసుకువస్తాడు. మరి వారు మీలాంటివారై ఉండరు. - సూరా అల్ ఫతహ్
48:1 إِنَّا فَتَحْنَا لَكَ فَتْحًا مُّبِينًا
(ఓ ప్రవక్తా!) మేము నీకు చాలా స్పష్టమైన విజయాన్ని ప్రసాదించాము.
48:2 لِّيَغْفِرَ لَكَ اللَّهُ مَا تَقَدَّمَ مِن ذَنبِكَ وَمَا تَأَخَّرَ وَيُتِمَّ نِعْمَتَهُ عَلَيْكَ وَيَهْدِيَكَ صِرَاطًا مُّسْتَقِيمًا
అల్లాహ్ నీ ముందటి, వెనుకటి పొరపాట్లను మన్నించటానికి, నీపై తన అనుగ్రహాన్ని పరిపూర్ణం గావించటానికి, నిన్ను రుజుమార్గంపై నడిపించటానికి,
48:3 وَيَنصُرَكَ اللَّهُ نَصْرًا عَزِيزًا
ఇంకా, అల్లాహ్ నీకు గొప్ప సహాయం అందజేయటానికిగాను (ఈ విజయం వొసగబడింది).
48:4 هُوَ الَّذِي أَنزَلَ السَّكِينَةَ فِي قُلُوبِ الْمُؤْمِنِينَ لِيَزْدَادُوا إِيمَانًا مَّعَ إِيمَانِهِمْ ۗ وَلِلَّهِ جُنُودُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ وَكَانَ اللَّهُ عَلِيمًا حَكِيمًا
విశ్వాసుల హృదయాలలో నెమ్మదిని (ప్రశాంతతను, నిబ్బరాన్ని) వేసినవాడు ఆయనే, వారి విశ్వాసంతోపాటు మరింత విశ్వాసం పెంపొందటానికి, భూమ్యాకాశాలలోని సైనిక దళాలన్నీ అల్లాహ్ వే. అల్లాహ్ జ్ఞాన సంపన్నుడు, వివేకవంతుడు.
48:5 لِّيُدْخِلَ الْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا وَيُكَفِّرَ عَنْهُمْ سَيِّئَاتِهِمْ ۚ وَكَانَ ذَٰلِكَ عِندَ اللَّهِ فَوْزًا عَظِيمًا
విశ్వసించిన పురుషులను, విశ్వసించిన స్త్రీలను క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేయడానికి, వారక్కడ కలకాలం ఉండేటందుకు, వారి పాపాలను వారినుండి తొలగించేటందుకు (అల్లాహ్ వారికి ఈ స్థిమితాన్ని ప్రసాదించాడు). అల్లాహ్ సన్నిధిలో ఇదే గొప్ప విజయం.
48:6 وَيُعَذِّبَ الْمُنَافِقِينَ وَالْمُنَافِقَاتِ وَالْمُشْرِكِينَ وَالْمُشْرِكَاتِ الظَّانِّينَ بِاللَّهِ ظَنَّ السَّوْءِ ۚ عَلَيْهِمْ دَائِرَةُ السَّوْءِ ۖ وَغَضِبَ اللَّهُ عَلَيْهِمْ وَلَعَنَهُمْ وَأَعَدَّ لَهُمْ جَهَنَّمَ ۖ وَسَاءَتْ مَصِيرًا
అల్లాహ్ విషయంలో చెడుగా అనుమానించే కపట విశ్వాసులైన పురుషులను – కపట విశ్వాసులైన స్త్రీలను, బహుదైవారాధకులైన పురుషులను – బహుదైవారాధకులైన స్త్రీలను దండించటానికి (కూడా అల్లాహ్ ముస్లింలకు మనోనిబ్బరాన్ని నూరిపోశాడు). వాస్తవానికి వారి దురనుమానాలు వారిపైనే పడతాయి. అల్లాహ్ వారిపై ఆగ్రహించాడు. వారిని శపించాడు. వారికోసం నరకాన్ని సిద్ధం చేశాడు. అది అత్యంత చెడ్డ గమ్యస్థానం.
48:7 وَلِلَّهِ جُنُودُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ وَكَانَ اللَّهُ عَزِيزًا حَكِيمًا
మరి భూమ్యాకాశాల సేవలన్నీ అల్లాహ్ వే. అల్లాహ్ మహాశక్తిశాలి, వివేచనా శీలి.
48:8 إِنَّا أَرْسَلْنَاكَ شَاهِدًا وَمُبَشِّرًا وَنَذِيرًا
(ఓ ప్రవక్తా!) నిశ్చయంగా మేము నిన్ను సాక్ష్యమిచ్చేవానిగా, శుభవార్తను వినిపించేవానిగా, హెచ్చరించేవానిగా చేసి పంపాము.
48:9 لِّتُؤْمِنُوا بِاللَّهِ وَرَسُولِهِ وَتُعَزِّرُوهُ وَتُوَقِّرُوهُ وَتُسَبِّحُوهُ بُكْرَةً وَأَصِيلًا
(ఓ ముస్లిములారా!) మీరు అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను విశ్వసించటానికి, అతనికి తోడ్పడటానికి, అతన్నిగౌరవించటానికి, ఉదయం సాయంత్రం అల్లాహ్ పవిత్రతను కొనియాడుతూ ఉండటానికి గాను (మేము ఈ ఏర్పాటు చేశాము).
48:10 إِنَّ الَّذِينَ يُبَايِعُونَكَ إِنَّمَا يُبَايِعُونَ اللَّهَ يَدُ اللَّهِ فَوْقَ أَيْدِيهِمْ ۚ فَمَن نَّكَثَ فَإِنَّمَا يَنكُثُ عَلَىٰ نَفْسِهِ ۖ وَمَنْ أَوْفَىٰ بِمَا عَاهَدَ عَلَيْهُ اللَّهَ فَسَيُؤْتِيهِ أَجْرًا عَظِيمًا
ఎవరయితే (నీ చేతిలో చెయ్యేసి) విధేయతా ప్రమాణం చేస్తున్నారో వారు యదార్థానికి అల్లాహ్ తో ప్రమాణం చేస్తున్నారు. వారి చేతులపై అల్లాహ్ చెయ్యి ఉంది. ఎవడయినా ప్రమాణ భంగానికి పాల్పడినట్లయితే, ఆ ప్రమాణ భంగపు నష్టం తన అత్మకే చేకూర్చుకుంటాడు. మరేవరయినా అల్లాహ్ తో చేసిన వాగ్దానాన్నినెరవేరిస్తే అల్లాహ్ అతనికి త్వరలోనే గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.
48:11 سَيَقُولُ لَكَ الْمُخَلَّفُونَ مِنَ الْأَعْرَابِ شَغَلَتْنَا أَمْوَالُنَا وَأَهْلُونَا فَاسْتَغْفِرْ لَنَا ۚ يَقُولُونَ بِأَلْسِنَتِهِم مَّا لَيْسَ فِي قُلُوبِهِمْ ۚ قُلْ فَمَن يَمْلِكُ لَكُم مِّنَ اللَّهِ شَيْئًا إِنْ أَرَادَ بِكُمْ ضَرًّا أَوْ أَرَادَ بِكُمْ نَفْعًا ۚ بَلْ كَانَ اللَّهُ بِمَا تَعْمَلُونَ خَبِيرًا
ఇక పల్లెటూరి ప్రజలలో వెనుక ఉండిపోయిన వారు ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి, “మా ఆస్తిపాస్తులు, మా ఆలుబిడ్డలు మమ్మల్ని కదలకుండా చేశాయి. తమరు కాస్త మా క్షమాపణకై ప్రార్ధించండి” అని ప్రాధేయపడతారు. వారు తమ హృదయాలలో లేని దాన్ని నోటితో పలుకుతున్నారు. వారికి ఈ విధంగా చెప్పు : “అల్లాహ్ యే గనక మీకేదైనా నష్టాన్ని కలిగించదలిస్తే లేదా మీకేదైనా లాభాన్ని చేకూర్చదలిస్తే మీ విషయంలో అల్లాహ్ నిర్ణయాన్ని అడ్డుకునే అధికారం ఎవరికుంది? పైగా మీరు చేస్తున్నదంతా అల్లాహ్ కు బాగా తెలుసు.
48:12 بَلْ ظَنَنتُمْ أَن لَّن يَنقَلِبَ الرَّسُولُ وَالْمُؤْمِنُونَ إِلَىٰ أَهْلِيهِمْ أَبَدًا وَزُيِّنَ ذَٰلِكَ فِي قُلُوبِكُمْ وَظَنَنتُمْ ظَنَّ السَّوْءِ وَكُنتُمْ قَوْمًا بُورًا
అంతేకాదు, “దైవప్రవక్త గానీ, ముస్లింలు గానీ తమ ఇంటి వారి వైపుకు తిరిగిరావటం అసంభవం అని మీరు తలపోశారు. ఈ ఆలోచన మీ అంతర్యాలను అలరించింది. మొత్తానికి మీ అనుమానాలు బహుచెడ్డవి. అసలు మీరు ముందునుంచే వినాశం పొందే జనుల్లా ఉన్నారు.
48:13 وَمَن لَّمْ يُؤْمِن بِاللَّهِ وَرَسُولِهِ فَإِنَّا أَعْتَدْنَا لِلْكَافِرِينَ سَعِيرًا
మరెవడైతే అల్లాహ్ నూ, ఆయన ప్రవక్తనూ విశ్వసించాడో అలాంటి అవిశ్వాసుల కోసం మేము మండే అగ్నిని సిద్ధం చేసి ఉంచాము.
48:14 وَلِلَّهِ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ يَغْفِرُ لِمَن يَشَاءُ وَيُعَذِّبُ مَن يَشَاءُ ۚ وَكَانَ اللَّهُ غَفُورًا رَّحِيمًا
భూమ్యాకాశాల సర్వసత్తాధికారం అల్లాహ్ దే. తను కోరినవారిని ఆయన క్షమిస్తాడు, తను కోరినవారిని శిక్షిస్తాడు. అల్లాహ్ అపారంగా క్షమించేవాడు, కరుణించేవాడు.
48:15 سَيَقُولُ الْمُخَلَّفُونَ إِذَا انطَلَقْتُمْ إِلَىٰ مَغَانِمَ لِتَأْخُذُوهَا ذَرُونَا نَتَّبِعْكُمْ ۖ يُرِيدُونَ أَن يُبَدِّلُوا كَلَامَ اللَّهِ ۚ قُل لَّن تَتَّبِعُونَا كَذَٰلِكُمْ قَالَ اللَّهُ مِن قَبْلُ ۖ فَسَيَقُولُونَ بَلْ تَحْسُدُونَنَا ۚ بَلْ كَانُوا لَا يَفْقَهُونَ إِلَّا قَلِيلًا
మీరు యుద్ధప్రాప్తిని తీసుకోవటానికి వెళుతున్నప్పుడు, వెనుక ఉండిపోయిన జనులు (గబగబా) వచ్చి, “మమ్మల్ని కూడా మీ వెంట రావటానికి అనుమతించండి” అని అంటారు. వారు అల్లాహ్ మాటనే మార్చివేయజూస్తున్నారు. (ఓ ప్రవక్తా!) వారికి చెప్పేయి : “మీరు ఎట్టి పరిస్థితిలోనూ మా వెంట రాలేరు. ఈ మేరకు అల్లాహ్ ముందుగానే సెలవిచ్చాడు.” దానికి వారు, “అది కాదులెండి. మీరు మాపై అసూయ చెందుతున్నారు” అని సమాధానమిస్తారు. అసలు విషయం ఏమిటంటే వారు విషయాన్ని చాలా కొద్దిగానే గ్రహిస్తారు.
48:16 قُل لِّلْمُخَلَّفِينَ مِنَ الْأَعْرَابِ سَتُدْعَوْنَ إِلَىٰ قَوْمٍ أُولِي بَأْسٍ شَدِيدٍ تُقَاتِلُونَهُمْ أَوْ يُسْلِمُونَ ۖ فَإِن تُطِيعُوا يُؤْتِكُمُ اللَّهُ أَجْرًا حَسَنًا ۖ وَإِن تَتَوَلَّوْا كَمَا تَوَلَّيْتُم مِّن قَبْلُ يُعَذِّبْكُمْ عَذَابًا أَلِيمًا
(ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం!) పల్లెటూరి ప్రజలలో వెనుక ఉండిపోయిన వారితో ఇలా అను: “త్వరలోనే మీకు, తీవ్రంగా పోరాడే ఒక జాతితో తలపడేందుకు పిలుపు వస్తుంది. మీరు వారితో యుద్ధం చేయవలసి వస్తుంది. లేదా వారంతట వారే ఆత్మసమర్పణ చేసుకుంటారు. (ఆ సమయంలో) మీరు గనక విధేయత చూపితే అల్లాహ్ మీకు ఉత్తమ ప్రతిఫలం ప్రసాదిస్తాడు. ఒకవేళ మీరు లోగడ విముఖత చూపినట్లే విముఖులైతే ఆయన మిమ్మల్ని బాధాకరమైన శిక్షకు లోను చేస్తాడు.”
48:17 لَّيْسَ عَلَى الْأَعْمَىٰ حَرَجٌ وَلَا عَلَى الْأَعْرَجِ حَرَجٌ وَلَا عَلَى الْمَرِيضِ حَرَجٌ ۗ وَمَن يُطِعِ اللَّهَ وَرَسُولَهُ يُدْخِلْهُ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ ۖ وَمَن يَتَوَلَّ يُعَذِّبْهُ عَذَابًا أَلِيمًا
గుడ్డివానిపై ఎలాంటి నిందారోపణ లేదు, కుంటివానిపై ఎలాంటి నిందారోపణ లేదు, వ్యాధి గ్రస్తునిపై కూడా ఎలాంటి నిందారోపణ లేదు. ఎవడు అల్లాహ్ కు, ఆయన ప్రవక్తకు విధేయుడై మసలుకుంటాడో అల్లాహ్ అతన్ని క్రింద సెలయేరులు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. మరి వెన్నుచూపి తిరిగిపోయిన వానికి వ్యధాభరితమైన శిక్షకు గురిచేస్తాడు.
48:18 لَّقَدْ رَضِيَ اللَّهُ عَنِ الْمُؤْمِنِينَ إِذْ يُبَايِعُونَكَ تَحْتَ الشَّجَرَةِ فَعَلِمَ مَا فِي قُلُوبِهِمْ فَأَنزَلَ السَّكِينَةَ عَلَيْهِمْ وَأَثَابَهُمْ فَتْحًا قَرِيبًا
(ఓ ప్రవక్తా!) విశ్వాసులు చెట్టు క్రింద నీతో (విధేయతా) ప్రమాణం చేస్తూ ఉన్నప్పుడు అల్లాహ్ వారిపట్ల ప్రసన్నుడయ్యాడు. వారి హృదయాలలో ఉన్న దాన్ని ఆయన తెలుసుకున్నాడు. అందువల్ల వారిపై ప్రశాంతస్థితిని (స్థిమితాన్ని) అవతరింపజేశాడు. ఇంకా సమీపంలోనే లభించే విజయాన్ని కూడా అనుగ్రహించాడు.
48:19 وَمَغَانِمَ كَثِيرَةً يَأْخُذُونَهَا ۗ وَكَانَ اللَّهُ عَزِيزًا حَكِيمًا
ఇంకా ఎన్నో విజయసొత్తులను కూడా! వాటిని వారు స్వంతం చేసుకుంటారు. అల్లాహ్ అపారశక్తిమంతుడు, వివేకసంపన్నుడు.
48:20 وَعَدَكُمُ اللَّهُ مَغَانِمَ كَثِيرَةً تَأْخُذُونَهَا فَعَجَّلَ لَكُمْ هَٰذِهِ وَكَفَّ أَيْدِيَ النَّاسِ عَنكُمْ وَلِتَكُونَ آيَةً لِّلْمُؤْمِنِينَ وَيَهْدِيَكُمْ صِرَاطًا مُّسْتَقِيمًا
అల్లాహ్ మీకు ఎన్నో విజయధనాలను గురించి వాగ్దానం చేసి ఉన్నాడు. వాటిని మీరు కైవసం చేసుకుంటారు. దీన్ని మాత్రం ఆయన మీకు తొందరగానే ప్రసాదించాడు. ప్రజల చేతులను మీనుండి కట్టిపడేశాడు – విశ్వాసులకు ఇదొక సూచనగా ఉండటానికి! ఇంకా ఆయన మిమ్మల్ని రుజుమార్గాన నడపటానికి!!
48:21 وَأُخْرَىٰ لَمْ تَقْدِرُوا عَلَيْهَا قَدْ أَحَاطَ اللَّهُ بِهَا ۚ وَكَانَ اللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرًا
ఇంకా – మీరింతవరకూ మీ అదుపులో తీసుకోలేకపోయిన మరికొన్ని విజయాలను కూడా వొసగాడు. అల్లాహ్ వాటిని పరివేష్టించి ఉన్నాడు. అల్లాహ్ ప్రతి దానిపై అధికారం కలవాడు.
48:22 وَلَوْ قَاتَلَكُمُ الَّذِينَ كَفَرُوا لَوَلَّوُا الْأَدْبَارَ ثُمَّ لَا يَجِدُونَ وَلِيًّا وَلَا نَصِيرًا
ఒకవేళ ఈ అవిశ్వాసులు మీతో యుద్ధానికి దిగినా వెన్నుచూపి పారిపోయి ఉండేవారు. మరి తమ కోసం ఏ సహాయకుణ్ణి, రక్షకుణ్ణి వారు పొంది ఉండేవారు కాదు.
48:23 سُنَّةَ اللَّهِ الَّتِي قَدْ خَلَتْ مِن قَبْلُ ۖ وَلَن تَجِدَ لِسُنَّةِ اللَّهِ تَبْدِيلًا
ఇది అల్లాహ్ (సమ్మతించిన) సంప్రదాయం. ఇంతకు ముందు నుంచే ఇది ఆనవాయితీగా వస్తూ వుంది. నీవు అల్లాహ్ సంప్రదాయంలో ఎలాంటి మార్పునూ పొందజాలవు.
48:24 وَهُوَ الَّذِي كَفَّ أَيْدِيَهُمْ عَنكُمْ وَأَيْدِيَكُمْ عَنْهُم بِبَطْنِ مَكَّةَ مِن بَعْدِ أَنْ أَظْفَرَكُمْ عَلَيْهِمْ ۚ وَكَانَ اللَّهُ بِمَا تَعْمَلُونَ بَصِيرًا
ముఖ్యంగా మక్కాలో అల్లాహ్ మీకు అవిశ్వాసులపై ప్రాబల్యం ఇచ్చిన మీదట అవిశ్వాసుల చేతులను మీ నుండి, మీ చేతులను వారి నుండి ఆపినవాడు ఆయనే. (అప్పుడు) మీరు చేసేదంతా అల్లాహ్ గమనిస్తూనే ఉన్నాడు.
48:25 هُمُ الَّذِينَ كَفَرُوا وَصَدُّوكُمْ عَنِ الْمَسْجِدِ الْحَرَامِ وَالْهَدْيَ مَعْكُوفًا أَن يَبْلُغَ مَحِلَّهُ ۚ وَلَوْلَا رِجَالٌ مُّؤْمِنُونَ وَنِسَاءٌ مُّؤْمِنَاتٌ لَّمْ تَعْلَمُوهُمْ أَن تَطَئُوهُمْ فَتُصِيبَكُم مِّنْهُم مَّعَرَّةٌ بِغَيْرِ عِلْمٍ ۖ لِّيُدْخِلَ اللَّهُ فِي رَحْمَتِهِ مَن يَشَاءُ ۚ لَوْ تَزَيَّلُوا لَعَذَّبْنَا الَّذِينَ كَفَرُوا مِنْهُمْ عَذَابًا أَلِيمًا
వారే తిరస్కార వైఖరిని అవలంబించినవారు. మిమ్మల్ని మస్జిదె హరాం నుండి అపినవారు. ఖుర్బానీ కొరకు ప్రత్యేకించబడిన పశువులను వాటి ఖుర్బానీ ప్రదేశానికి చేరకుండా అడ్డు తగిలినవారు. (మక్కా నగరంలో) నీకు తెలియని ముస్లిం పురుషులు, (మరెంతో మంది) ముస్లిం స్త్రీలు లేకుండా ఉండి నట్లయితే, తెలీని స్థితిలో వారు మీచేత త్రొక్కివేయబడతారన్న అనుమానం లేకుండా ఉన్నట్లయితే, వారివల్ల నీపై అపవాదు వచ్చే ప్రమాదం లేకపోయినట్లయితే (మీకు యుద్ధం చేసేందుకు అనుమతి ఇవ్వబడి ఉండేది. కాని అలాంటి పరిస్థితి రానివ్వలేదు). అల్లాహ్ తాను కోరిన వారిని తన కారుణ్యంలో చేర్పించుకోవటానికే ఆ పరిస్థితి రానివ్వలేదు. ఒకవేళ వారు (ఆ ముస్లింలు మక్కా నుండి) గనక వేర్పడి (వెళ్ళిపోయి) ఉంటే, మేము వారిలోని తిరస్కారులను బాధాకరమైన శిక్షకు గురిచేసి ఉండేవారము.
48:26 إِذْ جَعَلَ الَّذِينَ كَفَرُوا فِي قُلُوبِهِمُ الْحَمِيَّةَ حَمِيَّةَ الْجَاهِلِيَّةِ فَأَنزَلَ اللَّهُ سَكِينَتَهُ عَلَىٰ رَسُولِهِ وَعَلَى الْمُؤْمِنِينَ وَأَلْزَمَهُمْ كَلِمَةَ التَّقْوَىٰ وَكَانُوا أَحَقَّ بِهَا وَأَهْلَهَا ۚ وَكَانَ اللَّهُ بِكُلِّ شَيْءٍ عَلِيمًا
సత్య తిరస్కారులు తమ హృదయాలలో అహంభావాన్ని, అందునా అజ్ఞానకాలపు అహంభావాన్ని పెంచుకున్న ఆ (క్లిష్ట) తరుణంలో అల్లాహ్ తన ప్రవక్తపై, విశ్వాసులపై తన తరఫున ప్రశాంత స్థితిని అవతరింపజేశాడు. ఇంకా అల్లాహ్ ముస్లింలను భక్తి (తఖ్వా) వాక్కుకు కట్టుబడి ఉండేలా చేశాడు. వారు దానికి తగినవారు, హక్కుదారులు కూడా. అల్లాహ్ ప్రతిదీ బాగా తెలిసినవాడు.
48:27 لَّقَدْ صَدَقَ اللَّهُ رَسُولَهُ الرُّؤْيَا بِالْحَقِّ ۖ لَتَدْخُلُنَّ الْمَسْجِدَ الْحَرَامَ إِن شَاءَ اللَّهُ آمِنِينَ مُحَلِّقِينَ رُءُوسَكُمْ وَمُقَصِّرِينَ لَا تَخَافُونَ ۖ فَعَلِمَ مَا لَمْ تَعْلَمُوا فَجَعَلَ مِن دُونِ ذَٰلِكَ فَتْحًا قَرِيبًا
నిశ్చయంగా అల్లాహ్ తన ప్రవక్తకు సత్యంతో కూడుకున్న స్వప్నాన్ని చూపించాడు. అల్లాహ్ తలిస్తే మీరు తప్పకుండా మస్జిదె హరాం లో సురక్షితంగా ప్రవేశిస్తారు. శిరోముండనం చేయించుకుంటారు, తల వెంట్రుకలను కత్తిరించుకుంటారు. మీకే భయమూ ఉండదు. మీకు తెలియని విషయాలు ఆయనకు తెలుసు. మరి దానికి ముందే ఆయన ఓ శీఘ్ర విజయాన్ని కూడా మీకు అనుగ్రహించాడు.
48:28 هُوَ الَّذِي أَرْسَلَ رَسُولَهُ بِالْهُدَىٰ وَدِينِ الْحَقِّ لِيُظْهِرَهُ عَلَى الدِّينِ كُلِّهِ ۚ وَكَفَىٰ بِاللَّهِ شَهِيدًا
తన ప్రవక్తకు మార్గదర్శకత్వాన్ని, సత్యధర్మాన్ని ఇచ్చి దాన్ని ఇతర ధర్మాలన్నింటిపై పై చేయిగా ఉండేలా చేయటానికి పంపినవాడు ఆయనే. సాక్షిగా అల్లాహ్ యే చాలు.
48:29 مُّحَمَّدٌ رَّسُولُ اللَّهِ ۚ وَالَّذِينَ مَعَهُ أَشِدَّاءُ عَلَى الْكُفَّارِ رُحَمَاءُ بَيْنَهُمْ ۖ تَرَاهُمْ رُكَّعًا سُجَّدًا يَبْتَغُونَ فَضْلًا مِّنَ اللَّهِ وَرِضْوَانًا ۖ سِيمَاهُمْ فِي وُجُوهِهِم مِّنْ أَثَرِ السُّجُودِ ۚ ذَٰلِكَ مَثَلُهُمْ فِي التَّوْرَاةِ ۚ وَمَثَلُهُمْ فِي الْإِنجِيلِ كَزَرْعٍ أَخْرَجَ شَطْأَهُ فَآزَرَهُ فَاسْتَغْلَظَ فَاسْتَوَىٰ عَلَىٰ سُوقِهِ يُعْجِبُ الزُّرَّاعَ لِيَغِيظَ بِهِمُ الْكُفَّارَ ۗ وَعَدَ اللَّهُ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ مِنْهُم مَّغْفِرَةً وَأَجْرًا عَظِيمًا
ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం అల్లాహ్ ప్రవక్త. ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం వెంట ఉన్నవారు అవిశ్వాసులకు కొరుకుడు పడనివారు. ఒండొకరి పట్ల మాత్రం దయార్ద్ర హృదయులు. దైవకృపను, దైవప్రసన్నతను చూరగొనే ప్రయత్నంలో వారు (దైవ సన్నిధిలో) వినమ్రులై వంగటాన్ని, సాష్టాంగపడటాన్ని నీవు చూస్తావు. వారి సాష్టాంగ ప్రణామాల ప్రత్యేక ప్రభావం వారి ముఖారవిందాలపై తొణకిస లాడుతూ ఉంటుంది. వీరికి సంబంధించిన ఈ ఉపమానమే తౌరాతులో ఉంది. ఇంజీలులో (కూడా) వారి ఉపమానం ఉంది. అది ఒక పంటపొలం వంటిది. అది తన మొలకను మొలకెత్తించింది. తరువాత దానిని బలపరిచింది. ఆ తరువాత అది లావు అయింది. ఆ పైన అది తన కాండంపై నిటారుగా నిలబడింది, రైతులను అలరించసాగింది – వారి ద్వారా అవిశ్వాసులను మరింత ఉడికించాలని! వారిలో విశ్వసించి, సత్కార్యాలు చేసిన వారికి మన్నింపును, గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తానని అల్లాహ్ వాగ్దానం చేసి ఉన్నాడు.
- సూరా అల్ హుజురాత్
49:1 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تُقَدِّمُوا بَيْنَ يَدَيِ اللَّهِ وَرَسُولِهِ ۖ وَاتَّقُوا اللَّهَ ۚ إِنَّ اللَّهَ سَمِيعٌ عَلِيمٌ
విశ్వసించిన ఓ ప్రజలారా! అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను మించిపోకండి. అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు.
49:2 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَرْفَعُوا أَصْوَاتَكُمْ فَوْقَ صَوْتِ النَّبِيِّ وَلَا تَجْهَرُوا لَهُ بِالْقَوْلِ كَجَهْرِ بَعْضِكُمْ لِبَعْضٍ أَن تَحْبَطَ أَعْمَالُكُمْ وَأَنتُمْ لَا تَشْعُرُونَ
ఓ విశ్వాసులారా! మీ కంఠస్వరాలను ప్రవక్త కంఠస్వరం కంటే పైన (హెచ్చుగా) ఉంచకండి. మీరు పరస్పరం బిగ్గరగా మాట్లాడుకునే విధంగా ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం తో బిగ్గరగా మాట్లాడకండి. దీనివల్ల మీ కర్మలన్నీ వ్యర్ధమైపోవచ్చు. ఆ సంగతి మీకు తెలియను కూడా తెలియదు.
49:3 إِنَّ الَّذِينَ يَغُضُّونَ أَصْوَاتَهُمْ عِندَ رَسُولِ اللَّهِ أُولَٰئِكَ الَّذِينَ امْتَحَنَ اللَّهُ قُلُوبَهُمْ لِلتَّقْوَىٰ ۚ لَهُم مَّغْفِرَةٌ وَأَجْرٌ عَظِيمٌ
ఎవరైతే దైవప్రవక్త సమక్షంలో అణకువతో (తగ్గు స్వరాలలో) మాట్లాడుతారో వారి హృదయాలను అల్లాహ్ ధర్మ నిష్ఠ (తఖ్వా) కోసం పరికించాడు. వారికి మన్నింపుతో పాటు గొప్ప ప్రతిఫలం కూడా ఉంది.
49:4 إِنَّ الَّذِينَ يُنَادُونَكَ مِن وَرَاءِ الْحُجُرَاتِ أَكْثَرُهُمْ لَا يَعْقِلُونَ
(ఓ ప్రవక్తా!) కుటీరాల వెనుక నుంచి నిన్ను కేకలేసి పిలుస్తున్న వారిలో చాలా మందికి (బొత్తిగా) బుద్ధిలేదు.
49:5 وَلَوْ أَنَّهُمْ صَبَرُوا حَتَّىٰ تَخْرُجَ إِلَيْهِمْ لَكَانَ خَيْرًا لَّهُمْ ۚ وَاللَّهُ غَفُورٌ رَّحِيمٌ
నీవంతట నీవుగా వారి దగ్గరకు వెడలి వచ్చేవరకూ వారు గనక ఓపిక పట్టి ఉంటే, అది వారి కోసం ఎంతో ఉత్తమం అయి ఉండేది. అల్లాహ్ క్షమాగుణం కలవాడు. దయా స్వభావి.
49:6 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِن جَاءَكُمْ فَاسِقٌ بِنَبَإٍ فَتَبَيَّنُوا أَن تُصِيبُوا قَوْمًا بِجَهَالَةٍ فَتُصْبِحُوا عَلَىٰ مَا فَعَلْتُمْ نَادِمِينَ
ఓ విశ్వాసులారా! ఎవడయినా దుర్వర్తనుడు మీ వద్దకు ఏదైనా సమాచారాన్ని తీసుకువస్తే, దాని నిజానిజాలను నిర్ధారించుకోండి. అన్యథా మీరు నిజం తెలియని కారణంగా ఇతర జనులకు నష్టం కలిగించి, తరువాత చేసిన దానిపై సిగ్గుతో కుంచించుకు పోవలసిన పరిస్థితి రావచ్చు.
49:7 وَاعْلَمُوا أَنَّ فِيكُمْ رَسُولَ اللَّهِ ۚ لَوْ يُطِيعُكُمْ فِي كَثِيرٍ مِّنَ الْأَمْرِ لَعَنِتُّمْ وَلَٰكِنَّ اللَّهَ حَبَّبَ إِلَيْكُمُ الْإِيمَانَ وَزَيَّنَهُ فِي قُلُوبِكُمْ وَكَرَّهَ إِلَيْكُمُ الْكُفْرَ وَالْفُسُوقَ وَالْعِصْيَانَ ۚ أُولَٰئِكَ هُمُ الرَّاشِدُونَ
మీ మధ్య దైవప్రవక్త ఉన్నాడనే విషయాన్ని బాగా తెలుసుకోండి. చాలా విషయాలలో అతను గనక మీరు కోరినట్లుగా మసలుకుంటే మీరు ఇబ్బందుల్లో పడిపోతారు. కాని అల్లాహ్ విశ్వాసాన్ని మీకు ప్రియతమం చేశాడు. దాన్ని మీ హృదయాలలో శోభాయమానంగా చేశాడు. అవిశ్వాసం పట్ల, దుర్వర్తన పట్ల, అవిధేయత పట్ల మీకు రోత కలిగేలా చేశాడు. ఇలాంటి వారే సన్మార్గ గాములు –
49:8 فَضْلًا مِّنَ اللَّهِ وَنِعْمَةً ۚ وَاللَّهُ عَلِيمٌ حَكِيمٌ
అల్లాహ్ కృపవల్ల, ఆయన అనుగ్రహం వల్ల! అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, వివేకసంపన్నుడు.
49:9 وَإِن طَائِفَتَانِ مِنَ الْمُؤْمِنِينَ اقْتَتَلُوا فَأَصْلِحُوا بَيْنَهُمَا ۖ فَإِن بَغَتْ إِحْدَاهُمَا عَلَى الْأُخْرَىٰ فَقَاتِلُوا الَّتِي تَبْغِي حَتَّىٰ تَفِيءَ إِلَىٰ أَمْرِ اللَّهِ ۚ فَإِن فَاءَتْ فَأَصْلِحُوا بَيْنَهُمَا بِالْعَدْلِ وَأَقْسِطُوا ۖ إِنَّ اللَّهَ يُحِبُّ الْمُقْسِطِينَ
ఒకవేళ ముస్లింలలోని రెండు పక్షాల వారు పరస్పరం గొడవపడితే వారి మధ్య సయోధ్య చేయండి. మరి వారిలో ఒక పక్షంవారు రెండవ పక్షం వారిపై దౌర్జన్యం చేస్తే, దౌర్జన్యం చేసే వర్గం దైవాజ్ఞ వైపు మరలివచ్చే వరకూ మీరు వారితో పోరాడండి. వారు గనక మరలివస్తే వారి మధ్య న్యాయసమ్మతంగా సయోధ్య కుదర్చండి. సమభావంతో వ్యవహరించండి. నిశ్చయంగా సమభావంతో వ్యవహరించేవారిని అల్లాహ్ ప్రేమిస్తాడు.
49:10 إِنَّمَا الْمُؤْمِنُونَ إِخْوَةٌ فَأَصْلِحُوا بَيْنَ أَخَوَيْكُمْ ۚ وَاتَّقُوا اللَّهَ لَعَلَّكُمْ تُرْحَمُونَ
విశ్వాసులు (ముస్లింలు) అన్నదమ్ములు (అన్న సంగతిని మరువకండి). కనుక మీ అన్నదమ్ముల మధ్య సర్దుబాటుకు ప్రయత్నించండి. అల్లాహ్ కు భయపడుతూ ఉండండి – తద్వారా మీరు కరుణించబడవచ్చు.
49:11 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا يَسْخَرْ قَوْمٌ مِّن قَوْمٍ عَسَىٰ أَن يَكُونُوا خَيْرًا مِّنْهُمْ وَلَا نِسَاءٌ مِّن نِّسَاءٍ عَسَىٰ أَن يَكُنَّ خَيْرًا مِّنْهُنَّ ۖ وَلَا تَلْمِزُوا أَنفُسَكُمْ وَلَا تَنَابَزُوا بِالْأَلْقَابِ ۖ بِئْسَ الِاسْمُ الْفُسُوقُ بَعْدَ الْإِيمَانِ ۚ وَمَن لَّمْ يَتُبْ فَأُولَٰئِكَ هُمُ الظَّالِمُونَ
ఓ విశ్వాసులారా! పురుషులు సాటి పురుషులను ఎగతాళి చేయకూడదు. బహుశా వీరికంటే వారే ఉత్తములై ఉండవచ్చు. అలాగే స్త్రీలు సాటి స్త్రీలను పరిహసించరాదు. ఎందుకంటే బహుశా వీరికంటే వారే ఉత్తమురాలై ఉండవచ్చు. ఒకరినొకరు ఎత్తిపొడుచుకోకండి. ఒండొకరికి చెడ్డపేర్లను ఆపాదించకండి. విశ్వసించిన తరువాత తన సోదరుణ్ణి చెడ్డపేరుతో అవమానించటం ఎంత పాపం! మరెవరైతే పశ్చాత్తాపం చెందరో (ఈ ధోరణిని మానుకొనరో) వారే దుర్మార్గులు.
49:12 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اجْتَنِبُوا كَثِيرًا مِّنَ الظَّنِّ إِنَّ بَعْضَ الظَّنِّ إِثْمٌ ۖ وَلَا تَجَسَّسُوا وَلَا يَغْتَب بَّعْضُكُم بَعْضًا ۚ أَيُحِبُّ أَحَدُكُمْ أَن يَأْكُلَ لَحْمَ أَخِيهِ مَيْتًا فَكَرِهْتُمُوهُ ۚ وَاتَّقُوا اللَّهَ ۚ إِنَّ اللَّهَ تَوَّابٌ رَّحِيمٌ
ఓ విశ్వాసులారా! అతిగా అనుమానించటానికి దూరంగా ఉండండి. కొన్ని అనుమానాలు పాపాల క్రిందికి వస్తాయి సుమా! కూపీలు లాగకండి. మీలో ఎవరూ ఇంకొకరి గురించి వీపు వెనక చెడుగా (చాడీలు) చెప్పుకోకూడదు. ఏమిటి, మీలో ఎవరైనా చచ్చిపోయిన మీ సోదరుని మాంసం తినటానికి ఇష్టపడతారా? చూడండి, మీరు స్వయంగా దీన్ని ఏవగించుకుంటున్నారు. అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, కరుణించేవాడూను.
49:13 يَا أَيُّهَا النَّاسُ إِنَّا خَلَقْنَاكُم مِّن ذَكَرٍ وَأُنثَىٰ وَجَعَلْنَاكُمْ شُعُوبًا وَقَبَائِلَ لِتَعَارَفُوا ۚ إِنَّ أَكْرَمَكُمْ عِندَ اللَّهِ أَتْقَاكُمْ ۚ إِنَّ اللَّهَ عَلِيمٌ خَبِيرٌ
ఓ మానవులారా! మేము మిమ్మల్ని ఒకే పురుషుడు, ఒకే స్త్రీ ద్వారా సృష్టించాము. మరి మీ (పరస్పర) పరిచయం కోసం మిమ్మల్ని వివిధ వర్గాలుగా, తెగలుగా చేశాము. యదార్థానికి మీలో అందరికన్నా ఎక్కువగా భయభక్తులు గలవాడే అల్లాహ్ సమక్షంలో ఎక్కువగా ఆదరణీయుడు. నిశ్చయంగా అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, అప్రమత్తుడు.
49:14 قَالَتِ الْأَعْرَابُ آمَنَّا ۖ قُل لَّمْ تُؤْمِنُوا وَلَٰكِن قُولُوا أَسْلَمْنَا وَلَمَّا يَدْخُلِ الْإِيمَانُ فِي قُلُوبِكُمْ ۖ وَإِن تُطِيعُوا اللَّهَ وَرَسُولَهُ لَا يَلِتْكُم مِّنْ أَعْمَالِكُمْ شَيْئًا ۚ إِنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ
“మేము విశ్వసించాము” అని పల్లెవాసులు అంటున్నారు. (ఓ ప్రవక్తా!) వారికిలా చెప్పు : “నిజానికి మీరింకా విశ్వసించలేదు. కాని ‘(వ్యతిరేక ధోరణిని మానుకొని) లొంగిపోయాము (ఇస్లాం స్వీకరించాము)’ అని మాత్రం అనండి. వాస్తవానికి విశ్వాసం ఇంకా మీ హృదయాలలో ప్రవేశించనే లేదు. మీరు గనక అల్లాహ్ కు, ఆయన ప్రవక్తకు విధేయత చూపితే, ఆయన మీ కర్మల (ప్రతిఫలం) లో ఏ మాత్రం కోత విధించడు. నిశ్చయంగా అల్లాహ్ క్షమాశీలి, దయాశీలి.”
49:15 إِنَّمَا الْمُؤْمِنُونَ الَّذِينَ آمَنُوا بِاللَّهِ وَرَسُولِهِ ثُمَّ لَمْ يَرْتَابُوا وَجَاهَدُوا بِأَمْوَالِهِمْ وَأَنفُسِهِمْ فِي سَبِيلِ اللَّهِ ۚ أُولَٰئِكَ هُمُ الصَّادِقُونَ
అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను (దృఢంగా)విశ్వసించి, తరువాత ఎలాంటి సందేహానికి తావీయకుండా ఉంటూ, తమ ధనప్రాణాలతో అల్లాహ్ మార్గంలో పోరాడేవారే విశ్వాసులు. వారే సత్యవంతులు.
49:16 قُلْ أَتُعَلِّمُونَ اللَّهَ بِدِينِكُمْ وَاللَّهُ يَعْلَمُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۚ وَاللَّهُ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ
వారికి చెప్పు: “ఏమిటీ, మీ ధార్మికత గురించి మీరు అల్లాహ్ కే తెలియపరచాలనుకుంటున్నారా? భూమ్యాకాశాలలో ఉన్న ప్రతిదీ అల్లాహ్ కు తెలుసు. అల్లాహ్ ప్రతిదీ తెలిసినవాడు.”
49:17 يَمُنُّونَ عَلَيْكَ أَنْ أَسْلَمُوا ۖ قُل لَّا تَمُنُّوا عَلَيَّ إِسْلَامَكُم ۖ بَلِ اللَّهُ يَمُنُّ عَلَيْكُمْ أَنْ هَدَاكُمْ لِلْإِيمَانِ إِن كُنتُمْ صَادِقِينَ
తాము ఇస్లాం స్వీకరించి నీకేదో ఉపకారం చేసినట్లుగానే వారు మాట్లాడుతున్నారు. (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “మీ ఇస్లాం స్వీకరణకు సంబంధించిన ఉపకారం నాపై పెట్టకండి. వాస్తవానికి మీరు సత్యవంతులే అయితే (తెలుసుకోండి), అల్లాహ్ విశ్వాసమార్గం చూపి మీకు మహోపకారం చేశాడు.
49:18 إِنَّ اللَّهَ يَعْلَمُ غَيْبَ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ وَاللَّهُ بَصِيرٌ بِمَا تَعْمَلُونَ
“భూమ్యాకాశాలలో ఉన్న రహస్య విషయాలన్నీ అల్లాహ్ కు బాగా తెలుసు (అన్న సంగతిని మీరు గ్రహించాలి). మీరు చేసేదంతా ఆయన చూస్తూనే ఉన్నాడు.” - సూరా ఖాఫ్
50:1 ق ۚ وَالْقُرْآنِ الْمَجِيدِ
ఖాఫ్. దివ్యమైన ఖుర్ఆన్ సాక్షిగా!
50:2 بَلْ عَجِبُوا أَن جَاءَهُم مُّنذِرٌ مِّنْهُمْ فَقَالَ الْكَافِرُونَ هَٰذَا شَيْءٌ عَجِيبٌ
తమ వద్దకు స్వయంగా తమలో నుండే హెచ్చరించేవాడొకడు రావటం వారిని ఆశ్చర్యపరిచింది. అందుకే అవిశ్వాసులు ఇలా అన్నారు : “ఇది మరీ విచిత్రంగా ఉందే!
50:3 أَإِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا ۖ ذَٰلِكَ رَجْعٌ بَعِيدٌ
“ఏమిటీ, మేము మరణించి మట్టిగా మారిన తరువాత (మళ్ళి బ్రతికించబడతామా?) ఈ తిరిగిపోవటం చాలా దూరం (బుద్ధికి అందనిది)!”
50:4 قَدْ عَلِمْنَا مَا تَنقُصُ الْأَرْضُ مِنْهُمْ ۖ وَعِندَنَا كِتَابٌ حَفِيظٌ
భూమి వారిలో (ఎందరిని) ఏ మేరకు హరిస్తుందో కూడా మాకు తెలుసు. మా దగ్గర అన్నింటినీ భద్రపరిచే పుస్తకం ఉంది.
50:5 بَلْ كَذَّبُوا بِالْحَقِّ لَمَّا جَاءَهُمْ فَهُمْ فِي أَمْرٍ مَّرِيجٍ
పైగా వారు, సత్యం తమ వద్దకు వచ్చినప్పుడు దాన్ని అబద్దంగా చిత్రీకరించారు. అసలు వారు అయోమయంలో పడిపోయారు.
50:6 أَفَلَمْ يَنظُرُوا إِلَى السَّمَاءِ فَوْقَهُمْ كَيْفَ بَنَيْنَاهَا وَزَيَّنَّاهَا وَمَا لَهَا مِن فُرُوجٍ
ఏమిటీ, తమపైన ఉన్న ఆకాశాన్ని వారు చూడలేదా, ఏ విధంగా మేము దాన్ని నిర్మించి, ముస్తాబు చేశామో? మరి అందులో ఎలాంటి పగుళ్ళూ లేవు.
50:7 وَالْأَرْضَ مَدَدْنَاهَا وَأَلْقَيْنَا فِيهَا رَوَاسِيَ وَأَنبَتْنَا فِيهَا مِن كُلِّ زَوْجٍ بَهِيجٍ
ఇంకా మేము భూమిని పరచి, అందులో పర్వతాలను చేశాము. ఇంకా అందులో అందాలు చిందే అన్నిరకాల వస్తువులను మొలిపించాము.
50:8 تَبْصِرَةً وَذِكْرَىٰ لِكُلِّ عَبْدٍ مُّنِيبٍ
(అల్లాహ్ వైపు) మరలి వచ్చే ప్రతి దాసునికి ఇవి కనువిప్పుగా, గుణపాఠంగా ఉన్నాయి.
50:9 وَنَزَّلْنَا مِنَ السَّمَاءِ مَاءً مُّبَارَكًا فَأَنبَتْنَا بِهِ جَنَّاتٍ وَحَبَّ الْحَصِيدِ
ఇంకా మేము ఆకాశం నుండి శుభప్రదమైన నీటిని (వర్షాన్ని) కురిపించాము. తద్వారా తోటలను, కోతకొచ్చే ఆహార ధాన్యాలను మొలిపించాము.
50:10 وَالنَّخْلَ بَاسِقَاتٍ لَّهَا طَلْعٌ نَّضِيدٌ
ఒకదానిపై ఒకటి పేరుకుని ఉండే పండ్ల గుత్తులు గల ఎత్తైన ఖర్జూరపు చెట్లను,
50:11 رِّزْقًا لِّلْعِبَادِ ۖ وَأَحْيَيْنَا بِهِ بَلْدَةً مَّيْتًا ۚ كَذَٰلِكَ الْخُرُوجُ
దాసుల ఉపాధి నిమిత్తం వీటిని (ఉత్పత్తి చేశాము). ఇంకా మేము దీంతో నిర్జీవంగా ఉన్న ప్రదేశానికి జీవం పోశాము. ఈ విధంగానే (సమాధుల నుండి) బయటకు రావలసి ఉన్నది.
50:12 كَذَّبَتْ قَبْلَهُمْ قَوْمُ نُوحٍ وَأَصْحَابُ الرَّسِّ وَثَمُودُ
వీరికి పూర్వం నూహ్ జాతి వారు, రస్ జనులు, సమూదు వారు ధిక్కరించిన వారే.
50:13 وَعَادٌ وَفِرْعَوْنُ وَإِخْوَانُ لُوطٍ
ఆదు వారు, ఫిరౌను జనులు, లూత్ సోదరులు,
50:14 وَأَصْحَابُ الْأَيْكَةِ وَقَوْمُ تُبَّعٍ ۚ كُلٌّ كَذَّبَ الرُّسُلَ فَحَقَّ وَعِيدِ
అయికా వారు, తుబ్బా జాతి వారు కూడా. వారంతా ప్రవక్తలను ధిక్కరించారు. దాంతో నా శిక్షా వాగ్దానం వారి విషయంలో నిజమని తేలింది.
50:15 أَفَعَيِينَا بِالْخَلْقِ الْأَوَّلِ ۚ بَلْ هُمْ فِي لَبْسٍ مِّنْ خَلْقٍ جَدِيدٍ
ఏమిటీ, మేము తొలి(సారి) సృష్టికే అలసిపోయామా? అది కాదు, వారసలు సరికొత్త సృష్టి గురించి సందిగ్ధంలో పడిపోయారు.
50:16 وَلَقَدْ خَلَقْنَا الْإِنسَانَ وَنَعْلَمُ مَا تُوَسْوِسُ بِهِ نَفْسُهُ ۖ وَنَحْنُ أَقْرَبُ إِلَيْهِ مِنْ حَبْلِ الْوَرِيدِ
మేమే మనిషిని సృష్టించాము. వాడి మదిలో మెదిలే ఆలోచనలు సయితం మాకు తెలుసు. మేమతని ప్రాణనాళం కంటే కూడా అతనికి అతి చేరువలో ఉన్నాం.
50:17 إِذْ يَتَلَقَّى الْمُتَلَقِّيَانِ عَنِ الْيَمِينِ وَعَنِ الشِّمَالِ قَعِيدٌ
తీసుకోవలసిన ఇద్దరు (దూతలు) తీసుకోవటానికి వెళ్ళినప్పుడు (వారిలో) ఒకతను కుడి ప్రక్కన, మరొకతను ఎడమ ప్రక్కన కూర్చొని ఉంటాడు.
50:18 مَّا يَلْفِظُ مِن قَوْلٍ إِلَّا لَدَيْهِ رَقِيبٌ عَتِيدٌ
(మనిషి) నోట ఒక మాట వెలువడటమే ఆలస్యం, అతని దగ్గర ఒక పర్యవేక్షకుడు (దాన్ని నమోదు చేయడానికి) సిద్ధంగా ఉంటాడు.
50:19 وَجَاءَتْ سَكْرَةُ الْمَوْتِ بِالْحَقِّ ۖ ذَٰلِكَ مَا كُنتَ مِنْهُ تَحِيدُ
చివరికి మరణ మైకం – సత్య సమేతంగా – రానేవచ్చింది. “( ఓ మనిషీ!) దేనిపట్ల నువ్వు బెదిరి పారిపోయేవాడివో అదే ఇది.”
50:20 وَنُفِخَ فِي الصُّورِ ۚ ذَٰلِكَ يَوْمُ الْوَعِيدِ
మరి శంఖం ఊదబడుతుంది. (శిక్ష గురించి) వాగ్దానం చేయబడిన రోజు ఇదే.
50:21 وَجَاءَتْ كُلُّ نَفْسٍ مَّعَهَا سَائِقٌ وَشَهِيدٌ
ప్రతి వ్యక్తీ తన వెంట తనను తీసుకొచ్చే వాడొకడు, సాక్ష్యమిచ్చేవాడొకడు ఉన్న స్థితిలో హాజరవుతాడు.
50:22 لَّقَدْ كُنتَ فِي غَفْلَةٍ مِّنْ هَٰذَا فَكَشَفْنَا عَنكَ غِطَاءَكَ فَبَصَرُكَ الْيَوْمَ حَدِيدٌ
(అతనితో ఇలా అనబడుతుంది:) “నిశ్చయంగా నువ్వు దీనిపట్ల అలసత్వం వహించావు. ఇక నీ నుండి నీ తెరను తొలగించాము. ఈనాడు నీ చూపు చాలా సునిశితంగా ఉంది.”
50:23 وَقَالَ قَرِينُهُ هَٰذَا مَا لَدَيَّ عَتِيدٌ
“ఇదిగో, (ఇతని కర్మల చిట్టా) నావద్ద సిద్ధంగా ఉంది” అని అతని సహవాసి (అయిన దైవదూత) అంటాడు.
50:24 أَلْقِيَا فِي جَهَنَّمَ كُلَّ كَفَّارٍ عَنِيدٍ
(అప్పుడు ఈ విధంగా సెలవీయబడుతుంది : ) “పొగరుబోతు అయిన ప్రతి దైవతిరస్కారిని నరకంలో విసరివేయండి.
50:25 مَّنَّاعٍ لِّلْخَيْرِ مُعْتَدٍ مُّرِيبٍ
“వాడు మంచిని అడ్డుకునేవాడు, బరితెగించి పోయేవాడు, అనుమానాల అయ్యగా ప్రవర్తించేవాడు.
50:26 الَّذِي جَعَلَ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ فَأَلْقِيَاهُ فِي الْعَذَابِ الشَّدِيدِ
“వాడు అల్లాహ్ తో పాటు మరో దైవాన్ని చేర్చాడు. కాబట్టి వాణ్ణి తీవ్రమైన శిక్షలో పడవేయండి.”
50:27 قَالَ قَرِينُهُ رَبَّنَا مَا أَطْغَيْتُهُ وَلَٰكِن كَانَ فِي ضَلَالٍ بَعِيدٍ
“మా ప్రభూ! నేనితన్ని పెడదారి పట్టించలేదు. ఇతనే స్వయంగా బహుదూరపు అపమార్గంలో పడిఉన్నాడ”ని అతని సహవాసి (అయిన షైతాన్) అంటాడు.
50:28 قَالَ لَا تَخْتَصِمُوا لَدَيَّ وَقَدْ قَدَّمْتُ إِلَيْكُم بِالْوَعِيدِ
అప్పుడు అల్లాహ్ ఇలా అంటాడు : “నా దగ్గర ఇప్పుడు గొడవ చేయకండి. నేను ముందుగానే హెచ్చరికను (శిక్షకు సంబంధించిన వాగ్దానాన్ని) పంపాను.”
50:29 مَا يُبَدَّلُ الْقَوْلُ لَدَيَّ وَمَا أَنَا بِظَلَّامٍ لِّلْعَبِيدِ
“నా దగ్గర మాట మారదు. నేను నా దాసులకు కొంచెం కూడా అన్యాయం చేసేవాణ్ణి కూడా కాను.”
50:30 يَوْمَ نَقُولُ لِجَهَنَّمَ هَلِ امْتَلَأْتِ وَتَقُولُ هَلْ مِن مَّزِيدٍ
“నువ్వు నిండిపోయావా?” అని మేము నరకాన్ని అడిగిన నాడు, “ఏం, ఇంకా ఏమన్నా ఉందా?” అని అది అంటుంది.
50:31 وَأُزْلِفَتِ الْجَنَّةُ لِلْمُتَّقِينَ غَيْرَ بَعِيدٍ
స్వర్గం భయభక్తులు గల వారికి దగ్గరగా తీసుకురాబడుతుంది – అది ఏమాత్రం దూరాన ఉండదు.
50:32 هَٰذَا مَا تُوعَدُونَ لِكُلِّ أَوَّابٍ حَفِيظٍ
“ఇదీ మీకు వాగ్దానం చేయబడినది. (అల్లాహ్ వైపు) మరలి, నిష్టగా ఉండే ప్రతి ఒక్కరికీ ఉద్దేశించినది.
50:33 مَّنْ خَشِيَ الرَّحْمَٰنَ بِالْغَيْبِ وَجَاءَ بِقَلْبٍ مُّنِيبٍ
“కరుణామయుణ్ణి చూడకుండానే అతనికి భయపడుతూ, (అల్లాహ్ వైపు) మరలే హృదయాన్ని తీసుకువచ్చిన వారికి ఇది ప్రత్యేకించబడింది.
50:34 ادْخُلُوهَا بِسَلَامٍ ۖ ذَٰلِكَ يَوْمُ الْخُلُودِ
“మీరు ఈ స్వర్గంలో ప్రశాంతంగా, సురక్షితంగా ప్రవేశించండి. ఇది నిత్యం నిలిచి ఉండే దినం.”
50:35 لَهُم مَّا يَشَاءُونَ فِيهَا وَلَدَيْنَا مَزِيدٌ
అక్కడ వారికి కోరుకున్నదల్లా లభిస్తుంది. (పైగా) మా దగ్గర మరెంతో ఉన్నది.
50:36 وَكَمْ أَهْلَكْنَا قَبْلَهُم مِّن قَرْنٍ هُمْ أَشَدُّ مِنْهُم بَطْشًا فَنَقَّبُوا فِي الْبِلَادِ هَلْ مِن مَّحِيصٍ
వీరికి పూర్వం ఎన్నో సముదాయాలను మేము తుదముట్టించి ఉన్నాము. వారు బలపరాక్రమాల రీత్యా వీళ్ళకన్నా ఘటికులే. వారు (నిలువ నీడ కోసం) పట్టణాలలో గాలించసాగారు. కాని పారిపోయి ఆశ్రయం పొందేస్థలం ఏదైనా వారికి లభించిందా?!
50:37 إِنَّ فِي ذَٰلِكَ لَذِكْرَىٰ لِمَن كَانَ لَهُ قَلْبٌ أَوْ أَلْقَى السَّمْعَ وَهُوَ شَهِيدٌ
హృదయాన్ని కలిగి ఉండి లేదా శ్రద్దగా ఆలకించి సావధానంగా మసలుకునే ప్రతి వ్యక్తికీ ఇందులో హితబోధన గలదు.
50:38 وَلَقَدْ خَلَقْنَا السَّمَاوَاتِ وَالْأَرْضَ وَمَا بَيْنَهُمَا فِي سِتَّةِ أَيَّامٍ وَمَا مَسَّنَا مِن لُّغُوبٍ
నిశ్చయంగా మేము భూమ్యాకాశాలను, వాటి మధ్య ఉన్న వాటన్నింటినీ (కేవలం) ఆరు దినాలలో సృష్టించాము. మరి మాకు అలసట సోకనయినా లేదు.
50:39 فَاصْبِرْ عَلَىٰ مَا يَقُولُونَ وَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ قَبْلَ طُلُوعِ الشَّمْسِ وَقَبْلَ الْغُرُوبِ
కనుక (ఓ ప్రవక్తా!) వారు చెప్పే మాటలపై నువ్వు ఓర్పు వహించు. సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయానికి ముందు కూడా స్తోత్రసమేతంగా నీ ప్రభువు పవిత్రతను కొనియాడుతూ ఉండు.
50:40 وَمِنَ اللَّيْلِ فَسَبِّحْهُ وَأَدْبَارَ السُّجُودِ
రాత్రిపూట కూడా (ఏ సమయంలోనయినా) ఆయన పవిత్రతను కొనియాడు, మరి నమాజు తరువాత కూడా (ఆయన్నుస్తుతించు).
50:41 وَاسْتَمِعْ يَوْمَ يُنَادِ الْمُنَادِ مِن مَّكَانٍ قَرِيبٍ
ఇంకా వినుము: ఏ రోజున ఒక పిలిచేవాడొకడు చాలా దగ్గరి స్థలం నుండి పిలుస్తాడో…
50:42 يَوْمَ يَسْمَعُونَ الصَّيْحَةَ بِالْحَقِّ ۚ ذَٰلِكَ يَوْمُ الْخُرُوجِ
ఏ రోజున అందరూ ఒక భీకర అరుపును ఖచ్చితంగా వింటారో, అది (మృతుల సమాధుల నుండి) బయటపడే రోజై ఉంటుంది.
50:43 إِنَّا نَحْنُ نُحْيِي وَنُمِيتُ وَإِلَيْنَا الْمَصِيرُ
మేమే బ్రతికిస్తున్నాం. మేమే చంపుతున్నాం. ఎట్టకేలకు మా వైపుకే మరలి రావలసి ఉన్నది.
50:44 يَوْمَ تَشَقَّقُ الْأَرْضُ عَنْهُمْ سِرَاعًا ۚ ذَٰلِكَ حَشْرٌ عَلَيْنَا يَسِيرٌ
భూమి బ్రద్దలైపోయిన రోజున వారు ఉరుకులు పరుగులతో (బయటికి వస్తారు). ఈపాటి సమీకరణ మాకు చాలా తేలిక.
50:45 نَّحْنُ أَعْلَمُ بِمَا يَقُولُونَ ۖ وَمَا أَنتَ عَلَيْهِم بِجَبَّارٍ ۖ فَذَكِّرْ بِالْقُرْآنِ مَن يَخَافُ وَعِيدِ
వారు చెప్పేదేమిటో మాకు బాగా తెలుసు. (ఓ ప్రవక్తా!) నీవు వాళ్ళను బలవంతపెట్టే వాడివి కావు. కాబట్టి నీవు మా హెచ్చరికలను భయపడేవారికి ఖుర్ఆను ద్వారా బోధపరుస్తూ ఉండు.
- సూరా అజ్ జారియాత్
51:1 وَالذَّارِيَاتِ ذَرْوًا
దుమ్మును రేపే గాలుల సాక్షిగా!
51:2 فَالْحَامِلَاتِ وِقْرًا
మరి బరువును లేపే మేఘాలు (సాక్షి!)
51:3 فَالْجَارِيَاتِ يُسْرًا
మరి అలవోకగా, సుతిమెత్తగా సాగిపోయే ఓడలు (సాక్షి!)
51:4 فَالْمُقَسِّمَاتِ أَمْرًا
మరి పనులను పంపకం చేసేవారు (సాక్షి!)
51:5 إِنَّمَا تُوعَدُونَ لَصَادِقٌ
మీకు వేటి గురించి వాగ్దానం చేయబడుతున్నదో అవి నిజంగా సత్యమైనవి.
51:6 وَإِنَّ الدِّينَ لَوَاقِعٌ
నిశ్చయంగా న్యాయం (తీర్పు) జరగనున్నది.
51:7 وَالسَّمَاءِ ذَاتِ الْحُبُكِ
మార్గాలతో నిండిన ఆకాశం సాక్షిగా!
51:8 إِنَّكُمْ لَفِي قَوْلٍ مُّخْتَلِفٍ
నిశ్చయంగా మీరు అభిప్రాయభేదంతో కూడిన మాటలో పడి ఉన్నారు.
51:9 يُؤْفَكُ عَنْهُ مَنْ أُفِكَ
మరలింపబడినవాడే దాన్నుండి మరలిపోతాడు.
51:10 قُتِلَ الْخَرَّاصُونَ
నిరాధారమైన మాటలు మాట్లాడేవారు నాశనమవుదురు (గాక!)
51:11 الَّذِينَ هُمْ فِي غَمْرَةٍ سَاهُونَ
వారు పరధ్యానంలో పడి, మైమరచి పోయారు.
51:12 يَسْأَلُونَ أَيَّانَ يَوْمُ الدِّينِ
ఇంతకీ తీర్పుదినం ఎప్పుడట?! అని వారు ప్రశ్నిస్తున్నారు.
51:13 يَوْمَ هُمْ عَلَى النَّارِ يُفْتَنُونَ
అది వారు అగ్నిలో మాడ్చబడే దినమై ఉంటుంది.
51:14 ذُوقُوا فِتْنَتَكُمْ هَٰذَا الَّذِي كُنتُم بِهِ تَسْتَعْجِلُونَ
మీ శిక్ష యెక్క రుచి చూడండి. ఏ శిక్ష గురించి మీరు హడావిడి చేశారో ఆ శిక్ష ఇదే! (అని వారితో అనబడుతుంది).
51:15 إِنَّ الْمُتَّقِينَ فِي جَنَّاتٍ وَعُيُونٍ
నిశ్చయంగా భక్తిపరులు మాత్రం ఉద్యానవనాల, ఊటల మధ్య ఉంటారు.
51:16 آخِذِينَ مَا آتَاهُمْ رَبُّهُمْ ۚ إِنَّهُمْ كَانُوا قَبْلَ ذَٰلِكَ مُحْسِنِينَ
తమ ప్రభువు తమకు ప్రసాదించిన దాన్ని వారు గ్రహిస్తూ ఉంటారు. వారు అంతకుముందు సదాచార సంపన్నులుగా ఉండేవారు.
51:17 كَانُوا قَلِيلًا مِّنَ اللَّيْلِ مَا يَهْجَعُونَ
వారు రాత్రి పూట చాలా తక్కువగా నిద్రించేవారు.
51:18 وَبِالْأَسْحَارِ هُمْ يَسْتَغْفِرُونَ
రాత్రి చివరి గడియలలో క్షమాపణకై (అల్లాహ్ ను) వేడుకునేవారు.
51:19 وَفِي أَمْوَالِهِمْ حَقٌّ لِّلسَّائِلِ وَالْمَحْرُومِ
వారి ధనంలో యాచించేవారికి, యాచించని పేదవారికి కూడా హక్కుండేది.
51:20 وَفِي الْأَرْضِ آيَاتٌ لِّلْمُوقِنِينَ
నమ్మేవారికి భూమిలో పలు నిదర్శనాలున్నాయి.
51:21 وَفِي أَنفُسِكُمْ ۚ أَفَلَا تُبْصِرُونَ
స్వయంగా మీ ఆత్మల్లో (అస్తిత్వంలో) కూడా ఉన్నాయి. మరి మీరు పరిశీలనగా చూడటం లేదా?
51:22 وَفِي السَّمَاءِ رِزْقُكُمْ وَمَا تُوعَدُونَ
ఇంకా మీ ఉపాధి, దాంతోపాటు మీకు వాగ్దానం చేయబడేదంతా ఆకాశంలోనే ఉంది.
51:23 فَوَرَبِّ السَّمَاءِ وَالْأَرْضِ إِنَّهُ لَحَقٌّ مِّثْلَ مَا أَنَّكُمْ تَنطِقُونَ
కనుక భూమ్యాకాశాల ప్రభువు సాక్షిగా! ముమ్మాటికీ ఇది సత్యం. మీరు పరస్పరం మాట్లాడుకుంటున్నట్లే (సత్యమిది).
51:24 هَلْ أَتَاكَ حَدِيثُ ضَيْفِ إِبْرَاهِيمَ الْمُكْرَمِينَ
(ఓ ప్రవక్తా!) ఏమిటి, ఇబ్రాహీము యెక్క గౌరవనీయులైన అతిథుల గాధ నీకు చేరిందా?!
51:25 إِذْ دَخَلُوا عَلَيْهِ فَقَالُوا سَلَامًا ۖ قَالَ سَلَامٌ قَوْمٌ مُّنكَرُونَ
వారతని దగ్గరకు వచ్చినప్పుడు అతనికి సలాం చెప్పారు. అతను కూడా సలాంకు జవాబు చెప్పి, ‘ వీళ్ళు అపరిచిత వ్యక్తుల్లా ఉన్నారే!’ (అనుకున్నాడు).
51:26 فَرَاغَ إِلَىٰ أَهْلِهِ فَجَاءَ بِعِجْلٍ سَمِينٍ
తరువాత (మారు మాట్లాడకుండా గబగబా) తన ఇంటివారి వద్దకు వెళ్లి, ఒక బలిసిన అవుదూడను (దాని మాంసము వేయించి) తెచ్చాడు.
51:27 فَقَرَّبَهُ إِلَيْهِمْ قَالَ أَلَا تَأْكُلُونَ
దాన్ని వారి ముందు సమర్పించాడు. “(అయ్యో!) మీరు తినరేమిటి?” అన్నాడు.
51:28 فَأَوْجَسَ مِنْهُمْ خِيفَةً ۖ قَالُوا لَا تَخَفْ ۖ وَبَشَّرُوهُ بِغُلَامٍ عَلِيمٍ
(అప్పటికీ వారు తినకపోయేసరికి) వారి గురించి లోలోపలే భయపడిపోయాడు. “భయపడకండి” అని వారు అభయమిచ్చారు. ఇంకా వారతనికి జ్ఞానసంపన్నుడైన అబ్బాయి పుడతాడని శుభవార్త వినిపించారు.
51:29 فَأَقْبَلَتِ امْرَأَتُهُ فِي صَرَّةٍ فَصَكَّتْ وَجْهَهَا وَقَالَتْ عَجُوزٌ عَقِيمٌ
అంతలోనే అతని భార్య లబోదిబోమంటూ ముందుకు వచ్చింది. నెత్తి నోరు బాదుకుంటూ, “హవ్వ! నేనా ముసలిదాన్ని. దానికి తోడు గొడ్రాలిని కూడా” (నాకు సంతానమేమిటి?) అని అన్నది.
51:30 قَالُوا كَذَٰلِكِ قَالَ رَبُّكِ ۖ إِنَّهُ هُوَ الْحَكِيمُ الْعَلِيمُ
“అవును, ఇలాగే జరుగుతుందని నీ ప్రభువు సెలవిచ్చాడు. నిశ్చయంగా ఆయన వివేకవంతుడు, సర్వం తెలిసినవాడు” అని వారన్నారు.
51:31 قَالَ فَمَا خَطْبُكُمْ أَيُّهَا الْمُرْسَلُونَ
“ఓ దైవదూతలారా! ఇంతకీ మీ రాకలోని ముఖ్య ఉద్దేశం ఏమిటి?” అని (ఇబ్రాహీము) అడిగాడు.
51:32 قَالُوا إِنَّا أُرْسِلْنَا إِلَىٰ قَوْمٍ مُّجْرِمِينَ
“మేము అపరాధ జనుల వైపుకు పంపబడ్డాము.
51:33 لِنُرْسِلَ عَلَيْهِمْ حِجَارَةً مِّن طِينٍ
“వారిపై మట్టి రాళ్ళను కురిపించటానికి (వచ్చాము).
51:34 مُّسَوَّمَةً عِندَ رَبِّكَ لِلْمُسْرِفِينَ
“బరితెగించిపోయిన వారి కోసం నీ ప్రభువు వద్ద గుర్తులు వేయబడిన రాళ్ళవి” అని వారు చెప్పారు.
51:35 فَأَخْرَجْنَا مَن كَانَ فِيهَا مِنَ الْمُؤْمِنِينَ
మరి అక్కడున్న విశ్వాసులందరినీ మేము బయటికి తీసుకువచ్చాము.
51:36 فَمَا وَجَدْنَا فِيهَا غَيْرَ بَيْتٍ مِّنَ الْمُسْلِمِينَ
అయితే మేమక్కడ ముస్లింలకు చెందిన ఒక్కగానొక్క ఇల్లును మాత్రమే కనుగొన్నాము.
51:37 وَتَرَكْنَا فِيهَا آيَةً لِّلَّذِينَ يَخَافُونَ الْعَذَابَ الْأَلِيمَ
మరి మేమక్కడ, వ్యధాభరితమైన శిక్షకు భయపడే వారి కోసం ఒక (స్పష్టమైన) సూచనను వదలి పెట్టాము.
51:38 وَفِي مُوسَىٰ إِذْ أَرْسَلْنَاهُ إِلَىٰ فِرْعَوْنَ بِسُلْطَانٍ مُّبِينٍ
మరి మూసా (వృత్తాంతం)లో కూడా (మా తరఫున సూచన ఉంది). మేమతనికి స్పష్టమైన ప్రమాణాన్ని ఇచ్చి ఫిరౌను వద్దకు పంపించాము.
51:39 فَتَوَلَّىٰ بِرُكْنِهِ وَقَالَ سَاحِرٌ أَوْ مَجْنُونٌ
కాని అతను (ఫిరౌను) తన బలగాలను చూసుకుని విముఖతకు పాల్పడ్డాడు. “(వీడా! వీడొక) మాంత్రికుడో లేదా పిచ్చివాడో అయిఉంటాడ”ని ప్రేలాడు.
51:40 فَأَخَذْنَاهُ وَجُنُودَهُ فَنَبَذْنَاهُمْ فِي الْيَمِّ وَهُوَ مُلِيمٌ
ఎట్టకేలకు మేము అతణ్ణి, అతని సైన్యాలను పట్టుకుని సముద్రంలో పడవేశాము. వాడసలు నిందార్హుడే.
51:41 وَفِي عَادٍ إِذْ أَرْسَلْنَا عَلَيْهِمُ الرِّيحَ الْعَقِيمَ
అలాగే ఆదు వారిలో కూడా (మా తరఫున సూచన కలదు). మేము వారిపై అశుభమైన గాలులను పంపినప్పుడు,
51:42 مَا تَذَرُ مِن شَيْءٍ أَتَتْ عَلَيْهِ إِلَّا جَعَلَتْهُ كَالرَّمِيمِ
అవి ఏ వస్తువుపై వీచినా (ఎడాపెడా ఊపేసి) దాన్ని తుత్తునియలు చేసిగాని వదిలేవి కావు.
51:43 وَفِي ثَمُودَ إِذْ قِيلَ لَهُمْ تَمَتَّعُوا حَتَّىٰ حِينٍ
ఇంకా సమూదు (గాధ)లో కూడా (గుణపాఠం ఉంది). “కొద్ది రోజుల పాటు లబ్ది పొందండి” అని వారితో అనబడినపుడు…
51:44 فَعَتَوْا عَنْ أَمْرِ رَبِّهِمْ فَأَخَذَتْهُمُ الصَّاعِقَةُ وَهُمْ يَنظُرُونَ
(వారు దారికి రాకుండా) తమ ప్రభువు ఆజ్ఞ పట్ల పెడసరి వైఖరిని ప్రదర్శించారు. తత్కారణంగా వారు చూస్తూ ఉండగానే ఒక భయంకరమైన కేక (ప్రేలుడు) అమాంతం వారిని కబళించింది.
51:45 فَمَا اسْتَطَاعُوا مِن قِيَامٍ وَمَا كَانُوا مُنتَصِرِينَ
అంతే! (ఆ దెబ్బకు) వారు నిలబడనూ లేకపోయారు. తమకు సహాయం కూడా చేసుకోలేకపోయారు.
51:46 وَقَوْمَ نُوحٍ مِّن قَبْلُ ۖ إِنَّهُمْ كَانُوا قَوْمًا فَاسِقِينَ
మరి నూహ్ జాతి వారికి కూడా అంతకు మునుపు (అదే గతి పట్టింది). వారు కూడా పరమ అవిధేయులుగా ఉండేవారు.
51:47 وَالسَّمَاءَ بَنَيْنَاهَا بِأَيْدٍ وَإِنَّا لَمُوسِعُونَ
ఇంకా ఆకాశాన్ని మేము (మా) హస్తాలతో నిర్మించాము. నిశ్చయంగా మేము విశాలంగా చేసేవారము.
51:48 وَالْأَرْضَ فَرَشْنَاهَا فَنِعْمَ الْمَاهِدُونَ
భూమిని మేము పాన్పుగా చేశాము. ఎంతైనా మేము చాలా చక్కగా పరచేవారము.
51:49 وَمِن كُلِّ شَيْءٍ خَلَقْنَا زَوْجَيْنِ لَعَلَّكُمْ تَذَكَّرُونَ
మరి మీరు హితబోధను గ్రహించేటందుకుగాను మేము ప్రతి వస్తువునూ జతలు జతలుగా సృష్టించాము.
51:50 فَفِرُّوا إِلَى اللَّهِ ۖ إِنِّي لَكُم مِّنْهُ نَذِيرٌ مُّبِينٌ
కనుక మీరు అల్లాహ్ వైపు పరుగెత్తండి. నేను మాత్రం ఆయన తరఫున (వచ్చి) మిమ్మల్ని స్పష్టంగా హెచ్చరించే వాణ్ణి మాత్రమే.
51:51 وَلَا تَجْعَلُوا مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ ۖ إِنِّي لَكُم مِّنْهُ نَذِيرٌ مُّبِينٌ
అల్లాహ్ తో పాటు మరో ఆరాధ్య దైవాన్ని చేర్చకండి. నిశ్చయంగా నేను ఆయన తరఫున మిమ్మల్ని స్పష్టంగా హెచ్చరించేవాడిని.
51:52 كَذَٰلِكَ مَا أَتَى الَّذِينَ مِن قَبْلِهِم مِّن رَّسُولٍ إِلَّا قَالُوا سَاحِرٌ أَوْ مَجْنُونٌ
ఇలాగే వీరికి పూర్వం గడచిన వారు కూడా తమ వద్దకు వచ్చిన ప్రవక్తను గురించి, “ఇతడు మాంత్రికుడైనా అయిఉంటాడు లేదా పిచ్చివాడైనా అయిఉంటాడు” అనేవారు.
51:53 أَتَوَاصَوْا بِهِ ۚ بَلْ هُمْ قَوْمٌ طَاغُونَ
ఏమిటీ, ఈ విషయాన్ని వారు ఒండొకరికి తాకీదు చేసుకుంటూ వస్తున్నారా? లేదు, అసలు వారంతా తలబిరుసులే.
51:54 فَتَوَلَّ عَنْهُمْ فَمَا أَنتَ بِمَلُومٍ
కాబట్టి నువ్వు వాళ్ళ నుండి ముఖం త్రిప్పుకో. నీపై ఎలాంటి నింద ఉండదు.
51:55 وَذَكِّرْ فَإِنَّ الذِّكْرَىٰ تَنفَعُ الْمُؤْمِنِينَ
అయితే బోధనా కార్యక్రమాన్ని మాత్రం కొనసాగించు. ఎందుకంటే బోధన విశ్వాసులకు లాభదాయకం అవుతుంది.
51:56 وَمَا خَلَقْتُ الْجِنَّ وَالْإِنسَ إِلَّا لِيَعْبُدُونِ
నేను జిన్నాతులను, మానవులను సృష్టించినది వారు నన్ను ఆరాధించటానికి మాత్రమే.
51:57 مَا أُرِيدُ مِنْهُم مِّن رِّزْقٍ وَمَا أُرِيدُ أَن يُطْعِمُونِ
నేను వారి నుండి జీవనోపాధిని కోరటం లేదు. వారు నాకు అన్నం పెట్టాలని కూడా నేను కోరటం లేదు.
51:58 إِنَّ اللَّهَ هُوَ الرَّزَّاقُ ذُو الْقُوَّةِ الْمَتِينُ
అల్లాహ్ యే స్వయంగా అందరికీ ఉపాధిని సమకూర్చేవాడు. ఆయన మహాశక్తిశాలి, మహాబలుడు.
51:59 فَإِنَّ لِلَّذِينَ ظَلَمُوا ذَنُوبًا مِّثْلَ ذَنُوبِ أَصْحَابِهِمْ فَلَا يَسْتَعْجِلُونِ
కాబట్టి ఈ దుర్మార్గుల్లాంటివారికి ఏ వంతు లభించిందో అలాంటి వంతే వీరికి కూడా లభిస్తుంది. కాబట్టి వారు దాని కోసం నన్ను తొందరపెట్టరాదు.
51:60 فَوَيْلٌ لِّلَّذِينَ كَفَرُوا مِن يَوْمِهِمُ الَّذِي يُوعَدُونَ
ఏ దినం గురించి వాగ్దానం చేయబడుతున్నదో ఆ దినాన అవిశ్వాసులకు మూడటం తథ్యం. - సూరా అత్ తూర్
52:1 وَالطُّورِ
తూరు (పర్వతం) సాక్షిగా!
52:2 وَكِتَابٍ مَّسْطُورٍ
వ్రాయబడిన గ్రంథం సాక్షిగా!
52:3 فِي رَقٍّ مَّنشُورٍ
(అది) విప్పబడిన పత్రంలో ఉంది.
52:4 وَالْبَيْتِ الْمَعْمُورِ
నిత్యం దాసులతో నిండుగా ఉండే గృహం (బైతె మామూర్) సాక్షిగా!
52:5 وَالسَّقْفِ الْمَرْفُوعِ
ఎత్తైన కప్పు సాక్షిగా!
52:6 وَالْبَحْرِ الْمَسْجُورِ
రాజేయబడిన సముద్రం సాక్షిగా!
52:7 إِنَّ عَذَابَ رَبِّكَ لَوَاقِعٌ
నీ ప్రభువు శిక్ష సంభవించి తీరుతుంది.
52:8 مَّا لَهُ مِن دَافِعٍ
దాన్ని అడ్డుకోగలిగే వాడెవడూ లేడు.
52:9 يَوْمَ تَمُورُ السَّمَاءُ مَوْرًا
ఏ రోజున ఆకాశం గజగజా వణికి పోతూ ఉంటుందో,
52:10 وَتَسِيرُ الْجِبَالُ سَيْرًا
మరెప్పుడైతే పర్వతాలు నడుస్తూ తిరుగుతూ ఉంటాయో,
52:11 فَوَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
ఆ రోజు ధిక్కరించే వారికి మూడుతుంది.
52:12 الَّذِينَ هُمْ فِي خَوْضٍ يَلْعَبُونَ
వారు తమ అపసవ్యమైన విషయాలలో ఎగురుతూ, దుముకుతూ ఉండేవారు.
52:13 يَوْمَ يُدَعُّونَ إِلَىٰ نَارِ جَهَنَّمَ دَعًّا
ఆ రోజు వారు త్రోయబడుతూ, నెట్టబడుతూ నరకాగ్ని వైపు తీసుకురాబడతారు.
52:14 هَٰذِهِ النَّارُ الَّتِي كُنتُم بِهَا تُكَذِّبُونَ
“మీరు ధిక్కరిస్తూ వచ్చిన నరకాగ్ని ఇదే”.
52:15 أَفَسِحْرٌ هَٰذَا أَمْ أَنتُمْ لَا تُبْصِرُونَ
“(ఇప్పుడు చెప్పండి) ఇది మంత్రజాలమా? లేక మీకు కనబడటం లేదా?”
52:16 اصْلَوْهَا فَاصْبِرُوا أَوْ لَا تَصْبِرُوا سَوَاءٌ عَلَيْكُمْ ۖ إِنَّمَا تُجْزَوْنَ مَا كُنتُمْ تَعْمَلُونَ
“నరకానికి ఆహుతి అవండి. ఇప్పుడు మీరు ఓపికపట్టినా, ఓపిక పట్టకపోయినా మీకు ఒకటే. మీరు చేసుకున్న దాని ఫలితమే మీకివ్వబడింది” (అని అనబడుతుంది).
52:17 إِنَّ الْمُتَّقِينَ فِي جَنَّاتٍ وَنَعِيمٍ
నిశ్చయంగా భయభక్తులు గలవారు (స్వర్గ) వనాలలో, సుఖసౌఖ్యాలలో ఉంటారు.
52:18 فَاكِهِينَ بِمَا آتَاهُمْ رَبُّهُمْ وَوَقَاهُمْ رَبُّهُمْ عَذَابَ الْجَحِيمِ
వారు తమ ప్రభువు ప్రసాదించిన దానిపై సంతోషిస్తూ ఉంటారు. వారి ప్రభువు వారిని నరకయాతన నుండి రక్షించాడు కదా!
52:19 كُلُوا وَاشْرَبُوا هَنِيئًا بِمَا كُنتُمْ تَعْمَلُونَ
(వారితో ఇలా అనబడుతుంది:) “మీరు చేసుకున్న కర్మలకు ప్రతిఫలంగా హాయిగా తింటూ, త్రాగుతూ ఉండండి.”
52:20 مُتَّكِئِينَ عَلَىٰ سُرُرٍ مَّصْفُوفَةٍ ۖ وَزَوَّجْنَاهُم بِحُورٍ عِينٍ
వారక్కడ వరుసగా పరచబడిన ఆసనాలపై దిండ్లకు ఆనుకుని (ఠీవిగా) కూర్చుని ఉంటారు. అప్పటికి పెద్ద పెద్ద కన్నులు గల సుందరాంగులతో మేము వారి వివాహం జరిపించాము.
52:21 وَالَّذِينَ آمَنُوا وَاتَّبَعَتْهُمْ ذُرِّيَّتُهُم بِإِيمَانٍ أَلْحَقْنَا بِهِمْ ذُرِّيَّتَهُمْ وَمَا أَلَتْنَاهُم مِّنْ عَمَلِهِم مِّن شَيْءٍ ۚ كُلُّ امْرِئٍ بِمَا كَسَبَ رَهِينٌ
మరెవరైతే విశ్వసించారో, వారి సంతానం కూడా విశ్వసించి వారిని అనుసరించి ఉంటే, మేము వారి సంతానాన్ని కూడా వారితో కలుపుతాము. మరి వారి కర్మలను ఏ మాత్రం తగ్గించము. (నిజానికి) ప్రతి వ్యక్తీ తన సంపాదనకు తాకట్టుగా ఉన్నాడు.
52:22 وَأَمْدَدْنَاهُم بِفَاكِهَةٍ وَلَحْمٍ مِّمَّا يَشْتَهُونَ
మేము వారి కోరిక మేరకు ఫలాలను, మాంసాహారాలను పుష్కలంగా సరఫరా చేస్తూ ఉంటాము.
52:23 يَتَنَازَعُونَ فِيهَا كَأْسًا لَّا لَغْوٌ فِيهَا وَلَا تَأْثِيمٌ
వారు ఒకరి నుండి ఒకరు మధుపాత్రలను (ఆనందంతో) అందుకుంటూ ఉంటారు. ఆ మధువు వల్ల వ్యర్ధ ప్రేలాపనలుగానీ, పాపం (వైపు ప్రేరేపించే గుణం) గానీ ఉండవు.
52:24 وَيَطُوفُ عَلَيْهِمْ غِلْمَانٌ لَّهُمْ كَأَنَّهُمْ لُؤْلُؤٌ مَّكْنُونٌ
వారి చుట్టూ (సేవకోసం) అందమైన బాల సేవకులు తిరుగుతూ ఉంటారు. వారు మూసిఉంచబడిన ముత్యాల్లా (స్వచ్ఛంగా) ఉంటారు.
52:25 وَأَقْبَلَ بَعْضُهُمْ عَلَىٰ بَعْضٍ يَتَسَاءَلُونَ
వారు ఒండొకరి వైపు తిరిగి ప్రశ్నలు వేసుకుంటూ ఉంటారు.
52:26 قَالُوا إِنَّا كُنَّا قَبْلُ فِي أَهْلِنَا مُشْفِقِينَ
వారిలా అంటారు : “ఇదివరకు మేము మా వాళ్ళ మధ్య భయపడుతూ గడిపేవాళ్ళం.
52:27 فَمَنَّ اللَّهُ عَلَيْنَا وَوَقَانَا عَذَابَ السَّمُومِ
“ఇప్పుడు అల్లాహ్ మాకెంతో మేలు చేశాడు. తీవ్రమైన వడగాల్పుల శిక్ష నుండి మమ్మల్ని రక్షించాడు.”
52:28 إِنَّا كُنَّا مِن قَبْلُ نَدْعُوهُ ۖ إِنَّهُ هُوَ الْبَرُّ الرَّحِيمُ
“మేము ఇదివరకే ఆయన్ని ఆరాధిస్తూ ఉండేవారం. నిశ్చయంగా ఆయన సద్వ్యవహారం చేసేవాడు, దయాకరుడు.”
52:29 فَذَكِّرْ فَمَا أَنتَ بِنِعْمَتِ رَبِّكَ بِكَاهِنٍ وَلَا مَجْنُونٍ
కనుక (ఓ ప్రవక్తా!) నువ్వు వారికి బోధపరుస్తూ ఉండు. ఎందుకంటే నీ ప్రభువు అనుగ్రహం వల్ల నీవు (విషయాన్ని జిన్నాతుల నుండి గ్రహించే) జ్యోతిష్యుడవూ కావు, పిచ్చివాడవూ కావు.
52:30 أَمْ يَقُولُونَ شَاعِرٌ نَّتَرَبَّصُ بِهِ رَيْبَ الْمَنُونِ
“ఇతడొక కవిపుంగవుడు, మేమితనిపై కాలచక్రపు విపత్తులు వచ్చిపడతాయని ఎదురు చూస్తున్నాము” అని వారంటున్నారా?
52:31 قُلْ تَرَبَّصُوا فَإِنِّي مَعَكُم مِّنَ الْمُتَرَبِّصِينَ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “సరే, మీరు ఎదురుచూస్తూ ఉండండి. మీతో పాటు నేను కూడా ఎదురుచూస్తాను.”
52:32 أَمْ تَأْمُرُهُمْ أَحْلَامُهُم بِهَٰذَا ۚ أَمْ هُمْ قَوْمٌ طَاغُونَ
ఏమిటి, వారి బుద్ధులు వారికి ఆజ్ఞాపించేది ఇదేనా?! లేక వారు పొగరుబోతు జనులుగా తయారయ్యారా?
52:33 أَمْ يَقُولُونَ تَقَوَّلَهُ ۚ بَل لَّا يُؤْمِنُونَ
“ఇతను దీనిని (ఈ ఖుర్ఆన్ ను) స్వయంగా కల్పించుకున్నాడ”ని వారంటున్నారా? అసలు విషయం ఏమిటంటే వీళ్ళు విశ్వసించటం లేదు.
52:34 فَلْيَأْتُوا بِحَدِيثٍ مِّثْلِهِ إِن كَانُوا صَادِقِينَ
సరే, ఒకవేళ వారు (ఈ ఆరోపణలో) సత్యవంతులే అయితే దీన్ని పోలిన ఒక్క వాక్కునయినాసరే చేసి తీసుకు రావాలి.
52:35 أَمْ خُلِقُوا مِنْ غَيْرِ شَيْءٍ أَمْ هُمُ الْخَالِقُونَ
ఏమిటి, వీరు (పుట్టించేవాడు) ఎవరూ లేకుండానే వారంతట వారే పుట్టుకు వచ్చారా? లేక వారే స్వయంగా సృష్టికర్తలా?
52:36 أَمْ خَلَقُوا السَّمَاوَاتِ وَالْأَرْضَ ۚ بَل لَّا يُوقِنُونَ
ఏమిటి, భూమ్యాకాశాలను వాళ్ళే సృష్టించారా? అసలు వాళ్ళు నమ్మేరకం కాదు.
52:37 أَمْ عِندَهُمْ خَزَائِنُ رَبِّكَ أَمْ هُمُ الْمُصَيْطِرُونَ
పోనీ, వాళ్ళ దగ్గర నీ ప్రభువు ఖజానాలకు గాని ఉన్నాయా? వాళ్ళుగాని ఆ ఖజానాలను కావలివాళ్ళుగా ఉన్నారా?
52:38 أَمْ لَهُمْ سُلَّمٌ يَسْتَمِعُونَ فِيهِ ۖ فَلْيَأْتِ مُسْتَمِعُهُم بِسُلْطَانٍ مُّبِينٍ
పోనీ, వారి దగ్గర నిచ్చెన ఏదైనా ఉందా? దానిపైకెక్కి వారు (ఊర్థ్వ లోకాల రహస్యాలు) వినివస్తున్నారా? ఒకవేళ అలాంటిదేదైనా ఉంటే ఆ వినివచ్చేవాడు ఆ మేరకు ఏదైనా స్పష్టమైన ప్రమాణాన్ని సమర్పించాలి.
52:39 أَمْ لَهُ الْبَنَاتُ وَلَكُمُ الْبَنُونَ
ఏమిటి, అల్లాహ్ కైతే అందరూ ఆడపిల్లలూను, మీకేమో మగపిల్లలా?
52:40 أَمْ تَسْأَلُهُمْ أَجْرًا فَهُم مِّن مَّغْرَمٍ مُّثْقَلُونَ
ఏమిటి, నువ్వు ఏదన్నా ప్రతిఫలం అడుగుతున్నావా వారిని, దాని భారంతో వారు అణగారిపోతున్నారనటానికి?
52:41 أَمْ عِندَهُمُ الْغَيْبُ فَهُمْ يَكْتُبُونَ
ఏమిటి, వారి దగ్గర అగోచర జ్ఞానంగాని ఉందా? దాన్ని వారు లిఖిస్తూ ఉన్నారా?
52:42 أَمْ يُرِيدُونَ كَيْدًا ۖ فَالَّذِينَ كَفَرُوا هُمُ الْمَكِيدُونَ
ఏమిటి, వీళ్ళు ఏదైనా మాయోపాయం చేస్తున్నారా? అలాగైతే అవిశ్వాసులే ఆ మాయోపాయంలో పడతారు.
52:43 أَمْ لَهُمْ إِلَٰهٌ غَيْرُ اللَّهِ ۚ سُبْحَانَ اللَّهِ عَمَّا يُشْرِكُونَ
ఏమిటి, అల్లాహ్ తప్ప వారికి వేరే ఆరాధ్యదైవం ఉన్నాడా? (ముమ్మాటికీ లేడు) వారు కల్పించే భాగస్వామ్యాలకు అల్లాహ్ అతీతుడు, పరిశుద్ధుడు.
52:44 وَإِن يَرَوْا كِسْفًا مِّنَ السَّمَاءِ سَاقِطًا يَقُولُوا سَحَابٌ مَّرْكُومٌ
ఒకవేళ వారు ఆకాశం నుండి ఏదైనా రాలిపడే తునకను చూసినా “అది దట్టమైన మేఘం మాత్రమే” అంటారు.
52:45 فَذَرْهُمْ حَتَّىٰ يُلَاقُوا يَوْمَهُمُ الَّذِي فِيهِ يُصْعَقُونَ
కనుక (ఓ ముహమ్మద్!) వారు స్పృహ తప్పి పడిపోయే రోజున ఎదుర్కొనే వరకూ వారిని వారి మానాన వదలిపెట్టు.
52:46 يَوْمَ لَا يُغْنِي عَنْهُمْ كَيْدُهُمْ شَيْئًا وَلَا هُمْ يُنصَرُونَ
ఆ రోజు వారి మాయోపాయమేదీ వారికి ఉపయోగపడదు. వారికెలాంటి సహాయం కూడా చేయబడదు.
52:47 وَإِنَّ لِلَّذِينَ ظَلَمُوا عَذَابًا دُونَ ذَٰلِكَ وَلَٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ
నిశ్చయంగా దుర్మార్గులకు అది గాకుండా మరిన్ని శిక్షలు కూడా ఉన్నాయి. కాని వారిలో చాలా మందికి తెలియదు.
52:48 وَاصْبِرْ لِحُكْمِ رَبِّكَ فَإِنَّكَ بِأَعْيُنِنَا ۖ وَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ حِينَ تَقُومُ
మరి నీవు నీ ప్రభువు ఆజ్ఞకై ఓపికతో నిరీక్షించు. నిశ్చయంగా నువ్వు మా కళ్ళ ముందరే ఉన్నావు. నువ్వు నిలబడినప్పుడల్లా నీ ప్రభువు పవిత్రతను కొనియాడు, ఆయన్ని స్తుతించు.
52:49 وَمِنَ اللَّيْلِ فَسَبِّحْهُ وَإِدْبَارَ النُّجُومِ
రాత్రిపూట కూడా ఆయన పవిత్రతను కొనియాడు – మరి నక్షత్రాలు వెను తిరిగే వేళ కూడా. - సూరా అన్ నజ్మ్
53:1 وَالنَّجْمِ إِذَا هَوَىٰ
క్రింద పడేటప్పటి నక్షత్రం సాక్షిగా!
53:2 مَا ضَلَّ صَاحِبُكُمْ وَمَا غَوَىٰ
మీ సహచరుడు (అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం) దారి తప్పనూ లేదు, పెడదారి పట్టనూ లేదు.
53:3 وَمَا يَنطِقُ عَنِ الْهَوَىٰ
అతను తన మనోభిరామం ప్రకారం మాట్లాడటమూ లేదు.
53:4 إِنْ هُوَ إِلَّا وَحْيٌ يُوحَىٰ
అది (అతను మాట్లాడేదంతా) అతని వద్దకు పంపబడే దైవవాణి (వహీ) తప్ప మరేమీ కాదు.
53:5 عَلَّمَهُ شَدِيدُ الْقُوَىٰ
అసాధారణ శక్తిగల దైవదూత (జిబ్రయీల్) అతనికి (ఖుర్ఆన్) నేర్పాడు.
53:6 ذُو مِرَّةٍ فَاسْتَوَىٰ
అతడు గొప్ప శక్తి సంపన్నుడు. మరి అతను తిన్నగా నిలబడ్డాడు –
53:7 وَهُوَ بِالْأُفُقِ الْأَعْلَىٰ
అతడు ఎత్తైన ఆకాశపుటంచులపై ఉన్నాడు.
53:8 ثُمَّ دَنَا فَتَدَلَّىٰ
మరి అతను సమీపించసాగాడు… అలా అలా వాలుతూ వచ్చాడు.
53:9 فَكَانَ قَابَ قَوْسَيْنِ أَوْ أَدْنَىٰ
చివరికి అతను రెండు ధనస్సులంత దూరాన లేక అంతకన్నా తక్కువ దూరాన ఉండిపోయాడు.
53:10 فَأَوْحَىٰ إِلَىٰ عَبْدِهِ مَا أَوْحَىٰ
– తరువాత అతడు దైవదాసునికి అందజేయవలసిన సందేశాన్ని అందజేశాడు.
53:11 مَا كَذَبَ الْفُؤَادُ مَا رَأَىٰ
(ప్రవక్త) తిలకించినది అసత్యమని అతని హృదయం చెప్పలేదు.
53:12 أَفَتُمَارُونَهُ عَلَىٰ مَا يَرَىٰ
ఏమిటీ (ప్రవక్త) చూస్తున్న దానిపై మీరు అతనితో వాదులాడుతున్నారా?
53:13 وَلَقَدْ رَآهُ نَزْلَةً أُخْرَىٰ
అతను (ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం) అతణ్ణి (జిబ్రయీల్ ను) మరో సందర్భంలో కూడా చూసి ఉన్నాడు –
53:14 عِندَ سِدْرَةِ الْمُنتَهَىٰ
‘సిద్రతుల్ మున్తహా’ దగ్గర!
53:15 عِندَهَا جَنَّةُ الْمَأْوَىٰ
అక్కడే ‘జన్నతుల్ మావా’ కూడా ఉంది.
53:16 إِذْ يَغْشَى السِّدْرَةَ مَا يَغْشَىٰ
అప్పుడు ఆ ‘సిద్రా’ను ఆవరించే వస్తువేదో ఆవరిస్తూ ఉన్నది.
53:17 مَا زَاغَ الْبَصَرُ وَمَا طَغَىٰ
(అతని) చూపు తప్పిపోనూ లేదు, హద్దు దాటి పోనూ లేదు.
53:18 لَقَدْ رَأَىٰ مِنْ آيَاتِ رَبِّهِ الْكُبْرَىٰ
నిస్సందేహంగా అతను తన ప్రభువు యెక్క గొప్ప సూచనలు (కొన్నింటిని) తిలకించాడు.
53:19 أَفَرَأَيْتُمُ اللَّاتَ وَالْعُزَّىٰ
ఏమిటీ, మీరు లాతు, ఉజ్జాలను చూశారా?
53:20 وَمَنَاةَ الثَّالِثَةَ الْأُخْرَىٰ
మూడవది, చివరిది అయిన మనాతును (కూడా చూశారా?)
53:21 أَلَكُمُ الذَّكَرُ وَلَهُ الْأُنثَىٰ
ఏమిటేమిటి!? మీ కోసమేమో మగపిల్లలూను, ఆయన కోసమేమో ఆడపిల్లలా?
53:22 تِلْكَ إِذًا قِسْمَةٌ ضِيزَىٰ
ఈ విభజన మరీ ఘోరమైనది (కదూ!).
53:23 إِنْ هِيَ إِلَّا أَسْمَاءٌ سَمَّيْتُمُوهَا أَنتُمْ وَآبَاؤُكُم مَّا أَنزَلَ اللَّهُ بِهَا مِن سُلْطَانٍ ۚ إِن يَتَّبِعُونَ إِلَّا الظَّنَّ وَمَا تَهْوَى الْأَنفُسُ ۖ وَلَقَدْ جَاءَهُم مِّن رَّبِّهِمُ الْهُدَىٰ
నిజానికి ఇవన్నీ మీరూ, మీ తాత ముత్తాతలు వాటికి పెట్టుకున్న పేర్లు మాత్రమే. వీటిని గురించి అల్లాహ్ ఏ ప్రమాణమూ పంపలేదు. వీళ్ళు కేవలం అంచనాలను, తమ మనోవాంఛలను అనుసరిస్తున్నారు. మరి చూడబోతే వారి ప్రభువు తరఫున వారి వద్దకు ఖచ్చితంగా మార్గ దర్శకత్వం వచ్చి ఉన్నది.
53:24 أَمْ لِلْإِنسَانِ مَا تَمَنَّىٰ
ఏమిటీ, మనిషి కోరుకున్నదల్లా అతనికి ప్రాప్తిస్తుందా?
53:25 فَلِلَّهِ الْآخِرَةُ وَالْأُولَىٰ
ఇహలోకమూ, పరలోకమూ అల్లాహ్ అధీనంలో మాత్రమే ఉన్నాయి.
53:26 وَكَم مِّن مَّلَكٍ فِي السَّمَاوَاتِ لَا تُغْنِي شَفَاعَتُهُمْ شَيْئًا إِلَّا مِن بَعْدِ أَن يَأْذَنَ اللَّهُ لِمَن يَشَاءُ وَيَرْضَىٰ
ఆకాశాలలో ఎంతో మంది దైవదూతలు ఉన్నారు. కాని వాళ్ళ సిఫారసు ఏ మాత్రం పనికిరాదు. కాకపోతే అల్లాహ్ తన ఇష్టంతో, తాను కోరిన వారి విషయంలో (సిఫారసు వినడానికి) సమ్మతిస్తే అది వేరే విషయం.
53:27 إِنَّ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ لَيُسَمُّونَ الْمَلَائِكَةَ تَسْمِيَةَ الْأُنثَىٰ
పరలోకాన్ని విశ్వసించనివారు దైవదూతలకు ఆడవారి పేర్లు పెడతారు.
53:28 وَمَا لَهُم بِهِ مِنْ عِلْمٍ ۖ إِن يَتَّبِعُونَ إِلَّا الظَّنَّ ۖ وَإِنَّ الظَّنَّ لَا يُغْنِي مِنَ الْحَقِّ شَيْئًا
వాస్తవానికి వారికి ఈ విషయంలో ఎలాంటి పరిజ్ఞానము లేదు. వారు ఉత్త అనుమానాలను అనుసరిస్తున్నారు. నిజానికి (మూఢ) అనుమానాలు సత్యం ముందు దేనికీ పనికిరావు.
53:29 فَأَعْرِضْ عَن مَّن تَوَلَّىٰ عَن ذِكْرِنَا وَلَمْ يُرِدْ إِلَّا الْحَيَاةَ الدُّنْيَا
కనుక (ఓ ప్రవక్తా!) మా ధ్యానం నుండి తిరిగిపోయి, కేవలం ప్రాపంచిక జీవితాన్ని మాత్రమే ఆశించేవాణ్ణి నువ్వు పట్టించుకోకు.
53:30 ذَٰلِكَ مَبْلَغُهُم مِّنَ الْعِلْمِ ۚ إِنَّ رَبَّكَ هُوَ أَعْلَمُ بِمَن ضَلَّ عَن سَبِيلِهِ وَهُوَ أَعْلَمُ بِمَنِ اهْتَدَىٰ
వారికి తెలిసింది అంతవరకే. తన మార్గం నుండి తప్పిపోయిన వాడెవడో నీ ప్రభువుకు బాగా తెలుసు. సన్మార్గం పొందినవాని గురించి కూడా ఆయనకు బాగా తెలుసు.
53:31 وَلِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ لِيَجْزِيَ الَّذِينَ أَسَاءُوا بِمَا عَمِلُوا وَيَجْزِيَ الَّذِينَ أَحْسَنُوا بِالْحُسْنَى
భూమ్యాకాశాలలో ఉన్నదంతా అల్లాహ్ దే. దుష్కర్మలు చేసేవారికి అల్లాహ్ వారి కర్మలకు తగ్గ ప్రతిఫలం ఇవ్వటానికి, సత్కర్మలు చేసేవారికి వారి కర్మలకు తగ్గట్టుగా పుణ్యఫలం ప్రసాదించటానికి (సన్మార్గ దుర్మార్గాలు ఆయన చేతుల్లోనే ఉన్నాయి).
53:32 الَّذِينَ يَجْتَنِبُونَ كَبَائِرَ الْإِثْمِ وَالْفَوَاحِشَ إِلَّا اللَّمَمَ ۚ إِنَّ رَبَّكَ وَاسِعُ الْمَغْفِرَةِ ۚ هُوَ أَعْلَمُ بِكُمْ إِذْ أَنشَأَكُم مِّنَ الْأَرْضِ وَإِذْ أَنتُمْ أَجِنَّةٌ فِي بُطُونِ أُمَّهَاتِكُمْ ۖ فَلَا تُزَكُّوا أَنفُسَكُمْ ۖ هُوَ أَعْلَمُ بِمَنِ اتَّقَىٰ
ఎవరైతే పెద్ద పాపాలకు దూరంగా ఉంటారో, చిన్న చిన్న తప్పులు మినహా నీతిబాహ్యతను కూడా విడనాడతారో (వారి పాలిట) నిశ్చయంగా నీ ప్రభువు ఎంతో ఉదారంగా క్షమించేవాడు. ఆయన మిమ్మల్ని భూమి (మట్టి) నుండి సృజించినప్పుడూ, మీరు మీ మాత్రుగర్భాలలో శిశువులుగా ఉన్నప్పుడు కూడా మీ గురించి ఆయనకు బాగా ఎరుకే. కాబట్టి మీ పారిశుద్ధ్యాన్ని గురించి మీరు (గొప్పలు) చెప్పుకోకండి. దైవానికి భయపడే వాడెవడో ఆయనకు బాగా తెలుసు.
53:33 أَفَرَأَيْتَ الَّذِي تَوَلَّىٰ
సరేగాని (ఓ ప్రవక్తా! దైవ మార్గం నుండి) ముఖం త్రిప్పుకున్నవాన్ని నువ్వు గమనించావా?
53:34 وَأَعْطَىٰ قَلِيلًا وَأَكْدَىٰ
అతడు కాస్తంత ఇచ్చాడు. తర్వాత ఆపేశాడు.
53:35 أَعِندَهُ عِلْمُ الْغَيْبِ فَهُوَ يَرَىٰ
వాడి దగ్గర రహస్య జ్ఞానంగాని ఉందా? వాడు అన్నీ చూస్తూ ఉన్నాడా?
53:36 أَمْ لَمْ يُنَبَّأْ بِمَا فِي صُحُفِ مُوسَىٰ
ఏమిటీ, మూసా గ్రంథ ప్రతులలో గల విషయం గురించి వాడికి సమాచారం ఇవ్వబడలేదా?
53:37 وَإِبْرَاهِيمَ الَّذِي وَفَّىٰ
(అలాగే) విశ్వాసపాత్రుడైన ఇబ్రాహీము గ్రంథ ప్రతుల్లోని విషయం గురించి.
53:38 أَلَّا تَزِرُ وَازِرَةٌ وِزْرَ أُخْرَىٰ
(ఆ విషయం ఏమిటంటే) బరువును మోసేవాడెవడూ ఇంకొకరి బరువును మోయడు.
53:39 وَأَن لَّيْسَ لِلْإِنسَانِ إِلَّا مَا سَعَىٰ
ప్రతి మనిషి దేనికోసం పాటుపడతాడో అది మాత్రమే అతనికి లభిస్తుంది.
53:40 وَأَنَّ سَعْيَهُ سَوْفَ يُرَىٰ
నిశ్చయంగా అతని కృషి త్వరలోనే చూడబడుతుంది.
53:41 ثُمَّ يُجْزَاهُ الْجَزَاءَ الْأَوْفَىٰ
మరి అతనికి సంపూర్ణ ప్రతిఫలం వొసగబడుతుంది.
53:42 وَأَنَّ إِلَىٰ رَبِّكَ الْمُنتَهَىٰ
కడకు అందరూ పోయి చేరవలసింది నీ ప్రభువు వద్దకే.
53:43 وَأَنَّهُ هُوَ أَضْحَكَ وَأَبْكَىٰ
మరి ఆయనే నవ్విస్తున్నాడు, ఆయనే ఏడిపిస్తున్నాడు.
53:44 وَأَنَّهُ هُوَ أَمَاتَ وَأَحْيَا
మరి ఆయనే చంపుతున్నాడు, ఆయనే బ్రతికిస్తున్నాడు.
53:45 وَأَنَّهُ خَلَقَ الزَّوْجَيْنِ الذَّكَرَ وَالْأُنثَىٰ
మరి ఆయనే జంటలను – అంటే ఆడ మగలను – సృజించాడు.
53:46 مِن نُّطْفَةٍ إِذَا تُمْنَىٰ
(గర్భంలో) కార్చబడినప్పటి వీర్యపు బిందువుతో!
53:47 وَأَنَّ عَلَيْهِ النَّشْأَةَ الْأُخْرَىٰ
మలిసారి బ్రతికించి లేపే బాధ్యత కూడా ఆయనదే.
53:48 وَأَنَّهُ هُوَ أَغْنَىٰ وَأَقْنَىٰ
మరి ఆయనే ధనవంతులుగా చేస్తున్నాడు. మూలధనాన్ని కూడా ప్రసాదిస్తున్నాడు.
53:49 وَأَنَّهُ هُوَ رَبُّ الشِّعْرَىٰ
షీరా (నక్షత్రము) కు ప్రభువు కూడా ఆయనే.
53:50 وَأَنَّهُ أَهْلَكَ عَادًا الْأُولَىٰ
ప్రాచీన ఆదు వారిని అంతమొందించింది కూడా ఆయనే.
53:51 وَثَمُودَ فَمَا أَبْقَىٰ
సమూదు వారిని కూడా – ఒక్కర్ని మిగల్చకుండా (తుదముట్టించిన వాడూ ఆయనే)!
53:52 وَقَوْمَ نُوحٍ مِّن قَبْلُ ۖ إِنَّهُمْ كَانُوا هُمْ أَظْلَمَ وَأَطْغَىٰ
అంతకు మునుపు నూహు జాతివారిని (ఆయనే తుడిచిపెట్టాడు). నిశ్చయంగా వారు పరమ దుర్మార్గులు, తలబిరుసులు.
53:53 وَالْمُؤْتَفِكَةَ أَهْوَىٰ
తలక్రిందులుగా చేయబడిన బస్తీలను ఆయనే అమాంతం ఎత్తి పడవేశాడు.
53:54 فَغَشَّاهَا مَا غَشَّىٰ
మరి ఆ బస్తీలపై క్రమ్ముకున్నదేదో వచ్చి క్రమ్ముకుంది.
53:55 فَبِأَيِّ آلَاءِ رَبِّكَ تَتَمَارَىٰ
కనుక (ఓ మనిషీ!) నువ్వు నీ ప్రభువు అనుగ్రహాలలో దేనిపై గొడవపడగలవు?
53:56 هَٰذَا نَذِيرٌ مِّنَ النُّذُرِ الْأُولَىٰ
ఈయన పూర్వం హెచ్చరించిన ప్రవక్తల మాదిరిగానే హెచ్చరించే ప్రవక్త.
53:57 أَزِفَتِ الْآزِفَةُ
రానున్న గడియ దగ్గరపడింది.
53:58 لَيْسَ لَهَا مِن دُونِ اللَّهِ كَاشِفَةٌ
అల్లాహ్ తప్ప దాన్ని (ఆ నిర్ణీత సమయాన) స్పష్టంగా చూపించేవాడెవడూ లేడు.
53:59 أَفَمِنْ هَٰذَا الْحَدِيثِ تَعْجَبُونَ
ఏమిటీ, మీరు ఈ విషయంపై ఆశ్చర్యపోతున్నారా?
53:60 وَتَضْحَكُونَ وَلَا تَبْكُونَ
నవ్విపోతున్నారా? ఏడుపు రావటం లేదా?
53:61 وَأَنتُمْ سَامِدُونَ
పైపెచ్చు ఆటపాటల్లో నిర్లక్ష్యంగా ఉంటున్నారు.
53:62 فَاسْجُدُوا لِلَّهِ وَاعْبُدُوا ۩
అల్లాహ్ సన్నిధిలో సాష్టాంగపడండి. (ఆయన్నే) ఆరాధించండి. - సూరా అల్ ఖమర్
54:1 اقْتَرَبَتِ السَّاعَةُ وَانشَقَّ الْقَمَرُ
ప్రళయ ఘడియ దగ్గరపడింది. చంద్రుడు చీలిపోయాడు.
54:2 وَإِن يَرَوْا آيَةً يُعْرِضُوا وَيَقُولُوا سِحْرٌ مُّسْتَمِرٌّ
ఒకవేళ వీళ్ళు ఏదైనా మహిమను చూసినా, దాన్నుండి ముఖం త్రిప్పుకుంటారు. “పూర్వం నుండి జరుగుతూ వస్తున్న మాయాజాలమే కదా ఇది!” అనంటారు.
54:3 وَكَذَّبُوا وَاتَّبَعُوا أَهْوَاءَهُمْ ۚ وَكُلُّ أَمْرٍ مُّسْتَقِرٌّ
వీళ్ళు ధిక్కరించారు. తమ మనోవాంఛల వెనుకపోయారు. అయితే ప్రతి విషయానికి ఒక సమయం నిర్ధారితమై ఉంది.
54:4 وَلَقَدْ جَاءَهُم مِّنَ الْأَنبَاءِ مَا فِيهِ مُزْدَجَرٌ
నిశ్చయంగా వారివద్దకు ఎన్నో వార్తలొచ్చాయి. వాటిలో మందలింపుతో కూడిన హితోపదేశం ఉంది.
54:5 حِكْمَةٌ بَالِغَةٌ ۖ فَمَا تُغْنِ النُّذُرُ
సంపూర్ణ వివేకం ఉంది. కాని ఆ హెచ్చరికలు కూడా వారికెలాంటి ప్రయోజనం చేకూర్చలేదు.
54:6 فَتَوَلَّ عَنْهُمْ ۘ يَوْمَ يَدْعُ الدَّاعِ إِلَىٰ شَيْءٍ نُّكُرٍ
కనుక (ఓ ప్రవక్తా!) నువ్వు వారిని వదలిపెట్టు. పిలిచేవాడు భరించశక్యం కాని విషయం వైపు పిలిచిననాడు,
54:7 خُشَّعًا أَبْصَارُهُمْ يَخْرُجُونَ مِنَ الْأَجْدَاثِ كَأَنَّهُمْ جَرَادٌ مُّنتَشِرٌ
వారు కళ్ళు వంచుకుని గోరీల నుండి లేచి చెల్లాచెదురైన మిడుతల దండు వలే వస్తారు.
54:8 مُّهْطِعِينَ إِلَى الدَّاعِ ۖ يَقُولُ الْكَافِرُونَ هَٰذَا يَوْمٌ عَسِرٌ
తమను పిలిచేవాని వైపు పరుగెత్తుకుంటూ వస్తారు. అప్పుడు అవిశ్వాసులు “ఇది చాలా గడ్డు రోజు” అనంటారు.
54:9 كَذَّبَتْ قَبْلَهُمْ قَوْمُ نُوحٍ فَكَذَّبُوا عَبْدَنَا وَقَالُوا مَجْنُونٌ وَازْدُجِرَ
వారికి పూర్వం నూహ్ జాతి వారు కూడా (తమ ప్రవక్తను) ధిక్కరించారు. వారు మా దాసుణ్ణి త్రోసిపుచ్చి, అతణ్ణి “పిచ్చోడ”న్నారు. అతణ్ణి విదిలించారు.
54:10 فَدَعَا رَبَّهُ أَنِّي مَغْلُوبٌ فَانتَصِرْ
అప్పుడతను, “నేను ఆశక్తుణ్ణి అయిపోయాను. కాబట్టి నీవు నాకు సహాయం చెయ్యి” అంటూ తన ప్రభువును మొరపెట్టుకున్నాడు.
54:11 فَفَتَحْنَا أَبْوَابَ السَّمَاءِ بِمَاءٍ مُّنْهَمِرٍ
అప్పుడు మేము ఉధృతంగా నీటిని కురిపించేలా ఆకాశ ద్వారాలను తెరచి వేశాము.
54:12 وَفَجَّرْنَا الْأَرْضَ عُيُونًا فَالْتَقَى الْمَاءُ عَلَىٰ أَمْرٍ قَدْ قُدِرَ
మరి భూమి నుండి కూడా నీటి ఊటలు పొంగిపొరలేలా చేశాము. నిర్ణయించబడిన పనిని పూర్తిచేయటానికి (రెండు) నీళ్ళు కలిశాయి.
54:13 وَحَمَلْنَاهُ عَلَىٰ ذَاتِ أَلْوَاحٍ وَدُسُرٍ
మరి మేమతన్ని పలకలు, మేకులు గల దానిలో ఎక్కించాము.
54:14 تَجْرِي بِأَعْيُنِنَا جَزَاءً لِّمَن كَانَ كُفِرَ
అది మా కనుల ముందరే పయనించసాగింది – త్రోసిపుచ్చబడినవానికి ప్రతిఫలంగా!
54:15 وَلَقَد تَّرَكْنَاهَا آيَةً فَهَلْ مِن مُّدَّكِرٍ
నిశ్చయంగా మేము ఈ సంఘటనను ఒక సూచనగా మిగిల్చి ఉంచాము. మరి హితబోధను గ్రహించే వాడెవడైనా ఉన్నాడా?
54:16 فَكَيْفَ كَانَ عَذَابِي وَنُذُرِ
నా శిక్ష, నా హెచ్చరికలు ఎలా ఉండినవో చెప్పండి.
54:17 وَلَقَدْ يَسَّرْنَا الْقُرْآنَ لِلذِّكْرِ فَهَلْ مِن مُّدَّكِرٍ
నిశ్చయంగా మేము ఖుర్ఆన్ ను అర్ధం చేసుకోవటానికి గాను సులభతరం చేశాము. మరి (దీనిద్వారా) హితబోధను గ్రహించేవాడెవడైనా ఉన్నాడా?
54:18 كَذَّبَتْ عَادٌ فَكَيْفَ كَانَ عَذَابِي وَنُذُرِ
ఆద్ జాతి వారు (కూడా) ధిక్కరించారు. మరి నా శిక్ష, నా హెచ్చరికలు ఎలా ఉండినాయో (చూశారుగా)!
54:19 إِنَّا أَرْسَلْنَا عَلَيْهِمْ رِيحًا صَرْصَرًا فِي يَوْمِ نَحْسٍ مُّسْتَمِرٍّ
మేము వారిపై నిరంతరంగా వీచే ప్రచండమైన పెనుగాలిని ఒకానొక దుర్దినాన పంపాము.
54:20 تَنزِعُ النَّاسَ كَأَنَّهُمْ أَعْجَازُ نَخْلٍ مُّنقَعِرٍ
అది ఆ జనులను, కూకటివ్రేళ్ళతో పెకలించబడిన ఖర్జూరపు బోదెలవలె అమాంతం లేపి పడవేసేది.
54:21 فَكَيْفَ كَانَ عَذَابِي وَنُذُرِ
మరి నా శిక్ష, నా హెచ్చరిక ఎలా ఉండింది? (చూశారుగా)!
54:22 وَلَقَدْ يَسَّرْنَا الْقُرْآنَ لِلذِّكْرِ فَهَلْ مِن مُّدَّكِرٍ
నిశ్చయంగా మేము ఖుర్ఆన్ ను అర్ధం చేసుకునేందుకుగాను సులభతరం చేశాము. మరి (దీనిద్వారా) హితబోధను గ్రహించేవాడెవడైనా ఉన్నాడా?
54:23 كَذَّبَتْ ثَمُودُ بِالنُّذُرِ
సమూదు జాతి వారు (కూడా) హెచ్చరించేవారిని ధిక్కరించారు.
54:24 فَقَالُوا أَبَشَرًا مِّنَّا وَاحِدًا نَّتَّبِعُهُ إِنَّا إِذًا لَّفِي ضَلَالٍ وَسُعُرٍ
“ఏమిటీ, మనలోని ఒక మానవుణ్ణి మనం అనుసరించాలా? ఒకవేళ అదే గనక జరిగితే మనం ముమ్మాటికీ పెడదారిపట్టి, పిచ్చిలో పడినట్లే.
54:25 أَأُلْقِيَ الذِّكْرُ عَلَيْهِ مِن بَيْنِنَا بَلْ هُوَ كَذَّابٌ أَشِرٌ
“ఏమిటీ, మనం ఇంతమందిమి ఉండగా మన మధ్యన కేవలం అతనొక్కడికే బోధన (వహీ) పంపబడిందా? లేదు, అతను బీరాలు పోతున్న అబద్ధాల రాయుడు” అన్నారు.
54:26 سَيَعْلَمُونَ غَدًا مَّنِ الْكَذَّابُ الْأَشِرُ
అబద్ధాల రాయుడు, బడాయిని చాటుకునేవాడెవడో రేపు అందరూ తెలుసుకుంటారు.
54:27 إِنَّا مُرْسِلُو النَّاقَةِ فِتْنَةً لَّهُمْ فَارْتَقِبْهُمْ وَاصْطَبِرْ
వీళ్ళను పరీక్షించటానికి మేము ఒక ఆడ ఒంటెను పంపిస్తున్నాము. కాబట్టి (ఓ సాలెహ్!) నువ్వు వీళ్ళ (పరిణామం) కోసం ఎదురు చూస్తూ ఉండు. కాస్త ఓపిక పట్టు.
54:28 وَنَبِّئْهُمْ أَنَّ الْمَاءَ قِسْمَةٌ بَيْنَهُمْ ۖ كُلُّ شِرْبٍ مُّحْتَضَرٌ
అయితే వాళ్ళ మధ్య నీళ్ళ పంపకం జరిగిందని, ప్రతి ఒక్కరూ (నీళ్ళ కోసం) తమ తమ వంతు ప్రకారం రావలసి ఉంటుందని వారికి తెలియజెయ్యి.
54:29 فَنَادَوْا صَاحِبَهُمْ فَتَعَاطَىٰ فَعَقَرَ
కాని వాళ్ళు మాత్రం తమ సహవాసిని పిలిచారు. వాడు (ఆడ ఒంటెపై) దాడి చేసి, దాని గిట్టల్ని నరికివేశారు.
54:30 فَكَيْفَ كَانَ عَذَابِي وَنُذُرِ
ఇక నా శిక్ష ఎలా పడిందో, నా హెచ్చరిక ఎలా పరిణమించిందో (చూడండి)!
54:31 إِنَّا أَرْسَلْنَا عَلَيْهِمْ صَيْحَةً وَاحِدَةً فَكَانُوا كَهَشِيمِ الْمُحْتَظِرِ
మేము వారిపై ఒకే ఒక కేకను వదిలాము. అంతే! వాళ్ళ పరిస్థితి కంచే నిర్మించేవాడు తొక్కివేసిన గడ్డి మాదిరిగా అయిపోయింది.
54:32 وَلَقَدْ يَسَّرْنَا الْقُرْآنَ لِلذِّكْرِ فَهَلْ مِن مُّدَّكِرٍ
మేము ఖుర్ ఆన్ ను అర్థం చేసుకునేటందుకు ఎంతో సులభతరం చేశాము. (మరి (దీనిద్వారా) హితబోధను గ్రహించే వాడెవడైనా ఉన్నాడా?
54:33 كَذَّبَتْ قَوْمُ لُوطٍ بِالنُّذُرِ
లూత్ జాతి వారు (కూడా తమను) హెచ్చరించేవారిని ధిక్కరించారు.
54:34 إِنَّا أَرْسَلْنَا عَلَيْهِمْ حَاصِبًا إِلَّا آلَ لُوطٍ ۖ نَّجَّيْنَاهُم بِسَحَرٍ
మేము వారిపై రాళ్లు కురుపించే గాలిని పంపాము. అయితే లూత్ ఇంటివారిని మాత్రం (శిక్ష నుండి) మినహాయించాము. వాళ్ళను మేము రాత్రి వేకువజామున కాపాడాము –
54:35 نِّعْمَةً مِّنْ عِندِنَا ۚ كَذَٰلِكَ نَجْزِي مَن شَكَرَ
మా అనుగ్రహంతో! కృతజ్ఞతా భావం కలిగి ఉండే వారందరికీ మేమిలాగే (మంచి) ప్రతిఫలం ఇస్తూ ఉంటాము.
54:36 وَلَقَدْ أَنذَرَهُم بَطْشَتَنَا فَتَمَارَوْا بِالنُّذُرِ
అతను (లూత్ ప్రవక్త) వారికి మా పట్టు గురించి ముందుగానే హెచ్చరించాడు. కాని వారు హెచ్చరికల విషయంలో (సందేహించి అతనితో) కయ్యానికి దిగారు.
54:37 وَلَقَدْ رَاوَدُوهُ عَن ضَيْفِهِ فَطَمَسْنَا أَعْيُنَهُمْ فَذُوقُوا عَذَابِي وَنُذُرِ
అతన్నుండి అతని అతిథులను తీసుకోగోరి, అతణ్ణి దువ్వటం మొదలెట్టారు. అయితే మేము వారి కళ్ళు పోగొట్టాము. “నా శిక్ష, నా హెచ్చరికల రుచిచూడండి!” (అని వారితో అనటం జరిగింది).
54:38 وَلَقَدْ صَبَّحَهُم بُكْرَةً عَذَابٌ مُّسْتَقِرٌّ
తెల తెల వారుతుండగానే స్థిరమైన శిక్ష వారిని అమాంతం కబళించింది.
54:39 فَذُوقُوا عَذَابِي وَنُذُرِ
కాబట్టి నా శిక్షను, నా హెచ్చరికను చవిచూడండి.
54:40 وَلَقَدْ يَسَّرْنَا الْقُرْآنَ لِلذِّكْرِ فَهَلْ مِن مُّدَّكِرٍ
నిశ్చయంగా మేము ఖుర్ఆన్ ను హితబోధన నిమిత్తం సులభతరం చేశాము. మరి ఈ హితబోధనను గ్రహించే వాడెవడైనా ఉన్నాడా?
54:41 وَلَقَدْ جَاءَ آلَ فِرْعَوْنَ النُّذُرُ
ఫిరౌనువారి వద్దకు కూడా హెచ్చరించేవారు వచ్చారు.
54:42 كَذَّبُوا بِآيَاتِنَا كُلِّهَا فَأَخَذْنَاهُمْ أَخْذَ عَزِيزٍ مُّقْتَدِرٍ
కాని వారు మా సూచనలన్నింటినీ ధిక్కరించారు. అందుచేత మేము వారిని మహాశక్తిమంతుడు, సర్వాధికారి పట్టుకున్నట్లే పట్టుకున్నాము.
54:43 أَكُفَّارُكُمْ خَيْرٌ مِّنْ أُولَٰئِكُمْ أَمْ لَكُم بَرَاءَةٌ فِي الزُّبُرِ
(ఓ ఖురైషులారా!) మీలోని తిరస్కారులు (గతించిన) ఆ తిరస్కారులకంటే ఘనులా? లేక పూర్వపు గ్రంథాలలో మీ కోసం (మినహాయింపు) ఏదైనా వ్రాయబడి ఉందా?
54:44 أَمْ يَقُولُونَ نَحْنُ جَمِيعٌ مُّنتَصِرٌ
లేక “మేము గెలుపొందే వర్గం వాళ్ళము” అని వారు ధీమాను వ్యక్తపరుస్తున్నారా?
54:45 سَيُهْزَمُ الْجَمْعُ وَيُوَلُّونَ الدُّبُرَ
(బాగా తెలుసుకోండి) త్వరలోనే ఆ వర్గం ఓడిపోతుంది. వారు వెన్ను చూపి పారిపోతారు.
54:46 بَلِ السَّاعَةُ مَوْعِدُهُمْ وَالسَّاعَةُ أَدْهَىٰ وَأَمَرُّ
పైగా వారికి వాగ్దానం చేయబడిన అసలు (పరాభవ) సమయమైతే ప్రళయమే. ఆ ఘడియ అత్యంత కఠినమైనది, చేదైనది.
54:47 إِنَّ الْمُجْرِمِينَ فِي ضَلَالٍ وَسُعُرٍ
నిశ్చయంగా అపరాధులు మార్గవిహినులయ్యారు. యాతనకు గురయ్యారు.
54:48 يَوْمَ يُسْحَبُونَ فِي النَّارِ عَلَىٰ وُجُوهِهِمْ ذُوقُوا مَسَّ سَقَرَ
ఏ రోజున వారు తమ ముఖముల ఆధారంగా అగ్నిలోకి ఈడ్చబడతారో (ఆ రోజు) “నరకాగ్ని తాకిడి రుచిచూడండి” (అని వారితో అనబడుతుంది).
54:49 إِنَّا كُلَّ شَيْءٍ خَلَقْنَاهُ بِقَدَرٍ
నిశ్చయంగా, మేము ప్రతి వస్తువును ఒక (నిర్ణీత) ‘విధి’ ప్రకారం సృష్టించాము.
54:50 وَمَا أَمْرُنَا إِلَّا وَاحِدَةٌ كَلَمْحٍ بِالْبَصَرِ
మా ఆజ్ఞ ఒక్కటి చాలు (అది అమల్లోకి రావటం అనేది) రెప్పపాటు కాలంలో జరిగిపోతుంది.
54:51 وَلَقَدْ أَهْلَكْنَا أَشْيَاعَكُمْ فَهَلْ مِن مُّدَّكِرٍ
మేము (గతంలో) మీలాంటి వారినెందరినో తుదముట్టించి ఉన్నాము. మరి (దీని ద్వారా) నీతిని గ్రహించే వాడెవడైనా ఉన్నాడా?
54:52 وَكُلُّ شَيْءٍ فَعَلُوهُ فِي الزُّبُرِ
వీళ్ళు చేసినదంతా కర్మల పత్రాలలో నమోదై ఉంది.
54:53 وَكُلُّ صَغِيرٍ وَكَبِيرٍ مُّسْتَطَرٌ
(అలాగే) ప్రతి చిన్న పెద్ద విషయం వ్రాయబడి ఉంది.
54:54 إِنَّ الْمُتَّقِينَ فِي جَنَّاتٍ وَنَهَرٍ
నిశ్చయంగా మాపట్ల భయభక్తులు కలవారు (స్వర్గ) వనాల, సెలయేరుల మధ్య ఉంటారు.
54:55 فِي مَقْعَدِ صِدْقٍ عِندَ مَلِيكٍ مُّقْتَدِرٍ
సర్వశక్తుడు అయిన రాజాధిరాజు (అల్లాహ్) దగ్గర సత్యంతో కూడిన, గౌరవప్రదమైన సదస్సులో ఉంటారు. - సూరా ఆర్ రహ్మాన్
55:1 الرَّحْمَٰنُ
కరుణామయుడు (అయిన అల్లాహ్)
55:2 عَلَّمَ الْقُرْآنَ
ఖుర్ఆన్ ను నేర్పాడు.
55:3 خَلَقَ الْإِنسَانَ
ఆయన మనిషిని పుట్టించాడు.
55:4 عَلَّمَهُ الْبَيَانَ
ఆయన అతనికి మాట్లాడటం నేర్పాడు.
55:5 الشَّمْسُ وَالْقَمَرُ بِحُسْبَانٍ
సూర్యుడు, చంద్రుడు ఒక (నిర్ణీత) లెక్క ప్రకారం పోతున్నాయి.
55:6 وَالنَّجْمُ وَالشَّجَرُ يَسْجُدَانِ
నక్షత్రాలు, వృక్షాలు సాష్టాంగపడుతూ ఉన్నాయి.
55:7 وَالسَّمَاءَ رَفَعَهَا وَوَضَعَ الْمِيزَانَ
ఆయనే ఆకాశాన్ని ఎత్తుగా చేశాడు, ఆయనే (సమతూకం నిమిత్తం) త్రాసును ఉంచాడు.
55:8 أَلَّا تَطْغَوْا فِي الْمِيزَانِ
మీరు తూకంలో వైపరీత్యానికి పాల్పడకుండా ఉండేందుకు!
55:9 وَأَقِيمُوا الْوَزْنَ بِالْقِسْطِ وَلَا تُخْسِرُوا الْمِيزَانَ
తూకం సరిగ్గా – న్యాయసమ్మతంగా – ఉండేలా చూడండి. తూకంలో తగ్గించి ఇవ్వకండి.
55:10 وَالْأَرْضَ وَضَعَهَا لِلْأَنَامِ
ఆయన సృష్టిరాసుల కోసం భూమిని పరచి ఉంచాడు.
55:11 فِيهَا فَاكِهَةٌ وَالنَّخْلُ ذَاتُ الْأَكْمَامِ
అందులో పండ్లు ఫలాదులు, పొరలలో చుట్టబడిన ఖర్జూరాలు ఉన్నాయి.
55:12 وَالْحَبُّ ذُو الْعَصْفِ وَالرَّيْحَانُ
ఊక గల ధాన్యాలు, సువాసన గల పువ్వులు కూడా ఉన్నాయి.
55:13 فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
కనుక (ఓ మనుషులు, జిన్నులారా!) మీరు మీ ప్రభువు యెక్క ఏ ఏ అనుగ్రహాలను కాదనగలరు?
55:14 خَلَقَ الْإِنسَانَ مِن صَلْصَالٍ كَالْفَخَّارِ
ఆయన మనిషిని పెంకు మాదిరిగా శబ్దం చేసే మట్టితో సృజించాడు.
55:15 وَخَلَقَ الْجَانَّ مِن مَّارِجٍ مِّن نَّارٍ
మరి జిన్నాతులను ఆయన అగ్ని జ్వాలలతో సృష్టించాడు.
55:16 فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
కనుక మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని త్రోసిపుచ్చగలరు?
55:17 رَبُّ الْمَشْرِقَيْنِ وَرَبُّ الْمَغْرِبَيْنِ
రెండు తూర్పులకు ప్రభువు (ఆయనే), రెండు పడమరలకు ప్రభువు (కూడా ఆయనే).
55:18 فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
మరైతే (ఓ మానవ, జిన్ను వర్గీయులారా!) మీరు మీ ప్రభువు యెక్క ఏ ఏ అనుగ్రహాలను త్రోసిపుచ్చగలరు?
55:19 مَرَجَ الْبَحْرَيْنِ يَلْتَقِيَانِ
రెండు సాగర జలాలు పరస్పరం కలసి ప్రవహించేలా వదలిపెట్టినవాడు ఆయనే.
55:20 بَيْنَهُمَا بَرْزَخٌ لَّا يَبْغِيَانِ
అయితే ఆ రెండింటి మధ్య ఒక అడ్డు తెర ఉంది. దాన్ని అవి దాటిపోవు.
55:21 فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు?
55:22 يَخْرُجُ مِنْهُمَا اللُّؤْلُؤُ وَالْمَرْجَانُ
ఆ రెండింటి నుంచి ముత్యాలు, పగడాలు బయల్పడుతున్నై.
55:23 فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు?
55:24 وَلَهُ الْجَوَارِ الْمُنشَآتُ فِي الْبَحْرِ كَالْأَعْلَامِ
సముద్రాలలో పర్వతాల్లా ఎత్తుగా ఉండి రాకపోకలు సాగిస్తున్న ఓడలు కూడా ఆయనవే.
55:25 فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు?
55:26 كُلُّ مَنْ عَلَيْهَا فَانٍ
భూమండలం పై ఉన్నవారంతా నశించి పోవలసినవారే.
55:27 وَيَبْقَىٰ وَجْهُ رَبِّكَ ذُو الْجَلَالِ وَالْإِكْرَامِ
ఎప్పటికీ మిగిలి ఉండేది ఘనత, గౌరవం గల నీ ప్రభువు అస్తిత్వం మాత్రమే.
55:28 فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు?
55:29 يَسْأَلُهُ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ كُلَّ يَوْمٍ هُوَ فِي شَأْنٍ
ఆకాశాలలో, భూమిలో ఉన్నవారంతా (తమ అవసరాలు తీరడానికి) ఆయన్నే అర్థిస్తున్నారు. ప్రతి దినం ఆయన ఓ (వినూత్న) వైభవంతో వెలుగొందుతూ ఉంటాడు.
55:30 فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు?
55:31 سَنَفْرُغُ لَكُمْ أَيُّهَ الثَّقَلَانِ
(జిన్ను జాతికి, మనుజ జాతికి చెందిన) ఓ ఇరువర్గాల వారలారా! అతి త్వరలోనే మేము తీరికతో మీ సంగతి చూస్తాము.
55:32 فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు?
55:33 يَا مَعْشَرَ الْجِنِّ وَالْإِنسِ إِنِ اسْتَطَعْتُمْ أَن تَنفُذُوا مِنْ أَقْطَارِ السَّمَاوَاتِ وَالْأَرْضِ فَانفُذُوا ۚ لَا تَنفُذُونَ إِلَّا بِسُلْطَانٍ
ఓ జిన్నుల, మానవుల సమూహానికి చెందినవారలారా! మీలో ఎవరికైనా భూమ్యాకాశాల అంచుల నుండి పారిపోయే శక్తి ఉంటే పారిపోయి చూడండి! అధికారం లేకుండా మీరు ఎట్టి పరిస్థితిలోనూ పోలేరు.
55:34 فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు?
55:35 يُرْسَلُ عَلَيْكُمَا شُوَاظٌ مِّن نَّارٍ وَنُحَاسٌ فَلَا تَنتَصِرَانِ
(ఒకవేళ మీరు అవిధేయతకు పాల్పడినట్లయితే) మీపైకి మండే అగ్నిజ్వాలలు, ధూమకెరటాలు పంపబడతాయి. దాన్నుంచి మీరు తప్పించుకోలేరు.
55:36 فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు?
55:37 فَإِذَا انشَقَّتِ السَّمَاءُ فَكَانَتْ وَرْدَةً كَالدِّهَانِ
మరెప్పుడైతే ఆకాశం చీలిపోయి, ఎర్రని చర్మంలా తయారవుతుందో (ఆ స్థితిని ఓ సారి నెమరు వేసుకోండి!)
55:38 فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు?
55:39 فَيَوْمَئِذٍ لَّا يُسْأَلُ عَن ذَنبِهِ إِنسٌ وَلَا جَانٌّ
ఆ రోజు ఏ మనిషికీ, ఏ జిన్నుకూ అతని పాపాల గురించి ప్రశ్నించవలసిన అగత్యం ఉండదు.
55:40 فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు?
55:41 يُعْرَفُ الْمُجْرِمُونَ بِسِيمَاهُمْ فَيُؤْخَذُ بِالنَّوَاصِي وَالْأَقْدَامِ
అపరాధులు తమ వాలకాన్ని (నలుపు ఆవరించిన తమ ముఖాలను) బట్టే పసిగట్టబడతారు. మరి వారు తమ నుదుటి జుట్టు ద్వారా, పాదాల ద్వారా పట్టుకోబడతారు.
55:42 فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు?
55:43 هَٰذِهِ جَهَنَّمُ الَّتِي يُكَذِّبُ بِهَا الْمُجْرِمُونَ
నేరస్థులు అబద్ధమని కొట్టిపారేసిన నరకం ఇదే.
55:44 يَطُوفُونَ بَيْنَهَا وَبَيْنَ حَمِيمٍ آنٍ
వారు దీనికీ (నరకానికీ) – సలసలా కాగే నీళ్ళకు మధ్య తచ్చాడుతూ ఉంటారు.
55:45 فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు?
55:46 وَلِمَنْ خَافَ مَقَامَ رَبِّهِ جَنَّتَانِ
తమ ప్రభువు ఎదుట నిలబడవలసి ఉందనే భయం కలిగి ఉండేవారికి రెండు తోటలుంటాయి.
55:47 فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు?
55:48 ذَوَاتَا أَفْنَانٍ
(అవి రెండూ) శాఖోపశాఖలుగా విస్తరించి ఉంటాయి.
55:49 فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు?
55:50 فِيهِمَا عَيْنَانِ تَجْرِيَانِ
మరి ఆ రెండు తోటలలోనూ రెండు సెలయేరులు ప్రవహిస్తూ ఉంటాయి.
55:51 فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు?
55:52 فِيهِمَا مِن كُلِّ فَاكِهَةٍ زَوْجَانِ
ఆ రెండు తోటలలోనూ ప్రతి పండు యెక్క రెండేసి రకాలు ఉంటాయి.
55:53 فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు?
55:54 مُتَّكِئِينَ عَلَىٰ فُرُشٍ بَطَائِنُهَا مِنْ إِسْتَبْرَقٍ ۚ وَجَنَى الْجَنَّتَيْنِ دَانٍ
వారు (స్వర్గవాసులు) దళసరి పట్టు వస్త్రపు అస్తరుగల పరుపులపై దిండ్లకు ఆనుకుని (దర్జాగా) ఆసీనులై ఉంటారు. ఆ రెండు తోటల పండ్లు ఫలాలు (వారికి) మరీ దగ్గరగా ఉంటాయి.
55:55 فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు?
55:56 فِيهِنَّ قَاصِرَاتُ الطَّرْفِ لَمْ يَطْمِثْهُنَّ إِنسٌ قَبْلَهُمْ وَلَا جَانٌّ
వాటి మధ్య (బిడియంతో) చూపులు క్రిందికి వాలి ఉండే స్వర్గ కన్యలుంటారు. వీరికి పూర్వం ఆ స్వర్గ కన్యలను ఏ మానవుడుగానీ, ఏ జిన్నుగానీ ముట్టుకొని ఉండడు.
55:57 فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు?
55:58 كَأَنَّهُنَّ الْيَاقُوتُ وَالْمَرْجَانُ
ఆ స్వర్గకన్యలు (అందచందాల రీత్యా స్వచ్చమైన) కెంపులు, పగడాల మాదిరిగా ఉంటారు.
55:59 فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు?
55:60 هَلْ جَزَاءُ الْإِحْسَانِ إِلَّا الْإِحْسَانُ
సద్వ్యవహారానికి ప్రతిఫలం సద్వ్యవహారం గాక మరేం కాగలదు?
55:61 فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు?
55:62 وَمِن دُونِهِمَا جَنَّتَانِ
ఈ రెండు తోటలే గాకుండా మరో రెండు తోటలు కూడా ఉన్నాయి.
55:63 فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు?
55:64 مُدْهَامَّتَانِ
అవి రెండూను గుబురుగా, (రంగులో) ముదురు ఆకుపచ్చగా ఉంటాయి.
55:65 فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు?
55:66 فِيهِمَا عَيْنَانِ نَضَّاخَتَانِ
ఆ రెండు వనాలలో పొంగిపొరలే రెండు సెలయేరులుంటాయి.
55:67 فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు?
55:68 فِيهِمَا فَاكِهَةٌ وَنَخْلٌ وَرُمَّانٌ
ఆ రెండింటిలోనూ పండ్లు, ఖర్జూరాలు, దానిమ్మ కాయలు (పుష్కలంగా) ఉంటాయి.
55:69 فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు?
55:70 فِيهِنَّ خَيْرَاتٌ حِسَانٌ
వాటిలో సౌశీల్యవతులు, సౌందర్యవతులు అయిన స్త్రీలు ఉంటారు.
55:71 فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు?
55:72 حُورٌ مَّقْصُورَاتٌ فِي الْخِيَامِ
గుడారాలలో సురక్షితంగా ఉంచబడిన (ఎర్రని) సుందరాంగులు కూడా ఉన్నారు.
55:73 فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు?
55:74 لَمْ يَطْمِثْهُنَّ إِنسٌ قَبْلَهُمْ وَلَا جَانٌّ
వారికి (ఈ స్వర్గవాసులకు) పూర్వం వారిని ఏ మనిషిగానీ, జిన్నుగానీ ముట్టుకొని ఉండడు.
55:75 فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు?
55:76 مُتَّكِئِينَ عَلَىٰ رَفْرَفٍ خُضْرٍ وَعَبْقَرِيٍّ حِسَانٍ
వారు పచ్చటి పరుపులపై, ఖరీదైన తివాచీలపై దిండ్లకు ఆనుకొని కూర్చుని ఉంటారు.
55:77 فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు?
55:78 تَبَارَكَ اسْمُ رَبِّكَ ذِي الْجَلَالِ وَالْإِكْرَامِ
ఘనత గౌరవాలు గల నీ ప్రభువు నామం ఎంతో శుభప్రదమైనది. - సూరా వాఖియహ్
56:1 إِذَا وَقَعَتِ الْوَاقِعَةُ
ఆ అనివార్య సంఘటన సంభవించినపుడు,
56:2 لَيْسَ لِوَقْعَتِهَا كَاذِبَةٌ
అది సంభవించటంలో ఎలాంటి సందేహం (అసత్యం) లేదు.
56:3 خَافِضَةٌ رَّافِعَةٌ
అది కొందరిని హీనపరుస్తుంది, మరికొందరిని పైకెత్తుతుంది.
56:4 إِذَا رُجَّتِ الْأَرْضُ رَجًّا
భూమి తీవ్రకంపనంతో కంపించి నప్పుడు;
56:5 وَبُسَّتِ الْجِبَالُ بَسًّا
మరియు పర్వతాలు పొడిగా మార్చబడినప్పుడు;
56:6 فَكَانَتْ هَبَاءً مُّنبَثًّا
అప్పుడు వాటి దుమ్ము నలువైపులా నిండిపోయినప్పుడు;
56:7 وَكُنتُمْ أَزْوَاجًا ثَلَاثَةً
మరియు మీరు మూడు వర్గాలుగా విభజించబడతారు.
56:8 فَأَصْحَابُ الْمَيْمَنَةِ مَا أَصْحَابُ الْمَيْمَنَةِ
ఇక కుడిపక్షం వారు, ఆ కుడిపక్షము వారు ఎంత (అదృష్టవంతులు)!
56:9 وَأَصْحَابُ الْمَشْأَمَةِ مَا أَصْحَابُ الْمَشْأَمَةِ
మరికొందరు వామపక్షం వారుంటారు, ఆ వామపక్షపు వారు ఎంత (దౌర్భాగ్యులు)!
56:10 وَالسَّابِقُونَ السَّابِقُونَ
మరియు (ఇహలోకంలో విశ్వాసంలో) ముందున్న వారు (స్వర్గంలో కూడా) ముందుంటారు.
56:11 أُولَٰئِكَ الْمُقَرَّبُونَ
అలాంటి వారు (అల్లాహ్) సాన్నిధ్యాన్ని పొందుతారు.
56:12 فِي جَنَّاتِ النَّعِيمِ
వారు సర్వసుఖాలు గల స్వర్గవనాలలో ఉంటారు.
56:13 ثُلَّةٌ مِّنَ الْأَوَّلِينَ
మొదటి తరాల వారిలో నుండి చాలామంది;
56:14 وَقَلِيلٌ مِّنَ الْآخِرِينَ
మరియు తరువాత తరాల వారిలో నుండి కొంతమంది.
56:15 عَلَىٰ سُرُرٍ مَّوْضُونَةٍ
(బంగారు) జలతారు అల్లిన ఆసనాల మీద;
56:16 مُّتَّكِئِينَ عَلَيْهَا مُتَقَابِلِينَ
ఒకరికొకరు ఎదురెదురుగా, వాటి మీద దిండ్లకు ఆనుకొని కూర్చొని ఉంటారు.
56:17 يَطُوفُ عَلَيْهِمْ وِلْدَانٌ مُّخَلَّدُونَ
వారిచుట్టు ప్రక్కలలో చిరంజీవులైన (నిత్య బాల్యం) గల బాలురు (సేవకులు) తిరుగుతూ ఉంటారు.
56:18 بِأَكْوَابٍ وَأَبَارِيقَ وَكَأْسٍ مِّن مَّعِينٍ
(మధువు) ప్రవహించే చెలమల నుండి నింపిన పాత్రలు, గిన్నెలు మరియు కప్పులతో!
56:19 لَّا يُصَدَّعُونَ عَنْهَا وَلَا يُنزِفُونَ
దాని వలన వారికి తలనొప్పి గానీ లేక మత్తు గానీ కలుగదు.
56:20 وَفَاكِهَةٍ مِّمَّا يَتَخَيَّرُونَ
మరియు వారుకోరే పండ్లూ, ఫలాలు ఉంటాయి.
56:21 وَلَحْمِ طَيْرٍ مِّمَّا يَشْتَهُونَ
మరియు వారు ఇష్టపడే పక్షుల మాంసం.
56:22 وَحُورٌ عِينٌ
మరియు అందమైన కన్నులు గల సుందరాంగులు (హూరున్);
56:23 كَأَمْثَالِ اللُّؤْلُؤِ الْمَكْنُونِ
దాచబడిన ముత్యాలవలే!
56:24 جَزَاءً بِمَا كَانُوا يَعْمَلُونَ
ఇదంతా వారు చేస్తూ ఉండిన వాటికి (సత్కార్యాలకు) ప్రతిఫలంగా!
56:25 لَا يَسْمَعُونَ فِيهَا لَغْوًا وَلَا تَأْثِيمًا
అందులో వారు వ్యర్ధమైన మాటలు గానీ, పాప విషయాలు గానీ వినరు.
56:26 إِلَّا قِيلًا سَلَامًا سَلَامًا
“శాంతి (సలాం) శాంతి (సలాం)!” అనే మాటలు తప్ప!
56:27 وَأَصْحَابُ الْيَمِينِ مَا أَصْحَابُ الْيَمِينِ
మరియు కుడిపక్షం వారు, ఆ కుడిపక్షము వారు ఎంత (అదృష్టవంతులు)!
56:28 فِي سِدْرٍ مَّخْضُودٍ
వారు ముళ్ళు లేని సిద్ ర వృక్షాల మధ్య!
56:29 وَطَلْحٍ مَّنضُودٍ
మరియు పండ్లగెలలతో నిండిన అరటిచెట్లు,
56:30 وَظِلٍّ مَّمْدُودٍ
మరియు వ్యాపించి ఉన్న నీడలు,
56:31 وَمَاءٍ مَّسْكُوبٍ
మరియు ఎల్లప్పుడు ప్రవహించే నీరు,
56:32 وَفَاكِهَةٍ كَثِيرَةٍ
మరియు సమృద్ధిగా ఉన్న పండ్లు ఫలాలు,
56:33 لَّا مَقْطُوعَةٍ وَلَا مَمْنُوعَةٍ
ఎడతెగ కుండా మరియు అంతం కాకుండా (ఉండే వనాలలో);
56:34 وَفُرُشٍ مَّرْفُوعَةٍ
మరియు ఎత్తైన ఆసనాల మీద (కూర్చొని ఉంటారు).
56:35 إِنَّا أَنشَأْنَاهُنَّ إِنشَاءً
నిశ్చయంగా, మేము వారిని ప్రత్యేక సృష్టిగా సృష్టించాము;
56:36 فَجَعَلْنَاهُنَّ أَبْكَارًا
మరియు వారిని (నిర్మలమైన) కన్యలుగా చేశాము;
56:37 عُرُبًا أَتْرَابًا
వారు ప్రేమించే వారుగానూ, సమ వయస్సుగల వారుగానూ (ఉంటారు);
56:38 لِّأَصْحَابِ الْيَمِينِ
కుడిపక్షం వారి కొరకు.
56:39 ثُلَّةٌ مِّنَ الْأَوَّلِينَ
అందులో చాలా మంది మొదటి తరాలకు చెందిన వారుంటారు;
56:40 وَثُلَّةٌ مِّنَ الْآخِرِينَ
మరియు తరువాత తరాల వారిలో నుండి కూడా చాలా మంది ఉంటారు.
56:41 وَأَصْحَابُ الشِّمَالِ مَا أَصْحَابُ الشِّمَالِ
ఇక వామ (ఎడమ) పక్షం వారు; ఆ వామపక్షం వారు ఎంత (దౌర్భాగ్యులు)?
56:42 فِي سَمُومٍ وَحَمِيمٍ
వారు దహించే నరకాగ్నిలో మరియు సలసల కాగే నీటిలో;
56:43 وَظِلٍّ مِّن يَحْمُومٍ
మరియు నల్లటి పొగ ఛాయలో (ఉంటారు).
56:44 لَّا بَارِدٍ وَلَا كَرِيمٍ
అది చల్లగానూ ఉండదు మరియు ఓదార్చేదిగానూ ఉండదు;
56:45 إِنَّهُمْ كَانُوا قَبْلَ ذَٰلِكَ مُتْرَفِينَ
నిశ్చయంగా వారు ఇంతకు ముందు చాలా భోగభాగ్యాలలో పడిఉండిరి;
56:46 وَكَانُوا يُصِرُّونَ عَلَى الْحِنثِ الْعَظِيمِ
మరియు వారు మూర్ఖపు పట్టుతో ఘోరమైన పాపాలలో పడిఉండిరి;
56:47 وَكَانُوا يَقُولُونَ أَئِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا وَعِظَامًا أَإِنَّا لَمَبْعُوثُونَ
మరియు వారు ఇలా అనేవారు: “ఏమీ? మేము మరణించి, మట్టిగా మరియు ఎముకలుగా మారిపోయిన తరువాత కూడా మరల బ్రతికించి లేపబడతామా?
56:48 أَوَآبَاؤُنَا الْأَوَّلُونَ
“మరియు పూర్వీకులైన మా తాత ముత్తాతలు కూడానా?”
56:49 قُلْ إِنَّ الْأَوَّلِينَ وَالْآخِرِينَ
వారితో ఇలా అను: “నిశ్చయంగా, పూర్వీకులు మరియు తరువాత వారు కూడాను!
56:50 لَمَجْمُوعُونَ إِلَىٰ مِيقَاتِ يَوْمٍ مَّعْلُومٍ
“వారందరూ ఆ నిర్ణీతరోజు, ఆ సమయమున సమావేశపరచబడతారు.
56:51 ثُمَّ إِنَّكُمْ أَيُّهَا الضَّالُّونَ الْمُكَذِّبُونَ
“ఇక నిశ్చయంగా మార్గభ్రష్టులైన ఓ అసత్యవాదులారా!
56:52 لَآكِلُونَ مِن شَجَرٍ مِّن زَقُّومٍ
“మీరు ‘జుఖ్ఖూమ్ చెట్టును (ఫలాలను) తింటారు.
56:53 فَمَالِئُونَ مِنْهَا الْبُطُونَ
“దానితో కడుపులు నింపుకుంటారు.
56:54 فَشَارِبُونَ عَلَيْهِ مِنَ الْحَمِيمِ
“తరువాత, దానిమీద సలసల కాగే నీరు త్రాగుతారు.
56:55 فَشَارِبُونَ شُرْبَ الْهِيمِ
“వాస్తవానికి మీరు దానిని దప్పిక గొన్న ఒంటెలవలే త్రాగుతారు.”
56:56 هَٰذَا نُزُلُهُمْ يَوْمَ الدِّينِ
తీర్పుదినం నాడు (ఈ వామపక్షం) వారికి లభించే ఆతిధ్యం ఇదే!
56:57 نَحْنُ خَلَقْنَاكُمْ فَلَوْلَا تُصَدِّقُونَ
మిమ్మల్ని మేమే సృష్టించాము; అయితే మీరెందుకు ఇది సత్యమని నమ్మరు?
56:58 أَفَرَأَيْتُم مَّا تُمْنُونَ
ఏమీ? మీరెప్పుడైనా, మీరు విసర్జించే వీర్యబిందువును గమనించారా?
56:59 أَأَنتُمْ تَخْلُقُونَهُ أَمْ نَحْنُ الْخَالِقُونَ
ఏమీ? మీరా, దానిని సృష్టించే వారు? లేక మేమా దాని సృష్టికర్తలము?
56:60 نَحْنُ قَدَّرْنَا بَيْنَكُمُ الْمَوْتَ وَمَا نَحْنُ بِمَسْبُوقِينَ
మేమే మీ కోసం మరణం నిర్ణయించాం మరియు మమ్మల్ని అధిగమించేది ఏదీ లేదు;
56:61 عَلَىٰ أَن نُّبَدِّلَ أَمْثَالَكُمْ وَنُنشِئَكُمْ فِي مَا لَا تَعْلَمُونَ
మీ రూపాలను మార్చివేసి మీరు ఎరుగని (ఇతర రూపంలో) మిమ్మల్ని సృష్టించటం నుండి.
56:62 وَلَقَدْ عَلِمْتُمُ النَّشْأَةَ الْأُولَىٰ فَلَوْلَا تَذَكَّرُونَ
మరియు వాస్తవానికి మీ మొదటి సృష్టిని గురించి మీరు తెలుసుకున్నారు, అయితే మీరెందుకు గుణపాఠం నేర్చుకోరు?
56:63 أَفَرَأَيْتُم مَّا تَحْرُثُونَ
మీరు నాటే, విత్తనాలను గురించి, మీరెప్పుడైనా ఆలోచించారా?
56:64 أَأَنتُمْ تَزْرَعُونَهُ أَمْ نَحْنُ الزَّارِعُونَ
మీరా వాటిని పండించేది? లేక మేమా వాటిని పండించేవారము?
56:65 لَوْ نَشَاءُ لَجَعَلْنَاهُ حُطَامًا فَظَلْتُمْ تَفَكَّهُونَ
మేము తలచుకుంటే, దానిని పొట్టుగా మార్చివేయగలము, అప్పుడు మీరు ఆశ్చర్యంలో పడిపోతారు.
56:66 إِنَّا لَمُغْرَمُونَ
(మీరు అనేవారు): “నిశ్చయంగా, మేము పాడైపోయాము!
56:67 بَلْ نَحْنُ مَحْرُومُونَ
“కాదుకాదు, మేము దరిద్రుల మయ్యాము!” అని.
56:68 أَفَرَأَيْتُمُ الْمَاءَ الَّذِي تَشْرَبُونَ
ఏమీ? మీరు ఎప్పుడైనా మీరు త్రాగే నీటిని గురించి ఆలోచించారా?
56:69 أَأَنتُمْ أَنزَلْتُمُوهُ مِنَ الْمُزْنِ أَمْ نَحْنُ الْمُنزِلُونَ
మీరా దానిని మేఘాల నుండి కురిపించే వారు? లేక మేమా దానిని కురిపించే వారము?
56:70 لَوْ نَشَاءُ جَعَلْنَاهُ أُجَاجًا فَلَوْلَا تَشْكُرُونَ
మేము తలచుకుంటే దానిని ఎంతో ఉప్పుగా ఉండేలా చేసేవారము! అయినా మీరెందుకు కృతజ్ఞత చూపరు?
56:71 أَفَرَأَيْتُمُ النَّارَ الَّتِي تُورُونَ
మీరు రాజేసే అగ్నిని గమనించారా?
56:72 أَأَنتُمْ أَنشَأْتُمْ شَجَرَتَهَا أَمْ نَحْنُ الْمُنشِئُونَ
దాని వృక్షాన్ని పుట్టించినవారు మీరా? లేక దానిని ఉత్పత్తి చేసినది మేమా?
56:73 نَحْنُ جَعَلْنَاهَا تَذْكِرَةً وَمَتَاعًا لِّلْمُقْوِينَ
మేము దానిని (నరకాగ్నిని), గుర్తు చేసేదిగా మరియు ప్రయాణీకులకు (అవసరం గలవారికి) ప్రయోజనకారిగా చేశాము.
56:74 فَسَبِّحْ بِاسْمِ رَبِّكَ الْعَظِيمِ
కావున సర్వోత్తముడైన నీ ప్రభువు నామాన్ని స్తుతించు.
56:75 فَلَا أُقْسِمُ بِمَوَاقِعِ النُّجُومِ
ఇక నేను నక్షత్రాల స్థానాల (కక్ష్యల) సాక్షిగా చెబుతున్నాను.
56:76 وَإِنَّهُ لَقَسَمٌ لَّوْ تَعْلَمُونَ عَظِيمٌ
మరియు నిశ్చయంగా, మీరు గమనించగలిగితే, ఈ శపథం ఎంతో గొప్పది!
56:77 إِنَّهُ لَقُرْآنٌ كَرِيمٌ
నిశ్చయంగా ఈ ఖుర్ఆన్ దివ్యమైనది.
56:78 فِي كِتَابٍ مَّكْنُونٍ
సురక్షితమైన గ్రంధంలో ఉన్నది.
56:79 لَّا يَمَسُّهُ إِلَّا الْمُطَهَّرُونَ
దానిని పరిశుద్ధులు తప్ప మరెవ్వరూ తాకలేరు.
56:80 تَنزِيلٌ مِّن رَّبِّ الْعَالَمِينَ
ఇది సర్వలోకాల ప్రభువు తరుఫు నుండి అవతరింపజేయబడింది.
56:81 أَفَبِهَٰذَا الْحَدِيثِ أَنتُم مُّدْهِنُونَ
ఏమీ? మీరు ఈ సందేశాన్ని తేలికగా తీసుకుంటున్నారా?
56:82 وَتَجْعَلُونَ رِزْقَكُمْ أَنَّكُمْ تُكَذِّبُونَ
మరియు (అల్లాహ్) మీకు ప్రసాదిస్తున్న జీవనోపాధికి (కృతజ్ఞతలు) చూపక, వాస్తవానికి ఆయనకు మీరు తిరస్కరిస్తున్నారా?
56:83 فَلَوْلَا إِذَا بَلَغَتِ الْحُلْقُومَ
అయితే (చనిపోయేవాడి) ప్రాణం గొంతులోనికి వచ్చినపుడు, మీరెందుకు (ఆపలేరు)?
56:84 وَأَنتُمْ حِينَئِذٍ تَنظُرُونَ
మరియు అప్పుడు మీరు (ఏమీ చేయలేక) చూస్తూ ఉండిపోతారు.
56:85 وَنَحْنُ أَقْرَبُ إِلَيْهِ مِنكُمْ وَلَٰكِن لَّا تُبْصِرُونَ
మరియు అప్పుడు, మేము అతనికి మీకంటే చాలా దగ్గరలో ఉంటాము, కాని మీరు చూడలేక పోతారు.
56:86 فَلَوْلَا إِن كُنتُمْ غَيْرَ مَدِينِينَ
ఒకవేళ మీరు ఎవరి అదుపాజ్ఞలో (అధీనంలో) లేరనుకుంటే,
56:87 تَرْجِعُونَهَا إِن كُنتُمْ صَادِقِينَ
మీరు సత్యవంతులే అయితే దానిని (ఆ ప్రాణాన్ని) ఎందుకు తిరిగి రప్పించుకోలేరు?
56:88 فَأَمَّا إِن كَانَ مِنَ الْمُقَرَّبِينَ
కాని అతడు (మరణించే వాడు), (అల్లాహ్) సాన్నిధ్యాన్ని పొందినవాడైతే!
56:89 فَرَوْحٌ وَرَيْحَانٌ وَجَنَّتُ نَعِيمٍ
అతని కొరకు సుఖసంతోషాలు మరియు తృప్తి మరియు పరమానంద కరమైన స్వర్గవనం ఉంటాయి.
56:90 وَأَمَّا إِن كَانَ مِنْ أَصْحَابِ الْيَمِينِ
మరియు ఎవడైతే కుడిపక్షం వారికి చెందిన వాడో!
56:91 فَسَلَامٌ لَّكَ مِنْ أَصْحَابِ الْيَمِينِ
అతనితో: “నీకు శాంతి కలుగుగాక (సలాం)! నీవు కుడిపక్షం వారిలో చేరావు.” (అని అనబడుతుంది).
56:92 وَأَمَّا إِن كَانَ مِنَ الْمُكَذِّبِينَ الضَّالِّينَ
మరియు ఎవడైతే, అసత్యవాదులు, మార్గభ్రష్టులైన వారిలో చేరుతాడో!
56:93 فَنُزُلٌ مِّنْ حَمِيمٍ
అతని ఆతిధ్యానికి సలసల కాగే నీరు ఉంటుంది.
56:94 وَتَصْلِيَةُ جَحِيمٍ
మరియు భగభగమండే నరకాగ్ని ఉంటుంది.
56:95 إِنَّ هَٰذَا لَهُوَ حَقُّ الْيَقِينِ
నిశ్చయంగా, ఇది రూడీ అయిన నమ్మదగిన సత్యం!
56:96 فَسَبِّحْ بِاسْمِ رَبِّكَ الْعَظِيمِ
కావున సర్వోత్తముడైన నీ ప్రభువు పేరును స్తుతించు. - సూరా అల్ హదీద్
57:1 سَبَّحَ لِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ
ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న వస్తువులన్నీ అల్లాహ్ పవిత్రతను కొనియాడుతున్నాయి. ఆయన గొప్ప శక్తిశాలి, వివేచనాశీలి.
57:2 لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ يُحْيِي وَيُمِيتُ ۖ وَهُوَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
భూమ్యాకాశాల సార్వభౌమత్వం ఆయనదే. జీవన్మరణాల ప్రదాత ఆయనే. ఆయన ప్రతిదీ చేయగల అధికారం గలవాడు.
57:3 هُوَ الْأَوَّلُ وَالْآخِرُ وَالظَّاهِرُ وَالْبَاطِنُ ۖ وَهُوَ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ
ఆయనే మొదటివాడు, చివరివాడు. ఆయనే బాహ్యం. ఆయనే నిగూఢం. ఆయన ప్రతిదీ తెలిసినవాడు.
57:4 هُوَ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ فِي سِتَّةِ أَيَّامٍ ثُمَّ اسْتَوَىٰ عَلَى الْعَرْشِ ۚ يَعْلَمُ مَا يَلِجُ فِي الْأَرْضِ وَمَا يَخْرُجُ مِنْهَا وَمَا يَنزِلُ مِنَ السَّمَاءِ وَمَا يَعْرُجُ فِيهَا ۖ وَهُوَ مَعَكُمْ أَيْنَ مَا كُنتُمْ ۚ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ
ఆయనే భూమ్యాకాశాలను ఆరు రోజులలో సృష్టించాడు. ఆ తరువాత సింహాసనాన్ని అధిష్టించాడు. భూమి లోపలికి పోయేదీ, అందులో నుంచి బయల్పడేదీ, ఆకాశం నుంచి క్రిందికి దిగేదీ, మరందులోకి ఎక్కిపోయేదీ – అంతా ఆయనకు (బాగా)తెలుసు. మీరెక్కడ ఉన్నా ఆయన మీతోనే ఉంటాడు. మరి మీరు చేసే పనులన్నింటినీ అల్లాహ్ చూస్తూనే ఉన్నాడు.
57:5 لَّهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ وَإِلَى اللَّهِ تُرْجَعُ الْأُمُورُ
భూమ్యాకాశాల సార్వ భౌమత్వం ఆయనదే. సమస్త వ్యవహారాలు (తీర్పు నిమిత్తం) ఆయన వైపుకే మరలించబడతాయి.
57:6 يُولِجُ اللَّيْلَ فِي النَّهَارِ وَيُولِجُ النَّهَارَ فِي اللَّيْلِ ۚ وَهُوَ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ
ఆయనే రాత్రిని పగటిలోనికి ప్రవేశింపజేస్తున్నాడు, మరి ఆయనే పగటిని రాత్రిలోనికి జొప్పిస్తున్నాడు. ఆయన గుండెల్లోని గుట్టును (సయితం) బాగా ఎరిగినవాడు.
57:7 آمِنُوا بِاللَّهِ وَرَسُولِهِ وَأَنفِقُوا مِمَّا جَعَلَكُم مُّسْتَخْلَفِينَ فِيهِ ۖ فَالَّذِينَ آمَنُوا مِنكُمْ وَأَنفَقُوا لَهُمْ أَجْرٌ كَبِيرٌ
మీరు అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను విశ్వసించండి. అల్లాహ్ మిమ్మల్ని ఏ సంపదకైతే వారసులుగా చేశాడో అందులో నుంచి ఖర్చుచేయండి. మరి మీలో విశ్వసించి, దానధర్మాలు చేసే వారికి గొప్ప పుణ్యఫలం లభిస్తుంది.
57:8 وَمَا لَكُمْ لَا تُؤْمِنُونَ بِاللَّهِ ۙ وَالرَّسُولُ يَدْعُوكُمْ لِتُؤْمِنُوا بِرَبِّكُمْ وَقَدْ أَخَذَ مِيثَاقَكُمْ إِن كُنتُم مُّؤْمِنِينَ
మీరు అల్లాహ్ ను ఎందుకు విశ్వసించరు? అసలు మీకేమైపోయింది? చూడబోతే దైవప్రవక్త స్వయంగా మీ ప్రభువును విశ్వసించమని మీకు పిలుపు ఇస్తున్నాడు. మీరు నిజంగా విశ్వసించిన వారైతే ఆయన మీ నుండి గట్టి వాగ్దానం కూడా తీసుకున్నాడు (అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి).
57:9 هُوَ الَّذِي يُنَزِّلُ عَلَىٰ عَبْدِهِ آيَاتٍ بَيِّنَاتٍ لِّيُخْرِجَكُم مِّنَ الظُّلُمَاتِ إِلَى النُّورِ ۚ وَإِنَّ اللَّهَ بِكُمْ لَرَءُوفٌ رَّحِيمٌ
మిమ్మల్ని కారుచీకట్ల నుంచి వెలికితీసి కాంతి వైపు తీసుకుపోవటానికి తన దాసునిపై తేటతెల్లమైన ఆయతులను అవతరింప చేసినవాడు ఆయనే (అల్లాహ్ యే). నిశ్చయంగా అల్లాహ్ మీ యెడల మృదు స్వభావి, దయాశీలి.
57:10 وَمَا لَكُمْ أَلَّا تُنفِقُوا فِي سَبِيلِ اللَّهِ وَلِلَّهِ مِيرَاثُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ لَا يَسْتَوِي مِنكُم مَّنْ أَنفَقَ مِن قَبْلِ الْفَتْحِ وَقَاتَلَ ۚ أُولَٰئِكَ أَعْظَمُ دَرَجَةً مِّنَ الَّذِينَ أَنفَقُوا مِن بَعْدُ وَقَاتَلُوا ۚ وَكُلًّا وَعَدَ اللَّهُ الْحُسْنَىٰ ۚ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ خَبِيرٌ
మీరు అల్లాహ్ మార్గంలో ఖర్చుపెట్టక పోవటానికి కారణం ఏమిటి? అసలు మీకేమయింది? వాస్తవానికి భూమ్యకాశాలలోని వారసత్వం అంతా అల్లాహ్ కే చెందుతుంది. మీలో (మక్కా) విజయానికి పూర్వం దైవమార్గంలో ఖర్చుచేసినవారు, పోరాడినవారూ – ఇతరులూ సమానులు కాలేరు. (మక్కా) విజయం తర్వాత ఖర్చుచేసి, పోరాడిన వారికంటే వీరు గొప్ప అంతస్థులు కలవారు. అయితే మేలు చేస్తానన్న అల్లాహ్ వాగ్దానం మాత్రం వీరందరికీ వర్తిస్తుంది. మీరు చేసేదంతా అల్లాహ్ కు తెలుసు.
57:11 مَّن ذَا الَّذِي يُقْرِضُ اللَّهَ قَرْضًا حَسَنًا فَيُضَاعِفَهُ لَهُ وَلَهُ أَجْرٌ كَرِيمٌ
అల్లాహ్ కు ఉత్తమ (రీతిలో) రుణం ఇచ్చేవాడెవడు? దాన్ని ఆయన అతని కోసం పెంచుతూపోతాడు. అతని యెడల అది అత్యుత్తమ ప్రతిఫలంగా రూపొందుతుంది.
57:12 يَوْمَ تَرَى الْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ يَسْعَىٰ نُورُهُم بَيْنَ أَيْدِيهِمْ وَبِأَيْمَانِهِم بُشْرَاكُمُ الْيَوْمَ جَنَّاتٌ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا ۚ ذَٰلِكَ هُوَ الْفَوْزُ الْعَظِيمُ
ఆ రోజు (ప్రళయదినాన) విశ్వాసులైన పురుషులను, విశ్వాసులైన స్త్రీలను నీవు చూస్తావు. వారి కాంతి వారికి ముందు వైపున, కుడి వైపున పరిగెడుతూ ఉంటుంది. “ఈ రోజు మీకో శుభవార్త! క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలు మీ కోసం ఉన్నాయి. అందులో మీరు కలకాలం ఉంటారు. ఇదే గొప్ప సాఫల్యం!” (అని వారితో అనబడుతుంది).
57:13 يَوْمَ يَقُولُ الْمُنَافِقُونَ وَالْمُنَافِقَاتُ لِلَّذِينَ آمَنُوا انظُرُونَا نَقْتَبِسْ مِن نُّورِكُمْ قِيلَ ارْجِعُوا وَرَاءَكُمْ فَالْتَمِسُوا نُورًا فَضُرِبَ بَيْنَهُم بِسُورٍ لَّهُ بَابٌ بَاطِنُهُ فِيهِ الرَّحْمَةُ وَظَاهِرُهُ مِن قِبَلِهِ الْعَذَابُ
ఆ రోజు కపటులైన పురుషులు, కపటులైన స్త్రీలు విశ్వాసులనుద్దేశించి, “కాస్త మాకోసం ఆగండి! మేము కూడా మీ కాంతి నుండి కాస్త లబ్దిపొందుతాం” అని అంటారు. “మీరు వెనక్కి మరలండి. వెలుతురును అక్కడే వెతుక్కోండి” అని వారికి సమాధానం ఇవ్వబడుతుంది. మరి వారి మధ్య ఒక అడ్డుగోడ ఏర్పరచబడుతుంది. అందులో ఒక ద్వారం కూడా ఉంటుంది. దాని లోపలి వైపు కారుణ్యం ఉంటుంది. బయటి వైపు మాత్రం యాతన ఉంటుంది.
57:14 يُنَادُونَهُمْ أَلَمْ نَكُن مَّعَكُمْ ۖ قَالُوا بَلَىٰ وَلَٰكِنَّكُمْ فَتَنتُمْ أَنفُسَكُمْ وَتَرَبَّصْتُمْ وَارْتَبْتُمْ وَغَرَّتْكُمُ الْأَمَانِيُّ حَتَّىٰ جَاءَ أَمْرُ اللَّهِ وَغَرَّكُم بِاللَّهِ الْغَرُورُ
వీళ్ళు (కపటులు) వారిని (విశ్వాసులను) బిగ్గరగా పిలుస్తూ, “మేము మీ వెంటలేమా?!” అనంటారు. దానికి వారు, “అవును. మా వెంట ఉన్న సంగతి నిజమే. కాని మీరు మీ ఆత్మలను వంచించుకున్నారు. (మా పై గడ్డుకాలం రావాలని) ఎదురు చూశారు. సందేహాలలో ఊగిసలాడారు. పనికిమాలిన మీ అభిలాషలే మిమ్మల్ని దగా చేశాయి. ఎట్టకేలకు దైవాజ్ఞ రానే వచ్చింది. అల్లాహ్ విషయంలో మోసగించినవాడు (షైతాన్), మిమ్మల్ని (కడ దాకా) మోసంలోనే ఉంచాడు.”
57:15 فَالْيَوْمَ لَا يُؤْخَذُ مِنكُمْ فِدْيَةٌ وَلَا مِنَ الَّذِينَ كَفَرُوا ۚ مَأْوَاكُمُ النَّارُ ۖ هِيَ مَوْلَاكُمْ ۖ وَبِئْسَ الْمَصِيرُ
ఏమైనా ఈ రోజు మీనుండి గానీ, అవిశ్వాసుల నుండి గానీ పరిహారం తీసుకోబడదు. మీ అందరి నివాస స్థలం నరకాగ్నే. అదే మీ నేస్తం. అది మహా చెడ్డ గమ్యస్థానం.
57:16 أَلَمْ يَأْنِ لِلَّذِينَ آمَنُوا أَن تَخْشَعَ قُلُوبُهُمْ لِذِكْرِ اللَّهِ وَمَا نَزَلَ مِنَ الْحَقِّ وَلَا يَكُونُوا كَالَّذِينَ أُوتُوا الْكِتَابَ مِن قَبْلُ فَطَالَ عَلَيْهِمُ الْأَمَدُ فَقَسَتْ قُلُوبُهُمْ ۖ وَكَثِيرٌ مِّنْهُمْ فَاسِقُونَ
ఏమిటీ, విశ్వాసుల హృదయాలు అల్లాహ్ జ్ఞాపకం పట్ల, ఆయన అవతరింపజేసిన సత్యం పట్ల మెత్తబడే సమయం ఇంకా వారికి ఆసన్నం కాలేదా? వీరికి మునుపు గ్రంథం వొసగబడిన వారి మాదిరిగా వీరు కాకూడదు. మరి ఆ గ్రంథవహులపై ఒక సుదీర్ఘకాలం గడచిపోయేసరికి వారి హృదయాలు కఠినమై పోయాయి. వారిలో చాలామంది అవిధేయులు.
57:17 اعْلَمُوا أَنَّ اللَّهَ يُحْيِي الْأَرْضَ بَعْدَ مَوْتِهَا ۚ قَدْ بَيَّنَّا لَكُمُ الْآيَاتِ لَعَلَّكُمْ تَعْقِلُونَ
బాగా తెలుసుకోండి! భూమి మృతి చెందిన మీదట, అల్లాహ్ యే దానిని తిరిగి బ్రతికిస్తున్నాడు. మీరు అర్ధం చేసుకునేటందుకు మేము మా సూచనలను బాగా విడమరచి చెప్పాము.
57:18 إِنَّ الْمُصَّدِّقِينَ وَالْمُصَّدِّقَاتِ وَأَقْرَضُوا اللَّهَ قَرْضًا حَسَنًا يُضَاعَفُ لَهُمْ وَلَهُمْ أَجْرٌ كَرِيمٌ
నిశ్చయంగా దానధర్మాలు చేసే పురుషులు, దానధర్మాలు చేసే స్త్రీలు, అల్లాహ్ కు (చిత్తశుద్ధితో) మంచి ఋణం ఇచ్చేవారు – వారు ఇచ్చినది వారి కొరకు పెంచబడుతుంది. మరి వారి కొరకు గౌరవప్రదమైన ప్రతిఫలం ఉంది.
57:19 وَالَّذِينَ آمَنُوا بِاللَّهِ وَرُسُلِهِ أُولَٰئِكَ هُمُ الصِّدِّيقُونَ ۖ وَالشُّهَدَاءُ عِندَ رَبِّهِمْ لَهُمْ أَجْرُهُمْ وَنُورُهُمْ ۖ وَالَّذِينَ كَفَرُوا وَكَذَّبُوا بِآيَاتِنَا أُولَٰئِكَ أَصْحَابُ الْجَحِيمِ
మరెవరైతే అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను విశ్వసిస్తారో వారే తమ ప్రభువు దగ్గర సత్యవంతులు, సాక్షులు. వారికొరకు వారి పుణ్యఫలం కూడా ఉంటుంది. వారి జ్యోతి కూడా ఉంటుంది. మరెవరైతే అవిశ్వాసులై మా సూచనలను ధిక్కరించారో వారే నరకవాసులవుతారు.
57:20 اعْلَمُوا أَنَّمَا الْحَيَاةُ الدُّنْيَا لَعِبٌ وَلَهْوٌ وَزِينَةٌ وَتَفَاخُرٌ بَيْنَكُمْ وَتَكَاثُرٌ فِي الْأَمْوَالِ وَالْأَوْلَادِ ۖ كَمَثَلِ غَيْثٍ أَعْجَبَ الْكُفَّارَ نَبَاتُهُ ثُمَّ يَهِيجُ فَتَرَاهُ مُصْفَرًّا ثُمَّ يَكُونُ حُطَامًا ۖ وَفِي الْآخِرَةِ عَذَابٌ شَدِيدٌ وَمَغْفِرَةٌ مِّنَ اللَّهِ وَرِضْوَانٌ ۚ وَمَا الْحَيَاةُ الدُّنْيَا إِلَّا مَتَاعُ الْغُرُورِ
బాగా తెలుసుకోండి! ఈ ప్రాపంచిక జీవితం ఒక ఆట, తమాషా, అలంకార ప్రాయం, పరస్పరం బడాయిని చాటుకోవటం, సిరిసంపదలు, సంతానం విషయంలో ఒండొకరిని మించిపోవడానికి ప్రయత్నించటం మాత్రమే. (దీని) ఉపమానం వర్షపు నీరు లాంటిది. దానివల్ల మొలచిన పైరు రైతులను అలరిస్తుంది. మరి ఆ పంట ఎండిపోగానే అది పసుపువన్నెగా మారిపోవటం నీవు చూస్తావు. ఆ తరువాత అది పొట్టు పొట్టుగా తయారవుతుంది. మరి పరలోకంలో మాత్రం తీవ్రమైన శిక్ష ఉంది, అల్లాహ్ తరఫున క్షమాపణ, ఆయన ప్రీతి కూడా ఉంది. మొత్తానికి ప్రాపంచిక జీవితం మభ్యపెట్టే వస్తువు తప్ప మరేమీ కాదు.
57:21 سَابِقُوا إِلَىٰ مَغْفِرَةٍ مِّن رَّبِّكُمْ وَجَنَّةٍ عَرْضُهَا كَعَرْضِ السَّمَاءِ وَالْأَرْضِ أُعِدَّتْ لِلَّذِينَ آمَنُوا بِاللَّهِ وَرُسُلِهِ ۚ ذَٰلِكَ فَضْلُ اللَّهِ يُؤْتِيهِ مَن يَشَاءُ ۚ وَاللَّهُ ذُو الْفَضْلِ الْعَظِيمِ
(రండి!) మీ ప్రభువు క్షమాభిక్ష వైపు పరుగెత్తండి. ఇంకా, భూమ్యాకాశాలంత వెడల్పు గల స్వర్గం వైపు పరుగిడండి. అల్లాహ్ ను, ఆయన ప్రవక్తలను విశ్వసించే వారికోసం అది తయారు చేయబడింది. ఇది అల్లాహ్ అనుగ్రహం! ఆయన దీనిని తాను కోరిన వారికి ఇస్తాడు. అల్లాహ్ గొప్ప అనుగ్రహం కలవాడు.
57:22 مَا أَصَابَ مِن مُّصِيبَةٍ فِي الْأَرْضِ وَلَا فِي أَنفُسِكُمْ إِلَّا فِي كِتَابٍ مِّن قَبْلِ أَن نَّبْرَأَهَا ۚ إِنَّ ذَٰلِكَ عَلَى اللَّهِ يَسِيرٌ
ఏ ఆపద అయినాసరే – అది భూమిలో వచ్చేదైనా, స్వయంగా మీ ప్రాణాలపైకి వచ్చేదైనా – మేము దానిని పుట్టించకమునుపే అదొక ప్రత్యేక గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఇలా చేయటం అల్లాహ్ కు చాలా తేలిక.
57:23 لِّكَيْلَا تَأْسَوْا عَلَىٰ مَا فَاتَكُمْ وَلَا تَفْرَحُوا بِمَا آتَاكُمْ ۗ وَاللَّهُ لَا يُحِبُّ كُلَّ مُخْتَالٍ فَخُورٍ
పోయే దానిపై మీరు దుఖించకుండా, ప్రసాదించబడిన దానిపై మిడిసిపడకుండా ఉండాలని (మీకీ సంగతి తెలియజేయబడింది). అదిరిపడే ఏ అహంభావినీ అల్లాహ్ ఇష్టపడడు సుమా!
57:24 الَّذِينَ يَبْخَلُونَ وَيَأْمُرُونَ النَّاسَ بِالْبُخْلِ ۗ وَمَن يَتَوَلَّ فَإِنَّ اللَّهَ هُوَ الْغَنِيُّ الْحَمِيدُ
వారెలాంటి వారంటే తాము (స్వయంగా) పిసినారితనం చూపటమే గాక ఇతరులను (కూడా) పిసినారితనానికి పురికొల్పుతారు. ఎవడు (అల్లాహ్ మార్గం నుండి) ముఖం త్రిప్పుకుని పోయినా అల్లాహ్ అక్కరలేనివాడు, స్తోత్రనీయుడన్న సంగతిని అతను గుర్తుంచుకోవాలి.
57:25 لَقَدْ أَرْسَلْنَا رُسُلَنَا بِالْبَيِّنَاتِ وَأَنزَلْنَا مَعَهُمُ الْكِتَابَ وَالْمِيزَانَ لِيَقُومَ النَّاسُ بِالْقِسْطِ ۖ وَأَنزَلْنَا الْحَدِيدَ فِيهِ بَأْسٌ شَدِيدٌ وَمَنَافِعُ لِلنَّاسِ وَلِيَعْلَمَ اللَّهُ مَن يَنصُرُهُ وَرُسُلَهُ بِالْغَيْبِ ۚ إِنَّ اللَّهَ قَوِيٌّ عَزِيزٌ
నిశ్చయంగా మేము మా ప్రవక్తలకు స్పష్టమైన నిదర్శనాలను ఇచ్చి పంపాము. వారితో పాటు గ్రంథాన్ని, ధర్మకాటాను కూడా అవతరింపజేశాము – ప్రజలు న్యాయంపై నిలిచి ఉండటానికి! ఇంకా మేము ఇనుమును కూడా అవతరింపజేశాము. అందులో చాలా బలం ఉంది, జనుల కొరకు (ఇతరత్రా) ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇంకా – చూడకుండానే తనకు, తన ప్రవక్తలకు తోడ్పడే వారెవరో అల్లాహ్ తెలుసుకోదలిచాడు. నిస్సందేహంగా అల్లాహ్ మహాబలుడు, తిరుగులేనివాడు.
57:26 وَلَقَدْ أَرْسَلْنَا نُوحًا وَإِبْرَاهِيمَ وَجَعَلْنَا فِي ذُرِّيَّتِهِمَا النُّبُوَّةَ وَالْكِتَابَ ۖ فَمِنْهُم مُّهْتَدٍ ۖ وَكَثِيرٌ مِّنْهُمْ فَاسِقُونَ
మేము నూహును, ఇబ్రాహీమును ప్రవక్తలుగా చేసి పంపాము. మరి వారిద్దరి సంతతిలో ప్రవక్త పదవిని, గ్రంథ పరంపరను ఉంచాము. అయితే వారిలో కొందరు సన్మార్గ భాగ్యం పొందగా, అత్యధికులు అవిధేయులయ్యారు.
57:27 ثُمَّ قَفَّيْنَا عَلَىٰ آثَارِهِم بِرُسُلِنَا وَقَفَّيْنَا بِعِيسَى ابْنِ مَرْيَمَ وَآتَيْنَاهُ الْإِنجِيلَ وَجَعَلْنَا فِي قُلُوبِ الَّذِينَ اتَّبَعُوهُ رَأْفَةً وَرَحْمَةً وَرَهْبَانِيَّةً ابْتَدَعُوهَا مَا كَتَبْنَاهَا عَلَيْهِمْ إِلَّا ابْتِغَاءَ رِضْوَانِ اللَّهِ فَمَا رَعَوْهَا حَقَّ رِعَايَتِهَا ۖ فَآتَيْنَا الَّذِينَ آمَنُوا مِنْهُمْ أَجْرَهُمْ ۖ وَكَثِيرٌ مِّنْهُمْ فَاسِقُونَ
మరి వారి వెనుకే మేము మా ప్రవక్తలను నిరంతరం పంపసాగాము. వారి తరువాత మర్యం కుమారుడైన ఈసాను పంపాము. అతనికి ఇంజీలు గ్రంథాన్ని వొసగాము. అతన్ని అనుసరించే వారి హృదయాలలో మృదుత్వాన్ని, జాలిని సృజించాము. మరైతే సన్యాసత్వాన్ని (రహ్ బానియత్) వారంతట వారే ఆవిష్కరించారు. మేము మాత్రం దీనిని వారిపై విధించలేదు. దైవప్రీతిని తప్ప! మరి వారు దానికి తగురీతిలో కట్టుబడి ఉండలేకపోయారు. అయినప్పటికీ మేము వారిలో విశ్వసించిన వారికి వారి పుణ్య ఫలాన్ని ప్రసాదించాము. వారిలో అధికులు మాత్రం అవిధేయులుగా తయారయ్యారు.
57:28 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَآمِنُوا بِرَسُولِهِ يُؤْتِكُمْ كِفْلَيْنِ مِن رَّحْمَتِهِ وَيَجْعَل لَّكُمْ نُورًا تَمْشُونَ بِهِ وَيَغْفِرْ لَكُمْ ۚ وَاللَّهُ غَفُورٌ رَّحِيمٌ
ఓ విశ్వాసులారా! అల్లాహ్ కు భయపడండి. అతని ప్రవక్తను విశ్వసించండి. అల్లాహ్ మీకు తన కారుణ్యం నుంచి రెట్టింపు భాగాన్ని ప్రసాదిస్తాడు. ఇంకా మీకు జ్యోతిని అనుగ్రహిస్తాడు. దాని వెలుగులో మీరు నడుస్తారు. ఆయన మీ పాపాలను కూడా క్షమిస్తాడు. అల్లాహ్ గొప్ప క్షమాశీలి, దయాశీలి.
57:29 لِّئَلَّا يَعْلَمَ أَهْلُ الْكِتَابِ أَلَّا يَقْدِرُونَ عَلَىٰ شَيْءٍ مِّن فَضْلِ اللَّهِ ۙ وَأَنَّ الْفَضْلَ بِيَدِ اللَّهِ يُؤْتِيهِ مَن يَشَاءُ ۚ وَاللَّهُ ذُو الْفَضْلِ الْعَظِيمِ
దైవానుగ్రహంలోని ఏ భాగంపై కూడా తమకెలాంటి అధికారం లేదని, అనుగ్రహమంతా దేవుని చేతిలోనే ఉందని, ఆయన తను కోరిన వారికి దాన్ని ప్రసాదిస్తాడని గ్రంథ ప్రజలు తెలుసుకోవాలని (ఆయన ఈ విధంగా చేశాడు). అల్లాహ్ గొప్ప అనుగ్రహం కలవాడు. - సూరా అల్ ముజాదల హ్
58:1 قَدْ سَمِعَ اللَّهُ قَوْلَ الَّتِي تُجَادِلُكَ فِي زَوْجِهَا وَتَشْتَكِي إِلَى اللَّهِ وَاللَّهُ يَسْمَعُ تَحَاوُرَكُمَا ۚ إِنَّ اللَّهَ سَمِيعٌ بَصِيرٌ
(ఓ ప్రవక్తా!) తన భర్త విషయమై నీతో వాదిస్తూ, అల్లాహ్ కు ఫిర్యాదు చేసుకుంటూ ఉన్న ఆ స్త్రీ మాటను అల్లాహ్ విన్నాడు. ఇంకా, అల్లాహ్ మీరిద్దరి మధ్య జరిగిన సంవాదనను (కూడా) విన్నాడు. నిశ్చయంగా అల్లాహ్ (అంతా) వినేవాడు, చూసేవాడు.
58:2 الَّذِينَ يُظَاهِرُونَ مِنكُم مِّن نِّسَائِهِم مَّا هُنَّ أُمَّهَاتِهِمْ ۖ إِنْ أُمَّهَاتُهُمْ إِلَّا اللَّائِي وَلَدْنَهُمْ ۚ وَإِنَّهُمْ لَيَقُولُونَ مُنكَرًا مِّنَ الْقَوْلِ وَزُورًا ۚ وَإِنَّ اللَّهَ لَعَفُوٌّ غَفُورٌ
మీలో ఎవరైనాసరే తమ భార్యలపై ‘జిహార్’ను ప్రయోగించినంత మాత్రాన (నీవు నా తల్లి వీపు లాంటి దానివి అని నోరు జారినంత మాత్రాన) వారు వారికి తల్లులైపోరు. వారిని కన్నవారు మాత్రమే వాస్తవానికి వారి తల్లులు. నిజానికి ఈ విధంగా పలికేవారు అసహ్యమైన మాటను, అబద్ధాన్ని పలికారు. నిశ్చయంగా అల్లాహ్ మన్నించేవాడు, క్షమాభిక్షపెట్టేవాడూను.
58:3 وَالَّذِينَ يُظَاهِرُونَ مِن نِّسَائِهِمْ ثُمَّ يَعُودُونَ لِمَا قَالُوا فَتَحْرِيرُ رَقَبَةٍ مِّن قَبْلِ أَن يَتَمَاسَّا ۚ ذَٰلِكُمْ تُوعَظُونَ بِهِ ۚ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ خَبِيرٌ
మరెవరైనా తమ భార్యలపై ‘జిహార్’ను ప్రయోగించి, తమ నోటి ద్వారా జారిపోయిన (తప్పుడు) మాటను ఉపసంహరించదలచుకుంటే వారు ఒకరినొకరు తాకకముందే అతను ఒక బానిసకు స్వేచ్ఛను ప్రసాదించాలి. దీని ద్వారా మీకు గుణపాఠం నేర్పబడుతున్నది. మీరు చేసేదంతా అల్లాహ్ కు తెలుసు.
58:4 فَمَن لَّمْ يَجِدْ فَصِيَامُ شَهْرَيْنِ مُتَتَابِعَيْنِ مِن قَبْلِ أَن يَتَمَاسَّا ۖ فَمَن لَّمْ يَسْتَطِعْ فَإِطْعَامُ سِتِّينَ مِسْكِينًا ۚ ذَٰلِكَ لِتُؤْمِنُوا بِاللَّهِ وَرَسُولِهِ ۚ وَتِلْكَ حُدُودُ اللَّهِ ۗ وَلِلْكَافِرِينَ عَذَابٌ أَلِيمٌ
ఈ స్థోమత లేనివాడు, భార్యాభర్తలు పరస్పరం ముట్టుకోకముందే అతను రెండు మాసాలపాటు ఎడతెగకుండా ఉపవాసాలు పాటించాలి. ఈపాటి శక్తి కూడా లేనివాడు అరవై మంది అగత్యపరులకు అన్నం పెట్టాలి. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తపై మీ పరిపూర్ణ విశ్వాసం రూడీ కావటానికే ఇది మీపై విధించబడింది. ఇవి అల్లాహ్ నిర్ణయించిన హద్దులు. అవిశ్వాసులకు బాధాకరమైన శిక్ష ఖాయం.
58:5 إِنَّ الَّذِينَ يُحَادُّونَ اللَّهَ وَرَسُولَهُ كُبِتُوا كَمَا كُبِتَ الَّذِينَ مِن قَبْلِهِمْ ۚ وَقَدْ أَنزَلْنَا آيَاتٍ بَيِّنَاتٍ ۚ وَلِلْكَافِرِينَ عَذَابٌ مُّهِينٌ
అల్లాహ్ ఆయన ప్రవక్తకు వ్యతిరేకంగా వ్యవహరించేవారు వారి పూర్వీకులు పరాభవం పాలైనట్లే పరాభవం పాలవుతారు. నిశ్చయంగా మేము స్పష్టమైన నిదర్శనాలను అవతరింపజేసి ఉన్నాము. అవిశ్వాసులకు అవమానకరమయిన శిక్ష తథ్యం.
58:6 يَوْمَ يَبْعَثُهُمُ اللَّهُ جَمِيعًا فَيُنَبِّئُهُم بِمَا عَمِلُوا ۚ أَحْصَاهُ اللَّهُ وَنَسُوهُ ۚ وَاللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ شَهِيدٌ
ఏ రోజున అల్లాహ్ వారందరినీ తిరిగి లేపుతాడో అప్పుడు వారికి వారు చేసుకున్న కర్మలను తెలియపరుస్తాడు. అల్లాహ్ దాన్ని లెక్కించి పెట్టాడు. వారు మాత్రం దానిని మరచిపోయారు. కాని అల్లాహ్ అన్నింటికీ సాక్షిగా ఉన్నాడు.
58:7 أَلَمْ تَرَ أَنَّ اللَّهَ يَعْلَمُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۖ مَا يَكُونُ مِن نَّجْوَىٰ ثَلَاثَةٍ إِلَّا هُوَ رَابِعُهُمْ وَلَا خَمْسَةٍ إِلَّا هُوَ سَادِسُهُمْ وَلَا أَدْنَىٰ مِن ذَٰلِكَ وَلَا أَكْثَرَ إِلَّا هُوَ مَعَهُمْ أَيْنَ مَا كَانُوا ۖ ثُمَّ يُنَبِّئُهُم بِمَا عَمِلُوا يَوْمَ الْقِيَامَةِ ۚ إِنَّ اللَّهَ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ
భూమ్యాకాశాలలో ఉన్న ప్రతి వస్తువు గురించి అల్లాహ్ కు తెలుసన్నది నీవు చూడటం లేదా? నాల్గవవాడుగా అల్లాహ్ లేకుండా ఏ ముగ్గురి మధ్య కూడా రహస్య మంతనాలు జరగవు. అరవవాడుగా అల్లాహ్ లేకుండా ఏ ఐదుగురి మధ్యన కూడా (రహస్య సమాలోచనలు సాగవు). అంతకన్నా తక్కువ మంది ఉన్నా, ఎక్కువ మంది ఉన్నా – వారెక్కడ ఉన్నా – ఆయన వారితో ఉంటాడు. మరి వారు చేసుకున్నవన్నీ ప్రళయదినాన వారికి తెలియపరుస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ అన్నీ తెలిసినవాడు.
58:8 أَلَمْ تَرَ إِلَى الَّذِينَ نُهُوا عَنِ النَّجْوَىٰ ثُمَّ يَعُودُونَ لِمَا نُهُوا عَنْهُ وَيَتَنَاجَوْنَ بِالْإِثْمِ وَالْعُدْوَانِ وَمَعْصِيَتِ الرَّسُولِ وَإِذَا جَاءُوكَ حَيَّوْكَ بِمَا لَمْ يُحَيِّكَ بِهِ اللَّهُ وَيَقُولُونَ فِي أَنفُسِهِمْ لَوْلَا يُعَذِّبُنَا اللَّهُ بِمَا نَقُولُ ۚ حَسْبُهُمْ جَهَنَّمُ يَصْلَوْنَهَا ۖ فَبِئْسَ الْمَصِيرُ
రహస్య మంతనాలు జరపరాదని వారించబడినవారిని నీవు చూడలేదా? అయినాసరే వారు వారింపబడిన దానికే మళ్ళి పాల్పడుతున్నారు. వారు పాపం, అత్యాచారం, ప్రవక్త పట్ల అవిధేయతలకు సంబంధించిన రహస్య మంతనాలను సాగిస్తున్నారు. వారు నీ దగ్గరకు వచ్చినపుడు, అల్లాహ్ నీకు ఏ పదజాలంతో సలాం చెయ్యలేదో ఆ పదజాలంతో నీకు సలాం చేస్తారు. పైపెచ్చు, “మనం పలికే ఈ మాటలపై అల్లాహ్ మనల్ని ఎందుకు శిక్షించటం లేదు?!” అని లోలోపలే చెప్పుకుంటారు. వారికి నరకం (యాతన) సరిపోతుంది. వారు అందులోకి ప్రవేశిస్తారు. అది అత్యంత చెడ్డ గమ్యస్థానం.
58:9 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا تَنَاجَيْتُمْ فَلَا تَتَنَاجَوْا بِالْإِثْمِ وَالْعُدْوَانِ وَمَعْصِيَتِ الرَّسُولِ وَتَنَاجَوْا بِالْبِرِّ وَالتَّقْوَىٰ ۖ وَاتَّقُوا اللَّهَ الَّذِي إِلَيْهِ تُحْشَرُونَ
ఓ విశ్వాసులారా! మీరు గనక (పరస్పరం) రహస్య సమాలోచన జరిపితే పాపం, అత్యాచారం, ప్రవక్త పట్ల అవిధేయత గురించిన సమాలోచన జరపకండి. దానికి బదులు సత్కార్యం, భయ భక్తులకు సంబంధించిన సమాలోచన జరపండి. అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. ఆయన వద్దకే మీరంతా సమీకరించబడతారు.
58:10 إِنَّمَا النَّجْوَىٰ مِنَ الشَّيْطَانِ لِيَحْزُنَ الَّذِينَ آمَنُوا وَلَيْسَ بِضَارِّهِمْ شَيْئًا إِلَّا بِإِذْنِ اللَّهِ ۚ وَعَلَى اللَّهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُونَ
విశ్వాసులను వ్యాకుల పరచాలనుకునే (కుత్సిత) సమాలోచనలు షైతాను ప్రేరణలే. అల్లాహ్ అనుజ్ఞ కానంత వరకూ వాడు వారికి ఎలాంటి కీడు కలిగించలేడన్నది నిజం. విశ్వాసులు మాత్రం అల్లాహ్ నే నమ్ముకోవాలి.
58:11 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا قِيلَ لَكُمْ تَفَسَّحُوا فِي الْمَجَالِسِ فَافْسَحُوا يَفْسَحِ اللَّهُ لَكُمْ ۖ وَإِذَا قِيلَ انشُزُوا فَانشُزُوا يَرْفَعِ اللَّهُ الَّذِينَ آمَنُوا مِنكُمْ وَالَّذِينَ أُوتُوا الْعِلْمَ دَرَجَاتٍ ۚ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ خَبِيرٌ
ఓ విశ్వాసులారా! సమావేశాలలో కాస్త ఎడంగా కూర్చోండి అని మీతో అనబడినప్పుడు, మీరు కాస్త ఎడంగా కూర్చోండి. అల్లాహ్ మీకు విశాలాన్ని ప్రసాదిస్తాడు. ‘లేవండి’ అని మీతో అనబడినప్పుడు మీరు లేచినిలబడండి. మీలో విశ్వసించినవారి, జ్ఞానం ప్రసాదించబడినవారి అంతస్థులను అల్లాహ్ పెంచుతాడు. మీరు చేసే ప్రతి పనీ అల్లాహ్ జ్ఞాన పరిధిలో ఉంది.
58:12 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا نَاجَيْتُمُ الرَّسُولَ فَقَدِّمُوا بَيْنَ يَدَيْ نَجْوَاكُمْ صَدَقَةً ۚ ذَٰلِكَ خَيْرٌ لَّكُمْ وَأَطْهَرُ ۚ فَإِن لَّمْ تَجِدُوا فَإِنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ
విశ్వసించిన ఓ ప్రజలారా! మీరు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం తో రహస్య సమాలోచన చేయదలిస్తే, మీరు రహస్య సమాలోచనకు ముందు ఎంతో కొంత దానం చేయండి. ఇది మీ కొరకు ఎంతో ఉత్తమమైనది, పవిత్రమైనది. ఒకవేళ మీకు ఆ స్థోమత లేకపోతే అల్లాహ్ క్షమించేవాడు, కనికరించేవాడు.
58:13 أَأَشْفَقْتُمْ أَن تُقَدِّمُوا بَيْنَ يَدَيْ نَجْوَاكُمْ صَدَقَاتٍ ۚ فَإِذْ لَمْ تَفْعَلُوا وَتَابَ اللَّهُ عَلَيْكُمْ فَأَقِيمُوا الصَّلَاةَ وَآتُوا الزَّكَاةَ وَأَطِيعُوا اللَّهَ وَرَسُولَهُ ۚ وَاللَّهُ خَبِيرٌ بِمَا تَعْمَلُونَ
ఏమిటి, మీ రహస్య సమాలోచనకు ముందు మీరు దానం చేయాలి అనేసరికి భయపడిపోయారా? మీరు ఈ దానధర్మము చేయలేకపోయినప్పుడు అల్లాహ్ కూడా మిమ్మల్ని మన్నించాడు. అందుకే ఇప్పుడు నమాజులను (సజావుగా) నెలకొల్పండి. జకాత్ ను (విధిగా) ఇస్తూ ఉండండి. అల్లాహ్ కు, ఆయన ప్రవక్తకు విధేయత చూపుతూ ఉండండి. మీరు చేసేదంతా అల్లాహ్ కు పూర్తిగా ఎరుకే.
58:14 أَلَمْ تَرَ إِلَى الَّذِينَ تَوَلَّوْا قَوْمًا غَضِبَ اللَّهُ عَلَيْهِم مَّا هُم مِّنكُمْ وَلَا مِنْهُمْ وَيَحْلِفُونَ عَلَى الْكَذِبِ وَهُمْ يَعْلَمُونَ
ఏమిటి, అల్లాహ్ ఆగ్రహానికి గురైన వారితో కుమ్మక్కు అయిన వారిని నీవు చూడలేదా? అసలు వీరు (ఈ కపటులు) మీ వారూ కారు. వాళ్ళ పక్షాన చేరినవారూ కారు. తెలిసి కూడా వారు – ఉద్దేశ్యపూర్వకంగా – అసత్య విషయాలపై ప్రమాణం చేస్తున్నారు.
58:15 أَعَدَّ اللَّهُ لَهُمْ عَذَابًا شَدِيدًا ۖ إِنَّهُمْ سَاءَ مَا كَانُوا يَعْمَلُونَ
వారికోసం అల్లాహ్ అత్యంత కఠినమైన శిక్షను సిద్ధపరచి ఉంచాడు. వారు చేసేవి ముమ్మాటికీ చెడుపనులే.
58:16 اتَّخَذُوا أَيْمَانَهُمْ جُنَّةً فَصَدُّوا عَن سَبِيلِ اللَّهِ فَلَهُمْ عَذَابٌ مُّهِينٌ
వారు తమ ప్రమాణాలను ఆసరా (డాలు)గా చేసుకున్నారు. పైగా అల్లాహ్ మార్గం నుండి ఆపుతున్నారు. వారికి అవమానకరమైన శిక్ష తథ్యం.
58:17 لَّن تُغْنِيَ عَنْهُمْ أَمْوَالُهُمْ وَلَا أَوْلَادُهُم مِّنَ اللَّهِ شَيْئًا ۚ أُولَٰئِكَ أَصْحَابُ النَّارِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ
వారి సిరిసంపదలుగానీ, వారి సంతానం గానీ అల్లాహ్ కు వ్యతిరేకంగా వారికేమాత్రం పనికిరావు. వారు నరక వాసులు. వారందులో కలకాలం ఉంటారు.
58:18 يَوْمَ يَبْعَثُهُمُ اللَّهُ جَمِيعًا فَيَحْلِفُونَ لَهُ كَمَا يَحْلِفُونَ لَكُمْ ۖ وَيَحْسَبُونَ أَنَّهُمْ عَلَىٰ شَيْءٍ ۚ أَلَا إِنَّهُمْ هُمُ الْكَاذِبُونَ
వారందరినీ అల్లాహ్ తిరిగి లేపిన రోజున, వారు మీ ముందు ప్రమాణాలు చేసినట్లే ఆయన ముందు కూడా ప్రమాణాలు చేస్తారు. తమకూ ఏదో ఒక ఆధారం ఉందని తలపోస్తారు. బాగా తెలుసుకోండి! వారు పచ్చి అబద్ధాల కోరులు.
58:19 اسْتَحْوَذَ عَلَيْهِمُ الشَّيْطَانُ فَأَنسَاهُمْ ذِكْرَ اللَّهِ ۚ أُولَٰئِكَ حِزْبُ الشَّيْطَانِ ۚ أَلَا إِنَّ حِزْبَ الشَّيْطَانِ هُمُ الْخَاسِرُونَ
షైతాను వారిని లొంగదీసుకున్నాడు. వారు అల్లాహ్ ధ్యానాన్ని మరచి పోయేలా చేశాడు. వాళ్ళు షైతాను ముఠాకు చెందినవారు. బాగా తెలుసుకోండి! ఎట్టకేలకు నష్టపోయేది షైతాను ముఠాయే.
58:20 إِنَّ الَّذِينَ يُحَادُّونَ اللَّهَ وَرَسُولَهُ أُولَٰئِكَ فِي الْأَذَلِّينَ
ఎవరైతే అల్లాహ్ పట్ల, ఆయన ప్రవక్త పట్ల వైరవైఖరిని అవలంబిస్తారో వారు అత్యంత ఎక్కువగా పరాభవం పాలయ్యేవారిలో ఉంటారు.
58:21 كَتَبَ اللَّهُ لَأَغْلِبَنَّ أَنَا وَرُسُلِي ۚ إِنَّ اللَّهَ قَوِيٌّ عَزِيزٌ
“నేనూ, నా ప్రవక్తలు మాత్రమే ఆధిపత్యం వహిస్తాము” అని అల్లాహ్ వ్రాసిపెట్టేశాడు. నిశ్చయంగా అల్లాహ్ మహాబలుడు, తిరుగులేనివాడు.
58:22 لَّا تَجِدُ قَوْمًا يُؤْمِنُونَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ يُوَادُّونَ مَنْ حَادَّ اللَّهَ وَرَسُولَهُ وَلَوْ كَانُوا آبَاءَهُمْ أَوْ أَبْنَاءَهُمْ أَوْ إِخْوَانَهُمْ أَوْ عَشِيرَتَهُمْ ۚ أُولَٰئِكَ كَتَبَ فِي قُلُوبِهِمُ الْإِيمَانَ وَأَيَّدَهُم بِرُوحٍ مِّنْهُ ۖ وَيُدْخِلُهُمْ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا ۚ رَضِيَ اللَّهُ عَنْهُمْ وَرَضُوا عَنْهُ ۚ أُولَٰئِكَ حِزْبُ اللَّهِ ۚ أَلَا إِنَّ حِزْبَ اللَّهِ هُمُ الْمُفْلِحُونَ
అల్లాహ్ ను, అంతిమదినాన్ని విశ్వసించేవారు అల్లాహ్ పట్ల, ఆయన ప్రవక్త పట్ల శత్రుత్వం వహించేవారిని ప్రేమిస్తున్నట్లు నీవు ఎక్కడా చూడవు – ఆఖరికి వారు తమ తండ్రులైనాసరే, తమ కొడుకులైనాసరే, తమ అన్నదమ్ములైనాసరే, తమ పరివారజనులైనా సరే (ససేమిరా వారిని ప్రేమించరు). అల్లాహ్ విశ్వాసాన్ని రాసి పెట్టినది ఇలాంటి వారి హృదయాలలోనే! ఆయన తన ఆత్మ ద్వారా వీరిని ప్రత్యేకంగా బలపరిచాడు. ఇంకా వీరికి, క్రింద సెలయేరులు పారే స్వర్గ వనాలలో ప్రవేశం కల్పిస్తాడు. అందులో వీరు కలకాలం ఉంటారు. అల్లాహ్ వీరి పట్ల ప్రసన్నుడయ్యాడు. వీరు అల్లాహ్ పట్ల సంతుష్టులయ్యారు. అల్లాహ్ పక్షానికి చెందిన వారంటే వీరే. నిశ్చయంగా సాఫల్యం పొందేవారు అల్లాహ్ పక్షం వారే.
- సూరా అల్ హష్ర్
59:1 سَبَّحَ لِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۖ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ
భూమ్యాకాశాలలో ఉన్న ప్రతి వస్తువూ అల్లాహ్ పవిత్రతను కొనియాడుతున్నది. ఆయన మహాశక్తిమంతుడు, వివేకవంతుడు.
59:2 هُوَ الَّذِي أَخْرَجَ الَّذِينَ كَفَرُوا مِنْ أَهْلِ الْكِتَابِ مِن دِيَارِهِمْ لِأَوَّلِ الْحَشْرِ ۚ مَا ظَنَنتُمْ أَن يَخْرُجُوا ۖ وَظَنُّوا أَنَّهُم مَّانِعَتُهُمْ حُصُونُهُم مِّنَ اللَّهِ فَأَتَاهُمُ اللَّهُ مِنْ حَيْثُ لَمْ يَحْتَسِبُوا ۖ وَقَذَفَ فِي قُلُوبِهِمُ الرُّعْبَ ۚ يُخْرِبُونَ بُيُوتَهُم بِأَيْدِيهِمْ وَأَيْدِي الْمُؤْمِنِينَ فَاعْتَبِرُوا يَا أُولِي الْأَبْصَارِ
ఆయనే గ్రంథవహులలోని అవిశ్వాసులను వారి ఇండ్ల నుండి తొలి (సారి) సమీకరణలోనే తీసివేశాడు. వారు వెళ్లి పోతారని మీరు (సయితం) ఊహించలేదు. (పటిష్టమైన) తమ కోటలు తమను అల్లాహ్ (దెబ్బ) నుండి రక్షిస్తాయని వారు అనుకున్నారు. అయితే వారు ఊహించని చోటు నుంచి అల్లాహ్ దెబ్బ వారిపై విరుచుకుపడింది. ఇంకా అల్లాహ్ వారి గుండెల్లో దడ పుట్టించాడు. వారు తమ ఇండ్లను చేజేతులా కొల్లగొట్టసాగారు. ముస్లింల చేతుల మీదుగా కూడా (ధ్వంసం చేయించుకున్నారు). కాబట్టి ఓ కళ్ళున్నవారలారా! దీని ద్వారా గుణపాఠం నేర్చుకోండి.
59:3 وَلَوْلَا أَن كَتَبَ اللَّهُ عَلَيْهِمُ الْجَلَاءَ لَعَذَّبَهُمْ فِي الدُّنْيَا ۖ وَلَهُمْ فِي الْآخِرَةِ عَذَابُ النَّارِ
ఒకవేళ అల్లాహ్ వారిపై దేశ బహిష్కరణను వ్రాసి ఉండకపోతే, వారిని ప్రపంచంలోనే దండించి ఉండేవాడు. పరలోకంలోనయితే వారికి నరకాగ్ని శిక్ష ఎలాగూ ఉంది.
59:4 ذَٰلِكَ بِأَنَّهُمْ شَاقُّوا اللَّهَ وَرَسُولَهُ ۖ وَمَن يُشَاقِّ اللَّهَ فَإِنَّ اللَّهَ شَدِيدُ الْعِقَابِ
ఈ విధంగా ఎందుకు జరిగిందంటే వారు అల్లాహ్ పై, ఆయన ప్రవక్తపై కయ్యానికి కాలు దువ్వారు. ఎవడు అల్లాహ్ పై కయ్యానికి కాలు దువ్వినా అల్లాహ్ వాడ్ని చాలా కఠీనంగా శిక్షిస్తాడు.
59:5 مَا قَطَعْتُم مِّن لِّينَةٍ أَوْ تَرَكْتُمُوهَا قَائِمَةً عَلَىٰ أُصُولِهَا فَبِإِذْنِ اللَّهِ وَلِيُخْزِيَ الْفَاسِقِينَ
మీరు కొన్ని ఖర్జూరపు వృక్షాలను నరికివేసినా లేదా వాటిని వాటి వ్రేళ్ళపై నిలిచి ఉండేలా వదిలివేసినా – ఇదంతా అల్లాహ్ అనుజ్ఞతోనే జరిగింది. అవిధేయులను అవమానపరచటానికి (ఆపాటి చర్య అవసరమయింది).
59:6 وَمَا أَفَاءَ اللَّهُ عَلَىٰ رَسُولِهِ مِنْهُمْ فَمَا أَوْجَفْتُمْ عَلَيْهِ مِنْ خَيْلٍ وَلَا رِكَابٍ وَلَٰكِنَّ اللَّهَ يُسَلِّطُ رُسُلَهُ عَلَىٰ مَن يَشَاءُ ۚ وَاللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
ఇంకా – అల్లాహ్ తన ప్రవక్తకు అందజేసిన వారి సొమ్ముల కోసం మీరు మీ గుర్రాలనుగానీ, ఒంటెలనుగానీ పరుగెత్తించలేదు. అల్లాహ్ తన ప్రవక్తలకు తాను కోరిన వారిపై అధికారం వొసగుతాడు. అల్లాహ్ కు అన్నింటిపై అధికారం ఉంది.
59:7 مَّا أَفَاءَ اللَّهُ عَلَىٰ رَسُولِهِ مِنْ أَهْلِ الْقُرَىٰ فَلِلَّهِ وَلِلرَّسُولِ وَلِذِي الْقُرْبَىٰ وَالْيَتَامَىٰ وَالْمَسَاكِينِ وَابْنِ السَّبِيلِ كَيْ لَا يَكُونَ دُولَةً بَيْنَ الْأَغْنِيَاءِ مِنكُمْ ۚ وَمَا آتَاكُمُ الرَّسُولُ فَخُذُوهُ وَمَا نَهَاكُمْ عَنْهُ فَانتَهُوا ۚ وَاتَّقُوا اللَّهَ ۖ إِنَّ اللَّهَ شَدِيدُ الْعِقَابِ
(మీరు చెమటోడ్చకుండానే ఇతర) పుర ప్రజల నుండి అల్లాహ్ తన ప్రవక్తకు స్వాధీనపరచిన సొమ్ము అల్లాహ్ కు, ప్రవక్తకు, బంధువులకు, అనాథలకు, నిరుపేదలకు, బాటసారులకు వర్తిస్తుంది. ఈ సంపద మీలోని ధనిక వర్గాల మధ్యనే పరిభ్రమిస్తూ ఉండరాదన్న ఉద్దేశంతో ఈ విధంగా నిర్ణయించటం జరిగింది. దైవప్రవక్త మీకు ఇచ్చిన దానిని (సంతోషంగా) పుచ్చుకోండి. ఆయన ఏ విషయం నుండైన మిమ్మల్ని వారిస్తే, దాన్ని వదిలిపెట్టండి. అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ కఠినంగా శిక్షించగలవాడు.
59:8 لِلْفُقَرَاءِ الْمُهَاجِرِينَ الَّذِينَ أُخْرِجُوا مِن دِيَارِهِمْ وَأَمْوَالِهِمْ يَبْتَغُونَ فَضْلًا مِّنَ اللَّهِ وَرِضْوَانًا وَيَنصُرُونَ اللَّهَ وَرَسُولَهُ ۚ أُولَٰئِكَ هُمُ الصَّادِقُونَ
(ముఖ్యంగా ఈ ‘పై’ సొమ్ము) తమ ఇల్లూ వాకిలి నుండి, తమ ఆస్తి పాస్తుల నుండి గెంటివేయబడిన నిరుపేద ముహాజిర్లకు వర్తిస్తుంది. (ఎందుకంటే) వారు దైవానుగ్రహాన్ని, దైవప్రసన్నతను ఆశిస్తూ, దైవానికీ, ఆయన ప్రవక్తకు తోడ్పడుతున్నారు. వారే అసలు సిసలు సత్య సంధులు.
59:9 وَالَّذِينَ تَبَوَّءُوا الدَّارَ وَالْإِيمَانَ مِن قَبْلِهِمْ يُحِبُّونَ مَنْ هَاجَرَ إِلَيْهِمْ وَلَا يَجِدُونَ فِي صُدُورِهِمْ حَاجَةً مِّمَّا أُوتُوا وَيُؤْثِرُونَ عَلَىٰ أَنفُسِهِمْ وَلَوْ كَانَ بِهِمْ خَصَاصَةٌ ۚ وَمَن يُوقَ شُحَّ نَفْسِهِ فَأُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ
ఇకపోతే వీరికంటే ముందే ఈ ప్రదేశం (మదీనా)లోనూ, విశ్వాసంలోనూ స్థానికులై ఉన్నవారు (వారికి కూడా ఈ సొమ్ము వర్తిస్తుంది); వారు ఇల్లూ వాకిలిని వదలి తమ వైపుకు వలస వచ్చే ముహాజిర్లను ప్రేమిస్తారు. వారికి ఏమి ఇవ్వబడినా దానిపై తమ అంతర్యాలలో ఏ కాస్త అసూయను కూడా రానివ్వరు. తాము అమిత అవసరంలో ఉన్నప్పటికీ తమపైన వారికే ప్రాధాన్యతనిస్తారు. వాస్తవానికి తమ స్వార్థ ప్రియత్వం (పేరాశ) నుండి రక్షించబడినవారే కృతార్థులు.
59:10 وَالَّذِينَ جَاءُوا مِن بَعْدِهِمْ يَقُولُونَ رَبَّنَا اغْفِرْ لَنَا وَلِإِخْوَانِنَا الَّذِينَ سَبَقُونَا بِالْإِيمَانِ وَلَا تَجْعَلْ فِي قُلُوبِنَا غِلًّا لِّلَّذِينَ آمَنُوا رَبَّنَا إِنَّكَ رَءُوفٌ رَّحِيمٌ
వారి తరువాత వచ్చినవారు (వారికీ ఈ సొమ్ము వర్తిస్తుంది), వారిలా వేడుకుంటారు : “మా ప్రభూ! మమ్మల్ని క్షమించు. మాకన్నా ముందు విశ్వసించిన మా సోదరులను కూడా క్షమించు. విశ్వాసుల యెడల మా హృదయాలలో ఎలాంటి ద్వేషభావాన్ని కలిగించకు. మా ప్రభూ! నిశ్చయంగా నీవు మృదు స్వభావం కలిగినవాడవు, కనికరించేవాడవు.”
59:11 أَلَمْ تَرَ إِلَى الَّذِينَ نَافَقُوا يَقُولُونَ لِإِخْوَانِهِمُ الَّذِينَ كَفَرُوا مِنْ أَهْلِ الْكِتَابِ لَئِنْ أُخْرِجْتُمْ لَنَخْرُجَنَّ مَعَكُمْ وَلَا نُطِيعُ فِيكُمْ أَحَدًا أَبَدًا وَإِن قُوتِلْتُمْ لَنَنصُرَنَّكُمْ وَاللَّهُ يَشْهَدُ إِنَّهُمْ لَكَاذِبُونَ
(ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం!) నీవు కపటులను చూడలేదా? వారు గ్రంథవహుల్లోని తమ అవిశ్వాస సోదరులతో, “మీరు గనక దేశం నుండి బహిష్కరించబడితే మేము కూడా తప్పకుండా మీ వెంట బయలుదేరతాము. మీ విషయంలో మేమెన్నటికీ ఎవరి మాటా వినము. ఒకవేళ మీతో గనక యుద్ధం జరిగితే మేము మీకు తప్పకుండా సాయం చేస్తాము” అని అంటారు. కాని వాళ్ళు వట్టి అబద్ధాలరాయుళ్ళని అల్లాహ్ సాక్ష్యమిస్తున్నాడు.
59:12 لَئِنْ أُخْرِجُوا لَا يَخْرُجُونَ مَعَهُمْ وَلَئِن قُوتِلُوا لَا يَنصُرُونَهُمْ وَلَئِن نَّصَرُوهُمْ لَيُوَلُّنَّ الْأَدْبَارَ ثُمَّ لَا يُنصَرُونَ
ఒకవేళ వారు వెళ్ళగొట్టబడితే, వీరు వారితో పాటు వెళ్ళే రకం కాదు. ఒకవేళ వారితో యుద్ధం చేయబడితే వీళ్ళు వారికి సాయం కూడా చేయరు. ఒకవేళ సాయంగా వచ్చినా వెన్నుచూపి పారిపోతారు. మరి వారికి ఎలాంటి తోడ్పాటు కూడా లభించదు.
59:13 لَأَنتُمْ أَشَدُّ رَهْبَةً فِي صُدُورِهِم مِّنَ اللَّهِ ۚ ذَٰلِكَ بِأَنَّهُمْ قَوْمٌ لَّا يَفْقَهُونَ
(ముస్లిములారా!) వారి హృదయాలలో అల్లాహ్ భయం కన్నా అధికంగా మీ భయం ఉంది. ఎందుకంటే వారు తెలివి లేని జనులు.
59:14 لَا يُقَاتِلُونَكُمْ جَمِيعًا إِلَّا فِي قُرًى مُّحَصَّنَةٍ أَوْ مِن وَرَاءِ جُدُرٍ ۚ بَأْسُهُم بَيْنَهُمْ شَدِيدٌ ۚ تَحْسَبُهُمْ جَمِيعًا وَقُلُوبُهُمْ شَتَّىٰ ۚ ذَٰلِكَ بِأَنَّهُمْ قَوْمٌ لَّا يَعْقِلُونَ
వారంతా ఏకమైనా మీతో (మైదానాలలో) పోరాడలేరు. అయితే కోటలు గల పురములలో ఉండిగానీ, గోడల చాటున మాటేసిగానీ పోరాడగలరు. అసలు వాళ్ళ మధ్యనే తీవ్రమైన మనస్పర్ధలు ఉన్నాయి. వాళ్ళు కలసికట్టుగా ఉన్నారని నువ్వు అనుకుంటున్నావు. కాని వారి మనసులు పరస్పరం వేరుపడి ఉన్నాయి. వాళ్ళ ఈ (దు)స్థితికి కారణం వాళ్ళ తెలివి మాలినతనమే.
59:15 كَمَثَلِ الَّذِينَ مِن قَبْلِهِمْ قَرِيبًا ۖ ذَاقُوا وَبَالَ أَمْرِهِمْ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ
చూడబోతే వీళ్ళ వ్యవహారం వీరికి కొద్దికాలం క్రితమే గతించినవారిని పోలి ఉన్నది. వారెలాగూ తమ స్వయంకృతపు రుచిని చూశారు. వ్యధాభరితమైన శిక్ష కూడా వారికి పడుతుంది.
59:16 كَمَثَلِ الشَّيْطَانِ إِذْ قَالَ لِلْإِنسَانِ اكْفُرْ فَلَمَّا كَفَرَ قَالَ إِنِّي بَرِيءٌ مِّنكَ إِنِّي أَخَافُ اللَّهَ رَبَّ الْعَالَمِينَ
వీళ్ళ సంగతి షైతాను మాదిరిగా ఉన్నది. వాడు మానవునితో, “తిరస్కార వైఖరిని అవలంబించు” అని అంటాడు. తీరా అతను తిరస్కార వైఖరికి పాల్పడినప్పుడు “నీతో నాకెలాంటి సంబంధం లేదు, పో. నేను సకల లోకాల ప్రభువైన అల్లాహ్ కు భయపడుతున్నాను” అని అంటాడు.
59:17 فَكَانَ عَاقِبَتَهُمَا أَنَّهُمَا فِي النَّارِ خَالِدَيْنِ فِيهَا ۚ وَذَٰلِكَ جَزَاءُ الظَّالِمِينَ
పర్యవసానంగా వారిరువురూ (నరకం) అగ్నిలో ఉంటారు – శాశ్వతంగా ఉండేవారుగా! తమ ఆత్మలకు అన్యాయం చేసుకునే వారికి తగిన శాస్తి ఇదే.
59:18 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَلْتَنظُرْ نَفْسٌ مَّا قَدَّمَتْ لِغَدٍ ۖ وَاتَّقُوا اللَّهَ ۚ إِنَّ اللَّهَ خَبِيرٌ بِمَا تَعْمَلُونَ
విశ్వసించిన ఓ ప్రజలారా! అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. ప్రతి వ్యక్తీ రేపటి (తీర్పుదినం) కొరకు తానేం పంపుకున్నాడో చూసుకోవాలి. ఎల్ల వేళలా అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా మీరు ఏమేం చేస్తున్నారో అల్లాహ్ కనిపెట్టుకునే ఉన్నాడు.
59:19 وَلَا تَكُونُوا كَالَّذِينَ نَسُوا اللَّهَ فَأَنسَاهُمْ أَنفُسَهُمْ ۚ أُولَٰئِكَ هُمُ الْفَاسِقُونَ
మీరు అల్లాహ్ ను మరచిపోయిన వారి మాదిరిగా అయిపోకండి. (వారి ఈ విస్మరణ కారణంగా) అల్లాహ్ కూడా వారిని తమ అత్మలనే మరచిపోయిన వారిగా చేసేశాడు. ఇలాంటి వారే పరమ అవిధేయులు.
59:20 لَا يَسْتَوِي أَصْحَابُ النَّارِ وَأَصْحَابُ الْجَنَّةِ ۚ أَصْحَابُ الْجَنَّةِ هُمُ الْفَائِزُونَ
నరకవాసులు – స్వర్గవాసులు ఎన్నటికీ సమానులు కాలేరు. స్వర్గవాసులు మాత్రమే సాఫల్యం పొందినవారు.
59:21 لَوْ أَنزَلْنَا هَٰذَا الْقُرْآنَ عَلَىٰ جَبَلٍ لَّرَأَيْتَهُ خَاشِعًا مُّتَصَدِّعًا مِّنْ خَشْيَةِ اللَّهِ ۚ وَتِلْكَ الْأَمْثَالُ نَضْرِبُهَا لِلنَّاسِ لَعَلَّهُمْ يَتَفَكَّرُونَ
ఒకవేళ మేము ఈ ఖుర్ఆన్ ను ఏ పర్వతం మీదనో దింపి ఉంటే అది అల్లాహ్ భీతితో అణగారి, తునాతునకలై పోవటాన్ని నీవు చూసి ఉండేవాడివి. ప్రజలు యోచన చేయగలందులకు గాను మేము ఈ దృష్టాంతాలను వారికి వివరిస్తున్నాము.
59:22 هُوَ اللَّهُ الَّذِي لَا إِلَٰهَ إِلَّا هُوَ ۖ عَالِمُ الْغَيْبِ وَالشَّهَادَةِ ۖ هُوَ الرَّحْمَٰنُ الرَّحِيمُ
ఆయనే అల్లాహ్. ఆయన తప్ప మరో ఆరాధ్య దేవుడు లేడు – గోప్యంగా ఉన్నవాటిని, బహిర్గతమై ఉన్నవాటిని ఎరిగినవాడు. ఆయన కరుణామయుడు, కృపాశీలుడు.
59:23 هُوَ اللَّهُ الَّذِي لَا إِلَٰهَ إِلَّا هُوَ الْمَلِكُ الْقُدُّوسُ السَّلَامُ الْمُؤْمِنُ الْمُهَيْمِنُ الْعَزِيزُ الْجَبَّارُ الْمُتَكَبِّرُ ۚ سُبْحَانَ اللَّهِ عَمَّا يُشْرِكُونَ
ఆయనే అల్లాహ్. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ఆయనే రాజాధిరాజు, (పరమ పవిత్రుడు), లోపాలన్నింటికీ అతీతుడు, శాంతి (భద్రతల) ప్రదాత, పర్యవేక్షకుడు, సర్వశక్తుడు, బలపరాక్రమాలు గలవాడు, పెద్దరికం గలవాడు. ప్రజలు ఆయనకు కల్పించే భాగస్వామ్యాల నుండి అల్లాహ్ పవిత్రంగా ఉన్నాడు.
59:24 هُوَ اللَّهُ الْخَالِقُ الْبَارِئُ الْمُصَوِّرُ ۖ لَهُ الْأَسْمَاءُ الْحُسْنَىٰ ۚ يُسَبِّحُ لَهُ مَا فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ
ఆయనే అల్లాహ్ – సృష్టికర్త, ఉనికిని ప్రసాదించేవాడు, రూపకల్పన చేసేవాడు. అత్యున్నతమైన పేర్లు ఆయనకు ఉన్నాయి. భూమ్యాకాశాలలో ఉన్న ప్రతి వస్తువూ ఆయన పవిత్రతను కొనియాడుతోంది. ఆయనే సర్వాధికుడు, వివేకవంతుడు. - సూరా అల్ ముమ్ తహిన హ్
60:1 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَتَّخِذُوا عَدُوِّي وَعَدُوَّكُمْ أَوْلِيَاءَ تُلْقُونَ إِلَيْهِم بِالْمَوَدَّةِ وَقَدْ كَفَرُوا بِمَا جَاءَكُم مِّنَ الْحَقِّ يُخْرِجُونَ الرَّسُولَ وَإِيَّاكُمْ ۙ أَن تُؤْمِنُوا بِاللَّهِ رَبِّكُمْ إِن كُنتُمْ خَرَجْتُمْ جِهَادًا فِي سَبِيلِي وَابْتِغَاءَ مَرْضَاتِي ۚ تُسِرُّونَ إِلَيْهِم بِالْمَوَدَّةِ وَأَنَا أَعْلَمُ بِمَا أَخْفَيْتُمْ وَمَا أَعْلَنتُمْ ۚ وَمَن يَفْعَلْهُ مِنكُمْ فَقَدْ ضَلَّ سَوَاءَ السَّبِيلِ
విశ్వసించిన ఓ ప్రజలారా! నా శత్రువుల్ని, మీ శత్రువుల్ని మీ స్నేహితులుగా చేసుకోకండి. మీరేమో స్నేహపూర్వకంగా వారివైపు సందేశం పంపుతున్నారు. వారేమో మీ వద్దకు వచ్చిన సత్యాన్ని త్రోసిపుచ్చారు. మీ ప్రభువైన అల్లాహ్ ను మీరు విశ్వసించినందుకు వారు ప్రవక్తను, స్వయంగా మిమ్మల్ని కూడా దేశం నుండి బహిష్కరించారు. మీరు గనక నా మార్గంలో పోరాడటానికి, నా ప్రసన్నతను చూరగొనటానికి బయలుదేరిన వారైతే (మీరు వాళ్లతో స్నేహం చేయకండి). మీరు వారి వద్దకు స్నేహ సందేశాన్ని రహస్యంగా పంపిస్తారా! మీరు దాచేదీ, బహిర్గతం చేసేదీ – అంతా నాకు తెలుసు. మీలో ఎవడు ఈ కార్యకలాపాలకు పాల్పడినా అతను తిన్నని మార్గం నుండి తప్పిపోయినట్లే.
60:2 إِن يَثْقَفُوكُمْ يَكُونُوا لَكُمْ أَعْدَاءً وَيَبْسُطُوا إِلَيْكُمْ أَيْدِيَهُمْ وَأَلْسِنَتَهُم بِالسُّوءِ وَوَدُّوا لَوْ تَكْفُرُونَ
ఒకవేళ మీరు గనక వారి చేతికి చిక్కినట్లయితే, వారు మీ పట్ల బద్ధ శత్రువులుగా వ్యవహరిస్తారు. చెడు రీతిలో మీపై చేయి చేసుకుంటారు, నోరు కూడా పారేసుకుంటారు. మీరు (కూడా వారిలాగే) అవిశ్వాసానికి పాల్పడాలని కోరుకుంటారు.
60:3 لَن تَنفَعَكُمْ أَرْحَامُكُمْ وَلَا أَوْلَادُكُمْ ۚ يَوْمَ الْقِيَامَةِ يَفْصِلُ بَيْنَكُمْ ۚ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ
మీ రక్తసంబంధాలు, బంధుత్వాలు, మీ బిడ్డలు ప్రళయదినాన మీకు ఏవిధంగానూ ఉపయోగపడరు. అల్లాహ్ మీ మధ్య తీర్పు చేసేస్తాడు. మీరు చేసే పనులన్నిటిని అల్లాహ్ చూస్తూనే ఉన్నాడు.
60:4 قَدْ كَانَتْ لَكُمْ أُسْوَةٌ حَسَنَةٌ فِي إِبْرَاهِيمَ وَالَّذِينَ مَعَهُ إِذْ قَالُوا لِقَوْمِهِمْ إِنَّا بُرَآءُ مِنكُمْ وَمِمَّا تَعْبُدُونَ مِن دُونِ اللَّهِ كَفَرْنَا بِكُمْ وَبَدَا بَيْنَنَا وَبَيْنَكُمُ الْعَدَاوَةُ وَالْبَغْضَاءُ أَبَدًا حَتَّىٰ تُؤْمِنُوا بِاللَّهِ وَحْدَهُ إِلَّا قَوْلَ إِبْرَاهِيمَ لِأَبِيهِ لَأَسْتَغْفِرَنَّ لَكَ وَمَا أَمْلِكُ لَكَ مِنَ اللَّهِ مِن شَيْءٍ ۖ رَّبَّنَا عَلَيْكَ تَوَكَّلْنَا وَإِلَيْكَ أَنَبْنَا وَإِلَيْكَ الْمَصِيرُ
(ఓ ముస్లిములారా!) మీకు ఇబ్రాహీములోనూ, అతని వెంటనున్న వారిలోనూ అత్యుత్తమమైన ఆదర్శం ఉంది. వారంతా తమ జాతి వారితో స్పష్టంగా ఇలా చెప్పేశారు : “మీతోనూ, అల్లాహ్ ను వదలి మీరు పూజించే వారందరితోనూ మాకెలాంటి సంబంధం లేదు. మేము మిమ్మల్ని (మీ మిథ్య విశ్వాసాలను) తిరస్కరిస్తున్నాము. ఒకే ఒక్కడైన అల్లాహ్ ను మీరు విశ్వసించనంత వరకూ, మాకూ – మీకూ మధ్య శాశ్వతంగా విరోధం, వైషమ్యం ఏర్పడినట్లే.” అయితే ఇబ్రాహీము తన తండ్రితో, “(నాన్న!) నేను మీ మన్నింపు కోసం తప్పకుండా ప్రార్ధిస్తాను. (కాని) మీ విషయంలో నేను అల్లాహ్ సమక్షంలో అంతకంటే ఎక్కువ ఏమీ చేయలేను” అన్న మాట మాత్రం (వినయింపుతో కూడుకున్నది) – (ఇంకా వారిలా వేడుకున్నారు, “మా ప్రభూ! మేము నిన్నే నమ్ముకున్నాము. నీ వైపుకే మరలుతున్నాము. (ఎట్టకేలకు) నిన్నే చేరుకోవలసి ఉంది.
60:5 رَبَّنَا لَا تَجْعَلْنَا فِتْنَةً لِّلَّذِينَ كَفَرُوا وَاغْفِرْ لَنَا رَبَّنَا ۖ إِنَّكَ أَنتَ الْعَزِيزُ الْحَكِيمُ
“మా ప్రభూ! అవిశ్వాసుల కొరకు మమ్మల్ని పరీక్షా సాధనంగా చేయకు. ప్రభూ! మా తప్పులను క్షమించు. నిశ్చయంగా నీవు మాత్రమే సర్వాధికుడవు, వివేకవంతుడవు.”
60:6 لَقَدْ كَانَ لَكُمْ فِيهِمْ أُسْوَةٌ حَسَنَةٌ لِّمَن كَانَ يَرْجُو اللَّهَ وَالْيَوْمَ الْآخِرَ ۚ وَمَن يَتَوَلَّ فَإِنَّ اللَّهَ هُوَ الْغَنِيُّ الْحَمِيدُ
నిశ్చయంగా వారి (జీవన విధానం)లో మీకు అత్యుత్తమమైన ఆదర్శం ఉంది – ముఖ్యంగా అల్లాహ్(తో సమావేశము)ను, అంతిమదినాన్ని ఆశించే ప్రతి ఒక్కరికీ! ఒకవేళ ఎవరైనా విముఖత చూపితే (నష్టపోయేది వారే), అల్లాహ్ మాత్రం లక్ష్యపెట్టేవాడు కాడు. ఆయన సకలస్తోత్రాలకు అర్హుడు.
60:7 عَسَى اللَّهُ أَن يَجْعَلَ بَيْنَكُمْ وَبَيْنَ الَّذِينَ عَادَيْتُم مِّنْهُم مَّوَدَّةً ۚ وَاللَّهُ قَدِيرٌ ۚ وَاللَّهُ غَفُورٌ رَّحِيمٌ
బహుశా అల్లాహ్ మీకూ – మీ విరోధులకు మధ్య స్నేహాన్ని ఏర్పరచినా ఆశ్చర్యపోనవసరం లేదు. అల్లాహ్ కు అన్నీ సాధ్యమే. అల్లాహ్ (అపారంగా) క్షమించేవాడు, కనికరించేవాడు.
60:8 لَّا يَنْهَاكُمُ اللَّهُ عَنِ الَّذِينَ لَمْ يُقَاتِلُوكُمْ فِي الدِّينِ وَلَمْ يُخْرِجُوكُم مِّن دِيَارِكُمْ أَن تَبَرُّوهُمْ وَتُقْسِطُوا إِلَيْهِمْ ۚ إِنَّ اللَّهَ يُحِبُّ الْمُقْسِطِينَ
ధర్మం విషయంలో మీపై కాలుదువ్వకుండా, మిమ్మల్ని మీ ఇల్లూ వాకిలి నుండి వెళ్ళగొట్టకుండా ఉన్న వారితో మీరు సద్వ్యవహారం చేయటాన్ని, వారికి న్యాయం చేయటాన్ని అల్లాహ్ ఎంత మాత్రం విరోధించడు. పైగా అల్లాహ్ న్యాయం చేసే వారిని ప్రేమిస్తాడు.
60:9 إِنَّمَا يَنْهَاكُمُ اللَّهُ عَنِ الَّذِينَ قَاتَلُوكُمْ فِي الدِّينِ وَأَخْرَجُوكُم مِّن دِيَارِكُمْ وَظَاهَرُوا عَلَىٰ إِخْرَاجِكُمْ أَن تَوَلَّوْهُمْ ۚ وَمَن يَتَوَلَّهُمْ فَأُولَٰئِكَ هُمُ الظَّالِمُونَ
ధర్మం విషయంలో మీపై కయ్యానికి కాలుదువ్వి, మిమ్మల్ని మీ ఇల్లూ వాకిళ్ళ నుండి వెళ్ళగొట్టినవారితో, మిమ్మల్ని వెళ్ళగొట్టడంలో ఇతరులకు సహాయపడిన వారితో స్నేహసంబంధాలు ఏర్పరచుకోవటాన్ని మాత్రమే అల్లాహ్ వారిస్తున్నాడు. అలాంటి వారితో కుమ్మక్కు అయినవారే దుర్మార్గులు.
60:10 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا جَاءَكُمُ الْمُؤْمِنَاتُ مُهَاجِرَاتٍ فَامْتَحِنُوهُنَّ ۖ اللَّهُ أَعْلَمُ بِإِيمَانِهِنَّ ۖ فَإِنْ عَلِمْتُمُوهُنَّ مُؤْمِنَاتٍ فَلَا تَرْجِعُوهُنَّ إِلَى الْكُفَّارِ ۖ لَا هُنَّ حِلٌّ لَّهُمْ وَلَا هُمْ يَحِلُّونَ لَهُنَّ ۖ وَآتُوهُم مَّا أَنفَقُوا ۚ وَلَا جُنَاحَ عَلَيْكُمْ أَن تَنكِحُوهُنَّ إِذَا آتَيْتُمُوهُنَّ أُجُورَهُنَّ ۚ وَلَا تُمْسِكُوا بِعِصَمِ الْكَوَافِرِ وَاسْأَلُوا مَا أَنفَقْتُمْ وَلْيَسْأَلُوا مَا أَنفَقُوا ۚ ذَٰلِكُمْ حُكْمُ اللَّهِ ۖ يَحْكُمُ بَيْنَكُمْ ۚ وَاللَّهُ عَلِيمٌ حَكِيمٌ
ఓ విశ్వాసులారా! విశ్వసించిన స్త్రీలు మీ వద్దకు వలస వచ్చినప్పుడు మీరు వారిని పరీక్షించండి. (ఆ విషయానికి వస్తే) వారి విశ్వాసం గురించి అల్లాహ్ కు బాగా తెలుసు. వారు గనక విశ్వాసపాత్రులని మీకు అనిపిస్తే వారిని అవిశ్వాసుల వద్దకు తిప్పి పంపకండి. ఈ స్త్రీలు వారికి ధర్మ సమ్మతం కారు. వారు ఈ స్త్రీలకు కూడా ధర్మ సమ్మతం కాజాలరు. అవిశ్వాసులు ఖర్చు చేసినది వారికి చెల్లించండి. తద్వారా మీరు ఈ స్త్రీలకు మహార్ సొమ్మును చెల్లించి వారిని వివాహమాడటం ఏమాత్రం దోషం కాదు. విశ్వసించని స్త్రీల మానాన్ని మీ వివాహ బంధంలో ఉంచకండి. మీరు ఖర్చుపెట్టినది అడిగి తీసేసుకోండి. అటు అవిశ్వాసులు కూడా వారు ఖర్చు చేసినది అడిగి తీసేసుకోవాలి. ఇది అల్లాహ్ ఆజ్ఞ (తీర్పు). దీన్ని ఆయన మీ మధ్య విధించాడు. అల్లాహ్ మహా జ్ఞాని, మహావివేకి.
60:11 وَإِن فَاتَكُمْ شَيْءٌ مِّنْ أَزْوَاجِكُمْ إِلَى الْكُفَّارِ فَعَاقَبْتُمْ فَآتُوا الَّذِينَ ذَهَبَتْ أَزْوَاجُهُم مِّثْلَ مَا أَنفَقُوا ۚ وَاتَّقُوا اللَّهَ الَّذِي أَنتُم بِهِ مُؤْمِنُونَ
ఒకవేళ మీ భార్యలలో ఎవరైనా మీ అదుపాజ్ఞలను ఉల్లంఘించి అవిశ్వాసుల వద్దకు చేరితే, ఆ తరువాత బదులు తీర్చుకునే వంతు మీకు వస్తే, ఎవరి స్త్రీలు వెళ్ళిపోయారో వారికి, వారు ఖర్చుచేసినంత సొమ్మును చెల్లించండి. మీరు విశ్వసించినటువంటి అల్లాహ్ కు భయపడుతూ ఉండండి.
60:12 يَا أَيُّهَا النَّبِيُّ إِذَا جَاءَكَ الْمُؤْمِنَاتُ يُبَايِعْنَكَ عَلَىٰ أَن لَّا يُشْرِكْنَ بِاللَّهِ شَيْئًا وَلَا يَسْرِقْنَ وَلَا يَزْنِينَ وَلَا يَقْتُلْنَ أَوْلَادَهُنَّ وَلَا يَأْتِينَ بِبُهْتَانٍ يَفْتَرِينَهُ بَيْنَ أَيْدِيهِنَّ وَأَرْجُلِهِنَّ وَلَا يَعْصِينَكَ فِي مَعْرُوفٍ ۙ فَبَايِعْهُنَّ وَاسْتَغْفِرْ لَهُنَّ اللَّهَ ۖ إِنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ
ఓ ప్రవక్తా! విశ్వసించిన స్త్రీలు నీ వద్దకు వచ్చి, తాము ఎవరినీ అల్లాహ్ కు భాగస్వామ్యం కల్పించబోము అనీ, దొంగతనం చేయబోము అనీ, వ్యభిచారానికి పాల్పడబోము అనీ, తమ సంతానాన్ని చంపబోము అనీ, తమ కాళ్ళు చేతుల మధ్య నుండి ఎలాంటి అభాండాన్నీ కల్పించబోము అనీ, ఏ సత్కార్యంలోనూ నీకు అవిధేయత చూపబోము అని ప్రమాణం చేస్తే నువ్వు వారి చేత ప్రమాణం చేయించు. వారి క్షమాపణ కొరకు అల్లాహ్ ను ప్రార్ధించు. నిశ్చయంగా అల్లాహ్ క్షమాశీలి, దయాశీలి.
60:13 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَتَوَلَّوْا قَوْمًا غَضِبَ اللَّهُ عَلَيْهِمْ قَدْ يَئِسُوا مِنَ الْآخِرَةِ كَمَا يَئِسَ الْكُفَّارُ مِنْ أَصْحَابِ الْقُبُورِ
ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ ఆగ్రహానికి గురైన వారితో స్నేహం చేయకండి. చచ్చి సమాధుల్లో పడిఉన్న వారిపట్ల అవిశ్వాసులు ఎలా ఆశలు వదులుకున్నారో అలాగే వారు కూడా పరలోకం పట్ల ఆశ వదులుకున్నారు.
- సూరా అస్ సఫ్
61:1 سَبَّحَ لِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۖ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ
ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న ప్రతి వస్తువూ అల్లాహ్ పవిత్రతను కొనియాడుతున్నది. ఆయన సర్వశక్తుడు, వివేకవంతుడు.
61:2 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لِمَ تَقُولُونَ مَا لَا تَفْعَلُونَ
ఓ విశ్వాసులారా! మీరు చేయ(లే)ని దాన్ని గురించి ఎందుకు చెబుతారు?
61:3 كَبُرَ مَقْتًا عِندَ اللَّهِ أَن تَقُولُوا مَا لَا تَفْعَلُونَ
మీరు చేయని దాన్ని గురించి చెప్పటం అల్లాహ్ సమక్షంలో ఎంతో సహించరానిది.
61:4 إِنَّ اللَّهَ يُحِبُّ الَّذِينَ يُقَاتِلُونَ فِي سَبِيلِهِ صَفًّا كَأَنَّهُم بُنْيَانٌ مَّرْصُوصٌ
అల్లాహ్ ప్రేమించేది సీసం పోసి నిర్మింపబడిన గోడలాగా వరుసతీరి స్థిరంగా అతని మార్గంలో పోరాడేవారినే సుమా!
61:5 وَإِذْ قَالَ مُوسَىٰ لِقَوْمِهِ يَا قَوْمِ لِمَ تُؤْذُونَنِي وَقَد تَّعْلَمُونَ أَنِّي رَسُولُ اللَّهِ إِلَيْكُمْ ۖ فَلَمَّا زَاغُوا أَزَاغَ اللَّهُ قُلُوبَهُمْ ۚ وَاللَّهُ لَا يَهْدِي الْقَوْمَ الْفَاسِقِينَ
మూసా తన జాతివారితో, “ఓ నా జాతి ప్రజలారా! నేను మీ వద్దకు అల్లాహ్ తరఫున పంపబడిన ప్రవక్తనన్న సంగతి తెలిసి కూడా మీరు నన్నెందుకు ఇంతగా వేధిస్తున్నారు?” అని చెప్పినప్పటి విషయం (జ్ఞాపకం చేసుకోదగినది). వారు వక్రంగానే ఉండటంతో, అల్లాహ్ వారి హృదయాలు వంకరగానే ఉండేలా చేశాడు. అవిధేయ జనులకు అల్లాహ్ సన్మార్గం చూపడు.
61:6 وَإِذْ قَالَ عِيسَى ابْنُ مَرْيَمَ يَا بَنِي إِسْرَائِيلَ إِنِّي رَسُولُ اللَّهِ إِلَيْكُم مُّصَدِّقًا لِّمَا بَيْنَ يَدَيَّ مِنَ التَّوْرَاةِ وَمُبَشِّرًا بِرَسُولٍ يَأْتِي مِن بَعْدِي اسْمُهُ أَحْمَدُ ۖ فَلَمَّا جَاءَهُم بِالْبَيِّنَاتِ قَالُوا هَٰذَا سِحْرٌ مُّبِينٌ
మర్యమ్ కుమారుడైన ఈసా, “ఓ ఇస్రాయీలు సంతతివారలారా! నేను మీ వైపు అల్లాహ్ తరఫున పంపబడిన ప్రవక్తను. నాకు పూర్వం వచ్చిన తౌరాతు గ్రంథాన్ని ధృవపరుస్తున్నాను. నా తరువాత రాబోయే ప్రవక్తను గురించి శుభవార్తను ఇస్తున్నాను. అతని పేరు అహ్మద్” అని చెప్పినప్పటి సంగతి (కూడా స్మరించదగినదే). తీరా అతను స్పష్టమైన నిదర్శనాలను తీసుకువచ్చినప్పుడు, “ఇది పచ్చి ఇంద్రజాలం” అని వారు అన్నారు (తేలిగ్గా కొట్టి పారేశారు).
61:7 وَمَنْ أَظْلَمُ مِمَّنِ افْتَرَىٰ عَلَى اللَّهِ الْكَذِبَ وَهُوَ يُدْعَىٰ إِلَى الْإِسْلَامِ ۚ وَاللَّهُ لَا يَهْدِي الْقَوْمَ الظَّالِمِينَ
ఇస్లాం వైపు తనను ఆహ్వానించబడుతున్నప్పటికీ అల్లాహ్ పై అబద్ధపు నిందలను కల్పించేవాడికంటే పరమ దుర్మార్గుడెవడుంటాడు, ఇలాంటి దుర్మార్గులకు అల్లాహ్ సన్మార్గం చూపడు.
61:8 يُرِيدُونَ لِيُطْفِئُوا نُورَ اللَّهِ بِأَفْوَاهِهِمْ وَاللَّهُ مُتِمُّ نُورِهِ وَلَوْ كَرِهَ الْكَافِرُونَ
వారు అల్లాహ్ జ్యోతిని తమ నోళ్ళతో ఊది ఆర్పివేయదలుస్తున్నారు. అయితే అల్లాహ్ మాత్రం తన జ్యోతిని పరిపూర్ణం గావిస్తాడు – అవిశ్వాసులకు అది ఎంతగా సహించరానిదైనాసరే!
61:9 هُوَ الَّذِي أَرْسَلَ رَسُولَهُ بِالْهُدَىٰ وَدِينِ الْحَقِّ لِيُظْهِرَهُ عَلَى الدِّينِ كُلِّهِ وَلَوْ كَرِهَ الْمُشْرِكُونَ
ఆయనే తన ప్రవక్తకు సన్మార్గాన్ని, సత్యధర్మాన్ని ఇచ్చి పంపాడు – దాన్ని మత ధర్మాలన్నింటిపై ఆధిక్యం వహించేలా చేయటానికి! ఈ విషయం బహుదైవారాధకులకు ఇష్టం లేకపోయినా సరే.
61:10 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا هَلْ أَدُلُّكُمْ عَلَىٰ تِجَارَةٍ تُنجِيكُم مِّنْ عَذَابٍ أَلِيمٍ
ఓ విశ్వాసులారా! మిమ్మల్ని వ్యధాభరితమైన శిక్ష నుండి రక్షించే వర్తకమేదో నేను మీకు తెలుపనా?
61:11 تُؤْمِنُونَ بِاللَّهِ وَرَسُولِهِ وَتُجَاهِدُونَ فِي سَبِيلِ اللَّهِ بِأَمْوَالِكُمْ وَأَنفُسِكُمْ ۚ ذَٰلِكُمْ خَيْرٌ لَّكُمْ إِن كُنتُمْ تَعْلَمُونَ
మీరు అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను విశ్వసించండి. అల్లాహ్ మార్గంలో మీ ధన ప్రాణాలొడ్డి పోరాడండి. మీరు గనక తెలుసుకోగలిగితే ఇది మీకు ఎంతో మేలైనది.
61:12 يَغْفِرْ لَكُمْ ذُنُوبَكُمْ وَيُدْخِلْكُمْ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ وَمَسَاكِنَ طَيِّبَةً فِي جَنَّاتِ عَدْنٍ ۚ ذَٰلِكَ الْفَوْزُ الْعَظِيمُ
అల్లాహ్ మీ పాపాలను క్షమిస్తాడు. క్రింద కాలువలు ప్రవహించే (స్వర్గ) వనాలలో మీకు ప్రవేశం కల్పిస్తాడు. శాశ్వతంగా ఉండే ఉద్యానవనాలలో గల పరిశుబ్రమైన గృహాలలో ప్రవేశింపజేస్తాడు. నిజానికి ఇదే గొప్ప సాఫల్యం.
61:13 وَأُخْرَىٰ تُحِبُّونَهَا ۖ نَصْرٌ مِّنَ اللَّهِ وَفَتْحٌ قَرِيبٌ ۗ وَبَشِّرِ الْمُؤْمِنِينَ
మీరెంతగానో ఇష్టపడే మరొకటి (అనుగ్రహం) కూడా వొసగుతాడు. అది అల్లాహ్ సహాయం, శీఘ్ర విజయం! (ఓ ప్రవక్తా!) విశ్వాసులకు దీని గురించి శుభవార్తను వినిపించు.
61:14 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُونُوا أَنصَارَ اللَّهِ كَمَا قَالَ عِيسَى ابْنُ مَرْيَمَ لِلْحَوَارِيِّينَ مَنْ أَنصَارِي إِلَى اللَّهِ ۖ قَالَ الْحَوَارِيُّونَ نَحْنُ أَنصَارُ اللَّهِ ۖ فَآمَنَت طَّائِفَةٌ مِّن بَنِي إِسْرَائِيلَ وَكَفَرَت طَّائِفَةٌ ۖ فَأَيَّدْنَا الَّذِينَ آمَنُوا عَلَىٰ عَدُوِّهِمْ فَأَصْبَحُوا ظَاهِرِينَ
ఓ విశ్వాసులారా! మర్యం కుమారుడైన ఈసా తన హవారీలతో, “అల్లాహ్ మార్గంలో నాకు సహాయపడగల వారెవరు?” అని అన్నప్పుడు, “అల్లాహ్ మార్గంలో మేము సహాయపడతాము” అని హవారీలు సమాధాన మిచ్చినట్లు మీరు కూడా అల్లాహ్ కు సహాయకులు అవండి. తరువాత ఇస్రాయీలు సంతతివారిలో ఒక వర్గం వారు విశ్వసించగా, మరొక వర్గం వారు తిరస్కరించారు. అప్పుడు మేము విశ్వసించిన వారికి వారి శత్రువులకు వ్యతిరేకంగా తోడ్పడ్డాము. తత్ఫలితంగా వారు గెలుపొందారు. - సూరాఅల్ జుముఅ హ్
62:1 يُسَبِّحُ لِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ الْمَلِكِ الْقُدُّوسِ الْعَزِيزِ الْحَكِيمِ
భూమ్యాకాశాలలో ఉన్న వస్తువులన్నీ సార్వభౌముడు, పరిశుద్ధుడు, శక్తిశాలి, వివేచనాశీలి అయిన అల్లాహ్ పవిత్రతను కొనియాడుతున్నాయి.
62:2 هُوَ الَّذِي بَعَثَ فِي الْأُمِّيِّينَ رَسُولًا مِّنْهُمْ يَتْلُو عَلَيْهِمْ آيَاتِهِ وَيُزَكِّيهِمْ وَيُعَلِّمُهُمُ الْكِتَابَ وَالْحِكْمَةَ وَإِن كَانُوا مِن قَبْلُ لَفِي ضَلَالٍ مُّبِينٍ
ఆయనే నిరక్షరాస్యులైన జనులలో – స్వయంగా వారిలోనుంచే ఒక ప్రవక్తను ప్రభవింపజేశాడు. అతడు వారికి దేవుని వాక్యాలను చదివి వినిపిస్తున్నాడు. వారిని పరిశుద్ధపరుస్తున్నాడు, వారికి గ్రంథాన్నీ, వివేకాన్ని బోధిస్తున్నాడు. అంతకు ముందు వారు స్పష్టమైన మార్గవిహీనతకు లోనైఉండేవారు.
62:3 وَآخَرِينَ مِنْهُمْ لَمَّا يَلْحَقُوا بِهِمْ ۚ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ
ఇంకా వారితో చేరని ఇతరుల కొరకు కూడా (ఆ ప్రవక్తను ప్రభవింపజేశాడు). ఆయన (అల్లాహ్) గొప్ప శక్తిశాలి, వివేచనాశీలి.
62:4 ذَٰلِكَ فَضْلُ اللَّهِ يُؤْتِيهِ مَن يَشَاءُ ۚ وَاللَّهُ ذُو الْفَضْلِ الْعَظِيمِ
ఇది అల్లాహ్ అనుగ్రహం. ఆయన తాను కోరిన వారికి దీనిని ప్రసాదిస్తాడు. అల్లాహ్ గొప్ప అనుగ్రహం కలవాడు.
62:5 مَثَلُ الَّذِينَ حُمِّلُوا التَّوْرَاةَ ثُمَّ لَمْ يَحْمِلُوهَا كَمَثَلِ الْحِمَارِ يَحْمِلُ أَسْفَارًا ۚ بِئْسَ مَثَلُ الْقَوْمِ الَّذِينَ كَذَّبُوا بِآيَاتِ اللَّهِ ۚ وَاللَّهُ لَا يَهْدِي الْقَوْمَ الظَّالِمِينَ
తౌరాతు గ్రంథం ప్రకారం ఆచరించాలని ఆదేశించబడినప్పటికీ, దానికి అనుగుణంగా ఆచరించనివారి ఉపమానం ఎన్నో గ్రంథాలు (వీపుపై) మోపబడిన గాడిదలాంటిది. అల్లాహ్ వాక్యాలను ధిక్కరించినవారి దృష్టాంతం చాలా చెడ్డది. దుర్మార్గ జనులకు అల్లాహ్ సన్మార్గం చూపడు.
62:6 قُلْ يَا أَيُّهَا الَّذِينَ هَادُوا إِن زَعَمْتُمْ أَنَّكُمْ أَوْلِيَاءُ لِلَّهِ مِن دُونِ النَّاسِ فَتَمَنَّوُا الْمَوْتَ إِن كُنتُمْ صَادِقِينَ
(ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం!) వారికి ఈ విధంగా చెప్పు: “ఓ యూద జనులారా! ఇతర జనుల కన్నా మీరే అల్లాహ్ కు ప్రియమైన వారన్నది మీ తలంపు అయితే, మీరు చావును కోరుకోండి. మీరు మీ వాదనలో సత్యవంతులే అయితే (ఈ సవాలును స్వీకరించండి).”
62:7 وَلَا يَتَمَنَّوْنَهُ أَبَدًا بِمَا قَدَّمَتْ أَيْدِيهِمْ ۚ وَاللَّهُ عَلِيمٌ بِالظَّالِمِينَ
వారు తమ చేజేతులా చేసుకున్న అకృత్యాల కారణంగా వారెన్నటికీ చావును కోరుకోరు. దుర్మార్గుల సంగతి అల్లాహ్ కు బాగా తెలుసు.
62:8 قُلْ إِنَّ الْمَوْتَ الَّذِي تَفِرُّونَ مِنْهُ فَإِنَّهُ مُلَاقِيكُمْ ۖ ثُمَّ تُرَدُّونَ إِلَىٰ عَالِمِ الْغَيْبِ وَالشَّهَادَةِ فَيُنَبِّئُكُم بِمَا كُنتُمْ تَعْمَلُونَ
వారికి చెప్పు : “ఏ చావు నుండి మీరు పారిపోతున్నారో అది మిమ్మల్ని చేరుకోవటం ఖాయం. ఆ తరువాత మీరు రహస్య, బహిర్గత విషయాలను ఎరిగిన వాని సమక్షంలోకి తరలించబడతారు. మరి ఆయన మీరు చేస్తూ ఉండిన పనులన్నింటినీ మీకు తెలియజెపుతాడు.”
62:9 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا نُودِيَ لِلصَّلَاةِ مِن يَوْمِ الْجُمُعَةِ فَاسْعَوْا إِلَىٰ ذِكْرِ اللَّهِ وَذَرُوا الْبَيْعَ ۚ ذَٰلِكُمْ خَيْرٌ لَّكُمْ إِن كُنتُمْ تَعْلَمُونَ
ఓ విశ్వాసులారా! శుక్రవారం నాడు నమాజు కొరకు అజాన్ (పిలుపు) ఇవ్వబడినప్పుడు, మీరు అల్లాహ్ ధ్యానం వైపు పరుగెత్తండి. క్రయవిక్రయాలను వదలి పెట్టండి. మీరు గనక తెలుసుకోగలిగితే ఇది మీ కొరకు ఎంతో మేలైనది.
62:10 فَإِذَا قُضِيَتِ الصَّلَاةُ فَانتَشِرُوا فِي الْأَرْضِ وَابْتَغُوا مِن فَضْلِ اللَّهِ وَاذْكُرُوا اللَّهَ كَثِيرًا لَّعَلَّكُمْ تُفْلِحُونَ
మరి నమాజు ముగిసిన తరువాత భూమిలో విస్తరించి, దైవానుగ్రహాన్ని అన్వేషించండి. ఎక్కువగా అల్లాహ్ ను స్మరిస్తూ ఉండండి. తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు.
62:11 وَإِذَا رَأَوْا تِجَارَةً أَوْ لَهْوًا انفَضُّوا إِلَيْهَا وَتَرَكُوكَ قَائِمًا ۚ قُلْ مَا عِندَ اللَّهِ خَيْرٌ مِّنَ اللَّهْوِ وَمِنَ التِّجَارَةِ ۚ وَاللَّهُ خَيْرُ الرَّازِقِينَ
(జనుల పరిస్థితి ఎలా ఉందంటే) ఎప్పుడు ఏ వ్యాపార వస్తువు అమ్మబడుతున్నట్లు చూసినా, ఏ వినోద వస్తువు కానవచ్చినా వారు దాని వైపుకు పరుగెడుతున్నారు. నిన్ను నిలబడి ఉన్న స్థితిలోనే విడిచిపోతున్నారు. వారికి చెప్పు : “అల్లాహ్ దగ్గర ఏదైతే ఉందో అది వినోదం కన్నా, వర్తకం కన్నా ఎంతో మేలైనది. అల్లాహ్ ఉపాధి ప్రదాతలలోకెల్లా ఉత్తముడు.” - సూరా అల్ మునాఫిఖూన్
63:1 إِذَا جَاءَكَ الْمُنَافِقُونَ قَالُوا نَشْهَدُ إِنَّكَ لَرَسُولُ اللَّهِ ۗ وَاللَّهُ يَعْلَمُ إِنَّكَ لَرَسُولُهُ وَاللَّهُ يَشْهَدُ إِنَّ الْمُنَافِقِينَ لَكَاذِبُونَ
(ఓ ముహమ్మద్!) కపటులు నీ దగ్గరికి వచ్చినప్పుడు, “తమరు నిశ్చయంగా దైవప్రవక్తేనని మేము సాక్ష్యమిస్తున్నాం” అనంటారు. నీవు ముమ్మాటికీ ఆయన ప్రవక్తేనన్న సంగతి అల్లాహ్ కు తెలుసు. ఈ కపటులు పచ్చి అబద్ధాలకోరులని కూడా అల్లాహ్ సాక్ష్యమిస్తున్నాడు.
63:2 اتَّخَذُوا أَيْمَانَهُمْ جُنَّةً فَصَدُّوا عَن سَبِيلِ اللَّهِ ۚ إِنَّهُمْ سَاءَ مَا كَانُوا يَعْمَلُونَ
వారు తమ ప్రమాణాలను ఆసరాగా చేసుకున్నారు. ఆపై వారు అల్లాహ్ మార్గం నుండి ఆగిపోయారు. వారు పాల్పడే ఈ చేష్ట బహుచెడ్డది.
63:3 ذَٰلِكَ بِأَنَّهُمْ آمَنُوا ثُمَّ كَفَرُوا فَطُبِعَ عَلَىٰ قُلُوبِهِمْ فَهُمْ لَا يَفْقَهُونَ
ఎందుకంటే వారు (మొదట) విశ్వసించి, ఆ తరువాత అవిశ్వాస వైఖరికి పాల్పడ్డారు. అందువల్ల వారి హృదయాలపై సీలు వేయబడింది. ఇక వారు ఏమీ అర్ధం చేసుకో(లే)రు.
63:4 وَإِذَا رَأَيْتَهُمْ تُعْجِبُكَ أَجْسَامُهُمْ ۖ وَإِن يَقُولُوا تَسْمَعْ لِقَوْلِهِمْ ۖ كَأَنَّهُمْ خُشُبٌ مُّسَنَّدَةٌ ۖ يَحْسَبُونَ كُلَّ صَيْحَةٍ عَلَيْهِمْ ۚ هُمُ الْعَدُوُّ فَاحْذَرْهُمْ ۚ قَاتَلَهُمُ اللَّهُ ۖ أَنَّىٰ يُؤْفَكُونَ
నీవు వారిని చూసినప్పుడు వారి శరీరాకారాలు నిన్ను ఆకట్టుకుంటాయి. వారు మాట్లాడుతుంటే నువ్వు (అమితాసక్తితో) వారి మాటల్ని వింటూనే ఉండి పోతావు. ఒక రకంగా (చెప్పాలంటే) వారు గోడకు ఆనించబడిన కర్రల్లాంటివారు. (కాస్త గట్టిగా వినబడిన) ప్రతి కేకను వారు తమపై వచ్చి పడిన గండంగానే భావిస్తారు. వీరే అసలు శత్రువులు. వీరి పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. అల్లాహ్ వీళ్ళను నాశనం చేయ! వీరు (సత్యం నుండి) ఎలా తిరిగిపోతున్నారు!?
63:5 وَإِذَا قِيلَ لَهُمْ تَعَالَوْا يَسْتَغْفِرْ لَكُمْ رَسُولُ اللَّهِ لَوَّوْا رُءُوسَهُمْ وَرَأَيْتَهُمْ يَصُدُّونَ وَهُم مُّسْتَكْبِرُونَ
“రండి, దైవప్రవక్త మీ పాపాల మన్నింపుకై ప్రార్ధిస్తాడు” అని వారితో అన్నప్పుడు, వారు తమ తలలు తిప్పుకుంటారు. మరి వారు గర్వాతిశయంతో ఆగిపోవటం నీవు చూస్తావు.
63:6 سَوَاءٌ عَلَيْهِمْ أَسْتَغْفَرْتَ لَهُمْ أَمْ لَمْ تَسْتَغْفِرْ لَهُمْ لَن يَغْفِرَ اللَّهُ لَهُمْ ۚ إِنَّ اللَّهَ لَا يَهْدِي الْقَوْمَ الْفَاسِقِينَ
(ఓ ప్రవక్తా!) వారి క్షమాపణ కొరకు నువ్వు ప్రార్ధించినా, ప్రార్ధించకపోయినా ఒక్కటే – అల్లాహ్ ఎట్టి పరిస్థితిలోనూ వారిని క్షమించడు. నిశ్చయంగా అల్లాహ్ (ఇలాంటి) అవిధేయులకు సన్మార్గం చూపడు.
63:7 هُمُ الَّذِينَ يَقُولُونَ لَا تُنفِقُوا عَلَىٰ مَنْ عِندَ رَسُولِ اللَّهِ حَتَّىٰ يَنفَضُّوا ۗ وَلِلَّهِ خَزَائِنُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَلَٰكِنَّ الْمُنَافِقِينَ لَا يَفْقَهُونَ
“దైవప్రవక్త వెంట ఉన్నవారిపై ఏమీ ఖర్చుపెట్టకండి. చివరికి వారంతట వారే చెల్లాచెదురైపోతారు” అని చెప్పేది కూడా వీరే. యదార్ధానికి భూమ్యాకాశాలలోని నిధినిక్షేపాలన్నీ అల్లాహ్ యాజమాన్యంలోనివే. కాని కపటులు అర్ధం చేసుకోవటం లేదు.
63:8 يَقُولُونَ لَئِن رَّجَعْنَا إِلَى الْمَدِينَةِ لَيُخْرِجَنَّ الْأَعَزُّ مِنْهَا الْأَذَلَّ ۚ وَلِلَّهِ الْعِزَّةُ وَلِرَسُولِهِ وَلِلْمُؤْمِنِينَ وَلَٰكِنَّ الْمُنَافِقِينَ لَا يَعْلَمُونَ
“మనం గనక మదీనా నగరానికి తిరిగి వెళ్ళినట్లయితే, గౌరవనీయుడు అల్పుణ్ణి అక్కణ్ణుంచి వెళ్ళగొడతాడు” అని వారు అంటున్నారు. నిజానికి గౌరవమైతే అల్లాహ్ కు, ఆయన ప్రవక్తకు, విశ్వాసులకే చెందుతుంది. కాని ఈ కపటులు తెలుసుకోవటం లేదు.
63:9 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تُلْهِكُمْ أَمْوَالُكُمْ وَلَا أَوْلَادُكُمْ عَن ذِكْرِ اللَّهِ ۚ وَمَن يَفْعَلْ ذَٰلِكَ فَأُولَٰئِكَ هُمُ الْخَاسِرُونَ
ఓ విశ్వాసులారా! మీ సిరిసంపదలు, మీ సంతానం మిమ్మల్ని అల్లాహ్ ధ్యానం నుండి మరల్చరాదు. ఎవరైతే అలా చేస్తారో వారే నష్టపోయేవారు.
63:10 وَأَنفِقُوا مِن مَّا رَزَقْنَاكُم مِّن قَبْلِ أَن يَأْتِيَ أَحَدَكُمُ الْمَوْتُ فَيَقُولَ رَبِّ لَوْلَا أَخَّرْتَنِي إِلَىٰ أَجَلٍ قَرِيبٍ فَأَصَّدَّقَ وَأَكُن مِّنَ الصَّالِحِينَ
మీలో ఎవరికైనా చావు వచ్చి, “నా ప్రభూ! నాకు మరికొంత గడువు ఎందుకు ఇవ్వలేదు? (ఇస్తే) నేను కూడా దానధర్మాలు చేసి సజ్జనులలో చేరేవాణ్ణి కదా!” అని (కడుదీనంగా) పలికే దుస్థితి దాపురించకముందే మేము మీకు ప్రసాదించిన దాని నుండి (మా మార్గంలో) ఖర్చు చేయండి.
63:11 وَلَن يُؤَخِّرَ اللَّهُ نَفْسًا إِذَا جَاءَ أَجَلُهَا ۚ وَاللَّهُ خَبِيرٌ بِمَا تَعْمَلُونَ
ఏ ప్రాణికైనా, దాని నిర్ధారిత సమయం ఆసన్నమైందంటే, ఇక అల్లాహ్ ఎట్టి పరిస్థితిలోనూ దానికి గడువు ఇవ్వడు. మీరు చేసేదంతా అల్లాహ్ కు తెలుసు. - సూరా అత్ తగాబున్
64:1 يُسَبِّحُ لِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۖ لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ ۖ وَهُوَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
భూమ్యాకాశాలలో ఉన్నవన్నీ అల్లాహ్ పవిత్రతను కొనియాడుతున్నాయి. సర్వసత్తాధికారం ఆయనదే. స్తోత్రం ఆయనకే శోభాయమానం. అయన అన్నింటిపై అధికారం కలవాడు.
64:2 هُوَ الَّذِي خَلَقَكُمْ فَمِنكُمْ كَافِرٌ وَمِنكُم مُّؤْمِنٌ ۚ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ
మిమ్మల్ని సృష్టించినవాడు ఆయనే. మరి మీలో కొందరు అవిశ్వాసులుగా ఉంటె మరి కొందరు విశ్వాసులుగా ఉన్నారు. మీరు చేసేదంతా అల్లాహ్ చూస్తూనే ఉన్నాడు.
64:3 خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ بِالْحَقِّ وَصَوَّرَكُمْ فَأَحْسَنَ صُوَرَكُمْ ۖ وَإِلَيْهِ الْمَصِيرُ
అయన ఆకాశాలనూ, భూమినీ (న్యాయంతో), సమతూకం (సత్యం)తో సృష్టించాడు. మరి (అయన) మీ రూపు రేఖలను తీర్చిదిద్దాడు. మీకు చాల మంచి రూపమిచ్చాడు. కడకు చేరుకోవలసింది అయన వద్దకే.
64:4 يَعْلَمُ مَا فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ وَيَعْلَمُ مَا تُسِرُّونَ وَمَا تُعْلِنُونَ ۚ وَاللَّهُ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ
భూమ్యాకాశాలలో ఉండే వాటన్నింటి గురించి ఆయనకు తెలుసు. మీరు దాచేదీ బహిర్గతం చేసేదీ (అంతా) ఆయనకు తెలుసు. అల్లాహ్ గుండెల్లోని గుట్టును సయితం ఎరిగినవాడు.
64:5 أَلَمْ يَأْتِكُمْ نَبَأُ الَّذِينَ كَفَرُوا مِن قَبْلُ فَذَاقُوا وَبَالَ أَمْرِهِمْ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ
ఏమిటి, ఇంతకుమునుపు తిరస్కార వైఖరికి పాల్పడిన వారి సమాచారం మీకు చేరలేదా? వారు తమ ఆగడాల దుష్పరిణామాన్ని చవిచూశారు. వారి కొరకు బాధాకరమైన శిక్ష ఉన్నది.
64:6 ذَٰلِكَ بِأَنَّهُ كَانَت تَّأْتِيهِمْ رُسُلُهُم بِالْبَيِّنَاتِ فَقَالُوا أَبَشَرٌ يَهْدُونَنَا فَكَفَرُوا وَتَوَلَّوا ۚ وَّاسْتَغْنَى اللَّهُ ۚ وَاللَّهُ غَنِيٌّ حَمِيدٌ
ఎందుకంటే, వారి దగ్గరకు వారి ప్రవక్తలు స్పష్టమైన నిదర్శనాలను తీసుకువచ్చినప్పుడు, “ఏమిటీ, మానవమాత్రులు మాకు మార్గదర్శకత్వం వహిస్తారా?” అని వారు (చులకనగా) మాట్లాడారు. ఆ విధంగా వారు (సత్యాన్ని) తిరస్కరించారు. ముఖాలు త్రిప్పుకున్నారు. మరి అల్లాహ్ కూడా వారిని పట్టించుకోలేదు. అల్లాహ్ నిరపేక్షాపరుడు. అన్ని విధాలా ప్రశంసనీయుడు.
64:7 زَعَمَ الَّذِينَ كَفَرُوا أَن لَّن يُبْعَثُوا ۚ قُلْ بَلَىٰ وَرَبِّي لَتُبْعَثُنَّ ثُمَّ لَتُنَبَّؤُنَّ بِمَا عَمِلْتُمْ ۚ وَذَٰلِكَ عَلَى اللَّهِ يَسِيرٌ
తాము మరణించిన పిదప తిరిగి బ్రతికించబడటం అనేది ఎట్టి పరిస్థితిలోనూ జరగని పని అని అవిశ్వాసులు తలపోస్తున్నారు. (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “ఎందుకు జరగదు? నా ప్రభువు తోడు! మీరు తప్పకుండా మళ్ళి లేపబడతారు. మీరు చేసినదంతా మీకు తెలియపరచబడుతుంది. ఇలా చేయటం అల్లాహ్ కు చాలా తేలిక.”
64:8 فَآمِنُوا بِاللَّهِ وَرَسُولِهِ وَالنُّورِ الَّذِي أَنزَلْنَا ۚ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ خَبِيرٌ
కాబట్టి మీరు అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను, మేము అవతరింపజేసిన జ్యోతిని విశ్వసించండి. మీరు చేసే ప్రతి పనిని అల్లాహ్ కనిపెట్టుకుని ఉన్నాడు.
64:9 يَوْمَ يَجْمَعُكُمْ لِيَوْمِ الْجَمْعِ ۖ ذَٰلِكَ يَوْمُ التَّغَابُنِ ۗ وَمَن يُؤْمِن بِاللَّهِ وَيَعْمَلْ صَالِحًا يُكَفِّرْ عَنْهُ سَيِّئَاتِهِ وَيُدْخِلْهُ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا أَبَدًا ۚ ذَٰلِكَ الْفَوْزُ الْعَظِيمُ
ఏ రోజున ఆయన మిమ్మల్నందరినీ సమీకరణ జరిగే రోజుకై సమీకరిస్తాడో అది గెలుపోటముల రోజై ఉంటుంది. ఎవరైతే అల్లాహ్ ను విశ్వసించి, సదాచరణ చేస్తారో అల్లాహ్ వారి పాపాలను వారి నుండి దూరం చేస్తాడు. క్రింద కాలువలు ప్రవహించే (స్వర్గ) తోటలలో వారికి ప్రవేశం కల్పిస్తాడు. వారందులో కలకాలం ఉంటారు. గొప్ప సాఫల్యం ఇదే.
64:10 وَالَّذِينَ كَفَرُوا وَكَذَّبُوا بِآيَاتِنَا أُولَٰئِكَ أَصْحَابُ النَّارِ خَالِدِينَ فِيهَا ۖ وَبِئْسَ الْمَصِيرُ
మరెవరైతే తిరస్కారానికి పాల్పడ్డారో, మా ఆయతులను ధిక్కరించారో వారే నరకవాసులు. వారు నరకంలో కలకాలం ఉంటారు. అది చాలా చెడ్డ గమ్యస్థానం.
64:11 مَا أَصَابَ مِن مُّصِيبَةٍ إِلَّا بِإِذْنِ اللَّهِ ۗ وَمَن يُؤْمِن بِاللَّهِ يَهْدِ قَلْبَهُ ۚ وَاللَّهُ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ
అల్లాహ్ అనుమతి లేనిదే ఏ ఆపదా రాదు. ఎవడు అల్లాహ్ ను విశ్వసిస్తాడో అతని హృదయానికి అల్లాహ్ (సరైన దిశలో) మార్గదర్శకత్వం వహిస్తాడు. అల్లాహ్ అన్ని విషయాలూ తెలిసినవాడు.
64:12 وَأَطِيعُوا اللَّهَ وَأَطِيعُوا الرَّسُولَ ۚ فَإِن تَوَلَّيْتُمْ فَإِنَّمَا عَلَىٰ رَسُولِنَا الْبَلَاغُ الْمُبِينُ
(ప్రజలారా!) మీరు అల్లాహ్ కు విధేయత చూపండి. ప్రవక్త మాటను వినండి. ఒకవేళ మీరు విముఖత చూపితే, మా ప్రవక్త బాధ్యతల్లా స్పష్టంగా విషయాన్ని చేరవేయటమే.
64:13 اللَّهُ لَا إِلَٰهَ إِلَّا هُوَ ۚ وَعَلَى اللَّهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُونَ
అల్లాహ్! ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేనేలేడు. విశ్వసించిన వారు అల్లాహ్ ను మాత్రమే నమ్ముకోవాలి.
64:14 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِنَّ مِنْ أَزْوَاجِكُمْ وَأَوْلَادِكُمْ عَدُوًّا لَّكُمْ فَاحْذَرُوهُمْ ۚ وَإِن تَعْفُوا وَتَصْفَحُوا وَتَغْفِرُوا فَإِنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ
ఓ విశ్వాసులారా! మీ భార్యలలో, మీ బిడ్డలలో కొందరు మీకు శత్రువులు. కాబట్టి వారి పట్ల అప్రమత్తంగా ఉండండి. ఒకవేళ మీరు గనక ఉపేక్షించి, క్షమించి, సడలింపుల వైఖరిని అవలంబించినట్లయితే అల్లాహ్ క్షమించేవాడు, దయదలిచేవాడు.
64:15 إِنَّمَا أَمْوَالُكُمْ وَأَوْلَادُكُمْ فِتْنَةٌ ۚ وَاللَّهُ عِندَهُ أَجْرٌ عَظِيمٌ
మీ సిరిసంపదలు, మీ సంతానం నిజానికి మీ పాలిట ఒక పరీక్ష. గొప్ప ప్రతిఫలమయితే అల్లాహ్ వద్ద ఉన్నది.
64:16 فَاتَّقُوا اللَّهَ مَا اسْتَطَعْتُمْ وَاسْمَعُوا وَأَطِيعُوا وَأَنفِقُوا خَيْرًا لِّأَنفُسِكُمْ ۗ وَمَن يُوقَ شُحَّ نَفْسِهِ فَأُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ
కాబట్టి శాయశక్తులా మీరు అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. (ఆజ్ఞలను) వినండి, విధేయత చూపండి. (దైవమార్గంలో) ఖర్చు చేస్తూ ఉండండి. ఇది స్వయంగా మీకే శ్రేయస్కరం. ఎవరైతే తమ ఆత్మ లోభత్వం నుండి రక్షించబడ్డారో వారే సాఫల్య భాగ్యం పొందినవారు.
64:17 إِن تُقْرِضُوا اللَّهَ قَرْضًا حَسَنًا يُضَاعِفْهُ لَكُمْ وَيَغْفِرْ لَكُمْ ۚ وَاللَّهُ شَكُورٌ حَلِيمٌ
మీరు గనక అల్లాహ్ కు మంచి రుణం ఇస్తే (అంటే అల్లాహ్ మార్గంలో ఖర్చు పెడితే) దాన్ని ఆయన మీ కొరకు పెంచుతూపోతాడు. మీ పాపాలను కూడా క్షమిస్తాడు. అల్లాహ్ (తన దాసుల సేవలను) గుర్తించేవాడు, సహనశీలుడు.
64:18 عَالِمُ الْغَيْبِ وَالشَّهَادَةِ الْعَزِيزُ الْحَكِيمُ
ఆయన రహస్య, బహిర్గత విషయాలు తెలిసినవాడు. సర్వాధిక్యుడు, వివేకవంతుడు. - సూరా అత్ తలాఖ్
65:1 يَا أَيُّهَا النَّبِيُّ إِذَا طَلَّقْتُمُ النِّسَاءَ فَطَلِّقُوهُنَّ لِعِدَّتِهِنَّ وَأَحْصُوا الْعِدَّةَ ۖ وَاتَّقُوا اللَّهَ رَبَّكُمْ ۖ لَا تُخْرِجُوهُنَّ مِن بُيُوتِهِنَّ وَلَا يَخْرُجْنَ إِلَّا أَن يَأْتِينَ بِفَاحِشَةٍ مُّبَيِّنَةٍ ۚ وَتِلْكَ حُدُودُ اللَّهِ ۚ وَمَن يَتَعَدَّ حُدُودَ اللَّهِ فَقَدْ ظَلَمَ نَفْسَهُ ۚ لَا تَدْرِي لَعَلَّ اللَّهَ يُحْدِثُ بَعْدَ ذَٰلِكَ أَمْرًا
ఓ ప్రవక్తా! (నీ అనుచర సమాజానికి చెప్పు) మీరు మీ స్త్రీలకు విడాకులు ఇస్తున్నప్పుడు వారి గడువు (ఇద్దత్) ప్రకారం విడాకులివ్వండి. ‘గడువు’ (రుతువు)ను లెక్కిస్తూ ఉండండి. మీ ప్రభువైన అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. మీరు వారిని వారి ఇండ్ల నుండి గెంటివేయకండి, వారు సయితం వెళ్లిపోకూడదు. ఒకవేళ వారు బాహాటంగా ఏదైనా నీతిబాహ్యమైన చేష్టకు ఒడిగడితే (అప్పుడు వెళ్ళగొట్టవచ్చు). ఇవి అల్లాహ్ నిర్ధారించిన హద్దులు. ఎవరైతే అల్లాహ్ విధించిన హద్దులను అతిక్రమిస్తాడో అతడు తన స్వయానికే అన్యాయం చేసుకున్నవాడవుతాడు. నీకు తెలీదు – బహుశా అల్లాహ్ దీని తరువాత ఏదైనా కొత్త పరిస్థితిని కల్పిస్తాడేమో!
65:2 فَإِذَا بَلَغْنَ أَجَلَهُنَّ فَأَمْسِكُوهُنَّ بِمَعْرُوفٍ أَوْ فَارِقُوهُنَّ بِمَعْرُوفٍ وَأَشْهِدُوا ذَوَيْ عَدْلٍ مِّنكُمْ وَأَقِيمُوا الشَّهَادَةَ لِلَّهِ ۚ ذَٰلِكُمْ يُوعَظُ بِهِ مَن كَانَ يُؤْمِنُ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ ۚ وَمَن يَتَّقِ اللَّهَ يَجْعَل لَّهُ مَخْرَجًا
మరి ఆ స్త్రీలు తమ గడువు (ఇద్దత్)కు చేరుకున్నప్పుడు వారిని ఉత్తమ రీతిలో మీ వివాహబంధంలోనైనా ఉంచుకోండి. లేదంటే ఉత్తమరీతిలో వారిని వేర్పరచటమైనా చేయండి. మీలోని న్యాయశీలురైన ఇద్దరు వ్యక్తుల్ని సాక్షులుగా పెట్టుకోండి. అల్లాహ్ కొరకు సరైన సాక్ష్యాన్ని నెలకొల్పండి. అల్లాహ్ ను, అంతిమదినాన్ని విశ్వసించేవారికి ఇందు మూలంగా ఉపదేశించబడుతోంది. ఎవడైతే అల్లాహ్ కు భయపడుతూ మసలుకుంటాడో అతనికి అల్లాహ్ (ఈ సంక్షోభం నుండి) బయటపడే మార్గం కల్పిస్తాడు.
65:3 وَيَرْزُقْهُ مِنْ حَيْثُ لَا يَحْتَسِبُ ۚ وَمَن يَتَوَكَّلْ عَلَى اللَّهِ فَهُوَ حَسْبُهُ ۚ إِنَّ اللَّهَ بَالِغُ أَمْرِهِ ۚ قَدْ جَعَلَ اللَّهُ لِكُلِّ شَيْءٍ قَدْرًا
అతను ఊహించనైనాలేని చోటు నుండి అతనికి ఉపాధిని సమకూరుస్తాడు. అల్లాహ్ పై భారం మోపిన వానికి అల్లాహ్ యే చాలు. అల్లాహ్ తన కార్యాన్ని చేసి తీరుతాడు. అల్లాహ్ ప్రతి విషయానికీ ఒక లెక్కను నిర్ధారించాడు.
65:4 وَاللَّائِي يَئِسْنَ مِنَ الْمَحِيضِ مِن نِّسَائِكُمْ إِنِ ارْتَبْتُمْ فَعِدَّتُهُنَّ ثَلَاثَةُ أَشْهُرٍ وَاللَّائِي لَمْ يَحِضْنَ ۚ وَأُولَاتُ الْأَحْمَالِ أَجَلُهُنَّ أَن يَضَعْنَ حَمْلَهُنَّ ۚ وَمَن يَتَّقِ اللَّهَ يَجْعَل لَّهُ مِنْ أَمْرِهِ يُسْرًا
మీ స్త్రీలలో ముట్టుపై ఆశ వదులుకున్న వారి విషయంలో మీకేదైనా సందేహముంటే, వారి గడువు మూడు నెలలు. రజస్వల (రుతుస్రావం మొదలు) కాని వారి గడువు కూడా అంతే. గర్భవతుల గడువు వారి ప్రసవం అయ్యేవరకు ఉంటుంది. ఎవడు అల్లాహ్ కు భయపడతాడో అతనికి అల్లాహ్ అతని వ్యవహారంలో అన్ని విధాలా సౌలభ్యం కల్పిస్తాడు.
65:5 ذَٰلِكَ أَمْرُ اللَّهِ أَنزَلَهُ إِلَيْكُمْ ۚ وَمَن يَتَّقِ اللَّهَ يُكَفِّرْ عَنْهُ سَيِّئَاتِهِ وَيُعْظِمْ لَهُ أَجْرًا
ఇది అల్లాహ్ ఆజ్ఞ. దీన్ని ఆయన మీ వైపు అవతరింపజేశాడు. ఎవడు అల్లాహ్ కు భయపడతాడో అతని పాపాలను అల్లాహ్ అతని నుండి రూపుమాపుతాడు. అతనికి గొప్ప పుణ్యఫలాన్ని వొసగుతాడు.
65:6 أَسْكِنُوهُنَّ مِنْ حَيْثُ سَكَنتُم مِّن وُجْدِكُمْ وَلَا تُضَارُّوهُنَّ لِتُضَيِّقُوا عَلَيْهِنَّ ۚ وَإِن كُنَّ أُولَاتِ حَمْلٍ فَأَنفِقُوا عَلَيْهِنَّ حَتَّىٰ يَضَعْنَ حَمْلَهُنَّ ۚ فَإِنْ أَرْضَعْنَ لَكُمْ فَآتُوهُنَّ أُجُورَهُنَّ ۖ وَأْتَمِرُوا بَيْنَكُم بِمَعْرُوفٍ ۖ وَإِن تَعَاسَرْتُمْ فَسَتُرْضِعُ لَهُ أُخْرَىٰ
మీ స్థోమత మేరకు మీరు ఉండే చోటే (విడాకులు పొందిన) ఆ మహిళలను కూడా ఉండనివ్వండి. వారిని ఇబ్బందులపాలు చేసే ఉద్దేశంతో బాధించకండి. ఒకవేళ వారు గర్భవతులై ఉంటే, వారు శిశువును కనే వరకు వారికి ఖర్చులు ఇస్తూ ఉండండి. ఆ తరువాత వారు – మీ అభ్యర్ధన పై – బిడ్డకు పాలిచ్చినట్లయితే వారికి వారి ప్రతిఫలాన్ని ముట్టజెప్పండి. ధర్మానుసారం పరస్పరం సంప్రదించుకోండి. ఒకవేళ మీరు పరస్పరం గొడవపడినట్లయితే అతని కోరికపై మరొకామె బిడ్డకు పాలుపడుతుంది.
65:7 لِيُنفِقْ ذُو سَعَةٍ مِّن سَعَتِهِ ۖ وَمَن قُدِرَ عَلَيْهِ رِزْقُهُ فَلْيُنفِقْ مِمَّا آتَاهُ اللَّهُ ۚ لَا يُكَلِّفُ اللَّهُ نَفْسًا إِلَّا مَا آتَاهَا ۚ سَيَجْعَلُ اللَّهُ بَعْدَ عُسْرٍ يُسْرًا
స్థోమత ఉన్నవాడు తన స్థోమతకు తగ్గట్టుగా ఖర్చుచేయాలి. మరెవరికయితే అతని ఉపాధి కుదించబడిందో, అతను అల్లాహ్ తనకు ప్రసాదించిన దానిలో నుంచి (తన స్థాయికి తగ్గట్టుగానే) ఖర్చుపెట్టాలి. అల్లాహ్ ఏ ప్రాణిపైనా దానికి ఇచ్చిన దానికంటే ఎక్కువ భారం మోపడు. అల్లాహ్ ఇబ్బందుల తరువాత సౌలభ్యాన్ని కూడా కల్పిస్తాడు.
65:8 وَكَأَيِّن مِّن قَرْيَةٍ عَتَتْ عَنْ أَمْرِ رَبِّهَا وَرُسُلِهِ فَحَاسَبْنَاهَا حِسَابًا شَدِيدًا وَعَذَّبْنَاهَا عَذَابًا نُّكْرًا
ఎన్నో జనపదాలవారు తమ ప్రభువు ఆజ్ఞపట్ల, ఆయన ప్రవక్తల పట్ల తిరుగుబాటు ధోరణిని అవలంబించిన కారణంగా మేము కూడా వారి నుండి కటినంగా లెక్క తీసుకున్నాము. కానరాని రీతిలో వారిని దెబ్బతీశాము.
65:9 فَذَاقَتْ وَبَالَ أَمْرِهَا وَكَانَ عَاقِبَةُ أَمْرِهَا خُسْرًا
అంతే! వారు తమ కర్మల దుష్ఫలితాన్ని చవిచూశారు. చివరకు వారికి మిగిలింది తీవ్రనష్టమే.
65:10 أَعَدَّ اللَّهُ لَهُمْ عَذَابًا شَدِيدًا ۖ فَاتَّقُوا اللَّهَ يَا أُولِي الْأَلْبَابِ الَّذِينَ آمَنُوا ۚ قَدْ أَنزَلَ اللَّهُ إِلَيْكُمْ ذِكْرًا
వారి కోసం అల్లాహ్ కటినమైన శిక్షను సిద్ధపరచి ఉంచాడు. కనుక విశ్వసించిన ఓ విజ్ఞులారా! అల్లాహ్ కు భయపడండి. నిశ్చయంగా అల్లాహ్ మీ వైపు హితబోధను పంపాడు.
65:11 رَّسُولًا يَتْلُو عَلَيْكُمْ آيَاتِ اللَّهِ مُبَيِّنَاتٍ لِّيُخْرِجَ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ مِنَ الظُّلُمَاتِ إِلَى النُّورِ ۚ وَمَن يُؤْمِن بِاللَّهِ وَيَعْمَلْ صَالِحًا يُدْخِلْهُ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا أَبَدًا ۖ قَدْ أَحْسَنَ اللَّهُ لَهُ رِزْقًا
(అనగా) అల్లాహ్ యెక్క స్పష్టమైన వాక్యాలను (ఆదేశాలను) చదివి వినిపించి, విశ్వసించి సత్కార్యాలు చేసినవారిని ఆయన కారు చీకట్లలో నుండి వెలుగులోనికి తీసుకువచ్చేందుకు ఒక ప్రవక్తను పంపాడు. మరెవరైతే అల్లాహ్ ను విశ్వసించి సదాచరణ చేస్తారో వారిని అల్లాహ్ క్రింద కాలువలు ప్రవహించే (స్వర్గ) వనాలలో ప్రవేశింపజేస్తాడు. వాటిలో వారు కలకాలం ఉంటారు. నిశ్చయంగా అల్లాహ్ అతనికి అత్యుత్తమమైన ఉపాధిని వొసగాడు.
65:12 اللَّهُ الَّذِي خَلَقَ سَبْعَ سَمَاوَاتٍ وَمِنَ الْأَرْضِ مِثْلَهُنَّ يَتَنَزَّلُ الْأَمْرُ بَيْنَهُنَّ لِتَعْلَمُوا أَنَّ اللَّهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ وَأَنَّ اللَّهَ قَدْ أَحَاطَ بِكُلِّ شَيْءٍ عِلْمًا
అల్లాహ్ – ఆయనే సప్తాకాశాలను, అలాంటివే భూములను సృష్టించినవాడు. ఆయన ఆజ్ఞ వాటి మధ్య అవతరిస్తుంది – అల్లాహ్ అన్నింటిపై అధికారం కలిగి ఉన్నాడనీ, ఇంకా అల్లాహ్ తన జ్ఞానంతో అన్నింటినీ పరివేష్టించి ఉన్నాడని మీరు తెలుసుకోవటానికి. - సూరా అత్ తహ్రీం
66:1 يَا أَيُّهَا النَّبِيُّ لِمَ تُحَرِّمُ مَا أَحَلَّ اللَّهُ لَكَ ۖ تَبْتَغِي مَرْضَاتَ أَزْوَاجِكَ ۚ وَاللَّهُ غَفُورٌ رَّحِيمٌ
ఓ ప్రవక్తా! అల్లాహ్ నీ కోసం ధర్మ సమ్మతం చేసిన దానిని నువ్వెందుకు (నీ కొరకు) నిషేధించుకుంటున్నావు? (ఏమిటి?) నువ్వు నీ భార్యల ప్రసన్నతను పొందగోరుతున్నావా? అల్లాహ్ క్షమాశీలుడు, దయామయుడు.
66:2 قَدْ فَرَضَ اللَّهُ لَكُمْ تَحِلَّةَ أَيْمَانِكُمْ ۚ وَاللَّهُ مَوْلَاكُمْ ۖ وَهُوَ الْعَلِيمُ الْحَكِيمُ
(అనుచితమైన) మీ ప్రతిజ్ఞలను మీరు ఉపసంహరించుకోవటాన్ని అల్లాహ్ విధిగా ఖరారు చేశాడు సుమా! అల్లాహ్ యే మీ సంరక్షకుడు. ఆయనే సర్వజ్ఞాని, వివేక సంపన్నుడు.
66:3 وَإِذْ أَسَرَّ النَّبِيُّ إِلَىٰ بَعْضِ أَزْوَاجِهِ حَدِيثًا فَلَمَّا نَبَّأَتْ بِهِ وَأَظْهَرَهُ اللَّهُ عَلَيْهِ عَرَّفَ بَعْضَهُ وَأَعْرَضَ عَن بَعْضٍ ۖ فَلَمَّا نَبَّأَهَا بِهِ قَالَتْ مَنْ أَنبَأَكَ هَٰذَا ۖ قَالَ نَبَّأَنِيَ الْعَلِيمُ الْخَبِيرُ
ప్రవక్త తన భార్యలలో ఒకామెతో ఒక రహస్య విషయం చెప్పినప్పుడు, ఆమె ఆ విషయాన్ని (మరొకామెకు) తెలియపరిచింది. ఈ సంగతిని అల్లాహ్ తన ప్రవక్తకు తెలియపరచగా, ప్రవక్త ఈ విషయాన్ని కొంతచేప్పి, మరికొంత దాటవేశాడు. ప్రవక్త ఈ సమాచారాన్ని తన భార్యకు తెలిపినపుడు, “ఇంతకీ ఈ విషయం మీకెవరు తెలిపారు?” అని ఆమె అడిగింది. “అన్నీ తెలిసిన, సర్వం ఎరిగిన అల్లాహ్ నాకీ సంగతిని తెలియజేశాడు” అని ప్రవక్త చెప్పాడు.
66:4 إِن تَتُوبَا إِلَى اللَّهِ فَقَدْ صَغَتْ قُلُوبُكُمَا ۖ وَإِن تَظَاهَرَا عَلَيْهِ فَإِنَّ اللَّهَ هُوَ مَوْلَاهُ وَجِبْرِيلُ وَصَالِحُ الْمُؤْمِنِينَ ۖ وَالْمَلَائِكَةُ بَعْدَ ذَٰلِكَ ظَهِيرٌ
(ఓ ప్రవక్త సతీమణులారా!) మీరిద్దరూ అల్లాహ్ సమక్షంలో పశ్చాత్తాపం చెందితే (అది మీకే శ్రేయస్కరం). నిశ్చయంగా మీ హృదయాలు వంగిపోయాయి. మీరు గనక ప్రవక్తకు వ్యతిరేకంగా ఒండొకరికి సహాయపడితే ప్రవక్తకు సంరక్షకుడుగా అల్లాహ్ ఉన్నాడు. జిబ్రయీలు, సజ్జనులైన విశ్వాసులు (అతనికి) ఆదరువుగా ఉన్నారు – అదీగాక దైవదూతలు కూడా అతనికి సహాయకులుగా ఉన్నారు.
66:5 عَسَىٰ رَبُّهُ إِن طَلَّقَكُنَّ أَن يُبْدِلَهُ أَزْوَاجًا خَيْرًا مِّنكُنَّ مُسْلِمَاتٍ مُّؤْمِنَاتٍ قَانِتَاتٍ تَائِبَاتٍ عَابِدَاتٍ سَائِحَاتٍ ثَيِّبَاتٍ وَأَبْكَارًا
ఒకవేళ అతను (ప్రవక్త) మీకు విడాకులిస్తే అతి త్వరలోనే అతని ప్రభువు అతనికి మీకు బదులుగా మీకన్నా ఉత్తమురాలైన భార్యలను ప్రసాదిస్తాడు. వారు ముస్లిములు, విశ్వాసం కలిగి ఉన్న వారు, విధేయత చూపేవారు, పశ్చాత్తాపం చెందేవారు, ఆరాధనలు చేసేవారు, ఉపవాసాలు పాటించేవారు అయి ఉంటారు. వారు వితంతువులూ అయి ఉంటారు, కన్యలూ అయి ఉంటారు.
66:6 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا قُوا أَنفُسَكُمْ وَأَهْلِيكُمْ نَارًا وَقُودُهَا النَّاسُ وَالْحِجَارَةُ عَلَيْهَا مَلَائِكَةٌ غِلَاظٌ شِدَادٌ لَّا يَعْصُونَ اللَّهَ مَا أَمَرَهُمْ وَيَفْعَلُونَ مَا يُؤْمَرُونَ
ఓ విశ్వాసులారా! మీరు మిమ్మల్ని, మీ కుటుంబీకుల్ని అగ్ని బారి నుండి కాపాడుకోండి. (ఆ అగ్ని ఎటువంటిదంటే) మనుషులు, రాళ్లు దాని ఇంధనం కానున్నారు. దానిపై కర్కశులు, బలిష్టులు అయిన దూతలు నియమితులై ఉన్నారు. అల్లాహ్ ఆజ్ఞలను పాలించటంలో వారు ఏమాత్రం అలక్ష్యం చేయరు. పైగా వారికి జారీ చేయబడిన ఆజ్ఞలను వారు ఖచ్చితంగా పాలిస్తారు.
66:7 يَا أَيُّهَا الَّذِينَ كَفَرُوا لَا تَعْتَذِرُوا الْيَوْمَ ۖ إِنَّمَا تُجْزَوْنَ مَا كُنتُمْ تَعْمَلُونَ
ఓ అవిశ్వాసులారా! ఈ రోజు మీరు సాకులు చెప్పకండి. మీరు చేసుకున్న కర్మల ఫలితం మాత్రమే మీకివ్వబడుతుంది.
66:8 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا تُوبُوا إِلَى اللَّهِ تَوْبَةً نَّصُوحًا عَسَىٰ رَبُّكُمْ أَن يُكَفِّرَ عَنكُمْ سَيِّئَاتِكُمْ وَيُدْخِلَكُمْ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ يَوْمَ لَا يُخْزِي اللَّهُ النَّبِيَّ وَالَّذِينَ آمَنُوا مَعَهُ ۖ نُورُهُمْ يَسْعَىٰ بَيْنَ أَيْدِيهِمْ وَبِأَيْمَانِهِمْ يَقُولُونَ رَبَّنَا أَتْمِمْ لَنَا نُورَنَا وَاغْفِرْ لَنَا ۖ إِنَّكَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
ఓ విశ్వాసులారా! అల్లాహ్ వైపు పశ్చాత్తాపంతో మరలండి – నిష్కల్మషమైన పశ్చాత్తాపభావంతో! మీ ప్రభువు మీ పాపాలను మీనుండి దూరం చేయవచ్చు. క్రింద సెలయేళ్ళు ప్రవహించే (స్వర్గ) వనాలలో మీకు ప్రవేశం కల్పించవచ్చు. ఆ రోజు అల్లాహ్ ప్రవక్తనూ, అతని వెంటనున్న విశ్వాసులను అవమానపరచడు. వారి కాంతి వారి ముందూ, వారి కుడి వైపూ పరుగెడుతూ ఉంటుంది. అప్పుడు వారిలా వేడుకుంటూ ఉంటారు: “మా ప్రభూ! మా కాంతిని మా కొరకు పరిపూర్ణం గావించు. మమ్మల్ని క్షమించు. నిశ్చయంగా నీవు అన్నింటిపై అధికారం కలవాడవు.”
66:9 يَا أَيُّهَا النَّبِيُّ جَاهِدِ الْكُفَّارَ وَالْمُنَافِقِينَ وَاغْلُظْ عَلَيْهِمْ ۚ وَمَأْوَاهُمْ جَهَنَّمُ ۖ وَبِئْسَ الْمَصِيرُ
ఓ ప్రవక్తా! అవిశ్వాసులతో, కపటులతో పోరాడు. వారి పట్ల కఠినంగా వ్యవహరించు. వారి నివాసం నరకం. అది చాలా చెడ్డ గమ్యం.
66:10 ضَرَبَ اللَّهُ مَثَلًا لِّلَّذِينَ كَفَرُوا امْرَأَتَ نُوحٍ وَامْرَأَتَ لُوطٍ ۖ كَانَتَا تَحْتَ عَبْدَيْنِ مِنْ عِبَادِنَا صَالِحَيْنِ فَخَانَتَاهُمَا فَلَمْ يُغْنِيَا عَنْهُمَا مِنَ اللَّهِ شَيْئًا وَقِيلَ ادْخُلَا النَّارَ مَعَ الدَّاخِلِينَ
అల్లాహ్ అవిశ్వాసుల (హితబోధ) కోసం నూహు, లూతు భార్యల ఉదాహరణలను ఇస్తున్నాడు. వారిద్దరూ మా దాసుల్లోని ఇద్దరు సజ్జనుల అధ్వర్యంలో ఉండేవారు. అయితే వారిద్దరూ తమ భర్తల పట్ల ద్రోహానికి ఒడిగట్టారు. అందువల్ల వారిద్దరూ (సజ్జనదాసులు) దైవశిక్ష విషయంలో వారిని (తమ భార్యలను) ఏ విధంగానూ ఆదుకోలేకపోయారు. “పొండి, నరకానికి పోయేవారితో పాటు మీరూ పోయిపడండి” అని ఆ స్త్రీలిరువురితో అనబడింది.
66:11 وَضَرَبَ اللَّهُ مَثَلًا لِّلَّذِينَ آمَنُوا امْرَأَتَ فِرْعَوْنَ إِذْ قَالَتْ رَبِّ ابْنِ لِي عِندَكَ بَيْتًا فِي الْجَنَّةِ وَنَجِّنِي مِن فِرْعَوْنَ وَعَمَلِهِ وَنَجِّنِي مِنَ الْقَوْمِ الظَّالِمِينَ
మరి అల్లాహ్ విశ్వాసుల కొరకు ఫిరౌను భార్య ఉదాహరణను ఇస్తున్నాడు. అప్పుడామె ఇలా వేడుకున్నది: “నా ప్రభూ! నా కోసం నీ దగ్గర – స్వర్గంలో – ఒక గృహాన్ని నిర్మించు. నన్ను ఫిరౌను నుండి, అతని (దుష్ట) పోకడ నుండి రక్షించు. దుర్మార్గ జనుల నుండి నాకు విముక్తిని ప్రసాదించు.”
66:12 وَمَرْيَمَ ابْنَتَ عِمْرَانَ الَّتِي أَحْصَنَتْ فَرْجَهَا فَنَفَخْنَا فِيهِ مِن رُّوحِنَا وَصَدَّقَتْ بِكَلِمَاتِ رَبِّهَا وَكُتُبِهِ وَكَانَتْ مِنَ الْقَانِتِينَ
మరి ఇమ్రాన్ కుమార్తె అయిన మర్యం (గురించి కూడా అల్లాహ్ ఉదాహరిస్తున్నాడు). ఆమె తన మానాన్ని కాపాడుకున్నది. మరి మేము మా తరఫున ఆమెలో ప్రాణాన్ని ఊదాము. మరి ఆమె తన ప్రభువు వచనాలను, ఆయన గ్రంథాలను సత్యమని ధృవపరచింది. ఆమె వినయవిధేయతలు గల స్త్రీమూర్తుల కోవకు చెందినది. - సూరా అల్ ముల్క్
67:1 تَبَارَكَ الَّذِي بِيَدِهِ الْمُلْكُ وَهُوَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
ఎవరి చేతిలో విశ్వసామ్రాజ్యాధికారం ఉన్నదో ఆయన ఎంతో శుభకరుడు. ఆయన ప్రతి వస్తువుపై అధికారం కలవాడు.
67:2 الَّذِي خَلَقَ الْمَوْتَ وَالْحَيَاةَ لِيَبْلُوَكُمْ أَيُّكُمْ أَحْسَنُ عَمَلًا ۚ وَهُوَ الْعَزِيزُ الْغَفُورُ
మీలో మంచి పనులు చేసేవారెవరో పరీక్షించే నిమిత్తం ఆయన చావుబతుకులను సృజించాడు. ఆయన శక్తిశాలి, క్షమాశీలి కూడాను.
67:3 الَّذِي خَلَقَ سَبْعَ سَمَاوَاتٍ طِبَاقًا ۖ مَّا تَرَىٰ فِي خَلْقِ الرَّحْمَٰنِ مِن تَفَاوُتٍ ۖ فَارْجِعِ الْبَصَرَ هَلْ تَرَىٰ مِن فُطُورٍ
ఆయన ఒకదానిపై ఒకటిగా సప్తాకాశాలను నిర్మించాడు. (ఓ చూచేవాడా!) నీవు కరుణామయుని సృష్టి ప్రక్రియలో ఎలాంటి అస్తవ్యస్తతను కానలేవు. కావాలంటే మరోసారి (దృష్టిని సారించి)చూడు. నీకేమైనా లోపం (బీటలు వారినట్టు) కనిపిస్తోందా?
67:4 ثُمَّ ارْجِعِ الْبَصَرَ كَرَّتَيْنِ يَنقَلِبْ إِلَيْكَ الْبَصَرُ خَاسِئًا وَهُوَ حَسِيرٌ
మళ్ళి మళ్ళి దృష్టిని సారించు. నీ దృష్టి అలసిసొలసి, విఫలమై నీ వైపు తిరిగి వస్తుంది.
67:5 وَلَقَدْ زَيَّنَّا السَّمَاءَ الدُّنْيَا بِمَصَابِيحَ وَجَعَلْنَاهَا رُجُومًا لِّلشَّيَاطِينِ ۖ وَأَعْتَدْنَا لَهُمْ عَذَابَ السَّعِيرِ
నిశ్చయంగా మేము (భూమికి) సమీపంలో ఉన్న ఆకాశాన్ని దీపాలతో (నక్షత్రాలతో)ముస్తాబు చేశాము. ఇంకా వాటిని (ఆ దీపాలను) షైతానులను తరిమికొట్టే సాధనాలుగా చేశాము. షైతానుల కొరకైతే మేము నరకాగ్నిని కూడా సిద్ధపరచి ఉంచాము.
67:6 وَلِلَّذِينَ كَفَرُوا بِرَبِّهِمْ عَذَابُ جَهَنَّمَ ۖ وَبِئْسَ الْمَصِيرُ
తమ ప్రభువును తిరస్కరించిన వారికి నరకయాతన తథ్యం. అదెంత చెడ్డ గమ్యస్థలం!?
67:7 إِذَا أُلْقُوا فِيهَا سَمِعُوا لَهَا شَهِيقًا وَهِيَ تَفُورُ
వారు అందులో పడవేయబడినప్పుడు దాని వికృత గర్జనను వారు వింటారు. అది ఉద్రేకంతో ఉడికి పోతూ ఉంటుంది.
67:8 تَكَادُ تَمَيَّزُ مِنَ الْغَيْظِ ۖ كُلَّمَا أُلْقِيَ فِيهَا فَوْجٌ سَأَلَهُمْ خَزَنَتُهَا أَلَمْ يَأْتِكُمْ نَذِيرٌ
ఆగ్రహంతో బ్రద్దలైపోయినట్లే ఉంటుంది. అందులో ఏదైనా ఒక సమూహం పడవేయబడినప్పుడల్లా, దాని రక్షకులు వారినుద్దేశించి, “ఏమిటి, మీ వద్దకు హెచ్చరించే వారెవరూ రాలేదా?” అని అడుగుతారు.
67:9 قَالُوا بَلَىٰ قَدْ جَاءَنَا نَذِيرٌ فَكَذَّبْنَا وَقُلْنَا مَا نَزَّلَ اللَّهُ مِن شَيْءٍ إِنْ أَنتُمْ إِلَّا فِي ضَلَالٍ كَبِيرٍ
“ఎందుకు రాలేదు? హెచ్చరించే వాడొకడు వచ్చాడు. కాని మేమే అతణ్ణి ధిక్కరించాము. ‘అల్లాహ్ దేనినీ అవతరింపజేయలేదు. మీరే పెద్ద అపమార్గానికి లోనై ఉన్నార’ని (సూటిగా) చెప్పేశాము” అని వారు ఒప్పుకుంటారు.
67:10 وَقَالُوا لَوْ كُنَّا نَسْمَعُ أَوْ نَعْقِلُ مَا كُنَّا فِي أَصْحَابِ السَّعِيرِ
వారు ఇంకా ఇలా అంటారు : “మేము విని ఉంటే లేదా బుద్ధిపెట్టి ఆలోచించి ఉంటే నరకాగ్నికి ఆహుతి అయిన వాళ్లతో చేరేవాళ్ళం కాము.”
67:11 فَاعْتَرَفُوا بِذَنبِهِمْ فَسُحْقًا لِّأَصْحَابِ السَّعِيرِ
ఆ విధంగా వారు తమ తప్పును (పాపాన్ని) ఒప్పుకుంటారు. కనుక ఈ నరకవాసులు (దైవకారుణ్యానికి) దూరమవుదురుగాక!
67:12 إِنَّ الَّذِينَ يَخْشَوْنَ رَبَّهُم بِالْغَيْبِ لَهُم مَّغْفِرَةٌ وَأَجْرٌ كَبِيرٌ
తమ ప్రభువును చూడకుండానే ఆయనకు భయపడుతూ ఉండేవారి కోసం క్షమాపణ, గొప్ప పుణ్యఫలం ఉన్నాయి.
67:13 وَأَسِرُّوا قَوْلَكُمْ أَوِ اجْهَرُوا بِهِ ۖ إِنَّهُ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ
మీరు మీ మాటలను రహస్యంగా (మెల్లగా) పలికినా, బిగ్గరగా పలికినా (అల్లాహ్ కు తెలియకుండా ఉండవు). నిశ్చయంగా ఆయన గుండెల్లోని గుట్టును సయితం ఎరిగినవాడు.
67:14 أَلَا يَعْلَمُ مَنْ خَلَقَ وَهُوَ اللَّطِيفُ الْخَبِيرُ
ఏమిటి, పుట్టించిన ఆయనే ఎరుగకుండా ఉంటాడా? ఆయనైతే సూక్ష్మగ్రాహి, సర్వాన్నీ కనిపెట్టుకుని ఉన్నవాడు.
67:15 هُوَ الَّذِي جَعَلَ لَكُمُ الْأَرْضَ ذَلُولًا فَامْشُوا فِي مَنَاكِبِهَا وَكُلُوا مِن رِّزْقِهِ ۖ وَإِلَيْهِ النُّشُورُ
ధరిత్రిని మీకు లోబడి ఉండేలా చేసినవాడు ఆయనే. కాబట్టి మీరు దాని మార్గాలపై నడవండి. ఆయన సమకూర్చిన ఆహారాన్ని భుజించండి. కడకు మీరు సజీవులై నిలబడవలసింది ఆయన సన్నిధిలోనే.
67:16 أَأَمِنتُم مَّن فِي السَّمَاءِ أَن يَخْسِفَ بِكُمُ الْأَرْضَ فَإِذَا هِيَ تَمُورُ
ఏమిటి, నింగినున్నవాడు మిమ్మల్ని నేలలోనికి దిగబడేలా చేసే విషయమై, ఆపై నేల అకస్మాత్తుగా ప్రకంపించటంపై మీరు నిర్భయంగా ఉన్నారా?
67:17 أَمْ أَمِنتُم مَّن فِي السَّمَاءِ أَن يُرْسِلَ عَلَيْكُمْ حَاصِبًا ۖ فَسَتَعْلَمُونَ كَيْفَ نَذِيرِ
లేక నింగినున్నవాడు మీపై రాళ్ల వాన కురిపిస్తాడన్న భయం మీకు బొత్తిగా లేదా? మరైతే నా హెచ్చరిక ఎటువంటిదో మీకు త్వరలోనే తెలిసిపోతుంది.
67:18 وَلَقَدْ كَذَّبَ الَّذِينَ مِن قَبْلِهِمْ فَكَيْفَ كَانَ نَكِيرِ
వీరి పూర్వీకులు కూడా ధిక్కరించిన వారే. మరి వారిపై నా దెబ్బ ఎలాపడిందో చూశారుగా!
67:19 أَوَلَمْ يَرَوْا إِلَى الطَّيْرِ فَوْقَهُمْ صَافَّاتٍ وَيَقْبِضْنَ ۚ مَا يُمْسِكُهُنَّ إِلَّا الرَّحْمَٰنُ ۚ إِنَّهُ بِكُلِّ شَيْءٍ بَصِيرٌ
ఏమిటీ, వీరు తమపై రెక్కల్ని చాచుతూ, (ఒక్కోసారి) ముడుచుకుంటూ ఎగిరే పక్షుల్ని చూడటం లేదా? కరుణామయుడు (అయిన అల్లాహ్) తప్ప వాటిని ఆ స్థితిలో ఎవరూ నిలిపి ఉంచటం లేదు. నిశ్చయంగా ప్రతి వస్తువు ఆయన దృష్టిలో ఉంది.
67:20 أَمَّنْ هَٰذَا الَّذِي هُوَ جُندٌ لَّكُمْ يَنصُرُكُم مِّن دُونِ الرَّحْمَٰنِ ۚ إِنِ الْكَافِرُونَ إِلَّا فِي غُرُورٍ
కరుణామయుడు (అయిన అల్లాహ్) కు విరుద్ధంగా మీకు సాయపడే సైన్యం ఏదో కాస్త చెప్పండి!? అవిశ్వాసులు మాత్రం మోసంలో పడి ఉన్నారు.
67:21 أَمَّنْ هَٰذَا الَّذِي يَرْزُقُكُمْ إِنْ أَمْسَكَ رِزْقَهُ ۚ بَل لَّجُّوا فِي عُتُوٍّ وَنُفُورٍ
ఒకవేళ ఆయన గనక తన ఉపాధిని నిలిపివేస్తే, మరి మీకు ఉపాధిని ఇచ్చేవాడెవడో చెప్పండి!? (ఎవరూ లేరు.) కాని వీరు (ఈ అవిశ్వాసులు) మాత్రం తమ తలబిరుసుతనంపై, పలాయనంపై పాతుకుపోయారు.
67:22 أَفَمَن يَمْشِي مُكِبًّا عَلَىٰ وَجْهِهِ أَهْدَىٰ أَمَّن يَمْشِي سَوِيًّا عَلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ
సరే, తలక్రిందులై ముఖంతో నడిచిపోయేవాడు సన్మార్గం పొందుతాడా? లేక తిన్నని బాటపై (తన కాళ్ళ మీద) నడిచిపోయేవాడు సన్మార్గం పొందుతాడా?
67:23 قُلْ هُوَ الَّذِي أَنشَأَكُمْ وَجَعَلَ لَكُمُ السَّمْعَ وَالْأَبْصَارَ وَالْأَفْئِدَةَ ۖ قَلِيلًا مَّا تَشْكُرُونَ
వారికి చెప్పు: “మిమ్మల్ని పుట్టించిన వాడు ఆయనే (అల్లాహ్ యే). మీ చెవులను, కళ్ళను, హృదయాలను చేసిన వాడూ ఆయనే. మీరు కృతఙ్ఞతలు తెలిపేది మాత్రం చాలా తక్కువ.”
67:24 قُلْ هُوَ الَّذِي ذَرَأَكُمْ فِي الْأَرْضِ وَإِلَيْهِ تُحْشَرُونَ
వారికి చెప్పు : “మిమ్మల్ని నేలలో విస్తరింపజేసినవాడు ఆయనే. (కడకు) ఆయన వైపే మీరంతా సమీకరించబడతారు.”
67:25 وَيَقُولُونَ مَتَىٰ هَٰذَا الْوَعْدُ إِن كُنتُمْ صَادِقِينَ
మీరు చెప్పేదే నిజమైతే ఆ వాగ్దానం ఎప్పుడు సంభవిస్తుంది?” అని (అవిశ్వాసులు) అడుగుతున్నారు కదూ!
67:26 قُلْ إِنَّمَا الْعِلْمُ عِندَ اللَّهِ وَإِنَّمَا أَنَا نَذِيرٌ مُّبِينٌ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “ఆ విషయం అల్లాహ్ కే తెలుసు. నేను మటుకు స్పష్టంగా హెచ్చరించే వాణ్ణి మాత్రమే.”
67:27 فَلَمَّا رَأَوْهُ زُلْفَةً سِيئَتْ وُجُوهُ الَّذِينَ كَفَرُوا وَقِيلَ هَٰذَا الَّذِي كُنتُم بِهِ تَدَّعُونَ
వారు ఆ వాగ్దానాన్ని అతి దగ్గరలో చూసుకున్నప్పుడు అవిశ్వాసుల ముఖాలు వికృతంగా మారిపోతాయి. “మీరు (పదే పదే) అడుగుతుండేది ఇదే” అని వారితో అనబడుతుంది.
67:28 قُلْ أَرَأَيْتُمْ إِنْ أَهْلَكَنِيَ اللَّهُ وَمَن مَّعِيَ أَوْ رَحِمَنَا فَمَن يُجِيرُ الْكَافِرِينَ مِنْ عَذَابٍ أَلِيمٍ
వారిని అడుగు : “చూడండి! ఒకవేళ నన్నూ, నా వెంటనున్న వారిని అల్లాహ్ అంతమొందించినా లేక మాపై దయదలిచినా (ఏది ఏమైనా) అవిశ్వాసులను వ్యధాభరితమైన యాతన నుండి కాపాడేవాడెవడో చెప్పండి?”
67:29 قُلْ هُوَ الرَّحْمَٰنُ آمَنَّا بِهِ وَعَلَيْهِ تَوَكَّلْنَا ۖ فَسَتَعْلَمُونَ مَنْ هُوَ فِي ضَلَالٍ مُّبِينٍ
(ఓ ప్రవక్తా! వారికి) చెప్పు: “ఆయనే కరుణామయుడు (అయిన అల్లాహ్). మేము ఆయన్ని విశ్వసించాము. ఆయనపైనే భారం మోపాము. ఇకపోతే, స్పష్టమైన మార్గభ్రష్టత్వానికి గురై ఉన్నదెవరో మీకు త్వరలోనే తెలిసిపోతుంది.”
67:30 قُلْ أَرَأَيْتُمْ إِنْ أَصْبَحَ مَاؤُكُمْ غَوْرًا فَمَن يَأْتِيكُم بِمَاءٍ مَّعِينٍ
వారిని ఇలా అడుగు: “సరే, మీరు త్రాగే ఈ నీరు గనక భూమిలో ఇంకిపోతే, మీ కొరకు నీటి ఊటను బయటికి తెచ్చేదెవరో (ఇప్పుడు) చెప్పండి!?” - సూరా అల్ ఖలమ్
68:1 ن ۚ وَالْقَلَمِ وَمَا يَسْطُرُونَ
నూన్ – కలము సాక్షిగా! వారు (దైవదూతలు) వ్రాసే వ్రాత సాక్షిగా!
68:2 مَا أَنتَ بِنِعْمَةِ رَبِّكَ بِمَجْنُونٍ
(ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం) నీ ప్రభువు అనుగ్రహం వల్ల నీవు పిచ్చివాడవు కావు.
68:3 وَإِنَّ لَكَ لَأَجْرًا غَيْرَ مَمْنُونٍ
నిశ్చయంగా నీకు ఎన్నటికీ తరగని పుణ్యఫలం లభిస్తుంది.
68:4 وَإِنَّكَ لَعَلَىٰ خُلُقٍ عَظِيمٍ
ఇంకా, నీవు నైతికంగా అత్యున్నత స్థానంలో ఉన్నావు.
68:5 فَسَتُبْصِرُ وَيُبْصِرُونَ
కాబట్టి (త్వరలోనే) నీవూ చూస్తావు, వారూ చూసుకుంటారు,
68:6 بِأَييِّكُمُ الْمَفْتُونُ
మీలో మతి స్థిమితం లేనివారెవరో! (అందరూ చూస్తారు.)
68:7 إِنَّ رَبَّكَ هُوَ أَعْلَمُ بِمَن ضَلَّ عَن سَبِيلِهِ وَهُوَ أَعْلَمُ بِالْمُهْتَدِينَ
తన మార్గం నుండి తప్పిపోయిన వారెవరో నీ ప్రభువుకు బాగా తెలుసు. సన్మార్గం పొందిన వారెవరో కూడా ఆయనకు బాగా తెలుసు.
68:8 فَلَا تُطِعِ الْمُكَذِّبِينَ
కాబట్టి నువ్వు ధిక్కారుల మాట వినకు.
68:9 وَدُّوا لَوْ تُدْهِنُ فَيُدْهِنُونَ
నువ్వు కాస్త మెత్తబడితే, తాము కూడా మెతకవైఖరి అవలంబించవచ్చునని వారు కోరుతున్నారు.
68:10 وَلَا تُطِعْ كُلَّ حَلَّافٍ مَّهِينٍ
నువ్వు అదే పనిగా ప్రమాణాలు చేసే తుచ్చుని మాట వినకు.
68:11 هَمَّازٍ مَّشَّاءٍ بِنَمِيمٍ
– వాడు (ఎంతసేపటికీ) చులకనగా మాట్లాడతాడు, చాడీలు చెబుతాడు.
68:12 مَّنَّاعٍ لِّلْخَيْرِ مُعْتَدٍ أَثِيمٍ
మంచి పనులను అడ్డుకుంటాడు, బరితెగించిపోయే పాపాత్ముడు వాడు.
68:13 عُتُلٍّ بَعْدَ ذَٰلِكَ زَنِيمٍ
మిక్కిలి కర్కశుడు, వీటన్నింటికీ తోడు కళంకితుడు.
68:14 أَن كَانَ ذَا مَالٍ وَبَنِينَ
ఇంతకీ వాడి తలబిరుసుతనానికి కారణం వాడికి సిరిసంపదలు, పుత్ర సంతానం ఉండటమే. (కాబట్టి నువ్వు అతణ్ణి అనుసరించకు).
68:15 إِذَا تُتْلَىٰ عَلَيْهِ آيَاتُنَا قَالَ أَسَاطِيرُ الْأَوَّلِينَ
వాడి ముందు మా ఆయతులను పఠించినప్పుడు, “ఇవి పూర్వీకుల కట్టు కథలంటూ” తేలిగ్గా కొట్టిపారేస్తాడు.
68:16 سَنَسِمُهُ عَلَى الْخُرْطُومِ
ఇక మేము త్వరలోనే వాడి తొండం (ముక్కు)పై వాత వేస్తాము.
68:17 إِنَّا بَلَوْنَاهُمْ كَمَا بَلَوْنَا أَصْحَابَ الْجَنَّةِ إِذْ أَقْسَمُوا لَيَصْرِمُنَّهَا مُصْبِحِينَ
మేము తోటవారిని పరీక్షించినట్లే వీరిని (మక్కావారిని) కూడా పరీక్షించాము. అప్పుడా తోట యజమానులు “తెల్లవారే సరికల్లా ఆ తోట పండ్లను కోసుకుంటాము”అని ప్రతిన బూనారు.
68:18 وَلَا يَسْتَثْنُونَ
మరి వారు, “ఇన్ షా అల్లాహ్ (అల్లాహ్ తలచినట్లయితే)” అని అనలేదు.
68:19 فَطَافَ عَلَيْهَا طَائِفٌ مِّن رَّبِّكَ وَهُمْ نَائِمُونَ
అంతే! వారు నిద్రపోతుండగానే నీ ప్రభువు తరఫున ఒక ఆపద దాన్ని చుట్టుముట్టి పోయింది.
68:20 فَأَصْبَحَتْ كَالصَّرِيمِ
అంతే, ఆ తోట కోతకోసిన చేను మాదిరిగా అయిపోయింది.
68:21 فَتَنَادَوْا مُصْبِحِينَ
తెల్లవారగానే వారు ఒండొకరిని పిలవసాగారు.
68:22 أَنِ اغْدُوا عَلَىٰ حَرْثِكُمْ إِن كُنتُمْ صَارِمِينَ
“పండ్లు కోసుకోవాలనే ఉంటే మీ పొలానికి ఉదయం పెందలాడే పదండి” (అని చెప్పారు).
68:23 فَانطَلَقُوا وَهُمْ يَتَخَافَتُونَ
మరి వారు మెల్లిగా ఇలా మాట్లాడుకుంటూపోయారు.
68:24 أَن لَّا يَدْخُلَنَّهَا الْيَوْمَ عَلَيْكُم مِّسْكِينٌ
“ఈ రోజు ఏ బీదవాడు కూడా మీ వద్దకు జొరబడి రాకూడదు సుమా!”
68:25 وَغَدَوْا عَلَىٰ حَرْدٍ قَادِرِينَ
ఆ విధంగా మితిమీరిన ధీమాతో తెలతెలవారుతుండగా వారు గబా గబా అక్కడికి చేరుకున్నారు.
68:26 فَلَمَّا رَأَوْهَا قَالُوا إِنَّا لَضَالُّونَ
కాని తీరా తోటను చూసినప్పుడు “నిశ్చయంగా మనం దారి తప్పి వచ్చాం” అన్నారు.
68:27 بَلْ نَحْنُ مَحْرُومُونَ
“కాదు, కాదు. మనం సర్వమూ కోల్పోయాం” అని పలికారు.
68:28 قَالَ أَوْسَطُهُمْ أَلَمْ أَقُل لَّكُمْ لَوْلَا تُسَبِّحُونَ
వారందరిలో కాస్త మంచివాడు “మీరు అల్లాహ్ పవిత్రతను ఎందుకు కొనియాడరు?! అని నేను మీతో అనలేదా?” అన్నాడు.
68:29 قَالُوا سُبْحَانَ رَبِّنَا إِنَّا كُنَّا ظَالِمِينَ
అప్పుడు వారందరూ (తేరుకుని), “మన ప్రభువు పరమ పవిత్రుడు. నిజానికి మనమే దుర్మార్గులం” అని పలికారు.
68:30 فَأَقْبَلَ بَعْضُهُمْ عَلَىٰ بَعْضٍ يَتَلَاوَمُونَ
ఆ తరువాత వారు ఒండొకరి వైపు తిరిగి పరస్పరం నిందించుకోసాగారు.
68:31 قَالُوا يَا وَيْلَنَا إِنَّا كُنَّا طَاغِينَ
“మా పాడుగాను! నిశ్చయంగా మనం హద్దుమీరి పోయాము.”
68:32 عَسَىٰ رَبُّنَا أَن يُبْدِلَنَا خَيْرًا مِّنْهَا إِنَّا إِلَىٰ رَبِّنَا رَاغِبُونَ
“మన ప్రభువు మనకు ఈ తోట స్థానంలో ఇంతకన్నా మంచి తోటను ప్రసాదించవచ్చు. కాబట్టి ఇప్పుడు మనం మన ప్రభువు వైపునకే మరలుదాం” అని అన్నారు.
68:33 كَذَٰلِكَ الْعَذَابُ ۖ وَلَعَذَابُ الْآخِرَةِ أَكْبَرُ ۚ لَوْ كَانُوا يَعْلَمُونَ
ఇలాగే వచ్చిపడుతుంది విపత్తు. పరలోక విపత్తు అయితే ఇంతకన్నా పెద్దది. వారు దీన్ని తెలుసుకుంటే ఎంత బావుండు!
68:34 إِنَّ لِلْمُتَّقِينَ عِندَ رَبِّهِمْ جَنَّاتِ النَّعِيمِ
నిశ్చయంగా దైవభీతి పరాయణుల కోసం వారి ప్రభువు దగ్గర అనుగ్రహభరితమైన స్వర్గ వనాలున్నాయి.
68:35 أَفَنَجْعَلُ الْمُسْلِمِينَ كَالْمُجْرِمِينَ
ఏమిటి? మేము దైవవిధేయులను (ముస్లిములను) అపరాధుల సరసన నిలబెడతామా?
68:36 مَا لَكُمْ كَيْفَ تَحْكُمُونَ
అసలు మీకేమయింది? ఈ విధంగా ఎలా నిర్ణయించుకుంటున్నారు?
68:37 أَمْ لَكُمْ كِتَابٌ فِيهِ تَدْرُسُونَ
ఏమిటీ, మీ వద్ద మీరు చదివే పుస్తకం ఏదైనా ఉందా?
68:38 إِنَّ لَكُمْ فِيهِ لَمَا تَخَيَّرُونَ
అందులో మీరు కోరినదల్లా మీకు దొరుకుతుందని రాసి ఉందా?
68:39 أَمْ لَكُمْ أَيْمَانٌ عَلَيْنَا بَالِغَةٌ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ ۙ إِنَّ لَكُمْ لَمَا تَحْكُمُونَ
లేక మీరు తీర్మానించుకున్నదల్లా మీకు లభ్యమయ్యేట్టు, ప్రళయదినం వరకూ ఉండే ప్రమాణాలు గాని మీరు మా నుండి తీసుకున్నారా?
68:40 سَلْهُمْ أَيُّهُم بِذَٰلِكَ زَعِيمٌ
వారిలో ఎవరు ఈ విషయానికి బాధ్యులుగా ఉంటారో అడుగు.
68:41 أَمْ لَهُمْ شُرَكَاءُ فَلْيَأْتُوا بِشُرَكَائِهِمْ إِن كَانُوا صَادِقِينَ
ఏమిటి, వారి భాగస్థులుగాని ఎవరైనా ఉన్నారా? (ఒకవేళ ఉంటే), వారు సత్యవంతులైనట్లయితే తమ తమ భాగస్వాములను తీసుకురావాలి.
68:42 يَوْمَ يُكْشَفُ عَن سَاقٍ وَيُدْعَوْنَ إِلَى السُّجُودِ فَلَا يَسْتَطِيعُونَ
ఏ రోజున పిక్క విప్పబడుతుందో, అప్పుడు వారు సాష్టాంగ ప్రణామం (సజ్దా) కొరకు పిలవబడతారు. కాని వారు సాష్టాంగ పడలేరు.
68:43 خَاشِعَةً أَبْصَارُهُمْ تَرْهَقُهُمْ ذِلَّةٌ ۖ وَقَدْ كَانُوا يُدْعَوْنَ إِلَى السُّجُودِ وَهُمْ سَالِمُونَ
వారి చూపులు క్రిందికి వంగి ఉంటాయి. అవమానం వారిని క్రమ్ముకుంటూ ఉంటుంది. వారు మంచి స్థితిలో (క్షేమంగా) ఉన్నప్పుడు కూడా సాష్టాంగ ప్రణామాల కోసం పిలువబడేవారు.
68:44 فَذَرْنِي وَمَن يُكَذِّبُ بِهَٰذَا الْحَدِيثِ ۖ سَنَسْتَدْرِجُهُم مِّنْ حَيْثُ لَا يَعْلَمُونَ
సరే! ఇక నన్నూ, ఈ విషయాన్ని ధిక్కరించేవారిని వదలి పెట్టు. మేము వారిని, వారికి ఏ మాత్రం తట్టని రీతిలో క్రమ క్రమంగా (పతనం వైపు) లాగుతూ పోతున్నాము.
68:45 وَأُمْلِي لَهُمْ ۚ إِنَّ كَيْدِي مَتِينٌ
నేను వారికి కొంత గడువు ఇస్తాను. నిశ్చయంగా నా వ్యూహం చాలా గట్టిది.
68:46 أَمْ تَسْأَلُهُمْ أَجْرًا فَهُم مِّن مَّغْرَمٍ مُّثْقَلُونَ
(ఓ ప్రవక్తా!) నువ్వు వారి దగ్గర ఏదన్నా వేతనం అడుగుతున్నావా, మరి దాని భారంతో వారు కృంగిపోతున్నారా?
68:47 أَمْ عِندَهُمُ الْغَيْبُ فَهُمْ يَكْتُبُونَ
పోనీ, వారి వద్ద రహస్య జ్ఞానం ఉందా? తద్వారా వారు లిఖిస్తున్నారా?
68:48 فَاصْبِرْ لِحُكْمِ رَبِّكَ وَلَا تَكُن كَصَاحِبِ الْحُوتِ إِذْ نَادَىٰ وَهُوَ مَكْظُومٌ
కనుక (ఓ ప్రవక్తా!) నీవు నీ ప్రభువు నిర్ణయం జరిగేవరకూ ఓపికపట్టు. చేపవాని మాదిరిగా అయిపోకు. అప్పుడతను దుఖితుడై మమ్మల్ని మొర పెట్టుకున్నాడు.
68:49 لَّوْلَا أَن تَدَارَكَهُ نِعْمَةٌ مِّن رَّبِّهِ لَنُبِذَ بِالْعَرَاءِ وَهُوَ مَذْمُومٌ
అతని ప్రభువు అనుగ్రహమే గనక అతనికి తోడ్పడకుండా ఉంటే నిశ్చయంగా అతను నిందార్హ స్థితిలో, కటిక మైదానంలోకి విసిరివేయబడేవాడు.
68:50 فَاجْتَبَاهُ رَبُّهُ فَجَعَلَهُ مِنَ الصَّالِحِينَ
అయితే అతని ప్రభువు అతణ్ణి (మళ్ళి) ఎన్నుకున్నాడు. అతణ్ణి సజ్జనులలో చేర్చాడు.
68:51 وَإِن يَكَادُ الَّذِينَ كَفَرُوا لَيُزْلِقُونَكَ بِأَبْصَارِهِمْ لَمَّا سَمِعُوا الذِّكْرَ وَيَقُولُونَ إِنَّهُ لَمَجْنُونٌ
ఈ అవిశ్వాసులు ఖుర్ఆన్ ను విన్నప్పుడల్లా తమ వాడి చూపులతో నిన్ను జారించి పడవేసినట్లే ఉంటారు. ఖచ్చితంగా ఇతడు పిచ్చివాడే” అని అంటారు.
68:52 وَمَا هُوَ إِلَّا ذِكْرٌ لِّلْعَالَمِينَ
నిజానికి ఇది (ఈ ఖుర్ఆన్) సకల లోకాల వారికి ఆసాంతం హితబోధిని. - సూరా అల్ హఖ్ఖ
69:1 الْحَاقَّةُ
జరిగి తీరేది.
69:2 مَا الْحَاقَّةُ
ఏమిటా జరిగి తీరేది?
69:3 وَمَا أَدْرَاكَ مَا الْحَاقَّةُ
ఆ జరిగి తీరే దాని గురించి నీకేం తెలుసు?
69:4 كَذَّبَتْ ثَمُودُ وَعَادٌ بِالْقَارِعَةِ
తట్టేటటువంటి విపత్తును సమూదు, ఆదు జనులు ధిక్కరించారు.
69:5 فَأَمَّا ثَمُودُ فَأُهْلِكُوا بِالطَّاغِيَةِ
(పర్యవసానంగా) సమూదు వారు అత్యంత భయంకరమైన కేక ద్వారా అంత మొందించబడ్డారు.
69:6 وَأَمَّا عَادٌ فَأُهْلِكُوا بِرِيحٍ صَرْصَرٍ عَاتِيَةٍ
ఆదు వారు ప్రచండమైన పెనుగాలుల ద్వారా నాశనం చేయబడ్డారు.
69:7 سَخَّرَهَا عَلَيْهِمْ سَبْعَ لَيَالٍ وَثَمَانِيَةَ أَيَّامٍ حُسُومًا فَتَرَى الْقَوْمَ فِيهَا صَرْعَىٰ كَأَنَّهُمْ أَعْجَازُ نَخْلٍ خَاوِيَةٍ
వాటిని అల్లాహ్ వారిపై నిరంతరం ఏడు రాత్రులు , ఎనిమిది పగళ్ళు విధించాడు. (నీవు గనక అక్కడ ఉండి ఉంటే) వారు అక్కడ బోసిపోయిన ఖర్జూరపు బొద్దులవలే నేలకొరిగి పడి ఉండటం చూసేవాడివి.
69:8 فَهَلْ تَرَىٰ لَهُم مِّن بَاقِيَةٍ
మరి వారిలో ఎవడైనా మిగిలి ఉన్నట్లు నీకు కనిపిస్తున్నాడా?
69:9 وَجَاءَ فِرْعَوْنُ وَمَن قَبْلَهُ وَالْمُؤْتَفِكَاتُ بِالْخَاطِئَةِ
ఫిరౌను, అతనికి పూర్వం గతించినవారు, తలక్రిందులుగా చేయబడిన పట్టణాలవారు కూడా పాపాలకు ఒడిగట్టారు.
69:10 فَعَصَوْا رَسُولَ رَبِّهِمْ فَأَخَذَهُمْ أَخْذَةً رَّابِيَةً
వారు తమ ప్రభువు పంపిన ప్రవక్త(ల)ను ఎదిరించారు. అందువల్ల అల్లాహ్ వాళ్ళను (కూడా) చాలా గట్టిగా పట్టుకున్నాడు.
69:11 إِنَّا لَمَّا طَغَى الْمَاءُ حَمَلْنَاكُمْ فِي الْجَارِيَةِ
నీళ్ళ ఉధృతి పెరిగిపోయినప్పుడు మేము మిమ్మల్ని నావలోకి ఎక్కించాము.
69:12 لِنَجْعَلَهَا لَكُمْ تَذْكِرَةً وَتَعِيَهَا أُذُنٌ وَاعِيَةٌ
దీనిని మీకొక హితబోధగా, జ్ఞాపికగా చేయటానికి, విని జ్ఞాపకముంచుకునే చెవులు దీనిని (ఎల్లకాలం) జ్ఞాపకముంచుకునేందుకు (ఈ విధంగా చేశాము).
69:13 فَإِذَا نُفِخَ فِي الصُّورِ نَفْخَةٌ وَاحِدَةٌ
మరి శంఖం ఒకసారి పూరించబడినప్పుడు,
69:14 وَحُمِلَتِ الْأَرْضُ وَالْجِبَالُ فَدُكَّتَا دَكَّةً وَاحِدَةً
భూమిని, పర్వతాలను ఎత్తి, ఒకే ఒక దెబ్బకు తుత్తునియలుగా చేసి వేయబడినప్పుడు,
69:15 فَيَوْمَئِذٍ وَقَعَتِ الْوَاقِعَةُ
ఆ రోజు జరగవలసిన సంఘటన నిజంగానే జరుగుతుంది.
69:16 وَانشَقَّتِ السَّمَاءُ فَهِيَ يَوْمَئِذٍ وَاهِيَةٌ
అప్పుడు ఆకాశం బ్రద్దలైపోతుంది. మరి ఆ రోజు అది పట్టు సడలిపోతుంది.
69:17 وَالْمَلَكُ عَلَىٰ أَرْجَائِهَا ۚ وَيَحْمِلُ عَرْشَ رَبِّكَ فَوْقَهُمْ يَوْمَئِذٍ ثَمَانِيَةٌ
దైవదూతలు దాని అంచులపై ఉంటారు. ఆ రోజు నీ ప్రభువు సింహాసనాన్ని ఎనమండుగురు (దైవదూతలు) తమపై ఎత్తుకుని ఉంటారు.
69:18 يَوْمَئِذٍ تُعْرَضُونَ لَا تَخْفَىٰ مِنكُمْ خَافِيَةٌ
ఆనాడు మీరందరూ (దైవసన్నిధిలో) హాజరుపరచబడతారు. మీ రహస్యమేదీ దాగి ఉండదు.
69:19 فَأَمَّا مَنْ أُوتِيَ كِتَابَهُ بِيَمِينِهِ فَيَقُولُ هَاؤُمُ اقْرَءُوا كِتَابِيَهْ
మరి ఎవరి కర్మల పత్రం అతని కుడి చేతికి ఇవ్వబడుతుందో అతనంటాడు : “ఇదిగో, నా కర్మల పత్రాన్ని చదవండి.”
69:20 إِنِّي ظَنَنتُ أَنِّي مُلَاقٍ حِسَابِيَهْ
“నాకు నా లెక్క లభించనున్నదన్న గట్టి నమ్మకం నాకుండేది.”
69:21 فَهُوَ فِي عِيشَةٍ رَّاضِيَةٍ
మరి అతను మనసు మెచ్చిన భోగ జీవితం గడుపుతూ ఉంటాడు.
69:22 فِي جَنَّةٍ عَالِيَةٍ
ఉన్నతమైన స్వర్గ వనంలో!
69:23 قُطُوفُهَا دَانِيَةٌ
దాని పండ్లు అతి సమీపంలో వ్రేలాడుతూ ఉంటాయి.
69:24 كُلُوا وَاشْرَبُوا هَنِيئًا بِمَا أَسْلَفْتُمْ فِي الْأَيَّامِ الْخَالِيَةِ
“గత కాలంలో మీరు చేసుకున్న కర్మలకు ప్రతిఫలంగా హాయిగా తినండి, త్రాగండి” (అని వారితో అనబడుతుంది).
69:25 وَأَمَّا مَنْ أُوتِيَ كِتَابَهُ بِشِمَالِهِ فَيَقُولُ يَا لَيْتَنِي لَمْ أُوتَ كِتَابِيَهْ
ఇక ఎవరి కర్మల చిట్టా అతని ఎడమ చేతికి ఇవ్వబడుతుందో అతను ఇలా అంటాడు: “అయ్యో! నా కర్మల పత్రం నాకివ్వబడకుండా ఉంటే….
69:26 وَلَمْ أَدْرِ مَا حِسَابِيَهْ
“నా లెక్కేమిటో నాకసలు తెలియకుండా ఉంటే ఎంత బావుండేది!
69:27 يَا لَيْتَهَا كَانَتِ الْقَاضِيَةَ
“అయ్యో! ఆ చావే (నా వ్యవహారాన్ని) తేల్చేసి ఉంటే బాగుండేదే!
69:28 مَا أَغْنَىٰ عَنِّي مَالِيَهْ ۜ
“నా ధనం నాకేమాత్రం అక్కరకు రాలేదు.
69:29 هَلَكَ عَنِّي سُلْطَانِيَهْ
“నా అధికారం కూడా నా నుండి చేజారిపోయిందే!” (అని బాధపడతాడు).
69:30 خُذُوهُ فَغُلُّوهُ
(అప్పుడిలా ఆదేశించబడుతుంది) “పట్టుకోండి వాణ్ణి. వాడికి (మెడలో) గుదిబండ వేయండి.
69:31 ثُمَّ الْجَحِيمَ صَلُّوهُ
“మరి వాణ్ణి నరకంలోకి త్రోసివేయండి.
69:32 ثُمَّ فِي سِلْسِلَةٍ ذَرْعُهَا سَبْعُونَ ذِرَاعًا فَاسْلُكُوهُ
“మరి వాణ్ణి డెభ్భై మూరల పొడవు గల సంకెళ్ళతో బిగించి కట్టండి.
69:33 إِنَّهُ كَانَ لَا يُؤْمِنُ بِاللَّهِ الْعَظِيمِ
“వాడు మహోన్నతుడైన అల్లాహ్ ను విశ్వసించేవాడూ కాదు,
69:34 وَلَا يَحُضُّ عَلَىٰ طَعَامِ الْمِسْكِينِ
“నిరుపేదకు అన్నం పెట్టమని (కనీసం) ప్రోత్సహించేవాడూ కాదు.
69:35 فَلَيْسَ لَهُ الْيَوْمَ هَاهُنَا حَمِيمٌ
“కాబట్టి ఈ రోజు ఇక్కడ వీడి (స్థితిపై సానుభూతి చూపే) స్నేహితుడెవడూ లేడు.
69:36 وَلَا طَعَامٌ إِلَّا مِنْ غِسْلِينٍ
“గాయాల కడుగు నీరు తప్ప మరొకటేదీ వీడికి ఆహారంగా లభించదు.
69:37 لَّا يَأْكُلُهُ إِلَّا الْخَاطِئُونَ
“దానిని పాపాత్ములు తప్ప వేరెవరూ తినరు.”
69:38 فَلَا أُقْسِمُ بِمَا تُبْصِرُونَ
మరి మీరు చూచే వాటిపై నేను ప్రమాణం చేస్తున్నాను.
69:39 وَمَا لَا تُبْصِرُونَ
ఇంకా మీరు చూడలేని వాటిపై కూడా.
69:40 إِنَّهُ لَقَوْلُ رَسُولٍ كَرِيمٍ
నిశ్చయంగా ఇది (ఈ ఖుర్ఆన్) గౌరవనీయుడైన సందేశహరుడు తెచ్చిన (దైవ) వాక్కు.
69:41 وَمَا هُوَ بِقَوْلِ شَاعِرٍ ۚ قَلِيلًا مَّا تُؤْمِنُونَ
ఏ కవి పుంగవుడో పలికిన మాట కానే కాదు. మీరు విశ్వసించేది చాలా తక్కువ.
69:42 وَلَا بِقَوْلِ كَاهِنٍ ۚ قَلِيلًا مَّا تَذَكَّرُونَ
ఇది ఏ జ్యోతిష్యుని పలుకో అంతకన్నా కాదు. మీరు హితబోధను గ్రహించేది బహుస్వల్పం.
69:43 تَنزِيلٌ مِّن رَّبِّ الْعَالَمِينَ
నిజానికి సకల లోకాల ప్రభువు తరఫున అవతరించింది.
69:44 وَلَوْ تَقَوَّلَ عَلَيْنَا بَعْضَ الْأَقَاوِيلِ
ఒకవేళ ఇతను (ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం) గనక ఏదైనా విషయాన్ని కల్పించి మాకు ఆపాదించి ఉంటే,
69:45 لَأَخَذْنَا مِنْهُ بِالْيَمِينِ
మేమితని కుడి చెయ్యిని పట్టుకుని ఉండేవారం.
69:46 ثُمَّ لَقَطَعْنَا مِنْهُ الْوَتِينَ
మరి ఇతని కంఠనాళాన్ని కోసివేసేవారం.
69:47 فَمَا مِنكُم مِّنْ أَحَدٍ عَنْهُ حَاجِزِينَ
మరి మీలో ఎవరూ నన్ను ఈ పని చేయకుండా ఆపగలిగేవారు కాదు.
69:48 وَإِنَّهُ لَتَذْكِرَةٌ لِّلْمُتَّقِينَ
నిశ్చయంగా ఈ ఖుర్ఆన్ (అల్లాహ్ పట్ల) భయభక్తులు గలవారికి హితబోధిని.
69:49 وَإِنَّا لَنَعْلَمُ أَنَّ مِنكُم مُّكَذِّبِينَ
మీలో కొందరు ధిక్కరించేవారున్నారని మాకు బాగా తెలుసు.
69:50 وَإِنَّهُ لَحَسْرَةٌ عَلَى الْكَافِرِينَ
నిశ్చయంగా ఇది (ఈ ధిక్కారవైఖరి) అవిశ్వాసులను బాధపడేలా చేస్తుంది.
69:51 وَإِنَّهُ لَحَقُّ الْيَقِينِ
నిశ్చయంగా ఇది తిరుగులేని సత్యం.
69:52 فَسَبِّحْ بِاسْمِ رَبِّكَ الْعَظِيمِ
కనుక (ఓ ప్రవక్తా!) నీవు మహోన్నతుడైన నీ ప్రభువు నామం పవిత్రతను కొనియాడు. - సూరా అల్ ముఆరిజ్
70:1 سَأَلَ سَائِلٌ بِعَذَابٍ وَاقِعٍ
అడిగేవాడొకడు తప్పకుండా రానున్న శిక్షను గురించి అడిగాడు.
70:2 لِّلْكَافِرِينَ لَيْسَ لَهُ دَافِعٌ
అది అవిశ్వాసులపై (రానున్నది). దానిని తప్పించే వాడెవ్వడూ లేడు.
70:3 مِّنَ اللَّهِ ذِي الْمَعَارِجِ
అది (ఆ శిక్ష) సోపానాలకు యజమాని అయిన అల్లాహ్ తరఫున సంభవిస్తుంది.
70:4 تَعْرُجُ الْمَلَائِكَةُ وَالرُّوحُ إِلَيْهِ فِي يَوْمٍ كَانَ مِقْدَارُهُ خَمْسِينَ أَلْفَ سَنَةٍ
యాభై వేల సంవత్సరాల పరిమాణం గల రోజున దైవదూతలు మరియు ఆత్మ (జిబ్రయీల్) ఆయన వైపునకు అధిరోహిస్తారు.
70:5 فَاصْبِرْ صَبْرًا جَمِيلًا
కనుక (ఓ ప్రవక్తా!) నువ్వు అత్యుత్తమ రీతిలో సహనం వహించు.
70:6 إِنَّهُمْ يَرَوْنَهُ بَعِيدًا
అది (ఆ శిక్ష) చాలా దూరాన ఉందని వారు భావిస్తున్నారు.
70:7 وَنَرَاهُ قَرِيبًا
కాని అది మాకు చాలా దగ్గరే కనిపిస్తున్నది.
70:8 يَوْمَ تَكُونُ السَّمَاءُ كَالْمُهْلِ
ఆ రోజు ఆకాశం నూనె గసిలా అయిపోతుంది.
70:9 وَتَكُونُ الْجِبَالُ كَالْعِهْنِ
పర్వతాలు రంగురంగుల ఉన్నిలాగా అయిపోతాయి.
70:10 وَلَا يَسْأَلُ حَمِيمٌ حَمِيمًا
ఏ స్నేహితుడూ మరొక స్నేహితుని (మంచి చెడులను గురించి) అడిగి చూడడు.
70:11 يُبَصَّرُونَهُمْ ۚ يَوَدُّ الْمُجْرِمُ لَوْ يَفْتَدِي مِنْ عَذَابِ يَوْمِئِذٍ بِبَنِيهِ
వారు ఒండొకరికి చూపించబడతారు. కాని నేరస్థుడు ఆ రోజు (తనకు పడే) శిక్ష నుంచి తప్పించుకోవటానికి పరిహారంగా తన కుమారులను,
70:12 وَصَاحِبَتِهِ وَأَخِيهِ
తన ఇల్లాలినీ, తన సోదరుణ్ణి,
70:13 وَفَصِيلَتِهِ الَّتِي تُؤْوِيهِ
తనకు ఆశ్రయమిచ్చిన తన కుటుంబాన్నీ,
70:14 وَمَن فِي الْأَرْضِ جَمِيعًا ثُمَّ يُنجِيهِ
భూమండలంలోని సమస్త జనులనూ ఇచ్చేసి, తాను మాత్రం బయటపడాలని కోరుకుంటాడు.
70:15 كَلَّا ۖ إِنَّهَا لَظَىٰ
(కాని ఇది) అసంభవం. నిశ్చయంగా అది జ్వలించే అగ్ని.
70:16 نَزَّاعَةً لِّلشَّوَىٰ
అది తలలోని చర్మాన్ని, మాంసాన్ని సయితం దహించి వేస్తుంది.
70:17 تَدْعُو مَنْ أَدْبَرَ وَتَوَلَّىٰ
అది వీపు త్రిప్పుకునిపోయే, విముఖత చూపే ప్రతి ఒక్కరినీ కేకేసి పిలుస్తుంది.
70:18 وَجَمَعَ فَأَوْعَىٰ
అలాగే ధనాన్ని పోగుచేసి, భద్రంగా దాచిపెట్టేవాణ్ణి కూడా.
70:19 إِنَّ الْإِنسَانَ خُلِقَ هَلُوعًا
నిశ్చయంగా మానవుడు మహా దూకుడు స్వభావిగా పుట్టించబడ్డాడు.
70:20 إِذَا مَسَّهُ الشَّرُّ جَزُوعًا
(కాస్తంత) కీడు కలగగానే కలవరం చెందుతాడు.
70:21 وَإِذَا مَسَّهُ الْخَيْرُ مَنُوعًا
మరి మేలు కలిగినప్పుడు మాత్రం పిసినారిగా ప్రవర్తిస్తాడు.
70:22 إِلَّا الْمُصَلِّينَ
కాని నమాజు చేసేవారు మాత్రం అలాంటివారు కారు.
70:23 الَّذِينَ هُمْ عَلَىٰ صَلَاتِهِمْ دَائِمُونَ
వారు తమ నమాజుల (వ్యవస్థ)పై నిత్యం కొనసాగుతారు.
70:24 وَالَّذِينَ فِي أَمْوَالِهِمْ حَقٌّ مَّعْلُومٌ
వారి సంపదలో నిర్ణీత హక్కు ఉంటుంది.
70:25 لِّلسَّائِلِ وَالْمَحْرُومِ
అడిగేవారికి, అడగని వారికి కూడా.
70:26 وَالَّذِينَ يُصَدِّقُونَ بِيَوْمِ الدِّينِ
వారు ప్రతిఫల దినాన్ని దృఢంగా నమ్మే వారై ఉంటారు.
70:27 وَالَّذِينَ هُم مِّنْ عَذَابِ رَبِّهِم مُّشْفِقُونَ
వారు తమ ప్రభువు శిక్షకు భయపడుతూ ఉంటారు.
70:28 إِنَّ عَذَابَ رَبِّهِمْ غَيْرُ مَأْمُونٍ
నిశ్చయంగా వారి ప్రభువు శిక్ష నిర్భయంగా ఉండదగినది కాదు.
70:29 وَالَّذِينَ هُمْ لِفُرُوجِهِمْ حَافِظُونَ
వారు తమ మర్మాంగాలను (అక్రమ సంబంధాల నుండి) కాపాడుకుంటారు.
70:30 إِلَّا عَلَىٰ أَزْوَاجِهِمْ أَوْ مَا مَلَكَتْ أَيْمَانُهُمْ فَإِنَّهُمْ غَيْرُ مَلُومِينَ
అయితే తమ భార్యల విషయంలో, (ధర్మబద్ధంగా) తమ స్వాధీనంలో ఉన్న బానిస స్త్రీల విషయంలో మాత్రం వారు నిందార్హులు కారు.
70:31 فَمَنِ ابْتَغَىٰ وَرَاءَ ذَٰلِكَ فَأُولَٰئِكَ هُمُ الْعَادُونَ
ఇక ఎవరైనా ఇది గాక ఇంకా ఏవైనా (ఇతరత్రా అడ్డదారులు అవలంబించ) కోరితే, వారు హద్దుమీరిన వారవుతారు.
70:32 وَالَّذِينَ هُمْ لِأَمَانَاتِهِمْ وَعَهْدِهِمْ رَاعُونَ
వారు తమ అప్పగింతలకు, వాగ్దానాలకు కట్టుబడి ఉండే వారై ఉంటారు.
70:33 وَالَّذِينَ هُم بِشَهَادَاتِهِمْ قَائِمُونَ
వారు తమ సాక్ష్యాలపై నిలకడ కలిగి ఉంటారు.
70:34 وَالَّذِينَ هُمْ عَلَىٰ صَلَاتِهِمْ يُحَافِظُونَ
ఇంకా – వారు తమ నమాజులను కాపాడుతారు.
70:35 أُولَٰئِكَ فِي جَنَّاتٍ مُّكْرَمُونَ
ఇలాంటి వారే స్వర్గ వనాలలో సగౌరవంగా ఉండేవారు.
70:36 فَمَالِ الَّذِينَ كَفَرُوا قِبَلَكَ مُهْطِعِينَ
(ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం) ఇంతకీ ఈ తిరస్కారులకు ఏమైపోయిందీ? వారు నీ వైపు (పిచ్చిగా) ఎగబడి వస్తున్నారు!?
70:37 عَنِ الْيَمِينِ وَعَنِ الشِّمَالِ عِزِينَ
కుడివైపు నుంచి, ఎడమ వైపు నుంచి గుంపులు గుంపులుగా!
70:38 أَيَطْمَعُ كُلُّ امْرِئٍ مِّنْهُمْ أَن يُدْخَلَ جَنَّةَ نَعِيمٍ
ఏమిటి, వారిలోని ప్రతి ఒక్కడూ సుఖ సౌఖ్యాలతో నిండిన స్వర్గంలో తాను కూడా ప్రవేశింపజేయబడాలని ఆశపడుతున్నాడా?
70:39 كَلَّا ۖ إِنَّا خَلَقْنَاهُم مِّمَّا يَعْلَمُونَ
అసంభవం, మేము వారిని దేంతో పుట్టించామో స్వయంగా వారికీ తెలుసు.
70:40 فَلَا أُقْسِمُ بِرَبِّ الْمَشَارِقِ وَالْمَغَارِبِ إِنَّا لَقَادِرُونَ
అది కాదు. నేను తూర్పుల, పడమరల ప్రభువుపై ప్రమాణం చేసి చెబుతున్నాను….నిశ్చయంగా మేము శక్తిమంతులం.
70:41 عَلَىٰ أَن نُّبَدِّلَ خَيْرًا مِّنْهُمْ وَمَا نَحْنُ بِمَسْبُوقِينَ
….వీరికి బదులుగా, వీరికన్నా మెరుగైనవారిని తీసుకురాగల (శక్తిగల వార)ము. ఈ విషయంలో మేము అశక్తులం ఎంత మాత్రం కాము.
70:42 فَذَرْهُمْ يَخُوضُوا وَيَلْعَبُوا حَتَّىٰ يُلَاقُوا يَوْمَهُمُ الَّذِي يُوعَدُونَ
కనుక (ఓ ప్రవక్తా!) నీవు వారిని ఆషామాషీ విషయాలలో, అటపాటలలోనే పడి ఉండనివ్వు. చివరకు వారు తమకు వాగ్దానం చేయబడుతున్న దినాన్ని ఎలాగూ చేరుకుంటారు.
70:43 يَوْمَ يَخْرُجُونَ مِنَ الْأَجْدَاثِ سِرَاعًا كَأَنَّهُمْ إِلَىٰ نُصُبٍ يُوفِضُونَ
ఆ రోజు వారు సమాధుల నుంచి లేచి, ఒక నిర్ణీత లక్ష్యం వైపు ఉరకలు వేసినట్లే పరుగెడుతూ ఉంటారు.
70:44 خَاشِعَةً أَبْصَارُهُمْ تَرْهَقُهُمْ ذِلَّةٌ ۚ ذَٰلِكَ الْيَوْمُ الَّذِي كَانُوا يُوعَدُونَ
వారి చూపులు క్రిందికి వంగి ఉంటాయి. పరాభవం వారిని ఆవరిస్తూ ఉంటుంది. ఇదే వారికి వాగ్దానం చేయబడుతూ ఉన్న రోజు! - సూరా నూహ్
71:1 إِنَّا أَرْسَلْنَا نُوحًا إِلَىٰ قَوْمِهِ أَنْ أَنذِرْ قَوْمَكَ مِن قَبْلِ أَن يَأْتِيَهُمْ عَذَابٌ أَلِيمٌ
మేము నూహ్ అలైహిస్సలాం ను అతని జాతివైపు పంపించి, “నీ జాతి వారిపై బాధాకరమైన శిక్ష వచ్చిపడక ముందే నీవు వారిని భయపెట్టు” (అప్రమత్తుల్ని చేయి అని చెప్పాము).
71:2 قَالَ يَا قَوْمِ إِنِّي لَكُمْ نَذِيرٌ مُّبِينٌ
(నూహ్) ఇలా అన్నాడు : “ఓ నా జాతివారలారా! నేను మిమ్మల్ని స్పష్టంగా హెచ్చరిస్తున్నాను.”
71:3 أَنِ اعْبُدُوا اللَّهَ وَاتَّقُوهُ وَأَطِيعُونِ
“మీరు అల్లాహ్ ను ఆరాధించండి. ఆయనకు మాత్రమే భయపడండి. నా మాట వినండి. (నన్ను అనుసరించండి).
71:4 يَغْفِرْ لَكُم مِّن ذُنُوبِكُمْ وَيُؤَخِّرْكُمْ إِلَىٰ أَجَلٍ مُّسَمًّى ۚ إِنَّ أَجَلَ اللَّهِ إِذَا جَاءَ لَا يُؤَخَّرُ ۖ لَوْ كُنتُمْ تَعْلَمُونَ
“(అప్పుడు) అల్లాహ్ మీ పాపాలను క్షమిస్తాడు. ఒక నిర్ణీత గడువు వరకు మీకు అవకాశం ఇస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ నిర్ణయించిన గడువు వచ్చేసిందంటే ఇక అది వాయిదా పడటమంటూ ఉండదు. ఈ సంగతిని మీరు తెలుసుకోగలిగితే ఎంత బావుండు?”
71:5 قَالَ رَبِّ إِنِّي دَعَوْتُ قَوْمِي لَيْلًا وَنَهَارًا
(నూహ్) ఇలా విన్నవించుకున్నాడు : “నా ప్రభూ! నేను నా జాతివారిని రేయింబవళ్లూ నీ వైపు పిలిచాను.”
71:6 فَلَمْ يَزِدْهُمْ دُعَائِي إِلَّا فِرَارًا
“కాని నా పిలుపు వారి పలాయనాన్ని మరింత పెంచింది.”
71:7 وَإِنِّي كُلَّمَا دَعَوْتُهُمْ لِتَغْفِرَ لَهُمْ جَعَلُوا أَصَابِعَهُمْ فِي آذَانِهِمْ وَاسْتَغْشَوْا ثِيَابَهُمْ وَأَصَرُّوا وَاسْتَكْبَرُوا اسْتِكْبَارًا
“నీ క్షమాబిక్షకై నేను వారిని పిలిచినప్పుడల్లా వారు తమ వ్రేళ్ళను తమ చెవులలో పెట్టుకున్నారు. తమ వస్త్రాలను తమపైన కప్పుకున్నారు. మరీ మొండి ఘటాలుగా మారిపోయారు. మహా గర్విష్టుల్లా ప్రవర్తించారు.”
71:8 ثُمَّ إِنِّي دَعَوْتُهُمْ جِهَارًا
“మరి నేను వారిని బహిరంగంగా (లేక బిగ్గరగా) పిలిచాను.”
71:9 ثُمَّ إِنِّي أَعْلَنتُ لَهُمْ وَأَسْرَرْتُ لَهُمْ إِسْرَارًا
“ఆపైన నేను వారికి బాహాటంగా కూడా బోధపరిచాను. రహస్యంగా (ఏకాంతంలో) కూడా విడమరచి చెప్పాను.”
71:10 فَقُلْتُ اسْتَغْفِرُوا رَبَّكُمْ إِنَّهُ كَانَ غَفَّارًا
“నేనిలా అన్నాను – క్షమాపణకై మీ ప్రభువును వేడుకోండి. నిశ్చయంగా ఆయన అమితంగా క్షమించేవాడు.”
71:11 يُرْسِلِ السَّمَاءَ عَلَيْكُم مِّدْرَارًا
“ఆయన ఆకాశం నుంచి మీపై ధారాపాతంగా వర్షం కురిపిస్తాడు.”
71:12 وَيُمْدِدْكُم بِأَمْوَالٍ وَبَنِينَ وَيَجْعَل لَّكُمْ جَنَّاتٍ وَيَجْعَل لَّكُمْ أَنْهَارًا
“మీ సిరిసంపదల్లోనూ, పుత్ర సంతతిలోనూ పురోభివృద్ధిని వొసగుతాడు. మీ కొరకు తోటల్ని ఉత్పన్నం చేస్తాడు. ఇంకా మీ కోసం కాలువలను ప్రవహింపజేస్తాడు.”
71:13 مَّا لَكُمْ لَا تَرْجُونَ لِلَّهِ وَقَارًا
“అసలేమైంది మీకు, అల్లాహ్ ఔన్నత్యం (ఘనత) పట్ల మీకు బొత్తిగా భయం లేదేమిటి?”
71:14 وَقَدْ خَلَقَكُمْ أَطْوَارًا
“వాస్తవానికి ఆయన మిమ్మల్ని సృష్టి ప్రక్రియలోని అనేక దశల గుండా తీర్చిదిద్దాడు.”
71:15 أَلَمْ تَرَوْا كَيْفَ خَلَقَ اللَّهُ سَبْعَ سَمَاوَاتٍ طِبَاقًا
“ఏమిటి, అల్లాహ్ సప్తాకాశాలను ఎలా ఒకదానిపై ఒకటిగా సృష్టించాడో మీరు చూడటం లేదా?”
71:16 وَجَعَلَ الْقَمَرَ فِيهِنَّ نُورًا وَجَعَلَ الشَّمْسَ سِرَاجًا
“మరి వాటిలో చంద్రుణ్ణి కాంతిమంతంగా చేశాడు. సూర్యుణ్ణి దేదీప్యమానంగా చేశాడు.”
71:17 وَاللَّهُ أَنبَتَكُم مِّنَ الْأَرْضِ نَبَاتًا
“ఇంకా అల్లాహ్ మిమ్మల్ని నేల నుండి (ఒక ప్రత్యేక రీతిలో) మొలిపించాడు.”
71:18 ثُمَّ يُعِيدُكُمْ فِيهَا وَيُخْرِجُكُمْ إِخْرَاجًا
“మరి మిమ్మల్ని అందులోనికే తిరిగి తీసుకుపోతాడు. మరి ఆ నేలలో నుంచే మిమ్మల్ని (విచిత్రంగా) వెలికితిస్తాడు.”
71:19 وَاللَّهُ جَعَلَ لَكُمُ الْأَرْضَ بِسَاطًا
“ఇంకా – అల్లాహ్ భూమిని మీ కోసం పాన్పు మాదిరిగా చేశాడు.
71:20 لِّتَسْلُكُوا مِنْهَا سُبُلًا فِجَاجًا
“మీరు దాని సువిశాల మార్గాల్లో నడవటానికి” (అని చెప్పాను).
71:21 قَالَ نُوحٌ رَّبِّ إِنَّهُمْ عَصَوْنِي وَاتَّبَعُوا مَن لَّمْ يَزِدْهُ مَالُهُ وَوَلَدُهُ إِلَّا خَسَارًا
(ఆఖరికి) నూహ్ ఇలా మొరపెట్టుకున్నాడు : “నా ప్రభూ! వీళ్ళు నా మాటల్ని లక్ష్యపెట్టలేదు. ఎవరికి సిరిసంపదలు, సంతానం నష్టకరంగా పరిణమించాయో వారి మాటల్ని మాత్రమే వీళ్ళు విన్నారు.”
71:22 وَمَكَرُوا مَكْرًا كُبَّارًا
“ఇంకా – వీళ్ళు పెద్ద పెద్ద కుట్రలు పన్నారు.”
71:23 وَقَالُوا لَا تَذَرُنَّ آلِهَتَكُمْ وَلَا تَذَرُنَّ وَدًّا وَلَا سُوَاعًا وَلَا يَغُوثَ وَيَعُوقَ وَنَسْرًا
“ఇంకా వారిలా అన్నారు – ఎట్టి పరిస్థితిలోనూ మీ పూజ్య దైవాలను వదలకండి. వద్ద్ద్ ను గానీ, సువాను గానీ, యగూస్, యవూఖ్, నస్ర్ లను గానీ వదలి పెట్టకండి.”
71:24 وَقَدْ أَضَلُّوا كَثِيرًا ۖ وَلَا تَزِدِ الظَّالِمِينَ إِلَّا ضَلَالًا
“(ప్రభూ!) వీళ్ళు చాలామందిని అపమార్గం పట్టించారు. (కాబట్టి) నీవు ఈ దుర్మార్గుల అపమార్గాన్ని మరింతగా పెంచు.”
71:25 مِّمَّا خَطِيئَاتِهِمْ أُغْرِقُوا فَأُدْخِلُوا نَارًا فَلَمْ يَجِدُوا لَهُم مِّن دُونِ اللَّهِ أَنصَارًا
(ఎట్టకేలకు) వారు తమ పాపాల కారణంగానే ముంచి వేయబడ్డారు. మరి వారు నరకానికి చేర్చబడ్డారు. మరి వారు అల్లాహ్ ను తప్ప వేరెవరినీ సహాయకులుగా పొందలేకపోయారు.
71:26 وَقَالَ نُوحٌ رَّبِّ لَا تَذَرْ عَلَى الْأَرْضِ مِنَ الْكَافِرِينَ دَيَّارًا
నూహ్ ఇలా ప్రార్ధించాడు: “నా ప్రభూ! నీవు భూమండలంపై ఏ ఒక్క అవిశ్వాసినీ సజీవంగా వదలిపెట్టకు.”
71:27 إِنَّكَ إِن تَذَرْهُمْ يُضِلُّوا عِبَادَكَ وَلَا يَلِدُوا إِلَّا فَاجِرًا كَفَّارًا
“ఒకవేళ నీవు గనక వీళ్ళను వదలి పెడితే, వీళ్ళు నీ దాసులను మార్గం తప్పిస్తారు. వీళ్ళకు పుట్టబోయే బిడ్డలు కూడా అవిధేయులు, కరడుగట్టిన అవిశ్వాసులై ఉంటారు.”
71:28 رَّبِّ اغْفِرْ لِي وَلِوَالِدَيَّ وَلِمَن دَخَلَ بَيْتِيَ مُؤْمِنًا وَلِلْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ وَلَا تَزِدِ الظَّالِمِينَ إِلَّا تَبَارًا
“నా ప్రభూ! నన్నూ, నా తల్లిదండ్రులను, విశ్వసించి నా ఇంట్లో ప్రవేశించిన వారందరినీ, విశ్వాసులైన సమస్త పురుషులను, స్త్రీలను క్షమించు. దుర్మార్గులకు వినాశంలో తప్ప మరెందులోనూ వృద్ధినొసగకు.”
- సూరా అల్ జిన్న్
72:1 قُلْ أُوحِيَ إِلَيَّ أَنَّهُ اسْتَمَعَ نَفَرٌ مِّنَ الْجِنِّ فَقَالُوا إِنَّا سَمِعْنَا قُرْآنًا عَجَبًا
(ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం!) వారికి చెప్పు: నాకు దివ్యవాణి (వహీ) ద్వారా ఇలా తెలియజేయబడింది – జిన్నుల సమూహం ఒకటి (ఖుర్ఆన్ ను ) విన్నది. వారు (తమ వాళ్లతో) ఇలా అన్నారు: “మేమొక అద్భుతమైన ఖుర్ఆన్ ను విన్నాము.”
72:2 يَهْدِي إِلَى الرُّشْدِ فَآمَنَّا بِهِ ۖ وَلَن نُّشْرِكَ بِرَبِّنَا أَحَدًا
“అది సన్మార్గం వైపు దర్శకత్వం వహిస్తోంది. అందుకే మేము దానిని విశ్వసించాము. ఇక నుంచి మేము ఎవరినీ – ఎన్నటికీ – మా ప్రభువుకు సహవర్తుల్ని కల్పించము.”
72:3 وَأَنَّهُ تَعَالَىٰ جَدُّ رَبِّنَا مَا اتَّخَذَ صَاحِبَةً وَلَا وَلَدًا
“ఇంకా – మా ప్రభువు మహిమ అత్యున్నతమైనది. ఆయన తన కోసం (ఎవరినీ) భార్యగాగానీ, కొడుకుగాగానీ చేసుకోలేదు.”
72:4 وَأَنَّهُ كَانَ يَقُولُ سَفِيهُنَا عَلَى اللَّهِ شَطَطًا
“ఇంకా – మనలోని మూర్ఖుడు అల్లాహ్ గురించి సత్యవిరుద్ధమైన మాటలు పలికే వాడు.”
72:5 وَأَنَّا ظَنَنَّا أَن لَّن تَقُولَ الْإِنسُ وَالْجِنُّ عَلَى اللَّهِ كَذِبًا
“మనుషులైనా, జిన్నులైనా అల్లాహ్ కు అబద్ధాలు అంటగట్టడం అనేది అసంభవమని మనం అనుకున్నాము.”
72:6 وَأَنَّهُ كَانَ رِجَالٌ مِّنَ الْإِنسِ يَعُوذُونَ بِرِجَالٍ مِّنَ الْجِنِّ فَزَادُوهُمْ رَهَقًا
“అసలు విషయం ఏమిటంటే కొందరు మనుషులు కొందరు జిన్నాతుల శరణు వేడేవారు. ఈ కారణంగా జిన్నాతుల పొగరు మరింత పెరిగిపోయింది.”
72:7 وَأَنَّهُمْ ظَنُّوا كَمَا ظَنَنتُمْ أَن لَّن يَبْعَثَ اللَّهُ أَحَدًا
“అల్లాహ్ ఎవరినీ పంపడని (లేక ఎవరినీ తిరిగి బ్రతికించడని) మీరు తలపోసినట్లుగానే మనుషులు కూడా తలపోశారు.”
72:8 وَأَنَّا لَمَسْنَا السَّمَاءَ فَوَجَدْنَاهَا مُلِئَتْ حَرَسًا شَدِيدًا وَشُهُبًا
“మేము ఆకాశంలో బాగా వెదికాము. అది అప్రమత్తులైన పహరాదారులతో, అగ్నిజ్వాలలతో నిండి ఉండటం చూశాము.”
72:9 وَأَنَّا كُنَّا نَقْعُدُ مِنْهَا مَقَاعِدَ لِلسَّمْعِ ۖ فَمَن يَسْتَمِعِ الْآنَ يَجِدْ لَهُ شِهَابًا رَّصَدًا
“లోగడ మనం విషయాలు వినటానికి ఆకాశంలో పలుచోట్ల (మాటేసి) కూర్చునే వాళ్ళం. ఇప్పుడు ఎవరైనా చెవి యోగ్గి వినదలిస్తే, తన కోసం కాచుకుని ఉన్న అగ్నిజ్వాలను అతను పొందుతున్నాడు.”
72:10 وَأَنَّا لَا نَدْرِي أَشَرٌّ أُرِيدَ بِمَن فِي الْأَرْضِ أَمْ أَرَادَ بِهِمْ رَبُّهُمْ رَشَدًا
“ఇంకా – భూమిలో ఉన్న వారి కోసం ఏదైనా కీడు తలపెట్టబడినదో లేక వారి ప్రభువు వారికి సన్మార్గ భాగ్యం ప్రసాదించగోరుతున్నాడో మాకు తెలియదు.”
72:11 وَأَنَّا مِنَّا الصَّالِحُونَ وَمِنَّا دُونَ ذَٰلِكَ ۖ كُنَّا طَرَائِقَ قِدَدًا
“ఇంకా ఏమిటంటే – మనలో కొందరు సజ్జనులుంటే మరికొందరు తద్భిన్నంగా ఉన్నారు. మన దారులు వేర్వేరుగా ఉన్నాయి.”
72:12 وَأَنَّا ظَنَنَّا أَن لَّن نُّعْجِزَ اللَّهَ فِي الْأَرْضِ وَلَن نُّعْجِزَهُ هَرَبًا
“మనం భూమిలో అల్లాహ్ ను అశక్తుణ్ణి చేయటం గానీ, పారిపోయి (ఊర్థ్వలోకాల్లో) ఆయన్ని ఓడించటంగాని మనవల్ల కాని పని అని మాకర్ధమైపోయింది.”
72:13 وَأَنَّا لَمَّا سَمِعْنَا الْهُدَىٰ آمَنَّا بِهِ ۖ فَمَن يُؤْمِن بِرَبِّهِ فَلَا يَخَافُ بَخْسًا وَلَا رَهَقًا
“మేము మాత్రం సన్మార్గ బోధను వినగానే దానిని విశ్వసించాం. ఇక ఎవడు తన ప్రభువును విశ్వసించినా అతనికి ఎలాంటి నష్టంగానీ, అన్యాయంగానీ జరుగుతుందన్న భయం ఉండదు.”
72:14 وَأَنَّا مِنَّا الْمُسْلِمُونَ وَمِنَّا الْقَاسِطُونَ ۖ فَمَنْ أَسْلَمَ فَأُولَٰئِكَ تَحَرَّوْا رَشَدًا
“ఇంకా – మనలో కొందరు ముస్లింలై (దైవవిధేయులై)ఉంటే, మరికొందరు సన్మార్గం నుండి తొలగి ఉన్నారు. కనుక విధేయతా వైఖరిని అవలంబించినవారు సన్మార్గాన్ని అన్వేషించుకున్నారు.”
72:15 وَأَمَّا الْقَاسِطُونَ فَكَانُوا لِجَهَنَّمَ حَطَبًا
“సన్మార్గం నుండి తొలగిపోయి, అపవాదానికి లోనైనవారు – నరకానికి ఇంధనం అవుతారు.”
72:16 وَأَن لَّوِ اسْتَقَامُوا عَلَى الطَّرِيقَةِ لَأَسْقَيْنَاهُم مَّاءً غَدَقًا
ఇంకా (ఓ ప్రవక్తా! వారికి చెప్పు): వీరు గనక సన్మార్గంపై నిలకడగా ఉంటే మేము వారికి పుష్కలంగా నీళ్ళు త్రాగించి ఉండేవారం.
72:17 لِّنَفْتِنَهُمْ فِيهِ ۚ وَمَن يُعْرِضْ عَن ذِكْرِ رَبِّهِ يَسْلُكْهُ عَذَابًا صَعَدًا
తద్వారా వారిని ఈ విషయంలో పరీక్షించటానికి! మరెవడు తన ప్రభువు ధ్యానం నుండి ముఖం త్రిప్పుకుంటాడో అతణ్ణి అల్లాహ్ కఠినమైన శిక్షకు లోను చేస్తాడు.
72:18 وَأَنَّ الْمَسَاجِدَ لِلَّهِ فَلَا تَدْعُوا مَعَ اللَّهِ أَحَدًا
ఇంకా – మస్జిదులు కేవలం అల్లాహ్ కొరకే ప్రత్యేకించబడ్డాయి. కాబట్టి (వాటిలో) అల్లాహ్ తో పాటు ఇతరులెవరినీ పిలవకండి.
72:19 وَأَنَّهُ لَمَّا قَامَ عَبْدُ اللَّهِ يَدْعُوهُ كَادُوا يَكُونُونَ عَلَيْهِ لِبَدًا
అల్లాహ్ దాసుడు (ముహమ్మద్) అల్లాహ్ ను మాత్రమే ఆరాధించటానికి నిలబడినప్పుడు ఈ మూక అమాంతం అతనిపై విరుచుకుపడినట్లే ఉంటుంది.
72:20 قُلْ إِنَّمَا أَدْعُو رَبِّي وَلَا أُشْرِكُ بِهِ أَحَدًا
(ఓ ప్రవక్తా!) “నేనైతే కేవలం నా ప్రభువునే మొరపెట్టుకుంటాను, ఆయనకు సహవర్తులుగా ఎవరినీ చేర్చను” అని చెప్పు.
72:21 قُلْ إِنِّي لَا أَمْلِكُ لَكُمْ ضَرًّا وَلَا رَشَدًا
“మీకు కీడు (నష్టం)గానీ, మేలు (లాభం)గానీ చేకూర్చే అధికారం నాకు లేదు” అని (ఓ ప్రవక్తా!) చెప్పు.
72:22 قُلْ إِنِّي لَن يُجِيرَنِي مِنَ اللَّهِ أَحَدٌ وَلَنْ أَجِدَ مِن دُونِهِ مُلْتَحَدًا
“అల్లాహ్ పట్టు నుండి నన్నెవరూ రక్షించలేరు. నేను ఆయన ఆశ్రయం తప్ప వేరొకరి ఆశ్రయాన్ని పొందలేను” అని (ఓ ప్రవక్తా! వారికి) చెప్పు.
72:23 إِلَّا بَلَاغًا مِّنَ اللَّهِ وَرِسَالَاتِهِ ۚ وَمَن يَعْصِ اللَّهَ وَرَسُولَهُ فَإِنَّ لَهُ نَارَ جَهَنَّمَ خَالِدِينَ فِيهَا أَبَدًا
“అయితే నా బాధ్యతల్లా అల్లాహ్ వాణిని, ఆయన సందేశాలను (ప్రజలకు) అందజేయటమే. ఇక ఇప్పుడు ఎవరైనా అల్లాహ్ మాటను, అతని ప్రవక్త మాటను వినకపోతే వారికొరకు నరకాగ్ని ఉంది. అందులో వారు కలకాలం ఉంటారు.”
72:24 حَتَّىٰ إِذَا رَأَوْا مَا يُوعَدُونَ فَسَيَعْلَمُونَ مَنْ أَضْعَفُ نَاصِرًا وَأَقَلُّ عَدَدًا
ఎట్టకేలకు – వారికి వాగ్దానం చేయబడుతున్నది వారు చూసుకున్నప్పుడు, ఎవరి సహాయకులు బలహీనులో, ఎవరి సమూహం అతి తక్కువగా ఉందో వారే తెలుసుకుంటారు.
72:25 قُلْ إِنْ أَدْرِي أَقَرِيبٌ مَّا تُوعَدُونَ أَمْ يَجْعَلُ لَهُ رَبِّي أَمَدًا
(ఓ ప్రవక్తా! వారికి) చెప్పు : “మీతో వాగ్దానం చేయబడుతున్న విషయం (శిక్ష) సమీపంలోనే ఉందో లేక నా ప్రభువు దానికోసం దూరపు గడువును నిర్ణయిస్తాడో నాకు తెలియదు.”
72:26 عَالِمُ الْغَيْبِ فَلَا يُظْهِرُ عَلَىٰ غَيْبِهِ أَحَدًا
ఆయన అగోచర జ్ఞానం కలవాడు. తన అగోచర విషయాలను ఆయన ఎవరికీ తెలుపడు….
72:27 إِلَّا مَنِ ارْتَضَىٰ مِن رَّسُولٍ فَإِنَّهُ يَسْلُكُ مِن بَيْنِ يَدَيْهِ وَمِنْ خَلْفِهِ رَصَدًا
……తాను ఇష్టపడిన ప్రవక్తకు తప్ప! అయితే ఆ ప్రవక్తకు ముందూ, వెనుకా కూడా తన పహరాదారులను నియమిస్తాడు.
72:28 لِّيَعْلَمَ أَن قَدْ أَبْلَغُوا رِسَالَاتِ رَبِّهِمْ وَأَحَاطَ بِمَا لَدَيْهِمْ وَأَحْصَىٰ كُلَّ شَيْءٍ عَدَدًا
వారు తమ ప్రభువు సందేశాన్ని అందజేశారని తెలియటానికి (ఈ ఏర్పాటు జరిగింది). ఆయన వారి పరిసరాలన్నింటినీ పరివేష్టించి, ఒక్కో వస్తువును లెక్కపెట్టి ఉంచాడు. - సూరా అల్ ముజ్జమ్మిల్
73:1 يَا أَيُّهَا الْمُزَّمِّلُ
ఓ వస్త్రమును కప్పుకున్నవాడా!
73:2 قُمِ اللَّيْلَ إِلَّا قَلِيلًا
కొద్దిసేపు మినహా రాత్రంతా (నమాజులో) నిలబడు.
73:3 نِّصْفَهُ أَوِ انقُصْ مِنْهُ قَلِيلًا
సగం రాత్రి లేదా దానికంటే కొంచెం తక్కువ చేసుకో.
73:4 أَوْ زِدْ عَلَيْهِ وَرَتِّلِ الْقُرْآنَ تَرْتِيلًا
లేదా దానిని మరికొద్దిగా పెంచుకో. ఖుర్ఆన్ ను మాత్రం బాగా – ఆగి ఆగి నింపాదిగా (స్పష్టంగా) పఠించు.
73:5 إِنَّا سَنُلْقِي عَلَيْكَ قَوْلًا ثَقِيلًا
నిశ్చయంగా మేము నీపై ఒక బరువైన వాక్కును వేయనున్నాము.
73:6 إِنَّ نَاشِئَةَ اللَّيْلِ هِيَ أَشَدُّ وَطْئًا وَأَقْوَمُ قِيلًا
నిశ్చయంగా రాత్రివేళ లేవటం మనో స్థిమితానికి ఎంతో ఉపయుక్తమైనది. మాట సూటిగా వెలువడటానికి అది ఎంతో అనువైనది.
73:7 إِنَّ لَكَ فِي النَّهَارِ سَبْحًا طَوِيلًا
నిశ్చయంగా పగటిపూట నీకు సుదీర్ఘమైన వ్యాపకాలున్నాయి.
73:8 وَاذْكُرِ اسْمَ رَبِّكَ وَتَبَتَّلْ إِلَيْهِ تَبْتِيلًا
అందుకే నీవు నీ ప్రభువు నామాన్ని స్మరిస్తూ ఉండు. అన్నింటినీ వదలి ఆయన వైపే మనసును లగ్నం చేయి.
73:9 رَّبُّ الْمَشْرِقِ وَالْمَغْرِبِ لَا إِلَٰهَ إِلَّا هُوَ فَاتَّخِذْهُ وَكِيلًا
ఆయన తూర్పు – పడమరలకు ప్రభువు. ఆయన తప్ప వేరొక ఆరాధ్య దైవం లేడు. కాబట్టి నీవు ఆయన్నే నీ కార్యసాధకునిగా చేసుకో.
73:10 وَاصْبِرْ عَلَىٰ مَا يَقُولُونَ وَاهْجُرْهُمْ هَجْرًا جَمِيلًا
వారు చెప్పే మాటలపై ఓర్పు వహించు. హుందాగా వారి నుండి నిష్క్రమించు.
73:11 وَذَرْنِي وَالْمُكَذِّبِينَ أُولِي النَّعْمَةِ وَمَهِّلْهُمْ قَلِيلًا
ధిక్కార వైఖరికి ఒడిగట్టిన ఈ శ్రీమంతుల సంగతిని నాకు వదలి పెట్టు. వారికి మరికొంత గడువును ఇవ్వు.
73:12 إِنَّ لَدَيْنَا أَنكَالًا وَجَحِيمًا
నిశ్చయంగా మా దగ్గర (వారి కొరకు) సంకెళ్ళు ఉన్నాయి. (భగ భగ మండే) నరకాగ్ని ఉంది.
73:13 وَطَعَامًا ذَا غُصَّةٍ وَعَذَابًا أَلِيمًا
గొంతులో ఇరుక్కుపోయే ఆహారం, అత్యంత బాధాకరమైన శిక్షా ఉన్నాయి.
73:14 يَوْمَ تَرْجُفُ الْأَرْضُ وَالْجِبَالُ وَكَانَتِ الْجِبَالُ كَثِيبًا مَّهِيلًا
ఏ రోజున భూమి, పర్వతాలు తీవ్రంగా కంపిస్తాయో, పర్వతాలు ఇసుక తిప్పలు మాదిరిగా అయిపోతాయో (ఆ రోజు ఈ శిక్ష పడుతుంది.)
73:15 إِنَّا أَرْسَلْنَا إِلَيْكُمْ رَسُولًا شَاهِدًا عَلَيْكُمْ كَمَا أَرْسَلْنَا إِلَىٰ فِرْعَوْنَ رَسُولًا
మేము ఫిరౌను వద్దకు ప్రవక్తను పంపినట్లే మీ వద్దకు కూడా మీపై సాక్షిగా ఉండటానికి ఒక ప్రవక్తను పంపాము.
73:16 فَعَصَىٰ فِرْعَوْنُ الرَّسُولَ فَأَخَذْنَاهُ أَخْذًا وَبِيلًا
మరి ఫిరౌను ఆ ప్రవక్త మాట వినలేదు. అందువల్ల మేమతన్ని చాలా కఠినంగా పట్టుకున్నాము.
73:17 فَكَيْفَ تَتَّقُونَ إِن كَفَرْتُمْ يَوْمًا يَجْعَلُ الْوِلْدَانَ شِيبًا
ఒకవేళ మీరు కూడా తిరస్కరించినట్లయితే పసివాళ్ళను సయితం పండు ముసలివాళ్ళుగా మార్చివేసే ఆ రోజు నుండి మీరెలా తప్పించుకుంటారు?
73:18 السَّمَاءُ مُنفَطِرٌ بِهِ ۚ كَانَ وَعْدُهُ مَفْعُولًا
(ఆ రోజు) ఆకాశం బ్రద్దలైపోతుంది. అల్లాహ్ చేసిన ఈ వాగ్దానం జరిగి తీరుతుంది.
73:19 إِنَّ هَٰذِهِ تَذْكِرَةٌ ۖ فَمَن شَاءَ اتَّخَذَ إِلَىٰ رَبِّهِ سَبِيلًا
నిశ్చయంగా ఇదొక ఉపదేశం. ఇక కోరినవారు తమ ప్రభువు వైపు వెళ్ళే మార్గాన్ని అవలంబించవచ్చు.
73:20 إِنَّ رَبَّكَ يَعْلَمُ أَنَّكَ تَقُومُ أَدْنَىٰ مِن ثُلُثَيِ اللَّيْلِ وَنِصْفَهُ وَثُلُثَهُ وَطَائِفَةٌ مِّنَ الَّذِينَ مَعَكَ ۚ وَاللَّهُ يُقَدِّرُ اللَّيْلَ وَالنَّهَارَ ۚ عَلِمَ أَن لَّن تُحْصُوهُ فَتَابَ عَلَيْكُمْ ۖ فَاقْرَءُوا مَا تَيَسَّرَ مِنَ الْقُرْآنِ ۚ عَلِمَ أَن سَيَكُونُ مِنكُم مَّرْضَىٰ ۙ وَآخَرُونَ يَضْرِبُونَ فِي الْأَرْضِ يَبْتَغُونَ مِن فَضْلِ اللَّهِ ۙ وَآخَرُونَ يُقَاتِلُونَ فِي سَبِيلِ اللَّهِ ۖ فَاقْرَءُوا مَا تَيَسَّرَ مِنْهُ ۚ وَأَقِيمُوا الصَّلَاةَ وَآتُوا الزَّكَاةَ وَأَقْرِضُوا اللَّهَ قَرْضًا حَسَنًا ۚ وَمَا تُقَدِّمُوا لِأَنفُسِكُم مِّنْ خَيْرٍ تَجِدُوهُ عِندَ اللَّهِ هُوَ خَيْرًا وَأَعْظَمَ أَجْرًا ۚ وَاسْتَغْفِرُوا اللَّهَ ۖ إِنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ
(ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం!) నువ్వు ఒక్కోసారి మూడింట రెండు వంతుల రాత్రి కంటే కొంచెం తక్కువ, ఒక్కోసారి సగం రాత్రి, ఒక్కోసారి మూడింట ఒక వంతు రాత్రి ఆరాధనలో నిలబడుతున్నావనీ, నీ సహచరుల్లోని ఒక వర్గం కూడా ఇలాగే చేస్తుందన్న సంగతి నీ ప్రభువుకు బాగా తెలుసు. రేయింబవళ్ళ లెక్కను ఖచ్చితంగా మదించగలవాడు అల్లాహ్ మాత్రమే. ఎట్టి పరిస్థితిలోనూ మీరు దీనిని నిర్వర్తించలేరని ఆయనకు తెలుసు. అందుకే ఆయన మీపై దయదలిచాడు. కాబట్టి మీరు ఖుర్ఆన్ లో సులభంగా పఠించగలిగినంత భాగాన్ని పఠించండి. మీలో కొందరు వ్యాధి గ్రస్తులుంటారనీ, మరి కొందరు భువిలో సంచరించి దైవానుగ్రహాన్ని (అంటే ఉపాధిని) అన్వేషించేవారున్నారనీ, ఇంకా కొందరు దైవమార్గంలో యుద్ధం చేసేవారు కూడా ఉంటారని ఆయనకు తెలుసు. కాబట్టి మీరు సులువుగా పఠించగలిగినంత ఖుర్ఆన్ ను పఠించండి. నమాజును నెలకొల్పండి. జకాత్ ను ఇస్తూ ఉండండి. అల్లాహ్ కు మంచి రుణం ఇవ్వండి. మీరు మీ కోసం ఏ మంచిని (పుణ్యకార్యాన్ని) ముందుగా పంపినా, దాన్ని అల్లాహ్ దగ్గర అత్యుత్తమ పుణ్య ఫలం రూపంలో అత్యధికంగా పొందుతారు. క్షమాపణకై అల్లాహ్ ను అర్ధిస్తూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ గొప్ప క్షమాశీలి, దయాశీలి. - సూరా అల్ ముద్దస్సిర్
74:1 يَا أَيُّهَا الْمُدَّثِّرُ
ఓ కంబళి కప్పుకున్నవాడా!
74:2 قُمْ فَأَنذِرْ
లే. (లేచి జనులను) హెచ్చరించు.
74:3 وَرَبَّكَ فَكَبِّرْ
నీ ప్రభువు గొప్పతనాన్ని చాటి చెప్పు.
74:4 وَثِيَابَكَ فَطَهِّرْ
నీ దుస్తులను పరిశుభ్రంగా ఉంచుకో.
74:5 وَالرُّجْزَ فَاهْجُرْ
ఆశుద్ధతను వదలిపెట్టు.
74:6 وَلَا تَمْنُن تَسْتَكْثِرُ
ఉపకారం చేసి ఎక్కువ (ప్రతిఫలం) పొందాలని ఆశించకు.
74:7 وَلِرَبِّكَ فَاصْبِرْ
నీ ప్రభువు కొరకు ఓర్పు వహించు.
74:8 فَإِذَا نُقِرَ فِي النَّاقُورِ
మరెప్పుడైతే శంఖం పూరించబడుతుందో…
74:9 فَذَٰلِكَ يَوْمَئِذٍ يَوْمٌ عَسِيرٌ
ఆ రోజు చాలా గడ్డు రోజై ఉంటుంది.
74:10 عَلَى الْكَافِرِينَ غَيْرُ يَسِيرٍ
అది అవిశ్వాసుల పాలిట సులభమైనది కాదు.
74:11 ذَرْنِي وَمَنْ خَلَقْتُ وَحِيدًا
నన్నూ, నేను ఒంటరిగా పుట్టించిన వాడినీ వదలి పెట్టు (వాడి సంగతి నేను చూసుకుంటాను).
74:12 وَجَعَلْتُ لَهُ مَالًا مَّمْدُودًا
వాడికి నేను విరివిగా సంపద ఇచ్చాను.
74:13 وَبَنِينَ شُهُودًا
ఎల్లప్పుడూ వెన్నంటి ఉండే కొడుకులను కూడా (ఇచ్చాను).
74:14 وَمَهَّدتُّ لَهُ تَمْهِيدًا
ఇంకా వాడి కోసం అన్ని విధాలా సుఖసౌఖ్యాల సామగ్రిని సమకూర్చాను.
74:15 ثُمَّ يَطْمَعُ أَنْ أَزِيدَ
అయినా నేను వాడికి ఇంకా … ఇంకా ప్రసాదించాలని వాడు (పిచ్చిగా) ఆశపడుతున్నాడు.
74:16 كَلَّا ۖ إِنَّهُ كَانَ لِآيَاتِنَا عَنِيدًا
అలా జరగదు. వాడు మా ఆయతుల (సూచనల)కు బద్ధ విరోధిగా తయారయ్యాడు.
74:17 سَأُرْهِقُهُ صَعُودًا
త్వరలోనే నేను వాణ్ణి కఠినమైన ఎత్తుకు ఎక్కిస్తాను.
74:18 إِنَّهُ فَكَّرَ وَقَدَّرَ
వాడు ఆలోచించి ఒక ప్రతిపాదన చేశాడు.
74:19 فَقُتِلَ كَيْفَ قَدَّرَ
వాడు నాశనం గాను! ఎటువంటి ప్రతిపాదన చేశాడు వాడు!?
74:20 ثُمَّ قُتِلَ كَيْفَ قَدَّرَ
మరి వాడు నాశనమైపోను!! ఎలాంటి ప్రతిపాదన చేశాడు వాడు!?
74:21 ثُمَّ نَظَرَ
తరువాత వాడు దృష్టిని సారించాడు (ఆలోచించాడు).
74:22 ثُمَّ عَبَسَ وَبَسَرَ
ఆపైన నుదురు చిట్లించాడు. పాడు ముఖం పెట్టుకున్నాడు.
74:23 ثُمَّ أَدْبَرَ وَاسْتَكْبَرَ
అటుపిమ్మట వీపు త్రిప్పుకున్నాడు. గర్వం ప్రదర్శించాడు.
74:24 فَقَالَ إِنْ هَٰذَا إِلَّا سِحْرٌ يُؤْثَرُ
(చివరికి) ఇలా అన్నాడు : “ఇది పూర్వం నుంచీ నకలు చేయబడుతూ వస్తున్న మాయాజాలం మాత్రమే.”
74:25 إِنْ هَٰذَا إِلَّا قَوْلُ الْبَشَرِ
“ఇది మానవ వాక్కు తప్ప మరేమీ కాదు.”
74:26 سَأُصْلِيهِ سَقَرَ
నేను త్వరలోనే వాణ్ణి నరకాగ్నికి ఆహుతి చేస్తాను.
74:27 وَمَا أَدْرَاكَ مَا سَقَرُ
ఆ నరకాగ్ని ఎటువంటిదో నీకేం తెలుసు?
74:28 لَا تُبْقِي وَلَا تَذَرُ
అది (ఏ పాపాత్ముణ్ణి) మిగల్చదు, (దేనినీ కాలకుండా) వదలి పెట్టదు.
74:29 لَوَّاحَةٌ لِّلْبَشَرِ
(మనుషుల) చర్మాన్ని మాడ్చివేస్తుంది.
74:30 عَلَيْهَا تِسْعَةَ عَشَرَ
దానిపై పందొమ్మిది మంది (దైవదూతలు నియమితులై) ఉన్నారు.
74:31 وَمَا جَعَلْنَا أَصْحَابَ النَّارِ إِلَّا مَلَائِكَةً ۙ وَمَا جَعَلْنَا عِدَّتَهُمْ إِلَّا فِتْنَةً لِّلَّذِينَ كَفَرُوا لِيَسْتَيْقِنَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ وَيَزْدَادَ الَّذِينَ آمَنُوا إِيمَانًا ۙ وَلَا يَرْتَابَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ وَالْمُؤْمِنُونَ ۙ وَلِيَقُولَ الَّذِينَ فِي قُلُوبِهِم مَّرَضٌ وَالْكَافِرُونَ مَاذَا أَرَادَ اللَّهُ بِهَٰذَا مَثَلًا ۚ كَذَٰلِكَ يُضِلُّ اللَّهُ مَن يَشَاءُ وَيَهْدِي مَن يَشَاءُ ۚ وَمَا يَعْلَمُ جُنُودَ رَبِّكَ إِلَّا هُوَ ۚ وَمَا هِيَ إِلَّا ذِكْرَىٰ لِلْبَشَرِ
మేము నరకపాలకులుగా దైవదూతలను మాత్రమే ఉంచాము. ఇంకా మేము వారి (19) సంఖ్యను అవిశ్వాసులను పరీక్షించటానికి మాత్రమే నిర్ధారించాము. గ్రంథవహులకు నమ్మకం కుదరటానికి, విశ్వాసులు తమ విశ్వాసంలో మరింత ముందంజ వేయటానికి, గ్రంథవహులు, విశ్వసించినవారు సందేహానికి గురికాకుండా ఉండటానికి మేమిలా చేశాము. ఇంకా – హృదయాలలో రోగమున్నవారు, అవిశ్వాసులు, “ఇంతకీ ఈ (19) దృష్టాంతం ద్వారా అల్లాహ్ ఏం చెప్పదలిచాడు?” అని చెప్పటానికి కూడా (మేము ఈ విధంగా చేశాము). ఈ విధంగా అల్లాహ్ తాను కోరినవారిని పెడదారి పట్టిస్తాడు, తను కోరిన వారికి సన్మార్గం చూపుతాడు. నీ ప్రభువు సైన్యాలను స్వయంగా ఆయన తప్ప మరెవరూ ఎరుగరు. ఈ (నరక) వృత్తాంతం మానవ మాత్రుల బోధనార్ధం ప్రస్తావించబడింది.
74:32 كَلَّا وَالْقَمَرِ
నిజం చెబుతున్నాను. చంద్రుని సాక్షిగా!
74:33 وَاللَّيْلِ إِذْ أَدْبَرَ
తి(త)రిగి పోతున్న రాత్రి సాక్షిగా!
74:34 وَالصُّبْحِ إِذَا أَسْفَرَ
ప్రకాశమానమైన ఉదయం సాక్షిగా!
74:35 إِنَّهَا لَإِحْدَى الْكُبَرِ
నిశ్చయంగా అది (ఆ నరకం) చాలా పెద్ద విషయం.
74:36 نَذِيرًا لِّلْبَشَرِ
మానవులకు ఒక హెచ్చరిక!
74:37 لِمَن شَاءَ مِنكُمْ أَن يَتَقَدَّمَ أَوْ يَتَأَخَّرَ
మీలో ముందంజ వేయదలిచే ప్రతి ఒక్కరికీ, వెనుక ఉండిపోదలిచే ప్రతి ఒక్కరికీ.
74:38 كُلُّ نَفْسٍ بِمَا كَسَبَتْ رَهِينَةٌ
ప్రతి వ్యక్తీ తాను చేసుకున్నదానికి (తాను చేసిన కర్మలకు) ప్రతిగా తాకట్టుగా ఉన్నాడు.
74:39 إِلَّا أَصْحَابَ الْيَمِينِ
కుడి పక్షం వారు తప్ప!
74:40 فِي جَنَّاتٍ يَتَسَاءَلُونَ
వారు (స్వర్గ) వనాలలో (కూర్చొని) అడుగుతూ ఉంటారు,
74:41 عَنِ الْمُجْرِمِينَ
అపరాధుల గురించి.
74:42 مَا سَلَكَكُمْ فِي سَقَرَ
“ఇంతకీ ఏ విషయం మిమ్మల్ని నరకానికి తీసుకు వచ్చింది?” (అని ప్రశ్నిస్తారు).
74:43 قَالُوا لَمْ نَكُ مِنَ الْمُصَلِّينَ
వారిలా సమాధానమిస్తారు : “మేము నమాజు చేసే వారము కాము.”
74:44 وَلَمْ نَكُ نُطْعِمُ الْمِسْكِينَ
“నిరుపేదలకు అన్నం పెట్టే వారమూ కాము.”
74:45 وَكُنَّا نَخُوضُ مَعَ الْخَائِضِينَ
“పైగా, మేము పిడివాదన చేసే వారితో (తిరస్కారులతో) చేరి, వాదోపవాదాలలో మునిగి ఉండేవారం.”
74:46 وَكُنَّا نُكَذِّبُ بِيَوْمِ الدِّينِ
“ప్రతిఫల దినాన్ని ధిక్కరించేవాళ్ళం.”
74:47 حَتَّىٰ أَتَانَا الْيَقِينُ
“తుదకు మాకు మరణం వచ్చేసింది.”
74:48 فَمَا تَنفَعُهُمْ شَفَاعَةُ الشَّافِعِينَ
మరి సిఫారసు చేసేవారి సిఫారసు వారికి ఏమాత్రం ఉపయోగపడదు.
74:49 فَمَا لَهُمْ عَنِ التَّذْكِرَةِ مُعْرِضِينَ
ఇంతకీ వారికేమైపోయిందనీ, వారెందుకిలా హితబోధ నుండి ముఖం త్రిప్పుకుని పోతున్నారు?
74:50 كَأَنَّهُمْ حُمُرٌ مُّسْتَنفِرَةٌ
వారు బెదిరి (పారి)పోయే అడవి గాడిదల్లా ఉన్నారే!?
74:51 فَرَّتْ مِن قَسْوَرَةٍ
అవి సింహాన్ని చూసి పారిపోతుంటాయి.
74:52 بَلْ يُرِيدُ كُلُّ امْرِئٍ مِّنْهُمْ أَن يُؤْتَىٰ صُحُفًا مُّنَشَّرَةً
పైగా వారిలోని ప్రతి వ్యక్తీ, తనకు ప్రకాశిత ‘సహీఫాలు’ (ప్రతులు) ఇవ్వబడాలని కోరుకుంటున్నాడు.
74:53 كَلَّا ۖ بَل لَّا يَخَافُونَ الْآخِرَةَ
అలా జరగనేరదు. వారసలు పరలోకానికి భయపడటం లేదు.
74:54 كَلَّا إِنَّهُ تَذْكِرَةٌ
ముమ్మాటికీ కాదు (వాస్తవమేమిటంటే) ఈ ఖుర్ఆన్ ఒక హితబోధిని.
74:55 فَمَن شَاءَ ذَكَرَهُ
కాబట్టి ఇక కోరినవారు దీనిద్వారా ఉపదేశం గ్రహించవచ్చు.
74:56 وَمَا يَذْكُرُونَ إِلَّا أَن يَشَاءَ اللَّهُ ۚ هُوَ أَهْلُ التَّقْوَىٰ وَأَهْلُ الْمَغْفِرَةِ
అయితే అల్లాహ్ తలచినప్పుడు మాత్రమే వారు హితబోధను ఆస్వాదించగలరు. వారు భయపడవలసింది ఆయనకు మాత్రమే. క్షమాభిక్ష పెట్టడం కూడా ఆయనకే చెల్లు. - సూరా అల్ ఖియామ హ్
75:1 لَا أُقْسِمُ بِيَوْمِ الْقِيَامَةِ
నేను ప్రళయ దినంపై ప్రమాణం చేస్తున్నాను.
75:2 وَلَا أُقْسِمُ بِالنَّفْسِ اللَّوَّامَةِ
ఇంకా నేను, తనను తాను నిందించుకునే ఆత్మపై ప్రమాణం చేస్తున్నాను.
75:3 أَيَحْسَبُ الْإِنسَانُ أَلَّن نَّجْمَعَ عِظَامَهُ
ఏమిటి, మానవుడు మేమతని ఎముకలను కూర్చలేమని అనుకుంటున్నాడా?
75:4 بَلَىٰ قَادِرِينَ عَلَىٰ أَن نُّسَوِّيَ بَنَانَهُ
తప్పకుండా కూర్చగలము. మేమతని వ్రేళ్ళ కొనలను సైతం (యధాతథంగా) సవరించగలం.
75:5 بَلْ يُرِيدُ الْإِنسَانُ لِيَفْجُرَ أَمَامَهُ
ఈ మానవుడైతే ఇక మీదట కూడా దురంతాలకు పాల్పడదలుస్తున్నాడు.
75:6 يَسْأَلُ أَيَّانَ يَوْمُ الْقِيَامَةِ
“ఇంతకీ ప్రళయదినం ఎప్పుడు?” అని అడుగుతున్నాడు.
75:7 فَإِذَا بَرِقَ الْبَصَرُ
చూపు చెదిరిపోయినప్పుడు…”
75:8 وَخَسَفَ الْقَمَرُ
చంద్రుడు కాంతిహీనుడై పోయినప్పుడు…”
75:9 وَجُمِعَ الشَّمْسُ وَالْقَمَرُ
సూర్య చంద్రులు కలిపివేయబడినప్పుడు….
75:10 يَقُولُ الْإِنسَانُ يَوْمَئِذٍ أَيْنَ الْمَفَرُّ
ఆ రోజు మానవుడు, “నేనెక్కడికి పారిపోను?” అంటాడు.
75:11 كَلَّا لَا وَزَرَ
లేదు. ఎక్కడా ఏ ఆశ్రయమూ లేదు.
75:12 إِلَىٰ رَبِّكَ يَوْمَئِذٍ الْمُسْتَقَرُّ
ఆ రోజు నీ ప్రభువు వద్దనే స్థానముంటుంది.
75:13 يُنَبَّأُ الْإِنسَانُ يَوْمَئِذٍ بِمَا قَدَّمَ وَأَخَّرَ
ఆ రోజు మనిషికి, తానేం ముందుకు పంపాడో, మరేం వెనుక వదిలాడో తెలుపబడుతుంది.
75:14 بَلِ الْإِنسَانُ عَلَىٰ نَفْسِهِ بَصِيرَةٌ
మానవుడు తనకు వ్యతిరేకంగా తానే సాక్షిగా ఉంటాడు.
75:15 وَلَوْ أَلْقَىٰ مَعَاذِيرَهُ
(తన దుష్కర్మలను కప్పిపుచ్చుకోవటానికి) ఎన్ని సంజాయిషీలు ఇచ్చుకున్నప్పటికీను.
75:16 لَا تُحَرِّكْ بِهِ لِسَانَكَ لِتَعْجَلَ بِهِ
(ఓ ప్రవక్తా!) నీవు ఖుర్ఆన్ ను తొందరగా కంఠస్థం చేసుకోవటానికి నీ నాలుకను వేగంగా కదిలించకు.
75:17 إِنَّ عَلَيْنَا جَمْعَهُ وَقُرْآنَهُ
దాన్ని సమకూర్చే, (నీ చేత) పారాయణం చేయించే బాధ్యత మాది.
75:18 فَإِذَا قَرَأْنَاهُ فَاتَّبِعْ قُرْآنَهُ
కాబట్టి మేము దానిని పఠించాక, నువ్వు దాని పఠనాన్ని అనుసరించు.
75:19 ثُمَّ إِنَّ عَلَيْنَا بَيَانَهُ
మరి దానిని విడమరచి చెప్పే బాధ్యత కూడా మాపైనే ఉంది.
75:20 كَلَّا بَلْ تُحِبُّونَ الْعَاجِلَةَ
ఎన్నటికీ కాదు. మీరసలు తొందరగా లభించే దాని (ప్రపంచం)పై మోజు పడుతున్నారు.
75:21 وَتَذَرُونَ الْآخِرَةَ
పరలోకాన్ని మాత్రం వదలిపెడుతున్నారు.
75:22 وُجُوهٌ يَوْمَئِذٍ نَّاضِرَةٌ
ఆ రోజు ఎన్నో ముఖాలు (ఆహ్లాదకరంగా) తాజాగా ఉంటాయి.
75:23 إِلَىٰ رَبِّهَا نَاظِرَةٌ
తమ ప్రభువు వైపు చూస్తూ ఉంటాయి.
75:24 وَوُجُوهٌ يَوْمَئِذٍ بَاسِرَةٌ
ఆ రోజు మరెన్నో ముఖాలు ఉదాసీనం (కాంతిహీనం)గా ఉంటాయి.
75:25 تَظُنُّ أَن يُفْعَلَ بِهَا فَاقِرَةٌ
తమ పట్ల నడ్డి విరిచే వ్యవహారం జరగనున్నదని అవి అనుకుంటూ ఉంటాయి.
75:26 كَلَّا إِذَا بَلَغَتِ التَّرَاقِيَ
అసంభవం. (గుండెలోని) ప్రాణం గొంతు ప్రక్కన గల ఎముక వరకూ చేరుకున్నప్పుడు,
75:27 وَقِيلَ مَنْ ۜ رَاقٍ
“మంత్రించి నయం చేసే వాడెవడైనా ఉన్నాడా?” అని అనబడినప్పుడు,
75:28 وَظَنَّ أَنَّهُ الْفِرَاقُ
“పోయేకాలం వచ్చింద”న్న సంగతిని అతను తెలుసుకున్నప్పుడు,
75:29 وَالْتَفَّتِ السَّاقُ بِالسَّاقِ
ఒక పిక్క మరో పిక్కతో ఒడుసుకున్నప్పుడు,
75:30 إِلَىٰ رَبِّكَ يَوْمَئِذٍ الْمَسَاقُ
(ఓ మానవాత్మా!) ఈ రోజు నీవు నీ ప్రభువు వైపు సాగిపోవలసి ఉంటుంది.
75:31 فَلَا صَدَّقَ وَلَا صَلَّىٰ
వాడు సత్యాన్ని ధృవీకరించనూ లేదు, నమాజు చేయనూ లేదు.
75:32 وَلَٰكِن كَذَّبَ وَتَوَلَّىٰ
పైగా వాడు (సత్యాన్ని) ధిక్కరించాడు, వెను తిరిగిపోయాడు.
75:33 ثُمَّ ذَهَبَ إِلَىٰ أَهْلِهِ يَتَمَطَّىٰ
మిడిసిపడుతూ, తన ఇంటివారల వైపు వెళ్ళిపోయాడు.
75:34 أَوْلَىٰ لَكَ فَأَوْلَىٰ
శోచనీయం. నీ వైఖరి కడు శోచనీయం.
75:35 ثُمَّ أَوْلَىٰ لَكَ فَأَوْلَىٰ
మరి విచారకరం. నీ ధోరణి మిక్కిలి విచారకరం.
75:36 أَيَحْسَبُ الْإِنسَانُ أَن يُتْرَكَ سُدًى
ఏమిటీ, తనను ఇట్టే వదలిపెట్టడం జరుగుతుందని మానవుడు అనుకుంటున్నాడా?
75:37 أَلَمْ يَكُ نُطْفَةً مِّن مَّنِيٍّ يُمْنَىٰ
ఏమిటి, అతను (ఒకప్పుడు, మాతృ గర్భంలో) స్ఖలించబడిన చిక్కటి వీర్య బిందువుగా ఉండలేదా?
75:38 ثُمَّ كَانَ عَلَقَةً فَخَلَقَ فَسَوَّىٰ
మరి అతను ఒక నెత్తుటి గడ్డగా మారాడు. తరువాత అల్లాహ్ అతణ్ణి (దశను) మలిచాడు. ఆపైన అతణ్ణి తగు విధంగా తీర్చిదిద్దాడు.
75:39 فَجَعَلَ مِنْهُ الزَّوْجَيْنِ الذَّكَرَ وَالْأُنثَىٰ
మరి దాన్నుండి ఆడ మగలనే జంటలను చేశాడు.
75:40 أَلَيْسَ ذَٰلِكَ بِقَادِرٍ عَلَىٰ أَن يُحْيِيَ الْمَوْتَىٰ
ఇదంతా చేసినవాడు మృతులను బ్రతికించలేడా? - సూరా అద్ దహ్ర్
76:1 هَلْ أَتَىٰ عَلَى الْإِنسَانِ حِينٌ مِّنَ الدَّهْرِ لَمْ يَكُن شَيْئًا مَّذْكُورًا
సుదీర్ఘమైన కాలంలో మానవుడు చెప్పుకోదగ్గ వస్తువుగా లేకుండా ఉండిన సమయం ఒకటి గడవలేదా?
76:2 إِنَّا خَلَقْنَا الْإِنسَانَ مِن نُّطْفَةٍ أَمْشَاجٍ نَّبْتَلِيهِ فَجَعَلْنَاهُ سَمِيعًا بَصِيرًا
నిశ్చయంగా మేము మానవుణ్ణి పరీక్షించడానికి ఒక మిశ్రమ వీర్య బిందువుతో పుట్టించాము. మరి మేము అతణ్ణి వినేవాడుగా, చూసేవాడుగా చేశాము.
76:3 إِنَّا هَدَيْنَاهُ السَّبِيلَ إِمَّا شَاكِرًا وَإِمَّا كَفُورًا
మేమతనికి మార్గం కూడా చూపాము. ఇక వాడు కృతజ్ఞుడుగా వ్యవహరించినా లేదా కృతఘ్నుడుగా తయారైనా (వాడి ఇష్టం. మేము వాడి స్వేచ్చను హరించలేదు.)
76:4 إِنَّا أَعْتَدْنَا لِلْكَافِرِينَ سَلَاسِلَ وَأَغْلَالًا وَسَعِيرًا
అవిశ్వాసుల కోసం మేము సంకెళ్ళను, ఇనుప పట్టాలను, జ్వలించే అగ్నిని సిద్ధం చేసి ఉంచాము.
76:5 إِنَّ الْأَبْرَارَ يَشْرَبُونَ مِن كَأْسٍ كَانَ مِزَاجُهَا كَافُورًا
నిశ్చయంగా సజ్జనులు (విశ్వాసులు) ‘కాఫూర్’ కలుపబడిన మధుపాత్రలను సేవిస్తారు.
76:6 عَيْنًا يَشْرَبُ بِهَا عِبَادُ اللَّهِ يُفَجِّرُونَهَا تَفْجِيرًا
అదొక సరోవరం. దైవదాసులు దాన్నుండి (తనివి తీరా) త్రాగుతారు. (తాము కోరిన చోటికి) దాని పాయలు తీసుకుపోతారు.
76:7 يُوفُونَ بِالنَّذْرِ وَيَخَافُونَ يَوْمًا كَانَ شَرُّهُ مُسْتَطِيرًا
వారు తమ మొక్కుబడులను చెల్లిస్తుంటారు. ఏ రోజు కీడు నలువైపులా విస్తరిస్తుందో ఆ రోజు గురించి భయపడుతుంటారు.
76:8 وَيُطْعِمُونَ الطَّعَامَ عَلَىٰ حُبِّهِ مِسْكِينًا وَيَتِيمًا وَأَسِيرًا
అల్లాహ్ ప్రీతికోసం నిరుపేదలకు, అనాధులకు, ఖైదీలకు అన్నం పెడుతుంటారు.
76:9 إِنَّمَا نُطْعِمُكُمْ لِوَجْهِ اللَّهِ لَا نُرِيدُ مِنكُمْ جَزَاءً وَلَا شُكُورًا
(పైగా వారిలా అంటారు) : “మేము కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసమే మీకు తినిపిస్తున్నాము. అంతేగాని మీ నుండి మేము ఎలాంటి ప్రతిఫలాన్ని గానీ, ధన్యవాదాలను గానీ ఆశించటం లేదు.”
76:10 إِنَّا نَخَافُ مِن رَّبِّنَا يَوْمًا عَبُوسًا قَمْطَرِيرًا
“నిశ్చయంగా మేము మా ప్రభువు తరఫున సంభవించే అత్యంత కఠినమైన, సుదీర్ఘమైన రోజు గురించి భయపడుతున్నాము.”
76:11 فَوَقَاهُمُ اللَّهُ شَرَّ ذَٰلِكَ الْيَوْمِ وَلَقَّاهُمْ نَضْرَةً وَسُرُورًا
అందువల్ల అల్లాహ్ వారిని ఆనాటి కీడు నుండి రక్షించి,” వారికి ఉల్లాసాన్నీ, ఆహ్లాదాన్నీ వొసగాడు.
76:12 وَجَزَاهُم بِمَا صَبَرُوا جَنَّةً وَحَرِيرًا
వారి సహనానికి బదులుగా వారికి స్వర్గాన్నీ , పట్టువస్త్రాలను ప్రసాదించాడు.
76:13 مُّتَّكِئِينَ فِيهَا عَلَى الْأَرَائِكِ ۖ لَا يَرَوْنَ فِيهَا شَمْسًا وَلَا زَمْهَرِيرًا
వారక్కడ దిండ్లకు ఆనుకొని పీఠాలపై కూర్చుని ఉంటారు. అక్కడ వారు సూర్య తాపాన్ని గానీ, చలి తీవ్రతను గానీ చూడరు.
76:14 وَدَانِيَةً عَلَيْهِمْ ظِلَالُهَا وَذُلِّلَتْ قُطُوفُهَا تَذْلِيلًا
స్వర్గవనాల నీడలు వారిపై పడుతూ ఉంటాయి. వాటి పండ్ల గుత్తులు క్రిందికి వ్రేలాడుతూ (అందుబాటులో) ఉంటాయి.
76:15 وَيُطَافُ عَلَيْهِم بِآنِيَةٍ مِّن فِضَّةٍ وَأَكْوَابٍ كَانَتْ قَوَارِيرَا
వారి సేవలో వెండి పాత్రలు, గాజు గిన్నెలు తిప్పబడుతూ ఉంటాయి.
76:16 قَوَارِيرَ مِن فِضَّةٍ قَدَّرُوهَا تَقْدِيرًا
ఆ గాజు గిన్నెలు కూడా వెండివై ఉంటాయి. వాటిని (నింపేవారు) ఒక అంచనా ప్రకారం సరిగ్గా నింపి ఉంటారు.
76:17 وَيُسْقَوْنَ فِيهَا كَأْسًا كَانَ مِزَاجُهَا زَنجَبِيلًا
వారికక్కడ సొంటి కలిపిన మధు పాత్రలు త్రాగడానికి ఇవ్వబడతాయి –
76:18 عَيْنًا فِيهَا تُسَمَّىٰ سَلْسَبِيلًا
స్వర్గంలోని ఒక సెలయేరు నుండి. దాని పేరు సల్ సబీల్.
76:19 وَيَطُوفُ عَلَيْهِمْ وِلْدَانٌ مُّخَلَّدُونَ إِذَا رَأَيْتَهُمْ حَسِبْتَهُمْ لُؤْلُؤًا مَّنثُورًا
వారి చుట్టూ (నవ నవలాడే) పిన్న వయస్కులైన అబ్బాయిలు తిరుగాడుతూ ఉంటారు. వాళ్ళు నిత్యం అబ్బాయిలుగానే ఉంటారు. నీవు వారిని చూసినప్పుడు చెదిరిన ముత్యాలా! అని భావిస్తావు.
76:20 وَإِذَا رَأَيْتَ ثَمَّ رَأَيْتَ نَعِيمًا وَمُلْكًا كَبِيرًا
నువ్వు అక్కడ ఎటు చూసినా గొప్ప అనుగ్రహాలు, మహా సామ్రాజ్య వైభవమే కానవస్తాయి.
76:21 عَالِيَهُمْ ثِيَابُ سُندُسٍ خُضْرٌ وَإِسْتَبْرَقٌ ۖ وَحُلُّوا أَسَاوِرَ مِن فِضَّةٍ وَسَقَاهُمْ رَبُّهُمْ شَرَابًا طَهُورًا
వారి శరీరాలపై పచ్చని, నాణ్యమైన సన్నని సిల్కు వస్త్రాలు, దళసరి పట్టు వస్త్రాలే ఉంటాయి. ఇంకా, వారికి వెండి కంకణాలు – ఆభరణంగా – తొడిగింపబడతాయి. వారి ప్రభువు వారికి స్వచ్చమైన, పరిశుద్ధమైన మధువును త్రాగిస్తాడు.
76:22 إِنَّ هَٰذَا كَانَ لَكُمْ جَزَاءً وَكَانَ سَعْيُكُم مَّشْكُورًا
ఇది మీ కర్మలకు బదులుగా ఇవ్వబడిన ప్రతిఫలం. మీ కృషి స్వీకరించబడింది (గుర్తించబడింది అని వారితో అనబడుతుంది).”
76:23 إِنَّا نَحْنُ نَزَّلْنَا عَلَيْكَ الْقُرْآنَ تَنزِيلًا
నిశ్చయంగా మేము నీపై ఖుర్ఆన్ ను అంచెల వారీగా అవతరింపజేశాము.
76:24 فَاصْبِرْ لِحُكْمِ رَبِّكَ وَلَا تُطِعْ مِنْهُمْ آثِمًا أَوْ كَفُورًا
కాబట్టి (ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం!) నువ్వు నీ ప్రభువు ఆదేశం పై స్థిరంగా ఉండు. వారిలోని ఏ పాపాత్ముని , మరే కృతఘ్నుని మాట వినకు.
76:25 وَاذْكُرِ اسْمَ رَبِّكَ بُكْرَةً وَأَصِيلًا
నీ ప్రభువు నామాన్ని ఉదయం, సాయంత్రం స్మరిస్తూ ఉండు.
76:26 وَمِنَ اللَّيْلِ فَاسْجُدْ لَهُ وَسَبِّحْهُ لَيْلًا طَوِيلًا
రాత్రి వేళ ఆయన సన్నిధిలో సాష్టాంగ పడుతూ ఉండు. రాత్రి చాలాసేపు ఆయన పవిత్రతను కొనియాడు.
76:27 إِنَّ هَٰؤُلَاءِ يُحِبُّونَ الْعَاجِلَةَ وَيَذَرُونَ وَرَاءَهُمْ يَوْمًا ثَقِيلًا
వీళ్ళు తొందరగా లభించే దాని (ప్రపంచం)పై మోజు పడుతున్నారు. తమ వెనుక ఒక బరువైన దినాన్ని వదలి వేస్తున్నారు.
76:28 نَّحْنُ خَلَقْنَاهُمْ وَشَدَدْنَا أَسْرَهُمْ ۖ وَإِذَا شِئْنَا بَدَّلْنَا أَمْثَالَهُمْ تَبْدِيلًا
(మరి చూడబోతే) వీరిని పుట్టించింది , వీళ్ళ కీళ్ళను దృఢపరచినది మేమే. మరి మేము తలచుకున్నప్పుడల్లా వీరికి బదులుగా వీరిలాంటి వారిని తీసుకురాగలము.
76:29 إِنَّ هَٰذِهِ تَذْكِرَةٌ ۖ فَمَن شَاءَ اتَّخَذَ إِلَىٰ رَبِّهِ سَبِيلًا
నిశ్చయంగా ఇదొక ఉపదేశం. ఇక కోరినవారు తమ ప్రభువు మార్గాన్ని అవలంబించవచ్చు.
76:30 وَمَا تَشَاءُونَ إِلَّا أَن يَشَاءَ اللَّهُ ۚ إِنَّ اللَّهَ كَانَ عَلِيمًا حَكِيمًا
అల్లాహ్ కోరనిదే మీరు కోరలేరు. నిశ్చయంగా అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, వివేచనాపరుడు.
76:31 يُدْخِلُ مَن يَشَاءُ فِي رَحْمَتِهِ ۚ وَالظَّالِمِينَ أَعَدَّ لَهُمْ عَذَابًا أَلِيمًا
ఆయన తాను కోరిన వారిని తన కారుణ్య పరిధిలోకి తీసుకుంటాడు. దుర్మార్గుల కోసం ఆయన బాధాకరమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాడు.
- సూరా అల్ ముర్సలాత్
77:1 وَالْمُرْسَلَاتِ عُرْفًا
నిరాఘాటంగా వేగంతో వీచే పెనుగాలుల సాక్షిగా!
77:2 فَالْعَاصِفَاتِ عَصْفًا
మరి ప్రచండ వేగంతో వీచే పెనుగాలుల సాక్షిగా!
77:3 وَالنَّاشِرَاتِ نَشْرًا
మేఘాలను లేపి చెల్లాచెదురు చేసే గాలుల సాక్షిగా!
77:4 فَالْفَارِقَاتِ فَرْقًا
మరి (సత్యాసత్యాలను) వేరుపరచే వా(టి)రి సాక్షిగా!
77:5 فَالْمُلْقِيَاتِ ذِكْرًا
జ్ఞాపికను తీసుకువచ్చే దూతల సాక్షిగా!
77:6 عُذْرًا أَوْ نُذْرًا
సాకులు లేకుండా చేయటానికి, హెచ్చరించటానికి.
77:7 إِنَّمَا تُوعَدُونَ لَوَاقِعٌ
ఏ విషయం గురించి మీకు వాగ్దానం చేయబడుతున్నదో అది వచ్చి తీరుతుంది.
77:8 فَإِذَا النُّجُومُ طُمِسَتْ
నక్షత్రాలు కాంతిహీనం అయిపోయినప్పుడు…
77:9 وَإِذَا السَّمَاءُ فُرِجَتْ
ఆకాశం బద్దలైపోయినప్పుడు ….
77:10 وَإِذَا الْجِبَالُ نُسِفَتْ
పర్వతాలు తునాతునకలుగా చేసి ఎగుర వేయబడినప్పుడు…
77:11 وَإِذَا الرُّسُلُ أُقِّتَتْ
ప్రవక్తలందరూ నిర్ధారిత సమయంలో హాజరుపరచబడినప్పుడు….
77:12 لِأَيِّ يَوْمٍ أُجِّلَتْ
ఏ రోజు కోసం (వారందరిని) వాయిదా వేసినట్టు?
77:13 لِيَوْمِ الْفَصْلِ
తీర్పుదినం కోసం!
77:14 وَمَا أَدْرَاكَ مَا يَوْمُ الْفَصْلِ
తీర్పుదినం ఏమిటో నీకేం తెలుసు?
77:15 وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
ధిక్కార వైఖరిని అవలంబించే వారికి ఆ రోజు వినాశం ఖాయం.
77:16 أَلَمْ نُهْلِكِ الْأَوَّلِينَ
ఏమిటి, మేము పూర్వీకులను అంతమొందించలేదా?
77:17 ثُمَّ نُتْبِعُهُمُ الْآخِرِينَ
మరి మేము వారి తర్వాత వెనుకటి తరాల వారిని తీసుకు వచ్చాము.
77:18 كَذَٰلِكَ نَفْعَلُ بِالْمُجْرِمِينَ
మేము నేరస్తుల (పాపాత్ముల) పట్ల ఇలాగే వ్యవహరిస్తాం.
77:19 وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
ధిక్కార వైఖరిని అవలంబించే వారికి ఆ రోజు వినాశం ఖాయం.
77:20 أَلَمْ نَخْلُقكُّم مِّن مَّاءٍ مَّهِينٍ
ఏమిటి, మేము మిమ్మల్ని అల్పమైన నీళ్ళతో (వీర్యబిందువుతో) సృష్టించలేదా?
77:21 فَجَعَلْنَاهُ فِي قَرَارٍ مَّكِينٍ
ఆ తరువాత దానిని ఒక పటిష్టమైన, సురక్షితమైన చోట ఉంచాము –
77:22 إِلَىٰ قَدَرٍ مَّعْلُومٍ
ఒక నిర్ణీత కాలం వరకు.
77:23 فَقَدَرْنَا فَنِعْمَ الْقَادِرُونَ
మేము తగురీతిలో లెక్క వేశాము. ఆహా! మేము ఎంత ఖచ్చితంగా లెక్కించే శక్తి గలవారమో!
77:24 وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
ధిక్కార వైఖరిని అవలంబించే వారికి ఆ రోజు వినాశం ఖాయం.
77:25 أَلَمْ نَجْعَلِ الْأَرْضَ كِفَاتًا
ఏమిటి, మేము భూమిని తనలో ఇమిడ్చుకునేదిగా చేయలేదా?
77:26 أَحْيَاءً وَأَمْوَاتًا
సజీవ మరియు నిర్జీవ స్థితుల్లో.
77:27 وَجَعَلْنَا فِيهَا رَوَاسِيَ شَامِخَاتٍ وَأَسْقَيْنَاكُم مَّاءً فُرَاتًا
ఇంకా మేమందులో ఎత్తైన, బ్రహ్మాండమైన పర్వతాలను ప్రతిష్టించాము. మీ దాహాన్ని తీర్చే మంచి నీరును మీకు త్రాపాము.
77:28 وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
ధిక్కార వైఖరిని అవలంబించే వారికి ఆ రోజు వినాశం ఖాయం.
77:29 انطَلِقُوا إِلَىٰ مَا كُنتُم بِهِ تُكَذِّبُونَ
“మీరు ధిక్కరిస్తూ ఉన్న ఆ నరకం వైపే పదండి!”
77:30 انطَلِقُوا إِلَىٰ ظِلٍّ ذِي ثَلَاثِ شُعَبٍ
“మూడు పాయలుగా చీలిన ఆ నీడ వైపు పదండి!!”
77:31 لَّا ظَلِيلٍ وَلَا يُغْنِي مِنَ اللَّهَبِ
నిజానికి అది మీకు నీడనూ ఇవ్వదు, అగ్ని జ్వాలల నుండి మీకు రక్షణనూ ఇవ్వదు.
77:32 إِنَّهَا تَرْمِي بِشَرَرٍ كَالْقَصْرِ
నిశ్చయంగా నరకం మేడలు, మిద్దెలంతటి నిప్పు రవ్వలను విసురుతుంది.
77:33 كَأَنَّهُ جِمَالَتٌ صُفْرٌ
అవి పసుపు పచ్చని ఒంటెల మాదిరిగా ఉంటాయి.
77:34 وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
ధిక్కార వైఖరిని అవలంబించే వారికి ఆ రోజు వినాశం ఖాయం.
77:35 هَٰذَا يَوْمُ لَا يَنطِقُونَ
ఆ రోజు వారు మాట్లాడనూ లేరు.
77:36 وَلَا يُؤْذَنُ لَهُمْ فَيَعْتَذِرُونَ
సంజాయిషీ ఇచ్చుకొనే అనుమతి కూడా వారికి ఇవ్వబడదు.
77:37 وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
ధిక్కార వైఖరిని అవలంబించే వారికి ఆ రోజు వినాశం ఖాయం.
77:38 هَٰذَا يَوْمُ الْفَصْلِ ۖ جَمَعْنَاكُمْ وَالْأَوَّلِينَ
ఇది నిర్ణయ దినం. (దీని కోసం) మేము మిమ్మల్నీ, మీ పూర్వీకులందరినీ సమీకరించాము.
77:39 فَإِن كَانَ لَكُمْ كَيْدٌ فَكِيدُونِ
మరి మీరు నా నుండి (తప్పించుకునే) ఎత్తుగడ ఏదైనా వేయదలిస్తే వేయండి.
77:40 وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
ధిక్కార వైఖరిని అవలంబించే వారికి ఆ రోజు వినాశం ఖాయం.
77:41 إِنَّ الْمُتَّقِينَ فِي ظِلَالٍ وَعُيُونٍ
నిశ్చయంగా దైవభీతిపరులు చల్లని నీడలలో, (సల్లగసాగే) సెలయేరుల మధ్య ఉంటారు.
77:42 وَفَوَاكِهَ مِمَّا يَشْتَهُونَ
ఇంకా, తాము మెచ్చిన పండ్లు, ఫలాల మధ్య (హాయిగా) ఉంటారు.
77:43 كُلُوا وَاشْرَبُوا هَنِيئًا بِمَا كُنتُمْ تَعْمَلُونَ
“మీరు చేసుకున్న కర్మలకు ప్రతిఫలంగా హాయిగా తినండి, త్రాగండి” (అని వారితో అనబడుతుంది).
77:44 إِنَّا كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ
నిశ్చయంగా మేము సదాచార సంపన్నులకు ఇటువంటి ప్రతిఫలాన్నే ఇస్తాము.
77:45 وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
ధిక్కార వైఖరిని అవలంబించే వారికి ఆ రోజు వినాశం ఖాయం.
77:46 كُلُوا وَتَمَتَّعُوا قَلِيلًا إِنَّكُم مُّجْرِمُونَ
(ఓ ధిక్కార జనులారా! మీరు ప్రాపంచిక జీవితంలో) అంతో ఇంతో తినండి, లబ్దిని పొందండి. మీరెలాగూ నేరస్థులే.
77:47 وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
ధిక్కార వైఖరిని అవలంబించే వారికి ఆ రోజు వినాశం ఖాయం.
77:48 وَإِذَا قِيلَ لَهُمُ ارْكَعُوا لَا يَرْكَعُونَ
(దైవ సన్నిధిలో) “వినయపూర్వకంగా తలవంచండి” అని వారితో అన్నప్పుడు వారు తలవంచరు.
77:49 وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
ధిక్కార వైఖరిని అవలంబించే వారికి ఆ రోజు వినాశం ఖాయం.
77:50 فَبِأَيِّ حَدِيثٍ بَعْدَهُ يُؤْمِنُونَ
ఇక ఈ (ఖుర్ఆన్) విషయం తరువాత వారు విశ్వసించటానికి ఏం ఉంది(ట)? - సూరా అన్ నబా
78:1 عَمَّ يَتَسَاءَلُونَ
వీళ్ళు దేన్ని గురించి అడుగుతున్నారు?
78:2 عَنِ النَّبَإِ الْعَظِيمِ
గొప్ప సమాచారాన్ని గురించేనా?
78:3 الَّذِي هُمْ فِيهِ مُخْتَلِفُونَ
దాని గురించి వారందరూ విభేదించుకుంటున్నారు.
78:4 كَلَّا سَيَعْلَمُونَ
కాదు, త్వరలోనే వారు తెలుసుకుంటారు.
78:5 ثُمَّ كَلَّا سَيَعْلَمُونَ
మరెన్నటికీ కాదు. అతి త్వరలోనే వారికి (వాస్తవం) తెలిసిపోతుంది.
78:6 أَلَمْ نَجْعَلِ الْأَرْضَ مِهَادًا
ఏమిటి, మేము భూమిని పాన్పుగా చేయలేదా?
78:7 وَالْجِبَالَ أَوْتَادًا
పర్వతాలను మేకులుగా (పాతిపెట్టలేదా?)
78:8 وَخَلَقْنَاكُمْ أَزْوَاجًا
ఇంకా, మేము మిమ్మల్ని జంటలుగా సృష్టించాము.
78:9 وَجَعَلْنَا نَوْمَكُمْ سُبَاتًا
ఇంకా, మేము మీ నిద్రను హాయినిచ్చేదిగా చేశాము.
78:10 وَجَعَلْنَا اللَّيْلَ لِبَاسًا
ఇంకా, మేము రాత్రిని మీ కొరకు ఆచ్చాదనగా చేశాము.
78:11 وَجَعَلْنَا النَّهَارَ مَعَاشًا
ఇంకా, పగటిని జీవనోపాధి సమయంగా చేశాము.
78:12 وَبَنَيْنَا فَوْقَكُمْ سَبْعًا شِدَادًا
ఇంకా, మీపైన మేము పటిష్టమైన ఏడు ఆకాశాలను నిర్మించాము.
78:13 وَجَعَلْنَا سِرَاجًا وَهَّاجًا
ఇంకా, ఉజ్వలమైన ఒక దీపాన్ని సృజించాము.
78:14 وَأَنزَلْنَا مِنَ الْمُعْصِرَاتِ مَاءً ثَجَّاجًا
ఇంకా, మేము నీళ్ళతో నిండిన మేఘాల ద్వారా పుష్కలంగా వర్షాన్ని కురిపించాము.
78:15 لِّنُخْرِجَ بِهِ حَبًّا وَنَبَاتًا
తద్వారా ఆహార ధాన్యాలు, పచ్చిక బయళ్ళు వెలికితీయటానికి.
78:16 وَجَنَّاتٍ أَلْفَافًا
దట్టమైన తోటలు (ఉత్పన్నం చేయటానికి!)
78:17 إِنَّ يَوْمَ الْفَصْلِ كَانَ مِيقَاتًا
నిశ్చయంగా తీర్పుదిన సమయం నిర్ధారితమై ఉంది.
78:18 يَوْمَ يُنفَخُ فِي الصُّورِ فَتَأْتُونَ أَفْوَاجًا
శంఖం పూరించబడిననాడు, మీరు తండోపతండాలుగా తరలి వస్తారు.
78:19 وَفُتِحَتِ السَّمَاءُ فَكَانَتْ أَبْوَابًا
మరి ఆకాశం తెరువబడుతుంది. అందులో ఎన్నెన్నో ద్వారాలు ఏర్పడతాయి.
78:20 وَسُيِّرَتِ الْجِبَالُ فَكَانَتْ سَرَابًا
పర్వతాలు నడిపింపబడి, ఎండమావుల్లా మారిపోతాయి.
78:21 إِنَّ جَهَنَّمَ كَانَتْ مِرْصَادًا
నిశ్చయంగా నరకం మాటేసి ఉన్నది.
78:22 لِّلطَّاغِينَ مَآبًا
తలబిరుసుల నివాస స్థలమదే.
78:23 لَّابِثِينَ فِيهَا أَحْقَابًا
వారందులో యుగాల తరబడి (మ్రగ్గుతూ) ఉంటారు.
78:24 لَّا يَذُوقُونَ فِيهَا بَرْدًا وَلَا شَرَابًا
వారందులో ఎలాంటి చల్లదనాన్నిగానీ, త్రాగటానికి ఏ పానీయాన్నిగానీ, రుచిచూడరు –
78:25 إِلَّا حَمِيمًا وَغَسَّاقًا
మరిగే నీరు, (కారే) చీము తప్ప.
78:26 جَزَاءً وِفَاقًا
మొత్తానికి వారికి పూర్తి ప్రతిఫలం లభిస్తుంది.
78:27 إِنَّهُمْ كَانُوا لَا يَرْجُونَ حِسَابًا
నిశ్చయంగా వారికి లెక్క గురించిన ధ్యాసే ఉండేది కాదు.
78:28 وَكَذَّبُوا بِآيَاتِنَا كِذَّابًا
మా వాక్యాలను వారు యదేచ్ఛగా ధిక్కరించేవారు.
78:29 وَكُلَّ شَيْءٍ أَحْصَيْنَاهُ كِتَابًا
మేము ప్రతి విషయాన్ని లిఖించి, లెక్కించి ఉంచాము.
78:30 فَذُوقُوا فَلَن نَّزِيدَكُمْ إِلَّا عَذَابًا
ఇక మీరు (మీ స్వయంకృతాల) రుచి చూడండి. మేము మీకు (నరక) శిక్ష తప్ప మరే విషయాన్నీ పెంచము.
78:31 إِنَّ لِلْمُتَّقِينَ مَفَازًا
నిశ్చయంగా దైవభీతి పరులు సాఫల్య భాగ్యం పొందుతారు.
78:32 حَدَائِقَ وَأَعْنَابًا
వారి కొరకు స్వర్గ వనాలు, ద్రాక్ష ఫలాలున్నాయి.
78:33 وَكَوَاعِبَ أَتْرَابًا
నవనవలాడే సమ వయస్కులైన కన్యలున్నారు.
78:34 وَكَأْسًا دِهَاقًا
మద్యంతో నిండిన మధుపాత్రలున్నాయి.
78:35 لَّا يَسْمَعُونَ فِيهَا لَغْوًا وَلَا كِذَّابًا
అక్కడ వారు ఏ విధమైన వ్యర్థ ప్రలాపనలుగానీ, అసత్యాలనుగానీ వినరు.
78:36 جَزَاءً مِّن رَّبِّكَ عَطَاءً حِسَابًا
నీ ప్రభువు తరఫు నుండి వారికి (వారి కర్మలకు ప్రతిఫలంగా) తగినంతగా లభించే బహుమానం ఇది.
78:37 رَّبِّ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا الرَّحْمَٰنِ ۖ لَا يَمْلِكُونَ مِنْهُ خِطَابًا
ఆయన భూమ్యాకాశాలకు, వాటి మధ్యనున్న సమస్త వస్తువులకు ప్రభువు, మిక్కిలి కరుణామయుడు. ఆయనతో సంభాషించడానికి ఎవరూ సాహసించరు.
78:38 يَوْمَ يَقُومُ الرُّوحُ وَالْمَلَائِكَةُ صَفًّا ۖ لَّا يَتَكَلَّمُونَ إِلَّا مَنْ أَذِنَ لَهُ الرَّحْمَٰنُ وَقَالَ صَوَابًا
ఏ రోజున ఆత్మ మరియు దైవదూతలు వరుసలు తీరి నిలబడతారో (ఆ రోజు), కరుణామయుని అనుమతి పొందిన వాడు తప్ప మరెవడూ మాట్లాడలేడు. మరి అతనైనా సరైన మాటను మాత్రమే పలుకుతాడు.
78:39 ذَٰلِكَ الْيَوْمُ الْحَقُّ ۖ فَمَن شَاءَ اتَّخَذَ إِلَىٰ رَبِّهِ مَآبًا
ఆ రోజు (సంభవించటం అనేది) సత్యం. ఇక కోరినవారు (మంచి పనులు చేసి) తమ ప్రభువు దగ్గర స్థానం ఏర్పరచుకోవచ్చు.
78:40 إِنَّا أَنذَرْنَاكُمْ عَذَابًا قَرِيبًا يَوْمَ يَنظُرُ الْمَرْءُ مَا قَدَّمَتْ يَدَاهُ وَيَقُولُ الْكَافِرُ يَا لَيْتَنِي كُنتُ تُرَابًا
దగ్గరలోనే ఉన్న శిక్షను గురించి మేము నీకు హెచ్చరించాము. ఆ రోజు మానవుడు తన చేతులతో ఆర్జించి – ముందుగా పంపుకున్న – దానిని చూసుకుంటాడు. అప్పుడు అవిశ్వాసి, “అయ్యో! నేను మట్టినైపోయినా బావుండేదే!” అనంటాడు.
- సూరా అన్ నాజి ఆత్
79:1 وَالنَّازِعَاتِ غَرْقًا
మునిగి నిర్దాక్షిణ్యంగా (ప్రాణాలు) లాక్కుపోయేవారి సాక్షిగా!
79:2 وَالنَّاشِطَاتِ نَشْطًا
ముడిని విప్పి విడిపించేవారి సాక్షిగా!
79:3 وَالسَّابِحَاتِ سَبْحًا
తేలియాడుతూపోయే వారి సాక్షిగా!
79:4 فَالسَّابِقَاتِ سَبْقًا
వేగంగా దూసుకుపోతూ, ఒండొకరిని మించిపోయేవారి సాక్షిగా!
79:5 فَالْمُدَبِّرَاتِ أَمْرًا
(తమ ప్రభువు అప్పగించిన) పనులను పకడ్బందీగా అమలుపరిచే వారి సాక్షిగా!
79:6 يَوْمَ تَرْجُفُ الرَّاجِفَةُ
ఆ రోజు దద్దరిల్లేది దద్దరిల్లుతుంది.
79:7 تَتْبَعُهَا الرَّادِفَةُ
మరి దాని వెనుక వచ్చేది (వెంబడిస్తూనే) వస్తుంది.
79:8 قُلُوبٌ يَوْمَئِذٍ وَاجِفَةٌ
(ఎన్నో) గుండెలు ఆ రోజు భయంతో దడదడలాడుతాయి.
79:9 أَبْصَارُهَا خَاشِعَةٌ
వారి చూపులు క్రిందికి వంగి ఉంటాయి.
79:10 يَقُولُونَ أَإِنَّا لَمَرْدُودُونَ فِي الْحَافِرَةِ
“ఏమిటి, మేము మొదటి అవస్థలోనికే మళ్ళించబడతామా?” (అని వారు అడుగుతున్నారు.)
79:11 أَإِذَا كُنَّا عِظَامًا نَّخِرَةً
“మేము కృశించిన ఎముకలుగా మారిన తరువాత కూడానా?!” (అని వారు అంటున్నారు కదూ!)
79:12 قَالُوا تِلْكَ إِذًا كَرَّةٌ خَاسِرَةٌ
“మరైతే ఈ మళ్లింపు (మా పాలిట) నష్టకరమే” అని కూడా వారంటున్నారు.
79:13 فَإِنَّمَا هِيَ زَجْرَةٌ وَاحِدَةٌ
అదొక (భయంకరమైన) గద్దింపు (అని మరువకండి).
79:14 فَإِذَا هُم بِالسَّاهِرَةِ
(అది సంభవించగానే) వారంతా ఒక్కసారిగా మైదానంలో సమీకరించబడతారు.
79:15 هَلْ أَتَاكَ حَدِيثُ مُوسَىٰ
(ఓ ప్రవక్తా!) మూసా సంగతిగాని నీ వరకు చేరిందా?
79:16 إِذْ نَادَاهُ رَبُّهُ بِالْوَادِ الْمُقَدَّسِ طُوًى
అప్పుడు అతని ప్రభువు అతణ్ణి ‘తువా’ అనే పవిత్ర లోయలోకి పిలిచాడు.
79:17 اذْهَبْ إِلَىٰ فِرْعَوْنَ إِنَّهُ طَغَىٰ
“నువ్వు ఫిరౌను వద్దకు వెళ్ళు. వాడు మరీ చెలరేగిపోయాడు.”
79:18 فَقُلْ هَل لَّكَ إِلَىٰ أَن تَزَكَّىٰ
“నీ స్వీయ సంస్కరణకు నువ్వు సిద్ధంగా ఉన్నావా?” అని వాణ్ణి అడుగు.
79:19 وَأَهْدِيَكَ إِلَىٰ رَبِّكَ فَتَخْشَىٰ
“నువ్వు భయభక్తులతో మసలుకునేందుకుగాను, నేను నీకు నీ ప్రభువు మార్గం చూపించనా!?” (అని చెప్పమని అల్లాహ్ మూసాకు ఉపదేశించాడు).
79:20 فَأَرَاهُ الْآيَةَ الْكُبْرَىٰ
మరి (మూసా) అతనికి గొప్ప సూచన (మహిమ)ను చూపాడు.
79:21 فَكَذَّبَ وَعَصَىٰ
కాని వాడు మాత్రం ధిక్కరించాడు, అవిధేయతకు పాల్పడ్డాడు.
79:22 ثُمَّ أَدْبَرَ يَسْعَىٰ
ఆ తర్వాత తిరిగి వెళ్లి, తన సన్నాహాలు మొదలెట్టాడు.
79:23 فَحَشَرَ فَنَادَىٰ
మరి అందరినీ సమావేశపరచి, ప్రకటించాడు.
79:24 فَقَالَ أَنَا رَبُّكُمُ الْأَعْلَىٰ
“నేనే మీ సర్వోన్నత ప్రభువును” అన్నాడు.
79:25 فَأَخَذَهُ اللَّهُ نَكَالَ الْآخِرَةِ وَالْأُولَىٰ
అందువల్ల అల్లాహ్ అతన్ని ఇహపర లోకాల శిక్షగా పట్టుకున్నాడు.
79:26 إِنَّ فِي ذَٰلِكَ لَعِبْرَةً لِّمَن يَخْشَىٰ
నిశ్చయంగా ఇందులో దైవభీతిగల ప్రతి ఒక్కరికీ గొప్ప గుణపాఠం ఉంది.
79:27 أَأَنتُمْ أَشَدُّ خَلْقًا أَمِ السَّمَاءُ ۚ بَنَاهَا
ఏమిటి, మిమ్మల్ని సృష్టించటం కష్టంతో కూడుకున్న పనా? లేక ఆకాశాన్నా? ఆయనే (అల్లాహ్ యే) దానిని నిర్మించాడు.
79:28 رَفَعَ سَمْكَهَا فَسَوَّاهَا
ఆయనే దాని కప్పును బాగా ఎత్తుగా చేశాడు. మరి దానిని తీర్చిదిద్దాడు.
79:29 وَأَغْطَشَ لَيْلَهَا وَأَخْرَجَ ضُحَاهَا
దాని రాత్రిని చీకటిమయంగా చేశాడు, దాని పగటిని (వెలుతురుగా) బయల్పరిచాడు.
79:30 وَالْأَرْضَ بَعْدَ ذَٰلِكَ دَحَاهَا
తరువాత భూమిని సుగమం చేశాడు.
79:31 أَخْرَجَ مِنْهَا مَاءَهَا وَمَرْعَاهَا
అందులో నుంచి దాని నీళ్ళను, దాని పచ్చికను వెలికి తీశాడు.
79:32 وَالْجِبَالَ أَرْسَاهَا
ఇంకా, పర్వతాలను (స్థిరంగా) పాతి పెట్టాడు.
79:33 مَتَاعًا لَّكُمْ وَلِأَنْعَامِكُمْ
ఇదంతా మీ కోసమూను, మీ పశువుల ప్రయోజనం కోసమే.
79:34 فَإِذَا جَاءَتِ الطَّامَّةُ الْكُبْرَىٰ
మరెప్పుడైతే ఆ మహా విపత్తు (ప్రళయం) వచ్చిపడుతుందో…
79:35 يَوْمَ يَتَذَكَّرُ الْإِنسَانُ مَا سَعَىٰ
ఆ రోజు మనిషి తాను చేసిన దాన్ని నెమరు వేసుకుంటాడు.
79:36 وَبُرِّزَتِ الْجَحِيمُ لِمَن يَرَىٰ
ప్రతి చూపరి ముందూ నరకం బహిర్గతం చేయబడుతుంది.
79:37 فَأَمَّا مَن طَغَىٰ
కాబట్టి ఎవడు తలబిరుసుగా వ్యవహరించాడో,
79:38 وَآثَرَ الْحَيَاةَ الدُّنْيَا
మరి ప్రాపంచిక జీవితానికే ప్రాధాన్యం ఇచ్చాడో,
79:39 فَإِنَّ الْجَحِيمَ هِيَ الْمَأْوَىٰ
అతని నివాసం నరకమే అవుతుంది.
79:40 وَأَمَّا مَنْ خَافَ مَقَامَ رَبِّهِ وَنَهَى النَّفْسَ عَنِ الْهَوَىٰ
మరెవడు తన ప్రభువు ఎదుట నిలబడే విషయమై భయపడ్డాడో, ఇంకా తన మనసును చెడు వాంఛల నుండి ఆపుకున్నాడో,
79:41 فَإِنَّ الْجَنَّةَ هِيَ الْمَأْوَىٰ
అతని నివాసం స్వర్గమవుతుంది.
79:42 يَسْأَلُونَكَ عَنِ السَّاعَةِ أَيَّانَ مُرْسَاهَا
వారు ప్రళయం గురించి, ‘ఇంతకీ అదెప్పుడు సంభవిస్తుంది?’ అని నిన్ను అడుగుతున్నారు కదూ!
79:43 فِيمَ أَنتَ مِن ذِكْرَاهَا
ఆ వివరణతో అసలు నీకేం సంబంధం (ఉందనీ?)
79:44 إِلَىٰ رَبِّكَ مُنتَهَاهَا
ఆ సంగతి (దాని పరిజ్ఞానం) పూర్తిగా నీ ప్రభువు వైపే మరలుతుంది (కదా!)
79:45 إِنَّمَا أَنتَ مُنذِرُ مَن يَخْشَاهَا
నువ్వు మాత్రం దానికి భయపడేవారిని హెచ్చరించే వాడివి మాత్రమే.
79:46 كَأَنَّهُمْ يَوْمَ يَرَوْنَهَا لَمْ يَلْبَثُوا إِلَّا عَشِيَّةً أَوْ ضُحَاهَا
వారు దానిని ప్రత్యక్షంగా చూసిన నాడు, తాము (ప్రపంచంలో) కేవలం ఒక దినములో అంత్య భాగమో లేక దాని ఆరంభ భాగమో ఉండి ఉంటామని వారికి అనిపిస్తుంది. - సూరా అబస
80:1 عَبَسَ وَتَوَلَّىٰ
(ప్రవక్త!) నుదురు చిట్లించాడు, ముఖం త్రిప్పుకున్నాడు –
80:2 أَن جَاءَهُ الْأَعْمَىٰ
తన వద్దకు ఒక అంధుడు వచ్చినంత మాత్రానికే.
80:3 وَمَا يُدْرِيكَ لَعَلَّهُ يَزَّكَّىٰ
(ఓ ప్రవక్తా!) నీకేం తెలుసు, బహుశా అతను తనను సంస్కరించుకుంటాడేమో!!
80:4 أَوْ يَذَّكَّرُ فَتَنفَعَهُ الذِّكْرَىٰ
లేదా ఉపదేశం వింటాడేమో! ఉపదేశం అతనికి ప్రయోజనకరం అవుతుందేమో!!
80:5 أَمَّا مَنِ اسْتَغْنَىٰ
ఎవడైతే నిర్లక్ష్యం చేస్తున్నాడో,
80:6 فَأَنتَ لَهُ تَصَدَّىٰ
అతనిపై నువ్వు ఎంతో శ్రద్ధ చూపుతున్నావు.
80:7 وَمَا عَلَيْكَ أَلَّا يَزَّكَّىٰ
వాడు గనక దిద్దుబాటు చేసుకోకపోతే, ఆ నింద నీపై లేదు కదా!
80:8 وَأَمَّا مَن جَاءَكَ يَسْعَىٰ
మరెవరైతే నీ దగ్గరకు (శ్రద్ధగా) పరుగెత్తుకుంటూ వస్తున్నాడో,
80:9 وَهُوَ يَخْشَىٰ
దైవభీతి (కూడా) కలిగి ఉన్నాడో,
80:10 فَأَنتَ عَنْهُ تَلَهَّىٰ
అతని పట్లేమో నువ్వు అశ్రద్ధ వహిస్తున్నావు.
80:11 كَلَّا إِنَّهَا تَذْكِرَةٌ
ఇది సరైనది కాదు. ఈ ఖుర్ఆను మాత్రం హితబోధ నిమిత్తమే ఉన్నది.
80:12 فَمَن شَاءَ ذَكَرَهُ
కాబట్టి, కోరినవారు దీని ద్వారా హితబోధను గ్రహించవచ్చు.
80:13 فِي صُحُفٍ مُّكَرَّمَةٍ
అది గౌరవప్రదమైన సహీఫాల్లో (లిఖితమై) ఉన్నది.
80:14 مَّرْفُوعَةٍ مُّطَهَّرَةٍ
అవి మహోన్నతమైనవి, పవిత్రమైనవీను.
80:15 بِأَيْدِي سَفَرَةٍ
అది లేఖకుల (దైవదూతల ) చేతుల్లో ఉంది.
80:16 كِرَامٍ بَرَرَةٍ
(వారు) మహిమాన్వితులు, మంచి వారు కూడాను.
80:17 قُتِلَ الْإِنسَانُ مَا أَكْفَرَهُ
మనిషి నాశనం గాను! ఎటువంటి కృతఘ్నుడు వాడు?!
80:18 مِنْ أَيِّ شَيْءٍ خَلَقَهُ
(అల్లాహ్) వాణ్ణి దేంతో పుట్టించాడు?
80:19 مِن نُّطْفَةٍ خَلَقَهُ فَقَدَّرَهُ
ఒక్క వీర్య బిందువుతో (నే కదా!) పుట్టించాడు. మరి అతనికి (కావలసినవి) తగు రీతిలో ఉండేలా నిర్ధారించాడు.
80:20 ثُمَّ السَّبِيلَ يَسَّرَهُ
ఆపైన అతని కొరకు మార్గాన్ని సులభతరం చేశాడు.
80:21 ثُمَّ أَمَاتَهُ فَأَقْبَرَهُ
అటుపిమ్మట అతనికి చావునిచ్చాడు. ఆ తరువాత అతణ్ణి సమాధిలోనికి చేర్చాడు.
80:22 ثُمَّ إِذَا شَاءَ أَنشَرَهُ
మరి తాను కోరినప్పుడు అతణ్ణి బ్రతికించి లేపుతాడు.
80:23 كَلَّا لَمَّا يَقْضِ مَا أَمَرَهُ
ఎంతమాత్రం కాదు. అసలతను ఇంతవరకూ దైవాజ్ఞలను నెరవేర్చనే లేదు.
80:24 فَلْيَنظُرِ الْإِنسَانُ إِلَىٰ طَعَامِهِ
అయితే ఈ మనిషి తాను తినే ఆహారాన్ని కూడా కాస్త చూడాలి.
80:25 أَنَّا صَبَبْنَا الْمَاءَ صَبًّا
మేము పుష్కలంగా నీటిని కురిపించాము.
80:26 ثُمَّ شَقَقْنَا الْأَرْضَ شَقًّا
మరి నేలను అద్భుతమైన రీతిలో చీల్చాము.
80:27 فَأَنبَتْنَا فِيهَا حَبًّا
మరి అందులో ఆహార ధాన్యాన్ని ఉత్పన్నం చేశాము.
80:28 وَعِنَبًا وَقَضْبًا
ద్రాక్షపండ్లను, కూరగాయలను,
80:29 وَزَيْتُونًا وَنَخْلًا
జైతూను (ఆలివ్), ఖర్జూర పండ్లను (పండించాము).
80:30 وَحَدَائِقَ غُلْبًا
దట్టమైన తోటలను,
80:31 وَفَاكِهَةً وَأَبًّا
పండ్లు ఫలాలను, పచ్చిక బయళ్ళను (కూడా పండించాము).
80:32 مَّتَاعًا لَّكُمْ وَلِأَنْعَامِكُمْ
ఇదంతా మీ కోసం, మీ పశువుల ప్రయోజనార్ధం (చేశాము).
80:33 فَإِذَا جَاءَتِ الصَّاخَّةُ
(గూబ గుయ్యిమనిపించే) గావుకేక (అంటే ప్రళయం) వచ్చినప్పుడు….
80:34 يَوْمَ يَفِرُّ الْمَرْءُ مِنْ أَخِيهِ
ఆ రోజు మనిషి తన (స్వంత) సోదరుని నుండి పారిపోతాడు.
80:35 وَأُمِّهِ وَأَبِيهِ
తన తల్లి నుండి, తండ్రి నుండి,
80:36 وَصَاحِبَتِهِ وَبَنِيهِ
తన భార్య నుండి, తన పిల్లల నుండి (పారిపోతాడు).
80:37 لِكُلِّ امْرِئٍ مِّنْهُمْ يَوْمَئِذٍ شَأْنٌ يُغْنِيهِ
ఆ రోజు ప్రతి ఒక్కరికీ తన సంగతి చూసుకోవటంతోనే సరిపోతుంది.
80:38 وُجُوهٌ يَوْمَئِذٍ مُّسْفِرَةٌ
ఆ రోజు ఎన్నో ముఖాలు వెలిగిపోతుంటాయి.
80:39 ضَاحِكَةٌ مُّسْتَبْشِرَةٌ
(తమకు వినిపించబడిన శుభవార్తపై) నవ్వులు చిందిస్తూ, ఆనందంలో తేలియాడుతూ ఉంటాయి.
80:40 وَوُجُوهٌ يَوْمَئِذٍ عَلَيْهَا غَبَرَةٌ
మరెన్నో ముఖాలు ఆనాడు దుమ్ము కొట్టుకుని ఉంటాయి.
80:41 تَرْهَقُهَا قَتَرَةٌ
వాటిపై నలుపు ఆవరించి ఉంటుంది.
80:42 أُولَٰئِكَ هُمُ الْكَفَرَةُ الْفَجَرَةُ
వారే అవిశ్వాసులు, దుర్జనులు.
- సూరా అత్ తక్వీర్
81:1 إِذَا الشَّمْسُ كُوِّرَتْ
సూర్యుడు చుట్టివేయబడినప్పుడు,
81:2 وَإِذَا النُّجُومُ انكَدَرَتْ
నక్షత్రాలు కాంతిహీనం అయిపోయినప్పుడు,
81:3 وَإِذَا الْجِبَالُ سُيِّرَتْ
పర్వతాలు నడిపింపబడినప్పుడు,
81:4 وَإِذَا الْعِشَارُ عُطِّلَتْ
పదిమాసాల సూడి ఒంటెలు (వాటి మానాన) వదలివేయబడినప్పుడు,
81:5 وَإِذَا الْوُحُوشُ حُشِرَتْ
అడవి జంతువులన్నీ ఒకచోట సమీకరించబడినప్పుడు,
81:6 وَإِذَا الْبِحَارُ سُجِّرَتْ
సముద్రాలు రాజేయబడినప్పుడు,
81:7 وَإِذَا النُّفُوسُ زُوِّجَتْ
ఆత్మలు (వాటి తనువులతో) అనుసంధానం చేయబడినప్పుడు,
81:8 وَإِذَا الْمَوْءُودَةُ سُئِلَتْ
సజీవంగా పాతిపెట్టబడిన బాలిక ప్రశ్నించబడినప్పుడు,
81:9 بِأَيِّ ذَنبٍ قُتِلَتْ
‘తను ఏ పాపం చేసిందని హతమార్చబడింది?’ అని.
81:10 وَإِذَا الصُّحُفُ نُشِرَتْ
కర్మల చిట్టాలు తెరువబడినప్పుడు,
81:11 وَإِذَا السَّمَاءُ كُشِطَتْ
ఆకాశం తోలు ఒలచివేయబడినప్పుడు,
81:12 وَإِذَا الْجَحِيمُ سُعِّرَتْ
నరకం మండించబడినప్పుడు,
81:13 وَإِذَا الْجَنَّةُ أُزْلِفَتْ
స్వర్గం చాలా దగ్గరగా తేబడినప్పుడు,
81:14 عَلِمَتْ نَفْسٌ مَّا أَحْضَرَتْ
అప్పుడు (ఆ రోజు) ప్రతి ప్రాణి తాను తన వెంట తెచ్చుకున్నదేమిటో తెలుసుకుంటుంది.
81:15 فَلَا أُقْسِمُ بِالْخُنَّسِ
కనుక అది కాదు. వెనక్కి జరిగే నక్షత్రాలపై నేను ప్రమాణం చేస్తున్నాను.
81:16 الْجَوَارِ الْكُنَّسِ
అవి సంచరించేవి, కనుమరుగైపోయేవి.
81:17 وَاللَّيْلِ إِذَا عَسْعَسَ
గడచిపోయేటప్పటి రాత్రి సాక్షిగా!
81:18 وَالصُّبْحِ إِذَا تَنَفَّسَ
ప్రకాశిస్తున్నప్పటి ఉదయం సాక్షిగా (చెబుతున్నాను)!
81:19 إِنَّهُ لَقَوْلُ رَسُولٍ كَرِيمٍ
నిశ్చయంగా ఇది గౌరవనీయుడైన సందేశవాహకుడు (జిబ్రయీల్) తెచ్చిన (దైవ) వాక్కు.
81:20 ذِي قُوَّةٍ عِندَ ذِي الْعَرْشِ مَكِينٍ
అతడు శక్తిశాలి. అతడు సింహాసనాధిపతి (అయిన అల్లాహ్) దగ్గర ఉన్నత స్థానం కలవాడు.
81:21 مُّطَاعٍ ثَمَّ أَمِينٍ
(ఊర్థ్వ లోకాలలో) అతని మాట అనుసరనీయం. అతను ఎంతో నిజాయితీపరుడు.
81:22 وَمَا صَاحِبُكُم بِمَجْنُونٍ
(ఓ ప్రజలారా!) మీ ఈ సహచరుడు పిచ్చివాడు కాడు.
81:23 وَلَقَدْ رَآهُ بِالْأُفُقِ الْمُبِينِ
అతనా సందేశహరుణ్ణి స్పష్టమైన గగనతలంపై చూసి ఉన్నాడు.
81:24 وَمَا هُوَ عَلَى الْغَيْبِ بِضَنِينٍ
ఇంకా అతను అగోచర విషయాలను తెలియపరచడంలో పిసినారి కూడా కాడు.
81:25 وَمَا هُوَ بِقَوْلِ شَيْطَانٍ رَّجِيمٍ
ఇది (ఈ ఖుర్ఆన్) శాపగ్రస్తుడైన షైతాన్ వాక్కు కూడా కాదు.
81:26 فَأَيْنَ تَذْهَبُونَ
మరి మీరు ఎటుపోతున్నారు?
81:27 إِنْ هُوَ إِلَّا ذِكْرٌ لِّلْعَالَمِينَ
ఇది సమస్త లోకవాసుల కొరకు హితోపదేశం.
81:28 لِمَن شَاءَ مِنكُمْ أَن يَسْتَقِيمَ
(ముఖ్యంగా) మీలో రుజుమార్గాన నడవదలచిన వారి కోసం.
81:29 وَمَا تَشَاءُونَ إِلَّا أَن يَشَاءَ اللَّهُ رَبُّ الْعَالَمِينَ
సర్వలోక ప్రభువు అయిన అల్లాహ్ కోరనంతవరకు మీరేదీ కోరలేరు. - సూరా అల్ ఇన్ ఫితార్
82:1 إِذَا السَّمَاءُ انفَطَرَتْ
ఆకాశం చీలిపోయినప్పుడు,
82:2 وَإِذَا الْكَوَاكِبُ انتَثَرَتْ
నక్షత్రాలు రాలి (పడి) పోయినప్పుడు,
82:3 وَإِذَا الْبِحَارُ فُجِّرَتْ
సముద్రాలు ఉప్పొంగినప్పుడు,
82:4 وَإِذَا الْقُبُورُ بُعْثِرَتْ
సమాధులు పెళ్ళగించబడినప్పుడు,
82:5 عَلِمَتْ نَفْسٌ مَّا قَدَّمَتْ وَأَخَّرَتْ
(అప్పుడు) ప్రతి ఒక్కనికీ తాను ముందుకు పంపుకున్నదీ, వెనుక వదలి పెట్టినదీ (అంతా) తెలిసివస్తుంది.
82:6 يَا أَيُّهَا الْإِنسَانُ مَا غَرَّكَ بِرَبِّكَ الْكَرِيمِ
ఓ మానవుడా! ఉదాత్తుడైన నీ ప్రభువు పట్ల ఏ విషయం నిన్ను మోసంలో పడవేసింది?
82:7 الَّذِي خَلَقَكَ فَسَوَّاكَ فَعَدَلَكَ
(యదార్థానికి) ఆయనే నిన్ను పుట్టించాడు, నిన్ను చక్కగా తీర్చిదిద్దాడు, ఆపైన నిన్ను తగు రీతిలో పొందికగా మలిచాడు.
82:8 فِي أَيِّ صُورَةٍ مَّا شَاءَ رَكَّبَكَ
తాను కోరిన ఆకారంలో నిన్ను కూర్చాడు.
82:9 كَلَّا بَلْ تُكَذِّبُونَ بِالدِّينِ
ఎన్నటికీ కాదు, మీరైతే శిక్షా బహుమానాల దినాన్ని ధిక్కరిస్తున్నారు.
82:10 وَإِنَّ عَلَيْكُمْ لَحَافِظِينَ
నిశ్చయంగా మీ పైన పర్యవేక్షకులు నియమితులై ఉన్నారు.
82:11 كِرَامًا كَاتِبِينَ
(వారు మీ కర్మలను నమోదు చేసే) గౌరవనీయులైన లేఖకులు.
82:12 يَعْلَمُونَ مَا تَفْعَلُونَ
మీరు చేసేదంతా వారికి తెలుసు సుమా!
82:13 إِنَّ الْأَبْرَارَ لَفِي نَعِيمٍ
నిశ్చయంగా పుణ్యాత్ములు (స్వర్గ) సుఖాలలో ఉంటారు.
82:14 وَإِنَّ الْفُجَّارَ لَفِي جَحِيمٍ
మరి నిశ్చయంగా పాపాత్ములు నరకాగ్నిలో ఉంటారు.
82:15 يَصْلَوْنَهَا يَوْمَ الدِّينِ
ప్రతిఫల దినాన వారు అందులోకి ప్రవేశిస్తారు.
82:16 وَمَا هُمْ عَنْهَا بِغَائِبِينَ
వారు దాన్నుండి ఎన్నటికీ అదృశ్యం కాలేరు.
82:17 وَمَا أَدْرَاكَ مَا يَوْمُ الدِّينِ
ఆ ప్రతిఫల దినం ఎటువంటిదో నీకేం తెలుసు?
82:18 ثُمَّ مَا أَدْرَاكَ مَا يَوْمُ الدِّينِ
మరి ఆ ప్రతిఫల దినం ఎటువంటిదో (దాని గురించి)నీకేం తెలుసు?
82:19 يَوْمَ لَا تَمْلِكُ نَفْسٌ لِّنَفْسٍ شَيْئًا ۖ وَالْأَمْرُ يَوْمَئِذٍ لِّلَّهِ
ఆ రోజు ఏ జీవీ మరో జీవి కోసం ఏమీ చెయ్యజాలదు. ఆ రోజు సమస్త వ్యవహారాలు (అధికారాలన్నీ) అల్లాహ్ వద్దనే ఉంటాయి.
- సూరాఅల్ ముతఫ్ఫిఫీన్
83:1 وَيْلٌ لِّلْمُطَفِّفِينَ
(కొలతలు, తూనికల్లో ) తగ్గించి ఇచ్చే వారు నాశనమవుదురుగాక!
83:2 الَّذِينَ إِذَا اكْتَالُوا عَلَى النَّاسِ يَسْتَوْفُونَ
వారు ప్రజల నుండి కొలిచి తీసుకునేటప్పుడు మాత్రం పూర్తిగా – ఖచ్చితంగా – తీసుకుంటారు.
83:3 وَإِذَا كَالُوهُمْ أَو وَّزَنُوهُمْ يُخْسِرُونَ
కాని వారికి కొలచిగానీ, తూకం వేసిగానీ ఇచ్చేటప్పుడు మాత్రం తగ్గించి ఇస్తారు.
83:4 أَلَا يَظُنُّ أُولَٰئِكَ أَنَّهُم مَّبْعُوثُونَ
ఏమిటి, తాము (మరణానంతరం) తిరిగి లేపబడతామన్న ఆలోచన వారికి బొత్తిగా లేదా?
83:5 لِيَوْمٍ عَظِيمٍ
ఒక మహాదినాన…
83:6 يَوْمَ يَقُومُ النَّاسُ لِرَبِّ الْعَالَمِينَ
ఆ రోజు జనులంతా సర్వలోకాల ప్రభువు ముందు నిలబడతారు.
83:7 كَلَّا إِنَّ كِتَابَ الْفُجَّارِ لَفِي سِجِّينٍ
ముమ్మాటికీ (వారు అనుకునేది నిజం) కాదు. నిశ్చయంగా పాపాత్ముల కర్మల చిట్టా ‘సిజ్జీను’లో ఉంది.
83:8 وَمَا أَدْرَاكَ مَا سِجِّينٌ
‘సిజ్జీను’ అంటే ఏమిటో నీకేం తెలుసు?
83:9 كِتَابٌ مَّرْقُومٌ
(అదొక) లిఖిత పూర్వక గ్రంథం.
83:10 وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
ధిక్కరించేవారికి ఆ రోజు మూడటం ఖాయం.
83:11 الَّذِينَ يُكَذِّبُونَ بِيَوْمِ الدِّينِ
వారు ప్రతిఫల దినాన్ని ధిక్కరించేవారు.
83:12 وَمَا يُكَذِّبُ بِهِ إِلَّا كُلُّ مُعْتَدٍ أَثِيمٍ
బరితెగించిన పాపాత్ముడు మాత్రమే దాన్ని ధిక్కరిస్తాడు.
83:13 إِذَا تُتْلَىٰ عَلَيْهِ آيَاتُنَا قَالَ أَسَاطِيرُ الْأَوَّلِينَ
వాడికి మా వాక్యాలను చదివి వినిపించినప్పుడు, “ఇవి పూర్వీకుల కట్టుకథలే కదా!” అనంటాడు.
83:14 كَلَّا ۖ بَلْ ۜ رَانَ عَلَىٰ قُلُوبِهِم مَّا كَانُوا يَكْسِبُونَ
అది కాదు. అసలు విషయం ఏమిటంటే వారి దురాగతాల మూలంగా వారి హృదయాలకు తుప్పుపట్టింది.
83:15 كَلَّا إِنَّهُمْ عَن رَّبِّهِمْ يَوْمَئِذٍ لَّمَحْجُوبُونَ
కాదు, కాదు. ఆ రోజు వారు తమ ప్రభువును చూడకుండా ఉండే విధంగా – చాటున – ఉంచబడతారు.
83:16 ثُمَّ إِنَّهُمْ لَصَالُو الْجَحِيمِ
ఆపైన వారు తప్పకుండా నరకంలోకి త్రోయబడతారు.
83:17 ثُمَّ يُقَالُ هَٰذَا الَّذِي كُنتُم بِهِ تُكَذِّبُونَ
“(ఇంతకాలంగా) మీరు త్రోసిపుచ్చుతూ వచ్చిన వాస్తవం ఇదే” అని అప్పుడు వారితో అనబడుతుంది.
83:18 كَلَّا إِنَّ كِتَابَ الْأَبْرَارِ لَفِي عِلِّيِّينَ
ఎన్నటికీ కాదు. నిశ్చయంగా పుణ్యాత్ముల కర్మల చిట్టా ‘ఇల్లియ్యీన్’లో ఉంది.
83:19 وَمَا أَدْرَاكَ مَا عِلِّيُّونَ
‘ఇల్లియ్యీన్’ గురించి నీకేం తెలుసు?
83:20 كِتَابٌ مَّرْقُومٌ
(అదొక) లిఖితపూర్వక గ్రంథం.
83:21 يَشْهَدُهُ الْمُقَرَّبُونَ
సామీప్యం పొందినవారు (దైవదూతలు) దాన్ని కనిపెట్టుకుని ఉంటారు.
83:22 إِنَّ الْأَبْرَارَ لَفِي نَعِيمٍ
నిశ్చయంగా పుణ్యాత్ములు (స్వర్గ) సుఖాలలో ఉంటారు.
83:23 عَلَى الْأَرَائِكِ يَنظُرُونَ
(దర్జాగా) ఆసనాలపై కూర్చుని (పరిసరాలను) వీక్షిస్తూ ఉంటారు.
83:24 تَعْرِفُ فِي وُجُوهِهِمْ نَضْرَةَ النَّعِيمِ
వారి ముఖాలపై ఉట్టిపడే సుఖసౌఖ్యాల కళను నువ్వు (ఇట్టే) గుర్తుపడతావు.
83:25 يُسْقَوْنَ مِن رَّحِيقٍ مَّخْتُومٍ
సీలువేయబడిన స్వచ్చమైన మధువు వారికి త్రాపించబడుతుంది.
83:26 خِتَامُهُ مِسْكٌ ۚ وَفِي ذَٰلِكَ فَلْيَتَنَافَسِ الْمُتَنَافِسُونَ
పైగా అది కస్తూరితో కూడుకున్న ముద్ర (సీలు). మరి పోటీపడేవారు ఈ విషయంలో పోటీపడాలి.
83:27 وَمِزَاجُهُ مِن تَسْنِيمٍ
అందులో ‘తస్నీం’ కలిసి ఉంటుంది.
83:28 عَيْنًا يَشْرَبُ بِهَا الْمُقَرَّبُونَ
అదొక సెలయేరు సామీప్యం పొందిన సజ్జనులు ఆ విశిష్ట పానీయాన్ని సేవిస్తారు.
83:29 إِنَّ الَّذِينَ أَجْرَمُوا كَانُوا مِنَ الَّذِينَ آمَنُوا يَضْحَكُونَ
అపరాధులు విశ్వాసుల స్థితిపై (చులకనగా) నవ్వేవారు.
83:30 وَإِذَا مَرُّوا بِهِمْ يَتَغَامَزُونَ
వారి దగ్గర నుండి వెళుతున్నప్పుడు, పరస్పరం కన్నుగీటి మరీ సైగలు చేసేవారు.
83:31 وَإِذَا انقَلَبُوا إِلَىٰ أَهْلِهِمُ انقَلَبُوا فَكِهِينَ
తమ వారి వద్దకు తిరిగి వెళ్ళినప్పుడు కూడా (విశ్వాసులను గురించి) వేళాకోళం చేస్తూనే వెళ్ళేవారు.
83:32 وَإِذَا رَأَوْهُمْ قَالُوا إِنَّ هَٰؤُلَاءِ لَضَالُّونَ
వారిని (విశ్వాసులను) చూసినప్పుడల్లా, “నిశ్చయంగా వీళ్ళు పెడదారి పట్టార”ని అనేవారు.
83:33 وَمَا أُرْسِلُوا عَلَيْهِمْ حَافِظِينَ
ఇంతకీ వాళ్ళు (అవిశ్వాసులు) వారిపై (విశ్వాసులపై) కావలి వాళ్ళుగా చేసి పంపబడలేదు కదా!
83:34 فَالْيَوْمَ الَّذِينَ آمَنُوا مِنَ الْكُفَّارِ يَضْحَكُونَ
మరి ఈ రోజు విశ్వాసులు అవిశ్వాసుల స్థితిపై నవ్వుతారు.
83:35 عَلَى الْأَرَائِكِ يَنظُرُونَ
ఎత్తైన ఆసనాలపై కూర్చుని చూస్తూ ఉంటారు.
83:36 هَلْ ثُوِّبَ الْكُفَّارُ مَا كَانُوا يَفْعَلُونَ
ఏం?! ఈ అవిశ్వాసులు, తాము చేసుకున్న దానికి పూర్తి ప్రతిఫలం పొందారు కదా! - సూరా అల్ ఇన్ షి ఖాక్
84:1 إِذَا السَّمَاءُ انشَقَّتْ
ఆకాశం బ్రద్దలైపోయినప్పుడు,
84:2 وَأَذِنَتْ لِرَبِّهَا وَحُقَّتْ
అది తన ప్రభువు ఆజ్ఞను వింటుంది. దానికదే తగినది మరి!
84:3 وَإِذَا الْأَرْضُ مُدَّتْ
మరి భూమి (సాగదీయబడి) విస్తృత పరచబడినప్పుడు,
84:4 وَأَلْقَتْ مَا فِيهَا وَتَخَلَّتْ
అది తన లోపల ఉన్నదంతా బయట పడేసి, ఖాళీ అయిపోతుంది.
84:5 وَأَذِنَتْ لِرَبِّهَا وَحُقَّتْ
అది తన ప్రభువు ఆదేశాన్ని (ఖచ్చితంగా) వింటుంది. దానికదే శోభాయమానం మరి!
84:6 يَا أَيُّهَا الْإِنسَانُ إِنَّكَ كَادِحٌ إِلَىٰ رَبِّكَ كَدْحًا فَمُلَاقِيهِ
ఓ మానవుడా! నువ్వు నీ ప్రభువును చేరుకునేవరకు ఈ సాధనలో, (ఈ కఠోర పరిశ్రమలోనే) నిమగ్నుడవై ఉండి, తుదకు ఆయన్ని చేరుకుంటావు.
84:7 فَأَمَّا مَنْ أُوتِيَ كِتَابَهُ بِيَمِينِهِ
(ఆ సమయంలో) ఎవరి కర్మల పత్రం అతని కుడిచేతికి ఇవ్వబడుతుందో –
84:8 فَسَوْفَ يُحَاسَبُ حِسَابًا يَسِيرًا
అతని నుండి తేలికపాటి లెక్క తీసుకోబడుతుంది.
84:9 وَيَنقَلِبُ إِلَىٰ أَهْلِهِ مَسْرُورًا
అతను తనవారి వైపు సంబరపడుతూ వెళతాడు.
84:10 وَأَمَّا مَنْ أُوتِيَ كِتَابَهُ وَرَاءَ ظَهْرِهِ
మరెవరి కర్మల పత్రం అతని వీపు వెనుక నుండి ఇవ్వబడుతుందో
84:11 فَسَوْفَ يَدْعُو ثُبُورًا
అతను చావు కోసం కేకలు వేస్తాడు.
84:12 وَيَصْلَىٰ سَعِيرًا
మరి (అతను) మండే నరకాగ్నిలోకి ప్రవేశిస్తాడు.
84:13 إِنَّهُ كَانَ فِي أَهْلِهِ مَسْرُورًا
ఈ వ్యక్తి (ఇహలోకంలో) తన వారి మధ్య తెగ సంబరపడేవాడు.
84:14 إِنَّهُ ظَنَّ أَن لَّن يَحُورَ
తానెన్నటికీ (అల్లాహ్ వద్దకు) తిరిగి పోనని తలపోసేవాడు.
84:15 بَلَىٰ إِنَّ رَبَّهُ كَانَ بِهِ بَصِيرًا
ఎందుకు పోడు?! నిజానికి అతని ప్రభువు అతన్ని బాగా గమనిస్తూనే ఉండేవాడు.
84:16 فَلَا أُقْسِمُ بِالشَّفَقِ
సాయంకాలపు ఎర్రని కాంతి తోడు!
84:17 وَاللَّيْلِ وَمَا وَسَقَ
రాత్రి తోడు! అది తనలో లీనం చేసుకునే వస్తువుల తోడు!
84:18 وَالْقَمَرِ إِذَا اتَّسَقَ
పూర్ణచంద్రుని తోడు! (గా చెబుతున్నాను)
84:19 لَتَرْكَبُنَّ طَبَقًا عَن طَبَقٍ
నిశ్చయంగా మీరు క్రమేణా ఒక స్థితి నుండి మరో స్థితికి సాగిపోతుంటారు.
84:20 فَمَا لَهُمْ لَا يُؤْمِنُونَ
అసలు వారికేమైపోయింది, వారు ఎందుకని విశ్వసించరు?
84:21 وَإِذَا قُرِئَ عَلَيْهِمُ الْقُرْآنُ لَا يَسْجُدُونَ ۩
వారి ముందు ఖుర్ఆన్ ను పఠించినప్పుడు వారెందుకని సాష్టాంగపడరు?
84:22 بَلِ الَّذِينَ كَفَرُوا يُكَذِّبُونَ
పైగా విశ్వసించని ఈ జనులు (దీనిని) ధిక్కరిస్తున్నారు?
84:23 وَاللَّهُ أَعْلَمُ بِمَا يُوعُونَ
వారు తమ లోపల దాచి పెట్టుకునే లోగుట్టును గురించి అల్లాహ్ కు బాగా తెలుసు.
84:24 فَبَشِّرْهُم بِعَذَابٍ أَلِيمٍ
కాబట్టి వారికి బాధాకరమైన యాతనకు సంబంధించిన ‘శుభవార్త’ను వినిపించు.
84:25 إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ لَهُمْ أَجْرٌ غَيْرُ مَمْنُونٍ
అయితే, విశ్వసించి సత్కార్యాలు చేసిన వారికి మాత్రం ఎన్నటికీ తరగని పుణ్యఫలం ఉంది. - సూరా అల్ బురూజ్
85:1 وَالسَّمَاءِ ذَاتِ الْبُرُوجِ
బురుజులు గల ఆకాశం సాక్షిగా!
85:2 وَالْيَوْمِ الْمَوْعُودِ
వాగ్దానం చేయబడివున్న రోజు సాక్షిగా!
85:3 وَشَاهِدٍ وَمَشْهُودٍ
సాక్ష్య దినం (సమావేశమైనవారి ) సాక్షిగా! సమావేశమైన చోటు సాక్షిగా!
85:4 قُتِلَ أَصْحَابُ الْأُخْدُودِ
కందకం వాళ్ళు సర్వనాశనమయ్యారు.
85:5 النَّارِ ذَاتِ الْوَقُودِ
అది ఇంధనంతో బాగా మండించబడిన అగ్ని.
85:6 إِذْ هُمْ عَلَيْهَا قُعُودٌ
ఆ సమయంలో వాళ్ళు (కందకం వాళ్ళు) దాని చుట్టూ కూర్చున్నారు.
85:7 وَهُمْ عَلَىٰ مَا يَفْعَلُونَ بِالْمُؤْمِنِينَ شُهُودٌ
తాము విశ్వాసుల (ముస్లింల) పట్ల చేస్తున్న దాన్ని (తమాషాగా) తిలకిస్తూ ఉన్నారు.
85:8 وَمَا نَقَمُوا مِنْهُمْ إِلَّا أَن يُؤْمِنُوا بِاللَّهِ الْعَزِيزِ الْحَمِيدِ
ఇంతకీ ఆ విశ్వాసులు చేసిన తప్పు – వారు సర్వశక్తుడు, స్తోత్రనీయుడైన అల్లాహ్ ను విశ్వసించటం తప్ప మరొకటి కాదు. దానికే వారు ప్రతీకారం తీర్చుకున్నారు.
85:9 الَّذِي لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ وَاللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ شَهِيدٌ
మరి వాస్తవానికి భూమ్యాకాశాల సామ్రాజ్యానికి అధిపతి (కూడా) ఆయనే. మరి అల్లాహ్ అన్నింటికీ సాక్షిగా ఉన్నాడు.
85:10 إِنَّ الَّذِينَ فَتَنُوا الْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ ثُمَّ لَمْ يَتُوبُوا فَلَهُمْ عَذَابُ جَهَنَّمَ وَلَهُمْ عَذَابُ الْحَرِيقِ
ఎవరైతే విశ్వసించిన పురుషులను, విశ్వసించిన స్త్రీలను వేధించి (కనీసం) పశ్చాత్తాపం (కూడా) చెందలేదో వారి కొరకు నరక యాతన సిద్ధంగా ఉంది, దహించి వేసే యాతన కూడా ఉంది.
85:11 إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ لَهُمْ جَنَّاتٌ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ ۚ ذَٰلِكَ الْفَوْزُ الْكَبِيرُ
అయితే విశ్వసించి, సత్కార్యాలు చేసేవారి కోసం క్రింద కాలువలు ప్రవహించే తోటలు ఉన్నాయి. ఇదే గొప్ప విజయం.
85:12 إِنَّ بَطْشَ رَبِّكَ لَشَدِيدٌ
నిశ్చయంగా నీ ప్రభువు పట్టు చాలా కఠినమైనది.
85:13 إِنَّهُ هُوَ يُبْدِئُ وَيُعِيدُ
ఆయనే తొలిసారి పుట్టిస్తున్నాడు. మలిసారి ప్రభవింపజేసేవాడు కూడా ఆయనే.
85:14 وَهُوَ الْغَفُورُ الْوَدُودُ
ఆయనే అపారంగా క్షమించేవాడు, అమితంగా ప్రేమించేవాడు.
85:15 ذُو الْعَرْشِ الْمَجِيدُ
పీఠాధిపతి ఘనత గలవాడు.
85:16 فَعَّالٌ لِّمَا يُرِيدُ
తలచుకున్న దాన్ని చేసి తీరేవాడు.
85:17 هَلْ أَتَاكَ حَدِيثُ الْجُنُودِ
సైనిక దళాల సంగతి గానీ నీకు చేరిందా?
85:18 فِرْعَوْنَ وَثَمُودَ
(అనగా) ఫిరౌను మరియు సమూదు (దళాలు).
85:19 بَلِ الَّذِينَ كَفَرُوا فِي تَكْذِيبٍ
కాని (ఈ) తిరస్కారులు మాత్రం ధిక్కార వైఖరిలోనే పడి ఉన్నారు.
85:20 وَاللَّهُ مِن وَرَائِهِم مُّحِيطٌ
అల్లాహ్ కూడా వాళ్ళను అన్ని వైపుల నుండీ చుట్టుముట్టాడు.
85:21 بَلْ هُوَ قُرْآنٌ مَّجِيدٌ
కాదు…అసలు ఈ ఖుర్ఆన్ మహిమాన్వితమైనది.
85:22 فِي لَوْحٍ مَّحْفُوظٍ
సురక్షిత ఫలకంలో (లిఖితమై ఉంది). - సూరా అత్ తారిఖ్
86:1 وَالسَّمَاءِ وَالطَّارِقِ
ఆకాశం సాక్షిగా! రాత్రి చీకటిలో ప్రస్ఫుటమయ్యే దాని సాక్షిగా!
86:2 وَمَا أَدْرَاكَ مَا الطَّارِقُ
రాత్రిపూట ప్రస్ఫుటమయ్యేదేమిటో నీకు తెలుసా?
86:3 النَّجْمُ الثَّاقِبُ
అది ప్రకాశించే నక్షత్రం.
86:4 إِن كُلُّ نَفْسٍ لَّمَّا عَلَيْهَا حَافِظٌ
తనను కనిపెట్టుకుని ఉండే దూత లేకుండా ఏ ప్రాణి లేదు.
86:5 فَلْيَنظُرِ الْإِنسَانُ مِمَّ خُلِقَ
ఇక మానవుడు, తాను దేంతో పుట్టించబడ్డాడో చూసుకోవాలి.
86:6 خُلِقَ مِن مَّاءٍ دَافِقٍ
అతను ఎగిసిపడే నీటితో పుట్టించబడ్డాడు.
86:7 يَخْرُجُ مِن بَيْنِ الصُّلْبِ وَالتَّرَائِبِ
అది వెన్నెముక, ఛాతీభాగం మధ్య నుండి వెలువడుతుంది.
86:8 إِنَّهُ عَلَىٰ رَجْعِهِ لَقَادِرٌ
నిశ్చయంగా ఆయన, అతణ్ణి తిరిగి రప్పించుకునే శక్తిని కూడా కలిగి ఉన్నాడు.
86:9 يَوْمَ تُبْلَى السَّرَائِرُ
ఆ రోజు లోగుట్టులన్నీ (రట్టయి) పలికించబడతాయి.
86:10 فَمَا لَهُ مِن قُوَّةٍ وَلَا نَاصِرٍ
అప్పుడు అతనికంటూ ఏ (అధికార) బలమూ ఉండదు. ఏ సహాయకుడూ ఉండడు.
86:11 وَالسَّمَاءِ ذَاتِ الرَّجْعِ
వర్షం గల ఆకాశం సాక్షిగా!
86:12 وَالْأَرْضِ ذَاتِ الصَّدْعِ
బీటలు వారే భూమి సాక్షిగా!
86:13 إِنَّهُ لَقَوْلٌ فَصْلٌ
నిశ్చయంగా ఇది (ఈ ఖుర్ఆన్) నిర్ణాయకమైన వాక్కు.
86:14 وَمَا هُوَ بِالْهَزْلِ
ఇదేదో ఆషామాషీ విషయం కాదు.
86:15 إِنَّهُمْ يَكِيدُونَ كَيْدًا
వీళ్ళు (ఈ అవిశ్వాసులు) కొన్ని పన్నాగాలు పన్నుతున్నారు.
86:16 وَأَكِيدُ كَيْدًا
నేను కూడా ఒక పన్నాగం పన్నుతున్నాను.
86:17 فَمَهِّلِ الْكَافِرِينَ أَمْهِلْهُمْ رُوَيْدًا
కాబట్టి (ఓ ప్రవక్తా!) నువ్వు అవిశ్వాసులకు కాస్త విడుపు ఇవ్వు. కొన్నాళ్ళ పాటు వారిని వదలిపెట్టు. - సూరా అల్ ఆలా
87:1 سَبِّحِ اسْمَ رَبِّكَ الْأَعْلَى
(ఓ ప్రవక్తా!) సర్వోన్నతుడైన నీ ప్రభువు నామం యెక్క పవిత్రతను కొనియాడు.
87:2 الَّذِي خَلَقَ فَسَوَّىٰ
ఆయనే సృష్టించాడు, మరి ఆపైన తీర్చిదిద్దాడు.
87:3 وَالَّذِي قَدَّرَ فَهَدَىٰ
ఆయనే (కావలసిన వాటిని తగురీతిలో) నిర్ధారించాడు. పిదప మార్గం చూపించాడు.
87:4 وَالَّذِي أَخْرَجَ الْمَرْعَىٰ
మరి ఆయనే పచ్చిక బయళ్ళను ఉత్పన్నం చేశాడు.
87:5 فَجَعَلَهُ غُثَاءً أَحْوَىٰ
ఆపైన వాటిని నల్లని చెత్తకుప్పగా చేసేశాడు.
87:6 سَنُقْرِئُكَ فَلَا تَنسَىٰ
మేము నిన్ను చదివిస్తాము – మరి నువ్వు దానిని మరువలేవు.
87:7 إِلَّا مَا شَاءَ اللَّهُ ۚ إِنَّهُ يَعْلَمُ الْجَهْرَ وَمَا يَخْفَىٰ
అయితే అల్లాహ్ తలచినది మాత్రం (మరువగలవు). ఆయన బహిర్గతమయ్యే దానినీ, గోప్యంగా ఉన్నదానినీ ఎరిగినవాడు.
87:8 وَنُيَسِّرُكَ لِلْيُسْرَىٰ
(ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం!) మేము నీకు సౌలభ్యాన్ని సమకూరుస్తాము.
87:9 فَذَكِّرْ إِن نَّفَعَتِ الذِّكْرَىٰ
కనుక నీవు ఉపదేశం లాభదాయకం అయితే, ఉపదేశిస్తూ ఉండు.
87:10 سَيَذَّكَّرُ مَن يَخْشَىٰ
(అల్లాహ్ పట్ల) భయమున్నవాడు ఉపదేశాన్ని గ్రహిస్తాడు.
87:11 وَيَتَجَنَّبُهَا الْأَشْقَى
దౌర్భాగ్యుడు మాత్రమే దాన్ని దాట వేస్తాడు.
87:12 الَّذِي يَصْلَى النَّارَ الْكُبْرَىٰ
వాడు పెద్ద (ఘోరమైన) అగ్నిలోకి ప్రవేశిస్తాడు.
87:13 ثُمَّ لَا يَمُوتُ فِيهَا وَلَا يَحْيَىٰ
వాడందులో చావనైనా చావడు, బ్రతకనైనా బ్రతకడు. (రెంటికీ మధ్య దుర్భరస్థితిలో ఉంటాడు).
87:14 قَدْ أَفْلَحَ مَن تَزَكَّىٰ
పవిత్రుడైనవాడు ఖచ్చితంగా సాఫల్యం పొందాడు.
87:15 وَذَكَرَ اسْمَ رَبِّهِ فَصَلَّىٰ
అతను తన ప్రభువు నామాన్ని స్మరించాడు. నమాజు ఆచరించాడు.
87:16 بَلْ تُؤْثِرُونَ الْحَيَاةَ الدُّنْيَا
కాని మీరు మాత్రం ప్రాపంచిక జీవితానికే ప్రాముఖ్యమిస్తున్నారు.
87:17 وَالْآخِرَةُ خَيْرٌ وَأَبْقَىٰ
వాస్తవానికి పరలోకం ఎంతో మేలైనది, ఎప్పటికీ మిగిలి ఉండేది.
87:18 إِنَّ هَٰذَا لَفِي الصُّحُفِ الْأُولَىٰ
ఈ విషయాలు మునుపటి గ్రంథాలలోనూ ఉన్నాయి.
87:19 صُحُفِ إِبْرَاهِيمَ وَمُوسَىٰ
(అంటే) ఇబ్రాహీము, మూసాల గ్రంథాలలో! - సూరా అల్ గాషియ హ్
88:1 هَلْ أَتَاكَ حَدِيثُ الْغَاشِيَةِ
క్రమ్ముకునే ఆపద సంగతిగాని నీకు చేరిందా?
88:2 وُجُوهٌ يَوْمَئِذٍ خَاشِعَةٌ
ఆ రోజు ఎన్నో ముఖాలు అవమానంతో పాలిపోయి ఉంటాయి.
88:3 عَامِلَةٌ نَّاصِبَةٌ
శ్రమిస్తూ, అలసి సొలసి ఉంటాయి.
88:4 تَصْلَىٰ نَارًا حَامِيَةً
వారు మండే అగ్నికి ఆహుతి అవుతారు.
88:5 تُسْقَىٰ مِنْ عَيْنٍ آنِيَةٍ
వారికి ఉడికే చెలమ నీరు త్రాగించబడుతుంది.
88:6 لَّيْسَ لَهُمْ طَعَامٌ إِلَّا مِن ضَرِيعٍ
వారికి తినడానికి ముండ్ల చెట్టు తప్ప వేరొకటి ఆహారంగా దొరకదు.
88:7 لَّا يُسْمِنُ وَلَا يُغْنِي مِن جُوعٍ
అది వారిని లావుగానూ చేయదు, వారి ఆకలిని కూడా తీర్చదు.
88:8 وُجُوهٌ يَوْمَئِذٍ نَّاعِمَةٌ
మరెన్నో ముఖాలు ఆనాడు నవనవలాడుతూ ఉంటాయి.
88:9 لِّسَعْيِهَا رَاضِيَةٌ
వారు తమ కృషిపై సంతోషంతో ఉంటారు.
88:10 فِي جَنَّةٍ عَالِيَةٍ
ఉన్నతమైన స్వర్గంలో ఉంటారు.
88:11 لَّا تَسْمَعُ فِيهَا لَاغِيَةً
వారక్కడ ఎలాంటి అపసవ్యమైన మాట వినరు.
88:12 فِيهَا عَيْنٌ جَارِيَةٌ
అందులో (అద్భుతంగా) ప్రవహించే ఒక సెలయేరు ఉంటుంది.
88:13 فِيهَا سُرُرٌ مَّرْفُوعَةٌ
(ఇంకా) అందులో (రాజసం ఉట్టిపడే) ఎత్తైన పీఠాలు వేయబడి ఉంటాయి.
88:14 وَأَكْوَابٌ مَّوْضُوعَةٌ
వారికెదురుగా (మధు) పాత్రలు పేర్చబడి ఉంటాయి.
88:15 وَنَمَارِقُ مَصْفُوفَةٌ
వరుసగా వేయబడిన దిండ్లు ఉంటాయి.
88:16 وَزَرَابِيُّ مَبْثُوثَةٌ
అన్ని వైపులా పట్టు తివాచీలు పరచబడి ఉంటాయి.
88:17 أَفَلَا يَنظُرُونَ إِلَى الْإِبِلِ كَيْفَ خُلِقَتْ
ఏమిటి, ఒంటెలు ఎలా సృష్టించబడ్డాయో వారు చూడటం లేదా?
88:18 وَإِلَى السَّمَاءِ كَيْفَ رُفِعَتْ
ఆకాశం ఎలా ఎత్తుగా చేయబడిందో వారు గమనించటం లేదా?
88:19 وَإِلَى الْجِبَالِ كَيْفَ نُصِبَتْ
పర్వతాలు ఎలా పాతిపెట్టబడ్డాయో తిలకించటం లేదా?
88:20 وَإِلَى الْأَرْضِ كَيْفَ سُطِحَتْ
భూమి ఎలా (విశాలంగా) పరచబడి ఉన్నదో వారు వీక్షించటం లేదా?
88:21 فَذَكِّرْ إِنَّمَا أَنتَ مُذَكِّرٌ
కనుక (ఓ ప్రవక్తా!) నీవు మాత్రం బోధపరుస్తూ ఉండు. నీవు హితబోధ చేసేవాడివి మాత్రమే.
88:22 لَّسْتَ عَلَيْهِم بِمُصَيْطِرٍ
నీవు వారిపై కావలివాడవు కావు.
88:23 إِلَّا مَن تَوَلَّىٰ وَكَفَرَ
అయితే విముఖత చూపి, తిరస్కరించినవాణ్ణి,
88:24 فَيُعَذِّبُهُ اللَّهُ الْعَذَابَ الْأَكْبَرَ
అల్లాహ్ అతనికి చాలా పెద్ద శిక్ష విధిస్తాడు.
88:25 إِنَّ إِلَيْنَا إِيَابَهُمْ
ఎట్టి పరిస్థితిలోనూ వారు మా వద్దకే తిరిగి రావలసి ఉన్నది.
88:26 ثُمَّ إِنَّ عَلَيْنَا حِسَابَهُم
మరి వారి నుండి లెక్క తీసుకునే బాధ్యత మాపైనే ఉంది. - సూరా అల్ ఫజ్ర్
89:1 وَالْفَجْرِ
ఉషోదయం సాక్షిగా!
89:2 وَلَيَالٍ عَشْرٍ
పది రాత్రుల సాక్షిగా!
89:3 وَالشَّفْعِ وَالْوَتْرِ
సరి, బేసి (సంఖ్య)ల సాక్షిగా!
89:4 وَاللَّيْلِ إِذَا يَسْرِ
గడచిపోతున్నప్పటి రాత్రి సాక్షిగా!
89:5 هَلْ فِي ذَٰلِكَ قَسَمٌ لِّذِي حِجْرٍ
ఏమిటి, బుద్దిజ్ఞానం కలవానికి ఇందులోని ప్రమాణాలు చాలవా?
89:6 أَلَمْ تَرَ كَيْفَ فَعَلَ رَبُّكَ بِعَادٍ
నీ ప్రభువు ఆద్ జాతివారి పట్ల ఎలా వ్యవహరించాడో నీవు చూడలేదా?
89:7 إِرَمَ ذَاتِ الْعِمَادِ
ఎత్తయిన స్తంభాల వారైన ‘ఇరము’ పట్ల (నీ ప్రభువు చేసిన వ్యవహారం ఏమిటో గమనించలేదా)?
89:8 الَّتِي لَمْ يُخْلَقْ مِثْلُهَا فِي الْبِلَادِ
అలాంటి (శక్తి గల) వారు పట్టణాలలో అసలు సృష్టించబడలేదు.
89:9 وَثَمُودَ الَّذِينَ جَابُوا الصَّخْرَ بِالْوَادِ
లోయలో పెద్ద పెద్ద కొండరాళ్ళను చెక్కిన సమూదు వారి పట్ల (జరిగిందేమిటో నీవు గమనించలేదా?)
89:10 وَفِرْعَوْنَ ذِي الْأَوْتَادِ
మేకుల వాడైన ఫిరౌను పట్ల (నీ ప్రభువు ఏ విధంగా వ్యవహరించాడో నీకు తెలియదా)?
89:11 الَّذِينَ طَغَوْا فِي الْبِلَادِ
వాళ్ళంతా పట్టణాలలో (రాజ్యాలలో) చెలరేగిపోయిన వాళ్ళే.
89:12 فَأَكْثَرُوا فِيهَا الْفَسَادَ
మరి వారు వాటిలో ఎంతో అరాచకాన్ని సృష్టించారు.
89:13 فَصَبَّ عَلَيْهِمْ رَبُّكَ سَوْطَ عَذَابٍ
అందువల్ల (ఎట్టకేలకు) నీ ప్రభువు వారందరిపై శిక్షాకొరడాను ఘులిపించాడు.
89:14 إِنَّ رَبَّكَ لَبِالْمِرْصَادِ
నిశ్చయంగా నీ ప్రభువు (వారి కోసం) మాటేసి ఉన్నాడు.
89:15 فَأَمَّا الْإِنسَانُ إِذَا مَا ابْتَلَاهُ رَبُّهُ فَأَكْرَمَهُ وَنَعَّمَهُ فَيَقُولُ رَبِّي أَكْرَمَنِ
మనిషి పరిస్థితి ఎలాంటిదంటే అతని ప్రభువు అతణ్ణి పరీక్షించదలచి అతనికి గౌరవమర్యాదలను, అనుగ్రహభాగ్యాలను ప్రసాదించినప్పుడు అతను (ఉబ్బి తబ్బిబ్బై), “నా ప్రభువు నన్ను గౌరవనీయుణ్ణి చేశాడయా!” అనంటాడు.
89:16 وَأَمَّا إِذَا مَا ابْتَلَاهُ فَقَدَرَ عَلَيْهِ رِزْقَهُ فَيَقُولُ رَبِّي أَهَانَنِ
మరి ఆయన అతణ్ణి (మరో విధంగా) పరీక్షించదలచి, అతని ఉపాధిని కుదించినప్పుడు, “అయ్యో! నా ప్రభువే నన్ను పరాభవానికి గురిచేశాడు!” అని వాపోతాడు.
89:17 كَلَّا ۖ بَل لَّا تُكْرِمُونَ الْيَتِيمَ
అది (వాస్తవం) కాదు. అసలు విషయం ఏమిటంటే మీరు అనాధలను ఆదరించరు.
89:18 وَلَا تَحَاضُّونَ عَلَىٰ طَعَامِ الْمِسْكِينِ
నిరుపేదలకు అన్నంపెట్టే విషయంలో ఒకర్నొకరు ప్రోత్సహించుకోరు.
89:19 وَتَأْكُلُونَ التُّرَاثَ أَكْلًا لَّمًّا
ఇంకా మీరు (మృతుల) ఆస్తిపాస్తులను సమీకరించి, స్వాహా చేస్తారు.
89:20 وَتُحِبُّونَ الْمَالَ حُبًّا جَمًّا
మీరు ధనాన్ని విపరీతంగా ప్రేమిస్తారు.
89:21 كَلَّا إِذَا دُكَّتِ الْأَرْضُ دَكًّا دَكًّا
(మీ ధోరణి సరైనది) కాదు. భూమి దంచి దంచి చదునుగా చేయబడినప్పుడు….
89:22 وَجَاءَ رَبُّكَ وَالْمَلَكُ صَفًّا صَفًّا
నీ ప్రభువు (స్వయంగా) వరుసలు తీరిన దైవదూతల సమేతంగా ఏతెంచినపుడు….
89:23 وَجِيءَ يَوْمَئِذٍ بِجَهَنَّمَ ۚ يَوْمَئِذٍ يَتَذَكَّرُ الْإِنسَانُ وَأَنَّىٰ لَهُ الذِّكْرَىٰ
నరకం సైతం తేబడిననాడు … ఆనాడు మనిషికి జ్ఞానోదయం అవుతుంది. కాని ఆ రోజు జ్ఞానం కలిగి ఏం లాభం?
89:24 يَقُولُ يَا لَيْتَنِي قَدَّمْتُ لِحَيَاتِي
“అయ్యో! నేనీ (పరలోక) జీవితం కోసం ముందుగానే (జాగ్రత్తపడి ఏదైనా) చేసుకుని ఉంటే ఎంత బావుండేది!” అని అతనంటాడు.
89:25 فَيَوْمَئِذٍ لَّا يُعَذِّبُ عَذَابَهُ أَحَدٌ
మరి ఆ రోజు అల్లాహ్ శిక్షించినట్లుగా శిక్షించేవాడెవడూ ఉండడు.
89:26 وَلَا يُوثِقُ وَثَاقَهُ أَحَدٌ
అలాగే ఆయన బంధించినట్లుగా ఎవడూ బంధించలేడు.
89:27 يَا أَيَّتُهَا النَّفْسُ الْمُطْمَئِنَّةُ
“ఓ ప్రశాంత మనసా!”
89:28 ارْجِعِي إِلَىٰ رَبِّكِ رَاضِيَةً مَّرْضِيَّةً
“నీ ప్రభువు వైపు పద! నువ్వు ఆయన పట్ల సంతోషించావు. ఆయన నీ పట్ల సంతోషించాడు.
89:29 فَادْخُلِي فِي عِبَادِي
“కాబట్టి (సత్కరించబడిన) నా దాసులలో చేరిపో.
89:30 وَادْخُلِي جَنَّتِي
“నా స్వర్గంలో చేరిపో” (అని విధేయులతో అనబడుతుంది).
- సూరా అల్ బలద్
90:1 لَا أُقْسِمُ بِهَٰذَا الْبَلَدِ
ఈ నగరం తోడుగా (నేను చెబుతున్నాను)!
90:2 وَأَنتَ حِلٌّ بِهَٰذَا الْبَلَدِ
(ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం)! నువ్వు ఈ నగరంలో స్వేచ్ఛావాసివి.
90:3 وَوَالِدٍ وَمَا وَلَدَ
కన్న తండ్రి (తోడుగా), అతను కన్న సంతానం (తోడుగా చెబుతున్నాను).
90:4 لَقَدْ خَلَقْنَا الْإِنسَانَ فِي كَبَدٍ
నిశ్చయంగా మేము మనిషిని నిత్య కష్టాల్లో సృష్టించాము.
90:5 أَيَحْسَبُ أَن لَّن يَقْدِرَ عَلَيْهِ أَحَدٌ
ఏమిటి, తనపై ఎవరి అదుపూ, అజమాయిషీ లేదని అతను అనుకుంటున్నాడా?
90:6 يَقُولُ أَهْلَكْتُ مَالًا لُّبَدًا
“నేను రాసుల కొద్దీ ధనాన్ని ఖర్చుపెట్టాను తెలుసా!” అని అతను (గొప్పలు) చెప్పుకుంటున్నాడు.
90:7 أَيَحْسَبُ أَن لَّمْ يَرَهُ أَحَدٌ
ఏమిటి, తననెవరూ చూడలేదని అతను తలపోస్తున్నాడా?
90:8 أَلَمْ نَجْعَل لَّهُ عَيْنَيْنِ
ఏమిటి, మేమతనికి రెండు కళ్ళు సృజించలేదా?
90:9 وَلِسَانًا وَشَفَتَيْنِ
ఒక నాలుకను, రెండు పెదవులను (చేయలేదా)?
90:10 وَهَدَيْنَاهُ النَّجْدَيْنِ
మరి మేమతనికి రెండు మార్గాలు కూడా చూపాము.
90:11 فَلَا اقْتَحَمَ الْعَقَبَةَ
కాని అతను కఠినమైన కనుమను దాటిపోలేదు.
90:12 وَمَا أَدْرَاكَ مَا الْعَقَبَةُ
కఠినమైన కనుమ అంటే ఏమిటో నీకు తెలుసా?
90:13 فَكُّ رَقَبَةٍ
ఏ (బానిస లేక బానిసరాలి) మెడనైనా (బానిసత్వం నుండి) విడిపించటం.
90:14 أَوْ إِطْعَامٌ فِي يَوْمٍ ذِي مَسْغَبَةٍ
లేదా ఆకలిగొన్న నాడు అన్నం పెట్టడం –
90:15 يَتِيمًا ذَا مَقْرَبَةٍ
బంధుత్వంగల ఏ అనాధకు గాని,
90:16 أَوْ مِسْكِينًا ذَا مَتْرَبَةٍ
మట్టిలో పడిఉన్న ఏ నిరుపేదకు గానీ (అన్నం పెట్టడం)!
90:17 ثُمَّ كَانَ مِنَ الَّذِينَ آمَنُوا وَتَوَاصَوْا بِالصَّبْرِ وَتَوَاصَوْا بِالْمَرْحَمَةِ
అటుపిమ్మట, విశ్వసించి పరస్పరం సహనబోధ చేసుకుంటూ, ఒండొకరికి దయాదాక్షిణ్యాల గురించి తాకీదు చేసుకునేవారైపోవాలి.
90:18 أُولَٰئِكَ أَصْحَابُ الْمَيْمَنَةِ
వీళ్ళే కుడిపక్షం వారు (భాగ్యవంతులు).
90:19 وَالَّذِينَ كَفَرُوا بِآيَاتِنَا هُمْ أَصْحَابُ الْمَشْأَمَةِ
మరెవరైతే మా ఆయతుల పట్ల తిరస్కార వైఖరిని అవలంబించారో వారు దౌర్భాగ్యులు.
90:20 عَلَيْهِمْ نَارٌ مُّؤْصَدَةٌ
వారిని (అన్ని వైపుల నుంచి) అగ్ని చుట్టుముట్టుతుంది.
- సూరా ఆష్ షమ్స్
91:1 وَالشَّمْسِ وَضُحَاهَا
సూర్యుని సాక్షిగా! దాని ఎండ సాక్షిగా!
91:2 وَالْقَمَرِ إِذَا تَلَاهَا
(సూర్యుణ్ణి) వెంబడిస్తూ వచ్చేటప్పటి చంద్రుని సాక్షిగా!
91:3 وَالنَّهَارِ إِذَا جَلَّاهَا
(సూర్యుణ్ణి) దేదీప్యమానం చేసినప్పటి పగటి సాక్షిగా!
91:4 وَاللَّيْلِ إِذَا يَغْشَاهَا
(సూరీడును) క్రమ్ముకున్నప్పటి రాత్రి సాక్షిగా!
91:5 وَالسَّمَاءِ وَمَا بَنَاهَا
ఆకాశం సాక్షిగా! దాని (అద్భుత) నిర్మాణం సాక్షిగా!
91:6 وَالْأَرْضِ وَمَا طَحَاهَا
భూమి సాక్షిగా! దాన్ని సుగమం చేసిన ప్రక్రియ సాక్షిగా!
91:7 وَنَفْسٍ وَمَا سَوَّاهَا
ఆత్మ సాక్షిగా! దాన్ని తీర్చిదిద్దిన వాని సాక్షిగా!
91:8 فَأَلْهَمَهَا فُجُورَهَا وَتَقْوَاهَا
మరి (ఆయన) దానికి చెడునూ, చెడు నుంచి తప్పించుకుని మసలుకునే ప్రేరణను ఇచ్చాడు.
91:9 قَدْ أَفْلَحَ مَن زَكَّاهَا
దానిని (అంతరాత్మను, మనసును) పరిశుద్ధ పరచుకున్నవాడు సాఫల్యం పొందాడు.
91:10 وَقَدْ خَابَ مَن دَسَّاهَا
దాన్ని అణచి పెట్టినవాడు నష్టపోయాడు.
91:11 كَذَّبَتْ ثَمُودُ بِطَغْوَاهَا
సమూదు (జాతి) వారు తమ పొగరు మూలంగా (వారి ప్రవక్తను) ధిక్కరించారు.
91:12 إِذِ انبَعَثَ أَشْقَاهَا
అప్పుడు వారిలోని ఒక పెద్ద దౌర్భాగ్యుడు (వారి తలబిరుసుపోకడలకు సారధిగా) నిలబడ్డాడు.
91:13 فَقَالَ لَهُمْ رَسُولُ اللَّهِ نَاقَةَ اللَّهِ وَسُقْيَاهَا
“మీరు దేవుని ఈ ఆడ ఒంటె విషయంలో, దాని నీళ్ళ వంతు విషయంలో జాగ్రత్తగా ఉండండి” అని దైవప్రవక్త వారిని హెచ్చరించాడు.
91:14 فَكَذَّبُوهُ فَعَقَرُوهَا فَدَمْدَمَ عَلَيْهِمْ رَبُّهُم بِذَنبِهِمْ فَسَوَّاهَا
కాని వారు మాత్రం తమ ప్రవక్త (మాటల)ను త్రోసిపుచ్చి, దాని గిట్టెలను నరికి (చంపేశారు). అంతే! వారి ప్రభువు వారి దురాగతాల కారణంగా వారిపై వినాశాన్ని పంపాడు. వారందరినీ సమానం (నేలమట్టం) చేశాడు.
91:15 وَلَا يَخَافُ عُقْبَاهَا
దాని పరిణామాలను గురించి ఆయన ఏమాత్రం భయపడడు.
- సూరా అల్ లైల్
92:1 وَاللَّيْلِ إِذَا يَغْشَىٰ
(చీకటిని) అలుముకున్నప్పటి రాత్రి సాక్షిగా!
92:2 وَالنَّهَارِ إِذَا تَجَلَّىٰ
వెలుగును విరజిమ్మేటప్పటి పగటి సాక్షిగా!
92:3 وَمَا خَلَقَ الذَّكَرَ وَالْأُنثَىٰ
మగ, ఆడ జాతులను సృష్టించిన వాని సాక్షిగా!
92:4 إِنَّ سَعْيَكُمْ لَشَتَّىٰ
నిశ్చయంగా మీ కృషి (ప్రయత్నం) అనేక విధాలుగా ఉంటుంది.
92:5 فَأَمَّا مَنْ أَعْطَىٰ وَاتَّقَىٰ
ఎవరైతే (దైవమార్గంలో) ఇచ్చాడో, (తన ప్రభువుకు) భయపడుతూ ఉన్నాడో,
92:6 وَصَدَّقَ بِالْحُسْنَىٰ
ఇంకా సత్పరిణామాన్ని సత్యమని ధృవపరిచాడో,
92:7 فَسَنُيَسِّرُهُ لِلْيُسْرَىٰ
అతనికి మేము సులువైన మార్గపు సౌకర్యం వొసగుతాము.
92:8 وَأَمَّا مَن بَخِلَ وَاسْتَغْنَىٰ
మరెవరైతే పిసినారిగా తయారై, నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శించాడో,
92:9 وَكَذَّبَ بِالْحُسْنَىٰ
సత్పరిణామాన్ని త్రోసిపుచ్చాడో,
92:10 فَسَنُيَسِّرُهُ لِلْعُسْرَىٰ
అతనికి మేము కఠిన (దుర్) మార్గపు సామగ్రిని సమకూరుస్తాము.
92:11 وَمَا يُغْنِي عَنْهُ مَالُهُ إِذَا تَرَدَّىٰ
అతను పడిపోయే సమయంలో అతని ధనం అతనికే విధంగానూ పనికిరాదు.
92:12 إِنَّ عَلَيْنَا لَلْهُدَىٰ
నిజంగా మార్గం చూపే బాధ్యత మాదే.
92:13 وَإِنَّ لَنَا لَلْآخِرَةَ وَالْأُولَىٰ
పరలోకం, ఇహలోకం కూడా నిజంగా మా అధీనంలోనే ఉన్నాయి.
92:14 فَأَنذَرْتُكُمْ نَارًا تَلَظَّىٰ
మరి నేను మటుకు నిప్పులు చెరిగే నరకాగ్ని గురించి మిమ్మల్ని హెచ్చరించాను.
92:15 لَا يَصْلَاهَا إِلَّا الْأَشْقَى
దౌర్భాగ్యుడు మాత్రమే దానికి ఆహుతి అవుతాడు.
92:16 الَّذِي كَذَّبَ وَتَوَلَّىٰ
వాడు (సత్యాన్ని) ధిక్కరించి, (దాన్నుండి) ముఖం తిప్పుకుని పోయాడు.
92:17 وَسَيُجَنَّبُهَا الْأَتْقَى
దైవభీతిపరుడు మాత్రం దాన్నుండి సురక్షితంగా ఉంచబడతాడు –
92:18 الَّذِي يُؤْتِي مَالَهُ يَتَزَكَّىٰ
(ఎందుకంటే) అతను పవిత్రుడయ్యే నిమిత్తం తన ధనాన్ని ఇస్తాడు.
92:19 وَمَا لِأَحَدٍ عِندَهُ مِن نِّعْمَةٍ تُجْزَىٰ
పోనీ, అతనెవరికైనా ప్రత్యుపకారం చేస్తున్నాడా అంటే, అతనిపై ఒకరి ఉపకారం కూడా లేదాయె. (అయినాసరే అతను ఉపకారం చేస్తూనే ఉన్నాడు).
92:20 إِلَّا ابْتِغَاءَ وَجْهِ رَبِّهِ الْأَعْلَىٰ
మహోన్నతుడైన తన ప్రభువు ప్రసన్నతను పొందటానికి మాత్రమే అతను ఈ పని చేస్తున్నాడు.
92:21 وَلَسَوْفَ يَرْضَىٰ
కాబట్టి ఆయన (కూడా) తప్పకుండా సంతోషిస్తాడు.
- సూరా అజ్ జుహా
93:1 وَالضُّحَىٰ
పొద్దెక్కుతున్నప్పటి ఎండ సాక్షిగా!
93:2 وَاللَّيْلِ إِذَا سَجَىٰ
కుదుటపడిన రాత్రి సాక్షిగా!
93:3 مَا وَدَّعَكَ رَبُّكَ وَمَا قَلَىٰ
(ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం!) నీ ప్రభువు నిన్ను వదలిపెట్టనూ లేదు, నీతో విసిగిపోనూ లేదు.
93:4 وَلَلْآخِرَةُ خَيْرٌ لَّكَ مِنَ الْأُولَىٰ
నిశ్చయంగా నీ కోసం చివరి కాలం తొలికాలం కన్నా మేలైనదిగా ఉంటుంది.
93:5 وَلَسَوْفَ يُعْطِيكَ رَبُّكَ فَتَرْضَىٰ
నీ ప్రభువు త్వరలోనే నీకు (గొప్ప బహుమానం) వొసగుతాడు. దాంతో నీవు సంతోషపడతావు.
93:6 أَلَمْ يَجِدْكَ يَتِيمًا فَآوَىٰ
ఏమిటి, నువ్వు అనాధగా ఉండటం చూసి, ఆయన నీకు ఆశ్రయం కల్పించలేదా?
93:7 وَوَجَدَكَ ضَالًّا فَهَدَىٰ
మరి నిన్ను మార్గం తెలియనివానిగా గ్రహించి, సన్మార్గం చూపలేదా?
93:8 وَوَجَدَكَ عَائِلًا فَأَغْنَىٰ
ఇంకా – నిన్ను అభాగ్యునిగా పొంది భాగ్యవంతునిగా చేయలేదా?
93:9 فَأَمَّا الْيَتِيمَ فَلَا تَقْهَرْ
కాబట్టి (ఓ ప్రవక్తా!) నువ్వు కూడా అనాధ పట్ల దురుసుగా ప్రవర్తించకు.
93:10 وَأَمَّا السَّائِلَ فَلَا تَنْهَرْ
యాచించేవానిని కసిరికొట్టకు.
93:11 وَأَمَّا بِنِعْمَةِ رَبِّكَ فَحَدِّثْ
ఇంకా నీ ప్రభువు అనుగ్రహాలను గురించి పొగుడుతూ ఉండు. - సూరా ఆలమ్ నష్ర్
94:1 أَلَمْ نَشْرَحْ لَكَ صَدْرَكَ
(ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం!) ఏమిటి, మేము నీ హృదయాన్ని నీ కోసం విప్పలేదా?
94:2 وَوَضَعْنَا عَنكَ وِزْرَكَ
ఇంకా నీ మీది నుంచి నీ భారాన్ని కూడా మేము దించేశాము.
94:3 الَّذِي أَنقَضَ ظَهْرَكَ
అది నీ వీపును విరిచి వేస్తూ ఉండేది.
94:4 وَرَفَعْنَا لَكَ ذِكْرَكَ
ఇంకా – మేము నీ కీర్తిని ఉన్నతం చేశాము.
94:5 فَإِنَّ مَعَ الْعُسْرِ يُسْرًا
అయితే (ప్రతి) కష్టంతో పాటే సౌలభ్యం కూడా ఉంది.
94:6 إِنَّ مَعَ الْعُسْرِ يُسْرًا
నిశ్చయంగా (ప్రతి) కష్టంతో పాటే సౌలభ్యం కూడా ఉంది.
94:7 فَإِذَا فَرَغْتَ فَانصَبْ
కాబట్టి నీకు తీరిక చిక్కినప్పుడు (ఆరాధనలో) గట్టిగా శ్రమించు.
94:8 وَإِلَىٰ رَبِّكَ فَارْغَب
నీ ప్రభువు వైపే మనసును లగ్నం చెయ్యి. - సూరా అత్ తతీన్
95:1 وَالتِّينِ وَالزَّيْتُونِ
అత్తి పండు సాక్షిగా! ఆలివు సాక్షిగా!
95:2 وَطُورِ سِينِينَ
సినాయ్ పర్వతం సాక్షిగా!
95:3 وَهَٰذَا الْبَلَدِ الْأَمِينِ
శాంతియుతమైన ఈ నగరం (మక్కా) సాక్షిగా!
95:4 لَقَدْ خَلَقْنَا الْإِنسَانَ فِي أَحْسَنِ تَقْوِيمٍ
నిశ్చయంగా మేము మానవుణ్ణి అత్యుత్తమమైన ఆకృతిలో సృజించాము.
95:5 ثُمَّ رَدَدْنَاهُ أَسْفَلَ سَافِلِينَ
అటుపిమ్మట అతణ్ణి అధమాతి అధమ స్థానానికి మళ్ళించాము.
95:6 إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ فَلَهُمْ أَجْرٌ غَيْرُ مَمْنُونٍ
అయితే విశ్వసించి, ఆ పైన మంచి పనులు చేసిన వారికి మాత్రం ఎన్నటికీ తరగని పుణ్యఫలం ఉంది.
95:7 فَمَا يُكَذِّبُكَ بَعْدُ بِالدِّينِ
మరైతే (ఓ మానవుడా!) ప్రతిఫల దినాన్ని ధిక్కరించమని ఏ వస్తువు నిన్ను పురమాయిస్తున్నది.
95:8 أَلَيْسَ اللَّهُ بِأَحْكَمِ الْحَاكِمِينَ
ఏమిటి, అధికారులందరికంటే అల్లాహ్ గొప్ప అధికారి కాడా? - సూరా అల్ అలఖ్
96:1 اقْرَأْ بِاسْمِ رَبِّكَ الَّذِي خَلَقَ
(ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం!) చదువు, సృష్టించిన నీ ప్రభువు పేరుతో.
96:2 خَلَقَ الْإِنسَانَ مِنْ عَلَقٍ
ఆయన మనిషిని నెత్తుటి ముద్దతో సృష్టించాడు.
96:3 اقْرَأْ وَرَبُّكَ الْأَكْرَمُ
నువ్వు చదువుతూ పో. నీ ప్రభువు దయాశీలి.
96:4 الَّذِي عَلَّمَ بِالْقَلَمِ
ఆయన కలం ద్వారా (జ్ఞాన) బోధ చేశాడు.
96:5 عَلَّمَ الْإِنسَانَ مَا لَمْ يَعْلَمْ
ఆయన మనిషికి, అతడు ఎరుగని దానిని నేర్పాడు.
96:6 كَلَّا إِنَّ الْإِنسَانَ لَيَطْغَىٰ
అది కాదు. అసలు విషయం ఏమిటంటే మానవుడు హద్దు మీరి పోతున్నాడు.
96:7 أَن رَّآهُ اسْتَغْنَىٰ
ఎందుకంటే, తనకు ఎవరి అవసరమూ లేదన్న భావన అతనికుంది.
96:8 إِنَّ إِلَىٰ رَبِّكَ الرُّجْعَىٰ
నిశ్చయంగా (అందరూ) మరలిపోవలసింది నీ ప్రభువు వైపే.
96:9 أَرَأَيْتَ الَّذِي يَنْهَىٰ
అడ్డు తగిలేవాడిని నీవు చూశావా?
96:10 عَبْدًا إِذَا صَلَّىٰ
ఒక దాసుణ్ణి , అతను నమాజు చేస్తుండగా (అడ్డుకున్నాడు).
96:11 أَرَأَيْتَ إِن كَانَ عَلَى الْهُدَىٰ
ఇదిగో చూడు! ఒకవేళ అతను గనక సన్మార్గాన ఉంటే…
96:12 أَوْ أَمَرَ بِالتَّقْوَىٰ
లేదా అతను భయభక్తులను గురించి ఆజ్ఞాపిస్తూ ఉన్నట్లయితే…. (అతని గురించి నీ ఉద్దేశం ఏమిటి?)
96:13 أَرَأَيْتَ إِن كَذَّبَ وَتَوَلَّىٰ
ఇదిగో చూడు! వాడేమో ధిక్కార వైఖరిని అవలంబిస్తూ, ముఖం త్రిప్పుకొని పోతుంటే …(వాడి గురించి నీ అభిప్రాయం ఏమిటి?)
96:14 أَلَمْ يَعْلَم بِأَنَّ اللَّهَ يَرَىٰ
ఏమిటి, అల్లాహ్ తనను గమనిస్తున్నాడన్న విషయం అతనికి తెలియదా?
96:15 كَلَّا لَئِن لَّمْ يَنتَهِ لَنَسْفَعًا بِالنَّاصِيَةِ
కానేకాదు. ఒకవేళ వాడు గనక (తన వ్యతిరేక ధోరణిని) మానుకోకపోతే మేము వాడి నుదుటి జుత్తును పట్టి ఈడుస్తాము.
96:16 نَاصِيَةٍ كَاذِبَةٍ خَاطِئَةٍ
అబద్ధాలతో, దురంతాలతో కూడుకున్న (వాడి) నుదుటి జుత్తును!
96:17 فَلْيَدْعُ نَادِيَهُ
(కావాలంటే) వాడు తన సలహా మండలి సభ్యులను (సహాయార్ధం) పిలుచుకోవచ్చు.
96:18 سَنَدْعُ الزَّبَانِيَةَ
మేము కూడా (నరక) భటులను పిలుస్తాము.
96:19 كَلَّا لَا تُطِعْهُ وَاسْجُدْ وَاقْتَرِب ۩
తస్మాత్ జాగ్రత్త! నువ్వు వాడి మాట వినకు. (నీ ప్రభువు సన్నిధిలో) సాష్టాంగ పడి, సామీప్యం పొందు.
- సూరా అల్ ఖద్ర్
97:1 إِنَّا أَنزَلْنَاهُ فِي لَيْلَةِ الْقَدْرِ
నిశ్చయంగా మేము దీనిని (ఈ ఖుర్ఆనును) ఘనమైన రాత్రి యందు అవతరింపజేశాము.
97:2 وَمَا أَدْرَاكَ مَا لَيْلَةُ الْقَدْرِ
ఘనమైన రాత్రి గురించి నువ్వేమనుకున్నావు?
97:3 لَيْلَةُ الْقَدْرِ خَيْرٌ مِّنْ أَلْفِ شَهْرٍ
ఘనమైన రాత్రి వెయ్యి నెలల కంటే కూడా మేలైనది.
97:4 تَنَزَّلُ الْمَلَائِكَةُ وَالرُّوحُ فِيهَا بِإِذْنِ رَبِّهِم مِّن كُلِّ أَمْرٍ
ఆ రాత్రి యందు దైవదూతలు, ఆత్మ (జిబ్రయీల్) తమ ప్రభువు ఉత్తర్వుపై సమస్త విషయాల (నిర్వహణ) నిమిత్తం (దివి నుంచి భూమికి) దిగివస్తారు.
97:5 سَلَامٌ هِيَ حَتَّىٰ مَطْلَعِ الْفَجْرِ
ఆ రాత్రి అసాంతం శాంతియుతమైనది – తెల్లవారే వరకూ (అది ఉంటుంది). - సూరా అల్ బయ్యిన హ్
98:1 لَمْ يَكُنِ الَّذِينَ كَفَرُوا مِنْ أَهْلِ الْكِتَابِ وَالْمُشْرِكِينَ مُنفَكِّينَ حَتَّىٰ تَأْتِيَهُمُ الْبَيِّنَةُ
గ్రంథవహులకు చెందిన తిరస్కారులు, బహుదైవారాధకులు తమ వద్దకు స్పష్టమైన నిదర్శనం రానంతవరకూ (తమ తిరస్కార వైఖరిని) మానుకోనివారుగా ఉండేవారు. (ఇంతకీ ఆ నిదర్శనం ఏమిటంటే…)
98:2 رَسُولٌ مِّنَ اللَّهِ يَتْلُو صُحُفًا مُّطَهَّرَةً
పరిశుద్ధమైన గ్రంథ పత్రములను చదివి వినిపించే దైవప్రవక్త తమ వద్దకు రావాలి.
98:3 فِيهَا كُتُبٌ قَيِّمَةٌ
మరి వాటిలో (ఆ గ్రంథ పత్రాలలో) స్థిరమైన, సవ్యమైన ఆదేశాలు ఉండాలి.
98:4 وَمَا تَفَرَّقَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ إِلَّا مِن بَعْدِ مَا جَاءَتْهُمُ الْبَيِّنَةُ
మరి (ఈ) గ్రంథ వహులు తీరా తమ వద్దకు స్పష్టమైన నిదర్శనం వచ్చేసిన తరువాతే (విభేదించుకొని) చీలిపోయారు.
98:5 وَمَا أُمِرُوا إِلَّا لِيَعْبُدُوا اللَّهَ مُخْلِصِينَ لَهُ الدِّينَ حُنَفَاءَ وَيُقِيمُوا الصَّلَاةَ وَيُؤْتُوا الزَّكَاةَ ۚ وَذَٰلِكَ دِينُ الْقَيِّمَةِ
వారు అల్లాహ్ నే ఆరాధించాలని ధర్మాన్ని ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలనీ, ఏకాగ్రచిత్తులై – నమాజును నెలకొల్పాలనీ, జకాత్ ను ఇస్తూ ఉండాలని మాత్రమే వారికి ఆదేశించబడింది. ఇదే స్థిరమైన సవ్యమైన ధర్మం.
98:6 إِنَّ الَّذِينَ كَفَرُوا مِنْ أَهْلِ الْكِتَابِ وَالْمُشْرِكِينَ فِي نَارِ جَهَنَّمَ خَالِدِينَ فِيهَا ۚ أُولَٰئِكَ هُمْ شَرُّ الْبَرِيَّةِ
గ్రంథవహులలో తిరస్కారవైఖరికి పాల్పడినవారు, బహుదైవారాధకులు తప్పకుండా నరకాగ్నికి ఆహుతి అవుతారు. వారందులో కలకాలం ఉంటారు. వారు సృష్టితాలలో అందరికంటే చెడ్డవారు.
98:7 إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ أُولَٰئِكَ هُمْ خَيْرُ الْبَرِيَّةِ
అయితే విశ్వసించి, సత్కార్యాలు చేసినవారు; నిశ్చయంగా సృష్టిలో వారే అందరికన్నా ఉత్తములు.
98:8 جَزَاؤُهُمْ عِندَ رَبِّهِمْ جَنَّاتُ عَدْنٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا أَبَدًا ۖ رَّضِيَ اللَّهُ عَنْهُمْ وَرَضُوا عَنْهُ ۚ ذَٰلِكَ لِمَنْ خَشِيَ رَبَّهُ
వారికి ప్రతిఫలంగా వారి ప్రభువు దగ్గర శాశ్వతమైన స్వర్గ వనాలున్నాయి. వాటి క్రింద కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. వాటిలో వారు కలకాలం ఉంటారు. అల్లాహ్ వారి పట్ల ప్రసన్నుడయ్యాడు. వారు అల్లాహ్ పట్ల సంతోషపడ్డారు. ఈ అనుగ్రహ భాగ్యం తన ప్రభువుకు భయపడే వానికి మాత్రమే.
- సూరా అజ్ జిలజాల్
99:1 إِذَا زُلْزِلَتِ الْأَرْضُ زِلْزَالَهَا
భూమి చాలా తీవ్రమైన తన ప్రకంపనలతో కంపింపజేయబడినప్పుడు,
99:2 وَأَخْرَجَتِ الْأَرْضُ أَثْقَالَهَا
మరి భూమి తన బరువులన్నింటినీ తీసి బయట పడవేసినప్పుడు,
99:3 وَقَالَ الْإِنسَانُ مَا لَهَا
“అరె! దీనికేమైపోయిందీ?” అని మనిషి (కలవరపడుతూ)అంటాడు.
99:4 يَوْمَئِذٍ تُحَدِّثُ أَخْبَارَهَا
ఆ రోజు భూమి తన సంగతులన్నీ వివరిస్తుంది.
99:5 بِأَنَّ رَبَّكَ أَوْحَىٰ لَهَا
ఎందుకంటే నీ ప్రభువు దానికి, ఆ మేరకు ఆజ్ఞాపించి ఉంటాడు.
99:6 يَوْمَئِذٍ يَصْدُرُ النَّاسُ أَشْتَاتًا لِّيُرَوْا أَعْمَالَهُمْ
ఆ రోజు జనులు – వారి కర్మలు వారికి చూపబడేందుకుగాను – వేర్వేరు బృందాలుగా తరలి వస్తారు.
99:7 فَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ خَيْرًا يَرَهُ
కనుక ఎవడు అణుమాత్రం సత్కార్యం చేసినా దాన్ని అతను చూసుకుంటాడు.
99:8 وَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ شَرًّا يَرَهُ
మరెవడు అణుమాత్రం దుష్కార్యం చేసినా దాన్ని అతను చూసుకుంటాడు. - సూరా అల్ ఆదియాత్
100:1 وَالْعَادِيَاتِ ضَبْحًا
రొప్పుతూ, రివ్వున దూసుకుపోయే గుర్రాల సాక్షిగా!
100:2 فَالْمُورِيَاتِ قَدْحًا
మరి డెక్కల రాపిడితో నిప్పు రవ్వలను చెరిగేవాటి సాక్షిగా!
100:3 فَالْمُغِيرَاتِ صُبْحًا
మరి ప్రభాత సమయాన (ప్రత్యర్ధులపై) మెరుపుదాడి చేసేవాటి సాక్షిగా!
100:4 فَأَثَرْنَ بِهِ نَقْعًا
– మరి ఆ సమయంలో అవి దుమ్ము ధూళిని రేపుతాయి.
100:5 فَوَسَطْنَ بِهِ جَمْعًا
మరి దాంతో పాటు (శత్రు) సైనిక పంక్తుల మధ్యలోకి చొచ్చుకు పోతాయి.
100:6 إِنَّ الْإِنسَانَ لِرَبِّهِ لَكَنُودٌ
అసలు విషయం ఏమిటంటే మానవుడు తన ప్రభువు (విషయంలో) చేసిన మేలును మరచినవాడుగా తయారయ్యాడు.
100:7 وَإِنَّهُ عَلَىٰ ذَٰلِكَ لَشَهِيدٌ
నిజానికి ఈ విషయానికి స్వయంగా అతనే సాక్షి!
100:8 وَإِنَّهُ لِحُبِّ الْخَيْرِ لَشَدِيدٌ
యదార్ధానికి అతను ధన ప్రేమలో మహా ఘటికుడు.
100:9 أَفَلَا يَعْلَمُ إِذَا بُعْثِرَ مَا فِي الْقُبُورِ
ఏమిటి, సమాధుల్లోని వాటిని బయటికి కక్కించబడే సమయం గురించి అతనికి తెలియదా?
100:10 وَحُصِّلَ مَا فِي الصُّدُورِ
గుండెల్లోని గుట్టంతా రట్టు చేయబడే సమయం గురించి (అతనికి తెలీదా?)
100:11 إِنَّ رَبَّهُم بِهِمْ يَوْمَئِذٍ لَّخَبِيرٌ
నిశ్చయంగా ఆ రోజు వారి ప్రభువుకు వారి గురించి బాగా తెలిసి ఉంటుంది. - సూరా అల్ ఖారియ హ్
101:1 الْقَارِعَةُ
ఎడా పెడా బాదేది.
101:2 مَا الْقَارِعَةُ
ఏమిటీ, ఆ ఎడా పెడా బాదేది?
101:3 وَمَا أَدْرَاكَ مَا الْقَارِعَةُ
ఆ ఎడా పెడా బాదే దాని గురించి నీకేం తెలుసు?
101:4 يَوْمَ يَكُونُ النَّاسُ كَالْفَرَاشِ الْمَبْثُوثِ
ఆ రోజు మనుషులు చెల్లాచెదురైన దీపపు పురుగుల్లా అయిపోతారు.
101:5 وَتَكُونُ الْجِبَالُ كَالْعِهْنِ الْمَنفُوشِ
పర్వతాలు ఏకిన రంగు రంగుల దూది పింజాల్లా (లేక ఉన్నిలా) అయిపోతాయి.
101:6 فَأَمَّا مَن ثَقُلَتْ مَوَازِينُهُ
ఎవరి త్రాసు పళ్ళాలు బరువుగా ఉంటాయో.
101:7 فَهُوَ فِي عِيشَةٍ رَّاضِيَةٍ
అతను మనసు మెచ్చిన భోగ భాగ్యాలతో కూడిన జీవితంలో ఉంటాడు.
101:8 وَأَمَّا مَنْ خَفَّتْ مَوَازِينُهُ
మరెవరి త్రాసు పళ్ళాలు తేలికగా ఉంటాయో,
101:9 فَأُمُّهُ هَاوِيَةٌ
అతని నివాస స్థానం ‘హావియా’ అవుతుంది.
101:10 وَمَا أَدْرَاكَ مَا هِيَهْ
అదేమిటో (‘హావియా’ అంటే ఏమిటో) నీకేం తెలుసు?
101:11 نَارٌ حَامِيَةٌ
అది దహించివేసే అగ్ని. - సూరా అత్ తకాసుర్
102:1 أَلْهَاكُمُ التَّكَاثُرُ
అధికంగా పొందాలన్న ఆశ మిమ్మల్ని పరధ్యానంలో పడవేసింది.
102:2 حَتَّىٰ زُرْتُمُ الْمَقَابِرَ
ఆఖరికి మీరు (ఈ ఆశల ఆరాటంలోనే) సమాధులకు చేరుకుంటారు.
102:3 كَلَّا سَوْفَ تَعْلَمُونَ
ఎన్నటికీ కాదు, మీరు తొందరగానే తెలుసుకుంటారు.
102:4 ثُمَّ كَلَّا سَوْفَ تَعْلَمُونَ
మరెన్నటికీ కాదు…. మీరు చాలా తొందరగానే తెలుసుకుంటారు.
102:5 كَلَّا لَوْ تَعْلَمُونَ عِلْمَ الْيَقِينِ
అది కాదు. మీరు గనక నిశ్చిత జ్ఞానంతో తెలుసుకున్నట్లయితే (అసలు పరధ్యానంలోనే పడి ఉండరు).
102:6 لَتَرَوُنَّ الْجَحِيمَ
మీరు నరకాన్ని చూసి తీరుతారు.
102:7 ثُمَّ لَتَرَوُنَّهَا عَيْنَ الْيَقِينِ
అవును! మీరు దానిని ఖచ్చితంగా కళ్ళారా చూస్తారు సుమా!
102:8 ثُمَّ لَتُسْأَلُنَّ يَوْمَئِذٍ عَنِ النَّعِيمِ
మరి ఆ రోజు (దేవుని) అనుగ్రహాల గురించి మిమ్మల్ని తప్పకుండా ప్రశ్నించటం జరుగుతుంది. - సూరా అల్ అస్ర్
103:1 وَالْعَصْرِ
కాలం సాక్షిగా!
103:2 إِنَّ الْإِنسَانَ لَفِي خُسْرٍ
నిశ్చయంగా మానవుడు నష్టంలో పడి ఉన్నాడు.
103:3 إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَتَوَاصَوْا بِالْحَقِّ وَتَوَاصَوْا بِالصَّبْرِ
అయితే విశ్వసించి, సత్కార్యాలు చేసినవారు, పరస్పరం సత్యం గురించి ఉపదేశించినవారు, ఒండొకరికి సహనం (స్థయిర్యం) గురించి తాకీదు చేసినవారు మాత్రం నష్టపోరు.
- సూరా అల్ హుమజా హ్
104:1 وَيْلٌ لِّكُلِّ هُمَزَةٍ لُّمَزَةٍ
(ఇతరుల) తప్పులెన్నుతూ, పరోక్ష నిందకు పాల్పడే ప్రతి ఒక్కడికీ మూడుతుంది.
104:2 الَّذِي جَمَعَ مَالًا وَعَدَّدَهُ
వాడు ధనాన్ని పోగుచేసి, పదే పదే లెక్కపెడుతూ ఉంటాడు.
104:3 يَحْسَبُ أَنَّ مَالَهُ أَخْلَدَهُ
తన ధనం ఎల్లకాలం తన వెంటే ఉంటుందని వాడనుకుంటున్నాడు.
104:4 كَلَّا ۖ لَيُنبَذَنَّ فِي الْحُطَمَةِ
ఎన్నటికీ అలా జరగదు. వాడు తుత్తునియలు చేసివేసే దాంట్లో విసిరివేయబడతాడు.
104:5 وَمَا أَدْرَاكَ مَا الْحُطَمَةُ
ఆ తుత్తునియలు చేసివేసే దాన్ని గురించి ఏమనుకున్నావు?
104:6 نَارُ اللَّهِ الْمُوقَدَةُ
అది అల్లాహ్ రాజేసినటువంటి అగ్ని.
104:7 الَّتِي تَطَّلِعُ عَلَى الْأَفْئِدَةِ
అది హృదయాల వరకూ చొచ్చుకు పోయేటటువంటిది.
104:8 إِنَّهَا عَلَيْهِم مُّؤْصَدَةٌ
ఆ అగ్ని వారిపై అన్ని వైపుల నుండీ మూసివేయబడుతుంది.
104:9 فِي عَمَدٍ مُّمَدَّدَةٍ
వారు పొడవాటి స్తంభాల (అగ్నికీలల) మధ్య (చిక్కుకుని ఉంటారు). - సూరా అల్ ఫీల్
105:1 أَلَمْ تَرَ كَيْفَ فَعَلَ رَبُّكَ بِأَصْحَابِ الْفِيلِ
ఏమిటీ, నీ ప్రభువు ఏనుగుల వారి పట్ల వ్యవహరించిన తీరును నీవు చూడలేదా?
105:2 أَلَمْ يَجْعَلْ كَيْدَهُمْ فِي تَضْلِيلٍ
ఏమిటీ, వాళ్ళ కుట్రను (ఆయన) భగ్నం చేయలేదా?
105:3 وَأَرْسَلَ عَلَيْهِمْ طَيْرًا أَبَابِيلَ
వాళ్ళపై ఆయన గుంపులు గుంపులుగా పక్షులను పంపించాడు.
105:4 تَرْمِيهِم بِحِجَارَةٍ مِّن سِجِّيلٍ
అవి వారిపై మట్టితో తయారైన కంకర్రాళ్లను కురిపించసాగాయి.
105:5 فَجَعَلَهُمْ كَعَصْفٍ مَّأْكُولٍ
ఎట్టకేలకు, ఆయన వారిని తిని (తొక్కి వేసి)న తొక్కు మాదిరిగా చేసేశాడు.
- సూరా ఖురైష్
106:1 لِإِيلَافِ قُرَيْشٍ
ఖురైషులను అలవాటు చేసిన కారణంగా,
106:2 إِيلَافِهِمْ رِحْلَةَ الشِّتَاءِ وَالصَّيْفِ
(అంటే) చలికాలపు, ఎండాకాలపు ప్రయాణాలకు వారిని అలవాటు చేసిన కారణంగా,
106:3 فَلْيَعْبُدُوا رَبَّ هَٰذَا الْبَيْتِ
వారు ఈ (కాబా) గృహం యెక్క ప్రభువునే ఆరాధించాలి.
106:4 الَّذِي أَطْعَمَهُم مِّن جُوعٍ وَآمَنَهُم مِّنْ خَوْفٍ
ఆయనే వారికి ఆకలిగొన్నప్పుడు అన్నం పెట్టాడు. భయాందోళనల స్థితిలో భద్రత కల్పించాడు.
- సూరా అల్ మాఊ న్
107:1 أَرَأَيْتَ الَّذِي يُكَذِّبُ بِالدِّينِ
తీర్పు (దినము)ను ధిక్కరించే వాడిని నీవు చూశావా?!
107:2 فَذَٰلِكَ الَّذِي يَدُعُّ الْيَتِيمَ
వీడే అనాధను గెంటివేసేవాడు.
107:3 وَلَا يَحُضُّ عَلَىٰ طَعَامِ الْمِسْكِينِ
నిరుపేదకు అన్నం పెట్టమని కనీసం (ఇతరులకు) ప్రేరేపించనివాడు.
107:4 فَوَيْلٌ لِّلْمُصَلِّينَ
ఆ నమాజీలకు వినాశం తప్పదు (‘వైల్’ అనే నరక స్థానం వారికొరకు ఉన్నది).
107:5 الَّذِينَ هُمْ عَن صَلَاتِهِمْ سَاهُونَ
(ఎందుకంటే) వారు తమ నమాజుల పట్ల అశ్రద్ధ వహిస్తారు.
107:6 الَّذِينَ هُمْ يُرَاءُونَ
వారు (ఒకవేళ నమాజు చేసినా)పరులకు చూపటానికి చేస్తారు.
107:7 وَيَمْنَعُونَ الْمَاعُونَ
అతి సామాన్యమైన వాడుక వస్తువులు సయితం ఇవ్వటానికి వారు నిరాకరిస్తారు.
- సూరా అల్ కౌసర్
108:1 إِنَّا أَعْطَيْنَاكَ الْكَوْثَرَ
నిశ్చయంగా మేము నీకు కౌసర్ (సరస్సును, మరెన్నో వరాల)ను ప్రసాదించాము.
108:2 فَصَلِّ لِرَبِّكَ وَانْحَرْ
కాబట్టి నువ్వు నీ ప్రభువు కోసమే నమాజు చెయ్యి, ఖుర్బానీ ఇవ్వు.
108:3 إِنَّ شَانِئَكَ هُوَ الْأَبْتَرُ
ముమ్మాటికీ నీ శత్రువే నామరూపాల్లేకుండా పోయేవాడు.
- సూరా అల్ ఖాఫిరూన్
109:1 قُلْ يَا أَيُّهَا الْكَافِرُونَ
(ఓ ప్రవక్తా! వారికి) చెప్పు : “ఓ తిరస్కారులారా!”
109:2 لَا أَعْبُدُ مَا تَعْبُدُونَ
మీరు ఆరాధించే వాటిని నేను ఆరాధించటం లేదు.
109:3 وَلَا أَنتُمْ عَابِدُونَ مَا أَعْبُدُ
నేను ఆరాధిస్తున్న వానిని మీరు ఆరాధించరు.
109:4 وَلَا أَنَا عَابِدٌ مَّا عَبَدتُّمْ
మీరు ఆరాధించే వాటిని నేను అరాధించబోను.
109:5 وَلَا أَنتُمْ عَابِدُونَ مَا أَعْبُدُ
మరి నేను ఆరాధించేవానిని మీరెలాగూ ఆరాధించరు.
109:6 لَكُمْ دِينُكُمْ وَلِيَ دِينِ
మీ ధర్మం మీది, నా ధర్మం నాది.”
- సూరా అన్ నస్ర్
110:1 إِذَا جَاءَ نَصْرُ اللَّهِ وَالْفَتْحُ
(ఓ ప్రవక్తా!) అల్లాహ్ సహాయం అందినప్పుడు, విజయం వరించినప్పుడు,
110:2 وَرَأَيْتَ النَّاسَ يَدْخُلُونَ فِي دِينِ اللَّهِ أَفْوَاجًا
ప్రజలు గుంపులు గుంపులుగా అల్లాహ్ ధర్మంలోకి వచ్చి చేరటాన్ని నీవు చూసినప్పుడు,
110:3 فَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ وَاسْتَغْفِرْهُ ۚ إِنَّهُ كَانَ تَوَّابًا
నీవు నీ ప్రభువు స్తోత్రంతో సహా ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉండు, మన్నింపుకై ఆయన్ని ప్రార్ధించు. నిస్సందేహంగా ఆయన మహా గొప్పగా పశ్చాత్తాపాన్ని ఆమోదించే వాడు.
- సూరా అల్ లహబ్
111:1 تَبَّتْ يَدَا أَبِي لَهَبٍ وَتَبَّ
అబూ లహబ్ చేతులు రెండూ విరిగి పోయాయి. వాడు సయితం నాశనం అయిపోయాడు.
111:2 مَا أَغْنَىٰ عَنْهُ مَالُهُ وَمَا كَسَبَ
వాడి ధనంగానీ, వాడి సంపాదన గాని వాడికే మాత్రం పనికి రాలేదు.
111:3 سَيَصْلَىٰ نَارًا ذَاتَ لَهَبٍ
త్వరలోనే వాడు భగ భగ మండే అగ్నికి ఆహుతి అవుతాడు.
111:4 وَامْرَأَتُهُ حَمَّالَةَ الْحَطَبِ
ఇంకా అతని భార్య; పుల్లలు మోసుకుంటూ ఆమె కూడా (నరకానికి పోతుంది).
111:5 فِي جِيدِهَا حَبْلٌ مِّن مَّسَدٍ
ఆమె మెడలో (ఖర్జూర ఆకుతో) గట్టిగా పేనిన ఒక త్రాడు ఉంటుంది.
- సూరా అల్ ఇఖ్లాస్
112:1 قُلْ هُوَ اللَّهُ أَحَدٌ
(ఓ ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం!) వారికి ఇలా చెప్పు: అల్లాహ్ (నిజమైన ఆరాధ్యుడు)ఒక్కడు.
112:2 اللَّهُ الصَّمَدُ
అల్లాహ్ నిరపేక్షాపరుడు.(ఏ అక్కరా లేనివాడు).
112:3 لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ
ఆయన (ఎవరినీ) కనలేదు. ఆయన (కూడా) ఎవరికీ పుట్టినవాడు కాడు.
112:4 وَلَمْ يَكُن لَّهُ كُفُوًا أَحَدٌ
ఆయనకు సరిసమానుడు (పోల్చదగిన వాడు) ఎవడూ లేడు.
- సూరా అల్ ఫలఖ్
113:1 قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ
చెప్పు: నేను ప్రాతఃకాలపు ప్రభువు శరణు కోరుతున్నాను –
113:2 مِن شَرِّ مَا خَلَقَ
ఆయన సృష్టించిన వాటన్నింటి కీడు నుండి,
113:3 وَمِن شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ
కటిక చీకటి క్రమ్ముకున్నప్పటి రాత్రి చీకటి కీడు నుండి,
113:4 وَمِن شَرِّ النَّفَّاثَاتِ فِي الْعُقَدِ
(మంత్రించి)ముడులలో ఊదే వారి కీడు నుండి,
113:5 وَمِن شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ
అసూయపరుడు అసూయచెందినప్పటి కీడు నుండి (నేను నా ప్రభువు రక్షణ కోరుతున్నాను).
- సూరా అన్ నాస్
114:1 قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ
(ఈ విధంగా) చెప్పు: “నేను మానవుల ప్రభువు రక్షణ కోరుతున్నాను.
114:2 مَلِكِ النَّاسِ
మానవుల చక్రవర్తిని,
114:3 إِلَٰهِ النَّاسِ
మానవుల ఆరాధ్య దైవాన్ని (ఆశ్రయిస్తున్నాను) –
114:4 مِن شَرِّ الْوَسْوَاسِ الْخَنَّاسِ
దురాలోచనలను రేకెత్తించే,తప్పించుకునే వాడి కీడు నుండి,
114:5 الَّذِي يُوَسْوِسُ فِي صُدُورِ النَّاسِ
వాడు జనుల హృదయాలలో దురాలోచనలను రేకెత్తిస్తాడు –
114:6 مِنَ الْجِنَّةِ وَالنَّاسِ
వాడు జిన్ను వర్గానికి చెందినవాడైనా సరే, మానవ వర్గానికి చెందినవాడైనా సరే!