స్వచ్చమైన ఇస్లాం ఏమిటి? [పుస్తకం]

స్వచ్చమైన ఇస్లాం ఏమిటి? [పుస్తకం]

ఇటీవల కొందరు ముస్లింలు ఖుర్ఆన్, హదీసుల ప్రకారం ఆచరించే వారిని “కొత్త వర్గం, కొత్త ధర్మం” పేరుతో గుర్తు చేసుకుంటారు. దాన్ని కూడ అతిక్రమిస్తూ నలుగురు ఇమాములలోని ఎవరైనా ఒక్క ఇమామును కూడా అనుసరించని వారిని ‘గైర్ ముఖల్లిద్“లని, ఇస్లాం ధర్మానికి దూరమైన వారనీ, వివిధ బిరుదులతో సత్కరిస్తారు. ఇంకా ఏఏ పేర్లతో పిలుస్తారో కూడా తెలియదు. అసలు ఈ ఖుర్ఆన్, హదీస్లను ఆచరించడానికి ప్రామాణికత ఏమిటి?.

ప్రజల అవగాహన కోసం ప్రామాణిక ఆధారాల ద్వారా నిరూపితమైన సంవత్సరాలను ఈ పుస్తకంలో పొందుపరుస్తున్నాం. ఈ పుస్తకం అసలు ఉద్దేశం అన్ని రకాల ప్రారంభ సంవత్సరాలను తెలుపడం. ఖుర్ఆన్, హదీసులను ఎప్పటి నుండి ఆచరిస్తున్నారు?. వ్యక్తి అనుకరణమరియు నలుగురు ధార్మిక పండితుల అనుకరణ ఎప్పుడు మొదలైంది? ఇది ఇస్లాం ధర్మంలో ఎలా మొదలైంది ? హదీస్ మరియు ఫిఖాల్లో మార్పులు చేయడం ఎప్పటి నుండి జరుగుతుంది? అంతే కాకుండా నలుగురు ఇమాములు వ్యాఖ్యలను పేర్కొని వాటి వివరణ రాయడం జరిగింది. తద్వారా కొత్త, పాత విషయాలను తులనాత్మకంగా చూసుకోవడానికి.

[ఇక్కడ పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [37 పేజీలు]

ఇన్నల్ హమ్ ద లిల్లాహి, నహ్మదుహూ వ నస్తతఈహూ వ నసగ్ఫిరుహూ, వ నఊజు బిల్లాహి మిన్ షురూరి అన్ ఫుసినా  వ సయ్యిఆతి ఆమాలినా, మన్ యహ్ ది హిల్లాహు ఫలా ముజిల్లలహ్, వ మన్ యుజ్లిలు  ఫలా హాదియలహ్, వ అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్ హదు లాషరీక లహూ, వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహ్ అమ్మాబాద్

పాఠకులారా! అస్సలాము అలైకుమ్.

తౌహీద్ పబ్లిషర్స్ నెలకొల్పినప్పటి నుండి తన పాఠకుల కోసంబు ఖుర్ఆన్, హదీసులతో కూడుకున్న స్వచ్ఛమైన ఇస్లామీయ సాహిత్యాన్నిఅందించే సౌభాగ్యాన్ని పొందుతుంది. సంస్థ వ్యవస్థాపకులు సోదరులు ముహమ్మద్ రహ్మతుల్లాహ్ ఖాన్ (అడ్వకేట్) మరియు ఇంజినీర్ షాహిద్ సత్తార్ మా పుస్తకాలతో పాటు అవసరమనిపించిన పుస్తకాలన్ని పాఠకులకోసం ఉత్తమమైన పద్ధతిలో ప్రవేశపెడతారు.

“స్వచ్ఛమైన ఇస్లాం ఏమిటి? ఈ చిరు పుస్తకం కూడా మొదట భారత దేశంలో ప్రచురించబడింది. దాన్ని సవరించి అధునాతనంగా ప్రచురించడం జరిగింది. తొలి ఎడీషన్ మరియు ప్రస్తుత ఏడీషన్లో తేడాను పాఠకులు గమనించగలరని ఆశిస్తున్నాం.

ఈ పుస్తక రచయిత జనాబ్ ముహమ్మద్ ఇస్మాయీల్ జర్తార్గర్ (హైదరాబాద్) మరియు నూతన ప్రచురణలో సహాయం చేసిన మిత్రులందరికీ ఇహపరాలలో మంచి ప్రతిఫలం లభించాలని అల్లాహ్ను వేడుకుంటున్నాను. అల్లాహ్ ఈ పుస్తకాలన్నీ స్వీకరించుగాక! ఆమీన్.

వస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహూ
అబూ అద్నాన్ ముహమ్మద్ మునీర్ ఖమర్
హి.శ 1432 షవ్వాల్-2
సుప్రీంకోర్టు ప్రతినిధి, అల్ ఖుబర్ (సౌదీ)
క్రీ.శ 2011 ఆగస్టు-31సందేశ ప్రచారకులు అల్ ఖుబర్,అల్ జుహ్రాన్, అల్ దమ్మాహ్

నహ్మదుహూ వ నుసల్లి అలా వ రసూలిహిల్ కరీమ్ అమ్మాబాద్

“స్వచ్ఛమైన ఇస్లాం ఏమిటి” అనే పుస్తకం లోగడ ప్రచురించబడింది. పాఠకులు ఈ పుస్తకం ద్వారా ప్రయోజనం పొందారు. దానికి మరికొన్ని విషయాలు చేర్చి మళ్లీ ప్రచురిస్తున్నాం. దీని ప్రచారం, ప్రచురణలో ఆర్థికంగా సహాయం చేసిన శ్రేయోభిలాషులకు అల్లాహ్ మంచి ప్రతిఫలం ఇవ్వాలని ప్రార్ధిస్తున్నాను.

ముహమ్మద్ ఇస్మాయీల్
జర్తార్గర్ , 6-15

ఇటీవల కొందరు ముస్లింలు ఖుర్ఆన్, హదీసుల ప్రకారం ఆచరించేవారిని “కొత్త వర్గం, కొత్త ధర్మం” పేరుతో గుర్తు చేసుకుంటారు.దాన్ని కూడ అతిక్రమిస్తూ నలుగురు ఇమాములలోని ఎవరైనా ఒక్క ఇమామును కూడా అనుసరించని వారిని ‘గైర్ ముఖల్లిద్”లని, ఇస్లాం ధర్మానికి దూరమైన వారనీ, వివిధ బిరుదులతో సత్కరిస్తారు. ఇంకా ఏఏ పేర్లతో పిలుస్తారో కూడా తెలియదు. అసలు ఈ ఖుర్ఆన్, హదీస్లను ఆచరించడానికి ప్రామాణికత ఏమిటి?.

ప్రజల అవగాహన కోసం ప్రామాణిక ఆధారాల ద్వారా నిరూపితమైన సంవత్సరాలను ఈ పుస్తకంలో పొందుపరుస్తున్నాం. ఈ పుస్తకం అసలు ఉద్దేశం అన్ని రకాల ప్రారంభ సంవత్సరాలను తెలుపడం. ఖుర్ఆన్, హదీసులను ఎప్పటి నుండి ఆచరిస్తున్నారు?. వ్యక్తి అనుకరణ మరియు నలుగురు ధార్మిక పండితులు అనుకరణ ఎప్పుడు మొదలైంది? ఇది ఇస్లాం ధర్మంలో ఎలా మొదలైంది? హదీస్ మరియు ఫిఖాల్లో మార్పులు చేయడం ఎప్పటి నుండి జరుగుతుంది? అంతే కాకుండా నలుగురు ఇమాములు వ్యాఖ్యలను పేర్కొని వాటి వివరణ రాయడంజరిగింది. తద్వారా కొత్త, పాత విషయాలను తులనాత్మకంగా చూసుకోవడానికి. 

అనేక మంది సలఫీ పండితులు ఫిర్ఖా ల (వర్గాల) గురించి పెద్దపెద్ద గ్రంధాలు రచించారు. కాని మాకు వాటి వివరాల్లోకి వెళ్లాల్సినఅవసరం లేదు.

సోదరులారా! నేను మిమ్మల్ని విన్నవించుకునేదేమిటంటే, వివక్షను వీడి పారదర్శకంగా, సంస్కరణ దృష్టితో న్యాయంగా ఆలోచించండి.కొత్త పాత విషయాలను సమీక్షించండి. మన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) దైవ దౌత్య కాలం మక్కా మదీనాల్లో 23 సవంత్సరాలు, ఖులఫాయే రాషిదీన్ల కాలం సుమారు 30 యేళ్లు, సహాబాల కాలం సుమారు 60 యేళ్లు. ఇలా సుమారు హి.శ 1 నుంచి 100 యేళ్లు గడిచాయి. ఆ విశ్వాసులందరూ దైవవాణి, ఖుర్ఆన్, హదీస్లను అనుసరించేవారు.అంటే వారు ఖుర్ఆన్ మరియు హదీసుల ప్రకారం ఆచరించేవారు.తొలి శతాబ్దానికి చెందిన ఈ విశ్వాసులు, ధర్మాభిమానులు లక్షల్లోఉండేవారు. మరి వారందరూ ఏ ఇమామును అనుసరించేవారు? వారినిఏ ఇమామ్  అనుసరణీయులుగా పిలిచేవారు? వారు హనఫీలా?మాలికీలా? షాఫయీలా? లేదా హంబలీలా? అనే ప్రశ్న సహజంగానేఉత్పన్నం అవుతుంది.

రెండో ప్రశ్న ఏమిటంటే, ఆ కాలంలో ఈ ఇమామ్ లు వేరు వేరుధర్మాలు ఆచారంలో ఉండేవా?

మూడో ప్రశ్న ఏమిటంటే తొలి శతాబ్ది విశ్వాసులు (ఖులఫాయే రాషిదీన్ మరియు సహాబాలు, తాబాయీన్లు) ఖుర్ఆన్, హదీసుల ప్రకారంనడుచుకునే వారిపై కూడా ఈ అభియోగం మోపబడుతుందా?

దీనికి సమాధానం “లేదు” అనే వస్తుంది. ఎందుకంటే మొదటి హిజ్రీ లో నలుగురు ఇమాముల ఉనికే లేదు. అప్పటికి వారు పుట్టనూలే దు. దీని ద్వారా మొదటి హిజ్రిలో వ్యక్తి అనుకరణ మరియు ఇమాములు అనుసరణ, మరియు నాలుగు ధర్మవర్గాలు లేవు అన్నది సుస్పష్టం.ఇమాముల పుట్టుక ద్వారా ఈ విషయం మరింత రూడీ అవుతుంది. . ఇమామ్ ఇమాహ్ అబూ హనీఫా  (రహిమహుల్లాహ్) హి.శ 80 లో జన్మించారు. ఇమాం మాలిక్  (రహిమహుల్లాహ్) హి.శ 93 లో జన్మించారు. ఇతర ఇమామ్లు షాఫయీ (రహిమహుల్లాహ్), ఇమాహ్ అహ్మద్ బిన్ హంబల్  (రహిమహుల్లాహ్) రెండో శతాబ్దంలోజన్మించారు. నిరాధారంగా అభియోగాలు మోపేవారు ప్రాశ్చాత్తాపం చెందాలి. ఇలాంటి అగౌరవ పరిచే మాటలకు దూరంగా ఉండాలి.ప్రపంచంలోనే సరిగ్గా సమాధానం చెప్పలేని వారు ప్రళయం నాడుఎలా సమాధానం చెబుతారో తెలియదు.

ఈ వివరణ ద్వారా స్పష్టమవుతున్న విషయం ఏమిటంటే, ఇస్లామ్అంటే.. .ఖుర్ఆన్ మరియు హదీసులను ఆచరించడం..

ఇస్లామ్ లోబడి ఉంది….. ఖుర్ఆన్ మరియు హదీసుల పరిధిలో

ఇస్లామ్ సంపూర్ణ ధర్మం. దైవవాణి ద్వారా దీని ధ్రువీకరణ అవుతుంది. అల్లాహ్ మన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)పై హజ్జతుల్ విదా సందర్భంగా ఈ ఆయత్ మాయిదా-3:

الْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِينَكُمْ وَأَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي وَرَضِيتُ لَكُمُ الْإِسْلَامَ دِينًا

(అల్ యౌమ అక్ మల్ తు లకుమ్  దీనకుమ్ వ అత్మముఅలైకుమ్ నేమతీ వ రజీలకు లకుముల్ ఇస్లామ దీనా) (సూరా అల్ మాయిద 5:3)

అనువాదం: ఈనాడు నేను మీ ధర్మాన్ని మీ కొరకు పరిపూర్ణంచేశాను. మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను. మీ కొరకు ఇస్లామ్ను మీ ధర్మంగా అంగీకరించాను.

అవతరింపజేసి ఇస్లాం ధర్మం పూర్తయిందనే ముద్రవేశాడు. ఏ ముస్లిమూ దీన్ని తిరస్కరించ లేదు. కనుక ఈ ఆయత్ నేపద్యంలో ఎవరికీ ఇస్లాం ధర్మంలో కొత్త విషయం సృష్టించడం గాని, ఏ విషయాన్నైనా తీసి వేయడంగాని, లేదా ఏదైనా తక్కువైందని పెంచడం గాని చేసే హక్కు ఎవరికీ లేదు. ఎవరైనా ఇలాంటి జోక్యం చేసుకుంటే అది ఖుర్ఆన్ ఆయత్ ను తిరస్కరించడం అవుతుంది. ప్రళయంలో ఇలాంటి తిరస్కారుల గతి ఏంకాను? దీని ద్వారా స్పష్టమైన విషయం ఏమిటంటే ఖురాన్ హదీసుల ఆచరణే “ఇస్లాం”. ఇస్లాం పరిధి ఖుర్ఆన్, హదీసులవరకే పరిమితమై ఉంది.

ఇస్లాం సంపూర్ణ ధర్మం. దైవవాణి ఖుర్ఆన్ తో ఈ విషయం రూఢీ అవుతుంది. ఖుర్ఆన్లో అల్లాహ్ అనేక చోట్ల ఇలా తాకీదు చేశాడు

وَأَطِيعُوا اللَّهَ وَأَطِيعُوا الرَّسُولَ

“వ అతీఉల్లాహ వ అతీవుర్రసూల్”,
అల్లాహ్ మరియు అల్లాహ్ ప్రవక్తకు విధేయత కలిగి ఉండండి.. (సూరే తగాబున్ 64:12)

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రబోధించారు: మూసా (అలైహిస్సలాం) సమాజంలో 71వర్గాలున్నాయి. క్రైస్తవులు 22 వర్గాలయ్యారు. నా సమాజంలో 73 వర్గాలుఏర్పడతాయి. అందులో 72 వర్గాలు నరకానికి పోతాయి. ఒక్క వర్గమే స్వర్గానికి వెళ్తుంది.

సహబాలు “ఓ దైవప్రవక్తా! అది ఏ వర్గం అయి ఉంటుంది?”అని ప్రశ్నించారు.

అప్పుడు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “నేనూ, నా అనుయాయులు అనుసరించే మార్గం” అని సమాధానం ఇచ్చారు.

మన ప్రవక్త స్వర్గానికి వెళ్లే మార్గ ఆనవాలు చాలా స్పష్టంగాతెలిపారు. కనుక మనకు వేరే మార్గాల అవసరం లేదు. అయినప్పటికీ ఒక వేళ ఎవరైనా ఒక వ్యక్తి విధానాలకు ప్రాధాన్యత ఇచ్చి దాని ప్రకారంనడుచుకుంటే వారు ఏ స్థానాన్ని పొందుతారో అర్థం చేసుకోవచ్చు.స్వయంగా వారే వివేకంతో నిర్ణయించుకోవాలి.

నా మిత్రులారా! ఖుర్ఆన్ మరియు హదీస్ లో స్వచ్ఛమైన ఇస్లామని దీని ద్వారా తెలుస్తుంది. వాటి ప్రకారం ఆచరించేవారు ఇహపరాలలో సాఫల్యానికి అరులవుతారు. ఇస్లాం ఆరంభంనుంచి ఉంది. కొత్త ధర్మంకాదు. కొతా వర్గమూ కాదూ.  ఖుర్ఆన్, హదీస్ల ప్రకారం నడుచుకునేఒక సమాజం ఇది.

హదీసుల్లో మార్పులు చేయడం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కాలంలోనే మొదలైంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కాలంలో పెద్ద భాగంలో హదీసులుండేవి. ఒకరి నుండి మరొకరికి ఖులఫాయే రాషిదీన్ మరియు సహాబాలలో మధ్యనే మారుతూ వచ్చింది. వాటిని కొందరు రాసుకున్నారు. మరి కొందరు కంఠస్తం చేసుకున్నారు. ఇలా లేకపోతే ఖుర్ ఆన్, హదీస్ లను ఆచరించడం అసాధ్యం అయింది. కనుక మొదటి దశాబ్దంలో హదీసుల పెద్దభాగం ఉండేది. రెండో శతాబ్దంలో హదీసు వేత్తలు ఈ పనిని ముందుకు నడిపారు. హదీసులను ఒక చోట చేర్చి హదీసు గ్రంధాలను రూపొందించారు. ఇది కూడా వాస్తవ ప్రపంచంలోని ప్రముఖ ఉలమాలందరూ ఈ విషయాన్ని ధ్రువ పరుస్తారు కూడా.

రెండో మరియు మూడో శతాబ్దం ఇమామ్లు మరియు ముహద్దిస్ లది, అప్పుడు ఏదైనా సమస్య తలెత్తితే ప్రజలు ఇమామ్ల వద్దకు వెళ్లేవారు. వారు ఖుర్ఆన్, హదీస్ల ప్రకారం సమస్యలను పరిష్కరించే వారు.లేదా తమ విజ్ఞానం అవగాహనతో సమస్యను వివరించేవారు, దైవభీతివల్ల నేను చెప్పిన విషయాలు ఖుర్ఆన్, హదీస్లకు వ్యతిరేకంగా ఉంటేవాటిని విడిచి పెట్టమని చెప్పేవారు. ఈ విధంగా అప్పటి ఇమాములు, ముస్లింలు ఖుర్ఆన్, హదీసుల ప్రకారం ఆచరించేవారు. ఇమాములు ఎన్నో మాటలు చెప్పారు. వారి మాటలు గౌరవారం. (పుస్తకంలోనిరాబోయే పేజీలలో వాటిని పేర్కొనటం జరిగింది). వారందరూ  దైవభీతిపరులు, ధర్మపరాయణులు. ఏకేశ్వరో పాసకులు, సాంప్రదాయ విధేయులు, ఖుర్ ఆన్ హదీసులను పాటించే సజ్జనులకు ప్రతీకలు.ఎవరు కూడా తమ అనుచరులను వర్గాలుగా ఏర్పడమని పేర్కొనలేదు.తమతరపు నుండి వేరు వేరు ధర్మాలను రూపొందిచలేదు.

అల్లాహ్ వారి సమాధులను జ్యోతితో నింపుగాక, తన కారుణ్యాన్నిప్రసాదించు గాక… మిత్రులారా! మూడో శతాబ్దంలో కూడా వ్యక్తి అనుకరణ ఇమామ్ల పేర వర్గాలు, హనఫీ, మాలికీ, షాఫయీ, హంబలీలఉనికి లేదు. స్పృహతో చెప్పండి కొత్తది ఏమిటి? పాతది ఏమిటి?

నాలుగో శతాబ్దం నుండి వ్యక్తి అనుకరణ మొదలైంది. కాని ఇమామ్ల పేర్లతో వర్గాలుగా ఏర్పడే సంస్కృతి అప్పటికి ఇంకా రాలేదు.చరిత్ర దృష్టిలో ఫిఖా పుస్తకాల ప్రారంభాన్ని పేర్కొంటుంన్నాం. ఆ తరువాత వ్యక్తి అనుకరణ సంబంధాల (నిస్బత్) గురించి మరింత వివరణరాబోతుంది.

హనఫీల వర్గానికి చెందిన తొలి గ్రంధం ఖుదూరి హి.శ 428లోరచించబడింది. ఆ తరువాత ఇతర ఫిఖా (ధర్మ శాస్త్ర) గ్రంధాలు లిఖించబడ్డాయి. ఇలా ఫిఖా గ్రంథాల రచన ఐదవ శతాబ్దంలో మొదలైంది.హదీసు కూర్పు ఇస్లాం ప్రారంభ అయినప్పటి నుండి మొదలైంది. కానిఖుర్ ఆన్, హదీసులే ఇస్లాంకు పునాది. కనుక పూర్వ కాలం నుండే ఖుర్ ఆన్, హదీసులను ఆచారించే వారన్నది సుస్పష్టం. వ్యక్తి అనుకరణ మొదలై దినదిన ప్రవర్ధమానమైంది. అప్పటి రాజులు కూడా అటువైపు మొగ్గసాగారు.  చివరికి హి.శ 665లో రాజులు అనేక ప్రాంతాలలో వర్గాలను ఏర్పాటుచేసి హనఫీ, మాలికీ, షాఫయీ, హంబలీ ధర్మాలను అనుసరించే నలుగురు ఖాజీలను నియమించారు. కనుక ఏడవ శతాబ్దంలో ఆయా వర్గాల పేర్లు తెరపైకి వచ్చాయి. వ్యక్తి అనుకరణ మొదలైంది. ఈ కొత్త వర్గాలు మరియు ధర్మాలు ఈ విధంగా ఏడవ శతాబ్దంలో ఇస్లాం చేరాయి. ఆలోచించదగ్గ విషయం ఏమిటంటే ఏడవ శతాబ్దంలో స్వచ్ఛమైన ఇస్లాం ధర్మాన్ని నాలుగు భాగాలుగా చేశారు.నాలుగు వేరువేరు ధార్మిక శాస్తగ్రంధాలను రూపొందించారు. దాన్నిఒక్కొక్కటిని ఒక్కో వర్గం వారు అవలంభించ నారంభించినారు. పై పెచ్చు దీనిని పాత మరియు ఇస్లాం ప్రారంభం నుండి ఏడవ శతాబ్దం వరకుఖుర్ఆన్ మరియు హదీస్లపై ఆచరించడాన్ని వినూత్న కార్యంగా భావించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంతటి అన్యాయం.?

పరలోకానికి తొలి మజిలి సమాధి అని బాగా గుర్తుంచుకోండి.దాన్ని పరలోక పరీక్షకు తొలి పత్రం అన్నా అతిశయొక్తి కాదు. అల్లాహ్ తరపు నుండి మూడు ప్రశ్నలు అడగడం జరుగుతుంది. నీది ఏ ఇమామ్కు చెందిన వర్గం? నీ ఇమామ్ ఎవరు? అని ఎన్నటికీ అడగడం జరుగదు.ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మనకు తెలిపిన మూడు ప్రశ్నలనే అడగడం జరుగుతుంది.(1) నీ ప్రభువు ఎవరు? (2) నీ ధర్మం ఏమిటి? (3) నీ ప్రవక్త ఎవరు?. ఈప్రశ్నలకు ఎలా సమాధానం ఇవ్వాలో కూడా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) స్పష్టంగాతెలిపారు. (1) నా ప్రభువు అల్లాహ్. (2) నా ధర్మం ఇస్లాం (3) నాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) (అబూదావూద్).

సమాధి లోపల అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తేనే సాఫల్యంలభిస్తుంది. సమాధి యాతన నుండి విముక్తి కలుగుతుంది. ప్రాపంచిక జీవితంలో ఇస్లాం ధర్మాన్ని ఆచరించిన వారే ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలుగుతారు. ఇస్లాం ధర్మానికి వ్యతిరేకంగా నడుచుకుంటే సమాధానాలు కూడా వ్యతిరేకంగానే ఇస్తారు. ఇలాంటి పరిస్థితిలో సమాధి యాతన ప్రళయం వరకు ఉటుంది. ఆ తరువాత ప్రళయం సంభవిస్తుంది. అందరూ హష్ర్  మైదానంలో చేరతారు. అందరూ తమ తమ ఆచరణల ప్రకారం శిక్ష, ప్రతి ఫలాలను పొందుతారు. అప్పుడు ఎవరు ఎవరికి సహాయం చేయరు. ప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా సిఫారసు చేయరు. ఎవరినీ తన దగ్గరకు రానివ్వరు.

ప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: హష్ర్ రోజు నేను నా కొలను (కౌసర్) వద్దకు అందరికంటే ముందు చేరుకుంటాను. నా వద్ద నుండి పోయేవారు అందులోని నీటిని తాగుతారు. ఆ నీటిని తాగిన వారికి ఎప్పుడూ దాహం అవ్వదు. కొందరు నా దగ్గరకు వస్తారు. వారిని నేను గుర్తు పడతాను. నేను ఇలా అంటాను “వీరు నా వాళ్లు” అప్పుడునాతో ఇలా అనబడుతుంది. మీరు పరమదించిన తరువాత వీరు ధర్మంలోఎలాంటి కొత్తకొత్త విషయాలను సృష్టించారో మీకు తెలియదు. అప్పుడునేను ఇలా అంటాను: దూరంగా వెళ్లండి, దూరంగా వెళ్లండి. ఇలాంటివారిని నేను నా వద్దనుండి తరిమి వేస్తాను. (బుఖారి)

బాగా ఆలోచించండి ఆ రోజు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తప్ప మరెవరికీ సిఫారసుచేసే అధికారం ఉండదు. పెద్ద పెద్ద ప్రవక్తలు సయితం ఆరోజు సిఫారసు చేయడానికి నిరాకరిస్తారు.

మరో హదీసు భావం ఇలా ఉంది: హష్ర్ రోజు ప్రజలందరూ..కలసి ఆదమ్ (అలైహిస్సలాం) వద్దకు వెళ్లి “మీరు మా కోసం అల్లాహ్ వద్ద సిఫారసుచేయండి” అని విన్నవించుకుంటారు. అప్పుడు ఆయన “అల్లాహ్ దగ్గరకు వెళ్ళాలంటే నాకు భయంగా ఉంది, నేను మీ కోసం సిఫారసు చేయలేను..మీరు ఫలానా ఫలానా ఆయన వద్దకు వెళ్లండి” అంటారు. వారందరూ నూహ్ (అలైహిస్సలాం), ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) మరియు ఈసా(అలైహిస్సలాం)ల వద్దకు వెళతారు.వారందరూ కూడా “మేము అల్లాహ్ దగ్గరకు వెళ్లడానికి భయపడుతున్నాము. మీ కోసం సిఫారసు చేసేందుకు మేము అర్హులము కాము.మీరు చివరి ప్రవక్త వద్దకు వెళ్లండి అని అంటారు. వారందరూ చివరగా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వెళతారు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) సిఫారసు చేయడానికి అంగీకరించి అల్లాహ్ సమక్షంలో సాష్టాంగ పడతారు. అల్లాహ్ ను వేడుకుంటారు, అల్లాహ్ అనుమతితో సిఫారసు చేసి ప్రవేశం కల్పిస్తారు.(బుఖారి)

ఈ హదీసుల ద్వారా స్పష్టమవుతున్న విషయం ఏమిటంటే, చివరిశ్వాస వరకు ప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం)కు విధేయత చూపి, బిద్ అత్ కు దూరంగా ఉన్న వారికే కౌసర్ నీళ్లు, ప్రవక్త సిఫారసు ప్రాప్తం అవుతాయి. బిద్ అత్ కు దూరంగా ఉన్న వారికోసం ప్రవక్త సిఫారసు చేస్తారు. కనుక మనంఎల్లప్పుడు ప్రవక్తకు విధేయులై ఉండాలి. ఖుర్ఆన్, హదీసుల ప్రకారంనడుచుకోవాలి. అందులోనే ఇహపరాల సాఫల్యం ఉంది.

వ్యక్తి అనుకరణ చరిత్ర వివరాలేమిటంటే – ఏడవ, ఎనిమిదవ శతాబ్దంలో వ్యక్తి అనుకరణ బాగా అభివృద్ధి చెందింది. అప్పుడు రాజుల సహకారం ఉండేది. తొమ్మిదవ శతాబ్దం ప్రారంభంలో ఫర్ఖ్  బిన్ ఖర్ఖూక్  రాజు మక్కాలోని దైవ గృహం ప్రాగణంలో ఇబ్రాహీమ్ ముసల్లాహ్ తో పాటు నాలుగు ముసల్లాలు హనఫీ, మాలికీ, షాఫయీ, హంబలీ పేర్లతోఏర్పాటు చేశారు. ఇస్లాం ప్రారంభ కాలం నుండి తొమ్మిదవ శతాబ్దం వరకు కేవలం ఒక్కటే ఇబ్రాహీమ్ ముసల్లాహ్ మాత్రమే ఉండిది. ఇలా ఇస్లాం ధర్మంలో నాలుగు కొత్త ముసల్లాలు రాజు ఒత్తిడితో ప్రవేశించాయి.

ఇది తొమ్మిదవ శతాబ్దం నుండి పదమూడవ శతాబ్దం వరకుకొనసాగింది. ముసల్లీలు తాము విశ్వసించే, అనుసరించే ఇమాలతో కలిసి నమాజ్ చేసేవారు. ఒక ముసల్లా పై నమాజ్ చేసిన తర్వాత మరో ముసల్లా పై సమాజ్ చేసే అధికారం కూడా ఉండేది.

పద్నాల్గవ శతాబ్దం హి.శ.1343లో సౌదీ ప్రభుత్వం స్థాపకుడు షాహ్ అబ్దుల్ అజీజ్ ఇస్లాంలో ప్రవేశించిన నాలుగు ముసల్లాలను తొలగించి మునుపటి లాగానే ఇస్లాం ప్రారంభ కాలం ఉన్న ముసల్లానే ఉంచాడు. పూర్వం నుండి ఈ ముసల్లా వద్దనే నమాజ్ చేసేవారు.హాజీలు కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తారు.

సోదరులారా! ఈ వివరాల ద్వారా ఏం తెలుస్తుందంటే ఖుర్ఆన్,హదీసులపై ఆచరించే వారే సత్యవంతులు. ప్రళయం వరకు ఇదే వర్గం మిగిలి ఉంటుంది.

నేడు కొందరు ముస్లిములు గోపురాల్లో శబ్దం చేసే లాంటివారు.వారు ఎంత అరిచినా అది వారికే వినిపిస్తుంది. తమను పూర్వీకులుగా ఇతరులను ఆధినికులుగా చెప్పేవారే స్వయంగా ఆధునికులుగా తెరముందుకు వచ్చారు. అభియోగాలు మోపేవారే స్వయంగా అభియోగం మోపబడటానికి అర్హులయ్యారు.

నా మిత్రులారా! ముస్లిములం అయినందుకు మనం తప్పనిసరిగాఖుర్ఆన్, హదీసుల ప్రకారం నడుచుకోవాలి. అలా చేయకుండానే ముస్లిములమని వాదించేవారి వాదనలు అసత్యం. ఇస్లాం ధర్మం మొదలైనప్పటి తొలి ముస్లిముల నుండి ఇప్పుడున్న ముస్లిముల వరకు అందరివిశ్వాసం ఒక్కటే దేవుడు ఒక్కడే, ఖుర్ఆన్ ఒక్కటే, దైవప్రవక్త ఒక్కడే.మరి మనందరికి ఏమైంది? ఇస్లాం ధర్మం, ఖుర్ఆన్, హదీసులను ఆచరించి ఇహపరలోకాల్లో సాఫల్యం ఎందుకు పొందకూడదు? నేడు మనం ఇస్లాం ధర్మానికి దూరమవడం వల్ల ప్రాపంచిక ఆపదలు,కష్టాలుతో సతమత మవడం లేదా? దైవ కారుణ్యం మన నుండి దూరం కావడం లేదా? ఇవన్నీ వాస్తవాలు కాదా? మరైతే మన జీవితాలను ధార్మిక పరమైనవిగా ఎందుకు మలచుకోకూడదు? నేడు దీని ఆవశ్యకతఎంతైనా ఉంది. ఒకరిపై ఒకరు అభియోగాలు మోపడాన్ని స్వస్తి పలికే సమయం ఆసన్నమైంది. సంకుచిత భావాలను విడనాడాలి. విశాలదృష్టితో నడుచుకోవాలి. ముస్లిములందరూ సోదరులుగా మెలగాలన్నదే ఇస్లామీయ వాదనల లక్ష్యం. సమైక్య జీవితం గడిపి సజ్జనులుగాఏకమవ్వాలి. అల్లాహ్ ఆదేశం “ఇన్నమల్ మోమినూన ఇఖ్వతున్(సూరతుల్ హుజురాత్, ఆయత్-10) ప్రకారం ఆచరణాత్మక జీవితాన్ని దైవ కారుణ్యాలను అనుగ్రహాలను నోచుకోవాలి. ముందు ప్రవక్తకాలంలో హదీసు లిఖించబడిన ఆధారాలు, హదీసు గ్రంథాలు, ఫిఖా గ్రంథాల కూర్పు, నలుగురు ఖలీఫాలు మరియు నలుగురు ఇమాముల సంక్షిప్త సమాచారం వారి సత్యవాక్కులను పొందు పరచడం జరుగింది.సత్యాన్ని పేర్కొనడం మా బాధ్యత, మార్గదర్శం చూపేవాడు ఆ అల్లాహ్ యే.(ఆమీన్) 

– ముహమ్మద్ ఇస్మాయీల్ జర్తార్గర్ (కీర్తిశేషులు).

సకల స్తోత్రాలు అల్లాహకే శోభిస్తాయి. ఆయన సకల లోకాలకు ప్రభువు. విశ్వాన్నంతటికీ, భూమ్యాకాశాలకు నిజమైన యజమాని. విశ్వంపై అధికారం చలాయించేవాడు ఆయనే. ఆయన మొత్తం విశ్వాన్ని ఆవహించి ఉన్నాడు. అతను ఒంటరివాడు. అతనికి ఎవరూ భాగస్వాములు లేరు. అతను పరమ పవిత్రుడు. వినేవాడు, అంతాతెలిసిన వాడు, అంతా చూసేవాడు. అందరి పోషకుడు, రాత్రింబవళ్లు, సూర్య చంద్రులు, నక్షత్రాలకు యజమాని. సముద్రం, అందులో ఉన్న జీవులన్నిటిపై అధికారం ఉన్నవాడు. అతన్ని ఎంత స్తుతించినా తక్కువే.మాకోసం చివరి ప్రవక్త ముహమ్మద్(సల్లల్లాహు అలైహి వసల్లం)ను ప్రభవింపజేసి మమ్మల్ని అనుగ్రహించాడు. శ్రేష్ఠ సమాజంగా సత్కరించాడు. ఈ గొప్పవానికి ఎంతకృతజ్నతలు తెలిపినా తక్కువే.

అల్లాహ్ తన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ఉద్దేశించి ఇలాసెలవిచ్చాడు.

وَمَا أَرْسَلْنَاكَ إِلَّا رَحْمَةً لِّلْعَالَمِينَ

“ఓ ప్రవక్తా మేము నిన్ను ప్రపంచ మానవులకు కారుణ్యంగాసూ పంపాము. (అంబియా 21:107)

మరోచోట ఇలా సెలవిచ్చాడు.

وَمَا أَرْسَلْنَاكَ إِلَّا كَافَّةً لِّلنَّاسِ بَشِيرًا وَنَذِيرًا وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ

(ప్రవక్తా) “మేము నిన్ను సర్వ మానవులకు శుభవార్తనుఇచ్చేవాడుగా, హెచ్చరిక చేసేవాడుగా నియమించి పంపాము.(సూరె సబా 34:28)

మరో చోట ఇలా ఉంది:

قُلْ يَا أَيُّهَا النَّاسُ إِنِّي رَسُولُ اللَّهِ إِلَيْكُمْ جَمِيعًا

మానవులారా “నేను మీ అందరివైపునకు వచ్చిన సందేశహరుణ్ణి.(అల్ ఆరాఫ్ 7:158)

ఇంకోచోట ఇలా ఉంది:

وَدَاعِيًا إِلَى اللَّهِ بِإِذْنِهِ وَسِرَاجًا مُّنِيرًا

وَبَشِّرِ الْمُؤْمِنِينَ بِأَنَّ لَهُم مِّنَ اللَّهِ فَضْلًا كَبِيرًا

“ఓ ప్రవక్తా మేము నిన్ను సాక్షిగా చేసి, శుభవార్తను ఇచ్చేవానిగా, హెచ్చరిక చేసేవానిగా చేసి అల్లాహ్ వైపునకు పిలుపు ఇచ్చేవానిగా చేసి,ప్రకాశించే దీపంగా చేసి పంపాము.(అహ్ జాబ్ 33 :45-46)

ఈ ప్రకటన తర్వాత ఇస్లాంలో ప్రవేశించడానికి మానవుడు షహాదత్ వచనాన్ని అంగీకరించడంతో పాటు దైవదౌత్యాన్ని విశ్వసించడమూ తప్పనిసరి. సాక్షవచనం ఇస్లాం తొలి అంశం. ఈ వచనాన్ని నోటితో పలికి మనస్సుతో విశ్వసించేవాడు “ముస్లిమ్” అనబడతాడు.దాంతో పాటు అల్లాహ్ మరియు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆదేశాలను పాటించేవారు “విశ్వాసులు” అనబడతారు. అంటే ఆచరణతో సాక్ష్య వచనం ధ్రువీకరించబడుతుంది. కనుక ఖుర్ఆన్ హదీసులను ఆచరించడం ముస్లింల ప్రతీక.

ఖుర్ఆన్: “దైవగ్రంధాన్ని” అంటారు. అది లౌహె మహ్ పూజ్ (సురక్షిత ప్రదేశం) నుంచి అల్లాహ్ ఆదేశం మేరకు హజ్రత్ జిబ్రాయీల్ అలైహిస్సలామ్ ద్వారా మన ప్రియ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)పై సందర్భానుసారం కొంచెం కొంచెంగా 23 ఏళ్ళ కాలంలో అవతరించింది.

అల్లాహ్ తన పవిత్ర వచనమైన ఖుర్ఆన్ను హదీస్ గా పేర్కొనడంజరిగింది.

اللَّهُ نَزَّلَ أَحْسَنَ الْحَدِيثِ

అల్లాహు నజ్జల అహ్సనల్ హదీసి (సూరె జుమర్ 39:23)

అనువాదం: అల్లాహ్ ఎంతో శ్రేష్టమైన వచనాన్ని అవతరింపజేశాడు.

ఈ ఆయతో ఖుర్ఆన్ను హదీస్ పేర్కొనడం జరిగింది.

فَبِأَيِّ حَدِيثٍ بَعْدَ اللَّهِ وَآيَاتِهِ يُؤْمِنُونَ

అసలు వారు అల్లాహ్ ను, ఆయన వాక్యాలనూ కాక మరే విషయాన్ని విశ్వసిస్తారు?(సూరె జాసియ 45:6)

ఈ ఆయత్ లో  ఖుర్ఆన్ ఆయతులను హదీస్ గా పేర్కొనడం

 فَبِأَيِّ حَدِيثٍ بَعْدَهُ يُؤْمِنُونَ

అనువాదం : తరువాత అసలు వారు విశ్వసించే విషయంమరొకటి ఏది కాగలదు?.(అల్ ఆరాఫ్ 7:185)

వివరణ: అల్లాహ్ గ్రంధం మరియు దైవ ప్రవక్త వచ్చిన తరువాతకూడా వారు రుజుమార్గం అవలంభించకపోతే వారు ఏ విషయాన్నివిశ్వసిస్తారు?

ఈ ఆయత్ లో దైవ గ్రంథం ఖుర్ఆన్ను హదీస్ గా పేర్కొనడంజరిగింది.

అల్లాహ్ తన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మాటను తన గ్రంధంమైన ఖుర్ఆన్లో హదీస్ గా పేర్కొనడం జరిగింది.

وَإِذْ أَسَرَّ النَّبِيُّ إِلَىٰ بَعْضِ أَزْوَاجِهِ حَدِيثًا

 ప్రవక్త ఒక విషయాన్ని తన భార్యలలో ఒకామెకు రహస్యంగాచెప్పాడు. (తహ్రీం 66:3)

అల్లాహ్ ఆదేశాలకనుగుణంగా ఖుర్ఆన్ ను హదీసుగా పేర్కొనడంజరిగిందని అదేవిధంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనాలను కూడా హదీసుగానే పేర్కొనడం జరిగిందని ప్రస్ఫుటమవుతుంది. ఇస్లామ్ ధర్మ శాస్త్రం ప్రకారం దీని నిర్వచనం, దైవ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనం, ఆచరణ,ప్రసంగాన్ని హదీస్ అంటారు.

ప్రవచనం : ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆదేశాలను అంటారు.

ఆచరణ : ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆచరించి చూపిన విషయాలను అంటారు.

ప్రసంగం : ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమక్షంలో ఒక విషయాన్ని ఆచరించడంజరిగింది. ఆ విషయంలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మౌనం వహించారు. 

కనుక ఖుర్ఆన్ మరియు హదీసులే ఇస్లామ్ ధర్మానికి మూలాలు. దీన్ని అల్లాహ్ గ్రం ధమైన దివ్య ఖుర్ఆన్ ధ్రువీకరిస్తోంది..

ప్రవక్త కాలం: ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) దైవదౌత్యకాలం మక్కానగరంలో 13 ఏళ్లు ఉండింది. ఆ తరువాత దైవాదేశంతో మక్కా నుంచి వలస చేసి మదీనా నగరానికి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి హిజ్ర శకం ప్రారంభమవుతుంది. మదీనా నగరంలో దైవదౌత్యకాలం 10 ఏళ్ళు ఉండింది. ఇలా మొత్తం దైవదౌత్యకాలం 23 ఏళ్ళు. ఈ కాలంలో ఇస్లామ్ వెలుగు కిరణాలు ప్రపంచవ్యాప్తం అయ్యాయి. లక్షలమంది బహుదైవారాధకులు అరబ్బులు కానివ్వండి, అరబ్బేతరులు కానివ్వండి ఇస్లామ్ ధర్మాన్ని స్వీకరించారు. వీరందరూ దైవవాణి(ఖుర్ఆన్), ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రబోధనల ప్రకారం నడుచుకునేవారు. ఆతరువాత ఖలీఫాల కాలం సుమారు 30 ఏళ్ళు వరకు ఉండింది. వారివివరాలు ఇలా ఉన్నాయి:

(1) హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఖిలాఫత్ కాలం హి.శ 11 నుంచి13 వరకు (2 సంవత్సరాల 3 నెలల 9 రోజులు).

(2) హజ్రత్ ఉమర్ ఫారూఖ్ (రదియల్లాహు అన్హు) ఖిలాఫత్ కాలం హి.శ 13 నుంచి 23 వరకు (10 సంవత్సరాల 5 నెలల 4 రోజులు).

(3) హజ్రత్ ఉస్మాన్ గనీ (రదియల్లాహు అన్హు) ఖిలాఫత్ కాలం హి.శ. 23 నుంచి 35 వరకు (12 సంవత్సరాలు)

(4) హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) ఖిలాఫత్ కాలం హి.శ. 35 నుంచి 40 వరకు (4 సంవత్సరాల 9 నెలలు) 

మొత్తం: 29 సంవత్సరాల 5 నెలల13 రోజులు.ఈ కాలంలోని ముస్లిములందరూ కేవలం దైవవాణి (ఖుర్ఆన్)మరియు ప్రవక్త ప్రబోధనలు (హదీసు) ప్రకారం నడుచుకునేవారు.

హి.శ 40 నుంచి 100 సుమారు అరవై ఏళ్ళ కాలం గడిచింది.ఈ తొలి శకం చివరి కాలంలోని అనుయాయులు వివరాలు:

(1) మదీనా మునవ్వరాలోని ప్రవక్త అనుయాయుల్లో హజ్రత్ సహల్ బిన్ సాద్ విభిన్న ఉల్లేఖనాల ప్రకారం హి.శ 88 లేదా 91-963ఏళ్ళు లేదా 100 ఏళ్ళ వయస్సు మరణించారు.

(2) బస్రా సహాబాల్లో హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) విభిన్న కథనాలప్రకారం హి.శ 90 లేదా 93 కంటే గరిష్ఠంగా సుమారు 103ఏళ్ళ వయస్సులో మరణించారు.

(3) మక్కా నగరంలోని సహాబాల్లో హజ్రత్ అబూ తుఫైల్ ఆమిర్ బిన్ వాసిల (రదియల్లాహు అన్హు) అందరికంటే చివరి సహాబీ, ఆయన హి.శ 100లేదా విభిన్న కథనాల ప్రకారం హి.శ 110లో మరణించారు.

ఇలా తొలి శతాబ్దం పూర్తవగానే సహాబాల కాలం కూడా పరిసమాప్తం అయింది. తొలి శతాబ్దంలోని ఈ విశ్వాసులందరూ ఖుర్ఆన్ మరియు హదీసుల ప్రకారం ఆచరించేవారు. ఇస్లామీయబోధనలకు మూలం వీరే. వీరు తప్ప వేరేవారెవరూ లేరు.

మన ప్రియ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) కాలంలో ఖుర్ఆన్ మాదిరిగానే హదీసులు కూడా రాయడం జరిగేది. దీనికి పటిష్టమైన వ్యవస్థ ఉండేది.

(1) ఖయ్యిదుల్ ఇల్మ్ – విద్య మరియు హదీసులను రాసి నిర్బంధించుకోండి. (హాకిమ్ బయానుల్ ఇల్మ్, భాగం-5, పేజి-73)

(2) ఉక్తుబూ వలా హరజ – హదీసులను రాయండి. అందులో… ఎలాంటి అభ్యంతరం లేదు. (మజ్మవుజ్జవాయెద్: 60)

(3) ఉక్తుబూ ఇలా బీ షాహ్- అబూ షాహ్ కు నా హదీసును,ప్రసంగాన్ని రాసి ఇవ్వండి. (బుఖారి ముస్లిమ్)

(4) ఇస్తఇన్ బియమీనిక వ ఔ మాఅ బి యదిహీ – (ఓ అబూ రాఫె) నీకుడి చేతితో నా హదీసును వ్రాయి. (తిర్మిజీ, పేజీ:382)

(5) ఉక్తుబూ ఇలయ్య మంయ్యల్ఫజ్ బిల్ ఇస్లామి- కలిమా పఠించేవిశ్వాసుల పేర్లు వ్రాసి నాకు ఇవ్వు, (బుఖారీ, భాగం-1, పేజి: 430)

(6) మదీనాలోని యూదులకు శాంతి ప్రతులను వ్రాయించి ఇవ్వడం జరిగింది. ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తన మరియు యూదులు మరియు ఇతర ముస్లిముల కోసం శాంతి ఒప్పందాన్ని వ్రాయించారు. (సుననెఅబీ దావూద్ భాగం-2, పేజి: 25)

(7) హుదైబియాలో ఒప్పంద పత్రాన్ని వ్రాయించడం జరిగింది.(బుఖారీ, భాగం-1, పేజీ: 372)

(8) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు)తో ఒక సంకలనాన్ని రాయించారు.అందులో మదీనా పవిత్రత, ……… ఒంటెల వయస్సు, భూముల ఆదేశాలు, దైవేతరుల పేరుపై చేసే జిబహ్ నిషేధం, భూదురాక్రమణ, తల్లిదండ్రులను దూషించడం, బిద్ ఆతీలకు రక్షణఇవ్వడంలోని దూషణ తదితర సమస్యల గురించి వ్రాయడంజరిగింది.

(9) హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) ఇలా పేర్కొన్నారు: మేము ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ద్వారా ఖుర్ఆన్ను వ్రాశాము. మరియు ఈ ప్రతులను అంటే హదీసులోని ఈ సంకలాన్ని (బుఖారి)

(10) హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దాన ధర్మాల గ్రంథం (కితాబుస్ సదఖా) గురించి వ్రాయించారు. ఆ తరువాత ఆయన మరణించారు. ఈ గ్రంధాన్ని పాలకుల వద్దకు తీసుకెళ్ళడం కుదరలేదు. ఆ తరువాత హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) దాన్ని ఆచరించారు. అబూ బకర్ (రదియల్లాహు అన్హు) మరణించిన తరువాత హజ్రత్ఉమర్ (రదియల్లాహు అన్హు) దీన్ని అమలు పరచారు. ఈ గ్రంథం ఉమర్ (రదియల్లాహు అన్హు)కుటుంబంలో సురక్షితంగా ఉంది. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) మనవడు హజ్రత్ సాలమ్  (రహిమహుల్లాహ్) ఈ గ్రంథాన్ని ఇమామ్ జుహ్రీ (రహిమహుల్లాహ్)కు చదువుకోవడానికి ఇచ్చారు. దాన్ని ఇమామ్ జుహ్రీ (రహిమహుల్లాహ్) కంఠస్తం చేసుకున్నారు. ఖలీఫ ఉమర్ బిన్ అబ్దుల్అజీజ్  (రహిమహుల్లాహ్) దీన్ని నకలు చేయించారు. (అబూదావూద్, బైపాఖీ,మస్తక్ హాకిమ్, భాగం-1, పేజి-292)

(11) హజ్రత్ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తన చివరి కాలంలో హదీస్ కు సంబంధించిన ఒక ఉద్గ్రంధంలో  ఖుర్ఆన్ పారాయణం, నమాజ్, ఉపవాసం, జకాత్, విడాకులు, ప్రతీకార న్యాయం, రక్త పరిహారం ఇతర విధులు, సున్నతుల మరియు మహా అపరాధాల వివరాలు వ్రాయించి హజ్రత్ ఉమర్ బిన్ హజమ్ (రదియల్లాహు అన్హు) సహాబీ గుర్తింపుకోసం యమన్ వారి వద్దకు పంపించారు.

సమస్యల సమగ్రత పరంగా ఈ గ్రంధాన్ని హదీసులకు సంబంధించిన తొలి గ్రంథం అనవచ్చు. దీన్ని స్వయంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వ్రాయించారు. ఇలా అరబ్ నాయకులు, అరబ్బేతర రాజులకు ఇస్లాం సందేశ లేఖలు పంపించడం జరిగింది. 

(12) హిరకల్ చక్రవర్తి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పవిత్ర నామాన్ని తెప్పించాడు. దాన్ని ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) హి.శ. 6లో దహియ కల్పికి ఇచ్చి బస్రా పాలకుని వద్దకు పంపించారు. ఆయన దాన్ని హిరకల్ దగ్గరకు పంపించాడు.(బుఖారి, భాగం-1, పేజి-4)

(13) హజ్రత్ మఆజ్ (రదియల్లాహు అన్హు) కుమారుడు మదీనా మునవ్వరాలో మరణించాడు. అప్పుడు హజ్రత్ మఆజ్ యమన్లో  ఉన్నారు. ఆ వార్త విని మఆజ్ (రదియల్లాహు అన్హు) చాలా దు:ఖించారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మఆజ్(రదియల్లాహు అన్హు)కి ఒక సంతాప పత్రాన్ని రాసి పంపించారు. (ముస్తదిర్ హాకిమ్,భాగం-3, పేజి 373 తారీఖె ఖతీజ్,భాగం-3, పేజి-29)

(14) హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం సహాబాలలోఆయన కంటే ఎక్కువ హదీసులు ఉల్లేఖించినవారు ఇంకొకరులేరు. అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) తప్ప, ఎందుకంటే ఆయన హదీసులు వ్రాసేవారు. నేను వ్రాసేవాడిని కాదు. కంఠస్తం చేసుకునేవాడిని. (బుఖారి, తిర్మిజి)

(15) హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) 5376 హదీసులను కంఠస్తం చేసుకున్నారు.

హజ్రత్ బషీర్ బిన్ నహీక్ తాబయీ ఇలా పేర్కొన్నారు నేనుహజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) నుంచి హదీసులు విని వ్రాసుకునేవాడిని. ఆయన వద్ద నుంచి వెళ్ళి పోవాలని నిర్ణయించుకున్నప్పుడు ఆయన దగ్గరకు వెళ్ళి నేను వ్రాసుకున్న పుస్తకంలోని హదీసులు ఆయనకు వినిపించి ఇవన్నీ మీరు చెప్పిన హదీసులేనా? అనిఅడిగాను. అందుకు ఆయన “అవును” అన్నారు. (సుననె దారిమి)

(16) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అవసాన దశలో ఉన్నప్పుడు కొన్ని అత్యవసర ఆదేశాలు  ఉదాహరణకు అరబ్ నుంచి బహుదైవారాధకులు మరియు యూదులను తరిమేయడం, బృందాల ఆతిధ్యం, జైష్ అంత్యక్రియలు, హజ్రత్ ఉసామ (రదియల్లాహు అన్హు) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధి వద్ద సాష్టాంగపడకుండా చేయడం మరియు అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఖిలాఫత్ తదితర వ్యవహారాలు వ్రాయించడానికి పెన్ను, సిరా, కాగితాన్ని తెప్పించారు. ఇలా అన్నారు. ఖాల ఈతూనీ అక్తుబ్ లకుమ్కితాబన్ (బుఖారి భాగం-1, పేజి-449, ముస్లిమ్ భాగం-2, పేజి 42). చెప్పొచ్చే దేమిటంటే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వ్రాయించిన ఇలాంటి ప్రతులు చాలానే ఉన్నాయి. కాని ఇక్కడ సంక్షిప్తంగా పేర్కొనడంజరుగుతుంది. ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన జీవితంలోనే తన హదీసులను ప్రత్యేకంగా సందర్భానుసారం వ్రాయించేవారని తేటతెల్లమవుతుంది. అనేక మంది సహాబాలు వాటిని సమీకరించి సంరక్షించారు. మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి:

(17) సాదిఖ అనే ప్రతి ఎంతో పేరుగాంచింది. దాన్ని అమర్ బిన్ ఆస్(రదియల్లాహు అన్హు) రూపొందించారు. ఇందులో వెయ్యికి కొంచెం తక్కువహదీసులున్నాయి. అవి ముస్నద్ ఇమామ్ అహ్మద్లో ఉన్నాయి.

(18) ఒక ప్రతి సహీహ పేరుతో ఖ్యాతి పొందింది. దాన్ని హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) శిష్యులు హమ్మామ్ బిన్ మున్నబ రూపొందించారు. ఇందులోని హదీసులు కూడా మస్నదె అహ్మద్లో ఉన్నాయి. అంతే కాకుండా ఇమామ్ బుఖారి, ముస్లిమ్లు కూడా తమ గ్రంధాల్లో ఈ హదీసులను చేర్చారు. ఈ సంకలనానికి చెందిన వ్రాత ప్రతి ఇప్పటికీ డెమాస్కస్లోని బెర్లిన్ లైబ్రరీలో సురక్షితంగా ఉంది.

(19) ముస్నద్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) పేరుతో స్మరించడం జరుగుతుంది.ఇందులో హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనాలన్ని ఉన్నాయి.దీని వ్రాత ప్రతి జర్మనీ లైబ్రరీలో భద్రంగా ఉంది.

(20) ఒక ప్రతి హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) పేరుతో ఖ్యాతి పొందింది.

(21) హజ్జతుల్ విదా ప్రసంగాన్ని స్వయంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆదేశంతోవ్రాయించడం జరిగింది.

(22) మరో ప్రతి జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) నామంతో పేరు గాంచింది.దీన్ని ఆయన గారి ఇద్దరు శిష్యులు హజ్రత్ వహబ్ బిన్ మున్నబ మరియు హజ్రత్ సులైమాన్ బిన్ ఖైస్ అల్ షేకరి రూపొందించారు.

(23) అయిషా (రదియల్లాహు అన్హు) పేరుతో ఉన్న ప్రతిని అమ్ బిన్ జుబైర్ (రదియల్లాహు అన్హు) రూపొందించారు.

(24) అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) పేరుతో మరో ప్రతి ఖ్యాతి పొందింది.దీనికి సంబంధించి సయీద్ బిన్ హిలాల్ ఇలా పేర్కొంటు న్నారు.హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) తన ప్రతిని మాకు చూపించి ఇలా అన్నారు:”ఈ హదీసులు నేను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ద్వారా విని వ్రాశాను. తరువాత మళ్ళీ నేను ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం)కు చూపించాను. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) వీటినిధ్రువీకరించారు.

పేరు | జననం-మరణం|  వయస్సు | నివాసం| రచన

1. హజ్రత్ ఇమామ్ అబూ హనీఫ | హి. శ.80 -150 | వయస్సు 70 సం.| నివాసం: కూఫ

2. హజ్రత్ ఇమామ్ మాలిక్ | హి. శ. 93-179 | వయస్సు 84 సం.| నివాసం: మదీన | రచన: ముఅత్తా

3. హజ్రత్ ఇమామ్ షాఫయీ | హి. శ.150 204 | వయస్సు 54 సం.| నివాసం: ఈజిప్టు | రచన:  ముస్నద్  షాఫయీ

4. ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ | హి.శ 164-241 | వయస్సు 77 సం.| నివాసం: డెమాస్కస్ | రచన:  ముస్నద్ అహ్మద్

రెండవ హిజ్ర శకం నుంచి ఇమాముల కాలం ప్రారంభమయింది. మన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) శిక్షణ పొందిన సహాబాలు అల్లాహ్ సన్నిధికి చేరారు. గడుస్తున్న కొద్దీ సమస్యల పరిష్కారానికి సహాబాల లేమి కొట్టుచ్చినట్టు కనబడసాగింది. ఇక్కడి నుంచి ఇస్లామీయ సమాజానికి పరీక్షా కాలం మొదలయింది. ఇక ఈ నలుగురు ఇమాములే తమతమ ప్రాంతాల్లో ప్రజల మార్గదర్శక, హితబోధ కేంద్రాలుగా విలసిల్లసాగారు.వీరి వద్దకు ఏదైనా సమస్య వస్తే వారు ఖుర్ఆన్ మరియు హదీసుల ప్రకారం పరిష్కారం చెప్పేవారు. లేదా తమ అభిప్రాయాలతో అంచనాలు వేసి తమ అభిమతాన్ని వెల్లడించేవారు. ఈ విషయంలో అల్లాహ్ కు భయపడతూ ఇలా చెప్పేవారు: “సరైన హదీసే నా అభిమతం””.(అఖ్దుల్  జయ్యిద్)

(1) హజ్రత్ ఇమామ్ అబూ హనీఫ (రహిమహుల్లాహ్) కూఫా పట్టణంలోనివసించేవారు. అక్కడ రాజకీయ అస్థిరత నెలకొని ఉండేది. అది హుసైన్ (రదియల్లాహు అన్హు) చంపబడిన ప్రదేశం కూడాను. షియాల కేంద్రమూను. అక్కడ ఇమామ్ గారికి చాలా తక్కువ హదీసులు లభ్యమయ్యాయి. దాని మూలంగా ఆయన అనేక సమస్యలను అంచనాల ద్వారా తమ అభిమతాన్ని వెలిబుచ్చేవారు. దాంతో పాటు ఇలా మార్గ నిర్దేశనం చేసేవారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హదీసులవిషయంలో నా మాటలను రద్దు చేయండి.

(2) హజ్రత్ ఇమామ్ మాలిక్ (రదియల్లాహు అన్హు) మదీనా నగరంలో ఉండేవారు.ఆయన వీలైనంత వరకు హదీసులను సమీకరించారు. తన గ్రంధానికి ముఅత్తా ఇమామ్ మాలిక్ అని పేరు పెట్టారు.అందువల్ల సమస్యల్లో ఆయన అభిప్రాయం చాలా తక్కువగా కనబడుతుంది.

(3) హజ్రత్ ఇమామ్ షాఫయి  (రహిమహుల్లాహ్) తొలి కాలం బస్రాలో, రెండోకాలం ఈజిప్టులో గడిచింది. వీలైనంత వరకు ఆయన హదీసులను తన గ్రంథంలో సమీకరించారు. దానికి “మన్నదె షాఫయీ” అనిపేరు పెట్టారు.

(4) హజ్రత్ ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్  (రహిమహుల్లాహ్) కూడా హదీసులను సమీకరించడంలో నిమగ్నులయ్యారు. హదీసుల సింహభాగం ఆయన చేతికందింది. తన గ్రంధానికి “మస్నద్ అహ్మద్” అని పేరు పెట్టారు. ఇమామ్ గారి పరిష్కారాలలో అంచనాలకు,అభిమతాలను తావులేదు.

సారాంశం ఏమిటంటే, నలుగురు ఇమాముల కాలం కూడా దైవభీతి పరంగా ఖుర్ఆన్ మరియు హదీసుల వైపు మళ్లించేదే. ఒకవేళ ఎవరయినా ఇమామ్ ఏదైనా అభిప్రాయాన్ని వెల్లడిస్తే అది తాత్కాలికమే ఉంటుంది. దానికి సంబంధిచిన హదీసు దొరికిన వెంటను అది రద్దయిపోయేది.

సత్యవాక్కు పలికిన నలుగురు ఇమాములపై అల్లాహ్ కారుణ్యంకురియుగాక!

నేను చెప్పిన విషయానికి రుజువు దొరక్కపోతే నేను చెప్పిన విషయం ఆధారంగా ఫత్వా ఇవ్వడం అధర్మం. (మీజాన్ లిల్ షఅరాని,అఖ్ దుల్ జయ్యిద్ – పేజి:70)

(అ) నేను చెప్పిన విషయం ఖుర్ఆన్కు విరుద్ధంగా ఉంటే దాన్ని విడిచిపెట్టండి. మీరు చెప్పిన విషయం హదీసుకు కూడా విరుద్ధంగాఉంటే ఏం చేయాలి? అని ప్రజలు అడిగారు. అప్పుడు కూడావిడిచి పెట్టండి అన్నారు ఆయన. మళ్ళీ ప్రజలు మీరు చెప్పినవిషయం సహాబాల వ్యాఖ్యలకు కూడా విరుద్ధంగా ఉంటే? అనిప్రశ్నించారు. అప్పుడు కూడా విడిచి పెట్టండి అన్నారు. (అఖ్ దుల్ జయ్యిద్: పేజినంబర్-53)

(ఆ) నేను చెప్పిన విషయాలు ఖుర్ఆన్ మరియు హదీసులకు వ్యతిరేకంగా అనిపిస్తే నా మాటలను గోడకు కొట్టి ఖుర్ఆన్ హదీసులు ప్రకారం ఆచరించండి. (మీజాన్ లిల్ షఅరాని, అఖ్దుల్ జయ్యిద్-పేజీ:53)

(ఇ) హజ్రత్ ఇమామ్ అబూ హనీఫ  (రహిమహుల్లాహ్) గారి ఈ వాక్కు సువర్ణాక్షరాలతో లిఖించదగింది. ఆయన ఇలా పేర్కొన్నారు: “సరైనహదీసే నా అభిమతం”. (అఖ్దుల్ జయ్యిద్)

(ఈ) హదీసు ద్వారా రుజువయిన విషయాన్ని కళ్ళకు హత్తుకోండి.(జఫ్ రుల్  అమానీ)

(ఉ) నన్ను అనుసరించకండి. మాలిక్  (రహిమహుల్లాహ్) ను కూడా. మరే ఇతరుల్నీ అనుసరించకండి. ధర్మాదేశాలు ఖుర్ఆన్ మరియు హదీసులు ద్వారానే తీసుకోండి. (తౌహ్ ఫతుల్ ఇజాఫీ, ఫీ బయానిల్ అబ్రారి)

ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతున్న విషయమేమిటంటే, హజ్రత్ ఇమామ్ అబూ హనీఫ  (రహిమహుల్లాహ్) విశ్వాసం, అభిమతం ఖుర్ఆన్ మరియు హదీసులే. సహీహ్ హదీసుల ద్వారా నిరూపితమైన విషయం మాత్రమే ఆచరించదగ్గది. అంతే కాకుండా ఆయన ఇలా కూడా పేర్కొన్నారు: “నన్ను అనుసరించకండి. ఆధారాలు లేనిదే నేను చెప్పిన విషయాలనుకూడా విశ్వసించకండి. కేవలం ఖుర్ఆన్ మరియు హదీసుల ప్రకారంఆచరించండి”. ఇమామ్ గారు ఎంత సత్యమైన విషయం చెప్పారు. అల్లాహ్ఆయన సమాధిని జ్యోతిర్మయం చేయుగాక!

ప్రపంచంలో ఎవరూ సరైన మాటలే చెప్పరు. కొన్ని సరైనవి ఉంటాయి కొన్ని ఉండవు. వారు చెప్పిన సరైన మాటలను తీసుకోవాలి.లేని వాటిని విడిచి పెట్టాలి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పిన మాటలు తప్ప, ఎందుకంటే ఆయన చెప్పే మాటలన్నీ సరైనవే. అంగీకరించ దగ్గవే.ఒక్క మాటను కూడా విడిచి పెట్టడానికి వీలులేదు. (అఖ్దుల్ జయ్యిద్, పేజీ-70)

(అ) నేను కేవలం ఒక మనిషిని మాత్రమే. నేను చెప్పే విషయాలు సరైనవై ఉండవచ్చు, ఉండకపోనూ వచ్చు. ఖుర్ఆన్ మరియు హదీసుల ప్రకారం ఉన్న నేను చెప్పిన విషయాలను స్వీకరించండి. వాటికి వ్యతిరేకంగా ఉన్న వాటిని విడిచి పెట్టండి. సమగ్రంగా నన్ను అనుసరించకండి. (హఖీఖతుల్ ఫిఖ, జల్బుల్ మన ఫఅత్)

(ఆ) నేను చెప్పిన విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించండి. అది ఖుర్ఆన్ మరియు హదీసుల ప్రకారం ఉంటే దాన్ని ఆచరించండి.వ్యతిరేకంగా ఉండే విడిచి పెట్టండి.

నేను ఏదైనా ఒక సమస్యను వివరించి ఉంటే అది ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హదీసుకు వ్యతిరేకంగా ఉంటే, హదీసు ద్వారా నిరూపితమైనదే ఉన్నతమైనది. అందులో నన్ను అనుసరించకండి. (అఖ్దుల్ జయ్యిద్ :54)

(అ) సరైన హదీసు దొరికితే నా అభిమతం అదేనని (తెలుసుకోండి), నేను చెప్పిన విషయం హదీసుకు వ్యతిరేకంగా ఉంటే (ఖబర్దార్),హదీసునే ఆచరించండి. నేను చెప్పిన విషయాన్ని గోడకు తెగ్గొట్టండి.(అఖ్దుల్ జయ్యిద్ – 70)

(ఆ) హజ్రత్ ఇమామ్ షాఫయీ తన, ఇతరుల అనుసరణనువారించారు. (అఖుల జయ్యిద్)

నా అనుసరణ గాని, ఇమామ్ మాలిక్  (రహిమహుల్లాహ్), ఇమామ్ షాఫయీ (రహిమహుల్లాహ్), ఇమామ్ ఔజాయీ  (రహిమహుల్లాహ్), ఇమాజ్ సౌరీ  (రహిమహుల్లాహ్) అనుసరణగానీ చేయకండి. వీరందరూ ధార్మిక ఆదేశాలు, సమస్యలు ఎక్కడి నుంచి(ఖుర్ఆన్ మరియు హదీసులు) తీసుకునేవారో మీరు కూడా అక్కడి నుంచే తీసుకోండి. (అఖ్దుల్ జయ్యిద్-70)

(అ) ఎవరికీ అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) విషయంలో కల్పించుకునే విషయంలో అవకాశం లేదు.

ఈ నలుగురు ఇమాముల వ్యాఖ్యలతో ద్యోతకమవుతున్న విషయం ఏమిటంటే, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) హదీసుల ప్రకారం సహాబాలు ఏ మార్గాన్నయితే అనుసరించేవారో అదే మార్గాన్ని అవలంభించమని ఆదేశించడం జరిగింది. వీరందరూ ఖుర్ఆన్ మరియు హదీసుల ప్రకారం తమ ఆచరణలు చేపట్టేవారు. వారి అభిమతం ఇదే. ఈ నలుగురు మహానుభావులు తమ అనుసరణ నుంచి వారించారు. ఎవరు కూడాతమ పేరు మీద ప్రత్యేక అభిమతాన్ని రూపొందించలేదు.

ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు. నా కాలంలోని వారు అందరి కంటే ఉత్తములు. తరువాత ఆ తరువాత వారు. తరువాత ఆ తరువాత వారు.ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా రెండు కాలాల గురించి ప్రస్తావించారు. (బుఖారి)

అల్లామ ఇబ్నె హజ్ర్  (రహిమహుల్లాహ్) ఫత్ హుల్ బారీ విభాగం-14, బాబు ఫజాయిల్ అస్ హాబున్నబీలో ఇలా పేర్కొన్నారు. తబే తాబయీన్లు రెండు వందల ఇరవై (220) సంవత్సరాల వరకు జీవించారు. వారి కాలంలోనూ ఒక ప్రత్యేక వ్యక్తిని అనుసరించడం, వారి అభిమతం ప్రకారం నడుచుకోవడం జరిగేది కాదు. ఈ ఇమాముల శిష్యులు కొన్ని విషయాల్లో భేదాభిప్రాయాలు పడేవారు. ఎందుకంటే వారు ముఖల్లిద్ లు  (అనుసరించేవారు) కాదు. అల్లామ సనద్ బిన్ అత్తాన్  (రహిమహుల్లాహ్) ఇలా వ్రాశారు:సహాబాల కాలంలో ఒక ప్రత్యేక వ్యక్తి అనుసరణ జరిగేది కాదు.ఏదేమైనప్పటికీ మూడు కాలాల్లోనూ తఖ్లీద్  (అనుసరణ) అనేది లేదు.

అబూ ముహమ్మద్ అబ్దుల్లాహ్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఫజల్  (రహిమహుల్లాహ్)

హజ్రత్ అబూ అబ్దుల్లాహ్ ముహమ్మద్ బిన్ ఇస్మాయీల్ బుఖారీ  (రహిమహుల్లాహ్)

హజ్రత్ అబూ దావూద్ సులైమాన్ బిన్ అష్ అస్ (రహిమహుల్లాహ్)

హజ్రత్ అబూల్ హసన్ ముస్లిమ్ బిన్ హుజ్జాజ్  (రహిమహుల్లాహ్)

హజ్రత్ అబూ ఈసా ముహమ్మద్ బిన్ ఈసా బిన్ సూరహ్  (రహిమహుల్లాహ్)

హజ్రత్ అబూ అబూ అబ్దుల్లాహ్ ముహమ్మద్ బిన్ యజీద్ బిన్ మాజ రబయీ  (రహిమహుల్లాహ్)

హజ్రత్ అబూ అబ్దుర్రహ్మాన్ బిన్ అహ్మద్ బిన్ షుఐబ్  (రహిమహుల్లాహ్)

హజ్రత్ అబూ హసన్ బిన్ అలీ బిన్ ఉమర్  (రహిమహుల్లాహ్)

హజ్రత్ అబూ బకర్ అహ్మద్ బిన్ హుసైన్  (రహిమహుల్లాహ్)

హజ్రత్ షేఖ్ వలియుద్దీన్ ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ ఖతీబ్  (రహిమహుల్లాహ్)

గ్రంథం పేరు | జననం-మరణం| వయస్సు | జన్మస్థలం

దారిమీ | హి.శ 180 -255 | 75 సం. | సమర్ ఖండ్
బుఖారీ | హి.శ 194 -256 | 62 సం. | బుఖారా
అబూ దావూద్ | హి.శ 202 -275 | 73 సం. | బస్రా 
ముస్లిమ్ | హి.శ 204 -261 | 57 సం. | నేషాపూర్ (ఖురాసాన్)
తిర్మిజీ | హి.శ 209 -279 | 70 సం. | తిర్మిజ్ 
ఇబ్నెమాజ | హి.శ 209 -273 | 64 సం. | ఇరాక్ (ఖర్వీన్)
నసాయి | హి.శ 215 -303 | 88 సం. | ఖురాసాన్
దారే ఖుత్నీ | హి.శ 305 -385 | 80 సం. | బగ్దాద్ 
బైహఖీ  | హి.శ 384 – 458 | 74 సం. | బైహఖీ (నేషాపూర్)
దారిమీ | హి.శ 435 -516 | 81 సం. | మరూ (తబ్రేజ్)

ప్రముఖ హదీసు గ్రంధాలు ఇవి. ఇవే కాకుండా అనేక హదీసు పుస్తకాలు వ్రాయడం జరిగింది. హజ్రత్ షేక్ అబ్దుల్ ఖాదర్ జిలానీ (రహిమహుల్లాహ్) హి.శ (470-561), వయస్సు 91, నివాసం బగ్దాద్, రచన-గనియతుత్తాలిబీన్, ఫుతూహుల్ గైబ్, ఫతే రబ్బాని.

హజ్రత్ షేఖ్ అబ్దుల్ ఖాదర్ జిలానీ  (రహిమహుల్లాహ్) తన పుస్తకం ఫుతూహుల్ గైబ్ లో చక్కని హితబోధ చేశారు: “ఖుర్ఆన్, హదీసులను మీ ఇమాములుగా చేసుకోండి. ఏకాగ్రతతో వాటిని పఠించండి. వాగ్యుద్ధాలకు, సంశయాలకు గురికాకండి. కేవలం దైవ గ్రంధం, హదీసులనే ఆచరించండి. ఖుర్ఆన్ తప్ప మరే గ్రంధమూ ఆచరణయోగ్యం కాదని భావించండి. మనం విధేయత చూపేందుకు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తప్ప మరో మార్గదర్శకుడు లేడని భావించండి. ఎప్పుడూ ఖుర్ఆన్ హదీసులు పరిధిని దాటకండి. లేదంటే మనో కోరికలు, దురాలోచనలు మిమ్మల్ని రుజుమార్గం నుంచి తప్పిస్తాయి. గుర్తుంచుకోండి. మానవుడు దైవ గ్రంధం, హదీసుల ప్రకారం ఆచరిస్తేనే ఔలియా అల్లాహ్ స్థానానికిచేరుకుంటారు.

1. అనుసరణ కర్తకు ఇమామ్ చెప్పే మాటే ఆధారం. అతను స్వయంగా పరిశోధించలేడు. ఇమామ్ చేసిన పరిశోధనను పరిశీలించనూ లేడు. (ముస్లిమ్ అల్ సుబూత్ ముజ్ తబాయీ)

2. ప్రవక్తేతరుని (నబి లేదా ముజ్ తహిద్) మాటను, ఆధారాలను చూడకుండానే విశ్వసించడాన్ని “తఖ్లీద్” (అనుసరణ) అంటారు.(జమ్ ఉల్ జవామి)

3. హజ్రత్ ముల్లా అలీ ఖారీ  (రహిమహుల్లాహ్) హనఫీ ఇలా పేర్కొంటు న్నారు – ప్రవక్తేతరులు (ఇమామ్) మాటను ఆధారాలు లేకుండా విశ్వసించడాన్ని “తఖ్లీద్” అంటారు. (షర్ హు ఖసీద ఇమాలీ)

4.ఇమామ్ చెప్పిన మాటే అనుసరణ కర్తకు (ముఖల్లిద్ కు) ఆధారం. ఈ సమస్యలోని ఆదేశం ఇదే అని ముఖల్లిద్ అనాలి. ఎందుకంటే నా ఇమామ్ అభిప్రాయం ఇదే. ఇమామ్ తెలిపిన అభిప్రాయమే నా దగ్గర సరైనది. (తౌజీహ్ తల్వీహ్)

5. ఇమామ్ మాట ముఖల్లిద్కు ఆధారం. (తౌజీహ్)

6.ఇమామ్ చెప్పిన మాట ప్రకారమే ఫత్వా ఇవ్వాలి. ఆచరించాలి.(దుర్రె ముఖ్తార్ , మొదటి భాగం)

తఖ్లీద్ అంటే భావం ముఖల్లిద్ ఏ ఇమామను అయితే అనుసరిస్తున్నాదో అతని మాట ప్రకారమే నడచుకోవడం. దాన్ని అన్వేషించడం,ఆధారం చూపమని కోరడం తఖ్లీద్ ను భంగపరచడం అవుతుంది. వేరేమాటలో చెప్పాలంటే తఖ్లీద్ అంటే ఆరాధన అవుతుంది. ప్రవక్తేతరుని మాటను షరీఅత్ (ఖుర్ఆన్, హదీస్) ఆధారాల్లేకుండానే షరీఅత్కు చెందినవని విశ్వసించడం ఆచరించడం

వ్యక్తి అనుకరణ అనేది నాలుగో శతాబ్దంలో ప్రారంభమయింది.(అలాముల్ మౌఖయీన్, భాగం-1, పేజి-222)

తజికిరతుల్ హుఫ్ఫాజ్ 202వ పేజీలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నుంచి మూడు తరాలు ఖైరుల్ ఖురూన్ వరకు అనుకరణ ప్రశస్తే లేదు. ఖైరుల్ ఖురూన్ తరువాత అనుకరణ మొదలయిందని చెప్పవచ్చు. నాలుగో శతాబ్దంనుంచి ఆరో శతాబ్దం వరకు ఈ క్రమం నెలకొని ఉంది..

సంవత్సరాల వారిగా ధర్మశాస్త్ర గ్రంధాల వివరాలను పేర్కొంటున్నాము.

పుస్తకం పేరు | రచన కాలం

1. ఖుదూరి (ఫికాహ్ తొలి పుస్తకం) –  హి.శ. 428
2. హిదాయ (ప్రామాణిక ఫికాహ్ పుస్తకం) – హి.శ. 593
3. ఖాజీ ఖాన్ –  హి.శ. ఆరో శతాబ్దం
4. ఫతావా అల్ వాహియ – హి.శ. ఆరో శతాబ్దం
5. మున్నబ  – హి.శ. ఏడవ శతాబ్దం
6. ఖనియ – హి.శ. ఏడవ శతాబ్దం
7. కంజుల్ దఖాయఖ్ – హి.శ. 710
8. షర్ హై  వఖాయ – హి.శ. 745
9. నిహాయ – హి.శ. 8వ శతాబ్దం
10. ఇనాయ – హి.శ. 8వ శతాబ్దం
11. తహ్ తావీ – హి.శ. 8వ శతాబ్దం
12. జామిఉర్రమూజ్ – హి.శ. 8వ శతాబ్దం
13. ఫత్ హుల్ ఖదీర్- హి.శ. 9వ శతాబ్దం
14. బజాజియ – హి.శ. 9వ శతాబ్దం
15. ఖులాస కీదాన్ – హి.శ. 9వ శతాబ్దం
16. హల్య – హి.శ. 9వ శతాబ్దం
17. బహ్రుర్రఖాయఖ్ – హి.శ. 10వ శతాబ్దం
18. ఘనియ – హి.శ. 10వ శతాబ్దం
19. తన్వీరుల్ అబ్సార్ – హి.శ. 10వ శతాబ్దం
20. జఖీరతుల్ అఖ్బా  – హి.శ. 10వ శతాబ్దం
21. దుర్రె ముఖ్తార్ – హి.శ. 1011
22. ఫతావా ఖైరియ   – హి.శ. 11వ శతాబ్దం
23. ఫతావా అలమ్ గీరీ – హి.శ. 1118
24. మాలా బదమన – హి.శ. 1225
25. బహస్తీ జేవర్ – హి.శ. 1225
26. మురాఖిల్ ఫలాహ్  – హి.శ. 13వ శతాబ్దం
27. అమతుల్ ర ఆయత్  – హి.శ. 13వ శతాబ్దం

పైన పేర్కొన్న ఫిఖాహ్ పుస్తకాలే కాకుండా ఇంకా ఉన్నాయి.

హి.శ. 7లో తొలిసారి ఇమామ్లతో సంబంధం (“నిస్బతె అయిమ్మ”) నిర్ణయించడం జరిగింది. మెల్లమెల్లగా ముఖల్లిద్ల సంఖ్య పెరుగుతూ పోయింది. రాజులు కూడా అనుసరణ వైపే మొగ్గు చూపారు.ప్రతి రాజు తన భావ జాలానికి సారూప్యత కల ఖాజీని తన ఆస్థానంలో నియమించుకో సాగాడు. ప్రతి వర్గం తమ తమ అభిమతాన్ని వృద్ధి పరచుకుంటూ పోయింది. ఒకరిపై ఒకరు ఆధిక్యత ప్రదర్శించేందుకు పన్నాగాలు పన్నే స్థాయికి చేరుకున్నారు. చివరికి షాహ్ బీబర్స్ హి.శ 665లో ఈజిప్టు మరియు కైరోలో నాలుగు వర్గాల నలుగురు ఖాజీలు హనఫీ  (రహిమహుల్లాహ్), మాలికీ  (రహిమహుల్లాహ్), షాఫయీ  (రహిమహుల్లాహ్), హంబలీ  (రహిమహుల్లాహ్) లను నియమించాడు. ఇదే సాంప్రదాయం అమలులో ఉండేది. దీనికి అధికారికంగా అంగీకరించడం జరిగింది. ఇలా రాజుల ఒత్తిడితో కొత్త ఆవిష్కరణ ఇస్లామ్లో ప్రవేశించింది.

ఒక్క ఇస్లామ్ ధర్మం నాలుగు ముక్కలయింది. ఇది ఏడో శతాబ్దంనుంచి ప్రారంభమయింది. 8వ శతాబ్దంలోనూ ఈ సాంప్రదాయం కొనసాగింది

కాబా గృహంలో 4 ముసల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది.కనుక 9వ శతాబ్దం ప్రారంభకాలంలో చరాక్య రాజు ఫరాఖ్ బిన్ బఖూఖ్ కాబా గృహ ప్రాంగణంలో ఇబ్రాహీమీ ముసల్లాతో పాటు నూతనావిష్కరణలైన నాలుగు ముసల్లాలు హనఫీ  (రహిమహుల్లాహ్), మాలికీ  (రహిమహుల్లాహ్), షాఫయీ (రహిమహుల్లాహ్), హంబలీ (రహిమహుల్లాహ్)లను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తరువాత ఈ నాలుగు ముసల్లాల వ్యవహారం కూడా ధర్మంలో భాగంగా పరిగణించడం మొదలయింది. (అల్లామ షౌకాని ఇలా అంటారు. ఆనాటి పండితులు దీనిని తీవ్రంగా ఖండించారు.) (అల్ ఇర్షాద్, పేజి-58)

ఈ నూతనావిష్కరణలైన నాలుగు ముసల్లాలు 9వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం వరకు కొనసాగాయి.

నాలుగు ముసల్లాలు (నిస్ బతే  అయిమ్మ) రద్దు చేయబడ్డాయి.  సౌదీ ప్రభుత్వ వ్యవస్థాపకుడు షాహ్ అబ్దుల్ అజీజ్ హి.శ 1343లో ఈ  వ్యవస్థను రద్దు చేసి మొదట్లో ఉన్న కేవలం ఒక్క ఇబ్రాహీమీ ముసల్లా  వ్యవస్థనే తిరిగి ప్రారంభించాడు. అది కొనసాగుతూ నేటి వరకు అలాగే  ఉంది. ఈ ముసల్లా ద్వారానే అన్ని సమాజులు జరుగుతున్నాయి.  అల్హమ్దులిల్లాహి అలా జాలిక్.

మేము ప్రాథమికంగా సంవత్సరాల వారిగా అన్ని రకాల వివరాలను అందించాము. ఈ సత్యాన్ని తెలుసుకున్న తరువాత న్యాయమైన  విషయం ఏమిటంటే, ఖుర్ఆన్, హదీసుల ప్రకారం ఆచరించడాన్నే  తప్పనిసరిగా చేసుకోవాలి. ఎందుకంటే పరలోక సాఫల్యం దీని మీదే  ఆధారపడి ఉంది. జీవితంలోని ప్రతి రంగంలో అల్లాహ్ ఆదేశం ఏమిటి?  మన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆదేశం ఏమిటి? ఆయన ఎలా ఆచరించి చూపించారు?  దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆచరించాలి. ఇలాంటి ఆచరణే స్వర్గానికి  చేరుస్తుంది. ఏదో ఒక రోజు స్వర్గంలో ప్రవేశిస్తారు.

لَّقَدْ كَانَ لَكُمْ فِي رَسُولِ اللَّهِ أُسْوَةٌ حَسَنَةٌ 

1. “నిశ్చయంగానే అల్లాహ్ ప్రవక్తలో మీకు ఒక మంచి ఆదర్శం ఉండినది”.  (సూర  అహజాబ్ 33:21)

అల్లాహ్ ను మరియు ప్రళయదినాన్ని విశ్వసిస్తేనే, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు  విధేయత చూపాలని ఖుర్ఆన్ పదేపదే పేర్కొనడం జరిగింది.

مَّن يُطِعِ الرَّسُولَ فَقَدْ أَطَاعَ اللَّ

2. “ప్రవక్తకు విధేయత చూపినవాడు వాస్తవంగా అల్లాహ్ కు విధేయత  చూపినట్లే”. (నిసా 4:80)

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు విధేయత చూపడమే తనకు విధేయత చూపడమని  చెప్పి అల్లాహ్ మన జీవితాలకు మార్గదర్శనం చేశాడు. ఇది అల్లాహ్  గొప్ప ఉపకారం. ఈ ఉపకారానికి గాను మనం ఎంత కృతజ్ఞతలు తెలుపుకున్నా తక్కువే.

 فَلَا وَرَبِّكَ لَا يُؤْمِنُونَ حَتَّىٰ يُحَكِّمُوكَ فِيمَا شَجَرَ بَيْنَهُمْ ثُمَّ لَا يَجِدُوا فِي أَنفُسِهِمْ حَرَجًا مِّمَّا قَضَيْتَ وَيُسَلِّمُوا تَسْلِيمً

3. “ముహమ్మద్! నీ ప్రభువు సాక్షిగా! వారు తమ పరస్పర విభేదాలు  విషయంలో నిన్ను న్యాయనిర్ణేతగా స్వీకరించనంత వరకు, ఇంకా  నీవు ఏ నిర్ణయం చేసినా దానిని గురించి వారి మనస్సులలో  కూడా ఏమాత్రం సంకోచం లేకుండా దానిని యథాతథంగా శిరసా వహించనంత వరకు వారు నిజమైన విశ్వాసులు కాలేరు”.  (సూరె నిసా 4:65)

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا ادْخُلُوا فِي السِّلْمِ كَافَّةً وَلَا تَتَّبِعُوا خُطُوَاتِ الشَّيْطَانِ ۚ إِنَّهُ لَكُمْ عَدُوٌّ مُّبِينٌ

4. “విశ్వసించిన ప్రజలారా! పూర్తిగా ఇస్లామ్ లో ప్రవేశించండి. షైతాను  అడుగు జాడలు త్రొక్కకండి. అతడు మీకు బహిరంగ శత్రువు.”  (సూరె బఖర 2:208)

 قُلْ إِن كُنتُمْ تُحِبُّونَ اللَّهَ فَاتَّبِعُونِي يُحْبِبْكُمُ اللَّهُ وَيَغْفِرْ لَكُمْ ذُنُوبَكُمْ ۗ وَاللَّهُ غَفُورٌ رَّحِيمٌ

5. “మీకు నిజంగానే అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే నన్ను అనుసరించండి. అప్పుడు అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు. మీ పాపాలను  మన్నిస్తాడు. ఆయన అమితంగా క్షమించేవాడు”.  (సూర్ ఆలి ఇమ్రాన్ 3:31)

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَطِيعُوا اللَّهَ وَأَطِيعُوا الرَّسُولَ وَأُولِي الْأَمْرِ مِنكُمْ ۖ فَإِن تَنَازَعْتُمْ فِي شَيْءٍ فَرُدُّوهُ إِلَى اللَّهِ وَالرَّسُولِ إِن كُنتُمْ تُؤْمِنُونَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ

6. “విశ్వసించిన ప్రజలారా! విధేయత చూపండి అల్లాహ్ కు, విధేయత  చూపండి ప్రవక్తకు, మీలో అధికారం అప్పగించబడిన పెద్దలకు.  మీ మధ్య ఏ విషయంలోనైనా వివాదం తలెత్తితే దాన్ని అల్లాహ్ కు,  ప్రవక్తకు నివేదించండి. మీరు నిజంగానే అల్లాహ్ మీద అంతిమ  దినం మీద విశ్వాసం కలవారే అయితే”  (సూరె నిసా 4:59)

وَأَطِيعُوا اللَّهَ وَرَسُولَهُ وَلَا تَنَازَعُوا فَتَفْشَلُوا وَتَذْهَبَ رِيحُكُمْ

7. “అల్లాహ్ కు,, ఆయన ప్రవక్తకూ విధేయత చూపండి. పరస్పరం  కలహించుకోకండి. అలా జరిగితే మీలో బలహీనత ప్రవేశిస్తుంది. మీ శక్తి సన్నగిల్లుతుంది”.  (సూరె అన్ఫాల్ 8:46)

విధేయత (ఇత్తిబా) & అంధానుసరణ (తఖ్లీద్)