షిర్క్ ను స్పష్టంగా తెలుసుకునే “నాలుగు నియమాలు“ : పార్ట్ 2 – నసీరుద్దీన్ జామిఈ  [వీడియో | టెక్స్ట్]

షిర్క్ ను స్పష్టంగా తెలుసుకునే “నాలుగు నియమాలు“ : పార్ట్ 2
https://youtu.be/eW8NRgoEZ8o [34 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
షిర్క్ నాలుగు సూత్రాలు – పుస్తకం & వీడియో పాఠాలు

ఈ ఉపన్యాసంలో, ప్రసంగీకులు ఇమామ్ ముహమ్మద్ ఇబ్న్ అబ్దుల్ వహ్హాబ్ రచించిన “అల్-ఖవాయిద్ అల్-అర్బా” (నాలుగు నియమాలు) అనే గ్రంథం యొక్క రెండవ పాఠాన్ని కొనసాగించారు. గత పాఠంలో చర్చించిన ఆనందానికి కారణమయ్యే మూడు గుణాలను (కృతజ్ఞత, సహనం, క్షమాపణ) పునశ్చరణ చేశారు. ఈ పాఠంలో ప్రధానంగా హనీఫియ్యత్ (ఇబ్రాహీం (అ) వారి స్వచ్ఛమైన ఏకదైవారాధన మార్గం) గురించి వివరించారు. ఆరాధన (ఇబాదత్) అనేది అల్లాహ్ ను ఏకత్వంతో, చిత్తశుద్ధితో ఆరాధించడమేనని, మానవుల మరియు జిన్నుల సృష్టి యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఇదేనని ఖుర్ఆన్ ఆధారాలతో స్పష్టం చేశారు. తౌహీద్ లేని ఆరాధన, వుదూ లేకుండా చేసే నమాజ్ లాంటిదని, అది స్వీకరించబడదని ఒక శక్తివంతమైన ఉపమానంతో వివరించారు. ఆరాధనలో షిర్క్ (బహుదైవారాధన) ప్రవేశిస్తే కలిగే మూడు ఘోరమైన నష్టాలను (ఆరాధన చెడిపోవడం, పుణ్యం వృధా అవడం, శాశ్వతంగా నరకవాసిగా మారడం) ఖుర్ఆన్ ఆయతుల ద్వారా హెచ్చరించారు. షిర్క్ నుండి రక్షణ పొందడానికి ఇబ్రాహీం (అ) మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పిన దుఆలను ప్రస్తావించారు. చివరగా, గత పాఠంలోని ఒక చిన్న పొరపాటును సరిదిద్దుతూ, ఇమామ్ గారి జన్మస్థలం గురించి స్పష్టత ఇచ్చారు.

మతన్ (టెక్స్ట్):

اعلم أرشدك الله لطاعته أن الحنيفية -مِلةَ إبراهيمَ-: أنْ تَعبُدَ الله مُخلصاً له الدين، وبذلك أمرَ الله جميع الناس، وخَلَقهم لها ، كما قال تعالى

అల్లాహ్ నీకు విధేయత భాగ్యం ప్రసాదించుగాక! తెలుసుకో! ఇబ్రాహీం అలైహిస్సలాం మతం అయిన హనీఫియత్ అంటే: “నీవు ధర్మాన్ని ఆయనకే ప్రత్యేకించి కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించుట“. అల్లాహ్ సర్వ మానవాళికి ఈ ఆదేశమే ఇచ్చాడు, వారందరినీ పుట్టించినది కూడా దీని కొరకే. అల్లాహ్ ఆదేశం చదవండి:

وَمَا خَلَقتُ الجِنَّ وَالإِنسَ إِلّا لِيَعْبُدوِن
నేను జిన్నాతులను, మానవులను సృష్టించినది వారు నన్ను “ఆరాధించటానికి” మాత్రమే. (జారియాత్ 51:56).

فإذا عرفتَ أن الله خلقك لعبادته: فاعلم أنّ العبادةَ لا تُسمى عبادةً إلا مع التوحيد، (كما أنّ الصلاة لا تُسمى صلاة إلا مع الطهارة).

అల్లాహ్ నిన్ను ఆయన ఆరాధన కొరకు మాత్రమే పుట్టించాడన్నది నీవు తెలుసుకున్నప్పుడు, ఇది కూడా తెలుసుకో: ఎలాగైతే వుజూ లేనిది నమాజును నమాజ్ అనబడదో అలాగే తౌహీద్ (ఏకదైవారాధన) లేనంత వరకు ఏ ఆరాధన కూడా ఆరాధన అనబడదు. ఎలాగైతే నమాజులో వుజూ భంగమయితే నమాజ్ పాడవుతుందో, అలాగే ఆరాధనలో ‘షిర్క్’ ప్రవేశిస్తే అది పాడవుతుంది (స్వీకరించబడదు).

فإذا دخل الشركُ في العبادة فسدتْ، (كالحَدَثِ إذا دخل في الصلاة) ، كما قال تعالى

షిర్క్ ఏదైనా ఆరాధనలో కలుషితమైతే అది దానిని చెడగొడుతుందని, ఆ కార్యం వృధా అవుతుందని (పుణ్యఫలం దొరకదని), షిర్క్ కు పాల్పడినవాడు శాశ్వతంగా నరకవాసి అయిపోతాడు అని ఎప్పుడైతే నీవు తెలుసుకున్నావో, “షిర్క్ బిల్లాహ్ (అల్లాహ్ కు ఎవరినైనా భాగస్వామిగా చేయడం)” గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యమని గమనించు![2] -అల్లాహ్ నిన్ను దాని వలలో చిక్కకుండా కాపాడుగాక!- (ఆమీన్).

مَا كَانَ لِلْمُشْرِكِينَ أَنْ يَعْمُرُوا مَسَاجِدَ اللَّهِ شَاهِدِينَ عَلَى أَنْفُسِهِمْ بِالْكُفْرِ أُولَئِكَ حَبِطَتْ أَعْمَالُهُمْ وَفِي النَّارِ هُمْ خَالِدُونَ[ [التوبة: 17].

[2] “ముష్రిక్కులు తాము స్వయంగా తమ అవిశ్వాసాన్ని గురించి సాక్ష్యమిస్తున్నప్పుడు వారు అల్లాహ్‌ మస్జిదుల నిర్వహణకు ఎంతమాత్రం తగరు. వారి కర్మలన్నీ వృథా అయిపోయాయి. శాశ్వతంగా వారు నరకాగ్నిలో ఉంటారు“. (తౌబా 9:17). [కొన్ని పుస్తకాల్లో ఈ దలీల్ కూడా ఉంది].

ఆ షిర్క్ గురించే హెచ్చరిస్తూ అల్లాహ్ ఇలా తెలిపాడు:

إِنَّ اللَّهَ لَا يَغْفِرُ أَنْ يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَلِكَ لِمَنْ يَشَاءُ [النساء: 116].

తనకు భాగస్వామ్యం (షిర్క్‌) కల్పించటాన్ని అల్లాహ్‌ ఎట్టి పరిస్థితిలోనూ క్షమించడు. షిర్క్‌ మినహా తాను కోరిన వారి ఇతర పాపాలను క్షమిస్తాడు.  (నిసా 4:116).

అయితే అందుకు నాలుగు నియమాల (4మూల విషయాల)ను) తెలుసుకోవడం తప్పనిసరి అవుతుంది, అల్లాహ్ వాటిని తన దివ్య గ్రంథంలో ప్రస్తావించాడు:

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మదిన్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బాద్.

ప్రియ వీక్షకుల్లారా! అల్-ఖవాయిద్ అల్-అర్బా, నాలుగు నియమాలు. ఇమామ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్ రచించినటువంటి పుస్తకాలలో చాలా చిన్న పుస్తకం, కానీ చాలా గొప్ప లాభం మరియు చాలా ఎక్కువ విలువైనది.

ఈ రోజు మనం రెండవ క్లాసులో ఉన్నాము. అయితే, మరీ మరీ సంక్షిప్తంగా ఇంతకుముందు చదివిన పాఠం, ఇంతకుముందు యొక్క క్లాసులోని మూలం నేను మీకు చదివి వినిపిస్తాను. మీరు కూడా శ్రద్ధగా చూడండి. ఆ తర్వాత ఈరోజు చదివే అటువంటి పాఠాన్ని మనం ప్రారంభం చేద్దాము.

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం.

أَسْأَلُ اللَّهَ الْكَرِيمَ رَبَّ الْعَرْشِ الْعَظِيمِ
(అస్అలుల్లాహల్ కరీమ్, రబ్బల్ అర్షిల్ అజీమ్)
పరమదాత, మహోన్నత సింహాసనానికి ప్రభువైన అల్లాహ్ ను నేను అర్థిస్తున్నాను.

أَنْ يَتَوَلَّاكَ فِي الدُّنْيَا وَالْآخِرَةِ
(అన్ యతవల్లాక ఫిద్దున్యా వల్ ఆఖిరహ్)
ఇహపరలోకాలలో నిన్ను వలీగా చేసుకొనుగాక.

وَأَنْ يَجْعَلَكَ مُبَارَكًا أَيْنَمَا كُنْتَ
(వ అన్ యజ్అలక ముబారకన్ ఐనమా కున్త)
మరియు నీవు ఎక్కడ ఉన్నా నిన్ను శుభవంతుడిగా చేయుగాక.

وَأَنْ يَجْعَلَكَ مِمَّنْ إِذَا أُعْطِيَ شَكَرَ، وَإِذَا ابْتُلِيَ صَبَرَ، وَإِذَا أَذْنَبَ اسْتَغْفَرَ
(వ అన్ యజ్అలక మిమ్మన్ ఇదా ఉఅతియ షకర, వ ఇదబ్ తులియ సబర, వ ఇదా అద్నబ ఇస్తగ్ఫర)
ఇంకా ఏదైనా ప్రసాదించబడినప్పుడు కృతజ్ఞత చెల్లించే, పరీక్షకు గురైనప్పుడు సహనం వహించే, పాపం పొరపాటు జరిగినప్పుడు క్షమాపణ కోరుకునే వారిలో నిన్ను చేర్చుగాక.

వాస్తవానికి ఈ మూడు గుణాల్లోనే సౌభాగ్యం మరియు అదృష్టం ఉన్నది. సోదర మహాశయులారా! ఇక్కడి వరకు మనం అల్హందులిల్లాహ్ గత పాఠంలో చదివాము, దాని యొక్క వివరణ, ఈ దుఆలో వచ్చినటువంటి ప్రతి విషయం దాని యొక్క సంబంధించిన ఖుర్ఆన్ హదీద్ లో ఇంకా ఎక్కువ జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని కూడా తెలుసుకున్నాము.

ఆ తర్వాత ఇమామ్ ముహమ్మద్ ఇబ్న్ అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్ చెప్పారు:

اعْلَمْ أَرْشَدَكَ اللَّهُ لِطَاعَتِهِ
(ఇఅలం అర్షదకల్లాహు లితాఅతిహి)
అల్లాహ్ నీకు విధేయత భాగ్యం ప్రసాదించుగాక, తెలుసుకో!

أَنَّ الْحَنِيفِيَّةَ مِلَّةَ إِبْرَاهِيمَ
(అన్నల్ హనీఫియ్యత మిల్లత ఇబ్రాహీం)
ఇబ్రాహీం అలైహిస్సలాం మతం అయిన హనీఫియ్యత్ అంటే,

أَنْ تَعْبُدَ اللَّهَ وَحْدَهُ مُخْلِصًا لَهُ الدِّينَ
(అన్ తఅబుదల్లాహ వహ్దహు ముఖ్లిసన్ లహుద్దీన్)
నీవు ధర్మాన్ని ఆయనకే ప్రత్యేకించి, కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించుట.

అల్లాహ్ సర్వమానవాళికి ఈ ఆదేశమే ఇచ్చాడు.

وَخَلَقَهُمْ لِذَلِكَ
(వ ఖలఖహుమ్ లి దాలిక్)
వారందరినీ పుట్టించినది కూడా దీని కొరకే.

దలీల్ ఏమిటి? దలీల్:

وَمَا خَلَقْتُ الْجِنَّ وَالْإِنسَ إِلَّا لِيَعْبُدُونِ
(వమా ఖలఖ్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లి యఅబుదూన్)
నేను జిన్నాతులను, మానవులను సృష్టించినది వారు నన్ను ఆరాధించటానికి మాత్రమే.“(51:56)

సోదర మహాశయులారా! సంక్షిప్తంగా దీని యొక్క వివరణ కొంచెం విని, ఇంకా ముందుకు మనం సాగుదాము. అయితే ఇక్కడ కూడా మీరు గమనిస్తే:

ఆ నాలుగు నియమాలు ఏమిటో చెప్పేకి ముందు దుఆలు ఇచ్చారు. ఆ నాలుగు నియమాలు ఏమిటో తెలిపేకి ముందు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తున్నారు, తౌహీద్ అంటే ఏమిటి, ఇబాదత్ అంటే ఏమిటి మరియు షిర్క్ ను మనం అర్థం చేసుకోవడానికి చాలా సులభంగా మనం గ్రహించగలిగే అటువంటి ఒక ఉపమానం, దృష్టాంతం, ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. అయితే ఈ ముఖ్యమైన హితోపదేశానికి ముందు కూడా మరొక చిన్న దుఆ. అదేమిటి?

أَرْشَدَكَ اللَّهُ لِطَاعَتِهِ
(అర్షదకల్లాహు లితాఅతిహి)

అల్లాహు త’ఆలా నీకు విధేయత భాగ్యం ప్రసాదించుగాక. ఎల్లవేళల్లో నీ జీవితం అల్లాహ్ మరియు అల్లాహ్ యొక్క సత్య ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధేయతలోనే గడుస్తూ ఉండాలి, అలాంటి భాగ్యం అల్లాహ్ నీకు ప్రసాదించాలి. చూడండి ఎంత ముఖ్యమైన బోధ, ఎంత మంచి ఆశీర్వాదాలు, దీవెనలు, దుఆలు కదా.

మనం మన పిల్లలకు కూడా ఒరేయ్ నీ పాడగాను, చావరా నువ్వు. ఇలా అంటాం కదా మనం పిల్లల్ని ఒక్కొక్కసారి ఏదైనా పని చేయకుంటే. అవునా? కానీ ఇలా కాకుండా, అల్లాహ్ నీకు హిదాయత్ ఇవ్వుగాక! ఈ పని చెయ్యి నాయనా. గమనించండి, మొదటి దానిలో బద్ దుఆ ఉన్నది, శాపనము ఉన్నది. అది విన్నారంటే ఇంకెంత మన నుండి దూరమయ్యేటువంటి ప్రమాదం ఉంది. అదే ఒకవేళ, అల్లాహ్ నిన్ను, అల్లాహ్ నీపై కరుణించుగాక, అల్లాహ్ నీకు హిదాయత్ ఇవ్వుగాక, అల్లాహ్ నీకు విధేయత భాగ్యం ప్రసాదించుగాక, అల్లాహ్ నిన్ను తన ప్రియమైన దాసునిలో చేర్చుగాక, ఇలాంటి ఏదైనా దుఆలు ఇచ్చుకుంటూ మనం ఏదైనా ఆదేశం ఇస్తే, ఏదైనా విషయం బోధిస్తే ఎంత బాగుంటుంది కదా.

ఆ తర్వాత ఏమంటున్నారు? హనీఫియ్యత్, మిల్లతె ఇబ్రాహీం. దీని యొక్క వివరణ రమదాన్లో మేము బోధించినటువంటి ఇమామ్ ముహమ్మద్ ఇబ్న్ అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్ వారి మరో పుస్తకం ఉసూలె తలాత, త్రిసూత్రాలు, అందులో కూడా వచ్చింది.

ఇక్కడ నాలుగు నియమాలు చెప్పేకి ముందు మరోసారి మిల్లతె ఇబ్రాహీం అంటే ఏమిటి, ఇబ్రాహీం అలైహిస్సలాం ధర్మం అంటే ఏమిటి దాని గురించి వివరిస్తున్నారంటే ఇక్కడ ఉద్దేశం ఏమిటి? ఇక్కడ రెండు రకాలుగా అర్థం చేసుకోండి.

ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ సమాజంలో వచ్చారో, వారందరూ తమకు తాము ఇబ్రాహీమీయులు అనేవారు. అంటే ఇబ్రాహీం అలైహిస్సలాం సంతతి వారము మేము. ఆయన మా కొరకు వదిలినటువంటి స్వచ్ఛమైన మార్గం మీద ఉన్నాము, ధర్మం మీద ఉన్నాము అని భావించేవారు. కానీ షిర్క్ కు పాల్పడేవారు. అయితే వారికి బోధ చేయడం జరుగుతుంది. ఏ ఇబ్రాహీం పేరు మీరు తీసుకుంటున్నారో, చేస్తున్న పనులు వాటికి ఇబ్రాహీం అలైహిస్సలాం చాలా దూరంగా ఉన్నారు. ఇబ్రాహీం అలైహిస్సలాం వైపునకు తమకు తాము అంకితం చేసుకున్నారంటే, ఆయన వద్ద ఇబాదత్, తౌహీద్, ఏకదైవారాధన దేనిని అంటారో దానిని మీరు కూడా గ్రహించండి, అలాగే ఆచరించండి. ఇది ఒకటి.

రెండవది, ఇమామ్ ముహమ్మద్ ఇబ్న్ అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్ ఏ సమాజంలో వచ్చారో, వారు ముస్లింలు అయి ఎన్నో రకాల షిర్క్ పనులకు పాల్పడి ఉన్నారు. అయితే ఆ షిర్క్ నుండి వారిని బయటికి తీయడానికి ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క స్వచ్ఛమైన ధర్మం దాని యొక్క రిఫరెన్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు? ఖుర్ఆన్లో అల్లాహ్ ఇదే ఆదేశం ఇచ్చాడు.

أَنِ اتَّبِعْ مِلَّةَ إِبْرَاهِيمَ حَنِيفًا
(అనిత్తబిఅ మిల్లత ఇబ్రాహీమ హనీఫా)
“నీవు ఇబ్రాహీం అనుసరించిన ఏకేశ్వరోపాసనా మార్గాన్ని అవలంబించు” (16:123)

ఇందులో రెండు విషయాలు గమనించండి. ఒకటి, మిల్లత ఇబ్రాహీం, ఇబ్రాహీం అలైహిస్సలాం ధర్మం. రెండవది హనీఫియ్యత్. ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది, మరీ శ్రద్ధగా వినండి. హనీఫియ్యత్ అంటే ఏంటి? మనిషి అన్ని రకాల షిర్క్ విషయాలకు దూరంగా ఉండి ఒకే ఒక తౌహీద్ వైపునకు, అల్లాహ్ వైపునకు అంకితమై, వంగి, ఒక వైపునకు అంటే కేవలం అల్లాహ్ వైపునకు మాత్రమే మరలి ఉండడం. ఇది హనీఫియ్యత్.

ఇబ్రాహీం అలైహిస్సలాం వారి కాలంలో ప్రజలు అల్లాహ్ తో పాటు ఎవరెవరినైతే షిర్క్ చేసేవారో, వారందరినీ కూడా నాకు వారితో ఎలాంటి సంబంధం లేనని, లేదని స్పష్టంగా చెప్పేశారు. ఎన్నో ఆయతులలో ఈ విషయం ఉంది. సూరత్ అజ్-జుఖ్రుఫ్ చదవండి.

إِنَّنِي بَرَاءٌ مِّمَّا تَعْبُدُونَ
(ఇన్ననీ బరాఉమ్ మిమ్మా తఅబుదూన్)
“నిశ్చయంగా, మీరు పూజించే వాటితో నాకు ఏ మాత్రం సంబంధం లేదు.” (43:26)

إِلَّا الَّذِي فَطَرَنِي
(ఇల్లల్లదీ ఫతరనీ)
“కేవలం అల్లాహ్, ఆయనే నన్ను పుట్టించాడు, ఆయనే నా యొక్క నిజదైవం, నిజ ఆరాధ్యుడు, ఆయన వైపునకే నేను అంకితమై ఉన్నాను, ఆయనకే నేను దాస్యం చేస్తూ ఉన్నాను.”

ఈ విధంగా సోదరులారా! మనమందరము కూడా ఇబ్రాహీం అలైహిస్సలాం వారి ఈ ధర్మం, దేనినైతే మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొచ్చారో, ఏమిటి అది?

أَنْ تَعْبُدَ اللَّهَ وَحْدَهُ
(అన్ తఅబుదల్లాహ వహ్దహు)
నీవు ఏకైకుడైన అల్లాహ్ ను మాత్రమే ఆరాధించు.

مُخْلِصًا لَهُ الدِّينَ
(ముఖ్లిసన్ లహుద్దీన్)
ధర్మాన్ని, దీన్ ను కేవలం ఆయనకు మాత్రమే ప్రత్యేకించి.

ఖులూస్, లిల్లాహియ్యత్, చిత్తశుద్ధి. ఇదే ఆదేశం అల్లాహు త’ఆలా ఖుర్ఆన్లో అనేక సందర్భాలలో ఇచ్చాడు. ఉదాహరణకు,

وَمَا أُمِرُوا إِلَّا لِيَعْبُدُوا اللَّهَ مُخْلِصِينَ لَهُ الدِّينَ
(వమా ఉమిరూ ఇల్లా లియఅబుదుల్లాహ ముఖ్లిసీన లహుద్దీన్)
వారు అల్లాహ్ నే ఆరాధించాలని ధర్మాన్ని ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలనీ వారికి ఆదేశించబడింది” (98:5)

సూరతుల్ బయ్యినాలో. ఇంకా సూరత్ జుమర్, వేరే అనేక సందర్భాలలో. విషయం అర్థమైంది కదా. ఇబ్రాహీం అలైహిస్సలాం తీసుకువచ్చినటువంటి మిల్లత్, ధర్మం, హనీఫియ్యత్, ఒకే వైపునకు మరలి ఉండడం, అంకితమై ఉండడం, అది అల్లాహ్ వైపునకు, ఎలాంటి షిర్క్ లేకుండా, అదేమిటి? అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలి, ఏ రవ్వంత కూడా అల్లాహ్ ఆరాధనలో ఎవరినీ భాగస్వామిగా చేయకూడదు. అయితే, ఇదే ఆదేశం అల్లాహు త’ఆలా సర్వమానవాళికి ఇచ్చాడు.

وَمَا خَلَقْتُ الْجِنَّ وَالْإِنسَ إِلَّا لِيَعْبُدُونِ
(వమా ఖలఖ్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లి యఅబుదూన్)
నేను జిన్నాతులను, మానవులను సృష్టించినది వారు నన్ను “ఆరాధించటానికి” మాత్రమే.” (జారియాత్ 51:56).

మానవులను పుట్టించింది కూడా దీని కొరకే అని ఈ ఆయత్, సూరత్ జారియాత్, సూరా నెంబర్ 51, ఆయత్ నెంబర్ 56 ద్వారా చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే సోదర మహాశయులారా!

فإذا عرفتَ أن الله خلقك لعبادته: فاعلم أنّ العبادةَ لا تُسمى عبادةً إلا مع التوحيد، (كما أنّ الصلاة لا تُسمى صلاة إلا مع الطهارة).

అల్లాహ్ నిన్ను ఆయన ఆరాధన కొరకు మాత్రమే పుట్టించాడన్నది నీవు తెలుసుకున్నప్పుడు, ఇది కూడా తెలుసుకో: ఎలాగైతే వుజూ లేనిది నమాజును నమాజ్ అనబడదో అలాగే తౌహీద్ (ఏకదైవారాధన) లేనంత వరకు ఏ ఆరాధన కూడా ఆరాధన అనబడదు. ఎలాగైతే నమాజులో వుజూ భంగమయితే నమాజ్ పాడవుతుందో, అలాగే ఆరాధనలో ‘షిర్క్’ ప్రవేశిస్తే అది పాడవుతుంది (స్వీకరించబడదు).

ఆ తర్వాత ఇమామ్ ముహమ్మద్ అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్ చెబుతున్నారు. కొంచెం ఈ యొక్క సెంటెన్స్, పేరాగ్రాఫ్ పై శ్రద్ధ వహించండి. అల్లాహ్ నిన్ను ఆయన ఆరాధన కొరకు మాత్రమే పుట్టించాడన్నది నీవు తెలుసుకున్నప్పుడు, ఇది కూడా తెలుసుకో, (ఫఅలం) ఎలాగైతే వుదూ లేనిది నమాజ్ ను నమాజ్ అనబడదో, అలాగే తౌహీద్ (ఏకదైవారాధన) లేనంతవరకు ఏ ఆరాధన కూడా ఆరాధన అనబడదు.

అర్థమైందా? మరోసారి చదువుతున్నాను, చెబుతున్నాను, శ్రద్ధగా వినండి. ఆ తర్వాత వివరిస్తాను.

అల్లాహ్ నిన్ను పుట్టించింది ఎందుకు? ఆయన ఆరాధన కొరకు మాత్రమే కదా. అల్లాహ్ నిన్ను ఆయన ఆరాధన కొరకు మాత్రమే పుట్టించాడు అన్నది నీవు తెలుసుకున్నప్పుడు, ఇది కూడా తెలుసుకో, ఏంటి? ఎలాగైతే వుదూ లేని నమాజ్ ను నమాజ్ అనబడదో, అలాగే తౌహీద్, ఏకదైవారాధన లేని ఏ ఆరాధన కూడా ఆరాధన అనబడదు.

సోదర మహాశయులారా! సోదరీమణులారా! ఎంత ఎక్కువగా పెద్ద జ్ఞానం లేకున్నా, నమాజ్ ప్రాముఖ్యత తెలిసిన వ్యక్తి, వుదూ లేనిది నమాజ్ కాదు అని తెలిసిన వ్యక్తి, ఏం చేస్తాడు? వుదూ చేసుకొని వస్తున్నాడు. ఇంకా అతని యొక్క వుదూ అవయవాలలో తడి ఆరలేదు. వుదూ చేసుకున్నటువంటి ఆ నీరు ఇంకా కారుతూ ఉన్నది చేతుల నుండి, ముఖం నుండి. అంతలోనే అపాన వాయువు (gas) జరిగింది. అయితే, ఇంకా నా నేను వుదూ చేసుకున్న స్థితిలోనే ఫ్రెష్ గానే ఉన్నాను కదా. పోనీ జరిగిందేదో జరిగిపోయింది, పోయి నమాజ్ చేసుకుంటాను అని చేసుకుంటాడా? ఒకవేళ అతను అలా చేసుకున్నా గానీ, ఆ నమాజ్ నమాజ్ అవుతుందా? నెరవేరుతుందా? నమాజ్ చేసిన వారి జాబితాలో అతడు లెక్కించబడతాడా? కాదు కదా. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహీ హదీస్ ఉంది.

إِنَّ اللَّهَ لا يَقْبَلُ صَلاةً بِغَيْرِ طَهُورٍ
(ఇన్నల్లాహ లా యఖ్బలు సలాతన్ బిగైరి తహూరిన్)
అల్లాహు త’ఆలా వుదూ లేని నమాజును స్వీకరించడు.

అలాగే మరొక హదీస్ లో ఉంది. ఎవరైనా నమాజ్ చేశారు మరియు అతను నమాజ్ చేస్తున్న స్థితిలో అతనికి ఏదైనా జరిగి వుదూ భంగమైపోయింది, తిరిగి అతను వుదూ చేసి మళ్ళీ ఆ తర్వాత వచ్చి కొత్తగా నమాజ్ ప్రారంభించాలి. అప్పుడే అల్లాహ్ అతని నమాజును స్వీకరిస్తాడు. ఈ రెండవ హదీస్ బుఖారీలో ఉంది.

ఈ విధంగా మనిషి వుదూ చేసుకొని వచ్చి, ఇంకా అతని ముఖం ఆరనప్పటికీ, చేతులు ఆరనప్పటికీ, ఒకవేళ వుదూ తెగిపోయింది, భంగమైపోయింది, అపాన వాయువు జరిగి ఇంకా ఏదైనా కారణం వల్ల, వుదూ నీళ్లు ఆరలేదు కదా అని నమాజ్ చేయలేడు అతను. చేసినా అది నమాజ్ అనబడదు. అలాగే, మనం ఏ ఆరాధన అయినా, అందులో అల్లాహ్ తో పాటు ఇంకా వేరే ఎవరినైనా భాగస్వామిగా చేస్తున్నామంటే, ఇక షిర్క్ వచ్చింది అంటే తౌహీద్ మాయమైపోయింది. ఎందుకంటే షిర్క్ వచ్చింది అంటే కేవలం అల్లాహ్ యొక్క ఆరాధన జరగలేదు కదా. ఎలాగైతే వుదూ లేనిది నమాజ్ నమాజ్ అనబడదో, తౌహీద్ లేనిది ఆరాధన ఆరాధన అనబడదు.

ఈ పద్ధతిని ఏమంటారు? పాజిటివ్ గా నచ్చజెప్పడం, అర్థం చెప్పడం. ఇక రండి, ఇదే విషయాన్ని అపోజిట్ గా, మళ్ళీ మరింత వివరించి మనకు బోధిస్తున్నారు షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్. ఒకసారి ఈ విషయాన్ని కూడా శ్రద్ధగా వినండి, చూడండి. ఏంటి?

ఎలాగైతే నమాజ్ లో వుదూ భంగమైతే, నమాజ్ పాడవుతుందో, అలాగే ఆరాధనలో షిర్క్ ప్రవేశిస్తే, ఆ ఆరాధన పాడవుతుంది. అల్లాహ్ వద్ద స్వీకరించబడదు. గమనించండి ఇక్కడ. ఇంతకుముందు పాజిటివ్ లో అర్థం చేసుకున్నాము కదా. ఇప్పుడు ఇది అపోజిట్ గా.

వుదూ లేని నమాజ్ నమాజ్ అనబడదు. అలాగే తౌహీద్ లేని ఏ ఆరాధన కూడా ఆరాధన అనబడదు. ఇక మనిషి వుదూ చేసుకున్నాడు, నమాజ్ చేస్తున్నాడు. కానీ ఏమైంది? నమాజ్ లో ఉండగానే అపాన వాయువు వచ్చేసింది. గాలి వెళ్ళింది. ఏమైపోయింది? వుదూ భంగం, ఆ నమాజ్ కూడా భంగమే కదా. ఎలాగైతే వుదూను అపాన వాయువు భంగపరుస్తుందో, నమాజ్ ను అపాన వాయువు భంగపరుస్తుందో, అలాగే ఆరాధనను పాడు చేస్తుంది ఏమిటి? షిర్క్. అందుకొరకే ఎలాగైతే మనం మంచిగా వుదూ చేసుకున్న తర్వాత నమాజ్ స్వీకరించబడాలని చేస్తున్నాము, కానీ అపాన వాయువు జరిగితే మళ్ళీ వుదూ చేసుకొని వస్తాము. అలాగే ఆరాధన మనం చేస్తున్నప్పుడు ఏదైనా షిర్క్ జరిగింది అంటే అల్లాహ్ తో క్షమాపణ కోరుకొని, ఆ షిర్క్ నుండి మనం దూరమైపోవాలి. ఆ ఆరాధనను కేవలం అల్లాహ్ కు మాత్రమే అంకితం చేయాలి. అప్పుడే అది స్వీకరించబడుతుంది.

ఇక ఈ విషయాన్ని నేను మరికొన్ని ఆధారాలతో మీకు తెలియజేస్తాను. కానీ ఆ తర్వాత సెంటెన్స్ ను మరొకసారి గమనించండి. ఆ తర్వాత సెంటెన్స్, షిర్క్ ఇబాదత్ లో వస్తే, ఆరాధనలో వస్తే మూడు రకాల నష్టాలు జరుగుతాయి. మూడు రకాల నష్టాలు. ఏంటి అవి? వినండి ఇమామ్ ముహమ్మద్ అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్ ఏం చెబుతున్నారో.

షిర్క్ ఏదైనా ఆరాధనలో కలుషితమైతే అది దానిని చెడగొడుతుంది. ఆ కార్యం వృధా అవుతుంది. పుణ్యఫలం దానికి దొరకదు. ఇంకా షిర్క్ కు పాల్పడిన వాడు శాశ్వతంగా నరకవాసి అయిపోతాడు.”

ఈ మూడు నష్టాలు మంచిగా తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మరొక ముఖ్య విషయం ఇక్కడ మనకు తెలియజేస్తారు ఇమామ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్.

షిర్క్ యొక్క నష్టం అర్థమైందా మీకు? మరొకసారి వివరిస్తున్నాను. షిర్క్ యొక్క మూడు నష్టాలు ఇక్కడ తెలపడం జరిగింది. ఒకటి ఏమిటి? ఏ ఆరాధనలో షిర్క్ కలుషితం అవుతుందో, ఆ ఆరాధన పాడైపోతుంది, చెడిపోతుంది. రెండవ నష్టం, దానికి ఏ పుణ్యం లభించాలో, అది లభించదు. మూడవది, ఆ షిర్క్ చేసినవాడు, ఒకవేళ అది పెద్ద షిర్క్ అయ్యేది ఉంటే, అదే స్థితిలో మరణించేది ఉంటే, శాశ్వతంగా నరకానికి వెళ్తాడు.

షిర్క్ ఎంత భయంకర విషయమో తెలుస్తుందా? ఇంకా తెలియలేదా? వినండి నేను ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. మీరు డ్యూటీలో వచ్చారు. ఈ రోజుల్లో ఎన్నో కంపెనీలలో, ఫ్యాక్టరీలలో, వర్క్ షాప్ లలో, ఫింగర్ అటెండెన్స్ అనేది ఇంతకుముందు మాదిరిగా లేదు, బయోమెట్రిక్. మీ యొక్క కళ్ళ ద్వారా లేదా బొటనవేలిని ‘బస్మా’ అంటారు అరబీలో, ఈ విధంగా కరెక్ట్ టైం కు హాజరయ్యారు. ఏ పని మీరు చేయాలో, చాలా కష్టపడి ఎన్నో గంటలు ఆ పని చేశారు. కానీ ఏం జరిగింది? మీరు ఆ పని చేస్తున్న సందర్భంలో మీ యొక్క యజమాని యొక్క ఆజ్ఞా పాలన చేయకుండా, ఆ పనిలో ఎక్కడో మీరు చాలా ఘోరమైన తప్పు చేశారు. అందుకొరకు మీ యొక్క యజమాని, మీ యొక్క ఫ్యాక్టరీ యొక్క బాధ్యుడు ఏం చేశాడు? మీపై కోపగించుకొని, ఆ రోజు మీరు వచ్చిన ఏదైతే ప్రజెంట్ ఉందో, డ్యూటీలో హాజరయ్యారో, దాన్ని ఆబ్సెంట్ గా చేసేసాడు. రాలేదన్నట్లుగా. రెండవది, ఆ రోజంతా ఏదైతే మీరు శ్రమించారో, పని చేశారో, దానికి రావలసిన మీ యొక్క జీతం ఏదైతే ఉందో, అది కూడా దొరకదు అని చెప్పేశాడు. ఇలా జరుగుతూ ఉంటుంది కదా కొన్ని సందర్భాలలో మనం చూస్తాము కూడా, వార్తల్లో వింటాము కూడా. ఇక్కడ గమనించండి, చేసిన ఆ పని, చేయనట్లుగా లెక్క కట్టాడు. డ్యూటీకి హాజరయ్యారు, కాలేదు అన్నట్లుగా లెక్క కట్టాడు. మీకు రావలసిన ఆ శ్రమ, ఆ పని ఏదైతే జీతం ఉందో, అది కూడా ఇవ్వను అని అన్నాడు.

సోదర మహాశయులారా! ఇది కేవలం అర్థం కావడానికి చిన్న ఉదాహరణ అంతే. ఇంతకంటే మరీ ఘోరమైనది షిర్క్. మీరు దుఆ చేస్తూ కేవలం అల్లాహ్ తో దుఆ చేయకుండా వేరే ఎవరికైనా చేశారు. ఇంకా ఏదైనా ఆరాధన, ఉదాహరణకు తవాఫ్. కేవలం అల్లాహ్ కొరకు కావాలి, కఅబతుల్లాహ్ యొక్క తవాఫే జరగాలి. కానీ మీరు ఏదైనా దర్గాకు తవాఫ్ చేశారు. జిబహ్, కేవలం అల్లాహ్ పేరు మీద, అల్లాహ్ యొక్క సంతృప్తి కొరకు, అల్లాహ్ కొరకే జరగాలి. కానీ ఏదైనా బాబా, వలీ, ఏదైనా సమాధి వారికి అక్కడ జిబహ్ చేశారు. ఈ ఆరాధనలు, ఇందులో తౌహీద్ ను పాటించలేదు, షిర్క్ చేశారు. ఒక నష్టం ఏమిటి? ఆ పని మీరు ఏదైతే చేశారో, ఆరాధన ఏదైతే చేశారో, చేయనట్లుగానే లెక్కించబడుతుంది. రెండవది, దాని యొక్క పుణ్యం మీకు ఏ మాత్రం దొరకదు. వృధా అయిపోతుంది. ఒకవేళ అది పెద్ద షిర్క్ అయ్యేది ఉంటే, తౌబా చేయకుండా ఆ షిర్క్ స్థితిలోనే చనిపోతే, శాశ్వతంగా నరకంలో ఉంటారు.

అల్లాక్ అక్బర్! ఎంత ఘోరమైన విషయం చూడండి. అయితే దీనికి ఆధారం, సూరత్ అత్-తౌబా ఆయత్ నెంబర్ 17 చూడండి మీరు. అల్లాహు త’ఆలా ఎలా మనల్ని హెచ్చరిస్తున్నాడో.

مَا كَانَ لِلْمُشْرِكِينَ أَن يَعْمُرُوا مَسَاجِدَ اللَّهِ شَاهِدِينَ عَلَىٰ أَنفُسِهِم بِالْكُفْرِ ۚ أُولَٰئِكَ حَبِطَتْ أَعْمَالُهُمْ وَفِي النَّارِ هُمْ خَالِدُونَ
“ముష్రిక్కులు తాము స్వయంగా తమ అవిశ్వాసాన్ని గురించి సాక్ష్యమిస్తున్నప్పుడు వారు అల్లాహ్‌ మస్జిదుల నిర్వాహకులుగా ఉండటానికి ఎంత మాత్రం తగరు. వారి కర్మలన్నీ వృధా అయిపోయాయి. వారు శాశ్వతంగా నరకాగ్నిలో ఉంటారు.” (9:17)

సోదర మహాశయులారా! సూరత్ జుమర్ మీరు చదివారంటే,

وَلَقَدْ أُوحِيَ إِلَيْكَ وَإِلَى الَّذِينَ مِن قَبْلِكَ لَئِنْ أَشْرَكْتَ لَيَحْبَطَنَّ عَمَلُكَ
“అల్లాహు త’ఆలా మీకు మరియు మీ కంటే ముందు ప్రవక్తలందరి వైపునకు వహీ చేసినది ఏమిటంటే, నీవు షిర్క్ చేశావంటే, అల్లాహ్ కు ఎవరినైనా భాగస్వామిగా కలిపావంటే, నీ యొక్క సర్వసత్కార్యాలు వృధా అయిపోతాయి.”

ఇంకా

مِنَ الْخَاسِرِينَ
(మినల్ ఖాసిరీన్)
మరి షిర్క్ చేసేవారు పరలోక దినాన చాలా దివాలా తీస్తారు, నష్టపోతారు, లాస్ లో ఉంటారు.

సోదర మహాశయులారా! గమనిస్తున్నారా షిర్క్ నష్టం. సూరతుల్ అన్ఆమ్ లో కూడా ఈ విషయం తెలపడం జరిగింది.

وَلَوْ أَشْرَكُوا لَحَبِطَ عَنْهُم مَّا كَانُوا يَعْمَلُونَ
“వారు గనుక షిర్క్ చేస్తే వారి కర్మలన్నీ వృధా అయిపోతాయి.”

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహీ హదీస్,

مَنْ لَقِيَ اللَّهَ لا يُشْرِكُ بِهِ شَيْئًا دَخَلَ الْجَنَّةَ
ఎవరైతే చనిపోయే స్థితిలో, అంటే అల్లాహ్ ను కలుసుకునే స్థితిలో, ఎలాంటి షిర్క్ లేకుండా, తౌహీద్ పై వారి చావు వస్తుందో, వారు స్వర్గంలో ప్రవేశిస్తారు.

وَمَنْ لَقِيَهُ يُشْرِكُ بِهِ شَيْئًا دَخَلَ النَّارَ
మరి ఎవరైతే అల్లాహ్ ను, అల్లాహ్ తో పాటు ఇంకా ఎవరినైనా భాగస్వామిగా చేస్తూ షిర్క్ స్థితిలో అల్లాహ్ ను కలుసుకుంటారో, అతను నరకంలో ప్రవేశిస్తాడు.

శాశ్వతంగా నరకంలో ఉంటాడు అంటే ఏంటి భావం అర్థమైంది కదా? ఎవరైతే షిర్క్ చేసిన తర్వాత ఇహలోకంలో కొద్ది రోజులైనా, కొన్ని క్షణాలైనా జీవించే భాగ్యం కలిగి ఉండి, షిర్క్ యొక్క నష్టాన్ని తెలుసుకొని తౌబా చేశాడో, అతడు శాశ్వతంగా నరకంలో ఉండడు. ఎవరికైతే ఈ లోకంలో ఉండే భాగ్యం కలిగింది, షిర్క్ నష్టాన్ని తెలుసుకోలేదు, లేదా తెలుసుకున్నాడు కానీ తౌబా చేయలేదు, ఆ షిర్క్ స్థితిలోనే చనిపోయాడు.

అందుకొరకే ఎల్లవేళల్లో మన యొక్క బాధ్యత, మన యొక్క కర్తవ్యం ఏమిటి? మనం అల్లాహ్ తో అన్ని రకాల షిర్క్ ల నుండి క్షమాపణ కోరుకుంటూ ఉండాలి. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు,

إِنَّ الشِّرْكَ أَخْفَى مِنْ دَبِيبِ النَّمْلِ
(ఇన్నష్షిర్క అఖ్ఫా మిన్ దబీబిన్నమ్ల్)
“షిర్క్ మీలో చీమ నడక కంటే మరీ ఎంతో సూక్ష్మంగా మీలో ప్రవేశిస్తుంది”

ఈ మాట విని సహాబాలు చాలా భయపడిపోయారు. భయపడి ప్రవక్తా, ఒకవేళ పరిస్థితి ఇలా ఉండేది ఉంటే, మరి మేము ఈ షిర్క్ నుండి ఎలా రక్షణ పొందాలి? అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఈ దుఆ ఎక్కువగా చదువుతూ ఉండండి. నేర్చుకోండి ఈ దుఆ:

اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ أَنْ أُشْرِكَ بِكَ وَأَنَا أَعْلَمُ، وَأَسْتَغْفِرُكَ لِمَا لا أَعْلَمُ
(అల్లాహుమ్మ ఇన్నీ అఊదు బిక అన్ ఉష్రిక బిక వ అన అఅలమ్, వ అస్తగ్ఫిరుక లిమా లా అఅలమ్)

“ఓ అల్లాహ్! తెలిసి తెలిసి ఏదైనా షిర్క్ చేయడం, ఇలాంటి పరిస్థితి నాకు ఎప్పుడూ రాకూడదు, అందుకని నేను నీ శరణు కోరుతున్నాను. ఇది షిర్క్ అని తెలిసింది. కానీ ఏదైనా ప్రలోభానికి, ఏదైనా భయానికి, ఒకరి ఒత్తిడికి అది చేసేటువంటి పరిస్థితి నాకు ఎదురు కాకూడదు. అలా ఎదురయ్యే విషయం నుండి నీవు నన్ను కాపాడుకో.ఒకవేళ నాకు తెలియక పొరపాటున ఏదైనా షిర్క్ జరిగిపోతే, నేను నీతో క్షమాపణ కోరుతున్నాను. నా యొక్క అన్ని రకాల షిర్క్, చిన్నది, పెద్దది, తెలిసినది, తెలియనిది, అన్ని రకాల షిర్క్ లను ఓ అల్లాహ్, నీవు క్షమించు, నన్ను మన్నించు, ఆ షిర్క్ కు పాల్పడకుండా నన్ను కాపాడుకో.”

ఈ విధంగా దుఆలు మనం చేస్తూ ఉండాలి. చేయాలా వద్దా? అన్ని రకాల షిర్క్ నుండి కాపాడడానికి దుఆ చేయాలని ప్రవక్త నేర్పారు మనకు ఒక దుఆ. అంతే కాదు, ఈనాటి పాఠంలో ఆరంభంలో ఇబ్రాహీం అలైహిస్సలాం మిల్లత్ అని మనం తెలుసుకున్నాము, ఇబ్రాహీం అలైహిస్సలాం వారి సత్యధర్మం గురించి, ఆ ఇబ్రాహీం అలైహిస్సలాం ఎవరినైతే అల్లాహ్ తనకు ఖలీల్, అత్యంత ప్రియుడు అని బిరుదు ఇచ్చాడో, అంతటి గొప్ప ఇబ్రాహీం అలైహిస్సలాం దుఆ చేస్తున్నారు, ఏమని?

وَاجْنُبْنِي وَبَنِيَّ أَن نَّعْبُدَ الْأَصْنَامَ
(వజ్నుబ్నీ వ బనియ్య అన్ నఅబుదల్ అస్నామ్)
“నన్ను మరియు నా సంతానాన్ని విగ్రహారాధన నుండి కాపాడు ఓ అల్లాహ్”

గమనిస్తున్నారా? మనం ఈ రోజుల్లో ఇలాంటి దుఆలు చేయడం ఇంకా ఎంత అవసరం ఉందో గమనించండి. అరే అవసరం లేదండి, నేను పక్కా తౌహీద్ పరుడను, నేను మువహ్హిద్ ని. ఇలాంటి గర్వాలు మనకు ఏమీ లాభం రావు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దుఆ చేసేవారు. ఇబ్రాహీం అలైహిస్సలాం దుఆ చేసేవారు. అందుకొరకు మనం కూడా అన్ని రకాల షిర్క్ నుండి దూరం ఉండడానికి దుఆ చేయాలి. రండి ఆ తర్వాత ఏమంటున్నారు ఇమామ్ ముహమ్మద్ ఇబ్న్ అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్.

అల్లాహు త’ఆలా షిర్క్ గురించి హెచ్చరిస్తూ సూరతున్నిసా ఆయత్ నెంబర్ 116 లో తెలిపారు.

إِنَّ اللَّهَ لَا يَغْفِرُ أَن يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَٰلِكَ لِمَن يَشَاءُ
“తనకు భాగస్వామ్యం (షిర్క్) కల్పించడాన్ని అల్లాహ్ ఎట్టి పరిస్థితిలోనూ క్షమించడు. షిర్క్ మినహా తాను కోరిన వారి ఇతర పాపాలను క్షమిస్తాడు.” (4:116)

అయితే, ఈ షిర్క్ యొక్క ఇంత భయంకరమైన పరిస్థితిని మనం తెలుసుకున్నాక, ఇక ఆ షిర్క్ లో పడకుండా జాగ్రత్తగా ఉండడానికి నాలుగు మూల విషయాలను, నియమాలను తెలుసుకోవడం చాలా తప్పనిసరి అవుతుంది. ఆ విషయాలే ఇన్ షా అల్లాహ్ తర్వాత పాఠాల్లో మనం చెప్పబోతున్నాము. ఇక్కడివరకు అల్హందులిల్లాహ్ ఈ రోజు పాఠం పూర్తి కాబోతుంది. ఇక నుండి అంటే వచ్చే పాఠం ఆదివారం ఏదైతే జరుగుతుందో, అందులో ఈ అల్-ఖవాయిద్ అల్-అర్బా, నాలుగు నియమాలలో మొదటి నియమం ఏమిటో తెలపడం జరుగుతుంది. మరియు ఈ నియమాలు తెలుసుకోవడం చాలా అవసరం. వీటి ద్వారా మనం షిర్క్ లో పడకుండా జాగ్రత్తగా ఉండగలుగుతాము.

విన్న విషయాలను అర్థం చేసుకొని అల్లాహు త’ఆలా మనందరికీ తౌహీద్ పై స్థిరంగా ఉండే భాగ్యం కలిగించుగాక. ఆమీన్,

వ ఆఖిరు దఅవాన అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

మొదటి పాఠంలో నేను ఇమామ్ ముహమ్మద్ ఇబ్న్ అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్ వారి యొక్క చాలా సంక్షిప్తంగా పుట్టుక, దావత్ గురించి ఒకటి రెండు విషయాలు, రెండు మాటలు చెప్పాను. అయితే అందులో ఒక చిన్న పొరపాటు నాతో జరిగింది. అదేమిటి? ఆయన దిర్ఇయ్యాలో పుట్టారు అని చెప్పాను. అయితే దిర్ఇయ్యాలో కాదు, ఉయైనా అనే ప్రాంతంలో పుట్టారు. అది కూడా రియాద్ కు దగ్గరలోనే ఉంది. కాకపోతే, ఆయన జీవితంలో దిర్ఇయ్యా చాలా ముఖ్యమైన ఘట్టం. ఎందుకంటే దిర్ఇయ్యాలో అప్పుడు ముహమ్మద్ ఇబ్న్ సఊద్ రహిమహుల్లాహ్ రాజుగా ఉన్నారు. ఆయన ఇమామ్ ముహమ్మద్ ఇబ్న్ అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్ వారికి తోడ్పాటు ఇచ్చారు. ఇద్దరూ కలిసి మాషా అల్లాహ్ తౌహీద్ ను ఈ మొత్తం అరబ్ ద్వీపములో, జజీరతుల్ అరబ్ లో ప్రచారం చేయడానికి ఏకమయ్యారు. ఆ రకంగా దిర్ఇయ్యా దాని ప్రస్తావన వారి యొక్క చరిత్రలో ఉన్నది. కానీ ఆయన పుట్టిన యొక్క ప్రాంతం ప్లేస్ అది ఉయైనా.

షిర్క్ నాలుగు సూత్రాలు – పుస్తకం & వీడియో పాఠాలు

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=41663

ప్రవక్తలు ఎందుకు వచ్చారు? [వీడియో | టెక్స్ట్]

ప్రవక్తల రాక ఉద్దేశ్యం
https://youtu.be/e0k8L0QdnRk [12 నిముషాలు]
త్రిసూత్రాలు| పుస్తకం & వీడియో పాఠాలు | నసీరుద్దీన్ జామి’ఈ

ఈ ప్రసంగంలో, ప్రవక్తల పంపకం యొక్క ఉద్దేశ్యం, వారి పాత్ర మరియు సందేశం గురించి వివరించబడింది. అల్లాహ్ తన ప్రవక్తలందరినీ శుభవార్త ఇచ్చేవారిగా మరియు హెచ్చరించే వారిగా పంపాడని, ఏకదైవారాధన వైపు ప్రజలను పిలవడానికి మరియు బహుదైవారాధన (షిర్క్) నుండి హెచ్చరించడానికి వారు వచ్చారని స్పష్టం చేయబడింది. మొట్టమొదటి ప్రవక్త నూహ్ (అలైహిస్సలాం) మరియు చివరి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అని, వారి మధ్య వచ్చిన ప్రవక్తలందరి ప్రాథమిక సందేశం ఒక్కటేనని ఖురాన్ మరియు హదీసుల ఆధారాలతో వివరించబడింది. మానవులకు మార్గదర్శకత్వం కోసం అల్లాహ్ చేసిన ఈ ఏర్పాటును అనుసరించాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెప్పబడింది.

అల్హందులిల్లాహ్. ఉసూలె సలాస, త్రిసూత్రాలు, 22వ పాఠం.

ఇమాం ముహమ్మద్ ఇబ్ను అబ్దుల్ వహాబ్ రహిమహుల్లాహ్ చెప్పారు,

وَأَرْسَلَ اللَّهُ جَمِيعَ الرُّسُلِ مُبَشِّرِينَ وَمُنذِرِينَ
(వ అర్సలల్లాహు జమీఅర్రుసుల్ ముబష్షిరీన వ మున్దిరీన్)
అల్లాహు త’ఆలా ప్రవక్తలందరినీ కూడా శుభవార్త ఇచ్చే వారిగా మరియు హెచ్చరించే వారిగా చేసి పంపాడు.

దలీల్ ఇప్పుడే ఇన్షా అల్లాహ్ మనం తెలుసుకుందాము, కానీ ఇక్కడ ఒక మూడు విషయాలు గమనించండి. అల్లాహు త’ఆలా మనపై ఎంత గొప్ప దయ చూపాడు! మనం మార్గభ్రష్టత్వంలో పడి ఉండకుండా, చనిపోయిన తర్వాత నరకంలో శిక్ష పొందకుండా, మన మేలు కొరకు అల్లాహు త’ఆలా ప్రవక్తల పరంపరను ఆదం అలైహిస్సలాం తర్వాత నుండి షిర్క్ మొదలయ్యాక నూహ్ అలైహిస్సలాంని ఆ తర్వాత ఇంకా ఎందరో ప్రవక్తలని పంపుతూ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఈ పరంపరను అంతం చేశాడు.

అయితే ఆ ప్రవక్తలందరూ శుభవార్త ఇచ్చేవారు, హెచ్చరించేవారు. ఇక రెండో విషయం ఇక్కడ గమనించాల్సింది, శుభవార్త ఏంటి అది? ఎవరి కొరకు? మూడో విషయం, హెచ్చరిక ఏమిటి? ఎవరి కొరకు?

శుభవార్త ఎవరైతే కేవలం అల్లాహ్ ను ఆరాధించి ప్రవక్తను అనుసరిస్తారో, ఇక ఇప్పుడు ప్రళయం వచ్చే వరకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరిస్తారో, అలాంటి వారికి స్వర్గం యొక్క శుభవార్త. అల్లాహ్ యొక్క గొప్ప వరాలు, అనుగ్రహాల యొక్క శుభవార్త.

ఇక ఎవరైతే అల్లాహ్ ను ఆరాధించరో, అల్లాహ్ తో పాటు వేరే వారిని భాగస్వామిగా కలుపుతారో, ఎవరైతే ప్రవక్తల్ని వారి వారి కాలాలలో అనుసరించలేదో, ఇప్పుడు ప్రళయం వరకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించరో అలాంటి వారికి హెచ్చరిక. దేని గురించి? నరకం నుండి. ఇంకా వేరే భయంకరమైన శిక్షల నుండి.

అందుకొరకు ఈ పాఠంలోని ఈ మొదటి అంశం ద్వారా తెలిసేది ఏమిటంటే అల్లాహు త’ఆలా ప్రవక్తలందరినీ శుభవార్తను ఇచ్చే వారిగా, హెచ్చరిక చేసే వారిగా ఏదైతే పంపాడో మనం శుభవార్తను అందుకునే వారిలో చేరాలి.

ఇక ఈ మాటపై దలీల్ ఏమిటి? సూరతున్నిసా లోని ఈ ఆయత్.

رُّسُلًا مُّبَشِّرِينَ وَمُنذِرِينَ
(రుసులమ్ ముబష్షిరీన వమున్దిరీన్)
మేము వారిని శుభవార్తలు వినిపించే, హెచ్చరించే ప్రవక్తలుగా చేసి పంపాము (4:165)

అల్లాహు త’ఆలా ప్రవక్తలని శుభవార్తనిచ్చేవారిగా, హెచ్చరించేవారిగా చేసి పంపాడు. ఎందుకు?

لِّئَلَّا يَكُونَ لِلنَّاسِ عَلَى اللَّهِ حُجَّةٌ بَعْدَ الرُّسُلِ
(లిఅల్లా యకూన లిన్నాసి అలల్లాహి హుజ్జతుమ్ బ’అదర్రుసుల్)
ప్రవక్తలు వచ్చిన తరువాత అల్లాహ్‌కు వ్యతిరేకంగా వాదించటానికి ప్రజల వద్ద ఏ ఆధారమూ మిగలకూడదని (మేమిలా చేశాము) (4:165)

ప్రవక్తలను పంపిన తర్వాత ప్రజల వద్ద అల్లాహ్ కు వ్యతిరేకంగా ఏ ఒక్క సాకు మిగిలి ఉండకూడదు. వారి వద్ద ఏ ప్రమాణం మిగిలి ఉండకూడదు. అంటే ఏమిటి? రేపటి రోజు ప్రజలు వచ్చి ఎప్పుడైతే అల్లాహు త’ఆలా లెక్క తీసుకుంటాడో వారి మధ్యలో తీర్పు చేస్తాడో మరియు వారు వారి యొక్క షిర్క్, ఇంకా అవిధేయత కారణాల వల్ల ఏదైతే నరకంలో వెళ్తూ ఉంటారో, అప్పుడు వారు “ఓ అల్లాహ్! మమ్మల్ని ఎందుకు నరకంలో వేస్తున్నావు? నీవైతే మా హితోపదేశానికి, మమ్మల్ని మార్గం చూపడానికి, సన్మార్గం వైపునకు మాకు మార్గదర్శకత్వం చేయడానికి ఏ ప్రవక్తను పంపలేదు కదా, ఏ గ్రంథాన్ని అవతరింపజేయలేదు కదా” ఇలాంటి ఏ మాట చెప్పడానికి అవకాశం మిగిలి ఉండకూడదు. అందుకే అల్లాహు త’ఆలా ప్రవక్తలను పంపేసి స్వయం అల్లాహ్ ఒక హుజ్జత్, ఒక నిదర్శనం, వారిపై ఒక ప్రమాణం అల్లాహు త’ఆలా చేశాడు. ఇక ఎవరైతే సన్మార్గంపై ఉండరో, అల్లాహ్ యొక్క ఆరాధన మాత్రమే పాటించరో, ప్రవక్తల్ని అనుసరించరో దాని కారణంగా నరకంలో వెళితే ఇది అల్లాహ్ ది ఎంత మాత్రం తప్పు కాదు. అల్లాహ్ విషయంలో ఎలాంటి అన్యాయం చేశాడు అన్నటువంటి మాట మనం చెప్పలేము. ఎందుకంటే అల్లాహ్ వైపు నుండి మనం మార్గదర్శకత్వం పొందే సాధనాలన్నీ కూడా అల్లాహ్ యే ఏర్పాటు చేశాడు. ప్రవక్తలను పంపి, గ్రంథాలను అవతరింపజేసి. కానీ మనం ఒకవేళ సన్మార్గంపై రాకుంటే అది మన తప్పు అవుతుంది.

ఇక ఈనాటి పాఠంలో ముఖ్యమైన మరొక అంశం ఏమిటంటే షిర్క్ గురించి హెచ్చరిస్తూ వచ్చిన మొట్టమొదటి ప్రవక్త నూహ్ అలైహిస్సలాం. త్వరపడకండి. ఏదైనా ఆశ్చర్యం కలుగుతుందా? ఆదం అలైహిస్సలాం మొట్టమొదటి మానవుడు, ఆయన నబీ కూడా. మేము విన్నాము మరి ఇప్పుడు మొట్టమొదటి ప్రవక్త నూహ్ అని అంటున్నారు అలైహిస్సలాతో వసలామ్. అయితే ఆదం అలైహిస్సలాం మొదటి ప్రవక్త ఇది మాట కరెక్టే, ఇందులో అనుమానం లేదు. కానీ ఆదం అలైహిస్సలాం చనిపోయిన తర్వాత సుమారు వెయ్యి సంవత్సరాల వరకు ఎలాంటి షిర్క్ లేకుండినది. ప్రజలు బహుదైవారాధనలో పడలేదు, కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించేవారు. కాకపోతే కొన్ని వేరే తప్పులు ఉండినవి. కానీ షిర్క్ లాంటి పాపం నూహ్ అలైహిస్సలాం ఏ జాతిలో పుట్టారో, నూహ్ అలైహిస్సలాం పుట్టుక కంటే కొన్ని సంవత్సరాల క్రితం ఈ షిర్క్ ఎప్పుడైతే మొదలైనదో ఆ షిర్క్ ను ఖండించడానికి మళ్ళీ ప్రజలను ఏక దైవారాధన వైపునకు పిలవడానికి నూహ్ అలైహిస్సలాంను పంపడం జరిగింది. అందుకొరకే అవ్వలుర్రుసుల్, మొట్టమొదటి రసూల్ నూహ్ అలైహిస్సలాం అని ఖురాన్ ఆయత్ ద్వారా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల ద్వారా కూడా రుజువు అవుతుంది. ప్రవక్త హదీసుల్లో హదీసుష్షఫా’అ అని చాలా ప్రఖ్యాతి గాంచి ఉంది.

ఇక ఖురాన్ ఆయత్, సూరతున్నిసాలో:

إِنَّا أَوْحَيْنَا إِلَيْكَ كَمَا أَوْحَيْنَا إِلَى نُوحٍ وَالنَّبِيِّينَ مِن بَعْدِهِ
(ఓ ముహమ్మద్‌!) మేము నూహ్‌ వైపుకు, అతని తరువాత వచ్చిన ప్రవక్తల వైపుకు వహీ పంపినట్లే (వాణిని అవతరింపజేసినట్లే) నీ వైపుకూ వహీ పంపాము. (నిసా 4:163).

అల్లాహు త’ఆలా ప్రవక్తల ప్రస్తావన కంటే ముందు నూహ్ అలైహిస్సలాం ప్రస్తావన తీసుకొచ్చారు.

ఇక సోదర మహాశయులారా, నూహ్ అలైహిస్సలాం మొట్టమొదటి ప్రవక్త. అంతిమ ప్రవక్త, చిట్టచివరి ప్రవక్త, ఖాతమున్నబియ్యీన్, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రేమగా, గౌరవంగా మన ప్రవక్త అంటాము, అంటే వేరే ఎవరి ప్రవక్త కాదు అన్నటువంటి భావం ఎంత మాత్రం కాదు. సర్వ మానవాళి వైపునకు ప్రళయం వరకు వచ్చే సర్వ మానవాళి కొరకు ప్రతి దేశంలో ఉన్న వారి కొరకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కారుణ్య మూర్తి, ప్రవక్తగా చేసి పంపబడ్డారు.

అయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చిట్టచివరి ప్రవక్త అని ఖురాన్లో ఉంది.

وَلَٰكِن رَّسُولَ اللَّهِ وَخَاتَمَ النَّبِيِّينَ
(వలాకిర్ రసూలల్లాహి వ ఖాతమన్నబియ్యీన్)
అయితే, ఆయన అల్లాహ్ యొక్క ప్రవక్త మరియు ప్రవక్తల పరంపరకు అంతిమ ముద్ర. (33:40)

అలాగే అనేక సందర్భాలలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా చెప్పారు: “లా నబియ్య బ’అదీ”, నా తర్వాత ఎవరూ కూడా ప్రవక్తగా రాలేరు. మీరేదో ఆశ్చర్యపడుతున్నట్లు ఉన్నది. మీరేదో ఆలోచిస్తున్నారు కదా! మరి ఈసా అలైహిస్సలాం ప్రళయానికి కంటే ముందు వస్తారు కదా, ఆయన ప్రవక్త కదా! ఆయన ప్రవక్తగా ఉన్నారు ఇంతకుముందు. కానీ ఎప్పుడైతే ప్రళయానికి ముందు వస్తారో ప్రవక్త యొక్క హోదాలో రారు. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఉమ్మతీ, ప్రవక్త ధర్మాన్ని, షరీయత్ను అనుసరించే వారే కాదు ప్రజలందరినీ కూడా అనుసరించే రీతిలో పాలన చేసే వారు. అందరిపై షరీయతె ఇస్లామియా అమలు చేసే వారిగా వస్తారు.

ఇక ప్రవక్తలందరి ప్రస్తావన వచ్చింది కదా! అయితే వారందరినీ మొదటి ప్రవక్త నుండి మొదలుకొని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వరకు ఎంతమంది ప్రవక్తలొచ్చారో వారందరి రాక అసలైన ఉద్దేశం ఏమిటి?

يَأْمُرُهُمْ بِعِبَادَةِ اللَّهِ وَحْدَهُ
(య’మురుహుమ్ బి ఇబాదతిల్లాహి వహ్ దహ్)
కేవలం అల్లాహ్ నే ఆరాధించమని ఆయన వారిని ఆదేశిస్తారు

وَيَنْهَاهُمْ عَنْ عِبَادَةِ الطَّاغُوتِ
(వ యన్హాహుమ్ అన్ ఇబాదతిత్తాఘూత్)
మరియు త్రాగూత్ (మిథ్యా దైవాల) ఆరాధన నుండి వారిని వారించేవారు.

ప్రతి ప్రవక్త తమ జాతి వారికి ఏకైకుడైన అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలని ఆదేశిస్తారు. మరియు అల్లాహ్ కు వ్యతిరేకంగా ఎవరెవరిని పూజించడం జరుగుతుందో, తాఘూత్ ల యొక్క ఇబాదత్ నుండి ఖండిస్తారు. ఇది ప్రవక్తల యొక్క రాక ముఖ్య ఉద్దేశం.

ఈ మాట, దీనికి ఆధారం సూరతున్నహ్ల్ ఆయత్ నంబర్ 36.

وَلَقَدْ بَعَثْنَا فِي كُلِّ أُمَّةٍ رَّسُولًا
(వలఖద్ బ’అస్నా ఫీ కుల్లి ఉమ్మతిర్రసూలా)
ప్రతి జాతిలో మేము ఒక ప్రవక్తను పంపాము (16:36)

ఆ ప్రవక్త తమ జాతి వారికి:

أَنِ اعْبُدُوا اللَّهَ وَاجْتَنِبُوا الطَّاغُوتَ
(అని’బుదుల్లాహ వజ్తనిబుత్తాఘూత్)
అల్లాహ్ ను మాత్రమే మీరు ఆరాధించండి. త్రాగూత్ కు దూరంగా ఉండండి (16:36)

అని చాలా స్పష్టంగా చెప్పేవారు. అందుకొరకే సోదర మహాశయులారా, ఏ అల్లాహ్ పుట్టించాడో, పోషిస్తున్నాడో, ఈ సర్వ లోకాన్ని నడిపిస్తున్నాడో ఆ అల్లాహ్ మాత్రమే మనందరి ఆరాధనలకు ఏకైక అర్హుడు.

ఈనాటి పాఠంలో మనం తెలుసుకున్నటువంటి విషయాల సారాంశం ఏమిటంటే: అల్లాహ్ ప్రవక్తలను శుభవార్తను ఇచ్చే వారిగా, హెచ్చరించే వారిగా చేసి పంపాడు. మొట్టమొదటి ప్రవక్త నూహ్ అలైహిస్సలాం, చిట్టచివరి ప్రవక్త, ప్రవక్తల పరంపరకు అంతిమ మరియు ప్రవక్తలందరికీ ఒక ముద్ర లాంటి వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం.

మరియు ప్రవక్తలందరూ కూడా తమ జాతి వారికి ఏకైకుడైన అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలని ఆదేశించేవారు. మిథ్యా దైవాలను, అల్లాహ్ తప్ప అందరి ఆరాధనలను, తాఘూత్ యొక్క పూజను వదులుకోవాలి అని స్పష్టంగా ఖండించేవారు.

తాఘూత్ అంటే ఏమిటి? దీని గురించి మరింత వివరంగా వచ్చే పాఠంలో తెలుసుకోబోతున్నాము. వచ్చే పాఠం వినడం మర్చిపోకండి, చాలా ముఖ్యమైన విషయాలు అందులో ఉంటాయి. అల్లాహ్ మనందరికీ అల్లాహ్ ఆరాధనపై స్థిరత్వం ప్రసాదించుగాక. ఆమీన్.

واخر دعوانا أن الحمد لله رب العالمين، والسلام عليكم ورحمة الله وبركاته
(వా ఆఖిరు ద’అవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహ్).

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=41240

త్రిసూత్రాలు| పుస్తకం & వీడియో పాఠాలు | నసీరుద్దీన్ జామి’ఈ
ఇమాం ఇబ్ను బాజ్ రహిమహుల్లాహ్ ఈ పుస్తకం 100 సార్లు చదివించారు. దీని ద్వారా ఈ పుస్తకం యొక్క విలువను గమనించండి
https://teluguislam.net/2023/04/19/u3mnj/

సమాధుల పూజ – ఇస్లామీయ నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [వీడియో | టెక్స్ట్]

సమాధుల పూజ (ఇస్లామీయ నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు)
https://youtu.be/JEdmx9LRr78 (17 నిముషాలు)
 ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హాఫిజహుల్లాహ్)
ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]

ఈ ప్రసంగంలో, సమాధుల వద్ద జరిగే ఆరాధనల గురించి వివరించబడింది. ఇస్లాంలో సమాధుల పూజ తీవ్రంగా నిషిద్ధమని, అది పెద్ద షిర్క్ (బహుదైవారాధన) కిందకు వస్తుందని వక్త స్పష్టం చేశారు. చాలా మంది తాము కేవలం పుణ్యపురుషులను (ఔలియాలను) గౌరవిస్తున్నామని భావించినప్పటికీ, వారి చర్యలు ఆరాధన పరిధిలోకి వస్తున్నాయని ఆయన హెచ్చరించారు. సమాధుల వద్ద సజ్దా (సాష్టాంగం) చేయడం, తవాఫ్ (ప్రదక్షిణ) చేయడం, మొక్కుబడులు చెల్లించడం, సహాయం కోసం ప్రార్థించడం వంటివి కేవలం అల్లాహ్‌కు మాత్రమే చేయాల్సిన ఆరాధనలని ఉద్ఘాటించారు. ఆపదలను తొలగించి, అవసరాలు తీర్చే శక్తి కేవలం అల్లాహ్‌కు మాత్రమే ఉందని, చనిపోయిన వారు వినలేరని, సమాధానం ఇవ్వలేరని ఖురాన్ ఆయతుల ద్వారా స్పష్టం చేశారు. అల్లాహ్‌ను కాదని ఇతరులను ప్రార్థిస్తూ మరణించిన వారు నరకానికి వెళ్తారని ప్రవక్త హదీసును ఉటంకించారు. ముస్లింలు ఇలాంటి షిర్క్ చర్యలకు దూరంగా ఉండి, ఏకైక దైవమైన అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించాలని ఆయన పిలుపునిచ్చారు.

సమాధుల పూజ. అల్లాహు అక్బర్. బహుశా కొందరు మన మిత్రులు ఈ మాట విని కోపానికి వస్తారు కావచ్చు. కొందరంటారు – “ఏంటి మేము ఔలియాలను గౌరవిస్తాము, ప్రవక్తలను గౌరవిస్తాము, ఎవరైతే షహీద్ అయిపోయారో, పుణ్య పురుషులు ఉన్నారో వారిని గౌరవిస్తాము. మీరు సమాధుల పూజ అని అంటారా?” కానీ వాస్తవంగా ఈ రోజుల్లో జరుగుతున్నది అదే. చదవండి, వినండి, శ్రద్ధ వహించండి.

ప్రవక్త హూద్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర [వీడియో, టెక్స్ట్]

ప్రవక్త హూద్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర
https://www.youtube.com/watch?v=ofVrllbBImA [41నిముషాలు]
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగం ఆద్ జాతి మరియు ప్రవక్త హూద్ అలైహిస్సలాంల చరిత్రను వివరిస్తుంది. అల్లాహ్ ఆద్ జాతి వారికి అపారమైన శారీరక శక్తిని, సంపదను మరియు విజ్ఞానాన్ని ప్రసాదించాడు, కానీ వారు గర్వంతో విగ్రహారాధనలో మునిగిపోయారు. హూద్ అలైహిస్సలాం వారిని అల్లాహ్ వైపు ఆహ్వానించినప్పుడు వారు ఆయన్ని అపహాస్యం చేశారు. ఫలితంగా, అల్లాహ్ వారిపై భయంకరమైన పెనుగాలిని శిక్షగా పంపి వారిని నాశనం చేశాడు. ఈ కథ ద్వారా గర్వం మనిషిని ఎలా పతనానికి గురిచేస్తుందో మరియు అల్లాహ్ పై నమ్మకం ఎలా రక్షిస్తుందో తెలుస్తుంది. అలాగే షద్దాద్ రాజు నిర్మించిన ఇరం నగరం గురించిన కథనాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది.

అస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వ అలా ఆలిహి వ అస్ హాబిహి అజ్మయీన్.

ఖాలల్లాహు తబారక వ త’ఆలా ఫిల్ ఖుర్ఆనిల్ మజీద్. అఊజు బిల్లాహి మినష్షైతానిర్రజీమ్. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్.

وَأَمَّا عَادٌ فَأُهْلِكُوا بِرِيحٍ صَرْصَرٍ عَاتِيَةٍ سَخَّرَهَا عَلَيْهِمْ سَبْعَ لَيَالٍ وَثَمَانِيَةَ أَيَّامٍ حُسُومًا فَتَرَى الْقَوْمَ فِيهَا صَرْعَىٰ كَأَنَّهُمْ أَعْجَازُ نَخْلٍ خَاوِيَةٍ فَهَلْ تَرَىٰ لَهُمْ مِنْ بَاقِيَةٍ

ఆదు వారు ప్రచండమైన పెనుగాలుల ద్వారా నాశనం చేయబడ్డారు. వాటిని అల్లాహ్ వారిపై నిరంతరం ఏడు రాత్రులు , ఎనిమిది పగళ్ళు విధించాడు. (నీవు గనక అక్కడ ఉండి ఉంటే) వారు అక్కడ బోసిపోయిన ఖర్జూరపు బొద్దులవలే నేలకొరిగి పడి ఉండటం చూసేవాడివి. మరి వారిలో ఎవడైనా మిగిలి ఉన్నట్లు నీకు కనిపిస్తున్నాడా? (69:6-8)

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడైన, అద్వితీయుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక, ముఖ్యంగా మనందరి చివరి ప్రవక్త, విశ్వప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక ఆమీన్.

సోదర సోదరీమణులారా మీ అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను, అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈనాటి ప్రసంగంలో మనం ఒక జాతి గురించి తెలుసుకుందాం. వారికంటే గొప్ప శక్తిమంతులు అసలు పట్టణాలలోనే ఎవరూ సృష్టించబడలేదు అని స్వయంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సెలవిచ్చాడు. అలాంటి శక్తివంతమైన జాతి. వారు తలుచుకుంటే పెద్ద పెద్ద పర్వతాలను సైతం చిన్న రాయిలాగా తొలిచేసి నిర్మించుకుంటారు భవనాలు మాదిరిగా మార్చేస్తారు. అలాంటి జాతి. మరి అలాంటి జాతి ఎవరిని ఆరాధించింది? అలాంటి జాతి వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏ విధంగా రుజుమార్గం వైపు తీసుకురావడానికి ప్రవక్తను ఎవరిని పంపించాడు? ఆ ప్రవక్త ఆ జాతి వద్దకు వెళ్లి దైవవాక్యాలు వినిపిస్తే మరి అంత పెద్ద శక్తివంతమైన ఆ జాతి వారు ఆ ప్రవక్త మాటలను విశ్వసించారా లేదా తిరస్కరించారా? అసలు ఆ జాతి ఎవరు? ఎక్కడ ఆ జాతి ఉనికి ఉండింది భూమండలం మీద? పర్వతాలనే చెక్కేసి భవనాలు లాగా మార్చేసిన ఆ జాతి ప్రజల భవనాల ఆనవాళ్లు ఏమైనా ఈరోజు భూమండలం మీద మిగిలి ఉన్నాయా లేదా? ఇలాంటి విషయాలు ఈనాటి ప్రసంగంలో మనం తెలుసుకుందాం.

అరబ్బు భూమండలంలోని అరబ్బు ప్రదేశంలో దక్షిణ భాగం వైపు సౌదీ అరేబియాకి దక్షిణాన ఒక దేశం ఉంది దాని పేరు యెమన్ దేశం. ఆ యెమన్ దేశంలోని సనా మరియు హజ్రమౌత్ ఈ రెండు నగరాల మధ్యలో ఒక ప్రదేశం ఉంది ఆ ప్రదేశాన్ని ‘అహ్ కాఫ్’ అంటారు. ఆ అహ్ కాఫ్ అనే ప్రదేశంలో ఒక జాతి వారు నివసించే వారు, ఆ అరబ్బు జాతి వారిని ఆద్ జాతి అని పిలిచేవారు మరియు ఆదె ఊలా, ఆదె ఇరమ్ అని కూడా ఆ జాతి వారిని పిలిచేవారు.

ఆ జాతి ప్రజలు ఎలాంటి వ్యక్తులంటే ధార్మిక పండితులు వారి గురించి తెలియజేసిన విషయం, వారిలోని ప్రతి ఒక్క మనిషి 12 మూరల ఎత్తు కలిగినవాడు, శారీరకంగా చాలా దృఢమైన వారు శక్తిమంతులు. వారి గురించి ధార్మిక పండితులు తెలియజేయడం పక్కన పెడితే స్వయంగా సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేస్తూ ఏమన్నాడంటే:

الَّتِي لَمْ يُخْلَقْ مِثْلُهَا فِي الْبِلَادِ
(అల్లతీ లమ్ యుఖ్ లఖ్ మిస్ లుహా ఫిల్ బిలాద్)
అటువంటి శక్తి గలవారు పట్టణాలలో సృష్టించబడలేదు.” (89:8)

స్వయంగా అల్లాహ్ అలాంటి ప్రజలు అసలు పట్టణాలలోనే సృష్టించబడలేదు అంటే వారు ఎంత గొప్ప శక్తివంతులై ఉంటారో ఒక్కసారి ఆలోచించండి. వారి శక్తి సామర్థ్యాల మీద వారికే గర్వం ఉండేది వారు ఏమనేవారంటే:

مَنْ أَشَدُّ مِنَّا قُوَّةً
(మన్ అషద్దు మిన్నా ఖువ్వహ్)
బల పరాక్రమాలలో మాకన్నా మొనగాడు ఎవడైనా ఉన్నాడా?” (41:15) అని వాళ్ళు ఛాలెంజ్ విసిరేవారు.

అలాంటి జాతి వారు, అయితే విషయం ఏమిటంటే అల్లాహ్ వారిని అంత శక్తిమంతులుగా అంత దృఢమైన శరీరం గలవారిలాగా పుట్టించినప్పటికీ సైతాన్ వలలో చిక్కుకొని నూహ్ అలైహిస్సలాం వారి తర్వాత ఈ భూమండలం మీద ఈ ఆద్ జాతి వారు విగ్రహారాధన ప్రారంభించారు. విగ్రహారాధన ప్రారంభించిన తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయన సంప్రదాయం ప్రకారం వారిని మళ్ళీ సంస్కరించడానికి, మార్గభ్రష్టత్వానికి గురైన ఆ జాతి ప్రజలను మళ్ళీ రుజుమార్గం వైపు తీసుకురావడానికి వారిలో నుంచే ఒక ప్రవక్తను ప్రభవింపజేశాడు. ఆయన పేరే హూద్ అలైహిస్సలాం.

హూద్ అలైహిస్సలాం వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్తగా ఎన్నుకొని దైవవాక్యాలు వారి వద్దకు పంపించినప్పుడు హూద్ అలైహిస్సలాం ఆ దైవవాక్యాలు తీసుకొని ప్రజల ముందర వెళ్లారు. ప్రజల ముందర వెళ్లి ప్రజలను విగ్రహారాధన నుండి తప్పించి ఏకదైవ ఆరాధన వైపు పిలుపునిచ్చినప్పుడు, తౌహీద్ వైపు పిలుపునిచ్చినప్పుడు ఇతర జాతి ప్రజల మాదిరిగానే హూద్ అలైహిస్సలాం వారి జాతి ఆద్ జాతి ప్రజలు కూడా హూద్ అలైహిస్సలాం వారిని విమర్శించారు. ఏమని విమర్శించారు అసలు హూద్ అలైహిస్సలాం ఏమని పిలుపునిచ్చారు అవి కూడా మనకు ఖురాన్లో ప్రస్తావించబడి ఉన్నాయి అది కూడా మనం ఇన్షా అల్లాహ్ తెలుసుకుందాం. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లోని ఏడవ అధ్యాయం 65వ వాక్యంలో తెలియజేస్తున్నాడు:

وَإِلَىٰ عَادٍ أَخَاهُمْ هُودًا ۗ قَالَ يَا قَوْمِ اعْبُدُوا اللَّهَ مَا لَكُم مِّنْ إِلَٰهٍ غَيْرُهُ ۚ أَفَلَا تَتَّقُونَ
(వ ఇలా ఆదిన్ అఖాహుమ్ హూదాన్ కాల యా ఖౌమిఅబుదుల్లాహ మాలకుమ్ మిన్ ఇలాహిన్ గైరుహు)
మేము ‘ఆద్‌’ జాతి వద్దకు వారి సోదరుడైన హూద్‌ను పంపాము. ఆయన (వారితో) ఇలా అన్నాడు: “ఓ నా జాతి ప్రజలారా! అల్లాహ్‌నే ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరో ఆరాధ్య దైవం లేడు. మరి మీరు భయపడరా?” (7:65)

అని హూద్ అలైహిస్సలాం వారు ఆద్ జాతి ప్రజల వద్దకు వెళ్లి దైవవాక్యాలు వినిపించారు. చూడండి ప్రతి ప్రవక్త జాతి ప్రజల వద్దకు వెళ్లి అందరికంటే ముందు ఏ విషయం వైపు పిలుపునిస్తున్నాడు అంటే అల్లాహ్ ఆరాధన వైపుకు రండి ఆయనే అన్ని రకాల ఆరాధనలకు ఏకైక అర్హుడు అన్న విషయాన్ని ప్రకటిస్తున్నాడు అంటే ప్రతి ప్రవక్త ఎప్పుడైతే జాతి ప్రజలు బహుదైవారాధనకు గురయ్యారో వారిని ముందుగా ఏకదైవ ఆరాధన వైపుకి తౌహీద్ వైపుకి పిలుపునిచ్చాడు అన్న విషయం స్పష్టమవుతుంది.

హూద్ అలైహిస్సలాం తౌహీద్ వైపు ప్రజలకు పిలుపునిస్తే ఆ జాతి ప్రజలు ఏమని విమర్శించారంటే చూడండి వారేమన్నారంటే:

إِنَّا لَنَرَاكَ فِي سَفَاهَةٍ وَإِنَّا لَنَظُنُّكَ مِنَ الْكَاذِبِينَ
(ఇన్నా లనరాక ఫీ సఫాహతిన్ వ ఇన్నా లనజున్నుక మినల్ కాజిబీన్)
“నీవు మాకు తెలివితక్కువ వానిలా కనిపిస్తున్నావు. పైగా నీవు అబద్ధాలకోరువని మా అభిప్రాయం” (7:66) అన్నారు.

నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు నీకు మతి భ్రమించింది అనే రీతిలో జాతి ప్రజలు హూద్ అలైహిస్సలాం వారిని విమర్శించినప్పుడు హూద్ అలైహిస్సలాం ఆ జాతి ప్రజల వద్దకు వెళ్లి ఏమండీ:

يَا قَوْمِ لَيْسَ بِي سَفَاهَةٌ وَلَٰكِنِّي رَسُولٌ مِّن رَّبِّ الْعَالَمِينَ أُبَلِّغُكُمْ رِسَالَاتِ رَبِّي وَأَنَا لَكُمْ نَاصِحٌ أَمِينٌ

“ఓ నా జాతి ప్రజలారా! నాలో ఏమాత్రం తెలివితక్కువతనము లేదు. నేను సకల లోకాల ప్రభువు తరఫు నుంచి పంపబడిన ప్రవక్తను. నేను నా ప్రభువు సందేశాలను మీకు అందజేస్తున్నాను. నేను మీకు నమ్మకస్తుడైన హితైషిని” (7:67-68) అని చెప్పారు.

నా మతి భ్రమించింది నేను తెలివితక్కువ వాడిని అని మీరు అంటున్నారు కదా అలాంటిది ఏమీ లేదు అసలు విషయం ఏమిటంటే అల్లాహ్ నన్ను సురక్షితంగానే ఉంచాడు నేను సకల లోకాల ప్రభువైన అల్లాహ్ తరఫు నుండి ప్రవక్తగా మీ ముందు వచ్చి ఈ విషయాలు తెలియజేస్తున్నాను తప్ప మతి భ్రమించి నేను ఈ విషయాలు మాట్లాడటం లేదు అని హూద్ అలైహిస్సలాం వారు స్పష్టం చేశారు. అంతేకాదండి హూద్ అలైహిస్సలాం ఆ జాతి ప్రజలు చేస్తున్న చేష్టలను వివరిస్తూ అల్లాహ్ అనుగ్రహాలు వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రసాదించిన అనుగ్రహాల గురించి కూడా వారి ముందర వివరించారు. మనం చూసినట్లయితే ఆ జాతి ప్రజలు ఏం చేసేవారంటే పెద్ద పెద్ద పర్వతాల వద్దకు వెళ్లి ఆ పర్వతాలను చెక్కేసి తొలిచేసి భవనాలు లాగా మార్చేసేవారు. అది హూద్ అలైహిస్సలాం వారు చూసి వారితో ఏమన్నారంటే ఏమండీ:

أَتَبْنُونَ بِكُلِّ رِيعٍ آيَةً تَعْبَثُونَ وَتَتَّخِذُونَ مَصَانِعَ لَعَلَّكُمْ تَخْلُدُونَ
(అతబ్ నూన బికుల్లి రీఇన్ ఆయతన్ తఅబసూన్. వ తత్తఖిజూన మసానిఅ లఅల్లకుమ్ తఖ్ లుదూన్)

“మీరు ఎత్తయిన ప్రతి స్థలంలో ఎలాంటి ప్రయోజనం లేని స్మారక కట్టడాలు ఎందుకు కడుతున్నారు? మీరు ఇక్కడే శాశ్వతంగా ఉంటామన్నట్లు ఈ భవనాలు నిర్మిస్తున్నారా ఏంటి?” (26:128-129)

అసలు ఈ భవనాల్లో మీరు నివసిస్తారా? మీరు నివసించరు నివసించడానికి మైదానంలో భవనాలు నిర్మించుకున్నారు ఇళ్లు నిర్మించుకున్నారు ఈ పర్వతాలను చెక్కేసి తొలిచేసి భవనాలు లాగా మార్చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అంటే కేవలం ప్రపంచానికి మీ శక్తి సామర్థ్యాలు చూపించాలని మిమ్మల్ని పొగడాలని అయ్యో ఎంత శక్తిమంతులయ్యా పర్వతాలనే భవనాలు లాగా మార్చేశారు అని మిమ్మల్ని పొగడాలని ప్రజల వద్ద మీ శక్తి సామర్థ్యాలు మీరు ప్రదర్శించాలని కేవలం మీ అహంకారాన్ని ప్రదర్శించాలని మాత్రమే మీరు ఈ పనులు చేస్తున్నారు కాబట్టి మీ శ్రమ వృధా మీ సమయము వృధా ఇలాంటి పనులు మీరు ఎందుకు చేస్తున్నారు అని హూద్ అలైహిస్సలాం ఆ జాతి ప్రజలతో అనగా తర్వాత అల్లాహ్ అనుగ్రహాల గురించి కూడా వివరించారు ఏమన్నారు:

أَمَدَّكُم بِأَنْعَامٍ وَبَنِينَ وَجَنَّاتٍ وَعُيُونٍ
(అమద్దకుమ్ బి అన్ ఆమిన్ వ బనీన్. వ జన్నాతిన్ వ ఉయూన్)

“చూడండి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మీ కోసము పశువులను మరియు సంతానాన్ని ప్రసాదించాడు. మీకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తోటల ద్వారా సెలమల ద్వారా సహాయపడ్డాడు.” (26:133-134)

నీటి కాలువలు మీకోసం ప్రవహింపజేశాడు మీకు సంతానాన్ని ప్రసాదించాడు పశువులను ప్రసాదించాడు తోటలు మీకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రసాదించాడు ఈ అనుగ్రహాలు పొందిన మీరు అల్లాహ్ ను వేడుకోవాలి అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకోవాలి అల్లాహ్ మార్గంలో నడుచుకోవాలి మీ మీద ఉన్న ఇది బాధ్యత ఈ బాధ్యతను మీరు గ్రహించండి అని హూద్ అలైహిస్సలాం వారు చాలా రకాలుగా జాతి ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేసినప్పటికిని ఆ ఆద్ జాతి వారు హూద్ అలైహిస్సలాం వారితో ఏమనేవారంటే:

إِنْ هَٰذَا إِلَّا خُلُقُ الْأَوَّلِينَ
(ఇన్ హాజా ఇల్లా ఖులుఖుల్ అవ్వలీన్)
“ఇది పూర్వికుల పాత అలవాటు తప్ప మరేమీ కాదు.” (26:137)

మేము ఏమో కొత్త విషయాలు చేయట్లేదండి మా పూర్వీకులు చేస్తూ వచ్చిన విషయాలే మేము కూడా పాటిస్తూ ఉన్నాము వారి పద్ధతినే మేము కూడా అనుసరిస్తున్నాము అంతే తప్ప మేము కొత్త విషయాలు ఏమీ చేయట్లేదు ఈ విగ్రహారాధన మా పూర్వీకుల నుంచి వస్తున్న విషయమే అని చెప్పారు. మరికొంతమంది అయితే హూద్ అలైహిస్సలాం వారిని ఏమన్నారంటే:

أَجِئْتَنَا لِنَعْبُدَ اللَّهَ وَحْدَهُ وَنَذَرَ مَا كَانَ يَعْبُدُ آبَاؤُنَا
(అజిఅతనా లినఅబుదల్లాహ వహ్ దహు వ నజర మా కాన యఅబుదు ఆబాఉనా)

“మేము అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలని మా తాత ముత్తాతలు పూజిస్తూ వచ్చినవాటిని వదిలివేయమని చెప్పడానికి నువ్వు మా వద్దకు వచ్చావా?” (7:70) అన్నారు.

తాత ముత్తాతలు చేస్తూ వచ్చిన పనులన్నీ మేము వదిలేయాలి నువ్వు చెప్పినట్టుగా అన్ని దేవుళ్లను వదిలేసి ఒకే దేవుణ్ణి పూజించుకోవాలి ఈ మాటలు చెప్పడానికేనా నువ్వు మా వద్దకు వచ్చింది అన్నట్టు మరి కొంతమంది హేళన చేశారు వెక్కిరించారు. అయితే మరికొంతమంది అయితే మొండిగా ప్రవర్తిస్తూ హూద్ అలైహిస్సలాం వారితో ఏమన్నారంటే:

وَمَا نَحْنُ بِتَارِكِي آلِهَتِنَا عَن قَوْلِكَ
(వ మా నహ్ ను బి తారికి ఆలిహతినా అన్ ఖౌలిక)
“నువ్వు చెప్పినంత మాత్రాన మేము మా ఆరాధ్య దైవాలను వదిలిపెట్టము.” (11:53)

మేము ఎన్నో రోజుల నుంచి పూజించుకుంటూ వస్తున్నామయ్యా నువ్వు చెప్పగానే మా దేవుళ్లను పూజించటం మేము వదిలేయం మేము పూజిస్తాం అంతే అని మరికొంతమంది అయితే హూద్ అలైహిస్సలాం తో వాదించారు. అప్పుడు వారు వాదిస్తూ ఉంటే హూద్ అలైహిస్సలాం వారితో ఇలా అన్నారు:

أَتُجَادِلُونَنِي فِي أَسْمَاءٍ سَمَّيْتُمُوهَا أَنتُمْ وَآبَاؤُكُم مَّا نَزَّلَ اللَّهُ بِهَا مِن سُلْطَانٍ
(అ తుజాదిలూననీ ఫీ అస్మాయిన్ సమ్మైతుమూహా అన్తుమ్ వ ఆబాఉకుమ్ మా నజ్జలల్లాహు బిహా మిన్ సుల్తాన్)

“మీరు మీ తాత ముత్తాతలు కల్పించుకున్న పేర్ల విషయంలో ఇవి కేవలం మీరు మీ తాత ముత్తాతలు కల్పించుకున్న పేర్లు మాత్రమే ఈ పేర్ల విషయంలో నాతో గొడవ పడుతున్నారా? వాటి గురించి అవి ఆరాధ్య దైవాలని నిర్ధారించే ఏ ప్రమాణాన్ని అల్లాహ్ అవతరింపజేయలేదు.” (7:71)

ఈ విగ్రహాలు దేవుళ్ళు వీటిలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి మీ సమస్యలు పరిష్కరించే శక్తి సామర్థ్యాలు ఈ విగ్రహాలలో ఉన్నాయి అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఎలాంటి ఆధారము ఎలాంటి వాక్యం అవతరింపజేయలేదే అలాంటప్పుడు ఏ విషయాన్ని చూసి మీరు వాటిని పూజిస్తున్నారు ఏ ఆధారాన్ని బట్టి మీరు వాటిని నమ్ముతున్నారు కేవలం పూర్వీకుల అంధానుసరణ తప్ప మరే ఆధారము మీ వద్ద లేదు ఈ విషయాన్ని మీరు గ్రహించండి. అయితే నేను మాత్రం ఒక విషయం స్పష్టం చేసేస్తున్నాను అదేమిటంటే:

إِنِّي أُشْهِدُ اللَّهَ وَاشْهَدُوا أَنِّي بَرِيءٌ مِّمَّا تُشْرِكُونَ
(ఇన్నీ ఉష్ హిదుల్లాహ వష్ హదూ అన్నీ బరీఉమ్ మిమ్మా తుష్రికూన్)

“అల్లాహ్ తప్ప మీరు భాగస్వాములుగా నిలబెట్టే వారందరితో నేను విసిగిపోయాను. వారితో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఈ విషయానికి అల్లాహ్ ను సాక్షిగా పెడుతున్నాను మీరు కూడా ఈ విషయానికి సాక్షులుగా ఉండండి.” (11:54)

ఎవరినైతే మీరు పూజిస్తున్నారో దేవుళ్లు అని నమ్ముతున్నారో ఆరాధిస్తున్నారో వారితో నేను విసిగిపోయాను నేను వారి పూజను వారి పూజతో నేను దూరంగా ఉంటున్నాను నాకు ఈ విగ్రహాలకు ఎలాంటి సంబంధం లేదు ఈ విషయానికి నేను అల్లాహ్ కు సాక్ష్యం పెడుతున్నాను మీరు కూడా సాక్షులుగా ఉండండి అని హూద్ అలైహిస్సలాం వారు తెలియజేసేశారు. ప్రజలతో నువ్వు హూద్ అలైహిస్సలాం వారు మాట్లాడుతున్నారు ప్రజలు కూడా హూద్ అలైహిస్సలాం వారితో ఇదే విధంగా సమాధానం ఇస్తున్నారు ఈ విషయాలన్నీ మనం విన్నాము.

ఇక రండి ఆ జాతి ప్రజలు ఉంటారు ఆ జాతి పెద్దలు ఉంటారు కదండీ ప్రజలు ఒకవైపు పెద్దలు ఆ జాతి పెద్దలు వారు హూద్ అలైహిస్సలాం తో ఏమనేవారు చూడండి ఆ జాతి పెద్దలు హూద్ అలైహిస్సలాం వద్దకు వచ్చి ప్రజలందరినీ ఉద్దేశించి ఇలా అనేవారు:

مَا هَٰذَا إِلَّا بَشَرٌ مِّثْلُكُمْ يَأْكُلُ مِمَّا تَأْكُلُونَ مِنْهُ وَيَشْرَبُ مِمَّا تَشْرَبُونَ وَلَئِنْ أَطَعْتُم بَشَرًا مِّثْلَكُمْ إِنَّكُمْ إِذًا لَّخَاسِرُونَ
(మా హాజా ఇల్లా బషరుమ్ మిస్ లుకుమ్ యాకులు మిమ్మా తాకులున మిన్హు వయష్రబు మిమ్మా తష్రబూన్. వ లఇన్ అతఅతుమ్ బషరమ్ మిస్ లకుమ్ ఇన్నకుమ్ ఇజల్ లఖాసిరూన్)
“ఇతను కూడా మీలాంటి సామాన్య మానవుడే. మీరు తినేదే ఇతను తింటున్నాడు మీరు తాగేదే ఇతను త్రాగుతున్నాడు మీరు గనుక మీలాంటి ఒక మానవ మాత్రుని అనుసరించారంటే మీరు తప్పకుండా నష్టపోతారు.” (23:33-34)

జాతి ప్రజలు వచ్చి జాతి పెద్దలు వచ్చి ప్రజలను రెచ్చగొడుతున్నారు ఇతను కూడా మీలాంటి ఒక సాధారణ మనిషే మీలాంటి ఒక సాధారణ మనిషి వచ్చి చెప్పగానే మీరు వారి మాటలు వినేస్తే మీరు నష్టపోతారు కాబట్టి ఇతని మాటలు మీరు నమ్మాల్సిన అవసరం లేదు అని జాతి పెద్దలు వచ్చి ప్రజలతో అనేవారు. మరికొంతమంది వచ్చి ఏమనేవారు అంటే:

أَيَعِدُكُمْ أَنَّكُمْ إِذَا مِتُّمْ وَكُنتُمْ تُرَابًا وَعِظَامًا أَنَّكُم مُّخْرَجُونَ هَيْهَاتَ هَيْهَاتَ لِمَا تُوعَدُونَ
(అ యఇదుకుమ్ అన్నకుమ్ ఇజా మిత్తుమ్ వ కున్తుమ్ తురాబన్ వ ఇజామన్ అన్నకుమ్ ముఖ్రజూన్. హైహాత హైహాత లీమా తూఅదూన్)
“ఏమిటి? మీరు చచ్చి మట్టిగా ఎముకలుగా మారిపోయిన తర్వాత కూడా మీరు మళ్ళీ లేపబడతారని ఇతను వాగ్దానం చేస్తున్నాడా? అసంభవం! మీకు చేయబడే ఈ వాగ్దానం అసంభవం.” (23:35-36) అని మరికొంతమంది వచ్చి చెప్పేవారు.

ఇతని వాగ్దానాలని సంభవించే విషయాలు కావు. మనిషి మరణించి మట్టిలో కలిసిపోతాడు ఎముకల్లాగా మారిపోతాడు మళ్ళీ పుట్టడమంట తర్వాత అల్లాహ్ వద్ద లెక్కింపు జరగటమంట అక్కడ స్వర్గము నరకము అని ఫలితాలు శిక్షలు ఉన్నాయి అని విశ్వసించడమంట ఇవన్నీ అసంభవం జరిగే విషయాలు కావు అని మరికొంతమంది పెద్దలు వచ్చి జాతి ప్రజలకు మార్గభ్రష్టత్వానికి గురయ్యేటట్లుగా మాట్లాడేవారు. మరికొంతమంది అయితే ఏకంగా హూద్ అలైహిస్సలాం వారితోనే వచ్చి ఏమనేవారంటే జాతి పెద్దలు కొంతమంది:

إِن نَّقُولُ إِلَّا اعْتَرَاكَ بَعْضُ آلِهَتِنَا بِسُوءٍ
(ఇన్ నఖూలు ఇల్లా ఇఅతరాక బఅజు ఆలిహతినా బి సూ)
“మా ఆరాధ్య దైవాలలో ఎవరో నిన్ను ఏదైనా వ్యాధికి గురి చేసి ఉంటారని మేము అనుకుంటున్నాము.” (11:54)

ఈ విధంగా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే మా విగ్రహాలను దేవుళ్ళు కాదు అని నువ్వు ఎందుకు విమర్శిస్తున్నావు అంటే దీనికి గల ముఖ్యమైన కారణము మా దేవుళ్ళలోనే ఏదో ఒక దేవుడు ఆగ్రహించి నిన్ను శిక్షించాడు అతని శిక్ష నిన్ను పట్టుకునింది కాబట్టి ఈ విధంగా నువ్వు మతి భ్రమించి మాట్లాడుతున్నావు అని మాటలు మాట్లాడారు చిత్రీకరించి మరి హూద్ అలైహిస్సలాం వారిని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి మాటలు ప్రజలు చాలా తొందరగా స్వీకరిస్తారు నమ్మే నమ్ముతారు.

అయితే చూడండి హూద్ అలైహిస్సలాం వారు ఏమంటున్నారో చూడండి. వారు బెదిరించేటట్టు ప్రజలు కూడా భయపడే పోయేటట్టు వారు మాట్లాడుతుంటే దానికి సమాధానంగా హూద్ అలైహిస్సలాం వారు ఏమంటున్నారో చూడండి. హూద్ అలైహిస్సలాం వారు అంటున్నారు:

إِنِّي تَوَكَّلْتُ عَلَى اللَّهِ رَبِّي وَرَبِّكُم
(ఇన్నీ తవక్కల్తు అలల్లాహి రబ్బీ వ రబ్బికుమ్)
“నేను కేవలం అల్లాహ్ నే నమ్ముకున్నాను ఆయన నాకు ప్రభువే మీకు ప్రభువే.” (11:56)

వాళ్ళేమంటున్నారు మా దేవుళ్ళలో ఎవడో ఒకడు నిన్ను శిక్షించాడు కాబట్టి నీ మీద అతని శిక్ష పడింది నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు అని మా దేవుళ్ళు అని వారు వచ్చి హూద్ అలైహిస్సలాం తో హెచ్చరిస్తుంటే సమాధానంగా హూద్ అలైహిస్సలాం వారు ఏమంటున్నారు మీ దేవుడు ఏంటి నా దేవుడు ఏంటి అని చెప్పట్లేదు మీ దేవుడు ఏంటి నా దేవుడు గొప్పతనం చూడండి అనేటట్టుగా మాట్లాడట్లేదు ఆయన ఏమంటున్నారంటే నేను అల్లాహ్ నే నమ్ముతున్నాను ఆయన నాకు ప్రభువే మీకు ప్రభువే అంటే అల్లాహ్ నా దేవుడు అనే రీతిలో మాట్లాడట్లేదు అల్లాహ్ నాకు మీకు మనందరికీ దేవుడు అనే రీతిలోనే మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ ఒక దాయికి ఒక ఉదాహరణగా ఒక ఆదర్శప్రాయంగా విషయం తెలుపబడింది అదేమిటంటే ఎదుటి వ్యక్తి నా దేవుడు అని మాట్లాడుతుంటే దాయి అతనితో మాట్లాడేటప్పుడు నా దేవుడు అల్లాహ్ నా దేవుడు అల్లాహ్ అన్నట్టు మాట్లాడరాదు మన దేవుడు మీకు మాకు మనందరికీ దేవుడు అల్లాహ్ ఆ అల్లాహ్ గురించి తెలుసుకోండి ఆ అల్లాహ్ వైపుకు రండి అనే మాట్లాడాలి గాని విగ్రహాలు మీ దేవుళ్ళు అల్లాహ్ నా దేవుడు అనే రీతిలో మాట్లాడరాదు ఇది సరైన విధానము కాదు సరైన విధానం ఏమిటంటే అల్లాహ్ మనందరి ప్రభువు ఆ ప్రభువు వైపుకు రండి అని మాత్రమే చెప్పాలి. ఇది ఇక్కడ మనకు తెలియజేయడం జరిగింది. అలాగే హూద్ అలైహిస్సలాం వారు మరొక విషయం వారికి తెలియజేశారు ఏమన్నారంటే:

فَإِن تَوَلَّوْا فَقَدْ أَبْلَغْتُكُم مَّا أُرْسِلْتُ بِهِ إِلَيْكُمْ
(ఫఇన్ తవల్లౌ ఫఖద్ అబ్లగ్ తుకుమ్ మా ఉర్ సిల్ తు బిహీ ఇలైకుమ్)
“ఏమయ్యా నేనేమో మీ వద్దకు వచ్చి ఈ విషయాలు ప్రకటిస్తున్నాను ఒకవేళ మీరు మరలిపోదలిస్తే నేను మాత్రం నాకు ఇచ్చి పంపబడిన సందేశాన్ని మీకు అందజేశాను నా బాధ్యత నెరవేర్చేశాను.” (11:57)

అల్లాహ్ వాక్యాలు మీ వద్దకు చేర్చటం వాటిని వివరంగా మీ ముందర తెలియజేయడం నా బాధ్యత నేను ఆ బాధ్యతను నెరవేర్చాను మీరు మరలిపోతే నా బాధ్యత తీరిపోతుంది మీరు మాత్రం అల్లాహ్ వద్ద ప్రశ్నించబడతారన్న విషయాన్ని హూద్ అలైహిస్సలాం జాతి ప్రజలకు తెలియజేశారు. తర్వాత హూద్ అలైహిస్సలాం చాలా రోజుల వరకు అనేక సంవత్సరాలుగా ఆద్ జాతి వారు కి దైవ వాక్యాలు వినిపిస్తూ వినిపిస్తూ ముందుకు సాగిపోయారు. అయితే జాతి ప్రజలు హూద్ అలైహిస్సలాం వారిని పట్టించుకోవట్లేదు. అప్పుడు హూద్ అలైహిస్సలాం ఆ జాతి ప్రజలకు హెచ్చరించటం ప్రారంభించారు ఏమన్నారంటే:

إِنِّي أَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ عَظِيمٍ
(ఇన్నీ అఖాఫు అలైకుమ్ అజాబ యౌమిన్ అజీమ్)
“నేను మీ విషయంలో ఒక మహా దినపు శిక్ష గురించి భయపడుతున్నాను.” (26:135)

మీరు దైవ వాక్యాలను నమ్మటం లేదు మీరు దైవ వాక్యాలను అంగీకరించుట లేదు విశ్వసించుట లేదు ఒక మహా దినపు శిక్ష వచ్చి మీ మీద పడబోతుందన్న విషయము నాకు భయభ్రాంతుల్ని చేస్తుంది ఆ రోజు మీ మీద వచ్చి పడుతుందేమో ఆ శిక్ష వచ్చి మీ మీద పడుతుందేమో అని నేను భయపడుతున్నాను అని చెప్పారు. దానికి చూడండి గర్విష్టులు శక్తివంతులు బాగా ఎత్తుగా ఉన్నవారు బలంగా ఉన్నవారు శక్తిమంతులు మాకంటే గొప్పవాళ్ళు ఎవరూ లేరు ప్రపంచంలో అనుకుంటున్నవాళ్ళు శిక్ష వచ్చి పడుతుంది అని హూద్ అలైహిస్సలాం హెచ్చరిస్తుంటే వాళ్ళు ఎలాంటి గర్వంగా హూద్ అలైహిస్సలాం కు సమాధానం ఇస్తున్నారో చూడండి వాళ్ళు అంటున్నారు:

وَمَا نَحْنُ بِمُعَذَّبِينَ فَأْتِنَا بِمَا تَعِدُنَا إِن كُنتَ مِنَ الصَّادِقِينَ
(వ మా నహ్ ను బి ముఅజ్జబీన్. ఫ అత్తినా బిమా తఇదునా ఇన్ కున్త మినస్సాదిఖీన్)
“ఎట్టి పరిస్థితిలోనూ మేము శిక్షించబడము. ఏ శిక్ష గురించి నువ్వు మమ్మల్ని బెదిరిస్తున్నావో దాన్ని మా వద్దకు రప్పించు చూద్దాం.” (26:138, 7:70)

శిక్ష వచ్చి పడుతుంది అని హెచ్చరిస్తున్నావు కదా మేము శిక్షించబడము మాకంటే శక్తిమంతులు ఎవరూ ప్రపంచంలో లేరు కాబట్టి మాకు ఎలాంటి శిక్ష గురించి భయము లేదు ఒకవేళ శిక్ష వస్తుంది అదే నిజమైటట్లయితే ఆ శిక్ష తీసుకొని రా చూద్దాము అని హూద్ అలైహిస్సలాం తో ఛాలెంజ్ చేస్తున్నారు సవాలు విసురుతున్నారు ఆద్ జాతి ప్రజలు. అప్పుడు హూద్ అలైహిస్సలాం అల్లాహ్ తో ప్రార్థన చేశారు:

قَالَ رَبِّ انصُرْنِي بِمَا كَذَّبُونِ
(కాల రబ్బిన్ సుర్నీ బిమా కజ్జబూన్)
“ఓ ప్రభూ! వీళ్లు ధిక్కార వైఖరికి ప్రతిగా, వీళ్ళ ధిక్కార వైఖరికి ప్రతిగా నాకు సహాయపడు” (23:39) అని ప్రవక్త హూద్ అలైహిస్సలాం వారు ప్రార్థించారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా హూద్ అలైహిస్సలాం వారి ప్రార్థన స్వీకరించాడు స్వీకరించి త్వరలోని శిక్షించబడే రోజు రాబోతుంది నిరీక్షించండి అని తెలియజేశాడు. అదే విషయం హూద్ అలైహిస్సలాం జాతి ప్రజల వద్దకు వచ్చి:

فَانتَظِرُوا إِنِّي مَعَكُم مِّنَ الْمُنتَظِرِينَ
(ఫన్ తజిరూ ఇన్నీ మఅకుమ్ మినల్ మున్ తజిరీన్)
“దైవ శిక్ష తీసుకొని రా చూద్దామని సవాలు విసిరారు కదా మీరు నిరీక్షించండి మీతో పాటు నేను కూడా నిరీక్షిస్తున్నాను.” (7:71) అని తెలియజేశారు అంటే ప్రార్థన అయిపోయింది దైవ శిక్ష రావటం నిర్ణయించబడింది ఇక అది ఎప్పుడు వస్తాది అనే దాని కోసం మీరు ఎదురు చూడండి నేను కూడా మీతో పాటు నిరీక్షిస్తున్నాను అని హూద్ అలైహిస్సలాం వారు ఆద్ జాతి వారికి తెలియజేశారు.

ఆ తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క శిక్ష ప్రారంభమైంది. ప్రారంభంలో అక్కడ వర్షాలు ఆగిపోయాయి. వర్షం ఆగిపోయిన కారణంగా అక్కడ కరువు ఏర్పడింది. ప్రజలకు ఆహారము నీళ్ళ సమస్య ఎదురైంది చాలా రోజుల వరకు వర్షాలు కురవకపోయేసరికి కరువు ఏర్పడిన కారణంగా వారు ఆకలి దప్పికలతో అల్లాడే పరిస్థితి ఏర్పడింది అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత నల్లటి మేఘాలు వచ్చాయి ఇక్కడ గమనించండి కొంచెం బాగా మిత్రులారా నల్లటి మేఘాలు ఎప్పుడైతే వస్తూ కనిపించాయో అప్పుడు జాతి ప్రజలు ఏమన్నారంటే:

قَالُوا هَٰذَا عَارِضٌ مُّمْطِرُنَا
(ఖాలూ హాజా ఆరిజుమ్ ముమ్ తిరునా)
“ఇది మాపై వర్షాన్ని కురిపించే మబ్బులు. ఇవి మాపై వర్షాన్ని కురిపించే మబ్బు తునక” (46:24) అని వారు చెప్పుకోసాగారు. అయితే అల్లాహ్ ఏమన్నాడంటే:

بَلْ هُوَ مَا اسْتَعْجَلْتُم بِهِ ۖ رِيحٌ فِيهَا عَذَابٌ أَلِيمٌ
(బల్ హువ మస్ తఅ జల్ తుమ్ బిహీ రీహున్ ఫీహా అజాబున్ అలీమ్)
“నిజానికి అది మీరు తొందరపెట్టిన విపత్కర మేఘం, అదొక పెనుగాలి అందులో వేదాభరితమైన శిక్ష ఉంది.” (46:24)

వారేమనుకుంటున్నారు దూరం నుంచి చూసి అవి నల్లటి మబ్బులు ఇప్పుడు వర్షం వస్తుంది వర్షం కురుస్తుంది మా కరువు మొత్తం దూరమైపోతుంది అని వారు అనుకుంటున్నారు కానీ అల్లాహ్ ఏమంటున్నాడు అంటే ఆ మేఘాల వెనుక పెనుగాలి ఉంది మరియు విపత్కరమైన శిక్ష మీకోసం వస్తూ ఉంది భయంకరమైన శిక్ష అందులో దాగి ఉంది అని అంటున్నాడు. తర్వాత ఏమైందండి ఆ మేఘాలు ఎప్పుడైతే ఆ జాతి ప్రజల వద్దకు వచ్చాయో వర్షానికి బదులు తీవ్రమైన భయంకరమైన గాలి మొదలయింది. ఎన్ని రోజులు ఆ గాలి నడిచింది ఏ విధంగా అల్లాహ్ వారిని శిక్షించాడో అది కూడా ఖురాన్ లో ప్రస్తావించబడింది 69వ అధ్యాయం ఆరు ఏడు వాక్యాలలో అల్లాహ్ తెలియజేశాడు:

وَأَمَّا عَادٌ فَأُهْلِكُوا بِرِيحٍ صَرْصَرٍ عَاتِيَةٍ سَخَّرَهَا عَلَيْهِمْ سَبْعَ لَيَالٍ وَثَمَانِيَةَ أَيَّامٍ حُسُومًا فَتَرَى الْقَوْمَ فِيهَا صَرْعَىٰ كَأَنَّهُمْ أَعْجَازُ نَخْلٍ خَاوِيَةٍ
(వ అమ్మ ఆదున్ ఫ ఉహ్ లికూ బిరీహిన్ సర్ సరిన్ ఆతియతిన్. సఖ్ ఖరహా అలైహిమ్ సబ్ అ లయాలిన్ వ సమానియత అయ్యామిన్ హుసూమన్ ఫతరల్ ఖౌమ ఫీహా సర్ ఆ క అన్నహుమ్ అఅజాజు నఖ్ లిన్ ఖావియతిన్)

“ఆద్‌ జాతి వారు ప్రచండమైన పెనుగాలి ద్వారా నాశనం చేయబడ్డారు. దాన్ని అల్లాహ్ వారిపై నిరంతరం ఏడు రాత్రులు ఎనిమిది పగళ్లు విధించాడు. నీవు గనుక అక్కడ ఉండి ఉంటే వారు అక్కడ బోసిపోయిన ఖర్జూరపు బొద్దుల వలె నేలకొరిగి పడి ఉండటం చూసేవాడివి.” (69:6-7) అల్లాహు అక్బర్. ఏడు రాత్రులు ఎనిమిది పగళ్లు పూర్తి ఒక వారం వరకు ఆ పెనుగాలి వారిపైకి పంపించబడింది.

అంతే కాదు ఆ గాలితో పాటు మరొక శిక్ష ఏమిటంటే:

فَأَخَذَتْهُمُ الصَّيْحَةُ بِالْحَقِّ فَجَعَلْنَاهُمْ غُثَاءً
(ఫ అఖజత్ హుముస్ సైహతు బిల్ హఖ్ ఖి ఫజఅల్ నాహుమ్ గుసాఅన్)

“ఎట్టకేలకు న్యాయం వాంఛించే దాని ప్రకారం ఒక పెద్ద అరుపు అమాంతం వారిని కబళించింది అంతే మేము వారిని చెత్తాచెదారం లాగా చేసేసాము.” (23:41)

ఒకవైపు ఏడు రాత్రులు ఎనిమిది పగళ్ల వరకు తీవ్రమైన ఒక గాలి వీస్తూ ఉంది దానికి తోడుగా ఒక భయంకరమైన అరుపు కూడా వారిని పట్టుకునింది ఆ గాలి వచ్చినప్పుడు ఆ గాలి వచ్చి వారి ఇళ్లలోకి దూరి ఎవరైతే మాకంటే శక్తిమంతులు ప్రపంచంలో ఎవరూ లేరు అని విర్రవీగిపోయారో సవాలు విసిరారో ప్రపంచానికి అలాంటి వారి పరిస్థితి ఏమైపోయిందంటే ఆ గాలి వారిని పైకి తీసుకెళ్లి తలకిందులుగా కిందికి పడేసేది నేలకేసి కొడితే వచ్చి నేలకు తల తగలగానే తల బద్దలైపోయేది వారు తుఫాను వచ్చిన తర్వాత మనం టీవీ ఛానల్లో చూస్తూ ఉంటాం టెంకాయ చెట్లు, తాటి చెట్లు, ఖర్జూరపు చెట్లు అవన్నీ నేలకొరిగి ఉంటాయి పంట నష్టం జరిగింది అని చూపిస్తూ ఉంటాడు కదండీ ఆ విధంగా ఎంతో ఎత్తు ఉన్న బలశాలులైన ఆ ఆద్ జాతి ప్రజలందరూ కూడా బొద్దుల వలె కింద పడిపోయి ఉన్నారు తాటి ఖర్జూరపు టెంకాయ బొద్దుల వలె అక్కడ పడి మరణించారు నాశనమయ్యారు.

అయితే పూర్తి జాతిలో ఎంతమంది అయితే హూద్ అలైహిస్సలాం వారి మాటను నమ్మి విశ్వసించారో హూద్ అలైహిస్సలాం ప్రవక్తను మరియు ఆయన మాట విశ్వసించిన ఆ జాతి ప్రజలను మాత్రం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రక్షించాడు సురక్షితమైన ప్రదేశానికి వారిని తరలించాడు ఖురాన్లో 11వ అధ్యాయం 58వ వాక్యంలో అల్లాహ్ తెలియజేశాడు:

وَلَمَّا جَاءَ أَمْرُنَا نَجَّيْنَا هُودًا وَالَّذِينَ آمَنُوا مَعَهُ بِرَحْمَةٍ مِّنَّا
(వ లమ్మా జాఅ అమ్రునా నజ్జైనా హూదన్ వల్లజీన ఆమనూ మఅహూ బిరహ్ మతిమ్ మిన్నా)
“మరి మా ఆజ్ఞ అమల్లోకి వచ్చినప్పుడు మేము హూద్‌ను అతనితో పాటు విశ్వసించిన అతని సహచరులను మా ప్రత్యేక కృపతో కాపాడాము.” (11:58)

అంటే ఆద్ జాతి వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా గాలి మరియు అరుపు ద్వారా శిక్షించాడు వారందరూ నాశనమైపోయారు చెత్తాచెదారం లాగా అయిపోయారు విశ్వసించిన వారిని ప్రవక్తను మాత్రం అల్లాహ్ రక్షించాడు. ఇది హూద్ అలైహిస్సలాం మరియు ఆద్ జాతి యొక్క సంక్షిప్తమైన చరిత్ర.

అయితే ఈ చరిత్రతో మరొక కథ ముడిపడి ఉంది ఆ కథ అక్కడక్కడ కొంతమంది ప్రస్తావిస్తూ ఉంటారు అదేమిటంటే హూద్ అలైహిస్సలాం వారి జాతిని ఆద్ జాతి అంటారు కదండీ ఆ జాతి వద్ద షద్దాద్ బిన్ ఆద్ మరియు షదీద్ బిన్ ఆద్ అనే ఇద్దరు రాజులు ఆ జాతిని పరిపాలించేవారు వారిద్దరూ అన్నదమ్ములు వారి తండ్రి పేరు వచ్చి ఆద్, ఆ ఆద్ అనే రాజు ఆ ప్రదేశాన్ని పరిపాలించేవాడు కాబట్టి ఆ పూర్తి జాతిని ఆద్ జాతి వారు అని పేరు పెట్టడం జరిగింది. అయితే తండ్రి మరణించిన తర్వాత షద్దాద్ మరియు షదీద్ వీరిద్దరూ ఆ ప్రదేశాన్ని పరిపాలించారు. అయితే కొద్ది రోజులకు వారిద్దరిలో నుంచి షదీద్ అనే ఒక తమ్ముడు మరణించాడు షదీద్ మరణించిన తర్వాత పూర్తి బాధ్యతలు షద్దాద్ చేతికి అప్పగించబడ్డాయి ఆ తర్వాత షద్దాద్ ఒక్కడే ఆ ప్రదేశం మొత్తానికి రాజయ్యాడు పూర్తి అధికారాలు అతని చేతుల్లోకి వచ్చాయి అతను ఆ ప్రదేశాన్ని పరిపాలించడం ప్రారంభించాడు.

జాతి ప్రజలు చాలా శక్తివంతులు ఎత్తు కలిగిన వారు కాబట్టి వారిని తీసుకొని తన సామ్రాజ్యాన్ని అతను చాలా దూరం వరకు విస్తరించుకుంటూ పోయాడు. అయితే ఎప్పుడైతే హూద్ అలైహిస్సలాం వారు జాతి ప్రజల వద్దకు వెళ్లి అల్లాహ్ గురించి మరణానంతర జీవితం గురించి స్వర్గం గురించి నరకం గురించి వివరించారో ఆ రాజు వద్దకు స్వర్గం గురించి ఎవరో వినిపించారు అప్పుడు ఆ రాజు ఆ స్వర్గం గురించి స్వర్గ అనుగ్రహాల గురించి విని ఏమన్నాడంటే ఆకాశాలలో స్వర్గం ఉండటం ఏమిటి భూమండలం మీదే నేను స్వర్గాన్ని నిర్మించి చూపిస్తాను అని ప్రకటించాడు. హూద్ అలైహిస్సలాం వారిని విశ్వసించలేదు గర్వంతో అహంకారంతో అతను ఏమన్నాడంటే ఆకాశాల పైన ఉన్న స్వర్గం ఏమిటి భూమండలం మీదే నేను స్వర్గాన్ని నిర్మించి చూపిస్తాను చూడండి అని ఆ తర్వాత ‘అదన్‘ అనే ఒక ప్రదేశాన్ని ఎన్నుకొని అక్కడ బంగారము వెండి వజ్రాలు ఈ విధంగా అతని వద్ద ఉన్న ఖజానా మొత్తం ఖర్చు పెట్టి ఒక స్వర్గాన్ని నిర్మించే పని మొదలెట్టాడు.

ఆ రోజుల్లో ప్రజల ఆయుష్షు చాలా పెద్దది చాలా ఎక్కువ రోజులు వారు బ్రతికేవారు ఆ విధంగా 300 సంవత్సరాల వరకు కష్టపడి ప్రజలు ఒక స్వర్గాన్ని నిర్మించారు. అందులో భవనాలు ఏర్పాటు చేశారు రహదారులు నిర్మించారు నీటి కాలువలు నిర్మించారు పండ్ల తోటలు నిర్మించారు సేవకుల్ని ఉంచారు అన్ని సౌకర్యాలు ఉంచారు దానితోపాటు బంగారం అందులో ఉంచారు వెండి ఉంచారు వజ్రాలు ఉంచారు ఈ విధంగా నగలు ఆభరణాలు కూడా అందులో ఉంచారు దానికి ‘ఇరం‘ అని నామకరణం చేశాడు స్వర్గానికి జన్నతుల్ ఫిర్దౌస్ జన్నాతు అద్న్ అని పేర్లు ఉంటాయి కదండీ ఆ విధంగా ఇతను నిర్మించిన స్వర్గానికి అతను ‘ఇరం’ అని నామకరణం చేశాడు.

300 సంవత్సరాల వరకు కష్టపడి ప్రజలు ఒక స్వర్గాన్ని నిర్మించారు నిర్మించబడిన స్వర్గం గురించి రాజుకు తెలియజేశారు రాజు ఏం చేశాడంటే 300 సంవత్సరాల తర్వాత తను కోరుకున్న స్వర్గము నిర్మించబడింది ఆ స్వర్గ ప్రారంభోత్సవానికి వెళ్లడానికి బంధుమిత్రులతో పాటు పయనమయ్యాడు. మార్గ మధ్యంలో ప్రయాణం చేసుకుంటూ వెళుతూ ఉన్నాడు. ఒక్క రోజు ప్రయాణము చేస్తే ఒక్క రోజు తర్వాత ఆ స్వర్గానికి చేరుకుంటాడు అనగా దైవ శిక్ష వచ్చి ఆద్ జాతి వారి మీద పడింది ఆ శిక్షలో ఆద్ జాతితో పాటు ఆ రాజు అతని కుటుంబ సభ్యులు బంధు మిత్రులు అందరూ కూడా అక్కడికక్కడే నాశనమైపోయి మరణించారు చనిపోయారు. తను ఎంతో ఇష్టపడి నిర్మించుకున్న కలల స్వర్గాన్ని అతను చేరుకోలేకపోయాడు ఇంకా ఒక్క రోజు ప్రయాణం ఉందనగానే అంతలోనే అక్కడే అతను చనిపోయాడు మరణించాడు అని చరిత్రకారులు తెలియజేశారు.

ఇక్కడితో పూర్తి కథ ఇంకా పూర్తి కాలేదు. ఆ తర్వాత ఈ స్వర్గానికి సంబంధించిన మరొక విషయం చెప్పబడుతుంది అదేమిటంటే ఈ సంఘటన జరిగిన చాలా వేల సంవత్సరాల తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరణానంతరం నలుగురు ఖలీఫాల మరణానంతరం ఎప్పుడైతే అమీరె మావియా ఖలీఫాగా చక్రవర్తిగా ముస్లింలను పరిపాలిస్తున్నారో ఆ రోజుల్లో అబ్దుల్లా బిన్ ఖిలాబా అనే ఒక వ్యక్తి ఒంటెను వెతుక్కుంటూ వెళ్లారు. వెళ్తున్నారు ఒంటెను వెతుకుతున్నారు వెంట ఒంటె ఎక్కడికో పారిపోయింది ఆ పారిపోయిన ఒంటెను వెతుకుతూ వెతుకుతూ వెళ్తూ ఉంటే ఒక చోట కాలు జారారు కింద పడ్డారు లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్లి చూస్తే లోపల భవనాలు ఉన్నాయి అక్కడ వెండి వజ్రాలు బంగారం అన్నీ ఒక పెద్ద నగరాన్ని అక్కడ ఆయన చూశారు. ఆయన ఏం చేశారంటే అందులో నుంచి కొంచెం బంగారము వెండి వజ్రాలు ఇలాంటి ఆభరణాలు తీసుకొని ఏదో ఒక రకంగా కష్టపడి మళ్ళీ బయటికి వచ్చారు.

తరువాత ఆ విషయం తిన్నగా వారి ద్వారా వారి స్నేహితులకి స్నేహితుల ద్వారా బంధుమిత్రులకి బంధుమిత్రుల ద్వారా రాజు వద్దకు చేరిపోయింది. రాజు వద్దకు విషయం చేరినప్పుడు ఆ రాజు గారు అబ్దుల్లా బిన్ ఖిలాబా గారిని పిలిపించి ఏమయ్యా ఏదో సంఘటన జరిగిందంట భూమి లోపల నువ్వు ఎక్కడో కింద పడ్డావంట అక్కడ ఒక పెద్ద నగరం నీకు కనిపించింది అంట అక్కడ నువ్వు బంగారము ఇవన్నీ తీసుకువచ్చావు అంట కదా ఇది ఎక్కడ ఉందో నువ్వు మమ్మల్ని చూపించగలవా అని అడిగితే సరేనండి చూపిస్తాను పదండి అని ఆయన భటులతో పాటు బయలుదేరారు కానీ ఆ ప్రదేశాన్ని ఆయన కనుక్కోలేకపోయారు ఆ ప్రదేశానికి చేరుకోలేకపోయారు అని చెప్పడం జరిగింది.

అయితే ఈ రెండు సంఘటనలు ఎలాంటి సంఘటనలు అంటే ఇవి ప్రామాణికమైనవి కావు అని ధార్మిక పండితులు తేల్చి చెప్పారు ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఈ ప్రస్తావన అక్కడక్కడ కొంతమంది ఈ రాజు గురించి చర్చిస్తూ ఉంటారు తెలియజేస్తూ ఉంటారు అయితే ఇది ప్రామాణికమైన విషయం కాదన్న విషయం మీ దృష్టిలో నేను ఉంచదలిచాను కాబట్టి ఈ పూర్తి కథ వినిపించి దాని వాస్తవాన్ని కూడా మీకు తెలియజేయడం జరిగింది.

అయితే మిత్రులారా ఒక్క విషయం మాత్రం స్పష్టం అదేమిటంటే ఆద్ జాతి వారు చాలా శక్తిమంతులు. ఆ శక్తి సామర్థ్యాలను అల్లాహ్ కోసం అల్లాహ్ ధర్మం కోసం వారు ఉపయోగించలేదు గానీ ప్రపంచంలో వారి ఉనికిని చాటుకోవడానికి వారి శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి చూపించడానికి గర్వపడడానికి మాత్రమే ఉపయోగించారు. ఒక రకంగా చెప్పాలంటే అహంకారం ప్రదర్శించారు తత్కారణంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్తను పంపి వారిని సంస్కరించేటందుకు ప్రయత్నం చేసినా గానీ వారు ప్రవక్తను విశ్వసించలేదు అల్లాహ్ ను విశ్వసించలేదు కాబట్టి దైవ శిక్షకు గురయ్యారు. ఈ హూద్ అలైహిస్సలాం మరియు ఆద్ జాతి వారి చరిత్ర ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే అహంకారం ప్రదర్శిస్తే వారు ఎంతటి శక్తి సామర్థ్యం కలిగిన వారైనా సరే వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మెచ్చుకోడు వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కఠినంగా శిక్షిస్తాడు.

అలాగే రెండవ విషయం ఏమిటంటే హూద్ అలైహిస్సలాం వారిని జాతి ప్రజలు బెదిరించారు మా ప్రభువులు నీకు ఏదో రోగానికి గురి చేశారు కాబట్టి నువ్వు ఈ విధంగా వ్యాధిగ్రస్తుడిలా మారిపోయి మాట్లాడుతున్నావు అని లేనిపోని విషయాలు చెప్పి ఆయనను బెదిరించే ప్రయత్నం చేశారు అలాంటప్పుడు ఆయన అవునేమో అనుకోలేదు అల్లాహ్ మీద పూర్తి నమ్మకం కలిగి నాకు లాభ నష్టాలు ఏమి జరిగినా అల్లాహ్ తరఫునే జరుగుతాయి గానీ అల్లాహ్ తప్ప మరెవరికీ లాభాలు నష్టాలు సమకూర్చే అధికారము శక్తి లేదు అన్న విషయాన్ని ప్రపంచానికి ముఖ్యంగా ఆ జాతి ప్రజలకు తెలియజేశారు కాబట్టి మనం కూడా అదే విషయాన్ని నమ్మాలి. మనకు లాభం కలిగినా నష్టం కలిగినా అల్లాహ్ తరఫునే కలుగుతుంది కానీ అల్లాహ్ తప్ప మరెవరి వల్ల అది సాధ్యము కాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు “ప్రపంచం మొత్తం కలిపి మీకు సహాయం చేయాలనుకున్నా మీకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఎంత సహాయం చేయాలంటే అంతే చేయగలుగుతారు ప్రపంచం మొత్తం కలిసి మీకు నష్టం చేయాలనుకున్నా అల్లాహ్ మీకు ఎంత నష్టం చేయాలనుకుంటాడో అంతే వారు నష్టం చేయగలుగుతారు అంతే తప్ప అల్లాహ్ ఆజ్ఞకు మించి వారు ఏమీ చేయలేరు” అన్న విషయాన్ని తెలియజేశారు కాబట్టి అల్లాహ్ మీద పూర్తి నమ్మకం భక్తులకు ఉండాలి అనేది మనకు ఇక్కడ తెలుపడం జరిగింది.

చివరి విషయం ఏమిటంటే మనిషికి ఇహలోకంలోనూ పరలోకంలోనూ సాఫల్యము అల్లాహ్ పై మరియు ప్రవక్తల పై అల్లాహ్ వాక్యాలపై విశ్వాసము మరియు అనుసరణ ద్వారానే లభిస్తుంది అన్న విషయం తెలుసుకోవాలి.

నేను అల్లాహ్ తో దువా చేస్తున్నాను అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ రుజుమార్గం మీద స్థిరంగా నడుచుకునే భాగ్యం ప్రసాదించుగాక మార్గభ్రష్టత్వానికి గురి కాకుండా సైతాన్ వలలో చిక్కుకోకుండా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అల్లాహ్ మీద పూర్తి నమ్మకం కలిగి భక్తి శ్రద్ధలతో జీవితం గడిపే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక ఆమీన్.

అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

69:6 وَأَمَّا عَادٌ فَأُهْلِكُوا بِرِيحٍ صَرْصَرٍ عَاتِيَةٍ

69:7 سَخَّرَهَا عَلَيْهِمْ سَبْعَ لَيَالٍ وَثَمَانِيَةَ أَيَّامٍ حُسُومًا فَتَرَى الْقَوْمَ فِيهَا صَرْعَىٰ كَأَنَّهُمْ أَعْجَازُ نَخْلٍ خَاوِيَةٍ

ఆద్ వారు ప్రచండమైన పెనుగాలుల ద్వారా నాశనం చేయబడ్డారు. వాటిని అల్లాహ్ వారిపై నిరంతరం ఏడు రాత్రులు, ఎనిమిది పగళ్ళు విధించాడు. (నీవు గనక అక్కడ ఉండి ఉంటే) వారు అక్కడ బోసిపోయిన ఖర్జూరపు బొద్దులవలే నేలకొరిగి పడి ఉండటం చూసేవాడివి. (ఖుర్ఆన్ 69 : 6-7)

యమన్, ఒమన్ ల మధ్య ఉన్న ప్రదేశంలో కొండచరియల వద్ద ఆద్ జాతి ప్రజలు చాలా కాలం నివసించారు. వారు శారీరకంగా దృఢకాయులు. భవన నిర్మాణ కౌశలానికి వారు పెట్టింది పేరు. ఎత్తయిన అనేక భవనాలు నిర్మించిన ఘనత వారిది. వారి బలసామర్ధ్యాల వల్ల, వారి సంపద వల్ల మిగిలిన జాతుల కన్నా వారికి విశిష్ట స్థానం లభించింది. కాని భౌతికంగా వారు సాధించిన ప్రగతీ వికా సాలు, వారి శారీరక బలాధిక్యత వారిని అహంకారానికి, గర్వాతిశయానికి గురి చేశాయి. దౌర్జన్యాలు, అన్యాయానికి మారు పేరయిన పాలకుల చేతుల్లో రాజ్యాధికారం ఉండేది. వారికి వ్యతిరేకంగా గొంతువిప్పే సాహసం ఎవరూ చేసేవారు కాదు.

అల్లాహ్ గురించి ఏమీ తెలియని జాతి కాదు వారిది. అలాగే వారు అల్లాహ్ ఆరాధనను పూర్తిగా నిరాకరించనూ లేదు. కాని వారు కేవలం అల్లాహ్ ను మాత్రమే, అంటే ఒక్క అల్లాహ్ ను మాత్రమే ఆరాధించడాన్ని నిరాకరించారు. అల్లాహ్ పాటు వారు అనేక దేవీదేవతలను ఆరాధించేవారు. ఇది మహాపరాధం, అల్లాహ్ ఎంతమాత్రం సహించని అపరాధం ఇది.

అల్లాహ్ ఈ ప్రజలకు మార్గదర్శకత్వం అందించాలని, వారికి హితబోధ చేయాలని నిర్ణయించి, వారిలో ఒకరిని దైవప్రవక్తగా ఎన్నుకున్నాడు. ఆయనే హూద్ (అలైహిస్సలాం). ఆయన తనకు అప్పగించిన పనిని నిబద్ధతతో, దృఢసంకల్పంతో, సహనంతో నిర్వర్తించారు. ఆయన విగ్రహారాధనను ఖండించారు. ప్రజలకు బోధిస్తూ, “ప్రజలారా! ఈ రాళ్ళ వల్ల లాభం ఏముంది? మీ స్వంత చేతులతో . మీరు చెక్కే వీటి వల్ల ప్రయోజనం ఏముంటుంది? నిజానికి ఇలా చేయడం మీ వివేకవివేచనలను పరాభవించుకోవడమే అవుతుంది. దేవుడు కేవలం ఒకే ఒక్కడు. ఆయనే ఆరాధనకు అర్హుడు. ఆయనే అల్లాహ్. ఆయన్ను మాత్రమే ఆరాధించడం మీ బాధ్యత. ఆయనే మిమ్మల్ని సృష్టించాడు. ఆయనే మీకు పోషణనిస్తున్నాడు. ఆయనే మీకు జీవన్మరణాలు ఇస్తున్నాడు” అని చెప్పారు. ‘అల్లాహ్ మీకు అద్భుతమైన శారీరక శక్తిని ప్రసాదించాడు. అనేక విధాలుగా మిమ్మల్ని అనుగ్రహించాడు. కాబట్టి దేవుణ్ణి విశ్వసించండి. ఆయన మీకు ప్రసాదించిన అనుగ్రహాల విషయంలో నిర్లక్ష్యం చేయవద్దు. లేకపోతే నూహ్ జాతి ప్రజలకు పట్టిన దుర్గతి మీకూ పట్టవచ్చు అని వారిని హెచ్చరించారు.

హేతుబద్ధమైన వాదనతో హూద్ ప్రవక్త (అలైహిస్సలాం) ప్రజల్లో దైవవిశ్వాసాన్ని పాదుకొల్పడానికి ప్రయత్నించారు. కాని వారు ఆయన సందేశాన్ని స్వీకరించడానికి నిరాకరించారు. పైగా హూద్ (అలైహిస్సలాం)తో వాదనకు దిగారు. “హూద్ ! నీవు చెబుతున్న దేమిటి? ఈ దేవీదేవతలు అల్లాహ్ తో మా తరఫున సిఫారసు చేస్తాయి” అని. దబాయించారు. హూద్ (అలైహిస్సలాం) వారికి జవాబిస్తూ, “ప్రజలారా! అందరి దేవుడు అల్లాహ్ ఒక్కడే. ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరు. ఆయన మీ బృహద్ధ మనికన్నా మీకు దగ్గరగా ఉన్నాడు. ఈ విగ్రహాలు మీ కోసం సిఫారసు చేయలేవు. వీటిని ఆరాధించడం వల్ల మీరు అల్లాహు మరింత దూరం అవుతారు. మేము చాలా తెలివైన వాళ్ళం అని మీరు భావిస్తున్నారేమో! కాని మీ విశ్వాసాలు మీ అజ్ఞానాన్ని చాటిచెబుతున్నాయి” అన్నారు.

కాని వారు హూద్ (అలైహిస్సలాం) మాటలను తిరస్కరించారు. ఆయన్ను ఎగతాళి చేశారు. “హూద్! నీవు కూడా మాలాంటి మామూలు మనిషివే. అలాంటప్పుడు అల్లాహ్ నీకు మాత్రమే ప్రవక్త పదవీ బాధ్యతలను అనుగ్రహించాడా? అలా ఎన్నటికీ జరగదు. నువ్వు అబద్ధాలాడుతున్నావు” అన్నారు. హూద్ (అలైహిస్సలాం) వారికి జవాబిస్తూ, “నేను నా జీవితమంతా మీ మధ్యనే గడిపాను. నా వివేకవివేచనలను మీలో ఎవ్వరూ ప్రశ్నించలేదు. అల్లాహ్ నన్ను హెచ్చరించేవానిగా, మార్గం చూపేవానిగా ఎన్నుకున్నాడు. అల్లాహ్ ఒక్కడే. ఆయన ఏకత్వం అన్నది విశ్వం లోని ప్రతి వస్తువులోనూ కనబడుతుంది. ప్రతి వస్తువులోనూ ఒక సూచన ఉంది. కాబట్టి ఆయన్ను విశ్వసించండి. ఆయన్ను క్షమాభిక్ష కొరకై అర్థించండి. ఆయన కారుణ్యానికి దూరం కావద్దు. పరలోకం కొరకు ఏర్పాట్లు చేసుకోండి. మీకు వైభవోపేతమైన ఎత్తయిన భవనాలు ఉన్నాయి. ఈ భవనాలు మీ శక్తిని, మీ సంపదను చాటిచెబుతున్నాయి. కాని వీటి వల్ల మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇవి కేవలం మీ వైభవానికి చిహ్నాలైన అవశేషాలుగా మిగిలిపోతాయి. మీరు మీ సంపదను, మీ నైపుణ్యాలను ఎలాంటి జీవిత లక్ష్యం లేకుండా వెచ్చిస్తున్నారు. మీరు శాశ్వతంగా ఇక్కడే ఉంటారన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మీరు కేవలం సుఖవిలాసాల కోసం ప్రాకులాడుతున్నారు” అని హెచ్చరించారు. కాని ఆ ప్రజలు ఆయన బోధనలను పెడచెవిన పెట్టారు. హూద్ (అలైహిస్సలాం) తన ప్రచారోద్యమం నిష్ఫలమయ్యిందని గుర్తించారు. ఆయన వారితో, “అల్లాహ్ ముందు సాక్షులుగా ఉండండి. నేను దైవసందేశాన్ని మీకు అందజేశాను. నేను నా ప్రయత్నాలు కొనసాగిస్తునే ఉంటాను. మీ బెదిరింపులకు భయపడను. నేను కేవలం అల్లాహు మాత్రమే భయపడతాను” అన్నారు.

ఒక రోజు వారు ఆకాశాన్ని ఒక నల్లమబ్బు కప్పివేయడాన్ని చూశారు. వర్షం వస్తుందని వారు భావించారు. ఈ తొలకరి వర్షానికి పొలాలను సిద్ధం చేసుకోవాలనుకున్నారు. హూద్ (అలైహిస్సలాం) వారిని హెచ్చరించారు. ఇది దేవుని కరుణ వల్ల వచ్చిన మేఘం కాదు. ఇది అభిశాపంగా వస్తున్న గాలివాన. ఇది బాధాకరమైన శిక్షను తీసుకువస్తుంది. దీని గురించే నేను మీకు హెచ్చరికలు చేశాను అన్నారు.

భయంకరమైన తుఫాను గాలి ఎనిమిది పగళ్ళు, ఏడు రాత్రులు కొనసాగింది. ఆ ప్రాంతం యావత్తు శిథిలమయంగా మారే వరకు అది ఆగలేదు. అక్కడి దుర్మార్గ ప్రజలు అందరూ వినాశం పాలయ్యారు. ఎడారి ఇసుక వారిని ముంచెత్తింది. కేవలం హూద్ (అస), ఆయన అనుచరులు మాత్రం బ్రతికి బయటపడ్డారు. వారు అక్కడి నుంచి ‘హద్రమౌత్’కు వలస పోయారు. వారు అక్కడ ఒకేదేవుడు అల్లాహ్ ను ఆరాధిస్తూ శాంతియుతంగా జీవించారు.

(చదవండి దివ్యఖుర్ఆన్: 7:65-72, 11:50-60, 26:123-140)

ఇటీవల స్పేస్ షటిల్ నుంచి తీసుకున్న ఆధునిక రాడార్ ఇమేజ్ల వల్ల లభించిన వైజ్ఞానిక ఆధారాలతో దక్షిణ ఓమ్మాన్ ని ఉబార్ వద్ద ఎనిమిది ఎత్తయిన టవర్లను కనిపెట్టడం జరిగింది. ఈ ప్రాంతాన్ని “ఖాళీ ప్రదేశం” (ఎంప్టీ క్వార్టర్)గా పిలువడం జరుగుతుంది. ఈ సంఘటన దాదాపు 5000 సంవత్సరాలకు పూర్వం జరిగిందని భావిస్తున్నారు. ఒక్క దివ్యఖుర్ఆన్ తప్ప మరో మతగ్రంథం లేదా ధార్మిక పుస్తకం ఏదీ ఈ పట్టణం పతనాన్ని ప్రస్తావించలేదు.

[క్రింది భాగం అహ్సనుల్ బయాన్ నుండి తీసుకోబడింది]

ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ఉపదేశించాడు:

7:65 وَإِلَىٰ عَادٍ أَخَاهُمْ هُودًا ۗ قَالَ يَا قَوْمِ اعْبُدُوا اللَّهَ مَا لَكُم مِّنْ إِلَٰهٍ غَيْرُهُ ۚ أَفَلَا تَتَّقُونَ

మేము ఆద్‌జాతి వద్దకు వారి సోదరుడైన హూద్‌ను పంపాము. “నా జాతి ప్రజలారా! మీరు అల్లాహ్‌ను ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరో ఆరాధ్య దైవం లేడు. మరలాంటప్పుడు మీరు భయపడరా?” అని అతను చెప్పాడు.

7:66 قَالَ الْمَلَأُ الَّذِينَ كَفَرُوا مِن قَوْمِهِ إِنَّا لَنَرَاكَ فِي سَفَاهَةٍ وَإِنَّا لَنَظُنُّكَ مِنَ الْكَاذِبِينَ

దానికి అతని జాతిలోని అవిశ్వాస సర్దారులు, “నువ్వు మాకు తెలివి తక్కువ వానిలా కనిపిస్తున్నావు. పైగా నువ్వు అబద్ధాల కోరువని మా అభిప్రాయం” అన్నారు.

7:67 قَالَ يَا قَوْمِ لَيْسَ بِي سَفَاهَةٌ وَلَٰكِنِّي رَسُولٌ مِّن رَّبِّ الْعَالَمِينَ

“ఓ నా జాతివారలారా! నాలో ఏ మాత్రం తెలివితక్కువ తనం లేదు. నేను సకల లోకాల ప్రభువు తరఫున పంపబడిన ప్రవక్తను.

7:68 أُبَلِّغُكُمْ رِسَالَاتِ رَبِّي وَأَنَا لَكُمْ نَاصِحٌ أَمِينٌ

“నా ప్రభువు సందేశాలను మీకు చేరవేసేవాణ్ణి. మీరు నమ్మదగ్గ మీ శ్రేయోభిలాషిని.

7:69 أَوَعَجِبْتُمْ أَن جَاءَكُمْ ذِكْرٌ مِّن رَّبِّكُمْ عَلَىٰ رَجُلٍ مِّنكُمْ لِيُنذِرَكُمْ ۚ وَاذْكُرُوا إِذْ جَعَلَكُمْ خُلَفَاءَ مِن بَعْدِ قَوْمِ نُوحٍ وَزَادَكُمْ فِي الْخَلْقِ بَسْطَةً ۖ فَاذْكُرُوا آلَاءَ اللَّهِ لَعَلَّكُمْ تُفْلِحُونَ

“ఏమిటీ, మిమ్మల్ని హెచ్చరించటానికి స్వయంగా మీనుండే ఒక వ్యక్తి ద్వారా, మీ ప్రభువు తరఫునుండి మీ వద్దకు హితోపదేశం రావటం మీకు ఆశ్చర్యం కలిగించిందా? అల్లాహ్‌ మిమ్మల్ని నూహ్‌ జాతి అనంతరం వారసులుగా చేసి, మీకు ఎక్కువ శరీర సౌష్ఠవాన్ని ప్రసాదించిన సంగతిని గుర్తుంచుకోండి. అల్లాహ్‌ అనుగ్రహాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. తద్వారా మీరు సాఫల్యం పొందుతారు” అని హూద్‌ బోధపరచాడు.

7:70 قَالُوا أَجِئْتَنَا لِنَعْبُدَ اللَّهَ وَحْدَهُ وَنَذَرَ مَا كَانَ يَعْبُدُ آبَاؤُنَا ۖ فَأْتِنَا بِمَا تَعِدُنَا إِن كُنتَ مِنَ الصَّادِقِينَ

“మేము అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించాలనీ, మా తాత ముత్తాతలు పూజిస్తూ వచ్చిన వాటిని వదలివేయమని (చెప్పటానికేనా) నువ్వు మా వద్దకు వచ్చింది? ఒకవేళ నువ్వు సత్యవంతుడవే అయితే ఏ శిక్షను గురించి నువ్వు మమ్మల్ని బెదిరిస్తున్నావో దాన్ని మా వద్దకు రప్పించు చూద్దాం” అని వారు అన్నారు.

7:71 قَالَ قَدْ وَقَعَ عَلَيْكُم مِّن رَّبِّكُمْ رِجْسٌ وَغَضَبٌ ۖ أَتُجَادِلُونَنِي فِي أَسْمَاءٍ سَمَّيْتُمُوهَا أَنتُمْ وَآبَاؤُكُم مَّا نَزَّلَ اللَّهُ بِهَا مِن سُلْطَانٍ ۚ فَانتَظِرُوا إِنِّي مَعَكُم مِّنَ الْمُنتَظِرِينَ

అప్పుడు హూద్‌ ఇలా అన్నాడు : “ఇక మీ ప్రభువు శిక్ష, ఆయన ఆగ్రహం మీపై విరుచుకుపడినట్లే. ఏమిటీ, మీరూ మీ తాతముత్తాతలూ కల్పించుకున్న పేర్ల విషయంలో నాతో గొడవపడుతున్నారా? వాటి గురించి (అవి ఆరాధ్య దైవాలని నిర్థారించే) ఏ ప్రమాణాన్నీ అల్లాహ్‌ అవతరింపజెయ్యలేదు. కాబట్టి మీరూ నిరీక్షించండి, మీతోపాటు నేను కూడా నిరీక్షిస్తాను.”

7:72 فَأَنجَيْنَاهُ وَالَّذِينَ مَعَهُ بِرَحْمَةٍ مِّنَّا وَقَطَعْنَا دَابِرَ الَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا ۖ وَمَا كَانُوا مُؤْمِنِينَ

ఎట్టకేలకు మేము అతన్నీ, అతని సహచరులను మా కృపతో కాపాడాము. అయితే మా ఆయతులు అబద్ధాలంటూ కొట్టి పారేసినవారి వేరును త్రెంచివేశాము. వారు ఎట్టి పరిస్థితిలోనూ విశ్వసించేవారు కారు.

11:50 وَإِلَىٰ عَادٍ أَخَاهُمْ هُودًا ۚ قَالَ يَا قَوْمِ اعْبُدُوا اللَّهَ مَا لَكُم مِّنْ إِلَٰهٍ غَيْرُهُ ۖ إِنْ أَنتُمْ إِلَّا مُفْتَرُونَ

మరి మేము ఆద్‌ జాతి వైపుకు వారి సోదరుడైన హూద్‌ను పంపాము. అతను (తన వారినుద్దేశించి) ఇలా అన్నాడు: “ఓ నా జాతి ప్రజలారా! అల్లాహ్‌నే ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరో ఆరాధ్యుడు లేడు. మీరు కల్పించేవన్నీ అబద్ధాలు తప్ప మరేమీ కావు.”

11:51 يَا قَوْمِ لَا أَسْأَلُكُمْ عَلَيْهِ أَجْرًا ۖ إِنْ أَجْرِيَ إِلَّا عَلَى الَّذِي فَطَرَنِي ۚ أَفَلَا تَعْقِلُونَ

“ఓ నాజాతి ప్రజలారా! ఈ పనికై నేను మీనుండి ఎలాంటి ప్రతిఫలాన్నీ అడగటం లేదు. నాకు ప్రతిఫలం ఇచ్చే బాధ్యత నన్నుసృష్టించిన వానిదే. అయినప్పటికీ మీరు వివేకవంతులుగా వ్యవహరించరే?!”

11:52 وَيَا قَوْمِ اسْتَغْفِرُوا رَبَّكُمْ ثُمَّ تُوبُوا إِلَيْهِ يُرْسِلِ السَّمَاءَ عَلَيْكُم مِّدْرَارًا وَيَزِدْكُمْ قُوَّةً إِلَىٰ قُوَّتِكُمْ وَلَا تَتَوَلَّوْا مُجْرِمِينَ

“ఓ నా జాతి వారలారా! మీ పోషకుని (అంటే అల్లాహ్‌) సమక్షంలో మీ తప్పుల మన్నింపుకై ప్రార్థించండి. ఆయన సన్నిధిలో పశ్చాత్తాపం చెందండి. ఆయన మీపై (ఆకాశం నుండి) ధారాపాతంగా వర్షం కురిపిస్తాడు. మీకున్న బలిమికి మరింత శక్తినీ, బలాన్నీ చేకూరుస్తాడు. మీరు మాత్రం అపరాధులుగా తిరిగిపోకండి.”

11:53 قَالُوا يَا هُودُ مَا جِئْتَنَا بِبَيِّنَةٍ وَمَا نَحْنُ بِتَارِكِي آلِهَتِنَا عَن قَوْلِكَ وَمَا نَحْنُ لَكَ بِمُؤْمِنِينَ

దానికి వారు, “ఓ హూద్‌! నువ్వు మావద్దకు ఏ నిదర్శనాన్నీ తేలేదు. నువ్వు (నోటితో) చెప్పినంత మాత్రాన మేము మా ఆరాధ్య దైవాలను వదలి పెట్టలేము. నిన్ను మేము విశ్వసించబోవటం లేదు.

11:54 إِن نَّقُولُ إِلَّا اعْتَرَاكَ بَعْضُ آلِهَتِنَا بِسُوءٍ ۗ قَالَ إِنِّي أُشْهِدُ اللَّهَ وَاشْهَدُوا أَنِّي بَرِيءٌ مِّمَّا تُشْرِكُونَ

పైగా మా ఆరాధ్య దైవాలలో ఎవరో నిన్ను ఏదైనా వ్యాధికి గురిచేసి ఉంటారని మేము అనుకుంటున్నాము” అని పలికారు. అప్పుడు హూద్‌ ఇలా సమాధానమిచ్చాడు: “అల్లాహ్‌ తప్ప మీరు భాగస్వాములుగా నిలబెట్టే వారందరితో నేను విసుగెత్తి పోయాను. (వారితో నాకెలాంటి సంబంధం లేదు). నేను ఈ విషయానికి అల్లాహ్‌ను సాక్షిగా పెడుతున్నాను, మీరు కూడా దీనికి సాక్షులుగా ఉండండి.”

11:55 مِن دُونِهِ ۖ فَكِيدُونِي جَمِيعًا ثُمَّ لَا تُنظِرُونِ

“సరే. మీరంతా కలసి నాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నండి. నాకు ఏమాత్రం కూడా గడువు ఇవ్వకండి.

11:56 إِنِّي تَوَكَّلْتُ عَلَى اللَّهِ رَبِّي وَرَبِّكُم ۚ مَّا مِن دَابَّةٍ إِلَّا هُوَ آخِذٌ بِنَاصِيَتِهَا ۚ إِنَّ رَبِّي عَلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ

“నేను కేవలం అల్లాహ్‌నే నమ్ముకున్నాను. ఆయన నాకూ ప్రభువే. మీ అందరికీ ప్రభువే. ప్రతి ప్రాణి యొక్క జుట్టు ఆయన చేతిలోనే ఉంది. నిశ్చయంగా నా ప్రభువు సన్మార్గాన ఉన్నాడు.

11:57 فَإِن تَوَلَّوْا فَقَدْ أَبْلَغْتُكُم مَّا أُرْسِلْتُ بِهِ إِلَيْكُمْ ۚ وَيَسْتَخْلِفُ رَبِّي قَوْمًا غَيْرَكُمْ وَلَا تَضُرُّونَهُ شَيْئًا ۚ إِنَّ رَبِّي عَلَىٰ كُلِّ شَيْءٍ حَفِيظٌ

ఒకవేళ మీరు మరలి పోదలిస్తే (పొండి), నేను మాత్రం నాకిచ్చి పంపబడిన సందేశాన్ని మీకు అందజేశాను. నా ప్రభువు మీ స్థానంలో ఇంకొకరిని తీసుకువస్తాడు. మీరు ఆయనకు ఏవిధమైన కీడూ కలిగించలేరు. నిస్సందేహంగా నా ప్రభువు అన్నింటినీ పర్యవేక్షిస్తున్నాడు.”

11:58 وَلَمَّا جَاءَ أَمْرُنَا نَجَّيْنَا هُودًا وَالَّذِينَ آمَنُوا مَعَهُ بِرَحْمَةٍ مِّنَّا وَنَجَّيْنَاهُم مِّنْ عَذَابٍ غَلِيظٍ

మరి మా ఆజ్ఞ (అమల్లోకి) వచ్చినప్పుడు మేము హూద్‌నూ, అతనితో పాటు విశ్వసించిన అతని సహచరులనూ మా ప్రత్యేక కృపతో కాపాడాము. ఘోరమైన శిక్ష నుంచి వారిని రక్షించాము.

11:59 وَتِلْكَ عَادٌ ۖ جَحَدُوا بِآيَاتِ رَبِّهِمْ وَعَصَوْا رُسُلَهُ وَاتَّبَعُوا أَمْرَ كُلِّ جَبَّارٍ عَنِيدٍ

ఇదీ ఆద్‌ జాతి (వృత్తాంతం). వీరు తమ ప్రభువు ఆయతులను త్రోసి పుచ్చారు. ఆయన ప్రవక్తల పట్ల అవిధేయతకు పాల్పడ్డారు. ఇంకా అహంకారి, అవిధేయీ అయిన ప్రతివ్యక్తినీ వారు అనుసరించారు.

11:60 وَأُتْبِعُوا فِي هَٰذِهِ الدُّنْيَا لَعْنَةً وَيَوْمَ الْقِيَامَةِ ۗ أَلَا إِنَّ عَادًا كَفَرُوا رَبَّهُمْ ۗ أَلَا بُعْدًا لِّعَادٍ قَوْمِ هُودٍ

ప్రపంచంలోనూ వారికి శాపం అంటగట్టబడింది. ప్రళయదినాన కూడా అది (వారిని) వెన్నంటి ఉంటుంది. చూడండి! ఆద్‌ జాతి వారు తమ ప్రభువును తిరస్కరించారు. హూద్‌ జాతి వారైన ఆదు జనులు (దైవ కారుణ్యానికి) దూరం చెయ్యబడ్డారు.

26:123 كَذَّبَتْ عَادٌ الْمُرْسَلِينَ

ఆద్‌ జాతి వారు (కూడా) దైవ ప్రవక్తలను ధిక్కరించారు.

26:124 إِذْ قَالَ لَهُمْ أَخُوهُمْ هُودٌ أَلَا تَتَّقُونَ

అప్పుడు వారి సోదరుడైన హూద్‌, (వారినుద్దేశించి) ఇలా అన్నాడు : “మీరు బొత్తిగా భయపడరా?

26:125 إِنِّي لَكُمْ رَسُولٌ أَمِينٌ

“నేను మీ వద్దకు పంపబడిన నమ్మకస్థుణ్ణి అయిన ప్రవక్తను.

26:126 فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ

“కనుక అల్లాహ్‌కు భయపడండి. నా విధానాన్ని అనుసరించండి.

26:127 وَمَا أَسْأَلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ ۖ إِنْ أَجْرِيَ إِلَّا عَلَىٰ رَبِّ الْعَالَمِينَ

“ఈ పనికిగాను నేను మీనుండి ఎలాంటి ప్రతిఫలాన్నీ అడగటం లేదు. నాకు ప్రతిఫలం ఇచ్చే బాధ్యత సర్వలోకాల ప్రభువుపై ఉంది.

26:128 أَتَبْنُونَ بِكُلِّ رِيعٍ آيَةً تَعْبَثُونَ

“ఏమిటీ, మీరు ఎత్తయిన ప్రతి స్థలంలోనూ ఏమీ ప్రయోజనం లేని ఒక స్మారక కట్టడాన్ని నిర్మిస్తారా?

26:129 وَتَتَّخِذُونَ مَصَانِعَ لَعَلَّكُمْ تَخْلُدُونَ

“మీరు ఇక్కడే శాశ్వతంగా ఉంటామన్నట్లు అపురూపమైన (పటిష్టమైన) భవనాలను నిర్మిస్తున్నారే!

26:130 وَإِذَا بَطَشْتُم بَطَشْتُمْ جَبَّارِينَ

“మీరు ఎప్పుడు, ఎవరిని పట్టుకున్నా చాలా దౌర్జన్య పూరితంగా పంజా విసురుతున్నారే!?

26:131 فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ

“కనుక, మీరు అల్లాహ్‌కు భయపడండి. నా విధానాన్ని అనుసరించండి.

26:132 وَاتَّقُوا الَّذِي أَمَدَّكُم بِمَا تَعْلَمُونَ

“మీకు తెలిసివున్న సమస్త (మంచి) వస్తువులను మీకు వొసగి, మిమ్మల్ని ఆదుకున్న వానికి భయపడండి.

26:133 أَمَدَّكُم بِأَنْعَامٍ وَبَنِينَ

“ఆయన మీకు పశువుల ద్వారా, సంతానం ద్వారా తోడ్పడ్డాడు.

26:134 وَجَنَّاتٍ وَعُيُونٍ

“తోటల ద్వారా, చెలమల ద్వారా (సహాయపడ్డాడు).

26:135 إِنِّي أَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ عَظِيمٍ

“నేను మీ విషయంలో ఒక మహా దినపు శిక్ష గురించి భయపడుతున్నాను.”

26:136 قَالُوا سَوَاءٌ عَلَيْنَا أَوَعَظْتَ أَمْ لَمْ تَكُن مِّنَ الْوَاعِظِينَ

వారిలా అన్నారు : “నువ్వు మాకు బోధించినా, బోధించే వారిలో ఒకడవు కాకపోయినా మాకు ఒకటే.

26:137 إِنْ هَٰذَا إِلَّا خُلُقُ الْأَوَّلِينَ

“ఇది పూర్వీకుల పాత అలవాటు తప్ప మరేమీ కాదు.

26:138 وَمَا نَحْنُ بِمُعَذَّبِينَ

“ఎట్టి పరిస్థితిలోనూ మేము శిక్షించబడము.”

26:139 فَكَذَّبُوهُ فَأَهْلَكْنَاهُمْ ۗ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ

ఆద్‌ (జాతి) వారు అతనిని (హూదును) ధిక్కరించిన కారణంగా మేము వారిని అంతమొందించాము. నిశ్చయంగా ఇందులో సూచన ఉంది. కాని వారిలో అనేకులు విశ్వాసులు కాలేదు.

26:140 وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ

మరి నిస్సందేహంగా నీ ప్రభువు అపార శక్తిసంపన్నుడు, పరమ కృపాశీలుడు.

ప్రవక్తలు (మెయిన్ పేజీ):
https://teluguislam.net/prophets

ప్రవక్తల జీవిత చరిత్ర (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2_iYX30U89yPwY5LPGtir8

ఖురాన్ తఫ్సీర్ – సూర అల్ జిన్న్ [వీడియోలు]

ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో మొత్తం 28 ఆయతులు ఉన్నాయి. ఏకదైవారాధన, ప్రవక్తల పరంపర గురించి ఈ సూరా ముఖ్యంగా వివరించింది.మొదటి ఆయతులో ప్రస్తావనకు వచ్చిన జిన్నులు అన్న పదాన్ని ఈ సూరాకు పేరుగా పెట్టడం జరిగింది. దివ్య ఖుర్ఆన్ ప్రాముఖ్యానికి జిన్నులు కూడా ప్రభావితమయ్యాయని తెలియజేయడం ద్వారా ఖుర్ఆన్ ఔన్నత్యాన్ని విశదీకరించడం జరిగింది. జిన్నులు రెండు రకాలని, కొందరు మంచివారని, కొందరు చెడ్డవారని తెలిపింది. కొందరు జిన్నులు దైవవాణిని విన్న తర్వాత దానిని విశ్వసించారు. ఈ సూరా ఏకదైవారాధన ప్రాముఖ్యాన్ని నొక్కి చెప్పింది. అల్లాహ్ కు భాగస్వాములను చేర్చడం మహాపరాధమనీ, దానికి దూరంగా ఉండాలని బోధించింది. అల్లాహ్ కు కుమారులు ఎవరూ లేరని, ఆయనకు భాగస్వాములు కూడా లేరని, ఆయనకు అగోచరాలు (కంటికి కనబడనివి) అన్నీ తెలుసనీ, అల్లాహ్ ను,ఆయన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)ను తిరస్కరించిన వారు నరకాగ్నికి ఆహుతి అవుతారని హెచ్చరించింది. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)ను అల్లాహ్ ఎన్నుకుని తన సందేశాన్ని మానవాళికి చేరవేయడానికి పంపాడని, మానవులు ఆయనకు విధేయత చూపాలని, అల్లాహ్ కు భాగస్వాములుగా ఎవరినీ నిలబెట్టరాదని బోధించింది.

యూట్యూబ్ ప్లే లిస్ట్ (4 వీడియోలు)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV03Itn9bMAzB2-hY7-39uaR

ఖురాన్ తఫ్సీర్ – సూరా అల్ జిన్న్ – పార్ట్ 1 (అయతులు 1-7)
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/TI28ZCm3pN0 [52 నిముషాలు]

ఈ ప్రసంగంలో సూరతుల్ జిన్ (72వ అధ్యాయం)లోని మొదటి ఏడు ఆయతుల (వచనాలు) యొక్క తఫ్సీర్ (వివరణ) ఇవ్వబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో మరియు తాయిఫ్‌లో తీవ్రమైన తిరస్కరణ, కష్టాలను ఎదుర్కొన్నప్పుడు, అల్లాహ్ ఆయనకు ఓదార్పునివ్వడానికి ఈ సంఘటనను తెలియజేశాడు. మానవులు తిరస్కరించినప్పటికీ, అల్లాహ్ యొక్క మరొక సృష్టి అయిన జిన్నాతులు ఖుర్ఆన్ విని, దాని అద్భుత స్వభావానికి ప్రభావితులై, తక్షణమే విశ్వసించి, షిర్క్‌ను త్యజించారు. ఈ సూరత్ తౌహీద్ (ఏకదైవారాధన), రిసాలత్ (ప్రవక్తృత్వం) మరియు ఆఖిరత్ (పరలోక జీవితం) యొక్క ప్రాథమిక సూత్రాలను నొక్కి చెబుతుంది. ఇస్లాం పూర్వపు అరబ్బులు జిన్నాతుల శరణు వేడుకోవడం వంటి షిర్క్ చర్యలను, మరియు దాని పర్యవసానాలను ఇది ఖండిస్తుంది. ఖుర్ఆన్ యొక్క మార్గదర్శకత్వం, దానిని శ్రద్ధగా వినడం మరియు దాని బోధనల ప్రకారం జీవించడం యొక్క ప్రాముఖ్యతను ఈ వివరణ స్పష్టం చేస్తుంది.

72:1 قُلْ أُوحِيَ إِلَيَّ أَنَّهُ اسْتَمَعَ نَفَرٌ مِّنَ الْجِنِّ فَقَالُوا إِنَّا سَمِعْنَا قُرْآنًا عَجَبًا
(ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం!) వారికి చెప్పు: నాకు దివ్యవాణి (వహీ) ద్వారా ఇలా తెలియజేయబడింది – జిన్నుల సమూహం ఒకటి (ఖుర్ఆన్ ను ) విన్నది. వారు (తమ వాళ్లతో) ఇలా అన్నారు: “మేమొక అద్భుతమైన ఖుర్ఆన్ ను విన్నాము.”

72:2 يَهْدِي إِلَى الرُّشْدِ فَآمَنَّا بِهِ ۖ وَلَن نُّشْرِكَ بِرَبِّنَا أَحَدًا
“అది సన్మార్గం వైపు దర్శకత్వం వహిస్తోంది. అందుకే మేము దానిని విశ్వసించాము. ఇక నుంచి మేము ఎవరినీ – ఎన్నటికీ – మా ప్రభువుకు సహవర్తుల్ని కల్పించము.”

72:3 وَأَنَّهُ تَعَالَىٰ جَدُّ رَبِّنَا مَا اتَّخَذَ صَاحِبَةً وَلَا وَلَدًا
“ఇంకా – మా ప్రభువు మహిమ అత్యున్నతమైనది. ఆయన తన కోసం (ఎవరినీ) భార్యగాగానీ, కొడుకుగాగానీ చేసుకోలేదు.”

72:4 وَأَنَّهُ كَانَ يَقُولُ سَفِيهُنَا عَلَى اللَّهِ شَطَطًا
“ఇంకా – మనలోని మూర్ఖుడు అల్లాహ్ గురించి సత్యవిరుద్ధమైన మాటలు పలికే వాడు.”

72:5 وَأَنَّا ظَنَنَّا أَن لَّن تَقُولَ الْإِنسُ وَالْجِنُّ عَلَى اللَّهِ كَذِبًا
“మనుషులైనా, జిన్నులైనా అల్లాహ్ కు అబద్ధాలు అంటగట్టడం అనేది అసంభవమని మనం అనుకున్నాము.”

72:6 وَأَنَّهُ كَانَ رِجَالٌ مِّنَ الْإِنسِ يَعُوذُونَ بِرِجَالٍ مِّنَ الْجِنِّ فَزَادُوهُمْ رَهَقًا
“అసలు విషయం ఏమిటంటే కొందరు మనుషులు కొందరు జిన్నాతుల శరణు వేడేవారు. ఈ కారణంగా జిన్నాతుల పొగరు మరింత పెరిగిపోయింది.”

72:7 وَأَنَّهُمْ ظَنُّوا كَمَا ظَنَنتُمْ أَن لَّن يَبْعَثَ اللَّهُ أَحَدًا
“అల్లాహ్ ఎవరినీ పంపడని (లేక ఎవరినీ తిరిగి బ్రతికించడని) మీరు తలపోసినట్లుగానే మనుషులు కూడా తలపోశారు.”

ఈరోజు సూరతుల్ జిన్ మనం చదవబోతున్నాము. ఒకవేళ రాసుకుంటున్నారంటే త్వరగా రాసుకోండి.

قُلْ
(కుల్)
(ఓ ప్రవక్తా!) చెప్పు. (72:1)

أُوحِيَ
(ఊహియ)
నాకు వహీ చేయబడినది. (72:1 నుండి)

సర్వసామాన్యంగా వహీని తెలుగులో దివ్యవాణి లేదా దివ్య సందేశం అని అంటారు. దివ్యవాణి, దివ్య సందేశం చేయబడినది, పంపబడినది.

إِلَيَّ
(ఇలయ్య)
నా వైపున.

أَنَّهُ اسْتَمَعَ
(అన్నహుస్తమ’అ)
అదేమనగా, అంటే నాకు వహీ చేయబడిన విషయం ఏమనగా,
ఇస్తమ’అ – విన్నారు.

ఇస్తమ’అ అంటే అరబీలో సమి’అ అని కూడా వస్తుంది. మనం రుకూ నుండి నిలబడినప్పుడు కూడా సమి’అల్లాహు లిమన్ హమిద అంటాము. సమి’అ అంటే కూడా విన్నాడు, ఇస్తమ’అ అంటే కూడా విన్నాడు. కానీ ఇస్తమ’అలో కొంచెం శ్రద్ధగా వినే ఒక మాట ఉంటుంది, భావం ఉంటుంది. అయితే కావాలంటే మీరు రాసుకోవచ్చు, ఇస్తమ’అ – శ్రద్ధగా విన్నారు.

نَفَرٌ
(నఫరున్)
నఫరున్ అంటే చిన్న సమూహం. ఇక్కడ ఎందుకు అంటున్నాము చిన్న సమూహం అని? సర్వసామాన్యంగా అరబీలో మూడు నుండి పది లోపు లెక్క ఏదైతే ఉంటుందో, సంఖ్య ఏదైతే ఉంటుందో, అది ముగ్గురు కావచ్చు, నలుగురు కావచ్చు, ఐదుగురు కావచ్చు పది వరకు, నఫర్ అని అంటారు. చిన్న సమూహం.

مِّنَ الْجِنِّ
(మినల్ జిన్)
జిన్నాతులలో నుండి.

فَقَالُوا
(ఫకాలూ)
వారు అన్నారు. అసలు పదం ఇక్కడ కాలూ, వారు పలికారు, వారు అన్నారు.

إِنَّا
(ఇన్నా)
నిశ్చయంగా మేము

سَمِعْنَا
(సమి’అనా)
విన్నాము. చూశారా, ఇక్కడ వచ్చింది. ఇక్కడ సమి’అనా అని వచ్చింది ఎందుకు? ఎందుకంటే అక్కడ కేవలం తెలియజేస్తున్నారు ఇతరులకు. అయితే ఆ విషయం అనేది సమి’అనా అని వచ్చింది.

قُرْآنًا
(ఖుర్ఆనన్)
ఖుర్ఆన్.

عَجَبًا
(అజబా)
అద్భుతమైన.

يَهْدِي
(యహ్ దీ)
మార్గదర్శకత్వం చేస్తుంది.

إِلَى الرُّشْدِ
(ఇలర్ రుష్ద్)
రుష్ద్ అంటే ఇక్కడ సరైన మార్గం, సరైనది. ఆ, సన్మార్గం అని అంటే కూడా తప్పు కాదు.

فَآمَنَّا بِهِ
(ఫ ఆమన్నా బిహీ)
కనుక మేము విశ్వసించాము దానిని.

وَلَن نُّشْرِكَ
(వలన్ నుష్రిక)
మరియు మేము షిర్క్ చేయము.

بِرَبِّنَا
(బిరబ్బినా)
మా ప్రభువుతో పాటు

أَحَدًا
(అహదన్)
ఏ ఒక్కరిని.

వలన్ నుష్రిక – మేము షిర్క్ చేయము, మేము భాగస్వామి కల్పించము, సహవర్తున్ని నిలబెట్టము.

وَأَنَّهُ تَعَالَىٰ
(వ అన్నహూ త’ఆలా)
త’ఆలా అంటే ఉన్నతమైనది, మహోన్నతమైనది.

جَدُّ
(జద్దు)
ఇక్కడ అల్లాహ్ యొక్క గొప్పతనం, ఔన్నత్యం.

అరబీలో మనం తండ్రి యొక్క తండ్రి, ఆ తాతయ్యను, గ్రాండ్ ఫాదర్ని ఉర్దూలో దాదా అని ఏదైతే అంటారో వారిని కూడా జద్ అనబడుతుంది. ఎందుకంటే ఏ ఫ్యామిలీలో కూడా పెద్దవారు ఎవరైతే ఉంటారో వారికి ఒక పెద్ద గౌరవ స్థానం అనేది కూడా ఉంటుంది, దాని పరంగా జద్ అనబడుతుంది అని అంటారు. ఇక్కడ ఉద్దేశం ఏంటి? మా ప్రభువు ఔన్నత్యం చాలా గొప్పది, ఉన్నతమైనది.

مَا اتَّخَذَ
(మత్తఖద)
చేసుకోలేదు. అంటే అల్లాహు త’ఆలా విషయం చెప్పడం జరుగుతుంది, అల్లాహు త’ఆలా చేసుకోలేదు.

صَاحِبَةً
(సాహిబతన్)
ఎవరిని కూడా భార్యగా. సాహిబతన్ – భార్యగా.

وَلَا وَلَدًا
(వలా వలదా)
కుమారునిగా.

وَأَنَّهُ
(వ అన్నహూ)
మరియు నిశ్చయంగా

كَانَ يَقُولُ سَفِيهُنَا
(కాన యకూలు సఫీహునా)
చెప్పేవారు మాలోని మూర్ఖుడు

సఫీహున్ – సఫీహున్ అంటే మూర్ఖుడు, అవివేకుడు. సఫీహునా – మాలోని మూర్ఖుడు, మాలోని అవివేకుడు.

عَلَى اللَّهِ
(అలల్లాహి)
అల్లాహ్ పై

شَطَطًا
(షతతా)
షతతా అన్నటువంటి ఆ అరబీ పదానికి వాస్తవానికి ఏదైనా ఒక హద్దును దాటడం అని కూడా వస్తుంది. ఆ, ఏదైనా హద్దును దాటడం. అయితే ఇక్కడ భావం ఏంటంటే సత్యానికి విరుద్ధంగా హద్దులు దాటడాన్ని, మీరు రాసుకోండి సత్య విరుద్ధమైన, దారుణమైన.

وَأَنَّا ظَنَنَّا
(వ అన్నా దనన్నా)
మరియు నిశ్చయంగా మేము భావించే వారిమి.

أَن لَّن تَقُولَ
(అన్ లన్ తకూల)
ఈ లన్ అన్నది ఏదైనా విషయం, మాట, పని, లా అని ఏదైతే మనం అంటామో దానికంటే ఎక్కువ ఖచ్చితమైన భావం, నిరాకరణ భావం లన్ అనే పదంలో ఉంటుంది. లన్ తకూలు – ఎన్నటికీ చెప్పరు.

الْإِنسُ وَالْجِنُّ عَلَى اللَّهِ كَذِبًا
(అల్ ఇన్సు వల్ జిన్ అలల్లాహి కదిబా)
అల్ ఇన్సు – మానవులు, వల్ జిన్ – జిన్నాతులు, అలల్లాహి – అల్లాహ్ పై, కదిబా – అబద్ధాలు. అంటే జిన్నాతులను మానవులు ఎన్నటికీ అల్లాహ్ పై ఎలాంటి అబద్ధం చెప్పనే చెప్పరు, ఇలా మేము అనుకునే వారిమి.

وَأَنَّهُ
(వ అన్నహూ)
మరియు నిశ్చయంగా

كَانَ رِجَالٌ
(కాన రిజాలున్)
కాన – ఉండిరి, రిజాలున్ – కొంతమంది.

مِّنَ الْإِنسِ
(మినల్ ఇన్సి)
మానవుల్లో.

يَعُوذُونَ
(య’ఊదూన)
అ’ఊదు అని మనం సూరతుల్ ఫలక్ సూరతున్నాస్ లో చదువుతాము. సర్వసామాన్యంగా ఖుర్ఆన్ ప్రారంభం చేసినప్పుడు అ’ఊదు బిల్లాహి అంటాము. దాని మూలం నుండే వచ్చింది య’ఊదూన. య’ఊదూన అంటే శరణు వేడుకునేవారు.

بِرِجَالٍ مِّنَ الْجِنِّ
(బిరిజాలిమ్ మినల్ జిన్)
జిన్నాతులోని కొంతమందితో.

فَزَادُوهُمْ
(ఫజాదూహుమ్)
జాదూహుమ్ – అధికం చేయుట, అభివృద్ధి, పెంచుట.

رَهَقًا
(రహకా)
రహకా అంటే ఇక్కడ తలబిరుసుతనం వస్తుంది, పొగరు. ఈ రెండు కూడా వస్తాయి, రెండు కూడా రాయండి పర్లేదు.

وَأَنَّهُمْ
(వ అన్నహుమ్)
మరియు వారు

ظَنُّوا
(దన్నూ)
భావించేవారు.

كَمَا ظَنَنتُمْ
(కమా దనన్ తుమ్)
ఎలాగైతే మీరు భావించారో.

أَن لَّن يَبْعَثَ اللَّهُ
(అన్ లన్ యబ్’అసల్లాహు)
أَحَدًا
(అహదా)
అల్లాహ్ – అల్లాహ్, లన్ యబ్’అస్ – తిరిగి బ్రతికించడు, అల్లాహ్ అహదా – ఏ ఒక్కరిని.

యబ్’అస్ అన్నటువంటి ఈ పదంలో రెండు భావాలు వస్తాయి. ఒకటి, పంపడం, ప్రవక్తగా ఎవరినైనా చేసి పంపడం. మరొకటి, చనిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ లేపడం. ఈ రెండు భావాలు ఉంటాయి.

బిస్మిల్లాహ్ అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్.

సూరతుల్ జిన్. ఈ సూరత్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తృప్తిని ఇస్తూ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క గౌరవ మర్యాద, గొప్పతనాన్ని తెలియజేస్తూ. ప్రవక్తకు తృప్తి, శాంతి ఏంటి? ఓ ప్రవక్తా ఈ మానవులు ఎవరైతే చిన్నప్పటి నుండి మిమ్మల్ని మంచిగా చూసుకుంటూ అంటే మిమ్మల్ని మంచిగా గ్రహిస్తూ, మీ యొక్క సద్వర్తనను అర్థం చేసుకుంటూ, మీరు ఎంతో మంచివారు అని తెలిసినప్పటికీ కూడా మీ మాట వినకుండా, మీ బోధనను స్వీకరించకుండా మీరు ఏ ఖుర్ఆన్ తిలావత్ చేసి వినిపిస్తున్నారో దానిని వారు తిరస్కరిస్తూ మీ పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారో దాని గురించి రంది పడకండి. ఈ మానవులు మిమ్మల్ని గ్రహించకుంటే గ్రహించకపోయిరి, కానీ అల్లాహ్ సృష్టిలోని మరొక సృష్టి జిన్నాతులు మిమ్మల్ని విశ్వసించి, మీరు చదివే ఖుర్ఆన్‌ను విని, దాని పట్ల ఎలా ప్రభావితులయ్యారో ఆ పూర్తి సంఘటన మీకు తెలియజేస్తున్నాను, మీరు చూడండి, వినండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తృప్తిని ఇవ్వడం జరుగుతుంది.

మీరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్ర చదివి ఉండేది ఉంటే ఇటు ప్రవక్త వారిపై రెండు సంఘటనలు జరిగి ఉంటాయి కదా. అవిశ్వాసుల దౌర్జన్యాలు ప్రవక్తపై చాలా పెరిగిపోయి ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సుమారు 10, 11 సంవత్సరాల వరకు మక్కా వాసుల మధ్యలో అన్ని విధాలుగా వారికి సత్యాన్ని, ధర్మాన్ని బోధించే ప్రయత్నం చేస్తూ వారు వినడం లేదు, చాలా తక్కువ మంది మాత్రమే ఇస్లాం స్వీకరించారు. ఆ మధ్యలోనే హజ్రత్ అబూ తాలిబ్, హజ్రత్ ఖదీజా రదియల్లాహు త’ఆలా అన్హా వారి యొక్క మరణం తర్వాత మరింత ఎక్కువగా దౌర్జన్య కాండలు పెరిగిపోతాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తాయిఫ్ వెళ్లి అక్కడ వారికి దావత్ ఇస్తారు, కానీ వారు కూడా స్వీకరించకుండా తిరిగి వస్తున్నప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చాలా బాధ పెడతారు, శారీరకంగా చాలా నష్టం చేకూరుస్తారు. ఇలా ఇన్ని రకాల బాధలు ఉన్న సందర్భంలోనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తిరిగి వస్తుండగా నఖ్లా అనే ప్రాంతంలో ఉండగా ఈ సంఘటన సంభవిస్తుంది. ఏంటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఫజర్ నమాజ్‌లో ఖుర్ఆన్ యొక్క తిలావత్ చేస్తూ ఉంటారు, జిన్నాతులు వచ్చి విని వెళ్లి తమ జాతి వారికి ఈ ఖుర్ఆన్ గురించి బోధ చేస్తాయి. అయితే దీనికి సంబంధించిన కొన్ని హదీసుల భావం మనం తెలుసుకుందాము. సహీహ్ ముస్లిం గ్రంథంలోని హదీసులు, ఒకవేళ హదీస్ నెంబర్ మీరు ఇంగ్లీష్, అరబీ పుస్తకాల్లో వెతకాలంటే తెలుసుకోవాలంటే 449 హదీస్ నెంబర్ నుండి ఆ తర్వాత కొన్ని హదీసులు.

సారాంశం ఏమిటంటే నేను ఒక రెండు హదీసుల సారాంశం చెబుతున్నాను. మొదటి హదీస్ హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించారు. హజ్రత్ మ’అన్ బిన్ యజీద్, మస్రూఖ్, తాబియీ హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రదియల్లాహు అన్హు వారి యొక్క శిష్యులు మస్రూఖ్. మస్రూఖ్ని మ’అన్ యొక్క తండ్రి యజీద్ అడుగుతున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఫజర్ నమాజ్‌లో ఖుర్ఆన్ తిలావత్ చేస్తున్నప్పుడు జిన్నాతులు వచ్చి విన్నాయి అన్న సంఘటన ప్రవక్తకు ఎవరు తెలియజేశారు? అయితే మస్రూఖ్ చెప్పారు నేను మీ తండ్రి అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ తో విన్నాను. అక్కడ ఒక చెట్టు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలియజేసింది, కొందరు జిన్నాతులు మీ యొక్క తిలావత్‌ను వింటున్నారు అని. ప్రత్యేకంగా ఈ హదీస్‌ను ఎందుకు ప్రస్తావించాను అంటే అల్హందులిల్లాహ్ వాస్తవానికి మనందరికీ కూడా ఇందులో ప్రత్యేకంగా ఎవరైతే దావా పని చేస్తూ ఉంటారో ఇతరులకు బోధ చేస్తూ ఉంటారో వారు ఎన్ని సమస్యలు ఎదురైనా ఎంత ఇబ్బంది కలిగినా ప్రజల నుండి వారికి ఎలాంటి ఆపద కలిగినా అల్లాహ్ కొరకు ఓపిక సహనాలు వహిస్తూ ఉండేది ఉంటే అల్లాహు త’ఆలా వారికి తృప్తినిచ్చే కొన్ని సందర్భాలు కూడా కనబరుస్తాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎలాంటి స్థితిలో ఉన్నారు అక్కడ జిన్నాతులు వచ్చి వినడం, జిన్నాతులు వచ్చి వింటున్న విషయం ప్రవక్తకు తెలియదు. అల్లాహ్ తర్వాత వహీ ద్వారా తెలిపాడు కరెక్టే కానీ అక్కడ చెట్టు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఈ విషయం తెలియజేసింది. అంటే ఆ చెట్టు కూడా అల్లాహ్ యొక్క అనుమతితోనే ప్రవక్తకు తెలియజేస్తుంది. ఇందులో ప్రవక్త వారి ము’అజిజా (మహిమ) కూడా ఉంది, మరియు కేవలం మానవులే కాదు, అల్లాహు త’ఆలా తన యొక్క దాసునికి సహాయం చేయాలి, అతడు అల్లాహ్ కొరకు ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పుడు అతనికి తృప్తిని ఇవ్వాలి అని అల్లాహ్ కోరినప్పుడు ఏ మార్గం నుండైనా గానీ, చెట్టు నుండి అయినా గానీ ఎలాంటి సహాయం అందిస్తాడు, ఎలాంటి తృప్తిని కలుగజేస్తాడు మనకు ఇందులో బోధపడుతుంది.

మరొక విషయం ఇక్కడ మనం గమనించాల్సింది అది నేను ఇంతకుముందు చెప్పిన 449 హదీస్ నెంబర్‌లో కూడా కనబడుతుంది. అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రదియల్లాహు త’ఆలా అన్హు వింటున్నారు, ఉల్లేఖిస్తున్నారు. మరియు దీని తర్వాత హదీస్ నెంబర్ 450లో ఉంది హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖిస్తున్నారు.

ఆ హదీస్‌ల యొక్క సారాంశం ఏమిటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖుర్ఆన్ తిలావత్ చేస్తున్నప్పుడు జిన్నాతులు వచ్చి ఖుర్ఆన్‌ను శ్రద్ధగా విన్నారు మరియు విన్న తర్వాత వారి యొక్క మాట, వారు ఎలా ప్రభావితమయ్యారో ఖుర్ఆన్ ద్వారా దాన్ని ఎలా చెబుతున్నారో ఇక రండి మనం ఖుర్ఆన్ ఆయతుల ద్వారానే తెలుసుకుందాము.

ఇక్కడ ఈ సందర్భంలో మనం మరొక విషయం తెలుసుకోవడం చాలా లాభదాయకంగా ఉంటుంది. ప్రస్తుతం మీరు చదువుతున్నారు సూరత్ అల్-జిన్. కానీ ఈ జిన్నాతుల యొక్క సంఘటన సూరతుల్ అహ్కాఫ్, సూర నెంబర్ 46, ఆయత్ నెంబర్ 29 నుండి సుమారు చివరి వరకు అక్కడ కూడా అల్లాహు త’ఆలా ఈ విషయాన్ని ప్రస్తావించాడు.

ఇక వినండి ఒక్కసారి మీరు శ్రద్ధగా ఆయతుల యొక్క భావాన్ని, అందులో మనకు ఉన్నటువంటి గుణపాఠాలను. అల్లాహ్ ఇక్కడ చెప్తున్నాడు, కుల్ – చెప్పు. ఊహియ ఇలయ్య – నాకు వహీ చేయడం జరిగినది. ఇక్కడే కొంచెం ఆగి మనం ఒక విషయం తెలుసుకోవాలి. అది ఏమిటంటే మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇల్మె గైబ్ (అగోచర జ్ఞానం) లేదు అన్న విషయం ఇక్కడ ఈ ఆయత్ మరియు ఈ ఆయత్‌లో దీని వ్యాఖ్యానంలో వచ్చిన హదీసుల ద్వారా కూడా తెలుస్తుంది. ఎలా అంటే జిన్నాతులు వచ్చి విన్నారు కానీ ప్రవక్తకు ఆ విషయం తెలియదు. వహీ ద్వారా తెలపడం జరిగినది. అయితే ప్రవక్త ఆలిముల్ గైబ్ కారు, అగోచర జ్ఞానం కలిగిన వారు కారు అన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. సరే.

ఇస్తమ’అ నఫరుమ్ మినల్ జిన్ – జిన్నాతులోని కొంతమంది విన్నారు. ఏం విన్నారు? ఈ ఖుర్ఆన్‌ని విన్నారు. అయితే ఈ ఖుర్ఆన్‌ను కొంతమంది జిన్నాతులు కూడా శ్రద్ధగా వింటున్నప్పుడు ఓ మక్కా యొక్క అవిశ్వాసుల్లారా! ఇప్పుడు ఉన్నటువంటి ఓ ముస్లింలారా! మీరు ఈ ఖుర్ఆన్‌ను ఎందుకు శ్రద్ధగా చదవడం లేదు? ఎందుకు శ్రద్ధగా వినడం లేదు? ఎందుకు శ్రద్ధగా అర్థం చేసుకోవడం లేదు? మీరు అష్రఫుల్ మఖ్లూకాత్, సర్వ సృష్టిలో అత్యున్నత, అత్యుత్తమ సృష్టి మీరు. మీరు ఈ ఖుర్ఆన్‌ను మంచిగా అర్థం చేసుకోవడం, వినడం మీపై ఎక్కువ బాధ్యత ఉన్నది. ఈ బోధ మనందరికీ ఉంది, ఖుర్ఆన్ వినని వారి కొరకు ప్రత్యేకంగా ఉంది. ఎందుకంటే జిన్నాతుల కంటే కూడా ఎక్కువ ఘనత గల వారు మానవులు మరియు మానవుల కొరకే ప్రత్యేకంగా ఆ తర్వాత జిన్నాతుల కొరకు కూడా ఈ ఖుర్ఆన్ అవతరింప చేయడం జరిగినది. అలాంటి ఈ ఖుర్ఆన్‌ను మానవులు వినకుంటే ఇది చాలా శోచనీయం, బాధాకరమైన విషయం.

ఆ జిన్నాతులు విన్నారు ఆ తర్వాత ఏమన్నారు?

إِنَّا سَمِعْنَا قُرْآنًا عَجَبًا
(ఇన్నా సమి’అనా ఖుర్ఆనన్ అజబా)
మేమొక అద్భుతమైన ఖుర్ఆన్ ను విన్నాము. (72:1)

అల్లాహు అక్బర్. కానీ ఒక్కసారి తిరిగి రండి వెనక్కి మళ్ళీ మీరు. సూరతుల్ అహ్కాఫ్‌లో చూడండి ఆయత్ నెంబర్ 29లో యస్తమి’ఊనల్ ఖుర్ఆన్. ఆ జిన్నాతులు ఖుర్ఆన్‌ను శ్రద్ధగా వింటూ,

فَلَمَّا حَضَرُوهُ قَالُوا أَنصِتُوا
(ఫలమ్మా హదరూహు కాలూ అన్సితూ)
ప్రవక్త వద్దకు హాజరై శ్రద్ధగా వింటూ, ఖుర్ఆన్ వింటున్నప్పుడు పరస్పరం ఒకరికి ఒకరు మీరు మౌనం వహించండి, ఖుర్ఆన్‌ను ఇంకా శ్రద్ధగా వినండి అని ఒకరికి ఒకరు చెప్పుకున్నారు. (46:29 నుండి)

అల్లాహు అక్బర్. ఇక్కడ కూడా వచ్చింది ఇస్తమఅ నఫరుమ్ మినల్ జిన్ అని. కానీ అక్కడ సూరత్ అహ్కాఫ్ లో అన్సితు మీరు మౌనం వహించండి. మరియు సూరత్ ఆలే సూరతుల్ ఆరాఫ్ యొక్క చివర్లో మీరు చూస్తే వఇదా కురిఅల్ ఖుర్ఆను ఫస్తమిఊ లహు వ అన్సితు. ఫస్తమిఊ లహు వ అన్సితు. శ్రద్ధగా వినడం. అంటే మనసు పెట్టడం, మనసు దానికి లగ్నం చేయడం, వ అన్సితు ఎలాంటి వేరే డిస్టర్బెన్స్ లేకుండా వినడానికి ప్రయత్నం చేయడం, మౌనం వహించడం. ఈ విధంగా కూడా వారు పరస్పరం ఒకరికి ఒకరు చెప్పుకున్నారు.

అయితే ఇక్కడ ఏముంది మళ్ళీ ఫలమ్మా కుదియ సూరతుల్ అహ్కాఫ్ లో ఎప్పుడైతే ఖురాన్ తిలావత్ పూర్తి అయిపోయిందో వల్లౌ ఇలా కౌమిహిమ్ ఆ విన్న జిన్నాతులు తమ జాతి వారి వైపునకు వెళ్ళిపోయారు ముందిరీన్ వారిని హెచ్చరిస్తూ.

అల్లాహు అక్బర్. చూశారా? ఒక సత్యం తెలిసింది అంటే దాన్ని ఇతరులకు తెలపడం, షిర్క్ యొక్క చెడుతనం తెలిసింది అంటే దాని గురించి హెచ్చరించడం మన బాధ్యత అని వారు వెంటనే తిరిగిపోయారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద ఆగి ప్రవక్తను కలుసుకోలేదు. వెంటనే వెళ్లి జాతి వారు ఏ చెడులో ఉన్నారో, ఏ షిర్క్ చేస్తున్నారో వారిని ఆ షిర్క్ నుండి కాపాడటానికి వెళ్ళిపోయారు.

ఇక్కడ ధర్మవేత్తలు ఏం చెప్తున్నారంటే జిన్నాతులు అల్లాహ్ యొక్క సృష్టి వారు మనకు కనబడకపోయినప్పటికీ వారిలో స్త్రీలు, పురుషులు అందరూ ఉన్నారు, వారికి కూడా సంతానం కలుగుతుంది, వారిలో కూడా పెళ్లిళ్లు ఉన్నాయి మరియు మానవుల్లో ఎలాగైతే వర్గాలు ఉన్నాయో ధర్మపరంగా ఇంకా వేరే రీతిలో జిన్నుల్లో కూడా యూదులు, క్రైస్తవులు, ఇంకా వేరే రకమైన షిర్క్ చేసే వారు, మంచి వారు, పాపం చేసే వారు ఈ విధంగా రకరకాలుగా ఉన్నారు.

ఎందుకంటే సూరతుల్ అహ్కాఫ్ లోని ఆయత్ నంబర్ 30 ద్వారా చెబుతున్నారు కొందరు ధర్మవేత్తలు. ఏముంది అక్కడ? వారు వెళ్లి తమ జాతి వారికి చెప్పారు యా కౌమనా ఓ ప్రజలారా ఇన్నా సమీఅనా కితాబన్ నిశ్చయంగా మేము ఒక గ్రంథం గురించి విన్నాము ఉంజిల మింబ అది మూసా అది మూసా తర్వాత అవతరింప చేయబడినది. ముసద్దికం లిమాబైన యదైహ్ అంటే ఈ ఖురాన్ కు ముందు అవతరించిన గ్రంథాలను ధృవీకరిస్తుంది. యహదీ ఇలల్ హక్ సత్యం వైపునకు మార్గదర్శకత్వం చేస్తుంది. వఇలా తరీకిమ్ ముస్తకీమ్ మరియు సన్మార్గం వైపునకు. చూశారా వారు సత్యాన్ని విన్న వెంటనే వెళ్లి తమ జాతి వారికి తెలుపుతూ ఇది మూసా తర్వాత అవతరించినటువంటి గ్రంథం అని ఈ ఆయత్ ద్వారా చెప్తున్నారు ధర్మవేత్తలు వారు యూదులుగా ఉండినారు. ఆ జిన్నాతులు ఎవరైతే విన్నారో. ఎందుకంటే యూదులు ఈసా అలైహిస్సలాం ను విశ్వసించరు గనక ఈసా అలైహిస్సలాం ప్రస్తావన ఇక్కడ రాలేదు అంటారు.

మనకు ఇందులో బోధన ఏంటి? ఆ జిన్నాతుల కంటే మేలు, మంచివారము మనం. మనం ఈ ఖుర్ఆన్ పట్ల వారి కంటే ఎక్కువ శ్రద్ధ చూపాలి.

సూరతుల్ జిన్‌లో అజబన్ అని ఏదైతే చూస్తున్నారో దాని యొక్క భావం ఏంటి? అజబన్ అంటే చాలా అద్భుతమైనది. ఏ రకంగా అద్భుతమైనది? ఖుర్ఆన్ దాని యొక్క అరబీ శైలి, అరబీ సాహిత్య ప్రకారంగా చాలా అద్భుతమైనది. మరియు అందులో ఉన్నటువంటి బోధనల ప్రకారంగా చూసుకుంటే కూడా చాలా అద్భుతమైనది. అలాగే ఈ ఖుర్ఆన్ ఇతరులపై ఏ ప్రభావం చూపిస్తుందో దాని ప్రకారంగా కూడా ఇది చాలా అద్భుతమైనది. ఇది చాలా అద్భుతమైన గ్రంథం.

يَهْدِي إِلَى الرُّشْدِ
(యహదీ ఇలర్ రుష్ద్)
మార్గదర్శకత్వం చేస్తుంది రుష్ద్ – సరియైన మార్గం, సన్మార్గం వైపునకు.

فَآمَنَّا بِهِ
(ఫ ఆమన్నా బిహీ)
మేము దానిని విశ్వసించాము. (72:2)

అంటే ఖుర్ఆన్ గ్రంథాన్ని విశ్వసించాము. ఇక్కడ చూడండి ఇక ఎంత తొందరగా వారు విశ్వాస మార్గాన్ని అవలంబించారు. సత్యాన్ని విన్నారు అంటే ఏ ఆలస్యం వారు చేయలేదు. అయితే ఇక్కడ ఏంటి ప్రత్యేకంగా మక్కా అవిశ్వాసులకు ఇందులో ఒక రకమైన కొరడాలు ఉన్నాయి. ఖుర్ఆన్ ప్రవక్త వారు తిలావత్ చేస్తూ ఉంటే వారు పరస్పరం ఏమనుకుంటారు? లా తస్మ’ఊ లిహాదల్ ఖుర్ఆన్. సూరత్ హామీమ్ సజ్దాలో ఉంది చూడండి. మీరు ఖుర్ఆన్‌ను వినకండి, వల్గౌ ఫీహి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖుర్ఆన్ తిలావత్ చేస్తుంటే మీరు అల్లరి చేయండి అని వారు ఒకరికొకరు చెప్పుకుంటారు. కానీ ఇక్కడ జిన్నాతులు చూడండి అన్సితూ శ్రద్ధగా వినండి, మౌనం వహించండి అని ఒకరికి ఒకరు చెప్పుకుంటున్నారు. మరియు ఈ జిన్నాతులు విన్న వెంటనే విశ్వసించారు. మరియు ఈ మానవులు సంవత్సరాల తరబడి ఖుర్ఆన్‌ను వింటూనే ఉన్నారు, వింటూనే ఉన్నారు కానీ అది వారి యొక్క మదిలో దిగడం లేదు, దాన్ని వారు ఇంకా విశ్వసించడం లేదు.

ఆ తర్వాత ఉంది,

وَلَن نُّشْرِكَ بِرَبِّنَا أَحَدًا
(వలన్ నుష్రిక బిరబ్బినా అహదా)
మరియు మేము మా ప్రభువుకు ఎవ్వరినీ కూడా భాగస్వామిగా, సాటిగా కల్పించము. (72:2)

షిర్క్ యొక్క ఖండన ఇందులో చాలా స్పష్టంగా ఉంది. వారికి కూడా అర్థమైపోయింది షిర్క్ ఎంత చెడ్డ పని అని. అందుకొరకే ఇక మేము ఎన్నటికీ అల్లాహ్‌తో పాటు ఎవరినీ సాటిగా కల్పించము, ఎవరినీ కూడా భాగస్వామిగా చేయము. మరియు అల్లాహు త’ఆలాకు ఎలాంటి భార్య గానీ, సంతానం గానీ లేదు, అలాంటి అవసరం అల్లాహ్‌కు ఏ మాత్రం లేదు అని దాని తర్వాత ఆయతులో చెప్పడం జరుగుతుంది. అందుకొరకే ఉంది,

وَأَنَّهُ تَعَالَىٰ جَدُّ رَبِّنَا
(వ అన్నహూ త’ఆలా జద్దు రబ్బినా)
మరియు నిశ్చయంగా మా ప్రభువు వైభవం ఎంతో ఉన్నతమైనది. మా ప్రభువు చాలా గొప్పవాడు.

مَا اتَّخَذَ صَاحِبَةً وَلَا وَلَدًا
(మత్తఖద సాహిబతన్ వలా వలదా)
ఆయన ఎవరినీ కూడా భార్యగా మరియు కుమారునిగా చేసుకోలేదు. (72:3)

ఈ విషయం మనందరికీ కూడా చాలా స్పష్టమైనది. ముష్రికులు దైవదూతలను అల్లాహ్ యొక్క కుమార్తెలు అనేవారు. క్రైస్తవులు ఈసా అలైహిస్సలాంను అల్లాహ్ కుమారుడుగా, యూదులు ఉజైర్ అలైహిస్సలాంని అల్లాహ్ కుమారుడుగా అంటున్నారు. కానీ వాస్తవానికి ఎవరూ కూడా అల్లాహ్ యొక్క భార్య కారు, అల్లాహ్ యొక్క సంతానం కారు.

వాస్తవానికి అల్లాహ్‌కు భాగస్వామి ఎవరూ లేరు, అల్లాహ్‌తో పాటు ఎవరిని షిర్క్ చేయకూడదు మరియు అల్లాహ్‌కు సంతానం, భార్య ఉంది అని నమ్మకూడదు, ఇవన్నీ కూడా తప్పు మాట. కానీ మాలోని కొందరు అవివేకులు, మాలోని కొందరు మూర్ఖులు ఇలాంటి దారుణమైన మాటలు, సత్యానికి విరుద్ధమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఈ ఆయత్ ద్వారా చాలా స్పష్టంగా తెలిసిపోతుంది అల్లాహ్‌కు సంతానం ఉంది అని నమ్మడం, అల్లాహ్‌కు భార్య ఉంది అని నమ్మడం, అల్లాహ్‌కు భాగస్వాములు ఉన్నారు అని నమ్మడం, లేదా అలా నమ్మకపోయినా అల్లాహ్‌కు సంతానం ఉంది, భార్య ఉంది మరియు అల్లాహ్‌కు భాగస్వాములు ఉన్నారు అని నమ్మే వారికి శుభాకాంక్షలు తెలియజేయడం, అలా నమ్మే వారికి ఏదైనా తోడ్పాటు ఇవ్వడం, వారు అలాంటి తప్పుడు విశ్వాసాలతో, షిర్క్ యొక్క నమ్మకాలతో ఏమైనా పండుగలు చేసుకుంటే అందులో వారికి తోడుగా ఉండి వాటిలో పాల్గొనడం, ఇవన్నీ కూడా వాస్తవానికి మూర్ఖత్వం, అవివేకం. ఇవన్నీ కూడా సత్యానికి విరుద్ధమైన మాటలు. 25 డిసెంబర్ క్రిస్మస్ నుండి మొదలుకొని ఫస్ట్ జనవరి వరకు ఏదైతే ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏ రకమైన తప్పుడు పనుల్లో పడి ఉంటారో ఈ ఆయతుల ద్వారా కూడా మనం ఖండించవచ్చు వారికి దీని యొక్క సత్యం తెలియజేయవచ్చును.

ఆయత్ నెంబర్ ఐదును గమనించండి మీరు, చూడండి ఇక్కడ ఆ జిన్నాతులు ఒక సత్యం తెలిసిన తర్వాత వారు తమకు తాము సత్యాన్ని అవలంబించి అంతకు ముందు జ్ఞానం లేక ముందు ఏ తప్పు జరిగిందో దాని గురించి అల్లాహ్ ముందు ఎలా ఒక సాకు తెలుపుకుంటున్నారో, తమ నుండి జరిగిన తప్పును ఒప్పుకుంటూ దానిపై పశ్చాత్తాప పడుతున్నారో ఆ విషయం ఇక్కడ చెప్పడం జరిగినది. ఏంటది? మేము ఇంతకు ముందు అనుకునేవాళ్ళము మానవులు, జిన్నాతులు అల్లాహ్ పై ఎలాంటి అబద్ధం, అసత్యం చెప్పరు అని. కానీ ఇప్పుడు ఈ ఖుర్ఆన్ విన్న తర్వాత మాకు తెలిసింది, ఎంతో మంది ప్రజలు అల్లాహ్‌కు సంతానం కలుగజేస్తున్నారు. ఎంతో మంది జిన్నాతులు కూడా అల్లాహ్‌కు సంతానం ఉంది అన్నట్లుగా, అల్లాహ్‌తో పాటు ఇతరులను భాగస్వాములుగా చేసి షిర్క్ చేస్తున్నారు, ఇవన్నీ తప్పులు వారు చేస్తున్నారు, వాస్తవానికి వారు అది చేస్తున్నది తప్పు అని మాకు కూడా తెలియలేదు, మేము కూడా అజ్ఞానంలో ఉండి, అంధకారంలో ఉండి ఒక తప్పుడు విషయాన్ని విశ్వసిస్తూ వచ్చాము.

అనేక తఫ్సీర్ గ్రంథాల్లో, అరబీ తఫ్సీర్ గ్రంథాల్లో ఈ విషయం చాలా స్పష్టంగా వచ్చి ఉంది. వారి యొక్క నాయకుడైన ఇబ్లీస్ అతడు కేవలం మానవులనే కాదు, ఎంతో మంది జిన్నాతులను కూడా మోసంలో పడవేసి ఉండినాడు. ఎన్నో రకాల కుఫ్రులో వారిని పడవేసి ఉండినాడు వాడు. అందుకొరకే సామాన్య జిన్నులు వారితో ఏ పొరపాటు జరిగిందో మా పెద్దలు మా వారు ఎప్పుడూ కూడా అల్లాహ్ పై ఏదైనా అబద్ధం చెప్పే అటువంటి ధైర్యం చేస్తారు అని మేము అనుకోలేదు. వారు చెప్పే మాటలు సత్యమే అని వారిని మేము గుడ్డిగా అనుసరించాము. కానీ ఇప్పుడు తెలిసింది మాకు వారు కూడా షిర్క్ చేస్తున్నారు మరియు వారు కూడా అల్లాహ్‌కు సంతానం కలుగజేస్తున్నారు. అలాంటి విషయాలన్నిటికీ కూడా మేము దూరంగా ఉంటాము అన్నట్లుగా చాలా స్పష్టంగా వారు తెలియజేశారు.

ఆయత్ నెంబర్ ఆరులో ఉంది. దీనిని కొంచెం శ్రద్ధ వహించాలి. తౌహీద్‌కు సంబంధించిన ఒక చాలా ముఖ్యమైన మాట ఇక్కడ తెలపడం జరుగుతుంది. ఈ ఆయత్ నెంబర్ ఆరును మనం అర్థం చేసుకుంటే ఈ రోజుల్లో షైతానుల పట్ల, జిన్నాతుల పట్ల ఏదైతే భయం ఉంటుందో చాలా మందికి అది కూడా ఇన్ షా అల్లాహ్ దూరం కావచ్చు. ముందు ఒకసారి అనువాదాన్ని గ్రహించండి.

وَأَنَّهُ كَانَ رِجَالٌ مِّنَ الْإِنسِ يَعُوذُونَ بِرِجَالٍ مِّنَ الْجِنِّ فَزَادُوهُمْ رَهَقًا
(వ అన్నహూ కాన రిజాలుమ్ మినల్ ఇన్సి య’ఊదూన బిరిజాలిమ్ మినల్ జిన్ని ఫజాదూహుమ్ రహకా)

కాన రిజాలుమ్ మినల్ ఇన్సి – మానవుల్లోని కొందరు పురుషులు, మానవుల్లోని కొంతమంది య’ఊదూన – శరణు కోరేవారు, శరణు వేడుకునేవారు. ఎవరితోని? బిరిజాలిమ్ మినల్ జిన్ – జిన్నాతులోని కొందరి పురుషులతో, జిన్నాతులోని కొంతమందితో. ఏంటి ఈ సంఘటన ఇది? దేని గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది?

ధర్మవేత్తలు అంటారు, చాలా కాలం ముందు జిన్నాతులు మనుషులతో భయపడేవారు. కానీ ఈ మనుషులు ప్రయాణాలు చేస్తూ ప్రయాణ దారిలో ఎక్కడైనా వారికి రాత్రి అయింది అంటే ఎక్కడ వారు రాత్రి ఆగిపోయేవారో, రాత్రి పడుకొని ఇక మళ్ళీ పొద్దున్న మనం ప్రయాణం కొనసాగిద్దాము అని ఏదైనా ఒక చోట ఆగిన తర్వాత వారి యొక్క అల్లాహ్ పై నమ్మకం, విశ్వాసం ఎంత బలహీనమైపోయిందంటే అప్పటివరకు, ఆ రాత్రి ఏదైనా చోట ఆగిన వెంటనే ఈ ప్రాంతంలో ఏ జిన్నాతులైతే ఉన్నారో ఆ జిన్నాతులు, ఆ జిన్నాతుల నాయకుల యొక్క మేము శరణు కోరుతున్నాము, మేము రాత్రి ఇక్కడ ఆగుతున్నాము, బస చేస్తున్నాము, మాకు మీరు ఎలాంటి బాధ, హాని కలిగించవద్దు, మాకు ఎలాంటి నష్టం చేకూర్చవద్దు. ఈ విధంగా కేకలు వేసి జిన్నాతుల యొక్క సహాయం, జిన్నాతుల యొక్క శరణు కోరుతూ జిన్నాతులతో భయపడుతూ ఏమీ మీరు మాకు నష్టం చేకూర్చవద్దని విన్నవించుకోవడం, అర్ధించడం, ప్రాధేయపడటం ఇలా చేసేవారు. వేడుకునేవారు.

ఫజాదూహుమ్ రహకా – మానవులు ఇలా చేయడం ద్వారా ఈ విధంగా ఈ మానవులు వారి, హుమ్ – వారి అంటే జిన్నాతుల తలబిరుసుతనం మరింత అధికం చేశారు. అరే మానవులు కూడా మాతో భయపడుతున్నారు అంటే మమ్మల్ని ఇంత పెద్దగా వారు అనుకుంటున్నారు, భావిస్తున్నారు అని మానవులపై తమ యొక్క ఆధిపత్యం, తమ యొక్క పెత్తనం చలాయించడంలో, నడిపించడంలో, మానవులను భయపెట్టడంలో మరింత అధికమైపోయి తమకు తాము ఒక రకమైన గర్వంలో వచ్చేసారు.

ఈ ఫజాదూహుమ్ రహకా అని ఇప్పుడు మీరు చూస్తున్న ప్రకారంగా అనువాదంలో మానవులు, హుమ్ అంటే జిన్నాతులు. కానీ దీనికి విరుద్ధంగా కూడా అనువాదం చేయడం జరిగింది. అంటే ఏమిటి? ఈ మానవుల్లోని కొంతమంది జిన్నాతుల శరణు వేడుకోవడం ద్వారా ఆ జిన్నాతులు మానవుల యొక్క తలబిరుసుతనం, మానవులను సత్యం నుండి దూరం చేయడాన్ని మరింత పెంచేశాయి. అని ఎప్పుడైతే వారు అంటే మానవులు జిన్నాతులను వేడుకోవడం మొదలు పెట్టారో ఆ జిన్నాతులు దీనిని ఆసరగా తీసుకొని ఈ మానవుల్ని మరింత అల్లాహ్ కు దూరం చేయడం, మరింత సత్యం నుండి దూరం చేయడం, మరింత సత్యాన్ని తిరస్కరించడంలో బలంగా ఉండటం, ఇలాంటి తప్పుడు విషయం అన్నది పెంచేశాయి. అందుకొరకే ఈ రెండు భావాలు కూడా కరెక్టే. చెప్పే ఉద్దేశం ఏమిటి? ఎప్పుడూ కూడా మనం అల్లాహ్ వైపు నుండి వచ్చిన సత్యం ఏమిటో దాన్ని గ్రహించామంటే ఎలాంటి ఇబ్బందిలో ఉండము.

ఇక్కడ మరో విషయం తెలుస్తుంది మనకు, అల్లాహ్ ను ఏదైనా ఆపదలో, కష్టంలో, భయంలో మనం శరణు వేడుకోవడం అల్లాహ్ యొక్క ఆరాధన రకాల్లో చాలా గొప్ప రకం. ఇలా అల్లాహ్ యొక్క ఆరాధన రకాల్లో ఈ గొప్ప రకాన్ని అల్లాహ్ తప్ప వేరే ఎవరికైనా మనం అంకితం చేసామంటే ఘోరమైన షిర్క్ చేసిన వాళ్ళం అవుతాము. అందుకొరకే మనం ఏమంటాము? అ’ఊదు బిల్లాహి మినష్షైతానిర్రజీమ్. కుల్ అ’ఊదు బిరబ్బిల్ ఫలక్. కుల్ అ’ఊదు బిరబ్బిన్నాస్. ఈ సూరాలన్నిటిలో కూడా మనకు ఈ ఇస్తి’ఆదా, శరణు కోరడం ఇది అల్లాహ్ యొక్క ఇబాదత్ రకాల్లో ఒక ముఖ్యమైనది, ఇందులో మనం అల్లాహ్ కు ఎవరిని కూడా సాటి కల్పించకూడదు అన్నటువంటి భావం స్పష్టంగా ఉంది.

మరొక విషయం ఇందులో మనం గ్రహించాల్సింది, ఎంత షైతానులకు, జిన్నాతులకు ప్రజలు భయపడతారో అంతే అల్లాహ్ నుండి ఇంకా దూరమైపోతారు. ఇంకా షైతానులు వారిని మరింత ఆసరగా తీసుకొని బెదిరిస్తూనే ఉంటారు. అలా కాకుండా అల్లాహ్ ను మొరపెట్టుకొని ఏ భయం కలిగినా అల్లాహ్ శరణు తీసుకొని అల్లాహ్ పై విశ్వాసం బలంగా ఉంచుకుంటే మనకు షైతానుల నుండి ఏ హాని కలగదు, ఎలాంటి నష్టం అనేది జరగదు. అందుకొరకే చూడండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు నేర్పిన దుఆలలో కూడా ఎన్నో సందర్భాల్లో ఏ ఏ మనకు బాధలు, రంది, చింత, బెంగ ఇంకా ఏదైనా ఆపద, కష్టం వాటన్నిటి నుండి కేవలం అల్లాహ్ యొక్క శరణ మాత్రమే మనం కోరుతూ ఉండాలి అని నేర్పడం జరిగినది. ఉదయం సాయంకాలం చదివే దుఆలలో కూడా ఈ విషయాలు మనకు కనబడతాయి. అల్లాహుమ్మ ఇన్నీ అ’ఊదు బిక మిన్ షర్రి నఫ్సీ వ షర్రిష్షైతాని వ షిర్కిహీ. అల్లాహ్ యొక్క శరణ కోరడం జరుగుతుంది. అల్లాహుమ్మ ఇన్నీ అ’ఊదు బిక మినల్ కుఫ్రి వల్ ఫఖ్రి వ అ’ఊదు బిక మిన్ అదాబిల్ ఖబ్ర్. ఈ విధంగా అల్లాహ్ యొక్క శరణ కోరడం జరుగుతుంది. అల్లాహ్ యొక్క శరణ కోరడం ఇది అసలైన విషయం. ఎంతవరకు మానవులు షైతానులతో భయపడతారో ఆ షైతానులు మరింత మానవుల్ని హిదాయత్ నుండి దూరమే చేస్తారు.

ఆ తర్వాత ఆయతును గనక మనం గమనిస్తే,

وَأَنَّهُمْ ظَنُّوا كَمَا ظَنَنتُمْ أَن لَّن يَبْعَثَ اللَّهُ أَحَدًا
(వ అన్నహుమ్ దన్నూ కమా దనన్ తుమ్ అన్ లన్ యబ్’అసల్లాహు అహదా)
“అల్లాహ్ ఎవరినీ పంపడని (లేక ఎవరినీ తిరిగి బ్రతికించడని) మీరు తలపోసినట్లుగానే మనుషులు కూడా తలపోశారు.” (72:7)

ఆ ఖుర్ఆన్ విన్నటువంటి జిన్నాతులు వెళ్లి వారి జాతి వారికి తెలియజేస్తున్నారు కదా? అయితే ఏమంటున్నారు? మీరు ఎలాగైతే అల్లాహ్ ఏ ప్రవక్తను పంపడు, చనిపోయిన వారిని తిరిగి లేపడు అని మీరు అనుకునేవారో మానవుల్లో కూడా ఎంతో మంది ఇలాంటి తప్పుడు విశ్వాసంలోనే ఉన్నారు.

ఒకటి నుండి ఏడు వరకు ఈ ఆయతులను గనక మీరు గమనిస్తే చాలా స్పష్టంగా మీకు తౌహీద్, రిసాలత్, ఆఖిరత్ మూడు గురించి తెలుస్తుంది. అందుకొరకే అల్లాహ్ యొక్క గ్రంథం ఖుర్ఆన్‌ను చాలా శ్రద్ధగా చదువుతూ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మనకు ఇందులో అనేక బోధనలు కలుగుతాయి. జిన్నాతుల లాంటి వారు, మనకంటే తక్కువ స్థానంలో ఉన్నవారు అర్థం చేసుకొని తమ జాతి వారికి హెచ్చరించగలిగితే మనం అంతకంటే ఎక్కువ విలువ గలవాళ్ళము, ఘనత గలవాళ్ళము. తప్పకుండా మనం అల్లాహ్ యొక్క దయతో ఈ ఖుర్ఆన్‌ను అర్థం చేసుకున్నామంటే మన జాతి వారికి కూడా మంచి రీతిలో మనం బోధ చేయగలుగుతాము.

ఇక ఈ అన్ లన్ యబ్’అసల్లాహు అహదా, బ’అస్ కొన్ని సందర్భాల్లో ఆ ఎవరినైనా ప్రవక్తగా చేసి పంపడం అనే విషయంలో అలాగే ఇంకా చనిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ లేపడం అనే విషయాల్లో ఖుర్ఆన్‌లో అనేక సందర్భంలో ఉపయోగించడం జరిగింది.

ఉదాహరణకు స్టార్టింగ్‌లో సూరె బఖరాలోనే చూస్తే ఆయత్ నెంబర్ 56లో కనబడుతుంది మనకు, సుమ్మ బ’అస్నాకుమ్ మిమ్ బా’అది మౌతికుమ్. మీరు చనిపోయిన తర్వాత మిమ్మల్ని మేము మళ్ళీ తిరిగి బ్రతికించాము. అదే ఒకవేళ ఆయత్ నెంబర్ 129 చూస్తే ఇబ్రాహీం అలైహిస్సలాం దుఆ చేస్తున్నారు, రబ్బనా వబ్’అస్ ఫీహిమ్ రసూలా. ఓ అల్లాహ్ ఒక ప్రవక్తను వారిలో ప్రభవింపజేయి అని దుఆ చేశారు హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం. అంటే ఇక్కడ చెప్పే ఉద్దేశం ఏంటి? ఈ పదం ఏదైతే ఉందో బ’అస్ రెండు భావాల్లో వస్తుంది. రెండు భావాల్లో. దానికి ఒక ఉదాహరణ మీకు సూరతుల్ బఖరా ఆయత్ నెంబర్ 56 ద్వారా, మరొక ఉదాహరణ సూరతుల్ బఖరా ఆయత్ నెంబర్ 129 ద్వారా తెలపడం జరిగినది. ఇంకా దీనికి మీరు ఆధారాలు చూసుకోవాలనుకుంటే చాలా ఉన్నాయి.

ఉదాహరణకు నేను ఇది తెలుగు ఖుర్ఆన్, https://teluguislam.net/ab. వల్లాహి వల్లాహి అల్లాహు త’ఆలా జజాఏ ఖైర్ ఇవ్వుగాక మన అబ్దుర్రహ్మాన్ భాయ్ గారికి, ఎంత శ్రమ పడ్డారు వారు, వారి యొక్క ఫ్యామిలీ వారు ఈ ఒకే పేజీలో మొత్తం ఖుర్ఆన్ అరబీ టెక్స్ట్, తెలుగు అనువాదం యొక్క టెక్స్ట్ తీసుకురావడంలో. దీని ద్వారా చాలా చాలా లాభం కలుగుతుంది. మీరు ఎంత గ్రహించారో తెలియదు కానీ నేనైతే చాలా దీని ద్వారా లాభం పొందుతూ ఉంటాను. ఉదాహరణకు ఇక్కడే మీరు చూడండి, ఇక్కడ మీరు చూస్తున్నారు చాలా స్పష్టంగా, కేవలం బ’అస్ అన్న పదం నేను రాశాను. బా, ఐన్, సా. మొత్తం 59 రిజల్ట్ ఇక్కడ వచ్చాయి. చూస్తున్నారు కదా మీరు కూడా. ఇప్పుడు ఆయత్ నెంబర్, సూర బఖరా సూర నెంబర్ 2, ఆయత్ నెంబర్ 56. ఇందులో ఏ భావం ఉంది? చనిపోయిన తర్వాత తిరిగి లేపడం భావం ఉంది. ఆ తర్వాత మళ్ళీ మీరు చూడండి సూరతుల్ బఖరా ఆయత్ నెంబర్ 129 లో కనబడుతుంది, రబ్బనా వబ్’అస్ ఫీహిమ్ రసూలా. ఇందులో ప్రవక్తను పంపడం అనే భావంలో ఉంది. ఆ తర్వాత మూడో రిజల్ట్ చూస్తే ఇక్కడ కూడా ఫబ’అసల్లాహున్నబియ్యీన, ప్రవక్తలను పంపడం అన్న భావంలో వచ్చి ఉంది. ఆ, ఇక్కడ ఒక రాజును మా కొరకు పంపు అని ఇందులో కూడా. మరి ఇక్కడ చూస్తే 259వ ఆయత్ నెంబర్‌లో, ఫ అమాతహుల్లాహు మి’అత ఆమిన్ సుమ్మ బ’అసహ్. అల్లాహు త’ఆలా 100 సంవత్సరాల వరకు అతన్ని చంపి ఉంచాడు, ఆ తర్వాత మళ్ళీ తిరిగి లేపాడు. నువ్వు నూరేళ్ళు ఈ స్థితిలో పడి ఉన్నావు. కాస్త నీ అన్న పానీయాల వైపు చూడు. ఈ విధంగా మనం ఏదైనా ఒక పదం గురించి వెతకడం, దాని రిజల్ట్ పొందడం గురించి ఇది చాలా చాలా ఉత్తమ వెబ్సైట్. దీనిని మీరు మీ యొక్క ఫేవరెట్ చేసి పెట్టుకోండి. ఎలాగైతే నేను ఇక్కడ ఫేవరెట్ చేసి పెట్టుకున్నాను, స్టార్ గుర్తుని, ఇది. ఈ విధంగా చేసి పెట్టుకుంటే మీకు వెతకడంలో చాలా సులభం అవుతుంది.

అయితే మన టాపిక్ ఏంటి?

أَن لَّن يَبْعَثَ اللَّهُ أَحَدًا
(అన్ లన్ యబ్’అసల్లాహు అహదా)
ఆ జిన్నాతులు అంటున్నారు మేము కూడా మరియు మానవులు కూడా అల్లాహ్ ఏ ప్రవక్తను పంపడు, అల్లాహ్ ఎవరిని కూడా చనిపోయిన తర్వాత తిరిగి లేపడు అని అనుకునే వాళ్ళము, కానీ అలా కాదు, తప్పకుండా అల్లాహు త’ఆలా తిరిగి లేపుతాడు అన్నటువంటి స్పష్టమైన విషయం ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ రోజు ఈ ఆయతులు చదివాము మనము. ఇంకా అల్లాహ్ యొక్క దయతో ఇన్ షా అల్లాహ్ తర్వాత పాఠంలో మిగతా ఆయతులు చదివే ప్రయత్నం చేద్దాము. ఇక్కడి వరకే సెలవు తీసుకుంటున్నాను. జజాకుముల్లాహు ఖైరా, బారకల్లాహు ఫీకుమ్, అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహ్.



ఖురాన్ తఫ్సీర్ – సూరా అల్ జిన్న్ – పార్ట్ 2 (అయతులు 8 -13)
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/r_5kw6e_trk [49 నిముషాలు]

ఈ ప్రవచనంలో సూరహ్ అల్-జిన్ (72వ సూరా) యొక్క 8 నుండి 13వ ఆయతులపై దృష్టి సారించారు. 8 నుండి 13వ ఆయతుల యొక్క పదపదానికీ అనువాదం మరియు వివరణ ఇవ్వబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రాకకు ముందు, జిన్నాతులు ఆకాశంలోని వార్తలను దొంగతనంగా వినేవారని, కానీ ప్రవక్త ఆగమనం తర్వాత ఆకాశం కఠినమైన కావలి వారితో, ఉల్కలతో నింపబడిందని వివరించారు. ఈ మార్పుకు కారణం ఖుర్ఆన్ అవతరణ అని గ్రహించిన జిన్నాతులు, దానిని విని విశ్వసించారు. అల్లాహ్ యొక్క శక్తి నుండి తాము ఎప్పటికీ తప్పించుకోలేమని, ఆయనను ఓడించలేమని వారు దృఢంగా నమ్మారు. కీడు జరిగినప్పుడు దానిని నేరుగా అల్లాహ్ కు ఆపాదించకుండా, ‘కీడు ఉద్దేశించబడింది’ అని చెప్పడం ద్వారా జిన్నాతులు చూపిన గౌరవాన్ని ప్రవచకులు నొక్కిచెప్పారు. చివరగా, తమ ప్రభువును విశ్వసించిన వారికి పుణ్యాలలో ఎలాంటి నష్టం గానీ, అన్యాయం గానీ జరగదని ఆయతుల ద్వారా స్పష్టం చేశారు.

72:8 وَأَنَّا لَمَسْنَا السَّمَاءَ فَوَجَدْنَاهَا مُلِئَتْ حَرَسًا شَدِيدًا وَشُهُبًا
“మేము ఆకాశంలో బాగా వెదికాము. అది అప్రమత్తులైన పహరాదారులతో, అగ్నిజ్వాలలతో నిండి ఉండటం చూశాము.”

72:9 وَأَنَّا كُنَّا نَقْعُدُ مِنْهَا مَقَاعِدَ لِلسَّمْعِ ۖ فَمَن يَسْتَمِعِ الْآنَ يَجِدْ لَهُ شِهَابًا رَّصَدًا
“లోగడ మనం విషయాలు వినటానికి ఆకాశంలో పలుచోట్ల (మాటేసి) కూర్చునే వాళ్ళం. ఇప్పుడు ఎవరైనా చెవి యోగ్గి వినదలిస్తే, తన కోసం కాచుకుని ఉన్న అగ్నిజ్వాలను అతను పొందుతున్నాడు.”

72:10 وَأَنَّا لَا نَدْرِي أَشَرٌّ أُرِيدَ بِمَن فِي الْأَرْضِ أَمْ أَرَادَ بِهِمْ رَبُّهُمْ رَشَدًا
“ఇంకా – భూమిలో ఉన్న వారి కోసం ఏదైనా కీడు తలపెట్టబడినదో లేక వారి ప్రభువు వారికి సన్మార్గ భాగ్యం ప్రసాదించగోరుతున్నాడో మాకు తెలియదు.”

72:11 وَأَنَّا مِنَّا الصَّالِحُونَ وَمِنَّا دُونَ ذَٰلِكَ ۖ كُنَّا طَرَائِقَ قِدَدًا
“ఇంకా ఏమిటంటే – మనలో కొందరు సజ్జనులుంటే మరికొందరు తద్భిన్నంగా ఉన్నారు. మన దారులు వేర్వేరుగా ఉన్నాయి.”

72:12 وَأَنَّا ظَنَنَّا أَن لَّن نُّعْجِزَ اللَّهَ فِي الْأَرْضِ وَلَن نُّعْجِزَهُ هَرَبًا
“మనం భూమిలో అల్లాహ్ ను అశక్తుణ్ణి చేయటం గానీ, పారిపోయి (ఊర్థ్వలోకాల్లో) ఆయన్ని ఓడించటంగాని మనవల్ల కాని పని అని మాకర్ధమైపోయింది.”

72:13 وَأَنَّا لَمَّا سَمِعْنَا الْهُدَىٰ آمَنَّا بِهِ ۖ فَمَن يُؤْمِن بِرَبِّهِ فَلَا يَخَافُ بَخْسًا وَلَا رَهَقًا
“మేము మాత్రం సన్మార్గ బోధను వినగానే దానిని విశ్వసించాం. ఇక ఎవడు తన ప్రభువును విశ్వసించినా అతనికి ఎలాంటి నష్టంగానీ, అన్యాయంగానీ జరుగుతుందన్న భయం ఉండదు.”

وَاَنَّا
[వ అన్నా]
నిశ్చయంగా మేము.

لَمَسْنَا
[లమస్నా]
ఇక్కడ లమస్నా అన్నదానికి వెతికాము అని రాయవచ్చు.

السَّمَآءَ
[అస్ సమాఅ]
ఆకాశం

లమస్నా యొక్క అసలు భావం, అసలు భావం లమ్స్ అంటారు టచ్ చేయడాన్ని, తాకడాన్ని. దేనినైనా ముట్టుకుంటే అది ఏంటి అనేది మనకు తెలుస్తుంది కదా. అది మనకు ఏదైతే తెలిసిందో తాకడం ద్వారా. ఓహ్ ఇది వేడిగా ఉంది. అబ్బో ఇది చల్లగా ఉంది. అని మనం కొంచెం తాకిన తర్వాత ఏర్పడుతుంది. ఆ విషయాన్ని అంటారు వాస్తవానికి. కానీ ఇక్కడ ఉద్దేశ ప్రకారంగా వెతికాము అని భావం తీసుకోవడం జరుగుతుంది. ఆ అస్ సమాఅ, ఆకాశం

فَوَجَدْنَا
[ఫ వజద్నా]
మేము పొందాము.

هَا
[హా]
ఆకాశంలో అని భావం.

مُلِئَتْ
[ములిఅత్]
నిండి ఉన్నది.

حَرَسًا
[హరసన్]
పహరాదారులు, పహరాదారులతో.

شَدِيْدًا
[షదీదన్]
కఠినమైన రీతిలో.

شُهُبًا
[షుహుబా]
అగ్ని జ్వాలలు.

وَّاَنَّا
[వ అన్నా]
నిశ్చయంగా మేము

كُنَّا نَقْعُدُ
[కున్నా, నఖ్ ఉదు]
కూర్చుండే వారిమి.

مِنْهَا
[మిన్హా]
అక్కడ ఆకాశంలో ఉన్నవారి స్థలాల్లో.

مَقَاعِدَ
[మకాఇద]
మకాఇద్ అంటే కూర్చునే స్థలాల్లో.

لِلسَّمْعِ
[లిస్సమ్అ]
వినడానికి.

فَمَنْ
[ఫమన్]
కనుక ఎవరూ

يَسْتَمِعُ
[యస్తమిఉ]
వింటాడో, వినే ప్రయత్నం చేస్తాడో.

ఇంతకుముందే వచ్చింది మనకు

اَنَّهُ اسْتَمَعَ
[అన్నహుస్తమఅ.]
యస్తమిఉ ఇక్కడ వచ్చింది. కానీ ఇక్కడ ఉద్దేశపరంగా యస్తమిఉ వింటాడో వినే ప్రయత్నం చేస్తాడో అని.

الْاٰنَ
[అల్ ఆన]
ఇప్పుడు.

يَجِدْ
[యజిద్]
పొందుతాడు.

لَهٗ
[లహూ]
తన కొరకు.

شِهَابًا
[షిహాబన్]
అగ్ని జ్వాలను.

رَّصَدًا
[రసదా]
మాటు వేసి ఉన్నది. కాచుకొని ఉన్నది.

وَاَنَّا
[వ అన్నా]
మరియు నిశ్చయంగా మేము

لَا نَدْرِيْٓ
[లా నద్రీ]
మాకు తెలియదు.

اَشَرٌّ
[అషర్రున్.]
అ. ఇక్కడ ఆ ప్రశ్నార్థకంగా.

شَرٌّ
[షర్రున్]
కీడు, చెడు.

اُرِيْدَ
[ఉరీద]
ఉద్దేశింపబడినదా.

بِمَنْ فِى الْاَرْضِ
[బి మన్ ఫిల్ అర్ద్]
భూమిలో ఉన్నవారి గురించి.

اَمْ
[అమ్]
లేదా

اَرَادَ
[అరాద]
కోరాడా, ఉద్దేశించాడా.

بِهِمْ
[బిహిమ్]
వారి గురించి.

رَبُّهُمْ
[రబ్బుహుమ్]
వారి ప్రభువు.

رَشَدًا
[రషదా.]
ఇంతకుముందు ఏం రాసాము మనం రుష్ద్. సరియైన మార్గం. మేలు. రెండు రాసుకోండి.

وَاَنَّا
[వ అన్నా]
మరియు మేము.

وَاَنَّا مِنَّا
[వ అన్నా మిన్నా]
మాలో.

الصّٰلِحُوْنَ
[అస్ సాలిహూన్]
సజ్జనులు, సద్వర్తనులు. సజ్జనులు చాలా బాగుంటుంది. సద్వర్తన అనసరికి క్యారెక్టర్ కి సంబంధమైన అవుతుంది. కానీ సాలిహ్ లో విశ్వాస పరంగా గానీ ఆచరణ పరంగా గానీ, ప్రవర్తన పరంగా గానీ పరస్పర ప్రజలతో బిహేవియర్ మంచి వ్యవహారం విషయంలో గానీ అన్ని రకాలుగా సాలిహ్, మంచి వాళ్ళు. సాలిహూన్, సజ్జనులు.

وَمِنَّا
[వ మిన్నా]
మరియు మాలో

دُوْنَ ذٰلِكَ
[దూన దాలిక్]
దానికి భిన్నంగా.

كُنَّا
[కున్నా]
మేము ఉంటిమి.

طَرَاۤئِقَ قِدَدًا
[తరాయిక, కిదదా]
వివిధ మార్గాల్లో. వివిధ వర్గాల్లో. మన దారులు వేరు వేరు.

وَّاَنَّا ظَنَنَّآ
[వ అన్నా జనన్నా]
మేము భావించేవాళ్ళము. ఇక్కడ భావించడం అంటే ఇది నమ్మకం యొక్క భావంలో. ఒక్కొక్కసారి జనన్నా అనుమానంలో కూడా వస్తుంది కానీ ఇక్కడ అలా కాదు.

اَنْ لَّنْ نُّعْجِزَ اللّٰهَ
[అల్లన్ ను’జిజల్లాహ.]

نُعْجِزَ اللّٰهَ
[ను’జిజల్లాహ.]
మేము అల్లాహ్ ను అశక్తున్ని చేయలేము.

فِى الْاَرْضِ
[ఫిల్ అర్ద్]
భూమిలో.

وَلَنْ نُّعْجِزَهٗ هَرَبًا
[వలన్ ను’జిజహూ హరబా.]

هَرَبًا
[హరబా]
పారిపోయి.

وَلَنْ نُّعْجِزَهٗ
[వలన్ ను’జిజహూ]
మేము అశక్తున్ని చేయలేము, ఓడించలేము.

وَاَنَّا لَمَّا سَمِعْنَا الْهُدٰٓى
[వ అన్నా లమ్మా సమి’నల్ హుదా.]
నిశ్చయంగా మేము ఎప్పుడైతే విన్నామో,

لَمَّا
[లమ్మా]
ఎప్పుడైతే,

سَمِعْنَا
[సమి’నా]
విన్నామో.

الْهُدٰٓى
[అల్ హుదా]
మార్గదర్శకత్వాన్ని.

اٰمَنَّا بِهٖ
[ఆమన్నా బిహీ]
దానిని విశ్వసించాము.

فَمَنْ يُّؤْمِنْ
[ఫమన్ యు’మిన్]
ఎవరైతే విశ్వసిస్తారో.

بِرَبِّهٖ
[బిరబ్బిహీ]
తన ప్రభువుపై.

فَلَا يَخَافُ
[ఫలా యఖాఫు]
అతడు భయం చెందడు.

بَخْسًا
[బఖ్సన్]
ఏదైనా నష్టం వాటిల్లుతుందని.

وَّلَا رَهَقًا
[వలా రహకా.]
ఏదైనా దౌర్జన్యం, అన్యాయం. రహకా ఇంతకుముందు కూడా వచ్చింది. ఏం రాశారు? తలబిరుస్తనం షేక్. తలబిరుస్తనం వస్తుంది, దౌర్జన్యం అని కూడా వస్తుంది.

ఓకే, పలక, బలపం పక్కకు పెట్టి మాట ఇప్పుడు శ్రద్ధగా వినండి. వ్యాఖ్యానం తఫ్సీర్ మనం మొదలుపెడుతున్నాము.

సూరహ్ అల్-జిన్ (ఆయత్ 8-13) యొక్క తఫ్సీర్ మరియు వివరణ

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్. అల్హమ్దులిల్లాహ్, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్, అమ్మా బ’ద్.

సూరతుల్ జిన్, అల్లాహ్ యొక్క దయవల్ల ఇప్పటివరకు మనం ఏడు ఆయత్ లు చదివి ఉన్నాము. ఈరోజు నుండి ఎనిమిదవ ఆయత్ చదవబోతున్నాము. అయితే ఈ ఆయత్ ల యొక్క భావం తెలుసుకునేకి ముందు, దీనికి సంబంధించిన ఒక సంఘటనను మనతో అర్థం చేసుకుంటే చాలా బాగా ఉంటుంది. ఏంటి అది? మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రాకముందు షైతానుల ఒక అలవాటు ఉండినది. ఏంటి? ఒకరిపై ఒకరు అధిరోహించి, ఎక్కి, ఆకాశం వరకు చేరుకొని, అక్కడ వారు మాటు వేసుకొని ఉండే, దొంగతనంగా వినడానికి అక్కడ దైవదూతల మాటలను, వారు కొన్ని స్థానాలు ఏర్పరచుకొని ఉండిరి. అయితే మన ప్రవక్త ముహమ్మమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇక ప్రవక్తగా ప్రభవింపజేయబడతారు అన్న సందర్భంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ షైతానులు అక్కడి మాటలు ఏమీ దొంగలించకుండా ఉండడానికి అక్కడ వారికి, దొంగచాటున వినే అటువంటి షైతానులకు కఠిన శిక్షగా ఆకాశంలో తారలు ఏవైతే ఉన్నాయో కొన్నిటిని నియమించాడు. ఆ తారలు కొన్ని అగ్ని జ్వాలలతో ఆ షైతానులను కాల్చేస్తుండినవి. అయితే ఈ షైతానులు అక్కడి మాటలు వినడానికి ఎందుకు ప్రయత్నం చేసేవారు? అసలు ఏం జరిగేది? మనం ఖుర్ఆన్ లోని వేరే ఆయత్ ల ద్వారా గ్రహిస్తే తెలుస్తున్న విషయం ఏమిటంటే, ఎప్పుడైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏదైనా ఆదేశం దైవదూతలకు ఇవ్వడానికి వారికి ఒకే ఒక ఇస్తాడో, వారిని పిలుస్తాడో అల్లాహ్ యొక్క ఔన్నత్యం, గౌరవం, గొప్పతనంతో అందరూ సొమ్మసిల్లిపోతారు. అల్లాహ్ యొక్క మాట విన్న వెంటనే వారందరిలోకెల్లా జిబ్రీల్ అందరికంటే ముందు కోలుకొని అల్లాహ్ యొక్క మాటను చాలా శ్రద్ధగా వింటారు. ఆ తర్వాత ఆయన ఎవరెవరికి ఏ ఆదేశాలు ఇవ్వాలో అవి తెలియపరుస్తాడు. ఆ సందర్భంలో ఆ మాటలు ఒకరి వెనుక ఒకరి దేవదూతలకు చేరుతూ ఉంటాయి. వారు పంపిస్తూ ఉంటారు అల్లాహ్ వారికి ఇచ్చిన ఆదేశం, వారికి తెలిపిన విధానంలో వారు పంపించుకుంటూ ఉంటారు.

అయితే ఈ షైతానులు ఈ ఒక్క మాటను దొంగలించి అందులో పది మాటలు తమ వైపు నుండి కలిపి కింద మనుషుల్లో ఎవరైతే వారి యొక్క అనుయాయులు, వారిని అనుసరించే వారు ఫాలోవర్స్ ఉన్నారో, ఈ విషయం మనకు సహీహ్ ముస్లిం హదీస్ ద్వారా కూడా తెలుస్తుంది. కాహిన్, అర్రాఫ్, జ్యోతిషి అని మనం ఏదైతే అంటామో వారికి తెలియజేస్తారు. ఆ జ్యోతిష్యులు ఆ అందులో ఇక తొంభై మాటలు ఎక్కువగా కలిపి ఇక ప్రజల నుండి తప్పిపోయిన ఏదైనా వస్తువు గానీ వారి యొక్క భవిష్యత్తులో ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది అన్నటువంటి అగోచర విషయాలు తెలుపుతున్నట్లు, వారి యొక్క భవిష్యత్తు గురించి తెలియజేస్తున్నట్లుగా వారికి చెబుతారు. వాస్తవం ఏమిటంటే, ఒక్క మాట మాత్రమే వారు చెప్పిన వంద మాటల్లో నిజమవుతుంది. కానీ అమాయక ప్రజలు ఆ ఒక్క మాట ఏదైతే నిజమైనదో దాని ద్వారా వారి యొక్క తొంభై తొమ్మిది మాటలు నిజమన్నట్లుగా భావిస్తారు. అయితే ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రాకముందు ప్రవక్తగా ప్రభవించక ముందు ఆకాశంలో కట్టుదిట్టం పహరాలు, అక్కడ ఎవరూ దొంగచాటున వినకుండా ఉండడానికి అక్కడ చెక్ పాయింట్ లాంటివి అనుకోండి ఎక్కువైపోయాయి. అయితే ఈ జిన్నాతులు చాలా ఆశ్చర్యపడ్డారు ఈ విషయాన్ని చూసి, ఎందుకు ఇలా జరుగుతుంది, ఇంతకుముందు ఎప్పుడూ జరగకపోయేది కదా. అయితే ఎప్పుడైతే వారు వచ్చి ఖుర్ఆన్ విన్నారో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నోట, అప్పుడు వారికి అర్థమైంది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన సత్య సందేశాన్ని ప్రజలకు చేరవేయడానికి ఈ విధంగా ఆకాశంలో ఎన్నో రకాల తారలను మా కొరకు మాటు వేసి ఉంచి, మాపై మాటలు వినకుండా శిక్షను పంపించేవారు. వాటి యొక్క ప్రస్తావన ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు కొంచెం మనం ఆయత్ లను చదువుతూ ఈ విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.

వ అన్నా లమస్నస్ సమాఅ ఫవజద్నాహా ములిఅత్ హరసన్ శదీదన్ వ షుహుబా.

وَاَنَّا لَمَسْنَا السَّمَآءَ فَوَجَدْنٰهَا مُلِئَتْ حَرَسًا شَدِيْدًا وَّشُهُبًا ۙ‏
[వ అన్నా లమస్నస్ సమాఅ ఫవజద్నాహా ములిఅత్ హరసన్ శదీదన్ వ షుహుబా]
“మరి నిశ్చయంగా మేము ఆకాశాన్ని గాలించాము. అది కఠినమైన కావలి వారితో, నిప్పు రవ్వలతో నింపబడి ఉండటాన్ని మేము గమనించాము.” (72:8)

మరో అనువాదంలో ఏముంది? మేము ఆకాశంలో బాగా వెతికాము, అది అప్రమత్తులైన పహరాదారులతో, అగ్ని జ్వాలలతో నిండి ఉండటం చూశాము. ఈ ఆయత్ లో మనకు చూడడానికి ఇంతవరకు చెప్పుకున్నటువంటి సంఘటన ఏదైతే తెలుసుకున్నామో, అందులో స్పష్టంగా అర్థమైపోయింది మనకు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ షైతానులు వినకుండా ఉండడానికి అక్కడ మంచి బలవంతమైన షైతానులను ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వాటిని కాపలాదారులుగా పెట్టాడు. అయితే ఇక్కడ మనకు రెండు విషయాలు కనబడుతున్నాయి. ఒకటి, హరసన్ శదీదా, బలవంతమైన, కఠినమైన, మంచి పహరాదారులు. వ షుహుబా. షుహుబా అంటే ఇక్కడ ఉల్కలు అని కూడా కొందరు అనువాదం చేశారు. ఈ ఉల్కలు మనం వాడుక భాషలో వేటిని అంటారో మీలో ఎవరికైనా తెలిసి ఉంటే చెప్పండి ఒకసారి. ఆకాశం నుండి రాలేవి షేక్, ఉల్కలు అంటే. ఆకాశం నుండి రాలే అటువంటివి. గ్రహ సకలాలు అని చెప్తారు సార్ వాస్తవానికి సైన్స్ పరంగా. ఉల్కలు అని అంటారు వాటిని. గ్రహ సకలాల్ని. ఇక్కడ కొంచెం మనం, ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. అదేమిటంటే సైన్స్ పరంగా కొన్ని విషయాలు ఏవైతే మనకు తెలుస్తున్నాయో, ధర్మం అన్నది, ఇస్లాం చెప్పేటివి విరుద్ధమేమీ కావు. కొన్ని సందర్భాల్లో ఏదైనా విషయం అర్థం కాకపోతే సైన్స్ పూర్తి రీసెర్చ్ తో జరుగుతుంది అన్నటువంటి వాదనతో దాని వైపు మొగ్గు చూపి కొందరు అల్లాహ్ లేదా ప్రవక్త యొక్క మాటలను తిరస్కరించే ప్రయత్నం చేస్తారు. ఆ భావంలోకి వెళ్లకూడదు. ఎందుకంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏ సత్యాన్ని తెలియజేశాడో అవి ఇంకా సైంటిస్టుల పరిశోధనలకు రాలేదు కావచ్చు అని మనం భావించాలి, వాస్తవం కూడా ఇది. కానీ అల్లాహ్ యొక్క మాట, ప్రవక్త యొక్క మాట సైన్స్ పరిశోధనల కంటే చాలా ఫాస్ట్ గా మరియు చాలా అప్డేట్ గా ఉంటాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే కొందరు తొందరపాటులో ఇది ఇస్లాం దీని గురించి ఏం చెప్తుంది అన్నటువంటి విషయాలను మాట్లాడుతూ వ్యతిరేకత చూపి ఇస్లాంను వంకరగా, ఇస్లాంను తప్పుగా చూపించే ప్రయత్నం అందరూ చేస్తూ ఉంటారు. అయితే ఈ విషయంలో గానీ, ఏదైతే ఉల్కల ప్రస్తావన వచ్చిందో, లేదా భూకంపం విషయంలో గానీ ఇదంతా కూడా సైన్స్ కు మరియు ధర్మానికి వ్యతిరేకత తీసుకువచ్చే ప్రయత్నం ఏమాత్రం చేయనే చేయకూడదు. ఎవరికైనా ఎక్కడైనా ఏదైనా మాట అర్థం కాకుంటే అక్కడ మనం క్లియర్ గా ఒక మాట చెప్పవచ్చు. అదేమిటి? అల్లాహ్ చెప్పిన మాటలో ఎలాంటి రద్దు అనేది, ఎలాంటి అబద్ధం అనేది ఉండదు గనుక సైన్స్ పరిశోధనలు జరిపి, జరిపి, జరిపి, జరిపి వారి దృష్టిలో వచ్చిన విషయం అనుభవంలో వచ్చిన విషయం చెప్తారు గనుక ఇంకా వారి పరిశోధనలకు రాలేదు కావచ్చు అన్నటువంటి విషయంపై మనం ఉండాలి. కానీ ఇక్కడ చెప్పే ఉద్దేశం ఏంటి? అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కొన్ని తారలలో అలాంటి శక్తి వారికి ప్రసాదించి ఉన్నాడు. వారిని కాపలాదారులుగా ఉంచాడు. వారు ఎక్కడ షైతానులను చూస్తారో వాటిని పరిగెత్తించి, వారిని ఆ వారి వెంటపడి వారిని కాల్చేసే ప్రయత్నం చేస్తారు. అయితే మనం కొన్ని సందర్భాల్లో తారా పడిపోయింది లేదా ఉల్కల విషయం ఏదైతే మనం వింటామో లేదా చూస్తామో అయితే వల్లాహు అ’లం ఏదైనా తార షైతానులను కొట్టడానికి ఆ షైతానుల వెంట పరిగెడుతుంది కావచ్చు.

రెండో ఆయత్: వ అన్నా కున్నా నఖ్ ఉదు మిన్హా మకాఇద లిస్సమ్.

وَّاَنَّا كُنَّا نَقْعُدُ مِنْهَا مَقَاعِدَ لِلسَّمْعِ ۖ
[వ అన్నా కున్నా నఖ్ ఉదు మిన్హా మకాఇద లిస్సమ్]
“మరియు మేము (విషయాలు) వినటానికి ఆకాశంలో కొన్ని చోట్ల కూర్చునేవారము.” (72:9)

అక్కడ మేము కొన్ని కూర్చుండి ఉండే చోట్ల, స్థానాల్లో కూర్చుండే వారిమి లిస్సమ్ వినడానికి. తాను ఇప్పుడు ఎవరైనా అలా వినే ప్రయత్నం చేస్తే వానికి ఆ ఉల్కలు అనేటివి కాల్చేస్తాయి మరియు వారు దాని యొక్క శిక్ష పొందుతారు. ఇది మొదటి మాట దానికే మరింత బలం చేకూరుస్తూ ఆ షైతానులు, ఆ జిన్నాతులు ఎవరైతే విని విశ్వసించారో తమ జాతి వారి వద్దకు వెళ్లి ఈ విషయాలను వారు చెబుతున్నారు. అందులోనే మరొక మాట పదవ ఆయత్ లో వస్తుంది. ఈ పదవ ఆయత్ లో మనకు కొన్ని గుణపాఠాలు ఉన్నాయి. కొన్ని మంచి బోధనలు ఉన్నాయి, గ్రహించాలి. మొదటిది ఏమిటంటే,

వ అన్నా లా నద్రీ అశర్రున్ ఉరీద.

తిలావత్ పరంగా కూడా ప్రత్యేకంగా ఎవరైతే ఇమామ్ గా ఉంటారో, ఖుర్ఆన్ యొక్క తిలావత్ చేస్తూ ఉంటారో తిలావత్ ఎలా చేయాలంటే ప్రత్యేకంగా నమాజ్ లో ఉన్నప్పుడు గానీ, స్వయంగా మన కొరకు ఒంటరిగా మనం తిలావత్ చేసుకుంటున్నప్పుడు గానీ, లేదా ఏదైనా సభలో ఎక్కడైనా ఎవరికైనా ఖుర్ఆన్ మనం వినిపిస్తున్నాము, దాని యొక్క తిలావత్ చేసే విధానం అన్నది ఎంత మంచిగా, సుందరంగా, ఉత్తమంగా ఉండాలంటే ఖుర్ఆన్ యొక్క తిలావత్ ద్వారానే ఎంతో కొంత భావం అర్థమయ్యే రీతిలో తిలావత్ జరగాలి. ఇక్కడ అశర్రున్ అన్న పదం ఏదైతే వచ్చిందో వాస్తవానికి ఇందులో మహా నీచాతి నీచమైన, మహా చెడ్డది అన్నటువంటి భావంలో వస్తుంది. కానీ ఇక్కడ ఆ భావం కాదు. అలాంటి భావం ఉండేది ఉంటే అశర్రున్ డైరెక్ట్ చదవడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏముంది, అశర్రున్ ఉరీద బిమన్ ఫిల్ అర్ది అమ్ అరాద బిహిమ్ రబ్బుహుమ్ రషదా. ఈ మానవుల పట్ల ఏదైనా చెడు కోరడం జరిగినదా? ప్రశ్న. ఆ, ఆ అమిన్తుమ్ అని మీరు ఇంతకుముందు చదివారు కదా? ప్రశ్నార్థకంగా ఏదైతే వస్తుందో ఆ రీతిలో ఇక్కడ ‘ఆ’ ఉంది. షర్రున్ వేరే పదము. అంటే ‘ఆ’ ఒక వేరే పదం, ‘షర్రున్’ వేరే పదం. ఇందులో భావంలో ప్రశ్నార్థకం ఉంది. అందుకొరకే దీనిని ఎలా చదువుతారు, “వ అన్నా లా నద్రీ అశర్రున్”. అశర్, అషర్రున్. ఈ తిలావత్ లో రెండు విధానాలు వేరుగా ఉంటాయి. మొదటిది నేను ఏదైతే చదివానో అందులో అతి చెడ్డది అన్నటువంటి భావం వస్తుంది. రెండో విధానం ఏదైతే చదివామో అందులో చెడు కోరబడినదా అన్నటువంటి ప్రశ్న అడుగోవడడం జరుగుతుంది అన్నట్లుగా అర్థమవుతుంది. దీనిని నబరతుస్ సౌత్ అని అంటారు. ఈ విషయాన్ని ప్రత్యేకంగా ఎవరైతే తిలావత్ ఉత్తమ రీతిలో చేసేవారు, ఇమామ్ లు అలాంటి వారు ఈ విషయాన్ని గ్రహించాలి.

రెండో మాట ఇందులో గమనించండి, అశర్రున్ ఉరీద బిమన్ ఫిల్ అర్ద్ అమ్ అరాద బిహిమ్ రబ్బుహుమ్ రషదా. షర్రున్ మరియు రషదా ఇవి రెండు విరుద్ధ పదాలు. షర్ అంటే కీడు, రషదా అంటే మేలు. అయితే మనం మానవులం, అల్లాహ్ పట్ల పాటించే అటువంటి గౌరవ మర్యాద అన్నది ఎలాంటిదంటే, మనం అల్లాహ్ వైపునకు చెడును అంకితం చేయరాదు. అల్లాహ్ వారి పట్ల ఏదైనా చెడు కోరాడా, లేక అల్లాహ్ వారి పట్ల ఏదైనా మేలు కోరాడా? ఈ విధంగా చెప్పడం సరియైన విషయం కాదు. వాస్తవానికి ఈ లోకంలో జరిగేదంతా అల్లాహ్ కు ఇష్టం లేనిది ఏదైనా జరిగిన గాని దానిని ఏమంటారు, ఇజ్నన్ కౌనీ అంటారు. ఒకటి షరయీ ఒకటి కౌనీ. షరయీ అంటే షరియత్ పరంగా జరిగేది. కౌనీ అంటే అల్లాహ్ కు ఇష్టం లేకపోయినా గాని ఈ లోకంలో సంభవిస్తుంది. అందులో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మానవులను పరీక్షించాలనుకుంటాడు. అయితే అలాంటి అప్పుడు అది కూడా అల్లాహ్ అనుమతితో జరుగుతుంది. కానీ మనం అల్లాహ్ యొక్క గౌరవం మర్యాదను పాటిస్తూ అల్లాహ్ వైపు నుండి చెడు అన్నట్లుగా చెప్పము. ఇది అల్లాహ్ యొక్క గౌరవ మర్యాదలో. ఆ విషయం అర్థమైందని ఆశిస్తున్నాను. కానీ కొన్ని సందర్భాల్లో మనం ఏదైనా తొందరపాటులో ఉండి మన ఆలోచన ఎక్కడైనా ఉంటే, లేక మన యొక్క నాలాంటి తక్కువ జ్ఞానం గలవారు తొందరగా అర్థం కాకపోవచ్చు ఒక చిన్న ఉదాహరణ ఇస్తున్నాను. మనం మన తల్లిదండ్రుల ద్వారా లేదా మనకు విద్య చెప్పే అటువంటి గురువుల ద్వారా స్పష్టంగా గమనిస్తాము. వారి ముందు ఏదైనా పొరపాటు జరిగింది అని. కానీ ఇదిగో నువ్వు తప్పు చేసావు అని ఈ విధంగా చెప్పము. ఎందుకు? పెద్దలు. వారిని గౌరవించాలి. వారితో మర్యాదగా ఎంతో సభ్యత, సంస్కారంతో మనం మెలగాలి. అందుకని అలా చెప్పడం సరియైనది కాదు. ఏం చెబుతాము? ఒక్కసారి ఈ మాటను మీరు మరోసారి ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఈ చెప్పిన విషయాన్ని ఒక్కసారి మీరు విని చూసుకోండి. కరెక్టే చెప్పారు కదా! ఈ విధంగా కొంచెం గౌరవంగా మాట్లాడుతాము. అఊజుబిల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్ అల్లాహ్ కొరకు ఎగ్జాంపుల్ కాదు, మనకు అర్థం కావడానికి చెప్తున్నాను. మనం మన పెద్దల పట్ల మానవుల్లో వారి యొక్క గౌరవార్థం మాట విధానంలో తేడా ఉంటుంది. అదే మన పిల్లవాడు మనకంటే చిన్నవాడు ఎవరైనా స్టూడెంట్ తప్పు చేస్తే అతన్ని దండించే విధానం, మనకంటే పెద్దవారు ఏదైనా తప్పు చేస్తే వారికి చెప్పే విధానంలో తేడా ఉంటుంది. అయితే నేను ఇక్కడ చెప్పే ఉద్దేశం ఏంటి? జిన్నాతులు అల్లాహ్ పట్ల ఎంత మర్యాద పాటించాలో ఇక్కడ మనకు కనబడుతుంది. వారు అల్లాహ్ విషయంలో, అల్లాహ్ చెడును కోరాడా అని అనకుండా ఏమన్నారు, ఉరీద బిమన్ ఫిల్ అర్ద్. భూమిలో ఉన్న వారికి ఏదైనా కీడు ఉద్దేశించబడినదా? ఉరీద. దీనిని ఏమంటారు, ఫెయల్ మజ్హూల్ అని అంటారు. కానీ అదే తర్వాత ఏమొచ్చింది? అమ్ అరాద బిహిమ్ రబ్బుహుమ్. వారి ప్రభువు వారి కొరకు కోరాడా. రషదా మేలు. ఈ ఆయత్ ద్వారా మనకు బోధపడే మరొక విషయం ఏమిటంటే ఈ లోకంలో ఏ మంచి జరిగినా, ఏ కీడు జరిగినా అల్లాహ్ వైపు నుండి జరుగుతుంది కానీ మనం అందులో ఏ పాత్ర మనది లేదు, అందులో మనకు ఏ పాపం గానీ ఎలాంటి మనపై బాధ్యత అనేది ఉండదు అని కాదు. ఎందుకంటే అల్లాహ్ మనకు ఏ బుద్ధి జ్ఞానాలు ప్రసాదించాడో, మనకు మంచి చెడును ఎన్నుకొని పాటించే అటువంటి శక్తి సామర్థ్యాలను ప్రసాదించాడో అందుకని మనం దానికి బాధ్యులం అవుతాము. ఏదైతే మన ఏదైనా కొరత వల్ల, పొరపాటు వల్ల మన నుండి ఏదైనా తప్పు జరుగుతుందో దానికి బాధ్యులం మనం అవుతాము. దానిని మనం అల్లాహ్ పై వేయరాదు.

ఆ తర్వాత గమనించండి: వ అన్నా మిన్నస్ సాలిహూన వ మిన్నా దూన దాలిక్ కున్నా తరాయిక ఖిదదా.

وَاَنَّا مِنَّا الصّٰلِحُوْنَ وَمِنَّا دُوْنَ ذٰلِكَ ۗ كُنَّا طَرَاۤئِقَ قِدَدًا ۙ‏
[వ అన్నా మిన్నస్ సాలిహూన వ మిన్నా దూన దాలిక్ కున్నా తరాయిక ఖిదదా]
“మరియు మాలో కొందరు పుణ్యాత్ములు ఉన్నారు, మరికొందరు వేరే రకం వారు ఉన్నారు. మేము వివిధ వర్గాలుగా విడిపోయి ఉన్నాము.” (72:11)

మాలో కొందరు పుణ్యాత్ములు ఉన్నారు మరియు వారికి భిన్నంగా ఉన్నారు. మొన్నటి క్లాస్ లో స్టార్టింగ్ లోనే చెప్పడం జరిగింది. ఎలాగైతే మానవుల్లో అన్ని రకాల మనుషులు ఉన్నారో, వివిధ ధర్మాలను అవలంబించేవారు, మతాలను అవలంబించేవారు, మస్లక్ లను, ఫిర్కాలను అవలంబించేవారు. అలాగే జిన్నాతులో కూడా ఉన్నారు. కాకపోతే అందులో కూడా పుణ్యాత్ములు ఉన్నారు. లేరని కాదు. అదే విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. కున్నా తరాయిక ఖిదదా మేము వివిధ మార్గాల్లో ఉంటిమి. ఈ సందర్భంలో కూడా మనకు ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కొన్ని హదీసులు గుర్తు చేసుకోవాలి. ప్రళయం వచ్చేవరకు ఈ ప్రజల మధ్యలో భేదాభిప్రాయాలు మరియు ఇలాంటి వివిధ వర్గాలు ఇవన్నీ ఉంటాయి, జరుగుతూ ఉంటాయి కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైతే చెప్పారో లా తజాలు తాయిఫతున్ మిన్ ఉమ్మతీ, నా అనుచర సంఘంలో ఒక వర్గం ఉంటుంది, ఒక జమాత్ ఉంటుంది, తాయిఫా, వారు ప్రళయం వరకు కూడా సత్యంపై, అల్లాహ్ యొక్క ధర్మంపై ఉంటారు. వారిని విడనాడిన వారు ఎలాంటి నష్టం వారికి చేకూర్చలేరు. వారిని వదిలి వెళ్లిన వారు స్వయం సత్యం నుండి దూరం అవుతారు తప్ప, వారు ఎలాంటి ధర్మం విషయంలో ధర్మంపై స్థిరంగా ఉన్న వారికి ఇహ పరాల్లో ఏ కీడు కలగజేయలేరు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా చెప్పడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మీరు ఎక్కడ ఉన్న ఏ కాలంలో ఉన్న, ఏ చెడు మీ మధ్యలో ప్రబలినా గానీ, మంచి వారు కూడా ఉంటారు, మీరు వారిని వెతకాలి మరియు అలాంటి మంచి వారి యొక్క తోడుగా ఉండి వారి యొక్క మార్గాన్ని అవలంబించాలి. అయితే ఈ హదీస్ ఆయత్ ఇప్పుడు ఈ సూరహ్ జిన్ లో చదివినటువంటి ఆయత్ నంబర్ 11 మరియు ప్రవక్త వారి ఈ హదీస్ బుఖారీ ముస్లిం ఇత వేరే గ్రంథాల్లో వచ్చి ఉంది. దాని ఆధారంగా ధర్మవేత్తలు ఏమంటున్నారంటే జిన్నాతులో కూడా ఇహలోకంలో మనుషుల్లో ఉన్నటువంటి ఫిర్కాలు, వర్గాలు ఉన్నాయి. సత్యంపై, మన్హజె సలఫ్ పై మరియు అలాగే వేరే షియా ఇత వేరే వర్గాలు ఏవైతే ఉన్నాయో అలాంటి వారిలో కూడా జిన్నాతులో విభజించబడి ఉన్నారు.

ఆ తర్వాత ఆయత్ 12:

وَّاَنَّا ظَنَنَّآ اَنْ لَّنْ نُّعْجِزَ اللّٰهَ فِى الْاَرْضِ وَلَنْ نُّعْجِزَهٗ هَرَبًا ۙ‏
[వ అన్నా జనన్నా అల్లన్ ను’జిజల్లాహ ఫిల్ అర్ది వలన్ ను’జిజహూ హరబా]
“మేము భూమిలో అల్లాహ్ ను ఓడించలేమని, పారిపోయి కూడా ఆయన పట్టు నుండి తప్పించుకోలేమని మేము గట్టిగా నమ్ముతున్నాము.” (72:12)

ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే వారి యొక్క నమ్మకం, ఖుర్ఆన్ ని విశ్వసించిన తర్వాత జిన్నాతుల యొక్క నమ్మకం ఎంత మంచిగా ఉండిందో గమనించండి. ఇహ లోకంలో మేము ఈ భూమిలో గానీ, భూమిని తప్ప ఇంకా వేరే ఎక్కడైనా గానీ అల్లాహ్ ను వదలి ఎక్కడికి పారిపోయినా గానీ మేము అల్లాహ్ యొక్క పట్టు నుండి తప్పించుకొని పోయే అవకాశమే లేదు. మేము అల్లాహ్ యొక్క విధేయతకు దూరమై అల్లాహ్ యొక్క శిక్ష నుండి తప్పించుకోవడానికి ఎలాంటి అవకాశం లేదు. మనం ఎంత అశక్తులం, ఎంత బలహీనులం అంటే అల్లాహ్ ను ఆజిజ్ చేయడం, ఆయన మనపై గెలుపు పొందకుండా, ఆయన మనల్ని పట్టుకోకుండా మనం ఆయనపై గెలుపు పొందే రీతిలో ఏదైనా మార్గం ముమ్మాటికి ఉండదు. ఈ విషయం చెప్పడానికే ఈ రెండు పదాలు ఇక్కడ వచ్చి ఉన్నాయి. అల్లన్ ను’జిజల్లాహ ఫిల్ అర్ద్ వలన్ ను’జిజహూ హరబా. అల్లాహు అక్బర్. ఈ సందర్భంలో నాకు సహీ హదీస్ గుర్తుకొస్తుంది ఏదైతే మనకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రి పడుకునే ముందు కూడా చదివి పడుకోవాలి. ఎవరైతే ఈ దుఆ చదివి పడుకుంటారో, ఒకవేళ వారు ఆ రాత్రి చనిపోతే ఫిత్రతే ఇస్లాం పై వారి యొక్క చావు అవుతుంది అని ప్రవక్త వారు శుభవార్త ఇచ్చారు. అల్లాహుమ్మ ఇన్నీ అస్లంతు నఫ్సీ ఇలైక, వ ఫవ్వజ్తు అమ్రీ ఇలైక, వ వజ్జహ్తు వజ్హీ ఇలైక, రగ్బతన్ వ రహబతన్ మిన్క ఇల్లా ఇలైక, ఆ లా మల్జఅ వలా మన్జా మిన్క ఇల్లా ఇలైక్. ఇక్కడ ఈ పదం గమనించండి. నేను నిన్నే విశ్వసించాను. నేను నా కార్యమును నీకే సమర్పించుకున్నాను. నా ముఖాన్ని నీ వైపునకే అంకితం చేసుకున్నాను. భయపడి వచ్చినా నీ వైపునకే రావాలి. ఏదైనా ఆశతో వచ్చినా నీ వైపునకే రావాలి. నీ తప్ప మాకు ఏదైనా భయం నుండి రక్షణ కల్పించే స్థలం మరియు ఏదైనా ఆశకు సంబంధించిన మంచి ఏదైనా జరుగుతుంది అంటే నీ తప్ప వేరే ఎక్కడా లేదు. ఇందులో ఎంత బలమైన విశ్వాసం మనకు నేరపడటం జరిగిందో గమనించండి.

అలాగే ఇంకా మనం గమనించగలిగితే సూరతుజ్ జారియాత్ లో చూడండి. అల్లాహ్ ఏమంటున్నాడు, ఫఫిర్రూ ఇలల్లాహ్. మీరు అల్లాహ్ వైపునకు పరిగెత్తండి. ఇక్కడ ఎందుకు ఈ ఆయత్ ని తీసుకుంటున్నాము? సర్వసామాన్యంగా మనిషి ఇహలోకంలో ఎవరితో భయపడుతున్నాడో అతని వైపునకే పరిగెత్తడు. ఏం చేస్తాడు? అంతకంటే ఎక్కువ శక్తి సామర్థ్యాలు గలవాని వైపునకు పరిగెత్తి అక్కడ శరణు తీసుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ ఈ లోకంలో అల్లాహ్ కంటే గొప్ప శక్తి గలవాడు మరెవడూ లేడు గనుక అల్లాహ్ తో భయపడి వేరే ఎటువైపునకో పరిగెత్తరాదు, కేవలం అల్లాహ్ వైపునకే పరిగెత్తాలి. అదే మాట ఇక్కడ, మేము ఆ అల్లాహ్ ను వదలి ఎక్కడికైనా పారిపోవాలన్నా పారిపోయే అటువంటి శక్తి మాకు లేదు. లేదా ఈ భూమిలో అల్లాహ్ ను ఓడించి మేము గెలుపు పొందాలన్న అలాంటి శక్తి ఏమీ లేదు. మరి అలాంటి అప్పుడు అల్లాహ్ కు అవిధేయత ఎందుకు చూపాలి? అల్లాహ్ మాటను ఎందుకు ధిక్కరించాలి? సత్య ధర్మాన్ని వదిలి ఎందుకు జీవించాలి?

ఆ తర్వాత చెబుతున్నారు, ఈరోజు పాఠంలోని చివరి ఆయత్, ఆయత్ నంబర్ 13. మా పరిస్థితి ఎలాంటిదంటే, 12 యొక్క సంక్షిప్త భావం, మా పరిస్థితి ఎలాంటిదంటే మేము అల్లాహ్ ను తప్ప ఏ ఏ దేవతలను నమ్ముకుంటామో, ఎవరెవరిని పెద్దగా భావిస్తామో వారు మాకు మా క్లిష్ట పరిస్థితుల్లో ఏ సహాయము చేయలేరు. మరియు అల్లాహ్ ను వదలి మేము వారిని నమ్ముకొని అల్లాహ్ యొక్క పట్టు నుండి ఈ భూమిలో ఎక్కడికి మనం దాగి ఉండలేము, ఎటు కూడా పారిపోయి శరణు పొందలేము. అందుకొరకే మేము ఈ మార్గదర్శకత్వాన్ని విన్న వెంటనే విశ్వసించాము. మేము విశ్వసించాము. ఇక ఈ విశ్వాసం అల్లాహ్ పై ఎంత గొప్పది అంటే, ఎవరూ తన ప్రభువుని విశ్వసిస్తాడో ఆ ప్రభువు విషయంలో ఎలాంటి భయం అవసరం లేదు. ఫలా యఖాఫు బఖ్సన్ వలా రహకా. అతని పుణ్యాల్లో ఏ కొరత జరగదు, పాపాల్లో ఏ హెచ్చింపు జరగదు. అతడు ఎంత పుణ్యం చేశాడో అతనికి సంపూర్ణంగా దాని యొక్క ప్రతిఫలం ఇవ్వడం జరుగుతుంది. మరియు అతడు ఏ పాపాలు చేశాడో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అతడి యొక్క పాపాల కారణంగా అతనిపై కోపగించి ఏదైనా అతనికి ఎక్కువ శిక్ష ఇస్తాడా, లేదు. అల్లాహ్ వద్ద సంపూర్ణ న్యాయం ఉంది. ఖుర్ఆన్ లో ఈ విషయం అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. అనేక లా యలిత్కుమ్ మిన్ అ’మాలీకుమ్ షైఆ. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మీ పుణ్యాల్లో ఎలాంటి తగ్గింపు చేయడు. మరో కొన్ని సందర్భాల్లో అయితే అల్లాహ్ ఏం చెప్పాడు? ఖర్జూరపు ముక్కపై, ఖర్జూరపు బీజముపై ఏ పల్చని పొర ఉంటుందో అంత కూడా మీపై ఏ అన్యాయం జరగదు. ఏ అన్యాయం జరగదు. అంతటి న్యాయవంతుడైన అల్లాహ్, ఆ అల్లాహ్ ను విశ్వసించిన వారు చాలా అదృష్టవంతులు, వారు చాలా మంచి పని చేసిన వారు. ఈ జిన్నాతులకు సంబంధించిన మరికొన్ని బోధనలు మరియు వారికి ఇంకా మానవులకు ఒకవేళ సన్మార్గంపై ఉండేది ఉంటే ఎలాంటి మేలు జరుగుతాయి తర్వాత ఆయతులలో రానున్నది. ఇక్కడివరకే ఈ పాఠాన్ని మనం ముగించేస్తున్నాము. జజాకుముల్లాహు ఖైరన్ వ బారకల్లాహు ఫీకుమ్ వ ఆఖిరు ద’వానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఏదైనా ప్రశ్న ఉందా మీ దగ్గర? సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహ్.



72:14 وَأَنَّا مِنَّا الْمُسْلِمُونَ وَمِنَّا الْقَاسِطُونَ ۖ فَمَنْ أَسْلَمَ فَأُولَٰئِكَ تَحَرَّوْا رَشَدًا

“ఇంకా – మనలో కొందరు ముస్లింలై (దైవవిధేయులై)ఉంటే, మరికొందరు సన్మార్గం నుండి తొలగి ఉన్నారు. కనుక విధేయతా వైఖరిని అవలంబించినవారు సన్మార్గాన్ని అన్వేషించుకున్నారు.”

72:15 وَأَمَّا الْقَاسِطُونَ فَكَانُوا لِجَهَنَّمَ حَطَبًا

“సన్మార్గం నుండి తొలగిపోయి, అపవాదానికి లోనైనవారు – నరకానికి ఇంధనం అవుతారు.”

72:16 وَأَن لَّوِ اسْتَقَامُوا عَلَى الطَّرِيقَةِ لَأَسْقَيْنَاهُم مَّاءً غَدَقًا

ఇంకా (ఓ ప్రవక్తా! వారికి చెప్పు): వీరు గనక సన్మార్గంపై నిలకడగా ఉంటే మేము వారికి పుష్కలంగా నీళ్ళు త్రాగించి ఉండేవారం.

72:17 لِّنَفْتِنَهُمْ فِيهِ ۚ وَمَن يُعْرِضْ عَن ذِكْرِ رَبِّهِ يَسْلُكْهُ عَذَابًا صَعَدًا

తద్వారా వారిని ఈ విషయంలో పరీక్షించటానికి! మరెవడు తన ప్రభువు ధ్యానం నుండి ముఖం త్రిప్పుకుంటాడో అతణ్ణి అల్లాహ్ కఠినమైన శిక్షకు లోను చేస్తాడు.

72:18 وَأَنَّ الْمَسَاجِدَ لِلَّهِ فَلَا تَدْعُوا مَعَ اللَّهِ أَحَدًا

ఇంకా – మస్జిదులు కేవలం అల్లాహ్ కొరకే ప్రత్యేకించబడ్డాయి. కాబట్టి (వాటిలో) అల్లాహ్ తో పాటు ఇతరులెవరినీ పిలవకండి.

72:19 وَأَنَّهُ لَمَّا قَامَ عَبْدُ اللَّهِ يَدْعُوهُ كَادُوا يَكُونُونَ عَلَيْهِ لِبَدًا

అల్లాహ్ దాసుడు (ముహమ్మద్) అల్లాహ్ ను మాత్రమే ఆరాధించటానికి నిలబడినప్పుడు ఈ మూక అమాంతం అతనిపై విరుచుకుపడినట్లే ఉంటుంది.

72:20 قُلْ إِنَّمَا أَدْعُو رَبِّي وَلَا أُشْرِكُ بِهِ أَحَدًا

(ఓ ప్రవక్తా!) “నేనైతే కేవలం నా ప్రభువునే మొరపెట్టుకుంటాను, ఆయనకు సహవర్తులుగా ఎవరినీ చేర్చను” అని చెప్పు.

72:21 قُلْ إِنِّي لَا أَمْلِكُ لَكُمْ ضَرًّا وَلَا رَشَدًا

“మీకు కీడు (నష్టం)గానీ, మేలు (లాభం)గానీ చేకూర్చే అధికారం నాకు లేదు” అని (ఓ ప్రవక్తా!) చెప్పు.

72:22 قُلْ إِنِّي لَن يُجِيرَنِي مِنَ اللَّهِ أَحَدٌ وَلَنْ أَجِدَ مِن دُونِهِ مُلْتَحَدًا

“అల్లాహ్ పట్టు నుండి నన్నెవరూ రక్షించలేరు. నేను ఆయన ఆశ్రయం తప్ప వేరొకరి ఆశ్రయాన్ని పొందలేను” అని (ఓ ప్రవక్తా! వారికి) చెప్పు.


72:23 إِلَّا بَلَاغًا مِّنَ اللَّهِ وَرِسَالَاتِهِ ۚ وَمَن يَعْصِ اللَّهَ وَرَسُولَهُ فَإِنَّ لَهُ نَارَ جَهَنَّمَ خَالِدِينَ فِيهَا أَبَدًا

“అయితే నా బాధ్యతల్లా అల్లాహ్ వాణిని, ఆయన సందేశాలను (ప్రజలకు) అందజేయటమే. ఇక ఇప్పుడు ఎవరైనా అల్లాహ్ మాటను, అతని ప్రవక్త మాటను వినకపోతే వారికొరకు నరకాగ్ని ఉంది. అందులో వారు కలకాలం ఉంటారు.”

72:24 حَتَّىٰ إِذَا رَأَوْا مَا يُوعَدُونَ فَسَيَعْلَمُونَ مَنْ أَضْعَفُ نَاصِرًا وَأَقَلُّ عَدَدًا

ఎట్టకేలకు – వారికి వాగ్దానం చేయబడుతున్నది వారు చూసుకున్నప్పుడు, ఎవరి సహాయకులు బలహీనులో, ఎవరి సమూహం అతి తక్కువగా ఉందో వారే తెలుసుకుంటారు.

72:25 قُلْ إِنْ أَدْرِي أَقَرِيبٌ مَّا تُوعَدُونَ أَمْ يَجْعَلُ لَهُ رَبِّي أَمَدًا

(ఓ ప్రవక్తా! వారికి) చెప్పు : “మీతో వాగ్దానం చేయబడుతున్న విషయం (శిక్ష) సమీపంలోనే ఉందో లేక నా ప్రభువు దానికోసం దూరపు గడువును నిర్ణయిస్తాడో నాకు తెలియదు.”

72:26 عَالِمُ الْغَيْبِ فَلَا يُظْهِرُ عَلَىٰ غَيْبِهِ أَحَدًا

ఆయన అగోచర జ్ఞానం కలవాడు. తన అగోచర విషయాలను ఆయన ఎవరికీ తెలుపడు….

72:27 إِلَّا مَنِ ارْتَضَىٰ مِن رَّسُولٍ فَإِنَّهُ يَسْلُكُ مِن بَيْنِ يَدَيْهِ وَمِنْ خَلْفِهِ رَصَدًا

……తాను ఇష్టపడిన ప్రవక్తకు తప్ప! అయితే ఆ ప్రవక్తకు ముందూ, వెనుకా కూడా తన పహరాదారులను నియమిస్తాడు.

72:28 لِّيَعْلَمَ أَن قَدْ أَبْلَغُوا رِسَالَاتِ رَبِّهِمْ وَأَحَاطَ بِمَا لَدَيْهِمْ وَأَحْصَىٰ كُلَّ شَيْءٍ عَدَدًا

వారు తమ ప్రభువు సందేశాన్ని అందజేశారని తెలియటానికి (ఈ ఏర్పాటు జరిగింది). ఆయన వారి పరిసరాలన్నింటినీ పరివేష్టించి, ఒక్కో వస్తువును లెక్కపెట్టి ఉంచాడు.

అత్యంత పెద్ద నేరం, పాపం? – సలీం జామి’ఈ [ఆడియో & టెక్స్ట్]

అత్యంత పెద్ద నేరం, పాపం?
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/0m0vDeE36Cw [21 నిముషాలు]

ఈ ప్రసంగంలో షిర్క్ (బహుదైవారాధన) ఇస్లాంలో అత్యంత ఘోరమైన పాపం మరియు నేరం అనే అంశంపై దృష్టి సారించారు. సాధారణంగా ప్రజలు హత్య లేదా అత్యాచారం వంటి నేరాలను అతిపెద్దవిగా భావిస్తారని, కానీ ఖురాన్ మరియు హదీసుల ప్రకారం, అల్లాహ్‌కు భాగస్వాములను కల్పించడమే (షిర్క్) అన్నింటికన్నా పెద్ద పాపమని వక్త వివరిస్తారు. షిర్క్ యొక్క తీవ్రమైన పరిణామాలను, అంటే చేసిన మంచి పనులన్నీ వృధా కావడం, స్వర్గం నిషేధించబడటం మరియు నరకంలో శాశ్వత శిక్ష వంటి వాటిని ఖురాన్ ఆయతుల ద్వారా ఉటంకిస్తారు. ఇంకా, షిర్క్ రెండు రకాలుగా ఉంటుందని వివరిస్తారు: షిర్క్-ఎ-అక్బర్ (పెద్ద షిర్క్), ఇది ఇస్లాం నుండి బహిష్కరిస్తుంది, మరియు షిర్క్-ఎ-అస్గర్ (చిన్న షిర్క్). చిన్న షిర్క్‌లో అల్లాహ్ తప్ప ఇతరుల మీద ప్రమాణం చేయడం, తాయెత్తులు కట్టడం, మరియు రియా (ప్రదర్శన కోసం ఆరాధనలు చేయడం) వంటివి ఉంటాయని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల ద్వారా తెలియజేస్తారు. ప్రతి ముస్లిం ఈ ఘోరమైన పాపం నుండి దూరంగా ఉండాలని, తన ఆరాధనలను కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసమే చేయాలని వక్త ప్రబోధిస్తారు.

అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడైన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక, ఆమీన్.

رَبِّ اشْرَحْ لِي صَدْرِي وَيَسِّرْ لِي أَمْرِي وَاحْلُلْ عُقْدَةً مِّن لِّسَانِي يَفْقَهُوا قَوْلِي
[రబ్బిష్రహ్ లీ సద్రీ, వ యస్సిర్ లీ అమ్ రీ, వహ్ లుల్ ఉఖ్ దతమ్ మిల్ లిసానీ, యఫ్ ఖహూ ఖౌలీ]
(ఓ నా ప్రభూ! నా హృదయాన్ని నా కొరకు విశాలపరచు. నా కార్యాన్ని నాకు సులభతరం చెయ్యి. నా నాలుకలోని ముడిని విప్పు. ప్రజలు నా మాటను సులభంగా అర్థం చేసుకునేటట్లు చెయ్యి.) (20:25-28)

గౌరవనీయులైన ధార్మిక పండితులు, పెద్దలు మరియు ఇస్లామీయ సోదరులారా! ఈనాటి నా జుమా ప్రసంగ అంశం, షిర్క్ ఒక పెద్ద నేరం.

అభిమాన సోదరులారా, సాధారణంగా నేరాలన్నింటిలో పెద్ద నేరం ఏమిటి? పాపాలన్నింటిలో పెద్ద పాపం ఏమిటి? అని ప్రశ్నించినప్పుడు, ధర్మజ్ఞానము లేని వారు లేదా అంతంత మాత్రమే ధర్మజ్ఞానం ఉన్నవారు నేరాలన్నింటిలో పెద్ద నేరం అంటే, ప్రజల ప్రాణాలు హరించటం పెద్ద నేరం అని సమాధానం ఇస్తారు. మరి కొంతమంది అయితే అమ్మాయిలపై బలాత్కారాలు చేయటం, అత్యాచారాలు చేయటం పెద్ద నేరం అండి అని కొంతమంది సమాధానం ఇస్తారు. అలాగే మరికొంతమంది ప్రజల సొమ్ము దోచేయటం, లూటీలు చేయటం పెద్ద నేరం అండి అని ఈ విధంగా రకరకాల సమాధానాలు ఇస్తూ ఉంటారు.

నిజం ఏమిటంటే, ఇవన్నీ పెద్ద నేరాలే. కానీ వీటన్నింటికంటే కూడా ఒక పెద్ద నేరం ఉంది. అది బలాత్కారాలు చేయడం కంటే కూడా పెద్ద నేరము, లూటీలు దోపిడీలు చేయటం కంటే కూడా పెద్ద నేరము, ప్రజల ప్రాణాలు హరించటము కంటే కూడా పెద్ద నేరము. ఆ నేరం గురించి మాత్రము ఎక్కువ మందికి తెలియదు, చాలా తక్కువ మంది మాత్రమే ఆ దాని గురించి తెలుసుకొని ఉన్నారు. ఆ అంత పెద్ద నేరం ఏమిటి ఆ పెద్ద నేరం అంటే అభిమాన సోదరులారా, షిర్క్! బహుదైవారాధన. అల్లాహ్‌కు ఇతరులను సాటి కల్పించటం. ఇది పాపాలన్నింటిలో, నేరాలన్నింటిలో పెద్ద నేరము, పెద్ద పాపము.

అరే! అది అంత పెద్ద పాపం అని మీరు ఎలా చెప్పగలరండీ అని మీరు ప్రశ్నిస్తారేమో? ఇది నా మాట కాదు. నేను నా తరఫున ప్రకటిస్తున్న విషయము కాదు. అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం షిర్క్ బహుదైవారాధన పెద్ద నేరము అని పాపాలన్నింటిలో నేరాలన్నింటిలో పెద్ద నేరము అని ప్రకటించి ఉన్నారు.

మనం చూసినట్లయితే, సూరా లుఖ్మాన్‌లోని 13వ వాక్యంలో ఈ విధంగా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తెలియజేసి ఉన్నాడు:

إِنَّ الشِّرْكَ لَظُلْمٌ عَظِيمٌ
[ఇన్నష్షిర్క ల జుల్మున్ అజీమ్]
నిస్సందేహంగా అల్లాహ్‌కు భాగస్వాముల్ని కల్పించటం (షిర్క్‌ చేయటం) ఘోరమైన అన్యాయం (31:13)

అలాగే ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ఒక వ్యక్తి ఈ విధంగా ప్రశ్నించాడు. యా రసూలల్లాహ్, అయ్యు జంబి అక్బరు ఇందల్లాహ్? అల్లాహ్ దృష్టిలో పెద్ద నేరము ఏమిటి? అల్లాహ్ దృష్టిలో పెద్ద పాపము ఏమిటి? అని ఆ వ్యక్తి ప్రశ్నించగా, ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ వ్యక్తికి ఈ విధంగా సమాధానం ఇచ్చారు, అన్ తజ్ అల లిల్లాహి నిద్దన్ వహువ ఖలఖక. నీకు పుట్టించిన ప్రభువైన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తో ఇతరులను సాటి కల్పించడం, సహవర్తులుగా నిలబెట్టడం, ఇది నేరాలన్నింటిలో, పాపాలన్నింటిలో పెద్ద నేరము, పెద్ద పాపము అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ వ్యక్తికి సమాధానం ఇచ్చారు.

అలాగే మరొక సందర్భంలో శిష్యుల వద్ద ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రశ్నించారు. ఏమన్నారంటే, అలా ఉనబ్బిఉకుం బి అక్బరిల్ కబాయిర్? ఏమండీ నేను మీకు పాపాలలోనే పెద్ద పాపము, ఘోరాలలోనే పెద్ద ఘోరము, నేరాలలోనే పెద్ద నేరము దాని గురించి మీకు తెలుపనా అని తెలియజేశారు. శిష్యులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అన్నారు, బలా యా రసూలల్లాహ్. ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, తప్పనిసరిగా దాని గురించి మాకు మీరు తెలియజేయండి అనగా, అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మొదటిగా ప్రస్తావించిన విషయం ఏమిటంటే, అల్ ఇష్రాకు బిల్లాహ్. అల్లాహ్‌తో ఇతరులను సాటి కల్పించటం, అల్లాహ్‌కు సహవర్తులుగా ఇతరులను నిలబెట్టటం, ఇది పెద్ద పాపాలలోనే పెద్ద పాపము, పెద్ద నేరము అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ సందర్భంలో ప్రకటించారు.

అలాగే మరొక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుచర సమాజానికి ఏడు ప్రాణాంతకమైన విషయాల గురించి హెచ్చరించి ఉన్నారు. ఆయన ఏమన్నారంటే, ఇజ్తనిబుస్ సబ్అల్ మూబిఖత్. ఏడు ప్రాణాంతకమైన విషయాల నుండి మీరు దూరంగా ఉండండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి అన్నారు. ఆ ఏడు విషయాలు ఏమిటంటే అందులోని మొదటి విషయం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అష్షిర్కు బిల్లాహ్. అల్లాహ్‌తో ఇతరులను సహవర్తులుగా నిలబెట్టడం, షిర్క్ చేయటం, ఇది ఏడు ప్రాణాంతకమైన పాపాలలో మొదటి పాపము అన్నారు.

అభిమాన సోదరులారా! అటు అల్లాహ్ వాక్యము ద్వారా, ఇటు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పలుకుల ద్వారా మనకు ఒక విషయం మాత్రము స్పష్టంగా అర్థమైపోయింది, అది ఏమిటంటే షిర్క్ చేయటం, బహుదైవారాధన చేయటం, అల్లాహ్‌తో ఇతరులను సాటి కల్పించటం, ఇది ఘోరమైన నేరం, పెద్ద పాపము అని స్పష్టమయ్యింది.

ఇక రండి, ఈ షిర్క్ చేస్తే, ఈ పాపానికి ఎవరైనా ఒడిగడితే అతనికి జరిగే పరిణామం ఏమిటి? అతనికి జరిగే నష్టం ఏమిటి? అది కూడా మనము ఇన్షా అల్లాహ్ ఖురాన్ మరియు హదీసు గ్రంథాల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

షిర్క్ చేసే వ్యక్తికి కలిగే ఒక నష్టం ఏమిటంటే, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆ వ్యక్తికి స్వర్గం నుండి దూరంగా ఉంచేస్తాడు. ఎవరైతే షిర్క్‌కు పాల్పడతారో వారి కోసము స్వర్గం నిషేధించబడుతుంది. వారి నివాసం నరకమైపోతుంది. మనం చూసినట్లయితే ఖురాన్‌లోని సూరా మాయిదా 72వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు:

إِنَّهُ مَن يُشْرِكْ بِاللَّهِ فَقَدْ حَرَّمَ اللَّهُ عَلَيْهِ الْجَنَّةَ وَمَأْوَاهُ النَّارُ ۖ وَمَا لِلظَّالِمِينَ مِنْ أَنصَارٍ
ఎవడు అల్లాహ్‌కు సహవర్తులుగా ఇతరులను కల్పించాడో అలాంటి వానికోసం అల్లాహ్‌ స్వర్గాన్ని నిషేధించాడని తెలుసుకోండి. అతని నివాసం నరకాగ్ని. దుర్మార్గులకు సహాయపడే వాడెవడూ ఉండడు. (5:72)

అలాగే అభిమాన సోదరులారా, షిర్క్ చేసే వానికి కలిగే మరొక నష్టం ఏమిటంటే, అతని సత్కార్యాలు అన్నీ, అతని కర్మలన్నీ, అతని పుణ్యాలు అన్నీ తుడిచివేయబడతాయి. ఖురాన్‌లోని సూరా జుమర్ 65వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని హెచ్చరిస్తూ ఈ విధంగా తెలియజేస్తున్నాడు:

وَلَقَدْ أُوحِيَ إِلَيْكَ وَإِلَى الَّذِينَ مِن قَبْلِكَ لَئِنْ أَشْرَكْتَ لَيَحْبَطَنَّ عَمَلُكَ وَلَتَكُونَنَّ مِنَ الْخَاسِرِينَ
(ఓ ప్రవక్తా!) నిశ్చయంగా నీ వద్దకు, నీ పూర్వీకులైన ప్రవక్తల వద్దకు పంపబడిన సందేశం (వహీ) ఇది : “ఒకవేళ నువ్వు గనక బహుదైవారాధనకు పాల్పడితే నువ్వు చేసుకున్నదంతా వృధా అయిపోతుంది. మరి నిశ్చయంగా నువ్వు నష్టపోయినవారిలో చేర్తావు.” (39:65)

అల్లాహు అక్బర్. స్వయంగా ప్రవక్తలలో గొప్ప ప్రవక్త, అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తాకీదు చేస్తున్నాడు, ఒకవేళ నీవు గనుక షిర్క్‌కు పాల్పడినట్లయితే, నీ కర్మలన్నీ వృధా చేయబడతాయి అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆయనకే, అంత గొప్ప వ్యక్తికే అంత గొప్ప మహా ప్రవక్తకే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తాకీదు చేస్తున్నాడంటే, మీలాంటి, నాలాంటి, మనలాంటి సామాన్యమైన ప్రజల పరిస్థితి ఏమిటి అభిమాన సోదరులారా ఒక్కసారి ఆలోచించండి.

కాబట్టి ఇదే విషయము ఖురాన్‌లోని సూరా అన్ఆమ్ 88వ వాక్యంలో మనం చూచినట్లయితే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అక్కడ కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాడు:

ذَٰلِكَ هُدَى اللَّهِ يَهْدِي بِهِ مَن يَشَاءُ مِنْ عِبَادِهِ ۚ وَلَوْ أَشْرَكُوا لَحَبِطَ عَنْهُم مَّا كَانُوا يَعْمَلُونَ
ఇదీ అల్లాహ్‌ మార్గదర్శకత్వం. ఆయన తన దాసులలో తాను కోరిన వారిని ఈ మార్గంపై నడిపింపజేస్తాడు. ఒకవేళ వీరు సైతం, దైవత్వంలో భాగస్వామ్యానికి (షిర్కుకు) ఒడిగట్టి ఉంటే, వారు చేసుకున్న కర్మలన్నీ కూడా వృధా అయిపోయేవి. (6:88)

ఇక్కడ అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా కొంతమంది ప్రవక్తల ప్రస్తావన చేసి చివరికి ఏమంటున్నారంటే, ఇలాంటి ప్రవక్తలు కూడా ఒకవేళ షిర్క్‌కు పాల్పడినట్లయితే, బహుదైవారాధనకు గురైనట్లయితే, అల్లాహ్‌తో ఇతరులను సాటి కల్పించినట్లయితే, వారి సత్కార్యాలన్నీ వృధా అయిపోతాయి అంటున్నాడు. కాబట్టి దీని ద్వారా మనకు ఒక విషయం మాత్రము స్పష్టమవుతుంది, అదేమిటంటే అభిమాన సోదరులారా, ఏ వ్యక్తి అయితే షిర్క్ చేస్తాడో, ఏ వ్యక్తి అయితే అల్లాహ్‌తో ఇతరులను సహవర్తులుగా, సాటిగా నిలబెడతాడో, అతని సత్కార్యాలు అన్నీ అతని కర్మలన్నీ వృధా చేయబడతాయి.

అలాగే అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఒక్క విషయం మాత్రం చాలా స్పష్టంగా మనకు తెలియజేసి ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఆ విషయం మనము జీవితంలో ప్రతివేళ గుర్తు చేసుకుంటూ ఉండాలి. అదేమిటంటే సూరా నిసాలోని 48వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా స్పష్టంగా ఈ విషయాన్ని తెలియజేసి ఉన్నాడు:

إِنَّ اللَّهَ لَا يَغْفِرُ أَن يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَٰلِكَ لِمَن يَشَاءُ
తనకు భాగస్వామిగా మరొకరిని కల్పించటాన్ని (షిర్కును) అల్లాహ్‌ సుతరామూ క్షమించడు. ఇది తప్ప ఆయన తాను కోరిన వారి ఇతర పాపాలను క్షమిస్తాడు. (4:48)

అంటే తనకు భాగస్వామిగా మరొకరిని కల్పించటాన్ని షిర్క్‌ను అల్లాహ్ సుతరాము క్షమించడు. ఇది తప్ప ఆయన తాను కోరిన వారి ఇతర పాపాలను క్షమిస్తాడు. అంటే షిర్క్ తప్ప ఇతర పాపాలు మనిషి చేసి ఉంటే అల్లాహ్ తలిస్తే వాటిని క్షమించగలడేమో గానీ, షిర్క్‌ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా క్షమించడు అని ఈ వాక్యంలో స్పష్టంగా మనకు తెలియజేసి ఉన్నాడు. కాబట్టి, అభిమాన సోదరులారా, షిర్క్ పెద్ద నేరము అని, షిర్క్ క్షమించరాని నేరము అని, షిర్క్ వల్ల మనిషి స్వర్గానికి దూరమైపోతాడు, నరకానికి చేరుకుంటాడని, అతని కర్మలన్నీ వృధా చేయబడతాయని ఇంతవరకు విన్న విషయాలలో మనము అర్థం చేసుకున్నాము.

ఇక రండి, షిర్క్ గురించి మనం తెలుసుకోవాల్సిన మరొక విషయం ఉంది అదేమిటంటే, షిర్క్ రెండు రకాలు అభిమాన సోదరులారా. ఒకటి షిర్కె అక్బర్, రెండవది షిర్కె అస్గర్. షిర్కె అక్బర్ అంటే ఇప్పటివరకు మనం విన్నాము కదా, అల్లాహ్ దగ్గర చేయవలసిన కార్యాలు అల్లాహ్ వద్ద కాకుండా ఇతరుల వద్ద చేస్తే, అల్లాహ్‌కు ఇతరులను సాటి కల్పిస్తే అది షిర్కె అక్బర్ అవుతుంది. మరి షిర్కె అస్గర్ అంటే ఏమిటి? అభిమాన సోదరులారా, ఆ విషయము కూడా మనకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా స్పష్టంగా తెలియజేసి ఉన్నారు.

షిర్కె అస్గర్ రెండు రకాలు. చిన్న షిర్క్ రెండు రకాలు. ఒకటి బహిర్గతంగా కనిపించే షిర్క్, రెండవది కనిపించకుండా రహస్యంగా ఉండే షిర్క్.

బహిర్గతంగా కనిపించే చిన్న షిర్క్ ఏమిటి అంటే అభిమాన సోదరులారా, ఒకటి అల్లాహ్‌ను కాకుండా ఇతరుల మీద ప్రమాణం చేయటం. అల్లాహ్‌ను వదిలేసి ఇతరుల మీద ప్రమాణం చేయటం. మనం చూస్తూ ఉంటాం, ఏదైనా సందర్భంలో ఏదైనా ఒక మాట స్పష్టంగా ప్రజలకు నమ్మ జెప్పాలంటే చాలామంది ఏమంటుంటారంటే, నా తల్లి మీద నేను ప్రమాణం చేస్తున్నాను, నా తల్లి సాక్షిగా, నా బిడ్డల మీద నేను ప్రమాణం చేస్తున్నాను, నా బిడ్డల సాక్షిగా, నేను నడుపుతున్న బండి మీద నేను ప్రమాణం చేస్తున్నాను, ఈ బండి సాక్షిగా అని రకరకాల విషయాల మీద వాళ్లు ప్రమాణం చేస్తూ ఉంటారు. అయితే అభిమాన సోదరులారా, ఇలా చేయటం ధర్మ సమ్మతము కాదు. ఒకవేళ మనిషికి ప్రమాణం చేయటం తప్పనిసరి అయితే అతను కేవలం అల్లాహ్ పేరు మీద మాత్రమే ప్రమాణం చేయాలే గానీ ఇతరుల పేరు మీద ప్రమాణం చేయకూడదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఒకవేళ ఎవరైనా అల్లాహ్ పేరు మీద కాకుండా ఇతరుల పేరు మీద ప్రమాణం చేస్తే ఆ వ్యక్తి కూడా షిర్క్ చేసినట్లు అవుతుంది, చిన్న షిర్క్‌కు పాల్పడినట్లు అవుతుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పలుకులు వినండి, ఆయన తెలియజేశారు: మన్ హలఫ బిగైరిల్లాహి ఫఖద్ కఫర ఔ అష్రక. ఎవరైతే అల్లాహ్ కాకుండా ఇతరుల మీద ప్రమాణం చేస్తాడో అతను కుఫ్రుకు పాల్పడినట్లు లేదా షిర్క్‌కు పాల్పడినట్లు.

అలాగే అభిమాన సోదరులారా, చిన్న షిర్క్ యొక్క కనిపించే రెండో విషయం ఏమిటంటే, తాయెత్తులు వేలాడదీయటం. చాలామంది చేతుల్లో, మెడలలో, నడుము మీద, కాళ్ళ మీద తాయెత్తులు కట్టుకొని ఉంటారు. అభిమాన సోదరులారా, తాయెత్తులు కట్టటము కూడా ధర్మ సమ్మతము కాదు, నిషేధమైన కార్యము. ఎవరైనా వ్యక్తి తాయెత్తులు కట్టినట్లయితే అతను కూడా షిర్క్‌కు పాల్పడినట్లు అవుతుంది, అతను కూడా చిన్న షిర్క్ చేసినట్లు అవుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మన్ అల్లఖ తమీమతన్ ఫఖద్ అష్రక. ఎవరైతే తాయెత్తులు కట్టాడో అతను కూడా షిర్క్‌కు పాల్పడినట్లే.

ఇది చిన్న షిర్క్‌లో బహిర్గతంగా కనిపించే షిర్క్.

ఇక రండి అభిమాన సోదరులారా, చిన్న షిర్క్‌లో కనిపించకుండా రహస్యంగా ఉండే ఒక షిర్క్ ఉంది, అదేమిటంటే రియా అని తెలుగులో అంటారు, ప్రదర్శనా బుద్ధితో చేసే సత్కార్యాలు అని తెలుగులో అంటారు. ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నేను ఎక్కువగా ఈ షిర్కె అస్గర్ గురించి భయపడుతూ ఉన్నాను అన్నారు. శిష్యులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ప్రశ్నించారు, ఓ దైవ ప్రవక్త, ఈ చిన్న షిర్క్ అంటే ఏమిటండీ, దీని గురించి మీరు కంగారు పడుతున్నారు అని ప్రశ్నించగా అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఆయన పలుకులు వినండి, అఖ్వఫు మా అఖాఫు అలైకుం అష్షిర్కుల్ అస్గర్. ఖాలూ యా రసూలల్లాహ్ వమష్షిర్కుల్ అస్గర్? ఖాల అర్రియా. అంటే మీ విషయంలో నాకు అన్నిటికన్నా అధికంగా షిర్కె అస్గర్ చిన్న షిర్క్ గురించి భయమేస్తుంది. దైవ ప్రవక్త ఆ షిర్కె అస్గర్ అంటే ఏమిటి అని శిష్యులు అడిగినప్పుడు ఆయన అన్నారు, ప్రదర్శనా బుద్ధితో పని చేయటం.

అభిమాన సోదరులారా, ఒక వ్యక్తి నమాజు చేస్తున్నాడు, ఉపవాసాలు పాటిస్తున్నాడు, దానధర్మాలు చేస్తున్నాడు, జకాతు చెల్లిస్తున్నాడు, ఉమ్రా హజ్జులు ఆచరిస్తున్నాడు, అయితే అతను అల్లాహ్ ప్రసన్నత కోసం ఈ విషయాలన్నీ చేయట్లేదు గానీ ప్రజల దృష్టిలో నేను ఉత్తముడ్ని, భక్తుడ్ని అని నాకు పేరు ప్రతిష్టలు రావాలి అనే బుద్ధితో ఆ సంకల్పంతో అతను ఈ విషయాలు చేస్తే దీనినే రియా అంటారు, ప్రదర్శనా బుద్ధితో చేసిన సత్కార్యాలు అంటారు. ఇలా చేస్తే అభిమాన సోదరులారా, షిర్క్‌కు పాల్పడినట్లు అవుతుంది. ఎందుకంటే సత్కార్యాలు, ఆరాధనలు కేవలం అల్లాహ్ ప్రసన్నత కొరకు మాత్రమే చేయాలి గానీ ప్రదర్శనా బుద్ధితో చేయరాదు. ఎవరైనా ప్రదర్శనా బుద్ధితో చేస్తున్నట్టే అతను అల్లాహ్ ప్రసన్నత కోరుకోవట్లేదు గానీ ప్రజల ప్రసన్నత కోరుకుంటున్నాడు కాబట్టి అతను కూడా షిర్క్‌కు పాల్పడినట్లు అవుతుంది అభిమాన సోదరులారా.

అయితే మన బాధ్యత ఏమిటి? ఇప్పటివరకు మనం షిర్క్ గొప్ప షిర్క్ పెద్ద నేరమని తెలుసుకున్నాము. షిర్క్ రెండు రకాలు, షిర్క్ పెద్దది ఒకటి, చిన్నది ఒకటి అని తెలుసుకున్నాము. అలాగే పెద్ద షిర్క్‌కి, చిన్న షిర్క్‌కి ఉన్న తేడా ఏమిటో కూడా తెలుసుకోవాలి. అదేమిటంటే అభిమాన సోదరులారా, పెద్ద షిర్క్ చేసిన వారికి నరకశిక్ష విధించబడుతుంది, వారు స్వర్గం నుంచి దూరమైపోతారు, వారి సత్కార్యాలన్నీ వృధా చేయబడతాయి. అయితే చిన్న షిర్క్‌కు పాల్పడిన వారి సత్కార్యాలు మాత్రం వృధా చేయబడవు, వారికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తాత్కాలిక శిక్షలు వేసి మళ్లీ శిక్షలు ముగిసిన తర్వాత స్వర్గానికి పంపించడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ప్రదర్శనా బుద్ధితో ఏ ఏ సత్కార్యాలు ఆరాధనలు వారు చేసి ఉంటారో కేవలం ఆ సత్కార్యాలు, ఆ ఆరాధనలు మాత్రమే వృధా చేయబడతాయి.

కాబట్టి అభిమాన సోదరులారా, ఒక భక్తునిగా మనందరి బాధ్యత ఏమిటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము షిర్క్‌కి పాల్పడకూడదు. అందుకోసమే మనం చూచినట్లయితే గొప్ప గొప్ప భక్తులు ఎవరైతే గతించారో, వారు మరణించే ముందు వారి సంతానాన్ని పిలిచి షిర్క్‌కు పాల్పడవద్దు అని తాకీదు చేసి మరీ మరణించారు.

ఖురాన్‌లో లుక్మాన్ అలైహిస్సలాం వారి గురించి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రస్తావించి ఉన్నాడు. సూరా లుక్మాన్‌లో లుక్మాన్ అలైహిస్సలాం ఆయన కుమారుని పిలిచి ఏమంటున్నారంటే, “ఓ కుమారా, నీవు షిర్క్‌కు పాల్పడవద్దు. ఎందుకంటే షిర్క్ పెద్ద నేరము, ఘోరమైన పాపము కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నీవు షిర్క్‌కు పాల్పడవద్దు” అని తెలియజేశారు.

అదేవిధంగా ప్రవక్తలు, ఇతర గొప్ప గొప్ప భక్తులు వారి సంతానానికి, అనుచర సమాజానికి తెలియజేసిన విషయం ఏమిటంటే, ఎట్టి పరిస్థితుల్లో మీరు అల్లాహ్‌ను వదిలి ఇతరులను ఆరాధించకండి, అల్లాహ్‌కు ఇతరులను సహవర్తులుగా సాటిగా కల్పించకండి, మీకు నిలువునా చీల్చేసేసినా సరే, మీకు సజీవంగా దహనం చేసేసినా సరే మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బహుదైవారాధన, షిర్క్ చేయవద్దు, చేయవద్దు, చేయవద్దు అని తెలియజేసి ఉన్నారు.

కాబట్టి అభిమాన సోదరులారా, మనందరి బాధ్యత ఏమిటంటే మనం కేవలం అల్లాహ్‌నే ఆరాధించాలి, అల్లాహ్ మీదే నమ్మకం ఉంచాలి, ఆయన ప్రసన్నత కోసం మాత్రమే సత్కార్యాలు చేయాలి. అల్లాహ్‌తో నేను దుఆ చేస్తున్నాను, అల్లాహ్ మనందరికీ షిర్క్ నుండి కాపాడి, అల్లాహ్ ప్రసన్నత కోసం అల్లాహ్ ఆరాధనలు చేయడానికి మల్లా మనందరికీ భాగ్యము కల్పించు గాక.

అఖూలు ఖౌలి హాజా అస్తగ్ ఫిరుల్లాహ్ లీ వలకుం వలి సాయిరిల్ ముస్లిమీన ఫస్తగ్ఫిరూహు ఇన్నహు హువల్ గఫూరుర్ రహీమ్.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=17133

ప్రవక్తల జీవిత చరిత్ర (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2_iYX30U89yPwY5LPGtir8

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7

అల్లాహ్ యేతరులతో దుఆ చేయు నష్టాలు [వీడియో & టెక్స్ట్]

అల్లాహ్ యేతరులతో దుఆ చేయు నష్టాలు (خطورة الدعاء مع غير الله)
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

https://www.youtube.com/watch?v=k3vxVbMjq6g [27 నిముషాలు]

ఈ ప్రసంగంలో, వక్త దుఆ (ప్రార్థన) యొక్క ప్రాముఖ్యత మరియు దానిని సరైన పద్ధతిలో ఎలా చేయాలో ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా వివరిస్తున్నారు. దుఆ కేవలం అల్లాహ్ కే చెందాలని, ఆయనను కాకుండా ఇతరులను ప్రార్థించడం షిర్క్ (బహుదైవారాధన) మరియు కుఫ్ర్ (అవిశ్వాసం) అవుతుందని స్పష్టం చేస్తున్నారు. దుఆయే అసలైన ఇబాదత్ (ఆరాధన) అని, ఇతరులతో దుఆ చేయడం మహా అన్యాయం మరియు దౌర్జన్యం అని నొక్కిచెప్పారు. అల్లాహ్ ను వదిలి ప్రార్థించబడే వారికి ఎలాంటి శక్తి లేదని, వారు మన మొరలు వినలేరని, సహాయం చేయలేరని మరియు ప్రళయ దినాన మనకు శత్రువులుగా మారిపోతారని ఖురాన్ ఆయతుల ద్వారా హెచ్చరిస్తున్నారు. కాబట్టి, ప్రతి ఒక్కరూ తమ కష్టసుఖాలలో కేవలం ఏకైక అల్లాహ్ ను మాత్రమే వేడుకోవాలని ఈ ప్రసంగం యొక్క సారాంశం.

అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.
అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్.

సోదర సోదరీమణులారా! దుఆ అల్లాహ్ యేతరులతో చేయడం ఎంత నష్టమో ఎప్పుడైనా మనం గమనించామా? ఈరోజు ఈ అతి ముఖ్యమైన శీర్షికకు సంబంధించిన కొన్ని ఆయతులు దివ్య ఖురాన్ ద్వారా మరియు ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఒక రెండు హదీసులు కూడా మనం విందాము.

మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ముందు ఎందరు ప్రవక్తలు గతించారో, వారందరి జాతి వారు ఏ రకమైన షిర్క్ కు పాల్పడ్డారో అందులో అతి భయంకరమైనది, వారిని నరకంలో పడవేసినది అది దుఆ మిన్ దూనిల్లాహ్. అల్లాహ్ తప్ప ఇతరులతో దుఆ చేయడం. ఉదాహరణకు ఎవరైనా అనారోగ్యానికి గురవుతారు, ఎవరిపైనా ఏదైనా కష్టాలు ఆపదలు వస్తాయి, ఎవరికైనా సంతానం కలగదు. ఈ రోజు మనం సమాజంలో చూస్తున్నాము, వారు అల్లాహ్ ను కాకుండా ఇతరులను అర్ధిస్తారు, ఇతరులను ప్రార్థిస్తారు, ఇతరులతో దుఆ చేస్తారు. వారికి సంతానం కలగాలని, వారికి ఆరోగ్యం ప్రాప్తించాలని, వారి కష్టాలు దూరమైపోవాలని. ఇది ఎంత ఘోరమైన పాపమో ఎప్పుడైనా మనం ఆలోచించామా? అయితే నేను ఎక్కువ సమయం తీసుకోకుండా ఖురాన్ ఆయతుల ఆధారంగా కొన్ని ముఖ్య విషయాలు చెబుతున్నాను, ఈ ముఖ్యమైన శీర్షికకు సంబంధించినది. మీరు శ్రద్ధగా వింటారని ఆశిస్తున్నాను.

ఇందులో మొదటి విషయం, అసలు దుఆ ఎవరి హక్కు? అంటే మనం దాసులము, ఎవరితో దుఆ చేయాలి? దీని గురించి ఖురాన్ చాలా స్పష్టంగా మనకు తెలియజేసింది.

సూరతుర్ రాద్, సూర నెంబర్ 13, ఆయత్ నెంబర్ 14 లో అల్లాహ్ త’ఆలా తెలిపాడు:

لَهُ دَعْوَةُ الْحَقِّ
(లహు ద’వతుల్ హఖ్)
దుఆ యొక్క హక్కు కేవలం అల్లాహ్ ది మాత్రమే.” (13:14)

ఆయన తప్ప ఇంకా ఎవరితో దుఆ చేయడం ఇది న్యాయం, ధర్మం ఎంత మాత్రం కాదు.

ఇంకా, సూరె లుఖ్మాన్, ఆయత్ నెంబర్ 30 లో అల్లాహ్ తెలిపాడు:

وَأَنَّ مَا يَدْعُونَ مِن دُونِهِ الْبَاطِلُ
(వ అన్న మా యద్ఊన మిన్ దూనిహిల్ బాతిల్)
అల్లాహ్ తప్ప వారు ఎవరెవరితో దుఆ చేస్తున్నారో ఇదంతా కూడా వ్యర్థం, వృధా, అసత్యం.” (31:30)

అల్లాహు అక్బర్, గమనించారా? స్వయంగా మన సృష్టికర్త అయిన అల్లాహ్, మనం ఎవరితో దుఆ చేయాలని మనకు ఆదేశించాడు? ఈ విషయానికి వస్తే, ఖురాన్ లో ఒక సందర్భంలో కాదు, ఎన్నో చోట్ల. ఉదాహరణకు, సూరతు గాఫిర్, దాని యొక్క మరొక పేరు సూరతుల్ మూమిన్, ఆయత్ నెంబర్ 60 లో తెలిపాడు:

وَقَالَ رَبُّكُمُ ادْعُونِي أَسْتَجِبْ لَكُمْ
(వ ఖాల రబ్బుకుముద్ ఊనీ అస్తజిబ్ లకుమ్)
మీరు నన్నే ప్రార్థించండి. నేను మీ ప్రార్థనలను ఆమోదిస్తాను (40:60)

వ ఖాల రబ్బుకుమ్, మీ ప్రభువు మీకు ఈ ఆదేశం ఇస్తున్నాడు, ఉద్’ఊనీ, మీరు నాతో మాత్రమే దుఆ చేయండి, అస్తజిబ్ లకుమ్, నేను మీ దుఆలను అంగీకరిస్తాను. అల్లాహు అక్బర్, గమనించారా? నేను మీ దుఆలను అంగీకరిస్తాను అంటున్నాడు అల్లాహ్ త’ఆలా.

ఇంకా సోదర మహాశయులారా, దుఆ ఇది అసలైన ఇబాదత్, అసలైన ఆరాధన, అసలైన ప్రార్థన, దుఆ. ఇదే సూరత్, సూరత్ గాఫిర్, సూరతుల్ మూమిన్ ఆయత్ నెంబర్ 60 లో, అల్లాహ్ ఇలా తెలియజేశాడు:

وَقَالَ رَبُّكُمُ ادْعُونِي أَسْتَجِبْ لَكُمْ ۖ إِنَّ الَّذِينَ يَسْتَكْبِرُونَ عَنْ عِبَادَتِي سَيَدْخُلُونَ جَهَنَّمَ دَاخِرِينَ

మరి మీ ప్రభువు ఏమంటున్నాడంటే, “మీరు నన్నే ప్రార్థించండి. నేను మీ ప్రార్థనలను ఆమోదిస్తాను. నా దాస్యం పట్ల గర్వాహంకారం ప్రదర్శించేవారు త్వరలోనే అవమానితులై నరకంలో ప్రవేశించటం తథ్యం.”( 40:60)

దుఆ యొక్క ఆదేశం ఇచ్చిన వెంటనే, నా ఆరాధన పట్ల ఎవరైతే అహంకారానికి గురి అవుతాడో అని అంటున్నాడు అల్లాహ్ త’ఆలా, దుఆను ఆరాధన, దుఆ అసలైన ఇబాదత్ అని తెలిపాడు. ఎవరైతే దుఆ చేయరో అల్లాహ్ త’ఆలా తో, ఏం జరుగుతుంది? సయద్ ఖులూన జహన్నమ దాఖిరీన్. అవమానకరంగా వారు నరకంలో ప్రవేశిస్తారు. అల్లాహు అక్బర్. ఇంకా సోదర మహాశయులారా, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు,

الدُّعَاءُ هُوَ الْعِبَادَةُ
(అద్దుఆఉ హువల్ ఇబాదహ్)
దుఆ అసలైన ఇబాదత్.

మళ్ళీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇదే సూర గాఫిర్ యొక్క ఆయత్ పారాయణం చేశారు.

అంతేకాదు సోదరులారా, ఒకవైపున అల్లాహ్ త’ఆలా నాతోనే దుఆ చేయండి అని ఏదైతే ఆదేశించాడో, ఇతరుల ఎవరితోనీ దుఆ చేయకండి అని కూడా చెప్పాడు. ఇతరులతో దుఆ చేయడం నిషేధించాడు, వారించాడు. ఉదాహరణకు, సూరత్ యూనుస్ ఆయత్ నెంబర్ 106 లో తెలిపాడు:

وَلَا تَدْعُ مِن دُونِ اللَّهِ
(వలా తద్’ఉ మిన్ దూనిల్లాహ్)
అల్లాహ్ ను వదిలి మీరు ఎవరినీ అర్ధించకండి, ఎవరితో దుఆ చేయకండి.” (10:106)

సూరతుల్ ఖసస్ ఆయత్ నెంబర్ 88 లో చెప్పాడు:

وَلَا تَدْعُ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ
(వలా తద్’ఉ మ’అల్లాహి ఇలాహన్ ఆఖర్)
అల్లాహ్‌తో పాటు మరే దేవుణ్ణీ మొరపెట్టుకోకు. (28:88)

అల్లాహ్ తో పాటు ఇంకా ఎవరితోనీ కూడా, అల్లాహ్ తో పాటు వేరే ఏ దైవమైనా ఉన్నాడు అని భావించి వారితో మీరు దుఆ చేయకండి. సోదర మహాశయులారా, సూరత్ యూనుస్ మరియు సూరతుల్ ఖసస్ లోని ఈ రెండు ఆయతుల ద్వారా మనకు విషయం ఏం తెలిసింది? అల్లాహ్ తో దుఆ చేయడంతో పాటు ఇతరులతో చేయడం ఇది కూడా నిషేధం. అల్లాహ్ ను వదిలి వేరే ఎవరితోనైనా చేయడం ఇది కూడా నిషిద్ధం. మరి చేయవలసింది ఏంటిది? సూర గాఫిర్ లో మనం తెలుసుకున్నాము, కేవలం అల్లాహ్ తో మాత్రమే దుఆ చేయాలి.

అయితే, అల్లాహ్ తప్ప ఇతరులతో దుఆ చేయడం వల్ల మనకు నష్టం ఏమిటి? మహా భయంకరమైన నష్టం. అల్లాహ్ తో పాటు ఇతరులతో దుఆ చేయడం గాని, అల్లాహ్ ను వదిలి ఇతరులతో దుఆ చేయడం గాని, ఇది షిర్క్ మరియు కుఫ్ర్ లోకి వస్తుంది. బహుదైవారాధనలో లెక్కించడం జరుగుతుంది. సత్య తిరస్కారంలో లెక్కించడం జరుగుతుంది.

సూరతున్ నహల్ ఆయత్ నెంబర్ 86 గమనించండి.

وَإِذَا رَأَى الَّذِينَ أَشْرَكُوا شُرَكَاءَهُمْ
(వ ఇదా ర అల్లజీన అష్రకూ షురకాఅహుమ్)
ఈ ముష్రిక్కులు తాము (అల్లాహ్‌కు) భాగస్వాములుగా నిలబెట్టే వారిని చూడగానే..”

షిర్క్ చేసినటువంటి వారు, అల్లాహ్ తో పాటు ఇతరులను భాగస్వాములుగా కల్పించిన వారు తమ భాగస్వాములను చూస్తారు. ఎప్పుడు ఇది? ప్రళయ దినాన. చూసి ఏమంటారు?

قَالُوا رَبَّنَا هَٰؤُلَاءِ شُرَكَاؤُنَا الَّذِينَ كُنَّا نَدْعُو مِن دُونِكَ
(ఖాలూ రబ్బనా హాఉలాఇ షురకాఉనల్లజీన కున్నా నద్’ఊ మిన్ దూనిక్)
“ఓ మా ప్రభూ! మేము నిన్ను వదిలేసి మొరపెట్టుకున్న మా భాగస్వాములు వీరే” అని అంటారు” (16:86)

గమనిస్తున్నారా సోదరులారా? చదవండి మీరు సూరతున్ నహల్, సూర నెంబర్ 16, ఆయత్ నెంబర్ 86. ప్రళయ దినాన అందరూ హాజరవుతారు కదా, దుఆ చేసిన వారు ఎవరితోనైతే దుఆ చేయడం జరిగిందో. ఎప్పుడైతే వారిని చూస్తారో, “ఓ మా ప్రభువా, నిన్ను వదిలి మేము వారితో దుఆ చేసాము, వారిని మేము నీకు భాగస్వామిగా చేసాము. ఈరోజు వారు మాకు ఏమీ లాభం చేయడం లేదు” అని మొరపెట్టుకుంటారు. అయితే ఈ ఆయత్ లో మనకు చాలా స్పష్టంగా తెలిసింది, వారు స్వయంగా ఒప్పుకుంటున్నారు మేము ఈ షిర్క్ పని చేసాము అని.

అయితే, సూరతుల్ ఆరాఫ్, సూర నెంబర్ 7, ఆయత్ నెంబర్ 37 కూడా మీరు గమనించండి. మీరు కూడా స్వయంగా తెలుగు ఖురాన్ అనువాదాలు తీసి చదవండి, చూడండి, పరిశీలించండి. ఒక విషయం.. క్షమించండి, నేను నా టాపిక్ కు కొంచెం దూరమై ఒక విషయం మీకు అర్థం కావడానికి తెలియజేస్తున్నాను. మనం జానెడు కడుపులో పోయే కూడు తినడానికి మార్కెట్ లోకి వెళ్లి బియ్యం ఏ రకమైనది, ఈ టమాటాలు పాడు అయినాయా, మంచియా, ఉల్లిగడ్డ మంచిగుందా లేదా, ఈ కూరగాయలు మంచియా లేవా, ఒక్కొక్కటి ఏరుకొని మంచి మంచివి తీసుకొని వస్తాము కదా. మన స్వర్గం విషయానికి, ఏ ధర్మ జ్ఞానం మనం నేర్చుకోవాల్సి ఉందో దానిని కూడా మనం వెతకాలి, పరిశీలించాలి, సత్యం ఏదో తెలుసుకోవాలి. సూరతుల్ ఆరాఫ్ ఆయత్ నెంబర్ 37:

حَتَّىٰ إِذَا جَاءَتْهُمْ رُسُلُنَا يَتَوَفَّوْنَهُمْ قَالُوا أَيْنَ مَا كُنتُمْ تَدْعُونَ مِن دُونِ اللَّهِ ۖ قَالُوا ضَلُّوا عَنَّا وَشَهِدُوا عَلَىٰ أَنفُسِهِمْ أَنَّهُمْ كَانُوا كَافِرِينَ

ఆఖరికి మా దూతలు వారి ప్రాణాలు స్వాధీనం చేసుకోవటానికి వారివద్దకు వచ్చినప్పుడు “అల్లాహ్‌ను వదలి మీరు ఆరాధిస్తూ ఉన్నవారు ఇప్పుడెక్కడున్నారు?” అని అడుగుతారు. “వారంతా మా వద్ద నుంచి మటుమాయమై పోయారు” అని వాళ్ళు చెబుతారు. తాము అవిశ్వాసులుగా ఉండేవారన్న విషయాన్ని గురించి వారు స్వయంగా సాక్ష్యమిస్తారు.. (7:37)

అప్పుడు వారు తమకు తాము సాక్ష్యం పలుకుతారు, “అయ్యో, మేము ఎంత కుఫ్ర్ పని చేసాము, ఎంత అవిశ్వాసానికి పాల్పడే పని చేసాము, సత్య తిరస్కారంలో మేము పడి ఉన్నాము“. అయితే ఏం తెలిసింది? అల్లాహ్ తో కాకుండా లేదా అల్లాహ్ తో పాటు ఇతరులతో దుఆ చేయడం షిర్క్, కుఫ్ర్ లో వస్తుంది మరియు వారు ఏమీ వారికి లాభం చేకూర్చలేదు. వారు ఏమీ లాభం చేకూర్చరు అన్న విషయం ఇంకా ఎన్నో ఆయతుల ద్వారా ఇన్ షా అల్లాహ్ నేను తెలియజేస్తున్నాను.

అంతేకాదు సోదర మహాశయులారా, అల్లాహ్ ను వదిలి లేదా అల్లాహ్ తో పాటు ఇంకా వేరే వారితో కూడా దుఆ చేయడం ఇది మహా అన్యాయం, మహా దౌర్జన్యం. ఏ కొందరు యువకులు తమ జాతి వారిని ఎదిరించి, జాతి వారందరూ కూడా షిర్క్ పనులు చేస్తున్నారు, తౌహీద్ కు దూరమై ఉన్నారు, వారు కేవలం అల్లాహ్ ను మాత్రమే, కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలి అన్న తపనతో తమ గ్రామం నుండి కూడా దూరమయ్యారు. ఆ సందర్భంలో వారు ఏమంటారు, సూరతుల్ కహఫ్ ఆయత్ నెంబర్ 14:

لَّن نَّدْعُوَ مِن دُونِهِ إِلَٰهًا ۖ لَّقَدْ قُلْنَا إِذًا شَطَطًا
(లన్ నద్’ఉవ మిన్ దూనిహి ఇలాహన్, లఖద్ ఖుల్నా ఇదన్ షతతా)
మేము ఆయన్ని తప్ప వేరొక ఆరాధ్య దైవాన్ని పిలవటమన్నది జరగని పని. ఒకవేళ మేము గనక అలా చేస్తే ఎంతో దుర్మార్గపు మాటను పలికిన వారమవుతాము.” (18:14)

లన్ నద్’ఉవ మిన్ దూనిహీ ఇలాహా. మేము అల్లాహ్ ను వదిలి వేరే ఏ భూటకపు దైవాలను మేము ఆరాధించము. అల్లాహ్ ను వదిలి వేరే ఏ దైవంతో మేము దుఆ చేయము. ప్రజలు ఎవరెవరినైతే దైవాలుగా భావిస్తున్నారో, వారి దృష్టిలో, వారి యొక్క అభిప్రాయం ప్రకారం వారు దేవుళ్ళు కావచ్చు, కానీ సత్యమైన దేవుడు కేవలం అల్లాహ్. సత్యమైన ఆరాధ్యుడు కేవలం అల్లాహ్. ఆయన్ని తప్ప మేము ఇంకా ఎవరితో దుఆ చేయము. లఖద్ ఖుల్నా ఇజన్ షతతా. ఒకవేళ మేము ఇలా చేసి ఉంటే ఇది మహా దౌర్జన్యం అయిపోతుంది. గమనించారా? 

అంతేకాదు, అల్లాహ్ ను తప్ప వేరే ఎవరితోనైనా దుఆ చేయడం, అల్లాహ్ తో పాటు ఇంకా వేరే ఎవరితోనైనా దుఆ చేయడం… మహాశయులారా, ఇది అల్లాహ్ యొక్క శిక్షకు గురి చేసే విషయం. అవును, అల్లాహ్ యొక్క శిక్షకు గురి చేసే విషయం. చదవండి ఖురాన్ లో. సూరతుష్ షుఅరా ఆయత్ నెంబర్ 213 లో అల్లాహ్ తెలిపాడు:

فَلَا تَدْعُ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ فَتَكُونَ مِنَ الْمُعَذَّبِينَ
(ఫలా తద్’ఉ మ’అల్లాహి ఇలాహన్ ఆఖర ఫతకూన మినల్ ము’అద్దబీన్)
కనుక (ఓ ప్రవక్తా!) నువ్వు అల్లాహ్‌తోపాటు మరే ఇతర దైవాన్నీ మొరపెట్టుకోకు. నువ్వుగాని అలా చేశావంటే శిక్షించబడేవారిలో చేరిపోతావు సుమా!” (26:213)

ఫలా తద్వు మఅల్లాహి ఇలాహన్ ఆఖర్. అల్లాహ్ తో పాటు ఇంకా వేరే ఏ దైవంతో మీరు దుఆ చేయకండి. ఫతకూన మినల్ ముఅజ్జబీన్. అలా చేశావంటే, అలా చేశారంటే శిక్ష ఇవ్వబడిన వారిలో ఎవరికైతే శిక్ష పడుతుందో వారిలో మీరు కలిసిపోతారు. అల్లాహు అక్బర్. అల్లాహ్ మనందరిని ఇహలోకం, పరలోకం అన్ని రకాల శిక్షల నుండి దూరం చేయుగాక, దూరం ఉంచుగాక. మరియు శిక్షలకు గురి చేసే ప్రతి పాపం నుండి కూడా అల్లాహ్ మనల్ని దూరం ఉంచుగాక.

అంతేకాదు, చివరిలో ఒక రెండు ముఖ్యమైన విషయాలు అవేమిటంటే, అల్లాహ్ ను కాకుండా ఎవరినైతే ఆరాధిస్తారో, అల్లాహ్ ను కాకుండా లేదా అల్లాహ్ తో పాటు ఇంకా వేరే ఎవరితోనైతే దుఆ చేస్తారో, వారిలో ఏ శక్తి లేదు. మన మొరలు వినడానికి, మనం వేడుకునే వాటిని ఇవ్వడానికి, మన కష్ట దుఃఖాలు దూరం చేయడానికి, సుఖాలు ప్రసాదించడానికి, ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఇవ్వడానికి వారిలో ఏ శక్తి లేదు అని అల్లాహ్ చాలా స్పష్టంగా తెలిపాడు. ఒకవేళ వాస్తవంగా అల్లాహ్ ను నమ్మేవారయ్యేది ఉంటే ఈ ఆయతులను చాలా శ్రద్ధగా మనం అర్థం చేసుకోవాలి. సూరత్ ఫాతిర్, ఆయత్ నెంబర్ 13, 14.

وَالَّذِينَ تَدْعُونَ مِن دُونِهِ مَا يَمْلِكُونَ مِن قِطْمِيرٍ
(వల్లదీన తద్’ఊన మిన్ దూనిహి మా యమ్లికూన మిన్ ఖిత్మీర్)
ఆయన్ని వదలి మీరు ఎవరెవరిని పిలుస్తున్నారో వారు ఖర్జూరపు టెంకపై ఉండే పొరకు కూడా యజమానులు కారు.” (35:13)

إِن تَدْعُوهُمْ لَا يَسْمَعُوا دُعَاءَكُمْ وَلَوْ سَمِعُوا مَا اسْتَجَابُوا لَكُمْ ۖ وَيَوْمَ الْقِيَامَةِ يَكْفُرُونَ بِشِرْكِكُمْ ۚ وَلَا يُنَبِّئُكَ مِثْلُ خَبِيرٍ
ఒకవేళ మీరు వారిని మొర పెట్టుకున్నా, వారు మీ మొరను ఆలకించరు. ఒకవేళ ఆలకించినా, మీ అక్కరను తీర్చలేరు. పైపెచ్చు ప్రళయదినాన మీరు కల్పించే భాగస్వామ్యాన్ని (షిర్క్‌ను) వారు (సూటిగా) త్రోసిపుచ్చుతారు. అన్నీ తెలిసిన దేవుని మాదిరిగా (సావధానపరిచే సమాచారాన్ని) నీకు తెలిపే వాడెవడూ ఉండడు సుమా! (35:14)

(వల్లజీన తద్వూన మిన్ దూనిహీ). మీరు అల్లాహ్ ను వదిలి ఎవరినైతే దుఆ చేస్తారో, ఎవరితోనైతే దుఆ చేస్తారో, (మా యమ్లికూన మిన్ కిత్మీర్). ఖర్జూరపు బీజము మీద ఉండేటువంటి సన్నని ఆ పొర. అంతమాత్రం కూడా వారికి ఏ శక్తి లేదు. (ఇన్ తద్వూహుం లా యస్మవూ దుఆఅకుం). మీరు వారితో దుఆ చేస్తే మీ దుఆలను వారు వినలేరు. గమనించండి. సూరత్ ఫాతిర్ ఆయత్ 13, 14. మీరు అల్లాహ్ ను వదిలి ఎవరితోనైతే దుఆ చేస్తారో, వారు ఖర్జూరపు బీజము మీద ఉండేటువంటి సన్నని ఆ పొర ఏదైతే ఉంటుందో అంత మందం కూడా శక్తి కలిగి లేరు. మీరు వారిని అడిగితే, వారితో దుఆ చేస్తే వారు వినరు. కానీ ఈ రోజుల్లో ఎంతో మంది ఉన్నారు కదా, వింటారు అన్నటువంటి మూఢనమ్మకంలో. అయితే అల్లాహ్ ఏమంటున్నాడో చూడండి. (వలవ్ సమీవూ మస్తజాబూ లకుం). మీ మూఢనమ్మకాల ప్రకారంగా వారు వింటారు అని ఏదైతే అనుకుంటున్నారో, అలా జరిగినా ఎప్పుడైనా, ఏదైనా సందర్భంలో ఒక పరీక్షగా మేము వారికి వినిపించినా, వారు మీ దుఆలకు సమాధానం చెప్పలేరు.

(వ యౌమల్ ఖియామతి యక్ఫురూన బిషిర్కికుం). మీరు ఈ షిర్క్ ఏదైతే చేస్తున్నారో, దుఆ ఇతరులతో చేసి ఏ భాగస్వామ్యం కల్పింపజేస్తున్నారో, దీనిని వారు ప్రళయ దినాన తిరస్కరిస్తారు. (వలా యునబ్బిఉక మిస్లు ఖబీర్). సూక్ష్మ జ్ఞాని అయిన అల్లాహ్ ఆయన తెలిపినటువంటి విషయాలు మీకు తెలిపేవాడు ఇంకా వేరే ఎవడు లేడు.

అలాగే సోదర మహాశయులారా, సూరత్ సబా ఆయత్ నెంబర్ 22 ఒకసారి గమనించండి మీరు.

قُلِ ادْعُوا الَّذِينَ زَعَمْتُم مِّن دُونِ اللَّهِ ۖ لَا يَمْلِكُونَ مِثْقَالَ ذَرَّةٍ فِي السَّمَاوَاتِ وَلَا فِي الْأَرْضِ وَمَا لَهُمْ فِيهِمَا مِن شِرْكٍ وَمَا لَهُ مِنْهُم مِّن ظَهِيرٍ

(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : అల్లాహ్‌ను వదలి మీరు ఎవరెవరినయితే ఊహించుకుంటున్నారో వారందరినీ పిలిచి చూడండి. భూమ్యాకాశాలలో వారికి రవంత అధికారంగానీ, వాటిలో వారికి ఎలాంటి వాటాగానీ లేదు. వారిలో ఏ ఒక్కడూ అల్లాహ్‌కు సహాయకుడు కూడా కాడు. (34:22)

(ఖులిద్ వుల్లజీన జఅంతుం మిన్ దూనిల్లాహ్). మీ మూఢనమ్మకం ప్రకారం అల్లాహ్ ను వదిలి ఎవరెవరిని మీరు ఆరాధిస్తారో, ఎవరెవరిని పూజిస్తారో, ఎవరెవరితో దుఆ చేస్తారో, (ఉద్వూ), మీరు దుఆ చేసి చూడండి. వారిలో ఏముంది? (లా యమ్లికూన మిస్కాల జర్రతిన్ ఫిస్సమావాతి వలా ఫిల్ అర్జ్). ఆకాశాల్లో, భూమిలో రవ్వంత దానికి వారు అధికారం కలిగి లేరు. అల్లాహు అక్బర్. అల్లాహు అక్బర్. ఇంతకుముందు ఏం చెప్పాడు? సూరె ఫాతిర్ లో, ఖర్జూరపు బీజం మీద ఉండేటువంటి ఒక పొర అంతటి అధికారం కూడా వారికి లేదు. ఇక్కడ జర్రహ్, అణువు. కళ్ళతో కనబడదు మనకు. అంతటి అధికారం కూడా వారిలో లేదు. ఇంకా, (వమాలహుం ఫీహిమా మిన్ షిర్క్). భూమి ఆకాశాల్లో వారికి ఏ భాగస్వామ్యం లేదు.

అల్లాహ్ క్షమించుగాక, అల్లాహ్ కు కాదు ఒక ఉదాహరణ, పోలిక, మనకు అర్థం కావడానికి ఒక చిన్న విషయం తెలియజేస్తున్నాను. కొన్ని సందర్భంలో ఏమవుతుంది? నా వద్ద ఒక్క పైసా కూడా లేకపోవచ్చు. కానీ నేను ఒకరితో బిజినెస్ లో పార్ట్నర్ కావచ్చు కదా. ఏదైనా పనిలో నేను పొత్తు కలవవచ్చు కదా. ఈ విధంగా ప్రజలు ఏమనుకుంటారు? అరే, అతడు ఫలానా కంపెనీలో ఒక పార్ట్నర్ గా ఉన్నాడు, ఎంతటి మహానుభావుడో అని అనుకుంటాం కదా. అయితే అల్లాహ్ ఇలాంటి భావాన్ని కూడా ఎట్లా దూరం చేస్తున్నాడో గమనించండి. వారికి అణువంత అధికారం కూడా లేదు ఆకాశాల్లో గాని, భూమిలో గాని. అంతేకాదు వారు ఈ భూమి ఆకాశాల్లో అల్లాహ్ కు ఏ పార్ట్నర్ కారు, ఏ భాగస్వామి కారు. అంతెందుకు, కొందరు ఇహలోకం ప్రకారంగా చూసుకుంటే ఏ అధికారం ఉండదు, పార్ట్నర్ ఉండడు. కానీ ఒకరి కంపెనీ నడపడానికి, ఒకరి పని పూర్తి అవ్వడానికి ఏదో తన ఛాయాశక్తి కొంచెం సపోర్ట్ అయినా ఇస్తాడు కదా. అల్లాహ్ ఇలాంటి దానిని కూడా ఖండించాడు. ఏం చెప్పాడు? (వమాలహుం మిన్హుం మిన్ జహీర్). మీరు ఎవరెవరితోనైతే దుఆలు చేస్తున్నారో వారిలో ఏ ఒక్కడు కూడా అల్లాహ్ కు ఎలాంటి మద్దతునిచ్చేవాడు కాదు, ఎలాంటి సహాయం అందించేవాడు కాదు.

ఇక మీరు అలాంటి వారితో ఎందుకు దుఆ చేస్తున్నారు అని అల్లా రబ్బుల్ ఆలమీన్ హెచ్చరిస్తున్నాడు. అల్లాహు అక్బర్. గమనించండి సోదరులారా.

ప్రత్యేకంగా ఎవరైతే అల్లాహ్ ను కాకుండా వేరే ఎవరెవరినైతే ఆరాధిస్తున్నారో, పూజిస్తున్నారో, దుఆలు చేస్తున్నారో, అర్ధిస్తున్నారో, వారి యొక్క స్థితి ఏమిటి? ఇంకా, వారు ఏమైనా ప్రళయ దినాన మనకు లాభం కలగజేస్తారా? ఉపయోగపడతారా? అది కూడా జరగదు. సూరతుల్ అహ్కాఫ్ ఆయత్ నెంబర్ ఐదు, ఆరు వినండి.

وَمَنْ أَضَلُّ مِمَّن يَدْعُو مِن دُونِ اللَّهِ مَن لَّا يَسْتَجِيبُ لَهُ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ وَهُمْ عَن دُعَائِهِمْ غَافِلُونَ
అల్లాహ్ ను వదలి ప్రళయదినం వరకూ తన మొరను ఆమోదించలేని వారిని, పైగా తను మొరపెట్టుకున్న సంగతి కూడా తెలియని వారిని మొరపెట్టుకునేవానికన్నా పెద్ద మార్గభ్రష్టుడు ఎవడుంటాడు? (46:5)

وَإِذَا حُشِرَ النَّاسُ كَانُوا لَهُمْ أَعْدَاءً وَكَانُوا بِعِبَادَتِهِمْ كَافِرِينَ
మానవులంతా సమీకరించబడినపుడు వారు వారికి (తమ భక్తులకు) శత్రువులై పోతారు. వీళ్ళ పూజాపురస్కారాలను కూడా వాళ్ళు త్రోసిపుచ్చుతారు. (46:6)

(వ మన్ అదల్లు మిమ్మన్ యద్వూ మిన్ దూనిల్లాహ్). ఎవరైతే అల్లాహ్ ను వదిలి ఇతరులతో దుఆ చేస్తున్నారో వారి కంటే మార్గభ్రష్టులు ఇంకా వేరే ఎవరు లేరు. నేననడం లేదు, ఖురాన్ తీసి చూడండి మీరు. వ మన్ అదల్లు, అతని కంటే మార్గభ్రష్టత్వంలో ఇంకా ఎవరు లేరు. ఎవరు? ఎవరైతే అల్లాహ్ ను వదిలి ఇతరులతో దుఆ చేస్తున్నాడో. ఎలాంటి వారితో దుఆ చేస్తున్నాడు? (మల్లా యస్తజీబు లహు ఇలా యౌమిల్ ఖియామ). ప్రళయ దినం వరకు అతని దుఆలను అంగీకరించడం గాని, దుఆకు సమాధానం గాని చెప్పలేని వారు. అంతేకాదు, (వహుం అన్ దుఆఇహిం గాఫిలూన్). వారు వీరు చేసే దుఆలకు ఏ సంబంధం లేకుండా నిర్లక్ష్యంగా ఉన్నారు. వారికి తెలియనే తెలియదు, ఎవరో వచ్చి మా సమాధుల వద్ద, ఎవరో మా పేరును తీసుకొని దుఆలు చేస్తున్నారు అని.

(వ ఇజా హుషిరన్నాస్). ప్రళయ దినాన ఎప్పుడైతే సమూహ పరచడం జరుగుతుందో, (కానూ లహుం అదాఅ). ఈ దుఆ చేసేవారు, ఎవరితోనైతే దుఆ చేయడం జరిగిందో వారందరూ పరస్పరం శత్రువులైపోతారు. (వ కానూ బి ఇబాదతిహిం కాఫిరీన్). మరియు వారి యొక్క ఆరాధనలో, వారి యొక్క దుఆలు వాటి గురించి ఇంకార్ చేస్తారు, రద్దు చేస్తారు. వీరు మమ్మల్ని ఆరాధించలేదు, మాతోని దుఆ చేయలేదు అని స్పష్టంగా తెలియజేస్తారు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అల్లాహ్ క్షమించుగాక, ఇహలోక ప్రకారంగా నేను ఒక ఉదాహరణ ఇస్తున్నాను, గమనించండి.

ఉదాహరణకు నీవు ఏదైనా ఆపదలో ఇరుక్కున్నావు. కోర్టులో వెళ్ళవలసి వచ్చింది. ఏం జరిగింది? ఫలానా వకీల్ చాలా పేరు గలవాడు. ఫలానా లాయర్ ఎంతో పేరు గాంచిన వాడు. అతనిని నేను పిలిపించుకుంటే నన్ను ఎట్లనైనా ఈ కేసులో నుండి బయటికి తీసేస్తాడు అని అనుకున్నావు. అతడు వచ్చాడు. వచ్చిన తర్వాత, నీవు అనుకుంటున్నావు ఈ కేసు ఈ కోర్టులో ఆ వకీల్, ఆ లాయర్ నీకు సపోర్ట్ చేసి నీ తరఫు నుండి మాట్లాడి నిన్ను జైలు పాలు కాకుండా, శిక్షకు గురి కాకుండా కాపాడుకుంటాడు అని. తీరా సమయం వచ్చే వరకు ఏం జరిగింది? నీకు వ్యతిరేకమైపోయాడు. అతడు నీకు వ్యతిరేకమైపోయాడు. నీవు ఇంకా పాపంలో ఉన్నావు, నీ పై ఈ అపరాధం అన్నట్టుగా ఎన్నో సాక్షాలు తెచ్చి ఇరికించే ప్రయత్నం చేశాడు. అప్పుడు ఏమవుతుంది పరిస్థితి గమనించండి. ఇంతకంటే మరీ భయంకరమైన, ఘోరమైన పరిస్థితి అక్కడ రానుంది. అల్లాహ్ మనందరిని కూడా కాపాడుగాక.

ఖురాన్ లో మనం గమనిస్తే, ఆదం అలైహిస్సలాం, నూహ్ అలైహిస్సలాం, ఇబ్రాహీం అలైహిస్సలాం, ఇస్మాయిల్ అలైహిస్సలాం, యూనుస్ అలైహిస్సలాం, లూత్ అలైహిస్సలాం, సులేమాన్ అలైహిస్సలాం, అయ్యూబ్ అలైహిస్సలాం, యూసుఫ్ అలైహిస్సలాం, షుఐబ్ అలైహిస్సలాం, హూద్ అలైహిస్సలాం, జకరియా అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం, హారూన్ అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం మరియు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సుమారు 16 ప్రవక్తలు, వారు అల్లాహ్ తో ఏ దుఆ చేశారో, ఎలా ఎలా మొరపెట్టుకున్నారో ఆ దుఆల ప్రస్తావనలన్నీ కూడా ఖురాన్ లో ఉన్నాయి. ఎక్కడా కూడా వారు అల్లాహ్ తప్ప ఇతరులతో మొరపెట్టుకోలేదు. నేను ఎందుకు ప్రస్తావిస్తున్నాను? ఈ ప్రవక్తల సరైన మార్గాన్ని మనం అవలంబించినప్పుడే కదా మనకు మోక్షం లభించేది.

అంతేకాదు, అల్లాహ్ త’ఆలా ఖురాన్ లో ఎందరో పుణ్యాత్ముల గురించి కూడా తెలిపాడు. ఉదాహరణకు, ఇమ్రాన్ యొక్క భార్య, ఫిరౌన్ యొక్క భార్య మరియు బిల్ఖీస్ రాణి మరియు ఆ గుహలో, సూర కహఫ్ లో వచ్చిన ప్రస్తావన ఉన్నవారు. ఇంకా విశ్వాసులు, ఎవరైతే ఒక తోటకు అధికారి అయ్యారో వారి యొక్క సంఘటన ఉంది. ఈ విధంగా ఇంకా ఎందరో సంఘటనలు ఖురాన్ లో ఉన్నాయి. వారందరూ కూడా వారి కష్ట సమయాల్లో కేవలం ఏకభాగస్వామ్యం లేకుండా అల్లాహ్ తోనే దుఆ చేశారు, అల్లాహ్ నే మొరపెట్టుకున్నారు.

అందు గురించి సోదరులారా, ఇదే పని మనం కూడా చేయాలి. ఒకవేళ అల్లాహ్ ను కాకుండా వేరే ఎవరినైనా మనం మొరపెట్టుకున్నామో, వేరే ఎవరితోనైనా దుఆ చేసాము అంటే షిర్క్ లో పడిపోతాము, కుఫ్ర్ లో పడిపోతాము, మహా దౌర్జన్యం చేసిన వారమవుతాము, అల్లాహ్ యొక్క శిక్షకు గురి కావలసి వస్తుంది. అంతేకాకుండా అల్లాహ్ ను కాదని మనం ఎవరెవరినీ మొరపెట్టుకుంటామో ఎవరూ కూడా మనకు ఇహలోకంలో పనికిరారు. పరలోకంలోనైతే ఏమాత్రం మనకు లాభం చేకూర్చరు.

అల్లాహ్ మనందరినీ కాపాడుగాక, రక్షించుగాక. ఎల్లవేళల్లో కేవలం అల్లాహ్ తో మాత్రమే దుఆ చేస్తూ ఉండే సద్భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ తప్ప వేరే ఎవరెవరితో మనం ఇంతవరకు తెలిసి తెలియక, అజ్ఞానంలో ఉండి ఏమైతే చేసామో, అల్లాహ్ ఆ పాపాలన్నిటినీ కూడా క్షమించి, మన్నించి మనల్ని తన యొక్క పవిత్రమైన పుణ్య దాసుల్లో చేర్చుగాక.

వ ఆఖిరు ద’వానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.

వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=5159