1) హిజ్రత్ అర్థం 2) హిజ్రత్ విశిష్టత 3) దివ్య ఖుర్ఆన్ మరియు హదీసు వెలుగులో హిజ్రత్ ఆదేశం ప్రళయం వరకు ఉంది 4) మదీనాకు హిజ్రత్ : కారణాలు, వృత్తాంతాలు.
మొదటి ఖుత్బా
ధార్మిక సహోదరులారా!
హిజ్రీ శకపు నూతన సంవత్సరపు ఆరంభాన్ని పురస్కరించుకొని, నేటి ప్రసంగంలో, ఎంతో ప్రాచుర్యం పొందిన “మదీనా ప్రస్థానం (హిజ్రత్)” వృత్తాంతాన్ని సమగ్రంగా వివరించడం సబబుగా అనిపిస్తోంది. ఎందుకంటే – ఈ సంఘటన ద్వారానే ఇస్లామీ శకం ఆరంభమైనది. కానీ, దీని వివరాల్లోకి వెళ్ళే ముందు అసలు హిజ్రత్ అంటే ఏమిటి? దివ్య ఖుర్ఆన్ మరియు హదీసులలో దీని గూర్చి వివరించబడ్డ విశిష్ఠతలు ఏమిటి? వీటిని గూర్చి తెలుసు కుందాం రండి.
హిజ్రత్ అంటే – ‘అల్ హిజ్రహ్’ హిజర్ నుండి వచ్చింది. దీని అర్థం ‘వదలిపెట్టడం‘ అని.
అరబ్బులు ఇలా అనేవారు: “ఫలానా జాతి ఒక ప్రదేశాన్ని వదిలి మరో ప్రదేశానికి వెళ్ళిపోయింది.” ముహాజిర్ సహబాలు కూడా మక్కా పట్టణాన్ని వదిలి మదీనాకు ప్రస్థానం గావించారు.
‘అల్ హిజ్రత్’ ను మెజారిటీ ఉలమాలు ధార్మికంగా ఇలా నిర్వచించారు: “అవిశ్వాస భూభాగం (దారుల్ కుఫ్ర్) నుండి ఇస్లామీయ భూభాగం (దారుల్ ఇస్లామ్) వైపు మరలిరావడం”.
అయితే, హాఫిజ్ ఇబ్నె హజర్ (రహిమహుల్లాహ్) దీని గురించి ఇలా వివరించారు: “షరీయత్తు పరంగా ‘హిజ్రత్’ అంటే – అల్లాహ్ వారించిన ప్రతి కార్యాన్నీ విడిచిపెట్టడం.”
బహుశా, హాఫిజ్ ఇబ్నె హజర్ (రహిమహుల్లాహ్) ఈ నిర్వచనాన్ని, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి ఈ హదీసు నుండి గ్రహించి వుండవచ్చు.
“అల్లాహ్ వారించిన కార్యాలను విడిచిపెట్టేవాడు ముహాజిర్” (బుఖారీ: 1/35, అల్ ఫతహ్)
ఈ హదీసు ద్వారా తెలిసిందేమిటంటే- ‘హిజ్రత్’ అన్న పదం – బాహ్యము మరియు అంతరంగం – ఈ రెండు రకాల హిజ్రత్ లకు కూడా వర్తిస్తుంది.
“అంతరంగ హిజ్రత్ లక్ష్యమేమిటంటే – మనిషి షైతాను మరియు స్వయంగా అతని మనస్సు ఎంతో ఆకర్షకంగా మలచి అతని ముందు ప్రవేశపెట్టే కార్యాలను త్యజించడం. ఇక, బాహ్య హిజ్రత్ లక్ష్యమేమిటంటే – మనిషి తన ధర్మాన్ని అవిశ్వాసం మరియు ఉపద్రవాల బారి నుండి కాపాడుకొనే నిమిత్తం ఇస్లామీయ బోధనలపై శాంతియుతంగా ఆచరించుకోగలిగే ప్రదేశానికి మరలి వెళ్ళడం.” (ఫత్హుల్ బారి : 1/54)
ఇమామ్ అలాజ్ బిన్ అబ్దుస్సలామ్ (రహిమహుల్లాహ్) ఇలా సెలవిచ్చారు:
“హిజ్రత్ రెండు రకాలు. స్వదేశాన్ని విడిచిపెట్టడం మరియు పాపాలను, దౌర్జన్యాన్ని త్యజించడం. వీటిలో, రెండవ హిజ్రత్ ఉత్తమమైనది. ఎందుకంటే – దీని ద్వారా ఆ కరుణామయుడు (అల్లాహ్) సంతృప్తి చెందడమేకాక, మనస్సు మరియు షైతానుల దుష్ప్రరణ కూడా తగ్గుతుంది.”
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దైవ ప్రవక్త ﷺ ప్రేమ లో “గులూ” (అతిగా ప్రవర్తించడం, మితి మీరి పోవడం) [వీడియో] https://youtu.be/obwMyhfkPeM [10 నిముషాలు] వక్త: హబీబుర్ రహ్మాన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో ‘ఘులూ’ (غلو) అనే ఇస్లామీయ భావనను వివరించబడింది, అనగా అంతిమ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పట్ల ప్రేమలో హద్దులు మీరడం లేదా అతిశయించడం. సూరహ్ అన్-నిసాలోని ఖుర్ఆన్ వాక్యం ఆధారంగా, మతంలో ‘ఘులూ’ చేయడం నిషిద్ధమని స్పష్టం చేయబడింది. ప్రవక్తకు దైవత్వపు గుణగణాలను ఆపాదించడం లేదా ఆయనను అల్లాహ్ యొక్క దాసుడు మరియు ప్రవక్త అనే స్థాయి నుండి దైవత్వపు స్థాయికి పెంచడం వంటివి ‘ఘులూ’కు ఉదాహరణలుగా పేర్కొనబడ్డాయి. క్రైస్తవులు మర్యం కుమారుడైన ఈసా (అలైహిస్సలాం)ను ప్రశంసించడంలో హద్దులు మీరినట్లు, తనను అలా అతిగా పొగడవద్దని ప్రవక్త స్వయంగా హెచ్చరించారు మరియు తనను “అల్లాహ్ దాసుడు మరియు ఆయన ప్రవక్త” అని మాత్రమే పిలవమని బోధించారు. అల్లాహ్ యొక్క ప్రత్యేక హక్కులకు మరియు ఆయన దాసుల హక్కులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఇబ్నె ఖయ్యిమ్ పద్యం ద్వారా కూడా వివరించబడింది. ముగింపుగా, ప్రవక్తను అందరికంటే ఎక్కువగా ప్రేమించాలి కానీ అది అతిశయం అనే పాపంలోకి వెళ్లకుండా, ఇస్లాం యొక్క సమతుల్యమైన మధ్య మార్గాన్ని అనుసరించాలని నొక్కి చెప్పబడింది.
اِنَّ الْحَمْدَ لِلّهِ وَحْدَهُ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى مَنْ لَا نَبِيَّ بَعْدَهُ، أَمَّا بَعْدُ. ఇన్నల్ హమ్దలిల్లాహి వహ్దహు, వస్సలాతు వస్సలాము అలా మన్ లా నబియ్య బఅదహు, అమ్మా బఅద్. నిశ్చయంగా, సర్వ స్తోత్రాలు ఏకైకుడైన అల్లాహ్‌కే శోభాయమానం. ఎవరి తర్వాత ఏ ప్రవక్తా రాబోరో, ఆయనపై శాంతి మరియు శుభాలు వర్షించుగాక. ఆ తర్వాత…
అభిమాన సోదరులారా! ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమములోకి మీ అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. أَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. (మీకు అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు కలుగుగాక)
ఈరోజు మనం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రేమలో ‘ఘులూ’ (غلو) చేయటం గురించి తెలుసుకుందాం. ‘ఘులూ’ ఇది అరబీ పదం. ‘ఘులూ’ అంటే ఒకరి ప్రేమలో మితిమీరి పోవటం. దీనిని షరీఅత్ పరిభాషలో ‘ఘులూ’ అంటారు. ఒకరి ప్రేమలో హద్దు దాటటం, మితిమీరి పోవటం. దీనిని ‘ఘులూ’ అంటారు. తెలుగులో అతిశయిల్లటం, అతిగా ప్రవర్తించటం అని చెప్పవచ్చు. అతిశయిల్లటం, అతిగా ప్రవర్తించటం. ఇది షరీఅత్ పరిభాషలో ‘ఘులూ’ అంటే.
అల్లాహ్ సుబ్ హానహు వ తఆలా సూరహ్ నిసా, ఆయత్ నెంబర్ 171లో ఇలా సెలవిచ్చాడు: لَا تَغْلُوا فِي دِينِكُمْ (లా తగ్‌లూ ఫీ దీనికుమ్) “మీరు మీ ధర్మం విషయంలో అతిశయించకండి, హద్దు మీరకండి, మితిమీరకండి” అని అల్లాహ్ సుబ్ హానహు వ తఆలా సెలవిచ్చాడు.
దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యెడల ‘ఘులూ’ చేయటం అంటే, అతిశయించడం అంటే ఏమిటి? ఉదాహరణకు, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క గొప్పతనాన్ని వర్ణించేటప్పుడు మితిమీరిపోవటం. సూటిగా చెప్పాలంటే, ఆయన్ని, అంటే అంతిమ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని, దైవ దాస్యపు మరియు దైవ దౌత్యపు స్థానము నుండి మరింత పైకెత్తటం. ఇది ‘ఘులూ’ అంటే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకి ఒక స్థానం ఉంది. దైవ దాస్యపు స్థానం ఉంది, దైవ దౌత్యపు స్థానం ఉంది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంని ఆ స్థానం నుంచి పైకి ఎత్తటం. అంటే, దైవత్వపు కొన్ని గుణాలను ఆయనకు ఆపాదించటం. అల్లాహ్‌ను వదలి సహాయం కొరకు ఆయన్ని అర్థించటం, ఇవన్నీ ‘ఘులూ’ క్రిందికి వస్తాయి.
అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు. ఈ హదీస్ బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో ఉంది:
لَا تُطْرُونِي كَمَا أَطْرَتِ النَّصَارَى ابْنَ مَرْيَمَ، فَإِنَّمَا أَنَا عَبْدُهُ، فَقُولُوا عَبْدُ اللَّهِ وَرَسُولُهُ. లా తుత్రూనీ కమా అత్రతిన్ నసారబ్న మర్యమ, ఫ ఇన్నమా అన అబ్దుహు, ఫఖూలూ అబ్దుల్లాహి వ రసూలుహు. క్రైస్తవులు మర్యం కుమారుడిని (ఈసాని) పొగడడంలో హద్దులు మీరినట్లు మీరు నన్ను పొగడకండి. నిశ్చయంగా నేను ఆయన (అల్లాహ్) దాసుడిని మాత్రమే. కనుక నన్ను ‘అల్లాహ్ దాసుడు మరియు ఆయన ప్రవక్త’ అని అనండి.
“క్రైస్తవులు మర్యం కుమారుడగు ఈసా అలైహిస్సలామును పొగడటంలో మితిమీరినట్లు, మీరు నా ప్రశంసలో మితిమీరకండి. నేను దాసుడిని మాత్రమే. కనుక నన్ను దైవ దాసుడని, దైవ ప్రవక్త అని అనండి” అని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.
అభిమాన సోదరులారా! ఇంతకు ముందు ఎపిసోడ్‌లో మనం అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల ప్రేమ గురించి తెలుసుకున్నాం. అంతిమ దైవ ప్రవక్తను ప్రేమించాలి. అత్యధికంగా ప్రేమించాలి. అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించాలి. అందరికంటే ఎక్కువగా ప్రేమించాలి. కాకపోతే, ఆ ప్రేమలో ‘ఘులూ’ చేయకూడదు. ‘ఘులూ’ అంటే ఏమిటో తెలుసుకున్నాం, అతిశయిల్లటం, అతిగా ప్రవర్తించడం, ప్రవక్త గారి స్థానాన్ని మించి పైకి ఎత్తటం. ఏ విధంగానైతే క్రైస్తవులు ఈసా అలైహిస్సలాంను ఆయనను పొగడే విషయంలో హద్దు మీరారు, అతిశయించారు, తత్కారణంగా ఏమైంది? దేవుని స్థానములో, దేవునికి సమానంగా నిలబెట్టారు ఈసా అలైహిస్సలాంని క్రైస్తవులు. ఆ విధంగా నాకు పొగడే విషయంలో, నా ప్రశంస విషయంలో మీరు ఆ విధంగా హద్దు మీరకండి, ‘ఘులూ’ చేయకండి, అతిశయించకండి అని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనల్ని బోధించారు, హెచ్చరించారు.
అభిమాన సోదరులారా! ఇబ్నె ఖయ్యిమ్ రహమతుల్లాహి అలైహి ఒక కవిత్వములో ఇలా తెలియజేశారు, ఖసీదా నూనియ్యాలో. ఖసీదా అంటే పద్యము. నూనియ్యా అంటే ఆయన ఒక అనేక పద్యాలు రాశారు, ఒక పద్యంలో ప్రతి అక్షరం ‘నూన్’తో ముగిస్తుంది. ఆ పద్యంలోని ప్రతి వాక్యంలో చివరి అక్షరం ‘నూన్’ ఉంటుంది. అందుకు ఆ పద్యం పేరే ఖసీదా నూనియ్యా అని పడిపోయింది. ఆ ఖసీదా నూనియ్యాలో ఒకచోట అల్లామా ఇబ్నె ఖయ్యిమ్ రహమతుల్లాహి అలైహి ఇలా అన్నారు, వ్యాఖ్యానించారు:
“అల్లాహ్ యొక్క ఒక హక్కు ఉంది, అది ఎవరికీ చెందదు, దైవ ప్రవక్తలకు కూడా చెందదు. అల్లాహ్‌కు ఒక హక్కు ఉంది, అది ఎవరికీ చెందదు. మరియు ఆయన దాసుని హక్కు ఒకటి ఉంటుంది, దాసునికి కూడా ఒక హక్కు ఉంటుంది. ఇవి రెండూ వేరు వేరు హక్కులు. అల్లాహ్ హక్కు వేరు, దాసుని హక్కు వేరు. కనుక, ఆ రెండు హక్కులను విచక్షణారహితంగా ఒకే హక్కుగా చేయకండి.”
ఆధారం లేకుండా, విచక్షణారహితంగా రెండు హక్కులను ఒకటిగా చేయకండి. అల్లాహ్ హక్కు, దాసుని హక్కు ఒకటి కాదు. అంటే, అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దాసుడే కదా. అల్లాహ్ సృష్టికర్త, మనమందరము సృష్టి. ఆ సృష్టిలో అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ఒక సృష్టి, దాసుడే. అందుకు అల్లాహ్ హక్కు, అల్లాహ్ దాసుని హక్కు సమానం కాజాలవు, ఒకటిగా అవ్వవు.
అభిమాన సోదరులారా! చెప్పటం ఏమిటంటే, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రేమలో ‘ఘులూ’ చేయకూడదు. అది అధర్మం, ఇస్లాంలో దానికి సమ్మతం లేదు, సమ్మతించబడలేదు ఇస్లాంలో. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి ఒక స్థానం ఉంది. ఆ స్థానం నుంచి ఆయనకి పైకి తీసుకుని పోకూడదు, కింద దించకూడదు. ఇదే ఉమ్మతే వసత్. ఇస్లాం ధర్మం, దీనె వసత్. హద్దు మీరకూడదు, తక్కువ స్థాయికి దించకూడదు.
అభిమాన సోదరులారా! అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మానవుడే. అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ దాసులే. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సృష్టిలో ఒక సృష్టి. అందరికంటే ప్రేమ అంతిమ దైవ ప్రవక్త పట్ల కలిగి ఉండాలి, అందరికంటే ఎక్కువ. కాకపోతే, హద్దు మీరకూడదు, అతిశయించకూడదు, మితిమీరకూడదు. ఆయన ప్రేమలో ‘ఘులూ’ ఉండకూడదు అని తెలుసుకున్నాము. కాకపోతే, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయన మనిషి అయినప్పటికీ, దైవ దాసుడు అయినప్పటికీ, ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ స్థానం ఏమిటి, ఆ ప్రత్యేకతలు ఏమిటి, ఇన్షా అల్లాహ్ మనం వచ్చే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.
وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلهِ رَبِّ الْعَالَمِينَ. وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ. వ ఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. మా చివరి ప్రార్థన సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వ స్తోత్రాలు. మీకు అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు కలుగుగాక.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ముహమ్మద్ ﷺ పై దరూద్ పంపడంలో బిదత్ విధానాలు పాటించకండి [ఆడియో] https://youtu.be/SRlQmVpTG38 [4 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
జీవితంలో కాలం అత్యంత విలువైనది. కాలప్రవాహం నిరంతరంగా, నిరాఘాటంగా చాలా వేగంతో ప్రవహిస్తూ ఉంటుంది. కాలచక్రం మన మీద దయతలచి ఎక్కడా ఆగకుండా ముందుకు సాగి పోతూ మనల్ని జీవితంలో ఎదురయ్యే కష్టాలను, ఆపదలను సహించగలిగేలా చేస్తున్నది. గడిచే కాలం క్షతగాత్ర హృదయాలకు ఉపశమనాన్నీ, ఊరటనూ కలిగిస్తున్నది. ఒకవేళ ఈ కాల ప్రవాహమే గనక ఆగిపోతే భూమిపై మానవ ఉనికికే ప్రమాదం వాటిల్లుతుంది. ప్రతి మనిషీ ఓ శోకమూర్తిలా, కనిపిస్తాడు.
కొన్ని సంవత్సరాల క్రితం నా జీవితం కాల ప్రవాహంలోని సహజమైన ఎగుడు దిగుళ్ళను దాటుకుంటూ అతి వేగంగా ముందుకు సాగిపోతున్న సమయంలో హఠాత్తుగా కొన్ని అవాంఛనీయమైన సంఘటనలు జరిగాయి. వాటి మూలంగా నాకు రాత్రివేళ నిద్ర, పగటిపూట మనశ్శాంతి కరువయ్యాయి. దైనందిన కార్యకలాపాలన్నీ అస్తవ్యస్తమయిపోయాయి. ఇది నేను “నమాజ్ పుస్తకం” సంకలనం చేస్తున్న కాలం నాటి మాట.
ఈ రోజు దాని గురించి ఆలోచిస్తేనే చెప్పలేని ఆశ్చర్యం కలుగుతున్నది. అల్ప జ్ఞాని, పరిమిత సామర్థ్యం కలవాణ్ణి అయిన నేను ఇంత గొప్ప కార్యం ఎలా చేయగలిగానా అనిపిస్తోంది. వాస్తవం ఏమిటంటే నేను దైవప్రవక్త ప్రవచనాల సంకలనం, క్రోడీకరణ పనిలో పూర్తిగా లీనమయిపోయినందువల్ల బయటి ప్రపంచంలోని అల్లకల్లోల వాతావరణం నా మీద ప్రభావం చూపలేకపోయింది. ఆ విధంగా నేను ఎన్నో సమస్యల నుండి, బాధల నుండి సురక్షితంగా ఉండగలిగాను. అంతేకాదు, నా కార్యక్రమంలోనూ చెప్పదగిన ఆటంకం ఏమీ ఏర్పడలేదు. ఒకవేళ ఆ సమయంలో నేను నమాజ్ పుస్తకం పనిలో నిమగ్నుణ్ణి ఉండకపోయినట్లయితే, ఈ రోజు నా జీవితపు రూపురేఖలే మారిపోయి ఉండేవి. చెప్పొచ్చేదేమిటంటే దైవప్రవక్త ప్రవచనాలకు సంబంధించిన ఈ సంక్షిప్త సంకలనం-జీవితపు అత్యంత కఠినమైన, క్లిష్టతరమైన ప్రయాణంలో నాకు ఓ స్నేహితుడిగా, సానుభూతిపరుడిగా దోహదపడింది. నా దుఃఖంలో పాలు పంచుకున్నది. నా వల్ల ఎన్నో తప్పులు, ఎన్నో పాపాలు జరిగి ఉన్నప్పటికీ అల్లాహ్ నన్నింతగా కరుణిస్తున్నాడంటే ఇదంతా దరూద్ షరీఫ్ శుభాల మూలంగానే జరిగివుంటుందని నా నమ్మకం. హదీసులు చదువుతూ రాస్తూ ఉన్నప్పుడు మాటిమాటికీ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి, సత్యప్రవక్త అయిన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పేరు వచ్చినప్పుడల్లా ఆయన మీద అల్లాహ్ శాంతీశ్రేయాలు కురవాలని ప్రార్థించినందుకు నాకా మహాభాగ్యం లభించి ఉండవచ్చు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన అనుచరుడయిన ఉబై బిన్ కాబ్ (రదియల్లాహు అన్హు)తో అన్న మాటలు అక్షరాలా సత్యం. “కాబ్! నువ్వు నీ మొత్తం నీ ప్రార్థనను నా దరూద్ కోసం ప్రత్యేకించుకో. ఇహపరాల్లో నీకు కలిగే దుఃఖాలన్నిటికీ అది ఉపశమనంగా పనికి వస్తుంది” (తిర్మిజీ షరీఫ్).
అల్లాహ్ తన గ్రంథంలో ఒకచోట ఇలా అన్నాడు :
”ఓ ముహమ్మద్ చెప్పేయండి, విశ్వాసులకు ఈ ఖురాన్ మార్గదర్శకం వహిస్తుందని, ఉపశమనాన్ని కలిగిస్తుందనీను”.
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనాల విషయంలో కూడా నిస్సందేహంగా మనం ఈ మాట అనవచ్చు. ఆయన పలుకులు ప్రజలకు సన్మార్గం చూపించటంతో పాటు, ఉపశమనాన్ని కూడా ఇస్తాయి. ఇమామ్ రమావీ (రహిమహుల్లాహ్) తనకు సుస్తీ చేసినప్పుడల్లా తాను “నాకు హదీసు చదివి వినిపించండి. అందులో ఉపశమనం ఉంది” అని అంటారని బాగ్దాద్ చరిత్ర గ్రంథంలో వ్రాశారు. భారత ఉపఖండ ఆధ్యాత్మిక చరిత్రలో ప్రసిద్ధికెక్కిన ప్రముఖ హదీసువేత్త హజ్రత్ షాహ్ వలీయుల్లాహ్ గారి గురించి తెలియని వారుండరు. ఆయన తండ్రిగారైన షాహ్ అబ్దుర్రహీమ్ తరచూ ఇలా అంటుండేవారు: “మాకు ధర్మసేవ చేసే భాగ్యమంతా దరూద్ షరీఫ్ శుభాల మూలంగానే లభించింది”.
పండితులు సఖావీ (రహిమహుల్లాహ్) ‘ఖైలుల్ బదీ’ అనే గ్రంథంలో అనేకమంది హదీసువేత్తల స్వప్న విశేషాలను పొందుపరిచారు. ఆ గ్రంథం ప్రకారం కొంతమంది హదీసువేత్తలు హదీసులు వ్రాసే సమయంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రస్తావన వచ్చినప్పుడల్లా దరూద్ షరీఫ్ పఠించటం, వ్రాయటం చేసేవారు. దాని మూలంగా వారి పాపాలన్నిటినీ మన్నించటం జరిగింది.
దైవప్రవక్త హదీసులు మరియు దరూద్ షరీఫ్ మహిమల్ని, శుభాలను స్వానుభవంతో గ్రహించిన నేను ”శుచీ శుభ్రతల పుస్తకం” తర్వాత “దైవప్రవక్త విధానానుసరణ” పుస్తకాన్ని రచించే ముందు ”దరూద్ షరీఫ్ శుభాలు” అనే పుస్తకం సంకలనం చేయాలని దృఢంగా నిశ్చయించుకున్నాను. అల్ హమ్దులిల్లాహ్! అల్లాహ్ నా ఆశను నెరవేర్చాడు. ఈ పుస్తకంలోని మేళ్లన్నీ కూడా అల్లాహ్ కృపతో, ఆయన అనుగ్రహంతో జరిగినవే. పోతే ఇందులోని లోపాలన్నీ నా స్వయంకృతాలు.
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధి జీవితం – ఆయన ప్రజల సలాముకు జవాబు పలకటం
తనకు సలాం చేసే వారికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన సమాధిలో నుంచి ప్రతి సలాం చేస్తారని ప్రామాణికమైన హదీసు ద్వారా తెలుస్తోంది.
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధిలో ఉండి ప్రజల సలాం ఎలా వింటారు? వారి సలాంకు జవాబు ఎలా చెబుతారు? అనే విషయాలను గురించి చర్చించినప్పుడు మనం ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ప్రాపంచిక జీవనం దృష్ట్యా సాధారణ మానవులకు ఏ విధంగా మరణం సంభవిస్తుందో అదేవిధంగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు కూడా మరణం సంభవించింది. దివ్య ఖురాన్లో అల్లాహ్ పలుచోట్ల దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కొరకు ‘మరణం’ అనే పదాన్ని ఉపయోగించాడు.
”ముహమ్మద్ ఒక ప్రవక్త తప్ప మరేమీ కారు. అతనికి పూర్వం ఇంకా ఎందరో ప్రవక్తలు గతించారు. అలాంటప్పుడు ఒకవేళ అతను మరణిస్తే లేక హత్య చేయబడితే మీరు వెనుకంజవేసి మరలిపోతారా?” (ఆలి ఇమ్రాన్: 144)
అంబియా సూరాలో ఇలా చెప్పబడింది:
“ఓ ప్రవక్తా! శాశ్వత జీవితాన్ని మేము నీకు పూర్వం కూడా ఏ మానవునికీ ప్రసాదించలేదు. ఒకవేళ నీవు మరణిస్తే వారు మాత్రం శాశ్వతంగా జీవించి ఉంటారా?’ (అంబియా సూరా, 34వ సూక్తి)
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణించినప్పుడు ఆయన ప్రియ సహచరుడయిన హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ (రదియల్లాహు అన్హు) తన ఉపన్యాసంలో ఇలా ఎలుగెత్తి చాటారు :
”ముహమ్మద్ ను పూజించేవారు ముహమ్మద్ కు మరణం సంభవించిందన్న సత్యాన్ని గ్రహించాలి” (బుఖారీ షరీఫ్).
దైవప్రవక్త మరణానంతరం ఆయన పవిత్ర భౌతిక కాయానికి స్నానం చేయించి, వస్త్ర సంస్కారాలు చేయటం జరిగింది. ఆ తర్వాత జనాజా నమాజ్ ఆచరించి ఆయన భౌతిక కాయాన్ని సమాధిలో ఉంచి మట్టితో పూడ్చేయటం జరిగింది. ఇది వాస్తవం. కనుక ప్రాపంచిక జీవితం దృష్ట్యా ఆయనకు మరణం సంభవించిందనే విషయంలో ఎలాంటి సందేహానికీ తావులేదు. అయితే ఆయన సమాధి జీవితం మాత్రం ఇతర దైవప్రవక్తలు, పుణ్యాత్ములు, అమరవీరులు, సజ్జనులందరి కంటే ఎంతో మెరుగ్గా, ఎక్కువ పరిపూర్ణంగా ఉంటుంది. సమాధి జీవితం గురించి ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఆ జీవితం మరణానికి ముందు ఉండే ప్రాపంచిక జీవితం లాగుండదు. అలా అని అది పూర్తిగా పరలోక జీవితం కూడా కాదు. దాని వాస్తవిక స్థితి కేవలం అల్లాహ్ కు మాత్రమే తెలుసు. దివ్యఖురాన్లో అల్లాహ్ ఈ విషయాన్ని ఎంతో స్పష్టంగా ఇలా ప్రకటించాడు:
“అల్లాహ్ మార్గంలో చంపబడిన వారిని “మృతులు” అని అనకండి. వాస్తవానికి వారు సజీవులు. కాని మీరు వారి జీవితాన్ని గ్రహించలేరు.” (అల్బఖర : 154వ సూక్తి)
సమాధి జీవితం గురించి వివరిస్తూ అల్లాహ్ ”మీరు ఆ స్థితిని గ్రహించలేరు” అని స్పష్టంగా చెప్పిన తర్వాత – దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రజల సలాం విని దానికి జవాబు చెప్పగల్గుతారంటే బహుశా ఆయన మనలాగే బ్రతికే ఉన్నారేమో? ఆయన సలాం వినగలిగినప్పుడు మనం చెప్పుకునే మాటలు మాత్రం ఎందుకు వినలేరు? అంటూ భౌతికంగా ఆలోచించటానికి ప్రయత్నించకూడదు. మన విశ్వాసం (ఈమాన్) కోరేదేమంటే మనం అల్లాహ్, దైవప్రవక్త ఆదేశాలను యధాతథంగా ఆచరించాలి. ఏ విషయంలోనయితే షరీఅత్ మౌనం వహించిందో అలాంటి విషయాల్లో అనవసర సందేహాలకు, సంశయాలకు లోనవకుండా తెలిసిన విషయాలనే ఆచరించటానికి ప్రయత్నించాలి. ధర్మం, విశ్వాసాల రక్షణకు ఇదే అత్యంత సురక్షితమైన మార్గం.
దైవప్రవక్తకు అగోచర జ్ఞానం లేదు
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “అల్లాహ్ కొంతమంది దూతలకు ఒక బాధ్యతను అప్పగించాడు. వారు భువిలో సంచరిస్తూ ఉంటారు. ప్రజల్లో ఎవరయినా దరూద్ పఠిస్తే దాన్ని దైవప్రవక్తకు (అంటే నాకు) చేరవేస్తూ ఉంటారు” (అహ్మద్, నసాయి, దారిమి).
ఈ హదీసు ద్వారా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎల్లప్పుడూ తన సమాధిలోనే ఉంటారనీ, ఆయన సర్వాంతర్యామి కారని స్పష్టంగా అర్థమవుతోంది. ఒకవేళ ఆయనే గనక సర్వాంతర్యామి అయితే దైవదూతలు ఆయనకు దరూద్ చేరవేయవలసిన అవసరం ఏముంటుంది చెప్పండి?!
మరికొన్ని హదీసుల ప్రకారం దైవదూతలు ఫలానా దరూద్ ఫలానా అతని కుమారుడు పఠించాడని కూడా ఆయనకు తెలియపరుస్తారని బోధపడుతుంది. దీని ద్వారా కూడా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు అగోచర జ్ఞానం లేదని తెలుస్తోంది. ఒకవేళ ఆయనకే గనక అగోచర జ్ఞానముంటే దైవదూతలు ఫలానా వ్యక్తి దరూద్ పఠించాడని ఆయనకు తెలియజేయవలసిన అవసరం ఏముంది?
సంప్రదాయ విరుద్ధమయిన దరూద్ లు సలాములు
ప్రస్తుత కాలంలో ఇస్లాం ధర్మంలో క్రొత్తపోకడలు (బిద్అత్ లు) తామర తంపరలుగా పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా ప్రార్థనలు, సంకీర్తనల్లో ఎన్ని కల్పిత విషయాలు చేర్చబడ్డాయంటే వాటి మూలంగా సంప్రదాయబద్ధమైన (మస్నూన్) ప్రార్ధనలు, సంకీర్తనలు మరుగున పడిపోతున్నాయి. ఆఖరికి దరూద్, సలామ్ లలో కూడా ఎన్నో కల్పితమైన, సంప్రదాయ విరుద్ధమైన విషయాలు చోటు చేసుకున్నాయి. ఉదా:- దరూదె తాజ్, దరూదె లిఖ్ఖి, దరూదె ముఖద్దస్, దరూదె అక్బర్, దరూదె మాహీ, దరూదె తస్ జైనా మొదలగునవి. వీటిలో ప్రతి ఒక్క దరూద్ పఠనానికి ఒక ప్రత్యేకమైన సమయం కేటాయించబడింది. పుస్తకాల్లో వాటికి వేర్వేరు ప్రయోజనాలు ఆపాదించబడ్డాయి. మరి చూడబోతే వాటిలో ఏ ఒక్క దరూద్ వాక్యాలు కూడా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చేత ప్రవచించబడినట్లు రుజువు కావటం లేదు. కనుక వాటిని పఠించే పద్ధతి, వాటి ద్వారా కలిగే ప్రయోజనాలు అన్నీ మాయమాటలు మాత్రమే.
షరీఅత్లో కల్పితమైన, సంప్రదాయ విరుద్ధమైన చర్యలకు పాల్పడటం మూలంగా కలిగే నష్టమేమిటో తెలుసుకోవటానికి ప్రతి ముస్లిం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆదేశాలను దృష్టిలో పెట్టుకోవాలి. లేకపోతే ఈ కొద్దిపాటి అమూల్యమైన జీవితంలో ఖర్చు చేయబడే సమయం, ధనం, ఇతర శక్తి సామర్ధ్యాలన్నీ ప్రళయదినాన వృధా అయిపోయే ప్రమాదముంది..
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “ఎవరయినా ధర్మంలో షరీఅత్ పరంగా నిరాధారమైన పనికి శ్రీకారం చుడితే ఆ పని త్రోసిపుచ్చదగినది” (బుఖారీ- ముస్లిం). అంటే అల్లాహ్ సన్నిధిలో దానికి ఎలాంటి పుణ్యం లభించదన్నమాట! వేరొక హదీసులో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “ధర్మంలో తలెత్తే ప్రతి క్రొత్త పోకడ మార్గభ్రష్టతే, మార్గభ్రష్టత నరకానికి గొనిపోతుంది” అని హెచ్చరించారు. (అబూ నయీమ్).
ఈ సందర్భంగా ఇమామ్ బుఖారీ, ఇమామ్ ముస్లింలు వెలికితీసిన ఒక హదీసుని ప్రస్తావించటం చాలా ఉపయోగకరంగా ఉంటుందనుకుంటాను. ముగ్గురు మనుషులు దైవప్రవక్త సతీమణుల దగ్గరికి వెళ్ళి దైవప్రవక్త ఆరాధనా పద్ధతిని గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత వారిలో ఒకతను ‘నేను ఇప్పట్నుంచి ప్రతి రోజూ రాత్రంతా జాగారం చేస్తాను. అసలు విశ్రాంతే తీసుకోను’ అని ప్రతినబూనాడు. రెండో వ్యక్తి, “నేను రేపట్నుంచి నిరంతరాయంగా ఉపవాసముంటాను. ఈ వ్రతాన్ని ఎన్నటికీ విరమించను” అని ఒట్టేసుకున్నాడు. “నేనయితే ఎన్నటికీ వివాహం చేసుకోను. అసలు స్త్రీలనే ముట్టుకోను’ అని ప్రమాణం చేశాడు మూడోవ్యక్తి. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు ఈ విషయం తెలియగానే ఆయన వారిని హెచ్చరిస్తూ, “అల్లాహ్ సాక్షి! నేను మీ అందరి కంటే ఎక్కువగా అల్లాహ్ కు భయపడేవాడిని, నిష్టాగరిష్టుణ్ణి. అయినప్పటికీ నేను రాత్రిపూట ఆరాధనలు చేస్తాను, పడుకుంటాను కూడా. ఉపవాసాలుంటాను, అప్పుడప్పుడూ వాటిని విరమిస్తాను కూడా. అంతేకాదు, నేను స్త్రీలను వివాహం కూడా చేసుకున్నాను. కనుక జాగ్రత్త! ఎవరయితే నా విధానం పట్ల వైముఖ్య ధోరణికి పాల్పడతాడో అతనితో నాకెలాంటి సంబంధం లేదు” అని అన్నారు.
ప్రియ పాఠకులారా!
కాస్త ఆలోచించండి, ఆ ముగ్గురు వ్యక్తులు తమ ఉద్దేశ్యం ప్రకారం తాము వీలైనన్ని ఎక్కువ సత్కార్యాలు చేస్తున్నామనీ, ఎక్కువ పుణ్యం సంపాదించు కుంటున్నామని భావించారు. కాని వారు అవలంబించిన విధానం కల్పితమైనది. సంప్రదాయ విరుద్ధమైనది, కనుక దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి మాటల్ని తీవ్రంగా నిరసించారు. దరూద్ సలామ్ ల సంగతి కూడా అంతే.
కల్పితమైన, సంప్రదాయ విరుద్ధమైన దరూద్ లు, సలామ్ లు పఠించటం వృధా ప్రయాస మాత్రమే. పైగా దానివల్ల దైవప్రవక్త అప్రసన్నతకు, దైవాగ్రహానికి గురి కావలసి వస్తుంది. అంచేత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించిన దరూద్-సలామ్ లను మాత్రమే పఠించాలి. గుర్తుంచుకోండి! ప్రపంచంలోని ఇతర సాధువులు, పుణ్యాత్ములందరూ కలిసి తయారు చేసిన ఎన్నో పలుకుల కన్నా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) శుభ అధరాల నుండి వెలువడిన ఒక్క పలుకు ఎంతో అమూల్యమైనది, శ్రేష్ఠమైనదీను.
ఈ పుస్తకం సంకలనం కోసం హదీసుల్ని ఎంపిక చేసినప్పుడు ‘సహీహ్’ మరియు ‘హసన్’ కోవలకు చెందిన హదీసుల్ని మాత్రమే ఎంపిక చేసి పుస్తక ప్రామాణికతను కాపాడటానికి అన్ని విధాలా కృషి చేయటం జరిగింది. అయినప్పటికీ ఇందులో ఏదయినా బలహీనమైన హదీసు దొర్లిందని విద్యావంతులు మాకు తెలియపరిస్తే మేము వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.
ఈ పుస్తకాన్ని సిద్ధపరచటంలో మిత్రులు జనాబ్ హాఫిజ్ అబ్దుర్రహ్మాన్ (రక్షణ శాఖ) గారు చెప్పదగిన పాత్రను నిర్వహించారు. మా నాన్నగారు హాఫిజ్ ముహమ్మద్ ఇద్రీస్ కైలానీ ముసాయిదాను పునఃపరిశీలించటంతో పాటు వ్రాత, ప్రచురణ పనుల్ని దగ్గరుండి జరిపించారు. మా నాన్నగారు హజ్రత్ మౌలానా ముహమ్మద్ ఇస్మాయీల్ సలఫీ (రహిమహుల్లాహ్), హజ్రత్ మౌలానా ముహమ్మద్ అతావుల్లాహ్ హనీఫ్ (రహిమహుల్లాహ్) లాంటి ప్రసిద్ధ పండితుల దగ్గర శిష్యరికం చేసిన ప్రముఖుల్లో ఒకరు. దస్తూరీలో బాగా పేరు మోసిన వ్యక్తి. ఉపాధి నిమిత్తం దస్తూరీ పని చేసిన కాలంలోనే ఆయన ఆరు ప్రామాణిక గ్రంథాలయిన (సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లిం, సుననె తిర్మిజీ, సుననె నసాయి, సుననె అబూదావూద్, సుననె ఇబ్నెమాజా లనే గాక మిష్కాత్ షరీఫ్, దివ్యఖురాన్ కు సంబంధించిన అనేక వ్యాఖ్యాన గ్రంథాలను కూడా ఆయన తన చేత్తో వ్రాశారు. మౌలానా అతావుల్లాహ్ హనీఫ్ గారు తన ప్రసిద్ధ గ్రంథమైన “తాలీఖాతె సలఫియా” (నసాయీ షరీఫ్ వ్యాఖ్యాన) గ్రంథాన్ని వ్రాయటం కోసం ప్రత్యేకంగా మా నాన్నగారినే ఎన్నుకున్నారు.
అల్లాహ్ నాన్నగారికి ప్రత్యేక కరుణాకటాక్షాల్ని అనుగ్రహించాడు. యాభై ఎనిమిదవ పడిలో ఆయనకు దివ్యఖురాన్ ను కంఠస్తం చేసే మహాభాగ్యాన్ని ప్రసాదించాడు. విద్యాభ్యాసం పూర్తయినప్పటి నుంచే ఆయన దస్తూరీ పనితోబాటు తన సొంత ఊర్లో ధర్మప్రచార కార్యక్రమాల్ని కూడా నిర్వర్తించటం మొదలుపెట్టారు. అయితే గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా-దైవకృపతో ఆయన ఉపాధిని కూడా లెక్కచేయకుండా పూర్తి ఏకాగ్రతతో ఈ బాధ్యతను నిర్వహిస్తున్నారు. హదీస్ పబ్లికేషన్స్ తరఫున ప్రచురణ కార్యక్రమం మొదలయినప్పటి నుంచి ముసాయిదాలను పునఃపరిశీలించటం, వాటిని వ్రాయించటం, ప్రచురించటం ఆ తర్వాత వాటిని పంపిణీ చేయటం మొదలగు పనులన్నిటినీ ఆయనే నిర్వర్తిస్తున్నారు.
మహాశయులారా !
నాన్నగారు జనాబ్ హాఫిజ్ ముహమ్మద్ ఇద్రీస్ కైలానీ గారికి అల్లాహ్ ఆరోగ్యాన్నీ, ఆయుష్షును* ప్రసాదించాలని కోరుకోమని విన్నవించుకుంటున్నాను. దానివల్ల మనకు దైవగ్రంథ, దైవప్రవక్త ప్రవచనాల ప్రచార కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షణలో నిర్వహించే అవకాశం లభిస్తుంది. అలాగే కేవలం దైవప్రసన్నతను బడసే ఉద్దేశ్యంతో, దైవప్రవక్త ప్రవచనాల పట్ల తమకున్న ప్రేమాభిమానాల మూలంగా తమ అమూల్యమైన సమయాన్ని, శక్తి సామర్థ్యాలను, పవిత్ర సంపాదనను ఖర్చుపెట్టి తద్వారా దైవగ్రంథం, దైవప్రవక్త ప్రవచనాల ప్రాచుర్యం కోసం పాటుపడుతున్న ప్రభృతులందరి కోసం కూడా దైవాన్ని ప్రార్థించండి. దైవం వారందరికీ ఇహపరాల్లోనూ తన అనుగ్రహాలను ప్రసాదించుగాక! ప్రళయదినాన వారికి దైవప్రవక్త సిఫారసుకు నోచుకునే భాగ్యాన్ని ప్రాప్తించుగాక! (ఆమిన్).
సంకలనకర్త తండ్రిగారైన హాఫిజ్ ముహమ్మద్ ఇద్రీస్ కైలానీ (రహిమహుల్లాహ్) క్రీ.శ. 1992 అక్టోబర్ 13వ తేదీనాడు శాశ్వతంగా ఇహలోకాన్ని వీడిపోయారు. ఇన్నాలిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజివూన్. పాఠకులు ఆయన మన్నింపు కోసం, పరలోకంలో ఆయన అంతస్తుల పెరుగుదల కోసం అల్లాహ్ ను ప్రార్థించాలని కోరుకుంటున్నాం.
“రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంతస్సమీవుల్ అలీం. వతుబ్ అలైనా ఇనక అంతత్తవ్వాబుర్రహీమ్”. (ప్రభూ! మేము చేసిన ఈ సేవను స్వీకరించు. నిస్సందేహంగా నీవు అన్నీ వినేవాడవు. సర్వం తెలిసినవాడవు. ప్రభూ! మమ్మల్ని క్షమించు. నిస్సందేహంగా పశ్చాత్తాపాన్ని అంగీకరించే వాడవు, కరుణించే వాడవు నీవే)
ముహమ్మద్ ఇక్బాల్ కైలానీ కింగ్ సవూద్ యూనివర్సిటీ, సౌదీ అరేబియా
దరూద్ షరీఫ్ భావం (مَعْنَى الصَّلَاةِ عَلَى النَّبِيِّ ﷺ)
1వ అంశం: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)పై అల్లాహ్ దరూద్ పంపిస్తాడంటే ఆయనపై తన కారుణ్యాన్ని కురిపిస్తాడని అర్థం. అదే దైవదూతలు లేక ముస్లింలు ఆయన పై దరూద్ పంపిస్తారంటే ఆయనపై అల్లాహ్ కారుణ్య వర్షం కురవాలని ప్రార్థిస్తారని భావం.
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు:. “పంక్తుల్లో కుడివైపున వుండే వారిపై అల్లాహ్ కారుణ్యాన్ని కురిపిస్తాడు. దైవదూతలు కూడా వారిని అల్లాహ్ కరుణించాలని కోరుకుంటూ ఉంటారు”. (అబూదావూద్-హసన్ – అల్ బానీగారి సహీహ్ సుననె అబూదావూద్, మొదటి సంపుటి 628వ హదీసు)
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) ప్రబోదనం :- “దైవప్రవక్తలపై తప్ప మరెవరి పైనా దరూద్ పంపకండి. అయితే ముస్లిం స్త్రీ పురుషుల కోసం మాత్రం మన్నింపు ప్రార్థనలు చేయండి”.
(దీనిని ఇస్మాయీల్ ఖాజీగారు “ఫజ్లుస్సలాతి అలన్నబియ్యి” గ్రంథంలో పేర్కొన్నారు. ఇది సహీహ్ కోవకు చెందిన హదీసు) (అల్ బానీగారి ఫజ్లుస్సలాతి అలన్నబియ్యి గ్రంథం, 75వ హదీసు)
దరూద్ షరీఫ్ ప్రాశస్త్యం
3వ అంశం: ఒకసారి దరూద్ పఠిస్తే అల్లాహ్ పదిసార్లు కారుణ్యాలు కురిపిస్తాడు. పది పాపాలను మన్నిస్తాడు. ఇంకా పది అంతస్తులను పెంచుతాడు.
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “ఎవరయినా నాపై ఒకసారి దరూద్ పరిస్తే అల్లాహ్ అతనిపై పదిసార్లు కారుణ్యం కురిపిస్తాడు. అతని పది పాపాలను మన్నిస్తాడు. ఇంకా అతని పది అంతస్తులను పెంచుతాడు“. (నసాయి-సహీహ్) (అల్బానీగారి సహీహ్ సునని నసాయి గ్రంథం, మొదటి సంపుటి 1230వ హదీసు)
4వ అంశం: అత్యధికంగా దరూద్ పఠిస్తే ప్రళయ దినాన దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సాంగత్యం లభిస్తుంది.
హజ్రత్ ఇబ్న్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు. “నాపై అత్యధికంగా దరూద్ పఠించేవాడు ప్రళయ దినాన నాకు అందరికన్నా సమీపంలో ఉంటాడు.” (తిర్మిజీ – సహీహ్) [అల్ బానిగారి మిష్కాతుల్ మసాబీహి గ్రంథం, మొదటి భాగం 923 న హదీసు]
5వ అంశం: ఎవరయినా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై దరూద్ పఠిస్తే, స్వర్గంలో ఆయనకు ‘ఉన్నత స్థానం’ లభించాలని కోరుకుంటే ప్రళయ దినాన వారికి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సిఫారసు లభిస్తుంది.
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “ఎవరయినా నాపై దరూద్ పఠిస్తే, నాకు ‘వసీలా’ (స్వర్గంలో ఒక ఉన్నత స్థానం) లభించాలని అల్లాహ్ ను కోరుకుంటే, ప్రళయ దినాన నేను వారి గురించి తప్పకుండా సిఫారసు చేస్తాను“
(ఇస్మాయీల్ ఖాజీగారు దీనిని ‘ఫజ్లుస్సలాతి అలన్నబియ్యి’ గ్రంథంలో పేర్కొన్నారు. ఇది ‘సహీహ్’ కోవకు చెందిన హదీసు).[అల్ బానిగారి ‘ఫజ్లుస్సలాతి అలన్నబియ్యి’ గ్రంథం 50వ హదీసు]
6వ అంశం: దరూద్ షరీఫ్ పాపాల మన్నింపుకు, దుఃఖవిచారాలను దూరం చేసుకోవటానికి, కష్టాలు కడగండ్ల నుండి గట్టెక్కటానికి దోహదపడుతుంది.
హజ్రత్ ఉబై బిన్ కాబ్ (రదియల్లాహు అన్హు) కథనం: నేనొకసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తో మాట్లాడుతూ “దైవప్రవక్తా! నేను మీపై అత్యధికంగా దరూద్ పంపుతూ ఉంటాను, వాస్తవానికి నేను నా ప్రార్ధన (దుఆ)లో ఎంతసేపు మీపై దరూద్ పఠించాలి.” అని అడిగాను. అందుకాయన “నీకిష్టమయినంత సేపు” అని అన్నారు. “నా ప్రార్థనలో నాల్గో వంతు మీ దరూద్ కోసం కేటాయిస్తే సరిపోతుందా?” అని అడిగాను. ”సరిపోతుంది. కాని అంతకన్నా ఎక్కువ సేపు దరూద్ పరిస్తే అది నీకే మంచింది” అని అన్నారాయన, నేను “సగం ప్రార్థన దరూద్ కోసం కేటాయిస్తాను” అన్నాను. దానికాయన “సరే, నీ యిష్టం. కానీ అంతకన్నా ఎక్కువ సేపు దరూద్ పఠిస్తే అది నీకే మంచిది” అని అన్నారు. నేను మళ్లీ “అయితే మూడింట రెండు వంతుల ప్రార్థన దాని కోసమే కేటాయించమంటారా?” అని అడిగాను. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ”నీ యిష్టం. ఇంకా ఎక్కువ సమయం దరూద్ పఠిస్తే అది నీకే మంచిది” అని అన్నారు. చివరికి నేను “మరయితే నా ప్రార్ధన అంతా దరూద్ కోసమే ప్రత్యేకించుకుంటాను” అని అన్నాను. అప్పుడాయన “ఈ పద్ధతి నీ దుఃఖ విచారాలన్నిటినీ దూరం చేస్తుంది. నీ పాపాల మన్నింపుకు దోహదపడుతుంది” అని చెప్పారు. (తిర్మిజీ-హసన్) [అల్ బానీగారి సహీహ్ సుననె తిర్మిజీ రెండో సంపుటి 1999వ హదీసు]
7వ అంశం: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై దరూద్ పంపే వారిపై అల్లాహ్ కారుణ్యాన్ని కురిపిస్తాడు, ఆయన పై శాంతి అవతరించాలని కోరుకునే వారిపై అల్లాహ్ శాంతిని అవతరింపజేస్తాడు.
హజ్రత్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రదియల్లాహు అన్హు) కథనం : ఒక రోజు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంటి నుండి బయలుదేరి ఖర్జూరపు తోటలోకి వెళ్ళారు. అక్కడ ఆయన సజ్దా చేశారు. చాలా సేపటి వరకు అలాగే ఉండిపోయారు. ఎంతసేపటికీ సజ్దా నుండి లేవకపోవటంతో అదే స్థితిలో ఆయన ప్రాణం గాని పోయి వుంటుందేమోనని భయమేసింది నాకు! నేనాయన వైపు అలాగే చూస్తుండిపోయాను. అంతలో ఆయన తల పైకెత్తి ‘ఏమయింది?’ అని అడిగారు. నేను నాకు తోచింది చెప్పాను. అప్పుడాయన నాతో ఇలా అన్నారు :
”(నేను సజ్దా స్థితిలో ఉన్నప్పుడు) జిబ్రయీల్ దూత నన్ను సంబోధిస్తూ, “ఓ ముహమ్మద్! నేను మీకో శుభవార్త తెల్పనా? మీపై దరూద్ పంపిన వ్యక్తిపై తాను కారుణ్యాన్ని కురిపిస్తాననీ, మీ శాంతిని కోరేవారిపై తానూ శాంతిని అవతరింపజేస్తానని అంటున్నాడు అల్లాహ్” అని చెప్పారు. (అహ్మద్-సహీహ్) [అల్బానీగారి ఫజ్లుస్సలాతి అలన్నబియ్యి గ్రంథం 7వ హదీసు]
8వ అంశం: ఉదయం పదిసార్లు, సాయంత్రం పదిసార్లు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై దరూద్ పఠిస్తే, (ప్రళయ దినాన) ఆయన సిఫారసు భాగ్యం లభిస్తుంది.
హజ్రత్ అబూదర్దా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “ఎవరయితే ఉదయం పదిసార్లు, సాయంత్రం పదిసార్లు నాపై దరూద్ పఠిస్తారో, ప్రళయ దినాన వారికి నా సిఫారసు లభిస్తుంది“.(తబ్రానీ-హసన్) [అల్ బానీగారి ఫజ్లుస్సలాతి అలన్నబియ్యి గ్రంథం. 11వ హదీసు]
9వ అంశం: దరూద్ – ప్రార్థన (దుఆ) స్వీకరించబడేందుకు తోడ్పడుతుంది.
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) కథనం : ఓ రోజు నేను నమాజ్ చేస్తుండగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), ఆయనతో పాటు అబూబక్ర్, ఉమర్ (రదియల్లాహు అన్హుమా)లు కూడా (నాకు సమీపంలోనే) కూర్చొని ఉన్నారు. నేను (నమాజ్ ముగించుకొని దుఆ కోసం) కూర్చొని ముందుగా అల్లాహ్ ను స్తుతించాను. తర్వాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)పై దరూద్ పఠించి ఆ తర్వాత నా స్వయం కోసం దుఆ చేసుకున్నాను. అది విని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “(అలాగే) అల్లాహ్ ను ప్రార్థించు, నీకు తప్పకుండా ప్రసాదించబడుతుంది. (మళ్లీ) అల్లాహ్ ను ప్రార్థించు, నీకు తప్పకుండా ప్రసాదించటం జరుగుతుంది” అని పురికొల్పారు. (తిర్మిజీ-హసన్) [అల్ బానీగారి సహీహ్ సుననె తిర్మిజీ మొదటి సంపుటి 486 వ హదీసు]
10వ అంశం: దరూద్ పఠించే వారిపై అల్లాహ్ పదిసార్లు కారుణ్యాన్ని కురిపిస్తాడు.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “ఎవరయినా నాపై ఒకసారి దరూద్ పఠిస్తే అల్లాహ్ అతని మీద పదిసార్లు కారుణ్యాన్ని కురిపిస్తాడు“.(ముస్లిం – నమాజ్ ప్రకరణం)
11వ అంశం: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై ఒకసారి దరూద్ పఠించే వారిపై అల్లాహ్ పదిసార్లు కారుణ్యాన్ని కురిపిస్తాడు. ఒకసారి దైవప్రవక్త పై శాంతిని కోరుకునే వారి పై అల్లాహ్ పదిసార్లు శాంతిని అవతరింపజేస్తాడు.
హజ్రత్ అబూ తల్హా (రదియల్లాహు అన్హు) కథనం: ఓ రోజు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మా దగ్గరికి వచ్చారు. ఆ సమయంలో ఆయన ముఖారవిందం ఆనందాతిశయంతో వెలిగిపోతూ ఉంది. అది చూసి మేము ”ఈ రోజు మీ ముఖారవిందంలో సంతోషం తొణకిసలాడుతున్నట్లు కన్పిస్తుందే” అని అన్నాం. అప్పుడాయన మాకు ఇలా తెలియజేశారు. “నా దగ్గరకు జిబ్రయీల్ దూత వచ్చి ఓ శుభవార్త చెప్పి వెళ్ళారు. అల్లాహ్ నన్ను ఉద్దేశ్యించి, ”ముహమ్మద్! ఎవరయినా మీపై ఒకసారి దరూద్ పఠిస్తే, నేనతని పై పదిసార్లు కారుణ్యాన్ని కురిపిస్తాను. ఎవరయినా ఒకసారి మీపై శాంతి కలగాలని కోరుకుంటే నేను వారిపై పదిసార్లు శాంతిని అవతరింపజేస్తాను. ఇది మీకు సంతోషకరమే కదా! అని అడుగుతున్నాడట!” (నసాయి-హసన్)[అల్బానీగారి సహీహ్ సుననె నసాయి మొదటి సంపుటి1216వ హదీసు]
12వ అంశం: ఒకసారి దరూద్ పఠిస్తే ‘కర్మపత్రం’లో పదిపుణ్యాలు లిఖించబడతాయి.
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు : “ఎవరయినా నాపై ఒకసారి దరూద్ పఠిస్తే, అల్లాహ్ అతని కర్మల పత్రంలో పదిపుణ్యాలు జమ చేస్తాడు”. (దీనిని ఇస్మాయీల్ ఖాజీ ‘ఫజ్లుస్సలాతి అలన్నబియ్యి’ గ్రంథంలో పేర్కొన్నారు. ఇది సహీహ్ కోవకు చెందిన హదీసు) [అల్ బానీగారి ఫజ్లుస్సలాతి అలన్నబియ్యి గ్రంథం 11వ హదీసు]
13వ అంశం: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై దరూద్ పఠిస్తూ ఉన్నంత వరకు దైవదూతలు అలా పఠించే వారి కొరకు కారుణ్య ప్రార్థనలు చేస్తూ ఉంటారు.
హజ్రత్ ఆమిర్ బిన్ రబీఆ తన తండ్రి నుండి చేసిన కథనం ప్రకారం, తను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచిస్తుండగా విన్నారు: “ఏ ముస్లిం వ్యక్తి అయినా నాపై దరూద్ పఠిస్తూ ఉన్నంత వరకు దైవదూతలు అతనిపై కారుణ్యం కురవాలని ప్రార్థిస్తూనే ఉంటారు. కనుక ఇక మీ యిష్టం. దరూద్ తక్కువగానయినా పఠించండి లేదా ఎక్కువగానయినా పఠించండి”.
(దీనిని ఇస్మాయీల్ ఖాజీ ఫజ్లుస్సలాతి అలన్నబియ్యి గ్రంథంలో పేర్కొన్నారు. ఇది ‘హసన్’ కోవకు చెందిన హదీసు) [అల్ బానీగారి మిష్కాతుల్ మసాబీహ్ గ్రంథం మొదటి సంపుటి 725వ హదీసు]
14వ అంశం: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు సలాం చేస్తే, ఆయన తనకు సలాం చేసే వారికి ప్రతి సలాం చేస్తారు.
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “ఎవరయినా నాకు సలాం చేస్తే, ఆ సమయంలో అల్లాహ్ నా ఆత్మను (భూలోకానికి) త్రిప్పి పంపిస్తాడు. దాంతో నేను నాకు సలాం చేసిన వారికి ప్రతి సలాం చేస్తాను”. (అబూ దావూద్-హసన్) [అల్ బానీగారి ఫజ్లుస్సలాతి అలన్నబియ్యి గ్రంథంలోని 6వ హదీసు]
గమనిక: దరూద్ షరీఫ్ పఠనంపై లభించే పుణ్య పరిమాణం గురించి వివిధ హదీసుల్లో వివిధ రకాలుగా పేర్కొనటం జరిగింది. మొత్తానికి ఆ పుణ్యం దాన్ని పఠించేవారి చిత్తశుద్ధి, భక్తివిశ్వాసాల మీద ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని గ్రహించాలి.
దరూద్ షరీఫ్ ప్రాముఖ్యత (أَهْمِيةُ الصَّلَاةِ عَلَى النَّبِيِّ)
15వ అంశం: తన శుభనామం విన్న తర్వాత కూడా తనపై దరూద్ పఠించని వాణ్ణి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) శపించారు.
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా శపించారు: “తన ముందు నా పేరు ప్రస్తావించబడినప్పటికీ నాపై దరూద్ పంపని వాడు నాశనమయిపోవు గాక! పూర్తి రమజాన్ మాసాన్ని పొందినప్పటికీ తన పాపాలను ప్రక్షాళనం చేసుకోలేకపోయినవాడు నాశనమయిపోవు గాక! తన జీవితంలో ముసలివారయిన తల్లిదండ్రుల్ని పొందినప్పటికీ వారికి సేవ చేసుకొని స్వర్గంలోకి ప్రవేశించలేక పోయినవాడు నాశనమయిపోవు గాక!” (తిర్మిజీ – సహీహ్) (అల్ బానీగారి సహీహ్ సుననె తిర్మిజీ, మూడో సంపుటి 2810 వ హదీసు)
16వ అంశం: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి శుభనామం విన్న తర్వాత ఆయన పై దరూద్ పంపనివాణ్ణి జిబ్రయీల్ (అలైహిస్సలాం) శపిస్తే, అందుకు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ‘తథాస్తు’ అని పలికారు.
హజ్రత్ కాబ్ బిన్ ఉజ్రా (రదియల్లాహు అన్హు) కథనం: ఒక రోజు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మింబర్ (వేదిక)ను తీసుకొచ్చి పెట్టమని ఆదేశించారు. మేము అలాగే తీసుకొచ్చి పెట్టాం. ఆయన వేదిక తొలి మెట్టు ఎక్కినప్పుడు ‘ఆమీన్’ అని అన్నారు. రెండో మెట్టు ఎక్కినప్పుడు ‘ఆమీన్’ అని అన్నారు. మూడో మెట్టు ఎక్కినప్పుడు కూడా ‘ఆమీన్’ అని అన్నారు. ఉపన్యాసం ముగించి వేదిక దిగి క్రిందికి రాగానే సహాబాలు (సహచరులు) ఆశ్చర్యంతో, “ఈ రోజు విూరు విచిత్రంగా ప్రవర్తించారు. (ఖుత్బా సమయంలో) మీరలా అనటం మేము ఇంతకు ముందెన్నడూ వినలేదు. (విషయం ఏమిటి దైవప్రవక్తా?!)” అని అడిగారు.
అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) విషయాన్ని వివరిస్తూ ”జిబ్రయీల్ (అలైహిస్సలాం) వచ్చి “రమజాన్ మాసం పొందినప్పటికీ తన పాపాలను ప్రక్షాళనం చేయించుకోలేక పోయినవాడు నాశనమవుగాక!” అని శపించారు. నేనందుకు “ఆమీన్” అని అన్నాను. ఆ తర్వాత నేను రెండో మెట్టు ఎక్కుతున్నప్పుడు జిబ్రయీల్ ‘తన ముందు మీ శుభనామం ప్రస్తావనకు వచ్చినప్పటికీ మీ పై దరూద్ పంపనివాడు నాశనమయిపోవుగాక!’ అని శపించారు. నేనందుకు ”ఆమీన్” అని పలికాను. మూడో మెట్టు ఎక్కుతున్నప్పుడు జిబ్రయీల్, “ముసలి వారయిన తల్లిదండ్రుల్ని లేక వారిరువురిలో ఏ ఒక్కరినయినా పొంది వారికి సేవలు చేసుకొని స్వర్గాన్ని పొందలేకపోయినవాడు నాశనమవుగాక!” అని శపించారు. నేనందుకు కూడా ‘ఆమీన్’ అని అన్నాను” అని చెప్పారు. (హాకిమ్ – సహీహ్) (అల్ బానీగారి ఫజ్లుస్సలాతి అలన్నబియ్యి గ్రంథం 19 హదీసు)
17వ అంశం: దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై దరూద్ పంపనివాడు మహా పిసినిగొట్టు
హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) కథనం, ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “తన ముందు నా పేరు ప్రస్తావించబడినప్పటికీ నాపై దరూద్ పఠించనివాడు పిసినిగొట్టు.” (తిర్మిజీ-సహీహ్) (అల్ బానీగారి సహీహ్ సుననె తిర్మిజీ మూడో సంపుటి 2811వహదీసు)
హజ్రత్ అబూ జర్ర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “తన ముందు నా పేరు ప్రస్తావించబడినప్పటికీ నాపై దరూద్ పఠించనివాడు ప్రజలందరిలోకెల్లా మహా పిసినిగొట్టు”. (ఖాజీ ఇస్మాయీల్ దీనిని ఫజ్లుస్సలాతి అలన్నబియ్యి గ్రంథంలో పేర్కొన్నారు. ఇది సహీహ్ కోవకు చెందిన హదీసు) (అల్ బానీగారి ఫజ్లుస్సలాతి అలన్నబియ్యి గ్రంథం 37వ హదీసు)
18వ అంశం: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)పై దరూద్ పంపకుండా ఉండటం ప్రళయ దినాన దుఃఖదాయకంగా పరిణమిస్తుంది.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “కొంతమంది ఒకచోట సమావేశమై ఆ సమావేశంలో అల్లాహ్ ను జ్ఞాపకం చేసుకోకపోతే, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై దరూద్ పంపకపోతే ప్రళయదినాన ఆ సమావేశం వారి పాలిట దుఃఖదాయకంగా (తలవంపుగా) పరిణమిస్తుంది. వారు సత్కార్యాల ఆధారంగా స్వర్గంలో ప్రవేశించేవారయినా సరే” (అహ్మద్, ఇబ్నె హిబ్బాన్, హాకిమ్, ఖతీబ్- సహీహ్) (అల్బానీగారి సిల్సిలతుల్ అహాదీసుస్సహీహా ‘మొదటి సంపుటి 76వ హదీసు)
19వ అంశం : దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)పై దరూద్ పఠించకపోతే స్వర్గాన్ని కోల్పోయే ప్రమాదముంది!
హజ్రత్ ఫజాలా బిన్ ఉబైద్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక వ్యక్తి నమాజ్లో దరూద్ పఠించకుండా దుఆ చేస్తుండగా చూసి ‘ఇతను తొందరపడ్డాడు’ అని అన్నారు. ఆ తర్వాత అతణ్ణి దగ్గరకు పిలిచి అతన్నో లేక మరో వ్యక్తినో ఉద్దేశ్యించి, “మీలో ఎవరయినా నమాజ్ చేసేటప్పుడు దైవస్తోత్రంతో ప్రారంభించాలి. ఆ తర్వాత (తషహుద్ లో కూర్చున్నప్పుడు) దైవప్రవక్తపై దరూద్ పఠించాలి. దాని తర్వాత తమకు ఇష్టమొచ్చింది ప్రార్థించుకోవాలి” అని చెప్పారు. (తిర్మిజీ-సహీహ్) (అల్బానీగారి సహీహ్ సుననె తిర్మిజీ మూడో సంపుటి 2767వ హదీసు)
25వ అంశం: జనాజా నమాజ్లో రెండో తక్బీర్ తర్వాత దరూద్ పఠించటం మస్నూన్
హజ్రత్ అబూ ఉమామా బిన్ సహ్లి (రదియల్లాహు అన్హు) కథనం, ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అనుచరుల్లో ఒకాయన తనకు ఈ విషయం తెలిపారు. “జనాజా నమాజ్లో ఇమామ్ మొదటి తక్బీర్ తర్వాత మెల్లిగా ఫాతిహా సూరా పఠించటం, (రెండో తక్బీర్ తర్వాత) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై దరూద్ పఠించటం, (మూడో తక్బీర్ తర్వాత) మృతుని కోసం చిత్తశుద్ధితో ప్రార్థించటం, ఈ తక్బీరుల్లో ఖురాన్ పారాయణం చేయకుండా ఉండటం, (నాల్గో తక్బీర్ తర్వాత) మెడ త్రిప్పుతూ మెల్లిగా సలాం చేయటం సున్నత్ (సంప్రదాయం)“. (షాఫయీ) (ముస్నదె షాఫయీ-581 వ హదీసు)
26వ అంశం: అజాన్ విన్న తర్వాత ‘దుఆ’ చేసే ముందు దరూద్ పఠించటం మస్నూన్
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రబోధిస్తుండగా తాను విన్నానని హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హుమా) తెలియజేశారు: “ముఅజ్జన్ (అజాన్ ఇచ్చేవాని) ప్రకటన విన్నప్పుడు, అతను అనే పలుకులే మీరూ పలకండి. ఆ తర్వాత నాపై దరూద్ పఠించండి. నాపై ఒకసారి దరూద్ పఠించేవారిని అల్లాహ్ పదిసార్లు కరుణిస్తాడు. ఆ తర్వాత నాకు ‘వసీలా’ లభించాలని అల్లాహ్ ను ప్రార్థించండి. వసీలా అనేది స్వర్గంలో ఒక (ఉన్నత స్థానం). స్వర్గవాసులందరిలో అది కేవలం ఒకే ఒక్కరికి లభిస్తుంది. ఆ ఒక్కణ్ణి నేనేనని నా అభిప్రాయం. కనుక నాకు వసీలా లభించాలని ప్రార్థించే వ్యక్తికి నా సిఫారసు తప్పకుండా లభిస్తుంది“. (ముస్లిం – నమాజ్ ప్రకరణం.)
27వ అంశం: నిత్యం, ప్రతి చోటా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై దరూద్ పఠిస్తూ ఉండాలని విశ్వాసులకు ఆజ్ఞ అయింది.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “నా సమాధిని తిరునాళ్ళగా చేయకండి. మీ ఇండ్లను శ్మశానాలుగా మార్చుకోకండి. మీరెక్కడున్నా సరే నాపై దరూద్ పంపుతూ ఉండండి. మీ దరూద్ నాకు చేరవేయబడుతుంది”. (అహ్మద్-సహీహ్) (అల్బానీగారి ఫజ్లుస్సలాతి అలన్నబియ్యి గ్రంథంలోని 20వ పుట)
హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “నాపై అత్యధికంగా దరూద్ పంపండి. అల్లాహ్ నా సమాధి దగ్గర ఓ దూతను నియమిస్తాడు. నా అనుచరుడెవడయినా నాపై దరూద్ పంపితే, ఆ దైవదూత నాతో, “ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)! ఫలానా అతను ఫలానా సమయంలో మీపై దరూద్ పంపాడు’ అని చెబుతాడు“. (దైలమీ -హసన్)(అల్ బానీగారి సిల్సిలతుల్ అహాదీసుస్సహీహా నాల్గో సంపుటి 1530వ హదీసు)
హజ్రత్ ఇబ్నె మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “నా అనుచరులు నాకు చెప్పే సలాములను నాకు చేరవేయటానికి అల్లాహ్ కొంతమంది దూతల్ని నియమించాడు. వారు భూమిమీద తిరుగుతూ ఉంటారు”. (నసాయి-సహీహ్) (అల్ బానీగారి సహీహ్ సుననె నసాయి 1215వ హదీసు)
28వ అంశం: జుమానాడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై అత్యధికంగా దరూద్ పఠించాలి.
హజ్రత్ అబూ మస్ ఊద్ అన్సారీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “జుమా నాడు నాపై అత్యధికంగా దరూద్ పంపండి. ఎందుకంటే జుమా నాడు ఎవరయినా నాపై దరూద్ పరిస్తే అది తప్పకుండా నాకు సమర్పించబడుతుంది“. (హాకిమ్, బైహఖీ-సహీహ్) (అల్బానీ గారి సహీహ్ జామె సగీర్ మొదటి సంపుటి 1219వ హదీసు)
హజ్రత్ ఔస్ బిన్ ఔస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “మీ రోజుల్లో జుమా రోజు ఎంతో ఘనమైనది. ఆ రోజునే ఆదం పుట్టించబడ్డారు. ఆ రోజునే మరణించారు. ఆ రోజునే శంఖం పూరించబడుతుంది. ఆ రోజునే మృతుల్ని తిరిగి లేపే ఆజ్ఞ అవుతుంది. కనుక ఆ రోజు మీరు నాపై అత్యధికంగా దరూద్ పంపండి. మీ దరూద్ నాకు చేరవేయబడుతుంది“.
అది విని అనుచరులు, “దైవప్రవక్తా! మేము పంపే దరూద్ తమకు ఎలా చేరవేయబడుతుంది. అప్పటికి మీ ఎముకలు (సయితం) కృశించిపోయి ఉంటాయి కదా! (లేక) మీ దేహం మట్టిలో కలిసిపోయి ఉంటుంది కదా!” అని సందేహపడగా, “అల్లాహ్ దైవప్రవక్తల శరీరాల్ని మట్టికొరకు నిషేధం చేశాడు” అని చెప్పారాయన (సల్లల్లాహు అలైహి వసల్లం). (అబూదావూద్-సహీహ్) (అల్బానీగారి సహీహ్ సుననె అబూదావూద్ మొదటి సంపుటి 925)
29వ అంశం: దుఆలో ముందుగా దైవస్తోత్రం చేయాలి. ఆ తర్వాత దైవప్రవక్త పై దరూద్ పంపాలి.
హజ్రత్ ఫజాలా బిన్ ఉబైద్ (రదియల్లాహు అన్హు) కథనం: ఒకరోజు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) (మస్జిదులో) కూర్చొని ఉండగా ఒక వ్యక్తి లోనికి ప్రవేశించాడు. నమాజ్ చేసిన తర్వాత అతను “ఓ అల్లాహ్! నన్ను క్షమించు. నా మీద దయజూపు” అని ప్రార్థించటం మొదలు పెట్టాడు. అది చూసి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతన్ని ఉద్దేశ్యించి, “ఓయీ నమాజ్ చేసిన వ్యక్తి! నువ్వు ప్రార్థించటంలో తొందరపడ్డావు. నమాజ్ చేసుకున్న తర్వాత దుఆ కోసం కూర్చున్నప్పుడు ముందుగా తగిన విధంగా అల్లాహ్ ను స్తుతించు. తర్వాత నాపై దరూద్ పఠించు. ఆ తర్వాత నీ కోసం దుఆ చేసుకో” అని ఉపదేశించారు..
మరో వ్యక్తి సమాజ్ చేసుకున్న తర్వాత ”ముందుగా అల్లాహ్ ను స్తుతించాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై దరూద్ పఠించాడు. అది చూసి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “ఓయీ నమాజ్ చేసిన వ్యక్తీ! ప్రార్థించు, నీ ప్రార్ధన తప్పకుండా స్వీకరించబడుతుంది” అని అన్నారు. (తిర్మిజీ-సహీహ్) (అల్బానీ గారి సహీహ్ సుననె తిర్మిజీ మూడో సంపుటి 2865వ హదీసు)
30వ అంశం: పాపాల మన్నింపు కోసం దరూద్ పఠించటం మస్నూన్.
31 వ అంశం: కష్టసమయాల్లో, విచారఘడియల్లో దరూద్ పఠించటం మస్నూన్.
హజ్రత్ ఉబై బిన్ కాబ్(రదియల్లాహు అన్హు) కథనం: నేనొకసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో మాట్లాడుతూ, “దైవప్రవక్తా! నేను అత్యధికంగా మీపై దరూద్ పంపుతూ ఉంటాను. అసలు నా ప్రార్ధనలో ఎంత సేపు మీపై దరూద్ పఠించాలి?” అని అడిగాను. అందుకాయన, ”నీకిష్టమయినంతసేపు” అని అన్నారు. “నా ప్రార్థనలో నాల్గోవంతు మీ దరూద్ కోసం కేటాయిస్తే సరిపోతుందా?” అని అడిగాను, ”సరిపోతుంది. కాని * అల్బానీ గారి సహీహ్ సుననె తిర్మిజీ మూడో సంపుటి 2865వ హదీసు. అంతకన్నా ఎక్కువ సేపు దరూద్ పఠిస్తే అది నీకే మంచిది” అని అన్నారాయన. నేను “సగం ప్రార్థన (దుఆ) దరూద్ కోసం కేటాయిస్తాను” అని అన్నాను. దానికాయన ”సరే, నీ యిష్టం. కానీ అంతకన్నా ఎక్కువసేపు దరూద్ పఠిస్తే అది నీకే మంచిది” అన్నారు. నేను మళ్లీ “అయితే మూడింట రెండు వంతుల ప్రార్థన దానికోసమే కేటాయించమంటారా?” అని అడిగాను. ఆయన “నీ యిష్టం. ఇంకా ఎక్కువ సమయం దరూద్ పఠిస్తే అది నీకే మంచిది” అని అన్నారు. చివరికి నేను, ”మరయితే నా ప్రార్థన అంతా దరూద్ కోసమే ప్రత్యేకించుకుంటున్నాను” అని అన్నాను. అప్పుడాయన “ఈ పద్ధతి నీ దుఃఖవిచారాలన్నిటినీ దూరం చేస్తుంది. నీ పాపాల మన్నింపుకు దోహదపడుతుంది” అని చెప్పారు. (తిర్మిజీ-హసన్)(అల్బానీగారి సహీహ్ సుననె తిర్మిజీ రెండోసంపుటి 1999వ హదీసు)
32వ అంశం: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి శుభనామం విన్నప్పుడుగాని, చదివి నప్పుడుగాని, వ్రాసినప్పుడుగాని దరూద్ పఠించటం మస్నూన్.
హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: ”తన దగ్గర నా ప్రస్తావన వచ్చినప్పటికీ నాపై దరూద్ పఠించనివాడు పరమ పిసినిగొట్టు.” (తిర్మిజీ-సహీహ్) (అల్బానీగారి సహీహ్ సుననె తిర్మిజీ మూడో సంపుటి 2811వ హదీసు)
33వ అంశం: మస్జిద్ కి ప్రవేశించేటప్పుడు, మస్జిద్ నుండి వెడలినప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)పై సలాం పంపటం మస్నూన్.
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కుమార్తె హజ్రత్ ఫాతిమా (రదియల్లాహు అన్హా ) కథనం; దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మస్జిద్ కి ప్రవేశించేటప్పుడు ఇలా పలికేవారు.
“బిస్మిల్లాహి వస్సలాము అలా రసూలిల్లాహి అల్లాహుమ్మగ్ఫోర్లీ జునూబీ, వఫతహ్లీ అబ్వాబ రహ్మతిక”, (అల్లాహ్ పేరుతో మస్జిద్లోకి ప్రవేశిస్తున్నాను. దైవప్రవక్తపై శాంతి కురియు గాక! అల్లాహ్! నా పాపాలను మన్నించు. నా కోసం నీ కారుణ్య ద్వారాలను తెరిచి ఉంచు.)
తిరిగి మస్జిద్ నుండి వెడలినప్పుడు ఈ విధంగా ప్రార్థించేవారు.
“బిస్మిల్లాహి వస్సలాము అలా రసూలిల్లాహి, అల్లాహుమ్మ్ఫరీ జునూబీ వఫతహ్లీ అబ్వాబ పబ్లిక”. (అల్లాహ్ పేరుతో వెడలుతున్నాను. దైవప్రవక్తకు శాంతి కల్గుగాక! దేవా! నా పాపాలను మన్నించు. నీ కటాక్ష ద్వారాలను నా కోసం తెరిచి ఉంచు.)(ఇబ్నెమాజా-సహీహ్)(అల్బానీగారి సహీహ్ సుననె ఇబ్సెమాజా మొదటి సంపుటి 625వ హదీసు)
34వ అంశం: ప్రతి సమావేశంలోనూ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై దరూద్ పఠించటం మస్నూన్.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: కొంతమంది ఏదయినా ఒక చోట సమావేశమై ఆ సమావేశంలో అల్లాహ్ ను జ్ఞాపకం చేసుకోకపోతే, తమ ప్రవక్తపై దరూద్ పంపకపోతే ఆ సమావేశం వారిపాలిట తలవంపుగా పరిణమిస్తుంది. అల్లాహ్ వారిని శిక్షించనూవచ్చు లేదా మన్నించనూ వచ్చు. (తిర్మిజీ-సహీహ్)(అల్బానీగారి సహీహ్ సునవె తిర్మిజీ మూడో సంపుటి 2691వ హదీసు)
35వ అంశం: ప్రతిరోజూ ఉదయం సాయంత్రం దరూద్ పఠించటం మస్నూన్.
హజ్రత్ అబూదర్దా(రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: ఎవరయినా నాపై ఉదయం వేళ పదిసార్లు. తిరిగి సాయంత్రం పూట పదిసార్లు దరూద్ పఠిస్తే ప్రళయదినాన వారికి నా సిఫారసు లభిస్తుంది.(తబ్రానీ-హసన్)(అల్బానీగారి సహీహ్ జామే ఉస్-సగీర్ 6233వ హదీసు)
36వ అంశం: అజాన్ కంటే ముందు దరూద్ పఠించటంనిరాధారమైన విషయం.
37వ అంశం: ఏ ఫర్జ్ తర్వాత అయినా బిగ్గరగా సామూహికంగా దరూద్ పఠించాలన్న దానికి ప్రవక్త విధానం ద్వారా రుజువు లభించదు.
38వ అంశం: జుమా నమాజ్ తర్వాత నిలబడి సామూహికంగా బిగ్గరగా దరూద్ పఠించాలన్న దానికి ప్రవక్త విధానం ద్వారా రుజువు లభించదు.
39వ అంశం: నమాజ్ ముగిసిన తర్వాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు సలాం పంపటం మస్నూన్
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
1) సహాబాల ఆచరణల వెలుగులో ఖుర్ఆన్ మరియు హదీసుల అవగాహన.
2) ధార్మిక పరంగా మిలాదున్నబీ (దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) జన్మదినం ఉత్సవానికున్న విలువ.
3) మూడు ముఖ్య నియమాలు
4) ధర్మంలో ‘బిద్దతే హసన’ (మంచి క్రొత్త పోకడ) యొక్క అస్తిత్వం వుందా?
5) మిలాదున్నబీని జరుపుకొనే వారి ఆధారాలు మరియు వాటి జవాబులు.
ఇస్లామీయ సహెూదరులారా!
ఒక ముస్లిం యొక్క సాఫల్యత అనేది అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు విధేయత చూపడంలోనే వుంది. దివ్య ఖుర్ఆన్ మరియు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హదీసులలో అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వివరించిన విషయాలను అనుసరిస్తూ, వాటి తిరస్కరణ, అవిధేయతలకు ఎల్లప్పుడూ దూరంగా వుండాలి.
అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
“అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త యెడల విధేయత చూపే వారికి అల్లాహ్ క్రింద కాలువలు ప్రవహించే (స్వర్గం) వనాలలో ప్రవేశం కల్పిస్తాడు. వాటిలో వారు కలకాలం వుంటారు. గొప్ప విజయం అంటే ఇదే. ఎవడు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త యెడల అవిధేయుడై, ఆయన నిర్ధారించిన హద్దులను మీరిపోతాడో వాడిని ఆయన నరకాగ్నిలో పడవేస్తాడు. వాడందులో ఎల్లకాలం పడి వుంటాడు. అవమానకరమైన శిక్ష అలాంటి వారి కోసమే వుంది.” (నిసా:13- 14)
పై ఆయతులపై ఒక్కసారి దృష్టి సారించండి. వీటిలో అల్లాహ్ – విధేయత చూపుతూ తనను అనుసరించే వారికి స్వర్గపు శుభవార్తనూ, దీనికి వ్యతిరేకంగా అవిధేయత చూపి తనను తిరస్కరించే వారికి నరక శిక్షను గూర్చి తెలియజేశాడు. అందుకే ప్రతి ముస్లిం తన హృదయంలో తొంగి చూసి, తనే మార్గంలో పయనిస్తున్నాడో విశ్లేషించుకోవాలి. స్వర్గానికి తీసుకెళ్ళే మార్గంలోనా లేక (అల్లాహ్ శరణు) నరకంలోకి తీసుకెళ్ళే మార్గంలోనా అని. అల్లాహ్ కు విధేయత ఎలా సాధ్యమవుతుంది? అతనికి విధేయత అనేది – దివ్య ఖుర్ఆన్ ను చదవడం, నేర్పించడం ద్వారా మరియు దాని (ఆజ్ఞల)పై దృష్టి సారించి, దానినే మన జీవితపు కొలమానంగా నిర్ధారించడం ద్వారా సాధ్యమవుతుంది.
ఇక, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు విధేయత ఎలా సాధ్యమవుతుంది?
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
(1) దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అత్యుత్తమ గుణగణాల గురించి ఖురాన్ మరియు తౌరాత్ గ్రంథాల సాక్ష్యం.
(2) దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గుణగణాలను గూర్చి అనేక మంది సహాబాల సాక్ష్యం.
(3) అత్యుత్తమ గుణగణాల నమూనాలు.
ఇస్లామీయ సహోదరులారా! నేటి జుమా ఖుత్బా యొక్క అంశం – “దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అత్యుత్తమ గుణగణాలు”.
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గుణగణాల్ని చర్చించే ముందు మనమందరం ఒక విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. అదేమిటంటే – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అల్లాహ్ యొక్క ప్రవక్త అవడంతో పాటు దైవప్రవక్త లందరికీ నాయకులు (ఇమామ్). ప్రవక్త పాలనా పోషణలు స్వయంగా అల్లాహ్ చూస్తాడు. ఇలా అతణ్ణి, నిత్యం పరిశుద్ధం చేస్తూ గుణగణాల్లో, నైతికతలో అందరికన్నా ఉత్తముడిగా, ఆదర్శవంతునిగా తీర్చిదిద్దుతాడు. ప్రవక్త సంరక్షకుడు స్వయానా అల్లాహ్ కనుక దివ్య ఖురాన్లో రెండు విషయాలపై ఒట్టేసి మరీ ఆయన ప్రవక్తల నాయకులైన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గుణగణాలను గూర్చి సాక్ష్యమిచ్చాడు.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
“నూన్- కలము సాక్షిగా! వారు (దైవదూతలు) వ్రాసే సాక్షిగా! (ఓ ముహమ్మద్)! నీ ప్రభువు అనుగ్రహం వల్ల నీవు పిచ్చివాడవు కాదు. నిశ్చయంగా నీకు ఎన్నటికీ తరగని పుణ్యఫలం లభిస్తుంది. ఇంకా నీవు నైతికంగా అత్యున్నత స్థానంలో వున్నావు”. (ఖలమ్ : 1-4)
ప్రవక్త ఎల్లప్పుడూ దైవ వాణి (వహీ)ని అనుసరిస్తాడు. కనుక ఆ దైవవాణే వాస్తవానికి అతని నైతికత, గుణగణాలు అయివుంటాయి. అందుకే ఓ సారి ఆయెషా (రజి అల్లాహు అన్హతో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గుణగణాల గురించి అడగ్గా ఆమె జవాబిస్తూ – ఆయన గుణగణాలు స్వయానా దివ్య ఖురానే అని అన్నారు. (ముస్నద్ అహ్మద్ – సహీఉల్ అర్నావూత్)
అంటే ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) దివ్య ఖురానుకు ఆచరణా ప్రతిబింబము అన్నమాట.
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గుణగణాల సాక్ష్యం కేవలం ఖురానులోనే కాదు, మునపటి ఆకాశ గ్రంథాలలో కూడా లభ్యమై వుంది.
అతా బిన్ యసార్ (రహిమహుల్లాహ్) కథనం: “నేనొక సారి అబ్దుల్లా బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హు) ను కలిసి ఆయనతో – తౌరాత్ లో వివరించబడ్డ దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గుణగణాలను గూర్చి వివరించండి- అని అడిగాను. ఆయన జవాబిస్తూ – సరే, అల్లాహ్ సాక్షి! దివ్య ఖురానులో వివరించబడ్డ ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) కొన్ని గుణగణాలే తౌరాత్ లోనూ వివరించబడ్డాయి.
దివ్య ఖురాన్లో ఇలా వుంది: ‘ఓ ప్రవక్తా! మేము నిన్ను సాక్షిగా, శుభవార్తాహరుడిగా, భయపెట్టేవాడిగా చేసి పంపాము.’ తౌరాత్ లో కూడా ఈ గుణగణాలు వివరించబడ్డాయి. వీటితో పాటు తౌరాత్ లో ఇంకా ఆయన అరబ్బుల కోసం కోటగా వుంటారని, ఆయన నా(అల్లాహ్) దాసులు మరియు ప్రవక్త అని, ఆయన పేరు ‘ముతవక్కల్’ (అల్లాహ్ పై నమ్మకం వుంచేవాడు) అని నేను పెట్టాను – అని వుంది. ఇంకా ఆయన గుణగణాల్లో ఇవి కూడా వివరించబడ్డాయి – ఆయన దుర్గుణులు, కఠినులు కారు మరియు బజార్లలో గొంతెత్తి సంభాషించరు. చెడును చెడుతో సమాధానం ఇవ్వకుండా, దానిని ఉపేక్షించి క్షమిస్తారు అని వివరించారు. (బుఖారీ : 4838)
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అత్యుత్తమ గుణగణాలను గూర్చి దివ్య ఖురాను మరియు తౌరాత్ గ్రంథాల సాక్ష్యం తర్వాత మరి కొందరి సాక్ష్యం కూడా వినండి!
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
తన అనుచర సమాజం (ఉమ్మత్) పై దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హక్కులు:
1) అల్లాహ్ దాసుడిగా మరియు ప్రవక్తగా విశ్వసించడం.
2) తగిన విధంగా గౌరవించడం,
3) అల్లాహ్ తర్వాత, అత్యధికంగా ప్రేమించడం.
4) ఆదర్శాలను, సద్గుణాలను ఆచరించడం.
5) విధేయత చూపడం.
6) అభిప్రాయ భేదాలలో న్యాయనిర్ణేతగా స్వీకరించడం.
7) ఖుర్ఆన్ మరియు హదీసులకనుగుణంగా ఆచరించడం,
8) అత్యధికంగా దరూద్ పఠించడం.
గడిచిన జుమా ఖుత్బాలో, మేము ప్రవక్తల నాయకుడైన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) స్థాయి, మహత్యం, అద్భుతాలు మరియు ఆయన ప్రత్యేకతలలో కొన్నింటిని గూర్చి వివరించాము. మరి ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ప్రవక్తకు తన అనుచర సమాజం (ఉమ్మత్)పై ఉన్న హక్కులేంటి? రండి, ఖురాను మరియు హదీసుల వెలుగులో ఆ హక్కుల గురించి నేటి జుమా ఖుత్బాలో తెలుసుకుందాం.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దైవప్రవక్తలలో శ్రేష్టులయిన దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇస్మాయీల్ బిన్ ఇబ్రాహీం (అలైహిస్సలాం) వంశంలో జన్మించారు. ఆయన అల్లాహ్ దాసులు మరియు అంతిమ దైవప్రవక్త. ప్రళయం వరకు రాబోయే మానవులందరి కోసం ఆయనను ప్రవక్తగా చేసి పంపడం జరిగింది. ఆయన రాకతో దైవప్రవక్తల పరంపర సమాప్తమయ్యింది. ఆయన ఇతర ప్రవక్తలపై విశిష్టత మరియు ఆధిక్యతను పొందివున్నారు. ఇలాగే ఆయన ఉమ్మత్ స్థాయి కూడా ఇతర ఉమ్మత్ (అనుచర సమాజం)ల కన్నా ఎక్కువగా వుంది. ఆయన విధేయతను అల్లాహ్ తప్పనిసరి చేశాడు. ఆయనకు గల ప్రత్యేకతలు ఇతర ప్రవక్తలకు లేవు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని రండి! మన ప్రియ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి మహత్యం, ఆయన అద్భుతాలు మరియు
కొన్ని ప్రత్యేకతలను గూర్చి తెలుసుకొందాం.
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) స్థాయి మరియు ఆయన విశిష్టత
1) శ్రేష్ట వంశము
తన వంశము (కుటుంబం) రీత్యా దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఎంతో ఉన్నత స్థానం కలిగి వున్నారు.
ఈ విషయాన్నే వాయిలా బిన్ అసఖా (రదియల్లాహు అన్హు, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ద్వారా ఇలా ఉల్లేఖించారు:
“నిస్సందేహంగా అల్లాహ్, ఇస్మాయీల్ (అలైహిస్సలాం) సంతానంలో ‘కనాన’ ను ఎన్నుకున్నాడు. తదుపరి ‘కనాన’ నుండి ఖురైష్ ను, వారి నుండి బనూ హాషిమ్ ను ఎన్నుకున్నాడు. బనూ హాషిమ్ నుండి నన్ను ఎన్నుకున్నాడు.” (సహీ ముస్లిం : 2276)
ఇలాగే, రోము చక్రవర్తి (హెరిక్లెస్), అబూసుఫ్యాన్ (అప్పటి వరకు ఆయన ఇంకా ముస్లిం కాలేదు)ను దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వంశావళిని గూర్చి అడగ్గా – ఆయన జవాబిస్తూ, “అతను మాలో ఎంతో ఉన్నతమైన వంశానికి చెందిన వ్యక్తి” అని అన్నారు. దీని పై హెరిక్లెస్ స్పందిస్తూ – దైవప్రవక్తలు (సాధారణంగా) తమ జాతుల్లోని ఉన్నత వంశానికి చెందినవారై వుంటారు అని అన్నాడు. (సహీ బుఖారీ : 7, సహీ ముస్లిం : 1773)
2) మానవాళి కొరకు గొప్ప కటాక్షం
వాస్తవానికి మానవాళి పై అల్లాహ్ ఉపకారాలు లెక్కలేనంతగా వున్నాయి. కానీ వాటిలో అన్నింటి కన్నా ప్రత్యేక ఉపకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆగమనం. ఈ విషయాన్ని అల్లాహ్ దివ్య ఖుర్ఆన్ లో ఇలా సెలవిచ్చాడు:
“అల్లాహ్ విశ్వాసులకు చేసిన మహోపకారం ఏమిటంటే – ఆయన, వారిలోనుండే ఒక ప్రవక్తను ఎన్నుకొని వారి వద్దకు పంపాడు. అతడు వారికి ఆయన వాక్యాలను చదివి వినిపిస్తాడు, వారిని పరిశుద్దుల్ని చేస్తాడు. వారికి గ్రంథజ్ఞానాన్ని, వివేకాన్ని బోధిస్తాడు. నిశ్చయంగా అంతకు ముందు వాళ్ళు స్పష్టమైన అపమార్గానికి లోనై వున్నారు.” (ఆలి ఇమ్రాన్ : 164)
ఈ ఆయత్ లో అల్లాహ్ సెలవిచ్చినట్లు, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు దైవదౌత్య బాధ్యతలు అప్పగించబడ్డ సమయంలో మానవ జాతి స్పష్టమైన అపమార్గానికి లోనై అజ్ఞానపు అంధకార లోయలలో కొట్టుమిట్టాడుతోంది. ఈ తరుణంలో అల్లాహ్ వారి వద్దకు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను పంపి, వారిని అంధకారం నుండి బయటకు తీసి, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ద్వారా వారిని రుజుమార్గం వైపునకు దారి చూపాడు. ఇలా, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సర్వ మానవాళి కొరకు ఒక కారుణ్యంగా వున్నారు.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
“మేము నిన్ను సమస్త లోకవాసుల కోసం కారుణ్యంగా చేసి పంపాము.” (అంబియా : 107)
అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు.
“ప్రజలారా! నేను ప్రజల కొరకు (అల్లాహ్ తరఫు నుండి) బహుమానంగా పంపబడిన కారుణ్యాన్ని”
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ముస్లిం సముదాయం మీద ప్రవక్త ﷺ వారి హక్కులు https://youtu.be/vCfZBWieaic [52 నిముషాలు] వక్త:ముహమ్మద్ సలీం జామిఈ హఫిజహుల్లాహ్
ఈ ప్రసంగం ముస్లిం సమాజంపై ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హక్కుల గురించి వివరిస్తుంది. సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్‌ను స్తుతించడంతో ప్రసంగం మొదలవుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక జాతికి లేదా ప్రాంతానికి మాత్రమే కాక, యావత్ ప్రపంచానికి ప్రవక్తగా పంపబడ్డారని ఖుర్ఆన్ ఆధారాలతో స్పష్టం చేయబడింది. ఇందులో ప్రధానంగా ఐదు హక్కుల గురించి చర్చించబడింది: 1) ప్రవక్తను విశ్వసించడం, ఇది ప్రతి వ్యక్తి యొక్క ప్రాథమిక బాధ్యత; 2) ప్రవక్తను ప్రాణం కంటే ఎక్కువగా గౌరవించడం మరియు ఆయన సమక్షంలో స్వరాలు పెంచరాదని సహాబీల ఉదాహరణలతో వివరించబడింది; 3) ప్రవక్తను తల్లిదండ్రులు, సంతానం, మరియు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించడం, జైద్ రజియల్లాహు అన్హు వంటి సహాబీల ఉదాహరణలతో నొక్కి చెప్పబడింది; 4) జీవితంలోని ప్రతి రంగంలో ప్రవక్తను ఆదర్శంగా తీసుకోవడం; 5) ప్రవక్త ఆదేశాలను పాటించడం మరియు ఆయన వారించిన వాటికి దూరంగా ఉండటం ద్వారా ఆయనకు విధేయత చూపడం. ఈ హక్కులను నెరవేర్చడం ద్వారానే ఇహపరలోకాలలో సాఫల్యం లభిస్తుందని ఈ ప్రసంగం బోధిస్తుంది.
أَلْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ (అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్) وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى أَشْرَفِ الْأَنْبِيَاءِ وَالْمُرْسَلِينَ (వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్) نَبِيِّنَا مُحَمْمَدٍ وَعَلَى آلِهِ وَأَصْحَابِهِ أَجْمَعِينَ (నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ అస్హాబిహి అజ్మయీన్)
అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు, అద్వితీయుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక,ఆమీన్.
సోదర సోదరీమణులారా, మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.
السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ (అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు).
ముస్లిం సముదాయం మీద ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హక్కులు
ఈనాటి ప్రసంగంలో మనం ముస్లిం సముదాయం మీద ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హక్కులు ఏమిటి అనే విషయాన్ని ఇన్ షా అల్లాహ్ ఖుర్ఆన్, హదీస్ గ్రంథాల వెలుగులో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యుల ఉదాహరణల ద్వారా కూడా ఇన్ షా అల్లాహ్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ముందుగా ప్రతి వ్యక్తి తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ప్రదేశానికి, ఒక దేశానికి, ఒక జాతి వారికి ప్రవక్త కాదు, పూర్తి ప్రపంచానికి ఆయన ప్రవక్తగా పంపించబడ్డారు.
ఖుర్ఆన్ గ్రంథం ఏడవ అధ్యాయము 158 వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,
قُلْ يَا أَيُّهَا النَّاسُ إِنِّي رَسُولُ اللَّهِ إِلَيْكُمْ جَمِيعًا الَّذِي لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ (ఖుల్ యా అయ్యుహన్నాస్ ఇన్నీ రసూలుల్లాహి ఇలైకుమ్ జమీఅనిల్లజీ లహు ముల్కుస్సమావాతి వల్ అర్ద్) (ఓ ముహమ్మద్!) వారికి చెప్పు: “ఓ మానవులారా! నిశ్చయంగా నేను మీ అందరి వైపునకు అల్లాహ్ పంపిన ప్రవక్తను. భూమ్యాకాశాల సామ్రాజ్యం ఆయనదే. (7:158)
దాని అర్థం ఏమిటంటే, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వారికి చెప్పు, ఓ ప్రజలారా నేను భూమ్యాకాశాల సామ్రాజ్యానికి అధిపతి అయిన అల్లాహ్ తరఫున మీ అందరి వద్దకు పంపబడిన ప్రవక్తను. మీ అందరి వైపున పంపబడిన ప్రవక్త అంటే అందరికీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క దైవదౌత్యము వర్తిస్తుంది. అంటే నా మాటకు అర్థం ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పూర్తి ప్రపంచానికి, మానవులందరి వైపుకు ప్రవక్తగా పంపబడి ఉన్నారు, ఈ విషయాన్ని ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి. ఇక రండి.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించిన తర్వాత, విశ్వాసి మీద ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి తరఫున ఏమేమి బాధ్యతలు వస్తాయి, ఏమి హక్కులు అతని మీద ఉంటాయి, ఆ హక్కులు ఏమిటి, వాటిని అతను ఏ విధంగా చెల్లించుకోవాలి అనేది మనం చూద్దాం.
ప్రథమ హక్కు: విశ్వసించడం
ముందుగా తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించటం ప్రతి వ్యక్తి యొక్క కర్తవ్యం.
ఖుర్ఆన్ గ్రంథం సూరా తగాబున్ ఎనిమిదవ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,
فَآمِنُوا بِاللَّهِ وَرَسُولِهِ (ఫ ఆమినూ బిల్లాహి వ రసూలిహి) కనుక మీరు అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తను విశ్వసించండి. (64:8)
అనగా, మీరు అల్లాహ్‌ను విశ్వసించండి మరియు దైవ ప్రవక్త అనగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించండి. ఈ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మానవులను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించండి అని ఆదేశిస్తున్నాడు కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించటం ప్రతి వ్యక్తి యొక్క కర్తవ్యం.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూసి కొంతమంది విశ్వసించారు. చూడకుండా చాలామంది విశ్వసించారు. అయితే ఒక ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూసి విశ్వసించిన వారికి ఒక్కసారి శుభవార్త వినిపిస్తే చూడకుండా ఆయనను విశ్వసించిన వారికి ఏడుసార్లు శుభవార్త వినిపించి ఉన్నారు.
طوبى لمن رآني وآمن بي، وطوبى سبع مرات لمن لم يرني وآمن بي (తూబా లిమన్ రఆనీ వ ఆమన బీ, వ తూబా సబ అ మర్రాతిన్ లిమన్ లమ్ యరనీ వ ఆమన బీ.) ఇది ప్రామాణికమైన హదీసు. దాని అర్థం ఏమిటంటే, ఎవరైతే నన్ను చూసి నన్ను విశ్వసించాడో అతనికి ఒక్కసారి శుభవార్త, మరియు ఎవరైతే నన్ను చూడకుండా నన్ను విశ్వసించారో వారికి ఏడుసార్లు శుభవార్త అని ఆ ఉల్లేఖనంలో ప్రవక్త వారు తెలియజేసి ఉన్నారు. ఆ ప్రకారంగా మనము చాలా సంవత్సరాల తర్వాత ఈ భూమండలం మీద పుట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూడకుండా విశ్వసించాము కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన ఆ ఏడుసార్లు శుభవార్త ఇన్ షా అల్లాహ్ అది మనకు దక్కుతుంది.
అలాగే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి విని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రస్తావన అతని ముందర జరిగింది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్త అన్న విషయాన్ని అతను తెలుసుకొని కూడా ఏ వ్యక్తి అయితే ప్రవక్త వారిని విశ్వసించకుండా తిరస్కారిగా అలాగే ఉండిపోతాడో, అతను నరకానికి చేరుకుంటాడు, నరకవాసి అయిపోతాడు అని కూడా హెచ్చరించబడి ఉంది. ముస్లిం గ్రంథంలో మనం చూచినట్లయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా బోధించి ఉన్నారు,
والذي نفس محمد بيده، لا يسمع بي أحد من هذه الأمة يهودي ولا نصراني، ثم يموت ولم يؤمن بالذي أرسلت به، إلا كان من أصحاب النار (వల్లజీ నఫ్సు ముహమ్మదిన్ బి యదిహి, లా యస్మవు బీ అహదున్ మిన్ హాజిహిల్ ఉమ్మతి యహూదియ్యున్ వలా నస్రానియ్యున్, సుమ్మ యమూతు వలమ్ యుఅమిన్ బిల్లజీ ఉర్సిల్తు బిహి ఇల్లా కాన మిన్ అస్హాబిన్నార్). దీని భావం ఏమిటంటే, ఎవరి చేతిలో అయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రాణము ఉందో ఆ మహా శక్తిశాలి అయిన ప్రభువు సాక్షిగా నా ఈ అనుచర సమాజంలో అతను యూదుడు గాని, క్రైస్తవుడు గాని ఎవరైనా గాని, అతని ముందర నా ప్రస్తావన జరిగింది, అతను నా గురించి విన్నాడు. నా గురించి విని కూడా అతను నన్ను మరియు నా ద్వారా పంపబడిన శాసనాన్ని, ధర్మాన్ని విశ్వసించకుండా అలాగే మరణిస్తాడో అతను నరకవాసులలో చేరిపోతాడు. చూశారా? ప్రవక్త వారి గురించి విని, తెలుసుకొని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా పంపబడిన ధర్మాన్ని గురించి విని తెలుసుకొని కూడా ఏ వ్యక్తి అయితే విశ్వసించకుండా అలాగే మరణిస్తాడో అతను నరకవాసులకు చేరిపోతాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసి ఉన్నారు కాబట్టి ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత ఏమిటంటే అతని ముందర ఎప్పుడైతే ప్రవక్త వారి గురించి మరియు ప్రవక్త వారు తీసుకువచ్చిన ధర్మం గురించి ప్రస్తావించబడుతుందో అతను వెంటనే అర్థం చేసుకొని మనసారా ప్రవక్త వారిని విశ్వసించాలి, ప్రవక్త వారి ద్వారా పంపబడిన ధర్మాన్ని అతను స్వీకరించాలి.
ఏ విషయం మమ్మల్ని అడ్డుపడుతూ ఉంది ప్రవక్త వారిని మరియు ప్రవక్త తీసుకువచ్చిన ధర్మాన్ని స్వీకరించడానికి అంటే చాలామంది కేవలము భయం కారణంగా వెనకడుగు వేస్తూ ఉంటారు. చూడండి నేడు ప్రజలతో గాని, అధికారులతో గాని మనము భయపడి వెనకడుగు వేస్తే రేపు మరణానంతరము మమ్మల్ని వారు వచ్చి రక్షిస్తారా? మాకు అలాంటి గడ్డు పరిస్థితులు కూడా లేవు ప్రపంచంలో. మనము అల్హమ్దులిల్లాహ్ స్వతంత్రులము. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో చూడండి, ప్రజలు పేదరికంలో ఉన్నారు, ప్రజలు బానిసలుగా కూడా ఉన్నారు. బానిసలుగా ఉండి, పేదలుగా ఉండి కూడా వారు గడ్డు పరిస్థితులలో కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి తెలుసుకొని ప్రవక్త వారి సమక్షంలో హాజరయ్యి ప్రవక్త వారిని విశ్వసించారు, విశ్వాసులుగా మారారు. తత్కారణంగా ప్రజలు, అధికారులు, పెద్దలు వారిని హింసించారు, వారిని విమర్శించారు, వారిని హేళన చేశారు, రకరకాలుగా చిత్రహింసలు చేసినప్పటికినీ వారు మాత్రము విశ్వాసాన్ని వదులుకోకుండా ధైర్యంగా సమస్యలను ఎదుర్కొని విశ్వాసులుగా చరిత్రలో నిలిచిపోయారు మరియు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వద్ద కూడా గౌరవమైన స్థానం పొందారు. ఉదాహరణకు బిలాల్ రజియల్లాహు అన్హు వారిని చూడండి. ఈయన ఒక యజమాని వద్ద బానిసగా ఉండేవారు. యజమాని పేరు ఉమయ్య బహుశా నాకు గుర్తు రావట్లేదు. ఉమయ్య బిన్ ఖల్ఫ్. అతను ఏం చేసేవాడంటే, బిలాల్ రజియల్లాహు అన్హు వారు ముస్లింలు అయిపోయారు, విశ్వాసి అయిపోయారు అన్న విషయాన్ని విని తెలుసుకొని, బిలాల్ రజియల్లాహు అన్హు వారిని ఈ అరబ్బు దేశంలో ఎడారిలో ఎండాకాలంలో మిట్టమధ్యాహ్నం పూట ఎండ ఎంత తీవ్రంగా ఉంటుంది, ఆ వేడికి ఇసుక ఎంతగా కాలిపోతూ ఉంటుంది, అలాంటి మండుతున్న ఇసుక మీద అర్ధనగ్నంగా ఆయనను పడుకోబెట్టేవాడు, ఆ తర్వాత ఛాతి మీద పెద్ద పెద్ద రాళ్లు పెట్టేసేవాడు. పైన రాయి కాలుతూ ఉంటుంది, బరువుగా ఉంటుంది, కింద ఇసుక కూడా కాలుతూ ఉంటుంది, అలాంటి స్థితిలో ఆయన అల్లాడిపోతూ ఉంటే నీవు విశ్వాసాన్ని వదిలేయి, నేను కూడా నిన్ను హింసించడం వదిలేస్తాను అని చెప్పేవాడు. అవన్నీ భరించి కూడా ఆయన బానిస అయి ఉండి కూడా చిత్రహింసలు భరిస్తూ కూడా అల్లాహ్ ఒక్కడే నిజమైన ప్రభువు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ పంపించిన సత్య ప్రవక్త అని చాటి చెప్పారు. ఆ తర్వాత అతను అన్నము పెట్టకుండా, నీళ్లు ఇవ్వకుండా ఆకలిదప్పికలతో అలాగే ఉంచేశాడు, చెరసాలలో బంధించాడు, మెడలో తాడు కట్టేసి పోకిరి పిల్లవారికి, కుర్రాళ్ళ చేతికి ఇచ్చేశాడు. వారు బిలాల్ రజియల్లాహు అన్హు వారిని పశువులాగా ఈడ్చుకుంటూ తిరిగేవారు. తత్కారణంగా ఆయన శరీరానికి, కాళ్లకు గాయాలు అయిపోయేవి. అన్ని రకాలుగా ఆయనను హింసించినా అలాంటి గడ్డు పరిస్థితుల్లో బానిసగా అయ్యి ఉండి కూడా ఆయన విశ్వాసం పొందారు, ప్రవక్త వారిని మరియు ప్రవక్త వారు తీసుకువచ్చిన ధర్మాన్ని స్వీకరించి వచ్చిన సమస్యలని ధైర్యంగా ఎదుర్కొన్నారు. తత్కారణంగా ఆయన గొప్ప విశ్వాసిగా చరిత్రలో మిగిలిపోయారు, అల్లాహ్ వద్ద కూడా వారికి గొప్ప ఉన్నతమైన స్థానాలు ఉన్నాయి. కాబట్టి మనకు
الحمد لله ثم الحمد لله (అల్హమ్దులిల్లాహ్ సుమ్మా అల్హమ్దులిల్లాహ్), బానిసత్వం లేదు. అల్లాహ్ దయవల్ల మమ్మల్ని అందరినీ అల్లాహ్ స్వతంత్రులుగా ఉంచాడు కాబట్టి మనము కంగారు పడవలసిన అవసరము లేదు, బెదరవలసిన అవసరము లేదు, భయపడవలసిన వెనకడుగు వేయవలసిన అవసరం అంతకంటే లేదు. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి తెలుసుకోండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకువచ్చిన ధర్మాన్ని స్వీకరించండి. తద్వారానే ఇహపరాలా సాఫల్యము మనకు దక్కుతుంది.
రెండవ హక్కు: గౌరవించడం
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించడం ఇది మొదటి హక్కు. ఇక రెండవ హక్కు ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించిన తర్వాత ప్రాణం కంటే ఎక్కువగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవించాలని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేసి ఉన్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో ఆయన బ్రతికి ఉన్నప్పుడు శిష్యులకు, సహాబాలకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో బిగ్గరగా మాట్లాడకండి, శబ్దము పెంచకండి అని తాకీదు చేసి ఉన్నాడు. మనం చూసినట్లయితే, ఖుర్ఆన్ గ్రంథము 24వ అధ్యాయము 63వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,
దాని అర్థం ఏమిటంటే, మీరు దైవప్రవక్త పిలుపును మీలో ఒకరినొకరిని పిలుచుకునే మామూలు పిలుపులా అనుకోకండి. మనం పరస్పరం ఒకరినొకరిని ఏ విధంగా అయితే పిలుచుకుంటామో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విషయం అలాంటిది కాదు. ప్రవక్త వారితో మాట్లాడేటప్పుడు, వారితో సంభాషించేటప్పుడు మీరు జాగ్రత్తగా, సగౌరవంగా, అణకువతో మాట్లాడండి అని ఆ వాక్యంలో బోధించబడి ఉంది.
అలాగే ఖుర్ఆన్ గ్రంథం 49వ అధ్యాయం, రెండవ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَرْفَعُوا أَصْوَاتَكُمْ فَوْقَ صَوْتِ النَّبِيِّ وَلَا تَجْهَرُوا لَهُ بِالْقَوْلِ كَجَهْرِ بَعْضِكُمْ لِبَعْضٍ (యా అయ్యుహల్లజీన ఆమనూ లా తర్ఫవూ అస్వా తకుమ్ ఫౌఖ సౌతిన్నబియ్యి వలా తజ్హరూ లహు బిల్ ఖౌలి కజహ్రి బఅదికుమ్ లిబఅదిన్) ఓ విశ్వాసులారా! మీ స్వరాలను ప్రవక్త స్వరం కన్నా బిగ్గరగా చేయకండి, మీలో మీరు ఒకరితో మరొకరు బిగ్గరగా మాట్లాడినట్లు ఆయనతో మాట్లాడకండి. (49:2)
దీని అర్థం ఏమిటంటే, ఓ విశ్వాసులారా మీ కంఠస్వరాలను ప్రవక్త కంఠస్వరం కంటే హెచ్చుగా ఉంచకండి. మీరు పరస్పరం బిగ్గరగా మాట్లాడుకునే విధంగా ఆయనతో బిగ్గరగా మాట్లాడకండి. దీనివల్ల మీ కర్మలన్నీ వ్యర్థమైపోవచ్చు, జాగ్రత్త సుమా. చూశారా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎంతగా గౌరవించాలంటే ప్రవక్త వారి సమక్షంలో బిగ్గరగా శబ్దాన్ని పెంచి, హెచ్చించి మాట్లాడరాదు, పలకరాదు. ఒకవేళ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో ఆయనను గౌరవించకుండా బిగ్గరగా మాట్లాడినట్లయితే, శబ్దాన్ని పెంచినట్లయితే, అది ఒక రకంగా ప్రవక్త వారిని అగౌరవపరిచినట్లు అవుతుంది, తత్కారణంగా మనిషి యొక్క కర్మలు, సత్కార్యాలు, పుణ్యాలన్నీ వృధా అయిపోయే ప్రమాదం ఉంది అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు. దీనికి ఉదాహరణగా మనము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యుల గురించి ఒక ఉదాహరణ తీసుకుందాం.
ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు బనూ తమీమ్ అనే తెగకు చెందిన ఒక బిడారము, కొంతమంది సమూహము వచ్చారు. బనూ తమీమ్‌కు చెందిన వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలోకి వచ్చినప్పుడు, అబూబకర్ రజియల్లాహు అన్హు వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఒక సలహా ఇచ్చారు. ఓ దైవప్రవక్త, కాకా బిన్ మాబద్ అనే వ్యక్తిని ఈ సమూహానికి మీరు నాయకునిగా నియమించండి అన్నారు. అయితే, ఉమర్ రజియల్లాహు అన్హు వారు కూడా అక్కడ ఉన్నారు, ఆయన జోక్యం చేసుకుంటూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అన్నారు, ఓ దైవప్రవక్త, అక్రా బిన్ హాబిస్ ని ఈ సమూహానికి, ఈ తెగ వారికి నాయకునిగా నియమించండి అని ఆయన సలహా ఇచ్చారు. అబూబకర్ రజియల్లాహు అన్హు వారు ఒక వ్యక్తి గురించి ప్రస్తావిస్తూ ఉంటే, ఉమర్ రజియల్లాహు అన్హు వారు మరో వ్యక్తి గురించి ప్రస్తావించారు. అయితే ఇద్దరి మధ్య భేదాభిప్రాయం వచ్చింది కదండీ, వారిద్దరూ కూడా నేను చెప్పిన వ్యక్తే మంచిది, నేను చెప్పిన వ్యక్తిని నియమిస్తేనే మంచిది అని ఒకరంటూ ఉంటే, లేదండి నేను చెప్పిన వ్యక్తిని నియమిస్తేనే మంచిది అని ఒకరిని ఒకరు విమర్శించుకుంటూ ఆ తర్వాత మాట మాట పెరిగి వారు పెద్దగా శబ్దాలు చేయడం, హెచ్చుగా మాట్లాడటం ప్రారంభించేశారు. అలా జరిగినప్పుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వెంటనే ఈ వాక్యాలను అవతరింపజేశాడు. యా అయ్యుహల్లజీన ఆమనూ లా తర్ఫవూ అస్వా తకుమ్ ఫౌఖ సౌతిన్నబియ్యి. ఓ విశ్వాసులారా, మీ కంఠస్వరాలను ప్రవక్త వారి కంఠస్వరం వద్ద హెచ్చించకండి అని ఆ వాక్యాన్ని ఎప్పుడైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అవతరింపజేశాడో, మీరు జాగ్రత్త పడకపోతే మీ సత్కార్యాలు, మీ పుణ్యాలు వృధా అయిపోతాయని ఆ వాక్యం చివరలో తెలియజేసి ఉన్నాడు కదా, అది విన్న తర్వాత ఉమర్ రజియల్లాహు అన్హు వారు ఎంతగా మారిపోయారంటే, ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో ఆయన ఎంత మెల్లగా మాట్లాడేవారంటే, ఎంత చిన్నగా మాట్లాడేవారంటే, దగ్గరలో కూర్చున్న వ్యక్తి కూడా ఆయన ఏమి చెప్పారో వినలేక రెండవసారి మళ్ళీ అడిగేవారు. అయ్యో మీరు ఏం చెప్పారో సరిగా వినిపించలేదండి, చెప్పండి ఏంటో అని రెండవసారి మళ్ళీ అడగవలసి వచ్చేది. అంత నెమ్మదిగా, అంత చిన్నగా ఆయన మాట్లాడటం అలవాటు చేసుకున్నారు ఉమర్ రజియల్లాహు అన్హు వారు ఆ వాక్యము అవతరింపజేయబడిన తర్వాత.
కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవించటం ప్రతి విశ్వాసి యొక్క బాధ్యత, కర్తవ్యం. ఇది రెండవ హక్కు. దీనికి ఉదాహరణగా మనము చూచినట్లయితే, సాబిత్ బిన్ ఖైస్ రజియల్లాహు అన్హు వారు, ఆయన స్వరం కొంచెం పెద్దది. మామూలుగా కొంతమందికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా గొంతు కొంచెం పెద్దది ఇస్తాడు, వారు మామూలుగా మాట్లాడినా గాని శబ్దం కొంచెం హెచ్చుగా వస్తుంది. ఆ ప్రకారంగా సాబిత్ బిన్ ఖైస్ రజియల్లాహు అన్హు వారి స్వరము కూడా, కంఠము కూడా కొంచెం పెద్దది. ఆయన మామూలుగా మాట్లాడినా శబ్దం కొంచెం పెద్దగా, హెచ్చుగా వచ్చేది. ఎప్పుడైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ వాక్యాన్ని అవతరింపజేశాడో, యా అయ్యుహల్లజీన ఆమనూ లా తర్ఫవూ అస్వా తకుమ్ ఫౌఖ సౌతిన్నబియ్యి, ఆ వాక్యం అవతరింపజేయబడిన తర్వాత, ఆయన సాబిత్ బిన్ ఖైస్ రజియల్లాహు అన్హు వారు ప్రవక్త వారి సమావేశంలో రావడం, హాజరవ్వడమే మానేశారు. అసలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో ఆయన రావడమే మానేశారు. కొద్ది రోజులు గడిచాయి. కొద్ది రోజులు గడిచిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏంటండీ సాబిత్ బిన్ ఖైస్ కనిపించడం లేదు అని సహాబాలతో అడిగారు. అప్పుడు సాద్ బిన్ మాద్ రజియల్లాహు అన్హు వారు ఏం చెప్పారంటే, ఓ దైవప్రవక్త, నేను ఆయన పొరుగులోనే ఉంటాను. కాబట్టి మీరు అనుమతి ఇస్తే నేను వెళ్లి చూస్తాను, ఆయన ఎందుకు మీ మధ్య రావట్లేదు ఇక్కడ, ఎందుకు పాల్గొనట్లేదు మీ సమావేశంలో, నేను వెళ్లి తెలుసుకొని వస్తాను, మీరు అనుమతి ఇవ్వండి అంటే, ప్రవక్త వారు సరే అని పంపించారు. ఆ తర్వాత సాద్ బిన్ మాద్ రజియల్లాహు అన్హు వారు సాబిత్ బిన్ ఖైస్ రజియల్లాహు అన్హు వారి ఇంటికి వెళ్లి చూస్తే, ఆయన తల పట్టుకొని కూర్చొని ఉన్నారు, దిగులుగా ఉన్నారు. సాద్ బిన్ మాద్ రజియల్లాహు అన్హు వారు వెళ్లి ఏమండీ ప్రవక్త వారు మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు, ఈ మధ్య మీరు ప్రవక్త వారి సమావేశంలో హాజరు కాలేదు, ఎందుకండీ అలా, మిమ్మల్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు గుర్తు చేసుకుంటున్నారు అని అడిగినప్పుడు, సాబిత్ బిన్ ఖైస్ రజియల్లాహు అన్హు వారు అన్నారు, చూడండి, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందర బిగ్గరగా, పెద్ద శబ్దంతో మాట్లాడకండి, అలా మాట్లాడితే మీ కర్మలు వృధా అయిపోతాయి అని చెప్పాడు కాబట్టి, నా శబ్దం పెద్దది, నా కంఠం హెచ్చుగా ఉంటుంది కాబట్టి, నేను చేసుకున్న కర్మలన్నీ, సత్కార్యాలన్నీ వృధా అయిపోయాయి, నేను నరకవాసి అయిపోయానేమోనని నాకు భయంగా ఉంది, అందుకోసమే నేను దిగులుగా ఉన్నాను, అక్కడ రాలేకపోతున్నాను అని చెప్పారు. సాద్ బిన్ మాద్ రజియల్లాహు అన్హు వారు అదంతా విని, తిరిగి వచ్చి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేశారు. అదంతా తెలియజేసిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ మాట విని, వెంటనే ఆ సహాబీకి శుభవార్త తెలియజేశారు, సాద్ రజియల్లాహు అన్హు వారి ద్వారా. మీరు వెళ్ళండి, ఆయనకు తెలియజేయండి, ఆయన నరకవాసులలోని వ్యక్తి కాదు, ఆయన స్వర్గవాసులలోని వ్యక్తి అని శుభవార్త తెలియజేశారు.
ఈ ఉల్లేఖనం బుఖారీ మరియు ముస్లిం గ్రంథాలలో ఉంది. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవించే విధానము సహాబాల వద్ద ఎంతగా ఉందో, వారు ఎంతగా ప్రవక్త వారిని గౌరవించేవారో, మరియు ప్రవక్త వారిని అగౌరవపరచడాన్ని ఎంతగా వారు భయపడేవారో చూడండి, దీని ద్వారా మనకు అర్థమవుతుంది. అలాగే, ఎవరెవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసిస్తారో, ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవిస్తారో, అలాంటి వారి కోసము శుభవార్త ఉంది. ఖుర్ఆన్ గ్రంథము ఏడవ అధ్యాయము 157 వ వాక్యాన్ని మనం చూచినట్లయితే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,
فَالَّذِينَ آمَنُوا بِهِ وَعَزَّرُوهُ وَنَصَرُوهُ وَاتَّبَعُوا النُّورَ الَّذِي أُنْزِلَ مَعَهُ ۙ أُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ (ఫల్లజీన ఆమను బిహి వ అజ్జరూహు వ నసరూహు వత్తబవూన్నూరల్లజీ ఉన్జిల మఅహు ఉలాయిక హుముల్ ముఫ్లిహూన్) కనుక ఎవరైతే ఆయనను విశ్వసించి, ఆయనను గౌరవించి, ఆయనకు సహాయం చేసి, ఆయనతోపాటు అవతరింపజేయబడిన జ్యోతిని అనుసరిస్తారో, వారే సాఫల్యం పొందేవారు. (7:157)
దాని అర్థం ఏమిటంటే, ఎవరు ఈ ప్రవక్తను విశ్వసించి, అతనికి ఆదరువుగా నిలుస్తారో, తోడ్పాటు నందిస్తారో, ఇంకా అతనితో పాటు పంపబడిన జ్యోతిని అనుసరిస్తారో, వారే సాఫల్యం పొందేవారు. ప్రవక్త వారిని విశ్వసించి, ప్రవక్త వారిని అనుసరించి, ప్రవక్త వారిని గౌరవించేవారు సాఫల్యం పొందేవారు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా శుభవార్త తెలియజేసి ఉన్నాడు చూశారా.
అలాగే, సహాబాలు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యులు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎలా గౌరవించేవారో, ఒక అవిశ్వాసి అలనాటి అవిశ్వాసి, ఆయన పేరు ఉర్వా బిన్ మసూద్ సఖఫీ. తర్వాత, అప్పటి వరకు ఆయన ఇస్లాం స్వీకరించలేదు, తర్వాత ఆయన ఇస్లాం స్వీకరించారని ధర్మ పండితులు తెలియజేసి ఉన్నారు. ఉర్వా బిన్ మసూద్ సఖఫీ, ఈ సంఘటన జరిగే సమయానికి ఆయన ఇంకా ఇస్లాం స్వీకరించలేరు. సులహ్ హుదైబియా, హుదైబియా ఒప్పందం సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో ఆయన ప్రవక్త వారితో మాట్లాడటానికి వచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో మాట్లాడటానికి వచ్చినప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమావేశంలో సహాబాలు ఏ విధంగా అణకువతో ఉన్నారో, ప్రవక్త వారిని ఏ విధంగా గౌరవిస్తున్నారో కళ్లారా చూశాడు. కళ్లారా చూసి, తర్వాత మళ్ళీ మక్కాలో ఉన్న అవిశ్వాసుల వద్దకు వెళ్లి, అక్కడ చూసిన దృశ్యాన్ని ఈ విధంగా ఆయన తెలియజేస్తూ ఉన్నారు. ఏమంటున్నారో చూడండి: “ఓ నా జాతి ప్రజలారా, నేను పెద్ద పెద్ద రాజుల దర్బారులలోకి కూడా వెళ్ళాను. నేను రోమ్ చక్రవర్తి మరియు అలాగే ఈరాన్ చక్రవర్తి వారి దర్బారులలోకి కూడా నేను వెళ్ళాను. అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, పెద్ద పెద్ద రాజులను కూడా అతని దర్బారులో ఉన్న మంత్రులు అంతగా గౌరవించరు, ఎంతగా అయితే ప్రవక్త వారి శిష్యులు ప్రవక్త వారిని గౌరవిస్తున్నారో. అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, ప్రవక్త వారి నోటి నుండి ఉమ్మి కూడా ఒకవేళ బయటికి వచ్చేస్తే, శిష్యులు ఆ ఉమ్మిని తీసుకొని శరీరానికి పూసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రవక్త వారు ఉజూ చేస్తే, ఆయన ఉజూ చేసిన నీటిని శిష్యులు తీసుకోవాలని పోటీ పడుతూ ఉన్నారు. ఆయన కేవలం సైగ చేస్తే చాలు, వెంటనే ఆ పని చేసి పెట్టడానికి వారు సిద్ధంగా ఉన్నారు. అలా నేను గౌరవించబడటము, పెద్ద పెద్ద రాజులని సైతము నేను చూడలేదు. అంతగా ప్రవక్త వారి శిష్యులు ప్రవక్తను గౌరవిస్తున్నారు” అని తెలియజేశాడు.
చూశారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సహాబాలు ఏ విధంగా గౌరవించారు? అలాగే మనము కూడా ప్రవక్త వారిని గౌరవించాలి. ప్రవక్త వారు మన మధ్య లేరు కదా, మరి ఏ విధంగా మనము గౌరవించాలి అంటే, ప్రవక్త వారి ఆదేశాలు మన మధ్య ఉన్నాయి. ప్రవక్త వారి ఆదేశాలు, హదీసుల రూపంలో, ఉల్లేఖనాల రూపంలో మన మధ్య ఉన్నాయి. ఆ హదీసులు చదవబడేటప్పుడు, వినిపించేటప్పుడు మనము గౌరవంగా ఉండాలి, శ్రద్ధగా వినాలి. అలాగే, ప్రవక్త వారి ఆదేశాలను అదే గౌరవంతో మనము ఆచరించాలి.
ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవించడం, ముస్లిం సముదాయం మీద ఉన్న హక్కు. అయితే, గౌరవించాలి, ప్రతి ముస్లిం యొక్క హక్కు అని తెలుసుకున్న తర్వాత రెండు ముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. మొదటి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రవక్తను గౌరవించడం అనే పదాన్ని తీసుకొని, ప్రవక్త వారి విషయంలో హద్దు మీరిపోవడం సరికాదు. గౌరవంలో చాలామంది హద్దు మీరిపోతూ ఉంటారు. అంటే, ప్రవక్తను ప్రవక్త స్థానంలో కాకుండా, తీసుకెళ్లి దైవ స్థానంలో నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు, దీనిని గులు అని అంటారు. అల్లాహ్ సుబ్ హాన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ విషయాన్ని ఇష్టపడలేదు, ప్రవక్త వారు వారించి ఉన్నారు. మనం చూచినట్లయితే, బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనం, ప్రవక్త వారు తెలియజేశారు:
لا تطروني كما أطرت النصارى ابن مريم، فإنما أنا عبد فقولوا عبد الله ورسوله (లా తత్రూనీ కమా అతరతిన్నసారా ఇబ్న మర్యమ. ఇన్నమా అన అబ్దున్, ఫఖూలూ అబ్దుల్లాహి వ రసూలుహు.) చూశారా, మర్యం కుమారుడు ఈసా, ఏసుక్రీస్తు అంటారు కదండీ, ಮರ್ಯಮ್ ಕುಮಾರడైన ఈసా అలైహిస్సలాం వారి విషయంలో క్రైస్తవులు ఏ విధంగా అయితే హద్దు మీరిపోయారో, మీరు, అనగా ముస్లింలకు ఆదేశిస్తున్నారు, మీరు నా విషయంలో ఆ విధంగా హద్దు మీరకండి. నేను అల్లాహ్ దాసుడిని మరియు అల్లాహ్ ప్రవక్తని. నాకు ఉన్న స్థానంలో మాత్రమే నన్ను మీరు ఉంచి గౌరవించండి, నాకు లేని స్థానము నాకు కల్పించే ప్రయత్నం చేయకండి అని ప్రవక్త వారు వారించారు.
చూశారా, కాబట్టి ప్రవక్త వారిని గౌరవిస్తున్నాము అని చెబుతూ చాలామంది ప్రవక్త వారికి ఉన్న స్థానం కంటే ఎక్కువ స్థానము ఇచ్చేటట్టుగా అల్లాహ్ స్థానంలోకి తీసుకుని వెళ్లి నిలబెట్టేటట్టుగా చేస్తూ ఉంటారు, అలా చేయడం సరికాదు.
అలాగే, దీనికి విరుద్ధమైన విషయం. చాలామంది మూర్ఖులు అనలో, పాపిష్టులు అనలో, ఇంకేమనాలో తెలియదు, ప్రవక్త వారిని కించపరుస్తూ ఉంటారు. అల్లాహ్ మమ్మల్ని ఏమంటున్నాడు, ప్రవక్త వారిని గౌరవించాలి అంటున్నాడు. కానీ నేడు మనం చూస్తున్నాం, ముస్లింలు మనము అని చెప్పుకునే చాలామంది మూర్ఖులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కించపరుస్తున్నారు. వారి మాటల ద్వారా, వారి చేష్టల ద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కించపరుస్తున్నారు. ఈ మధ్యనే ఒక వ్యక్తి మీడియా ముందర వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కించపరుస్తున్నాడు. స్వయంగా నేను ముస్లిం అని కూడా మళ్లీ ప్రకటించుకుంటూ ఉన్నాడు. ఎంతటి మూర్ఖత్వం అండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రవక్తగా చెప్పుకున్న తర్వాతే ఒక వ్యక్తి ముస్లిం అవుతున్నాడు. అలాంటి వ్యక్తి, ప్రవక్త వారిని విశ్వసించిన తర్వాతే ముస్లిం అవుతున్న వ్యక్తి, ప్రవక్త వారిని కించపరచటం, అగౌరవపరచటం ఏమిటండి ఇది?
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎవరైతే కించపరుస్తారో, అగౌరవపరుస్తారో, ప్రపంచంలో కూడా శిక్షించబడతాడు, పరలోకంలో కూడా వారు శిక్షించబడతారు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖుర్ఆన్ గ్రంథము సూరా తౌబా 61వ వాక్యంలో తెలియజేసి ఉన్నాడు కాబట్టి, జాగ్రత్త. కర్మలు వృధా అయిపోతాయి, నష్టపోతారు ప్రపంచంలో కూడా శిక్షించబడతారు, పరలోకంలోనూ మరియు ప్రపంచంలోనూ. కాబట్టి ప్రవక్త వారిని అగౌరవపరచటం పెద్ద నేరం, అలాంటి నేరానికి పాల్పడరాదు, జాగ్రత్త అని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది.
మూడవ హక్కు: ప్రేమించడం
ముస్లిం సముదాయం మీద ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హక్కులలో నుంచి రెండు హక్కుల గురించి తెలుసుకున్నాం అండి. విశ్వసించడం ప్రథమ హక్కు, ప్రవక్త వారిని గౌరవించడం రెండవ హక్కు. ఇక మూడవ హక్కు ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అభిమానించాలి, ప్రేమించాలి.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు,
ثلاث من كن فيه وجد حلاوة الإيمان (సలాసున్ మన్ కున్న ఫీహి వజద హలావతల్ ఈమాన్.) మూడు విషయాలు ఎవరిలో ఉంటాయో, అతను ఈమాన్ విశ్వాసం యొక్క మాధుర్యాన్ని ఆస్వాదించాడు అన్నారు. ఆ మూడు విషయాలు ఏమిటి అంటే, మొదటి విషయం:
أن يكون الله ورسوله أحب إليه مما سواهما (అన్ యకూనల్లాహు వ రసూలుహు అహబ్బ ఇలైహి మిమ్మా సివాహుమా.) అల్లాహ్ మరియు అల్లాహ్ ప్రవక్త అనగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆ వ్యక్తి అందరికంటే ఎక్కువగా అభిమానించాలి, ప్రేమించాలి. అందరికంటే ఎక్కువ అంటే, తనకంటే, తన కుటుంబ సభ్యుల కంటే, తన తల్లిదండ్రుల కంటే, బంధుమిత్రుల కంటే, ప్రపంచంలో ఉన్న వారందరి కంటే, చివరికి తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రవక్త వారిని అభిమానించాలని దాని అర్థం.
దీనికి ఉదాహరణగా మనము చూచినట్లయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వేరే ఉల్లేఖనంలో ఈ విధంగా తెలియజేశారు:
لا يؤمن أحدكم حتى أكون أحب إليه من ولده ووالده والناس أجمعين (లా యూమిను అహదుకుమ్ హత్తా అకూన అహబ్బ ఇలైహి మిన్ వలదిహి వ వాలిదిహి వన్నాసి అజ్మయీన్.) మీలో ఏ వ్యక్తి కూడా అప్పటి వరకు విశ్వాసి కాజాలడు, ఎప్పటి వరకు అయితే అతను నన్ను తన సంతానము కంటే, తన తల్లిదండ్రుల కంటే, మానవులందరి కంటే ఎక్కువగా నన్ను అభిమానించడో అన్నారు. అంటే, తల్లిదండ్రుల కంటే, భార్యాబిడ్డల కంటే, ప్రపంచంలో ఉన్న ప్రజలందరి కంటే ఎక్కువగా ప్రవక్త వారిని అభిమానించినప్పుడే వ్యక్తి విశ్వాసి అవుతాడు.
ఉమర్ రజియల్లాహు అన్హు వారి గురించి ఉదాహరణ చాలా ప్రచారం చెంది ఉంది. ఉమర్ రజియల్లాహు అన్హు వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో హాజరయ్యి,
يا رسول الله، لأنت أحب إلي من كل شيء إلا من نفسي (యా రసూలల్లాహ్, లఅంత అహబ్బు ఇలయ్య మిన్ కుల్లి శైఇన్ ఇల్లా మిన్ నఫ్సీ) అన్నారు. ఓ దైవప్రవక్త, మీరు నాకు అందరికంటే ఎక్కువగా ఇష్టులు, నేను మిమ్మల్ని అందరికంటే ఎక్కువగా అభిమానిస్తున్నాను, అయితే నా ప్రాణము నాకు మీకంటే ఎక్కువ ప్రియమైనది అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు,
لا، والذي نفسي بيده، حتى أكون أحب إليك من نفسك (లా వల్లజీ నఫ్సీ బియదిహి, హత్తా అకూన అహబ్బ ఇలైక మిన్ నఫ్సిక్.) లేదు లేదు ఓ ఉమర్, ఎవరి చేతిలో అయితే నా ప్రాణము ఉందో ఆ అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, నీవు నీ ప్రాణము కంటే ఎక్కువగా నన్ను అభిమానించనంత వరకు పూర్తి సంపూర్ణ విశ్వాసి కాజాలవు అన్నారు.
ఉమర్ రజియల్లాహు అన్హు వారు ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తన ప్రాణము కంటే ఎక్కువగా అభిమానించారు. ఆ తర్వాత ప్రవక్త వారి వద్దకు వచ్చి, ఓ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నేను ఇప్పుడు మిమ్మల్ని నా ప్రాణము కంటే ఎక్కువగా అభిమానిస్తున్నాను అని తెలియజేసినప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు,
الآن يا عمر (అల్ ఆన యా ఉమర్.) ఓ ఉమర్, ఇప్పుడు నీ విశ్వాసము సంపూర్ణమైంది అని తెలియజేశారు.
చూశారా, కాబట్టి ప్రతి వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రాణము కంటే ఎక్కువగా అభిమానించాలి. ప్రాణము కంటే ఎక్కువగా అభిమానించినప్పుడే అతను సంపూర్ణ విశ్వాసి కాగలడు, లేని యెడల అతని విశ్వాసము సంపూర్ణము కాజాలదు అని తెలియజేయడం జరిగింది. ఇక్కడ మనము ఒక ఉదాహరణ తీసుకుందాం.
జైద్ రజియల్లాహు అన్హు వారి గురించి మనము చూచినట్లయితే, జైద్ రజియల్లాహు అన్హు వారిని ఆయన పసితనంలోనే దుండగులు దొంగలించారు. మన మొరటు భాషలో చెప్పాలంటే ఆయనను కిడ్నాప్ చేసేశారు. ఆయనను దొంగలు పట్టుకెళ్లి వేరే ప్రదేశాలలో అమ్మేశారు. ఆ తర్వాత నుండి ఆయన బానిస అయిపోయారు. ఆ తర్వాత చేతులు మారుతూ ఉన్నారు. ఒక వ్యక్తి ఆయనను కొన్నారు, తర్వాత వేరే వ్యక్తికి అమ్మేశారు, ఆ తర్వాత మరో వ్యక్తి మరో వ్యక్తిని అమ్మేశారు. ఆ ప్రకారంగా అమ్ముతూ అమ్ముతూ ఉన్నారు. ఆ విధంగా ఆయన చేతులు మారుతూ మారుతూ మారుతూ మక్కాలో ఖదీజా రజియల్లాహు త’ఆలా అన్హా వారి వద్దకు వచ్చారు. ఖదీజా రజియల్లాహు త’ఆలా అన్హా వారు జైద్ వారిని కొని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కానుకగా ఇచ్చారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కానుకగా ఇచ్చి, ఓ దైవప్రవక్త, ఈయనతో మీరు సేవలు చేయించుకోండి అని చెప్పారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జైద్ రజియల్లాహు త’ఆలా అన్హు వారితో సేవలు చేయించుకుంటూ ఉన్నారు. సేవలు చేయించుకుంటూ ఉంటున్నప్పుడు, ఒకరోజు అనుకోకుండా ఆయన కాబతుల్లాలో తిరుగుతూ ఉంటే, వారి తల్లిదండ్రులు కూడా హజ్ చేయడానికి వచ్చి కాబతుల్లా వద్ద ప్రదక్షిణలు, తవాఫ్ చేస్తూ ఉన్నారు. వెంటనే తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను చూసి గుర్తుపట్టి, జైద్ రజియల్లాహు అన్హు వారు వెళ్లి, “నేను పసితనంలో తప్పిపోయిన మీ అబ్బాయిని” అని తెలియజేశారు. మీ అబ్బాయిని అని ఎప్పుడైతే తెలియజేశారో, కుటుంబ సభ్యులు వెంటనే జైద్ రజియల్లాహు అన్హు వారిని పట్టుకొని, చిన్ననాటి రోజుల్లో తప్పిపోయిన బిడ్డ దొరికాడు అని వారు చాలా సంతోషించారు. వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, ఓ దైవప్రవక్త, మా అబ్బాయి పసితనంలో తప్పిపోయాడు, ఇప్పుడు అనుకొని ఊహించని రీతిలో ఇక్కడ బానిసగా ఉన్నాడు, మీరు అనుమతి ఇస్తే మా అబ్బాయిని మేము మా ఇంటికి తీసుకువెళ్ళిపోతాము అని అడిగినప్పుడు, ప్రవక్త వారు అన్నారు, మీరు సంతోషంగా తీసుకువెళ్ళవచ్చు, అయితే నిబంధన ఏమిటంటే, మీరు ఒకసారి జైద్ తో మాట్లాడండి, సంప్రదించి చూడండి. జైద్ వారు మీతో పాటు రావడానికి ఆయన సిద్ధమైతేనే మీరు తీసుకువెళ్ళండి, లేదంటే లేదు అని చెప్పారు.
ఆ తర్వాత, జైద్ రజియల్లాహు అన్హు వారి వద్దకు వెళ్లి, చూడండి దైవప్రవక్త వారు మీ ఇష్టం మీద వదిలేశారు, ఇక మాకు అనుమతి దొరికినట్లే, కాబట్టి పదండి మేము మా ఇంటికి వెళ్లిపోదాము అని అంటే, జైద్ రజియల్లాహు అన్హు వారు లేదు నేను రాను, నేను ప్రవక్త వద్దనే ఉండిపోతాను అని తేల్చి చెప్పేశారు.
ఏంటండీ, ఇక్కడ ముఖ్యంగా రెండు విషయాలు ఆలోచించాలి. ఒక విషయం ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనుమతి ఇచ్చేశారు, జైద్ రజియల్లాహు అన్హు వారికి ఇక బానిసత్వం నుంచి విముక్తి లభిస్తుంది, స్వతంత్రుడిగా ఆయన కుటుంబ సభ్యులతో పాటు వెళ్లి హాయిగా జీవించుకోవచ్చు. కానీ స్వతంత్రుడిగా వెళ్లి కుటుంబ సభ్యులతో హాయిగా జీవించుకోవడానికి ఆయన ఇష్టపడట్లేదు, ప్రవక్త వారి వద్ద బానిసగా ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నారు అంటే, ప్రవక్త వారిని ఆయన ఎంతగా అభిమానించేవారో, ఎంతగా ప్రేమించేవారో చూడండి. అలాగే, ప్రవక్త ఆయనతో ఎంత మంచిగా ప్రవర్తిస్తూ ఉంటే ఆయన ప్రవక్త వారిని అంతగా అభిమానిస్తున్నారు చూడండి.
కాబట్టి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సహాబాలు ఎంతగా ప్రేమించేవారో, ఎంతగా అభిమానించేవారో ఈ ఉదాహరణల ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది.
అలాగే మిత్రులారా, మరొక ఉదాహరణ మనము చూచినట్లయితే, ఒక సహాబీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఒక సహాబీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చారు. ప్రవక్త వారు ఆయనను చూసి ఏమండీ, ఏంటో మీరు కంగారుగా ఉన్నారు అని అడిగినప్పుడు, ఆయన అంటున్నారు, ఓ దైవప్రవక్త, మీరంటే నాకు చాలా ఇష్టం. నేను మిమ్మల్ని చాలా అభిమానిస్తున్నాను. నేను ఇంట్లో ఉన్నప్పుడు మీరు గుర్తుకు వస్తే, వెంటనే మిమ్మల్ని చూడాలనుకుంటాను, కాబట్టి నేను ఇంట్లో నుండి పరిగెత్తుకుంటూ మస్జిద్ లోకి వస్తాను. మీరు మస్జిద్ లో ఏదో ఒక చోట సహాబాలతో సమావేశమై ఉంటారు లేదంటే నమాజ్ చేస్తూ ఉంటారు, ఏదో ఒక విధంగా మీరు నన్ను కనిపిస్తారు. మిమ్మల్ని చూడగానే నాకు మనశ్శాంతి దొరుకుతుంది. అయితే ఈరోజు నాకు ఒక ఆలోచన తట్టింది, ఆ ఆలోచన కారణంగా నేను అయోమయంలో పడిపోయాను, నాకు బాధగా ఉంది, కంగారుగా ఉంది. అదేమిటంటే, మరణించిన తర్వాత పరలోకంలో మీరేమో ప్రవక్త కాబట్టి స్వర్గంలోని ఉన్నతమైన శిఖరాలకు చేరుకుంటారు, నేను ఒక సాధారణమైన వ్యక్తి కాబట్టి, అల్లాహ్ దయవల్ల నేను కూడా స్వర్గానికి వచ్చేసినా, నేను స్వర్గంలోనే మామూలు స్థానాలలో ఉంటాను. అక్కడ కూడా నాకు మిమ్మల్ని చూడాలని అనిపిస్తుంది. మరి అలాంటప్పుడు నేను మిమ్మల్ని అక్కడ ఎలా చూడగలను, అక్కడ చూడలేనేమోనని నాకు బాధగా ఉంది, కంగారుగా ఉంది, ఓ దైవప్రవక్త అన్నారు.
చూశారా, ఎంతటి తపన ఉందో ఆయనలో ప్రవక్త వారిని చూడాలనే తపన, ప్రవక్త వారిని చూసి మనశ్శాంతి పొందాలన్న అభిమానం చూశారా. ఆ తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వాక్యాలు అవతరింపజేశాడు.
وَمَنْ يُطِعِ اللَّهَ وَالرَّسُولَ فَأُولَٰئِكَ مَعَ الَّذِينَ أَنْعَمَ اللَّهُ عَلَيْهِمْ مِنَ النَّبِيِّينَ وَالصِّدِّيقِينَ وَالشُّهَدَاءِ وَالصَّالِحِينَ ۚ وَحَسُنَ أُولَٰئِكَ رَفِيقًا (వమయ్ యుతిఇల్లాహ వర్రసూల ఫఉలాయిక మఅల్లజీన అన్అమల్లాహు అలైహిమ్ మినన్నబియ్యీన వస్సిద్దీఖీన వష్షుహదాఇ వస్సాలిహీన వహసున ఉలాయిక రఫీఖా) ఎవరైతే అల్లాహ్‌కు, ప్రవక్తకు విధేయత చూపుతారో వారు, అల్లాహ్ అనుగ్రహం పొందిన ప్రవక్తలు, సత్యసంధులు, అమరగతులు, సద్వర్తనులతో పాటు ఉంటారు. వారు ఎంత మంచి స్నేహితులు! (4:69) ఖుర్ఆన్ గ్రంథం నాలుగవ అధ్యాయము 69 వ వాక్యము.
దాని అర్థం ఏమిటంటే, ఎవరైతే అల్లాహ్‌కు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు విధేయత కనబరుస్తారో, వారే అల్లాహ్ అనుగ్రహం పొందిన ప్రవక్తలతోను, సత్యసంధులతోను, షహీదులతోను, సద్వర్తనులతోను ఉంటారు. వీరు ఎంతో మంచి స్నేహితులు.
ఎవరైతే అల్లాహ్‌ను మరియు ప్రవక్త వారిని విశ్వసించి, అభిమానించి, ఆ ప్రకారంగా నడుచుకుంటారో వారు ప్రవక్తలతో పాటు ఉంటారట, సిద్దీఖీన్లతో పాటు సత్యసంధులతో పాటు ఉంటారట, షహీద్ వీరమరణం పొందిన వారితో పాటు ఉంటారట. ఎంతటి గౌరవం చూశారా?
سبحان الله ثم سبحان الله (సుబ్ హానల్లాహ్ సుమ్మా సుబ్ హానల్లాహ్).
అయితే మిత్రులారా, ఒకే మాట చెప్పి ఇన్ షా అల్లాహ్ ఒక విషయం వైపు మీ దృష్టిని నేను తీసుకువెళ్లాలనుకుంటున్నాను.. ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక వ్యక్తి వచ్చి
متى الساعة؟ (మతస్సాఅ) ప్రళయం ఎప్పుడు వస్తుంది అని అడిగాడు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన వైపు చూసి
ماذا أعددت لها؟ (మాజా ఆదత్త లహా) అని తిరిగి ప్రశ్నించారు. ప్రళయం గురించి నీవు అడుగుతున్నావు సరే, కానీ ఆ ప్రళయం కోసము నీవు ఏమి సిద్ధం చేసుకున్నావు అన్నారు. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, ఓ దైవప్రవక్త, నేను పెద్దగా నమాజులు ఏమి చదువుకోలేదు, నేను పెద్దగా ఉపవాసాలు ఏమి ఉండలేదు, చెప్పుకోదగ్గ పెద్ద పుణ్యకార్యం నేను ఏమి చేసుకోలేదు. నా మీద ఉన్న బాధ్యత మాత్రం నేను నెరవేర్చుకుంటూ ఉన్నాను, పెద్దగా చెప్పుకోదగ్గ పుణ్యకార్యము నేను ఏదీ చేయలేదు. కాకపోతే నేను నా గుండెల నిండా మీ అభిమానం ఉంచుకొని ఉన్నాను అన్నారు.
ఆయన ఏమంటున్నాడండి, నా గుండెల నిండా నేను మీ అభిమానాన్ని ఉంచుకొని ఉన్నాను అంటే వెంటనే ప్రవక్త వారు తెలియజేశారు,
أنت مع من أحببت (అంత మఅ మన్ అహబబ్త.) నీవు ఎవరినైతే అభిమానిస్తున్నావో, రేపు వారితో పాటే పరలోకంలో ఉంటావు అని చెప్పారు.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆ వ్యక్తి పూర్తి అభిమానిస్తున్నాడు కాబట్టి, ప్రవక్త వారు తెలియజేసిన శుభవార్త ప్రకారము ఆ వ్యక్తి ప్రవక్త వారి దగ్గరిలో స్వర్గంలో ఉంటాడు. అయితే, ఇక్కడ ఇప్పుడు నేను మిమ్మల్ని ఆలోచింపజేస్తున్న విషయం ఏమిటంటే, ముస్లింలము మేము, ముస్లింలము మేము అని ప్రకటించుకునే ప్రతి వ్యక్తి ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, మీ గుండెల్లో ఎవరి అభిమానం ఎక్కువగా ఉంది? అల్లాహ్ అభిమానం ఎక్కువగా ఉందా? ప్రవక్త అభిమానం ఎక్కువగా ఉందా? లేక చింపిరి చింపిరి బట్టలు వేసుకున్న మహిళలతో నృత్యాలు చేసే, ఎగిరే, చిందేసే నాటక నటీనటుల అభిమానము ఉందా ఆలోచించండి. ఒకవేళ మీరు అందరి కంటే ఎక్కువగా అల్లాహ్‌ను అభిమానిస్తున్నారు, ప్రవక్త వారిని అభిమానిస్తున్నారు అంటే, అల్హమ్దులిల్లాహ్, చాలా సంతోషకరమైన విషయం. అలా కాకుండా మీరు అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటే ఎక్కువగా నటీనటులను, వేరే వేరే వ్యక్తులను అభిమానిస్తున్నారు అంటే రేపు మీరు ఎవరితో పాటు ఉంటారు పరలోకంలో ప్రవక్త వారు తెలియజేసిన దాని ప్రకారం ఆలోచించండి.
లేదండి, మేము ప్రవక్త వారిని ఎక్కువగా అభిమానిస్తున్నాం అండి అని చాలామంది నోటితో ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. నోటితో మాట్లాడితే సరిపోదు. మీ మాట్లాడే తీరు, మీ డ్రెస్ కోడ్, మీరు ధరించే దుస్తులు, మీ హెయిర్ స్టైల్, మీ వెంట్రుకలు, అలాగే మీ బట్టలు, మీ మాట్లాడే తీరు, మీ హెయిర్ స్టైల్, అలాగే మీరు, మీ కుటుంబ సభ్యులలో ఉన్న వ్యవహార శైలి ఇవన్నీ మీరు ఎవరిని అభిమానిస్తున్నారో, ఎవరిని మీరు ఫాలో అవుతున్నారో చెప్పకనే చెబుతూ ఉన్నాయి. ముస్లింలు అంటున్న వారు, వారి బట్టలను చూడండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన విధంగా వారు దుస్తులు ధరిస్తున్నారా? ప్రవక్త వారు తెలియజేసిన దాని ప్రకారంగా వారు వెంట్రుకలు ఉంచుతున్నారా? ప్రవక్త వారు తెలియజేసిన దాని ప్రకారము వ్యవహార శైలిగా నడుచుకుంటున్నారా? అక్కడ మనకు తెలిసిపోతుంది ఎవరు ఎవరిని మనం ఫాలో చేస్తున్నాం, ఎవరిని మనం అభిమానిస్తున్నాం, ఎవరి ఫోటోలు కాపీలలో, నోట్ బుక్కులలో, ఇంట్లోని గోడల మీద అతిక్కించుకుంటున్నాం, అక్కడ మనకు తెలిసిపోతుంది మన అభిమానులు ఎవరో, మనం ఎవరిని అభిమానిస్తున్నాము అనేది.
కాబట్టి జాగ్రత్త, ఎవరిని అభిమానిస్తున్నారో వారితోనే రేపు ఉంటారు.
నాలుగవ హక్కు: ఆదర్శంగా తీసుకోవడం
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని నమ్మటం, విశ్వసించటం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవించటం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అభిమానించటం, మూడు హక్కుల గురించి తెలుసుకున్నాం కదండీ. ఇక మరొక హక్కు ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆదర్శమూర్తిగా, రోల్ మోడల్ గా, ఆదర్శనీయుడిగా తీసుకొని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి అడుగుజాడల్లో నడుచుకోవాలి. ప్రతి పనిలో, ప్రతి విషయంలో, ఆరాధనల్లో, వ్యవహారాల్లో, అలాగే విశ్వాసంలో, ప్రతి విషయంలో ప్రవక్త వారిని ఆదర్శంగా తీసుకోవాలి.
ఖుర్ఆన్ గ్రంథం 33వ అధ్యాయం 21వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,
لَقَدْ كَانَ لَكُمْ فِي رَسُولِ اللَّهِ أُسْوَةٌ حَسَنَةٌ لِمَنْ كَانَ يَرْجُو اللَّهَ وَالْيَوْمَ الْآخِرَ وَذَكَرَ اللَّهَ كَثِيرًا (లఖద్ కాన లకుమ్ ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనతున్ లిమన్ కాన యర్జుల్లాహ వల్ యౌమల్ ఆఖిర వ జకరల్లాహ కసీరా) వాస్తవానికి అల్లాహ్ ప్రవక్తలో మీ కొరకు – అంటే అల్లాహ్‌ను, అంతిమ దినాన్ని ఆశించేవారికీ, అల్లాహ్‌ను అధికంగా స్మరించే వారికీ – ఒక ఉత్తమ ఆదర్శం ఉంది. (33:21)
అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిలో మీ కొరకు అత్యుత్తమ ఆదర్శము ఉంది అన్నారు. ఏ వ్యక్తి అయినా సరే ఆయన తండ్రిగా ఉంటాడు లేదా కుమారునిగా ఉంటాడు లేదా వృత్తిపరంగా ఒక బోధకునిగా, ఒక టీచర్‌గా ఉంటాడు లేదా ఒక డాక్టర్‌గా ఉంటాడు, ఏ రంగానికి చెందిన వ్యక్తి అయినా సరే, ఏ వయసులో ఉన్న వ్యక్తి అయినా సరే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఒక తండ్రిగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆదర్శనీయులు, ఒక కుమారునిగా కూడా ప్రవక్త వారు ఆదర్శనీయులు, ఒక భర్తగా ప్రవక్త వారు ఆదర్శనీయులు, ఒక గురువుగా ప్రవక్త వారు ఆదర్శనీయులు, ఒక వ్యాపారిగా ప్రవక్త వారు ఆదర్శనీయులు, ఒక డాక్టర్‌గా ప్రవక్త వారు ఆదర్శనీయులు, ఒక బోధకునిగా ప్రవక్త వారు ఆదర్శనీయులు, ఒక లీడర్‌గా ప్రవక్త వారు ఆదర్శనీయులు, ఒక పొరుగువానిగా ప్రవక్త వారు ఆదర్శనీయులు, అలాగే ఒక సైన్యాధిపతిగా కూడా ప్రవక్త వారు ఆదర్శనీయులు. మనిషి జీవితంలోని ప్రతి రంగంలో కూడా ప్రవక్త వారు ఆదర్శనీయులు. కాబట్టి, ఏ వ్యక్తి అయినా సరే, ఏ రంగంలో ఉన్న వ్యక్తి అయినా సరే, ప్రవక్త వారిని ఆదర్శంగా తీసుకోవాలి.
ఇప్పుడు మనం ఎవరిని ఆదర్శంగా తీసుకుంటున్నాం? ఎవరిని ఆదర్శంగా తీసుకొని మనము జీవించుకుంటున్నాం? మన జీవన వ్యవహారాలు, మన జీవన శైలి ఎలా ఉంది, మన లావాదేవీలు ఏ విధంగా ఉన్నాయి, ఒక్కసారి ఆలోచించుకోండి మిత్రులారా. ప్రవక్త వారిని ఆదర్శంగా తీసుకొని మనము జీవించాలి, ఇది ముస్లింల సముదాయం మీద ఉన్న మరొక హక్కు.
ఐదవ హక్కు: విధేయత చూపడం
ఇక సమయం ఎక్కువైపోతుంది కాబట్టి, క్లుప్తంగా ఇన్ షా అల్లాహ్ చెబుతూ నా మాటను ముగించే ప్రయత్నం చేస్తాను. ప్రవక్త వారి తరఫున ముస్లిం సముదాయం మీద ఉన్న ముఖ్యమైన, ముఖ్యమైన, ముఖ్యమైన హక్కు, బాధ్యత ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి విధేయత చూపాలి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించాలి. అనుసరించటం, విధేయత చూపటం అంటే ఏమిటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ పనులకైతే మమ్మల్ని చేయమని ఆదేశించారో, ఆ పనులను చేయాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ పనులైతే చేయవద్దు అని వారించారో, ఆ పనులు చేయకుండా వాటికి దూరంగా ఉండాలి. మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ప్రవక్త వారు ప్రతి భక్తి కార్యానికి, ప్రతి మంచి కార్యానికి చేయమని ఆదేశించి ఉన్నారు. అలాగే, ప్రతి పాపానికి మరియు ప్రతి తప్పు కార్యానికి దూరంగా ఉండండి అని వారించి ఉన్నారు. ప్రవక్త వారు వారించిన విషయాలకు దూరంగా ఉండాలి, ప్రవక్త వారు బోధించిన, చేయమని చెప్పిన విషయాలను మనము చేయాలి. దీనినే ఇతాఅత్, ఇత్తెబా అని అరబీలో అంటారు, విధేయత అని తెలుగులో అంటారు, అనుసరించటం అని అంటారు.
ఖుర్ఆన్ గ్రంథం సూరా మాయిదా 92 వ వాక్యంలో అల్లాహ్ తెలియజేశాడు,
وَأَطِيعُوا اللَّهَ وَأَطِيعُوا الرَّسُولَ (వ అతీవుల్లాహ వ అతీవుర్రసూల్) అల్లాహ్‌కు విధేయత చూపండి, ప్రవక్తకు కూడా విధేయత చూపండి. (5:92)
అల్లాహ్‌కు విధేయత చూపండి మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కూడా విధేయత చూపండి, అనుసరించండి. ఎలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మనము విధేయత చూపాలి, అనుసరించాలంటే ఒక రెండు ఉదాహరణలు చెప్పిఇన్ షా అల్లాహ్ మాటను ముగించి ముందుకు కొనసాగిస్తాను.
ఒకసారి ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందుకు వచ్చాడు. ఆయన బంగారపు ఉంగరము ధరించి ఉన్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ వ్యక్తిని దగ్గరకు పిలిచి, ఆ ఉంగరము తీసేసి పక్కన పడేశారు. పురుషులు బంగారము ధరించడము ఇస్లాం నియమాల నిబంధనల ప్రకారము అది వ్యతిరేకం. పురుషులు బంగారము ధరించరాదు, ఇది ఇస్లాం మనకు బోధించే విషయం. ఆ వ్యక్తి బంగారము ధరించి ఉన్నారు కాబట్టి ప్రవక్త వారు ఆ బంగారపు ఉంగరము తీసి పక్కన పడేసి, మీరు నరకము యొక్క అగ్నిని ముట్టుకోవటము, చేతిలో పట్టుకోవటము ఇష్టపడతారా, మరి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పారు. తర్వాత ప్రవక్త వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు, ఆ వ్యక్తి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇతర శిష్యులు ఆ వ్యక్తిని పిలిచి, చూడండి, ఆ బంగారము ధరించవద్దు అని ప్రవక్త వారు తెలియజేశారు కాబట్టి, ఆ బంగారము మీరు ధరించవద్దు, కానీ అది అక్కడ పడిపోయి ఉంది కాబట్టి, అది మీరు తీసుకువెళ్ళండి, వేరే పనుల కోసం ఉపయోగించుకోండి అన్నారు. అయితే, ఆయన ఏమన్నారో తెలుసా,
لا والله، لا آخذه أبداً، وقد طرحه رسول الله صلى الله عليه وسلم (లా వల్లాహి, లా ఆఖుజుహు అబదా, వఖద్ తరహహు రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం.) అల్లాహ్ సాక్షిగా, అలా నేను చేయనంటే చేయను. ఏ పరికరాన్ని అయితే ప్రవక్త వారు తొలగించి పక్కన పడేశారో, దాన్ని నేను ముట్టుకోనంటే ముట్టుకోను అని చెప్పారు.
అలాగే మనం చూచినట్లయితే, అలీ రజియల్లాహు అన్హు వారు ఒకసారి పట్టు వస్త్రాలు ధరించి వెళ్తూ ఉన్నారు, ప్రవక్త వారి కంటపడ్డారు. ప్రవక్త వారు అలీ రజియల్లాహు అన్హు వారు పట్టు వస్త్రాలు ధరించి ఉన్న విషయాన్ని చూసి, ప్రవక్త వారికి ఆ విషయం నచ్చలేదు. ప్రవక్త వారికి నచ్చలేదన్న విషయం ఆయన ముఖ కవళికల ద్వారా కనపడింది. వెంటనే అలీ రజియల్లాహు అన్హు వారు గుర్తుపట్టి, ఇంటికి వచ్చేసి ఆ వస్త్రాలు తీసి, చించేసి మహిళలకు ఇచ్చేశారు. గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, ఇస్లామీయ నిబంధనల ప్రకారము పట్టు వస్త్రాలు పురుషులకు యోగ్యమైనవి కావు. పట్టు వస్త్రాలు మహిళలకే ప్రత్యేకం. పురుషులు పట్టు వస్త్రాలు ధరించరాదు, ఇది ఇస్లామీయ నిబంధన. అయితే అలీ రజియల్లాహు అన్హు వారు పట్టు వస్త్రాలు ధరించారు కాబట్టి, ప్రవక్త వారు ఆ విషయాన్ని ఇష్టపడలేదు. వెంటనే అలీ రజియల్లాహు అన్హు వారు ఆ విషయాన్ని గ్రహించి, ఆ పట్టు వస్త్రాలు ఇంటికి వెళ్లి చించేసి, మహిళల చేతికి ఇచ్చేశారు, మీకు ఇష్టం వచ్చినట్టు మీరు ఈ బట్టలతో ఏమైనా చేసుకోండి అని.
చూశారా, ప్రవక్త వారు ఇష్టపడలేదు, వెంటనే అలీ రజియల్లాహు అన్హు వారు ఆ దుస్తులను తొలగించేశారు. చూశారా, ఆ ప్రకారంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మనము అనుసరించాలి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మనము విధేయత చూపాలి. ఏ విషయాలనైతే ప్రవక్త వారు మమ్మల్ని వారించారో వాటికి దూరంగా ఉండాలి.
అలాగే, ముస్లిం సముదాయం మీద ఉన్న హక్కులలో మరొక హక్కు ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకువచ్చిన ధర్మాన్ని వ్యాపింపజేయాలి, ప్రచారం చేయాలి, ప్రజల వద్దకు తీసుకువెళ్లి చేరవేయాలి. ఆ పని ప్రవక్తలు చేశారు. ప్రవక్త, మీకు నేను చివరి ప్రవక్తని, నా తర్వాత ప్రవక్తలు రారు. ఇక దీని ప్రచారం యొక్క బాధ్యత మీ మీద ఉంది అని చెప్పి వెళ్ళిన తర్వాత సహాబాలు ఆ బాధ్యత నెరవేర్చారు. ఆ తర్వాత వారు కూడా బాధ్యత నెరవేర్చారు. మనము కూడా ఆ బాధ్యత నెరవేర్చాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులను అభిమానించాలి. ఎవరిని కూడా కించపరచరాదు, దూషించరాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద దరూద్ పఠించాలి, ఇది కూడా మన మీద ఉన్న బాధ్యత మరియు హక్కు. దరూద్ శుభాలు అనే ప్రసంగము
إِنْ شَاءَ ٱللَّٰهُ (ఇన్ షా అల్లాహ్) వినండి, అక్కడ దరూద్ గురించి, అది ఎంత విశిష్టమైన కార్యమో తెలపజడం జరిగింది. అలాగే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి స్నేహితులతో మనము కూడా అభిమానం చూపించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శత్రువులతో మనము కూడా శత్రుత్వాన్ని వ్యక్తపరచాలి. ఇవి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల ముస్లిం సముదాయం మీద ఉన్న హక్కులు. క్లుప్తంగా మీ ముందర ఉంచడం జరిగింది. నేను అల్లాహ్‌తో దుఆ చేస్తున్నాను, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మమ్మల్ని అందరినీ అన్న, విన్న మాటల మీద ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక,ఆమీన్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.