దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
[8:30 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ధర్మపరమైన నిషేధాలు –20
20– అల్లాహ్ ను వదలి సమాధిలో ఉన్నవారితో దుఆ చేసే, లేదా వారిని అల్లాహ్ ముందు మధ్యవర్తిగా నిలబెట్టే ఉద్దేశ్యంతో సమాధులను దర్శించకు. అక్కడ వారి స్థితిగతులను, వారి పర్యవసానాన్ని గ్రహించి, గుణపాఠం నేర్చుకునే ఉద్దేశ్యం ఉండాలి. (ప్రవక్త నేర్పిన ప్రకారం) వారికి సలాం చేయుటకు, వారి కొరకు అల్లాహ్ తో దుఆ చేయుటకు వెళ్ళుట మంచిదే.
ఆ అల్లాహ్ యే మీ ప్రభువు. సామ్రాజ్యాధికారం ఆయనదే. ఆయ- నను కాదని మీరు పిలిచే ఇతరులు కనీసం ఒక గడ్డిపోచకు కూడా యజమానులు కారు. వారిని వేడుకుంటే, వారు మీ అర్థింపులను వినలేరు. ఒకవేళ విన్నా వాటికి ఏ సమాధానమూ మీకు ఇవ్వలేరు. మీరు కల్పించిన దైవత్వపు భాగస్వామ్యాన్ని వారు ప్రళయం నాడు తిరస్కరిస్తారు. సత్యాన్ని గురించిన ఈ సరైన సమాచారాన్ని తెలిసిన వాడు తప్ప మరొకడెవ్వడూ మీకు అందజేయలేడు[. (ఫాతిర్ 35: 13,14).
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
[7:44 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ధర్మపరమైన నిషేధాలు –17
17- బర్కత్ (శుభం) కలిగే ఉద్దేశంతో సమాధుల మీద, దాని చుట్టు ప్రక్కలో ఎక్కడా నమాజు చేయకు. అక్కడ దుఆ చేయుట ఘనత గల విషయమని భావించకు. అక్కడ నమాజు చేయుట సంపూర్ణత్వానికి ఓ నిదర్శనం అని భావించకు. ఇవన్నియూ షిర్కులో లేదా దాని దరిదాపులకు చేరుకుండా ఉండటానికి పాటించవలసిన ముఖ్య పనులు [1].
“మీకు పూర్వం గడచిపోయినవారు తమ ప్రవక్తల మరియు పుణ్యాత్ముల సమాధులను మస్జిదులుగా చేసుకునేవారు, వినండి! మీరు అలా సమాధులను మస్జిదులుగా చేయబోకండి. నేను మిమ్మల్ని దీని నుండి నిషేధిస్తున్నాను. (ముస్లిం 532).
[1] సమాధి వద్ద నమాజు స్థితులు:
1- సమాధి వద్ద నమాజు చేయు వ్యక్తి సమాధి మరియు అందులో ఉన్న వారి గురించి ఏ ప్రత్యేక నమ్మకం లేకుండా, అల్లాహ్ ప్రసన్నత కొరకే, కాని అక్కడ చేయుట ఎక్కువ ఘనత అని భావిస్తే అతను షిర్క్ కు సంబంధించిన బిద్అత్ (దురాచారం) చేసినవాడు, శాపగ్రస్తుడు మరియు సృష్టిలో అతి నీచుడవుతాడు. కాని పెద్ద షిర్క్ కు పాల్పడిన, ఇస్లాం నుండి వైదొలిగినవాడు కాడు.
2- సమాధి వద్ద నమాజు చేయు వ్యక్తి అందులో ఉన్నవారి గురించి లాభాలు చేకూర్చే, నష్టాన్ని తొలిగించేవారని నమ్మి, వారితో మొర పెట్టుకుంటే, వేడుకుంటే అలాంటి వ్యక్తి పెద్ద షిర్క్ కు పాల్పడి, ఇస్లాం నుండి దూరమై, తౌహీద్ కు వ్యతిరేకమైన కార్యం చేసినవాడవుతాడు.
3- ఎవరైతే అజ్ఞానంతో సమాధి వద్ద నమాజ్ చేశాడో, అక్కడ సమాధి ఉన్నదని కూడా అతనికి తెలియదో అతని ఆ నమాజ్ సహీ అగును. అతడు పాపాత్ముడు కాడు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ప్రతి నమాజు తర్వాత చేతులెత్తి దుఆ చేయడం బిద్అత్ (కల్పితాచారం) కిందికి వస్తుందా? https://www.youtube.com/watch?v=uT6QWE7p4EI [9 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో, నమాజ్ తర్వాత చేతులెత్తి దుఆ చేయడం బిద్అత్ (మతంలో కొత్త ఆచారం) అవుతుందా అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితం ఆధారంగా చేతులెత్తి దుఆ చేయడాన్ని మూడు రకాలుగా విభజించారు. మొదటిది, ప్రవక్త గారు స్పష్టంగా చేతులెత్తిన సందర్భాలు (వర్షం కోసం దుఆ, అరఫా మైదానంలో దుఆ), ఇక్కడ మనం కూడా చేతులెత్తాలి. రెండవది, ప్రవక్త గారు దుఆ చేసినా చేతులెత్తని సందర్భాలు (సజ్దాలో, తషహ్హుద్ లో), ఇక్కడ మనం కూడా చేతులెత్తకూడదు. మూడవది, స్పష్టమైన ఆదేశం లేని సాధారణ సందర్భాలు. ఫర్జ్ నమాజ్ తర్వాత దుఆ అంగీకరించబడుతుందని హదీసులో ఉన్నప్పటికీ, ప్రవక్త గారు ప్రతి నమాజ్ తర్వాత క్రమం తప్పకుండా చేతులెత్తినట్లు రుజువు లేదు. కాబట్టి, దీనిని ఒక తప్పనిసరి అలవాటుగా మార్చుకోవడం ప్రవక్త విధానానికి విరుద్ధం మరియు బిద్అత్ అయ్యే ప్రమాదం ఉందని పండితులు వివరించారు. అప్పుడప్పుడు వ్యక్తిగతంగా దుఆ చేసుకుంటే తప్పు లేదు, కానీ దీనిని ఒక స్థిరమైన ఆచారంగా చేసుకోకూడదు.
ఏ నమాజ్ తర్వాత అయినా సరే చేతులెత్తి దుఆ చేయడం ఇది బిద్అత్ అంటున్నారు, ఇది నిజమా? అని అడుగుతున్నారు.
ఇక్కడ వచ్చిన ప్రశ్న ఏంటి? నమాజుల తర్వాత దుఆ చేయడం బిద్అత్ అని అంటున్నారు. అయితే వాస్తవానికి, ప్రశ్న చాలా సంక్షిప్తంగా ఉంది. దీన్ని కొంచెం విడమరిచి అర్థం చేసుకునే అవసరం ఉంది. అప్పుడు ఇందులో బిద్అత్ ఏమిటి? సున్నత్ ఏమిటి? చేయవలసింది ఏమిటి? చేయకూడనిది ఏమిటి? మనకు అర్థమవుతుంది. ముందు అసలు ప్రశ్నలోనికే వెళ్దాం మనం.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీథ్ ద్వారా మనకు తెలుస్తుంది, ఫర్జ్ నమాజ్ ప్రత్యేకంగా, ఫర్జ్ నమాజుల గురించి. వాటి చివరి భాగం, అది సలాం కంటే ముందు కావచ్చు, సలాం తర్వాత కావచ్చు. మరికొన్ని ఉల్లేఖనాల్లో సలాం తర్వాత అన్నటువంటి ప్రస్తావన కూడా ఉంది. ఆ సమయంలో చేసే దుఆ అంగీకరించబడుతుంది. ఆ సమయంలో చేసే దుఆ అంగీకరించబడుతుంది. అలాంటప్పుడు, ఈ హదీథ్ విన్నవారు ఏమనుకుంటారు? మనం దుఆ చేయడంలో తప్పేంటి? కానీ ఇక్కడ మరో ప్రశ్నలో ఉన్నటువంటి విషయం, చేతులెత్తి దుఆ చేయడం అని ఇక్కడ ప్రస్తావన ఉంది.
దుఆలో చేతులు ఎత్తడంపై హదీసులు
అయితే, అబూ దావూద్ లోని ఒక హదీథ్,
إِنَّ اللَّهَ حَيِيٌّ كَرِيمٌ (ఇన్నల్లాహ హయ్యియున్ కరీమున్) అల్లాహు త’ఆలా చాలా సిగ్గుపడువాడు, ఎంతో ఉదారుడు.
అయితే ఎప్పుడైతే దాసుడు రెండు చేతులెత్తి అల్లాహ్ తో ఏదైనా దుఆ చేస్తాడో, అతని చేతులను, అతనికి ఏమీ ప్రసాదించకుండా తిరిగి ఉత్తగా, ఖాళీగా, ఏమీ ఇవ్వకుండా తిరిగి పంపేయడం అల్లాహ్ కు స్వయంగా ఇది ఇష్టం కాదు.
దీని ద్వారా ఏమర్థమవుతుంది? అంటే, మనం దుఆ చేసేటప్పుడు చేతులెత్తాలి. మొదటి హదీస్ ద్వారా, ఫర్జ్ నమాజ్ తర్వాత దుఆ స్వీకరించబడుతుంది అని, ఈ హదీస్ ద్వారా చేతులెత్తి చేస్తే మరీ స్వీకరించబడుతుంది అని, అల్లాహ్ తప్పకుండా ప్రసాదిస్తాడు అని. అలాంటప్పుడు మనం నమాజుల తర్వాత దుఆ చేసి, చేయడానికి చేతులు ఎత్తడం తప్పు లేదు అని ఈ హదీసుల ద్వారా తెలుస్తుంది, కదా?
షేఖ్ బిన్ బాజ్ (రహిమహుల్లాహ్) వారి ఫత్వా: మూడు స్థితులు
అయితే, షేఖ్ బిన్ బాజ్ రహిమహుల్లాహ్ యొక్క ఫత్వా దీని గురించి ప్రత్యేకంగా చదవడం జరిగింది. ఆయన చాలా మంచి సమాధానం ఇచ్చారు. ఏం చెప్పారు?
దుఆలో మనం ఎప్పుడు చేతులెత్తాలి, ఎప్పుడు చేతులెత్తకూడదు. దుఆ చేస్తూ మనం ఎప్పుడు చేతులెత్తాలి, ఎప్పుడు చేతులెత్తకూడదు. దీని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారినే మనం అనుసరించాలి. అయితే, ఇక్కడ మనకు మూడు స్థితులు అనండి లేదా మూడు లెవెల్లు కనబడుతున్నాయి.
ఒకటి, కొన్ని సందర్భాలలో స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దుఆ చేస్తూ చేతులెత్తినట్లు రుజువు ఉంది. అక్కడ మనం తప్పకుండా చేతులెత్తాలి. ఉదాహరణకు, జుమా ఖుత్బా ఇస్తూ ఉండగా వర్షం కొరకు దుఆ చేసినప్పుడు చేతులెత్తి దుఆ చేశారు.
اللَّهُمَّ أَسْقِنَا (అల్లాహుమ్మ అస్ఖినా) ఓ అల్లాహ్, మాకు వర్షం కురిపించు.
సలాతుల్ ఇస్తిస్కా (వర్షం కొరకు నమాజ్) చేసినప్పుడు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేతులెత్తి దుఆ చేశారు అని రుజువు ఉన్నది. హజ్ చేస్తున్నప్పుడు మైదానే అరఫాత్ లో ఉన్నారు, చాలా దీర్ఘ సమయం వరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేతులెత్తి దుఆ చేశారు. చివరికి ఒంటె మీద కూర్చుండి చేతులెత్తి దుఆ చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ఆ ఒంటెను నడపడానికి ఒక కట్టె ఉంటుంది కదా, అది కింద పడిపోయినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక చెయ్యి అలాగే ఎత్తి ఉన్నారు, మరో చెయ్యితో ఆ కింద పడిపోయిన వస్తువును తీసుకున్నారు. అంటే ఈ విధంగా ఎక్కడైతే ప్రవక్త చేతులెత్తారు అని మనకు రుజువు ఉందో, అక్కడ మనం చేతులెత్తాలి.
కానీ, ఎక్కడ ప్రవక్త చేతులెత్తలేదు, దుఆ చేశారు కానీ చేతులెత్తలేదు, అక్కడ మనం అలాగే దుఆ చేయాలి కానీ చేతులెత్తకూడదు. ఉదాహరణకు, సజ్దాలో దుఆ చేయండి అని చెప్పడం జరిగింది, దుఆ అంగీకరించబడుతుంది అని కూడా చెప్పడం జరిగింది. అలాగే, తషహ్హుద్ లో ఉన్నప్పుడు కూడా మీరు దుఆ చేయండి అని చెప్పడం జరిగింది. కానీ ఈ సందర్భాలలో చేతులెత్తే ప్రస్తావన లేదు. అలాగే జుమా ఖుత్బా సందర్భంలో, సందర్భంలో, వేరే కొన్ని దుఆలు చేశారు కానీ చేతులెత్తినట్లు ఏ రుజువు లేదు, సుబూత్ లేదు. అందుకొరకు ఆ సందర్భాల్లో మనం చెయ్యి ఎత్తకూడదు. రెండు స్థితులు అర్థమైనాయి కదా?
ఇక మూడవది, ఏ సందర్భాల గురించి అయితే ఎత్తినట్లు, ఎత్తలేనట్లు ఏ ప్రస్తావన లేదో, అలాంటి చోట మనం ఏదైనా అడపాదడపా ఎత్తితే నష్టం లేదు కానీ, దానిని ఒక అలవాటుగా చేసుకోవడం, దానిని ఒక అలవాటుగా చేసుకోవడం ఇది ప్రవక్త విధానానికి వ్యతిరేకం అవుతుంది.
ముగింపు మరియు తీర్మానం
ఫర్జ్ నమాజ్ తర్వాత దుఆ, దీని ఘనత వచ్చి ఉంది. కానీ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నమాజ్ యొక్క వివరణ ఎంతో మంది సహాబాలు ఉల్లేఖించారు. కానీ చేతులెత్తి దుఆ చేసినట్లు ఎక్కడైనా ఉల్లేఖనం ఉందా? లేదు. అందు గురించి, షేఖ్ అబ్దుల్లా అల్ జిబ్రీన్ రహిమహుల్లాహ్ చెప్పిన విషయం ఏంటంటే, ఎవరైనా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పినటువంటి దుఆలు ఫర్జ్ నమాజ్ తర్వాత చేసి, ఆ తర్వాత చేతులెత్తి ఒకవేళ దుఆ చేసుకుంటే అభ్యంతరం లేదు.
అయితే మరి, షేఖ్ బిన్ బాజ్, షేఖ్ ఇబ్ను ఉథైమీన్ ఇంకా ఇతర పండితుల గురించి మనకు తెలుస్తుంది, వారు ఫత్వా ఏమిచ్చారు? ఫర్జ్ నమాజ్ తర్వాత చెయ్యి ఎత్తి దుఆ చేయడం బిద్అత్ అని. మరి ఎందుకు వీరు ఇలా చెప్పారు? ఎందుకు వీరు ఇలా చెప్పారంటే, మన వద్ద కొంతమంది ఇంకా వేరే ఏరియాలో కూడా, సలాం తింపిన తర్వాత ప్రవక్తతో ఏ ఏ దుఆలు అయితే రుజువై ఉన్నాయో, అవి ఆ విధంగా చదవకుండానే చేతులెత్తి దుఆ చేసే ఒక అలవాటుగా చేసుకుని ప్రతీ నమాజ్ తర్వాత చేయడం మొదలుపెట్టారు. ఇలాంటి ప్రస్తావన వచ్చినప్పుడు, అవును మరి, ఇది ప్రవక్త యొక్క సున్నత్ కాదు మరియు ప్రతీ సారి చేస్తున్నారు, అందుకొరకే ఇది బిద్అత్ లో వచ్చే ప్రమాదం ఉంటుంది, అందుకొరకే బిద్అత్ అని ఫత్వా ఇచ్చారు.
అందుకొరకు, దీన్ని మనం ఇక్కడ ఈ విధంగా అర్థం చేసుకోవాలి. షేఖ్ అబ్దుల్లా అల్ జిబ్రీన్ రహిమహుల్లాహ్ వారి యొక్క ఫత్వాను ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఇక ఎక్కడైతే ప్రస్తావన లేదో, చెయ్యి ఎత్తినట్లు, ఎత్తనట్లు, అక్కడ ఎప్పుడైనా ఒక్కసారి మనం ఎత్తి దుఆ చేస్తే అందులో పాపం లేదు కానీ, అదే ఒక అలవాటుగా చేయకూడదు.
هذا ما نعلم، والله أعلم بالصواب (హాదా మా న’అలం, వల్లాహు అ’అలం బిస్సవాబ్) ఇది మాకు తెలిసినది, మరియు సరైనది అల్లాహ్ కే బాగా తెలుసు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఓ అల్లాహ్! నేను నీ కారుణ్యముపైనే ఆశ పెట్టుకున్నాను, కనుక నన్ను క్షణకాలం కోసమైన నా మనోవాంఛలకు అప్పగించవద్దు. నాకై నా కార్యాలన్నీ చక్కదిద్దు నీవు తప్ప ఆరాధనకు అర్హుడు ఎవడూ లేడు. (అబూదావూద్, అహ్మద్).
3️⃣లా ఇలాహ ఇల్లా అంత సుబ్ హానక ఇన్నీ కున్తు మిన జ్జాలిమీన్
ఓ అల్లాహ్! నిశ్చయంగా నేను నీ దాసుడిని, నీ దాసుడి కుమారుడిని, నీ దాసురాలి పుత్రుడను, నా నొసలు, ముంగురులు నీ చేతిలో ఉన్నాయి. నీ ఆజ్ఞ నాలో కొనసాగుతున్నది నా కొరకై నీ తీర్పు న్యాయసమ్మతమైనది. నీ నామములన్నింటితో, వేటినైతే నీవు నీ కొరకుపెట్టుకున్నావో, లేదా నీ గ్రంథంలో అవతరింపజేసావో, లేదా నీ సృష్టిలో ఎవరికైనా తెలిపావో, లేదా నీ అగోచర జ్ఞానంలోనే ఉంచాలని నిశ్చయంచుకున్నావో, ఆ నామములన్నింటితో నిన్ను అడుగుచున్నాను – ఖుర్ఆన్ ను నా మనసుకు వసంతముగా, హృదయానికి కాంతిగా, నా మనోవేదనను దూరం చేసే దానిగా, నా దుఃఖాన్ని దూరం చేసేదిగా చేయమని వేడుచున్నాను.
[అహ్మద్ 1/391 మరియు అల్బానీ సహీహ్ అన్నారు.]
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
’అబ్దుర్రహ్మాన్ బిన్ అబీ లైలా ఉల్లేఖించారు: క’అబ్ బిన్ ’ఉజ్ర (రజియల్లాహు అన్హు) నన్ను కలిశారు. ‘ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా విషయం మీకు తెలియపరచనా!’ అని అన్నారు. దానికి నేను తప్ప కుండా వినిపించండి,’ అని అన్నాను. అప్పుడతను, ‘మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను, ఓ ప్రవక్తా! తమరిపై, తమ ఇంటి వారిపై ఎలా దరూద్ పంపాలి. ఎందుకంటే అల్లాహ్ సలామ్ పంపించే పద్ధతి మాకు నేర్పాడు,’ అని విన్నవించుకున్నాం. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పంపాలి అని అన్నారు:
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అల్లాహుమ్మ ఇన్నీ అవూజు బిక మిన్ జవాలి ని’మతిక, వ తహవ్వులి ఆఫియతిక, వ ఫుజాఅతి నిక్-మతిక్, వ జమీ’ఇ సఖతిక
ఓ అల్లాహ్, నేను నీ శరణులోకి వస్తున్నాను, ఏ అనుగ్రహాలు నాపై ఉన్నాయో నీ ఆ అనుగ్రహాలు నా నుండి దూరం కాకుండా ఉండటానికి, నీవు నన్ను ఏ సుఖంలో సౌఖ్యంలో ఉంచావో అది కూడా మారిపోకూడదు అని, నీ వైపు నుండి నేను ఏ అకస్మాత్తు ప్రమాదంలో పడకుండా ఉండటానికి, మరియు నీ అన్ని రకాల కోపానికి, ఆగ్రహానికి గురికాకుండా ఉండటానికి .
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖించారు, ప్రవక్తపై సూర నస్ర్ అవతరించిన తరువాత రుకూ మరియు సజ్దా లో ఈ దుఆ చదివేవారు:
సుబ్ హానకల్లాహుమ్మ రబ్బనా వ బిహందిక అల్లాహుమ్మగ్ ఫిర్లీ (ఓ అల్లా నీవు ఎంతో పరిశుద్ధునివి, పవిత్రునివి, ఓ మా ప్రభువా! నీకే సర్వ స్తోత్రములు, ఓ అల్లాహ్! నన్ను క్షమించు).
సర్వ సామాన్యంగా మనకు తెలిసిన దుఆలలో రుకూలో సుబ్ హాన రబ్బియల్ అజీం మరియు సజ్దా లో సుబ్ హాన రబ్బియల్ అఅలా చదువుతాము.కానీ ఈ ఒక్క దుఆ కాకుండా ఇంకా ఎన్నో దుఆలున్నాయి. మీరు మా చిన్న పుస్తకం ఎల్లవేళలలో మీ వెంట ఉంచుకోండి. దాని పేరు: రేయింబవళ్ళ ముఖ్యమైన దుఆలు
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అల్లాహ్ నామ స్మరణ ఘనత చాలా గొప్పగా ఉంది. అందుకే ముస్లిం జీవితంలో వివిధ సందర్భాలలో “బిస్మిల్లాహ్” అని పలకాలని బోధించడం జరిగింది. వాటిలో కొన్ని సందర్భాలు ఇప్పుడు తెలుసుకుందాము
1- పడుకునే ముందు బిస్మికల్లాహుమ్మ అమూతు వఅహ్ యా అనాలి. (బుఖారీ 6324).
2- మరుగుదొడ్లో ప్రవేశించేకి ముందు బిస్మిల్లాహి అల్లాహుమ్మ ఇన్నీ అఊజుబిక మినల్ ఖుబుసి వల్ ఖబాఇస్ (తిర్మిజి 606, బుఖారీ 142). అయితే తిర్మిజి (142)లో వచ్చిన హదీసులో ఉంది: ‘ఎవరైతే మరుగుదొడ్లో ప్రవేశించేకి ముందు “బిస్మిల్లాహ్” అంటారో వారి మర్మాంగాలను జిన్నులు చూడకుండా అడ్డు ఏర్పాటు చేయడం జరుగుతుంది.’
3,4- ఇంట్లో ప్రవేశించేకి ముందు, భోజనం చేసేకి ముందు ఎవరు “బిస్మిల్లాహ్” అంటారో వారితో పాటు షైతాన్ వారింట్లో ప్రవేశించడు మరియు వారి భోజనంలో కూడా పాల్గొనడు. (ముస్లిం 2018).
5- శరీరంలో ఎక్కడైనా నొప్పి ఉంటే అక్కడ చెయ్యి పెట్టి “బిస్మిల్లాహ్” 3సార్లు, “అఊజు బిల్లాహి వఖుద్రతిహి మిన్ షర్రి మా అజిదు వఉహాజిర్” 7సార్లు చదవాలి. (ముస్లిం 2202, అబూదావూద్ 3891). ఇలా చదువుతూ ఉండడం ద్వారా అల్లాహ్ దయతో నొప్పి మాయమైపోతుంది.
ఇంకా వుజూకు ముందు, భార్యభర్తలు కలుసుకునేకి ముందు, వాహనముపై ఎక్కేకి ముందు, జారి పడినప్పుడు, ఇంటి నుండి బైటికి వెళ్ళినప్పుడు, ఉదయసాయంకాలపు దుఆలలో ఇంకా ఎన్నో సందర్భాలున్నాయి ప్రతి ముస్లిం వాటిని తెలుసుకోవాలి.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
సమాధులను పూజించడం, మరణించి సమాధుల్లో ఉన్న వలీలు (పుణ్యపురుషులు) అవసరాలను తీరుస్తారని, కష్టాలను తొలిగిస్తారని నమ్మడం మరియు అల్లాహ్ ఆధీనంలోనే ఉన్నదాని సహాయం వారితో కోరడం, వారితో మొరపెట్టుకోవడం లాంటివి పెద్ద షిర్క్ లో లెక్కించ బడతాయి.
అల్లాహ్ ఆదేశం చదవండి:
وَقَضَى رَبُّكَ أَلَّا تَعْبُدُوا إِلَّا إِيَّاهُ మీ ప్రభువు తనను తప్ప ఇతరులను మీరు ఆరాధింపకూడదని ఆదేశించాడు [. (బనీఇస్రాఈల్ 17: 23).
అదే విధంగా చనిపోయిన ప్రవక్తలతో, పుణ్యాత్ములతో ఇంకెవరితోనైనా వారి సిఫారసు పొందుటకు, తమ కష్టాలు దూరమగుటకు వారితో దుఆ చేయడం కూడా షిర్క్. చదవండి అల్లాహ్ యొక్క ఈ ఆదేశం:
أَمَّنْ يُجِيبُ المُضْطَرَّ إِذَا دَعَاهُ وَيَكْشِفُ السُّوءَ وَيَجْعَلُكُمْ خُلَفَاءَ الأَرْضِ أَإلَهٌ مَعَ اللهِ బాధితుడు మొరపెట్టుకున్నప్పుడు అతని మొరలను ఆలకించి అతని బాధను తొలగించేవాడు ఎవడు? భూమిపై మిమ్మల్ని ప్రతినిధులుగాచేసినవాడు ఎవడు? అల్లాహ్ తో పాటు (ఈ పనులు చేసే) మరొక దేవుడు కూడ ఎవడైనా ఉన్నాడా?(నమ్ల్ 27: 62).
కొందరు కూర్చున్నా, నిలబడినా, జారిపడినా తమ పీర్, ముర్షిదుల నామములను స్మరించుటయే తమ అలవాటుగా చేసుకుంటారు. ఎప్పుడు ఏదైనా క్లిష్టస్థితిలో, కష్టంలో, ఆపదలో చిక్కుకున్నప్పుడు ఒకడు యా ముహమ్మద్ అని, మరొకడు యా అలీ అని, ఇంకొకడు యా హుసైన్ అని, మరి కొందరు యా బదవీ, యా జీలానీ, యా షాజులీ, యా రిఫాఈ, యా ఈద్ రూస్, యా సయ్యద జైనబ్, యా ఇబ్ను ఉల్వాన్ అని, యా గౌస్ అల్ మదద్ అని, యా ముఈనుద్దీన్ చిష్తీ అని, యా గరీబ్ నవాజ్ అని, నానా రకాలుగా పలుకుతారు. కాని అల్లాహ్ ఆదేశం ఏమిటని గమనించరు:
إِنَّ الَّذِينَ تَدْعُونَ مِنْ دُونِ اللهِ عِبَادٌ أَمْثَالُكُمْ فَادْعُوهُمْ فَلْيَسْتَجِيبُوا لَكُمْ إِنْ كُنْتُمْ صَادِقِينَ అల్లాహ్ ను వదలి మీరు వేడుకుంటున్న వారు మీ మాదిరిగానే కేవలం దాసులు. మీరు వారిని ప్రార్థించి చూడండి. మీకు వారి పట్ల ఉన్న భావాలు నిజమే అయితే మీ ప్రార్థనలకు వారు సమాధానం ఇవ్వాలి (అఅ’రాఫ్ 7: 194).
కొందరు సమాధి పూజారులు సమాధుల ప్రదక్షిణం చేస్తారు. వాటి మూలమూలలను చుంబిస్తారు. చేతులు వాటికి తాకించి తమ శరీరంపై పూసుకుంటారు. వాటి గడపను చుంబిస్తారు. దాని మట్టిని తీసుకొని తమ ముఖాలకు రుద్దుకుంటారు. వాటిని చూసినప్పుడు సాష్టాంగ పడతారు (సజ్దా చేస్తారు). తమ అవసరాలను కోరతూ రోగాల నుండి స్వస్థత పొందుటకు, సంతానం కావాలని, అవసరం తీరాలని వాటి ఎదుట భయభీతితో, వినయవినమ్రతలతో నిలబడతారు. ఒక్కోసారి సమాధిలో ఉన్నవారిని ఉద్దేశించి ఇలా పిలుస్తారు కూడా: యా సయ్యిదీ! ఓ మేరే బాబా! నేను చాలా దూరం నుండి మీ సమక్షంలో హాజరయ్యాను, నాకు ఏమీ ప్రసాదించక వెనక్కు త్రిప్పి పంపుతూ అవమాన పరచకు.
కాని అల్లాహ్ ఆదేశం ఏముందో గమనించారా?
وَمَنْ أَضَلُّ مِمَّنْ يَدْعُو مِنْ دُونِ اللهِ مَنْ لَا يَسْتَجِيبُ لَهُ إِلَى يَوْمِ القِيَامَةِ وَهُمْ عَنْ دُعَائِهِمْ غَافِلُونَ అల్లాహ్ ను వదలి ప్రళయం వరకు తమ ప్రార్థనలను విని సమాధాన మివ్వలేనటువంటి వారిని ప్రార్థించే వారికంటే, ఎక్కువ మార్గభ్రష్టులెవరు? మరియు వారు వీరి (ప్రార్థించేవారి) ప్రార్థనలను ఎరుగకుండా ఉన్నారు (అహ్ఖాఫ్ 46: 5).
ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు:
مَنْ مَاتَ وَهْوَ يَدْعُو مِنْ دُونِ الله نِدًّا دَخَلَ النَّارَ “ఎవరు అల్లాహ్ ను కాదని ఇతరులను ప్రార్థిస్తూ/దుఆ చేస్తూ చనిపోతాడో అతను నరకంలో ప్రవేశిస్తాడు”. (బుఖారి 4497).
కొందరు సమాధుల వద్ద తమ తల గొరిగించుకుంటారు. ‘సమాధుల హజ్ చేసే విధానం’ అన్న పేరుగల పుస్తకాలు కొందరి వద్ద లభిస్తాయి. విశ్వవ్యవస్థ నిర్వహణ శక్తి మరియు లాభనష్టాలు చేకూర్చే శక్తి వలీలకు ఉన్నదని కొందరు నమ్ముతారు. కాని అల్లాహ్ యొక్క ఈ ఆదేశం పట్ల వారు ఎలా అంధులైపోయారో గమనించండి:
وَإِنْ يَمْسَسْكَ اللهُ بِضُرٍّ فَلَا كَاشِفَ لَهُ إِلَّا هُوَ وَإِنْ يُرِدْكَ بِخَيْرٍ فَلَا رَادَّ لِفَضْلِهِ ఒకవేళ అల్లాహ్ నిన్ను ఏదైనా ఆపదకు గురి చేస్తే స్వయంగా ఆయన తప్ప ఆ ఆపదను తొలగించేవారు ఎవరూ లేరు. ఇంకా ఆయన గనక నీ విషయంలో మేలు చేయాలని సంకల్పిస్తే ఆయన అనుగ్రాహన్ని మల్లించే వాడు కూడా ఎవడూ లేడు (యూనుస్ 10: 107).
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.