
[11:10 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
https://teluguislam.net/dua-supplications/
ముస్లిం కష్టాల్లో, బాధల్లో ఉన్నప్పుడు అల్లాహ్ తో అధికంగా దుఆ చెయ్యాలి, ఈ క్రింది దుఆలు అధికంగా చేస్తూ ఉండండి👇
1️⃣అల్లాహు అల్లాహు రబ్బీ లా ఉష్రికు బిహీ షైఆ
اللهُ اللهُ رَبِّ لا أُشْرِكُ بِهِ شَيْئاً
అల్లాహ్! అల్లాహ్ యే నా ప్రభువు, దేనినైనా నేను ఆయనకు సాటి కల్పించను
(📚అబూదావూద్2-335).
2️⃣అల్లాహుమ్మ రహ్మతక అర్ జూ ఫలా తకిల్నీ ఇలా నఫ్సీ తర్ ఫత ఐనిన్ వ అస్లిహ్ లీ షఅనీ కుల్లహూ, లా ఇలాహ ఇల్లా అన్త్
اللّهُمَّ رَحْمَتَكَ أَرْجو فَلا تَكِلني إِلى نَفْسي طَرْفَةَ عَيْن، وَأَصْلِحْ لي شَأْني كُلَّه لَا إِلَهَ إِلَّا أنْت
ఓ అల్లాహ్! నేను నీ కారుణ్యముపైనే ఆశ పెట్టుకున్నాను, కనుక నన్ను క్షణకాలం కోసమైన నా మనోవాంఛలకు అప్పగించవద్దు. నాకై నా కార్యాలన్నీ చక్కదిద్దు నీవు తప్ప ఆరాధనకు అర్హుడు ఎవడూ లేడు. (అబూదావూద్, అహ్మద్).
3️⃣లా ఇలాహ ఇల్లా అంత సుబ్ హానక ఇన్నీ కున్తు మిన జ్జాలిమీన్
لَا إِلَهَ إِلَّا أنْت سُبْحانَكَ إِنِّي كُنْتُ مِنَ الظّالِمين
అల్లాహ్! నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. నీవు పవిత్రుడవు. నిజానికి నేనే దోషులలో చేరిన వాణ్ణి. (21 : 87)
4️⃣అల్లాహుమ్మ ఇన్నీ అబ్దుక, ఇబ్ను అబ్దిక, ఇబ్ను అమతిక, నాసియతీ బియదిక, మాదిన్ ఫియ్య హుక్ముక, అద్లున్ ఫియ్య ఖదాఉక, అస్అలుక బికుల్లిస్మిన్, హువలక సమ్మైత బిహీ నఫ్సక, అవ్ అన్జల్తహూ ఫీ కితాబిక అవ్ అల్లమ్ తహూ అహదన్ మిన్ ఖల్ఖిక అవ్ ఇస్తాసర్త బిహి ఫీ ఇల్మిల్ గైబి ఇన్దక, అన్ తజ్ అలల్ ఖుర్ఆన రబీఅ ఖల్బీ, వ నూర సద్రీ, వ జలాఅ హుజ్నీ, వదహాబ హమ్మీ!
اللّهُمَّ إِنِّي عَبْدُكَ ابْنُ عَبْدِكَ ابْنُ أَمَتِكَ نَاصِيَتِي بِيَدِكَ، مَاضٍ فِيَّ حُكْمُكَ، عَدْلٌ فِيَّ قَضَاؤكَ أَسْأَلُكَ بِكُلِّ اسْمٍ هُوَ لَكَ سَمَّيْتَ بِهِ نَفْسَكَ أَوْ أَنْزَلْتَهُ فِي كِتَابِكَ، أَوْ عَلَّمْتَهُ أَحَداً مِنْ خَلْقِكَ أَوِ اسْتَأْثَرْتَ بِهِ فِي عِلْمِ الغَيْبِ عِنْدَكَ أَنْ تَجْعَلَ القُرْآنَ رَبِيعَ قَلْبِي، وَنورَ صَدْرِي وجَلَاءَ حُزْنِي وذَهَابَ هَمِّي
ఓ అల్లాహ్! నిశ్చయంగా నేను నీ దాసుడిని, నీ దాసుడి కుమారుడిని, నీ దాసురాలి పుత్రుడను, నా నొసలు, ముంగురులు నీ చేతిలో ఉన్నాయి. నీ ఆజ్ఞ నాలో కొనసాగుతున్నది నా కొరకై నీ తీర్పు న్యాయసమ్మతమైనది. నీ నామములన్నింటితో, వేటినైతే నీవు నీ కొరకుపెట్టుకున్నావో, లేదా నీ గ్రంథంలో అవతరింపజేసావో, లేదా నీ సృష్టిలో ఎవరికైనా తెలిపావో, లేదా నీ అగోచర జ్ఞానంలోనే ఉంచాలని నిశ్చయంచుకున్నావో, ఆ నామములన్నింటితో నిన్ను అడుగుచున్నాను – ఖుర్ఆన్ ను నా మనసుకు వసంతముగా, హృదయానికి కాంతిగా, నా మనోవేదనను దూరం చేసే దానిగా, నా దుఃఖాన్ని దూరం చేసేదిగా చేయమని వేడుచున్నాను.
[అహ్మద్ 1/391 మరియు అల్బానీ సహీహ్ అన్నారు.]
You must be logged in to post a comment.