ముస్లిం సముదాయం మీద ప్రవక్త ﷺ వారి హక్కులు [వీడియో | టెక్స్ట్]

ముస్లిం సముదాయం మీద ప్రవక్త ﷺ వారి హక్కులు
https://youtu.be/vCfZBWieaic [52 నిముషాలు]
వక్త:ముహమ్మద్ సలీం జామిఈ హఫిజహుల్లాహ్

ఈ ప్రసంగం ముస్లిం సమాజంపై ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హక్కుల గురించి వివరిస్తుంది. సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్‌ను స్తుతించడంతో ప్రసంగం మొదలవుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక జాతికి లేదా ప్రాంతానికి మాత్రమే కాక, యావత్ ప్రపంచానికి ప్రవక్తగా పంపబడ్డారని ఖుర్ఆన్ ఆధారాలతో స్పష్టం చేయబడింది. ఇందులో ప్రధానంగా ఐదు హక్కుల గురించి చర్చించబడింది: 1) ప్రవక్తను విశ్వసించడం, ఇది ప్రతి వ్యక్తి యొక్క ప్రాథమిక బాధ్యత; 2) ప్రవక్తను ప్రాణం కంటే ఎక్కువగా గౌరవించడం మరియు ఆయన సమక్షంలో స్వరాలు పెంచరాదని సహాబీల ఉదాహరణలతో వివరించబడింది; 3) ప్రవక్తను తల్లిదండ్రులు, సంతానం, మరియు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించడం, జైద్ రజియల్లాహు అన్హు వంటి సహాబీల ఉదాహరణలతో నొక్కి చెప్పబడింది; 4) జీవితంలోని ప్రతి రంగంలో ప్రవక్తను ఆదర్శంగా తీసుకోవడం; 5) ప్రవక్త ఆదేశాలను పాటించడం మరియు ఆయన వారించిన వాటికి దూరంగా ఉండటం ద్వారా ఆయనకు విధేయత చూపడం. ఈ హక్కులను నెరవేర్చడం ద్వారానే ఇహపరలోకాలలో సాఫల్యం లభిస్తుందని ఈ ప్రసంగం బోధిస్తుంది.

أَلْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
(అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్)
وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى أَشْرَفِ الْأَنْبِيَاءِ وَالْمُرْسَلِينَ
(వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్)
نَبِيِّنَا مُحَمْمَدٍ وَعَلَى آلِهِ وَأَصْحَابِهِ أَجْمَعِينَ
(నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ అస్హాబిహి అజ్మయీన్)

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు, అద్వితీయుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక,ఆమీన్.

సోదర సోదరీమణులారా, మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.

السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు).

ఈనాటి ప్రసంగంలో మనం ముస్లిం సముదాయం మీద ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హక్కులు ఏమిటి అనే విషయాన్ని ఇన్ షా అల్లాహ్ ఖుర్ఆన్, హదీస్ గ్రంథాల వెలుగులో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యుల ఉదాహరణల ద్వారా కూడా ఇన్ షా అల్లాహ్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ముందుగా ప్రతి వ్యక్తి తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ప్రదేశానికి, ఒక దేశానికి, ఒక జాతి వారికి ప్రవక్త కాదు, పూర్తి ప్రపంచానికి ఆయన ప్రవక్తగా పంపించబడ్డారు.

ఖుర్ఆన్ గ్రంథం ఏడవ అధ్యాయము 158 వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,

قُلْ يَا أَيُّهَا النَّاسُ إِنِّي رَسُولُ اللَّهِ إِلَيْكُمْ جَمِيعًا الَّذِي لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ
(ఖుల్ యా అయ్యుహన్నాస్ ఇన్నీ రసూలుల్లాహి ఇలైకుమ్ జమీఅనిల్లజీ లహు ముల్కుస్సమావాతి వల్ అర్ద్)
(ఓ ముహమ్మద్!) వారికి చెప్పు: “ఓ మానవులారా! నిశ్చయంగా నేను మీ అందరి వైపునకు అల్లాహ్ పంపిన ప్రవక్తను. భూమ్యాకాశాల సామ్రాజ్యం ఆయనదే. (7:158)

దాని అర్థం ఏమిటంటే, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వారికి చెప్పు, ఓ ప్రజలారా నేను భూమ్యాకాశాల సామ్రాజ్యానికి అధిపతి అయిన అల్లాహ్ తరఫున మీ అందరి వద్దకు పంపబడిన ప్రవక్తను. మీ అందరి వైపున పంపబడిన ప్రవక్త అంటే అందరికీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క దైవదౌత్యము వర్తిస్తుంది. అంటే నా మాటకు అర్థం ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పూర్తి ప్రపంచానికి, మానవులందరి వైపుకు ప్రవక్తగా పంపబడి ఉన్నారు, ఈ విషయాన్ని ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి. ఇక రండి.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించిన తర్వాత, విశ్వాసి మీద ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి తరఫున ఏమేమి బాధ్యతలు వస్తాయి, ఏమి హక్కులు అతని మీద ఉంటాయి, ఆ హక్కులు ఏమిటి, వాటిని అతను ఏ విధంగా చెల్లించుకోవాలి అనేది మనం చూద్దాం.

ముందుగా తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించటం ప్రతి వ్యక్తి యొక్క కర్తవ్యం.

ఖుర్ఆన్ గ్రంథం సూరా తగాబున్ ఎనిమిదవ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,

فَآمِنُوا بِاللَّهِ وَرَسُولِهِ
(ఫ ఆమినూ బిల్లాహి వ రసూలిహి)
కనుక మీరు అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తను విశ్వసించండి. (64:8)

అనగా, మీరు అల్లాహ్‌ను విశ్వసించండి మరియు దైవ ప్రవక్త అనగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించండి. ఈ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మానవులను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించండి అని ఆదేశిస్తున్నాడు కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించటం ప్రతి వ్యక్తి యొక్క కర్తవ్యం.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూసి కొంతమంది విశ్వసించారు. చూడకుండా చాలామంది విశ్వసించారు. అయితే ఒక ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూసి విశ్వసించిన వారికి ఒక్కసారి శుభవార్త వినిపిస్తే చూడకుండా ఆయనను విశ్వసించిన వారికి ఏడుసార్లు శుభవార్త వినిపించి ఉన్నారు.

طوبى لمن رآني وآمن بي، وطوبى سبع مرات لمن لم يرني وآمن بي
(తూబా లిమన్ రఆనీ వ ఆమన బీ, వ తూబా సబ అ మర్రాతిన్ లిమన్ లమ్ యరనీ వ ఆమన బీ.)
ఇది ప్రామాణికమైన హదీసు. దాని అర్థం ఏమిటంటే, ఎవరైతే నన్ను చూసి నన్ను విశ్వసించాడో అతనికి ఒక్కసారి శుభవార్త, మరియు ఎవరైతే నన్ను చూడకుండా నన్ను విశ్వసించారో వారికి ఏడుసార్లు శుభవార్త అని ఆ ఉల్లేఖనంలో ప్రవక్త వారు తెలియజేసి ఉన్నారు. ఆ ప్రకారంగా మనము చాలా సంవత్సరాల తర్వాత ఈ భూమండలం మీద పుట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూడకుండా విశ్వసించాము కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన ఆ ఏడుసార్లు శుభవార్త ఇన్ షా అల్లాహ్ అది మనకు దక్కుతుంది.

అలాగే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి విని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రస్తావన అతని ముందర జరిగింది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్త అన్న విషయాన్ని అతను తెలుసుకొని కూడా ఏ వ్యక్తి అయితే ప్రవక్త వారిని విశ్వసించకుండా తిరస్కారిగా అలాగే ఉండిపోతాడో, అతను నరకానికి చేరుకుంటాడు, నరకవాసి అయిపోతాడు అని కూడా హెచ్చరించబడి ఉంది. ముస్లిం గ్రంథంలో మనం చూచినట్లయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా బోధించి ఉన్నారు,

والذي نفس محمد بيده، لا يسمع بي أحد من هذه الأمة يهودي ولا نصراني، ثم يموت ولم يؤمن بالذي أرسلت به، إلا كان من أصحاب النار
(వల్లజీ నఫ్సు ముహమ్మదిన్ బి యదిహి, లా యస్మవు బీ అహదున్ మిన్ హాజిహిల్ ఉమ్మతి యహూదియ్యున్ వలా నస్రానియ్యున్, సుమ్మ యమూతు వలమ్ యుఅమిన్ బిల్లజీ ఉర్సిల్తు బిహి ఇల్లా కాన మిన్ అస్హాబిన్నార్).
దీని భావం ఏమిటంటే, ఎవరి చేతిలో అయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రాణము ఉందో ఆ మహా శక్తిశాలి అయిన ప్రభువు సాక్షిగా నా ఈ అనుచర సమాజంలో అతను యూదుడు గాని, క్రైస్తవుడు గాని ఎవరైనా గాని, అతని ముందర నా ప్రస్తావన జరిగింది, అతను నా గురించి విన్నాడు. నా గురించి విని కూడా అతను నన్ను మరియు నా ద్వారా పంపబడిన శాసనాన్ని, ధర్మాన్ని విశ్వసించకుండా అలాగే మరణిస్తాడో అతను నరకవాసులలో చేరిపోతాడు. చూశారా? ప్రవక్త వారి గురించి విని, తెలుసుకొని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా పంపబడిన ధర్మాన్ని గురించి విని తెలుసుకొని కూడా ఏ వ్యక్తి అయితే విశ్వసించకుండా అలాగే మరణిస్తాడో అతను నరకవాసులకు చేరిపోతాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసి ఉన్నారు కాబట్టి ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత ఏమిటంటే అతని ముందర ఎప్పుడైతే ప్రవక్త వారి గురించి మరియు ప్రవక్త వారు తీసుకువచ్చిన ధర్మం గురించి ప్రస్తావించబడుతుందో అతను వెంటనే అర్థం చేసుకొని మనసారా ప్రవక్త వారిని విశ్వసించాలి, ప్రవక్త వారి ద్వారా పంపబడిన ధర్మాన్ని అతను స్వీకరించాలి.

ఏ విషయం మమ్మల్ని అడ్డుపడుతూ ఉంది ప్రవక్త వారిని మరియు ప్రవక్త తీసుకువచ్చిన ధర్మాన్ని స్వీకరించడానికి అంటే చాలామంది కేవలము భయం కారణంగా వెనకడుగు వేస్తూ ఉంటారు. చూడండి నేడు ప్రజలతో గాని, అధికారులతో గాని మనము భయపడి వెనకడుగు వేస్తే రేపు మరణానంతరము మమ్మల్ని వారు వచ్చి రక్షిస్తారా? మాకు అలాంటి గడ్డు పరిస్థితులు కూడా లేవు ప్రపంచంలో. మనము అల్హమ్దులిల్లాహ్ స్వతంత్రులము. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో చూడండి, ప్రజలు పేదరికంలో ఉన్నారు, ప్రజలు బానిసలుగా కూడా ఉన్నారు. బానిసలుగా ఉండి, పేదలుగా ఉండి కూడా వారు గడ్డు పరిస్థితులలో కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి తెలుసుకొని ప్రవక్త వారి సమక్షంలో హాజరయ్యి ప్రవక్త వారిని విశ్వసించారు, విశ్వాసులుగా మారారు. తత్కారణంగా ప్రజలు, అధికారులు, పెద్దలు వారిని హింసించారు, వారిని విమర్శించారు, వారిని హేళన చేశారు, రకరకాలుగా చిత్రహింసలు చేసినప్పటికినీ వారు మాత్రము విశ్వాసాన్ని వదులుకోకుండా ధైర్యంగా సమస్యలను ఎదుర్కొని విశ్వాసులుగా చరిత్రలో నిలిచిపోయారు మరియు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వద్ద కూడా గౌరవమైన స్థానం పొందారు. ఉదాహరణకు బిలాల్ రజియల్లాహు అన్హు వారిని చూడండి. ఈయన ఒక యజమాని వద్ద బానిసగా ఉండేవారు. యజమాని పేరు ఉమయ్య బహుశా నాకు గుర్తు రావట్లేదు. ఉమయ్య బిన్ ఖల్ఫ్. అతను ఏం చేసేవాడంటే, బిలాల్ రజియల్లాహు అన్హు వారు ముస్లింలు అయిపోయారు, విశ్వాసి అయిపోయారు అన్న విషయాన్ని విని తెలుసుకొని, బిలాల్ రజియల్లాహు అన్హు వారిని ఈ అరబ్బు దేశంలో ఎడారిలో ఎండాకాలంలో మిట్టమధ్యాహ్నం పూట ఎండ ఎంత తీవ్రంగా ఉంటుంది, ఆ వేడికి ఇసుక ఎంతగా కాలిపోతూ ఉంటుంది, అలాంటి మండుతున్న ఇసుక మీద అర్ధనగ్నంగా ఆయనను పడుకోబెట్టేవాడు, ఆ తర్వాత ఛాతి మీద పెద్ద పెద్ద రాళ్లు పెట్టేసేవాడు. పైన రాయి కాలుతూ ఉంటుంది, బరువుగా ఉంటుంది, కింద ఇసుక కూడా కాలుతూ ఉంటుంది, అలాంటి స్థితిలో ఆయన అల్లాడిపోతూ ఉంటే నీవు విశ్వాసాన్ని వదిలేయి, నేను కూడా నిన్ను హింసించడం వదిలేస్తాను అని చెప్పేవాడు. అవన్నీ భరించి కూడా ఆయన బానిస అయి ఉండి కూడా చిత్రహింసలు భరిస్తూ కూడా అల్లాహ్ ఒక్కడే నిజమైన ప్రభువు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ పంపించిన సత్య ప్రవక్త అని చాటి చెప్పారు. ఆ తర్వాత అతను అన్నము పెట్టకుండా, నీళ్లు ఇవ్వకుండా ఆకలిదప్పికలతో అలాగే ఉంచేశాడు, చెరసాలలో బంధించాడు, మెడలో తాడు కట్టేసి పోకిరి పిల్లవారికి, కుర్రాళ్ళ చేతికి ఇచ్చేశాడు. వారు బిలాల్ రజియల్లాహు అన్హు వారిని పశువులాగా ఈడ్చుకుంటూ తిరిగేవారు. తత్కారణంగా ఆయన శరీరానికి, కాళ్లకు గాయాలు అయిపోయేవి. అన్ని రకాలుగా ఆయనను హింసించినా అలాంటి గడ్డు పరిస్థితుల్లో బానిసగా అయ్యి ఉండి కూడా ఆయన విశ్వాసం పొందారు, ప్రవక్త వారిని మరియు ప్రవక్త వారు తీసుకువచ్చిన ధర్మాన్ని స్వీకరించి వచ్చిన సమస్యలని ధైర్యంగా ఎదుర్కొన్నారు. తత్కారణంగా ఆయన గొప్ప విశ్వాసిగా చరిత్రలో మిగిలిపోయారు, అల్లాహ్ వద్ద కూడా వారికి గొప్ప ఉన్నతమైన స్థానాలు ఉన్నాయి. కాబట్టి మనకు

الحمد لله ثم الحمد لله
(అల్హమ్దులిల్లాహ్ సుమ్మా అల్హమ్దులిల్లాహ్),
బానిసత్వం లేదు. అల్లాహ్ దయవల్ల మమ్మల్ని అందరినీ అల్లాహ్ స్వతంత్రులుగా ఉంచాడు కాబట్టి మనము కంగారు పడవలసిన అవసరము లేదు, బెదరవలసిన అవసరము లేదు, భయపడవలసిన వెనకడుగు వేయవలసిన అవసరం అంతకంటే లేదు. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి తెలుసుకోండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకువచ్చిన ధర్మాన్ని స్వీకరించండి. తద్వారానే ఇహపరాలా సాఫల్యము మనకు దక్కుతుంది.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించడం ఇది మొదటి హక్కు. ఇక రెండవ హక్కు ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించిన తర్వాత ప్రాణం కంటే ఎక్కువగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవించాలని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేసి ఉన్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో ఆయన బ్రతికి ఉన్నప్పుడు శిష్యులకు, సహాబాలకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో బిగ్గరగా మాట్లాడకండి, శబ్దము పెంచకండి అని తాకీదు చేసి ఉన్నాడు. మనం చూసినట్లయితే, ఖుర్ఆన్ గ్రంథము 24వ అధ్యాయము 63వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,

لَا تَجْعَلُوا دُعَاءَ الرَّسُولِ بَيْنَكُمْ كَدُعَاءِ بَعْضِكُمْ بَعْضًا
(లా తజ్అలూ దుఆ అర్రసూలి బైనకుమ్ క దుఆఇ బఅదికుమ్ బఅదా)
ఓ విశ్వాసులారా! మీలో మీరు ఒకరినొకరు పిలుచుకున్నట్లు ప్రవక్తను పిలవకండి. (24:63)

దాని అర్థం ఏమిటంటే, మీరు దైవప్రవక్త పిలుపును మీలో ఒకరినొకరిని పిలుచుకునే మామూలు పిలుపులా అనుకోకండి. మనం పరస్పరం ఒకరినొకరిని ఏ విధంగా అయితే పిలుచుకుంటామో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విషయం అలాంటిది కాదు. ప్రవక్త వారితో మాట్లాడేటప్పుడు, వారితో సంభాషించేటప్పుడు మీరు జాగ్రత్తగా, సగౌరవంగా, అణకువతో మాట్లాడండి అని ఆ వాక్యంలో బోధించబడి ఉంది.

అలాగే ఖుర్ఆన్ గ్రంథం 49వ అధ్యాయం, రెండవ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَرْفَعُوا أَصْوَاتَكُمْ فَوْقَ صَوْتِ النَّبِيِّ وَلَا تَجْهَرُوا لَهُ بِالْقَوْلِ كَجَهْرِ بَعْضِكُمْ لِبَعْضٍ
(యా అయ్యుహల్లజీన ఆమనూ లా తర్ఫవూ అస్వా తకుమ్ ఫౌఖ సౌతిన్నబియ్యి వలా తజ్హరూ లహు బిల్ ఖౌలి కజహ్రి బఅదికుమ్ లిబఅదిన్)
ఓ విశ్వాసులారా! మీ స్వరాలను ప్రవక్త స్వరం కన్నా బిగ్గరగా చేయకండి, మీలో మీరు ఒకరితో మరొకరు బిగ్గరగా మాట్లాడినట్లు ఆయనతో మాట్లాడకండి. (49:2)

దీని అర్థం ఏమిటంటే, ఓ విశ్వాసులారా మీ కంఠస్వరాలను ప్రవక్త కంఠస్వరం కంటే హెచ్చుగా ఉంచకండి. మీరు పరస్పరం బిగ్గరగా మాట్లాడుకునే విధంగా ఆయనతో బిగ్గరగా మాట్లాడకండి. దీనివల్ల మీ కర్మలన్నీ వ్యర్థమైపోవచ్చు, జాగ్రత్త సుమా. చూశారా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎంతగా గౌరవించాలంటే ప్రవక్త వారి సమక్షంలో బిగ్గరగా శబ్దాన్ని పెంచి, హెచ్చించి మాట్లాడరాదు, పలకరాదు. ఒకవేళ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో ఆయనను గౌరవించకుండా బిగ్గరగా మాట్లాడినట్లయితే, శబ్దాన్ని పెంచినట్లయితే, అది ఒక రకంగా ప్రవక్త వారిని అగౌరవపరిచినట్లు అవుతుంది, తత్కారణంగా మనిషి యొక్క కర్మలు, సత్కార్యాలు, పుణ్యాలన్నీ వృధా అయిపోయే ప్రమాదం ఉంది అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు. దీనికి ఉదాహరణగా మనము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యుల గురించి ఒక ఉదాహరణ తీసుకుందాం.

ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు బనూ తమీమ్ అనే తెగకు చెందిన ఒక బిడారము, కొంతమంది సమూహము వచ్చారు. బనూ తమీమ్‌కు చెందిన వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలోకి వచ్చినప్పుడు, అబూబకర్ రజియల్లాహు అన్హు వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఒక సలహా ఇచ్చారు. ఓ దైవప్రవక్త, కాకా బిన్ మాబద్ అనే వ్యక్తిని ఈ సమూహానికి మీరు నాయకునిగా నియమించండి అన్నారు. అయితే, ఉమర్ రజియల్లాహు అన్హు వారు కూడా అక్కడ ఉన్నారు, ఆయన జోక్యం చేసుకుంటూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అన్నారు, ఓ దైవప్రవక్త, అక్రా బిన్ హాబిస్ ని ఈ సమూహానికి, ఈ తెగ వారికి నాయకునిగా నియమించండి అని ఆయన సలహా ఇచ్చారు. అబూబకర్ రజియల్లాహు అన్హు వారు ఒక వ్యక్తి గురించి ప్రస్తావిస్తూ ఉంటే, ఉమర్ రజియల్లాహు అన్హు వారు మరో వ్యక్తి గురించి ప్రస్తావించారు. అయితే ఇద్దరి మధ్య భేదాభిప్రాయం వచ్చింది కదండీ, వారిద్దరూ కూడా నేను చెప్పిన వ్యక్తే మంచిది, నేను చెప్పిన వ్యక్తిని నియమిస్తేనే మంచిది అని ఒకరంటూ ఉంటే, లేదండి నేను చెప్పిన వ్యక్తిని నియమిస్తేనే మంచిది అని ఒకరిని ఒకరు విమర్శించుకుంటూ ఆ తర్వాత మాట మాట పెరిగి వారు పెద్దగా శబ్దాలు చేయడం, హెచ్చుగా మాట్లాడటం ప్రారంభించేశారు. అలా జరిగినప్పుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వెంటనే ఈ వాక్యాలను అవతరింపజేశాడు. యా అయ్యుహల్లజీన ఆమనూ లా తర్ఫవూ అస్వా తకుమ్ ఫౌఖ సౌతిన్నబియ్యి. ఓ విశ్వాసులారా, మీ కంఠస్వరాలను ప్రవక్త వారి కంఠస్వరం వద్ద హెచ్చించకండి అని ఆ వాక్యాన్ని ఎప్పుడైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అవతరింపజేశాడో, మీరు జాగ్రత్త పడకపోతే మీ సత్కార్యాలు, మీ పుణ్యాలు వృధా అయిపోతాయని ఆ వాక్యం చివరలో తెలియజేసి ఉన్నాడు కదా, అది విన్న తర్వాత ఉమర్ రజియల్లాహు అన్హు వారు ఎంతగా మారిపోయారంటే, ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో ఆయన ఎంత మెల్లగా మాట్లాడేవారంటే, ఎంత చిన్నగా మాట్లాడేవారంటే, దగ్గరలో కూర్చున్న వ్యక్తి కూడా ఆయన ఏమి చెప్పారో వినలేక రెండవసారి మళ్ళీ అడిగేవారు. అయ్యో మీరు ఏం చెప్పారో సరిగా వినిపించలేదండి, చెప్పండి ఏంటో అని రెండవసారి మళ్ళీ అడగవలసి వచ్చేది. అంత నెమ్మదిగా, అంత చిన్నగా ఆయన మాట్లాడటం అలవాటు చేసుకున్నారు ఉమర్ రజియల్లాహు అన్హు వారు ఆ వాక్యము అవతరింపజేయబడిన తర్వాత.

కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవించటం ప్రతి విశ్వాసి యొక్క బాధ్యత, కర్తవ్యం. ఇది రెండవ హక్కు. దీనికి ఉదాహరణగా మనము చూచినట్లయితే, సాబిత్ బిన్ ఖైస్ రజియల్లాహు అన్హు వారు, ఆయన స్వరం కొంచెం పెద్దది. మామూలుగా కొంతమందికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా గొంతు కొంచెం పెద్దది ఇస్తాడు, వారు మామూలుగా మాట్లాడినా గాని శబ్దం కొంచెం హెచ్చుగా వస్తుంది. ఆ ప్రకారంగా సాబిత్ బిన్ ఖైస్ రజియల్లాహు అన్హు వారి స్వరము కూడా, కంఠము కూడా కొంచెం పెద్దది. ఆయన మామూలుగా మాట్లాడినా శబ్దం కొంచెం పెద్దగా, హెచ్చుగా వచ్చేది. ఎప్పుడైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ వాక్యాన్ని అవతరింపజేశాడో, యా అయ్యుహల్లజీన ఆమనూ లా తర్ఫవూ అస్వా తకుమ్ ఫౌఖ సౌతిన్నబియ్యి, ఆ వాక్యం అవతరింపజేయబడిన తర్వాత, ఆయన సాబిత్ బిన్ ఖైస్ రజియల్లాహు అన్హు వారు ప్రవక్త వారి సమావేశంలో రావడం, హాజరవ్వడమే మానేశారు. అసలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో ఆయన రావడమే మానేశారు. కొద్ది రోజులు గడిచాయి. కొద్ది రోజులు గడిచిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏంటండీ సాబిత్ బిన్ ఖైస్ కనిపించడం లేదు అని సహాబాలతో అడిగారు. అప్పుడు సాద్ బిన్ మాద్ రజియల్లాహు అన్హు వారు ఏం చెప్పారంటే, ఓ దైవప్రవక్త, నేను ఆయన పొరుగులోనే ఉంటాను. కాబట్టి మీరు అనుమతి ఇస్తే నేను వెళ్లి చూస్తాను, ఆయన ఎందుకు మీ మధ్య రావట్లేదు ఇక్కడ, ఎందుకు పాల్గొనట్లేదు మీ సమావేశంలో, నేను వెళ్లి తెలుసుకొని వస్తాను, మీరు అనుమతి ఇవ్వండి అంటే, ప్రవక్త వారు సరే అని పంపించారు. ఆ తర్వాత సాద్ బిన్ మాద్ రజియల్లాహు అన్హు వారు సాబిత్ బిన్ ఖైస్ రజియల్లాహు అన్హు వారి ఇంటికి వెళ్లి చూస్తే, ఆయన తల పట్టుకొని కూర్చొని ఉన్నారు, దిగులుగా ఉన్నారు. సాద్ బిన్ మాద్ రజియల్లాహు అన్హు వారు వెళ్లి ఏమండీ ప్రవక్త వారు మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు, ఈ మధ్య మీరు ప్రవక్త వారి సమావేశంలో హాజరు కాలేదు, ఎందుకండీ అలా, మిమ్మల్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు గుర్తు చేసుకుంటున్నారు అని అడిగినప్పుడు, సాబిత్ బిన్ ఖైస్ రజియల్లాహు అన్హు వారు అన్నారు, చూడండి, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందర బిగ్గరగా, పెద్ద శబ్దంతో మాట్లాడకండి, అలా మాట్లాడితే మీ కర్మలు వృధా అయిపోతాయి అని చెప్పాడు కాబట్టి, నా శబ్దం పెద్దది, నా కంఠం హెచ్చుగా ఉంటుంది కాబట్టి, నేను చేసుకున్న కర్మలన్నీ, సత్కార్యాలన్నీ వృధా అయిపోయాయి, నేను నరకవాసి అయిపోయానేమోనని నాకు భయంగా ఉంది, అందుకోసమే నేను దిగులుగా ఉన్నాను, అక్కడ రాలేకపోతున్నాను అని చెప్పారు. సాద్ బిన్ మాద్ రజియల్లాహు అన్హు వారు అదంతా విని, తిరిగి వచ్చి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేశారు. అదంతా తెలియజేసిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ మాట విని, వెంటనే ఆ సహాబీకి శుభవార్త తెలియజేశారు, సాద్ రజియల్లాహు అన్హు వారి ద్వారా. మీరు వెళ్ళండి, ఆయనకు తెలియజేయండి, ఆయన నరకవాసులలోని వ్యక్తి కాదు, ఆయన స్వర్గవాసులలోని వ్యక్తి అని శుభవార్త తెలియజేశారు.

ఈ ఉల్లేఖనం బుఖారీ మరియు ముస్లిం గ్రంథాలలో ఉంది. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవించే విధానము సహాబాల వద్ద ఎంతగా ఉందో, వారు ఎంతగా ప్రవక్త వారిని గౌరవించేవారో, మరియు ప్రవక్త వారిని అగౌరవపరచడాన్ని ఎంతగా వారు భయపడేవారో చూడండి, దీని ద్వారా మనకు అర్థమవుతుంది. అలాగే, ఎవరెవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసిస్తారో, ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవిస్తారో, అలాంటి వారి కోసము శుభవార్త ఉంది. ఖుర్ఆన్ గ్రంథము ఏడవ అధ్యాయము 157 వ వాక్యాన్ని మనం చూచినట్లయితే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,

فَالَّذِينَ آمَنُوا بِهِ وَعَزَّرُوهُ وَنَصَرُوهُ وَاتَّبَعُوا النُّورَ الَّذِي أُنْزِلَ مَعَهُ ۙ أُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ
(ఫల్లజీన ఆమను బిహి వ అజ్జరూహు వ నసరూహు వత్తబవూన్నూరల్లజీ ఉన్జిల మఅహు ఉలాయిక హుముల్ ముఫ్లిహూన్)
కనుక ఎవరైతే ఆయనను విశ్వసించి, ఆయనను గౌరవించి, ఆయనకు సహాయం చేసి, ఆయనతోపాటు అవతరింపజేయబడిన జ్యోతిని అనుసరిస్తారో, వారే సాఫల్యం పొందేవారు. (7:157)

దాని అర్థం ఏమిటంటే, ఎవరు ఈ ప్రవక్తను విశ్వసించి, అతనికి ఆదరువుగా నిలుస్తారో, తోడ్పాటు నందిస్తారో, ఇంకా అతనితో పాటు పంపబడిన జ్యోతిని అనుసరిస్తారో, వారే సాఫల్యం పొందేవారు. ప్రవక్త వారిని విశ్వసించి, ప్రవక్త వారిని అనుసరించి, ప్రవక్త వారిని గౌరవించేవారు సాఫల్యం పొందేవారు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా శుభవార్త తెలియజేసి ఉన్నాడు చూశారా.

అలాగే, సహాబాలు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యులు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎలా గౌరవించేవారో, ఒక అవిశ్వాసి అలనాటి అవిశ్వాసి, ఆయన పేరు ఉర్వా బిన్ మసూద్ సఖఫీ. తర్వాత, అప్పటి వరకు ఆయన ఇస్లాం స్వీకరించలేదు, తర్వాత ఆయన ఇస్లాం స్వీకరించారని ధర్మ పండితులు తెలియజేసి ఉన్నారు. ఉర్వా బిన్ మసూద్ సఖఫీ, ఈ సంఘటన జరిగే సమయానికి ఆయన ఇంకా ఇస్లాం స్వీకరించలేరు. సులహ్ హుదైబియా, హుదైబియా ఒప్పందం సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో ఆయన ప్రవక్త వారితో మాట్లాడటానికి వచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో మాట్లాడటానికి వచ్చినప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమావేశంలో సహాబాలు ఏ విధంగా అణకువతో ఉన్నారో, ప్రవక్త వారిని ఏ విధంగా గౌరవిస్తున్నారో కళ్లారా చూశాడు. కళ్లారా చూసి, తర్వాత మళ్ళీ మక్కాలో ఉన్న అవిశ్వాసుల వద్దకు వెళ్లి, అక్కడ చూసిన దృశ్యాన్ని ఈ విధంగా ఆయన తెలియజేస్తూ ఉన్నారు. ఏమంటున్నారో చూడండి: “ఓ నా జాతి ప్రజలారా, నేను పెద్ద పెద్ద రాజుల దర్బారులలోకి కూడా వెళ్ళాను. నేను రోమ్ చక్రవర్తి మరియు అలాగే ఈరాన్ చక్రవర్తి వారి దర్బారులలోకి కూడా నేను వెళ్ళాను. అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, పెద్ద పెద్ద రాజులను కూడా అతని దర్బారులో ఉన్న మంత్రులు అంతగా గౌరవించరు, ఎంతగా అయితే ప్రవక్త వారి శిష్యులు ప్రవక్త వారిని గౌరవిస్తున్నారో. అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, ప్రవక్త వారి నోటి నుండి ఉమ్మి కూడా ఒకవేళ బయటికి వచ్చేస్తే, శిష్యులు ఆ ఉమ్మిని తీసుకొని శరీరానికి పూసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రవక్త వారు ఉజూ చేస్తే, ఆయన ఉజూ చేసిన నీటిని శిష్యులు తీసుకోవాలని పోటీ పడుతూ ఉన్నారు. ఆయన కేవలం సైగ చేస్తే చాలు, వెంటనే ఆ పని చేసి పెట్టడానికి వారు సిద్ధంగా ఉన్నారు. అలా నేను గౌరవించబడటము, పెద్ద పెద్ద రాజులని సైతము నేను చూడలేదు. అంతగా ప్రవక్త వారి శిష్యులు ప్రవక్తను గౌరవిస్తున్నారు” అని తెలియజేశాడు.

చూశారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సహాబాలు ఏ విధంగా గౌరవించారు? అలాగే మనము కూడా ప్రవక్త వారిని గౌరవించాలి. ప్రవక్త వారు మన మధ్య లేరు కదా, మరి ఏ విధంగా మనము గౌరవించాలి అంటే, ప్రవక్త వారి ఆదేశాలు మన మధ్య ఉన్నాయి. ప్రవక్త వారి ఆదేశాలు, హదీసుల రూపంలో, ఉల్లేఖనాల రూపంలో మన మధ్య ఉన్నాయి. ఆ హదీసులు చదవబడేటప్పుడు, వినిపించేటప్పుడు మనము గౌరవంగా ఉండాలి, శ్రద్ధగా వినాలి. అలాగే, ప్రవక్త వారి ఆదేశాలను అదే గౌరవంతో మనము ఆచరించాలి.

ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవించడం, ముస్లిం సముదాయం మీద ఉన్న హక్కు. అయితే, గౌరవించాలి, ప్రతి ముస్లిం యొక్క హక్కు అని తెలుసుకున్న తర్వాత రెండు ముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. మొదటి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రవక్తను గౌరవించడం అనే పదాన్ని తీసుకొని, ప్రవక్త వారి విషయంలో హద్దు మీరిపోవడం సరికాదు. గౌరవంలో చాలామంది హద్దు మీరిపోతూ ఉంటారు. అంటే, ప్రవక్తను ప్రవక్త స్థానంలో కాకుండా, తీసుకెళ్లి దైవ స్థానంలో నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు, దీనిని గులు అని అంటారు. అల్లాహ్ సుబ్ హాన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ విషయాన్ని ఇష్టపడలేదు, ప్రవక్త వారు వారించి ఉన్నారు. మనం చూచినట్లయితే, బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనం, ప్రవక్త వారు తెలియజేశారు:

لا تطروني كما أطرت النصارى ابن مريم، فإنما أنا عبد فقولوا عبد الله ورسوله
(లా తత్రూనీ కమా అతరతిన్నసారా ఇబ్న మర్యమ. ఇన్నమా అన అబ్దున్, ఫఖూలూ అబ్దుల్లాహి వ రసూలుహు.)
చూశారా, మర్యం కుమారుడు ఈసా, ఏసుక్రీస్తు అంటారు కదండీ, ಮರ್ಯಮ್ ಕುಮಾರడైన ఈసా అలైహిస్సలాం వారి విషయంలో క్రైస్తవులు ఏ విధంగా అయితే హద్దు మీరిపోయారో, మీరు, అనగా ముస్లింలకు ఆదేశిస్తున్నారు, మీరు నా విషయంలో ఆ విధంగా హద్దు మీరకండి. నేను అల్లాహ్ దాసుడిని మరియు అల్లాహ్ ప్రవక్తని. నాకు ఉన్న స్థానంలో మాత్రమే నన్ను మీరు ఉంచి గౌరవించండి, నాకు లేని స్థానము నాకు కల్పించే ప్రయత్నం చేయకండి అని ప్రవక్త వారు వారించారు.

చూశారా, కాబట్టి ప్రవక్త వారిని గౌరవిస్తున్నాము అని చెబుతూ చాలామంది ప్రవక్త వారికి ఉన్న స్థానం కంటే ఎక్కువ స్థానము ఇచ్చేటట్టుగా అల్లాహ్ స్థానంలోకి తీసుకుని వెళ్లి నిలబెట్టేటట్టుగా చేస్తూ ఉంటారు, అలా చేయడం సరికాదు.

అలాగే, దీనికి విరుద్ధమైన విషయం. చాలామంది మూర్ఖులు అనలో, పాపిష్టులు అనలో, ఇంకేమనాలో తెలియదు, ప్రవక్త వారిని కించపరుస్తూ ఉంటారు. అల్లాహ్ మమ్మల్ని ఏమంటున్నాడు, ప్రవక్త వారిని గౌరవించాలి అంటున్నాడు. కానీ నేడు మనం చూస్తున్నాం, ముస్లింలు మనము అని చెప్పుకునే చాలామంది మూర్ఖులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కించపరుస్తున్నారు. వారి మాటల ద్వారా, వారి చేష్టల ద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కించపరుస్తున్నారు. ఈ మధ్యనే ఒక వ్యక్తి మీడియా ముందర వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కించపరుస్తున్నాడు. స్వయంగా నేను ముస్లిం అని కూడా మళ్లీ ప్రకటించుకుంటూ ఉన్నాడు. ఎంతటి మూర్ఖత్వం అండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రవక్తగా చెప్పుకున్న తర్వాతే ఒక వ్యక్తి ముస్లిం అవుతున్నాడు. అలాంటి వ్యక్తి, ప్రవక్త వారిని విశ్వసించిన తర్వాతే ముస్లిం అవుతున్న వ్యక్తి, ప్రవక్త వారిని కించపరచటం, అగౌరవపరచటం ఏమిటండి ఇది?

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎవరైతే కించపరుస్తారో, అగౌరవపరుస్తారో, ప్రపంచంలో కూడా శిక్షించబడతాడు, పరలోకంలో కూడా వారు శిక్షించబడతారు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖుర్ఆన్ గ్రంథము సూరా తౌబా 61వ వాక్యంలో తెలియజేసి ఉన్నాడు కాబట్టి, జాగ్రత్త. కర్మలు వృధా అయిపోతాయి, నష్టపోతారు ప్రపంచంలో కూడా శిక్షించబడతారు, పరలోకంలోనూ మరియు ప్రపంచంలోనూ. కాబట్టి ప్రవక్త వారిని అగౌరవపరచటం పెద్ద నేరం, అలాంటి నేరానికి పాల్పడరాదు, జాగ్రత్త అని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది.

ముస్లిం సముదాయం మీద ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హక్కులలో నుంచి రెండు హక్కుల గురించి తెలుసుకున్నాం అండి. విశ్వసించడం ప్రథమ హక్కు, ప్రవక్త వారిని గౌరవించడం రెండవ హక్కు. ఇక మూడవ హక్కు ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అభిమానించాలి, ప్రేమించాలి.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు,

ثلاث من كن فيه وجد حلاوة الإيمان
(సలాసున్ మన్ కున్న ఫీహి వజద హలావతల్ ఈమాన్.)
మూడు విషయాలు ఎవరిలో ఉంటాయో, అతను ఈమాన్ విశ్వాసం యొక్క మాధుర్యాన్ని ఆస్వాదించాడు అన్నారు.
ఆ మూడు విషయాలు ఏమిటి అంటే, మొదటి విషయం:

أن يكون الله ورسوله أحب إليه مما سواهما
(అన్ యకూనల్లాహు వ రసూలుహు అహబ్బ ఇలైహి మిమ్మా సివాహుమా.)
అల్లాహ్ మరియు అల్లాహ్ ప్రవక్త అనగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆ వ్యక్తి అందరికంటే ఎక్కువగా అభిమానించాలి, ప్రేమించాలి.
అందరికంటే ఎక్కువ అంటే, తనకంటే, తన కుటుంబ సభ్యుల కంటే, తన తల్లిదండ్రుల కంటే, బంధుమిత్రుల కంటే, ప్రపంచంలో ఉన్న వారందరి కంటే, చివరికి తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రవక్త వారిని అభిమానించాలని దాని అర్థం.

దీనికి ఉదాహరణగా మనము చూచినట్లయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వేరే ఉల్లేఖనంలో ఈ విధంగా తెలియజేశారు:

لا يؤمن أحدكم حتى أكون أحب إليه من ولده ووالده والناس أجمعين
(లా యూమిను అహదుకుమ్ హత్తా అకూన అహబ్బ ఇలైహి మిన్ వలదిహి వ వాలిదిహి వన్నాసి అజ్మయీన్.)
మీలో ఏ వ్యక్తి కూడా అప్పటి వరకు విశ్వాసి కాజాలడు, ఎప్పటి వరకు అయితే అతను నన్ను తన సంతానము కంటే, తన తల్లిదండ్రుల కంటే, మానవులందరి కంటే ఎక్కువగా నన్ను అభిమానించడో అన్నారు. అంటే, తల్లిదండ్రుల కంటే, భార్యాబిడ్డల కంటే, ప్రపంచంలో ఉన్న ప్రజలందరి కంటే ఎక్కువగా ప్రవక్త వారిని అభిమానించినప్పుడే వ్యక్తి విశ్వాసి అవుతాడు.

ఉమర్ రజియల్లాహు అన్హు వారి గురించి ఉదాహరణ చాలా ప్రచారం చెంది ఉంది. ఉమర్ రజియల్లాహు అన్హు వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో హాజరయ్యి,

يا رسول الله، لأنت أحب إلي من كل شيء إلا من نفسي
(యా రసూలల్లాహ్, లఅంత అహబ్బు ఇలయ్య మిన్ కుల్లి శైఇన్ ఇల్లా మిన్ నఫ్సీ)
అన్నారు. ఓ దైవప్రవక్త, మీరు నాకు అందరికంటే ఎక్కువగా ఇష్టులు, నేను మిమ్మల్ని అందరికంటే ఎక్కువగా అభిమానిస్తున్నాను, అయితే నా ప్రాణము నాకు మీకంటే ఎక్కువ ప్రియమైనది అన్నారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు,

لا، والذي نفسي بيده، حتى أكون أحب إليك من نفسك
(లా వల్లజీ నఫ్సీ బియదిహి, హత్తా అకూన అహబ్బ ఇలైక మిన్ నఫ్సిక్.)
లేదు లేదు ఓ ఉమర్, ఎవరి చేతిలో అయితే నా ప్రాణము ఉందో ఆ అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, నీవు నీ ప్రాణము కంటే ఎక్కువగా నన్ను అభిమానించనంత వరకు పూర్తి సంపూర్ణ విశ్వాసి కాజాలవు అన్నారు.

ఉమర్ రజియల్లాహు అన్హు వారు ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తన ప్రాణము కంటే ఎక్కువగా అభిమానించారు. ఆ తర్వాత ప్రవక్త వారి వద్దకు వచ్చి, ఓ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నేను ఇప్పుడు మిమ్మల్ని నా ప్రాణము కంటే ఎక్కువగా అభిమానిస్తున్నాను అని తెలియజేసినప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు,

الآن يا عمر
(అల్ ఆన యా ఉమర్.)
ఓ ఉమర్, ఇప్పుడు నీ విశ్వాసము సంపూర్ణమైంది అని తెలియజేశారు.

చూశారా, కాబట్టి ప్రతి వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రాణము కంటే ఎక్కువగా అభిమానించాలి. ప్రాణము కంటే ఎక్కువగా అభిమానించినప్పుడే అతను సంపూర్ణ విశ్వాసి కాగలడు, లేని యెడల అతని విశ్వాసము సంపూర్ణము కాజాలదు అని తెలియజేయడం జరిగింది. ఇక్కడ మనము ఒక ఉదాహరణ తీసుకుందాం.

జైద్ రజియల్లాహు అన్హు వారి గురించి మనము చూచినట్లయితే, జైద్ రజియల్లాహు అన్హు వారిని ఆయన పసితనంలోనే దుండగులు దొంగలించారు. మన మొరటు భాషలో చెప్పాలంటే ఆయనను కిడ్నాప్ చేసేశారు. ఆయనను దొంగలు పట్టుకెళ్లి వేరే ప్రదేశాలలో అమ్మేశారు. ఆ తర్వాత నుండి ఆయన బానిస అయిపోయారు. ఆ తర్వాత చేతులు మారుతూ ఉన్నారు. ఒక వ్యక్తి ఆయనను కొన్నారు, తర్వాత వేరే వ్యక్తికి అమ్మేశారు, ఆ తర్వాత మరో వ్యక్తి మరో వ్యక్తిని అమ్మేశారు. ఆ ప్రకారంగా అమ్ముతూ అమ్ముతూ ఉన్నారు. ఆ విధంగా ఆయన చేతులు మారుతూ మారుతూ మారుతూ మక్కాలో ఖదీజా రజియల్లాహు త’ఆలా అన్హా వారి వద్దకు వచ్చారు. ఖదీజా రజియల్లాహు త’ఆలా అన్హా వారు జైద్ వారిని కొని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కానుకగా ఇచ్చారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కానుకగా ఇచ్చి, ఓ దైవప్రవక్త, ఈయనతో మీరు సేవలు చేయించుకోండి అని చెప్పారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జైద్ రజియల్లాహు త’ఆలా అన్హు వారితో సేవలు చేయించుకుంటూ ఉన్నారు. సేవలు చేయించుకుంటూ ఉంటున్నప్పుడు, ఒకరోజు అనుకోకుండా ఆయన కాబతుల్లాలో తిరుగుతూ ఉంటే, వారి తల్లిదండ్రులు కూడా హజ్ చేయడానికి వచ్చి కాబతుల్లా వద్ద ప్రదక్షిణలు, తవాఫ్ చేస్తూ ఉన్నారు. వెంటనే తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను చూసి గుర్తుపట్టి, జైద్ రజియల్లాహు అన్హు వారు వెళ్లి, “నేను పసితనంలో తప్పిపోయిన మీ అబ్బాయిని” అని తెలియజేశారు. మీ అబ్బాయిని అని ఎప్పుడైతే తెలియజేశారో, కుటుంబ సభ్యులు వెంటనే జైద్ రజియల్లాహు అన్హు వారిని పట్టుకొని, చిన్ననాటి రోజుల్లో తప్పిపోయిన బిడ్డ దొరికాడు అని వారు చాలా సంతోషించారు. వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, ఓ దైవప్రవక్త, మా అబ్బాయి పసితనంలో తప్పిపోయాడు, ఇప్పుడు అనుకొని ఊహించని రీతిలో ఇక్కడ బానిసగా ఉన్నాడు, మీరు అనుమతి ఇస్తే మా అబ్బాయిని మేము మా ఇంటికి తీసుకువెళ్ళిపోతాము అని అడిగినప్పుడు, ప్రవక్త వారు అన్నారు, మీరు సంతోషంగా తీసుకువెళ్ళవచ్చు, అయితే నిబంధన ఏమిటంటే, మీరు ఒకసారి జైద్ తో మాట్లాడండి, సంప్రదించి చూడండి. జైద్ వారు మీతో పాటు రావడానికి ఆయన సిద్ధమైతేనే మీరు తీసుకువెళ్ళండి, లేదంటే లేదు అని చెప్పారు.

ఆ తర్వాత, జైద్ రజియల్లాహు అన్హు వారి వద్దకు వెళ్లి, చూడండి దైవప్రవక్త వారు మీ ఇష్టం మీద వదిలేశారు, ఇక మాకు అనుమతి దొరికినట్లే, కాబట్టి పదండి మేము మా ఇంటికి వెళ్లిపోదాము అని అంటే, జైద్ రజియల్లాహు అన్హు వారు లేదు నేను రాను, నేను ప్రవక్త వద్దనే ఉండిపోతాను అని తేల్చి చెప్పేశారు.

ఏంటండీ, ఇక్కడ ముఖ్యంగా రెండు విషయాలు ఆలోచించాలి. ఒక విషయం ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనుమతి ఇచ్చేశారు, జైద్ రజియల్లాహు అన్హు వారికి ఇక బానిసత్వం నుంచి విముక్తి లభిస్తుంది, స్వతంత్రుడిగా ఆయన కుటుంబ సభ్యులతో పాటు వెళ్లి హాయిగా జీవించుకోవచ్చు. కానీ స్వతంత్రుడిగా వెళ్లి కుటుంబ సభ్యులతో హాయిగా జీవించుకోవడానికి ఆయన ఇష్టపడట్లేదు, ప్రవక్త వారి వద్ద బానిసగా ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నారు అంటే, ప్రవక్త వారిని ఆయన ఎంతగా అభిమానించేవారో, ఎంతగా ప్రేమించేవారో చూడండి. అలాగే, ప్రవక్త ఆయనతో ఎంత మంచిగా ప్రవర్తిస్తూ ఉంటే ఆయన ప్రవక్త వారిని అంతగా అభిమానిస్తున్నారు చూడండి.

కాబట్టి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సహాబాలు ఎంతగా ప్రేమించేవారో, ఎంతగా అభిమానించేవారో ఈ ఉదాహరణల ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది.

అలాగే మిత్రులారా, మరొక ఉదాహరణ మనము చూచినట్లయితే, ఒక సహాబీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఒక సహాబీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చారు. ప్రవక్త వారు ఆయనను చూసి ఏమండీ, ఏంటో మీరు కంగారుగా ఉన్నారు అని అడిగినప్పుడు, ఆయన అంటున్నారు, ఓ దైవప్రవక్త, మీరంటే నాకు చాలా ఇష్టం. నేను మిమ్మల్ని చాలా అభిమానిస్తున్నాను. నేను ఇంట్లో ఉన్నప్పుడు మీరు గుర్తుకు వస్తే, వెంటనే మిమ్మల్ని చూడాలనుకుంటాను, కాబట్టి నేను ఇంట్లో నుండి పరిగెత్తుకుంటూ మస్జిద్ లోకి వస్తాను. మీరు మస్జిద్ లో ఏదో ఒక చోట సహాబాలతో సమావేశమై ఉంటారు లేదంటే నమాజ్ చేస్తూ ఉంటారు, ఏదో ఒక విధంగా మీరు నన్ను కనిపిస్తారు. మిమ్మల్ని చూడగానే నాకు మనశ్శాంతి దొరుకుతుంది. అయితే ఈరోజు నాకు ఒక ఆలోచన తట్టింది, ఆ ఆలోచన కారణంగా నేను అయోమయంలో పడిపోయాను, నాకు బాధగా ఉంది, కంగారుగా ఉంది. అదేమిటంటే, మరణించిన తర్వాత పరలోకంలో మీరేమో ప్రవక్త కాబట్టి స్వర్గంలోని ఉన్నతమైన శిఖరాలకు చేరుకుంటారు, నేను ఒక సాధారణమైన వ్యక్తి కాబట్టి, అల్లాహ్ దయవల్ల నేను కూడా స్వర్గానికి వచ్చేసినా, నేను స్వర్గంలోనే మామూలు స్థానాలలో ఉంటాను. అక్కడ కూడా నాకు మిమ్మల్ని చూడాలని అనిపిస్తుంది. మరి అలాంటప్పుడు నేను మిమ్మల్ని అక్కడ ఎలా చూడగలను, అక్కడ చూడలేనేమోనని నాకు బాధగా ఉంది, కంగారుగా ఉంది, ఓ దైవప్రవక్త అన్నారు.

చూశారా, ఎంతటి తపన ఉందో ఆయనలో ప్రవక్త వారిని చూడాలనే తపన, ప్రవక్త వారిని చూసి మనశ్శాంతి పొందాలన్న అభిమానం చూశారా. ఆ తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వాక్యాలు అవతరింపజేశాడు.

وَمَنْ يُطِعِ اللَّهَ وَالرَّسُولَ فَأُولَٰئِكَ مَعَ الَّذِينَ أَنْعَمَ اللَّهُ عَلَيْهِمْ مِنَ النَّبِيِّينَ وَالصِّدِّيقِينَ وَالشُّهَدَاءِ وَالصَّالِحِينَ ۚ وَحَسُنَ أُولَٰئِكَ رَفِيقًا
(వమయ్ యుతిఇల్లాహ వర్రసూల ఫఉలాయిక మఅల్లజీన అన్అమల్లాహు అలైహిమ్ మినన్నబియ్యీన వస్సిద్దీఖీన వష్షుహదాఇ వస్సాలిహీన వహసున ఉలాయిక రఫీఖా)
ఎవరైతే అల్లాహ్‌కు, ప్రవక్తకు విధేయత చూపుతారో వారు, అల్లాహ్ అనుగ్రహం పొందిన ప్రవక్తలు, సత్యసంధులు, అమరగతులు, సద్వర్తనులతో పాటు ఉంటారు. వారు ఎంత మంచి స్నేహితులు! (4:69)
ఖుర్ఆన్ గ్రంథం నాలుగవ అధ్యాయము 69 వ వాక్యము.

దాని అర్థం ఏమిటంటే, ఎవరైతే అల్లాహ్‌కు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు విధేయత కనబరుస్తారో, వారే అల్లాహ్ అనుగ్రహం పొందిన ప్రవక్తలతోను, సత్యసంధులతోను, షహీదులతోను, సద్వర్తనులతోను ఉంటారు. వీరు ఎంతో మంచి స్నేహితులు.

ఎవరైతే అల్లాహ్‌ను మరియు ప్రవక్త వారిని విశ్వసించి, అభిమానించి, ఆ ప్రకారంగా నడుచుకుంటారో వారు ప్రవక్తలతో పాటు ఉంటారట, సిద్దీఖీన్లతో పాటు సత్యసంధులతో పాటు ఉంటారట, షహీద్ వీరమరణం పొందిన వారితో పాటు ఉంటారట. ఎంతటి గౌరవం చూశారా?

سبحان الله ثم سبحان الله
(సుబ్ హానల్లాహ్ సుమ్మా సుబ్ హానల్లాహ్).

అయితే మిత్రులారా, ఒకే మాట చెప్పి ఇన్ షా అల్లాహ్ ఒక విషయం వైపు మీ దృష్టిని నేను తీసుకువెళ్లాలనుకుంటున్నాను.. ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక వ్యక్తి వచ్చి

متى الساعة؟
(మతస్సాఅ)
ప్రళయం ఎప్పుడు వస్తుంది అని అడిగాడు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన వైపు చూసి

ماذا أعددت لها؟
(మాజా ఆదత్త లహా)
అని తిరిగి ప్రశ్నించారు. ప్రళయం గురించి నీవు అడుగుతున్నావు సరే, కానీ ఆ ప్రళయం కోసము నీవు ఏమి సిద్ధం చేసుకున్నావు అన్నారు.
అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, ఓ దైవప్రవక్త, నేను పెద్దగా నమాజులు ఏమి చదువుకోలేదు, నేను పెద్దగా ఉపవాసాలు ఏమి ఉండలేదు, చెప్పుకోదగ్గ పెద్ద పుణ్యకార్యం నేను ఏమి చేసుకోలేదు. నా మీద ఉన్న బాధ్యత మాత్రం నేను నెరవేర్చుకుంటూ ఉన్నాను, పెద్దగా చెప్పుకోదగ్గ పుణ్యకార్యము నేను ఏదీ చేయలేదు. కాకపోతే నేను నా గుండెల నిండా మీ అభిమానం ఉంచుకొని ఉన్నాను అన్నారు.


ఆయన ఏమంటున్నాడండి, నా గుండెల నిండా నేను మీ అభిమానాన్ని ఉంచుకొని ఉన్నాను అంటే వెంటనే ప్రవక్త వారు తెలియజేశారు,

أنت مع من أحببت
(అంత మఅ మన్ అహబబ్త.)
నీవు ఎవరినైతే అభిమానిస్తున్నావో, రేపు వారితో పాటే పరలోకంలో ఉంటావు అని చెప్పారు.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆ వ్యక్తి పూర్తి అభిమానిస్తున్నాడు కాబట్టి, ప్రవక్త వారు తెలియజేసిన శుభవార్త ప్రకారము ఆ వ్యక్తి ప్రవక్త వారి దగ్గరిలో స్వర్గంలో ఉంటాడు. అయితే, ఇక్కడ ఇప్పుడు నేను మిమ్మల్ని ఆలోచింపజేస్తున్న విషయం ఏమిటంటే, ముస్లింలము మేము, ముస్లింలము మేము అని ప్రకటించుకునే ప్రతి వ్యక్తి ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, మీ గుండెల్లో ఎవరి అభిమానం ఎక్కువగా ఉంది? అల్లాహ్ అభిమానం ఎక్కువగా ఉందా? ప్రవక్త అభిమానం ఎక్కువగా ఉందా? లేక చింపిరి చింపిరి బట్టలు వేసుకున్న మహిళలతో నృత్యాలు చేసే, ఎగిరే, చిందేసే నాటక నటీనటుల అభిమానము ఉందా ఆలోచించండి. ఒకవేళ మీరు అందరి కంటే ఎక్కువగా అల్లాహ్‌ను అభిమానిస్తున్నారు, ప్రవక్త వారిని అభిమానిస్తున్నారు అంటే, అల్హమ్దులిల్లాహ్, చాలా సంతోషకరమైన విషయం. అలా కాకుండా మీరు అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటే ఎక్కువగా నటీనటులను, వేరే వేరే వ్యక్తులను అభిమానిస్తున్నారు అంటే రేపు మీరు ఎవరితో పాటు ఉంటారు పరలోకంలో ప్రవక్త వారు తెలియజేసిన దాని ప్రకారం ఆలోచించండి.

లేదండి, మేము ప్రవక్త వారిని ఎక్కువగా అభిమానిస్తున్నాం అండి అని చాలామంది నోటితో ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. నోటితో మాట్లాడితే సరిపోదు. మీ మాట్లాడే తీరు, మీ డ్రెస్ కోడ్, మీరు ధరించే దుస్తులు, మీ హెయిర్ స్టైల్, మీ వెంట్రుకలు, అలాగే మీ బట్టలు, మీ మాట్లాడే తీరు, మీ హెయిర్ స్టైల్, అలాగే మీరు, మీ కుటుంబ సభ్యులలో ఉన్న వ్యవహార శైలి ఇవన్నీ మీరు ఎవరిని అభిమానిస్తున్నారో, ఎవరిని మీరు ఫాలో అవుతున్నారో చెప్పకనే చెబుతూ ఉన్నాయి. ముస్లింలు అంటున్న వారు, వారి బట్టలను చూడండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన విధంగా వారు దుస్తులు ధరిస్తున్నారా? ప్రవక్త వారు తెలియజేసిన దాని ప్రకారంగా వారు వెంట్రుకలు ఉంచుతున్నారా? ప్రవక్త వారు తెలియజేసిన దాని ప్రకారము వ్యవహార శైలిగా నడుచుకుంటున్నారా? అక్కడ మనకు తెలిసిపోతుంది ఎవరు ఎవరిని మనం ఫాలో చేస్తున్నాం, ఎవరిని మనం అభిమానిస్తున్నాం, ఎవరి ఫోటోలు కాపీలలో, నోట్ బుక్కులలో, ఇంట్లోని గోడల మీద అతిక్కించుకుంటున్నాం, అక్కడ మనకు తెలిసిపోతుంది మన అభిమానులు ఎవరో, మనం ఎవరిని అభిమానిస్తున్నాము అనేది.

కాబట్టి జాగ్రత్త, ఎవరిని అభిమానిస్తున్నారో వారితోనే రేపు ఉంటారు.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని నమ్మటం, విశ్వసించటం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవించటం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అభిమానించటం, మూడు హక్కుల గురించి తెలుసుకున్నాం కదండీ. ఇక మరొక హక్కు ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆదర్శమూర్తిగా, రోల్ మోడల్ గా, ఆదర్శనీయుడిగా తీసుకొని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి అడుగుజాడల్లో నడుచుకోవాలి. ప్రతి పనిలో, ప్రతి విషయంలో, ఆరాధనల్లో, వ్యవహారాల్లో, అలాగే విశ్వాసంలో, ప్రతి విషయంలో ప్రవక్త వారిని ఆదర్శంగా తీసుకోవాలి.

ఖుర్ఆన్ గ్రంథం 33వ అధ్యాయం 21వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,

لَقَدْ كَانَ لَكُمْ فِي رَسُولِ اللَّهِ أُسْوَةٌ حَسَنَةٌ لِمَنْ كَانَ يَرْجُو اللَّهَ وَالْيَوْمَ الْآخِرَ وَذَكَرَ اللَّهَ كَثِيرًا
(లఖద్ కాన లకుమ్ ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనతున్ లిమన్ కాన యర్జుల్లాహ వల్ యౌమల్ ఆఖిర వ జకరల్లాహ కసీరా)
వాస్తవానికి అల్లాహ్‌ ప్రవక్తలో మీ కొరకు – అంటే అల్లాహ్‌ను, అంతిమ దినాన్ని ఆశించేవారికీ, అల్లాహ్‌ను అధికంగా స్మరించే వారికీ – ఒక ఉత్తమ ఆదర్శం ఉంది. (33:21)

అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిలో మీ కొరకు అత్యుత్తమ ఆదర్శము ఉంది అన్నారు. ఏ వ్యక్తి అయినా సరే ఆయన తండ్రిగా ఉంటాడు లేదా కుమారునిగా ఉంటాడు లేదా వృత్తిపరంగా ఒక బోధకునిగా, ఒక టీచర్‌గా ఉంటాడు లేదా ఒక డాక్టర్‌గా ఉంటాడు, ఏ రంగానికి చెందిన వ్యక్తి అయినా సరే, ఏ వయసులో ఉన్న వ్యక్తి అయినా సరే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఒక తండ్రిగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆదర్శనీయులు, ఒక కుమారునిగా కూడా ప్రవక్త వారు ఆదర్శనీయులు, ఒక భర్తగా ప్రవక్త వారు ఆదర్శనీయులు, ఒక గురువుగా ప్రవక్త వారు ఆదర్శనీయులు, ఒక వ్యాపారిగా ప్రవక్త వారు ఆదర్శనీయులు, ఒక డాక్టర్‌గా ప్రవక్త వారు ఆదర్శనీయులు, ఒక బోధకునిగా ప్రవక్త వారు ఆదర్శనీయులు, ఒక లీడర్‌గా ప్రవక్త వారు ఆదర్శనీయులు, ఒక పొరుగువానిగా ప్రవక్త వారు ఆదర్శనీయులు, అలాగే ఒక సైన్యాధిపతిగా కూడా ప్రవక్త వారు ఆదర్శనీయులు. మనిషి జీవితంలోని ప్రతి రంగంలో కూడా ప్రవక్త వారు ఆదర్శనీయులు. కాబట్టి, ఏ వ్యక్తి అయినా సరే, ఏ రంగంలో ఉన్న వ్యక్తి అయినా సరే, ప్రవక్త వారిని ఆదర్శంగా తీసుకోవాలి.

ఇప్పుడు మనం ఎవరిని ఆదర్శంగా తీసుకుంటున్నాం? ఎవరిని ఆదర్శంగా తీసుకొని మనము జీవించుకుంటున్నాం? మన జీవన వ్యవహారాలు, మన జీవన శైలి ఎలా ఉంది, మన లావాదేవీలు ఏ విధంగా ఉన్నాయి, ఒక్కసారి ఆలోచించుకోండి మిత్రులారా. ప్రవక్త వారిని ఆదర్శంగా తీసుకొని మనము జీవించాలి, ఇది ముస్లింల సముదాయం మీద ఉన్న మరొక హక్కు.

ఇక సమయం ఎక్కువైపోతుంది కాబట్టి, క్లుప్తంగా ఇన్ షా అల్లాహ్ చెబుతూ నా మాటను ముగించే ప్రయత్నం చేస్తాను.
ప్రవక్త వారి తరఫున ముస్లిం సముదాయం మీద ఉన్న ముఖ్యమైన, ముఖ్యమైన, ముఖ్యమైన హక్కు, బాధ్యత ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి విధేయత చూపాలి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించాలి. అనుసరించటం, విధేయత చూపటం అంటే ఏమిటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ పనులకైతే మమ్మల్ని చేయమని ఆదేశించారో, ఆ పనులను చేయాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ పనులైతే చేయవద్దు అని వారించారో, ఆ పనులు చేయకుండా వాటికి దూరంగా ఉండాలి. మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ప్రవక్త వారు ప్రతి భక్తి కార్యానికి, ప్రతి మంచి కార్యానికి చేయమని ఆదేశించి ఉన్నారు. అలాగే, ప్రతి పాపానికి మరియు ప్రతి తప్పు కార్యానికి దూరంగా ఉండండి అని వారించి ఉన్నారు. ప్రవక్త వారు వారించిన విషయాలకు దూరంగా ఉండాలి, ప్రవక్త వారు బోధించిన, చేయమని చెప్పిన విషయాలను మనము చేయాలి. దీనినే ఇతాఅత్, ఇత్తెబా అని అరబీలో అంటారు, విధేయత అని తెలుగులో అంటారు, అనుసరించటం అని అంటారు.

ఖుర్ఆన్ గ్రంథం సూరా మాయిదా 92 వ వాక్యంలో అల్లాహ్ తెలియజేశాడు,

وَأَطِيعُوا اللَّهَ وَأَطِيعُوا الرَّسُولَ
(వ అతీవుల్లాహ వ అతీవుర్రసూల్)
అల్లాహ్‌కు విధేయత చూపండి, ప్రవక్తకు కూడా విధేయత చూపండి. (5:92)

అల్లాహ్‌కు విధేయత చూపండి మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కూడా విధేయత చూపండి, అనుసరించండి. ఎలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మనము విధేయత చూపాలి, అనుసరించాలంటే ఒక రెండు ఉదాహరణలు చెప్పిఇన్ షా అల్లాహ్ మాటను ముగించి ముందుకు కొనసాగిస్తాను.

ఒకసారి ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందుకు వచ్చాడు. ఆయన బంగారపు ఉంగరము ధరించి ఉన్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ వ్యక్తిని దగ్గరకు పిలిచి, ఆ ఉంగరము తీసేసి పక్కన పడేశారు. పురుషులు బంగారము ధరించడము ఇస్లాం నియమాల నిబంధనల ప్రకారము అది వ్యతిరేకం. పురుషులు బంగారము ధరించరాదు, ఇది ఇస్లాం మనకు బోధించే విషయం. ఆ వ్యక్తి బంగారము ధరించి ఉన్నారు కాబట్టి ప్రవక్త వారు ఆ బంగారపు ఉంగరము తీసి పక్కన పడేసి, మీరు నరకము యొక్క అగ్నిని ముట్టుకోవటము, చేతిలో పట్టుకోవటము ఇష్టపడతారా, మరి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పారు. తర్వాత ప్రవక్త వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు, ఆ వ్యక్తి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇతర శిష్యులు ఆ వ్యక్తిని పిలిచి, చూడండి, ఆ బంగారము ధరించవద్దు అని ప్రవక్త వారు తెలియజేశారు కాబట్టి, ఆ బంగారము మీరు ధరించవద్దు, కానీ అది అక్కడ పడిపోయి ఉంది కాబట్టి, అది మీరు తీసుకువెళ్ళండి, వేరే పనుల కోసం ఉపయోగించుకోండి అన్నారు. అయితే, ఆయన ఏమన్నారో తెలుసా,

لا والله، لا آخذه أبداً، وقد طرحه رسول الله صلى الله عليه وسلم
(లా వల్లాహి, లా ఆఖుజుహు అబదా, వఖద్ తరహహు రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం.)
అల్లాహ్ సాక్షిగా, అలా నేను చేయనంటే చేయను. ఏ పరికరాన్ని అయితే ప్రవక్త వారు తొలగించి పక్కన పడేశారో, దాన్ని నేను ముట్టుకోనంటే ముట్టుకోను అని చెప్పారు.

అలాగే మనం చూచినట్లయితే, అలీ రజియల్లాహు అన్హు వారు ఒకసారి పట్టు వస్త్రాలు ధరించి వెళ్తూ ఉన్నారు, ప్రవక్త వారి కంటపడ్డారు. ప్రవక్త వారు అలీ రజియల్లాహు అన్హు వారు పట్టు వస్త్రాలు ధరించి ఉన్న విషయాన్ని చూసి, ప్రవక్త వారికి ఆ విషయం నచ్చలేదు. ప్రవక్త వారికి నచ్చలేదన్న విషయం ఆయన ముఖ కవళికల ద్వారా కనపడింది. వెంటనే అలీ రజియల్లాహు అన్హు వారు గుర్తుపట్టి, ఇంటికి వచ్చేసి ఆ వస్త్రాలు తీసి, చించేసి మహిళలకు ఇచ్చేశారు. గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, ఇస్లామీయ నిబంధనల ప్రకారము పట్టు వస్త్రాలు పురుషులకు యోగ్యమైనవి కావు. పట్టు వస్త్రాలు మహిళలకే ప్రత్యేకం. పురుషులు పట్టు వస్త్రాలు ధరించరాదు, ఇది ఇస్లామీయ నిబంధన. అయితే అలీ రజియల్లాహు అన్హు వారు పట్టు వస్త్రాలు ధరించారు కాబట్టి, ప్రవక్త వారు ఆ విషయాన్ని ఇష్టపడలేదు. వెంటనే అలీ రజియల్లాహు అన్హు వారు ఆ విషయాన్ని గ్రహించి, ఆ పట్టు వస్త్రాలు ఇంటికి వెళ్లి చించేసి, మహిళల చేతికి ఇచ్చేశారు, మీకు ఇష్టం వచ్చినట్టు మీరు ఈ బట్టలతో ఏమైనా చేసుకోండి అని.

చూశారా, ప్రవక్త వారు ఇష్టపడలేదు, వెంటనే అలీ రజియల్లాహు అన్హు వారు ఆ దుస్తులను తొలగించేశారు. చూశారా, ఆ ప్రకారంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మనము అనుసరించాలి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మనము విధేయత చూపాలి. ఏ విషయాలనైతే ప్రవక్త వారు మమ్మల్ని వారించారో వాటికి దూరంగా ఉండాలి.

అలాగే, ముస్లిం సముదాయం మీద ఉన్న హక్కులలో మరొక హక్కు ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకువచ్చిన ధర్మాన్ని వ్యాపింపజేయాలి, ప్రచారం చేయాలి, ప్రజల వద్దకు తీసుకువెళ్లి చేరవేయాలి. ఆ పని ప్రవక్తలు చేశారు. ప్రవక్త, మీకు నేను చివరి ప్రవక్తని, నా తర్వాత ప్రవక్తలు రారు. ఇక దీని ప్రచారం యొక్క బాధ్యత మీ మీద ఉంది అని చెప్పి వెళ్ళిన తర్వాత సహాబాలు ఆ బాధ్యత నెరవేర్చారు. ఆ తర్వాత వారు కూడా బాధ్యత నెరవేర్చారు. మనము కూడా ఆ బాధ్యత నెరవేర్చాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులను అభిమానించాలి. ఎవరిని కూడా కించపరచరాదు, దూషించరాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద దరూద్ పఠించాలి, ఇది కూడా మన మీద ఉన్న బాధ్యత మరియు హక్కు. దరూద్ శుభాలు అనే ప్రసంగము

إِنْ شَاءَ ٱللَّٰهُ
(ఇన్ షా అల్లాహ్)
వినండి, అక్కడ దరూద్ గురించి, అది ఎంత విశిష్టమైన కార్యమో తెలపజడం జరిగింది. అలాగే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి స్నేహితులతో మనము కూడా అభిమానం చూపించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శత్రువులతో మనము కూడా శత్రుత్వాన్ని వ్యక్తపరచాలి. ఇవి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల ముస్లిం సముదాయం మీద ఉన్న హక్కులు. క్లుప్తంగా మీ ముందర ఉంచడం జరిగింది. నేను అల్లాహ్‌తో దుఆ చేస్తున్నాను, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మమ్మల్ని అందరినీ అన్న, విన్న మాటల మీద ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక,ఆమీన్.

وَ جَزَاكُمُ اللّٰهُ خَيْرًا
(వ జజాకుముల్లాహు ఖైరన్).

وَعَلَيْكُمُ السَّلَامُ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(వ అలైకుమ్ అస్సలామ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు).

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7

సూరహ్ అన్ నాస్ – ప్రతీ పదానికి అర్ధ భావాలు మరియు తఫ్సిర్ (Tafsir Surah An-Nas) [వీడియో]

[1/2] సూరహ్ అన్ నాస్ – ప్రతీ పదానికి అర్ధ భావాలు మరియు తఫ్సిర్ (Tafsir Surah An-Nas) – పార్ట్ 01
https://youtu.be/WDUnsY0M44c [40 నిముషాలు]
[2/2] సూరహ్ అన్ నాస్ – ప్రతీ పదానికి అర్ధ భావాలు మరియు తఫ్సిర్ (Tafsir Surah An-Nas) – పార్ట్ 02
https://youtu.be/p3lXJowIp0U [37 నిముషాలు]

بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ
బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్
అనంత కరుణామయుడూ, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో

114:1  قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ
ఖుల్ అఊదు బిరబ్బిన్నాస్
(ఈ విధంగా) చెప్పు: “నేను మానవుల ప్రభువు రక్షణ కోరుతున్నాను.

114:2  مَلِكِ النَّاسِ
మలికిన్నాస్
మానవుల చక్రవర్తిని,

114:3  إِلَٰهِ النَّاسِ
ఇలాహిన్నాస్
మానవుల ఆరాధ్య దైవాన్ని (ఆశ్రయిస్తున్నాను) –

114:4  مِن شَرِّ الْوَسْوَاسِ الْخَنَّاسِ
మిన్ షర్రిల్ వస్ వాసిల్ ఖన్నాస్
దురాలోచనలను రేకెత్తించే,తప్పించుకునే వాడి కీడు నుండి,

114:5  الَّذِي يُوَسْوِسُ فِي صُدُورِ النَّاسِ
అల్లదీ యు వస్ విసు ఫీ శుదూరిన్నాస్
వాడు జనుల హృదయాలలో దురాలోచనలను రేకెత్తిస్తాడు –

114:6  مِنَ الْجِنَّةِ وَالنَّاسِ
మినల్ జిన్నతి వన్నాస్
వాడు జిన్ను వర్గానికి చెందినవాడైనా సరే, మానవ వర్గానికి చెందినవాడైనా సరే!

యూట్యూబ్ ప్లే లిస్ట్ – సూరహ్ ఫలఖ్, సూరహ్ నాస్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2HGHU2YlPz7otYjjkVQJDo

య’లము మాబైన అయదీహిం వమా ఖల్ ఫహుం | అల్లాహ్ (త’ఆలా) యొక్క జ్ఞానం | ఆయతుల్ కుర్సీ [వీడియో]

య’లము మాబైన అయదీహిం వమా ఖల్ ఫహుం | అల్లాహ్ (త’ఆలా) యొక్క జ్ఞానం | ఆయతుల్ కుర్సీ
https://youtu.be/f31UIl50lWI [19 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)


يَعْلَمُ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ وَلاَ يُحِيطُونَ بِشَيْءٍ مِّنْ عِلْمِهِ إِلاَّ بِمَا شَاء
య’లము మాబైన అయదీహిం వమా ఖల్ ఫహుం వలా యుహీతూన బిషయ్యిమ్మిన్ ఇల్మిహీ ఇల్లా బి మాషా
వారికి ముందు ఉన్న దానినీ, వెనుక ఉన్నదానిని కూడా ఆయన ఎరుగు. ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయమూ వారి గ్రాహ్యపరిధిలోకి రాదు

ఆయతుల్ కుర్సీలోని يَعْلَمُ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ (యఅలము మా బైన ఐదీహిమ్ వమా ఖల్ఫహుమ్) మరియు وَلَا يُحِيطُونَ بِشَيْءٍ مِنْ عِلْمِهِ إِلَّا بِمَا شَاءَ (వలా యుహీతూన బిషైఇమ్ మిన్ ఇల్మిహీ ఇల్లా బిమా షా) అనే భాగాల యొక్క వ్యాఖ్యానం ఇక్కడ వివరించబడింది. అల్లాహ్ యొక్క జ్ఞానం సంపూర్ణమైనదని, గతం, వర్తమానం మరియు భవిష్యత్తులోని ప్రతి సూక్ష్మ విషయాన్ని ఆయన ఎరుగునని ఈ ప్రసంగం స్పష్టం చేస్తుంది. ఆయనకు తెలియనిది ఏదీ లేదు. ఈ సంపూర్ణ జ్ఞానం ఆయనకు మాత్రమే ఉంది కనుక, ఆరాధనకు అర్హుడు కూడా ఆయన మాత్రమే. ఈ విషయాన్ని స్పష్టం చేయడానికి, నిద్ర, మరపు వంటి మానవ బలహీనతలు ఉన్న ఒక పీర్ (గురువు) ఉదంతం ద్వారా షిర్క్ యొక్క ఘోరమైన తప్పిదాన్ని వివరించబడింది. ఇమామ్ ఇబ్ను కతీర్ మరియు ఇబ్ను జరీర్ వంటి వ్యాఖ్యాతల అభిప్రాయాలతో పాటు, అల్లాహ్ యొక్క అపారమైన జ్ఞానాన్ని వర్ణించే సూరతుల్ అన్ఆమ్ వంటి అనేక ఖురాన్ ఆయతులు కూడా ఉదహరించబడ్డాయి. ఆరాధనను కేవలం సర్వజ్ఞాని అయిన అల్లాహ్ కు మాత్రమే ప్రత్యేకం చేయాలని ఈ ప్రసంగం నొక్కి చెబుతుంది.

అల్లాహు తాలా చెప్పాడు:

يَعْلَمُ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ
[యఅలము మా బైన ఐదీహిమ్ వమా ఖల్ఫహుమ్]
వారి ముందు వారి వెనక ఉన్నదంతా కూడా అల్లాహ్ కు చాలా మంచిగా తెలుసు.

وَلَا يُحِيطُونَ بِشَيْءٍ مِنْ عِلْمِهِ إِلَّا بِمَا شَاءَ
[వలా యుహీతూన బిషైఇమ్ మిన్ ఇల్మిహీ ఇల్లా బిమా షా]
కానీ అతని యొక్క జ్ఞానంలో అల్లాహ్ కు సంబంధించిన జ్ఞానం గురించి వారికి ఏమీ తెలియదు, కేవలం అల్లాహ్ వారికి తెలుపాలని కోరినంత తప్ప.

చూడండి, మొదటి విషయం, మొదటి భాగంలో మనం విన్న ఈ తఫ్సీర్ యొక్క వ్యాఖ్యాన విషయాలు మరిచిపోకూడదు. వాటితో సంబంధం ఉంది ప్రతి ఒక్క భాగానికి. అల్లాహ్ మాత్రమే సత్య ఆరాధ్యనీయుడు అన్నదానికి అల్లాహు తాలా నిదర్శనాలు చూపిస్తున్నాడు అనగా, వాటిలో ఒకటి ఏమిటి? ఇది కూడా. ఆయన యొక్క జ్ఞానం సంపూర్ణ జ్ఞానం. భూతకాలంలో జరిగినది, వర్తమానంలో జరుగుతున్నది, భవిష్యత్తులో జరగబోయేది అన్నిటి గురించి కూడా చాలా సూక్ష్మంగా, వివరంగా, అన్ని కోణాల నుండి ఆయనకు తెలుసు. అలాంటి ఆ సంపూర్ణ జ్ఞానం ఈ విశ్వంలో ఎవరికీ లేదు. సంపూర్ణ జ్ఞానం ఉన్నవాడే నిజమైన ఆరాధ్యుడు కాగలుగుతాడు, వేరే ఎవరూ కూడా కాజాలరు.

చూడండి, నేను అడపాదడపా మన రోజువారీ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు ఒక ఉపమానంగా తెలియజేస్తూ ఉంటాను. ఎందుకు? తౌహీద్ విషయం, రిసాలత్ యొక్క విషయం, ఆఖిరత్ యొక్క విషయం మనకు చాలా మంచిగా అర్థం కావాలని. ఎవరైతే కలిమా లా ఇలాహ ఇల్లల్లాహ్ స్వీకరించలేదో, నోటితో పలకలేదో, మనస్సుతో ధ్రువీకరించలేదో, వారు ముస్లింలు కారు. ఈ విషయం మనకు స్పష్టంగా తెలుసు. వారిని కాఫిర్, ముష్రిక్ అనడం జరుగుతుంది. కానీ దురదృష్టవశాత్తు, కలిమా చదువుతూ, నమాజులు కూడా చేస్తూ, ఇంకా రిసాలత్, ఆఖిరత్ ఇవన్నిటినీ కూడా నమ్ముతూ, మన ముస్లింలలో ఎంతోమంది బాబాలను, దర్గాలను, పీర్లను, ముర్షద్ లను ఇంకా ఎవరెవరినో ఎంత నమ్ముతున్నారంటే వారు ఉన్నటువంటి ఆ భయంకరమైన షిర్క్ గురించి వారికి వారు తప్పు చేస్తున్నారు అన్నటువంటి ఏ కొంచెం కూడా భయం లేకపోయింది.

ఒక సంఘటన ద్వారా షిర్క్ యొక్క వివరణ

ఇలాంటి సందర్భంలో ఒక చిన్న సంఘటన. కొందరు దీనిని కల్పితమని అనుకుంటారేమో కావచ్చు. కానీ వాస్తవానికి మనలో ఎంతో మందికి ఒక గొప్ప గుణపాఠం ఇందులో ఉంది. అందుకొరకే నేను يَعْلَمُ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ [యఅలము మా బైన ఐదీహిమ్ వమా ఖల్ఫహుమ్] దీని యొక్క వ్యాఖ్యానంలో ఈ సంఘటనను పేర్కొంటున్నాను. శ్రద్ధగా వినండి.

ఎంతోమంది ఎందరో బాబాలను నమ్ముతారు. వెళ్లి వారికి సజ్దాలు చేస్తారు. వారి ముందు తమ యొక్క కష్టాలను, దుఃఖాలను తెలుపుకొని, వారి ద్వారా అవన్నీ దూరం అవుతాయని వారి యొక్క నమ్మకం. అయితే సంఘటన ఏమిటంటే, ఒక భక్తుని ఇంటికి ఒక మురీద్ ఇంటికి ఒక పీర్ సాబ్ వస్తాడు. ఆ మురీద్, ఆ భక్తుడు, నా ఇంట్లో ఈ రోజు ఆనందమే ఆనందం. నా యొక్క గురువు, నా యొక్క పీర్ సాబ్ ఇంటికి వచ్చాడు అని ఎన్నో రకాల సేవలు చేస్తాడు. ఆ మధ్యలో అతని పక్కన కూర్చొని తన యొక్క దుఃఖాలను, బాధలను చెప్పుకుంటూ ఉండగా అతడు, అతనికి కన్ను అంటుకుంటుంది. కొన్ని క్షణాల గురించి అలా నిద్రపోతాడు. మళ్లీ కొన్ని క్షణాల తర్వాత కళ్ళు తెరిచి, నిద్ర మత్తులో నుండి బయటికి వచ్చి మేల్కొని చూస్తాడు. భక్తుడు చెప్పుకుంటూనే పోతూ ఉన్నాడు. అప్పుడు అంటాడు, “నేను వింటూ వింటూ నాకు కొంచెం అలా నిద్ర వచ్చేసింది. ఈ మధ్యలో నీవు ఏమి చెప్పావు? మరోసారి చెప్పు.”

అయిపోయిందా సంఘటన? ఏమైనా అర్థమైందా మీకు? ఏ భక్తుడు అంటే ఇక్కడ వాస్తవానికి భక్తుడు కాదు, సర్వసామాన్యంగా జరుగుతుంది గనక ఈ పదం నేను కూడా వాడుతున్నాను మీకు అర్థం కావాలని. ఈ శిష్యుడు అనండి. ఇతను తన బాధలు ఏదైతే వెళ్లబుచ్చుతున్నాడో, కొన్ని క్షణాల గురించి అతనిలో ఉన్నటువంటి, అంటే ఆ పీర్ సాబ్, ఆ బాబా అతని యొక్క ఆ గురువులో ఉన్న ఆ లోపం కారణంగా ఈ మధ్యలో ఏం చెప్పాడో అతని యొక్క ఈ శిష్యుడు అతనికి తెలియలేదు.

ఎన్ని లోపాలు? అర్థమవుతుందా మీకు? ఒకటి నిద్రమత్తు. రెండవది నిద్రలో అతడు ఏం చెప్పాడో వినలేకపోయాడు. ఈ మధ్యలో అతను చెప్పిన బాధ ఇతనికి తెలియలేకపోయింది. ఎవరైతే సరిగా వినలేడో, ఎవరికైతే తన దాసుల గురించి, తన శిష్యుల గురించి, తన భక్తుల గురించి సరియైన జ్ఞానం కలిగి లేడో, ఎవరికైతే కొంతసేపటి గురించి నిద్రమత్తులోకి వెళ్లి ఏం జరుగుతుందో తెలియడం లేదో, అలాంటి వారిని ఆరాధించడం, పూజించడం, ఆరాధనకు సంబంధించిన ఏ కొంత భాగమైనా అతని ముందు మనం పాటించడం, మన కష్టబాధాలు వారే తొలగిస్తారన్నటువంటి కొందరు అయితే ఏమనుకుంటారు? వారి ద్వారా తొలగించబడతాయని. కానీ మరీ ఎంతోమంది ఉన్నారు, వారే మా యొక్క కష్టాలను దూరం చేస్తారని. ఇది ఎంతటి ఘోరమైన షిర్క్ లో పడుతున్నారో అర్థమవుతుందా?

అయితే అల్లాహు తాలా గురించి ఇక్కడ ఇంత స్పష్టంగా చెప్పడం జరిగింది, వాస్తవ ఆరాధ్యుడు, మీ ఆరాధనలకు నిజమైన అర్హుడు ఎవరు కాగలుగుతారంటే ఎవరికైతే సంపూర్ణ జ్ఞానం ఉందో, ఈ సంపూర్ణ జ్ఞానం అన్నది ఈ లోకంలో కేవలం ఒకే ఒక్కనికి ఉంది, ఆయనే ఎవరు? ఆ సృష్టికర్త అయిన అల్లాహ్.

ఈ ఆయత్ వ్యాఖ్యానంలో ఇమామ్ ఇబ్ను కతీర్ రహమహుల్లాహ్ తెలిపారు: دليل على إحاطة علمه بجميع الكائنات [దలలీలున్ అలా ఇహాతతి ఇల్మిహీ బిజమీయిల్ కాఇనాత్]. يَعْلَمُ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ [యఅలము మా బైన ఐదీహిమ్ వమా ఖల్ఫహుమ్] ఈ పదం ఇది ఒక గొప్ప దలీల్. ఈ పూర్తి వ్యవస్థలో, విశ్వంలో, ఈ సంపూర్ణ మొత్తం ఈ ప్రపంచంలో ماضيها وحاضرها ومستقبلها [మాదీహా వ హాదిరిహా వ ముస్తక్బలిహా] భూతకాలం, వర్తమానం, భవిష్యత్తు అన్నిటి గురించి సంపూర్ణంగా తెలిసినవాడు కేవలం అల్లాహ్ ఒకే ఒక్కడు.

ఇమామ్ ఇబ్ను జరీర్ అతబరీ రహమహుల్లాహ్, ముఫస్సిరీన్ లలో, వ్యాఖ్యానకర్తలలో చాలా ప్రథమ అంశంలో వీరిని లెక్కించడం జరుగుతుంది. إنما يعني بذلك أن العبادة لا تنبغي لمن كان بالأشياء جاهلا [ఇన్నమా యఅనీ బి దాలిక అన్నల్ ఇబాదత లా తంబగీ లిమన్ కాన బిల్ అశ్యాయి జాహిలా]. ఇబాదత్, ఆరాధన అతనికి చేయడం ఎవరికైతే, ఎవరైతే అతని చుట్టుపక్కల విషయాల నుండి అజ్ఞానంగా ఉన్నాడో అలాంటి వారి యొక్క ఆరాధన ఎలా చేయడం జరుగుతుంది? మరియు فكيف يعبد من لا يعقل شيئا البتة من وثن وصنم [ఫకైఫ యుఅబదు మల్ లా యఅఖిలు షైఅన్ అల్బత్తత మిన్ వసనిన్ వ సనమ్]. బుద్ధి జ్ఞానాలు పేరుకు మాత్రం లేనటువంటి విగ్రహాలను, తమ చేతులతో చేసుకున్నటువంటి విషయాలను ఆరాధించడం ఇది ఎలా సమంజసం అవుతుంది? అందుకొరకే దీని ద్వారా అల్లాహ్ తెలుపుతున్న విషయం ఏమిటంటే, فأخلصوا العبادة لمن هو محيط بالأشياء كلها، يعلمها، لا يخفى عليه صغيرها وكبيرها [ఫ అఖ్లిసూల్ ఇబాదత లిమన్ హువ ముహీతున్ బిల్ అశ్యాయి కుల్లిహా, యఅలముహా, లా యఖ్ఫా అలైహి సగీరుహా వ కబీరుహా]. కనుక మీరు ఆరాధనను ప్రత్యేకంగా కేవలం అతని కొరకు చేయండి, ఎవరైతే అన్ని విషయాల గురించి సంపూర్ణ జ్ఞానం కలిగి ఉన్నాడో, ఎంతటి సంపూర్ణ జ్ఞానం? لا يخفى عليه صغيرها وكبيرها [లా యఖ్ఫా అలైహి సగీరుహా వ కబీరుహా]. అతని ముందు వారి ఏ విషయం కూడా అది చిన్నదైనా, పెద్దదైనా మరుగుగా ఉండదు.

అందుకొరకే మనం చూస్తున్నాము అల్లాహ్ యొక్క పేర్లలో ఒక పేరు, గొప్ప పేరు ఏమిటి? عليم [అలీమ్]. అబ్దుల్ అలీమ్ అని మనం పేరు వింటూ ఉంటాము కదా? అలీమ్ యొక్క దాసుడు. అలీమ్ ఈ పదం ఖురాన్ లో 150 కంటే ఎక్కువ సందర్భాలలో అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ పేర్కొన్నాడు. ఇంకా ఈ ‘ఇల్మ్’ కు సంబంధించిన వేరే పదాలు, వేరే ఫార్మేట్, సీగాలలో అనేక సందర్భాలలో వచ్చింది. అయితే ఇక్కడ నేను కేవలం సూరతుల్ అన్ఆమ్, ఆయత్ నెంబర్ 59 ప్రస్తావించి, వేరే కొన్ని ఆయతుల భావాన్ని తెలియజేసి ఇంక ముందుకు సాగుతాను. శ్రద్ధ వహించండి.

ఖురాన్ ఆయతుల ద్వారా అల్లాహ్ యొక్క అపారమైన జ్ఞానం

ఈ ఆయత్ నెంబర్ 59 సూరతుల్ అన్ఆమ్, సూర నెంబర్ 6 లో అల్లాహ్ ఏమంటున్నాడో చూడండి:

وَعِنْدَهُ مَفَاتِحُ الْغَيْبِ لَا يَعْلَمُهَا إِلَّا هُوَ
[వ ఇందహూ మఫాతిహుల్ గైబ్ లా యఅలముహా ఇల్లా హువ]
ఆయన వద్దే, అంటే అల్లాహ్ వద్దనే అగోచర జ్ఞానాల తాళములు ఉన్నాయి. لا يعلمها إلا هو [లా యఅలముహా ఇల్లా హువ] ఆయన తప్ప వేరే ఎవరికీ వాటి గురించి తెలియదు. చూడండి ఎంత స్పష్టంగా ఉంది. గైబ్ కా ఇల్మ్, అగోచర జ్ఞానం సంపూర్ణ రీతిలో అల్లాహ్ తప్ప ఇంకా ఎవరికీ లేదు.

ఇక అల్లాహు తాలా యొక్క ఆ జ్ఞానం ఏ ఏ విషయాల గురించి? కొన్ని వివరాలు అల్లాహు తాలా ఇక్కడ తెలియజేస్తున్నాడు వెంటనే: وَيَعْلَمُ مَا فِي الْبَرِّ وَالْبَحْرِ [వ యఅలము మా ఫిల్ బర్రి వల్ బహర్]. అల్లాహ్ కు చాలా మంచిగా తెలుసు, మా ఫిల్ బర్ర్, ఎడారి ప్రాంతంలో గాని, వల్ బహర్, సముద్రాలలో గాని. అంటే ఇక్కడ నీటి ప్రదేశమైనా, నీరు లేని ప్రదేశమైనా. భూమిపై మరియు సముద్రాలపై అన్నిటి గురించి. అంతేకాదు, وَمَا تَسْقُطُ مِنْ وَرَقَةٍ إِلَّا يَعْلَمُهَا [వమా తస్ఖుతు మిన్ వరఖతిన్ ఇల్లా యఅలముహా]. ఏదైనా చెట్టు నుండి ఒక్క ఆకు రాలి పడుతుందంటే దాని గురించి కూడా అల్లాహ్ కు సంపూర్ణ జ్ఞానం ఉంది. وَلَا حَبَّةٍ فِي ظُلُمَاتِ الْأَرْضِ [వలా హబ్బతిన్ ఫీ దులుమాతిల్ అర్ద్]. అంతేకాదు, భూమి యొక్క లోపట, చీకట్లో ఒక విత్తనం, అల్లాహు అక్బర్, ఒక విత్తనం ఏదైతే వేయబడుతుందో దానిని, దానికి సంబంధించిన అన్ని వివరాలు, అది ఎప్పుడు పగులుతుంది, అందులో నుండి ఎప్పుడు మొలక ఎత్తుతుంది దీనికి సంబంధించిన అన్ని వివరాలు కేవలం అల్లాహ్ కు మాత్రమే తెలుసు.

ఇంకా وَلَا رَطْبٍ وَلَا يَابِسٍ [వలా రత్బిన్ వలా యాబిసిన్]. పచ్చిది అయినా, ఎండినది అయినా, ఏది గాని. ఈ పచ్చిది మరియు ఎండినది పంట విషయాలలో కావచ్చు, వేరే ఎన్నో విషయాలలో కావచ్చు. ప్రతి దాని గురించి అల్లాహ్ కు సంపూర్ణ జ్ఞానం గలదు. إِلَّا فِي كِتَابٍ مُبِينٍ [ఇల్లా ఫీ కితాబిమ్ ముబీన్]. ఇవన్నిటినీ కూడా అల్లాహు తాలా లౌహె మహ్ఫూజ్, ఎంతో సురక్షితంగా ఉన్నటువంటి అతని వద్ద ఉన్న ఆ గ్రంథంలో రాసి పెట్టాడు కూడా.

సోదర మహాశయులారా, గమనించండి ఇంతటి సూక్ష్మ జ్ఞానం గల ఆ అల్లాహు తాలా, నేను చెప్తున్నాను కదా ‘ఇల్మ్’, దీనికి సంబంధించిన వేరే ఫార్మేట్ లలో ఖురాన్ లో వచ్చిన ఆయతులను మనం చూసుకుంటూ వెళ్తే చాలా చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. لا يعزب عنه مثقال ذرة [లా యఅజుబు అన్హు మిస్ఖాలు దర్రహ్]. అణువంత, అణువుకు సమానమైన ఏ వస్తువు గాని, విషయం గాని అతనికి తెలియకుండా లేదు. واعلموا أن الله يعلم ما في أنفسكم [వఅలమూ అన్నల్లాహ యఅలము మా ఫీ అన్ఫుసికుమ్] మీ హృదయాలలో ఉన్నది కూడా అల్లాహ్ కు చాలా సూక్ష్మంగా తెలుసు.

సూరత్ ఖాఫ్ లో గమనిస్తున్నారా మీరు?

ولقد خلقنا الإنسان ونعلم ما توسوس به نفسه
[వలఖద్ ఖలఖ్నల్ ఇన్సాన్ వ నఅలము మా తువస్విసు బిహీ నఫ్సుహ్].
మనిషిని మేమే పుట్టించాము, ونعلم ما توسوس به نفسه [వ నఅలము మా తువస్విసు బిహీ నఫ్సుహ్] అతని యొక్క ఆలోచనలలో, అతని యొక్క ఊహ గానాలలో ఏది మెదులుతుంది, కదులుతుంది, అతడు ఏం ఆలోచిస్తున్నాడు, ఏం ఊహిస్తున్నాడు అది కూడా మాకు చాలా సూక్ష్మంగా, చాలా మంచి వివరంగా తెలుసు.

సూరతుర్రఅద్ లో ప్రతి స్త్రీ, స్త్రీ అంటే ఇక్కడ కేవలం మనిషియే కాదు, సర్వ సృష్టిలో స్త్రీ లింగం, పురుష లింగం అని అంటాము కదా, జంతువులలో కూడా ప్రతిదీ. يعلم الله، الله يعلم ما تحمل كل أنثى [అల్లాహు యఅలము మా తహ్మిలు కుల్లు ఉన్సా]. అల్లాహ్ కు మాత్రమే తెలుసు, ما تحمل كل أنثى [మా తహ్మిలు కుల్లు ఉన్సా]. ఎవరి గర్భాశయాలలో ఏమి పెరుగుతుంది, తరుగుతుంది, ఏ స్త్రీ ఏమి గర్భం దాల్చుతుంది, ఇదంతా కూడా అల్లాహ్ కు చాలా స్పష్టంగా తెలుసు. عالم الغيب والشهادة [ఆలిముల్ గైబి వష్షహాదహ్]. అన్నీ అతని ముందు చాలా స్పష్టం. గోచరము, అగోచరము, అన్ని రకాల జ్ఞానం గలవాడు. ألم يعلموا أن الله يعلم سرهم ونجواهم [అలమ్ యఅలమూ అన్నల్లాహ యఅలము సిర్రహుమ్ వ నజ్వాహుమ్] వారు ఏదైతే గుప్తంగా ఉంచుతున్నారో, వారు ఏ గుసగుసలాడుకుంటున్నారో దాని గురించి కూడా అల్లాహ్ కు తెలుసు.

ప్రియులారా, ఈ విధంగా నేను ఆయతులు వినిపించుకుంటూ పోతే చాలా ఆయతులు ఉన్నాయి. చెప్పే ఉద్దేశాన్ని గమనిస్తే, బుద్ధిమంతునికి ఒక్క చిన్న సైగ కూడా సరిపోతుంది. అదేంటి? ఇలాంటి సంపూర్ణ జ్ఞానం గల అల్లాహ్ మాత్రమే నిజమైన ఆరాధ్యుడు. ఇలాంటి అల్లాహ్ ను వదిలి, ఇంకా వేరే ఎవరెవరినైతే పూజిస్తున్నారో, ఎవరెవరినైతే ఆరాధిస్తున్నారో అదంతా కూడా వ్యర్థము, తప్పు. దానికి ఎలాంటి ఆధారము వారి వద్ద లేదు. అందుకొరకు అల్లాహ్ ను తప్ప ఇంకా వేరే ఎవరినీ కూడా ఆరాధించరాదు.

అల్లాహ్ (త’ఆలా)
https://teluguislam.net/allah/

తఫ్సీర్ ఆయతుల్ కుర్సీ – అల్లాహ్ యొక్క నామాలు & గుణగణాలు – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3zZ7VizbWTYAi6VApCjfk3

సూరా అల్ ఫలఖ్ – ఒక్కో పదానికి అర్థాలు & తఫ్సీర్ [వీడియో]

సూరా అల్ ఫలఖ్ ఒక్కో పదానికి అర్థాలు & తఫ్సీర్
https://youtu.be/3HHIbfhQZsc [46 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

సూరా అల్ ఫలఖ్

بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ
బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్
అనంత కరుణామయుడూ, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో

113:1 قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ
ఖుల్ అఊదు బిరబ్బిల్ ఫలఖ్ఖ్
చెప్పు: నేను ప్రాతఃకాలపు ప్రభువు శరణు కోరుతున్నాను –

113:2 مِن شَرِّ مَا خَلَقَ
మిన్ షర్రి మా ఖలఖ్ఖ్
ఆయన సృష్టించిన వాటన్నింటి కీడు నుండి,

113:3 وَمِن شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ
వ మిన్ షర్రి గాసిఖిన్ ఇదా వఖబ్బ్.
కటిక చీకటి క్రమ్ముకున్నప్పటి రాత్రి చీకటి కీడు నుండి,

113:4 وَمِن شَرِّ النَّفَّاثَاتِ فِي الْعُقَدِ
వ మిన్ షర్రిన్ నఫ్పాసఆతి ఫిల్ ఉఖద్ద్
(మంత్రించి)ముడులలో ఊదే వారి కీడు నుండి,

113:5 وَمِن شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ
వ మిన్ షర్రి హాసిదిన్ ఇదా హసద్ద్
అసూయపరుడు అసూయచెందినప్పటి కీడు నుండి (నేను నా ప్రభువు రక్షణ కోరుతున్నాను).

అల్లాహ్ శుభ నామములు : అల్-మలిక్, అల్-మాలిక్, అల్-మలీక్ యొక్క వివరణ [వీడియో]

అల్లాహ్ శుభ నామములు : అల్-మలిక్, అల్-మాలిక్, అల్-మలీక్ యొక్క వివరణ [వీడియో]
https://youtu.be/HA6Uv_WUJo0 [32 నిముషాలు] – షేఖ్ ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ

ۚ ذَٰلِكُمُ اللَّهُ رَبُّكُمْ لَهُ الْمُلْكُ ۖ لَا إِلَٰهَ إِلَّا هُوَ ۖ فَأَنَّىٰ تُصْرَفُونَ

ఆ అల్లాహ్‌ యే మీ ప్రభువు. రాజ్యాధికారం ఆయనదే. ఆయన తప్ప మరో ఆరాధ్య దేవుడు లేడు. మరలాంటప్పుడు మీరు ఎటు తిరిగిపోతున్నారు? [సూరా జుమర్ 39:6]

قُلِ ادْعُوا الَّذِينَ زَعَمْتُم مِّن دُونِ اللَّهِ ۖ لَا يَمْلِكُونَ مِثْقَالَ ذَرَّةٍ فِي السَّمَاوَاتِ وَلَا فِي الْأَرْضِ وَمَا لَهُمْ فِيهِمَا مِن شِرْكٍ وَمَا لَهُ مِنْهُم مِّن ظَهِيرٍ

(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : అల్లాహ్‌ను వదలి మీరు ఎవరెవరినయితే ఊహించుకుంటున్నారో వారందరినీ పిలిచి చూడండి. భూమ్యాకాశాలలో వారికి రవంత అధికారంగానీ, వాటిలో వారికి ఎలాంటి వాటాగానీ లేదు. వారిలో ఏ ఒక్కడూ అల్లాహ్‌కు సహాయకుడు కూడా కాడు. [సూరా సబా 34:22]

25:3 وَاتَّخَذُوا مِن دُونِهِ آلِهَةً لَّا يَخْلُقُونَ شَيْئًا وَهُمْ يُخْلَقُونَ وَلَا يَمْلِكُونَ لِأَنفُسِهِمْ ضَرًّا وَلَا نَفْعًا وَلَا يَمْلِكُونَ مَوْتًا وَلَا حَيَاةً وَلَا نُشُورًا

వారు అల్లాహ్‌ను వదలి (బూటకపు) దేవుళ్లను కల్పించుకున్నారు. వారు (అంటే ఆ బూటకపు దేవుళ్లు) ఏ వస్తువునూ సృష్టించలేరు. పైగా వారు స్వయంగా సృష్టించబడినవారు. వారు తమ స్వయానికి సైతం లాభనష్టాలు చేకూర్చుకునే అధికారం కలిగిలేరు. జీవన్మరణాలు కూడా వారి అధీనంలో లేవు. (మరణానంతరం) తిరిగి లేచే శక్తి కూడా వారివద్ద లేదు. [సూరా ఫుర్ఖాన్ 25:3]

35:13 يُولِجُ اللَّيْلَ فِي النَّهَارِ وَيُولِجُ النَّهَارَ فِي اللَّيْلِ وَسَخَّرَ الشَّمْسَ وَالْقَمَرَ كُلٌّ يَجْرِي لِأَجَلٍ مُّسَمًّى ۚ ذَٰلِكُمُ اللَّهُ رَبُّكُمْ لَهُ الْمُلْكُ ۚ وَالَّذِينَ تَدْعُونَ مِن دُونِهِ مَا يَمْلِكُونَ مِن قِطْمِيرٍ

ఆయన రాత్రిని పగటిలోనికి జొప్పిస్తున్నాడు, పగటిని రాత్రి లోనికి జొప్పిస్తున్నాడు. మరి ఆయన సూర్యచంద్రులను (తన శాసన) నిబద్ధుల్ని చేశాడు – ప్రతిదీ ఒక నిర్ధారిత కాలం ప్రకారం నడుస్తోంది. ఈ అల్లాహ్‌యే మీ ప్రభువు. విశ్వసామ్రాజ్యాధికారం ఆయనదే. ఆయన్ని వదలి మీరు ఎవరెవరిని పిలుస్తున్నారో వారు ఖర్జూరపు టెంకపై ఉండే పొరకు కూడా యజమానులు కారు. [సూరా ఫాతిర్ 35:13]

35:14 إِن تَدْعُوهُمْ لَا يَسْمَعُوا دُعَاءَكُمْ وَلَوْ سَمِعُوا مَا اسْتَجَابُوا لَكُمْ ۖ وَيَوْمَ الْقِيَامَةِ يَكْفُرُونَ بِشِرْكِكُمْ ۚ وَلَا يُنَبِّئُكَ مِثْلُ خَبِيرٍ

ఒకవేళ మీరు వారిని మొర పెట్టుకున్నా, వారు మీ మొరను ఆలకించరు. ఒకవేళ ఆలకించినా, మీ అక్కరను తీర్చలేరు. పైపెచ్చు ప్రళయదినాన మీరు కల్పించే భాగస్వామ్యాన్ని (షిర్క్‌ను) వారు (సూటిగా) త్రోసిపుచ్చుతారు. అన్నీ తెలిసిన దేవుని మాదిరిగా (సావధానపరిచే సమాచారాన్ని) నీకు తెలిపే వాడెవడూ ఉండడు సుమా! [సూరా ఫాతిర్ 35:13]

అల్లాహ్ (త’ఆలా): https://teluguislam.net/allah/

అల్లాహ్ శుభ నామాల వివరణ – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0tSV7A9HKJzSeM0aIAiYcb

మా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి ఇన్ షా అల్లాహ్:
http://www.youtube.com/user/teluguislam?sub_confirmation=1

ముహర్రం నెల, సంఘటనలు, సంప్రదాయాలు| సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) [వీడియో]

ముహర్రం నెల, సంఘటనలు, సంప్రదాయాలు| సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) [వీడియో]
https://youtu.be/Lxw9kVDaFTk [30 నిముషాలు]

ముహర్రం & ఆషూరా (ముహర్రం 10 వ తేదీ)- యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0Mlhg-zp9sHUArkqQGOoEz

ముహర్రం & ఆషూరా (ముహర్రం 10 వ తేదీ) మెయిన్ పేజీ
https://teluguislam.net/2020/08/20/muharram/

ముస్లిం సమాజంలో ధార్మికత లోపించటానికి కారణాలు వాటి పరిష్కారాలు [వీడియో]

ముస్లిం సమాజంలో ధార్మికత లోపించటానికి కారణాలు వాటి పరిష్కారాలు [వీడియో]
https://youtu.be/YLVGfyGBUws [47 నిముషాలు]
వక్త: షరీఫ్, వైజాగ్ (హఫిజహుల్లాహ్), మదీనా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్

హిజ్రీ క్యాలెండర్ ఆవశ్యకత | Importance of Hijri Calendar [వీడియో]

హిజ్రీ క్యాలెండర్ ఆవశ్యకత | Importance of Hijri Calendar [వీడియో]
https://youtu.be/yooNUIwiSMs [21 min]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ప్రస్తుతం మనం క్రొత్త హిజ్రీ సంవత్సరం లోకి ప్రవేశించాము (హిజ్రీ 1444). ముహర్రం మాసం హిజ్రీ క్యాలెండరు లోని మొదటి నెల. హిజ్రత్ అంటే వలస పోవడం. మక్కా నుండి మదీనా కు హిజ్రత్ చేయడం పురస్కరించుకొని ఈ హిజ్రీ క్యాలెండరు తయారు అయింది

ఈ వీడియో లో :

  1. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి కాలంలో ఏ విధం అయిన క్యాలెండరు వాడేవారు.
  2. హిజ్రీ కేలండర్ ఎప్పుడు మొదలైంది, ఏ ఖలీఫా కాలంలో హిజ్రీ క్యాలండర్ నిర్ణయించారు.
  3. మక్కా నుండి మదీనా కు హిజ్రత్ చేయడం పురస్కరించుకొని ఈ హిజ్రీ క్యాలెండరు ఎందుకు తయారు అయింది?
  4. హిజ్రీ క్యాలెండరు విశిష్టత
  5. షరియత్ లో హిజ్రీ కేలండర్ ఆవశ్యకత
  6. ఇంకా ఎన్నో మంచి విషయాలు షేఖ్ గారు వివరించారు

తప్పకుండ వినండి, మీ బంధు మిత్రులకు షేర్ చెయ్యండి, ఇన్ షా అల్లాహ్

ముహర్రం & ఆషూరా (ముహర్రం 10 వ తేదీ) మెయిన్ పేజీ
https://teluguislam.net/2020/08/20/muharram/

అల్లాహ్ శుభ నామమైన “రబ్బ్” యొక్క వివరణ [వీడియో & టెక్స్ట్]

అల్లాహ్ శుభ నామమైన “రబ్బ్” యొక్క వివరణ [వీడియో]
https://youtu.be/NTehdBRdCxg [28 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో అల్లాహ్ యొక్క శుభనామమైన “అర్-రబ్” (ప్రభువు) యొక్క లోతైన అర్థాలు మరియు భావనలు వివరించబడ్డాయి. “రబ్” అనే పదం సృష్టించడం, పోషించడం, నిర్వహించడం, నాయకత్వం వహించడం వంటి అనేక విస్తృతమైన అర్థాలను కలిగి ఉంటుందని వక్త తెలియజేశారు. ఈ పదం ఒంటరిగా ప్రయోగించబడినప్పుడు కేవలం అల్లాహ్ కు మాత్రమే ప్రత్యేకం అని, ఇతరులకు వాడాలంటే మరొక పదాన్ని జతచేయాలని అరబిక్ వ్యాకరణ నియమాన్ని ఉదహరించారు. అల్లాహ్ యొక్క రుబూబియత్ (ప్రభుత్వం) రెండు రకాలుగా ఉంటుందని వివరించారు: ఒకటి సాధారణ రుబూబియత్, ఇది సృష్టిలోని అందరి కోసం (విశ్వాసులు, అవిశ్వాసులతో సహా); రెండవది ప్రత్యేక రుబూబియత్, ఇది కేవలం విశ్వాసులకు, ప్రవక్తలకు మాత్రమే ప్రత్యేకం, దీని ద్వారా అల్లాహ్ వారికి విశ్వాస భాగ్యం, మార్గదర్శకత్వం మరియు ప్రత్యేక సహాయాన్ని అందిస్తాడు. ప్రవక్తలందరూ తమ ప్రార్థనలలో (దుఆ) “రబ్బనా” (ఓ మా ప్రభూ) అని అల్లాహ్ ను ఎలా వేడుకున్నారో ఖుర్ఆన్ ఆయతుల ద్వారా ఉదహరించారు. చివరగా, అల్లాహ్ ను ఏకైక రబ్ గా అంగీకరించడం తౌహీద్ యొక్క మూలమని, ఆయనతో పాటు ఇతరులను సంతానం, స్వస్థత లేదా ఇతర అవసరాల కోసం ఆరాధించడం షిర్క్ అనే ఘోరమైన పాపమని హెచ్చరించారు.

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ నబీయినా ముహమ్మద్ వఆలా ఆలిహి వసహ్బిహి అజ్మయీన్. అమ్మా బాద్.

أَعُوذُ بِاللَّهِ السَّمِيعِ الْعَلِيمِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ
(అఊజు బిల్లాహిస్ సమీయిల్ అలీమి మినష్ షైతానిర్ రజీమ్)
వినువాడు, సర్వజ్ఞాని అయిన అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను, శపించబడిన షైతాను నుండి.

بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ
(బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్)
అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో.

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
(అల్ హందు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్)
సర్వస్తోత్రాలు, పొగడ్తలన్నీ సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే.

అల్లాహ్ యొక్క శుభనామం రబ్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. అయితే, ప్రియ విద్యార్థులారా, వీక్షకులారా! రబ్ అన్న అల్లాహ్ యొక్క ఈ శుభనామం, ఉత్తమ పేరు, దీని యొక్క భావాన్ని, అర్థాన్ని గనక మనం చూస్తే, ఇందులో ఎన్నో అర్థాలు, ఎన్నో భావాలు వస్తాయి. అయితే, ఆ భావాలు తెలిపేకి ముందు అరబీ గ్రామర్ ప్రకారంగా ఒక మాట మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అదేమిటంటే, రబ్ మరియు సర్వసామాన్యంగా అరబీలో అర్-రబ్ అన్న ఈ పదం కేవలం విడిగా రబ్ లేదా అర్-రబ్, అల్లాహ్ కు మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఒకవేళ అల్లాహ్ ను కాకుండా వేరే ఎవరి గురించైనా ఈ పదం ఉపయోగించాలంటే, తప్పకుండా దానితో పాటు మరొక పదాన్ని కలపడం తప్పనిసరి. ఈ యొక్క నియమం ఏదైతే మీరు తెలుసుకున్నారో, ఇప్పుడు ఇది మంచిగా మీకు అర్థం కావాలంటే రండి, రబ్ యొక్క అర్థాన్ని తెలుసుకుంటే మనకు ఈ విషయం తెలుస్తుంది.

రబ్ యొక్క అర్థంలో పుట్టించడం, పోషించడం, జీవన్మరణాలు ప్రసాదించడం మరియు నిర్వహించడం, నడిపించడం ఇవన్నీ భావాలతో పాటు, ఏదైనా విషయాన్ని చక్కబరచడం, దానిని రక్షించుకుంటూ ఉండడం, చూడడం, ఇంకా నాయకుడు, ఉన్నత హోదా అంతస్తులు కలిగి ఉన్నవాడు, ఎవరి ఆదేశం మాత్రమే చెల్లుతుందో ప్రజలు అనుసరిస్తారో, ఎవరి పెత్తనం నడుస్తుందో ఇలాంటి భావాలన్నీ కూడా ఇందులో ఉపయోగపడతాయి, ఈ భావాలన్నీ కూడా ఈ పదానికి వస్తాయి.

ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ ‘అల్-బదాయిఉల్ ఫవాయిద్’ లో తెలిపారు,

إِنَّ هَذَا الِاسْمَ إِذَا أُفْرِدَ تَنَاوَلَ فِي دَلَالَاتِهِ سَائِرَ أَسْمَاءِ اللَّهِ الْحُسْنَى وَصِفَاتِهِ الْعُلْيَا
(ఇన్న హాజల్ ఇస్మ ఇజా ఉఫ్రిద తనావల ఫీ దిలాలాతిహి సాయిర అస్మాఇల్లాహిల్ హుస్నా వ సిఫాతిహిల్ ఉల్యా)
“నిశ్చయంగా ఈ పేరు (అర్-రబ్) ఒంటరిగా ప్రయోగించబడినప్పుడు, దాని సూచనలలో అల్లాహ్ యొక్క ఇతర ఉత్కృష్టమైన నామాలు మరియు ఉన్నత గుణాలన్నీ చేరిపోతాయి.”

ఈ మాటను షేఖ్ అబ్దుర్రజాక్ అల్-బదర్ హఫిజహుల్లాహ్ ప్రస్తావించి, ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ యొక్క మాట ఇలా చెప్పారు:

إِنَّ الرَّبَّ هُوَ الْقَادِرُ الْخَالِقُ الْبَارِئُ الْمُصَوِّرُ الْحَيُّ الْقَيُّومُ الْعَلِيمُ السَّمِيعُ الْبَصِيرُ الْمُحْسِنُ الْمُنْعِمُ الْجَوَادُ، الْمُعْطِي الْمَانِعُ الضَّارُّ النَّافِعُ الْمُقَدِّمُ الْمُؤَخِّرُ
(ఇన్నర్-రబ్బ హువల్ ఖాదిరుల్ ఖాలిఖుల్ బారివుల్ ముసవ్విరుల్ హయ్యుల్ ఖయ్యుముల్ అలీముస్ సమీయుల్ బసీరుల్ ముహ్సినుల్ మున్ఇముల్ జవాద్, అల్ ముఅతీ అల్ మానిఉ అద్దార్రు అన్నాఫిఉ అల్ ముఖద్దిము అల్ ముఅఖ్ఖిర్)

రబ్ అన్న యొక్క ఈ పదం అల్లాహ్ గురించి ఉపయోగించినప్పుడు, అల్లాహ్ యొక్క ఇంకా వేరే ఎన్నో పేర్లలో ఉన్నటువంటి భావం ఇందులో వచ్చేస్తుంది. అయితే, ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ కంటే కూడా చాలా ముందు ఇమామ్ తబరీ రహిమహుల్లాహ్, తఫ్సీర్ యొక్క పుస్తకాలలో ప్రామాణికమైన పరంపరలతో పేర్కొనబడిన మొట్టమొదటి తఫ్సీర్ అని దీనికి పేరు వచ్చింది, తఫ్సీరె తబరీ, అందులో ఇమామ్ ఇబ్ను జరీర్ రహిమహుల్లాహ్ చెప్పారు:

الرَّبُّ فِي كَلَامِ الْعَرَبِ مُتَصَرِّفٌ عَلَى مَعَانٍ، فَالسَّيِّدُ الْمُطَاعُ فِيهِمْ يُدْعَى رَبًّا
(అర్-రబ్బు ఫీ కలామిల్ అరబ్ ముతసర్రిఫున్ అలా మఆన్, ఫస్-సయ్యిదుల్ ముతాఉ ఫీహిమ్ యుద్ఆ రబ్బన్)
“అరబ్బుల భాషలో ‘రబ్’ అనే పదం అనేక అర్థాలలో వస్తుంది. వారిలో విధేయత చూపబడే నాయకుడిని ‘రబ్’ అని పిలుస్తారు.”

అరబీ భాషలో, అరబ్బుల మాటల్లో అర్-రబ్ అన్న పదం ఏ నాయకుడినైతే అనుసరించడం జరుగుతుందో, అలాంటి వాటిని మరియు ఏ మనిషి అయితే అన్ని విషయాలను, వ్యవహారాలను చక్కబరిచి వాటిని సరిదిద్ది, వాటి బాగోగులు చూసుకుంటాడో, అలాంటి వాడిని మరియు ఏదైనా విషయానికి అధికారి అయిన అలాంటి వారికి కూడా అర్-రబ్ అన్న పదం ఉపయోగపడుతుంది.

ఈ విధంగా, ఇంటి యొక్క యజమాని అని మనం అంటాము తెలుగులో. దీని గురించి అరబీలో రబ్బుద్-దార్. కేవలం రబ్ కాదు. దార్ అంటే ఇల్లు. ఇంటి యొక్క యజమాని – రబ్బుద్-దార్. ఈ పని యొక్క బాధ్యుడురబ్బుల్-అమల్. ఇప్పటికీ కువైట్ మరియు మరికొన్ని దేశాలలో స్పాన్సర్ ఎవరైతే ఉంటారో, సౌదీలో ‘కఫీల్‘ అని ఏదైతే అనడం జరుగుతుందో, అలా కువైట్‌లో ‘రబ్బుల్ అమల్’ అని అక్కడ పిలవడం, చెప్పడం జరుగుతుంది.

ఈ భావాన్ని మీరు తెలుసుకున్నారంటే, ఇక మనం అల్లాహ్ యొక్క పేరు చెప్పుకుంటున్నాము గనక, అల్లాహ్ యొక్క పేరు ఒకటి రబ్ ఉంది అని, తౌహీద్ కు సంబంధించిన మూడు ముఖ్యమైన భాగాలు – తౌహీదె రుబూబియత్, తౌహీదె అస్మా వ సిఫాత్, తౌహీదె ఉలూహియత్ – వీటిలో ఒకటి రుబూబియత్. అంటే ఈ మొత్తం విశ్వంలో సృష్టించడం, పోషించడం, నిర్వహించడంలో ఏకైకుడు, ఎలాంటి భాగస్వామి లేనివాడు అల్లాహ్ అని మనం విశ్వసించాలి, మనం నమ్మాలి.

అయితే, ఈ మొత్తం సృష్టిని సృష్టించడంలో అల్లాహ్ కు ఎవరూ కూడా భాగస్వామి లేరు. ఖుర్ఆన్ లో మనం శ్రద్ధగా చదివామంటే, ఈ విషయం చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఉదాహరణకు, అల్లాహ్ త’ఆలా ఖుర్ఆన్ లో కొన్ని సందర్భాలలో అల్లాహ్ మాత్రమే మన యొక్క రబ్ అని తెలియజేస్తూ, ఆయనే ఈ మొత్తం విశ్వాన్ని సృష్టించిన వాడు అని స్పష్టంగా తెలిపాడు. సూరతుల్ అన్ఆమ్, సూరహ్ నంబర్ ఆరు, ఆయత్ నంబర్ 102 చూడండి:

ذَٰلِكُمُ اللَّهُ رَبُّكُمْ ۖ لَا إِلَٰهَ إِلَّا هُوَ ۖ خَالِقُ كُلِّ شَيْءٍ فَاعْبُدُوهُ
(జాలికుముల్లాహు రబ్బుకుమ్, లా ఇలాహ ఇల్లా హువ, ఖాలిఖు కుల్లి షైఇన్ ఫఅబుదూహ్)
ఆయనే అల్లాహ్‌. మీ ప్రభువు. ఆయన తప్ప మరొకరెవరూ ఆరాధ్యులు కారు. సమస్త వస్తువులను సృష్టించినవాడు ఆయనే. కాబట్టి మీరు ఆయన్నే ఆరాధించండి. (6:102)

ఈ ఆయతును మీరు రాసుకోండి. ఎందుకంటే ఇప్పుడు చెప్పిన ఒక్క మాటకే కాదు ఇది దలీల్, ఈ ఆయత్ యొక్క భాగం ఏదైతే నేను చదివానో ఇప్పుడు, తెలుగు అనువాదం చెప్పానో, ఇందులో మరి ఎన్నో విషయాలు మనకు తెలుస్తాయి. ఇంకా ముందుకు కూడా నేను దీనిని ప్రస్తావిస్తాను. సూరె అన్ఆమ్ సూరహ్ నంబర్ ఆరు, ఆయత్ నంబర్ 102.

అల్లాహ్ త’ఆలాయే విశ్వంలో ఉన్నటువంటి ప్రతి దాని యొక్క మేలు, సంక్షేమాలు, వారందరి యొక్క బాగోగులు చూసుకుంటూ వారికి కావలసినటువంటి ప్రతి వారికి అవసరం తీర్చువాడు అల్లాహ్ మాత్రమే అన్నటువంటి భావం ఈ అర్-రబ్ అనే పదంలో ఉంది.

రబ్ లో రబ్బా యురబ్బీ తర్బియతన్. తర్బియత్పోషించడం అన్న పదం, అన్న భావం ఏదైతే ఉందో, ఇందులో రెండు రకాలు అన్న విషయం స్పష్టంగా తెలుసుకోండి.

అల్లాహ్ త’ఆలా రబ్, ప్రతి ఒక్కరి రుబూబియత్, ప్రతి ఒక్కరి తర్బియత్ వారి వారికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో దాని పరంగా వారిని పోషించే బాధ్యత అల్లాహ్ ఏదైతే తీసుకున్నాడో, అల్లాహ్ మాత్రమే చేయగలుగుతున్నాడో, దీని యొక్క ఈ రబ్ యొక్క భావంలో రెండు రకాలు ఉన్నాయి. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి.

ఒకటి, పాపాత్ముడైనా, పుణ్యాత్ముడైనా, విశ్వాసుడైనా, అవిశ్వాసుడైనా, సన్మార్గంపై ఉన్నవాడైనా, మార్గభ్రష్టంలో ఉన్నవాడైనా, ప్రతి ఒక్కరి సృష్టి, ఉపాధి, వారి యొక్క నిర్వహణ, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఎవరిని పైకి లేపాలి, ఎవరిని అధోగతికి పాలు చేయాలి, ఇదంతా కూడా అల్లాహ్ త’ఆలా చేస్తూ ఉంటాడు. ఇక ఇందులో అల్లాహ్ కు ఎవరూ కూడా భాగస్వామి లేరు. ఇది ఒక సామాన్యమైన భావం.

కానీ అల్లాహ్ త’ఆలా తన యొక్క ప్రవక్తలకు, తన ప్రత్యేకమైన పుణ్యాత్ములైన దాసులకు, సద్వర్తనులకు, విశ్వాస భాగ్యం, ప్రవక్త పదవి లాంటి గొప్ప మహా భాగ్యం, అల్లాహ్ యొక్క ఆరాధన సరైన రీతిలో చేసే అటువంటి భాగ్యం, మరియు వారు పాపాలను వదిలి పుణ్యాల వైపునకు రావడం, పాపం పొరపాటు జరిగిన వెంటనే తౌబా చేసే భాగ్యం కలుగజేయడం, ఇదంతా కూడా అల్లాహ్ యొక్క ప్రత్యేక రుబూబియత్. ఇది ప్రసాదించేవాడు కూడా అల్లాహ్ త’ఆలాయే. కానీ ఇలాంటివి ప్రత్యేక రుబూబియత్ లోని విషయాలు ఎవరికైనా లభించాలంటే, వారు అల్లాహ్ వైపునకు మరలడం కూడా తప్పనిసరి.

గమనించండి ఇక్కడ ఒక విషయం, అల్లాహ్ త’ఆలాయే నన్ను పుట్టించాడు, ఆయనే నన్ను పోషిస్తూ ఉన్నాడు. ఇహలోకంలో నేను రాకముందు తల్లి గర్భంలో నన్ను ఎలా పోషిస్తూ వచ్చాడు, పుట్టిన వెంటనే, మనం గమనించాలి ఇక్కడ. మనం మనుషులం గాని, పక్షులు గాని, జంతువులు, పశువులు గాని అల్లాహ్ యొక్క రుబూబియత్ విషయాన్ని గమనించేది ఇక్కడ చాలా గొప్ప ఒక నిదర్శనం మనకు ఉన్నది. గుడ్డులో ఉన్నా గాని పక్షులు, లేక పశువులు, జంతువులు, మనుషులు తల్లి గర్భంలో ఉన్నప్పుడు గాని, అక్కడ వారి యొక్క మొత్తం జన్మ యొక్క ప్రక్రియ ఎలా కొనసాగిస్తున్నాడు, అల్లాహ్ తప్ప వేరే ఎవరికైనా ఇలాంటి శక్తి ఉందా?

పుట్టిన వెంటనే, గుడ్డులో పూర్తి పక్షి తయారవుతుంది. బయటికి రావడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తూ అది వస్తుంది. మరియు వచ్చిన వెంటనే దానికి కావలసిన ఆహారం కళ్ళు తెరవకముందు ఎలా తల్లి దానికి ఇవ్వాలి అన్నటువంటి భాగ్యం, జ్ఞానం, అల్లాహ్ త’ఆలా ఆ పక్షికి ఎలా కలుగజేస్తాడో గమనించండి. ఇక మనిషి, జంతువుల విషయానికి వస్తే, పుట్టిన వెంటనే తన యొక్క ఆహారం ఎక్కడ ఉన్నదో అటు జంతువు గాని, అటు మనిషి గాని తన తల్లి స్థనాల్లో అన్న విషయాన్ని ఎలా గమనిస్తాడో చూడండి. ఈ భాగ్యం ఎవరు కలుగజేస్తున్నారు? ‘రబ్’ అన్నటువంటి పదం మనం చదివినప్పుడు, ఈ విషయాలు చూస్తున్నప్పుడు, అల్లాహ్ పై మన యొక్క విశ్వాసం అనేది చాలా బలంగా ఉండాలి. అయితే మనం పుట్టిన తర్వాత క్రమంగా మనలో ఎలాంటి శక్తి పెరుగుతుందో, మనలో బుద్ధిజ్ఞానాలు ఎలా పెరుగుతాయో, ఈ విషయంలో కూడా అల్లాహ్ రబ్ అయి మనల్ని ఎలా పెంచుతున్నాడో, ఇందులో మన కొరకు గొప్ప నిదర్శనాలు ఉన్నాయి.

ఇంతటి గొప్ప రబ్ అయిన అల్లాహ్, మనల్ని ఏ ఆదేశం ఇవ్వకుండా, మనల్ని పుట్టించి, మనకు ఏ ఉద్దేశం లేకుండా చేస్తాడా? చేయడు. అందుకొరకే అల్లాహ్ ఏమంటున్నాడు:

أَفَحَسِبْتُمْ أَنَّمَا خَلَقْنَاكُمْ عَبَثًا وَأَنَّكُمْ إِلَيْنَا لَا تُرْجَعُونَ
(అఫహసిబ్తుమ్ అన్నమా ఖలఖ్నాకుమ్ అబసవ్ వఅన్నకుమ్ ఇలైనా లా తుర్ జఊన్)
“మేము మిమ్మల్ని ఏదో ఆషామాషీగా (అర్థరహితంగా) పుట్టించామనీ, మీరు మా దగ్గరకు మరలిరావటం అనేది జరగని పని అని అనుకున్నారా?”(23:115)

అలా కాదు. ఒక ఉద్దేశపరంగా మిమ్మల్ని పుట్టించాము. అదేంటి? ఆ అల్లాహ్ యొక్క ఆరాధన మనం చేయడం. అందుకొరకే, ఖుర్ఆన్ లో అనేక సందర్భాలలో అల్లాహ్ తన రుబూబియత్ కు సంబంధించిన నిదర్శనాలు చూపించి, వెంటనే ఉలూహియత్ వైపునకు అల్లాహ్ త’ఆలా ఆహ్వానిస్తాడు. ఉదాహరణకు, ఇప్పుడు నేను చదివినటువంటి ఆయతే చూడండి. సూరత్ అన్ఆమ్, సూరహ్ నంబర్ ఆరు, ఆయత్ నంబర్ 102, ‘జాలికుముల్లాహు రబ్బుకుమ్’ – ఆయనే మీ ప్రభువు. అల్లాహ్ మీ ప్రభువు. ‘లా ఇలాహ ఇల్లా హువ’ – ఆయన తప్ప ఎవరు కూడా మీకు ఆరాధ్యనీయుడు కాడు. ఆయనే మిమ్మల్ని పుట్టించాడు గనక, ప్రతి వస్తువుని పుట్టించాడు గనక, మీరు ఆయన్ని మాత్రమే ఆరాధించండి.

ఇదే విధేయత, ఆరాధనా భావంతో మనం అల్లాహ్ ను వేడుకోవాలని మనకు నేర్పడం జరిగింది. మరియు మనం గనక ప్రత్యేకంగా సూరతుల్ అంబియాలో మరియు వేరే ఇతర సూరాలలో చూస్తే ప్రవక్తలు అందరూ అల్లాహ్ తో ప్రత్యేక వేడుకోలు, దుఆ, అర్ధింపు లాంటి విషయాలు ఎలా అల్లాహ్ తో అడిగేవారు? ‘రబ్బనా’.

రబ్బీ అంటే ఇది ఏకవచనం – ఓ నా ప్రభువా. రబ్బనా – ఓ మా ప్రభువా.

అయితే, ఆదం అలైహిస్సలాం కూడా ఎలా దుఆ చేశారు?

رَبَّنَا ظَلَمْنَا أَنْفُسَنَا
(రబ్బనా జలమ్నా అన్ఫుసనా)
“ఓ మా ప్రభూ! మేము మా ఆత్మలకు అన్యాయం చేసుకున్నాము”

అలాగే ఇబ్రాహీం అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం, హూద్ అలైహిస్సలాం, అయ్యూబ్ అలైహిస్సలాం, యాఖూబ్ అలైహిస్సలాం, ఇంకా ఎందరో ప్రవక్తల దుఆలు ఖుర్ఆన్ లో ఉన్నాయి కదా. ఇతరులతో దుఆ చేయడం ఎంత ఘోరం అన్నటువంటి ఒక వీడియో మాది ఉంది, మీరు చూడండి. ప్రవక్తలందరి దుఆలు ‘రబ్బనా’ తో స్టార్ట్ అవుతాయి. ఎందుకు? అల్లాహ్ యే మనల్ని అన్ని రకాలుగా పోషించి, పెంచి, మన యొక్క అవసరాలు తీర్చి మనల్ని చూసుకుంటూ, మన యొక్క బాగోగులు చూసుకుంటూ ఉండేవాడు. అందుకొరకు ‘రబ్బనా’. అల్లాహ్ యొక్క నామం ఎంత గొప్పదో అది ఇంతకుముందే మనం తెలుసుకున్నాము. కానీ దుఆలో వచ్చేసరికి, ‘రబ్బీ అవ్జిఅనీ అన్ అష్కుర నిఅమతకల్ లతీ’..సులైమాన్ అలైహిస్సలాం వారి యొక్క దుఆ కూడా. ఈ విధంగా అనేక సందర్భాలలో ‘రబ్బీ’ మరియు ‘రబ్బనా’ అన్నటువంటి పదాలతో దుఆ చేయడం మనకు నేర్పడం జరిగింది.

సోదర మహాశయులారా! అల్లాహ్ త’ఆలా రబ్ అయి ఉన్నాడు గనక, మనము అల్లాహ్ యొక్క రబ్ అన్న ఈ పదాన్ని ఎక్కడెక్కడ చదివినా గొప్ప విషయం మనం గమనించాల్సింది ఏమిటంటే, ఈ లోకంలో ఎంతోమంది తమకు తాము రబ్ అన్నటువంటి ఆరోపణ, దావా చేశారు.

ఉదాహరణకు, ఇబ్రాహీం అలైహిస్సలాం కాలంలో నమ్రూద్, మూసా అలైహిస్సలాం కాలంలో ఫిరౌన్. ఇక్కడ వారి యొక్క నమ్మకం ఏంటి? మేము రాజులము గనక, అందరూ ప్రజలు గనక, మా ఇష్టప్రకారమే మీరు జీవితం గడపాలి, మా ఆదేశాలను అనుసరించాలి. అల్లాహ్ ను నమ్మేవారు, వారు కూడా. “అల్లాహ్ కాకుండా మేము పుట్టించాము ఈ భూమ్యాకాశాలను, మేము మిమ్మల్ని పుట్టించాము” ఇలాంటి దావా లేకుండింది వారిది. సయ్యద్-ముతా అన్నటువంటి భావనతో, అంటే మాది పెత్తనం, మా మాటే చెల్లాలి, నడవాలి.

అయితే ఈరోజుల్లో కూడా ఎవరికైనా ఏదైనా అధికారం దొరికినదంటే, అల్లాహ్ అందరికంటే గొప్పవాడు ఉన్నాడు, అసలైన రబ్ అతను, అసలైన విధేయత అతనిది, మనం ఆరాధించవలసినది అల్లాహ్ ను అన్న విషయాన్ని మరచిపోయి, అల్లాహ్ యొక్క మాటకు వ్యతిరేకమైన, నేను నాయకుడిని నా మాట మీరు వినాలి అన్నటువంటి గర్వానికి ఏదైతే గురి అవుతారో, వారు కూడా భయపడాలి ఫిరౌన్ లాంటి గతి వారిది అవుతుంది అని. అందుకొరకే ఎల్లవేళల్లో అల్లాహు త’ఆలా తో భయపడి, అల్లాహ్ ను రబ్ అని ఏదైతే మనం నమ్ముతున్నామో,

يَا أَيُّهَا النَّاسُ اعْبُدُوا رَبَّكُمُ
(యా అయ్యుహన్నాసు ఉబుదూ రబ్బకుమ్)
ఓ ప్రజలారా! మీ ప్రభువైన, మీ యొక్క రబ్ అయిన అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి. (2:21)

إِنَّ اللَّهَ رَبِّي وَرَبُّكُمْ فَاعْبُدُوهُ ۚ هَٰذَا صِرَاطٌ مُسْتَقِيمٌ
(ఇన్నల్లాహ రబ్బీ వ రబ్బుకుమ్ ఫఅబుదూహ్, హాదా సిరాతుమ్ ముస్తఖీమ్)
నా ప్రభువు, నా యొక్క రబ్, మీ యొక్క రబ్ అల్లాహ్ మాత్రమే గనక ఆయన్నే ఆరాధించండి. ఇదియే సన్మార్గం.  (3:51)

ఇక ఈ సన్మార్గం నుండి ఎవరైనా దూరమైపోతే వారు చాలా చాలా ప్రమాదంలో పడిపోతారు. ఎల్లప్పుడూ అల్లాహ్ తో క్షమాపణ కోరుకుంటూ ఉండండి.

رَبِّ اغْفِرْ لِي وَلِأَخِي
(రబ్బిగ్ఫిర్లీ వలి అఖీ)
ఓ అల్లాహ్ నన్ను క్షమించు, నా సోదరుని, సోదరులను క్షమించు.(7:151)

رَبِّ اغْفِرْ لِي وَلِوَالِدَيَّ
(రబ్బిగ్ఫిర్లీ వలి వాలిదయ్య)
“ఓ నా ప్రభూ! నన్నూ, నా తల్లిదండ్రులను క్షమించు.” (71:28)

ఈ విధంగా, ఈ రెండు పదాలు ఇప్పుడు నేను చదివానో ఖుర్ఆన్ లో వచ్చినవే. మూసా అలైహిస్సలాం వారి యొక్క దుఆ, నూహ్ అలైహిస్సలాం యొక్క దుఆ ఈ విధంగా.

అలాగే అల్లాహ్ ను రబ్ అని మనం నమ్మే ఈ పదంలో, ఇందులో మనం చాలా బలమైన ఒక గట్టి విశ్వాసం ఏం ఉండాలంటే, ఈ లోకంలో మనం రబ్ అయిన అల్లాహ్ యొక్క విశ్వాసంపై బలంగా ఉన్నప్పుడు, ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి ఆపదలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, ఎంతటి దౌర్జన్యపరుల నుండి మనపై ఎలాంటి హింసా దౌర్జన్యాలు చేయబడినా, ఈ పరీక్షా కాలమైనటువంటి ఒక చిన్న జీవితంలో కొన్ని పరీక్షలు మాత్రమే. వాటిని దూరం చేసేవాడు అల్లాహ్ మాత్రమే. ఈ విషయం మనకు మూసా అలైహిస్సలాం, ఫిరౌన్, ఆ తర్వాత మూసా అలైహిస్సలాం మరియు బనీ ఇస్రాయీల్ యొక్క సంఘటనలో, అలాగే సూరతుల్ ముఅమిన్ లో, సూరతుల్ ముఅమిన్ లో అల్లాహ్ త’ఆలా ఫిరౌన్ వంశానికి సంబంధించిన ఒక విశ్వాసుని సంఘటన ఏదైతే తెలిపాడో, అందులో కూడా ఈ గొప్ప గుణపాఠం ఉంది.

ఎప్పుడైతే ఫిరౌన్ చెప్పాడో, “నన్ను వదలండి నేను మూసాను హత్య చేస్తాను,” అప్పుడు ఆ విశ్వాసుడు వెంటనే నిలబడి ఏమన్నాడు?

وَقَالَ رَجُلٌ مُؤْمِنٌ مِنْ آلِ فِرْعَوْنَ يَكْتُمُ إِيمَانَهُ أَتَقْتُلُونَ رَجُلًا أَنْ يَقُولَ رَبِّيَ اللَّهُ
(వ ఖాల రజులున్ ముఅమినున్ మిన్ ఆలి ఫిరౌన యక్తుము ఈమానహు అతఖ్ తులూన రజులన్ అన్ యఖూల రబ్బియల్లాహ్)
(అప్పటివరకూ) తన విశ్వాసాన్ని గోప్యంగా ఉంచిన, ఫిరౌన్‌ వంశానికి చెందిన విశ్వాసి అయిన ఒక పురుషుడు ఇలా అన్నాడు: “ఏమిటీ, ‘అల్లాహ్‌ నా ప్రభువు’ అని అన్నంత మాత్రానికే ఒక వ్యక్తిని మీరు చంపేస్తారా? (40:28)

నా ప్రభువు, నా యొక్క రబ్ అల్లాహ్ మాత్రమే అని చెప్పే ఇలాంటి వ్యక్తిని మీరు చంపుతారా? ఇంకా అతని పూర్తి సంఘటన మీరు చదవండి, సూరత్ అల్-ముఅమిన్, దీని యొక్క రెండవ పేరు గాఫిర్, సూరహ్ నంబర్ 40, ఆయత్ నంబర్ 28 నుండి ఈ సంఘటన మొదలవుతుంది.

అల్లాహ్ త’ఆలా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ యొక్క గొప్ప నామముల, మంచి పేర్ల ఏ వివరాలు తెలుసుకుంటున్నామో, దాని పరంగా మన విశ్వాసం ఉండి, అన్ని రకాల షిర్కులకు, మూఢనమ్మకాలకు అల్లాహ్ మనల్ని దూరం ఉంచుగాక. ఆమీన్.

వ ఆఖిరు దఅవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

అల్లాహ్ (త’ఆలా): https://teluguislam.net/allah/

అల్లాహ్ శుభ నామాల వివరణ – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0tSV7A9HKJzSeM0aIAiYcb

మా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి ఇన్ షా అల్లాహ్:
http://www.youtube.com/user/teluguislam?sub_confirmation=1

మహా ప్రవక్త ముహమ్మద్ ﷺ ఉన్నత వ్యక్తిత్వాన్ని అగౌరవ పరుస్తున్న నేటి పరిస్థితులలో ముస్లింగా మన బాధ్యత [వీడియో]

మహా ప్రవక్త ముహమ్మద్ ﷺ ఉన్నత వ్యక్తిత్వాన్ని అగౌరవ పరుస్తున్న నేటి పరిస్థితులలో ముస్లింగా మన బాధ్యత [వీడియో]
https://youtu.be/2ZKt_5BKDM0 [53 నిముషాలు]
వక్త: షరీఫ్ మదని , వైజాగ్ (హఫిజహుల్లాహ్)
ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వినాల్సిన వీడియో , మీ బంధు మిత్రులకు షేర్ చెయ్యడం మర్చిపోవద్దు సుమా!

మహా ప్రవక్త ﷺ జీవిత చరిత్ర – సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్:
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3A9nJQ26qTrl-iuvWeXrbO

సీరత్ పాఠాలు 12: ప్రవక్త ﷺ గురించి ముస్లిమేతరులు ఎవరేమన్నారు? [వీడియో]
https://teluguislam.net/2020/08/15/seerah-lessons-12/