[14:28 నిముషాలు]
సీరత్ పాఠాలు – 12: ప్రవక్త ﷺ గురించి ఎవరేమన్నారు?
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [14:27 నిముషాలు]
ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) అంతిమ ప్రవక్త [పుస్తకం] నుండి :
ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) గురించి ఎవరేమన్నారు?
కొందరు తత్వవేత్తలు, ఇస్లాం స్టడీ చేసిన పాశ్చాత్య నిపుణులు (orientalists) ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ఇచ్చిన స్టేట్ మెంట్స్ తెలుపుతున్నాము. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గొప్పతనాన్ని, ఆయన ప్రవక్తపదవిని, ఆయన ఉత్తమ గుణాలను వారు ఒప్పుకున్న విషయాల్ని స్పష్టం చేస్తున్నాము. కొందరు ఇస్లామీయ విరోధులు, శత్రువులు చేస్తున్న దుష్ప్రచారానికి, పక్షపాతానికి ఈ ఇస్లాం ధర్మం దూరంగా ఉంది అని వారు తెలిపిన ఇస్లాం ధర్మ వాస్తవికతలను మీ ముందుంచుతున్నాము. (అయితే ఇస్లాంగానీ, ప్రవక్తగానీ వారి ప్రశంసలకు, సాక్ష్యాలకు ఆధారపడిలేరు. మరి ఇవి తెలిపే కారణం ఏమిటంటే; ఇస్లాంను అర్థం చేసుకోకుండా, దానిని చెడుగా భావించేవారు, వారి వంశం, లేదా వారి లాంటి మతాలపై ఉన్నవారిలో కొందరు ఇస్లాంను చదివి ఎలా అర్థం చేసుకున్నారో అదే విధంగా ఇస్లాం అధ్యాయనం చేసి, న్యాయంపై ఉండాలన్నదే మా ఉద్దేశం).
జోర్జ్ బర్నార్డ్ షా:
George Bernard Shaw. జననం 26/7/1856.
మరణం 2/11/1950. జన్మ స్థలం Ireland.
జోర్జ్ బర్నార్డ్ షా తన రచన “ముహమ్మద్”లో (బ్రిటిష్ ప్రభుత్వం ఈ పుస్తకాన్ని కాల్చేసింది) ఇలా వ్రాశాడుః “ఈ నాటి సమాజానికి ముహమ్మద్ లాంటి మేధావి అవసరం చాలా ఉంది. ఈ ప్రవక్త ఎల్లప్పుడూ తన ధర్మాన్ని గౌరవ స్థానంలో ఉంచాడు. ఆయన తీసుకొచ్చిన ధర్మం ఇతర నాగరికతలను అంతమొందించే అంతటి శక్తి గలది. శాశ్వతంగా ఎల్లప్పుడూ ఉండునది. నా జాతి వాళ్ళల్లో చాలా మంది స్పష్టమైన నిదర్శనంతో ఈ ధర్మంలో ప్రవేశిస్తున్నది నేను చూస్తున్నాను. సమీపం లోనే ఈ ధర్మం యూరపు ఖండంలో విశాలమైన చోటు చేసుకుంటుంది”.
ఇంకా ఇలా వ్రాశాడు: “అజ్ఞానం, లేదా పక్షపాతం వల్ల మధ్య శతాబ్థి (Middle Ages) లోని క్రైస్తవ మత పెద్దలు ముహమ్మద్ తీసుకొచ్చిన ధర్మాన్ని అంధవికారంగా చిత్రీకరించి, అది క్రైస్తవ మతానికి శత్రువు అని ప్రచారం చేశారు. కాని నేను ఈ వ్యక్తి (ముహమ్మద్) గురించి చదివాను. అతను వర్ణనాతీతమైన, అపరూపమైన వ్యక్తి. ఆయన క్రైస్తవమతానికి శత్రువు ఎంత మాత్రం కారు. ఆయన్ను మానవ జాతి సంరక్షకుడని పిలవడం తప్పనిసరి. నా దృష్టిలో ఆయన గనక నేటి ప్రపంచ పగ్గాలు తన చేతిలో తీసుకుంటే మన సమస్యల పరిష్కార భాగ్యం ఆయనకు లభిస్తుంది. నిజమైన శాంతి, సుఖాలు ప్రాప్తమవుతాయి. అవి పొందడానికే మానవులు పరితపిస్తున్నారు.
థోమస్ కార్లైల్:
Thomas Carlyle జననం 4/12/1795 స్కాట్లాండ్ లోని Ecclefechan గ్రామంలో. మరణం 5/2/1881.
లండన్ లో. ప్రఖ్యాతిగాంచిన చరిత్ర కారుడు, సాహిత్య పరుడు.
థోమస్ కార్లైల్ తన ప్రఖ్యాతిగంచిన రచన “On Heroes, HeroWorship, and the Heroic in History”లో ఇలా వ్రాశాడు: “ముహమ్మద్ కుయుక్తుడు, మోసగాడు, అసత్యరూపి మరియు అతని ధర్మం కేవలం బూటకపు, బుద్ధిహీన విషయాల పుట్ట అన్న ప్రస్తుత మన వ్యూహం, మరియు ఇలాంటి వ్యూహాలను వినడం నేటి విద్యాజ్ఞాన యుగంలో మన కొరకే సిగ్గు చేటు. ఇలాంటి మూఢ, సిగ్గుచేటు విషయాలు ప్రభలకుండా పోరాడడం మన విధి. ఈ ప్రవక్త అందజేసిన సందేశం 12 వందల సంవత్సరాల నుండి రెండు వందల మిలియన్లకంటే ఎక్కువ మంది కొరకు ప్రకాశవంతంగా ఉంది. ఈ సందేశాన్ని విశ్వసించి, దాని ప్రకారం తమ జీవితాలను మలచుకొని దానిపై చనిపోయిన ప్రజలు అసంఖ్యాకులు. ఇంతటి గొప్ప వాస్తవం అబద్ధం, బూటకం అని భావించగలమా?”.
రామక్రిష్ణ రావు:
Prof. K. S. Ramakrishna Rao, Head of the Department
of Philosophy, Government College for Women, University of Mysore.
మన ఇండియా తత్వవేత్త రామక్రిష్ణారావు గారు ఇలా చెప్పారు: “అరబ్ ద్వీపంలో ముహమ్మద్ ప్రకాశమయినప్పుడు అది ఓ ఎడారి ప్రాంతం. అప్పటి ప్రపంచ దేశాల్లో నామమాత్రం గుర్తింపు లేని ప్రాంతం అది. కాని ముహమ్మద్ తన గొప్ప ఆత్మ ద్వారా క్రొత్త యుగాన్ని, నూతన జీవితాన్ని, కొత్త సంస్కృతి, సభ్యతను ఏర్పరిచారు. మరియు కొత్త రాజ్యాన్ని నిర్మించారు. అది మొరాకో నుండి ఇండియా ద్వీపకల్పం వరకు విస్తరించింది. అంతే కాదు ఆయన ఆసియా, ఆఫ్రికా మరియు యూరప్ ఖండాల్లోని జీవనశైలి, విచారణా విధానాల్లో గొప్ప మార్పు తేగలిగాడు.
S.M.జ్వీమర్:
Samuel Marinus Zwemer. జననం 12/4/1867.
Michigan. మరణం 2/4/1952. New York.
(S.M. Zweimer) ఇలా వ్రాశాడు: “నిశ్చయంగా ముహమ్మద్ ధార్మిక నాయకుల్లో అతి గొప్పవారు. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. ఆయన శక్తివంతుడైన సంస్కరణకర్త, అనర్గళవాగ్ధాటి, ధైర్యంగల అతిసాహసి, సువిచారం చేయు గొప్ప మేధావి అని అనడమే సమంజసం. ఈ సద్గుణాలకు విరుద్ధమైన విషయాలు ఆయనకు అంకితం చేయుట ఎంత మాత్రం తగదు, యోగ్యం కాదు. ఆయన తీసుకొచ్చిన ఈ ఖుర్ఆన్ మరియు ఆయన చరిత్ర ఇవి రెండూ ఆయన సద్గుణాలకు సాక్ష్యం.
విలియం మోయిర్:
Sir William Muir. జననం 27/4/1819. UK.
మరణం 11/7/1905. UK.
సర్ విలియమ్ యోయిర్ (Sir William Muir) ఇలా చెప్పాడు: “ముహమ్మద్ -ముస్లిముల ప్రవక్త- చిన్నప్పటి నుండే అమీన్ అన్న బిరుదు పొందారు. ఆయన ఉత్తమ నడవడిక, మంచి ప్రవర్తనను బట్టి ఆయన నగరవాసులందరూ ఏకంగా ఇచ్చిన బిరుదు ఇది. ఏదీ ఎట్లయినా, ముహమ్మదు వర్ణనాతీతమైన శిఖరానికి ఎదిగి యున్నారు. ఏ వ్యక్తి ఆయన గురించి వర్ణించగలడు?. ఆయన్ను ఎరగనివాడే ఆయన గౌరవస్థానాన్ని ఎరగడు. ఆయన గురించి ఎక్కువగా తెలిసినవాడు ఆయన గొప్ప చరిత్రను నిశితంగా పరిశీలించినవాడు. ఈ చరిత్రనే ముహమ్మదును ప్రవక్తల్లో మొదటి స్థానంలో మరియు విశ్వమేధావుల్లో ఉన్నతునిగా చేసింది.
ఇంకా ఇలా అన్నాడుః “ముహమ్మద్ తన స్పష్టమైన మాట, సులభమైన ధర్మం ద్వారా సుప్రసిద్ధులయ్యారు. మేధావుల మేధను దిగ్ర్భమలో పడవేసిన పనులు ఆయన పూర్తి చేశారు. అతి తక్కువ వ్యవధిలో అందరినీ జాగరూక పరచిన, అప్రమత్తం చేసిన, నశించిపోయిన సద్గుణాల్లో జీవం పోసిన, గౌరవ మర్యాదల ప్రతిష్ఠను చాటి చెప్పిన ఇస్లాం యొక్క ప్రవక్త ముహమ్మద్ లాంటి సంస్కరణకర్త చరిత్రలో ఎవ్వరూ మనకు కనబడరు.
లియో టోల్స్ టాయ్:
Leo Tolstoy Nikolayevich. జననం 9/9/1828
Tula Oblast, Russia. మరణం 20/11/1910
ప్రపంచపు గొప్ప నవలా రచయిత, తత్త్వవేత్త
గొప్ప నవలారచయిత, తత్వవేత్త రష్యాకు చెందిన లియో టోల్స్ టాయ్ ఇలా చెప్పాడు: “ముహమ్మద్ విఖ్యాతి, కీర్తి గౌరవానికి ఇది ఒక్క విషయం సరిపోతుంది: ఆయన అతి నీచమైన, రక్తపాతాలు సృష్టించే జాతిని, సమాజాన్ని దుర్గుణాల రాక్షసి పంజాల నుండి విడిపించారు. వారి ముందు అభివృద్ధి, పురోగతి మార్గాలు తెరిచారు. ముహమ్మద్ ధర్మశాస్త్రం కొంత కాలంలో విశ్వమంతటిపై రాజ్యమేలుతుంది. ఎందుకనగా ఆ ధర్మానికి బుద్ధిజ్ఞానాలతో మరియు మేధ వివేకాలతో పొందిక, సామరస్యం ఉంది.
ఆస్ట్రియా దేశస్తుడైన షుబ్రుక్ చెప్పాడుః ముహమ్మద్ లాంటి వ్యక్తి వైపు తనకు తాను అంకితం చేసుకోవడంలో మానవజాతి గర్వపడుతుంది. ఎందుకనగా ఆయన చదువరులు కానప్పటికీ కొద్ది శతాబ్ధాల క్రితం ఒక చట్టం తేగలిగారు. మనం ఐరోపాకు చెందిన వాళ్ళం గనక దాని శిఖరానికి చేరుకున్నామంటే మహా అదృష్టవంతులమవుతాము.
వస్సలాము అలైకు వరహ్మతుల్లాహి వబరకాతుహు
సీరత్ ముందు పాఠాలు :
- సీరత్ పాఠాలు 1: శుభ జననం, ఏనుగుల సంఘటన [వీడియో]
- సీరత్ పాఠాలు 2: పోషణ,వ్యాపారం,వివాహం [వీడియో]
- సీరత్ పాఠాలు 3: ప్రవక్త పదవి, ప్రచారం [వీడియో]
- సీరత్ పాఠాలు 4: హబషాకు హిజ్రత్ (వలస), దుఃఖ సంవత్సరం [వీడియో]
- సీరత్ పాఠాలు 5: చంద్రుడు రెండు ముక్కలగుట, మేరాజ్ సంఘటన, తాయిఫ్ ప్రయాణం,మదీనావాసులు ఇస్లాం స్వీకరించుట [వీడియో]
- సీరత్ పాఠాలు 6: మదీనాకు హిజ్రత్ (వలస), బద్ర్ యుద్ధం [వీడియో]
- సీరత్ పాఠాలు 7: ఉహుద్ యుద్ధం నుండి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మరణం వరకు [వీడియో]
- సీరత్ పాఠాలు 8: సహజ గుణాలు, సద్గుణాలు, మహిమలు [వీడియో]
- సీరత్ పాఠాలు 9: ప్రవక్త గారి పరిహాసం, బాలలతో అనురాగం, ఇంటి వారితో ప్రవక్త గారి వ్యవహారం, ప్రవక్త గారి కారుణ్యం [వీడియో]
- సీరత్ పాఠాలు 10: ప్రవక్త ﷺ వారి ఓపిక, సహనాలు [వీడియో]
- సీరత్ పాఠాలు 11: ప్రవక్త ﷺ వారి జుహ్ద్, వస్త్రాధారణ, న్యాయం [వీడియో]
ఇతరములు:
You must be logged in to post a comment.