దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
హిజ్రీ క్యాలెండర్ ఆవశ్యకత | Importance of Hijri Calendar [వీడియో] [21 min] https://teluguislam.net/2022/08/01/importance-of-hijri-calendar/ ప్రస్తుతం మనం క్రొత్త హిజ్రీ సంవత్సరం లోకి ప్రవేశించాము (హిజ్రీ 1444). ముహర్రం మాసం హిజ్రీ క్యాలెండరు లోని మొదటి నెల. హిజ్రత్ అంటే వలస పోవడం. మక్కా నుండి మదీనా కు హిజ్రత్ చేయడం పురస్కరించుకొని ఈ హిజ్రీ క్యాలెండరు తయారు అయింది
మొహర్రం నెల మరియు ఆషూరా దినం | జాదుల్ ఖతీబ్ https://teluguislam.net/?p=29531 1) మొహర్రం మాసం ప్రాధాన్యత 2) నాలుగు నిషిద్ధ మాసాలు మరియు వాటి ప్రత్యేక ఆదేశాలు 3) దుష్కార్యాల ప్రభావాలు 4) మొహర్రం నెలలో శోక గీతాలాపన (నోహా) మరియు హాహాకారాలు (మాతం) చేయడం 5) హుస్సేన్ (రదియల్లాహు అన్హు) వీర మరణం 6) మొహర్రం మాసం మరియు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సహచరులు 7) మొహర్రం మాసంలో ఉపవాసం ప్రాధాన్యత 8) చరిత్రలో ఆషూరా దినం ప్రాధాన్యత 9) ఆషూరా దినపు ఉపవాసం ప్రాధాన్యత మరియు మహత్యం
ముహర్రం మరియు ఆషూరా ఘనతలు [28 నిమిషాల వీడియో] ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) https://teluguislam.net/2019/08/29/muharram-and-ashurah-greatness/ కేవలం 28 నిమిషాల ఈ క్లిప్ లో ముహర్రమ్ మాసము అందులోని ఆషూరా (పదవ తేది) ఘనత ఖుర్ఆన్ హదీసుల ఆధారంగా తెలుపడంతో పాటు, ఉపవాసం ఘనత, ఏ రోజుల్లో ఉపవాసం ఉండడం ఉత్తమం అన్న విషయం సహీ హదీసుల ఆధారంగా తెలుపాము.
ముహర్రం ఘనత [వీడియో] [6 నిమిషాలు ] ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) https://teluguislam.net/2019/08/20/muharram-greatness/ అత్యంత పవిత్రమైన నెలలలో ఒకటైన ముహర్రం నెల త్వరలో మన ముందుకు రాబోతున్నది. ఇటువంటి శుభప్రదమైన నెలలో ఎక్కువ పుణ్యాలు సంపాదించిపెట్టే మంచిపనుల గురించి ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవలెను. దీని ద్వారా వారు తమ ఉన్నత స్థితిని మరింతగా అభివృద్ధి పరచుకోవటానికి, చేసిన పాపాలను క్షమింప జేసుకోవటానికి మరియు అల్లాహ్ మెప్పును పొందటానికి ప్రయత్నించేందుకు ఇది ఒక మంచి అవకాశం. [వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)]
ముహర్రం నెల వాస్తవికత https://teluguislam.net/2019/08/27/reality-of-the-month-of-muharram/ ఇది “ఇస్లాంలో అధర్మ కార్యాలు మరియు వాటి ప్రక్షాళణ” అను పుస్తకం నుంచి తీసుకోబడింది. (పేజీలు : 52-66). కూర్పు: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ (హఫిజహుల్లాహ్). ఇందులో కూర్చిన విషయాలు: (1) ముహర్రం నెల విశిష్టత, (2) ముహర్రం నెలలో ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సాంప్రదాయం, (3) అహ్లె బైత్ (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటివారి) విశిష్టత, (4) హజ్రత్ హసన్ మరియు హుసైన్ (రజియల్లాహు అన్హుమా) విశిష్టత, (5) కర్బలా సంఘటన, కర్బలా సంఘటన అనంతరం, (6) మరణానంతరం భాధను తెలిపే ధర్మ విధానం, (7) అతిశయిల్లటం (హద్దు మీరటం), (8) ముహర్రం నెలలో అధర్మ ఆచారాలు
ముహర్రం దురాచారాలు – గౌరవప్రదమైన మాసాల్లో ‘దౌర్జన్యం’ చేసుకోకండి [వీడియో] [6 నిముషాలు] https://teluguislam.net/2019/08/20/bidah-in-muharram/ ఈ వీడియోలో గౌరవప్రదమైన మాసాలు ఏమిటి? వాటిలో చేసేవి, చేయరాని పనులు ఏమిటి? దౌర్జన్యం చేసుకోకండి అని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది, అయితే దౌర్జన్యం అంటే ఏమేమి భావాలు వస్తాయి. ప్రత్యేకంగా ముహర్రంలో మన సమాజంలో జరుగుతున్న దురాచారాలు ఏమిటో తెలుపడం జరిగింది [వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)]
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, వక్త పరలోక చింతన (ఆఖిరత్ కా ఫిక్ర్) యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. సూరా అల్-హషర్ మరియు సూరా అల్-హజ్ నుండి ఖురాన్ వచనాలను ఉటంకిస్తూ, విశ్వాసులు రేపటి కోసం (పరలోకం కోసం) ఏమి సిద్ధం చేసుకున్నారో ఆలోచించాలని మరియు అల్లాహ్‌కు భయపడాలని (తఖ్వా) గుర్తుచేస్తారు. తఖ్వా యొక్క నిజమైన అర్ధాన్ని వివరించడానికి హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) మరియు హజ్రత్ ఉబై బిన్ కాబ్ (రదియల్లాహు అన్హు) మధ్య జరిగిన సంభాషణను ఉదాహరణగా చూపిస్తారు. పాపాలు మరియు ప్రాపంచిక ప్రలోభాలు నిండిన జీవితంలో విశ్వాసాన్ని కాపాడుకోవడమే తఖ్వా అని వివరిస్తారు. సహాబాల జీవితాల నుండి ఉదాహరణలు ఇస్తూ, వారు ప్రాపంచిక జీవితం కంటే పరలోక జీవితానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో వివరిస్తారు. ఆధునిక ముస్లింలు ‘వహన్’ (ప్రపంచ ప్రేమ మరియు మరణ భయం) అనే వ్యాధితో బాధపడుతున్నారని, ఇది వారి బలహీనతకు కారణమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసును ఉటంకిస్తారు. ఇహలోక జీవితం తాత్కాలికమని, పరలోక జీవితమే శాశ్వతమైనదని మరియు శ్రేష్ఠమైనదని ఖురాన్ మరియు కవిత్వం ద్వారా ప్రసంగాన్ని ముగిస్తారు.
أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ (అఊదు బిల్లాహి మినష్షైతానిర్రజీమ్) శపించబడిన షైతాను నుండి నేను అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను.
అల్హందులిల్లాహి వహ్ దహ్, వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బஃదా అమ్మా బஃద్. ఫ అఊదు బిల్లాహిస్సమీయిల్ అలీమ్ మినష్షైతానిర్రజీమ్ మిన్ హమదిహి వ నఫ్ఖిహి వ నఫ్సిహి బిస్మిల్లాహిర్రహ్మా నిర్రహీం.
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ حَقَّ تُقَاتِهِ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسْلِمُونَ (యా అయ్యుహల్లదీన ఆమనుత్తఖుల్లాహ హఖ్ఖ తుఖాతిహి వలా తమూతున్న ఇల్లా వ అన్తుమ్ ముస్లిమూన్) “ఓ విశ్వాసులారా! అల్లాహ్‌కు భయపడవలసిన విధంగా భయపడండి. మరియు ముస్లింలుగా తప్ప మరణించకండి.” (3:102)
వ ఖాలల్లాహు తబారక వ త’ఆలా ఫీ మౌదయిన్ ఆఖర్
سُبْحَانَكَ لَا عِلْمَ لَنَا إِلَّا مَا عَلَّمْتَنَا ۖ إِنَّكَ أَنتَ الْعَلِيمُ الْحَكِيمُ (సుబ్ హానక లా ఇల్మ లనా ఇల్లా మా అల్లమ్తనా ఇన్నక అన్తల్ అలీముల్ హకీమ్) “నీవు పవిత్రుడవు. నీవు మాకు నేర్పినది తప్ప మాకు మరే జ్ఞానమూ లేదు. నిశ్చయంగా నీవు సర్వజ్ఞుడవు, వివేచనాపరుడవు.” (2:32)
తొలగింపబడిన షైతానుకు ఎక్కిన రక్షింప ఉందుటకై అల్లాహ్ యొక్క శరణు వేడుకుంటూ, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, ప్రతిఫల దినానికి యజమాని అయినటువంటి అల్లాహ్ తబారక వ త’ఆలా యొక్క శుభ నామముతో ప్రారంభిస్తున్నాను. అన్ని రకాల పొగడ్తలు, ప్రశంసలు, సకల స్తోత్రములు ఆ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకే అంకితము. ఎవరైతే సమస్త సృష్టిని సృష్టించి, తన అధికార పీఠాన్ని అధిష్టించి, ఆయన సృష్టించినటువంటి సృష్టిరాశులన్నింటిలో కల్లా ఉన్నతమైనటువంటి జీవిగా మానవుడిని మలిచి మరియు వారి వైపునకు సందేశాన్ని జారీ చేసేటటువంటి ఉద్దేశంతో ప్రవక్తల యొక్క పరంపరను ప్రారంభించాడు. ఈ ప్రవక్తల యొక్క పరంపర హజ్రతే ఆదం అలైహిస్సలాతు వస్సలాం నుంచి మొదలుకొని చిట్టచివరి ప్రవక్త, మహనీయుడైనటువంటి ప్రవక్త, ఆదర్శ మహామూర్తి, కారుణ్య మూర్తి, హృదయాల విజేత, జనాబే ముస్తఫా, అహ్మదే ముజ్తబా, ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై తన దైవదౌత్యాన్ని పరిసమాప్తం గావించాడు. అల్లాహ్ తబారక వ త’ఆలా ఈ ధరణిపై ఎంతమంది దైవ ప్రవక్తలనైతే ప్రభవింపజేశాడో, వారందరిపై కూడా అల్లాహ్ తబారక వ త’ఆలా యొక్క శాంతి మరియు కారుణ్యాలు కురిపింపజేయుగాక. ముఖ్యంగా, చిట్టచివరి ప్రవక్త మహనీయుడైనటువంటి ప్రవక్త, ముహమ్మదే అక్రమ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ తబారక వ త’ఆలా యొక్క కోటానుకోట్ల దరూద్లు మరియు సలాములు, శుభాలు మరియు కారుణ్యాలు కురిపింపజేయుగాక. ఆమీన్.
పరలోక చింతన మరియు తఖ్వా
సోదరీ సోదర మహాశయులారా! అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ గ్రంథములో 59వ సూరా, సూరా అల్-హషర్, వాక్య నెంబర్ 18లో అల్లాహ్ త’ఆలా ఇలా అంటున్నాడు:
“విశ్వసించిన ఓ ప్రజలారా! అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. ప్రతి వ్యక్తీ రేపటి (తీర్పుదినం) కొరకు తానేం పంపుకున్నాడో చూసుకోవాలి. ఎల్ల వేళలా అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా మీరు ఏమేం చేస్తున్నారో అల్లాహ్ కనిపెట్టుకునే ఉన్నాడు.” (59:18)
ఒకే వాక్యంలో అల్లాహ్ తబారక వ త’ఆలా ఇక్కడ రెండుసార్లు ‘యా అయ్యుహల్లదీన ఆమనుత్తఖుల్లాహ్’ – ఓ విశ్వాసులారా, మీరు అల్లాహ్ తబారక వ త’ఆలాకు భయపడండి అని చెబుతూ, తర్వాత అల్లాహ్ తబారక వ త’ఆలా వల్ తన్జుర్ నఫ్సుమ్మా ఖద్దమత్ లిగదిన్ వత్తఖుల్లాహ్ మరియు ప్రతీ వ్యక్తి రేపటి కోసం తాను ఏమి తయారు చేసుకున్నాడో దాని గురించి చూసుకోవాలని చెప్పి, దాని తర్వాత మరొక్కసారి అల్లాహ్ తబారక వ త’ఆలా ఒకే వాక్యంలో రెండుసార్లు ‘ఇత్తఖుల్లాహ్’ అల్లాహ్ తబారక వ త’ఆలాకు భయపడండి, రెండుసార్లు తఖ్వా గురించి ప్రస్తావించడం జరిగింది.
అమీరుల్ మోమినీన్ హజ్రతే ఉమర్ ఫారూఖ్ రది అల్లాహు అన్హు గారు హజ్రతే ఉబై బిన్ కాబ్ రది అల్లాహు అన్హు గారిని ప్రశ్నిస్తూ ఈ విధంగా అన్నారు, “తఖ్వా అంటే ఏమిటి?”. హజ్రతే ఉబై బిన్ కాబ్ రది అల్లాహు అన్హు గారు హజ్రతే ఉమర్ రది అల్లాహు అన్హు గారిని ప్రశ్నిస్తున్నారు, “ఓ ఉమర్ రది అల్లాహు అన్హు, అమా సలక్త తరీఖన్ దా షౌకిన్?” ఓ ఉమర్ రది అల్లాహు అన్హు, మీరు మీ జీవితంలో ముళ్ల కంచెలతో నిండి ఉన్నటువంటి ఎక్కడైనా ఒక ఇరుకైనటువంటి మార్గము గుండా మీరు పయనించారా?” అని హజ్రతే ఉమర్ రది అల్లాహు అన్హు వారిని అడిగారు. అప్పుడు హజ్రతే ఉమర్ రది అల్లాహు అన్హు గారు అన్నారు, “ఖాల బలా”, నేను అటువంటి మార్గంపై నడిచాను. హజ్రతే ఉబై బిన్ కాబ్ రది అల్లాహు అన్హు గారు ప్రశ్నిస్తున్నారు, ఒకవేళ నువ్వు అటువంటి మార్గంపై నడిచినట్లయితే, “ఫమా అమిల్త?” నువ్వు అటువంటి మార్గంపై నడిచినప్పుడు నువ్వు ఏం చేశావు అని చెప్పేసి అంటే, హజ్రతే ఉమర్ రది అల్లాహు అన్హు వారు అంటున్నారు, “షమ్మర్తు వజ్తహత్తు”, నేను చాలా కష్టపడ్డాను, చాలా జాగ్రత్తగా నా యొక్క వస్త్రాలు, నా యొక్క బట్టలు వాటికి అంటకుండా, ముళ్ల కంచెలకు తగలకుండా నేను చాలా జాగ్రత్తగా దానిలో నుంచి బయటకు వచ్చేసానని హజ్రతే ఉమర్ రది అల్లాహు అన్హు గారు జవాబు పలుకుతున్నారు. ఉబై బిన్ కాబ్ రది అల్లాహు అన్హు వారు అంటున్నారు, “ఫదాలికత్ తఖ్వా”, ఇదే తఖ్వా అంటే.
కాబట్టి సోదర మహాశయులారా, ఇక్కడ ముళ్ల కంచెలు అంటే మన ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నటువంటి మహాపాపాలు మరి అదే విధంగా అశ్లీలమైనటువంటి కార్యాలు, మరి ఈ ఇరుకైనటువంటి సందు ఏమిటంటే మన జీవితం సోదరులారా, మరి మన జీవితంలో మన చుట్టుపక్కల ఉన్నటువంటి అశ్లీలమైనటువంటి పనులు మరి అదే విధంగా మహాపాప కార్యాల నుండి మనల్ని మనము అదే విధంగా మన యొక్క విశ్వాసాన్ని రక్షించుకుంటూ బయటకు వెళ్లిపోవటమే తఖ్వా.
అల్లాహ్ తబారక వ త’ఆలా సూరా అల్-హషర్ 59వ సూరాలో 18వ వాక్యంలో ఒకే వాక్యంలో రెండుసార్లు ప్రస్తావిస్తున్నాడు: య్యా అయ్యుహల్లదీన ఆమనుత్తఖుల్లాహ్ – ఓ విశ్వసించినటువంటి ప్రజలారా, మీరు భయపడండి దేని గురించి? వల్ తన్జుర్ నఫ్సుమ్మా ఖద్దమత్ లిగదిన్ – అంటే రేపటి కోసం అంటే మీరు పరలోకం కోసం ఏమి తయారు చేసుకున్నారో ఆ విషయంలో మీరు భయపడండి. మరి దాని తర్వాత అల్లాహ్ తబారక వ త’ఆలా మళ్ళీ అంటున్నాడు: వత్తఖుల్లాహ్ ఇన్నల్లాహ ఖబీరుమ్ బిమా త’మలూన్ – ఈ ఇహలోకంలో మీరు ఏం చేస్తున్నారో అల్లాహ్ తబారక వ త’ఆలా దాని గురించి సమస్తము ఎరిగి ఉన్నాడు, కాబట్టి ఆ విషయంలో కూడా మీరు అల్లాహ్ తబారక వ త’ఆలాకు భయపడండి అని ఇటు ఇహలోకము, అటు పరలోకము, ఈ రెండు విషయాల్లో కూడా ఒకే వాక్యంలో అల్లాహ్ తబారక వ త’ఆలా రెండుసార్లు తఖ్వా కలిగి ఉండండి, భయభక్తులు కలిగి ఉండండి అని చెప్పడం జరిగింది.
సూరా అంబియా, 21వ సూరా, ఒకటో వాక్యంలో అల్లాహ్ తబారక వ త’ఆలా మరోచోట ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు:
اقْتَرَبَ لِلنَّاسِ حِسَابُهُمْ وَهُمْ فِي غَفْلَةٍ مُّعْرِضُونَ ప్రజల లెక్కల ఘడియ సమీపించింది. అయినప్పటికీ వారు పరధ్యానంలో పడి, విముఖత చూపుతున్నారు. (21:1)
మానవుల యొక్క లెక్కల గడియ సమీపించింది. అయినా వారు పరధ్యానంలో పడి ఉన్నారు అని అల్లాహ్ తబారక వ త’ఆలా ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు.
ఈ విధంగా అల్లాహ్ తబారక వ త’ఆలా ఈ రెండు వాక్యాల్లో కూడా మనకు పరలోక చింతనను కలుగజేస్తూ, పరలోకం గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతగా ఉందో తెలియజేస్తున్నాడు. సోదర మహాశయులారా, ఖురాన్ గ్రంథంలో అతి ముఖ్యంగా ప్రస్తావించబడినటువంటి మూడు ముఖ్యమైనటువంటి అంశాలు. ఒకటి, ఈమాన్ బిల్లాహ్ (అల్లాహ్ తబారక వ త’ఆలా పై విశ్వాసము). రెండు, ఈమాన్ బిర్రుసుల్ (ప్రవక్తలపై విశ్వాసము). మరి మూడవది, ఈమాన్ బిల్ ఆఖిరా (అంటే పరలోకంపై విశ్వాసము). ఈరోజు ఏవైతే మీ వాక్యాలు మీ ముందు ప్రస్తావించబడ్డాయో, ఇందులో అల్లాహ్ తబారక వ త’ఆలా పరలోకం గురించి ప్రస్తావిస్తూ, పరలోక చింతన ఏ విధంగా కలిగి ఉండాలో అల్లాహ్ తబారక వ త’ఆలా తెలియజేస్తున్నాడు.
ప్రళయ దినం యొక్క భయంకర దృశ్యం
సూరా అల్-హజ్, 22వ సూరా, మొదటి వాక్యంలో అల్లాహ్ తబారక వ త’ఆలా ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు:
ఓ ప్రజలారా! మీ ప్రభువుకు భయపడండి. నిశ్చయంగా ప్రళయ సమయాన జరిగే ప్రకంపనం మహా (భీకర) విషయం.ఆనాడు మీరు దాన్ని చూస్తారు. పాలుపట్టే ప్రతి తల్లీ పాలు త్రాగే తన పసికందును మరచిపోతుంది. గర్భవతుల గర్భాలూ పడిపోతాయి. ప్రజలు మైకంలో తూలుతున్నట్లు నీకు కనిపిస్తారు. వాస్తవానికి వారు మైకంలో ఉండరు. అయితే అల్లాహ్ (తరఫున వచ్చిపడిన) విపత్తు అత్యంత తీవ్రంగా ఉంటుంది. (22:1-2)
అల్లాహ్ తబారక వ త’ఆలా ఈ వాక్యంలో ఇలా ప్రస్తావిస్తున్నాడు: “యా అయ్యుహన్నాసుత్తఖూ రబ్బకుమ్” – ఓ మానవులారా, మీ ప్రభువు పట్ల మీరు భయపడండి. “ఇన్న జల్జలతస్సాఅతి షైయున్ అజీమ్” – ఎందుకంటే ప్రళయం రోజు వచ్చేటటువంటి జల్జలా (భూకంపము) అది ఎంతో భయంకరమైనటువంటిది. ఆ రోజు ఎంత భయంకరంగా ఉంటుందంటే అల్లాహ్ తబారక వ త’ఆలా అంటున్నాడు: “యౌమ తరౌనహా తద్ హలు కుల్లు ముర్దిఅతిన్ అమ్మా అర్దఅత్” – ఆ రోజు ఆవరించినప్పుడు పాలిచ్చేటటువంటి ప్రతి స్త్రీ తన చంటిబిడ్డను మరచిపోవటాన్ని, గర్భవతి అయిన ప్రతి స్త్రీ తన గర్భాన్ని కోల్పోవటాన్ని నీవు చూస్తావు. “వతరన్నాస సుకారా వమాహుమ్ బిసుకారా వలాకిన్న అదాబల్లాహి షదీద్” – మరియు మానవులందరినీ మత్తులో ఉన్నట్లు నీవు చూస్తావు, కానీ వాస్తవానికి వారు త్రాగి మత్తులో ఉండరు. కానీ అల్లాహ్ తబారక వ త’ఆలా శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందంటే ఆ శిక్షను చూసి, ఆ ప్రళయాన్ని చూసి వారి మతిస్థిమితం పోతుంది అని దైవం ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు.
కాబట్టి సోదర మహాశయులారా, మనిషి జీవితంలో ఇహపరలోకాలలో సాఫల్యం చెందడానికి కావలసినటువంటి ముఖ్యమైనటువంటి వాటిలో ఒక ముఖ్యమైనటువంటి అంశము పరలోక చింత. అయితే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అనుచరులు, సహాబాలలో పరలోక చింత ఎంతగా ఉండేదంటే వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెనకాలే నమాజులు చదివేటటువంటి వారు, వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పగానే ఉపవాసాలు ఉండేటటువంటి వారు, వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆజ్ఞాపించగానే జకాత్‌ను చెల్లించేటటువంటి వారు. మరి అదే విధంగా వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పగానే అల్లాహ్ తబారక వ త’ఆలా యొక్క మార్గంలో పోరాడడానికి కూడా వారు వెనకాడినటువంటి వారు కాదు.
అయినప్పటికీ కూడా సహాబాలలో పరలోక చింత ఎంతగా ఉండేది అంటే, ఉదాహరణకు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే, హజ్రతే ముఆద్ బిన్ జబల్ రది అల్లాహు అన్హు గారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఈ విధంగా ప్రస్తావిస్తున్నారు: “ఖాల యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇஃదిల్లీ అస్అలుక అన్ కలిమతిన్ ఖద్ అమ్రదత్నీ వ అస్ఖమత్నీ వ అహ్జనత్నీ.” ఫఖాల నబియ్యుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం “సల్నీ అమ్మా షిஃతా.” హజ్రతే ముఆద్ బిన్ జబల్ రది అల్లాహు అన్హు గారు అంటున్నారు, ఈ హదీసును ముస్నదే అహ్మద్‌లో ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ రహమహుల్లాహ్ గారు 22,122వ నెంబర్ హదీసులో తీసుకొచ్చారు. హజ్రతే ముఆద్ బిన్ జబల్ రది అల్లాహు అన్హు వారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రశ్నిస్తున్నారు: “ఓ ప్రవక్తా, నా లోపల ఒక రకమైనటువంటి చింత ఉంది. అది నన్ను లోలోపల నుంచి ఎంతగా తినేస్తుందంటే, ఖద్ అమ్రదత్నీ వ అస్ఖమత్నీ వ అహ్జనత్నీ – నన్ను బాధకు గురిచేస్తుంది, నా లోలోపలే అది తినేస్తుంది.” ఎలాగైతే సోదరులారా, ఒక వ్యక్తి యవ్వనుడైనప్పటికీ కూడా అతని లోపల బాధ గనుక, దుఃఖము గనుక లోలోపల అతన్ని తినివేస్తూ ఉన్నప్పుడు, అతడు ఎంత యవ్వనుడున్నా కూడా ఆ యవ్వనము ఉన్నప్పటికీ కూడా అతని ముఖంపై ముసలి యొక్క కవళికలు కనిపించడం ప్రారంభమవుతాయి. హజ్రతే ముఆద్ బిన్ జబల్ రది అల్లాహు అన్హు గారిని చూసి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడుగుతున్నారు, “ఓ ముఆద్, అదేమిటో అడుగు. ఇస్సల్నీ అమ్మా షిஃతా – ఏమిటో అడుగు” అంటే, ముఆద్ బిన్ జబల్ రది అల్లాహు అన్హు గారు సోదర మహాశయులారా అడుగుతున్నారు. ఏమన్నారంటే: “యా నబియ్యల్లాహ్, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, హద్దిస్నీ బి అమలిన్ యుద్ఖిల్నియల్ జన్నహ్” – ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, స్వర్గములో ఎలా ప్రవేశించాలో ఏదైనా అమలు ఉంటే అది చెప్పండి అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో మాద్ బిన్ జబల్ రది అల్లాహు అన్హు గారు ప్రస్తావిస్తున్నారు. ఈ హదీసును ఇమామ్ అల్బానీ రహమహుల్లాహ్ గారు సహీగా ధృవీకరించారు.
అయితే సోదరులారా, ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, సహాబా అనుచరులు, వారు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెనక నమాజులు చదువుతూ కూడా, వారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆజ్ఞను శిరసావహిస్తూ కూడా, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఎంతో మంది సహాబాలు అడుగుతున్నారు, “దుల్లనీ అలా అమలిన్ ఇదా అమిల్తుహు దఖల్తుల్ జన్నహ్” – ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఆ ఆచరణ ఏదైనా ఉంటే చెప్పండి, దాన్ని చేసి నేను స్వర్గంలో ప్రవేశించడానికి. ఏ విధంగా సహాబాలలో పరలోకం అనేటటువంటి చింత ఎంత అధికంగా ఉండేదో మనం ఇక్కడ గమనించగలం.
అంతేకాదు సోదరులారా, హజ్రతే అబూదర్ రిఫారీ రది అల్లాహు అన్హు వారైతే ఆయన అంటున్నారు, నన్ను గనక ఒక వృక్షంగాను అల్లాహ్ తబారక వ త’ఆలా చేసి ఉంటే ఎంత బాగుణ్ణు, ఎవరైనా దాన్ని నరికి వెళ్ళిపోయేటటువంటి వారు, నాకు పరలోకంలో అల్లాహ్ తబారక వ త’ఆలా లేపి నువ్వు ఈ పని ఎందుకు చేశావు అనేటటువంటి అడిగేటటువంటి ప్రసక్తి ఉండేది కాదేమో అని ఈ విధంగా సహాబాలు దుఃఖించేటటువంటి వారు.
ముస్నద్ ఏ అహ్మద్ లో 13,150వ హదీసులో హజ్రతే ఆయిషా రది అల్లాహు అన్హా వారి యొక్క ఉల్లేఖనంలో ఈ హదీస్ వస్తుంది. ఆయిషా రది అల్లాహు అన్హా వారు అంటున్నారు, “సమిஃతున్నబియ్య సల్లల్లాహు అలైహి వసల్లం యఖూలు ఫీ బஃది సలాతిహి, అల్లాహుమ్మ హాసిబ్నీ హిసాబయ్యసీరా.” హజ్రతే ఆయిషా రది అల్లాహు అన్హా వారు అంటున్నారు, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన చదివేటటువంటి నమాజుల్లో కొన్నింటిలో ఈ విధంగా ప్రార్థించేటటువంటి వారు: “అల్లాహుమ్మ హాసిబ్నీ హిసాబయ్యసీరా” – ఓ అల్లాహ్, నా యొక్క లెక్కలను తేలికపాటి లెక్కలుగా నువ్వు తీసుకో. అమ్మా ఆయిషా రది అల్లాహు అన్హా వారు అడుగుతున్నారు, “ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ తేలికపాటి లెక్కలంటే ఏమిటి?” అని ఆయిషా రది అల్లాహు అన్హా వారు హజ్రతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడుగుతున్నారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జవాబు చెబుతూ అంటున్నారు, “ఖాల అయ్ యన్జుర ఫీ కితాబిహి ఫయతజావదు అన్హు.” దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, “ఓ ఆయిషా, నువ్వు భలే ప్రశ్నలు వేస్తావే! వాస్తవానికి తేలికపాటి లెక్కలంటే ఏమిటంటే అల్లాహ్ తబారక వ త’ఆలా తన దాసుల యొక్క కర్మపత్రాలను చూసిన తర్వాత వారిని అట్టే విడిచిపెట్టటము లేక వారిని అలాగే క్షమించివేయటము ఇదే తేలికపాటి లెక్కలు. ఎందుకంటే ఆయిషా, ఒకవేళ అల్లాహ్ తబారక వ త’ఆలా గనక ప్రశ్నించటం ప్రారంభిస్తే, ఆయన ప్రశ్నించేటటువంటి జవాబులు చెప్పేటటువంటి ధైర్యము గానీ లేక జవాబు చెప్పేటటువంటి స్తోమత ఎవరికీ ఉంటుంది? ఒకవేళ అల్లాహ్ తబారక వ త’ఆలా గనక ప్రశ్నించటం మొదలుపెడితే, వివరంగా అడగటం మొదలుపెడితే ఆ వ్యక్తి నాశనమైపోతాడు” అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ హదీసులో ప్రస్తావిస్తున్నారు.
ఈ హదీస్ ద్వారా మనకు తెలిసినటువంటి విషయం ఏమిటంటే, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఎంతగా పరలోకం గురించి చింతన చెందేటటువంటి వారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. అయితే సోదర మహాశయులారా, ఒకసారి మన జీవితాల్ని మనం చూసుకున్నట్లయితే, మన జీవితాల్లో మనం నడుస్తున్నటువంటి మార్గం ఏమిటి? వాస్తవానికి మనం పరలోక జీవితం గురించి ఆలోచించి మన యొక్క జీవితాన్ని గడుపుతున్నామా? ఇహలోక జీవితంలో పడిపోయి పరలోక జీవితాన్ని మరచి నడుస్తున్నామా? అల్లాహ్ తబారక వ త’ఆలా అందుకనే ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు, “ఇఖ్ తరబలిన్నాసి హిసాబుహుమ్ వహుమ్ ఫీ గఫ్లతిమ్ ముஃరిదూన్” – ప్రజల యొక్క లెక్కల గడియ సమీపిస్తున్నప్పటికీ కూడా ప్రజలు మాత్రం పరధ్యానంలో పడి ఉన్నారని దైవం అంటున్నాడు.
‘వహన్’ అనే వ్యాధి
అందుకనే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరొక హదీసులో ఈ విధంగా ప్రస్తావిస్తున్నారు. అబూ దావూద్ లో 4297వ నెంబర్ లో హదీస్ ఈ విధంగా ప్రస్తావించబడింది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా అంటున్నారు: “యూషికుల్ ఉమము అన్ తదాఅ అలైకుమ్ కమా తదాఅల్ అకలతు ఇలా ఖస్అతిహా.” ఫఖాల ఖాయిలున్ వమిన్ ఖిల్లాతిన్నహ్ను యౌమయిదిన్? ఖాల “బల్ అన్తుమ్ యౌమయిదిన్ కసీరున్ వలాకిన్నకుమ్ గుసాఅన్ క గుసాయిస్సైల్. వలయన్ది అన్నల్లాహు మిన్ సుదూరి అదువ్వికుముల్ మహాబత మిన్కుమ్, వలయఖ్దిఫన్నల్లాహు ఫీ ఖులూబికుముల్ వహన్.” ఫఖాల ఖాయిలున్ “యా రసూలల్లాహ్, వమల్ వహన్?” ఖాల “హుబ్బుద్దునియా వకరాహియతుల్ మౌత్.”
ప్రళయానికి సమీప కాలంలో ముస్లిం సమాజంపై ఇస్లాం వ్యతిరేక శక్తులన్నీ కూడా ఆ విధంగా విరుచుకొని పడతాయి, ఏ విధంగానైతే వడ్డించినటువంటి విస్తరిపై ఆకలితో ఉన్నటువంటి జంతువు విరుచుకొని పడుతుందో. అప్పుడు ఒక అతను అడుగుతున్నాడు, “ఫఖాల ఖాయిలున్ వమిన్ ఖిల్లాతిన్నహ్ను యౌమయిదిన్” – ఆ సమయంలో మా యొక్క సంఖ్య అతి స్వల్పంగా ఉంటుందా? అని అంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, లేదు, “బల్ అన్తుమ్ కసీరున్ వలాకిన్నకుమ్ గుసాఅన్ క గుసాయిస్సైల్.” మీరు ఆ సమయంలో అత్యధికంగా ఉంటారు, కానీ మీ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే నీటికి విరుద్ధంగా నురగ మాదిరిగా మీరు మారిపోయి ఉంటారు. ఎలాగైతే సముద్రంలో ఉండేటటువంటి నురగ ఉంటుందో. వాస్తవానికి ఇక్కడ ఆలోచించినట్లయితే సోదర మహాశయులారా, ఎవరైనా దాహము, దప్పికతో ఉంటే ఒక గ్లాసు నీళ్లు అతనికి దప్పిక తగ్గడానికి, దాహం తీరడానికి మనం ఇచ్చినట్లయితే అతడు ఆ గ్లాసు నీళ్లు తాగి దాహాన్ని తీర్చుకోగలడు గానీ అదే గనక మనం అదే గ్లాసులో మనం ఒక గ్లాసు నురగ అతనికి ఇచ్చినట్లయితే ఆ నురగతో అతనికి ఏ విధమైనటువంటి ప్రయోజనం కలగదు. ఎందుకంటే నీటికి విలువ ఉంది గానీ నురగకు ఆ విలువ ఉండదు. మరి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, నీటికి విరుద్ధంగా నురగ మాదిరిగా మీరు మారిపోతారు. మరి అటువంటి సమయంలో ఏమి జరుగుతుంది? “వలయన్ది అన్నల్లాహు మిన్ సుదూరి అదువ్వికుముల్ మహాబత మిన్కుమ్” – మీ యొక్క శత్రువుల యొక్క హృదయాల్లో మీ పట్ల ఉన్నటువంటి భయాన్ని అల్లాహ్ తబారక వ త’ఆలా తొలగిస్తాడు. మరి అదే విధంగా, “వలయఖ్దిఫన్నల్లాహు ఫీ ఖులూబికుముల్ వహన్” – మీ యొక్క హృదయాలలో అల్లాహ్ తబారక వ త’ఆలా ఆ సమయంలో ఒక రోగాన్ని జనింపజేస్తాడు. ఏమిటండీ ఆ రోగము అంటే, బీపీనా? కాదు సోదరులారా. షుగరా? కాదు సోదరులారా. మరి ఇటువంటి వ్యాధులేమీ కానప్పుడు అది ఏ వ్యాధి అండీ అంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక వింతైనటువంటి పదాన్ని వినియోగించారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, “వలయఖ్దిఫన్నల్లాహు ఫీ ఖులూబికుముల్ వహన్” – అదేమిటంటే మీ హృదయాల్లో జనించేటటువంటి వ్యాధి, ఆ వ్యాధి పేరే వహన్. మరి ఈ వ్యాధి వహన్ అన్నటువంటిది అరబ్బులో కూడా సహాబాలు కొత్తగా విన్నారు. సహాబాలు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అడుగుతున్నారు, “వమల్ వహను యా రసూలల్లాహ్?” ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ వహన్ అంటే ఏమిటి అని అంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, “హుబ్బుద్దునియా వకరాహియతుల్ మౌత్” – పరలోక చింత వదిలేసి ఇహలోక వ్యామోహంలో పడిపోవటము ఈ వ్యాధికి ఉన్నటువంటి మొదటి లక్షణము. మరి రెండవ లక్షణం ఏమిటండీ అంటే మరణము అంటే భయము.
అయితే సోదర మహాశయులారా, ఈరోజు మన సమాజంలో మనం చూసుకున్నట్లయితే, మరి మన సమాజం దేని వైపునైతే పరుగెడుతుందో, ఆ పరుగును మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం చెప్పగలిగినటువంటి విషయం ఏమిటంటే ఈరోజు మన సమాజము ఇహలోకం అన్నటువంటి వ్యామోహంలో కొట్టిమిట్టాడుతుంది. పరలోక ధ్యానాన్ని మరిచిపోయి ఉన్నాము. అల్లాహ్ త’ఆలా సూరతుల్ ఆలాలో ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాడు:
بَلْ تُؤْثِرُونَ الْحَيَاةَ الدُّنْيَا ﴿١٦﴾ وَالْآخِرَةُ خَيْرٌ وَأَبْقَىٰ ﴿١٧﴾ కాని మీరు మాత్రం ప్రాపంచిక జీవితానికే ప్రాముఖ్యమిస్తున్నారు.వాస్తవానికి పరలోకం ఎంతో మేలైనది, ఎప్పటికీ మిగిలి ఉండేది. (87:16-17)
అయినప్పటికీ ఎన్ని విషయాలు చెప్పబడ్డాయి, సుహుఫి ఇబ్రాహీమ వ మూసా – ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం గారి యొక్క సహీఫాలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది, మూసా అలైహిస్సలాతు వస్సలాం గారికి కూడా ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది, అయినప్పటికీ కూడా మీ పరిస్థితి ఎలా ఉంది అంటే “బల్ తుஃసిరూనల్ హయాతద్దునియా” – మీరు అయినప్పటికీ ఇహలోక జీవితానికే ప్రాధాన్యతనిస్తున్నారే గానీ, పరలోక జీవితం ఎటువంటిది? అల్లాహ్ త’ఆలా అంటున్నాడు, “బల్ తుஃసిరూనల్ హయాతద్దునియా వల్ ఆఖిరతు ఖైరువ్ వ అబ్ఖా.” వాస్తవానికి ఇహలోక జీవితం కన్నా పరలోక జీవితం ఎంతో మేలైనటువంటిది. ఎందుకంటే అది కలకాలం ఉండిపోయేటటువంటిది. ఇహలోక జీవితం అంతమైపోయేటటువంటిది.
అందుకనే సోదర మహాశయులారా, ఒక కవి తెలుగులో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు:
ఇల్లు వాకిలి నాటి ఇల్లాలు నాదనుచు ఎల భ్రమచితివోయి మనసా! కాలూని వలలోన కానేక చిక్కేవు కడచేరుటే త్రోవ మనసా! తనయులు చుట్టాలు తనవారని నమ్మి తలపోయకే వెర్రి మనసా! నీ తనువు వెళ్ళేడి సమయంబు లోపల నీవెంట రాదేది మనసా!
ఇల్లు, వాకిలి, నీవు కట్టుకున్నటువంటి ఇల్లాలు ఇవన్నీ నీవే అని అనుకుంటున్నావు. కాలూని వలలోన కానేక చిక్కేవు, కడచేరుటే త్రోవ మనసా. బంధుత్వం అన్నటువంటి వలలో చిక్కుకొని పోయావు, మరి ఈ బంధుత్వాన్ని బ్యాలెన్స్ గా చేసుకొని ఇహపరలోకాలలో సాఫల్యం చెందటం అంటే మామూలు విషయం కాదు. నీ తనువు వెళ్ళేడి సమయంబు లోపల నీ వెంట రాదేది మనసా. కానీ నీ తనయులు, చుట్టాలు నీ వారని నమ్ముతున్నావేమో, నువ్వు చచ్చిపోయేటప్పుడు నీతో పాటు వచ్చేది కేవలం నువ్వు చేసుకున్నటువంటి నీ పాపపుణ్యాలు తప్ప మరొకటి ఏమీ రాదు అన్నటువంటి విషయాన్ని ఒక కవి కూడా తెలుగులో ఈ విధంగా చక్కగా తన తెలుగు కవితంలో తెలియజేస్తున్నాడు.
అల్లాహ్ తబారక వ త’ఆలా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ అంటున్నాడు, వాస్తవానికి పరలోక జీవితమే అసలైనటువంటి జీవితము. ఇహలోక జీవితము కేవలం ఒక ఆటవినోదం తప్ప మరేమీ కాదు. ఒక మోసపూరితమైనటువంటి జీవితం తప్ప మరేమీ కాదు అని దైవం ఎన్నో చోట్ల అల్లాహ్ తబారక వ త’ఆలా ఖురాన్ గ్రంథంలో ప్రస్తావించడం జరిగింది.
అల్లాహ్ తబారక వ త’ఆలాతో దువా ఏమనగా, అల్లాహ్ తబారక వ త’ఆలా మనందరికీ కూడా పరలోక చింతనను కలిగి ఉండేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఎప్పటివరకైతే మనం ఇహలోకంలో బ్రతికి ఉంటామో అప్పటివరకు కూడా అల్లాహ్ తబారక వ త’ఆలాను ఆరాధిస్తూ బ్రతికి ఉండేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. మరియు ఎప్పుడైతే మనం మరణిస్తామో అల్లాహ్ తబారక వ త’ఆలా వైపునకు విశ్వాస స్థితిలోనే అల్లాహ్ వైపునకు మరలేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
సహాబా : ‘సహాబీ‘కి బహువచనం ‘సహాబా‘. విశ్వాస (ఈమాన్) స్థితిలో దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)ను కలుసుకుని, విశ్వాసస్థితిలో తనువు చాలించిన వారంతా సహాబా (సహచరులు- రది అల్లాహు అన్హుమ్) అనబడతారు.
వారు ముస్లిం సమాజంలో అందరికన్నా శ్రేష్టులని, ఇస్లాం వైపు ముందంజవేసిన వారని, ప్రవక్త సహచర్య భాగ్యం పొందినవారని, ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)తో కలిసి జిహాద్ చేసినవారని, షరీయత్ బరువు బాధ్యతలను మోయటమే గాకుండా దానిని తమ తరువాతి తరాల వారికి అందించిన ధన్యజీవులని, ఈ కారణంగా వారు ప్రపంచంలోనే అత్యుత్తమ సమూహం అని మనం విశ్వసించటం తప్పనిసరి (వాజిబ్). – [నుండి: సహాబా అంటే ఎవరు? వారి గురించి ఎటువంటి నమ్మకం కలిగి ఉండాలి? – డా. సాలెహ్ అల్ ఫౌజాన్]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ఈ ప్రసంగంలో, సహాబాల (ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరులు) యొక్క నిర్వచనం, వారి ఉన్నత స్థానం మరియు ప్రాముఖ్యత వివరించబడింది. వారి జీవిత చరిత్రను తెలుసుకోవడం ఎందుకు ముఖ్యమో హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనతో స్పష్టం చేయబడింది. సహాబాల యొక్క సద్గుణాలను మరియు వారి పట్ల అల్లాహ్ యొక్క ప్రసన్నతను సూరతుల్ ఫతహ్ వంటి ఖుర్ఆన్ ఆయతుల ద్వారా వివరించారు. సహాబాలను దూషించడాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీవ్రంగా ఖండించిన హదీసులు, వారి పట్ల విశ్వాసులు నిర్వర్తించాల్సిన బాధ్యతలు మరియు వారి మధ్య ఉన్న వివిధ స్థాయిల గురించి చర్చించబడింది. సలఫె సాలెహీన్ (పూర్వపు సత్పురుషులు) సహాబాలను ఎలా గౌరవించేవారో అబ్దుల్లా బిన్ ఉమర్ మరియు అబ్దుల్లా ఇబ్నుల్ ముబారక్ వంటి వారి ఉదాహరణలతో వివరించబడింది. సహాబాలను దూషించే వారి పట్ల ఇమామ్ అహ్మద్ వంటి ఇస్లామీయ పండితుల కఠినమైన వైఖరిని కూడా ఈ ప్రసంగం స్పష్టం చేస్తుంది.
సహాబా – నిర్వచనం
సోదర సోదరీమణులారా, సహాబీ ఇది ఏకవచనం, సహాబా ఇది బహువచనం. సహాబియా ఇది ఏకవచనం, స్త్రీలను అంటారు. సహాబియాత్ ఇది బహువచనం, స్త్రీలను అంటారు. ఏ స్త్రీలు? ఏ పురుషులు? సహాబీ అంటే ఎవరైతే విశ్వాస స్థితిలో ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూసి, కలిసి, విశ్వాస స్థితిలోనే చనిపోయారో వారిని సహాబీ అంటారు. ఇక ఒక్కరు పురుషులైతే సహాబీ, ఇద్దరు పురుషులైతే సహాబియాన్, అంతకంటే ఎక్కువ వారిని సహాబా లేదా అస్హాబు ముహమ్మద్, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మిత్రులు అని అనబడుతుంది. ఒక స్త్రీ అయ్యేది ఉంటే, ప్రవక్త సల్లల్లహు అలైహి వసల్లం వారిని చూసి, ప్రవక్త సల్లల్లహు అలైహి వసల్లం వారిపై విశ్వసించి, విశ్వాస స్థితిలో చనిపోయిన స్త్రీ సహాబియా, సహాబియతాన్, సహాబియాత్.
సహాబాల జీవిత చరిత్ర తెలుసుకోవడం ఎందుకు ముఖ్యం?
అయితే సోదర సోదరీమణులారా, వారి జీవిత గాథ తెలుసుకోవడం, వారి జీవిత విషయాలు తెలుసుకోవడం ఎందుకు ముఖ్యము అన్నటువంటి ఒక ప్రశ్న మీరు అడగవచ్చు. అయితే సమాధానం చాలా శ్రద్ధగా వినండి. ఈ సమాధానం నేను నా ఇష్టంతో, నేను నా ఆలోచనతో చెప్పేది కాదు. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తాలా అన్హు, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మిత్రులలో, సహాబాలలో ఒక గొప్ప సహాబీ. ఆయన తెలుపుతున్నారు. ఏమన్నారు ఆయన?
“అల్లాహు తాలా మానవుల హృదయాల పట్ల దృష్టి వేశాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హృదయాన్ని అందరి హృదయాల కంటే ఎంతో ఉత్తమంగా చూశాడు. ఆయన్ని ప్రవక్తగా ఎన్నుకున్నాడు. ఆ తర్వాత, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ప్రజల హృదయాలను వెతికాడు, చూశాడు. సహాబాల హృదయాలను ఎంతో పరిశుద్ధంగా పొందాడు. అల్లాహ్ ఆ సహాబాలను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి స్నేహితులుగా, అండదండగా, వారికి వారి ఈ ప్రచార కార్యక్రమంలో దోహదపడేవారుగా ఎన్నుకున్నాడు“
ఈ సహాబాలు ఎంత గొప్పవారు, ఎంత గొప్ప శ్రేణికి చెందినవారు. అల్లాహు తాలా స్వయంగా ప్రళయ దినం వరకు సురక్షితంగా ఉండేటటువంటి సత్య గ్రంథం, దివ్య గ్రంథం ఖుర్ఆన్ లో వంద కంటే పైగా ఆయతులలో వారిని ప్రశంసించాడు. వారి యొక్క ఉన్నత గుణాలను ప్రస్తావించాడు. వారి యొక్క ఎన్నో మంచి విషయాలను ప్రళయం వరకు వచ్చే ప్రజలందరి కొరకు ఒక మంచి ఆదర్శంగా ఉంటాయని కూడా తెలిపాడు.
ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించిన ఈ సహాబాలు, వారిని విశ్వసించడం మన విశ్వాసంలోని ఒక ముఖ్యమైన భాగం. మనం అల్లాహ్ ను విశ్వసిస్తున్నాము, అల్లాహ్ యొక్క ప్రవక్తలను, వారిలో ప్రత్యేకంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసిస్తాము. ఇంకా విశ్వాసానికి సంబంధించిన ఏ ఏ విషయాలు ఉన్నాయో, వాటిలో ఒక ముఖ్యమైన విషయం సహాబాలను కూడా విశ్వసించడం.
హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తాలా అన్హు చెప్పిన ఒక విషయాన్ని గమనించండి,
أَبَرُّ هَذِهِ الْأُمَّةِ قُلُوبًا (అబర్రు హాదిహిల్ ఉమ్మతి ఖులూబా) సహాబాలు సర్వ విశ్వాసులలో, సర్వ విశ్వాసులలో అతి పరిశుద్ధమైన హృదయాలు గలవారు.
وَأَعْمَقُهَا عِلْمًا (వ అ’మఖుహా ‘ఇల్మా) చాలా లోతుగల జ్ఞానం, విద్య గలవారు.
وَأَقَلُّهَا تَكَلُّفًا (వ అఖల్లుహా తకల్లుఫా) చాలా తక్కువగా వారు ఏదైనా పని చేయడంలో వారి నుండి కావాలని ఏదీ పొరపాటు జరిగేది కాదు మరియు కావాలని ఎలాంటి బాధలలో చిక్కుకునే ప్రయత్నం చేసేవారు కారు.
وَأَحْسَنُهَا حَالًا (వ అహ్సనుహా హాలా) అందరికంటే ఉత్తమ స్థితిలో జీవితం గడిపేవారు.
اخْتَارَهُمُ اللَّهُ لِصُحْبَةِ نَبِيِّهِ وَلِإِقَامَةِ دِينِهِ (ఇఖ్తారహుముల్లాహు లిసుహబతి నబియ్యిహి వలి ఇఖామతి దీనిహి) అల్లాహు తాలా వారిని తన ప్రవక్తకు స్నేహితులుగా ఎన్నుకున్నాడు మరియు తన ఈ ధర్మాన్ని స్థాపించబడటానికి వారిని ఎన్నుకున్నాడు
గమనించారా? అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తాలా అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మక్కాలో ఉండగానే విశ్వసించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఇంచుమించు ఒక 20 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ జీవితం గడిపారు. తొలి రోజుల్లో ఇస్లాం స్వీకరించిన సహాబాలను చూశారు. మదీనా వలస వచ్చిన తర్వాత సహాబాలను చూశారు. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చివరి దశలో ఇస్లాం స్వీకరించిన వారిని కూడా చూశారు. అయితే గమనించండి, వారు సహాబాల గురించి ఎంత గొప్ప విషయం తెలిపారు.
ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం అల్లాహ్ ప్రవక్త. ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం వెంట ఉన్నవారు అవిశ్వాసులకు కొరుకుడు పడనివారు. ఒండొకరి పట్ల మాత్రం దయార్ద్ర హృదయులు. దైవకృపను, దైవప్రసన్నతను చూరగొనే ప్రయత్నంలో వారు (దైవ సన్నిధిలో) వినమ్రులై వంగటాన్ని, సాష్టాంగపడటాన్ని నీవు చూస్తావు. వారి సాష్టాంగ ప్రణామాల ప్రత్యేక ప్రభావం వారి ముఖారవిందాలపై తొణకిస లాడుతూ ఉంటుంది. వీరికి సంబంధించిన ఈ ఉపమానమే తౌరాతులో ఉంది. ఇంజీలులో (కూడా) వారి ఉపమానం ఉంది. అది ఒక పంటపొలం వంటిది. అది తన మొలకను మొలకెత్తించింది. తరువాత దానిని బలపరిచింది. ఆ తరువాత అది లావు అయింది. ఆ పైన అది తన కాండంపై నిటారుగా నిలబడింది, రైతులను అలరించసాగింది – వారి ద్వారా అవిశ్వాసులను మరింత ఉడికించాలని! వారిలో విశ్వసించి, సత్కార్యాలు చేసిన వారికి మన్నింపును, గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తానని అల్లాహ్ వాగ్దానం చేసి ఉన్నాడు. (48:29)
గమనించండి, ఈ రోజుల్లో ఎవరైతే సహాబాలను అగౌరవపరుస్తున్నారో, సహాబాలలో ఏ ఒక్కరి ప్రస్తావన వచ్చినా వారి పట్ల అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారో, ఒకసారి ఈ ఖుర్ఆన్ ఆయత్ ల పట్ల శ్రద్ధ వహించాలి. అల్లాహ్ వారిని ప్రశంసిస్తున్నాడు. వారిలో ఉన్నటువంటి ఉత్తమ గుణాలను ప్రస్తావిస్తున్నాడు. వారి యొక్క ఈ ఉత్తమ గుణాలు కేవలం ఖుర్ఆన్ లోనే కాదు, ఖుర్ఆన్ కంటే ముందు గ్రంథాలు ఏవైతే ఉన్నాయో తౌరాత్ మరియు ఇంజీల్, వాటిలో కూడా వీరి ఉత్తమ గుణాలు ఉన్నాయి అని స్వయంగా అల్లాహ్ సాక్ష్యం పలుకుతున్నాడో, అలాంటి వారిని మనం దూషించడం, అలాంటి వారి గురించి మనం చెడుగా ఆలోచించడం, అలాంటి వారి పట్ల మనం ఏదైనా దుర్భాషలాడటం, ఇది మన విశ్వాసంలో కొరత, మన విశ్వాసానికి చాలా భయంకరమైన ముప్పు కలుగజేస్తుంది.
అల్లాహ్ తాలా వారిని ప్రశంసిస్తూ ఇస్లాం మరియు ఇస్లాం స్వీకరించిన వారి పట్ల ఎంత మృదువుగా, ఎంత ఆప్యాయతతో, కరుణా కటాక్షాలతో వారు జీవితం గడుపుతారంటే, అవిశ్వాసానికి సంబంధించిన విషయాలు మరియు సత్య ధర్మమైన ఇస్లాంకు వ్యతిరేకమున్న విషయాలు వారికి ఏమాత్రం ఇష్టం ఉండవు. నీవు వారిని రుకూ చేస్తూ, సజ్దా చేస్తూ చూస్తూ ఉంటావు. వారు అల్లాహ్ యొక్క కారుణ్యాన్ని, అల్లాహ్ యొక్క సంతృప్తిని కోరుతూ ఉంటారు. మరియు వారి యొక్క సజ్దా గుర్తులు, చిహ్నాలు వారి ముఖాలపై ఎంతో స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఏమన్నాడో గమనించండి అల్లాహు తాలా,
ఇదంతా వారి గురించి ప్రస్తావించి, ప్రశంసించి, “వారి ఈ ఉపమానం తౌరాతులో ఉంది.” ఈ ఉదాహరణలు, ఈ పోలికలు, ఈ ఉత్తమ గుణాలు వారి గురించి ఏవైతే ప్రస్తావించబడ్డాయో, ఇవన్నీ కూడా తౌరాతులలో కూడా ఉన్నాయి. అంటే వీరి గుణాలు ఇలా ఉంటాయి, ఎవరైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసిస్తారో, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహాబాలు ఎవరైతే ఉన్నారో, వారి యొక్క ఈ ఉత్తమ గుణాలు అని తౌరాత్ లో ప్రస్తావన వచ్చి ఉంది. అంతే కాదు, ఇంజీల్ లో ఎలా ఉంది?
“ఇంజీలులో (కూడా) వారి ఉపమానం ఉంది. అది ఒక పంటపొలం వంటిది. అది తన మొలకను మొలకెత్తించింది. తరువాత దానిని బలపరిచింది. ఆ తరువాత అది లావు అయింది. ఆ పైన అది తన కాండంపై నిటారుగా నిలబడింది, రైతులను అలరించసాగింది – వారి ద్వారా అవిశ్వాసులను మరింత ఉడికించాలని! వారిలో విశ్వసించి, సత్కార్యాలు చేసిన వారికి మన్నింపును, గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తానని అల్లాహ్ వాగ్దానం చేసి ఉన్నాడు“.” (48:29)
సహాబాలను దూషించడంపై ప్రవక్త హెచ్చరిక
ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతో స్పష్టంగా తెలిపారు:
لَا تَسُبُّوا أَصْحَابِي (లా తసుబ్బూ అస్ హాబీ) నా సహాబాలను మీరు దూషించకండి.
అంతేకాదు, వారి యొక్క స్థానం ఎంత గొప్పదో అది కూడా ఇదే హదీసులో తెలియబరిచారు. అదేమిటి?
“లవ్ అన్ఫఖ అహదు మిన్కుమ్ మిస్ల ఉహుదిన్ జహబా, మా బలగ ముద్ద అహదిహిమ్ వలా నసీఫహు.” మీలో ఎవరైనా ఉహద్ పర్వతం ఎంత పెద్దగా ఉందో అంత బంగారం అల్లాహ్ మార్గంలో ఖర్చు చేసినా, సహాబాలు సామాన్యంగా ఏదైనా విషయం, ఏదైనా వస్తువు, వారు ఒక ముప్పావు కిలో, 600 గ్రాములు, లేదా 300 గ్రాముల వరకు ఏదైతే ఖర్చు పెట్టారో దానికి సమానం కూడా కాజాలదు. అల్లాహు అక్బర్.
గమనించండి సోదరులారా. ఉహద్ పర్వతం ఎంత పెద్దదో తెలుసా? ఇంచుమించు 7 నుండి 8 కిలోమీటర్ల పొడవు, 2 నుండి 3 కిలోమీటర్ల వెడల్పు మరియు 700 మీటర్ల ఎత్తు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మీలో ఎవరైనా ఉహద్ పర్వతం అంత బంగారం ఖర్చు పెట్టినా, సహాబాలు ఒక 300 గ్రాముల వరకు లేదా ఒక 600, 650 గ్రాముల వరకు ఏదైనా వస్తువు ఖర్చు పెట్టి ఉంటే, మీ ఈ ఉహద్ పర్వతం లాంటి బంగారం అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టడం సహాబాలు చేసిన ఈ పుణ్యానికి, దానానికి సమానంగా కాజాలదు. సహాబాల స్థానంలో, మీ స్థానంలో ఇంత పెద్ద గొప్ప వ్యత్యాసం ఉంది. మీరు ఏ నోట వారిని దూషిస్తారు? ఏ నోట వారిని మీరు చెడుగా ప్రస్తావిస్తారు?
సహాబాల పట్ల మన హక్కులు మరియు బాధ్యతలు
మొదటి హక్కు సహాబాల గురించి మనపై ఉన్నది ఏమిటి? అల్లాహు తాలా లేదా చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఏ ఘనతలు తెలిపారో వాటిని నమ్మడం. వారిలో ఎంతో గొప్ప స్థానంలో, వారి స్థానాల్లో హెచ్చుతగ్గులు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, మొట్టమొదటి స్థానంలో హజ్రత్ అబూబకర్, రెండవ స్థానంలో హజ్రత్ ఉమర్, మూడవ స్థానంలో హజ్రత్ ఉస్మాన్, నాలుగో స్థానంలో హజ్రత్ అలీ రదియల్లాహు అన్హుమ్ వరద్వు అన్. ఇక ఈ నలుగురి తర్వాత, ఇహలోకంలో ఏ పది మంది గురించైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వర్గం యొక్క శుభవార్త ఇచ్చారో వారిలో ఈ నలుగురు వస్తారు, మిగిలిన ఆరుగురు, ఆ తర్వాత బద్ర్ లో పాల్గొన్నవారు. కానీ మొట్టమొదటి హక్కు ఏమిటి? ఎవరి గురించి ఏ ఏ ఘనతలు ఖుర్ఆన్ లో లేదా హదీసుల్లో వచ్చి ఉన్నాయో వాటిని మనం నమ్మాలి. వాటిలో ఏ ఒక్కటిని కూడా తిరస్కరించకూడదు.
ఎందుకో తెలుసా? ఉదాహరణకు, హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు గారి యొక్క ఘనతలో ఖుర్ఆన్ లో కొన్ని ఆయతులు అవతరింపజేయబడ్డాయి. స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్నో హదీసుల్లో ఆయన గురించి ఎన్నో గొప్ప విషయాలు చెప్పారు. వాటిలో ఏ ఒక్కటినీ కూడా మనం తిరస్కరిస్తే, ఇందులో అబూబకర్ స్థానంలో ఏ కొరత ఏర్పడదు. కానీ మనం ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాటలు తిరస్కరించిన వారిలో, అల్లాహ్ యొక్క ఆయతులను తిరస్కరించిన వారిలో అయిపోతాము. ఎప్పుడైతే మనం వారికి ఏ స్థానం ఇవ్వబడినదో దానిని మనం విశ్వసిస్తున్నామో, నమ్ముతున్నామో, అక్కడే వారిలోని ఏ ఒక్కరి పట్ల కూడా మన మనసులో ఏ కీడు కానీ, ఏ కపటం గానీ, ఎలాంటి దోషం కానీ ఉండకూడదు. మన హృదయంలో ఎలాంటి కపటము, ద్వేషము, జిగస్సు ఏదీ కూడా ఉండకూడదు. మన హృదయం వారి గురించి ఎంతో తేటతెల్లగా, స్పష్టంగా ఉండాలి. ఎలాంటి కీడు లేకుండా ఉండాలి.
“ఎవరైతే విశ్వాస స్త్రీ పురుషులను వారి ఏ పాపం లేకుండా, ఏ కారణం లేకుండా వారిని బాధ పెడతారో, వారికి హాని కలుగజేస్తారో, వారు చాలా భయంకరమైన పాపాన్ని మరియు ఒక భయంకరమైన అపనిందను, స్పష్టమైన పాపాన్ని తమ మెడకు కట్టుకున్నవారైపోతారు.“
అందు గురించి అలాంటి వారు భయపడాలి. ఇక్కడ సామాన్యంగా విశ్వాసుల పదం ఏదైతే వచ్చిందో, ఎవరో విశ్వాసులని అనుకోకండి. విశ్వాసుల్లో మొట్టమొదటి స్థానంలో సహాబాలు వస్తారు అన్న విషయం మరవకండి.
కాలాల్లో ఉత్తమమైన కాలం
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటున్నారు? సహీ బుఖారీ, సహీ ముస్లిం ఇంకా వేరే హదీస్ గ్రంథాల్లో ఈ హదీస్ ఉంది:
خَيْرُ النَّاسِ قَرْنِي ثُمَّ الَّذِينَ يَلُونَهُمْ ثُمَّ الَّذِينَ يَلُونَهُمْ (ఖైరున్నాసి ఖర్నీ, సుమ్మల్లజీన యలూనహుమ్, సుమ్మల్లజీన యలూనహుమ్) అన్ని కాలాల్లో అతి ఉత్తమమైన కాలం నాది, మళ్లీ ఆ తర్వాత వచ్చే కాలం, మళ్లీ ఆ తర్వాత వచ్చే కాలం.
అల్లాహు అక్బర్. గమనించండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ ఆ కాలాన్ని అన్ని కాలాల్లో అతి శ్రేష్టమైనదని తెలుపుతున్నారు. ఎందుకు? ఎందుకంటే ప్రజలు తిరస్కరించినప్పుడు ఈ సహాబాలు ఇస్లాంను స్వీకరించారు, విశ్వాస మార్గాన్ని అవలంబించారు. ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని వదిలేశారో, చివరికి స్వయంగా వారి కుటుంబంలోని కొందరు, అప్పుడు ఈ సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చేరువుగా అయ్యారు, దగ్గరగా అయ్యారు. ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తమ ఇంటి నుండి వెళ్లగొట్టారో, అప్పుడు ఈ సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సహాయమందజేసి, తమకు దగ్గరగా తీసుకున్నారు. ఈ విధంగా ఇస్లాం పట్ల సహాబాల త్యాగాలు ఇంతా అంతా కావు, ఎంతో గొప్పమైనవి.
సలఫె సాలెహీన్ మరియు సహాబాల గౌరవం
మన సలఫె సాలెహీన్ రహిమహుముల్లాహ్ సహాబాలను ఎలా గౌరవించేవారు? సహాబాల గురించి వారి యొక్క విశ్వాసం, వారి యొక్క ప్రేమ, వారి యొక్క గౌరవ మర్యాదలు ఎలా ఉండేవి? వాటిని కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము.
హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు అన్హు, హజ్రత్ ఉమర్ రదియల్లాహు అన్హు గారి యొక్క కుమారుడు. ఒక సందర్భంలో అతను తెలిపాడు, “ప్రజలారా, సహాబాలను దూషించకండి. సహాబాలు కొంతసేపు, ఒక చిన్నపాటి గడియ, వారు ఏదైతే అల్లాహ్ ఆరాధనలో గడిపారో, మీరు మీ జీవితాంతం చేసే మీ ఆరాధన వారి ఆ గడియపాటు ఆరాధనకు చేరుకోదు.” వారి స్థానం అంత గొప్పది కనుక మీరు వారిని దూషించకండి.
అబ్దుల్లా ఇబ్నుల్ ముబారక్ రహిమహుల్లాహ్, చాలా గొప్ప ముహద్దిస్, ఒక వ్యక్తి అతని వద్దకు వచ్చాడు. వచ్చి, ముఆవియా రదియల్లాహు తాలా అన్హు ఎక్కువ ఘనత గలవారా, లేకుంటే ఉమర్ బిన్ అబ్దుల్ అజీజా అని ప్రశ్నించాడు. అబ్దుల్లా ఇబ్నుల్ ముబారక్ ఏం సమాధానం చెప్పారు? దానికంటే ముందు ఒక విషయం తెలుసుకోండి. ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ సహాబీ కాదు, తాబియీన్లలో వస్తారు. ఆయన చాలా ఉత్తమమైన వారు, ఆయన ఒక ఖలీఫా, వారిని ఐదవ ఖలీఫా అని అంటారు. కానీ ముఆవియా రదియల్లాహు తాలా అన్హు ఆయనకు ఎన్నో ఘనతలు ఉన్నాయి. అట్టి ముఖ్యమైన ఘనత ఏమిటి? సహాబీ. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తమ కళ్లారా చూశారు, విశ్వసించారు, విశ్వాస స్థితిలో మరణించారు. అంతేకాదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై ఏ వహీ వచ్చేదో దానిని రాసేవారు ఏ సహాబాలైతే ఉన్నారో, కాతిబీనె వహీ, వారిలో ఒకరు. అంతేకాదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి బావమరిది. అంటే, హజ్రత్ అమీరె ముఆవియా రదియల్లాహు తాలా అన్హు గారి యొక్క సోదరి ఉమ్మె హబీబా రదియల్లాహు తాలా అన్హా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పవిత్ర భార్య. విశ్వాసం మరియు సహాబీ కావడం తో పాటు ఇన్ని రకాల ఇంకా మరెన్నో ఘనతలు కూడా ఉన్నాయి. అయితే అతి ముఖ్యమైన విషయం అతను సహాబీ. ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ చాలా ఉత్తమమైన వారు కానీ సహాబీ కాదు.
అయితే ఒక వ్యక్తి వచ్చి ఏమడుగుతున్నాడు అబ్దుల్లా ఇబ్నుల్ ముబారక్ తో? అమీరె ముఆవియా ఎక్కువ ఘనత గలవారా లేకుంటే ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ ఎక్కువ ఘనత గలవారా? అప్పుడు అబ్దుల్లా ఇబ్నుల్ ముబారక్ రహిమతుల్లాహి అలైహి చెప్పారు, “ముఆవియా రదియల్లాహు తాలా అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఉండగా, ఆయన ముక్కులో పోయినటువంటి దుమ్ము, ధూళి, దాని స్థానానికి కూడా ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ చేరుకోడు, నీవేం మాట్లాడుతున్నావు?”
అల్లాహు అక్బర్. ఇక్కడ గమనించండి, ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహిమతుల్లాహి అలైహి గారికి ఉన్న ఘనత, వారికి ఉన్న విద్య, ఆయన ఒక ఖలీఫా, ఆ విషయాల్లో మనం ఏ కొరత చూపి ఆయన్ని అవమానించడం కాదు. సహాబాల ఘనత ఎంత గొప్పదో అది తెలియజేస్తున్నాము. ఇది మనమే కాదు, మనకంటే ముందు పూర్వీకులు సలఫె సాలెహీన్ రహిమహుల్లాహ్, వారిలో అబ్దుల్లా ఇబ్నుల్ ముబారక్ ఎలాంటి ముహద్దిస్ అంటే, ఎందరో ముహద్దిసులు చెప్పారు, ఈయనపై ఎలాంటి దోషం లేని, జరహ్ లేని ముహద్దిస్ అని.
సహాబాల యొక్క స్థానం, వారి యొక్క ఘనత విషయంలో సహీ ముస్లిం షరీఫ్ లో వచ్చి ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:
اللَّهَ اللَّهَ فِي أَصْحَابِي ، اللَّهَ اللَّهَ فِي أَصْحَابِي (అల్లాహ అల్లాహ ఫీ అస్హాబీ, అల్లాహ అల్లాహ ఫీ అస్హాబీ) “నా సహాబాల ప్రస్తావన వచ్చినప్పుడు నేను మిమ్మల్ని అల్లాహ్ ను గుర్తు చేస్తున్నాను, మీరు అల్లాహ్ తో భయపడండి. నా సహాబాల ప్రస్తావన వచ్చినప్పుడు నేను మిమ్మల్ని అల్లాహ్ ను గుర్తు చేస్తున్నాను, మీరు అల్లాహ్ తో భయపడండి.“
ఆ తర్వాత చెప్పారు, “మీరు వారిలో ఏ ఒక్కరిని కూడా తమ మనోవాంఛల కొరకు, తమ మనసులోని చెడు కోరికల కొరకు ఒక సాకుగా తీసుకోకండి”
فَمَنْ أَحَبَّهُمْ فَبِحُبِّي أَحَبَّهُمْ، وَمَنْ أَبْغَضَهُمْ فَبِبُغْضِي أَبْغَضَهُمْ (ఫమన్ అహబ్బహుమ్ ఫబిహుబ్బీ అహబ్బహుమ్, వమన్ అబ్గదహుమ్ ఫబిబుగ్దీ అబ్గదహుమ్) “ఎవరైతే వారి పట్ల ప్రేమగా ఉంటాడో అతడు నా పట్ల ప్రేమగా ఉన్నట్లు. మరియు ఎవరైతే వారి పట్ల ద్వేషంగా ఉంటాడో, అతడు నా పట్ల ద్వేషంగా ఉన్నట్లు“
وَمَنْ آذَاهُمْ فَقَدْ آذَانِي، وَمَنْ آذَانِي فَقَدْ آذَى اللَّهَ، وَمَنْ آذَى اللَّهَ يُوشِكُ أَنْ يَأْخُذَهُ (వమన్ ఆదాహుమ్ ఫఖద్ ఆదానీ, వమన్ ఆదానీ ఫఖద్ ఆదల్లాహ తబారక వ తాలా) “ఎవరైతే నా సహాబాలను హాని కలిగించాడో, వారికి కీడు కలుగజేశాడో, అతడు నాకు కీడు కలుగజేసినట్లు, నాకు బాధ కలుగజేసినట్లు. మరి ఎవరైతే నన్ను బాధ పెట్టాడో, అతడు అల్లాహ్ ను బాధ పెట్టినవాడవుతాడు.“
గమనించారా? సహాబాల యొక్క స్థానం ఎంత గొప్పగా ఉందో? వారిని ప్రేమించడం, వారి పట్ల ద్వేషంగా ఉండకుండా ప్రేమగా ఉండడం ఎంత ముఖ్యమో మన జీవితంలో, అర్థమవుతుంది కదా ఈ హదీసుల ద్వారా?
మరొక హదీస్, హజ్రత్ ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినట్లు, షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ సహీహాలో ప్రస్తావించారు దీనిని:
مَنْ سَبَّ أَصْحَابِي فَعَلَيْهِ لَعْنَةُ اللَّهِ وَالْمَلائِكَةِ وَالنَّاسِ أَجْمَعِينَ (మన్ సబ్బ అస్హాబీ ఫఅలైహి ల’నతుల్లాహి వల్ మలాఇకతి వన్నాసి అజ్మయీన్) ఎవరైతే నా సహాబాలను దూషిస్తాడో, అతనిపై అల్లాహ్ యొక్క శాపం, దైవదూతల శాపం మరియు సర్వ ప్రజల యొక్క శాపం పడుగాక.
సహాబాలను దూషించడంపై ఇస్లామీయ పండితుల అభిప్రాయం
ఇమామ్ అహ్మద్ రహిమతుల్లాహి అలైహి, నాలుగు ఇమాములలో ఒక గొప్ప ఇమాం కదా. ఆయన ఏమన్నారో తెలుసా? సహాబాల విషయంలో, “నీవు ఎప్పుడైనా ఏదైనా వ్యక్తిని చూశావు, అతడు సహాబాలలో ఏ ఒక్కరినైనా దూషిస్తున్నాడు అంటే, అతడు నిజమైన ముస్లిమో కాదో అని శంకించవలసి వస్తుంది, అనుమాన పడే అటువంటి పరిస్థితి వస్తుంది.”
ఇలాంటి మాట ఎందుకు చెప్పారు ఇమామ్ అహ్మద్ రహిమతుల్లాహి అలైహి? ఎందుకంటే నిజమైన ముస్లిం, ఖుర్ఆన్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహీ హదీసుల జ్ఞానం ఉన్న ముస్లిం, ఏ సహాబీని కూడా దూషించడు.
ఇంకా మరో సందర్భంలో హజ్రత్ ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహిమహుల్లాహ్ తెలిపారు, “ఏ వ్యక్తికి కూడా సహాబాలను దూషించడం దూరం, సహాబాలను అగౌరవంగా ప్రస్తావించడం కూడా తగదు. ఎవరైనా అలా చేశాడంటే ఆ వ్యక్తి కాలంలో, ఆ వ్యక్తి ఉన్నచోట ఏ ముస్లిం నాయకుడు ఉన్నాడో అతడు అలాంటి వ్యక్తికి శిక్ష ఇవ్వాలి. ఎందుకంటే సహాబాలను దూషించడం ఇది చిన్నపాటి పాపం కాదు, ఘోర పాపాల్లో లెక్కించబడుతుంది“
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
సహాబా : ‘సహాబీ‘కి బహువచనం ‘సహాబా‘. విశ్వాస (ఈమాన్) స్థితిలో దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)ను కలుసుకుని, విశ్వాసస్థితిలో తనువు చాలించిన వారంతా సహాబా (సహచరులు- రది అల్లాహు అన్హుమ్) అనబడతారు.
వారు ముస్లిం సమాజంలో అందరికన్నా శ్రేష్టులని, ఇస్లాం వైపు ముందంజవేసిన వారని, ప్రవక్త సహచర్య భాగ్యం పొందినవారని, ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)తో కలిసి జిహాద్ చేసినవారని, షరీయత్ బరువు బాధ్యతలను మోయటమే గాకుండా దానిని తమ తరువాతి తరాల వారికి అందించిన ధన్యజీవులని, ఈ కారణంగా వారు ప్రపంచంలోనే అత్యుత్తమ సమూహం అని మనం విశ్వసించటం తప్పనిసరి (వాజిబ్).
అల్లాహ్ తన అంతిమ గ్రంథంలో వారిని కొనియాడుతూ ఇలా సెలవిచ్చాడు :
“ముహాజిర్లలో, అన్సార్లలో ప్రప్రథమంగా ముందంజవేసిన వారితోనూ, తరువాత చిత్తశుద్ధితో వారిని అనుసరించినవారితోనూ అల్లాహ్ ప్రసన్నుడయ్యాడు. వారు అల్లాహ్ పట్ల సంతుష్టులయ్యారు. క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలను అల్లాహ్ వారికోసం సిద్ధం చేసి ఉంచాడు. వాటిలో వారు కలకాలం ఉంటారు. గొప్ప సాఫల్యం అంటే ఇదే.”(అత్ తౌబా : 100)
ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) అల్లాహ్ ప్రవక్త, ఆయన వెంట ఉన్నవారు అవిశ్వాసులకు కొరుకుడు పడనివారు. ఒండొకరి పట్ల మాత్రం దయార్ద్ర హృదయులు. దైవ కృపను, దైవప్రసన్నతను చూరగొనే ప్రయత్నంలో వారు (దైవ సన్నిధిలో) వినమ్రులై వంగటాన్ని, సాష్టాంగ పడటాన్ని నీవు చూస్తావు. వారి సాష్టాంగ ప్రణామాల ప్రత్యేక ప్రభావం వారి ముఖారవిందాలపై తొణికిసలాడుతూ ఉంటుంది. వీరికి సంబంధించిన ఈ ఉపమానమే తౌరాతులో ఉంది. ఇన్‌జీలులో (కూడా) వారి ఉపమానం ఉంది. అది ఒక పంటపొలం వంటిది. అది తన మొలకను మొలకెత్తించింది. తరువాత దానిని బలపరిచింది. ఆ తరువాత అది లావు అయింది. ఆపైన అది తన కాండంపై నిటారుగా నిలబడింది. రైతులను అలరించసాగింది – వారి ద్వారా అవిశ్వాసులను మరింత ఉడికించాలని! వారిలో విశ్వసించి సత్కార్యాలు చేసిన వారికి మన్నింపును, గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తానని అల్లాహ్ వాగ్దానం చేసి ఉన్నాడు. (అల్ ఫత్‌హ్ : 29)
(ముఖ్యంగా ఈ ‘పై’ సొమ్ము) తమ ఇల్లూ వాకిలి నుండీ, తమ ఆస్తి పాస్తుల నుండీ గెంటివేయబడిన నిరుపేద ముహాజిర్లకు చెందుతుంది. (ఎందుకంటే) వారు దైవానుగ్రహాన్ని దైవప్రసన్నతను ఆశిస్తూ దైవానికీ, ఆయన ప్రవక్తకూ తోడ్పడుతున్నారు. వారే సిసలయిన సత్యసంధులు. ఇకపోతే; వీరికంటే ముందే ఈ ప్రదేశం (మదీనా) లోనూ, విశ్వాసంలోనూ స్థానికులుగా ఉన్నవారు (వారికి కూడా ఈ సొమ్ము వర్తిస్తుంది). వారు ఇల్లూ వాకిలిని వదలి తమ వైపునకు వలసవచ్చే ముహాజిర్లను ప్రేమిస్తారు. వారికి ఏమి ఇవ్వబడినా తమ ఆంతర్యాలలో ఏ కాస్త కూడా సంకోచాన్ని రానివ్వరు. తాము ఎంతో అవసరంలో ఉన్నప్పటికీ తమపైన వారికే ప్రాధాన్యతనిస్తారు. వాస్తవానికి తమ ఆంతర్యంలోని స్వార్థప్రియత్వం (పేరాశ) నుండి రక్షించబడినవారే కృతార్థులు. (అల్ హష్ర్ : 8, 9)
ఈ సూక్తులలో అల్లాహ్ ముహాజిర్లను, అన్సార్లను మెచ్చుకున్నాడు. వారిని సత్కార్యాల వైపు ముందంజవేసే వారుగా అభివర్డించాడు. తాను వారి పట్ల ప్రసన్నుణ్తి అయ్యానని, వారి కొరకు పిల్లకాలువలు ప్రవహించే ఉద్యాన వనాలను సిద్ధపరచి ఉంచానని తెలిపాడు. ఇంకా వారిలోని సుగుణాలను తెలుపుతూ వారు పరస్పరం దయాగుణం కలవారని, అవిశ్వాసులకు మాత్రం సింహస్వప్నమని చెప్పాడు. వారు అత్యధికంగా దైవసన్నిధిలో వంగేవారని, సాష్టాంగ ప్రణామాలు చేసేవారని, వారి ఆంతర్యాలు నిర్మలంగా ఉండేవని చెప్పాడు. వారిలోని మరో ప్రత్యేకత ఏమిటంటే; వారు దైవవిధేయతా చిహ్నంతో కనుగొనబడేవారు. అల్లాహ్ వారిని తన ప్రవక్త సహచర్యం కొరకు ఎంపిక చేశాడు – తద్వారా అవిశ్వాసులను మరింతగా ఉడికించాలని. వారిలో ముహాజిర్లు అనబడే వారి విశిష్టత ఏమిటంటే, వారు అల్లాహ్ ప్రీతి కొరకు, ధర్మసంస్థాపనార్థం తమ స్వదేశాన్ని, తమ ఆస్తిపాస్తులను వదలి ప్రస్థానం చేశారు. ఈ విషయంలో వారు నిజాయితీపరులని నిరూపించుకున్నారు. అన్సార్లు అనబడేవారి ప్రత్యేకత ఏమిటంటే వారు మదీనావాసులు. ముహాజిర్లను ఆదుకోవటంలో, దైవధర్మానికి తోడ్పడటంలో నికార్సయిన విశ్వాసులని నిరూపించుకున్నారు. వారిలోని ఓ గొప్ప సుగుణం ఏమిటంటే వారు తమ ముహాజిర్ సోదరులను అమితంగా ప్రేమించేవారు. వారి ప్రేమ నిష్కల్మషమయినది. వారి ఆంతర్యాలలో కల్లాకపటం ఉండేది కాదు. వారు ఎల్లప్పుడూ తమ ఆత్మలపై తమ ముహాజిర్ సోదరులకే ప్రాధాన్యత ఇచ్చారు. వారి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకునేవారు. వారి మనసులలో పిసినారితనం, సంకుచిత స్వభావం ఏ కోశానా ఉండేవి కావు. అందుకే వారు విజయ భాగ్యానికి నోచుకున్నారు. ఇవి వారిలోని సర్వసామాన్యమయిన సుగుణాలు. అలాగే కొన్ని ప్రత్యేక సుగుణాల దృష్టా వారిలో కొందరు మరికొందరి కంటే గొప్పవారుగా కీర్తించబడ్డారు – ముఖ్యంగా ఇస్లాం కొరకు, ధర్మయుద్ధం కొరకు, హిజ్రత్ కొరకు ముందంజవేసిన కారణంగా!
వారిలో అందరికన్నా గొప్ప సహాబీలు (రది అల్లాహు అన్హుమ్)నలుగురు ధర్మ ఖలీఫాలు. అంటే హజ్రత్ అబూబకర్, హజ్రత్ ఉమర్, హజ్రత్ ఉస్మాన్, హజ్రత్ అలీ (రది అల్లాహు అన్హుమ్). ఆ తరువాత అష్ర ముబష్షిరన్ – అంటే స్వర్గలోక శుభవార్త ప్రపంచంలోనే పొందిన ధన్యజీవులు. వారు (నలుగురు ధర్మఖలీఫాలతో పాటు) తల్హా జుబైర్, అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్, అబూ ఉబైదా బిన్ జర్రాహ్, సాద్ బిన్ అబీ వఖ్ఖాస్, సయూద్ బిన్ జైద్ (రది అల్లాహు అన్హుమ్). ముహాజిర్లకు అన్సార్లపై ఒకింత ప్రాధాన్యం ఉంది. బద్ర్ యుద్ధంలో పాల్గొన్నవారికి, అహ్లో బైఅతే రిజ్వాన్‌లో ఉన్నవారికి ప్రత్యేక ప్రాధాన్యత వొసగబడింది. అలాగే మక్కా విజయానికి పూర్వం ఇస్లాం స్వీకరించి జిహాద్ చేసినవారు, మక్కా విజయం తర్వాత ఇస్లాం స్వీకరించిన సహాబీల కన్నా గొప్పవారు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, ఇస్లాంలో పురుషులు బంగారం ధరించడం పూర్తిగా నిషిద్ధం (హరామ్) అని స్పష్టంగా వివరించబడింది. బంగారం ఏ రూపంలో ఉన్నా – ఉంగరం, గొలుసు, బ్రాస్‌లెట్ వంటివి – పురుషులు వాడకూడదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీసుల ప్రకారం, బంగారం మరియు పట్టు స్త్రీలకు ధర్మసమ్మతం కానీ పురుషులకు నిషిద్ధం. ఒక సహాబీ చేతిలో బంగారు ఉంగరం చూసినప్పుడు ప్రవక్త దానిని తీసి పారేసి, అది నరక జ్వాల వంటిదని హెచ్చరించిన సంఘటన వివరించబడింది. ఆ సహాబీ, ప్రవక్త పారేసిన దానిని తిరిగి తీసుకోకపోవడం, ప్రవక్త పట్ల వారికున్న గౌరవం మరియు అనుసరణకు నిదర్శనం. ఆధునిక కాలంలో గడియారాలు, బటన్లు, పెన్నులు వంటి వస్తువులలో కూడా బంగారం వాడకంపై హెచ్చరిక చేయబడింది. చెడును శక్తి ఉన్నప్పుడు చేతితో ఆపాలని, నిషిద్ధమని తెలిసిన వెంటనే దానిని వదిలివేయాలని ఈ ప్రసంగం బోధిస్తుంది.
పురుషులు బంగారం ధరించడం
బంగారం ఏ రూపంలో ఉన్నా, దానిని పురుషులు వాడుట నిషిద్ధం. శ్రద్దగా వినండి. బంగారం ఏ రూపంలో ఉన్నా, గొలుసు రూపంలో కొందరు వేసుకుంటారు, ఏదైనా ఒక బ్యాంగిల్ రూపంలో చేతిలో వేసుకుంటారు పురుషులు. మరి కొందరు ఉన్నారు, రెండు చెవులలో నుండి ఏదైనా ఒక చెవిలో, ఇలా కొందరు ఈనాటి కాలంలో అలవాటు పడుతున్నారు. అయితే బంగారం ఏ రూపంలో ఉన్నా, దానిని పురుషులు వాడుట నిషిద్ధం.
ఈరోజు మార్కెట్లో గడియారాలు, అద్దాలు, బటన్లు, పెన్నులు, చైన్లు ఇంకా మెడల్ పేరుతో బంగారపు లేదా బంగారు వన్నె ఎక్కించినవి చాలా ఉన్నాయి. ఇంకా పురుషులకు స్వర్ణ గడియారం అని కొన్ని కాంపిటీషన్లలో ప్రకటించబడుతుంది. అయితే ఇవి నిషిద్ధం అని తెలుసుకోవాలి.
ప్రవక్త మరియు సహాబీ సంఘటన
సహీహ్ ముస్లిం షరీఫ్ లో వచ్చినటువంటి హదీస్. శ్రద్ధగా వింటారు, అర్థం చేసుకుంటారు అని ఆశిస్తున్నాను.
అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన ప్రకారం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఒక వ్యక్తి చేతికి బంగారపు ఉంగరం చూశారు. ఆయన దానిని తీసిపారేశారు. మళ్ళీ ఇలా హెచ్చరించారు: “మీలో ఎవరికైనా నరకజ్వాల కావాలని ఉంటే దీనిని తన చేతిలో తొడగవచ్చు”. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వెళ్ళిన తరువాత అక్కడ ఉన్నవారన్నారు: ‘నీ ఉంగరాన్ని తీసుకో, వేరే విధంగా దానితో ప్రయోజనం పొందవచ్చు’. అప్పుడు అతనన్నాడు: ‘లేదు. అల్లాహ్ సాక్షిగా! ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తీసిపారేసిన దాన్ని నేను ఎన్నడూ తీసుకోను’. (ముస్లిం 2090).
ఎవరైతే చేతిలో బంగారపు ఏదైనా వస్తువు వేసుకుంటారో, ఉంగరం కానీ, గాజు కానీ, ఇంకా ఇలాంటిది ఏదైనా, అయితే వారు నరక శిక్షకు ఆహుతి అవుతారు అని హెచ్చరిక ఇది.
అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అటు వెళ్ళిపోయిన తర్వాత, అక్కడ ఉన్నవారు ఆ సహాబీకి చెప్పారు, “నీ ఉంగరాన్ని తీసుకో, వేరే విధంగా దానితో ప్రయోజనం పొందవచ్చు.” అప్పుడు ఆ సహాబీ అన్నారు, “లేదు. అల్లాహ్ సాక్షిగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీసి పారేసిన దానిని నేను ఎన్నడూ తీసుకోను.” ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల ఉన్నటువంటి గౌరవ అభిమానం. ప్రవక్తకు ఏ విషయం ఇష్టం లేదో, ప్రవక్త తన చేతితో దానిని తీసి పారేశారో, అలాంటి దాని దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాలి? ఒక విషయాన్ని ప్రవక్త నిషిద్ధం అని అన్నప్పుడు, దానికి నేను ఎందుకు పాల్పడాలి? ఇలాంటి కాంక్ష ఎంత గొప్పగా ఉండిందో గమనించండి.
ఈ రోజుల్లో, “అరే ఈ తాయెత్తు వేసుకోవద్దు, ఈ ఉంగరం బంగారపుది పురుషులు వేసుకోకూడదు” అని చెప్పినప్పుడు, “సరే, నేను తర్వాత తీసేస్తాను, లేదు ఇంట్లో నేను మా అమ్మతోని ఒకసారి మాట్లాడి ఆ తర్వాత తీస్తాను” ఈ విధంగా మన యొక్క సాకులు ఉంటాయి. కానీ సహాబీ, గమనించండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీసి పారేసిన విషయానికి దగ్గరగా పోదలుచుకోలేదు.
ఈ హదీస్ లో మనకు బోధపడిన కొన్ని విషయాలు:
బంగారపు ఉంగరం వేసుకొనుట నరక శిక్షకు కారణమవుతుంది.
తన శక్తి పరిధిలో ఉన్నప్పుడు మనిషి చెడును తన చేతితో ఖండించాలి. ఎవరికి అధికారం ఉన్నదో వారే చేయాలి, వేరే వారు చేసి ఇంకా నష్టానికి గురికాకూడదు.
పురుషుడు బంగారపు ఉంగరం వేసుకొని ఉంటే, తెలిసిన వెంటనే, ఏ ఆలస్యం చేయకుండా తన చేతిలో నుండి తీసి కనీసం జేబులోనైనా వేసుకోవాలి. కానీ ఇక ఆ చేతిలో ఉంచుకోకూడదు. మెడలో ఉంటే మెడలో నుండి తీసేయాలి. తర్వాత తన ఇంట్లోని స్త్రీలకు ఇవ్వచ్చు, స్త్రీలు దాన్ని ఉపయోగించవచ్చును.
సహాబాలు ప్రవక్త అనుకరణలో ఎంత ముందుగా ఉండేవారన్న విషయం తెలిసింది.
అయితే ఇక్కడ గమనించండి మరొక విషయం. అదేమిటంటే, ఈ రోజుల్లో కొందరు ఏమంటున్నారు? సరే ఇక బంగారం నిషిద్ధం అన్నారు కదా, మరి వెండిది వేయవచ్చా? “లేదు మా అబ్బాయి వాళ్ళ స్నేహితులు క్లాస్మేట్లు ఎవరో వేసుకున్నారంట, ఇంట్లో వచ్చి అడుగుతున్నాడు, నాకు కూడా ఒక చిన్న ఏదైనా వెండి యొక్క చైన్ ఇవ్వమని, లేదా చేతిలో ఏదైనా చైన్ వేసుకుంటా” అని. లేదు. ఇన్ షా అల్లాహ్ ఆ మాట తర్వాత కూడా వస్తుంది. స్త్రీలు పురుషుల పోలిక, పురుషులు స్త్రీల పోలిక అవలంబించకూడదు అని. కానీ ఇక్కడ ఒక మాట వచ్చింది గనక నేను దాన్ని గుర్తు చేశాను, చెప్పేశాను.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.