కహాన, అర్రాఫ (జ్యోతిష్యం) – ఇస్లామీయ నిషిద్ధతలు & జాగ్రత్తలు [వీడియో]

బిస్మిల్లాహ్

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

కహాన, అర్రాఫ (జ్యోతిష్యం)

కహాన అంటే భవిష్యత్తులో సంభవించేవాటిని, మనుసులో ఉండేవాటిని తెలుపుట. ఇలా తెలిపేవాడు కాహిన్. అర్రాఫ అంటే కొన్ని మూల విషయాల ఆధారంగా దొంగలించబడిన, కనబడని, తప్పిపోయిన వస్తువులను తెలుపుతానని ఆరోపించుట. ఇలా ఆరోపించేవాడు అర్రాఫ్.

కాహిన్ మరియు అర్రాఫ్, వీరిద్దరూ అగోచర జ్ఞానం గలదని ఆరోపణ చేసినందుకు సర్వోత్తము డైన అల్లాహ్ పట్ల అవిశ్వాసానికి పాల్పడ్డారు. వాస్తవమేమిటంటే అగోచర జ్ఞానం అల్లాహ్ తప్ప ఎవరికీ లేదు. వీరు అమాయకుల నుండి సొమ్ము కాజేసుకొనుటకు వారిని తమ వలలో చిక్కించుకుంటారు. అందుకు ఎన్నో రకాల సాధనాలు ఉపయోగిస్తారు. ఉదాహరణకు: భూమిపై రేఖలు గీసి, గవ్వలకు రంద్రాలు చేసి తాయత్తు కట్టి, అరచేతిలో, పాత్ర అడుగులో, గాజులో, అద్దంలో చూసి మంత్రాలు చదివి (భవిష్యం తెలిపే ఆరోపణ చేస్తారు). వారు చెప్పే విషయాల్లో ఎప్పుడైనా ఒక్కసారి ఒక్కటి సత్యమైనా 99 అబద్ధాలే ఉంటాయి. కాని ఈ అసత్యవాదులు ఒక్కసారి చెప్పే నిజాన్ని మాత్రమే అమాయకులు గుర్తు పెట్టుకొని తమ భవిష్యత్తు మరియు వివాహ, వ్యాపారాల్లో అదృష్టం – దురదృష్టం, ఇంకా తప్పిపోయిన వస్తువుల గురించి తెలుసుకోవడానికి వారి వద్దకు వెళ్తుంటారు. ఎవరు వారి మాటను సత్యం, నిజం అని నమ్ము తారో వారు అవిశ్వాసులవుతారు. ఇస్లాం నుండి బహిష్కరించబడతారు. దీని నిరూపణ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఈ హదీసుః

مَنْ أَتَى كَاهِنًا أَوْ عَرَّافًا فَصَدَّقَهُ بِمَا يَقُولُ فَقَدْ كَفَرَ بِمَا

أُنْزِلَ عَلَى مُحَمَّدٍ صَلَّى اللهُ عَلَيهِ وَسَلَّم

ఎవడు కాహిన్ లేక అర్రాఫ్ వద్దకు వచ్చి అతను చెప్పినదానిని సత్యం అని నమ్ముతాడో అతడు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై అవతరించినదానిని తిరస్కరించినవాడవుతాడు”. (ముస్నద్ అహ్మద్ 2/429, సహీహుల్ జామి 5939).

ఒకవేళ వారి వద్దకు వెళ్ళేవాడు వారికి అగోచర జ్ఞానం కలదని, వారి మాట సత్యం అని నమ్మక కేవలం చూడడానికి, అనుభవం కొరకు వెళ్తే అతడు అవిశ్వాసి కాడు. కాని అతని నలభై రోజుల నమాజు అల్లాహ్ వద్ద స్వీకరించబడదు. దీనికి నిరూపణ ప్రవక్త ﷺ యొక్క ఈ హదీసుః

مَنْ أَتَى عَرَّافًا فَسَأَلَهُ عَنْ شَيْءٍ لَمْ تُقْبَلْ لَهُ صَلَاةٌ أَرْبَعِينَ لَيْلَةً

“ఎవరైతే అర్రాఫ్ వద్దకు వచ్చి అతనిని ఏదైనా విషయం అడుగుతాడో అతని నలభై రోజుల నమాజు అంగీకరించబడదు”. (ముస్లిం 2230).

అయినా నమాజు మాత్రం చదవడం మరియు తౌబా చేయడం (జరిగిన తప్పుపై పశ్చాత్తాప పడడం) తప్పనిసరి.

[ఇది ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) గారు రాసిన ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు అను పుస్తకం నుంచి తీసుకోబడింది. ]


సూరతుల్ కహఫ్ సూరాలో ప్రస్తావించబడిన అల్లాహ్ కారుణ్యం సూరతుల్ కహఫ్ తఫ్సీర్ : 3వ భాగం [వీడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

సూరతుల్ కహఫ్ సూరాలో ప్రస్తావించబడిన అల్లాహ్ కారుణ్యం
సూరతుల్ కహఫ్ తఫ్సీర్ : 3వ భాగం
https://www.youtube.com/watch?v=H8kEmHrBPyM [27:51 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, వక్త సూరతుల్ కహఫ్ యొక్క ప్రాముఖ్యతను, ముఖ్యంగా శుక్రవారం నాడు దానిని పఠించడం యొక్క విశిష్టతను వివరిస్తారు. అల్లాహ్ యొక్క కారుణ్యం (రహ్మత్) అనే అంశం ఈ సూరాలో ఎంత బలంగా ప్రస్తావించబడిందో వారు నొక్కిచెప్పారు. గుహలోని యువకులు అల్లాహ్ కారుణ్యం కోసం ప్రార్థించడం, మూసా (అలైహిస్సలాం) మరియు ఖిద్ర్ (అలైహిస్సలాం) ల సంఘటన, మరియు జుల్-ఖర్నైన్ నిర్మించిన గోడ వంటి వివిధ ఘట్టాలను ఉదాహరణలుగా చూపుతూ, విశ్వాసం, జ్ఞానం మరియు సత్కార్యాల ద్వారా అల్లాహ్ కారుణ్యాన్ని ఎలా పొందాలో వివరిస్తారు. కేవలం చిలుక పలుకుల్లా కాకుండా, అర్థం చేసుకుని ఖురాన్‌ను చదవడం ద్వారానే అల్లాహ్ యొక్క అసలైన కారుణ్యాన్ని పొందగలమని వక్త ఉద్భోదిస్తారు.

అస్సలాము అలైకుం వ’రహ్మతుల్లాహి వ’బరకాతుహు.అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ’అలా ఆలిహి వ’సహ్బిహి అజ్మయీన్, అమ్మా బాద్.

సోదర మహాశయులారా! ఈ రోజు అల్లాహ్ యొక్క దయవల్ల మనం సూరతుల్ కహఫ్‌లో అల్లాహు తాలా చాలా గొప్ప రహస్యాలు, చాలా గొప్ప విషయాలు మన కొరకు పెట్టాడు. అందుకొరకే ప్రత్యేకంగా ప్రతి జుమా రోజు దీని యొక్క తిలావత్ ఆదేశం ఇవ్వడం జరిగింది. అయితే అందులో అనేక లాభాలు, అనేక విషయాలు, అనేక రహస్యాలు ఉన్నాయి.

అయితే ధర్మవేత్తలు ఒక విషయాన్ని చాలా హైలైట్‌గా, గొప్పగా చెప్పారు. ఆ విషయాన్ని నేను ఈరోజు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. దయచేసి శ్రద్ధగా వింటారని ఆశిస్తున్నాను.

సోదర మహాశయులారా, అల్లాహు తాలా అర్-రహ్మాన్ అర్-రహీమ్. ఈ విషయం మనం ఖురాన్ ఆరంభంలో బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీంలోనే చూస్తున్నాము. అల్లాహు తాలా ఈ దివ్య గ్రంథం ఖురాన్‌ని ఏ ప్రవక్త ద్వారా మనకు అందజేశాడో, ఆ ప్రవక్త గురించి ఏం చెప్పాడు? సూరతు తౌబాలో చెప్పాడు, వబిల్ మూమినీన రవూఫుర్రహీమ్. విశ్వాసుల పట్ల చాలా కనికరం గలవారు.

అలాగే సూరతుల్ అంబియాలో తెలిపాడు,

وَمَا أَرْسَلْنَاكَ إِلَّا رَحْمَةً لِّلْعَالَمِينَ
[వమా అర్సల్నాక ఇల్లా రహ్మతల్ లిల్ ఆలమీన్]
మేము మిమ్మల్ని సర్వలోకాల కొరకు కారుణ్యమూర్తిగా చేసి పంపాము.

అల్లాహ్ కరుణామయుడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కారుణ్యమూర్తిగా స్వయంగా అల్లాహు తాలా తెలియ బరిచాడు. మరియు ఈ ఖురాన్ ఇది కూడా సర్వమానవాళికి ఒక గొప్ప కారుణ్య సందేశం. ఈ విషయం స్వయంగా ఖురాన్‌లో అనేక సందర్భాలలో చెప్పడం జరిగింది.

అయితే ఖురాన్‌లోని 114 సూరాలలో ప్రతి సూరా మన పట్ల ఎంతో కరుణ, కారుణ్య సందేశం తీసుకుని వచ్చింది. అందులో సూరతుల్ కహఫ్ ప్రత్యేకంగా ఇందులో ఈ విషయం ఉంది. సూరతుల్ కహఫ్ యొక్క ఆరంభంలోనే అల్లాహు తాలా ఏం తెలియజేశాడో ఒకసారి ఇక్కడ చూడండి, ఆయత్ నంబర్ 10.

فَقَالُوا رَبَّنَا آتِنَا مِن لَّدُنكَ رَحْمَةً
[ఫకాలూ రబ్బనా ఆతినా మిల్ లదున్క రహ్మహ్]
మా ప్రభువా, నీ వద్ద నుంచి మాకు కారుణ్యాన్ని ప్రసాదించు.

అల్లాహు తాలా ఇక్కడ ఈ ఆయత్, సూరా యొక్క సుమారు ఆరంభంలోనే, ఏ యువకుల విశ్వాస గాధను మనకు తెలియబరిచాడో, వారు ప్రత్యేకంగా అల్లాహ్‌తో కోరుకున్నది ఏమిటి?

رَبَّنَا آتِنَا مِن لَّدُنكَ رَحْمَةً
[రబ్బనా ఆతినా మిల్ లదున్క రహ్మహ్]
ఓ మా ప్రభువా, నీ వద్ద నుంచి మాకు కారుణ్యాన్ని ప్రసాదించు.

وَهَيِّئْ لَنَا مِنْ أَمْرِنَا رَشَدًا
[వ హయ్యి లనా మిన్ అమ్రినా రషదా]
మా పనిలో మాకోసం సన్మార్గాన్ని సులభతరం చెయ్యి.

సోదర మహాశయులారా, ఇక్కడ ఇది మొదలైంది అంటే, ఈ “రహ్మత్” అన్న పదం ఈ సూరాలో సుమారు ఆరు సార్లు వచ్చింది. ఆయత్ నంబర్ 10 లో ఇలా కోరారు వారు. అయితే ఇంకా ముందుకు వెళ్లి మనం చూశామంటే, ఇదే సూరాలోని ఆయత్ నంబర్ 16 లో,

يَنشُرْ لَكُمْ رَبُّكُم مِّن رَّحْمَتِهِ
[యన్షుర్ లకుమ్ రబ్బుకుమ్ మిర్ రహ్మతిహి]
మీరు బహుదైవారాధన, ఈ షిర్క్ పనుల నుండి రక్షణ పొందుటకు గుహలోకి ప్రవేశించండి. అక్కడ మీ ప్రభువు మీకు కారుణ్యాన్ని ప్రసాదిస్తాడు.

ఇంకా ఎక్కడెక్కడ వచ్చిందో నేను తర్వాత తెలియజేస్తాను. కానీ ఇక్కడ ఒక గొప్ప విషయాన్ని మీరు గ్రహించండి. మీరు ఒక గొప్ప విషయాన్ని గ్రహించండి. అదేమిటి?

ఇమామ్ ఖుర్తుబీ రహమహుల్లా తన తఫ్సీర్‌లో, సూరత్ కహఫ్‌లోని తఫ్సీర్‌లో పేర్కొన్నారు, ఈ కొంతమంది యువకులు ఎవరైతే తమ విశ్వాసాన్ని, తమ సత్య ధర్మాన్ని కాపాడుకొనుటకు ఆ రాజు మరియు ఆనాటి కాలంలో ఉన్నటువంటి వారి సమాజంలోని బహుదైవారాధకుల నుండి పారిపోయి ఒక గుహలో ఏదైతే శరణు తీసుకున్నారో, వారు ఏదో పిచ్చివాళ్ళ లాంటి వారు, అనాథ లాంటి వారు, లేక ఏమీ గతి లేని వారు, అలాంటి వారు కాదు సుమా! సమాజంలో ఉన్నత శ్రేణికి చెందిన కుటుంబాలకు సంబంధించిన ఆ యువకులు. కానీ సమాజమంతా ఏ షిర్క్‌లో, ఏ బహుదైవారాధనలో కూరుకుపోయిందో, దాని నుండి రక్షణ పొంది, అల్లాహ్ యొక్క తౌహీద్ గొప్పతనాన్ని, దైవ ఏకత్వం యొక్క మహత్వాన్ని, గొప్పతనాన్ని ఎప్పుడైతే వారు గ్రహించారో, అన్ని రకాల ఆస్తిపాస్తులను, హోదా అంతస్తులను అన్నిటినీ కూడా వారు వదిలేశారు. ఇక ఎప్పుడైతే వారికి ప్రాణ నష్టం కలుగుతుందన్నటువంటి భయం కలిగిందో, ఒక గుహలో వారు శరణు తీసుకోవడానికి వెళ్లారు.

గమనించండి, ఆయత్ నంబర్ 10 మరియు ఆయత్ నంబర్ 16 పై మీరు శ్రద్ధ వహించారంటే, మీకు ఈ అల్లాహ్ యొక్క కరుణ ఏదైతే కోరుతున్నారో, అల్లాహు తాలా తన కరుణ విషయాన్ని ఖురాన్‌లో ప్రత్యేకంగా సూరతుల్ కహఫ్‌లో ఇంత గొప్పగా ఏదైతే చెప్పాడో, దాన్ని గమనించండి. ఇంతకుముందు మనం చదివాము ఆయత్ నంబర్ 10 ఇక్కడ చూస్తున్నారు కదా. ఇక ఇది ఎప్పుడు చెప్పారు వారు?

أَمْ حَسِبْتَ أَنَّ أَصْحَابَ الْكَهْفِ وَالرَّقِيمِ كَانُوا مِنْ آيَاتِنَا عَجَبًا
ఏమిటి గుహవారిని, శిలా ఫలకం వారిని నువ్వు మా శక్తి సూచనలలో మహా విచిత్రమైన సూచనగా తలపోస్తున్నావా?

إِذْ أَوَى الْفِتْيَةُ إِلَى الْكَهْفِ فَقَالُوا رَبَّنَا آتِنَا مِن لَّدُنكَ رَحْمَةً وَهَيِّئْ لَنَا مِنْ أَمْرِنَا رَشَدًا
ఆ యువకులు గుహలో ఆశ్రయం పొందినప్పుడు ఇలా ప్రార్థించారు, ‘మా ప్రభు, నీ వద్ద నుంచి మాకు కారుణ్యాన్ని ప్రసాదించు, మా పనిలో మా కోసం సన్మార్గాన్ని సులభతరం చెయ్యి.’

ఆ తర్వాత వారి సంఘటనే ఉంది. ఇక ఆయత్ నంబర్ 16 లో చూడండి.

وَإِذِ اعْتَزَلْتُمُوهُمْ وَمَا يَعْبُدُونَ إِلَّا اللَّهَ فَأْوُوا إِلَى الْكَهْفِ يَنشُرْ لَكُمْ رَبُّكُم مِّن رَّحْمَتِهِ وَيُهَيِّئْ لَكُم مِّنْ أَمْرِكُم مِّرْفَقًا
ఇప్పుడు మీరు వాళ్ళతోను, అల్లాహ్‌ను కాకుండా వారు పూజిస్తున్న ఇతర దైవాలతోను తెగతెంపులు చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఏదన్నా గుహలోకి పోయి కూర్చోండి. మీ ప్రభువు మీపై తన కారుణ్యాన్ని విస్తరింపజేస్తాడు.

పదాన్ని గమనించండి. యన్షుర్ లకుమ్. కారుణ్యాన్ని విస్తరింపజేస్తాడు. అంతేనా? కాదు, మరో శుభవార్త.

وَيُهَيِّئْ لَكُم مِّنْ أَمْرِكُم مِّرْفَقًا
మీ కార్యసిద్ధికై సౌలభ్యాన్ని సమకూరుస్తాడు.

గమనించారా ఇక్కడ?

వాస్తవానికి దీని యొక్క గొప్పతనం మీరు ప్రత్యేకంగా గ్రహించారంటే, ముస్లింలు ముందు గ్రహించారంటే, మరియు మా ముస్లిమేతర సోదర సోదరీమణులు కూడా గ్రహించారంటే, ఎంతో బాగుండును. ఎందుకంటే ఇహలోకంలో మనిషికి లాభాన్ని చేకూర్చేది, ఇహపరలోకాల్లో అతనికి ఆనందాన్ని, సుఖాన్ని కలగజేసేది ఏమిటి? ఏకదైవారాధన, విశ్వాసం. గమనించండి, పెద్ద హోదా అంతస్తులకు చెందిన సంతానం అయినప్పటికీ అన్నిటినీ వదులుకున్నారు, తౌహీద్ యొక్క వారికి విషయం అర్థమైన తర్వాత, గుహలో వారు శరణు తీసుకున్నారు. ఇక అక్కడ అల్లాహ్ కారుణ్యానికి దూరమయ్యారా?

ఈ రోజుల్లో ఏమంటారు? అరే, వీడు పిచ్చివాడు, ఏదో సమాజంలో అందరితోని కలిసి ఉండకుండా. అందరూ చేసినట్లు చేస్తూ ఉండాలి, నీ కల్మ నీతో ఉంటుంది, నీ ఇస్లాం నీతో ఉంటుంది. పర్వాలేదు, కొంచెం ఒకసారి సమాధి కాడికి వెళ్లి అక్కడ వంగినా గానీ, ఏదైనా వినాయకునికి అక్కడ ఏదైనా చేసినా గానీ, ఇంకా వేరే ఏదైనా పనులు… ఈ విధంగా ఎంతో మంది ఎలాంటి షిర్క్ పనులకు పాల్పడుతున్నారు? అసలు విషయం ఏంటంటే విశ్వాసం, తౌహీద్ యొక్క మాధుర్యాన్ని వారు గ్రహించలేదు.

మీరు ఇక్కడ చూడండి, ఖురాన్ ఆయతుల ద్వారా గ్రహించండి. నేను ఏదో పెద్ద వ్యాఖ్యానాల లోతులోకి వెళ్తలేను. కారుణ్యం అన్నది సోదర మహాశయులారా, అల్లాహ్ యొక్క తౌహీద్ ద్వారా మనకు అర్థమవుతుంది. ఎంత మనం అల్లాహ్ యొక్క తౌహీద్ పై స్థిరంగా ఉంటామో, అంతే ఎక్కువగా మనం అల్లాహ్ యొక్క కారుణ్యాలను గ్రహించగలుగుతాము.

ఎప్పుడైతే అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఇదే సూరత్లో పరలోకానికి సంబంధించిన కొన్ని విషయాలు తెలియజేశాడు, ఆ మధ్యలో కూడా వ రబ్బుకల్ గఫూరు జుర్రహ్మహ్. నిశ్చయంగా నీ ప్రభువు ఎంతో క్షమించేవాడు, ఎంతో మీ పాపాలను మన్నించేవాడు. మరియు మరో గొప్ప విషయం ఏం చెప్పాడు? జుర్రహ్మహ్. నీ ప్రభువు ఎంతో కారుణ్యం గలవాడు. ఇది ఎక్కడుంది? ఆయత్ నంబర్ 58లో ఒకసారి మీరు చూడండి, గమనించండి. దీని ద్వారా మనకు తెలుస్తుంది ఏమిటి? మనిషి ఇహలోకంలో, పరలోకంలో అల్లాహ్ యొక్క సత్య గ్రంథాన్ని విశ్వసించడం ద్వారానే అల్లాహ్ కారుణ్యాన్ని అతడు పొందగలుగుతాడు. అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని విశ్వసించి దానిని అనుసరించడంలోనే అతడు అల్లాహ్ యొక్క కారుణ్యాన్ని పొందగలుగుతాడు. అందుకొరకే ఆయత్ నంబర్ 57 మీరు చూశారంటే “నేను అరబీ ఆయత్ కాకుండా అనువాదం చదువుతున్నాను మీకు తొందరగా అర్థం కావాలని: “తన ప్రభువు వచనాల ద్వారా హితబోధ చేసినప్పటికీ విముఖత చూపి, తన చేతులతో ముందుగా చేసి పంపుకున్న దానినే మరిచిపోయిన వానికన్నా ఎక్కువ దుర్మార్గుడు ఎవడు ఉంటాడు?” వారు దానిని, అంటే ఖురాన్‌ను, అర్థం చేసుకోకుండా మేము వారి హృదయాలపై తెరలు వేసేసాము. ఇన్నాలిల్లాహ్. అల్లాహ్ మన హృదయాన్ని అలా చేయకూడదు. మనం దుఆ చేయాలి, ఓ అల్లాహ్, మా హృదయాన్ని నీ సన్మార్గం వైపునకు, అల్లాహుమ్మష్రహ్ సుదూరనా. మూసా అలైహిస్సలాం దుఆ చేశారు. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి షరహ సద్ర్ గురించి అల్లాహు తాలా శుభవార్త ఇచ్చాడు. వారి చెవులకు చెవుడు కలిగించాము. అల్లాహు అక్బర్, అస్తగ్ఫిరుల్లాహ్. ప్రపంచ మాటలన్నీ వింటున్నారు, కానీ ధర్మబోధ అనేది వినకుండా వారు, వారికి చెవుడు అనేది ఏర్పడింది. నువ్వు సన్మార్గం వైపుకు వారిని పిలుస్తూ ఉన్నప్పటికీ, వారు ఎన్నటికీ సన్మార్గం పొందే వారు కారు. ఎందుకంటే వారు నీ మాట వినకుండా పరిగెత్తిపోతున్నారు. ఆ తర్వాత ఏం చెప్పాడు?

وَرَبُّكَ الْغَفُورُ ذُو الرَّحْمَةِ
[వ రబ్బుకల్ గఫూరు జుర్రహ్మహ్]
వీరు చేస్తున్నటువంటి ఈ పాపాలు ఏవైతే ఉన్నాయో,

لَّوْ يُؤَاخِذُهُم بِمَا كَسَبُوا لَعَجَّلَ لَهُمُ الْعَذَابَ
[లౌ యుఆఖిదుహుమ్ బిమా కసబూ లఅజ్జల లహుముల్ అదాబ్]
వారి చేష్టలకు శిక్షగా ఆయన గనక వారిని పట్టుకున్నట్లయితే, వారిని తొందరగా శిక్షించి ఉండేవాడు.

بَل لَّهُم مَّوْعِدٌ
[బల్ లహుమ్ మౌయిదున్]
అసలు విషయం ఏమిటంటే వారి కోసం ఒక వాగ్దాన సమయం నిర్ధారితమై ఉంది. దాని నుంచి తప్పించుకొని పోయే చోటేదీ వారికి దొరకదు.

అల్లాహు తాలా చాలా కనికరం గలవాడు, ఎంతో కరుణామయుడు. అందుకొరకే అల్లాహు తాలా వారిని వారి కుఫ్ర్, వారి యొక్క షిర్క్, వారి బహుదైవారాధన, ఖురాన్‌ను తిరస్కరించడం ఇలాంటి పనులకు వెంటనే శిక్షిస్తలేడు అల్లాహు తాలా. ఈ రోజుల్లో కూడా ఎంతో మంది ముస్లింలు ఏమంటారు? ఫలానా కాఫిర్ వాళ్లు, ఫలానా అవిశ్వాసులు ఇంత దౌర్జన్యం చేస్తున్నారు, ఇంత ఇబ్బంది పెడుతున్నారు, ఏమేమో జరుగుతుంది, అల్లాహు తాలా వారిని ఇంకా ఎందుకు తొందరగా శిక్షిస్తలేడు? అల్లాహు తాలా ఎంతో కరుణామయుడు. ఓపిక సహనాలు వహిస్తున్నాడు. ప్రజలు సత్యాన్ని తెలుసుకొని దానిని నమ్మాలి అని.

సోదర మహాశయులారా, ఇక్కడ ఏదైతే తెలిసిందో, మనిషి ఖురాన్ గ్రంథాన్ని అర్థం చేసుకొని చదివితే అల్లాహ్ యొక్క కారుణ్యాన్ని తొందరగా పొందగలుగుతాడు. సూరతుల్ ఆరాఫ్ యొక్క చివరలో చూశారు కదా మీరు?

وَإِذَا قُرِئَ الْقُرْآنُ فَاسْتَمِعُوا لَهُ وَأَنصِتُوا لَعَلَّكُمْ تُرْحَمُونَ
దివ్య ఖుర్‌ఆన్‌ పారాయణం జరుగుతున్నప్పుడు దానిని శ్రద్ధగా వినండి, నిశ్శబ్దంగా ఉండండి. తద్వారా మీరు కరుణించబడవచ్చు.

అల్లాహు అక్బర్. ఈ ఆయత్ యొక్క వ్యాఖ్యానంలో ఎందరో సలఫుస్సాలిహీన్ చెప్పారు, నీవు అల్లాహ్ యొక్క కారుణ్యాన్ని త్వరగా పొందాలనుకుంటే ఖురాన్ శ్రద్ధగా విను, ఖురాన్ వింటున్నప్పుడు మౌనం వహించు, మరియు ఖురాన్‌ను మంచి విధంగా అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యి.

ఇంకా సోదర మహాశయులారా, అలాగే అల్లాహు తాలా ఇదే సూరాలోని ఆయత్ నంబర్ 65 లో కూడా ఈ “రహ్మహ్” అన్న పదాన్ని ప్రస్తావించాడు. అక్కడ ఏ విషయంలో ఉందో ఒకసారి మీరు గమనించండి.

ఇక్కడ ఈ సంఘటన మీకు గుర్తుండే కదా? సూరతుల్ కహఫ్ మీరు ఎన్నో సార్లు అనువాదంతో చదివి ఉండవచ్చును. మూసా అలైహిస్సలాం ఒకసారి తమ జాతి మధ్యలో ఉన్నప్పుడు, అందరికంటే ఎక్కువ విద్య గలవారు ఎవరు అని అడిగినప్పుడు, పొరపాటున తొందరగా ఆయన నోట వెళ్తుంది “నేను” అని. ఈ సమాధానం అల్లాహ్‌కు ఇష్టం ఉండదు. అల్లాహు తాలా అంటాడు, ఓ మూసా, నా యొక్క దాసుడు ఉన్నాడు, అతని వద్దకు వెళ్ళు, అతనికి ఏ జ్ఞానం అయితే ఉందో దాన్ని కూడా నువ్వు నేర్చుకో. అయితే అక్కడికి వెళ్తారు. ఆ సంఘటన ఇక్కడ ఉంది.

فَوَجَدَا عَبْدًا مِّنْ عِبَادِنَا آتَيْنَاهُ رَحْمَةً مِّنْ عِندِنَا
అక్కడ వారు మా దాసులలోని ఒక దాసుణ్ణి కనుగొన్నారు. మేము అతనికి మా వద్ద నుంచి ఒక ప్రత్యేక కారుణ్యాన్ని ప్రసాదించి ఉన్నాము.

وَعَلَّمْنَاهُ مِن لَّدُنَّا عِلْمًا
ఇంకా మా వద్ద నుంచి అతనికి ఓ ప్రత్యేక విద్యను నేర్పి ఉన్నాము.

గమనిస్తున్నారా? మనిషి ఎంత ఎక్కువగా విద్య నేర్చుకొని దాని ప్రకారంగా ఆచరిస్తూ ఉంటాడో, అంతే ఎక్కువగా అల్లాహ్ యొక్క కారుణ్యాన్ని నోచుకుంటాడు. అల్లాహ్ యొక్క కారుణ్యాన్ని పొందడానికి అల్లాహ్ తన ప్రవక్తల ద్వారా పంపిన విద్య నేర్చుకోవడం చాలా ముఖ్యం.

ఇక మీరు ఆ తర్వాత ఇదే సూరాలోని మరో ఆయత్ గమనించండి. ఆయత్ నంబర్ 82. ఇందులో ఏ విషయం ఉంది?

మూసా మరియు ఖిద్ర్ ఇద్దరు కలిసి బయలుదేరుతారు. బయలుదేరినప్పుడు ఏమవుతుంది? అక్కడ ఒక గోడ ఉంటుంది. అక్కడ ఒక గోడ ఉంటుంది, పడిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. అయితే ఆ గోడను ఖిద్ర్ అలైహిస్సలాం ఒక్కరే దానిని నిలబెడతారు, బాగు చేస్తారు.

يَسْتَخْرِجَا كَنزَهُمَا رَحْمَةً مِّن رَّبِّكَ

అది ఇద్దరు అనాథలకు సంబంధించిన గోడ. ఆ గోడ కింద ఆ అనాథల కొరకు వారి తండ్రి చనిపోయేకి ముందు ఒక ధనం అనేది దాచి పెట్టి పోతాడు. ఈ పిల్లలు ఇంకా చిన్నగా ఉన్నారు. ఇప్పుడే ఒకవేళ ఆ గోడ పడిపోయింది, అది బయటికి వచ్చింది అంటే, ప్రజలు దోచుకుంటారు. ఈ పిల్లలు పెరిగే వరకు అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ దాన్ని కాపాడడానికి ఖిద్ర్‌ను పంపి ఆ గోడను సరి చేయించాడు. అయితే అక్కడ అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఏమంటున్నాడు? ఈ అనాథలిద్దరు యుక్త వయస్సుకు చేరినప్పుడు నీ ప్రభువు దయానుగ్రహంతో తమ ఈ నిధిని వెలికి తీసుకోవాలన్నది నీ ప్రభువు సంకల్పం. నీ ప్రభువు దయానుగ్రహం.

అల్లాహు అక్బర్. ఇక్కడ ఏం తెలిసింది? మనం విశ్వాసంపై ఉండి, మన పిల్లల కొరకు విశ్వాస మార్గాన్ని మరియు వారి కొరకు సదాచరణ, సత్కార్యాల గురించి బోధించి ఉన్నాము అంటే, మనము ఒకవేళ తొందరగా చనిపోయినా, మన పిల్లలు చిన్నగా ఉన్నా అల్లాహ్ వారిని వృధా కానివ్వడు. ఎందుకు? అల్లాహ్ తన కరుణతో వారిని రక్షిస్తాడు, సంరక్షిస్తాడు, వారి యొక్క బాగోగులు అల్లాహ్ చూసుకుంటాడు.

సోదర మహాశయులారా, ఇంకా చెప్పుకుంటూ పోతే ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. అంతేకాదు, మనిషికి ఇహలోకంలో ఏదైనా పెద్ద హోదా, అంతస్తు లభించింది, మనిషికి ఇహలోకంలో ఒక పెద్ద రాజ్యం లభించింది, అతడు దానిని అల్లాహ్ యొక్క ఇష్ట ప్రకారంగా ప్రజల పట్ల మేలు చేయడానికి పూర్తి చేశాడంటే ఇది కూడా అల్లాహ్ వైపు నుండి చాలా గొప్ప కరుణ విషయం. ఇదే సూరా ఆయత్ నంబర్ 98 లో అల్లాహు తాలా మరోసారి ఈ రహ్మత్ యొక్క ప్రస్తావన చేశాడు. ఏముంది అక్కడ? జుల్-ఖర్నైన్.

అల్లాహ్ ఏం చెప్పాడు? మష్రిఖ్ (తూర్పు), మగ్రిబ్ (పడమర), మరియు నార్త్ (ఉత్తర) అన్ని దిశలో వెళ్లారు. అక్కడ జయించారు, ప్రజల పట్ల మేలు చేశారు, ఎందరో ప్రజలు ఇస్లాం స్వీకరించారు. చివరికి ఎక్కడికి వచ్చారు? సద్, యాజూజ్ మాజూజ్. అక్కడ గమనించండి, యాజూజ్ మాజూజ్ చాలా దుష్టులు, దౌర్జన్యులు. వారు అల్లాహ్ ధర్మాన్ని ధిక్కరించి ప్రజలపై చాలా హింస చేస్తూ ఉండేవారు. ఎప్పుడైతే ఆ ప్రాంతానికి చేరుకున్నారో, ఆ బాధితులు జుల్-ఖర్నైన్‌తో చెప్పారు,

نَجْعَلُ لَكَ خَرْجًا
మేము కావాలంటే నీకు కొంత ఇచ్చేస్తాము డబ్బు.

عَلَىٰ أَن تَجْعَلَ بَيْنَنَا وَبَيْنَهُمْ سَدًّا
నీవు ఒక డ్యాం లాంటిది, ఒక పెద్ద గోడ లాంటిది, మాకు వారికి మధ్యలో వారు మాపై వచ్చి దండయాత్ర చేయకుండా, దౌర్జన్యం చేయకుండా ఒక అడ్డు నిర్మించు.

జుల్-ఖర్నైన్ ఏం చేశారు? ఎలాంటి నాకు అవసరం లేదు, అల్లాహ్ నాకు ఇచ్చిన ధనం చాలా ఉంది. కేవలం మీరు ఒకవేళ ఏమైనా చేయగలిగితే, నాకు మీ యొక్క సపోర్ట్ కొంత ఇవ్వండి. ఎందుకంటే మనుషులు నాతో పాటు తక్కువ ఉన్నారు, మీరు ఇందులో కొంత సహాయపడ్డారంటే ఒక పటిష్టమైన గోడ మనం తయారు చేద్దాము. అయితే గోడనే తయారు చేయలేదు. ఒక పెద్ద గుట్ట లాంటిది వారి మధ్యలో, వీరి మధ్యలో చేసి, అంతే వదలలేదు.

آتُونِي زُبَرَ الْحَدِيدِ
నాకు ఇనుప రేకులను తెచ్చి ఇవ్వండి.

حَتَّىٰ إِذَا سَاوَىٰ بَيْنَ الصَّدَفَيْنِ
ఆ విధంగా అతను ఆ రెండు పర్వతాల మధ్య గోడను సమానంగా లేపిన తర్వాత, అగ్నిని రాజేయండి అని ఆజ్ఞాపించాడు. ఆ ఇనుప రేకులు బాగా కాలి అగ్నిగా మారిన తర్వాత, కరిగిన రాగిని తెండి, దానిపై పోస్తాను అని అన్నాడు.

వ్యాఖ్యానకర్తలు ఏమంటున్నారు, ముఫస్సిరీన్ రహమహుముల్లా చెబుతున్నారు, ఇది వారు దాటడం మరీ ఇబ్బందికరంగా ఉంటది, అందుకొరకు ఆయన ఇలాంటి ఉపాయాన్ని అవలంబించారు. కానీ ఇదంతా చేసిన తర్వాత ఏమంటున్నారు? గమనించండి. ఇక వారిలో అంటే యాజూజ్ మాజూజ్‌లో ఆ గోడను ఎక్కే శక్తి లేకపోయింది, దానికి రంధ్రం వేయటం కూడా వారి తరం కాదు. గమనించారా? ఆ వెంటనే ఏమంటున్నారు? ఇది కేవలం నా ప్రభువు కటాక్షం.

هَٰذَا رَحْمَةٌ مِّن رَّبِّي
[హాదా రహ్మతుమ్ మిర్రబ్బీ]

ఈ రోజుల్లో ఎవరెవరైతే తమ యొక్క శక్తిశాలిని, తమ యొక్క ఆర్థిక శక్తిని, తమ యొక్క అణువు శక్తిని, తమ యొక్క సైన్య శక్తిని, ఇంకా పెద్ద పెద్ద సైంటిస్టుల మా వద్ద శక్తి ఉంది అన్నటువంటి విషయాల ద్వారా ప్రజలకు నష్టం చేకూరుస్తున్నారు, ప్రజలకు వారికి సౌకర్యాలు, వారు ఉన్నటువంటి ఇబ్బందుల నుండి బయట తీయకుండా వారిని మరింత పీడిస్తున్నారు. చివరికి కొన్ని దేశాలలో ఏమవుతుంది? ధనవంతులు మరింత ధనవంతులు అయిపోతున్నారు, బీదవాళ్లు ఇంకా బీదవాళ్లు అయిపోతున్నారు. ఇలాంటి పరిస్థితి ఏదైతే కొందరు చేస్తున్నారో, జుల్-ఖర్నైన్ యొక్క ప్రస్తావన అల్లాహ్ ఖురాన్‌లో ఏదైతే చేశాడో గమనించాలి. ఇంత పెద్ద ఒక పని చేసిన తర్వాత కూడా అతను ఏమంటున్నాడు? ఇది నాది గొప్పతనం ఏమీ కాదు, కేవలం నా ప్రభువు కటాక్షం. అయితే నా ప్రభువు వాగ్దాన సమయం వచ్చినప్పుడు ఆయన దాన్ని నేలమట్టం చేసేస్తాడు.

అల్లాహు అక్బర్! అల్లాహు అక్బర్! గమనించారా? ఇంత పటిష్టమైన గోడ, కరిగిన రాగిని అందులో పోయడం జరిగింది. ఇనుప రేకులతో తయారు చేయడం జరిగింది. కానీ ఏమంటున్నారు? నా ప్రభువు కోరినప్పుడు అది పూర్తిగా నేలమట్టం అయిపోతుంది.

అల్లాహు అక్బర్! ఈ విధంగా సోదర మహాశయులారా, చెప్పే నా యొక్క ఉద్దేశాన్ని మీరు గమనించారా లేదా? ఈ సూరాలో సుమారు ఏడు సార్లు “రుహ్మా”, “రహ్మత్”, “రహ్మతిహి” అన్నటువంటి పదాలు, కారుణ్యం గురించి ఏదైతే చెప్పబడ్డాయో, దీని ద్వారా మనకు బోధ పడుతున్నది ఏమిటంటే, మనం ప్రతి జుమా పూర్తి శ్రద్ధతో ఈ సూరాను చదివామంటే, పూర్తి వారంలో మనం దీనిని మంచి విధంగా గ్రహించామంటే, అల్లాహ్ యొక్క కారుణ్యాన్ని పొందడానికి ఎంతో మంచి ఆస్కారం ఉంటుంది. కానీ తోతా మైనా కీ తరహా సే పడ్నా నహీ హోనా. చిలుక చదివినట్టుగా చదవడం కాదు. ఈ రోజుల్లో ఎన్నో వీడియోలు యూట్యూబ్‌లో చూస్తారు కావచ్చు మీరు. ఎందరో చిలుకలకు సూరే ఫాతిహా మొత్తం నేర్పడం జరిగింది. కొన్ని చిలుకలకు సూరే యాసీన్ యొక్క రుకూ, రెండు రుకూలు యాద్ చేయడం, చేపించడం జరిగింది. కానీ ఏమైనా అర్థమవుతాయా వాటికి? గాడిద పై నీవు సిమెంట్ బస్తాలు వేసినా గానీ, లేక మంచి పుస్తకాల, ఖురాన్ గ్రంథాలు దానిపై వేసి ఎక్కడికైనా తీసుకెళ్లినా గానీ, గాడిద గాడిద. తన వీపు మీద ఏది ఉన్నదో తెలియదు. మన పరిస్థితి అలా కాకూడదు. మనం అర్థం చేసుకొని చదవాలి.

నేను ప్రత్యేకంగా ఈ రోజు అల్లాహ్ యొక్క కారుణ్యం గురించి ఈ సూరాలో ఎంత గొప్పగా చెప్పడం జరిగింది, ధర్మవేత్తలు ఈ సూరాలో ఉన్నటువంటి రహస్యాలలో ఈ “రహ్మత్” కారుణ్యం యొక్క రహస్యం చాలా గొప్పది. బహుశా ఆరోగ్యం కొంచెం తోడు ఇవ్వనందుకు నేను మంచి విధంగా చెప్పలేకపోయాను కావచ్చు, కానీ ఆయతుల యొక్క రిఫరెన్స్ మీకు చూపిస్తూ ఏదైతే నేను చిన్న ప్రయత్నం చేశానో, కనీసం మీరు చదివేటప్పుడు శ్రద్ధగా చదవండి. అల్లాహ్ యొక్క దయతో మీకు నేను చెప్పిన దానికన్నా ఎక్కువ మంచి రీతిలో విషయం అర్థం కావచ్చు.

జజాకుముల్లాహు ఖైరా వ అహసనల్ జజా వ బారకల్లాహు ఫీకుమ్. అల్లాహ్ మీరు వచ్చి ఇంత శ్రద్ధగా విన్న యొక్క మీ కృషిని స్వీకరించు గాక. ధర్మ విద్య ఎక్కువగా నేర్చుకుంటూ ఉండేటువంటి సద్భాగ్యం మనందరికీ ప్రసాదించు గాక. ఆమీన్.

వ ఆఖిరు ద’వానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వ’రహ్మతుల్లాహి వ’బరకాతుహు.


సూరతుల్ కహఫ్ తఫ్సీర్ (వ్యాఖ్యానం) – మెయిన్ పేజీ. (అన్నీ పాఠాల కోసం)
https://teluguislam.net/tafsir-kahf/

ఖురాన్ మెయిన్ పేజీ
https://teluguislam.net/quran

సూరతుల్ కహఫ్ పారాయణం: సాద్ అల్-ఘమిడి | తెలుగు సబ్ టైటిల్స్: అహ్సనుల్ బయాన్ |వీడియో
https://teluguislam.net/2020/06/25/18-al-kahf

మరణాంతర జీవితం – పార్ట్ 11: విశ్వాసులలో ఎవరైతే పాపాలు చేసి ఉన్నారో, వారు ప్రళయదినాన ఎలా హాజరవుతారు? [ఆడియో, టెక్స్ట్]

బిస్మిల్లాహ్

మరణాంతర జీవితం – పార్ట్ 11 [ఆడియో]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

పార్ట్ 11. ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [ 22:03 నిముషాలు]

అస్సలామ్ అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలామ్ అలా రసూలుల్లాహ్ అమ్మాబాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

ఈనాటి శీర్షిక – విశ్వాసులలో ఎవరైతే పాపాలు చేసి ఉన్నారో, వారు ప్రళయదినాన ఎలా హాజరవుతారు? ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే దీని వల్ల మనకు ఇహలోకంలో అలాంటి పాపాలు చేయకుండా జాగ్రత్తపడి ఉండాలన్నటువంటి ఒక జాగృతి కలుగుతుంది.

ఆ పాపాల్లో – అల్లాహ్ ఏ ధనధాన్యాలు మనకు ప్రసాదించాడో వాటిలో ఆయన ఒక నిర్ణీత పరిమాణంలో బీదవాళ్లకు ఇవ్వాలని ఏదైతే ఆదేశించాడో – అంటే జకాత్, విధిదానం అది చెల్లించకపోవడం. వాస్తవానికి మనం చూస్తే బంగారం గాని, వెండి గానీ లేదా మన వద్ద ఉన్నటువంటి కాష్ అమౌంట్ అందులో కేవలం రెండున్నర శాతం మాత్రమే మనం ఇవ్వాల్సింది. అంటే తొంబై ఏడున్నర శాతం మన వద్దనే ఉంటుంది. బీదవాళ్లకు కేవలం రెండున్నర శాతం మాత్రమే. కానీ మనలో ఎంతోమంది ధనవంతులు ఈ రెండున్నర శాతం కూడా పేదవాళ్లకు వారి హక్కు ఇవ్వడం మానుకుంటారు.

దీని మూలంగా ఎప్పుడైతే మనం సమాధుల నుండి లేచి ప్రళయ దినాన ఆ మహా మైదానంలో హాజరు అవుతామో ఈ జకాత్ చెల్లించని వారు ఇలాంటి కష్టాలను ఎదుర్కొంటారు. ఏంటి అది? వారి యొక్క ఆ సొమ్మును ఇనుప పత్రాలుగా తయారు చేసి నరకాగ్నిలో వేడి చేసి, వాటి ద్వారా ఆ మనిషి యొక్క ముఖము ముందటి భాగం, వెనుకభాగం, కుడి, ఎడమ ప్రక్కలలో వాతలు పెట్టడం జరుగుతుంది. ఇలా ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది? వినండి ఈ హదీస్. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు. “ఇలా వాతలు పెట్టడం జరుగుతూ ఉంటుంది. చల్లారినప్పుడల్లా మళ్ళీ వేడి చేయడం, మళ్లీ వాతలు పెట్టడం ఇలా జరుగుతూనే ఉంటుంది. ఆ రోజున ఏ రోజైతే యాబైవేల సంవత్సరాల పరిమాణంలో ఉందో ఎప్పటివరకు జరుగుతుంది? మానవుల మధ్యలో తీర్పు జరిగి పూర్తి అయ్యేంత వరకు. ఆ తరువాత ఇక అతడు స్వర్గవాసుల్లో అవుతాడా? నరకవాసుల్లో అవుతాడా? ఆ నిర్ణయాలు తర్వాత జరుగుతాయి. కానీ ఈశిక్ష ఇలా జరుగుతూనే ఉంటుంది ఆ ప్రళయ దినాన ఎప్పుడైతే సమాధులు నుండి లేచి హాజరవుతారో”.

అలాగే ఒంటెల్లో కుడా జకాత్ ఉంది. ఎవరి వద్దనయితే ఆవులు ఉంటాయో వారు కూడా జకాత్ చెల్లించాలి. కనీసం 5 ఒంటెలు ఉన్న వ్యక్తి జకాత్ చెల్లించాలి. కనీసం 30 ఆవులు ఉన్న వ్యక్తి అతను జకాత్ చెల్లించాలి. కనీసం 120 మేకలు ఉన్న వ్యక్తి ఇందులో నుండి జకాత్ తీయాలి. జకాత్ చెల్లించకుంటే ప్రళయ దినాన ఆ వ్యక్తి హాజరు అవుతాడు. అతని ఆ జంతువులు వస్తాయి. ఆ జంతువులు అతన్ని తమ కాళ్లతో, కొమ్ములతో కొడుతూ వారిని తొక్కుతూ ఈవిధంగా శిక్ష జరుగుతూనే ఉంటుంది ప్రజల మధ్యలో తీర్పు జరిగేంత వరకు. అల్లాహు అక్బర్. అందుగురించి ఈనాటి ఈ జీవితంలో మనం చిన్నపాటి కష్టాన్ని భరించలేక పోతామో, ఇక్కడ ఎవరైనా ఏదైనా సందర్భంలో సహాయానికి రావచ్చు. కానీ అక్కడ ఎవరూ కూడా ఏ సహాయాన్ని పొందలేరు.

ఇంకా రెండవ పాపం – గర్వము, అహంకారము. ఇది కూడా మహా చెడ్డ పాపం. ఎవరిలో ఈచెడ్డ గుణం చోటు చేసుకుంటుందో ఎన్నో సత్యాలను, ధర్మాలను, ఎన్నో మంచి విషయాల్ని తిరస్కరిస్తాడు. అందుగురించి ఎవరైతే ఇహలోకంలో అహంకారానికి గురి అవుతారో వారికి ఇలాంటి శిక్ష ఇవ్వడం జరుగుతుంది అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హెచ్చరించారు. “మైదానే మెహ్ షర్ లో గర్వ అహంకారానికి గురైన వారిని ఎలా తీసుకురావడం జరుగుతుంది? వారు చిన్న చీమలు ఏవైతే ఉంటాయో, వాటి కంటే అధ్వానంగా ఉంటారు. వారు గర్వంలో, అహంకారంలో తమకు తాము ఎంతో పెద్దగా, గొప్పగా చెప్పుకునేవారు. అల్లాహ్ (తఆలా) చూసే వారు కూడా వారిని హీనంగా భావించాలని చీమ కంటే మరీ చిన్నగా. అప్పుడు నలువైపుల నుండి వారిపై అవమానం అనేది కమ్ముకొని ఉంటుంది“. ఎవరైతే అల్లాహ్ ఇహలోకంలో వారికీ ఏ అనుగ్రహం, వరం ప్రసాదించి ఉన్నా దానిపై ఎలాంటి గర్వానికి గురి కాకుండా ఆ అనుగ్రహాన్ని, ఆయన యొక్క విధేయతలో ఉపయోగించే ప్రయత్నం చేయాలి. దాని ద్వారా ప్రజలకు సేవ చెయ్యాలి. అల్లాహ్ పట్ల విశ్వాసం, నమ్మకం బలంగా కలిగి ఉండాలి.

మూడవ రకమైన పాపం – ఇందులో ఎన్నో రకాల పాపాలు వస్తాయి. ఏమిటి శిక్ష? అల్లాహ్ వారిపై ఆగ్రహిస్తాడు ఆ ప్రళయదినాన. వారి వైపున కన్నెత్తి చూడడు, వారితో మాట్లాడడు, వారికి కఠిన శిక్ష విధిస్తాడు. ఎవరు అలంటి వారు? ఎవరికైతే అల్లాహ్ ధర్మ విద్య ప్రసాదించాడో అతడు దానిపై ఆచరిస్తూ, ఇతరులకు సత్య విషయాలు తెలియ జేస్తూ, ధర్మ విషయాలు ప్రజలకు బోధ చేస్తూ, ప్రజలు ఏదైనా విషయం ధర్మానికి సంబంధించింది అడిగినప్పుడు అతనికి తెలిసి ఉంటే ఏమాత్రం దాపరికం, ఏమాత్రం దాన్ని దాచి పెట్టకుండా స్పష్టంగా తెలియజేయాలి. ఎవరైతే దాచి పెడతారో వారితో కూడా అల్లాహ్ (తఆలా) ప్రళయదినాన మాట్లాడడు.

చదవండి ఖురాన్ యొక్క ఆయత్ “మేము స్పష్టమైన ఆధారాలు ఏవైతే అవతరింపజేశామో అవి వారికి చేరినప్పటికీ వాటిని వారు దాచిపెడతారు. ఎవరైతే ఇలాంటి కార్యానికి గురి అవుతారో? ఏమిటి శిక్ష వారికి? ప్రళయదినాన అల్లాహ్ వారి వైపున చూడడు, వారితో మాట్లాడడు.” ఈ రోజుల్లో ఎంతో మంది అల్లాహ్ ఆయతులను ప్రపంచపు యొక్క చిన్నపాటి సామాగ్రి కొరకు అమ్ముకుంటూ ఉంటారు. ప్రజలకు ఇష్టమైన రీతిలో వారి కోరికల ప్రకారంగా వారికి పరిష్కారం తెలిపే ప్రయత్నం చేస్తారు. అల్లాహ్ తో భయపడకుండా అల్లాహ్ అవతరింపజేసిన సత్య విషయాల్ని దాచిపెడతారు. అలాంటి వారికి సూరయే బకరాలోని 174, 175 ఆయతులు వారిలో జాగృతిని తీసుకురావాలి. వారు అలాంటి చెడు అలవాటును మానేయాలి.

మరొక సందర్భంలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలియపరిచారు. “ఎవరైతే విద్య నేర్చుకొని దాన్ని కంఠస్తం చేసి ఉన్నారు. అయినా అది ప్రజలకు తెలియ చేయకుండా మౌనం వహిస్తారు. దాన్ని దాచిపెడతారు. ప్రళయదినాన అతడు హాజరవుతాడు. అతన్ని తీసుకురావడం జరుగుతుంది. అతని నోటికి కళ్లెం వేయబడుతుంది. ఎలాంటి కళ్లెం? నరకానికి సంబంధించిన కళ్లెం“. ఈ హదీస్ ఇబ్నుమాజా లో ఉంది. హదీస్ నెంబర్ 261. ఈవిధంగా అల్లాహ్ ప్రసాదించిన విద్యను ప్రజలకు తెలియ చేయకుండా, ధర్మం వారికి నేర్పకుండా ఉండడం కూడా మనల్ని శిక్షకు గురి చేస్తుంది.

ఇంకా ఎవరి పట్ల అయితే అల్లాహ్ (తఆలా) తన ఆగ్రహం వ్యక్తం పరుస్తాడో, మాట్లాడాడో, వారి వైపు కన్నెత్తి చూడడో మరియు వారికి కఠిన శిక్ష విధిస్తాడో వారిలో ఒకరు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకొని దాన్ని పూర్తి చేయకుండా వాగ్దాన వ్యతిరేకం చేయడం. ఇది కూడా మహా పాపం. అల్లాహ్ ఖురాన్ సూర ఆలె ఇమ్రాన్ ఆయత్ నెంబర్ 77 లో ఇలా తెలిపాడు. “ఎవరైతే అల్లాహ్ పేరున వాగ్దానాలు చేసి ప్రజలతో ఒడంబడికలు చేసుకొని వాటిని పూర్తి చేయకుండా వాగ్దాన వ్యతిరేకం చేస్తారో, అలాంటి వారికి ప్రళయ దినాన ఎలాంటి పుణ్యాల్లో రవ్వంత వారికి భాగం లేదు. అల్లాహ్ వారితో మాట్లాడడు. వారి వైపున చూడడు. వారికి కఠిన శిక్ష విధిస్తాడు“.

ఇంకా మహాశయులారా! ఏ పాపాల వల్లనయితే అల్లాహ్ ఆగ్రహం కురుస్తుందో, అల్లాహ్ వారి వైపున చూడడో, మాట్లాడడో వారిలో మరో మూడు రకాల వారు వస్తారు. వారి గురించి సహీ ముస్లిం షరీఫ్ హదీస్ నెంబర్ 106 లో ఉంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేసారు. “మూడు రకాల మనుషులు ఉన్నారు. అల్లాహ్ ప్రళయదినాన వారితో మాట్లాడడు. వారి వైపున చూడడు. వారిని శుభ్రపరచడు. వారికి కఠిన శిక్ష విధిస్తాడు“. ఈవిధంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మూడు సార్లు చెప్పారు.

ఇదే మాట అప్పుడు అబూధర్ (రదియల్లాహు అన్హు) ఓ ప్రవక్తా! వారు నాశనం అయిపోయారు. వారు చాలా నష్టంలో పడిపోయారు. ఎవరు వారు? ఎలాంటి పాపాలు చేసినవారు? అని విన్నవించుకున్నారు. అప్పుడు ప్రవక్త చెప్పారు. “తమ వస్త్రాలను చీల మండలాని (ankles) కి క్రిందిగా తొడిగే వారు, ఈ రోజుల్లో మనలో ఎంతో మంది ఈ పాపానికి గురి అవుతున్నారు. మనకు నష్టం ఏముందండి ఒకవేళ మనం చీల మండలానికి పైగా తొడుగుతే? చీల మండలానికి పైగా తొడిగితే ఇంతటి ఘోరమైన శిక్షల నుండి, ప్రళయదినాన సంభవించేటువంటి ఇలాంటి ఘోర బాధల నుండి మనం తప్పించుకోగలుగుతాం కదా!

ఆ ముగ్గురు ఎవరు? ఒకరు చీల మండలానికి క్రింది గా తమ వస్త్రాలు ధరించే వారు. రెండోవారు ఎవరికైనా ఏదైనా ఉపకారం చేసి, వారికి బాధ కలిగించే వారు. మాటిమాటికి గుర్తు చేసి, వారిని మనసు నొప్పించే వారు. మూడో రకమైన వారు తమ యొక్క సామాగ్రిని అసత్యపు ప్రమాణాలతో విక్రయించేవారు. ఈ మూడు రకాల వారికి ఈశిక్ష అని తెలియజేయడం జరిగింది.

ఇలాంటి శిక్షకే గురి అయ్యేవారు మరికొందరు ఉన్నారు. వారి ప్రస్తావన ఈ హదీస్ లో వచ్చి ఉంది. హజరత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా హెచ్చరించారు. మూడు రకాల వారు. అల్లాహ్ ప్రళయదినాన వారి వైపున చూడడు. వారిని శుభ్రపరచడు. వారికి కఠిన శిక్ష, బాధాకరమైన శిక్ష ఉంటుంది. వారిలో ఒకరు దారిలో ఒక బాటసారి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతనికి దాహం కలిగింది. పక్కనే అక్కడ ఒక వ్యక్తి అతని వద్ద అతని అవసరానికంటే ఎక్కువ నీళ్ళు ఉన్నాయి. అయినా ఒకరికి త్రాగడానికి నీళ్లు ఇవ్వడం లేదు. ఇలాంటి వ్యక్తి కూడా ప్రళయ దినాన అల్లాహ్ కరుణను నోచుకోడు. అల్లాహ్ మాట్లాడడు. అల్లాహ్ కఠిన శిక్ష విధిస్తాడు. రెండో రకమైన వ్యక్తి. తన నాయకుడు అతని చేతిలో చేయి వేసి మాట వాగ్ధానం ఇచ్చి నేను నీకు విధేయుడిగా ఉంటాను అని అంటాడు. కానీ ఇది కేవలం ప్రాపంచిక ఉద్దేశంతో. అతని ద్వారా ప్రపంచ లాభం ఏదైనా కలిగితే అతనితో ఉంటాడు. లేదా అతనికి వ్యతిరేకంగా ఉంటాడు. ఇలాంటి వారికి కూడా ఈ శిక్ష ఉంటుంది. మూడో రకమైన వ్యక్తి అస్ర్ తరువాత నిలబడి తన సామాను అమ్ముకుంటున్నాడు. మాట మాటల్లో అల్లాహ్ సాక్షిగా నేను దీనిని ఇంతకే కొన్నాను అని అబద్దపు ప్రమాణాలు అల్లాహ్ పేరు మీద చేస్తూ ఉంటాడు. మళ్ళీ ఆ తర్వాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సూరయే ఆలె ఇమ్రాన్ ఆయత్ నెంబర్ 77 ఏదైతే మనం ఇంతకుముందు విన్నామో అది పఠించారు, పారాయణం చేశారు.

ఈ హదీత్ సహీ బుఖారీ లో ఉంది. హదీత్ నంబర్ 2358. ఇంకా ఆ ప్రణయ దినాన మహా మైదానంలో ఎలాంటి పాపాలు చేసిన వారికి ఏమి జరుగుతుంది? ఈ హదీత్ వినండి, సహీ ముస్లిం షరీఫ్, అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు. “మూడు రకాల వారు ఉన్నారు. అల్లాహ్ ప్రణయ దినాన వారితో మాట్లాడడు. వారిని శుభ్రపరచడు. వారి వైపునకు చూడడు. వారికి కఠిన శిక్ష ఉంటుంది. ఎవరు వారు? వివాహమైన తరువాత వృద్ధాప్యానికి చేరుకుంటూ కూడా వ్యభిచారానికి గురి అయ్యేవాడు. రెండు రకమైన వ్యక్తి, రాజ్య పీఠానికి అధికారుడు అయ్యాడు. అయినా అబద్దం పలుకుతున్నాడు. అలాంటి వ్యక్తికి కూడా ఈ శిక్ష. మూడో రకమైన వ్యక్తి బీదవాడు, బిచ్ఛం అడుక్కు తినేటటువంటి పరిస్థితి. అయినా గర్వాహంకారానికి గురి అవుతున్నాడు. ఇలాంటి ముగ్గురిని కూడా కఠిన శిక్షకు గురి చేసి అల్లాహ్ వారిని శుభ్రపరచడు, వారితో మాట్లాడాడు. వారి వైపున చూడడు అని చెప్పడం జరిగింది“.

అలాగే ఆ ప్రళయదినాన ఎక్కడైతే అల్లాహ్ క్షణం పాటు మన వైపు చూసి మాట్లాడకుంటే మన యొక్క పరిస్థితి గత ఎపిసోడ్ లలో మనం విని ఉన్నాము. ఎంత ఘోరంగా ఉంటుంది. ఎంత దీర్ఘకాలం ఉంటుంది. అక్కడ ఆ కష్టాలను ఎదుర్కోకుండా ఉండాలంటే ఇహలోకంలో ఇలాంటి పాపాలు మనం విడనాడు కోవాలి.

మరొక హదీత్ లో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరో రకమైన ముగ్గురు గురించి చెప్పారు. అబ్దుల్లా బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తెలిపారు. మూడు రకాల వారి వైపున అల్లాహ్ (తఆలా) ప్రళయదినాన కన్నెత్తి చూడడు. ఒక రకమైన వ్యక్తి, తన తల్లిదండ్రుల పట్ల అవిధేయునిగా ఉండేవాడు. పురుషులు లాంటి దుస్తులు, పురుషులు లాంటి వేషాలు వేసే స్త్రీ. మూడో రకమైన వ్యక్తి తన ఇంట్లో చెడును చూసి కూడా సహిస్తూ ఉండేవాడు. దాన్ని ఆపివేయడం, దాన్ని తీసివేయడం, ఆ చెడు నుండి తన ఇంటి వారిని ఆపడం ఏమాత్రం ప్రయత్నం చేయడం లేదు. అలాంటి వ్యక్తిని దయ్యూస్ అంటారు. ఇలాంటి వారిపట్ల కూడా అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ కన్నెత్తి చూడడు“.

ఇంకా ప్రళయదినాన ఆ మైదానంలో మనం ఆకలి దప్పులకు గురి కాకూడదు అంటే ఇహలోకంలో ఆ పరలోకాన్ని గుర్తు చేసుకోవాలి. బీద వాళ్ళను గుర్తు చేయాలి. విశ్వాస మార్గం మీద ఉండి కేవలం తనను తాను మాత్రమే జీవిస్తున్నాడు అన్నట్లుగా భావించకుండా తానే కడుపు నిండా తినుకుంటూ, ఇతరుల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఉండకూడదు. ఎందుకంటే ఒక సందర్భంలో ఒక వ్యక్తి కడుపు నిండా తిని బేవులు తీస్తూ ఉన్నాడు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు తెలిపారు. ఇలా బేవులు తీయడం మానుకో, ఇహలోకంలో ఎల్లప్పుడూ కడుపు నిండా తినుకుంటా ఉండేవారు ప్రళయ దినాన దీర్ఘకాలం వరకు ఆకలితో ఉంటారు. అల్లాహు అక్బర్. తిర్మిది యొక్క హదీత్ ఇది.

ఈవిధంగా ప్రజలారా! ప్రళయ దినాన ఇలాంటి పాపాలకు గురి అయ్యే వారికి ఇలాంటి శిక్షలు ఉన్నాయి అని ఎందుకు చెప్పడం జరుగుతుంది? ఆ రోజు రాకముందు మనం ఇహలోకంలో మనల్ని మనం చక్క దిద్దుకోవాలి. విశ్వాస మార్గాన్ని అవలంభించి ఏకైక సృష్టికర్తను ఆరాధిస్తూ, ఆయన ప్రవక్త విధానాన్ని పాటిస్తూ, మనం ఇస్లాం ప్రకారంగా జీవితం గడుపుతూ, సాధ్యమైనంతవరకు పాపాల నుండి దూరం ఉంటూ ఉంటె, ప్రళయ దినం దీర్ఘకాలం ఏదైతే ఉందో, ఎన్నో కష్టాలు, బాధలతో కూడుకొని ఉందో ఆ కష్ట బాధలు మన నుండి దూరమై ఆ కాలం మనకు చాలా తేలికగా, తొందరగా గడవవచ్చు. అల్లాహ్ (తఆలా) అన్ని రకాల పాపాల నుండి మనల్ని కాపాడుగాక.

అయితే మరో రకం అవిశ్వాసులు వారి ప్రస్తావన గడిచింది. విశ్వాసంలో పాపాత్ములు వారి ప్రస్తావన కూడా ఈ రోజు మనం విన్నాము. ఇన్షా అల్లాహ్ తరువాయి భాగంలో పుణ్యాత్ములే పుణ్యాత్ములు. అల్లాహ్ యొక్క ప్రియమైన దాసులు. వారిపై అల్లాహ్ యొక్క కరుణలు ఎలా కురుస్తాయి ప్రళయ దినాన? వాటిని విని అలాంటి వారిలో మనం చేరే ప్రయత్నం చేద్దాము. తరువాయి భాగాన్ని కూడా తప్పకుండా వింటారు అని ఆశిస్తూ మీతో శెలవు తీసుకుంటున్నాను

జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వ బరకాతుహు.


పూర్తి భాగాలు క్రింద వినండి 

ముస్లిం వనిత – పార్ట్ 04: ఇస్తిహాజా (అసాధారణ రక్తస్రావం), నిఫాస్ (పురుటి రక్తస్రావం),బహిష్టు మరియు కాన్పులను ఆపడం [వీడియో]

బిస్మిల్లాహ్

[17:23 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ముస్లిం వనిత [పుస్తకం]

“ఇస్తిహాజ”, దాని ఆదేశాలు

ఎప్పుడూ ఆగకుండా, ఒకవేళ ఆగినా నెలలో కేవలం రెండు మూడు రోజులు మాత్రమే ఆగి మళ్ళీ స్రవిస్తూ ఉండే రక్తాన్ని “ఇస్తిహాజ” అంటారు. కొందరు 15 రోజులకంటే అధికంగా వస్తే అది “ఇస్తిహాజ” అని అన్నారు. ఇక ఏ స్త్రీకైనా బహిష్టు అలవాటే 15రోజలకంటే ఎక్కువగా ఉంటే అది వేరే విషయం.

ముస్తహాజ యొక్క మూడు స్థితులు:

(ఇస్తిహాజలో ఉన్న స్త్రీని ముస్తహాజ అంటారు).

1- స్థితి: ఇస్తిహాజకు ముందు బహిష్టు యొక్క కాలపరిమితి ఎన్ని రోజులనేది గుర్తుండవచ్చు. ఆ కాలపరిమితి ప్రకారం అన్ని రోజులు బహిష్టు రోజులని లెక్కించాలి. అప్పుడు బహిష్టు ఆదేశాలే ఆమెకు వర్తించును. మిగితా రోజులు ఇస్తిహాజ రోజులుగా లెక్కించాలి. అప్పుడు ఆమె ఇస్తహాజ ఆదేశాలను పాటించాలి.

దీని ఉదాహరణ: ఒక స్త్రీకి ప్రతి నెలారంభంలో ఆరు రోజులు బహిష్టు వచ్చేది. కాని ఒకసారి ఆ కాలం దాటినప్పటికీ ఆగలేదు. అలాంటపుడు ఆ నెల మొదటి ఆరు రోజులు బహిష్టు రోజులుగానూ ఆ తరువాతవి ఇస్తిహాజ రోజులుగానూ లెక్కించ వలెను. ఆరు రోజుల తరువాత స్నానం చేసి నమాజు, ఉపవాసాలు పాటించాలి. అప్పుడు రక్తస్రావం జరుగుతూ ఉన్నా పరవాలేదు.

2- స్థితి: మొదటిసారి బహిష్టు అయి, ఆగకుండా రక్తస్రావం జరుగుతూ ఉంటే బహిష్టు రోజుల గడువు తెలిసే వీలు లేకుంటే అలాంటప్పుడు బహిష్టు రక్తము మరియు ఇస్తిహాజ రక్తములో భేదమును తెలుసుకోవాలి. బహిష్టు రక్తము నలుపుగా లేక దుర్వాసనగా లేక చిక్కగా ఉండును. ఈ మూడిట్లో ఏ ఒక్క విధంగానున్నా అప్పుడు బహిష్టు ఆదేశాల్ని పాటించాలి. ఎప్పుడయితే ఇవి మారునో అప్పటి నుండి ఇస్తిహాజ ఆదేశాలు పాటించాలి.

దీని ఉదాహరణ: ఒక స్త్రీకి రక్తస్రావం ప్రారంభమయి ఆగడము లేదు. అలాంటపుడు తేడా/వ్యత్యాసం ఉందా లేదా గమనించవలెను. ఉదాహరణకు: పది రోజులు నలుపుగా తరువాత ఎరుపుగా లేక పది రోజులు చిక్కగా తరువాత పలుచగా లేక పది రోజులు దుర్వాసన తరువాత  ఏ వాసన లేకుండా ఉంటే, మొదటి మూడు గుణాలు అంటే నలుపుగా, చిక్కగా, దుర్వాసనగా ఉంటే ఆమె బహిష్టురాళు. ఆ మూడు గుణాలు లేకుంటే ఆమె ముస్తహాజ.

3- స్థితి: బహిష్టు కాలపరిమితి తెలియదు, తేడాను గుర్తు పట్టట్లేదు. రక్త స్రావం ప్రారంభమైనప్పటి నుంచే ఆగకుండా ఉంది. అంతే గాకుండా ఒకే విధంగా ఉండి భేదము కూడా ఏర్పడడము లేదు, లేక అది బహిష్టు అన్న ఖచ్చితమైన నిర్ధారణకు రాకుండా సందిగ్ధంలో పడవేసే విషయాలున్నప్పుడు తన దగ్గరి బంధువుల్లో ఉన్న స్త్రీల అలవాటు ప్రకారం మొదటి నుంచే ఆరు లేక ఏడు రోజులు బహిష్టు రోజులుగా లెక్కించి, మిగితవి ఇస్తిహాజగా లెక్కించవలెను.

ఇస్తిహాజ ధర్మములు

ఇస్తహాజ మరియు పరిశుద్ధ స్త్రీలలో ఈ చిన్న భేదము తప్ప మరేమీ లేదు.

  • 1- ముస్తహాజా ప్రతి నమాజుకు వుజూ చేయాలి.
  • 2- వుజూ చేసే ముందు రక్త మరకలను కడిగి రహస్యాంగాన్ని దూదితో గట్టిగా బంధించాలి.

నిఫాసు, దాని ధర్మములు

ప్రసవ కారణంగా గర్భ కోశము నుంచి స్రవించు రక్తాన్ని నిఫాసు అంటారు. అది ప్రసవముతోనైనా, లేక తరువాత ప్రారంభమైనా, లేక ప్రసవావస్థతో ప్రసవానికి రెండు మూడు రోజుల ముందైనా సరే. అలాంటి స్త్రీ రక్తస్రావం ఆగిపోయినప్పుడే పరిశుద్ధమగును. (కొందరు స్త్రీలు నలబై రోజులకు ముందే రక్తస్రావం నిలిచినప్పటికీ స్నానం చేసి పరిశుద్ధులు కారు. నమాజు ఇతర ప్రార్థనలు చేయరు. నలబై రోజుల వరకు వేచిస్తారు. ఇది తప్పు. ఎప్పుడు పరిశుద్ధు- రాలయినదో అప్పటి నుండే నమాజులు మొదలెట్టాలి). నలబై రోజులు దాటినా రక్తస్రావం ఆగకుండా ఉంటే, నలబై రోజుల తరువాత స్నానం చేయవలెను. “నిఫాసు” కాలపరిమితి నలబై రోజులకంటే ఎక్కువ ఉండదు. నలబై రోజులకు ఎక్కువ అయితే అది బహిష్టు కావచ్చును. ఒకవేళ బహిష్టు అయితే, ఆ నిర్ణిత రోజులు ముగిసి పరిశుద్ధమయిన తరువాత స్నానం చేయవలెను.

పిండము మానవ రూపము దాల్చిన తరువాత జన్మిస్తెనే “నిఫాసు” అనబడును. మానవ రూపం దాల్చక ముందే గర్భము పడిపోయి రక్తస్రావం జరిగితే అది నిఫాసు కాదు. అది ఒక నరము నుంచి స్రవించు రక్తము మాత్రమే. అప్పుడు ముస్తహాజకు వర్తించే ఆదేశమే ఆమెకు వర్తించును. మానవ రూపము ఏర్పడుటకు కనీస కాలం గర్భము నిలిచినప్పటి నుండి ఎనభై (80) రోజులు. గరిష్ఠ కాలం తొంబై (90) రోజులు అవుతుంది.

నిఫాసు ధర్మములు కూడా బహిష్టు గురించి తెలిపిన ధర్మములే.

బహిష్టు మరియు కాన్పులను ఆపడం

స్త్రీ బహిష్టు కాకుండా ఏదయినా ఉపయోగించదలుచుకుంటే ఈ రెండు షరతులతో ఉపయోగించవచ్చును.

  • 1- ఏలాంటి నష్ట భయముండకూడదు. నష్ట భయమున్నచో అది ధర్మసమ్మతం కాదు.
  • 2- భార్య తన భర్త అనుమతితో ఉపయోగించాలి.

బహిష్టు కావడానికి ఏదయినా ఉపయోగించ దలుచుకంటే ఈ రెండు షరతులతో ఉపయోగించవచ్చును.

  • 1- భర్త అనుమతితో ఉపయోగించాలి.
  • 2- నమాజు, రోజా లాంటి విధిగా ఉన్న ఆరాధనలు పాటించని ఉద్దేశంగా ఉపయోగించకూడదు.

గర్భం నిలువకుండా (కుటుంబ నియంత్రణ కొరకు) ఏదైనా ఉపయోగించదలుచుకుంటే ఈ రెండు షరతులను పాటించాలి.

  • 1- కుటుంబ నియంత్రణ ఉద్దేశంగా చేయుట యోగ్యం లేదు.
  • 2- ఒక నిర్ణీత కాలపరిమితి వరకు అనగా గర్భము వెంటనే గర్భము నిలిచి స్త్రీ ఆరోగ్యానికి హాని కలిగే భయముంటె మాత్రమే. అది కూడా భర్త అనుమతితో. ఇంకా దీని వల్ల ఆమె ఆరోగ్యానికి ఏదైనా హాని కలిగే భయం ఉంటే కూడా చేయించకూడదు.

ముందు పాఠాలు:

ఫిఖ్ హ్ (శుద్ధి, నమాజు) – పార్ట్ 7B: తయమ్ముమ్ ఆదేశాలు [వీడియో]

బిస్మిల్లాహ్

[27:32 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ఈ వీడియో క్రింది పుస్తక ఆధారంగా వివరించబడింది.
శుద్ధి & నమాజు [పుస్తకం]


తయమ్ముమ్:

క్రింద తెలుపబడే కారణాలు సంభవించి నప్పుడు ప్రయాణికులు, స్థానికులు ఎవరైనా సరే వుజూ మరియు గుస్ల్ కు బదులుగా తయమ్ముమ్ చేయవచ్చును.

1- అతికష్టంగా వెతికినప్పటికీ నీళ్ళు దొరకనప్పు డు, లేదా ఉండికూడా వుజూకు సరిపడనప్పుడు తయమ్ముమ్ చేయవచ్చును. కొంత దూరములో నీళ్ళు ఉన్నా అక్కడికి వెళ్ళి తీసుకోవడంలో అతనికి ధన, ప్రాణ నష్టమున్నప్పుడు కూడా తయమ్ముమ్ చేయవచ్చును.

2- వుజూ అవయవాల్లో ఏ ఒకదానికైనా గాయమయితే దాన్ని కడిగే ప్రయత్నం చేయాలి. కడగడం వల్ల నష్టం ఉంటే మసహ్ చేయాలి, అంటే చేయి తడి చేసి దాని మీద తుడువాలి. మసహ్ వల్ల కూడా హాని కలిగే భయం ఉంటే తయమ్ముమ్ చేయవచ్చును.

3- నీళ్ళు లేదా వాతవరణం మరీ చల్లగా ఉండి నీళ్ళ ఉపయోగం హానికరంగా ఉంటే తయమ్ముమ్ చేయవచ్చును.

4- నీళ్ళు కేవలం త్రాగడానికి మాత్రమే ఉన్నప్పుడు కూడా తయమ్ముమ్ చేయవచ్చును.

తయమ్ముమ్ విధానం:

మనుసులో నియ్యత్ /సంకల్పం చేసుకొని రెండు అరచేతులు ఒక సారి భూమిపై తట్టి ముఖముపై మళ్ళీ మణికట్ల వరకు రెండు చేతులపై మసహ్ చేయాలి. (కొందరు వుజూ చేసినట్లుగా మోచేతుల వరకు, కాళ్ళు సయితం మసహ్ చేస్తారు ఇది ప్రవక్త పద్దతి ఎంతమాత్రం కాదు). వుజూను భంగపరిచే విషయాలే తయ మ్ముమ్ ను భంగపరుస్తాయి. నమాజుకు ముందు లేదా నమాజ్ మధ్యలో నీళ్ళు లభిస్తే తయమ్ముం  భంగమవుతుంది. నమాజ్ పూర్తి చేసుకున్న తరువాత నీళ్ళు లభిస్తే ఆ నమాజ్ అయినట్లే. తిరిగి మళ్ళీ చేయవలసిన అవసరం లేదు.

ఈ పుస్తకం ఆధారంగా చెప్పిన ముందు వీడియో పాఠాలు

జునుబీ’ (అశుద్ద స్థితిలో ఉన్నవారి) పై నిషిద్ధ విషయాలు [వీడియో, టెక్స్ట్]

‘జునుబీ’ (అశుద్ద స్థితిలో ఉన్నవారి) పై నిషిద్ధ విషయాలుఫిఖ్ హ్ (శుద్ధి, నమాజు) : పార్ట్ 7A
https://youtu.be/4tRtuTItZkY [30 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
శుద్ధి & నమాజు [పుస్తకం]

ఈ ప్రసంగంలో, ‘ఫిఖ్ అత్-తహారా వస్-సలాహ్’ (పారిశుధ్యం మరియు నమాజ్ ఆదేశాలు) అనే అంశంపై ఏడవ తరగతిలో భాగంగా, జునూబీ (అశుద్ధావస్థలో ఉన్న వ్యక్తి)కి నిషిద్ధమైన పనుల గురించి వివరించబడింది. జునూబీ అంటే స్వప్నస్కలనం లేదా భార్యాభర్తల సంభోగం కారణంగా అశుద్ధతకు లోనైన స్త్రీ లేదా పురుషుడు. వీరికి నిషిద్ధమైనవి నాలుగు ప్రధాన పనులు: 1) నమాజ్ చేయడం, 2) కాబా తవాఫ్ చేయడం, 3) దివ్య ఖుర్ఆన్ గ్రంథాన్ని ముట్టుకోవడం, మరియు 4) మస్జిద్‌లో ఆగడం లేదా నివసించడం. ప్రతి అంశానికి ఖుర్ఆన్ ఆయతులు, హదీసుల నుండి ఆధారాలు, మరియు నలుగురు ఇమామ్‌ల ఏకాభిప్రాయం (ఇజ్మా)తో సహా వివరణ ఇవ్వబడింది. అశుద్ధావస్థలో నమాజ్ చేయరాదు కానీ దాని కోసం నమాజ్‌ను ఆలస్యం చేయడం లేదా వదిలివేయడం తప్పు అని, వెంటనే స్నానం చేసి నమాజ్ ఆచరించాలని స్పష్టం చేయబడింది.

అస్సలాము అలైకుం వ’రహ్మతుల్లాహి వ’బరకాతుహు

أَلْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ، وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِينَ، نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَصَحْبِهِ أَجْمَعِينَ، أَمَّا بَعْدُ
(అల్ హందు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సఃబిహి అజ్మయీన్, అమ్మా బ’ద్)
సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రాలు. ప్రవక్తల నాయకుడైన మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయన కుటుంబ సభ్యులు మరియు ఆయన సహచరులందరిపై శాంతి మరియు శుభాలు వర్షించుగాక.

సోదర మహాశయులారా సోదరీమణులారా! ఫిఖ్ అత్-తహారా వస్-సలాహ్ (Fiqh al-Taharah wa’l-Salah), పరిశుభ్రత మరియు నమాజ్‌కు సంబంధించిన ఆదేశాల ఈ క్లాస్ ఏదైతే మనం మొదలుపెట్టామో, అల్లాహ్ యొక్క దయవల్ల ఈ రోజున ఏడవ క్లాస్ మనం మొదలుపెట్టబోతున్నాము.

అయితే ఈనాడు మనం చదివేటువంటి పాఠాలు ఏవైతే ఉన్నాయో, పరిశుద్ధ స్థితిలో లేనివారు, ప్రత్యేకంగా అశుద్ధావస్థలో ఉన్నవారు అంటే జునూబీ (Junubi) అని ఎవరినైతే అనడం జరుగుతుందో, వారిపై నిషిద్ధములు ఉన్నవి ఏమిటి మరియు తయమ్ముమ్‌కు సంబంధించి కొన్ని ఆదేశాలు ఖుర్ఆన్ హదీస్ ఆధారంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.

అయితే రండి, ‘జునూబీ‘ అన్న పదం ఏదైతే ఉందో, అరబీలో జునూబీ అన్న పదం స్వప్నస్కలనం వల్ల లేదా భార్యాభర్తల సంభోగం కారణంగా అశుద్ధతకు లోనైన వ్యక్తిని, స్త్రీ అయినా పురుషుడు అయినా, జునూబీ అని అంటారు.

అయితే, ఈ అశుద్ధ స్థితిలో ఎవరైతే ఉంటారో, ఆ కొంత కాలం, ఆ కొంత సమయం ఏదైతే వారు అశుద్ధంగా ఉంటారో అప్పుడు ఏ కార్యాలు చేయడం వారిపై నిషిద్ధంగా ఉంటాయి? అయితే ఇక్కడ మీరు చూస్తున్నట్లు నాలుగు విషయాలు ప్రస్తావించడం జరిగింది. ఒకటి నమాజ్, రెండవది తవాఫ్, మూడవది దివ్య ఖుర్ఆన్ ను ముట్టుకోవడం, నాలుగవది మస్జిద్ లో ఉండడం, అక్కడ కూర్చోవడం, పడుకోవడం, నిలవడం.

అయితే రండి, ఈ నాలుగు విషయాలకు కొంత వివరణ మనం తెలుసుకుందాము. నమాజ్, తవాఫ్, దివ్య ఖుర్ఆన్ ను ముట్టుకోవడం, మస్జిద్ లో ఆగడం. ఇవి నాలుగు పనులు జునూబీ చేయరాదు.

అయితే, వీటికి సంబంధించి మనం ధర్మాదేశాలు చూస్తే గనక, అక్కడ ఎన్నో దలీల్ (ఆధారాలు), నిదర్శనాలు ఉన్నాయి.

ఉదాహరణకు, అల్లాహు త’ఆలా సూరతున్ నిసా ఆయత్ నెంబర్ 43లో తెలిపాడు:

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ لَا تَقْرَبُوا۟ ٱلصَّلَوٰةَ وَأَنتُمْ سُكَـٰرَىٰ حَتَّىٰ تَعْلَمُوا۟ مَا تَقُولُونَ وَلَا جُنُبًا إِلَّا عَابِرِى سَبِيلٍ حَتَّىٰ تَغْتَسِلُوا۟

విశ్వసించిన ప్రజలారా! మీరు (తాగిన) మత్తులో ఉన్నప్పుడు నమాజు దరిదాపులకు కూడా పోకండి. మీరు పలికేదేమిటో మీకు అర్థం కాగలిగినప్పుడే (నమాజు చెయ్యాలి). లైంగిక అశుద్ధావస్థలో కూడా – స్నానం చేయనంతవరకూ – నమాజు చేయరాదు. (మస్జిదు) దారిగుండా సాగిపోయేటి పరిస్థితి అయితే అది వేరే విషయం! (4:43)

నమాజ్‌కు సమీపించకూడదు. ఇక్కడ ఎవరు? రెండవ విషయం, వలా జునుబన్ (వలా జునుబన్) – జునూబీ, అశుద్ధావస్థలో ఉన్నటువంటి వ్యక్తి. ఎప్పటివరకు? హత్తా తఘ్ తసిలూ – స్నానం చేసే వరకు. స్నానం చేసిన తర్వాతనే వారు నమాజ్ చేయాలి, అంతకుముందు నమాజ్ చేయడానికి అవకాశం లేదు. ఈ నమాజ్ చేయడం వారిపై నిషిద్ధం.

ఇక ఈ అశుద్ధ స్థితిలో నమాజ్ చేయడం నిషిద్ధం అని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజుల్లో ఎంతోమంది యువకులు, యువతులు ఈ ఆదేశం, అల్లాహు త’ఆలా ఏదైతే ఇచ్చాడో, తప్పుడు భావం తీసుకుని నమాజ్‌ను వదులుతూ ఉన్నారు. ఎందరినో చూడడం జరుగుతుంది, వేరే నమాజ్‌లు వారు పూర్తి పాబందీగా చేసినప్పటికీ, రాత్రి అశుద్ధావస్థకు లోనయ్యారు, స్వప్నస్కలనం జరిగింది, వారిని మేల్కొలిపినప్పటికీ, వారు ఫజ్ర్ నమాజ్ జమాఅత్‌తో చేయడానికి రారు. ఇళ్లల్లో తల్లులు లేపినా పిల్లల్ని, వారు చాలా అశ్రద్ధ వహిస్తారు. ఏందంటే నేను స్నానం చేసేది ఉంది, ఇప్పుడు ఈ చల్లదనం, ఇప్పుడు ఇంత తొందరగా చేయాలంటే నాతో కుదరదు, నేను 7 గంటల తర్వాత లేచి స్నానం చేసి అప్పుడు నమాజ్ చేసుకుంటాను.

అయితే సోదర మహాశయులారా, ఈ ఆయత్ ద్వారా చెప్పదలచిన విషయం ఏమిటంటే, అశుద్ధావస్థలో నమాజ్ చేయడం సరియైన విషయం కాదు. ఇలాంటి మనిషి తప్పకుండా స్నానం చేసి నమాజ్ చేయాలి అని చెప్పడం జరుగుతుంది కానీ, “నమాజ్ ఆలస్యం చేయండి, నమాజ్ దాని సమయం దాటినా పర్వాలేదు, మీరు ఆలస్యంగా చేసుకున్నా అభ్యంతరం లేదు”, అలాంటి మాట ఇక్కడ చెప్పడం జరగలేదు. ఈ విషయం గుర్తుంచుకోవాలి.

అశుద్ధావస్థలో ఉన్న వారిపై నమాజ్ నిషిద్ధం అన్న దాని గురించి హదీసులలో కూడా ఆధారం ఉంది. మనకు సహీహ్ బుఖారీ హదీస్ నెంబర్ 275 మరియు సహీహ్ ముస్లింలో హదీస్ నెంబర్ 605, ఇలా స్పష్టంగా కనబడుతుంది.

అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించారు:

ఉఖీమతిస్సలాహ్ – నమాజ్ కొరకు ఇఖామత్ చెప్పడం జరిగింది. వ ఉద్దిలతిస్ సుఫూఫు ఖియామా – అందరూ పంక్తుల్లో నిలబడి సఫ్‌లన్నీ కూడా సక్రమంగా చేయబడ్డాయి. ఫ ఖరజ ఇలైనా రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం – నమాజ్ చేయించడానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చేశారు. ఫలమ్మా ఖామ ఫీ ముసల్లా – ప్రవక్త నమాజ్ చేయించే, ఇమామత్ చేయించే స్థలం ఏదైతే ఉందో అక్కడ నిలబడిన నిలబడ్డారు, జకర – అప్పుడు గుర్తుకొచ్చింది అన్నహు జునుబున్ – ప్రవక్త అశుద్ధావస్థలో ఉన్నట్లు, స్నానం చేయవలసిన అవసరం ఉంది అని ప్రవక్త వారికి గుర్తుకొచ్చింది. ఫ ఖాల లనా – అబూ హురైరా అంటున్నారు, ప్రవక్త వారు మా సహాబాలందరినీ ఉద్దేశించి చెప్పారు, మకానకుమ్ – మీరు ఇలాగే నిలబడి ఉండండి. సుమ్మ రజ’అ ఫఘ్ తసల – ప్రవక్త వెళ్ళిపోయారు, స్నానం చేశారు. సుమ్మ ఖరజ ఇలైనా – మళ్ళీ ప్రవక్త మా మధ్యలో వచ్చారు, వ ర’సుహు యఖ్తుర్ – తల నుండి నీళ్లు, నీళ్ల యొక్క చుక్కలు, నీళ్ల బొట్లు పడుతూ ఉన్నాయి. ఫ కబ్బర ఫ సల్లైనా మా’అహు – అల్లాహు అక్బర్ అని తక్బీరె తహ్రీమా అన్నారు. మేము ప్రవక్త వెంట నమాజ్ చేసుకున్నాము.

ఈ హదీస్ ద్వారా కూడా ఏం తెలిసింది? ప్రవక్త మరిచిపోయారు. అయితే, నమాజ్ చేయించడానికి వచ్చేశారు కానీ నిలబడి ముసల్లా మీద నమాజ్ స్టార్ట్ చేసేకి ముందుగా గుర్తుకు వచ్చేసింది, అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంటనే ఆ విషయాన్ని, ఏదైతే గుర్తుకు వచ్చిందో, సహాబాలను అక్కడే ఉండమని చెప్పి వెళ్ళిపోయారు మరియు నమాజ్ స్నానం చేసిన తర్వాతనే వచ్చి నమాజ్ చేయించారు.

సోదర మహాశయులారా, కనీసం ఒక ఆధారం మనం తెలుసుకున్నా అల్హందులిల్లాహ్ సరిపోతుంది. కానీ మీకు ఈ హదీసుల పట్ల కూడా మంచి అవగాహన కలిగి ఉండాలి అని నిదానంగా ఇలాంటి దలీల్ అన్నీ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. అందుకొరకు శ్రద్ధ వహించండి, నోట్స్ తయారు చేసుకుంటూ ఉండండి మరియు పాఠం జరిగిన తర్వాత, క్లాస్ తర్వాత ఈ పాఠాలను మీరు నెమరువేసుకుంటూ ఉండండి, రివ్యూ చేసుకుంటూ ఉండండి. దీని ద్వారా విద్య అనేది ఇంకా బలపడుతుంది, మీ మనసుల్లో నాటుకుపోతుంది, ఇంకా మీరు ఈ విషయాలు మర్చిపోకుండా ఉండాలంటే మీ వెనక వారికి, క్లాసులో పాల్గొనలేని వారికి చెబుతూ ఉండాలి కూడా.

అశుద్ధావస్థలో ఉన్నటువంటి జునూబీపై రెండవది ఏదైతే నిషిద్ధంగా ఉందో, అది కాబతుల్లాహ్ యొక్క తవాఫ్. దీనికి సంబంధించి ఎన్నో ఆధారాలు మనకు కనబడతాయి. సర్వసామాన్యంగా నేను ఏదైతే చెబుతూ ఉంటానో, మన మధ్యలో నాలుగు ఫిఖ్‌లు ఏవైతే ఫేమస్‌గా ఉన్నాయో, అంతకంటే ఎక్కువ ఫిఖ్‌లు కూడా ఇమామ్‌లు కూడా ఉండిరి, కానీ ఇవి నాలుగు ఫేమస్ అయిపోయాయి, హనఫీ, మాలికీ, షాఫియీ, హంబలీ. ఈ నాలుగు ఫిఖ్‌లలో కూడా ఏకీభవంగా తవాఫ్ చేసే వ్యక్తి కూడా తప్పకుండా పరిశుద్ధావస్థలో ఉండడం మరియు తవాఫ్ చేసేకి ముందు అతను వుదూ చేసుకోవడం చాలా నొక్కి చెప్పడం జరిగింది.

ఇంతకుముందు నేను ఏదైతే నమాజ్ గురించి ఒక ఆయత్ వినిపించానో, సూరత్ అన్-నిసా ఆయత్ నెంబర్ 43, దాని ద్వారా కూడా ఆధారం తీసుకోవడం జరుగుతుంది.

అలాగే హజ్రత్ ఆయిషా రదియల్లాహు త’ఆలా అన్హా వారికి హజ్ చేసే సందర్భంలో ఆమె నిలవారి ఏదైతే మొదలైపోయిందో, బహిష్టు, ఆ సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఏం చెప్పారు: ఇఫ్’అలీ మా యఫ్’అలుల్ హాజ్, ఘైర అల్లా తతూఫిల్ బైత్ హత్తా తత్ హురీ – ఇంకో ఉల్లేఖనంలో హత్తా తఘ్ తసిలీ. ఓ ఆయిషా, నీవు ఈ నెలవారి రక్తస్రావంలో ఉన్నావని బాధపడకు, హజ్ విషయంలో నీకు ఏదైనా ఆటంకం కలిగింది అన్నట్లుగా నీవు నొచ్చుకోవద్దు ఎందుకంటే నీవు ఈ స్థితిలో ఉండి కూడా హాజీ ఏ ఏ పనులు చేస్తాడో అవన్నీ చేయవచ్చును నువ్వు, కేవలం ఒక్క తవాఫ్ తప్ప. తవాఫ్ చేయకూడదు, పరిశుద్ధమై స్నానం చేసే వరకు తవాఫ్ చేయకు.

ఈ హదీస్ సహీహ్ బుఖారీలో ఉంది 305, సహీహ్ ముస్లింలో ఉంది 1211. ఈ హదీస్ ద్వారా కూడా ధర్మవేత్తలందరూ ఏకీభవించారు. స్త్రీ నెలవారి రక్తస్రావం జరుగుతుంది అంటే ఆమె అశుద్ధావస్థలో ఉన్నట్లు. అశుద్ధావస్థలో ఉన్నవారు తవాఫ్ చేయకూడదు.

ఇదే కాకుండా హజ్రత్ సఫియా బిన్తె హుయై ఇబ్ను అఖ్తబ్ రదియల్లాహు త’ఆలా అన్హా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పవిత్ర భార్య, ఆమెకు సంబంధించిన ఒక హదీస్ ద్వారా కూడా ఈ విషయం తెలుస్తుంది.

మరియు అలాగే ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు త’ఆలా అన్హు వారి యొక్క ఉల్లేఖనం ఉంది, సునన్ నసాయిలో, నసాయి కుబ్రా 3944, అలాగే బైహఖీలో 9573 మరియు ఈ హదీసును కొందరు ధర్మవేత్తలు మౌఖూఫ్ మరియు సహీహ్ అని చెప్పారు. కానీ ఈ మాట చెప్పేవారు ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు త’ఆలా అన్హు అయినప్పటికీ, హదీస్ పరిభాషలో, ఇస్తిలాహె హదీస్లో దీనిని హుక్ముర్ రఫ్’అ అని అంటారు, హుక్ముల్ మర్ఫూ అని అంటారు. అంటే, ఇలాంటి మాట సహాబీ తన ఇష్టానుసారం చెప్పడానికి హక్కు ఉండదు, వారు ప్రవక్తతో విని ఉంటారు, తెలుసుకొని ఉంటారు కానీ ప్రవక్త చెప్పారు అన్నటువంటి మాట ఆ సందర్భంలో వారు చెప్పలేదు. ఏంటి విషయం?

అత్తవాఫు బిల్ బైతి సలాహ్ – కాబతుల్లాహ్ యొక్క తవాఫ్ కూడా సలాహ్, నమాజ్ లాంటిది. కాకపోతే ఈ తవాఫ్‌లో మాట్లాడే అటువంటి, నడిచే అటువంటి అనుమతి ఇవ్వడం జరిగింది. నమాజ్‌లో మాట్లాడే, నడిచే అనుమతి కూడా లేదు.”

సోదర మహాశయులారా, తవాఫ్ చేయకూడదు అన్నటువంటి ఈ విషయం ఏదైతే ఉందో, దీని గురించి మనకు ఈ ఆధారాలు ఏవైతే తెలిశాయో, వీటిపై మనం తృప్తి ఉండి, ఎప్పుడూ మనం తవాఫ్ చేసినా అశుద్ధావస్థలో ఉండకుండా పరిశుభ్రతలో ఉండి, వుదూ చేసుకొని తవాఫ్ చేసే ప్రయత్నం చేయాలి.

ఇక రండి, మూడో విషయం అశుద్ధావస్థలో ఏమి చేయరాదు? ఖుర్ఆన్ ను తాకకూడదు అన్నటువంటి విషయం. అయితే ఖుర్ఆన్ ను తాకకూడదు అన్నటువంటి విషయం ఏదైతే ఉందో, దీని గురించి కూడా హనఫీ, మాలికీ, షాఫియీ, హంబలీ, ఈ నాలుగు ఫిఖ్‌లలో, నాలుగు ఫిఖ్‌లలో జునూబీ – జునూబీ అంటే ఎవరో తెలిసింది కదా, అశుద్ధావస్థలో ఉన్న వ్యక్తి – ఖుర్ఆన్ ను ముట్టుకోకూడదు, ఖుర్ఆన్ ను తాకకూడదు అని ఏకీభవించారు. మరియు ఇమామ్ ఇబ్ను అబ్దిల్ బర్ర్, ఇమామ్ ఇబ్ను అబ్దిల్ బర్ర్ ఈ విషయంలో అందరి ఏకాభిప్రాయం ఉంది, ఇజ్మా ఉంది అని కూడా స్పష్టంగా తెలిపారు. ఈ విషయం అల్-ఇస్తిద్కార్ లో ఉంది. అలాగే ఇమామ్ షౌకానీ రహిమహుల్లాహ్ కూడా ఈ విషయం తెలిపారు, నైలుల్ అవ్తార్ లో ఈ మాట ఆయన రాశారు.

దీనికి సూరతుల్ వాఖిఆ, ఇందులోని ఆయత్ ద్వారా కూడా దలీల్ తీసుకోవడం జరుగుతుంది. కొందరు సూరత్ అల్-వాఖిఆలో వచ్చిన ఆయత్ ను దేవదూతల గురించి అని, అది లౌహె మహ్ఫూజ్ గురించి అని అంటారు. కానీ సర్వసామాన్యంగా అధికమంది ధర్మవేత్తలు ఈ ఆయత్ నే ఆధారంగా తీసుకున్నారు మరియు ఇమామ్ ఖుర్తుబీ రహిమహుల్లాహ్ తఫ్సీరె ఖుర్తుబీలో చెప్పారు: అన్నహు ఇదా కాన లా యజూజు లహు అల్-లుబ్సు ఫిల్ మస్జిద్, ఫ అహ్రా అల్లా యజూజ లహు మస్సుల్ ముస్హఫ్, వలల్ ఖిరాఅతు ఫీహి ఇద్ హువ అ’జము హుర్మతన్. మనం నాలుగో విషయం తెలుసుకోబోతున్నాము మస్జిద్ లో ఉండకూడదు అని. అక్కడ వివరాలు వస్తాయి దానికి సంబంధించి. అయితే ఇమామ్ ఖుర్తుబీ ఇక్కడ ఆ విషయాన్ని ప్రస్తావించారు. జునూబీ మస్జిద్ లో ఆగకూడదు, అక్కడ నిలువకూడదు. అయితే, మస్జిద్ లో జునూబీ నిలువకూడదు అని ఆదేశం ఉన్నప్పుడు, ఫ అహ్రా అల్లా యజూజ లహు మస్సుల్ ముస్హఫ్ – అయితే అతను ముస్హఫ్ ను, ఖుర్ఆన్ గ్రంథాన్ని తాకకపోవడం, ముట్టుకోకపోవడం ఇది మరీ చాలా అవసరమైన విషయం. వలల్ ఖిరాఅతు ఫీహి – దానిని ముట్టుకొని, చూసి చదవడం కూడా ఇది యోగ్యం లేదు. ఇద్ హువ అ’జము హుర్మతన్ – ఖుర్ఆన్ గ్రంథం, దీని యొక్క గౌరవప్రదం అనేది మస్జిద్ కంటే కూడా ఎక్కువగా ఉంది.

అంతేకాకుండా, మరొక హదీస్ ద్వారా కూడా దలీల్ తీసుకుంటారు ఎందరో ధర్మవేత్తలు. తబరానీ, దారుఖుత్నీ ఇంకా వేరే హదీస్ గ్రంథాల్లో ఈ హదీస్ వచ్చి ఉంది. షేక్ అల్బానీ రహిమహుల్లాహ్ సహీహుల్ జామిఅలో దీనిని ప్రస్తావించారు. హదీస్ నెంబర్ 7780. ఏంటి హదీస్? లా యమస్సుల్ ఖుర్ఆన ఇల్లా తాహిరున్ – ఖుర్ఆన్ ను పరిశుభ్రంగా ఉన్న వ్యక్తే ముట్టుకోవాలి, తాకాలి. అయితే జునూబీ మనిషి ఖుర్ఆన్ ను ముట్టుకోకూడదు, తాకకూడదు.

అయినా మీరు గమనించండి, ఈ జనాబత్ అనేది ఏదైతే ఉందో, ఈ అశుద్ధావస్థ ఏదైతే ఉందో, అది చాలా తక్కువ సమయమే ఉంటుంది. స్త్రీలకు నెలవారి లేదా ప్రసవ రక్తం స్రవించే సందర్భంలో ఒక కొన్ని రోజుల వరకు వారు ఆ అశుద్ధావస్థలో ఉంటారు, వారి విషయం వేరు. కానీ జనాబత్ అన్నది ఏదైతే ఉందో, స్వప్నస్కలనం లేదా భార్యాభర్తల సంభోగం కారణంగా అశుద్ధావస్థ, ఇది చాలా తక్కువ సమయం ఉంటుంది. అందుకొరకు ఈ సమయంలో ఖుర్ఆన్ ను ముట్టుకోకపోవడం, తాకకుండా ఉండడమే మేలైన విషయం.

ఈ కొన్ని ఆయత్ హదీసులు కాకుండా, సహాబాల యొక్క అతర్, వాటి ద్వారా కూడా దీనికి ఆధారం తీసుకోవడం జరుగుతుంది. ఇందులో సల్మాన్ ఫార్సీ రదియల్లాహు త’ఆలా అన్హు వారి యొక్క ఉల్లేఖనం ఉంది. ఇమామ్ ఇబ్ను అబీ షైబా తన ముసన్నఫ్‌లో 1106, మరియు ఇమామ్ బైహఖీ మరియు ఇమామ్ దారుఖుత్నీ ఇంకా ఇమామ్ జైల’యీ రహిమహుల్లాహ్ నస్బుర్ రాయాలో కూడా దీనిని ఉల్లేఖించారు.

సల్మాన్ ఫార్సీ రదియల్లాహు త’ఆలా అన్హు ఒక ప్రయాణంలో ఉండగా, అబ్దుర్రహ్మాన్ బిన్ యజీద్ బిన్ జాబిర్ ఉల్లేఖిస్తున్నారు, ఆయన చెప్పారు: సల్మాన్ ఫార్సీ రదియల్లాహు త’ఆలా అన్హు కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లారు. తిరిగి వచ్చేసిన తర్వాత నేను అడిగాను, మీరు వుదూ చేసుకోండి, ల’అల్లనా నస్’అలుక అన్ ఆయిన్ మినల్ ఖుర్ఆన్ – మేము నీతో ఖుర్ఆన్‌లోని కొన్ని ఆయతుల గురించి అడగాలనుకుంటున్నాము. అప్పుడు సల్మాన్ రదియల్లాహు త’ఆలా అన్హు చెప్పారు: సలూనీ, ఫ ఇన్నీ లా అముస్సుహు – అడగండి, నేను ఖుర్ఆన్‌ను ముట్టుకోను, తాకను. ఇన్నహు లా యమస్సుహు ఇల్లల్ ముతహహరూన్ – ఈ ఖుర్ఆన్‌ను తాకడానికి పవిత్రంగా, పరిశుభ్రంగా ఉండడం తప్పనిసరి. అప్పుడు మేము వారితో అడిగాము, ఫ ఖర’అ అలైనా ఖబ్ల అన్ యతవద్ద’అ – అయితే సల్మాన్ రదియల్లాహు త’ఆలా అన్హు వుదూ చేసుకునేకి ముందు, ఖుర్ఆన్‌ను తాకకుండా, ఖుర్ఆన్ ఆయత్ మాకు చదివి వినిపించారు.

ఈ విధంగా సోదర మహాశయులారా, మనకు అల్లాహ్ యొక్క దయవల్ల ఖుర్ఆన్ ను ముట్టుకోకూడదు అన్నటువంటి విషయం గురించి ఈ ఆధారాలు తెలిసినవి.

జునూబీ, అశుద్ధావస్థలో ఉన్న వ్యక్తిపై నిషిద్ధం ఉన్న నాలుగో విషయం ఏదైతే ఉందో, మస్జిద్ లో ఆగడం, మస్జిద్ లో నిలవడం. దీనికి సంబంధించి కూడా ఖుర్ఆన్ లోని సూరత్ అన్-నిసాలోని ఆయత్ 43 ఏదైతే ఇంతకుముందు మనం చెప్పుకున్నామో, వలా జునుబన్ ఇల్లా ఆబిరీ సబీలిన్ హత్తా తఘ్ తసిలూ, ఈ ఆయత్ ద్వారానే దలీల్ తీసుకోవడం జరుగుతుంది.

మాషాఅల్లాహ్. తబారకల్లాహ్. గమనించండి. అందుకొరకే నేను మాటిమాటికి చెబుతూ ఉంటాను. నాకు అరబీ వచ్చయ్యా, అరె ఖుర్ఆన్ అయితే నా భాషలో తర్జుమా, అనువాదం ఉంది కదా నేను చదివి తెలుసుకుంటాను, ఇట్లాంటి మోసాలకు గురి కాకూడదు, నాకు జ్ఞానం ఉంది, నేను స్వయంగా ధర్మ విద్య నేర్చుకుంటాను అన్నటువంటి మాటల్లో పడి మనిషి పెడమార్గంలో పడే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఉలమాల ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటే, క్లాసులలో పాల్గొని ఉండేది ఉంటే, ఇంకా దానికి సంబంధించిన వ్యాఖ్యానాలు చదువుతూ ఉంటే, ఒక్కొక్క ఆయత్ ద్వారా ఎన్ని ధర్మ విషయాలు ధర్మవేత్తలు మనకు తెలియజేస్తూ ఉంటారు.

మస్జిద్ లో నిలవడం జునూబీపై నిషిద్ధం అన్న దాని గురించి ఈ ఆయత్ నుండి ఎలా దలీల్ తీసుకున్నారో చెప్పండి? ఇల్లా ఆబిరీ సబీలిన్. జునూబీ ఎవరైతే ఉన్నారో వారు నమాజ్‌కు, నమాజ్ చేసే స్థలానికి అక్కడికి రాకూడదు. కానీ నమాజ్ చేసే స్థలం ఏదైతే ఉంటుందో, ఇల్లా ఆబిరీ సబీల్ – అలా దాటుతూ వెళ్ళవచ్చు. అయితే, నమాజ్ చేసే స్థలం అంటే ఇక మస్జిద్. సర్వసామాన్యంగా. అయితే ఆ మస్జిద్, దానికి కూడా ఒక గౌరవ స్థానం అల్లాహ్ ప్రసాదించాడు. అందుకొరకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ ఆయత్ ఏదైతే అవతరించిందో ఇది నమాజ్ గురించి, నమాజ్ చేసే స్థలం గురించి కూడా అని ధర్మవేత్తలు దీని గురించి ఏకీభవించారు. హనఫీ, మాలికీ, షాఫియీ, హంబలీ, అందరూ దీనిని ఏకీభవించారు.

ఒకవేళ ఎవరికైనా అనుమానం రావచ్చు, సర్వసామాన్యంగా మేము అంటూ ఉంటాము, మనం కేవలం ఖుర్ఆన్ హదీస్‌ను ఫాలో కావాలి. ఇక ఎవరైతే ఖుర్ఆన్ హదీస్ కాకుండా ఈ మస్లక్‌లలో పడి ఉన్నారో, హనఫీ, షాఫియీ, హంబలీ, మాలికీ, ఈ విధంగా ఇది మంచి విషయం కాదు, అంధీ తఖ్లీద్ (గుడ్డి అనుకరణ) అనేది ఇది చాలా ప్రమాదకరం అని చెబుతూ ఉంటారు. మరి ఈ మస్లే మసాయిల్, ఈ ధర్మ విషయాలు బోధిస్తున్నప్పుడు మాటిమాటికి హనఫీ, మాలికీ, షాఫియీ, హంబలీ అందరూ దీనిని ఏకీభవించారు అని వాటిని ఎందుకు ప్రస్తావిస్తున్నారు? ఇది తెలుసుకోవాల్సిన విషయం. చూడండి, ఇదే మన్హజె సలఫ్. మనకు సహాబాలు ఎలా ఖుర్ఆన్ హదీసులను అర్థం చేసుకున్నారో, ధర్మవేత్తలు ఎలా అర్థం చేసుకున్నారో, వాటిని మనం తెలుసుకోవాలి. తెలుసుకొని అదే రకంగా మనం అనుసరించాలి. ఎప్పుడైనా ఎవరైనా, ఎక్కడైనా వారితో పొరపాటు జరిగితే వారి గురించి అల్లాహ్ వారిని మన్నించుగాక అని దుఆ చేస్తూ, ఖుర్ఆన్ హదీస్‌కు చేరువగా, దగ్గరగా ఎవరి మాట ఉందో తీసుకోవాలి, ఖుర్ఆన్ హదీస్‌ను అనుసరించాలి. అల్లాహ్ యొక్క దయ కలిగితే వేరే సందర్భాలలో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చెబుదాము.

అయితే, జునూబీ అశుద్ధావస్థలో ఉన్న వ్యక్తి మస్జిద్ లో నిలవకూడదు. ఈ ఆయత్ ద్వారా దలీల్ తీసుకోవడం జరిగింది. ధర్మ పండితులందరూ కూడా ఏకీభవించారు. తఫ్సీర్ ఇబ్ను కసీర్ లో ఈ మాట ఉంది. అలాగే సౌదీ అరబ్ లోని ఇఫ్తా కమిటీ, ఫత్వా కమిటీ ఏదైతే ఉందో వారు కూడా దీనిని ఏకీభవించారు. కానీ ఇందులో ఒక విషయం, ఖుర్ఆన్ ఆయత్ ద్వారానే మనకు తెలుస్తుంది. ఎవరికైనా వేరే ఏ గత్యంతరం లేక మస్జిద్ నుండి దాటి వెళ్ళవలసిన అవసరం వస్తే, వారు తప్పకుండా అలా వెళ్ళవచ్చు. ఇందులో అనుమానం లేదు. ఫిఖ్ షాఫియీ, హంబలీ అలాగే ఇమామ్ ఇబ్ను తైమియా, ఇబ్ను బాజ్, ఇబ్ను ఉసైమీన్ వీరందరి ఫత్వాలు కూడా ఇలాగే ఉన్నాయి.

ఇక్కడ ఒక విషయం. ఈ రోజుల్లో కొన్ని సందర్భాల్లో ఇప్పుడు లాక్డౌన్ కారణంగా కాకపోవచ్చు కానీ అంతకుముందు కూడా మస్జిద్ లో పడుకుంటారు కొందరు. అయితే మస్జిద్ లో పడుకోవడం పాపం తప్పేమీ లేదు. కానీ ఎవరైతే మస్జిద్ లో పడుకుంటున్నారో వారు ఈ విషయాన్ని, ఈ అంశాన్ని శ్రద్ధగా ఎల్లవేళల్లో మదిలో నాటుకొని ఉండాలి. అదేమిటి? ఒకవేళ నిద్రలో వారికి స్వప్నస్కలనం జరిగిందంటే, వెంటనే వారు వెళ్లి స్నానం చేసేయాలి. అరె ఫజర్ నమాజ్ కొరకు ఇంకా మూడు గంటలు ఉన్నాయి కదా, ఇంకా రెండు గంటలు ఉన్నాయి కదా అని అలాగే అక్కడ పడుకొని ఉండిపోవడం, ఇది మంచి విషయం కాదు.

సోదర మహాశయులారా, ఈ విధంగా మనం అల్లాహ్ యొక్క దయవల్ల ఈ అశుద్ధావస్థలో ఏ ఏ పనులు చేయరాదు అన్నటువంటి విషయం ఆ మనం తెలుసుకున్నాము. అయితే, ఖుర్ఆన్ చదవవచ్చు కానీ ఖుర్ఆన్ ను తాకకూడదు అని సల్మాన్ ఫార్సీ రదియల్లాహు త’ఆలా అన్హు వారి యొక్క మాట ద్వారా కూడా మనం అర్థం చేసుకున్నాము ఈ మధ్యలో. కానీ ఎలాగైనా అశుద్ధావస్థ అనేది జనాబత్‌కు సంబంధించింది, ఎక్కువ సేపు ఉండదు గనుక మనం కావాలని మరీ ఆలస్యం చేయకూడదు. కావాలని ఖుర్ఆన్ ను తాకడం గాని, చదవడం గాని చేయకుండా ఉండి, అల్లాహ్ యొక్క జిక్ర్ చేస్తూ ఉండడం, ఇందులో అభ్యంతరం లేదు.

మరి ఏ ధర్మ పండితులైతే ఖుర్ఆన్ చూడకుండా చదవవచ్చు అని అన్నారో, వారు తీసుకున్నటువంటి దలీళ్లలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీస్, అన్న నబి సల్లల్లాహు అలైహి వసల్లం, రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం కాన యద్కురుల్లాహ అలా కుల్లి అహ్యానిహి – ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎల్లవేళల్లో అల్లాహ్ యొక్క జికర్ చేస్తూ ఉండేవారు. ఇమామ్ బుఖారీ ము’అల్లఖన్ ఈ హదీస్‌ను ప్రస్తావించారు 634 కంటే ముందు, సహీహ్ ముస్లింలో 373లో ఈ హదీస్ ఉంది.

కానీ హజ్రత్ అలీ రదియల్లాహు త’ఆలా అన్హు వారి యొక్క ఆచరణ గురించి ముసన్నఫ్ అబ్దుర్రజాఖ్‌లో అలాగే ఇమామ్ అబూ ను’అయమ్ అస్సలాలో, ఇమామ్ దారుఖుత్నీ సునన్‌లో ఆ మరియు ఇంకా వేరే ధర్మవేత్తలు ప్రస్తావించారు, అలీ రదియల్లాహు త’ఆలా అన్హు ఒక సందర్భంలో చెప్పారు: ఇఖ్ర’ఉల్ ఖుర్ఆన మా లమ్ యుసిబ్ అహదుకుమ్ జనాబ, ఫ ఇన్ అసాబత్హు జనాబతున్ ఫలా, వలా హర్ఫన్ వాహిదా – మీలో ఎవరైనా జనాబత్, అశుద్ధావస్థకు లోనయ్యారంటే వారు ఖుర్ఆన్ లోని ఒక అక్షరం కూడా చదవకూడదు.

అయితే, మరి అలీ రదియల్లాహు త’ఆలా అన్హు చదవకూడదు అని అంటున్నారు కదా? మరి కొందరు ధర్మవేత్తలు ఏమన్నారు? చదవవచ్చు అని అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీస్ ద్వారా దలీల్ తీసుకున్నారు. అయితే, అలీ రదియల్లాహు త’ఆలా అన్హు వారి యొక్క ఈ మాట ద్వారా వేరే కొందరు ధర్మవేత్తలు ఏమంటారంటే, అలీ రదియల్లాహు అన్హు చెప్పిన మాట కరెక్టే, చదవకండి అని. కానీ అక్కడ వివరణ లేదు, ఖుర్ఆన్ చూసి చదవడమా లేకుంటే చూడకుండా చదవడమా అని. ఖుర్ఆన్ ను పట్టుకొని చదవడమా లేక మనకు కంఠస్థం ఉన్న దానిలో నుండి చదవడమా? ఈ విధంగా కూడా ఒక దలీల్ ఇవ్వడం జరిగింది.


ఈ పుస్తకం ఆధారంగా చెప్పిన ముందు వీడియో పాఠాలు

ధర్మ జ్ఞానం లేకుండా ధర్మ జ్ఞానం బోధించడం ఘోరాతి ఘోరమైన పాపం [ఆడియో]

బిస్మిల్లాహ్

[36:27 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ఇతరములు

ధర్మ ప్రచారం (దావా) (మెయిన్ పేజీ)
https://teluguislam.net/dawah/

ఉసూలె సలాస (త్రి సూత్రాలు): పార్ట్ 4 (చివరి భాగం) – నీ ప్రవక్త ఎవరు? – షేఖ్ డా. సఈద్ అహ్మద్ మదనీ [వీడియో]

బిస్మిల్లాహ్

[40:31 నిముషాలు]
నీ ప్రవక్త ఎవరు?
ఉసూలె సలాసహ్ : త్రి సూత్రాలు (మూడు మౌలిక సూత్రాలు) – పార్ట్ 4
షేఖ్ డా. సఈద్ అహ్మద్ మదనీ హఫిజహుల్లాహ్

ఈ వీడియో పాఠాలు క్రింది పుస్తకం ఆధారంగా వివరించబడ్డాయి:
ఉసూలె సలాస (త్రి సూత్రాలు) [పుస్తకం] [మర్కజ్ దారుల్ బిర్ర్]

ఫిఖ్ హ్ (శుద్ధి, నమాజు) – పార్ట్ 06: గుసుల్ (శుద్ధి స్నానం) [వీడియో]

బిస్మిల్లాహ్

[45:28 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

అంశాలు: గుసుల్ (శుద్ధి స్నానం)

ఈ వీడియో క్రింది పుస్తక ఆధారంగా వివరించబడింది.
శుద్ధి & నమాజు [పుస్తకం]

గుస్ల్ (స్నానం):

శుద్ధి పొందే ఉద్దేశం (నియ్యత్)తో పూర్తి శరీరంపై నీళ్ళు పోసుకొనుటనే గుస్ల్ అంటారు. పూర్తి శరీరం కడగడం, అందులో పుక్కిలించడం మరియు ముక్కులో నీళ్ళు ఎక్కించడం కూడా తప్పనిసరి. అప్పుడే గుస్ల్ అగును. (ప్రవక్త గుస్ల్ పద్థతి ఇదిః ముందు మర్మాంగ భాగాన్ని శుభ్ర- పరుచుకోవాలి. పిదప నమాజుకు చేయునటు- వంటి వుజూ చేయాలి. అరచేతిలో నీళ్ళు తీసుకొని తల మీద పోసి రుద్దాలి. ఇలా మూడు సార్లు చేయాలి. మళ్ళీ పూర్తి శరీరము పై నీళ్ళు పోసుకొని స్నానం చేయాలి).

ఐదు సందర్భాల్లో గుస్ల్ చేయడం విధిగా ఉంది:

1- స్త్రీలకు గానీ పురుషులకు గానీ నిద్రలో ఉన్నా లేక మేల్కొని ఉన్నా కామము (షహ్వత్)తో ‘మనీ’ ఉబికిపడితే గుస్ల్ విధి అవుతుంది. కామము లేకుండా ఏదైనా వ్యాది, లేదా విపరీతమైన చలి కారణంగా వెలువడితే గుస్ల్ విధి కాదు. అలాగే స్ఖలనమైనట్లు కలగని ‘మనీ’ లేదా దాని మర్కలేమీ చూడకుంటే గుస్ల్ విధి కాదు. ఎప్పుడు ‘మనీ’ లేక దాని మర్కలు కనబడునో అప్పుడే గుస్ల్ విధి అవుతుంది. స్ఖలమైనట్లు అతనికి గుర్తు లేకున్నా పరవాలేదు.

2- మర్మాంగాల కలయిక. అంటే భర్త మర్మాంగం భార్య మర్మాంగంలో ప్రవేశించినప్పుడు వీర్యం పడకపోయినా స్నానం చేయుట విధియగును.

3- రుతు స్రావం, ప్రసవ స్రావం ముగిసిన తరువాత గుస్ల్ విధియగును.

4- శవానికి గుస్ల్ చేయించడం విధిగా ఉంది.

5- అవిశ్వాసుడు ఇస్లాం స్వీకరించినపుడు.

‘జునుబీ’ పై నిషిద్ధ విషయాలు:

(స్వప్నస్ఖలనం వల్ల, లేదా భార్యభర్తల సంభోగం కారణంగా అశుద్ధతకు లోనయిన వ్యక్తిని ‘జునుబీ’ అంటారు).

1- నమాజ్.
2- తవాఫ్.
3- దివ్య ఖుర్ఆనును ముట్టుకోవడం, మెల్లగ, శబ్దముగా, చూసీ, చూడక ఏ స్థితిలోగాని చదవడం నిశిధ్ధం.
4- మస్జిదులో నిలవడం. కాని మస్జిదులో నుండి దాటి పోవడంలో తప్పేమీ లేదు. మస్జిదులో నిలువవలసినప్పుడు వుజూ చేసుకున్నా (మలినం  కొంత వరకు తగ్గును, కనుక అది) సరిపోవును.


ఈ పుస్తకం ఆధారంగా చెప్పిన ముందు వీడియో పాఠాలు

ముస్లిం వనిత – పార్ట్ 03: హైజ్ (బహిష్టు, రుతుస్రావం, ముట్టు) ఆదేశాలు [వీడియో]

బిస్మిల్లాహ్

[26:37 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ముస్లిం వనిత [పుస్తకం]

“హైజ్”, “నిఫాసు”ల ధర్మములు

“హైజ్” (బహిష్టు) కాలము, దాని గడువు: స్త్రీలకు ప్రతి నెలా జరిగే రక్తస్రావాన్ని హైజ్ అంటారు.

1- వయస్సు: ఎక్కువ శాతం 12 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సులో హైజ్ వస్తుంది. ఆరోగ్యం, వాతవరణం మరియు ప్రాంతాన్ని బట్టి ముందుగాని తరువాత గాని రావచ్చు.

2- కాలపరిమితి: కనీసం ఒక రోజు. గరిష్ఠ కాలపరిమితి 15 రోజులు.

గర్భిణి యొక్క బహిష్టు: సామాన్యంగా గర్భం నిలిచిన తర్వాత రక్త స్రావముండదు. గర్భిణీ ప్రసవ వేదనతో ప్రసవించడానికి రెండు మూడు రోజుల ముందు రక్తము చూసినచో అది “నిఫాసు” అగును. ఒకవేళ ప్రసవ వేదన లేనిచో అది “నిఫాసు” కాదు, బహిష్టు కాదు.

అసాధారణ బహిష్టు:

అసాధారణ బహిష్టు రకాలు:

1- ఎక్కువ, తక్కువ: ఉదాః ఒక స్త్రీ యొక్క (బహిష్టు కాలం) సాధారణంగా ఆరు రోజులు. కాని ఒక సారి ఏడు రోజులు వచ్చింది, ఏడు రోజుల అలవాటుండి ఆరు రోజులే వచ్చింది.

2- వెనక, ముందు: ఉదాః నెలారంభంలో అలవాటుండి నెలాఖరులో వచ్చింది. నెలాఖరులో అలవాటుండి నెలారంభంలో వచ్చింది.

పరిష్కారం: వెనక, ముందు అయినా, ఎక్కువ, తక్కువ రోజులు అయినా, ఎప్పుడు రక్తస్రావం చూసిందో అప్పుడే బహిష్టు, ఎప్పుడు ఆగి పోతుందో అప్పుడే పరిశుభ్రమయినట్లు.

3- పసుపు లేదా గోదుమ రంగు: బహిష్టు రోజుల మధ్యలో లేదా చివరిలో పరిశుభ్రతకు కొంచం ముందు పసుపు లేదా గోదుమ రంగు వలే అంటే పుండు నుండి వెళ్ళే నీటి మాదిరిగా చూచినచో అది బహిష్టు రక్తస్రావమే అగును. బహిష్టు స్త్రీలకు వర్తించే ఆదేశము ఆ స్త్రీకి వర్తించును. ఒకవేళ పరిశుభ్రత పొందిన తరువాత అలా వస్తే అది బహిష్టు రక్తస్రావము కాదు.

4- ఒక రోజు రక్తస్రావముండడము మరో రోజు ఉండక పోవడం.

ఇది రెండు రకాలుగా కావచ్చు.

మొదటి రకం: ఇది ఎల్లపుడూ ఉన్నచో “ముస్తహాజ” కావచ్చును. “ముస్తహాజా”లకు వర్తించే ఆదేశాలే ఆమెకు వర్తించును.

రెండవ రకం: ఎల్లపుడూ కాకుండా, ఎప్పుడయినా ఒకసారి వచ్చి, ఆ తరువాత పరిశుభ్రం అవుతుంది.

ఎవరికి ఒకరోజుకన్నా తక్కువ రక్తస్రావం ఆగిపోతుందో అది పరిశుద్ధతలో లెక్కించబడదు.                                                                                                                                                                                                          ఒకవేళ ఏదైనా గుర్తు ఉంటే అది వేరే విషయం; ఉదా: అలవాటుగా ఉన్న చివరి రోజుల్లో ఆగిపోవడం, లేదా తెల్లని ద్రవం రావడం (తెల్లబట్ట అవడం కూడా అంటారు కొందరు).

5- రక్తస్రావం ఉండదు కాని బహిష్టు రోజుల మధ్య లేక పరిశుద్ధమగుటకు కొంచెం ముందు తడిగా ఉన్నట్లు గ్రహించినచో అది బహిష్టు. ఒకవేళ పరిశుద్ధమయిన తరువాత ఉంటే అది బహిష్టు కాదు.

బహిష్టు యొక్క ధర్మములు

1- నమాజ్: బహిష్టు స్త్రీ పై ఫర్జ్, సున్నత్, నఫిల్ అన్ని విధాల నమాజులు నిషిద్ధం. చేసినా అది నెవరవేరదు. కాని కనీసం ఒక రకాత్ చేయునంత సమయం దాని మొదట్లో లేక చివరిలో లభించినచో ఆ నమాజు తప్పకుండా చేయవలెను. మొదటి దానికి ఉదాహరణః సూర్యాస్తమయం అయ్యాక మగ్రిబ్ యొక్క ఒక రకాత్ చేయునంత సమయం దాటాక బహిష్టు అయినచో, ఆమె పరిశుద్ధమయిన తర్వాత ఆ మగ్రిబ్ నమాజు ‘ఖజా’ చేయవలెను. ఎందుకనగా ఆ నమాజు యొక్క ఒక్క రకాతు చేయునంత సమయం పొందిన పిదపనే బహిష్టు అయింది. ఇక చివరి దానికి ఉదాహరణః సూర్యోదయానికి ముందు ఒక రకాత్ మాత్రమే చేయునంత సమయం ఉన్నపుడు పరిశుద్ధమయితే, (స్నానం చేశాక) ఆ ఫజ్ర్ నమాజ్ ‘ఖజా’ చేయాలి. ఎందుకనగా రక్తస్రావం ఆగిన తరువాత ఆమె ఒక్క రకాత్ చేయునంత సమయం పొందినది.

ఇక జిక్ర్, తక్బీర్, తస్బీహ్, తహ్మీద్, తినుత్రాగినప్పుడు బిస్మిల్లాహ్ అనడం, హదీసు మరియు ధర్మ విషయాలు చదవడం, దుఆ చేయడం, దుఆపై ఆమీన్ అనడం, ఖుర్ఆన్ పారాయణం వినడం, నోటితో కాకుండా చూస్తూ గ్రహించి చదవడం, తెరిచియున్న ఖుర్ఆనులో లేదా బ్లాక్ బోర్డ్ పై వ్రాసియున్న దాన్ని చూస్తూ మనస్సులో చదవడం నేరం కాదు, యోగ్యమే. ఏదైనా ముఖ్య అవసరం: టీచర్ గా ఉన్నపుడు లేదా పరీక్ష సమయాల్లో ఇంకా ఒకరి కరెక్షన్ కొరకు ఖుర్ఆన్ చూస్తూ చదవడం, చదివించడం పాపము కాదు, కాని ఆ సమయంలో చేతులకు గ్లౌజులు ధరించి ఉండాలి, లేదా ఏదైనా అడ్డుతో పట్టుకోవాలి.

2- ఉపవాసం (రోజా):  ఫర్జ్, నఫిల్ అన్ని విధాల రోజాలు నిషేధం. కాని ఫర్జ్ రోజాలు తరువాత ఖజా (పూర్తి) చేయాలి. ఉపవాస స్థితిలో బహిష్టు వస్తే ఆ ఉపవాసం నెరవేరదు, అది సూర్యాస్తమయానికి కొన్ని క్షణాల ముందైనా సరే. అది ఫర్జ్ ఉపవాసమయితే ఇతర రోజుల్లో పూర్తి చేయాలి. సూర్యాస్తమయమునకు కొద్ది క్షణాల ముందు రక్తస్రావం అయినట్లు అనిపించి, అలాకాకుండా సూర్యాస్తమయం తరువాతనే అయితే ఆ ఉపవాసం పూర్తయినట్లే. ఉషోదయం అయిన కొద్ది క్షణాల తర్వాత పరిశుద్ధమయితే ఆ రోజు యొక్క ఉపవాసం ఉండరాదు. అదే ఉషోదయానికి కొద్ది క్షణాలు ముందు అయితే ఉపవాసం ఉండాలి. స్నానం ఉషోదయం తరువాత చేసినా అభ్యంతరం లేదు.

3- కాబా యొక్క తవాఫ్ (ప్రదక్షిణం): అది నఫిలైనా, ఫర్జ్ అయినా అన్నీ నిషిద్ధం. హజ్ సమయంలో తవాఫ్ తప్ప ఇతర కార్యాలుః సఫా మర్వా సఈ, అరఫాత్ మైదానంలో నిలవడం, ముజ్దలిఫా, మినాలో రాత్రులు గడపడం, జమ్రాతులపై రాళ్ళు రువ్వడం మొదలగునవన్నీ పూర్తి చేయాలి. ఇవి నిషిద్ధం కావు. పరిశుద్ధ స్థితిలో తవాఫె హజ్ చేసిన వెంటనే లేక సఫా మర్వా సఈ మధ్యలో బహిష్టు ప్రారంభమయితే ఆ హజ్ లో ఏలాంటి లోపముండదు.

4-  మస్జిదులో నిలవడం: బహిష్టు స్త్రీ మస్జిదులో ఉండుట నిషిద్ధం.

5- సంభోగం: భార్య రజస్సుగా ఉన్నపుడు భర్త ఆమెతో సంభోగించడం నిషిద్ధం. భర్త సంభోగాన్ని కోరుతూ వచ్చినా భార్య అంగీకరించడం కూడా నిషిద్ధం. పురుషుని కొరకు అతని భార్య ఈ స్థితిలో ఉన్నపుడు ఆమెతో సంభోగం తప్ప ముద్దులాట మరియు కౌగలించుకొనుట ఇతర విషయాలన్నీ అల్లాహ్ అనుమతించాడు.

6- విడాకులుః భార్య రజస్సుగా ఉన్నపుడు విడాకులివ్వడం నిషిద్ధం. ఆమె ఆ స్థితిలో ఉన్నపుడు విడాకులిచ్చినా అతడు అల్లాహ్, ఆయన ప్రవక్త యొక్క అవిధేయుడయి ఒక నిషిద్ధ కార్యం చేసినవాడవుతాడు. కనుక అతడు విడాకులను ఉపసంహరించుకొని ఆమె పరిశుద్ధురాలయిన తరువాత విడాకులివ్వాలి. అప్పుడు కూడా ఇవ్వకుండా మరోసారి బహిష్టు తరువాత పరిశుద్ధురాలయ్యాక ఇష్టముంటే ఉంచుకోవడం లేదా విడాకులివ్వడం మంచిది.

7-  స్నానం చేయడం విధిగా ఉందిః పరిశుద్ధురాలయిన తరువాత సంపూర్ణంగా తలంటు స్నానం చేయుట విధి. తల వెంట్రుకలు కట్టి (జెడ వేసి) ఉన్నచో వాటిలో నీళ్ళు చేరని భయమున్నచో అవి విప్పి అందులో నీళ్ళు చేర్పించవలెను. నమాజు సమయం దాటక ముందు పరిశుద్ధమయినచో ఆ సమయంలో ఆ నమాజును పొందుటకు స్నానం చేయడంలో తొందరపడుట కూడా విధిగా ఉంది. ప్రయాణంలో ఉండి నీళ్ళు లేనిచో, లేదా దాని ఉపయోగములో ఏ విధమైనా హాని కలిగే భయమున్నచో, లేక అనారోగ్యం వల్ల హాని కలిగే భయమున్నచో స్నానానికి బదులుగా “తయమ్ముం”(1) చేయవలెను. తరువాత నీళ్ళు లభించిన లేక ఏ కారణమయితే అడ్డగించిందో అది తొలిగిపోయిన తరువాత స్నానం చేయవలెను.

(1) దాని విధానం ఇది: ఒక సారి రెండు చేతులు భూమిపై కొట్టి ముఖముపై ఒకసారి మరియు మణికట్ల వరకు చేతులపై ఒకసారి తుడుచుకోవాలి.

ముందు పాఠాలు: