ముస్లిం వనిత – పార్ట్ 01: స్త్రీల హక్కులు, భర్తలపై భార్యల హక్కులు [వీడియో]

బిస్మిల్లాహ్

[21:20 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ముస్లిం వనిత [పుస్తకం]

ముస్లిం వనిత

స్త్రీ యొక్క సామాన్య హక్కులు

స్త్రీలకు కొన్ని సామాన్య హక్కులున్నాయి. వాటిని స్వయంగా స్త్రీలు తెలుసుకొనుట మరియు పురుషులు వాటిని వారి కొరకు అంగీకరించుట ఎంతయినా అవసరం. స్త్రీలు తమ ఈ హక్కలను తమిష్టానుసారం వినియొగించుకోవచ్చును.

సంక్షిప్తంగా ఆ హక్కులు ఇవి

1- స్వామ్యం (Ownership): బిల్డింగ్, పంటలు, పొలాలు, ఫ్యాక్టరీలు, తోటలు, బంగారం, వెండి మరియు అన్ని రకాల పశువులు. వీటన్నిట్లో స్త్రీ తను కోరినవి తన యాజమాన్యంలో ఉంచుకో వచ్చును. స్త్రీ భార్య, తల్లి, బిడ్డ మరియు చెల్లి, ఏ రూపములో ఉన్నా, పై విషయాలు తన అధికారంలో ఉండ వచ్చును.

2- వివాహ హక్కు, భర్తను ఎన్నుకునే హక్కు. భర్తతో జీవితం గడపడంలో నష్టం ఏర్పడినపుడు వివాహ బంధాన్ని తెంచుకొని, విడాకులు కోరే హక్కు. ఇది స్త్రీ యొక్క ప్రత్యేక హక్కు అనడంలో ఏ సందేహం లేదు.

3- విద్య: తనపై విధిగా ఉన్న విషయాలను నేర్చుకునే హక్కు. ఉదాః అల్లాహ్ గురించి, తన ప్రార్థనలు మరియు వాటిని చేసే విధానం తెలుసుకొనుట తనపై విధిగా ఉన్న హక్కులు. తను ఎలాంటి ప్రవర్తన అవలంభించాలి, ఏలాంటి సంస్కారం, సభ్యత పాటించాలి అనే విషయాలు తెలుసుకొనుట ప్రతి స్త్రీ హక్కు. అల్లాహ్ ఆదేశం:

[فَاعْلَمْ أَنَّهُ لَا إِلَهَ إِلَّا اللهُ …]. {محمد:19}

{అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైనవాడు ఎవడు లేడని బాగా తెలుసుకో}. (ముహమ్మద్ 47: 19). ప్రవక్త ఇలా చెప్పారుః

طَلَبُ الْعِلْمِ فَرِيضَةٌ عَلَى كُلِّ مُسْلِمٍ. {ابن ماجة }

విద్యనభ్యసించడం ప్రతి ముస్లింపై విధిగా యుంది“. (ఇబ్ను మాజ 224).

4- దానధర్మం: తన స్వంత ధనము నుంచి తను కోరుకున్నట్లు తనపైగాని, ఇతరులపై గానిః వారు తన భర్త అయినా, సంతానమ యినా, తండ్రి లేక తల్లి అయినా ఖర్చు చేయవచ్చును. హద్దుకు మించి, వ్యర్థమైన ఖర్చు చేయకూడదు. (చేసినచో, దాన్ని నిరోధించడం ఆమె బాధ్యుని విధి). ఖర్చు చేయడంలో పురుషునికి ఉన్నంత అధికారం స్త్రీలకూ ఉంది.

5- వాంగ్మూలం: తన స్వంత ధనం నుంచి తన జీవితములోనే మూడవ వంతు ధనము గురించి తను కోరినవారికి వసియ్యత్ (వాజ్మూలం) చేయ వచ్చును. తను చనిపోయిన తరువాత ఆమె ఆ వసియ్యత్ ను ఏలాంటి అభ్యంతరం లేకుండా జారి చేయించ వచ్చును. ఎందుకనగా వసియ్యత్ ప్రతి ఒక్కరి స్వంత విషయం. పురుషులకున్న విధంగానే స్త్రీలకు కూడా ఆ హక్కుంది. ప్రతి ఒక్కరు అల్లాహ్ నుంచి సత్ఫలితం కోరుట చాలా ముఖ్యం. కాని ఈ వసియ్యత్ మొత్తం ఆస్తిలో మూడిట్లో ఒక వంతుకన్న ఎక్కువ ఉండకూడదు.

6- దుస్తులు ధరించడంలో తినిష్టానుసారం పట్టు బట్టలు, బంగారము ధరించవచ్చును. ఇవి రెండూ పురుషులపై నిషిద్ధము. కాని ధరించి కూడా నగ్నంగా ఉన్నట్లనిపించే దుస్తులు ధరించ కూడదు. అంటే శరీర సగభాగం లేక నాల్గవ భాగం మాత్రమే ధరించుట, లేక తలను, మెడను మరియు ఛాతిని కొంగుతో, పైటతో కప్పియుంచక పోవుట. ఈ స్థితిలో కేవలం తన భర్త ఎదుట మాత్రం ఉండవచ్చును.

7- భర్త కొరకు సింగారం చేయుట, సుర్మా, కాటిక పెట్టుకొనుట, ఇతర యోగ్యమైన వస్తువులతో సింగారించుకొనుట, భర్త ఇష్టపడే మంచి దుస్తులు ధరించుట యోగ్యమే. కాని అవిశ్వాస స్త్రీలు మరియు వేశ్యలు ధరించే డ్రెస్సులు ధరించక, సందేహాత్మక వస్త్రాల నుండి దూరముండుటయే మంచిది.

8- తినే త్రాగే విషయాల్లో తమకు నచ్చినది తినత్రాగ వచ్చును. పురుషులకు వేరు స్త్రీలకు వేరు అని ఏమీ లేదు. పురుషులకు యోగ్యమున్నదే స్త్రీలకు ఉంది. పురుషులకు నిషిద్ధమున్నదే స్త్రీలకు నిషిద్ధమున్నది. అల్లాహ్ (సూరె ఆరాఫ్ 7: 31)లో ఈ విధంగా బోధించాడుః

[…وَكُلُوا وَاشْرَبُوا وَلَا تُسْرِفُوا إِنَّهُ لَا يُحِبُّ المُسْرِفِينَ].

{తినండి త్రాగండి, మితిమీరకండి. అల్లాహ్ మితి- మీరేవారిని ప్రేమించడు}. (సూర ఆరాఫ్ 7: 31).

భర్తపై భార్య హక్కులు

స్త్రీ యొక్క ప్రత్యేక హక్కుల్లో ఆమె పట్ల ఆమె భర్తపై ఉన్న హక్కులు. ఇవి తన భర్త హక్కులు ఆమెపై ఉన్న విధంగనే ఉన్నవి. ఉదా: అల్లాహ్ మరియు ప్రవక్త అవిధేయతకు గురి చేయని భర్త ఆజ్ఞలు పాటించడం. అతనికి భోజనాలు వండి పెట్టడం. పడకను బాగుంచడం. సంతానాన్ని పోషించి, మంచి శిక్షణ ఇవ్వడం. అతని ధన, మానమును కాపాడడం. తన మానాన్ని కాపాడుతూ, యోగ్యమైన అలంకరణ వస్తువులను ఉపయోగించి అతని కొరకు సింగారించుకొనడం. ఇవి స్త్రీపై ఉన్న తన భర్త హక్కులు.

ఒక స్త్రీ పట్ల తన భర్తపై ఉన్న హక్కుల్లో అల్లాహ్ ఆదేశాను సారం సంక్షిప్తంగా కొన్ని హక్కులు క్రింద తెలుసుకుందాము.

[…وَلَهُنَّ مِثْلُ الَّذِي عَلَيْهِنَّ بِالمَعْرُوفِ …].

{మగవారికి మహిళలపై ఉన్నటువంటి హక్కులే ధర్మం ప్రకారం మహిళలకు కూడా మగవారిపై ఉన్నాయి}. (బఖర 2: 228).

ప్రతి విశ్వాస స్త్రీ తన ఈ హక్కులను గుర్తెరిగి ఏలాంటి సిగ్గు పడకుండా, భయపడకుండా తన హక్కులను పొందాలని మేము ఇచ్చట పేర్కొన్నాము. భర్త ఆమెకి ఈ హక్కులను పూర్తిగా ఇవ్వడం అతనిపై విధిగా ఉంది. ఒక వేళ ఆమె స్వయంగా తన ఈ హక్కులను వదులుకుంటే పర్వాలేదు.

భర్తపై ఉన్న భార్య హక్కులు ఇవి:

1- కలిమిలోనైనా, లేమిలోనైనా భార్య యొక్క పోషణ, వస్త్ర, చికిత్స మరియు గృహ వసతులు మొదలగునవి తను ఏర్పాటు చేయాలి.

2- ఆమె ధన, ప్రాణ, మానములను మరియు ఆమె ధర్మాన్ని కాపాడాలి. పురుషునికి స్త్రీపై అధికారమివ్వబడింది గనుకు అధికారి విధి ఏమనగా తనకు దేనిపై అధికారమివ్వబడిందో దాన్ని రక్షించటం, కనిపెట్టి ఉండటం.

3- ఆమె తప్పనిసరిగా పాటించవలసిన ధర్మాదేశాలు ఆమెకు నేర్పే బాధ్యత భర్తది. అతనిలో నేర్పే శక్తి లేకుంటే, స్త్రీల విద్య బోధన ప్రత్యేక సమావేశాల్లోః మస్జిదులో లేక బడిలో వెళ్ళి నేర్చుకొనుటకు అనుమతివ్వాలి. అచ్చట ఉపద్రవం లేకుండా శాంతి ఉండాలి. ఇద్దరిలో ఏ ఒక్కరికి కూడా ఏలాంటి నష్టం కలిగే భయం ఉండకూడదు.

4- భార్యతో సద్వర్తనతో మెలగాలి.

అల్లాహ్ ఆదేశం ఇలా ఉంది:

وَعَاشِرُوْهُنَّ بِالمعْرُوْفِ
వారితో సద్భావంతో జీవితం గడపండి]. (నిసా 4: 19).

సద్వర్తనతో మెలిగుట, మంచి విధంగా సంసారం చేయుట అనగా భార్యతో కాపురం చేయుట ఒక హక్కు. దాన్ని పూర్తి చెయ్యాలి. ఆమెను దూషించి, తిట్టి బాధ కలిగించరాదు. ఏలాంటి నష్టం లేకుంటే ఆమె బంధువులతో కలుసుకోవడం నుండి ఆపరాదు. ఆమె మోయలేని భారాన్ని ఆమెకు అప్పగించరాదు. మాట మరియు తన ప్రవర్తన ద్వారా మంచిగా వ్యవహరించాలి.

ప్రవక్త సల్లల్లాహు అలైహహి వసల్లం ఇలా చెప్పారు:

మీలో మంచివారు ఎవరయ్యా అంటే తమ భార్యల పట్ల మంచితనముతో మెలిగేవారే. నేను నా భార్యల పట్ల మంచిగా మెలిగేవాణ్ణి“. (తిర్మిజి 3895).

%d bloggers like this: