అబూ హురైరహ్ (రది అల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచనం:
“జాగ్రత్తగా వినండి! ఈ ఐహిక జీవితం శాపభూయిష్టమైనది. అంటే అల్లాహ్ కారుణ్యానికి దూరం చేస్తుంది. ఈ ఐహిక జీవితంలో నిమగ్నమై, పరలోకాన్ని మరచి పోయినవాడు అల్లాహ్ (త’ఆలా) కారుణ్యానికి దూరమై పోతాడు. ఇంకా ఈ ప్రపంచంలో ప్రతి వస్తువూ శపించదగినదే. ఎందుకంటే అల్లాహ్ కారుణ్యానికి దూరం చేస్తుంది. అయితే అల్లాహ్ ధ్యానం, మరియు అల్లాహ్ సాన్నిహిత్యం పొందినవారు తప్ప. ఈ రెంటిలో అన్ని రకాల మేళ్ళూ ఉన్నాయి. ఇంకా ధార్మిక పండితుడైనా, ధార్మిక విద్యను అభ్యసించే వాడయినా వీరంతా అల్లాహ్ కారుణ్యం హక్కుగలవారు.”
(తిర్మిజి, ఇబ్నె మాజహ్).
[5176. (22) [3/143 1-ప్రామాణికం] – మిష్కాతుల్ మసాబీహ్ [హదీసులు]