ఫర్జ్ ఉపవాసము యొక్క నియ్యత్ (సంకల్పం) ఎప్పుడు చేసుకోవచ్చు? నఫిల్ ఉపవాసము యొక్క నియ్యత్ ఎప్పుడు చేసుకోవచ్చు?
విధిగా ఉండవలసిన ఉపవాస సంకల్పం (నియ్యత్) ఉషోదయానికి(ఫజ్ర్) ముందు రాత్రి వేలలో ఏ సమయంలోనైనా చెయ్యాలి. అయితే నఫిల్ ఉపవాస సంకల్పం ఏమీ తిన త్రాగ కుండా ఉన్న వ్యక్తి పొద్దెక్కిన తర్వాత కూడా చేయవచ్చును.
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Video Courtesy: Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
లాఇలాహ ఇల్లల్లాహ్, ఇస్లాం యొక్క పునాది. ఇస్లాంలో దాని స్థానం చాలా గొప్పది. అది ఇస్లాం స్థంబాలలో మొదటిది. విశ్వాస భాగాలలో ఉన్నత భాగం. మరియు సత్కార్యాల అంగీకారము ఆ వచనాన్ని హృదయ పూర్వకంగా పఠించి దాని అర్దాన్ని తెలుసుకొని, దాని ప్రకారం ఆచరించడంపైనే ఆధారపడి ఉంది.
దాని వాస్తవ అర్థం: “వాస్తవంగా అల్లాహ్ తప్ప వేరెవరు ఆరాధనలకు అర్హులు కారు“. ఇదే సరియైన అర్థం. ఇది కాక ‘అల్లాహ్ తప్ప సృష్టికర్త ఎవడు లేడు’, ‘అల్లాహ్ తప్ప శూన్యము నుండి ఉనికిలోకి తెచ్చే శక్తి గలవాడెవడు లేడు’ లేక ‘విశ్వంలో అల్లాహ్ తప్ప మరేమి లేదు’ అనే భావాలు (లాఇలాహ ఇల్లల్లాహ్ యొక్క అర్థం) కావు.
ఈ పవిత్ర వచనములో రెండు విషయాలు (రుకున్ లు) ఉన్నాయి:
(1) నిరాకరించుట, ఇది ‘లాఇలాహ‘ అన్న పదంలో ఉంది. అనగా ఉలూహియ్యత్ (ఈశ్వరత్వాన్ని, ఆరాధన అర్హతను) ప్రతి వస్తువు నుండి నిరాకరించుట.
(2) అంగీకరించుట, ఇది ‘ఇల్లల్లాహ్‘ అన్న పదంలో ఉంది. అనగా ఉలూహియ్యత్ (ఆరాధనల)కు అర్హత గల అద్వితీయుడు అల్లాహ్ మాత్రమేనని, ఆయనకు భాగస్వాముడెవడు లేడని నమ్ముట.
అల్లాహ్ తప్ప మరెవ్వరి ఆరాధన, ప్రార్థన చేయరాదు. ఆరాధన లోని ఏ ఒక్క భాగాన్ని కూడా అల్లాహ్ తప్ప ఇతరులకు చేయుట యోగ్యం లేదు.
ఏ వ్యక్తి ‘లాఇలాహ ఇల్లల్లాహ్‘ యొక్క ఈ వాస్తవ భావాన్ని తెలుసుకొని దాన్ని పఠిస్తాడో, దాని ప్రకారం ఆచరిస్తాడో మరియు దృఢ విశ్వాసముతో బహుదైవారాధనను తిరస్కరించి, అల్లాహ్ ఏకత్వమును విశ్వసిస్తాడో అతడే వాస్తవ ముస్లిం (విధేయుడు). ఇలాంటి విశ్వాసముంచకుండా ఆచరించువాడు మునాఫిఖ్ (కపటవిశ్వాసి, వంచకుడు). మరియు దీనికి వ్యతిరేకంగా ఆచరించువాడు అది అతను నోటితో పలికినా ముష్రిక్ (బహుదైవారాధకుడు), కాఫిర్ (సత్యతిరస్కారి) అవుతాడు.
లాఇలాహ ఇల్లల్లాహ్ ఘనత:
ఈ పవిత్ర వచన ఘనతలు, లాభాలు చాలా ఉన్నాయి. అందులో కొన్ని క్రింద తెలుపబడుతున్నని.
1- తౌహీద్ గల వ్యక్తి నరక శిక్షకు గురి అయినా, అతను అందులో శాశ్వతంగా ఉండకుండా లాఇలాహ ఇల్లల్లాహ్ అడ్డుపడుతుంది. ప్రవక్త సల్లల్హాహు అలైహి వసల్లం చెప్పారు:
“లాఇలాహ ఇల్లల్లాహ్ పఠించిన వక్తి హృదయంలో జొన్న గింజంత విశ్వాసమున్నా నరకం నుండి వెలికి వస్తాడు. ఏ వ్యక్తి లాఇలాహ ఇల్లల్లాహ్ చదివాడో అతని హృదయంలో గోదుమ గింజంత విశ్వాసమున్నా నరకం నుండి వెలికి వస్తాడు. అలాగే ఎవరు లాఇలాహ ఇల్లల్లాహ్ చదివాడో అతని మనుస్సులో ఇసుమంత / రవ్వంత విశ్వాసమున్నా అతనూ నరకం నుండి వెలికి వస్తాడు”. (బుఖారి 44, ముస్లిం 193).
2- మానవులు, జిన్నాతులు దీని (లాఇలాహ ఇల్లల్లాహ్) కొరకే పుట్టించ బడ్డారు. సూరా జారియాత్ (51: 56)లో అల్లాహ్ ఇలా ఆదేశించాడు:
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
రెండవ భాగం: (కొంచెం మొదటి భాగం మళ్ళీ రిపీట్ అయ్యింది)
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ(హఫిజహుల్లాహ్)
ఈ సత్కార్యాలు చేయండి స్వర్గగృహాలు పొందండి
1) అల్లాహ్ ను విశ్వసించడం,
2) ఆయన ప్రవక్తను విశ్వసించడం,
3) సత్కార్యాలు చేయడం,
4) జిహాద్ చేయడం,
5) తఖ్వా,
6) సహనం,
7) అల్లాహ్ పై నమ్మకం,
8) మనస్ఫూర్వకమైన స్నేహం కేవలం విశ్వాసులతో చేయడం,
9) మంచిని ఆదేశించడం చెడు నుండి ఖండించడం,
10) నమాజు స్థాపించడం,
11) జకాత్ (విధిదానం) చెల్లించడం,
12) అల్లాహ్, ఆయన ప్రవక్త విధేయత పాటించడం,
13) మంచి విధంగా మాట్లాడడం,
14) అన్నం తినిపించడం,
15) ఉపవాసాలుండడం,
16) తహజ్జుద్ చేయడం,
17) సంతానం చనిపోతే ఇన్నా లిల్లాహి వఇన్నా ఇలైహి రాజిఊన్, అల్ హందులిల్లాహ్ అనడం.
18) బజారులో ప్రవేశిస్తూ దుఆ చదవడం. లాఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లాషరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హందు యుహ్ యీ వయుమీతు వహువ హయ్యున్ లాయమూతు బియదిహిల్ ఖైరు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్.
19) సూర ఇఖ్లాస్ పదిసార్లు చదవడం,
20) పన్నెండు రకాతుల సున్నతె ముఅక్కద చేయడం,
21) రోగిని పరామర్శించడం,
22) ముస్లింతో కలవటానికి వెళ్ళడం.
23) చాష్త్ నమాజు నాలుగు రకాతులు చేయడం,
24) జొహ్ర్ కు ముందు నాలుగు రకాతులు చేయడం,
25) పంక్తి (నమాజు సఫ్)లో ఖాలీ స్థలం ఉండనీయ కూడదు,
26) హక్కు తనదైనా గొడవను వదలుకోవడం,
27) పరిహాసముగానైనా అబద్ధం పలకకుండా ఉండడం,
28) సద్వర్తన అవలంబించడం,
29) మస్జిద్ నిర్మించడం లేదా నిర్మాణంలో పాల్గొనడం.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అల్ హమ్ దు లిల్లాహ్ , గొప్ప శుభవార్త. ఇప్పుడు అహ్సనుల్ బయాన్ తెలుగు అనువాదం కూడా కూడా ఈ యాప్ లో జత చేసారు
Al Quran (Tafsir& by Word) – ఇది ఇంగ్లీష్ లో ఫేమస్ యాప్. ఇంగ్లిష్ తెలిసిన వారు తఫ్సిర్ ఇబ్న్ కసీర్ చదవచ్చు. అలాగే ప్రతి పదానికి అరబిక్ అర్ధం, దాని అరబీ మూల పదం, ఇంకా అది ఎక్కెడెక్కడ వచ్చింది అని తెలుసుకోవచ్చు. ఇప్పుడు మేము సూచించిన మేరకు అహ్సనుల్ బయాన్ అనువాదం రీసెంట్ గా జత చేసారు.
(2) యాప్ ఓపెన్ చేసిన తరువాత క్రింది విధంగా కనపడుతుంది
(3) పైన బొమ్మలో సూరహ్ ఫాతిహా లేదా ఇంకా ఏదైనా సూరహ్ క్లిక్ చెయ్యండి
(4) పైన బొమ్మ లో A మీద క్లిక్ చేస్తే క్రింద బొమ్మ వస్తుంది
(5) పైన బొమ్మలో తెలుగు ట్రాన్స్ లేషన్ (అహ్సనుల్ బయాన్లేదా దివ్య ఖురాన్ సందేశం) సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మీరు ప్రతి ఆయత్ కి తెలుగు అర్ధం చదువుకోవచ్చు
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఖుర్బానీ ఇచ్చే వ్యక్తి ఖుర్బానీ జంతువును జిబహ్ చేయునప్పుడు బిస్మిల్లాహి వల్లాహు అక్బర్ అనాలి. (అంటే: అల్లాహ్ పేరుతో జిబహ్ చేయుచున్నాను, అల్లాహ్ యే గొప్పవాడు).
అల్లాహుమ్మ హాజా మిన్క వలక, అల్లాహుమ్మ తకబ్బల్ మిన్నీ అనాలి. (అంటే: ఓ అల్లాహ్! ఖుర్బానీ చేయు భాగ్యం నీవే ప్రసాదించావు, నీ కొరకే ఖుర్బానీ చేయుచున్నాము, ఓ అల్లాహ్! నా వైపు నుండి దీనిని స్వీకరించు).
(బుఖారి 5565, ముస్లిం 1967, దార్మీ 1989).
జిబహ్ చేయువారు ఇతరులైతే మిన్నీ అనే చోట మిన్ హు అనాలి.
ఇంకొక దుఆ:
إِنِّي وَجَّهْتُ وَجْهِيَ لِلَّذِي فَطَرَ السَّمَاوَاتِ وَالْأَرْضَ حَنِيفًا ۖ وَمَا أَنَا مِنَ الْمُشْرِكِينَ ఇన్నీ వజ్జహ్ తు వజ్ హియ లిల్లజీ ఫతరస్ సమావాతి వల్ అర్ధ హనీఫన్ వమా అన మినల్ ముష్రికీన్. నేను ఆకాశాలను, భూమిని సృష్టించినవాని వైపుకు ఏకాగ్రతతో నా ముఖాన్ని త్రిప్పుకుంటున్నాను. నేను షిర్క్ చేసేవారిలోని వాణ్ణి కాను. (సూరా అల్ అన్-ఆమ్ 6:79)
قُلْ إِنَّ صَلَاتِي وَنُسُكِي وَمَحْيَايَ وَمَمَاتِي لِلَّهِ رَبِّ الْعَالَمِينَ لَا شَرِيكَ لَهُ ۖ وَبِذَٰلِكَ أُمِرْتُ وَأَنَا أَوَّلُ الْمُسْلِمِينَ ఇన్న సలాతీ వ నుసుకీ వమహ్ యాయ వ మమాతీ లిల్లాహి రబ్బిల్ ఆలమీన్ లా షరీకలహూ వ బిజాలిక ఉమిర్తు వ అన మినల్ ముస్లిమీన్. “నిస్సందేహంగా నా నమాజు, నా సకల ఆరాధనలు, నా జీవనం, నా మరణం – ఇవన్నీ సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కొరకే.ఆయనకు భాగస్వాములెవరూ లేరు. దీని గురించే నాకు ఆజ్ఞాపించబడింది. ఆజ్ఞాపాలన చేసే వారిలో నేను మొదటివాణ్ణి.” (సూరా అల్ అన్-ఆమ్ 6:162-163)
అల్లాహుమ్మ మిన్క వలక, బిస్మిల్లాహి వల్లాహు అక్బర్, అల్లాహుమ్మ తకబ్బల్ మిన్నీ (ఓ అల్లాహ్! ఖుర్బానీ చేయు భాగ్యం నీవే ప్రసాదించావు, నీ కొరకే ఖుర్బానీ చేయుచున్నాము, అల్లాహ్ పేరుతో జిబహ్ చేయుచున్నాను, అల్లాహ్ యే గొప్పవాడు. ఓ అల్లాహ్! నా వైపు నుండి దీనిని స్వీకరించు
[అబూ దావుద్ హదీసు నెం: 2795, షేక్ అల్బానీ గారు హసన్ అని డిక్లేర్ చేసారు]
ఈ దుఆ తెలుగు అర్ధం కోసం వీడియో చూడండి
ఖుర్బానీ ఆదేశాలు – ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) ఖుర్బానీ అసలు ఉద్దేశ్యం, ఖుర్బానీ ప్రాముఖ్యత, ఖుర్బానీ ఘనత, ఖుర్బానీ ఎవరి కొరకు?, కొన్ని ముఖ్య విషయాలు, ఖుర్బానీ నిబంధనలు, ఖుర్బానీ జంతువు లోపాలు, జిబహ్ షరతులు, తప్పులు సరిదిద్దుకుందాం, మృతుల వైపున ఖుర్బానీ.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
Video Courtesy: Dawah and Foreigners guidance office, zulfi, Saudi Arabia.
జిల్ హిజ్జలోని తొలిదశ
బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం
ఇస్లామీయ క్యాలెండర్ ప్రకారం 12వ మాసమైన జిల్ హిజ్జలోని తొలిదశ (అంటే మొదటి పది రోజుల)కు చాలా ఘనతలు ఉన్నాయి, వాటిలో కొన్ని ఇవి:
1- అల్లాహ్ సూర ఫజ్ర్ (89)లో దీని ప్రమాణం చేశాడు
2- ఈ దశలోనే అల్లాహ్ ఇస్లాం ధర్మాన్ని పరిపూర్ణం గావించాడు. (బుఖారి 4407).
3- ఈ దశలోనే ఇస్లాం యొక్క మూల స్థంబాలు ఏకమవుతాయి, ఇలా వేరే రోజుల్లో కావు.
4- ఈ దశలో చేయబడే సత్కార్యాలు అల్లాహ్ కు ఇతర రోజుల్లో చేసే సత్కార్యాల కంటే అధికంగా ఇష్టం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: జిల్ హిజ్జ తొలి దశకంలో చేసే సత్కార్యాలు ఇతర దినాల్లో చేసే సత్కార్యాల కన్నా అల్లాహ్ కు ఎక్కువగా ప్రియమైనవి, శ్రేష్ఠమైనవి, (అబూ దావూద్ 2438, బుఖారి 969). ఔన్నత్యాల రీత్యా అవి చాలా గొప్ప దినాలు, వాటిలో అధికంగా లాఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్, అల్ హందులిల్లాహ్ అంటూ ఉండండి. (అహ్మద్ 10/296). వాటిలో చేసే సత్కార్యాలకు పుణ్య ఫలం ఇతర రోజుల్లో చేసే సత్కార్యాల ఫలం కన్నా ఎక్కువగా లభిస్తుంది. (దార్మీ 1815).
5- వాటిలో ఒక రోజు; అరఫా రోజు (9 వ రోజు) ఘనత:
(1) సూర బురూజ్ (85)లోని 3వ ఆయతులో ‘వమష్ హూద్’ అని ఆ రోజు ప్రమాణం చేయడం జరిగింది.
(2) హాజీల గురించి అది చాలా ముఖ్య- మైన రోజు, అది లేనిది హజ్ నెరవేరదు. (తిర్మిజి 889).
(3) ఆ రోజు అల్లాహ్ ప్రజల్ని నరకం నుండి విడుదల చేసినంత మరే రోజూ చేయడు, (ముస్లిం 1348).
(4) ఆ రోజు అరఫాత్ మైదానంలో వచ్చిన హాజీల పాపాలు ఇసుక కణాలు, వర్షపు చుక్కలు, లేదా సముద్రపు నురుగంత ఉన్నా అల్లాహ్ క్షమిస్తాడు, ఇంతే కాదు, వారు ఎవరి గురించి దుఆ చేస్తారో వారి పాపాలు కూడా మన్నించేస్తాడు. (బజ్జార్ 6177, సహీహ్ తర్గీబ్ 1113).
(5) ఉత్తమమైన దుఆ అరఫా రోజు చేసే దుఆ. (తిర్మిజి 3585).
(6) హజ్ చేయనివారు అరఫా రోజు ఉపవాసముండాలి, అందుకు వారి గత రెండు సంవత్సరాల పాపాలు మన్నించ- బడతాయి. (ముస్లిం 1162).
5- ఈ తొలిదశకంలోని చివరి రోజును ‘యౌం నహ్ర్’ (జంతు బలిదాన ‘ఖుర్బానీ’ దినం) అంటారు, అల్లాహ్ దృష్టిలో యౌం నహ్ర్ మరియు దాని తర్వాత రోజు కన్నా ఉత్తమమైన రోజులు మరేమీ లేవు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. (అబూ దావూద్ 1765).
అందుకే ఈ దశను అదృష్టంగా భావించి పుణ్యాల్ని సమకూర్చుకునే ప్రయత్నం చేయాలి. ప్రత్యేకంగా ఈ సత్కార్యాలు: విశ్వాస పునరుద్ధరణ, నమాజుల స్థాపితం, దానదర్మాలు, నఫిల్ (అరఫా) ఉపవాసాలు, హజ్, ఉమ్రాలు, ఖుర్బానీ చేయడం, స్త్రీ పురుషులందరూ ఈద్ గాహ్ కు వెళ్ళడం, అధికంగా జిక్ర్ (అల్లాహ్ స్మరణ) చేయడం, చెడుకు దూరంగా ఉండడం, ప్రత్యేకంగా షిర్క్, బిద్అత్, బంధు,మిత్ర సంబధాలను తెంచడం లాంటి నుండి. ఎక్కువగా తౌబా, ఇస్తిగ్ఫార్ మరియు ఖుర్ఆన్ పారాయణం చేస్తూ ఉండడం.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
సౌదీ అరేబియాలోని సుప్రీంకోర్టు నుండి అధికారిక ప్రకటన : రేపు ఆగష్టు 2 (శుక్రవారం) 1 ధుల్-హిజ్జా 1440. అందువల్ల, శనివారం 10 ఆగస్టు ʿ అరాఫా దినం మరియు ఆదివారం 11 ఆగస్టు ʿ ఈద్ అల్ -ఆధా 1440.
మీ దేశంలో చంద్రుడు కనిపించే దాన్ని బట్టి, పైన తెలిపిన తేదీలు మారతాయి
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఖుర్ఆన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనల ఆధారంగా ఈ ఆడియో సిరీస్ లో మరణానంతర జీవితం గురించి చక్కగా వివరించబడింది.
మరణం నుండి మొదలుకొని సమాధి, దాని వరాలు, శిక్షలు, దాని నుండి లేపబడటం, అల్లాహ్ ముందు మహ్-షర్ మైదానం లో హాజరవడం, త్రాసులో తూకం చేయబడుట, కర్మపత్రాలు తీసుకోవడం, నరకంపై ఉన్న వంతెన దాటడం, ప్రవక్త సిఫారసు, స్వర్గం నరకం వివరాలు ఇంకా అనేక విషయాలు మొత్తం 91 భాగాల్లో తెలుపడ్డాయి. మీరు స్వయంగా వీటిని శ్రద్ధగా విని, తెలుసుకొని ఇతరులకు తెలియజేసి రెట్టింపు పుణ్యాలు పొందండి.
45. త్రాసును తేలికగా చేసే పాప కార్యాలు (4) [ఆడియో, టెక్స్ట్] (3) ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాట కంటే ఇతరుల ఆదేశాలకు ప్రాధాన్యత ఇవ్వడం, (4) అల్లాహ్ క్షమించడని ఇతరుల గురించి ప్రమాణం చేయడం, (5) అసర్ నమాజ్‌ను వదులుకోవడం, (6) ఏకాంతంలో అల్లాహ్ నిషేధించిన కార్యాలకు పాల్పడటం మరియు (7) సరైన కారణం లేకుండా కుక్కను పెంచడం
46. త్రాసును తేలికగా చేసే పాప కార్యాలు (5) [ఆడియో, టెక్స్ట్] (8) జ్యోతిష్కునితో ఏదైనా ప్రశ్న అడగడం, (9) జ్యోతిష్కుడు చెప్పిన దానిని నమ్మడం, (10) మత్తు సేవించడం, (11) ప్రజల సొమ్మును కాజేయడం, (12) దుష్ప్రవర్తన, (13) ముస్లిం పరువుకు భంగం కలిగించడం
47. త్రాసును తేలికగా చేసే పాప కార్యాలు (6) [ఆడియో, టెక్స్ట్] (14) అల్లాహ్ మార్గంలో పోరాడటానికి వెళ్ళిన వారి స్త్రీలను కాపాడకుండా వారికి ద్రోహం చేయడం, (15) ఆత్మహత్య (Suicide), (16) నమాజు స్వీకరించబడని పాపాలు, (17) దానధర్మాలు చేసి బాధపెట్టడం, (18) చీలమండలానికి కిందిగా దుస్తులు ధరించడం మరియు ఎవరికైనా ఏదైనా మేలు చేసి చెప్పుకొని బాధ కలిగించడం మరియు ఏదైనా సామాను విక్రయిస్తూ అసత్య ప్రమాణాలు చేయడం.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.