ప్రళయ దిన చిహ్నాలు [పుస్తకం]

బిస్మిల్లాహ్

టైటిల్: అదిగో ప్రళయం దగ్గరికి వచ్చేస్తోంది 
కూర్పు: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ (హఫిజహుల్లాహ్)

ప్రళయ దిన సూచనలు/చిహ్నాలు
Signs of the Day of Judgement (Book of Ashratu – al-Sa’a)

[ఇక్కడ చదవండి / డౌన్లోడ్ చేసుకోండి]
[మొబైల్ ఫ్రెండ్లీ బుక్] [87 పేజీలు] [PDF] [1.8 MB]

విషయ సూచిక

  • 1. ముఖ్య గమనిక
  • 2. ప్రళయం అనేక పేర్లు
  • 3. అస్సాఆ (ఘడియ)
  • 4. ప్రళయం సమీపమున సంభవించే చిన్న చిన్న సూచనలు
    • 5. ప్రళయం సమీపించినప్పుడు ప్రజలు ఇస్లాం ధర్మం నుండి వైదొలుగుతారు
    • 6. ముస్లిం సమాజంలో బహుదైవారాధన అధికమైపోతుంది.
    • 7. ప్రవక్తలమని చెప్పుకునేవారు వస్తారు.
    • 8. ప్రజలు బిద్‌అత్ (నూతన ఆచారాల) ద్వారా ధర్మజ్ఞానం గ్రహిస్తారు
    • 9. ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) సున్నతులకు (విధేయతకు) దూరమైపోతారు.
    • 10. హలాల్‌, హరామ్‌ అనే భేదాలను లెక్కచెయ్యరు.
    • 11. అబద్దాలను, నిరాధారమైన విషయాలను ప్రచురిస్తారు.
    • 12. పెద్దపెద్ద భవనాలు కట్టబడును.
    • 13. గత మతస్థుల జీవన విధానాలకు అనుగుణంగా వ్యవహరిస్తారు.
    • 14. స్త్రీలు శరీరం కనపడే దుస్తులు ధరిస్తారు, వారి చేష్టలు మారిపోతాయి.
    • 15. అశ్లీలము, వ్యభిచారం సర్వత్రా వ్యాపిస్తుంది.
    • 16. సంగీతం అధికమైపోతుంది.
    • 17. రక్త సంబంధీకులతో తెగతెంపులు చేసుకుంటారు.
    • 18. దుష్టులు ఉత్తములుగా చలామణి అవుతారు.
    • 19. కల్లోలాలను భరించలేక చావును కోరుకుంటారు.
    • 20. ఇస్లామీయ ధర్మ అనుసరణ అతికష్టమైపోతుంది.
    • 21. వర్షం అధికమైపోతుంది కాని పంటలు పండవు.
    • 22. భూకంపాలు ఎక్కువైపోతాయి.
    • 23. జంతువులు, వస్తువులు మాట్లాడుతాయి.
    • 24. మక్కా మదీనాల పరిస్థితి.
    • 25. చల్లటి గాలుల ఆధారంగా విశ్వాసులకు మరణం ప్రసాదించబడుతుంది.
  • 26. ప్రళయం సమీపమున సంభవించే పెద్ద సూచనలు.
    • 27. మహ్ దీ (అలైహిస్సలాం).
    • 28. మసీహుద్‌ దజ్జాల్‌ .
    • 29. దజ్జాల్‌ బయల్పడే ప్రదేశం.
    • 30. దజ్జాల్‌ మక్కా మదీనాలో ప్రవేశించలేడు.
    • 31. దజ్జాల్‌ రూపు రేఖలు.
    • 32. దజ్జాల్‌ మంత్రజాలం.
    • 33. దజ్జాల్‌ కీడు నుండి అల్లాహ్‌ శరణు కోరడం.
    • 34. ఈసా(అలైహిస్సలాం) చేతిలో దజ్ఞాల్‌ చావు.
    • 35. మర్యమ్‌ (అలైహస్సలామ్‌) కుమారుడగు ప్రవక్త ఈసా (అలైహిస్సలామ్‌).
    • 36. ఈసా(అలైహిస్సలాం) రూపము.
    • 37. ఈసా(అలైహిస్సలాం) మరణించలేదు, ఆకాశముపైకి లేపుకోబడ్డారు.
    • 38. ఈసా(అలైహిస్సలాం) తిరిగి భూలోకానికి వస్తారు.
    • 39. ఈసా (అలైహిస్సలాం) ఖుర్‌ఆన్‌ హదీస్‌లకు అనుగుణంగా పరిపాలన చేస్తారు.
    • 40. ఈసా(అలైహిస్సలాం) కాలంలో సర్వత్రా శాంతి సుఖాలు మరియు అను(గహాలతో నిండిపోతాయి.
    • 41. ఈసా(అలైహిస్సలాం) యూదులతో మరియు క్రైస్తవులతో యుద్ధం చేస్తారు.
    • 42. ప్రవక్త ఈసా(అలైహిస్సలాం) మరణము.
    • 43. యాజూజ్‌ మాజూజ్‌.
    • 44. యాజూజ్‌ మాజూజ్‌ల రూపము.
    • 45. యాజూజ్‌ మాజూజ్‌ల బీభత్సం.
    • 46. నరకంలో యాజూజ్‌ మాజూజ్‌
    • 47. మూడుసార్లు అణగదొక్కబడతారు.
    • 48. దుఖాన్‌ (పొగ).
    • 49. పడమటి నుండి సూర్యుడు ఉదయిస్తాడు.
    • 50. పడమటి దిక్కు నుండి సూర్యుడు ఉదయించిన తరువాత క్షమాపణలు స్వీకరించబడవు.
    • 51. దాబ్బ (జంతువు).
    • 52. అగ్ని.
  • 53. అశుద్దుల ఆధిక్యత గొప్పెమీ కాదు.

ఇతరములు:

అల్లాహ్ యేతరులతో దుఆ చేయు నష్టాలు [వీడియో & టెక్స్ట్]

అల్లాహ్ యేతరులతో దుఆ చేయు నష్టాలు (خطورة الدعاء مع غير الله)
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

https://www.youtube.com/watch?v=k3vxVbMjq6g [27 నిముషాలు]

ఈ ప్రసంగంలో, వక్త దుఆ (ప్రార్థన) యొక్క ప్రాముఖ్యత మరియు దానిని సరైన పద్ధతిలో ఎలా చేయాలో ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా వివరిస్తున్నారు. దుఆ కేవలం అల్లాహ్ కే చెందాలని, ఆయనను కాకుండా ఇతరులను ప్రార్థించడం షిర్క్ (బహుదైవారాధన) మరియు కుఫ్ర్ (అవిశ్వాసం) అవుతుందని స్పష్టం చేస్తున్నారు. దుఆయే అసలైన ఇబాదత్ (ఆరాధన) అని, ఇతరులతో దుఆ చేయడం మహా అన్యాయం మరియు దౌర్జన్యం అని నొక్కిచెప్పారు. అల్లాహ్ ను వదిలి ప్రార్థించబడే వారికి ఎలాంటి శక్తి లేదని, వారు మన మొరలు వినలేరని, సహాయం చేయలేరని మరియు ప్రళయ దినాన మనకు శత్రువులుగా మారిపోతారని ఖురాన్ ఆయతుల ద్వారా హెచ్చరిస్తున్నారు. కాబట్టి, ప్రతి ఒక్కరూ తమ కష్టసుఖాలలో కేవలం ఏకైక అల్లాహ్ ను మాత్రమే వేడుకోవాలని ఈ ప్రసంగం యొక్క సారాంశం.

అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.
అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్.

సోదర సోదరీమణులారా! దుఆ అల్లాహ్ యేతరులతో చేయడం ఎంత నష్టమో ఎప్పుడైనా మనం గమనించామా? ఈరోజు ఈ అతి ముఖ్యమైన శీర్షికకు సంబంధించిన కొన్ని ఆయతులు దివ్య ఖురాన్ ద్వారా మరియు ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఒక రెండు హదీసులు కూడా మనం విందాము.

మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ముందు ఎందరు ప్రవక్తలు గతించారో, వారందరి జాతి వారు ఏ రకమైన షిర్క్ కు పాల్పడ్డారో అందులో అతి భయంకరమైనది, వారిని నరకంలో పడవేసినది అది దుఆ మిన్ దూనిల్లాహ్. అల్లాహ్ తప్ప ఇతరులతో దుఆ చేయడం. ఉదాహరణకు ఎవరైనా అనారోగ్యానికి గురవుతారు, ఎవరిపైనా ఏదైనా కష్టాలు ఆపదలు వస్తాయి, ఎవరికైనా సంతానం కలగదు. ఈ రోజు మనం సమాజంలో చూస్తున్నాము, వారు అల్లాహ్ ను కాకుండా ఇతరులను అర్ధిస్తారు, ఇతరులను ప్రార్థిస్తారు, ఇతరులతో దుఆ చేస్తారు. వారికి సంతానం కలగాలని, వారికి ఆరోగ్యం ప్రాప్తించాలని, వారి కష్టాలు దూరమైపోవాలని. ఇది ఎంత ఘోరమైన పాపమో ఎప్పుడైనా మనం ఆలోచించామా? అయితే నేను ఎక్కువ సమయం తీసుకోకుండా ఖురాన్ ఆయతుల ఆధారంగా కొన్ని ముఖ్య విషయాలు చెబుతున్నాను, ఈ ముఖ్యమైన శీర్షికకు సంబంధించినది. మీరు శ్రద్ధగా వింటారని ఆశిస్తున్నాను.

ఇందులో మొదటి విషయం, అసలు దుఆ ఎవరి హక్కు? అంటే మనం దాసులము, ఎవరితో దుఆ చేయాలి? దీని గురించి ఖురాన్ చాలా స్పష్టంగా మనకు తెలియజేసింది.

సూరతుర్ రాద్, సూర నెంబర్ 13, ఆయత్ నెంబర్ 14 లో అల్లాహ్ త’ఆలా తెలిపాడు:

لَهُ دَعْوَةُ الْحَقِّ
(లహు ద’వతుల్ హఖ్)
దుఆ యొక్క హక్కు కేవలం అల్లాహ్ ది మాత్రమే.” (13:14)

ఆయన తప్ప ఇంకా ఎవరితో దుఆ చేయడం ఇది న్యాయం, ధర్మం ఎంత మాత్రం కాదు.

ఇంకా, సూరె లుఖ్మాన్, ఆయత్ నెంబర్ 30 లో అల్లాహ్ తెలిపాడు:

وَأَنَّ مَا يَدْعُونَ مِن دُونِهِ الْبَاطِلُ
(వ అన్న మా యద్ఊన మిన్ దూనిహిల్ బాతిల్)
అల్లాహ్ తప్ప వారు ఎవరెవరితో దుఆ చేస్తున్నారో ఇదంతా కూడా వ్యర్థం, వృధా, అసత్యం.” (31:30)

అల్లాహు అక్బర్, గమనించారా? స్వయంగా మన సృష్టికర్త అయిన అల్లాహ్, మనం ఎవరితో దుఆ చేయాలని మనకు ఆదేశించాడు? ఈ విషయానికి వస్తే, ఖురాన్ లో ఒక సందర్భంలో కాదు, ఎన్నో చోట్ల. ఉదాహరణకు, సూరతు గాఫిర్, దాని యొక్క మరొక పేరు సూరతుల్ మూమిన్, ఆయత్ నెంబర్ 60 లో తెలిపాడు:

وَقَالَ رَبُّكُمُ ادْعُونِي أَسْتَجِبْ لَكُمْ
(వ ఖాల రబ్బుకుముద్ ఊనీ అస్తజిబ్ లకుమ్)
మీరు నన్నే ప్రార్థించండి. నేను మీ ప్రార్థనలను ఆమోదిస్తాను (40:60)

వ ఖాల రబ్బుకుమ్, మీ ప్రభువు మీకు ఈ ఆదేశం ఇస్తున్నాడు, ఉద్’ఊనీ, మీరు నాతో మాత్రమే దుఆ చేయండి, అస్తజిబ్ లకుమ్, నేను మీ దుఆలను అంగీకరిస్తాను. అల్లాహు అక్బర్, గమనించారా? నేను మీ దుఆలను అంగీకరిస్తాను అంటున్నాడు అల్లాహ్ త’ఆలా.

ఇంకా సోదర మహాశయులారా, దుఆ ఇది అసలైన ఇబాదత్, అసలైన ఆరాధన, అసలైన ప్రార్థన, దుఆ. ఇదే సూరత్, సూరత్ గాఫిర్, సూరతుల్ మూమిన్ ఆయత్ నెంబర్ 60 లో, అల్లాహ్ ఇలా తెలియజేశాడు:

وَقَالَ رَبُّكُمُ ادْعُونِي أَسْتَجِبْ لَكُمْ ۖ إِنَّ الَّذِينَ يَسْتَكْبِرُونَ عَنْ عِبَادَتِي سَيَدْخُلُونَ جَهَنَّمَ دَاخِرِينَ

మరి మీ ప్రభువు ఏమంటున్నాడంటే, “మీరు నన్నే ప్రార్థించండి. నేను మీ ప్రార్థనలను ఆమోదిస్తాను. నా దాస్యం పట్ల గర్వాహంకారం ప్రదర్శించేవారు త్వరలోనే అవమానితులై నరకంలో ప్రవేశించటం తథ్యం.”( 40:60)

దుఆ యొక్క ఆదేశం ఇచ్చిన వెంటనే, నా ఆరాధన పట్ల ఎవరైతే అహంకారానికి గురి అవుతాడో అని అంటున్నాడు అల్లాహ్ త’ఆలా, దుఆను ఆరాధన, దుఆ అసలైన ఇబాదత్ అని తెలిపాడు. ఎవరైతే దుఆ చేయరో అల్లాహ్ త’ఆలా తో, ఏం జరుగుతుంది? సయద్ ఖులూన జహన్నమ దాఖిరీన్. అవమానకరంగా వారు నరకంలో ప్రవేశిస్తారు. అల్లాహు అక్బర్. ఇంకా సోదర మహాశయులారా, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు,

الدُّعَاءُ هُوَ الْعِبَادَةُ
(అద్దుఆఉ హువల్ ఇబాదహ్)
దుఆ అసలైన ఇబాదత్.

మళ్ళీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇదే సూర గాఫిర్ యొక్క ఆయత్ పారాయణం చేశారు.

అంతేకాదు సోదరులారా, ఒకవైపున అల్లాహ్ త’ఆలా నాతోనే దుఆ చేయండి అని ఏదైతే ఆదేశించాడో, ఇతరుల ఎవరితోనీ దుఆ చేయకండి అని కూడా చెప్పాడు. ఇతరులతో దుఆ చేయడం నిషేధించాడు, వారించాడు. ఉదాహరణకు, సూరత్ యూనుస్ ఆయత్ నెంబర్ 106 లో తెలిపాడు:

وَلَا تَدْعُ مِن دُونِ اللَّهِ
(వలా తద్’ఉ మిన్ దూనిల్లాహ్)
అల్లాహ్ ను వదిలి మీరు ఎవరినీ అర్ధించకండి, ఎవరితో దుఆ చేయకండి.” (10:106)

సూరతుల్ ఖసస్ ఆయత్ నెంబర్ 88 లో చెప్పాడు:

وَلَا تَدْعُ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ
(వలా తద్’ఉ మ’అల్లాహి ఇలాహన్ ఆఖర్)
అల్లాహ్‌తో పాటు మరే దేవుణ్ణీ మొరపెట్టుకోకు. (28:88)

అల్లాహ్ తో పాటు ఇంకా ఎవరితోనీ కూడా, అల్లాహ్ తో పాటు వేరే ఏ దైవమైనా ఉన్నాడు అని భావించి వారితో మీరు దుఆ చేయకండి. సోదర మహాశయులారా, సూరత్ యూనుస్ మరియు సూరతుల్ ఖసస్ లోని ఈ రెండు ఆయతుల ద్వారా మనకు విషయం ఏం తెలిసింది? అల్లాహ్ తో దుఆ చేయడంతో పాటు ఇతరులతో చేయడం ఇది కూడా నిషేధం. అల్లాహ్ ను వదిలి వేరే ఎవరితోనైనా చేయడం ఇది కూడా నిషిద్ధం. మరి చేయవలసింది ఏంటిది? సూర గాఫిర్ లో మనం తెలుసుకున్నాము, కేవలం అల్లాహ్ తో మాత్రమే దుఆ చేయాలి.

అయితే, అల్లాహ్ తప్ప ఇతరులతో దుఆ చేయడం వల్ల మనకు నష్టం ఏమిటి? మహా భయంకరమైన నష్టం. అల్లాహ్ తో పాటు ఇతరులతో దుఆ చేయడం గాని, అల్లాహ్ ను వదిలి ఇతరులతో దుఆ చేయడం గాని, ఇది షిర్క్ మరియు కుఫ్ర్ లోకి వస్తుంది. బహుదైవారాధనలో లెక్కించడం జరుగుతుంది. సత్య తిరస్కారంలో లెక్కించడం జరుగుతుంది.

సూరతున్ నహల్ ఆయత్ నెంబర్ 86 గమనించండి.

وَإِذَا رَأَى الَّذِينَ أَشْرَكُوا شُرَكَاءَهُمْ
(వ ఇదా ర అల్లజీన అష్రకూ షురకాఅహుమ్)
ఈ ముష్రిక్కులు తాము (అల్లాహ్‌కు) భాగస్వాములుగా నిలబెట్టే వారిని చూడగానే..”

షిర్క్ చేసినటువంటి వారు, అల్లాహ్ తో పాటు ఇతరులను భాగస్వాములుగా కల్పించిన వారు తమ భాగస్వాములను చూస్తారు. ఎప్పుడు ఇది? ప్రళయ దినాన. చూసి ఏమంటారు?

قَالُوا رَبَّنَا هَٰؤُلَاءِ شُرَكَاؤُنَا الَّذِينَ كُنَّا نَدْعُو مِن دُونِكَ
(ఖాలూ రబ్బనా హాఉలాఇ షురకాఉనల్లజీన కున్నా నద్’ఊ మిన్ దూనిక్)
“ఓ మా ప్రభూ! మేము నిన్ను వదిలేసి మొరపెట్టుకున్న మా భాగస్వాములు వీరే” అని అంటారు” (16:86)

గమనిస్తున్నారా సోదరులారా? చదవండి మీరు సూరతున్ నహల్, సూర నెంబర్ 16, ఆయత్ నెంబర్ 86. ప్రళయ దినాన అందరూ హాజరవుతారు కదా, దుఆ చేసిన వారు ఎవరితోనైతే దుఆ చేయడం జరిగిందో. ఎప్పుడైతే వారిని చూస్తారో, “ఓ మా ప్రభువా, నిన్ను వదిలి మేము వారితో దుఆ చేసాము, వారిని మేము నీకు భాగస్వామిగా చేసాము. ఈరోజు వారు మాకు ఏమీ లాభం చేయడం లేదు” అని మొరపెట్టుకుంటారు. అయితే ఈ ఆయత్ లో మనకు చాలా స్పష్టంగా తెలిసింది, వారు స్వయంగా ఒప్పుకుంటున్నారు మేము ఈ షిర్క్ పని చేసాము అని.

అయితే, సూరతుల్ ఆరాఫ్, సూర నెంబర్ 7, ఆయత్ నెంబర్ 37 కూడా మీరు గమనించండి. మీరు కూడా స్వయంగా తెలుగు ఖురాన్ అనువాదాలు తీసి చదవండి, చూడండి, పరిశీలించండి. ఒక విషయం.. క్షమించండి, నేను నా టాపిక్ కు కొంచెం దూరమై ఒక విషయం మీకు అర్థం కావడానికి తెలియజేస్తున్నాను. మనం జానెడు కడుపులో పోయే కూడు తినడానికి మార్కెట్ లోకి వెళ్లి బియ్యం ఏ రకమైనది, ఈ టమాటాలు పాడు అయినాయా, మంచియా, ఉల్లిగడ్డ మంచిగుందా లేదా, ఈ కూరగాయలు మంచియా లేవా, ఒక్కొక్కటి ఏరుకొని మంచి మంచివి తీసుకొని వస్తాము కదా. మన స్వర్గం విషయానికి, ఏ ధర్మ జ్ఞానం మనం నేర్చుకోవాల్సి ఉందో దానిని కూడా మనం వెతకాలి, పరిశీలించాలి, సత్యం ఏదో తెలుసుకోవాలి. సూరతుల్ ఆరాఫ్ ఆయత్ నెంబర్ 37:

حَتَّىٰ إِذَا جَاءَتْهُمْ رُسُلُنَا يَتَوَفَّوْنَهُمْ قَالُوا أَيْنَ مَا كُنتُمْ تَدْعُونَ مِن دُونِ اللَّهِ ۖ قَالُوا ضَلُّوا عَنَّا وَشَهِدُوا عَلَىٰ أَنفُسِهِمْ أَنَّهُمْ كَانُوا كَافِرِينَ

ఆఖరికి మా దూతలు వారి ప్రాణాలు స్వాధీనం చేసుకోవటానికి వారివద్దకు వచ్చినప్పుడు “అల్లాహ్‌ను వదలి మీరు ఆరాధిస్తూ ఉన్నవారు ఇప్పుడెక్కడున్నారు?” అని అడుగుతారు. “వారంతా మా వద్ద నుంచి మటుమాయమై పోయారు” అని వాళ్ళు చెబుతారు. తాము అవిశ్వాసులుగా ఉండేవారన్న విషయాన్ని గురించి వారు స్వయంగా సాక్ష్యమిస్తారు.. (7:37)

అప్పుడు వారు తమకు తాము సాక్ష్యం పలుకుతారు, “అయ్యో, మేము ఎంత కుఫ్ర్ పని చేసాము, ఎంత అవిశ్వాసానికి పాల్పడే పని చేసాము, సత్య తిరస్కారంలో మేము పడి ఉన్నాము“. అయితే ఏం తెలిసింది? అల్లాహ్ తో కాకుండా లేదా అల్లాహ్ తో పాటు ఇతరులతో దుఆ చేయడం షిర్క్, కుఫ్ర్ లో వస్తుంది మరియు వారు ఏమీ వారికి లాభం చేకూర్చలేదు. వారు ఏమీ లాభం చేకూర్చరు అన్న విషయం ఇంకా ఎన్నో ఆయతుల ద్వారా ఇన్ షా అల్లాహ్ నేను తెలియజేస్తున్నాను.

అంతేకాదు సోదర మహాశయులారా, అల్లాహ్ ను వదిలి లేదా అల్లాహ్ తో పాటు ఇంకా వేరే వారితో కూడా దుఆ చేయడం ఇది మహా అన్యాయం, మహా దౌర్జన్యం. ఏ కొందరు యువకులు తమ జాతి వారిని ఎదిరించి, జాతి వారందరూ కూడా షిర్క్ పనులు చేస్తున్నారు, తౌహీద్ కు దూరమై ఉన్నారు, వారు కేవలం అల్లాహ్ ను మాత్రమే, కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలి అన్న తపనతో తమ గ్రామం నుండి కూడా దూరమయ్యారు. ఆ సందర్భంలో వారు ఏమంటారు, సూరతుల్ కహఫ్ ఆయత్ నెంబర్ 14:

لَّن نَّدْعُوَ مِن دُونِهِ إِلَٰهًا ۖ لَّقَدْ قُلْنَا إِذًا شَطَطًا
(లన్ నద్’ఉవ మిన్ దూనిహి ఇలాహన్, లఖద్ ఖుల్నా ఇదన్ షతతా)
మేము ఆయన్ని తప్ప వేరొక ఆరాధ్య దైవాన్ని పిలవటమన్నది జరగని పని. ఒకవేళ మేము గనక అలా చేస్తే ఎంతో దుర్మార్గపు మాటను పలికిన వారమవుతాము.” (18:14)

లన్ నద్’ఉవ మిన్ దూనిహీ ఇలాహా. మేము అల్లాహ్ ను వదిలి వేరే ఏ భూటకపు దైవాలను మేము ఆరాధించము. అల్లాహ్ ను వదిలి వేరే ఏ దైవంతో మేము దుఆ చేయము. ప్రజలు ఎవరెవరినైతే దైవాలుగా భావిస్తున్నారో, వారి దృష్టిలో, వారి యొక్క అభిప్రాయం ప్రకారం వారు దేవుళ్ళు కావచ్చు, కానీ సత్యమైన దేవుడు కేవలం అల్లాహ్. సత్యమైన ఆరాధ్యుడు కేవలం అల్లాహ్. ఆయన్ని తప్ప మేము ఇంకా ఎవరితో దుఆ చేయము. లఖద్ ఖుల్నా ఇజన్ షతతా. ఒకవేళ మేము ఇలా చేసి ఉంటే ఇది మహా దౌర్జన్యం అయిపోతుంది. గమనించారా? 

అంతేకాదు, అల్లాహ్ ను తప్ప వేరే ఎవరితోనైనా దుఆ చేయడం, అల్లాహ్ తో పాటు ఇంకా వేరే ఎవరితోనైనా దుఆ చేయడం… మహాశయులారా, ఇది అల్లాహ్ యొక్క శిక్షకు గురి చేసే విషయం. అవును, అల్లాహ్ యొక్క శిక్షకు గురి చేసే విషయం. చదవండి ఖురాన్ లో. సూరతుష్ షుఅరా ఆయత్ నెంబర్ 213 లో అల్లాహ్ తెలిపాడు:

فَلَا تَدْعُ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ فَتَكُونَ مِنَ الْمُعَذَّبِينَ
(ఫలా తద్’ఉ మ’అల్లాహి ఇలాహన్ ఆఖర ఫతకూన మినల్ ము’అద్దబీన్)
కనుక (ఓ ప్రవక్తా!) నువ్వు అల్లాహ్‌తోపాటు మరే ఇతర దైవాన్నీ మొరపెట్టుకోకు. నువ్వుగాని అలా చేశావంటే శిక్షించబడేవారిలో చేరిపోతావు సుమా!” (26:213)

ఫలా తద్వు మఅల్లాహి ఇలాహన్ ఆఖర్. అల్లాహ్ తో పాటు ఇంకా వేరే ఏ దైవంతో మీరు దుఆ చేయకండి. ఫతకూన మినల్ ముఅజ్జబీన్. అలా చేశావంటే, అలా చేశారంటే శిక్ష ఇవ్వబడిన వారిలో ఎవరికైతే శిక్ష పడుతుందో వారిలో మీరు కలిసిపోతారు. అల్లాహు అక్బర్. అల్లాహ్ మనందరిని ఇహలోకం, పరలోకం అన్ని రకాల శిక్షల నుండి దూరం చేయుగాక, దూరం ఉంచుగాక. మరియు శిక్షలకు గురి చేసే ప్రతి పాపం నుండి కూడా అల్లాహ్ మనల్ని దూరం ఉంచుగాక.

అంతేకాదు, చివరిలో ఒక రెండు ముఖ్యమైన విషయాలు అవేమిటంటే, అల్లాహ్ ను కాకుండా ఎవరినైతే ఆరాధిస్తారో, అల్లాహ్ ను కాకుండా లేదా అల్లాహ్ తో పాటు ఇంకా వేరే ఎవరితోనైతే దుఆ చేస్తారో, వారిలో ఏ శక్తి లేదు. మన మొరలు వినడానికి, మనం వేడుకునే వాటిని ఇవ్వడానికి, మన కష్ట దుఃఖాలు దూరం చేయడానికి, సుఖాలు ప్రసాదించడానికి, ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఇవ్వడానికి వారిలో ఏ శక్తి లేదు అని అల్లాహ్ చాలా స్పష్టంగా తెలిపాడు. ఒకవేళ వాస్తవంగా అల్లాహ్ ను నమ్మేవారయ్యేది ఉంటే ఈ ఆయతులను చాలా శ్రద్ధగా మనం అర్థం చేసుకోవాలి. సూరత్ ఫాతిర్, ఆయత్ నెంబర్ 13, 14.

وَالَّذِينَ تَدْعُونَ مِن دُونِهِ مَا يَمْلِكُونَ مِن قِطْمِيرٍ
(వల్లదీన తద్’ఊన మిన్ దూనిహి మా యమ్లికూన మిన్ ఖిత్మీర్)
ఆయన్ని వదలి మీరు ఎవరెవరిని పిలుస్తున్నారో వారు ఖర్జూరపు టెంకపై ఉండే పొరకు కూడా యజమానులు కారు.” (35:13)

إِن تَدْعُوهُمْ لَا يَسْمَعُوا دُعَاءَكُمْ وَلَوْ سَمِعُوا مَا اسْتَجَابُوا لَكُمْ ۖ وَيَوْمَ الْقِيَامَةِ يَكْفُرُونَ بِشِرْكِكُمْ ۚ وَلَا يُنَبِّئُكَ مِثْلُ خَبِيرٍ
ఒకవేళ మీరు వారిని మొర పెట్టుకున్నా, వారు మీ మొరను ఆలకించరు. ఒకవేళ ఆలకించినా, మీ అక్కరను తీర్చలేరు. పైపెచ్చు ప్రళయదినాన మీరు కల్పించే భాగస్వామ్యాన్ని (షిర్క్‌ను) వారు (సూటిగా) త్రోసిపుచ్చుతారు. అన్నీ తెలిసిన దేవుని మాదిరిగా (సావధానపరిచే సమాచారాన్ని) నీకు తెలిపే వాడెవడూ ఉండడు సుమా! (35:14)

(వల్లజీన తద్వూన మిన్ దూనిహీ). మీరు అల్లాహ్ ను వదిలి ఎవరినైతే దుఆ చేస్తారో, ఎవరితోనైతే దుఆ చేస్తారో, (మా యమ్లికూన మిన్ కిత్మీర్). ఖర్జూరపు బీజము మీద ఉండేటువంటి సన్నని ఆ పొర. అంతమాత్రం కూడా వారికి ఏ శక్తి లేదు. (ఇన్ తద్వూహుం లా యస్మవూ దుఆఅకుం). మీరు వారితో దుఆ చేస్తే మీ దుఆలను వారు వినలేరు. గమనించండి. సూరత్ ఫాతిర్ ఆయత్ 13, 14. మీరు అల్లాహ్ ను వదిలి ఎవరితోనైతే దుఆ చేస్తారో, వారు ఖర్జూరపు బీజము మీద ఉండేటువంటి సన్నని ఆ పొర ఏదైతే ఉంటుందో అంత మందం కూడా శక్తి కలిగి లేరు. మీరు వారిని అడిగితే, వారితో దుఆ చేస్తే వారు వినరు. కానీ ఈ రోజుల్లో ఎంతో మంది ఉన్నారు కదా, వింటారు అన్నటువంటి మూఢనమ్మకంలో. అయితే అల్లాహ్ ఏమంటున్నాడో చూడండి. (వలవ్ సమీవూ మస్తజాబూ లకుం). మీ మూఢనమ్మకాల ప్రకారంగా వారు వింటారు అని ఏదైతే అనుకుంటున్నారో, అలా జరిగినా ఎప్పుడైనా, ఏదైనా సందర్భంలో ఒక పరీక్షగా మేము వారికి వినిపించినా, వారు మీ దుఆలకు సమాధానం చెప్పలేరు.

(వ యౌమల్ ఖియామతి యక్ఫురూన బిషిర్కికుం). మీరు ఈ షిర్క్ ఏదైతే చేస్తున్నారో, దుఆ ఇతరులతో చేసి ఏ భాగస్వామ్యం కల్పింపజేస్తున్నారో, దీనిని వారు ప్రళయ దినాన తిరస్కరిస్తారు. (వలా యునబ్బిఉక మిస్లు ఖబీర్). సూక్ష్మ జ్ఞాని అయిన అల్లాహ్ ఆయన తెలిపినటువంటి విషయాలు మీకు తెలిపేవాడు ఇంకా వేరే ఎవడు లేడు.

అలాగే సోదర మహాశయులారా, సూరత్ సబా ఆయత్ నెంబర్ 22 ఒకసారి గమనించండి మీరు.

قُلِ ادْعُوا الَّذِينَ زَعَمْتُم مِّن دُونِ اللَّهِ ۖ لَا يَمْلِكُونَ مِثْقَالَ ذَرَّةٍ فِي السَّمَاوَاتِ وَلَا فِي الْأَرْضِ وَمَا لَهُمْ فِيهِمَا مِن شِرْكٍ وَمَا لَهُ مِنْهُم مِّن ظَهِيرٍ

(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : అల్లాహ్‌ను వదలి మీరు ఎవరెవరినయితే ఊహించుకుంటున్నారో వారందరినీ పిలిచి చూడండి. భూమ్యాకాశాలలో వారికి రవంత అధికారంగానీ, వాటిలో వారికి ఎలాంటి వాటాగానీ లేదు. వారిలో ఏ ఒక్కడూ అల్లాహ్‌కు సహాయకుడు కూడా కాడు. (34:22)

(ఖులిద్ వుల్లజీన జఅంతుం మిన్ దూనిల్లాహ్). మీ మూఢనమ్మకం ప్రకారం అల్లాహ్ ను వదిలి ఎవరెవరిని మీరు ఆరాధిస్తారో, ఎవరెవరిని పూజిస్తారో, ఎవరెవరితో దుఆ చేస్తారో, (ఉద్వూ), మీరు దుఆ చేసి చూడండి. వారిలో ఏముంది? (లా యమ్లికూన మిస్కాల జర్రతిన్ ఫిస్సమావాతి వలా ఫిల్ అర్జ్). ఆకాశాల్లో, భూమిలో రవ్వంత దానికి వారు అధికారం కలిగి లేరు. అల్లాహు అక్బర్. అల్లాహు అక్బర్. ఇంతకుముందు ఏం చెప్పాడు? సూరె ఫాతిర్ లో, ఖర్జూరపు బీజం మీద ఉండేటువంటి ఒక పొర అంతటి అధికారం కూడా వారికి లేదు. ఇక్కడ జర్రహ్, అణువు. కళ్ళతో కనబడదు మనకు. అంతటి అధికారం కూడా వారిలో లేదు. ఇంకా, (వమాలహుం ఫీహిమా మిన్ షిర్క్). భూమి ఆకాశాల్లో వారికి ఏ భాగస్వామ్యం లేదు.

అల్లాహ్ క్షమించుగాక, అల్లాహ్ కు కాదు ఒక ఉదాహరణ, పోలిక, మనకు అర్థం కావడానికి ఒక చిన్న విషయం తెలియజేస్తున్నాను. కొన్ని సందర్భంలో ఏమవుతుంది? నా వద్ద ఒక్క పైసా కూడా లేకపోవచ్చు. కానీ నేను ఒకరితో బిజినెస్ లో పార్ట్నర్ కావచ్చు కదా. ఏదైనా పనిలో నేను పొత్తు కలవవచ్చు కదా. ఈ విధంగా ప్రజలు ఏమనుకుంటారు? అరే, అతడు ఫలానా కంపెనీలో ఒక పార్ట్నర్ గా ఉన్నాడు, ఎంతటి మహానుభావుడో అని అనుకుంటాం కదా. అయితే అల్లాహ్ ఇలాంటి భావాన్ని కూడా ఎట్లా దూరం చేస్తున్నాడో గమనించండి. వారికి అణువంత అధికారం కూడా లేదు ఆకాశాల్లో గాని, భూమిలో గాని. అంతేకాదు వారు ఈ భూమి ఆకాశాల్లో అల్లాహ్ కు ఏ పార్ట్నర్ కారు, ఏ భాగస్వామి కారు. అంతెందుకు, కొందరు ఇహలోకం ప్రకారంగా చూసుకుంటే ఏ అధికారం ఉండదు, పార్ట్నర్ ఉండడు. కానీ ఒకరి కంపెనీ నడపడానికి, ఒకరి పని పూర్తి అవ్వడానికి ఏదో తన ఛాయాశక్తి కొంచెం సపోర్ట్ అయినా ఇస్తాడు కదా. అల్లాహ్ ఇలాంటి దానిని కూడా ఖండించాడు. ఏం చెప్పాడు? (వమాలహుం మిన్హుం మిన్ జహీర్). మీరు ఎవరెవరితోనైతే దుఆలు చేస్తున్నారో వారిలో ఏ ఒక్కడు కూడా అల్లాహ్ కు ఎలాంటి మద్దతునిచ్చేవాడు కాదు, ఎలాంటి సహాయం అందించేవాడు కాదు.

ఇక మీరు అలాంటి వారితో ఎందుకు దుఆ చేస్తున్నారు అని అల్లా రబ్బుల్ ఆలమీన్ హెచ్చరిస్తున్నాడు. అల్లాహు అక్బర్. గమనించండి సోదరులారా.

ప్రత్యేకంగా ఎవరైతే అల్లాహ్ ను కాకుండా వేరే ఎవరెవరినైతే ఆరాధిస్తున్నారో, పూజిస్తున్నారో, దుఆలు చేస్తున్నారో, అర్ధిస్తున్నారో, వారి యొక్క స్థితి ఏమిటి? ఇంకా, వారు ఏమైనా ప్రళయ దినాన మనకు లాభం కలగజేస్తారా? ఉపయోగపడతారా? అది కూడా జరగదు. సూరతుల్ అహ్కాఫ్ ఆయత్ నెంబర్ ఐదు, ఆరు వినండి.

وَمَنْ أَضَلُّ مِمَّن يَدْعُو مِن دُونِ اللَّهِ مَن لَّا يَسْتَجِيبُ لَهُ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ وَهُمْ عَن دُعَائِهِمْ غَافِلُونَ
అల్లాహ్ ను వదలి ప్రళయదినం వరకూ తన మొరను ఆమోదించలేని వారిని, పైగా తను మొరపెట్టుకున్న సంగతి కూడా తెలియని వారిని మొరపెట్టుకునేవానికన్నా పెద్ద మార్గభ్రష్టుడు ఎవడుంటాడు? (46:5)

وَإِذَا حُشِرَ النَّاسُ كَانُوا لَهُمْ أَعْدَاءً وَكَانُوا بِعِبَادَتِهِمْ كَافِرِينَ
మానవులంతా సమీకరించబడినపుడు వారు వారికి (తమ భక్తులకు) శత్రువులై పోతారు. వీళ్ళ పూజాపురస్కారాలను కూడా వాళ్ళు త్రోసిపుచ్చుతారు. (46:6)

(వ మన్ అదల్లు మిమ్మన్ యద్వూ మిన్ దూనిల్లాహ్). ఎవరైతే అల్లాహ్ ను వదిలి ఇతరులతో దుఆ చేస్తున్నారో వారి కంటే మార్గభ్రష్టులు ఇంకా వేరే ఎవరు లేరు. నేననడం లేదు, ఖురాన్ తీసి చూడండి మీరు. వ మన్ అదల్లు, అతని కంటే మార్గభ్రష్టత్వంలో ఇంకా ఎవరు లేరు. ఎవరు? ఎవరైతే అల్లాహ్ ను వదిలి ఇతరులతో దుఆ చేస్తున్నాడో. ఎలాంటి వారితో దుఆ చేస్తున్నాడు? (మల్లా యస్తజీబు లహు ఇలా యౌమిల్ ఖియామ). ప్రళయ దినం వరకు అతని దుఆలను అంగీకరించడం గాని, దుఆకు సమాధానం గాని చెప్పలేని వారు. అంతేకాదు, (వహుం అన్ దుఆఇహిం గాఫిలూన్). వారు వీరు చేసే దుఆలకు ఏ సంబంధం లేకుండా నిర్లక్ష్యంగా ఉన్నారు. వారికి తెలియనే తెలియదు, ఎవరో వచ్చి మా సమాధుల వద్ద, ఎవరో మా పేరును తీసుకొని దుఆలు చేస్తున్నారు అని.

(వ ఇజా హుషిరన్నాస్). ప్రళయ దినాన ఎప్పుడైతే సమూహ పరచడం జరుగుతుందో, (కానూ లహుం అదాఅ). ఈ దుఆ చేసేవారు, ఎవరితోనైతే దుఆ చేయడం జరిగిందో వారందరూ పరస్పరం శత్రువులైపోతారు. (వ కానూ బి ఇబాదతిహిం కాఫిరీన్). మరియు వారి యొక్క ఆరాధనలో, వారి యొక్క దుఆలు వాటి గురించి ఇంకార్ చేస్తారు, రద్దు చేస్తారు. వీరు మమ్మల్ని ఆరాధించలేదు, మాతోని దుఆ చేయలేదు అని స్పష్టంగా తెలియజేస్తారు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అల్లాహ్ క్షమించుగాక, ఇహలోక ప్రకారంగా నేను ఒక ఉదాహరణ ఇస్తున్నాను, గమనించండి.

ఉదాహరణకు నీవు ఏదైనా ఆపదలో ఇరుక్కున్నావు. కోర్టులో వెళ్ళవలసి వచ్చింది. ఏం జరిగింది? ఫలానా వకీల్ చాలా పేరు గలవాడు. ఫలానా లాయర్ ఎంతో పేరు గాంచిన వాడు. అతనిని నేను పిలిపించుకుంటే నన్ను ఎట్లనైనా ఈ కేసులో నుండి బయటికి తీసేస్తాడు అని అనుకున్నావు. అతడు వచ్చాడు. వచ్చిన తర్వాత, నీవు అనుకుంటున్నావు ఈ కేసు ఈ కోర్టులో ఆ వకీల్, ఆ లాయర్ నీకు సపోర్ట్ చేసి నీ తరఫు నుండి మాట్లాడి నిన్ను జైలు పాలు కాకుండా, శిక్షకు గురి కాకుండా కాపాడుకుంటాడు అని. తీరా సమయం వచ్చే వరకు ఏం జరిగింది? నీకు వ్యతిరేకమైపోయాడు. అతడు నీకు వ్యతిరేకమైపోయాడు. నీవు ఇంకా పాపంలో ఉన్నావు, నీ పై ఈ అపరాధం అన్నట్టుగా ఎన్నో సాక్షాలు తెచ్చి ఇరికించే ప్రయత్నం చేశాడు. అప్పుడు ఏమవుతుంది పరిస్థితి గమనించండి. ఇంతకంటే మరీ భయంకరమైన, ఘోరమైన పరిస్థితి అక్కడ రానుంది. అల్లాహ్ మనందరిని కూడా కాపాడుగాక.

ఖురాన్ లో మనం గమనిస్తే, ఆదం అలైహిస్సలాం, నూహ్ అలైహిస్సలాం, ఇబ్రాహీం అలైహిస్సలాం, ఇస్మాయిల్ అలైహిస్సలాం, యూనుస్ అలైహిస్సలాం, లూత్ అలైహిస్సలాం, సులేమాన్ అలైహిస్సలాం, అయ్యూబ్ అలైహిస్సలాం, యూసుఫ్ అలైహిస్సలాం, షుఐబ్ అలైహిస్సలాం, హూద్ అలైహిస్సలాం, జకరియా అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం, హారూన్ అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం మరియు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సుమారు 16 ప్రవక్తలు, వారు అల్లాహ్ తో ఏ దుఆ చేశారో, ఎలా ఎలా మొరపెట్టుకున్నారో ఆ దుఆల ప్రస్తావనలన్నీ కూడా ఖురాన్ లో ఉన్నాయి. ఎక్కడా కూడా వారు అల్లాహ్ తప్ప ఇతరులతో మొరపెట్టుకోలేదు. నేను ఎందుకు ప్రస్తావిస్తున్నాను? ఈ ప్రవక్తల సరైన మార్గాన్ని మనం అవలంబించినప్పుడే కదా మనకు మోక్షం లభించేది.

అంతేకాదు, అల్లాహ్ త’ఆలా ఖురాన్ లో ఎందరో పుణ్యాత్ముల గురించి కూడా తెలిపాడు. ఉదాహరణకు, ఇమ్రాన్ యొక్క భార్య, ఫిరౌన్ యొక్క భార్య మరియు బిల్ఖీస్ రాణి మరియు ఆ గుహలో, సూర కహఫ్ లో వచ్చిన ప్రస్తావన ఉన్నవారు. ఇంకా విశ్వాసులు, ఎవరైతే ఒక తోటకు అధికారి అయ్యారో వారి యొక్క సంఘటన ఉంది. ఈ విధంగా ఇంకా ఎందరో సంఘటనలు ఖురాన్ లో ఉన్నాయి. వారందరూ కూడా వారి కష్ట సమయాల్లో కేవలం ఏకభాగస్వామ్యం లేకుండా అల్లాహ్ తోనే దుఆ చేశారు, అల్లాహ్ నే మొరపెట్టుకున్నారు.

అందు గురించి సోదరులారా, ఇదే పని మనం కూడా చేయాలి. ఒకవేళ అల్లాహ్ ను కాకుండా వేరే ఎవరినైనా మనం మొరపెట్టుకున్నామో, వేరే ఎవరితోనైనా దుఆ చేసాము అంటే షిర్క్ లో పడిపోతాము, కుఫ్ర్ లో పడిపోతాము, మహా దౌర్జన్యం చేసిన వారమవుతాము, అల్లాహ్ యొక్క శిక్షకు గురి కావలసి వస్తుంది. అంతేకాకుండా అల్లాహ్ ను కాదని మనం ఎవరెవరినీ మొరపెట్టుకుంటామో ఎవరూ కూడా మనకు ఇహలోకంలో పనికిరారు. పరలోకంలోనైతే ఏమాత్రం మనకు లాభం చేకూర్చరు.

అల్లాహ్ మనందరినీ కాపాడుగాక, రక్షించుగాక. ఎల్లవేళల్లో కేవలం అల్లాహ్ తో మాత్రమే దుఆ చేస్తూ ఉండే సద్భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ తప్ప వేరే ఎవరెవరితో మనం ఇంతవరకు తెలిసి తెలియక, అజ్ఞానంలో ఉండి ఏమైతే చేసామో, అల్లాహ్ ఆ పాపాలన్నిటినీ కూడా క్షమించి, మన్నించి మనల్ని తన యొక్క పవిత్రమైన పుణ్య దాసుల్లో చేర్చుగాక.

వ ఆఖిరు ద’వానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.

వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=5159


మీజాన్ : ప్రళయ దినాన త్రాసు [వీడియో]

బిస్మిల్లాహ్

సఊది అరేబియాలోని జుల్ఫీ జాలియాత్ వారు సమర్పిస్తున్న మరో నూతన వీడియో వీక్షించండి ప్రళయదినాన త్రాసును నెలకొల్పడం సత్యం, ఎవరి పుణ్యపళ్ళాలు బరువుగా ఉంటాయో వారే స్వర్గంలో చేరేవారు.

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.


ప్రళయ దినాన కర్మలు బరువు వేసే త్రాసు స్థాపించబడుతుంది.

త్రాసు గురించి అల్లాహ్‌ ఖుర్‌ఆన్‌ గ్రంథంలో ఇలా సెలవిచ్చాడు:

وَنَضَعُ الْمَوَازِينَ الْقِسْطَ لِيَوْمِ الْقِيَامَةِ فَلَا تُظْلَمُ نَفْسٌ شَيْئًا ۖ وَإِن كَانَ مِثْقَالَ حَبَّةٍ مِّنْ خَرْدَلٍ أَتَيْنَا بِهَا ۗ وَكَفَىٰ بِنَا حَاسِبِينَ

“ప్రళయ దినాన కచ్చితంగా తూచేటటువంటి త్రాసులను మేము ఏర్పాటు చేస్తాము. ఆ తర్వాత ఎవరిపై కూడా రవ్వంత అన్యాయం జరగదు. ఎవరైనా ఒక ఆవగింజకు సమానమైన ఆన్యాయం చేసి ఉన్నా దాన్ని కూడా మేము ముందుకు తీసుకొస్తాము. లెక్క తీసుకొనుటకు మేమే చాలు.” (21,సూరతుల్‌ అంబియా: 47)

హజ్రత్‌ ఇమామ్‌ ఖుర్‌తుబి (రహిమహుల్లాహ్) ఇలా ప్రవచించారు: “లెక్కలు తీసుకున్న తరువాత కర్మలను తూకం వేస్తారు. వారి పుణ్యాల బరువుకు తగ్గట్టుగా ప్రతిఫలం కూడా ఉంటుంది. అందుకనే లెక్కలు తీసుకున్న తరువాత కర్మలు తూయబడును. తరువాత వాటి ఆధారంగా మానవులకు (అంతస్తుల) ప్రతిఫలం ప్రసాదించడం జరుగుతుంది.” (తజ్‌కిరతుల్‌ ఖుర్‌తుబి: 309)

హజ్రత్‌ సల్మాన్‌ ఫార్సీ (రది అల్లాహు అన్హు) కథనం; ప్రవక్త ముహమ్మద్‌ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: “ప్రళయ దినాన త్రాసులో (కర్మలు) తూకం వేయబడును. ఆ త్రాసు భూమ్యాకాశాలను తూకం వేసేటంత విశాలంగా ఉంటుంది“. *

ఓ ప్రభూ! “దీనిలో ఎవరినీ తూకం వేస్తారు?” అని అల్లాహ్‌ దూతలు ప్రశ్నించారు. దానికి అల్లాహ్‌: “నా సృష్టిలో నేను తలచుకున్నవారందరినీ” అని అన్నాడు. అప్పుడు అల్లాహ్‌ దూతలు: “సుబ్ హానక్! మేము నీకు ఎంతగా ఆరాధించాలో అంతగా ఆరాధించ లేదే!” అని అంటారు.(హాకిమ్‌, అస్‌ సహీహ: 941)

*గమనిక: కొందరు త్రాసు అనగా “అల్లాహ్‌ న్యాయాన్ని స్థాపిస్తాడే తప్ప త్రాసు రూపాంతరము ఉండదనీ భావించారు”. అలా భావించడం సరికాదు. నిజమైన విషయం ఏమంటే! అల్లాహ్‌ సాక్ష్యాత్తు త్రాసును నిలబెట్టుతాడు. ఇలా మనం విశ్వసించడం వల్ల ఖుర్‌ఆన్‌, హదీసులలో ప్రచురించబడిఉన్న నిజమైన వాక్యాలకు అనుగుణమైన విశ్వాసం అవుతుంది. కనుక విశ్వాసులందరూ ఆ త్రాసును తప్పక విశ్వసించాలి. మరియు ప్రళయ దినాన దానిలో కర్మలు తూయబడుతాయనీ, దానికి రెండు తూకం వేసే పళ్ళెములు ఒక సరిసమానం చేసే ముళ్లు కూడా ఉందనీ విశ్వసించాలి. ఇంకా దానిలో కర్మలు తూకం వేస్తే పైకీ క్రిందికి ఆ పళ్ళెములు వంగుతాయనీ కూడా విన్వసించాలి. ఇదే ‘“అహ్‌లుస్‌ సున్నత్‌ వల్‌ జమాఅత్‌” విశ్వాసం.

ఎలాంటి కర్మలను త్రాసులో తూకం వేస్తారు?

హజ్రత్‌ అబూ హురైరా (రది అల్లాహు అన్హు) కథనం; ప్రవక్త ముహమ్మద్‌ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

“రెండు వాక్యాలు పలకటానికి చాలా తేలికైనవి, కాని అవి త్రాసులో చాలా బరువైనవి, కరుణామయునికి ఎంతో ప్రియమైనవి. అవి, “సుబ్‌హానల్లాహి వబిహమ్‌దిహి, సుబ్‌హానల్లాహిల్‌ అజీమ్‌.” (బుఖారీ,ముస్లిం)

హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ అమ్ర్ బిన్‌ ఆస్‌ (రది అల్లాహు అన్హు) కథనం; ప్రవక్త ముహమ్మద్‌ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: “ప్రళయ దినాన ప్రజలందరి ముందు నా ఉమ్మత్‌కు చెందిన ఒక వ్యక్తిని కేకలు పెట్టి పిలువడం జరుగుతుంది. తరువాత అతని ముందు తొంభైతొమ్మిది (కర్మల) పత్రాలను తెరిచి పరుస్తారు. ప్రతి పత్రం అతను చూడగలిగినంత దూరం వరకూ (పెద్దదిగా) ఉంటుంది.”

తరువాత అల్లాహ్‌ అతనితో: “దీని (పాపాల పత్రాలు)లో నీవు చేయని (విషయాలు) ఏమైనా ఉన్నాయనీ చెప్పగలవా?” అని ప్రశ్నిస్తాడు.

అతను: “లేదు నా ప్రభూ!” అని అంటాడు.

మరలా అల్లాహ్‌ అతనితో: “వాటిని జాగ్రత్తగా రాసేవారు (మున్కర్‌ నకీర్‌) నీపై (నీ పత్రాలలో) అన్యాయంగా ఏమైనా రాసారా!”’ అని ప్రశ్నిస్తాడు. తరువాత అతనితో: “నీ వద్ద వాటికి (ఆ పాపాల పత్రాలకు) బదులు పుణ్యాలేమైనా ఉన్నాయా?” అని అల్లాహ్‌ ప్రశ్నిస్తాడు.

అప్పుడు అతను: లోలోన భయపడుతూ “నా వద్ద (పుణ్యాలు) లేవు” అని అంటాడు.

ఆ తరువాత అల్లాహ్‌ అతనితో: “ఎందుకు లేవు మా వద్ద నీ పుణ్యం ఒకటుంది. ఈ రోజు మేము ఎవరికీ అన్యాయం చెయ్యబోము” అని అల్లాహ్‌ (షహాదత్‌) “అష్‌హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్‌, వ అష్‌హదు అన్న ముహమ్మదన్‌ అబ్దుహు వ రసూలుహు”’ పత్రాన్ని అతనికి ప్రసాదిస్తాడు. అతను: (దాన్ని చూసి) “ఓ అల్లాహ్‌ ఈ ఒక్క పత్రం అన్ని (పాపాల) పత్రాలకు సరిసమానమవుతుందా?” అని ఆశ్చర్యపడుతూ అంటాడు.

తరువాత అల్లాహ్‌: “ఈ రోజు నీకు ఎలాంటి అన్యాయం జరగదు” అని అంటాడు.

తరువాత “(అతని పాపాల) పత్రాలన్ని ఒక పళ్లెంలో వేస్తారు. మరియు ‘షహాదత్‌ పత్రం’ మరొక పళ్లెంలో వేస్తారు. ఆ (పాపాల) పత్రాలన్ని తేలికైపోతాయి. షహాదత్‌ పత్రం (అన్ని పత్రాలపై) బరువైపోతుంది. (ఎందుకంటే) అల్లాహ్‌ పేరు కంటే (ఎక్కువ) ఏదీ బరువు ఉండదు.”’ (తిర్మిజీ హాకిమ్‌, సహీహ్‌ ఇబ్నుమాజ: 3469)

హజ్రత్‌ అబూ దర్దా (రది అల్లాహు అన్హు) కథనం; ప్రవక్త ముహమ్మద్‌ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:  “ప్రళయం రోజున త్రాసులో తూకం చేసినప్పుడు ఉత్తమ గుణాలకంటే ఎక్కువ బరువు ఏ విషయము ఉండదు.” (ఇబ్నుమాజ, తిర్మిజీ, హాకిమ్‌)

హజ్రత్‌ అబూ హురైరా (రది అల్లాహు అన్హు) కథనం; ప్రవక్త ముహమ్మద్‌ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: “ప్రళయం రోజు ఒక లావుగా బలసిన వ్యక్తి వస్తాడు. అయినా అతను (త్రాసులో) దోమ రెక్కకు సమానం కూడా బరువు ఉండడు. తరువాత ఖుర్‌ఆన్‌ సూక్తిని ఇలా పఠించారు: 

 فَلَا نُقِيمُ لَهُمْ يَوْمَ الْقِيَامَةِ وَزْنًا

 “ప్రళయం రోజున మేము వారిని ఏ మాత్రము బరువుగా నిలబెట్టము.””(18,సూరతుల్‌ కహఫ్‌:105) (బుఖారీ)

హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌వూద్‌ (రది అల్లాహు అన్హు) కథనం; “ఒక రోజు నేను ప్రవక్త ముహమ్మద్‌ సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు మిస్వాక్‌ చెట్టు నుండి మిస్వాక్‌ను తెంపుకొనే టప్పుడు క్రిందకు (నేలపై) పడిపోయేటట్టు గాలి వీచింది. ఆ పరిస్టితిని చూసి ప్రజలు నవ్వినారు. మీరు ఎందుకు నవ్వుతున్నారనీ? ప్రవక్త ముహమ్మద్‌ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రశ్నించారు. దానికి వారందరూ: ఓ అల్లాహ్‌ ప్రవక్తా! “ఆయన కాళ్ళు సన్నగా ఉన్నందువలన” అని సమాధానమిచ్చారు. ఆ తరువాత ప్రవక్త ముహమ్మద్‌ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: “ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో, అతని సాక్షిగా! ప్రళయ దినాన త్రాసులో ఆయన కాళ్ళు ఉహద్‌ కొండకంటే ఎక్కువ బరువు ఉంటాయి.” (అహ్మద్‌, ఇర్వావుల్‌ గలీల్‌:65)

హజ్రత్‌ అబూ మాలిక్‌ అల్‌ అష్‌అరి (రది అల్లాహు అన్హు) కథనం; ప్రవక్త ముహమ్మద్‌ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

“పరిశుభ్రత విశ్వాసానికి ఒక షరతు. ఆల్‌ హమ్‌దులిల్లాహ్‌ (అనే పదాలు) త్రాసులో నిండిపోతాయి. సుబ్‌హానల్లాహి, వల్‌ హమ్‌దు లిల్లాహి (అనే పదాలు) భూమ్యాకాశాల మధ్యలో ఉన్న (స్థలమంతా) నిండిపోతాయి.” (ముస్లిం)

హజ్రత్‌ అబూ హురైరా (రది అల్లాహు అన్హు) కథనం; ప్రవక్త ముహమ్మద్‌ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

“ఎవరైనా అల్లాహ్‌ను విశ్వసిస్తూ, అతని వాగ్దానాన్ని ధృవీకరిస్తూ, తన గుర్రానికి (ధర్మ పోరాటానికై ఎల్లప్పుడు) సిద్ధంగా ఉంచినట్లయితే, ఆ గుర్రానికి అతను మేత పెట్టినందుకు, నీరు త్రాగించినందుకు, (ఆ గుర్రం) పేడ వేసినందుకు, మూత్ర విసర్జన చేసినందుకు బదులుగా, ప్రళయ దినాన ఆ వ్యక్తి కొరకు త్రాసులో పుణ్యాలు బరువు చేయ బడుతాయి.” (బుఖారి)

[ఇది జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ (హఫిజ హుల్లాహ్) గారు రాసిన మరణానంతర జీవితం [పుస్తకం] లో నుండి తీసుకోబడింది]


ఇతరములు:

ఇస్లాంలో పారిశుధ్యానికి ఉన్న ప్రాముఖ్యత [వీడియో]

బిస్మిల్లాహ్

ఇస్లాంలో పారిశుధ్యానికి ఉన్న ప్రాముఖ్యతను కొన్ని ఖుర్ఆన్ ఆయతుల మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహీ హదీసుల  ఆధారంగా తెలుపబడింది. వినండి, వినిపించండి.

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.

రెండు భాగాల వీడియో. మొత్తం 28 నిమిషాలు 

ఇతరములు:

 

సేవకుని కంటే ఉత్తమమైన జిక్ర్ [వీడియో]

బిస్మిల్లాహ్

[సురక్షిత యూట్యూబ్ లింక్: https://safeYouTube.net/w/ZYPq]

సేవకుని కంటే ఉత్తమమైన జిక్ర్ – الذكر عند النوم (Telugu – تلغو)
Dhikr better than having a servant
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.

3- నిద్రించునప్పుడు జిక్ర్ : అలీ (రదియల్లాహు అన్హు)  ఉల్లేఖనం ప్రకారం: ఫాతిమా (రదియల్లాహు అన్హా) ఒకసారి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లంతో) పనిమనిషి కావాలని అడిగినప్పుడు “మీ కొరకు పనిమనిషికన్నా మేలైన విషయం తెలుపనా?” అని ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం)  ఇలా చెప్పారు: “మీరిద్దరూ పడకపై చేరుకున్నప్పుడు 34 సార్లు అల్లాహు అక్బర్‌, 33 సార్లు సుబ్‌ హానల్లాహ్‌, 33 సార్లు అల్‌ హందులిల్లాహ్‌ అని పఠించండి. ఈ స్మరణ మీ కోసం సేవకుడి కంటే ఎంతో శ్రేష్టమైన సంపద“. (బుఖారీ 6318. ముస్లిం 2727). [శత సాంప్రదాయాలు (100 Sunan ) అను పుస్తకం నుండి]

ఇతరములు:

జిక్ర్ & దుఆ : https://teluguislam.net/dua-supplications/

అశుద్ధ (అపరిశుభ్రత) విషయాలు [ఆడియో]

బిస్మిల్లాహ్

అశుద్ధ విషయాలు వాటి వివరాలు, వాటిని పరిశుద్ధ పరచు విధానాల గురించి ఖుర్ఆన్ హదీసుల ఆధారంగా తప్పక వినండి, విన్పించండి

ఇక్కడ ఆడియో వినండి / డౌన్లోడ్ చేసుకోండి (28 నిమిషాల ఆడియో)

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.

ఇతరములు:

ఇస్లాం లో దినాలు, తద్దినాలు, చాలీస్మాలు, బర్సీలు జరుపుకోవచ్చా? [ఆడియో]

బిస్మిల్లాహ్

dinalu taddinalu.jpg

ఇక్కడ ఆడియో వినండి / డౌన్లోడ్ చేసుకోండి (7 నిమిషాల ఆడియో)

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.

అల్లాహ్ నామస్మరణ (జిక్ర్) యొక్క ఘనత – హిస్నుల్ ముస్లిం

బిస్మిల్లాహ్

ఇక్కడ ఆడియో వినండి / డౌన్లోడ్ చేసుకోండి (7 నిమిషాల ఆడియో)

వక్త: అబూ హయ్యాన్ హమ్మాద్ ఉమరీ (హఫిజహుల్లాహ్)

[నుండి: హిస్నుల్ ముస్లిం, సంకలనం: షేఖ్‌ సయీద్‌  అల్‌ ఖహ్తాని , అనువాదం: జఫరుల్లాహ్‌ ఖాన్‌ నద్వీ]

అల్లాహ్ నామస్మరణ (జిక్ర్) యొక్క ఘనత
అల్లాహ్ నామస్మరణ (జిక్ర్) యొక్క ఘనత
అల్లాహ్ నామస్మరణ (జిక్ర్) యొక్క ఘనత
అల్లాహ్ నామస్మరణ (జిక్ర్) యొక్క ఘనత

చెడు కలలు వస్తే ఏమి చెయ్యాలి? [ఆడియో]

బిస్మిల్లాహ్

[6:08 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.


చెడు కల వచ్చినప్పుడు ఏం చెయ్యాలి?

  • అప్పడి దాక పడుకున్న దానికి భిన్నంగా అంటే కుడి వైపు ఉంటే ఎడమ వైపు, ఎడమ వైపు ఉంటే కుడి వైపుకు మరలి నిద్రపోవాలి.
  • ఎడమవైపు మూడు సార్లు ఉమ్మాలి.
  • షైతాన్ మరియు చెడు కలల నుండి అల్లాహ్ శరణు కోరుకోవాలి.
  • ఈ చెడు కల గురుంచి ఇతరులకు చెప్పకూడదు.

దుఆలు 

bad-dreams-1 చెడు కలలు

[హిస్నుల్ ముస్లిం, సంకలనం: షేఖ్‌ సయీద్‌  అల్‌ ఖహ్తాని , అనువాదం: జఫరుల్లాహ్‌ ఖాన్‌ నద్వీ]


bad-dreams-2 చెడు కలలు

ప్రళయ దినాన దాసునితో మొట్టమొదట ప్రశ్నించబడే ఆరాధన నమాజు

బిస్మిల్లాహ్

“(ఓ ప్రవక్తా!) నీ వైపునకు పంపబడిన (వహీ చేయబడిన) గ్రంథాన్ని పారాయణం చేస్తూ ఉండు. నమాజును నెలకొల్చు. నిశ్చయంగా నమాజ్‌ సిగ్గమాలినతనం నుంచి, చెడు విషయాల నుంచి ఆపుతుంది. నిశ్చయంగా అల్లాహ్‌ స్మరణ చాలా గొప్ప విషయం (అన్నసంగతిని మరువరాదు). మీరు చేసేదంతా అల్లాహ్‌కు తెలుసు.” (29, సూరతుల్‌ అన్‌కబూత్‌:45)

హజ్రత్ అబ్దుల్లాహ్‌ బిన్‌ జాబిర్‌ (రది అల్లాహు అన్హు) కథనం; ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “ఐదు పూటల నమాజు చేయటం మీలో ఒకరి ఇంటి ముందు నిండుగా ప్రవహిస్తున్న సెలయేటిలో (పతి రోజు ఐదుపూటల స్నానం చేయటం లాంటిది” (ముస్లిం).

ఒక వ్యక్తి జీవితమంతా ముస్లింగా ఉండాలంటే అతను ప్రతి రోజు ఐదు సమయాల నమాజు విధిగా ఆచరించాలి. నమాజును ఆచరించేవారి కొరకు ప్రళయ దినాన అది జ్యోతిగాను ధృవ పత్రముగాను ఉంటుంది. తద్వారా వారు ప్రళయ దినాన నరకం నుండి విముక్తి పొందుతారు. కనుక అల్లాహ్‌ ఇలా తెలియజేసాడు: “వారి తరువాత కొందరు అయోగ్యులు వారి స్థానంలో వచ్చారు. వారు నమాజును త్యజించారు. మనో వాంఛలను అనుసరించారు. కనుక వారు త్వరలోనే (ప్రళయ దినాన) గయ్ (అనే నరకం)లో పడవేయబడుతారు” (19, సూరతుల్‌ మర్యం:59).

నమాజు ఆచరించేవారి కొరకు స్వర్గం ప్రాప్తమవుతుందని అల్లాహ్‌ ఇలా తెలియజేసాడు: “తమ నమాజులను కాపాడుకునేవారు. ఇలాంటి వారు సగౌరవంగా స్వర్గవనాలలో ఉంటారు” (70, మఆరిజ్‌:34-35).

ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేసారు: “ప్రళయ దినాన దాసునితో మొట్టమొదట ప్రశ్నించబడే ఆరాధన నమాజు. ఆ నమాజును సరిగ్గా పాటించినట్లయితే సాఫల్యం పొందుతాడు. అదే గనుక సరిగ్గాలేదంటే అతను నష్టపోతాడు, విఫలుడవుతాడు” (తిర్మిజీ, సహీహ్‌ అల్‌ జామీ :2020).

నరకవాసుల పాపాల గురించి స్వర్గవాసులు ప్రశ్నించే విషయాన్ని అల్లాహ్‌ ఇలా తెలియజేసాడు: మీరు ఎందువల్ల నరకంలో పడ్డారు? (అప్పుడు వారు ఇలా సమాధానమిస్తారు). “మేము నమాజును స్థాపించలేదు. మేము పేదలకు అన్నదానం చేసేవారము కాము. మరియు మేము సత్యాన్ని తిరస్కరించే వారితో కలిసి సత్యాన్ని తిరస్కరిస్తూ ఉండేవారము. ప్రళయ దినాన్ని అబద్దంగా భావించాము, చివరికి మాకు మృత్యువు వచ్చేసింది” (74, సూరతుల్‌ ముద్దసిర్‌:42-47).

నమాజును ఉద్దేశ్యపూర్వకంగా వదిలినవారు ముస్లిములు కానేకారని ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా హెచ్చరించారు: “విశ్వాసిగల దాసునికి కుఫ్ర్ కు (తిరస్కారికి) మధ్య వ్యత్యాసం నమాజును పాటించకపోవడమే”” (ముస్లిం). ప్రవక్త ముహమ్మద్‌ మరొకచోట ఇలా ప్రవచించారు: “మన (విశ్వాసుల) మధ్య మరియు వారి (అవిశ్వాసుల) మధ్య ఉన్న ఒడంబడిక నమాజును పాటించడము. ఎవరైయితే దాన్ని (నమాజును) పాటించరో, వారు అవిశ్వాసానికి గురికాబడ్డారు” (అహ్మద్‌, తిర్మిజీ, ఇబ్నుమాజా). మరొక చోట ఇలా తెలియజేసారు: “ఇస్లామే అసలైన ధర్మం. నమాజు దీని స్తంభం, దీని అత్యుత్తమ విలువైన స్థానం “అల్‌ జిహాద్‌ ఫీ సబీలిల్లాహ్‌”’ (ముస్లిం).

ప్రియమైన సోదరులారా! నమాజును జీవితంలో ఒక భాగంగా భావించి తప్పక నెరవేర్చండి. అప్పుడే ఇహపరాల సాఫల్యం పొందగలరు. ఎవరయితే ఆత్మ పరిశీలన చేసుకుంటారో, మరణానంతర జీవితం కొరకు సదాచరణా చేసుకుంటారో వారే వివేకవంతులు. మరెవరయితే తన మనసును దాని కోరికల అనుసరణకై వదిలేస్తారో, తరువాత అల్లాహ్‌ అనుగ్రహంపట్ల ఆశలు పెంచుకుంటారో వారే అవివేకులు.


ఇది “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు విధానము” అనే పుస్తకం నుండి తీసుకోబడింది. కూర్పు: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ (హఫిజ హుల్లాహ్)