ప్రతి నమాజు తర్వాత చేతులెత్తి దుఆ చేయడం బిద్అత్ (కల్పితాచారం) కిందికి వస్తుందా? [వీడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

ప్రతి నమాజు తర్వాత చేతులెత్తి దుఆ చేయడం బిద్అత్ (కల్పితాచారం) కిందికి వస్తుందా?
https://www.youtube.com/watch?v=uT6QWE7p4EI [9 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, నమాజ్ తర్వాత చేతులెత్తి దుఆ చేయడం బిద్అత్ (మతంలో కొత్త ఆచారం) అవుతుందా అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితం ఆధారంగా చేతులెత్తి దుఆ చేయడాన్ని మూడు రకాలుగా విభజించారు. మొదటిది, ప్రవక్త గారు స్పష్టంగా చేతులెత్తిన సందర్భాలు (వర్షం కోసం దుఆ, అరఫా మైదానంలో దుఆ), ఇక్కడ మనం కూడా చేతులెత్తాలి. రెండవది, ప్రవక్త గారు దుఆ చేసినా చేతులెత్తని సందర్భాలు (సజ్దాలో, తషహ్హుద్ లో), ఇక్కడ మనం కూడా చేతులెత్తకూడదు. మూడవది, స్పష్టమైన ఆదేశం లేని సాధారణ సందర్భాలు. ఫర్జ్ నమాజ్ తర్వాత దుఆ అంగీకరించబడుతుందని హదీసులో ఉన్నప్పటికీ, ప్రవక్త గారు ప్రతి నమాజ్ తర్వాత క్రమం తప్పకుండా చేతులెత్తినట్లు రుజువు లేదు. కాబట్టి, దీనిని ఒక తప్పనిసరి అలవాటుగా మార్చుకోవడం ప్రవక్త విధానానికి విరుద్ధం మరియు బిద్అత్ అయ్యే ప్రమాదం ఉందని పండితులు వివరించారు. అప్పుడప్పుడు వ్యక్తిగతంగా దుఆ చేసుకుంటే తప్పు లేదు, కానీ దీనిని ఒక స్థిరమైన ఆచారంగా చేసుకోకూడదు.

ఇక్కడ వచ్చిన ప్రశ్న ఏంటి? నమాజుల తర్వాత దుఆ చేయడం బిద్అత్ అని అంటున్నారు. అయితే వాస్తవానికి, ప్రశ్న చాలా సంక్షిప్తంగా ఉంది. దీన్ని కొంచెం విడమరిచి అర్థం చేసుకునే అవసరం ఉంది. అప్పుడు ఇందులో బిద్అత్ ఏమిటి? సున్నత్ ఏమిటి? చేయవలసింది ఏమిటి? చేయకూడనిది ఏమిటి? మనకు అర్థమవుతుంది. ముందు అసలు ప్రశ్నలోనికే వెళ్దాం మనం.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీథ్ ద్వారా మనకు తెలుస్తుంది, ఫర్జ్ నమాజ్ ప్రత్యేకంగా, ఫర్జ్ నమాజుల గురించి. వాటి చివరి భాగం, అది సలాం కంటే ముందు కావచ్చు, సలాం తర్వాత కావచ్చు. మరికొన్ని ఉల్లేఖనాల్లో సలాం తర్వాత అన్నటువంటి ప్రస్తావన కూడా ఉంది. ఆ సమయంలో చేసే దుఆ అంగీకరించబడుతుంది. ఆ సమయంలో చేసే దుఆ అంగీకరించబడుతుంది. అలాంటప్పుడు, ఈ హదీథ్ విన్నవారు ఏమనుకుంటారు? మనం దుఆ చేయడంలో తప్పేంటి? కానీ ఇక్కడ మరో ప్రశ్నలో ఉన్నటువంటి విషయం, చేతులెత్తి దుఆ చేయడం అని ఇక్కడ ప్రస్తావన ఉంది.

దుఆలో చేతులు ఎత్తడంపై హదీసులు

అయితే, అబూ దావూద్ లోని ఒక హదీథ్,

إِنَّ اللَّهَ حَيِيٌّ كَرِيمٌ
(ఇన్నల్లాహ హయ్యియున్ కరీమున్)
అల్లాహు త’ఆలా చాలా సిగ్గుపడువాడు, ఎంతో ఉదారుడు.

అయితే ఎప్పుడైతే దాసుడు రెండు చేతులెత్తి అల్లాహ్ తో ఏదైనా దుఆ చేస్తాడో, అతని చేతులను, అతనికి ఏమీ ప్రసాదించకుండా తిరిగి ఉత్తగా, ఖాళీగా, ఏమీ ఇవ్వకుండా తిరిగి పంపేయడం అల్లాహ్ కు స్వయంగా ఇది ఇష్టం కాదు.

దీని ద్వారా ఏమర్థమవుతుంది? అంటే, మనం దుఆ చేసేటప్పుడు చేతులెత్తాలి. మొదటి హదీస్ ద్వారా, ఫర్జ్ నమాజ్ తర్వాత దుఆ స్వీకరించబడుతుంది అని, ఈ హదీస్ ద్వారా చేతులెత్తి చేస్తే మరీ స్వీకరించబడుతుంది అని, అల్లాహ్ తప్పకుండా ప్రసాదిస్తాడు అని. అలాంటప్పుడు మనం నమాజుల తర్వాత దుఆ చేసి, చేయడానికి చేతులు ఎత్తడం తప్పు లేదు అని ఈ హదీసుల ద్వారా తెలుస్తుంది, కదా?

షేఖ్ బిన్ బాజ్ (రహిమహుల్లాహ్) వారి ఫత్వా: మూడు స్థితులు

అయితే, షేఖ్ బిన్ బాజ్ రహిమహుల్లాహ్ యొక్క ఫత్వా దీని గురించి ప్రత్యేకంగా చదవడం జరిగింది. ఆయన చాలా మంచి సమాధానం ఇచ్చారు. ఏం చెప్పారు?

దుఆలో మనం ఎప్పుడు చేతులెత్తాలి, ఎప్పుడు చేతులెత్తకూడదు. దుఆ చేస్తూ మనం ఎప్పుడు చేతులెత్తాలి, ఎప్పుడు చేతులెత్తకూడదు. దీని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారినే మనం అనుసరించాలి. అయితే, ఇక్కడ మనకు మూడు స్థితులు అనండి లేదా మూడు లెవెల్లు కనబడుతున్నాయి.

ఒకటి, కొన్ని సందర్భాలలో స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దుఆ చేస్తూ చేతులెత్తినట్లు రుజువు ఉంది. అక్కడ మనం తప్పకుండా చేతులెత్తాలి. ఉదాహరణకు, జుమా ఖుత్బా ఇస్తూ ఉండగా వర్షం కొరకు దుఆ చేసినప్పుడు చేతులెత్తి దుఆ చేశారు.

اللَّهُمَّ أَسْقِنَا
(అల్లాహుమ్మ అస్ఖినా)
ఓ అల్లాహ్, మాకు వర్షం కురిపించు.

సలాతుల్ ఇస్తిస్కా (వర్షం కొరకు నమాజ్) చేసినప్పుడు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేతులెత్తి దుఆ చేశారు అని రుజువు ఉన్నది. హజ్ చేస్తున్నప్పుడు మైదానే అరఫాత్ లో ఉన్నారు, చాలా దీర్ఘ సమయం వరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేతులెత్తి దుఆ చేశారు. చివరికి ఒంటె మీద కూర్చుండి చేతులెత్తి దుఆ చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ఆ ఒంటెను నడపడానికి ఒక కట్టె ఉంటుంది కదా, అది కింద పడిపోయినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక చెయ్యి అలాగే ఎత్తి ఉన్నారు, మరో చెయ్యితో ఆ కింద పడిపోయిన వస్తువును తీసుకున్నారు. అంటే ఈ విధంగా ఎక్కడైతే ప్రవక్త చేతులెత్తారు అని మనకు రుజువు ఉందో, అక్కడ మనం చేతులెత్తాలి.

కానీ, ఎక్కడ ప్రవక్త చేతులెత్తలేదు, దుఆ చేశారు కానీ చేతులెత్తలేదు, అక్కడ మనం అలాగే దుఆ చేయాలి కానీ చేతులెత్తకూడదు. ఉదాహరణకు, సజ్దాలో దుఆ చేయండి అని చెప్పడం జరిగింది, దుఆ అంగీకరించబడుతుంది అని కూడా చెప్పడం జరిగింది. అలాగే, తషహ్హుద్ లో ఉన్నప్పుడు కూడా మీరు దుఆ చేయండి అని చెప్పడం జరిగింది. కానీ ఈ సందర్భాలలో చేతులెత్తే ప్రస్తావన లేదు. అలాగే జుమా ఖుత్బా సందర్భంలో, సందర్భంలో, వేరే కొన్ని దుఆలు చేశారు కానీ చేతులెత్తినట్లు ఏ రుజువు లేదు, సుబూత్ లేదు. అందుకొరకు ఆ సందర్భాల్లో మనం చెయ్యి ఎత్తకూడదు. రెండు స్థితులు అర్థమైనాయి కదా?

ఇక మూడవది, ఏ సందర్భాల గురించి అయితే ఎత్తినట్లు, ఎత్తలేనట్లు ఏ ప్రస్తావన లేదో, అలాంటి చోట మనం ఏదైనా అడపాదడపా ఎత్తితే నష్టం లేదు కానీ, దానిని ఒక అలవాటుగా చేసుకోవడం, దానిని ఒక అలవాటుగా చేసుకోవడం ఇది ప్రవక్త విధానానికి వ్యతిరేకం అవుతుంది.

ముగింపు మరియు తీర్మానం

ఫర్జ్ నమాజ్ తర్వాత దుఆ, దీని ఘనత వచ్చి ఉంది. కానీ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నమాజ్ యొక్క వివరణ ఎంతో మంది సహాబాలు ఉల్లేఖించారు. కానీ చేతులెత్తి దుఆ చేసినట్లు ఎక్కడైనా ఉల్లేఖనం ఉందా? లేదు. అందు గురించి, షేఖ్ అబ్దుల్లా అల్ జిబ్రీన్ రహిమహుల్లాహ్ చెప్పిన విషయం ఏంటంటే, ఎవరైనా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పినటువంటి దుఆలు ఫర్జ్ నమాజ్ తర్వాత చేసి, ఆ తర్వాత చేతులెత్తి ఒకవేళ దుఆ చేసుకుంటే అభ్యంతరం లేదు.

అయితే మరి, షేఖ్ బిన్ బాజ్, షేఖ్ ఇబ్ను ఉథైమీన్ ఇంకా ఇతర పండితుల గురించి మనకు తెలుస్తుంది, వారు ఫత్వా ఏమిచ్చారు? ఫర్జ్ నమాజ్ తర్వాత చెయ్యి ఎత్తి దుఆ చేయడం బిద్అత్ అని. మరి ఎందుకు వీరు ఇలా చెప్పారు? ఎందుకు వీరు ఇలా చెప్పారంటే, మన వద్ద కొంతమంది ఇంకా వేరే ఏరియాలో కూడా, సలాం తింపిన తర్వాత ప్రవక్తతో ఏ ఏ దుఆలు అయితే రుజువై ఉన్నాయో, అవి ఆ విధంగా చదవకుండానే చేతులెత్తి దుఆ చేసే ఒక అలవాటుగా చేసుకుని ప్రతీ నమాజ్ తర్వాత చేయడం మొదలుపెట్టారు. ఇలాంటి ప్రస్తావన వచ్చినప్పుడు, అవును మరి, ఇది ప్రవక్త యొక్క సున్నత్ కాదు మరియు ప్రతీ సారి చేస్తున్నారు, అందుకొరకే ఇది బిద్అత్ లో వచ్చే ప్రమాదం ఉంటుంది, అందుకొరకే బిద్అత్ అని ఫత్వా ఇచ్చారు.

అందుకొరకు, దీన్ని మనం ఇక్కడ ఈ విధంగా అర్థం చేసుకోవాలి. షేఖ్ అబ్దుల్లా అల్ జిబ్రీన్ రహిమహుల్లాహ్ వారి యొక్క ఫత్వాను ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఇక ఎక్కడైతే ప్రస్తావన లేదో, చెయ్యి ఎత్తినట్లు, ఎత్తనట్లు, అక్కడ ఎప్పుడైనా ఒక్కసారి మనం ఎత్తి దుఆ చేస్తే అందులో పాపం లేదు కానీ, అదే ఒక అలవాటుగా చేయకూడదు.

هذا ما نعلم، والله أعلم بالصواب
(హాదా మా న’అలం, వల్లాహు అ’అలం బిస్సవాబ్)
ఇది మాకు తెలిసినది, మరియు సరైనది అల్లాహ్ కే బాగా తెలుసు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=12966

సురయే యాసీన్ ఘనత గురుంచి ఎంతో గొప్పగా చెబుతారు, ఇది నిజమేనా? మృతులపై యాసీన్ సూరా చదవవచ్చా? [వీడియో]

బిస్మిల్లాహ్

[1:12 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

హజ్రత్ హుసైన్ (రజియల్లాహు అన్హు) హంతకులెవరు? [వీడియో]

బిస్మిల్లాహ్

[50:41 నిముషాలు]
ఫజీలతుష్షేఖ్ సఈద్ అహ్మద్ మదనీ (హఫిజహుల్లాహ్)

ముహర్రం & ఆషూరా (ముహర్రం 10 వ తేదీ) మెయిన్ పేజీ
https://teluguislam.net/2020/08/20/muharram/

ముహర్రం నెలలో ఏమి చేయాలి? ఏమి చేయకూడదు? ఈ నెలతో హుస్సైన్ (రజియల్లాహు అన్హు) కు సంబంధం ఏమిటి? [వీడియో]

బిస్మిల్లాహ్

[60 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ముహర్రం & ఆషూరా (ముహర్రం 10 వ తేదీ) మెయిన్ పేజీ
https://teluguislam.net/2020/08/20/muharram/

బిదాఅత్ (కల్పిత ఆచారాల, దురాచారాల) వల్ల పరలోకంలో తీర్పుదినం రోజు జరిగే నష్టాలు [వీడియో]

బిస్మిల్లాహ్

[6:53 నిమిషాలు ]
పరలోకంలో ఏలాంటి నష్టాలు వాటిల్లుతాయో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

బిద్అత్ (కల్పితాచారం) – Bidah
https://teluguislam.net/others/bidah/

బిద్అత్ (కల్పితాచారం) – Bidah


ముహర్రం పండుగ ఎలా జరుపుకోవాలి? [వీడియో]

బిస్మిల్లాహ్

[2:32 నిముషాలు]
మనం ముహర్రం పండుగ జరుపుకోవచ్చా?
జరుపుకో కూడదు అంటే ఏంటి సాక్ష్యం (దలీల్)?
జరుపుకొనేది ఉండి వుంటే ఎలా జరుపుకోవాలి?

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ముహర్రం & ఆషూరా (ముహర్రం 10 వ తేదీ)

ఆయతే కరీమా అంటే ఏమిటి? దీనిపై జరిగే బిద్అత్ లు మరియు వాస్తవాలు [వీడియో]

బిస్మిల్లాహ్
ఆయతే కరీమా (Ayat-e-kareema) అంటే ఏమిటి? దీనిపై జరిగే బిద్అత్ లు మరియు వాస్తవాలు || ఈ ఆయత్ ఎలా చదవాలి? ఎందుకు చదవాలి?

[6:30 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

దీని గురుంచి మరొక వీడియో :

సూరా అల్ అంబియా లోని అయతులు 87,88

وَذَا النُّونِ إِذ ذَّهَبَ مُغَاضِبًا فَظَنَّ أَن لَّن نَّقْدِرَ عَلَيْهِ فَنَادَىٰ فِي الظُّلُمَاتِ أَن لَّا إِلَٰهَ إِلَّا أَنتَ سُبْحَانَكَ إِنِّي كُنتُ مِنَ الظَّالِمِينَ – 21:87

చేపవాడు (యూనుస్‌ అలైహిస్సలాం) కోపగించుకుని వెళ్ళిపోయినప్పటి స్థితి(ని కూడా జ్ఞప్తికి తెచ్చుకోండి.) మేము తనను పట్టుకోలేమని అతడు భావించాడు. ఆఖరికి అతను చీకట్లలో నుంచి, “అల్లాహ్‌! నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. నీవు పవిత్రుడవు. నిజానికి నేనే దోషులలో చేరిన వాణ్ణి” అని మొరపెట్టుకున్నాడు.

فَاسْتَجَبْنَا لَهُ وَنَجَّيْنَاهُ مِنَ الْغَمِّ ۚ وَكَذَٰلِكَ نُنجِي الْمُؤْمِنِينَ – 21:88

అందువల్ల మేము అతని మొరను ఆలకించాము. దుఃఖం నుంచి అతనికి విముక్తిని కల్పించాము. విశ్వాసులను మేము ఇలాగే కాపాడుతాము.

క్విజ్: 76: ప్రశ్న 02: సమాధుల పూజ [ఆడియో]

బిస్మిల్లాహ్

[7:36 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

రెండవ ప్రశ్న సిలబస్ : సమాధుల పూజ

ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు (Muharramat) పుస్తకం నుండి:

సమాధులను పూజించడం, మరణించి సమాధుల్లో ఉన్న వలీలు (పుణ్యపురుషులు) అవసరాలను తీరుస్తారని, కష్టాలను తొలిగిస్తారని నమ్మడం మరియు అల్లాహ్ ఆధీనంలోనే ఉన్నదాని సహాయం వారితో కోరడం, వారితో మొరపెట్టుకోవడం లాంటివి పెద్ద షిర్క్ లో లెక్కించ బడతాయి.

అల్లాహ్ ఆదేశం చదవండి:

وَقَضَى رَبُّكَ أَلَّا تَعْبُدُوا إِلَّا إِيَّاهُ
మీ ప్రభువు తనను తప్ప ఇతరులను మీరు ఆరాధింపకూడదని ఆదేశించాడు
[. (బనీఇస్రాఈల్ 17: 23).

అదే విధంగా చనిపోయిన ప్రవక్తలతో, పుణ్యాత్ములతో ఇంకెవరితోనైనా వారి సిఫారసు పొందుటకు, తమ కష్టాలు దూరమగుటకు వారితో దుఆ చేయడం కూడా షిర్క్. చదవండి అల్లాహ్ యొక్క ఈ ఆదేశం:

أَمَّنْ يُجِيبُ المُضْطَرَّ إِذَا دَعَاهُ وَيَكْشِفُ السُّوءَ وَيَجْعَلُكُمْ خُلَفَاءَ الأَرْضِ أَإلَهٌ مَعَ اللهِ
బాధితుడు మొరపెట్టుకున్నప్పుడు అతని మొరలను ఆలకించి అతని బాధను తొలగించేవాడు ఎవడు? భూమిపై మిమ్మల్ని ప్రతినిధులుగా
చేసినవాడు ఎవడు? అల్లాహ్ తో పాటు (ఈ పనులు చేసే) మరొక దేవుడు కూడ ఎవడైనా ఉన్నాడా?
(నమ్ల్ 27: 62).

కొందరు కూర్చున్నా, నిలబడినా, జారిపడినా తమ పీర్, ముర్షిదుల నామములను స్మరించుటయే తమ అలవాటుగా చేసుకుంటారు. ఎప్పుడు ఏదైనా క్లిష్టస్థితిలో, కష్టంలో, ఆపదలో చిక్కుకున్నప్పుడు ఒకడు యా ముహమ్మద్ అని, మరొకడు యా అలీ అని, ఇంకొకడు యా హుసైన్ అని, మరి కొందరు యా బదవీ, యా జీలానీ, యా షాజులీ, యా రిఫాఈ, యా ఈద్ రూస్, యా సయ్యద జైనబ్, యా ఇబ్ను ఉల్వాన్ అని, యా గౌస్ అల్ మదద్ అని, యా ముఈనుద్దీన్ చిష్తీ అని, యా గరీబ్ నవాజ్ అని, నానా రకాలుగా పలుకుతారు. కాని అల్లాహ్ ఆదేశం ఏమిటని గమనించరు:

إِنَّ الَّذِينَ تَدْعُونَ مِنْ دُونِ اللهِ عِبَادٌ أَمْثَالُكُمْ فَادْعُوهُمْ فَلْيَسْتَجِيبُوا لَكُمْ إِنْ كُنْتُمْ صَادِقِينَ
అల్లాహ్ ను వదలి మీరు వేడుకుంటున్న వారు మీ మాదిరిగానే కేవలం దాసులు. మీరు వారిని ప్రార్థించి చూడండి. మీకు వారి పట్ల ఉన్న భావాలు నిజమే అయితే మీ ప్రార్థనలకు వారు సమాధానం ఇవ్వాలి (అఅ’రాఫ్ 7: 194).

కొందరు సమాధి పూజారులు సమాధుల ప్రదక్షిణం చేస్తారు. వాటి మూలమూలలను చుంబిస్తారు. చేతులు వాటికి తాకించి తమ శరీరంపై పూసుకుంటారు. వాటి గడపను చుంబిస్తారు. దాని మట్టిని తీసుకొని తమ ముఖాలకు రుద్దుకుంటారు. వాటిని చూసినప్పుడు సాష్టాంగ పడతారు (సజ్దా చేస్తారు). తమ అవసరాలను కోరతూ రోగాల నుండి స్వస్థత పొందుటకు, సంతానం కావాలని, అవసరం తీరాలని వాటి ఎదుట భయభీతితో, వినయవినమ్రతలతో నిలబడతారు. ఒక్కోసారి సమాధిలో ఉన్నవారిని ఉద్దేశించి ఇలా పిలుస్తారు కూడా: యా సయ్యిదీ! ఓ మేరే బాబా! నేను చాలా దూరం నుండి మీ సమక్షంలో హాజరయ్యాను, నాకు ఏమీ ప్రసాదించక వెనక్కు త్రిప్పి పంపుతూ అవమాన పరచకు.

కాని అల్లాహ్ ఆదేశం ఏముందో గమనించారా?

وَمَنْ أَضَلُّ مِمَّنْ يَدْعُو مِنْ دُونِ اللهِ مَنْ لَا يَسْتَجِيبُ لَهُ إِلَى يَوْمِ القِيَامَةِ وَهُمْ عَنْ دُعَائِهِمْ غَافِلُونَ
అల్లాహ్ ను వదలి ప్రళయం వరకు తమ ప్రార్థనలను విని సమాధాన మివ్వలేనటువంటి వారిని ప్రార్థించే వారికంటే, ఎక్కువ మార్గభ్రష్టులెవరు? మరియు వారు వీరి (ప్రార్థించేవారి) ప్రార్థనలను ఎరుగకుండా ఉన్నారు
(అహ్ఖాఫ్ 46: 5).

ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు:

مَنْ مَاتَ وَهْوَ يَدْعُو مِنْ دُونِ الله نِدًّا دَخَلَ النَّارَ
“ఎవరు అల్లాహ్ ను కాదని ఇతరులను ప్రార్థిస్తూ/దుఆ చేస్తూ చనిపోతాడో అతను నరకంలో ప్రవేశిస్తాడు”.
(బుఖారి 4497).

కొందరు సమాధుల వద్ద తమ తల గొరిగించుకుంటారు. ‘సమాధుల హజ్ చేసే విధానం’ అన్న పేరుగల పుస్తకాలు కొందరి వద్ద లభిస్తాయి. విశ్వవ్యవస్థ నిర్వహణ శక్తి మరియు లాభనష్టాలు చేకూర్చే శక్తి వలీలకు ఉన్నదని కొందరు నమ్ముతారు. కాని అల్లాహ్ యొక్క ఈ ఆదేశం పట్ల వారు ఎలా అంధులైపోయారో గమనించండి:

وَإِنْ يَمْسَسْكَ اللهُ بِضُرٍّ فَلَا كَاشِفَ لَهُ إِلَّا هُوَ وَإِنْ يُرِدْكَ بِخَيْرٍ فَلَا رَادَّ لِفَضْلِهِ
ఒకవేళ అల్లాహ్ నిన్ను ఏదైనా ఆపదకు గురి చేస్తే స్వయంగా ఆయన తప్ప ఆ ఆపదను తొలగించేవారు ఎవరూ లేరు. ఇంకా ఆయన గనక నీ విషయంలో మేలు చేయాలని సంకల్పిస్తే ఆయన అనుగ్రాహన్ని మల్లించే వాడు కూడా ఎవడూ లేడు (యూనుస్ 10: 107).

ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (7:33 నిముషాలు)

ఆడియో విన్న తర్వాత క్రింది ప్రశ్న ట్రై చెయ్యండి

(2) సమాధుల చుట్టూ ప్రదక్షిణలు చెయ్యడం , అక్కడ బలి ఇవ్వడం ఎలాంటి కార్యం?

A) ధర్మ సమ్మతం
B) చిన్న పాపం
C) ఘోర పాపం (షిర్క్)

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz

ఇంకా క్రింది పోస్టులు చదవండి:

సలాతుత్ తస్బీహ్ గురించి ప్రశ్నించిన సోదరునికి జవాబు [ఆడియో]

బిస్మిల్లాహ్

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (4:33నిముషాలు)

మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కండి: https://teluguislam.net/whatsapp/

ఇతరములు: [నమాజు]

13,14 & 15 వ షాబాన్ రోజు ఉపవాసం గురుంచి ప్రశ్న [ఆడియో]

బిస్మిల్లాహ్

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (7నిముషాలు)

షాబాన్ నెలలో సున్నతులు & బిద్ఆత్’లు