
https://youtu.be/JkmEHDE7xDU
[2:38 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ఆడియోలో ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) లేదా ఇతరుల మాధ్యమంతో (వసీలా) అల్లాహ్‌ను ప్రార్థించడం సరైనదేనా అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వబడింది. ఖురాన్ మరియు హదీసుల ప్రకారం దుఆ (ప్రార్థన) చేయడానికి సరైన పద్ధతిని ఇది వివరిస్తుంది. సరైన పద్ధతి ప్రకారం, మొదట అల్లాహ్‌ను స్తుతించి, ఆ తర్వాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై దరూద్ (సలావత్) పంపి, ఆపై మన అవసరాలను అల్లాహ్‌తో విన్నవించుకోవాలి.
“ప్రవక్త యొక్క పుణ్యం కారణంగా” లేదా “ఫాతిమా, హసన్, హుసైన్‌ల పుణ్యం కారణంగా” మా ప్రార్థనను స్వీకరించు అని వేడుకోవడం ప్రవక్త (స) నేర్పని, సహాబాలు ఆచరించని మరియు సలఫ్-ఎ-సాలిహీన్ పద్ధతి కాని ఒక బిదాత్ (నూతన కల్పన) అని స్పష్టం చేయబడింది. కావున, ముస్లింలు ఇలాంటి పద్ధతులకు దూరంగా ఉండాలని బోధించబడింది.
ఇక్కడ వలీ భాయ్ ఒక ప్రశ్న అడిగారు, అస్సలాము అలైకుమ్. వ అలైకుమ్ అస్సలామ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. “ప్యారే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం కే తుఫైల్ సే (ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆశీర్వాదం వల్ల)” మా యొక్క ప్రార్థనలు మరియు దువాలను అల్లాహ్ స్వీకరించు గాక అని అనటం పరిపాటి అయిపోయింది. కావున ఈ విధంగా వేడుకోవటం సమంజసమేనా?
చూడండి, అల్లాహు తాలా దుఆ చేసే యొక్క విధానాన్ని, పద్ధతిని మనకు తెలియజేశాడు. మనం ఖురాన్ ఆరంభంలోనే సూరహ్ ఫాతిహా చూస్తున్నాము కదా?
اَلْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعٰلَمِيْنَۙ، الرَّحْمٰنِ الرَّحِيْمِۙ، مٰلِكِ يَوْمِ الدِّيْنِۗ، اِيَّاكَ نَعْبُدُ وَاِيَّاكَ نَسْتَعِيْنُۗ
(అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అర్-రహ్మానిర్-రహీం, మాలికి యౌమిద్దీన్, ఇయ్యాక న’బుదు వ ఇయ్యాక నస్త’ఈన్)
(సర్వస్తోత్రములు అల్లాహ్, సకల లోకాల ప్రభువుకే శోభాయమానం. ఆయన అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు. తీర్పుదినానికి యజమాని. మేము నిన్నే ఆరాధిస్తున్నాము మరియు నీ సహాయాన్నే అర్థిస్తున్నాము.)
ఆ తర్వాత, మనకు కావలసింది ఏమిటో, మనకు మన జీవితంలో చాలా అత్యవసరమైనది ఏమిటో అది అడగండి అని అల్లాహ్ స్వయంగా మనకు నేర్పాడు. అయితే అల్లాహు తాలా దుఆ అడిగే యొక్క పద్ధతిని మనకు తెలియజేశాడు. అల్లాహ్ తో మనం ఏదైనా అడగాలంటే, ఏదైనా అర్ధించాలి అంటే, దుఆ చేయాలి అంటే ముందు అల్లాహ్ యొక్క స్తోత్రములు, అల్లాహ్ యొక్క పొగడ్తలు మనం పొగడాలి. అల్లాహ్ యొక్క స్తుతిని స్తుతించాలి.
ఇక ఆ తర్వాత హదీసుల ద్వారా మనకు తెలుస్తున్న విషయం ఏంటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ చదవాలి. ఈ విషయం గమనించండి. ఈ రోజుల్లో ధర్మ జ్ఞానం ఖురాన్ హదీసుల నుండి మనం నేర్చుకోవడం లేదు. మనం అంటే అధిక మంది. అల్హందులిల్లాహ్ కొంతమంది ఉన్నారు, మీలాంటి చాలా శుభము గలవారు కూడా ఉన్నారు. అల్హందులిల్లాహ్ చాలా మంది ఖురాన్ హదీస్ ద్వారా సరైన జ్ఞానం నేర్చుకోవడం లేదు. అందుకొరకు, మనకు మన అవసరాలు ఏవైతే ఉన్నాయో, వాటి యొక్క పరిష్కారాలు అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖురాన్ మరియు హదీసుల్లో తెలిపారు. అయితే మనం నేర్చుకోవట్లేదు.
ఇక్కడ ప్రశ్నలో వచ్చిన విషయానికి మనం దూరమవుతున్నామని అనుకుంటున్నారు, కానీ లేదు. మనం దుఆ అంగీకరించబడాలి, మనం చేసే దుఆ అల్లాహు తాలా స్వీకరించాలి అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహీ హదీస్ ద్వారా మనకు తెలుస్తుంది, అల్లాహ్ యొక్క స్తుతి, ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై దరూద్ చదివి, మనం కావలసింది మనం కోరాలి. అప్పుడు అల్లాహు తాలా తప్పకుండా దుఆ స్వీకరిస్తాడు.
ఇక, “నబీ కే సదఖే కే తుఫైల్ మే (ప్రవక్త యొక్క పుణ్యం మరియు గౌరవం కారణంగా)”, “ఫాతిమా కే సదఖే కే తుఫైల్ మే (ఫాతిమా యొక్క పుణ్యం మరియు గౌరవం కారణంగా)”, “హసన్ హుసైన్ కే సదఖే కే తుఫైల్ మే (హసన్ మరియు హుసైన్ యొక్క పుణ్యం మరియు గౌరవం కారణంగా)”, “హమారీ దుఆ కుబూల్ ఫర్మా (మా ప్రార్థనను స్వీకరించు)” – ఈ విధంగా చెప్పడం, పలకడం స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పలేదు, సహాబాలు ఆచరించలేదు మరియు ఈ పద్ధతి అనేది మన సలఫ్-ఎ-సాలిహీన్ వారిది కాదు. ఇది ఈ పద్ధతి బిదాతి పద్ధతి (ధర్మంలో నూతన కల్పన). దీని నుండి మనం దూరం ఉండాలి.
వసీలా , తవస్సుల్
- అల్లాహ్ సామీప్యం కోసం సృష్టితాలను ‘సాధనంగా’ చేసుకోవటం – డా. సాలెహ్ అల్ ఫౌజాన్ [PDF]
- వసీలా వాస్తవికత – ఖుత్ బాతే నబవీ ﷺ (మర్కజ్ దారుల్ బిర్ర్) [PDF] [4p]
- వసీలా ధర్మ పరిధిలో – జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ [PDF] [6p]
- అధర్మమైన వసీలా – హబీబుర్ రహ్మాన్ జామి’ఈ [YT వీడియో] [13 నిముషాలు]
- దుఆలో ధర్మసమ్మతమైన వసీలా ఏది? – నసీరుద్దీన్ జామి’ఈ [వీడియో] [24 నిముషాలు]
- ధర్మసమ్మతమైన వసీలా ఆధారాలు – నసీరుద్దీన్ జామి’ఈ [వీడియో] [26 నిముషాలు]
- నిషిద్ధమైన మరియు అధర్మ మాధ్యస్థం (వసీలా)తో, అల్లాహ్ కు దుఆ చేయకు [YTవీడియో] [3 నిముషాలు]
తౌహీద్ & షిర్క్ (మెయిన్ పేజీ):
https://teluguislam.net/tawheed-shirk/
You must be logged in to post a comment.