
రెండవ ప్రశ్నకు సిలబస్: క్రింద ఇచ్చిన హదీస్ ఖుద్సీ చదవండి
అబూ హురైరా (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, అల్లాహ్ ఇలా తెలిపాడని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు:
“నా ‘వలీ’ ప్రియతమునితో శత్రుత్వం వహించేవాడు నాతో యుద్దానికి సిద్ధమవ్వాలని ప్రకటిస్తున్నాను. నా దాసుడు నా సాన్నిధ్యం కోరి ఆచరించే వాటిలోకెల్లా నేను అతనిపై విధిగా నిర్ణయించినవి నాకు ప్రియమైనవి. నా దాసుడు నఫిల్ (అదనపు) సత్కార్యాల ద్వారా నాకు ఇంకా ఎంతో చేరువవుతాడు. కడకు అతడు నా ప్రేమకు పాత్రుడవుతాడు. అతడు నాకు ప్రీతి పాత్రుడు అయినప్పుడు నేను, అతడు వినే చెవినవుతాను, అతడు చూసే కన్నునవుతాను, అతడు పట్టుకునే చెయ్యినవుతాను, అతడు నడిచే కాలునవుతాను. ఇక అతడు నన్ను అడిగితే నేను తప్పక ప్రసాదిస్తాను, శరణు కోరితే నేను శరణు ఇస్తాను. నేను చేసే ఏ పనిలోనూ తటపటాయించను, విశ్వాసుని ప్రాణం తీయునప్పుడు తప్ప. అతను మరణం అంటే ఇష్టపడడు, అతనికి హాని కలగించడం అంటే నేను ఇష్టపడను. (కాని అది జరగక తప్పదు)”. (బుఖారీ 6502).
ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి
(2) ఫర్జ్ (విధి) చేయబడిన ఆరాధన తర్వాత ఏ ఆరాధన వల్ల దాసులు అల్లాహ్ కు ఇంకా దగ్గరవుతారు?
A] ఫర్జ్
B] హజ్
C] నఫిల్
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz
You must be logged in to post a comment.