308. హజ్రత్ అయిషా (రధి అల్లాహు అన్హ), హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రధి అల్లాహు అన్హు) ల కధనం:-
ధైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు మరణసమయం ఆసన్నమయినపుడు ఆయన పరిస్థితి చాలా దుర్భరంగా మారిపోయింది. ఒక్కోసారి ఆయన తన దుప్పటిని ముఖం మీదికి లాగుకునేవారు. కాస్సేపటికి ఊపిరి ఆడకపోవడంతో ముఖం మీది దుప్పటిని తొలగించి వేసేవారు. అలాంటి స్థితిలో సయితం ఆయన (సమాధి పూజలను శపిస్తూ) “యూదులు, క్రైస్తవులు తమ ప్రవక్తల సమాధుల్ని ప్రార్ధనా స్థలాలుగా చేసుకున్నారు. దేవుడు వారిని శపించుగాక!” అని అన్నారు. ఈ విధంగా ప్రవచించి ఆయన ముస్లింలను ఇలాంటి చర్యలకు పాల్పడకూడదని పరోక్షంగా హెచ్చరించారు.
[సహీహ్ బుఖారీ : 8 వ ప్రకరణం – సలాత్, 55 వ అధ్యాయం – హద్దసనా అబూయమాన్]
Read English Version of this Hadeeth
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…
Related