
[6:19 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
తెలుగులో ఇస్లామిక్ క్విజ్ 77వ భాగం 2వ ప్రశ్న సిలబస్:
ఇస్లామీయ నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు (Muharramat) పుస్తకం నుండి:
మొక్కుబడులు:
అల్లాహ్ ను కాకుండా ఇతరుల పేరున మొక్కుకొనుట షిర్క్ అవుతుంది.
البخاري 6696:- عَنْ عَائِشَةَ رَضِيَ اللَّهُ عَنْهَا، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ : ” مَنْ نَذَرَ أَنْ يُطِيعَ اللَّهَ فَلْيُطِعْهُ، وَمَنْ نَذَرَ أَنْ يَعْصِيَهُ فَلَا يَعْصِهِ “.
ఎవరు అల్లాహ్ యొక్క విధేయత లో ఏదైనా మొక్కుబడి చేసుకుంటారో వారు దానిని పూర్తి చేయాలి మరి ఎవరైతే అల్లాహ్ అవిధేయత లో మొక్కుబడి చేస్తారో వారు దానిని పూర్తి చేయకూడదు
ఈ రోజుల్లో ప్రజలు సమాధిలో ఉన్నవారి పేరున దీపాలు, కొవ్వత్తులు, కోళ్ళు, ఆస్తులు మొదలగునవి ఇస్తానని మొక్కుకుంటారు. అయితే ఇది ఘోరమైన షిర్క్ అన్న విషయం మరచిపోతారు.
జిబహ్ చేయుట:
అల్లాహ్ తప్ప ఇతరుల కొరకు జిబహ్ చేయుట (జంతువును బలి ఇచ్చుట) షిర్క్. అల్లాహ్ ఆదేశం చదవండి:
فَصَلِّ لِرَبِّكَ وَانْحَرْ
నీ ప్రభువు కొరకే నమజు చేయు మరియు ఖుర్బానీ ఇవ్వు (కౌసర్ 108: 2).
అంటే అల్లాహ్ కొరకు మరియు అల్లాహ్ పేరుతో మాత్రమే జిబహ్ చేయి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఆదేశించారు:
لَعَنَ اللهُ مَنْ ذَبَحَ لِغَيْرِ الله
“అల్లాహ్ కు కాక ఇతరుల కోసం జిబహ్ చేయువానిపై అల్లాహ్ శపించాడు”. (ముస్లిం 1978).
జిబహ్ లో రెండు నిషేధాలు ఏకమవుతాయి. (1) అల్లాహ్ కు తప్ప ఇతరుల కోసం జిబహ్. (2) అల్లాహ్ పేరుతో కాకుండా ఇతరుల పేరుతో జిబహ్. ఈ రెండు కారణాల వల్ల ఆ జంతువు మాంసం తినడం యోగ్యం కాదు.
ఈ రోజుల్లో జిన్నుల పేరు మీద జిబహ్ చేసే షిర్క్ ప్రబలి ఉంది. అదేమనగా; ఇల్లు కొనుగోళు చేసినా, నిర్మించినా అందులో ఎక్కడైనా లేదా ప్రత్యేకించి దాని గడప మీద, అలాగే బావి త్రవ్వినా, అక్కడే ఓ జంతువు జిబహ్ చేస్తారు. అది షైతాన్ (భూతాల)కు భయపడి, వాని నష్టం నుండి దూరముండుటకు వాని పేరు మీద జిబహ్ చేస్తారు. (వాస్తవేమిటంటే అల్లాహ్ ను కాక ఇతరులతో భయపడరాదు. ఇలాంటి జిబహ్ చేయరాదు). (తైసీరుల్ అజీజుల్ హమీద్ 158. దారుల్ ఇఫ్తా ముద్రణ).
ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (6:17 నిముషాలు)
(2) గోరీలవద్ద మరియు నూతన భవనం , బోరుబావి , లేదా చెరువు నిర్మించినప్పుడు కీడు పోయేందుకు (అల్లాహ్ యేతరుల కోసం, అల్లాహ్ యేతరుల పేరు మీద) జిబహ్ చెయ్యడం సమ్మతమేనా?
A] చెయ్య కూడదు
B] చెయ్యవచ్చు
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz
ఇంకా క్రింది పోస్టులు చదవండి:
- సమాధుల, దర్గాల వద్ద జంతుబలి ఇవ్వటం, కానుకలు సమర్పించుకోవటం, శ్రద్ధాంజలి ఘటించటం – డా. సాలెహ్ అల్ ఫౌజాన్
- అల్లాహ్ యేతరుల కొరకు జిబహ్ (జంతు బలిదానం) చేయుట షిర్క్ అక్బర్ – ఇమామ్ అస్-సాదీ
You must be logged in to post a comment.