దరూద్ షరీఫ్ శుభాలు – ముహమ్మద్‌ ఇక్బాల్ కైలానీ [పుస్తకం]

దరూద్ షరీఫ్ శుభాలు – ముహమ్మద్‌ ఇక్బాల్ కైలానీ [పుస్తకం]

ఉర్దూ మూలం : మౌలానా ముహమ్మద్ ఇక్బాల్ కీలానీ
తెలుగు అనువాదం : బద్రుల్ ఇస్లాం
ప్రకాశకులు : హదీస్ పబ్లికేషన్స్

డెస్క్ టాప్ వెర్షన్
[ఇక్కడ పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [64 పేజీలు] [ఫైల్ సైజు: 3.24 MB]

మొబైల్ ఫ్రెండ్లీ వెర్షన్
[ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [64 పేజీలు] [ఫైల్ సైజు: 12.5 MB]

విషయ సూచిక

  • రూపు రేఖలు
  • వంశధార
  • ప్రవక్త జీవిత చరిత్ర (టూకీగా)
  • తొలిపలుకులు [PDF] [8p]
  1. దరూద్ షరీఫ్ భావం [PDF] [1p]
  2. దైవ ప్రవక్తలందరిపై దరూద్ పంపాలి [PDF]
  3. దరూద్ షరీఫ్ ప్రాశస్త్యం [PDF] [7p]
  4. దరూద్ షరీఫ్ ప్రాముఖ్యత [PDF] [4p]
  5. మస్నూన్ దరూద్ వాక్యాలు [PDF] [9p]
  6. దరూద్ షరీఫ్ పఠించే సందర్భాలు [PDF] [8p]
  7. బలహీనమైన కాల్పనికమైన హదీసులు [PDF] [4p]

బిస్మిల్లా హిర్రహ్మానిర్రహీం

అల్హమ్దు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్, అమ్మాబాద్.

జీవితంలో కాలం అత్యంత విలువైనది. కాలప్రవాహం నిరంతరంగా, నిరాఘాటంగా చాలా వేగంతో ప్రవహిస్తూ ఉంటుంది. కాలచక్రం మన మీద దయతలచి ఎక్కడా ఆగకుండా ముందుకు సాగి పోతూ మనల్ని జీవితంలో ఎదురయ్యే కష్టాలను, ఆపదలను సహించగలిగేలా చేస్తున్నది. గడిచే కాలం క్షతగాత్ర హృదయాలకు ఉపశమనాన్నీ, ఊరటనూ కలిగిస్తున్నది. ఒకవేళ ఈ కాల ప్రవాహమే గనక ఆగిపోతే భూమిపై మానవ ఉనికికే ప్రమాదం వాటిల్లుతుంది. ప్రతి మనిషీ ఓ శోకమూర్తిలా, కనిపిస్తాడు.

కొన్ని సంవత్సరాల క్రితం నా జీవితం కాల ప్రవాహంలోని సహజమైన ఎగుడు దిగుళ్ళను దాటుకుంటూ అతి వేగంగా ముందుకు సాగిపోతున్న సమయంలో హఠాత్తుగా కొన్ని అవాంఛనీయమైన సంఘటనలు జరిగాయి. వాటి మూలంగా నాకు రాత్రివేళ నిద్ర, పగటిపూట మనశ్శాంతి కరువయ్యాయి. దైనందిన కార్యకలాపాలన్నీ అస్తవ్యస్తమయిపోయాయి. ఇది నేను “నమాజ్ పుస్తకం” సంకలనం చేస్తున్న కాలం నాటి మాట.

ఈ రోజు దాని గురించి ఆలోచిస్తేనే చెప్పలేని ఆశ్చర్యం కలుగుతున్నది. అల్ప జ్ఞాని, పరిమిత సామర్థ్యం కలవాణ్ణి అయిన నేను ఇంత గొప్ప కార్యం ఎలా చేయగలిగానా అనిపిస్తోంది. వాస్తవం ఏమిటంటే నేను దైవప్రవక్త ప్రవచనాల సంకలనం, క్రోడీకరణ పనిలో పూర్తిగా లీనమయిపోయినందువల్ల బయటి ప్రపంచంలోని అల్లకల్లోల వాతావరణం నా మీద ప్రభావం చూపలేకపోయింది. ఆ విధంగా నేను ఎన్నో సమస్యల నుండి, బాధల నుండి సురక్షితంగా ఉండగలిగాను. అంతేకాదు, నా కార్యక్రమంలోనూ చెప్పదగిన ఆటంకం ఏమీ ఏర్పడలేదు. ఒకవేళ ఆ సమయంలో నేను నమాజ్ పుస్తకం పనిలో నిమగ్నుణ్ణి ఉండకపోయినట్లయితే, ఈ రోజు నా జీవితపు రూపురేఖలే మారిపోయి ఉండేవి. చెప్పొచ్చేదేమిటంటే దైవప్రవక్త ప్రవచనాలకు సంబంధించిన ఈ సంక్షిప్త సంకలనం-జీవితపు అత్యంత కఠినమైన, క్లిష్టతరమైన ప్రయాణంలో నాకు ఓ స్నేహితుడిగా, సానుభూతిపరుడిగా దోహదపడింది. నా దుఃఖంలో పాలు పంచుకున్నది. నా వల్ల ఎన్నో తప్పులు, ఎన్నో పాపాలు జరిగి ఉన్నప్పటికీ అల్లాహ్ నన్నింతగా కరుణిస్తున్నాడంటే ఇదంతా దరూద్ షరీఫ్ శుభాల మూలంగానే జరిగివుంటుందని నా నమ్మకం. హదీసులు చదువుతూ రాస్తూ ఉన్నప్పుడు మాటిమాటికీ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి, సత్యప్రవక్త అయిన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పేరు వచ్చినప్పుడల్లా ఆయన మీద అల్లాహ్ శాంతీశ్రేయాలు కురవాలని ప్రార్థించినందుకు నాకా మహాభాగ్యం లభించి ఉండవచ్చు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన అనుచరుడయిన ఉబై బిన్ కాబ్ (రదియల్లాహు అన్హు)తో అన్న మాటలు అక్షరాలా సత్యం. “కాబ్! నువ్వు నీ మొత్తం నీ ప్రార్థనను నా దరూద్ కోసం ప్రత్యేకించుకో. ఇహపరాల్లో నీకు కలిగే దుఃఖాలన్నిటికీ అది ఉపశమనంగా పనికి వస్తుంది” (తిర్మిజీ షరీఫ్).

అల్లాహ్ తన గ్రంథంలో ఒకచోట ఇలా అన్నాడు :

”ఓ ముహమ్మద్ చెప్పేయండి, విశ్వాసులకు ఈ ఖురాన్ మార్గదర్శకం వహిస్తుందని, ఉపశమనాన్ని కలిగిస్తుందనీను”.

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనాల విషయంలో కూడా నిస్సందేహంగా మనం ఈ మాట అనవచ్చు. ఆయన పలుకులు ప్రజలకు సన్మార్గం చూపించటంతో పాటు, ఉపశమనాన్ని కూడా ఇస్తాయి. ఇమామ్ రమావీ (రహిమహుల్లాహ్) తనకు సుస్తీ చేసినప్పుడల్లా తాను “నాకు హదీసు చదివి వినిపించండి. అందులో ఉపశమనం ఉంది” అని అంటారని బాగ్దాద్ చరిత్ర గ్రంథంలో వ్రాశారు. భారత ఉపఖండ ఆధ్యాత్మిక చరిత్రలో ప్రసిద్ధికెక్కిన ప్రముఖ హదీసువేత్త హజ్రత్ షాహ్ వలీయుల్లాహ్ గారి గురించి తెలియని వారుండరు. ఆయన తండ్రిగారైన షాహ్ అబ్దుర్రహీమ్ తరచూ ఇలా అంటుండేవారు: “మాకు ధర్మసేవ చేసే భాగ్యమంతా దరూద్ షరీఫ్ శుభాల మూలంగానే లభించింది”.

పండితులు సఖావీ (రహిమహుల్లాహ్) ‘ఖైలుల్ బదీ’ అనే గ్రంథంలో అనేకమంది హదీసువేత్తల స్వప్న విశేషాలను పొందుపరిచారు. ఆ గ్రంథం ప్రకారం కొంతమంది హదీసువేత్తలు హదీసులు వ్రాసే సమయంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రస్తావన వచ్చినప్పుడల్లా దరూద్ షరీఫ్ పఠించటం, వ్రాయటం చేసేవారు. దాని మూలంగా వారి పాపాలన్నిటినీ మన్నించటం జరిగింది.

దైవప్రవక్త హదీసులు మరియు దరూద్ షరీఫ్ మహిమల్ని, శుభాలను స్వానుభవంతో గ్రహించిన నేను ”శుచీ శుభ్రతల పుస్తకం” తర్వాత “దైవప్రవక్త విధానానుసరణ” పుస్తకాన్ని రచించే ముందు ”దరూద్ షరీఫ్ శుభాలు” అనే పుస్తకం సంకలనం చేయాలని దృఢంగా నిశ్చయించుకున్నాను. అల్ హమ్దులిల్లాహ్! అల్లాహ్ నా ఆశను నెరవేర్చాడు. ఈ పుస్తకంలోని మేళ్లన్నీ కూడా అల్లాహ్ కృపతో, ఆయన అనుగ్రహంతో జరిగినవే. పోతే ఇందులోని లోపాలన్నీ నా స్వయంకృతాలు.

తనకు సలాం చేసే వారికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన సమాధిలో నుంచి ప్రతి సలాం చేస్తారని ప్రామాణికమైన హదీసు ద్వారా తెలుస్తోంది.

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధిలో ఉండి ప్రజల సలాం ఎలా వింటారు? వారి సలాంకు జవాబు ఎలా చెబుతారు? అనే విషయాలను గురించి చర్చించినప్పుడు మనం ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ప్రాపంచిక జీవనం దృష్ట్యా సాధారణ మానవులకు ఏ విధంగా మరణం సంభవిస్తుందో అదేవిధంగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు కూడా మరణం సంభవించింది. దివ్య ఖురాన్లో అల్లాహ్ పలుచోట్ల దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కొరకు ‘మరణం’ అనే పదాన్ని ఉపయోగించాడు.

“ఓ ప్రవక్తా! నీవూ మరణిస్తావు, వారూ మరణిస్తారు.” (అజ్ జుమర్ : 30)

ఆలి ఇమ్రాన్ సూరాలో ఇలా ప్రకటించబడింది :

”ముహమ్మద్ ఒక ప్రవక్త తప్ప మరేమీ కారు. అతనికి పూర్వం ఇంకా ఎందరో ప్రవక్తలు గతించారు. అలాంటప్పుడు ఒకవేళ అతను మరణిస్తే లేక హత్య చేయబడితే మీరు వెనుకంజవేసి మరలిపోతారా?” (ఆలి ఇమ్రాన్: 144)

అంబియా సూరాలో ఇలా చెప్పబడింది:

“ఓ ప్రవక్తా! శాశ్వత జీవితాన్ని మేము నీకు పూర్వం కూడా ఏ మానవునికీ ప్రసాదించలేదు. ఒకవేళ నీవు మరణిస్తే వారు మాత్రం శాశ్వతంగా జీవించి ఉంటారా?’ (అంబియా సూరా, 34వ సూక్తి)

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణించినప్పుడు ఆయన ప్రియ సహచరుడయిన హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ (రదియల్లాహు అన్హు) తన ఉపన్యాసంలో ఇలా ఎలుగెత్తి చాటారు :

”ముహమ్మద్ ను పూజించేవారు ముహమ్మద్ కు మరణం సంభవించిందన్న సత్యాన్ని గ్రహించాలి” (బుఖారీ షరీఫ్).

దైవప్రవక్త మరణానంతరం ఆయన పవిత్ర భౌతిక కాయానికి స్నానం చేయించి, వస్త్ర సంస్కారాలు చేయటం జరిగింది. ఆ తర్వాత జనాజా నమాజ్ ఆచరించి ఆయన భౌతిక కాయాన్ని సమాధిలో ఉంచి మట్టితో పూడ్చేయటం జరిగింది. ఇది వాస్తవం. కనుక ప్రాపంచిక జీవితం దృష్ట్యా ఆయనకు మరణం సంభవించిందనే విషయంలో ఎలాంటి సందేహానికీ తావులేదు. అయితే ఆయన సమాధి జీవితం మాత్రం ఇతర దైవప్రవక్తలు, పుణ్యాత్ములు, అమరవీరులు, సజ్జనులందరి కంటే ఎంతో మెరుగ్గా, ఎక్కువ పరిపూర్ణంగా ఉంటుంది. సమాధి జీవితం గురించి ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఆ జీవితం మరణానికి ముందు ఉండే ప్రాపంచిక జీవితం లాగుండదు. అలా అని అది పూర్తిగా పరలోక జీవితం కూడా కాదు. దాని వాస్తవిక స్థితి కేవలం అల్లాహ్ కు మాత్రమే తెలుసు. దివ్యఖురాన్లో అల్లాహ్ ఈ విషయాన్ని ఎంతో స్పష్టంగా ఇలా ప్రకటించాడు:

“అల్లాహ్ మార్గంలో చంపబడిన వారిని “మృతులు” అని అనకండి. వాస్తవానికి వారు సజీవులు. కాని మీరు వారి జీవితాన్ని గ్రహించలేరు.” (అల్బఖర : 154వ సూక్తి)

సమాధి జీవితం గురించి వివరిస్తూ అల్లాహ్ ”మీరు ఆ స్థితిని గ్రహించలేరు” అని స్పష్టంగా చెప్పిన తర్వాత – దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రజల సలాం విని దానికి జవాబు చెప్పగల్గుతారంటే బహుశా ఆయన మనలాగే బ్రతికే ఉన్నారేమో? ఆయన సలాం వినగలిగినప్పుడు మనం చెప్పుకునే మాటలు మాత్రం ఎందుకు వినలేరు? అంటూ భౌతికంగా ఆలోచించటానికి ప్రయత్నించకూడదు. మన విశ్వాసం (ఈమాన్) కోరేదేమంటే మనం అల్లాహ్, దైవప్రవక్త ఆదేశాలను యధాతథంగా ఆచరించాలి. ఏ విషయంలోనయితే షరీఅత్ మౌనం వహించిందో అలాంటి విషయాల్లో అనవసర సందేహాలకు, సంశయాలకు లోనవకుండా తెలిసిన విషయాలనే ఆచరించటానికి ప్రయత్నించాలి. ధర్మం, విశ్వాసాల రక్షణకు ఇదే అత్యంత సురక్షితమైన మార్గం.

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “అల్లాహ్ కొంతమంది దూతలకు ఒక బాధ్యతను అప్పగించాడు. వారు భువిలో సంచరిస్తూ ఉంటారు. ప్రజల్లో ఎవరయినా దరూద్ పఠిస్తే దాన్ని దైవప్రవక్తకు (అంటే నాకు) చేరవేస్తూ ఉంటారు” (అహ్మద్, నసాయి, దారిమి).

ఈ హదీసు ద్వారా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎల్లప్పుడూ తన సమాధిలోనే ఉంటారనీ, ఆయన సర్వాంతర్యామి కారని స్పష్టంగా అర్థమవుతోంది. ఒకవేళ ఆయనే గనక సర్వాంతర్యామి అయితే దైవదూతలు ఆయనకు దరూద్ చేరవేయవలసిన అవసరం ఏముంటుంది చెప్పండి?!

మరికొన్ని హదీసుల ప్రకారం దైవదూతలు ఫలానా దరూద్ ఫలానా అతని కుమారుడు పఠించాడని కూడా ఆయనకు తెలియపరుస్తారని బోధపడుతుంది. దీని ద్వారా కూడా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు అగోచర జ్ఞానం లేదని తెలుస్తోంది. ఒకవేళ ఆయనకే గనక అగోచర జ్ఞానముంటే దైవదూతలు ఫలానా వ్యక్తి దరూద్ పఠించాడని ఆయనకు తెలియజేయవలసిన అవసరం ఏముంది?

ప్రస్తుత కాలంలో ఇస్లాం ధర్మంలో క్రొత్తపోకడలు (బిద్అత్ లు) తామర తంపరలుగా పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా ప్రార్థనలు, సంకీర్తనల్లో ఎన్ని కల్పిత విషయాలు చేర్చబడ్డాయంటే వాటి మూలంగా సంప్రదాయబద్ధమైన (మస్నూన్) ప్రార్ధనలు, సంకీర్తనలు మరుగున పడిపోతున్నాయి. ఆఖరికి దరూద్, సలామ్ లలో కూడా ఎన్నో కల్పితమైన, సంప్రదాయ విరుద్ధమైన విషయాలు చోటు చేసుకున్నాయి. ఉదా:- దరూదె తాజ్, దరూదె లిఖ్ఖి, దరూదె ముఖద్దస్, దరూదె అక్బర్, దరూదె మాహీ, దరూదె తస్ జైనా మొదలగునవి. వీటిలో ప్రతి ఒక్క దరూద్ పఠనానికి ఒక ప్రత్యేకమైన సమయం కేటాయించబడింది. పుస్తకాల్లో వాటికి వేర్వేరు ప్రయోజనాలు ఆపాదించబడ్డాయి. మరి చూడబోతే వాటిలో ఏ ఒక్క దరూద్ వాక్యాలు కూడా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చేత ప్రవచించబడినట్లు రుజువు కావటం లేదు. కనుక వాటిని పఠించే పద్ధతి, వాటి ద్వారా కలిగే ప్రయోజనాలు అన్నీ మాయమాటలు మాత్రమే.

షరీఅత్లో కల్పితమైన, సంప్రదాయ విరుద్ధమైన చర్యలకు పాల్పడటం మూలంగా కలిగే నష్టమేమిటో తెలుసుకోవటానికి ప్రతి ముస్లిం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆదేశాలను దృష్టిలో పెట్టుకోవాలి. లేకపోతే ఈ కొద్దిపాటి అమూల్యమైన జీవితంలో ఖర్చు చేయబడే సమయం, ధనం, ఇతర శక్తి సామర్ధ్యాలన్నీ ప్రళయదినాన వృధా అయిపోయే ప్రమాదముంది..

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “ఎవరయినా ధర్మంలో షరీఅత్ పరంగా నిరాధారమైన పనికి శ్రీకారం చుడితే ఆ పని త్రోసిపుచ్చదగినది” (బుఖారీ- ముస్లిం). అంటే అల్లాహ్ సన్నిధిలో దానికి ఎలాంటి పుణ్యం లభించదన్నమాట! వేరొక హదీసులో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “ధర్మంలో తలెత్తే ప్రతి క్రొత్త పోకడ మార్గభ్రష్టతే, మార్గభ్రష్టత నరకానికి గొనిపోతుంది” అని హెచ్చరించారు. (అబూ నయీమ్).

ఈ సందర్భంగా ఇమామ్ బుఖారీ, ఇమామ్ ముస్లింలు వెలికితీసిన ఒక హదీసుని ప్రస్తావించటం చాలా ఉపయోగకరంగా ఉంటుందనుకుంటాను. ముగ్గురు మనుషులు దైవప్రవక్త సతీమణుల దగ్గరికి వెళ్ళి దైవప్రవక్త ఆరాధనా పద్ధతిని గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత వారిలో ఒకతను ‘నేను ఇప్పట్నుంచి ప్రతి రోజూ రాత్రంతా జాగారం చేస్తాను. అసలు విశ్రాంతే తీసుకోను’ అని ప్రతినబూనాడు. రెండో వ్యక్తి, “నేను రేపట్నుంచి నిరంతరాయంగా ఉపవాసముంటాను. ఈ వ్రతాన్ని ఎన్నటికీ విరమించను” అని ఒట్టేసుకున్నాడు. “నేనయితే ఎన్నటికీ వివాహం చేసుకోను. అసలు స్త్రీలనే ముట్టుకోను’ అని ప్రమాణం చేశాడు మూడోవ్యక్తి. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు ఈ విషయం తెలియగానే ఆయన వారిని హెచ్చరిస్తూ, “అల్లాహ్ సాక్షి! నేను మీ అందరి కంటే ఎక్కువగా అల్లాహ్ కు భయపడేవాడిని, నిష్టాగరిష్టుణ్ణి. అయినప్పటికీ నేను రాత్రిపూట ఆరాధనలు చేస్తాను, పడుకుంటాను కూడా. ఉపవాసాలుంటాను, అప్పుడప్పుడూ వాటిని విరమిస్తాను కూడా. అంతేకాదు, నేను స్త్రీలను వివాహం కూడా చేసుకున్నాను. కనుక జాగ్రత్త! ఎవరయితే నా విధానం పట్ల వైముఖ్య ధోరణికి పాల్పడతాడో అతనితో నాకెలాంటి సంబంధం లేదు” అని అన్నారు.

ప్రియ పాఠకులారా!

కాస్త ఆలోచించండి, ఆ ముగ్గురు వ్యక్తులు తమ ఉద్దేశ్యం ప్రకారం తాము వీలైనన్ని ఎక్కువ సత్కార్యాలు చేస్తున్నామనీ, ఎక్కువ పుణ్యం సంపాదించు కుంటున్నామని భావించారు. కాని వారు అవలంబించిన విధానం కల్పితమైనది. సంప్రదాయ విరుద్ధమైనది, కనుక దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి మాటల్ని తీవ్రంగా నిరసించారు. దరూద్ సలామ్ ల సంగతి కూడా అంతే.

కల్పితమైన, సంప్రదాయ విరుద్ధమైన దరూద్ లు, సలామ్ లు పఠించటం వృధా ప్రయాస మాత్రమే. పైగా దానివల్ల దైవప్రవక్త అప్రసన్నతకు, దైవాగ్రహానికి గురి కావలసి వస్తుంది. అంచేత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించిన దరూద్-సలామ్ లను మాత్రమే పఠించాలి. గుర్తుంచుకోండి! ప్రపంచంలోని ఇతర సాధువులు, పుణ్యాత్ములందరూ కలిసి తయారు చేసిన ఎన్నో పలుకుల కన్నా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) శుభ అధరాల నుండి వెలువడిన ఒక్క పలుకు ఎంతో అమూల్యమైనది, శ్రేష్ఠమైనదీను.

ఈ పుస్తకం సంకలనం కోసం హదీసుల్ని ఎంపిక చేసినప్పుడు ‘సహీహ్’ మరియు ‘హసన్’ కోవలకు చెందిన హదీసుల్ని మాత్రమే ఎంపిక చేసి పుస్తక ప్రామాణికతను కాపాడటానికి అన్ని విధాలా కృషి చేయటం జరిగింది. అయినప్పటికీ ఇందులో ఏదయినా బలహీనమైన హదీసు దొర్లిందని విద్యావంతులు మాకు తెలియపరిస్తే మేము వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.

ఈ పుస్తకాన్ని సిద్ధపరచటంలో మిత్రులు జనాబ్ హాఫిజ్ అబ్దుర్రహ్మాన్ (రక్షణ శాఖ) గారు చెప్పదగిన పాత్రను నిర్వహించారు. మా నాన్నగారు హాఫిజ్ ముహమ్మద్ ఇద్రీస్ కైలానీ ముసాయిదాను పునఃపరిశీలించటంతో పాటు వ్రాత, ప్రచురణ పనుల్ని దగ్గరుండి జరిపించారు. మా నాన్నగారు హజ్రత్ మౌలానా ముహమ్మద్ ఇస్మాయీల్ సలఫీ (రహిమహుల్లాహ్), హజ్రత్ మౌలానా ముహమ్మద్ అతావుల్లాహ్ హనీఫ్ (రహిమహుల్లాహ్) లాంటి ప్రసిద్ధ పండితుల దగ్గర శిష్యరికం చేసిన ప్రముఖుల్లో ఒకరు. దస్తూరీలో బాగా పేరు మోసిన వ్యక్తి. ఉపాధి నిమిత్తం దస్తూరీ పని చేసిన కాలంలోనే ఆయన ఆరు ప్రామాణిక గ్రంథాలయిన (సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లిం, సుననె తిర్మిజీ, సుననె నసాయి, సుననె అబూదావూద్, సుననె ఇబ్నెమాజా లనే గాక మిష్కాత్ షరీఫ్, దివ్యఖురాన్ కు సంబంధించిన అనేక వ్యాఖ్యాన గ్రంథాలను కూడా ఆయన తన చేత్తో వ్రాశారు. మౌలానా అతావుల్లాహ్ హనీఫ్ గారు తన ప్రసిద్ధ గ్రంథమైన “తాలీఖాతె సలఫియా” (నసాయీ షరీఫ్ వ్యాఖ్యాన) గ్రంథాన్ని వ్రాయటం కోసం ప్రత్యేకంగా మా నాన్నగారినే ఎన్నుకున్నారు.

అల్లాహ్ నాన్నగారికి ప్రత్యేక కరుణాకటాక్షాల్ని అనుగ్రహించాడు. యాభై ఎనిమిదవ పడిలో ఆయనకు దివ్యఖురాన్ ను కంఠస్తం చేసే మహాభాగ్యాన్ని ప్రసాదించాడు. విద్యాభ్యాసం పూర్తయినప్పటి నుంచే ఆయన దస్తూరీ పనితోబాటు తన సొంత ఊర్లో ధర్మప్రచార కార్యక్రమాల్ని కూడా నిర్వర్తించటం మొదలుపెట్టారు. అయితే గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా-దైవకృపతో ఆయన ఉపాధిని కూడా లెక్కచేయకుండా పూర్తి ఏకాగ్రతతో ఈ బాధ్యతను నిర్వహిస్తున్నారు. హదీస్ పబ్లికేషన్స్ తరఫున ప్రచురణ కార్యక్రమం మొదలయినప్పటి నుంచి ముసాయిదాలను పునఃపరిశీలించటం, వాటిని వ్రాయించటం, ప్రచురించటం ఆ తర్వాత వాటిని పంపిణీ చేయటం మొదలగు పనులన్నిటినీ ఆయనే నిర్వర్తిస్తున్నారు.

మహాశయులారా !

నాన్నగారు జనాబ్ హాఫిజ్ ముహమ్మద్ ఇద్రీస్ కైలానీ గారికి అల్లాహ్ ఆరోగ్యాన్నీ, ఆయుష్షును* ప్రసాదించాలని కోరుకోమని విన్నవించుకుంటున్నాను. దానివల్ల మనకు దైవగ్రంథ, దైవప్రవక్త ప్రవచనాల ప్రచార కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షణలో నిర్వహించే అవకాశం లభిస్తుంది. అలాగే కేవలం దైవప్రసన్నతను బడసే ఉద్దేశ్యంతో, దైవప్రవక్త ప్రవచనాల పట్ల తమకున్న ప్రేమాభిమానాల మూలంగా తమ అమూల్యమైన సమయాన్ని, శక్తి సామర్థ్యాలను, పవిత్ర సంపాదనను ఖర్చుపెట్టి తద్వారా దైవగ్రంథం, దైవప్రవక్త ప్రవచనాల ప్రాచుర్యం కోసం పాటుపడుతున్న ప్రభృతులందరి కోసం కూడా దైవాన్ని ప్రార్థించండి. దైవం వారందరికీ ఇహపరాల్లోనూ తన అనుగ్రహాలను ప్రసాదించుగాక! ప్రళయదినాన వారికి దైవప్రవక్త సిఫారసుకు నోచుకునే భాగ్యాన్ని ప్రాప్తించుగాక! (ఆమిన్).

సంకలనకర్త తండ్రిగారైన హాఫిజ్ ముహమ్మద్ ఇద్రీస్ కైలానీ (రహిమహుల్లాహ్) క్రీ.శ. 1992 అక్టోబర్ 13వ తేదీనాడు శాశ్వతంగా ఇహలోకాన్ని వీడిపోయారు. ఇన్నాలిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజివూన్. పాఠకులు ఆయన మన్నింపు కోసం, పరలోకంలో ఆయన అంతస్తుల పెరుగుదల కోసం అల్లాహ్ ను ప్రార్థించాలని కోరుకుంటున్నాం.

రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంతస్సమీవుల్ అలీం. వతుబ్ అలైనా ఇనక అంతత్తవ్వాబుర్రహీమ్”.
(ప్రభూ! మేము చేసిన ఈ సేవను స్వీకరించు. నిస్సందేహంగా నీవు అన్నీ వినేవాడవు. సర్వం తెలిసినవాడవు. ప్రభూ! మమ్మల్ని క్షమించు. నిస్సందేహంగా పశ్చాత్తాపాన్ని అంగీకరించే వాడవు, కరుణించే వాడవు నీవే)

ముహమ్మద్ ఇక్బాల్ కైలానీ
కింగ్ సవూద్ యూనివర్సిటీ, సౌదీ అరేబియా

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ أَنَّ رَسُوْلَ اللهِ ﷺ قَالَ: «الْمَلَائِكَةُ تُصَلِّي عَلَى أَحَدِكُمْ مَا دَامَ فِي مُصَلاهُ الَّذِي صَلَّى فِيهِ مَا لَمْ يُحْدِتْ تَقُوْلُ اللَّهُمَّ اغْفِرْ لَهُ اللَّهُمَّ ارْحَمْهُ.– رَوَاهُ الْبُخَارِيُّ

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగాప్రవచించారు: మీలో ఎవరయినా తను నమాజ్ చేసిన స్థలంలో పరిశుద్ధావస్థలో కూర్చొని ఉన్నంత వరకు (అంటే అతని వుజూ భంగం కానంత వరకు) దైవదూతలు అతనిపై దరూద్ పంపుతూ, “అల్లాహ్! ఇతన్ని మన్నించు, ఇతన్ని కరుణించు” అని ప్రార్థిస్తూఉంటారు. (బుఖారీ – నమాజ్ ప్రకరణం)

عَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ : قَالَ رَسُولُ اللَّهِ ﷺ : إِنَّ اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى مَيَامِنِ الصُّفُوفِ . رَوَاهُ أَبُو دَاوُدَ

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు:. “పంక్తుల్లో కుడివైపున వుండే వారిపై అల్లాహ్ కారుణ్యాన్ని కురిపిస్తాడు. దైవదూతలు కూడా వారిని అల్లాహ్ కరుణించాలని కోరుకుంటూ ఉంటారు”. (అబూదావూద్-హసన్ – అల్ బానీగారి సహీహ్ సుననె అబూదావూద్, మొదటి సంపుటి 628వ హదీసు)

عَنِ ابْنِ عَبَّاسٍ رَضِيَ اللهُ عَنْهُمَا أَنَّهُ قَالَ: لاَ تُصَلُّوْا صَلَاةٌ عَلَى أَحَدٍ إِلَّا عَلَى النَّبِيِّ وَلكِنْ يُدْعَى لِلْمُسْلِمِينَ وَالْمُسْلِمَاتِ بِالاِسْتِغْفَارِ. رَوَاهُ إِسْمَاعِيْلُ الْقَاضِي

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) ప్రబోదనం :- “దైవప్రవక్తలపై తప్ప మరెవరి పైనా దరూద్ పంపకండి. అయితే ముస్లిం స్త్రీ పురుషుల కోసం మాత్రం మన్నింపు ప్రార్థనలు చేయండి”.

(దీనిని ఇస్మాయీల్ ఖాజీగారు “ఫజ్లుస్సలాతి అలన్నబియ్యి” గ్రంథంలో పేర్కొన్నారు. ఇది సహీహ్ కోవకు చెందిన హదీసు) (అల్ బానీగారి ఫజ్లుస్సలాతి అలన్నబియ్యి గ్రంథం, 75వ హదీసు)

عَنْ أَنَسٍ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللهِ ﷺ: (مَنْ صَلَّى عَلَيَّ صَلَاةَ وَاحِدَةً صَلَّى اللهُ عَلَيْهِ عَشْرَ صَلَوَاتٍ وَحُطَّتْ عَنْهُ عَشَرُ خَطِيئَاتٍ وَرُفِعَتْ لَهُ عَشَر دَرَجَاتٍ– رَوَاهُ النَّسَائِيُّ

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “ఎవరయినా నాపై ఒకసారి దరూద్ పరిస్తే అల్లాహ్ అతనిపై పదిసార్లు కారుణ్యం కురిపిస్తాడు. అతని పది పాపాలను మన్నిస్తాడు. ఇంకా అతని పది అంతస్తులను పెంచుతాడు“. (నసాయి-సహీహ్) (అల్బానీగారి సహీహ్ సునని నసాయి గ్రంథం, మొదటి సంపుటి 1230వ హదీసు)

عَنِ ابْنِ مَسْعُوْدٍ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللهِ : أَوْلَى النَّاسِ بِي يَوْمَ الْقِيَامَةِ أَكْثَرُهُمْ عَلَيَّ صَلَاةٌ. رَوَاهُ التَّرْمِذِيُّ

హజ్రత్ ఇబ్న్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు. “నాపై అత్యధికంగా దరూద్ పఠించేవాడు ప్రళయ దినాన నాకు అందరికన్నా సమీపంలో ఉంటాడు.” (తిర్మిజీ – సహీహ్) [అల్ బానిగారి మిష్కాతుల్ మసాబీహి గ్రంథం, మొదటి భాగం 923 న హదీసు]

عَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو رَضِيَ اللهُ عَنْهُمَا قَالَ: قَالَ رَسُولُ اللَّهِ ﷺ: (مَنْ صَلَّى عَلَى أَوْ سَأَلَ لِي الْوَسِيلَةَ حَقَّتْ عَلَيْهِ شَفَاعَتِي يَوْمَ الْقِيَامَةِ». رَوَاهُ إِسْمَاعِيلُ الْقَاضِي فِي فَضْلِ الصَّلَاةِ عَلَى النَّبِيِّ ﷺ

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “ఎవరయినా నాపై దరూద్ పఠిస్తే, నాకు ‘వసీలా’ (స్వర్గంలో ఒక ఉన్నత స్థానం) లభించాలని అల్లాహ్ ను కోరుకుంటే, ప్రళయ దినాన నేను వారి గురించి తప్పకుండా సిఫారసు చేస్తాను

(ఇస్మాయీల్ ఖాజీగారు దీనిని ‘ఫజ్లుస్సలాతి అలన్నబియ్యి’ గ్రంథంలో పేర్కొన్నారు. ఇది ‘సహీహ్’ కోవకు చెందిన హదీసు).[అల్ బానిగారి ‘ఫజ్లుస్సలాతి అలన్నబియ్యి’ గ్రంథం 50వ హదీసు]

عَنْ أُبَيّ بن كعب رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قُلْتُ  يَا رَسُولَ اللهِ، إِنِّي أُكْثِرُ الصَّلَاةَ عَلَيْكَ، فَكَمْ أَجْعَلُ لَكَ مِنْ صَلَاتِي؟ فَقَالَ: «مَا شِئْتَ». قَالَ: قُلْتُ: الرُّبُعَ. قَالَ: «مَا شِئْتَ، فَإِنْ زِدْتَ فَهُوَ خَيْرٌ لَكَ». قُلْتُ: النِّصْفَ. قَالَ: «مَا شِئْتَ، فَإِنْ زِدْتَ فَهُوَ خَيْرٌ لَكَ». قَالَ: قُلْتُ: فَالثُّلُثَيْنِ. قَالَ: «مَا شِئْتَ، فَإِنْ زِدْتَ فَهُوَ خَيْرٌ لَكَ». قُلْتُ: أَجْعَلُ لَكَ صَلَاتِي كُلَّهَا. قَالَ: «إِذَاً تُكْفَى هَمَّكَ، وَيُغْفَرُ لَكَ ذَنْبُكَ. رَوَاهُ الترمذي

హజ్రత్ ఉబై బిన్ కాబ్ (రదియల్లాహు అన్హు) కథనం: నేనొకసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తో మాట్లాడుతూ “దైవప్రవక్తా! నేను మీపై అత్యధికంగా దరూద్ పంపుతూ ఉంటాను, వాస్తవానికి నేను నా ప్రార్ధన (దుఆ)లో ఎంతసేపు మీపై దరూద్ పఠించాలి.” అని అడిగాను. అందుకాయన “నీకిష్టమయినంత సేపు” అని అన్నారు. “నా ప్రార్థనలో నాల్గో వంతు మీ దరూద్ కోసం కేటాయిస్తే సరిపోతుందా?” అని అడిగాను. ”సరిపోతుంది. కాని అంతకన్నా ఎక్కువ సేపు దరూద్ పరిస్తే అది నీకే మంచింది” అని అన్నారాయన, నేను “సగం ప్రార్థన దరూద్ కోసం కేటాయిస్తాను” అన్నాను. దానికాయన “సరే, నీ యిష్టం. కానీ అంతకన్నా ఎక్కువ సేపు దరూద్ పఠిస్తే అది నీకే మంచిది” అని అన్నారు. నేను మళ్లీ “అయితే మూడింట రెండు వంతుల ప్రార్థన దాని కోసమే కేటాయించమంటారా?” అని అడిగాను. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ”నీ యిష్టం. ఇంకా ఎక్కువ సమయం దరూద్ పఠిస్తే అది నీకే మంచిది” అని అన్నారు. చివరికి నేను “మరయితే నా ప్రార్ధన అంతా దరూద్ కోసమే ప్రత్యేకించుకుంటాను” అని అన్నాను. అప్పుడాయన “ఈ పద్ధతి నీ దుఃఖ విచారాలన్నిటినీ దూరం చేస్తుంది. నీ పాపాల మన్నింపుకు దోహదపడుతుంది” అని చెప్పారు. (తిర్మిజీ-హసన్) [అల్ బానీగారి సహీహ్ సుననె తిర్మిజీ రెండో సంపుటి 1999వ హదీసు]

عَنْ عَبْدِ الرَّحْمَنِ بْنِ عَوْفٍ رَضِيَ اللهُ عَنْهُ قَالَ : خَرَجَ رَسُولُ اللهِ ﷺ حَتَّى دَخَلَ نخلا فَسَجَدَ فَأَطَالَ السُّجُوْدَ حَتَّى خَشِيْتُ أَنْ يَكُوْنَ اللهُ قَدْ تَوَفَّاهُ قَالَ : فَجِئْتُ أَنْظُرُ فَرَفَعَ رَأْسَهُ فَقَالَ : مَالَكَ؟ فَذَكَرْتُ لَهُ ذَلِكَ قَالَ: فَقَالَ : إِنَّ جِبْرِيلَ عَلَيْهِ السَّلامُ قَالَ لِي: أَلا أُبَشِّرُكَ أَنَّ اللهَ عَزَّ وَجَلَّ يَقُولُ لَكَ مَنْ صَلَّى عَلَيْكَ صَلَاةٌ صَلَّيْتُ عَلَيْهِ وَمَنْ سَلَّمَ عَلَيْكَ سَلَّمْتُ عَلَيْهِ». رَوَاهُ أَحْمَدُ

హజ్రత్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రదియల్లాహు అన్హు) కథనం : ఒక రోజు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంటి నుండి బయలుదేరి ఖర్జూరపు తోటలోకి వెళ్ళారు. అక్కడ ఆయన సజ్దా చేశారు. చాలా సేపటి వరకు అలాగే ఉండిపోయారు. ఎంతసేపటికీ సజ్దా నుండి లేవకపోవటంతో అదే స్థితిలో ఆయన ప్రాణం గాని పోయి వుంటుందేమోనని భయమేసింది నాకు! నేనాయన వైపు అలాగే చూస్తుండిపోయాను. అంతలో ఆయన తల పైకెత్తి ‘ఏమయింది?’ అని అడిగారు. నేను నాకు తోచింది చెప్పాను. అప్పుడాయన నాతో ఇలా అన్నారు :

”(నేను సజ్దా స్థితిలో ఉన్నప్పుడు) జిబ్రయీల్ దూత నన్ను సంబోధిస్తూ, “ఓ ముహమ్మద్! నేను మీకో శుభవార్త తెల్పనా? మీపై దరూద్ పంపిన వ్యక్తిపై తాను కారుణ్యాన్ని కురిపిస్తాననీ, మీ శాంతిని కోరేవారిపై తానూ శాంతిని అవతరింపజేస్తానని అంటున్నాడు అల్లాహ్” అని చెప్పారు. (అహ్మద్-సహీహ్) [అల్బానీగారి ఫజ్లుస్సలాతి అలన్నబియ్యి గ్రంథం 7వ హదీసు]

عَنْ أَبِي الدَّرْدَاءِ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ ﷺ: «مَنْ صَلَّى عَلَيَّ حِيْنَ يُصْبِحُ عَشْرًا وَحِيْنَ يُمْسِي عَشْرًا أَدْرَكَتْهُ شَفَاعَتِي يَوْمَ الْقِيَامَةِ». رَوَاهُ الطَّبَرَانِي

హజ్రత్ అబూదర్దా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “ఎవరయితే ఉదయం పదిసార్లు, సాయంత్రం పదిసార్లు నాపై దరూద్ పఠిస్తారో, ప్రళయ దినాన వారికి నా సిఫారసు లభిస్తుంది“.(తబ్రానీ-హసన్) [అల్ బానీగారి ఫజ్లుస్సలాతి అలన్నబియ్యి గ్రంథం. 11వ హదీసు]

عَنْ عَبْدِ اللَّهِ بْنِ مَسْعُوْدٍ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: كُنتُ أُصَلِّي وَالنَّبِيُّ ﷺ وَأَبُو بَكْرٍ وَعُمَرُ رَضِيَ اللهُ عَنْهُمَا مَعَهُ ,فَلَمَّا جَلَسْتُ بَدَأْتُ بالثَّناءِ عَلَى اللهِ ثُمَّ الصَّلَاةِ عَلَى النَّبِيِّ ثُمَّ دَعَوْتُ لِنَفْسِي فَقَالَ النَّبِيُّ ﷺ: «سَلْ تُعْطَهُ، سَلْ تُعْطَة» رَوَاهُ التَّرْمِذِيُّ

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) కథనం : ఓ రోజు నేను నమాజ్ చేస్తుండగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), ఆయనతో పాటు అబూబక్ర్, ఉమర్ (రదియల్లాహు అన్హుమా)లు కూడా (నాకు సమీపంలోనే) కూర్చొని ఉన్నారు. నేను (నమాజ్ ముగించుకొని దుఆ కోసం) కూర్చొని ముందుగా అల్లాహ్ ను స్తుతించాను. తర్వాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)పై దరూద్ పఠించి ఆ తర్వాత నా స్వయం కోసం దుఆ చేసుకున్నాను. అది విని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “(అలాగే) అల్లాహ్ ను ప్రార్థించు, నీకు తప్పకుండా ప్రసాదించబడుతుంది. (మళ్లీ) అల్లాహ్ ను ప్రార్థించు, నీకు తప్పకుండా ప్రసాదించటం జరుగుతుంది” అని పురికొల్పారు. (తిర్మిజీ-హసన్) [అల్ బానీగారి సహీహ్ సుననె తిర్మిజీ మొదటి సంపుటి 486 వ హదీసు]

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ أَنّ رَسُوْلَ اللهِ ﷺ قَالَ: «مَنْ صَلَّى عَلَيَّ وَاحِدَةً صَلَّى اللَّهُ عَلَيْهِ عَشْرًا» . رَوَاهُ مُسْلِمٌ

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “ఎవరయినా నాపై ఒకసారి దరూద్ పఠిస్తే అల్లాహ్ అతని మీద పదిసార్లు కారుణ్యాన్ని కురిపిస్తాడు“.(ముస్లిం – నమాజ్ ప్రకరణం)

عَنْ أَبِي طَلْحَةَ رَضِيَ اللهُ عَنْهُ أَنَّ رَسُولَ اللهِ ﷺ ، جَاءَ ذَاتَ يَوْمِ وَالْبُشْرَى فِي وَجْهِهِ فَقُلْنَا إِنَّا لَنَرَى الْبُشْرَى فِي وَجْهِكَ فَقَالَ: «إِنَّهُ أَتَانِي الْمَلَكُ جِبْرِيلُ فَقَالَ : يَا مُحَمَّدُ إِنَّ رَبَّكَ يَقُوْلُ أَمَا يُرْضِيْكَ الله ﷺ أَنَّهُ لَا يُصَلِّي عَلَيْكَ أَحَدٌ إِلا صَلَّيْتُ عَلَيْهِ عَشْرًا، وَلا يُسَلَّمْ عَلَيْكَ أَحَدٌ إِلا سَلَّمْتُ عَلَيْهِ عَشْرًا». رَوَاهُ النَّسَائِيُّ (حسن)

హజ్రత్ అబూ తల్హా (రదియల్లాహు అన్హు) కథనం: ఓ రోజు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మా దగ్గరికి వచ్చారు. ఆ సమయంలో ఆయన ముఖారవిందం ఆనందాతిశయంతో వెలిగిపోతూ ఉంది. అది చూసి మేము ”ఈ రోజు మీ ముఖారవిందంలో సంతోషం తొణకిసలాడుతున్నట్లు కన్పిస్తుందే” అని అన్నాం. అప్పుడాయన మాకు ఇలా తెలియజేశారు. “నా దగ్గరకు జిబ్రయీల్ దూత వచ్చి ఓ శుభవార్త చెప్పి వెళ్ళారు. అల్లాహ్ నన్ను ఉద్దేశ్యించి, ”ముహమ్మద్! ఎవరయినా మీపై ఒకసారి దరూద్ పఠిస్తే, నేనతని పై పదిసార్లు కారుణ్యాన్ని కురిపిస్తాను. ఎవరయినా ఒకసారి మీపై శాంతి కలగాలని కోరుకుంటే నేను వారిపై పదిసార్లు శాంతిని అవతరింపజేస్తాను. ఇది మీకు సంతోషకరమే కదా! అని అడుగుతున్నాడట!” (నసాయి-హసన్)[అల్బానీగారి సహీహ్ సుననె నసాయి మొదటి సంపుటి1216వ హదీసు]

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ : قَالَ رَسُولُ اللهِ ﷺ: «مَنْ صَلَّى عَلَيَّ مَرَّةً وَاحِدَةً كَتَبَ اللهُ لَهُ عَشْرَ حَسَنَاتٍ – رَوَاهُ إِسْمَاعِيلُ الْقَاضِيُّ فِي فَضْلِ الصَّلَاةِ عَلَى النَّبِيِّ . (صحیح)

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు : “ఎవరయినా నాపై ఒకసారి దరూద్ పఠిస్తే, అల్లాహ్ అతని కర్మల పత్రంలో పదిపుణ్యాలు జమ చేస్తాడు”. (దీనిని ఇస్మాయీల్ ఖాజీ ‘ఫజ్లుస్సలాతి అలన్నబియ్యి’ గ్రంథంలో పేర్కొన్నారు. ఇది సహీహ్ కోవకు చెందిన హదీసు) [అల్ బానీగారి ఫజ్లుస్సలాతి అలన్నబియ్యి గ్రంథం 11వ హదీసు]

عَنْ عَامِرِ بْنِ ربيعة عَنْ أَبِيْهِ رَضِيَ اللهُ عَنْهُ قَالَ : سَمِعْتُ النَّبِيَّ ﷺ يَقُولُ: (مَا مِنْ عَبْدٍ يُصَلِّي عَلَيَّ إِلا صَلَّتْ عَلَيْهِ الْمَلَائِكَةُ مَا صَلَّى عَلَيَّ فَلْيُقِلَّ أَوْ لَيُكْثِرُه . رَوَاهُ إِسْمَاعِيلُ الْقَاضِيُّ فِي فَضْلِ الصَّلاةِ عَلَى النَّبِيِّ (حسن)

హజ్రత్ ఆమిర్ బిన్ రబీఆ తన తండ్రి నుండి చేసిన కథనం ప్రకారం, తను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచిస్తుండగా విన్నారు: “ఏ ముస్లిం వ్యక్తి అయినా నాపై దరూద్ పఠిస్తూ ఉన్నంత వరకు దైవదూతలు అతనిపై కారుణ్యం కురవాలని ప్రార్థిస్తూనే ఉంటారు. కనుక ఇక మీ యిష్టం. దరూద్ తక్కువగానయినా పఠించండి లేదా ఎక్కువగానయినా పఠించండి”.

(దీనిని ఇస్మాయీల్ ఖాజీ ఫజ్లుస్సలాతి అలన్నబియ్యి గ్రంథంలో పేర్కొన్నారు. ఇది ‘హసన్’ కోవకు చెందిన హదీసు) [అల్ బానీగారి మిష్కాతుల్ మసాబీహ్ గ్రంథం మొదటి సంపుటి 725వ హదీసు]

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ ﷺ: «مَا مِنْ أَحَدٍ يُسَلِّمُ عَلَيَّ إِلا رَدَّ اللهُ عَلَى رُوْحِي حَتَّى أَرُدَّ عَلَيْهِ السَّلاَمَ». رواه أبو داود (حسن)

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “ఎవరయినా నాకు సలాం చేస్తే, ఆ సమయంలో అల్లాహ్ నా ఆత్మను (భూలోకానికి) త్రిప్పి పంపిస్తాడు. దాంతో నేను నాకు సలాం చేసిన వారికి ప్రతి సలాం చేస్తాను”. (అబూ దావూద్-హసన్) [అల్ బానీగారి ఫజ్లుస్సలాతి అలన్నబియ్యి గ్రంథంలోని 6వ హదీసు]

గమనిక: దరూద్ షరీఫ్ పఠనంపై లభించే పుణ్య పరిమాణం గురించి వివిధ హదీసుల్లో వివిధ రకాలుగా పేర్కొనటం జరిగింది. మొత్తానికి ఆ పుణ్యం దాన్ని పఠించేవారి చిత్తశుద్ధి, భక్తివిశ్వాసాల మీద ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని గ్రహించాలి.

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللهِ ﷺ: «رَغِمَ أَنْفُ رَجُلٍ ذَكَرْتُ عِنْدَهُ فَلَمْ يُصَلِّ عَلَيَّ وَرَغِمَ أَنْفُ رَجُلٍ دَخَلَ عَلَيْهِ رَمَضَانُ ثُمَّ انْسَلَخَ قَبْلُ أَنْ يُغْفَرَ لَهُ، وَرَغِمَ أَنْفُ رَجُلٍ أَدْرَكَ عِنْدَهُ أَبْوَاهُ الْكِبَرَ فَلَمْ يُدْخِلَاهُ الْجَنَّة». رَوَاهُ التَّرْمِذِيُّ (صحیح)

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా శపించారు: “తన ముందు నా పేరు ప్రస్తావించబడినప్పటికీ నాపై దరూద్ పంపని వాడు నాశనమయిపోవు గాక! పూర్తి రమజాన్ మాసాన్ని పొందినప్పటికీ తన పాపాలను ప్రక్షాళనం చేసుకోలేకపోయినవాడు నాశనమయిపోవు గాక! తన జీవితంలో ముసలివారయిన తల్లిదండ్రుల్ని పొందినప్పటికీ వారికి సేవ చేసుకొని స్వర్గంలోకి ప్రవేశించలేక పోయినవాడు నాశనమయిపోవు గాక!” (తిర్మిజీ – సహీహ్) (అల్ బానీగారి సహీహ్ సుననె తిర్మిజీ, మూడో సంపుటి 2810 వ హదీసు)

عَنْ كَعْبِ بْنِ عُجْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ : قَالَ رَسُولُ اللهِ ﷺ: « أَحْضُرُوا الْمِنْبَرَ فَحَضَرْنَا فَلَمَّا ارْتَقَى الدَّرَجَةَ قَالَ آمِيْنَ ثُمَّ ارْتَقَى الدَّرَجَةَ الثَّانِيَةَ فَقَالَ: آمِيْنَ ثُمَّ ارتَقَى الدَّرَجَةَ الثَّالِثَةَ فَقَالَ: آمِيْنَ، فَلَمَّا فَرَغَ نَزَلَ عَنِ الْمِنْبَرِ قَالَ: فَقُلْنَا لَهُ: يَا رَسُولَ الله لَقَدْ سَمِعْنَا مِنْكَ الْيَوْمَ شَيْئًا مَا كُنَّا نَسْمَعُهُ قَالَ: إِنَّ جِبْرِيلَ عَرَضَ لِي فَقَالَ : بَعُدَ مَنْ أَدْرَكَ رَمَضَانَ فَلَمْ يُغْفَرْ لَهُ، فَقُلْتُ: آمِيْنَ فَلَمَّا رَقِيْتُ الثَّانِيَةَ قَالَ: بَعُدَ مَنْ ذُكِرْتَ عِنْدَهُ فَلَمْ يُصَلِّ عَلَيْكَ. فَقُلْتُ : آمِيْنَ. فَلمَّا رَقِيْتُ الثَّالِثَةَ قَالَ : بَعُدَ مَنْ أَدْرَكَ أبَوَيْهِ الْكِبَرَ أَوْ أَحَدَهُمَا فَلَمْ يُدْخِلاهَ الْجَنَّةَ. فَقُلْتُ : آمِيْنَ ». رَوَاهُ الْحَاكِمُ (صحیح)

హజ్రత్ కాబ్ బిన్ ఉజ్రా (రదియల్లాహు అన్హు) కథనం: ఒక రోజు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మింబర్ (వేదిక)ను తీసుకొచ్చి పెట్టమని ఆదేశించారు. మేము అలాగే తీసుకొచ్చి పెట్టాం. ఆయన వేదిక తొలి మెట్టు ఎక్కినప్పుడు ‘ఆమీన్’ అని అన్నారు. రెండో మెట్టు ఎక్కినప్పుడు ‘ఆమీన్’ అని అన్నారు. మూడో మెట్టు ఎక్కినప్పుడు కూడా ‘ఆమీన్’ అని అన్నారు. ఉపన్యాసం ముగించి వేదిక దిగి క్రిందికి రాగానే సహాబాలు (సహచరులు) ఆశ్చర్యంతో, “ఈ రోజు విూరు విచిత్రంగా ప్రవర్తించారు. (ఖుత్బా సమయంలో) మీరలా అనటం మేము ఇంతకు ముందెన్నడూ వినలేదు. (విషయం ఏమిటి దైవప్రవక్తా?!)” అని అడిగారు.

అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) విషయాన్ని వివరిస్తూ ”జిబ్రయీల్ (అలైహిస్సలాం) వచ్చి “రమజాన్ మాసం పొందినప్పటికీ తన పాపాలను ప్రక్షాళనం చేయించుకోలేక పోయినవాడు నాశనమవుగాక!” అని శపించారు. నేనందుకు “ఆమీన్” అని అన్నాను. ఆ తర్వాత నేను రెండో మెట్టు ఎక్కుతున్నప్పుడు జిబ్రయీల్ ‘తన ముందు మీ శుభనామం ప్రస్తావనకు వచ్చినప్పటికీ మీ పై దరూద్ పంపనివాడు నాశనమయిపోవుగాక!’ అని శపించారు. నేనందుకు ”ఆమీన్” అని పలికాను. మూడో మెట్టు ఎక్కుతున్నప్పుడు జిబ్రయీల్, “ముసలి వారయిన తల్లిదండ్రుల్ని లేక వారిరువురిలో ఏ ఒక్కరినయినా పొంది వారికి సేవలు చేసుకొని స్వర్గాన్ని పొందలేకపోయినవాడు నాశనమవుగాక!” అని శపించారు. నేనందుకు కూడా ‘ఆమీన్’ అని అన్నాను” అని చెప్పారు. (హాకిమ్ – సహీహ్) (అల్ బానీగారి ఫజ్లుస్సలాతి అలన్నబియ్యి గ్రంథం 19 హదీసు)

عَنْ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُ قَالَ : قَالَ رَسُوْلُ اللهِ ﷺ : «الْبَخِيْلُ الَّذِي مَنْ ذُكِرْتُ عِنْدَهُ فَلَمْ يُصَلِّ عَلَيَّ». رَوَاهُ التَّرْمِذِيُّ

హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) కథనం, ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “తన ముందు నా పేరు ప్రస్తావించబడినప్పటికీ నాపై దరూద్ పఠించనివాడు పిసినిగొట్టు.” (తిర్మిజీ-సహీహ్) (అల్ బానీగారి సహీహ్ సుననె తిర్మిజీ మూడో సంపుటి 2811వహదీసు)

عَنْ أَبِي ذَرٍّ رَضِيَ اللهُ عَنْهُ أَنَّ رَسُوْلَ اللهِ ﷺ قَالَ: « إِنَّ أَبْخَلَ النَّاسِ مَنْ ذُكِرْتُ عِنْدَهُ فَلَمْ يُصَلِّ عَلَيَّ » – رَوَاهُ إِسْمَاعِيْلُ الْقَاضِي فِي فَضْلِ الصَّلَاةِ عَلَى النَّبِيِّ (صحیح)

హజ్రత్ అబూ జర్ర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “తన ముందు నా పేరు ప్రస్తావించబడినప్పటికీ నాపై దరూద్ పఠించనివాడు ప్రజలందరిలోకెల్లా మహా పిసినిగొట్టు”. (ఖాజీ ఇస్మాయీల్ దీనిని ఫజ్లుస్సలాతి అలన్నబియ్యి గ్రంథంలో పేర్కొన్నారు. ఇది సహీహ్ కోవకు చెందిన హదీసు) (అల్ బానీగారి ఫజ్లుస్సలాతి అలన్నబియ్యి గ్రంథం 37వ హదీసు)

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ : قَالَ رَسُولُ اللهِ ﷺ: « مَا فَعَدَ قَوْمٌ مَقْعَدًا لَمْ يَذْكُرُوا فِيه اللهَ عَزَّ وَجَلَّ وَيُصَلُّوْا عَلَى النَّبِيِّ إِلا كَانَ عَلَيْهِمْ حَسْرَةٌ يَوْمَ الْقِيَامَةِ وَإِنْ دَخَلُوا الْجَنَّةَ لِلثَّوَابِ » رَوَاهُ أَحْمَدُ وَابْنُ حَبَّانِ وَالْحَاكِمُ وَالْخَطِيْبُ . (صحیح)

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “కొంతమంది ఒకచోట సమావేశమై ఆ సమావేశంలో అల్లాహ్ ను జ్ఞాపకం చేసుకోకపోతే, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై దరూద్ పంపకపోతే ప్రళయదినాన ఆ సమావేశం వారి పాలిట దుఃఖదాయకంగా (తలవంపుగా) పరిణమిస్తుంది. వారు సత్కార్యాల ఆధారంగా స్వర్గంలో ప్రవేశించేవారయినా సరే” (అహ్మద్, ఇబ్నె హిబ్బాన్, హాకిమ్, ఖతీబ్- సహీహ్) (అల్బానీగారి సిల్సిలతుల్ అహాదీసుస్సహీహా ‘మొదటి సంపుటి 76వ హదీసు)

عَنِ ابْنِ عَبَّاسِ رَضِيَ اللهُ عَنْهُمَا قَالَ: قَالَ رَسُولُ اللهِ ﷺ: « مَنْ نَسِيَ الصَّلاةَ عَلَيَّ خطئ طريقَ الْجَنَّةِ » . رَوَاهُ ابْنُ مَاجَةَ (صحیح)

హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు : “నాపై దరూద్ పంపటం మరిచిపోయినవాడు స్వర్గమార్గం తప్పిపోతాడు” (ఇబ్నెమాజా-సహీహ్) (అల్బానీగారి సహీహ్ సుననె ఇబ్నెమాజా మొదటి సంపుటి 740వ హదీసు.)

عَنْ أَنس رَضِيَ اللهُ عَنْهُ قَالَ : قَالَ رَسُوْلُ اللهِ ﷺ:« كُلُّ دُعَاءِ مَحْجُوْبٌ حَتَّى يُصَلِّيَ عَلَى النَّبِيُّ » . رَوَاهُ الطَّبَرَانِيُّ (حسن)

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)పై దరూద్ పఠించనంతవరకు ఏ దుఆ స్వీకృతిని పొందజాలదు“. (తబ్రానీ-హసన్) (అల్బానీగారి సిల్సిలతుల్ అహాదీసుస్సహీహా ఐదో సంపుటి 2035వ హదీసు)

عن فضالة بْنِ عبيد رَضِيَ اللهُ عَنْهُ قَالَ : سَمِعَ النَّبِيُّ ﷺ رَجُلًا يَدْعُو فِي صَلَاتِهِ فَلَمْ يُصَلِّ عَلَى النَّبِيُّ . فَقَالَ النَّبِيُّ ﷺ: «( عجل هذا ) ، ثُمَّ دَعَاهُ فَقَالَ لَهُ أَوْ لِغَيْرِهِ إِذَا صَلَّى أَحَدُكُمْ فَلْيَبْدَا بِتَحْمِيدِ اللَّهِ والثناء عَلَيْهِ ثُمَّ لَيُصَلِّ عَلَى النبي ﷺ ثُمَّ لَيَدْعُ بَعْدُ مَا شَاءَ» . رَوَاهُ التَّرْمِذِيُّ (صحیح)

హజ్రత్ ఫజాలా బిన్ ఉబైద్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక వ్యక్తి నమాజ్లో దరూద్ పఠించకుండా దుఆ చేస్తుండగా చూసి ‘ఇతను తొందరపడ్డాడు’ అని అన్నారు. ఆ తర్వాత అతణ్ణి దగ్గరకు పిలిచి అతన్నో లేక మరో వ్యక్తినో ఉద్దేశ్యించి, “మీలో ఎవరయినా నమాజ్ చేసేటప్పుడు దైవస్తోత్రంతో ప్రారంభించాలి. ఆ తర్వాత (తషహుద్ లో కూర్చున్నప్పుడు) దైవప్రవక్తపై దరూద్ పఠించాలి. దాని తర్వాత తమకు ఇష్టమొచ్చింది ప్రార్థించుకోవాలి” అని చెప్పారు. (తిర్మిజీ-సహీహ్) (అల్బానీగారి సహీహ్ సుననె తిర్మిజీ మూడో సంపుటి 2767వ హదీసు)

عَنْ أَبِي أَمَامَةَ بْنِ سَهْلِ رَضِيَ اللهُ عَنْهُ أَنَّهُ أَخْبَرَهُ رَجُلٌ مِنْ أَصْحَابِ النَّبِيِّ ﷺ أَنَّ السُّنَّةَ فِي الصَّلَاةِ عَلَى الْجَنَازَةِ أَنْ يُكَبَّرَ الإِمَام ثُمَّ يَقْرَأْ بِفَاتِحَةِ الْكِتَابِ بَعْدَ التكبيرة الأولَى سِرًّا فِي نَفْسِهِ ثُمَّ يُصَلِّي عَلَى النَّبِيِّ ﷺ وَيُخَلَّص الدُّعاءَ لِلْجَنَازَةِ فِي التَّكْبِيرَاتِ وَلَا يَقْرَأْ فِي شَيْءٍ مِنْهُنَّ ثُمَّ يُسَلَّمْ سِرًّا فِي نَفْسِهِ. رَوَاهُ الشَّافِعِيُّ.

హజ్రత్ అబూ ఉమామా బిన్ సహ్లి (రదియల్లాహు అన్హు) కథనం, ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అనుచరుల్లో ఒకాయన తనకు ఈ విషయం తెలిపారు. “జనాజా నమాజ్లో ఇమామ్ మొదటి తక్బీర్ తర్వాత మెల్లిగా ఫాతిహా సూరా పఠించటం, (రెండో తక్బీర్ తర్వాత) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై దరూద్ పఠించటం, (మూడో తక్బీర్ తర్వాత) మృతుని కోసం చిత్తశుద్ధితో ప్రార్థించటం, ఈ తక్బీరుల్లో ఖురాన్ పారాయణం చేయకుండా ఉండటం, (నాల్గో తక్బీర్ తర్వాత) మెడ త్రిప్పుతూ మెల్లిగా సలాం చేయటం సున్నత్ (సంప్రదాయం)“. (షాఫయీ) (ముస్నదె షాఫయీ-581 వ హదీసు)

عَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرِو بْنِ الْعَاصِ رَضِيَ اللهُ عَنْهُمَا أَنَّهُ سَمِعَ النَّبِيِّ ﷺ يَقُولُ : إذَا سَمِعْتُمُ الْمُؤَذَنَ فَقُوْلُوْا مِثْلَ مَا يَقُوْلُ ثُمَّ صَلُّوْا عَلَيَّ فَإِنَّهُ مَنْ صَلَّى عَلَيَّ صَلَاةٌ صَلَّى اللهُ عَلَيْهِ بِهَا عَشْرًا، ثُمَّ سَلُوْا اللهَ لِي الْوَسِيْلَةَ فَإِنَّهَا مَنْزِلَةٌ فِي الْجَنَّةِ لا تَنْبَغِي إِلا لِعَبْدِ مِنْ عِبَادِ اللهِ وَأَرْجُوْ أَنْ أَكُونَ أَنَا هُوَ فَمَنْ سَأَلَ اللَّهَ لِي الْوَسِيلَةَ حَلَّتْ لَهُ الشَّفَاعَةُ». رَوَاهُ مُسْلِمٌ.

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రబోధిస్తుండగా తాను విన్నానని హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హుమా) తెలియజేశారు: “ముఅజ్జన్ (అజాన్ ఇచ్చేవాని) ప్రకటన విన్నప్పుడు, అతను అనే పలుకులే మీరూ పలకండి. ఆ తర్వాత నాపై దరూద్ పఠించండి. నాపై ఒకసారి దరూద్ పఠించేవారిని అల్లాహ్ పదిసార్లు కరుణిస్తాడు. ఆ తర్వాత నాకు ‘వసీలా’ లభించాలని అల్లాహ్ ను ప్రార్థించండి. వసీలా అనేది స్వర్గంలో ఒక (ఉన్నత స్థానం). స్వర్గవాసులందరిలో అది కేవలం ఒకే ఒక్కరికి లభిస్తుంది. ఆ ఒక్కణ్ణి నేనేనని నా అభిప్రాయం. కనుక నాకు వసీలా లభించాలని ప్రార్థించే వ్యక్తికి నా సిఫారసు తప్పకుండా లభిస్తుంది“. (ముస్లిం – నమాజ్ ప్రకరణం.)

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ ﷺ: « لَا تَتَّخِذُوا قَبْرِي عيدا وَلا تَجْعَلُوا بُيُوتَكُمْ قُبُورًا وَحيثُما كُنتُمْ فَصَلُّوا عَلَيَّ فَإِنَّ صَلاتِكُمْ تَبْلُغُنِي ». رَوَاهُ أَحْمَدُ

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “నా సమాధిని తిరునాళ్ళగా చేయకండి. మీ ఇండ్లను శ్మశానాలుగా మార్చుకోకండి. మీరెక్కడున్నా సరే నాపై దరూద్ పంపుతూ ఉండండి. మీ దరూద్ నాకు చేరవేయబడుతుంది”. (అహ్మద్-సహీహ్) (అల్బానీగారి ఫజ్లుస్సలాతి అలన్నబియ్యి గ్రంథంలోని 20వ పుట)

عَنْ أَبِي بَكْرِ الصَّدِّيقِ رَضِيَ اللهُ عَنْهُ قَالَ : قَالَ رَسُوْلُ اللهِ ﷺ: «أَكْثِرُوا الصَّلَاةَ عَلَيَّ فَإِنَّ اللَّهَ وَكُل بِي مَلَكًا عِنْدَ قَبْرِي فَإِذَا صَلَّى عَلَيَّ رَجُلٌ مِنْ أُمَّتِي قَالَ لِي ذلِكَ الْمَلَكُ : يَا مُحَمَّدَ إِنَّ فُلانَ ابْنَ فُلَانِ صَلَّى عَلَيْكَ السَّاعَةَ . رَوَاهُ الدَّيْلَمِي (حسن)

హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “నాపై అత్యధికంగా దరూద్ పంపండి. అల్లాహ్ నా సమాధి దగ్గర ఓ దూతను నియమిస్తాడు. నా అనుచరుడెవడయినా నాపై దరూద్ పంపితే, ఆ దైవదూత నాతో, “ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)! ఫలానా అతను ఫలానా సమయంలో మీపై దరూద్ పంపాడు’ అని చెబుతాడు“. (దైలమీ -హసన్)(అల్ బానీగారి సిల్సిలతుల్ అహాదీసుస్సహీహా నాల్గో సంపుటి 1530వ హదీసు)

عَنِ ابْنِ مَسْعُوْدٍ رَضِيَ اللهُ عَنْهُ قَالَ : قَالَ رَسُولُ اللهِ ﷺ :إِنَّ للهِ مَلائِكَة سيَّاحِيْنَ فِي الْأَرْضِ يُبَلِّغُونِي مِنْ  أمتي السَّلَامَ. رَوَاهُ النَّسَائِيُّ (صحیح)

హజ్రత్ ఇబ్నె మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “నా అనుచరులు నాకు చెప్పే సలాములను నాకు చేరవేయటానికి అల్లాహ్ కొంతమంది దూతల్ని నియమించాడు. వారు భూమిమీద తిరుగుతూ ఉంటారు”. (నసాయి-సహీహ్) (అల్ బానీగారి సహీహ్ సుననె నసాయి 1215వ హదీసు)

عَنْ أَبِي مَسْعُوْدٍ الأَنْصَارِيُّ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللهِ ﷺ : «أَكْثِرُوا الصَّلاةَ عَليَّ فِي يَوْمِ الْجُمْعَةِ فَإِنَّهُ لَيْسَ يُصَلِّ عَلَيَّ أَحَدٌ يَوْمَ الْجُمْعَةِ إِلَّا عُرِضَتْ على صلاته». رَوَاهُ الْحَاكِمُ وَالْبَيْهَقِي

హజ్రత్ అబూ మస్ ఊద్ అన్సారీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “జుమా నాడు నాపై అత్యధికంగా దరూద్ పంపండి. ఎందుకంటే జుమా నాడు ఎవరయినా నాపై దరూద్ పరిస్తే అది తప్పకుండా నాకు సమర్పించబడుతుంది“. (హాకిమ్, బైహఖీ-సహీహ్) (అల్బానీ గారి సహీహ్ జామె సగీర్ మొదటి సంపుటి 1219వ హదీసు)

عَنْ أَوْسِ بْنِ أَوْسٍ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ ﷺ: “إِنَّ مِنْ أَفْضَلِ أَيَّامِكُمْ يَوْمَ الْجُمْعَةِ فِيْهِ خُلِقَ آدَمُ، وَفِيْهِ قُبِضَ ، وَفِيْهِ الْنَّفْخَةُ، وَفِيْهِ الصَّعْقَةُ، فَأَكْثِرُوْا عَلَيَّ مِنَ الصَّلَاةِ فِيْهِ فَإِنَّ صَلاتِكُمْ مَعْرُوْضَةٌ عَلَيَّ قَالَ قَالُوا : يَا رَسُوْلَ اللهِ ﷺ وَكَيْفَ تُعْرَضُ صَلَاتُنا عَلَيْكَ وَقَدْ أَرَمْتَ؟ فَقَالَ : إِنَّ اللهَ عَزَّوَجَلَّ حَرَّمَ عَلَى الْأَرْضِ أَجْسَادَ الأَنْبِيَاءِ – رَوَاهُ ابو داود (صحيح)

హజ్రత్ ఔస్ బిన్ ఔస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “మీ రోజుల్లో జుమా రోజు ఎంతో ఘనమైనది. ఆ రోజునే ఆదం పుట్టించబడ్డారు. ఆ రోజునే మరణించారు. ఆ రోజునే శంఖం పూరించబడుతుంది. ఆ రోజునే మృతుల్ని తిరిగి లేపే ఆజ్ఞ అవుతుంది. కనుక ఆ రోజు మీరు నాపై అత్యధికంగా దరూద్ పంపండి. మీ దరూద్ నాకు చేరవేయబడుతుంది“.

అది విని అనుచరులు, “దైవప్రవక్తా! మేము పంపే దరూద్ తమకు ఎలా చేరవేయబడుతుంది. అప్పటికి మీ ఎముకలు (సయితం) కృశించిపోయి ఉంటాయి కదా! (లేక) మీ దేహం మట్టిలో కలిసిపోయి ఉంటుంది కదా!” అని సందేహపడగా, “అల్లాహ్ దైవప్రవక్తల శరీరాల్ని మట్టికొరకు నిషేధం చేశాడు” అని చెప్పారాయన (సల్లల్లాహు అలైహి వసల్లం). (అబూదావూద్-సహీహ్) (అల్బానీగారి సహీహ్ సుననె అబూదావూద్ మొదటి సంపుటి 925)

عَنْ فَضَالَةَ بْن عُبَيْدٍ قَالَ: بَيْنَ رَسُولُ اللهِ ﷺ قَاعِدٌ إِذْ دَخَلَ رَجُلٌ فَصَلَّى فَقَالَ: اللَّهُمَّ اغْفِرْ لِي وَارْحَمْنِي. فَقَالَ رَسُولُ اللهِ : عَجَّلْتَ أَيُّهَا الْمُصَلِّي، إذَا صَلَّيْتَ فَقَعَدْتَ فَاحْمَدِ اللَّهَ بِمَا هُوَ أَهْلُهُ وصَلَّ عَلَيَّ ثُمَّ ادْعُهُ، قَالَ : ثُمَّ صَلَّى رَجُلٌ آخَرٌ بَعْدَ ذَلِكَ فَحَمِدَ اللهَ وَصَلَّى عَلَى النَّبِيِّ ﷺ فَقَالَ ا أَيُّهَا الْمُصَلِّي أَدْعُ تُجَبْ». رَوَاهُ التَّرْمِذِي (صحیح)

హజ్రత్ ఫజాలా బిన్ ఉబైద్ (రదియల్లాహు అన్హు) కథనం: ఒకరోజు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) (మస్జిదులో) కూర్చొని ఉండగా ఒక వ్యక్తి లోనికి ప్రవేశించాడు. నమాజ్ చేసిన తర్వాత అతను “ఓ అల్లాహ్! నన్ను క్షమించు. నా మీద దయజూపు” అని ప్రార్థించటం మొదలు పెట్టాడు. అది చూసి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతన్ని ఉద్దేశ్యించి, “ఓయీ నమాజ్ చేసిన వ్యక్తి! నువ్వు ప్రార్థించటంలో తొందరపడ్డావు. నమాజ్ చేసుకున్న తర్వాత దుఆ కోసం కూర్చున్నప్పుడు ముందుగా తగిన విధంగా అల్లాహ్ ను స్తుతించు. తర్వాత నాపై దరూద్ పఠించు. ఆ తర్వాత నీ కోసం దుఆ చేసుకో” అని ఉపదేశించారు..

మరో వ్యక్తి సమాజ్ చేసుకున్న తర్వాత ”ముందుగా అల్లాహ్ ను స్తుతించాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై దరూద్ పఠించాడు. అది చూసి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “ఓయీ నమాజ్ చేసిన వ్యక్తీ! ప్రార్థించు, నీ ప్రార్ధన తప్పకుండా స్వీకరించబడుతుంది” అని అన్నారు. (తిర్మిజీ-సహీహ్) (అల్బానీ గారి సహీహ్ సుననె తిర్మిజీ మూడో సంపుటి 2865వ హదీసు)

عَنْ أُبي بْنِ كَعْبٍ رَضِيَ اللهُ عَنْهُ قَالَ : قُلْتُ يَا رَسُولَ اللَّهِ وَ إِنِّي أُكْثِرُ الصَّلَاةَ عَلَيْكَ فَكَمْ أَجْعَلُ لَكَ مِنْ صَلَاتِي ؟ قَالَ : مَاشِئتَ. قُلْتُ : الرُّبْعَ. قَالَ: مَا شِئتَ فَإِنْ زِدْتَ فَهُوَ خَيْرٌ لَكَ . قُلْتُ : فَالنَّصْفَ . قَالَ : مَا شِئْتَ فَإِنْ زِدْتَ فَهُوَ خَيْرٌ لَكَ . قُلْتُ: فَالثُّلُتَيْنِ . قَالَ : مَا شِئتَ فَإِنْ زِدْتَ فَهُوَ خَيْرٌ لَكَ . قُلْتُ : أَجْعَلُ لَكَ صَلَاتِي كُلَّهَا . قَالَ : إذا يُكْفَى هَمَّكَ وَيُغْفَرُ لَكَ ذَنْبُكَ . رَوَاهُ الترمذي (حسن)

హజ్రత్ ఉబై బిన్ కాబ్(రదియల్లాహు అన్హు) కథనం: నేనొకసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో మాట్లాడుతూ, “దైవప్రవక్తా! నేను అత్యధికంగా మీపై దరూద్ పంపుతూ ఉంటాను. అసలు నా ప్రార్ధనలో ఎంత సేపు మీపై దరూద్ పఠించాలి?” అని అడిగాను. అందుకాయన, ”నీకిష్టమయినంతసేపు” అని అన్నారు. “నా ప్రార్థనలో నాల్గోవంతు మీ దరూద్ కోసం కేటాయిస్తే సరిపోతుందా?” అని అడిగాను, ”సరిపోతుంది. కాని * అల్బానీ గారి సహీహ్ సుననె తిర్మిజీ మూడో సంపుటి 2865వ హదీసు. అంతకన్నా ఎక్కువ సేపు దరూద్ పఠిస్తే అది నీకే మంచిది” అని అన్నారాయన. నేను “సగం ప్రార్థన (దుఆ) దరూద్ కోసం కేటాయిస్తాను” అని అన్నాను. దానికాయన ”సరే, నీ యిష్టం. కానీ అంతకన్నా ఎక్కువసేపు దరూద్ పఠిస్తే అది నీకే మంచిది” అన్నారు. నేను మళ్లీ “అయితే మూడింట రెండు వంతుల ప్రార్థన దానికోసమే కేటాయించమంటారా?” అని అడిగాను. ఆయన “నీ యిష్టం. ఇంకా ఎక్కువ సమయం దరూద్ పఠిస్తే అది నీకే మంచిది” అని అన్నారు. చివరికి నేను, ”మరయితే నా ప్రార్థన అంతా దరూద్ కోసమే ప్రత్యేకించుకుంటున్నాను” అని అన్నాను. అప్పుడాయన “ఈ పద్ధతి నీ దుఃఖవిచారాలన్నిటినీ దూరం చేస్తుంది. నీ పాపాల మన్నింపుకు దోహదపడుతుంది” అని చెప్పారు. (తిర్మిజీ-హసన్)(అల్బానీగారి సహీహ్ సుననె తిర్మిజీ రెండోసంపుటి 1999వ హదీసు)

عَنْ عَلِيّ رَضِيَ اللهُ عَنْهُ قَالَ : قَالَ رسول الله ﷺ : الْبَخِيلُ الَّذِي مَنْ ذُكِرْتُ عَنْدَهُ فَلَمْ يُصَلُّ عَلَيَّ». رَوَاهُ التَّرْمِذِيُّ (صحیح)

హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: ”తన దగ్గర నా ప్రస్తావన వచ్చినప్పటికీ నాపై దరూద్ పఠించనివాడు పరమ పిసినిగొట్టు.” (తిర్మిజీ-సహీహ్) (అల్బానీగారి సహీహ్ సుననె తిర్మిజీ మూడో సంపుటి 2811వ హదీసు)

عَنْ فَاطِمَةَ رَضِيَ اللهُ عَنْهَا بِنْتِ رَسُوْلِ اللهِ ﷺ قَالَتْ : كَانَ رَسُوْلُ اللهِ ﷺ إِذَا دَخَلَ الْمَسْجِدَ يَقُولُ: «بِسْمِ اللهِ وَالسَّلَامِ عَلَى رَسُوْلِ اللَّهِ ، اللَّهُمَّ اغْفِرْ لِي ذُنُونِي، وَافْتَحْ لِي أَبْوَابَ رَحْمَتِكَ، وَإِذَا خَرَجَ قَالَ: بِسْمِ اللَّهِ وَالسَّلَامُ عَلَى رَسُوْلِ اللهِ ، اللَّهُمَّ اغْفِرْ لِي ذُنُوبِي وَافْتَحْ لِي أَبْوَابَ فَضْلِكَ رَوَاهُ ابْنُ مَاجَةَ

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కుమార్తె హజ్రత్ ఫాతిమా (రదియల్లాహు అన్హా ) కథనం; దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మస్జిద్ కి ప్రవేశించేటప్పుడు ఇలా పలికేవారు.

“బిస్మిల్లాహి వస్సలాము అలా రసూలిల్లాహి అల్లాహుమ్మగ్ఫోర్లీ జునూబీ, వఫతహ్లీ అబ్వాబ రహ్మతిక”, (అల్లాహ్ పేరుతో మస్జిద్లోకి ప్రవేశిస్తున్నాను. దైవప్రవక్తపై శాంతి కురియు గాక! అల్లాహ్! నా పాపాలను మన్నించు. నా కోసం నీ కారుణ్య ద్వారాలను తెరిచి ఉంచు.)

తిరిగి మస్జిద్ నుండి వెడలినప్పుడు ఈ విధంగా ప్రార్థించేవారు.

“బిస్మిల్లాహి వస్సలాము అలా రసూలిల్లాహి, అల్లాహుమ్మ్ఫరీ జునూబీ వఫతహ్లీ అబ్వాబ పబ్లిక”. (అల్లాహ్ పేరుతో వెడలుతున్నాను. దైవప్రవక్తకు శాంతి కల్గుగాక! దేవా! నా పాపాలను మన్నించు. నీ కటాక్ష ద్వారాలను నా కోసం తెరిచి ఉంచు.)(ఇబ్నెమాజా-సహీహ్)(అల్బానీగారి సహీహ్ సుననె ఇబ్సెమాజా మొదటి సంపుటి 625వ హదీసు)

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللهِ ﷺ: «مَا جَلَسَ قَوْمٌ مَجْلِسًا لَمْ يَذْكُرُوا اللهَ فِيْهِ، وَلَمْ يُصَلَّوْا عَلَى نَبِيِّهِمْ إِلا كَانَ عَلَيْهِمْ يَرَةً فَإِنْ شَاءَ عَذَبَهُمْ وَإِنْ شَاءَ غَفَرَ لَهُمْ . رَوَاهُ التَّرْمِذِيُّ (صحیح)

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: కొంతమంది ఏదయినా ఒక చోట సమావేశమై ఆ సమావేశంలో అల్లాహ్ ను జ్ఞాపకం చేసుకోకపోతే, తమ ప్రవక్తపై దరూద్ పంపకపోతే ఆ సమావేశం వారిపాలిట తలవంపుగా పరిణమిస్తుంది. అల్లాహ్ వారిని శిక్షించనూవచ్చు లేదా మన్నించనూ వచ్చు. (తిర్మిజీ-సహీహ్)(అల్బానీగారి సహీహ్ సునవె తిర్మిజీ మూడో సంపుటి 2691వ హదీసు)

عَنْ أَبِي الدَّرْدَاءِ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللهِ ﷺ: «مَنْ صَلَّى عَلَيَّ حَيْنَ يُصْبِحُ عَشْرًا وَحِيْنَ يُمْسِي عَشْرًا أَدْرَكَتْهُ شَفَاعَتِي يَوْمَ الْقِيَامَةِ». رَوَاهُ الطَّبَرَانِيُّ (حسن)

హజ్రత్ అబూదర్దా(రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: ఎవరయినా నాపై ఉదయం వేళ పదిసార్లు. తిరిగి సాయంత్రం పూట పదిసార్లు దరూద్ పఠిస్తే ప్రళయదినాన వారికి నా సిఫారసు లభిస్తుంది.(తబ్రానీ-హసన్)(అల్బానీగారి సహీహ్ జామే ఉస్-సగీర్ 6233వ హదీసు)

عَنْ أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: كَانَ إِذَا سَلَّمَ النَّبِيُّ ﷺ مِنَ الصَّلاة قَالَ ثَلَاثَ مَرَّاتٍ : سُبْحَانَ رَبِّكَ رَبِّ الْعِزَّةِ عَمَّا يَصِفُوْنَ، وَسَلَامٌ عَلَى الْمُرْسَلِيْنَ، وَالْحَمْدُ للهِ رَبِّ الْعَالَمِينَ. رَوَاهُ أَبُوْ يَعْلِي (حسن)

హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) కథనం: దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సలాం చేసి నమాజ్ ముగించిన తర్వాత మూడుసార్లు ఈ విధంగా ప్రార్థించేవారు. “సుబహాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిపూన్వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హము లిల్లాహి రబ్బిల్ ఆలమీన్”, నీ ప్రభువు పరిశుద్ధుడు, గొప్ప గౌరవోన్నతులు కలవాడు, వారు కల్పిస్తున్న అన్ని విషయాలకూ అతీతుడు. దైవప్రవక్తలపై శాంతి వర్షించుగాక! సకలలోక ప్రభువే సకల స్తోత్రాలకూ అర్హుడు. (అబూయాలా – జయీఫ్)(ఈ హదీసు ఆధారాల రిత్యా బలహీనమైనది. వివరాలకోసం జయీఫ్ జామే ఉస్-సగీర్ 4419, అజ్జయిఫా 4201 లు చూడండి)

ఇస్లాం తెలుగు పుస్తకాలు (Telugu Islamic Books) డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ:
https://teluguislam.net/?p=4259

హదీసు పబ్లికేషన్స్ వారు ప్రచురించిన పుస్తకాలు క్రింది లింక్ దర్శించి డౌన్లోడ్ చేసుకోగలరు.
https://teluguislam.net/hadith-publications-books/

అనుచర సమాజం (ఉమ్మత్)పై దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హక్కులు | జాదుల్ ఖతీబ్

[ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి]
https://bit.ly/rights-of-the-prophet-on-ummah
[PDF [31 పేజీలు]

ఖుత్బా లోని ముఖ్యాంశాలు: 

తన అనుచర సమాజం (ఉమ్మత్) పై దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హక్కులు: 

  • 1) అల్లాహ్ దాసుడిగా మరియు ప్రవక్తగా విశ్వసించడం. 
  • 2) తగిన విధంగా గౌరవించడం, 
  • 3) అల్లాహ్ తర్వాత, అత్యధికంగా ప్రేమించడం. 
  • 4) ఆదర్శాలను, సద్గుణాలను ఆచరించడం. 
  • 5) విధేయత చూపడం. 
  • 6) అభిప్రాయ భేదాలలో న్యాయనిర్ణేతగా స్వీకరించడం. 
  • 7) ఖుర్ఆన్ మరియు హదీసులకనుగుణంగా ఆచరించడం, 
  • 8) అత్యధికంగా దరూద్ పఠించడం. 

గడిచిన జుమా ఖుత్బాలో, మేము ప్రవక్తల నాయకుడైన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) స్థాయి, మహత్యం, అద్భుతాలు మరియు ఆయన ప్రత్యేకతలలో కొన్నింటిని గూర్చి వివరించాము. మరి ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ప్రవక్తకు తన అనుచర సమాజం (ఉమ్మత్)పై ఉన్న హక్కులేంటి? రండి, ఖురాను మరియు హదీసుల వెలుగులో ఆ హక్కుల గురించి నేటి జుమా ఖుత్బాలో తెలుసుకుందాం. 

కాలాన్ని దూషించకు. ఇది అల్లాహ్ ను బాధ కలిగించినట్లగును [వీడియో]

కాలాన్ని దూషించకు. ఇది అల్లాహ్ ను బాధ కలిగించినట్లగును [వీడియో]
https://youtu.be/4Asy-MTKEcU [6 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

90- కాలాన్ని దూషించకు.(*) ఇది అల్లాహ్ ను బాధ కలిగించినట్లగును( **). కాలాన్ని సృష్టించి, దానిని నియమ బద్ధంగా చేసింది అల్లాహ్ యే. కాలంలోనే విధివ్రాత అమలు జరిగే విధంగా చేశాడు.

عَنْ أَبِي هُرَيْرَةَ عَنْ النَّبِيِّ قَالَ: (لَا تَسُبُّوا الدَّهْرَ فَإِنَّ اللهَ هُوَ الدَّهْرُ)

“కాలాన్ని దూషించకండి, నిశ్చయంగా అల్లాహ్ యే కాలం” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (ముస్లిం/అన్నహ్ యు అన్ సబ్బిద్దహ్ ర్ 2246).

మరో ఉల్లేఖనంలో ఉందిః

عَنْ أَبِي هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُولُ الله : (قَالَ اللهُ عَزَّ وَجَلَّ يُؤْذِينِي ابْنُ آدَمَ يَسُبُّ الدَّهْرَ وَأَنَا الدَّهْرُ بِيَدِي الْأَمْرُ أُقَلِّبُ اللَّيْلَ وَالنَّهَارَ)

అల్లాహ్ చెప్పాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినట్లు అబూ హురైరా ఉల్లేఖించారుః “మానవూడు నన్ను బాధిస్తున్నాడు. అతడు కాలాన్ని దూషిస్తున్నాడు. వాస్తవానికి నేనే కాలం. అధికారమంతయూ నా చేతిలోనే ఉంది. రేయింబవళ్ళను మార్చేవాడిని నేనే”. (బుఖారి/వమా యుహ్ లికునా ఇల్లద్దహ్ ర్ 4826).

(*) కాలాన్ని దూషించడం మూడు రకాలుగా ఉంటుందిః

1- తౌహీద్ కు వ్యెతిరేకమైన ఘోరమైన షిర్క్. కొందరు ఇలా అంటారుః ‘కాలం పాడుగాను’, ‘ఈ రాత్రి విపరీతమైన వేడి గలది’, ‘మహా చల్లని రాత్రి’, ఇలాంటి మాటలు అన్నప్పుడు వేడి, చలిను పుట్టించేది కాలం, రాత్రి అని నమ్మితే ఇదే ఘోరమైన షిర్క్.

2-కాలం సృష్టికర్త అల్లాహ్ అని నమ్మినప్పటికీ విపరీతమైన వేడి, లేదా చలి ఉన్నప్పుడు యమకోపంతో, ఓపిక లేకుండా, దానిని భరించడం లో పుణ్యం అన్న విషయం మరచి, అల్లాహ్ వ్రాసిన విధివ్రాత మీద ఆగ్రహంతో ప్రవర్తించుట లేదా దాని వార్త ఇతరులకు ఇచ్చుట. ఈ ప్రవర్తన సరియైనది కాదు. ఇందువల్ల మనిషి పాపానికి గురవుతాడు.

3-మంచి విశ్వాసం మరియు సదుద్దేశంతో ఎలా ఉంది వాతవరణం అంటే సమాధానంగా చలి ఉంది అని వేడి ఉంది అని ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా ఉంది అని తెలుపుతే ఈ పద్ధతి సరైనది. ఇందులో ఏలాంటి పాపము లేదు.

(**) కాలాన్ని, భూమిని, జడపదార్థాల్ని మరియు ఇతర సృష్టిని దూషించుట అల్లాహ్ ను దూషించినట్లు. ఎందునగా అది వాస్తవానికి వాటిని ఉనికిలోకి తెచ్చినవారిని దూషించినట్లు. ఉదాహరణకుః నీవు ఒక ఇల్లును దాని బలహీన నిర్మాణం వల్ల లేదా ఏదైనా వాహనాన్ని అది మంచిగా లేనందుకు దూషించావంటే వాస్తవానికి దానిని చేసినవానిని దూషించినట్లు. అందుకే ఈ చేష్టకు దూరంగా ఉండి భయపడాలి.

ధర్మపరమైన నిషేధాలు (భాగాలు) – యూట్యూబ్ ప్లేలిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2ipsEd3T9LtuCJ3_1vELEu

ధర్మపరమైన నిషేధాలు (పాయింట్స్ క్లిప్స్) – యూట్యూబ్ ప్లేలిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0PzbYW7saGrZ3TYVB51Rtb

అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి

కొంతమంది అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందుతారు. అది వారి అపరాధాలు, పాపాలు అధికమైనందుకు, లేదా ఒకసారో, కొన్నిసార్లో తౌబా చేసి, తిరిగి అదే పాపానికి పాల్పడినందుకు, ఇక అల్లాహ్ క్షమించడు అని భావించి, మరింత పాపాల్లోనే ఇరుక్కు పోతారు. తౌబా చేయడం, అల్లాహ్ వైపు మరలడం మానేస్తారు. కాని వారు చేసే ఘోరమైన తప్పు ఇదే. ఎందుకనగా అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందేది అవిశ్వాసులే. విశ్వాసులు నిరాశ నిస్పృహలను సంపూర్ణంగా వదలుకొని, అల్లాహ్ కారుణ్యాన్ని ఆశించి, పాపాలను విడనాడి స్వచ్ఛమైన తౌబా చేయాలి. అల్లాహ్ ఆదేశాలను చాలా శ్రద్ధగా చదవండిః

۞ قُلْ يَـٰعِبَادِىَ ٱلَّذِينَ أَسْرَفُوا۟ عَلَىٰٓ أَنفُسِهِمْ لَا تَقْنَطُوا۟ مِن رَّحْمَةِ ٱللَّهِ ۚ إِنَّ ٱللَّهَ يَغْفِرُ ٱلذُّنُوبَ جَمِيعًا ۚ إِنَّهُۥ هُوَ ٱلْغَفُورُ ٱلرَّحِيمُ

ఓ ప్రవక్తా! ఇలా అను: తమ ఆత్మలపై అన్యాయం చేసుకున్న నా దాసులారా! అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా, అల్లాహ్ అన్ని పాపాలను క్షమిస్తాడు. నిశ్చయంగా ఆయనే క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత. (జుమర్ 39: 53).

అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి, నిశ్చయంగా, సత్యతిరస్కార జాతికి చెందినవారు తప్ప, ఇతరులు అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందరు. (జుమర్ 39: 53).


పై పోస్ట్ క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది

తౌబా (పశ్చాత్తాపం) [పుస్తకం]
https://teluguislam.net/?p=1656

క్రింది వీడియో కూడా వినండి:
నీ పాపాలు ఎంత ఉన్నా సరే అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకు [వీడియో]

అల్లాహ్ శుభనామములైన “అల్ హయ్ (సజీవుడు), అల్ ఖయ్యూమ్ (సర్వానికి ఆధారభూతుడు)” యొక్క వివరణ [వీడియో & టెక్స్ట్]

అల్లాహ్ శుభనామములైన “అల్ హయ్ (సజీవుడు), అల్ ఖయ్యూమ్” యొక్క వివరణ
https://youtu.be/Y9EhNR3PhYw [27 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, వక్త అల్లాహ్ యొక్క రెండు గొప్ప నామాలైన “అల్-హయ్యు” (సజీవుడు) మరియు “అల్-ఖయ్యూమ్” (సర్వానికి ఆధారభూతుడు) యొక్క లోతైన అర్థాలను వివరిస్తారు. “అల్-హయ్యు” అంటే అల్లాహ్ శాశ్వతంగా, సంపూర్ణంగా జీవించి ఉన్నవాడని, ఆయన జీవంలో ఎలాంటి లోపం లేదని, మరియు సమస్త జీవరాశులకు ఆయనే జీవప్రదాత అని అర్థం. “అల్-ఖయ్యూమ్” అంటే అల్లాహ్ స్వీయ-ఆధారితమైనవాడని, ఆయనకు ఎవరి సహాయం అవసరం లేదని, అదే సమయంలో సృష్టి మొత్తాన్ని ఆయనే పోషిస్తూ, నిర్వహిస్తున్నాడని భావం. ఈ రెండు నామాలు కలిసి అల్లాహ్ యొక్క అన్ని ذاتي (దాతి) మరియు فعلي (ఫి’లీ) గుణాలను కలిగి ఉన్నాయని వక్త నొక్కిచెప్పారు. ఈ నామాల ప్రాముఖ్యతను వివరించడానికి ఖురాన్ (సూరహ్ అల్-బఖరా, సూరహ్ ఆల్-ఇమ్రాన్, సూరహ్ తాహా) మరియు హదీసుల నుండి ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. కష్ట సమయాల్లో ఈ నామాలతో అల్లాహ్‌ను ప్రార్థించడం చాలా పుణ్యప్రదమని, ఆయన సహాయం మరియు క్షమాపణ పొందటానికి ఇది ఒక మార్గమని చెప్పబడింది. విశ్వాసులు తమ విశ్వాసాన్ని బలోపేతం చేసుకోవడానికి, కేవలం అల్లాహ్‌పైనే ఆధారపడటానికి ఈ నామాలను అర్థం చేసుకుని, వాటిపై ధ్యానం చేయాలని వక్త ప్రోత్సహించారు.

అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహి వహదహు వస్సలాతు వస్సలాము అలా మన్ లా నబియ్య బఅద అమ్మా బఅద్.

సోదర మహాశయులారా, సోదరీమణులారా, ప్రియ వీక్షకులారా! అల్లాహ్ యొక్క శుభ నామాలలో చాలా గొప్ప నామాలలో లెక్కించబడే అటువంటివి రెండు నామాలు అల్-హయ్యు, అల్-ఖయ్యూమ్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము.

మీకు తెలిసిన విషయమే, అల్-హయ్యు అల్-ఖయ్యూమ్, ఇవి రెండూ కలిసి ఖురాన్ లో మూడు సందర్భాల్లో అల్లాహ్ తఆలా ప్రస్తావించాడు. ఎక్కడెక్కడ? నేను ఒక హదీస్ చెప్పినప్పుడు దాని వివరణ మీకు తెలియజేస్తాను. కానీ ఈ సందర్భంలో మనం ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయం ఈ రెండు నామాల యొక్క భావం ముందు.

అల్-హయ్యు అంటే సంపూర్ణ, ఎలాంటి కొరత లేని జీవం గలవాడు, సజీవుడు. అంతేకాదు, స్వతహాగా స్వయం ఎవరి ఏ ఆధారం లేకుండా సజీవంగా ఉండి, ప్రతీ ఒక్కరికి జీవం ప్రసాదించేవాడు.

అల్-హయ్యు అన్న పేరు అల్లాహ్ ది ఏదైతే ఉందో,

أَلْحَيَاةُ الْكَامِلَة
అల్-హయాతుల్ కామిలా
సంపూర్ణమైన జీవం

అందులో అల్లాహ్ యొక్క గొప్ప గుణం ఏముంది? అల్లాహు తఆలా యొక్క గొప్ప గుణం, అల్లాహ్ సజీవుడు. స్వతహాగా, ఎవరి ఆధారం లేకుండా అల్లాహు తఆలా జీవించి ఉన్నాడు. అంతేకాదు, ఇతరులకు కూడా జీవం ప్రసాదించువాడు. ఇంత గొప్పగా దీనిని ఇంతగా ఏం చెబుతున్నారు, మనమందరము కూడా జీవించి ఉన్నాము కదా అని కొందరు చాలా చులకనగా ఆలోచిస్తారు కావచ్చు. కానీ ఇలా ఆలోచించడం కూడా తప్పు.

మన జీవితం, సృష్టి రాశుల్లోని ఎవరి జీవితమైనా వందలాది సంవత్సరాలు కాదు, వేలాది, లక్షలాది సంవత్సరాలు ఎవరైనా బ్రతికి ఉన్నా, వారి బ్రతుకుకు, వారి జీవనానికి, వారి ఉనికి కంటే ముందు ఏమీ లేకుండా ఉన్నారు. ఒకరోజు వారి ఉనికి అంతము కానుంది. కానీ అల్లాహు తఆలా ఆది, అంతము లేనివాడు. అల్లాహ్ మొట్టమొదటి నుండి, ఇక దాని యొక్క ప్రారంభం మనకు తెలియదు, కేవలం అల్లాహ్ కే తెలుసు. అప్పటినుండి ఉన్నాడంటే, చివరి వరకు కూడా ఉంటాడు. అల్లాహ్ కు మరణం అన్నది, మరియు అలసట అన్నది, నిద్ర, కునుకు అన్నది ఏదీ కూడా లేదు. అదే విషయం సూరత్ అల్-బఖరా లోని ఆయతల్ కుర్సీ, ఖురాన్ లోని అతి గొప్ప ఆయత్, ఆయతుల్ కుర్సీలో అల్లాహ్ ఇలా అంటాడు:

ٱللَّهُ لَآ إِلَٰهَ إِلَّا هُوَ ٱلْحَىُّ ٱلْقَيُّومُ ۚ لَا تَأْخُذُهُۥ سِنَةٌ وَلَا نَوْمٌ
అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్, లా త’అఖుదుహూ సినతువ్ వలా నౌమ్
అల్లాహ్, ఆయన తప్ప సత్య ఆరాధ్యుడు మరెవ్వడూ లేడు, అల్-హయ్యు (సజీవుడు), అల్-ఖయ్యూమ్ (సృష్టి యావత్తుకు ఆధారభూతుడు). ఆయనకు కునుకు గానీ, నిద్ర గానీ రాదు.

ఇక్కడ అల్-హయ్యు యొక్క వివరణలో, “లా త’అఖుదుహూ సినతువ్ వలా నౌమ్” అని కూడా ఎందుకు ప్రస్తావించడం జరిగింది? ఎందుకంటే నిద్రను చిన్న మరణం అని కూడా అంటారు. మరియు ఈ విషయం సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలో వచ్చిన ఒక హదీస్ ద్వారా కూడా మనకు తెలుస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క దుఆలలో ఒక దుఆ ఇది కూడాను. మనమందరము ఇలాంటి దుఆలు నేర్చుకోవాలి. కేవలం నేర్చుకోవడమే కాదు, ఇలాంటి దుఆలు చదువుతూ ఉండాలి కూడా.

ఏంటి ఆ దుఆ?

اللَّهُمَّ لَكَ أَسْلَمْتُ وَبِكَ آمَنْتُ وَعَلَيْكَ تَوَكَّلْتُ وَإِلَيْكَ أَنَبْتُ وَبِكَ خَاصَمْتُ اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِعِزَّتِكَ لَا إِلَهَ إِلَّا أَنْتَ أَنْ تُضِلَّنِي، أَنْتَ الْحَيُّ الَّذِي لَا يَمُوتُ وَالْجِنُّ وَالْإِنْسُ يَمُوتُونَ

అల్లాహుమ్మ లక అస్లంతు, వబిక ఆమంతు, వఅలైక తవక్కల్తు, వఇలైక అనబ్తు, వబిక ఖాసంతు. అల్లాహుమ్మ ఇన్నీ అఊదు బిఇజ్జతిక లా ఇలాహ ఇల్లా అంత అన్ తుదిల్లనీ, అంతల్ హయ్యుల్లదీ లా యమూత్, వల్-జిన్ను వల్-ఇన్సు యమూతూన్.

ఓ అల్లాహ్, నీకు నేను విధేయుడనయ్యాను, నిన్నే నేను విశ్వసించాను, నీపైనే నేను భారం మోపాను, నీ వైపునకే నేను మరలాను, నీ ఆధారంగానే నేను వాదిస్తున్నాను. ఓ అల్లాహ్, నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు, నీ ఘనత యొక్క శరణు కోరుతున్నాను, నీవు నన్ను మార్గభ్రష్టత్వానికి గురి చేయకుండా కాపాడు. నీవే సజీవునివి, ఎన్నటికీ చావు రాని వానివి. జిన్నాతులు మరియు మానవులందరూ కూడా చనిపోయేవారే.

అల్లాహ్ తప్ప ఈ లోకంలో ఎవరైనా గానీ, వారికి ఏ జీవం అయితే ఉన్నదో, ఏ బ్రతుకు అయితే ఉన్నదో, అల్లాహ్ ప్రసాదించినదే. అల్లాహ్ కోరినప్పుడు వారిని మరణింపజేస్తాడు.

اللَّهُ الَّذِي خَلَقَكُمْ
అల్లాహుల్లదీ ఖలఖకుమ్
అల్లాహ్ యే మిమ్మల్ని సృష్టించాడు. (సూరతుర్-రూమ్)

సూరతుర్-రూమ్ లో ఇంతకుముందు మనం ఆయత్ విని ఉన్నాము. అల్లాహ్ యే మిమ్మల్ని సృష్టించాడు, మీకు మరణం ప్రసాదిస్తాడు. అల్లాహు తఆలా మళ్ళీ మిమ్మల్ని సజీవంగా లేపుతాడు.

అయితే సోదర మహాశయులారా, అల్-హయ్యు, ఇందులో అల్లాహు తఆలా యొక్క దీనిని “ఇస్మే దాత్” అని కూడా అంటారు. అంటే, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ యొక్క అతి గొప్ప, స్వతహాగా ఉండే అటువంటి గుణాలన్నిటినీ కూడా ఈ ఒక్క పేరు తెలియజేస్తుంది. ఉదాహరణకు, ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ ఒక సందర్భంలో తెలియజేశారు:

الحَيُّ الْجَامِعُ لِصِفَاتِ الذَّاتِ
అల్-హయ్యు అల్-జామిఉ లి-సిఫాతిద్-దాత్
అల్-హయ్యు (అనే పేరు) అల్లాహ్ యొక్క స్వతస్సిద్ధమైన గుణాలన్నిటినీ సమీకరించేది.

అల్లాహ్ యొక్క స్వతహా గుణాలు, ఎలాంటి స్వతహా గుణాలు? అల్-ఇల్మ్ (జ్ఞానం), వస్-సమ్’అ (వినడం), వల్-బసర్ (చూడడం), వల్-యద్ (చెయ్యి), ఇలాంటి అల్లాహ్ యొక్క ఏ గుణాల ప్రస్తావన వచ్చి ఉన్నదో ఖురాన్, సహీహ్ హదీసులలో, వాటన్నిటినీ, అవన్నీ కూడా ఈ అల్-హయ్యు అన్న పేరులో వచ్చేస్తాయి.

ఇక అల్-ఖయ్యూమ్. దీని భావం ఏమిటంటే, అల్లాహు తఆలా ఎవరి ఏ అవసరం, ఏ ఆధారం లేకుండా స్వతహాగా ఉన్నాడు అంటే, ఇతరులందరి పనులను, వ్యవహారాలను, వారి యొక్క అన్ని విషయాలను అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ మాత్రమే చక్కబరుస్తూ, వాటికి బాధ్యత తీసుకుని ఉన్నాడు. అందుకొరకే, సర్వసామాన్యంగా మన తెలుగు అనువాదాల్లో అల్-ఖయ్యూమ్ అని వచ్చిన పేరుకు “సర్వ సృష్టికి ఆధారభూతుడు” అన్నటువంటి తెలుగు పదం ఉపయోగించడం జరిగింది. మరియు ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ ఈ పేరు గురించి చెప్పారు,

القَيُّومُ الْجَامِعُ لِصِفَاتِ الأَفْعَالِ
అల్-ఖయ్యూమ్ అల్-జామిఉ లి-సిఫాతిల్-అఫ్ఆల్
అల్-ఖయ్యూమ్ (అనే పేరు) అల్లాహ్ యొక్క కార్యాలకు సంబంధించిన గుణాలన్నిటినీ సమీకరించేది.

ఆ సిఫాతుల్ అఫ్ఆల్ ఏంటి? అల్-ఖల్ఖ్ (సృష్టించడం), అర్-రిజ్ఖ్ (ఉపాధి కలిగించడం), వల్-ఇన్ఆమ్ (అనుగ్రహాలు నొసంగడం), అల్-ఇహ్యా (బ్రతికించడం), వల్-ఇమాత (చంపడం), ఇలాంటి ఇంకా ఎన్నో పేర్లు “రాజిఅతున్ ఇలా ఇస్మిహిల్ ఖయ్యూమ్” (అల్-ఖయ్యూమ్ అనే పేరు వైపు మరలుతాయి). ఇవన్నీ కూడా అల్-ఖయ్యూమ్ అన్న పేరులో వచ్చేస్తాయి.

అల్-హయ్యు వల్-ఖయ్యూమ్, ఇవి రెండూ ఖురాన్ లో కూడా వచ్చి ఉన్నాయి మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల్లో కూడా వచ్చి ఉన్నాయి. ఖురాన్ లో వచ్చి ఉన్న సందర్భాన్ని ముందు తీసుకుందాము. దీనికి సంబంధించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఒక సహీహ్ హదీస్ కూడా ఉంది. అబీ హాతిమ్ లో, తిర్మిదీ లో, ఇబ్నే మాజా లో ఇంకా వేరే హదీస్ గ్రంథాల్లో, షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ వారు “సహీహుల్ జామిఅ” లో ప్రస్తావించారు (హదీస్ నం. 979).

اِسْمُ اللَّهِ الأَعْظَمُ الَّذِي إِذَا دُعِيَ بِهِ أَجَابَ وَإِذَا سُئِلَ بِهِ أَعْطَى
ఇస్ముల్లాహిల్ అ’జమ్ అల్లదీ ఇదా దుఇయ బిహి అజాబ్, వ ఇదా సుఇల బిహి అ’తా
అల్లాహ్ యొక్క గొప్ప పేరు, దాని ద్వారా దుఆ చేస్తే ఆయన వెంటనే స్వీకరిస్తాడు మరియు దాని ద్వారా అర్ధించడం జరిగితే ఆయన ప్రసాదిస్తాడు.

ఏంటి ఆ పేర్లు? చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఖురాన్ లోని సూరతుల్ బఖరాలో, సూరత్ ఆల్-ఇమ్రాన్ లో మరియు సూరతు తాహా లో ఉన్నాయి. ఇక హదీస్ వ్యాఖ్యానకర్తలు చెబుతున్నారు, సూరహ్ బఖరాలో గనుక మనం చూస్తే ఆయత్ నంబర్ 255, ఆయతుల్ కుర్సీలో:

ٱللَّهُ لَآ إِلَٰهَ إِلَّا هُوَ ٱلْحَىُّ ٱلْقَيُّومُ
అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్.

సూరత్ ఆల్-ఇమ్రాన్ యొక్క ఆరంభంలోనే:

الٓمٓ (١) ٱللَّهُ لَآ إِلَٰهَ إِلَّا هُوَ ٱلْحَىُّ ٱلْقَيُّومُ (٢)
అలిఫ్-లామ్-మీమ్. అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్.

ఇక సూరత్ త్వాహాలో గనుక మనం చూస్తే, ఆయత్ నంబర్ 111:

وَعَنَتِ ٱلْوُجُوهُ لِلْحَىِّ ٱلْقَيُّومِ
వ అనతిల్ వుజూహు లిల్-హయ్యిల్ ఖయ్యూమ్.

సోదర మహాశయులారా, ఈ హదీస్, ఈ హదీస్ యొక్క వివరణలో మనకు తెలిసిన విషయం ఏంటంటే, మనం అల్లాహు తఆలా యొక్క ఈ రెండు పేర్ల గొప్పతనాన్ని గ్రహించాలి మరియు ఇందులో ఉన్నటువంటి భావాన్ని గ్రహించాలి. దీని ద్వారా మన విశ్వాసాన్ని బలంగా సరిచేసుకోవాలి.

ఏంటి సరిచేసుకోవాలి? మీరు ఆయతులలో గమనించారు కదా, సూరత్ బఖరాలోని 255, ఆల్-ఇమ్రాన్ లోని స్టార్టింగ్ ఆయత్లో, అల్లాహు తఆలా ఈ రెండు పేర్లను ప్రస్తావిస్తూ తాను మాత్రమే సత్య ఆరాధ్యనీయుడు అన్న మాటను అక్కడ ప్రస్తావించాడు. ఇక ఎవరెవరినైతే అల్లాహ్ ను కాక ఇతరులను మనం మొక్కుతున్నామో, మనలో చాలా మంది వారిపై ఆధారపడి, వారిపై నమ్మకం కలిగి, వారి గురించి ఎన్ని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారో, వారు ఒక్కసారి ఆలోచించాలి.

ఖురాన్ లో అల్లాహ్ ఏమంటున్నాడు?

وَتَوَكَّلْ عَلَى ٱلْحَىِّ ٱلَّذِى لَا يَمُوتُ
వ తవక్కల్ అలల్-హయ్యిల్లదీ లా యమూత్.
నీవు ఎల్లప్పుడూ సజీవంగా ఉండే, ఎన్నడూ కూడా చనిపోని ఆ అల్లాహ్ పై మాత్రమే నమ్మకం కలిగి, ఆధారపడి, అతని మీదనే భరోసా ఉంచు.

భరోసా ఉర్దూ పదం, కొన్ని ప్రాంతాల్లో తెలుగులో ఉపయోగపడుతుంది. తవక్కుల్, ఇ’తిమాద్, భరోసా, నమ్మకం, ఆధారపడి ఉండడం ఎవరి మీద? ఎవరైతే సజీవంగా ఉండేవాడో, ఎన్నటికీ మరణించనివాడో. మరి ఈ రోజుల్లో మనలో ఎంతో మంది తాయెత్తుల మీద, తమ యొక్క ఉద్యోగాల మీద, ఎవరిదైనా ఏదైనా ఉద్యోగం పోయింది ఈ కరోనా సందర్భంలో, ఎందరో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎందరో వారి ఉపాధి మార్గాలు అన్నీ కూడా నశించిపోయాయి అని ఎంతో బాధకు, నిరాశ నిస్పృహలకు గురి అయ్యారు. ఇది తగుతుందా?

ఏ అల్లాహ్ సజీవంగా ఉన్నాడో, పూర్తి విశ్వం అతని ఆధీనంలో ఉన్నదో, అతని ఇష్ట ప్రకారంగానే భూమి, ఆకాశాలు, వీటిలో ఉన్న సమస్తమూ నిలిచి ఉన్నాయో, అలాంటి అల్లాహ్ మనకు సృష్టికర్తగా, ఆరాధ్యనీయుడుగా ఉన్నప్పుడు మనం ఎందుకని ఇంతటి భయం, నిరాశ, నిస్పృహలకు గురి కావాలి? ఒక్కసారి మీరు సూరత్ ఫాతిర్ ఆయత్ నంబర్ 41 చదవండి.

إِنَّ ٱللَّهَ يُمْسِكُ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضَ أَن تَزُولَا
ఇన్నల్లాహ యుమ్సికుస్-సమావాతి వల్-అర్ద అన్ తజూలా.
యదార్థానికి అల్లాహ్ ఆకాశాలను, భూమిని వాటి స్థానాల నుండి తొలగిపోకుండా నిలిపి ఉంచాడు.

ఇందులో చాలా ముఖ్యమైన భావం ఉంది. గమనిస్తున్నారా? ఆకాశాలకు పిల్లర్లు చూస్తున్నామా? ఎవరు దానిని కాపాడి ఉన్నాడు? మనపై పడకుండా? సూరహ్ అంబియా లోని ఆయత్ చదివితే మీరు, భూమి ఆకాశాలు ముందు దగ్గరగా ఉండినవి. కానీ అల్లాహ్ వాటిని దూరం చేశాడు. మనం నివసించుటకు మంచి నివాస స్థానంగా ఈ భూమిని చేశాడు. అల్లాహ్ ఏమంటున్నాడో చూడండి. అవి గనుక తమ స్థానాల నుండి తొలగిపోతే, అల్లాహ్ తప్ప వాటిని నిలిపి ఉంచేవాడు కూడా ఎవడూ లేడు.

ఈ ఆయత్ కాకుండా మీరు ఒకవేళ గమనించారంటే, అలాగే సూరతుర్-రూమ్ ఆయత్ నంబర్ 25 మీరు తీసి ఒకసారి చూడండి. ఈ రెండు పేర్ల యొక్క భావాన్ని మనం మంచి విధంగా తెలుసుకున్నప్పుడు, ఇలాంటి ఆయతులను మనం దృష్టిలో ఉంచుకోవడం, మన యొక్క విశ్వాసాన్ని మరింత ప్రగాఢంగా, బలంగా చేస్తుంది.

అల్లాహ్ అంటున్నాడు:

وَمِنْ ءَايَٰتِهِۦٓ أَن تَقُومَ ٱلسَّمَآءُ وَٱلْأَرْضُ بِأَمْرِهِۦ
వ మిన్ ఆయాతిహీ అన్ తఖూమస్-సమాఉ వల్-అర్దు బి-అమ్రిహ్
మరియు ఆయన సూచనలలో ఒకటి, ఆకాశం మరియు భూమి ఆయన ఆదేశంతోనే నిలకొని ఉన్నాయి.

ఈ “తఖూమ” అన్న పదం ఏదైతే ఉందో, దీని నుండే “ఖయ్యూమ్” అన్న అల్లాహ్ యొక్క పేరు వస్తుంది. (కాఫ్, యా, మీమ్) భూమి ఆకాశాలు ఆయన ఆదేశంతోనే నిలకొని ఉన్నాయి. అల్లాహ్ యే వాటిని నిలిపి ఉన్నాడు. అల్లాహ్ యే వాటిని నిలిపి ఉన్నాడు. ఈ భావం మనకు సూరతుర్-ర’అద్ ఆయత్ నంబర్ 33లో కూడా కనబడుతుంది.

أَفَمَنْ هُوَ قَآئِمٌ عَلَىٰ كُلِّ نَفْسٍۭ بِمَا كَسَبَتْ
అఫమన్ హువ ఖాఇమున్ అలా కుల్లి నఫ్సిన్ బిమా కసబత్
ప్రతి ప్రాణి చేసే కర్మలను పర్యవేక్షించేవాడు (అల్లాహ్).

అల్లాహు తఆలా భూమి ఆకాశాలను తన ఆదేశంతో నిలకొలిపి ఉన్నాడు. మరి ఆయన మిమ్మల్ని పిలువగానే ఒక్క పిలుపు పైనే మీరంతా భూమిలో నుంచి బయటికి వస్తారు. అల్లాహు అక్బర్. అల్లాహు అక్బర్. గమనించండి. అలాంటి అల్లాహ్ కు మనం ఎంత విధేయులుగా ఉండాలి.

ఇక్కడ మరొక విషయం, ఈ రెండు పేర్ల యొక్క ప్రభావం మనపై, మన జీవితాలపై, మన యొక్క క్యారెక్టర్, మన యొక్క నడవడిక, మన యొక్క వ్యవహారాలు, లావాదేవీలు వీటన్నిపై ఎలా ఉండాలంటే, మనలో ఎవరికైనా ఏదైనా కష్టం, ఏదైనా బాధ, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, ఈ రెండు పేర్ల ఆధారంగా అల్లాహ్ తో దుఆ చేసి అల్లాహ్ పై ప్రగాఢమైన నమ్మకం కలిగి ఉండాలి. ఇక అల్లాహ్ యొక్క దయతో మనకు ఏమీ కాదు, అల్లాహ్ మాత్రమే మనల్ని వీటిలో కాపాడుకునేవాడు అని సంపూర్ణ నమ్మకం కలిగి ఉండాలి. ఎందుకు?

ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ చాలా మంచి విషయం ఇక్కడ చెప్పారు. అల్-హయ్యు లో అల్లాహ్ యొక్క స్వతహాగా ఉండే ఎన్నో గుణాలు ఇందులో వచ్చాయి, మరియు అల్లాహ్ యొక్క ఎన్నో పేర్లు పనులకు సంబంధించినవి అల్-ఖయ్యూమ్ అన్న పేరులో వచ్చి ఉంది. అలాంటప్పుడు బాధలను తొలగించేవాడు, కష్టాలను దూరం చేసేవాడు, ఇబ్బందిలో ఉన్న వారికి సులభతరం ప్రసాదించేవాడు, అల్లాహ్ తప్ప వేరే ఎవరూ కూడా లేరు. అందుకొరకే ఒక్కసారి ఈ హదీసును చాలా శ్రద్ధగా గమనించండి. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇందులో మనకు ఎంత గొప్ప విషయాన్ని బోధిస్తున్నారు. మనం గనుక వాస్తవంగా ఈ హదీసును అర్థం చేసుకుంటే, ఇక మనకు ఎలాంటి కష్టం వచ్చినా అల్లాహ్ యొక్క ఈ రెండు పేర్ల ఆధారంగా మనం దుఆ చేస్తే, ఎలా ఈ దుఆ స్వీకరించబడుతుందో మనకు అర్థమవుతుంది. సునన్ తిర్మిదీ లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని హజ్రత్ అనస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు. హదీస్ నంబర్ 3524.

كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم إِذَا كَرَبَهُ أَمْرٌ قَالَ
కానన్-నబియ్యు సల్లల్లాహు అలైహి వసల్లమ ఇదా కరబహు అమ్రున్ ఖాల్
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఏదైనా విషయం చాలా ఇబ్బందిగా, చాలా బాధగా, కష్టాల్లో పడవేసేది వస్తే ఇలా దుఆ చేసేవారు.

يَا حَىُّ يَا قَيُّومُ بِرَحْمَتِكَ أَسْتَغِيثُ
యా హయ్యు యా ఖయ్యూమ్, బిరహ్మతిక అస్తగీస్.

(నోట్ చేసుకోండి మీరందరూ కూడా ఈ దుఆను. గుర్తుంచుకోండి. యాద్ చేసుకోండి. చిన్నదే. నాలుగే పదాలు ఉన్నాయి)

ఈ రెండైతే మీకు అట్లనే గుర్తైపోయాయి. ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. “యా హయ్యు యా ఖయ్యూమ్, బిరహ్మతిక అస్తగీస్“. నీ యొక్క కరుణ ఆధారంగా, తేరే రహ్మత్ కే వాస్తే సే, నీ కరుణ యొక్క వసీలాతో “అస్తగీస్”, నీ యొక్క సహాయాన్ని అర్ధిస్తున్నాను. ఎక్కడా ఏ సహాయం దొరకనప్పుడు, అల్లాహ్ నే మనం సహాయం కొరకు కోరాలి అని అంటారు కదా. ఒక రకంగా చూసుకుంటే ఈ పదం కూడా కరెక్ట్ కాదు. అన్నిటికంటే ముందు, ఏదైనా పని జరిగే మధ్యలో, చివరిలో, అన్ని వేళల్లో ముందు అల్లాహ్ యొక్క సహాయమే కోరాలి. దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అన్నటువంటి ఒక సామెత చాలా ప్రబలి ఉంది. అంటే ఎవరికి దిక్కు లేకుంటే అప్పుడు దేవుడు చూస్తాడా అని? ఒక మనిషిని నీ పని కావడానికి ఆధారంగా చేశాడంటే వాస్తవానికి అల్లాహ్, నఊజుబిల్లా అస్తగఫిరుల్లా, అప్పుడు మరిచిపోయి ఉన్నాడు నిన్ను, అతడు చూసుకున్నాడు, అల్లాహు తఆలా నీ పట్ల శ్రద్ధ లేకుండా ఉన్నాడు, అతడు చూసుకున్నాడు, ఇట్లాంటి భావం, ఇలాంటి సామెతల్లో వచ్చేటువంటి ప్రమాదం ఉంది. వాస్తవం ఏమిటంటే నీపై ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, అల్లాహ్ చూస్తూ ఉన్నాడు, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ తో నీవు ఎంత ఎక్కువగా సంబంధం బలపరుచుకుని దుఆ చేస్తూ ఉంటావో, అంతే అల్లాహు తఆలా నీ యొక్క పనులను చక్కబరుస్తూ ఉంటాడు.

ఇక ఉదయం సాయంకాలం చదివే దుఆలలో, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా తమ కుమార్తె అయినటువంటి ఫాతిమా రదియల్లాహు తఆలా అన్హా కి నేర్పిన దుఆ ఏమిటి? అల్లాహు అక్బర్, గమనించండి. మరియు ఈ దుఆను కూడా మీరు గుర్తుంచుకోండి, ఉదయం సాయంకాలం దుఆలలో చదవండి.

يَا حَىُّ يَا قَيُّومُ بِرَحْمَتِكَ أَسْتَغِيثُ أَصْلِحْ لِي شَأْنِي كُلَّهُ وَلاَ تَكِلْنِي إِلَى نَفْسِي وَلاَ إِلَى أَحَدٍ مِنْ خَلْقِكَ طَرْفَةَ عَيْنٍ
యా హయ్యు యా ఖయ్యూమ్, బిరహ్మతిక అస్తగీస్, అస్లిహ్ లీ ష’అనీ కుల్లహ్, వలా తకిల్నీ ఇలా నఫ్సీ, వలా ఇలా అహదిన్ మిన్ ఖల్ఖిక తర్ఫత ఐన్.

నా సర్వ వ్యవహారాలను అల్లాహ్, నీవు చక్కబరుచు. స్వయం నా వైపునకు గానీ, ఇంకా వేరే ఎవరి వైపునకు గానీ, రెప్ప కొట్టేంత సమయంలో కూడా, అంత కూడా నీవు నన్ను వేరే ఎవరి వైపునకు, నా వైపునకు అంకితం చేయకు, నీవే నన్ను చూసుకో, నా వ్యవహారాలన్నిటినీ కూడా చక్కబరుచు.

అంతేకాదు సోదర మహాశయులారా, ఈ అల్-హయ్యు, అల్-ఖయ్యూమ్ రెండు పేర్లతో మనం ఏదైనా దుఆ చేస్తే కూడా అల్లాహ్ స్వీకరిస్తాడన్న విషయం ఇంతకుముందే హదీస్ ఆధారంగా విన్నాము మనం. ఒకవేళ మన పాపాలు చాలా అయిపోయాయి, అల్లాహ్ తో మనం క్షమాపణ కోరుకోవాలి అనుకుంటున్నాము. అలాంటప్పుడు తిర్మిదీ లో వచ్చిన హదీస్, ఇంకా వేరే హదీస్ గ్రంథాల్లో కూడా ఉంది. ఏమిటి? ఎవరైతే:

أَسْتَغْفِرُ اللَّهَ الَّذِي لاَ إِلَهَ إِلاَّ هُوَ الْحَىُّ الْقَيُّومُ وَأَتُوبُ إِلَيْهِ
అస్తగఫిరుల్లాహల్లదీ లా ఇలాహ ఇల్లా హువల్-హయ్యుల్-ఖయ్యూమ్, వ అతూబు ఇలైహ్

అని చదువుతూ ఉంటారో, వారి యొక్క పాపాలన్నీ కూడా మన్నించబడతాయి. చివరికి యుద్ధ మైదానం నుండి వెనుదిరిగి వచ్చిన ఘోరమైనటువంటి పాపమైనా గానీ, ఇలాంటి దుఆ అర్థ భావాలతో చదువుతూ ఉంటే తప్పకుండా అల్లాహు తఆలా అలాంటి ఘోరమైన పాపాన్ని కూడా మన్నించేస్తాడు.

సోదర మహాశయులారా, చెప్పుకుంటూ పోతే ధర్మవేత్తలు రాసిన విషయాలు, మరియు ఖురాన్ లో ఆయతు, ఖురాన్ లో వచ్చిన ఈ పేర్ల యొక్క వ్యాఖ్యానాలు, హదీసులో వచ్చిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క దుఆలు ఇంకా మనకు చాలా దొరుకుతాయి. కానీ విన్న కొన్ని విషయాలను కూడా అర్థం చేసుకుని మనం మన యొక్క అఖీదా బాగు చేసుకుందాము, ఇలాంటి గొప్ప అల్లాహ్ ను మాత్రమే ఆరాధించి మన యొక్క సుఖ, దుఃఖ, కష్టం మరియు ఆరాం, స్వస్థత, అన్ని సమయ సందర్భాల్లో అల్లాహ్ ను మాత్రమే మనం సజీవంగా, సర్వ వ్యవహారాలను నిలిపేవాడు, వాటన్నిటినీ చూసేవాడు, అలాంటి అల్లాహ్ “యా హయ్యు యా ఖయ్యూమ్, బిరహ్మతిక అస్తగీస్” అని వేడుకుంటూ ఉండాలి. ఇంతటితో ఈ రెండు పేర్ల వివరణ ముగిస్తున్నాను.

వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.

అల్లాహ్ (త’ఆలా):
https://teluguislam.net/allah/

అల్లాహ్ శుభ నామాలు & లక్షణాలు – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0tSV7A9HKJzSeM0aIAiYcb

మా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి ఇన్ షా అల్లాహ్:
http://www.youtube.com/user/teluguislam?sub_confirmation=1

మన పయనం ఎటు?

మన పయనం ఎటు? – షేఖ్ షరీఫ్, మదనీ (హఫిజహుల్లాహ్) (వైజాగ్)
https://youtu.be/-8syV7w-fUk [32 నిముషాలు]

పరలోకం (The Hereafter) :
https://teluguislam.net/hereafter/

దున్యా (ఇహలోక జీవితం)

పరలోక చింతన

రహస్యాలను బహిర్గతం చేయరాదు (జుమా ఖుత్బా) [వీడియో]

రహస్యాలను బహిర్గతం చేయరాదు (జుమా ఖుత్బా) [వీడియో]
https://youtu.be/3vmp5tOnKUQ [30 నిముషాలు]
వక్త : షేఖ్ అబ్దుల్ గప్ఫార్,ఉమ్రీ
ప్రతి ఒక్కరూ తప్పకుండా వినవలసిన వీడియో, మీ బంధు మిత్రులకు షేర్ చేయడం మర్చిపోవద్దు

ముస్లింలకు అల్లాహ్ సహాయం ఎప్పుడు వస్తుంది? [వీడియో & టెక్స్ట్]

ముస్లింలకు అల్లాహ్ సహాయం ఎప్పుడు వస్తుంది? [వీడియో]
https://youtu.be/9uMBSVvAqv0 [8 నిముషాలు]
వక్త: షేక్ షరీఫ్, వైజాగ్ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, ప్రసంగికుడు ఇస్లాంలో విజయం మరియు సాఫల్యం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు విధేయత చూపడం ద్వారా మాత్రమే గొప్ప విజయం సాధ్యమని ఖురాన్ వాక్యాన్ని ఉటంకించారు. ఈ విధేయతకు పునాది తౌహీద్ (ఏకత్వం) అని, దానిని అర్థం చేసుకోవడం మరియు షిర్క్ (బహుదేవతారాధన) నుండి దూరంగా ఉండటం ముస్లిం సమాజానికి అత్యవసరం అని తెలిపారు. సమాజంలో ఇప్పటికీ ఉన్న మూఢనమ్మకాలు, తాయెత్తులు మరియు ఇతర షిర్క్ పద్ధతుల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ప్రసంగాలు వినడమే కాకుండా, తౌహీద్ యొక్క ప్రాథమిక జ్ఞానాన్ని (తౌహీద్-ఎ-రుబూబియత్, ఉలూహియత్, అస్మా వ సిఫాత్) నేర్చుకోవాలని ఆయన ప్రేక్షకులను కోరారు. షేఖ్ సాలెహ్ ఫౌజాన్ రాసిన “అఖీదా ఎ తౌహీద్” అనే పుస్తకాన్ని తెలుగులో చదవమని సిఫార్సు చేశారు, ఎందుకంటే అల్లాహ్‌ను సరిగ్గా తెలుసుకోకుండా చేసే ఆరాధన స్వీకరించబడదని స్పష్టం చేశారు.

ఏదైతే ఖుత్బా ఎ మస్నూనాలో ప్రతి ఖతీబ్, ప్రతి ప్రసంగీకుడు ఒక వాక్యం చదువుతారండి. 33వ సూరా, సూరె అహ్ జాబ్, వాక్యము సంఖ్య 71, అల్లాహ్ ఏమంటున్నారు?

وَمَن يُطِعِ اللَّهَ وَرَسُولَهُ فَقَدْ فَازَ فَوْزًا عَظِيمًا
(వమైఁయుతిఇల్లాహ వ రసూలహూ ఫఖద్ ఫాజ ఫౌజన్ అజీమా)
ఎవరైతే అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్తకు విధేయత చూపుతారో, వారు వాస్తవానికి ఒక గొప్ప విజయాన్ని పొందారు.

అల్లాహ్ ఏమన్నారు ఖురాన్ గ్రంథములో? ఎవరైతే అల్లాహ్ కు, అల్లాహ్ ప్రవక్తకు విధేయత చూపుతారో, వారు వాస్తవమైన, స్పష్టమైన ఒక గొప్ప విజయాన్ని పొందుతారు అని అల్లాహ్ త’ఆలా ఖురాన్ గ్రంథములో తెలియజేశారు ప్రియులారా. కాబట్టి సోదర సమాజమా, ఈరోజు మనం విజయాన్ని కోరుకుంటున్నామా? సాఫల్యాన్ని కోరుకుంటున్నామా? అయితే మనకు కావాలి, మనం అల్లాహ్ యొక్క విధేయత చూపాలి, ప్రవక్త యొక్క విధేయత చూపాలి. అల్లాహ్ యొక్క విధేయతలో మొదటి మాట ప్రియులారా, తౌహీద్ ను తెలుసుకోవాలి. అల్లాహ్ యొక్క ఏకత్వంపై దృఢంగా నిలబడాలి. షిర్క్ అనే చెడుకు మనం దూరమైపోవాలి. అప్పుడే ముస్లిం సమాజానికి అల్లాహ్ యొక్క సాఫల్యం లభిస్తుంది.

ఆ, ముహర్రం సంబంధించి మాటలు అవుతున్నాయి. ఏమండీ, ఓ ముస్లిం సమాజమా, ఇంకా ముస్లిం సమాజములో షిర్క్ నృత్యము చేస్తుంది ప్రియులారా. ఇంకా ముస్లింల యొక్క విశ్వాసాలు అంధవిశ్వాసాలలో ఉన్నాయి. ఇంకా మనం షిర్క్ ను నమ్మేవారిలో ఉన్నాం. ప్రతిసారీ నేను చెప్పే మాట, ఇంతవరకు ముస్లిం సమాజం ఇంకా మూఢనమ్మకాలపై, అపశకునాలపై, ఫలానా నక్షత్రాలపై, ఫలానా ముహూర్తాలపై, ఫలానా రోజులపై, ఫలానా సమయాలపై మనం నమ్మకం పెట్టుకుని కూర్చుంటే అల్లాహ్ సహాయము చేస్తాడా ప్రియులారా? ఇంకా ముస్లిం సమాజం షిర్క్ లో లేదు? చిన్న షిర్క్ లు మనం చేయటము లేదు? అని అంటారు. ప్రతిసారీ చెప్పే మాట, అవే తావీజులు, అవే తాయెత్తులు, అవే నిమ్మకాయలు, అవే ఫలానా ఫలానా నమ్మకం కలిగి లేమా? బయట కనిపిస్తాం సుబ్ హా నల్లాహ్. తౌహీద్ పై ఉన్నవారం, ఏమండీ, మనస్సులో కూడా తౌహీద్ అంత దృఢంగా ఉన్నదా సుబ్ హా నల్లాహ్? అల్లాహ్ త’ఆలా ఇహపరలోకాలలో మనకి సాఫల్యం ఎప్పుడు ప్రసాదిస్తాడు?

إِنَّ الَّذِينَ قَالُوا رَبُّنَا اللَّهُ ثُمَّ اسْتَقَامُوا تَتَنَزَّلُ عَلَيْهِمُ الْمَلَائِكَةُ أَلَّا تَخَافُوا وَلَا تَحْزَنُوا وَأَبْشِرُوا بِالْجَنَّةِ الَّتِي كُنتُمْ تُوعَدُونَ
(ఇన్నల్లజీన ఖాలూ రబ్బునల్లాహు సుమ్మస్తఖామూ తత నజ్జలు అలైహిముల్ మలాఇకతు అల్లా తఖాఫూ వలా తహ్ జనూ వ అబ్ షిరూ బిల్ జన్నతిల్లతీ కున్ తుమ్ తూఅదూన్)

అల్లాహ్ అంటూ ఉన్నారు, ఎవరైతే “అల్లాహ్ యే నా సృష్టికర్త” అని పలికిన పిదప దానిపై స్థిరముగా నిలబడిపోతారో, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కడగండ్లు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, అల్లాహ్ ను విశ్వసించిన తర్వాత, అల్లాహ్ తో పాటు ఎవరైతే షిర్క్ చేయరో,

الَّذِينَ آمَنُوا وَلَمْ يَلْبِسُوا إِيمَانَهُم بِظُلْمٍ أُولَٰئِكَ لَهُمُ الْأَمْنُ وَهُمْ مُّهْتَدُونَ
(అల్లజీన ఆమనూ వలమ్ యల్ బిసూ ఈమానహుమ్ బిజుల్మిన్ ఉలాఇక లహుముల్ అమ్ను వహుమ్ ముహ్ తదూన్)

అల్లాహ్ త’ఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నారు, అల్లాహ్ ను విశ్వసించిన తరువాత, ఎవరైతే విశ్వాసాన్ని షిర్క్ తో కలగాపులగము చేయరో, అది చిన్న షిర్క్ కానివ్వండి, పెద్ద షిర్క్ కానివ్వండి, షిర్క్ మన జీవితాల నుండి పూర్తిగా తొలగిపోతేనే అల్లాహ్ యొక్క సహాయం మనకు లభిస్తుంది ప్రియులారా.

ఒక మాట చెప్పనా? మీరు అనుకుంటారేమో, షిర్క్ చేస్తే నరకములోనే శిక్ష పడుతుంది, లేదు ప్రియులారా. మూసా అలైహిస్సలాం యొక్క జాతిని సంబోధిస్తూ అల్లాహ్ త’ఆలా ఇస్రాయేలు ప్రజలకు తెలియజేశాడు, మీరు షిర్క్ చేస్తే ప్రపంచములోనే మీకు శిక్ష పడుతుంది. అదే విధంగా మనకు కూడా తెలియజేయటం జరుగుతుంది, మనము షిర్క్ చేసినట్లయితే ప్రపంచములోనే అల్లాహ్ త’ఆలా మనపై శిక్షలు పంపిస్తాడు. కాబట్టి తౌహీద్ నేర్చుకోండి.

ఈరోజు మనం ప్రసంగాలు వింటూ ఉంటాం. ప్రతిసారీ నేను చెప్పే మాట ప్రియులారా, ప్రసంగాల పరంపర బాగుంది. అనేకమంది ఈ ప్రసంగాల ద్వారా, నేను నిష్పక్షపాతంగా మాట్లాడితే, ప్రసంగాలు వింటున్నాం, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, ప్రసంగాలు విని విని విని మన యొక్క గడ్డములో వెంట్రుకలు తెల్లబడిపోయాయి. నా ప్రశ్న ప్రియులారా, తౌహీద్ ఎంతవరకు నేర్చుకున్నాం? ఈరోజు ఇన్ని ఏళ్లపాటు ప్రసంగాలు విన్నాం. అహ్లె హదీస్, నించుంటే ఖురాన్, కూర్చుంటే హదీస్. మాషా అల్లాహ్, ముబారక్ హో. అల్హమ్దులిల్లాహ్, కానీ ఈ రోజు వరకు తౌహీద్, అల్లాహ్ యొక్క ఏకత్వం ఎన్ని రకాలు? మొదటి సఫ్ఫులో నించునే మన ముసల్లీలు, క్షమించండి ప్రియులారా బాధ కలిగితే, నేను బాధతో చెబుతున్నాను. ఎందుకంటే ఈరోజు ప్రసంగాల వరద ఉంది, మాషా అల్లాహ్ ప్రసంగాలు జరుగుతున్నాయి, YouTube లో కొడితే ప్రసంగం, ఫలానా Twitter, ఏ సోషల్ మీడియా, కానీ మనం ఎంతవరకు అల్లాహ్ ను గుర్తించాం? ప్రతిసారీ నేను చెబుతున్నాను, తౌహీద్-ఎ-రుబూబియ్యత్ మనం తెలుసుకున్నామా? తౌహీద్-ఎ-ఉలూహియ్యా మనం తెలుసుకున్నామా? తౌహీద్-ఎ-అస్మా వ సిఫాత్ మనం తెలుసుకున్నామా ప్రియులారా? ఒక్కసారి చదవండి.

అల్లాహు అక్బర్, మనము గనక అల్లాహ్ ను గురించి పూర్తి జ్ఞానము తెలుసుకోకుండా, అల్లాహ్ ను విశ్వసించవలసిన విధంగా విశ్వసించకుండా, ఒంటి కాలిపై 100 సంవత్సరాలు నమాజు చేసినా అల్లాహ్ స్వీకరించడు సుబ్ హా నల్లాహ్. మొన్న కూడా చెప్పాను నేను. అనేకమంది ముస్లింలు మాషా అల్లాహ్ 50 ఏళ్ల ముసల్లీలు ఇప్పటికీ కూడా, “అల్లాహ్ ఎక్కడున్నాడండీ?” అంటే, “అల్లాహ్ సర్వవ్యాప్తి” అని చెప్పే ముస్లింలు ఉన్నారు. అల్లాహ్ త’ఆలా అర్ష్ పై ఉన్నాడు. కానీ చాలామంది ముస్లింలు ఇంకా అల్లాహ్ ప్రతిచోటా ఉన్నాడు అని చెప్పేవారు ఉన్నారు. ఆ, చేతులెత్తండి, ఎంతమంది “అల్లాహ్ కి ఆకారం లేదు” అంటే, 90 మంది చేతులెత్తేస్తారు, అల్లాహ్ కి ఆకారం ఉంది ప్రియులారా. అల్లాహ్ కి ముఖం ఉంది, అల్లాహ్ కు చేతులు ఉన్నాయి, అల్లాహ్ కు కాళ్ళు ఉన్నాయి, అల్లాహ్ ఆనందిస్తాడు, అల్లాహ్ నవ్వుతాడు, అల్లాహ్ సంతోషిస్తాడు. కానీ అల్లాహ్ ఎలా ఉన్నాడు ఎవరికీ తెలియదు. అల్లాహ్ చెయ్యి ఎలా ఉంది ఎవరికీ తెలియదు. మనం తౌహీద్ నే తెలుసుకోలేదు, అల్లాహ్ సహాయం ఎక్కడ చేస్తాడు?

కాబట్టి, నేను ఈరోజు మిమ్మల్ని అర్ధిస్తున్నాను. అర్ధిస్తున్నాను ప్రియులారా. అరబీ రాదండీ, ఉర్దూ రాదండీ, కనీసం తెలుగు భాషలో సౌదీ అరేబియాలో, ప్రపంచములో ఇప్పటివరకు బ్రతికున్న మన యొక్క విద్వాంసులలో మహానుభావుడు ఫజీలతుష్ షేఖ్ సాలెహ్ ఫౌజాన్ హఫిజహుల్లాహ్ ఒక పుస్తకం రచించారు, అఖీదా ఎ తౌహీద్“. ఆ పుస్తకం హైదరాబాద్ హదీస్ పబ్లికేషన్స్ వారు తెలుగులో దేవుని ఏకత్వం పేరుతో ప్రింట్ చేశారు. ఈ ఒక్క పుస్తకం తౌహీద్ కొరకు ఇన్షా అల్లాహ్ సాధారణ జనాలకి సరిపోతుంది. ప్రసంగాలు విందాం, దాని ద్వారా జ్ఞానము కూడా జీవితంలో తెచ్చే ప్రయత్నం చేద్దాం ప్రియులారా. ఎప్పటివరకు మనం అల్లాహ్ ను గుర్తించమో, ఎప్పటివరకు అల్లాహ్ ను పోల్చుకోమో, మన ఆరాధన అల్లాహ్ స్వీకరించడు. ప్రియ సోదర సమాజమా, అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని గుర్తించండి.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=20406

తౌహీద్ & షిర్క్ (మెయిన్ పేజీ):
https://teluguislam.net/tawheed-shirk/

అఖీదా-యే-తౌహీద్ (దేవుని ఏకత్వం) – డా. సాలెహ్ అల్ ఫౌజాన్ [పుస్తకం]
https://teluguislam.net/2019/09/20/aqeedah-tawheed-shaykh-fawzan/

సూరహ్ అన్ నాస్ – ప్రతీ పదానికి అర్ధ భావాలు మరియు తఫ్సిర్ (Tafsir Surah An-Nas) [వీడియో]

[1/2] సూరహ్ అన్ నాస్ – ప్రతీ పదానికి అర్ధ భావాలు మరియు తఫ్సిర్ (Tafsir Surah An-Nas) – పార్ట్ 01
https://youtu.be/WDUnsY0M44c [40 నిముషాలు]
[2/2] సూరహ్ అన్ నాస్ – ప్రతీ పదానికి అర్ధ భావాలు మరియు తఫ్సిర్ (Tafsir Surah An-Nas) – పార్ట్ 02
https://youtu.be/p3lXJowIp0U [37 నిముషాలు]

بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ
బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్
అనంత కరుణామయుడూ, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో

114:1  قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ
ఖుల్ అఊదు బిరబ్బిన్నాస్
(ఈ విధంగా) చెప్పు: “నేను మానవుల ప్రభువు రక్షణ కోరుతున్నాను.

114:2  مَلِكِ النَّاسِ
మలికిన్నాస్
మానవుల చక్రవర్తిని,

114:3  إِلَٰهِ النَّاسِ
ఇలాహిన్నాస్
మానవుల ఆరాధ్య దైవాన్ని (ఆశ్రయిస్తున్నాను) –

114:4  مِن شَرِّ الْوَسْوَاسِ الْخَنَّاسِ
మిన్ షర్రిల్ వస్ వాసిల్ ఖన్నాస్
దురాలోచనలను రేకెత్తించే,తప్పించుకునే వాడి కీడు నుండి,

114:5  الَّذِي يُوَسْوِسُ فِي صُدُورِ النَّاسِ
అల్లదీ యు వస్ విసు ఫీ శుదూరిన్నాస్
వాడు జనుల హృదయాలలో దురాలోచనలను రేకెత్తిస్తాడు –

114:6  مِنَ الْجِنَّةِ وَالنَّاسِ
మినల్ జిన్నతి వన్నాస్
వాడు జిన్ను వర్గానికి చెందినవాడైనా సరే, మానవ వర్గానికి చెందినవాడైనా సరే!

యూట్యూబ్ ప్లే లిస్ట్ – సూరహ్ ఫలఖ్, సూరహ్ నాస్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2HGHU2YlPz7otYjjkVQJDo

సూరా అల్ ఫలఖ్ – ఒక్కో పదానికి అర్థాలు & తఫ్సీర్ [వీడియో]

సూరా అల్ ఫలఖ్ ఒక్కో పదానికి అర్థాలు & తఫ్సీర్
https://youtu.be/3HHIbfhQZsc [46 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

సూరా అల్ ఫలఖ్

بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ
బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్
అనంత కరుణామయుడూ, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో

113:1 قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ
ఖుల్ అఊదు బిరబ్బిల్ ఫలఖ్ఖ్
చెప్పు: నేను ప్రాతఃకాలపు ప్రభువు శరణు కోరుతున్నాను –

113:2 مِن شَرِّ مَا خَلَقَ
మిన్ షర్రి మా ఖలఖ్ఖ్
ఆయన సృష్టించిన వాటన్నింటి కీడు నుండి,

113:3 وَمِن شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ
వ మిన్ షర్రి గాసిఖిన్ ఇదా వఖబ్బ్.
కటిక చీకటి క్రమ్ముకున్నప్పటి రాత్రి చీకటి కీడు నుండి,

113:4 وَمِن شَرِّ النَّفَّاثَاتِ فِي الْعُقَدِ
వ మిన్ షర్రిన్ నఫ్పాసఆతి ఫిల్ ఉఖద్ద్
(మంత్రించి)ముడులలో ఊదే వారి కీడు నుండి,

113:5 وَمِن شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ
వ మిన్ షర్రి హాసిదిన్ ఇదా హసద్ద్
అసూయపరుడు అసూయచెందినప్పటి కీడు నుండి (నేను నా ప్రభువు రక్షణ కోరుతున్నాను).