త్రాసును తేలికగా చేసే పాప కార్యాలు (5) – మరణానంతర జీవితం : పార్ట్ 46 [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

త్రాసును తేలికగా చేసే పాప కార్యాలు [5] – [మరణానంతర జీవితం – పార్ట్ 46]
https://www.youtube.com/watch?v=wYTBaAwO2oE [24 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, త్రాసును తేలికగా చేసే పాప కార్యాల గురించి వివరించబడింది. వీటిలో ముఖ్యంగా జ్యోతిష్కులను సంప్రదించడం, వారు చెప్పినది నమ్మడం, మరియు అలా చేయడం వల్ల కలిగే తీవ్రమైన పరిణామాలు (40 రోజుల నమాజ్ స్వీకరించబడకపోవడం, ఇస్లాంను తిరస్కరించినట్లు అవ్వడం) వంటివి హదీసుల ఆధారంగా చర్చించబడ్డాయి. అలాగే, మత్తుపానీయం సేవించడం యొక్క పాపం, దాని పర్యవసానాలు, మరియు పశ్చాత్తాపం యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పబడింది. ఇతరుల హక్కులను కాలరాయడం, వారి ఆస్తులను అన్యాయంగా తీసుకోవడం, మరియు ప్రళయ దినాన “దివాలా తీసిన వ్యక్తి”గా నిలబడటం గురించి హెచ్చరించబడింది. చివరగా, దుష్ప్రవర్తన సత్కార్యాలను ఎలా నాశనం చేస్తుందో, మరియు ఒక ముస్లిం పరువుకు భంగం కలిగించడం ఎంత పెద్ద పాపమో స్పష్టం చేయబడింది.

అస్సలాము అలైకుం వ’రహ్మతుల్లాహి వ’బరకాతుహు. అల్ హందులిల్లాహి వహ్ద వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బా’ద అమ్మా బాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. మనం త్రాసును తేలికగా చేసే పాప కార్యాల గురించి తెలుసుకుంటూ ఉన్నాము.

అందులో ఎనిమిదవ విషయం, జ్యోతిషునితో ఏదైనా ప్రశ్న అడగడం.

మహాశయులారా! ఈ రోజుల్లో మన సమాజంలో స్వయంగా వారి భవిష్యత్తు ఏమిటో వారికి తెలియకుండానే ప్రజల భవిష్యత్తు చెప్పడానికి ఫుట్‌పాత్‌ల మీద, వేరే కొన్ని ప్రదేశాలలో, మరి కొందరు హై-ఫై ఇంకా సౌకర్యాలతో కూడి ఉన్న స్థలాల్లో ఉన్నవారు ఫలానా రోజు అలా జరుగుతుంది, ఫలానా రోజు అలా జరుగుతుంది, నీ వివాహం తర్వాత ఇలా నీకు లాభం ఉంటుంది, నీ వివాహం తర్వాత నీకు ఇలా నష్టం ఉంటుంది, ఈ వ్యాపారం నీవు ప్రారంభిస్తే నీకు ఇందులో లాభం ఉంటుంది, నీకు ఇందులో నష్టం ఉంటుంది, ఈ విధంగా కొన్ని భవిష్య సూచనలు, కొన్ని విషయాలు చెప్పడం మనం అడపాదడపా వింటూనే ఉన్నాము.

వాటిలో అనేక విషయాలు అబద్ధం, అసత్యం అన్న విషయం మనలోని చాలా మందికి తెలుసు. కానీ అనేకమంది కొన్ని మూఢనమ్మకాలు, మూఢవిశ్వాసాలకు గురియై ఉంటారు. వారిపై ఏదైనా ఆపద, ఏదైనా పరీక్ష వచ్చిపడినప్పుడు, ఇలాంటి వారిని నమ్ముకొని, వారి వద్దకు వెళ్ళి తమ భవిష్యత్తు గురించి వారితో తెలుసుకుంటూ ఉంటారు. అయితే ఇలా భవిష్యత్తు గురించి వారిని ఏదైనా ప్రశ్నించడం, ఇది మహా పాప కార్యం. ఎంతటి పాప కార్యం అంటే దీనివల్ల మన ఇతర సత్కార్యాలు, ఇతర మంచి విషయాలు అన్నీ నశించిపోతాయి.

వినండి ఈ హదీథ్.

مَنْ أَتَى عَرَّافًا فَسَأَلَهُ عَنْ شَيْءٍ لَمْ تُقْبَلْ لَهُ صَلَاةُ أَرْبَعِينَ لَيْلَةً
(మన్ అతా అర్రాఫన్ ఫస’అలహు అన్ షై’ఇన్ లమ్ తుఖ్బల్ లహు సలాతు అర్బ’ఈన లైలా)

“ఎవరైనా జ్యోతిష్కుని వద్దకు వచ్చి వారిని ఏదైనా విషయం అడిగారంటే వారి యొక్క నలభై రోజుల నమాజ్ స్వీకరించబడదు.”

నలభై రోజుల నమాజ్. వారి యొక్క నలభై రోజుల నమాజ్ స్వీకరించబడదు అంటే ఎంత నష్టంలో ఆ మనిషి పడి ఉంటాడో గమనించవచ్చు.

అలాగే, తొమ్మిదవ విషయం, ఇలాంటి జ్యోతిషుల వద్దకు వచ్చి వారు చెప్పిన విషయాన్ని సత్యంగా నమ్మడం మరీ భయంకరమైన విషయం. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

مَنْ أَتَى كَاهِنًا أَوْ عَرَّافًا فَصَدَّقَهُ بِمَا يَقُولُ فَقَدْ كَفَرَ بِمَا أُنْزِلَ عَلَى مُحَمَّدٍ
(మన్ అతా కాహినన్ అవ్ అర్రాఫన్ ఫసద్దఖహు బిమా యఖూల్ ఫఖద్ కఫర బిమా ఉన్జిల అలా ముహమ్మద్)

“ఎవరైతే ఇలాంటి జ్యోతిషుల వద్దకు, భవిష్యత్తు గురించి కొన్ని విషయాలు తెలుపుతాము అని అంటారో, వారి వద్దకు వచ్చి వారు ఏదైనా ఒక మాటను వారు సత్యంగా నమ్మితే, అలాంటి వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అల్లాహ్ యే ధర్మాన్ని అవతరింపజేశాడో దానిని తిరస్కరించినట్లు, దాని పట్ల అవిశ్వాసానికి పాల్పడినట్లు.”

అందుకు మహాశయులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. కేవలం ప్రశ్నించడం ద్వారా నలభై రోజుల నమాజు స్వీకరించబడదు. ఇక వారు చెప్పిన సమాధానాన్ని సత్యంగా భావిస్తే అవిశ్వాసానికి పాల్పడినట్లు అవుతుంది. ఇక అవిశ్వాసం వల్ల మన సత్కార్యాలు ఏ ఒక్కటి కూడా మిగలకుండా ఉండిపోతుంది కదా? చివరికి మన త్రాసు తేలికగా ఉండిపోతుంది.

ఇంకా మహాశయులారా, అలాంటి పాప కార్యాల్లో పదవ విషయం, మత్తు సేవించడం. ఈ రోజుల్లో ఎంతమంది మత్తు సేవిస్తూ ఉన్నారు. దీనివల్ల ఎంత పాపాన్ని ఒడిగట్టుకుంటున్నారు. అల్లాహ్ తో భయపడండి. ఆ సృష్టికర్తతో భయపడండి. ప్రళయ దినాన మనకు ఆయన ఇహలోకంలో ఏ ఆరోగ్యం ఇచ్చాడో, ఏ డబ్బు ధనం ఇచ్చాడో వీటన్నిటి గురించి ప్రశ్నిస్తాడు. అప్పుడు మనం ఏం సమాధానం చెప్పుకుందాం?

మన త్రాసును తేలికగా చేసే పాప కార్యాల్లో ఒకటి, పదవది, మత్తు సేవించడం. దీనికి సంబంధించిన హదీథ్ ఈ విధంగా ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

“ఎవరైతే మత్తు సేవిస్తారో వారి యొక్క నలభై రోజుల నమాజ్ స్వీకరించబడదు. అతను తౌబా చేస్తే అల్లాహ్ తౌబా అంగీకరిస్తాడు.”

తౌబా అంటే తెలుసు కదా, అల్లాహ్ తో క్షమాపణ కోరడం, ఇక ఎన్నడూ అలాంటి పాపానికి ఒడిగట్టను అని శపధం చేసుకోవడం మరియు తిరిగి ఆ పాపాన్ని చేయకపోవడం. ఎవరైతే ఇలా మత్తు సేవిస్తారో వారి నలభై రోజుల నమాజ్ స్వీకరించబడదు. ఇక ఎవరైతే తౌబా చేస్తారో అల్లాహ్ అతని తౌబాను స్వీకరిస్తాడు.

మళ్ళీ ఎవరు రెండవసారి మత్తు సేవిస్తాడో, ఇక ఆ తర్వాత తౌబా చేసుకుంటాడో, అల్లాహ్ అతని తౌబా స్వీకరిస్తాడు. మళ్ళీ ఎవరైతే మూడోసారి మత్తు సేవిస్తాడో మరియు మళ్ళీ తౌబా చేస్తాడో, అల్లాహ్ అతని తౌబా మూడవసారి కూడా స్వీకరిస్తాడు. కానీ అతను మళ్ళీ నాలుగోసారి అదే అలవాటుకు పాల్పడ్డాడు, ఆ తర్వాత మళ్ళీ అతను తౌబా చేస్తే, ఇక నాలుగోసారి అల్లాహ్ అతని తౌబాను స్వీకరించడు.

మొదటిసారి అతను మత్తు సేవిస్తే నలభై రోజుల నమాజ్ స్వీకరించబడదు. తౌబా చేస్తే తౌబా స్వీకరించబడుతుంది. రెండవసారి మత్తు సేవిస్తే, రెండవసారి నలభై రోజుల నమాజ్ స్వీకరించబడదు. తౌబా చేస్తే తౌబా స్వీకరించబడుతుంది. మళ్ళీ మూడవసారి మత్తు సేవిస్తే నలభై రోజుల నమాజ్ స్వీకరించబడదు. మూడవసారి తౌబా చేస్తే అల్లాహ్ తౌబా స్వీకరిస్తాడు. కానీ మళ్ళీ నాలుగోసారి, మళ్ళీ నాలుగోసారి అదే మత్తు సేవించడానికి అలవాటు పడితే, ఇక ఆ తర్వాత తౌబా చేస్తే అల్లాహ్ అతని తౌబా స్వీకరించడు.

నాలుగోసారి మత్తు సేవించడానికి పాల్పడ్డాడు అంటే మళ్ళీ నలభై రోజుల నమాజ్ స్వీకరించబడదు. ఇక ఆ తర్వాత తౌబా చేస్తే తౌబా కూడా స్వీకరించబడదు. అంటే మూడుసార్లు అల్లాహ్ మనకు, అలాంటి పాపం చేసిన వారికి అవకాశం ఇచ్చాడు. నాలుగోసారి ఆ పాపానికి ఒడిగడితే అల్లాహ్ ఇక అతని తౌబా కూడా స్వీకరించడు.

ఏం జరుగుద్ది? అతను అదే స్థితిలో చనిపోయాడు అంటే అల్లాహ్ ప్రళయ దినాన అతనికి ఏమిస్తాడు? మహాశయులారా, భయపడండి అల్లాహ్ తో. నాలుగోసారి మళ్ళీ అతడు అలవాటు పడ్డాడు అంటే నలభై రోజుల నమాజ్ స్వీకరించబడదు, తౌబా చేస్తే తౌబా కూడా స్వీకరించబడదు. అల్లాహ్ అతనికి నహరుల్ ఖబాల్, అల్-ఖబాల్ అన్న నది నుండి వచ్చే ద్రవం త్రాగిపిస్తాడు. ఆ ఖబాల్ నది నుండి వచ్చే ద్రవం ఏంటిది, ఎలా ఉంటుంది, ఏమిటి అని అడిగినప్పుడు, అది నరకవాసుల పుండ్ల నుండి కారుతూ వచ్చిన చీము అని చెప్పడం జరిగింది.

ఎప్పుడైనా గమనించారా? మన శరీరంలో ఎక్కడైనా ఏదైనా పుండు ఉంది అంటే స్వయంగా మనం మన శరీరంలోని పుండు నుండి వచ్చే చీమును చూడడం, దాని యొక్క దుర్వాసనను మనం భరించలేం. ఇక నరకవాసుల వారి యొక్క పుండ్ల నుండి కారుతున్న చీము వారికి త్రాగడానికి ఇవ్వడం జరుగుతుంది అంటే ఇకనైనా మత్తు సేవించడాన్ని మానుకుంటారు అని నేను ఆశిస్తున్నాను. ఇలా మానుకునే సద్భాగ్యం అల్లాహ్ ఈ త్రాగే వారందరికీ, మత్తు సేవించే వారందరికీ అల్లాహ్ తౌబా చేసుకునే సద్భాగ్యం ప్రసాదించాలి అని అల్లాహ్ తో వేడుకుంటున్నాను.

మహాశయులారా, ప్రళయ దినాన త్రాసును తేలికగా చేసే పాపాల్లో 11వ విషయం, ప్రజల సొమ్మును కాజేసుకోవడం, ప్రజల సొమ్ము తినివేయడం. ఇది కూడా మహా పాపం.

మహాశయులారా, త్రాసును తేలికగా చేసే పాప కార్యాల్లో 11వ విషయం, ఇతరుల సొమ్మును కాజేయడం, వారిపై దౌర్జన్యం చేయడం. దీనికి సంబంధించిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీథ్ ఏమిటంటే, ఒక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రశ్నించారు:

أَتَدْرُونَ مَنِ الْمُفْلِسُ
(అతద్రూన మనిల్ ముఫ్లిస్)
“ముఫ్లిస్ (దివాలా తీసినవాడు) అంటే ఎవరో మీకు తెలుసా?”

అప్పుడు సహచరులు అన్నారు:

الْمُفْلِسُ فِينَا مَنْ لاَ دِرْهَمَ لَهُ وَلاَ مَتَاعَ
(అల్-ముఫ్లిసు ఫీనా మన్ లా దిర్హమ లహు వలా మతా’అ)
“ప్రవక్తా, మాలోని బీదవాడు ఎవరంటే ఎవరి వద్దనైతే ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, ప్రపంచ సామాగ్రి ఏమీ లేదో అలాంటి వారు”

అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

నా అనుచర సంఘంలోని బీదవారు ఎవరంటే, ప్రళయ దినాన నమాజ్, జకాత్, ఉపవాసాలు, నమాజ్, జకాత్ (విధిదానాలు), రోజా (ఉపవాసాలు), వీటన్నిటినీ తీసుకుని వస్తాడు.

وَيَأْتِي قَدْ شَتَمَ هَذَا وَقَذَفَ هَذَا وَأَكَلَ مَالَ هَذَا وَسَفَكَ دَمَ هَذَا وَضَرَبَ هَذَا
(వ య’తీ ఖద్ షతమ హాదా, వ ఖదఫ హాదా, వ అకల మాల హాదా, వ సఫక దమ హాదా, వ దరబ హాదా)

ఇంకా ప్రళయ దినాన ఆ వ్యక్తి ఎలా వస్తాడు అంటే, ఎవరినైనా దూషించి, ఎవరిపైనైనా అపనింద వేసి, ఎవరి సొమ్ము అపహరించి, ఎవరినైనా హత్య చేసి, ఎవరినైనా కొట్టి…

ఈ విధంగా ప్రజలలో ఎందరి పట్ల ఎన్నో రకాల అన్యాయాలకు గురియై ప్రళయ దినాన హాజరవుతాడు. అతని వెంట నమాజ్, విధిదానాలు, ఉపవాసాలు ఉన్నాయి, కానీ ఇలాంటి పాపాలు కూడా ఉన్నాయి. అప్పుడు ఏం జరుగుద్ది? వారందరూ, ఇతని నుండి ఎవరెవరికి ఏయే అన్యాయం జరిగిందో, వారందరూ హాజరవుతారు మరియు అల్లాహ్ వద్ద ఇతని గురించి షికాయత్ చేసినప్పుడు, ఇతని గురించి అల్లాహ్ వద్ద అడిగినప్పుడు, అల్లాహు త’ఆలా అతని యొక్క సత్కార్యాలన్నీ కూడా వారి వారిపై జరిగిన అన్యాయానికి సమానంగా వారికి ఇచ్చేస్తాడు.

ఆ తర్వాత, ఇతని వద్ద సత్కార్యాలన్నీ కూడా మిగలకుండా అయిపోయినప్పుడు, ఇంకా ఎన్నో కేసులు మిగిలి ఉన్నప్పుడు, వారిపై జరిగిన అన్యాయానికి సమానంగా వారి పాపాలు తీసుకుని ఇతనిపై వేయడం జరుగుతుంది మరియు ఇతన్ని నరకంలో పంపడం జరుగుతుంది. గమనించారా? నమాజులు ఉన్నాయి, ఉపవాసాలు ఉన్నాయి, ఇంకా ఎన్నో రకాల విధిదానాలు, దానధర్మాలు ఉన్నాయి. కానీ కొట్టడం, తిట్టడం, అపనింద వేయడం, ఈ రకంగా ఎన్నో పాపాలకు గురి అయినందుకు వారందరూ కూడా వచ్చి ఇతనికి వ్యతిరేకంగా అల్లాహ్ వద్ద కేసు పెట్టినప్పుడు, ఇతని సత్కార్యాలన్నీ వారికి ఇవ్వడం జరుగుతుంది. సత్కార్యాలన్నీ ఇచ్చినప్పటికీ ఇంకా కొన్ని కేసులు మిగిలి ఉంటే, వారి యొక్క పాపాలు ఇతనిపై వేయబడి, ఇతన్ని నరకంలో పంపడం జరుగుతుంది. ఎంత నష్టం అవుతుందో కదా? అల్లాహ్ యొక్క ఎంత గొప్ప అనుగ్రహం, ఇలాంటి పరిస్థితులు రానున్నాయి, అందు గురించి ఇహలోకంలోనే జాగ్రత్త పడి అక్కడికి వచ్చే ప్రయత్నం చేయండి అని మనకు చెప్పడం జరుగుతుంది.

ఈ విధంగా మహాశయులారా, ఎవరైతే ఇలాంటి అన్యాయాలకు పాల్పడతారో, ఇహలోకంలోనే వారి యొక్క ఆ హక్కు చెల్లించేసేయాలి. మన వద్ద చెల్లించడానికి ఏమీ లేకుంటే, కనీసం వారితో కలిసి, వారితో మాఫీ చేయించుకోవాలి. లేదా అంటే ప్రళయ దినాన ఇలాంటి ఘోరమైన శిక్షకు గురి కావలసి వస్తుంది, ప్రళయ దినాన మన యొక్క త్రాసు అనేది తేలికగా అయిపోతుంది.

తిర్మిజీలోని ఒక హదీథ్ లో ఉంది, ఒక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని హజ్రత్ అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించారు:

“అల్లాహ్ ఆ మనిషిని కరుణించు గాక, అతని ద్వారా ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగింది అంటే అతను వారితో క్షమాపణ కోరి లేదా వారికి ఏదైనా ఇచ్చే హక్కు ఉండేది ఉంటే ఇచ్చేసి ఇహలోకంలోనే ఎలాంటి బరువు లేకుండా, ఎలాంటి ఒకరిపై అన్యాయం లేకుండా ఉంటాడో, ఈ విధంగా ప్రళయ దినాన అతను కలుసుకున్నప్పుడు అల్లాహ్ యొక్క కరుణా కటాక్షాలను పొందుతాడు. కానీ ఎవరైతే ఇలా కాకుండా ప్రజల పట్ల అన్యాయాలకు గురి అయి వస్తాడో, ప్రళయ దినాన అల్లాహు త’ఆలా ఇతని పుణ్యాలు ఆ బాధితులకు ఇచ్చేస్తాడు. ఇతని వద్ద పుణ్యాలు లేనిచో, బాధితుల నుండి వారిపై జరిగిన అన్యాయానికి సమానంగా పాపాలు తీసుకుని ఇతనిపై వేయడం జరుగుతుంది.”

అందుగురించి మహాశయులారా, అన్ని స్థితుల్లో అల్లాహ్ తో భయపడుతూ ఉండాలి. ఎక్కడ ఎవరు ఏమీ చూడడం లేదు అని భావించకుండా మనం అన్ని రకాల సత్కార్యాల్లో ముందుకు ఉండాలి. ఎవరిపై కూడా ఎలాంటి అన్యాయం చేయకుండా జాగ్రత్త పడాలి.

ప్రజల పట్ల ఏదైనా అన్యాయం చేయడం, ఇది ఎంత భయంకరమైన పాపమో మన యొక్క సలఫె సాలెహీన్ రహిమహుముల్లాహ్ చాలా మంచి విధంగా గ్రహించేవారు. అందుకే సుఫ్యాన్ అస్-సౌరీ రహమహుల్లాహ్ ఒక సందర్భంలో చెప్పారు:

“నా మధ్య, అల్లాహ్ మధ్య 70 పాపాలు ఉండడం, నాకు, నా మధ్య మరియు నాలాంటి మనుషుల మధ్య ఒక్క పాపం ఉండడం కంటే ఎంతో ఇష్టమైనది. ఎందుకంటే నా మధ్య నా ప్రభువు మధ్య ఉండే పాపాల గురించి నేను డైరెక్ట్ గా క్షమాపణ కోరుకుంటే అది మన్నించడం జరుగుతుంది. కానీ నా మధ్య మరియు నాలాంటి దాసుని మధ్య ఉన్న పాపం అది నేను అల్లాహ్ తో క్షమాపణ కోరుకుంటే క్షమించబడదు. వెళ్ళి అతనితో క్షమాపణ కోరుకోవాలి, లేదా అతనికి ఏదైనా హక్కు ఇచ్చేది ఉంటే తప్పకుండా ఇవ్వాలి.”

ఇక ఇక్కడ ఒక విషయం గమనించండి మీరు కూడా. ఏ ఇస్లాం ధర్మం అయితే ఇతరులకు ఏ బాధ కలిగించకుండా, ఇతరులపై ఏ అన్యాయం చేయకుండా ప్రళయ దినాన హాజరు కావాలి అని నేర్పుతుందో, ఆ ఇస్లాం ధర్మం, ఇస్లాంకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాల్లో ఏయే అభాండాలు మోపడం జరుగుతుందో వాటన్నిటి శిక్షణ ఇస్లాం ఇస్తుంది అని చెప్పగలమా? బుద్ధి జ్ఞానంతో మనం గ్రహిస్తే, సోదరులారా, సోదరీమణులారా, సామాన్య జీవితంలో మామూలీ చిన్నపాటి ఏ అన్యాయానికి కూడా ఇస్లాం మనకు అనుమతి ఇవ్వదు. ఎందుకంటే దీనివల్ల ప్రళయ దినాన మన త్రాసు బరువు తగ్గిపోతుంది అని హెచ్చరించడం జరుగుతుంది.

ఇక యుద్ధ మైదానంలో ఉన్నప్పటికీ కూడా, యుద్ధంలో శత్రువులు మన ముంగట ఉన్న ఉండి, యుద్ధాలు జరుగుతున్నప్పుడు కూడా ఏ ఒక్కరి పట్ల అన్యాయంగా ప్రవర్తించకుండా ఉండడానికి కూడా ఇస్లాం మనకు శిక్షణ ఇచ్చి ఉంది.

హజ్రత్ ముఆద్ ఇబ్ను అనస్ రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖనం ప్రకారం, “మేము ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వెంట ఒక యుద్ధంలో ఉన్నాము. ఆ యుద్ధంలో ఒక సందర్భంలో ఒకచోట మజిలీ చేయడం అవసరం పడింది. అయితే అప్పుడు ప్రవక్తతో ఉన్న ప్రజల్లో కొంతమంది దారిలో ప్రజలు నడిచేటువంటి దారిలో సైతం తమ యొక్క గుడారాలు వేసుకొని, ప్రజలకు నడవడంలో ఇబ్బంది కలిగే అటువంటి విధంగా ప్రవర్తించడం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూశారు.” ఏం చెప్పారు అప్పుడు?

గమనించండి. ఈ రోజుల్లో సిటీలలో ప్రజలు నడిచే దారిని కూడా ఆక్రమించుకోవడం జరుగుతుంది. ఆ రోజుల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యుద్ధ మైదానంలో ఉన్నారు. ఎడారిలో. కానీ ప్రజలు అడపాదడపా వచ్చిపోయే దారిలో గుడారాలు వేసుకొని, టెంట్ వేసుకొని ప్రజలకు నడవడంలో ఇబ్బంది కలిగే విధంగా ఉండడాన్ని కూడా ఇష్టపడలేదు. అదే సందర్భంలో ఎలాంటి ఆదేశం జారీ చేశారో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు: “ఎవరైతే ప్రవక్తతో యుద్ధంలో పాల్గొన్నాము, చాలా పుణ్యాలు మనం పొందుతాము అన్నటువంటి సంతోషంలో పడి ఉన్నారో కానీ దారిలో ఏదైనా గుడారం వేసి, టెంట్ వేసి ప్రజలకు నడిచే దారిలో వారికి ఇబ్బంది కలుగజేస్తున్నారో, అలాంటి వారికి ఆ యుద్ధం యొక్క ఏ పుణ్యమూ లభించదు.” ఏ పుణ్యమూ లభించదు అంటే ఏమిటి? యుద్ధం పాల్గొనే యొక్క గొప్ప పుణ్యం ఏదైతే ఉందో, దానిని ఇలాంటి చిన్నపాటి అన్యాయం అని అనుకుంటారు కావచ్చు, మరికొందరైతే దీనిని ఏ అన్యాయము అని కూడా భావించరు కావచ్చు, అలాంటి విషయాన్ని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహించడం లేదు.

అందుగురించి మహాశయులారా, మనం ప్రజల పట్ల ఉత్తమ రీతిలో ప్రవర్తించాలి. వారిపై మన నుండి ఏ ఒక్క చిన్నపాటి అన్యాయం ఉండకూడదు లేదా అంటే ప్రళయ దినాన మనం చాలా నష్టపోయే వారిలో కలుస్తాము.

ప్రళయ దినాన మన త్రాసు తేలికగా అయ్యే పాప కార్యాల్లో 12వ విషయం, దుష్ప్రవర్తన.

త్రాసును బరువుగా చేసే సత్కార్యాలలో సత్ప్రవర్తన అని విన్నాము కదా? అయితే త్రాసును తేలికగా చేసే దుష్కార్యాల్లో దుష్ప్రవర్తన.

దుష్ప్రవర్తనకు సంబంధించిన విషయం మనం ఎప్పుడైతే సత్ప్రవర్తన గురించి విన్నామో, అక్కడ ఒక హదీసు విన్నాము. అదేమిటంటే అల్లాహ్ కు ప్రియమైన వారిలో, ఎవరైతే ప్రజల పట్ల ప్రయోజనకరంగా జీవిస్తారో మరియు అల్లాహ్ కు ఇష్టమైన ప్రియమైన కార్యాల్లో ఒక ముస్లింని సంతోషపెట్టడం, వారిపై ఏదైనా అప్పు ఉంటే అప్పు చెల్లించడంలో సహాయం చేయడం, వారికి ఏదైనా కష్టం ఉంటే ఆ కష్టం తొలగిపోవడంలో వారికి సహాయం చేయడం, ఈ విధంగా ఎన్నో విషయాలు వింటూ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు అని కూడా మనం విన్నాము: “నేను నా ఈ మస్జిద్ లో ఏతెకాఫ్ చేయడం కంటే నా యొక్క సోదరుని అవసరాన్ని తీర్చడం నాకు ఎక్కువ ఇష్ట కార్యం.”

ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

وَإِنَّ سُوءَ الْخُلُقِ لَيُفْسِدُ الْعَمَلَ كَمَا يُفْسِدُ الْخَلُّ الْعَسَلَ
(వ ఇన్న సూ’అల్ ఖులుఖి లయుఫ్సిదుల్ అమల కమా యుఫ్సిదుల్ ఖల్లుల్ అసల)

వినండి, నిశ్చయంగా దుష్ప్రవర్తన మీ సర్వ సత్కార్యాలను భస్మం చేసేస్తుంది. మీ సర్వ సత్కార్యాల సత్ఫలితాన్ని నశింపజేస్తుంది, ఎలాగైతే వెనిగర్ తేనె యొక్క తీపిని నశింపజేస్తుందో.

ఒకసారి అనుభవించి చూడండి, ఎంత క్వాలిటీ గల, స్వచ్ఛమైన, ఎలాంటి కలుషితం లేకుండా తేనె మీ వద్ద ఉన్నా, అందులో మీరు వెనిగర్ కలిపారంటే, ఆ వెనిగర్ అనేది ఆ తేనెపై ఎంత దుష్ప్రభావం చూపుతుందో, అలాగే మీ దుష్ప్రవర్తన అనేది మీ సర్వ సత్కార్యాలను నశింపజేస్తుంది.

అందు గురించి మహాశయులారా, మనం ఒకరి పట్ల దుష్ప్రవర్తన ప్రవర్తించకూడదు. ప్రతి ఒక్కరితో ఉత్తమంగా ప్రవర్తించే ప్రయత్నం చేయాలి. ఇంట్లో భార్యాభర్తల్లో గాని, తల్లిదండ్రులు పిల్లలతో గాని, పిల్లలు తల్లిదండ్రులతో గాని, పరస్పరం సోదర సోదరీమణులు ఒకరి పట్ల ఒకరు, ఈ విధంగా ఇంటి బయటికి వెళ్ళిన తర్వాత ప్రజల పట్ల కూడా మన వ్యవహారం చాలా ఉత్తమంగా ఉండాలి.

ప్రళయ దినాన మన త్రాసును తేలికగా చేసే దుష్కార్యాల్లో 13వ విషయం, ముస్లిం యొక్క, ఒక విశ్వాసునిపై ఏదైనా అపనింద వేసి అతన్ని అవమాన పాలు చేయడం.

మహాశయులారా, ఇది చూడడానికి చిన్న విషయం కానీ, మహా భయంకరమైన పాపం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు:

إِنَّ مِنْ أَرْبَى الرِّبَا الاِسْتِطَالَةُ فِي عِرْضِ الْمُسْلِمِ بِغَيْرِ حَقٍّ
(ఇన్న మిన్ అర్బర్-రిబా అల్-ఇస్తితాలతు ఫీ ఇర్ దిల్ ముస్లిం బిగైరి హఖ్ఖిన్)

ఒక ముస్లింను అన్యాయంగా, అక్రమంగా అవమానించడం ఇది వడ్డీలో అతి భయంకరమైన భాగం

అంటే ఏమిటి? వడ్డీ ఎలాగైతే పుణ్యాన్ని నశింపజేస్తుందో, ఆ విధంగా ఒక ముస్లింపై మనం ఏదైనా అపనింద వేసాము, అతన్ని అవమాన పాలు చేసాము అంటే ఈ రకంగా మనకు చాలా నష్టం కలుగుతుంది. ఇది కూడా దుష్ప్రవర్తనలో వచ్చేస్తుంది, సత్ప్రవర్తనకు వ్యతిరేకంగా ఉంటుంది.

అల్లాహు త’ఆలా మనందరికీ కూడా మన త్రాసును బరువు చేసే సత్కార్యాలు చేసే భాగ్యం ప్రసాదించి, త్రాసును తేలికగా చేసే దుష్కార్యాల నుండి దూరం ఉండే భాగ్యం ప్రసాదించు గాక. జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వ’రహ్మతుల్లాహి వ’బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43736

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
మరణానంతర జీవితం [పుస్తకం]

త్రాసును తేలికగా చేసే పాప కార్యాలు (4) – మరణానంతర జీవితం : పార్ట్ 45 [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

త్రాసును తేలికగా చేసే పాప కార్యాలు [4] – [మరణానంతర జీవితం – పార్ట్ 45]
https://www.youtube.com/watch?v=nMRENiqwyCw [21 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, వక్త ప్రళయ దినాన మంచి పనుల త్రాసును తేలికగా చేసే వివిధ పాప కార్యాల గురించి వివరిస్తున్నారు. (3) ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాట కంటే ఇతరుల ఆదేశాలకు ప్రాధాన్యత ఇవ్వడం, (4) అల్లాహ్ క్షమించడని ఇతరుల గురించి ప్రమాణం చేయడం, (5) అసర్ నమాజ్‌ను వదులుకోవడం, (6) ఏకాంతంలో అల్లాహ్ నిషేధించిన కార్యాలకు పాల్పడటం మరియు (7) సరైన కారణం లేకుండా కుక్కను పెంచడం వంటివి ఇందులో ఉన్నాయి. ఈ చర్యలు కొండలంత పుణ్యాలను కూడా నాశనం చేసి, వాటిని దుమ్ము ధూళి వలె మార్చేస్తాయని ఖురాన్ మరియు హదీసుల ఆధారాలతో హెచ్చరించారు.

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహి కఫా వస్సలాతు వస్సలాము అలా ఇబాదిల్లజీ నస్తఫా అమ్మాబాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

త్రాసును తేలికగా చేసే పాప కార్యాల గురించి మనం తెలుసుకుంటున్నాము. అందులో మూడవది, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాటపై, ఆయన ఆదేశంపై ఇతరుల ఆదేశాలకు ప్రాధాన్యత ఇవ్వడం.

మహాశయులారా! ఇది కూడా మహా ఘోరమైన పాపం. దీనివల్ల మన పుణ్యాలన్నీ కూడా, సత్కార్యాల సత్ఫలితాలన్నీ కూడా నశించిపోయి, మన త్రాసు అనేది తేలికగా అయిపోతుంది. సూరె హుజరాత్ ఆయత్ నెంబర్ ఒకటిలో అల్లాహు త’ఆలా విశ్వాసులందరికీ ఇచ్చిన ఆదేశం ఏమిటంటే,

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تُقَدِّمُوا بَيْنَ يَدَيِ اللَّهِ وَرَسُولِهِ
(యా అయ్యుహల్లజీన ఆమనూ లా తుఖద్దిమూ బైన యదయిల్లాహి వ రసూలిహి)
విశ్వసించిన ఓ ప్రజలారా! అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను మించిపోకండి.  (49:1)

మనం విశ్వాసులం, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఆదేశాలను అనుసరిస్తూ ఉండాలి. కానీ వారి కంటే ముందుగా, ఆదేశం లభించక ముందే తన మన ఇష్టానుసారం ఏదైనా చేయడానికి, ఆదేశం వచ్చిన తర్వాత దాన్ని అనుసరించకుండా మన అభిప్రాయాలను మనం అనుసరించడానికి ఏమాత్రం అనుమతి మనకు లేదు.

ఆ తర్వాత సూరె హుజరాత్‌లోని ఆయత్ నెంబర్ రెండును గమనించండి. అందులో ఇవ్వబడిన హెచ్చరిక ద్వారా భయ కంపితులై, అలాంటి చేష్టలకు గురి కాకుండా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం మనం చేయాలి.

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَرْفَعُوا أَصْوَاتَكُمْ فَوْقَ صَوْتِ النَّبِيِّ وَلَا تَجْهَرُوا لَهُ بِالْقَوْلِ كَجَهْرِ بَعْضِكُمْ لِبَعْضٍ أَن تَحْبَطَ أَعْمَالُكُمْ وَأَنتُمْ لَا تَشْعُرُونَ
(యా అయ్యుహల్లజీన ఆమనూ లా తర్‌ఫఊ అస్వాతకుమ్ ఫౌఖ సౌతిన్నబియ్యి వలా తజ్‌హరూ లహూ బిల్ ఖౌలి కజహ్రి బఅదికుమ్ లి బఅదిన్ అన్ తహ్‌బత అఅమాలుకుమ్ వ అన్తుమ్ లా తష్ఉరూరున్)
ఓ విశ్వాసులారా! మీ కంఠస్వరాలను ప్రవక్త కంఠస్వరం కంటే పైన (హెచ్చుగా) ఉంచకండి. మీరు పరస్పరం బిగ్గరగా మాట్లాడుకునే విధంగా ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం తో బిగ్గరగా మాట్లాడకండి. దీనివల్ల మీ కర్మలన్నీ వ్యర్ధమైపోవచ్చు. ఆ సంగతి మీకు తెలియను కూడా తెలియదు..” (49:2)

ఓ విశ్వాసులారా! ప్రవక్త మాట కంటే, ప్రవక్త స్వరం కంటే మీ స్వరం అనేది ఎత్తుగా ఉండకూడదు. మరియు మీరు పరస్పరం ఎలానైతే ఒకరు మరొకరిని పిలుచుకుంటారో అలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ప్రవర్తించకండి. చివరికి మీరు, మీరు చేసే ఈ దుష్కార్యం వల్ల, మీరు ప్రవక్త స్వరంపై మీ స్వరాన్ని ఎత్తడం వల్ల, పరస్పరం మీరు ఎలా పిలుచుకుంటారో అలా ప్రవక్తను పిలవడం ద్వారా మీ సత్కార్యాలన్నీ కూడా వృధా అయిపోతాయి. అది మీకు తెలియకుండానే జరగవచ్చు. అంటే మీ పాపాల, మీ ఈ పాపం వల్ల మీ సత్కార్యాలు నశించిపోతున్నాయి అన్న విషయం మీకు తెలియకుండానే ఇదంతా జరగవచ్చు. అల్లాహు అక్బర్. ఎంత భయంకరమైన విషయమో గమనించండి.

ప్రవక్త స్వరంపై మన స్వరాన్ని ఎత్తడం, ప్రవక్త మాటపై మన మాటను పెంచడం, పరస్పరం పిలుచుకున్నట్లు ప్రవక్తను పిలవడం, దీనివల్ల మనకు తెలియకుండానే మన సత్కార్యాలు వృధా అవుతున్నాయి అంటే, ఇక ఎవరైతే తెలిసి తెలిసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశాన్ని విడనాడుతున్నారో, ప్రవక్త ఆదేశం ఒకటి ఉంది అంటే, తనకిష్టమైన నాయకుడు, తనకిష్టమైన ఇమామ్, తనకిష్టమైన పీర్, తనకిష్టమైన మౌల్వీ సాబ్, వారి యొక్క ఫత్వాలు ఇంకో రకంగా ఉంటే ప్రవక్తను వదిలేసి వారినే అనుసరిస్తున్నారో, వారి యొక్క సత్కార్యాలు వృధా కావా? అలాంటి వారు భయపడే అవసరం లేదా?

ఈ రోజుల్లో మనలోని ఎంతో మంది సోదరులు, ఒకవైపు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానం, మరోవైపు మన తాత ముత్తాతల విధానం, మన యొక్క దురాచారాలు, మన యొక్క గ్రామ చట్టాలు ఈ విధంగా ఉంటాయి. ప్రవక్తను వదిలేసి వాటిని అనుసరిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి వారు ఏ నష్టంలో పడరు అని ఏదైనా మన దగ్గర జమానత్ ఉందా? అందు గురించి మనం ఈ ఆయతులు చదివిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి.

మహాశయులారా! మన త్రాసును తేలికగా చేసే పాప కార్యాల్లో, అల్లాహ్ ఫలానా వ్యక్తిని క్షమించడు అని ప్రమాణం చేయడం. అల్లాహు అక్బర్. ఒకసారి ఈ హదీసును గ్రహించండి. హజ్రత్ జుందుబ్ రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఒక వ్యక్తి ఇలా అన్నాడు,

إِنَّ اللَّهَ لَا يَغْفِرُ لِفُلَانٍ
(ఇన్నల్లాహ లా యగ్‌ఫిరు లి ఫులాన్)
నిశ్చయంగా అల్లాహ్ ఫలానా వ్యక్తిని క్షమించడు, మన్నించడు.

అప్పుడు అల్లాహు త’ఆలాకు చాలా కోపం వచ్చింది. అల్లాహ్ ఆగ్రహానికి గురి అయ్యాడు. ఫలానా వ్యక్తిని నా అతనికి నా క్షమాపణ లభించదు అని, నా వైపు నుండి అతన్ని కరుణించడం జరగదు అని ప్రమాణాలు చేసేటువంటి అధికారం ఇతనికి ఎక్కడి నుండి వచ్చింది? నిశ్చయంగా నేను ఫలానా వ్యక్తిని క్షమించాను మరియు ఇలాంటి ప్రమాణాలు చేసే వ్యక్తి యొక్క సర్వ సత్కార్యాలను వృధా చేసేసాను. అల్లాహు అక్బర్. గమనించారా? ఎంత భయంకరమైన విషయమో.

అయితే మహాశయులారా, అల్లాహ్ యొక్క కరుణా కటాక్షాలను, మన్నింపు క్షమాపణలను మనం మన చేతిలో, మన అధికారంలో తీసుకోకూడదు. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తూ ఉంటే, “సోదరా! ఇలాంటి తప్పు చేసే వారిని అల్లాహ్ క్షమించడు అని తెలియజేయడం జరిగింది. ఇలాంటి పాపం చేసే వారిని అల్లాహ్ శపిస్తాడని తెలియజేయడం జరిగింది. ఇలాంటి పాపం చేసేది ఉంటే అల్లాహ్ నరకంలో ప్రవేశింపజేస్తాడు అని చెప్పడం జరిగింది. ఇలాంటి పాపం చేసేది ఉంటే అల్లాహ్ స్వర్గంలో పంపడం లేదు అని చెప్పడం జరిగింది.” ఇలాంటి బోధన మనం చేయాలి. కానీ, “నువ్వు ఈ తప్పు చేస్తున్నావా? నిన్ను అల్లాహ్ క్షమించనే క్షమించడు. అల్లాహ్ నీకు ఎప్పుడూ కూడా పశ్చాత్తాపపడి క్షమాపణ కోరుకునే అధికారమే, అటువంటి భాగ్యమే ప్రసాదించడు.” ఇట్లాంటి ఆదేశాలు మనం జారీ చేయకూడదు. ఒకరిని అల్లాహ్ యొక్క క్షమాపణ పట్ల నిరాశకు గురి చేయకూడదు.

ఒకవేళ ఇదే ప్రమాణాలు చేసుకుంటూ, నిన్ను ఎన్నటికీ అల్లాహ్ క్షమించడు అని అంటే, అల్లాహ్, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ అతనికి అతను ఆగ్రహానికి గురై, ఇలాంటి వ్యక్తి యొక్క సర్వ సత్కార్యాలను వృధా చేసేస్తాడు. అల్లాహు అక్బర్. అందు గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.

మహాశయులారా! త్రాసును తేలికగా చేసే పాపాల్లో, అసర్ నమాజ్‌ను వదులుకోవడం. అల్లాహు అక్బర్. అసర్ నమాజ్. అల్లాహ్ రేయింబవళ్ళలో, రాత్రి పగళ్ళలో ఐదు వేలల నమాజ్ మనపై విధిగావించాడు. ఐదు నమాజుల్లో ఒకటి మధ్యలో ఉన్న నమాజ్ అసర్ నమాజ్. ఎవరైతే అసర్ నమాజ్ వదిలేస్తారో వారి యొక్క సత్కార్యాలు వృధా అయిపోతాయి. శ్రద్ధ వహించండి ఈ హదీసుపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు,

مَنْ تَرَكَ صَلَاةَ الْعَصْرِ فَقَدْ حَبِطَ عَمَلُهُ
(మన్ తరక సలాతల్ అస్ర్ ఫఖద్ హబిత అమలుహూ)
ఎవరైతే అసర్ నమాజ్‌ను విడనాడతారో వారి యొక్క సత్కార్యాలన్నీ కూడా వృధా అయిపోతాయి.

ఈ అసర్ నమాజ్ ఎంత ముఖ్యమైనదంటే,

حَافِظُوا عَلَى الصَّلَوَاتِ وَالصَّلَاةِ الْوُسْطَىٰ
(హాఫిజూ అలస్సలవాతి వస్సలాతిల్ వుస్తా)
“నమాజులను, ప్రత్యేకించి మధ్య నమాజును కాపాడండి.” (2:238)

అని అల్లాహు త’ఆలా ఖురాన్లో ఆదేశం ఇచ్చాడు. మీరు అన్ని నమాజులను పాబందీగా చేస్తూ ఉండండి. కానీ మధ్యలో ఉన్న నమాజు పట్ల ఎక్కువ శ్రద్ధ వహించండి. ఇందులో మధ్యలోని నమాజ్ అంటే అసర్ నమాజ్ అని ఎన్నో హదీసుల ద్వారా మనకు తెలుస్తుంది.

అబూ ములైహ్ రహిమహుల్లాహ్ చెప్పారు, మేము ఒక సందర్భంలో, ఒక యుద్ధంలో ఉన్నాము. గమనించండి, యుద్ధంలో ఉన్నప్పుడు ఎంత మనిషి బిజీగా ఉంటాడో, అటువైపు శత్రువుల నుండి శత్రువుల బాణాలు, ఆయుధాలు మన మీదికి వచ్చి పడే, మన ప్రాణాలు పోయే అటువంటి భయం క్షణం క్షణం ఉంటుంది. అబూ ములైహ్ అంటున్నారు, మేము ఒక యుద్ధంలో హజ్రత్ బురైదా రదియల్లాహు త’ఆలా అన్హు వెంట ఉన్నాము. అసర్ నమాజ్ సమయం ప్రవేశించింది. అప్పుడు బురైదా రదియల్లాహు త’ఆలా అన్హు చెప్పారు, అసర్ నమాజ్ మీరు చేసుకోండి. ఇందులో ఆలస్యం చేయకండి. ఎందుకంటే నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా విన్నాను,

مَنْ تَرَكَ صَلَاةَ الْعَصْرِ فَقَدْ حَبِطَ عَمَلُهُ
(మన్ తరక సలాతల్ అస్ర్ ఫఖద్ హబిత అమలుహూ)
ఎవరైతే అసర్ నమాజ్ విడినాడారో, ఎవరైతే అసర్ నమాజ్ వదిలేశారో వారి యొక్క సర్వ సత్కార్యాలు వృధా అయిపోయాయి.

దీని గురించి మనల్ని భయకంపితులుగా చేసే హదీస్ కూడా ఉంది. సహీహ్ బుఖారీలోని హదీస్. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు,

الَّذِي تَفُوتُهُ صَلَاةُ الْعَصْرِ كَأَنَّمَا وُتِرَ أَهْلَهُ وَمَالَهُ
(అల్లజీ తఫూతుహూ సలాతుల్ అస్ర్ క అన్నమా వుతిర అహ్లహూ వ మాలహూ)
ఎవరి అసర్ నమాజ్ తప్పిపోయినదో, ఎవరైతే అసర్ నమాజ్ చేయలేకపోయారో వారు ఎలాంటి వారంటే వారి యొక్క సొమ్ము, ధనము, ఆస్తిపాస్తులు, ఆలు పిల్లలు అందరూ నశించిపోయినటువంటి వాడు.

ఎప్పుడైనా ఈ బాధ మనకు కలిగిందా ఒకసారి ఆలోచించండి. అటు నమాజ్ టైం అయింది, ఇటువైపున కొడుకుకు చాలా జ్వరం వచ్చింది అంటే, మనం నమాజ్‌ను వదులుకొని కొడుకును ముందు హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి అని కోరుకుంటాము. ఇక ఎవరి ఆస్తిపాస్తులు, ఆలు పిల్లలు అందరూ నశించిపోయారో అతని పరిస్థితి ఎలా ఉంటుంది? అసర్ నమాజ్ కూడా తప్పిపోయినప్పుడు అంత బాధ మనకు కలిగిందా? ఎంత బాధనైతే మన ఆస్తిపాస్తులు, మన ఆలు పిల్లలు అందరూ నశించిపోయినప్పుడు కలుగుతుందో, అలాంటి బాధ ఏదైనా ఒక్క నమాజ్ మిస్ అయినప్పుడు మనకు కలిగిందా? అందు గురించి మహాశయులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతర సత్కార్యాలన్నిటినీ కూడా వృధా చేసుకోకుండా నమాజ్ కాపాడుకుంటూ మనం ఇతర సత్కార్యాలను కూడా కాపాడుకోవాలి.

మన త్రాసు బరువును తగ్గించేసి, తేలికగా చేసే పాపాల్లో మరో భయంకరమైన పాపం, ఏకాంతంలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరు చూడటం లేదు కదా అని భావించుకుంటూ ఉన్నప్పుడు, అల్లాహ్ నిషేధించిన కార్యాలకు పాల్పడడం. దీనివల్ల కూడా మన ఇతర సత్కార్యాలన్నీ కూడా వృధా అయిపోతాయి. ఈ రోజుల్లో ఎంతమంది మన, మనలోని ఎంతమంది పరిస్థితి ఇలా గురై ఉంది. ఒక్కసారి ఈ హదీసును మీరు చాలా శ్రద్ధగా వినండి. దీనిని అర్థం చేసుకొని ఇందులో చూపబడిన నష్టాలకు దూరంగా ఉండేటువంటి సద్భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక.

హజ్రత్ సౌబాన్ రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించిన ఈ హదీస్, దీనిని మనం మన ఈ చెవులతోనే కాకుండా, హృదయంలో ఉన్నటువంటి చెవులతో శ్రద్ధగా విని ఉంటే, ఈ హదీస్ మనలోని నిద్రలో ఉన్న వారిని నిద్రలో నుండి మేల్కొలుపుతుంది. అశ్రద్ధలో ఉన్నవారి యొక్క అశ్రద్ధతనాన్ని దూరం చేసేస్తుంది. అంతటి భయంకరమైన హదీస్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు,

لَأَعْلَمَنَّ أَقْوَامًا مِنْ أُمَّتِي يَأْتُونَ يَوْمَ الْقِيَامَةِ بِحَسَنَاتٍ أَمْثَالِ جِبَالِ تِهَامَةَ بِيضًا فَيَجْعَلُهَا اللَّهُ عَزَّ وَجَلَّ هَبَاءً مَنْثُورًا
(ల అ’లమన్న అఖ్‍వామన్ మిన్ ఉమ్మతీ య’తూన యౌమల్ ఖియామతి బి హసనాతిన్ అమ్సాల జిబాలి తిహామా బైదా ఫ యజ్అలుహల్లాహు అజ్జవజల్ల హబాఅన్ మన్సూరా)

నేను నా అనుచర సంఘంలోని కొందరిని గుర్తుపడతాను. వారు నాకు తెలుసు. వారు తిహామా నగరంలోని పర్వతాల మాదిరిగా సత్కార్యాలను తీసుకొని ప్రళయ దినాన హాజరవుతారు. (అరబ్బులో తిహామా కొండలు చాలా ఫేమస్. అలాంటి కొండల మాదిరిగా పుణ్యాలు చేసుకొని వస్తారు ప్రళయ దినాన.) కానీ అల్లాహు త’ఆలా వాటిని దుమ్ము ధూళి వలె చేసేస్తాడు.

ఈ భయంకరమైన విషయం విని సౌబాన్ రదియల్లాహు త’ఆలా అన్హు అడిగారు, “ప్రవక్తా, వారు ఎలాంటి వారు? వారి గుణం ఏమిటి? వారి గురించి ఏదైనా స్పష్టంగా తెలపండి. మాకు తెలియకుండానే మేము అలాంటి వారిలో కలిసిపోకుండా ఉండడానికి మేము జాగ్రత్త పడతాము” అని విన్నవించుకున్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, “వారు మీ సోదరులే, మీ వంశం వారే. వారు రాత్రి వేళల్లో నిలబడి తహజ్జుద్ నమాజ్‌లు చేసే అటువంటి వారు. మీరు ఎలా తహజ్జుద్ నమాజ్ చేస్తున్నారో అలా వారు కూడా తహజ్జుద్ నమాజ్ చేసేవారు. కానీ ఒంటరిగా ఉండి అల్లాహ్ నిషేధించిన వాటికి పాల్పడే అవకాశం దొరికితే, వాటికి దూరంగా ఉండడానికి బదులుగా ఆ నిషిద్ధ కార్యాలకు పాల్పడేవారు.”

ఈ రోజుల్లో సోషల్ మీడియాలో, మన చేతుల్లోని స్మార్ట్ ఫోన్స్, ఒక హాస్టల్లో ఉన్నవారు కూడా, ఒకచోట పనిచేసేవాళ్ళు కూడా, హెడ్ ఫోన్స్ చెవులలో పెట్టుకున్నారు, పై నుండి దుప్పటి కప్పుకున్నారు. లోపలి నుండి స్మార్ట్ ఫోన్స్ ఆన్ చేసుకుంటూ, ఇష్టమైన చిత్రాలు చూసుకుంటూ, పాప కార్యాలు చూసుకుంటూ, పక్కన ఎవరూ కూడా వినడం లేదు, పక్కన ఉన్నవారు ఎవరూ చూడడం లేదు. ఈ విధంగా సామాన్యంగా ఈరోజు జరుగుతున్న ఇటువంటి పాపాలు, అక్రమ సంబంధాలు పెట్టుకొని వారిలో ఒంటరి తనాల్లో కలుసుకోవడం, ఎవరు చూడడం లేదు కదా అని ప్రత్యేక కోడ్ వర్డ్లలో వారితోని మాట్లాడుకోవడం, ఇంకా ఇలాంటి ఎన్నో దుష్కార్యాలు ఈనాటి సమాజంలో ప్రబలిపోతూ ఉన్నాయి. ఎప్పుడైనా ఏదైనా విషయం బయటికి వచ్చినా, దానిని ఏదో రకంగా కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం, అల్లాహు అక్బర్. మహాశయులారా, అల్లాహ్ మనందరికీ సన్మార్గం చూపుగాక. ఇంతటి భయంకరమైన హదీస్ ఇది. చూడడానికి నమాజ్‌లు చేస్తూ ఉండడం, వేరే సత్కార్యాలు చేస్తూ ఉండడం, ఒక మంచివాడుగా ప్రజల్లో పేరు పొందడం, కానీ ఒంటరిగా ఉండి పాపాలు చేసే అవకాశం వస్తే, ఏమాత్రం జంకకుండా, వెనుక ఉండకుండా, అల్లాహ్‍తో భయపడకుండా అలాంటి నిషిద్ధ కార్యాలకు పాల్పడడం, ఇది మన సత్కార్యాలన్నిటినీ వృధా చేసేస్తుంది.

మహాశయులారా, మన సత్కార్యాలను వృధా చేసి మన త్రాసును తేలికగా చేసే పాప కార్యాల్లో ఏడవది, కుక్కను పెంచడం. అల్లాహు అక్బర్. ఈ రోజుల్లో ఎందరో ముస్లింల ఇళ్లల్లో కూడా పెట్టీ అని, ఇంకా ఏదేదో పేర్లతో, రకరకాల, ఎంతో అందమైన ముద్దుగా ఉన్నటువంటి పేర్లతో కుక్కలను పిలుచుకుంటూ, పెంచుకుంటూ, వారిని తమ ఒడిలో తమ పిల్లల మాదిరిగా ఉంచుకుంటూ ఇలా వారిని పోషిస్తున్నారు.

ఈ రోజుల్లో ఎంతో మంది తమ సొంత పిల్లలను తమ ఒడిలో కూర్చోబెట్టుకొని ఉన్నట్లుగా కుక్కను పెంచుకుంటున్నారు. ఎంతో ముద్దు ముద్దు పేర్లతో వారిని పిలుచుకుంటూ, వారిని తమ ఒడిలో కూర్చోబెట్టుకుంటున్నారు. ఈ విధంగా మహాశయులారా, ముందే పుణ్యాలు, సత్కార్యాలు చాలా తక్కువగా మనకు ఉన్నాయి అంటే, ఇలాంటి పాప కార్యాల వల్ల మరింత మనం ప్రళయ దినాన నష్టపోతాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు,

مَنِ اتَّخَذَ كَلْبًا، إِلَّا كَلْبَ زَرْعٍ أَوْ غَنَمٍ أَوْ صَيْدٍ، يَنْقُصُ مِنْ أَجْرِهِ كُلَّ يَوْمٍ قِيرَاطٌ
(మనిత్తఖద కల్బన్ ఇల్లా కల్బ జర్ఇన్ అవ్ గనమిన్ అవ్ సైదిన్ యన్ఖుసు మిన్ అజ్రిహీ కుల్ల యౌమిన్ ఖీరాత్)
ఎవరైతే కుక్కను పెంచుతారో, వారి యొక్క పుణ్యాల్లో ప్రతి రోజూ ఒక ఖీరాత్ పుణ్యాలు తగ్గుతూ ఉంటాయి.

ఒక ఖీరాత్ పుణ్యాలు అంటే ఎంతో తెలుసా? జనాజా నమాజ్‌కు సంబంధించిన విషయాల్లో మనం తెలుసుకున్నాము. ఒక ఖీరాత్ అంటే ఉహుద్ పర్వతానికి సమానం. రెండు ఖీరాత్‌లు అంటే రెండు ఉహుద్ పర్వతాలు లేదా రెండు పెద్ద పర్వతాలకు సమానం.

ప్రతి రోజూ ఒక ఖీరాత్ పుణ్యం తగ్గుతూ ఉంటుంది ఎవరైతే కుక్కను పెంచుతూ ఉంటారో. కానీ ఇందులో కేవలం మూడు రకాల కుక్కలను పెంచే అనుమతి ఉంది. ఆ కుక్కలు కూడా సాధ్యమైనంత వరకు మన ఇంటి ఆవరణలో ఉండకుండా బయట ఉంచే ప్రయత్నం చేయాలి. ఎలాంటి మూడు కుక్కలు? ఒకటి, మనం మన తోట రక్షణ కొరకు పెంచే కుక్క, అది తోటలోనే ఉండాలి, ఇంటి వద్ద ఉండకూడదు. మరొకటి, మేకల రక్షణ కొరకు మనం పెంచే కుక్క, అది మేకల వద్దనే ఉండాలి, మన ఇంట్లోనికి రానివ్వకూడదు. మూడవది, كَلْبَ صَيْدٍ (కల్బ సైదిన్) వేటాడడానికి, వేరే కొన్ని జంతువులను వేటాడడానికి వేట యొక్క శిక్షణ ఇవ్వబడిన కుక్కలు. సామాన్య కుక్కలు కూడా కాదు. వేట యొక్క శిక్షణ వారికి ఇవ్వబడాలి. అలాంటి కుక్కలు, అవి కూడా ఇంట్లోనికి ప్రవేశించకుండా మనం జాగ్రత్త పడాలి.

ఈ మూడు రకాల కుక్కలు పెంచడానికి అనుమతి ఉంది. ఈ మూడు ఉద్దేశాలు కాకుండా ఇంకా ఎవరైనా కుక్కను పెంచుతున్నారు అంటే ప్రతి రోజూ వారి యొక్క సత్కార్యాలలో నుండి ఒక ఖీరాత్ సత్కార్యాలు తగ్గిపోతూ ఉంటాయి. ఈ విధంగా మనం ఎంత నష్టానికి గురి అయిపోతామో గమనించండి.

మరికొన్ని పాప కార్యాలు ఉన్నాయి, వాటి ద్వారా కూడా మన త్రాసు అనేది తేలికగా అయిపోతుంది. తరువాయి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.

వ ఆఖిరు దఅవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=41887

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
మరణానంతర జీవితం [పుస్తకం]

ప్రళయ దినాన నెలకొల్పబడే త్రాసు యొక్క గాంభీర్యత, కష్టతరం, దాని యొక్క భయంకరత్వం [మరణానంతర జీవితం – పార్ట్ 20] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

ప్రళయ దినాన నెలకొల్పబడే త్రాసు యొక్క గాంభీర్యత, కష్టతరం, దాని యొక్క భయంకరత్వం
https://www.youtube.com/watch?v=75Sw5ptc_50
[మరణానంతర జీవితం – పార్ట్ 20] [21 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహి వహద, వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బాద. అమ్మా బాద్.

రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. ఈనాటి శీర్షిక: ప్రళయ దినాన నెలకొల్పబడే త్రాసు యొక్క గాంభీర్యత, కష్టతరం, దాని యొక్క భయంకరత్వం.

త్రాసు గురించి వింటున్న వివరాలతో ఇహలోకంలోనే మనకు ఒక గుణపాఠం రావాలి. మనం దైనందిన జీవితంలో చేసే సత్కార్యాలు పెరుగుతూ ఉండాలి మరియు దుష్కార్యాలు తగ్గుతూ ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా రేపటి రోజు ఆ త్రాసులో తూకం చేయబడతాయి.

ప్రళయ దినాన ఎప్పుడైతే సూక్ష్మమైన విషయాలను కూడా త్రాసులో పెట్టబడి తూకం చేయడం జరుగుతూ ఉంటుందో, ఇవన్నీ విషయాలు కర్మపత్రాల్లో కూడా వ్రాయబడి ఉంటాయో, ఆ కర్మపత్రాలను కూడా తూకం చేయడం జరుగుతుందో, ఈ విషయాల్ని అపరాధులు, పాపాలు చేస్తూ ఉన్నవారు ఈ విషయాన్ని చూసి చాలా గాంభీర్యతకు గురి అవుతారు. వారు స్వయంగా ఏమంటారు ఆ సందర్భంలో, ఆ విషయాన్ని అల్లాహు తాలా సూరహ్ కహఫ్ లో తెలియజేశాడు.

وَوُضِعَ الْكِتَابُ
కర్మపత్రాలు వారి ముందు పెట్టడం జరుగుతుంది.

فَتَرَى الْمُجْرِمِينَ مُشْفِقِينَ مِمَّا فِيهِ
అపరాధులను నీవు ఆ రోజు చూస్తావు, వారు భయ కంపితులై వాటిలో ఉన్న, వ్రాయబడిన ఆ విషయాలన్నింటినీ చూసి భయకంపితులై పోతారు.

وَيَقُولُونَ
మరియు అంటారు:

يَا وَيْلَتَنَا مَالِ هَٰذَا الْكِتَابِ
మా పాడుగాను, ఇది ఎలాంటి గ్రంథం, ఎలాంటి కర్మపత్రం.

لَا يُغَادِرُ صَغِيرَةً وَلَا كَبِيرَةً
ఏ చిన్న దానిని గానీ, ఏ పెద్ద దానిని గానీ వదిలేయకుండా మొత్తం దీంట్లో వ్రాయబడింది.

إِلَّا أَحْصَاهَا
ప్రతీ ఒక్కటి అందులో చేర్చడం జరిగింది.

وَوَجَدُوا مَا عَمِلُوا حَاضِرًا
వారు చేసుకున్న సర్వాన్ని వారు తమ ముందు హాజరుగా చూస్తారు.

وَلَا يَظْلِمُ رَبُّكَ أَحَدًا
నీ ప్రభువు ఎవరిపై కూడా ఏ మాత్రం అన్యాయం చేయడు, ఎవరిపై ఏ రవ్వంత కూడా దౌర్జన్యం చేయడు.

త్రాసు అంటే ఏమిటి? ప్రళయ దినాన దాని యొక్క గాంభీర్యత, కష్టతరం అనేది ఎలా ఉంటుంది? [మరణానంతర జీవితం – పార్ట్ 19] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

త్రాసు అంటే ఏమిటి? ప్రళయ దినాన దాని యొక్క గాంభీర్యత, కష్టతరం అనేది ఎలా ఉంటుంది?
[మరణానంతర జీవితం – పార్ట్ 19] [21 నిముషాలు]
https://www.youtube.com/watch?v=kKaOZfTuxe0
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహి వహద, వస్సలాతు వస్సలాము అలా మన్ లా నబియ్య బాద అమ్మాబాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

ఈనాటి శీర్షిక: త్రాసు అంటే ఏమిటి? ప్రళయ దినాన దాని యొక్క గాంభీర్యత, కష్టతరం అనేది ఎలా ఉంటుంది?

మహాశయులారా, సృష్టికర్త అయిన అల్లాహ్ సర్వము తెలిసినవాడు. మరియు ఆయన ఎవరి పట్ల కూడా ఎలాంటి అన్యాయం చేయనివాడు. ఆయన కరుణామయుడు, కృపాశీలుడు మరియు దాసులకు వారి పుణ్యాలకంటే ఎంతో ఎక్కువ రేట్లో ఉపకారాలు చేసి వారిని మన్నిస్తూ ఉండేవాడు. కానీ రవ్వంత కూడా ఎవరిపై ఏ అన్యాయము చేయడు.

ఆయన ప్రళయ దినాన తలచుకుంటే, దాసుల పట్ల ఆయనకున్న పరిజ్ఞానంతో వారి యొక్క విశ్వాసం, అవిశ్వాసం, సత్కార్యాలు, దుష్కార్యాలు అనే ఆధారం మీద వారిని స్వర్గంలో పంపడం, నరకంలో పంపడం వంటి తీర్పులు చేయగలడు. అలా చేసే అధికారం అతనికి ఉంది. కానీ, అలా చేయకుండా వారి యొక్క లెక్క, వారి యొక్క తీర్పు, సాక్ష్యాధారాలను, ఇంకా ఆ రోజు త్రాసును నెలకొల్పుతాడు.

త్రాసును నెలకొల్పి, అందులో ప్రజలు చేసినటువంటి సత్కార్యాలను ఒకవైపున, దుష్కార్యాలను మరోవైపున తూకం చేస్తాడు. స్వయంగా సత్కార్యాలు, దుష్కార్యాలు చేసిన ప్రజలను కూడా అందులో పెట్టడం జరుగుతుంది. అంతేకాదు, ఏ కర్మపత్రాలు దైవదూతలు రాస్తూ ఉన్నారో, ఆ పత్రాలను కూడా, ఆ ఫైల్లను కూడా అందులో తూకం చేయడం జరుగుతుంది. ఇదంతా దేని కొరకు? ప్రజలు కూడా స్వయంగా వారు తృప్తికరమైన న్యాయం వారికి లభించినది అని వారికి మనస్తృప్తి కలగాలి.

99. సూరా అజ్ జిల్ జాల్ (భూకంపం) – ఖురాన్ తఫ్సీర్ (వ్యాఖ్యానం) [వీడియో & టెక్స్ట్]

99. సూరా అజ్ జిల్ జాల్ (భూకంపం) – ఖురాన్ తఫ్సీర్ (వ్యాఖ్యానం)
https://youtu.be/BaJGDgkkjvc [38 min]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగం ఖురాన్‌లోని 99వ అధ్యాయం, సూరతుల్ జిల్జాల్ యొక్క వివరణాత్మక వ్యాఖ్యానం (తఫ్సీర్). భూమి తీవ్రంగా ప్రకంపించబడటం, తనలోని శవాలను, నిధులను బయటకు వెళ్లగ్రక్కడం, మానవుడు నిశ్చేష్టుడై “దీనికేమైంది?” అని ప్రశ్నించడం వంటి ప్రళయదినపు భయానక సంఘటనలను వక్త వివరిస్తారు. ఈ సూరా యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెబుతూ, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దానిని తన నమాజులో పఠించడం, అది సహచరులపై చూపిన గాఢమైన ప్రభావం గురించిన హదీసులను ఉదహరిస్తారు. భూమి స్వయంగా మానవుడు చేసిన ప్రతి చిన్న, పెద్ద కర్మకు సాక్ష్యమిస్తుందని, జవాబుదారీతనం అనే ప్రధాన సందేశాన్ని ఈ సూరా తెలియజేస్తుందని వివరిస్తారు. అణువంత మంచి చేసినా, చెడు చేసినా అది దాని కర్తకు చూపించబడుతుందని, కనుక ఈ జీవితంలో మన కర్మల పట్ల జాగ్రత్త వహించాలని శ్రోతలను హెచ్చరిస్తూ ప్రసంగం ముగుస్తుంది.

السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.)

اَلْحَمْدُ لِلَّهِ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى رَسُولِ اللَّهِ، أَمَّا بَعْدُ
(అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్.)

أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ
(అవూజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్)
శాపగ్రస్తుడైన షైతాను నుండి నేను అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను.

بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ
(బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్)
అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో (ప్రారంభిస్తున్నాను).

إِذَا زُلْزِلَتِ الْأَرْضُ زِلْزَالَهَا
(ఇదా జుల్జిలతిల్ అర్దు జిల్జాలహా)
భూమి చాలా తీవ్రమైన తన ప్రకంపనలతో కంపింపజేయబడినప్పుడు (సూరా అజ్-జిల్జాల్ 99:1)

ఇదా జుల్జిలత్. కంపించ చేయబడినప్పుడు. అల్ అర్ద్, భూమి. మళ్ళీ దాని యొక్క మస్దర్ జిల్జాలహా అని ఏదైతే వచ్చిందో, హా అంటే ఆ భూమి అని దాని వైపునకు సైగ చేయడం జరుగుతుంది. జిల్జాల్ అని వచ్చిన మరోసారి చెప్పబడిన పదానికి తీవ్రమైన రీతిలో. అంటే ఏమిటి? భూమి చాలా తీవ్రమైన తన ప్రకంపనలతో కంపించ చేయబడినప్పుడు.

وَأَخْرَجَتِ الْأَرْضُ أَثْقَالَهَا
(వ అఖ్రజతిల్ అర్దు అస్ఖాలహా)
మరి భూమి తన బరువులన్నింటినీ తీసి బయట పడవేసినప్పుడు, (సూరా అజ్-జిల్జాల్ 99:2)

వ అఖ్రజత్ బయట పడవేసినప్పుడు. అల్ అర్ద్ ఆ భూమి. దేనిని బయట పడేసినప్పుడు? తనలో ఉన్నటువంటి బరువులన్నింటినీ. మరి భూమి తన బరువులన్నింటినీ తీసి బయట పడవేసినప్పుడు,

وَقَالَ الْإِنسَانُ مَا لَهَا
(వ ఖాలల్ ఇన్సాను మాలహా)
“అరె! దీనికేమైపోయిందీ?” అని మనిషి (కలవరపడుతూ)అంటాడు. (సూరా అజ్-జిల్జాల్ 99:3)

మనిషి అంటాడు, మాలహా? అరె! దీనికి ఏమైపోయింది?

يَوْمَئِذٍ تُحَدِّثُ أَخْبَارَهَا
(యౌమఇదిన్ తుహద్దిసు అఖ్బారహా)
ఆ రోజు భూమి తన సంగతులన్నీ వివరిస్తుంది. (సూరా అజ్-జిల్జాల్ 99:4)

యౌమఇదిన్ ఆ రోజు తుహద్దిసు వివరిస్తుంది. అఖ్బారహా. తుహద్దిసు అంటే ఇక్కడ అర్ద్. అరబీలో అర్ద్ స్త్రీలింగం, ఫీమేల్ వర్డ్ గా ఉపయోగించడం జరుగుతుంది. అందుకొరకే తుహద్దిసు వచ్చింది. పురుషలింగం అయితే యుహద్దిసు వచ్చేది. తుహద్దిసు, భూమి వివరిస్తుంది, తెలియజేస్తుంది. అఖ్బారహా తన సంగతులన్నీ, తన సమాచారాలన్నీ.

بِأَنَّ رَبَّكَ أَوْحَىٰ لَهَا
(బి అన్న రబ్బక అవ్హాలహా)
ఎందుకంటే నీ ప్రభువు దానికి, ఆ మేరకు ఆజ్ఞాపించి ఉంటాడు.(సూరా అజ్-జిల్జాల్ 99:5)

అలా ఎందుకు చేస్తుంది? ఎందుకు వివరిస్తుంది? ఎందుకంటే బి అన్న, ఎందుకంటే రబ్బక నీ ప్రభువు అవ్హాలహా దానికి ఆజ్ఞాపించి ఉంటాడు అలా చేయాలని.

يَوْمَئِذٍ يَصْدُرُ النَّاسُ أَشْتَاتًا لِّيُرَوْا أَعْمَالَهُمْ
(యౌమఇదిన్ యస్దురున్నాసు అష్తాతల్ లియురవ్ అఅమాలహుమ్)
ఆ రోజు జనులు – వారి కర్మలు వారికి చూపబడేందుకుగాను – వేర్వేరు బృందాలుగా తరలి వస్తారు. (సూరా అజ్-జిల్జాల్ 99:6)

యౌమఇదిన్ ఆ రోజు. యస్దురున్నాస్, యస్దురు తరలి వస్తారు, తిరిగి వస్తారు. అన్నాస్ జనులు, ప్రజలు. అష్ తాతా వేరు వేరు బృందాలుగా. లియురవ్ వారికి చూపబడేందుకు అఅమాలహుమ్ వారి యొక్క కర్మలు. ఆ రోజు జనులు వారి కర్మలు వారికి చూపబడేందుకు గాను వేరు వేరు బృందాలుగా తరలి వస్తారు.

فَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ خَيْرًا يَرَهُ
(ఫమయ్యామల్ మిస్ఖాల దర్రతిన్ ఖైరయ్యరహ్)
కనుక ఎవడు అణుమాత్రం సత్కార్యం చేసినా దాన్ని అతను చూసుకుంటాడు. (సూరా అజ్-జిల్జాల్ 99:7)

వమయ్యామల్ మిస్ఖాల దర్రతిన్ ఖైరయ్యరహ్. కనుక ఎవడు అణుమాత్రం సత్కార్యం చేసినా. ఫమన్ ఎవడైనా గానీ, ఎవడు అని ఇక్కడ చెప్పడం జరిగింది. యఅమల్ చేస్తాడో, చేసినా. మిస్ఖాల దర్రహ్ అణువంత. దర్రహ్ చీమల కంటే చిన్నగా, చీమల యొక్క గుడ్లు, చీమల యొక్క పిల్లలు, అంతకంటే మరీ చిన్నది. ఖైరన్ ఏదైనా సత్కార్యం. యరహు దాన్ని అతడు చూసుకుంటాడు. కనుక ఎవడు అణుమాత్రం సత్కార్యం చేసినా దాన్ని అతను చూసుకుంటాడు.

وَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ شَرًّا يَرَهُ
(వమయ్యామల్ మిస్ఖాల దర్రతిన్ షర్రయ్యరహ్)
మరెవడు అణుమాత్రం దుష్కార్యం చేసినా దాన్ని అతను చూసుకుంటాడు. (సూరా అజ్-జిల్జాల్ 99:8)

మరెవరు అణుమాత్రం దుష్కార్యం చేసినా దాన్ని అతను చూసుకుంటాడు.

సోదర మహాశయులారా! ఖురాన్ సూరతులలోని క్రమంలో ఈ 99వ సూరత్, సూరతుల్ జిల్జాల్, చాలా ప్రాముఖ్యత గల సూరా. ఈ సూరా యొక్క ప్రాముఖ్యతను వివరించడానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఎన్నో హదీసులు వచ్చి ఉన్నాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొన్ని సందర్భాల్లో, ఎలాగైతే ముస్నద్ అహ్మద్ లో హదీస్ వచ్చి ఉందో, అబూ ఉమామా రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించారు:

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చివరి కాలంలో కొంచెం బరువు పెరిగారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విత్ర్ చేసిన తర్వాత కూర్చుండి రెండు రకాతులు ఎప్పుడైనా చేసేవారు. ఆ రెండు రకాతులలోని మొదటి రకాతులో సూరే ఫాతిహా తర్వాత ఇదా జుల్జిలతిల్ అర్ద్ చదివేవారు. మరియు రెండవ రకాతులో సూరే ఫాతిహా తర్వాత ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్ (قُلْ يَا أَيُّهَا الْكَافِرُونَ) చదివేవారు.

దీని ప్రాముఖ్యతను గమనించడానికి, అబూ దావూద్ లో వచ్చినటువంటి ఒక హదీస్, 816 హదీస్ నెంబర్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక రోజు ఫజర్ నమాజులోని రెండు రకాతుల్లో కూడా ఇదే సూరత్ జిల్జాల్. చదివారు.

సోదర మహాశయులారా! ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో, సహాబాల యొక్క జీవితాల్లో, ఈ సూరా పట్ల ఎలాంటి ప్రాముఖ్యత ఉండినది, చాలా భయంకరమైన గొప్ప విషయాలు చెప్పుకోవడానికి, సూక్ష్మమైన విషయాల గురించి ప్రస్తావన చేసుకునేటందుకు, ఏ చిన్న, అతి చిన్న, మరీ చిన్న పుణ్య కార్యమైనా చేసుకోవడానికి ముందుకు రావాలని, ఏ చిన్న, ఏ అతి చిన్న, మరీ చిన్న పాపమైనా తప్పకుండా దానితో దూరం ఉండాలని ఈ సూరా ద్వారా గుణపాఠం తెచ్చుకొని ఇతరులకు బోధించేవారు, నేర్పేవారు ఈ సూరా ఆధారంగా.

సోదర మహాశయులారా! ఈ సూరా యొక్క ప్రాముఖ్యత మరొక హదీస్ ద్వారా కూడా మనకు తెలుస్తుంది. ఆ హదీసును కొందరు ధర్మవేత్తలు జయీఫ్ (ضَعِيفٌ) అన్నారు కానీ, ముస్నద్ అహ్మద్ ఏదైతే చాలా ఎక్కువ వాల్యూమ్ లో పూర్తి రీసెర్చ్ తో ప్రింట్ అయిందో, 35-40 కంటే ఎక్కువ వాల్యూమ్స్ లో, దాని యొక్క రీసెర్చ్ చేసిన ముహఖ్ఖిఖీన్ (مُحَقِّقِينَ) దానిని బలమైనదిగానే చెప్పారు. ఆ హదీస్ కొంచెం పొడుగ్గా ఉంది, సారాంశం చెబుతున్నాను:

ఆ మనిషి చాలా సంతోషంగా ప్రవక్త వద్ద నుండి తిరిగి వెళ్తూ, అల్లాహ్ యే సత్యంతో మిమ్మల్ని పంపాడో ఆ అల్లాహ్ యొక్క సాక్ష్యంతో చెబుతున్నాను, తప్పకుండా ఈ సూరాను నేను నేర్చుకుంటాను, నేను ఇంతకంటే ఎక్కువగా బహుశా నేర్చుకోలేకపోతాను కావచ్చు కానీ దీనిని అయితే తప్పకుండా నేర్చుకుంటాను అని వెనుతిరిగి పోయాడు అక్కడి నుండి. అతడు వెళ్తున్నది చూసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, “ఇతడు సాఫల్యం పొందాడు, ఇతడు విజయం పొందాడు“.

సోదర మహాశయులారా! గమనిస్తున్నారా? ఇక మీలో ఎవరెవరికైతే ఈ సూరా రాదో, లేక ఈ సూరా యొక్క భావాన్ని ఇంతవరకు అర్థం చేసుకొని ప్రయత్నం చేయలేదో, ఇక శ్రద్ధగా వినండి, ఆయత్ యొక్క వ్యాఖ్యానాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కానీ ఈ హదీస్ మరియు ఇంతకుముందు తెలుసుకున్న హదీసుల ద్వారా దీని యొక్క ప్రాముఖ్యతను గ్రహించండి. మరియు ఎన్నో హదీసులు వచ్చి ఉన్నాయి ఈ సూరా ఖురాన్ లోని సగం సూరా, ఈ సూరా ఖురాన్ లోని నాలుగో వంతుకు సమానం, కానీ అలాంటి హదీసులు సహీ లేవు అని ఎందరో ధర్మవేత్తలు చెప్పి ఉన్నారు.

సోదర మహాశయులారా! ఈ సూరాలో పరలోకం పట్ల మన యొక్క విశ్వాసం పెరిగే రీతిలో, పరలోకానికి సంబంధించిన రెండు సందర్భాలను ప్రస్తావించడం జరిగింది. ఒకటి, మొదటి శంఖు ఊదబడినప్పుడు ఈ విశ్వం అంతా చెల్లాచెదురై నాశనమవుతున్న సందర్భాన్ని, మరొకటి రెండవ శంఖు ఊదబడిన తర్వాత ఏం జరుగుతుంది, ఎక్కడికి వెళ్తారు, గమ్యస్థానాలు ఏమవుతాయి, పరిస్థితి ఏముంటుంది దాని గురించి చెప్పడం జరిగింది.

సోదర మహాశయులారా! ఇక్కడ మీరు చూస్తున్నట్లు, ఇదా జుల్జిలతిల్ అర్దు జిల్జాలహా. జుల్జిలత్ అని క్రియ రూపంలో ఉన్న ఒక పదాన్ని చెప్పిన వెంటనే మళ్ళీ జిల్జాలహా అని ఫార్మాట్ చేంజ్ చేసి మస్దర్ రూపంలో తీసుకువచ్చి, అల్లాహ్ త’ఆలా చెప్పదలచినది ఏమిటంటే, ఈ ప్రళయ సమయాన ఏ భూకంపం ఏర్పడుతుందో, ఈ మొత్తం భూమిలో ఏ ప్రకంపనలు స్టార్ట్ అవుతాయో, అవి ఏమో చిన్నవి కావు, చాలా భయంకరమైనవి.

గమనించండి ఒక్కసారి మీరు, ఎక్కడో ఇండోనేషియాకు ఎంతో దూరంలో, అది కూడా సముద్రం లోపలని భూమిలో ప్రకంపనలు మొదలౌతే, వాటి యొక్క ప్రభావమే కాదు, నష్టం వేలాది వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మన భారతదేశానికి కూడా చేరుకొని, సునామీ అన్న పేరుతో ఈ రోజు కూడా మర్చిపోని స్థితిలో ఉన్నాము కదా. అయితే అది సునామీ అన్నటువంటి పేరు ఏదైతే ఉందో, కేవలం సముద్రాల, సముద్రం యొక్క అలలు, కెరటాలు పెరిగి ఏదో నష్టం జరిగింది కాదు కదా. ఎక్కడ ఇండోనేషియా, ఎక్కడ సముద్రం లోపలి భాగంలో సంభవించిన ప్రకంపన, భూకంపం, అక్కడ భూమి దద్దరిల్లింది. ఇన్ని వేల కిలోమీటర్ల దూరంలో దాని నష్టం ఇంతా అంతా కాదు, కోట్ల కోట్లలో జరిగింది, ప్రాణాలు పోయాయి, ప్రాణ నష్టంతో పాటు ధన నష్టం కూడా జరిగింది. సోదర మహాశయులారా! ఒక్కసారి ఒక్కచోట వచ్చిన ఈ భూకంపం ఎంత దూరం నష్టం చేకూర్చింది, ఇక ప్రళయదినాన్ని గుర్తుంచుకోండి, గుర్తు తెచ్చుకోండి, ఈ మొత్తం భూమిలో ఎక్కడా కూడా ఖాళీ లేకుండా అంతటా ఈ భూకంపం వచ్చినప్పుడు పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందో ఆలోచించగలమా మనం?

ఎక్కడైనా ఒకచోట భూకంపం వస్తుంది అంటే రాని చోటకు ప్రజలు పరిగెత్తుతారు. కదా? మరి ఆ రోజు పరిగెత్తడానికి ఎక్కడ స్థలం ఉన్నది? ఎక్కడ స్థలం ఉన్నది? అందుకొరకు సోదర మహాశయులారా! ఖురాన్ ఆయతులను గ్రహించి, గమనించి మన జీవితంలో మార్పు తెచ్చుకునే మనం ప్రయత్నం చేయాలి. లేదా అంటే మన శక్తి ఏం శక్తి? మనం ఏం చేయగలుగుతాము? ఎలాంటి విపత్తులు మనం అడ్డుకోగలుగుతాము?

ఆ రోజు, వ అఖ్రజతిల్ అర్దు అస్ఖాలహా. భూమి తన యొక్క బరువులన్నింటినీ. ఇక్కడ బరువులు అంటే ఒకటి కాదు రెండు కాదు, అనేక విషయాల ప్రస్తావన ఉంది. ఒకటి, ఇక్కడ ఆదం అలైహిస్సలాం నుండి మొదలుకొని చివరి మానవుని వరకు ఎవరు ఎక్కడ ఎలా చనిపోయారో, వారిని కాల్చడం జరిగినా, వారిని పూడ్చడం జరిగినా, వారు ఏదైనా జంతువుకి ఆహుతి అయిపోయినా, ఏదైనా అగ్నికి ఆహుతి అయిపోయినా, ఏదైనా జంతు మృగ జీవికి ఒక నివాలా అయిపోయినా, ఏ పరిస్థితిలో చనిపోయినా వారిని సమాధి చేయబడినా, చేయబడకపోయినా అంతా కూడా తిరిగి వచ్చేది మట్టి వైపునకే. 77వ సూరా సూరతుల్ ముర్సలాత్ లో వచ్చిన ఒక ఆయత్ ను గమనించండి,

أَلَمْ نَجْعَلِ الْأَرْضَ كِفَاتًا أَحْيَاءً وَأَمْوَاتًا
(అలం నజ్అలిల్ అర్ద కిఫాతా అహ్యాఅవ్ వ అమ్ వాతా.)
మేము ఈ భూమిని వారి యొక్క జీవుల కొరకు మరియు చనిపోయిన వారి కొరకు అందరి కొరకు సరిపోయేదిగా చేసి ఉంచాము.

గమనించండి, ఈ ఆయత్ లో ఇంకా వేరే ఎన్నో బోధనలు ఉన్నాయి వేరే సందర్భంలో. కానీ చెప్పే ఉద్దేశ్యం ఏమిటి, తిరస్కరించిన వారైనా, నమ్మిన వారైనా, విశ్వాసులైనా, అవిశ్వాసులైనా, ఆస్తికులైనా, నాస్తికులైనా, అందరూ కూడా ఈ భూమిలోకి ఏదైతే పోయారో ఏ రీతిలోనైనా వెలికి వస్తారు. తప్పకుండా బయటికి వస్తారు. సూరతుల్ ఇన్షికాఖ్ (سُورَةُ الْإِنْشِقَاقِ) లో చదవండి, ముతఫ్ఫిఫీన్ (مُطَفِّفِينَ) తర్వాత సూరత్,

وَأَلْقَتْ مَا فِيهَا وَتَخَلَّتْ
(వ అల్ఖత్ మా ఫీహా వ తఖల్లత్.)
ఇక బరువులన్నింటినీ తీసివేస్తుంది బయటికి అని రెండవ భావం, ఈ భూమిలో ఎక్కడెక్కడ ఏ ఖజానాలు ఉన్నాయో, ఏ కోశాగారాలు ఉన్నాయో, ఏ ఏ రకమైన ధాతువులు ఉన్నాయో, వెండి బంగారం రూపులోనైనా, ఇంకా వేరే ఏ రీతిలోనైనా అంతా కూడా బయటికి వచ్చి పడుతుంది. మనిషి ఎటు నడిచినా గానీ బంగారం, వెండి అంతకంటే ఇంకా విలువైనది వేరే ఎంతో సామాగ్రి అతను కళ్ళతో చూస్తాడు. సహీ ముస్లిం లోని ఒక హదీస్ శ్రద్ధగా వినండి, అల్లాహు అక్బర్.

تَقِيءُ الْأَرْضُ أَفْلَاذَ كَبِدِهَا أَمْثَالَ الْأُسْطُوَانِ مِنَ الذَّهَبِ وَالْفِضَّةِ
(తఫిల్ అర్దు అఫ్లాద కబిదిహా అమ్సాలల్ ఉస్తువాన్ మిన దహబి వల్ ఫిద్దా.)
ప్రళయదినాన ఈ భూమి తనలో ఉన్నటువంటి ఖజానాలన్నిటినీ బయటికి పడేస్తుంది. పెద్ద పెద్ద గుట్టలు, పర్వతాల మాదిరిగా మనిషి కళ్ళ ముందు వెండి బంగారాలు పడి ఉంటాయి.

అప్పుడు ఒక హంతకుడు వస్తాడు, అయ్యో, ఈ బంగారం వెండి కొరకే కదా నేను ఫలానా వ్యక్తిని చంపి ఈ ధన ఆశలో ఒకరి ప్రాణం తీసుకున్నాను, ఇప్పుడు ఇంతగా నా కళ్ళ ముందు ఉంది కానీ నాకు ఏ ప్రయోజనం చేకూర్చదు ఇది, దీనిని తీసుకొని ఏ లాభం పొందలేను. మరొక వ్యక్తి వస్తాడు, అయ్యో, నేను ఈ డబ్బు ధన ఆశలో బంధుత్వాలను తెంచాను, నా యొక్క సంబంధాలను పాడు చేసుకున్నాను, నేను ఈ యొక్క డబ్బు ధన ఆశలో ఎందరి నా దగ్గర వారిని దూరం చేసుకున్నాను, అయ్యో అని వాపోతాడు. కానీ అది అతనికి ఏ ప్రయోజనం చేకూర్చదు. దొంగ వస్తాడు, అతడు ఇదంతా చూసి, అయ్యో, దీని గురించేనా నా యొక్క చేతులు నరికి వేయబడినవి, ఈ రోజు తీసుకుందాం అంటే కూడా ఏ ప్రయోజనం లేకుండా పోయింది. ఆ తర్వాత వారి కళ్ళ ముందు ఉంటుంది కానీ ఎవరు దానిని ముట్టరు, ఏమీ తీసుకోలేరు.

ఇదంతా కూడా ఇంత స్పష్టంగా వివరంగా మనకు చెప్పబడినప్పుడు, ఈ రోజుల్లో మనం నా తాత భూమి నా అయ్యకు దొరకలేదు, ఇక ఇప్పుడు నేను ఇంత అధికారంలో వచ్చిన కదా, నా చిన్నాయనలకు, నా పెదనాయనలకు అందరికీ ఇక నేను జైల్లో వేస్తాను, వారి సంతానాలనే వేస్తాను, వారి యొక్క వంశమే గుర్తుంచుకోవాలి అన్నటువంటి పన్నాగలు పన్ని, ఏ ఏ ప్రయత్నాలు చేస్తారో, దౌర్జన్యాలు చేసి ఒకరి భూమిని ఏదైతే ఆక్రమించుకుంటారో, ఏ ఏ రీతిలో చివరికి ఒక మాట ఇక్కడ చెప్పవచ్చు కదా, కట్నకానుకల రూపంలో అమ్మాయిల తల్లిదండ్రులపై దౌర్జన్యాలు చేసి ఏ ఏ సొమ్ము లూటీ చేస్తున్నారో, ఈ సూరత్ యొక్క వ్యాఖ్యానంలో వచ్చిన హదీస్ ద్వారా గుణపాఠం నేర్చుకోవాలి.

భూమి తన బరువులన్నింటినీ తీసి బయట పడేసినప్పుడు, మనిషి, అయ్యో, అరె దీనికి ఏమైపోయింది, ఇది ఇలా ఎందుకు చేస్తుంది? అల్లాహు అక్బర్. అల్లాహు అక్బర్. మనిషి ఇలా మొత్తుకుంటాడు కానీ ఏమీ లాభం.

మరొక వ్యాఖ్యానం, బరువులన్నీ తీసి బయట పడేసినప్పుడు అన్న దానికి ధర్మవేత్తలు, ఖురాన్ వ్యాఖ్యానకర్తలు తెలిపారు, అదేమిటంటే, ఆ రోజు మనిషి ఏ ఏ విషయాలను నమ్మకపోయేదో ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు, ఆ సత్యాలు వాస్తవాలన్నీ కూడా అతని కళ్ల ముందుకు వచ్చేస్తాయి. అప్పుడు అతను ఆ విషయాలన్నింటినీ, వేటినైతే ప్రవక్తలు, ప్రవక్తల యొక్క నాయబులు, వారి యొక్క మార్గంపై ఉన్నటువంటి దాయిలు, ప్రచారకులు ఏ సత్యాలు ఖురాన్ హదీస్ ఆధారంగా తెలిపినప్పటికీ తిరస్కరించేవారో, నమ్మకుండా ఉండేవారో వారికి ఆ వాస్తవాలన్నీ కూడా ముందుకు వచ్చేస్తాయి. సోదర మహాశయులారా! ఈ సందర్భంలో మనిషి చాలా బాధగా అంటాడు, అయ్యో ఇదేమైపోయింది, ఇది ఎలా ఎందుకు జరుగుతుంది, మరియు ఈ సందర్భం అనేది ఖురాన్ లో ఇంకా వేరే సూరాలలో కూడా చెప్పడం జరిగినది. ఉదాహరణకు సూరత్ యాసీన్ చదువుతారు కదా, ఎంత మన దౌర్భాగ్యం గమనించండి, సూర యాసీన్,

لِّيُنذِرَ مَن كَانَ حَيًّا
(లియున్దిర మన్ కాన హయ్యా)
బ్రతికి ఉన్న వారి కొరకు ఇదిగో హెచ్చరిక అని అల్లాహ్ అదే సూరాలో చెబుతున్నాడు.

బ్రతికి ఉన్న వారు చదివి గుణపాఠం నేర్చుకోవడం లేదు, చనిపోయిన వారి మీద చదువుతున్నారు, వారు వినడానికి కూడా ఏ శక్తి వారిలో లేదు. అదే సూరత్ యాసీన్ లో అల్లాహ్ త’ఆలా తెలిపాడు,

هَٰذَا مَا وَعَدَ الرَّحْمَٰنُ وَصَدَقَ الْمُرْسَلُونَ
(హాదా మా వఅదర్ రహ్మాను వ సదఖల్ ముర్సలూన్.)
అప్పుడు వారి కళ్లు తెరిచినట్లు అవుతాయి, వారి కళ్ల మీద ఉన్నటువంటి ముసుగు తొలగిపోయినట్లు ఏర్పడుతుంది, అప్పుడు అంటారు అయ్యో, మమ్మల్ని మా సమాధుల నుండి ఎక్కడైతే హాయిగా పడుకొని ఉంటిమో, ఎవరు లేపేశారు మమ్మల్ని? రహ్మాన్ చేసిన వాగ్దానం ఇదే కదా అది. ప్రవక్తలు చెప్పుకుంటూ వచ్చినటువంటి విషయాలు ఇప్పుడు నిజంగానే జరుగుతున్నాయి, అవే కదా ఇవి. కానీ అప్పుడు మనిషి వాటన్నిటినీ సత్యంగా నమ్మితే ఏ లాభం ఉండదు.

సోదర మహాశయులారా! ఇదా జుల్జిలతిల్ అర్దు జిల్జాలహా, ఇదా దీనిని అరబీ గ్రామర్ ప్రకారంగా ఒక షర్తియా పదం అంటారు, దాని యొక్క సమాధానం నాలుగో ఆయత్ లో అల్లాహ్ ఇస్తున్నాడు, యౌమఇదిన్ తుహద్దిసు అఖ్బారహా. అల్లాహు అక్బర్. ఆయత్ నెంబర్ రెండులో చూశారు మీరు, తన బరువులన్నింటినీ వెలికి తీస్తుంది అని.

ఇక ఆయత్ నెంబర్ నాలుగులో ఉన్న విచిత్రం గమనించండి, ఆ రోజు భూమి తన సంగతులన్నీ వివరిస్తుంది. ఏమిటి ఆ సంగతులు? ఏమిటి ఆ సంగతులు? అల్లాహు అక్బర్. అల్లాహ్ త’ఆలా మనిషిని పుట్టించినప్పటి నుండి కాదు అంతకు ముందు నుండి ఈ భూమి ఉంది. ప్రళయం వరకు ఎక్కడెక్కడ ఏమి జరిగినదో అదంతా కూడా ఈ భూమి అంతా వివరిస్తూ ఉంటుంది. అల్లాహు అక్బర్.

హజరత్ అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు వారి ఉల్లేఖనం వస్తుంది. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో ఈ సూరతుల్ జిల్జాల్ తిలావత్ చేశారు. సూరత్ జిల్జాల్ తిలావత్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఈ ఆయత్ నెంబర్ నాలుగు వరకు చేరుకున్నారో, మీకు తెలుసా దాని యొక్క సమాచారాలన్నీ కూడా ఏమిటి? మీకు తెలుసా దాని యొక్క సంగతులన్నీ ఏమిటి? అది ఏం వివరిస్తుంది? ఆ సమయంలో సహాబాలు సామాన్యంగా జవాబు ఇచ్చినట్లుగానే ఇచ్చారు, అల్లాహ్ మరియు ప్రవక్తకే తెలుసు. అప్పుడు ప్రవక్త తెలిపారు,

فَإِنَّ أَخْبَارَهَا أَنْ تَشْهَدَ عَلَى كُلِّ عَبْدٍ وَأَمَةٍ
(ఫఇన్న అఖ్బారహా అన్ తష్హద అలా కుల్లి అబ్దివ్ వ అమతిన్.)
ప్రతి మానవుడు పురుషుడు అయినా, స్త్రీ అయినా భూమిలోని ఏ చోట ఉండి ఏ పని చేశాడో దాని గురించి ఆ భూమి వివరిస్తుంది. ఫలానా వ్యక్తి ఇక్కడ ఉండి ఇలాంటి పని చేశాడు, ఇక్కడ ఉండి ఇలాంటి పని చేశాడు. అందుకొరకే రబీఆ ఉల్లేఖించిన ఒక ఉల్లేఖనంలో తబరానీ కబీర్ లో వచ్చింది,

تَحَفَّظُوا مِنَ الْأَرْضِ، فَإِنَّهَا أُمُّكُمْ
(తహఫ్ఫదూ మినల్ అర్ద్, ఫఇన్నహా ఉమ్ముకుమ్.)
మీరు చాలా జాగ్రత్తగా ఉండి మీ యొక్క ఈ భూమి నుండి. ఎందుకంటే ఇది మీ యొక్క తల్లి లాంటిది. మీరు ఈ భూమిపై నివసిస్తున్నారు, దీని లోకే వెళ్ళేవారు ఉన్నారు.

وَإِنَّهُ لَيْسَ مِنْ أَحَدٍ عَامِلٌ عَلَيْهَا خَيْرًا أَوْ شَرًّا إِلَّا وَهِيَ مُخْبِرَةٌ بِهِ
(వఇన్నహూ లైస మిన్ అహదిన్ ఫాయిలున్ అలైహా ఖైరన్ అవ్ షర్రన్ ఇల్లా వహియ ముఖ్బిరా.)
గుర్తుంచుకోండి, గుర్తుంచుకోండి, ఈ భూమి దీనిపై మీరు ఎక్కడ ఉండి ఏ పని చేసినా, మంచి పని చేసినా, చెడ్డ పని చేసినా ఆ భూమి రేపటి రోజు తప్పకుండా చెప్పనున్నది.

ఈ రెండు హదీసులు ప్రామాణికతలో కొంచెం బలహీనంగా ఉన్నప్పటికీ, ఒకటి మరొకటికి మంచి సపోర్ట్ ఇస్తుంది అని ధర్మవేత్తలు అంటారు. అందుకొరకే వీటిని ప్రస్తావించడం జరిగింది.

సోదర మహాశయులారా! ఇక్కడ మనం భయపడవలసిన విషయం ఏమిటంటే, ఈ భూమిలోని ఏ చోట ఉండి మనం ఏ పని చేస్తున్నామో, అది మన గురించి సాక్ష్యం పలుకుతుంది. వేరే కొన్ని ఉల్లేఖనాల ద్వారా తెలుస్తుంది, హజరత్ ఆయిషా రదియల్లాహు త’ఆలా అన్హా, ఇంకా వేరే సహాబాల ద్వారా రుజువైనటువంటి కొన్ని హదీసుల ద్వారా తెలుస్తున్న విషయం ఏమిటంటే, మనిషి ఎప్పుడూ కూడా ఏ చిన్న సత్కార్యాన్ని విలువ లేకుండా భావించకూడదు. ఇది ఏమవుసరం అన్నట్లుగా భావించకూడదు. అలాగే ఏ పెద్ద సత్కార్యాన్ని కూడా చేయడంలో వెనక ఉండకూడదు. అలాగే ఏ పాప కార్యం పట్ల కూడా ఇది ఎంత నష్టం చేకూరుస్తుంది అన్నటువంటి ధోరణిలో ఉండకూడదు.

ఈ ఆయతుల ద్వారా మనకు బోధపడుతుంది, మనం ఏ సత్కార్యాలు చేసినా, ఏ పాప కార్యాలు చేసినా వాటి గురించి సాక్ష్యాధారాలు తయారవుతూ పోతూ ఉన్నాయి. ఆ రోజు మనం మన నోటితో ఏ విషయాన్ని తిరస్కరించినా, స్వయం మన యొక్క శరీరం నుండే మనకు దానికి వ్యతిరేకంగా సాక్ష్యాలు వచ్చేస్తాయి. అందుకొరకు అల్లాహ్ తో భయపడుతూ ఉండాలి.

మరియు ఆ తర్వాత ఆయత్ నెంబర్ ఆరులో గమనించండి, ఆయత్ నెంబర్ ఐదులో, ఇదంతా కూడా అల్లాహ్ యొక్క అనుమతితో, అల్లాహ్ యొక్క ఆజ్ఞతోనే భూమి చేస్తుంది. గమనించండి, భూమి యొక్క సృష్టికర్త అల్లాహ్ మరియు అల్లాహ్ త’ఆలా ఆజ్ఞ ప్రకారమే అది మసులుకుంటుంది. అల్లాహ్ త’ఆలా ఖురాన్ లో ఒక చోట చెబుతున్నాడు, భూమి మరియు ఆకాశం ఈ రెండిటికీ అల్లాహ్ త’ఆలా మీకు ఇష్టమైనా లేకపోయినా మీరు విధేయులుగానే రావాలి అని అంటే వారు,

أَتَيْنَا طَائِعِينَ
(అతైనా తాయిఈన్)
మేము ఓ అల్లాహ్ నీకు విధేయులుగా హాజరయ్యాము అని చెప్పారు.

ఖురాన్ లోని ఆయత్ భావం. ఇంతటి విధేయత ఈ భూమి ఆకాశాలు పాటిస్తూ, ఎక్కడ ఏం మనం చేశామో అవన్నీ వివరిస్తున్నప్పుడు, మనం ఇంకా ఎంత అశ్రద్ధగా ఉంటాము? ఇంకా ఎన్ని రోజులు ఈ అశ్రద్ధ, ఏమరుపాటులో ఉంటాము?

ఆ తర్వాత అల్లాహ్ త’ఆలా ఆయత్ నెంబర్ ఆరులో తెలియజేస్తున్నాడు,

يَوْمَئِذٍ يَصْدُرُ النَّاسُ أَشْتَاتًا لِّيُرَوْا أَعْمَالَهُمْ
(యౌమఇదిన్ యస్దురున్నాసు అష్ తాతల్ లియురవ్ అఅమాలహుమ్)
ఆ రోజు జనులు – వారి కర్మలు వారికి చూపబడేందుకుగాను – వేర్వేరు బృందాలుగా తరలి వస్తారు.

యస్దుర్ (يَصْدُرُ) అని ఏదైతే ఇక్కడ చెప్పడం జరిగిందో, తరలి రావడం, తిరిగి రావడం. సమాధుల నుండి మైదానే మెహషర్ లో లెక్క తీర్పు గురించి మరియు అక్కడ ఎన్నో సంఘటనలు, ఎన్నో ఘట్టాలు ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ రెండవ తిరుగు ఏ గమ్యస్థానం ఉంటుందో ఎవరికి, స్వర్గం నరకం రూపంలో అటువైపున అని. మరియు ఇక్కడ ఏదైతే అష్ తాతా (أَشْتَاتًا), వేరు వేరు బృందాలుగా అని చెప్పడం జరిగిందో దానికి ఖురాన్ లోని ఇంకా ఎన్నో ఆయతులు కూడా సాక్ష్యాధారంగా ఉన్నాయి. దీని యొక్క భావంలో ఎన్నో విషయాలు వస్తాయి. ఒకటి ఏమిటి, అవిశ్వాసులు ఒక బృందం, విశ్వాసులు ఒక బృందం. ఈ విధంగా కూడా చెప్పడం జరిగింది. మరొక భావం ఇక్కడ, ప్రతి ప్రవక్త వారి యొక్క అనుచరుల ప్రకారంగా వేరు వేరు బృందాలు. మరొక భావం ఇందులో, ప్రతి ప్రవక్తతో వారిలో కొందరు విశ్వసించేవారు, మరికొందరు విశ్వసించని వారు. ఈ విధంగా ఖురాన్ లో ఎన్నో సందర్భాల్లో మనకు ఈ విషయాలు తెలుస్తాయి,

وَيَوْمَ نَحْشُرُ مِن كُلِّ أُمَّةٍ فَوْجًا مِّمَّن يُكَذِّبُ بِآيَاتِنَا فَهُمْ يُوزَعُونَ
(వయౌమ నహ్షురు మిన్ కుల్లి ఉమ్మతిన్ ఫౌజన్ మిమ్మన్ యుకద్దిబు బి ఆయాతినా ఫహుమ్ యూజఊన్)
ఆ రోజు మేము ప్రతి మానవ సమాజం నుంచి, మా ఆయతులను ధిక్కరించే ఒక్కొక్క సమూహాన్ని చుట్టుముట్టి మరీ తెస్తాము. ఆ తరువాత వారంతా వర్గీకరించబడతారు.” (27:83)

సూరతున్ నహల్ లో, అలాగే ఇంకా వేరే సూరాలలో కూడా ఈ భావం ఉంది. కానీ మళ్ళీ ఇక్కడ మరోసారి మీరు గమనించండి, లియురవ్ అఅమాలహుమ్. ఈ పదం, ఈ పదం ఏదైతే లియురవ్ అఅమాలహుమ్ అని ఉందో మనల్ని కంపించి వేయాలి, మనలో భయాన్ని పుట్టించాలి. ఎందుకు? ఏం చెప్పడం జరుగుతుంది, వారి యొక్క కర్మలు వారికి చూపించడానికి. అల్లాహు అక్బర్.

సోదర మహాశయులారా! ఎలాగైతే కొన్ని సందర్భాల్లో ఎక్కడైనా సీక్రెట్ సీసీటీవీలు, కెమెరాలు ఉంటాయి. ఇక్కడ మనల్ని ఎవరు చూడటం లేదు అని ఏదో నేరానికి పాల్పడతాము. కానీ పట్టుబడిన తర్వాత ఎప్పుడైతే ఆ సీసీ ఫొటేజ్ లను మన ముందు స్పష్టంగా ఒక స్క్రీన్ లో చూపించడం జరుగుతుందో, మనం ఆ ప్రాంతంలో ఎటు నుండి వస్తున్నాము, ఎలా వస్తున్నాము, ఏ ఏ ఆయుధాలతో, ఏ ఏ సాధనాలతో వస్తున్నాము, ఎలా లూటీ, దోపిడీ ఇంకా వేరే నేరాలకు పాల్పడుతున్నాము అదంతా మన కళ్ళారా మనం చూసుకుంటూ ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది ఈ లోకంలో ఒక్కసారి గమనించండి. ఇది ఏదో ఒక్కసారి చేసినటువంటి పొరపాటు, అది ఏదో రికార్డ్ అయిపోయింది, కానీ దాని గురించి విని మనం కొన్ని సందర్భాల్లో సిగ్గుకు గురి అవుతాము, ఎంతో సందర్భాల్లో ఛీ ఇలాంటి పనులు ఎందుకు చేయాలి అని అనుకుంటాము.

కానీ ఇక్కడ గమనించండి, అటువైపున భూమి సాక్ష్యం పలుకుతుంది, భూమి అంతా కూడా తెలియజేస్తుంది, మళ్ళీ అల్లాహ్ వద్దకు హాజరవుతున్నాము, అక్కడ ఈ ఫొటో, సీసీటీవీలలో మొత్తం రికార్డ్ అయినటువంటి మన పూర్తి జీవితం యొక్క ఫ్లాష్ బ్యాక్ రికార్డ్ వీడియో మొత్తం బయటికి వస్తుంది, అప్పుడు మనం ఎక్కడ తల దాచుకుంటాము? అప్పుడు మనం ఎక్కడ అల్లాహ్ యొక్క శిక్షల నుండి పారిపోతాము? ఏదైనా అవకాశం ఉందా?

లియురవ్ అఅమాలహుమ్, వారికి వారి కర్మలన్నీ చూపడం జరుగుతుంది అంటే దైవదూతలు రాసుకున్నటువంటి ఆ దఫ్తర్లు, రిజిస్టర్లు ఓపెన్ చేసి చూపిస్తారు అనే ఒక్కటే భావంలో మీరు ఉండకండి. ఆ చూపించడం అనేది మనకు, మనం ఇక్కడ లోకంలో ఏ రీతిలో మనం మసులుకుంటూ ఉంటామో ఆ ప్రకారంగా అక్కడ మనతో పరిస్థితి జరుగుతుంది. ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనం చేసిన తప్పులను ఒప్పుకొని అల్లాహ్ తో ఆ సమయంలో కూడా ఒకవేళ ఇహలోకంలో విశ్వాసంగా ఉండి కొన్ని పొరపాట్లు జరిగితే, తౌహీద్ పై ఉండి వేరే కొన్ని పాపాలు జరిగితే బహుశా అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ మనల్ని మన్నించేస్తాడు అన్నటువంటి ఆశ ఉంచవచ్చు కూడా. అవును, ఒక హదీస్ ద్వారా కూడా ఈ భావం మనకు కనబడుతుంది. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పి ఉన్నారు కూడా, మీలో ప్రతి ఒక్కడు ఎన్ని పాపాలు చేసినా గానీ విశ్వాసాన్ని పునరుద్ధరించుకోవాలి, తౌబా ఇస్తిగ్ఫార్ లాంటివి చేసుకుంటూ ఉండాలి, కానీ దానితో పాటు ఏంటి, ఏ పాపం జరిగినప్పటికీ అల్లాహ్ పట్ల సదుద్దేశంతో ఉండాలి. అల్లాహ్ నా విశ్వాసాన్ని స్వీకరించి, నా పుణ్యాలను స్వీకరించి, నా పాపాలను మన్నిస్తాడు అని. కానీ ఆ ఉద్దేశం ప్రకారంగా తన యొక్క విశ్వాసం, ఆచరణ కూడా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఒకవేళ అలా ప్రయత్నం చేయకుండా కేవలం బూటకపు అబద్ధపు ఆశలను పెట్టుకొని మనం చెడును చెడుగా భావించి ఛీ అన్నట్లుగా మన మనసులో లేకుంటే ఈ పశ్చాత్తాపం, ఈ ఆశ అనేది మనకు ఏ ప్రయోజనం చేకూర్చదు.

ఆ తర్వాత ఆయత్ నెంబర్ ఏడు మరియు ఎనిమిది, ఇది కూడా చాలా భయంకరమైన విషయం ఇందులో ఉంది. ఏమిటంటే, ఎక్కడ ఏ లోకంలో ఏ చాటున, ఏ గుహలో, ఏ రీతిలో ఎక్కడ ఉండి కూడా రవ్వంత, అణువంత, ఏ చిన్న పుణ్య కార్యం చేసినా అది మనం చూసుకుంటాము. మరియు ఇహలోకంలో ఏ చెడు చేసినా దాన్ని కూడా పరలోకంలో చూసుకుంటాము. ఈ భావంలో కూడా ఖురాన్ లో ఎన్నో ఆయతులు ఉన్నాయి,

وَوَجَدُوا مَا عَمِلُوا حَاضِرًا ۗ وَلَا يَظْلِمُ رَبُّكَ أَحَدًا
(వవజదూ మా అమిలూ హాదిరా వలా యద్లిము రబ్బుక అహదా.)
అల్లాహ్ త’ఆలా మీరు చేసిన పూర్తి మీ యొక్క జీవితమంతా ఏ ఏ కార్యాల్లో గడిసిందో దాన్నంతా కూడా హాజరు పరుస్తాడు, అల్లాహ్ ఎవరిపైనా కూడా ఏ కొంచెం అన్యాయం చేయడు.

సహీ బుఖారీలో వచ్చినటువంటి ఒక ఉల్లేఖనం ద్వారా మనం చాలా భయకంపితులైపోవాలి. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్నో విషయాలు తెలియజేస్తూ, గుర్రం గురించి నేను నిన్నటి క్లాస్ లో ఏదైతే ఒక హదీస్ సంక్షిప్త భావం చెప్పానో అది ఒకరి కొరకు అజ్ర్ (أَجْرٌ) ఉంటే మరొకరి కొరకు సిత్ర్ (سِتْرٌ) మరియు ఇంకో వారికి అది పాపంగా ఉంటుంది, మూడు రకాల విషయాలు, రకాల గుర్రాలు ఉన్నాయి అని. ఆ హదీస్ వివరించిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఒక సహాబీ అడిగారు, ప్రవక్తా, ఈ గుర్రం గురించి అయితే బాగానే చెప్పారు, మరి ఈ గాడిదల గురించి ఏంటి ప్రస్తావన అని. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాట ఏంటో గమనించండి,

مَا أُنْزِلَ فِيهَا شَيْءٌ إِلَّا هَذِهِ الْآيَةُ الْفَاذَّةُ الْجَامِعَةُ
(మా ఉన్జిల ఫీహా షైఅన్ ఇల్లా హాదిహిల్ ఆయతిల్ ఫాద్దతిల్ జామిఆ.)
మీరు అడిగిన ప్రశ్నకు నా వైపు నుండి నాకు ఏ సమాధానం లేదు, అల్లాహ్ ఏదైతే అవతరింపజేస్తూ ఉంటాడో, వహీ చేస్తూ ఉంటాడో దాని ప్రకారంగా నేను మీకు చెబుతూ ఉంటాను, ఇప్పుడు మీరు దీని గురించి ఏదైతే అడిగారో ఇక్కడ గుర్తుంచుకోండి, ప్రత్యేకంగా దీని గురించి నాకైతే ఏమీ ఆదేశం రాలేదు, ఏ వహీ రాలేదు, కానీ ఒక జామిఅ ఆయత్, ఒక విచిత్రమైన, ఒక యునీక్ లాంటి ఆయత్ అది మీరు గుర్తుంచుకోండి,

فَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ خَيْرًا يَرَهُ وَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ شَرًّا يَرَهُ
(ఫమయ్యామల్ మిస్ఖాల దర్రతిన్ ఖైరయ్యరహ్, వమయ్యామల్ మిస్ఖాల దర్రతిన్ షర్రయ్యరహ్)
కనుక ఎవడు అణుమాత్రం సత్కార్యం చేసినా దాన్ని అతను చూసుకుంటాడు. మరెవడు అణుమాత్రం దుష్కార్యం చేసినా దాన్ని అతను చూసుకుంటాడు.”

సోదర మహాశయులారా! ఫరజ్దఖ్ అని ఒక చాలా ప్రఖ్యాతి గాంచిన కవి. అయితే ఆ కవి యొక్క బాబాయి ప్రవక్త సల్లల్లాهُ అలైహి వసల్లం వద్దకు వచ్చాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతని ముందు ఈ సూరా చదువుతూ, ఫమయ్యామల్ మిస్ఖాల దర్రతిన్ ఖైరయ్యరహ్, వమయ్యామల్ మిస్ఖాల దర్రతిన్ షర్రయ్యరహ్ అని తిలావత్ చేశారు. ఆ మనిషి, అతడు కూడా అరబ్, అరబీ భాష పట్ల మంచి అవగాహన. విన్న వెంటనే ఏమన్నాడు, చాలు చాలు చాలు, ఇక మీరు ఆపండి. ఈ విషయమే నాకు సరిపోయింది, మనం గుణపాఠం తెచ్చుకోవడానికి, జీవితంలో ఒక మార్పు తెచ్చుకోవడానికి, ఇక బహుశా దీని తర్వాత ఏది వినే అవసరం ఉండదు అని చెప్పుకొచ్చాడు.

అంటే ఏంటి, మనం ఏదైతే ఇహలోకంలో పుణ్యం చేస్తామో, పరలోకంలో దాని గురించి మనకు తప్పకుండా ప్రతిఫలం లభించడమే కాదు, ఆ పుణ్య కార్యాన్ని కూడా మనం చూస్తాము వీడియో రూపంలో. మరియు ఎక్కడైతే ఏ పాపాలు చేస్తామో వాటిని కూడా వీడియో రూపంలో చూస్తాము. అలాంటి సందర్భంలో మన పరిస్థితి ఏముంటుందో, భయపడాలి అల్లాహ్ తో.

అందుకొరకే సోదర మహాశయులారా! సమయం కూడా కావస్తుంది గనుక, ఈ విధంగా హదీస్ గ్రంథాల్లో ఒక సూరాకు సంబంధించి, ఆ సూరాలోని కొన్ని ఆయతులకు సంబంధించి ఏ ఏ హదీసులు వస్తాయో, వాటిలో ఏ ఏ గుణపాఠాలు ఉంటాయో వాటి ద్వారా మనం మంచి బోధ నేర్చుకొని మన జీవితంలో మార్పు తెచ్చుకోవాలి. పరలోకం పట్ల విశ్వాసం మనది చాలా బలంగా ఉండాలి మరియు ఇహలోకంలోనే మనం మార్పు తెచ్చుకొని పుణ్యాల వైపునకు రావాలి లేదా అంటే చాలా నష్టంలో ఉంటాము.

అల్లాహ్ త’ఆలా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక. ఖురాన్ ను శ్రద్ధగా చదివి అర్థం చేసుకుంటూ ఉండే భాగ్యం ప్రసాదించుగాక.

آمِينَ وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ. وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(ఆమీన్ వ ఆఖిరు దఅవాన అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.)

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=31951

మా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి ఇన్ షా అల్లాహ్:
http://www.youtube.com/user/teluguislam?sub_confirmation=1

నాలుక ఉపద్రవాలు – హబీబుర్ రహ్మాన్ జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

నాలుక ఉపద్రవాలు – Dangers of the Tongue
https://youtu.be/4_uBq6Qy5lM [20 నిముషాలు]
వక్త: హబీబుర్ రహ్మాన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, నాలుక వల్ల కలిగే ఐదు ప్రధాన ఉపద్రవాలు మరియు పాపాల గురించి వివరించబడింది. ఇస్లాంలో నాలుకను అదుపులో ఉంచుకోవడం యొక్క ప్రాముఖ్యతను హదీసుల వెలుగులో నొక్కి చెప్పబడింది. పరోక్ష నింద (గీబత్), చాడీలు చెప్పడం (నమీమత్), రెండు నాలుకల ధోరణి (జుల్ వజ్హైన్), అబద్ధం చెప్పడం (కజిబ్), మరియు అబద్ధపు ప్రమాణం చేయడం అనే ఐదు పాపాలు స్వర్గానికి దూరం చేసి నరకానికి దగ్గర చేస్తాయని ఖురాన్ మరియు హదీసుల ఆధారాలతో హెచ్చరించబడింది. ముస్లిం తన నాలుక మరియు చేతుల నుండి ఇతరులకు హాని కలగకుండా చూసుకున్నప్పుడే ఉత్తముడవుతాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధనల సారాంశం.

ఇన్నల్ హమ్ దలిల్లాహి వహ్ దహ్ వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బ’అదహ్ అమ్మా బ’అద్.

అభిమాన సోదరులారా, మీకందరికీ నా ఇస్లామీ అభివాదం, అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహ్.

ఈరోజు మనం నాలుక ఉపద్రవాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ప్రియ సోదరులారా, మనిషి, ఒక ముస్లిం అవసరం మేరకే మాట్లాడాలి. అనవసరమైన మాటలు మాట్లాడేవారు, పిడి వాదాలకు దిగేవారు హదీసులో తీవ్ర పదజాలంతో హెచ్చరించబడ్డారు. అందుకే “నోరే నాకం (స్వర్గం), నోరే నరకం” అన్నారు పెద్దలు. నాలుకను సరిగ్గా ఉపయోగిస్తే అది స్వర్గానికి మార్గం సుగమం చేస్తుంది, దాన్ని దుర్వినియోగం చేస్తే నరకానికి గొనిపోతుంది అన్నమాట.

ఒక హదీస్ తెలుసుకుందాం. తిర్మిజీలో హదీస్ ఉంది. ఉఖ్బా బిన్ ఆమిర్ రదియల్లాహు త’ఆలా అన్హు కథనం, ఆయన ప్రవక్త గారిని ఒక మాట అడిగారు. అది ఏమిటి?

“యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం,

مَنِ النَّجَاةُ؟
(మన్ నజాత్?)”
“ముక్తికి మార్గం ఏది?”

ఓ దైవ ప్రవక్తా, ముక్తికి మార్గం ఏది? అని అడిగారు. చాలా ముఖ్యమైన ప్రశ్న ఇది. ముక్తికి మార్గం ఏది? దానికి సమాధానంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు:

أَمْسِكْ عَلَيْكَ لِسَانَكَ، وَلْيَسَعْكَ بَيْتُكَ، وَابْكِ عَلَى خَطِيئَتِكَ
(అమ్సిక్ అలైక లిసానక, వల్ యస’అక బైతుక, వబ్కి అలా ఖతీఅతిక)
నీ నాలుకను అదుపులో ఉంచుకో.అలాగే నీ ఇల్లు నిన్ను ఇమిడ్చుకోవాలి. పాపాలను గుర్తు చేసుకుని, మనము చేసిన తప్పుల్ని గుర్తు చేసుకుని రోదించాలి

ఈ హదీస్ తిర్మిజీ గ్రంథంలో ఉంది. అంటే, ఉఖ్బా బిన్ ఆమిర్ రదియల్లాహు అన్హు అడిగిన ప్రశ్న మాట ఏమిటి? ముక్తికి మార్గం ఏది? సమాధానం ఏమిటి ప్రవక్త గారు చెప్పారు? నీ నాలుకను అదుపులో ఉంచుకో, పెట్టుకో. నీ నాలుకను కాపాడుకో. అలాగే నీ ఇల్లు నిన్ను ఇమిడ్చుకోవాలి, అంటే నీ తీరిక సమయం ఇంట్లో గడవాలి. అలాగే నీ పాపాలను, నీ బలహీనతలను గుర్తించుకుని రోదించు, కన్నీళ్లు కార్చు అన్నమాట.

అంటే ఈ హదీస్‌లో ఉఖ్బా బిన్ ఆమిర్ రదియల్లాహు అన్హు ఒక ముఖ్యమైన ప్రశ్న అడిగితే, ముక్తి పొందాలంటే ఎలా పొందగలము, ముక్తికి మార్గం ఏది అంటే, దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మూడు విషయాలు చెప్పారు.

  • దాంట్లో మొదటిది ఏమిటి? నాలుకను అదుపులో పెట్టుకో. నాలుకను కాపాడుకో, రక్షించుకో. ఎందుకు? ఎందుకంటే నోరే నాకం, నోరే నరకం, ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా ముఖ్యమైన విషయం మాట ఇది పెద్దలు చెప్పిన మాట.
  • రెండవది, తీరిక సమయాన్ని, ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా ఇంట్లో గడపాలి.
  • మూడవది, పాపాలను గుర్తు చేసుకుని, మనము చేసిన తప్పుల్ని గుర్తు చేసుకుని రోదించాలి, కన్నీళ్లు కార్చాలి.

ఇక ఇంకో హదీస్ తెలుసుకుందాం. అబూ సయీద్ రదియల్లాహు త’ఆలా అన్హు కథనం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు. అదేమిటంటే, తెల్లవారజామున మనిషి శరీరంలోని అవయవాలన్నీ నాలుకను అత్యంత దీనంగా బతిమాలుతాయి. ఏమని బతిమాలుతాయి? “ఓ నాలుకా, నువ్వు మా విషయంలో అల్లాహ్‌కు భయపడి మసలుకో. ఎందుకంటే మా వ్యవహారం నీతో ముడిపడి ఉంది. నువ్వు సవ్యంగా ఉంటే మేము కూడా సవ్యంగా ఉండగలుగుతాం. నువ్వు వక్రతకు లోనైతే మేము కూడా వక్రతకు లోనైపోతాము.” ఈ విధంగా ప్రధాన పాత్ర వహిస్తుంది నాలుక. అది సవ్యంగా ఉంటే శరీర అవయవాలన్నీ సవ్యంగా ఉంటాయి. నాలుక వక్రతకు లోనైతే శరీర అవయవాలన్నీ వక్రతకు లోనైపోతాయి అన్నమాట.

ఇంకో హదీస్. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు:

مَنْ وَقَاهُ اللَّهُ شَرَّ مَا بَيْنَ لَحْيَيْهِ وَشَرَّ مَا بَيْنَ رِجْلَيْهِ دَخَلَ الْجَنَّةَ
(మన్ వఖాహుల్లాహు షర్ర మాబైన లహ్యైహి వ షర్ర మాబైన రిజ్లైహి దఖలల్ జన్నహ్)
“ఎవరినైతే అల్లాహ్ అతని రెండు దవడల మధ్య ఉన్న దాని (నాలుక) చెడు నుండి మరియు రెండు కాళ్ళ మధ్య ఉన్న దాని (మర్మాంగం) చెడు నుండి కాపాడతాడో, అతను స్వర్గంలో ప్రవేశిస్తాడు.”

ఎవడైతే తన రెండు దవడల మధ్య ఉన్న నాలుకను రక్షించుకుంటాడో, కాపాడుకుంటాడో, అలాగే రెండు కాళ్ళ మధ్య ఉన్న మర్మాంగాన్ని కాపాడుకుంటాడో, దఖలల్ జన్నహ్, అటువంటి వ్యక్తి స్వర్గంలో ప్రవేశిస్తాడు. అంటే స్వర్గంలో ప్రవేశించడానికి రెండు ముఖ్యమైన విషయాలను మనం రక్షించుకోవాలి అన్నమాట. ఒకటి నాలుక, రెండవది మర్మాంగం.

ఇక ఇంకో హదీస్. అబూ మూసా రదియల్లాహు అన్హు దైవ ప్రవక్తకు ప్రశ్న అడిగారు, “ఖుల్తు యా రసూలల్లాహ్, నేను అడిగాను, ఓ దైవ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం,

أَىُّ الْمُسْلِمِينَ أَفْضَلُ؟
(అయ్యుల్ ముస్లిమీన అఫ్జల్?)”
“ముస్లింలలో ఉత్తముడు ఎవరు?”

ఓ దైవ ప్రవక్తా, ముస్లింలు చాలా మంది ఉన్నారు సమాజంలో, ప్రపంచంలో. శ్రేష్ఠమైన ముస్లిం ఎవరు? ముస్లింలలో ఉత్తమమైన ముస్లిము, శ్రేష్ఠమైన వాడు, గొప్పవాడు ఎవరు? దానికి సమాధానం ప్రవక్త గారు ఇలా ఇచ్చారు:

مَنْ سَلِمَ الْمُسْلِمُونَ مِنْ لِسَانِهِ وَيَدِهِ
(మన్ సలిమల్ ముస్లిమూన మిన్ లిసానిహీ వ యదిహీ)
“ఎవని నాలుక మరియు చేతి నుండి ఇతర ముస్లింలు సురక్షితంగా ఉంటారో (అతనే ఉత్తముడు).”

ఏ ముస్లిం నాలుక ద్వారా, చేతుల ద్వారా ఇతరులకి హాని జరగదో, కీడు జరగదో, అటువంటి ముస్లిం అందరికంటే శ్రేష్ఠుడు, ఉత్తముడు అని మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఈ హదీస్ బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో ఉంది. సారాంశం ఏమిటంటే, నోరే నాకం, నోరే నరకం. కావున, అభిమాన సోదరులారా, నాలుక ఉపద్రవాలలో ఐదు తెలుసుకోబోతున్నాం. అంటే నాలుకకి సంబంధించిన పాపాలలో ఐదు పాపాలు మనం తెలుసుకుందాం.

మొదటిది, గీబత్, పరోక్ష నింద. గీబత్ అంటే ఏంటి? ఒక హదీస్ మనం తెలుసుకుంటే మనకు గీబత్ అర్థమవుతుంది. అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు కథనం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు,

أَتَدْرُونَ مَا الْغِيبَةُ؟
(అతద్రూన మల్ గీబహ్?)
“గీబత్ (పరోక్ష నింద) అంటే ఏమిటో మీకు తెలుసా?”

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సంభాషణ శైలి సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఒక్కొక్కసారి వాక్యం చెప్పేస్తారు, హదీస్. ఒక్కొక్కసారి ప్రశ్నోత్తరాల రూపంలో చెబుతారు. ఆ చెప్పబోయే మాట ఎంత ముఖ్యమైన ఉంటుందో ఆ విధంగా మాట్లాడే పద్ధతి ఉంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గీబత్ గురించి ఇలా ఆయనే అడుగుతున్నారు, “అతద్రూన మల్ గీబహ్? గీబత్ ఏంటో మీకు తెలుసా?”

సహాబాలు అన్నారు,

اللَّهُ وَرَسُولُهُ أَعْلَمُ
(అల్లాహు వ రసూలుహూ అ’అలమ్)
“అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకే బాగా తెలుసు.”

సహాబాలు బదులిచ్చారు, “ఓ దైవ ప్రవక్తా, అల్లాహ్‌కు తెలుసు, అల్లాహ్ ప్రవక్తకు తెలుసు, మాకు తెలియదు” అని. అప్పుడు అన్నారు ప్రవక్త గారు,

ذِكْرُكَ أَخَاكَ بِمَا يَكْرَهُ
(దిక్రుక అఖాక బిమా యక్రహ్)
“నీ సోదరుని గురించి అతను ఇష్టపడని విధంగా ప్రస్తావించటమే (గీబత్).”

అంటే మీ సోదరుని గురించి అతను వింటే అసహ్యించుకునే విధంగా మాట్లాడటం. సోదరుడు లేనప్పుడు వీపు వెనుక అతను వింటే అసహ్యించుకుంటాడు, ఆ విధంగా అతని గురించి మాట్లాడటం, దానికి గీబత్ అంటారు అని ప్రవక్త గారు సమాధానం ఇచ్చారు. ఈ సమాధానం విని సహాబీ మళ్ళీ తన ఒక డౌట్‌ని ఇలా అడిగారు, వ్యక్తం చేశారు, అదేమిటి, ఖీల (అడగబడింది),

أَفَرَأَيْتَ إِنْ كَانَ فِي أَخِي مَا أَقُولُ؟
(అఫరఅయిత ఇన్ కాన ఫీ అఖీ మా అఖూల్?)
“ఒకవేళ నేను చెప్పేది నా సోదరునిలో నిజంగానే ఉంటే అప్పుడేమిటి?”

“ఓ దైవ ప్రవక్తా, నా సోదరుని గురించి నేను చెప్పేది నిజంగానే అతనిలో ఉంది. ఏ లోపం గురించి నేను మాట్లాడుతున్నానో, ఏ తప్పు గురించి నేను మాట్లాడుతున్నానో నా సోదరుని గురించి, అది నిజంగానే అతనిలో ఉంది. అతనిలో లేనిది నేను చెప్పటం లేదు. అతనిలో ఉన్న విషయాన్నే నేను చెప్తున్నాను. అలాగైతే?” అని ఆయన తన అనుమానాన్ని వ్యక్తం చేశారు. దానికి విని ప్రవక్త గారు అన్నారు,

إِنْ كَانَ فِيهِ مَا تَقُولُ فَقَدِ اغْتَبْتَهُ
(ఇన్ కాన ఫీహి మా తఖూలు ఫఖద్ ఇగ్తబ్తహు)
“అతనిలో నువ్వు చెప్పేది ఉంటేనే నువ్వు గీబత్ చేసినట్లు.”

అంటే అతనిలో ఉండే తప్పులనే నువ్వు చెప్తున్నావు, అప్పుడే అది గీబత్ అయ్యేది. అతనిలో ఉండే లోపాలు, అతనిలో ఉండే తప్పులు, అతను లేనప్పుడు నువ్వు అతను అసహ్యించుకునేలా చెప్తున్నావు కదా, అదే గీబత్.

وَإِنْ لَمْ يَكُنْ فِيهِ فَقَدْ بَهَتَّهُ
(వ ఇన్ లమ్ యకున్ ఫీహి ఫఖద్ బహత్తహు)
“ఒకవేళ అతనిలో అది లేకపోతే, నువ్వు అతనిపై అభాండం (బుహతాన్) మోపినట్లు.”

అతనిలో లేనిది చెప్తే అది గీబత్ కాదు, బుహతాన్ అవుతుంది, అభాండాలు వేయటం అవుతుంది. గీబత్ (పరోక్ష నింద) వేరు, అభాండం వేయటం వేరు. ఒక వ్యక్తిలోని ఉండే లోపాలు, తప్పులు అతను లేనప్పుడు చెప్పుకోవటం గీబత్. అతను వింటే బాధపడతాడు, ఆ విధంగా చెప్పుకోవటం గీబత్, పరోక్ష నింద. అతనిలో లేని విషయాలు చెప్తే అది బుహతాన్, అభాండం వేయడం అవుతుంది.

కాకపోతే, సాక్ష్యం ఇచ్చేటప్పుడు, కోర్టులో, ఖాజీ దగ్గర, నిర్ణయాలు జరుగుతున్నాయి, పంచాయితీ జరుగుతూ ఉంది, సాక్ష్యం కోసం పిలిపించారు. అటువంటి సమయంలో అందరూ హాజరవుతారు. అటువంటప్పుడు ఉండేది ఉన్నట్టుగా, లేనిది లేనట్టుగా చెప్తే అది తప్పు లేదు. దీనికి చాలా వివరాలు ఉన్నాయి. సారాంశం ఏమిటంటే, గీబత్, పరోక్ష నింద అంటే వ్యక్తి లేనప్పుడు వీపు వెనుక అతను అసహ్యించుకునేలా అతని గురించి చెప్పుకోవటం. ఇది ఇస్లాంలో నిషిద్ధమైనది.

అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరహ్ హుజరాత్‌లో ఇలా తెలియజేశాడు:

…وَلَا يَغْتَب بَّعْضُكُم بَعْضًا ۚ أَيُحِبُّ أَحَدُكُمْ أَن يَأْكُلَ لَحْمَ أَخِيهِ مَيْتًا فَكَرِهْتُمُوهُ ۚ وَاتَّقُوا اللَّهَ ۚ إِنَّ اللَّهَ تَوَّابٌ رَّحِيمٌ
“… ఒకరి దోషాలను ఒకరు వెతకకండి. మీలో ఒకరు మరొకరి గురించి చాడీలు చెప్పకండి. మీలో ఎవరయినా తన చనిపోయిన సోదరుని మాంసం తినడానికి ఇష్టపడతాడా? దానిని మీరు అసహ్యించుకుంటారు కదా! మీరు అల్లాహ్‌కు భయపడండి. నిశ్చయంగా, అల్లాహ్ పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, అపార కరుణాప్రదాత.” (49:12)

అల్లాహు అక్బర్! మీరు గీబత్ చేసుకోకండి. మీలో కొందరు కొందరి గురించి గీబత్ చేసుకోకండి. పరోక్ష నింద, వీపు వెనుక చాడీలు చెప్పుకోకండి. వీపు వెనుక, వెనుక చాడీలు చెప్పుకోకండి. మీలో ఎవరైనా చనిపోయిన మీ సోదరుని మాంసం తినడానికి ఇష్టపడతాడా? అల్లాహు అక్బర్! చనిపోయిన సోదరుడు, అంటే శవం మాంసం తినడానికి ఇష్టపడతారా? ఫకరిహ్ తుమూహ్, మీరు ఏవగించుకుంటున్నారు కదా, అసహ్యించుకుంటున్నారు కదా. వత్తఖుల్లాహ్. అలాగైతే, గీబత్ విషయంలో అల్లాహ్‌కు భయపడండి. ఇన్నల్లాహ తవ్వాబుర్ రహీమ్, నిశ్చయంగా అల్లాహ్ తౌబా స్వీకరించేవాడు, కనికరించేవాడు.

ఇది మొదటిది. నాలుక ఉపద్రవాలలో, నాలుకకు సంబంధించిన రోగాలలో ఒకటి, పాపాలలో ఒకటి గీబత్, పరోక్ష నింద.

రెండవది, చాడీలు చెప్పటం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

لاَ يَدْخُلُ الْجَنَّةَ نَمَّامٌ
(లా యద్ఖులుల్ జన్నత నమ్మామున్)
“చాడీలు చెప్పేవాడు స్వర్గంలో ప్రవేశించడు.”

చాడీలు చెప్పేవాడు స్వర్గంలో ప్రవేశించడు, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఈ హదీస్ బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో ఉంది. అలాగే ఒక హదీస్, మనందరికీ తెలిసిన విషయమే, నేను దాని ఆ హదీస్ యొక్క సారాంశం చెప్తున్నాను. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఎక్కడో పోతుంటే మధ్యలో సమాధులు కనబడినాయి. ఆ సమాధులలో ఏం చెప్పారు? ఈ సమాధిలో ఉన్న వారికి శిక్ష పడుతుంది అని చెప్పాడు ప్రవక్త గారు. దేని మూలంగా? ఒక వ్యక్తికి చాడీల మూలంగా, చాడీలు చెప్పుకుంటూ తిరిగేవాడు ఒక వ్యక్తి, దాని మూలంగా సమాధిలో శిక్ష అనుభవిస్తున్నాడు. రెండో వ్యక్తి, మూత్రం పోసినప్పుడు ఒంటి మీద దాని తాలూకు తుంపరలు పడకుండా జాగ్రత్త పడేవాడు కాదు. కావున చాడీలు సమాజంలో కుటుంబాలను, జీవితాలను ఛిన్నాభిన్నం చేయటానికి ముఖ్యమైన పాత్ర వహిస్తుంది చాడీ. కావున చాడీల నుంచి మనం దూరంగా ఉండాలి. నాలుకకి సంబంధించిన ఉపద్రవాలలో రెండవది చాడీలు చెప్పటం.

మూడవది, జుల్ వజ్హైన్ (రెండు ముఖాల వాడు). రెండు నాలుకల ధోరణికి పాల్పడేవాడు. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, ఒక సుదీర్ఘమైన హదీస్ ఉంది, ఆ హదీస్‌లోని చివరి భాగం ఇది:

وَتَجِدُونَ شَرَّ النَّاسِ ذَا الْوَجْهَيْنِ الَّذِي يَأْتِي هَؤُلاَءِ بِوَجْهٍ وَهَؤُلاَءِ بِوَجْهٍ
“ప్రజలలోకెల్లా చెడ్డవాడు రెండు ముఖాల వాడు అని మీరు గమనిస్తారు. అతను ఈ గుంపు వద్దకు ఒక ముఖంతో, ఆ గుంపు వద్దకు మరో ముఖంతో వెళ్తాడు.”

ముత్తఫఖున్ అలైహ్, బుఖారీ, ముస్లింలోని హదీస్. అంటే ప్రజలలో రెండు ముఖాల గలవారిని అత్యంత నీచులు అయినట్లు మీరు గమనిస్తారు. వాడు చేసే పని ఏమిటి? వారు కొందరి దగ్గరికి ఒక ముఖంతో, మరికొందరి దగ్గరికి ఇంకో ముఖంతో వెళ్తారు. అంటే అర్థం ఏమిటి? ఒక వర్గం దగ్గరికి ఒక ముఖంతో పోవటం, ఇంకో వర్గం దగ్గరికి ఇంకో ముఖంతో పోవటం, అర్థం ఏమిటి? ఒక వ్యక్తి దగ్గరికి పోయి, ఒక వర్గం దగ్గరికి పోయి, “నేను మీ శ్రేయోభిలాషిని, మీకు మిత్రుణ్ణి. మీకు ఎవరు శత్రువో వాడు నాకు కూడా శత్రువు.” అతని గురించి గొప్పలు చెప్పుకుని అతని శత్రువు గురించి చెడుగా చెప్పి వచ్చి, మళ్లీ అదే వ్యక్తి శత్రువు దగ్గరికి పోయి ఇదే మాట రిపీట్ చేయటం, “నేను నీకు మిత్రుణ్ణి, నేను నీకు శ్రేయోభిలాషిని, నీ శత్రువుకి నేను శత్రువుని.” ఈ విధంగా అతను రెండు ముఖాలు చూపించాడు. ఒక వర్గం ఇంకో వర్గానికి పడదు, ఈ వర్గానికి ఒక రకంగా మాట్లాడి అదే పద్ధతి ఆ వర్గం దగ్గరికి పోయి కూడా చెప్పటం. దీనిని అంటారు జుల్ వజ్హైన్, రెండు నాలుకల ధోరణి. ఇది చాలా చెడ్డది.

నాలుగవది, అబద్ధం చెప్పటం. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

إِنَّ الصِّدْقَ يَهْدِي إِلَى الْبِرِّ وَإِنَّ الْبِرَّ يَهْدِي إِلَى الْجَنَّةِ… وَإِنَّ الْكَذِبَ يَهْدِي إِلَى الْفُجُورِ وَإِنَّ الْفُجُورَ يَهْدِي إِلَى النَّارِ
“నిశ్చయంగా, సత్యం పుణ్యం వైపు దారి తీస్తుంది మరియు పుణ్యం స్వర్గం వైపు దారి తీస్తుంది… మరియు నిశ్చయంగా, అసత్యం పాపం వైపు దారి తీస్తుంది మరియు పాపం నరకం వైపు దారి తీస్తుంది…”

సత్యం అనేది, నిజం అనేది సదాచరణ వైపు తీసుకునిపోతుంది. వ ఇన్నల్ బిర్ర యహదీ ఇలల్ జన్నహ్. సదాచరణ, నిజాయితీ స్వర్గంలో తీసుకునిపోతుంది. వ ఇన్నర్ రజుల లయజ్దుకు. ఒక వ్యక్తి నిజం చెప్తూ ఉంటాడు, హత్తా యుక్తబ ఇందల్లాహి సిద్దీఖన్, చివరికి అల్లాహ్ వద్ద అతను నిజాయితీపరుడు అని అతని గురించి రాయడం జరుగుతుంది, లిఖించడం జరుగుతుంది. వ ఇన్నల్ కజిబ యహదీ ఇలల్ ఫుజూర్, అబద్ధం అనేది అవిధేయత వైపుకు తీసుకునిపోతుంది, పాపం వైపుకు తీసుకుని వెళ్తుంది. వ ఇన్నల్ ఫుజూర యహదీ ఇలన్నార్, ఈ అవిధేయత నరకానికి తీసుకునిపోతుంది. వ ఇన్నర్ రజుల లయక్దిబు, ఒక వ్యక్తి అబద్ధం చెబుతూనే ఉంటాడు, హత్తా యుక్తబ ఇందల్లాహి కజ్జాబన్, చివరికి అల్లాహ్ దగ్గర అతను అబద్ధీకుడుగా లిఖించబడతాడు.

ప్రియ సోదరులారా, సారాంశం ఏమిటంటే ఈ హదీస్‌లో, సత్యమే మాట్లాడితే నిజాయితీపరుడైపోతాడు, తత్కారణంగా స్వర్గంలోకి ప్రవేశిస్తాడు. అబద్ధం మాట్లాడుతూ ఉంటే అబద్ధీకుడు అని లిఖించబడతాడు, తత్కారణంగా నరకానికి పోతాడు. నాలుక ఉపద్రవాలలో ఇది అబద్ధం కూడా ఒకటి.

ఐదవది, అబద్ధపు ప్రమాణం చేయటం. సామాన్యంగా అబద్ధం చెప్పటం అది ఒక రకమైన ఉపద్రవం, తప్పు, చెడు. అబద్ధపు సాక్ష్యం ఇవ్వటం, ప్రమాణం చేయటం లేక ఒట్టు పెట్టుకోవటం అంటే వాస్తవానికి సాక్ష్యం ఇవ్వటం అన్నమాట. లేక ఒకరికి సాక్ష్యంగా పెట్టుకోవటం అన్నమాట. అల్లాహ్ పైన ప్రమాణం చేసి చెబుతున్నాడంటే అదెంత ముఖ్యమైనది, అసాధారణమైన విషయమో బాగా ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనము చేసే ప్రమాణంపై అల్లాహ్‌ను కూడా మనము తీసుకునివస్తున్నాము, అల్లాహ్ పైన ప్రమాణం చేస్తున్నామంటే అల్లాహ్‌కు కూడా దీంట్లో మనము ఇది చేస్తున్నాం. కావున, అవసరం లేకపోయినప్పటికీ ప్రమాణం చేయటమే తప్పు. అవసరం పడితే, ముఖ్యావసరం అయితేనే ప్రమాణం చేయాలి. అవసరం లేకపోతే ప్రమాణం చేయటం తప్పు. దానికి తోడు అబద్ధపు ప్రమాణం చేయటం. సుబ్ హా నల్లాహ్! సత్యమైన, నిజంగానే ప్రమాణం చేయటం అనవసరమైన విషయాలలో చేయకూడదు, అవసరమైతేనే చేయాలి. ఇక ఒకటి అవసరం కాదు, రెండవది ప్రమాణం చేస్తున్నాము, అది కూడా అబద్ధం ప్రమాణం చేస్తున్నాము, అంటే ఇది తీవ్రమైన తప్పు.

అభిమాన సోదరులారా, దీని గురించి ఇస్లాం ధర్మంలో దీని వివరాలు ఎక్కువగా ఉన్నాయి. సారాంశం ఏమిటంటే, నాలుక ఉపద్రవాలలో చాలా ఉన్నాయి, వాటిలో నేను ఐదు విషయాలు నేను వ్యక్తం చేశాను, తెలియజేశాను. ఒకటి గీబత్, పరోక్ష నింద, రెండోది చాడీలు చెప్పటం, మూడవది జుల్ వజ్హైన్, రెండు నాలుకల ధోరణి, నాలుగవది అబద్ధం చెప్పటం, ఐదవది అబద్ధపు ప్రమాణం చేయటం. ఇవి నాలుకకి సంబంధించిన ఉపద్రవాలలో ముఖ్యమైనవి.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ నాలుకకి సంబంధించిన ప్రతి ప్రమాదం నుండి, ప్రతి చెడు నుండి కాపాడు గాక. అల్లాహ్ మనందరికీ ప్రతి పాపం నుండి కాపాడు గాక. ఆమీన్.

వ ఆఖిరు ద’అవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహ్.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=24855

పాపాలు (Sins):
https://teluguislam.net/sins/

ఈ క్రింది లింక్‌ దర్శించి, మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: గ్రూప్ 1: https://chat.whatsapp.com/JYb4QhZ4Hlu5Ek076Xx4fJ

జిక్ర్ మరియు ఇస్తిగ్ఫార్ ఘనత & రోజు వారి జీవితంలో చదివే ప్రత్యేక దుఆలు మరియు వాటి ఘనతలు [వీడియో & టెక్స్ట్]

జిక్ర్ మరియు ఇస్తిగ్ఫార్ ఘనత & రోజు వారి జీవితంలో చదివే ప్రత్యేక దుఆలు మరియు వాటి ఘనతలు
https://youtu.be/Oldiv3H1dE0 [60+ నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, ఇస్తిగ్ఫార్ (క్షమాపణ కోరడం) మరియు ధిక్ర్ (అల్లాను స్మరించడం) యొక్క ప్రాముఖ్యత మరియు ప్రయోజనాల గురించి ఖురాన్ మరియు హదీసుల వెలుగులో వివరించబడింది. ఇస్తిగ్ఫార్ అనేది పాపాల నుండి హృదయాన్ని శుభ్రపరచడమే కాకుండా, వర్షాలు, సంపద, సంతానం వంటి ప్రాపంచిక మరియు పారలౌకిక శుభాలను తెస్తుందని నొక్కి చెప్పబడింది. సయ్యిదుల్ ఇస్తిగ్ఫార్ వంటి ప్రత్యేక దువాల ఘనత కూడా చర్చించబడింది. అదేవిధంగా, ధిక్ర్ అనేది ఒక ముస్లిం జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆరాధనగా మారుస్తుందని, నిలబడి, కూర్చుని, పడుకుని – అన్ని స్థితులలో అల్లాహ్ స్మరణలో ఉండటం వల్ల అపారమైన పుణ్యం మరియు అల్లాహ్ శిక్ష నుండి రక్షణ లభిస్తుందని స్పష్టం చేయబడింది. లా ఇలాహ ఇల్లల్లాహ్ మరియు సుబ్హానల్లాహి వబిహమ్దిహి వంటి ధిక్ర్ ల యొక్క గొప్పతనం మరియు ప్రతి ఫర్జ్ నమాజు తర్వాత చేసే తస్బీహ్‌ల వల్ల కలిగే లాభాలు కూడా వివరించబడ్డాయి. అంతిమంగా, ప్రతి ముస్లిం తన జీవితాన్ని ఇస్తిగ్ఫార్ మరియు ధిక్ర్ లతో అలంకరించుకోవాలని ప్రబోధించబడింది.

ప్రియ వీక్షకులారా! ఈరోజు అల్లాహ్ యొక్క దయతో మనం రెండు అంశాలపై మాట్లాడుకుందాము. అయితే ఈ రెండు అంశాలకు సంబంధించిన సందేశం మీకు ముందే చేరి ఉన్నది గ్రూపులలో. ఒకటి ధిక్ర్ గురించి మరొకటి ఇస్తిగ్ఫార్ గురించి. అయితే ధిక్ర్ మరియు ఇస్తిగ్ఫార్ లో మన రోజువారీ జీవితంలో మనం చదివే దువాలలో ఏ గొప్ప విషయాలు ఉన్నాయి, వాటి గురించి ప్రత్యేకంగా గుర్తు చేస్తూ ఇన్షా అల్లాహ్ నేను కొన్ని విషయాలు తెలియజేస్తాను.

అయితే ఇందులో ప్రతి ఒక్క అంశం, ధిక్ర్ మరియు ఇస్తిగ్ఫార్, సపరేట్గా మనకు స్పష్టంగా అర్థం కావడానికి నేను రెండు టాపిక్కులుగా, రెండు అంశాలుగా వేరువేరు చెప్తాను. సుమారు ఒక 25 నుండి 30 నిమిషాలు ముందు ఇస్తిగ్ఫార్ గురించి మాట్లాడుకుందాము. ఆ తర్వాత ధిక్ర్ గురించి.

అల్హమ్దులిల్లాహి వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్.

ఇస్తిగ్ఫార్ (క్షమాపణ కోరడం)

أَعُوذُ بِاللَّهِ السَّمِيعِ الْعَلِيمِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ
فَقُلْتُ اسْتَغْفِرُوا رَبَّكُمْ إِنَّهُ كَانَ غَفَّارًا يُرْسِلِ السَّمَاءَ عَلَيْكُم مِّدْرَارًا وَيُمْدِدْكُم بِأَمْوَالٍ وَبَنِينَ وَيَجْعَل لَّكُمْ جَنَّاتٍ وَيَجْعَل لَّكُمْ أَنْهَارًا
ఫకుల్తుస్తగ్ఫిరూ రబ్బకుమ్ ఇన్నహూ కాన గఫ్ఫారా, యుర్సిలిస్ సమాఅ అలైకుమ్ మిద్రారా, వయుమ్‌దిద్‌కుమ్ బి అమ్వాలివ్ వబనీన వయజ్అల్ లకుమ్ జన్నతివ్ వయజ్అల్ లకుమ్ అన్హారా.
నేను ఇలా అన్నాను, ‘క్షమాపణకై మీ ప్రభువును వేడుకోండి. నిశ్యయంగా ఆయన అమితంగా క్షమించేవాడు. ఆయన ఆకాశం నుంచి మీపై ధారాపాతంగా వర్షం కురిపిస్తాడు. మీ సిరిసంపదల్లోనూ, పుత్ర సంతతిలోనూ పురోభివృద్ధిని ఒసగుతాడు. మీ కొరకు తోటల్ని ఉత్పన్నం చేస్తాడు, ఇంకా మీ కోసం కాలువలను ప్రవహింపజేస్తాడు.’

సోదర మహాశయులారా, సోదరీమణులారా, ప్రియ వీక్షకులారా! సూరత్ నూహ్ 29వ పారాలో ఒక ముఖ్యమైన ప్రవక్తలలో ఒక గొప్ప ప్రవక్త నూహ్ అలైహిస్సలాం వారి దావత్, వారు తమ జాతి వారికి ఇచ్చినటువంటి సందేశంలో ఇస్తిగ్ఫార్ గురించి ఉన్నటువంటి కొన్ని ఆయతులు, అందులోని కొన్ని గొప్ప భావం గలటువంటి, ఘనత గలటువంటి విషయాలు తెలియజేయడానికి నేను మీ ముందు తిలావత్ చేశాను.

అయితే ఇస్తిగ్ఫార్ అంటే ఏంటి? ఇస్తిగ్ఫార్ అంటే మనం మన పాపాల మన్నింపుకై అల్లాహ్ తో అర్ధించడం. అస్తగ్ఫిరుల్లాహ్ అని మనం అంటాము సర్వసామాన్యంగా. నమాజ్ నుండి సలాం తిప్పిన తర్వాత అంటే ఏంటి? ఓ అల్లాహ్, నేను నా పాపాల నుండి నీ క్షమాభిక్షను, మన్నింపును కోరుతున్నాను.

సోదర మహాశయులారా, నేను ఈ ఇస్తిగ్ఫార్ గురించి మరికొన్ని విషయాలు చెప్పేకి ముందు ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. మనలో ఎంతో మంది ఒకరి చేతి కింద పని చేస్తారు. అలాంటప్పుడు సర్వసామాన్యంగా ఏదైనా మన పనిలో మిస్టేక్ జరిగినప్పుడు మనం మన పై వారితో సారీ అని అంటూ ఉంటాము. కదా? కొన్ని సందర్భాల్లో ఒకే రోజులో ఎన్నోసార్లు ఇలాంటి ఏదైనా పొరపాటు జరిగి ఉంటే మనం అక్కడ ఆ సమయంలో ఆ పెద్దవారి ముందు సారీ అని, క్షమించండి అని ఈ భావం గల ఇంకా వేరే ఏ పదాలైనా గానీ ఉపయోగిస్తాము.

ఇక్కడ గమనించండి, ఒక వ్యక్తి పని చేస్తున్నాడు. తనకు పైగా ఉన్నటువంటి అధికారికి ఆ పని గురించి ఉత్తమ రీతిలో చేయాలని, అందులో ఏదైనా లోపం జరిగితే క్షమాపణ కోరాలని మన యొక్క స్వభావంలో ఈ విషయం ఉన్నది. అయితే మనమందరము కూడా మన సృష్టికర్త నిజ ఆరాధ్యుడైన అల్లాహ్ యొక్క దాసులం. అల్లాహు తాలా ఆరాధన కొరకే మనం పుట్టించబడ్డాము. ఇక తప్పు జరగకుండా నూటికి నూరు శాతం, హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మనం జీవితం గడపలేము. పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, తప్పులు జరుగుతూ ఉంటాయి. అందుకొరకే మనం అల్లాహ్ తో క్షమాపణ కోరుకుంటూ ఎల్లవేళల్లో అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ యందు మన యొక్క లోపం, మన యొక్క కొరత, మనతో జరిగేటువంటి తప్పులు, అపరాధాలు, పాపాలు అన్నిటి గురించి ఓ అల్లాహ్, నీవు నన్ను క్షమించు, మన్నించు అని మనం ఇలా అనుకుంటూ ఉంటే ఇది మన యొక్క ఆత్మశుద్ధి, ఆ పాపం నుండి ఇక ముందుకు దూరం ఉండడానికి, జరిగిన పాపం దాని యొక్క శిక్ష నుండి తప్పించుకోవడానికి, అల్లాహ్ యొక్క క్షమాభిక్ష, మన్నింపు పొంది అతని కరుణ ఛాయల్లో రావడానికి, అతనికి ఇంకా దగ్గర అవ్వడానికి ఇస్తిగ్ఫార్ ఎంతో ముఖ్యమైన విషయం.

అయితే రండి, ఇస్తిగ్ఫార్ గురించి రెండు, మూడు గంటలు చెప్పుకుంటూ పోయినా గానీ ఈ అంశం పూర్తి కాదు. అన్ని ఆయతులు, అన్ని హదీసులు ఎన్నో కోణాల నుండి దీనిని మనం చెప్పుకోవచ్చు. కానీ మన రోజువారీ జీవితంలో మనకు చాలా ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు నేను తెలియజేస్తున్నాను, మీరు శ్రద్ధ వహిస్తారని ఆశిస్తున్నాను.

అన్నిటికంటే ముందు నేను ఇబ్ను మాజాలో వచ్చినటువంటి ఒక హదీస్ వినిపిస్తున్నాను. చాలా ముఖ్యమైన హదీస్ ఇది. దీని ద్వారా మనకు ఇస్తిగ్ఫార్ యొక్క లాభం అన్నది చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే రండి ఇదిగోండి, ఈ హదీస్ అరబీ పదాలు మీరు కూడా చూస్తూ దీని యొక్క అర్థాన్ని, దీని యొక్క భావాన్ని తెలుసుకోండి.

ఇప్పుడే మీకు చూపిస్తూ ఉన్నాను.

అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, “నిశ్చయంగా దాసుడు ఒక తప్పు, అపరాధం, పాపం చేసినప్పుడు అతని యొక్క హృదయంలో ఒక నల్ల మచ్చ ఏర్పడుతుంది. అతడు ఆ పాపాన్ని వదులుకుంటే, అల్లాహ్ తో క్షమాపణ కోరుకుంటే, పాపం చేయడం ద్వారా అల్లాహ్ కు ఏదైతే దూరమయ్యాడు కదా, తాబా (అల్లాహ్ వైపునకు మరలితే) అతని ఆ హృదయంలో నుండి ఆ మచ్చ అనేది దూరమైపోతుంది. పాపాలు పెరిగిపోతే ఆ నల్ల మచ్చలు పెరుగుతూ పోతాయి, చివరికి పూర్తి హృదయంపై ఆ మచ్చలు మచ్చలు మచ్చలు మచ్చలు ఎక్కువైపోయి హృదయమే నల్లగా అయిపోతుంది. ఇదే అల్లాహు అజ్జవజల్ల తన కితాబులో చెప్పాడు.” ఇదే,

كَلَّا ۖ بَلْ ۜ رَانَ عَلَىٰ قُلُوبِهِم مَّا كَانُوا يَكْسِبُونَ
కల్లా బల్ రాన అలా ఖులూబిహిమ్ మా కానూ యక్సిబూన్.
అది కాదు, అసలు విషయం ఏమిటంటే వారి దురాగతాల మూలంగా వారి హృదయాలకు తుప్పు పట్టింది.

ఇక్కడ అల్లాహు తాలా తుప్పు పట్టింది అని ఏదైతే అంటున్నాడో, ఈ తుప్పు అనేది హృదయానికి దేనివల్ల పట్టింది? వారి యొక్క దురాగతాలు, వారి యొక్క పాపాలు, వారి యొక్క చెడు పనులు ఏవైతే వారు చేస్తున్నారో.

ఇన్షా అల్లాహ్ మీకు విషయం అర్థమైందని ఆశిస్తున్నాను. ఈ హదీస్ ద్వారా మనకు బోధపడిన విషయం ఏంటి? ఎప్పుడెప్పుడైతే దాసుడు ఓ తప్పుకు, ఓ పాపానికి ఒడిగడతాడో అప్పుడప్పుడు అతని యొక్క హృదయం నల్లగా అవుతుంది. పాపాలు పెరిగిపోతూ పోయాయి, కానీ వాటిని ఆ నల్ల మచ్చను దూరం చేయడానికి పాపాన్ని వదులుకోవడం, అల్లాహ్ తో క్షమాపణ కోరుకోవడం, అల్లాహ్ వైపునకు మరలడం ఇలాంటిదేమీ చేయకుంటే అది ఇంకా నల్లగా అయిపోయి తర్వాత చాలా ప్రమాదానికి మనిషి గురి అయిపోతాడు.

అయితే రండి ఇక్కడ మనం ముందు తెలుసుకుందాము, పాపం అంటే ఏమిటి? సోదర మహాశయులారా, అల్లాహ్ ఏ ఆదేశం ఇచ్చాడో దానిని పాటించకపోవడం పాపం. అల్లాహ్ ఏ విషయాన్ని చేయకూడదు అని చెప్పాడో అంటే అల్లాహ్ యొక్క వారింపులు, వాటికి పాల్పడడం ఇది పాపంలో లెక్కించబడుతుంది. ఈ విధంగా ఇది మన మధ్య అల్లాహ్ కు మధ్యలో కావచ్చు, మన మధ్య మనలాంటి మానవుల మధ్యలో కావచ్చు, మనము మరియు మానవులే కాకుండా ఇతర, ఉదాహరణకు ఎక్కడైనా ఒక చెట్టు ఉన్నది. నీడ ఆ చెట్టు ద్వారా ప్రజలు పొందుతూ ఉన్నారు. అనవసరంగా ఆ చెట్టును కోసేసాము. ప్రజలకు కలిగేటువంటి లాభాన్ని మనం దూరం చేశాము. ఇది కూడా ఒక పాపమే. మనం డైరెక్ట్ గా ఒక మనిషికి బాధ కలిగించలేదు, ఇన్డైరెక్ట్ గా కలిగించాము. జంతువులు ఉన్నాయి, కాలక్షేపంగా నా యొక్క గురి బాగా ఉందా లేదా అని కేవలం పరీక్షించుకోవడానికి పక్షులను, జంతువులను ఈటెతో గానీ లేదా ఇంకా ఈ రోజుల్లో గన్ అలాంటి వేరే పరికరాలతో వాటిని చంపడం ఇది ఇస్లాం ధర్మంలో పాపంగా చెప్పడం జరిగింది. కొందరు కొన్ని రకాల పక్షుల పిల్లల్ని పట్టుకుంటారు దాని మూలంగా ఆ పక్షి యొక్క తల్లి ఏదైతే ఉంటుందో దానికి చాలా బాధ కలుగుతూ ఉంటుంది, ఇది కూడా ఒక పాపంలో వస్తుంది. అర్థం కావడానికి ఈ విషయాలు చెప్తున్నాను. మనం వెళ్తూ వెళ్తూ ఆ ఏందీ తీసుకెళ్లి డస్ట్ బిన్ లో వేసేది అని బనానా అరటిపండు యొక్క ఆ తొక్క ఏదైతే ఉందో అలాగే దారిలో పడేస్తాము. హదీస్ లో ఏముంది? దారిలో నుండి బాధ కలిగించే విషయాన్ని దూరం చేయడం పుణ్యకార్యం. ఇక్కడ మనం బాధ కలిగించే ప్రయత్నం చేస్తున్నాము. ఈ విధంగా మనం అల్లాహ్ పట్ల గానీ, ప్రజల పట్ల గానీ, ఇంకా వేరే ఎవరి పట్ల గానీ ఏదైనా వారికి హాని కలిగించడం ఇవన్నీ కూడా పాపాల్లో లెక్కించబడతాయి. పాపాలు చేయడం వల్ల అది స్వయం మన ఆత్మకు, మన శరీరానికి, మన ఆరోగ్యానికి, పాపం వల్ల మన ఇంట్లో మనకు, మన పిల్లలకు, మన యొక్క సంపదలో, మన యొక్క ధనంలో, మన రోజువారీ జీవితంలో, మన సమాజానికి ఎంతో చెడు ఉంటుంది. పాపాల ప్రభావం వ్యక్తిగత మరియు సామాజిక జీవితంపై, ఇది ఒక ముఖ్యమైన అంశం. ఇన్షా అల్లాహ్ ఏ రోజైనా దాని గురించి వివరంగా తెలుసుకుందాము. కానీ ఇప్పుడు నేను ఇక్కడ దాన్ని సంక్షిప్తంగా ఎందుకు ప్రస్తావిస్తున్నాను? ఇలాంటి ఏ తప్పు ఏ పాపం జరిగినా గానీ మనం స్వచ్ఛమైన మనసుతో అల్లాహ్ తో క్షమాపణ కోరుకోవాలి. అల్లాహ్ తో క్షమాభిక్ష కోరాలి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే మనం అల్లాహ్ తో క్షమాపణ కోరుకుంటామో అక్కడ నాలుగు కండిషన్లను గుర్తుంచుకోవాలి. అప్పుడే అల్లాహ్ తో మనం కోరుకున్న ఆ క్షమాపణ స్వీకరించబడుతుంది. మన యొక్క తప్పు, మన యొక్క పొరపాటు, మన యొక్క పాపం అది మన్నించబడుతుంది. దాని యొక్క శిక్ష నుండి మనం తప్పించుకోగలుగుతాము. ఈ కండిషన్లు పూర్తి చేయడంలో ఎంత వెనక ఉంటామో, ఎంత లేజీతనం మనం చేస్తామో అంతే మన తౌబా ఇస్తిగ్ఫార్ యొక్క ఆమోదం కూడా, అది స్వీకరించబడడం కూడా చాలా వెనక ఉండిపోతాము. ఏంటి అవి? మొదటిది, చేసిన తప్పును ఛీ అని భావించడం. దానిని అది గుర్తు వచ్చినప్పుడు నాతో ఎలా జరిగిపోయింది కదా అని ఒక పశ్చాత్తాప భావం అనేది మనిషిలో ఉండాలి. కొన్ని పాపాల గురించి ఎలా ఉంటుంది? అయ్యో వాడు చూస్తున్నాడు, వీడు చూస్తున్నాడు అని వదులుకుంటాము. కానీ మనసులో ఇంత మంచి అవకాశం పాయే కదా అని అనుకుంటాము. చూడడానికి పాపం చేయట్లేదు కావచ్చు, కానీ ఇది తౌబాలో రాదు. ఎందుకు? పాపం పట్ల కాంక్ష ఉంది. ఇక్కడ ఏం జరగాలి? మొట్టమొదటి షరతు, మొట్టమొదటి నిబంధన, పాపాన్ని తప్పుగా భావించాలి, పాపంగా భావించాలి, ఛీ నాతో ఎలా ఇది జరిగింది కదా అని ఒక బాధగా ఉండాలి. రెండవది, ఏ పాపం నుండి మనం క్షమాపణ కోరుకుంటున్నామో, తౌబా చేస్తున్నామో దానిని వదులుకోవాలి. దానిని వదులుకోవాలి. వడ్డీ తినే వ్యక్తి గానీ, జూదం ఆడే వ్యక్తి గానీ, మత్తు సేవించే వ్యక్తి గానీ, నేను క్షమాపణ కోరుకుంటున్నాను, అస్తగ్ఫిరుల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్, ఓ అల్లాహ్ నన్ను క్షమించు అని అంటున్నాడు, కానీ ఆ పాపాన్ని వదులుకోవడం లేదు. ఒక వ్యక్తి నమాజ్ చేయట్లేదు. మహా ఘోరమైన పాపం ఇది. ఓ అల్లాహ్ నన్ను క్షమించు అని అంటున్నాడు. మళ్ళీ నమాజ్ సమయం వచ్చింది. నమాజ్ చేయడం, అతడు నమాజ్ చేయకపోవడం ఒక చెడు అలవాటు ఏదైతే చేసుకున్నాడో దానిని వదులుకోవాలి. మూడో కండిషన్, ఇకముందు నేను ఆ పాపానికి ఒడిగట్టను, నేను ఆ పాపం చేయను అని బలంగా సంకల్పించుకోవాలి. దృఢంగా నిశ్చయించుకోవాలి, సంకల్పించుకోవాలి. ఈ మూడు పాపాలు, సారీ, ఈ మూడు కండిషన్లు పాపం యొక్క సంబంధం మనిషి మరియు అల్లాహ్ కు మధ్యలో ఉన్నప్పుడు. కానీ ఒకవేళ ఒకవేళ పాపం ఎవరితో, మనిషి పట్ల జరిగి ఉంటే, ఎవరినైనా కొట్టి ఉన్నాము, ఎవరినైనా మనం అవమానపరిచి ఉన్నాము, ఎవరిదైనా ఏదైనా సొమ్ము అన్యాయంగా తీసుకుని ఉన్నాము, అలాంటప్పుడు ఈ మూడు షరతులతో పాటు కండిషన్లతో పాటు ఆ వ్యక్తితో క్షమాపణ కోరుకోవాలి, ఆ వ్యక్తి మన్నిచేసేయాలి, లేదా అతని యొక్క హక్కు అతనికి చేరవేసేయాలి. ఈ నాలుగు కండిషన్లు ఉంటాయి. ఈ నాలుగు కండిషన్లు మనం పూర్తి చేయాలి. అప్పుడే మన తౌబా, మన ఇస్తిగ్ఫార్ అన్నది స్వీకరించబడుతుంది.

సోదర మహాశయులారా, ఈ సందర్భంలో మరికొన్ని ముఖ్యమైన విషయాలు మీరు గుర్తుంచుకోండి. ఏంటి అవి? ఒకటి, పాపాల సంఖ్య ఎంత ఎక్కువగా ఉన్నా మనం ప్రతిసారి, ప్రతిసారి, ప్రతిసారి అల్లాహ్ తో క్షమాపణ కోరుకుంటూనే ఉండాలి. రెండవది, పాపాలు ఎంత ఘోరమైనవి అయినా ఆ ఇంత పెద్ద పాపం చేశాను నేను, అల్లాహ్ క్షమిస్తాడా నన్ను అని అనుకోవద్దు. నిన్ను క్షమించడం అల్లాహ్ కు కష్టం ఏమీ కాదు. కానీ స్వచ్ఛమైన మనసుతో అల్లాహ్ తో క్షమాపణ కోరుకొని పాపాన్ని విడనాడాలి. రెండోది ఏం చెప్పాను నేను ఇప్పుడు? ఎంత ఘోరమైన పాపాలు అయినా గానీ. మూడవది, అజ్ఞానం వల్ల, షైతాన్, మానవుల్లోని, జిన్నాతుల్లోని షైతానుల దుష్ప్రేరేపణ వల్ల అయ్యో ఇన్ని సంవత్సరాల నుండి చేస్తున్నా కదా నేను పాపాలు, అని అనుకోవద్దు. అర్థమవుతుంది కదా? పాపాలు ఎంత ఎక్కువగా ఉన్నా, ఎలాంటి ఘోరమైన పాపమైనప్పటికీ, మూడవది ఎంత దీర్ఘకాలం నుండి ఉన్నా గానీ, నేను ఇందులో ప్రతి ఒక్కదానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి కానీ సమయం సరిపోదు అని నేను ఆ ఆధారాలు మీకు చూపడం లేదు.

ఇక సోదర మహాశయులారా, మన రోజువారీ జీవితంలో మనం ప్రతిసారి, ప్రతిసారి, ప్రతిసారి అల్లాహ్ తో క్షమాపణ కోరుకుంటూనే ఉండాలి. ఒక్కసారి మీరు గమనించండి, సహీహ్ ముస్లిం షరీఫ్ ఇంకా తిర్మిజీ, ఇబ్ను మాజా వేరే హదీస్ గ్రంథాల్లో వచ్చిన విషయం, మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి ఏమని విశ్వసిస్తాము? మాసూమ్ అనిల్ ఖతా, పాప రహితులు ప్రవక్తలు. అయినా గానీ సహాబాలు ఏమంటున్నారు? ఒక్కొక్క సమావేశంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వందేసి సార్లు రబ్బిగ్ఫిర్లీ, అస్తగ్ఫిరుల్లాహ్, ఓ అల్లాహ్ నా పాపాలను క్షమించు అని అనేవారు. ప్రవక్త అయి ఇంత ఎక్కువగా అల్లాహ్ తో క్షమాపణ కోరుకుంటూ ఉండేవారంటే మనం ప్రతిరోజు ఎన్నిసార్లు క్షమాపణ కోరుకుంటూ ఉండాలి? అయితే ఎక్కువగా క్షమాపణ కోరుకుంటూ ఉండాలి. ఈ క్షమాపణ కోరుకుంటూ ఉండడం వల్ల మనకు చాలా చాలా లాభాలు కలుగుతాయి. లాభాల దాని యొక్క ఘనతలు చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు, చాలా ఎక్కువ ఘనతలు ఉన్నాయి. కానీ సంక్షిప్తంగా కొన్ని చెప్తున్నాను గుర్తుంచుకోండి. ఇప్పుడు నేను చదివిన ఆయత్ ఏదైతే ఉందో స్టార్టింగ్ లో సూరత్ నూహ్ లోని ఆయత్లు ఒక్కసారి ఆ ఆయతుల యొక్క కేవలం భావాన్ని మీరు స్పీడ్ గా చూసి వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇదిగోండి మీకు చూపించడం జరుగుతుంది. అల్హమ్దులిల్లాహి కసీరా.

ఆయత్ నెంబర్ 10 నుండి మొదలవుతుంది చూడండి. మన సూర నెంబర్ 71. నేను ఇలా అన్నాను, నూహ్ అలైహిస్సలాం అంటున్నారు, “క్షమాపణకై మీ ప్రభువును వేడుకోండి. నిశ్చయంగా ఆయన అమితంగా క్షమించేవాడు.” లాభాలు ఏంటి? “ఆయన ఆకాశం నుంచి మీపై ధారాపాతంగా వర్షం కురిపిస్తాడు.” వర్షాలు లేకుంటే అల్లాహ్ తో క్షమాపణ కోరుకుంటూ ఉంటే అల్లాహ్ వర్షాలు కురిపిస్తాడు. రెండో లాభం, “మీ సిరిసంపదల్లోనూ,” చూస్తున్నారా? రెండో లాభం సిరిసంపదల్లో. మూడో లాభం, “పుత్ర సంతతిలోనూ.” సంతానం కలిగే విషయంలో “పురోభివృద్ధిని ఒసగుతాడు.” నాలుగో లాభం, “మీ కొరకు తోటల్ని ఉత్పన్నం చేస్తాడు.” మీ కొరకు తోటల్ని ఉత్పన్నం చేస్తాడు. ఐదో లాభం, “ఇంకా మీ కోసం కాలువలను ప్రవహింపజేస్తాడు.” తోటలు ఉంటే నీళ్లు వాటికి అవసరం. అయితే అల్లాహు తాలా కాలువలను కూడా ప్రవహింపజేస్తాడు. చూస్తున్నారా? ఇక్కడ ఎంత స్పష్టంగా మనకు కనబడిందో, ఇస్తిగ్ఫార్ ఎంత ఎక్కువగా ఉంటుందో అంతే ఎక్కువగా అల్లాహ్ యొక్క దయతో మనకు లాభాలు కలుగుతూ ఉంటాయి.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో చెప్పారు, ఇది సహీహ్ హదీస్, షేఖ్ అల్బానీ రహమహుల్లాహ్ వారు సహీహాలో ప్రస్తావించారు 2299. ఏంటి హదీస్? జుబైర్ బిన్ అవ్వామ్ రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, “ప్రళయ దినాన స్వయం తన కర్మల పత్రాన్ని చూసి సంతోషపడాలి అని ఎవరైతే కోరుతున్నారో, కోరుకుంటున్నారో, ఎంత ఎక్కువ ఇస్తిగ్ఫార్ అందులో ఉంటే అంతే ఎక్కువగా అతనికి ప్రళయ దినాన సంతోషం కలుగుతుంది.” అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. చూడండి, గమనిస్తున్నారా? ఈ ప్రపంచపు ఉదాహరణ ద్వారా కూడా మీకు చెప్పగలను. ఒక వ్యక్తి ఇద్దరు మనుషులు పనిచేస్తున్నారు అనుకోండి ఒక వర్క్ షాప్ లో, ఒక ఫ్యాక్టరీలో, ఒక కంపెనీలో. ఇద్దరితో కూడా తప్పు జరిగింది. కానీ ఒక వ్యక్తి వెంటనే మేనేజర్ దగ్గరికి వెళ్లి, “సార్, ఆ పనిలో నాతో ఈ మిస్టేక్ జరిగింది, క్షమించండి సార్, ఇక నుండి నేను శ్రద్ధ వహిస్తాను.” జీతం తీసుకునే సమయం వచ్చేసరికి మరొక వ్యక్తి క్షమాపణ కోరుకోలేదు. ఆ ఏంటి మొన్న నువ్వు ఆ తప్పు చేశావు కదా, అయ్యో జరగదా అంత మాత్రంలో దాన్ని గురించి మందలిస్తావా? ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. ఇంకా వేరే ఏదైనా అడ్డ రీతిలో మాట్లాడాడు. మీరే ఆలోచించండి ఇద్దరిలో ఎవరు ఆ మేనేజర్ కి ఇష్టం? ఆ మేనేజర్ ఎవరి పట్ల ఇష్టపడతాడు? మరియు మనం మన జీతం తీసుకునే సందర్భంలో మనతో జరిగే మిస్టేక్ వల్ల ఏ మన జీతం అయితే కట్ అవుతుందో దాని కారణంగా జీతం పొందిన రోజు సంతోషం ఎవరు ఉంటారు, బాధగా ఎవరు ఉంటారు? కేవలం అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ మీరు గమనించండి. ప్రళయ దినాన మనం అల్లాహ్ ముందు హాజరైన తర్వాత అక్కడ మన కర్మ పత్రాలు తూకం చేయబడతాయి, మన కర్మ పత్రాలు మన కుడి చేతిలో లేదా ఎడమ చేతిలో ఇవ్వబడతాయి. ఆ సందర్భంలో మన కర్మ పత్రంలో మనకు సంతోషకరమైన విషయం చూడాలనుకుంటే అధికంగా, అధికంగా, అధికంగా ఇస్తిగ్ఫార్ అందులో ఉండడం తప్పనిసరి.

మరొక హదీస్ ఉంది. షేఖ్ అల్బానీ రహమహుల్లాహ్ సహీహుల్ జామిలో ప్రస్తావించారు 3930, అబ్దుల్లా బిన్ బుస్ర్ రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించారు, “తూబా.” తూబా అంటే ఏంటి? తూబా అంటే మీకు సంతోషం, మీకు శుభవార్త కలుగు గాక అని కూడా భావం వస్తుంది. తూబా అంటే స్వర్గంలో ఒక చెట్టు ఉంది, దాని ద్వారా స్వర్గవాసుల వస్త్రాలు తయారు చేయబడతాయి. ఈ విధంగా అల్లాహు తాలా దాని నీడలో ఉండేటువంటి గొప్ప శుభవార్త మనకు ఇస్తున్నాడని భావం. అయితే ఎవరైతే తన కర్మ పత్రాల్లో ఎక్కువగా ఇస్తిగ్ఫార్ చూస్తారో అలాంటి వారికి గొప్ప శుభవార్త ఉన్నది.

ఈ విధంగా సోదర మహాశయులారా, మనం ఇస్తిగ్ఫార్ పట్ల ఎప్పుడూ కూడా అశ్రద్ధగా ఏమాత్రం ఉండకూడదు. ఇక రండి, మన రోజువారీ జీవితంలో, మన రోజువారీ జీవితంలో ఏ ఏ సందర్భాలలో మనం ఇస్తిగ్ఫార్ చేస్తూ ఉండాలి? సోదర మహాశయులారా, అనేక సందర్భాలు ఉన్నాయి, అనేక సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకు చూడండి, ప్రతి నమాజ్ వెంటనే అస్తగ్ఫిరుల్లాహ్. రుకూలో, సజ్దాలో సుబ్హానకల్లాహుమ్మ రబ్బనా వబిహమ్దిక అల్లాహుమ్మగ్ఫిర్లీ. అల్లాహుమ్మగ్ఫిర్లీ. గుర్తుంది కదా, అల్లాహుమ్మగ్ఫిర్లీ అంటే ఓ అల్లాహ్ నన్ను క్షమించు. రుకూలో, సజ్దాలో. అలాగే ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తషహ్హుద్ లో మనం చదవవలసిన దువాలలో అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తాలా అన్హు అడిగినప్పుడు చెప్పిన దువా ఏమిటి?
اللَّهُمَّ إِنِّي ظَلَمْتُ نَفْسِي ظُلْمًا كَثِيرًا، وَلَا يَغْفِرُ الذُّنُوبَ إِلَّا أَنْتَ، فَاغْفِرْ لِي مَغْفِرَةً مِنْ عِنْدِكَ، وَارْحَمْنِي إِنَّكَ أَنْتَ الْغَفُورُ الرَّحِيمُ
అల్లాహుమ్మ ఇన్నీ జలమ్తు నఫ్సీ జుల్మన్ కసీరన్ వలా యగ్ఫిరుజ్జునూబ ఇల్లా అంత ఫగ్ఫిర్లీ మగ్ఫిరతమ్ మిన్ ఇన్దిక వర్హమ్నీ ఇన్నక అంతల్ గఫూరుర్రహీమ్.
చూడండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సజ్దాలో,
اللَّهُمَّ اغْفِرْ لِي ذَنْبِي كُلَّهُ دِقَّهُ وَجِلَّهُ، وَأَوَّلَهُ وَآخِرَهُ وَعَلَانِيَتَهُ وَسِرَّهُ
అల్లాహుమ్మగ్ఫిర్లీ జంబీ కుల్లహూ దిక్కహూ వజిల్లహూ వ అవ్వలహూ వ ఆఖిరహూ వ అలానియతహూ వ సిర్రహూ.
అంటే ఏంటి? గమనించండి ఇక్కడ భావాన్ని. ఇది ముస్లిం షరీఫ్ లోని హదీస్. అల్లాహుమ్మగ్ఫిర్లీ జంబీ. ఓ అల్లాహ్ నా పాపాలను క్షమించు. కుల్లహూ అన్ని పాపాలను. దిక్కహూ వ జిల్లహూ, చిన్న పాపాలు, పెద్ద పాపాలు. వ అవ్వలహూ వ ఆఖిరహూ, ముందు చేసినవి, తర్వాత చేసినవి. వ అలానియతహూ వ సిర్రహూ, నేను ఎక్కడైనా దాగి ఉండి గుప్తంగా చేసిన పాపాలైనా లేదా బహిరంగంగా చేసిన పాపాలైనా. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అన్ని రకాల పాపాల నుండి క్షమాపణకై ఎంత మంచి దువాలు నేర్పబడ్డాయో మీరు గమనిస్తున్నారు కదా? ఇలాంటి దువాలు మనం నేర్చుకోవాలి. రెయిన్బో వల్ల ముఖ్యమైన దువాలు అని మాది ఒక పీడీఎఫ్ ఉంది, చదవండి. అందులో ఇలాంటి దువాలన్నీ కూడా జమా చేయడం, అందులో పూర్తి రిఫరెన్స్ తో తెలియజేయడం జరిగినది.

సోదర మహాశయులారా, అతి ముఖ్యంగా, అతి ముఖ్యంగా మనం ఎన్ని రకాల పదాలు, ఏ ఏ సందర్భాలు అల్లాహ్ తో క్షమాపణ కోరుకోవడానికి ఉపయోగిస్తామో వాటన్నిటిలోకెల్లా సయ్యిదుల్ ఇస్తిగ్ఫార్ చాలా చాలా చాలా చాలా చాలా ముఖ్యమైనది. సయ్యిదుల్ ఇస్తిగ్ఫార్.

اللَّهُمَّ أَنْتَ رَبِّي لَا إِلَهَ إِلَّا أَنْتَ، خَلَقْتَنِي وَأَنَا عَبْدُكَ، وَأَنَا عَلَى عَهْدِكَ وَوَعْدِكَ مَا اسْتَطَعْتُ، أَعُوذُ بِكَ مِنْ شَرِّ مَا صَنَعْتُ، أَبُوءُ لَكَ بِنِعْمَتِكَ عَلَيَّ، وَأَبُوءُ لَكَ بِذَنْبِي فَاغْفِرْ لِي، فَإِنَّهُ لَا يَغْفِرُ الذُّنُوبَ إِلَّا أَنْتَ
అల్లాహుమ్మ అంత రబ్బీ లా ఇలాహ ఇల్లా అంత, ఖలఖ్తనీ వ అన అబ్దుక, వ అన అలా అహ్‌దిక వ వఅ్‌దిక మస్తతఅతు, అఊజు బిక మిన్ షర్రి మా సనఅతు, అబూఉ లక బి నిఅమతిక అలయ్య, వ అబూఉ లక బి జంబీ ఫగ్ఫిర్లీ, ఫఇన్నహూ లా యగ్ఫిరుజ్జునూబ ఇల్లా అంత.

మీరందరూ కూడా దీనిని కంఠస్థం చేసుకునే అవసరం లేదు. లేదు, నిజంగా చెప్తున్నాను. కేవలం చూసి చదవండి సరిపోతుంది. మీకు ఈ ఘనత ప్రాప్తిస్తుంది. ఈ దువా గురించి ముస్నద్ అహ్మద్ లో ఒక పదం ఏముందో తెలుసా? ఇన్న అవ్ఫకద్ దుఆ. దువాలలో ఎక్కువ భాగ్యాన్ని ప్రసాదించేటువంటి దుఆ, అల్లాహుమ్మ అంత రబ్బీ వ అన అబ్దుక, జలమ్తు నఫ్సీ వఅతరఫ్తు బిజంబీ, యా రబ్బి ఫగ్ఫిర్లీ జంబీ ఇన్నక అంత రబ్బీ ఇన్నహూ లా యగ్ఫిరుజ్జునూబ ఇల్లా అంత. మరియు నేను సయ్యిదుల్ ఇస్తిగ్ఫార్ లో ఏదైతే చదివాను కదా, దాని గురించి సహీహ్ బుఖారీలో వచ్చిన హదీస్ ఏమిటి? ఎవరైతే పగలు, ఉదయం పూట దీనిని సంపూర్ణ నమ్మకం మరియు విశ్వాసంతో చదువుతారో సాయంకాలం కాకముందే అతను చనిపోతాడో అతడు స్వర్గవాసుల్లో ఒకడైపోతాడు. ఎవరైతే రాత్రి చదువుతారో పూర్తి నమ్మకంతో అతను ఉదయం కాకముందు చనిపోతే అతడు స్వర్గవాసుల్లో ఒకడైపోతాడు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. గమనిస్తున్నారా ఎంత గొప్ప అదృష్ట విషయం ఇందులో తెలియజేయడం జరిగింది? అందుకొరకే సోదర మహాశయులారా, ఎల్లవేళల్లో అల్లాహ్ తో మనం క్షమాపణ కోరుకుంటూనే ఉండాలి. కానీ ఉదయం అజ్కార్లలో, సాయంకాలం అజ్కార్లలో కనీసం ఒక్కసారైనా గానీ, ఒక్కసారైనా గానీ ఈ దువా చదవాలి.

సోదర మహాశయులారా ఇక్కడ మీకు ఒక శుభవార్త వినిపిస్తున్నాను, శ్రద్ధ వహించండి. కొందరు మీ యొక్క ఫ్రెండ్స్ లలో, మీకు తెలిసిన వాళ్లలో ఎవరైనా ముస్లిమేతరులు అయి ఉంటారు. ఎప్పుడైనా ఏదైనా అనారోగ్య సందర్భంలో లేదా అట్లే ఏదైనా సందర్భంలో, “అరే మీ ముస్లింలు మంచిగా దువా చేస్తారురా భాయ్, మీ ముస్లింలు ఆ ఏదో చదివి ఊదుతారు చాలా నయం అవుతుంది” ఈ విధంగా కొంచెం ఒక ముస్లింల వైపు ఆకర్షణ కలిగి, ముస్లింల యొక్క దువాతో వారు ప్రభావితులై ఉంటారు. అలాంటి వారిలో, అలాంటి వారికి ఈ దువా మీరు నేర్పే ప్రయత్నం చేయండి. దీని యొక్క భావం వారిని చదవమని చెప్పండి, అరబీలో ఈ పదాలు రాకపోయినా గానీ.

ఒక సందర్భంలో ఏం జరిగింది? హుసైన్ అనే వ్యక్తి, స్వాద్ తో వస్తుంది ఇక్కడ పేరు, ఇమ్రాన్ ఇబ్ను హుసైన్ గారి యొక్క తండ్రి, ఈ హదీస్ ముస్నద్ అహ్మద్ లో వచ్చి ఉంది, దాని యొక్క రిసెర్చ్ చేసేవారు షేఖ్ షుఐబ్ అల్ అర్నావూత్ దీని యొక్క సనదును సహీహ్ అని చెప్పారు. ఒక వ్యక్తి హుసైన్ ఇంకా ఇస్లాం స్వీకరించలేదు. అతను వచ్చి ప్రవక్తతో అడిగాడు, “నాకు మీరు ఏదైనా నేర్పండి, నేను చెప్పుకోవడానికి, చదువుకోవడానికి.” ప్రవక్త చెప్పారు,

اللَّهُمَّ قِنِي شَرَّ نَفْسِي، وَاعْزِمْ لِي عَلَى أَرْشَدِ أَمْرِي
అల్లాహుమ్మ కినీ షర్ర నఫ్సీ, వ అజిమ్లీ అలా అర్షది అమ్రీ.
ఓ అల్లాహ్ నా యొక్క నఫ్స్, స్వయం నాలో ఉన్నటువంటి చెడు నుండి నన్ను కాపాడు. మరియు అతి ఉత్తమ విషయం వైపునకు నాకు మార్గదర్శకత్వం చేసి నేను దానిపై దృఢంగా ఉండే విధంగా నాకు భాగ్యం కలుగజేయి.

ఒక నాన్ ముస్లిం, ముస్లిమేతరుడు అడిగినప్పుడు ప్రవక్త అతనికి ఈ దువా నేర్పారు. ఆ వ్యక్తి ఈ దువా చదవడం మొదలు పెట్టాడు, కొద్ది రోజులకు అల్లాహు తాలా అతనికి భాగ్యం కలుగజేశాడు, అతడు ఇస్లాం స్వీకరించాడు. ఇస్లాం స్వీకరించిన కొద్ది రోజులకు మళ్ళీ వచ్చాడు. వచ్చి చెప్పాడు, “నేను ఒక సందర్భంలో మీ వద్దకు వచ్చాను, మీరు అల్లాహుమ్మ కినీ షర్ర నఫ్సీ వ అజిమ్లీ అలా అర్షది అమ్రీ అని నాకు నేర్పారు. అయితే నేను దానిని చదువుతూ చదువుతూ ఉన్నాను, నాకు ఇస్లాం భాగ్యం కలిగింది. ఇప్పుడు నేను ఏం చెప్పాలో మీరు నాకు తెలియజేయండి.” అప్పుడు ప్రవక్త నేర్పారు,

اللَّهُمَّ اغْفِرْ لِي مَا أَسْرَرْتُ وَمَا أَعْلَنْتُ، وَمَا أَخْطَأْتُ وَمَا عَمَدْتُ، وَمَا عَلِمْتُ وَمَا جَهِلْتُ
అల్లాహుమ్మగ్ఫిర్లీ మా అస్రర్తు వమా ఆలన్తు వమా అఖ్తఅతు వమా అమద్తు వమా అలిమ్తు వమా జహిల్తు.
ఓ అల్లాహ్ నన్ను క్షమించు. నేను గోప్యంగా చేసిన పాపాలు, బహిరంగంగా చేసిన పాపాలు. ఏ పాపాలైతే నేను తెలిసి చేశానో అవి వాటిని కూడా మన్నించు, ఏ పాపాలైతే తెలియకుండా చేశానో వాటిని కూడా మన్నించు. మరియు ఏ పాపాలైతే నేను తెలిసి చేశానో మరియు ఏ పాపాలైతే నేను తెలియకుండా అజ్ఞానంగా చేశానో అన్నిటినీ కూడా నీవు మన్నించు.

చూస్తున్నారా గమనిస్తున్నారా? ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దువాలు నేర్పేవారు. అయితే సోదర మహాశయులారా, చివరిలో నేను ఇస్తిగ్ఫార్ కు సంబంధించిన మరొకటి మీకు వినిపించదల్చుకుంటున్నాను, దాన్ని కూడా గుర్తుంచుకోండి. కానీ నేను చెప్తున్నాను కదా, ఇలాంటి దువాలన్నీ కూడా మీరు కంఠస్థం చేసే అవసరం లేదు, కేవలం చూసి చదువుతున్నా గానీ మీకు లాభం కలుగుతుంది.

أَسْتَغْفِرُ اللَّهَ الَّذِي لَا إِلَهَ إِلَّا هُوَ الْحَيَّ الْقَيُّومَ وَأَتُوبُ إِلَيْهِ
అస్తగ్ఫిరుల్లాహల్లదీ లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్ వ అతూబు ఇలై.
అస్తగ్ఫిరుల్లాహల్లదీ లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్ వ అతూబు ఇలై.
ఇది ఎప్పుడూ కూడా చదవడం మర్చిపోకండి. ఇది మర్చిపోకండి ఎందుకంటే ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఎవరైతే ఇది చదువుతూ ఉంటారో వారి యొక్క పాపాలు ఒకవేళ వారి యొక్క పాపాలు ఒకవేళ ఎంత ఎక్కువ ఉన్నా గానీ మన్నించబడతాయి. చివరికి అతను ధర్మ యుద్ధం నుండి వెనుదిరిగినా అలాంటి పాపం కూడా ఈ దువా కారణంగా మన్నించబడుతుంది. చూశారా? చూస్తున్నారా గమనిస్తున్నారా ఎంత గొప్ప లాభం అనేది ఇందులో తెలపడం జరిగింది? అందుకొరకు సోదర మహాశయులారా, ఇస్తిగ్ఫార్ అనేది మాటిమాటికి చేస్తూ ఉండండి. నేను ఇంతకు ముందే చెప్పాను చెప్పుకుంటూ పోతే విషయాలు చాలా ఉంటాయి. కానీ ఈ కొన్ని విషయాలు ఈరోజు మనకు సరిపోతాయి. ప్రత్యేకంగా ఇందులో మన రోజువారీ జీవితంలో మనం చదవవలసిన కొన్ని ముఖ్యమైన దువాలు, సందర్భాల గురించి కూడా తెలపడం జరిగింది. ఆ సందర్భాల్లో వాటిని మీరు పాటిస్తూ ఉండండి. ఇన్షా అల్లాహ్ ఇక్కడి వరకు దీన్ని ఆపేసి ఈ అంశాన్ని వేరే అంశం వైపునకు ముందుకు సాగుదాము. విన్న విషయాలను అర్థం చేసి ఆచరించే సద్భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక. ఆమీన్. వా ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ధిక్ర్ (అల్లాను స్మరించడం)

సరే మిత్రులారా, ఇప్పుడు నేను రెండవ అంశం చెప్పబోతున్నాను. అందరూ శ్రద్ధగా వింటారని ఆశిస్తున్నాను. నేను కొంచెం ఫాస్ట్ గానే చెప్పే ప్రయత్నం చేస్తాను మరియు అందరూ కూడా దీనిని విని, ఆచరించి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి.

అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ నబియ్యినా ముహమ్మద్ వాలా ఆలిహి వసహ్బిహి అజ్మయీన్ అమ్మా బాద్.

أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ
وَاذْكُرُوا اللَّهَ كَثِيرًا
వజ్కురుల్లాహ జిక్రన్ కసీరా.
సోదర మహాశయులారా, సోదరీమణులారా, ప్రియ వీక్షకులారా! మనమందరము దాసులము. దాసుడు తన యజమాని యొక్క స్తుతి, అతని యొక్క పొగడ్త, అతని యొక్క గొప్పతనాన్ని చాటడమే దాసుని యొక్క అసలైన పని. ఇందులో అతను ఎంత వెనక ఉంటే అంతే అతనికి నష్టం జరుగుతుంది, యజమానికి ఏ నష్టం జరగదు. అందుకొరకే ఒక మన తెలుగు కవి ఏం చెప్తున్నాడు?

ఉన్నత చదువులు ఎన్ని చదివినా ఫలము ఉండబోదురా, ఉన్నత చదువులు ఎన్ని చదివినా ఫలము ఉండబోదురా, సృష్టికర్తను గ్రహించలేని డిగ్రీలన్నీ వ్యర్థమురా, నీ డిగ్రీలన్నీ వ్యర్థమురా, నీ డిగ్రీలన్నీ వ్యర్థమురా.

సృష్టికర్తను గ్రహించాలి. ఆ సృష్టికర్తనే మనం స్తుతిస్తూ ఉండాలి, అతన్నే పొగడుతూ ఉండాలి.

సోదర మహాశయులారా, సోదరీమణులారా, ఎల్లవేళల్లో మనం అల్లాహ్ యొక్క ఆరాధన కొరకే పుట్టించబడ్డాము. అయితే ఇక మనకు వేరే పనులు వద్దా? ఈ లోకంలో జీవిస్తున్నామంటే వేరే ఎన్నో పనులు కూడా ఉంటాయి. మాటిమాటికి అల్లాహ్ నే ఆరాధించుకుంటూ ఎలా ఉండగలుగుతాము అని కొందరు చికాకుగా అడ్డ ప్రశ్న వేస్తారు. కానీ ఇస్లాం ధర్మాన్ని కొంచెం లోతు జ్ఞానంతో, మంచి విధంగా అర్థం చేసుకుంటూ చదివారంటే మన జీవితంలోని ప్రతి క్షణం మనం ఆరాధనలో ఉన్నట్లు, మన జీవితంలోని ప్రతి క్షణం అల్లాహ్ యొక్క స్మరణ, అల్లాహ్ ను గుర్తిస్తూ ఉన్నట్లు చేసుకోగలము. కానీ ఈ భాగ్యం ఎవరికి కలుగుతుంది? ఎవరికి కలుగుతుంది? ఎవరు ఎంత ఎక్కువ ఇస్లాం జ్ఞానం నేర్చుకుంటారో అంతే ఎక్కువగా వారు తమ ప్రతి విషయాన్ని అల్లాహ్ యొక్క ఆరాధన, ప్రతి ఘడియను అల్లాహ్ యొక్క స్మరణలో గడపగలుగుతారు. వారు ఏ పని చేస్తూ ఉన్నా గానీ, ఏదైనా కంపెనీలో పని చేస్తూ ఉన్నా, ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తూ ఉన్నా, ఏదైనా వ్యవసాయంలో ఉన్నా, బజార్లో ఉండి ఏమైనా సామానులు అమ్ముతూ ఉన్నా, చివరికి నిద్రపోతూ ఉన్నా గానీ. అవునా? అవును. ముఆద్ బిన్ జబల్ రదియల్లాహు తాలా అన్హు ఏమంటున్నారు? ఇన్నీ అహ్‌తసిబు నౌమతీ కమా అహ్‌తసిబు కౌమతీ. నేను రాత్రి మేల్కొని అల్లాహ్ ఎదుట నిలబడి తహజ్జుద్ చేస్తూ ఉండి, అహ్‌తసిబు (పుణ్యం ప్రాప్తించాలని కోరుతూ ఉంటానో), అహ్‌తసిబు నౌమతీ (నేను పడకపై పడుకొని నిద్రిస్తూ కూడా దీనికి బదులుగా అల్లాహ్ నాకు పుణ్యం ప్రసాదించాలి, ప్రసాదిస్తాడు అన్నటువంటి ఆశ కలిగి, నమ్మకం కలిగి ఉంటాను).

అవును మరి. ఎవరైతే టైం మేనేజ్మెంట్ ఏ కాదు ఈనాటి పర్సనల్ డెవలప్మెంట్ క్లాసులలో వినేది, స్వయం తన క్షణ క్షణాన్ని అల్లాహ్ యొక్క స్మరణలో, అల్లాహ్ యొక్క ధిక్ర్ లో, అల్లాహ్ యొక్క ఆరాధనలో ఎలా గడపగలను అన్నది నేర్చుకోవాలి. తాను చేస్తున్న ప్రతిదీ కూడా అల్లాహ్ స్మరణ, అల్లాహ్ యొక్క ఆరాధన అయిపోవాలి. ఆ జ్ఞానాన్ని నేర్చుకోవాలి.

ఎందుకంటే ముస్లిం అని ఏదైతే మనం అంటామో దాని భావమే ఏంటి? విధేయుడు. అయితే విధేయత ఏదో ఒక్క సందర్భంలో కాదు, ఎల్లవేళల్లో ఉండాలి. నీవు ఎక్కడ ఉన్నావు, ఏ స్థితిలో ఉన్నావు, ఏ పనిలో ఉన్నావు, ఏం మాట్లాడుతున్నావు అది నీ సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క విధేయతలో ఉంటే నీవు అతని ఆరాధనలో ఉన్నట్లే, అతని స్మరణలో ఉన్నట్లే.

ఈ విధంగా ఎవరైతే అల్లాహ్ యొక్క స్మరణలో ఉంటారో వారికి ఎన్ని పరీక్షలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని కష్టాలు వారిపై వచ్చిపడినా అల్లాహ్ యొక్క స్మరణ నుండి వారు దూరం కాలేరు. ఒక విషయం ఆలోచించండి, సుఖంగా హాయిగా జీవిస్తున్నారు అని మనం కొందరి గురించి అనుకుంటాము. ఏ విషయం చూసి? అతని వద్ద ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ ని చూసి, అతని వద్ద ఉన్న బిల్డింగ్లను చూసి, అతని వద్ద ఉన్న కార్లను చూసి, అతని వద్ద ఉన్నటువంటి ధన సంపద, ఈ లోకపు కొన్ని సౌకర్యాలు. అరే వానికేం బాధరా భాయ్, ఎంత ధరలు పెరిగినా గానీ బోలెడంత డబ్బు ఉన్నది వానికి, వాడు హాయిగా బతుకుతాడు. ఈ విధంగా మనం అనుకుంటాము. కానీ ఒకవేళ అతను అల్లాహ్ స్మరణలో లేకుంటే, తన జీవితాన్ని అల్లాహ్ యొక్క విధేయతలో గడపకుంటే అతడు ఈ సౌకర్యం సౌకర్యం కాదు, ఈ సుఖం సుఖం కాదు, ఇది వాస్తవానికి చాలా చాలా బాధాకరమైన జీవితం.

ఇక సోదర మహాశయులారా, ఈ ధిక్ర్ యొక్క అంశం కూడా, అల్లాహు అక్బర్, చాలా విశాలంగా ఉంది. ఎందుకంటే ప్రతీది కూడా ధిక్ర్ లో రావచ్చు. లా ఇలాహ ఇల్లల్లాహ్ ధిక్ర్. నమాజ్ కూడా ధిక్ర్. ప్రతి ఆరాధన అల్లాహ్ యొక్క ధిక్ర్. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ధిక్ర్ ను రెండు రకాలుగా అర్థం చేసుకోవడానికి సులభ రీతిలో విభజించి నేను చెబుతున్నాను. ఒకటి ఏమిటి? ధిక్ర్ అంటే స్మరించడం, గుర్తు చేయడం, మరిచిపోకుండా ఉండడం. ఈ భావాలు వస్తాయి ధిక్ర్ అన్న అరబీ పదానికి. అయితే అల్లాహ్ యొక్క ధిక్ర్ చేస్తూ ఉండాలి అని అంటే ఏంటి? మనం ఎప్పుడు, ఎక్కడ, ఏ సందర్భంలో, ఏ స్థితిలో ఉంటామో అక్కడ ఆ సమయంలో, ఆ స్థితిలో, ఆ సందర్భంలో అల్లాహ్ యొక్క ఏ ఆదేశం ఉన్నది, ప్రవక్త వారి ఏ విధానం ఉన్నది తెలుసుకొని ఆ రకంగా చేయడం, పాటించడం ఇది అల్లాహ్ యొక్క ధిక్ర్. ఇది ఒక సామాన్య భావంలో, ఓకేనా? ఇక రెండవది, మనం అల్లాహ్ ను గుర్తు చేస్తూ కూర్చుంటూ, లేస్తూ అన్ని సందర్భాల్లో అల్లాహ్, అల్లాహ్, అల్లాహ్, అల్లాహ్, అల్లాహ్ అని అనడం. ఉదాహరణకు, ఏదైనా పని మొదలు పెడుతున్నప్పుడు బిస్మిల్లాహ్. ఏదైనా తిన్న తర్వాత, తాగిన వెంటనే అల్హమ్దులిల్లాహ్. ఏదైనా శుభవార్త మనకు దొరికింది, మాషా అల్లాహ్. ఏదైనా పని పూర్తయింది, అల్హమ్దులిల్లాహ్. ఏదైనా బాధాకరమైన వార్త మనకు వచ్చింది, ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. ఆశ్చర్యకరమైన ఏదైనా విషయం మనకు తెలిసింది, సుబ్హానల్లాహ్. ఎవరి గురించైనా, ఎక్కడైనా ఏదైనా గొప్ప విషయాలు చెప్పుకుంటూ విన్నాము, అల్లాహు అక్బర్. మనం ఏదైనా సహాయం కోరాలనుకున్నాము, లా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లాహ్. మనం అల్లాహ్ ను స్తుతించి పుణ్యాలు సంపాదించుకోవాలనుకుంటున్నాము, సుబ్హానల్లాహి వబిహమ్దిహ్. మన యొక్క పుణ్యాల త్రాసు బరువుగా కావాలని కోరుతున్నాము, సుబ్హానల్లాహి వబిహమ్దిహి సుబ్హానల్లాహిల్ అజీమ్. పాపాలు ఎక్కువగా ఉన్నాయి, బాధ కలుగుతుంది, అవన్నీ కూడా తొలగిపోవాలని కాంక్ష ఉంది, లా ఇలాహ ఇల్లల్లాహ్. ఏదైనా బాధగా ఏర్పడుతుంది, కష్టాల్లో ఉన్నారు అవి తొలగిపోవాలి, దూరం అయిపోవాలి, లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కున్తు మినజ్జాలిమీన్. ఈ విధంగా మనం అలవాటు చేసుకోవాలి. కూర్చుంటూ, లేస్తూ అన్ని సందర్భాల్లో.

ఒక్కసారి మీరు సూరత్ ఆలె ఇమ్రాన్. సూర ఆలె ఇమ్రాన్ చివరి కంటే కొంచెం ముందు, కొన్ని ఆయతుల ముందు ఈ రెండు ఆయతులను గనుక మీరు శ్రద్ధ వహించారంటే ఎంత గొప్ప శుభవార్త ఇందులో ఉందో ఒక్కసారి మీరు చూడండి. అల్లాహు తాలా ఇలాంటి శుభవార్త ఇస్తున్నాడు.

అది ఏమిటంటే, సూర ఆలె ఇమ్రాన్, సూర నెంబర్ మూడు, ఆయత్ నెంబర్ 191.

الَّذِينَ يَذْكُرُونَ اللَّهَ قِيَامًا وَقُعُودًا وَعَلَىٰ جُنُوبِهِمْ وَيَتَفَكَّرُونَ فِي خَلْقِ السَّمَاوَاتِ وَالْأَرْضِ رَبَّنَا مَا خَلَقْتَ هَٰذَا بَاطِلًا سُبْحَانَكَ فَقِنَا عَذَابَ النَّارِ
అల్లజీన యజ్కురూనల్లాహ కియామవ్ వ కుఊదవ్ వ అలా జునూబిహిమ్ వ యతఫక్కరూన ఫీ ఖల్కిస్ సమావాతి వల్ అర్ద్, రబ్బనా మా ఖలఖ్త హాజా బాతిలా, సుబ్హానక ఫకినా అజాబన్నార్.
వారు నిలుచుని, కూర్చుని, తమ పడకలపై ఒత్తిగిలి అల్లాహ్ ను స్మరిస్తూ ఉంటారు. వీరే నిజమైన విజ్ఞులు, బుద్ధిమంతులు, జ్ఞానవంతులు, ఇలాంటి వారే అల్లాహ్ ను అన్ని స్థితుల్లో స్మరిస్తూ, గుర్తు చేస్తూ, అల్లాహ్ యొక్క ధ్యానంలో ఉంటూ తమ జీవితం గడుపుతారు కదా, భూమి ఆకాశాల సృష్టి గురించి యోచన చేస్తూ ఉంటారు. వారు ఇలా అంటారు, “మా ప్రభువా, నువ్వు ఈ సృష్టిని నిరర్థకంగా చేయలేదు. సుబ్హానక్, నువ్వు పవిత్రుడవు. మమ్మల్ని నరకాగ్ని శిక్ష నుండి కాపాడు.”

ఇక్కడ మీరు గమనించారు కదా? వారు నిలుచుని, కూర్చుని, తమ పడకలపై ఒత్తిగిలి అల్లాహ్ ను స్మరిస్తూ ఉంటారు. అల్లాహ్ ను ఎప్పుడెప్పుడు స్మరించాలి? అన్ని స్థితుల్లో స్మరిస్తూ ఉండాలి అన్నటువంటి గొప్ప విషయం ఇందులో మనకు తెలిసినది. అర్థమైంది కదా?

ఇక ఈ ధిక్ర్ మనం ఎల్లవేళల్లో చేస్తూ ఉంటే మనకు ఏంటి లాభం కలుగుతుంది? అల్లాహు అక్బర్. నేను కొన్ని లాభాలు ఇంతకు ముందే మీకు చెప్పాను కొన్ని పదాలు చెప్తూ చెప్తూ. ఇందులో అతి గొప్ప విషయం మీరు గమనించాల్సింది, అదేమిటి? ముస్నద్ అహ్మద్ లో వచ్చిన హదీస్, షేఖ్ అల్బానీ రహమహుల్లాహ్ సహీహాలో ప్రస్తావించారు 134 హదీస్ నెంబర్. నూహ్ అలైహిస్సలాం వారి యొక్క వసియత్, వాంగ్మూలం తన కుమారుడికి ఏముండినది? ఆయన చెప్పారు, నేను లా ఇలాహ ఇల్లల్లాహ్ గురించి నిన్ను ఆదేశిస్తున్నాను, నీవు లా ఇలాహ ఇల్లల్లాహ్ అధికంగా చదువుతూ ఉండు. ఎందుకు? దీని ఘనత, దీని యొక్క గొప్పతనం, దీని యొక్క ప్రాముఖ్యత ఎంతగా ఉన్నదంటే, ఏడు ఆకాశాలు, ఏడు భూమిలు త్రాసులోని ఒక పల్లెంలో పెట్టబడి, లా ఇలాహ ఇల్లల్లాహ్ ను మరో పల్లెంలో ఇది త్రాసు యొక్క రెండు పల్ల్యాలు ఉంటాయి కదా, ఒక వైపున ఏడు ఆకాశాలు, ఏడు భూములు, మరోవైపున కేవలం లా ఇలాహ ఇల్లల్లాహ్ పెట్టబడితే లా ఇలాహ ఇల్లల్లాహ్ అన్నది చాలా బరువుగా అయిపోతుంది. అంతేకాదు, లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క ఘనత, ప్రాముఖ్యత గురించి ఇంకా ఏం చెప్పారు? ఏడు ఆకాశాలు, ఏడు భూములు ఒక రింగ్ మాదిరిగా, ఎలాంటి రింగ్? చాలా బలమైన, గట్టి. లా ఇలాహ ఇల్లల్లాహ్ దానిని విరగ్గొట్టగలిగేంతటి శక్తి కలదు. అల్లాహు అక్బర్ చూస్తున్నారా? ఆ తర్వాత సుబ్హానల్లాహి వబిహమ్దిహి గురించి ఏం చెప్పారో చూడండి. సుబ్హానల్లాహి వబిహమ్దిహి ఇది కూడా అధికంగా నీవు చదువుతూ ఉండు, దీని గురించి నేను నిన్ను ఆదేశిస్తున్నాను. ఇది ఈ సృష్టిలోని ప్రతి వస్తువు యొక్క ఇబాదత్, ప్రతి వస్తువు యొక్క ఆరాధన. ఈ విషయం మీకు ఖురాన్ లో తెలుస్తుందా?

وَإِن مِّن شَيْءٍ إِلَّا يُسَبِّحُ بِحَمْدِهِ وَلَٰكِن لَّا تَفْقَهُونَ تَسْبِيحَهُمْ
వఇమ్ మిన్ షైఇన్ ఇల్లా యుసబ్బిహు బిహమ్దిహి వలాకిల్ లా తఫ్కహూన తస్బీహహుమ్.
ఆకాశాలు, భూములు అన్నీ కూడా అల్లాహ్ యొక్క స్తుతి, అల్లాహ్ యొక్క పవిత్రతను కొనియాడుతున్నాయి. వాటిలో ఉన్న ప్రతీది కూడా సుబ్హానల్లాహి వబిహమ్దిహి అని అంటూ ఉన్నాయి. అయితే ఇక్కడ హదీస్ లో ఇదే విషయం వచ్చింది. నూహ్ అలైహిస్సలాం తన కొడుక్కు చెప్పారు, “సుబ్హానల్లాహి వబిహమ్దిహి ప్రతి సృష్టిలోని ప్రతీ దాని యొక్క సలాహ్. దీని ద్వారా ఈ సృష్టిలోని ప్రతి ఒక్కరికి సుబ్హానల్లాహి వబిహమ్దిహి అనడం ద్వారానే వారికి వారి యొక్క ఉపాధి, వారి యొక్క ఆహారం లభిస్తున్నది.” అందుకొరకే అల్లాహ్ యొక్క ధిక్ర్ అధికంగా చేస్తూ ఉండాలి. ఈ రోజుల్లో మనం ఏమనుకుంటాము? నాకు మంచి ఉద్యోగం ఉంటేనే నా ఉపాధి, నాకు నా మంచి ఆ వ్యవసాయం ఉంటేనే ఉపాధి. ఇవన్నీ బాహ్యమైన సాధనాలు. వీటిలో హలాల్ ఏవో వాటిని మనం పాటించాలి. కానీ ఉత్తమమైన ఉపాధి లభించడానికి బాహ్యంగా కనబడని ఎన్నో, ఎన్నో సాధనాలు ఉంటాయి. వాటిలో అతి గొప్పది, అతి ముఖ్యమైనది అల్లాహ్ యొక్క స్మరణ, అల్లాహ్ యొక్క ధిక్ర్.

సోదర మహాశయులారా, మన రోజువారీ జీవితంలోని ధిక్ర్ లలో కొన్ని ఘనతలు మీరు చూడండి. ఈ విషయాలను మనం ఒకవేళ గ్రహించామంటే ప్రతిరోజు మనం అల్లాహ్ యొక్క ధిక్ర్ ఇంకా అధికంగా చేస్తూ ఉండగలము. అధికంగా చేస్తూ ఉండగలము. ఉదాహరణకు, ఉదయం సాయంకాలం చదివే దువాలలో ఒక దువా ఉంది,

اللَّهُمَّ إِنِّي أَصْبَحْتُ أُشْهِدُكَ وَأُشْهِدُ حَمَلَةَ عَرْشِكَ وَمَلَائِكَتَكَ وَجَمِيعَ خَلْقِكَ أَنَّكَ أَنْتَ اللَّهُ لَا إِلَهَ إِلَّا أَنْتَ وَأَنَّ مُحَمَّدًا عَبْدُكَ وَرَسُولُكَ
అల్లాహుమ్మ ఇన్నీ అస్బహ్తు ఉష్హిదుక వ ఉష్హిదు హమలత అర్షిక వ మలాయికతక వ జమీఅ ఖల్కిక అన్నక అంతల్లాహు లా ఇలాహ ఇల్లా అంత వ అన్న ముహమ్మదన్ అబ్దుక వ రసూలుక.
ఉదయం చదివినప్పుడు “అల్లాహుమ్మ ఇన్నీ అస్బహ్తు” అని అంటారు. సాయంకాలం చదివినప్పుడు “అల్లాహుమ్మ ఇన్నీ అమ్సైతు” అని అంటారు. ఈ దువా చదవడం ద్వారా లాభం ఏంటి? ఈ దువా ఉదయం చదివినట్లయితే వారి యొక్క పగలంతా జరిగిన పాపాలు మన్నించబడతాయి. సాయంకాలం చదివిన ఈ దువా ఎవరైతే నాలుగు సార్లు చదివేది ఉంటే వారిని నరకాగ్ని నుండి రక్షణ కల్పించడం జరుగుతుంది.

సోదర మహాశయులారా, మన రోజువారీ జీవితంలో అల్లాహ్ యొక్క ధిక్ర్ లో ఉదయం, సాయంకాలం కొన్ని అజ్కార్లు వేరువేరుగా ఉన్నాయి మరియు ఎక్కువ శాతం ఉదయం, సాయంకాలం రెండు సందర్భాల్లో చదివేటివి ఉన్నాయి. ఒక దువా వస్తుంది,

أَعُوذُ بِكَلِمَاتِ اللَّهِ التَّامَّاتِ مِنْ شَرِّ مَا خَلَقَ
అఊజు బికలిమాతిల్లాహిత్ తామ్మాతి మిన్ షర్రి మా ఖలఖ్.
మూడు సార్లు ఎవరైతే దీనిని చదువుతారో వారికి రాత్రి ఏ విష పురుగు హాని కలిగించదు అని ముస్లిం షరీఫ్ లో వచ్చిన హదీస్. గమనించండి ఎంత గొప్ప పుణ్యం ఇందులో, ఎంత గొప్ప లాభం ఉంది ఇందులో. అలాగే ఉదయం మూడు సార్లు, సాయంకాలం మూడు సార్లు

بِسْمِ اللَّهِ الَّذِي لَا يَضُرُّ مَعَ اسْمِهِ شَيْءٌ فِي الْأَرْضِ وَلَا فِي السَّمَاءِ وَهُوَ السَّمِيعُ الْعَلِيمُ
బిస్మిల్లాహిల్లజీ లా యదుర్రు మఅస్మిహి షైఉన్ ఫిల్ అర్ది వలా ఫిస్సమాఇ వహువస్ సమీఉల్ అలీమ్.
చదివేది ఉంటే వారికి ఏదీ కూడా నష్టం పరచదు అని మనకు హదీస్ ద్వారా తెలుస్తుంది.

సోదర మహాశయులారా,

لَا إِلَهَ إِلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ
లా ఇలాహ ఇల్లల్లాహు వహ్‌దహూ లా షరీక లహూ, లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహువ అలా కుల్లి షైఇన్ కదీర్.
ఇది ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత చదివేది ఉంది. ఉదయం, సాయంకాలం చదివేది ఉంది. ఇన్షా అల్లాహ్ దీనికి సంబంధించి ఒక ప్రత్యేక దర్సు కూడా మనం పెట్టే ప్రయత్నం చేద్దాము. కొన్ని సందర్భాల్లో చదివే దాంట్లో కొన్ని పదాలు ఎక్కువగా కూడా ఉన్నాయి, దాని ప్రకారంగా వాటి యొక్క ఘనతలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కానీ ఈ సందర్భంలో మీరు అల్లాహ్ యొక్క ధిక్ర్ లలో ఫర్జ్ నమాజ్ తర్వాత మనం పది పది సార్లు సుబ్హానల్లాహ్, పది సార్లు అల్హమ్దులిల్లాహ్, పది సార్లు అల్లాహు అక్బర్ లేదా 33 సార్లు సుబ్హానల్లాహ్, 33 సార్లు అల్హమ్దులిల్లాహ్, 33 సార్లు అల్లాహు అక్బర్, ఒక్కసారి లా ఇలాహ ఇల్లల్లాహు వహ్‌దహూ లా షరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహువ అలా కుల్లి షైఇన్ కదీర్. ముస్లిం షరీఫ్ లో వచ్చిన హదీస్ ఏమిటి? ఎవరైతే 33, 33, 33 తర్వాత లా ఇలాహ ఇల్లల్లాహ్ ఒక్కసారి చదివి వంద పూర్తి చేస్తారో వారి యొక్క పాపాలు సముద్రపు నురుగంత ఉన్నా గానీ అవి మన్నించబడతాయి. ఎంత గొప్ప అదృష్టం గమనిస్తున్నారా మీరు? అలాగే సోదర మహాశయులారా, పది సార్లు, పది సార్లు, పది సార్లు చదవడం ఫర్జ్ నమాజ్ ల తర్వాత. దీని ఘనత నమాజ్ నిధులు అనేటువంటి మా వీడియోలో చెప్పడం జరిగినవి. మీరు జీడీకే ఎన్ఎస్సిఆర్ఈ యూట్యూబ్ ఛానల్ లో వెళ్లి నమాజ్ నిధులు అన్నది చూడండి. సుమారు దాంట్లో 10వ వీడియో, 10వ ఎపిసోడ్. మీకు అల్లాహ్ మార్గంలో జిహాద్ చేసినంత, ఉమ్రా చేసినంత, హజ్ చేసినంత, అల్లాహ్ మార్గంలో దానధర్మాలు చేసినంత పుణ్యం లభిస్తుంది. ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత పది పది సార్లు మీరు సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్ అంటూ ఉంటే, ఎంత గొప్ప ఘనతనో గమనించండి.

ఇంకా సోదర మహాశయులారా, ఈ పది పది సార్లు చదవడం ద్వారా దీని గురించి సహీహ్ హదీస్ ఒకటి అబూ దావూద్ లో కూడా వచ్చి ఉంది. మనం పది పది సార్లు చదివితే 30 అవుతాయి, ఐదు నమాజ్ లలో కలిపితే 150 అవుతాయి, కానీ త్రాసులో ప్రళయ దినాన 1500 పుణ్యాలు లభిస్తాయి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శుభవార్త ఇచ్చారు.

సోదర మహాశయులారా, మనం ఎప్పుడైతే నమాజ్ లో వచ్చి నిలబడతామో సుబ్హానల్లాహి వల్హమ్దులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు అల్లాహు అక్బర్ అని చదువుతామో ఆకాశపు ద్వారాలు తెరవబడతాయి అని సహీహ్ ముస్లిం లో వచ్చి ఉంది. అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు తాలా అన్హు అంటున్నారు, ప్రవక్తతో నేను ఈ హదీస్ విన్నప్పటి నుండి నా నమాజ్ ఆరంభంలో నేను ఇదే చదువుతాను అని. గమనిస్తున్నారా? ఈ విధంగా అల్లాహ్ యొక్క స్మరణలో చాలా చాలా లాభాలు ఉన్నాయి. అందుకొరకే అల్లాహు తాలా మీరు అధికంగా అల్లాహ్ యొక్క ధిక్ర్ చేయండి అని చెప్పాడు. మరియు ఏ నమాజ్ లో ఎక్కువగా అల్లాహ్ యొక్క ధిక్ర్ ఉంటుందో ఆ నమాజ్ యొక్క సవాబ్, ఆ నమాజ్ యొక్క పుణ్యం పెరిగిపోతుంది. ఏ ఉపవాసంలో అల్లాహ్ యొక్క ధిక్ర్ ఎక్కువ ఉంటుందో ఆ ఉపవాస పుణ్యం అనేది అందరికంటే ఎక్కువగా ఉంటుంది. ఏ హజ్ లో అల్లాహ్ యొక్క ధిక్ర్ ఎక్కువగా ఉంటుందో ఆ హజ్ లో, ఆ హజ్ యొక్క పుణ్యం చాలా ఎక్కువగా ఉంటుంది.

చివరిలో ఒక రెండు విషయాలు తెలుసుకొని సమాప్తం చేద్దాము. అదేమిటంటే అధికంగా అల్లాహ్ యొక్క ధిక్ర్ చేయడం ఇది విశ్వాసుల ఉత్తమ గుణం. ధిక్ర్ లో వెనక అయి ఉండడం, ధిక్ర్ లో బద్ధకం వహించడం ఇది మునాఫికుల గుణం. మునాఫికులు అల్లాహ్ యొక్క ధిక్ర్ చేయడంలో చాలా బద్ధకం వహిస్తారు అని అల్లాహు తాలా స్పష్టంగా ఖురాన్ లో తెలిపాడు. అల్లాహు తాలా ఖురాన్ లో తెలిపాడు. అయితే అలాంటి ఆ బద్ధకం వహించే మునాఫికులలో మనం ఏ మాత్రం చేరకూడదు. మనం ఏ మాత్రం చేరకూడదు. సూరత్ నిసా ఆయత్ నెంబర్ 142. మీకు కూడా నేను ఒకసారి చూపిస్తున్నాను, శ్రద్ధగా చూసి ఆ మునాఫికుల లిస్టులో నుండి తమను తాము బయటికి ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి.

إِنَّ الْمُنَافِقِينَ يُخَادِعُونَ اللَّهَ وَهُوَ خَادِعُهُمْ وَإِذَا قَامُوا إِلَى الصَّلَاةِ قَامُوا كُسَالَىٰ يُرَاءُونَ النَّاسَ وَلَا يَذْكُرُونَ اللَّهَ إِلَّا قَلِيلًا
ఇన్నల్ మునాఫికీన యుఖాదిఊనల్లాహ వహువ ఖాదిఉహుమ్, వఇజా కామూ ఇలస్సలాతి కామూ కుసాలా యురాఊనన్నాస వలా యజ్కురూనల్లాహ ఇల్లా కలీలా.
నిశ్చయంగా కపటులు అల్లాహ్ ను మోసం చేయజూస్తున్నారు. అయితే అల్లాహ్ వారి మోసానికి శిక్ష విధించనున్నాడు. వారు నమాజ్ కోసం నిలబడినప్పుడు ఎంతో బద్ధకంతో కేవలం జనులకు చూపే ఉద్దేశంతో నిలబడతారు, ఏదో నామమాత్రంగా దైవాన్ని స్మరిస్తారు. వారు చాలా తక్కువగా అల్లాహ్ యొక్క స్మరణ చేస్తారు. నామమాత్రంగా అల్లాహ్ ని స్మరిస్తారు.

ఇలాంటి వారిలో మనం కలవకూడదు. ఇలాంటి ఈ భావం ఒకటి అక్కడ సూరత్ తౌబాలో కూడా చెప్పడం జరిగింది. సూరత్ తౌబాలో కూడా ఇలాంటి ఒక భావం వచ్చి ఉంది. అయితే సోదర మహాశయులారా, అల్లాహ్ యొక్క ధిక్ర్ అన్నది మనం ఉదయం మేల్కొని అల్హమ్దులిల్లాహిల్లజీ అహ్యానా బాదమా అమాతనా వఇలైహిన్నుషూర్ నుండి మొదలుకొని పొద్దంతలో అనేక సందర్భాల్లో చివరికి మళ్ళీ పడకపై వెళ్లే వరకు ప్రతి సమయం, ప్రతి సందర్భం, ప్రతి స్థితిలో ఉంది. యుద్ధ మైదానంలో శత్రువులు ఒకరిపై ఒకరు అక్కడ తూటలు వదులుకుంటూ, బాణాలు విసురుకుంటూ, రక్త సిక్తం అయ్యే సందర్భంలో కూడా అల్లాహ్ ఏమన్నాడు? మీరు ఒక వర్గాన్ని కలిసి యుద్ధంలో వారితో పోరాటంలో ఉన్నప్పుడు కూడా ధైర్యంగా స్థిరంగా ఉండండి, వెనుదిరగకండి మరియు అల్లాహ్ ను అధికంగా స్మరించండి. గమనించండి, అలాంటి క్లిష్ట పరిస్థితిలో కూడా అల్లాహు తాలా స్మరణ చేయడం నుండి మనకు మినహాయింపు ఇవ్వలేదంటే వేరే ఏ సందర్భంలో ఉంటుంది? అజాన్ తర్వాత కూడా ధిక్ర్ ఉంది, ఇంకా అనేక వజూ తర్వాత ఉంది, మస్జిద్ లో ప్రవేశించే సందర్భంలో ఉంది, రాత్రి వేళ ఉంది, రుకూలో, సజ్దాలో, కునూతులో, సలాం తింపిన తర్వాత, మయ్యిత్ కొరకు అలాగే ఎన్నో సందర్భాలు ఉన్నాయి. మనం చిన్నపాటి జేబులో ఉండేటువంటి పుస్తకాలు గానీ లేదా మన మొబైల్ లో చిన్నపాటి రెయిన్బో వల్ల ముఖ్యమైన దువాలు ఇలాంటి పీడీఎఫ్ గానీ పెట్టుకొని మనం అల్లాహ్ యొక్క స్మరణ అధికంగా చేస్తూ ఉన్నామంటే మనకు ఇహపరలోకాల్లో మేల్లే మేలు కలుగుతాయి.

చివరిలో ఒక హదీస్ యొక్క భావం, ఇక నేను అది చూపించి మళ్ళీ ఇంకా ఆలస్యం చేయను, హదీస్ భావం చెప్పి సమాప్తం చేస్తాను. అదేమంటే ఎవరైతే ఈ లోకంలో ఎక్కడైనా కూర్చుంటారో లేదా ఏదైనా ఎక్కడైనా నడుస్తారో లేదా ఎక్కడైనా ఇలా వెల్లకిలా పడుకుంటారో, అక్కడ అల్లాహ్ ను స్మరించలేదు, అల్లాహ్ ను స్తుతించలేదు, అల్లాహ్ యొక్క సత్య ప్రవక్తపై దరూద్ చేయలేదు, చదవలేదు అంటే ఆ సమయం, ఆ ఘడియ, ఆ పడుకోవడం, ఆ నడవడం, ఆ కూర్చోవడం ఇదంతా కూడా వారి కొరకు ప్రళయ దినాన పశ్చాత్తాప భావంగా చాలా నష్టకరంగా ఉంటుంది. అక్కడ ఈ నష్టాన్ని తీర్చుకోవడానికి వేరే ఏ సాధనం ఉండదు. ఇలాంటి సమయం రాకముందే ఇక్కడే బుద్ధి జ్ఞానాలు నేర్చుకొని అల్లాహ్ ను అధికంగా స్మరించే ప్రయత్నం చేయాలి. అల్లాహ్ మనందరికీ సద్భాగ్యం ప్రసాదించు గాక. ఆమీన్. వా ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.

(ఆడియోలో కనిపించే హదీస్ యొక్క అనువాదం)

ఈ హదీస్ చూస్తున్నారు. దీనిని మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. కేవలం అనువాదం నేను చెబుతున్నాను శ్రద్ధ వహించండి. అబూ దర్దా రదియల్లాహు అన్హు ఉల్లేఖిస్తున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి సహాబాలతో అడిగారు, “నేను మీకు తెలియజేయనా, మీ కర్మల్లో అతి ఉత్తమమైనవి, అల్లాహ్ కు ఎక్కువగా ఇష్టమైనది, మీ యొక్క చక్రవర్తి అయిన అల్లాహ్ కు ఎక్కువగా ఇష్టమైనది, అంటే అల్లాహ్ కు ఎక్కువ ఇష్టమైన మరియు అల్లాహ్ వద్ద మీ కర్మల్లో అత్యంత ఉత్తమమైనది, మీ యొక్క స్థానాలను చాలా పైకి చేసే ఎత్తు చేసే రెట్టింపు చేసేటువంటిది, మరియు మీరు వెండి బంగారాలను అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయడం కంటే కూడా ఉత్తమమైనది. అంతేకాదు ఇంకా, ఇంకా ఉంది. మీరు మీ శత్రువులను కలిసి, మీరు వారి మెడలను నరకడం, వారు మీ మెడలను నరకడం కంటే కూడా ఉత్తమం.” అల్లాహు అక్బర్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక్క విషయం గురించి చెప్పాలనుకుంటున్నారు, కానీ ఎన్ని విషయాల కంటే ఉత్తమమైనదో గమనించండి. సర్వ కర్మల్లో ఉత్తమమైనది, అల్లాహ్ కు చాలా ప్రసన్నతమైనది, స్థానాలను రెట్టింపు చేయునది, మరియు వెండి బంగారం ఖర్చు చేయడం కంటే కూడా ఉత్తమమైనది, శత్రువులను కలిసి వారు మెడలు నరకడం మనం వారి మెడలను మెడలను నరకడం కంటే కూడా ఉత్తమమైనది. ఏంటి? అల్లాహ్ యొక్క ధిక్ర్. అల్లాహ్ యొక్క ధిక్ర్. చూశారా? ఇంత గొప్ప ఘనత. ఈ ఘనతను మనం మరియు ఇది చాలా సులభమైనది కూడా. ధిక్ర్ చేయడానికి మనకు వజూ అవసరం ఉండదు. ధిక్ర్ చేయడానికి మనకు నిలబడాలి, ఖిబ్లా దిశలో ఉండాలి ఇట్లాంటి ఏ కండిషన్లు లేవు. అందుకొరకే ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సబకల్ ముఫర్రిదూన్ అని చెప్పారు. అంటే అల్లాహ్ యొక్క ధిక్ర్ అధికంగా చేసేవారు చాలా చాలా చాలా అందరికంటే ముందుగా దూసుకెళ్లారు అని. అందుకొరకే మరొక హదీస్ లో ఉంది, మనిషిని అల్లాహ్ యొక్క శిక్ష నుండి కాపాడేది అల్లాహ్ యొక్క ధిక్ర్ కంటే గొప్ప విషయం మరొకటి వేరేదేమీ లేదు అని.

జిక్ర్, దుఆ మెయిన్ పేజీ:
https://teluguislam.net/dua-supplications/

మా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి ఇన్ షా అల్లాహ్:
http://www.youtube.com/user/teluguislam?sub_confirmation=1

అసూయ సత్కార్యాలను హరించి వేస్తుంది, అగ్ని కట్టెలను భస్మీపటలం చేసినట్లే [వీడియో]

అసూయ సత్కార్యాలను హరించి వేస్తుంది, అగ్ని కట్టెలను భస్మీపటలం చేసినట్లే | బులూగుల్ మరాం | హదీసు 1277
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) – https://youtu.be/oaEzWzJQHFo – 8 నిముషాలు

1277. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రబోధించారు: “అసూయకు దూరంగా ఉండండి ఎందుకంటే అగ్ని కట్టెలను భస్మీపటలం చేసినట్లే అసూయ సత్కార్యాలను హరించి వేస్తుంది.” (దీనిని అబూదావూద్ సేకరించారు-ఇబ్నెమాజాలోనూ హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు)చే ఈ విధంగానే ఉల్లేఖించ బడింది)

సారాంశం: అసూయ లేక ఈర్య పెద్ద పాపాల కోవకు చెందినది. ఈర్ష్య మూలంగానే షైతాన్ తొలిసారిగా అల్లాహ్ ను ధిక్కరించాడు. ఖాబిల్ తన సోదరుడైన హాబిల్ ని అసూయతోనే హత్య చేశాడు. దైవప్రవక్త హజ్రత్ యూసుఫ్ (అలైహిస్సలాం) సోదరులు ఆయన యెడల చేసిన చెడు వ్యవహారానికి అసలు కారణం ఈ అసూయే. యూద పండితులు, అబ్దుల్లాహ్ బిన్ ఉబై వంటి కపటులు మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పట్ల చేసిన కపట చేష్టలన్నింటికీ మూలం ఈర్ష్యే. దీనికి సంబంధించిన ఉల్లేఖనాలనేకం ఉన్నాయి. ఇది విశ్వాసానికి విరుద్ధాంశం. అందుకే దీనికి దూరంగా ఉండమని మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) చాలా గట్టిగా తాకీదు చేశారు.


యూట్యూబ్ ప్లే లిస్ట్ – బులూగుల్ మరాం – కితాబుల్ జామి:
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV266FkpuZpGacbo51H-4DV3

మా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి ఇన్ షా అల్లాహ్:
http://www.youtube.com/user/teluguislam?sub_confirmation=1

ఇతర ముఖ్యమైన లింకులు:

మంచిని ఆదేశించడంతో పాటు, చెడును ఖండించడం తప్పనిసరి [వీడియో]

బిస్మిల్లాహ్

[5:33 నిముషాలు ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ధర్మ ప్రచారం (దావా) (మెయిన్ పేజీ)
https://teluguislam.net/dawah/

మనిషి తనకు తాను చెడు నుంచి దూరంగా ఉండటానికి ఏమి చేయాలి? [వీడియో]

బిస్మిల్లాహ్

[6:10 నిముషాలు ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

పాపాలు (Sins) మెయిన్ పేజీ
https://teluguislam.net/sins/