[1:15 నిముషాలు ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
తెలుగుఇస్లాం.నెట్ * తెలుగులో ఇస్లాం జ్ఞాన సంపద *
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మమ్మల్ని ఉద్దేశించి “నేను మీకు అన్నిటికంటే ఘోరమైన పాపాలను గురించి తెలుపనా? అని అడిగారు. ఈమాట ఆయన మూడుసార్లు పలికారు. దానికి మేము “తప్పకుండా తెలుపండి దైవప్రవక్తా!” అన్నాము. అప్పుడాయన “అల్లాహ్ కు ఇతరులను సాటి కల్పించటం, తల్లిదండ్రులమాట వినకపోవటం” అని తెలిపారు. ఆ తరువాత ఆయన ఆనుకుని కూర్చున్న వారల్లా ఒక్కసారిగా లేచి సరిగా కూర్చొని “జాగ్రత్తగా వినండి! అబద్ధమాడటం (అన్నిటికంటే ఘోరమైన పాపం)” అని అన్నారు. ఇలా మాటిమాటికి చెబుతూ పోయారు. చివరికి మేము మనసులో “అయ్యో! ఈయన ఈ మాటలు ఇక చాలిస్తే బాగుండు” అని అనుకున్నాం.
1675. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ వూద్ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉద్బోధించారు :-
నిజం మనిషిని పుణ్యకార్యాల వైపుకు తీసుకుని వెళుతుంది. పుణ్యకార్యాలు (అతడ్ని) స్వర్గానికి గొనిపోతాయి. ఎవరైనా ఎల్లప్పుడు నిజం చెబుతుంటే అది అతడ్ని ఎప్పుడో ఓ రోజు సిద్దీఖ్ (సత్యశీలుడి) గా మార్చివేస్తుంది. అబద్ధం మనిషిని పాపకార్యాల వైపుకు తీసుకుని వెళుతుంది. పాపకార్యాలు అతడ్ని నరకానికి చేర్చుతాయి. ఎవరైనా (ఎల్లప్పుడూ) అబద్ధమాడుతుంటే దానివల్ల అతడు ఎప్పుడో ఓ రోజు అల్లాహ్ దగ్గర అబద్దాలరాయుడిగా వ్రాయబడతాడు.
[సహీహ్ బుఖారీ : 78 వ ప్రకరణం – అదబ్, 69 వ అధ్యాయం – ఖౌలిల్లాహి తఅలా (యాఅయ్యుహల్లజీన ఆమనుత్తఖుల్లాహ వకూనూ మాఅస్సాదిఖీన్)]
సామాజిక మర్యాదల ప్రకరణం – 29 వ అధ్యాయం – అబద్ధం చెడ్డ విషయం, సత్యం మంచి విషయం. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-2. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్