విశ్వాసుల మధ్య స్నేహం – షేక్ హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో & టెక్స్ట్]

విశ్వాసులతో స్నేహం అంటే ఏమిటి?
https://youtu.be/VIPOLPgJOa4 [8 నిముషాలు]
వక్త: షేక్ హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగం ఇస్లాంలో విశ్వాసుల మధ్య స్నేహం యొక్క భావనను వివరిస్తుంది. ఈ స్నేహం ఏకేశ్వరోపాసన (తౌహీద్) కోసం పరస్పర ప్రేమ మరియు సహకారంపై ఆధారపడి ఉంటుందని ఇది నొక్కి చెబుతుంది. వక్త సూరా అత్-తౌబా, 71వ ఆయతును ఉటంకిస్తూ, విశ్వాసులను మంచిని ఆజ్ఞాపించే, చెడును నిషేధించే, నమాజ్ స్థాపించే, జకాత్ ఇచ్చే, మరియు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు విధేయత చూపే పరస్పర మిత్రులుగా వర్ణించారు. ఇంకా, ఈ బంధాన్ని వివరించడానికి రెండు హదీసులు సమర్పించబడ్డాయి: మొదటిది విశ్వాసులను ఒక గోడలోని ఇటుకలతో పోలుస్తుంది, ప్రతి ఒక్కటి మరొకదాన్ని బలపరుస్తుంది, రెండవది విశ్వాసుల సమాజాన్ని సమిష్టిగా నొప్పిని అనుభవించే ఒకే శరీరంతో పోలుస్తుంది. విశ్వాసులు ఒకరికొకరు బలం, మద్దతు మరియు కరుణకు మూలంగా ఉండాలనేది ప్రధాన సందేశం.

ఇన్నల్ హమ్ దలిల్లాహి వహ్దహు, వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బ’అదహు, అమ్మా బ’అద్.

ఆత్మీయ సోదరులారా, ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరికీ స్వాగతం. నా ఇస్లామీయ అభివాదం అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

ఈరోజు మనం విశ్వాసులతో స్నేహం అంటే ఏమిటి? అనే విషయం గురించి తెలుసుకోబోతున్నాం.

విశ్వాసులతో స్నేహం అంటే, మువహ్హిదీన్‌లను అనగా ఏక దైవారాధకులైన విశ్వాసులను ప్రేమించడం, వారితో సహకరించడం అన్నమాట.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరత్ తౌబా, ఆయత్ 71లో ఇలా సెలవిచ్చాడు.

وَالْمُؤْمِنُونَ وَالْمُؤْمِنَاتُ بَعْضُهُمْ أَوْلِيَاءُ بَعْضٍ ۚ يَأْمُرُونَ بِالْمَعْرُوفِ وَيَنْهَوْنَ عَنِ الْمُنكَرِ وَيُقِيمُونَ الصَّلَاةَ وَيُؤْتُونَ الزَّكَاةَ وَيُطِيعُونَ اللَّهَ وَرَسُولَهُ ۚ أُولَٰئِكَ سَيَرْحَمُهُمُ اللَّهُ ۗ إِنَّ اللَّهَ عَزِيزٌ حَكِيمٌ

విశ్వాసులైన పురుషులూ, విశ్వాసులైన స్త్రీలూ – వారంతా ఒండొకరికి మిత్రులుగా (సహాయకులుగా, చేదోడు వాదోడుగా) ఉంటారు. వారు మంచిని గురించి ఆజ్ఞాపిస్తారు. చెడుల నుంచి వారిస్తారు. నమాజులను నెలకొల్పుతారు, జకాత్‌ను చెల్లిస్తారు. అల్లాహ్‌కు, ఆయన ప్రవక్తకు విధేయులై ఉంటారు. అల్లాహ్‌ అతిత్వరలో తన కారుణ్యాన్ని కురిపించేది వీరిపైనే. నిస్సందేహంగా అల్లాహ్‌ సర్వాధిక్యుడు, వివేచనాశీలి.(9:71)

ఈ ఆయతులో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా విశ్వాసుల సద్గుణాల ప్రస్తావన చేశాడు. విశ్వాసుల యొక్క సద్గుణాలను ప్రస్తావించాడు. మొదటి సద్గుణం ఏమిటంటే వారు, అంటే విశ్వాసులు, పురుషులైనా, స్త్రీలైనా, విశ్వాసులు, విశ్వాసులైన పురుషులు, విశ్వాసులైన స్త్రీలు, వారు పరస్పరం స్నేహితులుగా మసులుకుంటారు. ఒండొకరికి సహాయ సహకారాలు అందించుకుంటారు. సుఖదుఃఖాలలో పాలుపంచుకుంటారు అన్నమాట.

మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు.

الْمُؤْمِنُ لِلْمُؤْمِنِ كَالْبُنْيَانِ يَشُدُّ بَعْضُهُ بَعْضًا
(అల్ ముఅమిను లిల్ ముఅమిని కల్ బున్యాన్, యషుద్దు బ’అదుహు బా’దా)
ఒక విశ్వాసి, సాటి విశ్వాసికి గోడ లాంటివాడు. ఆ గోడలోని ఒక ఇటుక, ఇంకో ఇటుకకు పుష్టినిస్తుంది. (బుఖారీ మరియు ముస్లిం)

అంటే ఒక విశ్వాసి, సాటి విశ్వాసికి గోడ లాంటివాడు. ఆ గోడలోని ఒక ఇటుక ఇంకో ఇటుకకు పుష్టినిస్తుంది. సుబ్ హా నల్లాహ్! అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక విశ్వాసికి మరో విశ్వాసికి మధ్య ఉండే సంబంధాన్ని ఈ హదీసులో వివరించారు. అల్ ముఅమిను లిల్ ముఅమిని కల్ బున్యాన్. కట్టడం లాంటివాడు. ఒక విశ్వాసి ఇంకో విశ్వాసికి కట్టడం లాంటివాడు, గోడ లాంటివాడు. ఎందుకంటే ఒక గోడలో ఒక ఇటుక, ఇంకో ఇటుకకు బలం ఇస్తుంది, పుష్టినిస్తుంది. విశ్వాసులు కూడా పరస్పరం అలాగే ఉంటారు, ఉండాలి అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రస్తావించిన మాట. అలాగే, అంతిమ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకో హదీసులో ఇలా సెలవిచ్చారు.

مَثَلُ الْمُؤْمِنِينَ فِي تَوَادِّهِمْ وَتَرَاحُمِهِمْ وَتَعَاطُفِهِمْ مَثَلُ الْجَسَدِ إِذَا اشْتَكَى مِنْهُ عُضْوٌ تَدَاعَى لَهُ سَائِرُ الْجَسَدِ بِالسَّهَرِ وَالْحُمَّى

(మసలుల్ ముఅమినీన ఫీ తవాద్దిహిమ్ వ తరాహుమిహిమ్ వ త’ఆతుఫిహిమ్ మసలుల్ జసద్, ఇజష్ తకా మిన్హు ఉద్వున్ తదాఆ లహూ సాయిరుల్ జసది బిస్సహరి వల్ హుమ్మా)

పరస్పర ప్రేమానురాగాలను పంచుకోవటంలో, ఒండొకరిపై దయ చూపటంలోనూ, విశ్వాసుల (ముఅమినీన్‌ల) ఉపమానం ఒక శరీరం లాంటిది. శరీరంలోని ఏదైనా ఒక అవయవం బాధకు గురైనప్పుడు, మొత్తం శరీరానికి నొప్పి కలుగుతుంది. శరీరమంతా వ్యాకులతకు లోనవుతుంది. (ముస్లిం)

ఈ హదీసులో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ప్రేమానురాగాల విషయంలో, దయ చూపే విషయంలో ఒండొకరికి ఒకరు సహాయం చేసుకునే విషయంలో, చేదోడు వాదోడుగా ఉండే విషయంలో, పరస్పరం కలిసిమెలిసి ఉండే విషయంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రపంచంలో ఉన్న విశ్వాసులందరూ ఒక శరీరం లాంటి వారు. శరీరంలోని ఒక భాగానికి బాధ అయితే, మొత్తం శరీరం బాధపడుతుంది. అదే ఉపమానం ఒక విశ్వాసిది అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.

అత్మీయ సోదరులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ నిజమైన విశ్వాసిగా జీవించే సద్బుద్ధిని అల్లాహ్ ప్రసాదించుగాక. ఆమీన్. మరిన్ని వివరాలు ఇన్ షా అల్లాహ్ వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అప్పటివరకు సెలవు. వ ఆఖిరు ద’అవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43226


అల్లాహ్ హరాం చేసినదానిని హలాల్ చేయుట, లేదా అల్లాహ్ హలాల్ చేసిన దానిని హరాం చేయుట [వీడియో| టెక్స్ట్]

అల్లాహ్ హరాం చేసినదానిని హలాల్ చేయుట, లేదా అల్లాహ్ హలాల్ చేసిన దానిని హరాం చేయుట
https://www.youtube.com/watch?v=FkFraSDe3uM
 ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హాఫిజహుల్లాహ్)
ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]

ఈ ప్రసంగంలో, ఇస్లాంలో నిషిద్ధమైన రెండవ ప్రధాన విషయం గురించి వివరించబడింది. అల్లాహ్ హలాల్ (ధర్మసమ్మతం) చేసిన దానిని హరామ్ (నిషిద్ధం)గా లేదా హరామ్ చేసిన దానిని హలాల్‌గా మార్చడం ఎంత పెద్ద పాపమో ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా స్పష్టం చేయబడింది. యూదులు మరియు క్రైస్తవులు తమ పండితులను, సన్యాసులను అల్లాహ్ ను వదిలి ప్రభువులుగా చేసుకోవడం అంటే, వారు హలాల్-హరామ్ నిర్ణయాలలో వారిని గుడ్డిగా అనుసరించడమే అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వివరించారు. ఈ అధికారం కేవలం అల్లాహ్ కు మాత్రమే ఉందని, ఇతరులకు ఈ హక్కును ఆపాదించడం లేదా అనుసరించడం అవిశ్వాసానికి దారితీస్తుందని హెచ్చరించారు. ముస్లింలు తమ జీవితంలోని అన్ని విషయాలలో, ముఖ్యంగా వివాదాల పరిష్కారంలో, ఖురాన్ మరియు సున్నత్‌లను మాత్రమే అనుసరించాలని, మానవ నిర్మిత చట్టాలను ఆశ్రయించకూడదని ఈ ప్రసంగం నొక్కి చెబుతుంది.

నిషిద్ధ విషయాలలో మొదటి విషయం షిర్క్ అని, దానిలో కొన్ని రకాలు చదివాము. అయితే ఈ రోజు మూడవ పాఠంలో, నిషిద్ధ విషయాలలో రెండవది అల్లాహ్ హరామ్ చేసిన దానిని హలాల్ చేయుట లేదా అల్లాహ్ హలాల్ చేసిన దానిని హరామ్ చేయుట. శ్రద్ధ వహించండి. అల్లాహ్ ఒక వస్తువును హరామ్ చేశాడు, దానిని హలాల్ చేయుట. లేదా అల్లాహ్ ఒక వస్తువును హలాల్ చేశాడు, దానిని హరామ్ చేయుట.

అల్లాహ్ హరామ్ చేసిన దానిని హలాల్ చేయుట లేదా అల్లాహ్ హలాల్ చేసిన దానిని హరామ్ చేయుట లేదా ఇలాంటి హక్కు అల్లాహ్ తప్ప ఇతరులకు ఉంది అని నమ్ముట. గమనిస్తున్నారా? స్వయంగా మనిషి, ఒక మనిషి అల్లాహ్ హలాల్ చేసిన దాన్ని హరామ్ చేస్తున్నాడు. లేదా అల్లాహ్ హరామ్ చేసిన దానిని హలాల్ చేస్తున్నాడు. మూడో మాట దీంట్లో ఏమిటి? అల్లాహ్ తప్ప ఈ హలాల్, హరామ్ చేసేటటువంటి హక్కు ఎవరికైనా ఉంది అని నమ్మటం. ఒక వ్యక్తి స్వయంగా హలాల్‌ను హరామ్ చేయట్లేదు. కానీ ఎవరైనా చేస్తూ ఉంటే అతన్ని సహీగా, కరెక్ట్‌గా నమ్ముతున్నాడు. అలా చేయడం అతనికి తగును, అతనికి ఆ హక్కు ఉంది అన్నటువంటి నమ్మకం ఉంది. ఇక ఇలా ఈ నమ్మడం అనేది కూడా అవిశ్వాసంలో వస్తుంది. అల్లాహు త’ఆలా నిషేధించాడు. అంతేకాదు, ఇంకా శ్రద్ధ వహించండి.

సమస్యల తీర్పు కొరకు అల్లాహ్ పంపిన ఇస్లాం ధర్మం కాకుండా ఇతర న్యాయస్థానాలకు వెళ్ళుట. సర్వసామాన్యంగా ఈ రోజుల్లో ముస్లింలలో పరస్పరం ఏదైతే గొడవలు, ప్రత్యేకంగా భార్యాభర్తల గొడవల విషయాలలో ముస్లిం కమ్యూనిటీ, ముస్లిం పంచాయతీ, ముస్లిం వారి యొక్క వారి జమాతుల్లో ఉన్నటువంటి ధర్మవేత్తల పర్యవేక్షణలో ఒక కమిటీ ఏర్పాటు చేసి, వారి యొక్క అధ్వర్యంలో తమ గొడవలకు మంచి పరిష్కారం ఖురాన్, హదీసుల ఆధారంగా తీసుకునే ప్రయత్నం చేయకుండా ఏం చేస్తూ ఉంటారు? ఏదైనా గొడవ జరిగింది, వెంటనే లంచాలు ఇచ్చి తమ ఎదుటి వారిపై కేసులు నమోదు చేయిస్తారు. తమకు ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వారి గురించి కోర్టుల యొక్క మెట్లు ఎక్కుతారు. అయితే ఇలా చేయడం అంతా కూడా సమంజసం, మంచి విషయమే అని భావించడం, ఎక్కడైతే ఖురాన్, హదీస్ ప్రకారంగా తీర్పులు జరగవో అలాంటి చోట వెళ్ళడం, అలాంటి చోట వారితో తీర్పులు చేయించుకోవడం, ఇవన్నీ కూడా ఎంత ఘోరమైన విషయం! ఇంకా శ్రద్ధగా వినండి. మరియు ఇస్లామీయ చట్టాలతో కాకుండా ఇతర చట్టాలతో తీర్పు కోరుట లేదా అది యోగ్యమైనదని సంతోషంగా నమ్ముట, ఎంతటి భయంకరమైన అవిశ్వాసంలో పడవేస్తుందో ఖురాన్‌లోని ఈ ఆయతు ద్వారా తెలుసుకోండి. మరియు ఈ ఆయతు సూరతు తౌబా, సూర నెంబర్ తొమ్మిది, ఆయతు నెంబర్ 31. శ్రద్ధగా వినండి.

అల్లాహ్ తెలుపుతున్నాడు:

اتَّخَذُوا أَحْبَارَهُمْ وَرُهْبَانَهُمْ أَرْبَابًا مِّن دُونِ اللَّهِ
(ఇత్తఖజూ అహ్బారహుమ్ వ రుహ్బానహుమ్ అర్బాబమ్ మిన్ దూనిల్లాహ్)
వారు అల్లాహ్‌ను వదలి తమ పండితులను, తమ సన్యాసులను ప్రభువులుగా చేసుకున్నారు. (9:31)

వారు అంటే, యూదులు, క్రైస్తవులు. అల్లాహ్‌ను కాదని తమ పండితులను, తమ సన్యాసులను తమ ప్రభువులుగా చేసుకున్నారు. యూదులు, క్రైస్తవులు అల్లాహ్‌ను వదిలి ఎవరిని? తమ యొక్క పండితులను, తమ యొక్క సన్యాసులను ఏం చేశారు? ప్రభువులుగా చేసుకున్నారు. أَرْبَابًا مِّن دُونِ اللَّهِ (అర్బాబమ్ మిన్ దూనిల్లాహ్) రబ్ ఏకవచనం, అర్బాబ్ ఇది బహువచనం. ఇక మనం చూస్తూ ఉంటాము, చర్చిలో ఉండేటువంటి పాస్టర్లు, వారినైతే ప్రభువుగా నమ్మరు కదా? లేక వారి యొక్క పెద్ద పండితులను సామాన్య క్రైస్తవులు ప్రభువుగా నమ్మరు కదా అని ఈ రోజుల్లో కూడా ఎంతో మంది అనుకుంటారు, కదా? రండి, తిర్మిజీ మరియు ముస్తద్రక్ హాకింలోని హదీస్ ద్వారా దీని యొక్క వివరణ వినండి.

ఈ ఆయతు, సూరత్ తౌబా ఆయతు నెంబర్ 31, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పఠిస్తుండగా అదీ బిన్ హాతిమ్ రదియల్లాహు అన్హు విని, “ప్రవక్తా! యూదులు, క్రైస్తవులు తమ పండితులను, సన్యాసులను ఆరాధించేవారు కారు కదా?” సామాన్య యూదులు మరియు క్రైస్తవులు వారి యొక్క పండితులను, వారి యొక్క సన్యాసులను, పాస్టర్లను పూజించరు కదా? ఆరాధించరు కదా? మరి ప్రభువుగా చేసుకున్నారని ఆయతులో చెప్పబడింది? అతని యొక్క ప్రశ్న విని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, “అవును, నువ్వు అంటున్నావు ఆరాధించేవారు కాదు. అవును, ఆరాధించేవారు కాదు. కానీ అల్లాహ్ హరామ్ చేసిన దానిని వారి పండితులు, సన్యాసులు హలాల్ చేస్తే వారు దానిని హలాల్‌గానే భావించేవారు. ఇంకా అల్లాహ్ హలాల్ చేసిన దానిని వారి పండితులు, సన్యాసులు హరామ్ చేస్తే వారు దానిని హరామ్‌గానే భావించేవారు. కనుక ఇది వారిని ఆరాధించినట్లు. అందుకని వారు తమ సన్యాసులను, పండితులను ప్రభువులుగా చేసుకున్నారు” అన్నటువంటి సమాధానం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది సహీహ్ హదీస్. షేఖ్ అల్బానీ రహమహుల్లాహ్ వారు కూడా గాయతుల్ మరాంలో సహీహ్ అని తెలిపారు. అయితే అర్థమైంది కదా సోదర మహాశయులారా?

అంతేకాదు. మరొక ఆయత్ సూరత్ తౌబాలోనే ఉంది. కొంచెం శ్రద్ధగా వినండి. అంతకంటే ముందు, అల్లాహ్ నిషేధించిన వాటిని నిషిద్ధంగా నమ్మని వారు, నిషిద్ధతలను నిషిద్ధంగా నమ్మని వారు యూదులు, క్రైస్తవులు మరియు బహుదైవారాధకులు. కానీ ఈ పని ఒక ముస్లింగా తమకు తాము అనుకునే వాళ్ళు, తమ పేర్లు ముస్లింలుగా పెట్టుకొని ఇలాంటి పనులు చేస్తే మరి వారి గతి ఏమవుతుంది? అల్లాహు అక్బర్. చూడండి, సూరత్ తౌబా ఆయత్ నెంబర్ 29.

وَلَا يُحَرِّمُونَ مَا حَرَّمَ اللَّهُ وَرَسُولُهُ وَلَا يَدِينُونَ دِينَ الْحَقِّ
(వ లా యుహర్రిమూన మా హర్రమల్లాహు వ రసూలుహు వ లా యదీనూన దీనల్ హఖ్)
అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త నిషిద్ధం చేసిన వాటిని వారు నిషిద్ధంగా భావించరు, మరియు సత్య ధర్మాన్ని అవలంబించరు. (9:29)

యూదులు, క్రైస్తవులు, బహుదైవారాధకులు, వీరందరూ అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త నిషేధించిన వాటిని వారు నిషిద్ధంగా భావించరు మరియు సత్య ధర్మాన్ని అవలంబించరు. ఒకవేళ ఎవరైనా ముస్లిం ఈ పని చేశాడంటే చాలా, చాలా నష్టంలో పడిపోతాడు. ఎలాంటి నష్టం? అల్లాహ్ పై చాలా పెద్ద అభాండం మోపినట్లు. చూడండి, సూర యూనుస్‌లోని ఆయతు నెంబర్ 59, అల్లాహు త’ఆలా తెలుపుతున్నాడు.

قُلْ أَرَأَيْتُم مَّا أَنزَلَ اللَّهُ لَكُم مِّن رِّزْقٍ فَجَعَلْتُم مِّنْهُ حَرَامًا وَحَلَالًا قُلْ آللَّهُ أَذِنَ لَكُمْ ۖ أَمْ عَلَى اللَّهِ تَفْتَرُونَ
(ఓ ప్రవక్తా!) ఇలా అను: “ఏమిటి? మీరు ఆలోచించారా? అల్లాహ్ మీ కొరకు అవతరింపజేసిన జీవనోపాధిలో నుండి మీరు స్వయంగానే కొన్నింటిని హరామ్‌గానూ, మరి కొన్నింటిని హలాల్‌గానూ నిర్ధారించుకున్నారు.” వారినిలా అడుగు: “ఇలా చేయడానికి అల్లాహ్ మీకు అనుమతించాడా? లేక మీరు అల్లాహ్‌కు అబద్ధాలను అంటగడుతున్నారా?” (10:59)

ఈ ఆయతు ద్వారా ఏం తెలుస్తుంది? అల్లాహు త’ఆలా ప్రజల్లో ఎవరికీ కూడా ఏదైనా వస్తువును హలాల్ చేసే, ఏదైనా వస్తువును హరామ్ చేసే అటువంటి హక్కు ఇవ్వలేదు. ఇది వాస్తవం, ఇవ్వలేదు. ఇది కేవలం అల్లాహ్ యొక్క హక్కు మాత్రమే. ఇంతకుముందు కూడా దీనికి సంబంధించిన కొన్ని ఆధారాలు మొదటి పాఠంలో, మొదటి క్లాస్‌లో విన్నాము మనం. మీలో ఎవరికైనా గుర్తు లేకుంటే ఒకసారి ఆ పాఠాన్ని తర్వాత మీరు చూడండి, వినండి. అయితే అల్లాహ్ అయితే ఎవరికీ ఈ హక్కు ఇవ్వలేదు. అలాంటప్పుడు ఎవరైనా ఈ హక్కును దుర్వినియోగం చేసుకుంటున్నాడు, అతడు దౌర్జన్యపరుడు అవుతున్నాడు, అంతేకాదు అల్లాహ్ పై అబద్ధాలు మోపేవాడు అవుతున్నాడు.

అర్థమైంది కదా? ఎంత ఘోరమైన పాపం? అందుకొరకే ఈ రోజుల్లో కూడా ప్రజలు తమకు ఇష్టం వచ్చినట్లుగా కొన్ని వస్తువులను ఇది హలాల్ అని, ఇది హరామ్ అని లేదా వారి యొక్క పెద్దలు, గురువులు, “అరే హమారే బాబా బోలే జీ,” “మా పీర్ సాబ్ చెప్పారు,” “మేము ఫలానా ముర్షిదులను నమ్ముతున్నాము, ఆయన చెప్పినట్లే మేము వింటాము” ఇక వారు హరామ్ చేసిందే హరామ్, వారు హలాల్ అని చెప్పిందే హలాల్. ఈ విధంగా మనం అల్లాహ్ మరియు ప్రవక్తకు వ్యతిరేకంగా ఒక మార్గంలో వెళ్తున్నామంటే అది మనల్ని స్వర్గానికి తీసుకెళ్తుందా? మనమే మంచిగా ఆలోచించాలి.

ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]


ఖురాన్ తఫ్సీర్ – సూర అల్ జిన్న్ [వీడియోలు]

ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో మొత్తం 28 ఆయతులు ఉన్నాయి. ఏకదైవారాధన, ప్రవక్తల పరంపర గురించి ఈ సూరా ముఖ్యంగా వివరించింది.మొదటి ఆయతులో ప్రస్తావనకు వచ్చిన జిన్నులు అన్న పదాన్ని ఈ సూరాకు పేరుగా పెట్టడం జరిగింది. దివ్య ఖుర్ఆన్ ప్రాముఖ్యానికి జిన్నులు కూడా ప్రభావితమయ్యాయని తెలియజేయడం ద్వారా ఖుర్ఆన్ ఔన్నత్యాన్ని విశదీకరించడం జరిగింది. జిన్నులు రెండు రకాలని, కొందరు మంచివారని, కొందరు చెడ్డవారని తెలిపింది. కొందరు జిన్నులు దైవవాణిని విన్న తర్వాత దానిని విశ్వసించారు. ఈ సూరా ఏకదైవారాధన ప్రాముఖ్యాన్ని నొక్కి చెప్పింది. అల్లాహ్ కు భాగస్వాములను చేర్చడం మహాపరాధమనీ, దానికి దూరంగా ఉండాలని బోధించింది. అల్లాహ్ కు కుమారులు ఎవరూ లేరని, ఆయనకు భాగస్వాములు కూడా లేరని, ఆయనకు అగోచరాలు (కంటికి కనబడనివి) అన్నీ తెలుసనీ, అల్లాహ్ ను,ఆయన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)ను తిరస్కరించిన వారు నరకాగ్నికి ఆహుతి అవుతారని హెచ్చరించింది. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)ను అల్లాహ్ ఎన్నుకుని తన సందేశాన్ని మానవాళికి చేరవేయడానికి పంపాడని, మానవులు ఆయనకు విధేయత చూపాలని, అల్లాహ్ కు భాగస్వాములుగా ఎవరినీ నిలబెట్టరాదని బోధించింది.

యూట్యూబ్ ప్లే లిస్ట్ (4 వీడియోలు)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV03Itn9bMAzB2-hY7-39uaR

ఖురాన్ తఫ్సీర్ – సూరా అల్ జిన్న్ – పార్ట్ 1 (అయతులు 1-7)
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/TI28ZCm3pN0 [52 నిముషాలు]

ఈ ప్రసంగంలో సూరతుల్ జిన్ (72వ అధ్యాయం)లోని మొదటి ఏడు ఆయతుల (వచనాలు) యొక్క తఫ్సీర్ (వివరణ) ఇవ్వబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో మరియు తాయిఫ్‌లో తీవ్రమైన తిరస్కరణ, కష్టాలను ఎదుర్కొన్నప్పుడు, అల్లాహ్ ఆయనకు ఓదార్పునివ్వడానికి ఈ సంఘటనను తెలియజేశాడు. మానవులు తిరస్కరించినప్పటికీ, అల్లాహ్ యొక్క మరొక సృష్టి అయిన జిన్నాతులు ఖుర్ఆన్ విని, దాని అద్భుత స్వభావానికి ప్రభావితులై, తక్షణమే విశ్వసించి, షిర్క్‌ను త్యజించారు. ఈ సూరత్ తౌహీద్ (ఏకదైవారాధన), రిసాలత్ (ప్రవక్తృత్వం) మరియు ఆఖిరత్ (పరలోక జీవితం) యొక్క ప్రాథమిక సూత్రాలను నొక్కి చెబుతుంది. ఇస్లాం పూర్వపు అరబ్బులు జిన్నాతుల శరణు వేడుకోవడం వంటి షిర్క్ చర్యలను, మరియు దాని పర్యవసానాలను ఇది ఖండిస్తుంది. ఖుర్ఆన్ యొక్క మార్గదర్శకత్వం, దానిని శ్రద్ధగా వినడం మరియు దాని బోధనల ప్రకారం జీవించడం యొక్క ప్రాముఖ్యతను ఈ వివరణ స్పష్టం చేస్తుంది.

72:1 قُلْ أُوحِيَ إِلَيَّ أَنَّهُ اسْتَمَعَ نَفَرٌ مِّنَ الْجِنِّ فَقَالُوا إِنَّا سَمِعْنَا قُرْآنًا عَجَبًا
(ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం!) వారికి చెప్పు: నాకు దివ్యవాణి (వహీ) ద్వారా ఇలా తెలియజేయబడింది – జిన్నుల సమూహం ఒకటి (ఖుర్ఆన్ ను ) విన్నది. వారు (తమ వాళ్లతో) ఇలా అన్నారు: “మేమొక అద్భుతమైన ఖుర్ఆన్ ను విన్నాము.”

72:2 يَهْدِي إِلَى الرُّشْدِ فَآمَنَّا بِهِ ۖ وَلَن نُّشْرِكَ بِرَبِّنَا أَحَدًا
“అది సన్మార్గం వైపు దర్శకత్వం వహిస్తోంది. అందుకే మేము దానిని విశ్వసించాము. ఇక నుంచి మేము ఎవరినీ – ఎన్నటికీ – మా ప్రభువుకు సహవర్తుల్ని కల్పించము.”

72:3 وَأَنَّهُ تَعَالَىٰ جَدُّ رَبِّنَا مَا اتَّخَذَ صَاحِبَةً وَلَا وَلَدًا
“ఇంకా – మా ప్రభువు మహిమ అత్యున్నతమైనది. ఆయన తన కోసం (ఎవరినీ) భార్యగాగానీ, కొడుకుగాగానీ చేసుకోలేదు.”

72:4 وَأَنَّهُ كَانَ يَقُولُ سَفِيهُنَا عَلَى اللَّهِ شَطَطًا
“ఇంకా – మనలోని మూర్ఖుడు అల్లాహ్ గురించి సత్యవిరుద్ధమైన మాటలు పలికే వాడు.”

72:5 وَأَنَّا ظَنَنَّا أَن لَّن تَقُولَ الْإِنسُ وَالْجِنُّ عَلَى اللَّهِ كَذِبًا
“మనుషులైనా, జిన్నులైనా అల్లాహ్ కు అబద్ధాలు అంటగట్టడం అనేది అసంభవమని మనం అనుకున్నాము.”

72:6 وَأَنَّهُ كَانَ رِجَالٌ مِّنَ الْإِنسِ يَعُوذُونَ بِرِجَالٍ مِّنَ الْجِنِّ فَزَادُوهُمْ رَهَقًا
“అసలు విషయం ఏమిటంటే కొందరు మనుషులు కొందరు జిన్నాతుల శరణు వేడేవారు. ఈ కారణంగా జిన్నాతుల పొగరు మరింత పెరిగిపోయింది.”

72:7 وَأَنَّهُمْ ظَنُّوا كَمَا ظَنَنتُمْ أَن لَّن يَبْعَثَ اللَّهُ أَحَدًا
“అల్లాహ్ ఎవరినీ పంపడని (లేక ఎవరినీ తిరిగి బ్రతికించడని) మీరు తలపోసినట్లుగానే మనుషులు కూడా తలపోశారు.”

ఈరోజు సూరతుల్ జిన్ మనం చదవబోతున్నాము. ఒకవేళ రాసుకుంటున్నారంటే త్వరగా రాసుకోండి.

قُلْ
(కుల్)
(ఓ ప్రవక్తా!) చెప్పు. (72:1)

أُوحِيَ
(ఊహియ)
నాకు వహీ చేయబడినది. (72:1 నుండి)

సర్వసామాన్యంగా వహీని తెలుగులో దివ్యవాణి లేదా దివ్య సందేశం అని అంటారు. దివ్యవాణి, దివ్య సందేశం చేయబడినది, పంపబడినది.

إِلَيَّ
(ఇలయ్య)
నా వైపున.

أَنَّهُ اسْتَمَعَ
(అన్నహుస్తమ’అ)
అదేమనగా, అంటే నాకు వహీ చేయబడిన విషయం ఏమనగా,
ఇస్తమ’అ – విన్నారు.

ఇస్తమ’అ అంటే అరబీలో సమి’అ అని కూడా వస్తుంది. మనం రుకూ నుండి నిలబడినప్పుడు కూడా సమి’అల్లాహు లిమన్ హమిద అంటాము. సమి’అ అంటే కూడా విన్నాడు, ఇస్తమ’అ అంటే కూడా విన్నాడు. కానీ ఇస్తమ’అలో కొంచెం శ్రద్ధగా వినే ఒక మాట ఉంటుంది, భావం ఉంటుంది. అయితే కావాలంటే మీరు రాసుకోవచ్చు, ఇస్తమ’అ – శ్రద్ధగా విన్నారు.

نَفَرٌ
(నఫరున్)
నఫరున్ అంటే చిన్న సమూహం. ఇక్కడ ఎందుకు అంటున్నాము చిన్న సమూహం అని? సర్వసామాన్యంగా అరబీలో మూడు నుండి పది లోపు లెక్క ఏదైతే ఉంటుందో, సంఖ్య ఏదైతే ఉంటుందో, అది ముగ్గురు కావచ్చు, నలుగురు కావచ్చు, ఐదుగురు కావచ్చు పది వరకు, నఫర్ అని అంటారు. చిన్న సమూహం.

مِّنَ الْجِنِّ
(మినల్ జిన్)
జిన్నాతులలో నుండి.

فَقَالُوا
(ఫకాలూ)
వారు అన్నారు. అసలు పదం ఇక్కడ కాలూ, వారు పలికారు, వారు అన్నారు.

إِنَّا
(ఇన్నా)
నిశ్చయంగా మేము

سَمِعْنَا
(సమి’అనా)
విన్నాము. చూశారా, ఇక్కడ వచ్చింది. ఇక్కడ సమి’అనా అని వచ్చింది ఎందుకు? ఎందుకంటే అక్కడ కేవలం తెలియజేస్తున్నారు ఇతరులకు. అయితే ఆ విషయం అనేది సమి’అనా అని వచ్చింది.

قُرْآنًا
(ఖుర్ఆనన్)
ఖుర్ఆన్.

عَجَبًا
(అజబా)
అద్భుతమైన.

يَهْدِي
(యహ్ దీ)
మార్గదర్శకత్వం చేస్తుంది.

إِلَى الرُّشْدِ
(ఇలర్ రుష్ద్)
రుష్ద్ అంటే ఇక్కడ సరైన మార్గం, సరైనది. ఆ, సన్మార్గం అని అంటే కూడా తప్పు కాదు.

فَآمَنَّا بِهِ
(ఫ ఆమన్నా బిహీ)
కనుక మేము విశ్వసించాము దానిని.

وَلَن نُّشْرِكَ
(వలన్ నుష్రిక)
మరియు మేము షిర్క్ చేయము.

بِرَبِّنَا
(బిరబ్బినా)
మా ప్రభువుతో పాటు

أَحَدًا
(అహదన్)
ఏ ఒక్కరిని.

వలన్ నుష్రిక – మేము షిర్క్ చేయము, మేము భాగస్వామి కల్పించము, సహవర్తున్ని నిలబెట్టము.

وَأَنَّهُ تَعَالَىٰ
(వ అన్నహూ త’ఆలా)
త’ఆలా అంటే ఉన్నతమైనది, మహోన్నతమైనది.

جَدُّ
(జద్దు)
ఇక్కడ అల్లాహ్ యొక్క గొప్పతనం, ఔన్నత్యం.

అరబీలో మనం తండ్రి యొక్క తండ్రి, ఆ తాతయ్యను, గ్రాండ్ ఫాదర్ని ఉర్దూలో దాదా అని ఏదైతే అంటారో వారిని కూడా జద్ అనబడుతుంది. ఎందుకంటే ఏ ఫ్యామిలీలో కూడా పెద్దవారు ఎవరైతే ఉంటారో వారికి ఒక పెద్ద గౌరవ స్థానం అనేది కూడా ఉంటుంది, దాని పరంగా జద్ అనబడుతుంది అని అంటారు. ఇక్కడ ఉద్దేశం ఏంటి? మా ప్రభువు ఔన్నత్యం చాలా గొప్పది, ఉన్నతమైనది.

مَا اتَّخَذَ
(మత్తఖద)
చేసుకోలేదు. అంటే అల్లాహు త’ఆలా విషయం చెప్పడం జరుగుతుంది, అల్లాహు త’ఆలా చేసుకోలేదు.

صَاحِبَةً
(సాహిబతన్)
ఎవరిని కూడా భార్యగా. సాహిబతన్ – భార్యగా.

وَلَا وَلَدًا
(వలా వలదా)
కుమారునిగా.

وَأَنَّهُ
(వ అన్నహూ)
మరియు నిశ్చయంగా

كَانَ يَقُولُ سَفِيهُنَا
(కాన యకూలు సఫీహునా)
చెప్పేవారు మాలోని మూర్ఖుడు

సఫీహున్ – సఫీహున్ అంటే మూర్ఖుడు, అవివేకుడు. సఫీహునా – మాలోని మూర్ఖుడు, మాలోని అవివేకుడు.

عَلَى اللَّهِ
(అలల్లాహి)
అల్లాహ్ పై

شَطَطًا
(షతతా)
షతతా అన్నటువంటి ఆ అరబీ పదానికి వాస్తవానికి ఏదైనా ఒక హద్దును దాటడం అని కూడా వస్తుంది. ఆ, ఏదైనా హద్దును దాటడం. అయితే ఇక్కడ భావం ఏంటంటే సత్యానికి విరుద్ధంగా హద్దులు దాటడాన్ని, మీరు రాసుకోండి సత్య విరుద్ధమైన, దారుణమైన.

وَأَنَّا ظَنَنَّا
(వ అన్నా దనన్నా)
మరియు నిశ్చయంగా మేము భావించే వారిమి.

أَن لَّن تَقُولَ
(అన్ లన్ తకూల)
ఈ లన్ అన్నది ఏదైనా విషయం, మాట, పని, లా అని ఏదైతే మనం అంటామో దానికంటే ఎక్కువ ఖచ్చితమైన భావం, నిరాకరణ భావం లన్ అనే పదంలో ఉంటుంది. లన్ తకూలు – ఎన్నటికీ చెప్పరు.

الْإِنسُ وَالْجِنُّ عَلَى اللَّهِ كَذِبًا
(అల్ ఇన్సు వల్ జిన్ అలల్లాహి కదిబా)
అల్ ఇన్సు – మానవులు, వల్ జిన్ – జిన్నాతులు, అలల్లాహి – అల్లాహ్ పై, కదిబా – అబద్ధాలు. అంటే జిన్నాతులను మానవులు ఎన్నటికీ అల్లాహ్ పై ఎలాంటి అబద్ధం చెప్పనే చెప్పరు, ఇలా మేము అనుకునే వారిమి.

وَأَنَّهُ
(వ అన్నహూ)
మరియు నిశ్చయంగా

كَانَ رِجَالٌ
(కాన రిజాలున్)
కాన – ఉండిరి, రిజాలున్ – కొంతమంది.

مِّنَ الْإِنسِ
(మినల్ ఇన్సి)
మానవుల్లో.

يَعُوذُونَ
(య’ఊదూన)
అ’ఊదు అని మనం సూరతుల్ ఫలక్ సూరతున్నాస్ లో చదువుతాము. సర్వసామాన్యంగా ఖుర్ఆన్ ప్రారంభం చేసినప్పుడు అ’ఊదు బిల్లాహి అంటాము. దాని మూలం నుండే వచ్చింది య’ఊదూన. య’ఊదూన అంటే శరణు వేడుకునేవారు.

بِرِجَالٍ مِّنَ الْجِنِّ
(బిరిజాలిమ్ మినల్ జిన్)
జిన్నాతులోని కొంతమందితో.

فَزَادُوهُمْ
(ఫజాదూహుమ్)
జాదూహుమ్ – అధికం చేయుట, అభివృద్ధి, పెంచుట.

رَهَقًا
(రహకా)
రహకా అంటే ఇక్కడ తలబిరుసుతనం వస్తుంది, పొగరు. ఈ రెండు కూడా వస్తాయి, రెండు కూడా రాయండి పర్లేదు.

وَأَنَّهُمْ
(వ అన్నహుమ్)
మరియు వారు

ظَنُّوا
(దన్నూ)
భావించేవారు.

كَمَا ظَنَنتُمْ
(కమా దనన్ తుమ్)
ఎలాగైతే మీరు భావించారో.

أَن لَّن يَبْعَثَ اللَّهُ
(అన్ లన్ యబ్’అసల్లాహు)
أَحَدًا
(అహదా)
అల్లాహ్ – అల్లాహ్, లన్ యబ్’అస్ – తిరిగి బ్రతికించడు, అల్లాహ్ అహదా – ఏ ఒక్కరిని.

యబ్’అస్ అన్నటువంటి ఈ పదంలో రెండు భావాలు వస్తాయి. ఒకటి, పంపడం, ప్రవక్తగా ఎవరినైనా చేసి పంపడం. మరొకటి, చనిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ లేపడం. ఈ రెండు భావాలు ఉంటాయి.

బిస్మిల్లాహ్ అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్.

సూరతుల్ జిన్. ఈ సూరత్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తృప్తిని ఇస్తూ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క గౌరవ మర్యాద, గొప్పతనాన్ని తెలియజేస్తూ. ప్రవక్తకు తృప్తి, శాంతి ఏంటి? ఓ ప్రవక్తా ఈ మానవులు ఎవరైతే చిన్నప్పటి నుండి మిమ్మల్ని మంచిగా చూసుకుంటూ అంటే మిమ్మల్ని మంచిగా గ్రహిస్తూ, మీ యొక్క సద్వర్తనను అర్థం చేసుకుంటూ, మీరు ఎంతో మంచివారు అని తెలిసినప్పటికీ కూడా మీ మాట వినకుండా, మీ బోధనను స్వీకరించకుండా మీరు ఏ ఖుర్ఆన్ తిలావత్ చేసి వినిపిస్తున్నారో దానిని వారు తిరస్కరిస్తూ మీ పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారో దాని గురించి రంది పడకండి. ఈ మానవులు మిమ్మల్ని గ్రహించకుంటే గ్రహించకపోయిరి, కానీ అల్లాహ్ సృష్టిలోని మరొక సృష్టి జిన్నాతులు మిమ్మల్ని విశ్వసించి, మీరు చదివే ఖుర్ఆన్‌ను విని, దాని పట్ల ఎలా ప్రభావితులయ్యారో ఆ పూర్తి సంఘటన మీకు తెలియజేస్తున్నాను, మీరు చూడండి, వినండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తృప్తిని ఇవ్వడం జరుగుతుంది.

మీరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్ర చదివి ఉండేది ఉంటే ఇటు ప్రవక్త వారిపై రెండు సంఘటనలు జరిగి ఉంటాయి కదా. అవిశ్వాసుల దౌర్జన్యాలు ప్రవక్తపై చాలా పెరిగిపోయి ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సుమారు 10, 11 సంవత్సరాల వరకు మక్కా వాసుల మధ్యలో అన్ని విధాలుగా వారికి సత్యాన్ని, ధర్మాన్ని బోధించే ప్రయత్నం చేస్తూ వారు వినడం లేదు, చాలా తక్కువ మంది మాత్రమే ఇస్లాం స్వీకరించారు. ఆ మధ్యలోనే హజ్రత్ అబూ తాలిబ్, హజ్రత్ ఖదీజా రదియల్లాహు త’ఆలా అన్హా వారి యొక్క మరణం తర్వాత మరింత ఎక్కువగా దౌర్జన్య కాండలు పెరిగిపోతాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తాయిఫ్ వెళ్లి అక్కడ వారికి దావత్ ఇస్తారు, కానీ వారు కూడా స్వీకరించకుండా తిరిగి వస్తున్నప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చాలా బాధ పెడతారు, శారీరకంగా చాలా నష్టం చేకూరుస్తారు. ఇలా ఇన్ని రకాల బాధలు ఉన్న సందర్భంలోనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తిరిగి వస్తుండగా నఖ్లా అనే ప్రాంతంలో ఉండగా ఈ సంఘటన సంభవిస్తుంది. ఏంటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఫజర్ నమాజ్‌లో ఖుర్ఆన్ యొక్క తిలావత్ చేస్తూ ఉంటారు, జిన్నాతులు వచ్చి విని వెళ్లి తమ జాతి వారికి ఈ ఖుర్ఆన్ గురించి బోధ చేస్తాయి. అయితే దీనికి సంబంధించిన కొన్ని హదీసుల భావం మనం తెలుసుకుందాము. సహీహ్ ముస్లిం గ్రంథంలోని హదీసులు, ఒకవేళ హదీస్ నెంబర్ మీరు ఇంగ్లీష్, అరబీ పుస్తకాల్లో వెతకాలంటే తెలుసుకోవాలంటే 449 హదీస్ నెంబర్ నుండి ఆ తర్వాత కొన్ని హదీసులు.

సారాంశం ఏమిటంటే నేను ఒక రెండు హదీసుల సారాంశం చెబుతున్నాను. మొదటి హదీస్ హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించారు. హజ్రత్ మ’అన్ బిన్ యజీద్, మస్రూఖ్, తాబియీ హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రదియల్లాహు అన్హు వారి యొక్క శిష్యులు మస్రూఖ్. మస్రూఖ్ని మ’అన్ యొక్క తండ్రి యజీద్ అడుగుతున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఫజర్ నమాజ్‌లో ఖుర్ఆన్ తిలావత్ చేస్తున్నప్పుడు జిన్నాతులు వచ్చి విన్నాయి అన్న సంఘటన ప్రవక్తకు ఎవరు తెలియజేశారు? అయితే మస్రూఖ్ చెప్పారు నేను మీ తండ్రి అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ తో విన్నాను. అక్కడ ఒక చెట్టు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలియజేసింది, కొందరు జిన్నాతులు మీ యొక్క తిలావత్‌ను వింటున్నారు అని. ప్రత్యేకంగా ఈ హదీస్‌ను ఎందుకు ప్రస్తావించాను అంటే అల్హందులిల్లాహ్ వాస్తవానికి మనందరికీ కూడా ఇందులో ప్రత్యేకంగా ఎవరైతే దావా పని చేస్తూ ఉంటారో ఇతరులకు బోధ చేస్తూ ఉంటారో వారు ఎన్ని సమస్యలు ఎదురైనా ఎంత ఇబ్బంది కలిగినా ప్రజల నుండి వారికి ఎలాంటి ఆపద కలిగినా అల్లాహ్ కొరకు ఓపిక సహనాలు వహిస్తూ ఉండేది ఉంటే అల్లాహు త’ఆలా వారికి తృప్తినిచ్చే కొన్ని సందర్భాలు కూడా కనబరుస్తాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎలాంటి స్థితిలో ఉన్నారు అక్కడ జిన్నాతులు వచ్చి వినడం, జిన్నాతులు వచ్చి వింటున్న విషయం ప్రవక్తకు తెలియదు. అల్లాహ్ తర్వాత వహీ ద్వారా తెలిపాడు కరెక్టే కానీ అక్కడ చెట్టు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఈ విషయం తెలియజేసింది. అంటే ఆ చెట్టు కూడా అల్లాహ్ యొక్క అనుమతితోనే ప్రవక్తకు తెలియజేస్తుంది. ఇందులో ప్రవక్త వారి ము’అజిజా (మహిమ) కూడా ఉంది, మరియు కేవలం మానవులే కాదు, అల్లాహు త’ఆలా తన యొక్క దాసునికి సహాయం చేయాలి, అతడు అల్లాహ్ కొరకు ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పుడు అతనికి తృప్తిని ఇవ్వాలి అని అల్లాహ్ కోరినప్పుడు ఏ మార్గం నుండైనా గానీ, చెట్టు నుండి అయినా గానీ ఎలాంటి సహాయం అందిస్తాడు, ఎలాంటి తృప్తిని కలుగజేస్తాడు మనకు ఇందులో బోధపడుతుంది.

మరొక విషయం ఇక్కడ మనం గమనించాల్సింది అది నేను ఇంతకుముందు చెప్పిన 449 హదీస్ నెంబర్‌లో కూడా కనబడుతుంది. అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రదియల్లాహు త’ఆలా అన్హు వింటున్నారు, ఉల్లేఖిస్తున్నారు. మరియు దీని తర్వాత హదీస్ నెంబర్ 450లో ఉంది హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖిస్తున్నారు.

ఆ హదీస్‌ల యొక్క సారాంశం ఏమిటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖుర్ఆన్ తిలావత్ చేస్తున్నప్పుడు జిన్నాతులు వచ్చి ఖుర్ఆన్‌ను శ్రద్ధగా విన్నారు మరియు విన్న తర్వాత వారి యొక్క మాట, వారు ఎలా ప్రభావితమయ్యారో ఖుర్ఆన్ ద్వారా దాన్ని ఎలా చెబుతున్నారో ఇక రండి మనం ఖుర్ఆన్ ఆయతుల ద్వారానే తెలుసుకుందాము.

ఇక్కడ ఈ సందర్భంలో మనం మరొక విషయం తెలుసుకోవడం చాలా లాభదాయకంగా ఉంటుంది. ప్రస్తుతం మీరు చదువుతున్నారు సూరత్ అల్-జిన్. కానీ ఈ జిన్నాతుల యొక్క సంఘటన సూరతుల్ అహ్కాఫ్, సూర నెంబర్ 46, ఆయత్ నెంబర్ 29 నుండి సుమారు చివరి వరకు అక్కడ కూడా అల్లాహు త’ఆలా ఈ విషయాన్ని ప్రస్తావించాడు.

ఇక వినండి ఒక్కసారి మీరు శ్రద్ధగా ఆయతుల యొక్క భావాన్ని, అందులో మనకు ఉన్నటువంటి గుణపాఠాలను. అల్లాహ్ ఇక్కడ చెప్తున్నాడు, కుల్ – చెప్పు. ఊహియ ఇలయ్య – నాకు వహీ చేయడం జరిగినది. ఇక్కడే కొంచెం ఆగి మనం ఒక విషయం తెలుసుకోవాలి. అది ఏమిటంటే మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇల్మె గైబ్ (అగోచర జ్ఞానం) లేదు అన్న విషయం ఇక్కడ ఈ ఆయత్ మరియు ఈ ఆయత్‌లో దీని వ్యాఖ్యానంలో వచ్చిన హదీసుల ద్వారా కూడా తెలుస్తుంది. ఎలా అంటే జిన్నాతులు వచ్చి విన్నారు కానీ ప్రవక్తకు ఆ విషయం తెలియదు. వహీ ద్వారా తెలపడం జరిగినది. అయితే ప్రవక్త ఆలిముల్ గైబ్ కారు, అగోచర జ్ఞానం కలిగిన వారు కారు అన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. సరే.

ఇస్తమ’అ నఫరుమ్ మినల్ జిన్ – జిన్నాతులోని కొంతమంది విన్నారు. ఏం విన్నారు? ఈ ఖుర్ఆన్‌ని విన్నారు. అయితే ఈ ఖుర్ఆన్‌ను కొంతమంది జిన్నాతులు కూడా శ్రద్ధగా వింటున్నప్పుడు ఓ మక్కా యొక్క అవిశ్వాసుల్లారా! ఇప్పుడు ఉన్నటువంటి ఓ ముస్లింలారా! మీరు ఈ ఖుర్ఆన్‌ను ఎందుకు శ్రద్ధగా చదవడం లేదు? ఎందుకు శ్రద్ధగా వినడం లేదు? ఎందుకు శ్రద్ధగా అర్థం చేసుకోవడం లేదు? మీరు అష్రఫుల్ మఖ్లూకాత్, సర్వ సృష్టిలో అత్యున్నత, అత్యుత్తమ సృష్టి మీరు. మీరు ఈ ఖుర్ఆన్‌ను మంచిగా అర్థం చేసుకోవడం, వినడం మీపై ఎక్కువ బాధ్యత ఉన్నది. ఈ బోధ మనందరికీ ఉంది, ఖుర్ఆన్ వినని వారి కొరకు ప్రత్యేకంగా ఉంది. ఎందుకంటే జిన్నాతుల కంటే కూడా ఎక్కువ ఘనత గల వారు మానవులు మరియు మానవుల కొరకే ప్రత్యేకంగా ఆ తర్వాత జిన్నాతుల కొరకు కూడా ఈ ఖుర్ఆన్ అవతరింప చేయడం జరిగినది. అలాంటి ఈ ఖుర్ఆన్‌ను మానవులు వినకుంటే ఇది చాలా శోచనీయం, బాధాకరమైన విషయం.

ఆ జిన్నాతులు విన్నారు ఆ తర్వాత ఏమన్నారు?

إِنَّا سَمِعْنَا قُرْآنًا عَجَبًا
(ఇన్నా సమి’అనా ఖుర్ఆనన్ అజబా)
మేమొక అద్భుతమైన ఖుర్ఆన్ ను విన్నాము. (72:1)

అల్లాహు అక్బర్. కానీ ఒక్కసారి తిరిగి రండి వెనక్కి మళ్ళీ మీరు. సూరతుల్ అహ్కాఫ్‌లో చూడండి ఆయత్ నెంబర్ 29లో యస్తమి’ఊనల్ ఖుర్ఆన్. ఆ జిన్నాతులు ఖుర్ఆన్‌ను శ్రద్ధగా వింటూ,

فَلَمَّا حَضَرُوهُ قَالُوا أَنصِتُوا
(ఫలమ్మా హదరూహు కాలూ అన్సితూ)
ప్రవక్త వద్దకు హాజరై శ్రద్ధగా వింటూ, ఖుర్ఆన్ వింటున్నప్పుడు పరస్పరం ఒకరికి ఒకరు మీరు మౌనం వహించండి, ఖుర్ఆన్‌ను ఇంకా శ్రద్ధగా వినండి అని ఒకరికి ఒకరు చెప్పుకున్నారు. (46:29 నుండి)

అల్లాహు అక్బర్. ఇక్కడ కూడా వచ్చింది ఇస్తమఅ నఫరుమ్ మినల్ జిన్ అని. కానీ అక్కడ సూరత్ అహ్కాఫ్ లో అన్సితు మీరు మౌనం వహించండి. మరియు సూరత్ ఆలే సూరతుల్ ఆరాఫ్ యొక్క చివర్లో మీరు చూస్తే వఇదా కురిఅల్ ఖుర్ఆను ఫస్తమిఊ లహు వ అన్సితు. ఫస్తమిఊ లహు వ అన్సితు. శ్రద్ధగా వినడం. అంటే మనసు పెట్టడం, మనసు దానికి లగ్నం చేయడం, వ అన్సితు ఎలాంటి వేరే డిస్టర్బెన్స్ లేకుండా వినడానికి ప్రయత్నం చేయడం, మౌనం వహించడం. ఈ విధంగా కూడా వారు పరస్పరం ఒకరికి ఒకరు చెప్పుకున్నారు.

అయితే ఇక్కడ ఏముంది మళ్ళీ ఫలమ్మా కుదియ సూరతుల్ అహ్కాఫ్ లో ఎప్పుడైతే ఖురాన్ తిలావత్ పూర్తి అయిపోయిందో వల్లౌ ఇలా కౌమిహిమ్ ఆ విన్న జిన్నాతులు తమ జాతి వారి వైపునకు వెళ్ళిపోయారు ముందిరీన్ వారిని హెచ్చరిస్తూ.

అల్లాహు అక్బర్. చూశారా? ఒక సత్యం తెలిసింది అంటే దాన్ని ఇతరులకు తెలపడం, షిర్క్ యొక్క చెడుతనం తెలిసింది అంటే దాని గురించి హెచ్చరించడం మన బాధ్యత అని వారు వెంటనే తిరిగిపోయారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద ఆగి ప్రవక్తను కలుసుకోలేదు. వెంటనే వెళ్లి జాతి వారు ఏ చెడులో ఉన్నారో, ఏ షిర్క్ చేస్తున్నారో వారిని ఆ షిర్క్ నుండి కాపాడటానికి వెళ్ళిపోయారు.

ఇక్కడ ధర్మవేత్తలు ఏం చెప్తున్నారంటే జిన్నాతులు అల్లాహ్ యొక్క సృష్టి వారు మనకు కనబడకపోయినప్పటికీ వారిలో స్త్రీలు, పురుషులు అందరూ ఉన్నారు, వారికి కూడా సంతానం కలుగుతుంది, వారిలో కూడా పెళ్లిళ్లు ఉన్నాయి మరియు మానవుల్లో ఎలాగైతే వర్గాలు ఉన్నాయో ధర్మపరంగా ఇంకా వేరే రీతిలో జిన్నుల్లో కూడా యూదులు, క్రైస్తవులు, ఇంకా వేరే రకమైన షిర్క్ చేసే వారు, మంచి వారు, పాపం చేసే వారు ఈ విధంగా రకరకాలుగా ఉన్నారు.

ఎందుకంటే సూరతుల్ అహ్కాఫ్ లోని ఆయత్ నంబర్ 30 ద్వారా చెబుతున్నారు కొందరు ధర్మవేత్తలు. ఏముంది అక్కడ? వారు వెళ్లి తమ జాతి వారికి చెప్పారు యా కౌమనా ఓ ప్రజలారా ఇన్నా సమీఅనా కితాబన్ నిశ్చయంగా మేము ఒక గ్రంథం గురించి విన్నాము ఉంజిల మింబ అది మూసా అది మూసా తర్వాత అవతరింప చేయబడినది. ముసద్దికం లిమాబైన యదైహ్ అంటే ఈ ఖురాన్ కు ముందు అవతరించిన గ్రంథాలను ధృవీకరిస్తుంది. యహదీ ఇలల్ హక్ సత్యం వైపునకు మార్గదర్శకత్వం చేస్తుంది. వఇలా తరీకిమ్ ముస్తకీమ్ మరియు సన్మార్గం వైపునకు. చూశారా వారు సత్యాన్ని విన్న వెంటనే వెళ్లి తమ జాతి వారికి తెలుపుతూ ఇది మూసా తర్వాత అవతరించినటువంటి గ్రంథం అని ఈ ఆయత్ ద్వారా చెప్తున్నారు ధర్మవేత్తలు వారు యూదులుగా ఉండినారు. ఆ జిన్నాతులు ఎవరైతే విన్నారో. ఎందుకంటే యూదులు ఈసా అలైహిస్సలాం ను విశ్వసించరు గనక ఈసా అలైహిస్సలాం ప్రస్తావన ఇక్కడ రాలేదు అంటారు.

మనకు ఇందులో బోధన ఏంటి? ఆ జిన్నాతుల కంటే మేలు, మంచివారము మనం. మనం ఈ ఖుర్ఆన్ పట్ల వారి కంటే ఎక్కువ శ్రద్ధ చూపాలి.

సూరతుల్ జిన్‌లో అజబన్ అని ఏదైతే చూస్తున్నారో దాని యొక్క భావం ఏంటి? అజబన్ అంటే చాలా అద్భుతమైనది. ఏ రకంగా అద్భుతమైనది? ఖుర్ఆన్ దాని యొక్క అరబీ శైలి, అరబీ సాహిత్య ప్రకారంగా చాలా అద్భుతమైనది. మరియు అందులో ఉన్నటువంటి బోధనల ప్రకారంగా చూసుకుంటే కూడా చాలా అద్భుతమైనది. అలాగే ఈ ఖుర్ఆన్ ఇతరులపై ఏ ప్రభావం చూపిస్తుందో దాని ప్రకారంగా కూడా ఇది చాలా అద్భుతమైనది. ఇది చాలా అద్భుతమైన గ్రంథం.

يَهْدِي إِلَى الرُّشْدِ
(యహదీ ఇలర్ రుష్ద్)
మార్గదర్శకత్వం చేస్తుంది రుష్ద్ – సరియైన మార్గం, సన్మార్గం వైపునకు.

فَآمَنَّا بِهِ
(ఫ ఆమన్నా బిహీ)
మేము దానిని విశ్వసించాము. (72:2)

అంటే ఖుర్ఆన్ గ్రంథాన్ని విశ్వసించాము. ఇక్కడ చూడండి ఇక ఎంత తొందరగా వారు విశ్వాస మార్గాన్ని అవలంబించారు. సత్యాన్ని విన్నారు అంటే ఏ ఆలస్యం వారు చేయలేదు. అయితే ఇక్కడ ఏంటి ప్రత్యేకంగా మక్కా అవిశ్వాసులకు ఇందులో ఒక రకమైన కొరడాలు ఉన్నాయి. ఖుర్ఆన్ ప్రవక్త వారు తిలావత్ చేస్తూ ఉంటే వారు పరస్పరం ఏమనుకుంటారు? లా తస్మ’ఊ లిహాదల్ ఖుర్ఆన్. సూరత్ హామీమ్ సజ్దాలో ఉంది చూడండి. మీరు ఖుర్ఆన్‌ను వినకండి, వల్గౌ ఫీహి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖుర్ఆన్ తిలావత్ చేస్తుంటే మీరు అల్లరి చేయండి అని వారు ఒకరికొకరు చెప్పుకుంటారు. కానీ ఇక్కడ జిన్నాతులు చూడండి అన్సితూ శ్రద్ధగా వినండి, మౌనం వహించండి అని ఒకరికి ఒకరు చెప్పుకుంటున్నారు. మరియు ఈ జిన్నాతులు విన్న వెంటనే విశ్వసించారు. మరియు ఈ మానవులు సంవత్సరాల తరబడి ఖుర్ఆన్‌ను వింటూనే ఉన్నారు, వింటూనే ఉన్నారు కానీ అది వారి యొక్క మదిలో దిగడం లేదు, దాన్ని వారు ఇంకా విశ్వసించడం లేదు.

ఆ తర్వాత ఉంది,

وَلَن نُّشْرِكَ بِرَبِّنَا أَحَدًا
(వలన్ నుష్రిక బిరబ్బినా అహదా)
మరియు మేము మా ప్రభువుకు ఎవ్వరినీ కూడా భాగస్వామిగా, సాటిగా కల్పించము. (72:2)

షిర్క్ యొక్క ఖండన ఇందులో చాలా స్పష్టంగా ఉంది. వారికి కూడా అర్థమైపోయింది షిర్క్ ఎంత చెడ్డ పని అని. అందుకొరకే ఇక మేము ఎన్నటికీ అల్లాహ్‌తో పాటు ఎవరినీ సాటిగా కల్పించము, ఎవరినీ కూడా భాగస్వామిగా చేయము. మరియు అల్లాహు త’ఆలాకు ఎలాంటి భార్య గానీ, సంతానం గానీ లేదు, అలాంటి అవసరం అల్లాహ్‌కు ఏ మాత్రం లేదు అని దాని తర్వాత ఆయతులో చెప్పడం జరుగుతుంది. అందుకొరకే ఉంది,

وَأَنَّهُ تَعَالَىٰ جَدُّ رَبِّنَا
(వ అన్నహూ త’ఆలా జద్దు రబ్బినా)
మరియు నిశ్చయంగా మా ప్రభువు వైభవం ఎంతో ఉన్నతమైనది. మా ప్రభువు చాలా గొప్పవాడు.

مَا اتَّخَذَ صَاحِبَةً وَلَا وَلَدًا
(మత్తఖద సాహిబతన్ వలా వలదా)
ఆయన ఎవరినీ కూడా భార్యగా మరియు కుమారునిగా చేసుకోలేదు. (72:3)

ఈ విషయం మనందరికీ కూడా చాలా స్పష్టమైనది. ముష్రికులు దైవదూతలను అల్లాహ్ యొక్క కుమార్తెలు అనేవారు. క్రైస్తవులు ఈసా అలైహిస్సలాంను అల్లాహ్ కుమారుడుగా, యూదులు ఉజైర్ అలైహిస్సలాంని అల్లాహ్ కుమారుడుగా అంటున్నారు. కానీ వాస్తవానికి ఎవరూ కూడా అల్లాహ్ యొక్క భార్య కారు, అల్లాహ్ యొక్క సంతానం కారు.

వాస్తవానికి అల్లాహ్‌కు భాగస్వామి ఎవరూ లేరు, అల్లాహ్‌తో పాటు ఎవరిని షిర్క్ చేయకూడదు మరియు అల్లాహ్‌కు సంతానం, భార్య ఉంది అని నమ్మకూడదు, ఇవన్నీ కూడా తప్పు మాట. కానీ మాలోని కొందరు అవివేకులు, మాలోని కొందరు మూర్ఖులు ఇలాంటి దారుణమైన మాటలు, సత్యానికి విరుద్ధమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఈ ఆయత్ ద్వారా చాలా స్పష్టంగా తెలిసిపోతుంది అల్లాహ్‌కు సంతానం ఉంది అని నమ్మడం, అల్లాహ్‌కు భార్య ఉంది అని నమ్మడం, అల్లాహ్‌కు భాగస్వాములు ఉన్నారు అని నమ్మడం, లేదా అలా నమ్మకపోయినా అల్లాహ్‌కు సంతానం ఉంది, భార్య ఉంది మరియు అల్లాహ్‌కు భాగస్వాములు ఉన్నారు అని నమ్మే వారికి శుభాకాంక్షలు తెలియజేయడం, అలా నమ్మే వారికి ఏదైనా తోడ్పాటు ఇవ్వడం, వారు అలాంటి తప్పుడు విశ్వాసాలతో, షిర్క్ యొక్క నమ్మకాలతో ఏమైనా పండుగలు చేసుకుంటే అందులో వారికి తోడుగా ఉండి వాటిలో పాల్గొనడం, ఇవన్నీ కూడా వాస్తవానికి మూర్ఖత్వం, అవివేకం. ఇవన్నీ కూడా సత్యానికి విరుద్ధమైన మాటలు. 25 డిసెంబర్ క్రిస్మస్ నుండి మొదలుకొని ఫస్ట్ జనవరి వరకు ఏదైతే ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏ రకమైన తప్పుడు పనుల్లో పడి ఉంటారో ఈ ఆయతుల ద్వారా కూడా మనం ఖండించవచ్చు వారికి దీని యొక్క సత్యం తెలియజేయవచ్చును.

ఆయత్ నెంబర్ ఐదును గమనించండి మీరు, చూడండి ఇక్కడ ఆ జిన్నాతులు ఒక సత్యం తెలిసిన తర్వాత వారు తమకు తాము సత్యాన్ని అవలంబించి అంతకు ముందు జ్ఞానం లేక ముందు ఏ తప్పు జరిగిందో దాని గురించి అల్లాహ్ ముందు ఎలా ఒక సాకు తెలుపుకుంటున్నారో, తమ నుండి జరిగిన తప్పును ఒప్పుకుంటూ దానిపై పశ్చాత్తాప పడుతున్నారో ఆ విషయం ఇక్కడ చెప్పడం జరిగినది. ఏంటది? మేము ఇంతకు ముందు అనుకునేవాళ్ళము మానవులు, జిన్నాతులు అల్లాహ్ పై ఎలాంటి అబద్ధం, అసత్యం చెప్పరు అని. కానీ ఇప్పుడు ఈ ఖుర్ఆన్ విన్న తర్వాత మాకు తెలిసింది, ఎంతో మంది ప్రజలు అల్లాహ్‌కు సంతానం కలుగజేస్తున్నారు. ఎంతో మంది జిన్నాతులు కూడా అల్లాహ్‌కు సంతానం ఉంది అన్నట్లుగా, అల్లాహ్‌తో పాటు ఇతరులను భాగస్వాములుగా చేసి షిర్క్ చేస్తున్నారు, ఇవన్నీ తప్పులు వారు చేస్తున్నారు, వాస్తవానికి వారు అది చేస్తున్నది తప్పు అని మాకు కూడా తెలియలేదు, మేము కూడా అజ్ఞానంలో ఉండి, అంధకారంలో ఉండి ఒక తప్పుడు విషయాన్ని విశ్వసిస్తూ వచ్చాము.

అనేక తఫ్సీర్ గ్రంథాల్లో, అరబీ తఫ్సీర్ గ్రంథాల్లో ఈ విషయం చాలా స్పష్టంగా వచ్చి ఉంది. వారి యొక్క నాయకుడైన ఇబ్లీస్ అతడు కేవలం మానవులనే కాదు, ఎంతో మంది జిన్నాతులను కూడా మోసంలో పడవేసి ఉండినాడు. ఎన్నో రకాల కుఫ్రులో వారిని పడవేసి ఉండినాడు వాడు. అందుకొరకే సామాన్య జిన్నులు వారితో ఏ పొరపాటు జరిగిందో మా పెద్దలు మా వారు ఎప్పుడూ కూడా అల్లాహ్ పై ఏదైనా అబద్ధం చెప్పే అటువంటి ధైర్యం చేస్తారు అని మేము అనుకోలేదు. వారు చెప్పే మాటలు సత్యమే అని వారిని మేము గుడ్డిగా అనుసరించాము. కానీ ఇప్పుడు తెలిసింది మాకు వారు కూడా షిర్క్ చేస్తున్నారు మరియు వారు కూడా అల్లాహ్‌కు సంతానం కలుగజేస్తున్నారు. అలాంటి విషయాలన్నిటికీ కూడా మేము దూరంగా ఉంటాము అన్నట్లుగా చాలా స్పష్టంగా వారు తెలియజేశారు.

ఆయత్ నెంబర్ ఆరులో ఉంది. దీనిని కొంచెం శ్రద్ధ వహించాలి. తౌహీద్‌కు సంబంధించిన ఒక చాలా ముఖ్యమైన మాట ఇక్కడ తెలపడం జరుగుతుంది. ఈ ఆయత్ నెంబర్ ఆరును మనం అర్థం చేసుకుంటే ఈ రోజుల్లో షైతానుల పట్ల, జిన్నాతుల పట్ల ఏదైతే భయం ఉంటుందో చాలా మందికి అది కూడా ఇన్ షా అల్లాహ్ దూరం కావచ్చు. ముందు ఒకసారి అనువాదాన్ని గ్రహించండి.

وَأَنَّهُ كَانَ رِجَالٌ مِّنَ الْإِنسِ يَعُوذُونَ بِرِجَالٍ مِّنَ الْجِنِّ فَزَادُوهُمْ رَهَقًا
(వ అన్నహూ కాన రిజాలుమ్ మినల్ ఇన్సి య’ఊదూన బిరిజాలిమ్ మినల్ జిన్ని ఫజాదూహుమ్ రహకా)

కాన రిజాలుమ్ మినల్ ఇన్సి – మానవుల్లోని కొందరు పురుషులు, మానవుల్లోని కొంతమంది య’ఊదూన – శరణు కోరేవారు, శరణు వేడుకునేవారు. ఎవరితోని? బిరిజాలిమ్ మినల్ జిన్ – జిన్నాతులోని కొందరి పురుషులతో, జిన్నాతులోని కొంతమందితో. ఏంటి ఈ సంఘటన ఇది? దేని గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది?

ధర్మవేత్తలు అంటారు, చాలా కాలం ముందు జిన్నాతులు మనుషులతో భయపడేవారు. కానీ ఈ మనుషులు ప్రయాణాలు చేస్తూ ప్రయాణ దారిలో ఎక్కడైనా వారికి రాత్రి అయింది అంటే ఎక్కడ వారు రాత్రి ఆగిపోయేవారో, రాత్రి పడుకొని ఇక మళ్ళీ పొద్దున్న మనం ప్రయాణం కొనసాగిద్దాము అని ఏదైనా ఒక చోట ఆగిన తర్వాత వారి యొక్క అల్లాహ్ పై నమ్మకం, విశ్వాసం ఎంత బలహీనమైపోయిందంటే అప్పటివరకు, ఆ రాత్రి ఏదైనా చోట ఆగిన వెంటనే ఈ ప్రాంతంలో ఏ జిన్నాతులైతే ఉన్నారో ఆ జిన్నాతులు, ఆ జిన్నాతుల నాయకుల యొక్క మేము శరణు కోరుతున్నాము, మేము రాత్రి ఇక్కడ ఆగుతున్నాము, బస చేస్తున్నాము, మాకు మీరు ఎలాంటి బాధ, హాని కలిగించవద్దు, మాకు ఎలాంటి నష్టం చేకూర్చవద్దు. ఈ విధంగా కేకలు వేసి జిన్నాతుల యొక్క సహాయం, జిన్నాతుల యొక్క శరణు కోరుతూ జిన్నాతులతో భయపడుతూ ఏమీ మీరు మాకు నష్టం చేకూర్చవద్దని విన్నవించుకోవడం, అర్ధించడం, ప్రాధేయపడటం ఇలా చేసేవారు. వేడుకునేవారు.

ఫజాదూహుమ్ రహకా – మానవులు ఇలా చేయడం ద్వారా ఈ విధంగా ఈ మానవులు వారి, హుమ్ – వారి అంటే జిన్నాతుల తలబిరుసుతనం మరింత అధికం చేశారు. అరే మానవులు కూడా మాతో భయపడుతున్నారు అంటే మమ్మల్ని ఇంత పెద్దగా వారు అనుకుంటున్నారు, భావిస్తున్నారు అని మానవులపై తమ యొక్క ఆధిపత్యం, తమ యొక్క పెత్తనం చలాయించడంలో, నడిపించడంలో, మానవులను భయపెట్టడంలో మరింత అధికమైపోయి తమకు తాము ఒక రకమైన గర్వంలో వచ్చేసారు.

ఈ ఫజాదూహుమ్ రహకా అని ఇప్పుడు మీరు చూస్తున్న ప్రకారంగా అనువాదంలో మానవులు, హుమ్ అంటే జిన్నాతులు. కానీ దీనికి విరుద్ధంగా కూడా అనువాదం చేయడం జరిగింది. అంటే ఏమిటి? ఈ మానవుల్లోని కొంతమంది జిన్నాతుల శరణు వేడుకోవడం ద్వారా ఆ జిన్నాతులు మానవుల యొక్క తలబిరుసుతనం, మానవులను సత్యం నుండి దూరం చేయడాన్ని మరింత పెంచేశాయి. అని ఎప్పుడైతే వారు అంటే మానవులు జిన్నాతులను వేడుకోవడం మొదలు పెట్టారో ఆ జిన్నాతులు దీనిని ఆసరగా తీసుకొని ఈ మానవుల్ని మరింత అల్లాహ్ కు దూరం చేయడం, మరింత సత్యం నుండి దూరం చేయడం, మరింత సత్యాన్ని తిరస్కరించడంలో బలంగా ఉండటం, ఇలాంటి తప్పుడు విషయం అన్నది పెంచేశాయి. అందుకొరకే ఈ రెండు భావాలు కూడా కరెక్టే. చెప్పే ఉద్దేశం ఏమిటి? ఎప్పుడూ కూడా మనం అల్లాహ్ వైపు నుండి వచ్చిన సత్యం ఏమిటో దాన్ని గ్రహించామంటే ఎలాంటి ఇబ్బందిలో ఉండము.

ఇక్కడ మరో విషయం తెలుస్తుంది మనకు, అల్లాహ్ ను ఏదైనా ఆపదలో, కష్టంలో, భయంలో మనం శరణు వేడుకోవడం అల్లాహ్ యొక్క ఆరాధన రకాల్లో చాలా గొప్ప రకం. ఇలా అల్లాహ్ యొక్క ఆరాధన రకాల్లో ఈ గొప్ప రకాన్ని అల్లాహ్ తప్ప వేరే ఎవరికైనా మనం అంకితం చేసామంటే ఘోరమైన షిర్క్ చేసిన వాళ్ళం అవుతాము. అందుకొరకే మనం ఏమంటాము? అ’ఊదు బిల్లాహి మినష్షైతానిర్రజీమ్. కుల్ అ’ఊదు బిరబ్బిల్ ఫలక్. కుల్ అ’ఊదు బిరబ్బిన్నాస్. ఈ సూరాలన్నిటిలో కూడా మనకు ఈ ఇస్తి’ఆదా, శరణు కోరడం ఇది అల్లాహ్ యొక్క ఇబాదత్ రకాల్లో ఒక ముఖ్యమైనది, ఇందులో మనం అల్లాహ్ కు ఎవరిని కూడా సాటి కల్పించకూడదు అన్నటువంటి భావం స్పష్టంగా ఉంది.

మరొక విషయం ఇందులో మనం గ్రహించాల్సింది, ఎంత షైతానులకు, జిన్నాతులకు ప్రజలు భయపడతారో అంతే అల్లాహ్ నుండి ఇంకా దూరమైపోతారు. ఇంకా షైతానులు వారిని మరింత ఆసరగా తీసుకొని బెదిరిస్తూనే ఉంటారు. అలా కాకుండా అల్లాహ్ ను మొరపెట్టుకొని ఏ భయం కలిగినా అల్లాహ్ శరణు తీసుకొని అల్లాహ్ పై విశ్వాసం బలంగా ఉంచుకుంటే మనకు షైతానుల నుండి ఏ హాని కలగదు, ఎలాంటి నష్టం అనేది జరగదు. అందుకొరకే చూడండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు నేర్పిన దుఆలలో కూడా ఎన్నో సందర్భాల్లో ఏ ఏ మనకు బాధలు, రంది, చింత, బెంగ ఇంకా ఏదైనా ఆపద, కష్టం వాటన్నిటి నుండి కేవలం అల్లాహ్ యొక్క శరణ మాత్రమే మనం కోరుతూ ఉండాలి అని నేర్పడం జరిగినది. ఉదయం సాయంకాలం చదివే దుఆలలో కూడా ఈ విషయాలు మనకు కనబడతాయి. అల్లాహుమ్మ ఇన్నీ అ’ఊదు బిక మిన్ షర్రి నఫ్సీ వ షర్రిష్షైతాని వ షిర్కిహీ. అల్లాహ్ యొక్క శరణ కోరడం జరుగుతుంది. అల్లాహుమ్మ ఇన్నీ అ’ఊదు బిక మినల్ కుఫ్రి వల్ ఫఖ్రి వ అ’ఊదు బిక మిన్ అదాబిల్ ఖబ్ర్. ఈ విధంగా అల్లాహ్ యొక్క శరణ కోరడం జరుగుతుంది. అల్లాహ్ యొక్క శరణ కోరడం ఇది అసలైన విషయం. ఎంతవరకు మానవులు షైతానులతో భయపడతారో ఆ షైతానులు మరింత మానవుల్ని హిదాయత్ నుండి దూరమే చేస్తారు.

ఆ తర్వాత ఆయతును గనక మనం గమనిస్తే,

وَأَنَّهُمْ ظَنُّوا كَمَا ظَنَنتُمْ أَن لَّن يَبْعَثَ اللَّهُ أَحَدًا
(వ అన్నహుమ్ దన్నూ కమా దనన్ తుమ్ అన్ లన్ యబ్’అసల్లాహు అహదా)
“అల్లాహ్ ఎవరినీ పంపడని (లేక ఎవరినీ తిరిగి బ్రతికించడని) మీరు తలపోసినట్లుగానే మనుషులు కూడా తలపోశారు.” (72:7)

ఆ ఖుర్ఆన్ విన్నటువంటి జిన్నాతులు వెళ్లి వారి జాతి వారికి తెలియజేస్తున్నారు కదా? అయితే ఏమంటున్నారు? మీరు ఎలాగైతే అల్లాహ్ ఏ ప్రవక్తను పంపడు, చనిపోయిన వారిని తిరిగి లేపడు అని మీరు అనుకునేవారో మానవుల్లో కూడా ఎంతో మంది ఇలాంటి తప్పుడు విశ్వాసంలోనే ఉన్నారు.

ఒకటి నుండి ఏడు వరకు ఈ ఆయతులను గనక మీరు గమనిస్తే చాలా స్పష్టంగా మీకు తౌహీద్, రిసాలత్, ఆఖిరత్ మూడు గురించి తెలుస్తుంది. అందుకొరకే అల్లాహ్ యొక్క గ్రంథం ఖుర్ఆన్‌ను చాలా శ్రద్ధగా చదువుతూ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మనకు ఇందులో అనేక బోధనలు కలుగుతాయి. జిన్నాతుల లాంటి వారు, మనకంటే తక్కువ స్థానంలో ఉన్నవారు అర్థం చేసుకొని తమ జాతి వారికి హెచ్చరించగలిగితే మనం అంతకంటే ఎక్కువ విలువ గలవాళ్ళము, ఘనత గలవాళ్ళము. తప్పకుండా మనం అల్లాహ్ యొక్క దయతో ఈ ఖుర్ఆన్‌ను అర్థం చేసుకున్నామంటే మన జాతి వారికి కూడా మంచి రీతిలో మనం బోధ చేయగలుగుతాము.

ఇక ఈ అన్ లన్ యబ్’అసల్లాహు అహదా, బ’అస్ కొన్ని సందర్భాల్లో ఆ ఎవరినైనా ప్రవక్తగా చేసి పంపడం అనే విషయంలో అలాగే ఇంకా చనిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ లేపడం అనే విషయాల్లో ఖుర్ఆన్‌లో అనేక సందర్భంలో ఉపయోగించడం జరిగింది.

ఉదాహరణకు స్టార్టింగ్‌లో సూరె బఖరాలోనే చూస్తే ఆయత్ నెంబర్ 56లో కనబడుతుంది మనకు, సుమ్మ బ’అస్నాకుమ్ మిమ్ బా’అది మౌతికుమ్. మీరు చనిపోయిన తర్వాత మిమ్మల్ని మేము మళ్ళీ తిరిగి బ్రతికించాము. అదే ఒకవేళ ఆయత్ నెంబర్ 129 చూస్తే ఇబ్రాహీం అలైహిస్సలాం దుఆ చేస్తున్నారు, రబ్బనా వబ్’అస్ ఫీహిమ్ రసూలా. ఓ అల్లాహ్ ఒక ప్రవక్తను వారిలో ప్రభవింపజేయి అని దుఆ చేశారు హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం. అంటే ఇక్కడ చెప్పే ఉద్దేశం ఏంటి? ఈ పదం ఏదైతే ఉందో బ’అస్ రెండు భావాల్లో వస్తుంది. రెండు భావాల్లో. దానికి ఒక ఉదాహరణ మీకు సూరతుల్ బఖరా ఆయత్ నెంబర్ 56 ద్వారా, మరొక ఉదాహరణ సూరతుల్ బఖరా ఆయత్ నెంబర్ 129 ద్వారా తెలపడం జరిగినది. ఇంకా దీనికి మీరు ఆధారాలు చూసుకోవాలనుకుంటే చాలా ఉన్నాయి.

ఉదాహరణకు నేను ఇది తెలుగు ఖుర్ఆన్, https://teluguislam.net/ab. వల్లాహి వల్లాహి అల్లాహు త’ఆలా జజాఏ ఖైర్ ఇవ్వుగాక మన అబ్దుర్రహ్మాన్ భాయ్ గారికి, ఎంత శ్రమ పడ్డారు వారు, వారి యొక్క ఫ్యామిలీ వారు ఈ ఒకే పేజీలో మొత్తం ఖుర్ఆన్ అరబీ టెక్స్ట్, తెలుగు అనువాదం యొక్క టెక్స్ట్ తీసుకురావడంలో. దీని ద్వారా చాలా చాలా లాభం కలుగుతుంది. మీరు ఎంత గ్రహించారో తెలియదు కానీ నేనైతే చాలా దీని ద్వారా లాభం పొందుతూ ఉంటాను. ఉదాహరణకు ఇక్కడే మీరు చూడండి, ఇక్కడ మీరు చూస్తున్నారు చాలా స్పష్టంగా, కేవలం బ’అస్ అన్న పదం నేను రాశాను. బా, ఐన్, సా. మొత్తం 59 రిజల్ట్ ఇక్కడ వచ్చాయి. చూస్తున్నారు కదా మీరు కూడా. ఇప్పుడు ఆయత్ నెంబర్, సూర బఖరా సూర నెంబర్ 2, ఆయత్ నెంబర్ 56. ఇందులో ఏ భావం ఉంది? చనిపోయిన తర్వాత తిరిగి లేపడం భావం ఉంది. ఆ తర్వాత మళ్ళీ మీరు చూడండి సూరతుల్ బఖరా ఆయత్ నెంబర్ 129 లో కనబడుతుంది, రబ్బనా వబ్’అస్ ఫీహిమ్ రసూలా. ఇందులో ప్రవక్తను పంపడం అనే భావంలో ఉంది. ఆ తర్వాత మూడో రిజల్ట్ చూస్తే ఇక్కడ కూడా ఫబ’అసల్లాహున్నబియ్యీన, ప్రవక్తలను పంపడం అన్న భావంలో వచ్చి ఉంది. ఆ, ఇక్కడ ఒక రాజును మా కొరకు పంపు అని ఇందులో కూడా. మరి ఇక్కడ చూస్తే 259వ ఆయత్ నెంబర్‌లో, ఫ అమాతహుల్లాహు మి’అత ఆమిన్ సుమ్మ బ’అసహ్. అల్లాహు త’ఆలా 100 సంవత్సరాల వరకు అతన్ని చంపి ఉంచాడు, ఆ తర్వాత మళ్ళీ తిరిగి లేపాడు. నువ్వు నూరేళ్ళు ఈ స్థితిలో పడి ఉన్నావు. కాస్త నీ అన్న పానీయాల వైపు చూడు. ఈ విధంగా మనం ఏదైనా ఒక పదం గురించి వెతకడం, దాని రిజల్ట్ పొందడం గురించి ఇది చాలా చాలా ఉత్తమ వెబ్సైట్. దీనిని మీరు మీ యొక్క ఫేవరెట్ చేసి పెట్టుకోండి. ఎలాగైతే నేను ఇక్కడ ఫేవరెట్ చేసి పెట్టుకున్నాను, స్టార్ గుర్తుని, ఇది. ఈ విధంగా చేసి పెట్టుకుంటే మీకు వెతకడంలో చాలా సులభం అవుతుంది.

అయితే మన టాపిక్ ఏంటి?

أَن لَّن يَبْعَثَ اللَّهُ أَحَدًا
(అన్ లన్ యబ్’అసల్లాహు అహదా)
ఆ జిన్నాతులు అంటున్నారు మేము కూడా మరియు మానవులు కూడా అల్లాహ్ ఏ ప్రవక్తను పంపడు, అల్లాహ్ ఎవరిని కూడా చనిపోయిన తర్వాత తిరిగి లేపడు అని అనుకునే వాళ్ళము, కానీ అలా కాదు, తప్పకుండా అల్లాహు త’ఆలా తిరిగి లేపుతాడు అన్నటువంటి స్పష్టమైన విషయం ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ రోజు ఈ ఆయతులు చదివాము మనము. ఇంకా అల్లాహ్ యొక్క దయతో ఇన్ షా అల్లాహ్ తర్వాత పాఠంలో మిగతా ఆయతులు చదివే ప్రయత్నం చేద్దాము. ఇక్కడి వరకే సెలవు తీసుకుంటున్నాను. జజాకుముల్లాహు ఖైరా, బారకల్లాహు ఫీకుమ్, అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహ్.



ఖురాన్ తఫ్సీర్ – సూరా అల్ జిన్న్ – పార్ట్ 2 (అయతులు 8 -13)
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/r_5kw6e_trk [49 నిముషాలు]

ఈ ప్రవచనంలో సూరహ్ అల్-జిన్ (72వ సూరా) యొక్క 8 నుండి 13వ ఆయతులపై దృష్టి సారించారు. 8 నుండి 13వ ఆయతుల యొక్క పదపదానికీ అనువాదం మరియు వివరణ ఇవ్వబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రాకకు ముందు, జిన్నాతులు ఆకాశంలోని వార్తలను దొంగతనంగా వినేవారని, కానీ ప్రవక్త ఆగమనం తర్వాత ఆకాశం కఠినమైన కావలి వారితో, ఉల్కలతో నింపబడిందని వివరించారు. ఈ మార్పుకు కారణం ఖుర్ఆన్ అవతరణ అని గ్రహించిన జిన్నాతులు, దానిని విని విశ్వసించారు. అల్లాహ్ యొక్క శక్తి నుండి తాము ఎప్పటికీ తప్పించుకోలేమని, ఆయనను ఓడించలేమని వారు దృఢంగా నమ్మారు. కీడు జరిగినప్పుడు దానిని నేరుగా అల్లాహ్ కు ఆపాదించకుండా, ‘కీడు ఉద్దేశించబడింది’ అని చెప్పడం ద్వారా జిన్నాతులు చూపిన గౌరవాన్ని ప్రవచకులు నొక్కిచెప్పారు. చివరగా, తమ ప్రభువును విశ్వసించిన వారికి పుణ్యాలలో ఎలాంటి నష్టం గానీ, అన్యాయం గానీ జరగదని ఆయతుల ద్వారా స్పష్టం చేశారు.

72:8 وَأَنَّا لَمَسْنَا السَّمَاءَ فَوَجَدْنَاهَا مُلِئَتْ حَرَسًا شَدِيدًا وَشُهُبًا
“మేము ఆకాశంలో బాగా వెదికాము. అది అప్రమత్తులైన పహరాదారులతో, అగ్నిజ్వాలలతో నిండి ఉండటం చూశాము.”

72:9 وَأَنَّا كُنَّا نَقْعُدُ مِنْهَا مَقَاعِدَ لِلسَّمْعِ ۖ فَمَن يَسْتَمِعِ الْآنَ يَجِدْ لَهُ شِهَابًا رَّصَدًا
“లోగడ మనం విషయాలు వినటానికి ఆకాశంలో పలుచోట్ల (మాటేసి) కూర్చునే వాళ్ళం. ఇప్పుడు ఎవరైనా చెవి యోగ్గి వినదలిస్తే, తన కోసం కాచుకుని ఉన్న అగ్నిజ్వాలను అతను పొందుతున్నాడు.”

72:10 وَأَنَّا لَا نَدْرِي أَشَرٌّ أُرِيدَ بِمَن فِي الْأَرْضِ أَمْ أَرَادَ بِهِمْ رَبُّهُمْ رَشَدًا
“ఇంకా – భూమిలో ఉన్న వారి కోసం ఏదైనా కీడు తలపెట్టబడినదో లేక వారి ప్రభువు వారికి సన్మార్గ భాగ్యం ప్రసాదించగోరుతున్నాడో మాకు తెలియదు.”

72:11 وَأَنَّا مِنَّا الصَّالِحُونَ وَمِنَّا دُونَ ذَٰلِكَ ۖ كُنَّا طَرَائِقَ قِدَدًا
“ఇంకా ఏమిటంటే – మనలో కొందరు సజ్జనులుంటే మరికొందరు తద్భిన్నంగా ఉన్నారు. మన దారులు వేర్వేరుగా ఉన్నాయి.”

72:12 وَأَنَّا ظَنَنَّا أَن لَّن نُّعْجِزَ اللَّهَ فِي الْأَرْضِ وَلَن نُّعْجِزَهُ هَرَبًا
“మనం భూమిలో అల్లాహ్ ను అశక్తుణ్ణి చేయటం గానీ, పారిపోయి (ఊర్థ్వలోకాల్లో) ఆయన్ని ఓడించటంగాని మనవల్ల కాని పని అని మాకర్ధమైపోయింది.”

72:13 وَأَنَّا لَمَّا سَمِعْنَا الْهُدَىٰ آمَنَّا بِهِ ۖ فَمَن يُؤْمِن بِرَبِّهِ فَلَا يَخَافُ بَخْسًا وَلَا رَهَقًا
“మేము మాత్రం సన్మార్గ బోధను వినగానే దానిని విశ్వసించాం. ఇక ఎవడు తన ప్రభువును విశ్వసించినా అతనికి ఎలాంటి నష్టంగానీ, అన్యాయంగానీ జరుగుతుందన్న భయం ఉండదు.”

وَاَنَّا
[వ అన్నా]
నిశ్చయంగా మేము.

لَمَسْنَا
[లమస్నా]
ఇక్కడ లమస్నా అన్నదానికి వెతికాము అని రాయవచ్చు.

السَّمَآءَ
[అస్ సమాఅ]
ఆకాశం

లమస్నా యొక్క అసలు భావం, అసలు భావం లమ్స్ అంటారు టచ్ చేయడాన్ని, తాకడాన్ని. దేనినైనా ముట్టుకుంటే అది ఏంటి అనేది మనకు తెలుస్తుంది కదా. అది మనకు ఏదైతే తెలిసిందో తాకడం ద్వారా. ఓహ్ ఇది వేడిగా ఉంది. అబ్బో ఇది చల్లగా ఉంది. అని మనం కొంచెం తాకిన తర్వాత ఏర్పడుతుంది. ఆ విషయాన్ని అంటారు వాస్తవానికి. కానీ ఇక్కడ ఉద్దేశ ప్రకారంగా వెతికాము అని భావం తీసుకోవడం జరుగుతుంది. ఆ అస్ సమాఅ, ఆకాశం

فَوَجَدْنَا
[ఫ వజద్నా]
మేము పొందాము.

هَا
[హా]
ఆకాశంలో అని భావం.

مُلِئَتْ
[ములిఅత్]
నిండి ఉన్నది.

حَرَسًا
[హరసన్]
పహరాదారులు, పహరాదారులతో.

شَدِيْدًا
[షదీదన్]
కఠినమైన రీతిలో.

شُهُبًا
[షుహుబా]
అగ్ని జ్వాలలు.

وَّاَنَّا
[వ అన్నా]
నిశ్చయంగా మేము

كُنَّا نَقْعُدُ
[కున్నా, నఖ్ ఉదు]
కూర్చుండే వారిమి.

مِنْهَا
[మిన్హా]
అక్కడ ఆకాశంలో ఉన్నవారి స్థలాల్లో.

مَقَاعِدَ
[మకాఇద]
మకాఇద్ అంటే కూర్చునే స్థలాల్లో.

لِلسَّمْعِ
[లిస్సమ్అ]
వినడానికి.

فَمَنْ
[ఫమన్]
కనుక ఎవరూ

يَسْتَمِعُ
[యస్తమిఉ]
వింటాడో, వినే ప్రయత్నం చేస్తాడో.

ఇంతకుముందే వచ్చింది మనకు

اَنَّهُ اسْتَمَعَ
[అన్నహుస్తమఅ.]
యస్తమిఉ ఇక్కడ వచ్చింది. కానీ ఇక్కడ ఉద్దేశపరంగా యస్తమిఉ వింటాడో వినే ప్రయత్నం చేస్తాడో అని.

الْاٰنَ
[అల్ ఆన]
ఇప్పుడు.

يَجِدْ
[యజిద్]
పొందుతాడు.

لَهٗ
[లహూ]
తన కొరకు.

شِهَابًا
[షిహాబన్]
అగ్ని జ్వాలను.

رَّصَدًا
[రసదా]
మాటు వేసి ఉన్నది. కాచుకొని ఉన్నది.

وَاَنَّا
[వ అన్నా]
మరియు నిశ్చయంగా మేము

لَا نَدْرِيْٓ
[లా నద్రీ]
మాకు తెలియదు.

اَشَرٌّ
[అషర్రున్.]
అ. ఇక్కడ ఆ ప్రశ్నార్థకంగా.

شَرٌّ
[షర్రున్]
కీడు, చెడు.

اُرِيْدَ
[ఉరీద]
ఉద్దేశింపబడినదా.

بِمَنْ فِى الْاَرْضِ
[బి మన్ ఫిల్ అర్ద్]
భూమిలో ఉన్నవారి గురించి.

اَمْ
[అమ్]
లేదా

اَرَادَ
[అరాద]
కోరాడా, ఉద్దేశించాడా.

بِهِمْ
[బిహిమ్]
వారి గురించి.

رَبُّهُمْ
[రబ్బుహుమ్]
వారి ప్రభువు.

رَشَدًا
[రషదా.]
ఇంతకుముందు ఏం రాసాము మనం రుష్ద్. సరియైన మార్గం. మేలు. రెండు రాసుకోండి.

وَاَنَّا
[వ అన్నా]
మరియు మేము.

وَاَنَّا مِنَّا
[వ అన్నా మిన్నా]
మాలో.

الصّٰلِحُوْنَ
[అస్ సాలిహూన్]
సజ్జనులు, సద్వర్తనులు. సజ్జనులు చాలా బాగుంటుంది. సద్వర్తన అనసరికి క్యారెక్టర్ కి సంబంధమైన అవుతుంది. కానీ సాలిహ్ లో విశ్వాస పరంగా గానీ ఆచరణ పరంగా గానీ, ప్రవర్తన పరంగా గానీ పరస్పర ప్రజలతో బిహేవియర్ మంచి వ్యవహారం విషయంలో గానీ అన్ని రకాలుగా సాలిహ్, మంచి వాళ్ళు. సాలిహూన్, సజ్జనులు.

وَمِنَّا
[వ మిన్నా]
మరియు మాలో

دُوْنَ ذٰلِكَ
[దూన దాలిక్]
దానికి భిన్నంగా.

كُنَّا
[కున్నా]
మేము ఉంటిమి.

طَرَاۤئِقَ قِدَدًا
[తరాయిక, కిదదా]
వివిధ మార్గాల్లో. వివిధ వర్గాల్లో. మన దారులు వేరు వేరు.

وَّاَنَّا ظَنَنَّآ
[వ అన్నా జనన్నా]
మేము భావించేవాళ్ళము. ఇక్కడ భావించడం అంటే ఇది నమ్మకం యొక్క భావంలో. ఒక్కొక్కసారి జనన్నా అనుమానంలో కూడా వస్తుంది కానీ ఇక్కడ అలా కాదు.

اَنْ لَّنْ نُّعْجِزَ اللّٰهَ
[అల్లన్ ను’జిజల్లాహ.]

نُعْجِزَ اللّٰهَ
[ను’జిజల్లాహ.]
మేము అల్లాహ్ ను అశక్తున్ని చేయలేము.

فِى الْاَرْضِ
[ఫిల్ అర్ద్]
భూమిలో.

وَلَنْ نُّعْجِزَهٗ هَرَبًا
[వలన్ ను’జిజహూ హరబా.]

هَرَبًا
[హరబా]
పారిపోయి.

وَلَنْ نُّعْجِزَهٗ
[వలన్ ను’జిజహూ]
మేము అశక్తున్ని చేయలేము, ఓడించలేము.

وَاَنَّا لَمَّا سَمِعْنَا الْهُدٰٓى
[వ అన్నా లమ్మా సమి’నల్ హుదా.]
నిశ్చయంగా మేము ఎప్పుడైతే విన్నామో,

لَمَّا
[లమ్మా]
ఎప్పుడైతే,

سَمِعْنَا
[సమి’నా]
విన్నామో.

الْهُدٰٓى
[అల్ హుదా]
మార్గదర్శకత్వాన్ని.

اٰمَنَّا بِهٖ
[ఆమన్నా బిహీ]
దానిని విశ్వసించాము.

فَمَنْ يُّؤْمِنْ
[ఫమన్ యు’మిన్]
ఎవరైతే విశ్వసిస్తారో.

بِرَبِّهٖ
[బిరబ్బిహీ]
తన ప్రభువుపై.

فَلَا يَخَافُ
[ఫలా యఖాఫు]
అతడు భయం చెందడు.

بَخْسًا
[బఖ్సన్]
ఏదైనా నష్టం వాటిల్లుతుందని.

وَّلَا رَهَقًا
[వలా రహకా.]
ఏదైనా దౌర్జన్యం, అన్యాయం. రహకా ఇంతకుముందు కూడా వచ్చింది. ఏం రాశారు? తలబిరుస్తనం షేక్. తలబిరుస్తనం వస్తుంది, దౌర్జన్యం అని కూడా వస్తుంది.

ఓకే, పలక, బలపం పక్కకు పెట్టి మాట ఇప్పుడు శ్రద్ధగా వినండి. వ్యాఖ్యానం తఫ్సీర్ మనం మొదలుపెడుతున్నాము.

సూరహ్ అల్-జిన్ (ఆయత్ 8-13) యొక్క తఫ్సీర్ మరియు వివరణ

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్. అల్హమ్దులిల్లాహ్, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్, అమ్మా బ’ద్.

సూరతుల్ జిన్, అల్లాహ్ యొక్క దయవల్ల ఇప్పటివరకు మనం ఏడు ఆయత్ లు చదివి ఉన్నాము. ఈరోజు నుండి ఎనిమిదవ ఆయత్ చదవబోతున్నాము. అయితే ఈ ఆయత్ ల యొక్క భావం తెలుసుకునేకి ముందు, దీనికి సంబంధించిన ఒక సంఘటనను మనతో అర్థం చేసుకుంటే చాలా బాగా ఉంటుంది. ఏంటి అది? మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రాకముందు షైతానుల ఒక అలవాటు ఉండినది. ఏంటి? ఒకరిపై ఒకరు అధిరోహించి, ఎక్కి, ఆకాశం వరకు చేరుకొని, అక్కడ వారు మాటు వేసుకొని ఉండే, దొంగతనంగా వినడానికి అక్కడ దైవదూతల మాటలను, వారు కొన్ని స్థానాలు ఏర్పరచుకొని ఉండిరి. అయితే మన ప్రవక్త ముహమ్మమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇక ప్రవక్తగా ప్రభవింపజేయబడతారు అన్న సందర్భంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ షైతానులు అక్కడి మాటలు ఏమీ దొంగలించకుండా ఉండడానికి అక్కడ వారికి, దొంగచాటున వినే అటువంటి షైతానులకు కఠిన శిక్షగా ఆకాశంలో తారలు ఏవైతే ఉన్నాయో కొన్నిటిని నియమించాడు. ఆ తారలు కొన్ని అగ్ని జ్వాలలతో ఆ షైతానులను కాల్చేస్తుండినవి. అయితే ఈ షైతానులు అక్కడి మాటలు వినడానికి ఎందుకు ప్రయత్నం చేసేవారు? అసలు ఏం జరిగేది? మనం ఖుర్ఆన్ లోని వేరే ఆయత్ ల ద్వారా గ్రహిస్తే తెలుస్తున్న విషయం ఏమిటంటే, ఎప్పుడైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏదైనా ఆదేశం దైవదూతలకు ఇవ్వడానికి వారికి ఒకే ఒక ఇస్తాడో, వారిని పిలుస్తాడో అల్లాహ్ యొక్క ఔన్నత్యం, గౌరవం, గొప్పతనంతో అందరూ సొమ్మసిల్లిపోతారు. అల్లాహ్ యొక్క మాట విన్న వెంటనే వారందరిలోకెల్లా జిబ్రీల్ అందరికంటే ముందు కోలుకొని అల్లాహ్ యొక్క మాటను చాలా శ్రద్ధగా వింటారు. ఆ తర్వాత ఆయన ఎవరెవరికి ఏ ఆదేశాలు ఇవ్వాలో అవి తెలియపరుస్తాడు. ఆ సందర్భంలో ఆ మాటలు ఒకరి వెనుక ఒకరి దేవదూతలకు చేరుతూ ఉంటాయి. వారు పంపిస్తూ ఉంటారు అల్లాహ్ వారికి ఇచ్చిన ఆదేశం, వారికి తెలిపిన విధానంలో వారు పంపించుకుంటూ ఉంటారు.

అయితే ఈ షైతానులు ఈ ఒక్క మాటను దొంగలించి అందులో పది మాటలు తమ వైపు నుండి కలిపి కింద మనుషుల్లో ఎవరైతే వారి యొక్క అనుయాయులు, వారిని అనుసరించే వారు ఫాలోవర్స్ ఉన్నారో, ఈ విషయం మనకు సహీహ్ ముస్లిం హదీస్ ద్వారా కూడా తెలుస్తుంది. కాహిన్, అర్రాఫ్, జ్యోతిషి అని మనం ఏదైతే అంటామో వారికి తెలియజేస్తారు. ఆ జ్యోతిష్యులు ఆ అందులో ఇక తొంభై మాటలు ఎక్కువగా కలిపి ఇక ప్రజల నుండి తప్పిపోయిన ఏదైనా వస్తువు గానీ వారి యొక్క భవిష్యత్తులో ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది అన్నటువంటి అగోచర విషయాలు తెలుపుతున్నట్లు, వారి యొక్క భవిష్యత్తు గురించి తెలియజేస్తున్నట్లుగా వారికి చెబుతారు. వాస్తవం ఏమిటంటే, ఒక్క మాట మాత్రమే వారు చెప్పిన వంద మాటల్లో నిజమవుతుంది. కానీ అమాయక ప్రజలు ఆ ఒక్క మాట ఏదైతే నిజమైనదో దాని ద్వారా వారి యొక్క తొంభై తొమ్మిది మాటలు నిజమన్నట్లుగా భావిస్తారు. అయితే ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రాకముందు ప్రవక్తగా ప్రభవించక ముందు ఆకాశంలో కట్టుదిట్టం పహరాలు, అక్కడ ఎవరూ దొంగచాటున వినకుండా ఉండడానికి అక్కడ చెక్ పాయింట్ లాంటివి అనుకోండి ఎక్కువైపోయాయి. అయితే ఈ జిన్నాతులు చాలా ఆశ్చర్యపడ్డారు ఈ విషయాన్ని చూసి, ఎందుకు ఇలా జరుగుతుంది, ఇంతకుముందు ఎప్పుడూ జరగకపోయేది కదా. అయితే ఎప్పుడైతే వారు వచ్చి ఖుర్ఆన్ విన్నారో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నోట, అప్పుడు వారికి అర్థమైంది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన సత్య సందేశాన్ని ప్రజలకు చేరవేయడానికి ఈ విధంగా ఆకాశంలో ఎన్నో రకాల తారలను మా కొరకు మాటు వేసి ఉంచి, మాపై మాటలు వినకుండా శిక్షను పంపించేవారు. వాటి యొక్క ప్రస్తావన ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు కొంచెం మనం ఆయత్ లను చదువుతూ ఈ విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.

వ అన్నా లమస్నస్ సమాఅ ఫవజద్నాహా ములిఅత్ హరసన్ శదీదన్ వ షుహుబా.

وَاَنَّا لَمَسْنَا السَّمَآءَ فَوَجَدْنٰهَا مُلِئَتْ حَرَسًا شَدِيْدًا وَّشُهُبًا ۙ‏
[వ అన్నా లమస్నస్ సమాఅ ఫవజద్నాహా ములిఅత్ హరసన్ శదీదన్ వ షుహుబా]
“మరి నిశ్చయంగా మేము ఆకాశాన్ని గాలించాము. అది కఠినమైన కావలి వారితో, నిప్పు రవ్వలతో నింపబడి ఉండటాన్ని మేము గమనించాము.” (72:8)

మరో అనువాదంలో ఏముంది? మేము ఆకాశంలో బాగా వెతికాము, అది అప్రమత్తులైన పహరాదారులతో, అగ్ని జ్వాలలతో నిండి ఉండటం చూశాము. ఈ ఆయత్ లో మనకు చూడడానికి ఇంతవరకు చెప్పుకున్నటువంటి సంఘటన ఏదైతే తెలుసుకున్నామో, అందులో స్పష్టంగా అర్థమైపోయింది మనకు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ షైతానులు వినకుండా ఉండడానికి అక్కడ మంచి బలవంతమైన షైతానులను ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వాటిని కాపలాదారులుగా పెట్టాడు. అయితే ఇక్కడ మనకు రెండు విషయాలు కనబడుతున్నాయి. ఒకటి, హరసన్ శదీదా, బలవంతమైన, కఠినమైన, మంచి పహరాదారులు. వ షుహుబా. షుహుబా అంటే ఇక్కడ ఉల్కలు అని కూడా కొందరు అనువాదం చేశారు. ఈ ఉల్కలు మనం వాడుక భాషలో వేటిని అంటారో మీలో ఎవరికైనా తెలిసి ఉంటే చెప్పండి ఒకసారి. ఆకాశం నుండి రాలేవి షేక్, ఉల్కలు అంటే. ఆకాశం నుండి రాలే అటువంటివి. గ్రహ సకలాలు అని చెప్తారు సార్ వాస్తవానికి సైన్స్ పరంగా. ఉల్కలు అని అంటారు వాటిని. గ్రహ సకలాల్ని. ఇక్కడ కొంచెం మనం, ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. అదేమిటంటే సైన్స్ పరంగా కొన్ని విషయాలు ఏవైతే మనకు తెలుస్తున్నాయో, ధర్మం అన్నది, ఇస్లాం చెప్పేటివి విరుద్ధమేమీ కావు. కొన్ని సందర్భాల్లో ఏదైనా విషయం అర్థం కాకపోతే సైన్స్ పూర్తి రీసెర్చ్ తో జరుగుతుంది అన్నటువంటి వాదనతో దాని వైపు మొగ్గు చూపి కొందరు అల్లాహ్ లేదా ప్రవక్త యొక్క మాటలను తిరస్కరించే ప్రయత్నం చేస్తారు. ఆ భావంలోకి వెళ్లకూడదు. ఎందుకంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏ సత్యాన్ని తెలియజేశాడో అవి ఇంకా సైంటిస్టుల పరిశోధనలకు రాలేదు కావచ్చు అని మనం భావించాలి, వాస్తవం కూడా ఇది. కానీ అల్లాహ్ యొక్క మాట, ప్రవక్త యొక్క మాట సైన్స్ పరిశోధనల కంటే చాలా ఫాస్ట్ గా మరియు చాలా అప్డేట్ గా ఉంటాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే కొందరు తొందరపాటులో ఇది ఇస్లాం దీని గురించి ఏం చెప్తుంది అన్నటువంటి విషయాలను మాట్లాడుతూ వ్యతిరేకత చూపి ఇస్లాంను వంకరగా, ఇస్లాంను తప్పుగా చూపించే ప్రయత్నం అందరూ చేస్తూ ఉంటారు. అయితే ఈ విషయంలో గానీ, ఏదైతే ఉల్కల ప్రస్తావన వచ్చిందో, లేదా భూకంపం విషయంలో గానీ ఇదంతా కూడా సైన్స్ కు మరియు ధర్మానికి వ్యతిరేకత తీసుకువచ్చే ప్రయత్నం ఏమాత్రం చేయనే చేయకూడదు. ఎవరికైనా ఎక్కడైనా ఏదైనా మాట అర్థం కాకుంటే అక్కడ మనం క్లియర్ గా ఒక మాట చెప్పవచ్చు. అదేమిటి? అల్లాహ్ చెప్పిన మాటలో ఎలాంటి రద్దు అనేది, ఎలాంటి అబద్ధం అనేది ఉండదు గనుక సైన్స్ పరిశోధనలు జరిపి, జరిపి, జరిపి, జరిపి వారి దృష్టిలో వచ్చిన విషయం అనుభవంలో వచ్చిన విషయం చెప్తారు గనుక ఇంకా వారి పరిశోధనలకు రాలేదు కావచ్చు అన్నటువంటి విషయంపై మనం ఉండాలి. కానీ ఇక్కడ చెప్పే ఉద్దేశం ఏంటి? అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కొన్ని తారలలో అలాంటి శక్తి వారికి ప్రసాదించి ఉన్నాడు. వారిని కాపలాదారులుగా ఉంచాడు. వారు ఎక్కడ షైతానులను చూస్తారో వాటిని పరిగెత్తించి, వారిని ఆ వారి వెంటపడి వారిని కాల్చేసే ప్రయత్నం చేస్తారు. అయితే మనం కొన్ని సందర్భాల్లో తారా పడిపోయింది లేదా ఉల్కల విషయం ఏదైతే మనం వింటామో లేదా చూస్తామో అయితే వల్లాహు అ’లం ఏదైనా తార షైతానులను కొట్టడానికి ఆ షైతానుల వెంట పరిగెడుతుంది కావచ్చు.

రెండో ఆయత్: వ అన్నా కున్నా నఖ్ ఉదు మిన్హా మకాఇద లిస్సమ్.

وَّاَنَّا كُنَّا نَقْعُدُ مِنْهَا مَقَاعِدَ لِلسَّمْعِ ۖ
[వ అన్నా కున్నా నఖ్ ఉదు మిన్హా మకాఇద లిస్సమ్]
“మరియు మేము (విషయాలు) వినటానికి ఆకాశంలో కొన్ని చోట్ల కూర్చునేవారము.” (72:9)

అక్కడ మేము కొన్ని కూర్చుండి ఉండే చోట్ల, స్థానాల్లో కూర్చుండే వారిమి లిస్సమ్ వినడానికి. తాను ఇప్పుడు ఎవరైనా అలా వినే ప్రయత్నం చేస్తే వానికి ఆ ఉల్కలు అనేటివి కాల్చేస్తాయి మరియు వారు దాని యొక్క శిక్ష పొందుతారు. ఇది మొదటి మాట దానికే మరింత బలం చేకూరుస్తూ ఆ షైతానులు, ఆ జిన్నాతులు ఎవరైతే విని విశ్వసించారో తమ జాతి వారి వద్దకు వెళ్లి ఈ విషయాలను వారు చెబుతున్నారు. అందులోనే మరొక మాట పదవ ఆయత్ లో వస్తుంది. ఈ పదవ ఆయత్ లో మనకు కొన్ని గుణపాఠాలు ఉన్నాయి. కొన్ని మంచి బోధనలు ఉన్నాయి, గ్రహించాలి. మొదటిది ఏమిటంటే,

వ అన్నా లా నద్రీ అశర్రున్ ఉరీద.

తిలావత్ పరంగా కూడా ప్రత్యేకంగా ఎవరైతే ఇమామ్ గా ఉంటారో, ఖుర్ఆన్ యొక్క తిలావత్ చేస్తూ ఉంటారో తిలావత్ ఎలా చేయాలంటే ప్రత్యేకంగా నమాజ్ లో ఉన్నప్పుడు గానీ, స్వయంగా మన కొరకు ఒంటరిగా మనం తిలావత్ చేసుకుంటున్నప్పుడు గానీ, లేదా ఏదైనా సభలో ఎక్కడైనా ఎవరికైనా ఖుర్ఆన్ మనం వినిపిస్తున్నాము, దాని యొక్క తిలావత్ చేసే విధానం అన్నది ఎంత మంచిగా, సుందరంగా, ఉత్తమంగా ఉండాలంటే ఖుర్ఆన్ యొక్క తిలావత్ ద్వారానే ఎంతో కొంత భావం అర్థమయ్యే రీతిలో తిలావత్ జరగాలి. ఇక్కడ అశర్రున్ అన్న పదం ఏదైతే వచ్చిందో వాస్తవానికి ఇందులో మహా నీచాతి నీచమైన, మహా చెడ్డది అన్నటువంటి భావంలో వస్తుంది. కానీ ఇక్కడ ఆ భావం కాదు. అలాంటి భావం ఉండేది ఉంటే అశర్రున్ డైరెక్ట్ చదవడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏముంది, అశర్రున్ ఉరీద బిమన్ ఫిల్ అర్ది అమ్ అరాద బిహిమ్ రబ్బుహుమ్ రషదా. ఈ మానవుల పట్ల ఏదైనా చెడు కోరడం జరిగినదా? ప్రశ్న. ఆ, ఆ అమిన్తుమ్ అని మీరు ఇంతకుముందు చదివారు కదా? ప్రశ్నార్థకంగా ఏదైతే వస్తుందో ఆ రీతిలో ఇక్కడ ‘ఆ’ ఉంది. షర్రున్ వేరే పదము. అంటే ‘ఆ’ ఒక వేరే పదం, ‘షర్రున్’ వేరే పదం. ఇందులో భావంలో ప్రశ్నార్థకం ఉంది. అందుకొరకే దీనిని ఎలా చదువుతారు, “వ అన్నా లా నద్రీ అశర్రున్”. అశర్, అషర్రున్. ఈ తిలావత్ లో రెండు విధానాలు వేరుగా ఉంటాయి. మొదటిది నేను ఏదైతే చదివానో అందులో అతి చెడ్డది అన్నటువంటి భావం వస్తుంది. రెండో విధానం ఏదైతే చదివామో అందులో చెడు కోరబడినదా అన్నటువంటి ప్రశ్న అడుగోవడడం జరుగుతుంది అన్నట్లుగా అర్థమవుతుంది. దీనిని నబరతుస్ సౌత్ అని అంటారు. ఈ విషయాన్ని ప్రత్యేకంగా ఎవరైతే తిలావత్ ఉత్తమ రీతిలో చేసేవారు, ఇమామ్ లు అలాంటి వారు ఈ విషయాన్ని గ్రహించాలి.

రెండో మాట ఇందులో గమనించండి, అశర్రున్ ఉరీద బిమన్ ఫిల్ అర్ద్ అమ్ అరాద బిహిమ్ రబ్బుహుమ్ రషదా. షర్రున్ మరియు రషదా ఇవి రెండు విరుద్ధ పదాలు. షర్ అంటే కీడు, రషదా అంటే మేలు. అయితే మనం మానవులం, అల్లాహ్ పట్ల పాటించే అటువంటి గౌరవ మర్యాద అన్నది ఎలాంటిదంటే, మనం అల్లాహ్ వైపునకు చెడును అంకితం చేయరాదు. అల్లాహ్ వారి పట్ల ఏదైనా చెడు కోరాడా, లేక అల్లాహ్ వారి పట్ల ఏదైనా మేలు కోరాడా? ఈ విధంగా చెప్పడం సరియైన విషయం కాదు. వాస్తవానికి ఈ లోకంలో జరిగేదంతా అల్లాహ్ కు ఇష్టం లేనిది ఏదైనా జరిగిన గాని దానిని ఏమంటారు, ఇజ్నన్ కౌనీ అంటారు. ఒకటి షరయీ ఒకటి కౌనీ. షరయీ అంటే షరియత్ పరంగా జరిగేది. కౌనీ అంటే అల్లాహ్ కు ఇష్టం లేకపోయినా గాని ఈ లోకంలో సంభవిస్తుంది. అందులో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మానవులను పరీక్షించాలనుకుంటాడు. అయితే అలాంటి అప్పుడు అది కూడా అల్లాహ్ అనుమతితో జరుగుతుంది. కానీ మనం అల్లాహ్ యొక్క గౌరవం మర్యాదను పాటిస్తూ అల్లాహ్ వైపు నుండి చెడు అన్నట్లుగా చెప్పము. ఇది అల్లాహ్ యొక్క గౌరవ మర్యాదలో. ఆ విషయం అర్థమైందని ఆశిస్తున్నాను. కానీ కొన్ని సందర్భాల్లో మనం ఏదైనా తొందరపాటులో ఉండి మన ఆలోచన ఎక్కడైనా ఉంటే, లేక మన యొక్క నాలాంటి తక్కువ జ్ఞానం గలవారు తొందరగా అర్థం కాకపోవచ్చు ఒక చిన్న ఉదాహరణ ఇస్తున్నాను. మనం మన తల్లిదండ్రుల ద్వారా లేదా మనకు విద్య చెప్పే అటువంటి గురువుల ద్వారా స్పష్టంగా గమనిస్తాము. వారి ముందు ఏదైనా పొరపాటు జరిగింది అని. కానీ ఇదిగో నువ్వు తప్పు చేసావు అని ఈ విధంగా చెప్పము. ఎందుకు? పెద్దలు. వారిని గౌరవించాలి. వారితో మర్యాదగా ఎంతో సభ్యత, సంస్కారంతో మనం మెలగాలి. అందుకని అలా చెప్పడం సరియైనది కాదు. ఏం చెబుతాము? ఒక్కసారి ఈ మాటను మీరు మరోసారి ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఈ చెప్పిన విషయాన్ని ఒక్కసారి మీరు విని చూసుకోండి. కరెక్టే చెప్పారు కదా! ఈ విధంగా కొంచెం గౌరవంగా మాట్లాడుతాము. అఊజుబిల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్ అల్లాహ్ కొరకు ఎగ్జాంపుల్ కాదు, మనకు అర్థం కావడానికి చెప్తున్నాను. మనం మన పెద్దల పట్ల మానవుల్లో వారి యొక్క గౌరవార్థం మాట విధానంలో తేడా ఉంటుంది. అదే మన పిల్లవాడు మనకంటే చిన్నవాడు ఎవరైనా స్టూడెంట్ తప్పు చేస్తే అతన్ని దండించే విధానం, మనకంటే పెద్దవారు ఏదైనా తప్పు చేస్తే వారికి చెప్పే విధానంలో తేడా ఉంటుంది. అయితే నేను ఇక్కడ చెప్పే ఉద్దేశం ఏంటి? జిన్నాతులు అల్లాహ్ పట్ల ఎంత మర్యాద పాటించాలో ఇక్కడ మనకు కనబడుతుంది. వారు అల్లాహ్ విషయంలో, అల్లాహ్ చెడును కోరాడా అని అనకుండా ఏమన్నారు, ఉరీద బిమన్ ఫిల్ అర్ద్. భూమిలో ఉన్న వారికి ఏదైనా కీడు ఉద్దేశించబడినదా? ఉరీద. దీనిని ఏమంటారు, ఫెయల్ మజ్హూల్ అని అంటారు. కానీ అదే తర్వాత ఏమొచ్చింది? అమ్ అరాద బిహిమ్ రబ్బుహుమ్. వారి ప్రభువు వారి కొరకు కోరాడా. రషదా మేలు. ఈ ఆయత్ ద్వారా మనకు బోధపడే మరొక విషయం ఏమిటంటే ఈ లోకంలో ఏ మంచి జరిగినా, ఏ కీడు జరిగినా అల్లాహ్ వైపు నుండి జరుగుతుంది కానీ మనం అందులో ఏ పాత్ర మనది లేదు, అందులో మనకు ఏ పాపం గానీ ఎలాంటి మనపై బాధ్యత అనేది ఉండదు అని కాదు. ఎందుకంటే అల్లాహ్ మనకు ఏ బుద్ధి జ్ఞానాలు ప్రసాదించాడో, మనకు మంచి చెడును ఎన్నుకొని పాటించే అటువంటి శక్తి సామర్థ్యాలను ప్రసాదించాడో అందుకని మనం దానికి బాధ్యులం అవుతాము. ఏదైతే మన ఏదైనా కొరత వల్ల, పొరపాటు వల్ల మన నుండి ఏదైనా తప్పు జరుగుతుందో దానికి బాధ్యులం మనం అవుతాము. దానిని మనం అల్లాహ్ పై వేయరాదు.

ఆ తర్వాత గమనించండి: వ అన్నా మిన్నస్ సాలిహూన వ మిన్నా దూన దాలిక్ కున్నా తరాయిక ఖిదదా.

وَاَنَّا مِنَّا الصّٰلِحُوْنَ وَمِنَّا دُوْنَ ذٰلِكَ ۗ كُنَّا طَرَاۤئِقَ قِدَدًا ۙ‏
[వ అన్నా మిన్నస్ సాలిహూన వ మిన్నా దూన దాలిక్ కున్నా తరాయిక ఖిదదా]
“మరియు మాలో కొందరు పుణ్యాత్ములు ఉన్నారు, మరికొందరు వేరే రకం వారు ఉన్నారు. మేము వివిధ వర్గాలుగా విడిపోయి ఉన్నాము.” (72:11)

మాలో కొందరు పుణ్యాత్ములు ఉన్నారు మరియు వారికి భిన్నంగా ఉన్నారు. మొన్నటి క్లాస్ లో స్టార్టింగ్ లోనే చెప్పడం జరిగింది. ఎలాగైతే మానవుల్లో అన్ని రకాల మనుషులు ఉన్నారో, వివిధ ధర్మాలను అవలంబించేవారు, మతాలను అవలంబించేవారు, మస్లక్ లను, ఫిర్కాలను అవలంబించేవారు. అలాగే జిన్నాతులో కూడా ఉన్నారు. కాకపోతే అందులో కూడా పుణ్యాత్ములు ఉన్నారు. లేరని కాదు. అదే విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. కున్నా తరాయిక ఖిదదా మేము వివిధ మార్గాల్లో ఉంటిమి. ఈ సందర్భంలో కూడా మనకు ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కొన్ని హదీసులు గుర్తు చేసుకోవాలి. ప్రళయం వచ్చేవరకు ఈ ప్రజల మధ్యలో భేదాభిప్రాయాలు మరియు ఇలాంటి వివిధ వర్గాలు ఇవన్నీ ఉంటాయి, జరుగుతూ ఉంటాయి కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైతే చెప్పారో లా తజాలు తాయిఫతున్ మిన్ ఉమ్మతీ, నా అనుచర సంఘంలో ఒక వర్గం ఉంటుంది, ఒక జమాత్ ఉంటుంది, తాయిఫా, వారు ప్రళయం వరకు కూడా సత్యంపై, అల్లాహ్ యొక్క ధర్మంపై ఉంటారు. వారిని విడనాడిన వారు ఎలాంటి నష్టం వారికి చేకూర్చలేరు. వారిని వదిలి వెళ్లిన వారు స్వయం సత్యం నుండి దూరం అవుతారు తప్ప, వారు ఎలాంటి ధర్మం విషయంలో ధర్మంపై స్థిరంగా ఉన్న వారికి ఇహ పరాల్లో ఏ కీడు కలగజేయలేరు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా చెప్పడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మీరు ఎక్కడ ఉన్న ఏ కాలంలో ఉన్న, ఏ చెడు మీ మధ్యలో ప్రబలినా గానీ, మంచి వారు కూడా ఉంటారు, మీరు వారిని వెతకాలి మరియు అలాంటి మంచి వారి యొక్క తోడుగా ఉండి వారి యొక్క మార్గాన్ని అవలంబించాలి. అయితే ఈ హదీస్ ఆయత్ ఇప్పుడు ఈ సూరహ్ జిన్ లో చదివినటువంటి ఆయత్ నంబర్ 11 మరియు ప్రవక్త వారి ఈ హదీస్ బుఖారీ ముస్లిం ఇత వేరే గ్రంథాల్లో వచ్చి ఉంది. దాని ఆధారంగా ధర్మవేత్తలు ఏమంటున్నారంటే జిన్నాతులో కూడా ఇహలోకంలో మనుషుల్లో ఉన్నటువంటి ఫిర్కాలు, వర్గాలు ఉన్నాయి. సత్యంపై, మన్హజె సలఫ్ పై మరియు అలాగే వేరే షియా ఇత వేరే వర్గాలు ఏవైతే ఉన్నాయో అలాంటి వారిలో కూడా జిన్నాతులో విభజించబడి ఉన్నారు.

ఆ తర్వాత ఆయత్ 12:

وَّاَنَّا ظَنَنَّآ اَنْ لَّنْ نُّعْجِزَ اللّٰهَ فِى الْاَرْضِ وَلَنْ نُّعْجِزَهٗ هَرَبًا ۙ‏
[వ అన్నా జనన్నా అల్లన్ ను’జిజల్లాహ ఫిల్ అర్ది వలన్ ను’జిజహూ హరబా]
“మేము భూమిలో అల్లాహ్ ను ఓడించలేమని, పారిపోయి కూడా ఆయన పట్టు నుండి తప్పించుకోలేమని మేము గట్టిగా నమ్ముతున్నాము.” (72:12)

ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే వారి యొక్క నమ్మకం, ఖుర్ఆన్ ని విశ్వసించిన తర్వాత జిన్నాతుల యొక్క నమ్మకం ఎంత మంచిగా ఉండిందో గమనించండి. ఇహ లోకంలో మేము ఈ భూమిలో గానీ, భూమిని తప్ప ఇంకా వేరే ఎక్కడైనా గానీ అల్లాహ్ ను వదలి ఎక్కడికి పారిపోయినా గానీ మేము అల్లాహ్ యొక్క పట్టు నుండి తప్పించుకొని పోయే అవకాశమే లేదు. మేము అల్లాహ్ యొక్క విధేయతకు దూరమై అల్లాహ్ యొక్క శిక్ష నుండి తప్పించుకోవడానికి ఎలాంటి అవకాశం లేదు. మనం ఎంత అశక్తులం, ఎంత బలహీనులం అంటే అల్లాహ్ ను ఆజిజ్ చేయడం, ఆయన మనపై గెలుపు పొందకుండా, ఆయన మనల్ని పట్టుకోకుండా మనం ఆయనపై గెలుపు పొందే రీతిలో ఏదైనా మార్గం ముమ్మాటికి ఉండదు. ఈ విషయం చెప్పడానికే ఈ రెండు పదాలు ఇక్కడ వచ్చి ఉన్నాయి. అల్లన్ ను’జిజల్లాహ ఫిల్ అర్ద్ వలన్ ను’జిజహూ హరబా. అల్లాహు అక్బర్. ఈ సందర్భంలో నాకు సహీ హదీస్ గుర్తుకొస్తుంది ఏదైతే మనకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రి పడుకునే ముందు కూడా చదివి పడుకోవాలి. ఎవరైతే ఈ దుఆ చదివి పడుకుంటారో, ఒకవేళ వారు ఆ రాత్రి చనిపోతే ఫిత్రతే ఇస్లాం పై వారి యొక్క చావు అవుతుంది అని ప్రవక్త వారు శుభవార్త ఇచ్చారు. అల్లాహుమ్మ ఇన్నీ అస్లంతు నఫ్సీ ఇలైక, వ ఫవ్వజ్తు అమ్రీ ఇలైక, వ వజ్జహ్తు వజ్హీ ఇలైక, రగ్బతన్ వ రహబతన్ మిన్క ఇల్లా ఇలైక, ఆ లా మల్జఅ వలా మన్జా మిన్క ఇల్లా ఇలైక్. ఇక్కడ ఈ పదం గమనించండి. నేను నిన్నే విశ్వసించాను. నేను నా కార్యమును నీకే సమర్పించుకున్నాను. నా ముఖాన్ని నీ వైపునకే అంకితం చేసుకున్నాను. భయపడి వచ్చినా నీ వైపునకే రావాలి. ఏదైనా ఆశతో వచ్చినా నీ వైపునకే రావాలి. నీ తప్ప మాకు ఏదైనా భయం నుండి రక్షణ కల్పించే స్థలం మరియు ఏదైనా ఆశకు సంబంధించిన మంచి ఏదైనా జరుగుతుంది అంటే నీ తప్ప వేరే ఎక్కడా లేదు. ఇందులో ఎంత బలమైన విశ్వాసం మనకు నేరపడటం జరిగిందో గమనించండి.

అలాగే ఇంకా మనం గమనించగలిగితే సూరతుజ్ జారియాత్ లో చూడండి. అల్లాహ్ ఏమంటున్నాడు, ఫఫిర్రూ ఇలల్లాహ్. మీరు అల్లాహ్ వైపునకు పరిగెత్తండి. ఇక్కడ ఎందుకు ఈ ఆయత్ ని తీసుకుంటున్నాము? సర్వసామాన్యంగా మనిషి ఇహలోకంలో ఎవరితో భయపడుతున్నాడో అతని వైపునకే పరిగెత్తడు. ఏం చేస్తాడు? అంతకంటే ఎక్కువ శక్తి సామర్థ్యాలు గలవాని వైపునకు పరిగెత్తి అక్కడ శరణు తీసుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ ఈ లోకంలో అల్లాహ్ కంటే గొప్ప శక్తి గలవాడు మరెవడూ లేడు గనుక అల్లాహ్ తో భయపడి వేరే ఎటువైపునకో పరిగెత్తరాదు, కేవలం అల్లాహ్ వైపునకే పరిగెత్తాలి. అదే మాట ఇక్కడ, మేము ఆ అల్లాహ్ ను వదలి ఎక్కడికైనా పారిపోవాలన్నా పారిపోయే అటువంటి శక్తి మాకు లేదు. లేదా ఈ భూమిలో అల్లాహ్ ను ఓడించి మేము గెలుపు పొందాలన్న అలాంటి శక్తి ఏమీ లేదు. మరి అలాంటి అప్పుడు అల్లాహ్ కు అవిధేయత ఎందుకు చూపాలి? అల్లాహ్ మాటను ఎందుకు ధిక్కరించాలి? సత్య ధర్మాన్ని వదిలి ఎందుకు జీవించాలి?

ఆ తర్వాత చెబుతున్నారు, ఈరోజు పాఠంలోని చివరి ఆయత్, ఆయత్ నంబర్ 13. మా పరిస్థితి ఎలాంటిదంటే, 12 యొక్క సంక్షిప్త భావం, మా పరిస్థితి ఎలాంటిదంటే మేము అల్లాహ్ ను తప్ప ఏ ఏ దేవతలను నమ్ముకుంటామో, ఎవరెవరిని పెద్దగా భావిస్తామో వారు మాకు మా క్లిష్ట పరిస్థితుల్లో ఏ సహాయము చేయలేరు. మరియు అల్లాహ్ ను వదలి మేము వారిని నమ్ముకొని అల్లాహ్ యొక్క పట్టు నుండి ఈ భూమిలో ఎక్కడికి మనం దాగి ఉండలేము, ఎటు కూడా పారిపోయి శరణు పొందలేము. అందుకొరకే మేము ఈ మార్గదర్శకత్వాన్ని విన్న వెంటనే విశ్వసించాము. మేము విశ్వసించాము. ఇక ఈ విశ్వాసం అల్లాహ్ పై ఎంత గొప్పది అంటే, ఎవరూ తన ప్రభువుని విశ్వసిస్తాడో ఆ ప్రభువు విషయంలో ఎలాంటి భయం అవసరం లేదు. ఫలా యఖాఫు బఖ్సన్ వలా రహకా. అతని పుణ్యాల్లో ఏ కొరత జరగదు, పాపాల్లో ఏ హెచ్చింపు జరగదు. అతడు ఎంత పుణ్యం చేశాడో అతనికి సంపూర్ణంగా దాని యొక్క ప్రతిఫలం ఇవ్వడం జరుగుతుంది. మరియు అతడు ఏ పాపాలు చేశాడో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అతడి యొక్క పాపాల కారణంగా అతనిపై కోపగించి ఏదైనా అతనికి ఎక్కువ శిక్ష ఇస్తాడా, లేదు. అల్లాహ్ వద్ద సంపూర్ణ న్యాయం ఉంది. ఖుర్ఆన్ లో ఈ విషయం అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. అనేక లా యలిత్కుమ్ మిన్ అ’మాలీకుమ్ షైఆ. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మీ పుణ్యాల్లో ఎలాంటి తగ్గింపు చేయడు. మరో కొన్ని సందర్భాల్లో అయితే అల్లాహ్ ఏం చెప్పాడు? ఖర్జూరపు ముక్కపై, ఖర్జూరపు బీజముపై ఏ పల్చని పొర ఉంటుందో అంత కూడా మీపై ఏ అన్యాయం జరగదు. ఏ అన్యాయం జరగదు. అంతటి న్యాయవంతుడైన అల్లాహ్, ఆ అల్లాహ్ ను విశ్వసించిన వారు చాలా అదృష్టవంతులు, వారు చాలా మంచి పని చేసిన వారు. ఈ జిన్నాతులకు సంబంధించిన మరికొన్ని బోధనలు మరియు వారికి ఇంకా మానవులకు ఒకవేళ సన్మార్గంపై ఉండేది ఉంటే ఎలాంటి మేలు జరుగుతాయి తర్వాత ఆయతులలో రానున్నది. ఇక్కడివరకే ఈ పాఠాన్ని మనం ముగించేస్తున్నాము. జజాకుముల్లాహు ఖైరన్ వ బారకల్లాహు ఫీకుమ్ వ ఆఖిరు ద’వానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఏదైనా ప్రశ్న ఉందా మీ దగ్గర? సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహ్.



72:14 وَأَنَّا مِنَّا الْمُسْلِمُونَ وَمِنَّا الْقَاسِطُونَ ۖ فَمَنْ أَسْلَمَ فَأُولَٰئِكَ تَحَرَّوْا رَشَدًا

“ఇంకా – మనలో కొందరు ముస్లింలై (దైవవిధేయులై)ఉంటే, మరికొందరు సన్మార్గం నుండి తొలగి ఉన్నారు. కనుక విధేయతా వైఖరిని అవలంబించినవారు సన్మార్గాన్ని అన్వేషించుకున్నారు.”

72:15 وَأَمَّا الْقَاسِطُونَ فَكَانُوا لِجَهَنَّمَ حَطَبًا

“సన్మార్గం నుండి తొలగిపోయి, అపవాదానికి లోనైనవారు – నరకానికి ఇంధనం అవుతారు.”

72:16 وَأَن لَّوِ اسْتَقَامُوا عَلَى الطَّرِيقَةِ لَأَسْقَيْنَاهُم مَّاءً غَدَقًا

ఇంకా (ఓ ప్రవక్తా! వారికి చెప్పు): వీరు గనక సన్మార్గంపై నిలకడగా ఉంటే మేము వారికి పుష్కలంగా నీళ్ళు త్రాగించి ఉండేవారం.

72:17 لِّنَفْتِنَهُمْ فِيهِ ۚ وَمَن يُعْرِضْ عَن ذِكْرِ رَبِّهِ يَسْلُكْهُ عَذَابًا صَعَدًا

తద్వారా వారిని ఈ విషయంలో పరీక్షించటానికి! మరెవడు తన ప్రభువు ధ్యానం నుండి ముఖం త్రిప్పుకుంటాడో అతణ్ణి అల్లాహ్ కఠినమైన శిక్షకు లోను చేస్తాడు.

72:18 وَأَنَّ الْمَسَاجِدَ لِلَّهِ فَلَا تَدْعُوا مَعَ اللَّهِ أَحَدًا

ఇంకా – మస్జిదులు కేవలం అల్లాహ్ కొరకే ప్రత్యేకించబడ్డాయి. కాబట్టి (వాటిలో) అల్లాహ్ తో పాటు ఇతరులెవరినీ పిలవకండి.

72:19 وَأَنَّهُ لَمَّا قَامَ عَبْدُ اللَّهِ يَدْعُوهُ كَادُوا يَكُونُونَ عَلَيْهِ لِبَدًا

అల్లాహ్ దాసుడు (ముహమ్మద్) అల్లాహ్ ను మాత్రమే ఆరాధించటానికి నిలబడినప్పుడు ఈ మూక అమాంతం అతనిపై విరుచుకుపడినట్లే ఉంటుంది.

72:20 قُلْ إِنَّمَا أَدْعُو رَبِّي وَلَا أُشْرِكُ بِهِ أَحَدًا

(ఓ ప్రవక్తా!) “నేనైతే కేవలం నా ప్రభువునే మొరపెట్టుకుంటాను, ఆయనకు సహవర్తులుగా ఎవరినీ చేర్చను” అని చెప్పు.

72:21 قُلْ إِنِّي لَا أَمْلِكُ لَكُمْ ضَرًّا وَلَا رَشَدًا

“మీకు కీడు (నష్టం)గానీ, మేలు (లాభం)గానీ చేకూర్చే అధికారం నాకు లేదు” అని (ఓ ప్రవక్తా!) చెప్పు.

72:22 قُلْ إِنِّي لَن يُجِيرَنِي مِنَ اللَّهِ أَحَدٌ وَلَنْ أَجِدَ مِن دُونِهِ مُلْتَحَدًا

“అల్లాహ్ పట్టు నుండి నన్నెవరూ రక్షించలేరు. నేను ఆయన ఆశ్రయం తప్ప వేరొకరి ఆశ్రయాన్ని పొందలేను” అని (ఓ ప్రవక్తా! వారికి) చెప్పు.


72:23 إِلَّا بَلَاغًا مِّنَ اللَّهِ وَرِسَالَاتِهِ ۚ وَمَن يَعْصِ اللَّهَ وَرَسُولَهُ فَإِنَّ لَهُ نَارَ جَهَنَّمَ خَالِدِينَ فِيهَا أَبَدًا

“అయితే నా బాధ్యతల్లా అల్లాహ్ వాణిని, ఆయన సందేశాలను (ప్రజలకు) అందజేయటమే. ఇక ఇప్పుడు ఎవరైనా అల్లాహ్ మాటను, అతని ప్రవక్త మాటను వినకపోతే వారికొరకు నరకాగ్ని ఉంది. అందులో వారు కలకాలం ఉంటారు.”

72:24 حَتَّىٰ إِذَا رَأَوْا مَا يُوعَدُونَ فَسَيَعْلَمُونَ مَنْ أَضْعَفُ نَاصِرًا وَأَقَلُّ عَدَدًا

ఎట్టకేలకు – వారికి వాగ్దానం చేయబడుతున్నది వారు చూసుకున్నప్పుడు, ఎవరి సహాయకులు బలహీనులో, ఎవరి సమూహం అతి తక్కువగా ఉందో వారే తెలుసుకుంటారు.

72:25 قُلْ إِنْ أَدْرِي أَقَرِيبٌ مَّا تُوعَدُونَ أَمْ يَجْعَلُ لَهُ رَبِّي أَمَدًا

(ఓ ప్రవక్తా! వారికి) చెప్పు : “మీతో వాగ్దానం చేయబడుతున్న విషయం (శిక్ష) సమీపంలోనే ఉందో లేక నా ప్రభువు దానికోసం దూరపు గడువును నిర్ణయిస్తాడో నాకు తెలియదు.”

72:26 عَالِمُ الْغَيْبِ فَلَا يُظْهِرُ عَلَىٰ غَيْبِهِ أَحَدًا

ఆయన అగోచర జ్ఞానం కలవాడు. తన అగోచర విషయాలను ఆయన ఎవరికీ తెలుపడు….

72:27 إِلَّا مَنِ ارْتَضَىٰ مِن رَّسُولٍ فَإِنَّهُ يَسْلُكُ مِن بَيْنِ يَدَيْهِ وَمِنْ خَلْفِهِ رَصَدًا

……తాను ఇష్టపడిన ప్రవక్తకు తప్ప! అయితే ఆ ప్రవక్తకు ముందూ, వెనుకా కూడా తన పహరాదారులను నియమిస్తాడు.

72:28 لِّيَعْلَمَ أَن قَدْ أَبْلَغُوا رِسَالَاتِ رَبِّهِمْ وَأَحَاطَ بِمَا لَدَيْهِمْ وَأَحْصَىٰ كُلَّ شَيْءٍ عَدَدًا

వారు తమ ప్రభువు సందేశాన్ని అందజేశారని తెలియటానికి (ఈ ఏర్పాటు జరిగింది). ఆయన వారి పరిసరాలన్నింటినీ పరివేష్టించి, ఒక్కో వస్తువును లెక్కపెట్టి ఉంచాడు.

మోక్షానికి మార్గం: జ్ఞానం, ఆచరణ, ప్రచారం – హబీబుర్ రహ్మాన్ జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

మోక్షానికి మార్గం – హబీబుర్ రహ్మాన్ జామి’ఈ [వీడియో]
https://youtu.be/Hf6tdEiLp2I [68 నిముషాలు]

ఈ ప్రసంగం మోక్షానికి మార్గాన్ని వివరిస్తుంది, దీనిని మూడు ప్రాథమిక సూత్రాలుగా విభజించారు: జ్ఞానం (ఇల్మ్), ఆచరణ (అమల్), మరియు ప్రచారం (దావత్). మొదటిది, ధార్మిక విద్య యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది, ఖురాన్ మరియు హదీసుల నుండి సరైన అవగాహన పొందడం విశ్వాసానికి పునాది అని వివరిస్తుంది. రెండవది, పొందిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడం, స్థిరత్వంతో ధర్మ మార్గంలో నడవడం యొక్క ఆవశ్యకతను చర్చిస్తుంది. మూడవది, నేర్చుకున్న సత్యాన్ని ఇతరులకు వివేకంతో, ఉత్తమ రీతిలో అందజేయడం కూడా మోక్ష మార్గంలో ఒక ముఖ్యమైన భాగమని స్పష్టం చేస్తుంది. ఈ మూడు అంశాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని, వీటిని అనుసరించడం ద్వారానే ఇహపరలోకాల సాఫల్యం సాధ్యమవుతుందని ప్రసంగం సారాంశం.

أَعُوذُ بِاللهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ
(అవూజు బిల్లాహి మినష్షైతానిర్రజీమ్)
بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ
(బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్)

يَرْفَعِ اللَّهُ الَّذِينَ آمَنُوا مِنكُمْ وَالَّذِينَ أُوتُوا الْعِلْمَ دَرَجَاتٍ
(యర్ఫఇల్లాహుల్లజీన ఆమనూ మిన్కుమ్ వల్లజీన ఊతుల్ ఇల్మ దరజాత్)

అభిమాన సోదరులారా, సర్వ స్తోత్రాలు, అన్ని విధాల పొగడ్తలు సర్వలోక ప్రభువైన, పాలకుడైన అల్లాహ్‌కే శోభిస్తాయి. అనంత కరుణా శుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయు గాక.

హమ్ద్ మరియు సనా తర్వాత, అభిమాన సోదర సోదరీమణులారా, ఈ రోజు నా ప్రసంగాంశం ‘మోక్షానికి మార్గం’ అని మీకందరికీ తెలిసిన విషయమే.ఈ అంశానికి సంబంధించిన అనేక విషయాలు, వివరాలు ఉన్నాయి. కాకపోతే ఈ రోజు నేను ఈ అంశానికి సంబంధించిన ముఖ్యమైన మూడు విషయాలు చెప్పదలిచాను.

ఒకటి – أَلتَّعَلُّمُ بِالدِّينْ (అత్తఅల్లుము బిద్దీన్) – ధర్మ అవగాహనం.
రెండవది– أَلْإِلْتِزَامُ بِهَا (అల్ ఇల్తిజాము బిహా) – దానికి కట్టుబడి ఉండటం, స్థిరత్వం.
మూడవది – أَلدَّعْوَةُ إِلَيْهَا (అద్దఅవతు ఇలైహా) – ఇతరులకు అందజేయటం.

మోక్షానికి మార్గం అనే ఈ అంశం పైన ముఖ్యమైన ఈ మూడు విషయాల గురించి మనము తెలుసుకోబోతున్నాం. సారాంశం చెప్పాలంటే, ఇల్మ్, అమల్, దావత్. (జ్ఞానం, ఆచరణ, ప్రచారం)

మొదటగా జ్ఞానం గురించి. జ్ఞానం మహిమను చాటే ఖురాన్ ఆయతులు, హదీసులు ఎన్నో ఉన్నాయి. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం,

طَلَبُ الْعِلْمِ فَرِيضَةٌ عَلَى كُلِّ مُسْلِمٍ
(తలబుల్ ఇల్మి ఫరీదతున్ అలా కుల్లి ముస్లిం) అంటే, జ్ఞానాన్ని ఆర్జించడం ప్రతి ముస్లిం పై విధి అని అన్నారు. పురుషులైనా, స్త్రీలైనా. ఈ హదీస్ సహీహ్ ఇబ్నె మాజాలో ఉంది మరియు ఈ హదీస్ సహీహ్ హదీస్.

జ్ఞానం అంటే కేవలం సర్టిఫికెట్లను సంపాదించడం కాదు. అల్లాహ్ పట్ల భీతిని హృదయంలో జనింపజేసేదే నిజమైన జ్ఞానం. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరా ఫాతిర్, ఆయత్ నంబర్ 28లో ఇలా సెలవిచ్చాడు:

إِنَّمَا يَخْشَى اللَّهَ مِنْ عِبَادِهِ الْعُلَمَاءُ
(ఇన్నమా యఖ్షల్లాహ మిన్ ఇబాదిహిల్ ఉలమా)
నిస్సందేహంగా అల్లాహ్ దాసులలో జ్ఞానులు మాత్రమే ఆయనకు భయపడతారు. (సూరా ఫాతిర్, ఆయత్ నంబర్ 28)

జ్ఞానాన్ని ఆర్జించే ప్రక్రియ తల్లి ఒడి నుంచి మొదలై సమాధి వరకు కొనసాగుతుంది. జ్ఞానం అధ్యయనం ద్వారా, అనుసరణ ద్వారా, ధార్మిక పండితుల సాహచర్యం ద్వారా జ్ఞానం పెరుగుతుంది, సజీవంగా ఉంటుంది. అలాగే, జ్ఞాన అధ్యయనం చేయటం, పుస్తక పఠనం, జ్ఞానుల సాహచర్యాన్ని విడిచిపెట్టడం ద్వారా జ్ఞానం అనేది అంతరిస్తుంది. ఈ విషయం మనము గమనించాలి. కావున, మానవుడు ఎల్లప్పుడూ తన జ్ఞానాన్ని పెంచుకునేందుకై కృషి చేస్తూనే ఉండాలి.

దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు స్వయంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నేర్పిన దుఆ, సూరా తాహా ఆయత్ నంబర్ 114:

رَّبِّ زِدْنِي عِلْمًا
(రబ్బీ జిద్నీ ఇల్మా)
ఓ నా ప్రభువా, నా జ్ఞానాన్ని పెంచు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఉంది. అదేమంటే, మానవులలో అందరికంటే ఎక్కువ జ్ఞానం ఎవరికి ఉంటుంది? ప్రవక్తలకి. ప్రవక్తలలో ప్రథమంగా ఎవరు ఉన్నారు? అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహ్ గురించి, విశ్వాసం గురించి, ఇస్లాం గురించి, ఖురాన్ గురించి, అన్ని విషయాల గురించి ఎక్కువ జ్ఞానం కలిగిన వారు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అయినప్పటికీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన సొంతం కోసం చేసుకునేందుకు ఏ దుఆ నేర్పించాడు? ‘రబ్బీ జిద్నీ ఇల్మా’ జ్ఞానం గురించి దుఆ నేర్పించాడు. ఓ నా ప్రభువా, నా జ్ఞానాన్ని పెంచు. అంటే మహాజ్ఞాని అయిన, ఇమాముల్ అంబియా అయిన, రహ్మతుల్లిల్ ఆలమీన్ అయిన మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం దుఆ చేస్తున్నారు తన కోసం? జ్ఞానం పెరగటానికి దుఆ చేస్తున్నారు. దీంతో మనకు అర్థం అవుతుంది, మోక్షానికి మార్గం కోసం జ్ఞానం ప్రథమంగా ఉంటుంది.

పూర్వ కాలానికి చెందిన మహానుభావులు వైజ్ఞానిక ఔన్నత్యాన్ని కలిగి ఉన్నప్పటికీ, తమ చివరి శ్వాస వరకు ఈ పవిత్రమైన కార్యాన్ని కొనసాగించారు. ఈ విషయాన్నీ మరొకసారి గమనించి వినండి , పూర్వ కాలానికి చెందిన మహానుభావులు, మన పూర్వీకులు, సలఫ్ సాలెహీన్లు, ముహద్దసీన్లు, అయిమ్మాలు, సహాబాలు, తాబయీన్లు, వారు వైజ్ఞానిక ఔన్నత్యాన్ని కలిగి ఉన్నప్పటికీ, తమ చివరి శ్వాస వరకు ఈ పవిత్రమైన కార్యాన్ని కొనసాగించారు.

ఇమాం మాలిక్ రహమతుల్లాహి అలైహి ఇలా అన్నారు: ఏ వ్యక్తి వద్దైతే జ్ఞానం ఉన్నదో, ఎవరి దగ్గర జ్ఞానం ఉన్నదో, అతడు జ్ఞానాన్ని ఆర్జించడాన్ని విడిచిపెట్టకూడదు. జ్ఞానం ఉన్నా కూడా జ్ఞానాన్ని ఆర్జించుకుంటూనే ఉండాలి అని ఇమాం మాలిక్ రహమతుల్లాహి అలైహి సెలవిచ్చారు.

అలాగే, ఇమాం అబూ అమ్ర్ బిన్ అల్-అలా రహమతుల్లాహి అలైహిని ఎవరో ప్రశ్నించారు: ఏమని? మానవుడు ఎప్పటి వరకు జ్ఞానాన్ని ఆర్జించాలి? అని అడిగితే ఆ మహానుభావుడు ఈ విధంగా సమాధానం ఇచ్చారు. ఎప్పుడు వరకు జ్ఞానాన్ని ఆర్జించాలి? అతడు ఆరోగ్యంగా ఉన్నంత వరకు, ఆరోగ్యవంతునిగా, శక్తిమంతునిగా ఉన్నంత వరకు జ్ఞానాన్ని ఆర్జిస్తూనే ఉండాలి.

అలాగే, ఇమాం ఇబ్నె అబ్దుల్ బర్ర్ రహమతుల్లాహి అలైహి, ఇబ్నె అబీ గస్సాన్ రహమతుల్లాహి అలైహి యొక్క వ్యాఖ్యను ఈ విధంగా ఉల్లేఖించారు: ఎప్పుడైతే మీరు జ్ఞానం పట్ల నిరపేక్షాపరులైపోతారో, అప్పుడు అజ్ఞానులైపోతారు. అల్లాహు అక్బర్. ఎప్పుడైతే జ్ఞానం పట్ల నిరపేక్షాపరులు అవుతామో, అప్పుడు వారు ఏమైపోతారు? అజ్ఞానులు అయిపోతారని ఇమాం ఇబ్నె అబ్దుల్ బర్ర్ రహమతుల్లాహి అలైహి సెలవిచ్చారు.

అలాగే, ప్రజల్లో జ్ఞానాన్ని ఆర్జించే అవసరాన్ని అందరికంటే ఎక్కువగా ఎవరు కలిగి ఉన్నాడు? ఈ ప్రశ్న గమనించి వినండి. ప్రజల్లో జ్ఞానాన్ని ఆర్జించే అవసరాన్ని అందరికంటే ఎక్కువగా ఎవరు కలిగి ఉన్నాడు? అని ఇమాం సుఫియాన్ బిన్ ఉయైనా రహమతుల్లాహి అలైహిను ఎవరో ప్రశ్నించారు. ఆయన ఇచ్చిన సమాధానం ఏమిటంటే, వారిలో అందరికంటే గొప్ప పండితుడు అయిన వ్యక్తి. గొప్ప పండితుడు, ఎవరి దగ్గర ఆల్రెడీ జ్ఞానం ఉందో అటువంటి వ్యక్తి ఇంకా జ్ఞానాన్ని ఆర్జించాలి అని అన్నారు ఆయన. ఎందుకు అని మళ్ళీ ప్రశ్నిస్తే, ఎందుకంటే అటువంటి వ్యక్తి తన జ్ఞానం వలన ఏదైనా చిన్న తప్పు చేసినా, అది ఎంతో పెద్ద చెడ్డ విషయంగా పరిగణించబడుతుంది. కనుక, ఎల్లప్పుడూ జ్ఞానాన్ని ఆర్జించేందుకై నిరంతరాయంగా కృషి చేస్తూనే ఉండాలి.

అభిమాన సోదరులారా, ఇక ధార్మిక విద్య ఎందుకు అవసరం అంటే, ముఖ్యంగా ధార్మిక విద్య గురించి నేను మాట్లాడుతున్నాను. ముఖ్యంగా ధార్మిక విద్య ఎందుకు అవసరం అంటే, ఇస్లాం ధర్మం విద్యపై స్థాపించబడింది. విద్య లేనిదే ఇస్లాం లేదు. ఇస్లాం పై నడిచే ప్రతి వ్యక్తికి విద్య అవసరం. ధార్మిక విద్య అంటే ఖురాన్, హదీసుల అవగాహన. అదే మనకు సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క ఆరాధన పద్ధతి నేర్పుతుంది. అసలు అల్లాహ్ అంటే ఎవరు? సృష్టికర్త అంటే ఎవరు? అల్లాహ్ పట్ల విశ్వాసం అంటే ఏమిటి? ఇంకా ఏ ఏ విషయాల పైన విశ్వసించాలి? ఏ విధంగా విశ్వసించాలి? ఎటువంటి విశ్వాసం కలిగి ఉండాలి? అల్లాహ్ మనతో ఏమి కోరుతున్నాడు? మన జీవన విధానం ఏ విధంగా ఉండాలి? మన జీవిత లక్ష్యం ఏమిటి? మరణానంతర జీవితం ఏమిటి? అనేది ధార్మిక విద్య వలనే తెలుస్తుంది.

అభిమాన సోదరులారా, స్వర్గానికి పోయే దారి, మోక్షానికి మార్గం చూపేది కూడా ధార్మిక విద్యే. ఇస్లాం ధర్మం గురించి సరైన అవగాహన ఉన్న వ్యక్తి షిర్క్, కుఫ్ర్, బిద్అత్, ఇతర దురాచారాలు, సామాజిక రుగ్మతలు, అన్యాయాలు, ఘోరాలు, నేరాలు, పాపాలు వాటి నుంచి తెలుసుకుంటాడు, వాటితో దూరంగా ఉంటాడు. సారాంశం ఏమిటంటే ఇహపరలోకాల సాఫల్యం ధార్మిక విద్య వల్లే దక్కుతుంది. ఈ విషయం మనము గ్రహించాలి.

అలాగే, అభిమాన సోదరులారా, ధార్మిక విద్య రెండు రకాలు. ధార్మిక విద్య రెండు రకాలు. ఒకటి ఇల్మె ఖాస్, ప్రత్యేకమైన విద్య. రెండవది ఇల్మె ఆమ్. ఇల్మె ఖాస్ అంటే అది ఫర్జె కిఫాయా. ఉమ్మత్‌లో కొంతమంది నేర్చుకుంటే సరిపోతుంది, అది ప్రతి ఒక్కరికీ సాధ్యం కూడా కాదు. ప్రతి వ్యక్తికి అది సాధ్యం కాదు. ఉమ్మత్‌లో కొంతమంది దానిని నేర్చుకుంటే సరిపోతుంది. అంటే, ఖురాన్ మరియు హదీసుల లోతుకి వెళ్ళడం. తఖస్సుస్ ఫిల్ లుగా, భాషలో ప్రావీణ్యత, తఫ్సీర్, ఉసూలె తఫ్సీర్, హదీస్, ఉసూలె హదీస్, ఫిఖ్, ఉసూలె ఫిఖ్, నహూ, సర్ఫ్ అంటే అరబీ గ్రామర్, ఫిఖ్, ఉసూలె ఫిఖ్, అల్-బలాగా, ఇల్ముల్ మఆనీ, ఇల్ముల్ బయాన్, ఇల్ముల్ ఫరాయిజ్, వగైరా మొదలగునవి.

అలాగే, ఈ విషయం గురించి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరా తౌబా ఆయత్ నంబర్ 122లో ఇలా సెలవిచ్చాడు:

فَلَوْلَا نَفَرَ مِن كُلِّ فِرْقَةٍ مِّنْهُمْ طَائِفَةٌ لِّيَتَفَقَّهُوا فِي الدِّينِ وَلِيُنذِرُوا قَوْمَهُمْ إِذَا رَجَعُوا إِلَيْهِمْ لَعَلَّهُمْ يَحْذَرُونَ
ప్రతి పెద్ద సమూహంలో నుంచి ఒక చిన్న సమూహం బయలుదేరి ధర్మ అవగాహనను పెంపొందించుకోవాలి. పెంపొందించుకుని వారు తమ వద్దకు తిరిగి వచ్చినప్పుడు, వారు భయభక్తులను అలవరుచుకునేందుకు గాను వారికి భయబోధ చేయాల్సింది.

ధర్మ జ్ఞానాన్ని ఆర్జించాలని ఈ ఆయత్ మనకు నొక్కి చెబుతుంది. ధర్మ విద్య కోసం ప్రతి పెద్ద జన సమూహం నుంచి, ప్రతి తెగ నుంచి కొంతమంది తమ ఇల్లు వాకిలిని వదలి జ్ఞాన పీఠాలకు, ధార్మిక విశ్వవిద్యాలయాలకు వెళ్ళాలి. ధర్మ జ్ఞానానికి సంబంధించిన వివిధ విభాగాలలో పాండిత్యాన్ని పెంపొందించుకోవాలి. ఆ తర్వాత తమ తమ ప్రదేశాలకు తిరిగి వెళ్లి ప్రజలకు ధర్మ ధర్మాలను విడమరిచి చెప్పాలి, మంచిని ప్రబోధించాలి, చెడుల నుంచి వారించాలి. ధర్మ అవగాహన అంటే ఇదే.

అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇలా సెలవిచ్చాడు ఆలి ఇమ్రాన్‌లో ఆయత్ నంబర్ ఏడు, సూరా ఆలి ఇమ్రాన్.

هُوَ الَّذِي أَنزَلَ عَلَيْكَ الْكِتَابَ مِنْهُ آيَاتٌ مُّحْكَمَاتٌ هُنَّ أُمُّ الْكِتَابِ وَأُخَرُ مُتَشَابِهَاتٌ ۖ فَأَمَّا الَّذِينَ فِي قُلُوبِهِِمْ زَيْغٌ فَيَتَّبِعُونَ مَا تَشَابَهَ مِنْهُ ابْتِغَاءَ الْفِتْنَةِ وَابْتِغَاءَ تَأْوِيلِهِ ۗ وَمَا يَعْلَمُ تَأْوِيلَهُ إِلَّا اللَّهُ ۗ وَالرَّاسِخُونَ فِي الْعِلْمِ يَقُولُونَ آمَنَّا بِهِ كُلٌّ مِّنْ عِندِ رَبِّنَا ۗ وَمَا يَذَّكَّرُ إِلَّا أُولُو الْأَلْبَابِ

నీపై గ్రంథాన్ని అవతరింపజేసిన వాడు ఆయనే. అందులో సుస్పష్టమైన ముహ్కమాత్ వచనాలు ఉన్నాయి, స్పష్టమైన వచనాలు, ఆయతులు ఉన్నాయి, అవి గ్రంథానికి మూలం. వ ఉఖరు ముతషాబిహాత్. మరికొన్ని ముతషాబిహాత్ ఆయతులు ఉన్నాయి, అంటే బహువిధ భావంతో కూడిన వచనాలు. ఫ అమ్మల్లజీన ఫీ కులూబిహిమ్ జైగున్, ఎవరి హృదయాలలో వక్రత ఉంటుందో, వారు ఏం చేస్తారు? ఫయత్తబిఊన మా తషాబహ మిన్హుబ్తిగా అల్ ఫిత్నతి వబ్తిగా అతఅవీలిహి, వారు అందులోని అంటే ఆ ముతషాబిహాత్‌లోని బహువిధ భావ వచనాల వెంటపడి ప్రజలను భ్రష్టు పట్టించడానికి ప్రయత్నిస్తారు. తమ ఉద్దేశాలకు అనుగుణంగా తాత్పర్యాలు చేస్తారు. నిజానికి వాటి వాస్తవికత అల్లాహ్‌కు తప్ప మరెవరికీ తెలియదు. కాకపోతే ఆ తర్వాత అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: వర్రాసిఖూన ఫిల్ ఇల్మి యకూలూన ఆమన్నా బిహి కుల్లుమ్ మిన్ ఇంది రబ్బినా వమా యజ్జక్కరు ఇల్లా ఉలుల్ అల్బాబ్. అంటే, అయితే జ్ఞానంలో పరిపక్వత పొందిన వారు, ధర్మ అవగాహనం కలిగిన వారు, జ్ఞానంలో పరిపక్వత కలిగిన వారు, పొందిన వారు మాత్రం, మేము వీటిని విశ్వసించాము, ఇవన్నీ మా ప్రభువు తరపు నుంచి వచ్చినవే అని అంటారు. వాస్తవానికి బుద్ధిజ్ఞానులు కలవారు మాత్రమే హితబోధను గ్రహిస్తారు. ఇది ఇల్మె ఖాస్ గురించి కొన్ని విషయాలు చెప్పాను నేను, ఇంకా వివరణకి అంత సమయం లేదు కాబట్టి.

ఇక ఇల్మె ఆమ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇల్మె ఆమ్. ఇది ప్రతి వ్యక్తి నేర్చుకోవలసిన జ్ఞానం. ప్రతి వ్యక్తి, ప్రతి ముస్లిం నేర్చుకోవలసిన జ్ఞానం ఇల్మె ఆమ్. దీని గురించే మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: తలబుల్ ఇల్మి ఫరీదతున్ అలా కుల్లి ముస్లిం. ముస్లిం అయిన ప్రతి స్త్రీ పురుషునిపై జ్ఞానాన్ని ఆర్జించటం విధి, తప్పనిసరి అన్నారు. అంటే, తౌహీద్ అంటే ఏమిటి? షిర్క్ అంటే ఏమిటి? బిద్అత్ అంటే ఏమిటి? సున్నత్ అంటే ఏమిటి? నమాజ్ విధానం, దాని వివరాలు, ఉపవాసం, దాని వివరాలు, హజ్, ఉమ్రా, హలాల్ సంపాదన, వ్యవహార సరళి, జీవన విధానం, ధర్మ సమ్మతం అంటే ఏమిటి, అధర్మం అంటే ఏమిటి, హలాల్ సంపాదన ఏమిటి, హరామ్ సంపాదన దేనిని అంటారు? అమ్మ నాన్నకి సంబంధించిన హక్కులు, భార్యాభర్తలకు సంబంధించిన హక్కులు, సంతానానికి సంబంధించిన హక్కులు, ఇరుగుపొరుగు వారి హక్కులు, జంతువుల హక్కులు, ఈ విధంగా ఈ విషయాలు ఇల్మె ఆమ్‌ కిందికి వస్తాయి.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరా ముహమ్మద్ ఆయత్ 19లో ఇలా సెలవిచ్చాడు:

فَاعْلَمْ أَنَّهُ لَا إِلَٰهَ إِلَّا اللَّهُ وَاسْتَغْفِرْ لِذَنبِكَ
ఓ ప్రవక్తా, అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడని నువ్వు బాగా తెలుసుకో. అంటే లా ఇలాహ ఇల్లల్లాహ్ గురించి, తౌహీద్ గురించి, ఏకదైవ ఆరాధన గురించి, ఏకత్వం గురించి, షిర్క్ ఖండన గురించి బాగా తెలుసుకో, స్పష్టంగా తెలుసుకో, నీ పొరపాట్లకు గాను క్షమాపణ వేడుకుంటూ ఉండు. ఈ ఆయత్ ఆధారంగా ఇమాముల్ ముహద్దసీన్, ఇమాం బుఖారీ రహమతుల్లాహి అలైహి తన సహీహ్ బుఖారీలో ఈ చాప్టర్ ఈ విధంగా ఆయన తీసుకొని వచ్చారు:

بَابُ الْعِلْمِ قَبْلَ الْقَوْلِ وَالْعَمَلِ
చెప్పకంటే ముందు, ఆచరించటం కంటే ముందు జ్ఞానం అవసరం అని ఇమాం బుఖారీ రహమతుల్లాహి అలైహి సహీహ్ బుఖారీలో ఒక చాప్టర్ తీసుకొని వచ్చారు.

అభిమాన సోదరులారా, జ్ఞానం, ధర్మ అవగాహన విశిష్టత గురించి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరా ముజాదలా, ఖురాన్‌లోని 28వ భాగంలోని మొదటి సూరా, ఆయత్ 18లో ఇలా సెలవిచ్చాడు:

يَرْفَعِ اللَّهُ الَّذِينَ آمَنُوا مِنكُمْ وَالَّذِينَ أُوتُوا الْعِلْمَ دَرَجَاتٍ
(యర్ఫఇల్లాహుల్లజీన ఆమనూ మిన్కుమ్ వల్లజీన ఊతుల్ ఇల్మ దరజాత్)
మీలో విశ్వసించిన వారి, జ్ఞానం ప్రసాదించబడిన వారి అంతస్తులను అల్లాహ్ పెంచుతాడు.

అంటే ఈ ఆయత్‌లో ప్రత్యేకంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రెండు విషయాలు తెలియజేశాడు. ఒకటి విశ్వాసం, ఆ తర్వాత జ్ఞానం ప్రసాదించబడిన వారు. వారిద్దరి అంతస్తులను అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పెంచుతాడు.

అలాగే, సూరా ఆలి ఇమ్రాన్, ఆయత్ నంబర్ 18లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

شَهِدَ اللَّهُ أَنَّهُ لَا إِلَٰهَ إِلَّا هُوَ وَالْمَلَائِكَةُ وَأُولُو الْعِلْمِ قَائِمًا بِالْقِسْطِ
(షహిదల్లాహు అన్నహూ లా ఇలాహ ఇల్లా హువ వల్ మలాఇకతు వ ఉలుల్ ఇల్మి కాఇమం బిల్ కిస్త్)
అల్లాహ్ తప్ప మరో ఆరాధ్య దైవం లేడని స్వయంగా అల్లాహ్ మరియు ఆయన దూతలు, జ్ఞాన సంపన్నులు, జ్ఞానులు, ధార్మిక పండితులు, ధర్మ అవగాహన కలిగిన వారు సాక్ష్యమిస్తున్నారు. ఆయన సమత్వం, సమతూకంతో ఈ విశ్వాన్ని నిలిచి ఉంచాడు, నిలిపి ఉంచాడు.

అలాగే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరా అన్‌కబూత్ ఆయత్ 43లో ఇలా సెలవిచ్చాడు:

وَتِلْكَ الْأَمْثَالُ نَضْرِبُهَا لِلنَّاسِ ۖ وَمَا يَعْقِلُهَا إِلَّا الْعَالِمُونَ
ప్రజలకు బోధ పరచడానికి మేము ఈ ఉపమానాలను ఇస్తున్నాము. అయితే జ్ఞానం కలవారు మాత్రమే వీటిని అర్థం చేసుకోగలుగుతారు.

అభిమాన సోదరులారా, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఆయతులు, ప్రామాణిక హదీసులు ఉన్నాయి. మోక్షానికి మార్గం, స్వర్గానికి దారి, నరకము నుంచి కాపాడుకోవటం దీనికి ప్రథమంగా ఉండేది జ్ఞానం. నేను రెండు ఉదాహరణలు ఇచ్చి రెండవ అంశం పైన నేను పోతాను.

మొదటి ఉదాహరణ ఆదం అలైహిస్సలాం ఉదాహరణ. సూరా బఖరా ప్రారంభంలోనే మనకు ఆ ఆయతులు ఉంటాయి.

وَعَلَّمَ آدَمَ الْأَسْمَاءَ كُلَّهَا ثُمَّ عَرَضَهُمْ عَلَى الْمَلَائِكَةِ فَقَالَ أَنبِئُونِي بِأَسْمَاءِ هَٰؤُلَاءِ إِن كُنتُمْ صَادِقِينَ
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆదం అలైహిస్సలాంను సృష్టించిన తర్వాత మొదటి పని ఏమిటి? ఆదం అలైహిస్సలాంకు జ్ఞానాన్ని నేర్పించాడు. వఅల్లమ ఆదమల్ అస్మా కుల్లహా. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆదం అలైహిస్సలాంను సృష్టించిన తర్వాత, అంటే మొదటి మానవుడు, మొదటి వ్యక్తి. సృష్టి తర్వాత ప్రథమంగా అల్లాహ్ చేసిన పని ఏమిటి? జ్ఞానం నేర్పించాడు. ఆ జ్ఞానం కారణంగానే ఆదం అలైహిస్సలాం మస్జూదే మలాయికా అయ్యారు. ఆ వివరానికి నేను పోవ దల్చుకోలేదు. ఇది ఒక ఉదాహరణ.

రెండవ ఉదాహరణ, ఇమాముల్ అంబియా, రహమతుల్లిల్ ఆలమీన్, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మొదటి వాణి, దేనికి సంబంధించిన వాణి వచ్చింది? జ్ఞానం గురించే వచ్చింది. సూరా అలఖ్ మొదటి ఐదు ఆయతులు. ఇఖ్రా బిస్మి రబ్బికల్లజీ ఖలఖ్. ఇఖ్రాతో ఖురాన్ మొదటి ఆయత్ అవతరించింది. జ్ఞానంతో.

అభిమాన సోదరులారా, ఇవి ఉదాహరణగా నేను చెప్పాను. మోక్షానికి మార్గం అనే ఈ అంశం పైన మొదటి ముఖ్యమైన విషయం జ్ఞానం. ఎందుకంటే జ్ఞానం లేనిదే ఇస్లాం లేదు, ఇస్లాం విద్య పైనే స్థాపించబడింది. ఇది మొదటి విషయం, సరైన అవగాహన కలిగి ఉండాలి. దేని గురించి? ధర్మం గురించి, ఖురాన్ గురించి, అల్లాహ్ గురించి, విశ్వాసాల గురించి సరైన జ్ఞానం కలిగి ఉండాలి. ఇది మొదటి విషయం.

ఇక ఈ రోజుకి అంశానికి సంబంధించిన రెండవ అంశం, రెండవ విషయం, అది అల్ ఇల్తిజాము బిహా. అమల్, ఆచరణ, స్థిరత్వం. అంటే దానికి కట్టుబడి ఉండటం. ఏదైతే ఆర్జించామో, నేర్చుకున్నామో దానిపై స్థిరంగా ఉండాలి.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇలా సెలవిచ్చాడు:

وَالْعَصْرِ إِنَّ الْإِنسَانَ لَفِي خُسْرٍ إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَتَوَاصَوْا بِالْحَقِّ وَتَوَاصَوْا بِالصَّبْرِ
(వల్ అస్ర్ ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్ ఇల్లల్లజీన ఆమనూ వ అమిలుస్సాలిహాతి వతవాసవ్ బిల్ హక్కి వతవాసవ్ బిస్సబ్ర్)
నిశ్చయంగా మానవుడు నష్టంలో పడి ఉన్నాడు. అయితే విశ్వసించి సత్కార్యాలు చేసిన వారు, పరస్పరం సత్యం గురించి ఉపదేశించిన వారు, ఒండొకరికి సహనం గురించి తాకీదు చేసిన వారు మాత్రం నష్టపోరు.

ఈ సూరా యొక్క తఫ్సీర్, వివరణలోకి నేను పోవటం లేదు. ఈ సూరాలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నాలుగు విషయాలు వివరించాడు. ఈమాన్, విశ్వాసం. రెండవది ఆచరణ, అల్ ఇల్తిజాము బిహా, ఆచరణ, అమల్. మూడవది, సత్యం, ఒకరి గురించి ఒకరికి చెప్పుకోవటం, అంటే అమర్ బిల్ మారూఫ్ వ నహీ అనిల్ మున్కర్, దావత్, ప్రచారం చేయటం. నాలుగవది, సబర్, సహనం. అంటే విద్యను, జ్ఞానాన్ని ఆర్జించే సమయంలో, విషయంలో, ఆ ప్రక్రియలో, విశ్వాసపరంగా జీవించే సందర్భంలో, ఆచరించే విషయంలో, అమర్ బిల్ మారూఫ్ వ నహీ అనిల్ మున్కర్, దావత్ విషయంలో ఆపదలు రావచ్చు, సమస్యలు రావచ్చు, కష్టాలు రావచ్చు, నష్టాలు రావచ్చు, సహనంతో ఉండాలి అనేది ఈ నాలుగు ముఖ్యమైన విషయాలు అల్లాహ్ ఈ సూరాలో తెలియజేశాడు. అంటే జ్ఞానం తర్వాత, విశ్వాసం తర్వాత, ఆచరణ, కట్టుబడి ఉండటం, ఆచరించటం.

ఈ విషయం గురించి ఖురాన్‌లో ఒకచోట కాదు, రెండు సార్లు కాదు, పది సార్లు కాదు, అనేక సార్లు, 40-50 సార్ల కంటే ఎక్కువ ఆయతులు ఉన్నాయి దీనికి సంబంధించినవి. నేను ఒక ఐదు ఆరు ఉదాహరణగా చెప్తాను. సూరా కహఫ్, ఆయత్ నంబర్ 107. ఈ రోజు ఈ ప్రోగ్రాం ప్రారంభమైంది సూరా కహఫ్‌లోని చివరి నాలుగు ఆయతుల పారాయణంతో. ఈ ఆయత్, సూరా కహఫ్, ఆయత్ నంబర్ 107.

إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ كَانَتْ لَهُمْ جَنَّاتُ الْفِرْدَوْسِ نُزُلًا
విశ్వసించి సత్కార్యాలు చేసిన వారికి ఆతిథ్యంగా ఫిరదౌస్ వనాలు ఉంటాయి.

అభిమాన సోదరులారా, ఇక్కడ ఒక గమనిక, ఇప్పుడు నేను ఆచరణ అనే విషయానికి చెప్తున్నాను, విషయం చెప్తున్నాను. విశ్వాసం అంటే ధర్మ పండితులు, జ్ఞానం జ్ఞానంతో పోల్చారు. విశ్వాసం అంటే జ్ఞానం అని కూడా మనము అర్థం చేసుకోవచ్చు. ఓకే, విశ్వాసం, జ్ఞానం. ఆ తర్వాత ఆచరణ. ఈ ఆయత్‌లో అల్లాహ్ ఏం సెలవిచ్చాడు? విశ్వసించి, విశ్వాసం తర్వాత, జ్ఞానం తర్వాత, సత్కార్యాలు చేసిన వారికి ఆతిథ్యంగా ఫిరదౌస్ వనాలు ఉన్నాయి. ఫిరదౌస్ వనం అనేది స్వర్గంలోని అత్యున్నత స్థానం. అందుకే మీరు అల్లాహ్‌ను స్వర్గం కోరినప్పుడల్లా జన్నతుల్ ఫిరదౌస్‌ను కోరండి, ఎందుకంటే అది స్వర్గంలోని అత్యున్నత స్థలం, స్వర్గంలోని సెలయేరులన్నీ అక్కడి నుంచే పుడతాయి అని మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఈ హదీస్ బుఖారీ కితాబుత్తౌహీద్‌లో ఉంది.

అలాగే, సూరా కహఫ్‌లోనే ఆయత్ నంబర్ 30లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ إِنَّا لَا نُضِيعُ أَجْرَ مَنْ أَحْسَنَ عَمَلًا
విశ్వసించి సత్కార్యాలు చేసిన వారి విషయం, నిశ్చయంగా మేము ఉత్తమ ఆచరణ చేసిన వారి ప్రతిఫలాన్ని వృథా కానివ్వము.

ఎవరి కర్మలు, ఎవరి ప్రతిఫలం వృథా కాదు? ఈ ఆయత్ యొక్క అనువాదం గమనించండి. ఇన్నల్లజీన ఆమనూ వ అమిలుస్సాలిహాత్. విశ్వసించి సత్కార్యాలు చేసిన వారు, ఆచరించే వారు, ఏదైతే నేర్చుకున్నారో, ధర్మ అవగాహనం కలిగి ఉన్నారో, ఆ తర్వాత జ్ఞానం తర్వాత దానిపై కట్టుబడి ఉన్నారో, స్థిరంగా ఉన్నారో వారి ప్రతిఫలాన్ని అల్లాహ్ వృథా చేయడు. ఈ ఆయత్‌లో అల్లాహ్ సెలవిచ్చాడు.

అలాగే, సూరా బఖరా ఆయత్ నంబర్ 277లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَأَقَامُوا الصَّلَاةَ وَآتَوُا الزَّكَاةَ لَهُمْ أَجْرُهُمْ عِندَ رَبِّهِمْ وَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ
విశ్వసించి (సున్నత్‌ ప్రకారం) సత్కార్యాలు చేసేవారికి, నమాజులను నెలకొల్పేవారికి, జకాత్‌ను చెల్లించేవారికి తమ ప్రభువు వద్ద పుణ్యఫలం ఉంది. వారికెలాంటి భయంగానీ, చీకూ చింతగానీ ఉండవు.

ఈ ఆయత్ యొక్క అర్థాన్ని గమనించండి. విశ్వసించి సత్కార్యాలు చేసే వారికి, విశ్వసించిన తర్వాత, ఆర్జించిన తర్వాత, అవగాహన కలిగిన తర్వాత, దానిపైన స్థిరంగా ఉండేవారికి, కట్టుబడి ఉండేవారికి, నమాజులను నెలకొల్పే వారికి, జకాతులను చెల్లించే వారికి, తమ ప్రభువు వద్ద పుణ్యఫలం ఉంది, వారికి ఎలాంటి భయం గానీ, చీకూచింత గానీ ఉండదు. అభిమాన సోదర సోదరీమణులారా,

ఈ ఆయత్‌లో నేను ముఖ్యంగా రెండు విషయాలు చెప్పదలిచాను, బాగా గమనించి వింటారని ఆశిస్తున్నాను, గ్రహిస్తారని ఆశిస్తున్నాను. ఈ ఆయత్‌లో రెండు విషయాలు ఉన్నాయి, ఒకటి ఉంది ఖౌఫ్, రెండవది ఉంది హుజ్న్. ఖౌఫ్ అంటే ఉర్దూలో డర్, తెలుగులో భయం. హుజ్న్ అంటే ఉర్దూలో గమ్, తెలుగులో దుఃఖం, చింత. ఇక దీనికి మనము అసలు ఖౌఫ్ దేనిని అంటారు, హుజ్న్ దేనిని అంటారు? భయం అంటే ఏమిటి, హుజ్న్, దుఃఖం, చింత అంటే ఏమిటి? ఇది మనం తెలుసుకోవాలి.

ఖౌఫ్ అంటే భవిష్యత్తులో ప్రమాదానికి సంబంధించినది. భవిష్యత్తులో, రాబోయే కాలంలో. ప్రమాదానికి సంబంధించినది. గతంలో జరిగిన ప్రమాదం వల్ల కలిగే బాధను హుజ్న్ అంటారు. తేడా చూడండి. ఖౌఫ్ అంటే భవిష్యత్తులో ప్రమాదానికి సంబంధించిన విషయం. హుజ్న్ అంటే చింత అంటే, దుఃఖం అంటే, గతంలో జరిగిన ప్రమాదం వల్ల కలిగే బాధకు సంబంధించినది. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే ధర్మ పండితుల వివరణ ఏమిటంటే, భయం, ఖౌఫ్ అనేది గ్రహించిన ప్రమాదం వల్ల కలిగే ఆటంకం. హుజ్న్, గమ్, చింతన అంటే మానసిక క్షోభ లేదా గుండె యొక్క డిప్రెషన్ ని అంటారు. అల్లాహు అక్బర్. అంటే, ధర్మ అవగాహన తర్వాత, జ్ఞానం తర్వాత, కట్టుబడి ఉంటే ఈ రెండు ఉండవు. ఖౌఫ్ ఉండదు, హుజ్న్ ఉండదు. భయము ఉండదు, దుఃఖం ఉండదు. గతం గురించి, భవిష్యత్తు గురించి. ఇంత వివరం ఉంది ఈ ఆయత్‌లో.

అభిమాన సోదరులారా, అలాగే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరా యూనుస్, సూరా యూనుస్ ఆయత్ నంబర్ తొమ్మిదిలో ఇలా సెలవిచ్చాడు:

إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ يَهْدِيهِمْ رَبُّهُم بِإِيمَانِهِمْ ۖ تَجْرِي مِن تَحْتِهِمُ الْأَنْهَارُ فِي جَنَّاتِ النَّعِيمِ
నిశ్చయంగా విశ్వసించి సత్కార్యాలు చేసిన వారికి వారి ప్రభువు వారి విశ్వాసం కారణంగా వారిని గమ్యస్థానానికి చేరుస్తాడు. క్రింద కాలువలు ప్రవహించే అనుగ్రహభరితమైన స్వర్గ వనాలలోకి.

అభిమాన సోదరులారా, సమయం అయిపోతా ఉంది నేను తొందర తొందరగా కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను.

إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ سَيَجْعَلُ لَهُمُ الرَّحْمَٰنُ وُدًّا
విశ్వసించి సత్కార్యాలు చేసిన వారి యెడల కరుణామయుడైన అల్లాహ్ ప్రేమానురాగాలను సృజిస్తాడు. (సూరా మర్యం ఆయత్ 96)

సుబ్ హా నల్లాహ్. విశ్వసించి, దానిపై కట్టుబడి ఉంటే, స్థిరత్వంగా ఉంటే, ఆచరిస్తే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రేమానురాగాలను సృజిస్తాడు. అంటే, ప్రజల హృదయాలలో వారి పట్ల ప్రేమను, గౌరవ భావాన్ని జనింపజేస్తాడు అన్నమాట.

అలాగే సూరా బయినా ఆయత్ ఏడులో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ أُولَٰئِكَ هُمْ خَيْرُ الْبَرِيَّةِ
అయితే విశ్వసించి, సత్కార్యాలు చేసినవారు; నిశ్చయంగా సృష్టిలో వారే అందరికన్నా ఉత్తములు.(98:7)

మానవులలో, ప్రజలలో, మనుషులలో అందరికంటే ఉత్తమమైన వారు, గొప్పమైన వారు, ఉన్నత స్థాయికి చేరిన వారు ఎవరు? విశ్వసించి సత్కార్యాలు చేసిన వారు. నిశ్చయంగా సృష్టిలో వారే అందరికంటే ఉత్తములు అని సాక్ష్యం ఎవరు ఇస్తున్నారు? సకల లోకాలకు సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా.

అభిమాన సోదరులారా, అబూ అమర్ లేదా అబీ అమ్రా సుఫియాన్ బిన్ అబ్దుల్లా కథనం, నేను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అడిగాను. ఆయన ఏం అడిగారు ప్రవక్త గారితో? నాకు ఇస్లాం గురించి ఏమైనా బోధించండి. అయితే దాని గురించి నేను మిమ్మల్ని తప్ప వేరొకళ్ళని అడగవలసిన అవసరం రాకూడదు. ఒక విషయం చెప్పండి అది విని నేను ఆచరించిన తర్వాత ఇంకెవ్వరికీ అడిగే నాకు అవసరమే రాకూడదు, అటువంటి విషయం ఏమైనా బోధించండి అని ఆయన కోరితే మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా బోధించారు: ఒకే ఒక వాక్యం. దాంట్లో రెండు విషయాలు ఉన్నాయి.

آمَنْتُ بِاللهِ ثُمَّ اسْتَقِمْ
(ఆమన్తు బిల్లాహి సుమ్మస్తకిమ్)

అంటే, నేను అల్లాహ్‌ను నమ్ముతున్నాను, నేను అల్లాహ్‌ను విశ్వసిస్తున్నాను, అల్లాహ్ పట్ల విశ్వాసం, ఈమాన్ కలిగి ఉన్నాను అని చెప్పు. తర్వాత ఆ మాట పైనే స్థిరంగా, నిలకడగా ఉండు అని మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారు. అంటే చివరి శ్వాస వరకు ఈమాన్ పైనే స్థిరంగా ఉండాలి, నిలకడగా ఉండాలి అన్నమాట. అభిమాన సోదరులారా, ఈ విధంగా దీనికి సంబంధించిన ఆయతులు, ఖురాన్ ఆయతులు, హదీసులు చాలా ఉన్నాయి.

ఇక, మోక్షానికి మార్గం ఈ అంశానికి సంబంధించిన నేను మూడు విషయాలు చెప్తానని ప్రారంభంలో అన్నాను. ఒకటి జ్ఞానం, కొన్ని విషయాలు తెలుసుకున్నాము. రెండవది దానిపై కట్టుబడి ఉండటం. ఇల్మ్ తర్వాత అమల్. జ్ఞానం తర్వాత ఆచరణ. ఇక ఈ రోజు నా మూడవ విషయం ఏమిటంటే,

أَلدَّعْوَةُ إِلَيْهَا (అద్దఅవతు ఇలైహా) – ఇతరులకు అందజేయటం. దావత్.

ఇల్మ్, అమల్, దావత్.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరా ఆలి ఇమ్రాన్, ఆయత్ 104లో ఇలా సెలవిచ్చాడు:

وَلْتَكُن مِّنكُمْ أُمَّةٌ يَدْعُونَ إِلَى الْخَيْرِ وَيَأْمُرُونَ بِالْمَعْرُوفِ وَيَنْهَوْنَ عَنِ الْمُنكَرِ ۚ وَأُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ
మేలు వైపుకు పిలిచే, మంచిని చేయమని ఆజ్ఞాపించే, చెడుల నుంచి వారించే ఒక వర్గం మీలో ఉండాలి. ఈ పనిని చేసేవారే సాఫల్యాన్ని పొందుతారు.

అలాగే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరా నహల్‌లో ఆయత్ 125లో ఇలా సెలవిచ్చాడు:

ادْعُ إِلَىٰ سَبِيلِ رَبِّكَ بِالْحِكْمَةِ وَالْمَوْعِظَةِ الْحَسَنَةِ ۖ وَجَادِلْهُم بِالَّتِي هِيَ أَحْسَنُ
నీ ప్రభువు మార్గం వైపు జనులను వివేకంతోను, చక్కని ఉపదేశంతోను పిలువు. అత్యుత్తమ రీతిలో వారితో సంభాషణ జరుపు. అంటే, ధర్మ పరిచయ, దావత్ కార్యక్రమానికి సంబంధించిన మూల సూత్రాలు తెలుపబడ్డాయి. ఏ విధంగా ఆహ్వానించాలి? అది వివేకం, మంచి హితబోధ, మృదుత్వంతో కూడుకున్నవి. అత్యుత్తమ రీతిలో మాట్లాడాలి. నగుమోముతోనే విషయాన్ని విడమరిచి చెప్పాలి. మీరు వారి శ్రేయాన్ని అభిలషించే వారన్న అభిప్రాయాన్ని ఎదుటి వారితో కలిగించాలి. దురుసు వైఖరి ఎంత మాత్రం తగదు.

అలాగే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరా ఫుస్సిలత్ ఆయత్ 33లో ఇలా సెలవిచ్చాడు:

وَمَنْ أَحْسَنُ قَوْلًا مِّمَّن دَعَا إِلَى اللَّهِ وَعَمِلَ صَالِحًا وَقَالَ إِنَّنِي مِنَ الْمُسْلِمِينَ
అల్లాహ్ వైపు పిలుస్తూ, సత్కార్యాలు చేస్తూ, నేను విధేయులలో ఒకడను అని పలికే వాని మాట కంటే మంచి మాట మరెవరిది కాజాలదు, కాగలదు. అంటే ఎవరైతే అల్లాహ్ వైపు పిలుస్తాడో, అంటే దావత్ పని చేస్తాడో, ఇతరులకు అందజేస్తాడో, అటువంటి మాట కంటే మంచి మాట, గొప్ప మాట, ఉత్తమమైన మాట ఎవరిది అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అంటున్నాడు.

అభిమాన సోదరులారా, సూరా మాయిదా ఆయత్ నంబర్ 78. ఈ విషయం చాలా ముఖ్యమైనది.

لُعِنَ الَّذِينَ كَفَرُوا مِن بَنِي إِسْرَائِيلَ عَلَىٰ لِسَانِ دَاوُودَ وَعِيسَى ابْنِ مَرْيَمَ ۚ ذَٰلِكَ بِمَا عَصَوا وَّكَانُوا يَعْتَدُونَ كَانُوا لَا يَتَنَاهَوْنَ عَن مُّنكَرٍ فَعَلُوهُ ۚ لَبِئْسَ مَا كَانُوا يَفْعَلُونَ
బనీ ఇస్రాయీల్‌లోని అవిశ్వాసులు దావూద్ నోట, మర్యం పుత్రుడైన ఈసా అలైహిస్సలాం నోట, దావూద్ అలైహిస్సలాం నోట, ఈసా అలైహిస్సలాం నోట శపించబడ్డారు, శాపానికి గురయ్యారు. ఎందుకంటే, ఎందుకు? కారణం ఏమిటి? వారు అవిధేయతకు పాల్పడేవారు, హద్దు మీరి ప్రవర్తించేవారు. అంతేకాకుండా చివర్లో అల్లాహ్ ఈ ముఖ్యమైన కారణం చెప్పాడు. అది ఏమిటి? కానూ లా యతనాహౌన అమ్ మున్కరిన్ ఫఅలూహు లబిఅస మా కానూ యఫ్అలూన్. వారు తాము చేసే చెడు పనుల నుండి ఒండొకరిని నిరోధించే వారు కారు. వారు చేస్తూ ఉండినది బహు చెడ్డది. ఈ ఆయత్‌లో బనీ ఇస్రాయీల్‌లోని ఒక వర్గానికి దావూద్ అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం నోట శపించబడ్డారు, శపించబడటం జరిగింది, ఒక వర్గం శపించబడ్డారు. కారణం ఏమిటి? ముఖ్యమైన మూడు కారణాల వల్ల వారు శాపానికి గురయ్యారు, ప్రవక్తల ద్వారా. ఆ ముఖ్యమైన మూడు విషయాలు ఏమిటి? ఒకటి, అల్లాహ్ విధిని నెరవేర్చకుండా ఉండటం. ఒకటి అల్లాహ్ విధిని వారు నెరవేర్చలేదు. అంటే ఆచరించలేదు. వారికి ఏ ధర్మ జ్ఞానం అల్లాహ్ ఇచ్చాడో, ఏ జ్ఞానాన్ని అల్లాహ్ వారికి ఇచ్చాడో, ఏ ఆదేశాలు అల్లాహ్ వారికి ఇచ్చాడో, ఏ జ్ఞానం వారికి తెలుసో దానిపైన వారు ఆచరించలేదు, జ్ఞానం తర్వాత ఆచరణ లేదు.

రెండవ కారణం ఏమిటి? ధర్మం విషయంలో అతిశయించటం, గులూ చేయటం. మూడవ విషయం ఏమిటి? చెడుల నుంచి ఆపే పని చేయకపోవటం. అంటే అమర్ బిల్ మారూఫ్ వ నహీ అనిల్ మున్కర్, దావా పని వారు చేయలేదు. ముఖ్యమైన ఈ మూడు కారణాల వల్ల బనీ ఇస్రాయీల్‌లోని ఒక వర్గం దావూద్ అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం నోట శపించబడ్డారు. ఇది మనము గ్రహించాల్సిన విషయం.

అభిమాన సోదరులారా, ఇక దావత్ విషయంలో, ఇతరులను, ధర్మాన్ని, జ్ఞానాన్ని అందజేసే విషయంలో, ముఖ్యమైన ఒక విషయం ఉంది. అది మనం గమనించాలి. అది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరా యూసుఫ్ ఆయత్ 108లో ఇలా సెలవిచ్చాడు:

قُلْ هَٰذِهِ سَبِيلِي أَدْعُو إِلَى اللَّهِ ۚ عَلَىٰ بَصِيرَةٍ أَنَا وَمَنِ اتَّبَعَنِي ۖ وَسُبْحَانَ اللَّهِ وَمَا أَنَا مِنَ الْمُشْرِكِينَ
అల్లాహు అక్బర్. ఈ ఆయత్ యొక్క పూర్తి నేను వివరణలోకి పోను అంత సమయం కూడా లేదు. క్లుప్తంగా దీని అర్థం తెలుసుకుందాము. ఓ ప్రవక్తా, ఇలా చెప్పు, నా మార్గం అయితే ఇదే. నేను, నా అనుయాయులు పూర్తి అవగాహనతో, దృఢ నమ్మకంతో అల్లాహ్ వైపుకు పిలుస్తున్నాము. అల్లాహ్ పరమ పవిత్రుడు. నేను అల్లాహ్‌కు భాగస్వాములను కల్పించే వారిలోని వాడిని కాను, అంటే నేను ముష్రిక్‌ను కాను. అంటే, తౌహీద్ మార్గమే నా మార్గం, మొదటి విషయం. రెండవది, నేనే కాదు ప్రవక్తలందరి మార్గం కూడా ఇదే. మూడవది, నేను ఈ మార్గం వైపు ప్రజలని ఆహ్వానిస్తున్నాను, దావా పని చేస్తున్నాను కదా, పూర్తి విశ్వాసంతోను, ప్రమాణబద్ధమైన ఆధారాలతోను, నేను ఈ మార్గం వైపునకు పిలుస్తున్నాను. నేను మాత్రమే కాదు, నన్ను అనుసరించే వారు కూడా ఈ మార్గం వైపుకే పిలుస్తున్నారు. అల్లాహ్ పరిశుద్ధుడు, దోషరహితుడు, సాటిలేని వాడు, ప్రజలు కల్పించే భాగస్వామ్యాలకు, పోలికలకు ఆయన అతీతుడు. అంటే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే దావత్ విధానం, గూగుల్ సార్‌ని ఆధారంగా తీసుకొని, నాలుగు పుస్తకాలు లేకపోతే నాలుగు విషయాల, నాలుగు సబ్జెక్టుల, నాలుగు సబ్జెక్టులు కంఠస్థం చేసుకొని లేదా నాలుగు ఆడియోలు, వీడియోల క్లిప్పులు చేసి అది కంఠస్థం చేసుకొని సూటు బూటు వేసుకొని ధర్మ పండితులు అవ్వరు. సరైన ధర్మ అవగాహనం కలిగి ఉండాలి. అదఊ ఇలా ఇలల్లాహి అలా బసీరతిన్, పూర్తి విశ్వాసం తర్వాత ప్రమాణబద్ధమైన ఆధారాలతోను.

అభిమాన సోదరులారా, ఇక చివర్లో నేను ఒక్క హదీస్ చెప్పి నా ఈ ప్రసంగాన్ని ముగిస్తాను. ఈ హదీస్ బుఖారీ గ్రంథంలో ఉంది. చిన్న హదీస్, మూడే మూడు పదాలు ఉన్నాయి ఆ హదీస్‌లో. అది ఏమిటంటే, కాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

بَلِّغُوا عَنِّي وَلَوْ آيَةً
(బల్లిగూ అన్నీ వలవ్ ఆయహ్)

నా తరఫు నుండి ఒక్క ఆయత్ అయినా సరే మీకు తెలిస్తే, అది ఇతరులకు అందజేసే బాధ్యత మీ పైన ఉంది. ఈ హదీస్‌లో మూడు ముఖ్యమైన విషయాలు ఇమాం హసన్ బసరీ రహమతుల్లాహి అలైహి వివరించారు. బల్లిగూ అనే పదంలో తక్లీఫ్ ఉంది. అన్నీ అనే పదంలో తష్రీఫ్ ఉంది. వలవ్ ఆయహ్ అనే పదంలో తస్హీల్ ఉంది. తక్లీఫ్ అంటే బాధ్యత. బల్లిగూ అనే మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారు. ఆదేశం అది, ఆర్డర్. బల్లిగూ. అంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బాధ్యత ఇస్తున్నారు, ముకల్లఫ్ చేస్తున్నారు. ఇతరులను అందజేసే బాధ్యత మీపై ఉంది, మీపై మోపుతున్నాను, ఈ విషయం గ్రహించండి. ఈ పదంలో తక్లీఫ్ ఉంది. ఆ బాధ్యతను మనం తెలుసుకోవాలి, గ్రహించాలి. రెండవది అన్నీలో తష్రీఫ్ ఉంది. తష్రీఫ్ అంటే గౌరవం. నా తరఫు నుంచి వచ్చిన విషయాలు, నా తరఫు నుంచి, గమనించాలి, వివరణకి పోవటానికి సమయం లేదు, నా తరఫు నుంచి అంటే ఖురాన్, ప్రామాణికమైన హదీసులు మాత్రమే. అన్నీ. ఏ హదీస్ కి ప్రామాణికం లేదో, ఆ విషయాలు చర్చించకూడదు. మౌజూ హదీస్, మన్ఘడత్ హదీస్, ఖురాఫాత్, ఇస్రాయీలియాత్, వారి వెంట పడకూడదు. అన్నీ నా తరఫు నుంచి స్పష్టంగా ఈ వాక్యం నేను చెప్పాను. ఖురాన్ గురించి సందేహం లేదు. కాకపోతే ఖురాన్ యొక్క అవగాహన, ఈ వాక్యానికి భావం ఏమిటి? ఈ వాక్యానికి అర్థం సహాబాలు ఎలా చేసుకున్నారు? ఈ వాక్యానికి అర్థం ప్రవక్త గారు ఎలా చెప్పారు? ఆ వాక్యానికి అర్థం సహాబాలు, తాబయీన్లు, ముహద్దసీన్లు, సలఫ్‌లు ఏ అర్థం తీసుకున్నారో ఆ అర్థమే మనం తీసుకోవాలి. హదీస్ విషయంలో, ప్రవక్త గారి ప్రవచనాల విషయంలో అన్నీ, నా తరఫు నుంచి, ఈ హదీస్ సహీహ్, ఈ హదీస్ ప్రామాణికమైనది, ఇది హసన్ అని మీకు నమ్మకం అయితేనే మీరు చెప్పాలి. అన్నీ ఎందుకంటే అది గౌరవంతో పాటు ప్రవక్త గారు కండిషన్ పెట్టారు, నా తరఫు నుంచి వచ్చే హదీసులు చెప్పండి. అంటే ఏ విషయం గురించి స్పష్టత లేదో, ఇది ప్రవక్త గారి వాక్యం కాదు, స్పష్టత లేదు, మౌజూ హదీస్, మున్కర్ హదీస్, జయీఫ్ హదీస్, మన్ఘడత్ హదీస్ అంటే ఏంటి? అది ప్రవక్త గారు చెప్పారని రుజువు లేదు. అటువంటి విషయాలు మనం చెప్పకూడదు. బల్లిగూ అన్నీ వలవ్ ఆయాలో మొదటిది బాధ్యత ప్రవక్త గారు మాకు అప్పగిస్తున్నారు. అల్లాహు అక్బర్. రెండవది అన్నీ, ప్రవక్త గారు మాకు గౌరవాన్ని ప్రసాదిస్తున్నారు. వలవ్ ఆయహ్ ఈ పదం చెప్పి ప్రవక్త గారు మాకు సులభం చేశారు. శక్తికి మించిన బరువు మోపలేదు. మీకు ఎంత శక్తి ఉందో, ఎంత సామర్థ్యం ఉందో, ఎంత స్తోమత ఉందో, ఎంత జ్ఞానం ఉందో అంతవరకే మీరు బాధ్యులు. ఈ మూడు విషయాలు ఈ హదీస్‌లో చెప్పబడింది.

అభిమాన సోదరులారా, ఈ విధంగా ఈ రోజు నేను మోక్షానికి మార్గం, సాఫల్యం, ఇహపరలోకాల సాఫల్యం, స్వర్గానికి పోయే దారి, నరకం నుండి ఎలా కాపాడుకోవాలి, మోక్షానికి మార్గం సారాంశం, దానికి సంబంధించిన మూడు విషయాలు క్లుప్తంగా చెప్పాను. ఒకటిది జ్ఞానం, ఇల్మ్, అమల్, దావత్. జ్ఞానం, ఆచరణ, దావత్. క్లుప్తంగా చెప్పాలంటే నా ఈ రోజు ప్రసంగానికి సారాంశం ఏమిటి? అత్తఅల్లుము బిద్దీన్, ధర్మ అవగాహన, జ్ఞానం, ఇల్మ్, ఆర్జించటం, ధార్మిక విద్య నేర్చుకోవటం. వల్ ఇల్తిజాము బిహా, నేర్చుకున్న తర్వాత కట్టుబడి ఉండటం, స్థిరత్వం కలిగి ఉండటం, ఆపదలు వస్తాయి, సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి, ముఖ్యంగా ఎంత ఎక్కువ స్థానంలో మనము ఇస్లాంని ఆచరిస్తామో, ఎంత ఉన్నత స్థాయిలో మన విశ్వాసం ఉంటుందో, ఆ విశ్వాస పరంగానే మనకు బాధలు వస్తాయి. అప్పుడు ఆ బాధల్లో, సమస్యల్లో, కష్టాల్లో, నష్టాల్లో మనము మన విశ్వాసాన్ని కోల్పోకూడదు. విశ్వాసంలో లోపం రానివ్వకూడదు. చాలా, దానికి మనకు ఆదర్శం ప్రవక్తలు, సహాబాలు, తాబయీన్లు. వారిని మనము ఆదర్శంగా తీసుకోవాలి, వారికి ఏ విధంగా కష్టాలు వచ్చాయి. వారికి వచ్చే కష్టాలలో ఒక్క శాతం కూడా మాకు రావు, అయినా కూడా వారు, సుమయ్యా రదియల్లాహు అన్హా. మోక్షానికి మార్గం మేము సుమయ్యా రదియల్లాహు అన్హా యొక్క ఉదాహరణ మనం వివరిస్తే సరిపోతుంది కదా. సుమయ్యా రదియల్లాహు అన్హా ప్రారంభంలోనే ఇస్లాం స్వీకరించారు. సన్మార్గ భాగ్యం దక్కింది. ఆ తర్వాత ఆవిడ పైన ఎన్ని కష్టాలు వచ్చాయి. ఒక పక్కన భర్త, ఒక పక్కన తనయుడు. వారికి ఎన్ని కష్టాలు వచ్చాయి, ఎన్ని బాధలు వచ్చాయి, మనం ఊహించలేము. కానీ వారి విశ్వాసంలో కొంచెమైనా తేడా వచ్చిందా? కొంచెమైనా తేడా? చివరికి కొడుకు చూస్తున్నాడు, తనయుడు అమ్మార్ రదియల్లాహు అన్హా కళ్ల ఎదుట సుమయ్యా రదియల్లాహు అన్హాను దుర్మార్గుడైన అబూ జహల్ నాభి కింద పొడిచి హత్య చేశాడు. కానీ వారి విశ్వాసంలో తేడా వచ్చిందా? ఈ రోజు మనము చిన్న చిన్న విషయాలలో, చిన్న చిన్న ప్రాపంచిక లబ్ధి కోసము, చిన్న చిన్న సమస్యలు వచ్చినా మన విశ్వాసంలో తేడా జరిగిపోతా ఉంది.

అభిమాన సోదరులారా, ఆ విధంగా, మొదటి విషయం, అత్తఅల్లుము బిద్దీన్, ధర్మ అవగాహన, జ్ఞానం, ఇల్మ్. రెండవది, అల్ ఇల్తిజాము బిహా, ఆచరణం, కట్టుబడి ఉండటం. మూడవది, వద్దఅవతు ఇలైహా, ధర్మ ప్రచారం చేయటం. ఈ మూడు విషయాల సారాంశం, ఇవాళ తెలుసుకున్నాము.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ చెప్పటం కంటే ఎక్కువ, వినటం కంటే ఎక్కువ, ఇస్లాం ధర్మాన్ని నేర్చుకుని, సరైన అవగాహన కలిగి, ఆ విధంగా ఆచరించి, అలాగే ఇతరులకు ప్రచారం చేసే, అందజేసే సద్బుద్ధిని, శక్తిని, యుక్తిని అల్లాహ్ ప్రసాదించు గాక. ఆమీన్.

వ ఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ధర్మ జ్ఞానం (మెయిన్ పేజీ):
https://teluguislam.net/others/ilm-knowledge

సత్కార్య వనాలు: ధర్మ ప్రచారం, శిక్షణ

బిస్మిల్లాహ్

సత్కార్య వనాలుతొమ్మిదవ వనం
అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia)
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)

నవ వనం – ప్రచారం, శిక్షణ

అల్లాహ్ సాక్షిగా ఇంతకంటే అందమైన తోట మరొకటి ఉండదు; రకరకాల ఫలాలు, ప్రభావితం చేసే పుష్పాలు, ఈ తోట దర్శనానికి వచ్చిన వాడు అలసిపోడు, దాని చెలమలు అంతం కావు. దాని ఛాయ ఎడతెగనిది. దాని ఊటలు లెక్కలేనివి. అందులో తన హృదయం, నోరు మరి ఆలోచనలతో పనితీసుకునువాడే విజయవంతుడు. తేనెటీగ మాదిరిగా; అది విసుగు, అలసట అంటే తెలియదు. రకారకాల రసాన్ని పీల్చుకుంటూ తేనె తయారు చేస్తుంది. ఈ (ప్రచార, శిక్షణ) తోటలో పని చేసేవాడు ప్రతిఫలం పొందుతాడు. దాని కోతకు సిద్ధమయ్యేవాడు లాభం మరియు సంతోషం పొందుతాడు.

ఒక మంచి మాట ద్వారా నీవు బోధన ఆరంభించు. ఎందుకనగా మంచి మాట ఒక సదకా (సత్కార్యం). ఒక చిరునవ్వు ద్వారా ప్రచారం ఆరంభించు. నీ తోటి సోదరునితో నీవు మందహాసముతో మాట్లాడడం కూడా సత్కార్యం. నీ ఉత్తమ నడవడిక ద్వారా నీవు ప్రచారకుడివయిపో. నీవు నీ ధనంతో ప్రజల్ని ఆకట్టుకోలేవు. నీ సద్వర్తనతో ఆకట్టుకోగలుగుతావు.

సోదరా! ప్రవక్తగారి ఒక వచనం అయినా సరే ఇతరుల వరకు చేరవేయి. నీ ప్రేమికుల గుండెల్లో ప్రవక్తి గారి ఒక సంప్రదాయ ప్రేమను కలిగించు. వారి హృదయాలను వారి ప్రభువు విధేయతతో అలంకరించు. వివేకము మరియు మంచి ఉపదేశం ద్వారా వారిని పిలువు. దూరం చేసే మాటలు, కఠోర పద్ధతి విడనాడు.

[فَبِمَا رَحْمَةٍ مِنَ اللهِ لِنْتَ لَهُمْ وَلَوْ كُنْتَ فَظًّا غَلِيظَ القَلْبِ لَانْفَضُّوا مِنْ حَوْلِكَ فَاعْفُ عَنْهُمْ وَاسْتَغْفِرْ لَهُمْ وَشَاوِرْهُمْ فِي الأَمْرِ فَإِذَا عَزَمْتَ فَتَوَكَّلْ عَلَى اللهِ إِنَّ اللهَ يُحِبُّ المُتَوَكِّلِينَ] {آل عمران:159}

(ప్రవక్తా!) అల్లాహ్ యొక్క అనంత కరుణ వల్లనే నీవు వారిపట్ల మృదు స్వభావుడవు అయ్యావు. నీవే గనక కర్కశుడవు కఠిన హృదయుడవు అయినట్లయితే వారందరూ నీ చుట్టు పక్కల నుండి దూరంగా పోయేవారు. (ఆలి ఇమ్రాన్ 3: 159).

నీ పట్ల తప్పు చేసిన వాడిని క్షమించి పిలుపునిచ్చావని ఆశించు. పాపంలో మునిగి ఉన్న నీ సోదరునికి సహాయం చేసి నీ చేత అతని సన్మార్గానికి మార్గం సుగమం చేయి. రుజుమార్గం నుండి దూరమైన ప్రతి ఒక్కరి పట్ల వాత్సల్య కాంతి ద్వారా నీ కళ్ళను ప్రకాశవంతం చేసుకో చివిరికి నీవు ఎవరెవరి కోసం సన్మార్గం కోరుతున్నావో వారికి ఈ కాంతి లభిస్తుంది.

నీ పొరుగువానికి ఒక క్యాసెట్ బహుకరించి, లేదా నీ మిత్రునికి ఓ పుస్తకం పంపి, ఇస్లాం వైపు స్వచ్ఛముగా పిలిచి అల్లాహ్ అతనికి సధ్బాగ్యం ప్రసాదించుగాక అని ఆశిస్తూ కూడా నీవు ప్రచారకునివి కావచ్చు.

నీకు ప్రసాదించబడిన సర్వ శక్తులను, ఉపాయాలను ఉపయోగించి ప్రచారకునివి కావచ్చు. నీవు కాలు మోపిన ప్రతి చోట శుభం కలగజేసేవానివిగా అయిపో. అడ్డంకులుంటాయని భ్రమ పడకు. చిన్నవాటిని మహా పెద్దగా భావించి (భయం చెందకు). విద్యావంతులు, గొప్ప ప్రచారకులతో సంప్రదించి నీ ప్రచారం ఆరభించు. ఇలా నీ ప్రచారం పరిపూర్ణజ్ఞానం మీద ఆధారపడి నడుస్తూ ఉంటుంది.

ادْعُ إِلَى سَبِيلِ رَبِّكَ بِالحِكْمَةِ وَالمَوْعِظَةِ الحَسَنَةِ وَجَادِلْهُمْ بِالَّتِي هِيَ أَحْسَنُ إِنَّ رَبَّكَ هُوَ أَعْلَمُ بِمَنْ ضَلَّ عَنْ سَبِيلِهِ وَهُوَ أَعْلَمُ بِالمُهْتَدِينَ {النحل:125}

నీ ప్రభువు మార్గం వైపునకు పిలువు, వివేకంతో, చక్కని హితబోధతో. ఉత్తమోత్తమ రీతిలో వారితో వాదించు. నీ ప్రభువుకే బాగా తెలుసు; ఆయన మార్గం నుండి తప్పిపోయినవాడు ఎవడో, రుజు మార్గంపై ఉన్నవాడూ ఎవడో. (నహ్ల్ 16: 125).

నీ బాధ్యత సందేశం అందజెయ్యడమే.

وَمَا عَلَينَا إِلَّا الْبَلَاغُ الْـمُبِين. {يس 17}
స్పష్టమైన రీతిలో సందేశాన్ని అందజేయడమే మా బాధ్యత (యాసీన్ 36: 17).

హృదయాలకు మార్గం చూపే బాధ్యత, తాలాలు పడి ఉన్నవాటిలో తాను కోరేవారివి విప్పే బాధ్యత కూడా అల్లాహ్ దే.

ذَلِكَ هُدَى اللهِ يَهْدِي بِهِ مَنْ يَشَاءُ وَمَنْ يُضْلِلِ اللهُ فَمَا لَهُ مِنْ هَادٍ] {الزُّمر:23}
ఇది అల్లాహ్ మార్గదర్శకత్వం. దీని ద్వారా ఆయన తాను కోరిన వారిని సత్యమార్గంపైకి తీసుకువస్తాడు. స్వయంగా అల్లాహ్ మార్గం చూపనివాడికి, మరొక మార్గదర్శకుడు ఎవ్వడూ లేడు. (జుమర్ 39: 23).

నీ ప్రచారం ఫలించినది, దాని ఫలితంగా పండిన ఫలాలు చూసి సంతోషపడు. నీవు పొందే ప్రతి విజయాన్ని నీ కొరకు వేచి చూస్తున్న, నీ అడుగులు పడటానికి ఎదురుచూస్తున్న మరో విజయానికి మెట్టుగా ఉంచి ముందుకెదుగు.

ప్రవక్త ﷺ తమ జాతి వారి సన్మార్గంతో ఎంత సంతోషించారు? కాదు, అనారోగ్య యూదుని పిల్లవాని సన్మార్గంతో ప్రవక్త ﷺ చాలా సంతోషించారు. ఆ సంఘటనను అనస్ ( రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖించారుః

(كَانَ غُلَامٌ يَهُودِيٌّ يَخْدُمُ النَّبِيَّ ﷺ فَمَرِضَ فَأَتَاهُ النَّبِيُّ ﷺ يَعُودُهُ فَقَعَدَ عِنْدَ رَأْسِهِ فَقَالَ لَهُ أَسْلِمْ فَنَظَرَ إِلَى أَبِيهِ وَهُوَ عِنْدَهُ فَقَالَ لَهُ أَطِعْ أَبَا الْقَاسِمِ ﷺ فَأَسْلَمَ فَخَرَجَ النَّبِيُّ ﷺ وَهُوَ يَقُولُ الْحَمْدُ لِلَّهِ الَّذِي أَنْقَذَهُ مِنْ النَّارِ)

ఒక యూద బాలుడు ప్రవక్త సేవ చేస్తూ ఉండేవాడు. ఒకసారి అతని ఆరోగ్యం చెడిపోయింది. అతడ్ని పరామర్శించడానికి ప్రవక్త ﷺ వచ్చి, అతని తలాపున కూర్చున్నారు. కొంతసేపటికి “నీవు ఇస్లాం స్వీకరించు” అని అతనితో అన్నారు. అప్పుడు అతడు అక్కడే ఉన్న తన తండ్రి వైపు చూశాడు. దానికి అతను నీవు అబుల్ ఖాసిం ﷺ (అంటే ప్రవక్త) మాటను అనుసరించు అని అన్నాడు. అప్పుడు ఆ బాలుడు ఇస్లాం స్వీకరించాడు. (ఆ తర్వాత కొంత సేపటికి ఆ బాలుడు చనిపోయాడు. అప్పుడు ప్రవక్త) “అల్ హందులిల్లాహ్! అల్లాహ్ ఇతడిని నరకం నుండి కాపాడాడు” అన్నారు. (బుఖారి 1356).

తలతలలాడే ప్రవక్త మాటలను శ్రద్ధగా విను, అతిఉత్తమ, అతిఉన్నతమైన ప్రచారకులు (అంటే ప్రవక్త) తాను తయ్యారు చేసిన ప్రచారకుల్లో చిత్తశుద్ధిగల ఒకరైనా అలీ బిన్ అబీ తాలిబ్ ( రదియల్లాహు అన్హు) కు ఖైబర్ రోజున ఇలా చెప్పారు:

(ادْعُهُمْ إِلَى الْإِسْلَامِ وَأَخْبِرْهُمْ بِمَا يَجِبُ عَلَيْهِمْ فَوَالله لَأَنْ يُهْدَى بِكَ رَجُلٌ وَاحِدٌ خَيْرٌ لَكَ مِنْ حُمْرِ النَّعَمِ)

“వారిని ఇస్లాం వైపునకు పిలువు. వారిపై విధిగా ఉన్న విషయాల్ని వారికి తెలియజేయి. అల్లాహ్ సాక్షిగా! నీ ద్వారా ఒక్క మనిషికి కూడా సన్మార్గం ప్రాప్తమయ్యిందంటే అది నీకు మేలు జాతికి చెందిన ఎర్ర ఒంటెల కంటే ఎంతో ఉత్తమం”. (బుఖారి 2942).

ప్రచార కార్యం ద్వారా లేదా ఎవరికైనా ఒక ధర్మ విషయం నేర్పడం ద్వారా నీవెన్ని పుణ్యాలు పొందుతావు లెక్కించలేవు. నీవు ఇచ్చిన పిలుపు ప్రకారం ఆచరించే వారు, నీవు నేర్పిన విద్యకు క్రియరూపం ఇచ్చేవారు ఎంతమంది ఉంటారో అంతే పుణ్యం నీకు లభిస్తుంది. వారి పుణ్యాల్లో ఏలాంటి కొరత జరగదు. అల్లాహ్ గొప్ప దయగలవాడు.

ప్రచార కార్యం నీ నుండి, నీ ఇల్లాలు పిల్లలతో, నీ దగ్గరివారితో ఆరంభం చేయి. బహుశా అల్లాహ్ నీ శ్రమలో శుభం కలుగు జేయుగాక. నీ సత్కార్యాన్ని అంగీకరించుగాక. ఆయన చాలా దాతృత్వ, ఉదార గుణం గలవాడు.

అల్లాహ్ వైపు పిలుపుకు సంబంధించిన ఓ సత్కార్య సంఘటన శ్రద్ధగా చదువు. ఎవరితో ఈ సంఘటన జరిగిందో స్వయంగా అతడే చెప్పాడు. అతను ఇటాలీ దేశానికి సంబంధించిన అల్ బర్తో ఓ. పచ్చీని (Alberto O. Pacini).:- నాకు సత్య ధర్మం వైపునకు సన్మార్గం చూపిన అల్లాహ్ కే అనేకానేక స్తోత్రములు. అంతకు మునుపు నేను నాస్తికునిగా, విలాసవంతమైన జీవితం గడుపుతూ మనోవాంఛల పూజ చేసేవాడిని. జీవితం అంటే డబ్బు, పైసా అని. సంపాదనే పరమార్థం అని భావిస్తూ ఉండేవాడిని. ఆకాశ ధర్మాలన్నిటితో విసుగెత్తి పోయి ఉంటిని. ప్రథమ స్థానంలో ఇస్లామే ఉండినది. ఎందుకనగా మా సమాజంలో దానిని చరిత్రలోనే అతి చెడ్డ ధర్మంగా చిత్రీకరిస్తున్నారు. ముస్లిములు అంటే మా మధిలో విగ్రహాలను పూజించేవారు, సహజీవన చేయలేనివారు, ఏదో కొన్ని అగోచరాలను నమ్ముతూ వాటి ద్వారానే తమ సమస్యల పరిష్కారాన్ని కోరువారు. రక్తపిపాసులు, గర్వులు, కపటులు మరియు ఇతరులతో ప్రేమపూర్వకమైన వాతవరణంలో జీవితం గడిపే గుణం లేనివారు అని అనుకునేవాడిని. ఇస్లాంకు వ్యతిరేకమైన ఈ వాతావరణంలో నేను పెరిగాను. కాని అల్లాహ్ నా కొరకు మార్గదర్శకత్వం వ్రాసాడు, అది కూడా సంపాదన కొరకై ఇటాలీ వలస వచ్చిన ఓ ముస్లిం యువకుని ద్వారా. ఏ ఉద్దేశ్యం లేకుండానే నేను అతడిని కలిశాను. ఒక రాత్రి నేను చాలా సేపటి వరకు ఒక బార్ లో రాత్రి గడిపి తిరిగి వస్తున్నాను. మత్తు కారణంగా పూర్తి స్పృహ తప్పి ఉన్నాను. రోడ్ మీద నడుస్తూ వస్తున్నాను నాకు ఏదీ తెలియకుండా ఉంది పరిస్థితి. అకస్మాత్తుగా వేగంగా వస్తున్న ఓ కార్ నన్ను ఢీకొంది. నేలకు ఒరిగాను. నా రక్తంలోనే తేలాడుతుండగా, అప్పుడే ఆ ముస్లిం యువకుడు తారసపడి నా తొలి చికిత్సకు ప్రయత్నం చేశాడు. పోలీస్ కు ఖబరు ఇచ్చాడు. నేను కోలుకునే వరకు నన్ను చూసుకుంటూ నా సేవలో ఉన్నాడు. ఇదంతా నాకు చేసిన వ్యక్తి ఒక ముస్లిం అని నేను నమ్మలేక పోయాను. అప్పుడు నేను అతనికి దగ్గరయ్యాను. అతని ధర్మం యొక్క మూల విషయాలు తెలుపమని కోరాను. దేని గురించి ఆదేశిస్తుంది, దేని గురించి నివారిస్తుందో చెప్పుమన్నాను. అలాగే ఇతర మతాల గురించి నీ ధర్మ అభిప్రాయమేమిటి? ఈ విధంగా ఇస్లాం గురించి తెలుసుకొని, ఆ యువకుని సద్పర్తన వల్ల అతనితో ఉండసాగాను. చివరికి పూర్తి నమ్మకం కలిగింది; నేను అజ్ఞానంలో ఉండి నా ముఖంపై దుమ్ము రాసుకుంటుంటినీ అని, ఇస్లామే సత్యధర్మమని. వాస్తవానికి అల్లాహ్ చెప్పింది నిజమేననిః

وَمَنْ يَبْتَغِ غَيْرَ الإِسْلَامِ دِينًا فَلَنْ يُقْبَلَ مِنْهُ وَهُوَ فِي الآَخِرَةِ مِنَ الخَاسِرِينَ {آل عمران:85}

ఎవడైనా ఈ విధేయతా విధానాన్ని (ఇస్లాం) కాక మరొక మార్గాన్ని అవలంబించదలిస్తే, ఆ మార్గం ఎంతమాత్రం ఆమోదించ బడదు. అతడు పరలోకంలో విఫలుడౌతాడు, నష్టపోతాడు. (ఆలి ఇమ్రాన్ 3: 85).

అప్పుడు నేను ఇస్లాం స్వీకరించాను.


ఈ పోస్ట్ క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది. క్రింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి పూర్తి పుస్తకం చదవండి.

  • సత్కార్య వనాలు (Hadayiq)
    అంశాల నుండి
     : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia)
    అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)

ఇతర లింకులు:

క్రైస్తవులకు దావా (ధర్మ ప్రచారం) ఏ పద్దతిలో ఇవ్వాలి? [వీడియో]

బిస్మిల్లాహ్

[48:23 నిముషాలు]
షేఖ్. డా సఈద్ అహ్మద్ మదనీ (హఫిజహుల్లాహ్)

దావా : ఇస్లాం ధర్మ ప్రచారం.
దాయీ : ధర్మ ప్రచార కర్త.
మద్ఊ : ధర్మ ప్రచారం ఎవరికీ చేయ బడుతుందో వారు.

ధర్మ ప్రచారం (దావా) (మెయిన్ పేజీ)
https://teluguislam.net/dawah/

మంచిని ఆదేశించడంతో పాటు, చెడును ఖండించడం తప్పనిసరి [వీడియో]

బిస్మిల్లాహ్

[5:33 నిముషాలు ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ధర్మ ప్రచారం (దావా) (మెయిన్ పేజీ)
https://teluguislam.net/dawah/

ఓ దాయీల్లారా! బోధించే ముందు మీరు అమలు చేయండి [వీడియో]

బిస్మిల్లాహ్

[3:15 నిముషాలు]
షేఖ్. డా సఈద్ అహ్మద్ మదనీ (హఫిజహుల్లాహ్)

దావా : ధర్మ ప్రచారం.
దాయీ : ధర్మ ప్రచార కర్త.

ధర్మ ప్రచారం (దావా) (మెయిన్ పేజీ)
https://teluguislam.net/dawah/

దాయీలకు (ధర్మ ప్రచారకర్తలకు) కనీస అరబీ బాష ప్రావీణ్యం ఎంతో అవసరం [వీడియో]

బిస్మిల్లాహ్

[4:36 నిముషాలు]
షేఖ్. డా సఈద్ అహ్మద్ మదనీ (హఫిజహుల్లాహ్)

దావా : ధర్మ ప్రచారం.
దాయీ : ధర్మ ప్రచార కర్త.
మద్ఊ : ధర్మ ప్రచారం ఎవరికీ చేయ బడుతుందో వారు

ధర్మ ప్రచారం (దావా) (మెయిన్ పేజీ)
https://teluguislam.net/dawah/

ధర్మ ప్రచారంలో సలఫ్ విధానం [వీడియో]

బిస్మిల్లాహ్

[52:05 నిముషాలు]
షేఖ్. డా సఈద్ అహ్మద్ మదనీ (హఫిజహుల్లాహ్)

దావా : ధర్మ ప్రచారం. దాయీ : ధర్మ ప్రచార కర్త. మద్ఊ : ధర్మ ప్రచారం ఎవరికీ చేయ బడుతుందో వారు.. సలఫ్ అనే పదం ‘సలఫ్ అస్-సాలిహ్’ అనే పదానికి సంక్షిప్త వెర్షన్, అంటే ‘పూర్వ కాలపు సజ్జనులు’ ఇది ఇస్లాం యొక్క మొదటి మూడు తరాలను ప్రత్యేకంగా సూచిస్తుంది

ధర్మ ప్రచారం (దావా) (మెయిన్ పేజీ)
https://teluguislam.net/dawah/