
[54:28 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
సలఫ్ అంటే ఎవరు? మన్’హజె సలఫ్ అంటేమిటి ?
సలఫ్ అనే పదం ‘సలఫ్ అస్-సాలిహ్’ అనే పదానికి సంక్షిప్త వెర్షన్, అంటే ‘పూర్వ కాలపు పుణ్యాత్ములు, సజ్జనులు’. ఇది ఇస్లాం యొక్క మొదటి మూడు తరాలను ప్రత్యేకంగా సూచిస్తుంది. ముహమ్మద్ ప్రవక్త (ﷺ) ఈ మూడు తరాలను ఉత్తమ ముస్లిం తరాలుగా అభివర్ణించారు.
عَنْ عَبْدِ اللَّهِ رَضِيَ اللَّهُ عَنْهُ، عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: «خَيْرُ النَّاسِ قَرْنِي، ثُمَّ الَّذِينَ يَلُونَهُمْ، ثُمَّ الَّذِينَ يَلُونَهُم»
మొదటిది: ప్రవక్త (ﷺ) మరియు ఆయన సహబా (సహచరులు).
రెండవది: తాబిఈన్ (సహచరుల అనుచరులు).
మూడవది: తబఎ తాబిఈన్ (సహచరుల అనుచరుల అనుచరులు)
[బుఖారీ 2652, ముస్లిం 2533]
అయితే సలఫ్ ఎలా ఖుర్ఆన్, హదీసులను అర్థం చేసుకున్నారో, ఆచరించారో అలాగే అర్థం చేసుకునే, ఆచరించే ప్రయత్నం చేసేవారినే ‘సలఫీ’ లేదా ‘అహ్లె హదీస్’ అని అంటారు. మరియు ‘నిజమైన అహ్లుస్ సున్న వల్ జమాఅ’ వీరే.
You must be logged in to post a comment.