ధర్మప్రచారం మరియు దాని ప్రతిఫలం

హదీథ్׃ 03

الدال على الخير كفاعله ధర్మప్రచారం మరియు దాని ప్రతిఫలం

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِي اللهُ عَنْهُ أَنَّ رَسُوْلُ اللهِ  صَلَّى اللهُ عَلَيهِ وَسَلَّمْ  قَالَ: ” مَنْ دَعَا إِلَى هُدًى كَانَ لَهُ مِنَ الْأَجْرِ مِثْلُ أُجُوْرِ مَنْ تَبِعَهُ لَا يَنْقُصُ ذَالِكَ مِنْ أُجُوْرِهِمْ شَيْئًا، وَمَنْ دَعَا إِلَى ضَلَالَةٍ كَانَ عَلَيْهِ مِنَ الْإِثْمِ مِثْلُ آثَامِ مَنْ تَبِعَهُ لَا يَنْقُصُ ذَالِكَ مِنْ آثَامِهِمْ شَيْئًا” رواه مسلم

అన్ అబిహురైరా రదియల్లాహు అన్హు అన్న రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం ఖాల : మన్ దఆ ఇలా హుదన్ కాన లహు మినల్ అజ్ రి మిథ్ లు ఉజూరి మన్ తబిఅహు లా యన్ ఖుశు దాలిక మిన్ ఉజూరిహిమ్ షైయ్యిన్, వ మన్ దఆ ఇలా దలాలథిన్ కాన అలైహి మినల్   ఇథ్ మి  మిథ్ లు  ఆథామి మన్ తబిఅహు లా యన్ ఖుశు దాలిక మిన్ ఆథామిహిమ్ షైయ్యిన్ ” రవాహ్ ముస్లిం.

తాత్పర్యం :- అన్ = ఉల్లేఖించారు, అబి హురైరా = ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివసల్లం  యొక్క సహచరుడు. రదియల్లాహు అన్హు = అల్లాహ్ వారిని స్వీకరించుగాక, ఖాల = చెప్పారు, మన్ = ఎవరైతే, దఆ = ఆహ్వానం,  ఇలా = వైపుకు, హుదన్ = ఋజుమార్గం, కాన = అటువంటి, లహు = వారు, మినల్ = నుంచి, అజ్ రి = పుణ్యం, మిథ్ లు = ఉదాహరణకు, ఉజూరి = వారి పుణ్యం, మన్ = ఎవరైతే, తబిఅహు = అనుసరించినవారు, లా = లేకుండా, యన్ ఖుశు = తగ్గింపు, దాలిక =  అటువంటి, మిన్ = నుంచి, ఉజూరిహిమ్ =వారి పుణ్యం,  షైయ్యిన్  = ఏదైనా సరే, వ = మరియు, మన్ = ఎవరైతే, దఆ = ఆహ్వానం,  ఇలా = వైపుకు, దలాలథిన్ = చెడుపనులు,  కాన = అయ్యాడు, అలైహి = అతని మీద, మినల్  = నుంచి, ఇథ్ మి = పాపం, మిథ్ లు = ఉదాహరణకు, ఆథామి = అతని పాపం, మన్ = ఎవరైతే, తబిఅహు = అనుసరించినవారు, లా = లేకుండా, యన్ ఖుశు = తగ్గింపు, దాలిక = అటువంటి, మిన్ = నుంచి, ఆథామిహిమ్ = అతడి పాపం, షైయ్యిన్ = ఏదైనా సరే.

అనువాదం :- అబుహురైరా రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు – ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు “ఎవరైతే సత్యమార్గం(ఋజుమార్గం) వైపునకు ఆహ్వానిస్తారో వారికి కూడా (అతని పిలుపుననుసరించి) ఆ దారిలో నడిచిన వారికి లభించేటంతటి పుణ్యం మరియు ప్రతిఫలం దొరుకుతుంది, పిలుపిచ్చిన వారికి మరియు అనుసరించివానికి సరిసమానంగా, ఎటువంటి తగ్గింపు లేకుండా. మరియు  ఎవరైతే అసత్యమార్గం(పాపం) వైపునకు ప్రచారం చేస్తారో వారికి కూడా (అతని పిలుపుననుసరించి) ఆ దారిలో నడిచిన వారికి లభించేటంతటి పాపం లభిస్తుంది, పిలుపిచ్చిన వారికి మరియు అనుసరించి వారికి సరిసమానంగా – ఎటువంటి తగ్గింపు లేకుండా. ముస్లిం.

వివరణ:- ఇస్లాం ధర్మం మంచిపనులు, పుణ్యకార్యాల వైపు ఆహ్వానించటాన్ని ప్రోత్సహిస్తున్నది.  ఇంకా ఎవరైతే సమాజంలో మంచిని పెంపొందించటానికి ప్రయత్నిస్తారో వారికి కూడా ఆ మంచి పనులు చేసినవారికి లభించేటంతటి ఫలితం లభిస్తుంది. అంటే పిలుపు నిచ్చిన వారూ మరియు చేసినవారూ సరిసమానంగా అంతే మోతాదులో పుణ్యం పొందుతారు. అమలు చేసినవారి పుణ్యంలోనుండి ఎటువంటి తగ్గింపూ ఉండదు. అదే విధంగా ఇస్లాం ధర్మం చెడుపనులు, పాపపు కార్యాలు చేయటాన్ని నిరుత్సాహ పరుస్తుంది. ఇంకా ఎవరైతే సమాజంలో చెడును వ్యాపింపజేస్తారో వారికి కూడా ఆ పాపపు పనులు చేసినవారికి లభించేటంతటి శిక్ష పడుతుంది. అంటే పిలుపు నిచ్చినవారూ మరియు చేసినవారూ సరిసమానంగా అంతే మోతాదులో పాపం పొందుతారు. అమలు చేసినవారి పాపంలోనుండి ఎటువంటి తగ్గింపూ ఉండదు.

ఈ హదీథ్ అమలు చేయడం వలన కలిగే లాభలు׃

1. మంచి పనులు, పుణ్యకార్యాల వైపు పిలవటాన్ని ప్రోత్సహించవలెను. ఇందులో అల్లాహ్ తరుపునుండి ఎక్కువ పుణ్యం లభిస్తుంది.

2. మంచి పనులు (పుణ్యకార్యాలు) వ్యాపింపచేయవలెను. అవి ఎంత చిన్నవైనాసరే. ఎంతమంది వాటిని అమలు చేస్తారో అంతమంది యొక్క పుణ్యం మీకు లభిస్తుంది.

3. చెడు పనులు (పాపపుకార్యాలు) ఆపటానికి ప్రచారం చేయవలెను. అవి ఎంత చిన్నవైనాసరే. ఎంతమంది వాటిని అమలు చేస్తారో అంతమంది యొక్క పాపాలు మీ ఖాతాలో జమ అవుతాయి. అమలు చేసిన వారితో పాటు  మీ మీద కూడా నరకశిక్ష పడుతుంది. కాబట్టి పాపకార్యాలు, చెడుపనులను నిరుత్సాహపరచటానికి, అరికట్టటానికి అందరూ నడుం బిగించవలెను.

హదీథ్ ఉల్లేఖించినవారి పరిచయం:- అబుహురైరా అబ్దుర్రహ్మాన్ బిన్ సఖర్ అద్దౌసి రదియల్లాహు అన్హు ఖైబర్ యుద్ధం జరిగిన హిజ్ 7వ సంవత్సరంలో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహచర్యంలోనికి చేరారు. ఎక్కువ హదీథ్ లు జ్ఞాపకం ఉంచుకున్నవారిలో ఒకరు.

ప్రశ్నలు

1. మన్ దఆ  ఇలా ____ కాన లహు మినల్ అజ్ రి మిథ్ లు ఉజూరి మన్ తబిఅహు లా యన్ ఖుశు జాలిక మిన్ ఉజూరిహిమ్ షైయ్యిన్, వ మన్ దఆ ఇలా _______  కాన అలైహి మినల్ ఇథ్ మి మిథ్ లు ఆథామి మన్ తబిఅహు లా యన్ ఖుశు దాలిక మిన్ ఆథామిహిమ్ షైయ్యిన్

2. ఎవరైతే ______ వైపునకు ప్రచారం చేస్తారో వారికి కూడా (అతని పిలుపు ననుసరించి) ఆ దారిలో నడిచిన వారికి లభించేటంతటి పుణ్యం మరియు ప్రతిఫలం దొరుకుతుంది, పిలుపు ఇచ్చిన వారికి మరియు అనుసరించివానికి సరిసమానంగా, ఎటువంటి తగ్గింపు లేకుండా.

3. ఎవరైతే _________వైపునకు ఆహ్వానిస్తారో వారికి కూడా (అతని పిలుపుననుసరించి) ఆ దారిలో నడిచిన వారికి లభించేటంతటి పాపం లభిస్తుంది, పిలుపిచ్చిన వారికి మరియు అనుసరించి వారికి సరిసమానంగా – ఎటువంటి తగ్గింపు లేకుండా.

4. ఇస్లాం ధర్మం మంచి పనులు, పుణ్యకార్యాలు చేయటానికి పిలుపివ్వమని ప్రోత్సహిస్తున్నది.  _______________ (తప్పు  / ఒప్పు)

5. ఇంకా ఎవరైతే సమాజంలో _____ పెంపొందించటానికి ప్రయత్నిస్తారో వారికి కూడా ఆ మంచి పనులు చేసినవారికి లభించేటంతటి _____ లభిస్తుంది.

6. మంచి పనులు చేయమని పిలుపు నిచ్చినవారూ మరియు చేసినవారూ _______ అంతే మోతాదులో పుణ్యం పొందుతారు. అమలు చేసినవారి పుణ్యంలోనుండి ఎటువంటి తగ్గింపూ ఉండదు.

7. ఇస్లాం ధర్మం చెడుపనులు, పాపపు కార్యాలు చేయటాన్ని ________ పరుస్తుంది.

8. ఎవరైతే సమాజంలో చెడు పనులు వ్యాపింపజేస్తారో వారికి కూడా ఆ పాపపు పనులు చేసినవారికి లభించేటంతటి పాపం లభిస్తుంది. ________ (తప్పు / ఒప్పు)

9. పాపపు పనులు చేయమని పిలుపు నిచ్చినవారూ మరియు చేసినవారూ ________ అంతే మోతాదులో పాపం పొందుతారు.

10. మంచి పనులు, పుణ్యకార్యాల వైపు పిలవటాన్ని ________. దీనిలో అల్లాహ్ తరుపునుండి ఎక్కువ పుణ్యం లభిస్తుంది.

11. మంచి పనులు (పుణ్యకార్యాలు) ________ చేయవలెను. అవి ఎంత చిన్నవైనాసరే. ఎంతమంది వాటిని అమలు చేస్తారో అంతమంది యొక్క పుణ్యం మీకు లభిస్తుంది.

Source : హదీథ్ – మొదటి స్థాయి (రబువ జాలియాత్ – రియాద్). అనువాదం : –  సయ్యద్ యూసుఫ్ పాషా


ధర్మ ప్రచారం (దావా) (మెయిన్ పేజీ)
https://teluguislam.net/dawah/

%d bloggers like this: