దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
తన అనుచర సమాజం (ఉమ్మత్) పై దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హక్కులు:
1) అల్లాహ్ దాసుడిగా మరియు ప్రవక్తగా విశ్వసించడం.
2) తగిన విధంగా గౌరవించడం,
3) అల్లాహ్ తర్వాత, అత్యధికంగా ప్రేమించడం.
4) ఆదర్శాలను, సద్గుణాలను ఆచరించడం.
5) విధేయత చూపడం.
6) అభిప్రాయ భేదాలలో న్యాయనిర్ణేతగా స్వీకరించడం.
7) ఖుర్ఆన్ మరియు హదీసులకనుగుణంగా ఆచరించడం,
8) అత్యధికంగా దరూద్ పఠించడం.
గడిచిన జుమా ఖుత్బాలో, మేము ప్రవక్తల నాయకుడైన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) స్థాయి, మహత్యం, అద్భుతాలు మరియు ఆయన ప్రత్యేకతలలో కొన్నింటిని గూర్చి వివరించాము. మరి ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ప్రవక్తకు తన అనుచర సమాజం (ఉమ్మత్)పై ఉన్న హక్కులేంటి? రండి, ఖురాను మరియు హదీసుల వెలుగులో ఆ హక్కుల గురించి నేటి జుమా ఖుత్బాలో తెలుసుకుందాం.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ముస్లిం సముదాయం మీద ప్రవక్త ﷺ వారి హక్కులు https://youtu.be/vCfZBWieaic [52 నిముషాలు] వక్త:ముహమ్మద్ సలీం జామిఈ హఫిజహుల్లాహ్
ఈ ప్రసంగం ముస్లిం సమాజంపై ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హక్కుల గురించి వివరిస్తుంది. సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్‌ను స్తుతించడంతో ప్రసంగం మొదలవుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక జాతికి లేదా ప్రాంతానికి మాత్రమే కాక, యావత్ ప్రపంచానికి ప్రవక్తగా పంపబడ్డారని ఖుర్ఆన్ ఆధారాలతో స్పష్టం చేయబడింది. ఇందులో ప్రధానంగా ఐదు హక్కుల గురించి చర్చించబడింది: 1) ప్రవక్తను విశ్వసించడం, ఇది ప్రతి వ్యక్తి యొక్క ప్రాథమిక బాధ్యత; 2) ప్రవక్తను ప్రాణం కంటే ఎక్కువగా గౌరవించడం మరియు ఆయన సమక్షంలో స్వరాలు పెంచరాదని సహాబీల ఉదాహరణలతో వివరించబడింది; 3) ప్రవక్తను తల్లిదండ్రులు, సంతానం, మరియు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించడం, జైద్ రజియల్లాహు అన్హు వంటి సహాబీల ఉదాహరణలతో నొక్కి చెప్పబడింది; 4) జీవితంలోని ప్రతి రంగంలో ప్రవక్తను ఆదర్శంగా తీసుకోవడం; 5) ప్రవక్త ఆదేశాలను పాటించడం మరియు ఆయన వారించిన వాటికి దూరంగా ఉండటం ద్వారా ఆయనకు విధేయత చూపడం. ఈ హక్కులను నెరవేర్చడం ద్వారానే ఇహపరలోకాలలో సాఫల్యం లభిస్తుందని ఈ ప్రసంగం బోధిస్తుంది.
أَلْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ (అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్) وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى أَشْرَفِ الْأَنْبِيَاءِ وَالْمُرْسَلِينَ (వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్) نَبِيِّنَا مُحَمْمَدٍ وَعَلَى آلِهِ وَأَصْحَابِهِ أَجْمَعِينَ (నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ అస్హాబిహి అజ్మయీన్)
అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు, అద్వితీయుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక,ఆమీన్.
సోదర సోదరీమణులారా, మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.
السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ (అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు).
ముస్లిం సముదాయం మీద ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హక్కులు
ఈనాటి ప్రసంగంలో మనం ముస్లిం సముదాయం మీద ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హక్కులు ఏమిటి అనే విషయాన్ని ఇన్ షా అల్లాహ్ ఖుర్ఆన్, హదీస్ గ్రంథాల వెలుగులో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యుల ఉదాహరణల ద్వారా కూడా ఇన్ షా అల్లాహ్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ముందుగా ప్రతి వ్యక్తి తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ప్రదేశానికి, ఒక దేశానికి, ఒక జాతి వారికి ప్రవక్త కాదు, పూర్తి ప్రపంచానికి ఆయన ప్రవక్తగా పంపించబడ్డారు.
ఖుర్ఆన్ గ్రంథం ఏడవ అధ్యాయము 158 వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,
قُلْ يَا أَيُّهَا النَّاسُ إِنِّي رَسُولُ اللَّهِ إِلَيْكُمْ جَمِيعًا الَّذِي لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ (ఖుల్ యా అయ్యుహన్నాస్ ఇన్నీ రసూలుల్లాహి ఇలైకుమ్ జమీఅనిల్లజీ లహు ముల్కుస్సమావాతి వల్ అర్ద్) (ఓ ముహమ్మద్!) వారికి చెప్పు: “ఓ మానవులారా! నిశ్చయంగా నేను మీ అందరి వైపునకు అల్లాహ్ పంపిన ప్రవక్తను. భూమ్యాకాశాల సామ్రాజ్యం ఆయనదే. (7:158)
దాని అర్థం ఏమిటంటే, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వారికి చెప్పు, ఓ ప్రజలారా నేను భూమ్యాకాశాల సామ్రాజ్యానికి అధిపతి అయిన అల్లాహ్ తరఫున మీ అందరి వద్దకు పంపబడిన ప్రవక్తను. మీ అందరి వైపున పంపబడిన ప్రవక్త అంటే అందరికీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క దైవదౌత్యము వర్తిస్తుంది. అంటే నా మాటకు అర్థం ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పూర్తి ప్రపంచానికి, మానవులందరి వైపుకు ప్రవక్తగా పంపబడి ఉన్నారు, ఈ విషయాన్ని ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి. ఇక రండి.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించిన తర్వాత, విశ్వాసి మీద ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి తరఫున ఏమేమి బాధ్యతలు వస్తాయి, ఏమి హక్కులు అతని మీద ఉంటాయి, ఆ హక్కులు ఏమిటి, వాటిని అతను ఏ విధంగా చెల్లించుకోవాలి అనేది మనం చూద్దాం.
ప్రథమ హక్కు: విశ్వసించడం
ముందుగా తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించటం ప్రతి వ్యక్తి యొక్క కర్తవ్యం.
ఖుర్ఆన్ గ్రంథం సూరా తగాబున్ ఎనిమిదవ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,
فَآمِنُوا بِاللَّهِ وَرَسُولِهِ (ఫ ఆమినూ బిల్లాహి వ రసూలిహి) కనుక మీరు అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తను విశ్వసించండి. (64:8)
అనగా, మీరు అల్లాహ్‌ను విశ్వసించండి మరియు దైవ ప్రవక్త అనగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించండి. ఈ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మానవులను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించండి అని ఆదేశిస్తున్నాడు కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించటం ప్రతి వ్యక్తి యొక్క కర్తవ్యం.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూసి కొంతమంది విశ్వసించారు. చూడకుండా చాలామంది విశ్వసించారు. అయితే ఒక ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూసి విశ్వసించిన వారికి ఒక్కసారి శుభవార్త వినిపిస్తే చూడకుండా ఆయనను విశ్వసించిన వారికి ఏడుసార్లు శుభవార్త వినిపించి ఉన్నారు.
طوبى لمن رآني وآمن بي، وطوبى سبع مرات لمن لم يرني وآمن بي (తూబా లిమన్ రఆనీ వ ఆమన బీ, వ తూబా సబ అ మర్రాతిన్ లిమన్ లమ్ యరనీ వ ఆమన బీ.) ఇది ప్రామాణికమైన హదీసు. దాని అర్థం ఏమిటంటే, ఎవరైతే నన్ను చూసి నన్ను విశ్వసించాడో అతనికి ఒక్కసారి శుభవార్త, మరియు ఎవరైతే నన్ను చూడకుండా నన్ను విశ్వసించారో వారికి ఏడుసార్లు శుభవార్త అని ఆ ఉల్లేఖనంలో ప్రవక్త వారు తెలియజేసి ఉన్నారు. ఆ ప్రకారంగా మనము చాలా సంవత్సరాల తర్వాత ఈ భూమండలం మీద పుట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూడకుండా విశ్వసించాము కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన ఆ ఏడుసార్లు శుభవార్త ఇన్ షా అల్లాహ్ అది మనకు దక్కుతుంది.
అలాగే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి విని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రస్తావన అతని ముందర జరిగింది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్త అన్న విషయాన్ని అతను తెలుసుకొని కూడా ఏ వ్యక్తి అయితే ప్రవక్త వారిని విశ్వసించకుండా తిరస్కారిగా అలాగే ఉండిపోతాడో, అతను నరకానికి చేరుకుంటాడు, నరకవాసి అయిపోతాడు అని కూడా హెచ్చరించబడి ఉంది. ముస్లిం గ్రంథంలో మనం చూచినట్లయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా బోధించి ఉన్నారు,
والذي نفس محمد بيده، لا يسمع بي أحد من هذه الأمة يهودي ولا نصراني، ثم يموت ولم يؤمن بالذي أرسلت به، إلا كان من أصحاب النار (వల్లజీ నఫ్సు ముహమ్మదిన్ బి యదిహి, లా యస్మవు బీ అహదున్ మిన్ హాజిహిల్ ఉమ్మతి యహూదియ్యున్ వలా నస్రానియ్యున్, సుమ్మ యమూతు వలమ్ యుఅమిన్ బిల్లజీ ఉర్సిల్తు బిహి ఇల్లా కాన మిన్ అస్హాబిన్నార్). దీని భావం ఏమిటంటే, ఎవరి చేతిలో అయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రాణము ఉందో ఆ మహా శక్తిశాలి అయిన ప్రభువు సాక్షిగా నా ఈ అనుచర సమాజంలో అతను యూదుడు గాని, క్రైస్తవుడు గాని ఎవరైనా గాని, అతని ముందర నా ప్రస్తావన జరిగింది, అతను నా గురించి విన్నాడు. నా గురించి విని కూడా అతను నన్ను మరియు నా ద్వారా పంపబడిన శాసనాన్ని, ధర్మాన్ని విశ్వసించకుండా అలాగే మరణిస్తాడో అతను నరకవాసులలో చేరిపోతాడు. చూశారా? ప్రవక్త వారి గురించి విని, తెలుసుకొని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా పంపబడిన ధర్మాన్ని గురించి విని తెలుసుకొని కూడా ఏ వ్యక్తి అయితే విశ్వసించకుండా అలాగే మరణిస్తాడో అతను నరకవాసులకు చేరిపోతాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసి ఉన్నారు కాబట్టి ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత ఏమిటంటే అతని ముందర ఎప్పుడైతే ప్రవక్త వారి గురించి మరియు ప్రవక్త వారు తీసుకువచ్చిన ధర్మం గురించి ప్రస్తావించబడుతుందో అతను వెంటనే అర్థం చేసుకొని మనసారా ప్రవక్త వారిని విశ్వసించాలి, ప్రవక్త వారి ద్వారా పంపబడిన ధర్మాన్ని అతను స్వీకరించాలి.
ఏ విషయం మమ్మల్ని అడ్డుపడుతూ ఉంది ప్రవక్త వారిని మరియు ప్రవక్త తీసుకువచ్చిన ధర్మాన్ని స్వీకరించడానికి అంటే చాలామంది కేవలము భయం కారణంగా వెనకడుగు వేస్తూ ఉంటారు. చూడండి నేడు ప్రజలతో గాని, అధికారులతో గాని మనము భయపడి వెనకడుగు వేస్తే రేపు మరణానంతరము మమ్మల్ని వారు వచ్చి రక్షిస్తారా? మాకు అలాంటి గడ్డు పరిస్థితులు కూడా లేవు ప్రపంచంలో. మనము అల్హమ్దులిల్లాహ్ స్వతంత్రులము. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో చూడండి, ప్రజలు పేదరికంలో ఉన్నారు, ప్రజలు బానిసలుగా కూడా ఉన్నారు. బానిసలుగా ఉండి, పేదలుగా ఉండి కూడా వారు గడ్డు పరిస్థితులలో కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి తెలుసుకొని ప్రవక్త వారి సమక్షంలో హాజరయ్యి ప్రవక్త వారిని విశ్వసించారు, విశ్వాసులుగా మారారు. తత్కారణంగా ప్రజలు, అధికారులు, పెద్దలు వారిని హింసించారు, వారిని విమర్శించారు, వారిని హేళన చేశారు, రకరకాలుగా చిత్రహింసలు చేసినప్పటికినీ వారు మాత్రము విశ్వాసాన్ని వదులుకోకుండా ధైర్యంగా సమస్యలను ఎదుర్కొని విశ్వాసులుగా చరిత్రలో నిలిచిపోయారు మరియు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వద్ద కూడా గౌరవమైన స్థానం పొందారు. ఉదాహరణకు బిలాల్ రజియల్లాహు అన్హు వారిని చూడండి. ఈయన ఒక యజమాని వద్ద బానిసగా ఉండేవారు. యజమాని పేరు ఉమయ్య బహుశా నాకు గుర్తు రావట్లేదు. ఉమయ్య బిన్ ఖల్ఫ్. అతను ఏం చేసేవాడంటే, బిలాల్ రజియల్లాహు అన్హు వారు ముస్లింలు అయిపోయారు, విశ్వాసి అయిపోయారు అన్న విషయాన్ని విని తెలుసుకొని, బిలాల్ రజియల్లాహు అన్హు వారిని ఈ అరబ్బు దేశంలో ఎడారిలో ఎండాకాలంలో మిట్టమధ్యాహ్నం పూట ఎండ ఎంత తీవ్రంగా ఉంటుంది, ఆ వేడికి ఇసుక ఎంతగా కాలిపోతూ ఉంటుంది, అలాంటి మండుతున్న ఇసుక మీద అర్ధనగ్నంగా ఆయనను పడుకోబెట్టేవాడు, ఆ తర్వాత ఛాతి మీద పెద్ద పెద్ద రాళ్లు పెట్టేసేవాడు. పైన రాయి కాలుతూ ఉంటుంది, బరువుగా ఉంటుంది, కింద ఇసుక కూడా కాలుతూ ఉంటుంది, అలాంటి స్థితిలో ఆయన అల్లాడిపోతూ ఉంటే నీవు విశ్వాసాన్ని వదిలేయి, నేను కూడా నిన్ను హింసించడం వదిలేస్తాను అని చెప్పేవాడు. అవన్నీ భరించి కూడా ఆయన బానిస అయి ఉండి కూడా చిత్రహింసలు భరిస్తూ కూడా అల్లాహ్ ఒక్కడే నిజమైన ప్రభువు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ పంపించిన సత్య ప్రవక్త అని చాటి చెప్పారు. ఆ తర్వాత అతను అన్నము పెట్టకుండా, నీళ్లు ఇవ్వకుండా ఆకలిదప్పికలతో అలాగే ఉంచేశాడు, చెరసాలలో బంధించాడు, మెడలో తాడు కట్టేసి పోకిరి పిల్లవారికి, కుర్రాళ్ళ చేతికి ఇచ్చేశాడు. వారు బిలాల్ రజియల్లాహు అన్హు వారిని పశువులాగా ఈడ్చుకుంటూ తిరిగేవారు. తత్కారణంగా ఆయన శరీరానికి, కాళ్లకు గాయాలు అయిపోయేవి. అన్ని రకాలుగా ఆయనను హింసించినా అలాంటి గడ్డు పరిస్థితుల్లో బానిసగా అయ్యి ఉండి కూడా ఆయన విశ్వాసం పొందారు, ప్రవక్త వారిని మరియు ప్రవక్త వారు తీసుకువచ్చిన ధర్మాన్ని స్వీకరించి వచ్చిన సమస్యలని ధైర్యంగా ఎదుర్కొన్నారు. తత్కారణంగా ఆయన గొప్ప విశ్వాసిగా చరిత్రలో మిగిలిపోయారు, అల్లాహ్ వద్ద కూడా వారికి గొప్ప ఉన్నతమైన స్థానాలు ఉన్నాయి. కాబట్టి మనకు
الحمد لله ثم الحمد لله (అల్హమ్దులిల్లాహ్ సుమ్మా అల్హమ్దులిల్లాహ్), బానిసత్వం లేదు. అల్లాహ్ దయవల్ల మమ్మల్ని అందరినీ అల్లాహ్ స్వతంత్రులుగా ఉంచాడు కాబట్టి మనము కంగారు పడవలసిన అవసరము లేదు, బెదరవలసిన అవసరము లేదు, భయపడవలసిన వెనకడుగు వేయవలసిన అవసరం అంతకంటే లేదు. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి తెలుసుకోండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకువచ్చిన ధర్మాన్ని స్వీకరించండి. తద్వారానే ఇహపరాలా సాఫల్యము మనకు దక్కుతుంది.
రెండవ హక్కు: గౌరవించడం
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించడం ఇది మొదటి హక్కు. ఇక రెండవ హక్కు ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించిన తర్వాత ప్రాణం కంటే ఎక్కువగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవించాలని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేసి ఉన్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో ఆయన బ్రతికి ఉన్నప్పుడు శిష్యులకు, సహాబాలకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో బిగ్గరగా మాట్లాడకండి, శబ్దము పెంచకండి అని తాకీదు చేసి ఉన్నాడు. మనం చూసినట్లయితే, ఖుర్ఆన్ గ్రంథము 24వ అధ్యాయము 63వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,
దాని అర్థం ఏమిటంటే, మీరు దైవప్రవక్త పిలుపును మీలో ఒకరినొకరిని పిలుచుకునే మామూలు పిలుపులా అనుకోకండి. మనం పరస్పరం ఒకరినొకరిని ఏ విధంగా అయితే పిలుచుకుంటామో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విషయం అలాంటిది కాదు. ప్రవక్త వారితో మాట్లాడేటప్పుడు, వారితో సంభాషించేటప్పుడు మీరు జాగ్రత్తగా, సగౌరవంగా, అణకువతో మాట్లాడండి అని ఆ వాక్యంలో బోధించబడి ఉంది.
అలాగే ఖుర్ఆన్ గ్రంథం 49వ అధ్యాయం, రెండవ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَرْفَعُوا أَصْوَاتَكُمْ فَوْقَ صَوْتِ النَّبِيِّ وَلَا تَجْهَرُوا لَهُ بِالْقَوْلِ كَجَهْرِ بَعْضِكُمْ لِبَعْضٍ (యా అయ్యుహల్లజీన ఆమనూ లా తర్ఫవూ అస్వా తకుమ్ ఫౌఖ సౌతిన్నబియ్యి వలా తజ్హరూ లహు బిల్ ఖౌలి కజహ్రి బఅదికుమ్ లిబఅదిన్) ఓ విశ్వాసులారా! మీ స్వరాలను ప్రవక్త స్వరం కన్నా బిగ్గరగా చేయకండి, మీలో మీరు ఒకరితో మరొకరు బిగ్గరగా మాట్లాడినట్లు ఆయనతో మాట్లాడకండి. (49:2)
దీని అర్థం ఏమిటంటే, ఓ విశ్వాసులారా మీ కంఠస్వరాలను ప్రవక్త కంఠస్వరం కంటే హెచ్చుగా ఉంచకండి. మీరు పరస్పరం బిగ్గరగా మాట్లాడుకునే విధంగా ఆయనతో బిగ్గరగా మాట్లాడకండి. దీనివల్ల మీ కర్మలన్నీ వ్యర్థమైపోవచ్చు, జాగ్రత్త సుమా. చూశారా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎంతగా గౌరవించాలంటే ప్రవక్త వారి సమక్షంలో బిగ్గరగా శబ్దాన్ని పెంచి, హెచ్చించి మాట్లాడరాదు, పలకరాదు. ఒకవేళ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో ఆయనను గౌరవించకుండా బిగ్గరగా మాట్లాడినట్లయితే, శబ్దాన్ని పెంచినట్లయితే, అది ఒక రకంగా ప్రవక్త వారిని అగౌరవపరిచినట్లు అవుతుంది, తత్కారణంగా మనిషి యొక్క కర్మలు, సత్కార్యాలు, పుణ్యాలన్నీ వృధా అయిపోయే ప్రమాదం ఉంది అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు. దీనికి ఉదాహరణగా మనము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యుల గురించి ఒక ఉదాహరణ తీసుకుందాం.
ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు బనూ తమీమ్ అనే తెగకు చెందిన ఒక బిడారము, కొంతమంది సమూహము వచ్చారు. బనూ తమీమ్‌కు చెందిన వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలోకి వచ్చినప్పుడు, అబూబకర్ రజియల్లాహు అన్హు వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఒక సలహా ఇచ్చారు. ఓ దైవప్రవక్త, కాకా బిన్ మాబద్ అనే వ్యక్తిని ఈ సమూహానికి మీరు నాయకునిగా నియమించండి అన్నారు. అయితే, ఉమర్ రజియల్లాహు అన్హు వారు కూడా అక్కడ ఉన్నారు, ఆయన జోక్యం చేసుకుంటూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అన్నారు, ఓ దైవప్రవక్త, అక్రా బిన్ హాబిస్ ని ఈ సమూహానికి, ఈ తెగ వారికి నాయకునిగా నియమించండి అని ఆయన సలహా ఇచ్చారు. అబూబకర్ రజియల్లాహు అన్హు వారు ఒక వ్యక్తి గురించి ప్రస్తావిస్తూ ఉంటే, ఉమర్ రజియల్లాహు అన్హు వారు మరో వ్యక్తి గురించి ప్రస్తావించారు. అయితే ఇద్దరి మధ్య భేదాభిప్రాయం వచ్చింది కదండీ, వారిద్దరూ కూడా నేను చెప్పిన వ్యక్తే మంచిది, నేను చెప్పిన వ్యక్తిని నియమిస్తేనే మంచిది అని ఒకరంటూ ఉంటే, లేదండి నేను చెప్పిన వ్యక్తిని నియమిస్తేనే మంచిది అని ఒకరిని ఒకరు విమర్శించుకుంటూ ఆ తర్వాత మాట మాట పెరిగి వారు పెద్దగా శబ్దాలు చేయడం, హెచ్చుగా మాట్లాడటం ప్రారంభించేశారు. అలా జరిగినప్పుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వెంటనే ఈ వాక్యాలను అవతరింపజేశాడు. యా అయ్యుహల్లజీన ఆమనూ లా తర్ఫవూ అస్వా తకుమ్ ఫౌఖ సౌతిన్నబియ్యి. ఓ విశ్వాసులారా, మీ కంఠస్వరాలను ప్రవక్త వారి కంఠస్వరం వద్ద హెచ్చించకండి అని ఆ వాక్యాన్ని ఎప్పుడైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అవతరింపజేశాడో, మీరు జాగ్రత్త పడకపోతే మీ సత్కార్యాలు, మీ పుణ్యాలు వృధా అయిపోతాయని ఆ వాక్యం చివరలో తెలియజేసి ఉన్నాడు కదా, అది విన్న తర్వాత ఉమర్ రజియల్లాహు అన్హు వారు ఎంతగా మారిపోయారంటే, ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో ఆయన ఎంత మెల్లగా మాట్లాడేవారంటే, ఎంత చిన్నగా మాట్లాడేవారంటే, దగ్గరలో కూర్చున్న వ్యక్తి కూడా ఆయన ఏమి చెప్పారో వినలేక రెండవసారి మళ్ళీ అడిగేవారు. అయ్యో మీరు ఏం చెప్పారో సరిగా వినిపించలేదండి, చెప్పండి ఏంటో అని రెండవసారి మళ్ళీ అడగవలసి వచ్చేది. అంత నెమ్మదిగా, అంత చిన్నగా ఆయన మాట్లాడటం అలవాటు చేసుకున్నారు ఉమర్ రజియల్లాహు అన్హు వారు ఆ వాక్యము అవతరింపజేయబడిన తర్వాత.
కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవించటం ప్రతి విశ్వాసి యొక్క బాధ్యత, కర్తవ్యం. ఇది రెండవ హక్కు. దీనికి ఉదాహరణగా మనము చూచినట్లయితే, సాబిత్ బిన్ ఖైస్ రజియల్లాహు అన్హు వారు, ఆయన స్వరం కొంచెం పెద్దది. మామూలుగా కొంతమందికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా గొంతు కొంచెం పెద్దది ఇస్తాడు, వారు మామూలుగా మాట్లాడినా గాని శబ్దం కొంచెం హెచ్చుగా వస్తుంది. ఆ ప్రకారంగా సాబిత్ బిన్ ఖైస్ రజియల్లాహు అన్హు వారి స్వరము కూడా, కంఠము కూడా కొంచెం పెద్దది. ఆయన మామూలుగా మాట్లాడినా శబ్దం కొంచెం పెద్దగా, హెచ్చుగా వచ్చేది. ఎప్పుడైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ వాక్యాన్ని అవతరింపజేశాడో, యా అయ్యుహల్లజీన ఆమనూ లా తర్ఫవూ అస్వా తకుమ్ ఫౌఖ సౌతిన్నబియ్యి, ఆ వాక్యం అవతరింపజేయబడిన తర్వాత, ఆయన సాబిత్ బిన్ ఖైస్ రజియల్లాహు అన్హు వారు ప్రవక్త వారి సమావేశంలో రావడం, హాజరవ్వడమే మానేశారు. అసలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో ఆయన రావడమే మానేశారు. కొద్ది రోజులు గడిచాయి. కొద్ది రోజులు గడిచిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏంటండీ సాబిత్ బిన్ ఖైస్ కనిపించడం లేదు అని సహాబాలతో అడిగారు. అప్పుడు సాద్ బిన్ మాద్ రజియల్లాహు అన్హు వారు ఏం చెప్పారంటే, ఓ దైవప్రవక్త, నేను ఆయన పొరుగులోనే ఉంటాను. కాబట్టి మీరు అనుమతి ఇస్తే నేను వెళ్లి చూస్తాను, ఆయన ఎందుకు మీ మధ్య రావట్లేదు ఇక్కడ, ఎందుకు పాల్గొనట్లేదు మీ సమావేశంలో, నేను వెళ్లి తెలుసుకొని వస్తాను, మీరు అనుమతి ఇవ్వండి అంటే, ప్రవక్త వారు సరే అని పంపించారు. ఆ తర్వాత సాద్ బిన్ మాద్ రజియల్లాహు అన్హు వారు సాబిత్ బిన్ ఖైస్ రజియల్లాహు అన్హు వారి ఇంటికి వెళ్లి చూస్తే, ఆయన తల పట్టుకొని కూర్చొని ఉన్నారు, దిగులుగా ఉన్నారు. సాద్ బిన్ మాద్ రజియల్లాహు అన్హు వారు వెళ్లి ఏమండీ ప్రవక్త వారు మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు, ఈ మధ్య మీరు ప్రవక్త వారి సమావేశంలో హాజరు కాలేదు, ఎందుకండీ అలా, మిమ్మల్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు గుర్తు చేసుకుంటున్నారు అని అడిగినప్పుడు, సాబిత్ బిన్ ఖైస్ రజియల్లాహు అన్హు వారు అన్నారు, చూడండి, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందర బిగ్గరగా, పెద్ద శబ్దంతో మాట్లాడకండి, అలా మాట్లాడితే మీ కర్మలు వృధా అయిపోతాయి అని చెప్పాడు కాబట్టి, నా శబ్దం పెద్దది, నా కంఠం హెచ్చుగా ఉంటుంది కాబట్టి, నేను చేసుకున్న కర్మలన్నీ, సత్కార్యాలన్నీ వృధా అయిపోయాయి, నేను నరకవాసి అయిపోయానేమోనని నాకు భయంగా ఉంది, అందుకోసమే నేను దిగులుగా ఉన్నాను, అక్కడ రాలేకపోతున్నాను అని చెప్పారు. సాద్ బిన్ మాద్ రజియల్లాహు అన్హు వారు అదంతా విని, తిరిగి వచ్చి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేశారు. అదంతా తెలియజేసిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ మాట విని, వెంటనే ఆ సహాబీకి శుభవార్త తెలియజేశారు, సాద్ రజియల్లాహు అన్హు వారి ద్వారా. మీరు వెళ్ళండి, ఆయనకు తెలియజేయండి, ఆయన నరకవాసులలోని వ్యక్తి కాదు, ఆయన స్వర్గవాసులలోని వ్యక్తి అని శుభవార్త తెలియజేశారు.
ఈ ఉల్లేఖనం బుఖారీ మరియు ముస్లిం గ్రంథాలలో ఉంది. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవించే విధానము సహాబాల వద్ద ఎంతగా ఉందో, వారు ఎంతగా ప్రవక్త వారిని గౌరవించేవారో, మరియు ప్రవక్త వారిని అగౌరవపరచడాన్ని ఎంతగా వారు భయపడేవారో చూడండి, దీని ద్వారా మనకు అర్థమవుతుంది. అలాగే, ఎవరెవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసిస్తారో, ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవిస్తారో, అలాంటి వారి కోసము శుభవార్త ఉంది. ఖుర్ఆన్ గ్రంథము ఏడవ అధ్యాయము 157 వ వాక్యాన్ని మనం చూచినట్లయితే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,
فَالَّذِينَ آمَنُوا بِهِ وَعَزَّرُوهُ وَنَصَرُوهُ وَاتَّبَعُوا النُّورَ الَّذِي أُنْزِلَ مَعَهُ ۙ أُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ (ఫల్లజీన ఆమను బిహి వ అజ్జరూహు వ నసరూహు వత్తబవూన్నూరల్లజీ ఉన్జిల మఅహు ఉలాయిక హుముల్ ముఫ్లిహూన్) కనుక ఎవరైతే ఆయనను విశ్వసించి, ఆయనను గౌరవించి, ఆయనకు సహాయం చేసి, ఆయనతోపాటు అవతరింపజేయబడిన జ్యోతిని అనుసరిస్తారో, వారే సాఫల్యం పొందేవారు. (7:157)
దాని అర్థం ఏమిటంటే, ఎవరు ఈ ప్రవక్తను విశ్వసించి, అతనికి ఆదరువుగా నిలుస్తారో, తోడ్పాటు నందిస్తారో, ఇంకా అతనితో పాటు పంపబడిన జ్యోతిని అనుసరిస్తారో, వారే సాఫల్యం పొందేవారు. ప్రవక్త వారిని విశ్వసించి, ప్రవక్త వారిని అనుసరించి, ప్రవక్త వారిని గౌరవించేవారు సాఫల్యం పొందేవారు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా శుభవార్త తెలియజేసి ఉన్నాడు చూశారా.
అలాగే, సహాబాలు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యులు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎలా గౌరవించేవారో, ఒక అవిశ్వాసి అలనాటి అవిశ్వాసి, ఆయన పేరు ఉర్వా బిన్ మసూద్ సఖఫీ. తర్వాత, అప్పటి వరకు ఆయన ఇస్లాం స్వీకరించలేదు, తర్వాత ఆయన ఇస్లాం స్వీకరించారని ధర్మ పండితులు తెలియజేసి ఉన్నారు. ఉర్వా బిన్ మసూద్ సఖఫీ, ఈ సంఘటన జరిగే సమయానికి ఆయన ఇంకా ఇస్లాం స్వీకరించలేరు. సులహ్ హుదైబియా, హుదైబియా ఒప్పందం సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో ఆయన ప్రవక్త వారితో మాట్లాడటానికి వచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో మాట్లాడటానికి వచ్చినప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమావేశంలో సహాబాలు ఏ విధంగా అణకువతో ఉన్నారో, ప్రవక్త వారిని ఏ విధంగా గౌరవిస్తున్నారో కళ్లారా చూశాడు. కళ్లారా చూసి, తర్వాత మళ్ళీ మక్కాలో ఉన్న అవిశ్వాసుల వద్దకు వెళ్లి, అక్కడ చూసిన దృశ్యాన్ని ఈ విధంగా ఆయన తెలియజేస్తూ ఉన్నారు. ఏమంటున్నారో చూడండి: “ఓ నా జాతి ప్రజలారా, నేను పెద్ద పెద్ద రాజుల దర్బారులలోకి కూడా వెళ్ళాను. నేను రోమ్ చక్రవర్తి మరియు అలాగే ఈరాన్ చక్రవర్తి వారి దర్బారులలోకి కూడా నేను వెళ్ళాను. అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, పెద్ద పెద్ద రాజులను కూడా అతని దర్బారులో ఉన్న మంత్రులు అంతగా గౌరవించరు, ఎంతగా అయితే ప్రవక్త వారి శిష్యులు ప్రవక్త వారిని గౌరవిస్తున్నారో. అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, ప్రవక్త వారి నోటి నుండి ఉమ్మి కూడా ఒకవేళ బయటికి వచ్చేస్తే, శిష్యులు ఆ ఉమ్మిని తీసుకొని శరీరానికి పూసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రవక్త వారు ఉజూ చేస్తే, ఆయన ఉజూ చేసిన నీటిని శిష్యులు తీసుకోవాలని పోటీ పడుతూ ఉన్నారు. ఆయన కేవలం సైగ చేస్తే చాలు, వెంటనే ఆ పని చేసి పెట్టడానికి వారు సిద్ధంగా ఉన్నారు. అలా నేను గౌరవించబడటము, పెద్ద పెద్ద రాజులని సైతము నేను చూడలేదు. అంతగా ప్రవక్త వారి శిష్యులు ప్రవక్తను గౌరవిస్తున్నారు” అని తెలియజేశాడు.
చూశారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సహాబాలు ఏ విధంగా గౌరవించారు? అలాగే మనము కూడా ప్రవక్త వారిని గౌరవించాలి. ప్రవక్త వారు మన మధ్య లేరు కదా, మరి ఏ విధంగా మనము గౌరవించాలి అంటే, ప్రవక్త వారి ఆదేశాలు మన మధ్య ఉన్నాయి. ప్రవక్త వారి ఆదేశాలు, హదీసుల రూపంలో, ఉల్లేఖనాల రూపంలో మన మధ్య ఉన్నాయి. ఆ హదీసులు చదవబడేటప్పుడు, వినిపించేటప్పుడు మనము గౌరవంగా ఉండాలి, శ్రద్ధగా వినాలి. అలాగే, ప్రవక్త వారి ఆదేశాలను అదే గౌరవంతో మనము ఆచరించాలి.
ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవించడం, ముస్లిం సముదాయం మీద ఉన్న హక్కు. అయితే, గౌరవించాలి, ప్రతి ముస్లిం యొక్క హక్కు అని తెలుసుకున్న తర్వాత రెండు ముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. మొదటి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రవక్తను గౌరవించడం అనే పదాన్ని తీసుకొని, ప్రవక్త వారి విషయంలో హద్దు మీరిపోవడం సరికాదు. గౌరవంలో చాలామంది హద్దు మీరిపోతూ ఉంటారు. అంటే, ప్రవక్తను ప్రవక్త స్థానంలో కాకుండా, తీసుకెళ్లి దైవ స్థానంలో నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు, దీనిని గులు అని అంటారు. అల్లాహ్ సుబ్ హాన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ విషయాన్ని ఇష్టపడలేదు, ప్రవక్త వారు వారించి ఉన్నారు. మనం చూచినట్లయితే, బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనం, ప్రవక్త వారు తెలియజేశారు:
لا تطروني كما أطرت النصارى ابن مريم، فإنما أنا عبد فقولوا عبد الله ورسوله (లా తత్రూనీ కమా అతరతిన్నసారా ఇబ్న మర్యమ. ఇన్నమా అన అబ్దున్, ఫఖూలూ అబ్దుల్లాహి వ రసూలుహు.) చూశారా, మర్యం కుమారుడు ఈసా, ఏసుక్రీస్తు అంటారు కదండీ, ಮರ್ಯಮ್ ಕುಮಾರడైన ఈసా అలైహిస్సలాం వారి విషయంలో క్రైస్తవులు ఏ విధంగా అయితే హద్దు మీరిపోయారో, మీరు, అనగా ముస్లింలకు ఆదేశిస్తున్నారు, మీరు నా విషయంలో ఆ విధంగా హద్దు మీరకండి. నేను అల్లాహ్ దాసుడిని మరియు అల్లాహ్ ప్రవక్తని. నాకు ఉన్న స్థానంలో మాత్రమే నన్ను మీరు ఉంచి గౌరవించండి, నాకు లేని స్థానము నాకు కల్పించే ప్రయత్నం చేయకండి అని ప్రవక్త వారు వారించారు.
చూశారా, కాబట్టి ప్రవక్త వారిని గౌరవిస్తున్నాము అని చెబుతూ చాలామంది ప్రవక్త వారికి ఉన్న స్థానం కంటే ఎక్కువ స్థానము ఇచ్చేటట్టుగా అల్లాహ్ స్థానంలోకి తీసుకుని వెళ్లి నిలబెట్టేటట్టుగా చేస్తూ ఉంటారు, అలా చేయడం సరికాదు.
అలాగే, దీనికి విరుద్ధమైన విషయం. చాలామంది మూర్ఖులు అనలో, పాపిష్టులు అనలో, ఇంకేమనాలో తెలియదు, ప్రవక్త వారిని కించపరుస్తూ ఉంటారు. అల్లాహ్ మమ్మల్ని ఏమంటున్నాడు, ప్రవక్త వారిని గౌరవించాలి అంటున్నాడు. కానీ నేడు మనం చూస్తున్నాం, ముస్లింలు మనము అని చెప్పుకునే చాలామంది మూర్ఖులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కించపరుస్తున్నారు. వారి మాటల ద్వారా, వారి చేష్టల ద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కించపరుస్తున్నారు. ఈ మధ్యనే ఒక వ్యక్తి మీడియా ముందర వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కించపరుస్తున్నాడు. స్వయంగా నేను ముస్లిం అని కూడా మళ్లీ ప్రకటించుకుంటూ ఉన్నాడు. ఎంతటి మూర్ఖత్వం అండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రవక్తగా చెప్పుకున్న తర్వాతే ఒక వ్యక్తి ముస్లిం అవుతున్నాడు. అలాంటి వ్యక్తి, ప్రవక్త వారిని విశ్వసించిన తర్వాతే ముస్లిం అవుతున్న వ్యక్తి, ప్రవక్త వారిని కించపరచటం, అగౌరవపరచటం ఏమిటండి ఇది?
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎవరైతే కించపరుస్తారో, అగౌరవపరుస్తారో, ప్రపంచంలో కూడా శిక్షించబడతాడు, పరలోకంలో కూడా వారు శిక్షించబడతారు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖుర్ఆన్ గ్రంథము సూరా తౌబా 61వ వాక్యంలో తెలియజేసి ఉన్నాడు కాబట్టి, జాగ్రత్త. కర్మలు వృధా అయిపోతాయి, నష్టపోతారు ప్రపంచంలో కూడా శిక్షించబడతారు, పరలోకంలోనూ మరియు ప్రపంచంలోనూ. కాబట్టి ప్రవక్త వారిని అగౌరవపరచటం పెద్ద నేరం, అలాంటి నేరానికి పాల్పడరాదు, జాగ్రత్త అని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది.
మూడవ హక్కు: ప్రేమించడం
ముస్లిం సముదాయం మీద ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హక్కులలో నుంచి రెండు హక్కుల గురించి తెలుసుకున్నాం అండి. విశ్వసించడం ప్రథమ హక్కు, ప్రవక్త వారిని గౌరవించడం రెండవ హక్కు. ఇక మూడవ హక్కు ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అభిమానించాలి, ప్రేమించాలి.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు,
ثلاث من كن فيه وجد حلاوة الإيمان (సలాసున్ మన్ కున్న ఫీహి వజద హలావతల్ ఈమాన్.) మూడు విషయాలు ఎవరిలో ఉంటాయో, అతను ఈమాన్ విశ్వాసం యొక్క మాధుర్యాన్ని ఆస్వాదించాడు అన్నారు. ఆ మూడు విషయాలు ఏమిటి అంటే, మొదటి విషయం:
أن يكون الله ورسوله أحب إليه مما سواهما (అన్ యకూనల్లాహు వ రసూలుహు అహబ్బ ఇలైహి మిమ్మా సివాహుమా.) అల్లాహ్ మరియు అల్లాహ్ ప్రవక్త అనగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆ వ్యక్తి అందరికంటే ఎక్కువగా అభిమానించాలి, ప్రేమించాలి. అందరికంటే ఎక్కువ అంటే, తనకంటే, తన కుటుంబ సభ్యుల కంటే, తన తల్లిదండ్రుల కంటే, బంధుమిత్రుల కంటే, ప్రపంచంలో ఉన్న వారందరి కంటే, చివరికి తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రవక్త వారిని అభిమానించాలని దాని అర్థం.
దీనికి ఉదాహరణగా మనము చూచినట్లయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వేరే ఉల్లేఖనంలో ఈ విధంగా తెలియజేశారు:
لا يؤمن أحدكم حتى أكون أحب إليه من ولده ووالده والناس أجمعين (లా యూమిను అహదుకుమ్ హత్తా అకూన అహబ్బ ఇలైహి మిన్ వలదిహి వ వాలిదిహి వన్నాసి అజ్మయీన్.) మీలో ఏ వ్యక్తి కూడా అప్పటి వరకు విశ్వాసి కాజాలడు, ఎప్పటి వరకు అయితే అతను నన్ను తన సంతానము కంటే, తన తల్లిదండ్రుల కంటే, మానవులందరి కంటే ఎక్కువగా నన్ను అభిమానించడో అన్నారు. అంటే, తల్లిదండ్రుల కంటే, భార్యాబిడ్డల కంటే, ప్రపంచంలో ఉన్న ప్రజలందరి కంటే ఎక్కువగా ప్రవక్త వారిని అభిమానించినప్పుడే వ్యక్తి విశ్వాసి అవుతాడు.
ఉమర్ రజియల్లాహు అన్హు వారి గురించి ఉదాహరణ చాలా ప్రచారం చెంది ఉంది. ఉమర్ రజియల్లాహు అన్హు వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో హాజరయ్యి,
يا رسول الله، لأنت أحب إلي من كل شيء إلا من نفسي (యా రసూలల్లాహ్, లఅంత అహబ్బు ఇలయ్య మిన్ కుల్లి శైఇన్ ఇల్లా మిన్ నఫ్సీ) అన్నారు. ఓ దైవప్రవక్త, మీరు నాకు అందరికంటే ఎక్కువగా ఇష్టులు, నేను మిమ్మల్ని అందరికంటే ఎక్కువగా అభిమానిస్తున్నాను, అయితే నా ప్రాణము నాకు మీకంటే ఎక్కువ ప్రియమైనది అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు,
لا، والذي نفسي بيده، حتى أكون أحب إليك من نفسك (లా వల్లజీ నఫ్సీ బియదిహి, హత్తా అకూన అహబ్బ ఇలైక మిన్ నఫ్సిక్.) లేదు లేదు ఓ ఉమర్, ఎవరి చేతిలో అయితే నా ప్రాణము ఉందో ఆ అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, నీవు నీ ప్రాణము కంటే ఎక్కువగా నన్ను అభిమానించనంత వరకు పూర్తి సంపూర్ణ విశ్వాసి కాజాలవు అన్నారు.
ఉమర్ రజియల్లాహు అన్హు వారు ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తన ప్రాణము కంటే ఎక్కువగా అభిమానించారు. ఆ తర్వాత ప్రవక్త వారి వద్దకు వచ్చి, ఓ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నేను ఇప్పుడు మిమ్మల్ని నా ప్రాణము కంటే ఎక్కువగా అభిమానిస్తున్నాను అని తెలియజేసినప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు,
الآن يا عمر (అల్ ఆన యా ఉమర్.) ఓ ఉమర్, ఇప్పుడు నీ విశ్వాసము సంపూర్ణమైంది అని తెలియజేశారు.
చూశారా, కాబట్టి ప్రతి వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రాణము కంటే ఎక్కువగా అభిమానించాలి. ప్రాణము కంటే ఎక్కువగా అభిమానించినప్పుడే అతను సంపూర్ణ విశ్వాసి కాగలడు, లేని యెడల అతని విశ్వాసము సంపూర్ణము కాజాలదు అని తెలియజేయడం జరిగింది. ఇక్కడ మనము ఒక ఉదాహరణ తీసుకుందాం.
జైద్ రజియల్లాహు అన్హు వారి గురించి మనము చూచినట్లయితే, జైద్ రజియల్లాహు అన్హు వారిని ఆయన పసితనంలోనే దుండగులు దొంగలించారు. మన మొరటు భాషలో చెప్పాలంటే ఆయనను కిడ్నాప్ చేసేశారు. ఆయనను దొంగలు పట్టుకెళ్లి వేరే ప్రదేశాలలో అమ్మేశారు. ఆ తర్వాత నుండి ఆయన బానిస అయిపోయారు. ఆ తర్వాత చేతులు మారుతూ ఉన్నారు. ఒక వ్యక్తి ఆయనను కొన్నారు, తర్వాత వేరే వ్యక్తికి అమ్మేశారు, ఆ తర్వాత మరో వ్యక్తి మరో వ్యక్తిని అమ్మేశారు. ఆ ప్రకారంగా అమ్ముతూ అమ్ముతూ ఉన్నారు. ఆ విధంగా ఆయన చేతులు మారుతూ మారుతూ మారుతూ మక్కాలో ఖదీజా రజియల్లాహు త’ఆలా అన్హా వారి వద్దకు వచ్చారు. ఖదీజా రజియల్లాహు త’ఆలా అన్హా వారు జైద్ వారిని కొని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కానుకగా ఇచ్చారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కానుకగా ఇచ్చి, ఓ దైవప్రవక్త, ఈయనతో మీరు సేవలు చేయించుకోండి అని చెప్పారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జైద్ రజియల్లాహు త’ఆలా అన్హు వారితో సేవలు చేయించుకుంటూ ఉన్నారు. సేవలు చేయించుకుంటూ ఉంటున్నప్పుడు, ఒకరోజు అనుకోకుండా ఆయన కాబతుల్లాలో తిరుగుతూ ఉంటే, వారి తల్లిదండ్రులు కూడా హజ్ చేయడానికి వచ్చి కాబతుల్లా వద్ద ప్రదక్షిణలు, తవాఫ్ చేస్తూ ఉన్నారు. వెంటనే తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను చూసి గుర్తుపట్టి, జైద్ రజియల్లాహు అన్హు వారు వెళ్లి, “నేను పసితనంలో తప్పిపోయిన మీ అబ్బాయిని” అని తెలియజేశారు. మీ అబ్బాయిని అని ఎప్పుడైతే తెలియజేశారో, కుటుంబ సభ్యులు వెంటనే జైద్ రజియల్లాహు అన్హు వారిని పట్టుకొని, చిన్ననాటి రోజుల్లో తప్పిపోయిన బిడ్డ దొరికాడు అని వారు చాలా సంతోషించారు. వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, ఓ దైవప్రవక్త, మా అబ్బాయి పసితనంలో తప్పిపోయాడు, ఇప్పుడు అనుకొని ఊహించని రీతిలో ఇక్కడ బానిసగా ఉన్నాడు, మీరు అనుమతి ఇస్తే మా అబ్బాయిని మేము మా ఇంటికి తీసుకువెళ్ళిపోతాము అని అడిగినప్పుడు, ప్రవక్త వారు అన్నారు, మీరు సంతోషంగా తీసుకువెళ్ళవచ్చు, అయితే నిబంధన ఏమిటంటే, మీరు ఒకసారి జైద్ తో మాట్లాడండి, సంప్రదించి చూడండి. జైద్ వారు మీతో పాటు రావడానికి ఆయన సిద్ధమైతేనే మీరు తీసుకువెళ్ళండి, లేదంటే లేదు అని చెప్పారు.
ఆ తర్వాత, జైద్ రజియల్లాహు అన్హు వారి వద్దకు వెళ్లి, చూడండి దైవప్రవక్త వారు మీ ఇష్టం మీద వదిలేశారు, ఇక మాకు అనుమతి దొరికినట్లే, కాబట్టి పదండి మేము మా ఇంటికి వెళ్లిపోదాము అని అంటే, జైద్ రజియల్లాహు అన్హు వారు లేదు నేను రాను, నేను ప్రవక్త వద్దనే ఉండిపోతాను అని తేల్చి చెప్పేశారు.
ఏంటండీ, ఇక్కడ ముఖ్యంగా రెండు విషయాలు ఆలోచించాలి. ఒక విషయం ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనుమతి ఇచ్చేశారు, జైద్ రజియల్లాహు అన్హు వారికి ఇక బానిసత్వం నుంచి విముక్తి లభిస్తుంది, స్వతంత్రుడిగా ఆయన కుటుంబ సభ్యులతో పాటు వెళ్లి హాయిగా జీవించుకోవచ్చు. కానీ స్వతంత్రుడిగా వెళ్లి కుటుంబ సభ్యులతో హాయిగా జీవించుకోవడానికి ఆయన ఇష్టపడట్లేదు, ప్రవక్త వారి వద్ద బానిసగా ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నారు అంటే, ప్రవక్త వారిని ఆయన ఎంతగా అభిమానించేవారో, ఎంతగా ప్రేమించేవారో చూడండి. అలాగే, ప్రవక్త ఆయనతో ఎంత మంచిగా ప్రవర్తిస్తూ ఉంటే ఆయన ప్రవక్త వారిని అంతగా అభిమానిస్తున్నారు చూడండి.
కాబట్టి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సహాబాలు ఎంతగా ప్రేమించేవారో, ఎంతగా అభిమానించేవారో ఈ ఉదాహరణల ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది.
అలాగే మిత్రులారా, మరొక ఉదాహరణ మనము చూచినట్లయితే, ఒక సహాబీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఒక సహాబీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చారు. ప్రవక్త వారు ఆయనను చూసి ఏమండీ, ఏంటో మీరు కంగారుగా ఉన్నారు అని అడిగినప్పుడు, ఆయన అంటున్నారు, ఓ దైవప్రవక్త, మీరంటే నాకు చాలా ఇష్టం. నేను మిమ్మల్ని చాలా అభిమానిస్తున్నాను. నేను ఇంట్లో ఉన్నప్పుడు మీరు గుర్తుకు వస్తే, వెంటనే మిమ్మల్ని చూడాలనుకుంటాను, కాబట్టి నేను ఇంట్లో నుండి పరిగెత్తుకుంటూ మస్జిద్ లోకి వస్తాను. మీరు మస్జిద్ లో ఏదో ఒక చోట సహాబాలతో సమావేశమై ఉంటారు లేదంటే నమాజ్ చేస్తూ ఉంటారు, ఏదో ఒక విధంగా మీరు నన్ను కనిపిస్తారు. మిమ్మల్ని చూడగానే నాకు మనశ్శాంతి దొరుకుతుంది. అయితే ఈరోజు నాకు ఒక ఆలోచన తట్టింది, ఆ ఆలోచన కారణంగా నేను అయోమయంలో పడిపోయాను, నాకు బాధగా ఉంది, కంగారుగా ఉంది. అదేమిటంటే, మరణించిన తర్వాత పరలోకంలో మీరేమో ప్రవక్త కాబట్టి స్వర్గంలోని ఉన్నతమైన శిఖరాలకు చేరుకుంటారు, నేను ఒక సాధారణమైన వ్యక్తి కాబట్టి, అల్లాహ్ దయవల్ల నేను కూడా స్వర్గానికి వచ్చేసినా, నేను స్వర్గంలోనే మామూలు స్థానాలలో ఉంటాను. అక్కడ కూడా నాకు మిమ్మల్ని చూడాలని అనిపిస్తుంది. మరి అలాంటప్పుడు నేను మిమ్మల్ని అక్కడ ఎలా చూడగలను, అక్కడ చూడలేనేమోనని నాకు బాధగా ఉంది, కంగారుగా ఉంది, ఓ దైవప్రవక్త అన్నారు.
చూశారా, ఎంతటి తపన ఉందో ఆయనలో ప్రవక్త వారిని చూడాలనే తపన, ప్రవక్త వారిని చూసి మనశ్శాంతి పొందాలన్న అభిమానం చూశారా. ఆ తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వాక్యాలు అవతరింపజేశాడు.
وَمَنْ يُطِعِ اللَّهَ وَالرَّسُولَ فَأُولَٰئِكَ مَعَ الَّذِينَ أَنْعَمَ اللَّهُ عَلَيْهِمْ مِنَ النَّبِيِّينَ وَالصِّدِّيقِينَ وَالشُّهَدَاءِ وَالصَّالِحِينَ ۚ وَحَسُنَ أُولَٰئِكَ رَفِيقًا (వమయ్ యుతిఇల్లాహ వర్రసూల ఫఉలాయిక మఅల్లజీన అన్అమల్లాహు అలైహిమ్ మినన్నబియ్యీన వస్సిద్దీఖీన వష్షుహదాఇ వస్సాలిహీన వహసున ఉలాయిక రఫీఖా) ఎవరైతే అల్లాహ్‌కు, ప్రవక్తకు విధేయత చూపుతారో వారు, అల్లాహ్ అనుగ్రహం పొందిన ప్రవక్తలు, సత్యసంధులు, అమరగతులు, సద్వర్తనులతో పాటు ఉంటారు. వారు ఎంత మంచి స్నేహితులు! (4:69) ఖుర్ఆన్ గ్రంథం నాలుగవ అధ్యాయము 69 వ వాక్యము.
దాని అర్థం ఏమిటంటే, ఎవరైతే అల్లాహ్‌కు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు విధేయత కనబరుస్తారో, వారే అల్లాహ్ అనుగ్రహం పొందిన ప్రవక్తలతోను, సత్యసంధులతోను, షహీదులతోను, సద్వర్తనులతోను ఉంటారు. వీరు ఎంతో మంచి స్నేహితులు.
ఎవరైతే అల్లాహ్‌ను మరియు ప్రవక్త వారిని విశ్వసించి, అభిమానించి, ఆ ప్రకారంగా నడుచుకుంటారో వారు ప్రవక్తలతో పాటు ఉంటారట, సిద్దీఖీన్లతో పాటు సత్యసంధులతో పాటు ఉంటారట, షహీద్ వీరమరణం పొందిన వారితో పాటు ఉంటారట. ఎంతటి గౌరవం చూశారా?
سبحان الله ثم سبحان الله (సుబ్ హానల్లాహ్ సుమ్మా సుబ్ హానల్లాహ్).
అయితే మిత్రులారా, ఒకే మాట చెప్పి ఇన్ షా అల్లాహ్ ఒక విషయం వైపు మీ దృష్టిని నేను తీసుకువెళ్లాలనుకుంటున్నాను.. ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక వ్యక్తి వచ్చి
متى الساعة؟ (మతస్సాఅ) ప్రళయం ఎప్పుడు వస్తుంది అని అడిగాడు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన వైపు చూసి
ماذا أعددت لها؟ (మాజా ఆదత్త లహా) అని తిరిగి ప్రశ్నించారు. ప్రళయం గురించి నీవు అడుగుతున్నావు సరే, కానీ ఆ ప్రళయం కోసము నీవు ఏమి సిద్ధం చేసుకున్నావు అన్నారు. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, ఓ దైవప్రవక్త, నేను పెద్దగా నమాజులు ఏమి చదువుకోలేదు, నేను పెద్దగా ఉపవాసాలు ఏమి ఉండలేదు, చెప్పుకోదగ్గ పెద్ద పుణ్యకార్యం నేను ఏమి చేసుకోలేదు. నా మీద ఉన్న బాధ్యత మాత్రం నేను నెరవేర్చుకుంటూ ఉన్నాను, పెద్దగా చెప్పుకోదగ్గ పుణ్యకార్యము నేను ఏదీ చేయలేదు. కాకపోతే నేను నా గుండెల నిండా మీ అభిమానం ఉంచుకొని ఉన్నాను అన్నారు.
ఆయన ఏమంటున్నాడండి, నా గుండెల నిండా నేను మీ అభిమానాన్ని ఉంచుకొని ఉన్నాను అంటే వెంటనే ప్రవక్త వారు తెలియజేశారు,
أنت مع من أحببت (అంత మఅ మన్ అహబబ్త.) నీవు ఎవరినైతే అభిమానిస్తున్నావో, రేపు వారితో పాటే పరలోకంలో ఉంటావు అని చెప్పారు.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆ వ్యక్తి పూర్తి అభిమానిస్తున్నాడు కాబట్టి, ప్రవక్త వారు తెలియజేసిన శుభవార్త ప్రకారము ఆ వ్యక్తి ప్రవక్త వారి దగ్గరిలో స్వర్గంలో ఉంటాడు. అయితే, ఇక్కడ ఇప్పుడు నేను మిమ్మల్ని ఆలోచింపజేస్తున్న విషయం ఏమిటంటే, ముస్లింలము మేము, ముస్లింలము మేము అని ప్రకటించుకునే ప్రతి వ్యక్తి ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, మీ గుండెల్లో ఎవరి అభిమానం ఎక్కువగా ఉంది? అల్లాహ్ అభిమానం ఎక్కువగా ఉందా? ప్రవక్త అభిమానం ఎక్కువగా ఉందా? లేక చింపిరి చింపిరి బట్టలు వేసుకున్న మహిళలతో నృత్యాలు చేసే, ఎగిరే, చిందేసే నాటక నటీనటుల అభిమానము ఉందా ఆలోచించండి. ఒకవేళ మీరు అందరి కంటే ఎక్కువగా అల్లాహ్‌ను అభిమానిస్తున్నారు, ప్రవక్త వారిని అభిమానిస్తున్నారు అంటే, అల్హమ్దులిల్లాహ్, చాలా సంతోషకరమైన విషయం. అలా కాకుండా మీరు అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటే ఎక్కువగా నటీనటులను, వేరే వేరే వ్యక్తులను అభిమానిస్తున్నారు అంటే రేపు మీరు ఎవరితో పాటు ఉంటారు పరలోకంలో ప్రవక్త వారు తెలియజేసిన దాని ప్రకారం ఆలోచించండి.
లేదండి, మేము ప్రవక్త వారిని ఎక్కువగా అభిమానిస్తున్నాం అండి అని చాలామంది నోటితో ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. నోటితో మాట్లాడితే సరిపోదు. మీ మాట్లాడే తీరు, మీ డ్రెస్ కోడ్, మీరు ధరించే దుస్తులు, మీ హెయిర్ స్టైల్, మీ వెంట్రుకలు, అలాగే మీ బట్టలు, మీ మాట్లాడే తీరు, మీ హెయిర్ స్టైల్, అలాగే మీరు, మీ కుటుంబ సభ్యులలో ఉన్న వ్యవహార శైలి ఇవన్నీ మీరు ఎవరిని అభిమానిస్తున్నారో, ఎవరిని మీరు ఫాలో అవుతున్నారో చెప్పకనే చెబుతూ ఉన్నాయి. ముస్లింలు అంటున్న వారు, వారి బట్టలను చూడండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన విధంగా వారు దుస్తులు ధరిస్తున్నారా? ప్రవక్త వారు తెలియజేసిన దాని ప్రకారంగా వారు వెంట్రుకలు ఉంచుతున్నారా? ప్రవక్త వారు తెలియజేసిన దాని ప్రకారము వ్యవహార శైలిగా నడుచుకుంటున్నారా? అక్కడ మనకు తెలిసిపోతుంది ఎవరు ఎవరిని మనం ఫాలో చేస్తున్నాం, ఎవరిని మనం అభిమానిస్తున్నాం, ఎవరి ఫోటోలు కాపీలలో, నోట్ బుక్కులలో, ఇంట్లోని గోడల మీద అతిక్కించుకుంటున్నాం, అక్కడ మనకు తెలిసిపోతుంది మన అభిమానులు ఎవరో, మనం ఎవరిని అభిమానిస్తున్నాము అనేది.
కాబట్టి జాగ్రత్త, ఎవరిని అభిమానిస్తున్నారో వారితోనే రేపు ఉంటారు.
నాలుగవ హక్కు: ఆదర్శంగా తీసుకోవడం
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని నమ్మటం, విశ్వసించటం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవించటం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అభిమానించటం, మూడు హక్కుల గురించి తెలుసుకున్నాం కదండీ. ఇక మరొక హక్కు ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆదర్శమూర్తిగా, రోల్ మోడల్ గా, ఆదర్శనీయుడిగా తీసుకొని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి అడుగుజాడల్లో నడుచుకోవాలి. ప్రతి పనిలో, ప్రతి విషయంలో, ఆరాధనల్లో, వ్యవహారాల్లో, అలాగే విశ్వాసంలో, ప్రతి విషయంలో ప్రవక్త వారిని ఆదర్శంగా తీసుకోవాలి.
ఖుర్ఆన్ గ్రంథం 33వ అధ్యాయం 21వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,
لَقَدْ كَانَ لَكُمْ فِي رَسُولِ اللَّهِ أُسْوَةٌ حَسَنَةٌ لِمَنْ كَانَ يَرْجُو اللَّهَ وَالْيَوْمَ الْآخِرَ وَذَكَرَ اللَّهَ كَثِيرًا (లఖద్ కాన లకుమ్ ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనతున్ లిమన్ కాన యర్జుల్లాహ వల్ యౌమల్ ఆఖిర వ జకరల్లాహ కసీరా) వాస్తవానికి అల్లాహ్ ప్రవక్తలో మీ కొరకు – అంటే అల్లాహ్‌ను, అంతిమ దినాన్ని ఆశించేవారికీ, అల్లాహ్‌ను అధికంగా స్మరించే వారికీ – ఒక ఉత్తమ ఆదర్శం ఉంది. (33:21)
అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిలో మీ కొరకు అత్యుత్తమ ఆదర్శము ఉంది అన్నారు. ఏ వ్యక్తి అయినా సరే ఆయన తండ్రిగా ఉంటాడు లేదా కుమారునిగా ఉంటాడు లేదా వృత్తిపరంగా ఒక బోధకునిగా, ఒక టీచర్‌గా ఉంటాడు లేదా ఒక డాక్టర్‌గా ఉంటాడు, ఏ రంగానికి చెందిన వ్యక్తి అయినా సరే, ఏ వయసులో ఉన్న వ్యక్తి అయినా సరే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఒక తండ్రిగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆదర్శనీయులు, ఒక కుమారునిగా కూడా ప్రవక్త వారు ఆదర్శనీయులు, ఒక భర్తగా ప్రవక్త వారు ఆదర్శనీయులు, ఒక గురువుగా ప్రవక్త వారు ఆదర్శనీయులు, ఒక వ్యాపారిగా ప్రవక్త వారు ఆదర్శనీయులు, ఒక డాక్టర్‌గా ప్రవక్త వారు ఆదర్శనీయులు, ఒక బోధకునిగా ప్రవక్త వారు ఆదర్శనీయులు, ఒక లీడర్‌గా ప్రవక్త వారు ఆదర్శనీయులు, ఒక పొరుగువానిగా ప్రవక్త వారు ఆదర్శనీయులు, అలాగే ఒక సైన్యాధిపతిగా కూడా ప్రవక్త వారు ఆదర్శనీయులు. మనిషి జీవితంలోని ప్రతి రంగంలో కూడా ప్రవక్త వారు ఆదర్శనీయులు. కాబట్టి, ఏ వ్యక్తి అయినా సరే, ఏ రంగంలో ఉన్న వ్యక్తి అయినా సరే, ప్రవక్త వారిని ఆదర్శంగా తీసుకోవాలి.
ఇప్పుడు మనం ఎవరిని ఆదర్శంగా తీసుకుంటున్నాం? ఎవరిని ఆదర్శంగా తీసుకొని మనము జీవించుకుంటున్నాం? మన జీవన వ్యవహారాలు, మన జీవన శైలి ఎలా ఉంది, మన లావాదేవీలు ఏ విధంగా ఉన్నాయి, ఒక్కసారి ఆలోచించుకోండి మిత్రులారా. ప్రవక్త వారిని ఆదర్శంగా తీసుకొని మనము జీవించాలి, ఇది ముస్లింల సముదాయం మీద ఉన్న మరొక హక్కు.
ఐదవ హక్కు: విధేయత చూపడం
ఇక సమయం ఎక్కువైపోతుంది కాబట్టి, క్లుప్తంగా ఇన్ షా అల్లాహ్ చెబుతూ నా మాటను ముగించే ప్రయత్నం చేస్తాను. ప్రవక్త వారి తరఫున ముస్లిం సముదాయం మీద ఉన్న ముఖ్యమైన, ముఖ్యమైన, ముఖ్యమైన హక్కు, బాధ్యత ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి విధేయత చూపాలి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించాలి. అనుసరించటం, విధేయత చూపటం అంటే ఏమిటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ పనులకైతే మమ్మల్ని చేయమని ఆదేశించారో, ఆ పనులను చేయాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ పనులైతే చేయవద్దు అని వారించారో, ఆ పనులు చేయకుండా వాటికి దూరంగా ఉండాలి. మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ప్రవక్త వారు ప్రతి భక్తి కార్యానికి, ప్రతి మంచి కార్యానికి చేయమని ఆదేశించి ఉన్నారు. అలాగే, ప్రతి పాపానికి మరియు ప్రతి తప్పు కార్యానికి దూరంగా ఉండండి అని వారించి ఉన్నారు. ప్రవక్త వారు వారించిన విషయాలకు దూరంగా ఉండాలి, ప్రవక్త వారు బోధించిన, చేయమని చెప్పిన విషయాలను మనము చేయాలి. దీనినే ఇతాఅత్, ఇత్తెబా అని అరబీలో అంటారు, విధేయత అని తెలుగులో అంటారు, అనుసరించటం అని అంటారు.
ఖుర్ఆన్ గ్రంథం సూరా మాయిదా 92 వ వాక్యంలో అల్లాహ్ తెలియజేశాడు,
وَأَطِيعُوا اللَّهَ وَأَطِيعُوا الرَّسُولَ (వ అతీవుల్లాహ వ అతీవుర్రసూల్) అల్లాహ్‌కు విధేయత చూపండి, ప్రవక్తకు కూడా విధేయత చూపండి. (5:92)
అల్లాహ్‌కు విధేయత చూపండి మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కూడా విధేయత చూపండి, అనుసరించండి. ఎలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మనము విధేయత చూపాలి, అనుసరించాలంటే ఒక రెండు ఉదాహరణలు చెప్పిఇన్ షా అల్లాహ్ మాటను ముగించి ముందుకు కొనసాగిస్తాను.
ఒకసారి ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందుకు వచ్చాడు. ఆయన బంగారపు ఉంగరము ధరించి ఉన్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ వ్యక్తిని దగ్గరకు పిలిచి, ఆ ఉంగరము తీసేసి పక్కన పడేశారు. పురుషులు బంగారము ధరించడము ఇస్లాం నియమాల నిబంధనల ప్రకారము అది వ్యతిరేకం. పురుషులు బంగారము ధరించరాదు, ఇది ఇస్లాం మనకు బోధించే విషయం. ఆ వ్యక్తి బంగారము ధరించి ఉన్నారు కాబట్టి ప్రవక్త వారు ఆ బంగారపు ఉంగరము తీసి పక్కన పడేసి, మీరు నరకము యొక్క అగ్నిని ముట్టుకోవటము, చేతిలో పట్టుకోవటము ఇష్టపడతారా, మరి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పారు. తర్వాత ప్రవక్త వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు, ఆ వ్యక్తి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇతర శిష్యులు ఆ వ్యక్తిని పిలిచి, చూడండి, ఆ బంగారము ధరించవద్దు అని ప్రవక్త వారు తెలియజేశారు కాబట్టి, ఆ బంగారము మీరు ధరించవద్దు, కానీ అది అక్కడ పడిపోయి ఉంది కాబట్టి, అది మీరు తీసుకువెళ్ళండి, వేరే పనుల కోసం ఉపయోగించుకోండి అన్నారు. అయితే, ఆయన ఏమన్నారో తెలుసా,
لا والله، لا آخذه أبداً، وقد طرحه رسول الله صلى الله عليه وسلم (లా వల్లాహి, లా ఆఖుజుహు అబదా, వఖద్ తరహహు రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం.) అల్లాహ్ సాక్షిగా, అలా నేను చేయనంటే చేయను. ఏ పరికరాన్ని అయితే ప్రవక్త వారు తొలగించి పక్కన పడేశారో, దాన్ని నేను ముట్టుకోనంటే ముట్టుకోను అని చెప్పారు.
అలాగే మనం చూచినట్లయితే, అలీ రజియల్లాహు అన్హు వారు ఒకసారి పట్టు వస్త్రాలు ధరించి వెళ్తూ ఉన్నారు, ప్రవక్త వారి కంటపడ్డారు. ప్రవక్త వారు అలీ రజియల్లాహు అన్హు వారు పట్టు వస్త్రాలు ధరించి ఉన్న విషయాన్ని చూసి, ప్రవక్త వారికి ఆ విషయం నచ్చలేదు. ప్రవక్త వారికి నచ్చలేదన్న విషయం ఆయన ముఖ కవళికల ద్వారా కనపడింది. వెంటనే అలీ రజియల్లాహు అన్హు వారు గుర్తుపట్టి, ఇంటికి వచ్చేసి ఆ వస్త్రాలు తీసి, చించేసి మహిళలకు ఇచ్చేశారు. గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, ఇస్లామీయ నిబంధనల ప్రకారము పట్టు వస్త్రాలు పురుషులకు యోగ్యమైనవి కావు. పట్టు వస్త్రాలు మహిళలకే ప్రత్యేకం. పురుషులు పట్టు వస్త్రాలు ధరించరాదు, ఇది ఇస్లామీయ నిబంధన. అయితే అలీ రజియల్లాహు అన్హు వారు పట్టు వస్త్రాలు ధరించారు కాబట్టి, ప్రవక్త వారు ఆ విషయాన్ని ఇష్టపడలేదు. వెంటనే అలీ రజియల్లాహు అన్హు వారు ఆ విషయాన్ని గ్రహించి, ఆ పట్టు వస్త్రాలు ఇంటికి వెళ్లి చించేసి, మహిళల చేతికి ఇచ్చేశారు, మీకు ఇష్టం వచ్చినట్టు మీరు ఈ బట్టలతో ఏమైనా చేసుకోండి అని.
చూశారా, ప్రవక్త వారు ఇష్టపడలేదు, వెంటనే అలీ రజియల్లాహు అన్హు వారు ఆ దుస్తులను తొలగించేశారు. చూశారా, ఆ ప్రకారంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మనము అనుసరించాలి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మనము విధేయత చూపాలి. ఏ విషయాలనైతే ప్రవక్త వారు మమ్మల్ని వారించారో వాటికి దూరంగా ఉండాలి.
అలాగే, ముస్లిం సముదాయం మీద ఉన్న హక్కులలో మరొక హక్కు ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకువచ్చిన ధర్మాన్ని వ్యాపింపజేయాలి, ప్రచారం చేయాలి, ప్రజల వద్దకు తీసుకువెళ్లి చేరవేయాలి. ఆ పని ప్రవక్తలు చేశారు. ప్రవక్త, మీకు నేను చివరి ప్రవక్తని, నా తర్వాత ప్రవక్తలు రారు. ఇక దీని ప్రచారం యొక్క బాధ్యత మీ మీద ఉంది అని చెప్పి వెళ్ళిన తర్వాత సహాబాలు ఆ బాధ్యత నెరవేర్చారు. ఆ తర్వాత వారు కూడా బాధ్యత నెరవేర్చారు. మనము కూడా ఆ బాధ్యత నెరవేర్చాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులను అభిమానించాలి. ఎవరిని కూడా కించపరచరాదు, దూషించరాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద దరూద్ పఠించాలి, ఇది కూడా మన మీద ఉన్న బాధ్యత మరియు హక్కు. దరూద్ శుభాలు అనే ప్రసంగము
إِنْ شَاءَ ٱللَّٰهُ (ఇన్ షా అల్లాహ్) వినండి, అక్కడ దరూద్ గురించి, అది ఎంత విశిష్టమైన కార్యమో తెలపజడం జరిగింది. అలాగే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి స్నేహితులతో మనము కూడా అభిమానం చూపించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శత్రువులతో మనము కూడా శత్రుత్వాన్ని వ్యక్తపరచాలి. ఇవి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల ముస్లిం సముదాయం మీద ఉన్న హక్కులు. క్లుప్తంగా మీ ముందర ఉంచడం జరిగింది. నేను అల్లాహ్‌తో దుఆ చేస్తున్నాను, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మమ్మల్ని అందరినీ అన్న, విన్న మాటల మీద ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక,ఆమీన్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ప్రవక్త(ﷺ) చూపిన రుజుమార్గంలో ప్రళయం వరకూ సత్యంపై ఉండే జమాత్? షరీఫ్ మదనీ (హఫిజహుల్లాహ్) https://youtu.be/BokURAxRYRE – 38 నిముషాలు
6:153 وَأَنَّ هَٰذَا صِرَاطِي مُسْتَقِيمًا فَاتَّبِعُوهُ ۖ وَلَا تَتَّبِعُوا السُّبُلَ فَتَفَرَّقَ بِكُمْ عَن سَبِيلِهِ ۚ ذَٰلِكُمْ وَصَّاكُم بِهِ لَعَلَّكُمْ تَتَّقُونَ ఇదే నా రుజుమార్గం. కనుక మీరు దీనినే అనుసరించండి. ఇతరత్రా మార్గాలను అనుసరించకండి. అవి మిమ్మల్ని అల్లాహ్ మార్గం నుండి వేరు పరుస్తాయి. మీరు భయభక్తుల వైఖరిని అవలంబించేటందుకుగాను అల్లాహ్ మీకు ఈ విధంగా తాకీదు చేశాడు. (సూరా అల్ – అన్ ఆమ్ 6:153)
ఈ ప్రసంగంలో, వక్త ఖురాన్ మరియు హదీసుల వెలుగులో ‘రుజుమార్గం’ (సరైన మార్గం) యొక్క ప్రాముఖ్యతను వివరిస్తారు. ఇస్లాం మాత్రమే అల్లాహ్ చూపిన రుజుమార్గమని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అది పరిపూర్తి చేయబడిందని నొక్కి చెబుతారు. ప్రవక్త (స) తరువాత ఇస్లాంలో ఏర్పడిన వివిధ ఆలోచనా విధానాలు, వర్గాలు (హనఫీ, మాలికీ, షాఫఈ, హంబలీ) గురించి చర్చిస్తూ, అసలైన మార్గం ప్రవక్త మరియు ఆయన సహచరులు అనుసరించినదేనని స్పష్టం చేస్తారు. ‘అహలె హదీస్’ అనే పదం యొక్క మూలాన్ని, దాని నిర్వచనాన్ని వివరిస్తూ, ఇది ఖురాన్ మరియు హదీసులను సహచరుల అవగాహన ప్రకారం అనుసరించే విధానమని పేర్కొంటారు. చివరగా, ముస్లింలందరూ విభేదాలను వీడి, ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఐక్యంగా ఉండాలని, ఈ ఐక్యత కోసం భారతదేశంలోని ‘జమియతే అహలె హదీస్’ సంస్థతో కలిసి పనిచేయాలని పిలుపునిస్తారు.
నేను అల్లాహ్ యొక్క శరణు వేడుకుంటున్నాను, శపించబడిన షైతాన్ యొక్క కీడు నుండి. షైతాన్ యొక్క చేష్టల నుండి రక్షణ పొందుట కొరకు, అనంత కరుణామయుడు, అపార కృపా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.
ప్రియులారా, నేను మీ ముందు పవిత్ర ఖురాన్ గ్రంథం, సూరె అన్ఆమ్, వాక్యము సంఖ్య 153 పఠించాను. ఇందులో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేస్తున్నాడు ప్రవక్త వారితో. ప్రవక్త వారు అంటూ ఉన్నారు:
నిశ్చయంగా ఇదే నా రుజుమార్గం. కనుక మీరు దీనినే అనుసరించండి. ఇతర మార్గాలను అవలంబించకండి. అలా చేస్తే అవి మిమ్మల్ని ఆయన మార్గం నుండి తప్పించి చెల్లాచెదురు చేస్తాయి.” మీరు భయభక్తులు కలిగి ఉండటానికి అల్లాహ్ మీకు ఈ విధంగా ఆజ్ఞాపిస్తున్నాడు. (6:153)
“వ అన్న హాదా సిరాతీ ముస్తఖీమా” – ఇది రుజుమార్గం. ఖురాన్ అంటుంది, “వ అన్న హాదా సిరాతీ ముస్తఖీమా” – ఇది రుజుమార్గము. “ఫత్తబిఊహు” – మీరు ఈ రుజుమార్గాన్ని అనుసరించండి. “వలా తత్తబిఊ స్సుబుల” – ఈ మార్గాన్ని విడిచిపెట్టి వేరే మార్గాల వెంట వెళ్ళకండి. “ఫతఫర్రఖ బికమ్ అన్ సబీలిహీ” – మీరు గనక ఈ మార్గాన్ని విడిచిపెట్టి వేరే మార్గాల వెంట వెళితే మీరు నా మార్గము నుండి తప్పిపోతారు అని ప్రవక్త వారు తెలియజేశారు. ఆ మార్గం, ఏ మార్గం? అదే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేసిన మార్గం. “ఫతఫర్రఖ బికమ్ అన్ సబీలిహీ” – మీరు గనక ఆ మార్గాన్ని విడిచిపెడితే మీరు తప్పిపోతారు. “దాలికుమ్ వస్సాకుమ్ బిహీ ల అల్లకుమ్ తత్తఖూన్” – మీరు భక్తిపరులు అవుతారన్న సంగతి వలన, బహుశా మీరు భక్తిపరులు కాగలరని మీకు ఈ విధంగా ఆజ్ఞాపించటం జరుగుతుంది అని ఖురాన్ గ్రంథం చెబుతోంది.
రుజుమార్గం (సరైన మార్గం) అంటే ఏమిటి?
మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధించిన ఆ రుజుమార్గం ఏమిటి? ఏ రుజుమార్గం వలన అయితే మనిషి ప్రతి నమాజులో అల్లాహ్ త’ఆలాతో ప్రార్థిస్తాడు:
اهْدِنَا الصِّرَاطَ الْمُسْتَقِيمَ (ఇహ్‌దినస్సిరాతల్ ముస్తఖీమ్) ఓ అల్లాహ్, మాకు రుజుమార్గం (సన్మార్గం) చూపు. (1:6)
అల్లాహ్, నేను నీ నుండి రుజుమార్గాన్ని ఆశిస్తున్నాను. నాకు రుజుమార్గమును ప్రసాదించు. అల్లాహ్ త’ఆలాతో రోజుకు మనిషి అభ్యర్థిస్తాడు. మరి అల్లాహ్ త’ఆలా చూపిన ఆ రుజుమార్గం ఏమిటి? వాస్తవానికి ఆ రుజుమార్గం ఇస్లాం ధర్మం ప్రియులారా. ఇస్లాం అనే ధర్మం, ఇదే మానవులందరి కోసం వచ్చిన రుజుమార్గం. ఇస్లాం అనే ధర్మం ఏదైతే రుజుమార్గమో, మరి మనం స్వర్గానికి వెళ్ళాలంటే ఎలాంటి రుజుమార్గాన్ని అనుసరించాలి? ఏ రుజుమార్గం అయితే ప్రవక్త వారిపై పూర్తి చేయబడినదో, ఏ విధంగానైతే పవిత్ర ఖురాన్ గ్రంథం, ఐదవ సూరా, సూరె మాయిదా, వాక్యము సంఖ్య మూడు ప్రాంతంలో అల్లాహ్ త’ఆలా ఏమంటున్నారు మూడులో? అల్లాహ్ ఏమంటున్నారంటే:
الْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِينَكُمْ وَأَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي وَرَضِيتُ لَكُمُ الْإِسْلَامَ دِينًا (అల్ యౌమ అక్మల్తు లకుమ్ దీనకుమ్ వ అత్మమ్తు అలైకుమ్ ని’మతీ వ రదీతు లకుముల్ ఇస్లామ దీనా) “ఈ రోజు నేను మీ కోసం మీ ధర్మాన్ని పరిపూర్ణం చేశాను. మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను. మీ కొరకు ఇస్లాంను ధర్మంగా ఇష్టపడ్డాను.” (5:3)
మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అరఫా మైదానంలో ఉన్నారు. ప్రవక్త వారు జీవితంలో ఒకే ఒక హజ్ యాత్ర చేశారండి. హిజ్రీ పదవ సంవత్సరం, జుల్ హిజ్జా మాసం, తొమ్మిదవ తారీఖు, ప్రవక్త వారు అరఫాత్ మైదానంలో ఉండగా, అల్లాహ్ త’ఆలా వాక్యాన్ని దింపారు. “అల్ యౌమ అక్మల్తు లకుమ్ దీనకుమ్” – ఈ రోజు నేను ఇస్లాం అనే ధర్మాన్ని నీపై పరిపూర్తి చేశాను. మరి రుజుమార్గం అనగా ఏ ధర్మం అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై సీలు వేయబడినదో, అదే రుజుమార్గం.
ఇస్లాంలో భిన్నమైన ఆలోచనా విధానాలు మరియు వర్గాలు
మరి ఈనాటి ముస్లిం సమాజం ఆ రుజుమార్గాన్ని పొందాలి అంటే, మరి ఆ ప్రవక్త వారిపై ధర్మశాస్త్రం సీలు వేయబడిన తరువాత, ఏదైతే ఇస్లాంలో వివిధ రకాల మనుషులు వచ్చి వివిధ రకాల ఆలోచనా భావాలు కల్పించారో, ఆ ఆలోచనా భావాలను మనము తీసుకుంటే రుజుమార్గంపై ఉన్నట్లా? లేకపోతే ప్రవక్త వారిపై ఏ ధర్మశాస్త్రం అయితే పూర్తి చేయబడిందో ఆ ధర్మశాస్త్రంపై ఆచరించే వారు రుజుమార్గంలో ఉన్నట్లా? ఆ తరువాత, ప్రవక్త గతించారు. ప్రవక్త గతించిన తరువాత, సల్లల్లాహు అలైహి వసల్లం, బాగా వినండి. ఇది హిజ్రీ 1442వ సంవత్సరం. హిజ్రీ 1442వ సంవత్సరం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రపంచం నుండి ఏ హిజ్రీలో గతించారు? హిజ్రీ 11వ సంవత్సరంలో ప్రవక్త పరమపదించారు. ఆ తరువాత ఇస్లాం ధర్మశాస్త్రంలో అనేక రకాలైన ఆలోచనా భావాలు కలిగిన విద్వాంసులు వచ్చారు.
ఉదాహరణకి, నేటి ముస్లిం సమాజం ఏ విధంగానైతే ప్రపంచవ్యాప్తంగా నాలుగు రకాల ఆలోచనా భావాలను ముస్లిం సమాజం తమలోకి తీసుకుంది. ఈ నాలుగు రకాల ఆలోచనా భావాలు ఏమిటి? వారు ఏమంటారంటే, ముస్లిం సమాజంలో అనేకమంది తమకు తాము మేము అహలె సున్నత్ వల్ జమాత్, అహలుస్సున్నా వల్ జమాత్, మేమే అహలుస్సున్నా వల్ జమాత్. ఎవరైతే అహలుస్సున్నా వల్ జమాత్, నలుగురు ఇమాముల తరువాత ముస్లిం సమాజం తీసుకొచ్చింది. బాగా వినండి. నాలుగు రకాల స్కూల్స్, నాలుగు రకాల ఆలోచనా భావాలు ఇస్లాంలోకి వచ్చాయి. మొదటి ఆలోచనా భావన, ప్రవక్త గతించిన 69 సంవత్సరాల తరువాత పుట్టిన అబూ హనీఫా రహిమహుల్లాహ్. ప్రవక్త హిజ్రీ 11లో చనిపోతే, 80 హిజ్రీలో పుట్టిన అబూ హనీఫా రహిమహుల్లాహ్ వారి ఎవరైతే అనుచరులు ఉన్నారో, వారు హనఫీ స్కూల్ తీసుకొచ్చారు. హనఫీ ఇస్లామిక్ జ్యూరిస్ప్రుడెన్స్. ఆ తరువాత 93లో పుట్టిన మాలిక్ రహిమహుల్లాహ్, ఇమామ్ మాలిక్ రహిమహుల్లాహ్, అతనిది ఒక ఆలోచనా విధానం. ఆ తరువాత ప్రియులారా, హిజ్రీ 150లో పుట్టిన ఇమామ్ షాఫఈ రహిమహుల్లాహ్, అతనిది ఒక ఆలోచనా విధానం. హిజ్రీ 164లో పుట్టిన ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ రహిమహుల్లాహ్ ది ఒక ఆలోచనా విధానం. వీరి నలుగురిని ప్రపంచం ఏమంటుంది? ఇమామ్ అబూ హనీఫా వెంట నడిస్తే హనఫీలు, ఇమామ్ మాలిక్ వెంట నడిస్తే మాలికీలు, ఇమామ్ షాఫఈ వెంట నడిస్తే షాఫఈ మస్లక్ వారని, ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ వెనకాతల నడిస్తే హంబలీ అంటారు.
కాలక్రమేణా ప్రపంచంలో ఇలా రోజులు గడుస్తూ గడుస్తూ, భారతదేశంలో కూడా జమాత్ లు వెలసిల్లాయి. ఇక్కడ కూడా ఇస్లాం పేరుతో అనేక రకాలైన జమాత్ లు ఆవిర్భవించాయి. అల్లాహ్ రక్షించుగాక! ఈరోజు ప్రపంచంలో అత్యధిక బిద్అత్, అత్యధిక భ్రష్టు పట్టించే మూల స్థానం ఉంది అంటే, అల్లాహ్ రక్షించుగాక, ఇదే భారతదేశం నుండి ప్రపంచవ్యాప్తంగా అనేక రకాలైన బిద్అత్ లను స్థాపించే వ్యవస్థలు ఇక్కడే మూల కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నాయి. అదే క్రమంలో, మన మాట ప్రియులారా, నేను చెబుతున్న మాట, ప్రవక్త వారిపై అల్లాహ్ ఏ ఇస్లాంనైతే పరిపూర్తి చేశాడో, ఆ ఇస్లామే రుజుమార్గం. ఆ ఇస్లాం ఎక్కడ దొరుకుతుంది? మనం అన్వేషించే ప్రయత్నం చెయ్యాలి. భారతదేశంలో అనేక రకాలైన మనుషులు, పెద్ద పెద్ద ఇమాములు అనేక రకాలైన ఆలోచనా భావాలతో, ఏదైతే మన సమాజంలో బరేల్వీ వ్యవస్థ ఉంది. ఈ బరేల్వీ వ్యవస్థ ఎప్పుడు స్థాపించబడింది? సుమారు 1800 ప్రాంతంలోనే అహ్మద్ రజా ఖాన్ బరేల్వీ అనే వ్యక్తి ఉత్తర ప్రదేశ్ లో బరేల్వీ ప్రాంతంలో ఉంటూ బరేల్వీ అనే వర్గాన్ని స్థాపించారు. ఆ తరువాత దేవ్ బంద్ వర్గం వచ్చింది, ఖాసిం నానోతవి రహిమహుల్లాహ్. ఆ తరువాత మనకి తెలుసు ఇస్లాం నుండి బయటకు వెళ్లిన ఖాదియానీ వచ్చింది, మీర్జా గులాం అహ్మద్ ఖాదియానీ స్థాపించారు. మనం చూస్తున్నాం తబ్లీగీ జమాత్ వచ్చింది, మౌలానా ఇలియాస్ రహిమహుల్లాహ్ స్థాపించారు. జమాతె ఇస్లామీ హింద్ అనే సంస్థను చూశాం మనం, దాన్ని మౌదూదీ గారు స్థాపించారు. ఇలా వేరువేరు భావాలు గల, వేరువేరు ఆలోచనా విధానాలు గల ఇస్లాం జమాతులు ఈ యొక్క ప్రపంచంలో, మన భారతదేశంలో ఆవిర్భవించాయి.
అహలె హదీస్: మూలం మరియు నిర్వచనం
ఇదే క్రమంలో భారతదేశంలో అహలె హదీస్ అనే పేరుతో కూడా ఒక ఉద్యమం ప్రారంభించబడింది. ఈ అహలె హదీస్ లు ఎవరైతే అనబడ్డారో, వీరిని భారతదేశంలో ఉన్న మెజారిటీ ముస్లింలలో, హనఫీ వర్గంలో ఉన్నవారు తిడుతూ వచ్చారు. వీరు వహాబీలు, వీరి వెనకాతల నమాజ్ అవ్వదు, వీరికి సలాం చెప్పకండి, మేమంతా ముఖల్లిదులం, వీరు గైర్ ముఖల్లిదులు, వీరు ఇస్లాంలో కొత్త విధానాలు తీసుకొచ్చారు. మా తాత ముత్తాతల వరకు చెయ్యి కింద కట్టే వాళ్ళం, వీరొచ్చి చెయ్యి పైన కట్టే విధానం తీసుకొచ్చారు. మా తాత ముత్తాతలు ఆమీన్ గట్టిగా చెప్పేవారు కాదు, వీరొచ్చి మేము ఆమీన్ గట్టిగా చెప్పాలంటున్నారు. మా తాత ముత్తాతల కాలంలో మేము తక్బీర్ తో చేతులు ఎత్తేవారం కాదు, వీరు చేతులు ఎత్తుతున్నారు. మా తాత ముత్తాతల కాలంలో నమాజ్ అయిన తరువాత ఇజ్తిమాయీ దుఆ ఇమామ్ గారు చేసేవారు, మేము వెనకాతల ఆమీన్ ఆమీన్ పలికేవాళ్ళం, వీరు ఇది తీశారు. ఎన్ని తీశారండి? ఆమీన్ తీసేశారు, దుఆ తీసేశారు, చేతులు మాటిమాటికి పైకి ఎత్తుతున్నారు, చేతులు పైకి కడుతున్నారు, ఇదొక కొత్త వ్యవస్థ. వీరు గైర్ ముఖల్లిదులు. నఊజుబిల్లాహి మినస్సాలిక్.
ఒక మాట వాస్తవంగా మీరు తెలుసుకుంటే సోదరులారా, నేను ఏమీ ఆధారాలతో సహా మాట్లాడుతున్నాను. ఒక వర్గం వైపు నేను మోజుతో ఆ వర్గానికి సపోర్టుగా మాట్లాడను, ఒక వర్గం పైన వైరి వలన ఆ వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడడ కోవాల్సిన అవసరం మనకి లేదు. మనం మాట్లాడుకోవలసినది ఖురాన్ మరియు హదీసు మాట. ఈరోజు మనం చెబుతున్న మాట ఏమిటంటే, ఏదైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై ఇస్లాం ధర్మము పరిపూర్తి చేయబడిందో, “అల్ యౌమ అక్మల్తు లకుమ్ దీనకుమ్” అల్లాహ్ అన్నాడు, ప్రవక్తా, నీపై నేను ఇస్లాం ధర్మాన్ని పరిసమాప్తము చేసేసాను. ఆ విధానము ఎవరి వద్దనైతే ఈరోజు ప్రపంచంలో ఉందో, వారినే అహలె హదీస్ విధానం అన్నారు ప్రియులారా. ఈ అహలె హదీస్ విధానం ఎవడో నలుగురు నాలుగు తప్పులుగా మన గురించి చెప్పితే మనం తప్పు అయిపోం. మనము ఇన్షా అల్లాహ్ సత్యంపై ఉన్నవాళ్ళం. ఎందుకు? హదీసుల ద్వారా కొన్ని ఆలోచనలు చెబుతాను వినండి. ఫస్ట్ హదీస్, ప్రవక్త ఏం చెప్పారండి? “నా యొక్క ఉమ్మత్, నా అనుచర సమాజం 73 వర్గాలుగా చీలిపోతుంది,” ప్రవక్త అన్నారు. 73 వర్గాలుగా చీలిపోతుంది. “ఇల్లా మిల్లాతన్ వాహిదా” వారందరూ నరకానికి వెళ్తారు. “కుల్లుహుమ్ ఫిన్నార్” వారందరూ నరకంలోకి వెళ్తారు. ఇల్లా, కానీ “మిల్లాతన్ వాహిదా,” ఒకే ఒక సంఘము తప్ప. ప్రవక్త వారితో సహబాలు అడిగారు, “మన్ హియ యా రసూలల్లాహ్?” ప్రవక్తా, ఆ ఒక్క సంఘం ఏది? దేని గురించి అయితే మీరు స్వర్గానికి వెళ్తున్నారు అన్నారో? ప్రవక్త వారు ఏమన్నారు? “మా అన అలైహి వ అస్ హాబీ,” ఎవరైతే నన్ను అనుసరిస్తారో, నా సహబాలను అనుసరిస్తారో, వారు స్వర్గానికి వెళ్తారు అని ప్రవక్త వారు చెప్పడం జరిగింది. సుబ్ హా నల్లాహ్. ఆ ఒకే ఒక వర్గం ఎవరు? మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రెండో హదీస్, తిర్మిజీ గ్రంథంలో ఒక హదీస్ ఉల్లేఖించబడింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే, “లా తజాలు తాఇఫతుమ్ మిన్ ఉమ్మతీ,” నా యొక్క ఉమ్మత్ లో ఒక వర్గం ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. “మన్సూరీన్,” ఆ వర్గానికి విజయం ప్రాప్తమవుతుంది. ప్రజలు ఆ వర్గానికి సహాయము చేసినా, సహాయము చేయకపోయినా, వారు ఎల్లప్పుడూ సత్యంపై ఉంటారు. “హత్తా తఖూమస్సాఅ,” ఆఖరికి ప్రళయం వచ్చేస్తుంది, ఆ వర్గం మాత్రం సత్యంపై నిలబడుతుంది, వారికి విజయం ప్రాప్తమవుతుంది అని ప్రవక్త వారు అన్నారు. ఈ హదీసులో ఆ వర్గం, “తాఇఫా,” ఆ వర్గం అన్న మాటకు బుఖారీ రహిమహుల్లాహ్ వారి గురువు గారు, అలీ మదీనీ రహిమహుల్లాహ్ రాస్తున్నారు, ప్రవక్త వారు చెప్పిన ఆ వర్గం పేరు అహలుల్ హదీస్. బుఖారీ రహిమహుల్లాహ్ వారి గురువు గారు రాస్తున్నారు, ప్రవక్త చెప్పిన ఆ వర్గం పేరు అహలుల్ హదీస్. ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ రహిమహుల్లాహ్ రాస్తున్నారు, ప్రవక్త చెప్పిన ఆ వర్గం పేరు అహలుల్ హదీస్. దాని తర్వాత, పీరానె పీర్, పీరానె పీర్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహిమహుల్లాహ్ అంటున్నారు, గున్ యతుత్ తాలిబీన్ అనే వారి పుస్తకం. పీరానె పీర్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహిమహుల్లాహ్ రాసిన గున్ యతుత్ తాలిబీన్ పుస్తకంలో రాస్తున్నారు అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహిమహుల్లాహ్, ఆ వర్గం పేరు అహలుల్ హదీస్. ఆ తరువాత, అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహిమహుల్లాహ్ ఒక గొప్ప మాట చెప్పారండి. ఆయన ఏం చెప్పారంటే, బిద్అతీలను ఎలా మనం పోల్చుకోవాలి? అబ్దుల్ ఖాదిర్ జీలానీ అంటున్నారు రహిమహుల్లాహ్, బిద్అతీలను పోల్చుకునే మార్గం ఏమిటంటే, బిద్అతీలు ఎల్లప్పుడూ అహలె హదీస్ ల గురించి చెడుగా మాట్లాడుతుంటారు. ఎవడైతే అహలె హదీస్ గురించి చెడుగా మాట్లాడుతాడో, వాడు బిద్అతీ అని మనం పోల్చుకోవాలి అని అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహిమహుల్లాహ్ చెప్పారు. నేను చెప్పే మాట ఏమిటంటే, కన్ఫ్యూజ్, ఈరోజు ఏంటండీ ముస్లింల మనం? ఒకరంటారు ఫలానా అహలుస్సున్నా, ఒకరంటారు అహలె హదీస్, ఒకరంటారు ఫలానా తబ్లీగ్, ఒకరంటారు ఫలానా కజా, వ కజా, ఇన్ని మాటలు. ఇందులో ఈరోజు సత్యమైన వ్యవస్థ, ఖురాన్ మరియు హదీస్ వరకు మిమ్మల్ని చేర్చే వ్యవస్థ, ఎప్పుడైనా పరికించారా? ఎప్పుడైనా ఆలోచించారా? పుస్తకాలు తెరిచి చూసే ప్రయత్నం చేశారా? ఈరోజు సుబ్ హా నల్లాహ్, ఈ అహలుల్ హదీస్ అన్న మాట, అహలె హదీస్ అనే ఈ సంఘం, ఏ వ్యక్తి చేత స్థాపించబడలేదు. ఎలాగైతే నేను ఇందాక ప్రస్తావించాను, సుబ్ హా నల్లాహ్, మనం చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ జమాత్ గురించి చెడుగా మాట్లాడే హక్కు మాకు లేదు, మాట్లాడం ప్రియులారా. మనం బిద్అతులను, ఇస్లాం ధర్మశాస్త్రంలో నవీన పోకడలను ఖండిస్తాం. మనం తీసుకుందాం, మీరు చూపించండి, ప్రశ్నిస్తున్నాను, ఇన్ని నాళ్ళలో వస్తున్నాం మస్జిద్ లకు, ఒక వ్యవస్థ మనం తెలుసుకునే ప్రయత్నం చేశామా? అహలె హదీస్ అంటే ఏమిటి అసలు? అహలె హదీస్ అంటే ఒక మనిషి చేత స్థాపించబడిన ఒక జమాతా? అరె అన్ని జమాతులు, బరేల్వీ, సయ్యద్ అహ్మద్ రజా ఖాన్ బరేల్వీ. తబ్లీగీ జమాత్, ఫలానా మౌలానా ఇలియాస్. జమాతె ఇస్లామీ, ఫలానా అబుల్ అలా మౌదూదీ. ప్రతి జమాత్ ఏదైతే ఇస్లాం అన్న పేరుతో భారతదేశంలో ఉందో, ప్రతి జమాత్ ను ఒక వ్యక్తి స్థాపించాడు. కానీ ఈ అహలుల్ హదీస్ అనే వర్గాన్ని సుబ్ హా నల్లాహ్, సహబాల కాలము నుండి అహలె హదీస్ అన్న మాట వస్తుంది. ఆధారాలు చూపించాను. బుఖారీ రహిమహుల్లాహ్ వారి ఉస్తాద్ అలీ మదనీ రహిమహుల్లాహ్ అహలె హదీస్ అనే పదాన్ని ఉపయోగించారు. వాస్తవానికి అహలె హదీస్ అంటే ఏమిటి? చాలామంది నఊజుబిల్లా రకరకాల మాటలు పలికారు. భారతదేశంలో బ్రిటిష్ వారు తయారు చేశారు వహాబీలను, ఇదంతా తప్పుడు మాట ప్రియులారా. అహలె హదీస్ ప్రవక్త యొక్క సహబాల కాలం నుండి సుబ్ హా నల్లాహ్ ఉంది. దీన్నే అహలె హదీస్ అన్నారు, అహలె ఇత్తిబా అన్నారు, అహలుల్ అసర్ అన్నారు, అహలుత్ తౌహీద్ అన్నారు, ఫిర్కతున్ నాజియా అన్నారు. రకరకాల పేర్లతో దీన్ని పిలవడం జరిగింది. మన భారతదేశంలో ఇది అహలె హదీస్ గా పిలవడం జరుగుతుంది. దీనిలోనే మన కోసం స్వర్గం ఉంది ప్రియులారా. దానికి ఆధారం, అహలె హదీస్ అంటే అర్థం ఏంటి? అహల్, అహల్ అంటే అర్థము చెందిన వారు. అహల్ అంటే అర్థము చెందిన వారు. హదీస్ అంటే ఖురాన్ మరియు హదీస్. హదీస్ అనే పదం కేవలం హదీస్ కు మాత్రమే మనం దాన్ని ఇది చేయకూడదు ప్రియులారా. హదీస్ అంటే ఖురాన్ మరియు హదీస్ రెండింటినీ కలిపి ఇస్లామీయ ధర్మశాస్త్రం హదీస్ అని చెప్పింది ప్రియులారా. అంటే అహలె హదీస్ అంటే ఏమిటి? ఖురాన్ మరియు హదీస్ లపై ఆచరించే వారినే అహలె హదీస్ అన్నారు ప్రియులారా. మరి ఆచరణలో ఆలోచనా విధానం ఎలా ఉండాలి? ప్రతి ఒక్కడు వచ్చి ఖురాన్ ఎత్తి ఈ ఆయత్ ఇలాగ అర్థమైంది, ఈ ఆయత్ ఇలాగ అర్థమైంది, ఈ ఆయత్ ఇలాగ అర్థమైంది, లేదు. అహలె హదీస్ అంటే అదే ఖురాన్ చెప్తుంది, ఎలా ఖురాన్ హదీస్ ను నమ్మాలి? ఉదాహరణకి అల్లాహ్ త’ఆలా ఖురాన్ లో చెప్పాడు, “లా తఖ్రబుస్సలాత వ అన్తుమ్ సుకారా,” మీరు మధ్యము స్థితిలో ఉన్నప్పుడు నమాజు దరిదాపులకు వెళ్ళకండి. అరె, చూడండి చూడండి, అల్లాహ్ త’ఆలా మీరు నమాజు దరిదాపులకు వెళ్ళకండి, మధ్యము స్థితిలో ఉన్నప్పుడు, అంటే నమాజు చేసేటప్పుడు మధ్యం తాగకూడదేమో, నమాజు చేయని స్థితిలో మధ్యం తాగొచ్చేమో, అర్థం చేసుకునే వాడు ఇలా అర్థం చేసుకుంటాడు. కాబట్టి దాని యొక్క పుట్టు పూర్వోత్తరాలు, అది ఎప్పుడు అవతరించింది? ఎలా అవతరించింది? ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా అర్థం చేసుకోవాలి? ప్రవక్త వారి శిష్యులు ఏ విధంగా అర్థం చేసుకున్నారో, ఆ విధంగా ఖురాన్ హదీస్ ను అర్థం చేసుకోవాలి. దానికి ఆధారం ఇదే ఖురాన్, రెండవ సూరా, వాక్యం సంఖ్య 137. అల్లాహ్ ఏమన్నారంటే:
فَإِنْ آمَنُوا بِمِثْلِ مَا آمَنْتُم بِهِ فَقَدِ اهْتَدَوا (ఫ ఇన్ ఆమనూ బి మిస్లి మా ఆమన్తుమ్ బిహీ ఫఖదిహ్ తదవ్)
వారు కూడా మీరు విశ్వసించినట్లే విశ్వసిస్తే సన్మార్గం పొందుతారు. (2:137)
ఏ విధంగానైతే సహబాలు విశ్వసించారో, ఆ విధంగా విశ్వసిస్తేనే వారు మార్గదర్శకత్వంపై ఉన్నట్లు ప్రియులారా. కాబట్టి అహలె హదీస్ విధానం నిస్సంకోచంగా మిమ్మల్ని సహబాల విధానం వరకు తీసుకువెళ్తుంది. ఎవరైతే ఈ అహలె హదీస్ అనే మనహజ్ కాకుండా, అహలె హదీస్ మనహజ్ కాకుండా, ప్రవక్త మనహజ్ కాకుండా, సహబాల విధానం కాకుండా వేరే విధానాలపైకి వెళ్తే, వారు నరకంలోనికి వెళ్ళిపోతారు. ఆధారం, నాలుగవ సూరా, సూరె నిసా, వాక్యము సంఖ్య 115. అల్లాహ్ ఏమన్నారంటే, మనం చదవాలి, ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఖురాన్ అంటుంది:
సన్మార్గం స్పష్టమైన తర్వాత కూడా ప్రవక్తకు విరోధం వహించి, విశ్వాసుల మార్గాన్ని కాకుండా ఇతర మార్గాన్ని అవలంబించేవాడిని మేము వాడు తిరిగిన వైపుకే తిప్పివేస్తాము. వాడిని నరకాగ్నిలో పడవేస్తాము. అది చాలా చెడ్డ గమ్యస్థానం. (4:115)
ఎవరైతే మీకు ప్రవక్త విధానం చూపించి, సహబాల విధానం చూపించి, ప్రవక్త మరియు సహబాల విధానము తెలిసిన తరువాత ఆ విధానాన్ని విడిచిపెట్టి, వేరే విధానం వెంట వెళితే వాడిని మేము నరకంలో వేస్తాం అల్లాహ్ అన్నాడు. నేను చెప్పట్లేదు అల్లాహ్ అన్నాడు. ప్రవక్త మరియు సహబాల విధానం తెలిసిన తరువాత అల్లాహ్ మరియు ప్రవక్త విధానానికి దూరంగా వెళితే వాడిని మేము నరకంలో పడవేస్తాం. మరి ఈరోజు మనం అల్లాహ్ మార్గం, ప్రవక్త మార్గం, సహబాల మార్గంపై ఎంతవరకు ఉన్నట్లు? ఎంతవరకు ఈ ప్రపంచం మిమ్మల్ని పిలుస్తోంది? మేము ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ప్రపంచంలో ఆ అల్లాహ్ మార్గం, అల్లాహ్ ప్రవక్త మార్గం, సహబాల మార్గం మిమ్మల్ని అహలె హదీస్ అనే విధానం సుబ్ హా నల్లాహ్ పిలుస్తుంది. మీరు చెప్పట్లేదు అహలె హదీస్ చెప్పండి, చెప్పండి, కానీ ఈరోజు అహలె హదీస్ అనే విధానం మిమ్మల్ని స్వర్గం వరకు తీసుకువెళ్తుందని చెబుతున్నాము. ప్రపంచవ్యాప్తంగా ప్రియులారా దీన్నే సలఫీ వ్యవస్థ అన్నారు, అహలుల్ హదీస్ వ్యవస్థ అన్నారు, రకరకాల పేర్లతో పిలవడం జరిగింది. మా విధానం ఏంటండీ? మా విధానం ఏంటి? నలుగురు ఇమాములను ప్రేమిస్తాం. నలుగురు ఇమాముల పట్ల ప్రేమ ఉంది. ఏ ఇమామ్ ను తిరస్కరించరు అహలె హదీస్. ఈరోజు ప్రపంచంలో అన్ని ముస్లింలు, పెద్ద పెద్ద ముఫ్తీలు ఏమంటున్నారంటే లేదండి, అహలె హదీస్ కొత్తగా వచ్చిందండి, మా అబూ హనీఫా చెప్పిందే మాకు కావాలండి, మా షాఫఈ చెప్పిందే మాకు కావాలండి, ప్రవక్త చెప్పినా వద్దు. మేమేమంటున్నామంటే, ఖురాన్ తీయండి, నాలుగవ సూరా, మనం తెలుసుకోవాలి, 59వ వాక్యం:
ఓ విశ్వాసులారా! అల్లాహ్‌కు విధేయత చూపండి. ప్రవక్తకు విధేయత చూపండి. మీలోని అధికారులకు విధేయత చూపండి. ఏదైనా విషయంలో మీకు మధ్య అభిప్రాయభేదం వస్తే, దాన్ని అల్లాహ్ మరియు ప్రవక్త వైపుకు మరల్చండి. (4:59)
ఓ విశ్వసించిన ప్రజలారా, అల్లాహ్ కు విధేయత చూపండి, ప్రవక్తకు విధేయత చూపండి, మీలో పెద్దలకు విధేయత చూపండి. తఫ్సీర్ లో ఉలమాలు రాశారు, ఒకవేళ అక్కడ ఏదైనా ఖురాన్ హదీస్ కు వ్యతిరేకంగా ఉంటే మీరు పెద్దల్ని విడిచిపెట్టి అల్లాహ్ మరియు ప్రవక్త వైపునకు మరలిపోండి. నేను నలుగురిని, ఎంతమందికి ఐడియా కలిగి ఉన్నారో, ఐడియా లేకపోతే వినండి. ఐడియా, ఎందుకంటే ఈరోజు ఏందంటే అరె, ఏంది నేను హనఫియన్, హనఫియన్, ఎవరికి కావాలి? మీరు హనఫీ అవ్వొచ్చు మాస్టర్ అవ్వండి. కానీ ఇతరులను గైర్ ముఖల్లిదులు, వాళ్ళు ఇది, అది, ఓ చిన్న ఉదాహరణ ఇచ్చి మాట ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తాను. అహలె హదీస్ కు, అహలె హదీస్ కు, ఇతర ముఖల్లిదులకు, ఎవరైతే లేదు హనఫీ, లేదు షాఫఈ, లేదు మాలికీ, లేదు హంబలీ, ఎవరైతే ఉన్నారో వాళ్లకి మనకి చిన్న తేడా చూపే ప్రయత్నం చేసి ముందుకు వెళ్తాను. ఏమిటంటే, ఒక చిన్న స్టోరీ చెప్పాలి మీకు. ఒక వ్యక్తి ఉండేవాడు, బహుశా మీరు విని ఉంటారు. తమిళనాడు రాష్ట్రంలో, తమిళనాడు రాష్ట్రంలో రామనాథపురానికి చెందిన ఒక వ్యక్తి ఉండేవాడు, ఆయన చనిపోయాడు. ఆయన ముందు జీవితంలో షాఫఈ మస్లక్ లో ఉండేవాడు, జమాత్ తో తిరిగేవాడు. ఇండోనేషియా, జపాన్, ఎక్కడెక్కడికో వెళ్ళాడు. జీవితపు చరమాంకంలో అహలె హదీస్ విధానానికి దగ్గరయ్యాడు, సుబ్ హా నల్లాహ్. నేను ప్రశ్నించాను, అయ్యా మీరు జీవితంలో ఇన్నేళ్ల పాటు ఫలానా జమాత్ తో, ఇన్ని దేశాలు, ఇన్ని ఏళ్ళు తిరిగారు కదా, ఎందుకు విడిచిపెట్టేశారు? ఆయన స్టోరీ చెప్పాడు, అయ్యా నేను షాఫఈ అనే మస్లక్ లో ఉండేవాడిని. నేను ఒకసారి హజ్ యాత్రకు బయలుదేరాను. నేను తిరుచిరాపల్లి ఎయిర్పోర్ట్ కు వచ్చాను. తిరుచిరాపల్లి ఎయిర్పోర్ట్ కు వచ్చి ఫ్లైట్ ఎక్కుతున్నప్పుడు, మా మస్జిద్ ఇమామ్ గారు నా చెవిలో ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, అయ్యా, నువ్వు హజ్ యాత్ర చేయటానికి వెళ్తున్నావ్, నీ ఫ్లైట్ జెడ్డాలో ల్యాండ్ అవ్వడానికి ముందు మీకాత్ వస్తుంది. మీకాత్ ప్రాంతంలో మనం ఏం చేస్తామంటే సంకల్పం చేస్తాం. నేను ఉమ్రా చేయడానికి వెళ్తున్నాను. అల్లాహుమ్మ లబ్బైక ఉమ్రతన్, అల్లాహుమ్మ లబ్బైక హజ్జన్ అని మనం హజ్ లేదా ఉమ్రాకి ఫ్లైట్ లోనే మీకాత్ లో సంకల్పం చేస్తాం. గురువుగారు ఏం చెప్పారంటే చెవిలో, అరేయ్, నువ్వు హజ్ యాత్రకు వెళ్తున్నావ్, మీకాత్ రాగానే, అల్లాహ్ నేను హజ్ కు కోసం సంకల్పం చేస్తున్నాను, దానితోపాటే షాఫఈ నుండి హనఫీగా మారిపోతున్నాను అని సంకల్పం చేసుకో అన్నారు. ఇదేంటి గురువుగారు, తెల్లవారితే హనఫీలొక వ్యతిరేకంగా మనం ఉన్నాం, ఇప్పుడెందుకు హజ్ కు వెళ్తుంటే ఇప్పుడు హనఫీగా మారిపోమంటారు ఏమిటి అని బాధపడ్డాడు. గురువుగారు చెప్పారు, లేదు నాయనా, మన షాఫఈ మస్లక్ ప్రకారం ఏముందంటే పురుషుడు వజూ చేసిన తరువాత, పురుషుడు వజూ చేసిన తరువాత స్త్రీని ముట్టుకుంటే పురుషుడి వజూ భగ్నమైపోతుంది. నువ్వు హజ్ యాత్రకు వెళ్తున్నావ్, అక్కడ అనేక మంది పురుషులు స్త్రీలు ఉంటారు. నీకు తెలియకుండానే ఏదో స్త్రీ తవాఫ్, ప్రదక్షిణ చేసే కంగారులో నిన్ను తాకి వెళ్ళిపోతుంది, నీ వజూ విరిగిపోతుంది. నువ్వు షాఫఈ మస్లక్ లో ఉండిపోతే, మాటిమాటికి ఎవరో తగులుతుంటారు, వజూ చేస్తూ ఉంటావ్, నీ హజ్ యాత్ర మొత్తం వజూలోనే పోతుంది. అలా కాకుండా హనఫీ మస్లక్ ప్రకారం అయితే పురుషుడు వజూ చేసి స్త్రీని ముట్టుకుంటే పురుషుడి వజూ విరగదు. కాబట్టి హజ్ యాత్ర అంతా చేసుకో హనఫీ మస్లక్ లో, తిరిగి ఇండియాలో ల్యాండ్ అయిపోయినప్పుడు నేను షాఫఈగా మారిపోయాను అని చెప్పి ల్యాండ్ అయిపో అన్నాడు. ఇదేంది ఇస్లాం? హనఫీ మస్లక్ లో ఒకటి, షాఫఈ మస్లక్ లో ఒకటి. అహలె హదీస్, ఇది వినండి. అహలె హదీస్ ఏం చెప్తుంది? మనం షాఫఈని గౌరవిస్తాం, హనఫీని గౌరవిస్తాం. మనం ఏం చూస్తాం? ప్రవక్త ఏం చేశారు అని మనం చూస్తాం. సుబ్ హా నల్లాహ్, హదీస్. అమ్మా ఆయిషా సిద్దీకా రదియల్లాహు త’ఆలా అన్హా అంటున్నారు, రాత్రి పూట ప్రవక్త వారు తహజ్జుద్ నమాజ్ చేసేవారు. నేను ప్రవక్త ముందు పడుకునే దానిని, ప్రవక్త వారు తహజ్జుద్ నమాజ్ చేస్తూ సజ్దా చేసినప్పుడు ప్రవక్త వారి తల నా మోకాళ్లకు, ముడుపులకు తగిలేది. ఎప్పుడైతే ప్రవక్త తల నా కాళ్లకు తగిలేదో, నేను రెండు కాళ్లు ముడుచుకునే దానిని. అమ్మా ఆయిషా అంటున్నారు. దీని బట్టి ఏం తెలిసింది? పురుషుడు వజూ చేసి కేవలం స్త్రీని ముట్టుకుంటే వజూ విరగదు. ఇదే అహలె హదీస్. మనం నమ్ముతాం, ప్రతి ఒక్కరిని గౌరవిస్తాం. కానీ బండగా ఇది చేశారు ఆ గురువుగారు, చెయ్యం. ఖురాన్ లో ఉందా? హదీస్ లో ఉందా? ఇదే నిజమైన సహబాల మార్గం, ప్రవక్త మార్గం, స్వర్గానికి తీసుకువెళ్లే మార్గం. ఇదే వ్యవస్థను భారతదేశంలో అత్యధికంగా అహలె హదీస్ గా పిలుస్తారు. ఇదేదో కొత్తగా వచ్చింది కాదు, ఈరోజు అహలె హదీస్ అని చెప్పుకోవటానికి భయపడక్కర్లేదు. ఎందుకంటే ఇది ఒక మనిషి పెట్టిన సంస్థ కాదు. సహబాల విధానాన్నే అహలె హదీస్ అన్నారు.
జమియతే అహలె హదీస్ మరియు దాని పిలుపు
మరి ఇండియాలో దీని తారీఖ్ ఏంటి? ఇండియాలో ఎప్పుడు పూర్తి అధికారికంగా మనం మాట్లాడుకుంటే, భారతదేశంలో ప్రియులారా, ఈ అహలె హదీస్ జమాత్ ఎప్పుడు కమిటీగా, అహలె హదీస్ వ్యవస్థ ఉంది, ఎప్పుడు కమిటీగా స్థాపించబడింది అంటే, 1906వ సంవత్సరంలో ప్రియులారా, 1906, 1906వ సంవత్సరంలో బీహార్ రాష్ట్రంలో ఆరా అనే ప్రాంతంలో అహ్మదియా అనే ఒక మదరసా ఉండేది. ఆ మదరసా యొక్క వార్షికోత్సవములో అహలె హదీస్ కాన్ఫరెన్స్ పేరుతో మొట్టమొదటి ఇజ్తిమా భారతదేశంలో జరిగింది 1906లో ప్రియులారా. అప్పుడు ఈ జమియత్, ఒక కమిటీ పరంగా, మనుషులైతే ఎప్పుడో ఉన్నారు సుబ్ హా నల్లాహ్, కమిటీ పరంగా భారతదేశంలో 1906 నుండి ఆవిర్భావంలోనికి వచ్చింది. కానీ ముస్లింలు ఎప్పుడున్నారు? 1906లో వచ్చారా? ముస్లింలు సహబాల కాలంలోనే ఇండియాలోనికి వచ్చారు. రాసేవాళ్ళు రాస్తారు పుస్తకాల్లో, భారతదేశంలో ముస్లింలు 712 క్రీస్తుశకం సింధూ దండయాత్ర ద్వారా దేశంలోనికి వచ్చారు. ఇది అబద్ధం. 712లో మహమ్మద్ గజనవి, గోరి, పేర్లు ఉంటాయి కదా, గజనీ మహమ్మద్, ఇలాంటి పేర్లు ఉంటాయి. వారి ద్వారా దండయాత్ర ద్వారా, 712లో ముస్లింలు వచ్చారు, అబద్ధం. ఇస్లాం భారతదేశంలో ప్రవక్త కాలంలో వచ్చింది. భారతదేశంలో ఇప్పటికీ మొట్టమొదటి మస్జిద్ ఉంది, వెళ్లి చూడండి. ఇండియాలో మొట్టమొదటి మస్జిద్ 629లో కట్టారు, సుబ్ హా నల్లాహ్. ఇది 2021 అయితే, భారతదేశంలో మొదటి మస్జిద్ 629లో కట్టబడింది. ఇప్పటికీ కేరళలో, మలబార్ ప్రాంతంలో, చెరమాన్ పెరుమాళ్ జుమా మస్జిద్ పేరుతో మస్జిద్ వర్ధిల్లుతుంది ప్రియులారా. ఏది ఏమైనప్పటికీ, సుబ్ హా నల్లాహ్, మనం ఒక మంచి వ్యవస్థను కలిగి ఉండాలి, ఖురాన్ హదీస్ వ్యవస్థ, అదే అహలె హదీస్ వ్యవస్థ, అదే సహబాల కాలం నాటి నుండి ఉంది. ఇమాముల కాలం నాటి నుండి ఉంది. ప్రతి ఇమామ్ ఈ అహలె హదీస్ విధానాన్ని గౌరవించారు. ఇదే సత్యమని ధ్రువీకరించారు. ఈరోజు ప్రవక్తపై అవతరించిన ఇస్లాం, ఏదైతే అహలె హదీస్ రూపంలో మాత్రమే భారతదేశంలో ప్రస్తుత పరిస్థితుల్లో మిగిలి ఉంది ప్రియులారా. ఇండియాలో దీని ఆవిర్భావం 1906లో జరిగింది, సుబ్ హా నల్లాహ్. అప్పటి నుండి ఇదొక జమియత్ గా అవతరించింది. 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత, ఇది మర్కజీ జమియతే అహలె హదీస్ గా మారింది ప్రియులారా. అనేక శాఖలు కలిగి ఉంది, సుబ్ హా నల్లాహ్. ఇది ప్రపంచానికి శాంతి వైపునకు పిలుస్తుంది. దీని ద్వారా ప్రపంచానికి లాభాలు తప్ప నష్టాలు లేవు. ఈరోజు భారతదేశంలో మేమే అహలుస్సున్నా వల్ జమాత్, అహలుస్సున్నత్, అహలుస్సున్నత్, వీరంతా అహలె బిద్అత్ పనులు చేస్తున్నారు. ఈరోజు దేశంలో ఇస్లాంకు సంబంధించి, షరియత్ కు సంబంధించి విషయాలు కోర్టులకెక్కినాయి అంటే, ఎవరు కోర్టుకెక్కించారు? ఈరోజు ఇస్లాం షరియత్ లో భారతదేశం యొక్క కోర్టులు వచ్చి చుచ్చును పోయాయి అంటే ఎవరు చుచ్చు చేశారు? త్రిపుల్ తలాఖ్ తీసుకోండి. ఈ త్రిపుల్ తలాఖ్ అంశం భారతదేశంలో షరియత్, షరియత్ లోకి కోర్టు వచ్చింది అంటే త్రిపుల్ తలాఖ్ నియమం ఉంది. కానీ వాస్తవానికి ఖురాన్ హదీస్ ప్రకారం త్రిపుల్ తలాఖ్ ఇస్తే, మూడు తలాఖులు కాదు. ఎవడైనా మనిషి తన భార్యకు మూడు సార్లు తలాఖ్ చెబితే, షరియత్ ప్రకారం ఒక్క తలాఖ్ మాత్రమే అవుతుంది. స్త్రీ గౌరవాన్ని కాపాడే వ్యవస్థ అహలె హదీస్ వ్యవస్థ ప్రియులారా. ఈరోజు దేశంలో ఒక ఉద్యమం, స్త్రీలు మస్జిద్ లోకి రాకూడదు, స్త్రీల కోసం మస్జిద్ లో ఏర్పాటు లేదు, దీనికోసం కేరళలో ఒక స్త్రీ ఏం చేసింది? జుమా రోజు మీరు మస్జిద్ లకు స్త్రీలను రానివ్వటం లేదు, నేను ఇమామత్ చేయిస్తా, నఊజుబిల్లా, జుమా రోజు ఇమామత్ చేయించింది ఒక స్త్రీ. అల్లాహ్ రక్షించుగాక! దేని వలన? మీరు స్త్రీలకు మస్జిద్ లో పర్మిషన్ ఇవ్వకపోవడం వలన. కానీ ఈరోజు మేరు భారతదేశంలో అహలె హదీస్ మస్జిదులు స్త్రీల కోసం తలుపులు తెరుస్తున్నాయి, మాషా అల్లాహ్. మీరు మస్జిద్ కు వచ్చి పురుషులతో పాటు పరదా వ్యవస్థతో నమాజ్ స్థాపించవచ్చు. అహలె హదీస్ విధానం, దేశంలో ఇస్లాంకు వ్యతిరేకంగా గొంతెత్తే వారికి సమాధానం మన వద్ద ఉందండి. త్రిపుల్ తలాఖ్ కోసం మాట్లాడేవారు, మేము అహలె హదీస్ సమాధానం ఇస్తాం. ఎవరైనా స్త్రీ మస్జిద్ కు రాకూడదంటే, సమాధానం ఇవ్వగలదు అహలె హదీస్. ఈరోజు భారతదేశంలో ముస్లింల పట్ల ద్వేషం దేనికోసం అండి? కోపం, కొంతమంది ముస్లింలు, జ్ఞానం లేని ముస్లింలు ఏం చేస్తున్నారు? పండగ వస్తే, ఒక జెండాలు పెడతారు. ఆ జెండా దేనిని రిసెంబుల్ చేస్తుంది? అది పక్క దేశం యొక్క జెండాలాగా ఉంది. మరి ఆ జెండాలు పెట్టకుండా, ఈరోజు ఇస్లాంను పూర్తిగా వాస్తవ రూపంలో తెలియజేసేది అహలె హదీస్. ఒక అహలె హదీస్ మస్జిద్ వద్ద ఏదైనా పండగ వస్తే జెండా చూస్తారా? అల్లాహ్ రక్షించుగాక! మనమంతా బిద్అత్ ప్రియులారా. ఈరోజు అహలె హదీస్ విధానం, దేశంలో అనేక మంది హిందువులు తిడుతుంటారు. రోడ్డుపై వెళ్తున్నప్పుడు అనేక నగరాలలో మధ్యలో దర్గాల పేర్లతో, సమాధుల పేర్లతో సమాధులు ఉంటాయి. కానీ సమాధులు భూమికి ఇంత ఎత్తులో కూడా ఉండకూడదు, తొలగించాలని చెప్పిన వ్యవస్థ ఇస్లాం వ్యవస్థ. దీనితో దేశానికి శాంతి ఉంది. మరి ఎంతమంది ఈరోజు స్వర్గానికి వెళ్ళే ఈ వ్యవస్థ, దేశంలో ప్రజలకు శాంతి కలిగించే ఈ వ్యవస్థ, దేశంలో ప్రజలకు స్వచ్ఛమైన తౌహీద్ బోధించే ఈ వ్యవస్థతో కలిసి ఉన్నారు? కలవండి. ఈరోజు అహలె హదీస్ అనే ఈ విధానంతో, ఈ మస్లక్ ఎందుకంటే ప్రియులారా, నేను చెప్పే మాట, ఇంతకీ ఎందుకయ్యా చెప్తున్నారు ఈయన? నేను చెప్పే మాట, ఈరోజు మనమంతా ఒక శక్తి ప్రియులారా. ఈ శక్తి చిన్నాభిన్నం కాకూడదు. మనం ముక్కలు కాకూడదు. మనం ముక్కలైతే ఏమవుతుంది? ఖురాన్ తీయండి. అల్లాహ్ అంటున్నారు:
అల్లాహ్‌కు, ఆయన ప్రవక్తకు విధేయులై ఉండండి. పరస్పరం కలహించుకోకండి. అలా చేస్తే మీరు బలహీనులైపోతారు. మీ బలం నశిస్తుంది. ఓర్పు వహించండి. నిశ్చయంగా అల్లాహ్ ఓర్పు వహించేవారికి తోడుగా ఉంటాడు. (8:46)
అల్లాహ్ ఏమన్నాడు? “వ అతీఉల్లాహ,” అల్లాహ్ కు విధేయత చూపండి. “వ రసూల,” ప్రవక్తకు విధేయత చూపండి. “వలా తనాత’ఊ,” పరస్పరం కలహాలకు గురి కాకండి. మీరు కలహాలకు గురైతే “ఫతఫ్షలూ వ తద్ హబ రీహుకుమ్,” మీరు గనక కలహాలకు గురైతే మీరు ముక్కలైపోతారు, మీ గాలి, అంటే మీ బలం కాస్తా తగ్గిపోతుంది. “వస్బిరూ ఇన్నల్లాహ మ’అస్సాబిరీన్,” ఓర్పు వహించండి. అల్లాహ్ ఓర్పు వహించే వారికి తోడున్నాడు. ఒక సంఘంగా ఉండండి. ఖురాన్ యే చెప్పింది:
మీరందరూ కలిసి అల్లాహ్ త్రాడును గట్టిగా పట్టుకోండి. పరస్పరం విడిపోకండి. (3:103)
మీరంతా అల్లాహ్ మరియు ప్రవక్త త్రాడును గట్టిగా పట్టుకోండి. ముక్కలైపోకండి. ఈరోజు ముక్కలు చెక్కలైపోయాం ప్రియులారా. నేను ఒక మాట అంటాను, వ్యక్తిగతంగా మీరు ఏమనుకున్నా అనుకోండి, కానీ జమాత్ పరంగా, జమియత్ పరంగా ఈరోజు దేశానికి అవసరం ఈ అహలె హదీస్ విధానం ప్రియులారా. కాబట్టి దీని కోసం మనం పని చేయాలి, మనమంతా కలిసి ఉండాలి, ఒక సంఘంగా. ముస్లిమేతర శక్తులు, ముస్లిమేతర శక్తులు ఇస్లాంను అపఖ్యాతి పాలు చేయటానికి ఎంత స్ట్రాంగ్ గా పనిచేస్తున్నాయో, అల్లాహ్ చెప్పాడు ఖురాన్ గ్రంథంలో, తీయండి ఇంటికెళ్ళి ఎనిమిదవ సూరా, సుమారు వాక్యం సంఖ్య 72 లేదా 76, తీయండి. అల్లాహ్ ఏమన్నాడు? వారు అవిశ్వాసులు. వారు అవిశ్వాసులు, ఒకరికొకరు స్నేహితులు. ఈరోజు జెండాలు పట్టుకుని మనం పరిగెత్తుంటాం, సుబ్ హా నల్లాహ్, పరిగెట్టు, పరిగెట్టు, నమాజ్ అయినా కూడా ఇటు రాదు ధ్యాస, అటే వస్తుంది ధ్యాస. వారు అవిశ్వాసులు, ఒకరికొకరు స్నేహితులు. ఓ విశ్వాసులారా, మీరు గనక స్నేహితులు కాకపోతే, భూమిలో కల్లోలం చెలరేగుతుంది అని అల్లాహ్ త’ఆలా చెప్పాడు. స్నేహితులు అవుదామా లేదా? అవుదాం. చాలు ఆ మాటలు. మనం పరస్పరం వ్యక్తిగతంగా ఏమైనా పెట్టుకుందాం. కానీ అల్లాహ్ కోసం, ప్రవక్త కోసం, ఖురాన్ హదీస్ కోసం, ఈరోజు ఇస్లాం కోసం, ముస్లింలంతా ఒక శక్తిగా ఉండాలి ప్రియులారా. దీనికోసం సుబ్ హా నల్లాహ్, నేనేదైతే ఇందాక నుంచి జమాతె అహలె హదీస్ అంటున్నానో, ఇది కూడా ఒక వ్యవస్థ లాగా ఉంది, దీనికి కార్యచరణ ఉంది. దీనికి వెనకా ముందు ఏమీ లేకుండా లేదండి. ఢిల్లీ నుండి సుబ్ హా నల్లాహ్ మన జమియత్ ఉంది ప్రియులారా. మన జమియత్ ఈ దేశంలో 1906లో రిజిస్ట్రేషన్ అయినప్పటి నుండి తన పని చేస్తూ పోతుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత నుండి జమియత్ ఆవిర్భవించింది ప్రియులారా. చెప్పడం జరుగుతుంది, వల్లాహు ఆలమ్, ఈ యొక్క అహలె హదీస్ మనహజ్ పై నడిచే వారు, నేను విన్నాను హైదరాబాద్ లో, అల్లాహు ఆలమ్, సుమారు నాలుగు కోట్ల మంది మనం దేశంలో నివసిస్తున్నాం. కానీ మనం ఒక శక్తిగా నివసించటానికి మనమొక సంస్థను స్థాపించుకున్నాం. బయట బోర్డు కూడా పెట్టారు ప్రియులారా, మర్కజీ జమియతే అహలె హదీస్ హింద్, అఖిల భారత జమియతే అహలె హదీస్ హింద్ సంస్థ. ఇది ఢిల్లీ నగరంలో తన యొక్క ముఖ్య కేంద్రాన్ని కలిగి ఉంది. ప్రతి రాష్ట్రంలో రాష్ట్రీయ శాఖలు ఉన్నాయి. ప్రతి జిల్లాలో జిల్లా శాఖలు ఉన్నాయి. జిల్లాలలో నగర శాఖలు ఉన్నాయి. నగరాల కింద ప్రాంతీయ శాఖలు ఉన్నాయి, సుబ్ హా నల్లాహ్. ఢిల్లీలో మన అమీర్ గారు ఉన్నారు. స్టేట్ లో అమీర్ గారు ఉన్నారు. జిల్లాకి అమీర్ గారు ఉన్నారు. నగరానికి అమీర్ గారు ఉన్నారు. మనమొక సంస్థగా, ఒక బలంగా తయారవ్వాలంటే జమియత్ తో సంబంధం కలిగి ఉండాలి ప్రియులారా. అదే కోవలో తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ నగర జమియతే అహలె హదీస్ మిమ్మల్నందరినీ ఆహ్వానిస్తుంది, ఈ సంఘంతో ముడిపడండి. మనమంతా కలిసి పనిచేద్దాం, ఖురాన్ హదీస్ ప్రపంచానికి తెలియజేద్దాం. ఎవరయ్యా, నేను ఏ జమాత్ లో లేనండి, నాకు అమీర్ లేడండి. లేదు ప్రియులారా. జమాత్ లో ఉంటేనే నీపై అల్లాహ్ యొక్క చెయ్యి ఉంటుంది. హదీస్ లో ప్రవక్త వారు ఏం చెప్పారు? “యదుల్లాహి అలల్ జమాఅ,” జమాత్ పై అల్లాహ్ యొక్క చెయ్యి ఉంటుంది ప్రియులారా. కాబట్టి ఈరోజు జమాత్ వ్యవస్థతో మనం ఎంతవరకు కలిసి ఉన్నాం? ప్రియులారా అవసరం. నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, రోజుకొకటండి, అల్లాహ్ రక్షించుగాక, మన గురించి మాట్లాడేవాడు లేడు దేశంలో. అల్లాహ్ రక్షించుగాక, మొన్న ఇద్దరు నర్స్ అండి, ఇద్దరు సిస్టర్స్ ఢిల్లీలో ట్రైన్ ఎక్కారు, ఒడిస్సా వెళ్తున్నారు. ఎవరో ఇద్దరితో మాట్లాడుతున్నారట, సంథింగ్ ఎవరికో డౌట్ వచ్చింది. ఝాన్సీ రైల్వే స్టేషన్ లో దింపేశారు. దానికోసం ఒక సీఎం లేఖ రాసేస్తాడు, హోం మినిస్టర్ జవాబు ఇస్తాడు, మేము యాక్షన్ తీసుకుంటాం ట్రైన్ లో దింపిన వారిపై. ఒక ఇద్దరు నన్స్, ఒక ఇద్దరి కోసం దేశమంతా కోడై కూస్తుంది. వారి సంఘాలు ఆవురావురు కేకలు వేస్తున్నాయి. నేను ఒక కోటి పెట్టుకున్నాను, నాపై ముద్ర వేసేవారు ఉగ్రవాది అని ముద్ర వేస్తున్నారు. నాపై నుండి కింద నుండి, ఎందుకు కారణం? ఒకటి దేశంలో ముస్లింలు ఈ సున్నత్ ను విడిచిపెట్టకపోవడం. అల్లాహు అక్బర్, మనం ప్రతి ఒక్కరం ముస్లింలుగా ఉండి, దేశంలో ఉన్న 20% ముస్లింలు సుబ్ హా నల్లాహ్ ఈ గడ్డం వ్యవస్థ పాటిస్తే ఎవ్వరూ మిమ్మల్ని చూడరు. సుబ్ హా నల్లాహ్, ముస్లింల వ్యవహారం ఏది? ఈరోజు మనం చాలా మంది భయపడుతున్నాం షరియత్ ను ఆచరించడానికి, నడిపితే భయం. అల్లాహ్ మనకి తోడున్నాడు. కానీ చెప్పే మాట, ఇద్దరి గురించి మాట్లాడితే దేశం కోడై కూస్తుంది, మన కోసం మాట్లాడేవాడు నోరొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. పొద్దున్న లేగిస్తే పేపర్ లో ఇస్లామిక్ ఉగ్రవాదం అని రాస్తున్నాడు. ఎంతమంది బాధపడుతున్నాం? నేను అంటున్నాను ప్రియులారా, మనం ఏ ఫీల్డ్ లోనైతే ఆరితేరి ఉన్నామో, మనం ప్రశ్నించే వ్యవస్థగా మారాలంటే మనమంతా జమాత్ కు మన యొక్క సహాయం అందించాలి. ఎవరు, ఒక మెడికల్ ఫీల్డ్ లో నేను ఉన్నానండి, జమియత్ శబ్దం ఇస్తే నేను దాని కోసం పనిచేస్తున్నాను. ఫలానా ఫీల్డ్ లో, ఎంతమంది అయితే మీకు కలలు ఉన్నాయో, ఈ కలలన్నీ, గురువుగారు ఫలానా ఫీల్డ్ నాకు తెలుసండి, నేను జమియత్ కు సహకరిస్తాను. టెన్త్ క్లాస్ అయిపోయింది పిల్లవాడికి, టెన్త్ తరువాత ఏం చేయాలి? పిల్లలకు తెలియడం లేదు. నేను ఉన్నానండి, టెన్త్ తరువాత పిల్లలు ఎలా చదువుకోవాలో నేను చెప్పగలను, నేను జమియత్ కు ఈ విధంగా సహాయం చేస్తాను. గురువుగారు ఫలానా ఫీల్డ్ మెడికల్ నాకు తెలుసండి, నేను ఇన్షా అల్లాహ్ మనం ముస్లింల కోసం, ప్రతి ఒక్కరూ తన, తన అంటున్నారు, మనం? వాడు, వాడు, వాడు, వాడు, వాడు, వాడు, మేమేమో… ఈ దేశానికి అవసరం ప్రియులారా. ప్రతి ఒక్కరూ మనం అంటున్నారు, మనం మాత్రం నేను అనుకుంటున్నాం. పనికిరాదు ప్రియులారా. కాబట్టి మనమంతా మనముగా పని చేయాలంటే మనం జమియత్ తో కలవాలి ప్రియులారా. ఈ జమియత్ మీకు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసింది. బయట గోడ మీద పెట్టించిందంట అక్కడ. ఈ జమియత్ యొక్క సభ్యత్వం తీసుకోండి. 18 సంవత్సరాలు వస్తే మీరు జమియత్ యొక్క సభ్యత్వం తీసుకోవచ్చు. జమియత్ లో మీ సలహా ఇవ్వవచ్చు, మీ సంపదింపులు ఇవ్వవచ్చు, జమియత్ మీతో మాట్లాడుతుంది. జమియత్ ఏదైనా నిర్ణయం చేసుకుంటే మిమ్మల్ని కూడా సంప్రదిస్తుంది. మీరు జమియత్ లోకి రాకుండా, జమియత్ మూల సిద్ధాంతాలకు రాజీ కాకుండా, జమియత్ గురించి చెడుగా మాట్లాడుతూ, జమాత్ మమ్మల్ని పట్టించుకోదండి, మా వైపునకు చూడదండి, మాతో మాట్లాడదు అంటే, అవదు ప్రియులారా. కాబట్టి ఆహ్వానిస్తున్నాం మిమ్మల్ని. కాకినాడ నగర జమియత్ యొక్క బాధ్యులతో సంప్రదించండి. ఈ జమియత్ యొక్క సభ్యత్వ ఫారం నమోదు చేయండి. మనమంతా కలుద్దాం, ఒక శక్తిగా భారతదేశంలో పని చేద్దాం. ఇస్లాంకు వ్యతిరేకంగా ఏవైతే గొంతుకలు లేగుస్తున్నాయో, వాటిని మనం ఎదుర్కోవాలంటే శక్తి అవసరం ప్రియులారా. రెండో మాట ఏందీ, ఈ శక్తి అంటున్నారు, ఎదుర్కోవాలంటున్నారు, ఎవడు పడితే వాడు, నా విధానం ఇదండి, మీరు ఈ జెండా పట్టుకుంటాను, లేదు. ఆ విధానం కూడా ఖురాన్ హదీస్ మనకు తెలియజేసాయి. ఆ విధానాలను జమియత్ మీకు తెలియజేస్తుంది ప్రియులారా. కాబట్టి మరొక్కసారి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ప్రియులారా, మనమంతా కలిసి పనిచేద్దాం, ఖురాన్ హదీస్ ప్రపంచానికి అందిద్దాం. ఈరోజు అదే ఖురాన్ హదీస్ నిర్మలముగా, స్వచ్ఛముగా ప్రపంచానికి అందజేయటానికి భారతదేశంలో ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థ పేరు జమియతే అహలె హదీస్ హింద్, మర్కజీ జమియతే అహలె హదీస్ హింద్. ఈ యొక్క జమియత్ లో మనమంతా భాగస్వాములవుదాం, ఇన్షా అల్లాహ్ త’ఆలా భారతదేశంలో పనిచేద్దాం. అల్లాహ్ ఈ జమియత్ తో కలిసి పనిచేసే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
నలుగురు ఇమాముల విశిష్టత (ఇమామ్ అబూ హనీఫా, మాలిక్, షాఫ’ఐ, అహ్మద్ బిన్ హంబల్) https://youtu.be/TeTJLqXXYHk [38:34 నిముషాలు] వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో, నాలుగు గొప్ప ఇమామ్‌లైన ఇమామ్ అబూ హనీఫా, ఇమామ్ మాలిక్, ఇమామ్ షాఫయీ, మరియు ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ (రహ్మతుల్లాహి అలైహిమ్ అజ్మయీన్) యొక్క జీవిత చరిత్రలు, వారి విశిష్టతలు, మరియు ధర్మ సేవకు వారు చేసిన త్యాగాల గురించి వివరించబడింది. ప్రతి ఇమామ్ యొక్క బాల్యం, విద్యాభ్యాసం, వారి గురువులు, వారు రచించిన ముఖ్య గ్రంథాలు, మరియు వారు ఎదుర్కొన్న పరీక్షల గురించి క్లుప్తంగా చర్చించబడింది. ప్రసంగం ముగింపులో, ఈ ఇమామ్‌లను గుడ్డిగా అనుసరించడం (తఖ్లీద్) లేదా వారిని ద్వేషించడం రెండూ సరికాదని, వారిని గౌరవిస్తూనే, ఖుర్ఆన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి బోధనలకే ప్రాధాన్యత ఇవ్వాలనే సరైన మార్గాన్ని సూచించడం జరిగింది.
وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى أَشْرَفِ الْأَنْبِيَاءِ وَالْمُرْسَلِيْنَ (వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్) ప్రవక్తలలోకెల్లా అత్యంత శ్రేష్టులైన వారిపై మరియు దైవప్రవక్తలందరిపై శాంతి మరియు శుభాలు వర్షించుగాక.
أَمَّا بَعْدُ (అమ్మా బాద్) ఇక విషయానికి వస్తే
رَبِّ اشْرَحْ لِيْ صَدْرِيْ وَيَسِّرْ لِيْ أَمْرِيْ وَاحْلُلْ عُقْدَةً مِّنْ لِّسَانِيْ يَفْقَهُوْا قَوْلِيْ (రబ్బిష్రహ్ లీ సద్రీ వ యస్సిర్లీ అమ్ రీ వహ్ లుల్ ఉఖ్ దతమ్ మిల్ లిసానీ యఫ్ ఖహూ ఖౌలీ) “ఓ నా ప్రభూ! నా హృదయాన్ని నా కోసం విశాలపరచు. నా కార్యాన్ని నాకు సులభతరం చెయ్యి. నా నాలుక ముడిని విప్పు. జనులు నా మాటను బాగా అర్థం చేసుకునేందుకు.” (20:25-28)
సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పరలోక దినానికి యజమాని, మహోన్నత పీఠానికి అధిపతి, అద్వితీయుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే ప్రశంసలన్నీ, పొగడ్తలన్నీ శోభిస్తాయి.
ఆ కరుణామయుని కారుణ్యం ప్రవక్తలందరిపైనను, ముఖ్యంగా చిట్టచివరి ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై ఎల్లవేళలా వర్షించుగాక.
గౌరవనీయులైన పెద్దలు మరియు ఇస్లామీయ సోదరులారా! ఈనాటి ప్రసంగంలో నలుగురు ఇమాముల విశిష్టత గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
నాలుగురు ఇమాముల ఘనత
ఇస్లామీయ సోదరులారా! అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ప్రపంచంలో ధర్మ సేవ చేసిన భక్తులకు పేరు ప్రఖ్యాతి, ప్రతిష్ట, కీర్తిని ప్రసాదించాడు. గౌరవ ఉన్నత శిఖరాలకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారిని చేర్చాడు. అలా ధర్మ సేవ చేసి కీర్తిని పొందిన పండితులలో ఈ నలుగురు ఇమాములు కూడా ఉన్నారు. నలుగురు ఇమాములు అంటే ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి, ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి, ఇమామ్ షాఫయీ రహ్మతుల్లాహి అలైహి, ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి.
ధార్మిక సేవ చేసి ప్రాచుర్యం పొందిన అనేక మంది పండితులలో ఈ నలుగురు ఇమాములకు ఉన్నతమైన స్థానం అల్లాహ్ తరపున ఇవ్వబడింది. రండి సోదరులారా, ఈ నలుగురు ఇమాముల గురించి క్లుప్తంగా మనము ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఇమామ్ అబూ హనీఫా (రహ్మతుల్లాహి అలైహి)
ముందుగా, ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి గారి గురించి మనం చూచినట్లయితే, ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి గారి అసలు పేరు నోమాన్ బిన్ సాబిత్. ఆయనకు అబూ హనీఫా అని నామాంతరము ఉండేది, దీనిని అరబీ భాషలో కున్నియత్ అంటారు. ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి హిజ్రీ శకం 80వ సంవత్సరంలో కూఫా నగరంలో జన్మించారు.
ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి గారి తండ్రి బట్టల వ్యాపారం చేసేవారు కాబట్టి, ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి కూడా బట్టల వ్యాపారము చేశారు. అయితే ఒకరోజు ఒక వీధి నుండి వెళుతూ ఉంటే, ఇమామ్ షాబీ రహ్మతుల్లాహి అలైహి గారి కంటబడ్డారు. ఇమామ్ షాబీ రహ్మతుల్లాహి అలైహి, ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి గారిని చూచిన వెంటనే, “నాయనా, నీవు చదువుకుంటున్నావా లేదా?” అని ప్రశ్నించారు. దానికి సమాధానం ఇస్తూ ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి, “లేదండి నేను చదువుకోవట్లేదు” అన్నారు. అప్పుడు ఇమామ్ షాబీ రహ్మతుల్లాహి అలైహి వెంటనే ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి తో ఇలా అన్నారు, “నాయనా, నీ ముఖారవిందాన్ని బట్టి చూస్తుంటే నీవు ధార్మిక విద్య అభ్యసించడం ఎంతో ఉత్తమము అని నాకు అనిపిస్తుంది. కాబట్టి నాయనా, నీవు ధార్మిక విద్యను అభ్యసించు,” అని సలహా ఇచ్చారు.
ఆయన సలహాను పాటిస్తూ ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి అలనాటి గొప్ప గొప్ప ధార్మిక పండితుల వద్ద ధర్మ విద్య అభ్యసించారు. ఉదాహరణకు, అతా బిన్ అబీ రబాహ్ రహ్మతుల్లాహి అలైహి, అబ్దుల్లా బిన్ దీనార్ రహ్మతుల్లాహి అలైహి, ఇమామ్ నాఫె రహ్మతుల్లాహి అలైహి లాంటి గొప్ప గొప్ప ధార్మిక పండితుల వద్ద ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి ధర్మ విద్యను అభ్యసించారు.
ఆ రోజుల్లో ఇమామ్ హమ్మాద్ ఇబ్నె సులైమాన్ రహ్మతుల్లాహి అలైహి అనే ఒక గొప్ప ధార్మిక పండితుడు, ధర్మ విద్యకు సంబంధించిన ఒక విద్య, ఫిఖహ్ విద్య, ఆ ఫిఖహ్ విద్యలో చాలా ప్రాచుర్యం పొంది ఉన్నారు. ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి ఆయన వద్ద కూడా శిష్యరికము చేసి ఫిఖహ్ విద్యను అభ్యసించారు. ఆ తర్వాత ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి ఎంతగా ఎదిగారంటే, ఇమామ్ హమ్మాద్ బిన్ సులైమాన్ రహ్మతుల్లాహి అలైహి గారు మరణించిన తర్వాత ఆయన స్థానంలో ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి గారిని కూర్చోబెట్టడం జరిగింది.
అభిమాన సోదరులారా, ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి గారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అనేక ప్రత్యేకతలను ప్రసాదించాడు. ఆయనకు ప్రసాదించబడిన ప్రత్యేకతలలో ఒక ప్రత్యేకత ఏమిటంటే, ఎదుటి వ్యక్తి ఏదైనా ప్రశ్న అడిగితే దానికి తనదైన శైలిలో సమాధానం ఇచ్చి ఎదుటి వ్యక్తిని సంతృప్తి పరచటం ఆయనకే సొంతం.
ఉదాహరణకు, ఒకసారి ఆ రోజుల్లో ఒక నాస్తికుడు ఈ సృష్టి మొత్తము తనంతట తానే సృష్టించబడింది, దీనిని సృష్టించినవాడు ఒకడు ఎవడూ లేడు అని వాదించేవాడు. అతను ఒకరోజు కూఫా నగరానికి చేరుకొని అక్కడ కూడా తన వాదన ప్రజలకు వినిపిస్తూ ఉంటే, ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి అక్కడికి చేరుకున్నారు.
ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి ఆ నాస్తికుని వాదన విన్న తర్వాత, వెంటనే అతనితో ఇలా అన్నారు: “అవునయ్యా, నువ్వు చెబుతున్న విషయం నిజమే. నేను ఇప్పుడే ఒక చోటు నుంచి వస్తున్నాను, మార్గమధ్యలో నేను ఒక విషయాన్ని చూశాను, అదేమిటంటే, ఒక పెద్ద మాను (చెట్టు) ఉందండి, ఆ మాను తనంతట తానే తెగిపోయింది, ఆ తర్వాత చెక్కలు తయారయ్యాయి, ఆ చెక్కలన్నీ కలిసి ఒక పడవ రూపాన్ని దాల్చినాయి, ఆ పడవ నీటి మీద వచ్చి నిలబడింది, అందులో నేను ఎక్కుకున్నాను, ఆ పడవ తనంతట తానే నది అవతల ఒడ్డు నుంచి ఇవతల ఒడ్డుకు ప్రయాణం చేసి వచ్చింది, నేను ఆ పడవలో నుంచి దిగి ఇప్పుడే అక్కడి నుంచి మీ దగ్గరికి వస్తున్నాను,” అని చెప్పారు.
ఈ మాటలన్నీ విన్న ఆ నాస్తికుడు, “ఏమండీ! మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? నేనేమైనా మూర్ఖుడ్నా, బుద్ధిహీనుడ్నా? చెట్టు తనంతట తానే తెగిపోవడం ఏమిటి, చెక్కలు తయారైపోవడం ఏమిటి, ఎవరూ తయారు చేయకుండానే పడవ తయారైపోవటం ఏమిటి, ఎవరూ నడిపించకుండానే పడవ నది అవతల ఒడ్డు నుంచి ఇవతల వైపుకు వచ్చేయటం ఏమిటి? ఇదంతా నమ్మేదానికి నేనేమైనా మూర్ఖుడ్నా?” అని ప్రశ్నించినప్పుడు, ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి ఆ వ్యక్తితో ఇలా అన్నారు: “అయ్యా, ఒక చిన్న పడవ తనంతట తానే సృష్టించబడదు, ఒక చిన్న పడవ తనంతట తానే నడవదు అని మీరు అర్థం చేసుకోగలుగుతున్నారు. మరి ఇంత పెద్ద సృష్టి తనంతట తానే ఎలా సృష్టించబడుతుంది? తనంతట తానే ఎలా నడుస్తుంది ఎవరూ నడిపించకుండానే? ఒకసారి ఆలోచించరా?” అని చెప్పినప్పుడు, ఆ వ్యక్తి వెంటనే ఆ విషయాన్ని అర్థం చేసుకుని, ఈ సృష్టికి ఒక సృష్టికర్త ఉన్నాడు, ఈ సృష్టిని నడిపించే ఒక యజమాని ఉన్నాడు అన్న విషయాన్ని అర్థం చేసుకుని అక్కడి నుంచి వెళ్ళాడు సోదరులారా. ఇది ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి గారి చాతుర్యానికి సంబంధించిన ఒక చిన్న ఉదాహరణ.
ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి వారి వద్ద చాలా మంది శిష్యులు శిష్యరికం చేశారు. వారిలో ఇమామ్ అబూ యూసుఫ్ యాఖూబ్ బిన్ ఇబ్రాహీం రహ్మతుల్లాహి అలైహి, ఇమామ్ ముహమ్మద్ బిన్ హసన్ రహ్మతుల్లాహి అలైహి, ఇమామ్ జఫర్ బిన్ హుజైల్ రహ్మతుల్లాహి అలైహి, ఇమామ్ హసన్ బిన్ జియాద్ రహ్మతుల్లాహి అలైహి, ఈ నలుగురు శిష్యులు చాలా ప్రాచుర్యం పొందారు ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి గారి వద్ద శిష్యరికం చేసిన శిష్యుల్లో.
ఆ తర్వాత అలనాటి నాయకుడు ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి గారికి ఖాజీయుల్ ఖుదాత్ అనే పదవిని తీసుకోమని అభ్యర్థించాడు. ఖాజీయుల్ ఖుదాత్ అంటే మన భాషలో న్యాయమూర్తి పదవి అని చెప్పుకోవచ్చు. న్యాయమూర్తి పదవి తీసుకోమని ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి గారిని అడిగినప్పుడు, ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి ఆ పదవి స్వీకరించడానికి నిరాకరించారు. ఆ రాజు ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి గారి మీద కోపపడి ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి గారిని చెరసాలలో బంధించేశాడు. చెరసాలలోనే ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి హిజ్రీ శకం 150వ సంవత్సరంలో మరణం పొందారు సోదరులారా. ఇది ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి గారి యొక్క క్లుప్తమైన జీవన చరిత్ర.
ఇమామ్ మాలిక్ (రహ్మతుల్లాహి అలైహి)
ఇక రండి, మనం రెండవ ఇమామ్, ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారి గురించి కూడా క్లుప్తంగా తెలుసుకుందాం.
ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారి అసలు పేరు మాలిక్ బిన్ అనస్. ఆయనకు అబూ అబ్దుల్లాహ్ అని నామాంతరము ఉండేది. దీనిని అరబీ భాషలో కున్నియత్ అంటారు. ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి హిజ్రీ శకం 93వ సంవత్సరంలో మదీనా పట్టణంలో జన్మించారు.
ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి అలనాటి గొప్ప గొప్ప ధార్మిక పండితులైన ఇమామ్ అబ్దుర్రహ్మాన్ బిన్ హుర్ముజ్, ఇమామ్ నాఫె, ఇమామ్ ఇబ్నె షిహాబ్ జుహ్రీ, ఇమామ్ రబీఆ రహ్మతుల్లాహి అలైహిమ్ అజ్మయీన్ లాంటి గొప్ప గొప్ప ధార్మిక పండితుల వద్ద ధర్మ విద్యను అభ్యసించారు.
హదీసు గ్రంథాలలో మొట్టమొదటి హదీసు గ్రంథం, మువత్తా ఇమామ్ మాలిక్ అనే గ్రంథాన్ని రచించారు సోదరులారా. ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిర్మించిన మస్జిదె నబవీలో కూర్చొని ప్రజలకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి బోధనలు, ఉల్లేఖనాలు వినిపించేవారు.
ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారి కాలంలో ఆనాటి రాజు బలవంతంగా ఒక జంటకు విడాకులు ఇప్పించాడు. తలాఖ్ ఇప్పించాడు. ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారి వద్దకు ఆ విషయం చేరినప్పుడు, ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి బలవంతంగా ఇప్పించిన విడాకులు ఇస్లాం ధర్మం ప్రకారంగా అధర్మం, నిషేధం, అవి చెల్లవు అని ఫత్వా ఇచ్చారు సోదరులారా.
అలనాటి రాజు, ఖలీఫా మన్సూర్, వెంటనే ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారి మీద బలవంతం చేశాడు: “అయ్యా, నా ఇష్ట ప్రకారంగానే ఈ తలాఖ్ చెల్లుతుంది, ఈ విడాకులు చెల్లుబాటులో ఉంటాయి అని మీరు నా ఇష్ట ప్రకారంగా ఫత్వా ఇవ్వండి” అని బలవంతం చేశాడు. కానీ ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి అలనాటి రాజు ఖలీఫా మన్సూర్ గారి మాటను వినలేదు. అతను ఎంత బలవంతము చేసినా తల వంచలేదు. బలవంతంగా ఇప్పించబడిన తలాఖ్ ఇస్లాం ధర్మం ప్రకారంగా నిషేధం, చెల్లవు అంటే చెల్లవు అని చెప్పి ఫత్వా ఇచ్చారు.
ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారి ఈ ప్రవర్తన చూసి ఖలీఫా మన్సూర్ ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారి మీద కోపపడి, ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారిని చెరసాలలో బంధించాడు, కొరడాలతో కొట్టించాడు సోదరులారా. అంతేకాదు, ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారిని గాడిద మీద కూర్చోబెట్టి ఊరేగించారు.
ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి ప్రజలతో ఒకే మాట చెప్పేవారు: “ప్రజల్లారా, ఎవరైతే నన్ను గుర్తు పట్టున్నారో వారు గుర్తు పట్టున్నారు, మరెవరైతే నన్ను గుర్తు పట్టట్లేదో వినండి, నేను మాలిక్ బిన్ అనస్, నేను చెప్పే మాట ఒక్కటే, బలవంతంగా ఇప్పించబడిన తలాఖ్, బలవంతంగా ఇప్పించబడిన విడాకులు ఇస్లాం ధర్మం ప్రకారంగా అధర్మము, చెల్లవంటే చెల్లవు” అని చెప్పేవారు సోదరులారా. ఇది ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారి విశ్వాస నిలకడకు నిదర్శనము సోదరులారా.
ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారికి మదీనా పట్టణం అంటే చాలా అభిమానం. మదీనాలో నివసించే ధార్మిక పండితులు అంటే కూడా చాలా అభిమానం. ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారు మస్జిదె నబవీలో కూర్చొని ప్రజలకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉల్లేఖనాలు వినిపించేవారు. ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారి వద్ద కూడా చాలా మంది శిష్యులు శిష్యరికం చేశారు. ఆయన దగ్గర శిష్యరికం చేసిన శిష్యులలో ఇమామ్ షాఫయీ రహ్మతుల్లాహి అలైహి, ఇమామ్ ముహమ్మద్ బిన్ హసన్ అష్-షైబానీ రహ్మతుల్లాహి అలైహి వీరిరువురు చాలా పేరును పొందారు సోదరులారా.
అలాగే, అలనాటి మరొక రాజు, హారూనుర్ రషీద్, అతను కూడా ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారి వద్ద విద్య అభ్యసించాలనే కోరికతో ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారిని: “అయ్యా, మీరు రాజభవనానికి వచ్చి నాకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉల్లేఖనాలు వినిపించండి, నేను నేర్చుకోవాలనుకుంటున్నాను” అని విన్నవించుకున్నాడు. కానీ ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారు ఏమన్నారో తెలుసా? “మీకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉల్లేఖనాలు వినాలని, నేర్చుకోవాలని కోరిక ఉంటే మీరు మస్జిదె నబవీకి వచ్చి అక్కడ నలుగురితో పాటు కూర్చొని మీరు కూడా వినవచ్చు. నేను వచ్చి మీ రాజభవనంలో మీకు బోధించాలంటే నా వల్ల కాదు” అని చెప్పారు.
అలనాటి రాజు, హారూనుర్ రషీద్, మస్జిదె నబవీకి వెళ్ళి ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి బోధించే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉల్లేఖనాలు నలుగురితో పాటు సామాన్యమైన ప్రజలతో పాటు కూర్చొని విని ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారి వద్ద శిష్యరికం చేశాడు సోదరులారా.
ఆ తర్వాత ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి మదీనాలో మరణం పొందాలని చాలా కోరుకునేవారు, అల్లాహ్‌కు ప్రార్థించేవారు. అందుకోసమే ఎవరైనా మదీనా అవతల వైపు నుంచి మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారిని ఆహ్వానిస్తే, ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి మదీనా బయటకు ఎప్పుడూ వెళ్ళేవారు కాదు. ఆయన జీవితంలో చాలా తక్కువ సార్లు ఆయన మదీనా నగరాన్ని వదిలి బయటకు వెళ్ళారు. ఎక్కువ సమయం, ఆయన జీవితంలోని ఎక్కువ సమయం మదీనాలోనే ఆయన గడిపారు సోదరులారా.
ఆ తర్వాత, ఆయన ప్రార్థించినట్లుగానే, ఆయన కోరుకున్నట్లుగానే, హిజ్రీ శకం 179వ సంవత్సరంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారికి మదీనాలోనే మరణాన్ని ప్రసాదించారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనకు మదీనాలో మరణం ప్రసాదించిన తర్వాత మదీనాలోనే ఆయన ఖనన సంస్కారాలు కూడా జరపబడ్డాయి. ఇది ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారి యొక్క క్లుప్తమైన జీవిత చరిత్ర సోదరులారా.
ఇమామ్ షాఫయీ (రహ్మతుల్లాహి అలైహి)
ఇక రండి, మూడవ ఇమామ్, ఇమామ్ షాఫయీ రహ్మతుల్లాహి అలైహి గారి గురించి కూడా మనం తెలుసుకుందాం సోదరులారా.
ఇమామ్ షాఫయీ రహ్మతుల్లాహి అలైహి గారి యొక్క అసలు పేరు ముహమ్మద్ బిన్ ఇద్రీస్ షాఫయీ రహ్మతుల్లాహి అలైహి. ఆయనకు అబూ అబ్దుల్లాహ్ అనే నామాంతరము ఉండేది. దీనిని అరబీ భాషలో కున్నియత్ అంటారు.
ఇమామ్ షాఫయీ రహ్మతుల్లాహి అలైహి హిజ్రీ శకం 150వ సంవత్సరంలో గాజా పట్టణంలో జన్మించారు. రెండు సంవత్సరాల వయస్సుకు చేరగానే ఇమామ్ షాఫయీ రహ్మతుల్లాహి అలైహి గారి తండ్రి మరణించారు. తండ్రి మరణించిన తర్వాత ఇమామ్ షాఫయీ రహ్మతుల్లాహి అలైహి గారి తల్లి ఇమామ్ షాఫయీ రహ్మతుల్లాహి అలైహి గారిని తీసుకొని మక్కా నగరానికి వచ్చేసారు.
మక్కా నగరంలో ఇమామ్ షాఫయీ రహ్మతుల్లాహి అలైహి ఏడు లేదా తొమ్మిది సంవత్సరాల వయసులోనే పూర్తి ఖుర్ఆన్ గ్రంథాన్ని కంఠస్థం చేసేశారు. అల్లాహు అక్బర్! ఆ తర్వాత మదీనాలో ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉల్లేఖనాలు బోధిస్తున్నారన్న విషయాన్ని తెలుసుకొని మదీనాకు వెళ్లి, ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారి వద్ద శిష్యరికము చేసి మువత్తా ఇమామ్ మాలిక్ పూర్తి గ్రంథాన్ని వినటమే కాకుండా కంఠస్థము కూడా చేశారు. అల్లాహు అక్బర్! ఇది ఇమామ్ షాఫయీ రహ్మతుల్లాహి అలైహి గారి యొక్క జ్ఞాపక శక్తికి నిదర్శనము సోదరులారా.
ఆ తర్వాత ఇరాక్ పట్టణంలో ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి గారి యొక్క ప్రముఖ శిష్యులు ఇమామ్ ముహమ్మద్ రహ్మతుల్లాహి అలైహి గారు ఉన్నారన్న విషయాన్ని తెలుసుకొని ఇరాక్ పట్టణానికి వెళ్లి, ఇమామ్ ముహమ్మద్ రహ్మతుల్లాహి అలైహి గారి వద్ద శిష్యరికము చేసి ఫిఖహ్ ధర్మ విద్యను అభ్యసించారు. ఆ తర్వాత మక్కాకు తిరిగి వచ్చి మక్కాలో ప్రజలకు ధార్మిక విద్యను బోధించడం ప్రారంభించారు. ఆ తర్వాత 195 హిజ్రీ శకం అలాగే 198 హిజ్రీ శకంలో రెండు సార్లు ఇరాక్ పట్టణానికి వెళ్లి అక్కడ విద్యను బోధించి ఆ తర్వాత తిన్నగా ఈజిప్టు దేశానికి వెళ్లిపోయారు. ఆ తర్వాత మిగతా జీవితం మొత్తం ఆయన ఈజిప్టు దేశంలోనే గడిపారు.
ఇమామ్ షాఫయీ రహ్మతుల్లాహి అలైహి ఈ ప్రపంచానికి అందజేసిన గొప్ప కానుకలలో ఒక గొప్ప కానుక ఏమిటంటే ఆయన రచించిన ఒక గ్రంథం ‘అర్-రిసాలా ఫీ అదిల్లతిల్ అహ్కామ్’. ఈ గ్రంథంలో వివిధ విద్యలకు సంబంధించిన నియమాలన్నింటినీ ఆయన పొందుపరిచారు సోదరులారా. నేటికీ కూడా ధార్మిక పండితులు ఈ గ్రంథం యొక్క గొప్పతనాన్ని కొనియాడుతూనే ఉంటారు. అలాగే ‘కితాబుల్ ఉమ్‘, ‘మస్నదె షాఫయీ‘ లాంటి గొప్ప గొప్ప గ్రంథాలు ప్రపంచానికి ఇమామ్ షాఫయీ రహ్మతుల్లాహి అలైహి గారి ద్వారా కానుకగా అందజేయబడ్డాయి.
ఇమామ్ షాఫయీ రహ్మతుల్లాహి అలైహి హిజ్రీ శకం 204వ సంవత్సరంలో ఈజిప్టు దేశంలోనే మరణించారు. ఈజిప్టు దేశంలోనే ఆయన ఖనన సంస్కారాలు కూడా చేయబడ్డాయి. ఇది ఇమామ్ షాఫయీ రహ్మతుల్లాహి అలైహి గారి యొక్క క్లుప్తమైన జీవిత చరిత్ర.
ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ (రహ్మతుల్లాహి అలైహి)
ఇక రండి సోదరులారా, నాలుగవ ఇమామ్, నాలుగవ ధార్మిక పండితులైన ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి గారి గురించి కూడా మనము క్లుప్తంగా తెలుసుకుందాం.
అభిమాన సోదరులారా, ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి గారి అసలు పేరు అహ్మద్ బిన్ ముహమ్మద్ బిన్ హంబల్. ఆయనకు అబూ అబ్దుల్లాహ్ అని నామాంతరము ఉండేది. దీనిని అరబీ భాషలో మనం కున్నియత్ అంటాము.
ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి వారి తాత పేరుతో ఎక్కువగా ప్రాచుర్యం పొందారు. వాస్తవానికి అహ్మద్ గారి యొక్క తండ్రి పేరు ముహమ్మద్, కానీ ప్రపంచం ఆయనను అహ్మద్ ఇబ్నె హంబల్, హంబల్ కుమారుడు అని గుర్తిస్తుంది సోదరులారా. అంటే తాతగారి పేరుతోనే అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి గారు ప్రాచుర్యం పొందారు.
అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి హిజ్రీ శకం 164వ సంవత్సరంలో బగ్దాద్ పట్టణంలో జన్మించారు. పసితనంలోనే నాన్నగారు మరణించారు. 14 సంవత్సరాల వయసుకు చేరాక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉల్లేఖనాలు, హదీసులు తెలుసుకోవాలని, నేర్చుకోవాలని మనసులో కోరిక కలిగింది.
అలనాటి గొప్ప గొప్ప ధార్మిక పండితులు, ఇమామ్ అబూ యూసుఫ్ రహ్మతుల్లాహి అలైహి, ఇమామ్ షాఫయీ రహ్మతుల్లాహి అలైహి గారి వద్ద ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి విద్యను అభ్యసించారు. సోదరులారా, ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి గారికి హదీసుల మీద ఎంత అభిమానం ఉండేదంటే, ఫలానా దేశంలో కొంతమంది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉల్లేఖనాలు కంఠస్థం చేసి ఉన్నారన్న వార్త తెలుసుకున్న తర్వాత కాలి నడకన వెళ్ళి వారి వద్దకు చేరుకొని వారి నోట ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉల్లేఖనాలు విని వాటన్నింటినీ ఒక గ్రంథంలో పొందుపరిచారు. ఆయన జీవిత చరిత్ర చూచినట్లయితే, ఆయన బగ్దాద్ నుండి మక్కాకు, మక్కా నుండి యమన్ కు, యమన్ నుండి సిరియాకు కాలి నడకన ప్రయాణాలు చేశారు సోదరులారా. అల్లాహు అక్బర్!
ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏమిటంటే, హదీసు గ్రంథాలలో అన్నింటికంటే పెద్ద గ్రంథం ‘మస్నద్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి’. ‘మస్నదె అహ్మద్’, హదీసు గ్రంథాలలోనే పెద్ద గ్రంథం, ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి గారు ప్రపంచానికి కానుకగా ఇచ్చారు సోదరులారా. ఆయన ప్రపంచానికి అందజేసిన ‘మస్నదె అహ్మద్’ గ్రంథంలో 40,000 కంటే ఎక్కువ హదీసులు పొందుపరచబడి ఉన్నాయి. అల్లాహు అక్బర్!
ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి గారి యొక్క విశ్వాస ధృడత్వాన్ని మనం చూచినట్లయితే, ఆ రోజుల్లో మాయమాటలకు గురైన ఒక తెగ, మోతజిలే వారు, ‘ఖుర్ఆన్ మఖ్లూఖ్’ అని ఒక ఉపద్రవాన్ని లేవనెత్తారు. ‘ఖుర్ఆన్ మఖ్లూఖ్’ అని ఒక ఉపద్రవాన్ని లేవనెత్తినప్పుడు, ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి వారి ఈ వాదనను ఖండించారు. ఖుర్ఆన్ ఎన్నిటికీ మఖ్లూఖ్ కాజాలదు. ఖుర్ఆన్ మఖ్లూఖ్ కానే కాదు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క వాక్యం, అల్లాహ్ యొక్క మాట, ఖుర్ఆన్ ఎప్పటికీ మఖ్లూఖ్ కాజాలదు అని ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి ప్రకటించారు సోదరులారా.
తత్కారణంగా, అలనాటి నాయకులు ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి గారి మీద దౌర్జన్యం చేశారు, ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి గారిని చెరసాలలో బంధించారు, కొరడాలతో కొట్టించారు సోదరులారా. ఎంతగా కొరడాలతో కొట్టించారంటే, ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి గారి వీపు మొత్తం పుండు అయిపోయింది సోదరులారా, గాయాలతో వీపు మొత్తం పుండు అయిపోయింది.
అయినా కొరడా దెబ్బలు తింటూ కూడా, బాధను భరిస్తూ కూడా, ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి ఒకే మాట ప్రకటించేవారు. ఆయన ఏమనేవారంటే: ‘అతూనీ బిషైఇమ్ మిన్ కితాబిల్లహి అవ్ సున్నతి రసూలిహి హత్తా అఖూల బిహి’. ‘ఖుర్ఆన్ మఖ్లూఖ్ అని మీరు వాదిస్తున్నారు కదా, దానికి ఆధారంగా మీరు ఖుర్ఆన్ గ్రంథంలో నుంచి ఒక్క వాక్యము గానీ, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఒక ఉల్లేఖనం గానీ నాకు చూపించండి, నేను ఒప్పుకుంటాను. లేదంటే నా ప్రకటన ఒక్కటే, ఖుర్ఆన్ అల్లాహ్ వాక్యం, అది మఖ్లూఖ్ కాజాలదు‘ అని చెప్పేవారు సోదరులారా.
ఆయన ఆ విధంగా అలాంటి నిలకడను, అలాంటి స్థిరత్వాన్ని ప్రదర్శించారు కాబట్టే తర్వాత వచ్చిన వారు ఆ విషయాన్ని గ్రహించారు. ఖుర్ఆన్ మఖ్లూఖ్ అని చెప్పటము, వాదించటము తప్పు అన్న విషయాన్ని అర్థం చేసుకోగలిగారు. ఇదంతా ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి గారు ప్రదర్శించిన నిలకడ కారణముగానే జరిగిందని మనం చెప్పుకోవచ్చు సోదరులారా.
అయితే, చాలా ఎక్కువగా హింసలు ఎదుర్కొన్న కారణంగా, ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి అనారోగ్యానికి గురయ్యారు. ఆ తర్వాత, హిజ్రీ శకం 241వ సంవత్సరంలో ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి జుమా రోజున మరణించారు. ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి గురించి ధార్మిక పండితులు అప్పుడూ ఇప్పుడూ ఒకే మాట చెప్తారు, అదేమిటంటే, ఎవరైతే ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి గారిని అభిమానిస్తున్నారో, నిజానికి వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఉల్లేఖనాలను అభిమానిస్తున్నారు. ఎవరైతే ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి గారిని ద్వేషించుకుంటున్నారో, నిజానికి వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఉల్లేఖనాలను ద్వేషిస్తున్నారు. ఇది ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి గారికి అల్లాహ్ ఇచ్చిన కీర్తి సోదరులారా.
ఇమాములను అనుసరించే సరైన మార్గం
అభిమాన సోదరులారా! ఇప్పటివరకు మనం నలుగురు ఇమాములు – ఇమామ్ అబూ హనీఫా, ఇమామ్ మాలిక్, ఇమామ్ షాఫయీ, ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహిమ్ అజ్మయీన్ గురించి క్లుప్తంగా జీవిత చరిత్రను తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఆ ఇమాములు గతించిన తర్వాత ప్రజల్లో ఏర్పడిన అభిప్రాయాల గురించి క్లుప్తంగా తెలుసుకొని, ఆ విషయాన్ని తెలిపి నేను నా మాటను ముగిస్తాను సోదరులారా.
అభిమాన సోదరులారా, నలుగురు ఇమాములు మరణించిన తర్వాత, వారి మరణానంతరం తర్వాత వచ్చిన తరం వారు రెండు భిన్నమైన అభిప్రాయాలకు గురయ్యారు. కొందరు నలుగురు ఇమాములను ఎంతగా అభిమానించారంటే, వారి అభిమానంలో హద్దు మీరిపోయారు. వారిని ప్రవక్తకు ఇవ్వాల్సిన స్థానము ఇమాములకు ఇచ్చేశారు. అభిమాన సోదరులారా, కళ్ళు మూసుకొని వీరిని అనుసరించడం ప్రారంభించేశారు సోదరులారా. దీనిని అరబీ భాషలో తఖ్లీద్ అంటారు. ఇలా చేయడము సరి కాదు అభిమాన సోదరులారా. ఎందుకంటే ఈ నలుగురు ఇమాములలో ఏ ఒక్క ఇమాము కూడా ప్రజలను కళ్ళు మూసుకొని వారిని అనుసరించండి అని బోధించలేదు.
రండి, వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి వారు ఏమనేవారంటే: ‘ఇదా సహ్హల్ హదీసు ఫహువ మజ్హబీ’. “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాట వచ్చేస్తే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉల్లేఖనం వచ్చేస్తే అదే నా మార్గము” అని చెప్పారు సోదరులారా. అలాగే మరొక సందర్భంలో ఆయన ఏమన్నారంటే: ‘ఇదా వజద్తుమ్ కలామీ యుఖాలిఫు కలామ రసూలిల్లాహి ఫద్ రిబూ బి కలామిల్ హాయిత్’. “ఎప్పుడైనా నా మాట, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాటకు విరుద్ధంగా వచ్చేస్తే, మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాటనే తీసుకోండి, నా మాటను గోడకేసి విసిరికొట్టండి” అని చెప్పారు సోదరులారా.
అలాగే, ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారి గురించి మనం చూచినట్లయితే, ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారు ఏమన్నారంటే: ‘కుల్లున్ యుఖజు మిన్ కౌలిహి వ యురద్దు ఇల్లా సాహిబు హాజల్ ఖబ్ర్’. ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి మస్జిదె నబవీలో కూర్చొని శిష్యులకు, ప్రజలకు బోధించేటప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సమాధి వైపు సైగ చేస్తూ ఇలా చెప్పేవారు: “ప్రతి మనిషి యొక్క మాట తీసుకొనవచ్చు, ప్రతి మనిషి యొక్క మాటను తిరస్కరించే అధికారము అందరికీ కలదు. కానీ, ఈ సమాధిలో నిద్రిస్తున్న ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాటలను కేవలం తీసుకోవాలే తప్ప తిరస్కరించేదానికి అధికారము లేదు” అని చెప్పేవారు.
అలాగే ఇమామ్ షాఫయీ రహ్మతుల్లాహి అలైహి గారి గురించి మనం చూచినట్లయితే, ఇమామ్ షాఫయీ రహ్మతుల్లాహి అలైహి ఏమనేవారంటే, “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాట వచ్చేసిన తర్వాత, ప్రపంచంలోని ఏ వ్యక్తి మాటను కూడా తీసుకొని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాటను వదిలేయటము నిషేధం” అని చెప్పేవారు. అంతేకాకుండా ‘ఇదా సహ్హల్ హదీసు ఫహువ మజ్హబీ’, “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉల్లేఖనం వచ్చేస్తే అదే నా మార్గం” అని ఆయన కూడా ప్రకటించేవారు.
ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి గారి గురించి మనం చూసినట్లయితే, ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి గారు వారి శిష్యులలోని ఒక శిష్యునికి బోధిస్తూ ఇలా అన్నారు. ఏమన్నారంటే: ‘లా తుఖల్లిద్ నీ వలా తుఖల్లిద్ మాలికన్ వలల్ ఔజాయియ్య వఖుజ్ మిన్ హైసు అఖజూ’. “ఓ నా శిష్యుడా, నువ్వు కళ్ళు మూసుకొని నన్ను అనుసరించకు. అలాగే ఇమామ్ మాలిక్ ని, ఇమామ్ ఔజాయీని ఎవరిని కూడా నువ్వు కళ్ళు మూసుకొని అనుసరించకు. వాళ్ళందరూ ఎక్కడి నుంచి అయితే ధర్మ విద్యను అభ్యసించారో, నువ్వు కూడా అక్కడి నుంచే ధర్మ విద్యను అభ్యసించు” అని చెప్పేవారు. అల్లాహు అక్బర్!
ఇవన్నీ చూచిన తర్వాత మనకు ఏం అర్థమవుతుంది సోదరులారా? ఇమాములను కళ్ళు మూసుకొని అనుసరించడం ఇది సరి కాదు.
ఇక రెండవ రకమైన ప్రజలు ఎవరంటే ఈ నలుగురు ఇమాముల యొక్క జీవిత చరిత్రను తెలుసుకోకుండా, ఈ నలుగురు ఇమాముల యొక్క త్యాగాలను, వారు చేసిన ధార్మిక సేవను గుర్తించకుండా ఈ నలుగురు ఇమాములను ద్వేషిస్తారు, ఈ నలుగురు ఇమాములను దూషిస్తారు. దీనిని కూడా మనం ఖండిస్తాం. ఎందుకంటే వీళ్ళు ధర్మ సేవకు త్యాగాలు చేసిన వారు, ఎన్నో త్యాగాలు చేసి ప్రపంచానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉల్లేఖనాలు అందించిన వారు. వీరి త్యాగాలను మనము కనుమరుగు చేయలేము. వీరిని ద్వేషించుకోవటం, వీరిని దూషించడం తప్పు సోదరులారా.
న్యాయంగా మాట్లాడాలంటే నలుగురు ఇమాములు ప్రజలకు బోధించిన బోధనలలో కొన్ని బోధనలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాటలకు విరుద్ధంగా వెళ్ళాయి. కానీ, ఉద్దేశపూర్వకంగా వాళ్ళు ఈ తప్పు చేయలేదు సోదరులారా. వారికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉల్లేఖనాలు అందలేదు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీసులు వారికి చేరలేదు. కాబట్టి వారు అలాంటి ఫత్వాలు ఇచ్చారు. అయితే, మరణించే ముందు వారు చెప్పారు కదా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాట వచ్చేస్తే అదే మా మార్గము అని. కాబట్టి వారిని ద్వేషించుకోవటం, వారిని దూషించడం సరి కాదు.
ఈ రెండింటికి మధ్య ఒక మార్గం ఉంది. అదే సజ్జన పూర్వికుల మార్గం, అదే సలఫీల మార్గం, అదే అహ్లె హదీసుల మార్గం. అదేమిటంటే నలుగురు ఇమాములను గౌరవించడం తప్పనిసరి. నలుగురు ఇమాములతో పాటు ఇంకా ఎంత మంది ఇమాములు ఉన్నారో, ఎంత మంది ధర్మ సేవ చేసిన పండితులు ఉన్నారో, వారందరినీ గౌరవించడం తప్పనిసరి. వారెవరినీ కించపరచకూడదు. వారి త్యాగాలను మనము కొనియాడాలి. అయితే, వారి ఏ మాటలైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాటకు విరుద్ధంగా వెళ్ళాయో, ఆ మాటలను మాత్రం తీసుకోకుండా అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాటలనే తీసుకోవటం సరైన మార్గం అని బోధిస్తారు. ఇదే సలఫీల యొక్క బోధన, ఇదే అహ్లె హదీసుల యొక్క బోధన, ఇదే సరైన మార్గం.
అభిమాన సోదరులారా, చివరలో ఒక మాట చెప్పదలచుకుంటున్నాను, అదేమిటంటే, కళ్ళు మూసుకొని అనుసరించడానికి అర్హత కలిగిన ఈ ప్రపంచంలో ఏకైక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎందుకంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పేరు చెప్పి మనల్ని అనుసరించాలని ఆదేశించాడు కాబట్టి, కళ్ళు మూసుకొని మనము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అనుసరించవచ్చు.
అల్లాహ్ మనందరికీ ఈ విషయాలు అర్థం చేసుకొని సరైన మార్గంలో నడుచుకునే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక.
ఇమాం అబూ హనీఫా, మాలిక్, షాఫీ ఈ , అహ్మద్ బిన్ హంబల్ నాలుగు ఇమాములు గురుంచి తెలియజేయండి https://bit.ly/2Q04eLI
నేను ఇస్లాంలోకి కొత్తగా వచ్చాను, కొంతమంది నన్ను 4 ఇమాములను అనుసరించు అని ఇబ్బంది పెడుతున్నారు https://bit.ly/3wxRxIY
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
కనుక తన ప్రభువును కలుసుకోవాలని ఆశించేవాడు సత్కా- ర్యాలు చేయాలి. ఆరాధనలో తన ప్రభువుతో పాటు మరెవ్వరినీ చేర్చకూడదు[. (కహఫ్ 18: 110).
2- ఏ సత్కార్యం గురించి విన్నా దానిని ఆచరించడంలో ఆలస్యం చేయకు. సంతోషంతో, ఇష్టాపూర్వంగా సద్మనస్సుతో ముందడుగు వేయి. ఇది దైవభీతి చిహ్నం. అల్లాహ్ ఇలా ఆదేశించాడుః
మీ ప్రభువు క్షమాభిక్ష వైపునకు, స్వర్గం వైపునకు పోయే మార్గంలో పరుగెత్తండి. ఆ స్వర్గం భూమ్యాకాశాల అంత విశాలమై- నది. అది భయభక్తులు కలవారి కొరకు తయారు చెయ్య- బడింది. (ఆలి ఇమ్రాన్ 3: 133).
దైవాదేశాల పాలనకు త్వరపడే ఓ అరుదైన సంఘటన శ్రద్ధగా చదవండిః అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) నఫిల్ నమాజు చేస్తూ ఉన్నారు. నాఫిఅ అను ఆయన బానిస ప్రక్కనే కూర్చుండి, ఆయన ఏదైనా ఆదేశమిస్తే దాని పాలనకు వేచిస్తూ ఉన్నాడు. స్వయంగా నాఫిఅ ఓ గొప్ప పండితులు, ప్రఖ్యాతి గాంచిన హదీసు గ్రంథం మువత్త ఇమాం మాలిక్ యొక్క ఉల్లేఖకుల్లో ఒకరు. అతనిలో ఉన్న ఉన్నత గుణాల వల్ల అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ అతణ్ణి చాలా ప్రేమించేవారు. అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ నమాజులో ఖుర్ఆన్ పఠిస్తూ “మీరు అమితంగా ప్రేమించే వస్తువులను (అల్లాహ్ మార్గంలో) ఖర్చు పెట్టనంత వరకు మీరు సత్కార్య స్థాయికి చేరుకోలేరు”. (ఆలిఇమ్రాన్ 3: 92). చదివినప్పుడు వెంటనే తన చెయితో సైగ చేశాడు. ఆదేశపాలనకై సిద్ధంగా ఉన్న నాఫిఅకు ఆయన ఎందుకు సైగ చేస్తున్నాడో అర్థం కాలేక పోయింది. అర్థం చేసుకొనుటకై ఎంతో ప్రయత్నం చేశాడు. ఫలితం లేకపోయింది. అందుకు ఆయన సలాం తిప్పే వరకు వేచించి, ఎందుకు సైగ చేశారు? అని అడిగాడు. దానికి అబ్దుల్లాహ్ ఇలా సమాధానం చెప్పారు “అమితంగా నేను ప్రేమించే వస్తువులు ఏమిటని ఆలోచిస్తే నీవు తప్ప నాకు ఏదీ ఆలోచన రాలేదు. అయితే నేను నమాజులో ఉండగానే నీకు స్వేచ్ఛ ప్రసాదించుటకు సైగ చేయడమే మంచిదిగా భావించాను. నమాజు అయ్యే వరకు వేచిస్తే బహుశా నా కోరిక, వాంఛ ఆధిక్యత పొంది ఈ నిర్ణయానికి వ్యతిరేకం జరుగుతుందని భయం అనిపించింది. అందుకే వెంటనే సైగ చేశాను. ఈ మాటను విన్న నాఫిఅ వెంటనే “మీ సహచర్యం లభిస్తుంది కదా”? అని అడిగాడు. అవును నీవు నాతో ఉండవచ్చు అన్న హామీ ఇచ్చారు అబ్దుల్లాహ్.
3- అల్లాహ్ నీకు ఏదైనా సత్కార్యం చేసే భాగ్యం నొసంగాడంటే దానిని మంచి విధంగా సంపూర్ణంగా చేయుటకు ప్రయత్నించు.
మంచి పనులు చేసే వారికి మంచి బహుమానాలు లభిస్తాయి. ఇంకా ఎక్కువ అనుగ్రహం లభిస్తుంది. వారి ముఖాలను నల్లదనం గానీ అవమానం గానీ కప్పివేయవు. వారు స్వర్గానికి అర్హులు, అక్కడే శాశ్వతంగా ఉంటారు. (యూనుస్ 10: 26).
నీ అవసరం ఎవరికి పడిందో అతని స్థానంలో నీవు నిన్ను చూసుకో, అప్పుడు ప్రవక్త ఈ ఆదేశాన్ని కూడా దృష్టికి తెచ్చుకోః
“మీలో ఒకరు తాను తన గురించి కోరుకున్నట్లు తమ సోదరుని గురించి కోరనంత వరకు విశ్వాసి కాజాలడు”.(బుఖారి 13, ముస్లిం 45).
4- చేసిన పుణ్యాన్ని గుర్తు చేసుకోకు. ఎవరి పట్ల ఆ కార్యం చేశావో అతన్ని ఎత్తిపోడవకు, హెచ్చరించకు. దాని గురించి మరెవరికో చెప్పుకోబోకు. ఏదైనా ఔచిత్యం ఉంటే తప్ప. అల్లాహ్ ఆదేశం ఇలా ఉంది గమనించుః
“విశ్వాసులారా! మీరు దెప్పిపొడిచి, గ్రహీత మనస్సును గాయపరచి మీ దానధర్మాలను మట్టిలో కలపకండి.” (బఖర 2: 264).
నీవు చేసిన దాన్ని అల్లాహ్ వద్ద నీ త్రాసులో పెట్టడం జరుగుతుంది. ఎవరి పట్ల నీవు మేలు చేశావో వారు దాన్ని తిరస్కరించినా పరవా లేదు.
5- నీ పట్ల ఉపకారం చేసిన వారికి ప్రత్యుపకారం చేయి. అది కనీసం ఒక మంచి మాట ద్వారా అయినా సరే. అల్లాహ్ దయ తర్వాత నీవు సత్కార్యం చేయునట్లు ఇది నీకు తోడ్పడుతుంది. అల్లాహ్ ఆదేశం ఇలా ఉందిః
“మీరు పరస్పర వ్వవహారాలలో ఔదార్యం చూపడం మరవకండి.” (బఖర 2: 237).
ఈ పోస్ట్ క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది. క్రింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి పూర్తి పుస్తకం చదవండి.
సత్కార్య వనాలు అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia) అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.