98:1 لَمْ يَكُنِ الَّذِينَ كَفَرُوا مِنْ أَهْلِ الْكِتَابِ وَالْمُشْرِكِينَ مُنفَكِّينَ حَتَّىٰ تَأْتِيَهُمُ الْبَيِّنَةُ గ్రంథవహులకు చెందిన తిరస్కారులు, బహుదైవారాధకులు తమ వద్దకు స్పష్టమైన నిదర్శనం రానంతవరకూ (తమ తిరస్కార వైఖరిని) మానుకోనివారుగా ఉండేవారు. (ఇంతకీ ఆ నిదర్శనం ఏమిటంటే…)
98:2 رَسُولٌ مِّنَ اللَّهِ يَتْلُو صُحُفًا مُّطَهَّرَةً పరిశుద్ధమైన గ్రంథ పత్రములను చదివి వినిపించే దైవప్రవక్త తమ వద్దకు రావాలి.
98:3 فِيهَا كُتُبٌ قَيِّمَةٌ మరి వాటిలో (ఆ గ్రంథ పత్రాలలో) స్థిరమైన, సవ్యమైన ఆదేశాలు ఉండాలి.
98:4 وَمَا تَفَرَّقَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ إِلَّا مِن بَعْدِ مَا جَاءَتْهُمُ الْبَيِّنَةُ మరి (ఈ) గ్రంథవహులు తీరా తమ వద్దకు స్పష్టమైన నిదర్శనం వచ్చేసిన తరువాతే (విభేదించుకొని) చీలిపోయారు.
98:5 وَمَا أُمِرُوا إِلَّا لِيَعْبُدُوا اللَّهَ مُخْلِصِينَ لَهُ الدِّينَ حُنَفَاءَ وَيُقِيمُوا الصَّلَاةَ وَيُؤْتُوا الزَّكَاةَ ۚ وَذَٰلِكَ دِينُ الْقَيِّمَةِ వారు అల్లాహ్ నే ఆరాధించాలని ధర్మాన్ని ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలనీ, ఏకాగ్రచిత్తులై – నమాజును నెలకొల్పాలనీ, జకాత్ ను ఇస్తూ ఉండాలని మాత్రమే వారికి ఆదేశించబడింది. ఇదే స్థిరమైన సవ్యమైన ధర్మం.
98:7 إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ أُولَٰئِكَ هُمْ خَيْرُ الْبَرِيَّةِ అయితే విశ్వసించి, సత్కార్యాలు చేసినవారు; నిశ్చయంగా సృష్టిలో వారే అందరికన్నా ఉత్తములు.
98:8 جَزَاؤُهُمْ عِندَ رَبِّهِمْ جَنَّاتُ عَدْنٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا أَبَدًا ۖ رَّضِيَ اللَّهُ عَنْهُمْ وَرَضُوا عَنْهُ ۚ ذَٰلِكَ لِمَنْ خَشِيَ رَبَّهُ వారికి ప్రతిఫలంగా వారి ప్రభువు దగ్గర శాశ్వతమైన స్వర్గ వనాలున్నాయి. వాటి క్రింద కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. వాటిలో వారు కలకాలం ఉంటారు. అల్లాహ్ వారి పట్ల ప్రసన్నుడయ్యాడు. వారు అల్లాహ్ పట్ల సంతోషపడ్డారు. ఈ అనుగ్రహ భాగ్యం తన ప్రభువుకు భయపడే వానికి మాత్రమే.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం: “ప్రజలలో కొంత మంది అల్లాహ్‌కు అతి దగ్గరవారై ఉన్నారు .” అని ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అన్నారు. యా రసూలుల్లాహ్ ! వారెవరూ? అని కొందరు అడిగారు. దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం): “వారు అహ్‌లుల్ ఖుర్‌ఆన్ (ఖుర్‌ఆన్ (గంథాన్ని పారాయణం చేసేవారు, దానిని నేర్పేవారు, నేర్చుకునేవారు) మరియు వారే అల్లాహ్‌కు అతి దగ్గరవారై ఉంటారు, వారు ఆయనకు ప్రత్యేకులు” అని అన్నారు. [నసాయి, ఇబ్ను మాజా, హాకిమ్: సహీహ్ అత్తర్గీబ్ వత్తర్హీబ్: 1432]
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అంతిమ దైవగ్రంథం ఖుర్ఆన్ (అనువాదం, వ్యాఖ్యానం) – అహ్సనుల్ బయాన్
ప్రింట్ పుస్తకం కొనదలచిన వారు ఆన్లైన్ లో కొనుక్కోవచ్చును
ఉర్దూ భాషలో మౌలానా ముహమ్మద్ జునాగడీ (Moulana Muhammad Jonagari ) మరియు హాఫిజ్ సలాహుద్దీన్ యుసుఫ్ (Hafiz Salah-ud-Din Yusuf) లు కలిసి తయారు చేసిన అహ్సనుల్ బయాన్ అనే ప్రపంచ ప్రసిద్ధ ఖుర్ఆన్ సంకలనం యొక్క తెలుగు అనువాదమిది. దీనిని ముహమ్మద్ అజీజుర్రహ్మాన్ గారు తెలుగులో అనువదించినారు.
దీనిని శాంతిమార్గం పబ్లికేషన్ ట్రస్ట్, హైదరాబాదు వారు ప్రచురించారు. ఆన్లైన్ లో కొనుక్కోవడానికి క్రింద లింక్ నొక్కండి: (Rs. 600.00)- ప్రస్తుతం శాంతి మార్గం వెబ్సైటు లింక్ పని చెయ్యట్లేదు . ఈ నెంబర్ కి సంప్రదించండి: రసూల్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ మొబైల్: +91 77300 16040
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఆమనర్రసూలు బిమా ఉన్‌జిల ఇలైహి మిర్రబ్బీహీ్ వల్ మువ్ మి నూన్ కుల్లున్ ఆమన బిల్లాహి వమలాయికతిహీ వకుతుబిహీ వరుసులిహ్ లా నుఫర్రిఖు బైన అహది మ్మిర్రుసులిహ్ వఖాలూ సమిఅ్ నా వఅతఅ్ నా గుఫ్‌రానక రబ్బనా వ ఇలైకల్ మసీర్
తన ప్రభువు తరఫున అవతరింపజేయబడిన దానిని ప్రవక్త విశ్వసించాడు. దాన్ని విశ్వాసులు కూడా (సత్యమని నమ్మారు). వారంతా అల్లాహ్‌ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలనూ విశ్వసించారు. “మేము ఆయన (పంపిన) ప్రవక్తల మధ్య ఎలాంటి విచక్షణను, భేదభావాన్నీ పాటించము” (అని వారు చెబుతారు). “మేము విన్నాము. విధేయులం అయ్యాము. మా ప్రభూ! మేము నీ క్షమాభిక్షను అర్థిస్తున్నాము. కడకు మేము మరలి రావలసింది నీ వద్దకే” అని అంటారు.
అల్లాహ్ ఏ ప్రాణిపైనా దాని శక్తికి మించిన భారం వేయడు. అది ఏ పుణ్యాన్ని సంపాదించినా దానికే లభిస్తుంది. మరి అది ఏ పాపాన్ని మూటగట్టుకున్నా దాని ఫలితాన్ని అది చవి చూస్తుంది. (ఇలా ప్రార్థిస్తూ ఉండండి): “ఓ మా ప్రభూ! మేము మరచిపోయినా, లేక మేము పొరబడినా మమ్మల్ని నిలదీయకు. మా ప్రభూ! మాకు పూర్వం గతించిన వారిపై వేసినటువంటి భారాన్ని మాపై వేయకు. మా ప్రభూ! మేము మోయలేనటువంటి బరువును మాపై మోపకు. మమ్మల్ని మన్నించి వదలిపెట్టు. మాకు క్షమాభిక్ష పెట్టు. మాపై దయజూపు. నీవే మా సంరక్షకుడవు. అందుచేత అవిశ్వాసులకు వ్యతిరేకంగా మాకు సహాయపడు.”
ప్రవక్త ﷺ ఇలా తెలిపారని అబూ మస్ఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః
مَنْ قَرَأَ بِالْآيَتَيْنِ مِنْ آخِرِ سُورَةِ البَقَرَةِ فِي لَيْلَةٍ كَفَتَاهُ “ఎవరు రాత్రి వేళ సూర బఖరలోని చివరి రెండు ఆయతులు పఠిస్తారో అతనికి అవే చాలు”. (బుఖారి 5010 పదాలు, ముస్లిం 807).
ఇమాం నవవీ (రహిమహుల్లాహ్) చెప్పారుః అవి సరిపోతాయి అంటే తహజ్జుద్ కు బదులుగా సరిపోతాయి అని భావం. షైతాన్ నుండి, ఆపదల నుండి రక్షణకై అని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా కావచ్చు. (సహీ ముస్లిం షర్హ్ నవవీ 6/ 340, హ.న. 807)
ఇబ్ను హజర్ (రహిమహుల్లాహ్) పై అభిప్రాయాలకు/ భావాలకు మద్దతు ఇస్తూ ఇలా చెప్పారుః దీనిపై నేను ఇలా అంటానుః పైన పేర్కొనబడిన భావాలన్నియు సరియైనవి కావచ్చు. – అల్లాహ్ యే అందరికంటే ఎక్కువ తెలిసినవాడు- కాని మొదటి భావం గురించి మరో స్పష్టమైన ఉల్లేఖనం ఉంది, అది ఆసిం ద్వారా, అల్ ఖమాతో, ఆయన అబూ మస్ఊద్ తో, ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పినట్లు తెలిపారు.
مَن قَرَأخَاتِمة الْبَقَرَةِ أَجْزَأَتْ عَنْهُ قِيَامَ لَيْلَةٍ “ఎవరు సూర బఖరలోని చివరి ఆయతులు పఠిస్తారో అవి అతని వైపు నుండి తహజ్జుద్ కు బదులుగా సరిపోతాయి”. (ఫత్హుల్ బారీ బిషర్హి సహీహిల్ బుఖారిః ఇబ్ను హజ్ర్ అస్ఖలానీ 8/ 673, హ.న. 5010).
ఈ రెండు ఆయతుల పారాయణం చాలా సులువైన విషయం, అనేక మంది వాటిని కంఠస్తం చేసి ఉంటారు అల్ హందులిల్లాహ్. ముస్లిం వ్యక్తి ప్రతి రాత్రి వాటిని క్రమం తప్పకుండా చదివే ప్రయత్నం చేయాలి. ఇవి సులువుగా ఉన్నాయని కేవలం వీటినే పట్టుకొని, తహజ్జుద్ కు ఉన్నటువంటి పుణ్యం గల ఇతర సత్కార్యాలను వదలకూడదు. ఎందుకనగా విశ్వాసి సాధ్యమైనంత వరకు ఎక్కువ పుణ్యాలు సమకూర్చుకునే ప్రయత్నం చేస్తాడు. ఏ సత్కార్యం అంగీకరించబడుతుందనేది కూడా అతనికి తెలియదు.
అబ్దుల్లాహ్ బిన్ ఉమైర్ (రహిమహుల్లాహ్) చెప్పారుః అల్లాహ్ విధేయతకు సంబంధించిన విషయాల్లో, ఏదో అతి నీచమైన పని చేస్తున్నట్లుగా అతి సులువైన విషయాలతోనే సరిపుచ్చుకోకు. అలా కాకుండా ఎంతో ఆనందంతో, సంపూర్ణ కాంక్షతో కఠోరంగా శ్రమించే ప్రయత్నం చేయి. (హిల్యతుల్ ఔలియా…: అబూ నుఐమ్ 3/ 354).
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
వంద ఆయతుల పారాయణం చాలా సులువు, నీ సమయంలో నుండి కేవలం పది నిమిషాల పాటు మాత్రమే గడుస్తుంది. నీ వద్ద సమయం మరీ తక్కువగా ఉంటే, ఈ ఘనతను పొందాలనుకుంటే సూర సాఫ్ఫాత్ (సూర నం. 37), లేదా సూర ఖలమ్ (68) మరియు సూర హాఖ్ఖా (69) పారాయణం చేయవచ్చు.
ఒకవేళ ఈ వంద ఆయతుల పారాయణం రాత్రి వేళ తప్పిపోతే ఫజ్ర్ మరియు జొహ్ర్ నమాజుల మధ్య పారాయణం చేయు, ఇందులో బద్ధకం వహించకు, ఇన్ షా అల్లాహ్ నీవు దాని పుణ్యం పొందగలవు. ఎలా అనగా ప్రవక్త ﷺ ఇలా శుభవార్త ఇచ్చారని హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః
“ఎవరైనా తాను రోజువారీగా పారాయణం చేసే ఖుర్ఆనులోని కొంత ప్రత్యేక భాగం, లేదా ఏదైనా వేరే ఆరాధన చేయలేక నిద్రపోతే, మళ్ళీ దానిని ఫజ్ర్ మరియు జొహ్ర్ నమాజుల మధ్య పూర్తి చేసుకుంటే అతనికి రాత్రివేళ చేసినంత పుణ్యం లిఖించబడుతుంది”. (ముస్లిం 747).
ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) గారి ఈ ఉల్లేఖనం యొక్క వ్యాఖ్యానంలో ముబారక్ పూరి (రహిమహుల్లాహ్) ఇలా చెప్పారుః
ఈ హదీసు ద్వారా తెలిసిందేమిటంటే రాత్రిపూట (నమాజ్, ఖుర్ఆన్ పారాయణం లాంటి) ఏదైనా సత్కార్యం చేయుట, మరియు నిద్ర వల్ల లేదా మరే కారణంగా తప్పిపోతే ‘ఖజా’ చేయుట ధర్మసమ్మతమైనది. ఫజ్ర్ మరియు జొహ్ర్ నమాజుల మధ్య దానిని చేసినవాడు రాత్రి చేసినవానితో సమానం.
ముస్లిం (746), తిర్మిజి (445) మొదలైనవాటిలో హజ్రత్ ఆయిషా రజియల్లాహు అన్హా ద్వారా రుజువైన విషయం ఏమిటంటేః నిద్ర లేదా ఏదైనా అవస్త కారణంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తహజ్జుద్ నమాజ్ చేయలేకపోతే పగటి పూట పన్నెండు రకాతులు చేసేవారు.
బహుశా ఈ హదీసు ప్రతి రోజు ఖుర్ఆనులో ఓ ప్రత్యేక భాగ పారాయణం ఉండాలని, ప్రత్యేకంగా రాత్రి వేళ అని నిన్ను ప్రోత్సహిస్తుంది. ఏమీ! మనము అశ్రద్ధవహుల్లో లిఖించబడకుండా ఉండుటకు రాత్రి కనీసం పది ఆయతులైనా పారాయణం చేయాలని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రోత్సహించిన విషయం మీకు తెలియదా?
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారని అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖించారుః
“పది ఆయతులతో తహజ్జుద్ చేయువారు అలక్ష్యపరుల్లో వ్రాయబడరు. మరెవరయితే వంద ఆయతులతో తహజ్జుద్ చేస్తాడో వినయ విధేయుల్లో వ్రాయబడుతాడు. ఇంకా ఎవరయితే వెయ్యి ఆయతులతో తహజ్జుద్ చేస్తారో ‘ముఖంతిరీన్’లో వ్రాయబడుతాడు”. (ముఖంతిరీన్ అన్న పదం ఖింతార్ నుండి వచ్చింది. ఖింతార్ భావం పై హదీసులో చూడండి).
ఇకనైనా మనం ఖుర్ఆన్ పారాయణం చేయడానికి అడుగు ముందుకు వేద్దామా? మన ఖుర్ఆన్ సంపూర్ణం చేయడమనేది కేవలం రమజాను వరకే పరిమితమయి ఉండకూడదు, సంవత్సరమెల్లా ఉండాలి. తహజ్జుద్ పుణ్యం పొందుటకు ప్రతి రోజు వంద ఆయతుల పారాయణ కాంక్ష అనేది అల్లాహ్ గ్రంథాన్ని బలంగా పట్టుకొని ఉండడానికి శుభప్రదమైన అవకాశం కావచ్చు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
మిగతా క్లాసులు వీడియో ఒక్కక్కటిగా రోజూ జత చేస్తాము, ఇన్ షా అల్లాహ్
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
[53 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
సూరా అల్ కహఫ్ (ఆయతులు 100 – 110)
18:100 وَعَرَضْنَا جَهَنَّمَ يَوْمَئِذٍ لِّلْكَافِرِينَ عَرْضًا ఆ రోజు మేము నరకాన్ని అవిశ్వాసుల ముందు ప్రత్యక్షపరుస్తాము.
18:101 الَّذِينَ كَانَتْ أَعْيُنُهُمْ فِي غِطَاءٍ عَن ذِكْرِي وَكَانُوا لَا يَسْتَطِيعُونَ سَمْعًا నా స్మరణ పట్ల వారి కళ్లు పొరలు క్రమ్ముకుని ఉండేవి. అప్పుడు వారు (సత్య వాక్కును) వినే స్థితిలో కూడా లేరు.
18:102 أَفَحَسِبَ الَّذِينَ كَفَرُوا أَن يَتَّخِذُوا عِبَادِي مِن دُونِي أَوْلِيَاءَ ۚ إِنَّا أَعْتَدْنَا جَهَنَّمَ لِلْكَافِرِينَ نُزُلًا ఇప్పుడీ అవిశ్వాసులు, నన్ను కాదని నా దాసులను తమ సహాయకులుగా చేసుకుందామని అనుకుంటున్నారా? (వినండి!) మేము ఈ అవిశ్వాసుల ఆతిథ్యం కోసం నరకాన్ని సిద్ధంచేసి ఉంచాము.
18:103 قُلْ هَلْ نُنَبِّئُكُم بِالْأَخْسَرِينَ أَعْمَالًا (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “చేసుకున్న కర్మల రీత్యా మీలో అందరికన్నా ఎక్కువగా నష్టపోయే వారెవరో నేను మీకు చెప్పనా?
18:105 أُولَٰئِكَ الَّذِينَ كَفَرُوا بِآيَاتِ رَبِّهِمْ وَلِقَائِهِ فَحَبِطَتْ أَعْمَالُهُمْ فَلَا نُقِيمُ لَهُمْ يَوْمَ الْقِيَامَةِ وَزْنًا తమ ప్రభువు ఆయతులను, ఆయన్ని కలుసుకోవలసి ఉందన్న విషయాన్ని త్రోసి పుచ్చినవారు వీరే. అందువల్ల వారి కర్మలన్నీ వృధా అయిపోయాయి. కాబట్టి ప్రళయదినాన మేము వారి కర్మల బరువును తూయము.
18:106 ذَٰلِكَ جَزَاؤُهُمْ جَهَنَّمُ بِمَا كَفَرُوا وَاتَّخَذُوا آيَاتِي وَرُسُلِي هُزُوًا వారికి లభించే ప్రతిఫలం నరకం. ఎందుకంటే వారు (సత్యాన్ని) తిరస్కరించారు. నా ఆయతులను, నా ప్రవక్తలను పరిహసించారు.
18:107 إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ كَانَتْ لَهُمْ جَنَّاتُ الْفِرْدَوْسِ نُزُلًا అయితే విశ్వసించి, సత్కార్యాలు కూడా చేసిన వారికి ఆతిథ్యంగా ఫిరదౌసు వనాలు ఉన్నాయి.
18:108 خَالِدِينَ فِيهَا لَا يَبْغُونَ عَنْهَا حِوَلًا వారక్కడ కలకాలం ఉంటారు. ఆ స్థలాన్ని వదలి మరెక్కడి కైనా పోవాలని వారు ఎన్నటికీ కోరుకోరు.
18:109 قُل لَّوْ كَانَ الْبَحْرُ مِدَادًا لِّكَلِمَاتِ رَبِّي لَنَفِدَ الْبَحْرُ قَبْلَ أَن تَنفَدَ كَلِمَاتُ رَبِّي وَلَوْ جِئْنَا بِمِثْلِهِ مَدَدًا (ఓ ప్రవక్తా!) ఈ విధంగా చెప్పు : “ఒకవేళ నా ప్రభువు మాటలను వ్రాయటానికి సముద్రం సిరాగా మారిపోయినా సరే, నా ప్రభువు మాటలు పూర్తి కాకముందే, అది అయి పోతుంది.” – మేము మళ్లీ దాని వంటిదే (మరో సముద్రం) దాని సహాయార్థం తెచ్చినాసరే.”
18:110 قُلْ إِنَّمَا أَنَا بَشَرٌ مِّثْلُكُمْ يُوحَىٰ إِلَيَّ أَنَّمَا إِلَٰهُكُمْ إِلَٰهٌ وَاحِدٌ ۖ فَمَن كَانَ يَرْجُو لِقَاءَ رَبِّهِ فَلْيَعْمَلْ عَمَلًا صَالِحًا وَلَا يُشْرِكْ بِعِبَادَةِ رَبِّهِ أَحَدًا (ఓ ప్రవక్తా!) వారికి ఇలా చెప్పు: “నేనూ మీలాంటి మానవ మాత్రుణ్ణే.(కాకపోతే) ‘మీ అందరి ఆరాధ్యదైవం ఒకే ఆరాధ్య దైవం’ అన్న సందేశం (వహీ) నా వద్దకు పంపబడుతుంది. కనుక తన ప్రభువును కలుసుకోవాలన్న ఆకాంక్ష ఉన్నవాడు సత్కార్యాలు చేయాలి. తన ప్రభువు ఆరాధనలో వేరొకరికి భాగస్వామ్యం కల్పించకూడదు.”
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.