![అహ్సనుల్ బయాన్ (దివ్య ఖుర్'ఆన్) | తెలుగులో అరబీ ఉచ్చారణ (తెలుగు ఆవాజ్) [పుస్తకం]
ahsanul-bayan-telugu-awaz
Qur'an Transliteration in Telugu Script](https://teluguislam.files.wordpress.com/2023/02/ahsanul-bayan-telugu-awaz.jpg?w=761)
టైటిల్: అంతిమ దైవగ్రంథం ఖుర్ఆన్ (అనువాదం, వ్యాఖ్యానం) – అహ్సనుల్ బయాన్ (తెలుగు ఆవాజ్)
Ahsanul Bayan – Qur’an Transliteration in Telugu Script
శాంతిమార్గం పబ్లికేషన్ ట్రస్ట్, హైదరాబాదు వారు ప్రచురించినారు
[ఇక్కడ పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [1328 పేజీలు] [134 MB]
నోట్ : ప్రతి సూరాను విడివిడిగా చదవడానికి లేదా డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ పేజీ చివరలో చూడండి
Qur’an Transliteration in Telugu Script
https://youtu.be/HNDhgdhAP7Y
ఎన్నో సంవత్సరాలుగా తెలుగు పాఠకులు ఎదురు చూస్తున్న ఖుర్ఆన్ వచ్చేసింది.
👇 ఈ ఖుర్ఆన్ యొక్క ప్రత్యేకతలు.
తెలుగు నాట మారుమూల గ్రామల్లో అరబీ భాష చదవటం రానివారికి. నేర్చుకునే కనీస సౌకర్యాలు కూడ లేనివారికి అమూల్యమైన వరం ఈ ఖుర్ ఆన్ గ్రంథం.
తజ్ వీద్ (శాస్త్రబద్ద పఠనం) సూత్రాల ప్రాకారం తెలుగులో అరబీ ఉచ్చారణ తో అచ్చతెలుగు అనువాదం.
ఖుర్ ఆన్ పదాలు అరబీ బాష ప్రకారంగా విడివిడిగా పొందపరచబడ్డాయి. అరబీ బాష నేర్చుకోవాలనే ఆసక్తి గలవారికి ఇది ఎంతో ఉపయోగకరం.
మీరు ఫోన్ కాల్ ద్వారా మీ ఆర్డర్ బుక్ చేయించి, మీ ఇంటి వద్దకే ఖుర్ఆన్ పొందవచ్చు. వెంటనే సంప్రదించండి. 995 995 9008, 9949 455 740
ముఖ్య గమనిక (తప్పని సరిగా చదవండి)
బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం
ఇది ప్రయత్నమే…ప్రత్యామ్నాయం కాదు!
దివ్యఖుర్ఆన్ వాక్యాల భావాలను అర్థం చేసుకుంటూ అధ్యయనం చేయటం ఎంతో ప్రాముఖ్యత కలిగిన విషయం! అదే సమయంలో దాని ఆయతులను శాస్త్ర ప్రకారంగా ఇంపైన స్వరంతో పారాయణం చేయటం కూడా చాలా పుణ్యప్రదం.
ధర్మం కోరే విధంగా దివ్యఖుర్ఆన్ ను శాస్త్రబద్ధంగా పారాయణం చేయాలంటే ప్రతి ఒక్కరూ నేరుగా అరబీ భాష నేర్చుకోవటం తప్ప మరోమార్గం లేదు. ఖుర్ఆన్ పఠనశాస్త్రం (ఇల్మె ఖిరాత్) నేర్చుకొని దాని ప్రకారంగా పారాయణం చేసినప్పుడు మాత్రమే దివ్యఖుర్ఆన్ పఠనానికి నూటికి నూరుపాళ్ళు న్యాయం జరుగుతుంది. ఈ గ్రంథంలో అనుసరించబడిన ఉచ్చారణ విధానం పాఠకులను ఆ పఠనశాస్త్రం (ఇల్మె ఖిరాత్)కు దగ్గర చేసే ప్రయత్నమే కాని మూల విధానానికి దూరం చేసే ప్రక్రియ ఇది ఎంతమాత్రం కాదు.
ఇలా ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, దివ్యఖుర్ఆన్ గ్రంథాన్ని ఉస్మానీ రాతలో (ముస్ హఫ్ ఉస్మానీలో) తప్ప మరో రూపంలో రాయటాన్ని పండితులు తీవ్రంగా వ్యతిరేకిస్తారు. వారి ఆందోళన సహేతుకమే మరి! ప్రపంచవ్యాప్తంగా ఎవరికి వారు దివ్యఖుర్ఆన్ ను వివిధ స్క్రిప్ట్ లలో రాసుకొని వాటిని అరబీ ఖుర్ఆన్ కు ప్రత్యామ్నాయంగా భావిస్తూ, దానినే అంటి పెట్టుకుంటే భవిష్యత్తులో ముస్లిం సమాజం దానికి భారీ మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది.
ఖుర్ఆన్ పరిరక్షణా బాధ్యతను అల్లాహ్ స్వయంగా తీసుకున్నాడు. అందుకే 1400 యేండ్ల నుంచి ఖుర్ఆన్ పండితుల ద్వారా ఆ బాధ్యత నెరవేరుతూ వస్తోంది. ఇన్షా అల్లాహ్ ప్రళయం వరకూ దివ్య ఖుర్ఆన్ సురక్షితంగా ఉంటుంది. ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా అంటున్నాడు:
“ఇన్నా నహ్ ను నజ్జలన జిక్ర వ ఇన్నా లహూ ల హాఫిజూన్”
మేమే ఈ ఖుర్ఆన్ ను అవతరింపజేశాము. మరి మేమే దీనిని రక్షిస్తాము. (ఖుర్ఆన్ 15 : 9)
అయితే మన నాట మారుమూల గ్రామాల్లో అరబీ విద్య రానివాళ్ళు, నేర్చుకోలేనివాళ్ళు, నేర్చుకునే కనీస సౌకర్యాలకు కూడా నోచుకోలేకపోతున్న అభాగ్యులు కోట్లాదిమంది ఉన్నారు. అటువంటి మారుమూల ప్రాంతాలకు చేరుకొని ఖుర్ఆన్ పారాయణం కోసం తపించిపోతున్న తోటి విశ్వాసులకు చేయూతనిచ్చే పండితులు మన నాట ఎంతమంది ఉన్నారు చెప్పండి? మరి వారి ఖుర్ఆన్ పఠనా జిజ్ఞాస ఎలా నెరవేరుతుంది?
ఖుర్ఆన్ నేర్పించే గురువులు అందుబాటులో లేని చోట్ల పాఠకులు సొంతంగా కనీస ‘తజీవీద్’ (శాస్త్రబద్ధ పఠన) సూత్రాలను అనుసరించి ఖుర్ఆన్ పారాయణం చేసుకునేందుకు వీలుగా ఈ గ్రంథాన్ని రూపొందించటం జరిగింది. అరబీ నేర్చుకునే సౌకర్యం కలిగినవారు సులువుగా ఖుర్ఆన్ పఠించుకోగలుగుతారు. కాని ఆ సౌలభ్యం లేని తెలుగువారు కష్టపడి అయినా సరే; ఈ గ్రంథం ద్వారా దివ్య ఖుర్ఆన్ ను దాదాపు చక్కగా పఠించుకోగలుగుతారు. ఇది దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వివరించిన ఉదాహరణకు సాకారమని చెప్పవచ్చు.
ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: ఖుర్ఆన్ పండితుడయి ఉండి, దాన్ని పఠించే వ్యక్తి (ప్రళయ దినాన) గౌరవనీయులు పుణ్యాత్ములయిన దైవదూతల వెంట ఉంటాడు. ఖుర్ఆన్ ను పఠించడంలో తడబడుతూ, శ్రమకోర్చి పారాయణం చేసేవాడు రెట్టింపు పుణ్యాన్ని పొందుతాడు. (బుఖారీ, ముస్లిం)
అరబీ నేర్చుకునే వీలులేని తెలుగు పాఠకుల చేత సక్రమంగా ఖుర్ఆన్ ను పఠింపజేసే మా ప్రయత్నం ఇంతటితో అయిపోలేదు. భవిష్యత్తులో మరిన్ని రకాలుగా ఈ మార్గంలో ముందడుగులు వేసేందుకు మా పబ్లికేషన్ ప్రయత్నిస్తోంది. అల్లాహ్ తలిస్తే, అతి త్వరలో మరిన్ని మెరుగులతో దృశ్య (వీడియో), శ్రవణ (ఆడియో) మాధ్యమాల ద్వారా కూడా ఖుర్ఆన్ పఠనాన్ని తెలుగు ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలని కృతనిశ్చయంతో ఉన్నాం.
పాఠకుల ముందు మరో మారు విన్నవించుకుంటున్నాం! ఈ గ్రంథంలో అనుసరించబడిన ఉచ్చారణ విధానం పాఠకులను పఠనశాస్త్రం (ఇల్మె ఖిరాత్)కు దగ్గర చేసే ప్రయత్నమే కాని మూల విధానానికి దూరం చేసే ప్రకియ ఇది ఎంతమాత్రం కాదు.
అల్లాహ్ మా ఈ కృషిని ఆమోదించాలని, అల్లాహ్ కృపతో ఈ గ్రంథం ప్రజాదరణకు నోచుకోవాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ…
ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ
—
క్రింది లింక్ తప్పనిసరిగా వినండి:
అరబీ రాని వారు ఖురాన్ ను తెలుగులో చదవవచ్చా? – నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) [YT వీడియో]
ప్రతి సూరాను విడివిడిగా చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి
సూరా పేరు | డౌన్లోడ్ లింక్ |
---|---|
అల్ ఫాతిహా | 001 |
అల్ బఖర | 002 |
అలి ఇమ్రాన్ | 003 |
అన్ నిసా | 004 |
అల్ మాయిద | 005 |
అల్ అన్ ఆం | 006 |
అల్ ఆరాఫ్ | 007 |
అల్ అన్ ఫాల్ | 008 |
అత్ తౌబా | 009 |
యూనుస్ | 010 |
హూద్ | 011 |
యూసుఫ్ | 012 |
అర్ రాద్ | 013 |
ఇబ్రాహీమ్ | 014 |
అల్ హిజ్ర్ | 015 |
అన్ నహ్ల్ | 016 |
బనీ ఇస్రాయీల్ | 017 |
అల్ కహఫ్ | 018 |
మర్యమ్ | 019 |
తాహా | 020 |
అల్ అంబియా | 021 |
అల్ హజ్ | 022 |
అల్ మూ’మినూన్ | 023 |
అన్ నూర్ | 024 |
అల్ ఫుర్ఖాన్ | 025 |
అష్ షుఅరా | 026 |
అన్ నమ్ల్ | 027 |
అల్ ఖసస్ | 028 |
అల్ అన్ కబూత్ | 029 |
అర్ రూమ్ | 030 |
లుఖ్మాన్ | 031 |
అన్ సజ్ దహ్ | 032 |
అల్ అహ జాబ్ | 033 |
సబా | 034 |
ఫాతిర్ | 035 |
యాసీన్ | 036 |
అస్ సాఫ్ఫాత్ | 037 |
సాద్ | 038 |
అజ్ జుమర్ | 039 |
అల్ మూ’మిన్ | 040 |
హా మీమ్ అన్ సజ్ దహ్ | 041 |
అష్ షూరా | 042 |
అజ్ జుఖ్ రుఫ్ | 043 |
అద్ దుఖాన్ | 044 |
అల్ జాసియహ్ | 045 |
అల్ అహ్ ఖాఫ్ | 046 |
ముహమ్మద్ | 047 |
అల్ ఫత్ హ్ | 048 |
అల్ హుజురాత్ | 049 |
ఖాఫ్ | 050 |
అజ్ జారియాత్ | 051 |
అత్ తూర్ | 052 |
అన్ నజ్మ్ | 053 |
అల్ ఖమర్ | 054 |
అర్ రహ్మాన్ | 055 |
అల్ వాఖి అహ్ | 056 |
అల్ హదీద్ | 057 |
అల్ ముజాదలహ్ | 058 |
అల్ హష్ర్ | 059 |
అల్ ముమ్ తహినహ్ | 060 |
అస్ సఫ్ | 061 |
అల్ జుముఅహ్ | 062 |
అల్ మునాఫిఖూన్ | 063 |
అత్ తగాబున్ | 064 |
అత్ తలాఖ్ | 065 |
అత్ తహ్రీమ్ | 066 |
అల్ ముల్క్ | 067 |
అల్ ఖలమ్ | 068 |
అల్ హాఖ్ఖహ్ | 069 |
అల్ మఆరిజ్ | 070 |
నూహ్ | 071 |
అల్ జిన్న్ | 072 |
అల్ ముజ్జమ్మిల్ | 073 |
అల్ ముద్ధస్సిర్ | 074 |
అల్ ఖియామహ్ | 075 |
అద్ దహ్ర్ | 076 |
అల్ ముర్సలాత్ | 077 |
అన్ నబా | 078 |
అన్ నాజి ఆత్ | 079 |
అబస | 080 |
అత్ తక్వీర్ | 081 |
అల్ ఇన్ ఫితార్ | 082 |
అల్ ముతఫ్ఫిఫీన్ | 083 |
అల్ ఇన్ షిఖాఖ్ | 084 |
అల్ బురూజ్ | 085 |
అత్ తారిఖ్ | 086 |
అల్ ఆలా | 087 |
అల్ గాషియహ్ | 088 |
అల్ ఫజ్ర్ | 089 |
అల్ బలద్ | 090 |
అష్ షమ్స్ | 091 |
అల్ లైల్ | 092 |
అజ్ జుహా | 093 |
అలమ్ నష్రహ్ | 094 |
అత్ తీన్ | 095 |
అల్ అలఖ్ | 096 |
అల్ ఖద్ర్ | 097 |
అల్ బయ్యినహ్ | 098 |
అజ్ జిల్ జాల్ | 099 |
అల్ ఆదియాత్ | 100 |
అల్ ఖారిఅహ్ | 101 |
అత్ తకాసుర్ | 102 |
అల్ అస్ర్ | 103 |
అల్ హుమజహ్ | 104 |
అల్ ఫీల్ | 105 |
ఖురైష్ | 106 |
అల్ మాఊన్ | 107 |
అల్ కౌసర్ | 108 |
అల్ కాఫిరూన్ | 109 |
అన్ నస్ర్ | 110 |
అల్ లహబ్ | 111 |
అల్ ఇఖ్లాస్ | 112 |
అల్ ఫలఖ్ | 113 |
అన్ నాస్ | 114 |
You must be logged in to post a comment.