సూరహ్ బయ్యినహ్ ఘనత – షేఖ్ ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ [వీడియో]

సూరహ్ బయ్యినహ్ ఘనత – షేఖ్ ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ [వీడియో]
https://youtu.be/qxwqKWAlKgc [12 నిముషాలు]

98. సూరా అల్ బయ్యినహ్

98:1 لَمْ يَكُنِ الَّذِينَ كَفَرُوا مِنْ أَهْلِ الْكِتَابِ وَالْمُشْرِكِينَ مُنفَكِّينَ حَتَّىٰ تَأْتِيَهُمُ الْبَيِّنَةُ
గ్రంథవహులకు చెందిన తిరస్కారులు, బహుదైవారాధకులు తమ వద్దకు స్పష్టమైన నిదర్శనం రానంతవరకూ (తమ తిరస్కార వైఖరిని) మానుకోనివారుగా ఉండేవారు. (ఇంతకీ ఆ నిదర్శనం ఏమిటంటే…)

98:2 رَسُولٌ مِّنَ اللَّهِ يَتْلُو صُحُفًا مُّطَهَّرَةً
పరిశుద్ధమైన గ్రంథ పత్రములను చదివి వినిపించే దైవప్రవక్త తమ వద్దకు రావాలి.

98:3 فِيهَا كُتُبٌ قَيِّمَةٌ
మరి వాటిలో (ఆ గ్రంథ పత్రాలలో) స్థిరమైన, సవ్యమైన ఆదేశాలు ఉండాలి.

98:4 وَمَا تَفَرَّقَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ إِلَّا مِن بَعْدِ مَا جَاءَتْهُمُ الْبَيِّنَةُ
మరి (ఈ) గ్రంథవహులు తీరా తమ వద్దకు స్పష్టమైన నిదర్శనం వచ్చేసిన తరువాతే (విభేదించుకొని) చీలిపోయారు.

98:5 وَمَا أُمِرُوا إِلَّا لِيَعْبُدُوا اللَّهَ مُخْلِصِينَ لَهُ الدِّينَ حُنَفَاءَ وَيُقِيمُوا الصَّلَاةَ وَيُؤْتُوا الزَّكَاةَ ۚ وَذَٰلِكَ دِينُ الْقَيِّمَةِ
వారు అల్లాహ్ నే ఆరాధించాలని ధర్మాన్ని ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలనీ, ఏకాగ్రచిత్తులై – నమాజును నెలకొల్పాలనీ, జకాత్ ను ఇస్తూ ఉండాలని మాత్రమే వారికి ఆదేశించబడింది. ఇదే స్థిరమైన సవ్యమైన ధర్మం.

98:6 إِنَّ الَّذِينَ كَفَرُوا مِنْ أَهْلِ الْكِتَابِ وَالْمُشْرِكِينَ فِي نَارِ جَهَنَّمَ خَالِدِينَ فِيهَا ۚ أُولَٰئِكَ هُمْ شَرُّ الْبَرِيَّةِ
గ్రంథవహులలో తిరస్కారవైఖరికి పాల్పడినవారు, బహుదైవారాధకులు తప్పకుండా నరకాగ్నికి ఆహుతి అవుతారు. వారందులో కలకాలం ఉంటారు. వారు సృష్టితాలలో అందరికంటే చెడ్డవారు.

98:7 إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ أُولَٰئِكَ هُمْ خَيْرُ الْبَرِيَّةِ
అయితే విశ్వసించి, సత్కార్యాలు చేసినవారు; నిశ్చయంగా సృష్టిలో వారే అందరికన్నా ఉత్తములు.

98:8 جَزَاؤُهُمْ عِندَ رَبِّهِمْ جَنَّاتُ عَدْنٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا أَبَدًا ۖ رَّضِيَ اللَّهُ عَنْهُمْ وَرَضُوا عَنْهُ ۚ ذَٰلِكَ لِمَنْ خَشِيَ رَبَّهُ
వారికి ప్రతిఫలంగా వారి ప్రభువు దగ్గర శాశ్వతమైన స్వర్గ వనాలున్నాయి. వాటి క్రింద కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. వాటిలో వారు కలకాలం ఉంటారు. అల్లాహ్ వారి పట్ల ప్రసన్నుడయ్యాడు. వారు అల్లాహ్ పట్ల సంతోషపడ్డారు. ఈ అనుగ్రహ భాగ్యం తన ప్రభువుకు భయపడే వానికి మాత్రమే.

%d bloggers like this: