సూరా అల్ ఫాతిహా
1:1 بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ
అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతొ
1:2 الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
ప్రశంసలు, పొగడ్తలన్నీ అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయి. ఆయన సమస్త లోకాలకు పోషకుడు,
1:3 الرَّحْمَٰنِ الرَّحِيمِ
అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడు.
1:4 مَالِكِ يَوْمِ الدِّينِ
ప్రతిఫల దినానికి (అంటే ప్రళయ దినానికి) యజమాని.
1:5 إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ
మేము నిన్నే ఆరాధిస్తున్నాము, సహాయం కోసం నిన్ను మాత్రమే అర్ధిస్తున్నాము.
1:6 اهْدِنَا الصِّرَاطَ الْمُسْتَقِيمَ
మాకు రుజుమార్గం (సన్మార్గం) చూపించు.
1:7 صِرَاطَ الَّذِينَ أَنْعَمْتَ عَلَيْهِمْ غَيْرِ الْمَغْضُوبِ عَلَيْهِمْ وَلَا الضَّالِّينَ
నీవు అనుగ్రహించిన వారి మార్గం, నీ ఆగ్రహానికి గురికాని వారి, అపమార్గానికి లోనుకాని వారి మార్గం (చూపు).
2. సూరా అల్ బఖర
2:1 الم
అలిఫ్ లామ్ మీమ్.
2:2 ذَٰلِكَ الْكِتَابُ لَا رَيْبَ ۛ فِيهِ ۛ هُدًى لِّلْمُتَّقِينَ
ఈ గ్రంథం (అల్లాహ్ గ్రంథం అన్న విషయం) లో ఎంతమాత్రం సందేహం లేదు. భయభక్తులు కలవారికి ఇది సన్మార్గం చూపుతుంది.
2:3 الَّذِينَ يُؤْمِنُونَ بِالْغَيْبِ وَيُقِيمُونَ الصَّلَاةَ وَمِمَّا رزَقْنَاهُمْ يُنفِقُونَ
వారు గోప్యమైన విషయాలను విశ్వసిస్తారు, నమాజును నెలకొల్పుతారు. ఇంకా మేము ప్రసాదించిన దానిలో (సంపదలో) నుంచి ఖర్చుపెడతారు.
2:4 وَالَّذِينَ يُؤْمِنُونَ بِمَا أُنزِلَ إِلَيْكَ وَمَا أُنزِلَ مِن قَبْلِكَ وَبِالْآخِرَةِ هُمْ يُوقِنُونَ
మేము నీ వైపుకు (అంటే ప్రవక్త వైపుకు) అవతరింపజేసిన దానినీ, నీకు పూర్వం అవతరింపజేసిన వాటినీ వారు విశ్వసి స్తారు. పరలోకం పట్ల కూడా వారు దృఢనమ్మకం కలిగిఉంటారు.
2:5 أُولَٰئِكَ عَلَىٰ هُدًى مِّن رَّبِّهِمْ ۖ وَأُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ
ఇలాంటి వారే తమ ప్రభువు తరఫు నుంచి వచ్చిన సన్మార్గాన ఉన్నారు. సాఫల్యాన్ని పొందేవారు వీరే.
2:6 إِنَّ الَّذِينَ كَفَرُوا سَوَاءٌ عَلَيْهِمْ أَأَنذَرْتَهُمْ أَمْ لَمْ تُنذِرْهُمْ لَا يُؤْمِنُونَ
అవిశ్వాసులను నీవు భయపెట్టినా, భయపెట్టకపోయినా ఒకటే. ఇక వారు విశ్వసించరు.
2:7 خَتَمَ اللَّهُ عَلَىٰ قُلُوبِهِمْ وَعَلَىٰ سَمْعِهِمْ ۖ وَعَلَىٰ أَبْصَارِهِمْ غِشَاوَةٌ ۖ وَلَهُمْ عَذَابٌ عَظِيمٌ
అల్లాహ్ వారి హృదయాలపై,వారి చెవులపై ముద్రవేశాడు. వారి కళ్ళపై పొరవుంది. ఇంకా వారికి మహా (ఘోరమైన) శిక్ష వుంది.
2:8 وَمِنَ النَّاسِ مَن يَقُولُ آمَنَّا بِاللَّهِ وَبِالْيَوْمِ الْآخِرِ وَمَا هُم بِمُؤْمِنِينَ
మేము అల్లాహ్ పట్ల, అంతిమదినం పట్ల విశ్వాసం కలిగి ఉన్నామని కొందరంటున్నారు. కాని యదార్థానికి వారు విశ్వసించినవారు కారు.
2:9 يُخَادِعُونَ اللَّهَ وَالَّذِينَ آمَنُوا وَمَا يَخْدَعُونَ إِلَّا أَنفُسَهُمْ وَمَا يَشْعُرُونَ
వారు అల్లాహ్‌ను, విశ్వాసులనూ మోసపుచ్చుతున్నారు. అయితే వాస్తవానికి వారు స్వయంగా – తమను తామే మోసపుచ్చుకుంటున్నారు. కాని ఈ విషయాన్ని వారు గ్రహించటం లేదు.
2:10 فِي قُلُوبِهِم مَّرَضٌ فَزَادَهُمُ اللَّهُ مَرَضًا ۖ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ بِمَا كَانُوا يَكْذِبُونَ
వారి హృదయాలలో రోగం ఉంది. ఆ రోగాన్ని అల్లాహ్ మరింతగా పెంచాడు. ఇంకా, వారు చెప్పే అబద్ధం మూలంగా వారి కొరకు వ్యధాభరితమయిన శిక్ష ఉంది.
2:11 وَإِذَا قِيلَ لَهُمْ لَا تُفْسِدُوا فِي الْأَرْضِ قَالُوا إِنَّمَا نَحْنُ مُصْلِحُونَ
“భూమిలో కల్లోలాన్ని రేకెత్తించకండి” అని వారితో అన్నప్పుడల్లా, “మేము దిద్దుబాటుకు ప్రయత్నించేవారం మాత్రమే” అని వారు సమాధానమిస్తారు.
2:12 أَلَا إِنَّهُمْ هُمُ الْمُفْسِدُونَ وَلَٰكِن لَّا يَشْعُرُو
జాగ్రత్త! నిజానికి కల్లోల జనకులు వీరే. కాని వారికి ఆ విషయం తెలియటం లేదు.
2:13 وَإِذَا قِيلَ لَهُمْ آمِنُوا كَمَا آمَنَ النَّاسُ قَالُوا أَنُؤْمِنُ كَمَا آمَنَ السُّفَهَاءُ ۗ أَلَا إِنَّهُمْ هُمُ السُّفَهَاءُ وَلَٰكِن لَّا يَعْلَمُونَ
“ఇతరులు (అంటే ప్రవక్త ప్రియ సహచరులు) విశ్వసించినట్లే మీరూ విశ్వసించండి” అని వారితో చెప్పినప్పుడు, “మూర్ఖ జనులు విశ్వసించినట్లుగా మేము విశ్వసించాలా?” అని వారు (ఎదురు) ప్రశ్న వేస్తారు. తస్మాత్! ముమ్మాటికీ వీరే మూర్ఖులు. కాని ఆ సంగతి వీరికి తెలియటం లేదు.
2:14 وَإِذَا لَقُوا الَّذِينَ آمَنُوا قَالُوا آمَنَّا وَإِذَا خَلَوْا إِلَىٰ شَيَاطِينِهِمْ قَالُوا إِنَّا مَعَكُمْ إِنَّمَا نَحْنُ مُسْتَهْزِئُونَ
విశ్వాసులను కలుసుకున్నప్పుడు వారు,”మేమూ విశ్వసించిన వారమే” అని అంటారు. కాని తమ షైతానుల (అంటే తమ పెద్దల లేక సర్దారుల) వద్దకు పోయినప్పుడు, “మేము మీతోనే ఉన్నామండీ. కాకపోతే వాళ్ళతో పరిహాసమాడుతున్నామంతే” అని పలుకుతారు.
2:15 اللَّهُ يَسْتَهْزِئُ بِهِمْ وَيَمُدُّهُمْ فِي طُغْيَانِهِمْ يَعْمَهُونَ
అల్లాహ్ కూడా వారితో పరిహాసమాడుతున్నాడు. వారి తలబిరుసుతనాన్ని మరింత అధికం చేస్తున్నాడు. ఫలితంగా వారు అంధులై గమ్యరహితంగా తిరుగుతూపోతున్నారు.
2:16 أُولَٰئِكَ الَّذِينَ اشْتَرَوُا الضَّلَالَةَ بِالْهُدَىٰ فَمَا رَبِحَت تِّجَارَتُهُمْ وَمَا كَانُوا مُهْتَدِينَ
అపమార్గాన్ని సన్మార్గానికి బదులుగా కొనితెచ్చుకున్నవారు వీరే. అందుచేత వారి ఈ వర్తకం వారికి లాభదాయకమూ కాలేదు, వారు సన్మార్గానికి నోచుకోనూ లేదు.
2:17 مَثَلُهُمْ كَمَثَلِ الَّذِي اسْتَوْقَدَ نَارًا فَلَمَّا أَضَاءَتْ مَا حَوْلَهُ ذَهَبَ اللَّهُ بِنُورِهِمْ وَتَرَكَهُمْ فِي ظُلُمَاتٍ لَّا يُبْصِرُون
వారి ఉపమానం నిప్పు రాజేసిన వ్యక్తి లాంటిది. నిప్పు రాజేసినంతనే పరిసరాల్లోని వస్తువులన్నీ వెలుగులోనికి వచ్చాయి. అంతలోనే అల్లాహ్ వారి వెలుగును హరించి, వారిని కారు చీకట్లలో, ఏమీ కానరాని స్థితిలో వదిలేశాడు.
2:18 صُمٌّ بُكْمٌ عُمْيٌ فَهُمْ لَا يَرْجِعُونَ
వారు చెవిటివారు, మూగవారు, గ్రుడ్డివారు. ఇక వారు (సరైన దారికి) మరలిరారు.
2:19 أَوْ كَصَيِّبٍ مِّنَ السَّمَاءِ فِيهِ ظُلُمَاتٌ وَرَعْدٌ وَبَرْقٌ يَجْعَلُونَ أَصَابِعَهُمْ فِي آذَانِهِم مِّنَ الصَّوَاعِقِ حَذَرَ الْمَوْتِ ۚ وَاللَّهُ مُحِيطٌ بِالْكَافِرِينَ
లేదా (వారి ఉపమానం) ఆకాశం నుంచి కురిసే భారీ వర్షం మాదిరిగా ఉంది – అందులోనూ చిమ్మచీకట్లు, ఉరుములు, మెరుపులు! ఉరుముల గర్జన విని, మృత్యు భయంతో వారు తమ వ్రేళ్ళను తమ చెవులలో దూర్చుకుంటారు. అల్లాహ్ ఈ అవిశ్వాసులను అన్ని వైపుల నుంచీ ముట్టడిస్తాడు.
2:20 يَكَادُ الْبَرْقُ يَخْطَفُ أَبْصَارَهُمْ ۖ كُلَّمَا أَضَاءَ لَهُم مَّشَوْا فِيهِ وَإِذَا أَظْلَمَ عَلَيْهِمْ قَامُوا ۚ وَلَوْ شَاءَ اللَّهُ لَذَهَبَ بِسَمْعِهِمْ وَأَبْصَارِهِمْ ۚ إِنَّ اللَّهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
మెరుపులు వారి దృష్టిని ఎగరవేసుకుపోతాయా! అన్నట్టుంది వారి పరిస్థితి. అవి (మెరుపు తీగలు) వెలుగును విరజిమ్మినపుడల్లా వారు అందులో కొంతదూరం నడుస్తారు. తర్వాత వారిపై చీకటి ఆవరించగానే నిలబడిపోతారు. అల్లాహ్‌యే గనక తలచుకుంటే వారి వినేశక్తినీ, కంటిచూపునూ పోగొట్టేవాడే, నిశ్చయంగా అల్లాహ్ అన్నింటిపై అధికారం గలవాడు.
2:21 يَا أَيُّهَا النَّاسُ اعْبُدُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُمْ وَالَّذِينَ مِن قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُونَ
ప్రజలారా! మిమ్మల్నీ, మీకు పూర్వం వారినీ పుట్టించిన మీ ప్రభువునే ఆరాధించండి- తద్వారానే మీరు (పాపాల నుండి) సురక్షితంగా ఉంటారు.
2:22 الَّذِي جَعَلَ لَكُمُ الْأَرْضَ فِرَاشًا وَالسَّمَاءَ بِنَاءً وَأَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَأَخْرَجَ بِهِ مِنَ الثَّمَرَاتِ رِزْقًا لَّكُمْ ۖ فَلَا تَجْعَلُوا لِلَّهِ أَندَادًا وَأَنتُمْ تَعْلَمُونَ
ఆయనే మీ కోసం భూమిని పాన్పుగానూ, ఆకాశాన్ని కప్పుగానూ చేశాడు, ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి, తద్వారా పండ్లు ఫలాలను పండించి మీకు ఉపాధినొసగాడు. ఇది తెలిసి కూడా మీరు ఇతరులను అల్లాహ్‌కు భాగస్వాములుగా నిలబెట్టకండి.
2:23 وَإِن كُنتُمْ فِي رَيْبٍ مِّمَّا نَزَّلْنَا عَلَىٰ عَبْدِنَا فَأْتُوا بِسُورَةٍ مِّن مِّثْلِهِ وَادْعُوا شُهَدَاءَكُم مِّن دُونِ اللَّهِ إِن كُنتُمْ صَادِقِينَ
మేము మా దాసునిపై అవతరింపజేసిన దాని విషయంలో ఒకవేళ మీకేదన్నా అనుమానముంటే, అటువంటిదే ఒక్క సూరానైనా (రచించి) తీసుకురండి. మీరు సత్యవంతులే అయితే (ఈ పని కోసం) అల్లాహ్‌ను తప్ప మీ సహాయకులందరినీ పిలుచుకోండి.
2:24 فَإِن لَّمْ تَفْعَلُوا وَلَن تَفْعَلُوا فَاتَّقُوا النَّارَ الَّتِي وَقُودُهَا النَّاسُ وَالْحِجَارَةُ ۖ أُعِدَّتْ لِلْكَافِرِينَ
ఒకవేళ మీరు గనక ఈ పని చెయ్యకపోతే- ఎన్నటికీ అది మీ వల్ల కాని పనే- (దీన్ని సత్యమని ఒప్పుకుని) మానవులు,రాళ్ళు ఇంధనం కాగల ఆ అగ్ని నుండి (మిమ్మల్ని మీరు) కాపాడుకోండి. అది సత్య తిరస్కారుల కోసం తయారు చేయబడింది.
2:25 وَبَشِّرِ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ أَنَّ لَهُمْ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ ۖ كُلَّمَا رُزِقُوا مِنْهَا مِن ثَمَرَةٍ رِّزْقًا ۙ قَالُوا هَٰذَا الَّذِي رُزِقْنَا مِن قَبْلُ ۖ وَأُتُوا بِهِ مُتَشَابِهًا ۖ وَلَهُمْ فِيهَا أَزْوَاجٌ مُّطَهَّرَةٌ ۖ وَهُمْ فِيهَا خَالِدُونَ
విశ్వసించి, సత్కార్యాలు చేసే వారికి క్రింద కాలువలు ప్రవహించే (స్వర్గ)వనాల శుభవార్తలను అందజెయ్యి. తినడానికి అక్కడి పండ్లు వారికి ఇవ్వబడినప్పుడల్లా, “ఇలాంటి పండ్లే ఇంతకు మునుపు మాకు ఇవ్వబడినవి” అని వారంటారు. నిజానికి పరస్పరం పోలి వుండే ఫలాలు వారికి ప్రసాదించబడతాయి. వారి కొరకు పరిశుద్ధులైన భార్యలుంటారు. వారు ఈ స్వర్గవనాలలో కలకాలం ఉంటారు.
2:26 إِنَّ اللَّهَ لَا يَسْتَحْيِي أَن يَضْرِبَ مَثَلًا مَّا بَعُوضَةً فَمَا فَوْقَهَا ۚ فَأَمَّا الَّذِينَ آمَنُوا فَيَعْلَمُونَ أَنَّهُ الْحَقُّ مِن رَّبِّهِمْ ۖ وَأَمَّا الَّذِينَ كَفَرُوا فَيَقُولُونَ مَاذَا أَرَادَ اللَّهُ بِهَٰذَا مَثَلًا ۘ يُضِلُّ بِهِ كَثِيرًا وَيَهْدِي بِهِ كَثِيرًا ۚ وَمَا يُضِلُّ بِهِ إِلَّا الْفَاسِقِينَ
నిశ్చయంగా అల్లాహ్ దేనినీ ఉపమానంగా చెప్పటానికి సిగ్గుపడడు- (కడకు) దోమ అయినాసరే, దానికన్నా అల్పమైన వస్తువు అయినాసరే! విశ్వసించినవారు మాత్రం దీన్ని తమ ప్రభువు తరఫు నుంచి వచ్చిన సత్యమని భావిస్తారు. కాని అవిశ్వాసులు, “ఈ ఉపమానం ద్వారా ఇంతకీ అల్లాహ్ ఏం చెప్పదలచుకుంటున్నాడు?” అని అంటారు. ఈ విధంగా ఆయన దీని ద్వారానే ఎంతో మందిని అపమార్గం పట్టిస్తాడు, మరెంతో మందిని సన్మార్గంపైకి తీసుకువస్తాడు. అయితే దీని ద్వారా ఆయన అపమార్గానికి లోను చేసేది అవిధేయులను మాత్రమే.
2:27 الَّذِينَ يَنقُضُونَ عَهْدَ اللَّهِ مِن بَعْدِ مِيثَاقِهِ وَيَقْطَعُونَ مَا أَمَرَ اللَّهُ بِهِ أَن يُوصَلَ وَيُفْسِدُونَ فِي الْأَرْضِ ۚ أُولَٰئِكَ هُمُ الْخَاسِرُونَ
వీరు ఎలాంటి వారంటే అల్లాహ్‌తో చేసిన దృఢమైన ప్రమాణాన్ని భంగపరుస్తారు. అల్లాహ్ కలిపి ఉంచమని చెప్పిన వాటిని త్రెంచివేస్తారు. భువిలో చెడుగును వ్యాపింపజేస్తారు. వీరే అసలు నష్టాన్ని పొందేవారు.
2:28 كَيْفَ تَكْفُرُونَ بِاللَّهِ وَكُنتُمْ أَمْوَاتًا فَأَحْيَاكُمْ ۖ ثُمَّ يُمِيتُكُمْ ثُمَّ يُحْيِيكُمْ ثُمَّ إِلَيْهِ تُرْجَعُونَ
మీరు అల్లాహ్ యెడల తిరస్కార వైఖరికి ఎలా ఒడిగట్టగలరు? చూడబోతే నిర్జీవులుగా ఉన్న మీకు ఆయనే ప్రాణం పోశాడు. మరి మీ ప్రాణం తీసేవాడూ, తిరిగి మిమ్మల్ని బ్రతికించేవాడు కూడా ఆయనే. ఆ తరువాత మీరు ఆయన వైపుకే మరలించబడతారు.
2:29 هُوَ الَّذِي خَلَقَ لَكُم مَّا فِي الْأَرْضِ جَمِيعًا ثُمَّ اسْتَوَىٰ إِلَى السَّمَاءِ فَسَوَّاهُنَّ سَبْعَ سَمَاوَاتٍ ۚ وَهُوَ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ
ఆయనే మీ కోసం భూమిలో ఉన్న సమస్త వస్తువులనూ సృష్టించాడు. తరువాత ఆకాశం వైపుకు ధ్యానాన్ని మరల్చి, తగు రీతిలో సప్తాకాశాలను నిర్మించాడు. ఆయన అన్నీ తెలిసినవాడు.
2:30 وَإِذْ قَالَ رَبُّكَ لِلْمَلَائِكَةِ إِنِّي جَاعِلٌ فِي الْأَرْضِ خَلِيفَةً ۖ قَالُوا أَتَجْعَلُ فِيهَا مَن يُفْسِدُ فِيهَا وَيَسْفِكُ الدِّمَاءَ وَنَحْنُ نُسَبِّحُ بِحَمْدِكَ وَنُقَدِّسُ لَكَ ۖ قَالَ إِنِّي أَعْلَمُ مَا لَا تَعْلَمُونَ
“నేను భువిలో ప్రతినిధిని చేయబోతున్నాను” అని నీ ప్రభువు తన దూతలతో అన్నప్పుడు, “భూమిలో కల్లోలాన్ని రేకెత్తించి, రక్తం ప్రవహింపజేసేవాణ్ణి ఎందుకు సృష్టిస్తావు (ప్రభూ)? నిన్ను స్తుతించటానికి, ప్రశంసించటానికి, నీ పవిత్రతను కొనియాడటానికి మేమున్నాము కదా!” అని వారన్నారు. దానికి అల్లాహ్, “నాకు తెలిసినవన్నీ మీకు తెలియవు” అని అన్నాడు.
2:31 وَعَلَّمَ آدَمَ الْأَسْمَاءَ كُلَّهَا ثُمَّ عَرَضَهُمْ عَلَى الْمَلَائِكَةِ فَقَالَ أَنبِئُونِي بِأَسْمَاءِ هَٰؤُلَاءِ إِن كُنتُمْ صَادِقِينَ
(తరువాత) అల్లాహ్ ఆదంకు అన్ని (వస్తువుల) పేర్లనూ నేర్పి, వాటిని దూతల ముందుంచాడు. “ఒకవేళ మీరు చెప్పేదే నిజమయితే, కాస్త వీటి పేర్లు చెప్పండి?” అన్నాడు.
2:32 قَالُوا سُبْحَانَكَ لَا عِلْمَ لَنَا إِلَّا مَا عَلَّمْتَنَا ۖ إِنَّكَ أَنتَ الْعَلِيمُ الْحَكِيمُ
వారంతా ఇలా అన్నారు : “(ఓ అల్లాహ్!) నీవు అత్యంత పవిత్రుడవు. నీవు మాకు తెలియజేసినది తప్ప ఇంకేమీ మాకు తెలియదు. నిశ్చయంగా అన్నీ తెలిసినవాడవు, వివేకవంతుడవూ నీవే!”
2:33 قَالَ يَا آدَمُ أَنبِئْهُم بِأَسْمَائِهِمْ ۖ فَلَمَّا أَنبَأَهُم بِأَسْمَائِهِمْ قَالَ أَلَمْ أَقُل لَّكُمْ إِنِّي أَعْلَمُ غَيْبَ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَأَعْلَمُ مَا تُبْدُونَ وَمَا كُنتُمْ تَكْتُمُونَ
అప్పుడు అల్లాహ్, “ఓ ఆదం! వీటి పేర్లేమిటో నువ్వు తెలుపు” అన్నాడు. ఆయన వాటి పేర్లన్నీ చెప్పేయగానే అల్లాహ్ ఇలా ప్రకటించాడు: “భూమ్యాకాశాలలో గోప్యంగా వున్నవన్నీ నాకు తెలుసనీ, మీరు బహిర్గతం చేసేవీ, దాచి పెట్టేవీ అన్నీ నాకు తెలుసని (ముందే) నేను మీకు చెప్పలేదా?”
2:34 وَإِذْ قُلْنَا لِلْمَلَائِكَةِ اسْجُدُوا لِآدَمَ فَسَجَدُوا إِلَّا إِبْلِيسَ أَبَىٰ وَاسْتَكْبَرَ وَكَانَ مِنَ الْكَافِرِينَ
“మీరందరూ ఆదం ముందు సాష్టాంగపడండి” అని మేము దూతలను ఆజ్ఞాపించినపుడు ఇబ్లీసు తప్ప అందరూ సాష్టాంగపడ్డారు. వాడు మాత్రం తిరస్కరించాడు. అహంకారి అయి, అవిధేయులలో చేరిపోయాడు.
2:35 وَقُلْنَا يَا آدَمُ اسْكُنْ أَنتَ وَزَوْجُكَ الْجَنَّةَ وَكُلَا مِنْهَا رَغَدًا حَيْثُ شِئْتُمَا وَلَا تَقْرَبَا هَٰذِهِ الشَّجَرَةَ فَتَكُونَا مِنَ الظَّالِمِينَ
(తరువాత) మేము, “ఓ ఆదం! నువ్వూ, నీ భార్య – ఇద్దరూ- స్వర్గంలో ఉండండి, మీరు ఇష్టపడిన చోటు నుంచి స్వేచ్ఛగా తినండి, త్రాగండి. కాని ఈ వృక్షం దరిదాపులకు కూడా పోవద్దు. లేదంటే దుర్మార్గులలో చేరిపోతారు” అని చెప్పాము.
2:36 فَأَزَلَّهُمَا الشَّيْطَانُ عَنْهَا فَأَخْرَجَهُمَا مِمَّا كَانَا فِيهِ ۖ وَقُلْنَا اهْبِطُوا بَعْضُكُمْ لِبَعْضٍ عَدُوٌّ ۖ وَلَكُمْ فِي الْأَرْضِ مُسْتَقَرٌّ وَمَتَاعٌ إِلَىٰ حِينٍ
కాని షైతాన్ వారిని పెడత్రోవ పట్టించి, అక్కడి నుంచి బయటికి తీసివేయించాడు. మేము వారిని ఇలా ఆదేశించాము: “దిగిపోండి. మీరు ఒండొకరికి శత్రువులు. ఒక నిర్ణీత కాలం వరకు భూమిపైనే ఉండి మీరు లబ్ది పొందవలసి ఉంది.”
2:37 فَتَلَقَّىٰ آدَمُ مِن رَّبِّهِ كَلِمَاتٍ فَتَابَ عَلَيْهِ ۚ إِنَّهُ هُوَ التَّوَّابُ الرَّحِيمُ
అప్పుడు ఆదం (అలైహిస్సలాం) తన ప్రభువు నుంచి కొన్ని మాటలు నేర్చుకుని (పశ్చాత్తాపం చెందారు.) అల్లాహ్ ఆయన పశ్చాత్తాపాన్ని ఆమోదించాడు. నిశ్చయంగా ఆయన పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, కరుణించేవాడు కూడాను.
2:38 قُلْنَا اهْبِطُوا مِنْهَا جَمِيعًا ۖ فَإِمَّا يَأْتِيَنَّكُم مِّنِّي هُدًى فَمَن تَبِعَ هُدَايَ فَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ
మేము వారితో అన్నాము: “మీరంతా ఇక్కడి నుంచి దిగిపోండి. నా ఉపదేశం ఎప్పుడు మీ వద్దకు వచ్చినా, దాన్ని అనుసరించే వారికి ఎలాంటి భయంగానీ, దుఃఖంగానీ ఉండదు.”
2:39 وَالَّذِينَ كَفَرُوا وَكَذَّبُوا بِآيَاتِنَا أُولَٰئِكَ أَصْحَابُ النَّارِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ
ఎవరయితే దానిని నిరాకరించి, మా ఆయతులను అసత్యాలని త్రోసిపుచ్చుతారో వారే నరకాగ్నిలోకి పోయేవారు. వారందులో కలకాలం పడి ఉంటారు.
2:40 يَا بَنِي إِسْرَائِيلَ اذْكُرُوا نِعْمَتِيَ الَّتِي أَنْعَمْتُ عَلَيْكُمْ وَأَوْفُوا بِعَهْدِي أُوفِ بِعَهْدِكُمْ وَإِيَّايَ فَارْهَبُونِ
ఓ ఇస్రాయీలు వంశస్థులారా! నేను మీకు అనుగ్రహించిన భాగ్యాన్ని గురించి కాస్త జ్ఞాపకం చేసుకోండి. మీరు నాతో చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోండి, నేను మీతో చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తాను. మీరు నాకు మాత్రమే భయపడండి.
2:41 وَآمِنُوا بِمَا أَنزَلْتُ مُصَدِّقًا لِّمَا مَعَكُمْ وَلَا تَكُونُوا أَوَّلَ كَافِرٍ بِهِ ۖ وَلَا تَشْتَرُوا بِآيَاتِي ثَمَنًا قَلِيلًا وَإِيَّايَ فَاتَّقُونِ
మీ వద్దనున్న గ్రంథాలకు ధృవీకరణగా నేను అవతరింపజేసిన ఈ గ్రంథాన్ని (ఖుర్ఆన్ను) విశ్వసించండి. దీని పట్ల అందరికంటే ముందు మీరే తిరస్కారులు కాకండి. ఇంకా నా ఆయతులను కొద్దిపాటి ధరకు అమ్ముకోకండి. నాకు మాత్రమే భయపడండి.
2:42 وَلَا تَلْبِسُوا الْحَقَّ بِالْبَاطِلِ وَتَكْتُمُوا الْحَقَّ وَأَنتُمْ تَعْلَمُونَ
సత్యాన్ని అసత్యంతో కలిపి కలగాపులగం చేయకండి. తెలిసి కూడా సత్యాన్ని కప్పిపుచ్చకండి.
2:43 وَأَقِيمُوا الصَّلَاةَ وَآتُوا الزَّكَاةَ وَارْكَعُوا مَعَ الرَّاكِعِينَ
(ఇస్రాయీలు సంతతి వారలారా!) మీరు నమాజులను నెలకొల్పండి, జకాతును ఇవ్వండి, (నా సన్నిధిలో) రుకూ చేసే వారితోపాటు మీరూ రుకూ చేయండి.
2:44 أَتَأْمُرُونَ النَّاسَ بِالْبِرِّ وَتَنسَوْنَ أَنفُسَكُمْ وَأَنتُمْ تَتْلُونَ الْكِتَابَ ۚ أَفَلَا تَعْقِلُونَ
ప్రజలకైతే మీరు మంచిని గురించి ఆదేశిస్తారు, కాని మీ స్వయాన్ని మరచిపోతారే?! చూడబోతే మీరు గ్రంథపారాయణం చేస్తారాయె. మరి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదా?
2:45 وَاسْتَعِينُوا بِالصَّبْرِ وَالصَّلَاةِ ۚ وَإِنَّهَا لَكَبِيرَةٌ إِلَّا عَلَى الْخَاشِعِينَ
మీరు ఓర్పు ద్వారా, నమాజు ద్వారా సహాయం అర్థించండి. నిశ్చయంగా ఇది కష్టమయిన పనే. కాని (అల్లాహ్‌కు) భయపడేవారికి (ఇది సులువైనపని).
2:46 الَّذِينَ يَظُنُّونَ أَنَّهُم مُّلَاقُو رَبِّهِمْ وَأَنَّهُمْ إِلَيْهِ رَاجِعُونَ
(ఎందుకంటే) ఎట్టకేలకు తాము తమ ప్రభువును కలుసుకోవాల్సి ఉందనీ, ఆయన వైపునకే మరలిపోవలసి ఉందనీ వారు నమ్ముతారు.
2:47 يَا بَنِي إِسْرَائِيلَ اذْكُرُوا نِعْمَتِيَ الَّتِي أَنْعَمْتُ عَلَيْكُمْ وَأَنِّي فَضَّلْتُكُمْ عَلَى الْعَالَمِينَ
ఓ ఇస్రాయీలు (యాఖూబు) సంతతి వారలారా! నేను మీపై కురిపించిన అనుగ్రహాన్నీ, (నాటి) సమస్త లోకవాసులపై మీకు ఇచ్చిన ప్రాధాన్యతను గురించి (కాస్త) నెమరు వేసుకోండి.
2:48 وَاتَّقُوا يَوْمًا لَّا تَجْزِي نَفْسٌ عَن نَّفْسٍ شَيْئًا وَلَا يُقْبَلُ مِنْهَا شَفَاعَةٌ وَلَا يُؤْخَذُ مِنْهَا عَدْلٌ وَلَا هُمْ يُنصَرُونَ
ఎవరూ ఎవరికీ ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేని, ఎవరి సిఫారసూ స్వీకరించబడని, ఎవరి వద్ద కూడా పరిహారం తీసుకోబడని, ఎలాంటి సాయం అందజేయబడని ఆ దినానికి భయపడండి.
2:49 وَإِذْ نَجَّيْنَاكُم مِّنْ آلِ فِرْعَوْنَ يَسُومُونَكُمْ سُوءَ الْعَذَابِ يُذَبِّحُونَ أَبْنَاءَكُمْ وَيَسْتَحْيُونَ نِسَاءَكُمْ ۚ وَفِي ذَٰلِكُم بَلَاءٌ مِّن رَّبِّكُمْ عَظِيمٌ
(ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోండి) ఫిరౌను మనుషుల బారి నుండి మేము మీకు విముక్తి నొసగాము. వారు మిమ్మల్ని దారుణంగా వేధించేవారు. మీ కొడుకులను చంపివేసి, కూతుళ్ళను మాత్రం విడిచి పెట్టేవాళ్ళు. ఈ విముక్తి నొసగటంలో మీ ప్రభువు తరఫునుండి మీకు గొప్ప పరీక్ష ఉండినది.
2:50 وَإِذْ فَرَقْنَا بِكُمُ الْبَحْرَ فَأَنجَيْنَاكُمْ وَأَغْرَقْنَا آلَ فِرْعَوْنَ وَأَنتُمْ تَنظُرُونَ
అప్పుడు మేము మీ కోసం సముద్రాన్ని చీల్చి, మిమ్మల్ని సురక్షితంగా (ఆవలి ఒడ్డుకు) చేరవేశాము. అదే సమయంలో మీరు చూస్తుండగానే ఫిరౌనీయులను అందులో ముంచివేశాము.
2:51 وَإِذْ وَاعَدْنَا مُوسَىٰ أَرْبَعِينَ لَيْلَةً ثُمَّ اتَّخَذْتُمُ الْعِجْلَ مِن بَعْدِهِ وَأَنتُمْ ظَالِمُونَ
(జ్ఞాపకం చేసుకోండి) మేము మూసా (అలైహిస్సలాం)కు నలభై రాత్రుల వాగ్దానం చేసి (అతన్ని పిలిచి) నప్పుడు, అతను వెళ్ళిన తరువాత మీరు ఆవు దూడను పూజించటం మొదలెట్టారు. ఆ విధంగా మీరు దుర్మార్గానికి పాల్పడ్డారు.
2:52 ثُمَّ عَفَوْنَا عَنكُم مِّن بَعْدِ ذَٰلِكَ لَعَلَّكُمْ تَشْكُرُونَ
అయినప్పటికీ మేము మిమ్మల్ని మన్నించి వదలిపెట్టాము – అలాగయినా కృతజ్ఞులవుతారేమోనని!
2:53 وَإِذْ آتَيْنَا مُوسَى الْكِتَابَ وَالْفُرْقَانَ لَعَلَّكُمْ تَهْتَدُونَ
ఇంకా మేము మూసాకు, మీ మార్గదర్శకత్వం నిమిత్తం గ్రంథాన్నీ, గీటురాయినీ ప్రసాదించాము.
2:54 وَإِذْ قَالَ مُوسَىٰ لِقَوْمِهِ يَا قَوْمِ إِنَّكُمْ ظَلَمْتُمْ أَنفُسَكُم بِاتِّخَاذِكُمُ الْعِجْلَ فَتُوبُوا إِلَىٰ بَارِئِكُمْ فَاقْتُلُوا أَنفُسَكُمْ ذَٰلِكُمْ خَيْرٌ لَّكُمْ عِندَ بَارِئِكُمْ فَتَابَ عَلَيْكُمْ ۚ إِنَّهُ هُوَ التَّوَّابُ الرَّحِيمُ
(గుర్తు చేయి) మూసా తన జాతి ప్రజలతో ఇలా అన్నాడు: “ఓ నా జాతివారలారా! ఆవుదూడను ఆరాధ్య దైవంగా చేసుకుని మీరు మీ స్వయానికి అన్యాయం చేసుకున్నారు. కనుక ఇప్పుడు మీరు పశ్చాత్తాప భావంతో మీ సృష్టికర్త వైపుకు మరలండి. (ఈ ఘోర కృత్యానికి పాల్పడిన) మీలోని వారిని చంపండి. మీ సృష్టికర్త వద్ద ఇదే మీ కొరకు మేలైనది.” మరి ఆయన మీ పశ్చాత్తాపాన్ని స్వీకరించాడు. నిస్సందేహంగా ఆయన పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, కనికరించేవాడు.
2:55 وَإِذْ قُلْتُمْ يَا مُوسَىٰ لَن نُّؤْمِنَ لَكَ حَتَّىٰ نَرَى اللَّهَ جَهْرَةً فَأَخَذَتْكُمُ الصَّاعِقَةُ وَأَنتُمْ تَنظُرُونَ
మీరు మూసాతో అన్న మాటలను గుర్తుకు తెచ్చుకోండి : “ఓ మూసా! మేము అల్లాహ్‌ను కళ్ళారా చూడనంతవరకూ నిన్ను విశ్వసించము.” (మీ ఈ పెడసరి ధోరణికి శిక్షగా) మీరు చూస్తుండగానే (మీపై) పిడుగు పడింది.
2:56 ثُمَّ بَعَثْنَاكُم مِّن بَعْدِ مَوْتِكُمْ لَعَلَّكُمْ تَشْكُرُونَ
అయితే (ఈసారయినా) మీరు కృతజ్ఞులవుతారేమోనన్న ఉద్దేశంతో చనిపోయిన మిమ్మల్ని తిరిగి బ్రతికించాము.
2:57 وَظَلَّلْنَا عَلَيْكُمُ الْغَمَامَ وَأَنزَلْنَا عَلَيْكُمُ الْمَنَّ وَالسَّلْوَىٰ ۖ كُلُوا مِن طَيِّبَاتِ مَا رَزَقْنَاكُمْ ۖ وَمَا ظَلَمُونَا وَلَٰكِن كَانُوا أَنفُسَهُمْ يَظْلِمُونَ
మేము మీపై మేఘాల ఛాయను కల్పించాము. మీపై మన్న్, సల్వాలను (ఆహారంగా) దించాము. “మేము మీకు ప్రసాదించిన పరిశుద్ధమైన వస్తువులను తినండి” (అని చెప్పాము. కాని, వారు ఆ అనుగ్రహాలు అనుభవించి కృతజ్ఞులయ్యే బదులు కృతఘ్నత చూపటం మొదలుపెట్టారు). వారు మాకెలాంటి అన్యాయం చేయలేదు, కాకపోతే వారు తమకు తామే అన్యాయం చేసుకుంటూ పోయారు.
2:58 وَإِذْ قُلْنَا ادْخُلُوا هَٰذِهِ الْقَرْيَةَ فَكُلُوا مِنْهَا حَيْثُ شِئْتُمْ رَغَدًا وَادْخُلُوا الْبَابَ سُجَّدًا وَقُولُوا حِطَّةٌ نَّغْفِرْ لَكُمْ خَطَايَاكُمْ ۚ وَسَنَزِيدُ الْمُحْسِنِينَ
(ఇంకా ఆ విషయాన్ని కూడా నెమరు వేసుకోండి). “ఈ పురములో ప్రవేశించండి. అక్కడ మీకు ఇష్టమైన చోట, కోరుకున్న విధంగా తృప్తిగా తినండి. కాని నగర ముఖద్వారం గుండా పోతున్నప్పుడు ‘సజ్దా’ చేస్తూ మరీ పోవాలి. పోతున్నప్పుడు ‘హిత్తతున్’అని నోటితో పలుకుతూ ముందుకు సాగాలి. అప్పుడు మేము మీ తప్పులను మన్నిస్తాము, సదాచార సంపన్నులకు మరింతగా అనుగ్రహిస్తాము” అని మేము మీతో అన్నాము.
2:59 فَبَدَّلَ الَّذِينَ ظَلَمُوا قَوْلًا غَيْرَ الَّذِي قِيلَ لَهُمْ فَأَنزَلْنَا عَلَى الَّذِينَ ظَلَمُوا رِجْزًا مِّنَ السَّمَاءِ بِمَا كَانُوا يَفْسُقُونَ
కాని దుర్మార్గులు వారితో అనబడిన ఈ మాటను మార్చి వేశారు. అందుచేత మేము కూడా ఆ దుర్మార్గులపై వారి (దుర్మార్గం), ధిక్కార వైఖరికి శాస్తిగా ఆకాశం నుంచి శిక్షను అవతరింపజేశాము.
2:60 وَإِذِ اسْتَسْقَىٰ مُوسَىٰ لِقَوْمِهِ فَقُلْنَا اضْرِب بِّعَصَاكَ الْحَجَرَ ۖ فَانفَجَرَتْ مِنْهُ اثْنَتَا عَشْرَةَ عَيْنًا ۖ قَدْ عَلِمَ كُلُّ أُنَاسٍ مَّشْرَبَهُمْ ۖ كُلُوا وَاشْرَبُوا مِن رِّزْقِ اللَّهِ وَلَا تَعْثَوْا فِي الْأَرْضِ مُفْسِدِينَ
మూసా (అలైహిస్సలాం) తన జాతి ప్రజల కోసం నీటిని అడిగినప్పుడు, “నీ చేతి కర్రతో ఆ (కొండ) రాతిపై కొట్టు” అని మేమన్నాము. (అలా కొట్టగా) దాన్నుండి పన్నెండు ఊటలు పెల్లుబికాయి. వారిలోని ప్రతి తెగవారూ తమ తమ నీటి స్థలాన్ని తెలుసుకున్నారు. (అప్పుడు మేము వారికి ఈ విధంగా ఆదేశించాము:) “అల్లాహ్ (మీకు ప్రసాదించిన) ఉపాధిని తినండి, త్రాగండి. భువిలో అలజడిని రేపుతూ తిరగకండి.”
2:61 وَإِذْ قُلْتُمْ يَا مُوسَىٰ لَن نَّصْبِرَ عَلَىٰ طَعَامٍ وَاحِدٍ فَادْعُ لَنَا رَبَّكَ يُخْرِجْ لَنَا مِمَّا تُنبِتُ الْأَرْضُ مِن بَقْلِهَا وَقِثَّائِهَا وَفُومِهَا وَعَدَسِهَا وَبَصَلِهَا ۖ قَالَ أَتَسْتَبْدِلُونَ الَّذِي هُوَ أَدْنَىٰ بِالَّذِي هُوَ خَيْرٌ ۚ اهْبِطُوا مِصْرًا فَإِنَّ لَكُم مَّا سَأَلْتُمْ ۗ وَضُرِبَتْ عَلَيْهِمُ الذِّلَّةُ وَالْمَسْكَنَةُ وَبَاءُوا بِغَضَبٍ مِّنَ اللَّهِ ۗ ذَٰلِكَ بِأَنَّهُمْ كَانُوا يَكْفُرُونَ بِآيَاتِ اللَّهِ وَيَقْتُلُونَ النَّبِيِّينَ بِغَيْرِ الْحَقِّ ۗ ذَٰلِكَ بِمَا عَصَوا وَّكَانُوا يَعْتَدُونَ
(జ్ఞాపకం చేసుకోండి,) “ఓ మూసా! ఒకే రకమైన తిండిని మేము అస్సలు సహించము. అందుకే భూమిలో పండే ఆకుకూరలు, దోసకాయలు, గోధుమలు, పప్పుదినుసులు, ఉల్లిపాయలు ప్రసాదించవలసినదిగా నీ ప్రభువును ప్రార్థించు” అని మీరు డిమాండు చేసినప్పుడు అతనిలా అన్నాడు: “మీరు శ్రేష్ఠమైన వస్తువుకు బదులుగా అధమమైన దానిని కోరుకుంటున్నారెందుకు? (సరే!) ఏదయినా పట్టణానికి వెళ్ళండి. అక్కడ మీరు కోరుకున్నవన్నీ మీకు లభిస్తాయి.” దాంతో వారిపై పరాభవం, దారిద్య్రం రుద్దబడింది. వారు దైవాగ్రహానికి గురై తరలిపోయారు. వారి ఈ దురవస్థకు కారణమేమిటంటే వారు అల్లాహ్ ఆయతుల పట్ల తిరస్కార వైఖరిని అవలంబించేవారు, అన్యాయంగా ప్రవక్తలను చంపేవారు. ఇది వారి అవిధేయతకు, బరితెగించిన పోకడకు పర్యవసానం మాత్రమే!
2:62 إِنَّ الَّذِينَ آمَنُوا وَالَّذِينَ هَادُوا وَالنَّصَارَىٰ وَالصَّابِئِينَ مَنْ آمَنَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ وَعَمِلَ صَالِحًا فَلَهُمْ أَجْرُهُمْ عِندَ رَبِّهِمْ وَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ
విశ్వసించిన వారైనా, యూదులైనా, నసారాలయినా, సాబియనులయినా – ఎవరయినాసరే – అల్లాహ్‌ను, అంతిమ దినాన్ని విశ్వసించి సదాచరణ చేస్తే వారి ప్రతిఫలం వారి ప్రభువు వద్ద ఉం(టుం)ది. వారికెలాంటి భయంగానీ, దుఃఖంగానీ ఉండదు.
2:63 وَإِذْ أَخَذْنَا مِيثَاقَكُمْ وَرَفَعْنَا فَوْقَكُمُ الطُّورَ خُذُوا مَا آتَيْنَاكُم بِقُوَّةٍ وَاذْكُرُوا مَا فِيهِ لَعَلَّكُمْ تَتَّقُونَ
తూరు పర్వతాన్ని మీ పైకి ఎత్తి మేము మీ చేత చేయించిన ప్రమాణాన్ని కాస్త జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు, “మేము మీకు ప్రసాదించిన దానిని (గ్రంథాన్ని) గట్టిగా పట్టుకోండి. అందులో వున్న వాటిని బాగా జ్ఞాపకం చేసుకోండి, దీని ద్వారానే మిమ్మల్ని మీరు కాపాడుకునే అవకాశం ఉంది” (అని ఉపదేశించాము.)
2:64 ثُمَّ تَوَلَّيْتُم مِّن بَعْدِ ذَٰلِكَ ۖ فَلَوْلَا فَضْلُ اللَّهِ عَلَيْكُمْ وَرَحْمَتُهُ لَكُنتُم مِّنَ الْخَاسِرِينَ
కాని దీని తరువాత మీరు విముఖులైపోయారు. అయినప్పటికీ దైవానుగ్రహం, దైవకారుణ్యం మీపై ఉండింది. లేకపోతే మీరు (తీవ్రంగా) నష్టపోయేవారే.
2:65 وَلَقَدْ عَلِمْتُمُ الَّذِينَ اعْتَدَوْا مِنكُمْ فِي السَّبْتِ فَقُلْنَا لَهُمْ كُونُوا قِرَدَةً خَاسِئِينَ
శనివారం విషయంలో ఆజ్ఞోల్లంఘనకు పాల్పడిన మీ వారి గురించి కూడా మీకు బాగా తెలుసు. “అత్యంత అసహ్యకరమైన, ఛీత్కరించబడిన కోతులుగా మారిపోండి” అని మేము వాళ్ళను శపించాము.
2:66 فَجَعَلْنَاهَا نَكَالًا لِّمَا بَيْنَ يَدَيْهَا وَمَا خَلْفَهَا وَمَوْعِظَةً لِّلْمُتَّقِينَ
దీనిని మేము ఆ కాలం వారికీ, భావితరాల వారికీ గుణపాఠ సూచనగానూ, భయభక్తులు కలవారికి హితబోధగానూ చేశాము.
2:67 وَإِذْ قَالَ مُوسَىٰ لِقَوْمِهِ إِنَّ اللَّهَ يَأْمُرُكُمْ أَن تَذْبَحُوا بَقَرَةً ۖ قَالُوا أَتَتَّخِذُنَا هُزُوًا ۖ قَالَ أَعُوذُ بِاللَّهِ أَنْ أَكُونَ مِنَ الْجَاهِلِينَ
మూసా తన జాతివారితో, “అల్లాహ్ మిమ్మల్ని ఒక ఆవును ‘జిబహ్’ చేయవలసిందిగా ఆజ్ఞాపిస్తున్నాడు” అని అన్నప్పుడు, “ఏమిటీ, మాతో వేళాకోళం చేస్తున్నావా?” అని వారు ప్రశ్నించారు. దానికి అతను, “నేనలాంటి మూర్ఖుల్లో ఒకణ్ణి కాకుండా ఉండేందుకు అల్లాహ్ శరణు వేడుతున్నాను” అని జవాబిచ్చాడు.
2:68 قَالُوا ادْعُ لَنَا رَبَّكَ يُبَيِّن لَّنَا مَا هِيَ ۚ قَالَ إِنَّهُ يَقُولُ إِنَّهَا بَقَرَةٌ لَّا فَارِضٌ وَلَا بِكْرٌ عَوَانٌ بَيْنَ ذَٰلِكَ ۖ فَافْعَلُوا مَا تُؤْمَرُونَ
అప్పుడు వారు, “అయితే అది ఎటువంటిది అయిఉండాలో మాకు వివరించవలసిందిగా నీ ప్రభువును అర్థించు” అని అన్నారు. దానికి అతను, “అది మరీ ముసలిదై ఉండకూడదు, మరీ లేగదూడగా కూడా ఉండరాదు. పైగా అది మధ్యవయస్సులో వున్న ఆవు అయి ఉండాలని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. (సరేనా!) ఇక ఆజ్ఞాపించబడిన విధంగా చెయ్యండి” అని చెప్పాడు.
2:69 قَالُوا ادْعُ لَنَا رَبَّكَ يُبَيِّن لَّنَا مَا لَوْنُهَا ۚ قَالَ إِنَّهُ يَقُولُ إِنَّهَا بَقَرَةٌ صَفْرَاءُ فَاقِعٌ لَّوْنُهَا تَسُرُّ النَّاظِرِينَ
“అది ఏ రంగుదై ఉండాలో మాకు వివరించమని నీ ప్రభువును ప్రార్థించు” అని మళ్ళీ అడిగారు. “అది పసుపు వర్ణంగలదై, నిగనిగలాడుతూ, చూసేవారికి ఆకర్షణీయంగా కనిపించేలా ఉండాలన్నది అల్లాహ్ ఆజ్ఞ” అని మూసా సమాధానమిచ్చాడు.
2:70 قَالُوا ادْعُ لَنَا رَبَّكَ يُبَيِّن لَّنَا مَا هِيَ إِنَّ الْبَقَرَ تَشَابَهَ عَلَيْنَا وَإِنَّا إِن شَاءَ اللَّهُ لَمُهْتَدُونَ
అప్పుడు వారు, “అది ఎలాంటిదై ఉండాలో మాకు (ఇంకా బాగా) వివరించమని నీ ప్రభువును ప్రార్థించు. మాకు ఆవు సంగతి ఇంకా ప్రస్ఫుటం కాలేదు. అల్లాహ్ గనక తలిస్తే మేము మార్గదర్శకత్వం పొందుతాము” అని అన్నారు.
2:71 قَالَ إِنَّهُ يَقُولُ إِنَّهَا بَقَرَةٌ لَّا ذَلُولٌ تُثِيرُ الْأَرْضَ وَلَا تَسْقِي الْحَرْثَ مُسَلَّمَةٌ لَّا شِيَةَ فِيهَا ۚ قَالُوا الْآنَ جِئْتَ بِالْحَقِّ ۚ فَذَبَحُوهَا وَمَا كَادُوا يَفْعَلُونَ
దానికి అతను, “ఆ ఆవు పనిచేసేదీ, దుక్కి దున్నేదీ, సేద్యపు పనిలో ఉపయోగపడేదీ అయి ఉండకూడదు. ఇంకా అది ఆరోగ్యవంతమైనదై, ఎటువంటి మచ్చలూ లేకుండా ఉండాలి అన్నది అల్లాహ్ ఆజ్ఞ” అని చెప్పాడు. దానికి వారు “నువ్వు ఇప్పుడు సరిగ్గా చెప్పావు. (మాకిప్పుడు అర్థం అయింది)” అన్నారు. అసలు వారు ఆదేశపాలనకు ఏమాత్రం సుముఖంగా లేరు. ఎట్టకేలకు (మాట విని) ఆవును జిబహ్ చేశారు.
2:72 وَإِذْ قَتَلْتُمْ نَفْسًا فَادَّارَأْتُمْ فِيهَا ۖ وَاللَّهُ مُخْرِجٌ مَّا كُنتُمْ تَكْتُمُونَ
(జ్ఞాపకం చేసుకోండి.) మీరు ఒక వ్యక్తిని హత్య చేసి, ఆ విషయంలో పరస్పరం విభేదించుకోసాగారు. కాని మీ గుట్టును అల్లాహ్ రట్టు చేయాలనే నిర్ణయించుకున్నాడు.
2:73 فَقُلْنَا اضْرِبُوهُ بِبَعْضِهَا ۚ كَذَٰلِكَ يُحْيِي اللَّهُ الْمَوْتَىٰ وَيُرِيكُمْ آيَاتِهِ لَعَلَّكُمْ تَعْقِلُونَ
కనుక, “ఈ ఆవు (మాంసపు) ముక్క నొకదాన్ని హతుని దేహానికేసి కొట్టండి (అతడు లేచి నిలబడతాడు)” అని మేము అన్నాము. ఈ విధంగా అల్లాహ్ మృతులను బ్రతికించి తన నిదర్శనాలను చూపుతున్నాడు – మీరు ఇకనయినా బుద్ధిగా మసలుకోవాలని!
2:74 ثُمَّ قَسَتْ قُلُوبُكُم مِّن بَعْدِ ذَٰلِكَ فَهِيَ كَالْحِجَارَةِ أَوْ أَشَدُّ قَسْوَةً ۚ وَإِنَّ مِنَ الْحِجَارَةِ لَمَا يَتَفَجَّرُ مِنْهُ الْأَنْهَارُ ۚ وَإِنَّ مِنْهَا لَمَا يَشَّقَّقُ فَيَخْرُجُ مِنْهُ الْمَاءُ ۚ وَإِنَّ مِنْهَا لَمَا يَهْبِطُ مِنْ خَشْيَةِ اللَّهِ ۗ وَمَا اللَّهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُونَ
కాని ఆ తరువాత మీ హృదయాలు కఠినమైపోయాయి. రాళ్ళ మాదిరిగా, కాదు – వాటికంటే కూడా కఠినం అయిపోయాయి. కొన్ని రాళ్ళల్లోనుంచైతే సెలయేళ్ళు ప్రవహిస్తాయి. మరి కొన్ని రాళ్ళు పగలగా వాటి నుంచి నీరు చిమ్ముతుంది. మరికొన్ని అల్లాహ్ భయంతో (కంపించి) క్రిందపడి పోతాయి. మీ కార్యకలాపాల పట్ల అల్లాహ్ పరధ్యానంలో ఉన్నాడని అనుకోకండి.
2:75 أَفَتَطْمَعُونَ أَن يُؤْمِنُوا لَكُمْ وَقَدْ كَانَ فَرِيقٌ مِّنْهُمْ يَسْمَعُونَ كَلَامَ اللَّهِ ثُمَّ يُحَرِّفُونَهُ مِن بَعْدِ مَا عَقَلُوهُ وَهُمْ يَعْلَمُونَ
(ముస్లిములారా!) వారు మీ మాటను నమ్ముతారనే (ఇప్పటికీ) మీరు ఆశపడ్తున్నారా? వాస్తవానికి వారిలో, అల్లాహ్ వాక్కును విని, అర్థం చేసుకుని కూడా ఉద్దేశపూర్వకంగా దాన్ని మార్చి వేసేవారు ఉన్నారు.
2:76 وَإِذَا لَقُوا الَّذِينَ آمَنُوا قَالُوا آمَنَّا وَإِذَا خَلَا بَعْضُهُمْ إِلَىٰ بَعْضٍ قَالُوا أَتُحَدِّثُونَهُم بِمَا فَتَحَ اللَّهُ عَلَيْكُمْ لِيُحَاجُّوكُم بِهِ عِندَ رَبِّكُمْ ۚ أَفَلَا تَعْقِلُونَ
వారు విశ్వాసులను కలుసుకున్నప్పుడు తమ విశ్వాసాన్ని వెల్లడిస్తారు. తమ వర్గానికి చెందినవారిని ఏకాంతంలో కలుసుకున్నప్పుడు, “అల్లాహ్ మీకు తెలియజేసిన విషయాలను మీరు వీరికి ఎందుకు చేరవేస్తున్నారు? తద్వారా మీ ప్రభువు సమక్షంలో వారు మీపై వాదనకు బలం పొందగలరనే సంగతిని విస్మరించారా ఏమి?” అని అంటారు.
2:77 أَوَلَا يَعْلَمُونَ أَنَّ اللَّهَ يَعْلَمُ مَا يُسِرُّونَ وَمَا يُعْلِنُونَ
వారు దాచేదీ, బహిర్గతం చేసేదీ – అంతా అల్లాహ్‌కు తెలుసన్న సంగతి వారికి తెలియదా?!
2:78 وَمِنْهُمْ أُمِّيُّونَ لَا يَعْلَمُونَ الْكِتَابَ إِلَّا أَمَانِيَّ وَإِنْ هُمْ إِلَّا يَظُنُّونَ
వారిలో చదువురాని వారు కొందరున్నారు – వారికి గ్రంథ జ్ఞానం లేదు. వారు కేవలం ఆశల్ని నమ్ముకొని ఉన్నారు. లేనిపోని అంచనాలు వేసి, ఊహల్లో విహరిస్తూ ఉంటారు.
2:79 فَوَيْلٌ لِّلَّذِينَ يَكْتُبُونَ الْكِتَابَ بِأَيْدِيهِمْ ثُمَّ يَقُولُونَ هَٰذَا مِنْ عِندِ اللَّهِ لِيَشْتَرُوا بِهِ ثَمَنًا قَلِيلًا ۖ فَوَيْلٌ لَّهُم مِّمَّا كَتَبَتْ أَيْدِيهِمْ وَوَيْلٌ لَّهُم مِّمَّا يَكْسِبُونَ
తమ స్వహస్తాలతో లిఖించిన గ్రంథాన్ని దైవగ్రంథమని చెప్పి, ప్రాపంచిక తుచ్ఛ ప్రయోజనాన్ని పొందజూసే వారికి ‘వినాశం’ కలదు. వారి ఈ స్వహస్త లిఖిత రచన కూడా వారి వినాశానికి దారితీస్తుంది. వారి ఈ సంపాదన కూడా వారి నాశనానికి కారణ భూతం అవుతుంది.
2:80 وَقَالُوا لَن تَمَسَّنَا النَّارُ إِلَّا أَيَّامًا مَّعْدُودَةً ۚ قُلْ أَتَّخَذْتُمْ عِندَ اللَّهِ عَهْدًا فَلَن يُخْلِفَ اللَّهُ عَهْدَهُ ۖ أَمْ تَقُولُونَ عَلَى اللَّهِ مَا لَا تَعْلَمُونَ
పైగా, “మేము నరకాగ్నిలో కొన్ని రోజులు మాత్రమే ఉంటాము” అని వారంటున్నారు. వారిని అడుగు: మీరు ఆ మేరకు అల్లాహ్ నుండి పొందిన వాగ్దానం ఏదన్నా మీ వద్ద ఉందా? ఒకవేళ ఉంటే అల్లాహ్ ముమ్మాటికీ తన వాగ్దానానికి విరుద్ధంగా వ్యవహరించడు. (అసలు అలా జరగనే లేదు) అసలు మీరు మీకు తెలియని విషయాలను అల్లాహ్‌కు ఆపాదిస్తున్నారు.
2:81 بَلَىٰ مَن كَسَبَ سَيِّئَةً وَأَحَاطَتْ بِهِ خَطِيئَتُهُ فَأُولَٰئِكَ أَصْحَابُ النَّارِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ
నిస్సందేహంగా – ఎవడు పాపకార్యాలకు ఒడిగట్టాడో, అతని పాపాలు అతన్ని చుట్టుముట్టాయో అలాంటివారే నరకవాసులు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు.
2:82 وَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ أُولَٰئِكَ أَصْحَابُ الْجَنَّةِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ
మరెవరు విశ్వసించి, మంచి పనులు చేస్తారో వారు స్వర్గవాసులు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు.
2:83 وَإِذْ أَخَذْنَا مِيثَاقَ بَنِي إِسْرَائِيلَ لَا تَعْبُدُونَ إِلَّا اللَّهَ وَبِالْوَالِدَيْنِ إِحْسَانًا وَذِي الْقُرْبَىٰ وَالْيَتَامَىٰ وَالْمَسَاكِينِ وَقُولُوا لِلنَّاسِ حُسْنًا وَأَقِيمُوا الصَّلَاةَ وَآتُوا الزَّكَاةَ ثُمَّ تَوَلَّيْتُمْ إِلَّا قَلِيلًا مِّنكُمْ وَأَنتُم مُّعْرِضُونَ
మేము ఇస్రాయీల్ వంశస్థుల నుండి వాగ్దానం తీసుకున్నాము (దాన్ని గుర్తుకు తెచ్చుకోండి) : “అల్లాహ్‌ను తప్ప వేరెవరినీ ఆరాధించకూడదు. తల్లిదండ్రుల యెడల ఉత్తమంగా మెలగాలి. అలాగే బంధువులను, అనాధలను, అగత్యపరులను (ఆదరించాలి). ప్రజలతో మర్యాదగా మాట్లాడాలి. నమాజును నెలకొల్పుతూ ఉండాలి, జకాత్ ఇస్తూ ఉండాలి.” అయితే మీలో కొద్దిమంది తప్ప అందరూ మాట తప్పారు, ముఖం తిప్పుకున్నారు.
2:84 وَإِذْ أَخَذْنَا مِيثَاقَكُمْ لَا تَسْفِكُونَ دِمَاءَكُمْ وَلَا تُخْرِجُونَ أَنفُسَكُم مِّن دِيَارِكُمْ ثُمَّ أَقْرَرْتُمْ وَأَنتُمْ تَشْهَدُونَ
పరస్పరం రక్తం చిందించరాదనీ (చంపుకోరాదని), తోటి వారిని వారి నివాసస్థలాల నుంచి బహిష్కరించరాదనీ మీనుండి వాగ్దానం తీసుకున్నప్పుడు, దానికి మీరు అంగీకరించారు. ఆ విషయానికి స్వయంగా మీరే సాక్షులు.
2:85 ثُمَّ أَنتُمْ هَٰؤُلَاءِ تَقْتُلُونَ أَنفُسَكُمْ وَتُخْرِجُونَ فَرِيقًا مِّنكُم مِّن دِيَارِهِمْ تَظَاهَرُونَ عَلَيْهِم بِالْإِثْمِ وَالْعُدْوَانِ وَإِن يَأْتُوكُمْ أُسَارَىٰ تُفَادُوهُمْ وَهُوَ مُحَرَّمٌ عَلَيْكُمْ إِخْرَاجُهُمْ ۚ أَفَتُؤْمِنُونَ بِبَعْضِ الْكِتَابِ وَتَكْفُرُونَ بِبَعْضٍ ۚ فَمَا جَزَاءُ مَن يَفْعَلُ ذَٰلِكَ مِنكُمْ إِلَّا خِزْيٌ فِي الْحَيَاةِ الدُّنْيَا ۖ وَيَوْمَ الْقِيَامَةِ يُرَدُّونَ إِلَىٰ أَشَدِّ الْعَذَابِ ۗ وَمَا اللَّهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُونَ
కాని మీరు పరస్పరం చంపుకున్నారు. మీలోని ఒక వర్గం వారిని ఇండ్ల నుంచి బహిష్కరించటం కూడా చేశారు. పాపానికి, దౌర్జన్యానికి పాల్పడుతూ మీరు వారికి వ్యతిరేకంగా-ఇతరులను సమర్థించారు. మరి వారు బందీలుగా పట్టుబడి మీ వద్దకు వచ్చినప్పుడు మీరు వారికోసం నష్టపరిహారం ఇచ్చిన మాట వాస్తవమే. కాని మీరు వారిని వెళ్ళగొట్టడమే అధర్మం (అప్పుడు మీరు దాన్ని అస్సలు లెక్కచేయలేదు). ఏమిటీ? మీరు కొన్ని ఆజ్ఞలను విశ్వసించి, మరికొన్నింటిని తిరస్కరిస్తున్నారా? మీలో ఇలా చేసేవారికి ప్రపంచ జీవితంలో అవమానం తప్ప ఇంకేం ప్రతిఫలం ఉంటుంది? ఇక ప్రళయ దినాన వారు మరింత కఠినమైన శిక్ష వైపు మరలించబడతారు. అల్లాహ్‌కు మీ చేష్టలు తెలియకుండా లేవు.
2:86 أُولَٰئِكَ الَّذِينَ اشْتَرَوُا الْحَيَاةَ الدُّنْيَا بِالْآخِرَةِ ۖ فَلَا يُخَفَّفُ عَنْهُمُ الْعَذَابُ وَلَا هُمْ يُنصَرُونَ
పరలోకానికి బదులుగా ప్రాపంచిక జీవితాన్ని కొనుక్కున్న వారు వీరే. వీరికి విధించబడే శిక్షల్లో తగ్గింపూ ఉండదు, వారికి సహాయపడటమూ జరగదు.
2:87 وَلَقَدْ آتَيْنَا مُوسَى الْكِتَابَ وَقَفَّيْنَا مِن بَعْدِهِ بِالرُّسُلِ ۖ وَآتَيْنَا عِيسَى ابْنَ مَرْيَمَ الْبَيِّنَاتِ وَأَيَّدْنَاهُ بِرُوحِ الْقُدُسِ ۗ أَفَكُلَّمَا جَاءَكُمْ رَسُولٌ بِمَا لَا تَهْوَىٰ أَنفُسُكُمُ اسْتَكْبَرْتُمْ فَفَرِيقًا كَذَّبْتُمْ وَفَرِيقًا تَقْتُلُونَ
మేము మూసాకు గ్రంథం వొసగాము. అతని తరువాత కూడా ప్రవక్తలను పంపించాము. ఇంకా మేము మర్యమ్ కుమారుడైన ఈసాకు స్పష్టమైన నిదర్శనాలు ఇచ్చాము. రూహుల్ ఖుదుస్ ద్వారా అతనికి సహాయం చేశాము. అయితే ఏ ప్రవక్త అయినా మీ మనసులకు నచ్చని విషయాలు మీ వద్దకు తెచ్చినప్పుడల్లా మీరు అహంకారం ప్రదర్శించారు. వారిలో కొందరిని ధిక్కరించారు, మరి కొందరిని హతమార్చటం కూడా చేశారు.
2:88 وَقَالُوا قُلُوبُنَا غُلْفٌ ۚ بَل لَّعَنَهُمُ اللَّهُ بِكُفْرِهِمْ فَقَلِيلًا مَّا يُؤْمِنُونَ
“మా హృదయాలు గలేబుల్లో చుట్టబడి ఉన్నాయ”ని వారంటున్నారు. కాదు, వారి తిరస్కారవైఖరి మూలంగా అల్లాహ్ వారిని ధూత్కరించాడు. కనుక వారు విశ్వసించేది బహుస్వల్పం.
2:89 وَلَمَّا جَاءَهُمْ كِتَابٌ مِّنْ عِندِ اللَّهِ مُصَدِّقٌ لِّمَا مَعَهُمْ وَكَانُوا مِن قَبْلُ يَسْتَفْتِحُونَ عَلَى الَّذِينَ كَفَرُوا فَلَمَّا جَاءَهُم مَّا عَرَفُوا كَفَرُوا بِهِ ۚ فَلَعْنَةُ اللَّهِ عَلَى الْكَافِرِينَ
వారి వద్ద (ముందు నుంచే) ఉన్న దైవగ్రంథాన్ని ధృవీకరించే గ్రంథం అల్లాహ్ వద్ద నుంచి వచ్చినప్పుడు, తెలిసి కూడా వారు దానిని తిరస్కరించసాగారు – మరి చూడబోతే దీని రాకకు మునుపు తమకు అవిశ్వాసులపై విజయం చేకూరాలని వారు స్వయంగా అభిలషించేవారు. ఇటువంటి తిరస్కారులపై అల్లాహ్ శాపం పడుగాక!
2:90 بِئْسَمَا اشْتَرَوْا بِهِ أَنفُسَهُمْ أَن يَكْفُرُوا بِمَا أَنزَلَ اللَّهُ بَغْيًا أَن يُنَزِّلَ اللَّهُ مِن فَضْلِهِ عَلَىٰ مَن يَشَاءُ مِنْ عِبَادِهِ ۖ فَبَاءُوا بِغَضَبٍ عَلَىٰ غَضَبٍ ۚ وَلِلْكَافِرِينَ عَذَابٌ مُّهِينٌ
ఏ వస్తువుకు బదులుగా వారు తమను అమ్ముకున్నారో అది అత్యంత నీచమైనది- అది వారి తిరస్కారం. అల్లాహ్ తాను ఇష్టపడే తన దాసుణ్ణి ప్రత్యేకంగా అనుగ్రహించాడన్న అసూయతో వారు అల్లాహ్ తరఫున అవతరించిన విషయాలను తిరస్కరించి ఆగ్రహంపై ఆగ్రహానికి పాత్రులయ్యారు. ఇంకా ఈ తిరస్కారుల కొరకు ఘోర అవమానంతో కూడిన శిక్ష ఉంది.
2:91 وَإِذَا قِيلَ لَهُمْ آمِنُوا بِمَا أَنزَلَ اللَّهُ قَالُوا نُؤْمِنُ بِمَا أُنزِلَ عَلَيْنَا وَيَكْفُرُونَ بِمَا وَرَاءَهُ وَهُوَ الْحَقُّ مُصَدِّقًا لِّمَا مَعَهُمْ ۗ قُلْ فَلِمَ تَقْتُلُونَ أَنبِيَاءَ اللَّهِ مِن قَبْلُ إِن كُنتُم مُّؤْمِنِينَ
“అల్లాహ్ అవతరింపజేసిన గ్రంథాన్ని విశ్వసించండి” అని వారితో అన్నప్పుడు, “మాపై అవతరింపజేయబడిన దానిని మేము విశ్వసిస్తున్నాం” అని సమాధానమిస్తారు. దాని తర్వాత వచ్చిన దాన్ని, అది సత్యమైనప్పటికీ, తమవద్ద ఉన్న గ్రంథాన్ని అది ధృవీకరిస్తున్నప్పటికీ వారు తిరస్కరిస్తారు. (సరే! అలాగైతే) వారిని ఈ విధంగా అడుగు: “(మునుపటి గ్రంథాలపై) మీకు నమ్మకముంటే, మరి పూర్వం వచ్చిన దైవప్రవక్తలను ఎందుకు హత్య చేశారు?”
2:92 وَلَقَدْ جَاءَكُم مُّوسَىٰ بِالْبَيِّنَاتِ ثُمَّ اتَّخَذْتُمُ الْعِجْلَ مِن بَعْدِهِ وَأَنتُمْ ظَالِمُونَ
మీ వద్దకు మూసా ఈ సూచనలనే తీసుకువచ్చాడు. అయినా సరే అతను వెళ్ళిన తరువాత మీరు ఆవుదూడను పూజించారు. (అసలు విషయం ఏమిటంటే) మీరు దుర్మార్గులు.
2:93 وَإِذْ أَخَذْنَا مِيثَاقَكُمْ وَرَفَعْنَا فَوْقَكُمُ الطُّورَ خُذُوا مَا آتَيْنَاكُم بِقُوَّةٍ وَاسْمَعُوا ۖ قَالُوا سَمِعْنَا وَعَصَيْنَا وَأُشْرِبُوا فِي قُلُوبِهِمُ الْعِجْلَ بِكُفْرِهِمْ ۚ قُلْ بِئْسَمَا يَأْمُرُكُم بِهِ إِيمَانُكُمْ إِن كُنتُم مُّؤْمِنِينَ
మేము తూరు పర్వతాన్ని మీపైకి ఎత్తి, మీనుండి వాగ్దానం తీసుకున్న సందర్భాన్ని మననం చేసుకోండి – (ఆ సందర్భంగా మేము), “మీకు ప్రసాదించిన దానిని గట్టిగా పట్టుకోండి. మరియు వినండి” అని అనగానే, వారు “మేము విన్నాము. కాని శిరసావహించము” అని బదులిచ్చారు. అసలు వారి హృదయాలలో ఆవుదూడ పట్ల ప్రేమాభిమానాలు నూరి పోయబడ్డాయి. వారి అవిశ్వాసం కారణంగా (వారికీ దుర్గతి పట్టింది). వారితో అనండి : “మీరు విశ్వాసులే అయితే మీ ఈ విశ్వాసం మీకు చెడు ఆజ్ఞ ఇస్తోంది.”
2:94 قُلْ إِن كَانَتْ لَكُمُ الدَّارُ الْآخِرَةُ عِندَ اللَّهِ خَالِصَةً مِّن دُونِ النَّاسِ فَتَمَنَّوُا الْمَوْتَ إِن كُنتُمْ صَادِقِينَ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “ఒకవేళ అల్లాహ్ వద్ద పరలోక నివాసం ఇతర మానవులెవరికీ కాకుండా కేవలం మీ కొరకే ప్రత్యేకమై ఉంటే, రండి! మీ వాదన సత్యమైందనడానికి రుజువుగా మరణాన్ని కోరండి.”
2:95 وَلَن يَتَمَنَّوْهُ أَبَدًا بِمَا قَدَّمَتْ أَيْدِيهِمْ ۗ وَاللَّهُ عَلِيمٌ بِالظَّالِمِينَ
కాని వారు తమ చేజేతులా చేసుకున్న దురాగతాల దృష్ట్యా ఎన్నటికీ మరణాన్ని కోరరు. అల్లాహ్ దుర్మార్గుల గురించి బాగా ఎరిగినవాడు.
2:96 وَلَتَجِدَنَّهُمْ أَحْرَصَ النَّاسِ عَلَىٰ حَيَاةٍ وَمِنَ الَّذِينَ أَشْرَكُوا ۚ يَوَدُّ أَحَدُهُمْ لَوْ يُعَمَّرُ أَلْفَ سَنَةٍ وَمَا هُوَ بِمُزَحْزِحِهِ مِنَ الْعَذَابِ أَن يُعَمَّرَ ۗ وَاللَّهُ بَصِيرٌ بِمَا يَعْمَلُونَ
(ఓ ప్రవక్తా!) జీవితం పట్ల అందరికన్నా ఎక్కువ వ్యామోహం వీరికే ఉందన్న విషయాన్ని నువ్వు గ్రహిస్తావు. (జీవితం పట్ల వ్యామోహంలో) వీరు ముష్రిక్కులను కూడా మించిపోయారు. వీరిలోని ప్రతి ఒక్కడూ వెయ్యి సంవత్సరాల వయస్సును కోరుకుంటాడు. అయితే ఈ దీర్ఘాయుషు కూడా వారిని శిక్ష బారి నుంచి ఏ మాత్రం తప్పించలేదు. అల్లాహ్ వారి కార్యకలాపాలన్నింటినీ చూస్తూనే ఉన్నాడు.
2:97 قُلْ مَن كَانَ عَدُوًّا لِّجِبْرِيلَ فَإِنَّهُ نَزَّلَهُ عَلَىٰ قَلْبِكَ بِإِذْنِ اللَّهِ مُصَدِّقًا لِّمَا بَيْنَ يَدَيْهِ وَهُدًى وَبُشْرَىٰ لِلْمُؤْمِنِينَ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “జిబ్రీల్‌కు శత్రువు అయిన ప్రతివాడూ (అల్లాహ్‌తో శత్రుత్వాన్ని కొనితెచ్చుకున్నాడన్న) యదార్థాన్ని గ్రహించాలి. ఎందుకంటే అల్లాహ్ సూచనపైనే ఆయన నీ హృదయంపై ఈ సందేశాన్ని అవతరింపజేశాడు. ఇది (ఈ ఖుర్ఆన్) తనకు పూర్వం వచ్చిన గ్రంథాలను ధృవీకరిస్తుంది. విశ్వసించేవారికి మార్గదర్శకత్వం వహిస్తూ, వారికి శుభవార్త ఇస్తుంది.
2:98 مَن كَانَ عَدُوًّا لِّلَّهِ وَمَلَائِكَتِهِ وَرُسُلِهِ وَجِبْرِيلَ وَمِيكَالَ فَإِنَّ اللَّهَ عَدُوٌّ لِّلْكَافِرِينَ
ఎవరు అల్లాహ్‌కు, ఆయన దూతలకు, ఆయన ప్రవక్తలకు, జిబ్రీల్ మరియు మీకాయీల్కు శత్రువులుగా ఉంటారో, అటువంటి అవిశ్వాసులకు అల్లాహ్ శత్రువుగా ఉంటాడు.
2:99 وَلَقَدْ أَنزَلْنَا إِلَيْكَ آيَاتٍ بَيِّنَاتٍ ۖ وَمَا يَكْفُرُ بِهَا إِلَّا الْفَاسِقُونَ
(ఓ ప్రవక్తా!) స్పష్టమైన సూచనలను మేము నీపై అవతరింపజేశాము. అవిధేయులు తప్ప వేరెవరూ వాటిని త్రోసిపుచ్చరు.
2:100 أَوَكُلَّمَا عَاهَدُوا عَهْدًا نَّبَذَهُ فَرِيقٌ مِّنْهُم ۚ بَلْ أَكْثَرُهُمْ لَا يُؤْمِنُونَ
వారెప్పుడు ఏ వాగ్దానం చేసినా, వారిలోని ఏదో ఒక వర్గం దాన్ని భంగపరుస్తుంది. పైగా వారిలో అనేకులు విశ్వాసులు కారు.
2:101 وَلَمَّا جَاءَهُمْ رَسُولٌ مِّنْ عِندِ اللَّهِ مُصَدِّقٌ لِّمَا مَعَهُمْ نَبَذَ فَرِيقٌ مِّنَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ كِتَابَ اللَّهِ وَرَاءَ ظُهُورِهِمْ كَأَنَّهُمْ لَا يَعْلَمُونَ
వారి వద్దకు, వారి గ్రంథాన్ని నిజమని ధృవీకరించే ప్రవక్త అల్లాహ్ తరఫు నుంచి ఎప్పుడు వచ్చినా ఆ గ్రంథ వహులలోని ఒక వర్గంవారు, దైవగ్రంథాన్ని, అసలు దాని గురించి ఏమీ తెలియనివారుగా వెనుక పడవేశారు.
2:102 وَاتَّبَعُوا مَا تَتْلُو الشَّيَاطِينُ عَلَىٰ مُلْكِ سُلَيْمَانَ ۖ وَمَا كَفَرَ سُلَيْمَانُ وَلَٰكِنَّ الشَّيَاطِينَ كَفَرُوا يُعَلِّمُونَ النَّاسَ السِّحْرَ وَمَا أُنزِلَ عَلَى الْمَلَكَيْنِ بِبَابِلَ هَارُوتَ وَمَارُوتَ ۚ وَمَا يُعَلِّمَانِ مِنْ أَحَدٍ حَتَّىٰ يَقُولَا إِنَّمَا نَحْنُ فِتْنَةٌ فَلَا تَكْفُرْ ۖ فَيَتَعَلَّمُونَ مِنْهُمَا مَا يُفَرِّقُونَ بِهِ بَيْنَ الْمَرْءِ وَزَوْجِهِ ۚ وَمَا هُم بِضَارِّينَ بِهِ مِنْ أَحَدٍ إِلَّا بِإِذْنِ اللَّهِ ۚ وَيَتَعَلَّمُونَ مَا يَضُرُّهُمْ وَلَا يَنفَعُهُمْ ۚ وَلَقَدْ عَلِمُوا لَمَنِ اشْتَرَاهُ مَا لَهُ فِي الْآخِرَةِ مِنْ خَلَاقٍ ۚ وَلَبِئْسَ مَا شَرَوْا بِهِ أَنفُسَهُمْ ۚ لَوْ كَانُوا يَعْلَمُونَ
వారు సులైమాను రాజ్యంలోని షైతానులు అవలంబించిన విషయాల వెనుకపడ్డారు. అసలు సులైమాను ఎన్నడూ అవిశ్వాసానికి ఒడిగట్టలేదు, ఈ అవిశ్వాస పోకడ అసలు షైతానులదే. వారు ప్రజలకు చేతబడిని నేర్పేవారు. వారు బాబిలోనియాలో హారూత్, మారూత్ అనే ఇద్దరు దైవదూతలపై అవతరింపజేయబడిన విద్య వెంటపడ్డారు. “మేము ఒక పరీక్ష వంటివారం. నువ్వు మాత్రం అవిశ్వాసానికి పాల్పడకు” అని (స్పష్టంగా) చెప్పనంతవరకూ వారు (ఇద్దరూ) ఎవరికీ ఆ విద్యను నేర్పేవారు కూడా కాదు. అయినప్పటికీ జనులు వారి దగ్గర భార్యాభర్తలను విడగొట్టే విద్యను నేర్చుకునేవారు. ఎంత చేసినా వారు అల్లాహ్ అనుమతి లేకుండా ఆ చేతబడి ద్వారా ఎవరికీ ఎలాంటి కీడు కలిగించలేరు సుమా! తమకు నష్టం తప్ప ఏమాత్రం ప్రయోజనం చేకూర్చని దానిని వారు నేర్చుకుంటున్నారు. ఆ విద్యను కొనుక్కున్నవారికి పరలోకంలో (అక్కడి సుఖసౌఖ్యాలలో) ఎలాంటి భాగం లేదన్న సంగతి వారికి సయితం తెలుసు. ఎంత నీచమైన వస్తువుకు బదులుగా వారు తమను తాము అమ్ముకుంటున్నారో వారికి తెలిస్తే ఎంత బావుండు!
2:103 وَلَوْ أَنَّهُمْ آمَنُوا وَاتَّقَوْا لَمَثُوبَةٌ مِّنْ عِندِ اللَّهِ خَيْرٌ ۖ لَّوْ كَانُوا يَعْلَمُونَ
వారే గనక విశ్వసించి, అల్లాహ్ పట్ల భీతిపరులుగా వ్యవహరించి ఉంటే అల్లాహ్ తరఫున వారికి అత్యుత్తమ పుణ్యఫలం లభించి ఉండేది. ఆ సంగతిని వారు తెలుసుకోగలిగితే ఎంత బావుండేది!
2:104 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَقُولُوا رَاعِنَا وَقُولُوا انظُرْنَا وَاسْمَعُوا ۗ وَلِلْكَافِرِينَ عَذَابٌ أَلِيمٌ
ఓ విశ్వాసులారా! (దైవప్రవక్త-సల్లల్లాహు అలైహి వ సల్లంను) ‘రాయినా’ అని అనకండి, ‘ఉన్జుర్నా’ అని అనండి. శ్రద్ధగా వింటూ ఉండండి. అవిశ్వాసుల కొరకు బాధాకరమైన శిక్ష ఉంది.
2:105 مَّا يَوَدُّ الَّذِينَ كَفَرُوا مِنْ أَهْلِ الْكِتَابِ وَلَا الْمُشْرِكِينَ أَن يُنَزَّلَ عَلَيْكُم مِّنْ خَيْرٍ مِّن رَّبِّكُمْ ۗ وَاللَّهُ يَخْتَصُّ بِرَحْمَتِهِ مَن يَشَاءُ ۚ وَاللَّهُ ذُو الْفَضْلِ الْعَظِيمِ
మీపై మీ ప్రభువు తరఫు నుంచి ఏదైనా మేలుతో కూడుకున్న విషయం అవతరించటం గ్రంథవహుల్లోని తిరస్కారులకుగానీ, ముష్రిక్కు (బహుదైవారాధకు)లకు గానీ ఏమాత్రం ఇష్టం లేదు. (వారెంతగా అసూయ చెందినా ఫరవాలేదు) అల్లాహ్ తన ప్రత్యేక కారుణ్యం నుంచి తాను కోరిన వారికి అనుగ్రహిస్తాడు, అల్లాహ్ గొప్ప అనుగ్రహం కలవాడు.
2:106 مَا نَنسَخْ مِنْ آيَةٍ أَوْ نُنسِهَا نَأْتِ بِخَيْرٍ مِّنْهَا أَوْ مِثْلِهَا ۗ أَلَمْ تَعْلَمْ أَنَّ اللَّهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
(ఓ ప్రవక్తా!) ఏదేని ఒక వాక్యాన్ని మేము రద్దుపరచినా లేక మరపింపజేసినా (దాని స్థానంలో) దానికన్నా ఉత్తమమైన దానినీ లేదా కనీసం దానికి సమానమైన దానిని తీసుకువస్తాము. అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడన్న సంగతి నీకు తెలియదా?
2:107 أَلَمْ تَعْلَمْ أَنَّ اللَّهَ لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۗ وَمَا لَكُم مِّن دُونِ اللَّهِ مِن وَلِيٍّ وَلَا نَصِيرٍ
భూమ్యాకాశాల సార్వభౌమత్వం అల్లాహ్దేననీ, అల్లాహ్ తప్ప మరొకరెవరూ మీ రక్షకులూ, సహాయకులూ కారన్న విషయం నీకు తెలియదా?
2:108 أَمْ تُرِيدُونَ أَن تَسْأَلُوا رَسُولَكُمْ كَمَا سُئِلَ مُوسَىٰ مِن قَبْلُ ۗ وَمَن يَتَبَدَّلِ الْكُفْرَ بِالْإِيمَانِ فَقَدْ ضَلَّ سَوَاءَ السَّبِيلِ
లోగడ మూసా (అలైహిస్సలాం)కు వేయబడినటువంటి ప్రశ్నలే మీరు మీ ప్రవక్త (ముహమ్మద్-స)కు వేయదలుస్తున్నారా? (అయితే వినండి) విశ్వాసాన్ని అవిశ్వాస వైఖరి ద్వారా మార్చేవాడు రుజుమార్గం నుంచి తప్పిపోతాడు.
2:109 وَدَّ كَثِيرٌ مِّنْ أَهْلِ الْكِتَابِ لَوْ يَرُدُّونَكُم مِّن بَعْدِ إِيمَانِكُمْ كُفَّارًا حَسَدًا مِّنْ عِندِ أَنفُسِهِم مِّن بَعْدِ مَا تَبَيَّنَ لَهُمُ الْحَقُّ ۖ فَاعْفُوا وَاصْفَحُوا حَتَّىٰ يَأْتِيَ اللَّهُ بِأَمْرِهِ ۗ إِنَّ اللَّهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
ఈ గ్రంథవహుల్లోని అనేకులు, సత్యమేదో స్పష్టంగా తెలిసి పోయినప్పటికీ – కేవలం తమ మనసులలో ఉన్న అసూయ మూలంగా మిమ్మల్ని కూడా విశ్వాస మార్గం నుంచి అవిశ్వాసం వైపు మళ్ళించాలని చూస్తున్నారు. కాబట్టి అల్లాహ్ తన ఆదేశాన్ని తీసుకువచ్చే వరకూ మీరు కూడా మన్నింపుల వైఖరిని అవలంబిస్తూ ఉండండి, వారిని పట్టించుకోకండి. నిశ్చయంగా అల్లాహ్ అన్నింటిపై అధికారం కలవాడు.
2:110 وَأَقِيمُوا الصَّلَاةَ وَآتُوا الزَّكَاةَ ۚ وَمَا تُقَدِّمُوا لِأَنفُسِكُم مِّنْ خَيْرٍ تَجِدُوهُ عِندَ اللَّهِ ۗ إِنَّ اللَّهَ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ
మీరు మాత్రం నమాజును నెలకొల్పుతూ, జకాత్‌ను ఇస్తూ ఉండండి, మీరు మీ కోసం ఏ మంచి పనులను ముందుగా పంపుకున్నా అల్లాహ్ వద్ద వాటిని పొందుతారు. నిస్సందేహంగా అల్లాహ్ మీ కార్యకలాపాలన్నింటినీ గమనిస్తూనే ఉన్నాడు.
2:111 وَقَالُوا لَن يَدْخُلَ الْجَنَّةَ إِلَّا مَن كَانَ هُودًا أَوْ نَصَارَىٰ ۗ تِلْكَ أَمَانِيُّهُمْ ۗ قُلْ هَاتُوا بُرْهَانَكُمْ إِن كُنتُمْ صَادِقِينَ
“యూదులు, క్రైస్తవులు తప్ప వేరెవరూ స్వర్గంలో ప్రవేశించలేర”ని వారంటున్నారు. ఇవి వారి ఆశలు, ఆకాంక్షలు మాత్రమే. “మీరు మీ వాదనలో సత్యవంతులే అయితే ఆ మేరకు ఏదన్నా నిదర్శనం సమర్పించండి” అని వారిని అడుగు.
2:112 بَلَىٰ مَنْ أَسْلَمَ وَجْهَهُ لِلَّهِ وَهُوَ مُحْسِنٌ فَلَهُ أَجْرُهُ عِندَ رَبِّهِ وَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ
ఔను మరి! ఎవడైతే ఆచరణలో అత్యుత్తమ రీతిని అవలంబించి తనను తాను అల్లాహ్ సన్నిధిలో సమర్పించుకుంటాడో, అతనికి తన ప్రభువు వద్ద ప్రతిఫలం ఉంది. అలాంటి వారికి ఎలాంటి భయంగానీ, దుఃఖంగానీ ఉండవు.
2:113 وَقَالَتِ الْيَهُودُ لَيْسَتِ النَّصَارَىٰ عَلَىٰ شَيْءٍ وَقَالَتِ النَّصَارَىٰ لَيْسَتِ الْيَهُودُ عَلَىٰ شَيْءٍ وَهُمْ يَتْلُونَ الْكِتَابَ ۗ كَذَٰلِكَ قَالَ الَّذِينَ لَا يَعْلَمُونَ مِثْلَ قَوْلِهِمْ ۚ فَاللَّهُ يَحْكُمُ بَيْنَهُمْ يَوْمَ الْقِيَامَةِ فِيمَا كَانُوا فِيهِ يَخْتَلِفُونَ
క్రైస్తవులు సత్యంపై లేరని యూదులు అంటున్నారు. యూదులు సత్యంపై లేరని క్రైస్తవులంటున్నారు. మరి చూడబోతే వారంతా గ్రంథాన్ని చదువుతున్నారు. జ్ఞానం లేనివాళ్ళు కూడా ఇలాంటి మాటే అంటున్నారు. కనుక అల్లాహ్ ప్రళయ దినాన వీళ్ళ భేదాభిప్రాయం గురించి వీళ్ళ మధ్య తీర్పు చేస్తాడు.
2:114 وَمَنْ أَظْلَمُ مِمَّن مَّنَعَ مَسَاجِدَ اللَّهِ أَن يُذْكَرَ فِيهَا اسْمُهُ وَسَعَىٰ فِي خَرَابِهَا ۚ أُولَٰئِكَ مَا كَانَ لَهُمْ أَن يَدْخُلُوهَا إِلَّا خَائِفِينَ ۚ لَهُمْ فِي الدُّنْيَا خِزْيٌ وَلَهُمْ فِي الْآخِرَةِ عَذَابٌ عَظِيمٌ
అల్లాహ్ మస్జిదులలో, ఆయన నామస్మరణను అడ్డుకుని, వాటిని పాడుచేయడానికి ప్రయత్నించేవానికంటే పరమ దుర్మార్గుడు ఎవడుంటాడు? అటువంటివారు వాటిలో ప్రవేశించినా భయపడుతూనే ప్రవేశించాలి సుమా! వారికి ప్రపంచంలోనూ పరాభవం తప్పదు, పరలోకంలో కూడా మహా ఘోర శిక్ష తప్పదు.
2:115 وَلِلَّهِ الْمَشْرِقُ وَالْمَغْرِبُ ۚ فَأَيْنَمَا تُوَلُّوا فَثَمَّ وَجْهُ اللَّهِ ۚ إِنَّ اللَّهَ وَاسِعٌ عَلِيمٌ
తూర్పుపడమరలకు అధిపతి అల్లాహ్‌యే. మీరు మీ ముఖాన్ని ఏ వైపుకు త్రిప్పినా, అటు అల్లాహ్ సమ్ముఖం లభిస్తుంది. నిస్సందేహంగా అల్లాహ్ విస్తృతి కలవాడు, సర్వమూ తెలిసినవాడు.
2:116 وَقَالُوا اتَّخَذَ اللَّهُ وَلَدًا ۗ سُبْحَانَهُ ۖ بَل لَّهُ مَا فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ كُلٌّ لَّهُ قَانِتُونَ
అల్లాహ్‌కు సంతానం కలదని వీళ్ళు అంటున్నారు. (ఇలాంటి మాటలకు) ఆయన అతీతుడు, పవిత్రుడు. పైగా భూమ్యాకాశాలలో వున్న సమస్తమూ ఆయనదే. అవన్నీ ఆయన (ఆజ్ఞల)కు తల ఒగ్గి ఉన్నాయి.
2:117 بَدِيعُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ وَإِذَا قَضَىٰ أَمْرًا فَإِنَّمَا يَقُولُ لَهُ كُن فَيَكُونُ
భూమ్యాకాశాలను ప్రప్రథమంగా సృష్టించినవాడు ఆయనే. ఆయన ఏ పనినైనా చేయ సంకల్పించుకున్నప్పుడు దాన్ని ‘అయిపో’ అని అంటే చాలు, అది అయిపోతుంది.
2:118 وَقَالَ الَّذِينَ لَا يَعْلَمُونَ لَوْلَا يُكَلِّمُنَا اللَّهُ أَوْ تَأْتِينَا آيَةٌ ۗ كَذَٰلِكَ قَالَ الَّذِينَ مِن قَبْلِهِم مِّثْلَ قَوْلِهِمْ ۘ تَشَابَهَتْ قُلُوبُهُمْ ۗ قَدْ بَيَّنَّا الْآيَاتِ لِقَوْمٍ يُوقِنُونَ
జ్ఞానం లేనివాళ్లు, “అల్లాహ్ స్వయంగా మాతో ఎందుకు మాట్లాడడు? లేక మా వద్దకు ఏదైనా సూచన ఎందుకురాదు?” అని అంటారు. వారి పూర్వీకులు కూడా ఇలాంటి పలుకులే పలికారు. వారందరి హృదయాలు ఒకే విధమైనవి. వాస్తవానికి నమ్మేవారి కోసం మేము మా సూచనలను స్పష్టం చేసే ఉంచాము.
2:119 إِنَّا أَرْسَلْنَاكَ بِالْحَقِّ بَشِيرًا وَنَذِيرًا ۖ وَلَا تُسْأَلُ عَنْ أَصْحَابِ الْجَحِيمِ
(ఓ ప్రవక్తా!) మేము నిన్ను సత్యంతో పాటు శుభవార్తనిచ్చే వానిగా, హెచ్చరించేవానిగా చేసి పంపాము. నరకవాసుల గురించి నిన్ను (నిలదీసి) అడగటం జరగదు.
2:120 وَلَن تَرْضَىٰ عَنكَ الْيَهُودُ وَلَا النَّصَارَىٰ حَتَّىٰ تَتَّبِعَ مِلَّتَهُمْ ۗ قُلْ إِنَّ هُدَى اللَّهِ هُوَ الْهُدَىٰ ۗ وَلَئِنِ اتَّبَعْتَ أَهْوَاءَهُم بَعْدَ الَّذِي جَاءَكَ مِنَ الْعِلْمِ ۙ مَا لَكَ مِنَ اللَّهِ مِن وَلِيٍّ وَلَا نَصِيرٍ
(ఓ ముహమ్మద్!) నువ్వు వారి విధానాన్ని అనుసరించనంత వరకూ యూదులు, క్రైస్తవులు నిన్ను ఇష్టపడరు. అల్లాహ్ చూపిన మార్గమే సరైన మార్గం అని నువ్వు వారికి చెప్పేయి. ఒకవేళ నువ్వు నీ వద్దకు జ్ఞానం వచ్చిన మీదట కూడా వారి కోరికలను అనుసరిస్తే, అల్లాహ్ (పట్టు) నుండి నిన్ను రక్షించేవాడు, సహాయకుడూ ఎవడూ ఉండడు.
2:121 الَّذِينَ آتَيْنَاهُمُ الْكِتَابَ يَتْلُونَهُ حَقَّ تِلَاوَتِهِ أُولَٰئِكَ يُؤْمِنُونَ بِهِ ۗ وَمَن يَكْفُرْ بِهِ فَأُولَٰئِكَ هُمُ الْخَاسِرُونَ
మేము ఎవరికి గ్రంథం వొసగామో వారు దానిని పారాయణం చేయవలసిన రీతిలో పారాయణం చేస్తారు. (అంతేకాదు,) వారు ఈ గ్రంథాన్ని విశ్వసిస్తారు. ఇక, దీనిపట్ల తిరస్కార వైఖరిని అవలంబించినవారే నష్టపోయేది.
2:122 يَا بَنِي إِسْرَائِيلَ اذْكُرُوا نِعْمَتِيَ الَّتِي أَنْعَمْتُ عَلَيْكُمْ وَأَنِّي فَضَّلْتُكُمْ عَلَى الْعَالَمِينَ
ఓ (యాఖూబు) ఇస్రాయీలు సంతతివారలారా! నేను మీపై కురిపించిన వరాలను జ్ఞప్తికి తెచ్చుకోండి. నేను మీకు సమస్త లోకాలపై (అలనాటి అన్ని జాతులపై, సమాజాలపై) శ్రేష్ఠతను వొసగాను.
2:123 وَاتَّقُوا يَوْمًا لَّا تَجْزِي نَفْسٌ عَن نَّفْسٍ شَيْئًا وَلَا يُقْبَلُ مِنْهَا عَدْلٌ وَلَا تَنفَعُهَا شَفَاعَةٌ وَلَا هُمْ يُنصَرُونَ
ఎవరూ ఎవరికీ ఏ విధంగానూ తోడ్పడలేని, ఎవరి నుంచీ పరిహారం కూడా స్వీకరించబడని, ఏ సిఫారసూ ఎవరికీ ప్రయోజనకరం కాజాలని, ఎవరికీ సహాయం కూడా చేయజాలని ఆ దినానికి భయపడండి.
2:124 وَإِذِ ابْتَلَىٰ إِبْرَاهِيمَ رَبُّهُ بِكَلِمَاتٍ فَأَتَمَّهُنَّ ۖ قَالَ إِنِّي جَاعِلُكَ لِلنَّاسِ إِمَامًا ۖ قَالَ وَمِن ذُرِّيَّتِي ۖ قَالَ لَا يَنَالُ عَهْدِي الظَّالِمِينَ
(జ్ఞాపకం చేసుకోండి) ఇబ్రాహీం (అలైహిస్సలాం)ను అతని ప్రభువు అనేక విషయాలలో పరీక్షించగా, అతను అన్నింటిలోనూ (నికార్సుగా) నెగ్గుకు వచ్చాడు. అప్పుడు అల్లాహ్ అతన్ని ఉద్దేశించి, “నేను నిన్ను ప్రజలకు నాయకునిగా చేస్తాను” అన్నాడు. దానికి అతను, “నా సంతానాన్ని కూడానా!” అని అడిగాడు. అప్పుడు అల్లాహ్, “దుర్మార్గులకు నా వాగ్దానం వర్తించదు” అని సమాధానం ఇచ్చాడు.
2:125 وَإِذْ جَعَلْنَا الْبَيْتَ مَثَابَةً لِّلنَّاسِ وَأَمْنًا وَاتَّخِذُوا مِن مَّقَامِ إِبْرَاهِيمَ مُصَلًّى ۖ وَعَهِدْنَا إِلَىٰ إِبْرَاهِيمَ وَإِسْمَاعِيلَ أَن طَهِّرَا بَيْتِيَ لِلطَّائِفِينَ وَالْعَاكِفِينَ وَالرُّكَّعِ السُّجُودِ
(జ్ఞాపకం చేసుకోండి) మేము ఈ గృహాన్ని (కాబా గృహాన్ని) మానవులందరి పుణ్యక్షేత్రంగానూ, శాంతి నిలయంగానూ చేశాము. మీరు ఇబ్రాహీము నిలబడిన ప్రదేశాన్ని నమాజు స్థలంగా చేసుకోండి. “నా గృహాన్ని (సందర్శించి) ప్రదక్షిణ చేసేవారి కోసం, అక్కడ ఏతెకాఫ్ పాటించేవారి కోసం, రుకూ సజ్దాలు చేసేవారి కోసం మీరు దానిని పరిశుభ్రంగా, పరిశుద్ధంగా ఉంచాలి అని ఇబ్రాహీము, ఇస్మాయీలు నుంచి మేము వాగ్దానం తీసుకున్నాము.
2:126 وَإِذْ قَالَ إِبْرَاهِيمُ رَبِّ اجْعَلْ هَٰذَا بَلَدًا آمِنًا وَارْزُقْ أَهْلَهُ مِنَ الثَّمَرَاتِ مَنْ آمَنَ مِنْهُم بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ ۖ قَالَ وَمَن كَفَرَ فَأُمَتِّعُهُ قَلِيلًا ثُمَّ أَضْطَرُّهُ إِلَىٰ عَذَابِ النَّارِ ۖ وَبِئْسَ الْمَصِيرُ
“నా ప్రభూ! నీవు ఈ ప్రదేశాన్ని శాంతి నగరంగా చెయ్యి. ఈ నగరవాసులలో అల్లాహ్‌ను, అంతిమ దినాన్నీ విశ్వసించే వారికి పండ్లు ఫలాలను ఆహారంగా ప్రసాదించు” అని ఇబ్రాహీం అర్థించినప్పుడు అల్లాహ్ ఈ విధంగా పలికాడు: “విశ్వసించనివారికి కూడా నేను కొంత ప్రయోజనం చేకూర్చుతాను. కాని చివరకు వారిని అగ్నిశిక్ష వైపుకు ఈడుస్తాను. అది అత్యంత చెడ్డ నివాస స్థలం.”
2:127 وَإِذْ يَرْفَعُ إِبْرَاهِيمُ الْقَوَاعِدَ مِنَ الْبَيْتِ وَإِسْمَاعِيلُ رَبَّنَا تَقَبَّلْ مِنَّا ۖ إِنَّكَ أَنتَ السَّمِيعُ الْعَلِيمُ
ఇబ్రాహీం (అలైహిస్సలాం), ఇస్మాయీల్ (అలైహిస్సలాం)- ఇద్దరూ (కాబా) గృహ పునాదులను, గోడలను లేపుతూ ఇలా ప్రార్థించేవారు: “మా ప్రభూ! మా సేవను స్వీకరించు. నీవు మాత్రమే సర్వం వినేవాడవు, సర్వం తెలిసినవాడవు.”
2:128 رَبَّنَا وَاجْعَلْنَا مُسْلِمَيْنِ لَكَ وَمِن ذُرِّيَّتِنَا أُمَّةً مُّسْلِمَةً لَّكَ وَأَرِنَا مَنَاسِكَنَا وَتُبْ عَلَيْنَا ۖ إِنَّكَ أَنتَ التَّوَّابُ الرَّحِيمُ
“మా ప్రభూ! మమ్మల్ని నీ విధేయులు (ముస్లింలు)గా చేసుకో. మా సంతతి నుండి కూడా నీ విధేయతకు కట్టుబడి ఉండే ఒక సమూహాన్ని ప్రభవింపజెయ్యి. మాకు మా ఆరాధనా రీతులను నేర్పు. మమ్మల్ని క్షమించు. నిశ్చయంగా నీవు మాత్రమే పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడవు, అపారంగా కరుణించేవాడవు.”
2:129 رَبَّنَا وَابْعَثْ فِيهِمْ رَسُولًا مِّنْهُمْ يَتْلُو عَلَيْهِمْ آيَاتِكَ وَيُعَلِّمُهُمُ الْكِتَابَ وَالْحِكْمَةَ وَيُزَكِّيهِمْ ۚ إِنَّكَ أَنتَ الْعَزِيزُ الْحَكِيمُ
“మా ప్రభూ! నీ వాక్యాలను వారికి చదివి వినిపించే, గ్రంథజ్ఞానాన్ని నేర్పించే, విజ్ఞతా వివేచనలను విడమరచి చెప్పే, వారిని పరిశుద్ధపరచే ఒక ప్రవక్తను స్వయంగా వారి జాతి నుండే వారిలో ప్రభవింపజెయ్యి. నిస్సందేహంగా నీవు సర్వాధికుడవు, వివేకవంతుడవు.”
2:130 وَمَن يَرْغَبُ عَن مِّلَّةِ إِبْرَاهِيمَ إِلَّا مَن سَفِهَ نَفْسَهُ ۚ وَلَقَدِ اصْطَفَيْنَاهُ فِي الدُّنْيَا ۖ وَإِنَّهُ فِي الْآخِرَةِ لَمِنَ الصَّالِحِينَ
శుద్ధ అవివేకి మాత్రమే ఇబ్రాహీం ధర్మం (విధానం) పట్ల విరక్తి చెందుతాడు. మేము అతన్ని ప్రపంచంలోనూ ఎన్నుకున్నాము, పరలోకంలో కూడా అతడు సజ్జనుల సరసన ఉంటాడు.
2:131 إِذْ قَالَ لَهُ رَبُّهُ أَسْلِمْ ۖ قَالَ أَسْلَمْتُ لِرَبِّ الْعَالَمِينَ
“(ఆత్మ) సమర్పణ చేసుకో” అని అతని ప్రభువు అతన్ని ఆదేశించినప్పుడల్లా , “సకల లోకాల ప్రభువు సమక్షంలో నన్ను నేను సమర్పించుకున్నాను” అని అతను సమాధానం ఇచ్చాడు.
2:132 وَوَصَّىٰ بِهَا إِبْرَاهِيمُ بَنِيهِ وَيَعْقُوبُ يَا بَنِيَّ إِنَّ اللَّهَ اصْطَفَىٰ لَكُمُ الدِّينَ فَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسْلِمُونَ
ఈ ఉపదేశమే ఇబ్రాహీం మరియు యాఖూబ్ తమ సంతానానికి చేశారు. (వారిలా అన్నారు:) “నా బిడ్డలారా! అల్లాహ్ మీ కోసం ఈ (విధేయతా) ధర్మాన్నే ఇష్టపడ్డాడు. కనుక మీరు ముస్లింలుగా తప్ప మరణించకూడదు సుమా!”
2:133 أَمْ كُنتُمْ شُهَدَاءَ إِذْ حَضَرَ يَعْقُوبَ الْمَوْتُ إِذْ قَالَ لِبَنِيهِ مَا تَعْبُدُونَ مِن بَعْدِي قَالُوا نَعْبُدُ إِلَٰهَكَ وَإِلَٰهَ آبَائِكَ إِبْرَاهِيمَ وَإِسْمَاعِيلَ وَإِسْحَاقَ إِلَٰهًا وَاحِدًا وَنَحْنُ لَهُ مُسْلِمُونَ
ఏమిటీ, యాఖూబ్ మరణ ఘడియల్లో ఉన్నప్పుడు మీరక్కడ ఉన్నారా? ఆ సమయంలో ఆయన తన సంతానాన్నుద్దేశించి, “నా తదనంతరం మీరు దేనిని ఆరాధిస్తారు?” అని అడిగాడు. దానికి వారంతా, “మీ ఆరాధ్య దైవాన్ని, మీ పితామహులగు ఇబ్రాహీం, ఇస్మాయీలు, ఇస్హాఖ్ల ఆరాధ్యదైవం అయిన ఏకైక ఆరాధ్యుణ్ణి మాత్రమే ఆరాధిస్తాము, ఆయనకే విధేయులమై ఉంటాము” అని జవాబు ఇచ్చారు.
2:134 تِلْكَ أُمَّةٌ قَدْ خَلَتْ ۖ لَهَا مَا كَسَبَتْ وَلَكُم مَّا كَسَبْتُمْ ۖ وَلَا تُسْأَلُونَ عَمَّا كَانُوا يَعْمَلُونَ
అది గతించిన ఒక సమూహం. వారు చేసుకున్నది వారికి చెందుతుంది. మీరు చేసేది మీకు చెందుతుంది. వారి కర్మల గురించి మీరు ప్రశ్నించబడరు.
2:135 وَقَالُوا كُونُوا هُودًا أَوْ نَصَارَىٰ تَهْتَدُوا ۗ قُلْ بَلْ مِلَّةَ إِبْرَاهِيمَ حَنِيفًا ۖ وَمَا كَانَ مِنَ الْمُشْرِكِينَ
మీరు యూదులుగానో, క్రైస్తవులుగానో మారిపోతే సన్మార్గం పొందగలరని వారు అంటారు. (ఓ ముహమ్మద్!) మీరు వారికి స్పష్టంగా చెప్పండి: “కాదు, ఇబ్రాహీము ధర్మాన్ని అనుసరించే వారే సన్మార్గంపై ఉన్నారు. ఇబ్రాహీం స్వచ్ఛమైన ఏకదైవారాధ కుడు, అతను బహుదైవోపాసకుడు కాదు.”
2:136 قُولُوا آمَنَّا بِاللَّهِ وَمَا أُنزِلَ إِلَيْنَا وَمَا أُنزِلَ إِلَىٰ إِبْرَاهِيمَ وَإِسْمَاعِيلَ وَإِسْحَاقَ وَيَعْقُوبَ وَالْأَسْبَاطِ وَمَا أُوتِيَ مُوسَىٰ وَعِيسَىٰ وَمَا أُوتِيَ النَّبِيُّونَ مِن رَّبِّهِمْ لَا نُفَرِّقُ بَيْنَ أَحَدٍ مِّنْهُمْ وَنَحْنُ لَهُ مُسْلِمُونَ
(ముస్లిములారా!) మీరు ఇలా ప్రకటించండి : ”మేము అల్లాహ్‌ను విశ్వసించాము. మాపై అవతరింపజేయబడిన దానినీ, ఇబ్రాహీం, ఇస్మాయీల్, ఇస్హాఖ్, యాఖూబ్ మరియు వారి సంతతిపై అవతరింపజేయబడిన దానినీ, మూసా, ఈసా ప్రవక్తలకు వారి ప్రభువు తరఫున వొసగబడిన దానిని కూడా మేము విశ్వసించాము. మేము వారిలో ఎవరి మధ్య కూడా ఎలాంటి విచక్షణ (వివక్ష)ను పాటించము. మేము ఆయనకే విధేయులము.”
2:137 فَإِنْ آمَنُوا بِمِثْلِ مَا آمَنتُم بِهِ فَقَدِ اهْتَدَوا ۖ وَّإِن تَوَلَّوْا فَإِنَّمَا هُمْ فِي شِقَاقٍ ۖ فَسَيَكْفِيكَهُمُ اللَّهُ ۚ وَهُوَ السَّمِيعُ الْعَلِيمُ
ఒకవేళ వారు మీరు విశ్వసించినట్లే విశ్వసిస్తే, సన్మార్గం పొందగలరు. విముఖత గనక చూపితే వారు వైరభావానికి లోనై ఉన్నారన్నది సుస్పష్టం. వారి బారి నుండి (రక్షించటానికి) నీకు అల్లాహ్ చాలు. ఆయన అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు.
2:138 صِبْغَةَ اللَّهِ ۖ وَمَنْ أَحْسَنُ مِنَ اللَّهِ صِبْغَةً ۖ وَنَحْنُ لَهُ عَابِدُونَ
అల్లాహ్ రంగును స్వీకరించండి. అల్లాహ్ రంగుకన్నా మంచి రంగు ఎవరిది కాగలదు? మేము మాత్రం ఆయన్నే ఆరాధిస్తాము.
2:139 قُلْ أَتُحَاجُّونَنَا فِي اللَّهِ وَهُوَ رَبُّنَا وَرَبُّكُمْ وَلَنَا أَعْمَالُنَا وَلَكُمْ أَعْمَالُكُمْ وَنَحْنُ لَهُ مُخْلِصُونَ
వారితో చెప్పు : “ఏమిటీ, మాకూ ప్రభువు, మీకూ ప్రభువు అయిన అల్లాహ్ విషయంలో మీరు మాతో వాదులాడుతారా? మా ఆచరణలు మాకు, మీ ఆచరణలు మీకు. మేము ఆయనకే అంకితం అయ్యాము.
2:140 أَمْ تَقُولُونَ إِنَّ إِبْرَاهِيمَ وَإِسْمَاعِيلَ وَإِسْحَاقَ وَيَعْقُوبَ وَالْأَسْبَاطَ كَانُوا هُودًا أَوْ نَصَارَىٰ ۗ قُلْ أَأَنتُمْ أَعْلَمُ أَمِ اللَّهُ ۗ وَمَنْ أَظْلَمُ مِمَّن كَتَمَ شَهَادَةً عِندَهُ مِنَ اللَّهِ ۗ وَمَا اللَّهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُونَ
“ఇబ్రాహీము, ఇస్మాయీలు, ఇస్హాఖు, యాకూబు మరియు వారి సంతానం యూదులుగానో, క్రైస్తవులుగానో ఉన్నారని మీరు అంటున్నారా? ఏమిటీ, మీకు ఎక్కువ తెలుసా లేక అల్లాహ్‌కు ఎక్కువ తెలుసా?” అని వారిని అడుగు. అల్లాహ్ అప్పగించిన సాక్ష్యాన్ని దాచిపెట్టే వానికన్నా ఎక్కువ అన్యాయస్థుడు ఎవడు కాగలడు? మీ చేష్టల పట్ల అల్లాహ్ అజాగ్రత్తగా లేడు.
2:141 تِلْكَ أُمَّةٌ قَدْ خَلَتْ ۖ لَهَا مَا كَسَبَتْ وَلَكُم مَّا كَسَبْتُمْ ۖ وَلَا تُسْأَلُونَ عَمَّا كَانُوا يَعْمَلُونَ
అది గతించిన ఓ సమాజం. వారు చేసుకున్నది వారికి చెందుతుంది. మీరు చేసుకున్నది మీకు లభిస్తుంది. వారి కర్మల గురించి మీరు ప్రశ్నించబడరు.
2:142 سَيَقُولُ السُّفَهَاءُ مِنَ النَّاسِ مَا وَلَّاهُمْ عَن قِبْلَتِهِمُ الَّتِي كَانُوا عَلَيْهَا ۚ قُل لِّلَّهِ الْمَشْرِقُ وَالْمَغْرِبُ ۚ يَهْدِي مَن يَشَاءُ إِلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ
“వీరు ఏ ఖిబ్లా వైపుకు అభిముఖులయ్యేవారో దాన్నుంచి మరలటానికి కారణం ఏమిటీ?” అని మూర్ఖజనులు అంటారు. (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: తూర్పు పడమరలు (అన్నీ) అల్లాహ్‌వే. తాను తలచిన వారికి ఆయన రుజుమార్గం చూపుతాడు.
2:143 وَكَذَٰلِكَ جَعَلْنَاكُمْ أُمَّةً وَسَطًا لِّتَكُونُوا شُهَدَاءَ عَلَى النَّاسِ وَيَكُونَ الرَّسُولُ عَلَيْكُمْ شَهِيدًا ۗ وَمَا جَعَلْنَا الْقِبْلَةَ الَّتِي كُنتَ عَلَيْهَا إِلَّا لِنَعْلَمَ مَن يَتَّبِعُ الرَّسُولَ مِمَّن يَنقَلِبُ عَلَىٰ عَقِبَيْهِ ۚ وَإِن كَانَتْ لَكَبِيرَةً إِلَّا عَلَى الَّذِينَ هَدَى اللَّهُ ۗ وَمَا كَانَ اللَّهُ لِيُضِيعَ إِيمَانَكُمْ ۚ إِنَّ اللَّهَ بِالنَّاسِ لَرَءُوفٌ رَّحِيمٌ
అదే విధంగా మేము మిమ్మల్ని ఒక “న్యాయశీల సమాజం” (ఉమ్మతె వసత్)గా చేశాము – మీరు ప్రజలపై సాక్షులుగా, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మీపై సాక్షిగా ఉండటం కోసం (మేమిలా చేశాము.) ప్రవక్తకు విధేయత చూపటంలో ఎవరు నిజాయితీపరులో, మరెవరు వెనుతిరిగి పోయేవారో తెలుసుకునే (పరీక్షించే) నిమిత్తమే మేము, పూర్వం నీవు అభిముఖుడవై ఉండిన దిశను మీ ‘ఖిబ్లా’గా నిర్ధారించాము. ఇదెంతో కష్టమైన విషయమే అయినప్పటికీ అల్లాహ్ సన్మార్గం చూపిన వారికి (ఏ మాత్రం కష్టతరం కాదు). అల్లాహ్ మీ విశ్వాసాన్ని వృధా కానివ్వడు. నిశ్చయంగా అల్లాహ్ (తన దాసులైన) మానవుల యెడల అమితమైన వాత్సల్యం కలవాడు! పరమ కృపాశీలుడు.
2:144 قَدْ نَرَىٰ تَقَلُّبَ وَجْهِكَ فِي السَّمَاءِ ۖ فَلَنُوَلِّيَنَّكَ قِبْلَةً تَرْضَاهَا ۚ فَوَلِّ وَجْهَكَ شَطْرَ الْمَسْجِدِ الْحَرَامِ ۚ وَحَيْثُ مَا كُنتُمْ فَوَلُّوا وُجُوهَكُمْ شَطْرَهُ ۗ وَإِنَّ الَّذِينَ أُوتُوا الْكِتَابَ لَيَعْلَمُونَ أَنَّهُ الْحَقُّ مِن رَّبِّهِمْ ۗ وَمَا اللَّهُ بِغَافِلٍ عَمَّا يَعْمَلُونَ
(ఓ ప్రవక్తా!) నువ్వు నీ ముఖాన్ని మాటిమాటికీ ఆకాశం వైపుకు ఎత్తటం మేము గమనిస్తూనే ఉన్నాము. కాబట్టి ఇప్పుడు మేము, నువ్వు ఇష్టపడే ఆ దిశ వైపుకే నిన్ను త్రిప్పుతున్నాము. కనుక నువ్వు నీ ముఖాన్ని మస్జిదె హరామ్ వైపుకు త్రిప్పుకో. మీరెక్కడున్నాసరే ఇక మీదట మీ ముఖాలను దాని వైపుకే త్రిప్పాలి. (ఖిబ్లా మార్పుకు సంబంధించిన) ఈ విషయం, తమ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యమేనని గ్రంథం ఇవ్వబడిన వారికి బాగా తెలుసు. అల్లాహ్ వారి కార్యకలాపాల పట్ల అజాగ్రత్తగా లేడు.
2:145 وَلَئِنْ أَتَيْتَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ بِكُلِّ آيَةٍ مَّا تَبِعُوا قِبْلَتَكَ ۚ وَمَا أَنتَ بِتَابِعٍ قِبْلَتَهُمْ ۚ وَمَا بَعْضُهُم بِتَابِعٍ قِبْلَةَ بَعْضٍ ۚ وَلَئِنِ اتَّبَعْتَ أَهْوَاءَهُم مِّن بَعْدِ مَا جَاءَكَ مِنَ الْعِلْمِ ۙ إِنَّكَ إِذًا لَّمِنَ الظَّالِمِينَ
ఒకవేళ నీవు గ్రంథవహులకు నిదర్శనాలన్నీ చూపినా, వారు నీ ‘ఖిబ్లా’ను అనుసరించరు. వారి ‘ఖిబ్లా’ను అంగీకరించటం అన్నది నీవల్ల కూడా కానిపని. వారిలో కూడా కొందరు మరికొందరి ‘ఖిబ్లా’ను అనుసరించరు. ఒకవేళ నువ్వు- జ్ఞానం వచ్చేసిన తరువాత కూడా – వారి కోరికలను అనుసరించినట్లయితే నువ్వు కూడా దుర్మార్గులలో చేరిపోతావు సుమా!
2:146 الَّذِينَ آتَيْنَاهُمُ الْكِتَابَ يَعْرِفُونَهُ كَمَا يَعْرِفُونَ أَبْنَاءَهُمْ ۖ وَإِنَّ فَرِيقًا مِّنْهُمْ لَيَكْتُمُونَ الْحَقَّ وَهُمْ يَعْلَمُونَ
మేము ఎవరికి గ్రంథం వొసగామో వారు తమ కన్న కొడుకులను గుర్తుపట్టినట్లే అతన్ని (అనగా ముహమ్మద్-సఅసం-ను) గుర్తుపడతారు. వారిలోని ఒక సమూహం సత్యాన్ని గుర్తించి కూడా దాన్ని కప్పిపుచ్చుతుంది.
2:147 الْحَقُّ مِن رَّبِّكَ ۖ فَلَا تَكُونَنَّ مِنَ الْمُمْتَرِينَ
అయితే ఇది నీ ప్రభువు తరఫు నుంచి వచ్చిన (స్పష్టమయిన) సత్యం. (జాగ్రత్త!) నీవు మాత్రం సంశయాల్లో ఊగిస లాడేవారి సరసన చేరకు.
2:148 وَلِكُلٍّ وِجْهَةٌ هُوَ مُوَلِّيهَا ۖ فَاسْتَبِقُوا الْخَيْرَاتِ ۚ أَيْنَ مَا تَكُونُوا يَأْتِ بِكُمُ اللَّهُ جَمِيعًا ۚ إِنَّ اللَّهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
ప్రతి ఒక్కడూ ఏదో ఒక దిక్కుకు తిరుగుతున్నాడు. కాబట్టి మీరు సత్కార్యాలలో మించిపోయేందుకు ప్రయత్నించండి. మీరు ఎక్కడ ఉన్నాసరే అల్లాహ్ మిమ్మల్ని సమీకరిస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ ప్రతి వస్తువుపై అధికారం కలవాడు.
2:149 وَمِنْ حَيْثُ خَرَجْتَ فَوَلِّ وَجْهَكَ شَطْرَ الْمَسْجِدِ الْحَرَامِ ۖ وَإِنَّهُ لَلْحَقُّ مِن رَّبِّكَ ۗ وَمَا اللَّهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُونَ
నీవు ఎక్కడి నుంచి బయలుదేరినా (నమాజు కోసం) నీ ముఖాన్ని మస్జిదె హరాం వైపునకు త్రిప్పు. ఇదే నీ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యం. మీరు చేసేదంతా అల్లాహ్‌కు తెలియకుండా లేదు.
2:150 وَمِنْ حَيْثُ خَرَجْتَ فَوَلِّ وَجْهَكَ شَطْرَ الْمَسْجِدِ الْحَرَامِ ۚ وَحَيْثُ مَا كُنتُمْ فَوَلُّوا وُجُوهَكُمْ شَطْرَهُ لِئَلَّا يَكُونَ لِلنَّاسِ عَلَيْكُمْ حُجَّةٌ إِلَّا الَّذِينَ ظَلَمُوا مِنْهُمْ فَلَا تَخْشَوْهُمْ وَاخْشَوْنِي وَلِأُتِمَّ نِعْمَتِي عَلَيْكُمْ وَلَعَلَّكُمْ تَهْتَدُونَ
ఏ స్థలం నుంచి నీవు వెడలినా నీ ముఖాన్ని మజ్జిదె హరాం వైపునకు త్రిప్పు. మీరు ఎక్కడ ఉన్నాసరే, మీ ముఖాలను దాని వైపునకే త్రిప్పండి – జనులు మీతో వాదులాటకు దిగకుండా ఉండటానికి (ఇలాగే చేయండి). వారిలోని దుర్మార్గులకు (వారు ఎలాగూ రాద్ధాంతం చేసేవారే. అంతమాత్రాన మీరు వారికి) భయపడకండి. నాకు మాత్రమే భయపడండి- నేను నా అనుగ్రహాన్ని మీపై సంపూర్తి గావించటానికి, మీరు సన్మార్గగాములు అవటానికి.
2:151 كَمَا أَرْسَلْنَا فِيكُمْ رَسُولًا مِّنكُمْ يَتْلُو عَلَيْكُمْ آيَاتِنَا وَيُزَكِّيكُمْ وَيُعَلِّمُكُمُ الْكِتَابَ وَالْحِكْمَةَ وَيُعَلِّمُكُم مَّا لَمْ تَكُونُوا تَعْلَمُونَ
అదే విధంగా మేము మీ వద్దకు స్వయంగా మీలో నుండే ఒక ప్రవక్తను (నియుక్తం చేసి) పంపాము. అతడు మీకు మా వాక్యాలను చదివి వినిపిస్తున్నాడు, మిమ్మల్ని పరిశుద్ధుల్ని చేస్తున్నాడు, మీకు గ్రంథజ్ఞానాన్నీ, వివేకవంతమైన విషయాలను బోధిస్తున్నాడు, ఇంకా మీకు తెలియని విషయాలను నేర్పుతున్నాడు.
2:152 فَاذْكُرُونِي أَذْكُرْكُمْ وَاشْكُرُوا لِي وَلَا تَكْفُرُونِ
అందుకే మీరు నన్ను స్మరించండి, నేను మిమ్మల్ని జ్ఞాపక ముంచుకుంటాను. నాకు కృతజ్ఞులై ఉండండి. కృతఘ్నతకు పాల్పడకండి.
2:153 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اسْتَعِينُوا بِالصَّبْرِ وَالصَّلَاةِ ۚ إِنَّ اللَّهَ مَعَ الصَّابِرِينَ
ఓ విశ్వాసులారా! సహనం మరియు నమాజు ద్వారా సహాయం అర్థించండి. అల్లాహ్ సహనం పాటించేవారికి తోడుగా ఉంటాడు.
2:154 وَلَا تَقُولُوا لِمَن يُقْتَلُ فِي سَبِيلِ اللَّهِ أَمْوَاتٌ ۚ بَلْ أَحْيَاءٌ وَلَٰكِن لَّا تَشْعُرُونَ
అల్లాహ్ మార్గంలో చంపబడినవారిని మృతులు అని అనకండి. వారు బ్రతికే ఉన్నారు. కాని ఆ విషయం మీకు అర్థం కాదు.
2:155 وَلَنَبْلُوَنَّكُم بِشَيْءٍ مِّنَ الْخَوْفِ وَالْجُوعِ وَنَقْصٍ مِّنَ الْأَمْوَالِ وَالْأَنفُسِ وَالثَّمَرَاتِ ۗ وَبَشِّرِ الصَّابِرِينَ
మేము ఏదో ఒక విధంగా మిమ్మల్ని తప్పకుండా పరీక్షిస్తూ ఉంటాము – భయంతో, ఆకలిదప్పులతో, ధన ప్రాణాల నష్టంతో, పండ్ల కొరతతో (పరీక్షిస్తాము)! ఈ సహనమూర్తులకు శుభవార్త ఇవ్వండి.
2:156 الَّذِينَ إِذَا أَصَابَتْهُم مُّصِيبَةٌ قَالُوا إِنَّا لِلَّهِ وَإِنَّا إِلَيْهِ رَاجِعُونَ
వారికెప్పుడు ఏ ఆపద వచ్చిపడినా, “మేము ఖుద్దుగా అల్లాహ్‌కు చెందినవారము, మేము మరలిపోవలసింది కూడా ఆయన వద్దకే కదా!” అని అంటారు.
2:157 أُولَٰئِكَ عَلَيْهِمْ صَلَوَاتٌ مِّن رَّبِّهِمْ وَرَحْمَةٌ ۖ وَأُولَٰئِكَ هُمُ الْمُهْتَدُونَ
వారిపై వారి ప్రభువు దయానుగ్రహాలు, కారుణ్యం ఉన్నాయి. సన్మార్గాన్ని పొందినవారు కూడా వీరే.
2:158 إِنَّ الصَّفَا وَالْمَرْوَةَ مِن شَعَائِرِ اللَّهِ ۖ فَمَنْ حَجَّ الْبَيْتَ أَوِ اعْتَمَرَ فَلَا جُنَاحَ عَلَيْهِ أَن يَطَّوَّفَ بِهِمَا ۚ وَمَن تَطَوَّعَ خَيْرًا فَإِنَّ اللَّهَ شَاكِرٌ عَلِيمٌ
నిస్సందేహంగా సఫా మర్వాలు అల్లాహ్ చిహ్నాలలోనివి. కనుక కాబా గృహాన్ని (సందర్శించి) హజ్ ఉమ్రహ్‌లు చేసేవారు వాటి మధ్య ప్రదక్షిణ చేస్తే అందులో ఏ మాత్రం తప్పులేదు. స్వచ్ఛందంగా ఎవరైనా ఏదైనా సత్కార్యం చేస్తే అల్లాహ్ ఆదరించేవాడు, తెలుసుకునేవాడు.
2:159 إِنَّ الَّذِينَ يَكْتُمُونَ مَا أَنزَلْنَا مِنَ الْبَيِّنَاتِ وَالْهُدَىٰ مِن بَعْدِ مَا بَيَّنَّاهُ لِلنَّاسِ فِي الْكِتَابِ ۙ أُولَٰئِكَ يَلْعَنُهُمُ اللَّهُ وَيَلْعَنُهُمُ اللَّاعِنُونَ
మేము అవతరింపజేసిన నిదర్శనాలను మరియు సన్మార్గాన్ని ప్రజల కొరకు గ్రంథంలో విశదపరచిన తరువాత కూడా వాటిని దాచిపెట్టే వారిని అల్లాహ్ శపిస్తాడు. ఇంకా, వేరే శపించే వారు కూడా వారిని శపిస్తారు.
2:160 إِلَّا الَّذِينَ تَابُوا وَأَصْلَحُوا وَبَيَّنُوا فَأُولَٰئِكَ أَتُوبُ عَلَيْهِمْ ۚ وَأَنَا التَّوَّابُ الرَّحِيمُ
అయితే పశ్చాత్తాపం చెంది, తమ ప్రవర్తనను సంస్కరించుకుని, సత్యాన్ని బహిర్గతం చేసిన వారి పశ్చాత్తాపాన్ని నేను స్వీకరిస్తాను (వారి తప్పును మన్నిస్తాను). నేను పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాణ్ణి, అపారంగా కనికరించేవాణ్ణి.
2:161 إِنَّ الَّذِينَ كَفَرُوا وَمَاتُوا وَهُمْ كُفَّارٌ أُولَٰئِكَ عَلَيْهِمْ لَعْنَةُ اللَّهِ وَالْمَلَائِكَةِ وَالنَّاسِ أَجْمَعِينَ
నిశ్చయంగా అవిశ్వాసానికి పాల్పడి, అవిశ్వాస స్థితిలోనే మరణించిన వారిపై అల్లాహ్ మరియు ఆయన దూతల, ఇంకా జనులందరి శాపం పడుతుంది.
2:162 خَالِدِينَ فِيهَا ۖ لَا يُخَفَّفُ عَنْهُمُ الْعَذَابُ وَلَا هُمْ يُنظَرُونَ
అందులోనే వారు ఎల్లకాలం ఉంటారు. వారి శిక్షను తగ్గించటం గానీ, వారికి కొంత విడుపు ఇవ్వటంగానీ జరగదు.
2:163 وَإِلَٰهُكُمْ إِلَٰهٌ وَاحِدٌ ۖ لَّا إِلَٰهَ إِلَّا هُوَ الرَّحْمَٰنُ الرَّحِيمُ
మీ అందరి ఆరాధ్య దైవం ఒకే ఆరాధ్య దైవం. ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేనేలేడు. ఆయన అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడు.
2:164 إِنَّ فِي خَلْقِ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَاخْتِلَافِ اللَّيْلِ وَالنَّهَارِ وَالْفُلْكِ الَّتِي تَجْرِي فِي الْبَحْرِ بِمَا يَنفَعُ النَّاسَ وَمَا أَنزَلَ اللَّهُ مِنَ السَّمَاءِ مِن مَّاءٍ فَأَحْيَا بِهِ الْأَرْضَ بَعْدَ مَوْتِهَا وَبَثَّ فِيهَا مِن كُلِّ دَابَّةٍ وَتَصْرِيفِ الرِّيَاحِ وَالسَّحَابِ الْمُسَخَّرِ بَيْنَ السَّمَاءِ وَالْأَرْضِ لَآيَاتٍ لِّقَوْمٍ يَعْقِلُونَ
భూమ్యాకాశాల సృష్టిలో, రేయింబవళ్ళ (నిరంతర) మార్పిడిలో, ప్రజలకు లాభం చేకూర్చే వస్తువులను మోసుకుంటూ సముద్రాలలో నడిచే ఓడలలో, ఆకాశం నుంచి అల్లాహ్ వర్షపు నీటిని కురిపించి మృతభూమిని బ్రతికించటంలో, ఇంకా అందులో అన్ని రకాల ప్రాణులను వ్యాపింపజేయటంలో, వీచే పవనాల దిశలు మార్చటంలో, భూమ్యాకాశాల మధ్య (దేవుని) నియమ నిబంధనలకు కట్టుబడి మసలుకుంటున్న మేఘాలలో బుద్ధిమంతులకు (దేవుని శక్తి సామర్థ్యాలకు సంబంధించిన) ఎన్నో సూచనలున్నాయి.
2:165 وَمِنَ النَّاسِ مَن يَتَّخِذُ مِن دُونِ اللَّهِ أَندَادًا يُحِبُّونَهُمْ كَحُبِّ اللَّهِ ۖ وَالَّذِينَ آمَنُوا أَشَدُّ حُبًّا لِّلَّهِ ۗ وَلَوْ يَرَى الَّذِينَ ظَلَمُوا إِذْ يَرَوْنَ الْعَذَابَ أَنَّ الْقُوَّةَ لِلَّهِ جَمِيعًا وَأَنَّ اللَّهَ شَدِيدُ الْعَذَابِ
కాని అల్లాహ్‌ను కాదని ఆయనకు సహవర్తులుగా ఇతరులను నిలబెట్టి, అల్లాహ్‌ను ప్రేమించవలసిన విధంగా వారిని ప్రేమించేవారు కూడా ప్రజలలో కొందరు ఉన్నారు. అయితే విశ్వసించినవారు అల్లాహ్‌ను అంతకంటే ప్రగాఢంగా (అధికంగా) ప్రేమిస్తారు. సర్వశక్తులూ అల్లాహ్ అధీనంలోనే ఉన్నాయనీ, అల్లాహ్ చాలా కఠినంగా శిక్షించేవాడన్న యదార్థాన్ని ముష్రిక్కులు, అల్లాహ్ విధించే శిక్షలను చూసిన తరువాత తెలుసుకునే బదులు, ఇప్పుడే తెలుసుకుంటే ఎంత బాగుంటుంది! (తెలుసుకుంటే వారు ఈ షిర్క్ పాపానికి ఒడిగట్టరు).
2:166 إِذْ تَبَرَّأَ الَّذِينَ اتُّبِعُوا مِنَ الَّذِينَ اتَّبَعُوا وَرَأَوُا الْعَذَابَ وَتَقَطَّعَتْ بِهِمُ الْأَسْبَابُ
ఆ సమయంలో, వీళ్ళచేత అనుసరించబడిన నాయకులు తమ అనుచరులతో తమకు ఏ మాత్రం సంబంధం లేనట్లుగా ప్రవర్తిస్తారు. ఇంకా వారు శిక్షను కళ్ళారా చూసుకుంటారు. వారి మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలన్నీ తెగిపోతాయి.
2:167 وَقَالَ الَّذِينَ اتَّبَعُوا لَوْ أَنَّ لَنَا كَرَّةً فَنَتَبَرَّأَ مِنْهُمْ كَمَا تَبَرَّءُوا مِنَّا ۗ كَذَٰلِكَ يُرِيهِمُ اللَّهُ أَعْمَالَهُمْ حَسَرَاتٍ عَلَيْهِمْ ۖ وَمَا هُم بِخَارِجِينَ مِنَ النَّارِ
అప్పుడు (కనువిప్పు కలిగిన) అనుచరులు ఇలా అంటారు: “మేమే గనక మరోసారి ప్రాపంచిక జీవితం వైపుకు మరలించబడటమంటూ జరిగితే వీరు (ఈ అయ్యవార్లు) మా పట్ల ఇక్కడ విసుగును ప్రదర్శించినట్లే మేమూ వీరిపట్ల విసుగును ప్రదర్శించేవారం.” ఈ విధంగా వారు సిగ్గుతో కుంచించుకుపోయే విధంగా అల్లాహ్ వారి కర్మలను వారికి చూపిస్తాడు. అయినాసరే వారు నరకం నుంచి బయట పడటమన్నది అసంభవం.
2:168 يَا أَيُّهَا النَّاسُ كُلُوا مِمَّا فِي الْأَرْضِ حَلَالًا طَيِّبًا وَلَا تَتَّبِعُوا خُطُوَاتِ الشَّيْطَانِ ۚ إِنَّهُ لَكُمْ عَدُوٌّ مُّبِينٌ
ప్రజలారా! భూమిలోని ధర్మసమ్మతమైన, పవిత్రమైన వస్తువులన్నింటినీ తినండి. కాని షైతాన్ అడుగుజాడలలో మాత్రం నడవకండి. వాడు మీకు బహిరంగ శత్రువు.
2:169 إِنَّمَا يَأْمُرُكُم بِالسُّوءِ وَالْفَحْشَاءِ وَأَن تَقُولُوا عَلَى اللَّهِ مَا لَا تَعْلَمُونَ
వాడు మిమ్మల్ని కేవలం చెడు వైపుకు, నీతి బాహ్యత వైపుకు పురికొల్పుతాడు. ఏ విషయాల జ్ఞానం మీకు లేదో వాటిని అల్లాహ్ పేరుతో చెప్పమని మీకు ఆజ్ఞాపిస్తాడు.
2:170 وَإِذَا قِيلَ لَهُمُ اتَّبِعُوا مَا أَنزَلَ اللَّهُ قَالُوا بَلْ نَتَّبِعُ مَا أَلْفَيْنَا عَلَيْهِ آبَاءَنَا ۗ أَوَلَوْ كَانَ آبَاؤُهُمْ لَا يَعْقِلُونَ شَيْئًا وَلَا يَهْتَدُونَ
“అల్లాహ్ అవతరింపజేసిన గ్రంథాన్ని అనుసరించండి” అని వారికి చెప్పినప్పుడల్లా, “మా తాతలు తండ్రులు అవలంబిస్తూ ఉండగా చూచిన పద్ధతినే మేము పాటిస్తాము” అని వారు సమాధానమిస్తారు. వారి పూర్వీకులు ఒట్టి అవివేకులు, మార్గ విహీనులైనప్పటికీ (వీళ్లు వారినే అనుసరిస్తారన్నమాట!)
2:171 وَمَثَلُ الَّذِينَ كَفَرُوا كَمَثَلِ الَّذِي يَنْعِقُ بِمَا لَا يَسْمَعُ إِلَّا دُعَاءً وَنِدَاءً ۚ صُمٌّ بُكْمٌ عُمْيٌ فَهُمْ لَا يَعْقِلُونَ
సత్య తిరస్కారుల ఉపమానం పశువుల కాపరి యొక్క కేకను, అరుపును మాత్రమే వినే పశువుల వంటిది (ఆలోచన అన్నమాటే ఉండదు). వారు చెవిటివారు, మూగవారు, గ్రుడ్డివారు. వారు అర్థం చేసుకోరు.
2:172 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُلُوا مِن طَيِّبَاتِ مَا رَزَقْنَاكُمْ وَاشْكُرُوا لِلَّهِ إِن كُنتُمْ إِيَّاهُ تَعْبُدُونَ
ఓ విశ్వసించిన వారలారా! మీరు కేవలం అల్లాహ్‌ను ఆరాధించేవారే అయితే మేము మీకు ప్రసాదించిన పవిత్రమైన వస్తువులను తినండి, త్రాగండి, అల్లాహ్‌కు కృతజ్ఞతలు తెలుపండి.
2:173 إِنَّمَا حَرَّمَ عَلَيْكُمُ الْمَيْتَةَ وَالدَّمَ وَلَحْمَ الْخِنزِيرِ وَمَا أُهِلَّ بِهِ لِغَيْرِ اللَّهِ ۖ فَمَنِ اضْطُرَّ غَيْرَ بَاغٍ وَلَا عَادٍ فَلَا إِثْمَ عَلَيْهِ ۚ إِنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ
అల్లాహ్ మీ కొరకు నిషేధించినవి ఇవే: చచ్చిన జంతువులు, (ప్రవహించిన) రక్తం, పందిమాంసం, ఇంకా అల్లాహ్ తప్ప ఇతరుల పేరు ఉచ్చరించబడినది. ఎవరయినా ఉద్దేశపూర్వకంగా కాకుండా, హద్దులను అతిక్రమించకుండా- గత్యంతరం లేని స్థితిలో – తింటే పాపం కాదు. నిస్సందేహంగా అల్లాహ్ క్షమించేవాడు, జాలి చూపేవాడు.
2:174 إِنَّ الَّذِينَ يَكْتُمُونَ مَا أَنزَلَ اللَّهُ مِنَ الْكِتَابِ وَيَشْتَرُونَ بِهِ ثَمَنًا قَلِيلًا ۙ أُولَٰئِكَ مَا يَأْكُلُونَ فِي بُطُونِهِمْ إِلَّا النَّارَ وَلَا يُكَلِّمُهُمُ اللَّهُ يَوْمَ الْقِيَامَةِ وَلَا يُزَكِّيهِمْ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ
అల్లాహ్ తన గ్రంథంలో అవతరింపజేసిన విషయాలను దాచేవారు, వాటిని కొద్దిపాటి ధరకు అమ్ముకునేవారు వాస్తవానికి తమ పొట్టలను అగ్నితో నింపుకుంటున్నారు. ప్రళయ దినాన అల్లాహ్ వారితో అస్సలు మాట్లాడడు. వారిని పరిశుద్ధపరచడు. పైపెచ్చు వారికి బాధాకరమైన శిక్ష కలదు.
2:175 أُولَٰئِكَ الَّذِينَ اشْتَرَوُا الضَّلَالَةَ بِالْهُدَىٰ وَالْعَذَابَ بِالْمَغْفِرَةِ ۚ فَمَا أَصْبَرَهُمْ عَلَى النَّارِ
అపమార్గాన్ని సన్మార్గానికి బదులుగా, శిక్షను క్షమాభిక్షకు బదులుగా కొనుక్కున్నవారు వీరే. వారు నరకాగ్నిని ఎలా భరిస్తారో?!
2:176 ذَٰلِكَ بِأَنَّ اللَّهَ نَزَّلَ الْكِتَابَ بِالْحَقِّ ۗ وَإِنَّ الَّذِينَ اخْتَلَفُوا فِي الْكِتَابِ لَفِي شِقَاقٍ بَعِيدٍ
ఇలా ఎందుకు జరిగిందంటే, అల్లాహ్ సత్యంతో కూడుకున్న గ్రంథాన్ని అవతరింపజేయగా, ఈ గ్రంథంతో విభేదించే వారు, తమ పెడసరి ధోరణిలో బహుదూరం వెళ్ళిపోయారు.
2:177 لَّيْسَ الْبِرَّ أَن تُوَلُّوا وُجُوهَكُمْ قِبَلَ الْمَشْرِقِ وَالْمَغْرِبِ وَلَٰكِنَّ الْبِرَّ مَنْ آمَنَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ وَالْمَلَائِكَةِ وَالْكِتَابِ وَالنَّبِيِّينَ وَآتَى الْمَالَ عَلَىٰ حُبِّهِ ذَوِي الْقُرْبَىٰ وَالْيَتَامَىٰ وَالْمَسَاكِينَ وَابْنَ السَّبِيلِ وَالسَّائِلِينَ وَفِي الرِّقَابِ وَأَقَامَ الصَّلَاةَ وَآتَى الزَّكَاةَ وَالْمُوفُونَ بِعَهْدِهِمْ إِذَا عَاهَدُوا ۖ وَالصَّابِرِينَ فِي الْبَأْسَاءِ وَالضَّرَّاءِ وَحِينَ الْبَأْسِ ۗ أُولَٰئِكَ الَّذِينَ صَدَقُوا ۖ وَأُولَٰئِكَ هُمُ الْمُتَّقُونَ
మీరు మీ ముఖాలను తూర్పు దిక్కుకో, పడమర దిక్కుకో తిప్పటమే సదాచరణ కాదు. సదాచరణ అంటే వాస్తవానికి అల్లాహ్‌ను, అంతిమ దినాన్నీ, దైవదూతలనూ, దైవగ్రంథాన్నీ, దైవ ప్రవక్తలనూ విశ్వసించటం. ధనప్రీతి ఉన్నప్పటికీ సమీప బంధువులకు, అనాధలకు, అగత్యపరులకు, బాటసారులకు, యాచించే వారికి (ధనాన్ని) ఇవ్వటం, బానిసలకు విముక్తి నొసగటం, నమాజును నెలకొల్పటం, జకాతును చెల్లిస్తూ ఉండటం, ఇచ్చిన మాటను నిలుపుకోవటం, లేమిలో కష్టకాలంలో, యుద్ధ సమయాలలో సహన స్థయిర్యాలను కనబరచటం- ఇవన్నీ కలిగి వున్నవారే వాస్తవానికి సత్యమూర్తులు. భయభక్తులు కలవారు కూడా వీరే.
2:178 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُتِبَ عَلَيْكُمُ الْقِصَاصُ فِي الْقَتْلَى ۖ الْحُرُّ بِالْحُرِّ وَالْعَبْدُ بِالْعَبْدِ وَالْأُنثَىٰ بِالْأُنثَىٰ ۚ فَمَنْ عُفِيَ لَهُ مِنْ أَخِيهِ شَيْءٌ فَاتِّبَاعٌ بِالْمَعْرُوفِ وَأَدَاءٌ إِلَيْهِ بِإِحْسَانٍ ۗ ذَٰلِكَ تَخْفِيفٌ مِّن رَّبِّكُمْ وَرَحْمَةٌ ۗ فَمَنِ اعْتَدَىٰ بَعْدَ ذَٰلِكَ فَلَهُ عَذَابٌ أَلِيمٌ
ఓ విశ్వాసులారా! హతుల విషయంలో ప్రతీకార న్యాయం (ఖిసాస్) మీ కొరకు విధిగా నిర్ణయించబడింది. స్వతంత్రునికి బదులుగా స్వతంత్రుణ్ణి, బానిసకు బదులుగా బానిసను, స్త్రీకి బదులుగా స్త్రీని (మాత్రమే) హతమార్చాలి. ఒకవేళ హతుని సోదరుడు హంతకుణ్ణి కనికరించదలిస్తే అతను రక్తశుల్కాన్ని న్యాయసమ్మతంగా అడగాలి. హంతకుడు కూడా రక్తధనాన్ని ఉత్తమ రీతిలో అతనికి చెల్లించాలి. ఇది మీ ప్రభువు తరఫున ఇవ్వబడిన వెసులుబాటు, కారుణ్యం. ఆ తరువాత కూడా ఎవరయినా హద్దులు అతిక్రమిస్తే అతనికి వ్యధాభరితమైన శిక్ష ఉంటుంది.
2:179 وَلَكُمْ فِي الْقِصَاصِ حَيَاةٌ يَا أُولِي الْأَلْبَابِ لَعَلَّكُمْ تَتَّقُونَ
ఓ బుద్ధిమంతులారా! ఈ ప్రతీకార న్యాయంలోనే మీ జీవనం ఉంది – ఇలా ఉంటేనే మీరు (అమానుషాల నుండి) ఆగి ఉంటారు.
2:180 كُتِبَ عَلَيْكُمْ إِذَا حَضَرَ أَحَدَكُمُ الْمَوْتُ إِن تَرَكَ خَيْرًا الْوَصِيَّةُ لِلْوَالِدَيْنِ وَالْأَقْرَبِينَ بِالْمَعْرُوفِ ۖ حَقًّا عَلَى الْمُتَّقِينَ
మీలో ఎవరికయినా మరణ ఘడియలు సమీపించి, వారి వద్ద ఆస్తిపాస్తులున్నట్లయితే, వారు తమ తల్లిదండ్రుల, సమీప బంధువుల పేర ఉత్తమరీతిలో వీలునామా వ్రాసిపోవటం విధిగా చేయబడింది. భయభక్తులు కలవారికి ఈ విధ్యుక్త ధర్మం మరింతగా వర్తిస్తుంది.
2:181 فَمَن بَدَّلَهُ بَعْدَمَا سَمِعَهُ فَإِنَّمَا إِثْمُهُ عَلَى الَّذِينَ يُبَدِّلُونَهُ ۚ إِنَّ اللَّهَ سَمِيعٌ عَلِيمٌ
వీలునామా (వసీయతు గురించి) విన్న తరువాత కూడా ఏ వ్యక్తయినా దాన్ని మార్చివేస్తే ఆ పాపమంతా ఆ మార్చిన వానిపైనే పడుతుంది. వాస్తవానికి అల్లాహ్ వినేవాడు, తెలిసినవాడూను.
2:182 فَمَنْ خَافَ مِن مُّوصٍ جَنَفًا أَوْ إِثْمًا فَأَصْلَحَ بَيْنَهُمْ فَلَا إِثْمَ عَلَيْهِ ۚ إِنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ
వీలునామా చేసేవాడు పొరబాటున పక్షపాత వైఖరిని అవలంబించాడనో లేక పాపంతో కూడుకున్న శాసనం చేశాడనో భయపడినవారు సంబంధీకులందరినీ పిలిచి, వారందరి మధ్య రాజీ కుదిరిస్తే అందులో దోషం లేదు. అల్లాహ్ క్షమించేవాడు, కనికరించేవాడు కూడా.
2:183 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُتِبَ عَلَيْكُمُ الصِّيَامُ كَمَا كُتِبَ عَلَى الَّذِينَ مِن قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُونَ
ఓ విశ్వసించినవారలారా! ఉపవాసాలుండటం మీపై విధిగా నిర్ణయించబడింది – మీ పూర్వీకులపై కూడా ఇదే విధంగా ఉపవాసం విధించబడింది. దీనివల్ల మీలో భయభక్తులు పెంపొందే అవకాశం ఉంది.
2:184 أَيَّامًا مَّعْدُودَاتٍ ۚ فَمَن كَانَ مِنكُم مَّرِيضًا أَوْ عَلَىٰ سَفَرٍ فَعِدَّةٌ مِّنْ أَيَّامٍ أُخَرَ ۚ وَعَلَى الَّذِينَ يُطِيقُونَهُ فِدْيَةٌ طَعَامُ مِسْكِينٍ ۖ فَمَن تَطَوَّعَ خَيْرًا فَهُوَ خَيْرٌ لَّهُ ۚ وَأَن تَصُومُوا خَيْرٌ لَّكُمْ ۖ إِن كُنتُمْ تَعْلَمُونَ
అదీ లెక్కించదగిన కొన్ని రోజులు మాత్రమే. అయితే మీలో వ్యాధిగ్రస్తులుగానో, ప్రయాణీకులుగానో ఉన్నవారు ఆ ఉపవాసాల లెక్క ఇతర దినాలలో పూర్తి చేసుకోవాలి. స్థోమత ఉన్న వారు (ఉపవాసం పాటించకపోయినందుకు) పరిహారంగా ఒక నిరుపేదకు అన్నం పెట్టాలి. కాని ఎవరైనా స్వచ్ఛందంగా ఇంకా ఎక్కువ పుణ్యం చేస్తే, అది వారికే మేలు. మీరు గ్రహించ గలిగితే ఉపవాసం ఉండటమే మీ కొరకు శ్రేయస్కరం.
2:185 شَهْرُ رَمَضَانَ الَّذِي أُنزِلَ فِيهِ الْقُرْآنُ هُدًى لِّلنَّاسِ وَبَيِّنَاتٍ مِّنَ الْهُدَىٰ وَالْفُرْقَانِ ۚ فَمَن شَهِدَ مِنكُمُ الشَّهْرَ فَلْيَصُمْهُ ۖ وَمَن كَانَ مَرِيضًا أَوْ عَلَىٰ سَفَرٍ فَعِدَّةٌ مِّنْ أَيَّامٍ أُخَرَ ۗ يُرِيدُ اللَّهُ بِكُمُ الْيُسْرَ وَلَا يُرِيدُ بِكُمُ الْعُسْرَ وَلِتُكْمِلُوا الْعِدَّةَ وَلِتُكَبِّرُوا اللَّهَ عَلَىٰ مَا هَدَاكُمْ وَلَعَلَّكُمْ تَشْكُرُونَ
రమజాను నెల – ఖుర్ఆన్ అవతరింపజేయబడిన నెల. అది మానవులందరికీ మార్గదర్శకం. అందులో సన్మార్గంతోపాటు, సత్యాసత్యాలను వేరుపరచే స్పష్టమైన నిదర్శనాలు ఉన్నాయి. కనుక మీలో ఎవరు ఈ నెలను చూస్తారో వారు ఉపవాసాలుండాలి. అయితే రోగగ్రస్తుని గానో, ప్రయాణీకుని గానో ఉన్న వారు ఇతర దినాలలో ఈ లెక్కను పూర్తిచేయాలి. అల్లాహ్ మీకు సౌలభ్యాన్ని సమకూర్చదలుస్తున్నాడేగాని మిమ్మల్ని కష్టపెట్టదలచటం లేదు. మీరు (ఉపవాసాల) నిర్ణీత సంఖ్యను పూర్తిచేసుకోవాలన్నదీ, తాను అనుగ్రహించిన సన్మార్గ భాగ్యానికి ప్రతిగా ఆయన గొప్పతనాన్ని కీర్తించి, తగురీతిలో మీరు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవాలన్నది అల్లాహ్ అభిలాష!
2:186 وَإِذَا سَأَلَكَ عِبَادِي عَنِّي فَإِنِّي قَرِيبٌ ۖ أُجِيبُ دَعْوَةَ الدَّاعِ إِذَا دَعَانِ ۖ فَلْيَسْتَجِيبُوا لِي وَلْيُؤْمِنُوا بِي لَعَلَّهُمْ يَرْشُدُونَ
(ఓ ప్రవక్తా!) నా దాసులు నా గురించి నిన్ను అడిగితే, నేను (వారికి) అత్యంత సమీపంలోనే ఉన్నాననీ, పిలిచేవాడు నన్ను ఎప్పుడు పిలిచినా నేను అతని పిలుపును ఆలకించి ఆమోదిస్తానని (నువ్వు వారికి చెప్పు). కాబట్టి వారు కూడా నా ఆదేశాన్ని శిరసావహించాలి, నన్ను విశ్వసించాలి (ఈ విషయం నీవు వారికి తెలియజేయి). తద్వారానే వారు సన్మార్గ భాగ్యం పొందగల్గుతారు.
2:187 أُحِلَّ لَكُمْ لَيْلَةَ الصِّيَامِ الرَّفَثُ إِلَىٰ نِسَائِكُمْ ۚ هُنَّ لِبَاسٌ لَّكُمْ وَأَنتُمْ لِبَاسٌ لَّهُنَّ ۗ عَلِمَ اللَّهُ أَنَّكُمْ كُنتُمْ تَخْتَانُونَ أَنفُسَكُمْ فَتَابَ عَلَيْكُمْ وَعَفَا عَنكُمْ ۖ فَالْآنَ بَاشِرُوهُنَّ وَابْتَغُوا مَا كَتَبَ اللَّهُ لَكُمْ ۚ وَكُلُوا وَاشْرَبُوا حَتَّىٰ يَتَبَيَّنَ لَكُمُ الْخَيْطُ الْأَبْيَضُ مِنَ الْخَيْطِ الْأَسْوَدِ مِنَ الْفَجْرِ ۖ ثُمَّ أَتِمُّوا الصِّيَامَ إِلَى اللَّيْلِ ۚ وَلَا تُبَاشِرُوهُنَّ وَأَنتُمْ عَاكِفُونَ فِي الْمَسَاجِدِ ۗ تِلْكَ حُدُودُ اللَّهِ فَلَا تَقْرَبُوهَا ۗ كَذَٰلِكَ يُبَيِّنُ اللَّهُ آيَاتِهِ لِلنَّاسِ لَعَلَّهُمْ يَتَّقُونَ
ఉపవాస కాలంలోని రాత్రులలో మీరు మీ భార్యలను కలుసుకోవటం మీ కొరకు ధర్మసమ్మతం చేయబడింది. వారు మీకు దుస్తులు, మీరు వారికి దుస్తులు. మీరు రహస్యంగా ఆత్మద్రోహానికి పాల్పడుతున్నారనే సంగతి అల్లాహ్‌కు తెలుసు. అయినప్పటికీ ఆయన క్షమాగుణంతో మీ వైపుకు మరలి, మీ తప్పును మన్నించాడు. ఇకనుంచి మీరు మీ భార్యలతో (ఉపవాసపు రాత్రులందు) రమించడానికీ, అల్లాహ్ మీ కొరకు రాసిపెట్టిన దాన్ని అన్వేషించటానికీ మీకు అనుమతి ఉంది. తొలిజాములోని తెలుపు నడిరేయి నల్లని చారలో నుండి ప్రస్ఫుటం అయ్యే వరకూ తినండి, త్రాగండి. ఆ తరువాత (వీటన్నింటినీ పరిత్యజించి) రాత్రి చీకటి పడేవరకూ ఉపవాసం ఉండండి. ఇంకా – మీరు మస్జిదులలో ‘ఏతెకాఫ్’ పాటించేకాలంలో మాత్రం మీ భార్యలతో సమాగమం జరపకండి. ఇవి అల్లాహ్ (నిర్ధారించిన) హద్దులు. మీరు వాటి దరిదాపులకు కూడా పోకండి. ప్రజలు అప్రమత్తంగా ఉండగలందులకుగాను అల్లాహ్ తన ఆయతులను ఇలా విడమరచి చెబుతున్నాడు.
2:188 وَلَا تَأْكُلُوا أَمْوَالَكُم بَيْنَكُم بِالْبَاطِلِ وَتُدْلُوا بِهَا إِلَى الْحُكَّامِ لِتَأْكُلُوا فَرِيقًا مِّنْ أَمْوَالِ النَّاسِ بِالْإِثْمِ وَأَنتُمْ تَعْلَمُونَ
ఒకరి సొమ్మును ఇంకొకరు అన్యాయంగా స్వాహా చేయకండి. బుద్ధిపూర్వకంగా, అక్రమమైన రీతిలో ఇతరుల ఆస్తిలో కొంతభాగం కాజేయటం కోసం అధికారులకు ముడుపులు చెల్లించకండి. అది (న్యాయం కాదన్న సంగతి) మీకూ తెలిసినదే.
2:189 يَسْأَلُونَكَ عَنِ الْأَهِلَّةِ ۖ قُلْ هِيَ مَوَاقِيتُ لِلنَّاسِ وَالْحَجِّ ۗ وَلَيْسَ الْبِرُّ بِأَن تَأْتُوا الْبُيُوتَ مِن ظُهُورِهَا وَلَٰكِنَّ الْبِرَّ مَنِ اتَّقَىٰ ۗ وَأْتُوا الْبُيُوتَ مِنْ أَبْوَابِهَا ۚ وَاتَّقُوا اللَّهَ لَعَلَّكُمْ تُفْلِحُونَ
(ఓ ప్రవక్తా!) ప్రజలు నిన్ను నెలవంకలను గురించి ప్రశ్నిస్తున్నారు కదూ! ఇది ప్రజల (ఆరాధనల) వేళలను, హజ్ కాలాన్ని నిర్ధారించటానికి (జరిగిన ఏర్పాటు) అని నువ్వు వారికి సమాధానం ఇవ్వు. (ఇహ్రామ్ స్థితిలో) మీరు మీ ఇళ్ళల్లోకి వెనుక వైపు నుంచి రావటం సత్కార్యం కాదు. అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి వున్నవాడిదే అసలు సత్కార్యం. మీరు మీ ఇండ్లల్లోకి వాకిళ్ళ నుండే ప్రవేశించండి. సాఫల్యం పొందగలందులకుగాను అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి.
2:190 وَقَاتِلُوا فِي سَبِيلِ اللَّهِ الَّذِينَ يُقَاتِلُونَكُمْ وَلَا تَعْتَدُوا ۚ إِنَّ اللَّهَ لَا يُحِبُّ الْمُعْتَدِينَ
మీతో పోరాడే వారితో మీరు కూడా దైవమార్గంలో పోరాడండి. కాని మితిమీరకండి. మితిమీరి పోయేవారిని అల్లాహ్ ఇష్టపడడు.
2:191 وَاقْتُلُوهُمْ حَيْثُ ثَقِفْتُمُوهُمْ وَأَخْرِجُوهُم مِّنْ حَيْثُ أَخْرَجُوكُمْ ۚ وَالْفِتْنَةُ أَشَدُّ مِنَ الْقَتْلِ ۚ وَلَا تُقَاتِلُوهُمْ عِندَ الْمَسْجِدِ الْحَرَامِ حَتَّىٰ يُقَاتِلُوكُمْ فِيهِ ۖ فَإِن قَاتَلُوكُمْ فَاقْتُلُوهُمْ ۗ كَذَٰلِكَ جَزَاءُ الْكَافِرِينَ
వారు ఎక్కడ ఎదురైనా మీరు వారితో తలపడండి, మిమ్మల్ని ఎక్కడి నుంచి వారు తరిమికొట్టారో, అక్కడి నుంచి మీరు కూడా వారిని తరిమికొట్టండి. ఫిత్నా (కుఫ్ర్, షిర్క్, పీడన) అనేది చంపటం కన్నా తీవ్రమైనది. ‘మస్జిదె హరామ్’ వద్ద వారు మీతో యుద్ధం చేయనంతవరకూ మీరూ వారితో పోరాడకండి. వారు గనక మిమ్మల్ని హతమార్చడానికి ప్రయత్నిస్తే మీరు కూడా దీటైన జవాబు ఇవ్వండి. అవిశ్వాసులకు సరైన సమాధానం ఇదే.
2:192 فَإِنِ انتَهَوْا فَإِنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ
ఒకవేళ వారు గనక (తమ దమన నీతిని) మానుకుంటే నిశ్చయంగా అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడు.
2:193 وَقَاتِلُوهُمْ حَتَّىٰ لَا تَكُونَ فِتْنَةٌ وَيَكُونَ الدِّينُ لِلَّهِ ۖ فَإِنِ انتَهَوْا فَلَا عُدْوَانَ إِلَّا عَلَى الظَّالِمِينَ
పీడన (ఫిత్నా) సమసిపోనంతవరకూ, దైవధర్మానిది పైచేయి కానంతవరకూ వారితో పోరాడుతూనే ఉండండి. ఒకవేళ వారు యుద్ధాన్ని విరమిస్తే (మీరూ విరమించండి). మెడలు వంచ వలసింది దౌర్జన్యపరులవే.
2:194 الشَّهْرُ الْحَرَامُ بِالشَّهْرِ الْحَرَامِ وَالْحُرُمَاتُ قِصَاصٌ ۚ فَمَنِ اعْتَدَىٰ عَلَيْكُمْ فَاعْتَدُوا عَلَيْهِ بِمِثْلِ مَا اعْتَدَىٰ عَلَيْكُمْ ۚ وَاتَّقُوا اللَّهَ وَاعْلَمُوا أَنَّ اللَّهَ مَعَ الْمُتَّقِينَ
నిషిద్ధమాసం నిషిద్ధమాసానికి బదులుగా ఉన్నది. నిషేధాజ్ఞలు సరిసమానంగా వర్తిస్తాయి. మీపై ఎవరయినా దౌర్జన్యానికి ఒడిగడితే మీరు కూడా వారిపై ఆ మేరకు ప్రతీకారం తీర్చుకోండి. అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి. అల్లాహ్ భక్తిగలవారికి తోడుగా ఉన్నాడన్న విషయాన్ని తెలుసుకోండి.
2:195 وَأَنفِقُوا فِي سَبِيلِ اللَّهِ وَلَا تُلْقُوا بِأَيْدِيكُمْ إِلَى التَّهْلُكَةِ ۛ وَأَحْسِنُوا ۛ إِنَّ اللَّهَ يُحِبُّ الْمُحْسِنِينَ
అల్లాహ్ మార్గంలో ఖర్చుపెట్టండి. చేజేతులా మిమ్మల్ని మీరు వినాశం పాలు చేసుకోకండి. ఉత్తమంగా మసలుకోండి. నిస్సందేహంగా అల్లాహ్ ఉత్తమంగా వ్యవహరించేవారిని ప్రేమిస్తాడు.
2:196 وَأَتِمُّوا الْحَجَّ وَالْعُمْرَةَ لِلَّهِ ۚ فَإِنْ أُحْصِرْتُمْ فَمَا اسْتَيْسَرَ مِنَ الْهَدْيِ ۖ وَلَا تَحْلِقُوا رُءُوسَكُمْ حَتَّىٰ يَبْلُغَ الْهَدْيُ مَحِلَّهُ ۚ فَمَن كَانَ مِنكُم مَّرِيضًا أَوْ بِهِ أَذًى مِّن رَّأْسِهِ فَفِدْيَةٌ مِّن صِيَامٍ أَوْ صَدَقَةٍ أَوْ نُسُكٍ ۚ فَإِذَا أَمِنتُمْ فَمَن تَمَتَّعَ بِالْعُمْرَةِ إِلَى الْحَجِّ فَمَا اسْتَيْسَرَ مِنَ الْهَدْيِ ۚ فَمَن لَّمْ يَجِدْ فَصِيَامُ ثَلَاثَةِ أَيَّامٍ فِي الْحَجِّ وَسَبْعَةٍ إِذَا رَجَعْتُمْ ۗ تِلْكَ عَشَرَةٌ كَامِلَةٌ ۗ ذَٰلِكَ لِمَن لَّمْ يَكُنْ أَهْلُهُ حَاضِرِي الْمَسْجِدِ الْحَرَامِ ۚ وَاتَّقُوا اللَّهَ وَاعْلَمُوا أَنَّ اللَّهَ شَدِيدُ الْعِقَابِ
హజ్, ఉమ్రహ్లను అల్లాహ్ కొరకు పూర్తిచేయండి. ఒకవేళ మీరు నిలువరించబడితే, మీరు ఇవ్వగలిగిన ఖుర్బానీని ఇచ్చివేయండి. మీరు ఇచ్చే ఖుర్బానీ, ఖుర్బానీ స్థలానికి చేరనంతవరకూ శిరోముండనం చేయించుకోకండి. అయితే మీలో వ్యాధిగ్రస్తులుగా ఉన్నవారు, లేదా తలలో బాధ ఉన్నవారు (శిరోముండనం చేయించుకుంటే ఫరవాలేదు. కాని వారు) దీనికి పరిహారంగా ఉపవాసం ఉండటమో, దానధర్మాలు చేయటమో, ఖుర్బానీ ఇవ్వటమో చేయాలి. మరి ఆ తర్వాత (చిక్కుల నుంచి, నిలువరింపు నుంచి) ప్రశాంతతను పొంది ఉన్న స్థితిలో మీలో ఎవరయినా ఉమ్రహ్ మొదలుకుని హజ్ వరకు సంకల్పం బూని ప్రయోజనం (తమత్తు) పొందినట్లయితే, వారు తమ వద్దనున్న ఖుర్బానీని ఇచ్చివేయాలి. ఖుర్బానీ ఇవ్వలేనివారు హజ్ దినాలలో మూడు రోజులు ఉపవాసం పాటించాలి. హజ్ నుండి తిరిగి వచ్చిన తరువాత ఏడు రోజులు ఉపవాసముండాలి. ఈ విధంగా మొత్తం పది ఉపవాసాలవుతాయి. మస్జిదె హరామ్‌కు సమీపంలో ఉండని వారికి మాత్రమే ఈ ఆదేశం వర్తిస్తుంది. (ప్రజలారా!) అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి. అల్లాహ్ కఠినంగా శిక్షించేవాడన్న సంగతిని తెలుసుకోండి.
2:197 الْحَجُّ أَشْهُرٌ مَّعْلُومَاتٌ ۚ فَمَن فَرَضَ فِيهِنَّ الْحَجَّ فَلَا رَفَثَ وَلَا فُسُوقَ وَلَا جِدَالَ فِي الْحَجِّ ۗ وَمَا تَفْعَلُوا مِنْ خَيْرٍ يَعْلَمْهُ اللَّهُ ۗ وَتَزَوَّدُوا فَإِنَّ خَيْرَ الزَّادِ التَّقْوَىٰ ۚ وَاتَّقُونِ يَا أُولِي الْأَلْبَابِ
హజ్ మాసాలు నిర్థారితమై ఉన్నాయి. కనుక ఈ నిర్ణీత మాసాలలో హజ్‌ను తన కొరకు విధించుకున్న వ్యక్తి – హజ్ దినాలలో – కామ క్రీడలకు, పాపకార్యాలకు, ఘర్షణలకు దూరంగా ఉండాలి. మీరు ఏ సత్కార్యం చేసినా దాని గురించి అల్లాహ్‌కు తెలుసు. (హజ్ యాత్రకు బయలుదేరినప్పుడు) ప్రయాణ సామగ్రి(ఖర్చు)ని వెంటతీసుకెళ్ళండి. అయితే అన్నింటికంటే అత్యుత్తమ సామగ్రి దైవభీతి (అని బాగా గుర్తుంచుకోండి). కనుక ఓ బుద్ధిమంతులారా! నాకు భయపడుతూ ఉండండి.
2:198 لَيْسَ عَلَيْكُمْ جُنَاحٌ أَن تَبْتَغُوا فَضْلًا مِّن رَّبِّكُمْ ۚ فَإِذَا أَفَضْتُم مِّنْ عَرَفَاتٍ فَاذْكُرُوا اللَّهَ عِندَ الْمَشْعَرِ الْحَرَامِ ۖ وَاذْكُرُوهُ كَمَا هَدَاكُمْ وَإِن كُنتُم مِّن قَبْلِهِ لَمِنَ الضَّالِّينَ
(హజ్ యాత్ర సందర్భంగా) మీరు గనక మీ ప్రభువు అనుగ్రహాన్ని అన్వేషిస్తే అందులో తప్పేమీ లేదు. మీరు అరఫాత్ నుండి తిరిగి వస్తున్నప్పుడు ‘మష్అరె హరామ్’ వద్ద దైవనామాన్ని స్మరించండి – ఆయన సూచించిన విధంగానే ఆయన నామస్మరణ చేయండి. ఇంతకు మునుపైతే మీరు దారి తప్పి ఉన్నారు.
2:199 ثُمَّ أَفِيضُوا مِنْ حَيْثُ أَفَاضَ النَّاسُ وَاسْتَغْفِرُوا اللَّهَ ۚ إِنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ
తరువాత మీరు ప్రజలందరూ మరలే చోటు నుంచే మరలండి. క్షమాపణకై అల్లాహ్‌ను వేడుకుంటూ ఉండండి. నిస్సందేహంగా అల్లాహ్ క్షమించేవాడు, కనికరించేవాడూను.
2:200 فَإِذَا قَضَيْتُم مَّنَاسِكَكُمْ فَاذْكُرُوا اللَّهَ كَذِكْرِكُمْ آبَاءَكُمْ أَوْ أَشَدَّ ذِكْرًا ۗ فَمِنَ النَّاسِ مَن يَقُولُ رَبَّنَا آتِنَا فِي الدُّنْيَا وَمَا لَهُ فِي الْآخِرَةِ مِنْ خَلَاقٍ
హజ్ క్రియలన్నింటినీ నిర్వర్తించిన తరువాత అల్లాహ్‌ను ధ్యానించండి. మీ తాతముత్తాతలను జ్ఞాపకం చేసుకున్నట్లే, ఇంకా అంతకంటే అధికంగానే అల్లాహ్‌ను జ్ఞాపకం చేయండి. “ఓ ప్రభూ! మాకు ప్రపంచంలోనే ప్రసాదించు” అని ప్రార్థించేవారు కూడా ప్రజల్లో కొందరున్నారు. అటువంటి వారికి పరలోకంలో ఏ భాగమూ లభించదు.
2:201 وَمِنْهُم مَّن يَقُولُ رَبَّنَا آتِنَا فِي الدُّنْيَا حَسَنَةً وَفِي الْآخِرَةِ حَسَنَةً وَقِنَا عَذَابَ النَّارِ
ప్రజల్లోనే మరికొందరు, “ప్రభూ! మాకు ప్రపంచంలోనూ మేలును ప్రసాదించు, పరలోకంలో కూడా మేలును ప్రసాదించు. ఇంకా మమ్మల్ని నరకాగ్ని శిక్ష నుండి కాపాడు” అని ప్రార్థించేవారు కూడా ఉన్నారు.
2:202 أُولَٰئِكَ لَهُمْ نَصِيبٌ مِّمَّا كَسَبُوا ۚ وَاللَّهُ سَرِيعُ الْحِسَابِ
ఇలాంటి వారికి వారి కర్మలను బట్టి వాటా లభిస్తుంది. అల్లాహ్ వేగంగా లెక్క తీసుకునేవాడు.
2:203 وَاذْكُرُوا اللَّهَ فِي أَيَّامٍ مَّعْدُودَاتٍ ۚ فَمَن تَعَجَّلَ فِي يَوْمَيْنِ فَلَا إِثْمَ عَلَيْهِ وَمَن تَأَخَّرَ فَلَا إِثْمَ عَلَيْهِ ۚ لِمَنِ اتَّقَىٰ ۗ وَاتَّقُوا اللَّهَ وَاعْلَمُوا أَنَّكُمْ إِلَيْهِ تُحْشَرُونَ
గణించదగిన ఆ దినాలలో (తష్రీఖ్ దినాలలో) అల్లాహ్‌ను స్మరించండి. రెండు దినాలలోనే ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళేందుకు ఎవరైనా తొందరపాటు కనబరచినా తప్పులేదు. వెనుక ఉండిపోయిన వారు కూడా నిందార్హులు కారు. ఇది భయభక్తులు గల వారికై ఉద్దేశించినది. అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి. మీరంతా ఆయన వైపుకే సమీకరించబడతారన్న యదార్థాన్ని బాగా తెలుసుకోండి.
2:204 وَمِنَ النَّاسِ مَن يُعْجِبُكَ قَوْلُهُ فِي الْحَيَاةِ الدُّنْيَا وَيُشْهِدُ اللَّهَ عَلَىٰ مَا فِي قَلْبِهِ وَهُوَ أَلَدُّ الْخِصَامِ
(ఓ ప్రవక్తా!) ప్రజలలో కొందరు పలికే ప్రాపంచిక ఉద్దేశాలతో కూడుకున్న మాటలు నిన్ను అలరించవచ్చు. వాడు తన ఆంతర్యంలోనున్న అసలు విషయానికి అల్లాహ్‌ను సాక్షిగా పెడుతున్నాడు. మరి చూడబోతే వాడు పెద్ద తగవులమారి.
2:205 وَإِذَا تَوَلَّىٰ سَعَىٰ فِي الْأَرْضِ لِيُفْسِدَ فِيهَا وَيُهْلِكَ الْحَرْثَ وَالنَّسْلَ ۗ وَاللَّهُ لَا يُحِبُّ الْفَسَادَ
వాడు (నీ వద్ద నుండి) తిరిగి వెళ్ళిన తరువాత ధరణిలో కల్లోలాన్ని రేకెత్తించడంలో, పంటలను నాశనం చేయడంలో, సంతతిని పాడు చేయటంలో నిమగ్నుడైపోతాడు. కాగా; అల్లాహ్ ఇలాంటి చెడుగును సుతరామూ ఇష్టపడడు.
2:206 وَإِذَا قِيلَ لَهُ اتَّقِ اللَّهَ أَخَذَتْهُ الْعِزَّةُ بِالْإِثْمِ ۚ فَحَسْبُهُ جَهَنَّمُ ۚ وَلَبِئْسَ الْمِهَادُ
“అల్లాహ్‌కు భయపడు” అని వాడితో అన్నప్పుడు, వాడి గర్వం, దురభిమానం వాడ్ని పాపం వైపుకే పురికొల్పుతుంది. ఇలాంటి వారికి నరకమే గతి. అది అతి చెడ్డ నివాస స్థలం.
2:207 وَمِنَ النَّاسِ مَن يَشْرِي نَفْسَهُ ابْتِغَاءَ مَرْضَاتِ اللَّهِ ۗ وَاللَّهُ رَءُوفٌ بِالْعِبَادِ
ప్రజల్లోని మరి కొంతమంది ఎలాంటివారంటే, దైవ ప్రసన్నతను చూరగొనే ప్రయత్నంలో వారు తమ ప్రాణాలను సయితం పణంగా పెడుతున్నారు. అటువంటి (త్యాగధనులైన) తన దాసుల పట్ల అల్లాహ్ అమితమైన వాత్సల్యం కలిగి ఉంటాడు.
2:208 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا ادْخُلُوا فِي السِّلْمِ كَافَّةً وَلَا تَتَّبِعُوا خُطُوَاتِ الشَّيْطَانِ ۚ إِنَّهُ لَكُمْ عَدُوٌّ مُّبِينٌ
ఓ విశ్వాసులారా! ఇస్లాంలో పూర్తిగా ప్రవేశించండి. షైతాన్ అడుగు జాడలలో నడవకండి. వాడు మీకు బద్ధవిరోధి.
2:209 فَإِن زَلَلْتُم مِّن بَعْدِ مَا جَاءَتْكُمُ الْبَيِّنَاتُ فَاعْلَمُوا أَنَّ اللَّهَ عَزِيزٌ حَكِيمٌ
మీ వద్దకు స్పష్టమయిన నిదర్శనాలు వచ్చిన తరువాత కూడా మీరు ఒకవేళ తప్పటడుగు వేస్తే అల్లాహ్ సర్వశక్తి మంతుడు, వివేక సంపన్నుడన్న సంగతిని బాగా గుర్తుంచుకోండి.
2:210 هَلْ يَنظُرُونَ إِلَّا أَن يَأْتِيَهُمُ اللَّهُ فِي ظُلَلٍ مِّنَ الْغَمَامِ وَالْمَلَائِكَةُ وَقُضِيَ الْأَمْرُ ۚ وَإِلَى اللَّهِ تُرْجَعُ الْأُمُورُ
ఏమిటీ, అల్లాహ్ మరియు దూతలు స్వయంగా మేఘాల నీడలలో వచ్చి తమ కార్యాన్ని పరిపూర్తిగావిస్తారని వారు ఎదురుచూస్తున్నారా? కార్యాలన్నీ (నిర్ణయం కొరకు) అల్లాహ్ వైపుకే మరలించబడతాయి.
2:211 سَلْ بَنِي إِسْرَائِيلَ كَمْ آتَيْنَاهُم مِّنْ آيَةٍ بَيِّنَةٍ ۗ وَمَن يُبَدِّلْ نِعْمَةَ اللَّهِ مِن بَعْدِ مَا جَاءَتْهُ فَإِنَّ اللَّهَ شَدِيدُ الْعِقَابِ
మేము ఇస్రాయీల్ వంశస్థులకు ఎన్ని స్పష్టమైన నిదర్శనాలను ప్రసాదించామో వారినే అడగండి. దైవ ప్రసాదితాలు తమ వద్దకు చేరిన తరువాత వాటిని తారుమారు చేసేవారు, అల్లాహ్ కఠినమైన శిక్షలు విధించగలవాడన్న విషయాన్ని విస్మరించరాదు.
2:212 زُيِّنَ لِلَّذِينَ كَفَرُوا الْحَيَاةُ الدُّنْيَا وَيَسْخَرُونَ مِنَ الَّذِينَ آمَنُوا ۘ وَالَّذِينَ اتَّقَوْا فَوْقَهُمْ يَوْمَ الْقِيَامَةِ ۗ وَاللَّهُ يَرْزُقُ مَن يَشَاءُ بِغَيْرِ حِسَابٍ
అవిశ్వాసుల కొరకు ప్రాపంచిక జీవితం ఎంతో సుందరంగా, ఆకర్షణీయంగా మలచబడింది. వారు విశ్వసించిన వారిని అవహేళన చేస్తున్నారు. వాస్తవానికి అల్లాహ్ పట్ల భయభక్తులు గలవారు ప్రళయ దినాన వారికన్నా ఎంతో ఉన్నత స్థితిలో ఉంటారు. అల్లాహ్ తాను తలచిన వారికి లెక్కలేనంతగా ఉపాధిని అనుగ్రహిస్తాడు.
2:213 كَانَ النَّاسُ أُمَّةً وَاحِدَةً فَبَعَثَ اللَّهُ النَّبِيِّينَ مُبَشِّرِينَ وَمُنذِرِينَ وَأَنزَلَ مَعَهُمُ الْكِتَابَ بِالْحَقِّ لِيَحْكُمَ بَيْنَ النَّاسِ فِيمَا اخْتَلَفُوا فِيهِ ۚ وَمَا اخْتَلَفَ فِيهِ إِلَّا الَّذِينَ أُوتُوهُ مِن بَعْدِ مَا جَاءَتْهُمُ الْبَيِّنَاتُ بَغْيًا بَيْنَهُمْ ۖ فَهَدَى اللَّهُ الَّذِينَ آمَنُوا لِمَا اخْتَلَفُوا فِيهِ مِنَ الْحَقِّ بِإِذْنِهِ ۗ وَاللَّهُ يَهْدِي مَن يَشَاءُ إِلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ
మానవులంతా ఒకే సమాజంగా ఉండేవారు. అల్లాహ్ ప్రవక్తలను శుభవార్తనిచ్చే వారుగా, భయపెట్టే వారుగా చేసి పంపాడు. ప్రజల మధ్య తలెత్తిన అభిప్రాయ భేదాలపై తీర్పు చేయటానికిగాను వారివెంట (అనగా ప్రవక్తల వెంట) సత్య బద్ధమైన గ్రంథాలను పంపాడు. మరి వాళ్ళే (అనగా ప్రజలే) – స్పష్టమైన ఆదేశాలు వొసగబడిన తరువాత కూడా – పరస్పర వైర భావం, అసూయ మూలంగా అందులో విభేదించుకున్నారు. అందుచేత అల్లాహ్ విశ్వాసులకు ఈ భేదాభిప్రాయం నుండి కూడా తన ఆజ్ఞానుసారం సత్యం వైపుకు దర్శకత్వం వహించాడు. అల్లాహ్ తాను కోరిన వారికి రుజుమార్గం చూపుతాడు.
2:214 أَمْ حَسِبْتُمْ أَن تَدْخُلُوا الْجَنَّةَ وَلَمَّا يَأْتِكُم مَّثَلُ الَّذِينَ خَلَوْا مِن قَبْلِكُم ۖ مَّسَّتْهُمُ الْبَأْسَاءُ وَالضَّرَّاءُ وَزُلْزِلُوا حَتَّىٰ يَقُولَ الرَّسُولُ وَالَّذِينَ آمَنُوا مَعَهُ مَتَىٰ نَصْرُ اللَّهِ ۗ أَلَا إِنَّ نَصْرَ اللَّهِ قَرِيبٌ
ఏమిటీ, మీరు స్వర్గంలో ఇట్టే ప్రవేశించగలమని అనుకుంటున్నారా? వాస్తవానికి మీకు పూర్వం గతించిన వారికి ఎదురైనటువంటి పరిస్థితులు మీకింకా ఎదురు కానేలేదు. వారిపై కష్టాలు, రోగాలు వచ్చిపడ్డాయి. వారు ఎంతగా కుదిపి వేయబడ్డారంటే, (ఆ ధాటికి తాళలేక) “ఇంతకీ దైవసహాయం ఎప్పుడొస్తుంది?” అని ప్రవక్తలు, వారి సహచరులు ప్రశ్నించసాగారు. “వినండి! దైవ సహాయం సమీపంలోనే ఉంది” (అని వారిని ఓదార్చటం జరిగింది).
2:215 يَسْأَلُونَكَ مَاذَا يُنفِقُونَ ۖ قُلْ مَا أَنفَقْتُم مِّنْ خَيْرٍ فَلِلْوَالِدَيْنِ وَالْأَقْرَبِينَ وَالْيَتَامَىٰ وَالْمَسَاكِينِ وَابْنِ السَّبِيلِ ۗ وَمَا تَفْعَلُوا مِنْ خَيْرٍ فَإِنَّ اللَّهَ بِهِ عَلِيمٌ
తాము ఏం ఖర్చు చెయ్యాలి? అని వారు నిన్ను ప్రశ్నిస్తున్నారు. మీరేం ఖర్చు చేసినా అది మీ తల్లిదండ్రుల కొరకూ, బంధువుల కొరకూ, అనాధల కొరకూ, నిరుపేదలు, బాటసారుల కొరకూ ఖర్చు చేయాలి. మీరు ఏ మేలు చేసినా అల్లాహ్‌కు దాని గురించి తెలుసు అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు.
2:216 كُتِبَ عَلَيْكُمُ الْقِتَالُ وَهُوَ كُرْهٌ لَّكُمْ ۖ وَعَسَىٰ أَن تَكْرَهُوا شَيْئًا وَهُوَ خَيْرٌ لَّكُمْ ۖ وَعَسَىٰ أَن تُحِبُّوا شَيْئًا وَهُوَ شَرٌّ لَّكُمْ ۗ وَاللَّهُ يَعْلَمُ وَأَنتُمْ لَا تَعْلَمُونَ
యుద్ధం చేయటం మీకు కష్టంగా అనిపించినప్పటికీ, అది మీపై విధిగా నిర్ణయించబడింది. మీరు దేన్ని ఇష్టపడటం లేదో అదే మీ పాలిట బహుశా శుభకరం కావచ్చు. అలాగే మీరు మీ కోసం ఎంతగానో కోరుకునే విషయాలే మీ పాలిట హానికరంగా రూపొందవచ్చు. నిజ జ్ఞానం అల్లాహ్‌కు మాత్రమే ఉంది. మీకు ఆ విషయం తెలియదు.
2:217 يَسْأَلُونَكَ عَنِ الشَّهْرِ الْحَرَامِ قِتَالٍ فِيهِ ۖ قُلْ قِتَالٌ فِيهِ كَبِيرٌ ۖ وَصَدٌّ عَن سَبِيلِ اللَّهِ وَكُفْرٌ بِهِ وَالْمَسْجِدِ الْحَرَامِ وَإِخْرَاجُ أَهْلِهِ مِنْهُ أَكْبَرُ عِندَ اللَّهِ ۚ وَالْفِتْنَةُ أَكْبَرُ مِنَ الْقَتْلِ ۗ وَلَا يَزَالُونَ يُقَاتِلُونَكُمْ حَتَّىٰ يَرُدُّوكُمْ عَن دِينِكُمْ إِنِ اسْتَطَاعُوا ۚ وَمَن يَرْتَدِدْ مِنكُمْ عَن دِينِهِ فَيَمُتْ وَهُوَ كَافِرٌ فَأُولَٰئِكَ حَبِطَتْ أَعْمَالُهُمْ فِي الدُّنْيَا وَالْآخِرَةِ ۖ وَأُولَٰئِكَ أَصْحَابُ النَّارِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ
నిషిద్ధ మాసాలలో యుద్ధం చెయ్యటం గురించి ప్రజలు నిన్ను అడుగుతున్నారు. నువ్వు వారికి చెప్పు : ఈ మాసాలలో యుద్ధం చేయటం మహాపరాధం. అయితే అల్లాహ్ మార్గంలో అవరోధాలు కల్పించటం, అల్లాహ్‌ను తిరస్కరించటం, మస్జిదె హరామ్‌ను సందర్శించే జనులను అడ్డుకోవటం, అక్కడ నివసించే వారిని అక్కడి నుంచి వెళ్ళగొట్టడం అల్లాహ్ దృష్టిలో అంతకన్నా ఘోరమైన అపరాధం. ఈ ఉపద్రవం (ఫిత్నా) హత్య కన్నా పెద్దది. వారు మీతో యుద్ధం చేస్తూనే ఉంటారు. చివరికి వారికి వీలు కలిగితే మిమ్మల్ని మీ ధర్మం నుంచి మరలించనయినా మరలించేస్తారు. మరి మీలో గనక ఎవరయినా తమ ధర్మం నుంచి తిరిగిపోయి, అవిశ్వాస స్థితిలో మరణిస్తే వారి ఇహపర లోకాల్లోని కర్మలు సర్వనాశనమైపోతాయి. అలాంటి వారే నరకవాసులు. వారందులో కలకాలం పడి ఉంటారు.
2:218 إِنَّ الَّذِينَ آمَنُوا وَالَّذِينَ هَاجَرُوا وَجَاهَدُوا فِي سَبِيلِ اللَّهِ أُولَٰئِكَ يَرْجُونَ رَحْمَتَ اللَّهِ ۚ وَاللَّهُ غَفُورٌ رَّحِيمٌ
అయితే విశ్వసించినవారు, హిజ్రత్ చేసిన (వలసపోయిన) వారు, దైవ మార్గంలో పోరాడేవారు మాత్రమే దైవ కారుణ్యానికి అభ్యర్థులు. అల్లాహ్ అమితంగా క్షమించేవాడు, అపారంగా కరుణించేవాడు.
2:219 يَسْأَلُونَكَ عَنِ الْخَمْرِ وَالْمَيْسِرِ ۖ قُلْ فِيهِمَا إِثْمٌ كَبِيرٌ وَمَنَافِعُ لِلنَّاسِ وَإِثْمُهُمَا أَكْبَرُ مِن نَّفْعِهِمَا ۗ وَيَسْأَلُونَكَ مَاذَا يُنفِقُونَ قُلِ الْعَفْوَ ۗ كَذَٰلِكَ يُبَيِّنُ اللَّهُ لَكُمُ الْآيَاتِ لَعَلَّكُمْ تَتَفَكَّرُونَ
ప్రజలు నిన్ను మద్యపానం గురించి, జూదం గురించి ప్రశ్నిస్తున్నారు. నువ్వు వారికి చెప్పు: “రెండింటిలోనూ చాలా పెద్ద పాపం ఉంది. ప్రజలకు దీనివల్ల కొన్ని ప్రాపంచిక లాభాలు కూడా చేకూరుతాయి. కాని వీటి ద్వారా చేకూరే లాభం కన్నా పాపం చాలా ఎక్కువ.” ఏం ఖర్చు పెట్టాలి? అని వారు నిన్ను అడుగుతారు. ‘మీ ఖర్చులు పోగా మిగిలినది’ అని నువ్వు వారికి చెప్పు. మీరు యోచన చేసేటందుకు గాను అల్లాహ్ ఈ విధంగా తన ఆదేశాలను స్పష్టంగా వివరిస్తున్నాడు.
2:220 فِي الدُّنْيَا وَالْآخِرَةِ ۗ وَيَسْأَلُونَكَ عَنِ الْيَتَامَىٰ ۖ قُلْ إِصْلَاحٌ لَّهُمْ خَيْرٌ ۖ وَإِن تُخَالِطُوهُمْ فَإِخْوَانُكُمْ ۚ وَاللَّهُ يَعْلَمُ الْمُفْسِدَ مِنَ الْمُصْلِحِ ۚ وَلَوْ شَاءَ اللَّهُ لَأَعْنَتَكُمْ ۚ إِنَّ اللَّهَ عَزِيزٌ حَكِيمٌ
ఇహలోక జీవితంలో, పరలోకంలో కూడా. ఇంకా వీరు అనాధలను గురించి కూడా నిన్ను ప్రశ్నిస్తున్నారు కదూ! వారికి బోధపరచు: వారి బాగోగులను అభిలషించటం ఉత్తమం. (బాగు పరచే ఉద్దేశంతో) ఒకవేళ మీరు వారి సొమ్మును మీ సొమ్ములో కలుపుకుంటే వారూ మీ సహోదరులే. చెడగొట్టేవారెవరో, బాగు పరచేవారెవరో అల్లాహ్‌కు బాగా తెలుసు. అల్లాహ్‌యే గనక తలిస్తే మిమ్మల్ని కష్టాల్లో పడవేసేవాడే. నిశ్చయంగా అల్లాహ్ శక్తిమంతుడు, వివేకవంతుడు.
2:221 وَلَا تَنكِحُوا الْمُشْرِكَاتِ حَتَّىٰ يُؤْمِنَّ ۚ وَلَأَمَةٌ مُّؤْمِنَةٌ خَيْرٌ مِّن مُّشْرِكَةٍ وَلَوْ أَعْجَبَتْكُمْ ۗ وَلَا تُنكِحُوا الْمُشْرِكِينَ حَتَّىٰ يُؤْمِنُوا ۚ وَلَعَبْدٌ مُّؤْمِنٌ خَيْرٌ مِّن مُّشْرِكٍ وَلَوْ أَعْجَبَكُمْ ۗ أُولَٰئِكَ يَدْعُونَ إِلَى النَّارِ ۖ وَاللَّهُ يَدْعُو إِلَى الْجَنَّةِ وَالْمَغْفِرَةِ بِإِذْنِهِ ۖ وَيُبَيِّنُ آيَاتِهِ لِلنَّاسِ لَعَلَّهُمْ يَتَذَكَّرُونَ
దైవానికి భాగస్వామ్యం కల్పించే స్త్రీలు విశ్వసించి ముస్లింలు కానంతవరకూ మీరు వారిని వివాహమాడకండి. దైవానికి భాగస్వామ్యం కల్పించే స్వతంత్ర స్త్రీ మీకు ఎంతగా నచ్చినప్పటికీ ఆమెకన్నా అల్లాహ్‌ను విశ్వసించే ఒక బానిస స్త్రీ ఎంతో ఉత్తమురాలు. (అలాగే) షిర్కుకు ఒడిగట్టే పురుషులు విశ్వసించనంతవరకూ మీ స్త్రీలను వారి వివాహ బంధంలోకి ఇవ్వకండి. ఎందుకంటే షిర్కుకు పాల్పడే పురుషుడు మీకు నచ్చినప్పటికీ అతనికంటే విశ్వసించిన ఒక బానిస పురుషుడు ఎన్నో రెట్లు నయం. వీరు (మిమ్మల్ని) నరకం వైపుకు పిలుస్తున్నారు. కాని అల్లాహ్ తన అనుజ్ఞతో స్వర్గం వైపునకూ, క్షమాభిక్ష వైపునకూ పిలుస్తున్నాడు. ప్రజలు గుణపాఠం నేర్చుకునేందుకుగాను ఆయన తన ఆయతులను విడమరచి మరీ చెబుతున్నాడు.
2:222 وَيَسْأَلُونَكَ عَنِ الْمَحِيضِ ۖ قُلْ هُوَ أَذًى فَاعْتَزِلُوا النِّسَاءَ فِي الْمَحِيضِ ۖ وَلَا تَقْرَبُوهُنَّ حَتَّىٰ يَطْهُرْنَ ۖ فَإِذَا تَطَهَّرْنَ فَأْتُوهُنَّ مِنْ حَيْثُ أَمَرَكُمُ اللَّهُ ۚ إِنَّ اللَّهَ يُحِبُّ التَّوَّابِينَ وَيُحِبُّ الْمُتَطَهِّرِينَ
వారు నిన్ను బహిష్టు గురించి ప్రశ్నిస్తున్నారు. నువ్వు వారికి చెప్పు: అదొక అశుద్ధ స్థితి. కనుక అశుద్ధావస్థలో వారికి ఎడంగా ఉండండి. వారు పరిశుద్ధులయ్యేవరకు వారివద్దకు పోకండి. వారు పరిశుద్ధత నొందిన మీదట, అల్లాహ్ అనుమతించిన స్థానం నుంచి మీరు వారితో సమాగమం జరుపవచ్చు. అల్లాహ్ పశ్చాత్తాపపడేవారిని, పారిశుద్ధ్యాన్ని అవలంబించేవారిని ఇష్టపడతాడు.
2:223 نِسَاؤُكُمْ حَرْثٌ لَّكُمْ فَأْتُوا حَرْثَكُمْ أَنَّىٰ شِئْتُمْ ۖ وَقَدِّمُوا لِأَنفُسِكُمْ ۚ وَاتَّقُوا اللَّهَ وَاعْلَمُوا أَنَّكُم مُّلَاقُوهُ ۗ وَبَشِّرِ الْمُؤْمِنِينَ
మీ స్త్రీలు మీ పంటపొలాలు. కాబట్టి మీ పొలాల్లోకి మీరు కోరిన విధంగా రండి. మీ స్వయం కోసం (సత్కర్మలను) ముందుకు పంపండి. అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి. మీరు ఆయన్ని కలుసుకోవలసి ఉందన్న విషయాన్ని గ్రహించండి. (ఓ ప్రవక్తా!) విశ్వాసులకు శుభవార్తను వినిపించు.
2:224 وَلَا تَجْعَلُوا اللَّهَ عُرْضَةً لِّأَيْمَانِكُمْ أَن تَبَرُّوا وَتَتَّقُوا وَتُصْلِحُوا بَيْنَ النَّاسِ ۗ وَاللَّهُ سَمِيعٌ عَلِيمٌ
సత్కార్యాన్నీ, భయభక్తులనూ, మానవుల మధ్య సంస్కరణను విడిచిపెట్టే పరిస్థితి ఏర్పడేలా – మీరు అల్లాహ్‌ను మీ ‘ప్రమాణా’లకు లక్ష్యంగా పెట్టకండి. అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వం తెలిసినవాడు.
2:225 لَّا يُؤَاخِذُكُمُ اللَّهُ بِاللَّغْوِ فِي أَيْمَانِكُمْ وَلَٰكِن يُؤَاخِذُكُم بِمَا كَسَبَتْ قُلُوبُكُمْ ۗ وَاللَّهُ غَفُورٌ حَلِيمٌ
అనాలోచిత ప్రమాణాలను గురించి అల్లాహ్ మిమ్మల్ని నిలదీయడు. హృదయపూర్వకంగా మీరు చేసే ప్రమాణాలను గురించి మాత్రం ఆయన తప్పకుండా నిలదీసి అడుగుతాడు. అల్లాహ్ క్షమాశీలి, సహనశీలి కూడా.
2:226 لِّلَّذِينَ يُؤْلُونَ مِن نِّسَائِهِمْ تَرَبُّصُ أَرْبَعَةِ أَشْهُرٍ ۖ فَإِن فَاءُوا فَإِنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ
ఎవరయితే తమ భార్యలతో సంబంధం పెట్టుకోబోమని ఒట్టేసుకుంటారో వారి కొరకు నాలుగు మాసాల గడువు ఉంది. మరి వారు గనక (ఈలోగా) మరలివస్తే అల్లాహ్ కూడా క్షమించేవాడు, జాలి చూపేవాడు.
2:227 وَإِنْ عَزَمُوا الطَّلَاقَ فَإِنَّ اللَّهَ سَمِيعٌ عَلِيمٌ
ఒకవేళ వారు విడాకులు ఇవ్వాలనే నిశ్చయించుకుంటే, నిస్సందేహంగా అల్లాహ్ అన్నీ వినేవాడు, అంతా తెలిసినవాడు.
2:228 وَالْمُطَلَّقَاتُ يَتَرَبَّصْنَ بِأَنفُسِهِنَّ ثَلَاثَةَ قُرُوءٍ ۚ وَلَا يَحِلُّ لَهُنَّ أَن يَكْتُمْنَ مَا خَلَقَ اللَّهُ فِي أَرْحَامِهِنَّ إِن كُنَّ يُؤْمِنَّ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ ۚ وَبُعُولَتُهُنَّ أَحَقُّ بِرَدِّهِنَّ فِي ذَٰلِكَ إِنْ أَرَادُوا إِصْلَاحًا ۚ وَلَهُنَّ مِثْلُ الَّذِي عَلَيْهِنَّ بِالْمَعْرُوفِ ۚ وَلِلرِّجَالِ عَلَيْهِنَّ دَرَجَةٌ ۗ وَاللَّهُ عَزِيزٌ حَكِيمٌ
విడాకులు పొందిన స్త్రీలు తమను తాము మూడు రుతువుల దాకా ఆపి ఉంచుకోవాలి. వారు అల్లాహ్‌ను, అంతిమదినాన్నీ విశ్వసించేవారే అయితే అల్లాహ్ వారి గర్భాలలో సృష్టించిన దానిని దాచి ఉంచటం వారికి ధర్మ సమ్మతంకాదు. ఒకవేళ ఈ గడువు లోపల వారిని తిరిగి రప్పించుకోవాలన్న సదుద్దేశం భర్తలకు ఉంటే ధర్మం ప్రకారం అలా రప్పించుకునే హక్కు వారికి ఉంది. భర్తలకు స్త్రీలపై హక్కులున్నట్లే స్త్రీలకు కూడా వారిపై హక్కులున్నాయి – కాని ఉత్తమ రీతిలో! కాకపోతే పురుషులకు స్త్రీలపై ఒకింత ప్రాధాన్యత ఉంది. అల్లాహ్ సర్వాధికుడు, వివేచనాపరుడు.
2:229 الطَّلَاقُ مَرَّتَانِ ۖ فَإِمْسَاكٌ بِمَعْرُوفٍ أَوْ تَسْرِيحٌ بِإِحْسَانٍ ۗ وَلَا يَحِلُّ لَكُمْ أَن تَأْخُذُوا مِمَّا آتَيْتُمُوهُنَّ شَيْئًا إِلَّا أَن يَخَافَا أَلَّا يُقِيمَا حُدُودَ اللَّهِ ۖ فَإِنْ خِفْتُمْ أَلَّا يُقِيمَا حُدُودَ اللَّهِ فَلَا جُنَاحَ عَلَيْهِمَا فِيمَا افْتَدَتْ بِهِ ۗ تِلْكَ حُدُودُ اللَّهِ فَلَا تَعْتَدُوهَا ۚ وَمَن يَتَعَدَّ حُدُودَ اللَّهِ فَأُولَٰئِكَ هُمُ الظَّالِمُونَ
ఈ విడాకులు రెండుసార్లే. ఆ తరువాత సక్రమంగా (ఆమెను) ఆపుకోవాలి. లేదంటే ఉత్తమ రీతిలో వదలి పెట్టాలి. మీరు వారికి ఇంతకు ముందు ఇచ్చి ఉన్న వాటిలో నుంచి దేన్నయినా తిరిగి తీసుకోవటం ధర్మసమ్మతం కాదు. ఆఁ ఒకవేళ అల్లాహ్ విధించిన హద్దులకు కట్టుబడి ఉండలేమన్న భయం వారిరువురికీ ఉంటే అది వేరే విషయం. అందువల్ల దంపతులిద్దరూ అల్లాహ్ ఏర్పరచిన హద్దులకు కట్టుబడి ఉండలేరన్న భయం మీకు కలిగి, అదే సమయంలో స్త్రీ తన భర్తకు కొంత నష్టపరిహారం ఇచ్చి వేర్పడదలిస్తే – అట్టి పరిస్థితిలో ఇరువురిపై ఎలాంటి దోషంలేదు. ఇవి అల్లాహ్ నిర్ధారించిన హద్దులు. (జాగ్రత్త!) వాటిని దాటకూడదు. ఎవరు అల్లాహ్ నిర్థారించిన హద్దులను మీరిపోతారో వారే దుర్మార్గులు.
2:230 فَإِن طَلَّقَهَا فَلَا تَحِلُّ لَهُ مِن بَعْدُ حَتَّىٰ تَنكِحَ زَوْجًا غَيْرَهُ ۗ فَإِن طَلَّقَهَا فَلَا جُنَاحَ عَلَيْهِمَا أَن يَتَرَاجَعَا إِن ظَنَّا أَن يُقِيمَا حُدُودَ اللَّهِ ۗ وَتِلْكَ حُدُودُ اللَّهِ يُبَيِّنُهَا لِقَوْمٍ يَعْلَمُونَ
మరి ఆమెకు (మూడవసారి) గనక విడాకులిస్తే, ఆ స్త్రీ ఇతనిని తప్ప వేరొక వ్యక్తిని వివాహం చేసుకోనంతవరకూ ఇతని కోసం ఆమె ధర్మసమ్మతం కాజాలదు. ఆ తరువాత అతను (రెండవ భర్త) కూడా ఆమెకు విడాకులిస్తే, మళ్ళీ వీరిద్దరూ అల్లాహ్ (విధించిన) హద్దులకు కట్టుబడి ఉండగలమన్న నమ్మకం ఉండి వివాహ బంధంలోకి రాదలిస్తే అందులో తప్పులేదు. ఇవి అల్లాహ్ విధించిన హద్దులు. తెలుసుకోగలవారికి ఆయన వీటిని స్పష్టపరుస్తున్నాడు.
2:231 وَإِذَا طَلَّقْتُمُ النِّسَاءَ فَبَلَغْنَ أَجَلَهُنَّ فَأَمْسِكُوهُنَّ بِمَعْرُوفٍ أَوْ سَرِّحُوهُنَّ بِمَعْرُوفٍ ۚ وَلَا تُمْسِكُوهُنَّ ضِرَارًا لِّتَعْتَدُوا ۚ وَمَن يَفْعَلْ ذَٰلِكَ فَقَدْ ظَلَمَ نَفْسَهُ ۚ وَلَا تَتَّخِذُوا آيَاتِ اللَّهِ هُزُوًا ۚ وَاذْكُرُوا نِعْمَتَ اللَّهِ عَلَيْكُمْ وَمَا أَنزَلَ عَلَيْكُم مِّنَ الْكِتَابِ وَالْحِكْمَةِ يَعِظُكُم بِهِ ۚ وَاتَّقُوا اللَّهَ وَاعْلَمُوا أَنَّ اللَّهَ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ
మీరు స్త్రీలకు విడాకులు ఇచ్చినప్పుడు, వారి గడువు (ఇద్దత్) ముగియనుండగా వారిని సహృదయంతో మీ వద్ద ఆపి ఉంచుకోండి. లేదంటే ఉత్తమ రీతిలో సాగనంపండి. వారిపై దౌర్జన్యానికి ఒడిగట్టే ఉద్దేశంతో వారిని ఆపి ఉంచుకొని వేధించకండి. ఈ వైఖరిని అనుసరించినవాడు నిజానికి తనకు తానే అన్యాయం చేసుకున్నాడు. దైవాదేశాలతో పరిహాసమాడకండి. అల్లాహ్ మీకు చేసిన ఉపకారాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి. మీపై గ్రంథాన్ని, హిక్మత్ను (ప్రవక్త సంప్రదాయాన్ని, ధర్మశాస్త్రాన్ని) అవతరింపజేసి, మీకు చేసిన ఉపదేశాన్ని కూడా (అవలోకనం చేసుకోండి). అల్లాహ్ యెడల భయభక్తులు కలిగి ఉండండి. అల్లాహ్‌కు ప్రతిదీ తెలుసు అన్న విషయాన్ని మీరు తెలుసుకోండి.
2:232 وَإِذَا طَلَّقْتُمُ النِّسَاءَ فَبَلَغْنَ أَجَلَهُنَّ فَلَا تَعْضُلُوهُنَّ أَن يَنكِحْنَ أَزْوَاجَهُنَّ إِذَا تَرَاضَوْا بَيْنَهُم بِالْمَعْرُوفِ ۗ ذَٰلِكَ يُوعَظُ بِهِ مَن كَانَ مِنكُمْ يُؤْمِنُ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ ۗ ذَٰلِكُمْ أَزْكَىٰ لَكُمْ وَأَطْهَرُ ۗ وَاللَّهُ يَعْلَمُ وَأَنتُمْ لَا تَعْلَمُونَ
మీరు స్త్రీలకు విడాకులు ఇచ్చిన తరువాత, వారు తమ గడువు (ఇద్దత్)ను ముగించి, తమ (మాజీ) భర్తలను ధర్మబద్ధంగా పరస్పరం ఇష్టపడి వివాహమాడదలిస్తే మీరు వారికి అడ్డు తగలకండి. మీలో ఎవరయితే అల్లాహ్‌ను, అంతిమదినాన్నీ విశ్వసిస్తున్నారో వారికి ఈ ఉపదేశం చేయబడుతోంది. ఇందులోనే మీ పరిశుద్ధత, పరిశుభ్రత ఇమిడి ఉన్నాయి. అంతా అల్లాహ్‌కు తెలుసు, మీకు తెలియదు.
2:233 وَالْوَالِدَاتُ يُرْضِعْنَ أَوْلَادَهُنَّ حَوْلَيْنِ كَامِلَيْنِ ۖ لِمَنْ أَرَادَ أَن يُتِمَّ الرَّضَاعَةَ ۚ وَعَلَى الْمَوْلُودِ لَهُ رِزْقُهُنَّ وَكِسْوَتُهُنَّ بِالْمَعْرُوفِ ۚ لَا تُكَلَّفُ نَفْسٌ إِلَّا وُسْعَهَا ۚ لَا تُضَارَّ وَالِدَةٌ بِوَلَدِهَا وَلَا مَوْلُودٌ لَّهُ بِوَلَدِهِ ۚ وَعَلَى الْوَارِثِ مِثْلُ ذَٰلِكَ ۗ فَإِنْ أَرَادَا فِصَالًا عَن تَرَاضٍ مِّنْهُمَا وَتَشَاوُرٍ فَلَا جُنَاحَ عَلَيْهِمَا ۗ وَإِنْ أَرَدتُّمْ أَن تَسْتَرْضِعُوا أَوْلَادَكُمْ فَلَا جُنَاحَ عَلَيْكُمْ إِذَا سَلَّمْتُم مَّا آتَيْتُم بِالْمَعْرُوفِ ۗ وَاتَّقُوا اللَّهَ وَاعْلَمُوا أَنَّ اللَّهَ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ
పాల గడువును పూర్తి చేయాలని (తండ్రులు) కోరినపక్షంలో తల్లులు తమ పిల్లలకు పూర్తిగా రెండు సంవత్సరాలపాటు పాలు పట్టాలి. బిడ్డల తండ్రులపై పోషణాభారం ఉంటుంది. కనుక వారు వారికి ఉత్తమ రీతిలో అన్నవస్త్రాలను సమకూర్చాలి. ఎవరిపైనా శక్తికి మించిన భారం వేయబడదు. బిడ్డ మూలంగా తల్లిని వేధించటంగానీ, సంతానం కారణంగా తండ్రిని ముప్పు తిప్పలు పెట్టడంగానీ చేయరాదు. వారసులపై కూడా ఇటువంటి బాధ్యతే ఉంటుంది. ఒకవేళ ఉభయులూ (తల్లిదండ్రులు) తమ ఇష్టపూర్వకంగా, పరస్పర సంప్రతింపులతో పాలు విడిపించదలిస్తే వారు నిందార్హులు కారు. ఒకవేళ మీ సంతానానికి పాలు పట్టాలన్నదే మీ అభిలాష అయితే అందులోనూ దోషంలేదు. అయితే మీరు ఆమెకు సముచితమైన రీతిలో ఇవ్వవలసిన దాన్ని ఇవ్వండి. అల్లాహ్‌కు భయపడుతూ మసలుకోండి. అల్లాహ్ మీ కార్యకలాపాలన్నింటినీ గమనిస్తున్నాడన్న విషయాన్ని తెలుసుకోండి.
2:234 وَالَّذِينَ يُتَوَفَّوْنَ مِنكُمْ وَيَذَرُونَ أَزْوَاجًا يَتَرَبَّصْنَ بِأَنفُسِهِنَّ أَرْبَعَةَ أَشْهُرٍ وَعَشْرًا ۖ فَإِذَا بَلَغْنَ أَجَلَهُنَّ فَلَا جُنَاحَ عَلَيْكُمْ فِيمَا فَعَلْنَ فِي أَنفُسِهِنَّ بِالْمَعْرُوفِ ۗ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ خَبِيرٌ
మీలో ఎవరయినా మరణించి, వారు భార్యలను వదలిపోతే అటువంటి స్త్రీలు నాలుగు మాసాల పది రోజుల వరకూ తమను తాము గడువు (ఇద్దత్)లో ఆపుకోవాలి. గడువు ముగిసిన తరువాత వారు సంస్కారవంతమైన పద్ధతిలో తమ కొరకు మంచిదనుకున్న కార్యమేదయినా చేసుకుంటే అందులో మీపై దోషం ఏమీలేదు. మీరు ఏమేం చేస్తున్నారో అల్లాహ్‌కు అంతా తెలుసు.
2:235 وَلَا جُنَاحَ عَلَيْكُمْ فِيمَا عَرَّضْتُم بِهِ مِنْ خِطْبَةِ النِّسَاءِ أَوْ أَكْنَنتُمْ فِي أَنفُسِكُمْ ۚ عَلِمَ اللَّهُ أَنَّكُمْ سَتَذْكُرُونَهُنَّ وَلَٰكِن لَّا تُوَاعِدُوهُنَّ سِرًّا إِلَّا أَن تَقُولُوا قَوْلًا مَّعْرُوفًا ۚ وَلَا تَعْزِمُوا عُقْدَةَ النِّكَاحِ حَتَّىٰ يَبْلُغَ الْكِتَابُ أَجَلَهُ ۚ وَاعْلَمُوا أَنَّ اللَّهَ يَعْلَمُ مَا فِي أَنفُسِكُمْ فَاحْذَرُوهُ ۚ وَاعْلَمُوا أَنَّ اللَّهَ غَفُورٌ حَلِيمٌ
ఆ స్త్రీలను (వితంతువులను) నికాహ్ చేసుకోవాలన్న మీ సంకల్పాన్ని సూచనా ప్రాయంగా వారికి తెలియజేసినా లేక మీ ఉద్దేశాన్ని మీ గుండెల్లోనే దాచుకున్నా అందులో తప్పేమీలేదు. మీరు తప్పకుండా వారి గురించి ప్రస్తావిస్తారన్న సంగతి అల్లాహ్‌కు తెలుసు. అయితే మీరు వారికి లోపాయికారిగా వాగ్దానాలు చేయకండి. ధర్మయుక్తంగా ఏదన్నా చెబితే అది వేరే విషయం! కాని ఇద్దత్ (గడువు) కాలం ముగియనిదే నికాహ్ ఒప్పందాన్ని నిశ్చయం చేయకండి. మీ ఆంతర్యాల్లో దాగి వున్న విషయాలను సయితం అల్లాహ్ తెలుసుకుంటాడని మరువకండి. కనుక ఆయన పట్ల అప్రమత్తంగా ఉండండి. అల్లాహ్ క్షమించేవాడు, సహనశీలి అని కూడా తెలుసుకోండి.
2:236 لَّا جُنَاحَ عَلَيْكُمْ إِن طَلَّقْتُمُ النِّسَاءَ مَا لَمْ تَمَسُّوهُنَّ أَوْ تَفْرِضُوا لَهُنَّ فَرِيضَةً ۚ وَمَتِّعُوهُنَّ عَلَى الْمُوسِعِ قَدَرُهُ وَعَلَى الْمُقْتِرِ قَدَرُهُ مَتَاعًا بِالْمَعْرُوفِ ۖ حَقًّا عَلَى الْمُحْسِنِينَ
ఒకవేళ మీరు స్త్రీలను తాకకుండా, వారి మహర్‌ను నిర్ధారించకుండానే వారికి విడాకులిస్తే అది కూడా మీకు పాపం కాదు. అయితే వారికి ఎంతో కొంత ప్రయోజనం చేకూర్చండి. స్థితిమంతుడు తన స్థితికి తగినట్లుగా, పేదవాడు తన స్థోమతకు తగినట్లుగా ధర్మం ప్రకారం ప్రయోజనం చేకూర్చాలి. ఉత్తమంగా వ్యవహరించేవారికి ఇది విధిగా నిర్ణయించబడింది.
2:237 وَإِن طَلَّقْتُمُوهُنَّ مِن قَبْلِ أَن تَمَسُّوهُنَّ وَقَدْ فَرَضْتُمْ لَهُنَّ فَرِيضَةً فَنِصْفُ مَا فَرَضْتُمْ إِلَّا أَن يَعْفُونَ أَوْ يَعْفُوَ الَّذِي بِيَدِهِ عُقْدَةُ النِّكَاحِ ۚ وَأَن تَعْفُوا أَقْرَبُ لِلتَّقْوَىٰ ۚ وَلَا تَنسَوُا الْفَضْلَ بَيْنَكُمْ ۚ إِنَّ اللَّهَ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ
మీరు స్త్రీలను ముట్టుకోక ముందే విడాకులిచ్చేస్తే, అప్పటికే వారి ‘మహర్’ సొమ్ము కూడా నిర్ణయించబడి ఉంటే, నిర్ణీత మహర్లో సగం సొమ్ము వారికి ఇవ్వండి. ఒకవేళ వారు (స్త్రీలు) ఆ సొమ్మును కూడా మన్నించి వదలిపెడితే లేక వివాహ బంధం తన చేతిలో ఉన్న వ్యక్తి (పురుషుడు తాను పెళ్ళి సందర్భంగా యిచ్చిన మహర్ సొమ్మును) క్షమించివేస్తే అది వేరే విషయం. మీ మన్నింపుల వైఖరి దైవభక్తికి చాలా సన్నిహిత మైనది. ఒండొకరి పట్ల ఔదార్యం చూపటాన్ని విస్మరించకండి. నిస్సందేహంగా అల్లాహ్ మీ కర్మలను గమనిస్తూనే ఉన్నాడు.
2:238 حَافِظُوا عَلَى الصَّلَوَاتِ وَالصَّلَاةِ الْوُسْطَىٰ وَقُومُوا لِلَّهِ قَانِتِينَ
నమాజులను కాపాడుకోండి, ముఖ్యంగా మధ్యలో వున్న నమాజును. అల్లాహ్ సమక్షంలో వినమ్రులై నిలబడండి.
2:239 فَإِنْ خِفْتُمْ فَرِجَالًا أَوْ رُكْبَانًا ۖ فَإِذَا أَمِنتُمْ فَاذْكُرُوا اللَّهَ كَمَا عَلَّمَكُم مَّا لَمْ تَكُونُوا تَعْلَمُونَ
పరిస్థితులు భయానకంగా ఉన్నప్పుడు నడుస్తూనో లేక వాహనంపై పోతూనో (నమాజు చేయండి). శాంతిభద్రతలు నెలకొన్న తరువాత అల్లాహ్ మీకు బోధించిన విధంగా ఆయన్ని ధ్యానించండి. దాని గురించి అంతకుముందు మీకు తెలీదు.
2:240 وَالَّذِينَ يُتَوَفَّوْنَ مِنكُمْ وَيَذَرُونَ أَزْوَاجًا وَصِيَّةً لِّأَزْوَاجِهِم مَّتَاعًا إِلَى الْحَوْلِ غَيْرَ إِخْرَاجٍ ۚ فَإِنْ خَرَجْنَ فَلَا جُنَاحَ عَلَيْكُمْ فِي مَا فَعَلْنَ فِي أَنفُسِهِنَّ مِن مَّعْرُوفٍ ۗ وَاللَّهُ عَزِيزٌ حَكِيمٌ
మీలో ఎవరయినా చనిపోయి, వారు తమ భార్యలను వదలిపోతే, వారు ఒక ఏడాది కాలంపాటు ప్రయోజనం పొందేలా, వారిని ఎవరూ ఇండ్ల నుంచి గెంటివేయకుండా ఉండేలా వీలునామా వ్రాయాలి. ఒకవేళ వారు తమంతట తాముగా వెళ్ళిపోయి, తమ విషయంలో ధర్మసమ్మతంగా ఏమి చేసినా దానికి మీరు నిందార్హులు కారు. అల్లాహ్ సర్వాధికుడు, వివేచనాపరుడు.
2:241 وَلِلْمُطَلَّقَاتِ مَتَاعٌ بِالْمَعْرُوفِ ۖ حَقًّا عَلَى الْمُتَّقِينَ
విడాకులు పొందిన మహిళలకు సముచిత మేలు చేయటం భావ్యం. ఇది దైవభీతిపరులపై విధిగా చేయబడింది.
2:242 كَذَٰلِكَ يُبَيِّنُ اللَّهُ لَكُمْ آيَاتِهِ لَعَلَّكُمْ تَعْقِلُونَ
మీరు అర్థం చేసుకుని బుద్ధిగా మసలుకునేందుకుగాను అల్లాహ్ ఈ విధంగా తన ఆయతులను (ఆజ్ఞలను) మీకు విశద పరుస్తున్నాడు.
2:243 أَلَمْ تَرَ إِلَى الَّذِينَ خَرَجُوا مِن دِيَارِهِمْ وَهُمْ أُلُوفٌ حَذَرَ الْمَوْتِ فَقَالَ لَهُمُ اللَّهُ مُوتُوا ثُمَّ أَحْيَاهُمْ ۚ إِنَّ اللَّهَ لَذُو فَضْلٍ عَلَى النَّاسِ وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَشْكُرُونَ
వేల సంఖ్యలో ఉండి కూడా మరణ భీతితో ఇల్లూ వాకిలీ వదలిపోవడానికి సిద్ధమైన వారిని నీవు చూడలేదా? అల్లాహ్ వారితో “చావండి” అని అన్నాడు. మరి వారిని తిరిగి బ్రతికించాడు. నిస్సందేహంగా అల్లాహ్ జనుల పట్ల దయగలవాడు. కాని వారిలో అత్యధికులు కృతజ్ఞత చూపరు.
2:244 وَقَاتِلُوا فِي سَبِيلِ اللَّهِ وَاعْلَمُوا أَنَّ اللَّهَ سَمِيعٌ عَلِيمٌ
అల్లాహ్ మార్గంలో పోరాడండి. అల్లాహ్ అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడన్న విషయాన్ని మీరు తెలుసుకోండి.
2:245 مَّن ذَا الَّذِي يُقْرِضُ اللَّهَ قَرْضًا حَسَنًا فَيُضَاعِفَهُ لَهُ أَضْعَافًا كَثِيرَةً ۚ وَاللَّهُ يَقْبِضُ وَيَبْسُطُ وَإِلَيْهِ تُرْجَعُونَ
అల్లాహ్‌కు మంచి రుణం ఇచ్చేవారు మీలో ఎవరైనా ఉన్నారా? దాన్ని ఆయన ఎన్నోరెట్లు పెంచి తిరిగి ఇస్తాడు. (ఉపాధిని) తగ్గించేవాడు, పెంచేవాడు అల్లాహ్‌యే. కడకు మీరంతా మరలి పోవలసింది ఆయన వైపుకే.
2:246 أَلَمْ تَرَ إِلَى الْمَلَإِ مِن بَنِي إِسْرَائِيلَ مِن بَعْدِ مُوسَىٰ إِذْ قَالُوا لِنَبِيٍّ لَّهُمُ ابْعَثْ لَنَا مَلِكًا نُّقَاتِلْ فِي سَبِيلِ اللَّهِ ۖ قَالَ هَلْ عَسَيْتُمْ إِن كُتِبَ عَلَيْكُمُ الْقِتَالُ أَلَّا تُقَاتِلُوا ۖ قَالُوا وَمَا لَنَا أَلَّا نُقَاتِلَ فِي سَبِيلِ اللَّهِ وَقَدْ أُخْرِجْنَا مِن دِيَارِنَا وَأَبْنَائِنَا ۖ فَلَمَّا كُتِبَ عَلَيْهِمُ الْقِتَالُ تَوَلَّوْا إِلَّا قَلِيلًا مِّنْهُمْ ۗ وَاللَّهُ عَلِيمٌ بِالظَّالِمِينَ
మూసా తరువాత ఇస్రాయీలు సంతతి పెద్దల (రెండు నాల్కల ధోరణి)ని గురించి నువ్వు ఆలోచించావా? “మేము దైవమార్గంలో పోరాడేందుకుగాను మాకోసం ఎవరినయినా రాజుగా నియమించండి” అని వారు తమ ప్రవక్తను కోరారు. దానికి ఆ ప్రవక్త, “తీరా యుద్ధం విధించబడ్డాక మీరు వెనుకంజ వేస్తారేమో!” అని అన్నాడు. దానికి వారు, “మేము ఇప్పటికే ఇళ్లనుంచి తరిమివేయబడ్డాము. మా పిల్లలకు దూరం చేయబడ్డాము. అలాంటప్పుడు మేము దైవమార్గంలో పోరాడకుండా ఉండటం అనేది ఎలా సాధ్యం?” అని (కడు గంభీరంగా) పలికారు. తీరా యుద్ధం విధిగా చేయబడినప్పుడు, వారిలో కొద్ది మంది మినహా మిగిలిన వారంతా వెన్నుచూపారు. అల్లాహ్ దుర్మార్గులను బాగా ఎరుగు.
2:247 وَقَالَ لَهُمْ نَبِيُّهُمْ إِنَّ اللَّهَ قَدْ بَعَثَ لَكُمْ طَالُوتَ مَلِكًا ۚ قَالُوا أَنَّىٰ يَكُونُ لَهُ الْمُلْكُ عَلَيْنَا وَنَحْنُ أَحَقُّ بِالْمُلْكِ مِنْهُ وَلَمْ يُؤْتَ سَعَةً مِّنَ الْمَالِ ۚ قَالَ إِنَّ اللَّهَ اصْطَفَاهُ عَلَيْكُمْ وَزَادَهُ بَسْطَةً فِي الْعِلْمِ وَالْجِسْمِ ۖ وَاللَّهُ يُؤْتِي مُلْكَهُ مَن يَشَاءُ ۚ وَاللَّهُ وَاسِعٌ عَلِيمٌ
“అల్లాహ్ తాలూత్ను మీ రాజుగా నియమించాడని” వారి ప్రవక్త వారికి తెలియజేసినప్పుడు, “అతని అధికారం మాపై ఎలా నడుస్తుంది? రాజ్యాధికారానికి అతనికన్నా ఎక్కువ హక్కు దారులము మేమాయె! కనీసం అతనికి సిరిసంపదల్లో కూడా విస్తృతి వొసగబడలేదు” అని (సాకులు) చెప్పసాగారు. ప్రవక్త వారికి ఇలా నచ్చజెప్పాడు: “(చూడండి!) అల్లాహ్ అతన్నే మీపై (నాయకునిగా) ఎన్నుకున్నాడు. జ్ఞానపరంగా, శారీరకంగా కూడా అతనికి ఆధిక్యతను ప్రసాదించాడు. అల్లాహ్ తాను కోరిన వారికి రాజ్యాధికారం ఇస్తాడు. అల్లాహ్ విశాల సంపన్నుడు, జ్ఞాన సంపన్నుడు కూడా!”
2:248 وَقَالَ لَهُمْ نَبِيُّهُمْ إِنَّ آيَةَ مُلْكِهِ أَن يَأْتِيَكُمُ التَّابُوتُ فِيهِ سَكِينَةٌ مِّن رَّبِّكُمْ وَبَقِيَّةٌ مِّمَّا تَرَكَ آلُ مُوسَىٰ وَآلُ هَارُونَ تَحْمِلُهُ الْمَلَائِكَةُ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً لَّكُمْ إِن كُنتُم مُّؤْمِنِينَ
వారి ప్రవక్త వారికి మళ్ళీ ఈ విధంగా నచ్చజెప్పాడు: అతని రాజరికానికి సంబంధించిన బహిరంగ నిదర్శనం ఏమిటంటే (అతని ఏలుబడిలో) మీ వద్దకు ఆ (శుభసూచకాల) పెట్టె తిరిగి వస్తుంది. అందులో మీ ప్రభువు తరఫున మీకు గుండె నిబ్బరం ఉంది. మూసా, హారూన్ కుటుంబీకులు వదలి వెళ్ళిన అవశేషాలు కూడా అందులో ఉన్నాయి. దాన్ని దూతలు మోసుకువస్తారు. మీరే గనక విశ్వసించిన వారైతే ఇందులో మీ కొరకు స్పష్టమయిన సూచన ఉంది.
2:249 فَلَمَّا فَصَلَ طَالُوتُ بِالْجُنُودِ قَالَ إِنَّ اللَّهَ مُبْتَلِيكُم بِنَهَرٍ فَمَن شَرِبَ مِنْهُ فَلَيْسَ مِنِّي وَمَن لَّمْ يَطْعَمْهُ فَإِنَّهُ مِنِّي إِلَّا مَنِ اغْتَرَفَ غُرْفَةً بِيَدِهِ ۚ فَشَرِبُوا مِنْهُ إِلَّا قَلِيلًا مِّنْهُمْ ۚ فَلَمَّا جَاوَزَهُ هُوَ وَالَّذِينَ آمَنُوا مَعَهُ قَالُوا لَا طَاقَةَ لَنَا الْيَوْمَ بِجَالُوتَ وَجُنُودِهِ ۚ قَالَ الَّذِينَ يَظُنُّونَ أَنَّهُم مُّلَاقُو اللَّهِ كَم مِّن فِئَةٍ قَلِيلَةٍ غَلَبَتْ فِئَةً كَثِيرَةً بِإِذْنِ اللَّهِ ۗ وَاللَّهُ مَعَ الصَّابِرِينَ
తాలూత్ సైన్యాన్ని తీసుకుని బయలుదేరినప్పుడు ఇలా ప్రకటించాడు : “చూడండి! అల్లాహ్ మిమ్మల్ని ఒక కాలువ ద్వారా పరీక్షించబోతున్నాడు. అందులోని నీళ్ళను త్రాగినవాడు నా వాడు కాడు. త్రాగనివాడు మాత్రమే నా వాడు. చేత్తో గుక్కెడు నీరు తీసుకుని త్రాగితే ఫరవాలేదు.” కాని కొద్దిమంది తప్ప మిగిలిన వారంతా ఆ నీళ్ళను (కడుపునిండా) త్రాగేశారు. తాలూత్ విశ్వాసులైన తన సైన్యంతో కాలువ దాటి ముందుకు పోతున్నప్పుడు, “జాలూత్తో, అతని సైన్యంతో తలపడే శక్తి ఈ రోజు మాలో లేదు” అని వారన్నారు. కాని అల్లాహ్‌ను కలుసుకోవలసి ఉందనే విషయంపై దృఢవిశ్వాసం గల కొంతమంది ఇలా అన్నారు : “ఒక చిన్న వర్గం, ఒక పెద్ద వర్గాన్ని, దైవాజ్ఞతో జయించటం ఎన్నోసార్లు జరిగింది.” అల్లాహ్ సహనం చూపే వారికి అండగా నిలుస్తాడు.
2:250 وَلَمَّا بَرَزُوا لِجَالُوتَ وَجُنُودِهِ قَالُوا رَبَّنَا أَفْرِغْ عَلَيْنَا صَبْرًا وَثَبِّتْ أَقْدَامَنَا وَانصُرْنَا عَلَى الْقَوْمِ الْكَافِرِينَ
జాలూత్తో, అతని సైన్యంతో ముఖాముఖీ అయినప్పుడు వారు ఇలా ప్రార్థించారు: “ప్రభూ! మాకు సహన స్థయిర్యాలు ప్రసాదించు. మా కాళ్లకు నిలకడను ఇవ్వు. అవిశ్వాస జనులపై (జరిగే పోరాటంలో) మాకు తోడ్పడు.”
2:251 فَهَزَمُوهُم بِإِذْنِ اللَّهِ وَقَتَلَ دَاوُودُ جَالُوتَ وَآتَاهُ اللَّهُ الْمُلْكَ وَالْحِكْمَةَ وَعَلَّمَهُ مِمَّا يَشَاءُ ۗ وَلَوْلَا دَفْعُ اللَّهِ النَّاسَ بَعْضَهُم بِبَعْضٍ لَّفَسَدَتِ الْأَرْضُ وَلَٰكِنَّ اللَّهَ ذُو فَضْلٍ عَلَى الْعَالَمِينَ
కడకు అల్లాహ్ అనుజ్ఞతో వారు (జాలూత్ సైన్యాన్ని) ఓడించారు. దావూద్ జాలూత్ను సంహరించాడు. మరి అల్లాహ్ దావూద్‌కు రాజ్యాధికారాన్నీ, వివేచననూ ఒసగాడు. ఇంకా, తాను కోరినంత జ్ఞానాన్ని కూడా ఆయనకు ప్రసాదించాడు. అల్లాహ్ గనక కొందరిని మరికొందరి ద్వారా ఈ విధంగా తొలగించకపోతే భువిలో కల్లోలం రేకెత్తి ఉండేది. కాని అల్లాహ్ లోకవాసులపై ఎంతో దయానుగ్రహం కలవాడు.
2:252 تِلْكَ آيَاتُ اللَّهِ نَتْلُوهَا عَلَيْكَ بِالْحَقِّ ۚ وَإِنَّكَ لَمِنَ الْمُرْسَلِينَ
ఇవి అల్లాహ్ ఆయతులు. వీటిని మేము సత్యబద్ధంగా నీకు వినిపిస్తున్నాము. (ఓ ముహమ్మద్!) నిస్సందేహంగా నువ్వు దైవసందేశహరులలోని వాడవు.
2:253 تِلْكَ الرُّسُلُ فَضَّلْنَا بَعْضَهُمْ عَلَىٰ بَعْضٍ ۘ مِّنْهُم مَّن كَلَّمَ اللَّهُ ۖ وَرَفَعَ بَعْضَهُمْ دَرَجَاتٍ ۚ وَآتَيْنَا عِيسَى ابْنَ مَرْيَمَ الْبَيِّنَاتِ وَأَيَّدْنَاهُ بِرُوحِ الْقُدُسِ ۗ وَلَوْ شَاءَ اللَّهُ مَا اقْتَتَلَ الَّذِينَ مِن بَعْدِهِم مِّن بَعْدِ مَا جَاءَتْهُمُ الْبَيِّنَاتُ وَلَٰكِنِ اخْتَلَفُوا فَمِنْهُم مَّنْ آمَنَ وَمِنْهُم مَّن كَفَرَ ۚ وَلَوْ شَاءَ اللَّهُ مَا اقْتَتَلُوا وَلَٰكِنَّ اللَّهَ يَفْعَلُ مَا يُرِيدُ
వీరు దైవప్రవక్తలు. వీరిలో కొందరికి మరికొందరిపై మేము ప్రాధాన్యతను వొసగాము. వీరిలో కొందరితో అల్లాహ్ సంభాషించాడు. కొందరి తరగతులను ఉన్నతం చేశాడు. ఇంకా మేము మర్యమ్ కుమారుడగు ఈసాకు స్పష్టమైన సూచనలు ప్రసాదించాము. పరిశుద్ధాత్మ ద్వారా అతనికి తోడ్పాటునందించాము. ఒకవేళ అల్లాహ్‌యే గనక తలిస్తే వీరి తరువాత స్పష్టమయిన నిదర్శనాలు చూసిన ప్రజలు పరస్పరం తగవులాడుకునేవారు కాదు. కాని వారు విభేదాల్లో పడిపోయారు. వారిలో కొందరు విశ్వసించగా, మరి కొందరు అవిశ్వాసులుగా ఉండిపోయారు. అల్లాహ్ గనక కోరితే వీరు పరస్పరం కలహించుకునే వారు కారు. కాని అల్లాహ్ మాత్రం తాను తలచిందే చేస్తాడు.
2:254 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَنفِقُوا مِمَّا رَزَقْنَاكُم مِّن قَبْلِ أَن يَأْتِيَ يَوْمٌ لَّا بَيْعٌ فِيهِ وَلَا خُلَّةٌ وَلَا شَفَاعَةٌ ۗ وَالْكَافِرُونَ هُمُ الظَّالِمُونَ
ఓ విశ్వాసులారా! వ్యాపార లావాదేవీలుగానీ, స్నేహబంధాలుగానీ, సిఫార్సులుగానీ ఉండని ఆ రోజు రాకముందే మేము మీకు ప్రసాదించిన దానిలో నుంచి ఖర్చుచేయండి. వాస్తవానికి తిరస్కారులే దుర్మార్గులు.
2:255 اللَّهُ لَا إِلَٰهَ إِلَّا هُوَ الْحَيُّ الْقَيُّومُ ۚ لَا تَأْخُذُهُ سِنَةٌ وَلَا نَوْمٌ ۚ لَّهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۗ مَن ذَا الَّذِي يَشْفَعُ عِندَهُ إِلَّا بِإِذْنِهِ ۚ يَعْلَمُ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ ۖ وَلَا يُحِيطُونَ بِشَيْءٍ مِّنْ عِلْمِهِ إِلَّا بِمَا شَاءَ ۚ وَسِعَ كُرْسِيُّهُ السَّمَاوَاتِ وَالْأَرْضَ ۖ وَلَا يَئُودُهُ حِفْظُهُمَا ۚ وَهُوَ الْعَلِيُّ الْعَظِيمُ
అల్లాహ్ (మాత్రమే నిజానికి ఆరాధ్య దైవం). ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనేలేడు. ఆయన సజీవుడు; అన్నింటికీ మూలాధారం. ఆయనకు కునుకుగానీ, నిద్రగానీ పట్టదు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ ఆయన అధీనంలో ఉంది. ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగలవాడెవడు? వారికి ముందు ఉన్న దానినీ, వెనుక ఉన్నదానిని కూడా ఆయన ఎరుగు. ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయమూ వారి గ్రాహ్యపరిధిలోకి రాదు. ఆయన కుర్చీ వైశాల్యం భూమ్యాకాశాలను చుట్టుముట్టి ఉంది. వాటిని రక్షించటానికి ఆయన ఎన్నడూ అలసిపోడు. ఆయన సర్వోన్నతుడు, గొప్పవాడు.
2:256 لَا إِكْرَاهَ فِي الدِّينِ ۖ قَد تَّبَيَّنَ الرُّشْدُ مِنَ الْغَيِّ ۚ فَمَن يَكْفُرْ بِالطَّاغُوتِ وَيُؤْمِن بِاللَّهِ فَقَدِ اسْتَمْسَكَ بِالْعُرْوَةِ الْوُثْقَىٰ لَا انفِصَامَ لَهَا ۗ وَاللَّهُ سَمِيعٌ عَلِيمٌ
ధర్మం విషయంలో బలవంతం ఏమీ లేదు. సన్మార్గం అపమార్గం నుంచి ప్రస్ఫుటమయ్యింది. కనుక ఎవరయితే అల్లాహ్ తప్ప వేరితర ఆరాధ్యులను (తాగూత్ను) తిరస్కరించి అల్లాహ్‌ను మాత్రమే విశ్వసిస్తారో వారు దృఢమైన కడియాన్ని పట్టుకున్నారు. అది ఎన్నటికీ తెగదు. అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వం తెలిసినవాడు.
2:257 اللَّهُ وَلِيُّ الَّذِينَ آمَنُوا يُخْرِجُهُم مِّنَ الظُّلُمَاتِ إِلَى النُّورِ ۖ وَالَّذِينَ كَفَرُوا أَوْلِيَاؤُهُمُ الطَّاغُوتُ يُخْرِجُونَهُم مِّنَ النُّورِ إِلَى الظُّلُمَاتِ ۗ أُولَٰئِكَ أَصْحَابُ النَّارِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ
విశ్వసించినవారి సంరక్షకునిగా స్వయంగా అల్లాహ్ ఉంటాడు. ఆయన వారిని చీకట్ల నుంచి వెలుగు వైపుకు తీసుకుపోతాడు. కాగా; అవిశ్వాసుల నేస్తాలు షైతానులే (తాగూతే). వాళ్లు వారిని వెలుగు నుంచి చీకట్ల వైపుకు లాక్కు పోతారు. వారు నరకవాసులు, కలకాలం అందులోనే పడి ఉంటారు.
2:258 أَلَمْ تَرَ إِلَى الَّذِي حَاجَّ إِبْرَاهِيمَ فِي رَبِّهِ أَنْ آتَاهُ اللَّهُ الْمُلْكَ إِذْ قَالَ إِبْرَاهِيمُ رَبِّيَ الَّذِي يُحْيِي وَيُمِيتُ قَالَ أَنَا أُحْيِي وَأُمِيتُ ۖ قَالَ إِبْرَاهِيمُ فَإِنَّ اللَّهَ يَأْتِي بِالشَّمْسِ مِنَ الْمَشْرِقِ فَأْتِ بِهَا مِنَ الْمَغْرِبِ فَبُهِتَ الَّذِي كَفَرَ ۗ وَاللَّهُ لَا يَهْدِي الْقَوْمَ الظَّالِمِينَ
అల్లాహ్ తనకు రాజ్యాధికారం ఇచ్చాడని (గర్వం కొద్దీ) ఇబ్రాహీంతో అతని ప్రభువు (ఎవరన్న) విషయంపై గొడవపడిన వానిని నీవు చూడలేదా? “జీవన్మరణాలను ఇచ్చేవాడు నా ప్రభువు” అని ఇబ్రాహీం అన్నప్పుడు, “నేనూ బ్రతికిస్తాను, చంపుతాను” అని అతనన్నాడు. అప్పుడు ఇబ్రాహీం (అలైహిస్సలాం), “సరే! అల్లాహ్ సూర్యుణ్ణి తూర్పు వైపు నుంచి ఉదయింపజేస్తున్నాడు కదా! మరి నువ్వు దాన్ని కాస్త పడమటి వైపు నుంచి ఉదయింపజెయ్యి” అని కోరినప్పుడు ఆ దైవతిరస్కారి బిత్తరపోయాడు. యదార్థమేమిటంటే అల్లాహ్ దుర్మార్గులకు సన్మార్గం చూపడు.
2:259 أَوْ كَالَّذِي مَرَّ عَلَىٰ قَرْيَةٍ وَهِيَ خَاوِيَةٌ عَلَىٰ عُرُوشِهَا قَالَ أَنَّىٰ يُحْيِي هَٰذِهِ اللَّهُ بَعْدَ مَوْتِهَا ۖ فَأَمَاتَهُ اللَّهُ مِائَةَ عَامٍ ثُمَّ بَعَثَهُ ۖ قَالَ كَمْ لَبِثْتَ ۖ قَالَ لَبِثْتُ يَوْمًا أَوْ بَعْضَ يَوْمٍ ۖ قَالَ بَل لَّبِثْتَ مِائَةَ عَامٍ فَانظُرْ إِلَىٰ طَعَامِكَ وَشَرَابِكَ لَمْ يَتَسَنَّهْ ۖ وَانظُرْ إِلَىٰ حِمَارِكَ وَلِنَجْعَلَكَ آيَةً لِّلنَّاسِ ۖ وَانظُرْ إِلَى الْعِظَامِ كَيْفَ نُنشِزُهَا ثُمَّ نَكْسُوهَا لَحْمًا ۚ فَلَمَّا تَبَيَّنَ لَهُ قَالَ أَعْلَمُ أَنَّ اللَّهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
లేదా ఇండ్ల కప్పులు కూలి తలక్రిందులుగా పడివున్న పట్టణం మీదుగా పోయినవాడు; (అతనిని నీవు చూడలేదా?) “దీని చావు తరువాత అల్లాహ్ తిరిగి దీనికి ఎలా ప్రాణం పోస్తాడు?” అని ఆ వ్యక్తి ఆశ్చర్యపోయినప్పుడు అల్లాహ్ అతన్ని చంపి నూరేళ్ళవరకు మరణస్థితిలో ఉంచాడు. తరువాత అతన్ని లేపి, “ఈ స్థితిలో నువ్వు ఎంతకాలం ఉన్నావు?” అని అడిగాడు. “మహా అయితే ఒక రోజు లేక ఒక రోజులో కొంత భాగం” అని అతను బదులిచ్చాడు. “లేదు. నువ్వు నూరేళ్ళు ఈ స్థితిలో పడిఉన్నావు. కాస్త నీ అన్నపానీయాల వైపు చూడు. అవి ఏ మాత్రం చెడిపోలేదు. మరి నీ గాడిదను కూడా చూసుకో. మేము నిన్ను ప్రజల కోసం ఒక నిదర్శనంగా చేయదలిచాము. మేము (గాడిద) ఎముకలను ఏ విధంగా లేపి, వాటిపై మాంసం నింపుతామో చూడు! ఇదంతా ప్రస్ఫుటమయి పోయాక, “అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడని నాకు తెలుసు” అని అన్నాడతను.
2:260 وَإِذْ قَالَ إِبْرَاهِيمُ رَبِّ أَرِنِي كَيْفَ تُحْيِي الْمَوْتَىٰ ۖ قَالَ أَوَلَمْ تُؤْمِن ۖ قَالَ بَلَىٰ وَلَٰكِن لِّيَطْمَئِنَّ قَلْبِي ۖ قَالَ فَخُذْ أَرْبَعَةً مِّنَ الطَّيْرِ فَصُرْهُنَّ إِلَيْكَ ثُمَّ اجْعَلْ عَلَىٰ كُلِّ جَبَلٍ مِّنْهُنَّ جُزْءًا ثُمَّ ادْعُهُنَّ يَأْتِينَكَ سَعْيًا ۚ وَاعْلَمْ أَنَّ اللَّهَ عَزِيزٌ حَكِيمٌ
(మరొక సంఘటన.) “ఓ ప్రభూ! నీవు మృతులను ఎలా బ్రతికిస్తావో కాస్త నాకు చూపవా?” అని ఇబ్రాహీం విన్నవించుకున్నప్పుడు, “నీకు నమ్మకం లేదా?” అని దేవుని తరఫున సెలవీయబడింది. “ఎందుకు లేదు?! (నాకు పూర్తి నమ్మకం ఉంది. కాకపోతే) ఆత్మ తృప్తికై ఇలా అడిగాను” అని అతనన్నాడు. అప్పుడు అల్లాహ్, “నాలుగు పక్షులను తీసుకో. వాటిని మచ్చిక చేసుకో. (వాటిని కోసి ముక్కలు ముక్కలుగా చెయ్యి). తరువాత ఒక్కో పర్వతంపై దాని ఒక్కో (మాంసపు) ముక్కను ఉంచు. ఆపైన వాటిని పిలువు. అవి నీ వద్దకు పరుగెత్తుకుంటూ వస్తాయి. అల్లాహ్ సర్వశక్తిమంతుడు, వివేకవంతుడన్న సంగతిని బాగా తెలుసుకో” అని అన్నాడు.
2:261 مَّثَلُ الَّذِينَ يُنفِقُونَ أَمْوَالَهُمْ فِي سَبِيلِ اللَّهِ كَمَثَلِ حَبَّةٍ أَنبَتَتْ سَبْعَ سَنَابِلَ فِي كُلِّ سُنبُلَةٍ مِّائَةُ حَبَّةٍ ۗ وَاللَّهُ يُضَاعِفُ لِمَن يَشَاءُ ۗ وَاللَّهُ وَاسِعٌ عَلِيمٌ
అల్లాహ్ మార్గంలో తమ ధనాన్ని ఖర్చుచేసేవారి ఉపమానం ఇలా ఉంటుంది: ఒక విత్తనాన్ని నాటగా, అది మొలకెత్తి అందులో నుంచి ఏడు వెన్నులు పుట్టుకువస్తాయి. ప్రతి వెన్నులోనూ నూరేసి గింజలు ఉంటాయి. ఇదే విధంగా అల్లాహ్ తాను కోరినవారికి సమృద్ధి వొసగుతాడు. అల్లాహ్ పుష్కలంగా ప్రసాదించేవాడు, ప్రతిదీ తెలిసినవాడు.
2:262 الَّذِينَ يُنفِقُونَ أَمْوَالَهُمْ فِي سَبِيلِ اللَّهِ ثُمَّ لَا يُتْبِعُونَ مَا أَنفَقُوا مَنًّا وَلَا أَذًى ۙ لَّهُمْ أَجْرُهُمْ عِندَ رَبِّهِمْ وَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ
ఎవరయితే దైవమార్గంలో తమ ధనాన్ని ఖర్చు చేసిన తరువాత తమ దాతృత్వాన్ని మాటిమాటికీ చాటుతూ ఉండకుండా, (గ్రహీతల మనస్సును) నొప్పించకుండా జాగ్రత్త పడతారో, వారి ప్రతిఫలం వారి ప్రభువు వద్ద ఉంటుంది. వారికెలాంటి భీతిగానీ, దుఃఖంగానీ ఉండదు.
2:263 قَوْلٌ مَّعْرُوفٌ وَمَغْفِرَةٌ خَيْرٌ مِّن صَدَقَةٍ يَتْبَعُهَا أَذًى ۗ وَاللَّهُ غَنِيٌّ حَلِيمٌ
దానం చేసిన తరువాత మనసు నొప్పించటం కంటే మంచి మాట పలకటం, క్షమించటం ఎంతో మేలు. అల్లాహ్ అక్కరలేనివాడు, సహనశీలుడు.
2:264 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تُبْطِلُوا صَدَقَاتِكُم بِالْمَنِّ وَالْأَذَىٰ كَالَّذِي يُنفِقُ مَالَهُ رِئَاءَ النَّاسِ وَلَا يُؤْمِنُ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ ۖ فَمَثَلُهُ كَمَثَلِ صَفْوَانٍ عَلَيْهِ تُرَابٌ فَأَصَابَهُ وَابِلٌ فَتَرَكَهُ صَلْدًا ۖ لَّا يَقْدِرُونَ عَلَىٰ شَيْءٍ مِّمَّا كَسَبُوا ۗ وَاللَّهُ لَا يَهْدِي الْقَوْمَ الْكَافِرِينَ
ఓ విశ్వాసులారా! తన ధనాన్ని పరుల మెప్పుకోసం ఖర్చుచేస్తూ, అల్లాహ్‌ను గానీ, అంతిమదినాన్ని గానీ విశ్వసించని వ్యక్తి మాదిరిగా మీరు మీ ఉపకారాన్ని చాటుకుని, (గ్రహీతల) మనస్సులను నొప్పించి మీ దానధర్మాలను వృధా చేసుకోకండి. అతని ఉపమానం కొద్దిగా మట్టి పేరుకుని ఉన్న నున్నని రాతి బండ వంటిది. దానిపై భారీవర్షం కురిసి, ఆ మట్టి కాస్తా కొట్టుకు పోయి, కటికరాయి మాత్రమే మిగులుతుంది. ఈ ప్రదర్శనా కారులకు తాము చేసుకున్న దానిలో నుంచి ఏమీ ప్రాప్తించదు. అల్లాహ్ సత్యతిరస్కారులకు సన్మార్గం చూపడు.
2:265 وَمَثَلُ الَّذِينَ يُنفِقُونَ أَمْوَالَهُمُ ابْتِغَاءَ مَرْضَاتِ اللَّهِ وَتَثْبِيتًا مِّنْ أَنفُسِهِمْ كَمَثَلِ جَنَّةٍ بِرَبْوَةٍ أَصَابَهَا وَابِلٌ فَآتَتْ أُكُلَهَا ضِعْفَيْنِ فَإِن لَّمْ يُصِبْهَا وَابِلٌ فَطَلٌّ ۗ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ
ఇక దైవప్రసన్నతను చూరగొనే తపనతో, దృఢనమ్మకంతో తమ సంపదను ఖర్చుపెట్టేవారి ఉపమానం మెరక ప్రాంతంలో ఉన్న తోట వంటిది. భారీ వర్షం కురిస్తే అది రెట్టింపు పంటను ఇస్తుంది. ఒకవేళ దానిపై పెద్ద వర్షం పడకుండా, కేవలం వానజల్లు కురిసినా సరిపోతుంది. అల్లాహ్ మీ పనులన్నింటినీ చూస్తూనే ఉన్నాడు.
2:266 أَيَوَدُّ أَحَدُكُمْ أَن تَكُونَ لَهُ جَنَّةٌ مِّن نَّخِيلٍ وَأَعْنَابٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ لَهُ فِيهَا مِن كُلِّ الثَّمَرَاتِ وَأَصَابَهُ الْكِبَرُ وَلَهُ ذُرِّيَّةٌ ضُعَفَاءُ فَأَصَابَهَا إِعْصَارٌ فِيهِ نَارٌ فَاحْتَرَقَتْ ۗ كَذَٰلِكَ يُبَيِّنُ اللَّهُ لَكُمُ الْآيَاتِ لَعَلَّكُمْ تَتَفَكَّرُونَ
మీలో ఎవరికయినా ఖర్జూరం, ద్రాక్ష పండ్ల తోట ఉండి, అందులో పిల్ల కాలువలు ప్రవహిస్తూ, అందులో అతనికి అన్ని రకాల ఫలాలు కూడా లభిస్తూ ఉండి, అతను ముసలివాడైపోగా, మరోవైపు అతని పిల్లలు బలహీనులుగా ఉండగా – అకస్మాత్తుగా ఆ తోటపై నిప్పులు చెరిగే వడగాలి వచ్చి ఆ తోట కాలిపోవటాన్ని మీలో ఎవరయినాసరే ఇష్టపడతారా? మీరు ఆలోచించేటందుకుగాను అల్లాహ్ ఈ విధంగా తన ఆయతులను మీకు స్పష్టపరుస్తున్నాడు.
2:267 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَنفِقُوا مِن طَيِّبَاتِ مَا كَسَبْتُمْ وَمِمَّا أَخْرَجْنَا لَكُم مِّنَ الْأَرْضِ ۖ وَلَا تَيَمَّمُوا الْخَبِيثَ مِنْهُ تُنفِقُونَ وَلَسْتُم بِآخِذِيهِ إِلَّا أَن تُغْمِضُوا فِيهِ ۚ وَاعْلَمُوا أَنَّ اللَّهَ غَنِيٌّ حَمِيدٌ
ఓ విశ్వసించినవారలారా! ధర్మ సమ్మతమైన మీ సంపాదనలో నుంచి, మేము మీ కోసం నేల నుంచి ఉత్పత్తిచేసిన వస్తువులలో నుంచి ఖర్చు చేయండి. వాటిలోని చెడు (నాసిరకం) వస్తువులను ఖర్చుపెట్టే సంకల్పం చేసుకోకండి- మీరు స్వయంగా వాటిని తీసుకోరు. ఒకవేళ కళ్లు మూసుకొని ఉంటే అది వేరే విషయం. అల్లాహ్ అక్కరలేనివాడు, సర్వస్తోత్రములకు అర్హుడని తెలుసుకోండి.
2:268 الشَّيْطَانُ يَعِدُكُمُ الْفَقْرَ وَيَأْمُرُكُم بِالْفَحْشَاءِ ۖ وَاللَّهُ يَعِدُكُم مَّغْفِرَةً مِّنْهُ وَفَضْلًا ۗ وَاللَّهُ وَاسِعٌ عَلِيمٌ
షైతాన్ మీకు దారిద్య్రం గురించి భయపెడతాడు. నీతిమాలిన పనులకై పురికొల్పుతాడు. కాగా; అల్లాహ్ మిమ్మల్ని క్షమిస్తాననీ, అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అల్లాహ్ గొప్ప ఉదార స్వభావుడు, అన్నీ తెలిసినవాడు.
2:269 يُؤْتِي الْحِكْمَةَ مَن يَشَاءُ ۚ وَمَن يُؤْتَ الْحِكْمَةَ فَقَدْ أُوتِيَ خَيْرًا كَثِيرًا ۗ وَمَا يَذَّكَّرُ إِلَّا أُولُو الْأَلْبَابِ
ఆయన తాను కోరిన వారికి విజ్ఞతా వివేచనలను ప్రసాదిస్తాడు. ఎవరికి విజ్ఞతా వివేచనలు వొసగబడ్డాయో అతనికి ఎన్నో మేళ్లు వొసగబడినట్లే. హితబోధను బుద్ధిమంతులు తప్ప మరొకరు గ్రహించరు.
2:270 وَمَا أَنفَقْتُم مِّن نَّفَقَةٍ أَوْ نَذَرْتُم مِّن نَّذْرٍ فَإِنَّ اللَّهَ يَعْلَمُهُ ۗ وَمَا لِلظَّالِمِينَ مِنْ أَنصَارٍ
మీరు (దైవమార్గంలో) ఎంత ఖర్చు చేసినా, ఏ మొక్కుబడి చేసుకున్నా అల్లాహ్‌కు దాని గురించి పూర్తిగా తెలుసు. దుర్మార్గులకు సహాయం చేసే వారెవరూ లేరు.
2:271 إِن تُبْدُوا الصَّدَقَاتِ فَنِعِمَّا هِيَ ۖ وَإِن تُخْفُوهَا وَتُؤْتُوهَا الْفُقَرَاءَ فَهُوَ خَيْرٌ لَّكُمْ ۚ وَيُكَفِّرُ عَنكُم مِّن سَيِّئَاتِكُمْ ۗ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ خَبِيرٌ
ఒకవేళ మీరు బహిరంగంగా దానధర్మాలు చేసినా మంచిదే గాని, గోప్యంగా నిరుపేదలకు ఇస్తే అది మీ కొరకు ఉత్తమం. (దీనివల్ల) అల్లాహ్ మీ పాపాలను తుడిచిపెడతాడు. అల్లాహ్‌కు మీరు చేసేదంతా తెలుసు.
2:272 لَّيْسَ عَلَيْكَ هُدَاهُمْ وَلَٰكِنَّ اللَّهَ يَهْدِي مَن يَشَاءُ ۗ وَمَا تُنفِقُوا مِنْ خَيْرٍ فَلِأَنفُسِكُمْ ۚ وَمَا تُنفِقُونَ إِلَّا ابْتِغَاءَ وَجْهِ اللَّهِ ۚ وَمَا تُنفِقُوا مِنْ خَيْرٍ يُوَفَّ إِلَيْكُمْ وَأَنتُمْ لَا تُظْلَمُونَ
(ఓ ప్రవక్తా!) వారిని సన్మార్గంపై తెచ్చి నిలబెట్టే బాధ్యత నీపై లేదు. వాస్తవానికి సన్మార్గ భాగ్యాన్ని అల్లాహ్ తాను కోరిన వారికి అనుగ్రహిస్తాడు. మీరు దైవ మార్గంలో ఏ మంచి వస్తువును వ్యయపరచినా, దాని లాభాన్ని స్వయంగా మీరే పొందుతారు. కాకపోతే మీరు కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసమే ఖర్చు చేయాలి. మీరు ఎంత ఖర్చుచేసినా దాని పూర్తి ప్రతిఫలం మీకు ఇవ్వబడుతుంది. మీకు ఎంతమాత్రం అన్యాయం జరగదు.
2:273 لِلْفُقَرَاءِ الَّذِينَ أُحْصِرُوا فِي سَبِيلِ اللَّهِ لَا يَسْتَطِيعُونَ ضَرْبًا فِي الْأَرْضِ يَحْسَبُهُمُ الْجَاهِلُ أَغْنِيَاءَ مِنَ التَّعَفُّفِ تَعْرِفُهُم بِسِيمَاهُمْ لَا يَسْأَلُونَ النَّاسَ إِلْحَافًا ۗ وَمَا تُنفِقُوا مِنْ خَيْرٍ فَإِنَّ اللَّهَ بِهِ عَلِيمٌ
దైవమార్గంలో నిమగ్నులైన కారణంగా , (బ్రతుకు తెరువు కోసం) భూమిలో సంచరించే వీలులేని నిరుపేదలు వాస్తవానికి మీ ధన సహాయానికి అర్హులు. వారి నిజస్థితిని గురించి తెలియనివారు, (ఆత్మాభిమానం వల్ల) వారెవరినీ అడగకపోవటం చూసి, వారిని అవసరాలు లేనివారుగా తలపోస్తారు. మీరు వారి వాలకాన్ని చూసి వాస్తవస్థితిని ఊహించవచ్చు. తమకు సహాయం చెయ్యమంటూ వారు ప్రజల వెంటపడరు. (అటువంటి త్యాగధనుల సహాయార్థం) మీరు ఎంత సొమ్ము వెచ్చించినా, నిశ్చయంగా దాని గురించి అల్లాహ్‌కు తెలుసు.
2:274 الَّذِينَ يُنفِقُونَ أَمْوَالَهُم بِاللَّيْلِ وَالنَّهَارِ سِرًّا وَعَلَانِيَةً فَلَهُمْ أَجْرُهُمْ عِندَ رَبِّهِمْ وَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ
ఎవరయితే తమ సిరిసంపదలను రేయింబవళ్లు రహస్యంగానూ, బహిరంగంగానూ ఖర్చుచేస్తారో వారి కొరకు వారి ప్రభువు వద్ద (గొప్ప) పుణ్యఫలం ఉంది. వారికెలాంటి భయంగానీ, దుఃఖంగానీ ఉండదు.
2:275 الَّذِينَ يَأْكُلُونَ الرِّبَا لَا يَقُومُونَ إِلَّا كَمَا يَقُومُ الَّذِي يَتَخَبَّطُهُ الشَّيْطَانُ مِنَ الْمَسِّ ۚ ذَٰلِكَ بِأَنَّهُمْ قَالُوا إِنَّمَا الْبَيْعُ مِثْلُ الرِّبَا ۗ وَأَحَلَّ اللَّهُ الْبَيْعَ وَحَرَّمَ الرِّبَا ۚ فَمَن جَاءَهُ مَوْعِظَةٌ مِّن رَّبِّهِ فَانتَهَىٰ فَلَهُ مَا سَلَفَ وَأَمْرُهُ إِلَى اللَّهِ ۖ وَمَنْ عَادَ فَأُولَٰئِكَ أَصْحَابُ النَّارِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ
వడ్డీ సొమ్ము తినేవారు షైతాను పట్టటంవల్ల ఉన్మాది అయినవాని లాగానే నిలబడతారు. వారికీ దుర్గతి పట్టడానికి కారణం “వ్యాపారం కూడా వడ్డీ లాంటిదే కదా!” అని వారు అనటమే. వాస్తవానికి అల్లాహ్ వ్యాపారాన్ని ధర్మసమ్మతం చేసి, వడ్డీని నిషేధించాడు. కనుక ఎవరు తన ప్రభువు వద్దనుంచి వచ్చిన హితబోధను విని వడ్డీని మానుకున్నాడో, అతడు గతంలో పుచ్చుకున్నదేదో పుచ్చుకున్నాడు. అతని వ్యవహారం దైవా ధీనం. ఇకమీదట కూడా దీనికి పాల్పడినవారే నరకవాసులు. వారు కలకాలం అందులో పడి ఉంటారు.
2:276 يَمْحَقُ اللَّهُ الرِّبَا وَيُرْبِي الصَّدَقَاتِ ۗ وَاللَّهُ لَا يُحِبُّ كُلَّ كَفَّارٍ أَثِيمٍ
అల్లాహ్ వడ్డీని హరింపజేస్తాడు, దానధర్మాలను పెంచుతాడు. మేలును మరిచేవారిని, పాపిష్టులను అల్లాహ్ సుతరామూ ప్రేమించడు.
2:277 إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَأَقَامُوا الصَّلَاةَ وَآتَوُا الزَّكَاةَ لَهُمْ أَجْرُهُمْ عِندَ رَبِّهِمْ وَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ
విశ్వసించి (సున్నత్ ప్రకారం) సత్కార్యాలు చేసేవారికి, నమాజులను నెలకొల్పేవారికి, జకాత్‌ను చెల్లించేవారికి తమ ప్రభువు వద్ద పుణ్యఫలం ఉంది. వారికెలాంటి భయంగానీ, చీకూ చింతగానీ ఉండవు.
2:278 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَذَرُوا مَا بَقِيَ مِنَ الرِّبَا إِن كُنتُم مُّؤْمِنِينَ
ఓ విశ్వసించినవారలారా! అల్లాహ్‌కు భయపడండి. మీరు నికార్సయిన విశ్వాసులే అయినట్లయితే మిగిలి వున్న వడ్డీని విడిచి పెట్టండి.
2:279 فَإِن لَّمْ تَفْعَلُوا فَأْذَنُوا بِحَرْبٍ مِّنَ اللَّهِ وَرَسُولِهِ ۖ وَإِن تُبْتُمْ فَلَكُمْ رُءُوسُ أَمْوَالِكُمْ لَا تَظْلِمُونَ وَلَا تُظْلَمُونَ
ఒకవేళ మీరు గనక అలా చేయనట్లయితే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తతో యుద్ధానికి సిద్ధంకండి. ఒకవేళ మీరు పశ్చాత్తాపం చెందితే మీ అసలు సొమ్ము మీకే ఉంటుంది. మీరూ ఒకరికి అన్యాయం చేయకూడదు. మీకు కూడా అన్యాయం జరుగకూడదు.
2:280 وَإِن كَانَ ذُو عُسْرَةٍ فَنَظِرَةٌ إِلَىٰ مَيْسَرَةٍ ۚ وَأَن تَصَدَّقُوا خَيْرٌ لَّكُمْ ۖ إِن كُنتُمْ تَعْلَمُونَ
ఒకవేళ రుణగ్రస్తుడు యిబ్బందుల్లో ఉంటే అతని పరిస్థితి మెరుగుపడేవరకూ అతనికి గడువు ఇవ్వాలి. లేదా మన్నించి దానంగా వదలి పెట్టండి. మీరే గనక తెలుసుకోగలిగితే ఇది మీ కొరకు శ్రేయోదాయకం.
2:281 وَاتَّقُوا يَوْمًا تُرْجَعُونَ فِيهِ إِلَى اللَّهِ ۖ ثُمَّ تُوَفَّىٰ كُلُّ نَفْسٍ مَّا كَسَبَتْ وَهُمْ لَا يُظْلَمُونَ
మీరు అంతా అల్లాహ్ వైపుకు మరలింపబడే రోజుకు భయపడండి. ఆ తర్వాత ప్రతి ఒక్కరికీ తాను చేసుకున్న కర్మలకు పూర్తి ప్రతిఫలం వొసగబడుతుంది. ఎవరికీ ఎలాంటి అన్యాయం జరగదు.
2:282 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا تَدَايَنتُم بِدَيْنٍ إِلَىٰ أَجَلٍ مُّسَمًّى فَاكْتُبُوهُ ۚ وَلْيَكْتُب بَّيْنَكُمْ كَاتِبٌ بِالْعَدْلِ ۚ وَلَا يَأْبَ كَاتِبٌ أَن يَكْتُبَ كَمَا عَلَّمَهُ اللَّهُ ۚ فَلْيَكْتُبْ وَلْيُمْلِلِ الَّذِي عَلَيْهِ الْحَقُّ وَلْيَتَّقِ اللَّهَ رَبَّهُ وَلَا يَبْخَسْ مِنْهُ شَيْئًا ۚ فَإِن كَانَ الَّذِي عَلَيْهِ الْحَقُّ سَفِيهًا أَوْ ضَعِيفًا أَوْ لَا يَسْتَطِيعُ أَن يُمِلَّ هُوَ فَلْيُمْلِلْ وَلِيُّهُ بِالْعَدْلِ ۚ وَاسْتَشْهِدُوا شَهِيدَيْنِ مِن رِّجَالِكُمْ ۖ فَإِن لَّمْ يَكُونَا رَجُلَيْنِ فَرَجُلٌ وَامْرَأَتَانِ مِمَّن تَرْضَوْنَ مِنَ الشُّهَدَاءِ أَن تَضِلَّ إِحْدَاهُمَا فَتُذَكِّرَ إِحْدَاهُمَا الْأُخْرَىٰ ۚ وَلَا يَأْبَ الشُّهَدَاءُ إِذَا مَا دُعُوا ۚ وَلَا تَسْأَمُوا أَن تَكْتُبُوهُ صَغِيرًا أَوْ كَبِيرًا إِلَىٰ أَجَلِهِ ۚ ذَٰلِكُمْ أَقْسَطُ عِندَ اللَّهِ وَأَقْوَمُ لِلشَّهَادَةِ وَأَدْنَىٰ أَلَّا تَرْتَابُوا ۖ إِلَّا أَن تَكُونَ تِجَارَةً حَاضِرَةً تُدِيرُونَهَا بَيْنَكُمْ فَلَيْسَ عَلَيْكُمْ جُنَاحٌ أَلَّا تَكْتُبُوهَا ۗ وَأَشْهِدُوا إِذَا تَبَايَعْتُمْ ۚ وَلَا يُضَارَّ كَاتِبٌ وَلَا شَهِيدٌ ۚ وَإِن تَفْعَلُوا فَإِنَّهُ فُسُوقٌ بِكُمْ ۗ وَاتَّقُوا اللَّهَ ۖ وَيُعَلِّمُكُمُ اللَّهُ ۗ وَاللَّهُ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ
ఓ విశ్వాసులారా! మీరు పరస్పరం ఒక నిర్ణీత గడువు కొరకు అప్పు వ్యవహారం చేసుకుంటున్నప్పుడు దాన్ని (స్పష్టంగా) వ్రాసుకోండి. వ్రాసేవాడు ఈ వ్యవహారాన్ని మీ మధ్య న్యాయబద్ధంగా వ్రాయాలి. అల్లాహ్ ఎవడికైతే వ్రాయటం నేర్పాడో, అతను వ్రాయటానికి నిరాకరించకూడదు. అతడు వ్రాయాలి. రుణం పుచ్చుకున్న వ్యక్తి విషయాన్ని విడమరచి వ్రాయించాలి. ఈ విషయంలో అతను తన ప్రభువైన అల్లాహ్‌కు భయపడాలి. పుచ్చుకున్న దాన్ని తగ్గించి వ్రాయించకూడదు. ఒకవేళ రుణ గ్రహీత అమాయకుడో, బలహీనుడో, లేక చెప్పి వ్రాయించ లేనివాడో అయి ఉంటే అతని సంరక్షకుడు న్యాయంగా వ్రాయించాలి. మీలో ఇద్దరు పురుషులను ఈ వ్యవహారానికి సాక్షులుగా పెట్టుకోండి. ఇద్దరు పురుషులు లభ్యం కానిపక్షంలో మీరిష్టపడే సాక్షులలో ఒక పురుషుణ్ణి, ఇద్దరు స్త్రీలను సాక్షులుగా పెట్టుకోండి. ఎందుకంటే వారిలో ఒకామె మరచిపోతే, రెండవ స్త్రీ మరచిపోయిన ఆమెకు జ్ఞాపకం చేయవచ్చు. సాక్ష్యం కోసం పిలువబడినప్పుడు సాక్షులు రావటానికి నిరాకరించకూడదు. నిర్ణీతకాలం కొరకు తీసుకునే అప్పు, చిన్నదైనా పెద్దదైనా దాన్ని వ్రాసుకోవటంలో మాత్రం అశ్రద్ధ చేయరాదు. అల్లాహ్ దృష్టిలో ఈ పద్ధతి ఎంతో న్యాయవంతమైనది. ఇది సాక్ష్యాన్ని స్థిరంగా ఉంచుతుంది. సందేహాలకు, (అపార్థాలకు) లోనుకాకుండా ఉండేందుకు కూడా ఇది బాగా దోహదపడుతుంది. ఒకవేళ మీ మధ్య జరిగే వ్యవహారం అప్పటికప్పుడు తేలిపోయే వ్యాపార లావాదేవీలదైతే అట్టి పరిస్థితిలో దాన్ని వ్రాసుకోకపోయినా ఫరవాలేదు. కాని క్రయ విక్రయాల సందర్భంగా కూడా సాక్షులను ఉంచుకోండి. దస్తావేజు వ్రాసేవారిని గానీ, సాక్షులను గానీ ఇరకాటంలో పెట్టరాదు (అని తెలుసుకోండి). ఒకవేళ మీరు గనక అలాచేస్తే అది నియమోల్లంఘన క్రిందికి వస్తుంది. అల్లాహ్‌కు భయపడండి. అల్లాహ్ మీకు (పద్ధతిని) నేర్పుతున్నాడు. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు.
2:283 وَإِن كُنتُمْ عَلَىٰ سَفَرٍ وَلَمْ تَجِدُوا كَاتِبًا فَرِهَانٌ مَّقْبُوضَةٌ ۖ فَإِنْ أَمِنَ بَعْضُكُم بَعْضًا فَلْيُؤَدِّ الَّذِي اؤْتُمِنَ أَمَانَتَهُ وَلْيَتَّقِ اللَّهَ رَبَّهُ ۗ وَلَا تَكْتُمُوا الشَّهَادَةَ ۚ وَمَن يَكْتُمْهَا فَإِنَّهُ آثِمٌ قَلْبُهُ ۗ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ عَلِيمٌ
ఒకవేళ మీరు ప్రయాణంలో ఉండి, వ్రాసేవాడు దొరక్క పోతే వస్తువును తాకట్టుగా పెట్టండి. ఒకరికి మరొకరి పట్ల నమ్మకం ఏర్పడినట్లయితే, తనను నమ్మి ఇచ్చిన అమానతును అతను వాపసు చేయాలి. ఇంకా అతను తన ప్రభువైన అల్లాహ్‌కు భయపడుతూ మసలుకోవాలి. మీరు సాక్ష్యాన్ని దాచకండి. సాక్ష్యాన్ని దాచేవాని హృదయం పాపభూయిష్టమైనది. మీరు చేసేదంతా అల్లాహ్‌కు తెలుసు.
2:284 لِّلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۗ وَإِن تُبْدُوا مَا فِي أَنفُسِكُمْ أَوْ تُخْفُوهُ يُحَاسِبْكُم بِهِ اللَّهُ ۖ فَيَغْفِرُ لِمَن يَشَاءُ وَيُعَذِّبُ مَن يَشَاءُ ۗ وَاللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
ఆకాశాలలో, భూమిలో ఉన్న ప్రతి వస్తువూ అల్లాహ్‌దే. మీ మనసులలో ఉన్న దాన్ని మీరు వెల్లడించినా లేక దాచిపెట్టినా అల్లాహ్ మీ నుండి దాని లెక్క తీసుకుంటాడు. ఆ తరువాత ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు, తాను కోరిన వారిని శిక్షిస్తాడు. అల్లాహ్‌కు అన్నింటిపై అధికారం ఉంది.
2:285 آمَنَ الرَّسُولُ بِمَا أُنزِلَ إِلَيْهِ مِن رَّبِّهِ وَالْمُؤْمِنُونَ ۚ كُلٌّ آمَنَ بِاللَّهِ وَمَلَائِكَتِهِ وَكُتُبِهِ وَرُسُلِهِ لَا نُفَرِّقُ بَيْنَ أَحَدٍ مِّن رُّسُلِهِ ۚ وَقَالُوا سَمِعْنَا وَأَطَعْنَا ۖ غُفْرَانَكَ رَبَّنَا وَإِلَيْكَ الْمَصِيرُ
తన ప్రభువు తరఫున అవతరింపజేయబడిన దానిని ప్రవక్త విశ్వసించాడు. దాన్ని విశ్వాసులు కూడా (సత్యమని నమ్మారు). వారంతా అల్లాహ్‌ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలనూ విశ్వసించారు. “మేము ఆయన (పంపిన) ప్రవక్తల మధ్య ఎలాంటి విచక్షణను, భేదభావాన్నీ పాటించము” (అని వారు చెబుతారు). “మేము విన్నాము. విధేయులం అయ్యాము. మా ప్రభూ! మేము నీ క్షమాభిక్షను అర్థిస్తున్నాము. కడకు మేము మరలి రావలసింది నీ వద్దకే” అని అంటారు.
2:286 لَا يُكَلِّفُ اللَّهُ نَفْسًا إِلَّا وُسْعَهَا ۚ لَهَا مَا كَسَبَتْ وَعَلَيْهَا مَا اكْتَسَبَتْ ۗ رَبَّنَا لَا تُؤَاخِذْنَا إِن نَّسِينَا أَوْ أَخْطَأْنَا ۚ رَبَّنَا وَلَا تَحْمِلْ عَلَيْنَا إِصْرًا كَمَا حَمَلْتَهُ عَلَى الَّذِينَ مِن قَبْلِنَا ۚ رَبَّنَا وَلَا تُحَمِّلْنَا مَا لَا طَاقَةَ لَنَا بِهِ ۖ وَاعْفُ عَنَّا وَاغْفِرْ لَنَا وَارْحَمْنَا ۚ أَنتَ مَوْلَانَا فَانصُرْنَا عَلَى الْقَوْمِ الْكَافِرِينَ
అల్లాహ్ ఏ ప్రాణిపైనా దాని శక్తికి మించిన భారం వేయడు. అది ఏ పుణ్యాన్ని సంపాదించినా దానికే లభిస్తుంది. మరి అది ఏ పాపాన్ని మూటగట్టుకున్నా దాని ఫలితాన్ని అది చవి చూస్తుంది. (ఇలా ప్రార్థిస్తూ ఉండండి): “ఓ మా ప్రభూ! మేము మరచిపోయినా, లేక మేము పొరబడినా మమ్మల్ని నిలదీయకు. మా ప్రభూ! మాకు పూర్వం గతించిన వారిపై వేసినటువంటి భారాన్ని మాపై వేయకు. మా ప్రభూ! మేము మోయలేనటువంటి బరువును మాపై మోపకు. మమ్మల్ని మన్నించి వదలిపెట్టు. మాకు క్షమాభిక్ష పెట్టు. మాపై దయజూపు. నీవే మా సంరక్షకుడవు. అందుచేత అవిశ్వాసులకు వ్యతిరేకంగా మాకు సహాయపడు.”
3. సూరా ఆలి ఇమ్రాన్
3:1 الم
అలిఫ్ లామ్ మీమ్.
3:2 اللَّهُ لَا إِلَٰهَ إِلَّا هُوَ الْحَيُّ الْقَيُّومُ
అల్లాహ్ – ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. ఆయన సజీవుడు, సర్వసృష్టికి మూలాధారం.
3:3 نَزَّلَ عَلَيْكَ الْكِتَابَ بِالْحَقِّ مُصَدِّقًا لِّمَا بَيْنَ يَدَيْهِ وَأَنزَلَ التَّوْرَاةَ وَالْإِنجِيلَ
(ఓ ప్రవక్తా!) ఆయన నీపై సత్యంతోపాటు ఈ గ్రంథాన్ని అవతరింపజేశాడు. దానికి పూర్వం వచ్చిన గ్రంథాలను అది ధృవపరుస్తుంది. ఆయనే తౌరాతు, ఇన్జీలు గ్రంథాలను అవతరింపజేశాడు,
3:4 مِن قَبْلُ هُدًى لِّلنَّاسِ وَأَنزَلَ الْفُرْقَانَ ۗ إِنَّ الَّذِينَ كَفَرُوا بِآيَاتِ اللَّهِ لَهُمْ عَذَابٌ شَدِيدٌ ۗ وَاللَّهُ عَزِيزٌ ذُو انتِقَامٍ
ఇంతకు మునుపు ప్రజల కొరకు మార్గదర్శకత్వంగా. ఇంకా గీటురాయి (ఖుర్ఆన్)ని కూడా ఆయనే అవతరింపజేశాడు. అల్లాహ్ ఆయతులను తిరస్కరించిన వారికి కఠినశిక్ష పడటం ఖాయం. అల్లాహ్ సర్వాధిక్యుడు. ప్రతీకారం చేసేవాడూను.
3:5 إِنَّ اللَّهَ لَا يَخْفَىٰ عَلَيْهِ شَيْءٌ فِي الْأَرْضِ وَلَا فِي السَّمَاءِ
నిశ్చయంగా – భూమ్యాకాశాలలోని ఏ వస్తువూ అల్లాహ్‌కు గోప్యంగా లేదు.
3:6 هُوَ الَّذِي يُصَوِّرُكُمْ فِي الْأَرْحَامِ كَيْفَ يَشَاءُ ۚ لَا إِلَٰهَ إِلَّا هُوَ الْعَزِيزُ الْحَكِيمُ
ఆయనే తాను కోరిన విధంగా మాతృ గర్భాల్లో మీ రూపురేఖలను మలుస్తాడు. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ఆయన శక్తి సంపన్నుడు, వివేక సంపన్నుడు కూడాను.
3:7 هُوَ الَّذِي أَنزَلَ عَلَيْكَ الْكِتَابَ مِنْهُ آيَاتٌ مُّحْكَمَاتٌ هُنَّ أُمُّ الْكِتَابِ وَأُخَرُ مُتَشَابِهَاتٌ ۖ فَأَمَّا الَّذِينَ فِي قُلُوبِهِمْ زَيْغٌ فَيَتَّبِعُونَ مَا تَشَابَهَ مِنْهُ ابْتِغَاءَ الْفِتْنَةِ وَابْتِغَاءَ تَأْوِيلِهِ ۗ وَمَا يَعْلَمُ تَأْوِيلَهُ إِلَّا اللَّهُ ۗ وَالرَّاسِخُونَ فِي الْعِلْمِ يَقُولُونَ آمَنَّا بِهِ كُلٌّ مِّنْ عِندِ رَبِّنَا ۗ وَمَا يَذَّكَّرُ إِلَّا أُولُو الْأَلْبَابِ
నీపై గ్రంథాన్ని అవతరింపజేసినవాడు ఆయనే. అందులో సుస్పష్టమైన (ముహ్కమాత్) వచనాలున్నాయి. అవి గ్రంథానికి మూలం. మరికొన్ని బహువిధ భావంతో కూడిన (ముతషాబిహాత్) వచనాలున్నాయి. హృదయాలలో వక్రత ఉన్న వారు అందులోని బహువిధ భావ వచనాల (ముతషాబిహాత్) వెంట పడి (ప్రజలను) భ్రష్టుపట్టించటానికి ప్రయత్నిస్తారు. తమ ఉద్దేశాలకనుగుణంగా తాత్పర్యాలు తీస్తారు. నిజానికి వాటి వాస్తవికత అల్లాహ్‌కు తప్ప వేరెవరికీ తెలీదు. అయితే జ్ఞానంలో పరిపక్వత పొందినవారు మాత్రం, ”మేము వీటిని విశ్వసించాము. ఇవన్నీ మా ప్రభువు తరఫు నుంచి వచ్చినవే” అని అంటారు. వాస్తవానికి బుద్ధీ జ్ఞానాలు కలవారు మాత్రమే హితబోధను గ్రహిస్తారు.
3:8 رَبَّنَا لَا تُزِغْ قُلُوبَنَا بَعْدَ إِذْ هَدَيْتَنَا وَهَبْ لَنَا مِن لَّدُنكَ رَحْمَةً ۚ إِنَّكَ أَنتَ الْوَهَّابُ
(వారు ఇలా వేడుకుంటూ ఉంటారు:) ”మా ప్రభూ! సన్మార్గ భాగ్యం ప్రసాదించిన తరువాత మా హృదయాలలో వక్రతను రానీయకు. నీ వద్ద నుంచి మాకు కారుణ్యాన్ని ప్రసాదించు. నిశ్చయంగా నీవే గొప్ప దాతవు.”
3:9 رَبَّنَا إِنَّكَ جَامِعُ النَّاسِ لِيَوْمٍ لَّا رَيْبَ فِيهِ ۚ إِنَّ اللَّهَ لَا يُخْلِفُ الْمِيعَادَ
”మా ప్రభూ! నిశ్చయంగా నీవు జనులందరినీ ఒక రోజు సమీకరిస్తావు. ఆ రోజు రావటంలో సందేహానికి ఎలాంటి ఆస్కారం లేదు, అల్లాహ్ ఎట్టి పరిస్థితిలోనూ వాగ్దానానికి విరుద్ధంగా వ్యవహరించడు.”
3:10 إِنَّ الَّذِينَ كَفَرُوا لَن تُغْنِيَ عَنْهُمْ أَمْوَالُهُمْ وَلَا أَوْلَادُهُم مِّنَ اللَّهِ شَيْئًا ۖ وَأُولَٰئِكَ هُمْ وَقُودُ النَّارِ
అవిశ్వాసులను వారి సిరిసంపదలు గానీ, వారి సంతానం గానీ అల్లాహ్ (శిక్ష) నుంచి విడిపించటంలో ఏమాత్రం ఉపయోగపడవు. నరకానికి ఇంధనం అయ్యేవారు వీరే.
3:11 كَدَأْبِ آلِ فِرْعَوْنَ وَالَّذِينَ مِن قَبْلِهِمْ ۚ كَذَّبُوا بِآيَاتِنَا فَأَخَذَهُمُ اللَّهُ بِذُنُوبِهِمْ ۗ وَاللَّهُ شَدِيدُ الْعِقَابِ
ఫిరౌను జనులకు, వారికి పూర్వం గతించిన వారికి పట్టిన గతే వీరికీ పడుతుంది. (ఎందుకంటే) వారు మా వచనాలను ధిక్కరించారు. మరి అల్లాహ్ కూడా వారిని వారి పాపాలకుగాను పట్టుకున్నాడు. అల్లాహ్ తీవ్రంగా దండించేవాడు సుమా!
3:12 قُل لِّلَّذِينَ كَفَرُوا سَتُغْلَبُونَ وَتُحْشَرُونَ إِلَىٰ جَهَنَّمَ ۚ وَبِئْسَ الْمِهَادُ
(ఓ ప్రవక్తా!) అవిశ్వాసులతో చెప్పు: ”త్వరలోనే మీరు ఓటమి పాలవుతారు. నరకం వైపుకు సమీకరించబడతారు. అది అత్యంత చెడ్డ నివాస స్థలం.”
3:13 قَدْ كَانَ لَكُمْ آيَةٌ فِي فِئَتَيْنِ الْتَقَتَا ۖ فِئَةٌ تُقَاتِلُ فِي سَبِيلِ اللَّهِ وَأُخْرَىٰ كَافِرَةٌ يَرَوْنَهُم مِّثْلَيْهِمْ رَأْيَ الْعَيْنِ ۚ وَاللَّهُ يُؤَيِّدُ بِنَصْرِهِ مَن يَشَاءُ ۗ إِنَّ فِي ذَٰلِكَ لَعِبْرَةً لِّأُولِي الْأَبْصَارِ
ముఖాముఖీ అయిన ఆ రెండు వర్గాలలో మీ కోసం నిశ్చయంగా గుణపాఠ సూచన ఉంది. వాటిలో ఒక వర్గం దైవ మార్గంలో పోరాడుతూ ఉండగా, రెండోది అవిశ్వాసుల వర్గం. వారు తమకన్నా రెండింతలుండటాన్ని వారు స్వయంగా తమ కళ్ళతో తిలకించారు. అల్లాహ్ తాను తలచిన వారికి తన సహాయంతో బలం చేకూర్చుతాడు. కళ్ళున్న వారికోసం ఇందులో గొప్ప గుణపాఠం ఉంది.
3:14 زُيِّنَ لِلنَّاسِ حُبُّ الشَّهَوَاتِ مِنَ النِّسَاءِ وَالْبَنِينَ وَالْقَنَاطِيرِ الْمُقَنطَرَةِ مِنَ الذَّهَبِ وَالْفِضَّةِ وَالْخَيْلِ الْمُسَوَّمَةِ وَالْأَنْعَامِ وَالْحَرْثِ ۗ ذَٰلِكَ مَتَاعُ الْحَيَاةِ الدُّنْيَا ۖ وَاللَّهُ عِندَهُ حُسْنُ الْمَآبِ
స్త్రీలు, కుమారులూ, పోగుచేయబడిన వెండి బంగారు రాసులూ, అచ్చువేయబడిన (మేలిజాతి) గుర్రాలు, పశువులూ, పంటపొలాలు వంటి వ్యామోహాలపై ప్రేమ, జనులకు మనోజ్ఞంగా చేయబడింది. ఇది ప్రాపంచిక జీవన సామగ్రి. మరలిపోవలసిన అత్యుత్తమ నివాసమైతే అల్లాహ్ వద్దనే ఉంది.
3:15 قُلْ أَؤُنَبِّئُكُم بِخَيْرٍ مِّن ذَٰلِكُمْ ۚ لِلَّذِينَ اتَّقَوْا عِندَ رَبِّهِمْ جَنَّاتٌ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا وَأَزْوَاجٌ مُّطَهَّرَةٌ وَرِضْوَانٌ مِّنَ اللَّهِ ۗ وَاللَّهُ بَصِيرٌ بِالْعِبَادِ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: వీటికన్నా మేలైనదేదో నేను మీకు తెలుపనా? దైవభక్తి కలవారికి వారి ప్రభువు వద్ద స్వర్గ వనాలున్నాయి. వాటి క్రింద కాలువలు ప్రవహిస్తుంటాయి. వాటిలో వారు ఎల్లకాలం ఉంటారు. పవిత్రులైన భార్యలు వారి కోసం ఉంటారు. (వీటన్నింటితో పాటు) అల్లాహ్ ప్రసన్నత వారికి ప్రాప్తిస్తుంది. అల్లాహ్ దాసులను కనిపెట్టుకొని ఉన్నాడు.
3:16 الَّذِينَ يَقُولُونَ رَبَّنَا إِنَّنَا آمَنَّا فَاغْفِرْ لَنَا ذُنُوبَنَا وَقِنَا عَذَابَ النَّارِ
వారు ఇలా వేడుకుంటారు: ”మా ప్రభూ! మేము విశ్వసించాము. కనుక మా పాపాలను క్షమించు. ఇంకా మమ్మల్ని అగ్ని శిక్ష నుంచి కాపాడు.”
3:17 الصَّابِرِينَ وَالصَّادِقِينَ وَالْقَانِتِينَ وَالْمُنفِقِينَ وَالْمُسْتَغْفِرِينَ بِالْأَسْحَارِ
వారు ఓర్పు వహిస్తారు, సదా సత్యమే పలుకుతారు. విధేయత చూపుతారు. దైవమార్గంలో ఖర్చుచేస్తారు. రాత్రి చివరి భాగంలో క్షమాభిక్షకై వేడుకుంటారు.
3:18 شَهِدَ اللَّهُ أَنَّهُ لَا إِلَٰهَ إِلَّا هُوَ وَالْمَلَائِكَةُ وَأُولُو الْعِلْمِ قَائِمًا بِالْقِسْطِ ۚ لَا إِلَٰهَ إِلَّا هُوَ الْعَزِيزُ الْحَكِيمُ
అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యదైవం లేడని స్వయంగా అల్లాహ్, ఆయన దూతలు, జ్ఞానసంపన్నులూ సాక్ష్యమిస్తున్నారు. ఆయన సమత్వం, సమతూకంతో ఈ విశ్వాన్ని నిలిపి ఉంచాడు. సర్వాధిక్యుడు, వివేచనాశీలి అయిన ఆయన తప్ప మరొకరెవరూ ఆరాధనకు అర్హులు కారు.
3:19 إِنَّ الدِّينَ عِندَ اللَّهِ الْإِسْلَامُ ۗ وَمَا اخْتَلَفَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ إِلَّا مِن بَعْدِ مَا جَاءَهُمُ الْعِلْمُ بَغْيًا بَيْنَهُمْ ۗ وَمَن يَكْفُرْ بِآيَاتِ اللَّهِ فَإِنَّ اللَّهَ سَرِيعُ الْحِسَابِ
నిస్సందేహంగా ఇస్లాం మాత్రమే అల్లాహ్ వద్ద సమ్మతమైన ధర్మం. గ్రంథంకల ప్రజలు తమ వద్దకు జ్ఞానం వచ్చేసిన పిదపనే తమలోని పరస్పర అసూయాద్వేషాల కారణంగా విభేదించుకున్నారు. అల్లాహ్ వచనాల పట్ల ఎవరు తిరస్కార వైఖరిని అవలంబించినాసరే, అల్లాహ్ చాలా తొందరగానే వారి లెక్క తేలుస్తాడు.
3:20 فَإِنْ حَاجُّوكَ فَقُلْ أَسْلَمْتُ وَجْهِيَ لِلَّهِ وَمَنِ اتَّبَعَنِ ۗ وَقُل لِّلَّذِينَ أُوتُوا الْكِتَابَ وَالْأُمِّيِّينَ أَأَسْلَمْتُمْ ۚ فَإِنْ أَسْلَمُوا فَقَدِ اهْتَدَوا ۖ وَّإِن تَوَلَّوْا فَإِنَّمَا عَلَيْكَ الْبَلَاغُ ۗ وَاللَّهُ بَصِيرٌ بِالْعِبَادِ
ఒకవేళ అప్పటికీ వారు నీతో గొడవపడితే, ”నేనూ, నా అనుచరులు దైవ విధేయతకు తలఒగ్గాము” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పేయి. ”మరి మీరు కూడా దైవాజ్ఞకు తలఒగ్గుతున్నారా?” అని గ్రంథవహులను, నిరక్షరాస్యులను అడుగు. ఒకవేళ వారేగనక ఒప్పుకున్నట్లయితే సన్మార్గ భాగ్యం పొందినట్లే. ఒకవేళ వారు విముఖతను ప్రదర్శిస్తే, సందేశాన్ని అందజేయటం వరకే నీ బాధ్యత. అల్లాహ్ తన దాసులను చూస్తూనే ఉన్నాడు.
3:21 إِنَّ الَّذِينَ يَكْفُرُونَ بِآيَاتِ اللَّهِ وَيَقْتُلُونَ النَّبِيِّينَ بِغَيْرِ حَقٍّ وَيَقْتُلُونَ الَّذِينَ يَأْمُرُونَ بِالْقِسْطِ مِنَ النَّاسِ فَبَشِّرْهُم بِعَذَابٍ أَلِيمٍ
ఎవరయితే అల్లాహ్ ఆయతులను తిరస్కరిస్తూ, అన్యాయంగా ప్రవక్తలను చంపుతూ, ప్రజల్లో న్యాయం గురించి ఆజ్ఞాపించేవారిని కూడా తుదముట్టిస్తున్నారో వారికి (ఓ ప్రవక్తా!) వ్యధాభరితమైన శిక్ష ఉందన్న శుభవార్తను వినిపించు.
3:22 أُولَٰئِكَ الَّذِينَ حَبِطَتْ أَعْمَالُهُمْ فِي الدُّنْيَا وَالْآخِرَةِ وَمَا لَهُم مِّن نَّاصِرِينَ
వారి కర్మలు ఇహపరాలలో వృధా అయిపోయాయి. వారిని ఆదుకునేవారెవరూ లేరు.
3:23 أَلَمْ تَرَ إِلَى الَّذِينَ أُوتُوا نَصِيبًا مِّنَ الْكِتَابِ يُدْعَوْنَ إِلَىٰ كِتَابِ اللَّهِ لِيَحْكُمَ بَيْنَهُمْ ثُمَّ يَتَوَلَّىٰ فَرِيقٌ مِّنْهُمْ وَهُم مُّعْرِضُونَ
గ్రంథంలోని ఒక భాగం ఇవ్వబడగా, తమ పరస్పర వ్యవహారాల తీర్పుకోసం దైవగ్రంథం వైపునకు రండి అని పిలిచినప్పటికీ వారిలోని ఒక వర్గం ముఖం తిప్పుకుని పోవటాన్ని నీవు చూడలేదా?
3:24 ذَٰلِكَ بِأَنَّهُمْ قَالُوا لَن تَمَسَّنَا النَّارُ إِلَّا أَيَّامًا مَّعْدُودَاتٍ ۖ وَغَرَّهُمْ فِي دِينِهِم مَّا كَانُوا يَفْتَرُونَ
వారి (ఈ వైముఖ్య) ధోరణికి కారణం; ”నరకాగ్ని మమ్మల్ని లెక్కించదగిన కొన్ని రోజులు మాత్రమే కాల్చుతుంది” అని వారు చెప్పటమే. వారి ఈ మనోకల్పిత విషయాలే ధర్మం విషయంలో వారిని మోసంలో పడవేశాయి.
3:25 فَكَيْفَ إِذَا جَمَعْنَاهُمْ لِيَوْمٍ لَّا رَيْبَ فِيهِ وَوُفِّيَتْ كُلُّ نَفْسٍ مَّا كَسَبَتْ وَهُمْ لَا يُظْلَمُونَ
మరి మేము వారిని సమావేశపరచిన రోజున వారి గతేం కాను? అది రావటంలో ఎలాంటి సందేహానికి తావులేదు. అప్పుడు ప్రతి ప్రాణికీ అది సంపాదించుకున్న దాని పూర్తి ప్రతిఫలం ఇవ్వబడుతుంది. ఎవరికీ ఎలాంటి అన్యాయం జరగదు.
3:26 قُلِ اللَّهُمَّ مَالِكَ الْمُلْكِ تُؤْتِي الْمُلْكَ مَن تَشَاءُ وَتَنزِعُ الْمُلْكَ مِمَّن تَشَاءُ وَتُعِزُّ مَن تَشَاءُ وَتُذِلُّ مَن تَشَاءُ ۖ بِيَدِكَ الْخَيْرُ ۖ إِنَّكَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
(ఓ ముహమ్మద్!) ఈ విధంగా పలుకు: ”ఓ అల్లాహ్! విశ్వ రాజ్యాధిపతీ! నీవు కోరినవారికి రాజ్యాధికారం ఇస్తావు. నీవు కోరినవారి నుండి రాజ్యాన్ని లాక్కుంటావు. నీవు కోరిన వారికి గౌరవమొసగుతావు. నీవు కోరిన వారిని పరాభవానికి గురి చేస్తావు. సమస్త మేళ్లూ నీ చేతిలోనే ఉన్నాయి. నిశ్చయంగా నీవు ప్రతి వస్తువుపైన అధికారం కలవాడవు.
3:27 تُولِجُ اللَّيْلَ فِي النَّهَارِ وَتُولِجُ النَّهَارَ فِي اللَّيْلِ ۖ وَتُخْرِجُ الْحَيَّ مِنَ الْمَيِّتِ وَتُخْرِجُ الْمَيِّتَ مِنَ الْحَيِّ ۖ وَتَرْزُقُ مَن تَشَاءُ بِغَيْرِ حِسَابٍ
నువ్వే రాత్రిని పగటిలోనికి ప్రవేశింపజేస్తావు, పగటిని రాత్రి లోనికి తీసుకెళతావు. నువ్వే నిర్జీవమైన వాటి నుంచి జీవమున్న వాటిని తీస్తున్నావు, మరి నువ్వే జీవమున్న వాటి నుంచి నిర్జీవమైన వాటిని వెలికితీస్తున్నావు. ఇంకా నీవు కోరిన వారికి లెక్కలేనంత ఉపాధిని ఇస్తావు.”
3:28 لَّا يَتَّخِذِ الْمُؤْمِنُونَ الْكَافِرِينَ أَوْلِيَاءَ مِن دُونِ الْمُؤْمِنِينَ ۖ وَمَن يَفْعَلْ ذَٰلِكَ فَلَيْسَ مِنَ اللَّهِ فِي شَيْءٍ إِلَّا أَن تَتَّقُوا مِنْهُمْ تُقَاةً ۗ وَيُحَذِّرُكُمُ اللَّهُ نَفْسَهُ ۗ وَإِلَى اللَّهِ الْمَصِيرُ
విశ్వాసులు తమ తోటి విశ్వాసులను వదలి అవిశ్వాసులను స్నేహితులుగా చేసుకోరాదు. అలా చేసేవాడు ఏ విషయంలోనూ అల్లాహ్‌తో సంబంధం లేనివాడు. అయితే ఏ విధంగా నయినా వారి కీడు నుంచి రక్షణ పొందే ఉద్దేశ్యంతో మీరు మైత్రికోసం ప్రయత్నిస్తే అది వేరే విషయం. అల్లాహ్ తనకు మాత్రమే భయపడవలసిందిగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. కడకు (మీరు) మరలిపోవలసింది అల్లాహ్ వద్దకే.
3:29 قُلْ إِن تُخْفُوا مَا فِي صُدُورِكُمْ أَوْ تُبْدُوهُ يَعْلَمْهُ اللَّهُ ۗ وَيَعْلَمُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۗ وَاللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: ”మీరు మీ గుండెల్లోని మాటలను దాచినా లేక వ్యక్తపరచినా – వాటన్నింటినీ అల్లాహ్ తెలుసుకుంటాడు. భూమ్యాకాశాలలో ఉన్నవన్నీ ఆయనకు తెలుసు. అల్లాహ్ సర్వాన్నీ చేయగల సమర్థుడు.”
3:30 يَوْمَ تَجِدُ كُلُّ نَفْسٍ مَّا عَمِلَتْ مِنْ خَيْرٍ مُّحْضَرًا وَمَا عَمِلَتْ مِن سُوءٍ تَوَدُّ لَوْ أَنَّ بَيْنَهَا وَبَيْنَهُ أَمَدًا بَعِيدًا ۗ وَيُحَذِّرُكُمُ اللَّهُ نَفْسَهُ ۗ وَاللَّهُ رَءُوفٌ بِالْعِبَادِ
ఆ రోజు ప్రతి వ్యక్తీ తాను చేసుకున్న పుణ్యాన్నీ, తాను చేసిన పాపాన్నీ తన ముందు చూసుకుంటాడు. తనకూ – తన పాపానికీ మధ్య ఎంతో దూరం ఉంటే బావుండేదే! అని కాంక్షిస్తాడు. అల్లాహ్ తన గురించి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. అల్లాహ్ తన దాసుల పట్ల అమితమైన వాత్సల్యం గలవాడు.
3:31 قُلْ إِن كُنتُمْ تُحِبُّونَ اللَّهَ فَاتَّبِعُونِي يُحْبِبْكُمُ اللَّهُ وَيَغْفِرْ لَكُمْ ذُنُوبَكُمْ ۗ وَاللَّهُ غَفُورٌ رَّحِيمٌ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : ”మీకు నిజంగానే అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే మీరు నన్ను అనుసరించండి. (తత్ఫలితంగా) అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు. మీ పాపాలను మన్నిస్తాడు. ఆయన అమితంగా క్షమించేవాడు, అపారంగా కనికరించేవాడు.”
3:32 قُلْ أَطِيعُوا اللَّهَ وَالرَّسُولَ ۖ فَإِن تَوَلَّوْا فَإِنَّ اللَّهَ لَا يُحِبُّ الْكَافِرِينَ
ఇంకా వారికి చెప్పు : ”మీరు అల్లాహ్కూ, ప్రవక్తకూ విధేయులై ఉండండి.” ఒకవేళ వారు విముఖత చూపితే అల్లాహ్ తిరస్కారులను ఏ మాత్రం ఇష్టపడడు.
3:33 إِنَّ اللَّهَ اصْطَفَىٰ آدَمَ وَنُوحًا وَآلَ إِبْرَاهِيمَ وَآلَ عِمْرَانَ عَلَى الْعَالَمِينَ
నిశ్చయంగా అల్లాహ్ ఆదమ్నూ, నూహ్‌నూ, ఇబ్రాహీం పరివారాన్నీ, ఇమ్రాన్ సంతతినీ సమస్త లోకవాసులపై (వారికి ప్రాధాన్యత ఇచ్చి తన సందేశం కోసం) ఎన్నుకున్నాడు.
3:34 ذُرِّيَّةً بَعْضُهَا مِن بَعْضٍ ۗ وَاللَّهُ سَمِيعٌ عَلِيمٌ
వారిలో కొందరు మరికొందరి సంతానం. అల్లాహ్ అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు.
3:35 إِذْ قَالَتِ امْرَأَتُ عِمْرَانَ رَبِّ إِنِّي نَذَرْتُ لَكَ مَا فِي بَطْنِي مُحَرَّرًا فَتَقَبَّلْ مِنِّي ۖ إِنَّكَ أَنتَ السَّمِيعُ الْعَلِيمُ
(ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేయి,) ఇమ్రాను భార్య ఇలా వేడుకున్నది: ”ఓ నా ప్రభూ! నా గర్భంలో ఉన్న దానిని నీ సేవ కోసం అంకితం చేయాలని మొక్కుకున్నాను. నీవు నా తరఫున దీనిని స్వీకరించు. నిస్సందేహంగా నీవు సర్వం వినేవాడవు, సర్వం తెలిసినవాడవు.”
3:36 فَلَمَّا وَضَعَتْهَا قَالَتْ رَبِّ إِنِّي وَضَعْتُهَا أُنثَىٰ وَاللَّهُ أَعْلَمُ بِمَا وَضَعَتْ وَلَيْسَ الذَّكَرُ كَالْأُنثَىٰ ۖ وَإِنِّي سَمَّيْتُهَا مَرْيَمَ وَإِنِّي أُعِيذُهَا بِكَ وَذُرِّيَّتَهَا مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ
తరువాత ఆమె ప్రసవించినప్పుడు, ”ప్రభూ! నాకు ఆడపిల్ల కలిగినదే!” అని విన్నవించుకుంది. ఆమె కన్న సంతానం ఏదో అల్లాహ్‌కు బాగా తెలుసు. మగ పిల్లవాడు ఆడపిల్ల వంటివాడు కాడు. ”నేను ఈ పాపకు మర్యమ్ అని పేరు పెట్టాను. నేను ఈమెనూ, ఈమె సంతానాన్ని శాపగ్రస్తుడైన షైతాన్ బారి నుంచి రక్షణ పొందటానికి నీకు అప్పగిస్తున్నాను” అని అన్నది.
3:37 فَتَقَبَّلَهَا رَبُّهَا بِقَبُولٍ حَسَنٍ وَأَنبَتَهَا نَبَاتًا حَسَنًا وَكَفَّلَهَا زَكَرِيَّا ۖ كُلَّمَا دَخَلَ عَلَيْهَا زَكَرِيَّا الْمِحْرَابَ وَجَدَ عِندَهَا رِزْقًا ۖ قَالَ يَا مَرْيَمُ أَنَّىٰ لَكِ هَٰذَا ۖ قَالَتْ هُوَ مِنْ عِندِ اللَّهِ ۖ إِنَّ اللَّهَ يَرْزُقُ مَن يَشَاءُ بِغَيْرِ حِسَابٍ
అంతే! ఆమె ప్రభువు ఆ పసిపాపను ఉత్తమరీతిలో స్వీకరించి, అత్యుత్తమ రీతిలో ఆమెను పోషించాడు. ఆమె బాగోగులు చూసే బాధ్యతను జకరియ్యాకు అప్పగించాడు. జకరియ్యా ఆమె కుటీరానికి వెళ్ళినప్పుడల్లా, ఆమె వద్ద ఆహార పదార్థాలు కనిపించేవి. ”మర్యమ్! ఇవి నీ వద్దకు ఎక్కడి నుంచి వచ్చాయి?” అని ఆయన అడిగితే, ”అల్లాహ్ వద్ద నుంచి” అని ఆమె చెప్పేది. నిశ్చయంగా అల్లాహ్ తాను కోరిన వారికి లెక్క లేనంతగా ఉపాధిని ప్రసాదిస్తాడు.
3:38 هُنَالِكَ دَعَا زَكَرِيَّا رَبَّهُ ۖ قَالَ رَبِّ هَبْ لِي مِن لَّدُنكَ ذُرِّيَّةً طَيِّبَةً ۖ إِنَّكَ سَمِيعُ الدُّعَاءِ
అక్కడే జకరియ్యా (అలైహిస్సలాం) తన ప్రభువును వేడుకున్నాడు. ”ఓ నా ప్రభూ! నీ వద్ద నుండి నాకు మంచి సంతానాన్ని ప్రసాదించు. నిస్సందేహంగా నీవు మొరను ఆలకించేవాడవు” అని అన్నాడు.
3:39 فَنَادَتْهُ الْمَلَائِكَةُ وَهُوَ قَائِمٌ يُصَلِّي فِي الْمِحْرَابِ أَنَّ اللَّهَ يُبَشِّرُكَ بِيَحْيَىٰ مُصَدِّقًا بِكَلِمَةٍ مِّنَ اللَّهِ وَسَيِّدًا وَحَصُورًا وَنَبِيًّا مِّنَ الصَّالِحِينَ
కుటీరంలో నిలబడి నమాజు చేస్తుండగా దైవదూతలు తనను పిలిచి, ”అల్లాహ్ నీకు యహ్యా గురించిన శుభవార్త ఇస్తున్నాడు. అతడు దైవవాక్కును ధృవపరుస్తాడు. నాయకుడౌతాడు. ఇంద్రియ నిగ్రహం కలవాడు, దైవప్రవక్త, సద్వర్తనుల కోవకు చెందినవాడై ఉంటాడు” అని చెప్పారు.
3:40 قَالَ رَبِّ أَنَّىٰ يَكُونُ لِي غُلَامٌ وَقَدْ بَلَغَنِيَ الْكِبَرُ وَامْرَأَتِي عَاقِرٌ ۖ قَالَ كَذَٰلِكَ اللَّهُ يَفْعَلُ مَا يَشَاءُ
దానికి జకరియ్యా ఇలా విన్నవించుకున్నాడు : ”ప్రభూ! నేనేమో పండు ముసలివాణ్ణి. నా భార్య ఏమో గొడ్రాలు. అలాంటప్పుడు నాకు కొడుకు ఎలా పుడతాడు?” దానికి, ”అలాగే జరుగుతుంది. అల్లాహ్ తాను కోరినది చేస్తాడు” అని (దైవదూత) సమాధానం ఇచ్చాడు.
3:41 قَالَ رَبِّ اجْعَل لِّي آيَةً ۖ قَالَ آيَتُكَ أَلَّا تُكَلِّمَ النَّاسَ ثَلَاثَةَ أَيَّامٍ إِلَّا رَمْزًا ۗ وَاذْكُر رَّبَّكَ كَثِيرًا وَسَبِّحْ بِالْعَشِيِّ وَالْإِبْكَارِ
”నా ప్రభూ! దీనికి సంబంధించిన నిదర్శనం ఏదన్నా నా కొరకు నిర్ణయించు” అని అతను మనవి చేసుకోగా, ”నీ కొరకు నిదర్శనం ఏమిటంటే, మూడు రోజుల వరకూ నువ్వు సైగలు చేయటం తప్ప జనులతో మాట్లాడలేవు. నువ్వు నీ ప్రభువును అత్యధికంగా స్మరిస్తూ ఉండు. ఉదయం, సాయంత్రం ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉండు” అని చెప్పాడు.
3:42 وَإِذْ قَالَتِ الْمَلَائِكَةُ يَا مَرْيَمُ إِنَّ اللَّهَ اصْطَفَاكِ وَطَهَّرَكِ وَاصْطَفَاكِ عَلَىٰ نِسَاءِ الْعَالَمِينَ
(ఆ సందర్భాన్ని కూడా జ్ఞాపకం చేయి. మర్యమ్‌ను ఉద్దేశించి) దైవదూతలు ఇలా అన్నారు: ”ఓ మర్యమ్! అల్లాహ్ (తన సేవ కొరకు) నిన్ను ఎన్నుకున్నాడు. నిన్ను పరిశుద్ధురాలిగా చేశాడు. ప్రపంచంలోని మహిళలందరిపై నీకు ప్రాధాన్యతను ఇస్తూ నీ ఎంపిక చేశాడు.
3:43 يَا مَرْيَمُ اقْنُتِي لِرَبِّكِ وَاسْجُدِي وَارْكَعِي مَعَ الرَّاكِعِينَ
”(కనుక) ఓ మర్యమ్! నువ్వు నీ ప్రభువుకు విధేయత చూపు. ఆయనకు సజ్దా చెయ్యి (ఆయన సాన్నిధ్యంలో మోకరిల్లు). ‘రుకూ’ చేసే వారితో పాటు నువ్వూ రుకూ చెయ్యి (వినమ్రతతో ఆయన ముందు తలవంచు).”
3:44 ذَٰلِكَ مِنْ أَنبَاءِ الْغَيْبِ نُوحِيهِ إِلَيْكَ ۚ وَمَا كُنتَ لَدَيْهِمْ إِذْ يُلْقُونَ أَقْلَامَهُمْ أَيُّهُمْ يَكْفُلُ مَرْيَمَ وَمَا كُنتَ لَدَيْهِمْ إِذْ يَخْتَصِمُونَ
ఇవి అగోచర విషయాలలోనివి. (ఓ ప్రవక్తా!) వాటిని నీకు వహీ ద్వారా తెలియజేస్తున్నాము. మర్యమ్‌కు పోషకులుగా ఎవరుండాలి? అన్న విషయమై వారు తమ కలములు విసరినప్పుడు నీవు అక్కడ లేవు. (ఈ వ్యవహారంపై) వారు గొడవ పడినప్పుడు కూడా నీవు అక్కడ లేవు.
3:45 إِذْ قَالَتِ الْمَلَائِكَةُ يَا مَرْيَمُ إِنَّ اللَّهَ يُبَشِّرُكِ بِكَلِمَةٍ مِّنْهُ اسْمُهُ الْمَسِيحُ عِيسَى ابْنُ مَرْيَمَ وَجِيهًا فِي الدُّنْيَا وَالْآخِرَةِ وَمِنَ الْمُقَرَّبِينَ
దైవదూతలు, ”ఓ మర్యమ్! అల్లాహ్ నీకు తన వాక్కుకు సంబంధించిన శుభవార్తను వినిపిస్తున్నాడు. అతని పేరు మసీహ్ ఈసా బిన్ మర్యమ్. అతడు ఇహపరాలలో గౌరవనీయుడవుతాడు. అతను (అల్లాహ్) సామీప్యం పొందిన వారిలో ఒకడు.”
3:46 وَيُكَلِّمُ النَّاسَ فِي الْمَهْدِ وَكَهْلًا وَمِنَ الصَّالِحِينَ
”అతడు ఉయ్యాలలో ఉన్నప్పుడూ, పెద్దవాడైనప్పుడూను ప్రజలతో మాట్లాడతాడు. ఇంకా అతడు సద్వర్తనులలోని వాడై ఉంటాడు” అని అన్నప్పుడు;
3:47 قَالَتْ رَبِّ أَنَّىٰ يَكُونُ لِي وَلَدٌ وَلَمْ يَمْسَسْنِي بَشَرٌ ۖ قَالَ كَذَٰلِكِ اللَّهُ يَخْلُقُ مَا يَشَاءُ ۚ إِذَا قَضَىٰ أَمْرًا فَإِنَّمَا يَقُولُ لَهُ كُن فَيَكُونُ
ఆమె, ”నా ప్రభూ! నాకు పిల్లవాడు ఎలా పుడ్తాడు? నన్ను ఏ మనిషీ తాకలేదే!” అని అన్నది. ”అలాగే జరుగుతుంది. అల్లాహ్ తాను కోరినది పుట్టిస్తాడు. ఆయన ఏదైనా పనిని చేయ సంకల్పించుకుని ‘అయిపో’ అని అంటే చాలు, అది ‘అయిపోతుంది’ అని (దైవదూత ద్వారా) సమాధానం లభించింది.
3:48 وَيُعَلِّمُهُ الْكِتَابَ وَالْحِكْمَةَ وَالتَّوْرَاةَ وَالْإِنجِيلَ
అల్లాహ్ అతనికి అక్షర జ్ఞానాన్ని, వివేకాన్ని, తౌరాతు, ఇన్జీలు గ్రంథాల జ్ఞానాన్నీ నేర్పుతాడు (అని కూడా దైవదూతలు తెలిపారు).
3:49 وَرَسُولًا إِلَىٰ بَنِي إِسْرَائِيلَ أَنِّي قَدْ جِئْتُكُم بِآيَةٍ مِّن رَّبِّكُمْ ۖ أَنِّي أَخْلُقُ لَكُم مِّنَ الطِّينِ كَهَيْئَةِ الطَّيْرِ فَأَنفُخُ فِيهِ فَيَكُونُ طَيْرًا بِإِذْنِ اللَّهِ ۖ وَأُبْرِئُ الْأَكْمَهَ وَالْأَبْرَصَ وَأُحْيِي الْمَوْتَىٰ بِإِذْنِ اللَّهِ ۖ وَأُنَبِّئُكُم بِمَا تَأْكُلُونَ وَمَا تَدَّخِرُونَ فِي بُيُوتِكُمْ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً لَّكُمْ إِن كُنتُم مُّؤْمِنِينَ
ఇంకా అతను ఇస్రాయీలు వంశీయుల వైపుకు ప్రవక్తగా పంపబడతాడు. (వారినుద్దేశించి ఆయన ఇలా అంటాడు:) ”నేను మీ వద్దకు మీ ప్రభువు దగ్గరి నుంచి సూచనను తీసుకువచ్చాను. నేను మీ కోసం పక్షి ఆకారం ఉన్న ఒక మట్టి బొమ్మను తయారు చేసి అందులో ఊదుతాను. అల్లాహ్ ఆజ్ఞతో అది పక్షి అవుతుంది. ఇంకా అల్లాహ్ ఆజ్ఞతో నేను పుట్టుగ్రుడ్డిని, కుష్ఠు రోగిని బాగుచేస్తాను. మృతులను బ్రతికిస్తాను. మీరు తినే వాటినీ, మీరు మీ ఇండ్లలో నిలువచేసి ఉంచిన వాటిని గురించి (కూడా) చెబుతాను. మీరే గనక విశ్వసించేవారైతే ఇందులో మీ కొరకు గొప్ప సూచన ఉంది.”
3:50 وَمُصَدِّقًا لِّمَا بَيْنَ يَدَيَّ مِنَ التَّوْرَاةِ وَلِأُحِلَّ لَكُم بَعْضَ الَّذِي حُرِّمَ عَلَيْكُمْ ۚ وَجِئْتُكُم بِآيَةٍ مِّن رَّبِّكُمْ فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ
”ఇంకా నేను నాకు పూర్వం అవతరించిన తౌరాతు (గ్రంథము)ను ధృవపరుస్తున్నాను. మీ కొరకు నిషేధించబడిన కొన్ని వస్తువులను ధర్మసమ్మతం గావించటానికి కూడా నేను వచ్చాను. ఇంకా నేను మీ వద్దకు మీ ప్రభువు సూచనను తీసుకు వచ్చాను. కనుక మీరు అల్లాహ్‌కు భయపడండి. నాకు విధేయత చూపండి.”
3:51 إِنَّ اللَّهَ رَبِّي وَرَبُّكُمْ فَاعْبُدُوهُ ۗ هَٰذَا صِرَاطٌ مُّسْتَقِيمٌ
”నిశ్చయంగా అల్లాహ్ నాకూ ప్రభువే, మీకూ ప్రభువే. కనుక మీరంతా ఆయన్నే ఆరాధించండి. ఇదే రుజుమార్గం.”
3:52 فَلَمَّا أَحَسَّ عِيسَىٰ مِنْهُمُ الْكُفْرَ قَالَ مَنْ أَنصَارِي إِلَى اللَّهِ ۖ قَالَ الْحَوَارِيُّونَ نَحْنُ أَنصَارُ اللَّهِ آمَنَّا بِاللَّهِ وَاشْهَدْ بِأَنَّا مُسْلِمُونَ
అయితే వారిలోని తిరస్కార వైఖరిని పసిగట్టిన తరువాత ఈసా, ”అల్లాహ్ మార్గంలో నాకు తోడ్పడేవారెవరు?” అని ప్రశ్నించగా, హవారీలు, ”అల్లాహ్ మార్గంలో మేము (మీకు) తోడ్పడతాము. మేము అల్లాహ్‌ను విశ్వసించాము. మేము విధేయులమయ్యాము. ఈ విషయానికి మీరు సాక్షులుగా ఉండండి” అని జవాబిచ్చారు.
3:53 رَبَّنَا آمَنَّا بِمَا أَنزَلْتَ وَاتَّبَعْنَا الرَّسُولَ فَاكْتُبْنَا مَعَ الشَّاهِدِينَ
(వారు ఇంకా ఇలా అన్నారు:) ”ప్రభూ! నీవు అవతరింపజేసిన దాన్ని మేము విశ్వసించాము. మేము నీ ప్రవక్తను అనుసరించాము. కనుక సాక్షుల జాబితాలో మా పేర్లు కూడా వ్రాసుకో.”
3:54 وَمَكَرُوا وَمَكَرَ اللَّهُ ۖ وَاللَّهُ خَيْرُ الْمَاكِرِينَ
అవిశ్వాసులు రహస్యంగా ఎత్తులు వేయసాగారు. అల్లాహ్ కూడా వారి ఎత్తులకు పై ఎత్తులు వేశాడు. ఎత్తులు వేసే వారిలో అల్లాహ్ సాటిలేని మేటి.
3:55 إِذْ قَالَ اللَّهُ يَا عِيسَىٰ إِنِّي مُتَوَفِّيكَ وَرَافِعُكَ إِلَيَّ وَمُطَهِّرُكَ مِنَ الَّذِينَ كَفَرُوا وَجَاعِلُ الَّذِينَ اتَّبَعُوكَ فَوْقَ الَّذِينَ كَفَرُوا إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ ۖ ثُمَّ إِلَيَّ مَرْجِعُكُمْ فَأَحْكُمُ بَيْنَكُمْ فِيمَا كُنتُمْ فِيهِ تَخْتَلِفُونَ
అప్పుడు అల్లాహ్ ఇలా అన్నాడు : ఓ ఈసా! నేను నిన్ను పూర్తిగా తీసుకుంటాను. నిన్ను నా వైపుకు లేపుకుంటాను. అవిశ్వాసుల బారి నుంచి నిన్ను పరిశుద్ధునిగా చేస్తాను. నిన్ను అనుసరించిన వారిని ప్రళయదినం వరకూ అవిశ్వాసులపై పైచేయిగా ఉంచుతాను. ఆ తర్వాత మీరంతా మరలి రావలసింది నా వద్దకే. అప్పుడు నేనే మీ మధ్య ఉన్న పరస్పర విభేదాలపై తీర్పు చేస్తాను.
3:56 فَأَمَّا الَّذِينَ كَفَرُوا فَأُعَذِّبُهُمْ عَذَابًا شَدِيدًا فِي الدُّنْيَا وَالْآخِرَةِ وَمَا لَهُم مِّن نَّاصِرِينَ
మరి అవిశ్వాసులకైతే నేను ఇహలోకంలోనూ, పరలోకంలోనూ కఠిన శిక్ష విధిస్తాను. వారిని ఆదుకునే వారెవరూ ఉండరు.
3:57 وَأَمَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ فَيُوَفِّيهِمْ أُجُورَهُمْ ۗ وَاللَّهُ لَا يُحِبُّ الظَّالِمِينَ
అయితే విశ్వసించి, సత్కార్యాలు చేసినవారికి వారి పూర్తి పుణ్యఫలాన్ని అల్లాహ్ ఇస్తాడు. అల్లాహ్ దుర్మార్గులను ఎంత మాత్రం ఇష్టపడడు.
3:58 ذَٰلِكَ نَتْلُوهُ عَلَيْكَ مِنَ الْآيَاتِ وَالذِّكْرِ الْحَكِيمِ
(ఓ ముహమ్మద్!) మేము నీకు (దివ్య ఖుర్ఆన్) ఆయతులను, వివేకంతో కూడిన హితబోధను చదివి వినిపిస్తున్నాము.
3:59 إِنَّ مَثَلَ عِيسَىٰ عِندَ اللَّهِ كَمَثَلِ آدَمَ ۖ خَلَقَهُ مِن تُرَابٍ ثُمَّ قَالَ لَهُ كُن فَيَكُونُ
అల్లాహ్ దృష్టిలో ఈసా ఉపమానం ఆదం ఉపమానాన్ని పోలినదే. (ఆయన) అతన్ని మట్టితో చేసి ‘అయిపో’ అని ఆజ్ఞాపించగానే అతను (మనిషిగా) అయిపోయాడు.
3:60 الْحَقُّ مِن رَّبِّكَ فَلَا تَكُن مِّنَ الْمُمْتَرِينَ
నీ ప్రభువు తరఫు నుంచి (వచ్చిన) సత్యం ఇదే. జాగ్రత్త! శంకించే వారిలో చేరిపోకు.
3:61 فَمَنْ حَاجَّكَ فِيهِ مِن بَعْدِ مَا جَاءَكَ مِنَ الْعِلْمِ فَقُلْ تَعَالَوْا نَدْعُ أَبْنَاءَنَا وَأَبْنَاءَكُمْ وَنِسَاءَنَا وَنِسَاءَكُمْ وَأَنفُسَنَا وَأَنفُسَكُمْ ثُمَّ نَبْتَهِلْ فَنَجْعَل لَّعْنَتَ اللَّهِ عَلَى الْكَاذِبِينَ
కనుక నీ వద్దకు ఈ జ్ఞానం వచ్చిన తరువాత కూడా నీతో ఎవరయినా ఈ విషయంలో వాదనకు దిగితే వారితో స్పష్టంగా ఇలా చెప్పేయి: ”రండి! మీరూ మేము కలసి మన కుమారులను, మన స్త్రీలను పిలుద్దాం. స్వయంగా మనం కూడా వద్దాం. ఆ తర్వాత – ‘అబద్ధాలు చెప్పేవారిపై అల్లాహ్ శాపం పడుగాక’ అని దీనాతిదీనంగా ప్రార్థిద్దాము.”
3:62 إِنَّ هَٰذَا لَهُوَ الْقَصَصُ الْحَقُّ ۚ وَمَا مِنْ إِلَٰهٍ إِلَّا اللَّهُ ۚ وَإِنَّ اللَّهَ لَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ
నిశ్చయంగా ఇదే సత్యబద్ధమైన వృత్తాంతం. అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు. నిస్సందేహంగా అల్లాహ్‌యే సర్వాధిక్యుడు, వివేకవంతుడు.
3:63 فَإِن تَوَلَّوْا فَإِنَّ اللَّهَ عَلِيمٌ بِالْمُفْسِدِينَ
(ఈ సవాలు విసిరిన) తరువాత కూడా వారు (సత్యాన్ని) ఒప్పుకోక తిరిగిపోయినట్లయితే, అసలు సంక్షోభాన్ని రేకెత్తించే వారెవరో అల్లాహ్‌కు బాగా తెలుసు.
3:64 قُلْ يَا أَهْلَ الْكِتَابِ تَعَالَوْا إِلَىٰ كَلِمَةٍ سَوَاءٍ بَيْنَنَا وَبَيْنَكُمْ أَلَّا نَعْبُدَ إِلَّا اللَّهَ وَلَا نُشْرِكَ بِهِ شَيْئًا وَلَا يَتَّخِذَ بَعْضُنَا بَعْضًا أَرْبَابًا مِّن دُونِ اللَّهِ ۚ فَإِن تَوَلَّوْا فَقُولُوا اشْهَدُوا بِأَنَّا مُسْلِمُونَ
(ఓ ప్రవక్తా!) వారికి స్పష్టంగా చెప్పు: ”ఓ గ్రంథవహులారా! మాలోనూ, మీ లోనూ సమానంగా ఉన్న ఒక విషయం వైపుకు రండి. అదేమంటే మనం అల్లాహ్‌ను తప్ప వేరెవరినీ ఆరాధించకూడదు, ఆయనకు భాగస్వాములుగా ఎవరినీ కల్పించరాదు. అల్లాహ్‌ను వదలి మనలో ఎవరూ ఇంకొకరిని ప్రభువులుగా చేసుకోరాదు.” ఈ ప్రతిపాదన పట్ల గనక వారు విముఖత చూపితే, ”మేము మాత్రం ముస్లిం (విధేయు)లము అన్న విషయానికి మీరు సాక్షులుగా ఉండండి” అని వారికి చెప్పేయండి.
3:65 يَا أَهْلَ الْكِتَابِ لِمَ تُحَاجُّونَ فِي إِبْرَاهِيمَ وَمَا أُنزِلَتِ التَّوْرَاةُ وَالْإِنجِيلُ إِلَّا مِن بَعْدِهِ ۚ أَفَلَا تَعْقِلُونَ
ఓ గ్రంథవహులారా! మీరు ఇబ్రాహీం విషయంలో ఎందుకు గొడవపడుతున్నారు. తౌరాతు, ఇన్జీలు గ్రంథాలైతే ఆయన తరువాతనే అవతరించాయి కదా! అయినా మీరు అర్థం చేసుకోరే?!
3:66 هَا أَنتُمْ هَٰؤُلَاءِ حَاجَجْتُمْ فِيمَا لَكُم بِهِ عِلْمٌ فَلِمَ تُحَاجُّونَ فِيمَا لَيْسَ لَكُم بِهِ عِلْمٌ ۚ وَاللَّهُ يَعْلَمُ وَأَنتُمْ لَا تَعْلَمُونَ
చూడండి, మీకు తెలిసిన విషయం గురించి మీరెలాగూ వాదించారు. కాని మీకు తెలియని విషయాల గురించి ఎందుకు వాదిస్తున్నారు? (యదార్థం) అల్లాహ్‌కు తెలుసుగాని మీకు తెలియదు.
3:67 مَا كَانَ إِبْرَاهِيمُ يَهُودِيًّا وَلَا نَصْرَانِيًّا وَلَٰكِن كَانَ حَنِيفًا مُّسْلِمًا وَمَا كَانَ مِنَ الْمُشْرِكِينَ
ఇబ్రాహీం యూదుడూ కాదు, క్రైస్తవుడూ కాదు. ఆయన ఒకే దేవునివైపు అభిముఖుడైన ముస్లిం. ఆయన ముష్రిక్కులలోని వాడు ఎంతమాత్రం కాదు.
3:68 إِنَّ أَوْلَى النَّاسِ بِإِبْرَاهِيمَ لَلَّذِينَ اتَّبَعُوهُ وَهَٰذَا النَّبِيُّ وَالَّذِينَ آمَنُوا ۗ وَاللَّهُ وَلِيُّ الْمُؤْمِنِينَ
అందరికన్నా ఎక్కువగా ఇబ్రాహీంకు దగ్గరివారమని చెప్పుకునే హక్కు ఎవరికయినా ఉందీ అంటే, అది ఆయన్ని అనుసరించినవారికీ, ఈ ప్రవక్తకూ, విశ్వాసులకూ మాత్రమే ఉంది. అల్లాహ్ విశ్వాసులకు మాత్రమే నేస్తం.
3:69 وَدَّت طَّائِفَةٌ مِّنْ أَهْلِ الْكِتَابِ لَوْ يُضِلُّونَكُمْ وَمَا يُضِلُّونَ إِلَّا أَنفُسَهُمْ وَمَا يَشْعُرُونَ
గ్రంథవహులలోని ఒక వర్గం మిమ్మల్ని పెడత్రోవ పట్టించాలని చూస్తోంది. నిజానికి వారు తమను తామే పెడత్రోవలో పడ వేసుకుంటున్నారు. కాని ఆ విషయాన్ని వారు గ్రహించటంలేదు.
3:70 يَا أَهْلَ الْكِتَابِ لِمَ تَكْفُرُونَ بِآيَاتِ اللَّهِ وَأَنتُمْ تَشْهَدُونَ
”ఓ గ్రంథవహులారా! మీరు స్వయంగా అల్లాహ్ ఆయతులకు సాక్షిగా ఉండి కూడా వాటిని ఎందుకు తిరస్కరిస్తున్నారు?”
3:71 يَا أَهْلَ الْكِتَابِ لِمَ تَلْبِسُونَ الْحَقَّ بِالْبَاطِلِ وَتَكْتُمُونَ الْحَقَّ وَأَنتُمْ تَعْلَمُونَ
”గ్రంథం కల ఓ ప్రజలారా! తెలిసి కూడా మీరు సత్యానికి అసత్యపు రంగు పులిమి దానిని ఎందుకు అనుమానాస్పదం చేస్తారు? (ఉద్దేశపూర్వకంగా) సత్యాన్ని ఎందుకు కప్పిపుచ్చుతున్నారు??”
3:72 وَقَالَت طَّائِفَةٌ مِّنْ أَهْلِ الْكِتَابِ آمِنُوا بِالَّذِي أُنزِلَ عَلَى الَّذِينَ آمَنُوا وَجْهَ النَّهَارِ وَاكْفُرُوا آخِرَهُ لَعَلَّهُمْ يَرْجِعُونَ
గ్రంథవహులలోని ఒక వర్గం ఇలా అన్నది : ”విశ్వసించిన వారిపై అవతరించిన దానిని ఉదయం విశ్వసించి, సాయంత్రం తిరస్కరించండి. బహుశా ఇలాగయినా వారు మరలి పోతారేమో!”
3:73 وَلَا تُؤْمِنُوا إِلَّا لِمَن تَبِعَ دِينَكُمْ قُلْ إِنَّ الْهُدَىٰ هُدَى اللَّهِ أَن يُؤْتَىٰ أَحَدٌ مِّثْلَ مَا أُوتِيتُمْ أَوْ يُحَاجُّوكُمْ عِندَ رَبِّكُمْ ۗ قُلْ إِنَّ الْفَضْلَ بِيَدِ اللَّهِ يُؤْتِيهِ مَن يَشَاءُ ۗ وَاللَّهُ وَاسِعٌ عَلِيمٌ
”మీరు మీ ధర్మాన్ని అనుసరించేవారిని తప్ప వేరెవరినీ నమ్మవద్దు” (అని అంటారు). (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : ”నిశ్చయంగా అల్లాహ్ చూపే మార్గమే సన్మార్గం.” (గ్రంథవహులు తమ వారికి ఇంకా ఈ విధంగా కూడా నూరి పోస్తారు:) ”మీకు ఇవ్వబడినదే వేరెవరికయినా ఇవ్వబడి ఉండ వచ్చనీ, లేక వారు మీ ప్రభువు సమక్షంలో మీకు వ్యతిరేకంగా వాదిస్తారని (మీరు ఎంతమాత్రం అనుకోకండి).” ఓ ప్రవక్తా! వారితో అను: ”అనుగ్రహాలన్నీ అల్లాహ్ చేతిలో ఉన్నాయి. ఆయన తాను కోరిన వారికి వాటిని ఇస్తాడు. అల్లాహ్ గొప్ప విస్తృతి కలవాడు, అన్నీ తెలిసినవాడు.”
3:74 يَخْتَصُّ بِرَحْمَتِهِ مَن يَشَاءُ ۗ وَاللَّهُ ذُو الْفَضْلِ الْعَظِيمِ
”ఆయన తాను కోరిన వారిని తన కారుణ్యం కొరకు ప్రత్యేకించుకుంటాడు. అల్లాహ్ గొప్ప అనుగ్రహం కలవాడు.”
3:75 وَمِنْ أَهْلِ الْكِتَابِ مَنْ إِن تَأْمَنْهُ بِقِنطَارٍ يُؤَدِّهِ إِلَيْكَ وَمِنْهُم مَّنْ إِن تَأْمَنْهُ بِدِينَارٍ لَّا يُؤَدِّهِ إِلَيْكَ إِلَّا مَا دُمْتَ عَلَيْهِ قَائِمًا ۗ ذَٰلِكَ بِأَنَّهُمْ قَالُوا لَيْسَ عَلَيْنَا فِي الْأُمِّيِّينَ سَبِيلٌ وَيَقُولُونَ عَلَى اللَّهِ الْكَذِبَ وَهُمْ يَعْلَمُونَ
గ్రంథవహులలో కొందరు ఎలాంటివారంటే, నీవు వారి వద్ద ఒక పెద్ద ధనరాశిని అమానతుగా పెట్టినాసరే, వారు దాన్ని నీకు తిరిగి ఇచ్చేస్తారు. వారిలో మరి కొందరు కూడా ఉన్నారు. వారెలాంటి వారంటే నువ్వు వారికి ఒక్క దీనారును అప్పగించినా వారు తిరిగి ఇవ్వరు – నువ్వు వారి నెత్తిమీద నిల్చుంటే తప్ప! ఎందుకంటే ”నిరక్షర కుక్షుల (యూదేతరుల) హక్కు విషయంలో మమ్మల్ని నిలదీయటం జరగదు” అని వారు చెప్పి ఉన్నారు. వీరు తెలిసి కూడా అల్లాహ్‌కు అబద్ధాన్ని ఆపాదిస్తున్నారు.
3:76 بَلَىٰ مَنْ أَوْفَىٰ بِعَهْدِهِ وَاتَّقَىٰ فَإِنَّ اللَّهَ يُحِبُّ الْمُتَّقِينَ
ఎందుకు నిలదీయటం జరగదు? (వారిని నిలదీయటం ఖాయం). అయితే ఇచ్చిన మాటను నిలుపుకుని, భయభక్తుల వైఖరిని అవలంబిస్తే, అల్లాహ్ భయభక్తులుగలవారిని ప్రేమిస్తాడు.
3:77 إِنَّ الَّذِينَ يَشْتَرُونَ بِعَهْدِ اللَّهِ وَأَيْمَانِهِمْ ثَمَنًا قَلِيلًا أُولَٰئِكَ لَا خَلَاقَ لَهُمْ فِي الْآخِرَةِ وَلَا يُكَلِّمُهُمُ اللَّهُ وَلَا يَنظُرُ إِلَيْهِمْ يَوْمَ الْقِيَامَةِ وَلَا يُزَكِّيهِمْ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ
ఎవరయితే అల్లాహ్ వాగ్దానాన్ని, తమ ప్రమాణాలను కొద్ది పాటి మూల్యానికి అమ్ముకుంటారో అలాంటి వారికి పరలోకంలో ఏ భాగమూ లేదు. అల్లాహ్ వారిని ప్రళయదినాన పలకరించటంగానీ, వారి వంక చూడటంగానీ చేయడు. వారిని పరిశుద్ధ పరచడు. పైగా వారి కోసం బాధాకరమైన శిక్ష ఉంటుంది.
3:78 وَإِنَّ مِنْهُمْ لَفَرِيقًا يَلْوُونَ أَلْسِنَتَهُم بِالْكِتَابِ لِتَحْسَبُوهُ مِنَ الْكِتَابِ وَمَا هُوَ مِنَ الْكِتَابِ وَيَقُولُونَ هُوَ مِنْ عِندِ اللَّهِ وَمَا هُوَ مِنْ عِندِ اللَّهِ وَيَقُولُونَ عَلَى اللَّهِ الْكَذِبَ وَهُمْ يَعْلَمُونَ
వారిలోని మరికొందరు గ్రంథాన్ని పఠిస్తూ తమ నాలుకలను త్రిప్పుతారు – అది గ్రంథంలోని భాగమే అని మీరు భావించాలన్న ఉద్దేశ్యంతో వారలా చేస్తారు. కాని వాస్తవానికి అది గ్రంథంలో అంతర్భాగం కానేకాదు. ”అది అల్లాహ్ తరఫు నుంచి వచ్చినది” అని వారు అంటారు. యదార్థానికి అది అల్లాహ్ తరఫునుండి వచ్చినది కాదు. వారు ఉద్దేశ్యపూర్వకంగా అల్లాహ్‌కు అసత్యాన్ని అంటగడుతున్నారు.
3:79 مَا كَانَ لِبَشَرٍ أَن يُؤْتِيَهُ اللَّهُ الْكِتَابَ وَالْحُكْمَ وَالنُّبُوَّةَ ثُمَّ يَقُولَ لِلنَّاسِ كُونُوا عِبَادًا لِّي مِن دُونِ اللَّهِ وَلَٰكِن كُونُوا رَبَّانِيِّينَ بِمَا كُنتُمْ تُعَلِّمُونَ الْكِتَابَ وَبِمَا كُنتُمْ تَدْرُسُونَ
అల్లాహ్ ఏ మనిషికయినా గ్రంథాన్నీ, వివేకాన్నీ, ప్రవక్త పదవిని (నబువ్వత్ను) ప్రసాదించిన మీదట కూడా ‘మీరు అల్లాహ్‌ను వదలిపెట్టి నాకు దాసులుకండి’ అని అతడు ప్రజలతో అనటం ఎంతమాత్రం తగదు. దానికి బదులు, ‘మీరంతా ప్రభువు వారైపోండి’ అని అతడనాలి. ఎందుకంటే మీరు గ్రంథాన్ని నేర్పేవారవటం చేతనూ, గ్రంథాన్ని చదివేవారవటం చేతనూ (మీరు మీ ప్రభువు వారవటమే ధర్మం).
3:80 وَلَا يَأْمُرَكُمْ أَن تَتَّخِذُوا الْمَلَائِكَةَ وَالنَّبِيِّينَ أَرْبَابًا ۗ أَيَأْمُرُكُم بِالْكُفْرِ بَعْدَ إِذْ أَنتُم مُّسْلِمُونَ
దూతలను, ప్రవక్తలను ప్రభువులుగా చేసుకోమని అతడు మీకు ఎన్నటికీ ఆదేశించ(లే)డు. ఏమిటీ, మీరు ముస్లిములయిన మీదట కూడా అతడు మిమ్మల్ని అవిశ్వాసానికి పాల్పడమని ఆజ్ఞాపిస్తాడా? (ఇది అసంభవం).
3:81 وَإِذْ أَخَذَ اللَّهُ مِيثَاقَ النَّبِيِّينَ لَمَا آتَيْتُكُم مِّن كِتَابٍ وَحِكْمَةٍ ثُمَّ جَاءَكُمْ رَسُولٌ مُّصَدِّقٌ لِّمَا مَعَكُمْ لَتُؤْمِنُنَّ بِهِ وَلَتَنصُرُنَّهُ ۚ قَالَ أَأَقْرَرْتُمْ وَأَخَذْتُمْ عَلَىٰ ذَٰلِكُمْ إِصْرِي ۖ قَالُوا أَقْرَرْنَا ۚ قَالَ فَاشْهَدُوا وَأَنَا مَعَكُم مِّنَ الشَّاهِدِينَ
అల్లాహ్ (తన) ప్రవక్తల నుండి వాగ్దానం తీసుకున్నప్పుడు, ”నేను మీకు గ్రంథాన్ని, వివేకాన్ని ఒసగిన తరువాత, మీ వద్ద ఉన్న దాన్ని సత్యమని ధృవీకరించే ప్రవక్త మీ వద్దకు వస్తే మీరు తప్పకుండా అతన్ని విశ్వసించాలి, అతనికి సహాయపడాలి” అని చెప్పాడు. తరువాత ఆయన, ”ఈ విషయాన్ని మీరు ఒప్పుకుంటున్నారా? నేను మీపై మోపిన బాధ్యతను స్వీకరిస్తున్నారా?” అని ప్రశ్నించగా, ”మేము ఒప్పుకుంటున్నాము” అని అందరూ అన్నారు. ”మరయితే దీనికి మీరు సాక్షులుగా ఉండండి. మీతోపాటు నేనూ సాక్షిగా ఉంటాను” అని అల్లాహ్ అన్నాడు.
3:82 فَمَن تَوَلَّىٰ بَعْدَ ذَٰلِكَ فَأُولَٰئِكَ هُمُ الْفَاسِقُونَ
దీని తరువాత కూడా ఎవరు వెనుతిరిగిపోతారో వారే పరమ అవిధేయులు.
3:83 أَفَغَيْرَ دِينِ اللَّهِ يَبْغُونَ وَلَهُ أَسْلَمَ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ طَوْعًا وَكَرْهًا وَإِلَيْهِ يُرْجَعُونَ
ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న వారంతా – తమకు ఇష్టమున్నా లేకపోయినా అల్లాహ్ విధేయతకు కట్టుబడి ఉండగా, వీరు అల్లాహ్ ధర్మాన్ని కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తున్నారా? ఎట్టకేలకు వారంతా ఆయన వైపునకే మరలించబడతారు.
3:84 قُلْ آمَنَّا بِاللَّهِ وَمَا أُنزِلَ عَلَيْنَا وَمَا أُنزِلَ عَلَىٰ إِبْرَاهِيمَ وَإِسْمَاعِيلَ وَإِسْحَاقَ وَيَعْقُوبَ وَالْأَسْبَاطِ وَمَا أُوتِيَ مُوسَىٰ وَعِيسَىٰ وَالنَّبِيُّونَ مِن رَّبِّهِمْ لَا نُفَرِّقُ بَيْنَ أَحَدٍ مِّنْهُمْ وَنَحْنُ لَهُ مُسْلِمُونَ
(ఓ ప్రవక్తా!) వారితో అను: ”మేము అల్లాహ్‌ను, మాపై అవతరింపజెయ్యబడిన దానినీ విశ్వసించాము. ఇంకా ఇబ్రాహీము, ఇస్మాయీలు, ఇస్హాఖు, యాఖూబుపై, ఆయన సంతానంపై అవతరింపజెయ్యబడిన దానినీ, మూసా, ఈసా ఇంకా ఇతర ప్రవక్తలకు వారి ప్రభువు తరఫున వొసగబడిన వాటిని మేము విశ్వసించాము. మేము వారి మధ్య ఎలాంటి భేదభావాన్ని కనబరచము. మేము ఆయనకే విధేయులము.”
3:85 وَمَن يَبْتَغِ غَيْرَ الْإِسْلَامِ دِينًا فَلَن يُقْبَلَ مِنْهُ وَهُوَ فِي الْآخِرَةِ مِنَ الْخَاسِرِينَ
ఎవరయినా ఇస్లాంను కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తే అతని ధర్మం స్వీకరించబడదు. అలాంటి వ్యక్తి పరలోకంలో నష్టపోయినవారిలో చేరిపోతాడు.
3:86 كَيْفَ يَهْدِي اللَّهُ قَوْمًا كَفَرُوا بَعْدَ إِيمَانِهِمْ وَشَهِدُوا أَنَّ الرَّسُولَ حَقٌّ وَجَاءَهُمُ الْبَيِّنَاتُ ۚ وَاللَّهُ لَا يَهْدِي الْقَوْمَ الظَّالِمِينَ
(తొలుత) విశ్వసించి, ఈయన ప్రవక్త అనే విషయం సత్యమేనని సాక్ష్యం (కూడా) యిచ్చి, తీరా తమ వద్దకు స్పష్టమైన సూచనలు వచ్చేసిన మీదట అవిశ్వాసులైపోయిన వారికి అల్లాహ్ సన్మార్గం ఎలా చూపుతాడు? అల్లాహ్ ఇటువంటి దుర్మార్గులకు దారి చూపడు.
3:87 أُولَٰئِكَ جَزَاؤُهُمْ أَنَّ عَلَيْهِمْ لَعْنَةَ اللَّهِ وَالْمَلَائِكَةِ وَالنَّاسِ أَجْمَعِينَ
వారి పాపఫలంగా వారిపై అల్లాహ్ శాపం, దూతల, సమస్త జనుల శాపం పడుతుంది.
3:88 خَالِدِينَ فِيهَا لَا يُخَفَّفُ عَنْهُمُ الْعَذَابُ وَلَا هُمْ يُنظَرُونَ
ఈ (శాపగ్రస్త) స్థితిలో వారు కలకాలం ఉంటారు. వారి శిక్షను తగ్గించటంగానీ, వారికి గడువు ఇవ్వటంగానీ జరగదు.
3:89 إِلَّا الَّذِينَ تَابُوا مِن بَعْدِ ذَٰلِكَ وَأَصْلَحُوا فَإِنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ
అయితే ఆ తరువాత ఎవరు పశ్చాత్తాపం చెంది, తమ నడవడికను సరిదిద్దుకుంటారో (వారు రక్షించబడతారు). నిశ్చయంగా అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడు.
3:90 إِنَّ الَّذِينَ كَفَرُوا بَعْدَ إِيمَانِهِمْ ثُمَّ ازْدَادُوا كُفْرًا لَّن تُقْبَلَ تَوْبَتُهُمْ وَأُولَٰئِكَ هُمُ الضَّالُّونَ
ఎవరు విశ్వసించిన మీదట అవిశ్వాస వైఖరికి ఒడిగడతారో, ఆ తరువాత అవిశ్వాసంలో మరింత పెచ్చరిల్లుతారో వారి పశ్చాత్తాపం సుతరామూ స్వీకరించబడదు. అపమార్గం పాలైన వారంటే వీరే.
3:91 إِنَّ الَّذِينَ كَفَرُوا وَمَاتُوا وَهُمْ كُفَّارٌ فَلَن يُقْبَلَ مِنْ أَحَدِهِم مِّلْءُ الْأَرْضِ ذَهَبًا وَلَوِ افْتَدَىٰ بِهِ ۗ أُولَٰئِكَ لَهُمْ عَذَابٌ أَلِيمٌ وَمَا لَهُم مِّن نَّاصِرِينَ
మరెవరు అవిశ్వాసానికి ఒడిగట్టి, అవిశ్వాసులుగానే మరణించారో వారిలో ఎవరయినాసరే భూమి నిండా బంగారం సమర్పించినా, తమ పాపానికి పరిహారంగా ఇచ్చినాసరే అది స్వీకారయోగ్యం అవదు. వ్యధాభరితమైన శిక్షకు పాత్రులయ్యే వారంటే వీరే. వీరిని ఆదుకునే వాడెవడూ ఉండడు.
3:92 لَن تَنَالُوا الْبِرَّ حَتَّىٰ تُنفِقُوا مِمَّا تُحِبُّونَ ۚ وَمَا تُنفِقُوا مِن شَيْءٍ فَإِنَّ اللَّهَ بِهِ عَلِيمٌ
మీకు ప్రియాతిప్రియమైన వస్తువుల నుండి మీరు (దైవ మార్గంలో) ఖర్చు పెట్టనంతవరకూ మీరు పుణ్య స్థాయికి చేరుకోలేరు. మీరు ఖర్చుపెట్టేదంతా అల్లాహ్‌కు తెలుసు.
3:93 كُلُّ الطَّعَامِ كَانَ حِلًّا لِّبَنِي إِسْرَائِيلَ إِلَّا مَا حَرَّمَ إِسْرَائِيلُ عَلَىٰ نَفْسِهِ مِن قَبْلِ أَن تُنَزَّلَ التَّوْرَاةُ ۗ قُلْ فَأْتُوا بِالتَّوْرَاةِ فَاتْلُوهَا إِن كُنتُمْ صَادِقِينَ
తౌరాతు గ్రంథం అవతరించక పూర్వం, ఇస్రాయీల్ (యాఖూబు) తన కోసం నిషేధించుకున్న వస్తువులు తప్ప ఇతర ఆహార పదార్థాలన్నీ ఇస్రాయీల్ వంశస్థుల కొరకు ధర్మ సమ్మతం గానే ఉండేవి. ‘మీరు సత్యవంతులే అయితే తౌరాతును తీసుకుని రండి, దాన్ని చదివి వినిపించండి’ అని (ఓ ముహమ్మద్!) వారికి చెప్పు.
3:94 فَمَنِ افْتَرَىٰ عَلَى اللَّهِ الْكَذِبَ مِن بَعْدِ ذَٰلِكَ فَأُولَٰئِكَ هُمُ الظَّالِمُونَ
దీని తరువాత కూడా ఎవరయినా అల్లాహ్‌కు అబద్ధాన్ని ఆపాదిస్తే వారే దుర్మార్గులవుతారు.
3:95 قُلْ صَدَقَ اللَّهُ ۗ فَاتَّبِعُوا مِلَّةَ إِبْرَاهِيمَ حَنِيفًا وَمَا كَانَ مِنَ الْمُشْرِكِينَ
వారికి చెప్పు: ”అల్లాహ్ సత్యం పలికాడు. కనుక మీరంతా ఏకాగ్ర చిత్తంకల ఇబ్రాహీము ధర్మాన్నే అనుసరించండి. ఆయన బహుదైవోపాసకులలోని వాడు కాడు.”
3:96 إِنَّ أَوَّلَ بَيْتٍ وُضِعَ لِلنَّاسِ لَلَّذِي بِبَكَّةَ مُبَارَكًا وَهُدًى لِّلْعَالَمِينَ
నిశ్చయంగా మానవుల కొరకు ప్రప్రథమంగా ఖరారు చేయబడిన (దైవ) గృహం బక్కాలో (మక్కాలో) ఉన్నదే. అది శుభప్రదమైనది, సమస్త లోకవాసులకు మార్గదర్శకం కూడాను.
3:97 فِيهِ آيَاتٌ بَيِّنَاتٌ مَّقَامُ إِبْرَاهِيمَ ۖ وَمَن دَخَلَهُ كَانَ آمِنًا ۗ وَلِلَّهِ عَلَى النَّاسِ حِجُّ الْبَيْتِ مَنِ اسْتَطَاعَ إِلَيْهِ سَبِيلًا ۚ وَمَن كَفَرَ فَإِنَّ اللَّهَ غَنِيٌّ عَنِ الْعَالَمِينَ
అందులో స్పష్టమయిన సూచనలున్నాయి. మఖామె ఇబ్రాహీం (ఇబ్రాహీం నిలబడిన స్థలం) ఉన్నది. అందులోకి ప్రవేశించినవాడు రక్షణ పొందుతాడు. అక్కడికి వెళ్ళే స్థోమత గలవారికి, ఆ గృహ (యాత్ర) హజ్ చేయటాన్ని అల్లాహ్ విధిగా చేశాడు. మరెవరయినా (ఈ ఆజ్ఞను శిరసావహించటానికి) నిరాకరిస్తే అల్లాహ్‌కు సమస్త లోకవాసుల అవసరం ఎంతమాత్రం లేదు.
3:98 قُلْ يَا أَهْلَ الْكِتَابِ لِمَ تَكْفُرُونَ بِآيَاتِ اللَّهِ وَاللَّهُ شَهِيدٌ عَلَىٰ مَا تَعْمَلُونَ
”ఓ గ్రంథవహులారా! మీరు అల్లాహ్ ఆయతుల(వాక్యాల)ను ఎందుకు తిరస్కరిస్తున్నారు? మీరు చేసే కర్మలకు అల్లాహ్ సాక్షిగా ఉన్నాడు” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు.
3:99 قُلْ يَا أَهْلَ الْكِتَابِ لِمَ تَصُدُّونَ عَن سَبِيلِ اللَّهِ مَنْ آمَنَ تَبْغُونَهَا عِوَجًا وَأَنتُمْ شُهَدَاءُ ۗ وَمَا اللَّهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُونَ
”గ్రంథవహులారా! అల్లాహ్ మార్గం నుంచి మీరు విశ్వసించినవారిని ఎందుకు అడ్డుకుంటున్నారు? (ఇదే సన్మార్గం అన్న దానికి) మీరు సాక్షులై ఉండి కూడా అందులో లోపాలు వెతికే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? అల్లాహ్ మీ చేష్టల పట్ల పరధ్యానానికి లోనైలేడు” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు.
3:100 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِن تُطِيعُوا فَرِيقًا مِّنَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ يَرُدُّوكُم بَعْدَ إِيمَانِكُمْ كَافِرِينَ
విశ్వసించిన ఓ ప్రజలారా! మీరు గ్రంథవహులలోని ఏదయినా వర్గంవారి మాటను విన్నారంటే, వారు మిమ్మల్ని మీ విశ్వాసస్థితి నుంచి అవిశ్వాసులుగా మార్చుతారు.
3:101 وَكَيْفَ تَكْفُرُونَ وَأَنتُمْ تُتْلَىٰ عَلَيْكُمْ آيَاتُ اللَّهِ وَفِيكُمْ رَسُولُهُ ۗ وَمَن يَعْتَصِم بِاللَّهِ فَقَدْ هُدِيَ إِلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ
మీకు అల్లాహ్ ఆయతులు (వాక్యాలు) చదివి వినిపిస్తుండగా, ఆయన ప్రవక్త మీ మధ్యనుండగా మీరు అవిశ్వాసానికి ఎలా పాల్పడగలరు? ఎవరు అల్లాహ్ (ధర్మము)ను గట్టిగా పట్టుకున్నాడో నిస్సందేహంగా అతడు రుజుమార్గం వైపు దర్శకత్వం వహించబడినట్లే.
3:102 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ حَقَّ تُقَاتِهِ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسْلِمُونَ
ఓ విశ్వాసులారా! అల్లాహ్‌కు ఎంతగా భయపడాలో అంతగా భయపడండి. ముస్లింలుగా తప్ప మరణించకండి.
3:103 وَاعْتَصِمُوا بِحَبْلِ اللَّهِ جَمِيعًا وَلَا تَفَرَّقُوا ۚ وَاذْكُرُوا نِعْمَتَ اللَّهِ عَلَيْكُمْ إِذْ كُنتُمْ أَعْدَاءً فَأَلَّفَ بَيْنَ قُلُوبِكُمْ فَأَصْبَحْتُم بِنِعْمَتِهِ إِخْوَانًا وَكُنتُمْ عَلَىٰ شَفَا حُفْرَةٍ مِّنَ النَّارِ فَأَنقَذَكُم مِّنْهَا ۗ كَذَٰلِكَ يُبَيِّنُ اللَّهُ لَكُمْ آيَاتِهِ لَعَلَّكُمْ تَهْتَدُونَ
అల్లాహ్ త్రాడును అందరూ కలసి గట్టిగా పట్టుకోండి. చీలిపోకండి. అల్లాహ్ మీపై కురిపించిన దయానుగ్రహాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి – అప్పుడు మీరు ఒండొకరికి శత్రువులుగా ఉండేవారు. ఆయన మీ హృదయాలలో పరస్పరం ప్రేమానురాగాలను సృజించాడు. దాంతో ఆయన అనుగ్రహం వల్ల మీరు ఒకరి కొకరు అన్నదమ్ములుగా మారారు. మీరు అగ్నిగుండం ఆఖరి అంచులకు చేరుకోగా, ఆయన మిమ్మల్ని దాన్నుంచి కాపాడాడు. మీరు సన్మార్గం పొందాలని ఈ విధంగా అల్లాహ్ మీకు తన సూచనలను విశదపరుస్తున్నాడు.
3:104 وَلْتَكُن مِّنكُمْ أُمَّةٌ يَدْعُونَ إِلَى الْخَيْرِ وَيَأْمُرُونَ بِالْمَعْرُوفِ وَيَنْهَوْنَ عَنِ الْمُنكَرِ ۚ وَأُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ
మేలు వైపుకు పిలిచే, మంచిని చెయ్యమని ఆజ్ఞాపించే, చెడుల నుంచి వారించే ఒక వర్గం మీలో ఉండాలి. ఈ పనిని చేసేవారే సాఫల్యాన్ని పొందుతారు.
3:105 وَلَا تَكُونُوا كَالَّذِينَ تَفَرَّقُوا وَاخْتَلَفُوا مِن بَعْدِ مَا جَاءَهُمُ الْبَيِّنَاتُ ۚ وَأُولَٰئِكَ لَهُمْ عَذَابٌ عَظِيمٌ
తమ వద్దకు స్పష్టమయిన నిదర్శనాలు వచ్చేసిన తరువాత కూడా వర్గాలుగా విడిపోయి, విభేదించుకున్న వారి మాదిరిగా మీరు తయారవకండి. మహాశిక్ష ఉన్నది ఇటువంటివారి కోసమే.
3:106 يَوْمَ تَبْيَضُّ وُجُوهٌ وَتَسْوَدُّ وُجُوهٌ ۚ فَأَمَّا الَّذِينَ اسْوَدَّتْ وُجُوهُهُمْ أَكَفَرْتُم بَعْدَ إِيمَانِكُمْ فَذُوقُوا الْعَذَابَ بِمَا كُنتُمْ تَكْفُرُونَ
ఆనాడు కొన్ని ముఖాలు వెలిగిపోతూ ఉంటాయి. మరికొన్ని ముఖాలు నల్లబడి ఉంటాయి. నలుపు ఆవరించి ఉన్న మొహాలు కలిగిన వారినుద్దేశించి, ”మీరు విశ్వసించిన మీదట తిరస్కార వైఖరికి ఒడిగట్టారా? సరే, మీరు తిరస్కరించిన దాని ఫలితంగా శిక్షను చవిచూడండి” (అని అనబడుతుంది).
3:107 وَأَمَّا الَّذِينَ ابْيَضَّتْ وُجُوهُهُمْ فَفِي رَحْمَةِ اللَّهِ هُمْ فِيهَا خَالِدُونَ
తెల్లగా ప్రకాశిస్తున్న మొహాలవారు దైవకారుణ్యంలో ఉంటారు. అందులో వారు కలకాలం ఉంటారు.
3:108 تِلْكَ آيَاتُ اللَّهِ نَتْلُوهَا عَلَيْكَ بِالْحَقِّ ۗ وَمَا اللَّهُ يُرِيدُ ظُلْمًا لِّلْعَالَمِينَ
(ఓ ప్రవక్తా!) ఇవి అల్లాహ్ వచనాలు. వాటిని మేము నీకు ఉన్నదున్నట్లుగా చదివి వినిపిస్తున్నాము. లోకవాసులకు అన్యాయం చేయాలన్న తలంపు అల్లాహ్‌కు ఎంతమాత్రం లేదు.
3:109 وَلِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۚ وَإِلَى اللَّهِ تُرْجَعُ الْأُمُورُ
ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న సమస్తమూ అల్లాహ్‌కే చెందుతుంది. సకల వ్యవహారాలూ అల్లాహ్ వైపుకే మళ్ళించ బడతాయి.
3:110 كُنتُمْ خَيْرَ أُمَّةٍ أُخْرِجَتْ لِلنَّاسِ تَأْمُرُونَ بِالْمَعْرُوفِ وَتَنْهَوْنَ عَنِ الْمُنكَرِ وَتُؤْمِنُونَ بِاللَّهِ ۗ وَلَوْ آمَنَ أَهْلُ الْكِتَابِ لَكَانَ خَيْرًا لَّهُم ۚ مِّنْهُمُ الْمُؤْمِنُونَ وَأَكْثَرُهُمُ الْفَاسِقُونَ
మానవుల కోసం ఉనికిలోనికి తీసుకురాబడిన శ్రేష్ఠ సమాజం మీరు. మీరు మంచి విషయాలకై ఆజ్ఞాపిస్తారు, చెడు నుంచి ఆపుతారు, ఇంకా మీరు అల్లాహ్‌ను విశ్వసిస్తారు. గ్రంథవహులు కూడా విశ్వసించి ఉంటే, అది వారి కోసం శ్రేయస్కరం అయ్యేది. వారిలో కొందరు విశ్వాసులు కూడా ఉన్నారు. కాని అత్యధికులు అవిధేయులే.
3:111 لَن يَضُرُّوكُمْ إِلَّا أَذًى ۖ وَإِن يُقَاتِلُوكُمْ يُوَلُّوكُمُ الْأَدْبَارَ ثُمَّ لَا يُنصَرُونَ
వారు మీకు ఏమాత్రం హాని కలిగించలేరు – మహా అయితే కొంచెం బాధించటం తప్ప. ఒకవేళ మీతో తలపడవలసిన పరిస్థితే ఏర్పడినట్లయితే వారు మీకు వెన్ను చూపి పారిపోతారు. ఆ తరువాత వారికెలాంటి సహాయమూ లభించదు.
3:112 ضُرِبَتْ عَلَيْهِمُ الذِّلَّةُ أَيْنَ مَا ثُقِفُوا إِلَّا بِحَبْلٍ مِّنَ اللَّهِ وَحَبْلٍ مِّنَ النَّاسِ وَبَاءُوا بِغَضَبٍ مِّنَ اللَّهِ وَضُرِبَتْ عَلَيْهِمُ الْمَسْكَنَةُ ۚ ذَٰلِكَ بِأَنَّهُمْ كَانُوا يَكْفُرُونَ بِآيَاتِ اللَّهِ وَيَقْتُلُونَ الْأَنبِيَاءَ بِغَيْرِ حَقٍّ ۚ ذَٰلِكَ بِمَا عَصَوا وَّكَانُوا يَعْتَدُونَ
సర్వత్రా వారిపై పరాభవపు దెబ్బ పడుతుంది – వారికి అల్లాహ్ శరణు లేదా ప్రజల నుండి అభయహస్తం లభిస్తే తప్ప! వారు దైవాగ్రహానికి పాత్రులైపోయారు. వారికి దీనావస్థ అంట గట్టబడింది. వారి ఈ స్థితికి కారణమేమిటంటే వారు అల్లాహ్ ఆయతులను తిరస్కరించేవారు, అన్యాయంగా ప్రవక్తలను చంపి వేసేవారు. వారి అవిధేయతకు, అతిక్రమణలకు శాస్తి ఇది!
3:113 لَيْسُوا سَوَاءً ۗ مِّنْ أَهْلِ الْكِتَابِ أُمَّةٌ قَائِمَةٌ يَتْلُونَ آيَاتِ اللَّهِ آنَاءَ اللَّيْلِ وَهُمْ يَسْجُدُونَ
వారంతా ఒకలాంటివారు కారు. ఈ గ్రంథవహులలోని ఒక వర్గం వారు (సత్యంపై) నిలకడగా ఉన్నారు. వారు రాత్రి సమయాల్లో కూడా దైవవాక్యాలను పారాయణం చేస్తారు, సాష్టాంగపడతారు.
3:114 يُؤْمِنُونَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ وَيَأْمُرُونَ بِالْمَعْرُوفِ وَيَنْهَوْنَ عَنِ الْمُنكَرِ وَيُسَارِعُونَ فِي الْخَيْرَاتِ وَأُولَٰئِكَ مِنَ الصَّالِحِينَ
అల్లాహ్‌ను, అంతిమదినాన్ని కూడా వారు విశ్వసిస్తారు. మంచిని ఆజ్ఞాపిస్తారు, చెడు నుండి ఆపుతారు. సత్కార్యాల కోసం పరస్పరం పోటీపడతారు. వీరు సజ్జనుల కోవకు చెందినవారు.
3:115 وَمَا يَفْعَلُوا مِنْ خَيْرٍ فَلَن يُكْفَرُوهُ ۗ وَاللَّهُ عَلِيمٌ بِالْمُتَّقِينَ
వారు ఏ మంచి పనిచేసినా దానికి విలువ ఇవ్వకపోవటం అనేది జరగదు. భయభక్తులు గలవారి గురించి అల్లాహ్‌కు బాగా తెలుసు.
3:116 إِنَّ الَّذِينَ كَفَرُوا لَن تُغْنِيَ عَنْهُمْ أَمْوَالُهُمْ وَلَا أَوْلَادُهُم مِّنَ اللَّهِ شَيْئًا ۖ وَأُولَٰئِكَ أَصْحَابُ النَّارِ ۚ هُمْ فِيهَا خَالِدُونَ
ఇకపోతే అవిశ్వాసులు; వారి సంపదగానీ, సంతానం గానీ దైవ సమక్షంలో వారికి ఏ మాత్రం పనికిరావు. వారు నరకాగ్ని వాసులు. కలకాలం అందులోనే పడి ఉంటారు.
3:117 مَثَلُ مَا يُنفِقُونَ فِي هَٰذِهِ الْحَيَاةِ الدُّنْيَا كَمَثَلِ رِيحٍ فِيهَا صِرٌّ أَصَابَتْ حَرْثَ قَوْمٍ ظَلَمُوا أَنفُسَهُمْ فَأَهْلَكَتْهُ ۚ وَمَا ظَلَمَهُمُ اللَّهُ وَلَٰكِنْ أَنفُسَهُمْ يَظْلِمُونَ
ఈ అవిశ్వాసులు ఇహలోక జీవితంలో చేస్తున్న ఖర్చు తీవ్రమయిన చలిగాలులు తగిలి సర్వనాశనమైన దుర్మార్గుల పొలాన్ని పోలినది. అల్లాహ్ వారికెలాంటి అన్యాయమూ చేయలేదు. వాస్తవానికి వారే తమ మీద తాము అన్యాయం చేసుకునే వారు.
3:118 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَتَّخِذُوا بِطَانَةً مِّن دُونِكُمْ لَا يَأْلُونَكُمْ خَبَالًا وَدُّوا مَا عَنِتُّمْ قَدْ بَدَتِ الْبَغْضَاءُ مِنْ أَفْوَاهِهِمْ وَمَا تُخْفِي صُدُورُهُمْ أَكْبَرُ ۚ قَدْ بَيَّنَّا لَكُمُ الْآيَاتِ ۖ إِن كُنتُمْ تَعْقِلُونَ
ఓ విశ్వాసులారా! మీరు మీ వారిని తప్ప వేరితరులను మీ ఆంతరంగికులుగా చేసుకోకండి. ఇతరులు మీకు నష్టం కలిగించటానికి తమకు దొరికే ఏ అవకాశాన్నీ విడిచిపెట్టరు. మీరు కష్టాల్లో పడాలన్నదే వారి కోరిక. వారిలోని అక్కసు స్వయంగా వారి నోట వెల్లడయింది. ఇక వారు తమ ఆంతర్యాల్లో దాచి ఉంచినది మరింత తీవ్రమైనది. మేము మీ కొరకు సూచనలను స్పష్టం చేశాము. మీరు బుద్ధిమంతులే అయితే (వీటిపై యోచన చేయండి).
3:119 هَا أَنتُمْ أُولَاءِ تُحِبُّونَهُمْ وَلَا يُحِبُّونَكُمْ وَتُؤْمِنُونَ بِالْكِتَابِ كُلِّهِ وَإِذَا لَقُوكُمْ قَالُوا آمَنَّا وَإِذَا خَلَوْا عَضُّوا عَلَيْكُمُ الْأَنَامِلَ مِنَ الْغَيْظِ ۚ قُلْ مُوتُوا بِغَيْظِكُمْ ۗ إِنَّ اللَّهَ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ
మీరైతే వారిని ప్రేమిస్తున్నారు. కాని వారు మాత్రం మిమ్మల్ని ప్రేమించటం లేదు. మీరు గ్రంథాన్నంతటినీ విశ్వసిస్తున్నారు (కాని వారు విశ్వసించటం లేదు. మరలాంటప్పుడు వారు మీకు స్నేహితులెలా అవుతారు?). వారు మిమ్మల్ని కలసినప్పుడు తాము విశ్వసించామని చెబుతారు, కాని మీ దగ్గరి నుంచి తప్పుకున్నప్పుడు మీపై కోపంకొద్దీ తమ వ్రేళ్లను కసిగా కొరుక్కుం టారు. ”మీరు మీ కోపావేశంలోనే చావండి. నిశ్చయంగా అల్లాహ్ గుండెల్లోని గుట్టును గురించి బాగా తెలిసినవాడు” అని వారికి చెప్పండి.
3:120 إِن تَمْسَسْكُمْ حَسَنَةٌ تَسُؤْهُمْ وَإِن تُصِبْكُمْ سَيِّئَةٌ يَفْرَحُوا بِهَا ۖ وَإِن تَصْبِرُوا وَتَتَّقُوا لَا يَضُرُّكُمْ كَيْدُهُمْ شَيْئًا ۗ إِنَّ اللَّهَ بِمَا يَعْمَلُونَ مُحِيطٌ
మీకేదైనా మేలు కలిగితే వారు బాధపడతారు. అదే మీకేదైనా హాని జరిగితే మాత్రం ఆనందిస్తారు. మీరే గనక సహనంతో, భయభక్తులతో వ్యవహరించినట్లయితే వారి కుట్ర మీకెలాంటి నష్టమూ చేకూర్చదు. ఎందుకంటే వారి కార్యకలాపాలన్నింటినీ అల్లాహ్ ముట్టడించి ఉన్నాడు.
3:121 وَإِذْ غَدَوْتَ مِنْ أَهْلِكَ تُبَوِّئُ الْمُؤْمِنِينَ مَقَاعِدَ لِلْقِتَالِ ۗ وَاللَّهُ سَمِيعٌ عَلِيمٌ
(ఓ ప్రవక్తా! ఆ సమయాన్ని కూడా జ్ఞప్తికి తెచ్చుకో,) అప్పుడు నీవు తెలతెలవారుతుండగా నీ ఇంటి నుండి బయలుదేరి రణరంగంలో విశ్వాసులు మోహరించవలసిన స్థలాలను నిర్థారించ సాగావు. అల్లాహ్ అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు.
3:122 إِذْ هَمَّت طَّائِفَتَانِ مِنكُمْ أَن تَفْشَلَا وَاللَّهُ وَلِيُّهُمَا ۗ وَعَلَى اللَّهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُونَ
మీలోని రెండు సమూహాల వారి ఆత్మవిశ్వాసం సన్నగిల్లినప్పుడు అల్లాహ్ వారికి అండగా ఉన్నాడు. విశ్వాసులైన వారు సదా అల్లాహ్‌నే నమ్ముకోవాలి.
3:123 وَلَقَدْ نَصَرَكُمُ اللَّهُ بِبَدْرٍ وَأَنتُمْ أَذِلَّةٌ ۖ فَاتَّقُوا اللَّهَ لَعَلَّكُمْ تَشْكُرُونَ
బద్ర్ (యుద్ధం)లో మీరు అత్యంత దయనీయ స్థితిలో ఉన్నప్పుడు అల్లాహ్ మిమ్మల్ని ఆదుకున్నాడు. కాబట్టి అల్లాహ్‌కు మాత్రమే భయపడండి. తద్వారా మీకు కృతజ్ఞతలు తెలుపుకునే సద్బుద్ధి ప్రాప్తిస్తుంది.
3:124 إِذْ تَقُولُ لِلْمُؤْمِنِينَ أَلَن يَكْفِيَكُمْ أَن يُمِدَّكُمْ رَبُّكُم بِثَلَاثَةِ آلَافٍ مِّنَ الْمَلَائِكَةِ مُنزَلِينَ
(ఈ కృతజ్ఞతల మూలంగానే మీకు సహాయ సహకారాలు అందవచ్చు. (ఓ ప్రవక్తా!) నీవు విశ్వాసులను ఓదార్చిన ఆ ఘడియలను కాస్త జ్ఞాపకం చేసుకో!) ”ఏమిటీ, ఆకాశం నుంచి మూడు వేల మంది దూతలను దింపి మీ ప్రభువు మీకు తోడ్పడటం మీకు చాలదా?” అని అప్పుడు నువ్వు వారితో అన్నావు.
3:125 بَلَىٰ ۚ إِن تَصْبِرُوا وَتَتَّقُوا وَيَأْتُوكُم مِّن فَوْرِهِمْ هَٰذَا يُمْدِدْكُمْ رَبُّكُم بِخَمْسَةِ آلَافٍ مِّنَ الْمَلَائِكَةِ مُسَوِّمِينَ
”అవును. మీరే గనక సహనం వహించి, భయభక్తులతో మెలగుతూ ఉండి, వారు (దైవ విరోధులు) ఇదే ఆవేశంతో మీపైకి దండెత్తివస్తే, మీ ప్రభువు ఐదువేల మంది ప్రత్యేక చిహ్నాలుగల దూతలతో మీకు సాయమందిస్తాడు.”
3:126 وَمَا جَعَلَهُ اللَّهُ إِلَّا بُشْرَىٰ لَكُمْ وَلِتَطْمَئِنَّ قُلُوبُكُم بِهِ ۗ وَمَا النَّصْرُ إِلَّا مِنْ عِندِ اللَّهِ الْعَزِيزِ الْحَكِيمِ
అల్లాహ్ మీ కొరకు దీనిని శుభవార్తగానూ, ఇంకా మీ మనోనిబ్బరం కోసం జరిగే ఏర్పాటుగానూ చేశాడు. యదార్థానికి అసలు సహాయం మాత్రం అల్లాహ్ తరఫు నుంచి లభించేదే. ఆయన సర్వాధిక్యుడు, వివేచనాపరుడు.
3:127 لِيَقْطَعَ طَرَفًا مِّنَ الَّذِينَ كَفَرُوا أَوْ يَكْبِتَهُمْ فَيَنقَلِبُوا خَائِبِينَ
అవిశ్వాసులలోని ఒక వర్గం కథ ముగించడానికి లేదా వారిని పరాభవం పాలుచేయడానికి, (వారంతా) ఓటమిపాలై వెనుతిరిగిపోవటానికిగాను (అల్లాహ్ మీకు ఈ సహాయమందించాడు).
3:128 لَيْسَ لَكَ مِنَ الْأَمْرِ شَيْءٌ أَوْ يَتُوبَ عَلَيْهِمْ أَوْ يُعَذِّبَهُمْ فَإِنَّهُمْ ظَالِمُونَ
(ఓ ప్రవక్తా! ఈ వ్యవహారంలో) నీకెలాంటి నిర్ణయాధికారం లేదు. అల్లాహ్ (గనక తలిస్తే) వారి పశ్చాత్తాపాన్ని ఆమోదిస్తాడు లేదా వారిని శిక్షిస్తాడు. ప్రస్తుతానికి వారు అక్రమానికి పాల్పడినవారే!
3:129 وَلِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۚ يَغْفِرُ لِمَن يَشَاءُ وَيُعَذِّبُ مَن يَشَاءُ ۚ وَاللَّهُ غَفُورٌ رَّحِيمٌ
భూమ్యాకాశాలలో వున్నదంతా అల్లాహ్‌దే. ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు, తాను కోరిన వారిని శిక్షిస్తాడు. అల్లాహ్ క్షమించేవాడూ, కరుణించేవాడు కూడాను.
3:130 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَأْكُلُوا الرِّبَا أَضْعَافًا مُّضَاعَفَةً ۖ وَاتَّقُوا اللَّهَ لَعَلَّكُمْ تُفْلِحُونَ
ఓ విశ్వసించిన వారలారా! ద్విగుణీకృతం, బహుగుణీకృతం చేసి వడ్డీని తినకండి. మీరు సాఫల్యం పొందటానికి గాను అల్లాహ్‌కు భయపడండి.
3:131 وَاتَّقُوا النَّارَ الَّتِي أُعِدَّتْ لِلْكَافِرِينَ
అవిశ్వాసుల కొరకు సిద్ధం చేయబడిన నరకాగ్నికి భయపడండి.
3:132 وَأَطِيعُوا اللَّهَ وَالرَّسُولَ لَعَلَّكُمْ تُرْحَمُونَ
అల్లాహ్కూ, ప్రవక్తకూ విధేయత చూపండి – తద్వారా మీరు కనికరించబడే అవకాశం ఉంది.
3:133 وَسَارِعُوا إِلَىٰ مَغْفِرَةٍ مِّن رَّبِّكُمْ وَجَنَّةٍ عَرْضُهَا السَّمَاوَاتُ وَالْأَرْضُ أُعِدَّتْ لِلْمُتَّقِينَ
మీ ప్రభువు యొక్క క్షమాభిక్ష వైపునకు, స్వర్గం వైపునకు పరుగెత్తండి. ఆ స్వర్గం వెడల్పు భూమ్యాకాశాలంత ఉంటుంది. అది భయభక్తులు గలవారి కోసం తయారు చేయబడింది.
3:134 الَّذِينَ يُنفِقُونَ فِي السَّرَّاءِ وَالضَّرَّاءِ وَالْكَاظِمِينَ الْغَيْظَ وَالْعَافِينَ عَنِ النَّاسِ ۗ وَاللَّهُ يُحِبُّ الْمُحْسِنِينَ
వారు కలిమిలోనూ, లేమిలోనూ (దైవమార్గంలో) ఖర్చు చేస్తారు. కోపాన్ని దిగమ్రింగుతారు, ప్రజల పట్ల మన్నింపుల వైఖరిని అవలంబిస్తారు. అల్లాహ్ ఇలాంటి సదాచార సంపన్నులనే ప్రేమిస్తాడు.
3:135 وَالَّذِينَ إِذَا فَعَلُوا فَاحِشَةً أَوْ ظَلَمُوا أَنفُسَهُمْ ذَكَرُوا اللَّهَ فَاسْتَغْفَرُوا لِذُنُوبِهِمْ وَمَن يَغْفِرُ الذُّنُوبَ إِلَّا اللَّهُ وَلَمْ يُصِرُّوا عَلَىٰ مَا فَعَلُوا وَهُمْ يَعْلَمُونَ
తమ ద్వారా ఏదైనా నీతిబాహ్యమైన పని జరిగిపోతే లేదా తమ ఆత్మలకు వారు ఏదైనా అన్యాయం చేసుకుంటే వెంటనే అల్లాహ్‌ను తలచుకుని, తమ పాపాల క్షమాపణకై వేడుకుంటారు. – నిజానికి అల్లాహ్ తప్ప పాపాలను క్షమించే వాడెవడున్నాడు? – వారు తమ వల్ల జరిగింది తప్పు అని తెలిసినపుడు దానిపై హటం చెయ్యరు.
3:136 أُولَٰئِكَ جَزَاؤُهُم مَّغْفِرَةٌ مِّن رَّبِّهِمْ وَجَنَّاتٌ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا ۚ وَنِعْمَ أَجْرُ الْعَامِلِينَ
తమ ప్రభువు తరఫు నుంచి క్షమాభిక్ష, క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలు ప్రతిఫలంగా లభించేది ఇటువంటి వారికే. వాటిలో వారు ఎల్లకాలం ఉంటారు. ఈ సత్కార్యాలు చేసేవారికి లభించే పుణ్యఫలం ఎంత చక్కనిది!
3:137 قَدْ خَلَتْ مِن قَبْلِكُمْ سُنَنٌ فَسِيرُوا فِي الْأَرْضِ فَانظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُكَذِّبِينَ
మీకు పూర్వం కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. కనుక (దివ్య సందేశాన్ని) ధిక్కరించిన వారికి పట్టిన గతేమిటో భూమిలో సంచరించి చూడండి.
3:138 هَٰذَا بَيَانٌ لِّلنَّاسِ وَهُدًى وَمَوْعِظَةٌ لِّلْمُتَّقِينَ
సామాన్య ప్రజానీకం కోసం ఇది (ఈ ఖుర్ఆన్) ఒక బోధన. భయభక్తులు కలవారి కోసమైతే ఇది మార్గదర్శకం మరియు హితోపదేశం.
3:139 وَلَا تَهِنُوا وَلَا تَحْزَنُوا وَأَنتُمُ الْأَعْلَوْنَ إِن كُنتُم مُّؤْمِنِينَ
క్రుంగిపోకండి, దుఃఖించకండి. విశ్వాసులుగా ఉంటే కడకు మీరే ఆధిక్యత పొందుతారు.
3:140 إِن يَمْسَسْكُمْ قَرْحٌ فَقَدْ مَسَّ الْقَوْمَ قَرْحٌ مِّثْلُهُ ۚ وَتِلْكَ الْأَيَّامُ نُدَاوِلُهَا بَيْنَ النَّاسِ وَلِيَعْلَمَ اللَّهُ الَّذِينَ آمَنُوا وَيَتَّخِذَ مِنكُمْ شُهَدَاءَ ۗ وَاللَّهُ لَا يُحِبُّ الظَّالِمِينَ
మీరు దెబ్బతిన్నారనుకుంటే మీ ప్రత్యర్థులు కూడా అలాగే దెబ్బతిన్నారు. మేము ఈ కాలచక్రాన్ని జనుల మధ్య త్రిప్పుతూ ఉంటాము. (ఉహుద్ యుద్ధంలో మీకు ఎదురైన అపజయానికి అసలు కారణం ఏమిటంటే) మీలో (నికార్సయిన) విశ్వాసులు ఎవరో అల్లాహ్ చూపించదలిచాడు. మీలో కొందరికి ‘షహాదత్’ (వీర మరణ) స్థాయిని కూడా ఆయన ప్రసాదించదలిచాడు. అల్లాహ్ దుర్మార్గులను సుతరామూ ఇష్టపడడు.
3:141 وَلِيُمَحِّصَ اللَّهُ الَّذِينَ آمَنُوا وَيَمْحَقَ الْكَافِرِينَ
ఈ పరీక్ష ద్వారా అల్లాహ్ సిసలైన విశ్వాసులను వేరు చేసి అవిశ్వాసులను తుదముట్టించదలిచాడు.
3:142 أَمْ حَسِبْتُمْ أَن تَدْخُلُوا الْجَنَّةَ وَلَمَّا يَعْلَمِ اللَّهُ الَّذِينَ جَاهَدُوا مِنكُمْ وَيَعْلَمَ الصَّابِرِينَ
ఏమిటీ, మీరు స్వర్గంలో (ఇట్టే) ప్రవేశించగలమని అనుకుంటున్నారా? వాస్తవానికి మీలో (తన మార్గంలో) పోరాడేవారెవరో, ఓర్పు వహించేవారెవరో ఇప్పటివరకూ అల్లాహ్ పరీక్షించనే లేదు.
3:143 وَلَقَدْ كُنتُمْ تَمَنَّوْنَ الْمَوْتَ مِن قَبْلِ أَن تَلْقَوْهُ فَقَدْ رَأَيْتُمُوهُ وَأَنتُمْ تَنظُرُونَ
యుద్ధానికి ముందైతే మీరు (వీర) మరణాన్ని ఎంతగానో కోరుకునేవారు. ఇప్పుడు దాన్ని మీరు మీ కళ్లారా తిలకించారు.
3:144 وَمَا مُحَمَّدٌ إِلَّا رَسُولٌ قَدْ خَلَتْ مِن قَبْلِهِ الرُّسُلُ ۚ أَفَإِن مَّاتَ أَوْ قُتِلَ انقَلَبْتُمْ عَلَىٰ أَعْقَابِكُمْ ۚ وَمَن يَنقَلِبْ عَلَىٰ عَقِبَيْهِ فَلَن يَضُرَّ اللَّهَ شَيْئًا ۗ وَسَيَجْزِي اللَّهُ الشَّاكِرِينَ
ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఒక ప్రవక్త మాత్రమే. ఈయనకు పూర్వం కూడా (చాలామంది) ప్రవక్తలు గతించారు. ఒకవేళ ఈయన చనిపోతే లేక చంపబడితే మీరు- ఇస్లాం నుంచి – వెనుతిరిగిపోతారా? వెనుతిరిగిపోయేవాడు అల్లాహ్‌కు ఏ మాత్రం హాని కలిగించలేడు. కృతజ్ఞతలు తెలిపే వారికి అల్లాహ్ త్వరలోనే మంచి ప్రతిఫలం వొసగుతాడు.
3:145 وَمَا كَانَ لِنَفْسٍ أَن تَمُوتَ إِلَّا بِإِذْنِ اللَّهِ كِتَابًا مُّؤَجَّلًا ۗ وَمَن يُرِدْ ثَوَابَ الدُّنْيَا نُؤْتِهِ مِنْهَا وَمَن يُرِدْ ثَوَابَ الْآخِرَةِ نُؤْتِهِ مِنْهَا ۚ وَسَنَجْزِي الشَّاكِرِينَ
దైవాజ్ఞ కానంతవరకూ ఏ ప్రాణీ చావదు. నిర్థారిత సమయం రాయబడి ఉంది. ప్రాపంచిక ఫలితాన్ని కోరుకున్న వారికి మేము ఎంతో కొంత ఇచ్చేస్తాము. పరలోక ప్రతిఫలాన్ని కోరుకున్న వారికి మేము దాన్ని కూడా అనుగ్రహిస్తాము. కృతజ్ఞులై ఉండేవారికి మేము త్వరలోనే మంచి ప్రతిఫలాన్ని వొసగుతాము.
3:146 وَكَأَيِّن مِّن نَّبِيٍّ قَاتَلَ مَعَهُ رِبِّيُّونَ كَثِيرٌ فَمَا وَهَنُوا لِمَا أَصَابَهُمْ فِي سَبِيلِ اللَّهِ وَمَا ضَعُفُوا وَمَا اسْتَكَانُوا ۗ وَاللَّهُ يُحِبُّ الصَّابِرِينَ
ఎంతోమంది ప్రవక్తలకు ఆదరువుగా నిలిచి, ఎందరో అల్లాహ్ భక్తులు దైవమార్గంలో పోరాడారు. వారికి కూడా అల్లాహ్ మార్గంలో కష్టాలెదురయ్యాయి. కాని వారెన్నడూ ధైర్యం కోల్పో లేదు, అశక్తతకు లోనుకాలేదు, లొంగిపోనూ లేదు. అల్లాహ్ ఇష్టపడేది (ఇలాంటి) సహనమూర్తులనే.
3:147 وَمَا كَانَ قَوْلَهُمْ إِلَّا أَن قَالُوا رَبَّنَا اغْفِرْ لَنَا ذُنُوبَنَا وَإِسْرَافَنَا فِي أَمْرِنَا وَثَبِّتْ أَقْدَامَنَا وَانصُرْنَا عَلَى الْقَوْمِ الْكَافِرِينَ
వారిది ఒక్కటే పలుకు : ”మా ప్రభూ! మా పాపాలను క్షమించు. మా పనుల్లో మా వల్ల జరిగిన ‘అతి’ని మన్నించు. మా పాదాలకు నిలకడను ప్రసాదించు. అవిశ్వాస జనులకు వ్యతిరేకంగా మాకు తోడ్పాటునందించు.”
3:148 فَآتَاهُمُ اللَّهُ ثَوَابَ الدُّنْيَا وَحُسْنَ ثَوَابِ الْآخِرَةِ ۗ وَاللَّهُ يُحِبُّ الْمُحْسِنِينَ
అల్లాహ్ వారికి ప్రాపంచిక ఫలాన్నీ ఇచ్చాడు, పరలోకపు ఉత్తమ పుణ్య ఫలాన్ని కూడా ప్రసాదించాడు. సత్కార్యాలను ఉత్తమరీతిలో నిర్వర్తించేవారిని అల్లాహ్ ఎంతగానో ప్రేమిస్తాడు.
3:149 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِن تُطِيعُوا الَّذِينَ كَفَرُوا يَرُدُّوكُمْ عَلَىٰ أَعْقَابِكُمْ فَتَنقَلِبُوا خَاسِرِينَ
ఓ విశ్వాసులారా! మీరు గనక అవిశ్వాసుల మాట విన్నారంటే, వారు మిమ్మల్ని మీ కాలి మడమలపైనే తిరోన్ముఖుల్ని చేస్తారు (ధర్మభ్రష్టుల్ని చేస్తారు). అప్పుడు నష్టపోయేది మీరే.
3:150 بَلِ اللَّهُ مَوْلَاكُمْ ۖ وَهُوَ خَيْرُ النَّاصِرِينَ
వాస్తవానికి అల్లాహ్‌యే మీ రక్షకుడు, ఆయనే అత్యుత్తమ సహాయకుడూను.
3:151 سَنُلْقِي فِي قُلُوبِ الَّذِينَ كَفَرُوا الرُّعْبَ بِمَا أَشْرَكُوا بِاللَّهِ مَا لَمْ يُنَزِّلْ بِهِ سُلْطَانًا ۖ وَمَأْوَاهُمُ النَّارُ ۚ وَبِئْسَ مَثْوَى الظَّالِمِينَ
త్వరలోనే మేము అవిశ్వాసుల హృదయాలలో భయాన్ని కలిగిస్తాము. ఎందుకంటే అల్లాహ్ ఏ ప్రమాణాన్నీ అవతరింప జేయనప్పటికీ – నిరాధారంగా – వారు ఇతరత్రా వాటిని అల్లాహ్‌కు భాగస్వాములుగా కల్పిస్తున్నారు. కనుక నరకాగ్నియే వారి నివాస స్థలం. అది దుర్మార్గుల చెడ్డ నివాసం.
3:152 وَلَقَدْ صَدَقَكُمُ اللَّهُ وَعْدَهُ إِذْ تَحُسُّونَهُم بِإِذْنِهِ ۖ حَتَّىٰ إِذَا فَشِلْتُمْ وَتَنَازَعْتُمْ فِي الْأَمْرِ وَعَصَيْتُم مِّن بَعْدِ مَا أَرَاكُم مَّا تُحِبُّونَ ۚ مِنكُم مَّن يُرِيدُ الدُّنْيَا وَمِنكُم مَّن يُرِيدُ الْآخِرَةَ ۚ ثُمَّ صَرَفَكُمْ عَنْهُمْ لِيَبْتَلِيَكُمْ ۖ وَلَقَدْ عَفَا عَنكُمْ ۗ وَاللَّهُ ذُو فَضْلٍ عَلَى الْمُؤْمِنِينَ
అల్లాహ్ మీకు చేసిన వాగ్దానాన్ని నిజం చేసి చూపాడు. అప్పుడు మీరు ఆయన అనుజ్ఞతో వారిని వధించసాగారు. అయితే ఆఖరికి మీరు పిరికితనం చూపారు. కార్యనిర్వహణలో విభేదించుకున్నారు. మీరు ఇష్టపడే వస్తువును ఆయన మీకు చూపేసరికి, మీరు అవిధేయతకు ఒడిగట్టారు. మీలో కొందరు ప్రపంచం కోసం ప్రాకులాడగా, మరికొందరు పరలోకాన్ని కోరుకున్నారు. అందువల్ల అల్లాహ్ మిమ్మల్ని పరీక్షించే నిమిత్తం, మిమ్మల్ని వారి నుంచి వెనక్కి మళ్లించాడు. అయినా ఆయన మిమ్మల్ని క్షమించాడు. యదార్థానికి అల్లాహ్ విశ్వాసుల పట్ల గొప్ప అనుగ్రహం గలవాడు..
3:153 إِذْ تُصْعِدُونَ وَلَا تَلْوُونَ عَلَىٰ أَحَدٍ وَالرَّسُولُ يَدْعُوكُمْ فِي أُخْرَاكُمْ فَأَثَابَكُمْ غَمًّا بِغَمٍّ لِّكَيْلَا تَحْزَنُوا عَلَىٰ مَا فَاتَكُمْ وَلَا مَا أَصَابَكُمْ ۗ وَاللَّهُ خَبِيرٌ بِمَا تَعْمَلُونَ
ఆ సమయంలో మీరు పరారవసాగారు. ఇంకొకరిని పట్టించుకునే ధ్యాసే మీకు లేకపోయింది. ఆ క్షణంలో వెనుక నుంచి ప్రవక్త మిమ్మల్ని కేక వేస్తూనే వున్నాడు. కనుక మీకు దక్కకుండా పోయిన దాని గురించి, వాటిల్లిన నష్టాన్ని గురించి మీరు బాధపడకుండా ఉండటానికి అల్లాహ్ మీకు దుఃఖం వెంబడి దుఃఖం కలుగజేశాడు. మీరు చేసే పనులన్నీ అల్లాహ్‌కు తెలుసు.
3:154 ثُمَّ أَنزَلَ عَلَيْكُم مِّن بَعْدِ الْغَمِّ أَمَنَةً نُّعَاسًا يَغْشَىٰ طَائِفَةً مِّنكُمْ ۖ وَطَائِفَةٌ قَدْ أَهَمَّتْهُمْ أَنفُسُهُمْ يَظُنُّونَ بِاللَّهِ غَيْرَ الْحَقِّ ظَنَّ الْجَاهِلِيَّةِ ۖ يَقُولُونَ هَل لَّنَا مِنَ الْأَمْرِ مِن شَيْءٍ ۗ قُلْ إِنَّ الْأَمْرَ كُلَّهُ لِلَّهِ ۗ يُخْفُونَ فِي أَنفُسِهِم مَّا لَا يُبْدُونَ لَكَ ۖ يَقُولُونَ لَوْ كَانَ لَنَا مِنَ الْأَمْرِ شَيْءٌ مَّا قُتِلْنَا هَاهُنَا ۗ قُل لَّوْ كُنتُمْ فِي بُيُوتِكُمْ لَبَرَزَ الَّذِينَ كُتِبَ عَلَيْهِمُ الْقَتْلُ إِلَىٰ مَضَاجِعِهِمْ ۖ وَلِيَبْتَلِيَ اللَّهُ مَا فِي صُدُورِكُمْ وَلِيُمَحِّصَ مَا فِي قُلُوبِكُمْ ۗ وَاللَّهُ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ
మరి ఈ దుఃఖం తరువాత ఆయన శాంతియుత స్థితిని మీపై అవతరింపజేశాడు. దాంతో మీలోని ఒక వర్గం వారిపై కునుకు ఆవహించసాగింది. అయితే మరోవర్గం వారు తమ ప్రాణరక్షణ గురించి తీవ్ర విచారంలో పడిపోయారు. వారు అల్లాహ్ యెడల మరీ అజ్ఞానంతో కూడిన, సత్యదూరమైన సందేహాలను, అనుమానాలను వ్యక్తపరచసాగారు. ”ఇంతకీ మాకంటూ ఏదన్నా అధికారం ఉందా?” అని వారనేవారు. ”దీనికి సంబంధించిన నిర్ణయాధికారం అంతా అల్లాహ్‌దే” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు. వారు తమ ఆంతర్యాల్లో అణచి పెట్టుకున్న విషయాలను నీ ముందు వెలిబుచ్చటం లేదు. ”మాకంటూ అధికారమేదైనా ఉండి ఉంటే మేమిలా హత మార్చబడి ఉండేవాళ్ళం కాము” అని వారంటున్నారు. (అంటే తమ మనుషులు చంపబడేవారు కాదు అని వారి అభిప్రాయం). ”ఒకవేళ మీరు మీ ఇండ్లల్లోనే ఉన్నప్పటికీ, వధించబడటం అన్నది మీకు రాసిపెట్టి ఉంటే మీ అంతట మీరే వధ్యస్థలాలకు వచ్చి తీర్తారు” అని వారికి చెప్పు. మీ మనసుల్లో దాగి ఉన్న వాటిని పరికించేందుకు, మీ హృదయాలలో వున్న దానిని శుద్ధి చేసేందుకు (అల్లాహ్ ఈ పరిస్థితులను ఉత్పన్నం చేశాడు). అల్లాహ్ గుండెల్లోని గుట్టును బాగా ఎరిగినవాడు.
3:155 إِنَّ الَّذِينَ تَوَلَّوْا مِنكُمْ يَوْمَ الْتَقَى الْجَمْعَانِ إِنَّمَا اسْتَزَلَّهُمُ الشَّيْطَانُ بِبَعْضِ مَا كَسَبُوا ۖ وَلَقَدْ عَفَا اللَّهُ عَنْهُمْ ۗ إِنَّ اللَّهَ غَفُورٌ حَلِيمٌ
ఇరు సమూహాలు ముఖాముఖీ అయిన రోజున మీలో కొందరు వెన్నుచూపారు. వారు చేసిన కొన్ని తప్పుల వల్ల షైతాన్ వారిని తడబాటుకు లోనుచేశాడు. అయినా అల్లాహ్ వారిని మన్నించాడు. అల్లాహ్ క్షమించేవాడు, సహనశీలుడూను.
3:156 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَكُونُوا كَالَّذِينَ كَفَرُوا وَقَالُوا لِإِخْوَانِهِمْ إِذَا ضَرَبُوا فِي الْأَرْضِ أَوْ كَانُوا غُزًّى لَّوْ كَانُوا عِندَنَا مَا مَاتُوا وَمَا قُتِلُوا لِيَجْعَلَ اللَّهُ ذَٰلِكَ حَسْرَةً فِي قُلُوبِهِمْ ۗ وَاللَّهُ يُحْيِي وَيُمِيتُ ۗ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ
ఓ విశ్వసించిన వారలారా! మీరు ఆ అవిశ్వాసుల్లాగా ప్రవర్తించకండి. వారు, తమ సోదరులు ప్రయాణంలోనో, యుద్ధంలోనో ఉన్నప్పుడు, ”ఒకవేళ వారు మా వద్దనే ఉండి ఉంటే చనిపోయేవారూ కాదు, చంపబడేవారూ కాదు” అని అంటారు. ఈ విధమైన తమ ఆలోచనలను అల్లాహ్ తమ హృదయశోకానికి కారణాలుగా చేయాలనే వారిలాంటి మాటలు మాట్లాడుతుంటారు. వాస్తవానికి ప్రాణభిక్ష పెట్టేవాడు, ప్రాణం తీసేవాడు అల్లాహ్ మాత్రమే. మీరు చేసే పనులన్నిటినీ అల్లాహ్ కనిపెడుతూనే ఉన్నాడు.
3:157 وَلَئِن قُتِلْتُمْ فِي سَبِيلِ اللَّهِ أَوْ مُتُّمْ لَمَغْفِرَةٌ مِّنَ اللَّهِ وَرَحْمَةٌ خَيْرٌ مِّمَّا يَجْمَعُونَ
మీరు దైవమార్గంలో చంపబడినా లేక చనిపోయినా, (మీకు లభించే) దేవుని క్షమాభిక్ష మరియు కారుణ్యం వారు కూడబెడుతున్న దానికన్నా ఎంతో మేలైనవి.
3:158 وَلَئِن مُّتُّمْ أَوْ قُتِلْتُمْ لَإِلَى اللَّهِ تُحْشَرُونَ
మీరు చనిపోయినా లేక చంపబడినా (చివరకు) మీరు సమీకరించబడేది అల్లాహ్ వద్దకే (అని మరువకండి).
3:159 فَبِمَا رَحْمَةٍ مِّنَ اللَّهِ لِنتَ لَهُمْ ۖ وَلَوْ كُنتَ فَظًّا غَلِيظَ الْقَلْبِ لَانفَضُّوا مِنْ حَوْلِكَ ۖ فَاعْفُ عَنْهُمْ وَاسْتَغْفِرْ لَهُمْ وَشَاوِرْهُمْ فِي الْأَمْرِ ۖ فَإِذَا عَزَمْتَ فَتَوَكَّلْ عَلَى اللَّهِ ۚ إِنَّ اللَّهَ يُحِبُّ الْمُتَوَكِّلِينَ
(ఓ ప్రవక్తా!) అల్లాహ్ దయవల్లనే నీవు వారి యెడల మృదు మనస్కుడవయ్యావు. ఒకవేళ నువ్వే గనక కర్కశుడవు, కఠిన మనస్కుడవు అయివుంటే వారంతా నీ దగ్గరి నుంచి వెళ్ళిపోయేవారు. కనుక నువ్వు వారిపట్ల మన్నింపుల వైఖరిని అవలంబించు, వారి క్షమాపణ కోసం (దైవాన్ని) వేడుకో. కార్య నిర్వహణలో వారిని సంప్రదిస్తూ ఉండు. ఏదైనా పని గురించి తుది నిర్ణయానికి వచ్చినప్పుడు, అల్లాహ్‌పై భారం మోపు. నిశ్చయంగా అల్లాహ్ తనను నమ్ముకున్న వారిని ప్రేమిస్తాడు.
3:160 إِن يَنصُرْكُمُ اللَّهُ فَلَا غَالِبَ لَكُمْ ۖ وَإِن يَخْذُلْكُمْ فَمَن ذَا الَّذِي يَنصُرُكُم مِّن بَعْدِهِ ۗ وَعَلَى اللَّهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُونَ
అల్లాహ్‌యే గనక మీకు తోడ్పాటునందిస్తే ఇక మిమ్మల్ని ఎవరూ జయించలేరు. ఒకవేళ ఆయనే గనక మిమ్మల్ని విడిచి పెట్టేస్తే, తరువాత మీకు సహాయపడ గలవాడెవడు? కాబట్టి విశ్వసించినవారు సదా అల్లాహ్‌నే నమ్ముకోవాలి.
3:161 وَمَا كَانَ لِنَبِيٍّ أَن يَغُلَّ ۚ وَمَن يَغْلُلْ يَأْتِ بِمَا غَلَّ يَوْمَ الْقِيَامَةِ ۚ ثُمَّ تُوَفَّىٰ كُلُّ نَفْسٍ مَّا كَسَبَتْ وَهُمْ لَا يُظْلَمُونَ
ఒక ప్రవక్త ద్రోహానికి పాల్పడటమనేది జరగని పని. ద్రోహానికి పాల్పడే ప్రతి ఒక్కడూ తను ద్రోహానికి పాల్పడిన దానిని తీసుకుని ప్రళయదినాన హాజరవుతాడు. తరువాత ప్రతి ఒక్కరికీ వారు చేసుకున్న కర్మలకు పూర్తి ప్రతిఫలం ఇవ్వబడుతుంది. వారికెలాంటి అన్యాయం జరగదు.
3:162 أَفَمَنِ اتَّبَعَ رِضْوَانَ اللَّهِ كَمَن بَاءَ بِسَخَطٍ مِّنَ اللَّهِ وَمَأْوَاهُ جَهَنَّمُ ۚ وَبِئْسَ الْمَصِيرُ
ఏమిటీ, దైవ ప్రసన్నతకు అనుగుణంగా నడుచుకున్న వాడు, దైవాగ్రహానికి పాత్రుడై అతిచెడ్డ నివాసమైన నరకానికి పోయేవానితో సమానుడవుతాడా?
3:163 هُمْ دَرَجَاتٌ عِندَ اللَّهِ ۗ وَاللَّهُ بَصِيرٌ بِمَا يَعْمَلُونَ
అల్లాహ్ వద్ద వారి స్థానాలు వేర్వేరుగా ఉన్నాయి సుమా! వారు చేసేదంతా అల్లాహ్ చూస్తూనే ఉన్నాడు.
3:164 لَقَدْ مَنَّ اللَّهُ عَلَى الْمُؤْمِنِينَ إِذْ بَعَثَ فِيهِمْ رَسُولًا مِّنْ أَنفُسِهِمْ يَتْلُو عَلَيْهِمْ آيَاتِهِ وَيُزَكِّيهِمْ وَيُعَلِّمُهُمُ الْكِتَابَ وَالْحِكْمَةَ وَإِن كَانُوا مِن قَبْلُ لَفِي ضَلَالٍ مُّبِينٍ
అల్లాహ్ విశ్వాసులకు చేసిన మహోపకారం ఏమిటంటే, ఆయన వారిలో నుండే ఒక ప్రవక్తను ఎన్నుకుని వారి వద్దకు పంపాడు. అతడు వారికి ఆయన వాక్యాలను చదివి వినిపిస్తాడు. వారిని పరిశుద్ధుల్ని చేస్తాడు. వారికి గ్రంథ జ్ఞానాన్నీ, వివేకాన్నీ బోధిస్తాడు. నిశ్చయంగా అంతకు ముందైతే వాళ్ళు స్పష్టమైన అపమార్గానికి లోనై ఉండేవారు.
3:165 أَوَلَمَّا أَصَابَتْكُم مُّصِيبَةٌ قَدْ أَصَبْتُم مِّثْلَيْهَا قُلْتُمْ أَنَّىٰ هَٰذَا ۖ قُلْ هُوَ مِنْ عِندِ أَنفُسِكُمْ ۗ إِنَّ اللَّهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
(ఏమిటీ?) మీపై ఆపదరాగానే – దీనికన్నా రెండింతలుగా మీరు వారిపై విరుచుకుపడి ఉండి కూడా – ఇదెక్కడి నుంచి వచ్చిపడిందని అంటారా? ”ఇది చేజేతులా మీరు కొనితెచ్చుకున్నదే” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు. నిశ్చయంగా అల్లాహ్ ప్రతి దానినీ చేయగల సమర్థుడు.
3:166 وَمَا أَصَابَكُمْ يَوْمَ الْتَقَى الْجَمْعَانِ فَبِإِذْنِ اللَّهِ وَلِيَعْلَمَ الْمُؤْمِنِينَ
ఇరువర్గాల వారు ఢీకొన్న ఆ రోజున మీకు కలిగిన బాధ అల్లాహ్ ఆజ్ఞ మేరకేనని తెలుసుకోండి. మీలో (సిసలైన) విశ్వాసులెవరో అల్లాహ్ (బహిరంగంగా) తెలుసుకోదలిచాడు.
3:167 وَلِيَعْلَمَ الَّذِينَ نَافَقُوا ۚ وَقِيلَ لَهُمْ تَعَالَوْا قَاتِلُوا فِي سَبِيلِ اللَّهِ أَوِ ادْفَعُوا ۖ قَالُوا لَوْ نَعْلَمُ قِتَالًا لَّاتَّبَعْنَاكُمْ ۗ هُمْ لِلْكُفْرِ يَوْمَئِذٍ أَقْرَبُ مِنْهُمْ لِلْإِيمَانِ ۚ يَقُولُونَ بِأَفْوَاهِهِم مَّا لَيْسَ فِي قُلُوبِهِمْ ۗ وَاللَّهُ أَعْلَمُ بِمَا يَكْتُمُونَ
దగాకోరులెవరో కూడా ఆయన తెలుసుకోవాలను కున్నాడు. ”రండి, అల్లాహ్ మార్గంలో పోరాడండి లేదా అవిశ్వాసులను ఎదుర్కోండి” అని వారితో (కపటులతో) అన్నప్పుడు, ”యుద్ధం జరగబోతుందని మాకు తెలిసి ఉంటే తప్పకుండా మీవెంట వచ్చే వాళ్ళమే” అని వారు బదులిచ్చారు. ఆనాడు వాళ్లు విశ్వాసం కన్నా అవిశ్వాసానికి బహు చేరువలో ఉన్నారు. తమ మనసుల్లో లేని దాన్ని నోటితో పలుకుతున్నారు. వారు దాచి ఉంచే దానిని అల్లాహ్ బాగా ఎరుగు.
3:168 الَّذِينَ قَالُوا لِإِخْوَانِهِمْ وَقَعَدُوا لَوْ أَطَاعُونَا مَا قُتِلُوا ۗ قُلْ فَادْرَءُوا عَنْ أَنفُسِكُمُ الْمَوْتَ إِن كُنتُمْ صَادِقِينَ
వారు తమ ఇండ్లల్లోనే కూర్చున్నదిగాక, తమ సోదరుల గురించి మాట్లాడుకుంటూ, వారు కూడా తమ మాట విని ఉన్నట్లయితే ఈ విధంగా చంపబడి ఉండేవారు కాదు అని అంటారు. ”మీరు సత్యవంతులే అయితే మీ ప్రాణాలను మృత్యు వాతన పడకుండా కాపాడుకోండి” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు.
3:169 وَلَا تَحْسَبَنَّ الَّذِينَ قُتِلُوا فِي سَبِيلِ اللَّهِ أَمْوَاتًا ۚ بَلْ أَحْيَاءٌ عِندَ رَبِّهِمْ يُرْزَقُونَ
అల్లాహ్ మార్గంలో చంపబడిన వారిని సుతరామూ మృతులుగా తలపోయకండి. వారు సజీవులు. వారికి తమ ప్రభువు వద్ద ఆహారం ఇవ్వబడుతుంది.
3:170 فَرِحِينَ بِمَا آتَاهُمُ اللَّهُ مِن فَضْلِهِ وَيَسْتَبْشِرُونَ بِالَّذِينَ لَمْ يَلْحَقُوا بِهِم مِّنْ خَلْفِهِمْ أَلَّا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ
అల్లాహ్ తన అనుగ్రహం నుంచి ప్రసాదించిన దాంతో వారు చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా తమతో వచ్చిచేరని, తమ వెనుక (ప్రపంచంలోనే) ఉండిపోయినవారి (విశ్వాసుల) గురించి పరస్పరం శుభవార్త వినిపించుకుంటున్నారు. భయ పడవలసిన, దుఃఖించవలసిన అవసరం లేనందులకు (వారు ఆనందంగా ఉన్నారు).
3:171 يَسْتَبْشِرُونَ بِنِعْمَةٍ مِّنَ اللَّهِ وَفَضْلٍ وَأَنَّ اللَّهَ لَا يُضِيعُ أَجْرَ الْمُؤْمِنِينَ
అల్లాహ్ వరాల పట్ల, (ఆయన) అనుగ్రహం పట్ల వారు ఎంతగానో సంతోషిస్తున్నారు. అల్లాహ్ విశ్వాసుల పుణ్యఫలాన్ని వృధా కానివ్వడన్న విషయం కూడా వారినెంతగానో సంతృప్త పరచింది.
3:172 الَّذِينَ اسْتَجَابُوا لِلَّهِ وَالرَّسُولِ مِن بَعْدِ مَا أَصَابَهُمُ الْقَرْحُ ۚ لِلَّذِينَ أَحْسَنُوا مِنْهُمْ وَاتَّقَوْا أَجْرٌ عَظِيمٌ
ఎవరయితే తీవ్రంగా గాయపడిన తరువాత కూడా అల్లాహ్ మరియు అల్లాహ్ప్రవక్త ఆజ్ఞలను శిరసావహించారో, వారిలో ఎవరయితే సదాచరణ చేసి, భయభక్తులతో మసలుకున్నారో వారి కొరకు గొప్ప పుణ్యఫలముంది.
3:173 الَّذِينَ قَالَ لَهُمُ النَّاسُ إِنَّ النَّاسَ قَدْ جَمَعُوا لَكُمْ فَاخْشَوْهُمْ فَزَادَهُمْ إِيمَانًا وَقَالُوا حَسْبُنَا اللَّهُ وَنِعْمَ الْوَكِيلُ
”అవిశ్వాస జనులు మీకు వ్యతిరేకంగా భారీ సైన్యాన్ని మోహరించి ఉన్నారు. మీరు వారికి భయపడండి” అని ప్రజలు వారితో అన్నప్పుడు, ఆ మాట వారి విశ్వాసాన్ని మరింతగా పెంచింది. దానికి జవాబుగా, ”మాకు అల్లాహ్ చాలు. ఆయన చాలా మంచి కార్యసాధకుడు” అని వారన్నారు.
3:174 فَانقَلَبُوا بِنِعْمَةٍ مِّنَ اللَّهِ وَفَضْلٍ لَّمْ يَمْسَسْهُمْ سُوءٌ وَاتَّبَعُوا رِضْوَانَ اللَّهِ ۗ وَاللَّهُ ذُو فَضْلٍ عَظِيمٍ
(తత్ఫలితంగా) వారు అల్లాహ్ ప్రసాదించిన వరాలతో, అనుగ్రహంతో తిరిగి వచ్చారు. వారికెలాంటి కీడూ కలగలేదు. వారు అల్లాహ్ ప్రసన్నతను అనుసరించారు. అల్లాహ్ గొప్ప అనుగ్రహం కలవాడు.
3:175 إِنَّمَا ذَٰلِكُمُ الشَّيْطَانُ يُخَوِّفُ أَوْلِيَاءَهُ فَلَا تَخَافُوهُمْ وَخَافُونِ إِن كُنتُم مُّؤْمِنِينَ
నిజానికి (ఈ వార్త అందజేసిన) వాడు షైతాను. వాడు తన మిత్రుల గురించి మీకు భయపెట్టాడు. కనుక మీరు అవిశ్వాసులకు భయపడకండి, మీరు విశ్వాసులే అయితే నాకు భయపడండి.
3:176 وَلَا يَحْزُنكَ الَّذِينَ يُسَارِعُونَ فِي الْكُفْرِ ۚ إِنَّهُمْ لَن يَضُرُّوا اللَّهَ شَيْئًا ۗ يُرِيدُ اللَّهُ أَلَّا يَجْعَلَ لَهُمْ حَظًّا فِي الْآخِرَةِ ۖ وَلَهُمْ عَذَابٌ عَظِيمٌ
(ఓ ప్రవక్తా!) అవిశ్వాసంలో ముందుకు దూసుకుపోతున్న వారిని చూసి నువ్వు దిగులు చెందకు. వారు అల్లాహ్‌కు ఏమాత్రం కీడు కలిగించలేరు. వారికి పరలోకంలో ఎలాంటి భాగమూ ఇవ్వరాదన్నది అల్లాహ్ ఉద్దేశం. వారి కొరకు ఘోర శిక్ష కలదు.
3:177 إِنَّ الَّذِينَ اشْتَرَوُا الْكُفْرَ بِالْإِيمَانِ لَن يَضُرُّوا اللَّهَ شَيْئًا وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ
విశ్వాసానికి బదులుగా అవిశ్వాసాన్ని కొనేవారు ఎట్టి పరిస్థితిలోనూ అల్లాహ్‌కు అపకారం చేయలేరు. పైగా వ్యధాభరితమైన శిక్ష వారికోసం సిద్ధం చేయబడి ఉంది.
3:178 وَلَا يَحْسَبَنَّ الَّذِينَ كَفَرُوا أَنَّمَا نُمْلِي لَهُمْ خَيْرٌ لِّأَنفُسِهِمْ ۚ إِنَّمَا نُمْلِي لَهُمْ لِيَزْدَادُوا إِثْمًا ۚ وَلَهُمْ عَذَابٌ مُّهِينٌ
మేము ఇస్తున్న అవకాశాన్ని అవిశ్వాసులు తమ పాలిట మేలైనదని భావించరాదు సుమా! వారు తమ పాపాల పుట్టను పెంచుకోవటానికే ఈ అవకాశం ఇస్తున్నాం. అవమానభరిత మైన శిక్ష వారి కోసమే ఉంది.
3:179 مَّا كَانَ اللَّهُ لِيَذَرَ الْمُؤْمِنِينَ عَلَىٰ مَا أَنتُمْ عَلَيْهِ حَتَّىٰ يَمِيزَ الْخَبِيثَ مِنَ الطَّيِّبِ ۗ وَمَا كَانَ اللَّهُ لِيُطْلِعَكُمْ عَلَى الْغَيْبِ وَلَٰكِنَّ اللَّهَ يَجْتَبِي مِن رُّسُلِهِ مَن يَشَاءُ ۖ فَآمِنُوا بِاللَّهِ وَرُسُلِهِ ۚ وَإِن تُؤْمِنُوا وَتَتَّقُوا فَلَكُمْ أَجْرٌ عَظِيمٌ
అపవిత్రులను పవిత్రుల నుంచి వేరుపరచే వరకూ అల్లాహ్ విశ్వాసులను ఇప్పుడున్న స్థితిలోనే వదలిపెట్టడు. అలా అని అల్లాహ్ మీకు అగోచర విషయాలనూ తెలుపడు. పైగా అల్లాహ్ తన ప్రవక్తలలో తాను కోరిన వారిని (ఇందుకోసం) ఎన్నుకుంటాడు. అందుచేత మీరు అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తలను విశ్వసించండి. మీరే గనక విశ్వసించి, దైవభీతిపరులుగా మసలుకున్నట్లయితే మీకు గొప్ప పుణ్యఫలం లభిస్తుంది.
3:180 وَلَا يَحْسَبَنَّ الَّذِينَ يَبْخَلُونَ بِمَا آتَاهُمُ اللَّهُ مِن فَضْلِهِ هُوَ خَيْرًا لَّهُم ۖ بَلْ هُوَ شَرٌّ لَّهُمْ ۖ سَيُطَوَّقُونَ مَا بَخِلُوا بِهِ يَوْمَ الْقِيَامَةِ ۗ وَلِلَّهِ مِيرَاثُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۗ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ خَبِيرٌ
అల్లాహ్ తన కృపతో ప్రసాదించిన దానిలో పిసినారులుగా ప్రవర్తించేవారు, ఆ పిసినారితనం తమ పాలిట మేలైనదని భావించరాదు. వాస్తవానికి అది వారి పాలిట హానికరం. పిసినారి తనంతో వారు కూడబెట్టుకున్న వస్తువే ప్రళయదినాన వారి మెడకు గుదిబండగా మారుతుంది. భూమ్యాకాశాల వారసత్వం అల్లాహ్‌కే చెందుతుంది. మీరు చేసేదంతా అల్లాహ్‌కు తెలుసు.
3:181 لَّقَدْ سَمِعَ اللَّهُ قَوْلَ الَّذِينَ قَالُوا إِنَّ اللَّهَ فَقِيرٌ وَنَحْنُ أَغْنِيَاءُ ۘ سَنَكْتُبُ مَا قَالُوا وَقَتْلَهُمُ الْأَنبِيَاءَ بِغَيْرِ حَقٍّ وَنَقُولُ ذُوقُوا عَذَابَ الْحَرِيقِ
”అల్లాహ్ పేదవాడు, మేము ధనికులం” అని అన్నవారి మాటను అల్లాహ్ విన్నాడు. వారి ఈ మాటను మేము వ్రాసుకుంటాము. వారు ప్రవక్తలను అన్యాయంగా హతమార్చటాన్ని కూడా మేము నమోదు చేసుకుంటాము. ”దహించే అగ్ని శిక్షను చవిచూడండి.”
3:182 ذَٰلِكَ بِمَا قَدَّمَتْ أَيْدِيكُمْ وَأَنَّ اللَّهَ لَيْسَ بِظَلَّامٍ لِّلْعَبِيدِ
”ఇది మీరు ఇంతకుమునుపు చేసుకున్న కర్మలకు ప్రతిఫలం. అల్లాహ్ తన దాసులకు అన్యాయం చేసేవాడు కాడు” అని (తీర్పుదినాన) మేము వారికి చెబుతాము.
3:183 الَّذِينَ قَالُوا إِنَّ اللَّهَ عَهِدَ إِلَيْنَا أَلَّا نُؤْمِنَ لِرَسُولٍ حَتَّىٰ يَأْتِيَنَا بِقُرْبَانٍ تَأْكُلُهُ النَّارُ ۗ قُلْ قَدْ جَاءَكُمْ رُسُلٌ مِّن قَبْلِي بِالْبَيِّنَاتِ وَبِالَّذِي قُلْتُمْ فَلِمَ قَتَلْتُمُوهُمْ إِن كُنتُمْ صَادِقِينَ
”అగ్ని తినివేసేటటువంటి ఖుర్బానీని మా వద్దకు తేనంత వరకూ ఏ ప్రవక్తనూ విశ్వసించరాదని అల్లాహ్ మాకు ఆజ్ఞాపించాడు” అని చెప్పిన జనం వారు. ఓ ప్రవక్తా! వారితో ఇలా అను: ”నాకు పూర్వం మీ వద్దకు వచ్చిన ప్రవక్తలు ఇతర అనేక మహిమలతోపాటు, మీరు కోరుతున్న ఈ మహిమను కూడా తీసుకువచ్చారు. మరి మీరు సత్యవంతులే అయితే వారిని ఎందుకు చంపారు?”
3:184 فَإِن كَذَّبُوكَ فَقَدْ كُذِّبَ رُسُلٌ مِّن قَبْلِكَ جَاءُوا بِالْبَيِّنَاتِ وَالزُّبُرِ وَالْكِتَابِ الْمُنِيرِ
(ఇంతగా బోధపరచినప్పటికీ) వారు నిన్ను ధిక్కరిస్తే, నీకు పూర్వం కూడా స్పష్టమయిన నిదర్శనాలను, సహీఫాలను, జోతిర్మయమైన గ్రంథాన్ని తీసుకువచ్చిన ప్రవక్తలు కూడా ఇటువంటి ధిక్కారానికి గురయ్యారు.
3:185 كُلُّ نَفْسٍ ذَائِقَةُ الْمَوْتِ ۗ وَإِنَّمَا تُوَفَّوْنَ أُجُورَكُمْ يَوْمَ الْقِيَامَةِ ۖ فَمَن زُحْزِحَ عَنِ النَّارِ وَأُدْخِلَ الْجَنَّةَ فَقَدْ فَازَ ۗ وَمَا الْحَيَاةُ الدُّنْيَا إِلَّا مَتَاعُ الْغُرُورِ
ప్రతి ప్రాణీ మృత్యువు రుచి చూడవలసిందే. ప్రళయదినాన మీరు అందరూ మీ కర్మల పూర్తి ఫలితాన్ని పొందుతారు. అప్పుడు ఎవడు నరకాగ్ని నుంచి కాపాడబడి, స్వర్గంలో ప్రవేశం కల్పించబడతాడో అతడు నిశ్చయంగా సఫలీకృతుడయ్యాడు. ప్రాపంచిక జీవితమైతే ఒక మాయావస్తువు తప్ప మరేమీ కాదు.
3:186 لَتُبْلَوُنَّ فِي أَمْوَالِكُمْ وَأَنفُسِكُمْ وَلَتَسْمَعُنَّ مِنَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ مِن قَبْلِكُمْ وَمِنَ الَّذِينَ أَشْرَكُوا أَذًى كَثِيرًا ۚ وَإِن تَصْبِرُوا وَتَتَّقُوا فَإِنَّ ذَٰلِكَ مِنْ عَزْمِ الْأُمُورِ
నిశ్చయంగా మీ ధనప్రాణాల ద్వారా మీరు పరీక్షించ బడతారు. అంతేకాదు, మీకు పూర్వం గ్రంథం వొసగబడిన వారి తరఫునుండీ, ముష్రిక్కుల తరఫునుండీ మీరు బాధాకరమైన మాటలెన్నో వినవలసి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు గనక సహనం పాటిస్తూ, భయభక్తులతో మసలుకుంటే ఇదెంతో సాహసోపేతమైన పనే!
3:187 وَإِذْ أَخَذَ اللَّهُ مِيثَاقَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ لَتُبَيِّنُنَّهُ لِلنَّاسِ وَلَا تَكْتُمُونَهُ فَنَبَذُوهُ وَرَاءَ ظُهُورِهِمْ وَاشْتَرَوْا بِهِ ثَمَنًا قَلِيلًا ۖ فَبِئْسَ مَا يَشْتَرُونَ
(జ్ఞాపకం చెయ్యి,) అల్లాహ్ గ్రంథవహుల నుంచి, ”మీరు గ్రంథజ్ఞానాన్ని ప్రజలకు తప్పకుండా వివరించాలి. దానిని దాచకూడదు” అని వాగ్దానం తీసుకున్నాడు. అయినప్పటికీ వారు ఈ వాగ్దానాన్ని తమ వీపు వెనుక పడవేయటమేగాక అతి తక్కువ మూల్యానికి దాన్ని అమ్మివేశారు. వారు చేసిన ఈ వర్తకం బహు చెడ్డది.
3:188 لَا تَحْسَبَنَّ الَّذِينَ يَفْرَحُونَ بِمَا أَتَوا وَّيُحِبُّونَ أَن يُحْمَدُوا بِمَا لَمْ يَفْعَلُوا فَلَا تَحْسَبَنَّهُم بِمَفَازَةٍ مِّنَ الْعَذَابِ ۖ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ
తాము చేసిన పనులపై సంబరపడేవారు, తాము చేయని పనికి కూడా తమకు జేజేలు లభించాలని తహతహలాడేవారు శిక్ష నుంచి బయటపడ్తారని నువ్వు అనుకోకు. వారి కొరకైతే వ్యధా భరితమైన శిక్ష ఉంది.
3:189 وَلِلَّهِ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۗ وَاللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
భూమ్యాకాశాల సార్వభౌమత్వం అల్లాహ్‌దే. అల్లాహ్ ప్రతి వస్తువుపై అధికారం గలవాడు.
3:190 إِنَّ فِي خَلْقِ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَاخْتِلَافِ اللَّيْلِ وَالنَّهَارِ لَآيَاتٍ لِّأُولِي الْأَلْبَابِ
నిశ్చయంగా భూమ్యాకాశాల సృష్టిలో, రేయింబవళ్ల రాకపోకలలో విజ్ఞులకు ఎన్నో సూచనలున్నాయి.
3:191 الَّذِينَ يَذْكُرُونَ اللَّهَ قِيَامًا وَقُعُودًا وَعَلَىٰ جُنُوبِهِمْ وَيَتَفَكَّرُونَ فِي خَلْقِ السَّمَاوَاتِ وَالْأَرْضِ رَبَّنَا مَا خَلَقْتَ هَٰذَا بَاطِلًا سُبْحَانَكَ فَقِنَا عَذَابَ النَّارِ
వారు నిల్చుని, కూర్చుని, తమ పడకలపై ఒత్తిగిలి అల్లాహ్‌ను స్మరిస్తూ ఉంటారు. భూమ్యాకాశాల సృష్టి గురించి యోచన చేస్తూ ఉంటారు. వారిలా అంటారు : ”మా ప్రభూ! నువ్వు ఈ సృష్టిని నిరర్థకంగా చేయలేదు. నువ్వు పవిత్రుడవు. మమ్మల్ని నరకాగ్ని శిక్ష నుంచి కాపాడు.”
3:192 رَبَّنَا إِنَّكَ مَن تُدْخِلِ النَّارَ فَقَدْ أَخْزَيْتَهُ ۖ وَمَا لِلظَّالِمِينَ مِنْ أَنصَارٍ
”ఓ మా పోషకుడా! నువ్వెవరినైతే నరకాగ్నిలో పడవేస్తావో, వాణ్ణి నువ్వు పరాభవానికి, అవమానానికి గురి చేసినట్లే. యదార్థానికి దుర్మార్గులకు తోడ్పడేవారెవరూ ఉండరు.”
3:193 رَّبَّنَا إِنَّنَا سَمِعْنَا مُنَادِيًا يُنَادِي لِلْإِيمَانِ أَنْ آمِنُوا بِرَبِّكُمْ فَآمَنَّا ۚ رَبَّنَا فَاغْفِرْ لَنَا ذُنُوبَنَا وَكَفِّرْ عَنَّا سَيِّئَاتِنَا وَتَوَفَّنَا مَعَ الْأَبْرَارِ
”మా ప్రభూ! పిలిచేవాడొకడు విశ్వాసం (ఈమాన్) వైపుకు పిలవటం, ‘ప్రజలారా! మీ ప్రభువును విశ్వసించండి’ అని పిలుపునివ్వటం మేము విన్నాము. అంతే! మేము విశ్వసించాము. కనుక ఓ ప్రభూ! మా పాపాలను క్షమించు. మా చెడుగులను మా నుంచి దూరం చెయ్యి. సజ్జనులతోపాటు మాకు మరణం వొసగు.”
3:194 رَبَّنَا وَآتِنَا مَا وَعَدتَّنَا عَلَىٰ رُسُلِكَ وَلَا تُخْزِنَا يَوْمَ الْقِيَامَةِ ۗ إِنَّكَ لَا تُخْلِفُ الْمِيعَادَ
”మా ప్రభూ! నీ ప్రవక్తల ద్వారా నీవు మాకు చేసిన వాగ్దానం ప్రకారం మమ్మల్ని అనుగ్రహించు. ప్రళయదినాన మమ్మల్ని అవమానపరచకు. ఎట్టి పరిస్థితిలోనూ నీవు వాగ్దానానికి విరుద్ధంగా వ్యవహరించేవాడవు కావు.”
3:195 فَاسْتَجَابَ لَهُمْ رَبُّهُمْ أَنِّي لَا أُضِيعُ عَمَلَ عَامِلٍ مِّنكُم مِّن ذَكَرٍ أَوْ أُنثَىٰ ۖ بَعْضُكُم مِّن بَعْضٍ ۖ فَالَّذِينَ هَاجَرُوا وَأُخْرِجُوا مِن دِيَارِهِمْ وَأُوذُوا فِي سَبِيلِي وَقَاتَلُوا وَقُتِلُوا لَأُكَفِّرَنَّ عَنْهُمْ سَيِّئَاتِهِمْ وَلَأُدْخِلَنَّهُمْ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ ثَوَابًا مِّنْ عِندِ اللَّهِ ۗ وَاللَّهُ عِندَهُ حُسْنُ الثَّوَابِ
వారి ప్రభువు వారి మొరను ఆలకించి ఆమోదించాడు: ”మీలో పని చేసేవారి పనిని – వారు పురుషులైనా సరే, స్త్రీలయినాసరే – నేను వృధా చేయను. మీరు పరస్పరం ఒకే కోవకు చెందినవారు. కాబట్టి తమ స్వస్థలం వదలి వలస వెళ్ళినవారు (హిజ్రత్ చేసినవారు), తమ ఇళ్ళనుంచి వెళ్లగొట్ట బడినవారు, నా మార్గంలో వేధింపులకు గురైనవారు, నా మార్గంలో పోరాడి చంపబడినవారు – అటువంటి వారి చెడుగులను వారి నుంచి దూరం చేస్తాను. క్రింద కాలువలు ప్రవహించే (స్వర్గ) వనాలలో వారిని ప్రవేశింపజేస్తాను. ఇదీ అల్లాహ్ తరఫున వారికి లభించే పుణ్యఫలం. అల్లాహ్ వద్దనే అత్యుత్తమమయిన పుణ్యఫలం ఉంది” అని సెలవిచ్చాడు.
3:196 لَا يَغُرَّنَّكَ تَقَلُّبُ الَّذِينَ كَفَرُوا فِي الْبِلَادِ
(ఓ ప్రవక్తా!) నగరాలలో దైవ తిరస్కారుల స్వేచ్ఛా సంచారం నిన్ను మోసపుచ్చకూడదు.
3:197 مَتَاعٌ قَلِيلٌ ثُمَّ مَأْوَاهُمْ جَهَنَّمُ ۚ وَبِئْسَ الْمِهَادُ
ఇది చాలా స్వల్ప ప్రయోజనం మాత్రమే. ఆ తరువాత నరకమే వారి నివాస స్థలం అవుతుంది. అదెంతో అధ్వాన్నమైన స్థలం.
3:198 لَٰكِنِ الَّذِينَ اتَّقَوْا رَبَّهُمْ لَهُمْ جَنَّاتٌ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا نُزُلًا مِّنْ عِندِ اللَّهِ ۗ وَمَا عِندَ اللَّهِ خَيْرٌ لِّلْأَبْرَارِ
కాని తమ ప్రభువుకు భయపడుతూ మసలుకునేవారి కోసం క్రింద కాలువలు ప్రవహించే (స్వర్గ) వనాలున్నాయి. వాటిలో వారు కలకాలం ఉంటారు. ఇదీ అల్లాహ్ వద్ద నుంచి వారికి లభించే ఆతిథ్యం. సద్వర్తనుల కోసం అల్లాహ్ వద్ద ఉన్నది అన్నింటికంటే శ్రేష్ఠమైనది.
3:199 وَإِنَّ مِنْ أَهْلِ الْكِتَابِ لَمَن يُؤْمِنُ بِاللَّهِ وَمَا أُنزِلَ إِلَيْكُمْ وَمَا أُنزِلَ إِلَيْهِمْ خَاشِعِينَ لِلَّهِ لَا يَشْتَرُونَ بِآيَاتِ اللَّهِ ثَمَنًا قَلِيلًا ۗ أُولَٰئِكَ لَهُمْ أَجْرُهُمْ عِندَ رَبِّهِمْ ۗ إِنَّ اللَّهَ سَرِيعُ الْحِسَابِ
గ్రంథవహులలో కొందరున్నారు – వారు అల్లాహ్‌ను, మీపై అవతరించిన దానినీ, వారి వైపునకు అవతరించిన దాన్ని కూడా విశ్వసిస్తారు. అల్లాహ్‌కు భయపడుతూ ఉంటారు. అల్లాహ్ ఆయతులను కొద్దిపాటి మూల్యానికి అమ్ముకోరు. అలాంటివారి ప్రతిఫలం వారి ప్రభువు వద్ద ఉంది. నిశ్చయంగా అల్లాహ్ వేగంగా లెక్క తీసుకుంటాడు.
3:200 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اصْبِرُوا وَصَابِرُوا وَرَابِطُوا وَاتَّقُوا اللَّهَ لَعَلَّكُمْ تُفْلِحُونَ
ఓ విశ్వసించిన వారలారా! మీరు సహనస్థయిర్యాలను ప్రదర్శించండి. పరస్పరం సహనం గురించి బోధించుకుంటూ, (అల్లాహ్ మార్గంలో పోరుకు) సమాయత్తమై ఉండండి. అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి. తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు.
4. సూరా అన్ నిసా
4:1 يَا أَيُّهَا النَّاسُ اتَّقُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُم مِّن نَّفْسٍ وَاحِدَةٍ وَخَلَقَ مِنْهَا زَوْجَهَا وَبَثَّ مِنْهُمَا رِجَالًا كَثِيرًا وَنِسَاءً ۚ وَاتَّقُوا اللَّهَ الَّذِي تَسَاءَلُونَ بِهِ وَالْأَرْحَامَ ۚ إِنَّ اللَّهَ كَانَ عَلَيْكُمْ رَقِيبًا
మానవులారా! మిమ్మల్ని ఒకే ప్రాణి నుంచి పుట్టించి, దాన్నుంచే దాని జతను కూడా సృష్టించి, ఆ ఇద్దరి ద్వారా ఎంతో మంది పురుషులను, స్త్రీలను వ్యాపింపజేసిన మీ ప్రభువుకు భయపడండి. ఎవరిపేరుతో మీరు పరస్పరం మీకు కావలసిన వాటిని అడుగుతారో ఆ అల్లాహ్‌కు భయపడండి. బంధుత్వ సంబంధాల తెగత్రెంపులకు దూరంగా ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ మీపై నిఘావేసి ఉన్నాడు.
4:2 وَآتُوا الْيَتَامَىٰ أَمْوَالَهُمْ ۖ وَلَا تَتَبَدَّلُوا الْخَبِيثَ بِالطَّيِّبِ ۖ وَلَا تَأْكُلُوا أَمْوَالَهُمْ إِلَىٰ أَمْوَالِكُمْ ۚ إِنَّهُ كَانَ حُوبًا كَبِيرًا
తండ్రి లేని బిడ్డలకు వారి ఆస్తిని వారికివ్వండి. పరిశుద్ధమైన, ధర్మసమ్మతమైన వస్తువులకు బదులు అపవిత్రమైన, అధర్మమైన వస్తువులను తీసుకోకండి. మీ సొమ్ములతోపాటు వారి సొమ్మును కూడా కలగాపులగం చేసి స్వాహా చేయకండి. ముమ్మాటికీ ఇది మహా పాతకమే.
4:3 وَإِنْ خِفْتُمْ أَلَّا تُقْسِطُوا فِي الْيَتَامَىٰ فَانكِحُوا مَا طَابَ لَكُم مِّنَ النِّسَاءِ مَثْنَىٰ وَثُلَاثَ وَرُبَاعَ ۖ فَإِنْ خِفْتُمْ أَلَّا تَعْدِلُوا فَوَاحِدَةً أَوْ مَا مَلَكَتْ أَيْمَانُكُمْ ۚ ذَٰلِكَ أَدْنَىٰ أَلَّا تَعُولُوا
(మీ సంరక్షణలో ఉన్న) తండ్రిలేని ఆడపిల్లలను వివాహమాడి న్యాయం చేయలేమన్న భయం మీకుంటే, మీకు నచ్చిన వేరితర స్త్రీలలో ఇద్దరినిగానీ, ముగ్గురినిగానీ, నలుగురినిగానీ వివాహ మాడండి. అయితే వారి మధ్య న్యాయబద్ధంగా వ్యవహరించలేమన్న భయం మీకున్నప్పుడు ఒక్కామెతోనే సరిపెట్టుకోండి. లేదా మీ యాజమాన్యంలోకి వచ్చిన బానిస స్త్రీలతో గడపండి. మీరు ఒక వైపుకు మొగ్గిపోకుండా (అంటే అన్యాయానికి పాల్పడకుండా) ఉండటానికి ఇది అత్యుత్తమ మార్గం.
4:4 وَآتُوا النِّسَاءَ صَدُقَاتِهِنَّ نِحْلَةً ۚ فَإِن طِبْنَ لَكُمْ عَن شَيْءٍ مِّنْهُ نَفْسًا فَكُلُوهُ هَنِيئًا مَّرِيئًا
స్త్రీలకు వారి మహర్ సొమ్మును మనస్ఫూర్తిగా ఇవ్వండి. ఒకవేళ వారు గనక తమంతట తాముగా – ఇష్టపూర్వకంగా – మహర్లో కొంత మొత్తాన్ని వదలిపెట్టినట్లయితే సంతోషంగా (నిస్సంకోచంగా) దాన్ని అనుభవించండి.
4:5 وَلَا تُؤْتُوا السُّفَهَاءَ أَمْوَالَكُمُ الَّتِي جَعَلَ اللَّهُ لَكُمْ قِيَامًا وَارْزُقُوهُمْ فِيهَا وَاكْسُوهُمْ وَقُولُوا لَهُمْ قَوْلًا مَّعْرُوفًا
అల్లాహ్ మీ జరుగుబాటుకు ఆధారంగా చేసిన మీ ధనాన్ని అవివేకుల పరం చేయకండి. కాకపోతే ఆ సంపదలో నుంచి వారికి అన్నవస్త్రాలు మొదలగునవి సమకూర్చండి. వారితో మంచితనంతో, మృదువుగా మాట్లాడండి.
4:6 وَابْتَلُوا الْيَتَامَىٰ حَتَّىٰ إِذَا بَلَغُوا النِّكَاحَ فَإِنْ آنَسْتُم مِّنْهُمْ رُشْدًا فَادْفَعُوا إِلَيْهِمْ أَمْوَالَهُمْ ۖ وَلَا تَأْكُلُوهَا إِسْرَافًا وَبِدَارًا أَن يَكْبَرُوا ۚ وَمَن كَانَ غَنِيًّا فَلْيَسْتَعْفِفْ ۖ وَمَن كَانَ فَقِيرًا فَلْيَأْكُلْ بِالْمَعْرُوفِ ۚ فَإِذَا دَفَعْتُمْ إِلَيْهِمْ أَمْوَالَهُمْ فَأَشْهِدُوا عَلَيْهِمْ ۚ وَكَفَىٰ بِاللَّهِ حَسِيبًا
తండ్రిలేని బిడ్డలు పెళ్ళీడుకు వచ్చేవరకూ వారిని తీర్చిదిద్దుతూ, పరీక్షిస్తూ ఉండండి. ఒకవేళ వారిలో తెలివితేటలు, కార్యదక్షత కానవస్తే వారి ఆస్తిని వారికి అప్పగించండి. వారు పెద్దవారవుతున్నారన్న భయంతో వారి ఆస్తిపాస్తులను ఆదరా బాదరాగా దుబారా ఖర్చుచేయకండి. తండ్రిలేని బిడ్డల పోషకుడు ధనవంతుడైన పక్షంలో వారి సొమ్మును ముట్టుకోకూడదు. ఒకవేళ అతడు పేదవాడైతే ధర్మబద్ధంగా – అవసరమైనంత మేరకు – అనుభవించవచ్చు. మరి వారి ఆస్తిని వారికి అప్పగించేటప్పుడు దానికి సాక్షుల్ని పెట్టుకోండి. లెక్క తీసుకోవటానికి అల్లాహ్ చాలు.
4:7 لِّلرِّجَالِ نَصِيبٌ مِّمَّا تَرَكَ الْوَالِدَانِ وَالْأَقْرَبُونَ وَلِلنِّسَاءِ نَصِيبٌ مِّمَّا تَرَكَ الْوَالِدَانِ وَالْأَقْرَبُونَ مِمَّا قَلَّ مِنْهُ أَوْ كَثُرَ ۚ نَصِيبًا مَّفْرُوضًا
తల్లిదండ్రులు, సమీప బంధువులు వదలివెళ్ళిన ఆస్తిలో పురుషులకు భాగం ఉంది. అలాగే తల్లిదండ్రులు, సమీప బంధువులు వదలివెళ్ళిన ఆస్తిలో స్త్రీలకు కూడా భాగం ఉంది. ఆ ఆస్తి తక్కువైనాసరే, ఎక్కువైనాసరే (అందులో) వాటా మాత్రం నిర్ధారితమై ఉంది.
4:8 وَإِذَا حَضَرَ الْقِسْمَةَ أُولُو الْقُرْبَىٰ وَالْيَتَامَىٰ وَالْمَسَاكِينُ فَارْزُقُوهُم مِّنْهُ وَقُولُوا لَهُمْ قَوْلًا مَّعْرُوفًا
ఆస్తిని పంచుకునే సమయంలో బంధువులు, తండ్రిలేని బిడ్డలు, నిరుపేదలు వస్తే అందులో నుంచి వారికీ కొంత ఇవ్వండి. (ఆ సందర్భాన) వారితో మృదువుగా మాట్లాడండి.
4:9 وَلْيَخْشَ الَّذِينَ لَوْ تَرَكُوا مِنْ خَلْفِهِمْ ذُرِّيَّةً ضِعَافًا خَافُوا عَلَيْهِمْ فَلْيَتَّقُوا اللَّهَ وَلْيَقُولُوا قَوْلًا سَدِيدًا
ఒకవేళ తాము తమ వెనుక చిన్న చిన్న పసికందులను విడిచిపోతే, వారికెక్కడ అన్యాయం జరుగుతుందోనని ఆందోళన చెందేవారు (ఈ సందర్భంగా) భయపడాలి. వారు అల్లాహ్‌కు భయపడుతూ, సముచితమైన రీతిలో మాట్లాడాలి.
4:10 إِنَّ الَّذِينَ يَأْكُلُونَ أَمْوَالَ الْيَتَامَىٰ ظُلْمًا إِنَّمَا يَأْكُلُونَ فِي بُطُونِهِمْ نَارًا ۖ وَسَيَصْلَوْنَ سَعِيرًا
తండ్రిలేని బిడ్డల సొమ్మును అన్యాయంగా తినేవారు తమ పొట్టల్ని అగ్నితో నింపుకుంటున్నారు. త్వరలోనే వారు మండే అగ్నిలోకి ప్రవేశిస్తారు.
4:11 يُوصِيكُمُ اللَّهُ فِي أَوْلَادِكُمْ ۖ لِلذَّكَرِ مِثْلُ حَظِّ الْأُنثَيَيْنِ ۚ فَإِن كُنَّ نِسَاءً فَوْقَ اثْنَتَيْنِ فَلَهُنَّ ثُلُثَا مَا تَرَكَ ۖ وَإِن كَانَتْ وَاحِدَةً فَلَهَا النِّصْفُ ۚ وَلِأَبَوَيْهِ لِكُلِّ وَاحِدٍ مِّنْهُمَا السُّدُسُ مِمَّا تَرَكَ إِن كَانَ لَهُ وَلَدٌ ۚ فَإِن لَّمْ يَكُن لَّهُ وَلَدٌ وَوَرِثَهُ أَبَوَاهُ فَلِأُمِّهِ الثُّلُثُ ۚ فَإِن كَانَ لَهُ إِخْوَةٌ فَلِأُمِّهِ السُّدُسُ ۚ مِن بَعْدِ وَصِيَّةٍ يُوصِي بِهَا أَوْ دَيْنٍ ۗ آبَاؤُكُمْ وَأَبْنَاؤُكُمْ لَا تَدْرُونَ أَيُّهُمْ أَقْرَبُ لَكُمْ نَفْعًا ۚ فَرِيضَةً مِّنَ اللَّهِ ۗ إِنَّ اللَّهَ كَانَ عَلِيمًا حَكِيمًا
అల్లాహ్ మీ సంతానం విషయంలో మీకు ఈ విధంగా ఆజ్ఞాపిస్తున్నాడు : ఒక అబ్బాయి వాటా ఇద్దరు అమ్మాయిల వాటాకు సమానం. ఒకవేళ (మృతునికి) ఇద్దరుకన్నా ఎక్కువ మంది కుమార్తెలు మాత్రమే ఉంటే వారికి వారసత్వ ఆస్తిలో మూడింట రెండొంతుల భాగం లభిస్తుంది. ఒకవేళ ఒకే కూతురుంటే ఆమెకు సగభాగం దక్కుతుంది. చనిపోయిన వ్యక్తికి గనక సంతానముంటే, అతని తల్లిదండ్రులలో ఒక్కొక్కరికి అతను వదలివెళ్ళిన ఆస్తిలో ఆరింట ఒక భాగం లభిస్తుంది. ఒకవేళ మృతుడు సంతానం లేనివాడై ఉండి, అతని తల్లిదండ్రులే అతని ఆస్తికి వారసులైనపుడు, అతని తల్లికి మూడింట ఒక భాగం ఇవ్వాలి. ఒకవేళ మృతునికి గనక అనేక మంది అన్నదమ్ములుంటే, అప్పుడు తల్లికి ఆరింట ఒక భాగం మాత్రమే దక్కుతుంది. చనిపోయిన వ్యక్తి వ్రాసిన వీలునామాను అమలు పరచి, అతను చేసి వున్న అప్పులను తీర్చిన మీదటే ఈ (ఆస్తి) వాటాలు లభిస్తాయి. మీ తండ్రులలో లేక కుమారులలో – మీకు ప్రయోజనం చేకూర్చటంలో ఎవరు ఎక్కువ సన్నిహితులో మీకు తెలియదు. ఇవి అల్లాహ్ తరఫున నిర్ణయించబడిన వాటాలు. నిశ్చయంగా అల్లాహ్ సర్వజ్ఞాని, పరిపూర్ణ వివేకం గలవాడు.
4:12 وَلَكُمْ نِصْفُ مَا تَرَكَ أَزْوَاجُكُمْ إِن لَّمْ يَكُن لَّهُنَّ وَلَدٌ ۚ فَإِن كَانَ لَهُنَّ وَلَدٌ فَلَكُمُ الرُّبُعُ مِمَّا تَرَكْنَ ۚ مِن بَعْدِ وَصِيَّةٍ يُوصِينَ بِهَا أَوْ دَيْنٍ ۚ وَلَهُنَّ الرُّبُعُ مِمَّا تَرَكْتُمْ إِن لَّمْ يَكُن لَّكُمْ وَلَدٌ ۚ فَإِن كَانَ لَكُمْ وَلَدٌ فَلَهُنَّ الثُّمُنُ مِمَّا تَرَكْتُم ۚ مِّن بَعْدِ وَصِيَّةٍ تُوصُونَ بِهَا أَوْ دَيْنٍ ۗ وَإِن كَانَ رَجُلٌ يُورَثُ كَلَالَةً أَوِ امْرَأَةٌ وَلَهُ أَخٌ أَوْ أُخْتٌ فَلِكُلِّ وَاحِدٍ مِّنْهُمَا السُّدُسُ ۚ فَإِن كَانُوا أَكْثَرَ مِن ذَٰلِكَ فَهُمْ شُرَكَاءُ فِي الثُّلُثِ ۚ مِن بَعْدِ وَصِيَّةٍ يُوصَىٰ بِهَا أَوْ دَيْنٍ غَيْرَ مُضَارٍّ ۚ وَصِيَّةً مِّنَ اللَّهِ ۗ وَاللَّهُ عَلِيمٌ حَلِيمٌ
మీ భార్యలకు సంతానం లేనిపక్షంలో వారు వదలివెళ్ళిన ఆస్తిలో సగభాగం మీది. ఒకవేళ వారికి సంతానముంటే వారు విడిచిపెట్టిన ఆస్తిలో నాల్గోభాగం మీకు చెందుతుంది. వారు వ్రాసిపోయిన వీలునామాను అమలుపరచిన మీదట, లేదా వారు చేసిన అప్పుల్ని తీర్చిన మీదటే ఈ పంపకం జరగాలి. మీకు పిల్లలు లేని పక్షంలో మీరు వదలిపోయే ఆస్తిలో మీ భార్యలకు నాల్గో భాగం లభిస్తుంది. ఒకవేళ మీకు పిల్లలుంటే అప్పుడు మీరు వదలివెళ్ళే ఆస్తిలో మీ భార్యలకు ఎనిమిదో వంతు మాత్రమే లభిస్తుంది. మీరు వ్రాసి వెళ్ళిన వీలునామాను అమలు పరచి, లేదా మీరు చేసివెళ్ళిన అప్పుల్ని తీర్చిన తరువాతే మిగిలిన ఆస్తిలో పంపకాలు జరుగుతాయి. చనిపోయిన పురుషుడు లేక స్త్రీ ‘కలాలా’ అయి ఉండి (అంటే వారికి తండ్రిగాని, కొడుకు గాని లేకుండా ఉండి) వారికి ఒక సోదరుడు లేక ఒక సోదరి ఉన్నట్లయితే వారిలో ఒక్కొక్కరికి ఆరింట ఒక భాగం చొప్పున లభిస్తుంది. కాని వారు ఒకరికన్నా ఎక్కువ మంది ఉన్నట్లయితే అప్పుడు మొత్తం ఆస్తిలోని మూడో భాగాన్ని వారంతా సమానంగా పంచుకోవాలి. అయితే మృతుడు వ్రాసిన వీలునామాను అమలుపరచి, లేదా అతని అప్పులన్నీ తీర్చిన మీదటే ఈ పంపకం జరగాలి. ఇది ఇతరులకు నష్టకరంగా పరిణమించకూడదు. ఇది అల్లాహ్ తరఫున జరిగిన నిర్థారణ. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, సహనశీలుడు.
4:13 تِلْكَ حُدُودُ اللَّهِ ۚ وَمَن يُطِعِ اللَّهَ وَرَسُولَهُ يُدْخِلْهُ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا ۚ وَذَٰلِكَ الْفَوْزُ الْعَظِيمُ
ఇవి అల్లాహ్ నిర్ధారించిన హద్దులు. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సఅసం)కు విధేయత చూపేవారికి అల్లాహ్, క్రింద కాలువలు ప్రవహించే (స్వర్గ) వనాలలో ప్రవేశం కల్పిస్తాడు. వాటిలో వారు కలకాలం ఉంటారు. గొప్ప విజయం అంటే ఇదే.
4:14 وَمَن يَعْصِ اللَّهَ وَرَسُولَهُ وَيَتَعَدَّ حُدُودَهُ يُدْخِلْهُ نَارًا خَالِدًا فِيهَا وَلَهُ عَذَابٌ مُّهِينٌ
ఎవడు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సఅసం) యెడల అవిధేయుడై, ఆయన నిర్ధారించిన హద్దులను మీరిపోతాడో వాడ్ని ఆయన నరకాగ్నిలో పడవేస్తాడు. వాడందులో ఎల్లకాలం పడి ఉంటాడు. అవమానకరమైన శిక్ష అలాంటి వారికోసమే ఉంది.
4:15 وَاللَّاتِي يَأْتِينَ الْفَاحِشَةَ مِن نِّسَائِكُمْ فَاسْتَشْهِدُوا عَلَيْهِنَّ أَرْبَعَةً مِّنكُمْ ۖ فَإِن شَهِدُوا فَأَمْسِكُوهُنَّ فِي الْبُيُوتِ حَتَّىٰ يَتَوَفَّاهُنَّ الْمَوْتُ أَوْ يَجْعَلَ اللَّهُ لَهُنَّ سَبِيلًا
మీ స్త్రీలలో ఎవరయినా అక్రమ సంబంధం పెట్టుకుంటే వారికి వ్యతిరేకంగా మీలోని నలుగురు వ్యక్తులను సాక్షులుగా తీసుకురండి. వారు గనక సాక్ష్యం ఇస్తే ఆ స్త్రీలను మరణకాలం వచ్చే వరకుగానీ, లేదా అల్లాహ్ వారికోసం ఏదైనా మార్గాంతరం సూచించేవరకు గానీ – గృహాల్లో నిర్బంధించి ఉంచండి.
4:16 وَاللَّذَانِ يَأْتِيَانِهَا مِنكُمْ فَآذُوهُمَا ۖ فَإِن تَابَا وَأَصْلَحَا فَأَعْرِضُوا عَنْهُمَا ۗ إِنَّ اللَّهَ كَانَ تَوَّابًا رَّحِيمًا
మీలో ఏ ఇద్దరయినా ఈ (పాడు) పని చేస్తే వారిద్దరినీ బాధించండి. ఒకవేళ వారు పశ్చాత్తాపపడి, తమ ప్రవర్తనను సరిదిద్దుకుంటే వారిని ఉపేక్షించండి. నిస్సందేహంగా అల్లాహ్ పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, కరుణించేవాడు కూడా.
4:17 إِنَّمَا التَّوْبَةُ عَلَى اللَّهِ لِلَّذِينَ يَعْمَلُونَ السُّوءَ بِجَهَالَةٍ ثُمَّ يَتُوبُونَ مِن قَرِيبٍ فَأُولَٰئِكَ يَتُوبُ اللَّهُ عَلَيْهِمْ ۗ وَكَانَ اللَّهُ عَلِيمًا حَكِيمًا
అవివేకం వల్ల ఏదైనా చెడు కార్యానికి పాల్పడి, వెనువెంటనే తప్పు తెలుసుకుని పశ్చాత్తాపం చెందేవారి పశ్చాత్తాపాన్ని స్వీకరించే బాధ్యత మాత్రమే అల్లాహ్‌పై ఉంది. అటువంటి వారి పశ్చాత్తాపాన్ని అల్లాహ్ స్వీకరిస్తాడు. అల్లాహ్ మహాజ్ఞాని, గొప్ప వివేకవంతుడు.
4:18 وَلَيْسَتِ التَّوْبَةُ لِلَّذِينَ يَعْمَلُونَ السَّيِّئَاتِ حَتَّىٰ إِذَا حَضَرَ أَحَدَهُمُ الْمَوْتُ قَالَ إِنِّي تُبْتُ الْآنَ وَلَا الَّذِينَ يَمُوتُونَ وَهُمْ كُفَّارٌ ۚ أُولَٰئِكَ أَعْتَدْنَا لَهُمْ عَذَابًا أَلِيمًا
నిరంతరం పాపకార్యాలకు పాల్పడుతూ, తీరా మరణ ఘడియలు సమీపించాక, “ఇప్పుడు నేను పశ్చాత్తాపపడుతున్నాను” అని అనే వారి పశ్చాత్తాపం ఆమోదించబడదు. అలాగే అవిశ్వాస స్థితిలో ప్రాణం విడిచే వారి పశ్చాత్తాపం కూడా స్వీకరించబడదు. ఇలాంటి వారి కోసమే మేము వ్యధాభరితమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాము.
4:19 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا يَحِلُّ لَكُمْ أَن تَرِثُوا النِّسَاءَ كَرْهًا ۖ وَلَا تَعْضُلُوهُنَّ لِتَذْهَبُوا بِبَعْضِ مَا آتَيْتُمُوهُنَّ إِلَّا أَن يَأْتِينَ بِفَاحِشَةٍ مُّبَيِّنَةٍ ۚ وَعَاشِرُوهُنَّ بِالْمَعْرُوفِ ۚ فَإِن كَرِهْتُمُوهُنَّ فَعَسَىٰ أَن تَكْرَهُوا شَيْئًا وَيَجْعَلَ اللَّهُ فِيهِ خَيْرًا كَثِيرًا
విశ్వసించిన ఓ ప్రజలారా! మీరు బలవంతంగా స్త్రీలకు వారసులై కూర్చోవటం మీకు ధర్మసమ్మతం కానేరదు. మీరు వారికి ఇచ్చిన దానిలో (మహర్) నుంచి కొంత సొమ్ము కాజేసే ఉద్దేశ్యంతో వారిని ఆపి ఉంచుకోకండి. ఒకవేళ వారు గనక బాహాటంగా ఏదైనా నీతిమాలిన పనికి పాల్పడితే అది వేరే విషయం. వారితో ఉత్తమరీతిలో కాపురం చేయండి. ఒకవేళ వారు మీకు నచ్చకపోతే బహుశా ఏదో ఒక్క విషయం మూలంగా మీకు నచ్చకపోవచ్చు. కాని మీకు నచ్చని ఆ విషయంలోనే అల్లాహ్ అపారమైన శుభాన్ని పొందుపరచాడేమో! (మీకేం తెలుసు?)
4:20 وَإِنْ أَرَدتُّمُ اسْتِبْدَالَ زَوْجٍ مَّكَانَ زَوْجٍ وَآتَيْتُمْ إِحْدَاهُنَّ قِنطَارًا فَلَا تَأْخُذُوا مِنْهُ شَيْئًا ۚ أَتَأْخُذُونَهُ بُهْتَانًا وَإِثْمًا مُّبِينًا
మీరు ఒక భార్య స్థానంలో మరో భార్యను చేసుకోదలిస్తే, వారిలో ఎవరికయినా మీరు పెద్ద ధనరాశిని ఇచ్చివున్నా సరే, దానిలోనుంచి ఏ కొంచెం కూడా తిరిగి తీసుకోకండి. ఏమిటీ, అది అన్యాయం, స్పష్టమైన పాపం అయినప్పటికీ మీరు దాన్ని తీసుకుంటారా?
4:21 وَكَيْفَ تَأْخُذُونَهُ وَقَدْ أَفْضَىٰ بَعْضُكُمْ إِلَىٰ بَعْضٍ وَأَخَذْنَ مِنكُم مِّيثَاقًا غَلِيظًا
మీరు పరస్పరం కలుసుకున్న తరువాత, ఆ స్త్రీలు మీ నుండి గట్టి వాగ్దానం తీసుకున్న తరువాత కూడా ఆ ధనాన్ని మీరెలా (తిరిగి) తీసుకోగలుగుతారు?
4:22 وَلَا تَنكِحُوا مَا نَكَحَ آبَاؤُكُم مِّنَ النِّسَاءِ إِلَّا مَا قَدْ سَلَفَ ۚ إِنَّهُ كَانَ فَاحِشَةً وَمَقْتًا وَسَاءَ سَبِيلًا
మీ తండ్రులు వివాహమాడిన స్త్రీలను మీరు ఎట్టి పరిస్థితిలోనూ పెళ్ళి చేసుకోకండి. పూర్వం జరిగిందేదో జరిగిపోయింది. అదొక సిగ్గుమాలిన పని, ద్వేషానికి మూలం, ఒక చెడు నడత.
4:23 حُرِّمَتْ عَلَيْكُمْ أُمَّهَاتُكُمْ وَبَنَاتُكُمْ وَأَخَوَاتُكُمْ وَعَمَّاتُكُمْ وَخَالَاتُكُمْ وَبَنَاتُ الْأَخِ وَبَنَاتُ الْأُخْتِ وَأُمَّهَاتُكُمُ اللَّاتِي أَرْضَعْنَكُمْ وَأَخَوَاتُكُم مِّنَ الرَّضَاعَةِ وَأُمَّهَاتُ نِسَائِكُمْ وَرَبَائِبُكُمُ اللَّاتِي فِي حُجُورِكُم مِّن نِّسَائِكُمُ اللَّاتِي دَخَلْتُم بِهِنَّ فَإِن لَّمْ تَكُونُوا دَخَلْتُم بِهِنَّ فَلَا جُنَاحَ عَلَيْكُمْ وَحَلَائِلُ أَبْنَائِكُمُ الَّذِينَ مِنْ أَصْلَابِكُمْ وَأَن تَجْمَعُوا بَيْنَ الْأُخْتَيْنِ إِلَّا مَا قَدْ سَلَفَ ۗ إِنَّ اللَّهَ كَانَ غَفُورًا رَّحِيمًا
మీ కొరకు నిషేధించబడినవారు – మీ తల్లులు, మీ కుమార్తెలు, మీ అక్కా చెల్లెళ్ళు, మీ మేనత్తలు, మీ తల్లి సోదరీమణులు (మీ పిన్నమ్మ పెద్దమ్మలు), మీ అన్నదమ్ముల కుమార్తెలు, అక్కాచెల్లెళ్ళ కూతుళ్ళు (మేనకోడళ్ళు), మీకు పాలిచ్చిన తల్లులు, పాల వరుస ద్వారా మీకు అక్కాచెల్లెళ్ళు అయినవారు, మీ భార్యల తల్లులు (అత్తలు), మీరు దాంపత్య సుఖాన్ని అనుభవించిన మీ భార్యల (ఆమె మాజీ భర్త ద్వారా పుట్టిన) మీ సంరక్షణలోనున్న కూతుళ్ళు – ఒకవేళ మీరు వారితో సమాగమం జరపకుండా ఉంటే (కేవలం పెళ్ళిమాత్రం చేసుకుని వారికి విడాకులు యిచ్చేసివున్న పక్షంలో వారి కూతుళ్లను వివాహమాడటం) మీ కొరకు పాపం కాదు. అలాగే మీ వెన్ను నుండి (స్ఖలించబడిన వీర్యంతో) పుట్టిన మీ కొడుకుల భార్యలు (కోడళ్ళు) మీ కోసం నిషేధించబడ్డారు. (ఏకకాలంలో) ఇద్దరు అక్కా చెల్లెళ్ళను కలిపి భార్యలుగా చేసుకోవటం కూడా మీ కొరకు నిషిద్ధమే, లోగడ జరిగిందేదో జరిగిపోయింది. నిస్సందేహంగా అల్లాహ్ క్షమాశీలి, కృపాకరుడు కూడాను.
4:24 وَالْمُحْصَنَاتُ مِنَ النِّسَاءِ إِلَّا مَا مَلَكَتْ أَيْمَانُكُمْ ۖ كِتَابَ اللَّهِ عَلَيْكُمْ ۚ وَأُحِلَّ لَكُم مَّا وَرَاءَ ذَٰلِكُمْ أَن تَبْتَغُوا بِأَمْوَالِكُم مُّحْصِنِينَ غَيْرَ مُسَافِحِينَ ۚ فَمَا اسْتَمْتَعْتُم بِهِ مِنْهُنَّ فَآتُوهُنَّ أُجُورَهُنَّ فَرِيضَةً ۚ وَلَا جُنَاحَ عَلَيْكُمْ فِيمَا تَرَاضَيْتُم بِهِ مِن بَعْدِ الْفَرِيضَةِ ۚ إِنَّ اللَّهَ كَانَ عَلِيمًا حَكِيمًا
భర్తగల స్త్రీలు కూడా మీ కొరకు నిషేధించబడ్డారు. అయితే మీ యాజమాన్యంలోనికి వచ్చిన బానిస స్త్రీలు మాత్రం (నిషేధించబడలేదు). అల్లాహ్ ఈ ఆదేశాలను మీపై విధించాడు. ఈ స్త్రీలు మినహా మిగతా స్త్రీలను మీరు మహర్ రూపంలో ధనం చెల్లించి వివాహమాడటం మీ కొరకు ధర్మసమ్మతం (హలాల్) చేయబడింది. అయితే చెడుల నుండి దూరంగా ఉండే ఉద్దేశ్యంతోనే ఈ పని చెయ్యాలి తప్ప కామక్రీడల కోసం కాదు. అందుకే మీరు ఏ స్త్రీలతో సౌఖ్యాన్ని పొందారో వారికి నిర్థారిత మహర్ సొమ్మును ఇచ్చివేయండి. మహర్ సొమ్ము నిర్ధారించబడిన తరువాత మీరు పరస్పరం – ఇష్టపూర్వకంగా – ఆ విషయమై ఒక అవగాహనకు వస్తే అందులో దోషం ఏమీ లేదు. నిశ్చయంగా అల్లాహ్ సర్వం తెలిసినవాడు, వివేకవంతుడు.
4:25 وَمَن لَّمْ يَسْتَطِعْ مِنكُمْ طَوْلًا أَن يَنكِحَ الْمُحْصَنَاتِ الْمُؤْمِنَاتِ فَمِن مَّا مَلَكَتْ أَيْمَانُكُم مِّن فَتَيَاتِكُمُ الْمُؤْمِنَاتِ ۚ وَاللَّهُ أَعْلَمُ بِإِيمَانِكُم ۚ بَعْضُكُم مِّن بَعْضٍ ۚ فَانكِحُوهُنَّ بِإِذْنِ أَهْلِهِنَّ وَآتُوهُنَّ أُجُورَهُنَّ بِالْمَعْرُوفِ مُحْصَنَاتٍ غَيْرَ مُسَافِحَاتٍ وَلَا مُتَّخِذَاتِ أَخْدَانٍ ۚ فَإِذَا أُحْصِنَّ فَإِنْ أَتَيْنَ بِفَاحِشَةٍ فَعَلَيْهِنَّ نِصْفُ مَا عَلَى الْمُحْصَنَاتِ مِنَ الْعَذَابِ ۚ ذَٰلِكَ لِمَنْ خَشِيَ الْعَنَتَ مِنكُمْ ۚ وَأَن تَصْبِرُوا خَيْرٌ لَّكُمْ ۗ وَاللَّهُ غَفُورٌ رَّحِيمٌ
మీలో ఎవరికయినా స్వతంత్రులగు ముస్లిం స్త్రీలను వివాహమాడే స్థోమత లేకపోతే, మీ యాజమాన్యంలో ఉన్న విశ్వాసులైన బానిస స్త్రీలను నికాహ్ చేసుకోవాలి. మీ విశ్వాస స్థితి గురించి అల్లాహ్‌కు బాగా తెలుసు. మీరంతా పరస్పరం ఒక్కటే కదా! కాబట్టి వారి యజమానుల అనుమతితో వారిని వివాహమాడండి. నియమానుసారం వారి మహర్‌ను వారికి ఇవ్వండి. అయితే వారు సౌశీల్యవతులై ఉండాలి. బాహాటంగా అశ్లీల కార్యాలకు పాల్పడనివారై ఉండాలి. చాటుమాటు ప్రేమ కలాపాలు సాగించేవారు కాకుండా ఉండాలి. మరి ఆ బానిస స్త్రీలు వివాహబంధంలో కట్టుబడిన తరువాత కూడా సిగ్గుమాలిన పనికి గనక ఒడిగడితే స్వతంత్రులగు స్త్రీలకు విధించే శిక్షలో సగం శిక్ష వీరికి విధించబడుతుంది. తమ వల్ల పాపకార్యం జరిగి పోతుందేమో, ఓర్చుకోలేమేమో అన్న భయం ఉన్నవారికి ఇలా బానిస స్త్రీలను వివాహమాడే వెసులుబాటు ఇవ్వబడింది. ఒకవేళ మీరు ఆత్మనిగ్రహాన్ని అలవరచుకుంటే అది మీకే శ్రేయస్కరం. అల్లాహ్ అమితంగా క్షమించేవాడు, అపారంగా కనికరించేవాడూను.
4:26 يُرِيدُ اللَّهُ لِيُبَيِّنَ لَكُمْ وَيَهْدِيَكُمْ سُنَنَ الَّذِينَ مِن قَبْلِكُمْ وَيَتُوبَ عَلَيْكُمْ ۗ وَاللَّهُ عَلِيمٌ حَكِيمٌ
అల్లాహ్ మీకు (ధర్మాధర్మాలను) విడమరచి చెప్పాలనీ, మీ పూర్వీకుల్లోని (సజ్జనుల) మార్గంపై మిమ్మల్ని నడిపించాలనీ, మీ పశ్చాత్తాపాన్ని ఆమోదించాలని అభిలషిస్తున్నాడు. అల్లాహ్ సర్వం తెలిసినవాడు, వివేక సంపన్నుడు.
4:27 وَاللَّهُ يُرِيدُ أَن يَتُوبَ عَلَيْكُمْ وَيُرِيدُ الَّذِينَ يَتَّبِعُونَ الشَّهَوَاتِ أَن تَمِيلُوا مَيْلًا عَظِيمًا
అల్లాహ్ మీ పశ్చాత్తాపాన్ని అంగీకరించాలని కోరుతున్నాడు. కాని, తమ మనోవాంఛలను అనుసరిస్తున్నవారు మాత్రం మీరు (దైవమార్గం నుంచి) పెడదారి తీసి చాలా దూరం వెళ్ళిపోవాలని కోరుకుంటున్నారు.
4:28 يُرِيدُ اللَّهُ أَن يُخَفِّفَ عَنكُمْ ۚ وَخُلِقَ الْإِنسَانُ ضَعِيفًا
మీపైన ఉన్న బరువును తగ్గించాలన్నది అల్లాహ్ అభిలాష. ఎందుకంటే మానవుడు బలహీనుడుగా పుట్టించబడ్డాడు.
4:29 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَأْكُلُوا أَمْوَالَكُم بَيْنَكُم بِالْبَاطِلِ إِلَّا أَن تَكُونَ تِجَارَةً عَن تَرَاضٍ مِّنكُمْ ۚ وَلَا تَقْتُلُوا أَنفُسَكُمْ ۚ إِنَّ اللَّهَ كَانَ بِكُمْ رَحِيمًا
ఓ విశ్వసించిన వారలారా! ఒండొకరి సొమ్మును అధర్మంగా తినకండి. అయితే పరస్పర అంగీకారంతో జరిగే క్రయ విక్రయాల ద్వారా లభించే దానిని (తినవచ్చు). మిమ్మల్ని మీరు చంపుకోకండి. నిస్సందేహంగా అల్లాహ్ మీపై అమితమైన దయగలవాడు.
4:30 وَمَن يَفْعَلْ ذَٰلِكَ عُدْوَانًا وَظُلْمًا فَسَوْفَ نُصْلِيهِ نَارًا ۚ وَكَانَ ذَٰلِكَ عَلَى اللَّهِ يَسِيرًا
తలబిరుసుతనంతో, దౌర్జన్యంతో దీనికి (ఈ అవిధేయతకు) పాల్పడేవాడ్ని మేము నరకాగ్నిలో పడవేస్తాము. ఇలా చేయటం అల్లాహ్‌కు చాలా తేలిక.
4:31 إِن تَجْتَنِبُوا كَبَائِرَ مَا تُنْهَوْنَ عَنْهُ نُكَفِّرْ عَنكُمْ سَيِّئَاتِكُمْ وَنُدْخِلْكُم مُّدْخَلًا كَرِيمًا
మీకు వారించబడే మహాపరాధాలకు గనక మీరు దూరంగా ఉన్నట్లయితే, మీ చిన్న చిన్న పాపాలను మేము మీ (లెక్క) నుండి తీసేస్తాము. ఇంకా మిమ్మల్ని గౌరవప్రద స్థానాల్లో ప్రవేశింపజేస్తాము.
4:32 وَلَا تَتَمَنَّوْا مَا فَضَّلَ اللَّهُ بِهِ بَعْضَكُمْ عَلَىٰ بَعْضٍ ۚ لِّلرِّجَالِ نَصِيبٌ مِّمَّا اكْتَسَبُوا ۖ وَلِلنِّسَاءِ نَصِيبٌ مِّمَّا اكْتَسَبْنَ ۚ وَاسْأَلُوا اللَّهَ مِن فَضْلِهِ ۗ إِنَّ اللَّهَ كَانَ بِكُلِّ شَيْءٍ عَلِيمًا
అల్లాహ్ మీలో కొందరికి మరికొందరిపై దేని మూలంగా విశిష్ఠతను ప్రసాదించాడో దానికోసం ఆశపడకండి. పురుషులు సంపాదించిన దానినిబట్టి వారి భాగం వారికుంటుంది. అలాగే స్త్రీలు సంపాదించిన దానినిబట్టి వారి భాగం వారికుంటుంది. కాకపోతే మీరు అల్లాహ్ నుండి ఆయన అనుగ్రహాన్ని అర్థిస్తూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ ప్రతిదీ తెలిసినవాడు.
4:33 وَلِكُلٍّ جَعَلْنَا مَوَالِيَ مِمَّا تَرَكَ الْوَالِدَانِ وَالْأَقْرَبُونَ ۚ وَالَّذِينَ عَقَدَتْ أَيْمَانُكُمْ فَآتُوهُمْ نَصِيبَهُمْ ۚ إِنَّ اللَّهَ كَانَ عَلَىٰ كُلِّ شَيْءٍ شَهِيدًا
తల్లిదండ్రులు, సమీప బంధువులు వదలివెళ్ళిన ఆస్తికి మేము వారి వారసులను నిర్థారించిపెట్టాము. మీరు ఎవరితోనయినా ఏదయినా ఒప్పందం చేసుకుని ఉంటే, తదనుగుణంగా వారి భాగాన్ని వారికి ఇవ్వండి. యదార్థానికి అల్లాహ్ అన్నింటిపై సాక్షిగా ఉన్నాడు.
4:34 الرِّجَالُ قَوَّامُونَ عَلَى النِّسَاءِ بِمَا فَضَّلَ اللَّهُ بَعْضَهُمْ عَلَىٰ بَعْضٍ وَبِمَا أَنفَقُوا مِنْ أَمْوَالِهِمْ ۚ فَالصَّالِحَاتُ قَانِتَاتٌ حَافِظَاتٌ لِّلْغَيْبِ بِمَا حَفِظَ اللَّهُ ۚ وَاللَّاتِي تَخَافُونَ نُشُوزَهُنَّ فَعِظُوهُنَّ وَاهْجُرُوهُنَّ فِي الْمَضَاجِعِ وَاضْرِبُوهُنَّ ۖ فَإِنْ أَطَعْنَكُمْ فَلَا تَبْغُوا عَلَيْهِنَّ سَبِيلًا ۗ إِنَّ اللَّهَ كَانَ عَلِيًّا كَبِيرًا
పురుషులు స్త్రీలపై అధికారులు. ఎందుకంటే అల్లాహ్ ఒకరికి ఇంకొకరిపై విశిష్ఠతను వొసగాడు. అదీగాక పురుషులు తమ సంపదను (వారిపై) ఖర్చుపెట్టారు. కనుక గుణవంతులైన స్త్రీలు విధేయులై ఉంటారు. తమ భర్తలు లేని సమయంలో అల్లాహ్ రక్షణలో ఉంటూ (తమ శీలాన్నీ, భర్త సంపదను) కాపాడుతారు. ఏ స్త్రీలు అవిధేయతకు పాల్పడతారని మీకు భయం ఉంటుందో వారికి నచ్చజెప్పండి. (అవసరమైతే) పడక దగ్గర వారిని వేరుగా ఉంచండి. వారిని కొట్టండి. ఆ తరువాత వారు గనక మీకు విధేయులైతే వారిని అనవసరంగా వేధించే ఉద్దేశ్యంతో సాకులు వెతక్కండి. నిశ్చయంగా అల్లాహ్ సర్వోన్నతుడు, గొప్పవాడు.
4:35 وَإِنْ خِفْتُمْ شِقَاقَ بَيْنِهِمَا فَابْعَثُوا حَكَمًا مِّنْ أَهْلِهِ وَحَكَمًا مِّنْ أَهْلِهَا إِن يُرِيدَا إِصْلَاحًا يُوَفِّقِ اللَّهُ بَيْنَهُمَا ۗ إِنَّ اللَّهَ كَانَ عَلِيمًا خَبِيرًا
ఒకవేళ ఆలుమగల మధ్య విముఖత విరోధంగా మారే భయం మీకుంటే భర్త తరఫు నుంచి ఒక మధ్యవర్తినీ, భార్య వైపు నుంచి ఒక మధ్యవర్తినీ నియమించుకోండి. వారిద్దరూ గనక సర్దుబాటుకు ప్రయత్నం చేయదలిస్తే అల్లాహ్ ఆ దంపతుల మధ్య రాజీ కుదుర్చుతాడు. నిస్సందేహంగా అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, సర్వం ఎరిగినవాడు.
4:36 وَاعْبُدُوا اللَّهَ وَلَا تُشْرِكُوا بِهِ شَيْئًا ۖ وَبِالْوَالِدَيْنِ إِحْسَانًا وَبِذِي الْقُرْبَىٰ وَالْيَتَامَىٰ وَالْمَسَاكِينِ وَالْجَارِ ذِي الْقُرْبَىٰ وَالْجَارِ الْجُنُبِ وَالصَّاحِبِ بِالْجَنبِ وَابْنِ السَّبِيلِ وَمَا مَلَكَتْ أَيْمَانُكُمْ ۗ إِنَّ اللَّهَ لَا يُحِبُّ مَن كَانَ مُخْتَالًا فَخُورًا
అల్లాహ్‌ను ఆరాధించండి. ఆయనకు సహవర్తులుగా ఎవరినీ కల్పించకండి. తల్లిదండ్రుల పట్ల ఉత్తమంగా వ్యవహరించండి. బంధువుల పట్ల, తండ్రిలేని బిడ్డల పట్ల, నిరుపేదల పట్ల, ఆత్మీయులైన పొరుగువారి పట్ల, బంధువులు కాని పొరుగువారి పట్ల, ప్రక్కనున్న మిత్రుల పట్ల, బాటసారుల పట్ల, మీ అధీనంలో ఉన్న బానిసల పట్ల ఔదార్యంతో మెలగండి. నిశ్చయంగా అల్లాహ్ అహంకారంతో విర్రవీగేవారిని, బడాయి కొట్టే వారిని ఎంతమాత్రం ఇష్టపడడు.
4:37 الَّذِينَ يَبْخَلُونَ وَيَأْمُرُونَ النَّاسَ بِالْبُخْلِ وَيَكْتُمُونَ مَا آتَاهُمُ اللَّهُ مِن فَضْلِهِ ۗ وَأَعْتَدْنَا لِلْكَافِرِينَ عَذَابًا مُّهِينًا
వారు పిసినారులుగా ప్రవర్తించటమే గాక, ఇతరులకు కూడా పిసినారితనాన్ని నేర్పుతారు. అల్లాహ్ తన అనుగ్రహం నుండి తమకు ప్రసాదించిన దాన్ని దాచిపెడతారు. ఇటువంటి తిరస్కారుల కొరకు మేము అవమానకరమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాము.
4:38 وَالَّذِينَ يُنفِقُونَ أَمْوَالَهُمْ رِئَاءَ النَّاسِ وَلَا يُؤْمِنُونَ بِاللَّهِ وَلَا بِالْيَوْمِ الْآخِرِ ۗ وَمَن يَكُنِ الشَّيْطَانُ لَهُ قَرِينًا فَسَاءَ قَرِينًا
వారు ప్రజలకు చూపటానికి తమ సొమ్మును ఖర్చుపెడతారు. అల్లాహ్‌ను, అంతిమదినాన్ని విశ్వసించరు. వాస్తవమేమిటంటే షైతాను ఎవరికి స్నేహితుడయ్యాడో (వారిని ఇలాగే నాశనం చేస్తాడు), వాడు బహుచెడ్డ స్నేహితుడు.
4:39 وَمَاذَا عَلَيْهِمْ لَوْ آمَنُوا بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ وَأَنفَقُوا مِمَّا رَزَقَهُمُ اللَّهُ ۚ وَكَانَ اللَّهُ بِهِمْ عَلِيمًا
వారే గనక అల్లాహ్‌ను, అంతిమదినాన్ని విశ్వసించి, అల్లాహ్ తమకు ప్రసాదించిన దానిలో నుంచి ఖర్చుపెడితే ఏం పోయేది? వారి స్థితిగతులు అల్లాహ్‌కు బాగా తెలుసు.
4:40 إِنَّ اللَّهَ لَا يَظْلِمُ مِثْقَالَ ذَرَّةٍ ۖ وَإِن تَكُ حَسَنَةً يُضَاعِفْهَا وَيُؤْتِ مِن لَّدُنْهُ أَجْرًا عَظِيمًا
అల్లాహ్ ఎవరికీ రవ్వంత అన్యాయం చేయడనేది నిశ్చయం. సత్కార్యం ఉంటే ఆయన దాన్ని రెట్టింపు చేస్తాడు. అంతేకాదు, తన వద్దనున్న దానిలో నుంచి గొప్ప ప్రతిఫలాన్ని వొసగుతాడు.
4:41 فَكَيْفَ إِذَا جِئْنَا مِن كُلِّ أُمَّةٍ بِشَهِيدٍ وَجِئْنَا بِكَ عَلَىٰ هَٰؤُلَاءِ شَهِيدًا
(ఓ ముహమ్మద్-స!) మేము ప్రతి సమాజం నుంచి ఒక సాక్షిని తెచ్చి, వారిపై నిన్ను సాక్షిగా పెట్టినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది?
4:42 يَوْمَئِذٍ يَوَدُّ الَّذِينَ كَفَرُوا وَعَصَوُا الرَّسُولَ لَوْ تُسَوَّىٰ بِهِمُ الْأَرْضُ وَلَا يَكْتُمُونَ اللَّهَ حَدِيثًا
ఆ రోజు అవిశ్వాసులూ, ప్రవక్త పట్ల అవిధేయతకు పాల్పడినవారూ తాము నేలమట్టం చేయబడితే బావుండునే! అని కోరుకుంటారు. వారు దైవసమక్షంలో ఏ ఒక్క విషయాన్నీ దాచలేరు.
4:43 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَقْرَبُوا الصَّلَاةَ وَأَنتُمْ سُكَارَىٰ حَتَّىٰ تَعْلَمُوا مَا تَقُولُونَ وَلَا جُنُبًا إِلَّا عَابِرِي سَبِيلٍ حَتَّىٰ تَغْتَسِلُوا ۚ وَإِن كُنتُم مَّرْضَىٰ أَوْ عَلَىٰ سَفَرٍ أَوْ جَاءَ أَحَدٌ مِّنكُم مِّنَ الْغَائِطِ أَوْ لَامَسْتُمُ النِّسَاءَ فَلَمْ تَجِدُوا مَاءً فَتَيَمَّمُوا صَعِيدًا طَيِّبًا فَامْسَحُوا بِوُجُوهِكُمْ وَأَيْدِيكُمْ ۗ إِنَّ اللَّهَ كَانَ عَفُوًّا غَفُورًا
విశ్వసించిన ప్రజలారా! మీరు (తాగిన) మత్తులో ఉన్నప్పుడు నమాజు దరిదాపులకు కూడా పోకండి. మీరు పలికేదేమిటో మీకు అర్థం కాగలిగినప్పుడే (నమాజు చెయ్యాలి). లైంగిక అశుద్ధావస్థలో కూడా – స్నానం చేయనంతవరకూ – నమాజు చేయరాదు. (మస్జిదు) దారిగుండా సాగిపోయేటి పరిస్థితి అయితే అది వేరే విషయం! ఒకవేళ మీరు వ్యాధిగ్రస్తులైతే, లేక ప్రయాణంలో ఉంటే లేక మీలో ఎవరయినా మలమూత్ర విసర్జన చేసివస్తే లేక మీరు స్త్రీలతో సమాగమం జరిపి ఉంటే – అట్టి స్థితిలో మీకు నీరు లభ్యం కానిపక్షంలో పరిశుభ్రమైన మట్టి(ని ఉపయోగించే) సంకల్పం చేసుకోండి. (దాంతో) మీ ముఖాలను, చేతులను తుడుచుకోండి. నిశ్చయంగా అల్లాహ్ మన్నించేవాడు, క్షమాభిక్ష పెట్టేవాడు.
4:44 أَلَمْ تَرَ إِلَى الَّذِينَ أُوتُوا نَصِيبًا مِّنَ الْكِتَابِ يَشْتَرُونَ الضَّلَالَةَ وَيُرِيدُونَ أَن تَضِلُّوا السَّبِيلَ
గ్రంథంలో కొంతభాగం యివ్వబడిన వారిని మీరు చూడలేదా? వారు మార్గభ్రష్టతను కొనితెచ్చుకుంటారు. మీరు కూడా మార్గం తప్పాలన్నది వారి ఉద్దేశం.
4:45 وَاللَّهُ أَعْلَمُ بِأَعْدَائِكُمْ ۚ وَكَفَىٰ بِاللَّهِ وَلِيًّا وَكَفَىٰ بِاللَّهِ نَصِيرًا
మీ శత్రువుల గురించి అల్లాహ్ బాగా ఎరిగినవాడు. మీకు మిత్రుడిగా అల్లాహ్ చాలు. మీకు సహాయకుడిగా (కూడా) అల్లాహ్ చాలు.
4:46 مِّنَ الَّذِينَ هَادُوا يُحَرِّفُونَ الْكَلِمَ عَن مَّوَاضِعِهِ وَيَقُولُونَ سَمِعْنَا وَعَصَيْنَا وَاسْمَعْ غَيْرَ مُسْمَعٍ وَرَاعِنَا لَيًّا بِأَلْسِنَتِهِمْ وَطَعْنًا فِي الدِّينِ ۚ وَلَوْ أَنَّهُمْ قَالُوا سَمِعْنَا وَأَطَعْنَا وَاسْمَعْ وَانظُرْنَا لَكَانَ خَيْرًا لَّهُمْ وَأَقْوَمَ وَلَٰكِن لَّعَنَهُمُ اللَّهُ بِكُفْرِهِمْ فَلَا يُؤْمِنُونَ إِلَّا قَلِيلًا
కొంతమంది యూదులు పదాలను వాటి నిజస్థానం నుంచి తారుమారు చేస్తారు. “మేము విన్నాము, అవిధేయులం అయ్యాము” అని వారంటారు. అంతేకాదు – “విను. నీకేమీ వినపడకూడదు. రాయినా” అని పలుకుతారు. అలా అనేటప్పుడు వారు తమ నాలుకను మెలి తిప్పుతారు. (ఇస్లాం) ధర్మాన్ని ఎగతాళి చేయాలన్నది అసలు వారి ఉద్దేశం. ఇలా అనే బదులు వారు, “మేము విన్నాము. విధేయులమయ్యాము” అనీ, “వినండి. మా వంక చూడండి” అని పలికి ఉంటే అది వారి కొరకు ఎంతో శ్రేయస్కరంగా, సమంజసంగా ఉండేది. కాని అల్లాహ్ వారి అవిశ్వాసం మూలంగా వారిని శపించాడు. ఇక వారిలో విశ్వసించేది బహుకొద్దిమంది మాత్రమే.
4:47 يَا أَيُّهَا الَّذِينَ أُوتُوا الْكِتَابَ آمِنُوا بِمَا نَزَّلْنَا مُصَدِّقًا لِّمَا مَعَكُم مِّن قَبْلِ أَن نَّطْمِسَ وُجُوهًا فَنَرُدَّهَا عَلَىٰ أَدْبَارِهَا أَوْ نَلْعَنَهُمْ كَمَا لَعَنَّا أَصْحَابَ السَّبْتِ ۚ وَكَانَ أَمْرُ اللَّهِ مَفْعُولًا
ఓ గ్రంథవహులారా! మేము అవతరింపజేసిన దానిని విశ్వసించండి. అది మీ వద్ద ఉన్నదానిని ధృవీకరిస్తుంది. మేము ముఖాలను వికృతం చేసి, వీపు వైపుకు తిప్పకముందే లేక శనివారం వాళ్లను శపించినట్లుగా మేము వారినీ శపించక ముందే దీనిని (ఈ గ్రంథాన్ని) విశ్వసించండి. అల్లాహ్ తలచుకున్న పని ఇక అయిపోయినట్లే.
4:48 إِنَّ اللَّهَ لَا يَغْفِرُ أَن يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَٰلِكَ لِمَن يَشَاءُ ۚ وَمَن يُشْرِكْ بِاللَّهِ فَقَدِ افْتَرَىٰ إِثْمًا عَظِيمًا
తనకు భాగస్వామిగా మరొకరిని కల్పించటాన్ని (షిర్కును) అల్లాహ్ సుతరామూ క్షమించడు. ఇది తప్ప ఆయన తాను కోరిన వారి ఇతర పాపాలను క్షమిస్తాడు. అల్లాహ్‌కు భాగస్వామ్యం కల్పించినవాడు ఘోర పాపంతో కూడిన కల్పన చేశాడు.
4:49 أَلَمْ تَرَ إِلَى الَّذِينَ يُزَكُّونَ أَنفُسَهُم ۚ بَلِ اللَّهُ يُزَكِّي مَن يَشَاءُ وَلَا يُظْلَمُونَ فَتِيلًا
తాము పవిత్రులమని ఆత్మస్తుతి చేసుకునే వారిని నువ్వు చూడలేదా? యదార్థానికి అల్లాహ్ తాను కోరిన వారిని పవిత్రులుగా చేస్తాడు. ఎవరికీ ఒక చిన్న పీచు అంత అన్యాయం కూడా జరగదు.
4:50 انظُرْ كَيْفَ يَفْتَرُونَ عَلَى اللَّهِ الْكَذِبَ ۖ وَكَفَىٰ بِهِ إِثْمًا مُّبِينًا
వారు అల్లాహ్‌కు ఎలాంటి అసత్యాలను ఆపాదిస్తున్నారో చూడు! స్పష్టమైన పాపం కావటానికి ఈ ఒక్క చేష్ట చాలు.
4:51 أَلَمْ تَرَ إِلَى الَّذِينَ أُوتُوا نَصِيبًا مِّنَ الْكِتَابِ يُؤْمِنُونَ بِالْجِبْتِ وَالطَّاغُوتِ وَيَقُولُونَ لِلَّذِينَ كَفَرُوا هَٰؤُلَاءِ أَهْدَىٰ مِنَ الَّذِينَ آمَنُوا سَبِيلًا
గ్రంథంలో కొంతభాగం ఇవ్వబడిన వారిని నీవు చూడలేదా? వారు విగ్రహాల (జిబ్త్)పై, మిథ్యాదైవాల (తాగూత్)పై విశ్వాసం కలిగి ఉన్నారు. అవిశ్వాసుల గురించి అభిప్రాయపడుతూ, “విశ్వాసుల కంటే వీరే చాలా వరకు సన్మార్గాన ఉన్నారు” అని అంటారు.
4:52 أُولَٰئِكَ الَّذِينَ لَعَنَهُمُ اللَّهُ ۖ وَمَن يَلْعَنِ اللَّهُ فَلَن تَجِدَ لَهُ نَصِيرًا
అల్లాహ్ శపించింది కూడా వీరినే. అల్లాహ్ శాపానికి గురైన వారిని ఆదుకునే వాడెవణ్ణీ నీవు చూడవు.
4:53 أَمْ لَهُمْ نَصِيبٌ مِّنَ الْمُلْكِ فَإِذًا لَّا يُؤْتُونَ النَّاسَ نَقِيرًا
రాజ్యాధికారంలో వారికేదన్నా భాగముందా? ఒకవేళ ఉంటే వారు జనులకు రవంత కూడా ఇవ్వరు.
4:54 أَمْ يَحْسُدُونَ النَّاسَ عَلَىٰ مَا آتَاهُمُ اللَّهُ مِن فَضْلِهِ ۖ فَقَدْ آتَيْنَا آلَ إِبْرَاهِيمَ الْكِتَابَ وَالْحِكْمَةَ وَآتَيْنَاهُم مُّلْكًا عَظِيمًا
లేక అల్లాహ్ తన అనుగ్రహంతో ప్రజలకు ప్రసాదించిన దానిపై వారు అసూయ పడుతున్నారా? మేమైతే ఇబ్రాహీము సంతతికి గ్రంథాన్ని, వివేకాన్నీ ప్రసాదించాము. గొప్ప సామ్రాజ్యాన్ని కూడా వొసగాము.
4:55 فَمِنْهُم مَّنْ آمَنَ بِهِ وَمِنْهُم مَّن صَدَّ عَنْهُ ۚ وَكَفَىٰ بِجَهَنَّمَ سَعِيرًا
తరువాత వారిలో కొందరు ఈ గ్రంథాన్ని విశ్వసించగా, కొందరు (విశ్వసించకుండా) ఆగిపోయారు. (వారిని) దహించటానికి నరకం చాలు.
4:56 إِنَّ الَّذِينَ كَفَرُوا بِآيَاتِنَا سَوْفَ نُصْلِيهِمْ نَارًا كُلَّمَا نَضِجَتْ جُلُودُهُم بَدَّلْنَاهُمْ جُلُودًا غَيْرَهَا لِيَذُوقُوا الْعَذَابَ ۗ إِنَّ اللَّهَ كَانَ عَزِيزًا حَكِيمًا
మా ఆయతులను త్రోసిపుచ్చిన వారిని మేము అగ్నిలో పడవేస్తాము. వారి చర్మాలు బాగా ఉడికిపోయినప్పుడల్లా, వాటికి బదులుగా, వారు శిక్ష యొక్క రుచి చూసేందుకు వేరే చర్మాలను సృష్టిస్తాము. నిశ్చయంగా అల్లాహ్ సర్వాధిక్యుడు, వివేకవంతుడు.
4:57 وَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ سَنُدْخِلُهُمْ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا أَبَدًا ۖ لَّهُمْ فِيهَا أَزْوَاجٌ مُّطَهَّرَةٌ ۖ وَنُدْخِلُهُمْ ظِلًّا ظَلِيلًا
మరెవరు విశ్వసించి సత్కార్యాలు చేస్తారో వారిని మేము, క్రింద కాలువలు ప్రవహించే (స్వర్గ) వనాలలోకి తీసుకుపోతాము. వాటిలో వారు కలకాలం ఉంటారు. వారి కోసం అక్కడ పవిత్రులైన భార్యలుంటారు. ఇంకా మేము వారిని దట్టమైన నీడల్లోకి (మరియు పూరిపూర్ణ సౌఖ్యంలోకి) తీసుకుపోతాము.
4:58 إِنَّ اللَّهَ يَأْمُرُكُمْ أَن تُؤَدُّوا الْأَمَانَاتِ إِلَىٰ أَهْلِهَا وَإِذَا حَكَمْتُم بَيْنَ النَّاسِ أَن تَحْكُمُوا بِالْعَدْلِ ۚ إِنَّ اللَّهَ نِعِمَّا يَعِظُكُم بِهِ ۗ إِنَّ اللَّهَ كَانَ سَمِيعًا بَصِيرًا
“ఎవరి అమానతులను వారికి అప్పగించండి. ప్రజల మధ్య తీర్పులు చేసేటప్పుడు న్యాయంగా తీర్పు చేయండి” అని అల్లాహ్ మిమ్మల్ని గట్టిగా ఆదేశిస్తున్నాడు. నిశ్చయంగా అల్లాహ్ మీకు చేసే ఉపదేశం ఎంతో చక్కనిది. నిస్సందేహంగా అల్లాహ్ అన్నీ వింటున్నాడు, చూస్తున్నాడు.
4:59 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَطِيعُوا اللَّهَ وَأَطِيعُوا الرَّسُولَ وَأُولِي الْأَمْرِ مِنكُمْ ۖ فَإِن تَنَازَعْتُمْ فِي شَيْءٍ فَرُدُّوهُ إِلَى اللَّهِ وَالرَّسُولِ إِن كُنتُمْ تُؤْمِنُونَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ ۚ ذَٰلِكَ خَيْرٌ وَأَحْسَنُ تَأْوِيلًا
ఓ విశ్వాసులారా! అల్లాహ్‌కు విధేయత చూపండి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు విధేయత చూపండి. మరియు మీలోని అధికారులకు కూడా. ఆపైన ఏ విషయంలోనైనా మీ మధ్య వివాదం తలెత్తితే దాన్ని అల్లాహ్ మరియు ప్రవక్త వైపుకు మరల్చండి – మీకు నిజంగా అల్లాహ్‌పై, అంతిమ దినంపై నమ్మకం ఉన్నట్లయితే (మీరిలా చేయటం అవశ్యం)! ఇదే మేలైన పద్ధతి. పరిణామం రీత్యా కూడా ఇదే అన్నింటికంటే ఉత్తమమైనది.
4:60 أَلَمْ تَرَ إِلَى الَّذِينَ يَزْعُمُونَ أَنَّهُمْ آمَنُوا بِمَا أُنزِلَ إِلَيْكَ وَمَا أُنزِلَ مِن قَبْلِكَ يُرِيدُونَ أَن يَتَحَاكَمُوا إِلَى الطَّاغُوتِ وَقَدْ أُمِرُوا أَن يَكْفُرُوا بِهِ وَيُرِيدُ الشَّيْطَانُ أَن يُضِلَّهُمْ ضَلَالًا بَعِيدًا
(ఓ ప్రవక్తా!) నీపై అవతరించినదాన్నీ, నీకు పూర్వం వారిపై అవతరించిన దాన్నీ విశ్వసించాము అని అంటూనే తమ వ్యవహారాలను తీర్పు కోసం దైవేతరుల (తాగూత్) వద్దకు తీసుకు పోగోరే వారిని నీవు చూడలేదా? మరి నిజానికి షైతాన్ను (తాగూత్ను) తిరస్కరించమని వారికి (స్పష్టంగా) ఆదేశించటం జరిగింది. షైతానైతే వారిని మార్గం తప్పించి చాలా దూరంలో పడవేయాలని కోరుతున్నాడు.
4:61 وَإِذَا قِيلَ لَهُمْ تَعَالَوْا إِلَىٰ مَا أَنزَلَ اللَّهُ وَإِلَى الرَّسُولِ رَأَيْتَ الْمُنَافِقِينَ يَصُدُّونَ عَنكَ صُدُودًا
“అల్లాహ్ అవతరింపజేసిన దాని వైపుకు, ప్రవక్త (సఅసం) వైపుకు రండి” అని వారితో అన్నప్పుడల్లా, ఈ కపటులు నీ నుండి అయిష్టంగా ముఖం త్రిప్పుకుని పోవటాన్ని నీవు గమనిస్తావు.
4:62 فَكَيْفَ إِذَا أَصَابَتْهُم مُّصِيبَةٌ بِمَا قَدَّمَتْ أَيْدِيهِمْ ثُمَّ جَاءُوكَ يَحْلِفُونَ بِاللَّهِ إِنْ أَرَدْنَا إِلَّا إِحْسَانًا وَتَوْفِيقًا
మరి ఇదేమిటి? వారు తమ చేజేతులా చేసుకున్న దాని పర్యవసానంగా వారిపై ఏదన్నా ఆపద వచ్చిపడితే, అప్పుడు వారు నీ వద్దకు వచ్చి, అల్లాహ్‌పై ప్రమాణం చేస్తూ , “మేము మేలును, సయోధ్యను కాంక్షించి మాత్రమే ఇలా చేశాము” అని అంటారు.
4:63 أُولَٰئِكَ الَّذِينَ يَعْلَمُ اللَّهُ مَا فِي قُلُوبِهِمْ فَأَعْرِضْ عَنْهُمْ وَعِظْهُمْ وَقُل لَّهُمْ فِي أَنفُسِهِمْ قَوْلًا بَلِيغًا
వారి హృదయాలలో ఉన్నదంతా అల్లాహ్‌కు బాగా తెలుసు. కనుక (ఓ ప్రవక్తా!) వారిని పట్టించుకోకు. కాకపోతే వారికి బోధపరుస్తూ ఉండు. వారి మనోక్షేత్రంలో నాటుకునేలా మాట చెబుతూ ఉండు.
4:64 وَمَا أَرْسَلْنَا مِن رَّسُولٍ إِلَّا لِيُطَاعَ بِإِذْنِ اللَّهِ ۚ وَلَوْ أَنَّهُمْ إِذ ظَّلَمُوا أَنفُسَهُمْ جَاءُوكَ فَاسْتَغْفَرُوا اللَّهَ وَاسْتَغْفَرَ لَهُمُ الرَّسُولُ لَوَجَدُوا اللَّهَ تَوَّابًا رَّحِيمًا
మేము ఏ ప్రవక్తను పంపినా దైవాజ్ఞతో (ప్రజలు) అతనిని అనుసరించాలనే పంపాము. వారే గనక తమ ఆత్మలకు అన్యాయం చేసుకున్నప్పుడు, నీ వద్దకు వచ్చి క్షమాపణకై దైవాన్ని వేడుకుని ఉంటే, ప్రవక్త కూడా వారి మన్నింపుకై విన్నవించుకుని ఉంటే అప్పుడు వారు అల్లాహ్‌ను క్షమించేవాడుగా, కరుణించేవాడుగా పొంది ఉండేవారు.
4:65 فَلَا وَرَبِّكَ لَا يُؤْمِنُونَ حَتَّىٰ يُحَكِّمُوكَ فِيمَا شَجَرَ بَيْنَهُمْ ثُمَّ لَا يَجِدُوا فِي أَنفُسِهِمْ حَرَجًا مِّمَّا قَضَيْتَ وَيُسَلِّمُوا تَسْلِيمًا
కనుక (ఓ ప్రవక్తా!) నీ ప్రభువు తోడు! వారు తమ పరస్పర వివాదాలన్నింటిలో నిన్ను తీర్పరిగా చేసుకోనంతవరకూ, తర్వాత నీవు వారి మధ్య చెప్పిన తీర్పుపట్ల వారు తమ మనసులలో ఎలాంటి సంకోచానికి, అసంతృప్తికి ఆస్కారం యివ్వకుండా మనస్ఫూర్తిగా శిరసావహించనంతవరకూ – వారు విశ్వాసులు కాజాలరు.
4:66 وَلَوْ أَنَّا كَتَبْنَا عَلَيْهِمْ أَنِ اقْتُلُوا أَنفُسَكُمْ أَوِ اخْرُجُوا مِن دِيَارِكُم مَّا فَعَلُوهُ إِلَّا قَلِيلٌ مِّنْهُمْ ۖ وَلَوْ أَنَّهُمْ فَعَلُوا مَا يُوعَظُونَ بِهِ لَكَانَ خَيْرًا لَّهُمْ وَأَشَدَّ تَثْبِيتًا
ఒకవేళ మేము “మిమ్మల్ని మీరు చంపుకోండి” లేదా “మీ ఇళ్ల నుంచి వెళ్ళిపోండి” అనే ఆదేశాన్ని వారిపై విధించి ఉంటే, వారిలో బహుకొద్దిమంది మాత్రమే దాన్ని పాటించేవారు. అలా కాకుండా వారు తమకు ఉపదేశించబడుతున్న విధంగా చేసి వుంటే నిశ్చయంగా అది వారి కొరకు శ్రేయస్కరం అయ్యేది, ఎక్కువ స్థయిర్యాన్నీ ఒనగూర్చేది.
4:67 وَإِذًا لَّآتَيْنَاهُم مِّن لَّدُنَّا أَجْرًا عَظِيمًا
అదేగనక జరిగి ఉంటే మేము మా వద్ద నుండి వారికి గొప్ప పుణ్యఫలం ప్రసాదించి ఉండేవాళ్ళం.
4:68 وَلَهَدَيْنَاهُمْ صِرَاطًا مُّسْتَقِيمًا
ఇంకా వారికి రుజుమార్గం చూపించి ఉండేవాళ్ళం.
4:69 وَمَن يُطِعِ اللَّهَ وَالرَّسُولَ فَأُولَٰئِكَ مَعَ الَّذِينَ أَنْعَمَ اللَّهُ عَلَيْهِم مِّنَ النَّبِيِّينَ وَالصِّدِّيقِينَ وَالشُّهَدَاءِ وَالصَّالِحِينَ ۚ وَحَسُنَ أُولَٰئِكَ رَفِيقًا
ఎవరయితే అల్లాహ్‌కు, ప్రవక్త (సఅసం)కు విధేయత కనబరుస్తారో వారే అల్లాహ్ అనుగ్రహం పొందిన ప్రవక్తలతోనూ, సత్య సంధులతోనూ, షహీదులతోనూ, సద్వర్తనులతోనూ ఉంటారు. వీరు ఎంతో మంచి స్నేహితులు.
4:70 ذَٰلِكَ الْفَضْلُ مِنَ اللَّهِ ۚ وَكَفَىٰ بِاللَّهِ عَلِيمًا
ఇదీ అల్లాహ్ తరఫు నుంచి లభించే అనుగ్రహం. తెలుసుకోవటానికి అల్లాహ్‌యే చాలు.
4:71 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا خُذُوا حِذْرَكُمْ فَانفِرُوا ثُبَاتٍ أَوِ انفِرُوا جَمِيعًا
విశ్వాసులారా! మీరు మీ ఆత్మరక్షణా సామగ్రిని సమకూర్చుకోండి. ఆపైన వేర్వేరు దళాలుగా ఏర్పడి బయలుదేరండి లేదా అందరూ కలసికట్టుగా కదలండి.
4:72 وَإِنَّ مِنكُمْ لَمَن لَّيُبَطِّئَنَّ فَإِنْ أَصَابَتْكُم مُّصِيبَةٌ قَالَ قَدْ أَنْعَمَ اللَّهُ عَلَيَّ إِذْ لَمْ أَكُن مَّعَهُمْ شَهِيدًا
మీలో కొందరు వెనుకాడేవారు కూడా ఉన్నారు. ఒకవేళ మీకు ఏదన్నా నష్టం వాటిల్లితే, “అల్లాహ్ నన్ను అనుగ్రహించాడు. ఆ సమయంలో నేను వారివెంట లేను” అని అంటారు.
4:73 وَلَئِنْ أَصَابَكُمْ فَضْلٌ مِّنَ اللَّهِ لَيَقُولَنَّ كَأَن لَّمْ تَكُن بَيْنَكُمْ وَبَيْنَهُ مَوَدَّةٌ يَا لَيْتَنِي كُنتُ مَعَهُمْ فَأَفُوزَ فَوْزًا عَظِيمًا
ఒకవేళ దైవానుగ్రహం ఏదన్నా మీకు లభిస్తే, మీ మధ్య- అతని మధ్య స్నేహబంధమే లేనట్లుగా మాట్లాడుతూ – “అరెరే! నేనూ వారి వెంట ఉండి ఉంటే ఘనవిజయాన్ని పొంది ఉండేవాడినే!” అని చెబుతారు.
4:74 فَلْيُقَاتِلْ فِي سَبِيلِ اللَّهِ الَّذِينَ يَشْرُونَ الْحَيَاةَ الدُّنْيَا بِالْآخِرَةِ ۚ وَمَن يُقَاتِلْ فِي سَبِيلِ اللَّهِ فَيُقْتَلْ أَوْ يَغْلِبْ فَسَوْفَ نُؤْتِيهِ أَجْرًا عَظِيمًا
కాబట్టి ఇహలోక జీవితాన్ని పరలోకానికి బదులుగా అమ్మి వేసినవారు దైవమార్గంలో పోరాడాలి. దైవమార్గంలో పోరాడుతూ చంపబడినవానికి లేదా విజయం పొందినవానికి మేము గొప్ప పుణ్యఫలాన్ని వొసగుతాము.
4:75 وَمَا لَكُمْ لَا تُقَاتِلُونَ فِي سَبِيلِ اللَّهِ وَالْمُسْتَضْعَفِينَ مِنَ الرِّجَالِ وَالنِّسَاءِ وَالْوِلْدَانِ الَّذِينَ يَقُولُونَ رَبَّنَا أَخْرِجْنَا مِنْ هَٰذِهِ الْقَرْيَةِ الظَّالِمِ أَهْلُهَا وَاجْعَل لَّنَا مِن لَّدُنكَ وَلِيًّا وَاجْعَل لَّنَا مِن لَّدُنكَ نَصِيرًا
“మా ప్రభూ! దుర్మార్గుల ఈ పురము నుండి మాకు విముక్తి నొసగు. మా కొరకు నీ వద్దనుంచి ఒక రక్షకుణ్ణి నియమించు, మాకు (అండగా) నీ వద్ద నుంచి ఒక సహాయకుణ్ణి పంపించు” అని వేడుకుంటున్న బలహీన పురుషుల, స్త్రీల, పసివాళ్ళ విమోచనకై మీరు దైవమార్గంలో ఎందుకు పోరాడటం లేదు?!
4:76 الَّذِينَ آمَنُوا يُقَاتِلُونَ فِي سَبِيلِ اللَّهِ ۖ وَالَّذِينَ كَفَرُوا يُقَاتِلُونَ فِي سَبِيلِ الطَّاغُوتِ فَقَاتِلُوا أَوْلِيَاءَ الشَّيْطَانِ ۖ إِنَّ كَيْدَ الشَّيْطَانِ كَانَ ضَعِيفًا
విశ్వసించినవారు దైవమార్గంలో పోరాడతారు. అవిశ్వాస వైఖరిని అవలంబించినవారు దైవేతరుల మార్గంలో పోరాడతారు. కనుక (ఓ విశ్వాసులారా!) మీరు షైతాను స్నేహితులతో యుద్ధం చేయండి. షైతాను జిత్తులు అత్యంత బలహీనమైనవి.
4:77 أَلَمْ تَرَ إِلَى الَّذِينَ قِيلَ لَهُمْ كُفُّوا أَيْدِيَكُمْ وَأَقِيمُوا الصَّلَاةَ وَآتُوا الزَّكَاةَ فَلَمَّا كُتِبَ عَلَيْهِمُ الْقِتَالُ إِذَا فَرِيقٌ مِّنْهُمْ يَخْشَوْنَ النَّاسَ كَخَشْيَةِ اللَّهِ أَوْ أَشَدَّ خَشْيَةً ۚ وَقَالُوا رَبَّنَا لِمَ كَتَبْتَ عَلَيْنَا الْقِتَالَ لَوْلَا أَخَّرْتَنَا إِلَىٰ أَجَلٍ قَرِيبٍ ۗ قُلْ مَتَاعُ الدُّنْيَا قَلِيلٌ وَالْآخِرَةُ خَيْرٌ لِّمَنِ اتَّقَىٰ وَلَا تُظْلَمُونَ فَتِيلًا
“మీ చేతులను ఆపుకోండి, నమాజులను నెలకొల్పుతూ ఉండండి, జకాతును చెల్లిస్తూ ఉండండి” అని ఆదేశించబడిన వారిని నీవు చూడలేదా? తీరా వారికి యుద్ధం చెయ్యమని ఆజ్ఞాపించబడితే, వారిలోని ఒక వర్గంవారు అల్లాహ్‌కు భయపడవలసిన రీతిలో- పైగా అంతకంటే ఎక్కువగానే- జనులకు భయపడసాగారు. “ప్రభూ! నీవు మాపై యుద్ధాన్ని ఎందుకు విధించావు? మరి కొంతకాలంపాటు మమ్మల్ని ఎందుకు బ్రతకనివ్వలేదు?” అని అనసాగారు. వారితో ఇలా చెప్పు: ప్రాపంచిక ప్రయోజనాలు బహు స్వల్పమైనవి. (అల్లాహ్‌కు) భయపడేవారికి పరలోకమే మేలైనది. మీకు (అక్కడ) ఒక చిన్న పీచు అంత అన్యాయం కూడా జరగదు.
4:78 أَيْنَمَا تَكُونُوا يُدْرِككُّمُ الْمَوْتُ وَلَوْ كُنتُمْ فِي بُرُوجٍ مُّشَيَّدَةٍ ۗ وَإِن تُصِبْهُمْ حَسَنَةٌ يَقُولُوا هَٰذِهِ مِنْ عِندِ اللَّهِ ۖ وَإِن تُصِبْهُمْ سَيِّئَةٌ يَقُولُوا هَٰذِهِ مِنْ عِندِكَ ۚ قُلْ كُلٌّ مِّنْ عِندِ اللَّهِ ۖ فَمَالِ هَٰؤُلَاءِ الْقَوْمِ لَا يَكَادُونَ يَفْقَهُونَ حَدِيثًا
మీరెక్కడ ఉన్నాసరే, మృత్యువు మిమ్మల్ని కబళిస్తుంది. ఆఖరికి మీరు పటిష్టమైన కోటలలో ఉన్నాసరే (అది మిమ్మల్ని వదలదు). వారికేదైనా మంచి జరిగితే, “ఇది అల్లాహ్ తరఫున లభించింది” అని అంటారు. అదే వారికేదైనా కీడు కలిగితే, “ఇదంతా నీ మూలంగానే జరిగింది” అని నిందిస్తారు. “ఇవన్నీ వాస్తవానికి అల్లాహ్ తరఫుననే సంభవించాయి” అని (ఓ ప్రవక్తా!) వారికి తెలియజేయి. అసలు వీరికేమైపోయిందీ? ఏ విషయాన్ని కూడా వీరు బొత్తిగా అర్థం చేసుకోరే?!
4:79 مَّا أَصَابَكَ مِنْ حَسَنَةٍ فَمِنَ اللَّهِ ۖ وَمَا أَصَابَكَ مِن سَيِّئَةٍ فَمِن نَّفْسِكَ ۚ وَأَرْسَلْنَاكَ لِلنَّاسِ رَسُولًا ۚ وَكَفَىٰ بِاللَّهِ شَهِيدًا
నీకు ఏ మంచి జరిగినా అది అల్లాహ్ తరఫు నుంచే జరుగుతుంది. నీకు ఏదైనా చెడు జరిగితే అది నీ స్వయంకృతమే. (ఓ ముహమ్మద్!) మేము నిన్ను సమస్త జనులకు సందేశం అందజేసేవానిగా చేసి పంపాము. దీనికి సాక్షిగా అల్లాహ్ చాలు.
4:80 مَّن يُطِعِ الرَّسُولَ فَقَدْ أَطَاعَ اللَّهَ ۖ وَمَن تَوَلَّىٰ فَمَا أَرْسَلْنَاكَ عَلَيْهِمْ حَفِيظًا
ఈ ప్రవక్త (సఅసం)కు విధేయత చూపినవాడు అల్లాహ్‌కు విధేయత చూపినట్లే. మరెవరైతే విముఖత చూపుతారో వారిపై మేము నిన్ను కావలివానిగా చేసి పంపలేదు.
4:81 وَيَقُولُونَ طَاعَةٌ فَإِذَا بَرَزُوا مِنْ عِندِكَ بَيَّتَ طَائِفَةٌ مِّنْهُمْ غَيْرَ الَّذِي تَقُولُ ۖ وَاللَّهُ يَكْتُبُ مَا يُبَيِّتُونَ ۖ فَأَعْرِضْ عَنْهُمْ وَتَوَكَّلْ عَلَى اللَّهِ ۚ وَكَفَىٰ بِاللَّهِ وَكِيلًا
తాము విధేయత చూపుతున్నట్లు వారు నీ ముందర ప్రకటిస్తారు. కాని నీ దగ్గర నుంచి వెళ్ళిపోయిన తరువాత, వారిలోని ఒక వర్గం వారు రాత్రివేళల్లో సమావేశమై తాము చెప్పినదానికి వ్యతిరేకంగా మంతనాలు జరుపుతారు. రాత్రిపూట వారు జరిపే రహస్య మంతనాలను అల్లాహ్ నమోదు చేసుకుంటున్నాడు. కనుక (ఓ ముహమ్మద్!) వారిని పట్టించుకోకు. అల్లాహ్‌పైనే ఆధారపడి ఉండు. కార్యసాధనకై అల్లాహ్‌యే చాలు.
4:82 أَفَلَا يَتَدَبَّرُونَ الْقُرْآنَ ۚ وَلَوْ كَانَ مِنْ عِندِ غَيْرِ اللَّهِ لَوَجَدُوا فِيهِ اخْتِلَافًا كَثِيرًا
ఏమిటీ, వారు ఖుర్ఆన్ గురించి యోచన చేయరా? ఒకవేళ ఇది గనక అల్లాహ్ తరఫు నుంచి గాక ఇంకొకరి తరఫు నుంచి వచ్చి ఉంటే అందులో వారికి ఎంతో వైరుద్ధ్యం కనపడేది.
4:83 وَإِذَا جَاءَهُمْ أَمْرٌ مِّنَ الْأَمْنِ أَوِ الْخَوْفِ أَذَاعُوا بِهِ ۖ وَلَوْ رَدُّوهُ إِلَى الرَّسُولِ وَإِلَىٰ أُولِي الْأَمْرِ مِنْهُمْ لَعَلِمَهُ الَّذِينَ يَسْتَنبِطُونَهُ مِنْهُمْ ۗ وَلَوْلَا فَضْلُ اللَّهِ عَلَيْكُمْ وَرَحْمَتُهُ لَاتَّبَعْتُمُ الشَّيْطَانَ إِلَّا قَلِيلًا
శాంతికి సంబంధించిన వార్తగానీ, భయాందోళనల్ని కలిగించే సమాచారంగానీ ఏదైనా వారికి అందినప్పుడు దాన్ని వారు చాటింపు వేసేస్తారు. దానికి బదులు వారు ఆ విషయాన్ని ప్రవక్తకు, విషయం లోతుల్లోకి వెళ్ళే తమలోని విజ్ఞులకు చేరవేసి ఉంటే వారు అందలి నిజానిజాలను, ఉచితానుచితాలను పరికించి ఒక నిర్ణయానికి రావటానికి ఆస్కారముండేది. దైవానుగ్రహం, ఆయన కారుణ్యమే గనక మీపై లేకుండినట్లయితే మీలో కొందరు తప్ప – అందరూ షైతాను అనుయాయులుగా మారిపోయేవారు.
4:84 فَقَاتِلْ فِي سَبِيلِ اللَّهِ لَا تُكَلَّفُ إِلَّا نَفْسَكَ ۚ وَحَرِّضِ الْمُؤْمِنِينَ ۖ عَسَى اللَّهُ أَن يَكُفَّ بَأْسَ الَّذِينَ كَفَرُوا ۚ وَاللَّهُ أَشَدُّ بَأْسًا وَأَشَدُّ تَنكِيلًا
కనుక నీవు అల్లాహ్ మార్గంలో యుద్ధం చెయ్యి. నీవు నీ స్వయానికి మాత్రమే బాధ్యుడవు. అయితే విశ్వసించిన వారిని (యుద్ధం చేయమని) ప్రేరేపిస్తూ ఉండు. త్వరలో అల్లాహ్ అవిశ్వాసుల యుద్ధాన్ని ఆపినా ఆపి వేయవచ్చు! అల్లాహ్ అందరికంటే గొప్ప శక్తిగలవాడు, శిక్షించటంలో కూడా చాలా కఠినుడు.
4:85 مَّن يَشْفَعْ شَفَاعَةً حَسَنَةً يَكُن لَّهُ نَصِيبٌ مِّنْهَا ۖ وَمَن يَشْفَعْ شَفَاعَةً سَيِّئَةً يَكُن لَّهُ كِفْلٌ مِّنْهَا ۗ وَكَانَ اللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ مُّقِيتًا
ఎవరయినా ఒక మంచి పని కోసం సిఫారసు చేస్తే, అతనికి అందులో కొంత భాగం లభిస్తుంది. మరెవరయినా ఒక చెడు పని కోసం సిఫారసు చేస్తే, ఆ పాపంలో అతనికీ వాటా ఉంటుంది. అల్లాహ్ అన్నింటిపై అదుపు అజమాయిషీ కలవాడు.
4:86 وَإِذَا حُيِّيتُم بِتَحِيَّةٍ فَحَيُّوا بِأَحْسَنَ مِنْهَا أَوْ رُدُّوهَا ۗ إِنَّ اللَّهَ كَانَ عَلَىٰ كُلِّ شَيْءٍ حَسِيبًا
ఎవరయినా మీకు ‘సలాం’ చేసినప్పుడు మీరు అంతకంటే ఉత్తమరీతిలో జవాబు ఇవ్వండి లేదా కనీసం అదే విధంగానైనా చెప్పండి. నిశ్చయంగా అల్లాహ్ ప్రతిదానికీ లెక్క తీసుకుంటాడు.
4:87 اللَّهُ لَا إِلَٰهَ إِلَّا هُوَ ۚ لَيَجْمَعَنَّكُمْ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ لَا رَيْبَ فِيهِ ۗ وَمَنْ أَصْدَقُ مِنَ اللَّهِ حَدِيثًا
అల్లాహ్ – ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. ఆయన మిమ్మల్నందరినీ ప్రళయదినాన సమీకరిస్తాడు. ఆ రోజు (రావటం)లో సందేహానికి తావేలేదు. అల్లాహ్ మాటకన్నా సత్యమైన మాట మరెవరిది కాగలదు?
4:88 فَمَا لَكُمْ فِي الْمُنَافِقِينَ فِئَتَيْنِ وَاللَّهُ أَرْكَسَهُم بِمَا كَسَبُوا ۚ أَتُرِيدُونَ أَن تَهْدُوا مَنْ أَضَلَّ اللَّهُ ۖ وَمَن يُضْلِلِ اللَّهُ فَلَن تَجِدَ لَهُ سَبِيلًا
మీకేమైపోయిందీ? కపటుల విషయంలో మీరు రెండు వర్గాలుగా అయిపోతున్నారు? వాస్తవానికి వారి స్వయంకృతాల మూలంగా అల్లాహ్ వారిని వెనక్కి మరలించాడు. ఏమిటీ, అల్లాహ్ సన్మార్గం నుంచి తప్పించిన వారిని మీరు సన్మార్గానికి తీసుకురాదలుస్తున్నారా? అల్లాహ్ అపమార్గం పట్టించినవారి కోసం నీవు ఎన్నటికీ ఏ మార్గం కనుగొనలేవు సుమా!
4:89 وَدُّوا لَوْ تَكْفُرُونَ كَمَا كَفَرُوا فَتَكُونُونَ سَوَاءً ۖ فَلَا تَتَّخِذُوا مِنْهُمْ أَوْلِيَاءَ حَتَّىٰ يُهَاجِرُوا فِي سَبِيلِ اللَّهِ ۚ فَإِن تَوَلَّوْا فَخُذُوهُمْ وَاقْتُلُوهُمْ حَيْثُ وَجَدتُّمُوهُمْ ۖ وَلَا تَتَّخِذُوا مِنْهُمْ وَلِيًّا وَلَا نَصِيرًا
తాము అవిశ్వాసులుగా ఉన్నట్లే మీరు కూడా అవిశ్వాస వైఖరిని అవలంబించి, ఆపైన అందరూ ఒకేలాగా అయిపోవాలన్నది వారి ఆకాంక్ష! కనుక వారు దైవమార్గంలో తమ స్వస్థలాన్ని వదలి బయలుదేరనంతవరకూ, వారిలో ఎవరినీ మీ స్నేహితులుగా చేసుకోకండి. ఒకవేళ వారు విముఖులైపోతే వారిని పట్టుకోండి. ఎక్కడ దొరికితే అక్కడ వారిని చంపండి. జాగ్రత్త! వారిలో ఎవరినీ మీ మిత్రునిగా, సహాయకునిగా భావించకండి.
4:90 إِلَّا الَّذِينَ يَصِلُونَ إِلَىٰ قَوْمٍ بَيْنَكُمْ وَبَيْنَهُم مِّيثَاقٌ أَوْ جَاءُوكُمْ حَصِرَتْ صُدُورُهُمْ أَن يُقَاتِلُوكُمْ أَوْ يُقَاتِلُوا قَوْمَهُمْ ۚ وَلَوْ شَاءَ اللَّهُ لَسَلَّطَهُمْ عَلَيْكُمْ فَلَقَاتَلُوكُمْ ۚ فَإِنِ اعْتَزَلُوكُمْ فَلَمْ يُقَاتِلُوكُمْ وَأَلْقَوْا إِلَيْكُمُ السَّلَمَ فَمَا جَعَلَ اللَّهُ لَكُمْ عَلَيْهِمْ سَبِيلًا
అయితే మీతో ఒప్పందం చేసుకున్న వారితో కలసిపోయిన వారికీ, లేదా ఇటు మీతోనూ, అటు తమ వర్గం వారితోనూ యుద్ధం చేయటానికి మనసొప్పక మీ దగ్గరకు వచ్చే వారికి మాత్రం ఈ ఆజ్ఞ నుండి మినహాయింపు ఉంది. అల్లాహ్‌యే గనక తలిస్తే మీపై వారికి ప్రాబల్యాన్ని ఒసగేవాడే. అదేగనక జరిగితే వారు మీతో యుద్ధం చేసేవారే. కాబట్టి వారు మీ దారినుంచి తప్పుకుని, మీతో యుద్ధం చేయకుండా, సంధి కోసం ప్రయత్నిస్తే (అప్పుడు వారిపై దాడి జరపటానికి) అల్లాహ్ మీకు మార్గం తెరచి ఉంచలేదు.
4:91 سَتَجِدُونَ آخَرِينَ يُرِيدُونَ أَن يَأْمَنُوكُمْ وَيَأْمَنُوا قَوْمَهُمْ كُلَّ مَا رُدُّوا إِلَى الْفِتْنَةِ أُرْكِسُوا فِيهَا ۚ فَإِن لَّمْ يَعْتَزِلُوكُمْ وَيُلْقُوا إِلَيْكُمُ السَّلَمَ وَيَكُفُّوا أَيْدِيَهُمْ فَخُذُوهُمْ وَاقْتُلُوهُمْ حَيْثُ ثَقِفْتُمُوهُمْ ۚ وَأُولَٰئِكُمْ جَعَلْنَا لَكُمْ عَلَيْهِمْ سُلْطَانًا مُّبِينًا
వారిలో మరి కొంతమందిని కూడా మీరు చూస్తారు. వారు (పైకి) మీ నుంచి, తమ వర్గం వారి నుంచి శాంతిగా ఉండాలని కోరుకుంటారు. (కాని) ఎప్పుడైనా ఉపద్రవం వైపు మరలించ బడితే మాత్రం పిల్లిమొగ్గలు వేస్తారు. వారు గనక మీకు దూరంగా ఉండకపోతే, మీకు స్నేహ హస్తం అందించకపోతే, (యుద్ధం నుంచి) తమ చేతులను ఆపి ఉంచకపోతే వారిని పట్టుకోండి, ఎక్కడ దొరికితే అక్కడే వారిని హతమార్చండి. మేము మీకు స్పష్టమయిన అధికారాన్ని ప్రసాదించినది వీరి పైనే.
4:92 وَمَا كَانَ لِمُؤْمِنٍ أَن يَقْتُلَ مُؤْمِنًا إِلَّا خَطَأً ۚ وَمَن قَتَلَ مُؤْمِنًا خَطَأً فَتَحْرِيرُ رَقَبَةٍ مُّؤْمِنَةٍ وَدِيَةٌ مُّسَلَّمَةٌ إِلَىٰ أَهْلِهِ إِلَّا أَن يَصَّدَّقُوا ۚ فَإِن كَانَ مِن قَوْمٍ عَدُوٍّ لَّكُمْ وَهُوَ مُؤْمِنٌ فَتَحْرِيرُ رَقَبَةٍ مُّؤْمِنَةٍ ۖ وَإِن كَانَ مِن قَوْمٍ بَيْنَكُمْ وَبَيْنَهُم مِّيثَاقٌ فَدِيَةٌ مُّسَلَّمَةٌ إِلَىٰ أَهْلِهِ وَتَحْرِيرُ رَقَبَةٍ مُّؤْمِنَةٍ ۖ فَمَن لَّمْ يَجِدْ فَصِيَامُ شَهْرَيْنِ مُتَتَابِعَيْنِ تَوْبَةً مِّنَ اللَّهِ ۗ وَكَانَ اللَّهُ عَلِيمًا حَكِيمًا
ఒక విశ్వాసి మరో విశ్వాసిని చంపటం ఎంతమాత్రం తగదు. పొరపాటున జరిగితే అది వేరే విషయం. ఎవరయినా పొరపాటున ఒక ముస్లింను చంపితే దానికి పరిహారంగా ఒక ముస్లిం బానిసను బానిసత్వం నుంచి విడిపించాలి. ఇంకా హతుని కుటుంబీకులకు రక్త పరిహారం చెల్లించాలి. ఒకవేళ వారు క్షమాభిక్షపెడితే అది వేరే విషయం. కాని చంపబడిన వ్యక్తి, శత్రు వర్గానికి చెందినవాడై, అతను ముస్లిం కూడా అయి వుంటే అట్టి పరిస్థితిలో ఒక్క ముస్లిం బానిసకు విముక్తి నొసగాలి. ఒకవేళ హతుడు మీతో ఒడంబడిక చేసుకున్న జాతికి చెందినవాడైనపుడు రక్త పరిహారాన్ని అతని కుటుంబీకులకు చెల్లించి తీరాలి. (దాంతో పాటు) ఒక ముస్లిం బానిసను కూడా స్వతంత్రుడ్ని చేయాలి. బానిసకు విముక్తి నొసగే స్థోమత లేనివారు ఎడతెగకుండా రెండు మాసాలు ఉపవాసం ఉండాలి. అల్లాహ్ నుంచి క్షమాభిక్ష పొందటానికి (ఈ పద్ధతి సూచించబడింది). అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, వివేచనా పరుడూను.
4:93 وَمَن يَقْتُلْ مُؤْمِنًا مُّتَعَمِّدًا فَجَزَاؤُهُ جَهَنَّمُ خَالِدًا فِيهَا وَغَضِبَ اللَّهُ عَلَيْهِ وَلَعَنَهُ وَأَعَدَّ لَهُ عَذَابًا عَظِيمًا
ఇక ఉద్దేశ్యపూర్వకంగా ఒక విశ్వాసిని చంపేవానికి ప్రతిఫలం నరకమే. అందులో వాడు కలకాలం పడి ఉంటాడు. వాడిపై దైవాగ్రహం, ఆయన శాపం పడుతుంది. ఇంకా ఆయన అతని కోసం పెద్ద శిక్షను సిద్ధం చేసి ఉంచాడు.
4:94 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا ضَرَبْتُمْ فِي سَبِيلِ اللَّهِ فَتَبَيَّنُوا وَلَا تَقُولُوا لِمَنْ أَلْقَىٰ إِلَيْكُمُ السَّلَامَ لَسْتَ مُؤْمِنًا تَبْتَغُونَ عَرَضَ الْحَيَاةِ الدُّنْيَا فَعِندَ اللَّهِ مَغَانِمُ كَثِيرَةٌ ۚ كَذَٰلِكَ كُنتُم مِّن قَبْلُ فَمَنَّ اللَّهُ عَلَيْكُمْ فَتَبَيَّنُوا ۚ إِنَّ اللَّهَ كَانَ بِمَا تَعْمَلُونَ خَبِيرًا
ఓ విశ్వాసులారా! మీరు దైవమార్గంలో వెళ్తున్నప్పుడు నిజానిజాలను తెలుసుకొని వ్యవహరించండి. ఎవరయినా మీకు సలాం చేస్తే దానికి సమాధానంగా ‘నీవు విశ్వాసివి కావు’ అని అనకండి. మీరు ప్రాపంచిక జీవన సామగ్రిని అన్వేషించటంలో పడి ఉన్నారేమో! అయితే అల్లాహ్ వద్ద విజయధనం పుష్కలంగా ఉంది. లోగడ మీరు కూడా ఇలాగే ఉండేవారు. కాని తరువాత అల్లాహ్ మిమ్మల్ని కటాక్షించాడు. కనుక మీరు విషయాన్ని పరికించి మరీ మసలుకోండి. నిస్సందేహంగా అల్లాహ్‌కు మీరు చేసేదంతా తెలుసు.
4:95 لَّا يَسْتَوِي الْقَاعِدُونَ مِنَ الْمُؤْمِنِينَ غَيْرُ أُولِي الضَّرَرِ وَالْمُجَاهِدُونَ فِي سَبِيلِ اللَّهِ بِأَمْوَالِهِمْ وَأَنفُسِهِمْ ۚ فَضَّلَ اللَّهُ الْمُجَاهِدِينَ بِأَمْوَالِهِمْ وَأَنفُسِهِمْ عَلَى الْقَاعِدِينَ دَرَجَةً ۚ وَكُلًّا وَعَدَ اللَّهُ الْحُسْنَىٰ ۚ وَفَضَّلَ اللَّهُ الْمُجَاهِدِينَ عَلَى الْقَاعِدِينَ أَجْرًا عَظِيمًا
ఏ కారణమూ లేకుండా (ఇంటి పట్టున) కూర్చుండిపోయే విశ్వాసులు, దైవమార్గంలో తమ ధన ప్రాణాలతో పోరాడే విశ్వాసులూ సమానులు కాలేరు. తమ ధనప్రాణాలతో పోరాడేవారికి అల్లాహ్ ఇంట్లో కూర్చుని ఉండేవారిపై అంతస్థుల రీత్యా ఎంతో ఉన్నతిని ప్రసాదించాడు. ఆ మాటకొస్తే అల్లాహ్ ప్రతి ఒక్కరికీ ఉత్తమ ప్రతిఫలం ఇస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు. అయితే ఆయన కూర్చుని ఉండే వారిపై ముజాహిద్ (యోధు)లకు గొప్ప ప్రతిఫలం ద్వారా శ్రేష్ఠతను ప్రసాదించాడు.
4:96 دَرَجَاتٍ مِّنْهُ وَمَغْفِرَةً وَرَحْمَةً ۚ وَكَانَ اللَّهُ غَفُورًا رَّحِيمًا
ఆయన తరఫున వారి కొరకు ఉన్నత స్థానాలూ ఉన్నాయి. మన్నింపు మరియు కారుణ్యం కూడా ఉంది. అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడు కూడాను.
4:97 إِنَّ الَّذِينَ تَوَفَّاهُمُ الْمَلَائِكَةُ ظَالِمِي أَنفُسِهِمْ قَالُوا فِيمَ كُنتُمْ ۖ قَالُوا كُنَّا مُسْتَضْعَفِينَ فِي الْأَرْضِ ۚ قَالُوا أَلَمْ تَكُنْ أَرْضُ اللَّهِ وَاسِعَةً فَتُهَاجِرُوا فِيهَا ۚ فَأُولَٰئِكَ مَأْوَاهُمْ جَهَنَّمُ ۖ وَسَاءَتْ مَصِيرًا
ఎవరయితే తమకు తాము అన్యాయం చేసుకుంటూ ఉన్నారో, వారి ప్రాణాలను తీసేటప్పుడు దైవదూతలు, “మీరే స్థితిలో ఉండేవారు?” అని వారిని అడుగుతారు. దానికి వారు, “మేము మా ప్రదేశంలో బలహీనులముగా, (నిస్సహాయులంగా) ఉండేవారము” అని బదులిస్తారు. “ఏమిటీ? మీరు (ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి) వలసపోవటానికి దేవుని భూమి విశాలంగా లేదా?” అని దైవ దూతలు వారిని అడుగుతారు. వీరి నివాస స్థలమే నరకం. అది అత్యంత చెడ్డ గమ్య స్థానం.
4:98 إِلَّا الْمُسْتَضْعَفِينَ مِنَ الرِّجَالِ وَالنِّسَاءِ وَالْوِلْدَانِ لَا يَسْتَطِيعُونَ حِيلَةً وَلَا يَهْتَدُونَ سَبِيلًا
అయితే నిజంగానే ఏ సాధన సంపత్తి లేని, దారి తెలియని నిస్సహాయులైన పురుషుల, స్త్రీల, పసివాళ్ళ (సంగతి వేరు).
4:99 فَأُولَٰئِكَ عَسَى اللَّهُ أَن يَعْفُوَ عَنْهُمْ ۚ وَكَانَ اللَّهُ عَفُوًّا غَفُورًا
అల్లాహ్ వారిని మన్నించవచ్చు! అల్లాహ్ మన్నించేవాడు, క్షమాభిక్ష పెట్టేవాడు.
4:100 وَمَن يُهَاجِرْ فِي سَبِيلِ اللَّهِ يَجِدْ فِي الْأَرْضِ مُرَاغَمًا كَثِيرًا وَسَعَةً ۚ وَمَن يَخْرُجْ مِن بَيْتِهِ مُهَاجِرًا إِلَى اللَّهِ وَرَسُولِهِ ثُمَّ يُدْرِكْهُ الْمَوْتُ فَقَدْ وَقَعَ أَجْرُهُ عَلَى اللَّهِ ۗ وَكَانَ اللَّهُ غَفُورًا رَّحِيمًا
అల్లాహ్ మార్గంలో తన స్వస్థలాన్ని వదలి వలసపోయిన వాడు భూమండలంలో ఎన్నో ఆశ్రయాలను, విస్తృతిని పొందుతాడు. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సఅసం) వైపుకు వలస వెళ్ళటానికి తన గృహం నుంచి బయలుదేరి దారిలో మృత్యువాతన పడిన వానికి పుణ్యఫలం ప్రసాదించే బాధ్యత అల్లాహ్‌ది. అల్లాహ్ అపారంగా క్షమించేవాడు, అమితంగా కరుణించేవాడు.
4:101 وَإِذَا ضَرَبْتُمْ فِي الْأَرْضِ فَلَيْسَ عَلَيْكُمْ جُنَاحٌ أَن تَقْصُرُوا مِنَ الصَّلَاةِ إِنْ خِفْتُمْ أَن يَفْتِنَكُمُ الَّذِينَ كَفَرُوا ۚ إِنَّ الْكَافِرِينَ كَانُوا لَكُمْ عَدُوًّا مُّبِينًا
మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు, అవిశ్వాసులు మిమ్మల్ని వేధిస్తారనే భయం గనక మీకుంటే, మీరు నమాజులను కుదించుకోవటంలో తప్పులేదు. నిశ్చయంగా అవిశ్వాసులు మీ బహిరంగ శత్రువులే.
4:102 وَإِذَا كُنتَ فِيهِمْ فَأَقَمْتَ لَهُمُ الصَّلَاةَ فَلْتَقُمْ طَائِفَةٌ مِّنْهُم مَّعَكَ وَلْيَأْخُذُوا أَسْلِحَتَهُمْ فَإِذَا سَجَدُوا فَلْيَكُونُوا مِن وَرَائِكُمْ وَلْتَأْتِ طَائِفَةٌ أُخْرَىٰ لَمْ يُصَلُّوا فَلْيُصَلُّوا مَعَكَ وَلْيَأْخُذُوا حِذْرَهُمْ وَأَسْلِحَتَهُمْ ۗ وَدَّ الَّذِينَ كَفَرُوا لَوْ تَغْفُلُونَ عَنْ أَسْلِحَتِكُمْ وَأَمْتِعَتِكُمْ فَيَمِيلُونَ عَلَيْكُم مَّيْلَةً وَاحِدَةً ۚ وَلَا جُنَاحَ عَلَيْكُمْ إِن كَانَ بِكُمْ أَذًى مِّن مَّطَرٍ أَوْ كُنتُم مَّرْضَىٰ أَن تَضَعُوا أَسْلِحَتَكُمْ ۖ وَخُذُوا حِذْرَكُمْ ۗ إِنَّ اللَّهَ أَعَدَّ لِلْكَافِرِينَ عَذَابًا مُّهِينًا
(ఓ ప్రవక్తా!) నీవు వారి మధ్య ఉన్నప్పుడు, వారి కోసం నమాజును మొదలుపెట్టినప్పుడు, వారిలోని ఒక సమూహం తమ ఆయుధాలను తీసుకొని నీ వెంట నిలబడాలి. మరి వారు సజ్దా చేయగానే మీ వెనక్కి వెళ్ళిపోవాలి. అప్పటి వరకూ నమాజ్‌లో పాల్గొనని రెండవ సమూహం వచ్చి నీతోపాటు నమాజు చేయాలి. వారు కూడా తమ రక్షణ సామగ్రిని, తమ ఆయుధాలను చేబూని ఉండాలి. మీరు మీ ఆయుధాల పట్ల, సామగ్రిపట్ల ఏమరుపాటుకు లోనైతే, ఒక్కసారిగా మీపై విరుచుకుపడాలని అవిశ్వాసులు కోరుకుంటారు. అయితే వర్షం మూలంగా లేక అస్వస్థత మూలంగా ఇబ్బందిగా ఉండి మీరు మీ ఆయుధాలను విడిచినట్లయితే అది దోషం కాదు. అయినా ఆత్మరక్షణ సామగ్రిని వెంట తీసుకొని ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ తిరస్కారుల కోసం అవమానకరమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాడు.
4:103 فَإِذَا قَضَيْتُمُ الصَّلَاةَ فَاذْكُرُوا اللَّهَ قِيَامًا وَقُعُودًا وَعَلَىٰ جُنُوبِكُمْ ۚ فَإِذَا اطْمَأْنَنتُمْ فَأَقِيمُوا الصَّلَاةَ ۚ إِنَّ الصَّلَاةَ كَانَتْ عَلَى الْمُؤْمِنِينَ كِتَابًا مَّوْقُوتًا
మరి మీరు నమాజును నెరవేర్చిన తరువాత నిలుచున్నా, కూర్చున్నా, పరుండినా అల్లాహ్‌ను స్మరిస్తూ ఉండండి. అయితే పరిస్థితులు కుదుటపడిన తరువాత మాత్రం నమాజును నెలకొల్పండి. నిస్సందేహంగా నమాజును నిర్ధారిత వేళల్లో చేయటం విశ్వాసులకు విధిగా చేయబడింది.
4:104 وَلَا تَهِنُوا فِي ابْتِغَاءِ الْقَوْمِ ۖ إِن تَكُونُوا تَأْلَمُونَ فَإِنَّهُمْ يَأْلَمُونَ كَمَا تَأْلَمُونَ ۖ وَتَرْجُونَ مِنَ اللَّهِ مَا لَا يَرْجُونَ ۗ وَكَانَ اللَّهُ عَلِيمًا حَكِيمًا
వారిని వెంబడించటంలో ఏ మాత్రం బలహీనతను ప్రదర్శించకండి. ఒకవేళ మీరు అవిశ్రాంతంగా ఉన్నారను కుంటే మీ మాదిరిగానే వారు కూడా అవిశ్రాంతంగా ఉన్నారు. పైగా అల్లాహ్ నుంచి వారు ఆశించని వాటిని మీరు ఆశిస్తున్నారు. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, వివేచనాపరుడు.
4:105 إِنَّا أَنزَلْنَا إِلَيْكَ الْكِتَابَ بِالْحَقِّ لِتَحْكُمَ بَيْنَ النَّاسِ بِمَا أَرَاكَ اللَّهُ ۚ وَلَا تَكُن لِّلْخَائِنِينَ خَصِيمًا
(ఓ ప్రవక్తా!) అల్లాహ్ నీకు చూపిన విధంగా నీవు ప్రజల మధ్య తీర్పు చెయ్యటానికిగాను మేము నీ వైపుకు ఈ గ్రంథాన్ని సత్యంతోపాటు పంపాము. కనుక ద్రోహానికి పాల్పడే వారి తరఫున వాదిగా నిలబడకు.
4:106 وَاسْتَغْفِرِ اللَّهَ ۖ إِنَّ اللَّهَ كَانَ غَفُورًا رَّحِيمًا
క్షమాభిక్షకై అల్లాహ్‌ను వేడుకో. నిస్సందేహంగా అల్లాహ్ క్షమించేవాడు, కనికరించేవాడు.
4:107 وَلَا تُجَادِلْ عَنِ الَّذِينَ يَخْتَانُونَ أَنفُسَهُمْ ۚ إِنَّ اللَّهَ لَا يُحِبُّ مَن كَانَ خَوَّانًا أَثِيمًا
ఆత్మ ద్రోహం చేసుకునే వారి పక్షాన నిలిచి వాదించకు. దగాకోరును, పాపిష్టివాడిని అల్లాహ్ సుతరామూ ఇష్టపడడు.
4:108 يَسْتَخْفُونَ مِنَ النَّاسِ وَلَا يَسْتَخْفُونَ مِنَ اللَّهِ وَهُوَ مَعَهُمْ إِذْ يُبَيِّتُونَ مَا لَا يَرْضَىٰ مِنَ الْقَوْلِ ۚ وَكَانَ اللَّهُ بِمَا يَعْمَلُونَ مُحِيطًا
వారు ప్రజల నుంచి దాక్కోగలరు. కాని అల్లాహ్ నుంచి దాక్కోలేరు. వారు రాత్రివేళల్లో అల్లాహ్ ఇష్టపడని విషయాలపై రహస్య మంతనాలు సాగిస్తున్నప్పుడు ఆయన వారితో పాటు ఉంటాడు. వారి కర్మలన్నింటినీ ఆయన చుట్టుముట్టి ఉన్నాడు.
4:109 هَا أَنتُمْ هَٰؤُلَاءِ جَادَلْتُمْ عَنْهُمْ فِي الْحَيَاةِ الدُّنْيَا فَمَن يُجَادِلُ اللَّهَ عَنْهُمْ يَوْمَ الْقِيَامَةِ أَم مَّن يَكُونُ عَلَيْهِمْ وَكِيلًا
ప్రాపంచిక జీవితంలోనైతే మీరు వారి తరఫున వాదించారుగాని, ప్రళయ దినాన వారికి మద్దతుగా అల్లాహ్‌తో ఎవరు వాదిస్తారు? వారి తరఫున వకాల్తా ఎవరు పుచ్చుకుంటారు?
4:110 وَمَن يَعْمَلْ سُوءًا أَوْ يَظْلِمْ نَفْسَهُ ثُمَّ يَسْتَغْفِرِ اللَّهَ يَجِدِ اللَّهَ غَفُورًا رَّحِيمًا
ఎవరయినా దుష్కార్యానికి పాల్పడి లేదా తనకు తాను అన్యాయం చేసుకుని, ఆ తరువాత క్షమాపణకై అల్లాహ్‌ను అర్థిస్తే, అతడు అల్లాహ్‌ను క్షమాశీలిగా, కృపాశీలిగా పొందుతాడు.
4:111 وَمَن يَكْسِبْ إِثْمًا فَإِنَّمَا يَكْسِبُهُ عَلَىٰ نَفْسِهِ ۚ وَكَانَ اللَّهُ عَلِيمًا حَكِيمًا
కాని ఎవడయినా పాపాన్ని సంపాదించుకుంటే అతను సంపాదించుకున్నది అతనిపైనే పడుతుంది. అల్లాహ్ ప్రతిదీ తెలిసినవాడు, వివేచనాపరుడు.
4:112 وَمَن يَكْسِبْ خَطِيئَةً أَوْ إِثْمًا ثُمَّ يَرْمِ بِهِ بَرِيئًا فَقَدِ احْتَمَلَ بُهْتَانًا وَإِثْمًا مُّبِينًا
ఇంకా ఎవరయినా ఏదైనా తప్పు చేసి, లేదా పాపానికి పాల్పడి, ఆ నిందను ఏ పాపం ఎరుగని అమాయకుని పైకి నెట్టివేస్తే, అలాంటివాడు చాలా పెద్ద అపనిందను, స్పష్టమైన పాపాన్ని ఎత్తుకున్నవాడవుతాడు.
4:113 وَلَوْلَا فَضْلُ اللَّهِ عَلَيْكَ وَرَحْمَتُهُ لَهَمَّت طَّائِفَةٌ مِّنْهُمْ أَن يُضِلُّوكَ وَمَا يُضِلُّونَ إِلَّا أَنفُسَهُمْ ۖ وَمَا يَضُرُّونَكَ مِن شَيْءٍ ۚ وَأَنزَلَ اللَّهُ عَلَيْكَ الْكِتَابَ وَالْحِكْمَةَ وَعَلَّمَكَ مَا لَمْ تَكُن تَعْلَمُ ۚ وَكَانَ فَضْلُ اللَّهِ عَلَيْكَ عَظِيمًا
(ఓ ముహమ్మద్!) దైవానుగ్రహం, ఆయన కారుణ్యం నీపై లేకుండా ఉంటే వారిలోని ఒక సమూహం నిన్ను తప్పు దారి పట్టించాలనే అనుకుంది. కాని నిజానికి వారు తమను తామే అపమార్గానికి లోనుచేసుకుంటున్నారు. వారు నీకెలాంటి హానీ కలిగించలేరు. అల్లాహ్ నీపై గ్రంథాన్ని, వివేకాన్నీ అవతరింపజేశాడు. నీకు తెలియని విషయాలను నీకు నేర్పాడు. నీపై అల్లాహ్ యొక్క గొప్ప అనుగ్రహం ఉంది.
4:114 لَّا خَيْرَ فِي كَثِيرٍ مِّن نَّجْوَاهُمْ إِلَّا مَنْ أَمَرَ بِصَدَقَةٍ أَوْ مَعْرُوفٍ أَوْ إِصْلَاحٍ بَيْنَ النَّاسِ ۚ وَمَن يَفْعَلْ ذَٰلِكَ ابْتِغَاءَ مَرْضَاتِ اللَّهِ فَسَوْفَ نُؤْتِيهِ أَجْرًا عَظِيمًا
వారు జరిపే అత్యధిక రహస్య మంతనాలలో ఏ మేలూ ఉండదు. అయితే దానధర్మాల గురించి లేక మంచి పనుల గురించి లేక ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరచటం గురించి ఆజ్ఞాపించేవాని రహస్య మంతనాల్లో మేలుంటుంది. ఎవరయినా కేవలం దైవప్రసన్నత కోసం ఈ పనులు చేస్తే నిశ్చయంగా మేమతనికి గొప్ప ప్రతిఫలం ప్రసాదిస్తాము.
4:115 وَمَن يُشَاقِقِ الرَّسُولَ مِن بَعْدِ مَا تَبَيَّنَ لَهُ الْهُدَىٰ وَيَتَّبِعْ غَيْرَ سَبِيلِ الْمُؤْمِنِينَ نُوَلِّهِ مَا تَوَلَّىٰ وَنُصْلِهِ جَهَنَّمَ ۖ وَسَاءَتْ مَصِيرًا
కాని ఎవరయినా సన్మార్గం ప్రస్ఫుటమైన మీదట కూడా ప్రవక్త (సఅసం)కు వ్యతిరేకంగా పోతే, విశ్వాసులందరి మార్గాన్ని వీడి, ఇతర మార్గాన్ని అనుసరిస్తే, మేమతన్ని అతను మరలదలచుకున్న వైపుకే మరల్చుతాము. కడకు అతన్ని నరకంలో పడవేస్తాము. అది అత్యంత చెడ్డ గమ్యస్థానం.
4:116 إِنَّ اللَّهَ لَا يَغْفِرُ أَن يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَٰلِكَ لِمَن يَشَاءُ ۚ وَمَن يُشْرِكْ بِاللَّهِ فَقَدْ ضَلَّ ضَلَالًا بَعِيدًا
తనకు భాగస్వామ్యం (షిర్క్) కల్పించటాన్ని అల్లాహ్ ఎట్టి పరిస్థితిలోనూ క్షమించడు. షిర్క్ మినహా తాను కోరిన వారి ఇతర పాపాలను క్షమిస్తాడు. అల్లాహ్‌కు సహవర్తులుగా ఇతరులను నిలబెట్టినవాడు మార్గభ్రష్టతలో చాలా దూరం వెళ్ళి పోయాడు.
4:117 إِن يَدْعُونَ مِن دُونِهِ إِلَّا إِنَاثًا وَإِن يَدْعُونَ إِلَّا شَيْطَانًا مَّرِيدًا
వారు అల్లాహ్‌ను వదలి స్త్రీలను మొరపెట్టుకుంటున్నారు. వాస్తవానికి వారసలు పొగరుబోతు షైతానును మొరపెట్టుకుంటున్నారు.
4:118 لَّعَنَهُ اللَّهُ ۘ وَقَالَ لَأَتَّخِذَنَّ مِنْ عِبَادِكَ نَصِيبًا مَّفْرُوضًا
అల్లాహ్ వాణ్ణి శపించాడు. షైతాను ఇలా అన్నాడు: “నీ దాసుల నుండి నేను నిర్ణీత భాగాన్ని పొంది తీర్తాను.”
4:119 وَلَأُضِلَّنَّهُمْ وَلَأُمَنِّيَنَّهُمْ وَلَآمُرَنَّهُمْ فَلَيُبَتِّكُنَّ آذَانَ الْأَنْعَامِ وَلَآمُرَنَّهُمْ فَلَيُغَيِّرُنَّ خَلْقَ اللَّهِ ۚ وَمَن يَتَّخِذِ الشَّيْطَانَ وَلِيًّا مِّن دُونِ اللَّهِ فَقَدْ خَسِرَ خُسْرَانًا مُّبِينًا
“వారిని దారి నుంచి తప్పిస్తూ ఉంటాను. వారికి ఉత్తుత్తి ఆశలు చూపిస్తూ ఉంటాను. పశువుల చెవులు చీల్చమని వారికి పురమాయిస్తాను. అల్లాహ్ సృష్టిని మార్చమని వారిని ఆదేశిస్తాను.” వినండి! అల్లాహ్‌ను వదలి షైతానును తన స్నేహితునిగా చేసుకున్నవాడు స్పష్టంగా నష్టపోయినట్లే.
4:120 يَعِدُهُمْ وَيُمَنِّيهِمْ ۖ وَمَا يَعِدُهُمُ الشَّيْطَانُ إِلَّا غُرُورًا
వాడు వారికి వట్టి వాగ్దానాలు చేస్తూ ఉంటాడు. ఆశలు కలిగిస్తూ ఉంటాడు. కాని షైతాను వారితో చేసే వాగ్దానాలన్నీ మోసపూరితమైనవే.
4:121 أُولَٰئِكَ مَأْوَاهُمْ جَهَنَّمُ وَلَا يَجِدُونَ عَنْهَا مَحِيصًا
ఇటువంటి వారు చేరుకోవలసిన స్థలం నరకం. ఇక వారికి దాన్నుంచి తప్పించుకునే మార్గం ఏదీ ఉండదు.
4:122 وَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ سَنُدْخِلُهُمْ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا أَبَدًا ۖ وَعْدَ اللَّهِ حَقًّا ۚ وَمَنْ أَصْدَقُ مِنَ اللَّهِ قِيلًا
కాగా; ఎవరు విశ్వసించి సత్కార్యాలు చేస్తారో వారిని మేము క్రింద కాలువలు ప్రవహించే (స్వర్గ) వనాలలోకి తీసుకుపోతాము. అందులో వారు కలకాలం, శాశ్వతంగా ఉంటారు. ఈ అల్లాహ్ వాగ్దానం సత్యమైనది. అల్లాహ్ కంటే సత్యమైన మాట పలికేదెవరు?
4:123 لَّيْسَ بِأَمَانِيِّكُمْ وَلَا أَمَانِيِّ أَهْلِ الْكِتَابِ ۗ مَن يَعْمَلْ سُوءًا يُجْزَ بِهِ وَلَا يَجِدْ لَهُ مِن دُونِ اللَّهِ وَلِيًّا وَلَا نَصِيرًا
నిజస్థితి (సాఫల్యం) మీ ఆకాంక్షల కనుగుణంగా గానీ, గ్రంథవహుల ఆశలు, అభిలాషలపై ఆధారపడిగానీ లేదు. చెడుకు పాల్పడినవాడు ఎవడైనా దాని ఫలితాన్ని అనుభవిస్తాడు. దైవసమక్షంలో తనను సమర్థించే, తనను ఆదుకునే వారెవరినీ అతడు పొందలేడు.
4:124 وَمَن يَعْمَلْ مِنَ الصَّالِحَاتِ مِن ذَكَرٍ أَوْ أُنثَىٰ وَهُوَ مُؤْمِنٌ فَأُولَٰئِكَ يَدْخُلُونَ الْجَنَّةَ وَلَا يُظْلَمُونَ نَقِيرًا
సత్కార్యాలు చేసేవారు – వారు పురుషులైనా, స్త్రీలైనా- విశ్వసించి ఉంటే, ఇలాంటివారు తప్పకుండా స్వర్గంలో ప్రవేశిస్తారు. వారికి ఖర్జూరపు విత్తనంపై ఉండే గాటుకు సమానంగా కూడా అన్యాయం జరగదు.
4:125 وَمَنْ أَحْسَنُ دِينًا مِّمَّنْ أَسْلَمَ وَجْهَهُ لِلَّهِ وَهُوَ مُحْسِنٌ وَاتَّبَعَ مِلَّةَ إِبْرَاهِيمَ حَنِيفًا ۗ وَاتَّخَذَ اللَّهُ إِبْرَاهِيمَ خَلِيلًا
ఒక వ్యక్తి అల్లాహ్ ముందు తలవంచి, సదాచార సంపన్నుడై ఉండి, ఏకాగ్రచిత్తుడైన ఇబ్రాహీము ధర్మాన్ని అనుసరిస్తే – ధర్మం రీత్యా అతని కంటే ఉత్తముడు మరెవడు కాగలడు? ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం)ను అల్లాహ్ తన మిత్రునిగా చేసుకున్నాడు.
4:126 وَلِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۚ وَكَانَ اللَّهُ بِكُلِّ شَيْءٍ مُّحِيطًا
ఆకాశాలలో, భూమిలో ఉన్న సమస్తమూ అల్లాహ్‌దే. అల్లాహ్ అన్నింటినీ పరివేష్ఠించి ఉన్నాడు.
4:127 وَيَسْتَفْتُونَكَ فِي النِّسَاءِ ۖ قُلِ اللَّهُ يُفْتِيكُمْ فِيهِنَّ وَمَا يُتْلَىٰ عَلَيْكُمْ فِي الْكِتَابِ فِي يَتَامَى النِّسَاءِ اللَّاتِي لَا تُؤْتُونَهُنَّ مَا كُتِبَ لَهُنَّ وَتَرْغَبُونَ أَن تَنكِحُوهُنَّ وَالْمُسْتَضْعَفِينَ مِنَ الْوِلْدَانِ وَأَن تَقُومُوا لِلْيَتَامَىٰ بِالْقِسْطِ ۚ وَمَا تَفْعَلُوا مِنْ خَيْرٍ فَإِنَّ اللَّهَ كَانَ بِهِ عَلِيمًا
(ఓ ప్రవక్తా!) వారు నిన్ను స్త్రీల విషయమై ధర్మాదేశం ఏమిటని అడుగుతున్నారు. వారికి చెప్పు: “అల్లాహ్ స్వయంగా వారి విషయంలో మిమ్మల్ని ఆదేశిస్తున్నాడు. ఇంకా తండ్రిలేని ఆడ పిల్లలకు మీరు, వారి కొరకు నిర్ధారించబడిన హక్కును వారికివ్వకుండా, వారిని వివాహమాడాలనే మీ కోరిక గురించీ, బలహీనులైన పిల్లల గురించీ మీకు వినిపించబడుతున్న ఖుర్ఆన్ ఆయతులు కూడా (మిమ్మల్ని ఆదేశిస్తున్నాయి). ఇంకా తండ్రిలేని బిడ్డల విషయంలో న్యాయంగా వ్యవహరించమని కూడా ఆయన మీకు ఆజ్ఞాపిస్తున్నాడు. మీరు ఏ మంచిపని చేసినా దాని గురించి అల్లాహ్‌కు పూర్తిగా తెలుసు.
4:128 وَإِنِ امْرَأَةٌ خَافَتْ مِن بَعْلِهَا نُشُوزًا أَوْ إِعْرَاضًا فَلَا جُنَاحَ عَلَيْهِمَا أَن يُصْلِحَا بَيْنَهُمَا صُلْحًا ۚ وَالصُّلْحُ خَيْرٌ ۗ وَأُحْضِرَتِ الْأَنفُسُ الشُّحَّ ۚ وَإِن تُحْسِنُوا وَتَتَّقُوا فَإِنَّ اللَّهَ كَانَ بِمَا تَعْمَلُونَ خَبِيرًا
భర్త తనను ఈసడించుకుంటాడనో లేక తనను పట్టించుకోడనో స్త్రీకి భయమున్నప్పుడు వారిద్దరూ పరస్పరం సర్దుబాటు చేసుకుంటే అందులో వారిరువురిపై ఏమాత్రం దోషం లేదు. సర్దుబాటు అన్నింటికన్నా మేలైనది. ‘పేరాశ’ అనేది ప్రతి ప్రాణిలోనూ పొందుపరచబడి ఉంది. ఒకవేళ మీరు ఔదార్యాన్ని చూపి, భయభక్తుల వైఖరిని అవలంబించినట్లయితే మీ వ్యవహార శైలి అల్లాహ్‌కు తెలుస్తుంది.
4:129 وَلَن تَسْتَطِيعُوا أَن تَعْدِلُوا بَيْنَ النِّسَاءِ وَلَوْ حَرَصْتُمْ ۖ فَلَا تَمِيلُوا كُلَّ الْمَيْلِ فَتَذَرُوهَا كَالْمُعَلَّقَةِ ۚ وَإِن تُصْلِحُوا وَتَتَّقُوا فَإِنَّ اللَّهَ كَانَ غَفُورًا رَّحِيمًا
మీరు ఎంతగా ఆశించినప్పటికీ, శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ మీ భార్యలందరి మధ్య మీరు అన్నివిధాలా న్యాయం చెయ్యటమన్నది మీ వల్ల కాని పని. కాబట్టి మీరు పూర్తిగా ఒకామె వైపుకు మొగ్గిపోయి, రెండో ఆవిడను అనిశ్చిత స్థితిలో పడవెయ్యకండి. ఒకవేళ మీరు మీ ధోరణిని సరిదిద్దుకుని, భయభక్తుల (తఖ్వా)తో మసలుకుంటే నిశ్చయంగా అల్లాహ్ క్షమించేవాడు, కనికరించేవాడు.
4:130 وَإِن يَتَفَرَّقَا يُغْنِ اللَّهُ كُلًّا مِّن سَعَتِهِ ۚ وَكَانَ اللَّهُ وَاسِعًا حَكِيمًا
ఒకవేళ వారిరువురూ విడిపోవటం జరిగితే, అప్పుడు అల్లాహ్ తన విస్తృతమైన అనుగ్రహంతో వారిరువురికీ- ఒకరి అవసరం ఇంకొకరికి లేకుండా – తోడ్పడతాడు. అల్లాహ్ అపారమైన విస్తృతి కలవాడు, వివేక సంపన్నుడు.
4:131 وَلِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۗ وَلَقَدْ وَصَّيْنَا الَّذِينَ أُوتُوا الْكِتَابَ مِن قَبْلِكُمْ وَإِيَّاكُمْ أَنِ اتَّقُوا اللَّهَ ۚ وَإِن تَكْفُرُوا فَإِنَّ لِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۚ وَكَانَ اللَّهُ غَنِيًّا حَمِيدًا
ఆకాశాలలో, భూమిలో వున్న సమస్తమూ అల్లాహ్‌దే. అల్లాహ్‌కు భయపడుతూ మెలగవలసిందిగా మేము మీకు పూర్వం గ్రంథం వొసగబడినవారికీ, మీకూ ఆజ్ఞాపించాము. ఒకవేళ మీరు తిరస్కరిస్తే, ఆకాశాలలో, భూమిలో ఉన్నదంతా అల్లాహ్దేననీ, అల్లాహ్ అక్కరలు లేనివాడనీ, స్తోత్రనీయుడనీ మరువకండి.
4:132 وَلِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۚ وَكَفَىٰ بِاللَّهِ وَكِيلًا
ఆకాశాలలో, భూమిలో ఉన్న వస్తువులన్నీ అల్లాహ్ అధీనంలోనే ఉన్నాయి. కార్యనిర్వాహకారిగా అల్లాహ్ చాలు.
4:133 إِن يَشَأْ يُذْهِبْكُمْ أَيُّهَا النَّاسُ وَيَأْتِ بِآخَرِينَ ۚ وَكَانَ اللَّهُ عَلَىٰ ذَٰلِكَ قَدِيرًا
అల్లాహ్‌యే గనక తలిస్తే ఓ ప్రజలారా! మిమ్మల్ని తొలగించి, మీ స్థానంలో ఇతరుల్ని తేగలడు. ఈ పని చేయగల పూర్తి శక్తి అల్లాహ్‌కు ఉంది.
4:134 مَّن كَانَ يُرِيدُ ثَوَابَ الدُّنْيَا فَعِندَ اللَّهِ ثَوَابُ الدُّنْيَا وَالْآخِرَةِ ۚ وَكَانَ اللَّهُ سَمِيعًا بَصِيرًا
ఎవరయితే ప్రాపంచిక ప్రతిఫలాన్ని కోరుకుంటున్నాడో (అతడు), అల్లాహ్ వద్ద ప్రాపంచిక ప్రతిఫలంతో పాటు పరలోక ప్రతిఫలం కూడా ఉంది (అని తెలుసుకోవాలి). అల్లాహ్ అంతా వినేవాడు, అన్నింటినీ చూసేవాడు సుమా!
4:135 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُونُوا قَوَّامِينَ بِالْقِسْطِ شُهَدَاءَ لِلَّهِ وَلَوْ عَلَىٰ أَنفُسِكُمْ أَوِ الْوَالِدَيْنِ وَالْأَقْرَبِينَ ۚ إِن يَكُنْ غَنِيًّا أَوْ فَقِيرًا فَاللَّهُ أَوْلَىٰ بِهِمَا ۖ فَلَا تَتَّبِعُوا الْهَوَىٰ أَن تَعْدِلُوا ۚ وَإِن تَلْوُوا أَوْ تُعْرِضُوا فَإِنَّ اللَّهَ كَانَ بِمَا تَعْمَلُونَ خَبِيرًا
ఓ విశ్వసించిన వారలారా! మీరు న్యాయం విషయంలో గట్టిగా నిలబడండి. అల్లాహ్ ప్రసన్నత నిమిత్తం (సత్యం మాత్రమే పలికే) సాక్షులుగా ఉండండి – అది మీ స్వయానికీ, మీ తల్లిదండ్రులకు, మీ బంధువులకు వ్యతిరేకంగా పరిణమించినా సరే! అతను ధనికుడయినా, పేదవాడైనా సరే. వారి పట్ల అల్లాహ్ (మీకన్నా) ఎక్కువ శ్రేయోభిలాషి. కాబట్టి మీరు మీ మనోవాంఛకు లొంగిపోయి న్యాయాన్ని వీడకండి. ఒకవేళ మీరు మీ సాక్ష్యాన్ని వక్రీకరించినా, సాక్ష్యం చెప్పటానికి విముఖత చూపినా మీరు చేసే పనులన్నీ అల్లాహ్‌కు తెలుసు సుమా!
4:136 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا آمِنُوا بِاللَّهِ وَرَسُولِهِ وَالْكِتَابِ الَّذِي نَزَّلَ عَلَىٰ رَسُولِهِ وَالْكِتَابِ الَّذِي أَنزَلَ مِن قَبْلُ ۚ وَمَن يَكْفُرْ بِاللَّهِ وَمَلَائِكَتِهِ وَكُتُبِهِ وَرُسُلِهِ وَالْيَوْمِ الْآخِرِ فَقَدْ ضَلَّ ضَلَالًا بَعِيدًا
ఓ విశ్వాసులారా! అల్లాహ్‌ను, ఆయన ప్రవక్త (స)ను, ఆయన తన ప్రవక్త (స)పై అవతరింపజేసిన గ్రంథాన్నీ, అంతకు మునుపు ఆయన అవతరింపజేసిన గ్రంథాలన్నిటినీ విశ్వసించండి. ఎవడు అల్లాహ్‌ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను, అంతిమ దినాన్ని తిరస్కరించాడో వాడు మార్గం తప్పి చాలాదూరం వెళ్ళిపోయాడు.
4:137 إِنَّ الَّذِينَ آمَنُوا ثُمَّ كَفَرُوا ثُمَّ آمَنُوا ثُمَّ كَفَرُوا ثُمَّ ازْدَادُوا كُفْرًا لَّمْ يَكُنِ اللَّهُ لِيَغْفِرَ لَهُمْ وَلَا لِيَهْدِيَهُمْ سَبِيلًا
ఎవరు విశ్వసించి మళ్ళీ తిరస్కారులయ్యారో, మళ్లీ విశ్వసించి మళ్లీ తిరస్కార వైఖరికి ఒడిగట్టారో, ఆపైన తమ తిరస్కార వైఖరిలో పెచ్చరిల్లిపోయారో అలాంటి వారిని అల్లాహ్ ససేమిరా క్షమించడు. అటువంటి వారికి సన్మార్గం కూడా చూపడు.
4:138 شِّرِ الْمُنَافِقِينَ بِأَنَّ لَهُمْ عَذَابًا أَلِيمًا
కపటులకు వ్యధాభరితమైన శిక్ష ఖాయం అన్న శుభవార్తను వారికి అందజెయ్యి.
4:139 الَّذِينَ يَتَّخِذُونَ الْكَافِرِينَ أَوْلِيَاءَ مِن دُونِ الْمُؤْمِنِينَ ۚ أَيَبْتَغُونَ عِندَهُمُ الْعِزَّةَ فَإِنَّ الْعِزَّةَ لِلَّهِ جَمِيعًا
వారు ఎలాంటివారంటే, విశ్వాసులను వదలి అవిశ్వాసులను తమ మిత్రులుగా చేసుకుంటున్నారు. ఏమిటీ? వారు గౌరవ ప్రతిష్ఠల కోసం వారి వద్దకు వెళుతున్నారా? యదార్థానికి గౌరవమంతా అల్లాహ్ అధీనంలో ఉంది (అని వారు తెలుసుకోవాలి).
4:140 وَقَدْ نَزَّلَ عَلَيْكُمْ فِي الْكِتَابِ أَنْ إِذَا سَمِعْتُمْ آيَاتِ اللَّهِ يُكْفَرُ بِهَا وَيُسْتَهْزَأُ بِهَا فَلَا تَقْعُدُوا مَعَهُمْ حَتَّىٰ يَخُوضُوا فِي حَدِيثٍ غَيْرِهِ ۚ إِنَّكُمْ إِذًا مِّثْلُهُمْ ۗ إِنَّ اللَّهَ جَامِعُ الْمُنَافِقِينَ وَالْكَافِرِينَ فِي جَهَنَّمَ جَمِيعًا
అల్లాహ్ తన గ్రంథంలో ఇదివరకే మీ వద్దకు ఈ ఆజ్ఞను అవతరింపజేశాడు: ఎవరైనా అల్లాహ్ వాక్యాలను తిరస్కరిస్తూ, పరిహాసమాడుతున్నట్లు మీరు విన్నట్లయితే, – వారు ఆ మాటలు విడిచి పెట్టి వేరే మాటలు మాట్లాడటం మొదలు పెట్టనంతవరకూ – ఆ సమూహంలో వారితో కలసి కూర్చోకండి. (అన్యధా) మీరు కూడా ఆ సమయంలో వారిలాంటి వారుగానే పరిగణించబడతారు. అల్లాహ్ నిశ్చయంగా కపటులను, అవిశ్వాసులందరినీ నరకంలో పోగుచేయనున్నాడు.
4:141 الَّذِينَ يَتَرَبَّصُونَ بِكُمْ فَإِن كَانَ لَكُمْ فَتْحٌ مِّنَ اللَّهِ قَالُوا أَلَمْ نَكُن مَّعَكُمْ وَإِن كَانَ لِلْكَافِرِينَ نَصِيبٌ قَالُوا أَلَمْ نَسْتَحْوِذْ عَلَيْكُمْ وَنَمْنَعْكُم مِّنَ الْمُؤْمِنِينَ ۚ فَاللَّهُ يَحْكُمُ بَيْنَكُمْ يَوْمَ الْقِيَامَةِ ۗ وَلَن يَجْعَلَ اللَّهُ لِلْكَافِرِينَ عَلَى الْمُؤْمِنِينَ سَبِيلًا
ఈ కపటులు మీకు ఏ గతి పడుతుందోనని ఆసక్తితో ఎదురుచూస్తూ ఉంటారు. ఒకవేళ అల్లాహ్ తరఫు నుంచి మీకు విజయం చేకూరితే, “మేము మీతో లేమా?!” అని అంటారు. ఒకవేళ అవిశ్వాసులకు కాస్తంత ఆధిక్యత లభిస్తే, “మీకు వ్యతిరేకంగా పోరాడే శక్తి మాకు లేదా? (అయినాసరే) మేము ముస్లింలబారి నుంచి మిమ్మల్ని రక్షించలేదా?” అని (కపటులు) వారితో అంటారు. కాబట్టి ప్రళయదినాన అల్లాహ్ స్వయంగా మీ మధ్య తీర్పు చేస్తాడు. అల్లాహ్ ఎన్నటికీ అవిశ్వాసులకు, విశ్వాసులపై (విజయ) మార్గం సుగమం చేయడు.
4:142 إِنَّ الْمُنَافِقِينَ يُخَادِعُونَ اللَّهَ وَهُوَ خَادِعُهُمْ وَإِذَا قَامُوا إِلَى الصَّلَاةِ قَامُوا كُسَالَىٰ يُرَاءُونَ النَّاسَ وَلَا يَذْكُرُونَ اللَّهَ إِلَّا قَلِيلًا
నిశ్చయంగా కపటులు అల్లాహ్‌ను మోసం చేయజూస్తున్నారు. అయితే అల్లాహ్ వారి మోసానికి శిక్ష విధించనున్నాడు. వారు నమాజు కోసం నిలబడినప్పుడు ఎంతో బద్దకంతో, కేవలం జనులకు చూపే ఉద్దేశంతో నిలబడతారు. ఏదో నామ మాత్రంగా దైవాన్ని స్మరిస్తారు.
4:143 مُّذَبْذَبِينَ بَيْنَ ذَٰلِكَ لَا إِلَىٰ هَٰؤُلَاءِ وَلَا إِلَىٰ هَٰؤُلَاءِ ۚ وَمَن يُضْلِلِ اللَّهُ فَلَن تَجِدَ لَهُ سَبِيلًا
వారు ఎటూ కాకుండా మధ్యలోనే ఊగిసలాడుతున్నారు. పూర్తిగా అటూ ఉండరు, సరిగ్గా ఇటూ ఉండరు. అల్లాహ్ ఎవరినయితే అపమార్గం పాల్జేస్తాడో వాని కోసం నీవు ఏ మార్గాన్నీ కనుగొనలేవు.
4:144 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَتَّخِذُوا الْكَافِرِينَ أَوْلِيَاءَ مِن دُونِ الْمُؤْمِنِينَ ۚ أَتُرِيدُونَ أَن تَجْعَلُوا لِلَّهِ عَلَيْكُمْ سُلْطَانًا مُّبِينًا
ఓ విశ్వసించిన వారలారా! విశ్వాసులను వదలి అవిశ్వాసులను మిత్రులుగా చేసుకోకండి. ఏమిటీ, మీకు వ్యతిరేకంగా మీరే అల్లాహ్‌కు స్పష్టమైన ఆధారం సమకూర్చదలుస్తున్నారా?
4:145 إِنَّ الْمُنَافِقِينَ فِي الدَّرْكِ الْأَسْفَلِ مِنَ النَّارِ وَلَن تَجِدَ لَهُمْ نَصِيرًا
కపటులు నిశ్చయంగా నరకంలోని అధమాతి అధమ శ్రేణిలోకిపోతారు. వారికి సహాయపడే వారిని నీవు ఎన్నటికీ చూడలేవు.
4:146 إِلَّا الَّذِينَ تَابُوا وَأَصْلَحُوا وَاعْتَصَمُوا بِاللَّهِ وَأَخْلَصُوا دِينَهُمْ لِلَّهِ فَأُولَٰئِكَ مَعَ الْمُؤْمِنِينَ ۖ وَسَوْفَ يُؤْتِ اللَّهُ الْمُؤْمِنِينَ أَجْرًا عَظِيمًا
అయితే పశ్చాత్తాపం చెంది, తమ ప్రవర్తనను చక్కదిద్దుకుని, అల్లాహ్‌ను గట్టిగా నమ్మి, తమ ధర్మాన్ని అల్లాహ్ కొరకే ప్రత్యేకించుకున్నట్లయితే అప్పుడు వీరు విశ్వాసులతోపాటు ఉంటారు. త్వరలోనే అల్లాహ్ విశ్వాసులకు గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.
4:147 مَّا يَفْعَلُ اللَّهُ بِعَذَابِكُمْ إِن شَكَرْتُمْ وَآمَنتُمْ ۚ وَكَانَ اللَّهُ شَاكِرًا عَلِيمًا
మీరు కృతజ్ఞులుగా మసలుకుంటూ, విశ్వాసులుగా ఉన్నప్పుడు అల్లాహ్ మిమ్మల్ని శిక్షించి ఏం చేస్తాడు? అల్లాహ్ విలువనిచ్చేవాడూ, అన్నీ తెలిసినవాడు.
4:148 لَّا يُحِبُّ اللَّهُ الْجَهْرَ بِالسُّوءِ مِنَ الْقَوْلِ إِلَّا مَن ظُلِمَ ۚ وَكَانَ اللَّهُ سَمِيعًا عَلِيمًا
అన్యాయానికి గురైనవాడు తప్ప, ఏ మనిషి అయినా చెడు మాటలు బిగ్గరగా పలకటాన్ని అల్లాహ్ ఇష్టపడడు. అల్లాహ్ అంతా వినేవాడూ, అన్నీ తెలిసినవాడు.
4:149 إِن تُبْدُوا خَيْرًا أَوْ تُخْفُوهُ أَوْ تَعْفُوا عَن سُوءٍ فَإِنَّ اللَّهَ كَانَ عَفُوًّا قَدِيرًا
మీరు ఏదన్నా మంచి పనిని బహిర్గతంగా చేసినా, గుట్టుగా చేసినా లేక ఏదైనా చెడుగును మన్నించి వదలి పెట్టినా అల్లాహ్ అమితంగా మన్నించేవాడు, సర్వశక్తుడూ (అని తెలుసుకోండి.)
4:150 إِنَّ الَّذِينَ يَكْفُرُونَ بِاللَّهِ وَرُسُلِهِ وَيُرِيدُونَ أَن يُفَرِّقُوا بَيْنَ اللَّهِ وَرُسُلِهِ وَيَقُولُونَ نُؤْمِنُ بِبَعْضٍ وَنَكْفُرُ بِبَعْضٍ وَيُرِيدُونَ أَن يَتَّخِذُوا بَيْنَ ذَٰلِكَ سَبِيلًا
ఎవరయితే అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తలను తిరస్కరిస్తారో, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తల మధ్య భేదభావం పాటించదలుస్తున్నారో, ఇంకా “మేము కొంతమంది ప్రవక్తలను విశ్వసిస్తాం, మరి కొంతమందిని విశ్వసించం” అని చెబుతూ, రెంటికీ మధ్య ఓ (సరికొత్త) మార్గాన్ని తీయదలుస్తున్నారో-
4:151 أُولَٰئِكَ هُمُ الْكَافِرُونَ حَقًّا ۚ وَأَعْتَدْنَا لِلْكَافِرِينَ عَذَابًا مُّهِينًا
వీళ్ళే అసలైన అవిశ్వాసులు. ఇలాంటి అవిశ్వాసుల కొరకు మేము అవమానకరమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాము.
4:152 وَالَّذِينَ آمَنُوا بِاللَّهِ وَرُسُلِهِ وَلَمْ يُفَرِّقُوا بَيْنَ أَحَدٍ مِّنْهُمْ أُولَٰئِكَ سَوْفَ يُؤْتِيهِمْ أُجُورَهُمْ ۗ وَكَانَ اللَّهُ غَفُورًا رَّحِيمًا
(దీనికి భిన్నంగా) ఎవరు అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తలందరినీ విశ్వసించి, వారిలో ఎవరి మధ్యా తేడా చూపకుండా ఉంటారో వారికి అల్లాహ్ వారి పూర్తి పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాడు. అల్లాహ్ అపారంగా క్షమించేవాడు, అమితంగా కరుణించేవాడు.
4:153 يَسْأَلُكَ أَهْلُ الْكِتَابِ أَن تُنَزِّلَ عَلَيْهِمْ كِتَابًا مِّنَ السَّمَاءِ ۚ فَقَدْ سَأَلُوا مُوسَىٰ أَكْبَرَ مِن ذَٰلِكَ فَقَالُوا أَرِنَا اللَّهَ جَهْرَةً فَأَخَذَتْهُمُ الصَّاعِقَةُ بِظُلْمِهِمْ ۚ ثُمَّ اتَّخَذُوا الْعِجْلَ مِن بَعْدِ مَا جَاءَتْهُمُ الْبَيِّنَاتُ فَعَفَوْنَا عَن ذَٰلِكَ ۚ وَآتَيْنَا مُوسَىٰ سُلْطَانًا مُّبِينًا
(ఓ ప్రవక్తా!) నీవు ఆకాశం నుంచి ఏదైనా గ్రంథాన్ని తమపై అవతరింపజెయ్యవలసిందిగా ఈ గ్రంథవహులు నిన్ను అడుగుతున్నారు. వారు దీనికన్నా పెద్ద కోరికే మూసాను కోరి ఉన్నారు. “మాకు అల్లాహ్‌ను ప్రత్యక్షంగా చూపించు” అని వారు కోరారు. వారి ఈ దుర్మార్గ వైఖరి మూలంగా వారిపై పిడుగు విరుచుకుపడింది. ఆపైన వారి వద్దకు ఎన్నో స్పష్టమైన నిదర్శనాలు వచ్చిన తరువాత కూడా వారు ఆవు దూడను తమ ఆరాధ్య దైవంగా చేసుకున్నారు. అప్పటికీ మేము దాన్ని మన్నించాము. ఇంకా, మేము మూసాకు స్పష్టమైన ప్రాబల్యాన్ని (బహిరంగ నిదర్శనాన్ని) వొసగాము.
4:154 وَرَفَعْنَا فَوْقَهُمُ الطُّورَ بِمِيثَاقِهِمْ وَقُلْنَا لَهُمُ ادْخُلُوا الْبَابَ سُجَّدًا وَقُلْنَا لَهُمْ لَا تَعْدُوا فِي السَّبْتِ وَأَخَذْنَا مِنْهُم مِّيثَاقًا غَلِيظًا
వారి నుంచి ప్రమాణం తీసుకోవటానికి మేము వారిపైకి తూరు పర్వతాన్ని ఎత్తాము. సజ్దా చేస్తూ (నగర) ద్వారంలోనికి ప్రవేశించమని వారిని ఆజ్ఞాపించాము. శనివారం నాడు హద్దు మీరి ప్రవర్తించవద్దని కూడా వారికి ఉపదేశించాము. ఈ విధంగా మేము వారినుంచి చాలా గట్టి వాగ్దానం తీసుకున్నాము.
4:155 فَبِمَا نَقْضِهِم مِّيثَاقَهُمْ وَكُفْرِهِم بِآيَاتِ اللَّهِ وَقَتْلِهِمُ الْأَنبِيَاءَ بِغَيْرِ حَقٍّ وَقَوْلِهِمْ قُلُوبُنَا غُلْفٌ ۚ بَلْ طَبَعَ اللَّهُ عَلَيْهَا بِكُفْرِهِمْ فَلَا يُؤْمِنُونَ إِلَّا قَلِيلًا
వారు ప్రమాణ భంగం చేయటం వల్లనూ, దైవాజ్ఞల పట్ల తిరస్కార వైఖరికి ఒడిగట్టడం వల్లనూ, ప్రవక్తలను అన్యాయంగా హతమార్చటం వల్లనూ, “మా హృదయాలపై గలేబులున్నాయి” అని చెప్పటం వల్లనూ (వారికీ శాస్తి జరిగింది). వాస్తవానికి వారి తిరస్కారం కారణంగా అల్లాహ్ వారి హృదయాలకు సీలువేశాడు. అందువల్ల వారు చాలా తక్కువగా మాత్రమే విశ్వసిస్తారు.
4:156 وَبِكُفْرِهِمْ وَقَوْلِهِمْ عَلَىٰ مَرْيَمَ بُهْتَانًا عَظِيمًا
వారు తిరస్కారానికి పాల్పడటం వల్ల, మర్యమ్పై చాలా ఘోరమైన అపనిందను మోపటం వల్ల,
4:157 وَقَوْلِهِمْ إِنَّا قَتَلْنَا الْمَسِيحَ عِيسَى ابْنَ مَرْيَمَ رَسُولَ اللَّهِ وَمَا قَتَلُوهُ وَمَا صَلَبُوهُ وَلَٰكِن شُبِّهَ لَهُمْ ۚ وَإِنَّ الَّذِينَ اخْتَلَفُوا فِيهِ لَفِي شَكٍّ مِّنْهُ ۚ مَا لَهُم بِهِ مِنْ عِلْمٍ إِلَّا اتِّبَاعَ الظَّنِّ ۚ وَمَا قَتَلُوهُ يَقِينًا
ఇంకా – “మర్యమ్ పుత్రుడగు దైవప్రవక్త ఈసాను మేము హతమార్చాము” అని అనటం వల్ల – (వారు శిక్షను చవిచూశారు). నిజానికి వారు ఆయన్ని చంపనూలేదు, శిలువ పైకి ఎక్కించనూ లేదు. నిజం ఏమిటంటే, వారి కొరకు ఆయన్ని పోలిన వ్యక్తి రూపొందించబడ్డాడు. ఈసా విషయంలో విభేదించినవారు ఆయన వ్యవహారంలో సందేహానికి లోనయ్యారు. అంచనాలను అనుసరించటం తప్ప వారికి ఈ విషయమై ఖచ్చితంగా ఏమీ తెలియదు. అసలు వారు ఆయన్ని చంపలేదు,
4:158 بَل رَّفَعَهُ اللَّهُ إِلَيْهِ ۚ وَكَانَ اللَّهُ عَزِيزًا حَكِيمًا
పైగా అల్లాహ్ ఆయన్ని తన వైపునకు ఎత్తుకున్నాడు. అల్లాహ్ సర్వాధిక్యుడు, మహావివేకి.
4:159 وَإِن مِّنْ أَهْلِ الْكِتَابِ إِلَّا لَيُؤْمِنَنَّ بِهِ قَبْلَ مَوْتِهِ ۖ وَيَوْمَ الْقِيَامَةِ يَكُونُ عَلَيْهِمْ شَهِيدًا
గ్రంథవహులలో ఏ ఒక్కడూ ఈసాను, అతని (అంటే తన లేక ఆయన) మరణానికి మునుపు విశ్వసించకుండా మిగలడు. ప్రళయ దినాన ఆయన వారిపై సాక్షిగా ఉంటాడు.
4:160 فَبِظُلْمٍ مِّنَ الَّذِينَ هَادُوا حَرَّمْنَا عَلَيْهِمْ طَيِّبَاتٍ أُحِلَّتْ لَهُمْ وَبِصَدِّهِمْ عَن سَبِيلِ اللَّهِ كَثِيرًا
యూదుల దుర్మార్గం వల్ల వారికి ధర్మసమ్మతంగా ఉన్న అనేక పరిశుద్ధ వస్తువులను మేము వారికోసం నిషేధించాము. వారు ఎంతో మందిని దైవమార్గం నుంచి అడ్డుకోవటం వల్లనూ,
4:161 وَأَخْذِهِمُ الرِّبَا وَقَدْ نُهُوا عَنْهُ وَأَكْلِهِمْ أَمْوَالَ النَّاسِ بِالْبَاطِلِ ۚ وَأَعْتَدْنَا لِلْكَافِرِينَ مِنْهُمْ عَذَابًا أَلِيمًا
నిషేధించబడిన వడ్డీని పుచ్చుకోవటం వల్లనూ, జనుల సొమ్మును అన్యాయంగా స్వాహా చేయటం వల్లనూ (వారికీ దుర్గతి పట్టింది). వారిలో అవిశ్వాసులుగా ఉన్నవారి కోసం మేము బాధాకరమయిన శిక్షను సిద్ధం చేసి ఉంచాము.
4:162 لَّٰكِنِ الرَّاسِخُونَ فِي الْعِلْمِ مِنْهُمْ وَالْمُؤْمِنُونَ يُؤْمِنُونَ بِمَا أُنزِلَ إِلَيْكَ وَمَا أُنزِلَ مِن قَبْلِكَ ۚ وَالْمُقِيمِينَ الصَّلَاةَ ۚ وَالْمُؤْتُونَ الزَّكَاةَ وَالْمُؤْمِنُونَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ أُولَٰئِكَ سَنُؤْتِيهِمْ أَجْرًا عَظِيمًا
అయితే వారిలో పరిపూర్ణమైన, పరిపక్వతనొందిన జ్ఞానంగలవారూ, విశ్వసించినవారూ, నీపై అవతరింపజెయ్య బడినదానినీ, నీకు పూర్వం అవతరింపజెయ్యబడిన దానినీ విశ్వసించేవారూ, నమాజులను నెలకొల్పేవారూ, జకాతును చెల్లించేవారూ, అల్లాహ్ మరియు అంతిమ దినాన్ని విశ్వసించేవారూ – వీరందరికీ మేము గొప్ప పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాము.
4:163 إِنَّا أَوْحَيْنَا إِلَيْكَ كَمَا أَوْحَيْنَا إِلَىٰ نُوحٍ وَالنَّبِيِّينَ مِن بَعْدِهِ ۚ وَأَوْحَيْنَا إِلَىٰ إِبْرَاهِيمَ وَإِسْمَاعِيلَ وَإِسْحَاقَ وَيَعْقُوبَ وَالْأَسْبَاطِ وَعِيسَىٰ وَأَيُّوبَ وَيُونُسَ وَهَارُونَ وَسُلَيْمَانَ ۚ وَآتَيْنَا دَاوُودَ زَبُورًا
(ఓ ముహమ్మద్!) మేము నూహ్ వైపుకు, అతని తరువాత వచ్చిన ప్రవక్తల వైపుకు వహీ పంపినట్లే (వాణిని అవతరింపజేసినట్లే) నీ వైపుకూ వహీ పంపాము. ఇంకా మేము ఇబ్రాహీము, ఇస్మాయీలు, ఇస్హాఖు, యాకూబు మరియు అతని సంతతి వారికి, ఈసా, అయ్యూబు, యూనుసు, హారూను, సులైమానుల వైపుకు కూడా వహీ పంపాము. ఇంకా మేము దావూదుకు జబూరు (గ్రంథం) వొసగాము.
4:164 وَرُسُلًا قَدْ قَصَصْنَاهُمْ عَلَيْكَ مِن قَبْلُ وَرُسُلًا لَّمْ نَقْصُصْهُمْ عَلَيْكَ ۚ وَكَلَّمَ اللَّهُ مُوسَىٰ تَكْلِيمًا
నీకు పూర్వం గతించిన ఎంతో మంది ప్రవక్తల వృత్తాంతాలను మేము నీకు తెలియజేశాము. మరెంతో మంది ప్రవక్తల గాథలను తెలుపలేదు. మూసా (అలైహిస్సలాం) తోనైతే అల్లాహ్ నేరుగా మాట్లాడాడు.
4:165 رُّسُلًا مُّبَشِّرِينَ وَمُنذِرِينَ لِئَلَّا يَكُونَ لِلنَّاسِ عَلَى اللَّهِ حُجَّةٌ بَعْدَ الرُّسُلِ ۚ وَكَانَ اللَّهُ عَزِيزًا حَكِيمًا
మేము వారిని శుభవార్తలు వినిపించే, హెచ్చరించే ప్రవక్తలుగా చేసి పంపాము – ప్రవక్తలు వచ్చిన తరువాత అల్లాహ్‌కు వ్యతిరేకంగా వాదించటానికి ప్రజల వద్ద ఏ ఆధారమూ మిగలకూడదని (మేమిలా చేశాము). అల్లాహ్‌యే సర్వాధిక్యుడు, మహావివేకి.
4:166 لَّٰكِنِ اللَّهُ يَشْهَدُ بِمَا أَنزَلَ إِلَيْكَ ۖ أَنزَلَهُ بِعِلْمِهِ ۖ وَالْمَلَائِكَةُ يَشْهَدُونَ ۚ وَكَفَىٰ بِاللَّهِ شَهِيدًا
(ఓ ప్రవక్తా!) నీపై అవతరింపజేసిన దానిని గురించి, దాన్ని తన జ్ఞానంతో అవతరింపజేశానని అల్లాహ్ స్వయంగా సాక్ష్యమిస్తున్నాడు. దూతలు సయితం దాని గురించి సాక్ష్యమిస్తున్నారు. అసలు సాక్షిగా అల్లాహ్‌యే చాలు.
4:167 إِنَّ الَّذِينَ كَفَرُوا وَصَدُّوا عَن سَبِيلِ اللَّهِ قَدْ ضَلُّوا ضَلَالًا بَعِيدًا
ఎవరయితే అవిశ్వాసానికి ఒడిగట్టి, అల్లాహ్ మార్గంలోకి రాకుండా ఇతరులను కూడా అడ్డుకున్నారో వారు నిస్సందేహంగా అపమార్గంలో చాలా దూరం వెళ్ళిపోయారు.
4:168 إِنَّ الَّذِينَ كَفَرُوا وَظَلَمُوا لَمْ يَكُنِ اللَّهُ لِيَغْفِرَ لَهُمْ وَلَا لِيَهْدِيَهُمْ طَرِيقًا
అవిశ్వాసులై, అన్యాయానికి పాల్పడిన వారిని అల్లాహ్ ఎట్టి పరిస్థితిలోనూ క్షమించటంగానీ, ఏదైనా మార్గం చూపటంగానీ చేయడు-
4:169 إِلَّا طَرِيقَ جَهَنَّمَ خَالِدِينَ فِيهَا أَبَدًا ۚ وَكَانَ ذَٰلِكَ عَلَى اللَّهِ يَسِيرًا
వారికి నరకమార్గం చూపటం తప్ప! వారందులో ఎల్లకాలం పడి ఉంటారు. ఇలా చేయటం అల్లాహ్‌కు బహు సులువు.
4:170 يَا أَيُّهَا النَّاسُ قَدْ جَاءَكُمُ الرَّسُولُ بِالْحَقِّ مِن رَّبِّكُمْ فَآمِنُوا خَيْرًا لَّكُمْ ۚ وَإِن تَكْفُرُوا فَإِنَّ لِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ وَكَانَ اللَّهُ عَلِيمًا حَكِيمًا
ప్రజలారా! మీ వద్దకు మీ ప్రభువు తరఫు నుంచి ప్రవక్త సత్యం తీసుకువచ్చాడు. కాబట్టి మీరు విశ్వసించండి. అది మీకే మేలు. ఒకవేళ మీరు గనక తిరస్కరిస్తే ఆకాశాలలో, భూమిలో ఉన్నదంతా అల్లాహ్‌దే (అని తెలుసుకోండి). అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, వివేకవంతుడూను.
4:171 يَا أَهْلَ الْكِتَابِ لَا تَغْلُوا فِي دِينِكُمْ وَلَا تَقُولُوا عَلَى اللَّهِ إِلَّا الْحَقَّ ۚ إِنَّمَا الْمَسِيحُ عِيسَى ابْنُ مَرْيَمَ رَسُولُ اللَّهِ وَكَلِمَتُهُ أَلْقَاهَا إِلَىٰ مَرْيَمَ وَرُوحٌ مِّنْهُ ۖ فَآمِنُوا بِاللَّهِ وَرُسُلِهِ ۖ وَلَا تَقُولُوا ثَلَاثَةٌ ۚ انتَهُوا خَيْرًا لَّكُمْ ۚ إِنَّمَا اللَّهُ إِلَٰهٌ وَاحِدٌ ۖ سُبْحَانَهُ أَن يَكُونَ لَهُ وَلَدٌ ۘ لَّهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۗ وَكَفَىٰ بِاللَّهِ وَكِيلًا
ఓ గ్రంథవహులారా! మీరు మీ ధర్మం విషయంలో అతిశయిల్లకండి. సత్యం తప్ప మరోమాట అల్లాహ్‌కు ఆపాదించకండి. మర్యమ్ కుమారుడైన ఈసా మసీహ్ కేవలం దైవప్రవక్త మరియు (అయిపో అన్న) దైవవాక్కు (ద్వారా పుట్టించబడినవారు) మాత్రమే. దాన్ని ఆయన మర్యమ్ వైపు ప్రయోగించాడు. ఇంకా ఆయన (ఈసా), దేవుని దగ్గరి నుంచి వచ్చిన ఆత్మ మాత్రమే. కాబట్టి మీరు అల్లాహ్నూ, ఆయన పంపిన ప్రవక్తలందరినీ విశ్వసించండి. దేవుడు ‘ముగ్గురు’ అని అనకండి. ఈ (త్రిత్వం) వాదనను మానండి. ఇందులోనే మీకు మేలుంది. ఆరాధ్యుడగు అల్లాహ్ ఒక్కడు మాత్రమే. ఆయనకు కుమారుడున్నాడనే విషయానికి ఆయన అతీతుడు, పరిశుద్ధుడు. ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్నదంతా ఆయనకు చెందినదే. కార్య నిర్వాహకారిగా అల్లాహ్ ఒక్కడే చాలు.
4:172 لَّن يَسْتَنكِفَ الْمَسِيحُ أَن يَكُونَ عَبْدًا لِّلَّهِ وَلَا الْمَلَائِكَةُ الْمُقَرَّبُونَ ۚ وَمَن يَسْتَنكِفْ عَنْ عِبَادَتِهِ وَيَسْتَكْبِرْ فَسَيَحْشُرُهُمْ إِلَيْهِ جَمِيعًا
మసీహ్ (అలైహిస్సలాం) గానీ, అల్లాహ్ సామీప్యం పొందిన దూతలుగానీ తాము అల్లాహ్ దాసులు కావటాన్ని అగౌరవంగా, అవమానకరంగా ఎంత మాత్రం భావించరు. అల్లాహ్ దాస్యం చేయటాన్ని అవమానకరంగా, అగౌరవంగా భావించి, గర్వాతిశయంతో విర్రవీగే వారినందరినీ అల్లాహ్ తన వద్దకు ప్రోగుచేస్తాడు.
4:173 فَأَمَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ فَيُوَفِّيهِمْ أُجُورَهُمْ وَيَزِيدُهُم مِّن فَضْلِهِ ۖ وَأَمَّا الَّذِينَ اسْتَنكَفُوا وَاسْتَكْبَرُوا فَيُعَذِّبُهُمْ عَذَابًا أَلِيمًا وَلَا يَجِدُونَ لَهُم مِّن دُونِ اللَّهِ وَلِيًّا وَلَا نَصِيرًا
మరి ఎవరు విశ్వసించి, సత్కార్యాలు ఆచరించారో, వారికి వారి పూర్తి పుణ్య ఫలాన్ని వొసగటమేగాక, తన అనుగ్రహంతో మరింతగా ప్రసాదిస్తాడు. కాగా; (అల్లాహ్ దాస్యాన్ని) చిన్నతనంగా తలపోసి తలబిరుసులుగా ప్రవర్తించిన వారికి ఆయన బాధాకరమైన శిక్షను విధిస్తాడు. అల్లాహ్ తప్ప తమను ఆదుకునే రక్షకుణ్ణిగానీ, సహాయకుణ్ణిగానీ వారు పొందలేరు.
4:174 يَا أَيُّهَا النَّاسُ قَدْ جَاءَكُم بُرْهَانٌ مِّن رَّبِّكُمْ وَأَنزَلْنَا إِلَيْكُمْ نُورًا مُّبِينًا
ప్రజలారా! మీ వద్దకు మీ ప్రభువు తరఫు నుంచి స్పష్టమైన నిదర్శనం (బుర్హాన్) వచ్చేసింది. ఇంకా, మేము మీ వద్దకు స్పష్టమైన జ్యోతిని పంపాము.
4:175 فَأَمَّا الَّذِينَ آمَنُوا بِاللَّهِ وَاعْتَصَمُوا بِهِ فَسَيُدْخِلُهُمْ فِي رَحْمَةٍ مِّنْهُ وَفَضْلٍ وَيَهْدِيهِمْ إِلَيْهِ صِرَاطًا مُّسْتَقِيمًا
కాబట్టి, ఎవరు అల్లాహ్‌ను విశ్వసించి, ఆయనతో తమ సంబంధాన్ని పటిష్ఠం చేసుకుంటారో వారిని ఆయన తన కారుణ్యంలోకి, అనుగ్రహంలోకి తీసేసుకుంటాడు. వారికి తన వైపుకు తెచ్చే రుజుమార్గం చూపుతాడు.
4:176 يَسْتَفْتُونَكَ قُلِ اللَّهُ يُفْتِيكُمْ فِي الْكَلَالَةِ ۚ إِنِ امْرُؤٌ هَلَكَ لَيْسَ لَهُ وَلَدٌ وَلَهُ أُخْتٌ فَلَهَا نِصْفُ مَا تَرَكَ ۚ وَهُوَ يَرِثُهَا إِن لَّمْ يَكُن لَّهَا وَلَدٌ ۚ فَإِن كَانَتَا اثْنَتَيْنِ فَلَهُمَا الثُّلُثَانِ مِمَّا تَرَكَ ۚ وَإِن كَانُوا إِخْوَةً رِّجَالًا وَنِسَاءً فَلِلذَّكَرِ مِثْلُ حَظِّ الْأُنثَيَيْنِ ۗ يُبَيِّنُ اللَّهُ لَكُمْ أَن تَضِلُّوا ۗ وَاللَّهُ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ
(ఓ ప్రవక్తా!) వీరు నిన్ను (‘కలాలా’ గురించి) ధర్మాదేశం అడుగుతున్నారు. అల్లాహ్ (స్వయంగా) ‘కలాలా’ గురించి మీకు ఆదేశం ఇస్తున్నాడని నువ్వు వారికి చెప్పు. ఏ వ్యక్తయినా సంతానం లేకుండా చనిపోతే, అతనికి ఒక సోదరి మాత్రమే ఉంటే, అతను వదలి వెళ్ళిన ఆస్తిలో సగభాగం ఆమెకు లభిస్తుంది. ఒకవేళ సోదరి-సంతానం లేకుండా మరణిస్తే ఆమె సోదరుడు ఆమె ఆస్తికి వారసుడౌతాడు. ఒకవేళ (మరణించిన వ్యక్తికి) ఇద్దరు సోదరీమణులుంటే, అతని మొత్తం ఆస్తిలో మూడింట రెండొంతుల భాగం వారిద్దరికీ దక్కుతుంది. ఒకవేళ సోదరీసోదరులు అనేకమంది వారసులుగా ఉన్నప్పుడు, ఒక పురుషుని భాగం ఇద్దరు స్త్రీలకు ఇచ్చే భాగాలకు సమానంగా ఉంటుంది. మీరు పెడదారి పట్టకుండా ఉండేందుకుగాను అల్లాహ్ మీకు స్పష్టంగా విడమరచి చెబుతున్నాడు. అల్లాహ్ ప్రతిదీ తెలిసినవాడు.
- సూరా అల్ మాయిద
5:1 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَوْفُوا بِالْعُقُودِ ۚ أُحِلَّتْ لَكُم بَهِيمَةُ الْأَنْعَامِ إِلَّا مَا يُتْلَىٰ عَلَيْكُمْ غَيْرَ مُحِلِّي الصَّيْدِ وَأَنتُمْ حُرُمٌ ۗ إِنَّ اللَّهَ يَحْكُمُ مَا يُرِيدُ
ఓ విశ్వాసులారా! ప్రమాణాలను, ఒప్పందాలను నెరవేర్చండి. మీకు చదివి వినిపించబడేవి తప్ప మిగిలిన చతుష్పాద పశువులన్నీ మీ కోసం ధర్మసమ్మతం (హలాల్) గావించబడ్డాయి. అయితే మీరు ‘ఇహ్రామ్’ స్థితిలో ఉన్నప్పుడు వేటను ధర్మసమ్మతంగా పరిగణించకండి. నిశ్చయంగా అల్లాహ్ తాను కోరినది ఆజ్ఞాపిస్తాడు.
5:2 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تُحِلُّوا شَعَائِرَ اللَّهِ وَلَا الشَّهْرَ الْحَرَامَ وَلَا الْهَدْيَ وَلَا الْقَلَائِدَ وَلَا آمِّينَ الْبَيْتَ الْحَرَامَ يَبْتَغُونَ فَضْلًا مِّن رَّبِّهِمْ وَرِضْوَانًا ۚ وَإِذَا حَلَلْتُمْ فَاصْطَادُوا ۚ وَلَا يَجْرِمَنَّكُمْ شَنَآنُ قَوْمٍ أَن صَدُّوكُمْ عَنِ الْمَسْجِدِ الْحَرَامِ أَن تَعْتَدُوا ۘ وَتَعَاوَنُوا عَلَى الْبِرِّ وَالتَّقْوَىٰ ۖ وَلَا تَعَاوَنُوا عَلَى الْإِثْمِ وَالْعُدْوَانِ ۚ وَاتَّقُوا اللَّهَ ۖ إِنَّ اللَّهَ شَدِيدُ الْعِقَابِ
విశ్వసించిన ఓ ప్రజలారా! అల్లాహ్ చిహ్నాలనుగానీ, ఏ నిషిద్ధ మాసాన్నిగానీ అగౌరవపరచకండి. ఖుర్బానీ నిమిత్తం కాబా గృహానికి గొనిపోబడుతున్న జంతువుల, మెడలో పట్టాలు కట్టబడి ఉన్న జంతువుల జోలికిపోకండి. అలాగే తమ ప్రభువు అనుగ్రహాన్ని, ప్రసన్నతను పొందే ఉద్దేశ్యంతో పవిత్ర గృహం (కాబా) వైపుకు వెళుతున్న వారికి అడ్డు తగలకండి. అయితే మీరు ఇహ్రామ్ దీక్షను విరమించిన మీదట వేటాడవచ్చు. మస్జిదె హరామ్‌కు పోకుండా (ఒకప్పుడు) మిమ్మల్ని నిలువరించిన వారి పట్ల ద్వేషం మిమ్మల్ని హద్దుమీరినవారుగా మార్చివేయరాదు. సత్కార్యాలలో, అల్లాహ్ భీతితో కూడిన విషయాలలో ఒండొకరికి తోడ్పడుతూ ఉండండి. పాపకార్యాలలో, దౌర్జన్యపు పనుల్లో ఎవరితోనూ సహకరించకండి. అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి. నిస్సందేహంగా అల్లాహ్ చాలా కఠినంగా శిక్షించేవాడు.
5:3 حُرِّمَتْ عَلَيْكُمُ الْمَيْتَةُ وَالدَّمُ وَلَحْمُ الْخِنزِيرِ وَمَا أُهِلَّ لِغَيْرِ اللَّهِ بِهِ وَالْمُنْخَنِقَةُ وَالْمَوْقُوذَةُ وَالْمُتَرَدِّيَةُ وَالنَّطِيحَةُ وَمَا أَكَلَ السَّبُعُ إِلَّا مَا ذَكَّيْتُمْ وَمَا ذُبِحَ عَلَى النُّصُبِ وَأَن تَسْتَقْسِمُوا بِالْأَزْلَامِ ۚ ذَٰلِكُمْ فِسْقٌ ۗ الْيَوْمَ يَئِسَ الَّذِينَ كَفَرُوا مِن دِينِكُمْ فَلَا تَخْشَوْهُمْ وَاخْشَوْنِ ۚ الْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِينَكُمْ وَأَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي وَرَضِيتُ لَكُمُ الْإِسْلَامَ دِينًا ۚ فَمَنِ اضْطُرَّ فِي مَخْمَصَةٍ غَيْرَ مُتَجَانِفٍ لِّإِثْمٍ ۙ فَإِنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ
మీ కొరకు నిషేధించబడిన వస్తువులు ఇవి : మృత పశువు, రక్తం, పంది మాంసం, అల్లాహ్ పేరుగాక వేరితరుల పేరు ఉచ్చరించబడినది, గొంతు పిసకబడటం వల్ల చచ్చిన పశువు, దెబ్బ తగిలి చనిపోయిన పశువు, ఎత్తయిన స్థలం నుంచి క్రిందపడి చనిపోయినది లేక కొమ్ము తగలటం వల్ల చచ్చిపోయినది, క్రూరమృగాలు చీల్చి తినటం వల్ల చనిపోయిన పశువు (ఇవి మీ కొరకు హరామ్ గావించబడ్డాయి). కాని మీరు ఒకవేళ ‘జిబహ్’ చేస్తే అది మీ కొరకు నిషిద్ధం కాదు. అలాగే ఆస్థానాల వద్ద బలి ఇచ్చినవి కూడా నిషిద్ధమే. అదే విధంగా బాణాల ప్రయోగం ద్వారా అదృష్టాన్ని పరీక్షించుకోవటం కూడా నిషిద్ధమే. ఇవన్నీ అత్యంత నీచమైన పాప కార్యాలు. ఈ రోజు అవిశ్వాసులు మీ ధర్మం గురించి ఇక ఆశను వదులుకున్నారు. జాగ్రత్త! మీరు భయపడవలసింది వారికి కాదు, మీరు నాకు భయపడండి. ఈ రోజు మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణం గావించాను. మీపై నా అనుగ్రహాన్ని పూర్తిచేశాను. ఇంకా, ఇస్లాంను మీ ధర్మంగా సమ్మతించి ఆమోదించాను. ఎవడయినా తీవ్రమయిన ఆకలి బాధతో అల్లాడిపోతూ – గత్యంతరంలేని పరిస్థితిలో పాపానికి పాల్పడే ఉద్దేశం లేకుండా ఉండి (పై వాటిలో దేన్నయినా తిన్నట్లయితే) నిస్సందేహంగా అల్లాహ్ క్షమించేవాడు, కనికరించేవాడూను.
5:4 يَسْأَلُونَكَ مَاذَا أُحِلَّ لَهُمْ ۖ قُلْ أُحِلَّ لَكُمُ الطَّيِّبَاتُ ۙ وَمَا عَلَّمْتُم مِّنَ الْجَوَارِحِ مُكَلِّبِينَ تُعَلِّمُونَهُنَّ مِمَّا عَلَّمَكُمُ اللَّهُ ۖ فَكُلُوا مِمَّا أَمْسَكْنَ عَلَيْكُمْ وَاذْكُرُوا اسْمَ اللَّهِ عَلَيْهِ ۖ وَاتَّقُوا اللَّهَ ۚ إِنَّ اللَّهَ سَرِيعُ الْحِسَابِ
(ఓ ప్రవక్తా!) తమ కొరకు ‘హలాల్’ (అనగా ధర్మసమ్మతం) చేయబడిన వస్తువులేవి? అని ప్రజలు నిన్ను అడుగుతున్నారు. వారికి ఇలా చెప్పు: “పరిశుద్ధమైన వస్తువులన్నీ మీ కోసం హలాల్ చేయబడ్డాయి. అలాగే మీరు శిక్షణ ఇచ్చిన వేట జంతువులు మీ కోసం ఏదైనా వేటాడితే (ఆ వేట మాంసాన్ని మీరు తినండి). కాని, మీరు వాటిని అల్లాహ్ మీకు బోధించిన పద్ధతిలో తర్ఫీదు చేసి ఉండాలి సుమా! దానిపై అల్లాహ్ నామాన్ని స్మరించండి. అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి. నిస్సందేహంగా అల్లాహ్ తొందరగా లెక్క తీసుకునేవాడు.”
5:5 الْيَوْمَ أُحِلَّ لَكُمُ الطَّيِّبَاتُ ۖ وَطَعَامُ الَّذِينَ أُوتُوا الْكِتَابَ حِلٌّ لَّكُمْ وَطَعَامُكُمْ حِلٌّ لَّهُمْ ۖ وَالْمُحْصَنَاتُ مِنَ الْمُؤْمِنَاتِ وَالْمُحْصَنَاتُ مِنَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ مِن قَبْلِكُمْ إِذَا آتَيْتُمُوهُنَّ أُجُورَهُنَّ مُحْصِنِينَ غَيْرَ مُسَافِحِينَ وَلَا مُتَّخِذِي أَخْدَانٍ ۗ وَمَن يَكْفُرْ بِالْإِيمَانِ فَقَدْ حَبِطَ عَمَلُهُ وَهُوَ فِي الْآخِرَةِ مِنَ الْخَاسِرِينَ
ఈ రోజు పరిశుద్ధమైన వస్తువులన్నీ మీ కోసం హలాల్ చేయబడ్డాయి. గ్రంథవహులు జిబహ్ చేసినది మీ కొరకు ధర్మసమ్మతం. మీరు జిబహ్ చేసినది వారి కొరకు ధర్మసమ్మతం. సౌశీల్యవతులగు ముస్లిం స్త్రీలు, మీకు పూర్వం గ్రంథం వొసగబడినవారి సౌశీల్యవతులగు స్త్రీలు కూడా మీ కొరకు హలాల్ అవుతారు. అయితే మీరు వారికి చెల్లించవలసిన మహర్ సొమ్మును చెల్లించి, వారిని వివాహబంధంలోకి తెచ్చుకోవాలి. అంతేగాని, బహిరంగంగా వ్యభిచారం చేయటం కోసం, చాటు మాటు ప్రేమకలాపాలు జరపటం కోసం వారు మీకు హలాల్ కారు. విశ్వాసాన్ని తిరస్కరించినవారి కర్మలు వృథా అయిపోతాయి. పరలోకంలో వారు నష్టపోయిన వారిలో చేర్తారు.
5:6 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا قُمْتُمْ إِلَى الصَّلَاةِ فَاغْسِلُوا وُجُوهَكُمْ وَأَيْدِيَكُمْ إِلَى الْمَرَافِقِ وَامْسَحُوا بِرُءُوسِكُمْ وَأَرْجُلَكُمْ إِلَى الْكَعْبَيْنِ ۚ وَإِن كُنتُمْ جُنُبًا فَاطَّهَّرُوا ۚ وَإِن كُنتُم مَّرْضَىٰ أَوْ عَلَىٰ سَفَرٍ أَوْ جَاءَ أَحَدٌ مِّنكُم مِّنَ الْغَائِطِ أَوْ لَامَسْتُمُ النِّسَاءَ فَلَمْ تَجِدُوا مَاءً فَتَيَمَّمُوا صَعِيدًا طَيِّبًا فَامْسَحُوا بِوُجُوهِكُمْ وَأَيْدِيكُم مِّنْهُ ۚ مَا يُرِيدُ اللَّهُ لِيَجْعَلَ عَلَيْكُم مِّنْ حَرَجٍ وَلَٰكِن يُرِيدُ لِيُطَهِّرَكُمْ وَلِيُتِمَّ نِعْمَتَهُ عَلَيْكُمْ لَعَلَّكُمْ تَشْكُرُونَ
ఓ విశ్వసించినవారలారా! మీరు నమాజు కొరకు లేచినప్పుడు మీ మొహాలను, మోచేతుల సమేతంగా మీ చేతులను కడుక్కోండి. మీ తలలను మసహ్ చేయండి, చీలమండల వరకు మీ కాళ్ళను కడుక్కోండి. ఒకవేళ మీరు లైంగిక అశుద్ధావస్థకు లోనవుతే స్నానం చేసి పరిశుద్ధులు అవ్వండి. ఒకవేళ మీరు వ్యాధిగ్రస్తులైతే లేక ప్రయాణావస్థలో ఉంటే లేక మీలో ఎవరయినా కాలకృత్యాలు తీర్చుకుని వస్తే లేక మీరు స్త్రీలతో సమాగమం జరిపి ఉంటే – అట్టి పరిస్థితిలో – నీరు లభ్యం కాకపోతే పరిశుభ్రమైన మట్టితో ‘తయమ్ముమ్’ చేసుకోండి. దాన్ని మీ మొహాలపై, చేతులపై తుడుచుకోండి. అల్లాహ్ మిమ్మల్ని ఎలాంటి ఇబ్బందికీ గురి చేయదలచుకోడు. మీరు కృతజ్ఞులయ్యేందుకు మిమ్మల్ని పరిశుద్ధులుగా చేసి, మీపై తన అనుగ్రహాన్ని సంపూర్ణం గావించాలన్నదే ఆయన అభిలాష!
5:7 وَاذْكُرُوا نِعْمَةَ اللَّهِ عَلَيْكُمْ وَمِيثَاقَهُ الَّذِي وَاثَقَكُم بِهِ إِذْ قُلْتُمْ سَمِعْنَا وَأَطَعْنَا ۖ وَاتَّقُوا اللَّهَ ۚ إِنَّ اللَّهَ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ
మీపై ఉన్న అల్లాహ్ అనుగ్రహాన్ని, ఆయన మీనుండి తీసుకున్న ప్రమాణాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. అప్పుడు మీరు, “మేము విన్నాము, శిరసావహించాము” అని చెప్పి ఉన్నారు. అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ మనసుల్లోని విషయాలు సయితం ఎరిగినవాడు.
5:8 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُونُوا قَوَّامِينَ لِلَّهِ شُهَدَاءَ بِالْقِسْطِ ۖ وَلَا يَجْرِمَنَّكُمْ شَنَآنُ قَوْمٍ عَلَىٰ أَلَّا تَعْدِلُوا ۚ اعْدِلُوا هُوَ أَقْرَبُ لِلتَّقْوَىٰ ۖ وَاتَّقُوا اللَّهَ ۚ إِنَّ اللَّهَ خَبِيرٌ بِمَا تَعْمَلُونَ
ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ కొరకు సత్యంపై నిలకడగా ఉండండి. న్యాయానికి సాక్షులుగా ఉండండి. ఏదైనా ఒక వర్గంతో ఉన్న విరోధం మిమ్మల్ని న్యాయవిరుద్ధతకు పాల్పడనీయకూడదు. న్యాయం చెయ్యండి. ఇది దైవభీతికి అత్యంత చేరువైనది. అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి. మీరు చేసే పనులన్నీ అల్లాహ్‌కు తెలుస్తూనే ఉంటాయి.
5:9 وَعَدَ اللَّهُ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ ۙ لَهُم مَّغْفِرَةٌ وَأَجْرٌ عَظِيمٌ
విశ్వసించి, మంచిపనులు చేసిన వారికి గొప్ప మన్నింపుతో పాటు, గొప్ప ప్రతి ఫలం కూడా ఉందని అల్లాహ్ వాగ్దానం చేశాడు.
5:10 وَالَّذِينَ كَفَرُوا وَكَذَّبُوا بِآيَاتِنَا أُولَٰئِكَ أَصْحَابُ الْجَحِيمِ
మరెవరు అవిశ్వాసానికి ఒడిగట్టి, మా ఆదేశాలను ధిక్కరించారో వారే నరకవాసులు.
5:11 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اذْكُرُوا نِعْمَتَ اللَّهِ عَلَيْكُمْ إِذْ هَمَّ قَوْمٌ أَن يَبْسُطُوا إِلَيْكُمْ أَيْدِيَهُمْ فَكَفَّ أَيْدِيَهُمْ عَنكُمْ ۖ وَاتَّقُوا اللَّهَ ۚ وَعَلَى اللَّهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُونَ
విశ్వాసులారా! అల్లాహ్ మీకు చేసిన ఉపకారాన్ని కాస్త జ్ఞప్తికి తెచ్చుకోండి – అప్పుడు ఒక జాతివారు మీపై చేయి చేసుకోవాలని అనుకున్నారు. అయితే అల్లాహ్ వారి చేతులు మీపై లేవకుండా ఆపాడు. అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి. విశ్వాసులు నమ్ముకోవలసింది కూడా అల్లాహ్‌నే.
5:12 وَلَقَدْ أَخَذَ اللَّهُ مِيثَاقَ بَنِي إِسْرَائِيلَ وَبَعَثْنَا مِنْهُمُ اثْنَيْ عَشَرَ نَقِيبًا ۖ وَقَالَ اللَّهُ إِنِّي مَعَكُمْ ۖ لَئِنْ أَقَمْتُمُ الصَّلَاةَ وَآتَيْتُمُ الزَّكَاةَ وَآمَنتُم بِرُسُلِي وَعَزَّرْتُمُوهُمْ وَأَقْرَضْتُمُ اللَّهَ قَرْضًا حَسَنًا لَّأُكَفِّرَنَّ عَنكُمْ سَيِّئَاتِكُمْ وَلَأُدْخِلَنَّكُمْ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ ۚ فَمَن كَفَرَ بَعْدَ ذَٰلِكَ مِنكُمْ فَقَدْ ضَلَّ سَوَاءَ السَّبِيلِ
అల్లాహ్ ఇస్రాయీల్ సంతతి నుండి గట్టి వాగ్దానాన్ని తీసుకున్నాడు. వారిలో నుంచే పన్నెండు మంది నాయకులను మేము నియమించాము. ఇంకా అల్లాహ్ వారితో ఇలా అన్నాడు: “నిశ్చయంగా నేను మీకు తోడుగా ఉన్నాను. మీరు గనక నమాజును నెలకొల్పుతూ ఉంటే, జకాత్ ఇస్తూ ఉంటే, నా ప్రవక్తలను విశ్వసిస్తూ, వారిని గౌరవించి వారికి సహాయ పడితే, అల్లాహ్‌కు ఉత్తమ రుణాన్ని ఇస్తూ ఉంటే నేను మీ చెడుగులను మీ నుంచి దూరం చేస్తాను. క్రింద సెలయేళ్లు ప్రవహించే స్వర్గవనాలలోకి మిమ్మల్ని తీసుకుపోతాను. ఈ ప్రమాణం తరువాత కూడా మీలో ఎవడైనా తిరస్కార వైఖరికి పాల్పడితే అతడు రుజుమార్గం (సవావుస్సబీల్) నుంచి తప్పిపోయాడు.”
5:13 فَبِمَا نَقْضِهِم مِّيثَاقَهُمْ لَعَنَّاهُمْ وَجَعَلْنَا قُلُوبَهُمْ قَاسِيَةً ۖ يُحَرِّفُونَ الْكَلِمَ عَن مَّوَاضِعِهِ ۙ وَنَسُوا حَظًّا مِّمَّا ذُكِّرُوا بِهِ ۚ وَلَا تَزَالُ تَطَّلِعُ عَلَىٰ خَائِنَةٍ مِّنْهُمْ إِلَّا قَلِيلًا مِّنْهُمْ ۖ فَاعْفُ عَنْهُمْ وَاصْفَحْ ۚ إِنَّ اللَّهَ يُحِبُّ الْمُحْسِنِينَ
ఆ తరువాత వారు తమ వాగ్దానాన్ని భంగపరచిన కారణంగా మేము వారిని శపించాము. వారి హృదయాలను కఠినం చేశాము. (తత్కారణంగా) వారు పదాలను వాటి (అసలు) స్థానం నుంచి తారుమారు చేస్తున్నారు. అంతేకాదు, తమకు బోధించబడిన ఉపదేశంలో చాలా భాగం వారు మరచి పోయారు. (ఓ ప్రవక్తా!) వారు పాల్పడే ఏదో ఒక ద్రోహానికి సంబంధించిన సమాచారం నీకు అందుతూనే ఉంటుంది. అయితే వారిలో కొద్దిమంది మాత్రం అలాంటివారు కారు. అయినా సరే నువ్వు వారిని మన్నిస్తూ, ఉపేక్షిస్తూ ఉండు. నిస్సందేహంగా అల్లాహ్ ఉత్తమంగా వ్యవహరించేవారిని అమితంగా ప్రేమిస్తాడు.
5:14 وَمِنَ الَّذِينَ قَالُوا إِنَّا نَصَارَىٰ أَخَذْنَا مِيثَاقَهُمْ فَنَسُوا حَظًّا مِّمَّا ذُكِّرُوا بِهِ فَأَغْرَيْنَا بَيْنَهُمُ الْعَدَاوَةَ وَالْبَغْضَاءَ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ ۚ وَسَوْفَ يُنَبِّئُهُمُ اللَّهُ بِمَا كَانُوا يَصْنَعُونَ
తమను తాము ‘నసారా'(క్రైస్తవులు)గా చెప్పుకునేవారి నుండి కూడా మేము వాగ్దానం తీసుకున్నాము. అయితే వారు కూడా తమకు చేయబడిన ఉపదేశంలోని ఎక్కువ భాగాన్ని విస్మరించారు. ఈ కారణంగా మేము వారి మధ్య విరోధాన్ని, విద్వేషాలను తగిలించాము. అవి ప్రళయ దినం వరకూ ఉంటాయి. వారు చేస్తూ ఉండిన పనులన్నింటినీ అల్లాహ్ త్వరలోనే వారికి తెలియజేస్తాడు.
5:15 يَا أَهْلَ الْكِتَابِ قَدْ جَاءَكُمْ رَسُولُنَا يُبَيِّنُ لَكُمْ كَثِيرًا مِّمَّا كُنتُمْ تُخْفُونَ مِنَ الْكِتَابِ وَيَعْفُو عَن كَثِيرٍ ۚ قَدْ جَاءَكُم مِّنَ اللَّهِ نُورٌ وَكِتَابٌ مُّبِينٌ
ఓ గ్రంథవహులారా! మీ వద్దకు మా ప్రవక్త (సఅసం) వచ్చేశాడు. మీరు కప్పిపుచ్చుతూ ఉండిన గ్రంథంలోని ఎన్నో విషయాలను అతను మీ ముందు విపులీకరిస్తున్నాడు. మరెన్నో విషయాలను ఉపేక్షిస్తున్నాడు. అల్లాహ్ తరఫు నుంచి మీ వద్దకు జ్యోతి వచ్చేసింది. అంటే, స్పష్టమైన గ్రంథం వచ్చేసింది.
5:16 يَهْدِي بِهِ اللَّهُ مَنِ اتَّبَعَ رِضْوَانَهُ سُبُلَ السَّلَامِ وَيُخْرِجُهُم مِّنَ الظُّلُمَاتِ إِلَى النُّورِ بِإِذْنِهِ وَيَهْدِيهِمْ إِلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ
దాని ద్వారా అల్లాహ్ తన ప్రసన్నతను అనుసరించేవారికి శాంతి మార్గాలను చూపుతాడు. తన అనుమతి మేరకు వారిని చీకట్లలో నుంచి వెలికితీసి, కాంతి వైపుకు తీసుకువస్తాడు. రుజుమార్గం వైపుకు వారికి దర్శకత్వం వహిస్తాడు.
5:17 لَّقَدْ كَفَرَ الَّذِينَ قَالُوا إِنَّ اللَّهَ هُوَ الْمَسِيحُ ابْنُ مَرْيَمَ ۚ قُلْ فَمَن يَمْلِكُ مِنَ اللَّهِ شَيْئًا إِنْ أَرَادَ أَن يُهْلِكَ الْمَسِيحَ ابْنَ مَرْيَمَ وَأُمَّهُ وَمَن فِي الْأَرْضِ جَمِيعًا ۗ وَلِلَّهِ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا ۚ يَخْلُقُ مَا يَشَاءُ ۚ وَاللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
“అల్లాహ్ (అంటే) మర్యమ్ పుత్రుడైన మసీహ్యే” అని అన్నవారు నిస్సందేహంగా అవిశ్వాసానికి పాల్పడ్డారు. (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “ఒకవేళ అల్లాహ్ మర్యమ్ పుత్రుడైన మసీహ్‌ని, అతని తల్లిని, భూమండలంలోని సమస్త జనులనూ నాశనం చేయదలిస్తే, ఆయన్ని అడ్డుకోగల శక్తి, అధికారం ఎవరికున్నాయి? భూమ్యాకాశాలలోనూ, వాటి మధ్యలోనూ ఉన్నవాటి సమస్త సార్వభౌమత్వానికి అధిపతి అల్లాహ్‌యే. ఆయన తాను కోరిన దాన్ని సృష్టిస్తాడు. అల్లాహ్ ప్రతిదీ చేయగల అధికారం కలవాడు.”
5:18 وَقَالَتِ الْيَهُودُ وَالنَّصَارَىٰ نَحْنُ أَبْنَاءُ اللَّهِ وَأَحِبَّاؤُهُ ۚ قُلْ فَلِمَ يُعَذِّبُكُم بِذُنُوبِكُم ۖ بَلْ أَنتُم بَشَرٌ مِّمَّنْ خَلَقَ ۚ يَغْفِرُ لِمَن يَشَاءُ وَيُعَذِّبُ مَن يَشَاءُ ۚ وَلِلَّهِ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا ۖ وَإِلَيْهِ الْمَصِيرُ
“మేము అల్లాహ్ పుత్రులం, ఆయనకు ప్రియమైన వారం” అని యూదులు, క్రైస్తవులు (నస్రానీలు) అంటారు. (ఓ ప్రవక్తా!) వారిని ఇలా అడుగు : “మరయితే మీ పాపాలకుగాను ఆయన మిమ్మల్ని ఎందుకు శిక్షిస్తున్నాడు? కాదు, మీరు కూడా ఆయన సృష్టించిన మానవ వర్గానికి చెందినవారే. ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు, తాను కోరిన వారిని శిక్షిస్తాడు. భూమ్యా కాశాలలోనూ, వాటి మధ్యనూ ఉన్నవాటన్నింటిపై అధికారం అల్లాహ్‌దే. ఆయన వైపుకే మరలిపోవలసి ఉంది.”
5:19 يَا أَهْلَ الْكِتَابِ قَدْ جَاءَكُمْ رَسُولُنَا يُبَيِّنُ لَكُمْ عَلَىٰ فَتْرَةٍ مِّنَ الرُّسُلِ أَن تَقُولُوا مَا جَاءَنَا مِن بَشِيرٍ وَلَا نَذِيرٍ ۖ فَقَدْ جَاءَكُم بَشِيرٌ وَنَذِيرٌ ۗ وَاللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
గ్రంథవహులారా! ప్రవక్తల ఆగమన క్రమంలో విరామం తర్వాత మా ప్రవక్త మీ వద్దకు వచ్చేశాడు. అతను మీకు స్పష్టంగా విడమరచి చెబుతున్నాడు. మా వద్దకు శుభవార్త అందించేవాడు, భయపెట్టేవాడు ఎవరూ రాలేదన్న మాట మీరు అనకుండా ఉండేందుకుగాను (ఈ ఏర్పాటు జరిగింది). అందుకే ఇప్పుడు నిజంగా శుభవార్త వినిపించేవాడు, భయపెట్టేవాడు మీ వద్దకు వచ్చేశాడు. అల్లాహ్ అన్నింటిపై అధికారం కలవాడు.
5:20 وَإِذْ قَالَ مُوسَىٰ لِقَوْمِهِ يَا قَوْمِ اذْكُرُوا نِعْمَةَ اللَّهِ عَلَيْكُمْ إِذْ جَعَلَ فِيكُمْ أَنبِيَاءَ وَجَعَلَكُم مُّلُوكًا وَآتَاكُم مَّا لَمْ يُؤْتِ أَحَدًا مِّنَ الْعَالَمِينَ
మూసా తన జాతి వారినుద్దేశించి చెప్పిన విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి : “ఓ నా జాతి ప్రజలారా! అల్లాహ్ మీకు చేసిన ఉపకారాన్ని కాస్త మననం చేసుకోండి – ఆయన మీలో ప్రవక్తల్ని నియమించాడు. మిమ్మల్ని రాజులుగా చేశాడు. లోకవాసులలో ఎవరికీ ప్రసాదించని దానిని మీకు ప్రసాదించాడు.”
5:21 يَا قَوْمِ ادْخُلُوا الْأَرْضَ الْمُقَدَّسَةَ الَّتِي كَتَبَ اللَّهُ لَكُمْ وَلَا تَرْتَدُّوا عَلَىٰ أَدْبَارِكُمْ فَتَنقَلِبُوا خَاسِرِينَ
“నా జాతివారలారా! అల్లాహ్ మీకు రాసిపెట్టిన ఈ పవిత్ర ప్రదేశంలో ప్రవేశించండి. వెన్నుచూపి మరలిపోకండి. వెన్నుచూపి మరలిపోయారంటే మీరే నష్టపోతారు.”
5:22 قَالُوا يَا مُوسَىٰ إِنَّ فِيهَا قَوْمًا جَبَّارِينَ وَإِنَّا لَن نَّدْخُلَهَا حَتَّىٰ يَخْرُجُوا مِنْهَا فَإِن يَخْرُجُوا مِنْهَا فَإِنَّا دَاخِلُونَ
దానికి వారు ఇలా బదులిచ్చారు : “మూసా! అక్కడ మహాబలవంతులు ఉన్నారు. వారక్కణ్ణుంచి వెళ్ళిపోనంత వరకూ మేము అందులో ప్రవేశించేది లేదు. ఒకవేళ వారు వెళ్ళిపోతే మాత్రం, మేము తప్పకుండా అందులోకి ప్రవేశిస్తాము.”
5:23 قَالَ رَجُلَانِ مِنَ الَّذِينَ يَخَافُونَ أَنْعَمَ اللَّهُ عَلَيْهِمَا ادْخُلُوا عَلَيْهِمُ الْبَابَ فَإِذَا دَخَلْتُمُوهُ فَإِنَّكُمْ غَالِبُونَ ۚ وَعَلَى اللَّهِ فَتَوَكَّلُوا إِن كُنتُم مُّؤْمِنِينَ
అప్పుడు, అల్లాహ్‌కు భయపడే వారిలో ఆయన అనుగ్రహం పొందిన ఇద్దరు ఇలా అన్నారు : “మీరు వారిని ఎదుర్కోవటానికి (కనీసం) ద్వారం లోపలికైనా ప్రవేశించండి. మీరు లోపలికి ప్రవేశిస్తే చాలు, మీరే ఆధిక్యత పొందుతారు. మీరు విశ్వాసులే అయితే అల్లాహ్‌నే నమ్మండి.”
5:24 قَالُوا يَا مُوسَىٰ إِنَّا لَن نَّدْخُلَهَا أَبَدًا مَّا دَامُوا فِيهَا ۖ فَاذْهَبْ أَنتَ وَرَبُّكَ فَقَاتِلَا إِنَّا هَاهُنَا قَاعِدُونَ
(కాని ఈ మాటల్ని వారు లక్ష్య పెట్టలేదు). “ఓ మూసా! వారు అక్కడ ఉన్నంత వరకూ మేము సుతరామూ అక్కడికి వెళ్ళబోము. నువ్వూ, నీ ప్రభువూ పోయి ఉభయులూ వారితో పోరాడండి. మేమిక్కడే కూర్చుని ఉంటాము” అని వారు చెప్పారు.
5:25 قَالَ رَبِّ إِنِّي لَا أَمْلِكُ إِلَّا نَفْسِي وَأَخِي ۖ فَافْرُقْ بَيْنَنَا وَبَيْنَ الْقَوْمِ الْفَاسِقِينَ
అప్పుడు మూసా ఇలా విన్నవించుకున్నాడు: “ప్రభూ! నాకు నా స్వయంపైనా, నా సోదరునిపైన మాత్రమే అధికారం ఉంది. కాబట్టి నువ్వు మమ్మల్ని – ఈ అవిధేయులను వేరు చెయ్యి.”
5:26 قَالَ فَإِنَّهَا مُحَرَّمَةٌ عَلَيْهِمْ ۛ أَرْبَعِينَ سَنَةً ۛ يَتِيهُونَ فِي الْأَرْضِ ۚ فَلَا تَأْسَ عَلَى الْقَوْمِ الْفَاسِقِينَ
అప్పుడు అల్లాహ్ ఇలా అన్నాడు: “ఇక ఈ భూమి వారి కోసం నలభై సంవత్సరాల దాకా నిషేధించబడింది. వారు ఎక్కడా నిలువ నీడ లేకుండా నేలపై తచ్చాడుతూ తిరుగుతుంటారు. కనుక నువ్వు ఈ అవిధేయ జనుల విషయంలో దుఃఖించకు.”
5:27 وَاتْلُ عَلَيْهِمْ نَبَأَ ابْنَيْ آدَمَ بِالْحَقِّ إِذْ قَرَّبَا قُرْبَانًا فَتُقُبِّلَ مِنْ أَحَدِهِمَا وَلَمْ يُتَقَبَّلْ مِنَ الْآخَرِ قَالَ لَأَقْتُلَنَّكَ ۖ قَالَ إِنَّمَا يَتَقَبَّلُ اللَّهُ مِنَ الْمُتَّقِينَ
(ఓ ముహమ్మద్-స!) ఆదం యొక్క ఇద్దరు కుమారుల వృత్తాంతాన్ని కూడా వారికి యధాతథంగా వినిపించు. వారిరువురూ దైవానికి నజరానా సమర్పించగా, వారిలో ఒకరి నజరానా స్వీకరించబడింది. మరొకరిది స్వీకరించబడలేదు. అప్పుడు రెండవతను, “నేను నిన్ను చంపేస్తాను” అన్నాడు. దానికి సమాధానంగా మొదటివాడు, “అల్లాహ్ భీతిపరుల నజరానాను మాత్రమే స్వీకరిస్తాడు –
5:28 لَئِن بَسَطتَ إِلَيَّ يَدَكَ لِتَقْتُلَنِي مَا أَنَا بِبَاسِطٍ يَدِيَ إِلَيْكَ لِأَقْتُلَكَ ۖ إِنِّي أَخَافُ اللَّهَ رَبَّ الْعَالَمِينَ
“నువ్వు నన్ను చంపటానికి చెయ్యి ఎత్తినా, నేను మాత్రం నిన్ను చంపే ఉద్దేశంతో చెయ్యి ఎత్తను. నేను సకల లోకాల ప్రభువైన అల్లాహ్‌కు భయపడుతున్నాను.
5:29 إِنِّي أُرِيدُ أَن تَبُوءَ بِإِثْمِي وَإِثْمِكَ فَتَكُونَ مِنْ أَصْحَابِ النَّارِ ۚ وَذَٰلِكَ جَزَاءُ الظَّالِمِينَ
“నువ్వు నీ పాపంతో పాటు, నా పాపం కూడా నీ నెత్తిన పెట్టుకుని నరక వాసుల్లో చేరిపోవాలని కోరుకుంటాను (గాని నేను మాత్రం ఆ పాపానికి ఒడిగట్టలేను). దుర్మార్గులకు ప్రతిఫలం ఇదే” అని అన్నాడు.
5:30 فَطَوَّعَتْ لَهُ نَفْسُهُ قَتْلَ أَخِيهِ فَقَتَلَهُ فَأَصْبَحَ مِنَ الْخَاسِرِينَ
తర్వాత అతని మనసు తన సోదరుని హత్యకే పురికొల్పింది. అతణ్ణి హత్యచేసి అతడు నష్టపోయిన వారిలో చేరిపోయాడు.
5:31 فَبَعَثَ اللَّهُ غُرَابًا يَبْحَثُ فِي الْأَرْضِ لِيُرِيَهُ كَيْفَ يُوَارِي سَوْءَةَ أَخِيهِ ۚ قَالَ يَا وَيْلَتَا أَعَجَزْتُ أَنْ أَكُونَ مِثْلَ هَٰذَا الْغُرَابِ فَأُوَارِيَ سَوْءَةَ أَخِي ۖ فَأَصْبَحَ مِنَ النَّادِمِينَ
ఆ తరువాత సోదరుని శవాన్ని ఎలా దాచాలో అతనికి చూపించటానికి అల్లాహ్ ఒక కాకిని పంపాడు. అది నేలను త్రవ్వసాగింది. అతను (ఆ దృశ్యాన్ని చూసి,) “అయ్యో! నా సోదరుని శవాన్ని దాచే విషయంలో నేను ఈ కాకిపాటి వాణ్ణి కూడా కాలేకపోయానే” అంటూ సిగ్గుతో కుమిలిపోయాడు.
5:32 مِنْ أَجْلِ ذَٰلِكَ كَتَبْنَا عَلَىٰ بَنِي إِسْرَائِيلَ أَنَّهُ مَن قَتَلَ نَفْسًا بِغَيْرِ نَفْسٍ أَوْ فَسَادٍ فِي الْأَرْضِ فَكَأَنَّمَا قَتَلَ النَّاسَ جَمِيعًا وَمَنْ أَحْيَاهَا فَكَأَنَّمَا أَحْيَا النَّاسَ جَمِيعًا ۚ وَلَقَدْ جَاءَتْهُمْ رُسُلُنَا بِالْبَيِّنَاتِ ثُمَّ إِنَّ كَثِيرًا مِّنْهُم بَعْدَ ذَٰلِكَ فِي الْأَرْضِ لَمُسْرِفُونَ
ఈ కారణంగానే మేము ఇస్రాయీలు సంతతిపై ఈ ఫర్మానా విధించాము: “ఎవరయినా ఒకరి హత్యకు ప్రతీకారంగా కాకుండా, భూమిలో కల్లోలాన్ని రేకెత్తించినందుకు కాకుండా, అకారణంగా ఎవరినయినా చంపినట్లయితే అతడు సమస్త మానవులను చంపినవాడవుతాడు. అలాగే ఎవరయినా ఒకరి ప్రాణాన్ని రక్షిస్తే అతడు సమస్త మానవుల ప్రాణాలను రక్షించిన వాడవుతాడు.” వారి వద్దకు మా ప్రవక్తలెందరో స్పష్టమయిన నిదర్శనాలను తీసుకువచ్చారు. కాని ఆ తరువాత కూడా వారిలో చాలా మంది అవనిలో దుర్మార్గం, దౌర్జన్యాలకు పాల్పడేవారు ఉన్నారు.
5:33 إِنَّمَا جَزَاءُ الَّذِينَ يُحَارِبُونَ اللَّهَ وَرَسُولَهُ وَيَسْعَوْنَ فِي الْأَرْضِ فَسَادًا أَن يُقَتَّلُوا أَوْ يُصَلَّبُوا أَوْ تُقَطَّعَ أَيْدِيهِمْ وَأَرْجُلُهُم مِّنْ خِلَافٍ أَوْ يُنفَوْا مِنَ الْأَرْضِ ۚ ذَٰلِكَ لَهُمْ خِزْيٌ فِي الدُّنْيَا ۖ وَلَهُمْ فِي الْآخِرَةِ عَذَابٌ عَظِيمٌ
ఎవరు అల్లాహ్‌తోనూ, ఆయన ప్రవక్తతోనూ పోరాడుతారో, భూమిలో కల్లోలాన్ని రేకెత్తిస్తూ తిరుగుతుంటారో వారు వధించబడాలి. లేదా ఉరి కంబం ఎక్కించబడాలి. లేదా ఎదురుగా వారి కాళ్లు చేతులు ఖండించబడాలి. లేదా వారిని దేశం నుంచి బహిష్కరించాలి. ఇది ఇహలోకంలో వారికి కలగవలసిన పరాభవం. పరలోకంలో వారికి విధించబడే శిక్ష (ఇంతకన్నా) ఘోరంగా ఉంటుంది.
5:34 إِلَّا الَّذِينَ تَابُوا مِن قَبْلِ أَن تَقْدِرُوا عَلَيْهِمْ ۖ فَاعْلَمُوا أَنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ
కాని వారిలో ఎవరయినా మీ అదుపులోకి రాకముందే పశ్చాత్తాపపడితే, అల్లాహ్ అమితంగా క్షమించేవాడు, అపారంగా కరుణించేవాడని తెలుసుకోండి.
5:35 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَابْتَغُوا إِلَيْهِ الْوَسِيلَةَ وَجَاهِدُوا فِي سَبِيلِهِ لَعَلَّكُمْ تُفْلِحُونَ
విశ్వసించిన ఓ ప్రజలారా! అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి. ఆయన సామీప్యాన్ని పొందే సాధనం వెతకండి. ఆయన మార్గంలో(యుద్ధ ప్రాతిపదికన) కృషి సలపండి. తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు.
5:36 إِنَّ الَّذِينَ كَفَرُوا لَوْ أَنَّ لَهُم مَّا فِي الْأَرْضِ جَمِيعًا وَمِثْلَهُ مَعَهُ لِيَفْتَدُوا بِهِ مِنْ عَذَابِ يَوْمِ الْقِيَامَةِ مَا تُقُبِّلَ مِنْهُمْ ۖ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ
తిరస్కార వైఖరిని అవలంబించిన వారివద్ద భూమిలో ఉన్న సంపద మొత్తం, ఇంకా అంతే సంపద దానితోపాటు ఉండి, ఆ మొత్తం సంపదను వారు ప్రళయ దినపు శిక్షనుంచి తప్పించుకోవటానికి పరిహారంగా ఇవ్వదలచినా – అది వారి నుండి స్వీకరింపజాలదు. వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది.
5:37 يُرِيدُونَ أَن يَخْرُجُوا مِنَ النَّارِ وَمَا هُم بِخَارِجِينَ مِنْهَا ۖ وَلَهُمْ عَذَابٌ مُّقِيمٌ
వారు నరకాగ్ని నుంచి బయటపడాలని పరితపిస్తారు. కాని వారు దాన్నుంచి బయటికి రాలేరు. వారి కోసం శాశ్వితమైన శిక్ష ఉంటుంది.
5:38 وَالسَّارِقُ وَالسَّارِقَةُ فَاقْطَعُوا أَيْدِيَهُمَا جَزَاءً بِمَا كَسَبَا نَكَالًا مِّنَ اللَّهِ ۗ وَاللَّهُ عَزِيزٌ حَكِيمٌ
దొంగతనం చేసినది – పురుషుడైనా, స్త్రీ అయినా – ఉభయుల చేతులూ నరకండి. అది వారు చేసిన దానికి ప్రతిఫలం. అల్లాహ్ తరఫున విధించబడిన శిక్ష. అల్లాహ్ సర్వాధిక్యుడు, వివేచనాశీలి కూడా.
5:39 فَمَن تَابَ مِن بَعْدِ ظُلْمِهِ وَأَصْلَحَ فَإِنَّ اللَّهَ يَتُوبُ عَلَيْهِ ۗ إِنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ
పాపం చేసిన తరువాత పశ్చాత్తాపం చెంది, తన నడవడికను సరిదిద్దుకున్నవాని వైపుకు అల్లాహ్ కారుణ్యంతో మరలుతాడు. నిస్సందేహంగా అల్లాహ్ క్షమాభిక్షపెట్టేవాడు, కరుణించేవాడూను.
5:40 أَلَمْ تَعْلَمْ أَنَّ اللَّهَ لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ يُعَذِّبُ مَن يَشَاءُ وَيَغْفِرُ لِمَن يَشَاءُ ۗ وَاللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
ఆకాశాల మరియు భూమి యొక్క రాజ్యాధికారం అల్లాహ్‌దే నన్న సంగతి నీకు తెలియదా? ఆయన తాను తలచిన వారిని శిక్షిస్తాడు, తాను తలచినవారిని క్షమిస్తాడు. అల్లాహ్ అన్నింటిపై తిరుగులేని అధికారం కలవాడు.
5:41 يَا أَيُّهَا الرَّسُولُ لَا يَحْزُنكَ الَّذِينَ يُسَارِعُونَ فِي الْكُفْرِ مِنَ الَّذِينَ قَالُوا آمَنَّا بِأَفْوَاهِهِمْ وَلَمْ تُؤْمِن قُلُوبُهُمْ ۛ وَمِنَ الَّذِينَ هَادُوا ۛ سَمَّاعُونَ لِلْكَذِبِ سَمَّاعُونَ لِقَوْمٍ آخَرِينَ لَمْ يَأْتُوكَ ۖ يُحَرِّفُونَ الْكَلِمَ مِن بَعْدِ مَوَاضِعِهِ ۖ يَقُولُونَ إِنْ أُوتِيتُمْ هَٰذَا فَخُذُوهُ وَإِن لَّمْ تُؤْتَوْهُ فَاحْذَرُوا ۚ وَمَن يُرِدِ اللَّهُ فِتْنَتَهُ فَلَن تَمْلِكَ لَهُ مِنَ اللَّهِ شَيْئًا ۚ أُولَٰئِكَ الَّذِينَ لَمْ يُرِدِ اللَّهُ أَن يُطَهِّرَ قُلُوبَهُمْ ۚ لَهُمْ فِي الدُّنْيَا خِزْيٌ ۖ وَلَهُمْ فِي الْآخِرَةِ عَذَابٌ عَظِيمٌ
ఓ ప్రవక్తా! అవిశ్వాసంలో ముందుకు దూసుకుపోయే వారిని చూసి నువ్వు దుఃఖించకు. తాము ముస్లిములమేనని వారు నోటితో పలికినాసరే – వాస్తవానికి వారి హృదయాలు విశ్వాస పూరితం కావు (వాటిలో కాపట్యం ఉంది). కాగా; యూదుల్లోని కొందరు తప్పుడు మాటలను ఆసక్తితో చెవియొగ్గి వింటారు. ఇంకా ఇంతవరకూ నీ వద్దకు రాని వారి కోసం గూఢచారులుగా వ్యవహరిస్తున్నారు. వారు పదాల అసలు సందర్భాన్ని విడిచిపెట్టి, వాటిని తారుమారు చేస్తారు. “మీకు ఈ ఆదేశమే గనక ఇవ్వబడితే దాన్ని స్వీకరించండి. ఈ ఆదేశం గనక లభించకపోతే దూరంగా ఉండండి” అని (ప్రజలకు) చెబుతారు. అల్లాహ్ ఎవరినయినా వినాశాని (ఫిత్నా)కి లోను చేయదలిస్తే అల్లాహ్‌కు ప్రతిగా నీకు వారిపై ఏ అధికారం ఉండదు. అల్లాహ్ పరిశుద్ధ పరచదలచుకోలేనిది ఇటువంటి వారి హృదయాలనే. వారికి ఇహలోకంలోనూ పరాభవం ఉంటుంది, పరలోకంలో కూడా వారికి ఘోర శిక్ష తప్పదు.
5:42 سَمَّاعُونَ لِلْكَذِبِ أَكَّالُونَ لِلسُّحْتِ ۚ فَإِن جَاءُوكَ فَاحْكُم بَيْنَهُمْ أَوْ أَعْرِضْ عَنْهُمْ ۖ وَإِن تُعْرِضْ عَنْهُمْ فَلَن يَضُرُّوكَ شَيْئًا ۖ وَإِنْ حَكَمْتَ فَاحْكُم بَيْنَهُم بِالْقِسْطِ ۚ إِنَّ اللَّهَ يُحِبُّ الْمُقْسِطِينَ
వీరు చెవియొగ్గి అబద్ధాలు వినేవారు, నిషిద్ధమైన సొమ్ము (హరాం) చాలా ఎక్కువగా తినేవారు. ఒకవేళ వారు (తమ గొడవలను) నీ వద్దకు తీసుకువస్తే, నీకిష్టముంటే వారి మధ్య తీర్పు చెప్పు, లేదంటే విముఖతను తెలుపు. ఒకవేళ నువ్వు వారినుంచి ముఖం త్రిప్పుకున్నా వారు నీకెలాంటి హానీ కలిగించలేరు. ఒకవేళ నువ్వు (వారి వ్యవహారాలపై), తీర్పు చెబితే వారిమధ్య న్యాయసమ్మతంగా తీర్పు చెప్పు. నిస్సందేహంగా అల్లాహ్ న్యాయశీలురను ప్రేమిస్తాడు.
5:43 وَكَيْفَ يُحَكِّمُونَكَ وَعِندَهُمُ التَّوْرَاةُ فِيهَا حُكْمُ اللَّهِ ثُمَّ يَتَوَلَّوْنَ مِن بَعْدِ ذَٰلِكَ ۚ وَمَا أُولَٰئِكَ بِالْمُؤْمِنِينَ
దైవాదేశాలు పొందుపరచబడి వున్న తౌరాతు గ్రంథం తమ వద్ద ఉన్నప్పటికీ వారు నిన్ను ఎట్లా న్యాయనిర్ణేతగా చేసుకుంటున్నారు? (ఇది ఆశ్చర్యకరం కదూ?!) ఆ తరువాత మళ్ళీ తిరిగిపోతున్నారు. యదార్థమేమిటంటే వారసలు విశ్వాసులే కారు.
5:44 إِنَّا أَنزَلْنَا التَّوْرَاةَ فِيهَا هُدًى وَنُورٌ ۚ يَحْكُمُ بِهَا النَّبِيُّونَ الَّذِينَ أَسْلَمُوا لِلَّذِينَ هَادُوا وَالرَّبَّانِيُّونَ وَالْأَحْبَارُ بِمَا اسْتُحْفِظُوا مِن كِتَابِ اللَّهِ وَكَانُوا عَلَيْهِ شُهَدَاءَ ۚ فَلَا تَخْشَوُا النَّاسَ وَاخْشَوْنِ وَلَا تَشْتَرُوا بِآيَاتِي ثَمَنًا قَلِيلًا ۚ وَمَن لَّمْ يَحْكُم بِمَا أَنزَلَ اللَّهُ فَأُولَٰئِكَ هُمُ الْكَافِرُونَ
మేము తౌరాతు గ్రంథాన్ని అవతరింపజేశాము. అందులో మార్గదర్శకత్వము, జ్యోతీ ఉండేవి. ఈ తౌరాతు ఆధారంగానే ముస్లిములైన ప్రవక్తలు, రబ్బానీలు, ధర్మవేత్తలు యూదుల సమస్యలను పరిష్కరించేవారు. ఎందుకంటే దేవుని ఈ గ్రంథాన్ని రక్షించవలసిందిగా వారికి ఆజ్ఞాపించటం జరిగింది. దీనికి వారు సాక్షులుగా ఉండేవారు. కాబట్టి మీరు మనుషులకు భయపడకండి. నాకు మాత్రమే భయపడండి. నా వాక్యాలను కొద్దిపాటి వెలకు అమ్ముకోకండి. ఎవరు అల్లాహ్ అవతరింపజేసిన వహీ ప్రకారం తీర్పు చెయ్యరో వారే (కరడుగట్టిన) అవిశ్వాసులు.
5:45 وَكَتَبْنَا عَلَيْهِمْ فِيهَا أَنَّ النَّفْسَ بِالنَّفْسِ وَالْعَيْنَ بِالْعَيْنِ وَالْأَنفَ بِالْأَنفِ وَالْأُذُنَ بِالْأُذُنِ وَالسِّنَّ بِالسِّنِّ وَالْجُرُوحَ قِصَاصٌ ۚ فَمَن تَصَدَّقَ بِهِ فَهُوَ كَفَّارَةٌ لَّهُ ۚ وَمَن لَّمْ يَحْكُم بِمَا أَنزَلَ اللَّهُ فَأُولَٰئِكَ هُمُ الظَّالِمُونَ
మేము తౌరాతు గ్రంథంలో యూదుల కోసం ఒక శాసనాన్ని లిఖించాము: (దీని ప్రకారం) ప్రాణానికి బదులు ప్రాణం, కన్నుకు బదులు కన్ను, ముక్కుకు బదులు ముక్కు, చెవికి బదులు చెవి, పంటికి బదులు పన్ను. అలాగే కొన్ని ప్రత్యేక గాయాల కోసం కూడా (సరిసమానంగా) ప్రతీకారం ఉంది. కాని ఎవరయినా క్షమాభిక్ష పెడితే అది అతని పాలిట పరిహారం (కప్ఫారా) అవుతుంది. అల్లాహ్ అవతరింపజేసిన దానికనుగుణంగా తీర్పు ఇవ్వనివారే దుర్మార్గులు.
5:46 وَقَفَّيْنَا عَلَىٰ آثَارِهِم بِعِيسَى ابْنِ مَرْيَمَ مُصَدِّقًا لِّمَا بَيْنَ يَدَيْهِ مِنَ التَّوْرَاةِ ۖ وَآتَيْنَاهُ الْإِنجِيلَ فِيهِ هُدًى وَنُورٌ وَمُصَدِّقًا لِّمَا بَيْنَ يَدَيْهِ مِنَ التَّوْرَاةِ وَهُدًى وَمَوْعِظَةً لِّلْمُتَّقِينَ
ఆ ప్రవక్తల తరువాత మేము మర్యమ్ కుమారుడగు ఈసాను పంపాము. అతను తనకు పూర్వం వచ్చిన తౌరాతు గ్రంథాన్ని సత్యమని ధృవీకరించేవాడు. మేమతనికి ఇంజీలు గ్రంథాన్ని వొసగాము. అందులో మార్గదర్శకత్వమూ, జ్యోతీ ఉండేవి. అది తనకు ముందున్న తౌరాతు గ్రంథాన్ని ధృవీకరించేది. అంతేకాదు, అది దైవభీతి కలవారికి ఆసాంతం మార్గదర్శిని మరియు హితబోధిని కూడా.
5:47 وَلْيَحْكُمْ أَهْلُ الْإِنجِيلِ بِمَا أَنزَلَ اللَّهُ فِيهِ ۚ وَمَن لَّمْ يَحْكُم بِمَا أَنزَلَ اللَّهُ فَأُولَٰئِكَ هُمُ الْفَاسِقُونَ
ఇంజీలు గ్రంథం గలవారు కూడా, అల్లాహ్ ఇంజీలులో అవతరింపజేసిన దానికనుగుణంగానే తీర్పు చెయ్యాలి. అల్లాహ్ అవతరింపజేసిన దాని ప్రకారం తీర్పుచెయ్యని వారే పాపాత్ములు.
5:48 وَأَنزَلْنَا إِلَيْكَ الْكِتَابَ بِالْحَقِّ مُصَدِّقًا لِّمَا بَيْنَ يَدَيْهِ مِنَ الْكِتَابِ وَمُهَيْمِنًا عَلَيْهِ ۖ فَاحْكُم بَيْنَهُم بِمَا أَنزَلَ اللَّهُ ۖ وَلَا تَتَّبِعْ أَهْوَاءَهُمْ عَمَّا جَاءَكَ مِنَ الْحَقِّ ۚ لِكُلٍّ جَعَلْنَا مِنكُمْ شِرْعَةً وَمِنْهَاجًا ۚ وَلَوْ شَاءَ اللَّهُ لَجَعَلَكُمْ أُمَّةً وَاحِدَةً وَلَٰكِن لِّيَبْلُوَكُمْ فِي مَا آتَاكُمْ ۖ فَاسْتَبِقُوا الْخَيْرَاتِ ۚ إِلَى اللَّهِ مَرْجِعُكُمْ جَمِيعًا فَيُنَبِّئُكُم بِمَا كُنتُمْ فِيهِ تَخْتَلِفُونَ
ఇంకా (ఓ ప్రవక్తా!) మేము నీ వైపుకు ఈ గ్రంథాన్ని సత్య సమేతంగా అవతరింపజేశాము. అది తనకన్నా ముందు వచ్చిన గ్రంథాలను సత్యమని ధృవీకరిస్తుంది, వాటిని పరిరక్షిస్తుంది. కాబట్టి నువ్వు వారి పరస్పర వ్యవహారాలపై అల్లాహ్ అవతరింపజేసిన ఈ గ్రంథానికనుగుణంగానే తీర్పు చెయ్యి. నీ వద్దకు వచ్చిన ఈ సత్యాన్ని వీడి, వారి మనోవాంఛలను అనుసరించకు. మీలో ప్రతి ఒక్కరి కోసం మేము ఒక విధానాన్ని, మార్గాన్నీ నిర్ధారించాము. అల్లాహ్‌యే గనక తలిస్తే మీ అందరినీ ఒకే సమాజంగా చేసి ఉండేవాడు. అయితే మీకు వొసగబడిన దానిలో మిమ్మల్ని పరీక్షించాలన్నది ఆయన అభిలాష. కాబట్టి మీరు సత్కార్యాలు చేయటంలో త్వరపడండి. మీరంతా మరలిపోవలసింది అల్లాహ్ వైపుకే. ఆ తరువాత ఆయన, మీరు పరస్పరం విభేదించుకునే విషయాల గురించి మీకు (తన తీర్పు) తెలియజేస్తాడు.
5:49 وَأَنِ احْكُم بَيْنَهُم بِمَا أَنزَلَ اللَّهُ وَلَا تَتَّبِعْ أَهْوَاءَهُمْ وَاحْذَرْهُمْ أَن يَفْتِنُوكَ عَن بَعْضِ مَا أَنزَلَ اللَّهُ إِلَيْكَ ۖ فَإِن تَوَلَّوْا فَاعْلَمْ أَنَّمَا يُرِيدُ اللَّهُ أَن يُصِيبَهُم بِبَعْضِ ذُنُوبِهِمْ ۗ وَإِنَّ كَثِيرًا مِّنَ النَّاسِ لَفَاسِقُونَ
(ఓ ప్రవక్తా!) అల్లాహ్ అవతరింపజేసిన దానికనుగుణంగానే నీవు వారి మధ్య తీర్పు చేయి. వాళ్ళ కోరికలను ఎంత మాత్రం అనుసరించకు. అల్లాహ్ నీ వైపుకు అవతరింపజేసిన ఏదేని ఆజ్ఞ విషయంలో వారు నిన్ను ప్రక్కదారి పట్టించకుండా నీవు చాలా అప్రమత్తంగా ఉండు. ఒకవేళ వారు విముఖత చూపితే, వారు ఒడిగట్టిన కొన్ని పాపాలకుగాను వారికి శిక్ష విధించాలన్నదే అల్లాహ్ సంకల్పం అని తెలుసుకో. ప్రజల్లో చాలా మంది అవిధేయులే ఉంటారు.
5:50 أَفَحُكْمَ الْجَاهِلِيَّةِ يَبْغُونَ ۚ وَمَنْ أَحْسَنُ مِنَ اللَّهِ حُكْمًا لِّقَوْمٍ يُوقِنُونَ
ఏమిటీ, వారు మళ్ళీ అజ్ఞాన (కాల)పు తీర్పు కోరుతున్నారా? నమ్మకం గల వారి కోసం అల్లాహ్ కన్నా ఉత్తమ తీర్పు ఇవ్వగల వాడెవడుంటాడు?
5:51 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَتَّخِذُوا الْيَهُودَ وَالنَّصَارَىٰ أَوْلِيَاءَ ۘ بَعْضُهُمْ أَوْلِيَاءُ بَعْضٍ ۚ وَمَن يَتَوَلَّهُم مِّنكُمْ فَإِنَّهُ مِنْهُمْ ۗ إِنَّ اللَّهَ لَا يَهْدِي الْقَوْمَ الظَّالِمِينَ
ఓ విశ్వసించినవారలారా! యూదులను, నసారాను (అంటే క్రైస్తవులను) స్నేహితులుగా చేసుకోకండి. వారు ఒండొకరికి స్నేహితులు. మీలో ఎవరయినాసరే వారితో చెలిమిచేస్తే అతడు కూడా వారిలో ఒకడుగానే భావించబడతాడు. నిశ్చయంగా దుర్మార్గులకు అల్లాహ్ సన్మార్గం చూపడు.
5:52 فَتَرَى الَّذِينَ فِي قُلُوبِهِم مَّرَضٌ يُسَارِعُونَ فِيهِمْ يَقُولُونَ نَخْشَىٰ أَن تُصِيبَنَا دَائِرَةٌ ۚ فَعَسَى اللَّهُ أَن يَأْتِيَ بِالْفَتْحِ أَوْ أَمْرٍ مِّنْ عِندِهِ فَيُصْبِحُوا عَلَىٰ مَا أَسَرُّوا فِي أَنفُسِهِمْ نَادِمِينَ
మరి హృదయాలలో (కాపట్య) రోగం ఉన్నవారు పదేపదే వారి వైపుకు పరుగెత్తటం నీవు చూస్తావు. అంతేకాదు, “మాపై ఏ ఆపద వచ్చిపడుతుందోనని మేము భయపడుతున్నాము” అని వారంటారు. అయితే త్వరలోనే అల్లాహ్ విజయాన్ని చేకూర్చవచ్చు లేక తనవద్ద నుంచి దేన్నయినా అనుగ్రహించవచ్చు. అప్పుడు వారు తమ ఆంతర్యాల్లో దాచిపెట్టిన విషయాలపై పశ్చాత్తాపపడతారు.
5:53 وَيَقُولُ الَّذِينَ آمَنُوا أَهَٰؤُلَاءِ الَّذِينَ أَقْسَمُوا بِاللَّهِ جَهْدَ أَيْمَانِهِمْ ۙ إِنَّهُمْ لَمَعَكُمْ ۚ حَبِطَتْ أَعْمَالُهُمْ فَأَصْبَحُوا خَاسِرِينَ
విశ్వాసులు (వారి ఈ పరిస్థితిని చూసి), “మేము మీతోనే ఉన్నామని అదేపనిగా అల్లాహ్ పేర కఠోర ప్రమాణాలు చేసి చెప్పింది వీళ్ళేనా?!” అని అంటారు. వీళ్ళ సత్కార్యాలన్నీ వృథా అయ్యాయి. ఆ విధంగా వీరు (ఘోరంగా) నష్టపోయారు.
5:54 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا مَن يَرْتَدَّ مِنكُمْ عَن دِينِهِ فَسَوْفَ يَأْتِي اللَّهُ بِقَوْمٍ يُحِبُّهُمْ وَيُحِبُّونَهُ أَذِلَّةٍ عَلَى الْمُؤْمِنِينَ أَعِزَّةٍ عَلَى الْكَافِرِينَ يُجَاهِدُونَ فِي سَبِيلِ اللَّهِ وَلَا يَخَافُونَ لَوْمَةَ لَائِمٍ ۚ ذَٰلِكَ فَضْلُ اللَّهِ يُؤْتِيهِ مَن يَشَاءُ ۚ وَاللَّهُ وَاسِعٌ عَلِيمٌ
ఓ విశ్వాసులారా! మీలో ఎవరయినాసరే తమ ధర్మం నుంచి తిరిగిపోతే (పోవచ్చు), అల్లాహ్ త్వరలోనే మరో జాతి వారిని తీసుకువస్తాడు. అల్లాహ్ వారిని ప్రేమిస్తాడు, వారు అల్లాహ్‌ను ప్రేమిస్తారు. వారు విశ్వాసుల పట్ల మృదు స్వభావులుగానూ, అవిశ్వాసుల పట్ల కఠినులుగానూ ఉంటారు. వారు అల్లాహ్ మార్గంలో పోరాడుతారు. నిందించేవారి నిందలను వారు ఏమాత్రం పట్టించుకోరు. ఇది అల్లాహ్ అనుగ్రహం. ఆయన తాను కోరిన వారికి దీన్ని ప్రసాదిస్తాడు. అల్లాహ్ విస్తృతి కలవాడు, జ్ఞాన సంపన్నుడు.
5:55 إِنَّمَا وَلِيُّكُمُ اللَّهُ وَرَسُولُهُ وَالَّذِينَ آمَنُوا الَّذِينَ يُقِيمُونَ الصَّلَاةَ وَيُؤْتُونَ الزَّكَاةَ وَهُمْ رَاكِعُونَ
(ముస్లిములారా!) వాస్తవానికి మీ స్నేహితులు అల్లాహ్, ఆయన ప్రవక్త, ఇంకా నమాజును నెలకొల్పే, జకాతును చెల్లించే, రుకూ చేసే (ఆరాధనలో అణకువను కలిగి ఉండే) విశ్వాసులు మాత్రమే.
5:56 وَمَن يَتَوَلَّ اللَّهَ وَرَسُولَهُ وَالَّذِينَ آمَنُوا فَإِنَّ حِزْبَ اللَّهِ هُمُ الْغَالِبُونَ
అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తను, విశ్వాసులను మిత్రులుగా చేసుకున్నవారు, అల్లాహ్ పక్షంవారే విజయం పొందుతారన్న విషయాన్ని తెలుసుకోవాలి.
5:57 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَتَّخِذُوا الَّذِينَ اتَّخَذُوا دِينَكُمْ هُزُوًا وَلَعِبًا مِّنَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ مِن قَبْلِكُمْ وَالْكُفَّارَ أَوْلِيَاءَ ۚ وَاتَّقُوا اللَّهَ إِن كُنتُم مُّؤْمِنِينَ
ఓ విశ్వాసులారా! మీకు పూర్వం గ్రంథం వొసగబడిన వారిలో మీ ధర్మాన్ని నవ్వులాటగా, వినోదంగా చేసుకున్న వారినిగానీ, అవిశ్వాసులనుగానీ మీ స్నేహితులుగా చేసుకోకండి. మీరే గనక నిజమయిన విశ్వాసులైతే అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి.
5:58 وَإِذَا نَادَيْتُمْ إِلَى الصَّلَاةِ اتَّخَذُوهَا هُزُوًا وَلَعِبًا ۚ ذَٰلِكَ بِأَنَّهُمْ قَوْمٌ لَّا يَعْقِلُونَ
మీరు నమాజు కోసం పిలిచినప్పుడు వారు దాన్ని నవ్వులాటగా, తమాషాగా చేసుకుంటారు. ఎందుకంటే వారు బొత్తిగా బుద్ధిలేనివారు.
5:59 قُلْ يَا أَهْلَ الْكِتَابِ هَلْ تَنقِمُونَ مِنَّا إِلَّا أَنْ آمَنَّا بِاللَّهِ وَمَا أُنزِلَ إِلَيْنَا وَمَا أُنزِلَ مِن قَبْلُ وَأَنَّ أَكْثَرَكُمْ فَاسِقُونَ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “ఓ గ్రంథవహులారా!(అంటే ఓ యూదులారా, క్రైస్తవులారా!) మేము అల్లాహ్‌ను, మావైపుకు అవతరింపజేయబడిన దానినీ, దానికి పూర్వం అవతరింపజేయబడిన దానిని విశ్వసిస్తున్నామన్న కారణంతో, ఇంకా మీలో అత్యధికులు అపమార్గాన ఉన్న కారణంతోనే కదా మీరు మాతో వైరవైఖరిని అవలంబిస్తున్నది?”
5:60 قُلْ هَلْ أُنَبِّئُكُم بِشَرٍّ مِّن ذَٰلِكَ مَثُوبَةً عِندَ اللَّهِ ۚ مَن لَّعَنَهُ اللَّهُ وَغَضِبَ عَلَيْهِ وَجَعَلَ مِنْهُمُ الْقِرَدَةَ وَالْخَنَازِيرَ وَعَبَدَ الطَّاغُوتَ ۚ أُولَٰئِكَ شَرٌّ مَّكَانًا وَأَضَلُّ عَن سَوَاءِ السَّبِيلِ
వారికి చెప్పు : “అల్లాహ్ వద్ద దీనికన్నా చెడు ప్రతిఫలం పొందేవారు ఎవరో నేను మీకు తెలుపనా? అల్లాహ్ శాపానికి గురైనవారు, ఆయన ఆగ్రహానికి పాత్రులైనవారు – వారిలో కొందరిని ఆయన కోతులుగా, పందులుగా చేశాడు – ఇంకా మిథ్యా దైవాలను పూజించినవారు. అత్యంత అథమశ్రేణికి చెందినవారు వీరే. రుజుమార్గం నుంచి బహుదూరం వెళ్ళి పోయినవారు కూడా వీరే.
5:61 وَإِذَا جَاءُوكُمْ قَالُوا آمَنَّا وَقَد دَّخَلُوا بِالْكُفْرِ وَهُمْ قَدْ خَرَجُوا بِهِ ۚ وَاللَّهُ أَعْلَمُ بِمَا كَانُوا يَكْتُمُونَ
వారు మీ వద్దకు వచ్చినప్పుడు, “మేము విశ్వసించాము” అని అంటారు. నిజానికి వారు అవిశ్వాసంతోనే వచ్చారు. మరి ఆ అవిశ్వాసంతోనే తిరిగి వెళ్ళిపోయారు. వారు దాచిపెట్టే దాన్ని అల్లాహ్ బాగా ఎరుగు.
5:62 وَتَرَىٰ كَثِيرًا مِّنْهُمْ يُسَارِعُونَ فِي الْإِثْمِ وَالْعُدْوَانِ وَأَكْلِهِمُ السُّحْتَ ۚ لَبِئْسَ مَا كَانُوا يَعْمَلُونَ
వారిలో చాలామందిని నీవు చూస్తావు, వారు పాపకార్యాల వైపుకు, దౌర్జన్యం వైపుకు, అధర్మమయిన సొమ్మును స్వాహా చేయటం వైపుకు ఎగబడుతూ ఉంటారు. వారు చేసే ఈ చేష్టలన్నీ పరమ చెడ్డవి.
5:63 لَوْلَا يَنْهَاهُمُ الرَّبَّانِيُّونَ وَالْأَحْبَارُ عَن قَوْلِهِمُ الْإِثْمَ وَأَكْلِهِمُ السُّحْتَ ۚ لَبِئْسَ مَا كَانُوا يَصْنَعُونَ
వారు ఇలాంటి పాపిష్టిమాటలు చెప్పకుండా, అధర్మమైన సొమ్మును తినకుండా వారి మతాచార్యులు, పండితులు వారిని ఎందుకు ఆపరు? వారు చేస్తున్నది చాలా చెడ్డ పని.
5:64 وَقَالَتِ الْيَهُودُ يَدُ اللَّهِ مَغْلُولَةٌ ۚ غُلَّتْ أَيْدِيهِمْ وَلُعِنُوا بِمَا قَالُوا ۘ بَلْ يَدَاهُ مَبْسُوطَتَانِ يُنفِقُ كَيْفَ يَشَاءُ ۚ وَلَيَزِيدَنَّ كَثِيرًا مِّنْهُم مَّا أُنزِلَ إِلَيْكَ مِن رَّبِّكَ طُغْيَانًا وَكُفْرًا ۚ وَأَلْقَيْنَا بَيْنَهُمُ الْعَدَاوَةَ وَالْبَغْضَاءَ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ ۚ كُلَّمَا أَوْقَدُوا نَارًا لِّلْحَرْبِ أَطْفَأَهَا اللَّهُ ۚ وَيَسْعَوْنَ فِي الْأَرْضِ فَسَادًا ۚ وَاللَّهُ لَا يُحِبُّ الْمُفْسِدِينَ
“అల్లాహ్ చేతులు కట్టివేయబడి ఉన్నాయి” అని యూదులు అన్నారు. నిజానికి వారి చేతులే కట్టివేయబడ్డాయి. వారు అన్న ఈ మాట మూలంగా వారిని శపించటం జరిగింది. నిజానికి అల్లాహ్ చేతులు రెండూ విశాలంగా ఉన్నాయి. తాను తలచుకున్న విధంగా ఆయన ఖర్చుపెడుతున్నాడు. నీపైన నీ ప్రభువు తరఫు నుంచి అవతరించిన సందేశం వారిలోని చాలా మందిలో తలబిరుసుతనాన్ని, తిరస్కారభావాన్నే వృద్ధి చేస్తుంది. ఇంకా, మేము వారి మధ్య ప్రళయదినం వరకూ విరోధం, విద్వేషం ఉండేలా చేశాము. వారు యుద్ధాగ్నిని రాజేసినప్పుడల్లా, అల్లాహ్ దాన్ని ఆర్పివేస్తాడు. వారు భూమిలో కల్లోలాన్ని రేకెత్తిస్తూ తిరుగుతుంటారు. కాగా; అల్లాహ్ కల్లోల జనకులను ఎంతమాత్రం ప్రేమించడు.
5:65 وَلَوْ أَنَّ أَهْلَ الْكِتَابِ آمَنُوا وَاتَّقَوْا لَكَفَّرْنَا عَنْهُمْ سَيِّئَاتِهِمْ وَلَأَدْخَلْنَاهُمْ جَنَّاتِ النَّعِيمِ
ఒకవేళ ఈ గ్రంథవహులే గనక విశ్వసించి, భయభక్తులతో కూడుకున్న (తఖ్వా) విధానాన్ని అవలంబించినట్లయితే, మేము వారి పాపాలన్నింటినీ వారి నుంచి దూరంచేసి, సుఖ సౌఖ్యాలతో కూడుకున్న స్వర్గవనాలలో వారికి తప్పకుండా ప్రవేశం కల్పించేవారము.
5:66 وَلَوْ أَنَّهُمْ أَقَامُوا التَّوْرَاةَ وَالْإِنجِيلَ وَمَا أُنزِلَ إِلَيْهِم مِّن رَّبِّهِمْ لَأَكَلُوا مِن فَوْقِهِمْ وَمِن تَحْتِ أَرْجُلِهِم ۚ مِّنْهُمْ أُمَّةٌ مُّقْتَصِدَةٌ ۖ وَكَثِيرٌ مِّنْهُمْ سَاءَ مَا يَعْمَلُونَ
వారు గనక తౌరాతుకూ, ఇంజీలుకూ, తమ ప్రభువు తరఫున తమ వద్దకు పంపబడిన దానికి కట్టుబడి ఉంటే వారు తమపై నుంచీ, క్రింది నుంచీ పుష్కలంగా ఉపాధిని పొందుతూ, హాయిగా తినేవారు. వారిలో ఒక వర్గం మాత్రం మధ్యేమార్గం అవలంబిస్తుంది. కాని వారిలోని అత్యధికులు చేసే పనులు చాలా చెడ్డవి.
5:67 يَا أَيُّهَا الرَّسُولُ بَلِّغْ مَا أُنزِلَ إِلَيْكَ مِن رَّبِّكَ ۖ وَإِن لَّمْ تَفْعَلْ فَمَا بَلَّغْتَ رِسَالَتَهُ ۚ وَاللَّهُ يَعْصِمُكَ مِنَ النَّاسِ ۗ إِنَّ اللَّهَ لَا يَهْدِي الْقَوْمَ الْكَافِرِينَ
ఓ ప్రవక్తా! నీ ప్రభువు తరఫు నుంచి నీపై అవతరింపజేయబడిన దానిని (ప్రజలకు) అందజెయ్యి. ఒకవేళ నువ్వు గనక ఈ పని చెయ్యకపోతే, దైవప్రవక్తగా నీవు నీ ధర్మాన్ని నిర్వర్తించని వాడవవుతావు. అల్లాహ్ నిన్ను ప్రజల (కీడు) నుంచి కాపాడుతాడు. నిశ్చయంగా అల్లాహ్ తిరస్కారులకు సన్మార్గం చూపడు.
5:68 قُلْ يَا أَهْلَ الْكِتَابِ لَسْتُمْ عَلَىٰ شَيْءٍ حَتَّىٰ تُقِيمُوا التَّوْرَاةَ وَالْإِنجِيلَ وَمَا أُنزِلَ إِلَيْكُم مِّن رَّبِّكُمْ ۗ وَلَيَزِيدَنَّ كَثِيرًا مِّنْهُم مَّا أُنزِلَ إِلَيْكَ مِن رَّبِّكَ طُغْيَانًا وَكُفْرًا ۖ فَلَا تَأْسَ عَلَى الْقَوْمِ الْكَافِرِينَ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “ఓ గ్రంథవహులారా! మీరు తౌరాతునూ, ఇంజీలునూ, మీ ప్రభువు తరఫున మీ వద్దకు పంపబడిన దానినీ (మీ జీవితాలలో) నెలకొల్పనంతవరకూ మీరు ఏ ధర్మంపైనా లేనట్లే.” నీ ప్రభువు తరఫున నీపై అవతరింపజేయబడినది వారిలోని అనేకుల తలబిరుసుతనాన్ని, తిరస్కార వైఖరిని మరింత అధికం చేస్తుంది. కనుక నీవు ఈ తిరస్కారులపై దిగులు చెందకు.
5:69 إِنَّ الَّذِينَ آمَنُوا وَالَّذِينَ هَادُوا وَالصَّابِئُونَ وَالنَّصَارَىٰ مَنْ آمَنَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ وَعَمِلَ صَالِحًا فَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ
ముస్లిములైనా, యూదులైనా, సాబియీలైనా, నసారా (క్రైస్తవులు) అయినా- ఎవరయినా సరే- వారు గనక అల్లాహ్‌ను, అంతిమ దినాన్ని విశ్వసించి, సదాచరణ చేసినట్లయితే వారికెలాంటి భయంగానీ, చింతగానీ ఉండబోదు.
5:70 لَقَدْ أَخَذْنَا مِيثَاقَ بَنِي إِسْرَائِيلَ وَأَرْسَلْنَا إِلَيْهِمْ رُسُلًا ۖ كُلَّمَا جَاءَهُمْ رَسُولٌ بِمَا لَا تَهْوَىٰ أَنفُسُهُمْ فَرِيقًا كَذَّبُوا وَفَرِيقًا يَقْتُلُونَ
మేము ఇస్రాయీలు సంతతి వారి నుండి గట్టి వాగ్దానం తీసుకున్నాము. వారి వద్దకు ప్రవక్తలను పంపాము. కాని వారి మనోభీష్టానికి విరుద్ధమైన ఆదేశాలను ప్రవక్తలు వారి వద్దకు తీసుకువచ్చినప్పుడల్లా వారు ప్రవక్తలలో కొందరిని ధిక్కరించారు, మరికొందరిని హత్య చేస్తూ ఉన్నారు.
5:71 وَحَسِبُوا أَلَّا تَكُونَ فِتْنَةٌ فَعَمُوا وَصَمُّوا ثُمَّ تَابَ اللَّهُ عَلَيْهِمْ ثُمَّ عَمُوا وَصَمُّوا كَثِيرٌ مِّنْهُمْ ۚ وَاللَّهُ بَصِيرٌ بِمَا يَعْمَلُونَ
తమకు ఏ ఉపద్రవమూ సంభవించదని వారు తలపోశారు. ఈ కారణంగా వారు గుడ్డివారుగా, చెవిటివారుగా ప్రవర్తించారు. అయితే ఆ తరువాత అల్లాహ్ వారి పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు. కాని ఆ తరువాత కూడా వారిలో చాలామంది అంధులు, బధిరులు అయిపోయారు. అల్లాహ్ వారి చేష్టలన్నింటినీ చూస్తూనే ఉన్నాడు.
5:72 لَقَدْ كَفَرَ الَّذِينَ قَالُوا إِنَّ اللَّهَ هُوَ الْمَسِيحُ ابْنُ مَرْيَمَ ۖ وَقَالَ الْمَسِيحُ يَا بَنِي إِسْرَائِيلَ اعْبُدُوا اللَّهَ رَبِّي وَرَبَّكُمْ ۖ إِنَّهُ مَن يُشْرِكْ بِاللَّهِ فَقَدْ حَرَّمَ اللَّهُ عَلَيْهِ الْجَنَّةَ وَمَأْوَاهُ النَّارُ ۖ وَمَا لِلظَّالِمِينَ مِنْ أَنصَارٍ
“అల్లాహ్ (అంటే) మర్యమ్ కుమారుడగు మసీహ్యే” అని చెప్పినవారు నిస్సందేహంగా అవిశ్వాసానికి పాల్పడినట్లే. యదార్థానికి మసీహ్ ఖుద్దుగా వారితో ఇలా పలికాడు : “ఓ ఇస్రాయీలు వంశస్థులారా! నాకూ, మీకూ ప్రభువైన అల్లాహ్‌ను మాత్రమే పూజించండి.” ఎవడు అల్లాహ్‌కు సహవర్తులుగా ఇతరులను కల్పించాడో అలాంటి వానికోసం అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించాడని తెలుసుకోండి. అతని నివాసం నరకాగ్ని. దుర్మార్గులకు సహాయపడే వాడెవడూ ఉండడు.
5:73 لَّقَدْ كَفَرَ الَّذِينَ قَالُوا إِنَّ اللَّهَ ثَالِثُ ثَلَاثَةٍ ۘ وَمَا مِنْ إِلَٰهٍ إِلَّا إِلَٰهٌ وَاحِدٌ ۚ وَإِن لَّمْ يَنتَهُوا عَمَّا يَقُولُونَ لَيَمَسَّنَّ الَّذِينَ كَفَرُوا مِنْهُمْ عَذَابٌ أَلِيمٌ
“అల్లాహ్ ముగ్గురిలో మూడవవాడు” అని అన్నవారు కూడా ముమ్మాటికీ తిరస్కారానికి (కుఫ్ర్కు) పాల్పడినట్లే. వాస్తవానికి ఒక్కడైన అల్లాహ్ తప్ప మరో ఆరాధ్య దైవం లేనేలేడు. ఒకవేళ వారు గనక తమ ఈ మాటలను మానుకోకపోతే, వారిలో తిరస్కారవైఖరిపై ఉండే వారికి బాధాకరమైన శిక్ష తప్పకుండా అంటుకుంటుంది.
5:74 أَفَلَا يَتُوبُونَ إِلَى اللَّهِ وَيَسْتَغْفِرُونَهُ ۚ وَاللَّهُ غَفُورٌ رَّحِيمٌ
వారు అల్లాహ్ వైపునకు మరలరా? క్షమాపణ కోసం ఆయన్ని వేడుకోరా? అల్లాహ్ అపారంగా క్షమించేవాడు, అమితంగా కరుణించేవాడు కూడా.
5:75 مَّا الْمَسِيحُ ابْنُ مَرْيَمَ إِلَّا رَسُولٌ قَدْ خَلَتْ مِن قَبْلِهِ الرُّسُلُ وَأُمُّهُ صِدِّيقَةٌ ۖ كَانَا يَأْكُلَانِ الطَّعَامَ ۗ انظُرْ كَيْفَ نُبَيِّنُ لَهُمُ الْآيَاتِ ثُمَّ انظُرْ أَنَّىٰ يُؤْفَكُونَ
మర్యమ్ కుమారుడైన మసీహ్ ఒక ప్రవక్త తప్ప మరేమీ కాడు. ఆయనకు మునుపు కూడా ఎంతోమంది ప్రవక్తలు గతించారు. ఆయన తల్లి సద్వర్తనురాలు. ఆ తల్లీ కొడుకులిరువురూ అన్నం తినేవారే. చూడు, మేము వారి ముందు ఏ విధంగా నిదర్శనాలను విశదీకరిస్తున్నామో! అయినా వారు ఎలా తిరిగి పోతున్నారో చూడు!
5:76 قُلْ أَتَعْبُدُونَ مِن دُونِ اللَّهِ مَا لَا يَمْلِكُ لَكُمْ ضَرًّا وَلَا نَفْعًا ۚ وَاللَّهُ هُوَ السَّمِيعُ الْعَلِيمُ
వారితో ఇలా చెప్పు : ఏమిటీ, మీరు అల్లాహ్‌ను కాదని మీకు నష్టంగానీ, లాభంగానీ చేకూర్చే అధికారంలేని వారిని ఆరాధిస్తున్నారా? అల్లాహ్ మాత్రమే అన్నీ వినేవాడు, సర్వమూ తెలిసినవాడు.
5:77 قُلْ يَا أَهْلَ الْكِتَابِ لَا تَغْلُوا فِي دِينِكُمْ غَيْرَ الْحَقِّ وَلَا تَتَّبِعُوا أَهْوَاءَ قَوْمٍ قَدْ ضَلُّوا مِن قَبْلُ وَأَضَلُّوا كَثِيرًا وَضَلُّوا عَن سَوَاءِ السَّبِيلِ
ఇలా చెప్పేయి : “ఓ గ్రంథవహులారా! మీరు మీ ధర్మంలో అన్యాయంగా హద్దులు మీరకండి. పూర్వం తాము మార్గం నుంచి తప్పడమేగాక, ఎంతో మందిని మార్గం నుంచి తప్పించి రుజుమార్గ భ్రష్టులైనవారి మనోవాంఛలను అనుసరించకండి.”
5:78 لُعِنَ الَّذِينَ كَفَرُوا مِن بَنِي إِسْرَائِيلَ عَلَىٰ لِسَانِ دَاوُودَ وَعِيسَى ابْنِ مَرْيَمَ ۚ ذَٰلِكَ بِمَا عَصَوا وَّكَانُوا يَعْتَدُونَ
ఇస్రాయీలు సంతతిలోని అవిశ్వాసులు దావూదు నోట, మర్యమ్ పుత్రుడైన ఈసా నోట శపించబడ్డారు. ఎందుకంటే వారు అవిధేయతకు పాల్పడేవారు. హద్దుమీరి ప్రవర్తించేవారు.
5:79 كَانُوا لَا يَتَنَاهَوْنَ عَن مُّنكَرٍ فَعَلُوهُ ۚ لَبِئْسَ مَا كَانُوا يَفْعَلُونَ
వారు, తాము చేసే చెడు పనుల నుండి ఒండొకరిని నిరోధించేవారు కారు. వారు చేస్తూ ఉండినది బహుచెడ్డది.
5:80 تَرَىٰ كَثِيرًا مِّنْهُمْ يَتَوَلَّوْنَ الَّذِينَ كَفَرُوا ۚ لَبِئْسَ مَا قَدَّمَتْ لَهُمْ أَنفُسُهُمْ أَن سَخِطَ اللَّهُ عَلَيْهِمْ وَفِي الْعَذَابِ هُمْ خَالِدُونَ
వారిలో చాలామందిని నీవు చూస్తావు, వారు అవిశ్వాసులతో స్నేహసంబంధాలు పెట్టుకుంటారు. వారు తమ స్వయం కోసం ఏదయితే ముందుకు పంపుకున్నారో అది చాలా చెడ్డది. అందుకే అల్లాహ్ వారిపట్ల అప్రసన్నుడయ్యాడు. వారు కలకాలం శిక్షలో పడి ఉంటారు.
5:81 وَلَوْ كَانُوا يُؤْمِنُونَ بِاللَّهِ وَالنَّبِيِّ وَمَا أُنزِلَ إِلَيْهِ مَا اتَّخَذُوهُمْ أَوْلِيَاءَ وَلَٰكِنَّ كَثِيرًا مِّنْهُمْ فَاسِقُونَ
వారికి అల్లాహ్ పట్ల, ప్రవక్త పట్ల, ప్రవక్తపై అవతరింపజేయబడిన దానిపట్ల విశ్వాసమే గనక ఉంటే వారు అవిశ్వాసులను స్నేహితులుగా చేసుకునేవారే కాదు. కాని వారిలో చాలా మంది దైవవిధేయతకు దూరమైపోయారు.
5:82 لَتَجِدَنَّ أَشَدَّ النَّاسِ عَدَاوَةً لِّلَّذِينَ آمَنُوا الْيَهُودَ وَالَّذِينَ أَشْرَكُوا ۖ وَلَتَجِدَنَّ أَقْرَبَهُم مَّوَدَّةً لِّلَّذِينَ آمَنُوا الَّذِينَ قَالُوا إِنَّا نَصَارَىٰ ۚ ذَٰلِكَ بِأَنَّ مِنْهُمْ قِسِّيسِينَ وَرُهْبَانًا وَأَنَّهُمْ لَا يَسْتَكْبِرُونَ
విశ్వాసుల పట్ల శత్రుత్వంలో అందరికన్నా ఎక్కువగా కరడు గట్టినవారు యూదులు మరియు ముష్రిక్కులని నీవు తెలుసుకుంటావు. ఇక విశ్వాసులతో స్నేహం విషయానికి వస్తే “మేము సహాయకులం (నసారా లేక క్రైస్తవులం)” అని చెప్పుకునే వారిని నీవు ఎక్కువ సన్నిహితులుగా చూస్తావు. ఎందుకంటే వారిలో పండితులు, భవబంధాలకు దూరంగా ఉండే మతాచార్యులు ఉన్నారు. ఇంకో విషయం ఏమిటంటే వారు అహంకారం చూపరు.
5:83 وَإِذَا سَمِعُوا مَا أُنزِلَ إِلَى الرَّسُولِ تَرَىٰ أَعْيُنَهُمْ تَفِيضُ مِنَ الدَّمْعِ مِمَّا عَرَفُوا مِنَ الْحَقِّ ۖ يَقُولُونَ رَبَّنَا آمَنَّا فَاكْتُبْنَا مَعَ الشَّاهِدِينَ
ప్రవక్తపై అవతరించిన దానిని వారు విన్నప్పుడు, సత్యాన్ని గ్రహించిన కారణంగా వారి కళ్ళ నుంచి కన్నీరు ప్రవహించటం నీవు గమనిస్తావు. వారిలా అంటారు: “మా ప్రభూ! మేము విశ్వసించాము. కాబట్టి మా పేర్లను కూడా ధృవీకరించేవారితో పాటు వ్రాసుకో.
5:84 وَمَا لَنَا لَا نُؤْمِنُ بِاللَّهِ وَمَا جَاءَنَا مِنَ الْحَقِّ وَنَطْمَعُ أَن يُدْخِلَنَا رَبُّنَا مَعَ الْقَوْمِ الصَّالِحِينَ
“మేము అల్లాహ్‌ను, మా వద్దకు వచ్చిన సత్యాన్ని విశ్వసించకుండా ఉండటానికి ఇక మా వద్ద మిగిలిన సాకు ఏముంది? మా ప్రభువు మమ్మల్ని సజ్జనుల సహచర్యంలో చేరుస్తాడన్న ఆశ మాకుంది.”
5:85 فَأَثَابَهُمُ اللَّهُ بِمَا قَالُوا جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا ۚ وَذَٰلِكَ جَزَاءُ الْمُحْسِنِينَ
వారు ఈ విధంగా పలికినందుకుగాను అల్లాహ్ వారికి క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలను ప్రసాదిస్తాడు. వారందులో కలకాలం ఉంటారు. సజ్జనులకు ఇలాంటి ప్రతిఫలమే లభిస్తుంది.
5:86 وَالَّذِينَ كَفَرُوا وَكَذَّبُوا بِآيَاتِنَا أُولَٰئِكَ أَصْحَابُ الْجَحِيمِ
ఇకపోతే తిరస్కార వైఖరికి పాల్పడి, మా ఆయతులను ధిక్కరించేవారు – వారే నరకవాసులు.
5:87 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تُحَرِّمُوا طَيِّبَاتِ مَا أَحَلَّ اللَّهُ لَكُمْ وَلَا تَعْتَدُوا ۚ إِنَّ اللَّهَ لَا يُحِبُّ الْمُعْتَدِينَ
విశ్వసించిన ఓ ప్రజలారా! అల్లాహ్ మీ కోసం ధర్మసమ్మతం (హలాల్) చేసిన పవిత్రమైన వస్తువులను మీ అంతట మీరుగా నిషేధించుకోకండి. మితిమీరి పోకండి. నిశ్చయంగా అల్లాహ్ మితిమీరి పోయేవారిని ఇష్టపడడు.
5:88 وَكُلُوا مِمَّا رَزَقَكُمُ اللَّهُ حَلَالًا طَيِّبًا ۚ وَاتَّقُوا اللَّهَ الَّذِي أَنتُم بِهِ مُؤْمِنُونَ
అల్లాహ్ మీకు ప్రసాదించిన వాటిలో నుంచి ధర్మసమ్మతమైన, పరిశుద్ధమైన పదార్థాలను భుజించండి. మీరు విశ్వసించే అల్లాహ్‌కు భయపడండి.
5:89 لَا يُؤَاخِذُكُمُ اللَّهُ بِاللَّغْوِ فِي أَيْمَانِكُمْ وَلَٰكِن يُؤَاخِذُكُم بِمَا عَقَّدتُّمُ الْأَيْمَانَ ۖ فَكَفَّارَتُهُ إِطْعَامُ عَشَرَةِ مَسَاكِينَ مِنْ أَوْسَطِ مَا تُطْعِمُونَ أَهْلِيكُمْ أَوْ كِسْوَتُهُمْ أَوْ تَحْرِيرُ رَقَبَةٍ ۖ فَمَن لَّمْ يَجِدْ فَصِيَامُ ثَلَاثَةِ أَيَّامٍ ۚ ذَٰلِكَ كَفَّارَةُ أَيْمَانِكُمْ إِذَا حَلَفْتُمْ ۚ وَاحْفَظُوا أَيْمَانَكُمْ ۚ كَذَٰلِكَ يُبَيِّنُ اللَّهُ لَكُمْ آيَاتِهِ لَعَلَّكُمْ تَشْكُرُونَ
మీరు చేసే అర్థంలేని ప్రమాణాలను గురించి అల్లాహ్ మిమ్మల్ని నిలదీయడు. అయితే మీరు పటిష్టపరచిన ప్రమాణాలను గురించి ఆయన మిమ్మల్ని తప్పకుండా నిలదీస్తాడు. (అటువంటి ప్రమాణభంగానికి మీరు చెల్లించవలసిన) పరిహారం ఏమిటంటే, మీరు మీ ఇంటి వారికి పెట్టే మధ్యరకపు అన్నం పది మంది పేదలకు తినిపించాలి లేదా వారికి బట్టలుపెట్టాలి లేదా ఒక బానిసకో, బానిసరాలికో స్వేచ్ఛనొసగాలి. ఇవేవీ చేయలేనివారు మూడు రోజులపాటు ఉపవాసం పాటించాలి – మీరు ప్రమాణాలు చేసినప్పుడు (వాటిని భంగపరచినందుకు గాను ఇచ్చే) ప్రమాణాల పరిహారం ఇది. అందుకే మీరు ప్రమాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ విధంగా మీరు కృతజ్ఞతాపూర్వకంగా మసలుకునేందుకుగాను అల్లాహ్ మీకోసం తన ఆదేశాలను తేటతెల్లం చేస్తున్నాడు.
5:90 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِنَّمَا الْخَمْرُ وَالْمَيْسِرُ وَالْأَنصَابُ وَالْأَزْلَامُ رِجْسٌ مِّنْ عَمَلِ الشَّيْطَانِ فَاجْتَنِبُوهُ لَعَلَّكُمْ تُفْلِحُونَ
ఓ విశ్వసించిన వారలారా! సారాయి, జూదం, బలిపీఠాలు, జోస్యం కోసం వాడే బాణాలు- ఇవన్నీ పరమ జుగుప్సాకరమైన విషయాలు, షైతాన్ చేష్టలు. కాబట్టి వాటికి దూరంగా ఉండండి. మీరలా చేస్తే సాఫల్యం పొందవచ్చు.
5:91 إِنَّمَا يُرِيدُ الشَّيْطَانُ أَن يُوقِعَ بَيْنَكُمُ الْعَدَاوَةَ وَالْبَغْضَاءَ فِي الْخَمْرِ وَالْمَيْسِرِ وَيَصُدَّكُمْ عَن ذِكْرِ اللَّهِ وَعَنِ الصَّلَاةِ ۖ فَهَلْ أَنتُم مُّنتَهُونَ
సారాయి, జూదాల ద్వారా మీ మధ్య విరోధాన్ని, ద్వేషాన్ని సృజించాలనీ, అల్లాహ్ స్మరణ నుంచీ, నమాజు నుంచీ మిమ్మల్ని దూరంగా ఉంచాలని షైతాను కోరుకుంటున్నాడు. కనుక ఇకనయినా వాటిని మానుకోండి.
5:92 وَأَطِيعُوا اللَّهَ وَأَطِيعُوا الرَّسُولَ وَاحْذَرُوا ۚ فَإِن تَوَلَّيْتُمْ فَاعْلَمُوا أَنَّمَا عَلَىٰ رَسُولِنَا الْبَلَاغُ الْمُبِينُ
అల్లాహ్‌కు విధేయత చూపండి. ఆయన ప్రవక్తకు విధేయత చూపండి. (చెడుల పట్ల) కడు జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీరు గనక విముఖత చూపితే, మా ప్రవక్తపై ఉన్న బాధ్యతల్లా స్పష్టంగా విషయాన్ని అందజేయటం వరకేనని తెలుసుకోండి.
5:93 لَيْسَ عَلَى الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ جُنَاحٌ فِيمَا طَعِمُوا إِذَا مَا اتَّقَوا وَّآمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ ثُمَّ اتَّقَوا وَّآمَنُوا ثُمَّ اتَّقَوا وَّأَحْسَنُوا ۗ وَاللَّهُ يُحِبُّ الْمُحْسِنِينَ
విశ్వసించి, సత్కార్యాలు చేసేవారు (ఇంతకు మునుపు) తిన్నదానికి, తాగినదానికి వారిపై ఎటువంటి పాపం ఉండదు. కాకపోతే వారు ఇక మీదట భయభక్తులతో మెలగాలి, విశ్వసించి మంచిపనులు చెయ్యాలి. మళ్లీ భయభక్తుల వైఖరిని అవలంబించాలి, విశ్వసించాలి. మళ్ళీ అల్లాహ్‌కు భయపడుతూ సద్వర్తనులుగా మసలుకోవాలి. ఇటువంటి సద్వర్తనులనే అల్లాహ్ ప్రేమిస్తాడు.
5:94 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَيَبْلُوَنَّكُمُ اللَّهُ بِشَيْءٍ مِّنَ الصَّيْدِ تَنَالُهُ أَيْدِيكُمْ وَرِمَاحُكُمْ لِيَعْلَمَ اللَّهُ مَن يَخَافُهُ بِالْغَيْبِ ۚ فَمَنِ اعْتَدَىٰ بَعْدَ ذَٰلِكَ فَلَهُ عَذَابٌ أَلِيمٌ
విశ్వాసులారా! మీ చేతులకూ, మీ ఈటెలకూ అందుబాటులో ఉన్న కొన్ని వేట జంతువుల ద్వారా అల్లాహ్ మిమ్మల్ని పరీక్షిస్తాడు, తనను చూడకుండానే తనకు భయపడేవారెవరో తెలుసుకోవాలని. దీని తరువాత కూడా హద్దు మీరి ప్రవర్తించే వారికి వ్యధాభరితమైన శిక్ష ఉంటుంది.
5:95 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَقْتُلُوا الصَّيْدَ وَأَنتُمْ حُرُمٌ ۚ وَمَن قَتَلَهُ مِنكُم مُّتَعَمِّدًا فَجَزَاءٌ مِّثْلُ مَا قَتَلَ مِنَ النَّعَمِ يَحْكُمُ بِهِ ذَوَا عَدْلٍ مِّنكُمْ هَدْيًا بَالِغَ الْكَعْبَةِ أَوْ كَفَّارَةٌ طَعَامُ مَسَاكِينَ أَوْ عَدْلُ ذَٰلِكَ صِيَامًا لِّيَذُوقَ وَبَالَ أَمْرِهِ ۗ عَفَا اللَّهُ عَمَّا سَلَفَ ۚ وَمَنْ عَادَ فَيَنتَقِمُ اللَّهُ مِنْهُ ۗ وَاللَّهُ عَزِيزٌ ذُو انتِقَامٍ
ఓ విశ్వాసులారా! మీరు ఇహ్రాము స్థితిలో ఉన్నప్పుడు వేట జంతువులను చంపకండి. మీలో ఎవరైనా ఉద్దేశ్యపూర్వకంగా దానిని చంపినట్లయితే అతడు తాను చంపిన జంతువుకు సమానమైన జంతువును పరిహారంగా చెల్లించటం అవశ్యం. దానిని మీలోని ఇరువురు న్యాయశీలురు నిర్ణయించాలి. పరిహారంగా యివ్వబడే జంతువును ఖుర్బానీ నిమిత్తం కాబా వద్దకు చేర్చాలి. లేదా ఆ పాపానికి పరిహారంగా కొంతమంది పేదలకు అన్నం పెట్టాలి. లేదా దానికి సమానంగా ఉపవాసం పాటించాలి. తాను పాల్పడిన చేష్టకు ఫలితాన్ని చవిచూసేందుకు (ఈ విధంగా నిర్థారించబడింది). గతంలో జరిగిన దాన్ని అల్లాహ్ మన్నించాడు. ఇకమీదట కూడా ఎవరయినా అలా చేస్తే అల్లాహ్ ప్రతీకారం చేస్తాడు. అల్లాహ్ సర్వాధిక్యుడు, ప్రతీకారం చేసేవాడూను.
5:96 أُحِلَّ لَكُمْ صَيْدُ الْبَحْرِ وَطَعَامُهُ مَتَاعًا لَّكُمْ وَلِلسَّيَّارَةِ ۖ وَحُرِّمَ عَلَيْكُمْ صَيْدُ الْبَرِّ مَا دُمْتُمْ حُرُمًا ۗ وَاتَّقُوا اللَّهَ الَّذِي إِلَيْهِ تُحْشَرُونَ
సముద్రపు జంతువులను వేటాడటం, దాని ఆహారం మీకొరకు ధర్మసమ్మతం గావించబడింది. మీ ప్రయోజనం కోసం, ప్రయాణీకుల కోసం కూడా. అయితే మీరు ఇహ్రాము స్థితిలో ఉన్నంతవరకూ భూమిపై వేటాడటం నిషేధించబడింది. అల్లాహ్‌కు భయపడండి. ఆయన వద్దకే మీరంతా సమీకరించబడతారు.
5:97 جَعَلَ اللَّهُ الْكَعْبَةَ الْبَيْتَ الْحَرَامَ قِيَامًا لِّلنَّاسِ وَالشَّهْرَ الْحَرَامَ وَالْهَدْيَ وَالْقَلَائِدَ ۚ ذَٰلِكَ لِتَعْلَمُوا أَنَّ اللَّهَ يَعْلَمُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ وَأَنَّ اللَّهَ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ
గౌరవప్రద గృహమైన ‘కాబా’ను అల్లాహ్ మానవ మనుగడ సాధనంగా చేశాడు. ఇంకా నిషిద్ధ మాసాన్నీ, హదీ పశువును (హరమ్ క్షేత్రంలో ఖుర్బానీ ఇవ్వబడే జంతువులను), మెడలలో పట్టాలు వేసిన జంతువులను కూడా. ఆకాశాలలో, భూమిలో ఉన్న సమస్త వస్తువుల గురించి అల్లాహ్‌కు తెలుసనీ, ఆయన ప్రతిదీ క్షుణ్ణంగా ఎరిగినవాడన్న సంగతి మీకు తెలియడానికిగాను ఆయన ఇలా చేశాడు.
5:98 اعْلَمُوا أَنَّ اللَّهَ شَدِيدُ الْعِقَابِ وَأَنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ
తెలుసుకోండి! అల్లాహ్ శిక్షించటంలో కఠినుడు. దాంతో పాటు అల్లాహ్ అపారంగా క్షమించేవాడు, కనికరించేవాడు కూడా.
5:99 مَّا عَلَى الرَّسُولِ إِلَّا الْبَلَاغُ ۗ وَاللَّهُ يَعْلَمُ مَا تُبْدُونَ وَمَا تَكْتُمُونَ
సందేశాన్ని అందజేయటం వరకే ప్రవక్త బాధ్యత. మీరు వెల్లడించేదీ, దాచి పెట్టేదీ – అంతా అల్లాహ్‌కు తెలుసు.
5:100 قُل لَّا يَسْتَوِي الْخَبِيثُ وَالطَّيِّبُ وَلَوْ أَعْجَبَكَ كَثْرَةُ الْخَبِيثِ ۚ فَاتَّقُوا اللَّهَ يَا أُولِي الْأَلْبَابِ لَعَلَّكُمْ تُفْلِحُونَ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: అపవిత్రత యొక్క ఆధిక్యత నీకు ఎంత బాగా తోచినప్పటికీ అపవిత్రము – పవిత్రము ఎన్నటికీ సమానం కాలేవు. కనుక ఓ వివేకవంతులారా! అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి, తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు.
5:101 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَسْأَلُوا عَنْ أَشْيَاءَ إِن تُبْدَ لَكُمْ تَسُؤْكُمْ وَإِن تَسْأَلُوا عَنْهَا حِينَ يُنَزَّلُ الْقُرْآنُ تُبْدَ لَكُمْ عَفَا اللَّهُ عَنْهَا ۗ وَاللَّهُ غَفُورٌ حَلِيمٌ
ఓ విశ్వాసులారా! మీకు గనక విడమరచి చెబితే మీకు బాధ కలిగించేటటువంటి విషయాలను గురించి అడగకండి. అయితే ఖుర్ఆన్ అవతరించే సమయంలో మీరు వాటిని గురించి ప్రశ్నిస్తే అవి మీకు విడమరచి చెప్పబడతాయి. ఇంత వరకు వేసిన ప్రశ్నలను అల్లాహ్ మన్నించాడు. అల్లాహ్ అమితంగా క్షమించేవాడు, సహనశీలుడు కూడా.
5:102 قَدْ سَأَلَهَا قَوْمٌ مِّن قَبْلِكُمْ ثُمَّ أَصْبَحُوا بِهَا كَافِرِينَ
మీ పూర్వీకుల్లో కూడా కొందరు ఇలాంటి విషయాలను అడిగారు. మరి ఆ విషయాలను తిరస్కరించింది కూడా వారే.
5:103 مَا جَعَلَ اللَّهُ مِن بَحِيرَةٍ وَلَا سَائِبَةٍ وَلَا وَصِيلَةٍ وَلَا حَامٍ ۙ وَلَٰكِنَّ الَّذِينَ كَفَرُوا يَفْتَرُونَ عَلَى اللَّهِ الْكَذِبَ ۖ وَأَكْثَرُهُمْ لَا يَعْقِلُونَ
అల్లాహ్ ‘బహీరా’ను గానీ, ‘సాయిబా’ను గానీ, ‘వసీలా’ను గానీ, ‘హామ్’ను గానీ ఏర్పరచలేదు. అయినప్పటికీ అవిశ్వాసులు అల్లాహ్‌కు అబద్ధాన్ని అంటగడుతున్నారు. వారిలో చాలా మంది అవివేకులు.
5:104 وَإِذَا قِيلَ لَهُمْ تَعَالَوْا إِلَىٰ مَا أَنزَلَ اللَّهُ وَإِلَى الرَّسُولِ قَالُوا حَسْبُنَا مَا وَجَدْنَا عَلَيْهِ آبَاءَنَا ۚ أَوَلَوْ كَانَ آبَاؤُهُمْ لَا يَعْلَمُونَ شَيْئًا وَلَا يَهْتَدُونَ
“అల్లాహ్ అవతరింపజేసిన ఆదేశాల వైపుకు, ప్రవక్త వైపుకు రండి” అని వారితో అన్నప్పుడు, “మా తాత ముత్తాతలు అవలంబిస్తూ ఉండగా మేము చూసిన విధానమే మాకు చాలు” అని వారంటారు. ఏమిటీ? వారి తాత ముత్తాతలకు ఏమీ తెలీకపోయినప్పటికీ, వారు సన్మార్గంలో నడవనప్పటికీ వీరు వాళ్లనే అనుసరిస్తారా?
5:105 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا عَلَيْكُمْ أَنفُسَكُمْ ۖ لَا يَضُرُّكُم مَّن ضَلَّ إِذَا اهْتَدَيْتُمْ ۚ إِلَى اللَّهِ مَرْجِعُكُمْ جَمِيعًا فَيُنَبِّئُكُم بِمَا كُنتُمْ تَعْمَلُونَ
ఓ విశ్వసించినవారలారా! మీరు మీ గురించి జాగ్రత్త పడండి. మీరు గనక సన్మార్గంలో నడుస్తున్నట్లయితే దారి తప్పిన వారు మీకు ఎలాంటి నష్టం కలిగించజాలరు. మీరంతా అల్లాహ్ వద్దకే మరలిపోవలసి ఉంది. అప్పుడు ఆయన మీరు చేసిన కర్మలన్నింటినీ మీకు తెలుపుతాడు.
5:106 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا شَهَادَةُ بَيْنِكُمْ إِذَا حَضَرَ أَحَدَكُمُ الْمَوْتُ حِينَ الْوَصِيَّةِ اثْنَانِ ذَوَا عَدْلٍ مِّنكُمْ أَوْ آخَرَانِ مِنْ غَيْرِكُمْ إِنْ أَنتُمْ ضَرَبْتُمْ فِي الْأَرْضِ فَأَصَابَتْكُم مُّصِيبَةُ الْمَوْتِ ۚ تَحْبِسُونَهُمَا مِن بَعْدِ الصَّلَاةِ فَيُقْسِمَانِ بِاللَّهِ إِنِ ارْتَبْتُمْ لَا نَشْتَرِي بِهِ ثَمَنًا وَلَوْ كَانَ ذَا قُرْبَىٰ ۙ وَلَا نَكْتُمُ شَهَادَةَ اللَّهِ إِنَّا إِذًا لَّمِنَ الْآثِمِينَ
ఓ విశ్వాసులారా! మీలో ఎవరికయినా మరణ సమయం దగ్గరపడి, అతడు విల్లు చెప్పదలచినప్పుడు మీలోని ఇద్దరు వ్యక్తులు సాక్షులుగా ఉండటం భావ్యం. ఆ ఇద్దరు వ్యక్తులూ ధర్మచింతన గలవారై ఉండాలి. (వారు మీ వారై ఉండాలి). లేదా మీరు ప్రయాణావస్థలో ఉండి, మీకు మరణ విపత్తు దాపురిస్తే అన్యులిద్దరిని కూడా సాక్షులుగా తీసుకోవచ్చు. ఒకవేళ మీకు అనుమానం కలిగితే నమాజు అనంతరం ఆ ఇద్దరినీ ఆపుకోండి. మరి వారిద్దరూ దేవునిపై ప్రమాణం చేసి ఇలా చెప్పాలి: “మేము స్వప్రయోజనం కోసం ప్రమాణాలను అమ్ముకునేవాళ్ళం కాము. (మేము సాక్ష్యమిచ్చే వ్యక్తి) మా బంధువు అయినాసరే (మేము నిష్పక్షపాతంగానే వ్యవహరిస్తాము). అల్లాహ్ యొక్క సాక్ష్యాన్ని మేము దాచి పెట్టము. ఒకవేళ మేమలా చేస్తే ఘోరమైన పాపానికి పాల్పడిన వారమవుతాము.”
5:107 فَإِنْ عُثِرَ عَلَىٰ أَنَّهُمَا اسْتَحَقَّا إِثْمًا فَآخَرَانِ يَقُومَانِ مَقَامَهُمَا مِنَ الَّذِينَ اسْتَحَقَّ عَلَيْهِمُ الْأَوْلَيَانِ فَيُقْسِمَانِ بِاللَّهِ لَشَهَادَتُنَا أَحَقُّ مِن شَهَادَتِهِمَا وَمَا اعْتَدَيْنَا إِنَّا إِذًا لَّمِنَ الظَّالِمِينَ
ఆ తరువాత ఆ ఇద్దరు సాక్షులు ఏదయినా పాపానికి పాల్పడ్డారని తెలిస్తే, ఎవరికి వ్యతిరేకంగానయితే పాపం జరిగిందో వారిలో (మృతునికి) చాలా దగ్గరి వారైన ఇద్దరు వ్యక్తులు ముందుకు వచ్చి ఆ ఇద్దరి స్థానంలో నిలబడి, “వారిద్దరి సాక్ష్యం కన్నా మా సాక్ష్యం ఎక్కువ సత్యబద్ధమైనది. ఈ విషయంలో మేము ఎలాంటి అతిక్రమణకూ పాల్పడటం లేదు. మేమే గనక అలా చేస్తే పరమ దుర్మార్గులమవుతాము” అని అల్లాహ్‌పై ప్రమాణం చేసి చెప్పాలి.
5:108 ذَٰلِكَ أَدْنَىٰ أَن يَأْتُوا بِالشَّهَادَةِ عَلَىٰ وَجْهِهَا أَوْ يَخَافُوا أَن تُرَدَّ أَيْمَانٌ بَعْدَ أَيْمَانِهِمْ ۗ وَاتَّقُوا اللَّهَ وَاسْمَعُوا ۗ وَاللَّهُ لَا يَهْدِي الْقَوْمَ الْفَاسِقِينَ
ఈ పద్ధతివల్ల వారు యథాతథంగా సాక్ష్యమిస్తారనీ, తాము ప్రమాణాలు చేసిన తరువాత ప్రమాణాలు తమకు వ్యతిరేకంగా పరిణమిస్తాయన్న భయం వారికి ఉంటుందని ఆశించబడుతోంది. అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి. వినండి! అల్లాహ్ అవిధేయ జనులకు సన్మార్గం చూపడు.
5:109 يَوْمَ يَجْمَعُ اللَّهُ الرُّسُلَ فَيَقُولُ مَاذَا أُجِبْتُمْ ۖ قَالُوا لَا عِلْمَ لَنَا ۖ إِنَّكَ أَنتَ عَلَّامُ الْغُيُوبِ
ఏ రోజున అల్లాహ్ ప్రవక్తలందరినీ సమావేశపరచి, “మీకు ఏం సమాధానం లభించింది?” అని అడుగుతాడో ఆ రోజు, “మాకేమీ తెలియదు. నిశ్చయంగా రహస్య విషయాల గురించి పరిపూర్ణ జ్ఞానం కలవాడవు నువ్వే” అని వారంటారు.
5:110 إِذْ قَالَ اللَّهُ يَا عِيسَى ابْنَ مَرْيَمَ اذْكُرْ نِعْمَتِي عَلَيْكَ وَعَلَىٰ وَالِدَتِكَ إِذْ أَيَّدتُّكَ بِرُوحِ الْقُدُسِ تُكَلِّمُ النَّاسَ فِي الْمَهْدِ وَكَهْلًا ۖ وَإِذْ عَلَّمْتُكَ الْكِتَابَ وَالْحِكْمَةَ وَالتَّوْرَاةَ وَالْإِنجِيلَ ۖ وَإِذْ تَخْلُقُ مِنَ الطِّينِ كَهَيْئَةِ الطَّيْرِ بِإِذْنِي فَتَنفُخُ فِيهَا فَتَكُونُ طَيْرًا بِإِذْنِي ۖ وَتُبْرِئُ الْأَكْمَهَ وَالْأَبْرَصَ بِإِذْنِي ۖ وَإِذْ تُخْرِجُ الْمَوْتَىٰ بِإِذْنِي ۖ وَإِذْ كَفَفْتُ بَنِي إِسْرَائِيلَ عَنكَ إِذْ جِئْتَهُم بِالْبَيِّنَاتِ فَقَالَ الَّذِينَ كَفَرُوا مِنْهُمْ إِنْ هَٰذَا إِلَّا سِحْرٌ مُّبِينٌ
అప్పుడు అల్లాహ్ ఈ విధంగా అడుగుతాడు : “మర్యమ్ కుమారుడవైన ఓ ఈసా! నేను నీకూ, నీ తల్లికి ప్రసాదించిన అనుగ్రహాన్ని జ్ఞప్తికి తెచ్చుకో. అప్పుడు రూహుల్ ఖుదుస్ ద్వారా నేను నీకు సహాయం చేశాను. నీవు ఊయలలో ఉన్నప్పుడు, పెద్దవాడైన తరువాత కూడా ప్రజలతో మాట్లాడేవాడివి. అప్పుడు నేను నీకు గ్రంథాన్నీ, వివేకాన్నీ తౌరాతునూ, ఇంజీలునూ నేర్పాను. అప్పుడు నీవు నా అనుమతితో, మట్టితో పక్షి ఆకారం లాంటి దాన్ని తయారుచేసి, అందులోకి ఊదగానే నా అనుమతితో అది (నిజంగానే) పక్షి అయిపోయేది. అలాగే నీవు నా అనుమతితో పుట్టుగుడ్డినీ, కుష్టు రోగినీ బాగుచేసేవాడివి. నా అనుమతితో మృతులను లేపి నిలబెట్టే వాడివి. నీవు స్పష్టమైన నిదర్శనాలతో ఇస్రాయీలు వంశీయుల వద్దకు వచ్చినపుడు, ‘ఇది స్పష్టమైన మాయాజాలం తప్ప మరేమీ కాదు’ అని వారిలోని సత్య తిరస్కారులు చెప్పారు. ఆ సమయంలో మేము వారిని నీ నుంచి ఆపాము.
5:111 وَإِذْ أَوْحَيْتُ إِلَى الْحَوَارِيِّينَ أَنْ آمِنُوا بِي وَبِرَسُولِي قَالُوا آمَنَّا وَاشْهَدْ بِأَنَّنَا مُسْلِمُونَ
“మీరు నన్నూ, నా ప్రవక్తనూ విశ్వసించండి” అని నేను హవారీలకు ఆజ్ఞాపించినప్పుడు, “మేము విశ్వసించాము, మేము పూర్తిగా విధేయులమయ్యాము అన్నదానికి నువ్వు సాక్షిగా ఉండు” అని వారన్నారు.
5:112 إِذْ قَالَ الْحَوَارِيُّونَ يَا عِيسَى ابْنَ مَرْيَمَ هَلْ يَسْتَطِيعُ رَبُّكَ أَن يُنَزِّلَ عَلَيْنَا مَائِدَةً مِّنَ السَّمَاءِ ۖ قَالَ اتَّقُوا اللَّهَ إِن كُنتُم مُّؤْمِنِينَ
“మర్యమ్ కుమారుడవైన ఓ ఈసా! నీ ప్రభువు మా కోసం ఆహార పదార్థాలతో నిండిన ఒక పళ్లాన్ని ఆకాశం నుంచి దింపగలడా?” అని హవారీలు అడిగిన సందర్భం జ్ఞాపకం చేసుకోదగినది. అప్పుడు ఈసా, “మీరే గనక విశ్వాసులైతే అల్లాహ్‌కు భయపడండి” అన్నాడు.
5:113 قَالُوا نُرِيدُ أَن نَّأْكُلَ مِنْهَا وَتَطْمَئِنَّ قُلُوبُنَا وَنَعْلَمَ أَن قَدْ صَدَقْتَنَا وَنَكُونَ عَلَيْهَا مِنَ الشَّاهِدِينَ
దానికి వారిలా అన్నారు: “అందులోని ఆహారాన్ని తినాలని, తద్వారా మా మనసులు సంతృప్తి చెందాలనీ, నీవు మాకు చెప్పిన దంతా సత్యమనే నమ్మకం మాలో మరింత పెరగాలనీ, మేము సాక్ష్యమిచ్చేవారం కాగలగాలనీ కోరుకుంటున్నాము.”
5:114 قَالَ عِيسَى ابْنُ مَرْيَمَ اللَّهُمَّ رَبَّنَا أَنزِلْ عَلَيْنَا مَائِدَةً مِّنَ السَّمَاءِ تَكُونُ لَنَا عِيدًا لِّأَوَّلِنَا وَآخِرِنَا وَآيَةً مِّنكَ ۖ وَارْزُقْنَا وَأَنتَ خَيْرُ الرَّازِقِينَ
అప్పుడు మర్యమ్ కుమారుడగు ఈసా ఇలా వేడుకున్నాడు : “ఓ అల్లాహ్! మా ప్రభూ! ఆకాశం నుంచి మాపై ఆహారంతో నిండిన పళ్లాన్ని దించు. అది మా కొరకు, అనగా మాలోని తొలివారు, తుది వారందరికీ సంతోషకరమైన విషయం (పండుగ) కావాలి. ఇంకా నీ తరఫున అది ఒక సూచన కాగలగాలి. నీవు మాకు ఆహారం ప్రసాదించు. నీవు అందరికన్నా శ్రేష్ఠమైన ఆహార ప్రదాతవు.”
5:115 قَالَ اللَّهُ إِنِّي مُنَزِّلُهَا عَلَيْكُمْ ۖ فَمَن يَكْفُرْ بَعْدُ مِنكُمْ فَإِنِّي أُعَذِّبُهُ عَذَابًا لَّا أُعَذِّبُهُ أَحَدًا مِّنَ الْعَالَمِينَ
దానికి అల్లాహ్ ఇలా జవాబిచ్చాడు: “సరే, ఆ ఆహారాన్ని నేను మీపై అవతరింపజేస్తాను. మరి ఆ తరువాత కూడా మీలో ఎవరయినా అవిశ్వాసానికి పాల్పడితే లోకంలో ఎవరికీ విధించనటువంటి శిక్షను వారికి విధిస్తాను.”
5:116 وَإِذْ قَالَ اللَّهُ يَا عِيسَى ابْنَ مَرْيَمَ أَأَنتَ قُلْتَ لِلنَّاسِ اتَّخِذُونِي وَأُمِّيَ إِلَٰهَيْنِ مِن دُونِ اللَّهِ ۖ قَالَ سُبْحَانَكَ مَا يَكُونُ لِي أَنْ أَقُولَ مَا لَيْسَ لِي بِحَقٍّ ۚ إِن كُنتُ قُلْتُهُ فَقَدْ عَلِمْتَهُ ۚ تَعْلَمُ مَا فِي نَفْسِي وَلَا أَعْلَمُ مَا فِي نَفْسِكَ ۚ إِنَّكَ أَنتَ عَلَّامُ الْغُيُوبِ
(ఆ తరువాత) “మర్యమ్ పుత్రుడవైన ఓ ఈసా! అల్లాహ్‌ను వదలి నన్నూ, నా తల్లిని ఆరాధ్య దైవాలుగా చేసుకోండి అని గాని నీవు ప్రజలకు చెప్పావా?” అని అల్లాహ్ (నిలదీసి) అడిగే సందర్భం కూడా స్మరించుకోదగినదే. అప్పుడు ఈసా ఇలా విన్నవించుకుంటారు: “(ఓ అల్లాహ్!) నిన్ను పరమ పవిత్రునిగా భావిస్తున్నాను. ఏ మాటను అనే హక్కు నాకు లేదో అలాంటి మాటను అనటం నాకేమాత్రం తగదు. ఒకవేళ నేను గనక అలాంటిదేదైనా అని ఉంటే అది నీకు తెలిసి ఉండేది. నా మనసులో ఏముందో కూడా నీకు తెలుసు. కాని నీలో ఏముందో నాకు తెలీదు. నిశ్చయంగా నీవు సమస్త గుప్త విషయాలను ఎరిగినవాడవు.
5:117 مَا قُلْتُ لَهُمْ إِلَّا مَا أَمَرْتَنِي بِهِ أَنِ اعْبُدُوا اللَّهَ رَبِّي وَرَبَّكُمْ ۚ وَكُنتُ عَلَيْهِمْ شَهِيدًا مَّا دُمْتُ فِيهِمْ ۖ فَلَمَّا تَوَفَّيْتَنِي كُنتَ أَنتَ الرَّقِيبَ عَلَيْهِمْ ۚ وَأَنتَ عَلَىٰ كُلِّ شَيْءٍ شَهِيدٌ
‘నా ప్రభువూ, మీ ప్రభువూ అయిన అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించండి’ అని నీవు చెప్పమని ఆజ్ఞాపించిన విషయం తప్ప మరో మాటను నేను వారికి చెప్పలేదు. నేను వారిమధ్య ఉన్నంత కాలం వారిపై సాక్షిగా ఉన్నాను. నీవు నన్ను పైకి లేపుకున్న తరువాత నువ్వే వారిని కనిపెట్టుకుని ఉన్నావు. వాస్తవానికి అన్ని విషయాలను కనిపెట్టుకుని ఉండేవాడవు నువ్వే.
5:118 إِن تُعَذِّبْهُمْ فَإِنَّهُمْ عِبَادُكَ ۖ وَإِن تَغْفِرْ لَهُمْ فَإِنَّكَ أَنتَ الْعَزِيزُ الْحَكِيمُ
“ఒకవేళ నీవు వారిని శిక్షించినట్లయితే వారు నీ దాసులు. నీవు గనక వారిని క్షమించినట్లయితే నిశ్చయంగా నీవు సర్వాధిక్యుడవు, వివేచనాపరుడవు.”
5:119 قَالَ اللَّهُ هَٰذَا يَوْمُ يَنفَعُ الصَّادِقِينَ صِدْقُهُمْ ۚ لَهُمْ جَنَّاتٌ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا أَبَدًا ۚ رَّضِيَ اللَّهُ عَنْهُمْ وَرَضُوا عَنْهُ ۚ ذَٰلِكَ الْفَوْزُ الْعَظِيمُ
అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తాడు: “ఈ రోజు సత్యవంతులకు వారి సత్యం ప్రయోజనకరమవుతుంది. క్రింద కాలువలు ప్రవహించే (స్వర్గ) వనాలు వారికి ప్రాప్తిస్తాయి. అందులో వారు కలకాలం ఉంటారు. అల్లాహ్ వారి పట్ల ప్రసన్నుడయ్యాడు. వారు అల్లాహ్ పట్ల సంతుష్టులయ్యారు. వాస్తవానికి గొప్ప సాఫల్యమంటే ఇదే.
5:120 لِلَّهِ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا فِيهِنَّ ۚ وَهُوَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
ఆకాశాలు, భూమి, ఇంకా వాటిలో ఉన్న సమస్త వస్తువుల ఆధిపత్యం అల్లాహ్‌దే. ఆయన అన్నింటిపై అధికారం కలవాడు.
- సూరా అల్ అన్ ఆమ్
6:1 الْحَمْدُ لِلَّهِ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ وَجَعَلَ الظُّلُمَاتِ وَالنُّورَ ۖ ثُمَّ الَّذِينَ كَفَرُوا بِرَبِّهِمْ يَعْدِلُونَ
ప్రశంసలు, పొగడ్తలన్నీ భూమ్యాకాశాలను పుట్టించిన అల్లాహ్‌కు మాత్రమే శోభిస్తాయి. మరి ఆయనే చీకట్లనూ, వెలుగునూ తయారు చేశాడు. అయినప్పటికీ అవిశ్వాసులు (ఇతరులను) తమ ప్రభువుకు సమానులుగా నిలబెడుతున్నారు.
6:2 هُوَ الَّذِي خَلَقَكُم مِّن طِينٍ ثُمَّ قَضَىٰ أَجَلًا ۖ وَأَجَلٌ مُّسَمًّى عِندَهُ ۖ ثُمَّ أَنتُمْ تَمْتَرُونَ
ఆయనే మిమ్మల్ని మట్టితో చేశాడు. ఆపైన ఒక గడువును నిర్థారించాడు. మరో నిర్ణీత గడువు మాత్రం అల్లాహ్ వద్దనే ఉంది. అయినా మీరు సంశయానికి లోనై ఉన్నారు!
6:3 وَهُوَ اللَّهُ فِي السَّمَاوَاتِ وَفِي الْأَرْضِ ۖ يَعْلَمُ سِرَّكُمْ وَجَهْرَكُمْ وَيَعْلَمُ مَا تَكْسِبُونَ
ఆకాశాలలోనూ, భూమిలోనూ నిజదైవం ఆయనే. మీరు దాచిపెట్టేదీ, పైకి వ్యక్తపరచేదీ – అంతా ఆయనకు తెలుసు. మీరు చేసే పనులన్నీ ఆయనకు ఎరుకే.
6:4 وَمَا تَأْتِيهِم مِّنْ آيَةٍ مِّنْ آيَاتِ رَبِّهِمْ إِلَّا كَانُوا عَنْهَا مُعْرِضِينَ
వారి వద్దకు వారి ప్రభువు సూచనలలో నుంచి ఏ సూచన వచ్చినా దానిపట్ల వారు విముఖతే చూపుతున్నారు.
6:5 فَقَدْ كَذَّبُوا بِالْحَقِّ لَمَّا جَاءَهُمْ ۖ فَسَوْفَ يَأْتِيهِمْ أَنبَاءُ مَا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ
తమ వద్దకు వచ్చిన ఈ సత్య గ్రంథాన్ని కూడా వారు అసత్యమని త్రోసిపుచ్చారు. కాబట్టి దేనిపట్ల వారు పరిహాసమాడేవారో దానికి సంబంధించిన వార్తలు వారికి త్వరలోనే అందుతాయి.
6:6 أَلَمْ يَرَوْا كَمْ أَهْلَكْنَا مِن قَبْلِهِم مِّن قَرْنٍ مَّكَّنَّاهُمْ فِي الْأَرْضِ مَا لَمْ نُمَكِّن لَّكُمْ وَأَرْسَلْنَا السَّمَاءَ عَلَيْهِم مِّدْرَارًا وَجَعَلْنَا الْأَنْهَارَ تَجْرِي مِن تَحْتِهِمْ فَأَهْلَكْنَاهُم بِذُنُوبِهِمْ وَأَنشَأْنَا مِن بَعْدِهِمْ قَرْنًا آخَرِينَ
ఏమిటీ, మేము వీళ్ళకు పూర్వం ఎన్ని సముదాయాలను నాశనం చేశామో వీరు చూడలేదా? ప్రపంచంలో మీకు ప్రసాదించని బలిమిని మేము ఆ సముదాయాల వారికి ప్రసాదించాము. వారి కోసం మేము ధారాపాతంగా వర్షాన్ని కురిపించాము. వారి కోసం క్రింది నుంచి కాలువల్ని ప్రవహింపజేశాము. కాని వారి పాపాల మూలంగా మేము వారిని తుద ముట్టించాము. వారి తరువాత ఇతర సముదాయాలను ప్రభవింపజేశాము.
6:7 وَلَوْ نَزَّلْنَا عَلَيْكَ كِتَابًا فِي قِرْطَاسٍ فَلَمَسُوهُ بِأَيْدِيهِمْ لَقَالَ الَّذِينَ كَفَرُوا إِنْ هَٰذَا إِلَّا سِحْرٌ مُّبِينٌ
(ఓ ప్రవక్తా!) ఒకవేళ కాగితంపై లిఖించబడివున్న సందేశాన్నే మేము నీపై అవతరింపజేసినా, మరి వీళ్లు తమ స్వహస్తాలతో దానిని తాకినా, “ఇది స్పష్టమైన మాయాజాలం తప్ప మరేమీ కాదు” అనే అంటారు అవిశ్వాసులు.
6:8 وَقَالُوا لَوْلَا أُنزِلَ عَلَيْهِ مَلَكٌ ۖ وَلَوْ أَنزَلْنَا مَلَكًا لَّقُضِيَ الْأَمْرُ ثُمَّ لَا يُنظَرُونَ
“ఈయన వద్దకు ఒక దైవదూత ఎందుకు అవతరింపజేయబడలేదు?” అని వారు అంటున్నారు. మేమే గనక దూతను పంపి ఉంటే ఈ పాటికి వ్యవహారం ముగిసి ఉండేది. తర్వాత వీళ్ళకు కొద్దిపాటి గడువు కూడా ఇవ్వబడేది కాదు.
6:9 وَلَوْ جَعَلْنَاهُ مَلَكًا لَّجَعَلْنَاهُ رَجُلًا وَلَلَبَسْنَا عَلَيْهِم مَّا يَلْبِسُونَ
ఒకవేళ మేము దూతను పంపినా, అతన్ని మనిషిగానే చేసి ఉండేవారము. అప్పుడు మేము గైకొన్న ఈ చర్యవల్ల వారు ప్రస్తుతం ఏ సందేహానికి లోనై ఉన్నారో మళ్లీ అదే సందేహానికి లోనయ్యేవారు.
6:10 وَلَقَدِ اسْتُهْزِئَ بِرُسُلٍ مِّن قَبْلِكَ فَحَاقَ بِالَّذِينَ سَخِرُوا مِنْهُم مَّا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ
(ఓ ప్రవక్తా!) నీకు పూర్వం కూడా చాలామంది ప్రవక్తలు పరిహసించబడ్డారు. మరి ఆ పరిహాసమాడేవారిని, వారు పరిహసిస్తూ వచ్చిన ఆపదే చుట్టుముట్టింది.
6:11 قُلْ سِيرُوا فِي الْأَرْضِ ثُمَّ انظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُكَذِّبِينَ
‘కాస్త భూమిలో సంచరించి, (సత్యాన్ని) ధిక్కరించేవారికి ఏ గతి పట్టిందో చూడండి’ అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు.
6:12 قُل لِّمَن مَّا فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ قُل لِّلَّهِ ۚ كَتَبَ عَلَىٰ نَفْسِهِ الرَّحْمَةَ ۚ لَيَجْمَعَنَّكُمْ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ لَا رَيْبَ فِيهِ ۚ الَّذِينَ خَسِرُوا أَنفُسَهُمْ فَهُمْ لَا يُؤْمِنُونَ
“ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్నదంతా ఎవరిది?” అని వారిని అడుగు. వారికి చెప్పు: “సమస్తమూ అల్లాహ్‌దే.” కనికరించటాన్ని అల్లాహ్ తన కోసం అవశ్యం చేసుకున్నాడు. అల్లాహ్ ప్రళయదినాన మిమ్మల్నందరినీ సమీకరిస్తాడు. ఇందులో ఎలాంటి సందేహానికీ తావులేదు. కాని తమను తాము నష్టంలో పడవేసుకున్నవారు మాత్రం విశ్వసించరు.
6:13 وَلَهُ مَا سَكَنَ فِي اللَّيْلِ وَالنَّهَارِ ۚ وَهُوَ السَّمِيعُ الْعَلِيمُ
రాత్రిపూట, పగటివేళ విశ్రమిస్తూ ఉండేదంతా అల్లాహ్‌దే. ఆయన సర్వం వినేవాడు, సర్వం తెలిసినవాడు.
6:14 قُلْ أَغَيْرَ اللَّهِ أَتَّخِذُ وَلِيًّا فَاطِرِ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَهُوَ يُطْعِمُ وَلَا يُطْعَمُ ۗ قُلْ إِنِّي أُمِرْتُ أَنْ أَكُونَ أَوَّلَ مَنْ أَسْلَمَ ۖ وَلَا تَكُونَنَّ مِنَ الْمُشْرِكِينَ
“ఆకాశాలను, భూమినీ సృష్టించినవాడు, అందరికీ తినిపించేవాడూ, ఎవరి నుండి కూడా ఆహారం పుచ్చుకోనివాడూ అయిన అల్లాహ్‌ను వదలి నేను వేరొకరిని ఆరాధ్యునిగా చేసుకోవాలా?” అని ఓ ప్రవక్తా! వారిని అడుగు. ”అందరికంటే ముందు నేను ఇస్లాం స్వీకరించాలని నాకు ఆదేశించబడింది” అని నీవు వారికి తెలియజెయ్యి. “ఎట్టి పరిస్థితుల్లోనూ నీవు బహుదైవారాధకులలో చేరిపోకూడదు” (అని కూడా నాకు ఆదేశించబడిందని చెప్పు).
6:15 قُلْ إِنِّي أَخَافُ إِنْ عَصَيْتُ رَبِّي عَذَابَ يَوْمٍ عَظِيمٍ
“నేనే గనక నా ప్రభువు ఆజ్ఞను శిరసావహించకపోతే ఒకానొక మహాదినాన నాకు శిక్ష పడుతుందని నేను భయపడుతున్నాను” అని (కూడా) వారికి చెప్పు.
6:16 مَّن يُصْرَفْ عَنْهُ يَوْمَئِذٍ فَقَدْ رَحِمَهُ ۚ وَذَٰلِكَ الْفَوْزُ الْمُبِينُ
ఆ రోజు ఎవరిపై నుంచి ఆ శిక్ష తొలగించబడుతుందో ఆ వ్యక్తిని అల్లాహ్ అపారంగా కరుణించినట్లే. అదే స్పష్టమైన విజయం.
6:17 وَإِن يَمْسَسْكَ اللَّهُ بِضُرٍّ فَلَا كَاشِفَ لَهُ إِلَّا هُوَ ۖ وَإِن يَمْسَسْكَ بِخَيْرٍ فَهُوَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
ఒకవేళ అల్లాహ్ నిన్ను ఏదన్నా బాధకు గురిచేస్తే, ఆయన తప్ప మరెవరూ దాన్ని దూరం చేయలేరు. ఒకవేళ ఆయన నీకు ఏదన్నా మేలు చేస్తే, ఆయన అన్నింటిపై అధికారం కలవాడు.
6:18 وَهُوَ الْقَاهِرُ فَوْقَ عِبَادِهِ ۚ وَهُوَ الْحَكِيمُ الْخَبِيرُ
తన దాసులపై తిరుగులేని ఆధిపత్యం, అధికారం గలవాడు ఆయనే. ఆయన అత్యంత వివేచనాపరుడు, అన్నీ తెలిసినవాడు.
6:19 قُلْ أَيُّ شَيْءٍ أَكْبَرُ شَهَادَةً ۖ قُلِ اللَّهُ ۖ شَهِيدٌ بَيْنِي وَبَيْنَكُمْ ۚ وَأُوحِيَ إِلَيَّ هَٰذَا الْقُرْآنُ لِأُنذِرَكُم بِهِ وَمَن بَلَغَ ۚ أَئِنَّكُمْ لَتَشْهَدُونَ أَنَّ مَعَ اللَّهِ آلِهَةً أُخْرَىٰ ۚ قُل لَّا أَشْهَدُ ۚ قُلْ إِنَّمَا هُوَ إِلَٰهٌ وَاحِدٌ وَإِنَّنِي بَرِيءٌ مِّمَّا تُشْرِكُونَ
“అందరికన్నా గొప్ప సాక్ష్యం ఎవరిది?” అని వారిని అడుగు. “నాకూ- మీకూ మధ్య సాక్షిగా అల్లాహ్ ఉన్నాడు. ఈ ఖుర్ఆను ద్వారా నేను మిమ్మల్నీ, ఇది ఎవరెవరి వరకు చేరుతుందో వారందరినీ హెచ్చరించటానికి గాను ఈ ఖుర్ఆన్ నా వద్దకు వహీ ద్వారా పంపబడింది” అని (ఓ ప్రవక్తా!) వారికి తెలియపరచు. అల్లాహ్‌తోపాటు మరి కొంతమంది దేవుళ్లు కూడా ఉన్నారని మీరు నిజంగా సాక్ష్యం ఇవ్వగలరా? “నేను మాత్రం అలాంటి సాక్ష్యం (ఇవ్వనుగాక) ఇవ్వను” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు. “ఆయనే ఒకే ఒక్కడైన ఆరాధ్య దేవుడు. మీరు దైవానికి కల్పించే షిర్క్ (భాగస్వామ్యం)తో నాకెలాంటి సంబంధం లేదు” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పెయ్యి.
6:20 الَّذِينَ آتَيْنَاهُمُ الْكِتَابَ يَعْرِفُونَهُ كَمَا يَعْرِفُونَ أَبْنَاءَهُمُ ۘ الَّذِينَ خَسِرُوا أَنفُسَهُمْ فَهُمْ لَا يُؤْمِنُونَ
ఎవరికయితే మేము గ్రంథాన్ని వొసగి ఉన్నామో వారు తమ కన్న కొడుకులను గుర్తుపట్టినట్లే ప్రవక్తను గుర్తుపడతారు. అయితే తమను తాము నష్టంలో పడవేసుకున్నవారు మాత్రం విశ్వసించరు.
6:21 وَمَنْ أَظْلَمُ مِمَّنِ افْتَرَىٰ عَلَى اللَّهِ كَذِبًا أَوْ كَذَّبَ بِآيَاتِهِ ۗ إِنَّهُ لَا يُفْلِحُ الظَّالِمُونَ
అల్లాహ్‌పై అబద్ధపు నిందలు మోపే వాడికంటే లేదా అల్లాహ్ ఆయతులను అసత్యాలని త్రోసిపుచ్చే వాడికంటే ఎక్కువ దుర్మార్గుడెవడుంటాడు? ఇలాంటి దుర్మార్గులకు ఎన్నటికీ సాఫల్యం ప్రాప్తించదు.
6:22 وَيَوْمَ نَحْشُرُهُمْ جَمِيعًا ثُمَّ نَقُولُ لِلَّذِينَ أَشْرَكُوا أَيْنَ شُرَكَاؤُكُمُ الَّذِينَ كُنتُمْ تَزْعُمُونَ
మేము వారందరినీ సమీకరించే రోజున, “మీరు ఆరాధ్య దైవాలుగా చేసుకున్న మీ భాగస్వాములు ఏరి?” అని ముష్రిక్కులను మేము అడిగే సందర్భం కూడా జ్ఞాపకం చేసుకోదగినదే.
6:23 ثُمَّ لَمْ تَكُن فِتْنَتُهُمْ إِلَّا أَن قَالُوا وَاللَّهِ رَبِّنَا مَا كُنَّا مُشْرِكِينَ
అప్పుడు వారు, “మా ప్రభువైన అల్లాహ్ సాక్షి! మేము ముష్రిక్కులము కానేకాము” అని పలకటం తప్ప వారి షిర్కుకు మరే ఫలితమూ ఉండదు.
6:24 انظُرْ كَيْفَ كَذَبُوا عَلَىٰ أَنفُسِهِمْ ۚ وَضَلَّ عَنْهُم مَّا كَانُوا يَفْتَرُونَ
చూడు! వారు తమ గురించి తాము ఎలా అబద్ధం చెప్పుకుంటారో. వారు కల్పించుకుంటూ ఉండినవన్నీ వారినుండి మటుమాయమై పోతాయి.
6:25 وَمِنْهُم مَّن يَسْتَمِعُ إِلَيْكَ ۖ وَجَعَلْنَا عَلَىٰ قُلُوبِهِمْ أَكِنَّةً أَن يَفْقَهُوهُ وَفِي آذَانِهِمْ وَقْرًا ۚ وَإِن يَرَوْا كُلَّ آيَةٍ لَّا يُؤْمِنُوا بِهَا ۚ حَتَّىٰ إِذَا جَاءُوكَ يُجَادِلُونَكَ يَقُولُ الَّذِينَ كَفَرُوا إِنْ هَٰذَا إِلَّا أَسَاطِيرُ الْأَوَّلِينَ
వారిలో కొంతమంది నీ వైపు చెవి యొగ్గి ఉంటారు. మేము వారి హృదయాలపై తెరవేసి ఉంచాము. అందువల్ల వారు దానిని అర్థం చేసుకోలేరు. వారి చెవులలో చెవుడును ఉంచాము. (ఈ కారణంగా) వారు నిదర్శనాలన్నింటినీ చూసినప్పటికీ వాటిని విశ్వసించరు. ఆఖరికి వారు నీ వద్దకు వచ్చినపుడు అనవసరంగా నీతో వాదనకు దిగుతారు. అవిశ్వాసులు “ఇవి పూర్వీకుల నుంచీ చెలామణీలో ఉన్న కట్టుకథలు తప్ప మరేమీ కావు” అని అంటారు.
6:26 وَهُمْ يَنْهَوْنَ عَنْهُ وَيَنْأَوْنَ عَنْهُ ۖ وَإِن يُهْلِكُونَ إِلَّا أَنفُسَهُمْ وَمَا يَشْعُرُونَ
వాళ్లు దాన్నుంచి ఇతరులను ఆపటమే గాకుండా, స్వయంగా వాళ్లు కూడా దానికి దూరంగా ఉంటున్నారు. వాస్తవానికి వారు తమను మాత్రమే నాశనం చేసుకుంటున్నారు. కాని వారికి ఆ స్పృహే లేదు.
6:27 وَلَوْ تَرَىٰ إِذْ وُقِفُوا عَلَى النَّارِ فَقَالُوا يَا لَيْتَنَا نُرَدُّ وَلَا نُكَذِّبَ بِآيَاتِ رَبِّنَا وَنَكُونَ مِنَ الْمُؤْمِنِينَ
నరకం దగ్గర వారు నిలబెట్టబడినప్పుడు నీవు వారిని చూస్తే (ఎంత బావుండు!) – “అయ్యో! మేము మళ్లీ తిరిగి పంపబడితే బావుండునే! అదే గనక జరిగితే మేము మా ప్రభువు సూచనలను తిరస్కరించము. ఇంకా మేము విశ్వాసులలో చేరిపోతాము!” అని (ఆ సమయంలో) వారు పలుకుతారు.
6:28 بَلْ بَدَا لَهُم مَّا كَانُوا يُخْفُونَ مِن قَبْلُ ۖ وَلَوْ رُدُّوا لَعَادُوا لِمَا نُهُوا عَنْهُ وَإِنَّهُمْ لَكَاذِبُونَ
అసలు విషయం అది కాదు. వారు అంతకుముందు దేన్నయితే కప్పిపుచ్చేవారో అది వారి ముందు బహిర్గతం అయింది. ఒకవేళ వారు తిరిగి పంపబడినప్పటికీ, తమకు వారించబడిన పనులన్నీ మళ్లీ చేస్తారు. ముమ్మాటికీ వాళ్లు అబద్ధాలకోరులు.
6:29 وَقَالُوا إِنْ هِيَ إِلَّا حَيَاتُنَا الدُّنْيَا وَمَا نَحْنُ بِمَبْعُوثِينَ
“ఈ ప్రాపంచిక జీవితమే అసలు జీవితం. మళ్లీ మనం బ్రతికించబడటం అనేది కల్ల” అని వారు చెబుతున్నారు.
6:30 وَلَوْ تَرَىٰ إِذْ وُقِفُوا عَلَىٰ رَبِّهِمْ ۚ قَالَ أَلَيْسَ هَٰذَا بِالْحَقِّ ۚ قَالُوا بَلَىٰ وَرَبِّنَا ۚ قَالَ فَذُوقُوا الْعَذَابَ بِمَا كُنتُمْ تَكْفُرُونَ
వారు తమ ప్రభువు ఎదుట నిలబెట్టబడిన దృశ్యాన్ని నీవు చూస్తే (బావుండేది). “ఇది నిజం కాదా?!” అని అల్లాహ్ అడుగుతాడు. దానికి వారు “ఎందుకు నిజం కాదు? మా ప్రభువు సాక్షిగా (ఇది నిజమే)!” అని అంటారు. “మరయితే మీ తిరస్కారానికి బదులుగా శిక్షను చవిచూడండి” అని అల్లాహ్ సెలవిస్తాడు.
6:31 قَدْ خَسِرَ الَّذِينَ كَذَّبُوا بِلِقَاءِ اللَّهِ ۖ حَتَّىٰ إِذَا جَاءَتْهُمُ السَّاعَةُ بَغْتَةً قَالُوا يَا حَسْرَتَنَا عَلَىٰ مَا فَرَّطْنَا فِيهَا وَهُمْ يَحْمِلُونَ أَوْزَارَهُمْ عَلَىٰ ظُهُورِهِمْ ۚ أَلَا سَاءَ مَا يَزِرُونَ
అల్లాహ్‌ను కలుసుకోవలసి ఉందనే విషయాన్ని ధిక్కరించినవారు నిశ్చయంగా నష్టానికి గురయ్యారు. ఆఖరికి ఆ నిర్థారిత సమయం అకస్మాత్తుగా వచ్చిపడినప్పుడు, “అయ్యో! ఈ విషయాన్ని మేము ఎంత నిర్లక్ష్యం చేశాం!” అని బాధపడతారు. వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందంటే, వారు తమ బరువులను తమ వీపులపై మోస్తూ ఉంటారు. తెలుసుకోండి! వారు మోసే బరువు చాలా చెడ్డది.
6:32 وَمَا الْحَيَاةُ الدُّنْيَا إِلَّا لَعِبٌ وَلَهْوٌ ۖ وَلَلدَّارُ الْآخِرَةُ خَيْرٌ لِّلَّذِينَ يَتَّقُونَ ۗ أَفَلَا تَعْقِلُونَ
ప్రాపంచిక జీవితం ఆట, తమాషా తప్ప మరేమీ కాదు. అయితే భయభక్తులు కలవారి కోసం పరలోక నిలయం ఎంతో మేలైనది. ఏమిటీ, మీరు బొత్తిగా బుద్ధిని ఉపయోగించరా?
6:33 قَدْ نَعْلَمُ إِنَّهُ لَيَحْزُنُكَ الَّذِي يَقُولُونَ ۖ فَإِنَّهُمْ لَا يُكَذِّبُونَكَ وَلَٰكِنَّ الظَّالِمِينَ بِآيَاتِ اللَّهِ يَجْحَدُونَ
(ఓ ప్రవక్తా!) వాళ్లు అనే మాటలు నిన్ను దుఃఖానికి గురి చేస్తున్నాయన్న సంగతి మాకు బాగా తెలుసు. వారు ధిక్కరిస్తున్నది నిన్ను కాదు, నిజానికి ఈ దుర్మార్గులు అల్లాహ్ ఆయతులను తిరస్కరిస్తున్నారు.
6:34 وَلَقَدْ كُذِّبَتْ رُسُلٌ مِّن قَبْلِكَ فَصَبَرُوا عَلَىٰ مَا كُذِّبُوا وَأُوذُوا حَتَّىٰ أَتَاهُمْ نَصْرُنَا ۚ وَلَا مُبَدِّلَ لِكَلِمَاتِ اللَّهِ ۚ وَلَقَدْ جَاءَكَ مِن نَّبَإِ الْمُرْسَلِينَ
నీకు పూర్వం కూడా చాలామంది ప్రవక్తలు ధిక్కరించబడ్డారు. అయితే వారు (ప్రజల) ధిక్కారవైఖరికి, తమకు పెట్టబడిన బాధలకు సహనం వహించారు. కడకు వారికి మా సహాయం అందింది. అల్లాహ్ వాక్కులను మార్చేవాడు ఎవడూ లేడు. కొంతమంది ప్రవక్తలకు సంబంధించిన కొన్ని విషయాలు ఇప్పటికే నీ వద్దకు చేరాయి.
6:35 وَإِن كَانَ كَبُرَ عَلَيْكَ إِعْرَاضُهُمْ فَإِنِ اسْتَطَعْتَ أَن تَبْتَغِيَ نَفَقًا فِي الْأَرْضِ أَوْ سُلَّمًا فِي السَّمَاءِ فَتَأْتِيَهُم بِآيَةٍ ۚ وَلَوْ شَاءَ اللَّهُ لَجَمَعَهُمْ عَلَى الْهُدَىٰ ۚ فَلَا تَكُونَنَّ مِنَ الْجَاهِلِينَ
ఒకవేళ వారి వైముఖ్యం (ఓ ముహమ్మద్! (స) నీకు సహించరానిదిగా ఉంటే (నీవే దానికి ఏదైనా ఉపాయం ఆలోచించు). నీకే గనక శక్తి ఉంటే భూమిలో ఏదైనా సొరంగం లేదా ఆకాశంలో ఏదైనా నిచ్చెనను వెతికి వారి కోసం ఏదైనా మహిమ తేగలిగితే తెచ్చుకో. అల్లాహ్‌యే గనక తలచుకుంటే వారందరినీ సన్మార్గంపై సమీకరించి ఉండేవాడే. కనుక (ఓ ప్రవక్తా!) నువ్వు అవివేకుల్లో చేరిపోకు.
6:36 إِنَّمَا يَسْتَجِيبُ الَّذِينَ يَسْمَعُونَ ۘ وَالْمَوْتَىٰ يَبْعَثُهُمُ اللَّهُ ثُمَّ إِلَيْهِ يُرْجَعُونَ
వినేవారు మాత్రమే (సత్యాన్ని) స్వీకరిస్తారు. ఇకపోతే మృతుల విషయం – అల్లాహ్ వారిని బ్రతికించిలేపుతాడు. తర్వాత వారంతా ఆయన వద్దకే మరలించబడతారు.
6:37 وَقَالُوا لَوْلَا نُزِّلَ عَلَيْهِ آيَةٌ مِّن رَّبِّهِ ۚ قُلْ إِنَّ اللَّهَ قَادِرٌ عَلَىٰ أَن يُنَزِّلَ آيَةً وَلَٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ
ఈయన ప్రభువు తరఫు నుంచి ఈయనపై ఏదైనా మహిమ ఎందుకు అవతరింపజేయబడలేదు? అని వారు అడుగుతున్నారు. “అల్లాహ్ (ముమ్మాటికీ) మహిమను అవతరింపజేసే శక్తి కలిగి ఉన్నాడు” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు. అయితే వారిలో అధికులకు తెలియదు.
6:38 وَمَا مِن دَابَّةٍ فِي الْأَرْضِ وَلَا طَائِرٍ يَطِيرُ بِجَنَاحَيْهِ إِلَّا أُمَمٌ أَمْثَالُكُم ۚ مَّا فَرَّطْنَا فِي الْكِتَابِ مِن شَيْءٍ ۚ ثُمَّ إِلَىٰ رَبِّهِمْ يُحْشَرُونَ
భూమిలో సంచరించే ఎన్ని రకాల జంతువులైనా, తమ రెండు రెక్కల సహాయంతో ఎగిరే పక్షులైనా – అన్నీ మీలాంటి సముదాయాలే. మేము గ్రంథంలో నమోదు చేయకుండా దేన్నీ వదలిపెట్టలేదు. ఆపైన అందరూ తమ ప్రభువు వైపుకు సమీకరించబడేవారే.
6:39 وَالَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا صُمٌّ وَبُكْمٌ فِي الظُّلُمَاتِ ۗ مَن يَشَإِ اللَّهُ يُضْلِلْهُ وَمَن يَشَأْ يَجْعَلْهُ عَلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ
ఎవరయితే మా ఆయతులను ధిక్కరిస్తున్నారో వారు చీకట్లలో తచ్చాడుతున్న చెవిటివారు, మూగవారు. అల్లాహ్ తాను కోరిన వారిని పెడదారి పట్టిస్తాడు. అలాగే ఆయన తాను కోరిన వారిని రుజుమార్గంపై నడిపిస్తాడు.
6:40 قُلْ أَرَأَيْتَكُمْ إِنْ أَتَاكُمْ عَذَابُ اللَّهِ أَوْ أَتَتْكُمُ السَّاعَةُ أَغَيْرَ اللَّهِ تَدْعُونَ إِن كُنتُمْ صَادِقِينَ
(ఓ ప్రవక్తా!) వాళ్ళను అడుగు : “చూడండి! అల్లాహ్ తరఫునుంచి మీపై ఏదయినా ఆపద వచ్చిపడితే లేక మీపైన ప్రళయమే వస్తే అప్పుడు మీరు అల్లాహ్‌ను తప్ప వేరొకరెవరినయినా మొరపెట్టుకుంటారా? మీరు సత్యవంతులే అయితే (నిజం) చెప్పండి.”
6:41 بَلْ إِيَّاهُ تَدْعُونَ فَيَكْشِفُ مَا تَدْعُونَ إِلَيْهِ إِن شَاءَ وَتَنسَوْنَ مَا تُشْرِكُونَ
“లేదు. (ఆ క్షణంలో) మీరు కేవలం ఆయన్నే వేడుకుంటారు. దేనికోసం మీరు వేడుకున్నారో ఆ ఆపదను ఆయన మీ నుండి తొలగించదలచుకుంటే తొలగిస్తాడు. అలాంటి సమయాలలో మీరు మాత్రం (అల్లాహ్‌కు) సహవర్తులుగా నిలబెట్టిన వారందరినీ మరచిపోతారు.”
6:42 وَلَقَدْ أَرْسَلْنَا إِلَىٰ أُمَمٍ مِّن قَبْلِكَ فَأَخَذْنَاهُم بِالْبَأْسَاءِ وَالضَّرَّاءِ لَعَلَّهُمْ يَتَضَرَّعُونَ
నీకు పూర్వం ఎన్నో సమాజాల వద్దకు కూడా మేము ప్రవక్తలను పంపాము. ఆయా సమాజాలవారు అణకువను వ్యక్తపరచాలన్న ఉద్దేశంతో మేము వాళ్ళను దారిద్య్రానికి, అనారోగ్య బాధలకు గురిచేసి పట్టుకున్నాము.
6:43 فَلَوْلَا إِذْ جَاءَهُم بَأْسُنَا تَضَرَّعُوا وَلَٰكِن قَسَتْ قُلُوبُهُمْ وَزَيَّنَ لَهُمُ الشَّيْطَانُ مَا كَانُوا يَعْمَلُونَ
మా తరఫున వారిపైకి శిక్ష వచ్చినప్పటికీ వారు అణకువను ఎందుకు ప్రదర్శించలేదు? పైగా వారి హృదయాలు కఠినమై పోయాయి. షైతాన్ వారి దృష్టిలో వారు చేసే పనులన్నీ మంచివే అని భ్రమపడేలా చేశాడు.
6:44 فَلَمَّا نَسُوا مَا ذُكِّرُوا بِهِ فَتَحْنَا عَلَيْهِمْ أَبْوَابَ كُلِّ شَيْءٍ حَتَّىٰ إِذَا فَرِحُوا بِمَا أُوتُوا أَخَذْنَاهُم بَغْتَةً فَإِذَا هُم مُّبْلِسُونَ
తరువాత వారికి బోధించిన విషయాలను వారు విస్మరించినప్పుడు, మేము వారి కోసం అన్ని వస్తువుల ద్వారాలూ తెరిచాము. తమకు ప్రాప్తించిన వస్తువులపై వారు మిడిసిపడుతుండగా, అకస్మాత్తుగా మేము వారిని పట్టుకున్నాము. అప్పుడు, వారు పూర్తిగా నిరాశ చెందారు.
6:45 فَقُطِعَ دَابِرُ الْقَوْمِ الَّذِينَ ظَلَمُوا ۚ وَالْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
ఈ విధంగా, దుర్మార్గాలకు పాల్పడినవారి వేరు త్రెంపబడింది. సమస్త లోకాల ప్రభువైన అల్లాహ్‌కే కృతజ్ఞతలు.
6:46 قُلْ أَرَأَيْتُمْ إِنْ أَخَذَ اللَّهُ سَمْعَكُمْ وَأَبْصَارَكُمْ وَخَتَمَ عَلَىٰ قُلُوبِكُم مَّنْ إِلَٰهٌ غَيْرُ اللَّهِ يَأْتِيكُم بِهِ ۗ انظُرْ كَيْفَ نُصَرِّفُ الْآيَاتِ ثُمَّ هُمْ يَصْدِفُونَ
(ఓ ప్రవక్తా!) వారిని అడుగు: “అల్లాహ్‌యే గనక మీ వినికిడిని, మీ చూపును పూర్తిగా తీసేసుకుని, మీ హృదయాలకు ముద్రవేస్తే, అల్లాహ్ తప్ప వాటిని మీకు తిరిగి ప్రసాదించగల మరో ఆరాధ్యుడు ఎవడున్నాడు చెప్పండి?!” మేమెన్ని విధాలుగా మా సూచనలను వారికి విశదీకరిస్తున్నామో చూడు! అయినా వారు ముఖం త్రిప్పుకుంటున్నారు.
6:47 قُلْ أَرَأَيْتَكُمْ إِنْ أَتَاكُمْ عَذَابُ اللَّهِ بَغْتَةً أَوْ جَهْرَةً هَلْ يُهْلَكُ إِلَّا الْقَوْمُ الظَّالِمُونَ
“చూడండి! ఒకవేళ మీపై అకస్మాత్తుగా గానీ, బహిరంగంగా గానీ అల్లాహ్ యొక్క శిక్ష వచ్చిపడితే దుర్మార్గులు తప్ప ఎవరు నాశనం చేయబడతారు?” అని వారిని అడుగు.
6:48 وَمَا نُرْسِلُ الْمُرْسَلِينَ إِلَّا مُبَشِّرِينَ وَمُنذِرِينَ ۖ فَمَنْ آمَنَ وَأَصْلَحَ فَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ
మేము ప్రవక్తలను పంపేది, వారు శుభవార్త అందజేయటానికి, హెచ్చరించటానికి మాత్రమే. కాబట్టి ఎవరు విశ్వసించి, తమ ప్రవర్తనను సరిదిద్దుకుంటారో వారికెలాంటి భయంగానీ, దుఃఖంగానీ ఉండదు.
6:49 وَالَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا يَمَسُّهُمُ الْعَذَابُ بِمَا كَانُوا يَفْسُقُونَ
అయితే మా ఆయతులను అబద్ధాలని కొట్టిపారేసేవారికి, వారి అవిధేయత కారణంగా శిక్ష అంటుకుంటుంది.
6:50 قُل لَّا أَقُولُ لَكُمْ عِندِي خَزَائِنُ اللَّهِ وَلَا أَعْلَمُ الْغَيْبَ وَلَا أَقُولُ لَكُمْ إِنِّي مَلَكٌ ۖ إِنْ أَتَّبِعُ إِلَّا مَا يُوحَىٰ إِلَيَّ ۚ قُلْ هَلْ يَسْتَوِي الْأَعْمَىٰ وَالْبَصِيرُ ۚ أَفَلَا تَتَفَكَّرُونَ
ఓ ప్రవక్తా! వారికి చెప్పేయి: “నా వద్ద అల్లాహ్ ఖజానాలున్నాయని నేను మీతో అనటం లేదు. నా వద్ద అగోచర జ్ఞానం కూడా లేదు. నేను దైవదూతనని కూడా మీతో అనటం లేదు. నాపై అవతరింపజేయబడే ‘వహీ’ని మాత్రమే నేను అనుసరిస్తున్నాను.” (ఓ ప్రవక్తా!) వారిని అడుగు: ”గ్రుడ్డివాడు, కళ్ళున్నవాడూ – ఇద్దరూ సమానులేనా? మీరు ఈ మాత్రం ఆలోచించరా?”
6:51 وَأَنذِرْ بِهِ الَّذِينَ يَخَافُونَ أَن يُحْشَرُوا إِلَىٰ رَبِّهِمْ ۙ لَيْسَ لَهُم مِّن دُونِهِ وَلِيٌّ وَلَا شَفِيعٌ لَّعَلَّهُمْ يَتَّقُونَ
స్వయంగా తమ ప్రభువు తప్ప, తమను ఆదుకునేవారుగానీ, తమకోసం సిఫారసు చేసేవారుగాని ఉండని స్థితిలో తమ ప్రభువు దగ్గరికి హాజరు కావలసి ఉంటుందని భయపడేవారికి (ఓ ప్రవక్తా!) ఇందుమూలంగా హెచ్చరించు, దీనిద్వారా వారు భయభక్తుల వైఖరిని అవలంబించవచ్చు.
6:52 وَلَا تَطْرُدِ الَّذِينَ يَدْعُونَ رَبَّهُم بِالْغَدَاةِ وَالْعَشِيِّ يُرِيدُونَ وَجْهَهُ ۖ مَا عَلَيْكَ مِنْ حِسَابِهِم مِّن شَيْءٍ وَمَا مِنْ حِسَابِكَ عَلَيْهِم مِّن شَيْءٍ فَتَطْرُدَهُمْ فَتَكُونَ مِنَ الظَّالِمِينَ
ఉదయం, సాయంత్రం తమ ప్రభువును ప్రార్థిస్తూ, కేవలం ఆయన ప్రసన్నతను పొందాలనుకునేవారిని నీ దగ్గరి నుండి తొలగి పొమ్మనకు. (నువ్వు వారిని తొలగి పొమ్మనటానికి) నీపై వారి లెక్క ఏ మాత్రం లేదు. అలాగే నీ లెక్క కూడా వారిపై ఎంతమాత్రం లేదు. అయినప్పటికీ ఒకవేళ నువ్వు వాళ్లను తొలగిపొమ్మన్నావంటే దౌర్జన్యపరులలో చేరిపోతావు.
6:53 وَكَذَٰلِكَ فَتَنَّا بَعْضَهُم بِبَعْضٍ لِّيَقُولُوا أَهَٰؤُلَاءِ مَنَّ اللَّهُ عَلَيْهِم مِّن بَيْنِنَا ۗ أَلَيْسَ اللَّهُ بِأَعْلَمَ بِالشَّاكِرِينَ
“మా అందరిలోకీ అల్లాహ్ అనుగ్రహించినది వీళ్లనేనా!” అని వారు పలికేందుకుగాను మేము వారిలో కొందరిని మరి కొందరి ద్వారా పరీక్షించాము. కృతజ్ఞతా భావంతో మెలిగే వారిని అల్లాహ్ ఎరుగడా ఏమిటీ?!
6:54 وَإِذَا جَاءَكَ الَّذِينَ يُؤْمِنُونَ بِآيَاتِنَا فَقُلْ سَلَامٌ عَلَيْكُمْ ۖ كَتَبَ رَبُّكُمْ عَلَىٰ نَفْسِهِ الرَّحْمَةَ ۖ أَنَّهُ مَنْ عَمِلَ مِنكُمْ سُوءًا بِجَهَالَةٍ ثُمَّ تَابَ مِن بَعْدِهِ وَأَصْلَحَ فَأَنَّهُ غَفُورٌ رَّحِيمٌ
(ఓ ప్రవక్తా!) మా ఆయతులను విశ్వసించేవారు నీ వద్దకు వచ్చినప్పుడు, “మీపై సలామ్! (శాంతి కలుగుగాక!) దయ చూపటాన్ని మీ ప్రభువు తన కోసం విధిగా లిఖించుకున్నాడు. మీలో ఎవరయినా అజ్ఞానం వల్ల ఏదన్నా చెడు పని చేసి, తరువాత పశ్చాత్తాపం చెంది, దిద్దుబాటుకు ప్రయత్నిస్తే అల్లాహ్ అపారంగా క్షమించేవాడు, అమితంగా దయజూపేవాడు” అని చెప్పు.
6:55 وَكَذَٰلِكَ نُفَصِّلُ الْآيَاتِ وَلِتَسْتَبِينَ سَبِيلُ الْمُجْرِمِينَ
ఈ విధంగా మేము, అపరాధులు ఎంచుకున్న మార్గం ఎలాంటిదో విదితమయ్యేందుకుగాను ఆయతులను విడమరచి చెబుతుంటాము.
6:56 قُلْ إِنِّي نُهِيتُ أَنْ أَعْبُدَ الَّذِينَ تَدْعُونَ مِن دُونِ اللَّهِ ۚ قُل لَّا أَتَّبِعُ أَهْوَاءَكُمْ ۙ قَدْ ضَلَلْتُ إِذًا وَمَا أَنَا مِنَ الْمُهْتَدِينَ
(ఓ ప్రవక్తా!) “అల్లాహ్‌ను వదలి మీరు పిలిచే ఇతరులకు దాస్యం చేయటం నాకు నిషేధించబడింది” అని వారికి చెప్పేయి. “నేను మీ కోర్కెలను అనుసరించను. ఒకవేళ నేనలా చేసినట్లయితే మార్గ విహీనతకు లోనైపోతాను. సన్మార్గాన నడిచే వారిలో ఉండను” అని (కూడా) వారికి చెప్పు.
6:57 قُلْ إِنِّي عَلَىٰ بَيِّنَةٍ مِّن رَّبِّي وَكَذَّبْتُم بِهِ ۚ مَا عِندِي مَا تَسْتَعْجِلُونَ بِهِ ۚ إِنِ الْحُكْمُ إِلَّا لِلَّهِ ۖ يَقُصُّ الْحَقَّ ۖ وَهُوَ خَيْرُ الْفَاصِلِينَ
ఇంకా ఇలా చెప్పు: “నా వద్ద నా ప్రభువు తరఫున ఒక ప్రమాణం ఉంది. మీరేమో దాన్ని అసత్యమని త్రోసిపుచ్చుతున్నారు. దేనికోసం మీరు తొందర పెడుతున్నారో అది నా దగ్గరలేదు. నిర్ణయాధికారం అల్లాహ్‌కు తప్ప మరెవరికీ లేదు. ఆయన సత్యాన్ని తెలియపరుస్తాడు. అందరికన్నా ఉత్తమమైన తీర్పరి ఆయనే.”
6:58 قُل لَّوْ أَنَّ عِندِي مَا تَسْتَعْجِلُونَ بِهِ لَقُضِيَ الْأَمْرُ بَيْنِي وَبَيْنَكُمْ ۗ وَاللَّهُ أَعْلَمُ بِالظَّالِمِينَ
“మీరు తొందరపెట్టే ఆ వస్తువే గనక నా దగ్గర ఉండి ఉంటే మీకూ – నాకూ మధ్య ఈపాటికి వ్యవహారం తేలిపోయి ఉండేది. దుర్మార్గుల గురించి అల్లాహ్‌కు బాగా తెలుసు” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు.
6:59 وَعِندَهُ مَفَاتِحُ الْغَيْبِ لَا يَعْلَمُهَا إِلَّا هُوَ ۚ وَيَعْلَمُ مَا فِي الْبَرِّ وَالْبَحْرِ ۚ وَمَا تَسْقُطُ مِن وَرَقَةٍ إِلَّا يَعْلَمُهَا وَلَا حَبَّةٍ فِي ظُلُمَاتِ الْأَرْضِ وَلَا رَطْبٍ وَلَا يَابِسٍ إِلَّا فِي كِتَابٍ مُّبِينٍ
అగోచరాల తాళం చెవులు, (ఖజానాలు) అల్లాహ్ వద్దనే ఉన్నాయి. అల్లాహ్‌కు తప్ప ఇతరులెవరికీ వాటి గురించి తెలీదు. భూమిలోనూ, సముద్రాలలోనూ ఉన్న వస్తువులన్నింటి గురించి ఆయనకు తెలుసు. రాలే ఆకు కూడా ఆయనకు తెలీకుండా ఉండదు. నేలలోని చీకటి పొరలలో పడే ఏ గింజ అయినా – పచ్చిది, ఎండినది ఏది పడినా – స్పష్టమైన గ్రంథంలో నమోదై ఉంది.
6:60 وَهُوَ الَّذِي يَتَوَفَّاكُم بِاللَّيْلِ وَيَعْلَمُ مَا جَرَحْتُم بِالنَّهَارِ ثُمَّ يَبْعَثُكُمْ فِيهِ لِيُقْضَىٰ أَجَلٌ مُّسَمًّى ۖ ثُمَّ إِلَيْهِ مَرْجِعُكُمْ ثُمَّ يُنَبِّئُكُم بِمَا كُنتُمْ تَعْمَلُونَ
ఆయనే రాత్రిపూట (ఒకింత) మీ ఆత్మలను స్వాధీనం చేసుకుంటాడు. పగటిపూట మీరు చేసేదంతా ఆయనకు తెలుసు. మళ్లీ ఆయన నిర్థారిత సమయాన్ని పూర్తిచేయడానికి మిమ్మల్ని అందులో మేల్కొలుపుతున్నాడు. ఆ తర్వాత మీరంతా ఆయన వైపుకే మరలిపోవలసి ఉన్నది. ఆ తరువాత మీరు చేస్తూ ఉండిన కర్మలన్నింటినీ ఆయన మీకు తెలుపుతాడు.
6:61 وَهُوَ الْقَاهِرُ فَوْقَ عِبَادِهِ ۖ وَيُرْسِلُ عَلَيْكُمْ حَفَظَةً حَتَّىٰ إِذَا جَاءَ أَحَدَكُمُ الْمَوْتُ تَوَفَّتْهُ رُسُلُنَا وَهُمْ لَا يُفَرِّطُونَ
ఆయన తన దాసులపై తిరుగులేని ఆధిపత్యం గలవాడు. ఆయన మీపై కావలివాళ్ళను పంపుతాడు. చివరకు మీలో ఎవరికయినా మరణ ఘడియ సమీపిస్తే, మేము పంపిన దూతలు అతని ఆత్మను స్వాధీనం చేసుకుంటారు. (ఈ విధి నిర్వహణలో) వారెలాంటి నిర్లక్ష్యం చేయరు.
6:62 ثُمَّ رُدُّوا إِلَى اللَّهِ مَوْلَاهُمُ الْحَقِّ ۚ أَلَا لَهُ الْحُكْمُ وَهُوَ أَسْرَعُ الْحَاسِبِينَ
ఆపైన అందరూ తమ అసలు యజమాని అయిన అల్లాహ్ సన్నిధికి తీసుకురాబడతారు. బాగా వినండి! నిర్ణయాధికారం అల్లాహ్‌దే. ఆయన బహువేగంగా లెక్క తీసుకుంటాడు.
6:63 قُلْ مَن يُنَجِّيكُم مِّن ظُلُمَاتِ الْبَرِّ وَالْبَحْرِ تَدْعُونَهُ تَضَرُّعًا وَخُفْيَةً لَّئِنْ أَنجَانَا مِنْ هَٰذِهِ لَنَكُونَنَّ مِنَ الشَّاكِرِينَ
(ఓ ప్రవక్తా!) వారిని అడుగు: “నేలపై, సముద్రాలపై అలుముకున్న చీకట్లలో నుండి మిమ్మల్ని రక్షించేవాడెవడు? ‘ఆయన గనక మమ్మల్ని ఈ ఆపద నుంచి రక్షిస్తే మేము తప్పకుండా కృతజ్ఞులమై ఉంటామ’ని కడు దీనంగా, లోలోపలే మీరు ఎవరిని వేడుకుంటారు?”
6:64 قُلِ اللَّهُ يُنَجِّيكُم مِّنْهَا وَمِن كُلِّ كَرْبٍ ثُمَّ أَنتُمْ تُشْرِكُونَ
“ఈ విపత్తు నుండీ, అన్ని రకాల దుఃఖాల నుండీ మీకు విముక్తి నొసగేవాడు అల్లాహ్‌యే. అయినాసరే మీరు (మేలును మరిచిపోయి) షిర్కుకు ఒడిగడతారు!” అని చెప్పు.
6:65 قُلْ هُوَ الْقَادِرُ عَلَىٰ أَن يَبْعَثَ عَلَيْكُمْ عَذَابًا مِّن فَوْقِكُمْ أَوْ مِن تَحْتِ أَرْجُلِكُمْ أَوْ يَلْبِسَكُمْ شِيَعًا وَيُذِيقَ بَعْضَكُم بَأْسَ بَعْضٍ ۗ انظُرْ كَيْفَ نُصَرِّفُ الْآيَاتِ لَعَلَّهُمْ يَفْقَهُونَ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “మీ పై నుండి గానీ, మీ పాదాల క్రింది నుంచి గానీ మీపైకి శిక్షను తెచ్చే, లేదా మిమ్మల్ని వర్గాలుగా విడగొట్టి ఒకరి తడాఖాను ఇంకొకరికి చూపించే శక్తి కూడా ఆయనే కలిగి ఉన్నాడు.” వారు వాస్తవాన్ని గ్రహించగలందులకు ఏ విధంగా మేము సూచనలను పలు రీతులుగా వివరిస్తున్నామో చూడు!
6:66 وَكَذَّبَ بِهِ قَوْمُكَ وَهُوَ الْحَقُّ ۚ قُل لَّسْتُ عَلَيْكُم بِوَكِيلٍ
వాస్తవానికి అది సత్యమైనా, నీ జాతి దాన్ని అసత్యమని తిరస్కరిస్తోంది. “మీపై నేను కాపరిగా నియమించబడలేదు” అని (ప్రవక్తా!) వారికి చెప్పు.
6:67 لِّكُلِّ نَبَإٍ مُّسْتَقَرٌّ ۚ وَسَوْفَ تَعْلَمُونَ
ప్రతి ఒక్క వార్తకు (అనగా అది జరగటానికి) ఒక సమయం నిర్థారితమై ఉంది. త్వరలోనే మీకు తెలిసిపోతుంది.
6:68 وَإِذَا رَأَيْتَ الَّذِينَ يَخُوضُونَ فِي آيَاتِنَا فَأَعْرِضْ عَنْهُمْ حَتَّىٰ يَخُوضُوا فِي حَدِيثٍ غَيْرِهِ ۚ وَإِمَّا يُنسِيَنَّكَ الشَّيْطَانُ فَلَا تَقْعُدْ بَعْدَ الذِّكْرَىٰ مَعَ الْقَوْمِ الظَّالِمِينَ
(ఓ ప్రవక్తా!) మా ఆయతులలో లోపాలు వెతికేవారిని నీవు చూసినప్పుడు, వారు (దీనిని వదలి) ఇతర విషయాలపై మాట్లాడనంత వరకూ వారి మధ్య ఉండకు. ఒకవేళ షైతాను నిన్ను మరుపుకు గురిచేస్తే, జ్ఞాపకం వచ్చిన మీదట ఆ దుర్మార్గుల మధ్యన కూర్చోకు.
6:69 وَمَا عَلَى الَّذِينَ يَتَّقُونَ مِنْ حِسَابِهِم مِّن شَيْءٍ وَلَٰكِن ذِكْرَىٰ لَعَلَّهُمْ يَتَّقُونَ
వారి లెక్కల బాధ్యత ఏదీ దైవభీతిపరులపై లేదు. అయితే వారికి హితబోధ చేయటం మాత్రం మానుకోరాదు. ఎందుకంటే బహుశా వారు కూడా దైవభీతిపరులు కావచ్చు.
6:70 وَذَرِ الَّذِينَ اتَّخَذُوا دِينَهُمْ لَعِبًا وَلَهْوًا وَغَرَّتْهُمُ الْحَيَاةُ الدُّنْيَا ۚ وَذَكِّرْ بِهِ أَن تُبْسَلَ نَفْسٌ بِمَا كَسَبَتْ لَيْسَ لَهَا مِن دُونِ اللَّهِ وَلِيٌّ وَلَا شَفِيعٌ وَإِن تَعْدِلْ كُلَّ عَدْلٍ لَّا يُؤْخَذْ مِنْهَا ۗ أُولَٰئِكَ الَّذِينَ أُبْسِلُوا بِمَا كَسَبُوا ۖ لَهُمْ شَرَابٌ مِّنْ حَمِيمٍ وَعَذَابٌ أَلِيمٌ بِمَا كَانُوا يَكْفُرُونَ
(ప్రవక్తా!) ఎవరు తమ ధర్మాన్ని ఆటగా, వినోదంగా చేసుకున్నారో, ఎవరినయితే ప్రాపంచిక జీవితం మోసపుచ్చిందో వారికి దూరంగా ఉండు. అయితే ఈ ఖుర్ఆను ద్వారా వారికి ఉపదేశం మాత్రం చేస్తూ ఉండు. ఏ వ్యక్తీ తన చేష్టల మూలంగా ఇరుక్కుపోయే పరిస్థితి రాకుండా ఉండటానికి, అల్లాహ్ తప్ప వేరెవరూ సహాయం చేయని, సిఫారసు చేసేవాడెవడూ ఉండని దురవస్థ దాపురించకుండా ఉండటానికి, ప్రపంచ మంతటినీ పరిహారంగా ఇచ్చి బయటపడాలని తహతహలాడినా అది అతన్నుంచి స్వీకరించబడని (గడ్డు) స్థితి ఏర్పడకుండా ఉండటానికి గాను (నీవు వారికి బోధపరుస్తూ ఉండాలి సుమా!). తమ చేష్టల మూలంగా (అటువంటి పరిస్థితిలో) చిక్కుకునేవారు వీరే. తమ తిరస్కార వైఖరి కారణంగా వారికి సలసలా కాగే నీరు త్రాగేందుకు ఇవ్వబడుతుంది. ఇంకా వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది.
6:71 قُلْ أَنَدْعُو مِن دُونِ اللَّهِ مَا لَا يَنفَعُنَا وَلَا يَضُرُّنَا وَنُرَدُّ عَلَىٰ أَعْقَابِنَا بَعْدَ إِذْ هَدَانَا اللَّهُ كَالَّذِي اسْتَهْوَتْهُ الشَّيَاطِينُ فِي الْأَرْضِ حَيْرَانَ لَهُ أَصْحَابٌ يَدْعُونَهُ إِلَى الْهُدَى ائْتِنَا ۗ قُلْ إِنَّ هُدَى اللَّهِ هُوَ الْهُدَىٰ ۖ وَأُمِرْنَا لِنُسْلِمَ لِرَبِّ الْعَالَمِينَ
(ఓ ప్రవక్తా!) వారిని అడుగు : ఏమిటీ, మేము అల్లాహ్‌ను వదలి మాకు లాభంగానీ, నష్టంగానీ చేకూర్చలేని వారిని మొరపెట్టుకోవాలా? అల్లాహ్ మాకు సన్మార్గం చూపిన తరువాత షైతానులు ఒక వ్యక్తిని అడవిలో మార్గవిహీనుణ్ణి చేయగా, అతని సహవాసులు కొందరు ఉండి, “మా వద్దకు రా!” అని అతన్ని సన్మార్గం వైపుకు పిలుస్తున్నప్పటికీ, దిక్కులు చూస్తూ ఉండిపోయేవాని మాదిరిగా – మేము సన్మార్గం నుండి వెనుతిరిగి పోవాలా? వారితో ఇలా అను: “యదార్థానికి అల్లాహ్ చూపిన మార్గమే సన్మార్గం. మేము సర్వలోక ప్రభువుకు పూర్తిగా విధేయులు కావాలని మాకు ఆజ్ఞాపించబడింది.”
6:72 وَأَنْ أَقِيمُوا الصَّلَاةَ وَاتَّقُوهُ ۚ وَهُوَ الَّذِي إِلَيْهِ تُحْشَرُونَ
(ఇంకా ఇలా ఆదేశించబడింది:) “నమాజును నెలకొల్పండి, ఆయనకు భయపడండి, ఆఖరికి మీరంతా ఆయన వద్దకే సమీకరించబడతారు.”
6:73 وَهُوَ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ بِالْحَقِّ ۖ وَيَوْمَ يَقُولُ كُن فَيَكُونُ ۚ قَوْلُهُ الْحَقُّ ۚ وَلَهُ الْمُلْكُ يَوْمَ يُنفَخُ فِي الصُّورِ ۚ عَالِمُ الْغَيْبِ وَالشَّهَادَةِ ۚ وَهُوَ الْحَكِيمُ الْخَبِيرُ
ఆయనే ఆకాశాలనూ, భూమినీ సత్యబద్ధంగా సృష్టించాడు. ఏ రోజున ఆయన “అయిపో” అని ఆజ్ఞాపిస్తాడో అప్పుడు అది అయిపోతుంది. ఆయన మాట సత్యమైనది, ప్రభావపూరితమైనది. శంఖం ఊదబడే రోజున, అధికారమంతా ఆయనదే అవుతుంది. ఆయన నిగూఢమైన విషయాలను, బహిర్గతమై వున్న విషయాలనూ ఎరిగినవాడు. ఆయనే వివేక సంపన్నుడు, సర్వమూ తెలిసినవాడు.
6:74 وَإِذْ قَالَ إِبْرَاهِيمُ لِأَبِيهِ آزَرَ أَتَتَّخِذُ أَصْنَامًا آلِهَةً ۖ إِنِّي أَرَاكَ وَقَوْمَكَ فِي ضَلَالٍ مُّبِينٍ
ఇబ్రాహీము తన తండ్రి ఆజరుతో, “ఏమిటీ, నీవు విగ్రహాలను ఆరాధ్య దైవాలుగా చేసుకుంటున్నావా? నువ్వూ, నీ జాతి వారూ నిస్సందేహంగా స్పష్టమైన అపమార్గానికి గురై ఉన్నారని నాకనిపిస్తోంది” అని పలికిన సందర్భం కూడా స్మరించుకోదగినదే.
6:75 وَكَذَٰلِكَ نُرِي إِبْرَاهِيمَ مَلَكُوتَ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَلِيَكُونَ مِنَ الْمُوقِنِينَ
ఈ విధంగానే మేము ఇబ్రాహీముకు భూమ్యాకాశాలలోని సృష్టితాలను చూపించాము. అతనికి దృఢ నమ్మకం కలగాలన్న ఉద్దేశంతోనే అలా చేశాము.
6:76 فَلَمَّا جَنَّ عَلَيْهِ اللَّيْلُ رَأَىٰ كَوْكَبًا ۖ قَالَ هَٰذَا رَبِّي ۖ فَلَمَّا أَفَلَ قَالَ لَا أُحِبُّ الْآفِلِينَ
అతనిపై రాత్రి చీకటి అలుముకున్నప్పుడు, అతను ఒక నక్షత్రాన్ని చూసి, “ఇతనే నా ప్రభువు” అన్నాడు. కాని అది అస్తమించగానే, “అస్తమించే వాటిని నేను అభిమానించను” అని చెప్పాడు.
6:77 فَلَمَّا رَأَى الْقَمَرَ بَازِغًا قَالَ هَٰذَا رَبِّي ۖ فَلَمَّا أَفَلَ قَالَ لَئِن لَّمْ يَهْدِنِي رَبِّي لَأَكُونَنَّ مِنَ الْقَوْمِ الضَّالِّينَ
మరి అతను ప్రకాశిస్తున్న చంద్రుణ్ణి చూసి, “ఇతను నా ప్రభువు” అన్నాడు. కాని అది కూడా అస్తమించటంతో “ఒకవేళ నా ప్రభువు గనక నాకు మార్గదర్శకత్వం వహించకపోతే నేను మార్గవిహీన జనుల్లో చేరిపోతాను” అని పలికాడు.
6:78 فَلَمَّا رَأَى الشَّمْسَ بَازِغَةً قَالَ هَٰذَا رَبِّي هَٰذَا أَكْبَرُ ۖ فَلَمَّا أَفَلَتْ قَالَ يَا قَوْمِ إِنِّي بَرِيءٌ مِّمَّا تُشْرِكُونَ
ఆ తరువాత సూర్యుణ్ణి ప్రకాశిస్తుండగా చూసి, “ఇతనే నా ప్రభువు. ఇతను అందరికన్నా పెద్దవాడు” అని పలికాడు. కాని అది కూడా అస్తమించేసరికి అతనిలా అన్నాడు: “ఓ నా జాతి వారలారా! మీరు (దైవానికి) కల్పించే భాగస్వామ్యాలతో నాకు ఎలాంటి సంబంధం లేదు.
6:79 إِنِّي وَجَّهْتُ وَجْهِيَ لِلَّذِي فَطَرَ السَّمَاوَاتِ وَالْأَرْضَ حَنِيفًا ۖ وَمَا أَنَا مِنَ الْمُشْرِكِينَ
నేను ఆకాశాలను, భూమిని సృష్టించినవాని వైపుకు ఏకాగ్రతతో నా ముఖాన్ని త్రిప్పుకుంటున్నాను. నేను షిర్క్ చేసేవారిలోని వాణ్ణి కాను.”
6:80 وَحَاجَّهُ قَوْمُهُ ۚ قَالَ أَتُحَاجُّونِّي فِي اللَّهِ وَقَدْ هَدَانِ ۚ وَلَا أَخَافُ مَا تُشْرِكُونَ بِهِ إِلَّا أَن يَشَاءَ رَبِّي شَيْئًا ۗ وَسِعَ رَبِّي كُلَّ شَيْءٍ عِلْمًا ۗ أَفَلَا تَتَذَكَّرُونَ
అతని జాతి వారు అతనితో పిడివాదానికి దిగినప్పుడు, అతనిలా అన్నాడు: “ఏమిటీ, మీరు అల్లాహ్ విషయంలో నాతో వాదులాడుతున్నారా? వాస్తవానికి ఆయన నాకు సన్మార్గం చూపించాడు. మీరు కల్పించే సహవర్తులకు నేను ఏమాత్రం భయపడను. అయితే నా ప్రభువు గనక తలిస్తే ఏమైనా జరగవచ్చు. నా ప్రభువు జ్ఞానం అన్నింటినీ ఆవరించి ఉంది. అయినా మీరు గ్రహించరా?”
6:81 وَكَيْفَ أَخَافُ مَا أَشْرَكْتُمْ وَلَا تَخَافُونَ أَنَّكُمْ أَشْرَكْتُم بِاللَّهِ مَا لَمْ يُنَزِّلْ بِهِ عَلَيْكُمْ سُلْطَانًا ۚ فَأَيُّ الْفَرِيقَيْنِ أَحَقُّ بِالْأَمْنِ ۖ إِن كُنتُمْ تَعْلَمُونَ
“అల్లాహ్ మీ వద్దకు ఏ నిదర్శనాన్నీ అవతరింపజేయనప్పటికీ మీరు అల్లాహ్‌కు భాగస్వాములను కల్పించే విషయానికి భయపడటం లేదు. మరి అటువంటప్పుడు అల్లాహ్‌కు సహవర్తులుగా మీరు నిలబెట్టే వాటికి నేనెలా భయపడతాను? కాబట్టి ఈ రెండు పక్షాలలో సురక్షిత స్థితికి అర్హులెవరో మీకు తెలిస్తే కాస్త చెప్పండి.”
6:82 الَّذِينَ آمَنُوا وَلَمْ يَلْبِسُوا إِيمَانَهُم بِظُلْمٍ أُولَٰئِكَ لَهُمُ الْأَمْنُ وَهُم مُّهْتَدُونَ
విశ్వసించి, తమ విశ్వాసాన్ని దుర్మార్గం (షిర్కు)తో కలగా పులగం చేయకుండా ఉండేవారే సురక్షితంగా ఉన్నవారు. సన్మార్గంపై ఉన్నవారు కూడా వారే.
6:83 وَتِلْكَ حُجَّتُنَا آتَيْنَاهَا إِبْرَاهِيمَ عَلَىٰ قَوْمِهِ ۚ نَرْفَعُ دَرَجَاتٍ مَّن نَّشَاءُ ۗ إِنَّ رَبَّكَ حَكِيمٌ عَلِيمٌ
ఇబ్రాహీము (అలైహిస్సలాం) తన జాతి వారిని ఎదుర్కొనటానికిగాను మేము అతనికి ఇచ్చిన మా ‘నిదర్శనం’ ఇది! మేము తలచుకున్నవారి అంతస్తుల్ని పెంచుతాము. నిశ్చయంగా నీ ప్రభువు వివేకవంతుడు, గొప్ప పరిజ్ఞానం కలవాడు.
6:84 وَوَهَبْنَا لَهُ إِسْحَاقَ وَيَعْقُوبَ ۚ كُلًّا هَدَيْنَا ۚ وَنُوحًا هَدَيْنَا مِن قَبْلُ ۖ وَمِن ذُرِّيَّتِهِ دَاوُودَ وَسُلَيْمَانَ وَأَيُّوبَ وَيُوسُفَ وَمُوسَىٰ وَهَارُونَ ۚ وَكَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ
ఇంకా మేము అతనికి ఇస్హాఖును, యాఖూబ్ను ప్రసాదించాము. వారిలో ప్రతి ఒక్కరికీ మేము సన్మార్గం చూపించాము. అంతకు మునుపు మేము నూహ్‌కు సన్మార్గం చూపించి ఉన్నాము. ఇంకా అతని సంతతి వారిలోనుంచి దావూదు సులైమానులకు, అయ్యూబు యూసుఫులకు, మూసా హారూనులకు మేము సన్మార్గం చూపాము. సత్కార్యాలు చేసేవారికి మేము ఇలాగే ప్రతిఫలం ఇస్తూ ఉంటాము.
6:85 وَزَكَرِيَّا وَيَحْيَىٰ وَعِيسَىٰ وَإِلْيَاسَ ۖ كُلٌّ مِّنَ الصَّالِحِينَ
ఇంకా జకరియ్యా, యహ్యా, ఈసా, ఇల్యాస్లకు కూడా (మేము సన్మార్గం చూపించాము.) వారంతా సద్వర్తనుల కోవకు చెందినవారే.
6:86 وَإِسْمَاعِيلَ وَالْيَسَعَ وَيُونُسَ وَلُوطًا ۚ وَكُلًّا فَضَّلْنَا عَلَى الْعَالَمِينَ
ఇంకా – ఇస్మాయీలుకు, యసఆకు, యూనుసు లూతులకు కూడా (మేము మార్గదర్శకత్వం వహించాము). వారిలో ప్రతి ఒక్కరికీ మేము లోకవాసులందరిపై శ్రేష్ఠతను అనుగ్రహించాము.
6:87 وَمِنْ آبَائِهِمْ وَذُرِّيَّاتِهِمْ وَإِخْوَانِهِمْ ۖ وَاجْتَبَيْنَاهُمْ وَهَدَيْنَاهُمْ إِلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ
అంతేకాదు, వారి పితామహులలో (తాత ముత్తాతలలో), వారి సంతానంలో, వారి సహోదరులలో కూడా కొందరిని (మేము కటాక్షించాము.) వారిని (మా సేవకోసం) ఎన్నుకున్నాము. వారిని రుజుమార్గం వైపుకు నడిపించాము.
6:88 ذَٰلِكَ هُدَى اللَّهِ يَهْدِي بِهِ مَن يَشَاءُ مِنْ عِبَادِهِ ۚ وَلَوْ أَشْرَكُوا لَحَبِطَ عَنْهُم مَّا كَانُوا يَعْمَلُونَ
ఇదీ అల్లాహ్ మార్గదర్శకత్వం. ఆయన తన దాసులలో తాను కోరిన వారిని ఈ మార్గంపై నడిపింపజేస్తాడు. ఒకవేళ వీరు సైతం, దైవత్వంలో భాగస్వామ్యానికి (షిర్కుకు) ఒడిగట్టి ఉంటే, వారు చేసుకున్న కర్మలన్నీ కూడా వృధా అయిపోయేవి.
6:89 أُولَٰئِكَ الَّذِينَ آتَيْنَاهُمُ الْكِتَابَ وَالْحُكْمَ وَالنُّبُوَّةَ ۚ فَإِن يَكْفُرْ بِهَا هَٰؤُلَاءِ فَقَدْ وَكَّلْنَا بِهَا قَوْمًا لَّيْسُوا بِهَا بِكَافِرِينَ
మేము గ్రంథాన్నీ, వివేకాన్నీ, ప్రవక్త పదవినీ ప్రసాదించినది వీరికే. ఒకవేళ వారు గనక దానిని తిరస్కరించే పక్షంలో, దానిని తిరస్కరించకుండా ఉండే చాలా మందిని మేము దానికోసం నియమించి ఉన్నాము.
6:90 أُولَٰئِكَ الَّذِينَ هَدَى اللَّهُ ۖ فَبِهُدَاهُمُ اقْتَدِهْ ۗ قُل لَّا أَسْأَلُكُمْ عَلَيْهِ أَجْرًا ۖ إِنْ هُوَ إِلَّا ذِكْرَىٰ لِلْعَالَمِينَ
అల్లాహ్ సన్మార్గం చూపించినటువంటివారు వీరే. కనుక (ఓ ప్రవక్తా!) నువ్వు కూడా వారి మార్గాన్నే అనుసరించు. “దీనికిగాను నేను మీనుండి ఎలాంటి ప్రతిఫలాన్నీ అడగటం లేదు. ఇది సమస్త లోకవాసుల కోసం హితోపదేశం” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు.
6:91 وَمَا قَدَرُوا اللَّهَ حَقَّ قَدْرِهِ إِذْ قَالُوا مَا أَنزَلَ اللَّهُ عَلَىٰ بَشَرٍ مِّن شَيْءٍ ۗ قُلْ مَنْ أَنزَلَ الْكِتَابَ الَّذِي جَاءَ بِهِ مُوسَىٰ نُورًا وَهُدًى لِّلنَّاسِ ۖ تَجْعَلُونَهُ قَرَاطِيسَ تُبْدُونَهَا وَتُخْفُونَ كَثِيرًا ۖ وَعُلِّمْتُم مَّا لَمْ تَعْلَمُوا أَنتُمْ وَلَا آبَاؤُكُمْ ۖ قُلِ اللَّهُ ۖ ثُمَّ ذَرْهُمْ فِي خَوْضِهِمْ يَلْعَبُونَ
“అల్లాహ్ ఏ మానవమాత్రునిపైనా ఎలాంటి విషయాన్నీ అవతరింపజేయలేదు” అని పలికినప్పుడు ఈ (అవిశ్వాస) జనులు అల్లాహ్‌ను అర్థం చేసుకోవలసిన విధంగా అర్థం చేసుకోలేదు. వారిని అడుగు: “మరి మూసా తెచ్చిన ఆ గ్రంథాన్ని ఎవరు అవతరింపజేసినట్టు? ఆ గ్రంథం ఒక జ్యోతి. మానవుల కొరకు మార్గదర్శకత్వం. మీరు దాన్ని వేర్వేరు కాగితాలుగా విభజించి చూపుతున్నారు. ఎన్నో విషయాలను దాచేస్తున్నారు. మీకుగానీ, మీ పెద్దలకుగానీ తెలియని ఎన్నో విషయాలు (ఇందు మూలంగా) మీకు నేర్పబడ్డాయి.” దాన్ని అవతరింపజేసిన వాడు అల్లాహ్‌యే అని చెప్పు. ఆ తర్వాత వాళ్లను వారి వ్యర్థ విషయాలలోనే ఆడుకోనివ్వు.
6:92 وَهَٰذَا كِتَابٌ أَنزَلْنَاهُ مُبَارَكٌ مُّصَدِّقُ الَّذِي بَيْنَ يَدَيْهِ وَلِتُنذِرَ أُمَّ الْقُرَىٰ وَمَنْ حَوْلَهَا ۚ وَالَّذِينَ يُؤْمِنُونَ بِالْآخِرَةِ يُؤْمِنُونَ بِهِ ۖ وَهُمْ عَلَىٰ صَلَاتِهِمْ يُحَافِظُونَ
ఇది కూడా మేము అవతరింపజేసిన గ్రంథమే. ఎంతో శుభప్రదమైనది, తనకంటే ముందున్న గ్రంథాలను ధృవీకరించేది. నీవు మక్కా (ఉమ్ముల్ ఖురా) వారినీ, దాని పరిసరాల వారిని హెచ్చరించటానికిగాను (దీనిని అవతరింపజేశాము). పరలోకంపై దృఢ విశ్వాసం ఉన్నవారు దీనిని విశ్వసిస్తారు; వారు తమ నమాజులను జాగ్రత్తగా కాపాడుకునేవారై ఉంటారు.
6:93 وَمَنْ أَظْلَمُ مِمَّنِ افْتَرَىٰ عَلَى اللَّهِ كَذِبًا أَوْ قَالَ أُوحِيَ إِلَيَّ وَلَمْ يُوحَ إِلَيْهِ شَيْءٌ وَمَن قَالَ سَأُنزِلُ مِثْلَ مَا أَنزَلَ اللَّهُ ۗ وَلَوْ تَرَىٰ إِذِ الظَّالِمُونَ فِي غَمَرَاتِ الْمَوْتِ وَالْمَلَائِكَةُ بَاسِطُو أَيْدِيهِمْ أَخْرِجُوا أَنفُسَكُمُ ۖ الْيَوْمَ تُجْزَوْنَ عَذَابَ الْهُونِ بِمَا كُنتُمْ تَقُولُونَ عَلَى اللَّهِ غَيْرَ الْحَقِّ وَكُنتُمْ عَنْ آيَاتِهِ تَسْتَكْبِرُونَ
అల్లాహ్‌పై అబద్ధాన్ని కల్పించేవాడికంటే, లేదా తనపై ఎలాంటి వహీ అవతరించకపోయినప్పటికీ ‘నాపై వహీ అవతరించింది’ అని చెప్పే వానికంటే లేదా అల్లాహ్ అవతరింపజేసినటువంటిదే ‘నేను కూడా అవతరింపజేస్తాను’ అని అనేవాడి కంటే పరమ దుర్మార్గుడు ఎవడుంటాడు? ఈ దుర్మార్గులు మరణ యాతనలో ఉన్నప్పుడు, దైవదూతలు తమ చేతులు చాచి, “సరే! ఇక మీ ప్రాణాలు (బయటికి) తీయండి. మీరు అల్లాహ్‌కు అబద్ధాలను ఆపాదించినందుకూ, అల్లాహ్ ఆయతుల పట్ల గర్వాతిశయంతో విర్రవీగినందుకుగాను ఈ రోజు మీకు పరాభవంతో కూడిన శిక్ష విధించబడుతుంది” అని చెబుతుండగా (ఆ దృశ్యాన్ని) నీవు చూడగలిగితే ఎంత బావుండు!
6:94 وَلَقَدْ جِئْتُمُونَا فُرَادَىٰ كَمَا خَلَقْنَاكُمْ أَوَّلَ مَرَّةٍ وَتَرَكْتُم مَّا خَوَّلْنَاكُمْ وَرَاءَ ظُهُورِكُمْ ۖ وَمَا نَرَىٰ مَعَكُمْ شُفَعَاءَكُمُ الَّذِينَ زَعَمْتُمْ أَنَّهُمْ فِيكُمْ شُرَكَاءُ ۚ لَقَد تَّقَطَّعَ بَيْنَكُمْ وَضَلَّ عَنكُم مَّا كُنتُمْ تَزْعُمُونَ
మేము మిమ్మల్ని మొదటిసారి పుట్టించినట్లుగానే, మీరు మా సన్నిధికి ఒంటరిగా వచ్చారు. మేము మీకు ప్రసాదించిన దాన్నంతా మీ వెనుకే వదిలేసి వచ్చారు. మీ వ్యవహారాలలో మాకు భాగస్వాములని మీరు భావించిన మీ సిఫారసుదారులను కూడా ఇప్పుడు మేము మీవెంట చూడటం లేదు! నిజంగానే వారికీ – మీకూ మధ్య గల సంబంధాలన్నీ తెగిపోయాయి. మీరు నమ్ముతూ ఉన్నదంతా మీకు కనిపించకుండా పోయింది.
6:95 إِنَّ اللَّهَ فَالِقُ الْحَبِّ وَالنَّوَىٰ ۖ يُخْرِجُ الْحَيَّ مِنَ الْمَيِّتِ وَمُخْرِجُ الْمَيِّتِ مِنَ الْحَيِّ ۚ ذَٰلِكُمُ اللَّهُ ۖ فَأَنَّىٰ تُؤْفَكُونَ
నిస్సందేహంగా విత్తనాన్ని, టెంకను చీల్చేవాడు అల్లాహ్‌యే. ఆయన జీవమున్న దానిని జీవములేని దానిలో నుంచి తీస్తాడు. జీవములేని దానిని జీవమున్న దానిలో నుంచి తీసేవాడూ ఆయనే. ఆయనే అల్లాహ్. మరలాంటప్పుడు మీరు (సత్యం నుండి) ఎటు మరలిపోతున్నారు?
6:96 فَالِقُ الْإِصْبَاحِ وَجَعَلَ اللَّيْلَ سَكَنًا وَالشَّمْسَ وَالْقَمَرَ حُسْبَانًا ۚ ذَٰلِكَ تَقْدِيرُ الْعَزِيزِ الْعَلِيمِ
ఉదయాన్ని వెలికి తీసేవాడు ఆయనే. ఇంకా ఆయన రాత్రిని విశ్రాంతి సమయంగా చేశాడు. సూర్యచంద్రుల లెక్కను నిర్థారించాడు. ఇదంతా సర్వాధిక్యుడు, మహాజ్ఞాని (అయిన అల్లాహ్) చేసిన నిర్థారణ.
6:97 وَهُوَ الَّذِي جَعَلَ لَكُمُ النُّجُومَ لِتَهْتَدُوا بِهَا فِي ظُلُمَاتِ الْبَرِّ وَالْبَحْرِ ۗ قَدْ فَصَّلْنَا الْآيَاتِ لِقَوْمٍ يَعْلَمُونَ
చీకట్లలోనూ, భూమిలోనూ, సముద్రంలోనూ మీరు మార్గం తెలుసుకునేందుకుగాను ఆయనే మీ కోసం నక్షత్రాలను సృష్టించాడు. మేము జ్ఞానం కలవారి కోసం మా సూచనలను బాగా విడమరచి చెప్పాము.
6:98 وَهُوَ الَّذِي أَنشَأَكُم مِّن نَّفْسٍ وَاحِدَةٍ فَمُسْتَقَرٌّ وَمُسْتَوْدَعٌ ۗ قَدْ فَصَّلْنَا الْآيَاتِ لِقَوْمٍ يَفْقَهُونَ
ఇంకా, మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి పుట్టించినవాడు ఆయనే. మరి ఒక స్థలం ఎక్కువ కాలం ఉండేదీ, ఇంకొక స్థలం తక్కువ కాలం ఉండేదిగా నిర్థారించబడింది. అర్థం చేసుకోగలిగే వారి కోసం మేము మా సూచనలను స్పష్టంగా వివరించాము.
6:99 وَهُوَ الَّذِي أَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَأَخْرَجْنَا بِهِ نَبَاتَ كُلِّ شَيْءٍ فَأَخْرَجْنَا مِنْهُ خَضِرًا نُّخْرِجُ مِنْهُ حَبًّا مُّتَرَاكِبًا وَمِنَ النَّخْلِ مِن طَلْعِهَا قِنْوَانٌ دَانِيَةٌ وَجَنَّاتٍ مِّنْ أَعْنَابٍ وَالزَّيْتُونَ وَالرُّمَّانَ مُشْتَبِهًا وَغَيْرَ مُتَشَابِهٍ ۗ انظُرُوا إِلَىٰ ثَمَرِهِ إِذَا أَثْمَرَ وَيَنْعِهِ ۚ إِنَّ فِي ذَٰلِكُمْ لَآيَاتٍ لِّقَوْمٍ يُؤْمِنُونَ
ఇంకా – ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించినవాడు ఆయనే. ఆ తరువాత దాని ద్వారా మేము అన్నిరకాల మొక్కల్ని వెలికి తీశాము. ఆపైన మేము పచ్చని కొమ్మను సృజించాము. దాని ద్వారా మేము ఒకదానిపై ఒకటి పేరుకుని ఉన్న గింజలు గల పంటల్ని పండిస్తాము. ఖర్జూర చెట్ల నుంచి, అంటే వాటి పాళి నుండి క్రిందికి వ్రేలాడే పండ్ల గెలలను, ద్రాక్ష తోటలను, జైతూనును (ఆలివ్ పండ్లను), దానిమ్మ కాయలను ఉత్పన్నం చేశాము. వాటిలో కొన్ని ఒక దానిని ఇంకొకటి పోలి ఉంటాయి. మరికొన్ని పోలి ఉండవు. ప్రతి చెట్టుకు కాసినకాయ పెరిగి పెద్దదవుతున్నప్పుడు, అది పండుతున్నప్పుడు కాస్త నిశిత దృష్టితో చూడండి! నమ్మేవారి కోసం వీటిలో నిదర్శనాలున్నాయి.
6:100 وَجَعَلُوا لِلَّهِ شُرَكَاءَ الْجِنَّ وَخَلَقَهُمْ ۖ وَخَرَقُوا لَهُ بَنِينَ وَبَنَاتٍ بِغَيْرِ عِلْمٍ ۚ سُبْحَانَهُ وَتَعَالَىٰ عَمَّا يَصِفُونَ
ప్రజలు జిన్నాతులను అల్లాహ్‌కు భాగస్వాములుగా ఖరారు చేసుకున్నారు. మరి చూడబోతే వాళ్లను సృష్టించింది కూడా ఆయనే. అంతేకాదు, వీళ్లు ఎటువంటి జ్ఞానం లేకుండానే ఆయనకు కుమారులను, కుమార్తెలను కూడా కల్పించారు. వాస్తవానికి వీళ్లు చెప్పే ఈ మాటలకు ఆయన పవిత్రుడు, ఉన్నతుడు.
6:101 بَدِيعُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ أَنَّىٰ يَكُونُ لَهُ وَلَدٌ وَلَمْ تَكُن لَّهُ صَاحِبَةٌ ۖ وَخَلَقَ كُلَّ شَيْءٍ ۖ وَهُوَ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ
ఆకాశాలను, భూమినీ ఆవిష్కరించినవాడు ఆయనే. అల్లాహ్‌కు భార్యయే లేనపుడు ఆయనకు సంతానం ఎలా కలుగుతుంది? ఆయన ప్రతి వస్తువునూ సృష్టించాడు. ఆయనకు ప్రతిదీ బాగా తెలుసు.
6:102 ذَٰلِكُمُ اللَّهُ رَبُّكُمْ ۖ لَا إِلَٰهَ إِلَّا هُوَ ۖ خَالِقُ كُلِّ شَيْءٍ فَاعْبُدُوهُ ۚ وَهُوَ عَلَىٰ كُلِّ شَيْءٍ وَكِيلٌ
ఆయనే అల్లాహ్. మీ ప్రభువు. ఆయన తప్ప మరొకరెవరూ ఆరాధ్యులు కారు. సమస్త వస్తువులను సృష్టించినవాడు ఆయనే. కాబట్టి మీరు ఆయన్నే ఆరాధించండి. అన్ని విషయాల కార్యసాధకుడు ఆయనే.
6:103 لَّا تُدْرِكُهُ الْأَبْصَارُ وَهُوَ يُدْرِكُ الْأَبْصَارَ ۖ وَهُوَ اللَّطِيفُ الْخَبِيرُ
ఎవరి చూపులు కూడా ఆయన్ని అందుకోజాలవు. ఆయన మాత్రం అందరి చూపులను అందుకోగలడు. ఆయన సూక్ష్మదృష్టి కలవాడు. సర్వమూ తెలిసినవాడు.
6:104 قَدْ جَاءَكُم بَصَائِرُ مِن رَّبِّكُمْ ۖ فَمَنْ أَبْصَرَ فَلِنَفْسِهِ ۖ وَمَنْ عَمِيَ فَعَلَيْهَا ۚ وَمَا أَنَا عَلَيْكُم بِحَفِيظٍ
“నిస్సందేహంగా మీ వద్దకు మీ ప్రభువు తరఫునుంచి సత్యాన్ని దర్శించే సూచనలు వచ్చేశాయి. కనుక దాన్ని చూసిన వాడు తనకు లాభం చేకూర్చుకుంటాడు. గ్రుడ్డిగా వ్యవహరిస్తే తనకే నష్టం. నేను మాత్రం మీపై రక్షకుణ్ణి కాను” (అని ఓ ప్రవక్తా! చెప్పు).
6:105 وَكَذَٰلِكَ نُصَرِّفُ الْآيَاتِ وَلِيَقُولُوا دَرَسْتَ وَلِنُبَيِّنَهُ لِقَوْمٍ يَعْلَمُونَ
ఈ విధంగా మేము సూచనలను విభిన్న కోణాల నుంచి విశదీకరిస్తూ ఉంటాము- “నీవు ఎవరి వద్దనో పాఠాలు నేర్చుకున్నావు” అని వారు చెప్పేటందుకు, దాన్ని విజ్ఞులకు బాగా స్పష్టపరచేటందుకుగాను (మేమిలా చేస్తాము).
6:106 اتَّبِعْ مَا أُوحِيَ إِلَيْكَ مِن رَّبِّكَ ۖ لَا إِلَٰهَ إِلَّا هُوَ ۖ وَأَعْرِضْ عَنِ الْمُشْرِكِينَ
ఓ ప్రవక్తా! నీవు మాత్రం నీ ప్రభువు తరఫు నుంచి నీ వద్దకు వహీ ద్వారా పంపబడుతున్న విధానాన్ని అనుసరిస్తూ ఉండు. ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. ముష్రిక్కులను పట్టించుకోకు.
6:107 وَلَوْ شَاءَ اللَّهُ مَا أَشْرَكُوا ۗ وَمَا جَعَلْنَاكَ عَلَيْهِمْ حَفِيظًا ۖ وَمَا أَنتَ عَلَيْهِم بِوَكِيلٍ
అల్లాహ్ గనక తలచుకుని ఉంటే వారు షిర్క్‌కు ఒడిగట్టే వారే కారు. మేము నిన్ను వాళ్ళపై కావలివానిగా నియమించలేదు. నువ్వు వారి వ్యవహారాలకు బాధ్యుడవూ కావు.
6:108 وَلَا تَسُبُّوا الَّذِينَ يَدْعُونَ مِن دُونِ اللَّهِ فَيَسُبُّوا اللَّهَ عَدْوًا بِغَيْرِ عِلْمٍ ۗ كَذَٰلِكَ زَيَّنَّا لِكُلِّ أُمَّةٍ عَمَلَهُمْ ثُمَّ إِلَىٰ رَبِّهِم مَّرْجِعُهُمْ فَيُنَبِّئُهُم بِمَا كَانُوا يَعْمَلُونَ
వారు అల్లాహ్‌ను వదలి వేడుకునే వారిని మీరు దూషించకండి. ఎందుకంటే దీనికి బదులుగా వారు కూడా తమ అజ్ఞానం చేత మితిమీరిపోయి అల్లాహ్‌ను దూషిస్తారు. ఈ విధంగానే మేము అన్ని సమాజాలవారికీ వారి పనులు అందమైనవిగా చేశాము. తర్వాత వారంతా తమ ప్రభువు వద్దకే మరలి వెళతారు. అప్పుడు ఆయన, వారు చేస్తూ ఉన్నదేమిటో వారికి ఎరుక పరుస్తాడు.
6:109 وَأَقْسَمُوا بِاللَّهِ جَهْدَ أَيْمَانِهِمْ لَئِن جَاءَتْهُمْ آيَةٌ لَّيُؤْمِنُنَّ بِهَا ۚ قُلْ إِنَّمَا الْآيَاتُ عِندَ اللَّهِ ۖ وَمَا يُشْعِرُكُمْ أَنَّهَا إِذَا جَاءَتْ لَا يُؤْمِنُونَ
వీళ్లు అల్లాహ్‌పై అతి గట్టిగా ప్రమాణం చేస్తూ, తమ వద్దకు ఏదైనా సూచన గనక వస్తే తప్పకుండా విశ్వసిస్తామని అన్నారు. (ఓ ప్రవక్తా!) “సూచనలన్నీ అల్లాహ్ అధీనంలో ఉన్నాయి” అని వారికి చెప్పు. నీకేం తెలుసు? ఒకవేళ ఆ సూచనలు వచ్చినప్పటికీ వీళ్లు మాత్రం విశ్వసించేవారు కారు.
6:110 وَنُقَلِّبُ أَفْئِدَتَهُمْ وَأَبْصَارَهُمْ كَمَا لَمْ يُؤْمِنُوا بِهِ أَوَّلَ مَرَّةٍ وَنَذَرُهُمْ فِي طُغْيَانِهِمْ يَعْمَهُونَ
తొలిసారి ఏ విధంగానయితే వీళ్లు దీనిని విశ్వసించలేదో అదే విధంగా మేము కూడా వీళ్ల హృదయాలను, వీళ్ల చూపులను తిప్పివేస్తాము. వారిని వారి తలబిరుసుతనంలోనే, దారితప్పి తిరిగేలా వదలిపెడతాము.
6:111 وَلَوْ أَنَّنَا نَزَّلْنَا إِلَيْهِمُ الْمَلَائِكَةَ وَكَلَّمَهُمُ الْمَوْتَىٰ وَحَشَرْنَا عَلَيْهِمْ كُلَّ شَيْءٍ قُبُلًا مَّا كَانُوا لِيُؤْمِنُوا إِلَّا أَن يَشَاءَ اللَّهُ وَلَٰكِنَّ أَكْثَرَهُمْ يَجْهَلُونَ
మేము వాళ్ళ దగ్గరికి దూతలను పంపించినా, మృతులు వారితో మాట్లాడినా, సమస్త వస్తువులను మేము వారి కళ్ళ ఎదుటే తెచ్చిపెట్టినా వాళ్ళు విశ్వసించటమనేది కల్ల. ఒకవేళ అల్లాహ్ తలిస్తే అది వేరే విషయం. అయితే వీళ్ళలో చాలామంది అజ్ఞానపు మాటలు మాట్లాడేవారే.
6:112 وَكَذَٰلِكَ جَعَلْنَا لِكُلِّ نَبِيٍّ عَدُوًّا شَيَاطِينَ الْإِنسِ وَالْجِنِّ يُوحِي بَعْضُهُمْ إِلَىٰ بَعْضٍ زُخْرُفَ الْقَوْلِ غُرُورًا ۚ وَلَوْ شَاءَ رَبُّكَ مَا فَعَلُوهُ ۖ فَذَرْهُمْ وَمَا يَفْتَرُونَ
ఇదే విధంగా మేము ప్రతి ప్రవక్తకూ జిన్నులలోని షైతానులను, మనుషులలోని షైతానులను శత్రువులుగా చేశాము. వారిలోని కొందరు మరి కొందరిని మోసపుచ్చటానికి ముచ్చట గొలిపే మాటలతో ప్రేరేపిస్తుంటారు. నీ ప్రభువే గనక తలచుకుంటే వారెన్నటికీ అలా చేయలేరు. కాబట్టి వాళ్ళను, వారి కల్పనలను వదలివెయ్యి.
6:113 وَلِتَصْغَىٰ إِلَيْهِ أَفْئِدَةُ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ وَلِيَرْضَوْهُ وَلِيَقْتَرِفُوا مَا هُم مُّقْتَرِفُونَ
పరలోకాన్ని విశ్వసించని వారి మనసులు దానివైపుకు మొగ్గాలనీ, దానిని ఇష్టపడాలనీ, తాము ఒడిగట్టిన పాపాలకు వారు కూడా ఒడిగట్టాలని (వారీ మాయోపాయాలు చేస్తున్నారు).
6:114 أَفَغَيْرَ اللَّهِ أَبْتَغِي حَكَمًا وَهُوَ الَّذِي أَنزَلَ إِلَيْكُمُ الْكِتَابَ مُفَصَّلًا ۚ وَالَّذِينَ آتَيْنَاهُمُ الْكِتَابَ يَعْلَمُونَ أَنَّهُ مُنَزَّلٌ مِّن رَّبِّكَ بِالْحَقِّ ۖ فَلَا تَكُونَنَّ مِنَ الْمُمْتَرِينَ
ఏమిటీ, నేను అల్లాహ్‌ను కాకుండా ఇంకొక న్యాయనిర్ణేతను వెతకాలా? యదార్థానికి ఆయన ఒక సంపూర్ణ గ్రంథాన్ని మీ వద్దకు పంపి ఉన్నాడు. అందలి విషయాలు స్పష్టంగా విపులీకరించబడ్డాయి. మేము ఎవరికి గ్రంథం వొసగామో వారికి, ఈ గ్రంథం నీ ప్రభువు తరఫు నుంచి సత్యసమేతంగా వచ్చిందన్న విషయం బాగా తెలుసు. కాబట్టి (ఓ ప్రవక్తా!) నువ్వు శంకించేవారిలో చేరిపోకు.
6:115 وَتَمَّتْ كَلِمَتُ رَبِّكَ صِدْقًا وَعَدْلًا ۚ لَّا مُبَدِّلَ لِكَلِمَاتِهِ ۚ وَهُوَ السَّمِيعُ الْعَلِيمُ
సత్యం రీత్యా, న్యాయం రీత్యా నీ ప్రభువు వాక్కు సంపూర్ణమైనది. ఆయన వాక్కులను మార్చగలవాడెవడూ లేడు. ఆయన ప్రతిదీ వినేవాడు, ప్రతిదీ తెలిసినవాడు.
6:116 وَإِن تُطِعْ أَكْثَرَ مَن فِي الْأَرْضِ يُضِلُّوكَ عَن سَبِيلِ اللَّهِ ۚ إِن يَتَّبِعُونَ إِلَّا الظَّنَّ وَإِنْ هُمْ إِلَّا يَخْرُصُونَ
(ఓ ప్రవక్తా!) భూమిపై నివసించే అధిక సంఖ్యాకులు చెప్పినట్లుగా నీవు మసలుకున్నావంటే వారు నిన్ను అల్లాహ్ మార్గం నుంచి అపమార్గం పట్టిస్తారు. వారు వట్టి ఊహలను అనుసరిస్తారు. కేవలం అంచనాలతో మాట్లాడతారు.
6:117 إِنَّ رَبَّكَ هُوَ أَعْلَمُ مَن يَضِلُّ عَن سَبِيلِهِ ۖ وَهُوَ أَعْلَمُ بِالْمُهْتَدِينَ
తన దారిలో నుంచి పెడదారి తీసే వారెవరో నీ ప్రభువుకు బాగా తెలుసు. తన మార్గంపై నడిచేవారెవరో కూడా ఆయనకు బాగా తెలుసు.
6:118 فَكُلُوا مِمَّا ذُكِرَ اسْمُ اللَّهِ عَلَيْهِ إِن كُنتُم بِآيَاتِهِ مُؤْمِنِينَ
కనుక అల్లాహ్ ఆదేశాలపై మీకు గనక విశ్వాసముంటే అల్లాహ్ పేరు స్మరించబడిన జంతువు మాంసాన్ని తినండి.
6:119 وَمَا لَكُمْ أَلَّا تَأْكُلُوا مِمَّا ذُكِرَ اسْمُ اللَّهِ عَلَيْهِ وَقَدْ فَصَّلَ لَكُم مَّا حَرَّمَ عَلَيْكُمْ إِلَّا مَا اضْطُرِرْتُمْ إِلَيْهِ ۗ وَإِنَّ كَثِيرًا لَّيُضِلُّونَ بِأَهْوَائِهِم بِغَيْرِ عِلْمٍ ۗ إِنَّ رَبَّكَ هُوَ أَعْلَمُ بِالْمُعْتَدِينَ
అల్లాహ్ పేరు ఉచ్చరించబడిన జంతువు మాంసాన్ని మీరు తినకపోవటానికి అసలు కారణం ఏమిటీ? అల్లాహ్ మీ కొరకు నిషేధించిన జంతువుల వివరాలను ముందుగానే స్పష్టపరిచాడు కదా! గత్యంతరం లేని పరిస్థితుల్లో అవి కూడా (ప్రాణరక్షణ కోసం నిషిద్ధ జంతువులు సయితం) మీకోసం ధర్మ సమ్మతం అవుతాయి. వాస్తవమేమిటంటే చాలా మంది ఏ ప్రమాణమూ లేకుండానే – తమ కోరికల ఆధారంగా – జనులను పెడత్రోవ పట్టిస్తూ ఉంటారు. నిశ్చయంగా నియమాలను ఉల్లంఘించే వారిని నీ ప్రభువు బాగా ఎరుగు.
6:120 وَذَرُوا ظَاهِرَ الْإِثْمِ وَبَاطِنَهُ ۚ إِنَّ الَّذِينَ يَكْسِبُونَ الْإِثْمَ سَيُجْزَوْنَ بِمَا كَانُوا يَقْتَرِفُونَ
మీరు బహిరంగ పాపాలనూ, గోప్యమైన పాపాలను కూడా విడనాడండి. పాపాలకు ఒడిగట్టేవారికి అతి త్వరలోనే వారు చేసుకున్నదానికి శిక్ష పడి తీరుతుంది.
6:121 وَلَا تَأْكُلُوا مِمَّا لَمْ يُذْكَرِ اسْمُ اللَّهِ عَلَيْهِ وَإِنَّهُ لَفِسْقٌ ۗ وَإِنَّ الشَّيَاطِينَ لَيُوحُونَ إِلَىٰ أَوْلِيَائِهِمْ لِيُجَادِلُوكُمْ ۖ وَإِنْ أَطَعْتُمُوهُمْ إِنَّكُمْ لَمُشْرِكُونَ
అల్లాహ్ పేరు స్మరించబడని జంతువులను తినకండి. ఎందుకంటే ఇది ఆజ్ఞోల్లంఘన క్రిందికి వస్తుంది. మీతో వాదులాడటానికి షైతానులు తమ మిత్రులను ఉసిగొల్పుతుంటారు. ఒకవేళ మీరు గనక వారిని అనుసరించారంటే మీరు కూడా అల్లాహ్‌కు సహవర్తుల్ని కల్పించినవారు (ముష్రిక్కులు) అయిపోతారు (జాగ్రత్త!).
6:122 أَوَمَن كَانَ مَيْتًا فَأَحْيَيْنَاهُ وَجَعَلْنَا لَهُ نُورًا يَمْشِي بِهِ فِي النَّاسِ كَمَن مَّثَلُهُ فِي الظُّلُمَاتِ لَيْسَ بِخَارِجٍ مِّنْهَا ۚ كَذَٰلِكَ زُيِّنَ لِلْكَافِرِينَ مَا كَانُوا يَعْمَلُونَ
మృతుడుగా ఉన్న ఒక వ్యక్తికి మేము జీవితం ప్రసాదించి, అతనికి జ్యోతి నొసగగా, దానిని పుచ్చుకుని అతను జనుల మధ్య సంచరిస్తున్నాడు. ఇలాంటి వ్యక్తి, కటిక చీకట్లలో కూరుకుపోయి వాటి నుండి ఏమాత్రం బయటపడలేని వ్యక్తి లాంటివాడా? ఇదే విధంగా సత్యతిరస్కారులకు వారి పనులు వారికెంతో అందమైనవిగా తోస్తాయి.
6:123 وَكَذَٰلِكَ جَعَلْنَا فِي كُلِّ قَرْيَةٍ أَكَابِرَ مُجْرِمِيهَا لِيَمْكُرُوا فِيهَا ۖ وَمَا يَمْكُرُونَ إِلَّا بِأَنفُسِهِمْ وَمَا يَشْعُرُونَ
ఇదే విధంగా మేము ప్రతి పట్టణంలోనూ అక్కడి సర్దారులనే అపరాధాలకు ఒడిగట్టేవారుగా చేశాము – అక్కడ వారు తమ పన్నాగాలు పన్నటానికి! వాస్తవానికి వారు తమను తామే వంచించుకుంటున్నారు. కాని వారికి ఆ సంగతి తెలియటం లేదు.
6:124 وَإِذَا جَاءَتْهُمْ آيَةٌ قَالُوا لَن نُّؤْمِنَ حَتَّىٰ نُؤْتَىٰ مِثْلَ مَا أُوتِيَ رُسُلُ اللَّهِ ۘ اللَّهُ أَعْلَمُ حَيْثُ يَجْعَلُ رِسَالَتَهُ ۗ سَيُصِيبُ الَّذِينَ أَجْرَمُوا صَغَارٌ عِندَ اللَّهِ وَعَذَابٌ شَدِيدٌ بِمَا كَانُوا يَمْكُرُونَ
వారి వద్దకు ఏదైనా సూచన వచ్చినప్పుడు, “దైవప్రవక్తలకు ఇవ్వబడినదే మాకూ ఇవ్వబడనంతవరకూ మేము విశ్వసించేది లేదు” అని వారు అంటారు. తన దౌత్యాన్ని ఎవరికి అందజేయాలో అల్లాహ్‌కే బాగా తెలుసు. అతి త్వరలోనే అపరాధులు అల్లాహ్ వద్దకు చేరుకుని పరాభవాన్నీ, తమ దుష్టపన్నాగాలకు గాను కఠినాతి కఠినమైన శిక్షను అనుభవిస్తారు.
6:125 فَمَن يُرِدِ اللَّهُ أَن يَهْدِيَهُ يَشْرَحْ صَدْرَهُ لِلْإِسْلَامِ ۖ وَمَن يُرِدْ أَن يُضِلَّهُ يَجْعَلْ صَدْرَهُ ضَيِّقًا حَرَجًا كَأَنَّمَا يَصَّعَّدُ فِي السَّمَاءِ ۚ كَذَٰلِكَ يَجْعَلُ اللَّهُ الرِّجْسَ عَلَى الَّذِينَ لَا يُؤْمِنُونَ
కనుక అల్లాహ్, తాను సన్మార్గ భాగ్యం ప్రసాదించదలచిన వ్యక్తి హృదయాన్ని ఇస్లాం కొరకు విప్పుతాడు. అలాగే తాను అపమార్గాన వదిలేయదలచిన వ్యక్తి హృదయాన్ని ఆకాశానికెక్కే వానిలాగా కుంచింపజేస్తాడు. ఈ విధంగా అల్లాహ్ విశ్వసించని వారికి మాలిన్యాన్ని అంటగడతాడు.
6:126 وَهَٰذَا صِرَاطُ رَبِّكَ مُسْتَقِيمًا ۗ قَدْ فَصَّلْنَا الْآيَاتِ لِقَوْمٍ يَذَّكَّرُونَ
ఇదే నీ ప్రభువు యొక్క రుజుమార్గం. ఉపదేశాన్ని స్వీకరించే వారి కోసం మేము ఈ ఆయతులను స్పష్టంగా విడమరచి చెప్పాము.
6:127 لَهُمْ دَارُ السَّلَامِ عِندَ رَبِّهِمْ ۖ وَهُوَ وَلِيُّهُم بِمَا كَانُوا يَعْمَلُونَ
వారి కొరకు వారి ప్రభువు వద్ద శాంతి నిలయం ఉంది. వారి మంచి పనుల మూలంగా అల్లాహ్ వారికి రక్షకునిగా నిలుస్తాడు.
6:128 وَيَوْمَ يَحْشُرُهُمْ جَمِيعًا يَا مَعْشَرَ الْجِنِّ قَدِ اسْتَكْثَرْتُم مِّنَ الْإِنسِ ۖ وَقَالَ أَوْلِيَاؤُهُم مِّنَ الْإِنسِ رَبَّنَا اسْتَمْتَعَ بَعْضُنَا بِبَعْضٍ وَبَلَغْنَا أَجَلَنَا الَّذِي أَجَّلْتَ لَنَا ۚ قَالَ النَّارُ مَثْوَاكُمْ خَالِدِينَ فِيهَا إِلَّا مَا شَاءَ اللَّهُ ۗ إِنَّ رَبَّكَ حَكِيمٌ عَلِيمٌ
అల్లాహ్ వారందరినీ సమీకరించే రోజు, “ఓ జిన్నాతు వర్గీయులారా! మీరు మనుషుల్లోని చాలామందిని మీవారుగా చేసుకున్నారు” అని అంటాడు. అప్పుడు వారితో సంబంధాలు పెట్టుకుని ఉన్న మనుషులు ఇలా అంటారు: “మా ప్రభూ! మేము ఒండొకరి ద్వారా లబ్ది పొందిన సంగతి నిజమే. ఎట్టకేలకు నీవు మా కోసం నిర్థారించిన గడువుకు మేము చేరుకున్నాము.” అప్పుడు అల్లాహ్ ఇలా అంటాడు: “ఇక నరకమే మీ అందరి నివాస స్థలం. అందులోనే మీరు కలకాలం పడి ఉంటారు. అయితే అల్లాహ్ ఏదయినా తలిస్తే అది వేరే విషయం” నిస్సందేహంగా నీ ప్రభువు వివేక సంపన్నుడు, జ్ఞానవంతుడు.
6:129 وَكَذَٰلِكَ نُوَلِّي بَعْضَ الظَّالِمِينَ بَعْضًا بِمَا كَانُوا يَكْسِبُونَ
ఈ విధంగా కొందరు దుర్మార్గులను (కాఫిర్లను) మేము- వారు చేసుకున్న కర్మల కారణంగా – మరి కొందరికి సన్నిహితులుగా చేస్తాము.
6:130 يَا مَعْشَرَ الْجِنِّ وَالْإِنسِ أَلَمْ يَأْتِكُمْ رُسُلٌ مِّنكُمْ يَقُصُّونَ عَلَيْكُمْ آيَاتِي وَيُنذِرُونَكُمْ لِقَاءَ يَوْمِكُمْ هَٰذَا ۚ قَالُوا شَهِدْنَا عَلَىٰ أَنفُسِنَا ۖ وَغَرَّتْهُمُ الْحَيَاةُ الدُّنْيَا وَشَهِدُوا عَلَىٰ أَنفُسِهِمْ أَنَّهُمْ كَانُوا كَافِرِينَ
ఓ జిన్నాతు మరియు మానవ వర్గీయులారా! ఏమిటీ, నా ఆదేశాలను మీకు విడమరచి చెప్పే, ఈనాటి ఈ దినం గురించి మిమ్మల్ని హెచ్చరించే ప్రవక్తలు స్వయంగా మీనుండే మీ వద్దకు రాలేదా? (అని అల్లాహ్ తరఫున ప్రశ్నించబడినప్పుడు), “అవును వచ్చారు. మాకు వ్యతిరేకంగా స్వయంగా మేమే సాక్ష్యమిస్తున్నాం” అని అంటారు. ప్రాపంచిక జీవితం వారిని మోసానికి గురి చేసింది. తాము తిరస్కారులయ్యామన్న సంగతిని గురించి వారు స్వయంగా సాక్ష్యమిస్తారు.
6:131 ذَٰلِكَ أَن لَّمْ يَكُن رَّبُّكَ مُهْلِكَ الْقُرَىٰ بِظُلْمٍ وَأَهْلُهَا غَافِلُونَ
ఎందుకంటే, నీ ప్రభువు ఏ సీమను కూడా అక్కడి ప్రజలు (సత్యాసత్యాలు) తెలుసుకోకుండా ఉన్న స్థితిలో-వారి తిరస్కార వైఖరి మూలంగా నాశనం చేయడు.
6:132 وَلِكُلٍّ دَرَجَاتٌ مِّمَّا عَمِلُوا ۚ وَمَا رَبُّكَ بِغَافِلٍ عَمَّا يَعْمَلُونَ
ప్రతి ఒక్కరికీ వారి ఆచరణలను బట్టి అంతస్తులు లభిస్తాయి. నీ ప్రభువు వారి పనుల విషయంలో అజాగ్రత్తగా లేడు.
6:133 وَرَبُّكَ الْغَنِيُّ ذُو الرَّحْمَةِ ۚ إِن يَشَأْ يُذْهِبْكُمْ وَيَسْتَخْلِفْ مِن بَعْدِكُم مَّا يَشَاءُ كَمَا أَنشَأَكُم مِّن ذُرِّيَّةِ قَوْمٍ آخَرِينَ
ఇంకా నీ ప్రభువు ఏ అక్కరాలేనివాడు, కనికరించేవాడు. ఆయన గనక తలచుకుంటే మీ అందరినీ తుద ముట్టించి, మిమ్మల్ని వేరొక వంశం నుంచి పుట్టించినట్లే, మీ స్థానంలో తాను కోరినవారిని వసింపజేస్తాడు.
6:134 إِنَّ مَا تُوعَدُونَ لَآتٍ ۖ وَمَا أَنتُم بِمُعْجِزِينَ
మీకు వాగ్దానం చెయ్యబడుతున్నది ముమ్మాటికీ వచ్చి తీర్తుంది. మీరు (అల్లాహ్‌ను) అశక్తుణ్ణి చేయలేరు.
6:135 قُلْ يَا قَوْمِ اعْمَلُوا عَلَىٰ مَكَانَتِكُمْ إِنِّي عَامِلٌ ۖ فَسَوْفَ تَعْلَمُونَ مَن تَكُونُ لَهُ عَاقِبَةُ الدَّارِ ۗ إِنَّهُ لَا يُفْلِحُ الظَّالِمُونَ
ఓ ప్రవక్తా! వారికి ఇలా చెప్పు : “ఓ నా జాతి ప్రజలారా! మీ పని మీరు చేయండి. నా కర్తవ్యాన్ని నేను నెరవేరుస్తూ ఉంటాను. ఈ లోకంలో మేలైన పరిణామం ఎవరికి చెందుతుందో త్వరలోనే మీకు తెలిసిపోతుంది. అన్యాయానికి పాల్పడే వారు నిశ్చయంగా ఎన్నటికీ సాఫల్యం పొందలేరు.’
6:136 وَجَعَلُوا لِلَّهِ مِمَّا ذَرَأَ مِنَ الْحَرْثِ وَالْأَنْعَامِ نَصِيبًا فَقَالُوا هَٰذَا لِلَّهِ بِزَعْمِهِمْ وَهَٰذَا لِشُرَكَائِنَا ۖ فَمَا كَانَ لِشُرَكَائِهِمْ فَلَا يَصِلُ إِلَى اللَّهِ ۖ وَمَا كَانَ لِلَّهِ فَهُوَ يَصِلُ إِلَىٰ شُرَكَائِهِمْ ۗ سَاءَ مَا يَحْكُمُونَ
అల్లాహ్ సృష్టించిన పంట పొలాలలో నుంచి, పశువులలో నుంచి వీళ్లు కొంత భాగాన్ని అల్లాహ్ కోసం నిర్థారించారు. పైపెచ్చు “ఇది అల్లాహ్ భాగం, ఇది మేము నిలబెట్టిన సహవర్తుల భాగం” అని స్వయంగా తామే తీర్మానించుకొని చెబుతారు. సహవర్తుల కోసం నిర్థారించిన భాగం అల్లాహ్‌కు ఎలాగూ చేరదు. కాని అల్లాహ్ కోసం నిర్థారించినది మాత్రం వారు నిలబెట్టిన సహవర్తులకు ఇట్టే చేరిపోతుంది. వారి ఈ తీర్పు ఎంత ఘోరమైనది!?
6:137 وَكَذَٰلِكَ زَيَّنَ لِكَثِيرٍ مِّنَ الْمُشْرِكِينَ قَتْلَ أَوْلَادِهِمْ شُرَكَاؤُهُمْ لِيُرْدُوهُمْ وَلِيَلْبِسُوا عَلَيْهِمْ دِينَهُمْ ۖ وَلَوْ شَاءَ اللَّهُ مَا فَعَلُوهُ ۖ فَذَرْهُمْ وَمَا يَفْتَرُونَ
మరి ఇలాగే చాలామంది ముష్రిక్కుల దృష్టిలో వారి సహవర్తులు, వారిని నాశనం చేయడానికీ, వారి మత ధర్మాన్ని వారికి సందేహాస్పదంగా చేయటానికి వారి సంతాన హత్యను వారికి మంచిదిగా తోచినట్లు చేశారు. అల్లాహ్ తలచుకుని ఉంటే వారలా చేసి ఉండేవారు కాదు. కనుక నీవు వారినీ, వారు కల్పించే కల్పనలనూ వదిలెయ్యి.
6:138 وَقَالُوا هَٰذِهِ أَنْعَامٌ وَحَرْثٌ حِجْرٌ لَّا يَطْعَمُهَا إِلَّا مَن نَّشَاءُ بِزَعْمِهِمْ وَأَنْعَامٌ حُرِّمَتْ ظُهُورُهَا وَأَنْعَامٌ لَّا يَذْكُرُونَ اسْمَ اللَّهِ عَلَيْهَا افْتِرَاءً عَلَيْهِ ۚ سَيَجْزِيهِم بِمَا كَانُوا يَفْتَرُونَ
“ఈ కొన్ని పశువులు, పంట పొలాలు అందరికీ సమ్మతం కావు. మేము కోరినవారు తప్ప ఇతరులెవరూ వాటిని తినటం సమ్మతం కాదు” అని వారు తమంతట తాముగా – కల్పించుకొని – చెబుతారు. కొన్ని పశువులపై స్వారీ చేయటం, వాటి ద్వారా బరువు లాగించటం నిషేధించబడింది (అని అంటారు). మరి కొన్ని పశువులపై (జిబహ్ చేసే సమయంలో) వారు అల్లాహ్ పేరు ఉచ్చరించరు, అల్లాహ్‌కు అబద్ధాన్ని అంటగట్టటానికిగాను (వారు ఇలా చేస్తారు). వారు కల్పించే ఈ అబద్ధాలకుగాను త్వరలోనే అల్లాహ్ వారికి దాని ప్రతిఫలం ఇస్తాడు.
6:139 وَقَالُوا مَا فِي بُطُونِ هَٰذِهِ الْأَنْعَامِ خَالِصَةٌ لِّذُكُورِنَا وَمُحَرَّمٌ عَلَىٰ أَزْوَاجِنَا ۖ وَإِن يَكُن مَّيْتَةً فَهُمْ فِيهِ شُرَكَاءُ ۚ سَيَجْزِيهِمْ وَصْفَهُمْ ۚ إِنَّهُ حَكِيمٌ عَلِيمٌ
“ఈ పశువుల గర్భాలలో ఉన్నది కేవలం మా పురుషుల కోసమే. మా స్త్రీల కోసం అది నిషిద్ధం. ఒకవేళ అది చచ్చినదైతే అందరికీ అందులో భాగం ఉంటుంది” అని కూడా వారంటారు. వారి ఈ తప్పుడు మాటలకుగాను అల్లాహ్ త్వరలోనే వారిని దండిస్తాడు. నిశ్చయంగా ఆయన మహావివేకి, మహాజ్ఞాని.
6:140 قَدْ خَسِرَ الَّذِينَ قَتَلُوا أَوْلَادَهُمْ سَفَهًا بِغَيْرِ عِلْمٍ وَحَرَّمُوا مَا رَزَقَهُمُ اللَّهُ افْتِرَاءً عَلَى اللَّهِ ۚ قَدْ ضَلُّوا وَمَا كَانُوا مُهْتَدِينَ
మూర్ఖత్వం కొద్దీ, ఏ ఆధారమూ లేకుండానే తమ సంతానాన్ని హత్యచేసిన వారూ, అల్లాహ్ ఉపాధిగా ప్రసాదించిన వస్తువులను అల్లాహ్‌కు అబద్ధాలను అంటగడుతూ నిషేధించుకున్నవారూ ముమ్మాటికీ నష్టానికి గురయ్యారు. నిశ్చయంగా వారు మార్గ విహీనతకు లోనయ్యారు. వారు సన్మార్గాన లేరు.
6:141 وَهُوَ الَّذِي أَنشَأَ جَنَّاتٍ مَّعْرُوشَاتٍ وَغَيْرَ مَعْرُوشَاتٍ وَالنَّخْلَ وَالزَّرْعَ مُخْتَلِفًا أُكُلُهُ وَالزَّيْتُونَ وَالرُّمَّانَ مُتَشَابِهًا وَغَيْرَ مُتَشَابِهٍ ۚ كُلُوا مِن ثَمَرِهِ إِذَا أَثْمَرَ وَآتُوا حَقَّهُ يَوْمَ حَصَادِهِ ۖ وَلَا تُسْرِفُوا ۚ إِنَّهُ لَا يُحِبُّ الْمُسْرِفِينَ
ఆయనే పందిళ్ళపై ఎక్కించబడే తోటలను, పందిళ్ళపై ఎక్కించబడని తోటలను, ఖర్జూర చెట్లను, పంటపొలాలను సృజించాడు. వాటి ద్వారా రకరకాల ఆహార వస్తువులు లభ్యమవుతాయి. జైతూను (ఆలివ్), దానిమ్మ వృక్షాలను కూడా సృజించాడు. వాటిలో కొన్ని పరస్పరం పోలి ఉంటాయి. మరికొన్ని పోలి ఉండవు. వాటన్నింటి పండ్లు పండినప్పుడు వాటిని తినండి. పంటకోసే రోజున తప్పనిసరిగా చెల్లించవలసిన దాని హక్కును చెల్లించండి. మితిమీరకండి. మితిమీరే వారిని అల్లాహ్ ఎట్టిపరిస్థితిలోనూ ఇష్టపడడు.
6:142 وَمِنَ الْأَنْعَامِ حَمُولَةً وَفَرْشًا ۚ كُلُوا مِمَّا رَزَقَكُمُ اللَّهُ وَلَا تَتَّبِعُوا خُطُوَاتِ الشَّيْطَانِ ۚ إِنَّهُ لَكُمْ عَدُوٌّ مُّبِينٌ
పశువులలో ఎత్తుగా ఉండే వాటిని, పొట్టిగా ఉండేవాటినీ పుట్టించినవాడు కూడా ఆయనే. అల్లాహ్ మీకు ఇచ్చిన దానిని తినండి. కాని షైతాను అడుగుజాడల్లో నడవకండి. నిశ్చయంగా వాడు మీ బహిరంగ శత్రువు.
6:143 ثَمَانِيَةَ أَزْوَاجٍ ۖ مِّنَ الضَّأْنِ اثْنَيْنِ وَمِنَ الْمَعْزِ اثْنَيْنِ ۗ قُلْ آلذَّكَرَيْنِ حَرَّمَ أَمِ الْأُنثَيَيْنِ أَمَّا اشْتَمَلَتْ عَلَيْهِ أَرْحَامُ الْأُنثَيَيْنِ ۖ نَبِّئُونِي بِعِلْمٍ إِن كُنتُمْ صَادِقِينَ
(ఇవి ఆయన సృష్టించిన) ఎనిమిది ఆడమగలు. అంటే గొఱ్ఱెలలో రెండు రకాలు, మేకలలో రెండు రకాలు. “అల్లాహ్ నిషేధించినది ఆ రెండు మగ పశువులనా లేక రెండు ఆడ పశువులనా లేక ఆ రెండు ఆడపశువుల గర్భాలలో ఉన్న వాటినా? మీరు సత్యవంతులే అయితే ప్రమాణబద్ధంగా నాకు తెలియజేయండి” అని (ఓ ప్రవక్తా!) వారిని అడుగు.
6:144 وَمِنَ الْإِبِلِ اثْنَيْنِ وَمِنَ الْبَقَرِ اثْنَيْنِ ۗ قُلْ آلذَّكَرَيْنِ حَرَّمَ أَمِ الْأُنثَيَيْنِ أَمَّا اشْتَمَلَتْ عَلَيْهِ أَرْحَامُ الْأُنثَيَيْنِ ۖ أَمْ كُنتُمْ شُهَدَاءَ إِذْ وَصَّاكُمُ اللَّهُ بِهَٰذَا ۚ فَمَنْ أَظْلَمُ مِمَّنِ افْتَرَىٰ عَلَى اللَّهِ كَذِبًا لِّيُضِلَّ النَّاسَ بِغَيْرِ عِلْمٍ ۗ إِنَّ اللَّهَ لَا يَهْدِي الْقَوْمَ الظَّالِمِينَ
అలాగే ఒంటెలలో రెండు రకాలు, ఆవులలో రెండు రకాలను (ఆయన పుట్టించాడు). మరి వీటిలో అల్లాహ్ నిషేధించినది రెండు పోతులనా? లేక రెండు పడ్డలనా? లేక ఆ రెండు పడ్డల కడుపులలో ఉన్న దూడలను నిషేధించాడా? అని (ఓ ప్రవక్తా!) వాళ్ళను అడుగు. ఈ మేరకు అల్లాహ్ మీకు ఆదేశించినప్పుడు మీరక్కడ ఉన్నారా? ఏ ఆధారమూ లేకుండానే- ప్రజల్ని అపమార్గం పట్టించే ఉద్దేశంతో- అల్లాహ్‌కు అబద్ధాన్ని ఆపాదించే వానికన్నా పరమ దుర్మార్గుడు ఎవడుంటాడు? ఇలాంటి దుర్మార్గులకు అల్లాహ్ సన్మార్గం చూపడు.
6:145 قُل لَّا أَجِدُ فِي مَا أُوحِيَ إِلَيَّ مُحَرَّمًا عَلَىٰ طَاعِمٍ يَطْعَمُهُ إِلَّا أَن يَكُونَ مَيْتَةً أَوْ دَمًا مَّسْفُوحًا أَوْ لَحْمَ خِنزِيرٍ فَإِنَّهُ رِجْسٌ أَوْ فِسْقًا أُهِلَّ لِغَيْرِ اللَّهِ بِهِ ۚ فَمَنِ اضْطُرَّ غَيْرَ بَاغٍ وَلَا عَادٍ فَإِنَّ رَبَّكَ غَفُورٌ رَّحِيمٌ
ఓ ప్రవక్తా! వారికి చెప్పు : (వహీ ద్వారా) నా వద్దకు వచ్చిన ఆజ్ఞలలో చచ్చిన జంతువు, ప్రవహించే రక్తం, పందిమాంసం – అది పరమ అశుద్ధం గనక! – ఇంకా దైవేతరుల పేర కోయబడిన జంతువు తప్ప మరేదీ తినేవాడి కోసం నిషేధించబడినట్లు నాకు కనిపించదు. అయితే గత్యంతరం లేని పరిస్థితిలో- రుచికోసం కాకుండా, హద్దు మీరకుండా ఉంటే (వాటిని తింటే అట్టి స్థితిలో) నీ ప్రభువు క్షమించేవాడూ, కరుణించేవాడు.
6:146 وَعَلَى الَّذِينَ هَادُوا حَرَّمْنَا كُلَّ ذِي ظُفُرٍ ۖ وَمِنَ الْبَقَرِ وَالْغَنَمِ حَرَّمْنَا عَلَيْهِمْ شُحُومَهُمَا إِلَّا مَا حَمَلَتْ ظُهُورُهُمَا أَوِ الْحَوَايَا أَوْ مَا اخْتَلَطَ بِعَظْمٍ ۚ ذَٰلِكَ جَزَيْنَاهُم بِبَغْيِهِمْ ۖ وَإِنَّا لَصَادِقُونَ
యూదులకు మేము గోళ్ళు గల జంతువులన్నింటినీ నిషేధించాము. ఇంకా వారికి, ఆవు మరియు మేకలలో వాటి వీపులకు తగిలివున్న కొవ్వునీ, ప్రేగులపై ఉన్నదానినీ, ఎముకలతో కలిసి ఉన్న దానిని తప్ప – మిగిలిన క్రొవ్వును కూడా నిషేధించాము. వారి తలబిరుసుతనం మూలంగా మేము వారికి ఈ శిక్ష విధించాము. ముమ్మాటికీ మేము చెప్పేది నిజం.
6:147 فَإِن كَذَّبُوكَ فَقُل رَّبُّكُمْ ذُو رَحْمَةٍ وَاسِعَةٍ وَلَا يُرَدُّ بَأْسُهُ عَنِ الْقَوْمِ الْمُجْرِمِينَ
ఆ తరువాత కూడా వాళ్ళు నిన్ను ధిక్కరిస్తే, “మీ ప్రభువు విస్తృతమైన కారుణ్యం కలవాడు. అయితే ఆయన శిక్ష అపరాధ జనులపై నుంచి తొలగిపోదు” అని వారికి చెప్పెయ్యి.
6:148 سَيَقُولُ الَّذِينَ أَشْرَكُوا لَوْ شَاءَ اللَّهُ مَا أَشْرَكْنَا وَلَا آبَاؤُنَا وَلَا حَرَّمْنَا مِن شَيْءٍ ۚ كَذَٰلِكَ كَذَّبَ الَّذِينَ مِن قَبْلِهِمْ حَتَّىٰ ذَاقُوا بَأْسَنَا ۗ قُلْ هَلْ عِندَكُم مِّنْ عِلْمٍ فَتُخْرِجُوهُ لَنَا ۖ إِن تَتَّبِعُونَ إِلَّا الظَّنَّ وَإِنْ أَنتُمْ إِلَّا تَخْرُصُونَ
“అల్లాహ్ తలచుకొని ఉంటే మేముగానీ, మా తాత ముత్తాతలుగానీ షిర్క్‌కు పాల్పడేవారం కాము; ఏ వస్తువునూ నిషిద్ధంగా ఖరారు చేసేవారం కూడా కాము” అని ముష్రిక్కులు అంటారు. వీరికి పూర్వం గతించిన వారు కూడా ఇలాగే ధిక్కార వైఖరిని అవలంబించారు. కడకు వారు మా శిక్షను చవి చూశారు. (ఓ ప్రవక్తా!) వారిని అడుగు: “మీ దగ్గర ఏదైనా ప్రమాణం ఉంటే, దాన్ని మా ముందు సమర్పించండి. మీరు కేవలం ఊహలను అనుసరిస్తారు. అంచనాలతో మాట్లాడతారు.”
6:149 قُلْ فَلِلَّهِ الْحُجَّةُ الْبَالِغَةُ ۖ فَلَوْ شَاءَ لَهَدَاكُمْ أَجْمَعِينَ
ఇంకా వారికి ఇలా చెప్పు: “పరిపూర్ణమైన వాదన అల్లాహ్‌దే. ఆయనే గనక తలచుకుంటే మీ అందరినీ సన్మార్గంపై నడిపించేవాడే.”
6:150 قُلْ هَلُمَّ شُهَدَاءَكُمُ الَّذِينَ يَشْهَدُونَ أَنَّ اللَّهَ حَرَّمَ هَٰذَا ۖ فَإِن شَهِدُوا فَلَا تَشْهَدْ مَعَهُمْ ۚ وَلَا تَتَّبِعْ أَهْوَاءَ الَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا وَالَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ وَهُم بِرَبِّهِمْ يَعْدِلُونَ
“అల్లాహ్ ఈ వస్తువుల్ని నిషేధించాడు అని సాక్ష్యమిచ్చే మీ సాక్షులను తీసుకురండి” అని వారిని అడుగు. మరి వారు గనక అలా సాక్ష్యమిస్తే నీవు మాత్రం వారితోపాటు సాక్ష్యం ఇవ్వకు. వారి మిథ్యా భావాలను అనుసరించకు. మా ఆయతులను ధిక్కరించేవారి, పరలోకాన్ని విశ్వసించనివారి, ఇంకా ఇతరులను తమ ప్రభువుకు సమానులుగా నిలబెట్టేవారి కోరికలను అనుసరించకు.
6:151 قُلْ تَعَالَوْا أَتْلُ مَا حَرَّمَ رَبُّكُمْ عَلَيْكُمْ ۖ أَلَّا تُشْرِكُوا بِهِ شَيْئًا ۖ وَبِالْوَالِدَيْنِ إِحْسَانًا ۖ وَلَا تَقْتُلُوا أَوْلَادَكُم مِّنْ إِمْلَاقٍ ۖ نَّحْنُ نَرْزُقُكُمْ وَإِيَّاهُمْ ۖ وَلَا تَقْرَبُوا الْفَوَاحِشَ مَا ظَهَرَ مِنْهَا وَمَا بَطَنَ ۖ وَلَا تَقْتُلُوا النَّفْسَ الَّتِي حَرَّمَ اللَّهُ إِلَّا بِالْحَقِّ ۚ ذَٰلِكُمْ وَصَّاكُم بِهِ لَعَلَّكُمْ تَعْقِلُونَ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “రండి, మీ ప్రభువు మీపై నిషేధించిన వస్తువులు ఏవో మీకు చదివి వినిపిస్తాను. అవేమంటే; అల్లాహ్‌కు సహవర్తులుగా ఎవరినీ కల్పించకండి. తల్లిదండ్రుల యెడల ఉత్తమరీతి