స్వర్గంలోకి ప్రవేశించేవారు నాలుగు రకాలు – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో | టెక్స్ట్]

స్వర్గంలోకి ప్రవేశించేవారు నాలుగు రకాలు
హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్)
https://youtu.be/O0rxrJs_Nms [22 నిముషాలు]

ఈ ప్రసంగంలో, స్వర్గంలో ప్రవేశించే వారి గురించి వివరించబడింది. ముఖ్యంగా నాలుగు రకాల స్వర్గవాసుల గురించి చర్చించబడింది. మొదటి రకం వారు విచారణ లేకుండా స్వర్గానికి వెళ్లేవారు, వీరిలో 70,000 మంది ఉంటారని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. వీరి లక్షణాలు: ఇతరులను మంత్రించమని కోరరు, అపశకునాలు నమ్మరు, వాతలు పెట్టించుకోరు మరియు పూర్తిగా అల్లాహ్ పైనే నమ్మకం ఉంచుతారు. రెండవ రకం వారు విచారణ తర్వాత స్వర్గానికి వెళ్లేవారు. మూడవ రకం అస్ హాబుల్ ఆరాఫ్, వీరి పుణ్యాలు పాపాలు సమానంగా ఉంటాయి, వీరు కొంతకాలం ఆగి అల్లాహ్ దయతో స్వర్గానికి వెళ్తారు. నాల్గవ రకం వారు పాపాల కారణంగా నరకంలో శిక్ష అనుభవించిన తర్వాత, వారి ఈమాన్ కారణంగా స్వర్గానికి వెళ్లేవారు. పెద్ద పాపాలు చేసిన వారు కూడా చిత్తశుద్ధితో పశ్చాత్తాపం చెందితే (తౌబా), విచారణ లేకుండా స్వర్గానికి వెళ్లే అవకాశం ఉందని ఖుర్ఆన్ ఆయత్ ల ద్వారా స్పష్టం చేయబడింది. సహాబాల జీవితాల నుండి ఉదాహరణలు, ముఖ్యంగా ఉక్కాషా బిన్ మెహ్సన్ మరియు మూర్ఛ రోగంతో బాధపడిన స్త్రీ ఉదంతాలు, స్వర్గం పట్ల వారికున్న ఆకాంక్షను మరియు అల్లాహ్ పై వారికున్న ప్రగాఢ విశ్వాసాన్ని వివరిస్తాయి.

أَعُوذُ بِاللَّهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا
[అవూదు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యిఆతి అఅ్మాలినా]
మేము మా ఆత్మల చెడు నుండి మరియు మా చెడు పనుల నుండి అల్లాహ్ తో శరణు వేడుకుంటున్నాము.

مَنْ يَهْدِهِ اللَّهُ فَلَا مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلَا هَادِيَ لَهُ
[మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహు, వ మన్ యుద్లిల్ ఫలా హాదియ లహు]
అల్లాహ్ ఎవరికి మార్గనిర్దేశం చేస్తాడో, అతడిని ఎవరూ దారి తప్పించలేరు. మరియు ఆయన ఎవరిని దారి తప్పిస్తాడో, అతనికి ఎవరూ మార్గనిర్దేశం చేయలేరు.

وَأَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ
[వ అష్హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు]
మరియు అల్లాహ్ తప్ప మరెవరూ ఆరాధనకు అర్హులు కారని నేను సాక్ష్యమిస్తున్నాను, ఆయన ఒక్కడే, ఆయనకు భాగస్వామి ఎవరూ లేరు.

وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ
[వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు]
మరియు ముహమ్మద్ ఆయన దాసుడు మరియు ఆయన ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను.

أَمَّا بَعْدُ، فَإِنَّ خَيْرَ الْحَدِيثِ كِتَابُ اللَّهِ
[అమ్మా బఅదు ఫఇన్న ఖైరల్ హదీసి కితాబుల్లాహ్]
ఇక తర్వాత, నిశ్చయంగా, ఉత్తమమైన మాట అల్లాహ్ గ్రంథం (ఖుర్ఆన్).

وَخَيْرُ الْهَدْيِ هَدْيُ مُحَمَّدٍ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ
[వ ఖైరల్ హద్యి హద్యు ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం]
మరియు ఉత్తమమైన మార్గదర్శకత్వం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మార్గదర్శకత్వం.

وَشَرُّ الْأُمُورِ مُحْدَثَاتُهَا، وَكُلُّ مُحْدَثَةٍ بِدْعَةٌ، وَكُلُّ بِدْعَةٍ ضَلَالَةٌ، وَكُلُّ ضَلَالَةٍ فِي النَّارِ
[వ షర్రల్ ఉమూరి ముహ్దసాతుహా, వ కుల్ల ముహ్దసతిన్ బిద్అతున్, వ కుల్ల బిద్అతిన్ దలాలతున్, వ కుల్ల దలాలతిన్ ఫిన్నార్]
మరియు చెడ్డ విషయాలు (ధర్మంలో) కొత్తగా కల్పించబడినవి, మరియు ప్రతి కొత్తగా కల్పించబడిన విషయం ఒక బిద్అత్ (, మరియు ప్రతి బిద్అత్ ఒక మార్గభ్రష్టత్వం, మరియు ప్రతి మార్గభ్రష్టత్వం నరకాగ్నికి దారితీస్తుంది.

సర్వ స్తోత్రాలు, అన్ని విధాల పొగడ్తలు, సర్వలోక ప్రభువైన, పాలకుడైన, సృష్టికర్త అయిన అల్లాహ్ కే శోభిస్తాయి. అనంత కరుణా శుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయుగాక.

అభిమాన సోదరులారా, హమ్ద్ మరియు సనా తర్వాత స్వర్గములో ప్రవేశించే వారి గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం.

స్వర్గములో ప్రవేశించే వారు నాలుగు రకాలు. అల్లాహ్ దయ, ఆయన కరుణ మూలంగా ఎవరైతే స్వర్గములో ప్రవేశిస్తారో, స్వర్గ ప్రవేశం ఎవరికి జరుగుతుందో వారు నాలుగు రకాలు.

మొదటి రకం: విచారణ లేకుండా, అతను చేసిన కర్మల లెక్క తీసుకోకుండా స్వర్గ ప్రవేశం జరుగుతుంది. అదృష్టవంతులు వారు, ఎటువంటి లెక్క లేదు, విచారణ లేదు. విచారణ లేకుండా స్వర్గ ప్రవేశం. ఇది మొదటి రకం.

రెండవ రకం: విచారణ తర్వాత స్వర్గ ప్రవేశం. నిలబడాలి, పుస్తకం ఇవ్వబడుతుంది, ఖుర్ఆన్ మరియు హదీస్ లో చెప్పబడిన విధంగా ప్రతి విషయం గురించి లెక్క తీసుకోవడం జరుగుతుంది. ఎలా సంపాదించావు? ఎలా ఖర్చు పెట్టావు? జీవితం ఎలా గడిచింది? వయసు, యవ్వనం, ప్రతి విషయం గురించి, ప్రతి చిన్న ప్రతి పెద్ద. అల్లాహ్ హక్కులు పూర్తి చేశావా లేదా? దాసుల హక్కులు పూర్తి చేశావా లేదా? ఫర్జ్ విషయాలు, ఆదేశాలు పాటించావా లేదా? ప్రతి విషయం గురించి అడగడం జరుగుతుంది. పరీక్ష తర్వాత, విచారణ తర్వాత స్వర్గ ప్రవేశం. రెండవ రకం.

మూడవ రకం: వారు నరకానికి పోరు, కానీ స్వర్గ ప్రవేశానికి నిర్ణీత సమయం వరకు ఆపబడతారు. వారు నరకానికి ఏ మాత్రం పోరు స్వర్గానికే పోతారు, కాకపోతే నిర్ణీత సమయం వరకు స్వర్గానికి పోకుండా ఆపబడతారు. వారినే అస్ హాబుల్ ఆరాఫ్ అంటారు, వారి ప్రస్తావన సూర నెంబర్ 7, సూర ఆరాఫ్ లో ఉంది. ఆరాఫ్ వారు నిర్నీత సమయం వరకు స్వర్గం పోకుండా ఆపబడతారు, తర్వాత స్వర్గానికి పోతారు. ఇది మూడవ రకం.

నాల్గవ రకం: వారి పాపాల మూలంగా నరకానికి పోతారు. శిక్ష ముగిసిన తర్వాత వారి ఈమాన్ మూలంగా చివరికి అల్లాహ్ తన దయతో స్వర్గానికి పంపిస్తాడు.

ఈ నాలుగు రకాలు స్వర్గానికి పోయేవారు.

వారిలో మొదటి వారు ఎవరు? విచారణ లేకుండా, ఎటువంటి లెక్క తీసుకోకుండా స్వర్గానికి పోయేవారు. వారి గురించి బుఖారీలో ఒక హదీస్ ఉంది అది తెలుసుకుందాం.

అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా కథనం. ఈయన ఎవరు? మన ప్రవక్త గారి పినతండ్రి అబ్బాస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ కుమారులు. పెద్ద సహాబీ. ఖుర్ఆన్ జ్ఞానం కలిగిన వారు. ముఫస్సిర్ సహాబీ. ఆయన కోసం ప్రవక్త గారు దుఆ చేశారు. అందుకే ఖుర్ఆన్ యొక్క ఆయతుల పరమార్థం, అర్థం బాగా తెలిసిన వారు అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రదియల్లాహు అన్హు. ఆయన అంటున్నారు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, ఏమని? “నాకు గత సమాజాలను చూపించడం జరిగింది”. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కి గత సమాజాలు చూపించడం జరిగింది. తద్వారా నేను చూసింది ఏమిటంటే, (లక్షా ఇరవై నాలుగు వేల ప్రవక్తలలో) ఒక ప్రవక్తతో కేవలం కొంతమంది మాత్రమే ఉన్నారు, అంటే స్వర్గానికి పోయేవారు, పాస్ అయిన వారు, ఆయన్ని అల్లాహ్ ని విశ్వసించిన వారు విశ్వాసులు, మూమినీన్లు కొంతమంది మాత్రమే ఉన్నారు, కొంతమంది అంటే పది కంటే తక్కువ మంది. ఇంకో ప్రవక్తను చూశాను, ఆయనతో కేవలం ఒకే ఒక్క వ్యక్తి ఉన్నాడు. ఇంకో ప్రవక్తను చూశాను, ఆయన ఒక్కరే ఉన్నారు, ఆయనతో పాటు ఎవరూ లేరు. అంటే ఆ ప్రవక్తకి విశ్వసించిన వారు ఒక్కరు కూడా లేరు.

ఆ తర్వాత, అకస్మాత్తుగా నాకు పెద్ద సమూహం గోచరించింది. బహుశా ఇది నా అనుచర సమాజం అని అనుకున్నాను. కానీ ఇది మూసా అలైహిస్సలాం, ఆయన అనుచర సమాజం. ఆ తర్వాత, ఇటువైపు చూడండి అని నన్ను చెప్పటం జరిగింది, నేను చూశాను, పెద్ద సమూహం. ఎక్కడ వరకు చూస్తున్నానో అక్కడ వరకు ఉంది జనాలు, పెద్ద సమూహం. మరోవైపు చూడండి అని చెప్పడం జరిగింది, మరోవైపు చూశాను, పెద్ద సమూహం కనపడింది.

అప్పుడు, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇది మీ అనుచర సమాజం. వీరిలో డెబ్బై వేల మంది కర్మల విచారణ లేకుండానే స్వర్గములో ప్రవేశిస్తారు అని మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చి తమ గృహంలోకి వెళ్ళిపోయారు. ఇది విన్న సహాబాలు వారి మనసులో రకరకాల ఆలోచనలు, వారు ఎవరై ఉంటారు? విచారణ లేకుండా, లెక్క లేకుండా, డైరెక్ట్ స్వర్గ ప్రవేశం. సుబ్ హా నల్లాహ్! ఎంత అదృష్టవంతులు! వారెవరు? బహుశా ఇస్లాం స్థితిలోనే జన్మించి షిర్క్ దరిదాపులకి కూడా పోని వారు ఉండవచ్చు అని రకరకాల ఆలోచనలు, మాటలు మాట్లాడుకుంటున్నారు. అటువంటి వారు అయ్యి ఉండవచ్చు, ఇటువంటి వారు అయ్యి ఉండవచ్చు అని మాట్లాడుతూ ఉండగా, అంతలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత ఆ సహాబాల మాటలు విని, మీరు ఏమి మాట్లాడుకుంటున్నారు అని అడిగితే, ఓ దైవ ప్రవక్త! ఆ డెబ్బై వేల మంది ఎవరు? విచారణ లేకుండా, కర్మల లెక్క లేకుండా డైరెక్ట్ స్వర్గం, వారు ఎవరు దైవ ప్రవక్త అంటే దానికి సమాధానంగా మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాట ఏమిటంటే:

هُمُ الَّذِينَ لاَ يَرْقُونَ وَلاَ يَسْتَرْقُونَ وَلاَ يَتَطَيَّرُونَ وَعَلَى رَبِّهِمْ يَتَوَكَّلُونَ
[హుముల్లదీన లా యర్కూన వలా యస్తర్కూన వలా యతతయ్యరూన వఅలా రబ్బిహిమ్ యతవక్కలూన]
“వారు స్వయంగా మంత్రించి ఊదుకోరు, ఇతరులతో మంత్రించి ఊదించుకోరు, అపశకునం పాటించరు, కేవలం తమ ప్రభువు అనగా అల్లాహ్ పైనే నమ్మకం కలిగి ఉంటారు.”

ఈ నాలుగు లక్షణాలు, గుణాలు కలిగిన వారు. వారెవరు? వారు స్వయంగా మంత్రించి ఊదుకోరు, ఇతరులతో మంత్రించి ఊదించుకోరు, అపశకునం పాటించరు, కేవలం తమ ప్రభువు అనగా అల్లాహ్ పైనే నమ్మకం కలిగి ఉంటారు అని చెప్పారు, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం.

ఒక సహాబీ, ఆయన పేరు ఉక్కాషా బిన్ మెహ్సన్ రదియల్లాహు అన్హు, ఆయన ఇది విని వెంటనే, ఓ దైవ ప్రవక్త, విచారణ లేకుండా, కర్మల లెక్క లేకుండా, డైరెక్ట్ స్వర్గంలో ప్రవేశించే వారిలో నేను కూడా ఉండాలని దుఆ చేయండి అల్లాహ్ తో అని విన్నవించుకున్నారు. ఎవరు? ఉక్కాషా బిన్ మెహ్సన్ రదియల్లాహు అన్హు. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, దుఆ చేసే అవసరం లేదు, నువ్వు వారిలో ఉన్నావు అని శుభవార్త చెప్పేశారు. “పో ఉక్కాషా, నువ్వు వారిలో ఉన్నావు. ఎవరికైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా విచారణ లేకుండా, లెక్కల అది లెక్కలు లేకుండా డైరెక్ట్ గా స్వర్గం పంపుతారో, నువ్వు వారిలో ఉన్నావు” అని చెప్పారు. సుబ్ హా నల్లాహ్! ఈ భాగ్యం ఉక్కాషా బిన్ మెహ్సన్ కి ఖచ్చితంగా తెలిసిపోయింది. అల్ హమ్దులిల్లాహ్. ఇది విని ఇంకో సహాబీ లేచారు. ఓ దైవ ప్రవక్త, నా కోసం కూడా దుఆ చేయండి, నేను కూడా ఆ సమూహంలో ఉండాలి అని. దానికి మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, “సబకక బిహా ఉక్కాషా” అన్నారు. అంటే, ఉక్కాషా నీకన్నా ముందుకి వెళ్ళిపోయాడు, ఆ భాగ్యాన్ని ఆయన నోచుకున్నాడు అని చెప్పేశారు మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ హదీస్ బుఖారీలోనే మూడు చోట్ల ఉంది.

ఇదే హదీస్ ముస్లిం గ్రంథంలో కొంచెం తేడాతో ఇలా ఉంటుంది.

هُمُ الَّذِينَ لاَ يَسْتَرْقُونَ وَلاَ يَتَطَيَّرُونَ وَلاَ يَكْتَوُونَ وَعَلَى رَبِّهِمْ يَتَوَكَّلُونَ
[హుముల్లదీన లా యస్తర్కూన వలా యతతయ్యరూన వలా యక్తవూన వఅలా రబ్బిహిమ్ యతవక్కలూన]
“వారు ఇతరులతో మంత్రించి ఊదించుకోరు, అపశకునాలు పాటించరు, (వ్యాధి నివారణకు) వాతలు పెట్టించుకోరు మరియు తమ ప్రభువు పైనే నమ్మకం కలిగి ఉంటారు.”

వారు ఎవరంటే, వారు మంత్రించి ఊదించుకోరు. రెండవది, అపశకునం పాటించరు. ఈ అపశకునం గురించి రెండు వారాల ముందు మనం తెలుసుకున్నాం జుమా ప్రసంగంలోనే అపశకునం అంటే ఏమిటి అనేది. మూడవది, శరీరాన్ని అగ్నితో వాతలు పెట్టుకోరు. నాలుగవది, కేవలం అల్లాహ్ పైనే నమ్మకం కలిగి ఉంటారు. ఇది పూర్తి హదీస్, విచారణ లేకుండా స్వర్గానికి పోయే వారి గురించి.

దీనికి సంబంధించిన సహాబియాత్ లలో, సహాబాలలో అనేక ఉదాహరణలు మనకు కనబడతాయి, వారి జీవిత చరిత్ర మనము చదివితే. ప్రపంచ సమస్యలను, ప్రపంచ బాధలను పట్టించుకోకుండా, వారు ప్రాధాన్యత ఇచ్చింది పరలోకానికి. వారిలో ప్రతి ఒక్కరూ నేను విచారణ లేకుండా స్వర్గానికి పోయే వారిలో ఉండాలని ప్రయత్నం చేసేవారు. దానికి ఉదాహరణ ఒక హదీస్ ఉంది అది తెలుసుకుందాం. ఈ హదీస్ కూడా బుఖారీలో ఉంది, ముస్లింలో కూడా ఉంది. ఇది ఏమిటి?

అతా బిన్ అబూ రిబాహ్ అంటున్నారు, నాకు అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రదియల్లాహు అన్హుమా పిలిచి, నేను నీకు ఒక స్వర్గ స్త్రీని, స్వర్గ మహిళని చూపించనా అని అడిగారు. “ఖుల్తు బలా”, తప్పనిసరిగా చూపించండి, స్వర్గ మహిళ! అంటే ప్రతి ఒక్కరికి గ్యారెంటీ లేదు కదా. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత ఎవరు స్వర్గానికి పోతారో ఖచ్చితంగా చెప్పగలమా? కానీ ఎవరెవరికైతే మన ప్రవక్త గారు ముందే చెప్పి పోయారో వారు ఖచ్చితం గ్యారెంటీ. ఆ విషయం ఇది. అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ అంటున్నారు “ఓ అతా బిన్ అబూ రిబాహ్, స్వర్గ మహిళకి చూపించినా?” చూపించండి అన్నారు. అప్పుడు ఆయన అంటున్నారు ఇదిగో ఆ నల్ల రంగు గల స్త్రీ.

ఆవిడ ఒకసారి మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చి, ఓ దైవ ప్రవక్త, నాకు మూర్ఛ రోగం ఉంది. ఆ రోగం వచ్చినప్పుడు, ఆ స్థితిలో నేను నగ్నంగా అయిపోతాను, నా శరీరంలో బట్టలు లేచిపోతాయి, ఎగిరిపోతాయి. స్వస్థత కోసం దుఆ చేయండి దైవ ప్రవక్త అన్నారు.

ఇది విని మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆవిడకి రెండు ఆప్షన్లు ఇచ్చారు. అది ఏమిటి?

إِنْ شِئْتِ صَبَرْتِ وَلَكِ الْجَنَّةُ، وَإِنْ شِئْتِ دَعَوْتُ اللَّهَ أَنْ يُعَافِيَكِ
[ఇన్ షి’తి సబర్తి వలకిల్ జన్నతు, వ ఇన్ షి’తి దఅవుతుల్లాహ అన్ యుఆఫియకి]
“నువ్వు తలచుకుంటే సహనం వహించు, నీకు స్వర్గం ఉంది. లేదా నువ్వు కోరుకుంటే నేను అల్లాహ్ తో దుఆ చేస్తాను, ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు.”

ఆ స్వర్గ మహిళ మొదటి ఆప్షన్ ఎన్నుకున్నది. నేను సహనం వహిస్తాను ఓ దైవ ప్రవక్త, ఎందుకంటే నాకు స్వర్గం లభిస్తుంది, చెప్పారు కదా, స్వర్గం గ్యారెంటీ ఇస్తున్నారు కదా. నాకు ఈ రోగం ఉన్నా పర్వాలేదు, నేను సహనం వహిస్తాను, కాకపోతే ఒక్క విన్నపం. ఆ రోగం వచ్చినప్పుడు, ఆ స్థితిలో నా శరీరం నుంచి నా బట్టలు ఎగరకుండా ఉండాలి, నేను నగ్నం అవ్వకూడదు, దాని కోసం ప్రార్థించండి అన్నారు. దాని కోసం మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రార్థన చేశారు.

అభిమాన సోదరులారా, ఇది సహాబాల ప్రయత్నం, వారి కృషి, ఏ విధంగా నేను స్వర్గానికి పోవాలి, అది కూడా విచారణ లేకుండా స్వర్గానికి పోవాలి అనేది.

ఒక ప్రశ్న, అది ఏమిటంటే, కొందరు చిన్న చిన్న ఏదో పాపాలు చేస్తారు, పెద్ద పాపాలు కూడా చేస్తారు, కాకపోతే బుఖారీ హదీస్ లో చెప్పబడిన ఈ నాలుగు లక్షణాలు ఉన్నాయి కదా అవి ఉండవు. అపశకునం పాటించరు. షిర్క్ చేయరు. మంత్రించి ఊదించుకోరు. అల్లాహ్ పై నమ్మకం ఉంది. ఈ నాలుగు లక్షణాలు ఉన్నాయి, వేరే పాపాలు చేస్తున్నారు. అటువంటి వారు కర్మల విచారణ లేకుండా స్వర్గానికి పోతారా? ఈ ప్రశ్న షేఖ్ ముహమ్మద్ సాలెహ్ అల్-మునజ్జిద్ తో అడగడం జరిగింది. ఆయన సమాధానం ఇచ్చారు, చిన్న పెద్ద పాపాలకి పాల్పడిన వాడు కూడా కర్మల విచారణ లేకుండా స్వర్గానికి పోయే అవకాశం ఉంది అని చెప్పి ఆయన సూర ఫుర్ఖాన్ లోని ఈ ఆయత్ ను పఠించారు. ఆయత్ ఏమిటి?

وَالَّذِينَ لَا يَدْعُونَ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ وَلَا يَقْتُلُونَ النَّفْسَ الَّتِي حَرَّمَ اللَّهُ إِلَّا بِالْحَقِّ وَلَا يَزْنُونَ
వారు అల్లాహ్‌తోపాటు మరో దైవాన్ని మొరపెట్టుకోరు. న్యాయబద్ధంగా తప్ప – అల్లాహ్‌ ఏ ప్రాణిని హత్య చేయటాన్ని నిషేధించాడో దానిని హతమార్చరు. వారు వ్యభిచారానికి పాల్పడరు. (25:68)

అంటే, వారు అల్లాహ్ తో పాటు మరే దైవాన్ని మొరపెట్టుకోరు అంటే షిర్క్ చేయరు. న్యాయబద్ధంగా తప్ప అల్లాహ్ ఏ ప్రాణిని హత్య చేయటాన్ని నిషేధించాడో దానిని హతమార్చరు, అంటే హత్య చేయరు. వారు వ్యభిచారానికి పాల్పడరు, వ్యభిచారం చేయరు. మూడు విషయాలు, షిర్క్ చేయరు, హత్య చేయరు, వ్యభిచారం చేయరు. ఈ చేష్టలకు ఒడగట్టిన వారు, చేస్తే? హత్య చేశారు, లేదా వ్యభిచారం చేశారు, లేదా షిర్క్ చేశారు. ఇలా చేస్తే, పాప ఫలాన్ని పొంది తీరుతాడు. అంతేకాకుండా:

يُضَاعَفْ لَهُ الْعَذَابُ يَوْمَ الْقِيَامَةِ وَيَخْلُدْ فِيهِ مُهَانًا
ప్రళయదినాన అతనికి రెట్టింపు శిక్ష వడ్డించబడుతుంది. వాడు పరాభవంపాలై, అత్యంత నికృష్టస్థితిలో కలకాలం అందులో పడి ఉంటాడు. (25:69)

ఇక మూడోవ ఆయత్.

إِلَّا مَنْ تَابَ وَآمَنَ وَعَمِلَ عَمَلًا صَالِحًا فَأُولَٰئِكَ يُبَدِّلُ اللَّهُ سَيِّئَاتِهِمْ حَسَنَاتٍ ۗ وَكَانَ اللَّهُ غَفُورًا رَحِيمًا
అయితే (ఈ పాప కార్యాల తరువాత) ఎవరు పశ్చాత్తాపం చెంది, విశ్వసిస్తారో, సదాచరణ చేస్తారో అలాంటి వారి పాపాలను అల్లాహ్‌ పుణ్యాలుగా మార్చి వేస్తాడు. అల్లాహ్‌ క్షమాభిక్ష పెట్టేవాడు, కరుణాకరుడు.(25:70)

అయితే, ఈ పాప కార్యాల తర్వాత, పాపం చేసిన తర్వాత కుమిలిపోయి, పశ్చాత్తాపం చెంది, కన్నీళ్లు కార్చి, అంటే ఇక్కడ పశ్చాత్తాపం అంటే జోక్ కాదు, సీరియస్. ఏ పశ్చాత్తాపం గురించి అల్లాహ్ చెప్పాడో, “యా అయ్యుహల్లదీన ఆమనూ తూబూ ఇలల్లాహి తౌబతన్ నసూహా”. తౌబయే నసూహా. ఏ విధంగా ఖుర్ఆన్ లో హదీస్ లో తౌబా అంటే ఏమిటి, ఆ విధంగా తౌబా పశ్చాత్తాపం చెంది, కుమిలిపోయి పశ్చాత్తాపం చెందారో, విశ్వసిస్తారో, సదాచరణ చేస్తారో, అలాంటి వారి పాపాలను అల్లాహ్ పుణ్యాలుగా మార్చేస్తాడు. సుబ్ హా నల్లాహ్! వారు చేసిన పాపాలు పుణ్యాలుగా మార్చివేయబడతాయి. అల్లాహ్ క్షమాపశీలి, కరుణామయుడు. అంటే ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటి? తౌబా చేసుకుంటే, ఆ నాలుగు లక్షణాలు ఉంటే, షిర్క్ చేయని వారు, మంత్రించి ఊదుకోని వారు, అపశకునం పాటించని వారు, అల్లాహ్ పై నమ్మకం వేసిన వారు, వేరే పాపాలు చేసిన తర్వాత పూర్తి నమ్మకంతో, సంపూర్ణ విశ్వాసంతో, దృఢ సంకల్పంతో కుమిలిపోతూ నిజమైన తౌబా చేసుకుంటే వారికి కూడా విచారణ లేకుండా స్వర్గ ప్రవేశానికి అవకాశం ఉంది.

ఇక వారు ఎవరు? మూడవ వర్గం, నరకానికి పోరు, నిర్నీత సమయం వరకు ఆరాఫ్ పైన, ఆరాఫ్ అది స్థలం అక్కడ పరలోకములో. ఆరాఫ్ అంటే ఒక స్థలం పేరు, గోడ పేరు. ఆరాఫ్ పైన చాలామంది ఉంటారు, వారు ప్రతి ఒక్కరినీ వారి చిహ్నాలను బట్టి గుర్తుపడతారు. అంటే ఆరాఫ్ పైన ఉన్న మనుషులు స్వర్గానికి పోయేవారు ఎవరు, నరకానికి పోయేవారు ఎవరు, వారి ఆనవాలను బట్టి గుర్తుపట్టేస్తారు వాళ్ళు, ఆరాఫ్ వాళ్ళు, ఆ గోడ పైన ఉన్నవారు. వారు స్వర్గవాసులను పిలిచి “అస్సలాము అలైకుమ్”, మీపై శాంతి కలుగుగాక అని అంటారు. ఈ ఆరాఫ్ వారు అప్పటికీ ఇంకా స్వర్గంలో ప్రవేశించి ఉండరు. అయితే స్వర్గం లభిస్తుందన్న ఆశతో వారు ఉంటారు. అసలు వీళ్ళు ఎవరు? వీరి గురించి అత్యధిక ధర్మ పండితుల అభిప్రాయం ఏమిటంటే, ఆరాఫ్ వాళ్ళు, వారి సత్కర్మలు, దుష్కర్మలు, పుణ్యాలు, పాపాలు సరిసమానంగా ఉంటాయి. వారి సత్కర్మలు వారిని నరకంలో పోకుండా ఆపుతాయి, వారి దుష్కర్మలు స్వర్గానికి పోకుండా ఆపుతాయి. అందుకు నిర్నీత సమయం వరకు వారు వేచి ఉంటారు, స్వర్గానికి పోకుండా ఆపబడి ఉంటారు, ఆ తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన దయతో వారిని స్వర్గానికి పంపిస్తాడు. వీరు మూడవ రకం వారు.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ విచారణ లేకుండా స్వర్గంలో ప్రవేశించే ఆ సమూహంలో చేరిపించు గాక. ఆమీన్. మనందరికీ ఇహపరలోకాల సాఫల్యం ప్రసాదించుగాక. ఆమీన్. వా ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.

అంతిమ దినం పై విశ్వాసం [4] : స్వర్గ విశేషాలు – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా టెక్స్ట్] 

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُ 

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత : 

అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.

ఓ ముస్లింలారా! అల్లాహ్ తో భయపడండి, ఎల్లవేళలా ఆయన దైవ భీతిని కలిగి ఉండండి. మనసులో ఆయన భయాన్ని సజీవంగా ఉంచండి. ఆయనకు విధేయత చూపండి మరియు అవిధేయత నుంచి దూరంగా ఉండండి. .

మరియు తెలుసుకోండి! అల్లాహ్ తన ధర్మస్థాపనలో తాను లిఖించినటువంటి విధిరాతలో మరియు శిక్షించడంలో, ప్రతిఫలం ప్రసాదించడంలో ఆయన ఎంతో వివేకవంతుడు. మరియు అల్లాహ్ తఆలా యొక్క వివేకం ఏమిటంటే ఆయన తన సృష్టి కొరకు అంతిమ దినాన్ని నియమించాడు. ఆ రోజున ఆయన సమస్త సృష్టిరాశులకు తమ ఆచరణ యొక్క ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. ఈ విషయాన్ని ప్రవక్తల ద్వారా తన దాసులకు చేరవేశాడు. అల్లాహ్ ఇలా అంటున్నాడు.

أَفَحَسِبْتُمْ أَنَّمَا خَلَقْنَاكُمْ عَبَثًا وَأَنَّكُمْ إِلَيْنَا لَا تُرْجَعُونَ فَتَعَالَى اللَّهُ الْمَلِكُ الْحَقُّ

(మేము మిమ్మల్ని ఏదో ఆషామాషీగా (అర్థరహితంగా) పుట్టించామనీ, మీరు మా దగ్గరకు మరలిరావటం అనేది జరగని పని అని అనుకున్నారా? అల్లాహ్‌యే నిజమైన సార్వభౌముడు. ఆయన మహోన్నతుడు.) (సూరా అల్ మూ ‘మినూన్ 23:115-116)

ఓ విశ్వాసులారా! గడిచిన ఖుత్బాలో మనం అంతిమ దినంపై విశ్వాసంలో భాగంగా శంఖం పూరించడం, ప్రళయ సూచనలు, సృష్టి పునరుత్థానం, ప్రజలు హష్ర్ మైదానంలో సమీకరించబడటం, లెక్కల పత్రము శిక్ష ప్రతిఫలం గురించి తెలుసుకున్నాం ఈ రోజు మనం విశ్వాసుల కొరకు సృష్టించబడిన స్వర్గం గురించి తెలుసుకుందాం. 

1. స్వర్గనరకాలను విశ్వసించడం అంతిమ దినాన్ని విశ్వసించడంలో భాగం మరియు ఇది మానవుల మరియు జిన్నాతుల శాశ్వత నివాసం. స్వర్గం అనేది అనుగ్రహాల నిలయం, దీనిని విశ్వాసులకు మరియు పవిత్రమైన దాసుల కోసం తయారు చేయబడింది. దీని కొరకు అల్లాహ్ మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను విశ్వసించడం, వారి ఆజ్ఞలను పాటించడం తప్పనిసరి. స్వర్గం లోపల ఏ కన్ను చూడని, ఏ చెవి వినని మరియు ఏ మనసు అలోచించ లేనటువంటి అనుగ్రహాలు ఉన్నాయి. అల్లాహ్ ఇలా అంటున్నాడు: 

إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ أُولَٰئِكَ هُمْ خَيْرُ الْبَرِيَّةِ  جَزَاؤُهُمْ عِندَ رَبِّهِمْ جَنَّاتُ عَدْنٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا أَبَدًا ۖ رَّضِيَ اللَّهُ عَنْهُمْ وَرَضُوا عَنْهُ ۚ

(అయితే విశ్వసించి, సత్కార్యాలు చేసినవారు; నిశ్చయంగా సృష్టిలో వారే అందరికన్నా ఉత్తములు. వారికి ప్రతిఫలంగా వారి ప్రభువు దగ్గర శాశ్వతమైన స్వర్గ వనాలున్నాయి. వాటి క్రింద కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. వాటిలో వారు కలకాలం ఉంటారు. అల్లాహ్ వారి పట్ల ప్రసన్నుడయ్యాడు. వారు అల్లాహ్ పట్ల సంతోషపడ్డారు.) (98:7-8)

మరో చోట అల్లాహ్ ఇలా అన్నాడు. 

فَلَا تَعْلَمُ نَفْسٌ مَّا أُخْفِيَ لَهُم مِّن قُرَّةِ أَعْيُنٍ جَزَاءً بِمَا كَانُوا يَعْمَلُونَ

(వారు చేసిన కర్మలకు ప్రతిఫలంగా, వారి కళ్లకు చలువనిచ్చే ఎలాంటి సామగ్రిని మేము దాచిపెట్టామో (దాని గురించి) ఏ ప్రాణికీ తెలియదు.) (32:17)

స్వర్గం కష్టాలతో చుట్టుముట్టబడి ఉంది మరియు నరకాగ్ని ప్రలోభాలతో చుట్టుముట్టబడి ఉంది – కలామే హిక్మత్

అనస్ బిన్ మాలిక్ (రజి అల్లాహు అన్హు) ఉల్లేఖనం ఇలా ఉంది ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచించారు: “స్వర్గం కష్టాలతో చుట్టుముట్టబడి ఉంది మరియు నరకాగ్ని ప్రలోభాలతో చుట్టుముట్టబడి ఉంది..” (ముస్లిం)

పై హదీసు భావాన్ని గ్రహించాలంటే హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించిన హదీసును పరిశీలించవలసి ఉంది. అబూహురైర (రదియల్లాహు అన్హు) ప్రకారం, మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ప్రవచనం ఇలా ఉంది :

అల్లాహ్ స్వర్గ నరకాలను నిర్మించిన తరువాత (తన దూత అయిన) జిబ్రయీల్ను స్వర్గం వైపునకు పంపాడు. ”దాన్ని చూసిరండి, నేను దాని నివాసుల కోసం, దాన్ని రూపొందించాను” అని అల్లాహ్ (జిబ్రయీల్తో) అన్నాడు. జిబ్రయీల్ స్వర్గం వద్దకు వచ్చారు. స్వర్గాన్ని, అందులో నివసించే వారి కొరకు అల్లాహ్ తరఫున సమకూర్చబడిన సామగ్రిని తిలకించారు. తరువాత ఆయన (అల్లాహ్) వైపునకు మరలారు. “(ప్రభూ!) నీ గౌరవ ప్రపత్తుల సాక్షిగా! దాన్ని గురించి ఎవరు విన్నా సరే తప్పకుండా అందులోకే ప్రవేశిస్తారు.” అప్పుడు అల్లాహ్ ఆజ్ఞతో అది ఇక్కట్లతో చుట్టుముట్టబడింది. తరువాత ఆదేశించాడు “అందులో ప్రవేశించదలిచే వారికై నేను ఏమేం (సృష్టించి) ఉంచానో వెళ్ళి చూడండి.” జిబ్రయీల్ (అలైహిస్సలాం) దాని వైపునకు వెళ్ళిచూస్తే, అది ఇక్కట్లతో చుట్టుముట్టబడి ఉంది. జిబ్రయీల్ మరలివచ్చారు. “(ప్రభూ!) నీ గౌరవం సాక్షిగా! అందులో ఎవరూ ప్రవేశించలేరేమోనని నాకు అనుమానంగా ఉంది” అని విన్నవించుకున్నారు. అప్పుడు అల్లాహ్ ఆదేశమయ్యింది: ”వెళ్ళి నరకాన్ని చూడండి. అందులో ఉండేవారి కొరకు నేను ఏం సిద్ధం చేసి ఉంచానో చూడండి”. వెళ్ళి చూస్తే, అందులో తీవ్రమైన నిప్పు సెగలు కానవచ్చాయి. (జిబ్రయీల్) మరలి వచ్చి విన్నవించుకున్నారు : “(ప్రభూ!) నీ గౌరవోన్నతుల సాక్షిగా! ఎవరు దాన్ని గురించి విన్నా అందులోకి పోరు.” అప్పుడు దైవాజ్ఞతో అది సుఖభోగాలతో చుట్టుముట్టబడింది. ఆజ్ఞ అయ్యింది : “దాని వైపునకు వెళ్ళి చూడండి” అని. అప్పుడు నరకం వైపునకు వెళ్ళిచూసి ఇలా అన్నారు – ”(ప్రభూ!) నీ గౌరవాదరణల సాక్షిగా చెబుతున్నాను. ఎవరూ దీని బారిన పడకుండా ఉండలేరు, అందులోనే పడిపోతారని నాకు అనుమానంగా ఉంది.” (తిర్మిజ)

“స్వర్గాన్ని ఇక్కట్లతో చుట్టుముట్టడం జరిగింది.” – అంటే శాశ్వత సుఖాలకు నిలయమయిన స్వర్గంలో స్థానం సంపాదించటం కొరకు కొన్ని విధ్యుక్త ధర్మాలను విధిగా నిర్వర్తించాలని అల్లాహ్ నిర్ధారించాడు. అలాగే కొన్ని రకాల పనులకు, విషయ లాలసకు దూరంగా ఉండాలని కూడా అల్లాహ్ నిర్ణయించాడు. అల్లాహ్ నిర్ణయించిన విధ్యుక్త ధర్మాలను సక్రమంగా పాటించడం, ఆయన పోవద్దన్న వాటి జోలికి పోకుండా మనోవాంఛలను అణచుకోవటం మనిషికి కాస్త శ్రమగానే ఉంటుంది. దీన్నే కష్టాలతో, ఇక్కట్లతో పోల్చటం జరిగింది.

“నరకాన్ని సుఖవిలాసాలతో చుట్టుముట్టడం జరిగింది.” అంటే అల్లాహ్ విధించిన హద్దులను అతిక్రమించి జాలీగా గడపటం, అల్లాహ్ హరామ్ (నిషేధించిన) చేసిన సొమ్ము తినటం, విషయ లాలసలో (భౌతిక కోరికలలో) లీనమవటం మనిషికి ఎంతో సులభసాధ్యం. పైగా ఈ మార్గంలో పడిన మనిషి తింటూ, త్రాగుతూ, అనుభవిస్తూ మస్తుగా ఉంటాడు. కాని పర్యవసానం – అల్లాహ్ ఆజ్ఞల్ని ధిక్కరించిన కారణంగా భయంకరంగా ఉంటుంది. నరకం సుఖ విలాసాలతో చుట్టుముట్టడం జరిగిందనే దానికి భావం ఇదే.

పై చర్చ ద్వారా తేలిందేమంటే మనిషి స్వర్గంలో చేరటం అతి సులువయిన విషయం కాదు. నిరంతరం సాధన చేయకుండా కష్టాలను సహించకుండా, బాధలను భరించకుండా మహోన్నత లక్ష్యం ప్రాప్తం కాదు. అల్లాహ్ తన పవిత్ర గ్రంథంలో ఇలా సెలవిచ్చాడు :

أَمْ حَسِبْتُمْ أَن تَدْخُلُوا الْجَنَّةَ وَلَمَّا يَأْتِكُم مَّثَلُ الَّذِينَ خَلَوْا مِن قَبْلِكُم ۖ مَّسَّتْهُمُ الْبَأْسَاءُ وَالضَّرَّاءُ وَزُلْزِلُوا حَتَّىٰ يَقُولَ الرَّسُولُ وَالَّذِينَ آمَنُوا مَعَهُ مَتَىٰ نَصْرُ اللَّهِ ۗ أَلَا إِنَّ نَصْرَ اللَّهِ قَرِيبٌ

ఏమిటీ, మీరు స్వర్గంలో ఇట్టే ప్రవేశించగలమని అనుకుంటున్నారా? వాస్తవానికి మీకు పూర్వం గతించిన వారికి ఎదురైనటువంటి పరిస్థితులు మీకింకా ఎదురు కానేలేదు. వారిపై కష్టాలు, రోగాలు వచ్చిపడ్డాయి. వారు ఎంతగా కుదిపి వేయబడ్డారంటే, (ఆ ధాటికి తాళలేక) “ఇంతకీ దైవసహాయం ఎప్పుడొస్తుంది?” అని ప్రవక్తలు, వారి సహచరులు ప్రశ్నించసాగారు. “వినండి! దైవ సహాయం సమీపంలోనే ఉంది” (అని వారిని ఓదార్చటం జరిగింది).(అల్ బఖర 2:214)

ఇకపోతే, అల్లాహ్ హరామ్ (నిషిద్ధం) గా ఖరారు చేసిన వస్తువులు! పైకి అవి ఎంతో ఆకర్షణీయంగా, విలాసవంతమైనవిగా అగుపిస్తాయి. వాటిలో ఎంతో ఆనందాను భూతి ఉంటుంది. ఆ తళుకు బెళుకుల, రంగు రంగుల లోకంలో మనిషి తన నిజ స్థానాన్ని, తన జీవన పరమార్థాన్ని కూడా విస్మరించి వాటికి దాసోహం అంటాడు. కాని ఆ రసాస్వాదన క్షణికమైనది. ఆ తరువాత ఎదర ఉన్నదంతా చీకటే. అప్పటి వరకు తన పాలిట ఎంతో తియ్యనైనదిగా, మధురమైనవిగా అగుపించినవన్నీ తరువాత అతని యెడల విషపూరితమైనవిగా పరిణమిస్తాయి. అల్లాహ్ ప్రబోధం :

“ప్రాపంచిక జీవితమైతే కేవలం మోసపుచ్చే సామగ్రి మాత్రమే.” (హదీద్ 57 : 20)

మహాప్రవక్త గారి ప్రవచనంపై ఉలమాలు చేసిన వ్యాఖ్యను ఇమామ్ నవవి (రహిమహుల్లాహ్) ఇలా ఉటంకించారు :

ఒక్క అల్లాహ్ నే విశ్వసిస్తూ, ఆయన్నే సేవిస్తూ ఆయన మార్గంలో నిరంతరం పాటుపడుతూ, చెడుల నుంచి తనను రక్షించుకుంటూ జీవితం గడపటం, క్రోధాన్ని జయించటం, క్షమాగుణాన్ని అలవరచుకోవటం, దానధర్మాలు చేయటం, తనకు అపకారం తలపెట్టేవారికి సయితం ఉపకారం చేయటం, మనో వాంఛలను అదుపులో పెట్టుకోవటం, సహన స్థయిర్యాలను కలిగి ఉండటం- ఇవన్నీ స్వర్గపు బాటలోని కష్టాలే. స్వర్గం కోరుకుంటున్న వారు అవసరమైతే వీటిని ఆహ్వానించి, భరించవలసిందే.

పోతే – మద్యపానం, జూదం, వ్యభిచారం, అపసవ్యమైన అనర్థదాయకమయిన విషయాలు, అసత్యం, చాడీలు, మనోవాంఛల దాస్యం, పదార్థపూజ, వంశం, కులం గోత్రాల ప్రాతిపదికపై అహంకారాన్ని ప్రదర్శించడం, దురాచారాలు, దుస్సంప్రదాయాలు — ఇవన్నీ సరకానికి గొనిపోయేవే.

అయితే సుఖాలు, విలాసాలు అధర్మమని కాదు – వాటిలో ధర్మసమ్మతమైనవి కూడా ఉంటాయి. అయితే మనోవాంఛలకు ఒకసారి దాసుడైపోయిన మనిషి, ధర్మసమ్మతమైన మార్గాల ద్వారా కోర్కెలు తీరకపోతే అడ్డమైన గడ్డినల్లా కరచి వాటిని పొందాలని ప్రయత్నిస్తాడు. మంచీ చెడుల విచక్షణా జ్ఞానాన్ని కోల్పోతాడు. మితిమీరిన ఈ కోర్కెల మూలంగా అతని ఆంతర్యంలో కాఠిన్యం తిష్ఠవేస్తుంది. మనసులో మలినం పేరుకుంటుంది. దైవదాస్య భావం, దైవ విధేయతా భావం పట్ల అలసత్వం లేక వైముఖ్యం ప్రదర్శిస్తాడు. కోర్కెల గుఱ్ఱాలను పోషించడానికి రేయింబవళ్ళు సంపాదనా యత్నంలోనే ఉండిపోతాడు.

ఈ హదీసు ద్వారా బోధపడే మరో విషయం ఏమిటంటే, స్వర్గ నరకాలు సృజించబడి ఉన్నాయి. అవి ఎక్కడో ఒకచోట నెలకొని ఉన్నాయి. మేరాజ్ రాత్రిన ప్రవక్త మహనీయులు స్వర్గ నరకాలను చూసి వచ్చారు.

ఈ హదీసు ద్వారా బోధపడే మరో విషయం; ఈ ప్రపంచం కేవలం సుఖాస్వాదనలకు నిలయం కాదు. ఈ లోకంలో ఏ సుఖమయినా, మరే ఆనందమయినా – అది ధర్మ సమ్మతంగా లభిస్తే, దాన్ని అల్లాహ్ అనుగ్రహంగా భావించి పొందవచ్చు. ఇలాంటి సుఖాలు పరలోక సాఫల్యానికి ఎలాంటి అవరోధం కాజాలవు.

అల్లాహ్ ఆజ్ఞలను పాలిస్తూ, ఆయన మోపిన విధ్యుక్త ధర్మాలను నిర్వర్తిస్తూ ఆయన వద్దన్న వాటి జోలికి పోకుండా గడపటం సాధారణ విషయం కాదు. నిజానికి అదొక పెద్ద పరీక్ష, మహాయజ్ఞం. అయితే చిత్తశుద్ధితో అల్లాహ్ మార్గాన పయనించాలని నిశ్చయించుకున్న వాని కోసం, అల్లాహ్ తన మార్గాన్ని సులభతరం చేస్తాడు. అంటే అల్లాహ్ కు భయపడుతూ, అల్లాహ్ మార్గంలో ఖర్చుచేస్తూ ప్రవక్తలను విశ్వసిస్తూ మంచిపనులు చేసిన వారికి అల్లాహ్ స్వర్గంలో సులువుగా ప్రవేశం కల్పిస్తాడు.

హరామ్ నుండి మనిషి తనను కాపాడుకోవటం మొదట్లో కాస్త కష్టంగా కనిపిస్తుంది. కాని అతను స్థిర చిత్తంతో, ఓపికతో ధర్మ మార్గానికి కట్టుబడి ఉంటే రాను రాను అతను ఎంత కాలితే అంతే కుందనంలా, మేలిమి బంగారంలా మెరిసిపోతాడు. క్రమక్రమంగా చెడులంటే, హరామ్ వస్తువులంటే అతను అసహ్యించుకోసాగుతాడు. ఇక అప్పుడతను చెడుల బారిన పడకుండా, వాటికి దూరంగా ఉండటం ఎంతో సులువు. ప్రవక్త సహచరుల నుద్దేశించి ఇలా సెలవియ్యబడింది :

وَكَرَّهَ إِلَيْكُمُ الْكُفْرَ وَالْفُسُوقَ وَالْعِصْيَانَ ۚ أُولَٰئِكَ هُمُ الرَّاشِدُونَ

“ఆయన మీ మనసుల్లో అవిశ్వాసం, అపసవ్యత, అవిధేయత పట్ల ఏహ్యభావాన్ని కలుగజేశాడు. ఇటువంటి వారే అల్లాహ్ కరుణానుగ్రహాలకు నోచుకున్నారు.” (అల్ హుజురాత్ 49 : 7)

పై విషయాల సారాంశం ఏమిటంటే, మానవుడు కష్టాలను ఎదుర్కోవలసి వచ్చినప్పటికీ అతను స్వర్గపు బాటపై నడవాలి. ధర్మసమ్మతం కాని, నరకానికి గొనిపోయే ఎన్ని సుఖభోగాలు తారసపడినా వాటి వలలో చిక్కకుండా తనను రక్షించుకోవాలి.

[డౌన్లోడ్ PDF]

పుస్తకం నుండి :కలామే హిక్మత్ – 1 (వివేక వచనం)
రచన:సఫీ అహ్మద్ మదనీ
అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్
ప్రకాశకులు:జమీ అతే అహ్ లె హదీస్,ఆంధ్రప్రదేశ్

అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త యెడల ప్రేమ & సద్వర్తనుల సహచర్యం – కలామే హిక్మత్

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు : ఒక వ్యక్తి మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వచ్చి ప్రళయ దినం గురించి దర్యాప్తుచేశాడు. “ఆ (ప్రళయ) ఘడియ ఎప్పుడొస్తుంది?” అని అతను ప్రశ్నించాడు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) బదులిచ్చారు : ”నువ్వు దానిని ఏర్పాటు చేసుకున్నావా?” దానికి ఆ వ్యక్తి, “అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త యెడల ప్రేమ కలిగి ఉండటం తప్ప మరే తయారీ చేసుకోలేదు” అని అన్నాడు. అప్పుడు ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం), ”నువ్వు ప్రేమించేవారితో పాటు ఉంటావు” అని ప్రబోధించారు. (బుఖారి)

అనస్ (రదియల్లాహు అన్హు) ఏమంటున్నారో చూడండి: “నేనయితే మహాప్రవక్త మరియు అబూబకర్ (రదియల్లాహు అన్హు)ల పట్ల ప్రేమ కలిగి ఉండేవాడిని. ఒకవేళ నేను ఆ మహనీయులు చేసినన్ని మహత్కార్యాలు చేయలేకపోయినప్పటికీ ఈ ప్రేమ మూలంగా తీర్పుదినాన వారి సహచర్యంలోనే ఉండగలనన్న ఆశ నాకుంది.”

బుఖారిలోని మరో ఉల్లేఖనం ఇలా ఉంది : ఒకతను మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో, ”ఓ దైవప్రవక్తా! ఆ ఘడియ ఎప్పుడు వస్తుంది?” అని అడిగాడు. “నువ్వు దాని కొరకు చేసిన తయారీ ఏమిటీ?” అని మహాప్రవక్త ఎదురు ప్రశ్న వేశారు. అప్పుడు ఆ వ్యక్తి ”దానిగ్గాను నా వద్ద ఎక్కువ నమాజులు లేవు. ఎక్కువ ఉపవాసాలూ లేవు. ఎక్కువ దానధర్మాలు కూడా లేవు. అయితే నేను అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను ప్రేమిస్తున్నాను” అని విన్నవించుకున్నాడు. ఇది విని, “నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో వారి వెంట ఉంటావు” అని ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు.

దైవప్రవక్తను ఈ విధంగా ప్రశ్నించిన వ్యక్తి ఒక పల్లెటూరి వాడని ఉల్లేఖనాల ద్వారా తెలుస్తోంది. పల్లెటూరి మనుషులు విషయాన్ని దర్యాప్తు చేసే తీరే వేరు. వారిలో మొహమాటంగాని, ఊగిసలాటగాని సాధారణంగా ఉండదు. కాగా, మహాప్రవక్త ప్రియ సహచరుల ధోరణి దీనికి కొంత భిన్నంగా ఉండేది. ఏ విషయాన్ని ప్రవక్తకు అడగాలన్నా కించిత్ భయం, జంకు వారికి ఉండేది. పల్లెటూరి నుండి ఏ పామరుడయినా వచ్చి ప్రవక్తను ధర్మసందేహాలు అడిగితే బావుండేదని వారు తలపోస్తూ ఉండేవారు. ఆ విధంగా తమకు మరిన్ని ధార్మిక విషయాలు తెలుస్తాయన్నది వారి ఉద్దేశం.

1. ‘ఆ ఘడియ ఎప్పుడొస్తుంది?’ అనేది హదీసులోని ఒక వాక్యం. అరబీలో ”అ సాఅత్” అని ఉంది. దీనికి తెలుగులో “నిర్ధారిత సమయం” అని అర్థం వస్తుంది. నిర్ధారిత సమయం అంటే మనిషి మరణించగానే అతని కర్మల లెక్కను తీసుకునే సమయమైనా కావాలి లేదా సమస్త జనులను నిలబెట్టి లెక్కతీసుకునే ప్రళయదినమైనా కావాలి.

2. “నువ్వు దాన్ని ఏర్పాటు చేసుకున్నావా?” అనేది హదీసులోని మరో వాక్యం. ప్రళయదిన ప్రతిఫలం గురించి అంత తొందరపడుతున్నావు. సరే, మరి అక్కడ నీకు గౌరవ స్థానం లభించేందుకు కావలసిన సత్కార్యాలు చేసుకున్నావా? అన్న భావం ఆ ప్రశ్నలో ఇమిడి ఉంది. ఇది ఎంతో వివేకవంతమయిన, ఆలోచనాత్మకమయిన ప్రశ్న. ప్రళయదినం సంభవించటమైతే తథ్యం. అది తన నిర్ణీత సమయంలో రానే వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది? అన్న ఆదుర్దా కన్నా దానికోసం తను సన్నద్ధమై ఉన్నానా? లేదా? అన్న చింత మనిషికి ఎక్కువగా ఉండాలి.

3. ”నేనే తయారీ చేసుకోలేదు” అని ఆ పల్లెటూరి వ్యక్తి అనటంలోని ఉద్దేశ్యం తాను బొత్తిగా నమాజ్ చేయటం లేదని, దానధర్మాలు చేయటం లేదని కాదు. ఆ విధ్యుక్తధర్మాలను తను నెరవేరుస్తున్నాడు. అయితే అవి అతని దృష్టిలో బహుస్వల్పం అన్నమాట. మరో ఉల్లేఖనంలో ఆ విషయమే ఉంది (నా దగ్గర నమాజులు, ఉపవాసాలు, దానధర్మాలు ఎక్కువగా లేదని ఆ వ్యక్తి చెప్పాడు).

విధ్యుక్త ధర్మాలను (ఫరాయజ్) నెరవేర్చనిదే ఏ వ్యక్తి తాను అల్లాహ్ మరియు ఆయన అంతిమ ప్రవక్త అభిమానినని చెప్పుకోలేడు. సహాబాల హయాంలో ఇలా ఆలోచించే వారే కాదు. విశ్వసించి, ముస్లింనని ప్రకటించుకుని ఇస్లాంలోని ప్రధాన విధులపట్ల అలసత్వం వహించటం ఆనాడు ఎక్కడా లేదు.

4. “అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త పట్ల ప్రేమ తప్ప”

అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త యెడల ఎవరి హృదయంలోనయినా ప్రేమ ఉంటే అది అది అతనిలోని విశ్వాసానికి (ఈమాన్ కు) ప్రబల తార్కాణం అన్నమాట. విశ్వాసం లేనిదే ప్రేమ ప్రసక్తే రాదు. అంటే తన మనసులో విశ్వాసం ఉంది గనకనే అల్లాహ్ ను, దైవప్రవక్తను తాను ప్రేమిస్తున్నానని, అందుకనే తనకు పరలోకం గురించిన చింత అధికంగా ఉందని ఆ పల్లెటూరి వ్యక్తి ఉద్దేశ్యం. అతని ఆలోచన ఎంతో అర్థవంతమైంది కూడా.

5. ”నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో వారి వెంట ఉంటావు.”

అంటే నీ విశ్వాసం, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త యెడల నీకు గల ప్రేమ నీకు ఉపయోగపడతాయి. తీర్పుదినాన నీ చేత ప్రేమించబడిన వారి సహచర్యం నీకు ప్రాప్తమవుతుంది. ఇంకా నువ్వు వారి శ్రేణిలోని వ్యక్తిగానే పరిగణించబడతావు. అల్లాహ్ ను ప్రేమించినవాడు ప్రళయదినాన అల్లాహ్ ఆగ్రహానికి గురికాకుండా ఉంటాడు. మహాప్రవక్తను ప్రేమించినవాడు, ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) చెంత స్వర్గంలో ఉంటాడు. విశ్వాసుల పలు అంతస్థులు ఉంటాయి. ఒకరు ఎగువ స్థాయిలో ఉంటే మరొకరు దిగువస్థాయిలో ఉంటారు. ఎగువ స్థాయిలో నున్న వారు దిగువ స్థాయిలో ఉన్నవారిని చూచి అల్పులని భావించరు. అలాగే దిగువ స్థాయిలో నున్నవారు ఎగువస్థాయిలో నున్నవారిని చూసి అసూయ చెందరు. ప్రతి ఒక్కరూ అల్లాహ్ అనుగ్రహాలను ఆస్వాదిస్తూ ఆనందంలో మునిగి ఉంటాడు.

మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పల్లెటూరి వ్యక్తికి చేసిన ఉపదేశం విని సహచరులు ఎంతో సంతోషించారు. అది వారిలోని విశ్వాస భాగ్యానికి ప్రతీక. వారు అన్నిటికన్నా ఎక్కువగా పరలోకం గురించి ఆలోచిస్తుండేవారు. తాము ప్రేమించిన వారి వెంటే ఉంటామన్న సంగతి తెలియగానే వారి సాఫల్యం వారి కళ్ళముందు కదలాడింది. ఎందుకంటే మహాప్రవక్త యెడల వారికి గల ప్రేమ నిజమైనది, అపారమైనది, నిష్కల్మషమైనది.

కేవలం నోటితో ప్రకటించినంత మాత్రాన నిజమైన ప్రేమ వెల్లడి కాదు. ఆచరణకు, త్యాగానికి అది మారు పేరు. తాము ప్రేమించేవారి అభీష్టానుసారం మసలుకున్నప్పుడే, వారు సమ్మతించిన మార్గాన్ని అనుసరించినప్పుడే అది సార్థకమవుతుంది.

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) గారు మహాప్రవక్త మరియు అబూబకర్ (రదియల్లాహు అన్హు) లను ఎంతగానో ప్రేమించేవారు. ఆ కారణంగా తనకు వారి సహచర్యం లభిస్తుందని ఆయన ఆశిస్తుండేవారు. హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు అత్యంత ప్రియమైన సహచరులు. ఇహలోకంలో వారు ఎప్పుడూ ఆయనకు చేదోడు వాదోడుగా ఉండేవారు. ఒకేచోట వారి అంత్యక్రియలు జరిగాయి. స్వర్గంలో కూడా వారు ఒకేచోట ఉంటారు. దైవప్రవక్తల తరువాత – సామాన్య మానవులలో శ్రేష్టులైన వారు అబూబకర్ గారే. ఆ తరువాత స్థానం హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) గారిది.

6. ఆ మహనీయులు చేసినన్ని సత్కార్యాలు నేను చేయలేకపోయినా వారిని ప్రేమిస్తున్నందున పరలోకంలో వారి సహచర్యం నాకు లభిస్తుందని ఆశిస్తున్నానని హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) అన్నారు.

అంటే, నా సత్కార్యాలు వారి సత్కార్యాలు, త్యాగాల ముందు బహు స్వల్పమైనవి. అయితే నేను వారిని ప్రేమ అనే తీగతో అల్లుకుపోయాను. అందుచేత ఎలాగోలా స్వర్గంలోకి ప్రవేశిస్తాను.

అబూ మూసా అష్అరి ఉల్లేఖనం ఒకటి ఇలా ఉంది : “ఒక మనిషి కొందరిపట్ల ప్రేమ కలిగి ఉంటాడు. కాని వారి స్థాయిలో మహత్కార్యాలు చేయలేడు. మరి అప్పుడతని పరిస్థితి ఏమిటి? అని మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను అడగగా, ”మనిషి ఎవరిని ప్రేమిస్తాడో వారి వెంట ఉంటాడు” అని ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) బదులిచ్చారు.

ఈ అధ్యాయంలోని హదీసు ద్వారా అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను ప్రేమించటం వల్ల ప్రాప్తమయ్యే మహాభాగ్యం ఎటువంటిదో విదితమవుతోంది. అదేవిధంగా దైవదాసుల్లోని సద్వర్తనుల సావాసంలో ఉండటం శుభసూచకమని కూడా బోధపడుతోంది. ఇకపోతే, అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను ప్రేమించటమంటే ఏ విధంగా ప్రేమించటం అన్న ప్రశ్న జనిస్తుంది. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త కోరిన విధంగా జీవితం గడపటం, వారు వద్దన్న విషయాల జోలికి పోకుండా ఉండటం, వారి ప్రసన్నతను చూరగొనగలిగే పనులను చేయటమే ఆ ప్రేమకు ప్రతిరూపం.

ఇక, సద్వర్తనులయిన మానవులను ప్రేమించటం అంటే వారి దాస్యం చేయమని భావం ఎంతమాత్రం కాదు. వారి మాదిరిగా మంచి పనులు చేస్తూ, వారి స్థాయికి ఎదగటానికి ప్రయత్నించాలి.

పుస్తకం నుండి :కలామే హిక్మత్ – 1 (వివేక వచనం)
రచన:సఫీ అహ్మద్ మదనీ, అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్

2.24 – స్వర్గ భాగ్యాల, స్వర్గవాసుల ప్రకరణం | మహా ప్రవక్త మహితోక్తులు

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) (Al-Lulu-wal-Marjaan) .  

1797 – حديث أَبِي هُرَيْرَةَ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: حُجِبَتِ النَّارُ بِالشَّهَوَاتِ، وَحُجِبَتِ الْجَنَّةُ بِالْمَكَارِهِ
__________
أخرجه البخاري في: 81 كتاب الرقاق: 28 باب حجبت النار بالشهوات

1797. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు :- “నరకం మనో వాంఛలతో కప్పి వేయబడింది. స్వర్గం కష్టాలు కడగండ్లతో కప్పివేయబడింది.” *

(సహీహ్ బుఖారీ:- 81వ ప్రకరణం – అర్రిఖాఖ్, 28వ అధ్యాయం – హుజిబతిన్నారు బిషహవాత్)

* అంటే స్వర్గంలో ప్రవేశించే మార్గం కష్టాలు, కడగండ్లతో నిండి ఉంది. మరో మాటలో చెప్పాలంటే స్వర్గప్రవేశం చేయాలంటే కష్టాలు, బాధలు సహించవలసి ఉంటుందన్నమాట. అలాగే నరకానికి దారితీసే మార్గం మనోవాంఛలతో నిండి ఉంది. అంటే మనస్సుకు తోచిన విధంగా ప్రాపంచిక వ్యా మోహంతో విశృంఖల జీవితం గడిపితే అది మనిషిని నరకానికి గొని పోతుందన్నమాట. ఈ హదీసు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మాటల్లోని మర్మానికి, సమగ్రతకు ఒక మచ్చుతునకని, ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) అన్నారు. (సంకలనకర్త)

1798 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: قَالَ اللهُ: أَعْدَدْتُ لِعِبَادِي الصَّالِحِينَ مَا لاَ عَيْنٌ رَأَتْ، وَلاَ أُذُنٌ سَمِعَتْ، وَلاَ خَطَرَ عَلَى قَلْبِ بَشَرٍ فَاقْرَءُوا إِنْ شِئْتُمْ (فَلاَ تَعْلَمُ نَفْسٌ مَا أُخْفِيَ لَهُمْ مِنْ قُرَّةِ أَعْيُنِ)
__________
أخرجه البخاري في: 59 كتاب بدء الخلق: 8 باب ما جاء في صفة الجنة وأنها مخلوقة

1798. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా తెలిపారు :- అల్లాహ్ ఈ విధంగా అన్నాడు – “నేను నా పుణ్య దాసుల కోసం (స్వర్గంలో) ఎవరి కళ్ళూ చూడని, ఎవరి చెవులూ వినని, ఎవరి మనస్సుకూ అందనటువంటి సామగ్రిని సిద్ధం చేసి ఉంచాను.”

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఈ హదీసు తెలిపిన తరువాత, “దీనికి ఆధారం కావాలంటే ఖారీ ఖుర్ఆన్ సూక్తిని చదువుకోండ”ని ఈ క్రింది సూక్తిని వినిపించారు – “వారి కర్మలకు ప్రతిఫలంగా వారి కండ్ల చలువ కోసం అల్లాహ్ ఏ ప్రాణికీ తెలియని అపూర్వ సామగ్రిని సిద్ధపరచి ఉంచాడు.” (అస్సజ్జా : 17)

(సహీహ్ బుఖారీ:- 59వ ప్రకరణం – బద్ యిల్ ఖల్క్ , 8వ అధ్యాయం – మాజాఅ ఫీ సిఫతిల్ జన్నత్ వ అన్నహా మఖ్లూ ఖతున్)

1799 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، يَبْلُغُ بِهِ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: إِنَّ فِي الْجَنَّةِ شَجَرَةً يَسِيرُ الرَّاكِبُ فِي ظِلِّهَا مِائَةَ عَامٍ لاَ يَقْطَعُهَا
__________
أخرجه البخاري في: 65 كتاب التفسير: 56 سورة الواقعة: 1 باب قوله (وظل ممدود)

1799. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచించిన ఒక ప్రవచనాన్ని ఈ విధంగా తెలిపారు :- స్వర్గంలో ఒక మహావృక్షం ఉంది. దాని నీడలో ఒక రౌతు వందేండ్లు నడిచినా ఆ నీడ చివరి దాకా చేరుకోలేడు. (సహీహ బుఖారీ:- 65వ ప్రకరణం – తఫ్సీర్, 58వ సూరా – వాఖియా, 1వ అధ్యాయం – ఖౌలిహీ తఆలా వజిల్లిన్ మమ్ దూద్)

1800 – حديث سَهْلِ بْنِ سَعْدِ، عَنْ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: إِنَّ فِي الْجَنَّةِ لَشَجَرَةً يَسِيرُ الرَّاكِبُ فِي ظِلِّهَا مِائَةَ عَامٍ لاَ يَقْطَعُهَا
__________
أخرجه البخاري في: 81 كتاب الرقاق: 51 باب صفة الجنة والنار

1800. హజ్రత్ సహెల్ బిన్ సాద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు : స్వర్గంలో ఒక మహావృక్షం ఉంది. దాని నీడలో ఒక రౌతు వందేండ్లు నడిచినా ఆ నీడ చివరి దాకా చేరుకోలేడు.
(సహీహ్ బుఖారీ:- 81వ ప్రకరణం – అర్రిఖాఖ్, 51వ అధ్యాయం – సిఫతిల్ జన్నతి వన్నార్)

1801 – حديث أَبِي سَعِيدٍ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: إِنَّ فِي الْجَنَّةِ لَشَجَرَةً يَسِيرُ الرَّاكِبُ الْجَوَادَ الْمُضَمَّرَ السَّرِيعَ مِائَةَ عَامٍ مَا يَقْطَعُهَا
__________
أخرجه البخاري في: 81 كتاب الرقاق: 51 باب صفة الجنة والنار

1801. హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా తెలిపారు : “స్వర్గంలో ఒక మహావృక్షం ఉంది. దాని నీడ క్రింద ఒక రౌతు వేగంగా పరుగెత్తే గుర్రమెక్కి వందేండ్లు పయనించినా అతనా నీడ అంచుకు చేరుకోలేడు.” (సహీహ్ బుఖారీ:- 81వ ప్రకరణం – అర్రిఖాఖ్, 51వ అధ్యాయం – సిఫతిల్ జన్నతి వన్నార్)

1802 – حديث أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: إِنَّ اللهَ يَقُولُ لأَهْلِ الْجَنَّةِ: يَا أَهْلَ الْجَنَّةِ يَقُولُونَ: لَبَّيْكَ، رَبَّنَا وَسَعْدَيْكَ فَيَقُولُ: هَلْ رَضِيتُمْ فَيَقُولُونَ: وَمَا لَنَا لاَ نَرْضى وَقَدْ أَعْطَيْتَنَا مَا لَمْ تُعْطِ أَحَدًا مِنْ خَلْقِكَ فَيَقُولُ: أَنَا أُعْطِيكُمْ أَفْضَلَ مِنْ ذلِكَ قَالُوا: يَا رَبِّ وَأَيُّ شَيْءٍ أَفْضَلُ مِنْ ذَلِكَ فَيَقُولُ: أُحِلُّ عَلَيْكُمْ رِضْوَانِي، فَلاَ أَسْخَطُ عَلَيْكُمْ بَعْدَهُ أَبَدًا
__________
أخرجه البخاري في: 81 كتاب الرقاق: 51 باب صفة الجنة والنار

1802. హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధంగా ప్రవచించారు :- అల్లాహ్ స్వర్గవాసుల్ని “స్వర్గవాసులారా!” అని పిలుస్తాడు. దానికి స్వర్గవాసులు “మేము నీ సమక్షంలో హాజరయ్యాము ప్రభూ!” అనంటారు. “మీరు సంతోషంగా ఉన్నారా?” అని అడుగుతాడు అల్లాహ్. “మేమిక సంతోషంగా ఎందుకు ఉండము? నీవు నీ సృష్టిరాసుల్లో ఎవరికీ ప్రసాదించని మహాభాగ్యాలు మాకు ప్రసాదించావు” అంటారు స్వర్గవాసులు. “నేను మీకు ఇంతకన్నా శ్రేష్ఠమైన మహాభాగ్యం ప్రసాదిస్తాను” అంటాడు అల్లాహ్. “ప్రభూ! ఇంతకన్నా శ్రేష్ఠమైన మహాభాగ్యం ఇంకేముంటుంది?” అంటారు స్వర్గవాసులు. అప్పుడు అల్లాహ్ “నేను మీకు నా ప్రసన్నతా మహాభాగ్యం అనుగ్రహిస్తాను. ఇక నుండి నేను ఎన్నడూ మీ మీద ఆగ్రహించను” అని అంటాడు. (సహీహ్ బుఖారీ:- 81వ ప్రకరణం – అర్రిఖాఖ్, 51వ అధ్యాయం – సిఫతిల్ జన్నతి వన్నార్)

1803 – حديث سَهْلِ بْنِ سَعْدٍ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: إِنَّ أَهْلَ الْجَنَّةِ لَيَتَرَاءَوْنَ الْغُرَفَ فِي الْجَنَّةِ، كَمَا تَتَرَاءَوْنَ الْكَوْكَبَ فِي السَّمَاءِ قَالَ: فَحَدَّثْتُ النُّعْمَانَ ابْنَ أَبِي عَيَّاشٍ فَقَالَ: أَشْهَدُ لَسَمِعْتُ أَبَا سَعِيدٍ يُحَدِّثُ وَيَزِيدُ فِيهِ كَمَا تَرَاءَوْنَ الْكَوْكَبَ الْغَارِبَ فِي الأفُقِ الشَّرْقِيِّ وَالْغَرْبِيِّ
__________
أخرجه البخاري في: 81 كتاب الرقاق 51 باب صفة الجنة والنار

1803. హజ్రత్ సహెల్ బిన్ సాద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు : “స్వర్గంలో స్వర్గవాసులు ఒకరి మేడలను మరొకరు మీరిక్కడ ఆకాశంలో నక్షత్రాలను చూస్తున్నట్లు చూస్తారు.”

హదీసు ఉల్లేఖకుని ఉవాచ :- నేనీ హదీసుని నూమాన్ బిన్ అయాష్ (రహిమహుల్లాహ్) నుండి గ్రహించాను. ఆయన ఈ హదీసు గురించి చెబుతూ “నేనీ హదీసుని హజ్రత్ అబూ సయీద్ (రదియల్లాహు అన్హు) నోట విన్నానని సాక్ష్యమిస్తున్నాను” అని అన్నారు. అయితే ఆయన ఈ హదీసులో అదనంగా “మీరు ప్రాక్పశ్చిమ దిగ్మండలాల పై అస్తమిస్తుండే నక్షత్రాలను చూస్తున్నట్లు” అని అనేవారు.
(సహీహ్ బుఖారీ:- 81వ ప్రకరణం – అర్రిఖాఖ్, 51వ అధ్యాయం – సిఫతిల్ జన్నతి వన్నార్)

1804 – حديث أَبِي سَعِيدٍ الْخدْرِيِّ رضي الله عنه، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: إِنَّ أَهْلَ الْجَنَّةِ يَتَرَاءَيُونَ أَهْلَ الْغُرَفِ مِنْ فَوْقِهِم كَمَا يَتَرَاءَيُونَ الْكَوْكَبَ الدُّرِّيَّ الْغَابِرَ فِي الأُفُقِ مِنَ الْمَشْرِقِ أَوِ الْمَغْرِبِ، لِتَفَاضُلِ مَا بَيْنَهُمْ قَالُوا: يَا رَسُولَ اللهِ تِلْكَ مَنَازِلُ الأَنْبِيَاءِ، لاَ يَبْلُغُهَا غَيْرُهُمْ قَالَ: بَلَى، وَالَّذِي نَفْسِي بِيَدِهِ رِجَالٌ آَمَنوا بِاللهِ، وَصَدَّقُوا الْمُرْسَلِينَ
__________
أخرجه البخاري في: 59 كتاب بدء الخلق: 8 باب ما جاء في صفة الجنة وأنها مخلوقة

1804. హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) కథనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఉద్బోధిస్తూ “స్వర్గవాసులు తమ పైనుండే మేడలలోని వారిని, మీరు ప్రాక్పశ్చిమ దిగ్మండలాల పై దేదీప్యమానంగా మెరిసే నక్షత్రాలను చూస్తున్నట్లు చూస్తారు. దీనిక్కారణం స్వర్గవాసుల్లో కూడా అంతస్తులు, తరగతులు ఉంటాయి” అని అన్నారు. అనుచరులు ఈ మాట విని “దైవప్రవక్తా! ఈ మేడలు దైవప్రవక్తల గృహాలయి ఉంటాయా? అక్కడకు వారు తప్ప మరెవరూ చేరుకోలేరు కాబోలు” అని అన్నారు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) “ఎందుకు చేరుకోలేరు! నా ప్రాణం ఎవరి అధీనంలో ఉందో ఆ దేవుని సాక్షి! వీరసలు అల్లాహ్ ను విశ్వసించి ఆయన ప్రవక్తలను సమర్ధించిన వారయి ఉంటారు” అని అన్నారు.
(సహీహ్ బుఖారీ:- 59వ ప్రకరణం – బ యిల్ ఖల్ట్, 8వ అధ్యాయం – మాజాఆ ఫీ సిఫతిల్ జన్నతి వ అన్నహామఖూఖతున్)

1805 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: إِنَّ أَوَّلَ زُمْرَةٍ يَدْخُلُونَ الْجَنَّةَ عَلَى صُورَةِ الْقَمَرِ لَيْلَةَ الْبَدْرِ، ثُمَّ الَّذِينَ يَلُونَهُمْ، عَلَى أَشَدِّ كَوْكَبٍ دُرِّيٍّ فِي السَّمَاءِ إِضَاءَةً؛ لاَ يَبُولُونَ، وَلاَ يَتَغَوَّطُونَ، وَلاَ يَتْفِلُونَ، وَلاَ يَمْتَخِطُونَ أَمْشَاطُهُمُ الذَّهَبُ، وَرَشْحُهُمُ الْمِسْكُ، وَمَجَامِرُهُمُ الأَلُوَّةُ الأَنجُوجُ عُودُ الطِّيبِ وَأَزْوَاجُهُمُ الْحُورُ الْعِينُ عَلَى خَلْقِ رَجُلٍ وَاحِدٍ عَلَى صُورَةِ أَبِيهِمْ آدَمَ سِتُّونَ ذِرَاعًا فِي السَّمَاءِ
__________
أخرجه البخاري في: 60 كتاب الأنبياء: 1 باب خلق آدم، صلوات الله عليه، وذريته

1805. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు : “స్వర్గంలో ప్రవేశించే మొట్టమొదటి సమూహంలోని ప్రజల ముఖాలు పున్నమి రాత్రి చంద్రునిలా దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటాయి. వారి తరువాత స్వర్గంలో ప్రవేశించే వారి ముఖాలు మెరిసిపోయే ముత్యాల్లాంటి ప్రకాశవంతమైన నక్షత్రాల్లా ధగధగ మెరిసిపోతూ ఉంటాయి. ఈ నక్షత్రాలు ఆకాశంలో ఇతర నక్షత్రాల కన్నా ఎక్కువగా మెరుస్తూ ఉంటాయి. స్వర్గవాసులు మల మూత్ర విసర్జన చేయరు. అదీగాక వారు ఉమ్మరూ, చీదరు కూడా. వారి దువ్వెనలు బంగారంతో చేసినవయి ఉంటాయి. వారి చెమట నుండి కస్తూరి సువాసన గుబాళిస్తుంది. వారి ఉంగరాలపై సుగంధ పరిమళంతో కూడిన సామ్రాణి జ్వలిస్తూ ఉంటుంది. వారి భార్యలు విశాలమైన నల్లటి కళ్ళు గల (అందమైన) స్త్రీలయి ఉంటారు. స్వర్గవాసులందరి రూపాలు వారి పితామహుడు హజ్రత్ ఆదం (అలైహి) రూపంలా ఒకే విధంగా ఉంటాయి. వారి ఎత్తు అరవై బారలు ఉంటుంది. (సహీహ్ బుఖారీ:- 60వ ప్రకరణం – అంబియా, 1వ అధ్యాయం – ఖళ్ళి ఆదము సలవాతుల్లాహి అలైహి జుర్రియతివీ)

1806 – حديث أَبِي مُوسى الأَشْعَرِيِّ، أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: الْخَيْمَةُ دُرَّةٌ مُجَوَّفَةٌ، طُولُهَا فِي السَّمَاءِ ثَلاَثُونَ مِيلاً فِي كُلِّ زَاوِيَةٍ مِنْهَا لِلْمُؤْمِنِ أَهْلٌ، لاَ يَرَاهُمُ الآخَرُونَ
__________
أخرجه البخاري في: 59 كتاب بدء الخلق: 8 باب ما جاء في صفة الجنة وأنها مخلوقة

1806. హజ్రత్ అబూ మూసా అష్ అరీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు: (స్వర్గవాసి) కుటీరం ఒక ముత్యమయి ఉంటుంది (అది ఏక ముత్య కుటీరం). దాని లోపలి భాగం మెరుగుదిద్దబడి ఉంటుంది. దాని ఎత్తు 30 మైళ్ళు (48 కిలో మీటర్లు) ఉంటుంది. అందులోని ప్రతి గదిలో విశ్వాసుల కోసం భార్యలు ఉంటారు. వారిని ఇతరులెవరూ చూడలేరు. (సహీహ్ బుఖారీ:- 59వ ప్రకరణం – బద్ యిల్ ఖల్ట్, 8వ అధ్యాయం – మాజాఅ ఫీ సిఫతిల్ జన్నత్ వ అన్నహా మఖ్లూ ఖతున్)

1807 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: خَلَقَ اللهُ آدَمَ، وَطُولُهُ سِتُّونَ ذِرَاعًا، ثُمَّ قَالَ: اذْهَبْ فَسَلِّمْ عَلَى أُولَئِكَ مِنَ الْمَلاَئِكَةِ، فَاسْتَمِعْ مَا يُحَيُّونَكَ [ص:290] تَحِيَّتُكَ وَتَحِيَّةُ ذُرِّيَّتِكِ فَقَالَ: السَّلاَمُ عَلَيْكُمْ فَقَالُوا: السَّلاَمُ عَلَيْكَ وَرَحْمَةُ اللهِ فَزَادُوهُ، وَرَحْمَةُ اللهِ فَكُلُّ مَنْ يَدْخُلُ الْجَنَّةَ عَلَى صُورَةِ آدَمَ، فَلَمْ يَزَلِ الْخَلْقُ يَنْقُصُ حَتَّى الآنَ
__________
أخرجه البخاري في: 60 كتاب الأنبياء: 1 باب خلق آدم، صلوات الله عليه، وذريته

1807. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా తెలిపారు :- “అల్లాహ్ (తొలి మానవుడైన) హజ్రత్ ఆదం (అలైహిస్సలాం)ను సృష్టించాడు – అప్పుడాయన ఎత్తు అరవై బారలు ఉండింది – అల్లాహ్ ఆయనతో “దైవదూతల దగ్గరికెళ్ళి వారికి సలాం చెయ్యి, దానికి వారేమి సమాధానమిస్తారో విను. వారు పలికిన సలామే నీ, నీ సంతానం సలాం, ప్రతి సలాం అవుతుంది” అని అన్నాడు. అప్పుడు హజ్రత్ ఆదం (అలైహి) వెళ్ళి వారికి ‘అస్సలాము అలైకుం’ అనిసలాం చేశారు. దానికి వారు “అస్సలాము అలైక వ రహ్మతుల్లాహ్” అని ప్రతి సలాం చేశారు. వారు రహ్మతుల్లాహ్ అనే పదాన్ని అదనంగా పలికారు – స్వర్గంలో ప్రవేశించే ప్రతి మానవుని రూపం ఆదం (అలైహి) రూపంలా ఉంటుంది – ఆ (తొలి మానవుని సృష్టి) తరువాత ఈనాటి వరకూ మానవుల ఎత్తు నిరంతరాయంగా తగ్గుతూ వస్తోంది“.* (సహీహ్ బుఖారీ:- 60వ ప్రకరణం – అంబియా, 1వ అధ్యాయం – ఖల్ఖి ఆదమ సలవాతుల్లాహి అలైహి వజుర్రియతిహీ)

* ఈ హదీసు శీర్షికకు అనుగుణమైన హదీసు కాదు. దానిక్కారణం విషయసూచిక సహీహ్ ముస్లిం నుండి గ్రహించబడింది. సహీహ్ ముస్లిం విషయసూచిక ఈ అధ్యాయం క్రింద దీంతో పాటు మరో హదీసు కూడా ఉంది. అది సహీహ్ బుఖారీలో లేదు. అందువల్ల మూలంలో పక్షుల్లాంటి హృదయాలన్న ప్రస్తావన లేదు. (అనువాదకుడు)

1808 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: نارُكمْ جُزْءٌ مِنْ سَبْعِينَ جُزْءًا مِنْ نَارِ جَهَنَّمَ قِيلَ يَا رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ إِنْ كَانَتْ لَكَافِيَةً قَالَ: فُضِّلَتْ عَلَيْهِنَّ بِتِسْعَةٍ وَسِتِّينَّ جُزْءًا، كلُّهُنَّ مِثْلُ حَرِّهَا
__________
أخرجه البخاري في: 59 كتاب بدء الخلق: 10 باب صفة النار وأنها مخلوقة

1808. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధంగా ఉద్బోధించారు – “నరకాగ్ని మీ (ఇహలోక) అగ్నికి 70 రెట్లు ఎక్కువ తీవ్రంగా ఉంటుంది.” అనుచరులు ఈ మాట విని “దైవప్రవక్తా! (కాల్చడానికి) ఈ అగ్ని కూడా సరిపోతుంది కదా!” అని అన్నారు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) “నరకాగ్నికి మీ (ప్రాపంచిక) అగ్నిపై 69 రెట్ల ఆధిక్యత ఉంది. దాని డెబ్బె భాగాలలోని ప్రతి భాగం తీవ్రతలో మీ అగ్ని మాదిరిగా ఉంటుంది” అని సమాధానమిచ్చారు.
– (సహీహ్ బుఖారీ:- 59వ ప్రకరణం – బ యిల్ ఖల్ట్, 10వ అధ్యాయం – సిఫతిన్నారి వ అన్నహా మఖూఖహ్)

1809 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: تَحَاجَّتِ الْجَنَّةُ وَالنَّارُ [ص:291] فَقَالَتِ النَّارُ: أُوثِرْتُ بِالْمُتَكَبِّرِينَ وَالْمُتَجَبِّرِينَ وَقَالَتِ الْجَنَّةُ: مَا لِي لاَ يَدْخُلُنِي إِلاَّ ضُعَفَاءُ النَّاسِ وَسَقَطُهُمْ قَالَ اللهُ، تَبَارَكَ وَتَعَالَى، لِلْجنَّةِ: أَنْتِ رَحْمَتِي أَرْحَمُ بِكِ مَنْ أَشَاءُ مِنْ عِبَادِي وَقَالَ لِلنَّارِ: إِنَّمَا أَنْتِ عَذَابٌ أُعَذِّبُ بِكِ مَنْ أَشَاءُ مِنْ عِبَادِي وَلِكُلِّ وَاحِدَةٍ مِنْهُمَا مِلْؤُهَا فَأَمَّا النَّارُ فَلاَ تَمْتَلِىءُ حَتَّى يَضَعَ رِجْلَهُ فَتَقُولُ قَطٍ قَطٍ قَطٍ فَهُنَالِكَ تَمْتَلِىءُ، وَيُزْوَى بَعْضُهَا إِلَى بَعْضٍ وَلاَ يَظْلِمُ اللهُ، عَزَّ وَجَلَّ، مِنْ خَلْقِهِ أَحَدًا وَأَمَّا الْجَنَّةُ، فَإِنَّ اللهَ، عَزَّ وَجَلَّ، يُنْشِىءُ لَهَا خَلْقًا
__________
أخرجه البخاري في: 65 كتاب التفسير: 50 سورة ق: 1 باب قوله وتقول هل من مزيد

1809. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా తెలిపారు :- “స్వర్గ నరకాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. నరకం మాట్లాడుతూ “నాలో గర్విష్ఠులు, బలవంతులు ప్రవేశిస్తారు గనక నేను గొప్పదాన్ని” అని అన్నది. స్వర్గం మాట్లాడుతూ “నాలో మటుకు బలహీనులు, నిస్సహాయులు, ప్రజల దృష్టిలో విలువ లేని వాళ్ళు మాత్రమే ప్రవేశిస్తారు” అని అన్నది. అప్పుడు అల్లాహ్ జోక్యం చేసుకుంటూ స్వర్గంతో “నీవు నా కారుణ్యానివి. నీ ద్వారా నా దాసులలో నేను తలచుకున్న వారిని కరుణిస్తాను” అని అన్నాడు. ఆ తరువాత నరకంతో “నీవు ‘యాతనవు మాత్రమే. నీ ద్వారా నా దాసులలో నేను తలచుకున్న వారిని శిక్షిస్తాను” అని అన్నాడు. ఆ తరువాత స్వర్గ నరకాలు రెండిటినీ నింపడం జరుగుతుందని అల్లాహ్ వాగ్దానం చేశాడు. అయితే నరకంలో అల్లాహ్ తన కాలు పెట్టే దాకా అది నిండదు. అల్లాహ్ నరకంలో తన కాలు పెట్టినప్పుడు “చాలు చాలు ఇక చాలు” అంటుంది నరకం తన కడుపు నిండిపోయినట్లు. అది తనంతట తాను సంకోచిస్తుంది. అల్లాహ్ తన సృష్టి రాసుల్లో ఎవరికీ ఎలాంటి అన్యాయం చేయడు. ఇక స్వర్గం విషయానికొస్తే దాన్ని నింపడానికి అల్లాహ్ కొత్తగా మరికొందరిని సృష్టిస్తాడు” (సహీహ్ బుఖారీ:- 65వ ప్రకరణం – తఫ్సీర్, 5వ సూరా – ఖాఫ్, 1వ అధ్యాయం – ఖౌలిహీ వతఖూలు హల్ మిమ్మజీద్)

1810 – حديث أَنَسِ بْنِ مَالِكٍ قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: لاَ تَزَالُ جَهَنَّمُ تَقُولُ هَلْ مِنْ مَزِيدٍ، حَتَّى يَضَعَ رَبُّ الْعِزَّةِ فِيهَا قَدَمَهُ فَتَقُولُ قطِ قَطِ وَعِزَّتِكَ وَيُزْوَى بَعْضُهَا إِلَى بَعْض
__________
أخرجه البخاري في: 83 كتاب الأيمان والنذور: 12 باب الحلف بعزة الله وصفاته وكلماته

1810. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు :- “నరకం మాటి మాటికీ ఇంకేదయినా ఉంటే తెచ్చి పడేయండి” అని అంటుంది. చివరికి అల్లాహ్ తన కాలిని దాని మీద పెడతాడు. అప్పుడు నరకం “నీ గౌరవ ప్రతిష్ఠల సాక్ష్యం! చాలు చాలు” అని అంటుంది. అది తనంతట తాను సంకోచించిపోతుంది.” (సహీహ్ బుఖారీ:- 83వ ప్రకరణం – ఐమాన్ వన్నుజూర్, 11వ అధ్యాయం – అల్ హల్ఫి బిఇజ్జతిల్లాహి వ సిఫాతిహీ వకలిమాతిహీ)

1811 – حديث أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: يُؤْتَى بِالْمَوْتِ كَهَيْئَةِ كَبْشٍ أَمْلَحَ، فَيُنَادِي مُنَادٍ، يَا أَهْلَ الْجَنَّةِ فَيَشْرَئِبُّونَ وَيَنْظُرونَ فَيَقُولُ: هَلْ تَعْرِفُونَ هذَا فَيَقُولُونَ: نَعَمْ هذَا الْمَوْتُ وَكلُّهُمْ قَدْ رَأَوْهُ ثُمَّ يُنَادِي: يَا أَهْلَ النَّارِ فَيَشْرَئِبُّونَ وَيَنْظُرُونَ فَيَقُولُ: هَلْ تَعْرِفُونَ هذَا فَيَقُولُونَ: نَعَمْ هذَا الْمَوْتُ وَكُلُّهُمْ قَدْ رَآه فَيُذْبَحُ ثُمَّ يَقُولُ: يَا أَهْلَ الْجَنَّةِ خُلُودٌ، فَلاَ مَوْتَ وَيَا أَهْلَ النَّار خُلُودٌ، فَلاَ مَوْتَ ثُمَّ قَرَأَ (وَأَنْذِرْهُمْ يَوْمَ الْحَسْرَةِ إِذْ قُضِيَ الأَمْرُ وَهُمْ فِي غَفْلَةٍ، وَهؤُلاَءِ فِي غَفْلَةٍ، أَهْل الدُّنْيَا، وَهُمْ لاَ يُؤْمِنُونَ)
__________
أخرجه البخاري في: 65 كتاب التفسير: 19 سورة مريم: 1 باب قوله وأنذرهم يوم الحسرة

1811. హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధంగా తెలియజేశారు :

(ప్రళయదినాన) మృత్యువు ఒక తెల్లని పొట్టేలు రూపంలో తీసుకురాబడుతుంది. ఒక ప్రకటనకర్త ఎలుగెత్తి “స్వర్గవాసులారా!” అని పిలుస్తాడు. స్వర్గవాసులు తలలు పైకెత్తి అతని వైపు చూస్తారు. ఆ ప్రకటనకర్త “దీన్ని మీరు గుర్తించారా?” అని అడుగుతాడు వారిని. స్వర్గవాసులు దాన్ని ఇంతకు పూర్వం కూడా చూసి ఉన్నందున “గుర్తించాము. అది మృత్యువు” అని అంటారు. తర్వాత ఆ ప్రకటనకర్త నరకవాసుల్ని కూడా ఎలుగెత్తి పిలుస్తాడు. వారు కూడా తలలు పైకెత్తి అటు వైపు చూస్తారు. “మీరు దీన్ని గుర్తించారా?” అని అడుగుతాడు ప్రకటనకర్త. నరకవాసులు కూడా దాన్ని ఇంతకు పూర్వం చూసి ఉన్నందున “గుర్తించాము అది మృత్యువు” అని అంటారు. ఆ తరువాత దాన్ని కోసివేయడం జరుగుతుంది. అప్పుడు ప్రకటనకర్త అందరినీ సంబోధిస్తూ “స్వర్గవాసులారా! ఇప్పుడు జీవితం శాశ్వతమయిపోయింది. ఇక (మీకెవరికీ) మరణం రాదు. నరకవాసులారా! ఇప్పుడు జీవితం శాశ్వతమయిపోయింది. ఇక (మికెవరికీ) మరణం రాదు” అని అంటాడు.

ఆ తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ సూక్తి పఠిస్తారు : “ప్రవక్తా! ఏమరుపాటుకు లోనయి సత్యాన్ని విశ్వసించని వారిని తీర్పు దినం గురించి భయ పెట్టు. ఆ రోజు తీర్పు జరిగిన తరువాత దుఃఖం తప్ప మరేదీ మిగలదు.” (19:39)

(సహీహ్ బుఖారీ:- 65వ ప్రకరణం – తఫ్సీర్, 19వ సూరా – మర్యం, 1వ అధ్యాయం – ఖౌలిహీ (వ అంజిర్హుమ్ యౌమల్ హస్రా)

1812 – حديث ابْنِ عُمَرَ قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: إِذَا صَارَ أَهْلُ الْجَنَّةِ إِلَى الْجَنَّةِ، وَأَهْلُ النَّارِ إِلَى النَّارِ؛ جِيءَ بِالْمَوْتِ حَتَّى يُجْعَلَ بَيْنَ الْجَنَّةِ وَالنَّارِ ثُمَّ يُذْبَحُ ثُمَّ يُنَادِي مُنَادٍ: يَا أَهْلَ الْجنَّةِ لاَ مَوْتَ، وَيَا أَهْلَ النَّارِ لاَ مَوْتَ فَيَزْدَادُ أَهْلُ الْجَنَّةِ فَرَحًا إِلَى فَرَحِهِمْ، وَيَزْدَادُ أَهْلُ النَّارِ حُزْنًا إِلَى حُزْنِهِمْ
__________
أخرجه البخاري في: 81 كتاب الرقاق: 51 باب صفة الجنة والنار

1812. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు :

స్వర్గవాసులు స్వర్గంలో, నరకవాసులు నరకంలో ప్రవేశించిన తరువాత మరణాన్ని స్వర్గనరకాల మధ్యకు తెచ్చి నిలబెట్టడం జరుగుతుంది. తరువాత దాన్ని కోసివేస్తారు. అప్పుడు ఒక ప్రకటనకర్త లేచి “స్వర్గవాసులారా! ఇక నుండి మరణం ఉండదు. నరకవాసులారా! ఇక నుండి మరణం ఉండదు” అని ప్రకటిస్తాడు. ఈ ప్రకటన వినగానే స్వర్గవాసుల ఆనందం అవధులు దాటుతుంది; నరకవాసులు దుఃఖంతో మరింత క్రుంగిపోతారు.”

(సహీహ్ బుఖారీ:- 81వ ప్రకరణం – అర్రిఖాఖ్, 51వ అధ్యాయం – సిఫతిల్ జన్నతి వన్నార్)

1813 – حديث أَبِي هُرَيْرَةَ، عَنِ النَبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: مَا بَيْنَ مَنْكِبَيِ الْكَافِرِ مَسِيرَةُ ثَلاَثَةِ أَيَّامٍ لِلرَّاكِبِ الْمُسْرِعِ
__________
أخرجه البخاري في: 81 كتاب الرقاق: 51 باب صفة الجنة والنار

1813. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా తెలిపారు : సత్యతిరస్కారి రెండు భుజాల మధ్య ఎంత అంతరం ఉంటుందంటే, భుజం మీద వేగంగా నడిచే రౌతు గనక నడిస్తే అతను మూడు రోజుల దాకా నడుస్తూనే ఉంటాడు.* (సహీహ్ బుఖారీ:- 81వ ప్రకరణం – అర్రిఖాఖ్, 51వ అధ్యాయం – సిఫతిల్ జన్నతి వన్నార్)

*నరక శిక్ష తీవ్రతను చవిచూడటానికి వీలుగా సత్యతిరస్కారుల శరీరం ఆ మేరకు చాలా పెద్దదిగా ఉంటుంది. సహీహ్ ముస్లిం ఉల్లేఖనంలో సత్య తిరస్కారి దవడ ఉహుద్ పర్వతమంత ఉంటుందని కూడా ఉంది. ఇవన్నీ సత్యాలు, వీటిని ముస్లింలు విధిగా విశ్వసించాలి. (ఇమామ్ నవవీ – రహిమహుల్లాహ్)

1814 – حديث حارِثَةَ بْنِ وَهْبٍ الْخُزَاعِيِّ قَالَ: سَمِعْتُ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ: أَلاَ أُخْبِرُكُمْ بِأَهْلِ الْجَنَّةِ كُلُّ ضَعِيفٍ مَتَضَعِّفٍ، لَوْ أَقْسَمَ عَلَى اللهِ لأَبَرَّهُ أَلاَ أُخْبِرُكُمْ بِأَهْلِ النَّارِ كُلُّ عُتُلٍّ جَوَّاظٍ مُسْتَكْبِرٍ
__________
أخرجه البخاري في: 65 كتاب التفسير: 68 سورة ن والقلم: 1 باب عتُل بعد ذلك زنيم

1814. హజ్రత్ హారిస్ బిన్ వహబ్ ఖుజాయి (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు :

“నేను మీకు స్వర్గవాసుల్ని గురించి చెప్పనా? అల్పుడని, నీచుడని లోకులు భావించే ప్రతి బలహీనుడు, నిస్సహాయుడు గనక అల్లాహ్ మీద పూర్తి నమ్మకం ఉంచి ప్రమాణం చేస్తే అల్లాహ్ దాన్ని నిజపరుస్తాడు. నేను మీకు నరకవాసుల్ని గురించి చెప్పనా? జగడాలమారి, పిసినిగొట్టు, అహంకారి, గర్విష్ఠి అయిన ప్రతి వ్యక్తీ (నరకవాసియే). ”

(సహీహ్ బుఖారీ:- 65వ ప్రకరణం – తఫ్సీర్, 68వ సూరా – ఖలమ్, 1వ అధ్యాయం – ఉతుల్లింబాద జాలిక జనీమ్)

1815 – حديث عَبْدِ اللهِ بْنِ زَمْعَةَ، أَنَّهُ سَمِعَ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَخْطُبُ، وَذَكَرَ النَّاقَةَ وَالَّذِي عَقَرَ فَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: (إِذِ انْبَعَثَ أَشْقَاهَا) انْبَعَثَ لَهَا رَجُلٌ عَزِيزٌ عَارِمٌ مَنِيعٌ فِي رَهْطِهِ، مِثْلُ أَبِي زَمْعَةَ وَذَكَرَ النِّسَاءَ فَقَالَ: يَعْمِدُ أَحَدُكُمْ، يَجْلِدُ امْرَأَتَهُ جَلْدَ الْعَبْدِ، فَلَعَلَّهُ يُضَاجِعُهَا مِنْ آخِرِ يَوْمِهِ ثُمَّ وَعَظَهُمْ فِي ضَحِكِهِمْ مِنَ الضَّرْطَةِ، [ص:294] وَقَالَ لِمَ يَضْحَكُ أَحَدُكُمْ مِمَّا يَفْعَلُ
__________
أخرجه البخاري في: 65 كتاب التفسير: 91 سورة والشمس: 1 باب حدثنا موسى بن إسماعيل

1815. హజ్రత్ అబ్దుల్లా బిన్ జమా (రదియల్లాహు అన్హు) కథనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఉపన్యాసమిస్తుంటే విన్నాను. ఆయన (హజ్రత్ సాలిహ్ అలైహిస్సలామ్ గారి) ఒంటె సంగతి, దాని పొదుగును కోసి వేసిన వ్యక్తి సంగతి ప్రస్తావించారు. “ఆ జాతిలో అందరికన్నా బలవంతుడు దిగ్గున లేచాడు” (అషమ్స్ : 12) అనే సూక్తి పఠించి, ఆ ఒంటె పొదుగు కోసినవాడు ఆ జాతిలో అందరికన్నా బలాఢ్యుడు, పరమ దుర్మార్గుడు, జగడాలమారి, నోటి దురుసు గలవాడు” అని అన్నారు.

ఆ తరువాత ఆయన స్త్రీలను గురించి ప్రస్తావిస్తూ “మీలో కొందరు మీ భార్యలను బానిసల్ని కొట్టినట్లు కొడ్తున్నారు. కాని అదే రోజు చివరి భాగం (రాత్రివేళ)లో ఆమెను తమ దగ్గర పడుకోబెట్టుకుంటున్నారు. (ఇది చాలా అనుచితమైన చర్య)” అని అన్నారు.

ఆ తర్వాత ఆయన జనానికి హితోపదేశం చేస్తూ “ఎవరి నుంచయినా (శబ్దంతో) అపానవాయువు వెడలినప్పుడు నవ్వడం చాలా తప్పు. తాను చేసే పనినే ఇతరులు చేస్తే దానికి నవ్వడమెందుకు?” అని అన్నారు.

(సహీహ్ బుఖారీ:- 65వ ప్రకరణం – తఫ్సీర్, 91వ సూరా – అష్షమ్స్, 1వ అధ్యాయం – హద్దసనా మూసా బిన్ ఇస్మాయిల్)

1816 – حديث أَبِي هُرَيْرَةَ، قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: رَأَيْتُ عَمْرَو بْنَ عَامِرِ بْنِ لُحَيٍّ الْخُزَاعِيَّ يَجُرُّ قُصْبَهُ فِي النَّارِ، وَكَانَ أَوَّلَ مَنْ سَيَّبَ السَّوَائِبَ
__________
أخرجه البخاري في: 61 كتاب المناقب: 9 باب قصة خزاعة

1816. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు :-

నేను నరకంలో అమ్ర్ బిన్ ఆమిర్ బిన్ లుహయ్యి ఖుజాయీని చూశాను. అతను తన పేగులు లాక్కుంటున్నాడు. ఇతనే అందరికన్నా ముందు (అరేబియాలో) విగ్రహం పేరుతో మొక్కుబడి చేసి ఒంటెను వదిలే దురాచారాన్ని ప్రారంభించినవాడు.”

(సహీహ్ బుఖారీ:- 61వ ప్రకరణం – మనాఖిబ్, 9వ అధ్యాయం – ఖిస్సతిఖుజాఅ)

1817 – حديث عَائِشَةَ، قَالَتْ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: تُحْشَرُونَ حُفَاةً عُرَاةً غُرْلاً قَالَتْ عَائِشَةُ: فَقُلْتُ، يَا رَسُولَ اللهِ الرِّجَالُ وَالنِّسَاءُ يَنْظُرَ بَعْضُهُمْ إِلَى بَعْضٍ فَقَالَ: الأَمْرُ أَشَدُّ مِنْ أَنْ يَهِمَّهُمْ ذَاكِ
__________
أخرجه البخاري في: 81 كتاب الرقاق: 45 باب كيف الحشر

1817. విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హు) కథనం :-

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మాట్లాడుతూ “ప్రళయదినాన మానవులు నగ్న పాదాలతో, నగ్న శరీరాలతో, ఖత్నా (వడుగు) చేయబడనివారిగా లేపబడతారు” అని తెలిపారు. నేనీ మాట విని “దైవప్రవక్తా! (ఆ స్థితిలో) స్త్రీలు పురుషులు ఒకర్నొకరు చూసుకుంటారా?” అని అడిగాను. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దానికి సమాధానమిస్తూ “ఆ సమయంలో వారంతా తీవ్రమైన ఆపదకు లోనయి ఉంటారు. ఒకరివైపు మరొకరు చూసుకునే ఆలోచనే తట్టదు వారికి” అని అన్నారు.

(సహీహ్ బుఖారీ:- 81వ ప్రకరణం – అర్రిఖాఖ్, 45వ అధ్యాయం – కైఫల్ హష్ర్)

1818 – حديث ابْنِ عَبَّاسٍ قَالَ: قَامَ فِينَا النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَخْطُبُ، فَقَالَ: إِنَّكُمْ مَحْشُورُونَ حُفَاةً عُرَاةً غُرْلاً (كَمَا بَدَأْنَا أَوَّلَ خَلْقٍ نُعِيدُهُ) الآيَةَ وَإِنَّ أَوَّلَ الْخَلاَئِقِ يُكْسى يَوْمَ الْقَيَامَةِ إِبْرَاهِيمُ وَإِنَّهُ سَيُجَاءُ بِرِجَالٍ مَنْ أُمَّتِي فَيُؤْخَذُ بِهِمْ ذَاتَ الشِّمَالِ، فَأَقُولُ: يَا رَبِّ أُصَيْحَابِي فَيَقُولُ: إِنَّكَ لاَ تَدْرِي مَا أَحْدَثُوا بَعْدَكَ فَأَقُولُ كَمَا قَالَ الْعَبْدُ الصَّالِحُ: (وَكُنْتُ عَلَيْهِمْ شَهِيدًا مَا دُمْتُ فِيهِمْ) إِلَى قَوْلِهِ (الْحَكِيمُ) قَالَ: فَيُقَالُ إِنَّهُمْ لَمْ يَزَالُوا مُرْتَدِّينَ عَلَى أَعْقَابِهِمْ
__________
أخرجه البخاري في: 81 كتاب الرقاق: 45 باب كيف الحشر

1818. హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) లేచి మా ముందు ఉపన్యాసమిస్తూ “మీరు ప్రళయ దినాన లేపబడినప్పుడు నగ్న పాదాలతో, నగ్న శరీరాలతో, ఖత్నా (వడుగు) చేయబడనివారయి ఉంటారు. దివ్య ఖుర్ఆన్లో – ‘మేము మానవుడ్ని మొదట్లో ఏ విధంగా పుట్టించామో తిరిగి అదే విధంగా చేస్తాము’ అని ఉంది. ప్రళయదినాన అందరికంటే ముందు బట్టలు హజ్రత్ ఇబ్రాహీం (అలైహి)కు ధరింపజేయడం జరుగుతుంది” అని అన్నారు.

ఆ తరువాతఆయన ఇలా తెలియజేశారు .“ఆ రోజు నా అనుచర సమాజానికి చెందిన కొందరిని తీసుకొచ్చి ఎడమ పక్షం వారిలో చేర్చడం జరుగుతుంది. నేనప్పుడు ‘ప్రభూ! వీరు నా అనుచరులు కదా!’ అనంటాను. దానికి అల్లాహ్ ‘నీ తదనంతరం వీరు (ధర్మంలో లేని) ఎన్ని కొత్త కొత్త విషయాలు సృష్టించారో నీకు తెలియదు’ అనంటాడు. నేనీ మాట విని అల్లాహ్ పుణ్యదాసుడు (హజ్రత్ ఈసా-అలైహి) పలికిన పలుకులే పలుకుతాను”. ఆయన పలుకులు ఈ విధంగా ఉన్నాయి – “(ప్రభూ!) నేను వారి మధ్య ఉన్నంత వరకే నేను వారి మీద పర్యవేక్షకుడిగా ఉన్నాను. తమరు నన్ను వెనక్కి పిలిపించుకున్న తరువాత వారిపై తమరే పర్యవేక్షకులు. ఇప్పుడు తమరు వారిని శిక్షించదలచుకుంటే వారు తమరి దాసులే. ఒకవేళ వారిని క్షమిస్తే తమరు సర్వాధికారి, ఎంతో వివేకవంతులు.” (5:117, 118) ఆ తరువాత నాతో “(నీవు ప్రపంచం నుండి వెళ్ళిపోయిన తరువాత) వీరు మతభ్రష్టులయి జీవితాంతం అదే స్థితిలో ఉండిపోయారు” అని అనబడుతుంది.

(సహీహ్ బుఖారీ:- 81వ ప్రకరణం – అర్రిఖాఖ్, 45వ అధ్యాయం – కైఫల్ హష్ర్)

1819 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: يُحْشَرُ النَّاسُ عَلَى ثَلاَثِ طَرَائِقَ: رَاغِبِينَ رَاهِبِينَ وَاثْنَانِ عَلَى بَعِيرِ، وَثَلاَثَةٌ عَلَى بَعِيرٍ، وأَرْبَعَةٌ عَلَى بَعِير، وَعَشَرَةٌ عَلَى بَعِيرٍ وَيَحْشُرُ بَقِيَّتَهُمُ النَّارُ، تَقِيلُ مَعَهُمْ حَيْثُ قَالُوا، وَتَبِيتُ مَعَهُمْ حَيثُ بَاتُوا، [ص:296] وَتُصْبِحُ مَعَهُمْ حَيْثُ أَصْبَحُوا، وَتُمْسى مَعَهُمْ حَيْثُ أَمْسَوْا
__________
أخرجه البخاري في: 81 كتاب الرقاق: 45 باب كيف الحشر

1819. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు :

“పునరుత్థాన దినాన మానవులు మూడు వర్గాలుగా చీలిపోతారు. ఒక వర్గంలో భయం, ఆశ కలిగిన వారు ఉంటారు. (రెండవ వర్గంలో) ఒక ఒంటె మిద ఇద్దరు, మరొక ఒంటె మిద ముగ్గురు, వేరొక ఒంటి మీద నలుగురు చొప్పున ఉంటారు. మిగిలిన (మూడో వర్గం) వారిని అగ్ని ఒక చోట సమీకరిస్తుంది. వారు మధ్యాహ్నం వేళ ఎక్కడయినా నడుం వాల్చితే ఈ అగ్ని కూడా వారితో పాటే ఉంటుంది. రాత్రివేళ వారు ఎక్కడయినా గడిపితే అప్పుడు కూడా ఈ అగ్ని వారిని వెన్నంటే ఉంటుంది. ఉదయం లేచేటప్పుడు కూడా వారిని వెన్నంటే ఉంటుంది. సాయంత్రం అయినప్పుడు కూడా ఈ అగ్ని వారిని వెన్నంటే ఉంటుంది. (అంటే వారు ఎక్కడికి పోయినా, ఏ స్థితిలో ఉన్నాసరే అగ్ని వారిని వెన్నాడటం మానదన్నమాట).”

(సహీహ్ బుఖారీ:- 81వ ప్రకరణం – అర్రిఖాఖ్, 45వ అధ్యాయం – కైఫల్ హష్ర్)

1820 – حديث عَبْدِ اللهِ بْنِ عُمَرَ أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: يَوْمَ يَقُومُ النّاسُ لِرَبِّ الْعَالَمِينَ، حَتَّى يَغِيبَ أَحَدُهُمْ فِي رَشْحِهِ إِلَى أَنْصَافِ أُذُنَيْهِ
__________
أخرجه البخاري في: 65 كتاب التفسير: 83 سورة ويل للمطففين

1820. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు:

“మానవులు విశ్వ ప్రభువు సన్నిధిలో నిలబడే రోజు వారి పరిస్థితి చెమటలతో చాలా ఆందోళనకరంగా ఉంటుంది. కొందరు తమ చెవుల సగభాగం వరకు తమ సొంత చెమటతోనే మునిగి ఉంటారు.

(సహీహ్ బుఖారీ:- 65వ ప్రకరణం – తఫ్సీర్, 83వ సూరా – వైలుల్లిల్ ముతఫ్ఫిఫీన్)

1821 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: يَعْرَقُ النَّاسُ يَوْمَ الْقِيَامَةِ حَتَّى يَذْهَبَ عَرَقُهُمْ فِي الأَرْضِ سَبْعِينَ ذِرَاعًا، وَيُلْجِمُهُمْ حَتَّى يَبْلُغَ آذَانَهُمْ
__________
أخرجه البخاري في: 81 كتاب الرقاق: 47 باب قول الله تعالى (ألا يظن أولئك أنهم مبعوثون ليوم عظيم)

1821. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు :-

“ప్రళయదినాన మానవుల శరీరాల నుండి చెమట విపరీతంగా కారుతూ ఉంటుంది. ఆ చెమట నేల మీద డెబ్బె గజాల దాకా ప్రవహిస్తూ ఉంటుంది. వారు తమ నోళ్ళు, చెవుల దాకా చెమటలోనే మునిగి ఉంటారు.”

(సహీహ్ బుఖారీ:- 81వ ప్రకరణం – అర్రిఖాఖ్, 47వ అధ్యాయం – ఖౌలిల్లాహి తఆలా (అలా యజున్ను ఉలాయిక అన్నహమ్ మబ్ వూసూన లి యౌమిన్ అజీమ్)

1822 – حديث عَبْدِ اللهِ بْنِ عُمَرَ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: إِنَّ أَحَدَكمْ، إِذَا مَاتَ، عُرِضَ عَلَيْهِ مَقْعَدُهُ بِالْغَدَاةِ وَالْعَشِيِّ إِنْ كَانَ مِنْ أَهْلِ الْجَنَّةِ، فَمِنْ أَهْلِ الْجَنَّةِ؛ [ص:297] وَإِنْ كَانَ مِنْ أَهْلِ النَّارِ؛ فَيُقَالُ هذَا مَقْعَدُكَ حَتَّى يَبْعَثَكَ اللهُ يَوْمَ الْقِيَامَةِ
__________
أخرجه البخاري في: 23 كتاب الجنائز: 90 باب الميت يعرض عليه مقعده بالغداة والعشي

1822. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధంగా తెలియజేశారు :-

“మీలో ఎవరైనా చనిపోయినప్పుడు అతనికి (సమాధిలో) ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం అతను ఉండవలసిన శాశ్వత స్థానం చూపబడుతుంది. అతను గనక స్వర్గవాసి అయి ఉంటే అతనికి స్వర్గవాసుల స్థానం చూపబడుతుంది; నరకవాసి అయి ఉంటే అతనికి నరకవాసుల స్థానం చూపబడుతుంది. అప్పుడు “ఇదే నీ అసలు స్థానం. నిన్ను ప్రళయదినాన లేపినప్పుడు ఈ స్థానానికే నీవు చేరుకోవలసి ఉంటుంది” అని అతనికి చెప్పబడుతుంది.”

(సహీహ్ బుఖారీ:- 23వ ప్రకరణం – జనాయిజ్, 90వ అధ్యాయం – అల్ మయ్యతి యూరజు అలైహి మఖ్ అదుహు బిల్ ఘదాతి వల్ అషియ్యి )

1823 – حديث أَبِي أَيُّوبَ رضي الله عنه قَالَ: خَرَجَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، وَقَدْ وَجَبَتِ الشَّمْسُ، فَسَمِعَ صَوْتًا فَقَالَ: يَهُودُ تُعَذَّبُ فِي قُبُورِهَا
__________
أخرجه البخاري في: 23 كتاب الجنائز: 88 باب التعوذ من عذاب القبر

1823. హజ్రత్ అబూ అయ్యూబ్ అన్సారీ (రదియల్లాహు అన్హు) కథనం :-

“సూర్యాస్తమయం అయిన తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇంటి నుంచి బయలుదేరారు. ఒక చోట ఆయన ఒక విధమైన భయంకర) ధ్వని విని “ఇది సమాధిలో ఒక యూదుడి నుండి వస్తున్న ధ్వని. అతను సమాధి యాతనఅనుభవిస్తున్నాడు” అని అన్నారు.”

(సహీహ్ బుఖారీ:- 23వ ప్రకరణం – జనాయిజ్, 88వ అధ్యాయం – అత్తవ్వుజు మిన్ అజాబిల్ ఖబ్ర్)

1824 – حديث أَنَسِ بْنِ مَالِكٍ رضي الله عنه، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: إِنَّ الْعَبْدَ إِذَا وُضِعَ فِي قَبْرِهِ، وَتَوَلَّى عَنْهُ أَصْحَابُهُ، وَإِنَّهُ لَيَسْمَعُ قَرْعَ نِعَالِهِمْ، أَتَاهُ مَلَكَانِ، فَيُقعِدَانِهِ فَيقُولاَنِ: مَا كُنْتَ تَقُولُ فِي هذَا الرَّجُلِ (لِمُحَمَّدٍ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ) فَأَمَّا الْمُؤْمِنُ [ص:298] فَيَقُولُ: أَشْهَدُ أَنَّهُ عَبْدُ اللهِ وَرَسُولُهُ فَيُقَالُ لَهُ: انْظُرْ إِلَى مَقْعَدِكَ مِنَ النَّارِ، قَدْ أَبْدَلَكَ اللهُ بِهِ مَقْعَدًا مِنَ الْجَنَّةِ فَيَرَاهُمَا جَمِيعًا
__________
أخرجه البخاري في: 23 كتاب الجنائز: 87 باب ما جاء في عذاب القبر

1824. హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు :

“మనిషి (మృతదేహం)ని సమాధిలో పెట్టి (పూడ్చి) అతని బంధుమిత్రులు వెళ్ళిపోతారు. అతనింకా వారి చెప్పుల శబ్దం వింటూ ఉండగానే అతని దగ్గరికి ఇద్దరు దైవదూతలు వస్తారు. వారతడ్ని లేపి కూర్చోబెట్టి, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను గురించి ప్రశ్నిస్తూ “ఇతడ్ని గురించి నీ అభిప్రాయం ఏమిటి?” అని అడుగుతారు. అతను విశ్వాసి అయి ఉంటే “ఆయన అల్లాహ్ దాసుడు, అల్లాహ్ యొక్క ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను” అని అంటాడు. అప్పుడు వారు అతనితో ఇలా అంటారు. : “ఇదిగో చూడు ఇది నీ (శాశ్వత) స్థానం కావలసిన నరకం. దీనికి బదులు అల్లాహ్ నీకిప్పుడు స్వర్గంలో నివాసస్థానం ప్రసాదించాడు” అని చెబుతారు. ఈ విధంగా అతను తన రెండు స్థానాలను చూసుకుంటాడు.”

(సహీహ్ బుఖారీ:- 23వ ప్రకరణం – జనాయిజ్, 87వ అధ్యాయం – మాజాఆ ఫీ అజాబిల్ ఖబ్ర్ )

1825 – حديث الْبَرَاءِ بْنِ عَازِبٍ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: إِذَا أُقْعِدَ الْمُؤْمِنُ فِي قَبْرِهِ أُتِيَ، ثُمَّ شَهِدَ أَنْ لاَ إِله إِلاَّ اللهُ، وَأَنَّ مُحَمَّدًا رَسُولُ اللهِ، فَذلِكَ قَوْلُهُ (يُثَبِّتُ اللهُ الَّذِينَ آمَنُوا بَالْقَوْلِ الثَّابِتِ)
__________
أخرجه البخاري في: 23 كتاب الجنائز: 87 باب ما جاء في عذاب القبر

1825. హజ్రత్ బరాబిన్ ఆజిబ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధంగా తెలియజేశారు:

“విశ్వాసిని సమాధిలో పెట్టిన తరువాత అతని దగ్గరకు (ఇద్దరు దైవదూతలు) వస్తారు. అప్పుడు విశ్వాసి “అష్ హదు అన్ లాఇలాహ ఇల్లల్లాహు వఅష్ హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్” అని అంటాడు. దివ్య ఖుర్ఆన్లోని “విశ్వసించిన వారికి అల్లాహ్ ఒక స్థిర వచనం ఆధారంగా ఇహపర లోకాలలో స్థిరత్వాన్ని ప్రసాదిస్తాడు” (ఇబ్రాహీమ్ – 27) అనే సూక్తికి వివరణ ఇదే.”

(సహీహ్ బుఖారీ:- 23వ ప్రకరణం – జనాయిజ్, 87వ అధ్యాయం – మాజాఆ ఫీ అజాబిల్ ఖబ్ర్)

1826 – حديث أَبِي طَلْحَةَ، أَنَّ نَبِيَّ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، أَمَرَ يَوْمَ بَدْرٍ بِأَرْبَعَةٍ وَعِشْرِينَ رَجُلاً مِنْ صَنَادِيدِ قُرَيْشٍ، فَقُذِفُوا فِي طَوِيٍّ مِنْ أَطْوَاءِ بَدْرٍ، خَبِيثٍ مُخْبِثٍ وَكَانَ إِذَا ظَهَرَ عَلَى قَوْمٍ أَقَامَ بِالْعَرْصَةِ ثَلاَثَ لَيَالٍ فَلَمَّا كَانَ بِبَدْرٍ، الْيَوْمَ الثَّالِثَ، أَمَرَ بَرَاحِلَتِهِ فَشُدَّ عَلَيْهَا رَحْلُهَا ثُمَّ مَشَى وَاتَّبَعَهُ أَصْحَابُهُ وَقَالُوا مَا نُرَى يَنْطَلِقُ إِلاَّ لِبَعْضِ حَاجَتِهِ حَتَّى قَامَ عَلَى شَفَةِ الرَّكِيِّ فَجَعَلَ يُنَادِيهِمْ بِأَسْمَائِهِمْ وَأَسْمَاءِ آبَائِهِمْ: يَا فُلاَنُ بْنَ فُلاَنٍ وَيَا فُلاَنُ بْنَ فُلاَن أَيَسُرُّكُمْ أنَّكُمْ أَطَعْتُمُ اللهَ وَرَسُولَهُ فَإِنَّا قَدْ وَجَدْنَا مَا وَعَدَنَا رَبُّنَا حَقًّا، فَهَلْ وَجَدْتُمْ مَا وَعَدَ رَبُّكُمْ حَقًّا قَالَ: فَقَالَ عُمَرُ: يَا رَسُولَ اللهِ [ص:299] مَا تُكَلِّمُ مِنْ أَجْسَادٍ لاَ أَرْوَاحَ لَهَا فَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: وَالَّذِي نَفْسُ مُحَمَّدٍ بِيَدِهِ مَا أَنْتُمْ بِأَسْمَعَ لِمَا أَقُولُ مِنْهُمْ
__________
أخرجه البخاري في: 64 كتاب المغازي: 8 باب قتل أبي جهل

1826. హజ్రత్ అబూ తలా (రదియల్లాహు అన్హు) కథనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) బద్ర్ యుద్ధం నాడు ఖురైష్ నాయకుల్లో ఇరవై నాలుగు మంది వ్యక్తుల (మృతదేహాల)ను బద్ర్ లోని ఒక పాడుబడిన బావిలో పడవేయమని ఆజ్ఞాపించారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సాధారణంగా ఏదైనా జాతి పై విజయం సాధించినప్పుడు ఆ ప్రాంతంలో మూడు రాత్రుల పాటు బస చేస్తారు. బద్ర్ యుద్ధం ముగిసిన మూడవ రోజు రాగానే ఆయన తన స్వారీని తీసుకురమ్మని ఆజ్ఞాపించారు. దానిపై జీను కట్టిన తరువాత ఎక్కి బయలుదేరారు అనుచరులు కూడా ఆయన వెంట బయలుదేరారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఏదైనా పని మీద ఎక్కడికో వెళ్తున్నారని వారు భావించారు. చివరికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆ పాడుబడిన బావి ఒడ్డుకు వెళ్ళి నిలబడ్డారు. ఆయన ఆ హతులను వారి, వారి తండ్రుల పేర్లతో సంబోధిస్తూ “ఫలానా కొడుకు ఫలానా! ఫలానా కొడుకు ఫలానా!! మీరు అల్లాహ్ కు, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు విధేయులయి ఉండి ఉంటే బాగుండేదన్న వాస్తవాన్ని మీరు ఇప్పుడైనా బాగా గ్రహించారా? మేము మాత్రం మా ప్రభువు మాకు చేసిన వాగ్దానం నెరవేరిందని గ్రహించాము. మరి మీ ప్రభువు మీకు చేసిన వాగ్దానం నెరవేరిందని మీరు తెలుసుకున్నారా?” అని అన్నారు. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఈ మాట విని “దైవప్రవక్తా! మీరు ఆత్మలు లేని దేహాలతో మాట్లాడుతున్నారా?” అని అడిగారు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సమాధానమిస్తూ “ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రాణం ఎవరి అధీనంలో ఉందో ఆయన సాక్షిగా చెబుతున్నాను. నేను చెబుతున్న దానిని ఈ శవాలు నీకంటే బాగా వింటున్నాయి, అర్థం చేసుకుంటున్నాయి” అని అన్నారు.

(సహీహ్ బుఖారీ:- 64వ ప్రకరణం – మగాజి, 8వ అధ్యాయం – ఖత్ లి అబీజహల్)

1827 – حديث عَائِشَةَ، زَوْجِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَتْ لاَ تَسْمَعُ شَيْئًا لاَ تَعْرِفُهُ إِلاَّ رَاجَعَتْ فِيهِ حَتَّى تَعْرِفَهُ وَأَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: مَنْ حُوسِبَ عُذِّبَ قَالَتْ عَائِشَةُ: فَقُلْتُ أَوَلَيْسَ يَقُولُ اللهُ تَعَالَى (فَسَوْفَ يُحَاسَبُ حِسَابًا يَسِيرًا) قَالَتْ: فَقَالَ إِنَّمَا ذَلِكَ الْعَرْضُ، وَلكِنْ مَنْ نُوقِشَ الْحِسَابَ يَهْلِكْ
__________
أخرجه البخاري في: 3 كتاب العلم: 35 باب من سمع شيئًا فراجع حتى يعرفه

1827. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం :- నాకు తెలియని విషయం గురించి నేనెప్పుడైనా వింటే దాన్ని గురించి నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను అడిగి పూర్తిగా తెలుసుకుంటాను. (ఓ రోజు) ఆయన “ఎవరి నుండి లెక్క తీసుకోవడం జరుగుతుందో అతను (నరక) యాతనకు గురయినట్లే” అని అన్నారు.అప్పుడు నేను “(ఖుర్ఆన్లో) ‘అతని నుండి తేలికపాటి లెక్క తీసుకోవడం జరుగుతుంది’ అని అల్లాహ్ సెలవిచ్చాడు కదా!” అని అన్నాను.

దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సమాధానమిస్తూ “దానర్థం లెక్క తీసుకోవడం కాదు. కర్మల పత్రం చూపడం మాత్రమే. దీనికి భిన్నంగా ఎవరిని నిలదీసి లెక్క తీసుకోబడుతుందో అతను సర్వనాశనమవుతాడు” అని అన్నారు.

(సహీహ్ బుఖారీ:- 3వ ప్రకరణం – ఇల్మ్, 35వ అధ్యాయం – మన్ సమిఆ షై అన్ ఫరాజఆ హత్తా యారిఫహు)

1828 – حديث ابْنِ عُمَرَ رضي الله عنهما، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: إِذَا أَنْزَلَ اللهُ بِقَوْمٍ عَذَابًا، أَصَابَ الْعَذَابُ مَنْ كَانَ فِيهِمْ، ثُمَّ بُعِثُوا عَلَى أَعْمَالِهِمْ
__________
أخرجه البخاري في: 92 كتاب الفتن: 19 باب إذا أنزل الله بقوم عذابًا

1828. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధంగా తెలియజేశారు :-

“అల్లాహ్ ఏ జాతి పైనయినా శిక్ష విధించినపుడు ఆ జాతిలో ఉన్న వారందరిపై ఆ శిక్ష విరుచుకుపడుతుంది. (పుణ్యాత్ములు, పాపాత్ములు అంతా ఆ విపత్తుకు గురి అవుతారు). అయితే ప్రళయదినాన వారు తమ తమ కర్మలను బట్టి లేపబడతారు (వారికి వారి కర్మలను బట్టి పుణ్యఫలమో పాప ఫలమో లభిస్తుంది)”

(సహీహ్ బుఖారీ :- 92వ ప్రకరణం – ‘ఫితన్’, 19వ అధ్యాయం – ఇజా అన్జలల్లాహు బిఖౌమిన్ అజాబన్)

హషర్ మైదానంలో అల్లాహ్ కారుణ్యం | ఖుత్ బాతే నబవీ ﷺ

[డౌన్లోడ్ PDF]

إِنَّ أَصْحَابَ الْجَنَّةِ الْيَوْمَ فِي شُغُلٍ فَاكِهُونَ
స్వర్గవాసులు ఈ రోజు తమ (ఆహ్లాదకర) వ్యాపకాలలో నిమగ్నులై ఆనందిస్తూ ఉన్నారు“. (36 : 55) 

ఖుత్బాలో నేను పఠించిన ఆయత్ అర్థాన్ని మీరు విన్నారు. దైవ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి కొంత మంది వృద్ధులు వచ్చి ఇలా విన్నవించుకున్నారు. “ఓ దైవ ప్రవక్తా! ఇస్లాం స్వీకరించటానికి మేము సిద్ధంగా ఉన్నాము. కాని మేము మహా పాపాలు చేశాము. మా కర్మలపత్రాలు వాటివల్ల నలుపై పోయాయి. ఇప్పుడు ఇస్లాం స్వీకరించి ఏమి చేయమంటారు?” అప్పుడు పై ఆయత్ అవతరింపజేయ బడింది. ఇందులో అల్లాహ్ తన దాసులకు ఎంతో ఓదార్పును నమ్మకాన్ని ఇచ్చాడు. వాస్తవానికి ఇస్లాం మానవుని పూర్వ పాపాలన్నింటినీ తుడిచివేస్తుంది. ఖుర్ఆన్ మజీద్ ఈ అంశానికి సంబంధించిన అనేక ఆయతులున్నాయి. అల్లాహ్ అనంత కరుణామయుడు. పాపాలు చేసి పశ్చాత్తాపంతో మరలే వారికి క్షమాభిక్ష పెట్టటం ఆయన సుగుణం. అల్లాహ్ పవిత్ర ఖుర్ఆన్ గ్రంథంలో ఇలా సెలవిస్తున్నాడు:

وَالَّذِينَ إِذَا فَعَلُوا فَاحِشَةً أَوْ ظَلَمُوا أَنفُسَهُمْ ذَكَرُوا اللَّهَ فَاسْتَغْفَرُوا لِذُنُوبِهِمْ وَمَن يَغْفِرُ الذُّنُوبَ إِلَّا اللَّهُ وَلَمْ يُصِرُّوا عَلَىٰ مَا فَعَلُوا وَهُمْ يَعْلَمُونَ

తమ ద్వారా ఏదైనా నీతిబాహ్యమైన పని జరిగిపోతే లేదా తమఆత్మలకు వారు ఏదైనా అన్యాయం చేసుకుంటే వెంటనే అల్లాహ్ ను తలచుకుని, తమ పాపాల క్షమాపణకై వేడుకుంటారు. నిజానికి అల్లాహ్ తప్ప పాపాలను క్షమించే వాడెవడున్నాడు? వారు తమ వల్ల జరిగింది తప్పు అని తెలిసినపుడు దానిపై హటం చెయ్యరు“. (ఆలి ఇమ్రాన్ 3 : 135) 

పాపాల మన్నింపు, దైవ కారుణ్యం గురించి ఈ రోజు ఖుత్బాలో తెలుసుకుందాం. పైన పఠించిన ఆయత్తో నేను చెప్పబోయే విషయాన్ని గ్రహించే ఉంటారు. ఈరోజు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి ఒక మహోన్నతమైన ప్రవచనాన్ని బోధించ బోతున్నాను. అందులో ప్రళయదిన దృశ్యాలు మన ముందుకొస్తాయి. అల్లాహ్ ప్రళయ దినాన తనదాసుల పాపాలను ఎలా మన్నించి స్వర్గానికి చేరుస్తాడో కూడా మనకు బోధపడుతుంది. దైవ ప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) వారి ఈ దివ్య వచనాన్ని వినేముందు అల్లాహ్ దుఆ చేసుకోవాలి. “ఓ ప్రభూ! ప్రళయదినాన నీ కృపతో మమ్మల్ని మన్నించు” అని వేడుకోవాలి. అల్లాహ్ మనందరి పాపాలను మన్నించి నరకాగ్ని నుండి కాపాడి స్వర్గంలో ప్రవేశింపుగాక.. ఆమీన్. 

స్వర్గంలో ప్రవేశించే పురుషులు మరియు స్త్రీలు [ఆడియో]

స్వర్గంలో ప్రవేశించే పురుషులు మరియు స్త్రీలు [ఆడియో] – వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/V3o2f6XT_90 [16 నిముషాలు]

عَنِ ابْنِ عَبَّاسٍ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: ” أَلَا أُخْبِرُكُمْ بِرِجَالِكُمْ مِنْ أَهْلِ الْجَنَّةِ؟ النَّبِيُّ فِي الْجَنَّةِ، وَالصِّدِّيقُ فِي الْجَنَّةِ، وَالشَّهِيدُ فِي الْجَنَّةِ، وَالْمَوْلُودُ فِي الْجَنَّةِ، وَالرَّجُلُ يَزُورُ أَخَاهُ فِي نَاحِيَةِ الْمِصْرِ لَا يَزُورُهُ إِلَّا لِلَّهِ عَزَّ وَجَلَّ، وَنِسَاؤُكُمْ مِنْ أَهْلِ الْجَنَّةِ الْوَدُودُ الْوَلُودُ الْعَئُودُ عَلَى زَوْجِهَا الَّتِي إِذَا غَضِبَ جَاءَتْ حَتَّى تَضَعَ يَدَهَا فِي يَدِ زَوْجِهَا، وَتَقُولُ: «لَا أَذُوقُ غُمْضًا حَتَّى تَرْضَى»

ఇబ్నె అబ్బాస్ (రజియల్లాహు అన్హు) గారి ఉల్లేఖనం ప్రకారం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు ఇలా అన్నారు:

“నేను మీకు స్వర్గం లో ప్రవేశించే పురుషుల గురించి తెలుపనా?”

దానికి సహాబాలు తప్పకుండా ఓ ప్రవక్తా! (సల్లల్లాహు అలైహి వసల్లం) అని అన్నారు.

దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు :-

1- ప్రవక్త స్వర్గవాసి,
2- సిద్ధీఖ్ స్వర్గవాసి,
3- షహీద్ (అమరవీరుడు) స్వర్గవాసి,
4- బాల్యంలోనే చనిపోయే బాలుడు స్వర్గవాసి, మరియు
5- ఆ వ్యక్తి కూడా స్వర్గవాసి ఎవరైతే తన నగరం లో ఒక ప్రాంతం నుండి వేరొక ప్రాంతం లో ఉన్న తన ముస్లిం సోదరున్ని కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసం కలవడానికి వెళతాడో,

మరియు మీ స్త్రీలలో స్వర్గవాసులు:

1) తమ భర్తను ప్రేమించే వారు,
2) ఎక్కువ పిల్లలను కనునది
3) తన భర్త వైపునకు తిరిగి వచ్చునది అంటే: తన భర్త కోపంలో ఉన్నప్పుడు తామే స్వయంగా భర్త వద్దకు వెళ్లి తన చేతులను భర్త చేతులలో పెట్టి నేను మీరు నా పట్ల ప్రసన్నం అయ్యే వరకు నిద్ర సుఖాన్ని (హాయిని) పొందలేను అని చెప్పే స్త్రీ లు స్వర్గవాసులు

(ముదారాతున్నాస్: ఇబ్ను అబిద్దున్యా 1311, సహీహా 287).

మరణాంతర జీవితం – పార్ట్ 16: సిఫారసు కు సంబంధించిన మూఢ నమ్మకాలు, చెడు విశ్వాసాలు [ఆడియో, టెక్స్ట్]

బిస్మిల్లాహ్

మరణాంతర జీవితం – పార్ట్ 16 [ఆడియో]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

పార్ట్ 16. ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [ 21:24 నిముషాలు]

అస్సలామ్ అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలామ్ అలా రసూలుల్లాహ్ అమ్మాబాద్.

ఈనాటి మన శీర్షిక సిఫారసుకు సంబంధించిన మూఢ నమ్మకాలు, దుర విశ్వాసాలు. ఈ రోజుల్లో కొన్ని సామెతలు, కొన్ని ఉదాహరణలు చాలా ప్రఖ్యాతిగాంచి ఉన్నాయి మన అనేక మంది ప్రజల మధ్యలో. అవేమిటంటే మనం ఇహలోకంలో చీఫ్ మినిస్టర్ వద్దకు పోవాలంటే, ప్రైమ్ మినిస్టర్ వద్దకు పోవాలంటే వారి యొక్క P.A లేదా వారి యొక్క సెక్రటరీ యొక్క సిఫారసు ద్వారా అక్కడికి చేరుకుంటాము. అలాగే అల్లాహ్ వద్దకు మనం డైరెక్టుగా చేరుకోలేము గనక మనం పాపాత్ములము, మనతో చాలా తప్పిదాలు, పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. మనం ఎలా అల్లాహ్ కు ముఖం చూపించుకొని ఆయన వద్దకు వెళ్తాము? అందు గురించి ఆయన పుణ్యదాసులు, భక్తులు, విశ్వాసులు, ప్రవక్తలు, దైవ దూతలు అలాంటి వారితో మనం మొర పెట్టుకుంటే, అలాంటి వారి యొక్క సిఫారసు గురించి వారిని మనం కోరుతూ ఉంటే వారు మనల్ని అల్లాహ్ వద్దకు చేర్పిస్తారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజివూన్. మహాశయులారా! ఇలాంటి విషయం చాలా వరకు మీరు వింటారా లేదా? వింటూ ఉంటారు కానీ ఒక్కసారి అల్లాహ్ మనందరినీ క్షమించు గాక! గమనించండి. ఈలోకంలో ఉన్న నాయకులు వారితో అల్లాహ్ ను మనం పోల్చుతున్నామా? అవూదు బిల్లాహ్. ఎవరైతే ఇలాంటి ఒక సామెత ప్రైమ్ మినిస్టర్ వరకు చీఫ్ మినిస్టర్ వరకు వెళ్ళాలంటే మనకు వారి యొక్క సెక్రటరీ కింది అధికారుల సిఫారసుతో వెళ్ళాలి అని అంటూ ఉంటారో అలాంటి వారిని మీరు కూడా ఒక చిన్న ప్రేమ పూర్వకమైన ప్రశ్న అడగండి. అదేమిటంటే ఒకవేళ చీఫ్ మినిస్టర్ మరియు ప్రైమ్ మినిస్టర్ మీ క్లాసుమేట్, మీ ఇంటి పక్కన ఉండేవాడు, మీ యొక్క వాడలో ఉండేవాడు, మీ యొక్క చిన్ననాటి స్నేహితుడు అయితే అతనితో నీవు డైరెక్ట్ గా నీ సమస్యను ముందు పెట్టి నువ్వు మాట్లాడుతావా? లేక వేరే వాళ్లను అతని వద్దకు సిఫారసుకు తీసుకెళ్తావా? ప్రతి బుద్ధిమంతుడు ఏమి సమాధానం ఇస్తాడు? ప్రైమ్ మినిస్టర్ నాకు తెలిసిన వాడై ఉంటే, నాకు దగ్గరి వాడై ఉంటే నేను ఇతరులను ఎందుకు సిఫారసుగా తీసుకెళ్తాను? నేనే డైరెక్ట్ గా అతనితో మాట్లాడుకుంటాను. అవునా లేదా? మరి అల్లాహ్. అవూదు బిల్లాహ్. నేను అల్లాహ్ కు ఎలాంటి పోలికలు ఇవ్వడం లేదు. ఎవరైతే ఇలాంటి పోలికలు ఇస్తున్నారో వారి యొక్క ఆ పోలికకు సమాధానంగా ఇలాంటి ఒక విషయం చెప్పి, అల్లాహ్ గురించి మన విశ్వాసం ఏమిటి? అల్లాహ్ గురించి మన నమ్మకమేమిటి? మనం ఎంత పాపాత్ములమైనా, ఎన్ని దుష్కార్యాల్లో పడి ఉన్నా, ఆ అల్లాహ్ మనల్ని ఎలా సంబోధిస్తున్నాడు?

۞ قُلْ يَـٰعِبَادِىَ ٱلَّذِينَ أَسْرَفُوا۟ عَلَىٰٓ أَنفُسِهِمْ لَا تَقْنَطُوا۟ مِن رَّحْمَةِ ٱللَّهِ ۚ إِنَّ ٱللَّهَ يَغْفِرُ ٱلذُّنُوبَ جَمِيعًا ۚ إِنَّهُۥ هُوَ ٱلْغَفُورُ ٱلرَّحِيمُ

(ఓ ప్రవక్తా! నా తరఫున వారికి ఇలా) చెప్పు: “తమ ఆత్మలపై అన్యాయానికి ఒడిగట్టిన ఓ నా దాసులారా! మీరు అల్లాహ్‌ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా అల్లాహ్‌ పాపాలన్నింటినీ క్షమిస్తాడు. నిజంగా ఆయన అమితంగా క్షమించేవాడు, అపారంగా కరుణించేవాడు. (సూరా అజ్-జుమర్ 39:53)

“ఓ నా దాసులారా!” గమనించండి ఎవరిని అంటున్నాడు? నా దాసులారా అని అల్లాహు తఆలా ఇక్కడ దైవదూతలను అంటున్నాడా? ప్రవక్తలను అంటున్నాడా? పుణ్యపురుషులను అంటున్నాడా? మహా భక్తులని అంటున్నాడా? ఔలియా అల్లాహ్ ఇంకా మంచి మంచి సత్కార్యాలు చేసేవారిని అంటున్నాడా? కాదు, ఎవరైతే పాపాల మీద పాపాలు చేసుకొని తమ ఆత్మల మీద అన్యాయం చేసుకున్నారో, అల్లాహ్ యొక్క కారుణ్యం నుండి మీరు ఏమాత్రం నిరాశ చెందకండి.

అల్లాహు అక్బర్. అల్లాహ్ మనకు ఎంత దగ్గర ఉన్నాడు. అల్లాహు తఆలా డైరెక్ట్ మనలో ఎవరు ఎంత పాపాత్ములు అయినా కానీ నా దాసుడా! నా కారుణ్యం పట్ల నిరాశ చెందకు.

وَقَالَ رَبُّكُمُ ٱدْعُونِىٓ أَسْتَجِبْ لَكُمْ ۚ إِنَّ ٱلَّذِينَ يَسْتَكْبِرُونَ عَنْ عِبَادَتِى سَيَدْخُلُونَ جَهَنَّمَ دَاخِرِينَ

మరి మీ ప్రభువు ఏమంటున్నాడంటే, “మీరు నన్నే ప్రార్థించండి. నేను మీ ప్రార్థనలను ఆమోదిస్తాను. నా దాస్యం పట్ల గర్వాహంకారం ప్రదర్శించేవారు త్వరలోనే అవమానితులై నరకంలో ప్రవేశించటం తథ్యం.” (సూరా అల్ మూమిన్ 40:60)

మీ ప్రభువు మీతో చెబుతున్నాడు. నాతో డైరెక్ట్ మీరు దువా చేయండి, నేను మీ దుఆను అంగీకరిస్తాను. ఖురాన్ యొక్క ఆయతులు కదా ఇవి శ్రద్ద వహించండి. వీటి యొక్క భావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి.

మరో చిన్న ఉదాహరణ ఇస్తాను. ఈ ఉదాహరణ అల్లాహ్ విషయంలో కాదు, అల్లాహ్ గురించి కాదు. మన అల్ప జ్ఞానులకు మరియు మన బుర్రలో ఈ విషయాలు కొంచెం దిగి అర్థం చేసుకోవడానికి. ఇక్కడి నుండి వెయ్యి కిలోమీటర్ల దూరంలో నేను ఏ బాబాను, ఏ వలీని, ఏ పుణ్యాత్ముడ్ని నమ్ముకుంటున్నానో అతని యొక్క సమాధి అక్కడ ఉంది. నేను ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు అల్లాహ్ ను మొరపెట్టుకొని ఓ అల్లాహ్! నా ఈ కష్టాన్ని దూరం చెయ్యి అని పలకాలా? లేకుంటే నాకు ప్రియమైన ఫలానా బాబా, ఫలానా వలి మరియు నాకు నేను మీ యొక్క మురీద్ ని, నేను ఈ కష్టంలో ఉన్నాను. నా ఈ కష్టాన్ని మీరు దూరం చేయడానికి అల్లాహ్ ను మొరపెట్టుకోండి అని అనాలా?. ఎలా చెప్పాలి? ఆలోచించండి కొంచెం. మన ఈ కష్టాన్ని ఎవరు చూస్తున్నారు? అల్లాహ్ మంచిగా చూస్తున్నాడా లేక అతనా? నా కష్టం దూరం చెయ్యి అని మనం నోట ఏదైతే చెప్పుకుంటున్నామో ఆ మాటను అల్లాహ్ స్పష్టంగా ఏ అడ్డు లేకుండా వింటున్నాడా? లేకుంటే మనకు ప్రియమైన ఆ పుణ్యాత్ముడా? గమనించండి. ప్రతి ఒక్కరి ద్వారా సమాధానం ఏం వస్తుంది? వెయ్యి కిలోమీటర్లు వదిలేయండి. మన పక్క సమాధిలో ఉన్నప్పటికీ మనం ఏ పుణ్యాత్మునికి మురీద్ గా, ఏ పుణ్యాత్మునికి శిష్యునిగా, ఏ పుణ్యాత్మునికి మనం ప్రియునిగా ఉంటిమో అతను అతని యొక్క సమాధి మన పక్కలో ఉన్నప్పటికీ అల్లాహ్ కంటే మంచి విధంగా నా కష్టాన్ని చూసేవారు ఎవరు లేరు, అల్లాహ్ కంటే మంచి విధంగా నేను నా కష్టాన్ని నోటితో చెప్పుకున్నప్పుడు వినేవారు అంతకంటే గొప్పవారు ఎవరూ లేరు. మరియు నా కష్టాన్ని తొలిగించే విషయంలో కూడా అల్లాహ్ కు ఉన్నటువంటి శక్తి ఎవరికీ లేదు. అలాంటప్పుడు ఎవరికి మనం మొరపెట్టుకోవాలి?

ఇంకా విషయం అర్ధం కాలేదా? ఉదాహరణకి 105 డిగ్రీలు నీకు జ్వరం ఉంది. నీ పక్కనే డాక్టర్ ఉన్నాడు. నీ చుట్టుపక్కల నీ భార్య లేదు, నీ పిల్లలు లేరు, ఎవరూ లేరు. నీవు ఒంటరిగా నీవు ఆ గదిలో ఉన్నావు. పక్క గదిలో డాక్టర్ ఉన్నాడు మరియు నీ కొడుకు లేదా నీ భార్య లేదా నీవు ఎవనికి శిష్యునివో ఆ పుణ్యాత్ముడు అతని యొక్క సమాధి ఎడమ పక్కన ఉంది. నువ్వు ఎవరిని పిలుస్తావు ఈ సందర్భంలో? ఓ డాక్టర్ సాబ్ వచ్చి నాకు ఇంజక్షన్ ఇవ్వు, నన్ను చూడు అని అంటావా? లేకుంటే ఓ పుణ్యాత్ములు, ఓ నా బాబా సాహెబ్ నాకు ఈ జ్వరం ఉన్నది. నా కష్టాన్ని దూరం చెయ్యి. నా జ్వరాన్ని దూరం చెయ్యి అని అంటామా? బహుశా ఈ చిన్నపాటి ఉదాహరణల ద్వారా మాట అర్థమైంది అనుకుంటాను.

విషయం ఏంటంటే సోదరులారా! సిఫారసు యొక్క సంపూర్ణ అధికారం అల్లాహ్ చేతిలో ఉందన్న విషయం మనం తెలుసుకున్నాం. అయితే ఇంకా ఎవరైనా మనకు సిఫారసు ప్రళయ దినాన చేయగలరు అని వారితో మొరపెట్టుకోవడం, వారితో సిఫారసు గురించి కోరడం, ఇది పాతకాలపు నుండి అవిశ్వాసులు, ముష్రికులు, బహు దైవారాధకులు పాటిస్తూ వస్తున్నటువంటి ఒక ఆచారం.

ఈ విషయాన్ని అల్లాహ్ (తఆల) సూరయే యూనుస్ ఆయత్ నెంబర్ 18 లో ఎంత స్పష్టంగా తెలిపాడో మీరు ఒకసారి గమనించండి.

وَيَعْبُدُونَ مِن دُونِ اللَّهِ مَا لَا يَضُرُّهُمْ وَلَا يَنفَعُهُمْ وَيَقُولُونَ هَٰؤُلَاءِ شُفَعَاؤُنَا عِندَ اللَّهِ ۚ قُلْ أَتُنَبِّئُونَ اللَّهَ بِمَا لَا يَعْلَمُ فِي السَّمَاوَاتِ وَلَا فِي الْأَرْضِ ۚ سُبْحَانَهُ وَتَعَالَىٰ عَمَّا يُشْرِكُونَ

వారు అల్లాహ్‌ను వదలి తమకు నష్టాన్నిగానీ, లాభాన్ని గానీ చేకూర్చలేని వాటిని పూజిస్తున్నారు. ఇంకా, “అల్లాహ్‌ సమక్షంలో ఇవి మాకు సిఫారసు చేస్తాయి” అని చెబుతున్నారు. “ఏమిటీ, ఆకాశాలలో గానీ, భూమిలో గానీ అల్లాహ్‌కు తెలియని దానిని గురించి మీరు ఆయనకు తెలియజేస్తున్నారా?” వారు కల్పించే భాగస్వామ్యాల నుంచి ఆయన పవిత్రుడు, ఉన్నతుడు అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు. (సూరా యూనుస్ 10:18)

అల్లాహ్ ఆ ముష్రికుల విషయంలో తెలుపుతున్నాడు. “వారు అల్లాహ్ ను వదిలి వారికి ఏ మాత్రం లాభాన్ని చేకూర్చే లేదా వారికి ఏ మాత్రం నష్టాన్ని చేకూర్చ లేని వారిని ఆరాధిస్తున్నారు. వారు అల్లాహ్ ను వదిలి వారికి ఏ మాత్రం నష్టం గాని, లాభం కానీ చేకూర్చలేని వారిని ఆరాధిస్తున్నారు. ఇలా ఆరాధిస్తూ వారు వారి యొక్క నమ్మకాన్ని ఇలా తెలుపుతున్నారు: “మేము ఎవరినైతే ఆరాధిస్తున్నామో, ఎవరి వద్దకైతే వెళ్లి కొన్ని ఆరాధనకు సంబంధించిన విషయాలు పాటిస్తున్నామో వారు మా గురుంచి అల్లాహ్ వద్ద సిఫారసులు అవుతారు. వీరు అల్లాహ్ వద్ద మాకు సిఫారసులు అవుతారు”. వారికి చెప్పండి – ఏమిటి? అల్లాహ్ కు ఆకాశాలలో, భూమిలో తెలియని ఒక విషయాన్ని మీరు అల్లాహ్ కు తెలియపరుస్తున్నారా? ఇలాంటి సిఫారసులు చేసేవారితో, ఇలాంటి భాగస్వాములతో, అల్లాహ్ ఎంతో అతి ఉత్తముడు, పవిత్రుడు. వారు ఈ షిర్క్ పనిచేస్తున్నారు. ఇలాంటి షిర్క్ కు అల్లాహు (తఆలా) కు ఎలాంటి సంబంధం లేదు. అన్ని రకాల షిర్క్ పనులకు అతను ఎంతో ఉన్నతుడు”. గమనించారా? స్వయంగా అల్లాహ్ సూరయే యూనుస్ ఆయత్ నెంబర్ 18 లో ఇలాంటి ఎవరినైనా సిఫారసు చేస్తారు అని నమ్ముకొని వారి వద్ద ఏదైనా కొన్ని కార్యాలు చేస్తూ వారు మా గురించి అల్లాహ్ వద్ద సిఫారసు చేయాలి అని నమ్ముకోవడం ఇది షిర్క్ అని అల్లాహ్ ఎంత స్పష్టంగా తెలియ పరుస్తున్నాడు.

మరి కొన్ని ఆధారాలు, మరికొన్ని విషయాలు ఉన్నాయి. సూరతుల్ జుమర్ ఆయత్ నెంబర్ 3 ను కూడా .

 أَلَا لِلَّهِ الدِّينُ الْخَالِصُ ۚ وَالَّذِينَ اتَّخَذُوا مِن دُونِهِ أَوْلِيَاءَ مَا نَعْبُدُهُمْ إِلَّا لِيُقَرِّبُونَا إِلَى اللَّهِ زُلْفَىٰ إِنَّ اللَّهَ يَحْكُمُ بَيْنَهُمْ فِي مَا هُمْ فِيهِ يَخْتَلِفُونَ ۗ إِنَّ اللَّهَ لَا يَهْدِي مَنْ هُوَ كَاذِبٌ كَفَّارٌ

జాగ్రత్త! నిష్కల్మషమైన ఆరాధన మాత్రమే అల్లాహ్‌కు చెందుతుంది. ఎవరయితే అల్లాహ్‌ను గాకుండా ఇతరులను సంరక్షకులుగా ఆశ్రయించారో వారు, “ఈ పెద్దలు మమ్మల్ని అల్లాహ్‌ సాన్నిధ్యానికి చేర్చటంలో తోడ్పడతారని భావించి మాత్రమే మేము వీళ్లను ఆరాధిస్తున్నామ”ని అంటారు. ఏ విషయం గురించి వారు భేదాభిప్రాయానికి లోనై ఉన్నారో దానికి సంబంధించిన (అసలు) తీర్పు అల్లాహ్‌ (స్వయంగా) చేస్తాడు. అబద్ధాలకోరులకు, కృతఘ్నులకు అల్లాహ్‌ ఎట్టి పరిస్థితిలోనూ సన్మార్గం చూపడు. (సూరతుల్ జుమర్ 39:3

మీరు గమనిస్తే వారు ఇలాంటి మూడ నమ్మకాలకి గురి అయ్యి షిర్క్ చేస్తున్నారు అని అల్లాహ్ (తఆలా) మరి ఎంతో స్పష్టంగా తెలియ చేస్తున్నాడు. “ఎవరైతే అల్లాహ్ ను కాదని, ఇంకా వేరే ఔలియాలను నిలబెట్టుకున్నారో, ఎవరైతే అల్లాహ్ ను కాదని, ఇంకా వేరే ఔలియాలను నమ్ముతున్నారో, ఆ ఔలియాల వద్ద వారు సంతోషించడానికి ఏఏ కార్యాలు చేస్తున్నారో, దానికి ఒక సాకు తెలుపుకుంటూ ఏమంటారు వారు? మేము అక్కడ వారి యొక్క ఆరాధన ఏదైతే చేస్తున్నామో, ఆరాధనకు సంబంధించిన కొన్ని విషయాలు ఏదైతే వారి వద్ద పాటిస్తున్నామో, వారు మమ్మల్ని అల్లాహ్ కు చేరువుగా చేయాలని, అంటే మేము స్వయంగా అల్లాహ్ వద్ద చేరుకోలేము అందుకు గురించి వీరిని మధ్యలో సిఫారసుగా పెడుతున్నాము. వారు అల్లాహ్ వద్ద మాకు సిఫారసు చేసి మమ్మల్ని అల్లాహ్ కుదగ్గరగా చేస్తారు. అల్లాహు అక్బర్. అయితే అల్లాహ్ ఏమంటున్నాడు? ఇలాంటి విభేదాలకు వారు ఏదైతే గురి అయ్యారో, ప్రవక్తల అందరిని ఏదైతే మేము పంపామో, ఇలాంటి షిర్క్ నుండి ఆపడానికే పంపాము. కానీ వారు ఈ సరైన మార్గాన్ని వదిలి ఏదైతే భిన్నత్వానికి, విభేదానికి గురి అయ్యారో, దానికి సంబంధించిన తీర్పులు అన్నీ కూడా మేము సమీపంలో చేస్తాము ప్రళయ దినాన.

మళ్ళీ ఆ తర్వాత ఆయత్ యొక్క చివరి భాగం ఎలా ఉందో గమనించండి. “ఎవరైతే అబద్ధాలకు మరియు కృతఘ్నత, సత్య తిరస్కారానికి గురి అవుతారో, వారికి అల్లాహ్ సన్మార్గం చూపడు“.

అంటే మాట ఏంటి? అల్లాహ్ మధ్యలో ఎవరిని కూడా ఇలా మధ్యవర్తిగా నియమించలేదు. వారిని మనం సిఫారసులుగా చేసుకోవాలని అల్లాహ్ ఎవరిని కూడా నిర్ణయించలేదు. చివరికి ప్రవక్త మహానీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అందరికంటే శ్రేష్ఠులు గొప్పవారు. వారు కూడా ప్రళయ దినాన ఏ సిఫారసు అయితే చేస్తారో, దాని విషయంలో మనం హదీసులు విన్నాము. ఈ విషయం సహచరులకు కూడా తెలుసు. అయినప్పటికీ ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క సహాబి కూడా ప్రవక్తా! ప్రళయదినాన మాకు మీరు సిఫారసుగా నిలబడి మా పాపాలను క్షమించి, క్షమించడానికి అల్లాహ్ తో చెప్పుకొని, మమ్మల్ని అల్లాహ్ కు చేరువుగా చేయాలి అని ఈవిధంగా ఎప్పుడూ కూడా మొర పెట్టుకోలేదు.

అందుగురించి మహాశయులారా! ఇక్కడ సూరయే యాసీన్ లో ఒక పుణ్యాత్ముని సంఘటన అల్లాహ్ (తఆలా) ఏదైతే ప్రస్తావించాడో, అతను తౌహీదు పై ఉండి, షిర్క్ ని ఏదైతే విడనాడాడో మరియు అతని జాతివారు అతన్ని అందుకని హత్య చేశారో ఆ సంఘటన మొత్తం సూరయే యాసీన్ లో ఉంది. ఆ పుణ్యాత్ముడు ఏమంటాడు?

أَأَتَّخِذُ مِن دُونِهِ آلِهَةً إِن يُرِدْنِ الرَّحْمَٰنُ بِضُرٍّ لَّا تُغْنِ عَنِّي شَفَاعَتُهُمْ شَيْئًا وَلَا يُنقِذُونِ

అట్టి (నిజ) దైవాన్ని వదిలేసి నేను ఇతరులను ఆరాధ్యులుగా ఆశ్రయించాలా? ఒకవేళ కరుణామయుడు (అయిన అల్లాహ్‌) నాకేదైనా నష్టం కలిగించదలిస్తే వారి సిఫారసు నాకెలాంటి లాభమూ చేకూర్చదు. వారు నన్ను కాపాడనూ లేరు”. (36:23)

“ఏమిటి? అల్లాహ్, రహ్మాన్ ను కాదని ఇంకా వేరే వారు ఎవరినైనా నేను, నాకు ఆరాధ్యనీయునిగా చేసుకోవాలా? ఒకవేళ అల్లాహ్, రహ్మాన్ నాకు ఏదైనా నష్టం చేకూర్చాలని అంటే వారు ఆ నష్టాన్ని ఏమైనా దూరం చేయగలుగుతారా? ఆ సందర్భంలో వారి యొక్క ఏ సిఫారసు కూడా నాకు పని చేయదు. వారి యొక్క ఏ సిఫారసు నాకు లాభాన్ని చేకూర్చదు”.

ఈ విధంగా మహాశయులారా! ఇహలోకంలో ఎవరినీ కూడా మనం ఫలానా అతను నాకు సిఫారసు చేస్తాడు పరలోక దినాన అని భావించి వారి వద్ద ఏదైనా ఆరాధనకు సంబంధించిన విషయాలు పాటిస్తూ ఉండడం ఇది అల్లాహ్ కు ఎంత మాత్రం ఇష్టం లేదు.

ప్రళయదినాన నరకవాసులు నరకంలో పోయిన తర్వాత, స్వర్గవాసులు ఆ నరకవాసులను అడుగుతారు. మీరు ఎందుకు నరకంలో పడి ఉన్నారు? కారణం ఏంటి? ఏ పాపం వల్ల మీరు ఇక్కడ వచ్చి పడి ఉన్నారు? అని అంటే వారు స్వయంగా ఏ సత్కార్యాలని విడనాడినందుకు నరకంలో వచ్చి పడ్డారో, మరి ఏ మూఢనమ్మకాల వల్ల నరకంలో చేరవలసి వచ్చిందో స్వయంగా వారి నోట వారు తెలుపుతున్నారు. అల్లాహ్ ఈవిషయాన్ని సూరయే ముద్దస్సిర్ లో తెలిపాడు.

 مَا سَلَكَكُمْ فِي سَقَرَ قَالُوا لَمْ نَكُ مِنَ الْمُصَلِّينَ وَلَمْ نَكُ نُطْعِمُ الْمِسْكِينَ وَكُنَّا نَخُوضُ مَعَ الْخَائِضِينَ وَكُنَّا نُكَذِّبُ بِيَوْمِ الدِّينِ حَتَّىٰ أَتَانَا الْيَقِينُ فَمَا تَنفَعُهُمْ شَفَاعَةُ الشَّافِعِينَ

“ఇంతకీ ఏ విషయం మిమ్మల్ని నరకానికి తీసుకు వచ్చింది?” (అని ప్రశ్నిస్తారు). వారిలా సమాధానమిస్తారు : “మేము నమాజు చేసే వారము కాము. నిరుపేదలకు అన్నం పెట్టే వారమూ కాము. పైగా, మేము పిడివాదన చేసే వారితో (తిరస్కారులతో) చేరి, వాదోపవాదాలలో మునిగి ఉండేవారం. ప్రతిఫల దినాన్ని ధిక్కరించేవాళ్ళం. తుదకు మాకు మరణం వచ్చేసింది.” మరి సిఫారసు చేసేవారి సిఫారసు వారికి ఏమాత్రం ఉపయోగపడదు. (74:42-48)

వారు అంటారు. మేము నమాజ్ చేసే వారిలో కాకుంటిమి. నిరుపేదలకు అన్నం పెట్టే వారిమి కాకుంటిమి. అలాగే కాలక్షేపాలు చేసి సమయాన్ని వృధా చేసే వారిలో మేము కలిసి ఉంటిమి. మరియు మేము ఈ పరలోక దినాన్ని తిరస్కరిస్తుంటిమి. చివరికి మాకు చావు వచ్చేసింది. చావు వచ్చిన తర్వాత మేము సజీవంగా ఉన్నప్పుడు ఎవరెవరినైతే సిఫారసు చేస్తారు అని అనుకుంటూ ఉంటిమో, ఏ సిఫారసు చేసేవారి సిఫారసు మాకు ఏ లాభాన్ని చేకూర్చలేదు.

అల్లాహు అక్బర్. గమనిస్తున్నారా! ఇలాంటి మూఢనమ్మకాల వల్ల ఎంత నష్టం చేకూరుస్తుందో, ఎలా నరకంలో పోవలసి వస్తుందో అల్లాహ్ ఎంత స్పష్టంగా మనకు తెలియపరిచాడో గమనించండి.

కొందరు మరో రకమైన తప్పుడు భావంలో పడి ఉన్నారు. ప్రళయదినాన ప్రజలందరూ కలిసి ప్రవక్తల వద్దకు సిఫారసు కోరుతూ ఏదైతే వెళ్తారో దాన్ని ఆధారంగా పెట్టుకున్నారు. దాన్ని ఆధారంగా పెట్టుకొని ఏమంటారు? ప్రళయదినాన ప్రవక్తల వద్దకు సిఫారసు కోరుతూ వెళ్తారు కదా! అయితే ఈ రోజు మేము ఇహలోకంలో ఇలా పుణ్యాత్ముల వద్దకు సిఫారసు కోరుతూ వెళ్తే ఏమి నష్టం అవుతుంది? అయితే మహాశయులారా! ఆ విషయం ఇక్కడ వీరు పాటిస్తున్న దానికి ఎంత మాత్రం ఆధారంగా నిలవదు. ఎందుకంటే ఇక్కడ సామాన్య ప్రజలు చనిపోయిన వారిని సిఫారసులుగా కోరుతున్నారు. సిఫారసులుగా వారికి నిలబెట్టుకొని వారి వద్ద కొన్ని ఆరాధనలు చేస్తున్నారు మరియు ఆరోజు ప్రవక్తలు సజీవంగా ఉండి వారితో మాట్లాడుతున్నారు. రెండవ విషయం అక్కడ ఏదైతే ప్రజలు సిఫారసు గురించి కోరుతున్నారో, దేని గురించి? మా పాపాలు క్షమించమని కాదు, మా కష్టాలు దూరం చేయమని కాదు, మేము మా ఇబ్బందులు మీరే డైరెక్టుగా దూరం చెయ్యాలి అని కాదు. దేని గురించి అల్లాహ్ తీర్పు చేయడానికి రావాలి. తీర్పు మొదలు కావాలి అని మీరు సిఫారసు చేయండి అంతే! కానీ ఈ రోజుల్లో దానిని సాకుగా పెట్టుకొని ఎవరినైతే సిఫారసు గా నిలబెట్టుకున్నారో వారితో అన్ని రకాల సంతానం లేకుంటే సంతానము కోరడం, అనారోగ్యాన్ని దూరం చేయడానికి వారితో కోరడం, ఇంకా ఎన్నో రకాల కష్టాలు దూరం చేయాలని వారితో డైరెక్టుగా దుఆ చేయడం ఇలాంటివన్నీ షిర్క్ పనులు జరుగుతున్నాయి కదా! మరి ఆ విషయం ఎలా ఆధారంగా ఉంటుంది? అగత్యపరుడు, మరీ కష్టంలో ఉన్నవాడు దుఆ చేసినప్పుడు దుఆను స్వీకరించి విని అతని కష్టాన్ని దూరం చేసేవాడు అల్లాహ్ తప్ప ఇంక ఎవరు లేరు.

అందుగురించి మహాశయులారా! ఇలాంటి మూఢనమ్మకాలను వదులుకోవాలి. కేవలం యోగ్యమైన రీతిలో అల్లాహ్ మరియు మనకు ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపిన రీతిలోనే సిఫారసు యొక్క మార్గాలను అవలంభించాలి. కానీ ఇలాంటి మూఢనమ్మకాలు, ఇలాంటి దురవిశ్వాసాలకు లోనైతే చాలా నష్టానికి కూరుకుపోతాము.

అయితే మహాశయులారా! ఇహలోకంలో మనం ఏ కష్టాల్లో, ఏ ఆపదలో, ఏ ఇబ్బందులు, ఎన్ని రకాల బాధలకు, చింతలకు మనం గురి అవుతామో వాటిలో మరి మనం ఏదైనా మధ్యవర్తిత్వాన్ని అవలంబించి దుఆలు చేయడానికి ఏదైనా ఆస్కారం ఉందా? అలాంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఇలా పుణ్యాత్ములని, మరి ఇంకా చనిపోయిన మహాపురుషులని మధ్యవర్తిత్వంగా పెట్టుకొని వారిని సిఫారసుగా నిలబెట్టుకొని వారితో ఎలాంటి దుఆలు చేయకూడదు అని అంటున్నారు కదా? మరి మనం ఏదైనా ఇబ్బంది లో ఉన్నప్పుడు ఏ మధ్యవర్తిత్వాన్ని అవలంబించి ఎలా దుఆ చెయ్యాలి? అనే విషయం ఇన్షా అల్లాహ్ దీని తరువాయి భాగంలో మనం తెలుసుకోబోతున్నాము. అల్లాహు తఆలా మనందరికీ సత్-భాగ్యం ప్రసాదించుగాక!

జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వ బరకాతుహు.


పూర్తి భాగాలు క్రింద వినండి 

పరలోకం (The Hereafter) మెయిన్ పేజీ:
https://teluguislam.net/hereafter/

మరణాంతర జీవితం – పార్ట్ 15: ప్రళయ దినాన సిఫారసు ఎప్పుడు ఏ సందర్భంలో ఎవరికి లభిస్తుంది (పార్ట్ 02) & సిఫారసులు పొందడానికి, సిఫారసులు చేయడానికి గల కండిషన్స్ [ఆడియో, టెక్స్ట్]

బిస్మిల్లాహ్

మరణాంతర జీవితం – పార్ట్ 15 [ఆడియో]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

పార్ట్ 15. ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [ 23:16 నిముషాలు]

అస్సలామ్ అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలామ్ అలా రసూలుల్లాహ్ అమ్మాబాద్.

ఈనాటి అంశం గత భాగం యొక్క తర్వాత విషయం. ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) కాకుండా, ఇంకా వేరే ప్రవక్తలకు, దైవదూతలకు, విశ్వాసులకు సిఫారసు చేసే హక్కు ఏదైతే లభిస్తుందో, దాని గురించి మనం తెలుసుకుంటున్నాం. దానితో పాటు వారి ఆ సిఫారసును పొందడానికి ఎలాంటి వారు అర్హులవుతారు? అనే విషయం కూడా మనం తెలుసుకుంటున్నాము.

అయితే ఇతర ప్రవక్తల మరియు పుణ్యాత్ముల సిఫారసు మరే సందర్భంలో వారికి లభిస్తుంది అంటే ఏ ప్రజల గురించి నరకంలో వారు పోవాలన్నటువంటి తీర్పు జరుగుతుందో, కానీ అల్లాహ్ యొక్క దయ తరువాత అల్లాహ్ కొందరు ప్రవక్తలకు, కొందరు విశ్వాసులకు సిఫారసు అధికారం ఇస్తాడు. వారు సిఫారసు చేస్తారు. ఆ తర్వాత అల్లాహు తఆలా వారిని నరకంలో ప్రవేశించకుండా నరకం నుండి తప్పించి స్వర్గంలో చేర్చుతాడు. అల్లాహు అక్బర్. ఇది కూడా చాలా గొప్ప విషయం.

సహీ ముస్లిం హదీత్ నెంబర్ 1577, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు. “ఒక ముస్లిం ఎవరైనా చనిపోయాడు అంటే అతని జనాజా నమాజ్ చేయడానికి నలబై మంది నిలబడ్డారు. ఎలాంటి వారు ఆ నలబై మంది? అల్లాహ్ తో ఎలాంటి షిర్క్ చెయ్యనివారు. అల్లాహ్ తో పాటు ఎలాంటి వేరే భాగస్వాములను నిలబెట్టని వారు. ఏ ముస్లిం జనాజా నమాజ్ లో నలబై మంది ఎలాంటి షిర్క్ చెయ్యనివారు నిలబడతారో అల్లాహ్ వారి సిఫారసును అతని గురించి స్వీకరిస్తాడు“. చూడడానికి హదీస్ ఇంతే ఉంది.

కానీ ఇందులో మనం గ్రహిస్తే, ఆలోచిస్తే ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఒకటి, ఈ నలబై మంది ఎలాంటి వారు ఉండాలి? అల్లాహ్ తో పాటు ఇంకెవరిని కూడా అల్లాహ్ ఆరాధనలో భాగస్వామిగా చేయకూడదు. రెండో విషయం ఏం తెలుస్తుంది మనకు? సిఫారసు చేసేవారు షిర్క్ చేయకూడదు అని అన్నప్పుడు, ఎవరి గురించి సిఫారసు చేయడం జరుగుతుందో, అతను షిర్క్ చేసి ఉంటే వీరి సిఫారసు స్వీకరింప బడుతుందా అతని పట్ల? కాదు, అతను కూడా షిర్క్ చేయకుండా ఉండాలి. జనాజా నమాజ్ దీనిని “ఫర్ద్ యే కిఫాయా” అంటారు. అంటే ముస్లిం సముదాయంలో కొంతమంది చేసినా గాని అందరిపై నుండి పాపం అనేది లేపబడుతుంది. చదివిన వారికి పుణ్యం లభిస్తుంది. చదవని వారికి పాపం కలగదు. కానీ ఎవరూ చేయకుంటే అందరూ పాపాత్ములు అవుతారు. ఇలాంటి విషయాన్ని “ఫర్ద్ యే కిఫాయా” అంటారు. ఇది ఫర్ద్ యే కిఫాయా.

ఇక ఎవరైతే “ఫర్ద్ యే అయీన్” అంటే ఐదు పూటల నమాజ్ లు, ఫర్ద్ యే అయీన్ లో లెక్కించబడతాయి. ఫర్ద్ యే అయీన్ చేయకుండా కేవలం ఫర్ద్ యే కిఫాయా చేస్తే సరిపోతుందా? లేదు, చనిపోయిన ఆ ముసలి వ్యక్తి, అతను నమాజీ అయి ఉండాలి మరియు ఈ నలబై మంది కూడా కేవలం జనాజా లో హాజరైనవారు కాదు. ఐదు పూటల నమాజ్ లు చేస్తూ ఉండాలి. ఈ విధంగా మహాశయులారా! ఒక సిఫారసు ఈ రకంగా కూడా ఉంటుంది. అల్లాహు తఆలా దీనిని కూడా స్వీకరిస్తాడు. ఈ షరతు, ఈ కండిషన్ లతో పాటు.

మూడో రకమైన సిఫారసు స్వర్గంలో చేరిన వారు స్వర్గంలో వారి యొక్క స్థానాలు ఉన్నతం కావడానికి, వారు ఏ పొజిషన్ లో ఉన్నారో అంతకంటే గొప్ప స్థితికి వారు ఎదగడానికి సిఫారసు. ఇలాంటి ఒక సిఫారసు కూడా ఉంటుంది. అల్లాహు తఆలా మనకు కూడా అలాంటి సిఫారసు ప్రాప్తం చేయు గాక. ఒకవేళ మనం హదీతులు వింటూ, ఈ ధర్మ భోదనలు వింటూ సిఫారసు పొందే వారిలో మనం కలిసే ప్రయత్నం చేయడం కంటే, ఎవరికైతే సిఫారసు చేసే హక్కు లభిస్తుందో, అలాంటి గొప్ప విశ్వాసంలో మనం కలిస్తే ఇంకా ఎంత మంచిగా ఉంటుంది. ఇంకా ఎంత మన అదృష్టం పెరుగుతుందో ఒకసారి ఆలోచించండి.

ముస్లిం షరీఫ్ లో ఉంది. హదీత్ నెంబర్ 1528. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు. “ఎప్పుడైతే అబూ సలమా (రదియల్లాహు తఆలా అన్హు) మరణించారో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతని వద్దకు వచ్చారు. అతని గురించి ఇలా దుఆ చేశారు. ఓ అల్లాహ్! అబూ సలమాను క్షమించు, మన్నించు. సన్మార్గం పొందిన వారు ఎవరైతే ఉన్నారో, వారిలో ఇతని యొక్క స్థానం కూడా పెంచి, వారితో కలుపు. ఓ అల్లాహ్! అతని వెనక, అతని తరువాత ఎవరైతే మిగిలి ఉన్నారో, వారికి నీవే బాధ్యునిగా అయిపో. మమ్మల్ని మరియు అతన్ని మన్నించు ఓ సర్వ లోకాల ప్రభువా! ఆయన సమాధిని విశాలపరుచు మరియు అతని కొరకు అతని సమాధిని కాంతితో నింపు“.

గమనించారా! ఈవిధంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అబూ సలమా గురించి దువా చేశారు. మనం కూడా విశ్వాసులు మనలో ఎవరైనా చనిపోతే, “ఓ అల్లాహ్! ఇతనిని క్షమించు. ఇతని యొక్క స్థానం పెంచి, సన్మార్గం పొందిన వారిలో ఇతన్ని కలుపు మరియు అతని వెనక, అతని తర్వాత అతను వెనుక ఉన్న వారిలో నీవు వారికి ఒక బాధ్యునిగా అయిపో. అతన్ని మరియు మమ్మల్ని కరుణించు ఓ మా సర్వ లోకాల ప్రభువా! అతని సమాధిని విశాల పరుచు. అతని సమాధిని కాంతితో నింపు“. ఈ విధంగా దువా చేయాలి మనం. ఇది కూడా ఒక సిఫారసు. అల్లాహ్ దయతో స్వీకరించబడుతుంది.

ఈ విధంగా సోదరులారా! సిఫారసు ఏ ఏ సందర్బాలలో జరుగుతుందో, ఏ ఏ సందర్భాలలో సిఫారసు చేసేవారు సిఫారసు చేస్తూ ఉన్నారో, ఎవరి గురించి సిఫారసు చేయబడుతుందో వారిలో మనం కూడా కలవాలి. మన గురించి కూడా ఎవరైనా పుణ్యాత్ములు సిఫారసు చేయాలి, దైవ దూతలు సిఫారసు చెయ్యాలి, ప్రవక్తలు సిఫారసు చెయ్యాలి అన్నటువంటి ఈ కేటగిరీని మనం ఎన్నుకునే దానికి బదులుగా అంతకంటే గొప్ప స్థానం దైవదూతలు మరియు ప్రవక్తలతో పాటు ఏ విశ్వాసులకు ఇతరుల గురించి సిఫారసు చేసే హక్కు ఇవ్వబడుతుందో అలాంటి పుణ్యాత్ముల్లో మనం చేరేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇస్లాం నేర్పేది కూడా మనకు ఇదే.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక సందర్భంలో మనకు తెలిపారు. “మీరు అల్లాహ్ తో స్వర్గాన్ని కోరుకున్నప్పుడు ఫిరదౌస్ గురించి మీరు దుఆ చేయండి. దానిని కోరుకోండి. స్వర్గాలలో అన్ని స్వర్గాల కంటే శ్రేష్టమైనది, అన్ని స్వర్గాల కంటే అతి ఉత్తమ, ఉన్నత స్థానంలో ఉన్నది మరియు మధ్యలో ఉన్నది ఆ ఫిరదౌస్“.

ఈవిధంగా ఎప్పుడూ కూడా మనం టాప్ లో కాదు, హై టాప్ లో ఉండే ప్రయత్నం చేయాలి. మనం హై టాప్ కు చేరకపోయినా కనీసం దానికి దగ్గరలోనైనా చేరవచ్చు. కానీ ముందే మనం టార్గెట్ చాలా చిన్నది పెట్టుకుంటే హై స్టేజ్ వరకు ఎప్పుడు చేరుకుంటాము?

ఈ సిఫారసులు పొందడానికి, సిఫారసులు చేయడానికి ఎలాంటి అధికారం ఉండాలి? ఎలాంటి కండిషన్స్ ఉండాలి? అల్లాహు తఆలా ఖురాన్ లో, హదీతుల్లో ఎలాంటి కండీషన్స్ మనకు నిర్ణయించాడు? వాటిని తెలుసుకోవడం కూడా మనకు చాలా ముఖ్యం.

గత కార్యక్రమంలో మరియు కార్యక్రమంలో ముందు వరకు మనం ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) కాకుండా వేరే ప్రవక్తలకు, దైవదూతలకు, విశ్వాసులకు ఏఏ సందర్భాలలో ఎలాంటి సిఫారసు చేసే హక్కు దొరుకుతుందో తెలుసుకోవడంతో పాటు ఆ సిఫారసును పొందడానికి ఏఏ సత్కార్యాలు పనికి వస్తాయో అవి కూడా మనం తెలుసుకున్నాము. అయితే సిఫారసు చేయడానికి, సిఫారసు పొందడానికి ఎలాంటి కండీషన్స్, నిబంధనలు అవసరమో అల్లాహు తఆలా వాటిని కూడా ఖురాన్ లో తెలిపి ఉన్నారు. ఆ కండీషన్స్, ఆ నిబంధనలు మనలో ఉన్నప్పుడే మనం ఒకరికి సిఫారసు చేయగలుగుతాము. ఆ కండీషన్స్ మనలో ఉన్నప్పుడే ఒకరి సిఫారసు మనం పొందగలుగుతాము. వాటిని తెలుసుకోవడం మనలో ఏదైనా ఒకటి దానిలో లేకుంటే అది మనలో వచ్చే విధంగా మనం ప్రయత్నం చేయడం కూడా తప్పనిసరి.

అందులో మొట్ట మొదటి విషయం. సిఫారసు యొక్క సర్వాధికారం కేవలం అల్లాహ్ చేతిలో ఉన్నదన్న విషయాన్ని మనం దృఢంగా నమ్మాలి. ఎందుకంటే మహాశయులారా! నమ్మకం ఎంత బలహీనం అయిపోతుందో, అంతే పుణ్యాత్ములను, బాబాలను, దర్గాలను ఇంకా వేరే ఎవరెవరినో మనం ఆశించి వారు మనకు సిఫారసు చేస్తారు అని వారి వద్దకు వెళ్లి కొన్ని పూజ పునస్కారాలు, కొన్ని ఉపాసనాలు, కొన్ని ఆరాధనలు వారి సంతోషానికి అక్కడ చేసే ప్రయత్నాలు ఈ రోజుల్లో ప్రజలు చేస్తున్నారు. అయితే ఆ ప్రళయ దినాన ఎవరి సిఫారసు చెల్లదు. ఎవరు కూడా ఏ సిఫారసు చేయలేరు. ఎవరికీ కూడా ఏ అధికారం ఉండదు. సర్వాధికారం సిఫారసు గురించి, అన్ని రకాల సిఫారసులకు ఏకైక అధికారుడు కేవలం అల్లాహ్ మాత్రమే.

రెండవ విషయం మనం తెలుసుకోవలసినది ప్రళయ దినాన ఎక్కడా కూడా, ఏ ప్రాంతంలో కూడా అల్లాహ్ అనుమతి లేనిది ఏ ఒక్కరు నాలుక విప్పలేరు, మాట మాట్లాడలేరు. ఆయతల్ కుర్సీ అని ఏదైతే మనం ఆయత్ చదువుతామో సూరయే బకరా లో ఆయత్ నెంబర్ 255. అందులో చాలా స్పష్టంగా ఈ విషయం అల్లాహు తఆలా తెలియజేసాడు. مَن ذَا الَّذِي يَشْفَعُ عِنْدَهُ إِلاَّ بِإِذْنِهِ మన్ జల్లజీ యష్ ఫవూ ఇన్ దహూ ఇల్లా బి ఇజ్నిహీ ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగలవాడెవడు? .అరబీ గ్రామర్ ప్రకారంగా ఈ పదాల కూర్పును కూడా గమనించండి. చెప్పే విధానాన్ని కూడా గమనించండి. ఎవరు అతను? ఎవరికి అలాంటి అధికారం ఉన్నది? ఎవరు చేయగలుగుతారు ఈ కార్యం? అతని వద్ద సిఫారసు చేసేటటువంటి అధికారం ఎవరికి ఉన్నది? ఆయన అనుమతి లేకుండా, ఆయన పర్మిషన్ లేకుండా ఎవరు చేయగలుగుతారు? ఎవరికి అంతటి శక్తి, సామర్థ్యం ఉన్నది? రెండో విషయం ఏంటి? అల్లాహ్ అనుమతి లేనిది ఎవరు కూడా సిఫారసు చెయ్యలేరు, ఎవరు నోరు విప్పలేరు, మాట మాట్లాడలేరు.

మూడో విషయం మనం తెలుసుకోవలసినది. అల్లాహ్ అనుమతి ఇచ్చిన వారే సిఫారసు చేస్తారు అని కూడా మనకు రెండో విషయం ద్వారా తెలిసింది కదా! ఇక అల్లాహ్ ఎవరికి అనుమతి ఇస్తాడు? ఆయన ఇష్టపడిన వారికే సిఫారసు చేసే అనుమతి ఇస్తాడు. ఇక ఈ విషయము ఇహలోకంలో మనం ప్రత్యేకంగా ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం), సామాన్యంగా ఇతర ప్రవక్తలు తప్ప పేరు పెట్టి ఫలాన వ్యక్తి కూడా సిఫారసు చేయగలుగుతాడు, అల్లాహ్ అతనికి అనుమతి ఇస్తాడు అని మనం చెప్పలేము. ఎందుకంటే అలాంటి ఏ ఆధారము ఖురాన్ మరియు హదీత్ లో లేదు. విషయాన్ని గమనిస్తున్నారా! మూడో విషయం ఏంటి? అల్లాహ్ ఎవరి పట్ల సంతోషంగా ఉంటాడో వారికే అనుమతిస్తాడు. ముందు దీని యొక్క ఆధారం వినండి.

۞ وَكَم مِّن مَّلَكٍۢ فِى ٱلسَّمَـٰوَٰتِ لَا تُغْنِى شَفَـٰعَتُهُمْ شَيْـًٔا إِلَّا مِنۢ بَعْدِ أَن يَأْذَنَ ٱللَّهُ لِمَن يَشَآءُ وَيَرْضَىٰٓ

సూరా నజ్మ్ ఆయత్ నెంబర్ 26. “ఆయన ముందు ఎవరు కూడా సిఫార్సు చేసే అధికారం కలిగిలేరు. ఆయన అనుమతి ఇచ్చిన తర్వాత మాత్రమే ఎవరైనా సిఫారసు చేయగలుగుతారు. కానీ అల్లాహ్ ఎవరి పట్ల ఇష్టపడతాడో మరియు ఎవరి గురించి కోరుతాడో అతనికి మాత్రమే అల్లాహు తఆలా అనుమతి ఇస్తాడు“.

ఈ మూడో విషయం కూడా చాలా ముఖ్యమైనది. దీనిని తెలుసుకోకుంటే, దీనిని అర్థం చేసుకోకుంటే ఈరోజు చాలా నష్టం కలుగుతుంది. ప్రజలు తమ ఇష్టానుసారంగా ఇతను నాకు సిఫారసు చేస్తాడు. అంతే కాదు వారి యొక్క పేర్లతో వారి తాత ముత్తాతల పేర్లతో సంతకాలు చేయించుకొని, కాగితాలు భద్రంగా దాచుకొని సమాధుల్లో కూడా పెట్టుకుంటున్నారు. ఈవిధంగా మనకు వారి యొక్క సిఫారసు లభిస్తుంది అన్నటువంటివి ఇవన్నీ మూఢ నమ్మకాలు. అల్లాహ్ ఎవరిపట్ల ఇష్టపడతాడో, అల్లాహ్ ఎవరికి ఇష్టపడిన తర్వాత ఎవరిని కోరుతాడో వారికే అనుమతి ఇస్తాడు. ఈ ఆయత్ ద్వారా మనకు మరో విషయం కూడా బోధపడుతుంది. అల్లాహ్ ఎందరినో ఇష్టపడవచ్చు. కానీ సిఫారసు చేయడానికి అనుమతి కొందరికే ఇవ్వవచ్చు.

ఎందుకంటే నాలుగో కండీషన్, నాలుగో విషయం కూడా గుర్తుంచుకోండి. ఇప్పటివరకు ఏమి తెలుసుకున్నాం మనం? సిఫారసు చేయడానికి ఏదైతే అనుమతి కలగాలో, అల్లాహ్ ఇష్టపడిన వారికే అనుమతిస్తాడు. అయితే వీరు ఎవరి గురించి సిఫారసు చేయాలి? వారిపట్ల కూడా అల్లాహు తఆలా ఇష్టపడాలి. వారి యొక్క మాట, వారి యొక్క విశ్వాసం, వారి యొక్క జీవిత విధానం ఇదంతా కూడా అల్లాహ్ కు ఇష్టమైన రీతిలో ఉన్నప్పుడే అల్లాహ్ తెలియపరుస్తాడు నీవు సిఫారసు చేయాలి, ఇతని గురించి చేయాలి అని.

ఉదాహరణకు అల్లాహ్ ఒక వ్యక్తికి అనుమతి ఇచ్చాడు అనుకోండి. నీవు సిఫారసు చెయ్యి అని. అయితే తాను కోరిన వారందరికీ సిఫారసు చేసే అధికారం ఉండదు. అల్లాహు తఆలా కొన్ని హద్దులు నిర్ణయిస్తాడు. కొన్ని షరతులు నిర్ణయిస్తాడు. నిబంధనలు పెడతాడు. వాటిలో ఒకటి ముఖ్యమైనది ఏమిటి? ఎవరి గురించి సిఫారసు చెయ్యాలో వారిపట్ల కూడా అల్లాహు తఆలా సంతోషంగా ఉండాలి.

సూరయే మర్యమ్ ఆయత్ నెంబర్ 87. “అల్లాహ్ వద్ద ఎవరైతే తన ఒడంబడికను నిలుపుకున్నారో అలాంటి వారికే సిఫారసు లభిస్తుంది“. సిఫారసు చేసే హక్కు గాని, మరియు సిఫారసు పొందే హక్కు గాని. ఎందుకంటే అల్లాహ్ తో ఏ వాగ్దానం ఉన్నదో ప్రత్యేకంగా “కలిమె తయ్యిబా” కు సంబంధించిన వాగ్దానం. అందులో మనిషి ఏమాత్రం వెనక ఉండకూడదు.

మరియు సూరా తాహా ఆయత్ నెంబర్ 109 లో “ఆ రోజు ఎవరి సిఫారసు ఎవరికీ ఎలాంటి లాభం చేకూర్చదు. కేవలం అల్లాహ్, రహ్మాన్ అనుమతించిన వారికి మరియు ఎవరి మాట, ఎవరి పలుకుతో అల్లాహ్ ఇష్టపడ్డాడో వారు మాత్రమే“.

ఈవిధంగా మహాశయులారా! ఈ ఆయతులు అన్నింటినీ పరిశీలించండి. ఈ రోజుల్లో ఈ విషయాలు, ఈ సత్యాలు తెలియక సిఫారసు కు సంబంధించిన పెడ మార్గంలో, తప్పుడు భావంలో ఏదైతే పడి ఉన్నారో, వాటి నుండి మనం బయటికి రావడం తప్పనిసరి. ఆ తప్పుడు మార్గాలు ఏమిటి? సిఫారసు కు సంబంధించిన దుర నమ్మకాలు, మూడనమ్మకాలు, దుర విశ్వాసాలు ఏమిటి? ఇన్షా అల్లాహ్ తరువాయి భాగంలో మనం తెలుసుకుందాం.

43:86  وَلَا يَمْلِكُ الَّذِينَ يَدْعُونَ مِن دُونِهِ الشَّفَاعَةَ إِلَّا مَن شَهِدَ بِالْحَقِّ وَهُمْ يَعْلَمُونَ

అల్లాహ్‌ను వదలి వీళ్లు ఎవరెవరిని మొరపెట్టుకుంటున్నారో వారికి, సిఫారసుకు సంబంధించిన ఏ అధికారమూ లేదు. కాని సత్యం గురించి సాక్ష్యమిచ్చి, దానికి సంబంధించిన జ్ఞానమున్న వారు మాత్రం (సిఫారసుకు యోగ్యులు).” (సూరా అజ్ జుఖ్ రుఫ్ 43:86)

ఇక్కడ మనం సూరయే జుఖ్ రూఫ్ ఆయత్ నెంబర్ 86 లో కూడా పరిశీలించడం చాలా లాభదాయకం. “ఎవరైతే అల్లాహ్ ను వదిలి ఇతరులను పూజిస్తున్నారో, ఆరాధిస్తున్నారో, ఇతరులతో దుఆ చేస్తున్నారో, ఆరాధిస్తున్నారో వారు ఎలాంటి సిఫారసుకు అధికారులు కాజాలరు”. అల్లాహు అక్బర్.

సిఫారసుకు సంబంధించిన దురనమ్మకం, మూడ విశ్వాసం, ఎవరైతే అల్లాహ్ ను వదిలి అల్లాహ్ తో దుఆ చేయకుండా, ఇతరులతో దుఆ చేస్తున్నారో వారి యొక్క సిఫారసు పొందాలని కోరుతున్నారో వారికి ఎలాంటి సిఫారసు లభించదు. ఎవరైతే సత్యానికి సాక్ష్యం పలికి ఉంటారో ‘లా ఇలాహ ఇల్లల్లాహ్‘ కు సాక్ష్యం పలికి ఉంటారో, వారు దాని యొక్క భావాలను, అర్ధ భావాలను కూడా తెలుసుకొని ఉంటారో. లా ఇలాహ ఇల్లల్లాహ్ సాక్ష్యం పలకడం ఏంటిది? దాని అర్థ భావాలను తెలుసుకోవడం ఏంటిది? సాక్ష్యం పలకటం అంటే నోటితో పలకడం అని సామాన్యంగా మనం అనుకుంటాము కదా! కానీ దాని యొక్క అర్ధ భావాలను తెలుసుకోవడం అంటే అల్లాహ్ కు ఎవరినీ భాగస్వామిగా కలపకపోవడం. దుఆ లో, మొక్కుబడులలో, సజ్దాలో, సాష్టాంగ పడటంలో, రుకూ చేయడంలో ఇంకా వేరే ఎన్ని ఆరాధనకు సంబంధించిన ఎన్ని రకాలు ఉన్నాయో వాటిలో అల్లాహ్ తో పాటు ఇంకా ఎవరిని కూడా మనం భాగస్వామిగా చెయ్యకూడదు. ఆరాధనకు సంబంధించిన ఏ ఒక్క భాగం కూడా అల్లాహ్ తప్ప ఇతరులకు చేయకూడదు.

ఈరకంగా ఎవరైతే తన విశ్వాసం మరియు ఏకేశ్వరోపాసన లో షిర్క్ లేకుండా నమాజ్ యొక్క పాబంది చేస్తూ తన నాలుకను కూడా కాపాడుకుంటూ ఉంటాడో, ప్రజల్ని దూషిస్తూ, ప్రజల యొక్క పరోక్ష నింద చేస్తూ, చాడీలు చెప్పుకుంటూ ఇతరులలో ఎలాంటి అల్ల కల్లోలం జరపకుండా నాలుకను కాపాడుకుంటాడో అలాంటి వారే సిఫారసును పొందగలుగుతారు.

చివరిలో ఒక హదీత్ కూడా వినండి ప్రవక్త మహనీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు. “మాటిమాటికి ప్రజల్ని శపించేవారు, శాపనార్థాలు పెట్టేవారు ప్రళయ దినాన సాక్షానికి కూడా అర్హులు కారు, సిఫారసుకు కూడా అర్హులు కారు“. సహీ ముస్లింలోని హదీస్ నెంబర్ 4703. ఎంత గంభీర్యమైన విషయమో గమనించాలి. సిఫారసు ఎలాంటి వారు పొందలేరు అని ఇందులో తెలపడం జరుగుతుంది.

ఇన్షా అల్లాహ్ తరువాయి భాగంలో సిఫారసు కు సంబంధించిన మూడ నమ్మకాలు ఏంటి? దుర విశ్వాసాలు ఏంటి? మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.

జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వ బరకాతుహు.


పూర్తి భాగాలు క్రింద వినండి 

మరణాంతర జీవితం – పార్ట్ 14: ప్రళయ దినాన సిఫారసు ఎప్పుడు ఏ సందర్భంలో ఎవరికి లభిస్తుంది – పార్ట్ 01 [ఆడియో, టెక్స్ట్]

బిస్మిల్లాహ్

మరణాంతర జీవితం – పార్ట్ 14 [ఆడియో]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

పార్ట్ 14. ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [ 21:21 నిముషాలు]

అస్సలామ్ అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలామ్ అలా రసూలుల్లాహ్ అమ్మాబాద్.

ప్రళయ దినాన సిఫారసు ఎప్పుడు? ఏ సందర్భంలో? ఎవరికి లభిస్తుంది? అనే విషయాలు ఈనాటి శీర్షికలో మనం తెలుసుకుందాం.

మహాశయులారా! గత కార్యక్రమంలో మనం మహా మైదానంలో దీర్ఘ కాలాన్ని భరించలేక ప్రజలు అల్లాహ్ అతి త్వరలో తీర్పు చేయడానికి, రావడానికి సిఫారసు కోరుతూ ప్రవక్తల వద్దకు వెళ్తే చివరికి ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సిఫారసు చేయడానికి ఒప్పుకుంటారు అన్న విషయాల వివరాలు మనం తెలుసుకున్నాము. అయితే సిఫారసుల విషయం వచ్చింది కనుక సిఫారసుకు సంబంధించిన ఇతర విషయాలు కూడా మనం కొన్ని తెలుసుకొని ఉంటే చాలా బాగుంటుంది.

ప్రవక్త మహనీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక సందర్భంలో తెలిపారు. “ప్రతి ప్రవక్తకు అల్లాహ్ (తఆలా) ఒక దుఆ చాన్సు ఇచ్చాడు. తప్పకుండా దానిని స్వీకరిస్తాను అని కూడా వారికి శుభవార్త తెలిపాడు. అయితే గత ప్రవక్తలందరూ కూడా ఆ దుఆ ఇహలోకంలోనే చేసుకున్నారు. అది వారికి స్వీకరించబడినది కూడా. అయితే ఇలాంటి దుఆ నాకు ఏదైతే ఇవ్వడం జరిగిందో నేను నా అనుచర సంఘం యొక్క సిఫారసు ప్రళయ దినాన చేయడానికి నేను అక్కడ గురించి దాచి ఉంచాను. ఇహలోకంలో ఆ దుఆ నేను చేసుకోలేదు. ప్రళయ దినాన నా అనుచర సంఘం యొక్క సిఫారసు చేయడానికి నేను దానిని అలాగే భద్రంగా ఉంచాను“. [సహీ బుఖారీ హదీస్ నెంబర్ 6305]

మహాశయులారా! అంతిమ ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి జీవితాన్ని చదవండి. ఆయన సర్వమానవాళి కొరకే కాదు, ఈ సర్వ లోకాల వైపునకు కారుణ్యమూర్తిగా ఏదైతే పంపబడ్డారో, ఆయన తన అనుచర సంఘం గురించి ఇహలోకం లోనే కాదు, పరలోకంలో కూడా ఎంతగా చింతిస్తారో, అక్కడ కూడా వారు నరకంలో పోకుండా ఉండడానికి సిఫారసులు చేయడానికి ఎలా సిద్దం అవుతున్నారో, ఆ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని ఈ రోజు ప్రజలు తెలుసుకోకుండా ఆయనపై బురద జల్లే ప్రయత్నము ఎందరో చేస్తున్నారు. కానీ మనం మన ముఖాన్ని మీదికి చేసి సూర్యుని వైపునకు ఉమ్మివేస్తే సూర్యునికి ఏదైనా నష్టం చేకూరుతుందా?

మహాశయులారా! ఇలాంటి దయామయ, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ని, ఆయన బాటను అనుసరించి, ఆయన చూపిన విధానాన్ని అనుసరించి మన జీవితం గడిపితే మనమే ధన్యులం అవుతాము. మరో సందర్భంలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు – “ప్రళయ దినాన ఎవరైతే ఇహలోకంలో విశ్వాసం ఉండి, కొన్ని ఘోర పాపాలకు గురి అయ్యారో వారికి కూడా నా సిఫారసు లభిస్తుంది“. [సునన్ అబూదావూద్ హదీత్ నెంబర్ 4739]

అయితే ఎవరెవరికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి యొక్క సిఫారసు లభించవచ్చునో మరికొన్ని హదీసుల ఆధారంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం.

రెండవ సందర్భం: సహీ ముస్లిం హదీత్ నెంబర్ 333 లో హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు – “ప్రళయదినాన తీర్పు మరియు ఆ మహా మైదానంలో జరిగే అటువంటి అన్ని మజిలీలు పూర్తి అయిన తర్వాత ఎప్పుడైతే స్వర్గంలోకి ప్రవేశం జరుగుతుందో, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు చెప్పారు: నేను స్వర్గం ద్వారానికి వస్తాను, స్వర్గము యొక్క ద్వారం తెరవండి అని అక్కడ నేను కోరతాను. అప్పుడు స్వర్గపు దారం పై ఉన్నటువంటి దాని యొక్క రక్షక భటుడు మీరు ఎవరు? అని అడుగుతాడు. నేను అంటాను “ముహమ్మద్”. అప్పుడు అతను అంటాడు – “నీ గురించే అందరికంటే ముందు ఈ ద్వారం తెరవాలి అని నాకు అనుమతించడం జరిగింది. నాకు చెప్పడం ఆదేశించడం జరిగింది. నీకంటే ముందు ఎవరికొరకు కూడా ఈ ద్వారం తెరవకూడదు“.

మరో ఉల్లేఖనంలో ఉంది. “స్వర్గ ప్రవేశానికై సిఫారసు చేసేవారిలో, అందరికంటే తొలిసారిగా నేనే సిఫారసు చేస్తాను”. ఈ విధంగా గొప్ప సిఫారసు కాకుండా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారికి ప్రత్యేకంగా స్వర్గపు ద్వారం తెరవడానికి కూడా సిఫారసు చేస్తారు. ఆ తరువాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అందరికంటే ముందు ప్రవేశిస్తారు. వారి తర్వాత వారి యొక్క అనుచరులు ప్రవేశిస్తారు.

మూడవ సందర్భం ఎక్కడైతే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు సిఫారసు చేస్తారో వాటిలో ఒకటి వారి యొక్క పినతండ్రి అబూ తాలిబ్ గురుంచి. వారి యొక్క పినతండ్రి అబూ తాలిబ్ చివరి ఘడియ వరకు కూడా, ఆయన మరణ వేదనకు గురి అయ్యే వరకు కూడా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కి ఆయన తోడు లభించింది. కానీ ఆయన ఇస్లాం ధర్మాన్ని స్వీకరించలేదు. ఇస్లాం ధర్మానికి సపోర్ట్ చేశారు. ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)ని ఆదుకున్నారు. అల్లాహ్ దయ తర్వాత, ఆయన ఉన్నంత కాలం వరకు ఎన్నో సందర్భాలలో మక్కా యొక్క ముష్రికులు ప్రవక్త గారిని హత్య చేద్దాం అన్నటువంటి దురాలోచనకు కూడా వెనకాడలేదు. కానీ అబూతాలిబ్ ని చూసి వారు ధైర్యం చెయ్యలేక పోయేవారు.

అయితే అబూతాలిబ్ చివరి సమయంలో, మరణ వేదనలో ఉన్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అప్పుడు కూడా పినతండ్రి వద్దకు వెళ్లి, మీరు తప్పకుండా ‘లా ఇలాహ ఇల్లల్లాహ్‘ చదవండి. కనీసం ఒక్కసారైనా చదవండి. నేను అల్లాహ్ వద్ద నీ గురించి సిఫారసు చేసే ప్రయత్నం చేస్తాను. కానీ ఆయన శ్వాస వీడేకి ముందు “నేను నా తాత ముత్తాతల ధర్మంపై ఉన్నాను” అని అంటారు. అందువల్ల ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారికి చాలా బాధ కలుగుతుంది. అల్లాహ్ (తఆలా) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారికి ఒక రకమైన ఓదార్పు ఇస్తారు. ఇది కూడా ఒక రకంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి గురించి ఒక గొప్ప విశిష్టత. అదేమిటంటే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి యొక్క సిఫారసు వల్ల అబూతాలిబ్ కి నరకంలోని శిక్షలో కొంచెం తగ్గింపు జరుగుతుంది కానీ నరకంలో నుండి మాత్రం బయటికి రాలేరు. ఆ తగ్గింపు ఏదైతే జరుగుతుందో, అది కూడా ఎంత ఘోరంగా ఉందో, ఒక్కసారి ఆ విషయాన్ని గమనించండి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన బంధువుల వారికి సిఫారసు చేసుకొని కాపాడుకున్నారు అన్నమాట కాదు, [అదే హదీస్ లో సహీ బుఖారీ హదీస్ నెంబర్ 1408 మరియు సహీ ముస్లిం 360] ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు తెలిపారు. “నేను సిఫారసు చేసినందుకు అల్లాహ్ (తఆలా) ఆయన్ని నరకంలోని తక్కువ శిక్ష ఉండే అటువంటి భాగంలో ఏదైతే వేశాడో, ఆ శిక్ష ఎలాంటిది? ఆయన చీలమండలాల వరకు నరకం యొక్క అగ్ని చేరుకుంటే, దాని మూలంగా మెదడు ఉడుకుతున్నట్లుగా, వేడెక్కుతున్నట్లుగా ఆయన భరించలేక పోతారు“.

మహాశయులారా! నాలుగో సందర్భం, ప్రవక్త మహానీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారికి ప్రత్యేకంగా ఒక సిఫారసు యొక్క హక్కు ఏదైతే ఇవ్వడం జరుగుతుందో, అది ఎలాంటి లెక్క, తీర్పు లేకుండా, శిక్ష లేకుండా స్వర్గంలో ప్రవేశించడానికి సిఫారసు చేయడం. దాని యొక్క వివరాలు సహీ బుఖారీ హదీత్ నెంబర్ 4343, సహీ ముస్లిం 287. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు. “ఆ రోజున నేను చాలా సేపటి వరకు సజ్దాలో పడి ఉంటాను. అల్లాహ్ (తఆలా) ఓ మహమ్మద్! నీ తల ఎత్తు అని అంటాడు. నేను తల ఎత్తుతాను. అప్పుడు అల్లాహ్ (తఆలా) ఇది మరోసారి నువ్వు అడుగు. నువ్వు అడుగుతున్న విషయం నీకు ఇవ్వబడుతుంది. మరి నీ సిఫారసు చెయ్యి నీ యొక్క సిఫారసు స్వీకరించబడుతుంది. అప్పుడు నేను నా తలెత్తి ఓ అల్లాహ్! ఓ నా ప్రభువా! నా అనుచర సంఘం, నా అనుచర సంఘం, నా అనుచర సంఘం అని నేను అంటాను. అప్పుడు ఓ మహమ్మద్! నీ అనుచర సంఘంలో ఇంత మందిని ఎలాంటి లెక్క తీర్పు, శిక్ష ఏమి లేకుండా స్వర్గపు యొక్క ద్వారాల్లోని కుడి ద్వారం గుండా వారిని ప్రవేశింప చేయి”. అల్లాహు అక్బర్. అల్లాహ్ నన్ను, మిమ్మల్ని, మనందరినీ కూడా ప్రవక్త సిఫారసు నోచుకొని ఆ స్వర్గములోని కుడివైపున ఉన్న మొదటి ద్వారం గుండా ప్రవేశించేటువంటి భాగ్యం ప్రసాదించు గాక.

మహాశయులారా! ఎంత గొప్ప విషయం. అయితే అక్కడే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు. “అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ మరో శుభవార్త ఇస్తాడు. అదేమిటంటే ఎలాంటి శిక్ష, తీర్పు లేకుండా ప్రవేశించేవారు వారికి ప్రత్యేకంగా ఈ ద్వారము, కానీ వారు తలచుకుంటే ఏ ద్వారం గుండానైనా వారు ప్రవేశించవచ్చు.”

ఈ విధంగా ప్రవక్త మహనీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారికి ప్రత్యేకంగా ఈ నాలుగు రకాల సిఫారసులు ఇవ్వబడతాయి.

ఇవే కాకుండా, ఇంకా వేరే ప్రవక్తలకు కూడా అల్లాహ్ (తఆలా) వేరే సందర్భాలలో సిఫారసు చేసేటటువంటి హక్కు ఇస్తాడు మరియు వారికి సిఫారసు విషయంలో ఒక హద్దును కూడా నిర్ణయించడం జరుగుతుంది. వారు సిఫారసు చేస్తారు, అల్లాహ్ వారి సిఫారసును అంగీకరిస్తాడు కూడా. అలాంటి సిఫారసుల్లో ఒకటి ఎవరైతే విశ్వాసం ఉండి, తౌహీద్ ఉండి మరియు నమాజ్ లు చేస్తూ ఉన్నారో, నమాజ్ ను వీడనాడలేదో, కానీ వేరే కొన్ని పాపాల వల్ల వారిని నరకంలో పడవేయడం జరిగిందో, అల్లాహ్ తలుచుకున్నన్ని రోజులు నరకంలో వారికి శిక్షలు పడిన తరువాత అల్లాహ్ ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారికి మరియు కొందరు ప్రవక్తలకు, మరికొందరు పుణ్యాత్ముల కు సిఫారసు హక్కు ఇస్తాడు. వారి సిఫారసు కారణంగా అల్లాహ్ (తఆలా) ఆ నరకవాసులను నరకం నుండి తీసి స్వర్గంలోకి పంపిస్తాడు. దీనికి సంబంధించిన హదీత్ లు ఎన్నో ఉన్నాయి.

కానీ సహీ ముస్లిం లో హదీత్ నెంబర్ 269, హజ్రత్ అబూ సయీద్ ఖుధ్రి (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు. ప్రళయ దినాన సిఫారసు హక్కు ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారికి లభిస్తుంది. ప్రవక్తలకు లభిస్తుంది. అంతేకాకుండా పుణ్యాత్ములైన విశ్వాసులు అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ తో సిఫారసు చేస్తూ ఉంటారు. “ఓ అల్లాహ్! నరకంలో కొంతమంది పడి ఉన్నారు. వారు మాతో ఉపవాసాలు పాటించేవారు. మాతో పాటు వారు నమాజ్ చేసేవారు. మాతో పాటు వారు హజ్ చేసేవారు. కాని వేరే కొన్ని కారణాల వల్ల, వేరే కొన్ని పాపాల వల్ల నరకంలో వచ్చి పడిఉన్నారు. ఓ అల్లాహ్! వారిని కూడా నీవు నీ దయతో బయటికి తీసేయ్యి అల్లాహ్” అని వారు కోరుతారు. అప్పుడు వారితో చెప్పడం జరుగుతుంది – వారు నమాజ్ చేస్తూ ఉండేవారు గనుక వారు చేసే సజ్దాల యొక్క గుర్తు వారి నొసటిపై ఉంటుంది. ఆ నొసటి భాగాన్ని నరకాగ్నిలో ఏమాత్రం నష్టపరచదు. అల్లాహ్ ఆ సందర్భంలో మీరు ఎవరిని వారిలో గుర్తుపట్ట గలుగుతారో వారిని బయటికి తీయండి. అయితే వారు ఎలా గుర్తుపడతారు? నరకంలో కాలిన తరువాత వారు మారిపోతారు కదా? కానీ తౌహీద్ యొక్క శుభం వల్ల, నమాజు సరైన విధంగా పాటిస్తూ ఉన్నందువల్ల వారి ముఖాలను మాత్రం అగ్ని ఏమాత్రం కాల్చదు. వారి యొక్క ఆ ముఖాలను అగ్ని పై నిషేధింపబడినది గనుక అగ్ని ఆ ముఖాలకు ఎలాంటి నష్టం చేకూర్చలేదు గనుక, వారు తమ స్నేహితులను ఈ విధంగా గుర్తుపడతారు“. [సహీ బుఖారీ లోని హదీత్ లో ఉంది]

అంటే ఏం తెలుస్తుంది దీని ద్వారా? కేవలం కలిమా చదువుకుంటే సరిపోదు, ఏ ఒక్క నమాజ్ ను కూడా విడనాడకూడదు. నమాజ్ యొక్క ప్రాముఖ్యత చాలా గొప్పగా ఉంది. అల్లాహ్ దయ తర్వాత, నమాజ్ యొక్క శుభాల వల్లనే వారి యొక్క ముఖాలు నరకములో కాలకుండా, నరకం అగ్నిలో ఉన్నా గానీ, నరక గుండంలో ఉన్నాగాని ఎలాంటి మార్పు అనేది వారి ముఖాల్లో రాదు. అల్లాహు అక్బర్.

ఈ విధంగా ప్రవక్తలు, పుణ్యాత్ములు, ఉత్తమ విశ్వాసులు వారందరూ కలిసి అల్లాహ్ తో సిఫారసు చేసి, ఎంతో పెద్ద సంఖ్యను నరకంలో నుండి బయటికి తీపిస్తారు. ఆ తర్వాత అల్లాహ్ అంటాడు – “దైవదూతలు సిఫారసు చేశారు. ప్రవక్తలు సిఫారసు చేశారు. విశ్వాసులు సిఫారసు చేశారు. ఇక మిగిలి ఉన్నది కేవలం ఆ కరుణామయుడైన, అందరికంటే ఎక్కువగా కరుణించే కృపాశీలుడు మాత్రమే మిగిలి ఉన్నాడు.” అప్పుడు అల్లాహ్ (తఆలా) తన పిడికిలిలో నరకంలో నుండి ఒక పెద్ద సంఖ్యను తీస్తాడు బయటికి. వారు వేరే ఇంకా ఏ సత్కార్యాలు చేయలేక ఉంటారు.

ఈ విధంగా మహాశయులారా! అల్లాహ్ (తఆలా) ప్రవక్తలకు, దైవదూతలకు, విశ్వాసులకు సైతం మిగతా విశ్వాసుల్లో ఎవరైతే పాపాలు చేసి ఉన్నారో వారికి సిఫారసు చేయడానికి అధికారం, హక్కు ఇచ్చి ఉంటాడు. మరియు వారి సిఫారసును స్వీకరించి ఎంతోమంది నరకవాసులను నరకం నుండి బయటికి తీస్తాడు. దీనికి సంబంధించిన మరొక హదీత్ మీరు గమనించండి అందులో ఎంత ముఖ్య విషయం ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) బోధించారో దానిపై దృష్టి వహించండి.

ఈ హదీత్ సునన్ తిర్మిదీ లో ఉంది. హదీస్ నెంబర్ 2441. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు. “నా ప్రభువు వైపు నుండి నా వద్దకు వచ్చే ఒక వ్యక్తి వచ్చాడు మరియు నాకు ఛాయస్ ఎన్నుకోండి అని చెప్పాడు. ఏమిటి? నీ అనుచర సంఘంలోని సగం మందిని స్వర్గం లో చేర్పిస్తానని లేదా నీకు సిఫారసు యొక్క హక్కు కావాలా? అని. అయితే నేను సిఫారసు యొక్క హక్కు లభిస్తే బాగుంటుంది అని దాన్ని ఎన్నుకున్నాను. ఆ తర్వాత ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు. అయితే ఈ నా సిఫారసు ఎవరికి లభిస్తుంది అంటే ఎవరైతే అల్లాహ్ తో పాటు ఎవరిని భాగస్వామిగా చేయకుండా ఉండే స్థితిలో చనిపోతాడో అలాంటి వానికే నా ఈ సిఫారసు ప్రాప్తమవుతుంది“. అల్లాహు అక్బర్.

ఇంతకు ముందు హదీస్ లో సహీ ముస్లిం లో గమనించారు కదా! వారి యొక్క ముఖాలను అగ్ని ఏమాత్రం కాల్చదు, మార్చదు అని. అది నమాజ్ యొక్క శుభం మరియు ఆ విశ్వాసులు అంటారు – “ఈ నరకవాసులు మాతో నమాజ్ చేసే వారు, హజ్ చేసేవారు, ఉపవాసాలు ఉండేవారు” అంటే ఈ ఇస్లాం యొక్క ఐదు పునాదులు ఏవైతే ఉన్నాయో “లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్” యొక్క సత్యమైన సాక్ష్యం నమాజ్ చేయడం, విధి దానం చెల్లించడం, ఉపవాసాలు పాటించడం, శక్తి ఉన్నవారు హజ్ చేయడం. ఇది ఎంత ప్రాముఖ్యత గల విషయమో గమనించండి.

ఈ శీర్షిక ఇంకా సంపూర్ణం కాలేదు. తర్వాత భాగంలో కూడా దీని కొన్ని మిగతా విషయాలు మనం విందాము. అల్లాహ్ (తఆలా) మనందరికీ ప్రవక్త సిఫారసు ప్రాప్తం చేయు గాక!

జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వ బరకాతుహు.


పూర్తి భాగాలు క్రింద వినండి