
[2:32 నిముషాలు ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
అపశకునాల నమ్మకాలు ఇస్లాంలో నిషిద్ధం
https://teluguislam.net/2019/08/07/belief-in-omens-telugu-islam
తెలుగుఇస్లాం.నెట్ * తెలుగులో ఇస్లాం జ్ఞాన సంపద *
[2:32 నిముషాలు ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
అపశకునాల నమ్మకాలు ఇస్లాంలో నిషిద్ధం
https://teluguislam.net/2019/08/07/belief-in-omens-telugu-islam
1వ అధ్యాయం : ఏకత్వపు బాటకు సత్యమైన మాట
అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్ – ఇమామ్ అస్-సాదీ
القول السديد شرح كتاب التوحيد
The famous commentary of Shaykh as-Sa’di of the book Kitab at-Tawhid of Muhammad ibn Abdul Wahhab.
وَمَا خَلَقْتُ الْجِنَّ وَالْأِنْسَ إِلَّا لِيَعْبُدُونِ] الذريات56
“నేను జిన్నాతులను, మానవులను నా ఆరాధన కొరకు మాత్రమే సృష్టించాను”. (జారియాత్ 52:56).
[وَلَقَدْ بَعَثْنَا فِي كُلِّ أُمَّةٍ رَسُولًا أَنِ اُعْبُدُوا اللهَ وَاجْتَنِبُوا الطَّاغُوتَ] {النحل:36}
“మేము ప్రతి సముదాయంలోనూ ప్రవక్తను ప్రభవింపజేశాము. (అతడన్నాడు): “మీరు అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి, మిథ్యదైవా(తాగూత్)ల ఆరాధనను త్యజించండి”. (నహ్ల్ 16:36).
[وَقَضَى رَبُّكَ أَلَّا تَعْبُدُوا إِلَّا إِيَّاهُ وَبِالوَالِدَيْنِ إِحْسَانًا] {الإسراء:23}
“నీ ప్రభువు ఇలా ఆజ్ఞాపించాడు: ఆయనను తప్ప ఇతరులను ఆరాధించకూడదనీ మరియు తల్లిదండ్రులతో మంచితనంతో వ్యవహరించాలనీ”. (బనీ ఇస్రాఈల్ 17: 23)
[وَاعْبُدُوا اللهَ وَلَا تُشْرِكُوا بِهِ شَيْئًا] {النساء:36}
“మీరంతా అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి, మరియు ఆయనకు ఎవ్వరినీ భాగస్వామిగా చేయకండి”. (నిసా 4: 36).
[قُلْ تَعَالَوْا أَتْلُ مَا حَرَّمَ رَبُّكُمْ عَلَيْكُمْ أَلَّا تُشْرِكُوا بِهِ شَيْئًا] {الأنعام:151}
“(ప్రవక్తా వారికి చెప్పు): రండి, మీ ప్రభువు మీపై నిషేధించినవి ఏవో మీకు చదివి వినిపిస్తానుః మీరు ఆయనకు ఏలాంటి భాగస్వాములను కల్పించకండి”. (అన్ఆమ్ 6:151).
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు ఇలా చెప్పారుః ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ ముద్ర వేసి ఇచ్చిన ఆదేశాలను చూడదలుచుకున్నవారు పైన పేర్కొనబడిన ఆయతును (6:151) చదవాలి.
عَنْ مُعَاذِ بْنِ جَبَلٍ قَالَ: كُنْتُ رِدْفَ رَسُولِ الله ﷺ عَلَى حِمَارٍ يُقَالُ لَه عُفَيرٌ قَالَ: فَقَالَ لِيْ: (يَا مُعَاذ! تَدْرِي مَا حَقُّ اللهِ عَلَى الْعِبَادِ ، وَمَا حَقُّ الْعِبَادِ عَلَى الله؟) قَالَ قُلْتُ: اَللهُ وَرَسُوْلُهُ اَعْلَمُ، قَالَ: (فَإِنَّ حَقَّ اللهِ عَلَى الْعِبَادِ اَنْ يَعْبُدُوْالله وَلاَ يُشْرِكُوْا بِهِ شَيْئًا ، وَحَقُّ الْعِبَادِ عَلَى اللهِ عَزَّوَجَلَّ اَنْ لاَ يُعَذِّبَ مَنْ لاَّ يُشْرِكُ بِهِ شَيْئاً) قَالَ قُلْتُ: يَا رَسُوْلَ الله! أَفَلاَ أُبَشِّرُ النَّاسَ؟ قَالَ: (لاَ تُبَشِّرْهُمْ فَيَتَّكِلُوْا).
హజ్రత్ ముఆజ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, నేను ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెనక గాడిదపై ప్రయాణం చేస్తున్నాను. -ఆ గాడిద పేరు ‘ఉఫైర్’-అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ఓ ముఆజ్! దాసుల మీద అల్లాహ్ హక్కు, అల్లాహ్ మీద దాసుల హక్కు ఏముందో నీకు తెలుసా?” అని అడిగారు. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకే బాగా తెలుసు అని నేను సమాధానం ఇచ్చాను. అప్పుడు ఆయన ఇలా అన్నారుః “దాసుల మీద ఉన్న అల్లాహ్ హక్కు ఏమిటంటే; వారు అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలి, ఆయనకు ఎవరినీ భాగస్వామిగా కల్పకూడదు. మరియు అల్లాహ్ మీదున్న దాసుల హక్కు ఏమిటంటే; ఆయనకు ఎవరినీ భాగస్వామిగా కల్పనివారిని ఆయన శిక్షించకూడదు”. అయితే ప్రవక్తా! నేను ఈ శుభవార్త ప్రజలకు తెలియజేయనా? అని అడిగాను. దానికి ఆయన “ఇప్పుడే వారికీ శుభవార్త ఇవ్వకు, వారు దీని మీదే ఆధారపడిపోయి (ఆచనణ వదులుకుంటారేమో)” అని చెప్పారు. (ముస్లిం 30, బుఖారి 5967).
[لَا تَجْعَلْ مَعَ اللهِ إِلَهًا آَخَرَ فَتَقْعُدَ مَذْمُومًا مَخْذُولًا] {الإسراء:22}
“నీవు అల్లాహ్ తో పాటు వెరొక ఆరాధ్యుణ్ణి నిలబెట్టకు. అలా గనక చేస్తే నీవు నిందితుడవై, నిస్సహాయుడవై కూర్చుంటావు”. ముగింపు ఇలా చేశాడుః
[وَلَا تَجْعَلْ مَعَ اللهِ إِلَهًا آَخَرَ فَتُلْقَى فِي جَهَنَّمَ مَلُومًا مَدْحُورًا] {الإسراء:39}
“నీవు అల్లాహ్ తో పాటు వేరొకరిని ఆరాధ్యునిగా చేసుకోకు. అలాచేస్తే అవమానించబడి, ప్రతి మేలుకు దూరం చేయబడి, నరకంలో త్రోయబడతావు”.
అల్లాహ్ ఈ బోధనల ప్రాముఖ్యత, గొప్పతనాన్ని మనకు ఇలా తెలియజేశాడుః
[ذَلِكَ مِمَّا أَوْحَى إِلَيْكَ رَبُّكَ مِنَ الحِكْمَةِ] {الإسراء:39}
“ఇవన్నీ నీ ప్రభువు నీ వద్దకు వహీ ద్వారా పంపిన వివేచనభరిత (వివేకంతో నిండివున్న) విషయాలు”.
సూరె నిసా లోని ముప్పై అరవ ఆయతు (4:36)ను ‘ఆయతు హుఖూఖిల్ అషర’ అని అంటారు. అంటే పది హక్కులు అందులో తెలుపబడ్డాయి. అల్లాహ్ దాని ఆరంభం కూడా ఇలా చేశాడుః
[وَاعْبُدُوا اللهَ وَلَا تُشْرِكُوا بِهِ شَيْئًا] {النساء:36}
“అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి, ఆయనకు ఎవ్వరినీ భాగస్వామిగా చేయకండి”([2]).
ఈ అధ్యాయం పేరు ‘కితాబుత్ తౌహీద్’ (ఏకత్వపు అధ్యాయం). ఈ పేరు, మొదటి నుండి చివరి వరకు ఈ పుస్తకంలో ఏముందో దానిని తెలియపరుస్తుంది. అందుకే ప్రత్యేకంగా ‘ఖుత్బా[3]’ ప్రస్తావన రాలేదు. అంటే ఈ పుస్తకంలో ఏకదైవారాధన, దాని ఆదేశాలు, హద్దులు, షరతులు, ఘనతలు, ప్రమాణాలు, నియమాలు, వివరాలు, ఫలములు, కర్తవ్యములు, ఇంకా దానిని బలపరిచే, పటిష్టం చేసే, బలహీన పరిచే, సంపూర్ణం చేసే విషయాలన్నీ ప్రస్తావించబడ్డాయి.
తౌహీద్ అంటే ఏమిటో తెలుసుకోండిః సంపూర్ణ గుణాలు గల ప్రభువు (అల్లాహ్) ఏకైకుడు అని తెలుసుకొనుట, విశ్వసించుట ఇంకా వైభవం గల గొప్ప గుణాల్లో ఆయన అద్వితీయుడని మరియు ఆయన ఒక్కడే సర్వ ఆరాధనలకు అర్హుడని ఒప్పుకొనుట.
అల్లాహ్ ఘనమైన, మహా గొప్ప గుణాలుగల అద్వితీయుడు అని ఆయన గుణాల్లో ఎవనికి, ఏ రీతిలో భాగస్వామ్యం లేదు అని విశ్వసించుట. అల్లాహ్ స్వయంగా తన గురించి తెలిపిన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ గురించి తెలిపిన గుణనామములు, వాటి అర్థ భావాలు, వాటికి సంబంధించిన ఆదేశాలు ఖుర్ఆన్, హదీసులో వచ్చిన తీరు, అల్లాహ్ కు తగిన విధముగా నమ్మాలి. ఏ ఒక్క గుణనామాన్ని తిరస్కరించవద్దు, నిరాకరించవద్దు, తారుమారు చేయవద్దు, ఇతరులతో పోల్చవద్దు.
ఏ లోపాల, దోషాల నుండి పవిత్రుడని అల్లాహ్ స్వయం తన గురించి, లేదా ప్రవక్త అల్లాహ్ గురించి తెలిపారో వాటి నుండి అల్లాహ్ పవిత్రుడని నమ్మాలి.
సృషించుట, పోషించుట, (సర్వజగత్తు) నిర్వహణములో అల్లాహ్ యే అద్వితీయుడని విశ్వసించుట. సర్వసృష్టిని అనేక వరాలు ఇచ్చి పోషించేది ఆయనే. ఇంకా తన సృష్టిలోని ప్రత్యేకులైన –ప్రవక్తలు, వారి అనుచరుల- వారికి నిజమైన విశ్వాసం, ఉత్తమ ప్రవర్తన, లాభం చేకూర్చే విద్య, సత్కార్యాలు చేసే భాగ్యాం ప్రసాదించి అనుగ్రహిస్తున్నది ఆయనే. ఈ శిక్షణయే హృదయాలకు, ఆత్మలకు ప్రయోజనకరమైనది, ఇహపరాల శుభాల కొరకు అనివార్యమైనది.
సర్వసృష్టి యొక్క పూజ, ఆరాధనలకు అర్హుడు కేవలం అల్లాహ్ మాత్రమేనని తెలుసుకోవాలి, నమ్మాలి. ప్రార్థనలన్నీ చిత్తశుద్ధితో, ఆయన ఒక్కనికే అంకితం చేయాలి. ఈ చివరి రకములోనే పైన తెలుపబడిన రెండు రకాలు ఆవశ్యకముగా ఇమిడి ఉన్నాయి. ఎందుకంటే తౌహీదుల్ ఉలూహియ్యత్ అన్న ఈ రకంలో తౌహీదుల్ అస్మా వస్సిఫాత్ మరియు తౌహీదుర్ రుబూబియత్ గుణాలు కూడా వచ్చేస్తాయి. అందుకే ఆయన అస్మా వ సిఫాత్ లో మరియు రుబూబియత్ లో అద్వితీయుడు, ఏకైకుడు అయినట్లు ఆరాధనలకు కూడా ఒక్కడే అర్హుడు.
మొదటి ప్రవక్త నుండి మొదలుకొని చివరి ప్రవక్త వరకు అందరి ప్రచార ఉద్దేశం తౌహీదుల్ ఉలూహియ్యత్ వైపునకు పిలుచుటయే.
‘అల్లాహ్ మానవులను ఆయన్ను ఆరాధించుటకు, ఆయన కొరకే చిత్తశుద్ధిని పాటించుటకు పుట్టించాడని మరియు ఆయన ఆరాధన వారిపై విధిగావించబడినది’ అని స్పష్టపరిచే నిదర్శనాలను రచయిత ఈ అధ్యాయంలో పేర్కొన్నారు.
ఆకాశ గ్రంథాలన్నియూ మరియు ప్రవక్తలందరూ ఈ తౌహీద్ (ఏకదైవత్వం) ప్రచారమే చేశారు. మరియు దానికి వ్యతిరేకమైన బహుదైవత్వం, ఏకత్వంలో భాగస్వామ్యాన్ని ఖండించారు. ప్రత్యేకంగా మన ప్రవక్త ముహమ్మ్దద్ సల్లల్లాహు అలైహి వసల్లం.
దివ్య గ్రంథం ఖుర్ఆన్ కూడా ఈ తౌహీద్ గురించి ఆదేశమిచ్చింది, దానిని విధిగావించింది, తిరుగులేని రూపంలో దానిని ఒప్పించింది, చాలా గొప్పగా దానిని విశదపరిచింది, ఈ తౌహీద్ లేనిదే మోక్షం గానీ, సాఫల్యం గానీ, అదృష్టం గానీ ప్రాప్తించదని నిక్కచ్చిగా చెప్పింది. బుద్ధిపరమైన, గ్రాంథికమైన నిదర్శనాలు మరియు దిజ్మండలంలోని, మనిషి ఉనికిలోని నిదర్శనాలన్నియూ తౌహీద్ (ఏకదైవత్వం)ను పాటించుట విధి అని చాటి చెప్పుతాయి.
తౌహీద్ మానవులపై ఉన్న అల్లాహ్ యొక్క హక్కు. అది ధర్మవిషయాల్లో అతిగొప్పది, మౌలిక విషయాల్లో కూడా మరీ మూలమైనది, ఆచరణకు పుణాది లాంటిది. (అంటే తౌహీద్ లేనివాని సదాచరణలు స్వీకరించబడవు).
[1] ప్రవక్తను తిరస్కరించిన మక్కా అవిశ్వాసులు నమాజులు చేసేవారు, హజ్ చేసేవారు, దానధర్మాలు ఇతర పుణ్యకార్యాలు చేసేవారు. కాని అల్లాహ్ కు ఇతరులను భాగస్వాములుగా చేసేవారు. అందుకే అది ఏకదైవారాధన అనబడదు.
[2] భావం ఏమిటంటే: హక్కుల్లోకెల్లా మొట్టమొదటి హక్కు అల్లాహ్ ది. ఏ భాగస్వామ్యం లేకుండా అల్లాహ్ ఆరాధన చేయనివాడు అల్లాహ్ హక్కును నెరవార్చనివాడు. ఈ హక్కు నెరవేర్చకుండా మిగితా హక్కులన్నీ నెరవేర్చినా ఫలితమేమీ ఉండదు.
[3] సామాన్యంగా ప్రతి ధార్మిక పుస్తక ఆరంభం ‘అల్ హందులిల్లాహి నహ్మదుహు….’ అన్న అల్లాహ్ స్తోత్రములతో చేయబడుతుంది
నుండి: ఏకత్వపు బాటకు సత్యమైన మాట (అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్) – ఇమామ్ అస్-సాదీ [పుస్తకం]. తెలుగు అనువాదం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
28వ అధ్యాయం : అపశకునం
అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్ – ఇమామ్ అస్-సాదీ
The famous commentary of Shaykh as-Sa’di of the book Kitab at-Tawhid of Muhammad ibn Abdul Wahhab.
అల్లాహ్ ఆదేశం:
أَلَا إِنَّمَا طَائِرُهُمْ عِندَ اللَّهِ وَلَٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ
“అసలు వాస్తవానికి వారి అపశకునం అల్లాహ్ చేతులలో ఉంది. కాని వారిలో చాలా మంది జ్ఞానహీనులు“. (ఆరాఫ్ 7: 131).
అల్లాహ్ పంపిన ప్రవక్తలు ఇలా అన్నారు:
قَالُوا طَائِرُكُم مَّعَكُمْ
“మీ దుశ్శకునం స్వయంగా మీ వెంటనే ఉంది“. (యాసీన్ 36:19).
అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం : ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు:
“అస్పృశ్యత (అంటు వ్యాధి) సరైనది కాదు. అపశకునం పాటించకూడదు. గుడ్లగూబ (అరుపు, లేక ఒకరి ఇంటిపై వాలితే ఆ ఇంటివారికీ నష్టం కలుగుతుందని భావించుట) సరికాదు. ఉదర వ్యాధితో [1] అపశకునం పాటించుట కూడా సరైనది కాదు”. (బుఖారి, ముస్లిం). ముస్లిం హదీసు గ్రంథంలో “తారాబలం, దయ్యాల నమ్మకం కూడా సరైనది కాదు”. అని ఉంది.
[1] కొందరి నమ్మకం ప్రకారం రోగి కడుపులోకి ఒక జంతువు దూరి ఆకలిగా ఉన్నప్పుడు తీవ్రమైన దుఃఖం కలిగిస్తుంది. దీనివల్ల ఒక్కోసారి రోగి మృత్యువాతన కూడా పడతాడు. ఈ నమ్మకాన్ని అరబిలో “సఫర్” అంటారు.
అనసు (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించారు:
“అస్పృశ్యతా పాటింపు లేదు. దుశ్శకునం పాటించడం ధర్మ సమ్మతంకాదు. అయితే శుభశకునం (ఫాల్) పాటించడమంటే నాకిష్టమే” [2]. అప్పుడు అనుచరులు “మంచి శకునం అంటే ఏమిటి?” అని అడిగారు. దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “(మంచి శకునం అంటే) మంచి మాట (సద్వచనం)” అని సమాధానమిచ్చారు.
[2] అకస్మాత్తుగా ఏదైనా మంచి మాట విని లేదా సందర్భోచితమైన మాట విని దాన్నుండి సకారాత్మక ఫలితం తీయడమే మంచి శకునం (ఫాల్). ఇది ధర్మసమ్మతమే.
ఉఖ్బా బిన్ ఆమిర్ (రదియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దగ్గర దుశ్శకునం పాటించే ప్రస్తావన వచ్చింది. అప్పుడు ఆయన: “ఫాల్” మంచిది. అది ముస్లింను తన పనుల నుండి ఆపదు. మీలో ఎవరైనా తనకు ఇష్టం లేనిది చూస్తే ఇలా అనాలి:
اللَّهُمَّ لا يَأتى بالحَسَناتِ إلاَّ أنتَ ، وَلا يَدْفَعُ السَّيِّئاتِ إلاَّ أنْتَ ، وَلا حوْلَ وَلا قُوَّةَ إلاَّ بك
“అల్లాహుమ్మ లా యాతి బిల్ హసనతి ఇల్లా అంత. వలా యద్-ఫఉస్సయ్యిఆతి ఇల్లా అంత. వలాహౌల వలాఖువ్వత ఇల్లా బిక”
అర్ధం: ఓ అల్లాహ్! మంచిని ప్రసాదించేవాడివి నీవే. చెడును దూరము చేయువాడివి నీవే. మంచి చేయుటకు, చెడు నుండి దూరముంచుటకు నీకు తప్ప మరెవ్వరికి సాధ్యం కాదు). అని చెప్పారు. (అబూ దావూద్).
ఇబ్ను మస్ ఊద్, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పినట్టు ఉల్లేఖించారు:.
“దుశ్శకునం పాటించుట షిర్క్. దుశ్శకునం పాటించుట షిర్క్. మనలో ప్రతీ ఒకడు దానికి గురవుతాడు. కాని అల్లాహ్ పై ఉన్న నమ్మకం ద్వారా అల్లాహ్ దాన్ని దూరము చేస్తాడు”.
(అబూ దావూద్. తిర్మిజి. చెప్పారు: చివరి పదాలు ఇబ్ను మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) చెప్పినవి.
ఇబ్ను ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం:
“దుశ్శకునం తన పనికి అడ్డు పడిందని ఎవడు నమ్ముతాడో అతడు షిర్క్ చేసినట్టు”.
దాని పరిహారం ఏమిటని అడిగినప్పుడు:
« اللَّهُمَّ لَا خَيْرَ إِلَّا خَيْرُكَ وَلَا طَيْرَ إِلَّا طَيْرُكَ، وَ، وَلَا إِلهَ غَيْرُكَ »
“అల్లాహుమ్మ లా ఖైర ఇల్లా ఖైరుక. వలా తైర ఇల్లా తైరుక. వలాఇలాహ గైరుక” అనండి అని తెలిపారు.
(అర్ధం: నీ మంచి తప్ప మంచి ఎక్కడా లేదు. నీ శకునం తప్ప శకునం ఎక్కడా లేదు. నీ తప్ప సత్యమైన ఆరాధ్యుడు ఎవడూ లేడు). (అహ్మద్).
“నిన్ను పని చేయనిచ్ఛేది లేక పనికి అడ్డుపడేది దుశ్శకునం” అని ఫజ్‌ల్‌బిన్ అబ్బాసు (రదియల్లాహు అన్హు) అన్నారు.
ముఖ్యాంశాలు:
తాత్పర్యం: (అల్లామా అస్-సాదీ) :
పక్షులతో, పేర్లతో, పదాలతో, స్థలము వగైరాలతో అపశకునం పాటించుటను అరబిలో “తియర” అంటారు. అల్లాహ్ అపశకునమును నివారించి, దాన్ని పాటించేవారిని కఠినంగా హెచ్చరించాడు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఫాల్ అంటే ఇష్టపడేవారు. అపశకునమంటే అసహ్యించుకునేవారు.
అపశకునం మరియు ఫాల్‌లో వ్యత్యాసం ఏమనగా: ఫాల్ మానవుని విశ్వాసము, బుద్ధి, జ్ఞానములో లోపం కలుగచేయదు. అల్లాయేతరులపై మనస్సు లగ్నం విశ్వాసం, అల్లాహ్ పై నమ్మకముపై దెబ్బకొట్టింది. ఇలా (గీత గీయబడిన) రెండిట్లో లోపం కలుగ జేసింది అనడంలో ఏలాంటి సందేహం లేదు. ఆ తరువాత ఈ కారణంగా అతని మనస్సు బలహీనత, పిరికితనం, సృష్టిరాసులతో భయం ఎలా చోటు చేసుకుంటుందో అడుగకు. నిరాధారమైన వాటిని ఆధారంగా నమ్మి, అల్లాహ్ వైపు లగ్నం కాకుండా దూరమవుతాడు. ఇదంతయు ఏకత్వ విశ్వాస బలహీనత, అపనమ్మకము, షిర్క్ వాటి మార్గాల అనుసరణ, బుద్దిని చెడగొట్టే దురాచారాల వలన కలుగుతుంది.
రెండవది: అతడు ఆ ప్రభావాన్ని స్వీకరించడు. కాని అది తన ప్రభావాన్ని చూపి బాధ, చింతకు గురిచేస్తుంది. ఇది చూడడానికి మొదటిదానికంటే చిన్నది అయినా, అది చెడు, మానవునికి నష్టం. అతని మనస్సు బలహీనతకు కారణం మరియు అల్లాహ్ పై ఉండే నమ్మకంలో కూడా బలహీనత వస్తుంది. ఒకప్పుడు ఏదైనా ఇష్టములేని సంఘటన జరిగితే అది ఈ కారణంగానే అని భావిస్తాడు. అపశకునం పై అతని నమ్మకం మరీ రెట్టింపవుతుంది. ఒకప్పుడు పైన వివరించిన భాగంలో చేరే భయం కూడా ఉంటుంది.
అపశకునమును ఇస్లాం అసహ్యించుకునేదీ, దాన్ని పాటించేవారిని హెచ్చరించేదీ, అది ఏకత్వ విశ్వాసం మరియు అల్లాహ్ పై నమ్మకమును ఎలా వ్యతిరేకమో పై వివరణ ద్వారా మీకు తెలియవచ్చు.
ఇలాంటిది ఎవరికైనా సంభవించి, స్వభావికమైన ప్రభావాలు అతనిపై తమ ప్రభావాన్ని చూపుతే తను వాటిని దూరము చేయుటకు అన్ని రకాల ప్రయత్నాలు చేయాలి. అల్లాహ్ తో సహాయము కోరాలి. ఆ చెడు అతని నుండి దూరము కావాలంటే, ఏ విధంగా కూడా దాని వైపునకు మ్రొగ్గు చూప కూడదు.
నుండి: ఏకత్వపు బాటకు సత్యమైన మాట (అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్) – ఇమామ్ అస్-సాదీ [పుస్తకం]. తెలుగు అనువాదం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
You must be logged in to post a comment.