ఇది హిజ్రీ శకం 1411, మొహర్రం నెల 12వ తేదీన షేఖ్ అల్-ఉథైమీన్ (రహిమహుల్లాహ్) వారు ఇచ్చిన ఖుత్బా (ప్రసంగం). ఇది అరబిక్ భాషలో ప్రచురించబడింది మరియు దావూద్ బుర్ బాంక్ (రహిమహుల్లాహ్) ద్వారా ఆంగ్లంలోకి అనువదించబడింది.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
త్రాసును తేలికగా చేసే పాప కార్యాలు[5] – [మరణానంతర జీవితం – పార్ట్ 46] https://www.youtube.com/watch?v=wYTBaAwO2oE [24 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో, త్రాసును తేలికగా చేసే పాప కార్యాల గురించి వివరించబడింది. వీటిలో ముఖ్యంగా జ్యోతిష్కులను సంప్రదించడం, వారు చెప్పినది నమ్మడం, మరియు అలా చేయడం వల్ల కలిగే తీవ్రమైన పరిణామాలు (40 రోజుల నమాజ్ స్వీకరించబడకపోవడం, ఇస్లాంను తిరస్కరించినట్లు అవ్వడం) వంటివి హదీసుల ఆధారంగా చర్చించబడ్డాయి. అలాగే, మత్తుపానీయం సేవించడం యొక్క పాపం, దాని పర్యవసానాలు, మరియు పశ్చాత్తాపం యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పబడింది. ఇతరుల హక్కులను కాలరాయడం, వారి ఆస్తులను అన్యాయంగా తీసుకోవడం, మరియు ప్రళయ దినాన “దివాలా తీసిన వ్యక్తి”గా నిలబడటం గురించి హెచ్చరించబడింది. చివరగా, దుష్ప్రవర్తన సత్కార్యాలను ఎలా నాశనం చేస్తుందో, మరియు ఒక ముస్లిం పరువుకు భంగం కలిగించడం ఎంత పెద్ద పాపమో స్పష్టం చేయబడింది.
అస్సలాము అలైకుం వ’రహ్మతుల్లాహి వ’బరకాతుహు. అల్ హందులిల్లాహి వహ్ద వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బా’ద అమ్మా బాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. మనం త్రాసును తేలికగా చేసే పాప కార్యాల గురించి తెలుసుకుంటూ ఉన్నాము.
8. జ్యోతిష్కునితో ఏదైనా ప్రశ్న అడగడం
అందులో ఎనిమిదవ విషయం, జ్యోతిషునితో ఏదైనా ప్రశ్న అడగడం.
మహాశయులారా! ఈ రోజుల్లో మన సమాజంలో స్వయంగా వారి భవిష్యత్తు ఏమిటో వారికి తెలియకుండానే ప్రజల భవిష్యత్తు చెప్పడానికి ఫుట్‌పాత్‌ల మీద, వేరే కొన్ని ప్రదేశాలలో, మరి కొందరు హై-ఫై ఇంకా సౌకర్యాలతో కూడి ఉన్న స్థలాల్లో ఉన్నవారు ఫలానా రోజు అలా జరుగుతుంది, ఫలానా రోజు అలా జరుగుతుంది, నీ వివాహం తర్వాత ఇలా నీకు లాభం ఉంటుంది, నీ వివాహం తర్వాత నీకు ఇలా నష్టం ఉంటుంది, ఈ వ్యాపారం నీవు ప్రారంభిస్తే నీకు ఇందులో లాభం ఉంటుంది, నీకు ఇందులో నష్టం ఉంటుంది, ఈ విధంగా కొన్ని భవిష్య సూచనలు, కొన్ని విషయాలు చెప్పడం మనం అడపాదడపా వింటూనే ఉన్నాము.
వాటిలో అనేక విషయాలు అబద్ధం, అసత్యం అన్న విషయం మనలోని చాలా మందికి తెలుసు. కానీ అనేకమంది కొన్ని మూఢనమ్మకాలు, మూఢవిశ్వాసాలకు గురియై ఉంటారు. వారిపై ఏదైనా ఆపద, ఏదైనా పరీక్ష వచ్చిపడినప్పుడు, ఇలాంటి వారిని నమ్ముకొని, వారి వద్దకు వెళ్ళి తమ భవిష్యత్తు గురించి వారితో తెలుసుకుంటూ ఉంటారు. అయితే ఇలా భవిష్యత్తు గురించి వారిని ఏదైనా ప్రశ్నించడం, ఇది మహా పాప కార్యం. ఎంతటి పాప కార్యం అంటే దీనివల్ల మన ఇతర సత్కార్యాలు, ఇతర మంచి విషయాలు అన్నీ నశించిపోతాయి.
“ఎవరైనా జ్యోతిష్కుని వద్దకు వచ్చి వారిని ఏదైనా విషయం అడిగారంటే వారి యొక్క నలభై రోజుల నమాజ్ స్వీకరించబడదు.”
నలభై రోజుల నమాజ్. వారి యొక్క నలభై రోజుల నమాజ్ స్వీకరించబడదు అంటే ఎంత నష్టంలో ఆ మనిషి పడి ఉంటాడో గమనించవచ్చు.
9. జ్యోతిష్కుడు చెప్పిన దానిని నమ్మడం
అలాగే, తొమ్మిదవ విషయం, ఇలాంటి జ్యోతిషుల వద్దకు వచ్చి వారు చెప్పిన విషయాన్ని సత్యంగా నమ్మడం మరీ భయంకరమైన విషయం. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:
“ఎవరైతే ఇలాంటి జ్యోతిషుల వద్దకు, భవిష్యత్తు గురించి కొన్ని విషయాలు తెలుపుతాము అని అంటారో, వారి వద్దకు వచ్చి వారు ఏదైనా ఒక మాటను వారు సత్యంగా నమ్మితే, అలాంటి వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అల్లాహ్ యే ధర్మాన్ని అవతరింపజేశాడో దానిని తిరస్కరించినట్లు, దాని పట్ల అవిశ్వాసానికి పాల్పడినట్లు.”
అందుకు మహాశయులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. కేవలం ప్రశ్నించడం ద్వారా నలభై రోజుల నమాజు స్వీకరించబడదు. ఇక వారు చెప్పిన సమాధానాన్ని సత్యంగా భావిస్తే అవిశ్వాసానికి పాల్పడినట్లు అవుతుంది. ఇక అవిశ్వాసం వల్ల మన సత్కార్యాలు ఏ ఒక్కటి కూడా మిగలకుండా ఉండిపోతుంది కదా? చివరికి మన త్రాసు తేలికగా ఉండిపోతుంది.
10. మత్తు సేవించడం
ఇంకా మహాశయులారా, అలాంటి పాప కార్యాల్లో పదవ విషయం, మత్తు సేవించడం. ఈ రోజుల్లో ఎంతమంది మత్తు సేవిస్తూ ఉన్నారు. దీనివల్ల ఎంత పాపాన్ని ఒడిగట్టుకుంటున్నారు. అల్లాహ్ తో భయపడండి. ఆ సృష్టికర్తతో భయపడండి. ప్రళయ దినాన మనకు ఆయన ఇహలోకంలో ఏ ఆరోగ్యం ఇచ్చాడో, ఏ డబ్బు ధనం ఇచ్చాడో వీటన్నిటి గురించి ప్రశ్నిస్తాడు. అప్పుడు మనం ఏం సమాధానం చెప్పుకుందాం?
మన త్రాసును తేలికగా చేసే పాప కార్యాల్లో ఒకటి, పదవది, మత్తు సేవించడం. దీనికి సంబంధించిన హదీథ్ ఈ విధంగా ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:
“ఎవరైతే మత్తు సేవిస్తారో వారి యొక్క నలభై రోజుల నమాజ్ స్వీకరించబడదు. అతను తౌబా చేస్తే అల్లాహ్ తౌబా అంగీకరిస్తాడు.”
తౌబా అంటే తెలుసు కదా, అల్లాహ్ తో క్షమాపణ కోరడం, ఇక ఎన్నడూ అలాంటి పాపానికి ఒడిగట్టను అని శపధం చేసుకోవడం మరియు తిరిగి ఆ పాపాన్ని చేయకపోవడం. ఎవరైతే ఇలా మత్తు సేవిస్తారో వారి నలభై రోజుల నమాజ్ స్వీకరించబడదు. ఇక ఎవరైతే తౌబా చేస్తారో అల్లాహ్ అతని తౌబాను స్వీకరిస్తాడు.
“మళ్ళీ ఎవరు రెండవసారి మత్తు సేవిస్తాడో, ఇక ఆ తర్వాత తౌబా చేసుకుంటాడో, అల్లాహ్ అతని తౌబా స్వీకరిస్తాడు. మళ్ళీ ఎవరైతే మూడోసారి మత్తు సేవిస్తాడో మరియు మళ్ళీ తౌబా చేస్తాడో, అల్లాహ్ అతని తౌబా మూడవసారి కూడా స్వీకరిస్తాడు. కానీ అతను మళ్ళీ నాలుగోసారి అదే అలవాటుకు పాల్పడ్డాడు, ఆ తర్వాత మళ్ళీ అతను తౌబా చేస్తే, ఇక నాలుగోసారి అల్లాహ్ అతని తౌబాను స్వీకరించడు.“
మొదటిసారి అతను మత్తు సేవిస్తే నలభై రోజుల నమాజ్ స్వీకరించబడదు. తౌబా చేస్తే తౌబా స్వీకరించబడుతుంది. రెండవసారి మత్తు సేవిస్తే, రెండవసారి నలభై రోజుల నమాజ్ స్వీకరించబడదు. తౌబా చేస్తే తౌబా స్వీకరించబడుతుంది. మళ్ళీ మూడవసారి మత్తు సేవిస్తే నలభై రోజుల నమాజ్ స్వీకరించబడదు. మూడవసారి తౌబా చేస్తే అల్లాహ్ తౌబా స్వీకరిస్తాడు. కానీ మళ్ళీ నాలుగోసారి, మళ్ళీ నాలుగోసారి అదే మత్తు సేవించడానికి అలవాటు పడితే, ఇక ఆ తర్వాత తౌబా చేస్తే అల్లాహ్ అతని తౌబా స్వీకరించడు.
నాలుగోసారి మత్తు సేవించడానికి పాల్పడ్డాడు అంటే మళ్ళీ నలభై రోజుల నమాజ్ స్వీకరించబడదు. ఇక ఆ తర్వాత తౌబా చేస్తే తౌబా కూడా స్వీకరించబడదు. అంటే మూడుసార్లు అల్లాహ్ మనకు, అలాంటి పాపం చేసిన వారికి అవకాశం ఇచ్చాడు. నాలుగోసారి ఆ పాపానికి ఒడిగడితే అల్లాహ్ ఇక అతని తౌబా కూడా స్వీకరించడు.
ఏం జరుగుద్ది? అతను అదే స్థితిలో చనిపోయాడు అంటే అల్లాహ్ ప్రళయ దినాన అతనికి ఏమిస్తాడు? మహాశయులారా, భయపడండి అల్లాహ్ తో. నాలుగోసారి మళ్ళీ అతడు అలవాటు పడ్డాడు అంటే నలభై రోజుల నమాజ్ స్వీకరించబడదు, తౌబా చేస్తే తౌబా కూడా స్వీకరించబడదు. అల్లాహ్ అతనికి నహరుల్ ఖబాల్, అల్-ఖబాల్ అన్న నది నుండి వచ్చే ద్రవం త్రాగిపిస్తాడు. ఆ ఖబాల్ నది నుండి వచ్చే ద్రవం ఏంటిది, ఎలా ఉంటుంది, ఏమిటి అని అడిగినప్పుడు, అది నరకవాసుల పుండ్ల నుండి కారుతూ వచ్చిన చీము అని చెప్పడం జరిగింది.
ఎప్పుడైనా గమనించారా? మన శరీరంలో ఎక్కడైనా ఏదైనా పుండు ఉంది అంటే స్వయంగా మనం మన శరీరంలోని పుండు నుండి వచ్చే చీమును చూడడం, దాని యొక్క దుర్వాసనను మనం భరించలేం. ఇక నరకవాసుల వారి యొక్క పుండ్ల నుండి కారుతున్న చీము వారికి త్రాగడానికి ఇవ్వడం జరుగుతుంది అంటే ఇకనైనా మత్తు సేవించడాన్ని మానుకుంటారు అని నేను ఆశిస్తున్నాను. ఇలా మానుకునే సద్భాగ్యం అల్లాహ్ ఈ త్రాగే వారందరికీ, మత్తు సేవించే వారందరికీ అల్లాహ్ తౌబా చేసుకునే సద్భాగ్యం ప్రసాదించాలి అని అల్లాహ్ తో వేడుకుంటున్నాను.
11. ప్రజల సొమ్మును కాజేయడం
మహాశయులారా, ప్రళయ దినాన త్రాసును తేలికగా చేసే పాపాల్లో 11వ విషయం, ప్రజల సొమ్మును కాజేసుకోవడం, ప్రజల సొమ్ము తినివేయడం. ఇది కూడా మహా పాపం.
మహాశయులారా, త్రాసును తేలికగా చేసే పాప కార్యాల్లో 11వ విషయం, ఇతరుల సొమ్మును కాజేయడం, వారిపై దౌర్జన్యం చేయడం. దీనికి సంబంధించిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీథ్ ఏమిటంటే, ఒక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రశ్నించారు:
أَتَدْرُونَ مَنِ الْمُفْلِسُ (అతద్రూన మనిల్ ముఫ్లిస్) “ముఫ్లిస్ (దివాలా తీసినవాడు) అంటే ఎవరో మీకు తెలుసా?”
అప్పుడు సహచరులు అన్నారు:
الْمُفْلِسُ فِينَا مَنْ لاَ دِرْهَمَ لَهُ وَلاَ مَتَاعَ (అల్-ముఫ్లిసు ఫీనా మన్ లా దిర్హమ లహు వలా మతా’అ) “ప్రవక్తా, మాలోని బీదవాడు ఎవరంటే ఎవరి వద్దనైతే ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, ప్రపంచ సామాగ్రి ఏమీ లేదో అలాంటి వారు”
అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:
నా అనుచర సంఘంలోని బీదవారు ఎవరంటే, ప్రళయ దినాన నమాజ్, జకాత్, ఉపవాసాలు, నమాజ్, జకాత్ (విధిదానాలు), రోజా (ఉపవాసాలు), వీటన్నిటినీ తీసుకుని వస్తాడు.
وَيَأْتِي قَدْ شَتَمَ هَذَا وَقَذَفَ هَذَا وَأَكَلَ مَالَ هَذَا وَسَفَكَ دَمَ هَذَا وَضَرَبَ هَذَا (వ య’తీ ఖద్ షతమ హాదా, వ ఖదఫ హాదా, వ అకల మాల హాదా, వ సఫక దమ హాదా, వ దరబ హాదా)
“ఇంకా ప్రళయ దినాన ఆ వ్యక్తి ఎలా వస్తాడు అంటే, ఎవరినైనా దూషించి, ఎవరిపైనైనా అపనింద వేసి, ఎవరి సొమ్ము అపహరించి, ఎవరినైనా హత్య చేసి, ఎవరినైనా కొట్టి…“
ఈ విధంగా ప్రజలలో ఎందరి పట్ల ఎన్నో రకాల అన్యాయాలకు గురియై ప్రళయ దినాన హాజరవుతాడు. అతని వెంట నమాజ్, విధిదానాలు, ఉపవాసాలు ఉన్నాయి, కానీ ఇలాంటి పాపాలు కూడా ఉన్నాయి. అప్పుడు ఏం జరుగుద్ది? వారందరూ, ఇతని నుండి ఎవరెవరికి ఏయే అన్యాయం జరిగిందో, వారందరూ హాజరవుతారు మరియు అల్లాహ్ వద్ద ఇతని గురించి షికాయత్ చేసినప్పుడు, ఇతని గురించి అల్లాహ్ వద్ద అడిగినప్పుడు, అల్లాహు త’ఆలా అతని యొక్క సత్కార్యాలన్నీ కూడా వారి వారిపై జరిగిన అన్యాయానికి సమానంగా వారికి ఇచ్చేస్తాడు.
ఆ తర్వాత, ఇతని వద్ద సత్కార్యాలన్నీ కూడా మిగలకుండా అయిపోయినప్పుడు, ఇంకా ఎన్నో కేసులు మిగిలి ఉన్నప్పుడు, వారిపై జరిగిన అన్యాయానికి సమానంగా వారి పాపాలు తీసుకుని ఇతనిపై వేయడం జరుగుతుంది మరియు ఇతన్ని నరకంలో పంపడం జరుగుతుంది. గమనించారా? నమాజులు ఉన్నాయి, ఉపవాసాలు ఉన్నాయి, ఇంకా ఎన్నో రకాల విధిదానాలు, దానధర్మాలు ఉన్నాయి. కానీ కొట్టడం, తిట్టడం, అపనింద వేయడం, ఈ రకంగా ఎన్నో పాపాలకు గురి అయినందుకు వారందరూ కూడా వచ్చి ఇతనికి వ్యతిరేకంగా అల్లాహ్ వద్ద కేసు పెట్టినప్పుడు, ఇతని సత్కార్యాలన్నీ వారికి ఇవ్వడం జరుగుతుంది. సత్కార్యాలన్నీ ఇచ్చినప్పటికీ ఇంకా కొన్ని కేసులు మిగిలి ఉంటే, వారి యొక్క పాపాలు ఇతనిపై వేయబడి, ఇతన్ని నరకంలో పంపడం జరుగుతుంది. ఎంత నష్టం అవుతుందో కదా? అల్లాహ్ యొక్క ఎంత గొప్ప అనుగ్రహం, ఇలాంటి పరిస్థితులు రానున్నాయి, అందు గురించి ఇహలోకంలోనే జాగ్రత్త పడి అక్కడికి వచ్చే ప్రయత్నం చేయండి అని మనకు చెప్పడం జరుగుతుంది.
ఈ విధంగా మహాశయులారా, ఎవరైతే ఇలాంటి అన్యాయాలకు పాల్పడతారో, ఇహలోకంలోనే వారి యొక్క ఆ హక్కు చెల్లించేసేయాలి. మన వద్ద చెల్లించడానికి ఏమీ లేకుంటే, కనీసం వారితో కలిసి, వారితో మాఫీ చేయించుకోవాలి. లేదా అంటే ప్రళయ దినాన ఇలాంటి ఘోరమైన శిక్షకు గురి కావలసి వస్తుంది, ప్రళయ దినాన మన యొక్క త్రాసు అనేది తేలికగా అయిపోతుంది.
తిర్మిజీలోని ఒక హదీథ్ లో ఉంది, ఒక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని హజ్రత్ అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించారు:
“అల్లాహ్ ఆ మనిషిని కరుణించు గాక, అతని ద్వారా ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగింది అంటే అతను వారితో క్షమాపణ కోరి లేదా వారికి ఏదైనా ఇచ్చే హక్కు ఉండేది ఉంటే ఇచ్చేసి ఇహలోకంలోనే ఎలాంటి బరువు లేకుండా, ఎలాంటి ఒకరిపై అన్యాయం లేకుండా ఉంటాడో, ఈ విధంగా ప్రళయ దినాన అతను కలుసుకున్నప్పుడు అల్లాహ్ యొక్క కరుణా కటాక్షాలను పొందుతాడు. కానీ ఎవరైతే ఇలా కాకుండా ప్రజల పట్ల అన్యాయాలకు గురి అయి వస్తాడో, ప్రళయ దినాన అల్లాహు త’ఆలా ఇతని పుణ్యాలు ఆ బాధితులకు ఇచ్చేస్తాడు. ఇతని వద్ద పుణ్యాలు లేనిచో, బాధితుల నుండి వారిపై జరిగిన అన్యాయానికి సమానంగా పాపాలు తీసుకుని ఇతనిపై వేయడం జరుగుతుంది.”
అందుగురించి మహాశయులారా, అన్ని స్థితుల్లో అల్లాహ్ తో భయపడుతూ ఉండాలి. ఎక్కడ ఎవరు ఏమీ చూడడం లేదు అని భావించకుండా మనం అన్ని రకాల సత్కార్యాల్లో ముందుకు ఉండాలి. ఎవరిపై కూడా ఎలాంటి అన్యాయం చేయకుండా జాగ్రత్త పడాలి.
ప్రజల పట్ల ఏదైనా అన్యాయం చేయడం, ఇది ఎంత భయంకరమైన పాపమో మన యొక్క సలఫె సాలెహీన్ రహిమహుముల్లాహ్ చాలా మంచి విధంగా గ్రహించేవారు. అందుకే సుఫ్యాన్ అస్-సౌరీ రహమహుల్లాహ్ ఒక సందర్భంలో చెప్పారు:
“నా మధ్య, అల్లాహ్ మధ్య 70 పాపాలు ఉండడం, నాకు, నా మధ్య మరియు నాలాంటి మనుషుల మధ్య ఒక్క పాపం ఉండడం కంటే ఎంతో ఇష్టమైనది. ఎందుకంటే నా మధ్య నా ప్రభువు మధ్య ఉండే పాపాల గురించి నేను డైరెక్ట్ గా క్షమాపణ కోరుకుంటే అది మన్నించడం జరుగుతుంది. కానీ నా మధ్య మరియు నాలాంటి దాసుని మధ్య ఉన్న పాపం అది నేను అల్లాహ్ తో క్షమాపణ కోరుకుంటే క్షమించబడదు. వెళ్ళి అతనితో క్షమాపణ కోరుకోవాలి, లేదా అతనికి ఏదైనా హక్కు ఇచ్చేది ఉంటే తప్పకుండా ఇవ్వాలి.”
ఇక ఇక్కడ ఒక విషయం గమనించండి మీరు కూడా. ఏ ఇస్లాం ధర్మం అయితే ఇతరులకు ఏ బాధ కలిగించకుండా, ఇతరులపై ఏ అన్యాయం చేయకుండా ప్రళయ దినాన హాజరు కావాలి అని నేర్పుతుందో, ఆ ఇస్లాం ధర్మం, ఇస్లాంకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాల్లో ఏయే అభాండాలు మోపడం జరుగుతుందో వాటన్నిటి శిక్షణ ఇస్లాం ఇస్తుంది అని చెప్పగలమా? బుద్ధి జ్ఞానంతో మనం గ్రహిస్తే, సోదరులారా, సోదరీమణులారా, సామాన్య జీవితంలో మామూలీ చిన్నపాటి ఏ అన్యాయానికి కూడా ఇస్లాం మనకు అనుమతి ఇవ్వదు. ఎందుకంటే దీనివల్ల ప్రళయ దినాన మన త్రాసు బరువు తగ్గిపోతుంది అని హెచ్చరించడం జరుగుతుంది.
ఇక యుద్ధ మైదానంలో ఉన్నప్పటికీ కూడా, యుద్ధంలో శత్రువులు మన ముంగట ఉన్న ఉండి, యుద్ధాలు జరుగుతున్నప్పుడు కూడా ఏ ఒక్కరి పట్ల అన్యాయంగా ప్రవర్తించకుండా ఉండడానికి కూడా ఇస్లాం మనకు శిక్షణ ఇచ్చి ఉంది.
హజ్రత్ ముఆద్ ఇబ్ను అనస్ రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖనం ప్రకారం, “మేము ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వెంట ఒక యుద్ధంలో ఉన్నాము. ఆ యుద్ధంలో ఒక సందర్భంలో ఒకచోట మజిలీ చేయడం అవసరం పడింది. అయితే అప్పుడు ప్రవక్తతో ఉన్న ప్రజల్లో కొంతమంది దారిలో ప్రజలు నడిచేటువంటి దారిలో సైతం తమ యొక్క గుడారాలు వేసుకొని, ప్రజలకు నడవడంలో ఇబ్బంది కలిగే అటువంటి విధంగా ప్రవర్తించడం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూశారు.” ఏం చెప్పారు అప్పుడు?
గమనించండి. ఈ రోజుల్లో సిటీలలో ప్రజలు నడిచే దారిని కూడా ఆక్రమించుకోవడం జరుగుతుంది. ఆ రోజుల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యుద్ధ మైదానంలో ఉన్నారు. ఎడారిలో. కానీ ప్రజలు అడపాదడపా వచ్చిపోయే దారిలో గుడారాలు వేసుకొని, టెంట్ వేసుకొని ప్రజలకు నడవడంలో ఇబ్బంది కలిగే విధంగా ఉండడాన్ని కూడా ఇష్టపడలేదు. అదే సందర్భంలో ఎలాంటి ఆదేశం జారీ చేశారో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు: “ఎవరైతే ప్రవక్తతో యుద్ధంలో పాల్గొన్నాము, చాలా పుణ్యాలు మనం పొందుతాము అన్నటువంటి సంతోషంలో పడి ఉన్నారో కానీ దారిలో ఏదైనా గుడారం వేసి, టెంట్ వేసి ప్రజలకు నడిచే దారిలో వారికి ఇబ్బంది కలుగజేస్తున్నారో, అలాంటి వారికి ఆ యుద్ధం యొక్క ఏ పుణ్యమూ లభించదు.” ఏ పుణ్యమూ లభించదు అంటే ఏమిటి? యుద్ధం పాల్గొనే యొక్క గొప్ప పుణ్యం ఏదైతే ఉందో, దానిని ఇలాంటి చిన్నపాటి అన్యాయం అని అనుకుంటారు కావచ్చు, మరికొందరైతే దీనిని ఏ అన్యాయము అని కూడా భావించరు కావచ్చు, అలాంటి విషయాన్ని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహించడం లేదు.
అందుగురించి మహాశయులారా, మనం ప్రజల పట్ల ఉత్తమ రీతిలో ప్రవర్తించాలి. వారిపై మన నుండి ఏ ఒక్క చిన్నపాటి అన్యాయం ఉండకూడదు లేదా అంటే ప్రళయ దినాన మనం చాలా నష్టపోయే వారిలో కలుస్తాము.
12. దుష్ప్రవర్తన
ప్రళయ దినాన మన త్రాసు తేలికగా అయ్యే పాప కార్యాల్లో 12వ విషయం, దుష్ప్రవర్తన.
త్రాసును బరువుగా చేసే సత్కార్యాలలో సత్ప్రవర్తన అని విన్నాము కదా? అయితే త్రాసును తేలికగా చేసే దుష్కార్యాల్లో దుష్ప్రవర్తన.
దుష్ప్రవర్తనకు సంబంధించిన విషయం మనం ఎప్పుడైతే సత్ప్రవర్తన గురించి విన్నామో, అక్కడ ఒక హదీసు విన్నాము. అదేమిటంటే అల్లాహ్ కు ప్రియమైన వారిలో, ఎవరైతే ప్రజల పట్ల ప్రయోజనకరంగా జీవిస్తారో మరియు అల్లాహ్ కు ఇష్టమైన ప్రియమైన కార్యాల్లో ఒక ముస్లింని సంతోషపెట్టడం, వారిపై ఏదైనా అప్పు ఉంటే అప్పు చెల్లించడంలో సహాయం చేయడం, వారికి ఏదైనా కష్టం ఉంటే ఆ కష్టం తొలగిపోవడంలో వారికి సహాయం చేయడం, ఈ విధంగా ఎన్నో విషయాలు వింటూ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు అని కూడా మనం విన్నాము: “నేను నా ఈ మస్జిద్ లో ఏతెకాఫ్ చేయడం కంటే నా యొక్క సోదరుని అవసరాన్ని తీర్చడం నాకు ఎక్కువ ఇష్ట కార్యం.”
ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:
వినండి, నిశ్చయంగా దుష్ప్రవర్తన మీ సర్వ సత్కార్యాలను భస్మం చేసేస్తుంది. మీ సర్వ సత్కార్యాల సత్ఫలితాన్ని నశింపజేస్తుంది, ఎలాగైతే వెనిగర్ తేనె యొక్క తీపిని నశింపజేస్తుందో.
ఒకసారి అనుభవించి చూడండి, ఎంత క్వాలిటీ గల, స్వచ్ఛమైన, ఎలాంటి కలుషితం లేకుండా తేనె మీ వద్ద ఉన్నా, అందులో మీరు వెనిగర్ కలిపారంటే, ఆ వెనిగర్ అనేది ఆ తేనెపై ఎంత దుష్ప్రభావం చూపుతుందో, అలాగే మీ దుష్ప్రవర్తన అనేది మీ సర్వ సత్కార్యాలను నశింపజేస్తుంది.
అందు గురించి మహాశయులారా, మనం ఒకరి పట్ల దుష్ప్రవర్తన ప్రవర్తించకూడదు. ప్రతి ఒక్కరితో ఉత్తమంగా ప్రవర్తించే ప్రయత్నం చేయాలి. ఇంట్లో భార్యాభర్తల్లో గాని, తల్లిదండ్రులు పిల్లలతో గాని, పిల్లలు తల్లిదండ్రులతో గాని, పరస్పరం సోదర సోదరీమణులు ఒకరి పట్ల ఒకరు, ఈ విధంగా ఇంటి బయటికి వెళ్ళిన తర్వాత ప్రజల పట్ల కూడా మన వ్యవహారం చాలా ఉత్తమంగా ఉండాలి.
13. ముస్లిం పరువుకు భంగం కలిగించడం
ప్రళయ దినాన మన త్రాసును తేలికగా చేసే దుష్కార్యాల్లో 13వ విషయం, ముస్లిం యొక్క, ఒక విశ్వాసునిపై ఏదైనా అపనింద వేసి అతన్ని అవమాన పాలు చేయడం.
మహాశయులారా, ఇది చూడడానికి చిన్న విషయం కానీ, మహా భయంకరమైన పాపం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు:
“ఒక ముస్లింను అన్యాయంగా, అక్రమంగా అవమానించడం ఇది వడ్డీలో అతి భయంకరమైన భాగం“
అంటే ఏమిటి? వడ్డీ ఎలాగైతే పుణ్యాన్ని నశింపజేస్తుందో, ఆ విధంగా ఒక ముస్లింపై మనం ఏదైనా అపనింద వేసాము, అతన్ని అవమాన పాలు చేసాము అంటే ఈ రకంగా మనకు చాలా నష్టం కలుగుతుంది. ఇది కూడా దుష్ప్రవర్తనలో వచ్చేస్తుంది, సత్ప్రవర్తనకు వ్యతిరేకంగా ఉంటుంది.
అల్లాహు త’ఆలా మనందరికీ కూడా మన త్రాసును బరువు చేసే సత్కార్యాలు చేసే భాగ్యం ప్రసాదించి, త్రాసును తేలికగా చేసే దుష్కార్యాల నుండి దూరం ఉండే భాగ్యం ప్రసాదించు గాక. జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వ’రహ్మతుల్లాహి వ’బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
త్రాసును తేలికగా చేసే పాప కార్యాలు(3) – ‘చూపుగోలుతనం’ లేదా ప్రదర్శనా బుద్ధి (రియా) [మరణానంతర జీవితం – పార్ట్ 44] https://www.youtube.com/watch?v=gOF9pfhteUE [21 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో ప్రళయ దినాన కర్మల త్రాసును తేలికపరిచే పాప కార్యాల గురించి వివరించబడింది. ముఖ్యంగా, ‘చూపుగోలుతనం’ లేదా ప్రదర్శనా బుద్ధి (రియా) అనే పాపంపై దృష్టి సారించారు. అల్లాహ్ కోసం కాకుండా ఇతరుల ప్రశంసలు, పేరు ప్రఖ్యాతుల కోసం చేసే సత్కార్యాలను అల్లాహ్ తిరస్కరిస్తాడని ఒక హదీథ్ ద్వారా స్పష్టం చేయబడింది. దీని తీవ్రతను వివరిస్తూ, అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించిన ఒక సుదీర్ఘ హదీథ్ ను ప్రస్తావించారు. దాని ప్రకారం, ప్రళయ దినాన అల్లాహ్ ముందు తీర్పు కోసం నిలబెట్టబడే తొలి ముగ్గురు: ఖురాన్ పారాయణం చేసినవాడు, ధనాన్ని దానం చేసినవాడు మరియు అల్లాహ్ మార్గంలో పోరాడినవాడు. అయితే, వీరు తమ కార్యాలను ప్రజల మెప్పు కోసం చేసినందున, వారి సత్కార్యాలు నిరర్థకమై, నరకాగ్నికి గురవుతారు. ఈ హదీథ్ విని ముఆవియా (రదియల్లాహు అన్హు) తీవ్రంగా ప్రభావితమై, సూరహ్ హూద్ లోని ఆయతులను పఠించిన వృత్తాంతాన్ని కూడా వివరించారు. దానధర్మాలు, హజ్-ఉమ్రా, ఖుర్బానీ వంటి అనేక ఆచరణలలో ప్రదర్శనా ధోరణుల పట్ల జాగ్రత్త వహించాలని ప్రసంగం ముగుస్తుంది.
అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు. అల్హమ్దులిల్లాహి కఫా, వస్సలాతు వస్సలాము అలా ఇబాదిల్లజీ నస్తఫా, అమ్మా బాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.
ప్రళయ దినాన త్రాసును బరువుగా చేసే సత్కార్యాలు ఏమిటో ఈ శీర్షికలోని ఒక ముఖ్య విషయం, ఏ పాప కార్యాల వల్ల మన త్రాసు తేలికగా అయి మీదికి లేసిపోతుందో, బరువుగా ఉండదో, అలాంటి పాప కార్యాల గురించి మనం తెలుసుకుంటున్నాము.
మొదటి విషయం కుఫ్ర్, షిర్క్ మరియు ధర్మభ్రష్టత. వాటిలోని కొన్ని భాగాలను మనం తెలుసుకున్నాము. రెండవది చూపుగోలుతనం.
[2] చూపుగోలుతనం (ప్రదర్శనా బుద్ధి)
మీకు గుర్తుండాలి, త్రాసును బరువుగా చేసే సత్కార్యాలలో ఇఖ్లాస్, సంకల్ప శుద్ధి అని మనం తెలుసుకున్నాము. దానికి అపోజిట్, విరుద్ధమైన విషయం చూపుగోలుతనం. పేరు ప్రఖ్యాతులు పొందడానికి ఏదైనా సత్కార్యం చేయడం. ఇది మన ఆ సత్కార్య సత్ఫలితాన్ని మట్టిలో కలుపుతుంది. ఈ విధంగా ఆ చేసిన సత్కార్యం పుణ్యాల త్రాసులో ఉండి బరువుగా ఉండేదానికి బదులుగా పాపంలో లెక్కించబడుతుంది, త్రాసు తేలికగా అయిపోతుంది.
ఒకసారి ఈ హదీథ్ పై మీరు కూడా శ్రద్ధ వహించండి. అల్లాహ్ త’ఆలా తెలియజేశాడని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు.
مَنْ عَمِلَ عَمَلاً أَشْرَكَ فِيهِ مَعِي غَيْرِي تَرَكْتُهُ وَشِرْكَهُ [మన్ అమిల అమలన్ అష్రక ఫీహి మ’ఈ గైరీ, తరక్తుహు వ షిర్కహు] ఎవరైతే ఏదైనా కార్యం సత్కార్యం చేస్తాడో, అందులో నాతో పాటు ఇతరులను భాగస్వామిగా చేస్తాడో, నేను అతడిని అతడి భాగస్వామిని అన్నిటిని వదిలేస్తాను, అలాంటి సత్కార్య అవసరం నాకు లేదు, దాని యొక్క సత్ఫలితం కూడా నేను అతనికి ప్రసాదించను.
ఎంత నష్టం గమనించండి. అల్లాహ్ సంతృష్టి కొరకు మనం ఆ కార్యం చేయకుండా, దాని యొక్క లాభం ఇహలోకంలో ఎవరితోనైనా పొందాలి అన్నటువంటి ఉద్దేశంతో చేస్తే ఎంత నష్టానికి మనం గురి అవుతున్నాము.
ప్రళయదినాన తీర్పు ఇవ్వబడే తొలి ముగ్గురు
ఇంకా మహాశయులారా, ఈ హదీథ్ సహీ ముస్లిం షరీఫ్ లోనిది. కానీ ఇంతకంటే మరీ ఘోరమైన, ఇంతకంటే మరీ ఘోరమైన గతి, ఈ ప్రదర్శనా బుద్ధితో, చూపుగోలుతనంతో పేరు ప్రఖ్యాతుల గురించి ఏదైనా సత్కార్యం చేశామంటే ఎలాంటి శిక్షను ఎదుర్కోవలసి వస్తుందో, ఎలాంటి నరకంలో పడవలసి వస్తుందో మీరు ఈ హదీథ్ ద్వారా వినే ప్రయత్నం చేసి అర్థం చేసుకోండి.
జామె తిర్మిజీలో వివరంగా ఈ హదీథ్ ఉంది. పోతే దీని యొక్క కొన్ని భాగాలు సంక్షిప్తంగా సహీ ముస్లిం షరీఫ్ లో కూడా ఉంది. జామె తిర్మిజీ హదీథ్ నెంబర్ 2382.
షుఫయ్యా అల్ అస్బహీ రహిమహుల్లాహ్ ఉల్లేఖనం ప్రకారం, నేను మదీనా తయ్యిబా నగరానికి వచ్చాను. మస్జిద్-ఎ-నబవీలో ఒక వ్యక్తి చుట్టూనా చాలామంది పోగై ఉన్నారు. ఆ మధ్యలో ఉన్న వ్యక్తి అందరికీ ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీథులు వినిపిస్తున్నారు. నేను కూడా చోటు చేసుకొని అతనికి దగ్గరగా కూర్చున్నాను. హదీథులు వినిపించడం సమాప్తం అయ్యాక, ఒక్కొక్కరు ప్రజలందరూ కూడా లేచి పోయ్యాక, ఆయన ఒంటరిగా అయిన తర్వాత నేను ఆయనతో అడిగాను, నేను అల్లాహ్ యొక్క ప్రమాణం చేసి నిన్ను అడుగుతున్నాను, నీవు స్వయంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తో విని, అర్థం చేసుకొని, గ్రహించి ఉన్న ఏదైనా హదీథ్ ఉంటే నాకు వినిపించండి అని.
అప్పుడు హజ్రత్ అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు, “సరే మంచిది, నేను స్వయంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తో నా చెవులతో విన్న ఒక హదీథ్ ను, అర్థం చేసుకున్న హదీథ్ ను నీకు వినిపిస్తాను” అని అన్నారు. ఒక కేక వేశారు, స్పృహ తప్పి పడిపోయారు. కొంతసేపటి తర్వాత ఆయన, మరోసారి, “నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో విన్న హదీథ్ ను, దానిని అర్థం చేసుకున్న హదీథ్ ను నీకు వినిపిస్తాను” అని అన్నారు. కేక వేశారు, మళ్లీ స్పృహ తప్పారు. మరి కొంత సేపటికి తర్వాత ఆయన మూడోసారి అలాగే అని, మూడోసారి కూడా స్పృహ తప్పారు.
ఇక ఆ తర్వాత అతను స్పృహ స్థితి నుండి బయటికి వచ్చి, ఏం చెప్పారు? “నేను మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఇంట్లో ఉండగా, అప్పుడు నేను తప్ప ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఇంకా ఎవరూ లేరు, నేను ఈ హదీథ్ ను విన్నాను” అని మళ్లీ ఒక కేక వేశారు, స్పృహ తప్పిపోయారు. ఇక నేను ఒకవేళ ఆయన్ని ఆనుకొని పట్టుకోకుంటే పడిపోయేవారు. కొంతసేపటి వరకు నేను అలాగే అతన్ని పట్టుకొని ఉన్నాను. ఆ తర్వాత ఆయన మేల్కొన్నారు. ఆ తర్వాత చెప్పారు: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు అని.
ప్రళయ దినాన అల్లాహ్ త’ఆలా ప్రజల మధ్యలోకి వస్తాడు, వారి యొక్క తీర్పు చేయడానికి. అప్పుడు ఇహలోకంలో ఎన్ని జాతులు, ఎన్ని కులాలు, ఎవరెవరు ఎలా వచ్చారో అక్కడ ఎన్నో సంఘాలు, వారు తమ యొక్క మోకాళ్ళ మీద ఆ మహా మైదానంలో వచ్చి అల్లాహ్ యొక్క తీర్పు గురించి వేచిస్తూ ఉంటారు. అప్పుడు ఆ సందర్భంలో అల్లాహ్ త’ఆలా తొలిసారిగా ప్రజలందరి మధ్యలో నుండి ఒక వ్యక్తిని పిలుస్తాడు. అతడు ఎవడు? ఖురాన్ కంఠస్థం చేసిన వ్యక్తి, ఖురాన్ పారాయణం చేసే వ్యక్తి మరియు ఖురాన్ పట్ల శ్రద్ధ కలిగి ఉన్న వ్యక్తి.
అల్లాహ్ త’ఆలా ఆయన్ని పిలిచి, “నేను నీకు ఖురాన్ యొక్క విద్య ప్రసాదించాను కదా? నీవు దీనిని నమ్ముతావా? నా యొక్క ఈ అనుగ్రహాన్ని తిరస్కరిస్తావా?” అప్పుడు అతను అంటాడు, “లేదు ఓ అల్లాహ్, నేను తిరస్కరించను. నీవు నాకు ఈ అనుగ్రహాన్ని ప్రసాదించావు, నేను ఒప్పుకుంటాను.” అప్పుడు అల్లాహ్ అడుగుతాడు, “నా ఈ అనుగ్రహానికి బదులుగా నీవు ఎలాంటి కృతజ్ఞత తెలిపావు?” అప్పుడు అతను అంటాడు, “ఓ అల్లాహ్, నేను నీ కొరకే ఈ ఖురాన్ పారాయణం చేశాను. ప్రజలను ఈ ఖురాన్ వైపునకు ఆహ్వానించేవాణ్ణి, ప్రజలకు ఖురాన్ చదవడం నేర్పేవాణ్ణి.”
అప్పుడు అల్లాహ్ ఏమంటాడు? “నీవు అబద్ధం పలుకుతున్నావు, అసత్యం మాట్లాడుతున్నావు.” అప్పుడు దైవదూతలు కూడా అంటారు అతనితో, “నీవు అసత్యం పలుకుతున్నావు” అని. అప్పుడు అల్లాహ్ అంటాడు, “ఖురాన్ పారాయణం చేయడం, ప్రజలకు ఇది నేర్పడం, దీని యొక్క ఉద్దేశం నీది ఏమంటే ప్రజలు నిన్ను ఓ ఖారీ సాబ్, ఓ ఖారీ సాబ్ అని నీ పేరు ప్రఖ్యాతుల గురించి, ఇహలోకంలో గొప్ప పేరు సంపాదించాలన్న ఉద్దేశంతో నీవు చదివేవానివి. అల్లాహ్ ప్రసన్నత కొరకు కాదు.” ఓ అల్లాహ్, నీ కరుణా కటాక్షాలతో మమ్మల్ని ఇలాంటి వారిలో కలపకుండా కేవలం నీ సంతృష్టి కొరకు చదివే సద్భాగ్యుల్లో మమ్మల్ని కూడా చేర్చు ఓ అల్లాహ్.
“నీ ఉద్దేశం ఏముండే? నీవు ఇహలోకంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి ఖురాన్ చదివావు, ఖురాన్ పఠించావు, దానిని ఇతరులకు నేర్పావు. ప్రజలు నిన్ను చాలా మెచ్చుకున్నారు, అక్కడే నీ ఫలితం అయిపోయింది.”
ఆ తర్వాత, రెండో వ్యక్తిని అల్లాహ్ త’ఆలా పిలుస్తాడు ప్రజలందరి మధ్యలో నుండి. అతడు ఎవడు? అల్లాహ్ అతనికి చాలా డబ్బు, ధనం ప్రసాదించి ఉంటాడు. అల్లాహ్ అతని యొక్క అనుగ్రహాలను గుర్తు చేసి, “నీవు ఈ నా ఈ అనుగ్రహాలకు బదులుగా ఏమి ఆచరించావు? ఎలా కృతజ్ఞత తెలిపావు?” అని ప్రశ్నిస్తే, “ఓ అల్లాహ్, నీవు నాకు ఇచ్చిన ఈ అనుగ్రహాలన్నీ కూడా నేను ఒప్పుకుంటున్నాను. అయితే వీటిని నేను నీ మార్గంలో ఖర్చు పెట్టాను” అని అంటాడు. అప్పుడు అల్లాహ్ వైపు నుండి ఏం సమాధానం వస్తుంది? మళ్ళీ ఏం జరుగుతుంది? ఇన్షా అల్లాహ్ మనం తెలుసుకుందాము ఆ విషయాలు విందాము.
డబ్బు ధనాలు కలిగి ఉన్న వ్యక్తి ఒప్పుకుంటాడు. “నీవు నేను ప్రసాదించిన అనుగ్రహానికి బదులుగా ఎలా ఆచరించావు? ఏం చేశావు? ఏ కృతజ్ఞత తెలిపావు?” అని అంటే, “ఓ అల్లాహ్, నేను నీ మార్గంలో ఖర్చు పెట్టాను, బంధుత్వాలను పెంచుకునే ప్రయత్నం చేశాను, నీకు ఇష్టమైన మార్గాల్లో నా ఈ ధనాన్ని వెచ్చించాను.” అప్పుడు అల్లాహ్ త’ఆలా సమాధానం ఇస్తూ, “నీవు పేరు ప్రఖ్యాతుల గురించి, అరే ఇతను చాలా ఉదార మనసు మరియు ఎంతో మంచి బుద్ధి గలవాడు, ధనాన్ని ఖర్చు పెట్టేవాడు అని పేరు ప్రఖ్యాతుల గురించి నీవు ఖర్చు పెట్టావు. ఇహలోకంలో ప్రజలు కూడా నిన్ను మెచ్చుకున్నారు.” ఈ విధంగా అతనికి ఏ పుణ్యము, ఏ సత్ఫలితము ప్రసాదించడు.
మూడో వ్యక్తిని కూడా అల్లాహ్ త’ఆలా అందరి మధ్యలో నుండి తీసుకువస్తాడు. అల్లాహ్ అతనికి శక్తి, గొప్ప మేధ, బుద్ధి ప్రసాదించి ఉంటాడు. అతను అల్లాహ్ మార్గంలో పోరాడుతూ ఉంటాడు, పోరాడుతూ ఉంటాడు. “నేను నీకు ఇచ్చిన ఈ శక్తి సామర్థ్యాలను నీవు ఒప్పుకుంటున్నావా?” అంటే, “అవును ఓ అల్లాహ్, నేను ఒప్పుకుంటున్నాను.” “నీవు ఏం కృతజ్ఞత చెల్లించావు?” అని అంటే, “ఓ అల్లాహ్, నేను నీ మార్గంలో పోరాడాను” అని అతను సమాధానం ఇస్తాడు. అప్పుడు అల్లాహ్ అంటాడు, “నీవు అబద్ధం పలుకుతున్నావు.” దైవదూతలు కూడా అతనితో అంటారు, “నీవు అబద్ధం పలుకుతున్నావు. ఇహలోకంలో నీవు ఒక గొప్ప ధైర్యవంతునివి, చాలా గొప్పగా పోరాడే వానివి అని పేరు ప్రఖ్యాతుల గురించి ఇలా పోరాడావు.” అప్పుడు అల్లాహ్ త’ఆలా అతని యొక్క ఏ సత్కార్యాన్ని స్వీకరించడు. “నీవు అబద్ధం పలుకుతున్నావు” అని అంటాడు.
అబూ హురైరా చెప్పారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నా యొక్క మోకాళ్ళను ఇలా తట్టి, కొట్టి, “అబూ హురైరా, నీకు తెలుసా? అల్లాహ్ యొక్క సృష్టిలో తొలిసారిగా ఈ ముగ్గురిని ప్రశ్నించి, వారు అల్లాహ్ సంతృష్టి కొరకు ఆ సత్కార్యాలు చేయలేదు, పేరు ప్రఖ్యాతుల గురించే సత్కార్యాలు చేశారు గనుక వారి ఆ సత్కార్యాలని వృధా చేసి, ఎలాంటి సత్ఫలితం లేకుండా చేసి, నరకాగ్నిని ఈ ముగ్గురి ద్వారా మరింత ఎక్కువగా దహించడం జరుగుతుంది.”
అల్లాహ్ మనందరినీ కూడా నరక శిక్ష నుండి కాపాడు గాక. ఎప్పుడూ ఏ సత్కార్యం చేసినా గాని అల్లాహ్ తో పాటు ఇతరులను భాగస్వామిగా చేయకూడదు. అల్లాహ్ సంతృష్టి కాకుండా ఫలానా వారు, ఫలానా వారు నన్ను మెచ్చుకోవాలి, ఇహలోక పేరు ప్రఖ్యాతుల గురించి ఏదైనా చేయడం, ఇది మహా ఘోర పాపం. దీనివల్ల మన త్రాసు అనేది బరువుగా కాకుండా తేలికగా అయిపోతుంది అన్న విషయం ఈ హదీథ్ ల ద్వారా మనకు తెలిసింది.
ముఆవియా (రదియల్లాహు అన్హు) ప్రతిస్పందన
ఈ షుఫయ్యా రహిమహుల్లాహ్ ఎవరైతే అబూ హురైరా రదియల్లాహు అన్హు ద్వారా ఈ హదీథ్ ను విన్నారో, ఆయన హజ్రత్ ముఆవియా రదియల్లాహు త’ఆలా అన్హు గారి యొక్క బాడీగార్డ్ లలో ఒకరు. ఒక సందర్భంలో ముఆవియా రదియల్లాహు త’ఆలా అన్హు వద్దకు ఎవరో వచ్చారు. అప్పుడు షుఫయ్యా రదియల్లాహు అన్హు ఈ హదీథ్ ను కంప్లీట్ గా, సంపూర్ణంగా ఆ సందర్భంలో వినిపించారు. ఆ హదీథ్ ను విని హజ్రత్ ముఆవియా రదియల్లాహు త’ఆలా అన్హు ఏం చెప్పారు?
“ఖురాన్ ను చదివేవారు, చదివించేవారు, ధనభండారాలు అల్లాహ్ మార్గంలో ఖర్చు చేసేవారు మరియు అల్లాహ్ మార్గంలో పోరాడేవారు, వీరి యొక్క పరిస్థితి ఇలా ఉన్నది. వీరి ద్వారా నరకాగ్నిని దహించి వేయడం జరుగుతుంది అంటే, మరి మన పరిస్థితి ఏమవుతుందో కదా?” అని బాధపడుతూ ఉన్నారు. బాధ పడుతూ పడుతూ హజ్రత్ ముఆవియా రదియల్లాహు అన్హు కూడా స్పృహ తప్పిపోయారు. చాలా సేపటి తర్వాత ఎప్పుడైతే ఆయన మేల్కొన్నారో, ఖురాన్ యొక్క ఈ ఆయతులు పఠించారు.
ఖురాన్ సూరహ్ హూద్ యొక్క ఆయత్ నెంబర్ 15, 16 పఠించారు.
مَنۡ كَانَ يُرِيۡدُ الۡحَيٰوةَ الدُّنۡيَا وَزِيۡنَتَهَا نُوَفِّ اِلَيۡهِمۡ اَعۡمَالَهُمۡ فِيۡهَا وَهُمۡ فِيۡهَا لَا يُبۡخَسُوۡنَ ఎవరయితే ప్రాపంచిక జీవితం పట్ల, దాని అందచందాల పట్ల వ్యామోహితులవుతున్నారో అలాంటి వారికి వారి కర్మలను (వాటి ఫలితాన్ని) మేము ఇక్కడే పూర్తిగా ఇచ్చేస్తాము. ఇక్కడ (ప్రపంచంలో) వారికి ఏ లోటూ జరగదు. (11:15)
اُولٰٓئِكَ الَّذِيۡنَ لَيۡسَ لَهُمۡ فِى الۡاٰخِرَةِ اِلَّا النَّارُ ۖ وَحَبِطَ مَا صَنَعُوۡا فِيۡهَا وَبَاطِلٌ مَّا كَانُوۡا يَعۡمَلُوۡنَ అయితే అలాంటి వారికి పరలోకంలో అగ్ని తప్ప మరేమీ లభించదు. ప్రపంచంలో వారు చేసుకున్నదంతా వృథా అయిపోతుంది. వారు చేసే పనులన్నీ మిథ్యగా మారిపోతాయి. (11:16)
అల్లాహు అక్బర్, గమనించారా? ఎంత గొప్ప ఘోర విషయం. ప్రళయ దినాన వారికి అగ్ని తప్ప, నరకాగ్ని తప్ప ఇంకా వేరే ఏదీ లభించదు. ఇహలోకంలో వారు చేసినదంతా కూడా వృధా అయిపోతుంది. ఇక ముందుకు వారు ఏదైతే చేస్తూ ఉంటారో అదంతా కూడా వృధా అవుతుంది. పరలోకాన వారికి ఎలాంటి లాభం దాని ద్వారా చేకూర్చదు.
ముగింపు
అందుగురించే మహాశయులారా, అల్లాహ్ తో భయపడాలి. మనం ఏ సత్కార్యం చేసినా గాని కేవలం అల్లాహ్ యొక్క సంతృష్టి కొరకు చేయాలి మరియు ప్రదర్శనా బుద్ధి, పేరు ప్రఖ్యాతుల గురించి కాకుండా మనం అల్లాహ్ యొక్క అభీష్టాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా మహాశయులారా, ప్రళయ దినాన మన త్రాసు బరువు కాకుండా దాని యొక్క బరువు తగ్గిపోయి తేలికగా అయి మనకు స్వర్గంలో కాకుండా నరకంలో పోయేటువంటి పరిస్థితి రావడానికి ఒక ముఖ్య కారణం ఈ లోకంలో మనం చేసే సత్కార్యాలు కేవలం అల్లాహ్ సంతృష్టి కొరకు చేయడం కాకుండా ఇతరుల ప్రశంసలు అందుకోవడానికి, ఫలానా ఫలానా వారు మనల్ని మెచ్చుకోవాలని, ఇలా మనం చేస్తే మన పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి అని చేయడం మహా భయంకరం.
ఈ రోజుల్లో అనేకమంది దానధర్మాలు చేస్తూ ఉంటారు. ఎందుకు? ఏదైనా ఇలాంటి దానధర్మాలు చేస్తే రాయి మీద వారి పేరు రాయబడి చాలా కాలం వరకు అక్కడ పెట్టడం జరుగుతుంది, ఈ విధంగా వారిని గుర్తించడం జరుగుతుంది అని. మరికొందరు ఏదైనా మరో సత్కార్యం చేస్తారు మరియు దాని యొక్క ఫోటోలు తీసి ఫేస్ బుక్ లలో, వాట్సాప్ లలో, సోషల్ మీడియాలలో వేసి నేను ఇలా చేశాను అని చెప్పుకుంటారు. ఈ రోజుల్లో ఎంతోమంది హజ్ కు వెళ్తూ ఉంటారు, ఉమ్రాకు వెళ్తూ ఉంటారు. హజ్, ఉమ్రాల యొక్క ఎన్నో సందర్భాలలో ఫోటోలు తీసి ఫేస్ బుక్ లలో వేయడం, వాట్సాప్ గ్రూప్ లలో పంపడం. అలాగే మరికొందరు ఖుర్బానీ సందర్భాలలో మంచి మంచి జంతువులు కొని ప్రజల్లో వారి యొక్క పేరు రావాలి అని, దాని యొక్క ఫోటోలు తీసి సోషల్ మీడియాలో వేయడం, రమదాన్ మాసాల్లో ఇఫ్తార్ పార్టీలు ఇచ్చి వారి యొక్క పేరు ప్రఖ్యాతుల గురించి వాటి యొక్క ఫోటోలు తీసి గ్రూపులలో పంపడం.
అందరూ ఇలా చేసేవారు నవూజు బిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్, ఇలాంటి దుష్కార్యానికి పాల్పడుతున్నారు అని నేను చెప్పడం లేదు. కానీ అనేక మంది యొక్క ఉద్దేశాలు ఇంచుమించు ఇలాగా ఉంటున్నాయి. ఎవరైనా ఏదైనా కారణంగా ఒక నిరూపణ ఉండడానికి ఏదైనా చేస్తూ ఉంటే వారి యొక్క మన: సంకల్పాన్ని, వారి హృదయాంతరంలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని అల్లాహ్ యే బాగవుగా గుర్తెరుగుతాడు. కానీ ఈ రోజుల్లో సామాన్యంగా మీరు ఎవరిని అడిగినా గాని, “అరే, ఏంటి దీన్ని మీరు ఎందుకు ఫోటోలు తీసి వేశారు?” అంటే, “మన ఫ్రెండ్స్ చూస్తారు కదా, మంచి కామెంట్స్ ఇస్తారు కదా.” అయితే ఈ విధంగా మన యొక్క మన సంకల్పంలో అల్లాహ్ యొక్క అభీష్టం, అల్లాహ్ యొక్క సంతృష్టి తగ్గిపోవడం వల్ల మన యొక్క ఈ సత్కార్యాల సత్ఫలితాలు కూడా తగ్గిపోతున్నాయి. చివరికి మన యొక్క త్రాసులు బరువుగా కాకుండా తేలికగా అయిపోతున్నాయి.
అల్లాహ్ త’ఆలా మనందరికీ ఇలాంటి దుష్కార్యాల నుండి దూరం ఉంచుగాక. మన యొక్క త్రాసును తేలికగా చేసే మరికొన్ని పాపాల గురించి ఇన్షా అల్లాహ్ ఈ విధంగానే మనం తెలుసుకుంటూ ఉంటాము. మీరు ఈ కార్యక్రమాలను చూస్తూ ఉండండి. జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
త్రాసును తేలికగా చేసే పాప కార్యాలు[4] – [మరణానంతర జీవితం – పార్ట్ 45] https://www.youtube.com/watch?v=nMRENiqwyCw [21 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో, వక్త ప్రళయ దినాన మంచి పనుల త్రాసును తేలికగా చేసే వివిధ పాప కార్యాల గురించి వివరిస్తున్నారు. (3) ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాట కంటే ఇతరుల ఆదేశాలకు ప్రాధాన్యత ఇవ్వడం, (4) అల్లాహ్ క్షమించడని ఇతరుల గురించి ప్రమాణం చేయడం, (5) అసర్ నమాజ్‌ను వదులుకోవడం, (6) ఏకాంతంలో అల్లాహ్ నిషేధించిన కార్యాలకు పాల్పడటం మరియు (7) సరైన కారణం లేకుండా కుక్కను పెంచడం వంటివి ఇందులో ఉన్నాయి. ఈ చర్యలు కొండలంత పుణ్యాలను కూడా నాశనం చేసి, వాటిని దుమ్ము ధూళి వలె మార్చేస్తాయని ఖురాన్ మరియు హదీసుల ఆధారాలతో హెచ్చరించారు.
అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహి కఫా వస్సలాతు వస్సలాము అలా ఇబాదిల్లజీ నస్తఫా అమ్మాబాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.
[3] ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాట కంటే ఇతరుల ఆదేశాలకు ప్రాధాన్యత ఇవ్వడం
త్రాసును తేలికగా చేసే పాప కార్యాల గురించి మనం తెలుసుకుంటున్నాము. అందులో మూడవది, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాటపై, ఆయన ఆదేశంపై ఇతరుల ఆదేశాలకు ప్రాధాన్యత ఇవ్వడం.
మహాశయులారా! ఇది కూడా మహా ఘోరమైన పాపం. దీనివల్ల మన పుణ్యాలన్నీ కూడా, సత్కార్యాల సత్ఫలితాలన్నీ కూడా నశించిపోయి, మన త్రాసు అనేది తేలికగా అయిపోతుంది. సూరె హుజరాత్ ఆయత్ నెంబర్ ఒకటిలో అల్లాహు త’ఆలా విశ్వాసులందరికీ ఇచ్చిన ఆదేశం ఏమిటంటే,
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تُقَدِّمُوا بَيْنَ يَدَيِ اللَّهِ وَرَسُولِهِ (యా అయ్యుహల్లజీన ఆమనూ లా తుఖద్దిమూ బైన యదయిల్లాహి వ రసూలిహి) “విశ్వసించిన ఓ ప్రజలారా! అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను మించిపోకండి. ” (49:1)
మనం విశ్వాసులం, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఆదేశాలను అనుసరిస్తూ ఉండాలి. కానీ వారి కంటే ముందుగా, ఆదేశం లభించక ముందే తన మన ఇష్టానుసారం ఏదైనా చేయడానికి, ఆదేశం వచ్చిన తర్వాత దాన్ని అనుసరించకుండా మన అభిప్రాయాలను మనం అనుసరించడానికి ఏమాత్రం అనుమతి మనకు లేదు.
ఆ తర్వాత సూరె హుజరాత్‌లోని ఆయత్ నెంబర్ రెండును గమనించండి. అందులో ఇవ్వబడిన హెచ్చరిక ద్వారా భయ కంపితులై, అలాంటి చేష్టలకు గురి కాకుండా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం మనం చేయాలి.
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَرْفَعُوا أَصْوَاتَكُمْ فَوْقَ صَوْتِ النَّبِيِّ وَلَا تَجْهَرُوا لَهُ بِالْقَوْلِ كَجَهْرِ بَعْضِكُمْ لِبَعْضٍ أَن تَحْبَطَ أَعْمَالُكُمْ وَأَنتُمْ لَا تَشْعُرُونَ (యా అయ్యుహల్లజీన ఆమనూ లా తర్‌ఫఊ అస్వాతకుమ్ ఫౌఖ సౌతిన్నబియ్యి వలా తజ్‌హరూ లహూ బిల్ ఖౌలి కజహ్రి బఅదికుమ్ లి బఅదిన్ అన్ తహ్‌బత అఅమాలుకుమ్ వ అన్తుమ్ లా తష్ఉరూరున్) “ఓ విశ్వాసులారా! మీ కంఠస్వరాలను ప్రవక్త కంఠస్వరం కంటే పైన (హెచ్చుగా) ఉంచకండి. మీరు పరస్పరం బిగ్గరగా మాట్లాడుకునే విధంగా ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం తో బిగ్గరగా మాట్లాడకండి. దీనివల్ల మీ కర్మలన్నీ వ్యర్ధమైపోవచ్చు. ఆ సంగతి మీకు తెలియను కూడా తెలియదు..” (49:2)
ఓ విశ్వాసులారా! ప్రవక్త మాట కంటే, ప్రవక్త స్వరం కంటే మీ స్వరం అనేది ఎత్తుగా ఉండకూడదు. మరియు మీరు పరస్పరం ఎలానైతే ఒకరు మరొకరిని పిలుచుకుంటారో అలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ప్రవర్తించకండి. చివరికి మీరు, మీరు చేసే ఈ దుష్కార్యం వల్ల, మీరు ప్రవక్త స్వరంపై మీ స్వరాన్ని ఎత్తడం వల్ల, పరస్పరం మీరు ఎలా పిలుచుకుంటారో అలా ప్రవక్తను పిలవడం ద్వారా మీ సత్కార్యాలన్నీ కూడా వృధా అయిపోతాయి. అది మీకు తెలియకుండానే జరగవచ్చు. అంటే మీ పాపాల, మీ ఈ పాపం వల్ల మీ సత్కార్యాలు నశించిపోతున్నాయి అన్న విషయం మీకు తెలియకుండానే ఇదంతా జరగవచ్చు. అల్లాహు అక్బర్. ఎంత భయంకరమైన విషయమో గమనించండి.
ప్రవక్త స్వరంపై మన స్వరాన్ని ఎత్తడం, ప్రవక్త మాటపై మన మాటను పెంచడం, పరస్పరం పిలుచుకున్నట్లు ప్రవక్తను పిలవడం, దీనివల్ల మనకు తెలియకుండానే మన సత్కార్యాలు వృధా అవుతున్నాయి అంటే, ఇక ఎవరైతే తెలిసి తెలిసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశాన్ని విడనాడుతున్నారో, ప్రవక్త ఆదేశం ఒకటి ఉంది అంటే, తనకిష్టమైన నాయకుడు, తనకిష్టమైన ఇమామ్, తనకిష్టమైన పీర్, తనకిష్టమైన మౌల్వీ సాబ్, వారి యొక్క ఫత్వాలు ఇంకో రకంగా ఉంటే ప్రవక్తను వదిలేసి వారినే అనుసరిస్తున్నారో, వారి యొక్క సత్కార్యాలు వృధా కావా? అలాంటి వారు భయపడే అవసరం లేదా?
ఈ రోజుల్లో మనలోని ఎంతో మంది సోదరులు, ఒకవైపు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానం, మరోవైపు మన తాత ముత్తాతల విధానం, మన యొక్క దురాచారాలు, మన యొక్క గ్రామ చట్టాలు ఈ విధంగా ఉంటాయి. ప్రవక్తను వదిలేసి వాటిని అనుసరిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి వారు ఏ నష్టంలో పడరు అని ఏదైనా మన దగ్గర జమానత్ ఉందా? అందు గురించి మనం ఈ ఆయతులు చదివిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి.
[4] అల్లాహ్ ఫలానా వ్యక్తిని క్షమించడని ప్రమాణం చేయడం
మహాశయులారా! మన త్రాసును తేలికగా చేసే పాప కార్యాల్లో, అల్లాహ్ ఫలానా వ్యక్తిని క్షమించడు అని ప్రమాణం చేయడం. అల్లాహు అక్బర్. ఒకసారి ఈ హదీసును గ్రహించండి. హజ్రత్ జుందుబ్ రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఒక వ్యక్తి ఇలా అన్నాడు,
إِنَّ اللَّهَ لَا يَغْفِرُ لِفُلَانٍ (ఇన్నల్లాహ లా యగ్‌ఫిరు లి ఫులాన్) నిశ్చయంగా అల్లాహ్ ఫలానా వ్యక్తిని క్షమించడు, మన్నించడు.
అప్పుడు అల్లాహు త’ఆలాకు చాలా కోపం వచ్చింది. అల్లాహ్ ఆగ్రహానికి గురి అయ్యాడు. ఫలానా వ్యక్తిని నా అతనికి నా క్షమాపణ లభించదు అని, నా వైపు నుండి అతన్ని కరుణించడం జరగదు అని ప్రమాణాలు చేసేటువంటి అధికారం ఇతనికి ఎక్కడి నుండి వచ్చింది? నిశ్చయంగా నేను ఫలానా వ్యక్తిని క్షమించాను మరియు ఇలాంటి ప్రమాణాలు చేసే వ్యక్తి యొక్క సర్వ సత్కార్యాలను వృధా చేసేసాను. అల్లాహు అక్బర్. గమనించారా? ఎంత భయంకరమైన విషయమో.
అయితే మహాశయులారా, అల్లాహ్ యొక్క కరుణా కటాక్షాలను, మన్నింపు క్షమాపణలను మనం మన చేతిలో, మన అధికారంలో తీసుకోకూడదు. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తూ ఉంటే, “సోదరా! ఇలాంటి తప్పు చేసే వారిని అల్లాహ్ క్షమించడు అని తెలియజేయడం జరిగింది. ఇలాంటి పాపం చేసే వారిని అల్లాహ్ శపిస్తాడని తెలియజేయడం జరిగింది. ఇలాంటి పాపం చేసేది ఉంటే అల్లాహ్ నరకంలో ప్రవేశింపజేస్తాడు అని చెప్పడం జరిగింది. ఇలాంటి పాపం చేసేది ఉంటే అల్లాహ్ స్వర్గంలో పంపడం లేదు అని చెప్పడం జరిగింది.” ఇలాంటి బోధన మనం చేయాలి. కానీ, “నువ్వు ఈ తప్పు చేస్తున్నావా? నిన్ను అల్లాహ్ క్షమించనే క్షమించడు. అల్లాహ్ నీకు ఎప్పుడూ కూడా పశ్చాత్తాపపడి క్షమాపణ కోరుకునే అధికారమే, అటువంటి భాగ్యమే ప్రసాదించడు.” ఇట్లాంటి ఆదేశాలు మనం జారీ చేయకూడదు. ఒకరిని అల్లాహ్ యొక్క క్షమాపణ పట్ల నిరాశకు గురి చేయకూడదు.
ఒకవేళ ఇదే ప్రమాణాలు చేసుకుంటూ, నిన్ను ఎన్నటికీ అల్లాహ్ క్షమించడు అని అంటే, అల్లాహ్, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ అతనికి అతను ఆగ్రహానికి గురై, ఇలాంటి వ్యక్తి యొక్క సర్వ సత్కార్యాలను వృధా చేసేస్తాడు. అల్లాహు అక్బర్. అందు గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
[5] అసర్ నమాజ్‌ను వదులుకోవడం
మహాశయులారా! త్రాసును తేలికగా చేసే పాపాల్లో, అసర్ నమాజ్‌ను వదులుకోవడం. అల్లాహు అక్బర్. అసర్ నమాజ్. అల్లాహ్ రేయింబవళ్ళలో, రాత్రి పగళ్ళలో ఐదు వేలల నమాజ్ మనపై విధిగావించాడు. ఐదు నమాజుల్లో ఒకటి మధ్యలో ఉన్న నమాజ్ అసర్ నమాజ్. ఎవరైతే అసర్ నమాజ్ వదిలేస్తారో వారి యొక్క సత్కార్యాలు వృధా అయిపోతాయి. శ్రద్ధ వహించండి ఈ హదీసుపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు,
مَنْ تَرَكَ صَلَاةَ الْعَصْرِ فَقَدْ حَبِطَ عَمَلُهُ (మన్ తరక సలాతల్ అస్ర్ ఫఖద్ హబిత అమలుహూ) ఎవరైతే అసర్ నమాజ్‌ను విడనాడతారో వారి యొక్క సత్కార్యాలన్నీ కూడా వృధా అయిపోతాయి.
ఈ అసర్ నమాజ్ ఎంత ముఖ్యమైనదంటే,
حَافِظُوا عَلَى الصَّلَوَاتِ وَالصَّلَاةِ الْوُسْطَىٰ (హాఫిజూ అలస్సలవాతి వస్సలాతిల్ వుస్తా) “నమాజులను, ప్రత్యేకించి మధ్య నమాజును కాపాడండి.” (2:238)
అని అల్లాహు త’ఆలా ఖురాన్లో ఆదేశం ఇచ్చాడు. మీరు అన్ని నమాజులను పాబందీగా చేస్తూ ఉండండి. కానీ మధ్యలో ఉన్న నమాజు పట్ల ఎక్కువ శ్రద్ధ వహించండి. ఇందులో మధ్యలోని నమాజ్ అంటే అసర్ నమాజ్ అని ఎన్నో హదీసుల ద్వారా మనకు తెలుస్తుంది.
అబూ ములైహ్ రహిమహుల్లాహ్ చెప్పారు, మేము ఒక సందర్భంలో, ఒక యుద్ధంలో ఉన్నాము. గమనించండి, యుద్ధంలో ఉన్నప్పుడు ఎంత మనిషి బిజీగా ఉంటాడో, అటువైపు శత్రువుల నుండి శత్రువుల బాణాలు, ఆయుధాలు మన మీదికి వచ్చి పడే, మన ప్రాణాలు పోయే అటువంటి భయం క్షణం క్షణం ఉంటుంది. అబూ ములైహ్ అంటున్నారు, మేము ఒక యుద్ధంలో హజ్రత్ బురైదా రదియల్లాహు త’ఆలా అన్హు వెంట ఉన్నాము. అసర్ నమాజ్ సమయం ప్రవేశించింది. అప్పుడు బురైదా రదియల్లాహు త’ఆలా అన్హు చెప్పారు, అసర్ నమాజ్ మీరు చేసుకోండి. ఇందులో ఆలస్యం చేయకండి. ఎందుకంటే నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా విన్నాను,
مَنْ تَرَكَ صَلَاةَ الْعَصْرِ فَقَدْ حَبِطَ عَمَلُهُ (మన్ తరక సలాతల్ అస్ర్ ఫఖద్ హబిత అమలుహూ) ఎవరైతే అసర్ నమాజ్ విడినాడారో, ఎవరైతే అసర్ నమాజ్ వదిలేశారో వారి యొక్క సర్వ సత్కార్యాలు వృధా అయిపోయాయి.
దీని గురించి మనల్ని భయకంపితులుగా చేసే హదీస్ కూడా ఉంది. సహీహ్ బుఖారీలోని హదీస్. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు,
الَّذِي تَفُوتُهُ صَلَاةُ الْعَصْرِ كَأَنَّمَا وُتِرَ أَهْلَهُ وَمَالَهُ (అల్లజీ తఫూతుహూ సలాతుల్ అస్ర్ క అన్నమా వుతిర అహ్లహూ వ మాలహూ) ఎవరి అసర్ నమాజ్ తప్పిపోయినదో, ఎవరైతే అసర్ నమాజ్ చేయలేకపోయారో వారు ఎలాంటి వారంటే వారి యొక్క సొమ్ము, ధనము, ఆస్తిపాస్తులు, ఆలు పిల్లలు అందరూ నశించిపోయినటువంటి వాడు.
ఎప్పుడైనా ఈ బాధ మనకు కలిగిందా ఒకసారి ఆలోచించండి. అటు నమాజ్ టైం అయింది, ఇటువైపున కొడుకుకు చాలా జ్వరం వచ్చింది అంటే, మనం నమాజ్‌ను వదులుకొని కొడుకును ముందు హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి అని కోరుకుంటాము. ఇక ఎవరి ఆస్తిపాస్తులు, ఆలు పిల్లలు అందరూ నశించిపోయారో అతని పరిస్థితి ఎలా ఉంటుంది? అసర్ నమాజ్ కూడా తప్పిపోయినప్పుడు అంత బాధ మనకు కలిగిందా? ఎంత బాధనైతే మన ఆస్తిపాస్తులు, మన ఆలు పిల్లలు అందరూ నశించిపోయినప్పుడు కలుగుతుందో, అలాంటి బాధ ఏదైనా ఒక్క నమాజ్ మిస్ అయినప్పుడు మనకు కలిగిందా? అందు గురించి మహాశయులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతర సత్కార్యాలన్నిటినీ కూడా వృధా చేసుకోకుండా నమాజ్ కాపాడుకుంటూ మనం ఇతర సత్కార్యాలను కూడా కాపాడుకోవాలి.
[6] ఏకాంతంలో పాపాలు చేయడం
మన త్రాసు బరువును తగ్గించేసి, తేలికగా చేసే పాపాల్లో మరో భయంకరమైన పాపం, ఏకాంతంలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరు చూడటం లేదు కదా అని భావించుకుంటూ ఉన్నప్పుడు, అల్లాహ్ నిషేధించిన కార్యాలకు పాల్పడడం. దీనివల్ల కూడా మన ఇతర సత్కార్యాలన్నీ కూడా వృధా అయిపోతాయి. ఈ రోజుల్లో ఎంతమంది మన, మనలోని ఎంతమంది పరిస్థితి ఇలా గురై ఉంది. ఒక్కసారి ఈ హదీసును మీరు చాలా శ్రద్ధగా వినండి. దీనిని అర్థం చేసుకొని ఇందులో చూపబడిన నష్టాలకు దూరంగా ఉండేటువంటి సద్భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక.
హజ్రత్ సౌబాన్ రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించిన ఈ హదీస్, దీనిని మనం మన ఈ చెవులతోనే కాకుండా, హృదయంలో ఉన్నటువంటి చెవులతో శ్రద్ధగా విని ఉంటే, ఈ హదీస్ మనలోని నిద్రలో ఉన్న వారిని నిద్రలో నుండి మేల్కొలుపుతుంది. అశ్రద్ధలో ఉన్నవారి యొక్క అశ్రద్ధతనాన్ని దూరం చేసేస్తుంది. అంతటి భయంకరమైన హదీస్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు,
నేను నా అనుచర సంఘంలోని కొందరిని గుర్తుపడతాను. వారు నాకు తెలుసు. వారు తిహామా నగరంలోని పర్వతాల మాదిరిగా సత్కార్యాలను తీసుకొని ప్రళయ దినాన హాజరవుతారు. (అరబ్బులో తిహామా కొండలు చాలా ఫేమస్. అలాంటి కొండల మాదిరిగా పుణ్యాలు చేసుకొని వస్తారు ప్రళయ దినాన.) కానీ అల్లాహు త’ఆలా వాటిని దుమ్ము ధూళి వలె చేసేస్తాడు.
ఈ భయంకరమైన విషయం విని సౌబాన్ రదియల్లాహు త’ఆలా అన్హు అడిగారు, “ప్రవక్తా, వారు ఎలాంటి వారు? వారి గుణం ఏమిటి? వారి గురించి ఏదైనా స్పష్టంగా తెలపండి. మాకు తెలియకుండానే మేము అలాంటి వారిలో కలిసిపోకుండా ఉండడానికి మేము జాగ్రత్త పడతాము” అని విన్నవించుకున్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, “వారు మీ సోదరులే, మీ వంశం వారే. వారు రాత్రి వేళల్లో నిలబడి తహజ్జుద్ నమాజ్‌లు చేసే అటువంటి వారు. మీరు ఎలా తహజ్జుద్ నమాజ్ చేస్తున్నారో అలా వారు కూడా తహజ్జుద్ నమాజ్ చేసేవారు. కానీ ఒంటరిగా ఉండి అల్లాహ్ నిషేధించిన వాటికి పాల్పడే అవకాశం దొరికితే, వాటికి దూరంగా ఉండడానికి బదులుగా ఆ నిషిద్ధ కార్యాలకు పాల్పడేవారు.”
ఈ రోజుల్లో సోషల్ మీడియాలో, మన చేతుల్లోని స్మార్ట్ ఫోన్స్, ఒక హాస్టల్లో ఉన్నవారు కూడా, ఒకచోట పనిచేసేవాళ్ళు కూడా, హెడ్ ఫోన్స్ చెవులలో పెట్టుకున్నారు, పై నుండి దుప్పటి కప్పుకున్నారు. లోపలి నుండి స్మార్ట్ ఫోన్స్ ఆన్ చేసుకుంటూ, ఇష్టమైన చిత్రాలు చూసుకుంటూ, పాప కార్యాలు చూసుకుంటూ, పక్కన ఎవరూ కూడా వినడం లేదు, పక్కన ఉన్నవారు ఎవరూ చూడడం లేదు. ఈ విధంగా సామాన్యంగా ఈరోజు జరుగుతున్న ఇటువంటి పాపాలు, అక్రమ సంబంధాలు పెట్టుకొని వారిలో ఒంటరి తనాల్లో కలుసుకోవడం, ఎవరు చూడడం లేదు కదా అని ప్రత్యేక కోడ్ వర్డ్లలో వారితోని మాట్లాడుకోవడం, ఇంకా ఇలాంటి ఎన్నో దుష్కార్యాలు ఈనాటి సమాజంలో ప్రబలిపోతూ ఉన్నాయి. ఎప్పుడైనా ఏదైనా విషయం బయటికి వచ్చినా, దానిని ఏదో రకంగా కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం, అల్లాహు అక్బర్. మహాశయులారా, అల్లాహ్ మనందరికీ సన్మార్గం చూపుగాక. ఇంతటి భయంకరమైన హదీస్ ఇది. చూడడానికి నమాజ్‌లు చేస్తూ ఉండడం, వేరే సత్కార్యాలు చేస్తూ ఉండడం, ఒక మంచివాడుగా ప్రజల్లో పేరు పొందడం, కానీ ఒంటరిగా ఉండి పాపాలు చేసే అవకాశం వస్తే, ఏమాత్రం జంకకుండా, వెనుక ఉండకుండా, అల్లాహ్‍తో భయపడకుండా అలాంటి నిషిద్ధ కార్యాలకు పాల్పడడం, ఇది మన సత్కార్యాలన్నిటినీ వృధా చేసేస్తుంది.
[7] కుక్కను పెంచడం
మహాశయులారా, మన సత్కార్యాలను వృధా చేసి మన త్రాసును తేలికగా చేసే పాప కార్యాల్లో ఏడవది, కుక్కను పెంచడం. అల్లాహు అక్బర్. ఈ రోజుల్లో ఎందరో ముస్లింల ఇళ్లల్లో కూడా పెట్టీ అని, ఇంకా ఏదేదో పేర్లతో, రకరకాల, ఎంతో అందమైన ముద్దుగా ఉన్నటువంటి పేర్లతో కుక్కలను పిలుచుకుంటూ, పెంచుకుంటూ, వారిని తమ ఒడిలో తమ పిల్లల మాదిరిగా ఉంచుకుంటూ ఇలా వారిని పోషిస్తున్నారు.
ఈ రోజుల్లో ఎంతో మంది తమ సొంత పిల్లలను తమ ఒడిలో కూర్చోబెట్టుకొని ఉన్నట్లుగా కుక్కను పెంచుకుంటున్నారు. ఎంతో ముద్దు ముద్దు పేర్లతో వారిని పిలుచుకుంటూ, వారిని తమ ఒడిలో కూర్చోబెట్టుకుంటున్నారు. ఈ విధంగా మహాశయులారా, ముందే పుణ్యాలు, సత్కార్యాలు చాలా తక్కువగా మనకు ఉన్నాయి అంటే, ఇలాంటి పాప కార్యాల వల్ల మరింత మనం ప్రళయ దినాన నష్టపోతాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు,
مَنِ اتَّخَذَ كَلْبًا، إِلَّا كَلْبَ زَرْعٍ أَوْ غَنَمٍ أَوْ صَيْدٍ، يَنْقُصُ مِنْ أَجْرِهِ كُلَّ يَوْمٍ قِيرَاطٌ (మనిత్తఖద కల్బన్ ఇల్లా కల్బ జర్ఇన్ అవ్ గనమిన్ అవ్ సైదిన్ యన్ఖుసు మిన్ అజ్రిహీ కుల్ల యౌమిన్ ఖీరాత్) ఎవరైతే కుక్కను పెంచుతారో, వారి యొక్క పుణ్యాల్లో ప్రతి రోజూ ఒక ఖీరాత్ పుణ్యాలు తగ్గుతూ ఉంటాయి.
ఒక ఖీరాత్ పుణ్యాలు అంటే ఎంతో తెలుసా? జనాజా నమాజ్‌కు సంబంధించిన విషయాల్లో మనం తెలుసుకున్నాము. ఒక ఖీరాత్ అంటే ఉహుద్ పర్వతానికి సమానం. రెండు ఖీరాత్‌లు అంటే రెండు ఉహుద్ పర్వతాలు లేదా రెండు పెద్ద పర్వతాలకు సమానం.
ప్రతి రోజూ ఒక ఖీరాత్ పుణ్యం తగ్గుతూ ఉంటుంది ఎవరైతే కుక్కను పెంచుతూ ఉంటారో. కానీ ఇందులో కేవలం మూడు రకాల కుక్కలను పెంచే అనుమతి ఉంది. ఆ కుక్కలు కూడా సాధ్యమైనంత వరకు మన ఇంటి ఆవరణలో ఉండకుండా బయట ఉంచే ప్రయత్నం చేయాలి. ఎలాంటి మూడు కుక్కలు? ఒకటి, మనం మన తోట రక్షణ కొరకు పెంచే కుక్క, అది తోటలోనే ఉండాలి, ఇంటి వద్ద ఉండకూడదు. మరొకటి, మేకల రక్షణ కొరకు మనం పెంచే కుక్క, అది మేకల వద్దనే ఉండాలి, మన ఇంట్లోనికి రానివ్వకూడదు. మూడవది, كَلْبَ صَيْدٍ (కల్బ సైదిన్) వేటాడడానికి, వేరే కొన్ని జంతువులను వేటాడడానికి వేట యొక్క శిక్షణ ఇవ్వబడిన కుక్కలు. సామాన్య కుక్కలు కూడా కాదు. వేట యొక్క శిక్షణ వారికి ఇవ్వబడాలి. అలాంటి కుక్కలు, అవి కూడా ఇంట్లోనికి ప్రవేశించకుండా మనం జాగ్రత్త పడాలి.
ఈ మూడు రకాల కుక్కలు పెంచడానికి అనుమతి ఉంది. ఈ మూడు ఉద్దేశాలు కాకుండా ఇంకా ఎవరైనా కుక్కను పెంచుతున్నారు అంటే ప్రతి రోజూ వారి యొక్క సత్కార్యాలలో నుండి ఒక ఖీరాత్ సత్కార్యాలు తగ్గిపోతూ ఉంటాయి. ఈ విధంగా మనం ఎంత నష్టానికి గురి అయిపోతామో గమనించండి.
మరికొన్ని పాప కార్యాలు ఉన్నాయి, వాటి ద్వారా కూడా మన త్రాసు అనేది తేలికగా అయిపోతుంది. తరువాయి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. ఈనాటి శీర్షిక: ప్రళయ దినాన నెలకొల్పబడే త్రాసు యొక్క గాంభీర్యత, కష్టతరం, దాని యొక్క భయంకరత్వం.
త్రాసు గురించి వింటున్న వివరాలతో ఇహలోకంలోనే మనకు ఒక గుణపాఠం రావాలి. మనం దైనందిన జీవితంలో చేసే సత్కార్యాలు పెరుగుతూ ఉండాలి మరియు దుష్కార్యాలు తగ్గుతూ ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా రేపటి రోజు ఆ త్రాసులో తూకం చేయబడతాయి.
ప్రళయ దినాన ఎప్పుడైతే సూక్ష్మమైన విషయాలను కూడా త్రాసులో పెట్టబడి తూకం చేయడం జరుగుతూ ఉంటుందో, ఇవన్నీ విషయాలు కర్మపత్రాల్లో కూడా వ్రాయబడి ఉంటాయో, ఆ కర్మపత్రాలను కూడా తూకం చేయడం జరుగుతుందో, ఈ విషయాల్ని అపరాధులు, పాపాలు చేస్తూ ఉన్నవారు ఈ విషయాన్ని చూసి చాలా గాంభీర్యతకు గురి అవుతారు. వారు స్వయంగా ఏమంటారు ఆ సందర్భంలో, ఆ విషయాన్ని అల్లాహు తాలా సూరహ్ కహఫ్ లో తెలియజేశాడు.
وَوُضِعَ الْكِتَابُ కర్మపత్రాలు వారి ముందు పెట్టడం జరుగుతుంది.
فَتَرَى الْمُجْرِمِينَ مُشْفِقِينَ مِمَّا فِيهِ అపరాధులను నీవు ఆ రోజు చూస్తావు, వారు భయ కంపితులై వాటిలో ఉన్న, వ్రాయబడిన ఆ విషయాలన్నింటినీ చూసి భయకంపితులై పోతారు.
وَيَقُولُونَ మరియు అంటారు:
يَا وَيْلَتَنَا مَالِ هَٰذَا الْكِتَابِ మా పాడుగాను, ఇది ఎలాంటి గ్రంథం, ఎలాంటి కర్మపత్రం.
لَا يُغَادِرُ صَغِيرَةً وَلَا كَبِيرَةً ఏ చిన్న దానిని గానీ, ఏ పెద్ద దానిని గానీ వదిలేయకుండా మొత్తం దీంట్లో వ్రాయబడింది.
إِلَّا أَحْصَاهَا ప్రతీ ఒక్కటి అందులో చేర్చడం జరిగింది.
وَوَجَدُوا مَا عَمِلُوا حَاضِرًا వారు చేసుకున్న సర్వాన్ని వారు తమ ముందు హాజరుగా చూస్తారు.
وَلَا يَظْلِمُ رَبُّكَ أَحَدًا నీ ప్రభువు ఎవరిపై కూడా ఏ మాత్రం అన్యాయం చేయడు, ఎవరిపై ఏ రవ్వంత కూడా దౌర్జన్యం చేయడు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
త్రాసు అంటే ఏమిటి? ప్రళయ దినాన దాని యొక్క గాంభీర్యత, కష్టతరం అనేది ఎలా ఉంటుంది? [మరణానంతర జీవితం – పార్ట్ 19] [21 నిముషాలు] https://www.youtube.com/watch?v=kKaOZfTuxe0 వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహి వహద, వస్సలాతు వస్సలాము అలా మన్ లా నబియ్య బాద అమ్మాబాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.
ఈనాటి శీర్షిక: త్రాసు అంటే ఏమిటి? ప్రళయ దినాన దాని యొక్క గాంభీర్యత, కష్టతరం అనేది ఎలా ఉంటుంది?
మహాశయులారా, సృష్టికర్త అయిన అల్లాహ్ సర్వము తెలిసినవాడు. మరియు ఆయన ఎవరి పట్ల కూడా ఎలాంటి అన్యాయం చేయనివాడు. ఆయన కరుణామయుడు, కృపాశీలుడు మరియు దాసులకు వారి పుణ్యాలకంటే ఎంతో ఎక్కువ రేట్లో ఉపకారాలు చేసి వారిని మన్నిస్తూ ఉండేవాడు. కానీ రవ్వంత కూడా ఎవరిపై ఏ అన్యాయము చేయడు.
ఆయన ప్రళయ దినాన తలచుకుంటే, దాసుల పట్ల ఆయనకున్న పరిజ్ఞానంతో వారి యొక్క విశ్వాసం, అవిశ్వాసం, సత్కార్యాలు, దుష్కార్యాలు అనే ఆధారం మీద వారిని స్వర్గంలో పంపడం, నరకంలో పంపడం వంటి తీర్పులు చేయగలడు. అలా చేసే అధికారం అతనికి ఉంది. కానీ, అలా చేయకుండా వారి యొక్క లెక్క, వారి యొక్క తీర్పు, సాక్ష్యాధారాలను, ఇంకా ఆ రోజు త్రాసును నెలకొల్పుతాడు.
త్రాసును నెలకొల్పి, అందులో ప్రజలు చేసినటువంటి సత్కార్యాలను ఒకవైపున, దుష్కార్యాలను మరోవైపున తూకం చేస్తాడు. స్వయంగా సత్కార్యాలు, దుష్కార్యాలు చేసిన ప్రజలను కూడా అందులో పెట్టడం జరుగుతుంది. అంతేకాదు, ఏ కర్మపత్రాలు దైవదూతలు రాస్తూ ఉన్నారో, ఆ పత్రాలను కూడా, ఆ ఫైల్లను కూడా అందులో తూకం చేయడం జరుగుతుంది. ఇదంతా దేని కొరకు? ప్రజలు కూడా స్వయంగా వారు తృప్తికరమైన న్యాయం వారికి లభించినది అని వారికి మనస్తృప్తి కలగాలి.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఆదర్శ సమాజ సంస్థాపనలో హరామ్ మరియు హలాల్ యొక్క ప్రభావం https://youtu.be/B57_ENYyOeo [27 నిముషాలు] షేఖ్ షరీఫ్ హఫిజహుల్లాహ్
ఈ ప్రసంగంలో, వక్త ఒక ఆదర్శ సమాజం యొక్క పునాదుల గురించి వివరిస్తారు. హలాల్ (ధర్మసమ్మతం) మరియు హరాం (నిషిద్ధం) అనేవి కేవలం ఆహారానికి సంబంధించినవి కావని, జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తాయని స్పష్టం చేశారు. ఆదర్శ సమాజ స్థాపనకు మొదటి మెట్టు షిర్క్ (బహుదైవారాధన)ను విడనాడి తౌహీద్ (ఏకదైవారాధన)ను స్వీకరించడం అని ఉద్ఘాటించారు. తర్వాత, తల్లిదండ్రుల పట్ల విధేయత, అశ్లీలతకు దూరంగా ఉండటం మరియు హలాల్ జీవనోపాధి యొక్క ప్రాముఖ్యతను ఖురాన్ మరియు హదీసుల వెలుగులో వివరించారు. హరాం సంపాదన మరియు వినియోగం వల్ల కలిగే పర్యవసానాలు, ప్రార్థనలు స్వీకరించబడకపోవడం మరియు హృదయం కఠినంగా మారడం వంటివి ఉంటాయని హెచ్చరించారు. చివరగా, సమాజ సంస్కరణకు ప్రతి ఒక్కరూ హలాల్ మరియు హరాం పట్ల స్పష్టమైన అవగాహన కలిగి, వాటిని ఆచరించాలని పిలుపునిచ్చారు.
అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
أَلْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَبِهِ نَسْتَعِينُ وَالصَّلاةُ وَالسَّلامُ عَلَى رَسُولِهِ الْأَمِينِ، أَمَّا بَعْدُ (అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వబిహీ నస్త’ఈన్, వస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ అమీన్, అమ్మా బాద్) సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వ స్తోత్రాలు. మేము ఆయన సహాయాన్నే అర్థిస్తాము. మరియు ఆయన యొక్క నమ్మకమైన ప్రవక్తపై శాంతి మరియు శుభాలు వర్షించుగాక.
أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ శపించబడిన షైతాను నుండి నేను అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను.
بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో (ప్రారంభిస్తున్నాను).
كُنتُمْ خَيْرَ أُمَّةٍ أُخْرِجَتْ لِلنَّاسِ تَأْمُرُونَ بِالْمَعْرُوفِ وَتَنْهَوْنَ عَنِ الْمُنكَرِ وَتُؤْمِنُونَ بِاللَّهِ మానవజాతి (హితం) కోసం వెలికితీయబడిన శ్రేష్ఠమైన సమాజం మీరే. మీరు మంచిని ఆజ్ఞాపిస్తారు, చెడు నుండి వారిస్తారు. అల్లాహ్‌ను విశ్వసిస్తారు. (3:110)
رَبِّ اشْرَحْ لِي صَدْرِي وَيَسِّرْ لِي أَمْرِي وَاحْلُلْ عُقْدَةً مِّن لِّسَانِي يَفْقَهُوا قَوْلِي رَبِّ زِدْنِي عِلْمًا ఓ నా ప్రభూ! నా హృదయాన్ని నా కోసం విశాలపరచు. నా కార్యాన్ని నాకు సులభతరం చెయ్యి. నా నాలుకలోని ముడిని విప్పు, నా మాటను వారు అర్థం చేసుకోగలిగేటట్లు. ఓ ప్రభూ! నా జ్ఞానాన్ని వృద్ధి చేయి.
سُبْحَانَكَ لَا عِلْمَ لَنَا إِلَّا مَا عَلَّمْتَنَا ۖ إِنَّكَ أَنتَ الْعَلِيمُ الْحَكِيمُ “(ఓ అల్లాహ్!) నీవు అత్యంత పవిత్రుడవు. నీవు మాకు తెలియజేసినది తప్ప ఇంకేమీ మాకు తెలియదు. నిశ్చయంగా అన్నీ తెలిసినవాడవు, వివేకవంతుడవూ నీవే!” (2:32)
అల్లాహ్ యొక్క శరణు వేడుకుంటున్నాను, షైతాన్ యొక్క కీడు నుండి, షైతాన్ యొక్క చేష్టల నుండి రక్షణ పొందుట కొరకు. అనంత కరుణామయుడు, అపార కృపాప్రదాత అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.
ప్రియమైన ధార్మిక సోదరులారా, ధార్మిక సోదరీమణులారా, విశాఖపట్నం జిల్లా జమియత్ అహ్లె హదీస్ ఆధ్వర్యములో ఏర్పాటు చేయబడిన ఆదర్శ సమాజం అనే ఈ ఆధ్యాత్మిక, ధార్మిక సమావేశానికి నేను మీ అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాను ప్రియులారా.
హలాల్ మరియు హరాం యొక్క ప్రాముఖ్యత
సోదరులారా, ఈ సమావేశములో నాకు ఇవ్వబడిన అంశము సమాజముపై హరాం మరియు హలాల్ యొక్క ప్రభావం. సోదరులారా, ఏదైనా సమాజం ఆదర్శవంతమైన సమాజంగా తీర్చిదిద్దబడాలంటే, ఆ సమాజం అనుసరిస్తున్న పంథాపై సమాజం యొక్క అభివృద్ధి, దాని యొక్క పురోగతి ఆధారపడి ఉంటాయి.
మరి ఇస్లాం ధర్మశాస్త్రం ఈ సమాజాన్ని ఉత్తమ సమాజంగా మార్చటానికి ఏ విధంగా ప్రయత్నిస్తుంది? ఈరోజు మనం ఒక ఆదర్శ సమాజంగా ఏర్పడాలి అంటే ఏం చేయాలి? రోజుకు ఐదు పూటల మస్జిదులో నమాజ్ స్థాపించాం, మనం ఆదర్శ సమాజంగా మారిపోతామా? ఆదర్శ సమాజంగా ఒక సంఘం మారాలి అంటే ఆ సంఘం అల్లాహ్ త’ఆలా నిర్ణయించిన హద్దులకు లోబడి జీవితాన్ని గడపాలి. ఎప్పటివరకైతే అల్లాహ్ త’ఆలా దేనిని అయితే హరాం అన్నాడో దానికి దూరంగా ఉండనంత వరకు, దేనినైతే అల్లాహ్ హలాల్ చేశాడో దానిపై ఆచరించనంత వరకు ఈ సమాజం ఆదర్శ సమాజంగా మారదు ప్రియులారా.
హరాం, హలాల్ అన్న పదాలు మనం వింటూ ఉంటాం సాధారణంగా. ప్రతి దైనందిన జీవితంలో. వాస్తవానికి హరాం అంటే అర్థం ఏంటి? హలాల్ అంటే అర్థం ఏంటి? హరాం అనగా ప్రియులారా, ఆ కార్యం దేనినైతే మనిషి చేస్తాడో అతడు పాపి అవుతాడు. అతగాడికి పాపం ప్రసాదించబడుతుంది. హలాల్ దేన్ని అంటారు? హలాల్ ఆ పని దేనిని చేయటం వల్లనైతే మనిషి పుణ్యాన్ని పొందుతాడో. చిన్న మాట, హరాం చేసినవాడు పాపాన్ని అనుభవిస్తాడు. హలాల్ చేసినవాడు పుణ్యాన్ని పొందుతాడు.
ఆదర్శ సమాజ స్థాపనలో మొదటి మెట్టు: తౌహీద్
ఖురాన్ గ్రంథములో అల్లాహ్ త’ఆలా హరాం హలాల్‌కు సంబంధించిన మాటలు చాలా చెప్పారు. నేను ఈరోజు ముందు మీ ముందు సూరె అన్’ఆమ్, ఆరవ అధ్యాయము, వాక్యము సంఖ్య 151, 152, 153 వెలుగులో కొన్ని మాటలు చెబుతాను. ఈ వాక్యాలలో అల్లాహ్ ఏమంటున్నారు?
قُلْ تَعَالَوْا أَتْلُ مَا حَرَّمَ رَبُّكُمْ عَلَيْكُمْ (ఓ ప్రవక్తా!) వారికి చెప్పండి: రండి! మీ ప్రభువు మీకు ఏ విషయాలను హరాం చేశాడో నేను బోధిస్తాను.
అల్లాహ్ త’ఆలా దేన్ని హరాం చేశారు?
أَلَّا تُشْرِكُوا بِهِ شَيْئًا మీరు అల్లాహ్‌తో పాటు షిర్క్ చేయకండి.
ఏదైనా సమాజం ఉన్నత సమాజంగా, ఆదర్శ సమాజంగా మారాలి అంటే ఆ జాతిలో షిర్క్ ఉండకూడదు. ఈరోజు మనం షిర్క్ చేసినట్లయితే మనం ఎన్నటికీ ఆదర్శ సమాజంగా మారలేము. కాబట్టి మొదటి మాట, మనం తౌహీద్ పైకి రావాలి. ఈరోజు తౌహీద్ వైపునకు మనం రాకపోతే ప్రపంచంలో మనం ఆరాధన చేస్తున్నాం కానీ తౌహీద్ యొక్క మూల స్తంభాలు మనం తెలుసుకోలేదు.
గురువుగారు ఒక పుస్తకం పేరు చెప్పారండి. ఈరోజు మనం అహ్లుల్ హదీస్, ఖురాన్ హదీస్ పై ఆచరించే వారం. గురువుగారు చెప్పిన పుస్తకం గనక మనము చదివి ఉండకపోతే మనలో చిన్న లోపం ఉన్నట్టు ప్రియులారా. గురువుగారు చెప్పిన పుస్తకం పేరు ఏంటి? ఉసూలు స్సలాసా (మూడు మూల సూత్రాలు). ధర్మం యొక్క మూడు ప్రాథమిక మూల సూత్రాలు. మీరు చనిపోయిన తర్వాత మీ సమాధిలో ప్రశ్నింపబడే మూడు ప్రశ్నలు. నీ దైవం ఎవరు? నీ ధర్మం ఏమిటి? నీ ప్రవక్త ఎవరు? ఒక చిన్న పుస్తకం, తౌహీద్ యొక్క జ్ఞానాన్ని మనం పొందాలి ప్రియులారా. ఈరోజు రోజుకు ఐదు పూటల నమాజ్ ఆచరిస్తున్నాం, కానీ మన సమాజానికి ప్రశ్నించండి. సోదరులారా, చెవియొగ్గి వినండి. ప్రశ్నించండి. అల్లాహ్ ఎక్కడ ఉన్నాడు? అని అడిగితే ఈరోజు మనలో చాలామందికి సరిఅయిన జవాబు తెలియదు. అల్లాహ్ ఎక్కడ ఉన్నాడు? అని అడిగితె కొంతమంది హర్ జగహ్ అల్లాహ్ హై భాయ్ అని అంటారు . అరే! మరి అల్లాహ్ ఖురాన్ లో ఏమి చెబుతున్నాడో చూడండి :
الرَّحْمَنُ عَلَى الْعَرْشِ اسْتَوَى అనంత కరుణామయుడు అర్ష్ పై ఆసీనుడై ఉన్నాడు. (20:5)
ఇది తౌహీద్, అఖీదా ప్రియులారా. అల్లాహ్ త’ఆలాకి రూపం ఉందా? అనేక మంది అంటారు అల్లాహ్ నిరాకారుడు అని. లేదు ప్రియులారా, అల్లాహ్ ఆకారం కలిగి ఉన్నాడు. కానీ అల్లాహ్ యొక్క ఆకారం ఎలా ఉందో మనకు తెలియదు ప్రియులారా.
కాబట్టి ఆదర్శ సమాజం యొక్క స్థాపనలో మూల స్తంభం తౌహీద్ పై నిలబడటం. ఎవరైతే తౌహీద్ పై నిలబడతారో ప్రపంచములో శాంతి ఏర్పడుతుంది.
ఈరోజు ముస్లిం సమాజమా, నీ యొక్క బాధ్యత, ఈ రోజు ప్రపంచానికి మనం అల్లాహ్ యొక్క ఏకత్వం వైపునకు దావత్ ఇవ్వాలి. ఈరోజు ప్రపంచంలో మనుషులు మతాలు, కులాలు, ముఠాలు, వర్గాలుగా ముక్కలైపోయారు. వీరినందరినీ మనము గనక మనందరి సృష్టికర్త ఒక్కడే అన్న నినాదం వైపునకు తీసుకువస్తే ప్రపంచములో ఆదర్శ సమాజం ఏర్పడుతుంది. దీని కోసం మనం ఎంతవరకు పని చేస్తున్నాం? ఈ తౌహీద్ యొక్క ప్రభావం ప్రపంచములో ఉంటుంది. తౌహీద్ యొక్క ప్రభావం ఆఖిరత్ లో ఉంటుంది. కేవలం అల్లాహ్, అల్లాహ్, అల్లాహ్ అని చెప్పేస్తారు కానీ మూఢనమ్మకాలపై విశ్వాసం. ఒక తుమ్మితే బయటకు వెళ్ళకపోవటం, జ్వరం వస్తే తావీజు కట్టుకోవటం, ఇంకా నిమ్మకాయలపై, గుమ్మడికాయలపై, రాళ్లపై, చెట్లపై నమ్మకం పెట్టుకుంటే మనకి స్వర్గము లేదు.
ఎవరు సాఫల్యం చెందుతాడు?
الَّذِينَ آمَنُوا وَلَمْ يَلْبِسُوا إِيمَانَهُم بِظُلْمٍ ఎవరైతే అల్లాహ్‌ను విశ్వసించిన తర్వాత తమ ఈమాన్‌ను షిర్క్‌తో కలుషితం చేయరో,
أُولَئِكَ لَهُمُ الأَمْنُ అలాంటి వారి కొరకు శాంతి ఉంది. (6:82)
కాబట్టి, ఆదర్శ సమాజం యొక్క స్థాపనలో మనం చేయాల్సిన మొదటి పని అల్లాహ్ యొక్క తౌహీదులోనికి పూర్తిగా ప్రవేశించాలి. అల్లాహ్ యొక్క తౌహీదులోనికి మనం వచ్చేస్తే ప్రపంచంలో శాంతి ఉంది. ఆఖిరత్‌లో ఏముంది?
إِنَّ الَّذِينَ قَالُوا رَبُّنَا اللَّهُ ثُمَّ اسْتَقَامُوا تَتَنَزَّلُ عَلَيْهِمُ الْمَلائِكَةُ أَلاَّ تَخَافُوا وَلا تَحْزَنُوا وَأَبْشِرُوا بِالْجَنَّةِ الَّتِي كُنتُمْ تُوعَدُونَ ఎవరైతే, “అల్లాహ్ యే నా ప్రభువు” అని పలికిన పిదప, దానిపై స్థిరముగా నిలబడిపోయాడో, అలాంటి వారి వైపునకు వారు మరణించే సమయంలో దైవదూతలు వస్తారు, వారితో చెబుతారు: మీరు భయపడకండి, మీరు దుఃఖించకండి. అల్లాహ్ మీ కొరకు స్వర్గం యొక్క వాగ్దానము చేశాడు. (41:30)
ప్రియులారా, మొదటి మాట. ఇంకొకసారి విన్నవిస్తున్నాను. ప్రసంగాలు అవుతూ ఉంటాయి, వచ్చి కూర్చుంటాం, వెళ్ళిపోతాం. మనం జ్ఞానాన్ని ఆర్జించకపోతే మన జీవితాలలో తౌహీద్, అఖీదా రాదు. నేను విన్నవిస్తున్నాను, ఉసూలే స్సలాసా పుస్తకాన్ని చదవండి. నేను అభ్యర్థిస్తున్నాను, మనం ఇన్షా అల్లాహ్ త’ఆలా ఒక పుస్తకాన్ని చదివి తౌహీద్ యొక్క జ్ఞానాన్ని మన జీవితాల్లో తీసుకువద్దాం. అప్పుడే మన సమాజం ఆదర్శ సమాజంగా మారగలదు.
తల్లిదండ్రుల పట్ల విధేయత
ఇక రెండవ మాట ప్రియులారా, అల్లాహ్ అంటూ ఉన్నారు, ఆదర్శ సమాజం ఏర్పాటు కావటానికి మీరు చేయాల్సిన పని ప్రియులారా,
وَبِالْوَالِدَيْنِ إِحْسَانًا మీరు మీ తల్లిదండ్రులతో చక్కగా వ్యవహరించండి, వారిని గౌరవించండి.
ఈ సమాజం ఎంత గొప్ప సమాజంగా మారిపోయినా, తల్లిదండ్రి యొక్క విధేయత లేనంత వరకు ఈ సమాజం ఆదర్శ సమాజం కాలేదు. షిర్క్ ఎంత హరామో, తల్లిదండ్రి విశ్వాసులైతే వారి అవిధేయత అంతే హరాం. అల్లాహ్ ఖురాన్‌లో ఎక్కడ తౌహీద్ యొక్క ప్రస్తావన చేసినా వెంటనే తల్లిదండ్రి విధేయత గురించి అల్లాహ్ ప్రస్తావన తీసుకువచ్చారు.
హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హుమా హదీసుల్లేఖిస్తున్నారు. ప్రవక్త అంటున్నారు: “రిధా రబ్బీ ఫీ రిధల్ వాలిదైన్.” అల్లాహ్ యొక్క సంతృప్తి, అల్లాహ్ యొక్క ఆనందం, అల్లాహ్ యొక్క సంతుష్టీకరణ మీ తల్లిదండ్రిని గనక మీరు సంతోష పెడితే అందులో అల్లాహ్ యొక్క సంతోషం ఉంది. మీ తల్లిదండ్రిని గనక మీరు ఇష్టపెట్టకపోతే మీతో అల్లాహ్ ఇష్టపెట్టడు. కాబట్టి ఈరోజు ఆదర్శ సమాజం అన్న ఈ కాన్ఫరెన్స్ ద్వారా నేను మీకు ఇస్తున్న రెండో సందేశం, తల్లిదండ్రి విధేయత.
అదే అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హుమా ఒక వ్యక్తిని చూశారు. ఆ వ్యక్తి యమన్ దేశము నుండి కాబాకు వచ్చి తన తల్లిని భుజాలపై కూర్చోబెట్టుకొని కాబా ప్రదక్షిణ చేస్తున్నాడు. ప్రదక్షిణ అయిన తర్వాత ఆ వ్యక్తి అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హుమా వద్దకు వచ్చి అడిగాడు: “అయ్యా, ఈమె నా తల్లి. ఈమెను నేను నా భుజాలపై కూర్చోబెట్టుకొని కాబా యాత్ర చేశాను. నేను ఈమె యొక్క హక్కును, ఈమె రుణాన్ని నేను చెల్లించానా? ఈమె హక్కును నేను చెల్లించానా?” అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హుమా అంటున్నారు: “నీ మాతృమూర్తి నీకు జన్మనిచ్చినప్పుడు పడిన కష్టములో, పడిన బాధలో ఒక శ్వాస యొక్క రుణాన్ని కూడా నీవు నీ తల్లితో తీర్చుకోలేదయ్యా” అన్నారు. అల్లాహు అక్బర్! ప్రియులారా, ఆదర్శ సమాజం యొక్క స్థాపనలో తల్లిదండ్రి విధేయత మహోన్నతమైన స్థానాన్ని కలిగి ఉంటుంది.
అశ్లీలతకు దూరంగా ఉండటం
ఇక నా అంశములో మూడవ మాట ప్రియులారా, ఆదర్శ సమాజం యొక్క స్థాపనలో ఏ హరాం విషయముల నుండి మనం దూరంగా ఉండాలి? అల్లాహ్ అంటున్నారు:
وَلَا تَقْرَبُوا الْفَوَاحِشَ مَا ظَهَرَ مِنْهَا وَمَا بَطَنَ మీరు అశ్లీలం దరిదాపులకు వెళ్ళకండి, బహిరంగంగా చేసే అశ్లీలం మరియు గుట్టు చప్పుడు కాకుండా చేసే అశ్లీలం.
అల్లాహ్ అంటున్నారు, మీరు అశ్లీలం దరిదాపులకు వెళితే సమాజం ఉత్తమ సమాజంగా మారదు. ఎలాంటి అశ్లీలం? అల్లాహ్ అంటున్నారు, బాహాటంగా చేసే అశ్లీలం, గుట్టు చప్పుడు కాకుండా, నన్ను ఎవరూ చూడటము లేదే అని మనము చేసే అశ్లీలం. అల్లాహ్ త’ఆలా ఖురాన్ గ్రంథములో చెడు పని చేయకండి అని చెప్పలేదు, చెడు పని దరిదాపులకు కూడా వెళ్ళకండి అన్నారు.
అశ్లీలం అంటే ఏంటి? ఈరోజు అశ్లీలం రకరకాలుగా ఉంది. సంగీతం అశ్లీలం, పాటలు అశ్లీలం, చలన చిత్రాలు అశ్లీలం, వస్త్రధారణలో అశ్లీలం, ప్రేమ పేరుతో జీవితాన్ని నాశనం చేయటం, ప్రేమకు ముందు అశ్లీలం.
వలీ లేకుండా నికాహ్ చేసుకొని సమాజములో అశ్లీలం. ఈరోజు ఆదర్శ సమాజం ఏర్పాటు చేయాలంటే మన నికాహ్ వ్యవహారాలు ఈరోజు ఎలా ఉన్నాయి ప్రియులారా? నాకు బాధనిపిస్తుంది. నేను ఆంధ్ర రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో తిరుగుతాను. ఏ విధంగా ఉంది అంటే, వారు ఎవరో అంటున్నారు ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలతో నికాహ్ చేసుకుంటున్నారు, ఫలానా జిహాద్ ఏదో అంటున్నారు. అది కాదు, దానికి విరుద్ధంగా జరుగుతుంది. మన ఆడపిల్లలు ప్రియులారా, ఈరోజు సమాజంలో అల్లాహ్ రక్షించాలి. ప్రియమైన సోదరీమణులారా, మీరు గనక వింటే అశ్లీలం హరాం. అశ్లీలం నిషిద్ధం ప్రియులారా. అశ్లీలానికి దూరంగా ఉన్నంత వరకు మనం ఏమీ చేయలేము.
పదండి చూద్దాం. అశ్లీలం అంటే ఏంటి? పాటలు. సినిమా పాటలు మనం వింటున్నాం. ఏవండీ, మ్యూజిక్ ఏంటండీ? మ్యూజిక్ హరాం అండీ అని చెబితే ఈరోజు అంటారు, “అరే! మనసు బాగాలేదండీ. అశ్లీలంతో కూడిన సంగీతం, సాధారణ సంగీతం వింటే మనసుకు వినసొంపుగా ఉంటుంది” అని అంటారు. ఇబ్నె తైమియా రహిమహుల్లాహ్ త’ఆలా అంటున్నారు, “అది మద్యము. మనిషి హృదయానికి సంగీతం మద్యపానము లాంటిది. సంగీతం ఎలాగైతే మనిషిని, మద్యపానం ఎలాగైతే నాశనం చేస్తుందో, సంగీతం మనిషిని నాశనం చేస్తుంది.”
ఈరోజు ప్రేమ పేరుతో వివాహాలు. మీ తల్లిదండ్రి నిన్ను కని, జన్మనిచ్చి, పెంచి పోషిస్తే, తల్లిదండ్రి యొక్క గౌరవాన్ని బజారులో కలపటం ఆదర్శ సమాజం కాదు. మొబైల్ లో హరాం చూస్తే, దీని పర్యవసానం ఏంటి?
సౌబాన్ రదియల్లాహు త’ఆలా అన్హు చెప్పారు: ప్రవక్త వారు ఇలా అంటున్నారు: “నా సమాజములో కొంతమంది ప్రళయ దినాన తిహామా పర్వతమంత పరిమాణములో పుణ్యాన్ని తీసుకు వస్తారు.” కానీ అల్లాహ్ ఏం చేస్తాడు? “హబా అమ్ మన్సూరా.” వారి యొక్క పుణ్య కార్యాలను అల్లాహ్ ధూళి చేసేస్తాడు, దుమ్ము చేసేస్తాడు. వారి పుణ్య కార్యాలు పనికి రావు. తిహామా పర్వతమంత పరిమాణంలో పుణ్య కార్యాలు. ప్రవక్తా! ఏమై ఉంటుంది వారి జీవితం? వారు మాలాగా విశ్వసిస్తారే, నమాజును స్థాపించే వారే కదా? ప్రవక్త అంటున్నారు, వారు ఏకాంతములో హరాం పనులు చేసేవారై ఉంటారు. నీ జీవితం లో నమాజ్ మరియు మిగతా మంచి పనులు చేస్తావు. కానీ ఏకాంతములో నీవు చేసిన హరాం పని ప్రళయ దినాన నీ ఆచరణ మొత్తాన్ని తుక్కు చేసేస్తుంది. కాబట్టి జాగ్రత్త పడండి.
ఇక ఆఖరి చివరి మాట. ఈరోజు ఇస్లాం ధర్మంలో స్త్రీకి అల్లాహ్ త’ఆలా హిజాబ్‌ను ఇచ్చాడు. ఈరోజు మన సోదరీమణులు హిజాబ్ లేకుండా తిరుగుతున్నారు. ఇది అశ్లీలం కాదా ప్రియులారా? హిజాబ్ లేకుండా తిరగటం అశ్లీలము కాదా? ఈరోజు ఇంట్లో బయలుదేరి హిజాబ్ ఒంటిపై ఉంటుంది, ఇంటి నుండి వెళ్ళిన తర్వాత హిజాబ్ బ్యాగులో ఉంటుంది. ఇది ఎక్కడి ఈమాన్ ప్రియులారా? తల్లిదండ్రులారా, మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను, మీ పిల్లల యొక్క ట్రైనింగ్ మనం ఉత్తమ పద్ధతిలో చేయాలి. నా కూతురు అండి, నాకు ప్రేమ. కూతురికి ఏం చెప్పలేకపోతున్నాను. కూతుర్ని ఏం చేయలేకపోతున్నాను. ప్రవక్త వారు ఫాతిమా రదియల్లాహు త’ఆలా అన్హా గురించి ఏమన్నారు? ఫాతిమా నా శరీరంలో ముక్క(ఒక భాగం) . అంటే ఫాతిమాను అంత ప్రవక్త వారు ప్రేమించేవారు. ఒకసారి జుహైనా తెగకు చెందిన స్త్రీ దొంగతనం చేసింది. ఆ దొంగతనానికి సంబంధించి ప్రవక్త వారు చెయ్యి కత్తిరించమని ఆజ్ఞ ఇచ్చారు. రికమెండేషన్ వచ్చింది. ప్రవక్త ఏమన్నారు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రాణం ఎవరి చేతిలో ఉందో అల్లాహ్ సాక్షిగా! నా శరీరంలో ముక్క అయిన ఫాతిమా దొంగతనము చేసినా, ఈ ముహమ్మద్ తన కూతురు ఫాతిమా యొక్క చేతులు కత్తిరిస్తాడు. సుబ్ హా నల్లాహ్! కూతుర్ని ప్రవక్త ప్రేమించారు, కానీ ఏమంటున్నారు? హరాం పని చేస్తే కూతుర్ని కూడా ప్రవక్త శిక్షించటానికి వెనుకాడలేదు.
ఈరోజు మన ఇండ్లు ఎలా ఉన్నాయి? సోదరీమణులారా, మీరు వినండి. హిజాబ్ అల్లాహ్ త’ఆలా ఆకాశాల పై నుండి స్త్రీలకు ఇచ్చిన వరం ప్రియులారా. ఒక నల్లటి నీగ్రో స్త్రీ ప్రవక్త వద్దకు వచ్చింది: “ప్రవక్తా!” “చెప్పమ్మా.” “ప్రవక్తా!” “చెప్పు.” “నాకు మూర్ఛ వ్యాధి ఉంది ప్రవక్తా. మూర్ఛ వ్యాధి వస్తే, మూర్ఛ వ్యాధికి శరీరం కొట్టుకొని కింద పడిపోతాను ప్రవక్తా. కింద పడిపోయిన సమయంలో నా శరీరంపై బట్టలు అటూ ఇటూ చిందరవందర అయిపోతాయి. తమరు అల్లాహ్ తో దుఆ చేయండి, నాకు మూర్ఛ వ్యాధి తగ్గిపోవాలని.” ప్రవక్త అన్నారు: “అమ్మా! ఆ మూర్ఛ వ్యాధిపై ఓర్పు వహించు. అల్లాహ్ నీకు స్వర్గాన్ని ఇస్తాడు. లేదంటావా, నువ్వు ప్రార్థించమంటావా, నేను ప్రార్థిస్తాను తల్లి. కానీ స్వర్గం యొక్క వాగ్దానం చేయను.” ఆ స్త్రీ అంటుంది: “లేదు ప్రవక్తా, ఆ వ్యాధిపైనే జీవితం గడిపేస్తాను. కానీ ఒక్క దుఆ చేసి పెట్టండి ప్రవక్తా. ఎప్పుడైతే ఆ వ్యాధి వచ్చి, మూర్ఛ వచ్చి నేను కింద పడిపోతానో, నా దేహంపై బట్టలు చిందరవందర అయిపోతాయి కదా ప్రవక్తా. అల్లాహ్ తో దుఆ చేయండి, ఆ మూర్ఛ వ్యాధి వచ్చి నేను కింద పడిపోతే, నా శరీరంపై బట్టలు చిందరవందర కాకూడదు, పరపురుషుడు నా దేహాన్ని చూడకూడదు.” అల్లాహు అక్బర్! ఈరోజు మన సోదరీమణులు ఎక్కడ ఉన్నారు?
హలాల్ జీవనోపాధి మరియు దాని ప్రభావం
ప్రియులారా, ఇక మనం మాట్లాడుకుంటే సోదరులారా, ఈరోజు మనం ఆదర్శ సమాజం స్థాపించటానికి చేయాల్సిన పని, మనం తినేది హలాల్ అవ్వాలి. అల్లాహ్ ఏమన్నారు ఇదే వాక్యాలలో? “వ అవుఫుల్ కైల.” మీరు ఎప్పుడైతే కొలతలు తూస్తారో చక్కగా తూకం చేయండి. “వల్ మీజాన బిల్ ఖిస్త్.” మీరు ఎప్పుడైతే త్రాసు చూస్తారో త్రాసును చక్కగా చూడండి. మనం నమాజ్ చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ హరాం తింటున్నాం. ఈ హరాం గొప్ప డేంజర్ అండి. మనం దేన్ని తింటున్నాం పొట్టలో?
يَا أَيُّهَا الرُّسُلُ كُلُوا مِنَ الطَّيِّبَاتِ وَاعْمَلُوا صَالِحًا ఓ ప్రవక్తలారా! తయ్యిబ్ (పవిత్రమైన) హలాల్ తినండి మరియు సత్కార్యాలు చేయండి. (23:51)
ఈ వాక్యం ద్వారా ఉలమాలు రాస్తున్న మాట ఏంటి? ఎవడైతే హలాల్ తింటాడో వాడే సత్కార్యము చేయగలడు. హరాం తిన్నవాడు సత్కార్యము చేయలేడు. ప్రపంచంలో, హరాం యొక్క పర్యవసానాలు ఏంటి? వడ్డీ కానివ్వండి, తూకములో లోపము చేయటం కానివ్వండి, అబద్ధపు సాక్ష్యం చెప్పి వస్తువు అమ్మటం కానివ్వండి, అబద్ధపు ప్రమాణాలు చేయనివ్వండి. డబ్బు అయితే వచ్చేస్తుంది. దీని పర్యవసానాలు? “ఇన్నల్లాహ తయ్యిబ్, లా యఖ్బలు ఇల్లత్ తయ్యిబా.” అల్లాహ్ పరిశుద్ధుడు, పరిశుద్ధము కాకుండా ఏమీ స్వీకరించడు. మనం తినేది హరాం, సంపాదన హరాం. అబద్ధము చెప్పి, దొంగతనము చేసి, మోసము చేసి, కల్తీ చేసి అమ్మేస్తున్నాను. అల్లాహ్ ఆరాధన స్వీకరించడు.
మొదటి హదీస్, ఒక వ్యక్తి మక్కా వెళ్ళాడు, కాబాకు వెళ్ళాడు. చేతులు పైకెత్తాడు: “అల్లాహ్! నా ప్రార్థన ఆలకించు.” అల్లాహ్ అన్నాడు, “వీడి బట్ట హరాం, వీడి తిండి హరాం, వీడు హరాం”. వీడి యొక్క దుఆ అల్లాహ్ త’ఆలా ఎలా స్వీకరిస్తాడు? సుబ్ హా నల్లాహ్! ఆలోచించండి, హరాం తింటే వాటి ఏం జరుగుతుంది?
సుఫ్యాన్ అసౌరీ రహిమహుల్లాహ్ యొక్క శిష్యుడు, అతని పేరు యూసుఫ్ అస్బాత్. ఆయన అన్నారు, షైతాన్ ఏం చేస్తాడట? షైతాన్ ఉదయాన్నే తన సైన్యాన్ని పంపుతాడు: “అరే ఎవరు ఆరాధన చేస్తున్నారో చూసుకొని రా.” ఎప్పుడైతే వెళ్లి ఒక వ్యక్తి హరాం తింటున్నాడు తెలుస్తుందో వెంటనే అంటాడు షైతాన్: “వాడి వద్దకు నువ్వు వెళ్ళొద్దు. వాడి హరాం వాడిని నాశనం చేసేస్తుంది.”
అదే హలాల్ తింటే మన ఇండ్లు సంస్కరించబడతాయి, మన యొక్క సమాజం సంస్కరించబడుతుంది. సలఫ్ ఎలా ఉండేవారు తినటంలో? అబ్దుల్లా బిన్ ముబారక్ రహిమహుల్లాహ్ ఒక గొప్ప విద్యావంతుడు. అబ్దుల్లా బిన్ ముబారక్ వాళ్ళ తండ్రి ముబారక్ ఒక దానిమ్మ తోటలో పని చేసేవారు. చాలా రోజులకు దానిమ్మ తోట యజమాని వచ్చి అన్నాడు: “ముబారక్! ఒక దానిమ్మ చెట్టు నుండి ఒక దానిమ్మ పండు తీసుకురా.” ముబారక్ వెళ్లారు. దానిమ్మ చెట్టు నుండి దానిమ్మ పండు తీసుకువచ్చారు యజమానికి ఇచ్చారు. యజమాని తిన్నాడు, పుల్లగా ఉంది. “ముబారక్! ఇంకో దానిమ్మ పండు తీసుకురా.” హజరతే ముబారక్ రహిమహుల్లాహ్ వెళ్లారు. ఇంకో దానిమ్మ పండు తీసుకువచ్చారు, అదీ పుల్లగా ఉంది. అడిగారు యజమాని: “ఏమయ్యా! ఇన్నేళ్ల బట్టి నా తోటలో పని చేస్తున్నావు. ఏ చెట్టు దానిమ్మ పండు పుల్లగా ఉంటుందో, ఏ చెట్టు దానిమ్మ పండు తియ్యగా ఉంటుందో నీకు తెలియదా?” ముబారక్ అన్నారు: “అయ్యా, నేను మీ తోటలో కాపలా వాడిని. ఏ పండు ఎలా ఉందో చెక్ చేసే వాడిని కాదు. ఈ రోజు వరకు ఏ పండు ఎలా ఉంటుందో నేను తినలేదయ్యా.” యజమాని సంతోషపడ్డాడు. తన కూతురిని ముబారక్‌కి ఇచ్చి పెళ్లి చేశాడు. ఇద్దరికీ కలిగిన సంతానం అబ్దుల్లా బిన్ ముబారక్ రహిమహుల్లాహ్.
బుఖారీ రహిమహుల్లాహ్ నాన్న ఇస్మాయిల్ అంటారు,: “నా ఇంట్లో ఒక్క దిర్హము కూడా హరాం ప్రవేశించలేదు.” హరాం కాదు, అనుమానాస్పదము కూడా. పర్యవసానం? బుఖారీ రహిమహుల్లాహ్ వచ్చారు. కాబట్టి ఆదర్శ సమాజ సంస్థాపనకు మనం తింటున్న ఆహారం, మనం చేస్తున్న వ్యాపారం చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. లేదంటారా, ప్రపంచంలో మన హృదయం కఠినమైపోతుంది.
హసన్ బస్రీ రహిమహుల్లాహ్ అంటారు: “ఈ ప్రపంచములో అల్లాహ్ మనిషికి ఇచ్చే అతి పెద్ద శిక్ష, హరాం తినటం వల్ల వాడి హృదయం బండరాయి మాదిరిగా అయిపోతుంది.” ప్రేమ, కారుణ్యం వాడి హృదయంలో ఉండవు. కాబట్టి, మనం ఈరోజు ఈ యొక్క ఆదర్శ సమాజాన్ని స్థాపించాలంటే ఈ మార్గంపై నడవాలి ప్రియులారా. ప్రవక్త ఈ వాక్యాలు చెప్పి అదే అన్నారు:
وَأَنَّ هَذَا صِرَاطِي مُسْتَقِيمًا فَاتَّبِعُوهُ وَلاَ تَتَّبِعُواْ السُّبُلَ فَتَفَرَّقَ بِكُمْ عَن سَبِيلِهِ ذَلِكُمْ وَصَّاكُم بِهِ لَعَلَّكُمْ تَتَّقُونَ ఇది నా మార్గం. దీనిపై అనుసరించండి. మీరు నా మార్గంపై ఉంటారు. నా మార్గాన్ని విడిచిపెట్టేస్తే మీరు వేరే మార్గాలపై వెళ్ళిపోతారు.
అల్లాహ్ త’ఆలా మనందరికీ ప్రవక్త వారు, అల్లాహ్ బోధించిన ఈ మార్గంపై నడిచే సద్భాగ్యాన్ని ప్రసాదించు గాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. వస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
నాలుక ఉపద్రవాలు – Dangers of the Tongue https://youtu.be/4_uBq6Qy5lM [20 నిముషాలు] వక్త: హబీబుర్ రహ్మాన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో, నాలుక వల్ల కలిగే ఐదు ప్రధాన ఉపద్రవాలు మరియు పాపాల గురించి వివరించబడింది. ఇస్లాంలో నాలుకను అదుపులో ఉంచుకోవడం యొక్క ప్రాముఖ్యతను హదీసుల వెలుగులో నొక్కి చెప్పబడింది. పరోక్ష నింద (గీబత్), చాడీలు చెప్పడం (నమీమత్), రెండు నాలుకల ధోరణి (జుల్ వజ్హైన్), అబద్ధం చెప్పడం (కజిబ్), మరియు అబద్ధపు ప్రమాణం చేయడం అనే ఐదు పాపాలు స్వర్గానికి దూరం చేసి నరకానికి దగ్గర చేస్తాయని ఖురాన్ మరియు హదీసుల ఆధారాలతో హెచ్చరించబడింది. ముస్లిం తన నాలుక మరియు చేతుల నుండి ఇతరులకు హాని కలగకుండా చూసుకున్నప్పుడే ఉత్తముడవుతాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధనల సారాంశం.
అభిమాన సోదరులారా, మీకందరికీ నా ఇస్లామీ అభివాదం, అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహ్.
ఈరోజు మనం నాలుక ఉపద్రవాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
ప్రియ సోదరులారా, మనిషి, ఒక ముస్లిం అవసరం మేరకే మాట్లాడాలి. అనవసరమైన మాటలు మాట్లాడేవారు, పిడి వాదాలకు దిగేవారు హదీసులో తీవ్ర పదజాలంతో హెచ్చరించబడ్డారు. అందుకే “నోరే నాకం (స్వర్గం), నోరే నరకం” అన్నారు పెద్దలు. నాలుకను సరిగ్గా ఉపయోగిస్తే అది స్వర్గానికి మార్గం సుగమం చేస్తుంది, దాన్ని దుర్వినియోగం చేస్తే నరకానికి గొనిపోతుంది అన్నమాట.
ముక్తికి మార్గం
ఒక హదీస్ తెలుసుకుందాం. తిర్మిజీలో హదీస్ ఉంది. ఉఖ్బా బిన్ ఆమిర్ రదియల్లాహు త’ఆలా అన్హు కథనం, ఆయన ప్రవక్త గారిని ఒక మాట అడిగారు. అది ఏమిటి?
“యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం,
مَنِ النَّجَاةُ؟ (మన్ నజాత్?)” “ముక్తికి మార్గం ఏది?”
ఓ దైవ ప్రవక్తా, ముక్తికి మార్గం ఏది? అని అడిగారు. చాలా ముఖ్యమైన ప్రశ్న ఇది. ముక్తికి మార్గం ఏది? దానికి సమాధానంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు:
أَمْسِكْ عَلَيْكَ لِسَانَكَ، وَلْيَسَعْكَ بَيْتُكَ، وَابْكِ عَلَى خَطِيئَتِكَ (అమ్సిక్ అలైక లిసానక, వల్ యస’అక బైతుక, వబ్కి అలా ఖతీఅతిక) నీ నాలుకను అదుపులో ఉంచుకో.అలాగే నీ ఇల్లు నిన్ను ఇమిడ్చుకోవాలి. పాపాలను గుర్తు చేసుకుని, మనము చేసిన తప్పుల్ని గుర్తు చేసుకుని రోదించాలి
ఈ హదీస్ తిర్మిజీ గ్రంథంలో ఉంది. అంటే, ఉఖ్బా బిన్ ఆమిర్ రదియల్లాహు అన్హు అడిగిన ప్రశ్న మాట ఏమిటి? ముక్తికి మార్గం ఏది? సమాధానం ఏమిటి ప్రవక్త గారు చెప్పారు? నీ నాలుకను అదుపులో ఉంచుకో, పెట్టుకో. నీ నాలుకను కాపాడుకో. అలాగే నీ ఇల్లు నిన్ను ఇమిడ్చుకోవాలి, అంటే నీ తీరిక సమయం ఇంట్లో గడవాలి. అలాగే నీ పాపాలను, నీ బలహీనతలను గుర్తించుకుని రోదించు, కన్నీళ్లు కార్చు అన్నమాట.
అంటే ఈ హదీస్‌లో ఉఖ్బా బిన్ ఆమిర్ రదియల్లాహు అన్హు ఒక ముఖ్యమైన ప్రశ్న అడిగితే, ముక్తి పొందాలంటే ఎలా పొందగలము, ముక్తికి మార్గం ఏది అంటే, దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మూడు విషయాలు చెప్పారు.
దాంట్లో మొదటిది ఏమిటి? నాలుకను అదుపులో పెట్టుకో. నాలుకను కాపాడుకో, రక్షించుకో. ఎందుకు? ఎందుకంటే నోరే నాకం, నోరే నరకం, ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా ముఖ్యమైన విషయం మాట ఇది పెద్దలు చెప్పిన మాట.
రెండవది, తీరిక సమయాన్ని, ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా ఇంట్లో గడపాలి.
మూడవది, పాపాలను గుర్తు చేసుకుని, మనము చేసిన తప్పుల్ని గుర్తు చేసుకుని రోదించాలి, కన్నీళ్లు కార్చాలి.
నాలుక ప్రాముఖ్యత
ఇక ఇంకో హదీస్ తెలుసుకుందాం. అబూ సయీద్ రదియల్లాహు త’ఆలా అన్హు కథనం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు. అదేమిటంటే, తెల్లవారజామున మనిషి శరీరంలోని అవయవాలన్నీ నాలుకను అత్యంత దీనంగా బతిమాలుతాయి. ఏమని బతిమాలుతాయి? “ఓ నాలుకా, నువ్వు మా విషయంలో అల్లాహ్‌కు భయపడి మసలుకో. ఎందుకంటే మా వ్యవహారం నీతో ముడిపడి ఉంది. నువ్వు సవ్యంగా ఉంటే మేము కూడా సవ్యంగా ఉండగలుగుతాం. నువ్వు వక్రతకు లోనైతే మేము కూడా వక్రతకు లోనైపోతాము.” ఈ విధంగా ప్రధాన పాత్ర వహిస్తుంది నాలుక. అది సవ్యంగా ఉంటే శరీర అవయవాలన్నీ సవ్యంగా ఉంటాయి. నాలుక వక్రతకు లోనైతే శరీర అవయవాలన్నీ వక్రతకు లోనైపోతాయి అన్నమాట.
ఇంకో హదీస్. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు:
مَنْ وَقَاهُ اللَّهُ شَرَّ مَا بَيْنَ لَحْيَيْهِ وَشَرَّ مَا بَيْنَ رِجْلَيْهِ دَخَلَ الْجَنَّةَ (మన్ వఖాహుల్లాహు షర్ర మాబైన లహ్యైహి వ షర్ర మాబైన రిజ్లైహి దఖలల్ జన్నహ్) “ఎవరినైతే అల్లాహ్ అతని రెండు దవడల మధ్య ఉన్న దాని (నాలుక) చెడు నుండి మరియు రెండు కాళ్ళ మధ్య ఉన్న దాని (మర్మాంగం) చెడు నుండి కాపాడతాడో, అతను స్వర్గంలో ప్రవేశిస్తాడు.”
ఎవడైతే తన రెండు దవడల మధ్య ఉన్న నాలుకను రక్షించుకుంటాడో, కాపాడుకుంటాడో, అలాగే రెండు కాళ్ళ మధ్య ఉన్న మర్మాంగాన్ని కాపాడుకుంటాడో, దఖలల్ జన్నహ్, అటువంటి వ్యక్తి స్వర్గంలో ప్రవేశిస్తాడు. అంటే స్వర్గంలో ప్రవేశించడానికి రెండు ముఖ్యమైన విషయాలను మనం రక్షించుకోవాలి అన్నమాట. ఒకటి నాలుక, రెండవది మర్మాంగం.
ఇక ఇంకో హదీస్. అబూ మూసా రదియల్లాహు అన్హు దైవ ప్రవక్తకు ప్రశ్న అడిగారు, “ఖుల్తు యా రసూలల్లాహ్, నేను అడిగాను, ఓ దైవ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం,
ఓ దైవ ప్రవక్తా, ముస్లింలు చాలా మంది ఉన్నారు సమాజంలో, ప్రపంచంలో. శ్రేష్ఠమైన ముస్లిం ఎవరు? ముస్లింలలో ఉత్తమమైన ముస్లిము, శ్రేష్ఠమైన వాడు, గొప్పవాడు ఎవరు? దానికి సమాధానం ప్రవక్త గారు ఇలా ఇచ్చారు:
مَنْ سَلِمَ الْمُسْلِمُونَ مِنْ لِسَانِهِ وَيَدِهِ (మన్ సలిమల్ ముస్లిమూన మిన్ లిసానిహీ వ యదిహీ) “ఎవని నాలుక మరియు చేతి నుండి ఇతర ముస్లింలు సురక్షితంగా ఉంటారో (అతనే ఉత్తముడు).”
ఏ ముస్లిం నాలుక ద్వారా, చేతుల ద్వారా ఇతరులకి హాని జరగదో, కీడు జరగదో, అటువంటి ముస్లిం అందరికంటే శ్రేష్ఠుడు, ఉత్తముడు అని మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఈ హదీస్ బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో ఉంది. సారాంశం ఏమిటంటే, నోరే నాకం, నోరే నరకం. కావున, అభిమాన సోదరులారా, నాలుక ఉపద్రవాలలో ఐదు తెలుసుకోబోతున్నాం. అంటే నాలుకకి సంబంధించిన పాపాలలో ఐదు పాపాలు మనం తెలుసుకుందాం.
నాలుక ఉపద్రవాలు
మొదటిది, గీబత్, పరోక్ష నింద. గీబత్ అంటే ఏంటి? ఒక హదీస్ మనం తెలుసుకుంటే మనకు గీబత్ అర్థమవుతుంది. అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు కథనం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు,
أَتَدْرُونَ مَا الْغِيبَةُ؟ (అతద్రూన మల్ గీబహ్?) “గీబత్ (పరోక్ష నింద) అంటే ఏమిటో మీకు తెలుసా?”
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సంభాషణ శైలి సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఒక్కొక్కసారి వాక్యం చెప్పేస్తారు, హదీస్. ఒక్కొక్కసారి ప్రశ్నోత్తరాల రూపంలో చెబుతారు. ఆ చెప్పబోయే మాట ఎంత ముఖ్యమైన ఉంటుందో ఆ విధంగా మాట్లాడే పద్ధతి ఉంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గీబత్ గురించి ఇలా ఆయనే అడుగుతున్నారు, “అతద్రూన మల్ గీబహ్? గీబత్ ఏంటో మీకు తెలుసా?”
సహాబాలు అన్నారు,
اللَّهُ وَرَسُولُهُ أَعْلَمُ (అల్లాహు వ రసూలుహూ అ’అలమ్) “అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకే బాగా తెలుసు.”
సహాబాలు బదులిచ్చారు, “ఓ దైవ ప్రవక్తా, అల్లాహ్‌కు తెలుసు, అల్లాహ్ ప్రవక్తకు తెలుసు, మాకు తెలియదు” అని. అప్పుడు అన్నారు ప్రవక్త గారు,
ذِكْرُكَ أَخَاكَ بِمَا يَكْرَهُ (దిక్రుక అఖాక బిమా యక్రహ్) “నీ సోదరుని గురించి అతను ఇష్టపడని విధంగా ప్రస్తావించటమే (గీబత్).”
అంటే మీ సోదరుని గురించి అతను వింటే అసహ్యించుకునే విధంగా మాట్లాడటం. సోదరుడు లేనప్పుడు వీపు వెనుక అతను వింటే అసహ్యించుకుంటాడు, ఆ విధంగా అతని గురించి మాట్లాడటం, దానికి గీబత్ అంటారు అని ప్రవక్త గారు సమాధానం ఇచ్చారు. ఈ సమాధానం విని సహాబీ మళ్ళీ తన ఒక డౌట్‌ని ఇలా అడిగారు, వ్యక్తం చేశారు, అదేమిటి, ఖీల (అడగబడింది),
أَفَرَأَيْتَ إِنْ كَانَ فِي أَخِي مَا أَقُولُ؟ (అఫరఅయిత ఇన్ కాన ఫీ అఖీ మా అఖూల్?) “ఒకవేళ నేను చెప్పేది నా సోదరునిలో నిజంగానే ఉంటే అప్పుడేమిటి?”
“ఓ దైవ ప్రవక్తా, నా సోదరుని గురించి నేను చెప్పేది నిజంగానే అతనిలో ఉంది. ఏ లోపం గురించి నేను మాట్లాడుతున్నానో, ఏ తప్పు గురించి నేను మాట్లాడుతున్నానో నా సోదరుని గురించి, అది నిజంగానే అతనిలో ఉంది. అతనిలో లేనిది నేను చెప్పటం లేదు. అతనిలో ఉన్న విషయాన్నే నేను చెప్తున్నాను. అలాగైతే?” అని ఆయన తన అనుమానాన్ని వ్యక్తం చేశారు. దానికి విని ప్రవక్త గారు అన్నారు,
إِنْ كَانَ فِيهِ مَا تَقُولُ فَقَدِ اغْتَبْتَهُ (ఇన్ కాన ఫీహి మా తఖూలు ఫఖద్ ఇగ్తబ్తహు) “అతనిలో నువ్వు చెప్పేది ఉంటేనే నువ్వు గీబత్ చేసినట్లు.”
అంటే అతనిలో ఉండే తప్పులనే నువ్వు చెప్తున్నావు, అప్పుడే అది గీబత్ అయ్యేది. అతనిలో ఉండే లోపాలు, అతనిలో ఉండే తప్పులు, అతను లేనప్పుడు నువ్వు అతను అసహ్యించుకునేలా చెప్తున్నావు కదా, అదే గీబత్.
وَإِنْ لَمْ يَكُنْ فِيهِ فَقَدْ بَهَتَّهُ (వ ఇన్ లమ్ యకున్ ఫీహి ఫఖద్ బహత్తహు) “ఒకవేళ అతనిలో అది లేకపోతే, నువ్వు అతనిపై అభాండం (బుహతాన్) మోపినట్లు.”
అతనిలో లేనిది చెప్తే అది గీబత్ కాదు, బుహతాన్ అవుతుంది, అభాండాలు వేయటం అవుతుంది. గీబత్ (పరోక్ష నింద) వేరు, అభాండం వేయటం వేరు. ఒక వ్యక్తిలోని ఉండే లోపాలు, తప్పులు అతను లేనప్పుడు చెప్పుకోవటం గీబత్. అతను వింటే బాధపడతాడు, ఆ విధంగా చెప్పుకోవటం గీబత్, పరోక్ష నింద. అతనిలో లేని విషయాలు చెప్తే అది బుహతాన్, అభాండం వేయడం అవుతుంది.
కాకపోతే, సాక్ష్యం ఇచ్చేటప్పుడు, కోర్టులో, ఖాజీ దగ్గర, నిర్ణయాలు జరుగుతున్నాయి, పంచాయితీ జరుగుతూ ఉంది, సాక్ష్యం కోసం పిలిపించారు. అటువంటి సమయంలో అందరూ హాజరవుతారు. అటువంటప్పుడు ఉండేది ఉన్నట్టుగా, లేనిది లేనట్టుగా చెప్తే అది తప్పు లేదు. దీనికి చాలా వివరాలు ఉన్నాయి. సారాంశం ఏమిటంటే, గీబత్, పరోక్ష నింద అంటే వ్యక్తి లేనప్పుడు వీపు వెనుక అతను అసహ్యించుకునేలా అతని గురించి చెప్పుకోవటం. ఇది ఇస్లాంలో నిషిద్ధమైనది.
అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరహ్ హుజరాత్‌లో ఇలా తెలియజేశాడు:
…وَلَا يَغْتَب بَّعْضُكُم بَعْضًا ۚ أَيُحِبُّ أَحَدُكُمْ أَن يَأْكُلَ لَحْمَ أَخِيهِ مَيْتًا فَكَرِهْتُمُوهُ ۚ وَاتَّقُوا اللَّهَ ۚ إِنَّ اللَّهَ تَوَّابٌ رَّحِيمٌ “… ఒకరి దోషాలను ఒకరు వెతకకండి. మీలో ఒకరు మరొకరి గురించి చాడీలు చెప్పకండి. మీలో ఎవరయినా తన చనిపోయిన సోదరుని మాంసం తినడానికి ఇష్టపడతాడా? దానిని మీరు అసహ్యించుకుంటారు కదా! మీరు అల్లాహ్‌కు భయపడండి. నిశ్చయంగా, అల్లాహ్ పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, అపార కరుణాప్రదాత.” (49:12)
అల్లాహు అక్బర్! మీరు గీబత్ చేసుకోకండి. మీలో కొందరు కొందరి గురించి గీబత్ చేసుకోకండి. పరోక్ష నింద, వీపు వెనుక చాడీలు చెప్పుకోకండి. వీపు వెనుక, వెనుక చాడీలు చెప్పుకోకండి. మీలో ఎవరైనా చనిపోయిన మీ సోదరుని మాంసం తినడానికి ఇష్టపడతాడా? అల్లాహు అక్బర్! చనిపోయిన సోదరుడు, అంటే శవం మాంసం తినడానికి ఇష్టపడతారా? ఫకరిహ్ తుమూహ్, మీరు ఏవగించుకుంటున్నారు కదా, అసహ్యించుకుంటున్నారు కదా. వత్తఖుల్లాహ్. అలాగైతే, గీబత్ విషయంలో అల్లాహ్‌కు భయపడండి. ఇన్నల్లాహ తవ్వాబుర్ రహీమ్, నిశ్చయంగా అల్లాహ్ తౌబా స్వీకరించేవాడు, కనికరించేవాడు.
ఇది మొదటిది. నాలుక ఉపద్రవాలలో, నాలుకకు సంబంధించిన రోగాలలో ఒకటి, పాపాలలో ఒకటి గీబత్, పరోక్ష నింద.
రెండవది, చాడీలు చెప్పటం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
చాడీలు చెప్పేవాడు స్వర్గంలో ప్రవేశించడు, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఈ హదీస్ బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో ఉంది. అలాగే ఒక హదీస్, మనందరికీ తెలిసిన విషయమే, నేను దాని ఆ హదీస్ యొక్క సారాంశం చెప్తున్నాను. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఎక్కడో పోతుంటే మధ్యలో సమాధులు కనబడినాయి. ఆ సమాధులలో ఏం చెప్పారు? ఈ సమాధిలో ఉన్న వారికి శిక్ష పడుతుంది అని చెప్పాడు ప్రవక్త గారు. దేని మూలంగా? ఒక వ్యక్తికి చాడీల మూలంగా, చాడీలు చెప్పుకుంటూ తిరిగేవాడు ఒక వ్యక్తి, దాని మూలంగా సమాధిలో శిక్ష అనుభవిస్తున్నాడు. రెండో వ్యక్తి, మూత్రం పోసినప్పుడు ఒంటి మీద దాని తాలూకు తుంపరలు పడకుండా జాగ్రత్త పడేవాడు కాదు. కావున చాడీలు సమాజంలో కుటుంబాలను, జీవితాలను ఛిన్నాభిన్నం చేయటానికి ముఖ్యమైన పాత్ర వహిస్తుంది చాడీ. కావున చాడీల నుంచి మనం దూరంగా ఉండాలి. నాలుకకి సంబంధించిన ఉపద్రవాలలో రెండవది చాడీలు చెప్పటం.
మూడవది, జుల్ వజ్హైన్ (రెండు ముఖాల వాడు). రెండు నాలుకల ధోరణికి పాల్పడేవాడు. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, ఒక సుదీర్ఘమైన హదీస్ ఉంది, ఆ హదీస్‌లోని చివరి భాగం ఇది:
وَتَجِدُونَ شَرَّ النَّاسِ ذَا الْوَجْهَيْنِ الَّذِي يَأْتِي هَؤُلاَءِ بِوَجْهٍ وَهَؤُلاَءِ بِوَجْهٍ “ప్రజలలోకెల్లా చెడ్డవాడు రెండు ముఖాల వాడు అని మీరు గమనిస్తారు. అతను ఈ గుంపు వద్దకు ఒక ముఖంతో, ఆ గుంపు వద్దకు మరో ముఖంతో వెళ్తాడు.”
ముత్తఫఖున్ అలైహ్, బుఖారీ, ముస్లింలోని హదీస్. అంటే ప్రజలలో రెండు ముఖాల గలవారిని అత్యంత నీచులు అయినట్లు మీరు గమనిస్తారు. వాడు చేసే పని ఏమిటి? వారు కొందరి దగ్గరికి ఒక ముఖంతో, మరికొందరి దగ్గరికి ఇంకో ముఖంతో వెళ్తారు. అంటే అర్థం ఏమిటి? ఒక వర్గం దగ్గరికి ఒక ముఖంతో పోవటం, ఇంకో వర్గం దగ్గరికి ఇంకో ముఖంతో పోవటం, అర్థం ఏమిటి? ఒక వ్యక్తి దగ్గరికి పోయి, ఒక వర్గం దగ్గరికి పోయి, “నేను మీ శ్రేయోభిలాషిని, మీకు మిత్రుణ్ణి. మీకు ఎవరు శత్రువో వాడు నాకు కూడా శత్రువు.” అతని గురించి గొప్పలు చెప్పుకుని అతని శత్రువు గురించి చెడుగా చెప్పి వచ్చి, మళ్లీ అదే వ్యక్తి శత్రువు దగ్గరికి పోయి ఇదే మాట రిపీట్ చేయటం, “నేను నీకు మిత్రుణ్ణి, నేను నీకు శ్రేయోభిలాషిని, నీ శత్రువుకి నేను శత్రువుని.” ఈ విధంగా అతను రెండు ముఖాలు చూపించాడు. ఒక వర్గం ఇంకో వర్గానికి పడదు, ఈ వర్గానికి ఒక రకంగా మాట్లాడి అదే పద్ధతి ఆ వర్గం దగ్గరికి పోయి కూడా చెప్పటం. దీనిని అంటారు జుల్ వజ్హైన్, రెండు నాలుకల ధోరణి. ఇది చాలా చెడ్డది.
నాలుగవది, అబద్ధం చెప్పటం. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
إِنَّ الصِّدْقَ يَهْدِي إِلَى الْبِرِّ وَإِنَّ الْبِرَّ يَهْدِي إِلَى الْجَنَّةِ… وَإِنَّ الْكَذِبَ يَهْدِي إِلَى الْفُجُورِ وَإِنَّ الْفُجُورَ يَهْدِي إِلَى النَّارِ “నిశ్చయంగా, సత్యం పుణ్యం వైపు దారి తీస్తుంది మరియు పుణ్యం స్వర్గం వైపు దారి తీస్తుంది… మరియు నిశ్చయంగా, అసత్యం పాపం వైపు దారి తీస్తుంది మరియు పాపం నరకం వైపు దారి తీస్తుంది…”
సత్యం అనేది, నిజం అనేది సదాచరణ వైపు తీసుకునిపోతుంది. వ ఇన్నల్ బిర్ర యహదీ ఇలల్ జన్నహ్. సదాచరణ, నిజాయితీ స్వర్గంలో తీసుకునిపోతుంది. వ ఇన్నర్ రజుల లయజ్దుకు. ఒక వ్యక్తి నిజం చెప్తూ ఉంటాడు, హత్తా యుక్తబ ఇందల్లాహి సిద్దీఖన్, చివరికి అల్లాహ్ వద్ద అతను నిజాయితీపరుడు అని అతని గురించి రాయడం జరుగుతుంది, లిఖించడం జరుగుతుంది. వ ఇన్నల్ కజిబ యహదీ ఇలల్ ఫుజూర్, అబద్ధం అనేది అవిధేయత వైపుకు తీసుకునిపోతుంది, పాపం వైపుకు తీసుకుని వెళ్తుంది. వ ఇన్నల్ ఫుజూర యహదీ ఇలన్నార్, ఈ అవిధేయత నరకానికి తీసుకునిపోతుంది. వ ఇన్నర్ రజుల లయక్దిబు, ఒక వ్యక్తి అబద్ధం చెబుతూనే ఉంటాడు, హత్తా యుక్తబ ఇందల్లాహి కజ్జాబన్, చివరికి అల్లాహ్ దగ్గర అతను అబద్ధీకుడుగా లిఖించబడతాడు.
ప్రియ సోదరులారా, సారాంశం ఏమిటంటే ఈ హదీస్‌లో, సత్యమే మాట్లాడితే నిజాయితీపరుడైపోతాడు, తత్కారణంగా స్వర్గంలోకి ప్రవేశిస్తాడు. అబద్ధం మాట్లాడుతూ ఉంటే అబద్ధీకుడు అని లిఖించబడతాడు, తత్కారణంగా నరకానికి పోతాడు. నాలుక ఉపద్రవాలలో ఇది అబద్ధం కూడా ఒకటి.
ఐదవది, అబద్ధపు ప్రమాణం చేయటం. సామాన్యంగా అబద్ధం చెప్పటం అది ఒక రకమైన ఉపద్రవం, తప్పు, చెడు. అబద్ధపు సాక్ష్యం ఇవ్వటం, ప్రమాణం చేయటం లేక ఒట్టు పెట్టుకోవటం అంటే వాస్తవానికి సాక్ష్యం ఇవ్వటం అన్నమాట. లేక ఒకరికి సాక్ష్యంగా పెట్టుకోవటం అన్నమాట. అల్లాహ్ పైన ప్రమాణం చేసి చెబుతున్నాడంటే అదెంత ముఖ్యమైనది, అసాధారణమైన విషయమో బాగా ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనము చేసే ప్రమాణంపై అల్లాహ్‌ను కూడా మనము తీసుకునివస్తున్నాము, అల్లాహ్ పైన ప్రమాణం చేస్తున్నామంటే అల్లాహ్‌కు కూడా దీంట్లో మనము ఇది చేస్తున్నాం. కావున, అవసరం లేకపోయినప్పటికీ ప్రమాణం చేయటమే తప్పు. అవసరం పడితే, ముఖ్యావసరం అయితేనే ప్రమాణం చేయాలి. అవసరం లేకపోతే ప్రమాణం చేయటం తప్పు. దానికి తోడు అబద్ధపు ప్రమాణం చేయటం. సుబ్ హా నల్లాహ్! సత్యమైన, నిజంగానే ప్రమాణం చేయటం అనవసరమైన విషయాలలో చేయకూడదు, అవసరమైతేనే చేయాలి. ఇక ఒకటి అవసరం కాదు, రెండవది ప్రమాణం చేస్తున్నాము, అది కూడా అబద్ధం ప్రమాణం చేస్తున్నాము, అంటే ఇది తీవ్రమైన తప్పు.
అభిమాన సోదరులారా, దీని గురించి ఇస్లాం ధర్మంలో దీని వివరాలు ఎక్కువగా ఉన్నాయి. సారాంశం ఏమిటంటే, నాలుక ఉపద్రవాలలో చాలా ఉన్నాయి, వాటిలో నేను ఐదు విషయాలు నేను వ్యక్తం చేశాను, తెలియజేశాను. ఒకటి గీబత్, పరోక్ష నింద, రెండోది చాడీలు చెప్పటం, మూడవది జుల్ వజ్హైన్, రెండు నాలుకల ధోరణి, నాలుగవది అబద్ధం చెప్పటం, ఐదవది అబద్ధపు ప్రమాణం చేయటం. ఇవి నాలుకకి సంబంధించిన ఉపద్రవాలలో ముఖ్యమైనవి.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ నాలుకకి సంబంధించిన ప్రతి ప్రమాదం నుండి, ప్రతి చెడు నుండి కాపాడు గాక. అల్లాహ్ మనందరికీ ప్రతి పాపం నుండి కాపాడు గాక. ఆమీన్.
వ ఆఖిరు ద’అవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహ్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
పెద్ద పాపాలను గుర్తించడం ఎలా? How to identify the Major Sins? వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) https://youtu.be/GvxwOoF68I0 [5 నిముషాలు]
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అల్లాహ్ యొక్క హద్దులను మితిమీరకండి [వీడియో] వక్త: షరీఫ్, వైజాగ్ (హఫిజహుల్లాహ్), మదీనా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ https://youtu.be/VKKIMPEnFmM [46 నిముషాలు]
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.