
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
https://teluguislam.net/corona/
తెలుగుఇస్లాం.నెట్ * తెలుగులో ఇస్లాం జ్ఞాన సంపద *

383. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు :-
కపట విశ్వాసులకు ఫజ్ర్, ఇషా నమాజుల కంటే మరే నమాజు భారంగా ఉండదు. అయ్యో! ఈ రెండు నమాజులకు ఎంత పుణ్యం లభిస్తుందో తెలిస్తే వారీ నమాజుల్లో పాల్గొనడానికి మోకాళ్ళ మీద కుంటుకుంటూ రావలసి వచ్చినా సరే తప్పకుండా వస్తారు (కాని ఈ కపటుల కసలు నా మాటల మీద నమ్మకమే లేదాయే). ముఅజ్జిన్ కు ఇఖామత్ (పిలుపు) ఇవ్వమని చెప్పి, నమాజు చేయించడానికి (నా స్థానంలో) మరొకరిని నిలబడమని ఆజ్ఞాపించి నేను స్వయంగా అగ్నిజ్వాల తీసుకొని నమాజుకు ఇంకా రాని వారి ఇండ్లను తగలబెడదామని (ఎన్నోసార్లు) అనుకున్నాను.
[సహీహ్ బుఖారీ : 10 వ ప్రకరణం – అజాన్, 34 వ అధ్యాయం – ఫజ్లిల్ ఇషాయి ఫిల్ జమాఅత్]
ప్రార్ధనా స్థలాల ప్రకరణం – 42 వ అధ్యాయం – సామూహిక నమాజు ప్రాముఖ్యం, దీనిని పోగొట్టుకున్న వారికి హెచ్చరిక. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-1. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్
“ఒక వ్యక్తి ఇంటి ముందు ఒక నది ప్రవహిస్తూ ఉండి, అతనా నదిలో ప్రతిరోజు అయిదుసార్లు స్నానం చేస్తూ ఉంటే, ఇక అతని శరీరం మీద మలినం ఉంటుందా? దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?” దానికి ప్రవక్త అనుచరులు “అతని శరీరం మీద ఎలాంటి మలినం మిగిలి ఉండదు” అని అన్నారు ముక్తకంఠం తో.
అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), “రోజుకు అయిదుసార్లు నమాజు చేసే మనిషి పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. అయిదు వేళలా నమాజు చేయడం వల్ల దాసుని పాపాలను అల్లాహ్ క్షమిస్తాడు” అని బోధించారు.
హజ్రత్ ఉస్మాన్ (రధి అల్లాహు అన్హు) మస్జిదె నబవి (ప్రవక్త మస్జిదు) ని పునర్నిర్మించినపుడు ప్రజలు ఆయన్ని ఏవేవో మాటలు అన్నారు. హజ్రత్ ఉస్మాన్ (రధి అల్లాహు అన్హు) ఆ మాటలు విని ఇలా అన్నారు. “మీరు లేనిపోని మాటలు అంటున్నారు గాని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఏమన్నారో తెలుసా? ‘కేవలం దేవుని ప్రసన్నత కోసం ఎవరైనా మస్జిదు నిర్మిస్తే అతని కోసం దేవుడు అలాంటిదే ఒక ఇల్లు స్వర్గంలో నిర్మిస్తాడు’ అని అన్నారాయన.”
Read English Version: Whoever built a masjid, with the intention of seeking Allaah’s pleasure ..
హజ్రత్ ఉమర్ (రధి అల్లాహు అన్హు) భార్యలలో ఒకరు ఫజ్ర్, ఇషా వేళల సామూహిక నమాజులు చేయడానికి మస్జిద్ కు వెళ్ళేవారు. “స్త్రీలు మస్జిద్ కు వెళ్లడాన్ని హజ్రత్ ఉమర్ (రధి అల్లాహు అన్హు) ఇష్టపడరని, ఈ విషయంలో ఆయన ఎంతో అభిమానం గల వ్యక్తి అని తెలిసి కూడా మీరు ఇంటి నుండి బయటికి ఎందుకు వెళ్తున్నారు?” అని ఆమెను ఒకరు అడిగారు. దానికామె “అయితే ఉమర్ (రధి అల్లాహు అన్హు) నన్నెందుకు నిరోధించడం లేదు?” అని ఎదురు ప్రశ్న వేశారు. “ఎందుకంటే అల్లాహ్ దాశీలను అల్లాహ్ ఆలయానికి వెళ్ళడానికి నిరోధించకండని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అన్నారు. ఈ ప్రవచనమే మిమ్మల్ని నిరోధించకుండా ఆయనకు అడ్డుతగిలింది” అని అన్నాడు ఆ వ్యక్తి.
నమాజు ప్రకరణం – 30 వ అధ్యాయం – ఎలాంటి ఉపద్రవం లేదనుకుంటే స్త్రీలు సువాసన పూసుకోకుండా మస్జిద్ కు వెళ్ళవచ్చు. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-1. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్
Do not stop Allaah’s Imaa’ (women slaves) from going to Allaah’s mosques
దేవుని (కారుణ్య) ఛాయ తప్ప మరెలాంటి ఛాయ లభించని (ప్రళయ) దినాన దేవుడు ఏడుగురు వ్యక్తులను తన నీడ పట్టున ఆశ్రయమిస్తాడు. వారిలో
న్యాయంగా పాలన చేసే పరిపాలకుడు;
తన యౌవన జీవితం (వ్యర్ధ కార్యకలాపాల్లో గడపకుండా అంతిమ శ్వాస వరకూ) దైవారాధనలో గడిపిన యువకుడు;
మనసంతా మస్జిదులోనే ఉండేటటువంటి వ్యక్తి (అంటే ఉద్యోగం, వ్యాపారం తదితర ప్రపంచ వ్యవహారాల్లో నిమగ్నుడయి పోయినా ధ్యాసంతా మస్జిదు వైపు ఉండేటటువంటి మనిషన్న మాట);
కేవలం ధైవప్రసన్నత కోసం పరస్పరం అభిమానించుకునే, ధైవప్రసన్నత కోసమే పరస్పరం కలుసుకొని విడిపోయే ఇద్దరు వ్యక్తులు;
అంతస్తు, అందచందాలు గల స్త్రీ అసభ్యకార్యానికి పిలిచి నప్పుడు, తాను దైవానికి భయపడుతున్నానంటూ ఆమె కోరికను తిరస్కరించిన వ్యక్తి ;
కుడి చేత్తో ఇచ్చింది ఎడమచేతికి సయితం తెలియనంత గోప్యంగా దానధర్మాలు చేసిన వ్యక్తి;
ఏకాంతంలో దైవాన్ని తలచుకొని కంటతడి పెట్టే వ్యక్తి.
“మస్జిద్ కు అందరికంటే ఎక్కువ దూరముండే వ్యక్తి నమాజు కోసం అందరికంటే ఎక్కువ దూరం నడవ వలసి వస్తుంది. అందువల్ల అతనికే అందరికన్నా ఎక్కువ నమాజు పుణ్యం లభిస్తుంది. అలాగే (ఇషా) నమాజు తొందరగా చేసి పడుకునే వ్యక్తి కంటే ఇమామ్ వెనుక సామూహిక నమాజు కోసం ఎదురు చూసే వ్యక్తికి ఎక్కువ పుణ్యం లభిస్తుంది.”
You must be logged in to post a comment.